వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -33

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -33

— ఏకావాలి లో  అలంకార  చర్చ

అతిశయోక్తి అలంకారం -అతిశయోక్తి అలంకారం  ఉత్ప్రేక్షను పోలి ఉంటుంది కనుక మల్లినాథుడు దీని గురించి  చర్చించే ముందు ఆసక్యికలిగించే చిరు  ఉపోద్ఘాతం రాశాడు.-”తదేవ మధ్యవసాయ ప్రధానోత్ప్రేక్షామ్ లక్షయిత్వా -సంప్రత్య ధ్యవసితం ప్రాధాన్యేనాతిశయోక్తి0 విభాగ పూర్వ కమాహ ”
 ఆద్యావసతి అంటే అధ్యవసాయ .అది  సాధన స్థితిలో ఉంటె అప్పుడు అతిశయోక్తిలో మొదటి రకం అవుతుంది ..కానీ ఉత్ప్రేక్ష అధ్యావసాయాలో సాధ్య రకం పై ఆధార పడి  ఉంటుంది .ఉత్ప్రేక్ష సాధ్యవత్వం ,విషయం ల కు సంబంధం కలిగి ఉంటుంది .కానీ అతిశయోక్తి సిద్టత్వ ,విషయాంగిర్ణత్వ లతో సంబంధం కలిగి ఉంటుంది .అతిశయోక్తిలో అధ్యావసిత  సిధత్వం అంటే సంబంధం తేడా లేక పోవటం వలన అంటే వస్తువు వేరొకటి కాకపోవటం వలన ఉంటుంది .తేడా ఏమిటి అంటే తేడా లేకపోవటమే . విద్యాధరుని గ్రంధం ఏకావాలి లో అతిశయోక్తి నాలుగు రకాలని చెప్పాడు .మల్లినాథుడు మాత్రం మమ్మటుడు చెప్పిన నాలుగు అతిశయోక్తుల్ని వ్యతిరేకించాడు .మమ్మటుని అతిశయోక్తులు -1-భేదం లో భేదం లేక పోవటం 2-భేదం లేకపోవటం లో తేడా ఉండటం 3-వేరొక అసాధ్యమైన అర్ధం ”యది” మొదలైనచిన్నభాగాలతో  (పార్టికిల్ ) తెలియజేయటం  4-ఫలితం కారణం ల క్రమం అతిక్రమించటం
  ఇక్కడ మల్లినాథుడు సంబంధ అసంబంద0 ల నాధారంగా రకాలు చెప్పాడు .ఆ వైవిధ్యాన్ని ఒప్పుకోకపోతే ఆ రెండూ వేరు అవ్వాలి లేక రకాలలో కలిసి పోయి ఉండాలి అన్నాడు .అందులో మొదటిది ప్రత్యేక విలక్షణత ఉండటం వలన సమర్ధించ సాధ్యంకాదు .రెండవ ప్రత్యామ్నాయం కూడా సమర్ధింపబడదు కారణం ఇందులో భేద పరచే విషయం చెప్పబడక పోవటమే .ఇక మూడవ రకానికి వస్తే మమ్మటుడికే అనుమానాస్పదంగా ఉంది కనుక మొదటి రెండు ఒప్పుకోదగ్గవి కావు .నాలుగవ దానికి అసలు అవకాశమే లేదు -”పుష్పం ప్రవాలోపహితం యది స్యాన్ -ముక్తాఫలం వాస్ఫుటా  విద్రు మాస్యాం-తతో నుకుర్యా ద్విపదస్య తస్యా – స్తా మ్రొష్ట పర్యస్త  రుచం స్మితస్య ”
 మొదటిది సంబంధం లేని దానిలో సంబంధంఉందని చెప్పే ఉదాహరణ  .ఇక్కడ ‘  పుష్పం ,ముత్యం లమధ్య ఏరకమైన సంబంధం లేక పోయినా ”యది” అనేదాని వల్ల  సంబంధ అవకాశం ఉందేమో నని పిస్తుంది .రెండవ ఉదాహరణలో అభేదాలలో ఉన్న భేదాల రకాలు తెలియ జేస్తుంది ..స0బంధ  రాహిత్యం ఏదో ఒక భావం వలన ఉందనిపించటం. దీన్ని పండితులే తేల్చి చెప్పాలి .కనుక మల్లినాథుడు ఐదురకాల అతిశయోక్తులను సమర్ధించాడు అయితే ఇందులో సామాన్యం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది దీనికి అలంకార సర్వస్వ కర్త సమాధానం చెప్పాడు -”అధ్యావసిత ప్రాధాన్యే అతిశయోక్తిహ్ ఇతి సర్వస్వ కారో క్త మేవేతి బృమః ”
దీపకాలంకారం -దీన్ని చాలా స్పష్టంగా మల్లినాథుడు వర్ణించి చెప్పాడు .-”యథావా లోకే దేవా సమీపే స్థాపితస్య దీపస్య -కుంభా స్తంభా ధ్రుప లంభో పకారక త్వం త ధాయ మప్యేకత్ర స్థితం సర్వం -దీపకాతీతి దీపక ముచ్యత ఇత్యర్ధహ ”
ప్రాయాజా అనేది జంతువుకు అర్ధం అయినా త్యాగానికి కూడా అర్ధంగా ఉండి ,దేవుని దగ్గర పెట్టిన దీపం దూరానికి కూడా   కాంతిని  ప్రసరింప జేసినట్లు దారిలోని అన్నివస్తువులను  కాంతి వంతమ్ చేసినట్లు దీపక అలంకారం సార్ధకమైంది దీపకం లో ఒకటికాని  ఎక్కువ  సంబంధిత వస్తువులు ఒక గుణం తో కలపబడి ఉంటా యి .తుల్య యోగితలో అన్ని వస్తువులు సంబంధం కలిగికాని సంబంధం లేకుండాకాని ఉంటాయి .
 శ్లేషాలంకారం -మల్లినాథుడు శ్లేషను ”పదం లో సామ్యత ఉండి అది వస్తువుకు విశేషణానికి సంబంధం కలిగి ఉంటె శ్లేష ”అన్నాడు .కనుక ఇది శబ్దాలంకారం .విద్యాధరుడు ,మల్లినాథుడు ఇద్దరూ కూడా శ్లేషకు ,శబ్ద శక్తి మూల ధ్వనికి  ఉన్న భేదాన్ని వివరించారు .రెండింటిలోనూ వస్తువు విశేషణం లలో రెండు అర్ధాలు ఉంటాయి కానీ శ్లేషలో ఆ రెండు సంబంధం కలిగికాని లేకుండాకాని ఉంటాయి .అక్కడ పదానికున్న భావం సందర్భాన్ని బట్టి కప్పేస్తుంది కానీ వేరొక సందర్భం లేని అర్ధాన్ని సంబంధ మున్నా అర్ధం తర్వాత  సూచిస్తుంది .సందర్భం లేనిదాన్ని రెండర్ధాలమాటవలన గ్రహించాలి .శబ్ద శ్లేషలో సంబధం ఉన్నది లేనిది రెండూకూడా  బంకా ,కర్రా లాగా అతుక్కు పోయి ఉంటాయి అర్ధ శ్లేష లో అవి రెండుఒకే కొమ్మకున్న  రెండు పళ్ళు లాగా ఉంటుంది . ”యత్రప్రయత్న స్వరాది భేదా ద్రవస్తుతో భిన్నయోరేవ శబ్దయెహ్ మిథః సంశ్లేష భేదత్వాతు -కాష్ఠవదే కట్వేనావభాసః శబ్ద శ్లేష ఇత్యర్ధహ-తత్రైక వృ0త  ఫలద్వయ పద  ఖండేక  శబ్దే అర్ధ ద్వయ శ్లేష సార్ధ శ్లేషహ  ఇత్యర్ధహ  ”
అప్రస్తుత ప్రశంస -ఇందులో సంబంధం లేని అప్రస్తుతం చెప్పబడి ప్రకృతం సూచింపబడుతుంది ప్రశంస అనే దాని అర్ధం పొగడటం కాదు చెప్పటం లేక వర్ణించటం -”యత్రసారూప్యాది సంబంధత్రమా వశేనా ప్రస్తుత కధనాత్ ప్రస్తుతం గమ్యతే సాప్రస్తుత ప్రశంసయ్యుత్యర్ధహ్ ” అని మల్లినాథుని నిర్వ చనం
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -5 -2 చివరిభాగం (1-5-17 నుండి 7-5-17 వరకు )

వీక్లీ  అమెరికా -5 -2 చివరిభాగం (1-5-17 నుండి 7-5-17 వరకు )

  రెండు పుట్టిన రోజుల వారం -2
7 వ తేదీ ఆదివారం విషయాలు -నిన్న మైనేనిగారు నాకు మెయిల్ రాస్తూ డా ఇన్నయ్యగారి భార్య గారు ”ఈల్ వీజిల్ ”రాసిన ”నైట్ ”పుస్తకాన్ని తెలుగులోకి”కాళరాత్రి ”గా  అనువదించి ముద్రించారని తనకు పంపిన మూడు కాపీలలో ఒకటి పంపానని మంగళవారం అందుతుందని తెలియ జేశారు .దీ న్ని మా మనవుడు శ్రీకేత్ టెక్స్ట్ బుక్ గా చదివి నాకిస్తే నేనూ చదివి తెలుగులో డబ్బింగ్ చేద్దామనుకొని ఎందుకో చివర నచ్చక మానేశాను ఆ పని ఆమె చేసినందుకు అభినందనలు మా అమ్మాయి ఇంటి దగ్గర నిర్వహించే తెలుగు క్లాసులు ఈ రోజుతో అయిపోయాయి పరీక్ష పెట్టారు మళ్ళీ సెప్టెంబర్ లో బడులు తెరిచాకనే మళ్ళీ ప్రారంభం అప్పటిదాకా ఆటవిడుపు . ఇవాళ ఉదయం  వీక్లీ  5 మొదటిభాగం రాశాను .     మధ్యాహ్నం  భోజనాలయ్యాక రెండు గంటలకు బయల్దేరి హిందూ సెంటర్కు వెళ్లాం .అక్కడ షార్లెట్ సాయి సెంటర్ వాళ్ళు గాంధీ భవన్ లో శ్రీ సత్య సాయి మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మగారి జయంతిని జరిపారు శ్రీమతి జయ ముఖ్య భూమిక వహించింది.  పిల్లలతో చక్కని ప్రోగ్రాములు నిర్వ హింప జేశారు తలిదండ్రుల సహకారం పిల్లల కుతూహలం ,సెంటర్ లోని టీచర్ల శిక్షణ అన్నీ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి మా మనవాళ్ళు చి ఆశుతోష్ ,పీయూష్ లు కూడా పాత్ర పోషణ చేశారు  .
  సరిగ్గా మధ్యాహ్నం 3 కు ప్రార్ధన తో మొదలైంది .తర్వాత అందరూ సత్య అనిపిలిచే సత్య శంకర్ -బాబా కు తల్లికి ఉన్న చక్కని అనుబంధాన్ని తేలికమాటలతో అందరికీ అర్ధమయ్యేట్లు ఇంగ్లీష్  లో తెర మీద పిక్చర్లు చూపిస్తూ ప్రసంగించారు అతడు మంచి వక్త ,వాద్యకారుడు . భార్య సౌమ్య హార్మోనిస్టు  గాయకురాలు . కూతురు కూడా మంచిగాయని .ఈ కుటుంబం సాయి సెంటర్ కు వెన్నెముక అన్నివిషయాలలో –
”సాయి బాబా తాత  కొండలరాజు మనవడి లో  దైవ లక్షణాలు కనిపెట్టి చేయెత్తి నమస్కరించకుండా చేయి పట్టుకునేవాడు అదే నమస్కారం బాబా నిద్ర పోతుంటే వచ్చి పాదాలకు నమస్కరించేవాడటతాత .తాత కుఅన్నం వండేవాడు బాబా రసం బాగా కాచేవాడట ..పుట్టపర్తి అంటే పాము పుట్టపర్తి అనేవారట నాగ సంచారం ఎక్కువ కొండలు రాళ్లు రప్పలమయం బాబా చిన్నతనం లో .బాబాను చిన్నప్పటినుంచి బ్రహ్మ జ్ఞాని అనేవారట అందరూ .తల్లి నమ్మేదికాదట .ఒక్కోసారి ఆయన మహిమలు చూసి కంగారుతో అత్తగారికి చెప్పేది .ఆమె ఎవరికీ చెప్పకు నవ్వుతారు అనేది .. ఇంట్లో ఏ పండగ జరిగినా తన పుట్టిన రోజు అయినా సరే అందరికీ అన్నీ ఇప్పించి చివరికి తాను తీసుకునేవాడు సత్య నారాయణ రాజు అనే సత్య సాయి .దూరం గా అడవుల్లో ధ్యానం లో ఉన్న బాబా ను చూడటానికి తలిదండ్రులు వస్తే ”మాయ ”వచ్చింది అనేవాడు .అంటే తానూ సంసార బంధానికి దూరామని అర్ధం .బ్రహ్మజ్ఞానికి ఏ బంధాలు ఉండవని భావం .. తల్లితో ”నువ్వు ఈ ప్రపంచానికి చెందిన దానివి సర్వ ప్రపంచం నీదే ”అనేవాడు.
  దగ్గరున్న కొండపై మందిరం కడతాననేవాడు .అక్కడెందుకు పాములమయం ఇక్కడున్న బడి ని బాగు చేసి కొత్తది కట్టించు అని తల్లి చెబితే ముందర ఎలిమెంటరీ స్కూల్ కట్టించాడు .తర్వాత తల్లికోరికపై హైస్కూల్ కట్టించి ఆమెపేరుపెట్టించాడు .ప్రశాంతి మందిరం కట్టించినతర్వాత బాబా అక్కడే ఉండేవారు తల్లిదండ్రులు గ్రామం లోనే ఉండేవారు అందరు అప్పుడు రాగి సంకటే  తినేవారు . ప్రజలుసాయి గురించి చెడుమాటలు అంటూటే భరించ లేక కొడుక్కి చెబితే అప్పుడు అందర్నీ మందిరం లోనే ఉండే ఏర్పాటు చేశారు .ఒకసారి ప్రిన్సిపాల్ గోకక్ ఒక పిల్లాడు మందిరం లో అనేక పనులు చేసి ఆలస్యంగా వెడితే పంపించేశాడు వాడు ఏడుస్తూ కూర్చుంటే తానూ ప్రిన్సిపాల్ కు ఖాళీ ఉన్న సమయం లో వెళ్లి ”సారూ !మీ కన్నీ తెలుసు బిడ్డడు పను లన్నీ చేసి రావటం మూలాన కుసుసింత లేటుగా వచ్చిండు .తొ లి తప్పు కాయండి ”అని బతిమాలి ఆయన్ను ఒప్పించి కుర్రాడు వెళ్లేట్లు చేసిన మాతృమూర్తి అన్నాడు సత్య .తల్లి దండ్రులను తాతగారిని వీలున్నప్పుడల్లా వెళ్లి అంతకు ముందు చూసివచ్చేవారు సాయి .ఒక సారి తల్లికి తీవ్రంగా జ్వరం వచ్చి భరించలేక పోతుంటే సాయి వచ్చిమందు వేసి తగ్గించారట అప్పుడు ఆమెకు నమ్మకం కలిగిందట బాబా దైవ స్వరూపం అని . అలాగే చివరి సారి 19 72 లో ”స్వామీ స్వామీ ”అని కలవరించిందట వెంటనే ఆమె ముందు ఉన్నారట బాబా ”నాయనా నువ్వెవరవో నాకు ఎరుక పరచావు ధన్యోస్మి ”అంటూ చేతులు పట్టుకొని బాబా తల్లి ఈశ్వరమ్మగారు మరణించారని సత్య ప్రసంగం పూర్తి చేశాడు ఆసాంతం చాలా క్రమ పద్ధతిలో వివరించగా  అందరు  కరతాళ ధ్వనులతో అభినందించారు .
  తర్వాత 4-15 నుంచి నాలుగు ప్రదర్శనలు నిర్వహించారు .అందరూ పిల్లలే . వినాయక షణ్ముఖ ఈశ్వర రామ కృష్ణ సరస్వతి లక్ష్మి షిర్డీబాబ సత్యసాయి వేషాలతో మంచి దుస్తులు అలంకారాలు ఆయుధాలతో అలంకరించిన కుర్చీలలో కూర్చుని దేవతలంతా ఒక్కటే అనే భావాన్ని కలిగించారు .సాయి సర్వదేవతా స్వరూపుడు అనే భావం కలిగించారు దీనికి మంచి ట్రెయినింగ్ ఇచ్చి ,తీర్చి దిద్దిన లేడీ టీచర్ మానిని అభినందనీయురాలు డెకరేషన్ తో సహా అన్నీ ఆమె సమకూర్చింది తలిదండ్రులు వస్త్రాలు సమకూర్చారు .కాన్సెప్ట్ బాగుంది .పిల్లలతో తాము ఎందుకు ఏ పాత్ర వేసింది తెరమీద చెప్పగా చూపించి వైవిధ్యం కలిపించారు  .తర్వాత రీ సైక్లింగ్ విధానం పై నలుగురు ఆడపిల్లలు వివరించారు  చిలక పలుకుల్లా ఉన్నాయి ఫీల్ రాలేదని పించింది ..మూడోది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోబాటు బాబా కాన్ఫిడెన్స్ కూడా ఉండాలన్న ధీరీ తో పిల్లలే రాసి ప్రదర్శించింది బాగానే ఉంది అందరూ బాగానే చేశారు .చివరిదైన నాలుగవది సత్య సాయి జియోపార్దీ ”.దీనిని హిందూ సెంటర్ లో తెలుగు నేర్పే టీచరూ  పిల్లల డాక్టర్  మంచి డాన్స్ టీచర్ అయినా సాయి కృష్ణ అనే ఆవిడ నేతృత్వం లో ప్రదర్శించారు .ఇందులో మా మనవాళ్ళు అశుతోష్ ,పీయూష్ లు కూడా ఉన్నారు ఇంటి దగ్గర ఏ వేషం వేస్తున్నార్రా అని అడిగితె ”సీక్రెట్ ”అక్కడే చూడాలి అన్నారు అంతటి సీక్రెసీ ని బృందం అంతా మెయిన్ న్టైన్ చేసింది.ఇది సాయిబాబా జీవితం పై క్విజ్ ప్రోగ్రామ్ . చిన్న ప్రశ్నలే తేలికైనవే .ప్రేక్షకులకే   సరైన సమాధానం చెబితే బాబా ఫోటో బహుమతిగా ఇచ్చారు తమాషా ఏమిటట ఇన్నేళ్ళుగా సాయి సెంటర్ నడిపేవాళ్లు ఆయనపై ఎన్నో ప్రసంగాలు విన్నవాళ్ళు కూడా ఆయన ఎప్పుడు ఏనెల ఏ తేదీ ఏ వారం పుట్టారని అడిగితె కరెక్ట్ సమాధానం చెప్పక పోవటం వింత అనిపించింది
  దీనితర్వాత మళ్ళీ ఒక అరగంట భజన .
  సాయంత్రం 6 నుంచి స్నాక్స్ టీ  ఏర్పాటు .ఎవరికి వారు తమకు చేతనయింది ఇంటి దగ్గర చేసుకొచ్చి ఇక్కడ అందరూ తినే ఏర్పాటు చేశారు .ఒక తెలుగమ్మాయి పుట్టినరోజు నిన్నయితే ఇవాళ అందరి సమక్షం లో”ఎగ్ లెస్  బర్త్ డే కేక్ ”కోయించి అందరికి పెట్టించారు.ఇదికాక రసగుల్లాలు పునుగులు ,మిరపకాయ బజ్జీ ,మరొక శ్వీటు ,పిజ్జాలు ,అటుకుల పులిహోర కర్బూజకాయ ముక్కలు, మరమరాలు, కాఫీ, టీ లతో అందరూ సుష్టుగా లాగించారు .అంతా  అయ్యేసరికి రాత్రి ఏడు అయింది .ఇంటికి వచ్చేసరికి ఏడున్నర . ఈ ఫోటోలు పెట్టి ఇదంతా రాసేసరికి రాత్రి 10 .. ఇంతటితో ఈ వారానికి స్వస్తి .
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

—

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ జయంతి -7-5-17 ఆదివారం షార్లెట్ సాయి సెంటర్

This gallery contains 13 photos.

More Galleries | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -5-1 (1-5-17 నుండి 7-5-17 వరకు )

వీక్లీ  అమెరికా -5-1 (1-5-17 నుండి 7-5-17 వరకు )
రెండు పుట్టిన రోజులవారం

1-5-17 సోమవారం ఉదయం నిద్ర మంచం మీద నించి ఇంకా కేవకుండానే ఉయ్యూరు నుంచి మా మనవడు చరణ్ ఫోన్ చేసి”తాతా ! ఉయ్యూరు ను ,మమ్మల్ని మర్చిపోయావు ఫోన్ చేయటం లేదు ”అని నేరం వేశాడు నవ్వుతూ .మధ్యాహ్నం అడ్డాడ శిష్యుడు భూషణం ఫోన్ చేసి అక్కడ నేను పని చేసినప్పుడు దివాకర్లవారు రాసిన ”భారతావతరణం ”పద్యనాటిక నేను వేయించటం అందులో తానూ నన్నయ పాత్ర వేయటం జ్ఞాపకం చేశాడు .నిజమే అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఎస్ సి వాళ్ళు .వాళ్లకు మాటలు పలకటమే రాదు కానీ సాహసంగా తీసుకొని వాళ్ళతో పద్యాలు ప్రాక్టీస్  చేయించి వేయించాను చాలా చక్కగా చెప్పారు .అదొక సాహసం . మల్లినాథ సూరి 29 వ ఎపిసోడ్ రాసి  సుమారు 5 నెలలయింది .మళ్ళీ ఇవాళ మొదలుపెట్టి 30 వ ఎపిసోడ్ రాశాను .

సాయంత్రం డా ఎల్లాప్రగడ రామ మోహన రావు గారు” కారీ ”నుంచి ఫోన్ చేసి చాలా ఆప్యాయంగా మాట్లాడారు .మైనేనిగారికి ఊరగాయలు పంపించానని ఆయన చాలా అల్ప సంతోషి అని ,తనకు క్లాస్ మేట్ అని ఏరా అనుకుంటామని  ఊరగాయలు పంపినందుకు తనకు వెయ్యి డాలర్లు పంపిస్తానన్నారని తానూ ‘ఏరా !నేను పచ్చళ్ళు అమ్ముకునే వాడిగా కనపడుతున్నానా ?”అన్నానని చెప్పి మైనేని గారి వితరణ శీలత్వం సరసభారతి పుస్తకాలలో బాగా నేను రాశానని ,డబ్బు ఎందరికో ఉంటుంది కానీ దాన్ని మంచిపనులు ఖర్చు చేసి వారు అరుదు అలాంటి ఆరుధై నవాడు మా గోపాలకృష్ణ అన్నారు . ఆ తర్వాత మా చిన్నతనాలలో ఊరగాయలు పెట్టటం ఒక ఖార్ఖానా గా ఆ పరిశ్రమలాగా ఉండేదని ఇద్దరం జ్ఞాపకం చేసుకున్నాం .ఇళ్లల్లో గజం ఎత్తు  జాడీలు ఉండేవని మామిడికాయలు తరగటం కలపటం వగైరా వేసవి కాలపు కుటీర పరిశ్రమగా ఉండేదని అనుకొన్నాం . ఈ విషయాలన్నీ మైనేని గారికి వెంటనే మెయిల్ రాశా .ఆయన  రావుగారు రేపల్లె లో తమ స్వంత  తోట లో కాసిన మామిడికాయ చింతకాయ గోంగూర ,నిమ్మకాయ పండు మిర్చి లతో ఊరగాయలు పెట్టిస్తారని వాటినే తమకు పంపారని రాశారు . వారిద్దరి సౌజన్యం గొప్పది అలాంటి వారు నాకు మిత్రులవటం నా అదృష్టం .

  లైబ్రరీ పుస్తకాల గడువు రెండువారాలు మాత్రమే .మామనవాడు పీయూష్ చేత ఆన్ లైన్ రెన్యూ చేయించా .మళ్ళీ మంగళవారం మధ్యాహ్నం భూషణం వాట్సాప్ చేశాడు విషయం ఏమీ లేదు .సాయంత్రం కోడూరి పావని కెంటకీ నుంచి ఫోన్ చేసి మాట్లాడింది .ఆ అమ్మాయి చాలా పద్ధతిగల పిల్ల .భూషణం విసిగిస్తున్నాడా సార్ అంది . తాము  జులైలో మరో చోటికి వెళ్లవచ్చని చెప్పింది .మా శ్రీమతి తోనూ మాట్లాడింది ఎండ బాగానే ఉంది రెండుపూటలా వాకింగ్ చేశాను . ”చెన్నై చంద్రమా ”అన్నట్లు షార్లెట్ సూర్యుడు రాత్రి 8 గంటలకూ కనిపించాడు . రాత్రి సునయన ప్రెసెంట్ చేస్తున్న ”ఫ్రస్ట్రేటెడ్  ఉమన్ ”యు ట్యూబ్ లో చూసాం . సరదాగా బాగుంది ఎన్నో సమస్యలపై తనదైన ధోరణిలో బాగా ప్రదర్శిస్తోంది . దాదాపు ఏక పాత్రాభినయం . కరెంట్ టాపిక్స్ పై మంచికథనాలు . ఎంత ఈజీ గా చేస్తోందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది ..మహా నటీమణులు చాలరుఅనిపించింది .చిన్నతనం లో బేబీ సునయన గా చాలా చేససిందని ప్రభావతి జ్ఞాపకం  చేసుకొన్నది ..మహాతల్లి  లూ  బాగుంటాయి  

  బుధవారం మా మనవడు చి హర్ష 6. 7 /10 మార్కులతో తెలంగాణా ఎస్ ఎస్ సి పాసయ్యాడు . 2015 ఆగస్టు 9 న పెద్ద యాక్సిడెంట్ అయి డివైడర్ కు తల తగిలి రెండు సార్లు బ్రెయిన్ ఆపరేషన్ జరిగి  అన్నీ మర్చిపోయి క్రమ క్రమంగా కోలుకుని 10 పరీక్షలు రాయాల్సినవాడు 9 చదివి తర్వాత 10 కూడా చదివి ఈ ఏడాది టెన్త్ పాసవ్వటం అద్భుతం . అందుకే వాడి బ్రెయిన్ ఆప రేషన్ చేసిన డాక్టర్ వాడిని మిరకిల్ బాయ్ అంటాడు  నిజమే హోప్స్ లేవని చెప్పారు కానీ దైవ కృపవలన సమయానికి హాస్పిటల్లో చేర్చిన యువ దంపతుల చలువ వలన మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి కృప వలన బతికి బయట పడి  క్రమంగా అన్నీ గుర్తుకు వచ్చి చదివి పరీక్ష పాసవటం ఎనిమిదవ వింత యే . వాడు పాసయిన సంగతి అందరికి మెయిల్ లో తెలియబరచాను మైనేనిగారు శ్యామలాంద  ప్రసాద్ గారు ,వారణాసి సూర్యకుమారిగారు  బొడ్డ పాటి చంద్ర శేఖర్ మొదలైనవారు సంతోషం వెలిబుచ్చుతూ సమాధానమిచ్చారు .
  వైకింగ్ శకం పై మూడు ఎపిసోడ్లు రాశాను . ది నాజీ హోలోకాస్ట్ ,ఏ వరల్డ్ వితౌట్ జ్యుస్  ది  వైకింగ్స్ పుస్తకాలు చదివేశాను .ఉయ్యూరునుంచి తెచ్చుకొన్న ఆలంకారికులు చదివాను ఈవారం లో . గురువారం సాయంత్రం 6-30 కు మా మనవళ్లు 6 వతరగతి చదువుతున్న  స్కూల్  లో పిల్లల జంత్ర వాయిద్య ప్రదర్శన కు వెళ్లాం మా మనవడు చి ఆశుతోష్ ట్రంపెట్ వాయించాడు బృందంతో .చాలామంది పేరెంట్స్ చూడటానికి వచ్చారు
 మే  21 వ తేదీ జరిగే శ్రీ హనుమజ్జయ0తి  కార్యక్రమం తయారు చేసి ప్రింట్ చేయించమని రమణకు మెయిల్ లో పంపాను .శ్రీమతిశాంతిశ్రీ భక్తి సంగీత విభావరి డా శ్రీ ఆచంట శివరామ కృష్ణ మూర్తిగారి ధార్మిక ప్రసంగం ,శతకత్రయ ధారణ పోటీలు బహుమతుల ప్రదానం మిగిలిన వాటితో చేర్చాం
  శుక్రవారం హర్ష పాలిటెక్నీక్ ఎంట్రన్స్ బాగా రాస్శాడని శర్మ చెప్పాడు . ఆదివారం హిందూ సెంటర్ లోశ్రీ సత్యసాయి మాతృశ్రీ ఈశ్వరమ్మగారి జయంతి  కార్యక్రమ0 లో వేసే పిల్లల డ్రామాలో మా మనవాళ్ళు స్టేజ్ ప్రాక్టీ స్  కోసం విజ్జి పిల్లని రాత్రి 7 కు తీసుకువెళ్లి 10 కి తిరిగివచ్చింది .అంతకు ముందుకొక గంట ఇంట్లో తెలుగు స్పెషల్ క్లాస్ నిర్వ హించింది ఆఫీస్ నుంచి రాగానే .
  రాత్రి బాలమురళీ కృష్ణ సంగీతం ఎలాపడాలి గాత్ర ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి స్వర రాగ విషయాలలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి అనేవిషయాలపై ఇంగిలీషు లో చేసిన డిమాంస్ట్రేషన్ లెసన్ చూసాం యు ట్యూబ్ లో తర్వాత బృందావని రాగ తిల్లానా ఎలా పాడాలో నేర్పే తీరునూ చూసాం  బాలమురళి అంటే తిల్లానా స్పెషల్ .దీన్ని తమిళ విద్యార్థులకు నేర్పే  సిడి అది బాగుంది వాళ్ళు ఆయనతో చక్కగా పాడారు .ఇవి చూస్తే ఇలాంటి విషయాలపై బాలమురళికి ఉన్న సర్వజ్ఞత్వాన్ని  మన తెలుగు వాళ్ళు ఉపయోగించుకోలేక పోయారని పించింది .ఇలాంటి ఆయన పాఠాలు తెలుగులో ఉన్నాయో లేదో నాకు తెలియదు ఉంటె సంతోషం  .
  శనివారం  జ్యుల పై రెండు పుస్తకాలూ చదివి ఘోరకలి పేరిట 5 ఎపిసోడ్ లు రాశా . చి హర్ష పాలిటెక్నీక్ ఎంట్రన్స్ పరీక్షలో 45 మార్కులతో క్వాలిఫై అయినట్లు శర్మ మార్కుల మెమో తోసహా పంపాడు సంతోషించాము ఫోన్ చేసి మాట్లాడాం . అందరికి మెయిల్ ద్వారా విషయం తెలియ బరచాను .శ్రీ మైనేని  శ్రీ గాయత్రిప్రసాద్ గార్లు వెంటనే స్పందించి సంతోషం తెలిపారు
  సరసభారతి వీక్షకుల  సంఖ్య  ఈ ఉదయానికి 4 లక్షల 61 అయింది ఈ సంతోషవార్తనూ అందరికీ పంపాను  పవన్ రెండవ అమ్మాయి చి ప్రశాంతి పుట్టిన రోజును పిల్లలందరితో బయట నిర్వహించి రాత్రికి మమ్మల్ని ఇంటికి భోజనాలకుపిలిచాడు .మా కుటుంబం ,రాంకీ తమ్ముడు సాయి పవన్ కుటుంబం పవన్ మేనమామ కొడుకు కుటుంబం అతిధులం ..పవన్ భార్య రాధ అతిథిమర్యాద బాగా చేస్తుంది వాళ్ళత్త గారిని కంటికి రెప్పలాగా చూసుకుంటోంది ఆవిడ మా రెండవ బావగారు  వేలూరి వివేకానంద్ గారి అన్నగారైన ముకుందం గారి భార్య అంటే వదినగారు పవన్ ఆమె కుమారుడు ..పవన్ తండ్రి ముకుందం గారు చనిపోయి చాలా ఏళ్లయింది . వీరి బాగోగులు మా బావా అక్కయ్య చూశారు .  మంచి బంధుప్రేమ ఉన్నవాడు . భోజనంలో వంకాయ ,బెండకాయ కూరలు అల్లం చట్నీ ఆవకాయ ,బజ్జీలు గులాబ్జామ్ ,పెరుగు  పుచ్చ ముక్కలు ,మా అమ్మాయితీసుకు వెళ్లిన జున్ను ,పనస తొనలుతో సుష్టుగా భోజనం చేసాం . అన్నీ అదరహా . రాంకీ తమ్ముడు సాయి నా మెయిల్స్ పంపితే చదువుతానని అన్నాడు .వాళ్ళత్తగారు మామగారలకు మేంమంతా బాగా తెలుసునన్నారు విష్ణుభొట్ల ఇంటిపేరట . ఇంటికొచ్చి కొన్ని పంపాను . పవన్ తో డొమినికన్ ఆవిడ తన గురించి నాకేమీ సమాచారం పంపలేదని చెబితే తనకు పంపిందని తన గురించి రాయతగినంత గొప్ప విషయాలు లేవని తెలియ జేసిందని చెప్పాడు .సరదాగా ఒక అరగంట కబుర్లు చెప్పుకొని ఇంటికి రాత్రి 11 గంటలకు చేరాం .పవన్ ఇల్లు మా వాళ్ళ ఇంటికి చాలాదగ్గరే ఏడెనిమిది నిమిషాల కారు ప్రయాణమే  .మిగిలిన విషయాలు తర్వాత రెండో ఎపిసోడ్ లో రాస్తా ..
       మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మా బంధువు వేలూరి పవన్ కుమార్తె చి ప్రశాంతి పుట్టిన రోజు 6-5-17 రాత్రి వాళ్ళఇంట్లో విందు

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

ఘోరకలి -5(చివరిభాగం )

ఘోరకలి -5(చివరిభాగం )

                     బర్నింగ్ బుక్స్ బోన్ ఫైర్ -2

–అంతకు ముందు కొన్నివారాలుగా నిషేధిత పుస్తకాలను నాజీ ప్రభుత్వం సవాదేనం చేసుకొన్నది . మార్చ్ 12 న  స్టార్మ్ట్రూపర్స్ లోకల్ ట్రేడ్ యూనియన్ లైబ్రరీ ని తస్కరించి బోల్షెవిక్ ,పసిఫిస్ట్ ఏదీస్ట్  మార్క్సిస్టు పుస్తకాలు న్యూస్ పేపర్లు లోకల్ లైబ్రరీలనుంచి తొలగించాలని ఆదేశించింది .తర్వాత పబ్లిక్ లైబ్రేర్రలన్నీ వెయ్యి కళ్ళతో వెతికించి లాగించేసింది .హీదేం బెర్గ్ స్తూడెంట్ బాడీ విద్యార్థుల్ని తమదగ్గరున్న నిషేధ సాహిత్యాన్ని తొలగించమన్నది  తర్వాత బాన్ ,డార్మ్ స్టెడ్  డ్రేస్డైన్ ,ఫ్రీబర్గ్ ,గీసేన్  గూటింజెన్ ,విటెన్ బెర్గ్ మొదలైన 24 చోట్ల బుక్ బోన్ ఫైర్ పండగ చేశారు . ఏప్రిల్ ,మే లలో వేలాది లైబ్రరీ పుస్తకాలకు దహన సంస్కారం చేశారు  .వీటి స్థానం లో హిట్లర్ మీన్ కాంప్ పుస్తకాలను చేర్చారు లైబ్రరీలలో . ఫ్రాంక్ ఫర్ట్ లో రొమేన్ బెర్గ్ 15 వేలమంది చూస్తుండగా పుస్తక భోగిమంటలు వేశారు బెర్లిన్ ఒపెరాస్క్వేర్ లో 25 వేల విలువైన వెస్టర్న్ కాల్చర్కు చెందిన గ్రంధాలను అగ్నికి ఆహుతి చేశారు .ఇందులో 10 వేలు సెక్సువల్ ఇంస్టి ట్యూట్ కు చెందినవి  ప్రఖ్యాత జర్మన్ రచయితలైన షాలేం యాష్ ,హేన్రి బార్బస్ ,ఫ్రాంజ్ బోస్ ,జాన్ డాస్ పాసోస్ ,ఫరాయిడ్ ,అయిన్ స్టెయిన్ ,ఆంద్రీ గైడ్ ,ఎర్నెస్ట్ హేమిగ్వే ,హెలెన్ కెల్లర్ , లెనిన్ ,రోసా లక్సన్  బెర్గ్ అప్టాన్  సింక్లెర్ ,హేజీ వేల్స్ ,మొదలైన వారి అమూల్య గ్రంధాలు నాజీల అహంకారానికి అగ్ని జ్వాలకు ఆహుతయ్యాయి .ఈ బుక్ బర్ణింగ్  మంటలు ”సింబల్ ఆఫ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ”అని నాజీలు భుజాలు చరచుకొన్నారు ..ఈ దహన కాండలో ఎందరో ఎకాడమిస్ట్ లైబ్రేరియన్లు ,టీచర్లు  ,పాల్గొన్నారు .జెర్మనిస్ట్ అయిన మాక్స్ హెర్మన్ ఒక్కడే దీన్ని వ్యతిరేకించాడు  .ప్రాపగాండా మినిష్టర్ గోబెల్స్ ,అతని మంత్రిత్వ శాఖ ముందు నాయకత్వం వహించలేదు .కానీ తర్వాత సపోర్ట్ చేశాడు

    అనేక అసోసియేషన్లు నాజీ మూకలు ఈ సరస్వతీ మరణ హోమాన్ని జాతీయ పండగగా జరిపారు ..ఇదొక సంప్రదాయమే అయింది .ట్రక్కులనిండా నిషేధ పుస్తకాలు పెట్టి హిబ్రూ అని నిక్ నేం తగిలించి ,రెండు ఎద్దులతో లాగించి  కెన్నీ ట్రక్కులమీద ”చెత్త పుస్తకాలు ”అని పేరు రాసి  మరికొన్న ట్రక్కులను గుర్రాలతో లాగించి దానిమీద ”నేను ఈ పుస్తకాలు చదివిన గాడిదను ”అని పోస్టర్ అంటించి కుర్రాళ్ళు స్తూడెంట్లు అరుపులు కేకలతో ఊరేగి తగలబెట్టారు ..పిల్లలు యువకులు ముసలి ముతక అందరూ ఈ పాపం లో భాగస్వాములయ్యారు . దీనికి తోడు సంగీతం తో హోరెత్తించారు .ఇందులో పాల్గొన్నవారికి ఆ పుస్తకాలేమిటో ఎవరు రాశారో వాటిప్రాముఖ్యత ఏమిటో ఎవ్వరికీ తెలియదు అదీ మూక రాజ్యం అంటే ..హిట్లర్ చాలా అముఞ్చిపని చేస్తున్నాడని అభినందనలు ..నాజీల లిస్టులో శత్రువుల పేర్లు ఎక్కువ స్నేహితులపేర్లు అతి తక్కువ అదీ వైపరీత్యం .ఒపేరా స్క్వేర్ దగ్గర జరిగిన బుక్ బార్కింగ్ లో రచయితఆర్నార్డ్ జ్వీ గ్ తన పుస్తకాలు తగలబడుతుండగా స్వయం గా చూశాడు 1887 లో పుట్టిన ఆయన జర్మనీ తరఫున మొదటి వరుసలో యుద్ధం చేసి న యుద్ధ వీరుడు.
        సమాప్తం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-17-కాంప్-షార్లెట్-అమెరికా ..


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘోరకలి -4

ఘోరకలి -4

             బుక్  బర్ణింగ్ బోన్ ఫైర్
మనుషుల పనిపట్టి వారి సర్వ నాశనం చేసినట్లే హిట్లర్ తనకిష్టం లేని వారిరచనలను తగలబెట్టే ప్రయత్నం దేశవ్యాప్తంగాచేసి రికార్డ్ నెలకొల్పాడు .ఇదే” పుస్తక దహన భోగిమంటలు ”అనే బుక్ బర్ణింగ్ బోన్ ఫైర్ .ముఖ్యంగా హీబ్రూ బైబిల్ దహనం సోషలిస్టు సాహిత్య  దహనం ఇందులో భాగాలు .. ఈ దహనక్రియ పబ్లిక్ గా  బాండ్  మేళాలతో చప్పట్లు కేరింతలతో నడిబజార్లలో, యూని వర్సిటీ ఆవరణలో,సెంటర్ లలో  జరిపించాడు ..జ్యోవోయిష్ నాగరికత పూర్తిగా అంతమైపోవాలన్న  ఆరాటమే ఇది జ్యులు లేని ప్రపంచ నిర్మాణం సాధించాలన్న తపన . ఇదంతా ఒక  ఫా0టసీ . జ్యుల ను ఒక కల్పిత శత్రువుగా భావించి చీకట్లో చేసిన యుద్ధమే ఇది . జ్యులు ఏనాడూ జర్మనీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పని చేయలేదు ఆక్రమణలు చేయలేదు .ఆరకమైన సాహిత్యాన్నీ రాయలేదు . అందుకే యా0టి సెమిసిస్ట్ అనేది ఒక ఫా0టసీ అన్నారు . 1937 లో ”ది జ్యు  యాజ్ ఎ  క్రిమినల్ ”అనే పుస్తకాన్ని కిల్లర్ ,హాన్స్ ఆండర్సన్ లు రాశారు .అందులో ”స్పైరోకైతే బాక్తీరియా సిఫిలిస్ వ్యాధి కారణమైనట్లే జ్యులలో రాజకీయ ,రాజకీయేతర విషయాలలో నేర చరిత్ర రక్తం లోనే ఉన్నవాళ్లు మానవులకు జ్యులు పూర్తి వ్యతిరేకులు దుష్టత్వానికి మూర్తీభవించిన రూపం జ్యు .దేవుడికి వ్యతిరేకి .వాడి వాసనే చావుకు కారణం ”అని అభూత కల్పనలతో రాశారు  జాతి విద్వేషం కలగటానికి ఇది పూర్తిగా కారణాలలో ప్రధాన కారణమైంది
  క్రిస్టియానిటీ  జ్యుల మతమార్పిడిని సమర్ధించింది కానీ నాజీలు వ్యతిరేకించారు .ఇంతటి జాతి వ్యతిరేకతను నాజీలు కలిగించటానికి క్రైస్తవం కూడా బాగా దోహదం చేసింది .జ్యులనూ  జ్యుయిజాన్ని అగ్నికి ఆహుతి చేయాలన్నది హిట్లర్ సంకల్పం .వీళ్లకు ఈ భావం యూరోపియన్ కాలనీల నుండి వచ్చింది లక్షలాది ఇతరులను చంపి బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్ బెల్జియం రాజ్యాలను ఏర్పరచుకున్నారు 1904 -1907 మధ్యఆగ్నేయ ఆఫ్రికాలో(నాంబియా )   హెరెరో ,నామాక్వా లను జర్మన్లు తుడిచిపెట్టేశారు కనుక ఇప్పుడు కూడా అలాంటిది సాధ్యమని కలలు కన్నారు .జ్యులకు మూలాలు బలంగా ఉన్నాయని ,బైబిల్ ,క్రిస్టియానిటీ ,లకు కారణం భూతులని కనుక కొత్త పరభుత్వానికి పాత వాళ్ళు అడ్డు అని భావించారు నాజీలు జ్యులు అంటే టెర్రర్ ..కనుక ఎన్ని లక్షలమంది అయినా సరే జర్మనీ యూరప్ దేశాలలోని జ్యులను అంతం చేయాలనే నిశ్చయించాడు హిట్లర్ .. 919-33 వరకు జర్మనీలో న్యాయం చట్టం ప్రజాస్వామ్యం చక్కగా వర్ధిల్లాయి.  జ్యులకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే పోలీస్ న్యాయస్థానం వారి హక్కులను కాపాడాయి . థర్డ్ రీచ్ పాలనవచ్చాక జ్యులకు హింస ప్రజ్వరిల్లింది .రౌడీలు వీధిమూకలు మిలిటరీలో ఎస్ ఏ రూపం లో దూరిపోయారు .వీళ్ళు సైన్యానికి అనుబంధ సంస్థ అయ్యారు  జ్యులకు అన్యాయం జరిగి ఫిర్యాదు చేస్తే ”జ్యులను రక్షించటం పోలీసుల ద్యూటీ కాదు ”అనే స్థితికి వచ్చింది .ధనికులైన జ్యులు అనేక వర్తక వాణిజ్య సంస్థలను  కంపెనీలను స్థాపించి నిర్వహించేవారు .వేలాది ఉద్యోగస్తులు పని చేసేవారు .అనేక యూనివర్సిటీలలో న్యాయస్థానాలలో సంస్థలలో విద్యాలయాలలో జ్యులు ఉన్నతపదవుల్లో ఉండేవారు ఇప్పడు దీన్ని సహించలేక నాజీలు ”యాంటీ కే పటలిస్ట్ ”విధానం అవలంబించారు .హిట్లర్ కు జ్యుల వల్లనే ఫ్రెంచ్ విప్లవం ,సమాన హక్కులు ,కమ్యూనిజం కేపటలిజం వచ్చాయని భ్రమ ఉండేది .ఇదంతా కూలదోసి నవ జర్మనీ ఏర్పరచాలనుకొన్నాడు ఆ విషయం స్పష్టంగామీన్ కాంప్ అనే 

తన చరిత్రలో చెప్పాడు -”సృష్టికర్త దేవుని ఆజ్ఞప్రకారం నేను జ్యులను వ్యతిరేకిస్తూ ,దేవునిపనిలో నడుస్తున్నాననుకొంటున్నా”అన్నాడు  .కేపిటలిజం కన్జర్వేటిజం కమ్యూనిజం బోల్షివిజం మార్క్సిజం ,సోషలిజం .లిబరలిజం ,పసిఫిజం ,కాస్మోపాలిటనిజం  మెటీరియలిజం  నాస్తికత, ప్రజాస్వామ్యం లు ఏర్పడ్డాయని తానునమ్మి ప్రజలచేత నమ్మించాడు హిట్లర్ .నిజానికి వీమర్ రిపబ్లిక్ లో సాహిత్య సంస్కృతులు మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లాయి .వినోదం కేబరే క్లబ్ డాన్స్ లైంగిక స్వాతంత్రం ,సైకో అనాలసిస్ , ఫెమినిజం ,హోమో సెక్సుయాలిటీ  అబార్షన్ జాజ్ సంగీతం బాహాస్ ఆర్కి టెక్చర్  ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్  ఇంప్రెషనిజం ,క్యూబిజం డాడాయిజం ఎక్స్ప్రెషనిజం లు వర్ధిల్లాయి అందుకే హిట్లర్ కు ”ఎక్కడో ”కాలింది .. 1933 వరకు నాజీలకు జీనోసైడ్ (జాతి విధ్వంసం ),ఎక్స్టెర్మి నేషన్(దుంపనాశనం )ఆలోచన రాలేదు . కొత్త జర్మన్ జాతిని జ్యుల  రక్త రహితంగా ఏర్పరచాలని ఆతర్వాత వచ్చింది అందుకే ఆ మారణ హోమాలు .దానికోసమే ప్రజాస్వామ్యాన్ని బలపరచిన వీమర్ డెమాక్రసి చట్ట న్యాయ వ్యవస్థ ,జర్మన్ ఉదారవాదం కమ్యూనిజం  విధ్వంస నిర్ణయం  హిట్లర్ ఛాన్సలర్ అయినా కొత్తలో ”ఆ వీడెన్ని  రోజులుంటా డు రెండునెలల్లో మూలకు తోసిపారెయ్యమా స్ప్రింగ్ దాకా ఉంటె గొప్పే ”అని ప్రగల్భాలు  పలికారు డెమొక్రాట్లు .అప్పటికి హిట్లర్ అధికారాలు పరిమితమే .క్రమంగా బలపడి ప్రెసిడెంట్ అయి సైన్యాధికారి అయి సర్వాధికారాలున్న ఫ్యురేర్ చక్రవర్తి అయి డెమొక్రసీని డిక్టేటర్షిప్ తో శాసించాడు ఏకు మేకయ్యాడు . .
   ఏది చేసినా హిట్లర్ పెద్ద ఆర్భాటం గా చేసేవాడు” లో కీ ”ఉండేదికాదు .బంద్ మేళాలు మార్చింగ్ లు హెయిల్ హిట్లర్ నినాదాలు దీపాలతో హోరెత్తించేవాడు సెబాస్టియన్ హాఫ్నర్ హిట్లర్ గురించి రాస్తూ ”అతడిదగ్గర మనిషి రక్తం మాంసం వాసన వచ్చేది .మనుషుల్ని తినే జంతువు. అతడి చూపు భయంకరం ”అన్నాడు ..బలపడిన హిట్లర్ స్వతంత్రముగా ఉన్న రాజకీయ ,సాంఘిక ,సాంస్కృతిక ,సంస్థల అధికారాలను రద్దు చేసిపారేశాడు దీన్ని సింక్రనైజేషన్ ;;అన్నాడు ..ట్రేడ్ యూనియన్ లను రద్దుచేసి జర్మన్ లేబర్ ఫ్ర0ట్ఏర్పరచి  కమ్యూనిస్ట్ సోషలిస్టు పార్టీ ఆఫీసులని కూలగొట్టి  ఏక పార్టీ నాజీ ఏకవ్యక్తి హిట్లర్ పాలన ప్రారంభించాడు  ఫ్రాన్స్  లో బాస్టిల్లే పతనం 1789 లో జరిగిన జులై 14 నుంచి అమలు చేశాడు ..నాజీలు అంటే టెర్రర్ అనుకున్న హిట్లర్ ఇప్పుడు అందరికీ టెర్రర్ అయ్యాడు ప్రజాస్వామ్య మూలాలన్నీ విధ్వంసం చేశాడు .ఆటలు సంగీతం డాన్స్ లలో జ్యులు లేకుండాచేసి నాజీ లతో ఆలోచనలతో నింపాడు .జర్మన్ ఆర్ట్ లో విదేశీయులు దూరారని భావించి ఇప్పుడు జర్మన్ ఆర్ట్ కు ప్రాణం పోశాడు .జర్మన్ ఆర్ట్ సోల్ అండ్ స్పిరిట్ అనేది హిట్లర్ నినాదం   దీనికోసమే పుస్తక దహన కార్యక్రమం .చేబట్టాడు .టౌన్హాల్ ముందు రాత్రి 9-30 కి విద్యార్థులతో టార్చ్ పెరేడ్ జరిపించి ఊరేగింపు జరిపి స్వస్తిక్ జెండాలతో ,రైట్ వింగ్ పారామిలిటరీ దళాలు నడుస్తుంటే ఎస్ ఎస్ ఎస్ ఏ వాళ్ళ కేరింతలతో అరుపులు ఆర్భాటాలతో ప్రొఫెసర్లు లెక్చరర్లు విద్యార్థులు కదం తొక్కుతూ నడిచి ,అప్పటికే మధ్యాహ్నం పెద్ద పెద్ద దుంగలతో 12అడుగుల ఎత్తు  ,6 అడుగుల వెడల్పుగ తయారై  కణకణ మండుతున్న అగ్ని వేదిక  భగభగ భోగి మంటలను  వెదజల్లుతుండగా వామపక్ష జర్నల్స్ ,న్యూస్  పేపర్లు ,కమ్యూనిస్ట్ సోషలిస్టు గ్రంధాలు పోస్టర్లు కరపత్రాలు జెండాలు మంటల్లో కేరింతలతో వేసి మండుతుండగా చూసి చప్పటలతో హర్షధ్వానాలు చేస్తూ ఆపైన సోషలిస్టు టోపీలను విసిరేసి మండుతుండగా ఆనందించి వీమర్ రిపబ్లిక్ బ్యానర్లనూ తగలెట్టి రాక్షసానందాన్ని సామూహికంగా అనుభవించారు .ఇదే  బర్ణింగ్  బుక్స్ బోన్ ఫైర్ .కు నాంది .తర్వాత ఎక్కడెక్కడ ఎలా మండించారో చూద్దాం
ఇన్‌లైన్ చిత్రం 1.
ఇన్‌లైన్ చిత్రం 2
   సశేషం
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రసిద్ధులైన అయిదుగురు హవాయి మహిళలు-

ప్రసిద్ధులైన అయిదుగురు హవాయి మహిళలు-గబ్బిట దుర్గా ప్రసాద్

హవాయి ద్వీప దీపకాంతులై వెలుగులు చిమ్మిన అయిదుగురు ప్రసిద్ధ మహాళామణులను గురించి తెలుసుకొందాం ..

     1-మహిళా విద్య ఆరోగ్య దాయిని -క్వీన్ ఎమ్మా
 హవాయి  ప్రజల ఆరోగ్యం రోజు రోజుకూ  క్షీణించి పోతున్న సందర్భాన్ని గుర్తించి క్వీన్ ఎమ్మా కాలానికా మాకా 1859 లో క్వీన్స్ హాస్పిటల్ కట్టించి ప్రజలను కాపాడింది ..మసూచికం ,కలరా ఇన్ఫ్లు ఎంజా  వంటి వ్యాధులకు ఉచిత చికిత్స చేయించి ఆదుకున్నది .   1867 లో సెయింట్ఆండ్రోస్ బాలికా పాఠశాల స్థాపించి బాలికల విద్యకు మార్గదర్శి అయింది . గాత్ర సంగీతం  పియానో ,నాట్యంలలో ఆమె   అత్యధిక ప్రతిభావంతురాలు .
      2- పురుషులతో మహిళలకు సమాన హక్కులు ఇచ్చిన  -కా ఆహుమాను
హవాయి చరిత్రలో కా అహుమాను అత్యంత ప్రేరణాత్మక పాత్ర పోషించి మహిళాభివృద్ధికి దోహదం చేసింది . హవాయి సొసైటీలో ఆమెది అద్వితీయమైన పాత్ర . కామేహ మెహాకు అత్యంత నమ్మకం విధేయతకలిగి వుండి  రాణించింది . రాజు కామేహ మెహకు అత్యంత ఇష్టురాలైన భార్యగా దాదాపు ప్రధాన మంత్రి హోదాలో వుండి స్థానిక హవాయి స్త్రీల హక్కులకోసం అవిశ్రాంత కృషి చేసింది . మహారాజుతో మగవాళ్ళు తప్ప  వేరెవరు ప్రక్కన కూర్చుని భోజనం చేయని పరిస్థితి ఉండేది .ఈ పద్ధతిని మార్చేసి మగవారితో సమాన హోదాలో ఆడవారుకూడా కూర్చునే అర్హత కలిపించింది . మగవాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉన్న అన్ని కార్యకలాపాలలోను ఆడవారుకూడా  స్వేచ్ఛగా పాల్గొనే హక్కు  కల్పించి  కా అహుమాను మహిళా మార్గ దర్శిగా నిలిచింది .
    3-ప్రసిద్ధ ఎత్నో  బయాలజిస్ట్ -ఇసబెల్లా లోనా ఆబ్బట్

  మాలీ లోని హన్నాకు కు చెందిన ఎత్నో బయాలజిస్ట్ ఇసాబెల్లా కాకియా యు యాంగ్ లోనా అబ్బట్ హవాయిలో సైన్స్ లో పి .హెచ్ డి .పొందిన ప్రధమ మహిళ. చైనా ,హవాయిన్ మిశ్రమ జాతికి చెందిన ఈమె హవాయియన్ ఆల్గె ను తన హవాయియన్ తల్లి వలన విని గుర్తించి పరిశోధన చేసింది .  అకాడెమిక్ రికార్డ్ ప్రకారం ఆమె ఫసిఫిక్ ఆల్గె  పై ఎక్స్పర్ట్ .రెడ్ ఆల్గె అని పిలువబడే కుటుంబానికి చెందిన రోడో మేలాషియా తో సహా 200  స్పెసీస్  ను ఇసబెల్లా కనిపెట్టి రికార్డ్ సృష్టించింది . ఆమె కృషిని గుర్తించి రోడోమెలాషియా ను  ´´ఆబ్బొట్టెల్లా ´అని ఆమె పేరు తో గౌరవంగా పిలుస్తున్నారు . తన ప్రతిభా సర్వస్వ0 తో ఆమె ఎనిమిది గ్రంధాలు రాసింది . కాలిఫోర్నియా మాంటెరి పెనిన్సుల కు చెందిన మెరైన్ ఆల్గె  గ్రంధానికి సంపాదకత్వం వహించింది . సుమారు 150 రీసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించింది .

   4- సర్ఫింగ్ చాంపియన్ -రెల్  సన్
రెల్  కపోలియోకా ఎధు కాయ్ సన్ హవాయికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ సర్ఫింగ్ చాంపియన్ మాత్రమేకాక స్పోర్ట్స్ లో మార్గ దర్శి కూడా . చాలా ప్రశాంత చిత్తం తో దృఢ సంకల్పం తో ఉండే ఈమె చక్కని రైడింగ్ శైలికి ఆద్యురాలు . సర్ఫ్ కమ్యూనిటీ లో ఐక్యత సాధించి ,´ప్రో ఉమెన్స్ కాంపిటీటివ్ సర్ఫింగ్ సర్క్యూట్ ´ఏర్పడటానికి కృషి చేసింది . 1975 లో తనకు అత్యంత అభిమానమైన నార్త్ షోర్  లోని బీచ్ లో మొట్టమొదటి ఫీమేల్ లైఫ్ గార్డ్  అయింది .
 రెల్ ను అందరూ అభిమానంగా ´ఆంటీ రెల్ ´అని పిలుస్తారు . ఆమెకు వచ్చిన ´బ్రెస్ట్ కేన్సర్ ´ను ధైర్యం తో ఎదుర్కొని ఆరోగ్యం పొందినందుకు ఆమెను అందరూ గొప్పగా అభినందించి ఆరాధించారు . 1983లో డాక్టర్లు కేన్సర్ ను గుర్తించి ఆమె ఒక ఏడాదికన్నా ఎక్కువ కాలం బ్రతకదని తేల్చి చెప్పారు . 15 ఏళ్ళు అనుక్షణం మరణ యాతనతో పోరాడి గెలిచి 2-1-1998 న మరణించింది రెల్ -ది రియల్ హీరోయిన్ .
   5- అమెరికన్ కాంగ్రెస్ కు ఎన్నికైన ప్రధమ ఏషియన్ అమెరికన్ మహిళ-పాట్సి టి మింక్
అమెరికన్ కాంగ్రెస్ కు ఎన్నికైన మొదటి ఏషియన్ అమెరికన్ పాట్సి టోకెమోటో మింక్ . ఆమె స్థానికంగాను అమెరికాలోను సంచలనమే సృష్టించింది . 1960 లో పదివేల డెమొక్రాట్ నేషనల్ కన్వెన్షన్  ను ఉద్దేశించి టెలివిజన్ లో ప్రసంగించి అబ్బుర పరచింది . ఆ పార్టీలోని మూడువంతులు సభ్యులచేత సివిల్ రైట్స్ పై అభి వృద్ధికరమైన ఆలోచనలకు ఆమోదం తెలియ జేయించిన ఘనత ఆమెది . సివిల్ రైట్స్ కమిషన్ ను శాశ్వత కమీషన్ గా ఉంచటానికి ఆమె చేసిన కృషి బహుధా ప్రశంశనీయమైంది . ´ఫెడరాలిటీ  ఫండ్ ఎడ్యుయేషన్ ప్రోగ్రామ్ ´లో లింగ వివక్షతను  నిషేధించే ´టైటిల్ 9 ´గ్రంధాన్ని రాసింది . 1972 లో ప్రెసిడెన్షియల్ నామినేషన్ ఫర్ డెమొక్రాటిక్ పార్టీ కి మొదటి ఏషియన్ -అమెరికన్ మహిళ అయిన గౌరవం పొందింది .
                                                                                                           -గబ్బిట దుర్గాప్రసాద్
———————————————————————————————————————————
Posted in రచనలు | Tagged | Leave a comment

ఘోరకలి -3

ఘోరకలి -3

”Power tends to corrupt and absolute power corrupts absolutely ”అన్నాడు లార్డ్ జాన్ యాక్షన్ 18 87 లోనే .హిట్లర్ ఈ మాటలను రుజువు చేద్దామని కంకణం కట్టుకున్నాడు . దీనికి ఎన్నో మాయోపాయాలు నక్కజిత్తులు ,కపట నాటకాలు తడిగుడ్డతో గొంతులు కోయటాలు చేసిపారేశాడు పావులు చకచకా కదిపాడు అవతలి వాళ్ళను చిత్తైపోయేట్లు దిగ్భ్రము లోనయ్యేట్లు  నటుడు మహేష్ పోకిరిలో చెప్పిన మైండ్  బ్లాకయ్యేట్లు   చేశాడు శకునికి మించిన రాచకీయ జూదం ఆడాడు గోకర్ణ గజకర్ణ మాయల మరాఠీ విద్యలన్నీ ప్రదర్శించాడు .అదృష్టవంతులకే కాదు దురదృష్టవంతులకూ కాలం కలిసి వస్తుంది .జర్మన్ బజారులో పెయింటింగులు అమ్ముకుంటూ చింపి గుడ్డలు  కట్టుకొని నిలువ నీడ లేక  తిరిగినవాడికి అదృష్టం వరించి అందలమెక్కించింది . నహుషుడి లా కళ్ళు నెత్తికెక్కవా  ?గర్వం తో కళ్ళు మూసుకుపోవా.  ఉచ్ఛనీచాలు మర్చిపోయి పిచ్చ పిచ్చగా ప్రవర్తించి జర్మనీ ప్రజాస్వామిక పార్లమెంట్  మూడవ రీచ్ ను  ను చిదిపి ఛిద్రం చేసి వాళ్ళతోనే రాజాధి రాజమార్తా0డ,   చక్రవరి ఫురేర్   డిక్టేటర్  అనిపించుకున్నాడు దేనికీ ఎదురు లేకుండా సర్వాధికారాలు వారితోనే కట్ట బెట్టించుకొని థర్డ్ రీచ్  కి దిశా నిర్దేశం చేశాడు .ఎదురొస్తే ఖతం .దీనికి వంటపాడిన వాళ్ళు ఎస్ఎస్  దళం  ప్రచార సార్వ భౌమ గోబెల్స్ వగైరా .
  ఎర్నెస్ట్ రోహం ఎస్ ఎ.  ను బలమైన జర్మనీ సాధారణ సైన్యం ను  గడ గడ లాడించి ,హిట్లర్ అధికార ఆరోహణకు వీధి రౌడీలను  రివాల్యూషన ర్ల ను  అందించింది .వీళ్ళు  వ్యతిరేకుల  గొంతు  నొక్కేశారు . హిట్లర్ ఛాన్సలర్ అవగానే వీళ్ళను కరేపాకు ఏరేసినట్లు ఏరేశాడు . ఇది రోహీమ్ కు నచ్చలేదు .అతడు జర్మనీ అంతా ఎస్ ఎస్ఏ  చేతిలోకి వచ్చి జర్మన్ ఆర్మీని కంట్రోల్ చేయాలనుకున్నాడు .ఘటికుడైన హిట్లర్  వ్యాపార  మిలిటరీ సంస్థల తోడ్పాటు లేనిదే చక్రవర్తి కాలేనని గృహహించాడు .వాళ్ళతో మాట్లాడి ఎస్ ఏ వాళ్ళ పవర్ తగ్గించేశాడు .రోహీమ్ ను వదిలించుకోవడానికి రీన్ హార్డ్ హెడ్రిచ్ ని ఉసిగొల్పాడు .ఎస్ ఏ బలపడితే తమ ఉనికికి ప్రమాదమని గ్రహించాడు రోహీమ్ ను బలహీనపరిచే చర్యలన్నీ చేశాడు నాజీపార్టీలో ఒక సీక్రెట్ సెల్ ఏర్పాటు చేశాడు .వీళ్ళు సహజం గా హోమో సెక్సువల్స్ అన్నవిషయం అందరికీ తెలుసు .ఇదేదో తామే కనిపెట్టినట్లు పెద్ద బిల్డప్ ఇచ్చారు వ్యతిరేకులు .
   19 34 జూన్ 30 న వీళ్ళ భరతం పట్టటానికి మాస్టర్ ప్లాం వేశాడు హిట్లర్ అదే ”నైట్ ఆఫ్ ది లాంగ్ నైవ్స్ ”హిట్లర్ అనుచరులు బ్రయోన్ షార్ట్ ఎస్ ఏ లను చుట్టుముట్టి బజారులో కాల్చి చంపించాడు కొందరు ఇళ్లల్లోనే కైమా అయ్యారు మిగిలిన వాళ్ళు జైలుపాలయ్యారు రోహిన్ ను తెల్లవారుజామున హిట్లర్ ఆర్డర్ పై కస్టడీ లోకి తీసుకొని ఎక్సిక్యూట్ చేశారు .ఈ ఆకస్మిక హననం లో ఎంతమంది చచ్చారో తెలియదు కనీసం వందమందిని లేపేసి ఉంటారు .వీళ్ళ చావుపై విచారణ లేదు కారణం వీరంతా దేశ ద్రోహులని ముద్ర వేయటమే ..హిట్లర్ అండ్ కో కు ఆ రాత్రి శుభ రా త్రి .ఎస్ ఏ  లకు కాళరాత్రి .ఈ హత్యలు ఆగిపోక ముందే జనరల్ వీల్ హెల్మ్ వాన్ బ్లూమ్ బెర్గ్ సైన్యం పూర్తిగా ఫ్యుహెర్ హిట్లర్ ను సమర్ధిస్తున్నట్లు ప్రకటించాడు హీంలర్ కు ఘెట్టో ఆపరేషన్ అధికారం కట్టబెట్టాడు హెడ్రిచ్ కి రోజువారీ కార్యక్రమాలకు -హత్యలకు అధికారం వచ్చింది గోరింగ్ విమాన దళం అనబడే లూప్త్వాఫీ కి అధికారిఅయ్యాడు హిడేన్ బర్గ్ చనిపోయాక హిట్లర్ ప్రెసిడెంట్ ఛాన్సలర్ అయ్యాడు .అంటే సైన్యం కూడా హిట్లర్ చేతిలోకి వచ్చి సర్వ సత్తాక నియంత అయ్యాడు ఒకే దెబ్బకు ఎన్ని పిట్టాల్నో రాల్చేశాడు హిట్లర్ ..
               శుద్ధ జర్మనీ
  అధికారాలన్నీ హస్తగతమయ్యాక హిట్లర్ అనవసరమైన వాళ్ళను ఏరిపారెయ్యాలని జర్మన్ల శుద్ధ రక్తం కలుషితం కాకూడదని భావించాడు .హోమో సెక్సువల్స్ ను ముందు అరెస్ట్ చేయించి బహిష్కరణ (డిపోర్టేషన్)కాంప్ లకు తరలించాడు దీన్ని మతగురువులు సమర్ధించారు వీళ్ళవలన పబ్లిక్ హెల్త్ దెబ్బ తింటుందని గగ్గోలు పెట్టించాడు జర్మనీ అంతా గాలించి హోమోలను హోమో అని అనుమానమొచ్చింది వాళ్ళనూ అరెస్ట్ చేశారు .. తర్వాత చర్య ”జెహోవాస్ విట్నెస్ ”అంటే నాజీ పతాకమైన స్వస్తిక్ పతాకానికి సెల్యూట్  చేయనివారిని అగౌరవ పరచినవారినీ  హిట్లర్ కు విధేయత ప్రకటించనివారినీ  ,ఆర్మీలో  చేరనివారినీ ”రాజ ద్రోహులు ”(treasons) గా ముద్రవేసి బొక్కలో పెట్టారు .మతాన్నివదిలేసి రీచ్ కి కొందరు సాల్యూట్ కొడితే కొందరు వ్యతిరేకించి చువ్వలు లెక్కబెట్టారు .
           జిప్సీ ల హననం
 తరువాత ఘనమైన హిట్లర్ గారి ద్రుష్టి జిప్సీ లపై ప్రసరించింది .ఈ సంచార జాతికి థర్డ్ రీచ్ లో స్థానమే లేకుండా పోయింది .వాళ్ళు నల్లగా ఉండే సంచారులు వాళ్లకు స్వతంత్రం కావాలి ఎవరి కంట్రోల్ లోనూ ఉండని జాతి .వాళ్ళు సోషల్ ఆర్డర్ ను భంగపరచి ఆర్య రక్తాన్ని కలుషితం చేస్తున్నారని హిట్లర్ ఉవాచ . అందుకని 1930 లో నాజీలు జిప్సీ  సమస్యకు పరిష్కారం ఆలోచించింది స్థానిక పోలీసులు వారిపై దొంగతనం దోపిడీ ,సోమరితనం  అభియోగాలు మోపి అరెస్ట్ చేసే అధికారం ఇచ్చాడు .సహజం గా వాళ్ళకు జర్మనీ పౌరసత్వం ఉండదు కనుక వాళ్ళను దేశ బహిష్కరణ చేయటం తేలిక యింది .
           జ్యుల ఏరివేత
1935 లో నాజీ నేషనల్ కాన్ఫరెన్స్ నూరేం బెర్గ్ లో జరిగి మొదటిసారిగా జ్యుల కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఇక వరుస స్టేట్ మెంట్లు షురూ చేశారు .జర్మనీ వాళ్ళు కానీ జర్మన్ రక్తమున్నవారుకాని  జ్యుల తో వివాహ మాడటాన్ని  15-9-1935 న చట్టం ద్వారా రద్దు చేశారు పిల్లలు పుట్టే వయసున్న జ్యులు కాని   ఆడపిల్లలు   జ్యుల ఇళ్లల్లో పనిమనిషులుగా ఉండరాదని శాసించారు .చివరికి జ్యులు జర్మనీ జాతీయ జెండా ఎగుర వేయటాన్ని నిషేదించారు ..నవంబర్ 14 న జ్యుల పౌరసత్వాన్ని ఓటుహక్కును లాక్కుని   ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలనుంచి ఊడబెరికారు  .
                      వెర్రి వెయ్యి విధాలు
స్వచ్ఛ రక్త నినాదం జ్యులు జిప్సీలు ,ఇతర తక్కువ స్థాయి మనుషుల విషయంలోనే కాక రీచ్ పౌరుల విషయం లోనూ అవలంబించారు ..దీనికోసం దేశవ్యాప్తం గా  ”జాతి ఆరోగ్యం ”(రేషియల్ హైజీన్ )ప్రోగ్రామ్ అమలు జరిపారు .ఉత్తమ మానవ జాతిని సృష్టించటం ”అనే యుజెనిక్స్ ”ను అమలు చేశారు దీనికోసము వంశ చరిత్రలను త్రవ్వి తీశారు .జీన్ ఆధారంగా మానవ స్వభావాలుంటాయని ఈ శాస్త్రం చెబుతోంది .ఉదాహరణకు ”దాలా సోఫీల్లా ”అనే జీన్ ఉన్న వారి వంశం అంతా నౌకా రంగం లో రాణిస్తారు ”నోమాధిజం ”జీన్స్ ఉంటె ఇంటిపట్టున ఉండకుండా ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు ఇది వారసత్వ లక్షణమై జిప్సీలు ,కోమాంఛెస్ తెగలు సంచార జాతులయ్యాయి ..ఇవాళ ఈ విషయాలు నవ్వు పుట్టిస్తాయికానీ హిట్లర్ కాలం లో ఇదేంటి అని ఎవరూ ప్రశ్నించలేదు .యుజెనిక్స్ అప్పుడు ఒక గొప్ప శాస్త్రమై నాజీకాలం లో విజృంభించింది  ..దీన్ని అడ్డం పెట్టుకొని నాజీలు  బలవంతపు  స్ట్రెయిలైజేషన్ అమలు చేసి అంటేలోపమున్న వ్యక్తులకు బలవంతంగా  సంతానోత్పత్తి లేకుండా చేసి జాతిని శుద్ధి చేసే ప్రయత్నం చేశారు .దీనికి అనుగుణంగా చట్టాన్ని 1933 జులై 14 న తెచ్చి అనువంశిక లోపాలు లేకుండా జాతి శుద్ధ రక్తం  కలుషితం కాకుండా చేస్తున్నట్లు ప్రకటించి ఇందిరా గాంధీ కాలం లో కొడుకు సంజయ గాంధీ ప్రవర్తించినట్లు బలవంతపు కుటుంబ నియంత్రణ చేసిపారేశారు .మానసిక బలహీనులు మానసిక రోగులు ,కొన్ని రకాల నరాల  జబ్బువాళ్ళు ,గుడ్డి  కుంటి క్రానిక్ ఆల్కహాలికులు అందరూ దీని బారిన పడ్డారు ..ఆతర్వాత తెలివిమీరిన ప్రభుత్వం వ్యక్తులకు అనుమతి లేకుండానే ,వాళ్ళకసలు తెలియ కుండానే స్టెరిలైజేషన్లు శత సహస్రాలుగా చేశారు .ఎలా చేశారో జర్మన్ చరిత్రకారుడు అలెక్సా0డర్ మిత్స్ రిలీచ్ ”వ్యక్తులు డాక్టర్ ఎదురుగా కుర్చీలలో కూర్చుని ఫారాలు ఫిలిప్ చేస్తుంటారు వారికి తెలియ కుండానే ఎక్స్ రే పరికరాలు వాళ్ళ కుర్చీలకిందనే పెట్టి వాళ్ళ జనానావయవాలపై మూడే మూడు నిమిషాలు కిరణ ప్రసారం చేయించి స్టెరిలైజేషన్ చేశారు ”అని రాశాడు . ఇంతకంటే ఘోరం -మాస్ స్టెరిలైజేషన్ కోసం ఒక ఇర్రిటేటింగ్ పదార్ధాన్ని స్త్రీల  గర్భాశయం లోకి   పంపి  అండ ఉత్పత్తి ని నాశనం చేసి పిల్లలు పుట్టకుండా చేయటం .ఈ పని నమ్మకమైన చెకప్ పేరిట డాక్టర్ల చేత ఇంజెక్షన్లు చేయించటం .ఇలా జరిగిందని పేషేంట్ కు అసలు తెలియని తెలియదు నమ్మక ద్రోహం అంటే ఇదే .ఇదేమీ కాకమ్మకబుర్లుకావు స్టెరిలైజేషన్ ప్రాజెక్ట్ లో పాల్గొన్న కార్ల్ బ్రాన్డ్ట్ చెప్పిందే -”పెద్దగా డబ్బు ఖర్చుకాని అతి తేలికైన ,త్వరగా జరిగే స్టెరిలైజేషన్ ను జర్మన్ రీచ్ కు వ్యతిరేకులైన రష్యన్లు ,పోల్స్ జ్యుల పై ప్రయోగించారు.ఇది శత్రు వులను ఓడించటమే కాక సంపూర్ణ శత్రు సంహారం చేస్తుంది ”అని నమ్మకంగా చెప్పాడు
             అర్ధ రాత్రి అంకమ్మ శివాలు
  1938 అక్టోబర్ 27 న హిట్లర్ జ్యులకు వ్యతిరేకంగా ఒక చట్టం తెచ్చి 18 వేలమంది జ్యులను జర్మనీ నుంచి బహిష్కరించాడు వీళ్ళు పోలాండ్ ,రష్యాలలో పుట్టినవాళ్ళు కనుక వాళ్ళు జర్మన్ పౌరులు కాదుఅన్నాడు .వాళ్ళ ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కుక్కలని పిల్లుల్ని కుక్కినట్లు వాన్ లలో కుక్కి పశువులను సంతకు తోలుకు వెళ్లినట్లు సరిహద్దులలదాకా తీసుకొని వెళ్లి వాళ్ళమానాన వాళ్ళను వదిలేశారు .ఇందులో ఒక బాధితుడు జిండెల్ గ్రీన్ స్పీజిన్ ”ఎవరిదగ్గరా చిల్లిగవ్వ కూడా లేదు పదిమార్కులడబ్బుదాటి ఉంటె లాగేసుకున్నారు .ఇదేమిటి అంటే ఇదే  జర్మన్ చట్టం అన్నారు .ఎస్ ఎస్ మనుష్యులు మమ్మల్ని కొరడాలతో కొట్టారు  రక్తం కారిపోతున్నా  కనికరించలేదు మా సామాన్లన్నీ లాగేసుకున్నారు .అత్యంత ఆటవికంగా పాశవికం గా మా జీవితాలతో ఆటలాడారు ..జర్మనీలో ఇదే నేను చూసిన మొట్టమొదటి అమానుష చర్య ”అని  ఆతర్వాత గుర్తు చేసుకున్నాడు . అయ్యా అదీ హిట్లరయ్య నాజీ నియంత పాలన .
  జ్యుల నివాసాలపై పడి  దోచుకుని తగలబెట్టి భయపెట్టి చంపి విధ్వసం సృష్టించారు ఫైరింజన్ వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. వేలకొద్దీ జ్యుల ఆరాధనా స్థలానను ,7500 వ్యాపార సంస్థలను నాశనం చేశారు  లక్షలాది జ్యులను చంపారు .ఇంత  చేసిన హిట్లర్ ఆల్కల్ తాగేవాడుకాదు సిగరెట్ అలవాటులేదు పూర్తి శాకాహారి ,పెళ్లి పెటాకులు సంసారం చట్టబండలు లేనివాడు .మానవ సంబంధాలు తెలియనివాడు ప్రేమ  స్నేహం అంటే ఏమిటో తెలీనివాడు అంటే నమ్మగలమా నమ్మాలి ఇది నిజమే ..గోముఖ వ్యాఘ్రం సరైన పదమా ?ఇతని కేరక్టర్ ను చార్లీ చాప్లిన్ ”డి గ్రేట్ డిక్టేటర్ ”మూకీ చిత్రం లో అద్భుతంగా ఫన్నీగా పోషించి చూపాడు .
 ఇన్‌లైన్ చిత్రం 1
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-17 కాంప్-షార్లెట్ -అమెరికా

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘోరకలి -2

ఘోరకలి  -2

        మరో మృత్యుద్వారం -ఘెట్టో
నాజీ యుద్ధ తంత్రం యూరప్ అంతా మోహరించి జ్యుస్ ను అందరి లోనుంచి  వేరు చేయటం ప్రారంభించింది . వాళ్ళను తేలికగా గుర్తు పెట్టె వీలుగా జ్యులు ఎందరో ”ఎల్లో జ్యుఇష్ స్టార్ ”లను ధరించాలని ఆదేశించింది .వాళ్ళ ఐడెంటిటీ పేపర్లలో పెద్ద అక్షరం తో  ”j”ఉండేట్లు చేసింది వాళ్ళందరూ ప్రత్యేక నివేశన స్థలాలలోనే ఉండాలని శాసించింది .ఇవే ”ఘెట్టోలు ”.ఈ పనిని తాము ఆక్రమించుకున్న దేశాలనుంచి ముందుగా ప్రారంభించింది .వీటికోసం బాగా మురికి వాడలను ఎంపిక చేసింది దాని చుట్టూ గోడకాని బార్బెడ్ వైర్ ఫెన్స్ కానీ ఏర్పరచి ,,మైళ్ళ దూరాలలో ఉన్న జ్యు లను కాలినడకన నడిపించి ఇందులో పడేయించింది .అక్కడ అందరూ కిక్కిరిసిన గదులలో గాలి వెలుతురూ లేక సరైన మరుగుదొడ్లు లేక నీచ నికృష్ట జీవితం గడిపేట్లు చేసి అంటువ్యాధులు ప్రబలటానికి దోహదం చేసింది .చాలామంది టైఫాయిడ్ క్షయలతో బాధపడి చనిపోయారు .బొచ్చెలో ఇంత చాలీ చాలని రేషన్ కూడు పడేసి చావ లేక బతకా లేక త్రిశంకు స్వర్గం లో వేలాడేట్లు చేసింది ..డబ్బున్నవాళ్ళు ఇళ్ల నో  స్థలాలలో అమ్మి కానీ తనఖా పెట్టికానీ డబ్బు పొంది బయటినుంచి కావలసిన తిండి తెప్పించుకొనేవారు ..ఘెట్టో లో బతకాలీ  అంటే నాజీలు చెప్పిన ఏదో పని చేసిబతకాలి అదొక్కటే మార్గం ఇదీ బానిస బతుకే . విపరీతమైన ఎండా వానా చలి లో ఆడవ  చాకిరీ చేసి ,ఒళ్ళంతా గుల్ల చేసుకొని బతికారుపాపం .దీనితో నీరసం వచ్చి జబ్బులపాలయ్యేవారు .అక్కడ వాళ్లకు ఏమైందో తెలియదుకాని ఈ ఘెట్టోలనుంచి బతికి బయటపడిన వారు కనిపించనే లేదు .
          ఇంకో చావు తెలివి -ఆపరేషన్ బార్బరోస్సా
1941 స్ప్రింగ్ కాలం లో నియంత హిట్లర్ ”ఆపరేషన్ బార్బరోస్సా ”ప్రారంభించి సోవియట్ యూనియన్ పై దాడి చేశాడు .స్టాలిన్ తో అంతకు ముందు చేసుకున్న ఒడంబడికను గాలికొదిలేశారు హిట్లర్ ..ఇప్పుడుకూడా అతని సై నికాధికారులు వద్దనే వారించారు .ఇలా చేస్తే జర్మనీ సైన్యం చాలా చోట్ల మోహరించాల్సి వస్తుందని దానితో సైనిక పాటవం బలహీనమవుతుందని హెచ్చరించారు . రాజు కంటే మోండివాడు గొప్ప అన్నట్లు రాజూ చక్రవర్తి నియంత ఫురోర్ అయిన సర్వాధికారాలు చేతిలో ఉన్నహిట్లర్ మొండోడి కంటే గొప్పవాడై వాళ్ళమాట పట్టించుకోలేదు రుడాల్ఫ్ హెస్ కూడా వద్దన్నాడు .హిట్లర్ అతడిని విజయానికి తోడ్పడమన్నాడు .ఇంగ్లా0డ్ తో ఉన్న ఒప్పందం ప్రకారం పడమర భాగాలను అది కాపాడుతుందని తూర్పు వైపు జర్మన్ దాడికి ఇంగ్లాన్డ్ సహకరిస్తుందని నచ్చ చెప్పాడు .ఈ పని తానే  చేయాలని హెస్  రహస్యంగా పారాచూట్ లో ఇంగ్లాన్డ్ వెళ్లగా అతడు మానసికంగా బలహీనుడని భావించి జైల్లో పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం .జర్మనీ కి ఎంతో సేవ చేసి హిట్లర్ కు కుడిభుజంగా ఉన్న హెస్ ను హిట్లర్ తో నాజీలందరూ దేశద్రోహి అనే ముద్రవేసి అవహేళన చేసి అవమానించారు .అతడు చేసిన మంచి అంతా గాలిలో కలిసిపోయింది ..
  1941 జూన్ 22 న జర్మన్ సైన్యం రష్యా సరిహద్దులు దాటి లోపలి ప్రవేశించింది దీనితో ఆపరేషన్ బార్బరోస్సా ప్రారంభమైంది .వెంటనే స్టాలిన్ జర్మనీపై యుద్ధం ప్రకటించి కూటమిలో చేరాడు ..యుద్ధం లో రష్యా తో తలపడటమే కాదు హిట్లర్ మనసులో మరో ముఖ్య ఆలోచనా సుళ్ళు తిరుగుతోంది .బార్బరోస్సా నెపం తో జ్యుల సమస్యను పరిష్కరించాలని భావించాడు .కొన్ని యూనిట్లు ”Einsatzgruppen ”పేరుతొ సైన్యం వెంట వెళ్లాయి .ఈ యూనిట్లది  ఒకటే లక్ష్యం -జ్యులను ,పనికి మాలిన ,అక్కర లేని వాళ్ళను చంపేయటం . సరైన లక్ష్య నిర్దేశం తో ఈ యమభట యూనిట్లు  సామూహిక మరణాలను పకడ్బందీ గా చేసేశాయి .సెప్టెంబర్ 29 30 తేదీలలో యుక్రెయిన్ లోని ”బాబ యార్రవైన్  ”లో అత్యధిక సంఖ్యలో యూదులను ఊచ కోత  కోసేశారు ”Einsatzgruppen ”యూనిట్లు వేలాది యూదులను చుట్టు ముట్టి రవైన్ కుఅంటే లోయలోకి  ”తోలుకు ”వెళ్లారు . ఈ మృత్యు  దళాలన్నీ ఒకే రకంగా పని చేశాయి .ముందుగా జ్యుల  బట్టలు బలవంతంగా  విప్పించేశారు నగ్నం గా చేస్తే సిగ్గుతో ఎదురు తిరిగే ధైర్యం రాదనీ నాజీలనమ్మకం . ఆ బట్టల్ని రీచ్ లో కావాల్సినవారికి అమ్మేశారు .  ఈ ఘోరకలి ని చూసిన ఒక ప్రత్యక్ష సాఖికధనం -”లోయలో అడుగున అప్పటికే చంపబడిన జ్యు ల శరీరాలపై  అంటే శవాల గుట్టలపై  వీళ్ళను అతి వేగం గా పడుకో బెట్టారు .మార్క్ మాన్ వచ్చి ప్రతి జ్యు ను మెడపై పిస్టల్ తో కాల్చాడు .అతడు చావగానే మరో జ్యు ను ఆతర్వాత ఇంకో జ్యు ను నిరాటంకంగా వరుసబెట్టి కాల్చి చంపుతూనే ఉన్నాడు  .ఆడ ,మొగా పిల్లా జెల్లా అనే విచక్షణే లేదు .పసిపిల్లని తల్లి చంకలో ఎత్తుకొనేట్లు చేసి దారుణంగా చంపారు ఆ నికృష్టులు ”అని చెప్పాడు ..ఈ రెండు రోజుల్లో మృత్యుదళాలు 33,771 మంది యూదులను  చంపేశారు .బాబీ యార్ లోయ అంతా జ్యు ల మృత్యు కళేబరాలతో నిండి పోయింది .
   తర్వాత గాస్ చేంబర్లున్న మొబైల్ వాన్ లలో కూర్చోబెట్టి చంపారు వాన్లలో జ్యు లను కోళ్లను కుక్కినట్లు కుక్కి దాని డోర్ కు తాళం పేట్టి సీలు వేసి కార్బన్ మోనాక్సయిడ్ విషవాయువును వాన్ లోకి వదిలి అందరూ చచ్చే దాకా కాపలా కాశారు .ఇదో మృత్యుహేల పైశాచికానందం . ఈ మృత్యు యూనిట్లు రోజుకు ఒక లక్షమందిని చంపారంటే ముక్కున వేలేసుకొంటాం .నిజమే ఆ చావు  వాసన భరించలేక. .ఈ వేగం చాలలేదట మహా నియంత హిట్లర్ కు .. 1941  వేసవిలో ”యూరప్ లో ఉన్న జ్యు  కమ్యూనిటీ నంతా సంపూర్ణంగా అంతమొందించాలి ”అని హిట్లర్ తన అరమీసాలపై చెయ్యేసి శపథం చేశాడు .  కనుక ఇది అమలు చేయటానికి మరొక నరాంతక కీచక మార్గాన్ని అవలంబించాలని పధకం పన్నాడు . అతడి బుర్ర డెవిల్స్ వర్క్ షాప్ అయింది .
                      తుది  పరిష్కారం
 జ్యు  సమస్యకు అంతిమ పరిష్కారం కోసం ప్రణాళిక రీన్ హార్డ్ హెర్డ్రిచ్ కు హిట్లర్ అప్పగించాడు . 1942 జనవరి 20 న బెర్లిన్ పరిసరాల్లో ఉన్న వాన్నెసీ లో జరిగే మీటింగ్ లో దాన్ని హిట్లర్ ముందుంచాడు .ఈ పధకం ప్రకారం జ్యు లనందర్నీ సమావేశపరచటం ,వాళ్లకు ప్రయాణ సౌకర్యం కలిపించి రైళ్లలో ఎక్కించటం అక్కడినుంచి సమూల దుంపనాశనం చేసే కాంప్ (ఎక్స్టె ర్మి నేషన్ కాంప్ )లకు తరలించడం అక్కడ సామూహిక నరకం లోకి తోసెయ్యటం ఇందులో దశలవారీ పధ్ధతి .ఆ కాంప్ లు ప్రత్యేకంగా వేలాది మందిని అతి తక్కువ కాలం లో కిక్కురుమనకుండా ,పకడ్బందీగా  అత్యంత నైపుణ్య సామర్ధ్యాలతో చంపటానికి వీలుగా తయారు చేయించారు .చావు తెలివి తేటలంటే ఇవే మరి . ఇలాంటి మృత్యుకుహరాలను నాలుగు చెల్మ్నో ,బెలీజెక్ ,ట్రెబ్లింకా  శోబిబోర్ లలో ఏర్పాటు చేశారు.రెండు కాన్సంట్రేషన్ కాంప్ Auschwitz ,Majdanek లను కిల్లింగ్ సెంటర్లుగా మార్చారు ..ఇవి మనం చెప్పుకున్న ఏదనేషియా అంటే మెర్సీ కిల్లింగ్ సెంటర్ లను పోలినవే .ఇవన్నీ భయంకర అత్యంత మరణ సామర్ధ్యమున్న చావు కేంద్రాలే .షవర్ బాత్ లులాగా అనిపించే విషపు గ్యాస్ చేంబర్లు  శవదహనం క్షణాలమీద చేసే అతి విశాల దహన వేదికలతో భూలోక నరకాలుగా ఆఘ మేఘాలమీద తయారు చేయించారు .
   వాన్నెస్సే కాన్ఫరెన్స్ అయినఏడాదికే సోవియట్ యూనియన్ జర్మనీని తూ ర్పుయుద్ధం లో  చావు దెబ్బ తీసింది  2.-2-19 42 న  91 వేల  జర్మన్ సైన్యం స్టాలిన్గ్రాడ్ లో లొంగిపోయింది .అసలు 2,85 000 మందిలో యుద్ధం లో బతికినవాళ్లు వీళ్ళే. అత్యంత విశాల థర్డ్ రీచ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేద్దామనుకున్న నరరూప రాక్షస హిట్లర్ కు  ఈ అవమానం  అశనిఘాతమే అయింది  . యుద్ధం లో చావుదెబ్బతిన్నా జర్మన్ సైన్యం ,ఎస్ ఎస్ వాలంటీర్లు తుది పరిష్కారానికి పని చేస్తూనే ఉన్నారు .చావు రైళ్లు పరుగెత్తుతూనే ఉన్నాయి వేలాది మంది జ్యు లు తరలింపబడుతూనే ఉన్నారు ,గాస్ చేంబర్లు శవదహన వాటికలు ఇరవై నాలుగు గంటలూ పని చేస్తూ జ్యు హననం చేస్తూనే ఉన్నాయి .కాంపులలోని పెద్దపెద్ద ఇటుక చిమ్నీలనుంచి శవాల బూడిద ,పొగా  గాలిలోకి నిరంతరం చేరుతూ కారుకంపు కొడుతూనే ఉంది .ఈ ఫైనల్ సోల్యూ షన్ పితామహుడైన రీన్హర్ హి డ్రిచ్ ను జేక్ అభిమానులు పట్టుకొని చంపేసి పరిష్కారకర్త  జీవితాన్ని అనంత వాయువులోకలిపి పరిష్కరించారు ఎవడు తీసుకున్న గోతిలో వాడు పడటం సహజమే దీన్ని క్రూర ప్రతీకారం అన్నది జర్మన్ ఏ ఎస్ దళం .ఈ తుదిపరిష్కారాన్నే ”ఆపరేషన్ రీన్ హార్డ్ ”అన్నారు . రీన్ హార్డ్ హేడ్రిచ్  హత్యకు  ప్రతీకారం గా ఎస్ ఎస్ దళాలు 13 వందలమంది జేక్ లను విచక్షణా రహితంగా చంపేసి  లిడికో అనే చిన్న పట్టణాన్ని ధ్వంసం చేసి నేల మట్టం చేశారు.బెర్లిన్ లో 152 మంది జ్యు లను ఉరితీసి 3 వేలమంది జ్యు లను కాన్సెన్ట్రేషన్ కాంప్ లనుంచి పోలాండ్ లోని హనన కేంద్రాలకు తరలించారు
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2
ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4ఇన్‌లైన్ చిత్రం 5
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా 

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్కూల్ లో మా మనవడు చి ఆశుతోష్ ట్రంపెట్ కచేరి -4-5-17 సాయంత్రం

This gallery contains 8 photos.

More Galleries | Tagged | Leave a comment

ఘోరకలి -1 ,

ఘోరకలి -1         ,

జర్మనీలో హిట్లర్ నియంతకాలం లో జరిగిన దారుణ మానవ కాండ నరజాతి చరిత్రలో రక్తపు మరకలను మిగిల్చింది . అంతకు పూర్వం రష్యా చైనా లలో మానవ హననం జరిగింది కానీ ఇక్కడ పగా ద్వేషం జాతి నిర్మూలన తోపాటు పసిపిల్లలు వృద్ధులు ,పిచ్చివాళ్ళు అంగవైకల్యమున్నవారు ,,ముఖ్యం గా యూదులు ,జిప్సీ జాతులను భూమి మీదే లేకుండా చేయాలని ఆర్య రక్తమే స్వచ్ఛమైనది మిగతా రక్తం లేని స్వచ్ఛ ఆర్యరక్తపు జనాలతో  నూతన జర్మనీ నిర్మించాలన్న పగటి క లలతో ఇంతటి ఘోర కలి  సృష్టించారు .ఆ బీభత్సం జరిగి సుమారు 80 ఏళ్ళు అయినా ఎందరెందరో ఇప్పటిదాకా ఎన్నెనో రహస్యాలు వెలికి తీసి చరిత్ర కెక్కిస్తున్నా ,చదివిన ప్రతిసారీ గుండె చె రువైపోతూనే ఉంటుంది ఒళ్ళు గగుర్పాటు పొందుతూనే ఉంటుంది ఆ అభాగ్యులపట్ల కళ్ళు చెమరిస్తూనే ఉంటాయి ఆ నర రూప కిరాతుల అనాగరిక వికృత చేష్టలకు  బాధ్యులైన వారిపై కసి ద్వేషం ఉవ్వెత్తున ఉబుకు తూనే ఉంటుంది . రక్తం మరుగుతూనే ఉంటుంది ఇంతటి ఘోరకలి ఎప్పుడూ ఏదేశం లోనూ చూసి విని ఉండరు .
  హిట్లర్  స్టూడెంట్ లాండ్ ను వశ పరచుకున్నాక జెకోస్లో వేకియాపై ద్రుష్టి లేదన్నాడు.దాని సరిహద్దుల జోలికి రానని అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు  ఆత ను చెప్పేది ఒకటి చేసేది మరొకటి అబద్ధాలాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య -కాదుకాదు వెన్నుతో పుట్టిన విద్య . 1939 మార్చ్ 15 ఉదయం 6 గంటలకే జర్మనీ సైన్యం జెకోస్లోవేకియాపై దాడి చేశాయి .తమాషా ఏమిటంటే అక్కడ వారిని ఎదిరించినవారే లేరు . ముసలివాడైనా జేక్ ప్రెసిడెంట్ ఈమైల్హాచా ను బెదిరించి లొంగిపోయినట్లు సంతకం పెట్టించాడు హిట్లర్ . ఒక వేళ కాదని ఎదురు తిరిగితే జేక్ ప్రజల్ని చంపి ,నగరాలను విధ్వంసం  చేసి బూడిద కుప్ప చేస్తానని బెదిరించాడు ఇది హిట్లర్ సిగ్గులేని చేస్ట కు నిదర్శనం ..ఇలా జర్మన్ల రక్తపు బొట్టు చిందకుండా విజయం సాధించి మూడవ రీచ్ అనే జర్మనీ సామ్రాజ్యం లో కొత్త దేశాన్ని కలిపేశాడు 

దాస్టికం బుకాయింపు ,ఆగ్రహం బెదిరింపు లతో పొందిన విజయం అందుకే అతనిని ”బ్లఫ్ బ్లస్టర్ మాస్టర్ ”అంటారు . . 1939 ఆగస్టు 23న రష్యా నియంత స్టాలిన్ తో దాడి రహిత సంధి కుదుర్చుకొని రష్యాను తటస్థంగా ఉండేట్లు చేశాడు .ఫ్యూరర్ అని పిలువ బడే హిట్లర్ ..అందుకే అతనిని ‘ . ఇంతటి తో ఆగక చూపు పోలాండ్ పై పడింది .సైన్యాధికారులు సమయం కాదని వారిస్తున్నా ఉక్కు ,ఆయిల్ ,సరఫరాలు చాలా తక్కువగా ఉన్నాయని  ఉన్న ఆయుధ సామాగ్రి 6 వారాలకు మాత్రమే సరిపోతుందని చెప్పినా  పెడ  చెవిని పెట్టి ఆకస్మిక దాడులతో భయ భ్రా0తులను  చేసి చరిత్రలో పేరు పొందాలని భావించి సాధించిన ప్రతి విజయం మరోదానికి దారి చూపిస్తుందని కావలసినవన్నీ త్వరలోనే సమకూరుతాయని నచ్చ చెప్పి 1939 సెప్టెంబర్ 1 న పోలాండ్ పై 10 లక్షల సైన్యం తో విరుచుకు పడ్డాడు యుద్ధ టాంకులు  కాల్బలం లూప్త్ వాఫ్ అనే వైమానిక రక్షణ పై నుంచి ఇచ్చింది వణకిపోయిన పోలాండ్ లొంగిపోయింది .దీనితో తటస్థంగా ఇప్పటిదాకా ఉన్న బ్రిటన్ ఫ్రాన్స్ లు జర్మనీ పై యుద్ధ ప్రకటన చేసి ”అనుబంధ కూటమి ”గా మారాయి తర్వాత రష్యా అమెరికాలు దీనిలో చేరాయి ఇటలీ  జపాన్ లు జర్మనీ వైపు నిలబడి ”అక్ష కూటమి ”గా మారాయి .  .మళ్ళీ మామూలే హిట్లరయ్యకు మాట తప్పటం .చేసిన ఒప్పందాన్ని తూనా బొడ్డు  అని ఒట్టు తీసి గట్టున పెట్టి 1941 జూన్ 22 న హిట్లర్ రష్యాపై దాడి చేశాడు .జపాన్ అమెరికా వాళ్ళ పెరల్ హార్బర్ పై దాడి చేసింది .మొదట్లో దూకుడుగా దూసుకు పోయి,అజేయమగా ఉన్న  జర్మనీ పడమటి యూరప్ దేశాలను వరుసగా స్వాధీనం చేసుకొంటూ అప్రతిహతంగా ముందుకు పోతోంది డెన్మార్క్ నార్వే ,లక్సమ్  బర్గ్ బెల్జియం నెదర్లాన్డ్స్ చివరికి ఫ్రాన్స్ లు దాసోహమన్నాయి
       స్వచ్ఛ జర్మన్ రక్తం కోసం దారుణాలు
జర్మనీని స్వచ్ఛ జర్మన్ రక్తం తో నింపాలన్న హిట్లర్ ఆశయం ఎన్నడూ వదిలి పెట్టలేదు  కనుక ముందు ఎధునాసియా అంటే ” మెర్సీ  కిల్లింగ్”ను అమలుపరచాడు .అవయవ లోపంఉన్నవారు వికృతంగా ఉన్నవారు , మతి స్థిమితంలేనివారు పిచ్చివాళ్ళు వీరందరూ  మెర్సీ కిల్లింగ్ కు  బలయ్యారు   వీళ్ళతో ఆగలేదు పుట్టిన పసిపిల్లలమీదా దృష్టి పడింది ”సైన్టిఫిక్ రిజి స్ట్రే షన్ ఆఫ్ సివియర్ హెరెడిటరీ ఎయి ల్మెంట్స్ ”అనే సంస్థ రీసెర్చ్ నెపం తో తీవ్రం గా బాధపడుతున్న పిల్లకు మంచి మందు ఇచ్చి నయం చేస్తామని నమ్మబలికి ఈ రీసెర్చ్ కి సహాయంగా ప్రసూతి హాస్పత్రులు ,మిడ్ వైఫ్  లు ,లను సరైన పుట్టుక లేని బేబీలను గుర్తించి రిపోర్ట్ చేయమని చెప్పి జాబితాలు తయారు చేయించింది .వాళ్ళు చాంతాడంత లిస్ట్ లు తయారు చేసిచ్చారు . అవయవ లోపం  నరాల బలహీనత మానసికంగా కుంగిపోయిన వారూ ఉన్నారు .ఈ లిస్ట్ రీచ్ కమిటీకి చేరాక చూపు పెద్ద పిల్లలపై  పడివారి లిస్ట్ లు తయారు చేయించారు . ఈ రిపోర్ట్ లను ముగ్గురు పీనల్ డాక్టర్లు పరిశీలించి ఇందులో ఎవరు చావాలో ఎవరు బతకాలో నిర్ణయం చేసేవారు .కానీ చివరికి వాళ్లకు మందులు ఇచ్చిబాగు చేసినట్లుకాని అందులో బతికి బట్టకట్టిన వారు కానీ కలికానికి కూడా కనిపించేలేదని ఇదంతా నయవంచన అని తేలింది ఎవరూ మాట్లాడే వీలు లేదు మూ సుక్కొచోవటమే  ,
  పిల్లలనుంచి తలిదండ్రులను వేరు చేసి ”మీ పిల్లాడు కొత్త ట్రీట్ మెంట్ ప్రోగ్రామ్ ”లో ఉన్నాడు మంచి గట్టి మందులిచ్చి మీ వాడిని ఆరోగ్య వంతుడిని చేస్తారు ,,మంచి గొప్ప జీవితం లభిస్తుంది ”అని బ్లఫ్ మాస్టర్స్ పలికి వేరు చేసేవారు ఒక వేళ ఎవరైనా  తలిదండ్రులు  మేము ఇవ్వం మాపిల్లల్ని అన్నా ,అనుమానం తో ప్రశ్నలు వేసినా వారిని నయానా భయానా చెప్పి చివరికి ఒప్పుకునేదాకా బెదిరించేవారు .దీనిపై నిర్ణయం బాధ్యత పేరెంట్ లకు లేదు అదీ బ్లఫ్ మాస్టర్స్ చేతుల్లోనే ఉండేది .నిర్ణయాధికారం ఉందని మాత్రం పో జు కొట్టేవారు . సర్వం దైవా దీనం -సారీ నారీ అధీనం మరోసారి సారీ నాజీ అధీనం .అయ్యా ఈ ఇన్టేక్  ట్రీట్ మెంట్ సెంటర్లు నగరం నడి  బొడ్డున ఉన్నాయని కొంటె” తప్పులో”కాలేసినట్లే ఎక్కడో చాలా దూరం లోనిర్మాణుష్యప్రదేశం లో పల్లెల్లో ఉండేవి అంటే నమ్ముతారా ?అబద్ధాలమీద బతికింది నాజీ రెజీమ్ .
  కొన్ని వారాలతర్వాత పేరెంట్స్ కు వాళ్ళ పిల్లాడో పిల్లో చచ్చి పోయిందని నోటీస్ వచ్చేది .చావుకు కారణం న్యుమోనియా ,అపెండిక్స్ బద్దలవటం అని మాత్రమే తెలియ జేసేవాడు .అసలు కారణాలు వేరు బాబూ . వాళ్ళ డాక్టర్లే వాళ్ళని మర్డర్ చేశారు .రీచ్ కమిటీ పిల్లలు  ప్రాణాంతక  ఇంజెక్షన్లు ,విషవాయువు  ఆకలి , మూలం గానే చనిపోయారు .స్వయానా ఈ భయానక మరణాలను చూసిన డాక్టర్ హెర్మన్ ఫానిమిల్లర్ ”ఓక్ అనే ఆరోగ్య జర్మన్ ప్రజలకు  ఈ అభాగ్యులు  భారమని భావించాం .మేం  పిల్లల్ని చంపం ఇంజెక్షన్లతో విషంతో .మాది ఇంకా తేలికపద్ధతి చాలా సహజంగా ఉంటుంది ”అని  చెప్పి బెడ్ మీద ఉన్న పిల్లాడిని చచ్చిన ఎలుకను పట్టుకున్నట్లు పట్టుకుని విషపు నవ్వు నవ్వుతూ  ఈ వెధవ  చావుకు ఇంకా మూడునాలుగు రోజుల టైమ్ ఉంది ”అని ఒక డాక్టర్ స్వయానా చెప్పాడని రాశాడు ..ఇలాంటి చోట్ల వేలకొద్దీ జర్మన్ పిల్లలు ఈ డాక్టర్లనబడే కిరాతకులు చేతుల్లో అసువులు బాశారు .దీనికి కారణం ఒక్కటే ”రీచ్(హిట్లర్ జర్మనీ ) కు ఇలాంటి వాళ్ళు బతకటానికి అనర్హులన్న భావమే ఇక్కడ హీలర్స్ కిల్లర్స్ గా మారారు  ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న మెంటల్ పేషేంట్ లను ముందే హతమార్చారు ఈ హత ప్రక్రియకు ఒక కోడ్  ”ఆపరేషన్ T4”అని పేరుపెట్టారు .ఇది బెర్లిన్ హెడ్ క్వార్ట్రర్స్ –”టీర్ గార్టన్ స్ట్రాస్సీ -4 ”పేరు
  ఇక యువకులను చంపే ప్రోగ్రామ్ అమలుకు t 4 కిల్లింగ్ కేంద్రాలు 6 సెంటర్  లలో పెట్టారు . వాటిలో గాస్ చేంబర్లు షవర్ బాత్ ల రూపం లోనూ అనుబంధంగా   కళేబర దహన  వాటికలు ఉండేవి . ఒక క్రమపద్ధతిలో చంపటం అంతే  వేగంగా కాల్చిపారేయటం క్షణాలమీద జరిగిపోయేవి . 1941 ఆగస్టు లో ఈ హనన దహన ప్రోగ్రామ్ అంతమైంది .అప్పటిదాకా నిరంతరాయంగా 24 గంటలు ఏడు రోజు లూ జరిగింది .దాదాపు 80 వేల ప్రాణాలు వీరి ఆపరేషన్ 4 లో గాస్ కు మంటలకు ఆహుతయ్యాయి . కాదేదీ కవితకనర్హం ”అన్నాడు ఆతర్వాతెప్పుడో శ్రీ శ్రీ కానీ నాజీలు ”కాదేదీ చావుకనర్హం ”అని నమ్మారు ,రుజువు చేశారు ..నిజానికి ఈ నిరంతర హనన ప్రక్రియ ఆగిపోలేదు రెండవ ప్రపంచ యుద్ధకాలం లోను ఆ తర్వాతా కూడా జరిగింది ఈ కాలాన్ని ”వైల్డ్ ఎధునేషియా ”అన్నారు అంటే” ఆటవిక కారుణ్య హత్య ‘-వైల్డ్ మెర్సీ కిల్లింగ్ . కారణం ఇది అనధికారిక ,అవ్యవస్థిత మానవ మారణ హోమం .జర్మన్ కిల్లింగ్ సెంటర్ లలో ఈ మెర్సీ  కిల్లింగ్ సెంటర్ లలో ఎధు  నేషియా  ప్రోగ్రామ్  అధికారికంగా సమాప్తమయిన తర్వాత  ఎన్ని వేలమందిని చంపారో  లెక్కా డొక్కా లేదు
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3
  .
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి, మల్లినాథ సూరి మనీష -32

వ్యాఖ్యాన చక్రవర్తి,  మల్లినాథ సూరి మనీష -32

ఏకావాలి లో  అలంకార చర్చ
ఆపహ్నుతి  అలంకారం -దీనిలో రూపకాలంకారం లో ఉన్నట్లే ఆరోపం ఉంటుంది .అయితే ఇది అపహ్నవం  చేత సమర్ధింపబడుతుంది .కనుక వర్ణించబడే విషయం అలా ఉన్నట్లు కనబడదు అది ఒక ప్రత్యేకతతో మారిపోతుంది విద్యాధరుడు ఆపహ్నుతి లో మూడు రకాలు ఉన్నాయని చెప్పాడు -”ఆపహ్ను త్యా రొపః , ఆరోప్యా పహ్నవః -చలాది  శబ్దే రసత్యవం ప్రతిపాదనం చేతి త్రివిధోస్య బంధ ఇత్యర్ధహ ”అన్నాడు సూరి .మొదటి దానిలో ఆరోపం  రహస్యమైన దానితర్వాత వస్తుంది .రెండవ దానిలో దీనికి వ్యతిరేకంగా అంటే రహస్యం తర్వాత ఆరోపం వస్తుంది .మూడవ దానిలో రహస్యంగా ఉన్నదాన్ని చల ,ఆపదేశ వంటి శబ్దాలచేత సూచింపబడుతుంది దీని నేపధ్యంగా మల్లినాథుని నిర్వచనం సరళం గా ఉండి  ప్రత్యేకంగా కనిపిస్తుంది -”యత్యా రో ప్య మాణస్యా రోవిషయాపహ్నునేవనావ సాపాహ్నుతిః ”
 సహోక్తి-సహోక్తి   విషయం లో సూరి రుయ్యక భావం పై ఆధారపడ్డాడు ఇందులో సహా అంటే సూత్రాలోచన పాదాలమధ్య గౌణమైన సంబంధం కనుక వస్తువులమధ్య సంబంధం గా ఉండాలని లేదు అదివస్తువు  ఒకదానితో ఒకటి కలిసి పోవటం (ఇంట్రా ససెప్షన్ )పై ఆధార పడి  ఉంటుంది దీన్ని శ్లేష ద్వారా గుర్తించాలి ఇక్కడ రుయ్యకుని వివరణపై మల్లినాథుని వ్యాఖ్యానం దాన్ని గుర్తుకు తెస్తుంది .సహోక్తి లో ఉపమా న ,ఉపమేయాల సంబంధం ఉద్దేశ్య పూర్వకమైనదే ..సహా చేత సూచింపబడే వస్తువు ఉపమేయ స్థానం లో ఉండి వ్యక్తీకరించే క్రియ తో సంబంధంకలిగి ,రెండవ దాని అర్ధం సహలో చెప్పినట్లు  ఉద్దేశితమౌతుంది .-”ఇహ భావే ప్రకృతత్వాన్ ఉపమానోపమేయ భావో వైవక్షి కః -తత్ర సహార్ద నిర్దిష్టస్య అప్రాధాన్యా దుపమానా త్వమర్దాది తరస్య ప్రాధాన్యాద్యుపమేయ త్వం -యాత్రోపమానోపమేయ యో రేకస్య శబ్దహ -క్రియా సంబంధ ఇతరస్య సహార్ద నిర్దేశా ద్ గమ్యహ సా సహోక్తి రిత్యర్దా ”
ప్రతి వస్తూపమాలంకారం -అనేక వాక్యాలలో పోలిక ఉండటం దీనిప్రత్యేకత రెండు వాక్యాలుంటే వాటిలో లక్షణం లేక గుణం (యట్రి బ్యూ షన్ ) ఒకే రకంగా ఉంటుంది . దృష్టాంతం లో  మొదటిదానిలోని గుణం రెండవ దానిలోగుణం పోలికతో  ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఈ రెండు వేరు వేరు వాక్యాలలో చెప్పబడిన గుణాలు అసలైనదానికి దాని ప్రతిబింబాన్ని ఉన్న సంబంధంగా ఉంటాయి . మల్లి నాధుని వివరణ -”భిన్న యోరేవ వస్తు నో రత్యంత సదృశా యోరుభయత్ర  పృధంగా నిర్దేశో బింబ ప్రతి బింబ భావః ”కానీ ”యత్ర వస్తు స0బందేన ప్రతి బింబనం గమ్యతే సా నిదర్శనమే ”అన్నాడు .కొన్ని చోట్ల వస్తువుకు ,పోల్చబడేదానికి  ,సాధ్యం లేక సాధ్యం కాని    సంబంధాలు కొన్ని సందర్భాలలో ఉంటె   అది నిదర్శనాలంకారమవుతుంది-యత్ర పరస్పరని రక్షరాని రపేక్షర్ద త్వే న వాక్యార్ధ భేద స్తత్ర దృష్టాంతః -యత్ర సాపేక్షార్ధత్వే న విద్యర్ధ వాద యోరివ వాక్యయో  రేకవాక్య తా తత్ర నిదర్శనేతి  భేదః -ఉత్ప్రేక్షాలంకారం -ఉత్ప్రేక్షను విద్యాధరుడు తనపద్ధతిలో విచిత్రంగా నిర్వచించాడు .ఈ అలంకారం   శోషణం (అబ్సా ర్ప్షన్  ) లేక ఒకదానిలో ఒకటి దూసుకుపోవటం వలన అంటే ఆద్యావసయం వలన ఏర్పడుతుంది ఏకావాలి కర్త చక్కని నిర్వచనం చెప్పాడు -అభిన్న త్వే న ప్రతిభాసనమద్యావసాయహ్ ”అని అధ్యావసాయ కు అర్ధం చెప్పాడు వస్తువును పోల్చబడేది పూర్తిగా మింగేస్తే వచ్చేది ఆద్యావసయం 1-సిద్ధ 2 సాధ్య అని రెండురకాలన్నాడు విద్యాధరుడు.పోల్చబడినది వస్తువుతో ఉన్న సంబంధం తెలియబడితే వచ్చేది విషయ పై విషయం ఆరోపిస్తే వచ్చేది   .ఇదే అతిశయోక్తి ఆధారం .విషయం విషయిల సంబంధం వేరుగా ఉంటె కొత్త భావం అందులో స్ఫురిస్తుంది .ఇక్కడ అనుమానం  తర్కం ఊష సహాయ పడుతుంది .మల్లినాథుడు ఉత్ప్రేక్షకు కొత్త నిర్వచనమిచ్చాడు -”స0 భావన మాయోత్ప్రేక్షా ప్రకృతస్య పరేణ యాత్ అని మమ్మటుడు చెప్పనడానికి సూరి ”అప్రకృత గుణ క్రియాభి సంబంధాత్ ప్రకృతస్య  ప్రాకృతత్వే న స0భావన ముత్ప్రేక్ష్యో త్య ర్ధః ”
అధ్యావసాయ లోని సిద్ధ ,సాధ్యలనూ మల్లినాథుడు  విస్తరించి చెప్పాడు .-”యత్ర వైశ్య విషయిణో ర్ధ యో రూపాదానం తత్ర భేద వదవ భాసా దభేదో నావ బాసతే -విషయిణో సత్యతా ప్రతీతేహ్ -తథాపి విషయస్య తదా వ్యపదేశత ద్ధర్మ యోగి త్వాభ్యామ భేదోద్యవసీయతే సంభావ్యతా ఇతి వ్యాపార ప్రాధాన్యా ధ్యా వసాయః సాధ్య ఇత్యర్దహ”
  అధ్యావసాయ  సిద్ధ ఎప్పుడు అవుతుందిఅంటే విషయం శబ్దాలతో చెప్పబడక పోలిక చెప్పబడే దానితో మింగివేయబడితే అప్పుడు పోలిక వస్తువు అధ్యావాసిత అయి కప్పి వేయబడి స్పష్టమౌతుంది . సాధ్య ఎప్పుడౌతుంది అంటే -వస్తువు పోలిక చెప్పబడే దానితో తాదాత్మ్యంగా చెప్పబడితే అప్పుడు సాధ్య అవుతుంది -”యత్ర తుతస్యానుపాదానం తత్ర విషయిణా ఏవోయాదాన మహిమ్నా తస్య వస్తు తో సత్య స్యాపి సత్యతా ప్రతీతౌ విషయస్య తదాత్మా నాధ్యా వసిత ప్రాధాన్యే ”జ్ఞాతోదర ”ఇత్యర్ధ ధరమ్ ప్రతి జ్ఞానస్యేవా ద్యావసాయ స్యాద్య వసితం ప్రత్యుప సర్జన త్వం ప్రతీయతే -ఏతదేవాద్యావస్యా వయస్య సిద్ధాంతం నామ ”
  ఉత్ప్రేక్షలో ఉపమాన ఉపమేయాలు లేక విషయం విషయ లను గుర్తించటం  పూర్తికాకపోతే సాధ్య అవుతుంది .కానీ అతిశయోక్తిలో గుర్తించటం పూర్తి అయితే సిద్ధ అవుతుంది ఏకావాలి మల్లినాథుని నిర్వచనం లో ”గుణాభి సంబంధా ”అనే దాన్ని ఉపయోగించాడు ఇక్కడ గుణ అంటే క్రియ అనే అర్ధం లో వాడాడని గమనించాలి  .మరికొన్ని అలంకారాలు తర్వాత తెలుసుకొందాం .
  సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలంగాణ సాహిత్య అకాడెమి

ఇన్‌లైన్ చిత్రం 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వైకింగ్ శకం -3

వైకింగ్ శకం -3

1014 లో శ్వీన్ ఫోర్క్ బియర్డ్ లంకా షైర్ లోని  గెయిన్స్ బర్గ్ లో ఫిబ్రవరి 3 చనిపోయాడు  డెన్మార్క్ లో ఖననం చేశారు . ఏదెల్  రెడ్ నురాజుగా  పిలవగాశ్వీన్ కొడుకు  క్నాట్   ది  గ్రేట్ ను  తరిమికొట్టి సోదరుడు హరాల్డ్ -2 ను డెన్మార్క్ రాజును చేశాడు క్లాన్  టార్ఫ్  బ్రియాన్ బోరు ,హై కింగ్ ఆఫ్ ఐర్లాండ్ యుద్ధాలలో లీన్ స్టర్  రాజును  డబ్లిన్ రాజు సిల్క్ బియర్డ్  ఎరల్  ఆఫ్ ఆర్కెని ఐలాండ్స్ లాడ్  వేసేం ల సాయం తో ఓడించి చివరికి తానె చనిపోయాడు . 1015  లో క్నాట్  ఇంగ్లాన్డ్ కు 200 షిప్పులతో 10 వేల  సైన్యం తో  తిరిగివచ్చాడు . 1016   ఆషింగ్టన్ యుద్ధం లో ఏదెలా రెడ్ సాయాన్ని దుంప నాశనం చేసి థేమ్స్ నదికి ఉత్తరాన ఉన్న ఇంగ్లాన్డ్ ను స్వాధీనం చేసుకొని దేనిలా వెళ్ళాడు .ఏదేరాల్డ్ చనిపోగా పాత సెయింట్ పీటర్ పాల్ కాధెడ్రల్ లో  ఉంచారు . 1017లో క్నాట్   ది  గ్రేట్ ఇంగ్లాన్డ్ రాజుగా పట్టాభి షిక్తుడయ్యాడు .తర్వాత డెన్మార్క్ రాజు క్నాట్   తమ్ముడు హెరాల్డ్ చనిపోగా డెన్మార్క్ వచ్చేసి  దానికీ రాజయ్యాడు . 1027 లో రోమ్  సందర్శించి రెండవ కాన్రాడ్ కారోనేషన్ కు హాజరయ్యాడు . 1028 లో క్నట్  ఇంగ్లాన్డ్  డెన్మార్క్ నార్వే లకు రాజుగా గుర్తింపు పొందాడు .అంటే విశాల బ్రిటిష్ సామ్రాజ్యానికి వైకింగ్ కింగ్   చక్రవర్తి అనిపించుకున్నాడు . 7ఏళ్ళు పాలించి 1035 లో చనిపోతే వెస్ట్ మినిష్టర్ కెదెడ్రల్ లో అంత్యక్రియలు జరిపారు .కొడుకు హెరాల్డ్ హేర్  ఫుట్ ఇంగ్లాన్డ్ రాజయి 1040లో చనిపోయాడు మూడవ కెనాట్ 10 42 వరకు రాజు నార్వే జార్చుకున్నాడు 1040లో ఆర్దాక్న్తట్  ఇంగ్లాన్డ్ రాజుగా హెరాల్డ్ మరణం తర్వాత అయ్యాడు . 1042 లో హెర్లాడ్ ది కన్ఫెస్సర్ రాజయ్యాడు నార్వే రాజుగా హరాల్డ్ హార్ డ్రాతా ఉన్నాడు ఇతనికజిన్ డెన్మార్క్ రాజై 1066 దాకా ఉన్నాడు డెన్మార్క్ రాజు హరాల్డ్ శ్వీన్ యేస్ట్రర్ సన్ 1074 దాకా రాజ్యమేలాడు . 1066 లో కన్ఫెస్సర్ చనిపోగా ఎడ్వార్డ్ భార్య తమ్ముడు గా డ్ విన్సన్ తాత్కాలిక రాజయ్యాడు .హరాల్డ్ హర్ డ్రాడా ఇంగ్లాన్డ్ పై దాడి చేసి ఓడిపోయాడు  స్టామ్ఫోర్డ్  బ్రిడ్జ్ బాటిల్ లో చనిపోయాడు వైకింగ్ రాజు  రోల్లో మునిముని మనవడు విలియం నార్మాండి ఇంగ్లాన్డ్ ను 7 వేల  మంది సైన్యం తో ముట్టడించి హరాల్డ్ ను ఓడించి చంపి క్రిస్మస్ రోజున వెస్ట్ మినిష్టర్ అబ్బే లో ఇంగ్లాండ్ రాజయ్యాడు . 1069 లోనార్వే రాజు  శ్వీన్ యేస్త్రిడ్సన్  తమ్ముడు ఆస్ బోరన్  ”యార్క్ ”అన్వేషణకు మద్దతిచ్చి విలియం కు వ్యతిరేకంగా పెద్ద సైన్యం తయారు చేయించాడు .కానీ అతని అన్వేషణ పూర్తికాలేదు 1094 లో చివరి  డబ్లిన్ వైకింగ్ కింగ్ గాడ్ఫ్రెడ్  తొలగింపబడ్డాడు 1098లో నార్వే రాజు మాగ్నస్ బేర్ లెగ్స్ ఆర్కనీ  హెబ్రీడ్స్ కు  అన్వేషణకు వెళ్లి స్కాటిష్ రాజుచేత రికగ్నిషన్ పొందాడు . 1263 లో వెస్టర్న్  ఐల్స్ లో వైకింగులపాలనపై  స్కాట్ ల తిరుగుబాటుకు ప్రతిగా వైకింగ్ రాజు నాలుగవ హాక్సన్ లార్గ్స్ లో యుద్ధం చేసి ఓడిపోయాడు .చరిత్రలో వైకింగ్ ల చివరి దండ  యాత్ర ఇదే .దీనితో సుమారు 500 ఏళ్ళ వైకింగ్ శకం సమాప్తమైంది .

  వైకింగ్ అనే మాట విక్  అనే పదం నుంచి వచ్చింది దీని అర్ధం ఇరుకైన అగాధం .దీనికి చెందిన వాళ్ళని భావం .వికేం అనే నార్వీజియన్ పదం పాత నార్సేలోని వికిన్ నుంచి వచ్చి అక్కడ నివ సించినవారు అనే అర్ధం రూఢి అయింది వికింగ్ అనే పదం పాత ఆంగ్లో సాక్సన్ కవితలో ఉంది  జర్మన్లు వీరిని ”యాస్కోమిన్ని ”లేక యాష్ మెన్ అన్నారు అంటే  యాష్ అనే కలపతో పడవలు తయారు చేసేవారని అర్ధం బైజాన్టియన్లు ”వారంగియాన్స్ ”అన్నారు .అంటే మాటకు కట్టుబడేవారని నమ్మకస్తులని భావం .ఫ్రాంక్స్  ఇంగిలీషు వాళ్ళు వీళ్ళని నార్దర్న్ మెన్ లేక డేన్స్ అన్నారు .
గమ్యాలా ఉప్సల లో 2 వేల  ఏళ్ళనుంచి 2 నుంచి 3 వేలమంది మట్టిలో కూరుకు పోయిన మట్టి దిబ్బలున్నాయి 40 అడుగుల ఎత్తు తో ఇవి కట్టబడ్డాయి వీరు శ్వీడాన్ వైకింగులు   భావింపబడ్డారు డెన్మార్క్ లోని ఆల్ బోర్గ్ దగ్గర లిన్దోమ్ హుజీ 600  రాతినావలు వైకింగ్ కాలానివి కనిపించాయి . బ్రాన్జ్ యుగానికి చెందిన వైకింగ్ ల మట్టి సమాధులున్నాయి నార్త్ సి ఒక బ్రిడ్జిలాగా స్కాండినేవియాకు ఉపయోగ పడింది రేవన్  యుద్ధ వీరుని కి వైకింగ్ సంప్రదాయ సైనిక లా0చనాలతో పాతిపెట్టబడిన సమాధులను ఇటీవలకాలం లో త్రవ్వకాలలో కనుగొన్నారు
we are the pilgrims master -we shall go -always a little further -it may be -beyond that last blue mountain barred with snow -across that angry or that glimmering sea (golden journey to( s’amarkhand )కవిత వాళ్ళ ధైర్య సాహసాలకు ప్రతీక .హవామాల్ ”అనే పెద్దలు చెప్పిన సుద్దిమాటలు లో ఒక వైకింగ్ హీరో ఎలా జీవించి ఎలా మరణించాలో  వర్ణించబడింది –
”a coward believes he will live for ever -if he holds back in the battle -but in old age he shall have no peace -though spears have spared his limbs -cattle die  kindred die -every man is mortal -but the good name never dies -of one whohas done well.”
యూరప్ అంతా పోలార్ వేల్స్ పై మోజెక్కువ .గ్రీన్ లాండ్ వైకింగ్ లు అతి విలువైన నాణ్యమైన ఒకమాది రి సైజులో ఉండే నార్వాల్ వే ల్ అంటే బాగా ఇష్టపడ్డారు.వైకింగ్ యుగం లో అవి ఆర్కిటిక్ సముద్రం గ్రీన్ లాండ్ ,కెనాడాల లో బాగా ఉండేవి దీని మాంసం సి విటమిన్ కు బదులుగా వాడతారు దాని చర్మతో తాళ్లు పేనేవారు .దాని  దంతం అన్నిటికంటే మహా విలువైనది  ఎర కు బాగా పనికొచ్చేది ఇవి చాలా మిస్టీరియస్ జంతువులు . ఎప్పుడు ఎలా మీద పడతాయో తెలీదు 16 అడుగుల పొడవుండి 3,500 పౌండ్ల బరువుంటాయి వంకర తిరిగిన 10 అడుగుల దంతం 20పౌండ్ల బరువుతో తమాషాగా ఉంటుంది  ఆడది కనిపిస్తే మొ గా ఆడ నీటిపైకొచ్చి టస్క్లతో శృంగారం చేసుకొంటాయి .అప్పుడు ఫెన్సింగ్ కట్టినట్లే ఉంటుంది .మాధ్యయగపు గ్రీకులు  ఒక తెల్ల గుర్రం నుదుటిపైనా ఉన్న ఒకే కొమ్ముతో  స్వచ్ఛతకు చిహ్నంగా ఉండేదని నమ్మేవారు దాన్ని కన్యలు మాత్రమే మచ్చిక చేయగలరని దాని కొమ్ములతో కప్పులు తయారు చేసి అందులో ఏదైనా పోసుకొని త్రాగితే విషా నికి విరుగుడు  ఆవు తుందని  నమ్మకం కొమ్మును పొడి చేసి వైద్యం లో వాడితే సర్వ రోగాలకు మందు అని కూడా .కనుక నార్వాల్ వేల్స్ టాస్క్ కు యెంత విలువ ఉందొ ఆలోచించండి .వీటి టస్క్ ”బంగారం కంటే అతి విలువైనది ”అందుకే వైకింగ్ లకు దీని వేట  తెల్ల ఎలుగుబంటి ఫర్,  హంటింగ్ ఫాల్కన్ లపై మోజెక్కువ వీటిని పట్టి చక్రవర్తులు అమ్మేవారు డబ్బో డబ్బు .
  వైకింగ్ ల అన్వేషణలో గ్రీన్లాండ్ లోని చెట్లతో నిండియున్న భాగాన్ని మార్కులాండ్ అంటే వుడ్ లాండ్ గా రాళ్ళతోఉన్న భాగాన్ని హాల్  లాండ్ అంటే స్టోన్ లాండ్ అనీ పిలిచారు బెర్రీలు  ద్రాక్ష ప0డే దాన్ని న్యూ ఫౌండ్ లాండ్ అన్నారు అమెరికాలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న స్థానిక ఆటవికులు నార్త్  అమెరికన్ ఇండియన్స్ అయిన ఇనూట్ లను    స్క్రేలింగర్ లు అంటే ”అగ్లిమెన్ ”అన్నారు
  వైకింగ్ రాజు క్నాట్ కు ఇంగ్లాన్డ్ అంటే మహా అభిమానం    ఇవాళ ఐరోపాలో డాలర్ కు బదులు ”యూరో ;;ఉన్నది దీని ఆ వైభవం మొట్ట మొదట తెచ్చినవాడు క్నా ట్ .అతడు ”ఎడ్గార్ ది  పీస్ ఫుల్ ”పవిత్ర గ్రంధం నుంచి ఒక ఆకు తీసి ఇంగ్లాడ్  స్కాండినేవియన్ నాణాలను ప్రామాణికం చేశాడు ..కనుక 11 వ శతాబ్దిలో” సెంటర్ ఆఫ్ మానిటరీ యూనియన్”జర్మనీ కాదు ,ఫ్రాన్స్ కాదు ఇంగ్లాన్డ్ మాత్రమే అని గ్రహించాలి .ఔన్స్ యొక్క బరువునూ ప్రామాణికం చేసి బంగారం,వెండి  తూకం లో  తన సామ్రాజ్యం లో అంతా అమలు చేశాడు . అప్పుడు అది బైజాన్టిన్ సామ్రాజ్యపు ప్రమాణానికి సరిపోయింది .దీనితో యూరప్ అంతా ఒకే రకమైన మిడీవల్ సింగిల్ మార్కెట్ విధానం అమలైంది క్నాట్  ది  గ్రేట్ వైకింగ్ ఎంపరర్ వలన .. ఇతని చక్రవర్తి కిరీటం అష్టభుజాకారంగా 8 ఇరవై రెండుకేరట్ల బంగారు రేకులతో వజ్ర వైఢూర్యాలు ముత్యాలతో ధగధగా లాడింది . అప్పటికి ఇంకా వజ్రాలను సానబెట్టటం తెలియదు అందుకే నదిలోని గులక రాళ్ళలాగా వాటిని పొది గారు ..అతని సామ్రాజ్యం అతి విశాలమైనది .ఇంత ఘాన చరిత్ర ఉంది వైకింగులకు .
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వైకింగ్ శకం -2

వైకింగ్ శకం -2

హాఫ్ డాన్  రంగర్సన్  సైన్యాన్ని 876 లో నార్త్ అంబీరియా కు తీసుకు వెళ్లి అక్కడి ఆంగ్లో సాక్సన్  రాజులు అతన్ని దానికి రాజుగా ప్రకటిస్తే ఉండిపోయాడు .ఆతర్వాత రెండేళ్లకు గుత్రుమ్ నాయకత్వాన డేనిష్ సైన్యం ఆల్ఫ్రెడ్ నాయకత్వం లోని ఇంగిలీషు సైన్యాన్ని దోచుకొ0టే  తరిమేస్తే సోమర్సెట్ లెవెల్స్ కు పారిపోగా మళ్ళీ బలం కూర్చుకుని ఎడింగ్టన్ యుద్ధంలో విజయం సాధించి 880 లో ఆల్ఫ్రెడ్ తో సంధి చేసుకొని మెర్సియాను విభజించి ఈస్ట్ ఆంగ్లికా అనబడే ప్రాంతాన్ని పొంది వైకింగుల సంప్ర దాయాలు పాటించేట్లు చేసుకున్నాడు . 889 లో ఈస్ట్ ఆంగ్లికా కు  డేనిష్ రాజయిన   క్రిస్టియానిటీ పుచ్చుకొని ఏదెలా స్టన్ గా పేరు మార్చుకున్న  గోత్రుమ్ చనిపోయడు. 892 లో పెద్ద సైన్యం తో  డేనిష్ నౌకలు 300  తో కెంట్ పై దాడిచేసి ఆల్ఫ్రెడ్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి చెల్లాచెదరు చేశాయి 899 లో ఆంగ్లో సాక్సన్ రాజు  ఇంగ్లాన్డ్ గొప్పపాలకుడు  ఆల్ఫ్రెడ్ ది  గ్రేట్ చనిపోగా  ,మరుసటియేడు గన్  బోరన్ ఉల్ఫ్ సన్ గ్రీన్లాండ్ వశం  చేసుకున్నాడు 907 లో కీవ్ కు చెందిన ఓలెగ్ .అనే రస్ నాయకుడు  కాన్  స్టాన్టి నొపిల్ పై దాడికి సి ద్ధ మవగా  .అక్కడి రాజు సంధి తో రస్ లకు వ్యాపారానుమతినిచ్చారు . 911 లో  ఫ్రాన్స్  రాజు చార్లెస్ ది  సింపుల్ రూ పట్టణం తోబాటు పరిసర ప్రాంతాలన్నీ రోల్లో అనే వైకింగ్ నాయకుడికి కు ఇచ్చేశాడు  ఈ ప్రాంతమే నార్మ0డి  .స్నేబ్ జార్న్ అనే వాడు కొంతమందితోకలిసి ఐస్ లాండ్ నుంచి గ్రీన్ ల్యాండ్ కు అన్వేషణకు వెళ్లి అక్కడ వింటర్ గడిపారు .. 936 లో డెన్మార్క్ రాజుగా గోరం ది  ఓల్డ్ గుర్తింపు పొందాడు . లో యెదిలిస్తాన్ పెద్ద సైన్యం తో వైకింగులను ఓడించాడు 947 లో ఎరిక్ బ్లడ్ ఎక్స్ కాంబ్రియా యుద్ధం లో చనిపోగా ఇంగ్లాన్డ్ రాజు ఎడ్గార్ నార్స్   రాజ్యాన్ని రద్దు చేసి నార్త్ అంబార్లాన్డ్ కు అప్పగించాడు 958 లో గోరోం ది ఓల్డ్ కొడుకు  హరాల్డ్ బ్లూ టూత్ డెన్మార్క్ రాజై డేనిష్ తెగలనన్నిటినీ ఏకం చేసి సువిశాల రాజ్యాన్ని గొప్పగా పాలించాడు ఇతన్ని పేరే మనసెల్ ఫోన్ లోని బ్లూ టూత్ పరికరం.  975 లో ఇంగ్లాండ్ రాజు ఎడ్గార్ చనిపోతే ఎడ్వర్డ్ రాజయ్యాడు 978 లో ఏథేల్  రెడ్ రెండు సార్లు ఇంగ్లాన్డ్ రాజయి పాలించాడు . 980 -2 లో వైకింగ్ లు ఇంగ్లాండ్ పట్టణాలపై విరుచుకు పడ్డారు .అదే సమయం లో ఎరిక్ ది రెడ్ ఐస్ లాండ్ నుండి పడమరకు గ్రీన్ లాండ్ వైపుకు అన్వేషణ జరిపాడు ఉత్తర అమెరికాలో కాలు పెట్టిన మొదటి వైకింగ్ గా గుర్తింపు పొందాడు ఆ ప్రాంతమే లాబ్రడార్ .  986 లో ఎరిక్ సుమారు వెయ్యి మందితో గ్రీన్ లాండ్ వెళ్లిగ్రీన్ లాండ్ నార్వే మధ్య  2 వేలాదిమైళ్ళు చుట్టూ తిరిగి  ఉత్తర అమెరికా అన్వేషణ చేశాడు ఇతని సాహసాలన్నీ ”ది  సాగా ఆఫ్ ఎరిక్ ది  రెడ్ ”లో వివరంగా ఉన్నాయి . 986 లో డెన్మార్క్ కు  బ్లూటూత్ కొడుకు శ్వీన్ ఫోర్క్ బియర్డ్ రాజయ్యాడు 988 లో రోరిక్ వారసుడైన వ్లాదిమీర్ ది  గ్రేట్ రస్  నాయకుడి పాత పాగాన్ దేవతలను ధ్వంస0మ్ చేసి  డ్నీపర్ నదిలో  విసిరేసి క్రైస్తవంపుచ్చుకుని  తానూ తన అనుచరులతో సహా క్రైస్తవులయ్యారు . వైకింగులు ఉత్తర ఇంగ్లాన్డ్ పై దాడి చేశారు 991 లో నార్మాండి  ఇంగ్లాన్డ్ ల మధ్య శాంతి ఒడంబడిక జరిగి ఇంగ్లాన్డ్ లో శరణార్థులుగా నార్మన్ లో ఉండిపోయారు . 995 నుంచి నార్వే రాజుగా ఉన్న ఒలాగ్ మనవడితోసహా93 నౌ కలతో మాల్దాన్ యుద్ధం లో ఇంగ్లాన్డ్ సైన్యాన్ని ఓడించి ఏదెలా రెడ్ నుంచి 10 వేల  పౌండ్ల వెండిని పొందాడు . 994 లో వొలాఫ్ మళ్ళీ ఇంగ్లాన్డ్ వచ్చి శాంతి ఒడంబడిక చేసుకొని నార్వే వెళ్ళాడు 997-1000 లో డేనిష్ ఆర్మీ   నిరంతరం గా ఇంగ్లాన్డ్ పై దాడి చేస్తూనే ఉంది శ్వీన్ ఫోర్క్ బెడ్ తో చేసిన పోరాటం లో వొలాఫ్ చంపబడ్డాడు .ఈ లోగా ఐస్ లాండ్ లో థోరుగూరి తనవాళ్ళందర్నీ క్రైస్తవులుగా మార్చాడు 1001 లో డెయిష్ యుద్ధ నౌకలు పడమటి సస్సెక్స్ పై దాడి చేసి 24 వేల  పౌండ్ల డబ్బు పోందిందింది మరుసటి ఏడు సెయింట్ బ్రేస్ డే మాసకర్ జరిగి ఇంగ్లాండ్లో డే నుల సర్వ నాశనం జరిగి ఫోర్క్ బెడ్ సోదరి గున్నిహిల్డ్ తో సహా అందరూ చంపబడ్డారు మరోయేడాదికి శ్వీన్ ఫోర్క్ బెడ్ అనే డెన్మార్క్ రాజు ఇంగ్లాన్డ్ పై దాడిచేశాడు ఇంగ్లాన్డ్ లో అప్పుడు తీవ్రకరువు ఏర్పడింది డేనిష్ ఆర్మీ  డెన్మార్క్ కు తిరిగి వెళ్లి పోయింది 1006 లో శ్వీన్  మళ్ళీ ఇంగ్లాన్డ్ వచ్చి 36 వేల  పౌ0మ్ డ్లు  పట్టుకు పోయాడు . 1009 -12 మధ్య ఢోర్కెల్ ది  టాల్ తమ్ముడు హెమ్మింగ్ లు పెద్ద వైకింగ్ సైన్యం తో  ఇంగ్లాన్డ్ పై పడగా ఏదెలా రెడ్ అతనికి 48 వేల పౌన్లు  ఇచ్చిమంచి చేసుకున్నాడు లండన్ ను శ్వీన్ సైన్యపు దాడి నుంచి రక్షిస్తానని ఎధేర్డ్ తో ఒప్పందానికి వచ్చి తనవారిని గాలికొదిలేశారు . 1010లో డార్ఫిన్ కారల్స్ ఫెని  గ్రీన్ లాండ్ నుంచి ఉత్తర అమెరికాకు మూడవ   యాత్రమూడేళ్లు  చేసి మిగిలిన కొద్దిమందితో గ్రీన్ లాండ్ తిరిగివచ్చాడు .1013లో శ్వీన్ ఫోర్క్ బెడ్ శక్తి యుక్తులన్నీ సమీకరించి ఇంగ్లాన్డ్ పై పడగా  ,ఏధిల్ రెడ్ కొడుకులు  ఎడ్వార్డ్ ,ఆల్ఫ్రెడ్ ల తో సహా  నార్మాండీకి ప్రవాసానికి పారిపోయాడు .క్రిస్మస్ రోజున శ్వీన్ ఇంగ్లాన్డ్ కు మొదటి వైకింగ్ రాజుగా పట్టాభి షిక్తుడు అయ్యాడు ఇలా ఇంగ్లాన్డ్ లోనూ వైకింగ్ సామ్రాజ్యం ఏర్పడింది శ్వీన్ ఫోర్క్ బెడ్ రాజుగా .
      సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వైకింగు శకం

వైకింగు శకం

ఈ నాడు మనం సెల్ ఫోన్ లలో సమాచార0 ,  ఫోటోలు ,డాక్యుమెంట్లు ,మెసేజస్ సరఫరా చేయటానికి వాడుతున్న ”బ్లూ టూత్ ”ను  స్వీడన్  చెందిన ఎరిక్సన్  కంపెనీ  మొదట తయారు చేసి 19 94 లో విడుదల చేసింది .ఈ టెక్నలాజికి ఆపేరు ఎందుకొచ్చిందో తెలుసా ఆ పేరు 10 వ శతాబ్దికి చెందిన హరాల్డ్ బ్లూటూత్ బ్లాటంట్ అనే డెన్మార్క్ ను 958-987 వరకు పాలించిన వైకింగ్ రాజు  ఆ దేశాభి వృద్ధికి చేసిన విశేష కృషికి గౌరవ చిహ్నంగా పెట్టటం వలన . 8 వ శతాబ్దం నుంచి 11 వ శతాబ్ది వరకు వైకింగ్ యుగం ఉన్నది ఉత్తర యూరప్  ,స్కాండి నేవియన్ చరిత్ర తో సంబంధమున్నది .స్కాండినేవియన్ ” నా ర్సే  మెన్ ”సముద్ర ,నదీ మార్గాలద్వారా యూరప్ అన్వేషణలో వ్యాపారం ,దాడి ,కాలనీ స్థాపన ,రాజకీయ పాలన లతో నార్జ్  గ్రీన్ లాండ్ ,న్యూ ఫౌండ్ లాండ్ ,ఈ నాటి ఫారో ఐలాండ్స్  ,ఐస్ లాండ్ ,నార్వే,స్కాట్లాండ్ ,ఇంగ్లాన్డ్ ఐర్లాండ్ ,నెదర్ లాండ్స్ ,జర్మనీ యుక్రెయిన్ ,రష్యా టర్కీలను  వశపరుచుకొని రాజ్య పాలన చేసి విశాల వైకింగ్ సామ్రాజ్యాన్ని ఏర్పరచి చరిత్రలో వైకింగ్ యుగాన్ని స్థాపించారు . మొదట్లో ఆ యా దేశాల కరెన్సీ నే వాడినా తర్వాత  సొంత కరెన్సీ ప్రవేశ పెట్టారు .సముద్ర ప్రయాణం వారికి వెన్న తో పెట్టిన విద్య కావటం వారి నౌకలు పొడవుగా ప్రత్యేక తరహాలో ఉండటం ధై ర్యం సాహసమే ఊపిరిగా బాహు బలంతో బాహుబలులు అయి యెంత దూరమైనా వెళ్లి అనుకొన్నది సాధించటం వీరి లక్షణం .ముందు వ్యాపారం కాకపొతే దాడి  అవసరమైతే యుద్ధం లేక రాజులతో సంధి చేసుకొని వాళ్ళిచ్చే నగలు  బంగారం వెండి ఆయుధాలు దంతపు సరుకులు , రాజ్య భాగాలు తీసుకొని క్రమంగా బలపడి సత్తా చూపించారు వైకింగ్ లు .అందితే జుట్టు అందకా పొతే కాళ్ళు . దాదాపు భూమి సరిహద్దుల వరకు  ప్రయాణం చేశారు . హై  ఆర్కిటిక్ నుంచి పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ ద్వారా బైజాన్టిన్ కాలపు కాంస్టాన్టి  నొపిల్ దాకా వాళ్ళు వెళ్లారు . ఇండియా ,పర్షియా లనుంచి సిల్క్ బట్టలు సేకరించారు బాగ్దాడ్ సమర్ఖండ్ లనుంచి వెండి దీనారాలు సంపాదించారు .వీటిని తీసుకొని స్వదేశానికి వెళ్లేవారు . చరిత్ర వాళ్ళని క్రూరులు దుస్టు లు అన్నదికాని వారు దోచుకొన్నట్లు ఎక్కడా లేదు .వారిది ఎదురుదాడి మాత్రమే వారి భూముల్ని క్రిస్టియన్ మిషనరీలు ఆక్రమించటానికి వస్తే దేశ రక్షణ కోసం చేసినవే .చార్లె మాన్ అతని తర్వాత వారు చేసిన  యుద్ధాలకు వైకింగులు చేసింది ప్రతీకారం మాత్రమే .
    ఇంగ్లాన్డ్ లో వైకింగ్ యుగం 8-6-793 లో నార్త్ అంబర్ లాండ్ లోని విద్యా కేంద్రం లి0డి స్ ఫారినే అనే ఆబ్బె ను ధ్వంసం చేసి ,అందులోని మాంక్స్ ను చంపి ,లేక సముద్రంలోపడేసి లేక బానిసలుగా తీసుకు వెళ్లి ,చర్చిలో ఉన్న అమూల్య సంపద చేజిక్కించుకొని ఒక కొత్త సంప్రదాయానికి దారి చూపటం  తోప్రారంభమైంది .    బ్రిటన్ చరిత్రలో మునుపెన్నడూ ఇంతటి విధ్వంసం జరగలేదని చరిత్రకారులన్నారు ..దీని పని సాధనకు నాలుగేళ్లుగా ఓడలతో నార్త్ అంబర్ లాండ్ లో తిష్టవేసి ఈ నాటి రెక్కీలాంటివి నిర్వహించి అదును చూసి ఆ పని చేశారు అందుకే వాళ్ళను గొర్రెల్లో దాక్కున్నా నక్క అనేవారు వైకింగ్ లది  నార్త్ జర్మన్ భాష దానినే ఓల్డ్  నార్జ్  అంటారు నార్వే లో సహజ పర్వత శ్రేణులు వారికి సురక్షిత ప్రదేశాలు .ఇక్కడినుంచి ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్లకు సముద్రం చాలా అందుబాటులో ఉండటం వాళ్ళ సాహస యాత్రలకు బాగా కలిసి వచ్చింది
   884 లో డేనిష్ వైకింగ్ సైన్యం నార్త్ సీ  దగ్గర ఆర్చిబిషప్ రొంబర్ట్ఆధ్వర్యం లోని ప్రిషియన్ సైన్యం చేతిలో ఒడి పోయారు దీనితో ఈస్ట్ ప్రిషియానుంచి వైకింగులు శాశ్వతంగా వైదొలిగారు 911 లో  ఫ్రెంచ్ రాజు చార్లెస్ సింపుల్ వైకింగ్ యుద్ధ వీరనాయకుడు రోలో తో ఒక ఒడంబడిక చేసుకొని ”డ్యూక్   ”బిరుదిచ్చి  నార్మాండి ని కట్టబెట్టాడు రోలో అతనితో స్నేహం గా ఉంటానని ఉత్తర భాగం ప్పై ఏ ఇతర వైకింగ్ గ్రూపులు దాడి చేయకుండా రక్షిస్తానని  ఒప్పుకున్నాడు అనేక తరాల తర్వాత ఇక్కడ స్థిరపడ్డ వైకింగులు నార్మన్ భాష సంస్క్రుతులకు  అలవాటై నార్మన్ లు గా మారారు . 10 66 లో ఇంగ్లా0డ్ ను గెలిచిఆంగ్లో సాక్సన్  అరిస్టోక్రాసి రాజులయ్యారు .స్కాండినేవియాలో స్కాండినేవియన్ రాజ్య పాలన ఏర్పడ్డాక వైకింగుల  1030 లో సిక్ల్ స్టాడ్  యుద్ధం లో ఓడిపోవటం తో వైకింగుల యుగ పరి సమాప్తి అయింది ఇంగ్లాన్డ్ లో నార్వేజియన్ రాజు మూడవ హరాల్డ్  -1066 లో కింగ్ హెరాల్డ్ గాడ్ విన్సన్ చేతిలో స్తాంఫోర్డ్ బ్రిడ్జి యుద్ధం లో ఓడిపోయాక ,డాబులుం  ను స్ట్రాంగ్ బౌ ఆక్రమించాక ఐర్లాండ్ ,,స్కట్లాండ్ మూడవ అలెక్సాఅండర్ చేతిలో హకాన్ హాకనోర్సన్ ఓడా కా ,గాడ్విన్సన్ ను నారండి వైకింగ్ సంతతికి చెందిన ద్యూక్ విలియం ఓడించాక నా ర్స్ నుండి  స్కాట్ లాండ్ దాకా  13 -15 శతాబ్దాలలో విముక్తి చెందాక పూర్తిగా ఇంగ్లాండ్ లో  వైకింగుల శకం సమాప్తి అయింది .
  ఒక సారి వైకింగుల ప్రతాపాన్ని చారిత్రకంగా చూద్దాం 800 లో గ్రిమూర్ కంబన్ ఫారో ఐలాండ్ లో స్థిరపడ్డ మొట్టమొదటి సె ట్లర్ . 802 లో వైకింగ్ దండ  యాత్రలవలన
 అయోనా మొనాస్టరీ తర్వాత స్కాట్లాండ్  ఐర్లాండ్ మొనాస్టరీలు నాశనమయ్యాయి 806 లో మూడోసారి అయోనాకు వైకింగులు వచ్చారు కానీ వారిలో 70 మంది చచ్చారు 810 లో పెద్ద డేనిష్ నౌకలుదక్షిణ డెన్మార్క్ తీరప్రాంతం  ప్రిసియాపై దండెత్తాయి 827 లో గాడ్ ఫ్రెడ్ కొడుకు హారిక ది  ఎల్డర్ డేనిష్ రాజుగా క్రానికల్స్ పేర్కొన్నాయి 8 35 లో   థేమ్స్ ముఖద్వారం దాడికి గురైంది 836-37 లో వైకింగ్ నౌకలు బాయని ,లీఫీ లగుండా ఐర్లాండ్ చేరాయి 840 వింటర్ లో ఐర్లాండ్లో ఉండిపోయారు . డబ్లిన్ రీంరిక్ ,ఆర్కులో  వాటర్ ఫోర్డ్ ,వీక్లో నగరాలను చేరారు. 841 లో వైకింగ్ నావలు ఉత్తర ఫరాన్స్ లోని సీన్ వాలీ పై దాడి చేశాయి .డబ్లిన్ లో మొదటిసారి ఉండిపోయారు 841 లో వైకింగుల డబ్లిన్ వాసం చరిత్ర కెక్కింది 844 లో ఐర్లాండ్ లోని మిడీలాండ్ మొనాస్టరీ లపై దాడి చేశారు. 845 హోరిక్  ది ఎల్డర్ 600 నౌకలతో హంబర్గ్ పై దాడి చేసి ద్వాంసం చేసి హొలీ రోమన్ ఎంపరర్ లూయీ ది జర్మన్ వైకింగుల సహాయకులైన,యుక్రెయిన్ నుంచి జర్మనీ వచ్చిన  స్లావిక్ ఆటవికులపై చేసిన దాడికి , ప్రతీకారం తీర్చుకున్నాడు  వైకింగ్ నాయకుడు లగ్నర్  లార్డ్ బ్రోక్   పారిస్ పై దండెత్తుతానని బెదిరిస్తే సంధి చేసుకొని 7 వేల  పౌడ్ల వెండి అప్పగించాడు 848 లో బోర్డరాక్స్ వశమైంది 850-60 లో నార్వేజియన్ అయిన నద్దేడ్ ఐస్ లాండ్ లో మొదటిసారిగా కాలుపెట్టాడు . లో వెల్ష్ తీరం పై మొదటి దాడి 853 లో డబ్లిన్ కు వొలాఫ్ ఫస్ట్ మొదటి రాజై 870 వరకు పాలించాడు ..తర్వాత 1052 లోపు 20 మంది 1072-74 వరకు మళ్లీ 1091-నుంచి 10 94 వరకు వైకింగ్ రాజులపాలన సాగింది 859  లో బార్న్ ఐరన్ సైడ్ ,తమ్ముడు హాస్టీన్  లోరీ రివర్ మీదుగా  60 నౌకలతో ఫ్రాన్స్ ,స్పెయిన్ తీరాలను  జిబ్రాల్టర్ జలసంధి దాటి రోన్  చేరి స్థావరాలు ఏర్పరచుకొని , ఫ్రాన్స్  ఇటలీ  ఉత్త్రర ఆఫ్రికాలకు చేరి స్థిరపడ్డారు . 860 లో రూరిక్ సోదరులు తూర్పు స్వీ డన్ లోని రోసాగ్లేన్ లో  స్లావ్స్ ట్రైబల్ ఫెడరేషన్  కోరికపై పరిపాలన చేశారు నోల్ఖోవ్ నదిప్రక్కన నోవ్  గోరోడ్ ను కొత్త రాజధాని చేశారు తర్వాత రోరిక్ 200 షిప్పులతో సైనికులను తెప్పించి కాన్  స్టాన్టి నొపిల్ పై దండెత్తా లనుకొన్నాడు . నార్వే లోని ,కింగ్ హెరాల్డ్ ఫ్రీర్ తండ్రి     వెస్ట్ ఫోల్డ్ రాజు హాఫ్ డన్  ది బ్లాక్  ను నార్వేజియన్ రాజ్య  వంశ  స్థాపకుడు  గా భావిస్తారు.యితడు మరణించాడు.  865 లో  ”ది  గ్రేట్ హీడే న్   ఆర్మీ”ఇంగ్లాండ్ లో మొదట కాలు పెట్టి తర్వాత యార్క్ లో ప్రవేశించింది. 868 లో వెస్సెక్స్ ఏదెల్  రెడ్   డేనిష్ కు చెందిన ఇవ్వార్ ది  బోన్ లెస్ సైన్యం చేతిలో ఓడింది . 869 లో ఈస్ట్ ఏంజెల్స్ రాజు ఎడ్మన్డ్ హీడే న్ ఆర్మ్ చేతిలో చంపబడ్డాడు.  8 71  లో ఏడాదిపాటు వెస్సెక్స్ లో డేన్స్ తో యుద్ధం సాగింది.  సాక్సన్  రాజ్యాలన్నీ వైకింగుల హీడే న్  ఆర్మీకి దాసోహం అన్నాయి ఏధెల్రెడ్ చంపబడి ఆల్ఫ్రెడ్ రాజ్యానికి వారసుడయ్యాడు 8 71 లో హాఫ్డం రంగరెస్సన్ రాజై తన పేరుమీద మొదటిసారిగా వైకింగ్ నాణాలు ముద్రించాడు . 872 లో నార్వేవైకింగ్ మొదటి  రాజుగా హరాల్డ్ ఫహార్ అంటే బ్లాక్ కొడుకు అయ్యాడు . 874 లో ఐస్ లాండ్ లోఇంగోఫర్ ఆర్నర్సన్ మొదటి సెటిలర్ .రేక్జవిక్ (పొగ మేఘాలు )  అని తానె పేరుపెట్టిన  చోట నివాసమేర్పరచుకున్నాడు
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

 సశేషం 
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-17 -కాంప్- షార్లెట్ -అమెరికా 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -31

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -31

 ఏకావలి  లో అలంకార చర్చ
ఏకావాలి లో మరో ముఖ్య విషయం అలంకార నిర్వహణ .ఈ విషయం లో విద్యా దరుడు ,మల్లినాథుడు అత్యున్నత స్థాయి ప్రదర్శన చేశారు . పూర్వ ఆలంకారికుల విధానాన్ని అనుసరించి ,తమ వ్యాఖ్యానాలను జోడించారు .మల్లినాథుడు అలంకారాలతో ఉండే పోలికలను ఒక సామాన్య సిద్ధాంతాన్ననుసరించి వివరించాడు . ఇదే మల్లినాథుని ”తరల ”వ్యాఖ్యానం లో ప్రత్యేకత అందువలన అసలు ఏకావాలి లో ఉన్న వాటిని బహిర్గతం చేయటం సులువైంది . 5 వ ఉన్మేషం  అంతా అలంకార చర్చకే కేటాయించాడు సూరి . కొన్ని అలంకారాలపై మల్లినాథుని అభిప్రాయాలేమిటో తెలుసుకొందాం .
  కొన్ని అలంకారాలు ఆధారం లక్షణం
విద్యాధర ,మల్లినాధులిద్దరూ కొన్ని అలంకారాలు కొన్ని రకాల లక్షణాలపై ఆధార పడ్డాయని చెప్పి ,వివరించారు .దీనినేలాల్యే పండితుడు ఒక పట్టికలో పొందు పరచాడు .
లక్షణం                     ఉదాహరణ                          అలంకారానికి మూలం 

1-జగత్స వార్యా     సురధీర్ఘి కా అతిశయ పావనాపాది  అప్రస్తుత ప్రశంస
2-విపరీత             కిమివ నాపకృత మనేన                  వ్యాజ స్తుతి
3-అజహత్స్వార్యా   కావ్యాదయహ -విదుషో లక్ష  య0తి   సమాసోక్త్యాది
                              ఉత్ప్రాదాన లక్షణ

-4-జహ దజ హాత్సవర్యా – వారణేంద్రస్య దేశకాల విశిష్టహ  సమాసోక్త్యాది

                                  త్వ మధునా నాస్తి
5-సారొపా            అగ్నిర్మాణ వాకః
  1- గౌణి
   2- శుద్ధా             ఉపచారవతీ ,ఉపచారః ,విద్యా విధి
                          కార్య కారణా భావః తాదాభ్యామ్                       రూపకాది
       శుద్ధా –       యధా ఇంద్రార్ధ స్యూ ణాఇంద్రహ
                     స్వస్వామి భావా లక్షణా సంబంధః


6-సాధ్య వసనా    విషయం నిర్జీణౌ విషయహ
        1-గౌణి             అయం పరిజాతః                                  అతిశయోక్తి
    2-శుద్ధా          ఆయమానందః
మల్లినాథుని భావనలో ఆ రెండు అనుబంధాలు ఆరోప ,అధ్యారోపాల వలన  భిన్నమైనవి ”సారొపా సాధ్యాయ వసనా శుద్ధాస్ ”ల మధ్య భేదం కూడా అలాంటిదే కారణం సంబంధం ,పోలిక .విద్యాధరుడు 7 లక్షణాలను కావ్యప్రకాశ లోని 6 లక్షణాలకు బదులు  గా చెప్పాడు .జహదాది లో 3 రకాలు ,సారోపాధ్య వాసనం లో 4 రకాలు -2 గౌణాలు 2 శుద్ధాలు చెప్పాడు .అవి ఒకదానితో ఒకటి కలిసి మిళితమై ప్రాధమికంగా ,,ఆధీనకంగా సంబంధాలను తెలియ జేస్తాయి
  విద్యాధరుడు ఏకావాలి 5 వ ఉన్మేషం లో గుణాలు ,అలంకారాల పనేమిటో వివరించాడు . గుణాలు తీపి లాంటివని మనోభావాలకు  పూర్వ లక్షణాలకు లోబడి ఆ మనో భావ  ఉత్కృష్టత ను వ్యక్త పరుస్తాయి .అలంకారాలు కవిత్వం లో పదం అర్ధాలు సంబంధం తో ఉత్కృష్టత ను వివరిస్తాయి . వాటిలోనే ఉండి కలయికలో మనో భావాలను ద్రవీ భూతం చేస్తాయి .ఏకావాలి లోని ఒక విషయం పై వ్యాఖ్యానిస్తూ మల్లినాథ సూరి అనుమానం వ్యక్తబరచి దాన్ని చర్చతో నివృత్తి చేస్తాడు కొందరు గుణాలు ఉత్కృష్టత కలిగిస్తాయని అంటే ,అలంకారాలతో కలిసి ఆ స్థాయి తెస్తాయి అంటూ మల్లినాథుడు –
”కావ్యాత్మ రస సమావేతా  స్తుదుక్త ర్ష వేతవే ధర్మా గుణః -కావ్యా0గ సంయుక్త  స్తదుక్త
ర్శ హేతవోలంకార ఇతి భేద ఇత్యర్ధహ్ ”అంటూ అంగిరసమా వేతా గుణాః ఆంగే స్సంయుక్త స్త్వలంకారా ఇత్యుక్తమ్ ”అన్నాడు .. దీని తర్వాత ఏకావాలి లో కొన్ని అలంకారాలను వాటిపై మల్లినాథుని భావాలను తెలుసుకొందాం . 
   సశేషం 
  మీ-గబ్బిట  దుర్గా ప్రసాద్ -2-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -30

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -30

‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -3

ఏకావలి లో రసవిధానం -3

రస విధానం లో 2 వభాగం 23-12-16 న రాశాను .మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తున్నాను .

  కావ్యాలలోరాముడు మొదలైన  పాత్రలు కొద్ది గానే ఉన్నాయి .అవీ పూర్వకాలం పాత్రలు నటుడు ఈ పాత్రలను పోషించే టప్పుడు ఆ రస భావం అనుభావైకం కాదు అతని దృష్టి అంతా నటనపైనా వినోదం ఇవ్వటం పైనా డబ్బు సంపాదనపైనా  కేంద్రీకరించి ఉంటుంది . రసభావన కలగాలంటే నటుడు  ప్రేక్షక స్థానం లో ఉండాలి .మరి అప్పుడు రసం పరిధి ఏమిటి ?అప్పుడతను ప్రేక్షకులే పరిధి గా నిరూపిస్తాడు ‘’సామాజికానామితి ‘’.ప్రేక్షకులలో రసానందం కలుగుతుందా ?కాదన్నాడు .ప్రేక్షకుడికి  తనకు అనుభావాలైన ప్రేమ మొదలైన వి  వాసనా రూపం లో ఉంటాయి .అంటే ప్రేక్షకునిలో వాసనా రూపం లో ప్రేమ ,శృంగారం వంటికి శాశ్వత స్థాయి ఉంటుంది .ఈ స్థాయి ఆనందాన్నివ్వటం లో ఉన్న నిర్ణాయకాలలో అనేక తేడాలుంటాయి .ఈ  తేడాలురసం కంటే భిన్నం కాకపొతే వాటి ఉనికికి సార్ధకమేమిటి ?దీనికి సమాధానం ‘’పానక రసన్యాయం .పానకం లో అనేకం కలిసిఉన్నా మొత్తం మీద దాని రుచి వేరుగా ఉంటుంది .అంటే అన్నీ కలిసి ఒక కొత్త అనుభవాన్ని స్తాయి .అందులోని పదార్ధ ప్రత్యేకతలన్నీ కరిగిపోతాయి . ‘’.ఇక్కడ కూడా అంతే .ప్రతిదీ కూడా రసం లాగానే అనుభూతమౌతుంది .కాని చివరికి వాటి సమాహార భావనఅలౌకిక  ఆనందాన్నిస్తుంది  ఆనందం ఎలాగో ఇదీ అలానే .’’చార్వ్య మాణాతైకప్రాణాఇతి -అనుభవైక జీవిత ఇత్యర్ధః ‘’దీనితో దాని అసాధారణ ,అసామాన్యమైన స్వభావం ఎలా స్థాపించ బడుతుంది ?దీన్ని ఊహించిన రచయిత రసం అంటే బ్రహ్మాను భూతి అన్నాడు ‘’బ్రహ్మాస్వాద సబ్రహ్మ చారీ-బ్రహ్మాస్వాదకల్ప  ఇత్యర్ధః ‘’బ్రహ్మానందం శాశ్వతం గా ఉన్నప్పటికీ అంతరాయం లేని నిరంతర  ధ్యానం వలన పొందగలుగుతారు అంతకు ముందు కాని ,ఆ ఆతర్వాత కాని అది ఉండదు. అలాగే రసం కూడా స్వయం ప్రకాశకం (సెల్ఫ్ లూమినస్ ).అదిసదా కట్టుబడి ఉండే  ఆనంద సారం యొక్క స్వభావం .అది మానసిక గుణం .అది సూచన అనే ‘’వ్యాణీ జన ‘’తో కలిసి ఉంటుంది .జ్ఞానం మొదలైన వాటినుండి వేరు చేయబడి ఉండి వ్యక్తమౌతుంది అది స్వయం ప్రకాశకం గా దర్శన మిస్తుంది .ప్రాపంచిక ఆనందం ఇలా ఉండడు అయితే అసాధారణ అసామాన్య మైన రస స్వభావాన్ని ఎలా  కాదనగలం ?రసం బ్రహ్మానందమే .బ్రహ్మానుభవాన్ని యోగ సాధన వలన సాధించ వచ్చు .ఇదే తేడా .ఇక్కడ సరైన విభావ ,అనుభావాదులవలన అనుభవించగలం .ఇదొక్కటే ఈ రెండిటికి ఉన్న తేడా -’’కిం చ బ్రహ్మానంద  ఏవాయ మన్యత్ర యోగా గమ్యః-అత్ర తువిభావాదను సంధాను సంధానం గమ్య ఇతీయన్ ‘’

రసానుభవం అనేది సౌందర్య రసజ్నులందరి మనసుల కు సాక్షి .దీని వశీకరణ  ఇంద్రియాతీతమైనది .దాని రహస్యాన్ని ఎవరూ విప్పి చెప్పలేరు నిరూపించలేరుకూడా ..అందుకే ఈ ఉద్దేశ్యం తోనే ‘’లోకోత్తర చమత్కారి ‘’అనే పదాన్ని ప్రయోగించాడు దీనిపై రూడేన్ బెర్గ్ చక్కని వివరణ ఇచ్చాడు దాన్ని ముందే మనం తెలుసుకొన్నాం .ప్రేమ మొదలైనవి విభావాలనుండి పుడతాయి అవి ఆలంబన కారణాలయి స్త్రీలలో విభావ నలను చంద్రుడు,కోకిల స్వరం  మలయా మారుతం ,అందమైన ఉద్యానవనాలు  మొదలైన ఉద్దీప కారణాల వలన అనుభలవుతాయి .విద్యాధరుడు మొదటి అధ్యాయం లోనే ధ్వని సిద్ధాంత సూచన చేశాడు .ధ్వన్యాలంకార కర్త ఆనంద వర్ధనుని సిద్ధాంతాన్ని మరో సారి సమర్ధించి చెప్పాడన్నమాట .ధ్వనిని వ్యతిరేకించేవారిని వ్యతిరేకించాడు విద్యాధరుడు .ఈ విషయం లో మల్లినాద సూరి వ్యాఖ్యానం చాలా సరళం సంక్షిప్తం వివాదాస్పదం .

దీని తర్వాత ఏకావలి లో  అలంకారాలను గురించి తెలుసుకొందాం .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -4 –2 (చివరి భాగం ) 24-4-17 నుండి 30-4-17 వరకు మూడు విందులు రెండు పూజల వారం .

వీక్లీ అమెరికా -4 –2 (చివరి భాగం )

24-4-17 నుండి 30-4-17 వరకు

  మూడు విందులు రెండు పూజల వారం .

 

 శుక్రవారం ఎండబానే ఉంది .రాత్రి కొన్ని చినుకులు మాత్రమే పడ్డాయి ..ఇక్కడ ‘’షవర్స్ ఇన్ ఏప్రిల్ బ్రింగ్ ఫ్లవర్స్ ఇన్ మే ‘’అనే సామెత బాగా ప్రచారం లో ఉంది .ఏప్రిల్ వర్షాలు మేలో పూలు రావటానికి బాగా తోడ్పడతాయని భావం .మా అమ్మాయి విజ్జి ఉదయం 6-30 కే డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం లీవ్ పెట్టి ఒంటిగంటకు వచ్చి మమ్మల్ని గోసుకొండ అరుణ ఇంటికి భోజనానికి తీసుకు వెళ్ళింది వీళ్ళ  కమ్యూనిటీలోనే ఆ చివర ఉంటారు .అప్పటికే ‘’మణిద్వీప’’పూజ పూర్తీ చేసి మా కోసం రెడీ గా ఉంది అరుణ ..మణిద్వీపపూజ  ఇప్పటికి 8 వారాలుగా ప్రతి శుక్రవారంచేస్తూ ఆఖరి9 వ వారం ఇవాళ చేసి మాశ్రీమతికి  వాయనం ఇవ్వాలని ఆమె సంకల్పం .దేవుడిగది చాలా బాగా ఉంది అమ్మవారి అలంకారం పూలతో శోభాయ మానంగా ఉంది .లలితా పరమేశ్వరీ అమ్మవారు మణి ద్వీపం లో ఉంటుందని మనకు తెలుసు .మణి ద్వీపేశ్వరి పై అస్తోత్తరం ఉంది అది ప్రతివారం చదివి పూజ చేస్తారు .32 శ్లోకాల మణి ద్వీప వర్ణన స్తోత్రం,మణిద్వీప స్తోత్రం ,పంచ దశీ మంత్రం 40  చరణాల ‘’లలితా చాలీసా ‘’ నిత్య పారాయణ శ్లోకం ,దీప ప్రార్ధన ,లలితా నవ విధ భక్తిమాలిక  భక్తీ నీరాజనం మంగళ హారతి చదివి పూజ పూర్తీ చేస్తారు .మేము ఈ పూజను వినటం ఇదే మొదటి సారి .ఈ విషయాలన్నీ ఉన్న చిన్నపుస్తకాన్ని పెద్ద బాల శిక్ష సంకలన కర్త శ్రీ గాజుల సత్యనారాయణ ప్రచురించారు  అ పుస్తకం మాకు ఇచ్చింది .దాన్ని బట్టే వివరం తెలిసింది .

‘’పార్వతీ పరమేశ్వరుల వంటి దంపతలు మా ఇంటికి వచ్చారు ‘’అంటూ అరుణ పొంగిపోయింది మా శ్రీమతికి  నాకూ పూజ చేసి నూతన వస్త్రాలు అందజేసి మా శ్రీమతికి వాయనమిచ్చింది . తర్వాత భోజనాలు .మా కోసం కారం ఉప్పు తగ్గించి ప్రత్యేకంగా చేసింది .టమేటా పప్పు వంకాయ కూర ,బీన్స్ కూర కొత్త ఆవకాయ ,చట్నీ పూర్ణపు బూరెలు ,గారెలు పాయసం ,పులిహోర ,కర్నాటక బేడల(పప్పు) చారు అనే రసం పెరుగు మాంగో సలాడ్  లతో కమ్మని భోజనం పెట్టింది .దగ్గర కూర్చుని అన్నీ అడిగి వడ్డించి కొసరి కొసరి తినిపించింది అరుణ    అక్కడ సుమారు 15 మంది ఆడవాళ్ళు కూడా మాతో ఉన్నారు భోజనానికి .గురువారం ఉదయం మా ఇంటికొచ్చిన పద్మ అనే అమ్మాయి  కబుర్లతో జోకులతో మంచి సందడి చేసింది .ఈ బాచ్ ని చూస్తే మా అమ్మాయికి ట్విన్స్ పుట్టినప్పుడు2005 లో  మేము మిచిగాన్ లోని డెట్రాయిట్ దగ్గరున్న ట్రాయ్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న జ్యోతి ప్రీతీ బిందు మొదలైన వారంతా గుర్తుకొచ్చారు .అక్కడ వారానికొకరింట్లో భోజనాలు కబుర్లు సరదాలు పుట్టిన రోజు ,సీమంతం వేడుకలతో కాలం యిట్టె గడిచిపోయింది .అందరం అరుణ ఇంట్లో గ్రూప్ ఫోటో దిగాం ..మా అమ్మాయి అరుణకు చీర జాకెట్ పెట్టింది .ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 3 -30 అయింది .సాయంత్రం స్వామి బ్రహ్మానంద సరస్వతి పై రాశా .రాత్రి యు ట్యూబ్ లో కామెడీ  చూశాం .

 ఈవారం లో ‘’హ్యూమరిస్త్స్ ‘’,బిగ్ జోక్స్ ,బైజాంటిన్ ఎంపైర్ ,ది నాజిహోలో కాస్ట్,చదివాను .దీనిపై రాయానిపిస్తోంది ఇవికాక ది వైకింగ్స్ ఇంట రెస్ట్ గా  ఉంటె చదువుతున్నా ‘’.28 టు యాక్టర్ ప్లేస్ ‘’ డ్రైవింగ్ త్రూసౌది’’మొదలుపెట్టాకాని రుచించలేదు .

  శనివారం మా ఇంట్లో శ్రీ శంకర జయంతి .మా అల్లుడి సంకల్పం అమ్మాయి సహకారం  .ఉదయం 7 గంటలకే ఆవాహనతో ప్రారంభమైంది .రాంకీ తమ్ముడు ఇంకొక ఆయన వచ్చారు . ఉపనిషత్తులు ఆదిత్య హృదయం అరుణం చదివారు .తర్వాత ఒక 10 మంది వచ్చారు మధ్యాహ్నం 12 30 కు  కేసరి ఉప్మా కాఫీ లతో ఫలహారం . తర్వాత నమక చమకాలు .మధ్యాహ్నం 3 కు ఒక 25 మంది అయ్యారు .అప్పటికే రాంకీ వగైరాలు వచ్చారు .ఒకాయన భజగోవిందం పై పది నిమిషాలు మాట్లాడాడు .తరువాత ఆడవాళ్ళు పాటలు పాడారు .మా అమ్మాయి చెప్పే అపర ఘ౦టసాల గారుపూర్వపు  కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమాలోని భక్తీ గీతం పాడారు .రాంకీ తమ్ముడిభార్య పద్మశ్రీ త్యాగ రాజక్రుతులు బహుకమ్మగా గానం చేసింది .ఇద్దరు పిల్లలూ బాగా పాడారు గాయత్రి అనే అమ్మాయి కూడా చక్కగా స్వర రాగ యుక్తంగా పాడింది ఈమెను  ‘’షార్లెట్ స్కైలార్క్ ‘’అన్నాను ..రాంకీ  తమ్ముడు పంచాంగ శ్రవణం చేశారు సరైన హోమ్ వర్క్ చేయనట్లు అనిపించింది .మధ్యమధ్య నేను కొంత చెప్పా .తర్వాత శ్రీ శంకరాచార్యస్వామికి  అస్టోత్తర పూజ జరిగింది. రాంకీ పురోహితునిగా ఉన్నాడు . చివరికి మధ్యప్రదేశ్ లోపుట్టి బొంబాయిలో పెరిగి అమెరికా చేరిన ఒక యోగా మాస్టర్ తేలికైన ఇంగ్లీష్ ,హిందీలలో యోగా గురించి డిమాన్ స్ట్రేషన్  లెసన్ చెప్పాడు అందరూ మెచ్చారు .కేరళ లోని 92 ఏళ్ళ స్త్రీ యోగాసనాలు చాలా  సునాయాసంగా  చేస్తున్న వీడియో క్లిప్పింగ్ చూపించాడు .అందరూ చప్పట్లు చరిచారు .తర్వాత  మహా నైవేద్యం హారతి ,మంత్రం పుష్పం తో కార్యక్రమం పూర్తి .నాలుగు మాటలు నన్ను మాట్లాడమని రాంకీ అడిగితె ‘’ఇండియాలో మేము మరచిపోతున్న శంకరాచార్య స్వామిని అమెరికాలో గుర్తుంచుకొని మా అమ్మాయి అల్లుడూ శ్రర్దగా ఉదయం 7-30 నుంచి సాయంత్రాం 6-30 వరకు నిర్వహించటం గొప్ప విషయమని వారిద్దరిని అభినందిస్తున్నానని ,కంచి పెద్ద స్వామి శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు ‘’మైత్రీ భజతే ‘’అనే సంస్కృత గీతాన్ని రచిస్తే అంతర్జాతీయ సమితి యు యెన్ వో 50 వ వార్షికోత్సవం లో భారత రత్న ఏం ఎస్ సుబ్బు లక్ష్మి గానం చేసిందని దానికి అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారని,సరస భారతి మార్చి 26 ఉగాది వేడుకలో ‘’వసుధైక కుటుంబం ‘’శీర్షికపై కవి సమ్మేళనం నిర్వ హించిందని దాన్ని పుస్తకంగా తెస్తున్నామని  ,అప్పుడు జ్ఞాపికగా వసుధైక కుటుంబం చిత్రం  పరమాచార్య ఫోటో, వారి మైత్రీ గీతం లో చివరిభాగం తో జ్ఞాపిక తయారు చేయించి అందరికీ ఇచ్చామని చెప్పి జ్ఞాపిక చూపించా . పద్మశ్రీ వెంటనే ఆ గీతాన్ని బహు శ్రావ్యంగా పాడింది. అందరూ అభినందించారు .కార్యక్రమం పూర్తి ఆయే సమయానికి 45  మందిఉన్నారు పొద్దున్న కొందరు వచ్చి వెళ్ళారు .’’రాలీ’’లో భగవద్రామానుజ జయంతి చేస్తున్నారని అక్కడ సినీ ,టీవీ గాయని శ్రీమతి ఉష సంగీత విభావరి ఉందని చాలా మంది ఇక్కడికి రాలేదు లేక పోతే మరో 15 మంది వచ్చి ఉండేవాళ్ళు ఉష అమెరికాలోనే ఉండి ప్రోగ్రాములున్నప్పుడు మాత్రమే ఇండియాకు వస్తుంది .ఉష అక్క  ఉదయమే వచ్చి కాసేపు ఉండి వెళ్ళింది .

  తర్వాత మా అమ్మాయి అందరికీ చేసిన  వంట కాలతో  కమ్మని విందు భోజనం-టమేటా పప్పు వంకాయ చిక్కుడు కాయ కూర ,ఆవకాయ  పూరీలు ,బంగాళాదుంప కూరా ,కేసరి ,బూరెలు గారెలు ,పెరుగు పచ్చడి సాంబారు ,పెరుగన్నం .అందరూ సంతృప్తిగా భోజనం చేశారు .5 ఏళ్ళక్రితం పరిచయమైనా మంజుల .ప్రక్కి అరుణ చక్కగా పలకరించారు .

  భోజనాలతర్వాతగాయత్రి తో అందరూ అడిగి పాటలు పాడించాం .ప్రక్కి వాళ్ళమ్మాయి అబ్బాయి కూడా పాడారు . గాయత్రికి ‘’షార్లెట్ కౌమార కోకిల ‘’అని సరదాగా బిరుదు ఇచ్చి ఆ పేరేరే రాసి శతకత్రయం సరసభారతి ఉగాది జ్ఞాపిక అంద జేశాం ..ఆ అమ్మాయి తలిదండ్రులు బాగాశ్రర్ధ తీసుకొని సంగీతం నేర్పిస్తుంటే ఆ అమ్మాయి సార్ధకం చేస్తోంది ఇక్కడ పాడిన వారందరి తలిదండ్రులను అభి నందిస్తున్నాను .సరదాగా నేను  ఇద్దరు అరుణలలో ఒకమ్మాయిని ఇంటిపేరుతో ప్రక్కి అరుణ అని రెండో అమ్మాయి మాటల్లో చాలాసార్లు ‘’కరెక్ట్ అంకుల్ మీరుకరేక్ట్ ఆంటీ ‘’అనటం మూలంగా ఆ అమ్మాయిని ‘’కరెక్ట్ అరుణ ‘’అన్నా.అందరూ పగలబడినవ్వారు అరుణ ‘’కరెక్ట్ అంకుల్ ‘’అంది సరదాగా .ఇదంతా పూర్తి  అయేసరికి రాత్రి 9 అయింది .పవన్ భార్య రాదఉదయం నుంచి విజ్జికి చాలా సహాయంగా ఉంది .చివరికి అన్నీ సర్ది పవన్ దంపతులు మా ఆశీర్వాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళారు .

పవన్ రెండో కూతురు మా రెండవ బావ గారు  వేలూరి వివేకానంద్ గారి చెల్లెలు శాంతమ్మగారు లాగా నవ్వుతూ నవ్విస్తూ మూతి ముప్ఫై వంకర్లు తిప్పుతూ అచ్చంగా ఆవిడ పోలికలే వచ్చినట్లు అనిపించింది .ఈ విషయం హైదరాబాద్ వెళ్ళినప్పుడు శాంతమ్మగారితో చెప్పాలని మా ఆవిడ తహ తహ లాడుతోంది .తాత గారి చెల్లెలి అంటే మేనత్త పోలిక  అన్నమాట .

కొస ముక్క -తిరువాయూర్ లో త్యాగరాజ ఆరాధననాడు ఆయనకూ శివునికి అభిషేకం చేస్తారు .శంకర జయంతి నాడు కూడా శంకరా చార్యులు అపర శంకరులే కనుక ఆయనకు మహన్యాసం తో అభిషేకం చేస్తే బాగుంటుంది .వ్యాస మహర్షి వేద వాజ్మయాన్ని పురాణ ఇతిహాసాలను మనకు వరం గా ప్రసాదించారు .శ్రీ శంకర భగవత్పాదులు ప్రస్తానత్రయానికి వ్యాఖ్యానం రాసి జ్ఞానానికి  మార్గ౦ సుగమం చేశారు. ఇది ఒక స్థాయి ఉన్నవారికే పనికొస్తుంది .సామాన్యులు తరించటానికి మార్గం వారు రాసిన స్తోత్రాలు ,శివానంద సౌందర్య లహరి మొదలైనవి అందులో వేద వేదాంత సారం అంతా నిక్షిప్తం చేశారు . సంస్కృతాన్ని సామాన్య జనం స్థాయికి స్తోత్రాల ద్వారాతెచ్చి తరుణోపాయం చూపారు .కనుక జయంతి నాడు కనీసం రెండు గంటలు శివానంద సౌందర్య లహరి ,స్తోత్రాలను విడివిడిగా సామూహికంగా గానం చేస్తేనే ఆయన ఋణం తీరుతుంది .అప్పుడే గొప్ప అనుభూతి కలుగుతుంది. సౌందర్య లహరి అందరికీ అందుబాటు లో ఉండటం కష్టం .శివానంద లహరి చాలా సులభం అందరూ నేర్చుకొని పాడచ్చు అలాగే స్తోత్రాలు కూడా సామూహికంగా పాడాలి .అప్పుడే దాని ఇంపాక్ట్ మనకు తెలుస్తుంది .

   మరో విషయం శంకర జయంతినాడు సంస్కృతం లో కృషి చేసినవారికి కాని ,స్తోత్ర గానం చేసినవారికి కాని సంగీత నృత్యాలలో  రాణించినవారికి కాని ప్రోత్సాహక బహుమతులు అందిస్తే సార్ధకమౌతుంది ..దేశం కాని దేశం లో చేస్తున్నప్పుడు ఈ రెండూ బాగా రాణిస్తాయి .కనుక ఈ సారి శంకర జయంతికి ఈ ఆలోచన చేస్తే బాగుంటుందని నా భావన .ఒడ్డున కూర్చుని ఎన్నైనా చెప్పవచ్చు .దిగితే కానీ లోతు తెలియదని నాకు తెలుసు .అందుకే సరసభారతి గాయత్రికి శ్రీ సువర్చలాన్జనేయ శతక త్రయం, ఉగాది జ్ఞాపిక అందజేసి మార్గం చూపించింది .

  రాత్రి భారవి తీసిన శంకరాచార్య తెలుగు సినిమా చూశాం యు ట్యూబ్ లో .పైత్యం ఎక్కువ శ్రీహరిని మోహన బాబు ను ,సుమన్ ను  భరణి నిఎక్కడపడితే  అక్కడ చూపించి పలచన చేశాడు . హు౦దాతనం  ఉత్క్రు స్టతలోపించి చౌకబారు సినిమాగా గ్రాఫిక్ మయం గా మారింది. నిద్ర పోయే సరికి రాత్రి 12 .

30-4-17 ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి .వీలు ప్రకారం శనివారం చేశారు మా వాళ్ళు . నేను ఉదయం 6 -30 కే లేచి కాలకృత్యాలు పూర్తీ చేసి ఉదయం 7-30 కు పూజలో కూర్చున్నా .మామూలు నిత్య పూజ చేసి   శ౦కరా చార్య అస్తోత్తరం  శివ అస్తోత్తరం  సహస్రం ,లలితా సహస్రం దక్షిణా మూర్తి దత్త్రేయ అస్తోత్తరాలతో పూజ చేసి శివానంద లహరి సౌందర్య లహరి చదివి ,మహాన్యాసం తో నమక చమకాలు దశ శాంతి  సామ్రాజ్య పట్టాభి షేకం  తో ఏక రుద్రం చేసి(చదివి) , బిల్వ అష్టోత్తర౦  తో పూర్తీ చేసే సరికి ఉదయం 10-30 అయింది అంటే మూడు  గంటలు  పట్టింది ధన్యుడను అనుకొన్నా ..తర్వాత టిఫిన్ .

               వీక్లీ అమెరికా 4 మొదలు పెట్టి కొంత  రాశా .కాలి ఫోర్నియా నుంచి మేనల్లుడు శాస్త్రి భార్య విజయ లక్ష్మి  కొడుకు కృష్ణ ఫోన్ చేసి మాట్లాడారు . కృష్ణకు  సాన్  ఫ్రాసిస్కో లో మంచి కొత్త ఉద్యోగం వచ్చిందని మే 15 చేరుతాడని ,విజయలక్ష్మి అమ్మగారు మే 7 న కొడుకుతో ఇండియా నుండి అమెరికా వస్తున్నారని ,మమ్మల్ని వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండేట్లు రమ్మని కోరారు .సరే అన్నాం. మా ప్రయాణం మా చేతుల్లో లేదుకదా .

  ఈ వారమంతా బాహుబలి హడావిడి ఇండియాలో టికెట్ వెయ్యి రూపాయలు అమెరికాలో 42 డాలర్లని అంటున్నారు .అయినా కొని చూస్తూనే ఉన్నారట .80 కోట్లు కూడా ఉండని తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళి 450కోట్ల స్థాయికి తెచ్చి బాలీ వుడ్ ను మించి అతనిపై  నమ్మకం తో నిర్మాతలు అంత డబ్బూ పెట్టు  బడి పెట్టారు . వాళ్ళ పంట పండినదని కాసులవర్షం కురుస్తోందని మీడియా కోడై కూస్తోంది .రాజమౌళి తీసిన్న మగ ధీరకాని బాహు బలి 1 కాని నేను చూడలేదు ఆ సీన్లు ఏదైనా చానల్ లో వచ్చిన స్కిప్ చేస్తా . సినిమా హృదయాన్ని కదిలించాలి కాని గ్రాఫిక్స్ కాదు

  విజ్జి  ఉదయం 9-30 కు తెలుగు క్లాసు నిర్వహించి మధ్యాహ్నం 12 కు ఆఫీస్ కు వెళ్ళింది .రాత్రి 8 కి వచ్చింది .కాసేపు ఫ్యాన్ బకెట్ చూశా .అయ్యర్ సంస్కృత శ౦కరాచార్య కాసేపు చూశా .1970 దశకం లో తమిళ నుంచో మలయాళం నుంచో తెలుగులోకి డబ్బింగ్ అయిన  ఆది శంకరాచార్య సినిమా బాగా ఆడింది అందరికీ నచ్చింది అద్భుతమ నిపించింది అది యెక్కదైనా దొరుకుతుందేమోనని యు ట్యూబ్ లో వెతికితే కనపడలేదు .ఇక ఈ వారానికి స్వస్తి .

               మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-17 – కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -4 –1 24-4-17 నుండి 30-4-17 వరకు

వీక్లీ అమెరికా -4 –1

24-4-17 నుండి 30-4-17 వరకు

  మూడు విందులు రెండు పూజల వారం .

24 వ తేది  సోమవారం  ఇంకా బెడ్ మీద ఉండగానే  సెల్ మోగింది .నిద్రలో ఎత్తా.విశాఖ నుంచి స్వామిగారట మెయిల్ రాశాను జవాబు లేదని ఫిర్యాదు .తెలివి తెచ్చుకొని అమెరికాలో ఉన్నా తడిసి మోపెడవుతుంది అని కట్టేశా అయినా 30 రూపాయలు బొక్క పొద్దున్నే .అలాగే ఇక్కడికి వచ్చిన 7 వ తేది వాషింగ్టన్ నుంచి కారులో వస్తుంటే రావి శాస్త్రిగారి అబ్బాయి ప్రసాద్ గారు ఫోన్ చేశారు .అప్పటికి రోమింగ్ విషయం గుర్తులేక కాసేపు వాయి౦చామ్ .మా అమ్మాయి అరుస్తూనేఉంది. ఉండమని ఆపేశా .90 రూపాయలు తోసింది .అప్పటినుంచి మ్యూట్ లో పెడుతున్నా సెల్ .రెండు రోజులుగా వర్షం పడుతోంది . శ్రీ గండికోట సుబ్బారావు ,సోమలత గుర్తించినవైద్య  భైరవ దత్త లపై నెట్ లో రాశా ..ఇల్లంతా ఇద్దరు ఆడవాళ్ళు బహుశా మెక్సికన్లు అన్నీ సర్ది క్లీన్ చేశారు .

హైదరాబాద్ లో జ్యోతి శ్శాస్త్ర వేత్త ,పంచాంగ కర్త శ్రీ అడుసుమిల్లి (బ్రాహ్మణుల ఇంటిపేరు కమ్మవారింటి పేరుకాదు )లీలాప్రసాద్ గారబ్బాయి రాంకీ ,భార్య ఉష లు అయిదేళ్ళ క్రితం వచ్చినప్పుడే బాగా పరిచయం .వాళ్ళ ఇంట్లో ఇవాళ రాత్రి సాయి భజనకు పిలిస్తే మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చాక రాత్రి 7-30 కు బయల్దేరి 8 కి చేరాం .సుమారు 50 మంది వచ్చారు . రాంకీ ఉషా దంపతులకు శతకత్రయం ఇచ్చాము  ఆతను’’ వేద మాల ‘’అనే సంస్కృత శ్లోకాల పుస్తకం ఇచ్చాడు తర్వాత భోజనాలు .మూడు స్వీట్లు రెండుహాట్లు రెండుకూరలు పప్పు అప్పడం సాంబారు ,పెరుగు ,పుచ్చముక్కలు వగైరా లతో భోజనం .అన్నీ బాగానే ఉన్నాయి .రాంకీ తమ్ముడు భార్య ఇక్కడే ఉంటున్నారు .ఆమె పద్మశ్రీ సంగీతం బాగా పాడింది. మా మనవళ్ళు  ఆశుతోష్ ,పీయూష్ లకు సంగీత గురువు .అక్కడ ఒక డాన్స్ టీచర్ పరిచయమైంది .అలాగే పవన్  డోమేనికన్ రిపబ్లిక్ కు చెందిన ఆవిడను  పరిచయం చేశాడు ఆవిడను ఆరాధన రోజూ చూశా .ఇప్పుడు మాట్లాడా .ఆమె అక్కడ దేశానికి ప్రెసిడెంట్ అయ్యే చాన్స్ వచ్చినా వదిలేసి ఇక్కడ కొడుకుతో ఉంటోంది .మన సంప్రదాయాలు తెలుసు .ఉష బొట్టుపెడితే చక్కగా పెట్టి౦చు కోన్నది  .పవన్ చెబితే ఆవిడపై నెట్ లో వ్యాసం రాద్దామని అనుకొన్నాను .ఆవిడకు నా మెయిల్ ఐడి ఇక్కడి ఫోన్ నంబర్ ఇచ్చి ఆమె గురించి విషయాలు మెయిల్ చేయమన్నాను .అందగానే తెలుగులో రాస్తానని చెప్పా. .ఈ రోజు వరకు ఆమె నుండి విషయం రాలేదు .ఇంటికి వచ్చేసరికి రాత్రి పదిఅయింది

 మంగళవారం మధ్యాహ్నం మాంచి నిద్రలో ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు విజయ  వాడ నుంచి నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు చదివిన భూషణం బాబు వాట్సాఫ్ లో రెండు సార్లు ప్రయత్నిస్తే నేను ఎత్తలేదు  .మూడో సారీ చేస్తే అప్పుడు మెసేజ్ లో తాను స్టూడెంట్ అని ఉంటె నేనే ఫోన్ చేశా .దర్వాజా అయ్యాడు పాపం ఆనందం పట్టలేక .చాలా విషయాలు మాట్లాడుకున్నాం అతనిప్రక్కనే సురేష్ అనే అదే బాచి కుర్రాడుకూడా మాట్లాడాడు. అడ్డాడ వదిలి సుమారు 20 ఏళ్ళు అయినా ఇంకా గుర్తుపెట్టుకున్నారు ఈ బాచ్ వాల్లందరూ కలిసి అక్టోబర్ లో నేను ఇండియా వచ్చినతర్వాత ఒక గెట్ టు గెదర్ పెట్టాలన్న ప్లాన్ లో ఉన్నట్లు చెప్పారు .వీళ్ళతో పాటే 12 ఏళ్ళుగా ఇక్కడున్న పావని అనే అమ్మాయి దుబాయ్ లో ఉన్న ఆనంద్ కూడా ఇదివరకే మాట్లాడారు .నిద్రపట్టక మైనేనిగారికి వాట్సప్ లో  ప్రయత్నిస్తే దొరక్క పొతే మెయిల్ పెట్టాను .తర్వాత ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు .తర్వాత డా. యెన్ ఇన్నయ్యగారు ఫోన్ చేసి మాట్లాడుతూ చిత్రకారులు శ్రీ ఎస్వి రామారావు గారు చికాగో వచ్చి వారమయిందని  తెలుగు విద్యార్ధి పత్రికకు ఆర్టికల్ రాయమంటే రాశానని చెప్పారు ..బైజాంటిన్ సామ్రాజ్యం చదవటం మొదలుపెట్టి దాని నాగరకతపై ఒక వ్యాసం రాశాను  గీర్వాణ౦ లో 12 5 వరకు లాగాను .

కళాతపస్వి  కాశీనాధుని విశ్వనాద్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చారు .విశ్వనాధ ,మొల్ల, వెంగమాంబ పోస్తేజ్ స్టాంపులను కేంద్రం విడుదల చేసింది. రాత్రి 12 వరకు నిద్ర పట్టలేదు

 బుధవారం ఎండ బాగానే వచ్చింది రెండుపూటలా వాకింగ్ కు వెళ్ళా .ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో బి జెపి ‘’ఆప్’’ను వాళ్ళ ‘’చీపిరి ‘’తోనే తుడిచేసి 18 2 స్థానాలు 3 మునిసిపాల్తీలు గెల్చింది రాత్రి యు ట్యూబ్ లో క్రిష్ సినిమా ‘’కృష్ణం వందే జగద్గురుం ‘’చూశాం .పేరుకీ సినిమాకు లంకె లేదు సీన్లు అన్నీ ఇష్టం వచ్చినట్లు తీసి అతికించినట్లు అనిపించింది నయనతార ఎందుకున్నదో ఎవరికీ తెలీదు .దగ్గుబాటి రాణా బానే చేశాడు  టార్జాన్ సినిమాలకు బ్రహ్మాండంగా పనికోస్తాడని పించింది .మణిశర్మ సంగీతం సిరివెన్నెల పాటలూ వినసొంపు .పిక్చరై జేషన్ బాగుంది  సాయంత్రం ‘’కారీ ‘’లో ఉంటున్న మా అన్నయ్యగారి మనవడు అంటే కూతురు వేదవల్లి కొడుకు వేలూరి హరి ఫోన్ చేశాడు భార్య కూడా మాట్లాడింది .

  గురువారం గీర్వాణం 13 5 వరకు దేకా .రెండుపూటలా నడక .స్వామి రామా పుస్తకం ‘’లివింగ్ విత్ ది హిమాలయన్  మాస్టర్స్ ‘’పూర్తి చేసి హిమాలయ యోగులపై రాశా .విజ్జి వాళ్ళ ఇంటి ప్రక్క రవి గాయత్రి పలకరించి మాట్లాడారు రవి తలిదండ్రులు బుధవారం వస్తారట ఇండియా నుంచి

మధ్యాహ్నం విజ్జి స్నేహితురాలు వీటూరి పద్మ వచ్చి పలకరించింది .తర్వాత గోసుకొండ అరుణ కూడా వచ్చి శుక్రవారం వాళ్ళ ఇంట్లో అమ్మవారి మణి ద్వీప పూజ ఉందని తాంబూలాని భోజనానికి రమ్మని పిలిచింది .నేనెందుకు ‘’పోతు పేరంటాలు ‘’లాగా అనిపించింది కాని అంత ఆప్యాయంగా పిలిస్తే వెళ్ళాలి అనుకొన్నా .రాత్రి ఏమీ తోచక ‘’ఫ్యన్ బకెట్ ‘’చూశా౦ .ఒక జోకు మురికిదే అయినా బాగుంది -అది చెప్పకపోతే నా కడుపుబ్బరం తగ్గదు .ఒక భార్యా భర్తా తగువులాడుకొని విడాకులిప్పించమని పోలీస్ స్టేషన్ కొచ్చి సబిన్స్పెక్టర్ను . అడుగుతారు .సరేనని ఆమె దగ్గర లక్ష రూపాయలు కాష్ ఉందని సగం భర్త కిస్తానని అంది ఒకే ఇంటిలో వంటిల్లు భార్యకు బెడ్ రూమ్ భర్తకు పంచాడు .ముగ్గురు పిల్లల్ని ఏం చేయాలని సమస్య .ఎస్ ఐ నాలుగో సంతానం కన్నాక విడాకుల సంగతి చూద్దామన్నాడు .భార్య ‘’ఈ యనపై నమ్మకం పెట్టుకొంటే ఆ ముగ్గురూ కూడా పుట్టేవాళ్ళు కాదు ‘’అని గబుక్కున నోరు నొక్కు కుంది. అవాక్కవటం భర్త ,ఎస్ ఐ ల వంతు అయింది .పనిలో పని మరోకుళ్ళు జోకూ చెప్పకపోతే ఆగలేదు .బిగ్ జోక్స్ అనే పుస్తకం చదువుతున్నా .అందులో రాజకీయ నాయకుల మీద ఏదో కల్పిత జోకులు చాలా ఉన్నాయి అందులో ఒకటి చదివి నవ్వు ఆపుకోలేక పోయా . అమెరికా ప్రెసిడెంట్ ఒబామా  ఇంగ్లాండ్ వెళ్ళాడట. రాణి ఆరుగుర్రాల బండీలో ఆయన్ను  రాజ సౌధానికి   తీసుకు వస్తోందట .అందులో ఒక గుర్రం కొంత దూరం వెళ్లేసరికిడామ్మని పెద్ద శబ్దం తో పిత్తిందిట .పిచ్చకంపుట .ఇద్దరూ అవాక్కయి ‘’పిత్తినన ముత్తయిదుల్లా ముక్కు మీద కర్చీఫ్ పెట్టుకొని  భరి.స్తున్నారట .కాసేపయ్యాక   రాణి ఇకమర్యాదగా ఉండదని’’మిస్టర్ ప్రెసిడెంట్ ! మహా రాణీ అయినా కొన్ని విషయాలు ఆవిడ చేతుల్లో ఉండవు ‘’అన్నదట .అప్పుడు ఒబామా కూడా నవ్వుతూ ‘’ఇప్పటిదాకా ఆశబ్దం గుర్రానిదనుకోన్నాను  మీదా ?’’అన్నాడట ఆశ్చర్యంగా .ఆ పుస్తకం చదివితే జోకులు ఎలా పుట్టాయో మొదటి అధ్యాయం లో రాస్తూ ఇలాంటి కుళ్ళు జోకులే ముందు పుట్టాయని అన్నాడు రచయిత .కొన్ని జోకులు తరువాత రాస్తా. ఇప్పటికే వాసన భరించ లేక పోతున్నారేమో ?

                  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సరసభారతి పురస్కారం

29-4-17 శనివారం షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో  చక్కని సంగీతస్వరాలతో భక్తి కీర్తనలు గానం చేసిన సంగీతం టీచర్ శ్రీమతి పద్మశ్రీ ,గారికి ”షార్లెట్ స్కై లార్క్ ”అనే బిరుదు ను ,కుమారి గాయత్రికి ”షార్లెట్ కౌమార కోకిల ”బిరుదాన్నీ సరదాగా అందరి సమక్షం లో ఇచ్చి గాయత్రికి సరసభారతి పురస్కారం  గా ఉగాది జ్ఞాపిక ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామి శతక త్రయం బహూకరించిన ఫోటోలు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

షార్లెట్ శంకర జయంతి

షార్లెట్ శంకర జయంతి

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

కరపత్ర స్వామి ‘’అద్వైత బోధ దీపిక ‘’లోని ముఖ్య విషయాలు

కరపత్ర స్వామి  ‘’అద్వైత బోధ  దీపిక ‘’లోని ముఖ్య విషయాలు

ఒకసారి ఒక శిష్యుడు గురువు దగ్గరకు వగరుస్తూ పరుగెత్తుకొని వచ్చి తనను  సంసార  నావ దాటి౦చ మని సంసార సర్ప కాటునుంచి కాపాడమని  కోరాడు .శిష్యుడు తెలివిగా లవాడేనని  క్రమ శిక్షణ ఉన్నవాడేనని గ్రహించి గురువు  ఇలా చెప్పాడు -’’’మార్పు లేని ,ఆకారం లేని , ఆనంద  మయుడవైన నువ్వు  పరకాయ ప్రవేశం చేశానని ,నికృష్ట జీవితం గడుపుతున్నానని ఎందుకు అనుకున్నావు ?నిజానికి చావు లేదు ,పుట్టుక లేదు చావటానికి ఎవరూ పుట్టటానికి చావటానికి  ఉండరు .అసలు అలాంటిదేమీ లేదు .మరి ఉన్నదేమిటి అని అనుమానం వస్తుంది .ఆది అంతం లేని అద్వైతమైన బంధనం లేని  సర్వ స్వతంత్రమైన ఏక  ఆనంద సత్య చిదానందమే .మరి ఈ బాధలూ అవి ఎందుక౦ టే అద్వైత శక్తిని పూర్తిగా సరిగా అర్ధం చేసుకోకపోవటం వలన  .మాయా మొహం వలన .అది ఎందుకు ఏర్పడుతుంది ?అజ్ఞానం  అవిద్యవలన అలా అనిపిస్తుంది .సరే అజ్ఞానం అంటే ?శరీరం  నేను అనే భావాన్ని కలిగిస్తుంది దానినే జీవాత్మ అనుకొంటుంది .ఈ జీవాత్మ ఈ కనిపించేది అంతా నిజమని తానేఅన్నీ చేస్తున్నానిఅనుకుని  సుఖ దుఖాలు పొందుతాడు  .అదికావాలి ఇదికావాలని ఆరాట పడతాడు .అంతేకాని తనను తానూ తెలుసుకోడు .తన స్వీయజ్ఞానాన్ని ఉపయోగించడు .’’నేనెవరు ? ఈ ప్రపంచం ఏమిటి ’’అని ప్రశ్నించుకోడు .కనుక సంసార లంపటం లో పడి స్వస్వరూపాన్ని జ్ఞానాన్ని కోల్పోయి మర్చిపోతాడు ఇదే అజ్ఞానం

 శాస్త్రాలన్నీ మాయ వలననే సంసారం ప్రపంచం ఏర్పడుతున్నాయని అంటారు కదా మరి అజ్ఞానం వలన అంటారెందుకు ?ఈ రెండిటిని ఎలా సమన్వయించాలి ?మంచి ప్రశ్నే ఇది అజ్ఞానికి అనేక పేర్లున్నాయి అవే మాయ ,ప్రధాన ,అవ్యక్త ,అవిద్య ,ప్రకృతి  చీకటి మొదలైనవి .అజ్ఞానం వలనననే సంసారం ఏర్పడుతుంది  .అజ్ఞానం రెండు విధాలుగా  ఆవరణ  విక్షేపణ లా పని చేస్తుంది  ఆవరణ లో రెండురకాలు -ఇదికాదు అనేది ,అది ప్రకాశించదుఅని చెప్పేవి .మరి వీటినుండి దూరమై అసలు స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి ?గురువులవద్ద శాస్త్రాలు చదివి అర్ధం చేసుకొని .అప్పటికీ అద్వైత భావన అర్ధం కాకపొతే సత్యం ప్రకాశించడు అనిపిస్తుంది .దీనివలన కొంత జ్ఞానం కలిగి ఇంకా భ్రమలోనే ఉండటం జరుగుతుంది .ఇదే ఆవరణలో రెండవ దశ .

  విక్షేపం అంటే ?తాను  అద్వైత సచ్చిదానంద స్వరూపం అయినా తనను శరీరిగా భావి౦చటం వాడు వీడు అనుకోవటం అన్నీ తానే చేస్తున్నట్లు చెప్పుకోవటం  ను విక్షేపం అంటారు .ఇక్కడ అద్వైత సత్యం విక్షేపం లో చుట్టబడి ఉంటుంది . దీనినే అధ్యారోపణ౦  సూపర్ ఇంపోజిషన్ అంటారు .దీనిభావమేమి తిరుమలేశ ?తాడు పాముగా భావించటం స్తంభాన్ని దొంగగా  భావించటం ఎండమావి ని నీరుగా  అనుకోవటం లాంటిది .అసలు వస్తువును వేరొకటి అని భ్రమించటమే అధ్యారోపణ. ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే అద్వైత సచిదానంద పరమాత్మ సత్యమైనది .దీనిపై ప్రపంచం లోని జ్ఞాన అజ్ఞాన విషయాలు వస్తువులు విక్షేపిస్తాయి .ఇది నిజం కాని భావన -అన్ రియల్ ఫినామిన .అలా అయితే అద్వైతం కానిది ఏది ఎవరు విక్షేపం కలిగిస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది .సమాధానం మాయ .మాయ అంటే బ్రహ్మ గురించి తెలియకపోవటం

  సృష్టికి ముందు లయం తరవాత ప్రపంచం లేదు అంటే ఏది ఉన్నట్లు ? సజాతీయ ,విజాతీయ ,స్వగత భేదాలు లేని ఆధార భూతమైన ది మాత్రమె ఉంది . అదే సత్యజ్ఞానమన0తమ్ బ్రహ్మ .దాన్ని తెలియటం యెట్లా ?వేదం ఏం చెప్పిందంటే -సృష్టికి పూర్వం శుద్ధ ఆత్మ మాత్రమే ఉన్నది .యోగ  వాశిస్టం వలన కూడా అర్ధం చేసుకోవచ్చు .కొంచెం వివరంగా చెప్పాలంటే -ప్రళయం లో ఏక శుద్ధాత్మ తప్ప అంతా వెనక్కి తీసుకోబడుతుంది -విత్ డ్రాన్..శుద్ధాత్మ కదలదు మాట్లాడదుఆలోచించదు .కా౦తిచీకటికాని ఉండవు అయినా పరిపూర్ణంగా అవాచ్యం గ అంటే చెప్పటానికి వీలులేనిదిగా  శూన్యం కానిదిగా ఉంటుంది .అలాంటి అద్వైత స్థితిలో సృష్టి ఎలా జరిగింది ?అంటే మాయ వలన .దానితో అనేక రూపాలు పేర్లు వచ్చాయి .ఈ మాయ మనసుగా మారి అన్నీ సృష్టిస్తుంది .ఈ విషయాన్ని ఇంతకు ముందు ఎవరైనా చెప్పారా ?శ్రీరాముడికి వశిష్టుడు చెప్పాడు .ఎలా ? బ్రహ్మ౦  శక్తి అనంతం .అ శక్తులు మార్పు చెంది అన్నీ ఏర్పడతాయి . బ్రహ్మానికున్న విశేష శక్తు లేమిటి?జ్ఞానులలో జగృతికలిగించటం ,ఆకాశగమనం భూమిని ఘనంగా చేయటం ,నీటికి  ద్రవత్వం ,అగ్నికి వేడి ఆకాశం లో శూన్యం ,మృతజీవులను  కుళ్లి౦ప   జేయటం ,మొదలైనవి  దాని అనంత  శక్తులో కొన్నిమాత్రమే  ఈ లక్షణాలన్నీ వాటిలో అంతర్గతంగా ఉంటాయి . బ్రహ్మ౦ వలన  చైతన్యమౌతాయి . అద్వైత బ్రహ్మం లో ఇవన్నీ పైకి కనిపించకుండా లోపలే ఉండి నెమలి పురివిప్పినప్పుడు కనిపించే వివిధ రంగుల్లా విత్తనం లో దాగిన వృక్షంలా గుడ్డులోని పక్షిలా  బయట పడతాయి .

  బానే ఉంది ఇన్ని శక్తులు బ్రహ్మం లొ అంతర్గతంగా ఉంటె అన్నీ ఒక్కసారే ఎందుకు బయట పడవు అని అనుమానం రావచ్చు . భూమిమట్టిలో అనేక రకాల విత్తనాలు కాలాన్ని బట్టి ప్రదేశాన్నిబట్టి అనుకూల పరిస్తితులబట్టి ఎలా మొలకెత్తి వృద్ధి చెందుతాయో ఇక్కడా అంతే.బ్రహ్మం మాయ ను మనసుగా మార్చటం తో దాని శక్తులన్నీ విజ్రుమ్భించి ఈ ప్రపంచం ఆవిర్భ విస్తుంది అని  రాముడికి   వశిష్టుడు  బోధించాడు .

ఇన్‌లైన్ చిత్రం 1

           రేపు 30-4-17 ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకరాచార్య జయంతి సందర్భం గా శుభాకాంక్షలతో

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 )

19 07లో ఉత్తరప్రదేశ్ ప్రతాపగ్హడ్ దగ్గర భాటిని గ్రామం లో హరినారాయణ ఓజా గా కరపత్రి స్వామి జన్మించాడు .హిమాలయ దశనామి ముని సంప్రదాయానికి చెందినవాడు .జ్యోతిర్మఠ శంకరాచార్య స్వామి బ్రహ్మానంద సరస్వతి కి ముఖ్య శిష్యుడు .వార ణాసి లో ‘’ధర్మ సంఘం ‘’స్థాపించాడు .జీవితం లో ఎక్కువకాలం కాశీ లో నే గడిపాడు .అద్వైత వేదాంతాన్ని బహుళ ప్రచారం చేసిన వారిలో కరపత్రి స్వామి ఒకడు 19 4 8 లో ‘’రామ రాజ్య పరిషత్ ‘’అనే రాజకీయ పార్టీ నెలకొల్పాడు .19 51లో లోక్ సభకు జరిగిన మొదటి ఎన్నికలలో ఈ పార్టీ 3 సీట్లు ఉత్తర ప్రదేశ్ లో గెలిచింది .దీనిద్వారా హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రచారం చేశాడు భారతీయులందరికీ ఒకే సివిల్ కోడ్ ఉండాలని,  అది ధర్మ శాస్త్రాలపై ఆధార పడి ఉండాలని కరపత్రి స్వామి వాదన . కాని ఆపలేక పోయాడు 19 5 8 లో తనపర్తీని జన సంఘ్ పార్టీలో స్వామి విలీనం చేశాడు .19 6 6 లో గో సంరక్షణ ఉద్యమం చేబట్టి ఆవులను చంపరాదని ,గో మాంసాన్ని నిషేధించాలని తీవ్రంగా దేశ వ్యాప్త ఉద్యమం చేశాడు .సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటానికి 19 48 ఏప్రిల్ 18 న’’సన్మార్గ్ ‘’అనే దిన పత్రిక పెట్టి నడిపాడు 19 8 2 లో 7 5 వయేట మరణించాడు .

 కరపత్ర స్వామి సంస్కృతం లో ‘’అద్వైత బోధ దీపిక ‘’అనే గ్రంధాన్ని 12 అద్యాయాలతో రాశాడు ఇది తమిళ ఇంగ్లీష్ భాషలలో అనువాదమైంది .’’టాక్స్ విత్ రమణ మహర్షి’’ నిరికార్డ్ చేసిన మునగాల వెంకట రామయ్య 8 అధ్యాయాలను ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు.అద్వైత బోధ దీపిక శంకరాచార్యులవారి అద్వైతాన్ని అతి సులభంగా తేలికగా అర్ధం చేసుకోవటానికి వీలు కలిగించింది .భగవాన్ రమణ మహర్షి ఎవరికైనా సందేహాలుంటే అద్వైత కర దీపికను చదివి హాయిగా అనుమాన నివృత్తి చేసుకోవచ్చునని దీనిని రికమెండ్ చేసేవారు .’’శ్రీ విద్య -వరివస్య ‘’అనే కరపత్రిస్వామి వ్యాసాలను సంకలనం చేసి స్వామి దత్తాత్రేయానంద అనే సీతారామ కవిరాజ ప్రచురించాడు

.ఇన్‌లైన్ చిత్రం 4ఇన్‌లైన్ చిత్రం 5ఇన్‌లైన్ చిత్రం 6

13 7-చైతన్య  చరితామృత కర్త -కృష్ణ దాస కవిరాజ గోస్వామి (15 20-16 17)

 భాగీరధ ,సునందల కుమారుడైన కృష్ణ దాస బీహార్ లో కత్వా లోని బర్ద్వాన్ జిల్లా  జమాత్ పూర్ దగ్గర సాలారాలో 15 20 లో బ్రాహ్మణ వంశం లో జన్మించాడు మరణం 16 17 . .కలలో చైతన్యుడు దర్శనమిచ్చి బృందావనం వెళ్ళమని బోధించాడు .బృందావనం చేరి తన గత జీవితాన్ని ఎవరికి చెప్పలేదు .హరికధలతో  హరి కీర్తనలతో కాలక్షేపం చేశాడు నిత్యానంద స్వామి ,మణికేతన రామ దాసు లు ఆహ్వానితులు గా వచ్చేవారు .విష్ణు దైవం వైష్ణవ భక్తుల సహకారం లేకుండా చైతన్య చరితామృతం రాయలేనని భావించి ప్రతి అధ్యాయం లో చైతన్య ప్రభుని అద్వైత ప్రచారకర్త నిత్యానంద ప్రభులను స్మరించాడు .వ్యాసమహర్షి భాగవతం లో క్రష్ణలీలను  వర్ణించినట్లే బృందావన గోస్వామి అయిన కృష్ణదాసు చైతన్య లీలా విలాసాలను వర్ణించాడు .దీనిని చైతన్య గౌడీయమతం ప్రచురించింది .మదన మోహనుడు చెబితే నేను ఒక చిలకలాగామళ్ళీ పలికాను అన్నాడు కృష్ణదాస .దీన్ని రాయటానికి స్వరూప దామోదరుని నోట్స్ ను ఆధారంగా చేసుకున్నాడు .కృష్ణదాస్ హృదయం లో చైతన్య నామం భావం మూర్తి బోధనా భక్తీ అన్నీ సంగమించాయి .చైతన్య చరితకు విశ్వనాధ చక్రవర్తి టీక రాశాడు .

 కృష్ణ దాస కవిరాజ స్వగ్రామం జమతాపుర లో ఒక చిన్న గుడిలో స్వామి నిత్యానంద పాద ముద్రలున్నాయి .క్రష్ణదాసుకు నిత్యానందుని అనుగ్రహం పుష్కలంగా ఉన్నదని శ్రీ కృష్ణ మంత్రం ఉపదేశించాడని ని స్థానికులు భావించారు .అందుకనే అదే ప్రదేశం లో నిత్యానంద పాదుకలను ఏర్పాటు చేసి స్మరిస్తారు .కాని కృష్ణదాస రఘునాధ గోస్వామివద్ద దీక్ష తీసుకున్నాడని  ప్రేమ విలాసలో ఉన్నట్లు చెబుతారు .ఇక్కడి దేవాలయం లో క్రష్ణదాసుని కొయ్య పాదుకలుఅంటే పాంకోళ్ళున్నాయి .కృష్ణదాస విగ్రహం, సమాధి రాదా కుండ్ లో ఉన్నాయి .రఘునాధ దాస స్వామి మరణం తరవాత కృష్ణదాస కవిరాజ గోస్వామి అశ్విని మాసం కృష్ణ ద్వాదశినాడు మరణించాడు .

ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

ఇన్‌లైన్ చిత్రం 1

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జ్యోతిర్మఠపీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి

జ్యోతిర్మఠపీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి

20-12-18 6 8 న జన్మించిన రాజారావు  సన్యాసి అయి 15 0ఏళ్ళు ఖాళీగా ఉన్న ఉత్తర భారత దేశంలోని బదరీ క్షేత్రానికి దగ్గరలో ఉన్న జ్యోతిర్మఠఉత్తర ఆమ్నాయ పీఠాధి అవటం వింతయైన కధ.

అయోధ్య దగ్గర  గణ గ్రామంలో ‘’మిశ్ర ‘’అనే బ్రాహ్మణ కుటుంబం లో రాజా రావు పేరుతో జన్మించి  ,ఆధ్యాత్మిక భావ లహరిలో మునిగి తేలుతూమహా యోగి రాజు అని పించుకొని , మన ఆది శంకరాచార్యులవలె 9 వ ఏట తగిన గురువును అన్వేషిస్తూ ఇల్లు వదిలి పెట్టి వెళ్ళాడు .కాని ఒక పోలీసు గుర్తుపట్టి ఇంటికి తీసుకు వచ్చి అప్పగించాడు  .తనకు  గృహస్తాశ్రమం లో ఇష్టం లేదని  సన్యసించాలని ఉందని చెప్పాడు .పెళ్లి చేసుకోమంటే వద్దన్నాడ్డు .ఇంటి పురోహితుని అడిగారు ఆయన కుర్రాడి యోగ జ్ఞానానికి అబ్బుర పడి అతని ఇష్టం ప్రకారమే చేయమని సలహా ఇచ్చాడు తలిదంద్రులకూ కొడుకు రాజారాం ఆధ్యాత్మిక బలం అర్ధమై సరేనన్నారు .  రెండు రోజులతర్వాత ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి తపస్సుకోసం హిమాలయాలకు వెళ్ళాడు .  .సరైన గురువుకోసం  అణ్వేషిస్తూ ఎందరినో చూసి వారెవ్వరూ తన ఆధ్యాత్మిక దాహం తీర్చే సమర్దులుకారని నిర్ణయించుకున్నాడు .హరిద్వార్ రుశీ కేష్ లకు వెళ్ళాడు .14 వ ఏట ఉత్తర కాశిలో స్వామి కృష్ణానంద సరస్వతిని దర్శించి ఆయనే తాగిన గురువని  శిష్యుడయ్యాడు .ఆయన ‘’బ్రహ్మ చైతన్య బ్రహ్మ చారి ‘’అనే పేరుపెట్టాడు రాజా రామ్ కు . గురువు చెప్పినట్లు సాధన చేస్తూ ప్రక్కనే ఉన్న గుహలో తపస్సు చేసి వారానికి ఒక్క సారిమాత్రమే గురు దర్శనం చేసేవాడు .25 వ ఏట గుహ నుండి బయటికి వచ్చి గురువుగారి ఆశ్రమం లో ఉండి పోయాడు .34 వ ఏట కుంభ మేళ సమయం లో  గురువు శిష్యునికి సన్యాస దీక్షనిచ్చి స్వామి బ్రహ్మానంద సరస్వతి అనే  దీక్షా నామం ఇచ్చాడు .ఇక్కడి నుంచి మధ్య భారతం చేరి ఒక గుహలో ఏకాంతం గా తపోధ్యానాలతో 40 ఏళ్ళు ఉన్నాడు .

 7 0 వ ఏట  .అనేక విద్యావంతులు బ్రహ్మానంద ను అప్పటికి 150 సంవత్సరాలుగా తగిన పీఠాధిపతి దొరకకక ఖాళీగా ఉన్న జ్యోతిర్మఠ పీఠాదిపత్యం వహించటానికి ఆయనే సర్వ సమర్ధుడు అని అందరూ అనేకసార్లు కోరగా సరే నని ‘’మీరు అరణ్యం లో స్వేచ్చగా తిరిగే సింహాన్ని బంధిస్తున్నారు .మీ రందరి ఇష్టం ప్రకారంమీ మాటలను గౌరవించి  పీఠాదిపత్యాన్ని స్వీకరించి ఆది శంకరా చార్యుల అడుగు జాడలలో నడుస్తాను ‘’అన్నాడు దీనికి ముఖ్య ప్రేరకుడు కరపత్ర స్వామి . నియమించే ‘’ధర్మ మహా మండలి ‘ ఎంతో సంతోషంగా ఆహ్వానించింది /19 41 ఏప్రిల్ 1 న పీఠాదిపత్య విధానం అంతా వారణాశి పండితులు ,పూరీ శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ కృష్ణ తీర్ధ ,శృంగేరి శంకరాచార్యులు శ్రీ చంద్ర శేఖర భారతి స్వాముల సమక్షం లో మహా వైభవంగా నిర్వహించారు .గర్వాల్, వారణాసి ,దర్భంగా మహా రాజులు ఎందరెందరో మత ప్రముఖులు హాజరయ్యారు .వేదం లో చెప్పబడిన సర్వ లక్షణ సంశోభితుడు స్వామి బ్రహ్మానంద సరస్వతి అని అందరూ శ్లాఘించారు .

 బ్రహ్మానంద సరస్వతి మొదటి సారిగా జ్యోతిర్మఠాన్ని  పునర్నిర్మించాడు . ఆప్రాంతమంతా స్థానికుల ఆక్రమణలో ఉంటె స్థానిక డిప్యూటీ కమీషనర్ స్థానిక పెద్దల సహకారం తో ఖాళీ చేయించి  30 గదులతో రెండస్తుల భవన నిర్మాణం చేసి ‘’జ్యోతిర్మఠ పీఠ భవనం ‘’అని పేరు పెట్టాడు .దీనికి వంద గజాల దూరం లో దర్భంగా మహా రాజు మొదలు పెట్టిన ‘’పూర్ణ గిరి దేవి ‘’దేవాలయాన్ని బ్రహ్మాన౦ద  పూర్తీ చేయించాడు .సంప్రదాయ అద్వైత మత ప్రచారానికి ఉత్తర భారతం లో జ్యోతిర్మఠం అతి ముఖ్యమైన గొప్ప కేంద్రం . జ్యోతిర్మఠ శంకరాచార్యునిగా ఉత్తర భారత దేశమంతా పర్యటించి ప్రబోధాత్మక ప్రసంగాలతో  శంకరాద్వైత  భావ వ్యాప్తి చేశాడు  మహర్షి మహేష్ యోగి కరపత్రి స్వామి ,స్వామి స్వరూపానంద సరస్వతి ,స్వామి శాంతానంద సరస్వతి మొదలైన వారు బ్రహ్మానంద సరస్వతి ముఖ్య శిష్యులు .భారత ప్రధమ రాష్ట్ర పతి డా బాబూ రాజేంద్ర ప్రసాద్ ,ఫిలసాఫికల్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బ్రహ్మానంద సరస్వతిని దర్శించి ఆశీర్వాదాలు పొందారు .రాదా కృష్ణన్ ‘’మూరీ భవించిన వేదాంతం   సత్య స్వరూపం స్వామి బ్రహ్మానంద సరస్వతి ‘’అన్నారు .19 53లో 8 5 వ ఏట  బ్రహ్మైక్యం చెందటానికి 5 నెలల ముందు స్వామి బ్రహ్మానంద వీలునామా రాసి తన తదనంతర పీఠాదిపతి స్వామి శాంతానంద సరస్వతి అని పేర్కొన్నాడు .

స్వామి బ్రహ్మానంద గొప్ప శ్రీ చక్ర ఉపాసకుడు ఆయన వద్ద అరుదైన రూబీ శ్రీ చక్రం ఉండేది .ఆయన పీఠాదిపత్యకాలం లో ఎందరెందరో రాజులు ధనికులు ఆశ్రమానికి వచ్చి విలువైనకానుకలు సమర్పించేవారు .మంత్ర దీక్ష స్వీకరించేవారు .    ఈ ధన సంపద పీఠ ఆధ్యాత్మిక కార్య క్రమాలకు సద్వినియోగమయ్యేది . ‘’మహర్షి మహేష్ యోగి 20 08లో ‘’మహేష్ యోగి ట్రస్ట్ ‘’ఏర్పరచి బ్రహ్మానంద సరస్వతి పేరుతొ దేశంలోని 30 వేల వేద పండితుల కు ఆసరా కలిపించి గురు ఋణం తీర్చుకున్నాడు .కారణ జన్ముడు స్వామి బ్రహ్మానంద సరస్వతి శంకరాచార్య .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మణిద్వీప పూజ

షార్లెట్ లో మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి గోసుకొండ అరుణ ఇంట్లో 28-4-17 శుక్రవారం మధ్యాహ్నం  మణిద్వీప ప్పోజ ,వాయనం భోజనం ఫోటోలు 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

కొందరు హిమాలయ యోగులు -2(చివరిభాగం )

కొందరు హిమాలయ యోగులు -2(చివరిభాగం )

3-నిప్పు స్వామి

హిమాలయాలలో ఒక స్వామి నోటినుంచి నిప్పు అంటే మంటలను వెదజల్లెవాడు ..చిన్న అగ్గి పుల్ల ఆపని చేస్తు౦ది కదా యోగ శక్తులను అంతర్ముఖం చేసుకో కుండా ఈ ప్రదర్శనలేమిటని గురువు ఈసడిస్తే ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

4- నీమ్ కరోలి బాబా

నీం కరోలి బాబా కు ఎక్కడెక్కడ ఏమి జరిగిందో జరుగుతుందో తెలుసు .ఎవరైనా ఆయన్ను దర్శించటానికి వస్తే నువ్వు ఫలానా రోజున ఫలానా సమయం లో  ఫలానా చెట్టు కింద నన్ను గురించి చెడ్డగా మాట్లాడావు గుర్తుందా  ఇప్పుడు నన్ను చూడటానికి వచ్చావా వెళ్ళు వెళ్ళు అని తరిమేసేవాడు ఒక సారి ఆయన శిష్యుడైన ఒక ఫార్మసిస్ట్ దర్శించటానికి వచ్చాడు బాబా తనకు ఆకలిగా ఉందని ఆతని చేతిలో ఏది ఉంటె దాన్ని ఆహారంగా పెట్టమని కోరాడు .ఆతను తనదగ్గర ఆర్సేనికి ఉందని అది ప్రమాదమని వెంటనే భోజనం తెస్తానని అన్నాడు .బాబా అతని దగ్గర్నుంచి ఆర్సెనిక్ పౌడర్ లాక్కుని  గుప్పెడు నిండా తీసుకొని గ్లాసెడు మంచి నీళ్ళతో తినేశాడు చచ్చి పోతాడేమో నని అందరూ కంగారు పడ్డారు .కాని బాబాకు ఏమీ కాలేదు మర్నాడు యదా ప్రకారం తన కార్య క్రమాలు చేసుకొన్నాడు .

 బాబా ఎప్పటికప్పుడు ఆకలిగా ఉందనే వాడు .ఎదుటివారు ఆయన అంతక్రితమే భోజనం చేశాడని చెబితే ‘’అయితే’’ వాకే ‘’ఆకలి లేదు ‘’అనేవాడు .ఒక రోజు ఆయన 45 సార్లు భోజనం చేశాడు .తన శక్తిని ప్రదర్శించాలని ఆయన తహతహ ..అంతటి గొప్ప స్థాయి ఉన్నబాబా పసిపిల్లడిలాగా ప్రవర్తిస్తాడు .

ఇన్‌లైన్ చిత్రం 3

5-దిగంబర అస్సాం సన్యాసిని

అస్సాం కామాఖ్య దేవాలయం ప్రక్కనే చిన్న గదిలో ఈ దిగంబర సన్యాసిని ఉండేది . 96 ఏళ్ళ వయసు .ఆమె పగటిపూట గదిలో నుంచి బయటికి వచ్చి అప్పటికి 20 ఏళ్ళయింది గదిలోనే సమాధిలో ఉండిపోయేది .అయితే అర్ధరాత్రి దాటాక తెల్లవారు జామున మూడు గంటలకు ఆమె కామాఖ్యశక్తి దేవాలయానికి వెళ్లి మంత్రాలు చదువుతూ అమ్మవారిని పూజించేది .ఒంటి మీద నూలు పోగు కూడా ఉండేదికాదు .బక్క చిక్కి శాల్యావశిస్టమై ఎముకలకు చర్మం అతికించినట్లు ఉండేది .కళ్ళు మాత్రం అగ్ని గోళాలుగా ప్రకాశం తో ఉండేవి .స్వామి రామా ఆమె గది ప్రక్కనే మరో గదిలో ఉండేవాడు ఆమె చర్యలన్నీ గమనించేవాడు .ఒక రోజు రాత్రి ఆమె దేవాలయానికి వెళ్ళినప్పుడు చప్పుడు చేయకుండా తానూ వెనక వెళ్లి ఆమె చేసేవన్నీ చూశాడు .రావద్దని హెచ్చ రించి బెత్తం పెట్టి కొట్టి తరిమేసింది ఒక రోజు. అయినా ఈయన మానలేదు అప్పుడు రామా కున్న మారు పేరుతొ పిలిచింది ఆశ్చర్య పోయాడు ఈ నిక్  నేం ఆయన గురువుకు తప్ప ఎవరికీ తెలియదు .అప్పుడు స్వామి రామాను దగ్గర తీసుకుని తొడడ పై కూర్చో బెట్టుకొని’’నీసాధనలో కొన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకే వెడతావు నా శీస్సులు ఇస్తున్నాను ‘’అని  ఆశీర్వదించగా రామా కు స్వర్గం లో  తల్లి ఒడిలో ఉన్నట్లనిపించింది .అర్ధ రాత్రి అంకమ్మ శివాలులాగా ఈ గుడిలో ఏం చేస్తున్నావని రామా ఆమెను చనువుతో అడిగాడు .శక్తి పూజ చేస్తున్నట్లు చెప్పింది .రాత్రి 12 నుంచి మూడువరకు నా దగ్గర ఎవరున్నా సహించలేను ‘’అన్నది అందుకనే ఆ శక్తి దేవాలయానికి అర్ధ రాత్రి 12 నుంచి 2 వరకు మళ్ళీ 3 నుంచి నాలుగున్నర వరకు ఎవరూ దర్శించరు.స్వామి రామా ఆమెను మాతృ గురువు ‘’గా మదర్ టీచర్ గా భావించాడు .చాలా శక్తి సామర్ధ్యాలు ఉన్న చాలా ప్రశాంతం గా ఉండేది .ఆమె ఏది చెబితే అది జరిగేది .ఆమె రాత్రి ఏనాడు నిద్ర పోయి ఎరుగదు  తపో భంగిమలో కూర్చునే ఉండేది రాత్రంతా .ఒక రోజు స్వామిరామా ‘’అమ్మా మీరు పడుకుని నిద్రపోతే మీ మీకాళ్ళకు మాసేజ్ చేస్తాను ‘’అన్నాడు ఆమె వెంటనే ‘’నిద్రా ! అది నాకు పడదు .నేను జడత్వానికి ,బద్ధకానికి  అతీతం .నేను నిద్ర లేని నిద్ర పోతాను .దానికి పడుకోవాల్సిన పని లేదు యోగ నిద్రలో ఆన౦ దించేవారికి  పంది నిద్ర ఎందుకు ?’’అన్నది .దీని అర్ధం ఏమిటి అని అడిగితె ‘’పందులు శక్తికి మించి తెగతిని అరగటానికి గురక పెడుతూ నిద్రపోతాయి అవి అంతకాలం ఎలా నిద్రపోతాయోనని ఆశ్చర్యమేస్తుంది ‘’అంటూ ని ద్రా శాస్త్రాన్ని చక్కగా వివరించింది ..అప్పుడు మాండూక్య ఉపనిషత్ లోని మూడు నిద్రావస్తలు గుర్తుకు వచ్చాయి .స్వామి రామకు చివరిసారిగా సందేశమిస్తూ ‘’ఈ భౌతిక తల్లి బి౦బానికి అతుక్కు పోకు .నేను విశ్వ మాతను .సర్వాంతర్యామిని నీ అంతరాత్మను తెలుసుకో .భయం వీడు నేను నీతో ఎప్పుడూ ఉంటాను ‘’అనగానే రామా కళ్ళు నీళ్ళతో సుళ్ళు తిరిగాయి

 6-దేవర బాబా

ఉత్తర ప్రదేశ్ లోని దేవరబాబా వయస్సు 15 ౦ ఏళ్ళు అని అంటారు అప్పటికే .హిమాలయ పర్వత గుహలలో ధ్యాన తపస్సులు చేస్తూ అప్పుడప్పుడు తూర్పు ఉత్తర ప్రదేశ్ కు వస్తాడు ప్రధమ రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆయన ముఖ్య భక్తుడు .తన చిన్నతనం లో తండ్రి బాబా దగ్గరకు తెసుకు వెళ్ళాడని అప్పటికే ఆయన చాలా ముసలివాడని రాజేంద్ర ప్రసాద్ రాశాడు . రిషీ కేష్ లో  తాత్కాలిక పైన్ వుడ్ గుడిసె లో ఉండేవాడు  .ఒక్కోసారి చెట్టుకిందే ఉండి పోయేవాడు .చాలా నియమ నిష్టలతో పవిత్రంగా ఉండేవాడు ఎవరినీ తాక నిచ్చేవాడు కాదు .ఉత్తర భారత దేశమంతా దేవర బాబా శిష్యులే ఆయన కిందికి దిగి వచ్చాడని తెలిస్తే వేలాది మంది దర్శనానికి వచ్చేవారు .గట్టి పోలీసు బందోబస్తు ప్రభుత్వం చేసేది . కుంభ మేళాలో ఆయన్ను చూడటానికి విదేశాలనుంచి కూడా వేలాది భక్తులు వచ్చేవారు .ఆయన ఆహారం పళ్ళు కూరలు మాత్రమె .’’సంతోషమే గొప్ప సంపద .నియమ నిబద్ధత జీవితానికి అవసరం నూతన శ్వాస విధానాలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది టెక్నిక్ ఆఫ్ ఏజ్ లెస్ నెస్ ఈజ్ టెక్నిక్ ఆఫ్ ప్రాణ యామ’’అన్నది ఆయన సిద్ధాంతం ప్రేమైక మూర్తిగా దేవర బాబా ప్రసిద్ధుడు

ఇన్‌లైన్ చిత్రం 4

  మరి కొన్ని విషయాలు

బదరీనాద్ దగ్గర వాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది .అవి వికసించే కాలం లో అందరూ వెళ్లి చూసి మహదానందం పొందుతారు అనేక రంగులు రకాలు వాసనలతో కనులకు వైభోగం ఉంటుంది .అయితే ఆ పూల వాసన ఎక్కువ సేపు పీలిస్తే మత్తు మైకం వచ్చి జ్ఞాపక శక్తి తాత్కాలికంగా కనుమరుగౌతుంది కొన్ని గంటల ఆతర్వాత కాని మళ్ళీ విషయాలు గుర్తుకు రావు ..ఇక్కడే సిక్కుల గురుద్వారాకూడా ఉంది

ఇన్‌లైన్ చిత్రం 7ఇన్‌లైన్ చిత్రం 8ఇన్‌లైన్ చిత్రం 9

 వారణాసి లో ఒక వేశ్య ఉండేది .ఆమె పేరు బాగా ప్రచారం లో ఉండేది .ఒక చిన్న బోటు లో గంగానదిలో ఉండేది బోటు బయట ‘’నేను వేశ్యను నన్ను సాధువుగా అపార్ధం చేసుకోవద్దు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి భంగం కలిగించవద్దు ‘’అని బోర్డ్ ఉండేది .సాయం సమయం లో నీటినుంచి బయటికి వచ్చి ఇసుక తిన్నెలపై కూర్చుని ఏకాంతంగా మంత్రాలు చదువుకొనేది వేలాది మంది ఆమెతోపాటు  చదివే వారు ..ఎవరితోనూ మాట్ల్లాదేదికాడు సౌజ్ఞలు చేసి తనతోపాటు దైవ స్మరణ చేయమని చెప్పేది .ఒక రోజు సాయంత్రం దాదాపు ఆరు వేలమంది ఆమె దగ్గర ప్రార్ధనలు చేస్తుంటే ‘’నేను ఉదయానికల్లా వెళ్లి పోతాను నా శరీరం గంగలో పడెయ్యండి ‘.అది చేపలకన్నా ఆహారంగా ఉపయోగ పడుతుంది ‘’అని చెప్పింది  .చెప్పినట్లే మర్నాడు ఉదయం ఆమె దేహం చాలించింది ఆమె కోరిక తీర్చారు భక్తులు .

ఇన్‌లైన్ చిత్రం 5ఇన్‌లైన్ చిత్రం 6

  మహాత్మా గాంధి నడుస్తుంటే చాల తమాషా గా ప్రత్యేకంగా  ఉంటుంది  మునుల మహర్షుల నడకకంటే అతి భిన్నంగా ఉంటుంది .ఆయన నడుస్తుంటే ఆయన -శరీర౦ నుంచి విడిపోయినట్లు కనిపిస్తుంది  .గుర్రం బండిని లాగినట్లు ఆయన శరీరాన్ని లాగుతూ నడుస్తున్నట్లు అనిపించటం విశేషం .దీన్ని ఆతెన్ బరో తీసిన గాంధి సినిమాలో గాంధీగా నటించిన బెంక్లిన్  చక్కగా చూపించాడు దీనికి కారణం అయన ఎప్పుడూ కులమతాలకు అతీతంగా అందరినీ ప్రేమించటం అందరి క్షేమం కోసం ప్రార్ది౦చ టమేఅంటారు . .ఆయన కు ముగ్గురు గురువులు క్రీస్తు కృష్ణుడు బుద్ధుడు .

ఇన్‌లైన్ చిత్రం 10

 స్వామి బ్రహ్మానంద అరుదైన సిద్ధుడు .శ్రీ విద్యపై నిష్ణాతుడు .ఆయనకున్న అద్భుత శక్తులను గుర్తించి స్వామి కరపత్రి అనే మహా విద్వాంసుడు ఆయనను మూడు వందల ఏళ్ళుగా ఖాళీ గా ఉన్న ఉత్తర శంకరాచార్య మఠానికికి పీఠాధిపతి గా ఉండమని కోరగా అయ్యాడు .వేలాదిమంది అనుచరులతో యాత్రలు చేసేవాడు భక్తిని అద్వైతం తో జోడించి ప్రసంగించటం ఆయన ప్రత్యేకత .స్వామి బ్రహ్మానంద వద్ద అరుదైన కెంపు లతో చేయబడిన శ్రీ యంత్రం ఉండేది

ఇన్‌లైన్ చిత్రం 11ఇన్‌లైన్ చిత్రం 12ఇన్‌లైన్ చిత్రం 13

  సమాప్తం

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ రోజు డొక్కా సీతమ్మ గారి 107 వ వర్ధంతి

హైదరాబాద్ నుంచి శ్రీమతి గబ్బిట గిరిజ- నిరతాన్నదాత ,అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి 107 వ వర్ధంతి ఈ రోజే నని నాకు మెయిల్ ద్వారా గుర్తు చేసి0ది ఆమె కు కృతజ్ఞతలు తెలియ జేస్తూ సీతమ్మ తల్లిని మరోక్క సారి మళ్ళీ తలచుకొని మనసారా నివాళు లర్పిద్దాం  -దుర్గా ప్రసాద్

 

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

హిమాలయ యోగిపు౦గవులు -1 యువ రాజ స్వామి భావల్ సన్యాసి

కొందరు హిమాలయ యోగిపు౦గవులు -1

యువ రాజ స్వామి  భావల్ సన్యాసి

 ఈయన జీవితం ఒక వింతకధ .బెంగాల్ లో భావల్ ప్రాంత రాజు  భావల్ సన్యాసి .పెళ్లి అయ్యాక అందమైన భార్యతో డార్జిలింగ్ లో హాయిగా గడుపుతున్నాడు .భార్య ఒక డాక్టర్ కు దగ్గరై౦ది .ఈ ఇద్దరూ కలిసి భావల్ ను చంపే ప్రయత్నం లో రోజూ రాజుకు కొద్దిమోతాదు లో నాగుపాము విషాన్ని ఇంజెక్షన్ గా ఇవ్వటం ప్రారంభించారు .రాజు ఎందుకు అని అడిగితె అది బలానికిచ్చే  ఇంకేక్షన్ అని నమ్మకంగా చెప్పేవారు .క్రమంగా డాక్టర్ డోసు పెంచాడు .రెండు నెలలతర్వాత రాజు అపస్మారకం గా ఉంటె చనిపోయాడని డాక్టర్ ప్రకటించి అంత్యక్రియలకు హిమాలయ పర్వత ప్రాంత సెల యేరు దగ్గర ఏర్పాటు చేశారు .చితి అంటించారు .భూమి ఆకాశం బద్దలయ్యేట్లు విపరీతంగా ఆగకుండా వర్షం కురిసి చితి ఆరి పోయి  రాజు శరీర౦ ప్రవాహం లో  కొట్టుకు పోయింది .

 మూడు మైళ్ళు కిందకు కొట్టుకు పోయి స్వామి రామా గురువు ఆశ్రమం దగ్గరకు  కాంచన గంగ నుంచి కుమయూన్ హిమాలయాలదాకా కొట్టుకు వచ్చి చేరింది. ఆయన  తాళ్ళతో బంధింపబడిన శవాన్ని చూసి  ఆ వ్యక్తీ మరణించలేదని అపస్మారకం లో ఉన్నాడని ,మామూలు శ్వాస నాడి కొట్టుకోవటం లేదని గ్రహించి  శిష్యులను  తాళ్ళు కోసేయమని అతడు తన శిష్యుడు అని చెప్పి  పంపాడు . వాళ్ళు వెళ్లి అలానే చేసి ,రాజును గుహలోకి తీసుకువచ్చారు .కొద్ది రోజులకు రాజు మామూలు స్థితి లోకి వచ్చాడుకాని గత౦  ఏమాత్రం గుర్తులేదు . గురువుగారి శిష్యుడయ్యాడు .అయన సన్యాస దీక్ష నిచ్చాడు .గురువు వద్ద ఏడేళ్ళు గడిపాడు ..తరువాత గురువు ఆయనను పుణ్య క్షేత్రాలు దర్శించమని , ,యోగులను కలుసుకోమని చెప్పి పంపాడు . ,బాస్వాల్ సన్యాసి తప్పక తన అక్కగారి ఊరు  వెడతాడని అక్కడ గతం జ్ఞాపకం వస్తుందని ముందే ఊహించి  తనకు ఇక్కడ తపోభంగం జరుగుతోందని ఇంకా కొంచెం పైకి  వెళ్లి  అక్కడ ఉంటానని  చెప్పి పంపాడు .

  బాస్వాల్ సన్యాసి అనేక ప్రదేశాలు తిరిగి తిరిగి గురువు ఊహించినట్లే ఒక రోజు అక్కగారి ఊరు  చేరి  అక్క ఇంటికి భిక్షకు వెళ్ళాడు .ఆమె తమ్ముడిని గుర్తించి ఆహ్వానించింది  ఆరు  గంటలు ఆయనతో అక్క మాట్లాడిన తర్వాత కాని ఆయనకు గత స్మృతులు జ్ఞాపకం రాలేదు .అక్కడి బంధు మిత్రుల ప్రోద్బలంతో   తానే రాజ్యానికి వారసుడినని కోర్టులో కేసు వేశాడు సాక్ష్యాధారాలన్నీ రాజు పక్షం లో బలం గా ఉండటం చేత  తనకు  విషం  ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్ విషాన్ని బొంబాయి లాబ రేటరి లో కొన్నట్లు రుజువు అవటం వలన ,తనను భార్య ఆమె ప్రేమికుడైన డాక్టర్ ఎలా నయ వంచన తో మోసగించిందీ హిమాలయ స్వామి ఏ విధంగా ఆదుకున్నదీ ఆయన శిష్యుడుగా ఉన్న విషయం  పూస గుచ్చి నట్లు తెలియ జేయటం వలన  కేసు గెలిచి సంస్థానం డబ్బు సంపదా అన్నీ దక్కాయి .గురువు కోర్టుకు రాలేదుకాని శిష్యులను పంపాడు సాక్ష్యాలకోసం .కేసు ఎన్నో ఏళ్ళు నడిచింది . కేసు గెలిచి రాజ్యం సంపదా దక్కిన ఏడాదికి భాస్వాల్ సన్యాసి  మరణిం చాడు ఈ కేసుతో గురు స్వామి విషయం ప్రపంచ  మంతా తెలిసిపోయింది .ఈ గురువును వెదుక్కుంటూ అనేక ప్రదేశాలనుండి  సాధకులు వెళ్లి శిష్యులయ్యారు  గురువు ఎందుకు జనావాసాలకు దూరం గా ఉంటున్నారో అర్ధం చేసుకున్నారు .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

        2-ఆప్త మంత్రోపదేశికుడు -వాలా బాబా

ఒక్క గోచీ తప్ప ఏ రకమైన ఆచ్చాదన లేకుండా కాళ్ళకు పాద రక్షణ లేకుండా యెంత దూరమైనా నడిచే జడలు విపరీతంగా పెరిగి భూమిని ఆనుకోనేట్లు ఉన్న వాలా బాబా వద్ద ఆప్త మంత్రాన్ని నేర్చుకోమని స్వామి రామ గురువు పంపాడు .రామా కొన్ని రోజులు ఆయన గుహలో ఉన్నాడు ఒక రోజు వాలాబాబా ఒక చెట్టు ఎక్కి అక్కడ ఉన్న పెద్ద తేనెటీగ తుట్టె దగ్గరకు వెడుతుంటే వద్దని స్వామి రామా ఆపాడు .వినకుండా తేనే తుట్టె దగ్గరకు చేరి తెనేటీగలతో నోటితో ఏదో మాట్లాడాడు .అంతే.అవి చెదర లేదు బెదరలేదు ఆయన్ని ఏమీ చేయలేదు .రామాను కూడా తేనెతుట్ట దగ్గరకు వెళ్ళమన్నాడు మంత్రం చెబితే వెడతానన్నాడు రామా చెట్టు ఎక్కాక చెబుతానన్నాడు వాలా .అలాగే చేయగా అప్పుడు తీనేటీగలతో ‘’నేను ఇక్కడ మీతో ఉన్నాను మీకు హాని చేయను .నాకు హాని చేయద్దు ‘’అని చెప్పమన్నాడు అది మంత్రం కాదుగా అన్నాడు రామా .వాటికీ నీ భాష అర్ధమవుతుంది చెప్పినట్లు చేయమన్నాడువాలా .కాని ఏమి చేయలేక అలానే చేశాడు .అవి రామా జోలికి రాలేదు .చెట్టు దిగగానే ‘’ఇది నీకు మాత్రమె పనికొస్తుంది ఇంకా ఎవరికీ చెప్పద్దు ‘’అని హెచ్చరించాడు వాలాబాబా .చాలా సార్లు స్వామి రామా అలానే చేసి తేనే సేకరించేవాడు .ఒక సారి పంజాబ్ లో ఉండగా ఒక కంసాలి మంత్రం చెప్పమని ప్రాధేయపడితే వాలా బాబా చెప్పింది మరిచి వాడికి చెప్పాడు .వాడు తేనే తుట్టె దగ్గర ఈయన చెప్పినట్లే చెబితే  ఆ మంత్రం పారక వందలాది తేనెటీగలు కుట్టి బాధిస్తే  హాస్పిటల్ లో చేరిస్తే కోమాలో మూడు రోజులు ఉండిపోయాడు విశ్వ బ్రాహ్మణుడు

.ఇన్‌లైన్ చిత్రం 3.

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

న పురుష స్వాతంత్య్ర మర్హతి

ఇన్‌లైన్ చిత్రం 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 4- లక్షణ శాస్త్ర కర్త -శకటాయణుడు(8 18 -8 6 7 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

13 4-  లక్షణ శాస్త్ర  కర్త -శకటాయణుడు(8 18 -8 6 7 )

కాశ్మీర్ కు చెందిన శకటాయణుడు ,నైరుక్త కర్త..వ్యాకరణ వేత్తలలో అతిప్రాచీనుడు.తరువాత వారైన యాస్కుడు ,పాణిని ఆయన రచనలను ఉదాహరించటం వలననే లోకానికి తెలియ బడ్డాడు .నామ వాచాకాలన్నీ క్రియా జన్యాలేనన్నాడు .దీనినే సంస్కృతం లో ‘’కృత్ ప్రత్యయం ‘’అన్నారు .దీనిపై ప్రముఖ వ్యాకరణ వేత్త బిమల్ కృష్ణ మాతీలాల్ ‘’నైరుక్తకారులకు అంటే ఎటిమాలజిస్ట్ లకు పాణినీయులకు అంటే వ్యాకరణ వేత్తలకు మధ్య గొప్ప చర్చ జరిగింది .ఎటిమాలజిస్ట్ లునామవచాకాలన్నీ కొన్ని క్రియల నుండి ఏర్పడ్డాయన్నారు .నిరుక్త కర్త యాస్కుడు దీనినే సమర్ధింఛి శకటాయనుణుడిని.సమర్ధించి ఉదాహరించాడు .దీనివలమ పదాలన్నీ అత్యంత సూక్ష్మ రూపంలోకి అంటే దాతు రూపం లోకి విభజించటానికి వీలు కలిగింది .దీనికే ధాతు-ప్రత్యయ  వ్యవస్థ అనే పేరు కలిగింది .గార్గ్యుడు శకటాయణుడి అభిప్రాయాన్ని వ్యతిరేకిన్చాడని యాస్కుడు తెలియ జేశాడు .యాస్కుడు అన్నినామవాచకాలుధాతువులనుంచే రావాలనే నియమం లేదు అన్నాడు ‘’అని తెలియ బరచాడు .విభక్తి ప్రత్యయాలకు ప్రత్యేక అర్ధం ఉండదని , శకతాయణుడు అంటే  అవి నామవాచకం లేక క్రియ లు చెప్పే దాన్ని సమర్దిస్తాయని గార్గ్యుడు అన్నాడు .ఇలా ప్రాచీనకాలం లో మీమా౦స కులకు వ్యాకరణ కారులకు సుదీర్ఘ చర్చలు జరిగాయి ..శకటాయనుని రచనను ‘’లక్షణ శాస్త్రం ‘’అంటారు .ప్రాణమున్న ,ప్రాణం లేని వాటి లింగాలను తెలుసుకోవటానికి ఇది సహకరిస్తుంది .ఇతను క్రీ శ.818 లో జన్మించి 867 లో మరణించాడు. ఈ శకటాయణుడు యాస్క ,పాణిని లకు ముందు ఇనుప యుగం లోని వాడు

క్రీ .శ 9 వ శతాబ్దం లో మరొక వ్యాకరణ కర్త శకటా యణుడు అమోఘ వర్షుని కాలం లో ఉన్నాడని తెలుస్తోంది

135-  బృహద్దేశి సంస్కృత సంగీత కర్త -మతంగ ముని (6 వ శతాబ్దం )

భారతీయ సాంప్రదాయ సంగీతం పై ‘’బృహద్దేశి’’గ్రంధం రాసిన మతంగ ముని కాలం క్రీ శ 6 -8 శాతాబ్దిమధ్య .సంగీత రాగాలపై వచ్చిన మొట్టమొదటి గ్రంధం బృహద్దేశి.ఇందులో మార్గ  దేశి రాగాల వివరణ ఉన్నది  సర్గం నోటేషన్ ల వివరణ కూడా ఉంది .తన రచనలో భరతముని నాట్య శాస్త్రాన్ని మతంగముని చాలా సార్లు పేర్కొన్నాడు .సంగీత ప్రమాణాలు -మ్యూజికల్ స్కేల్స్ ,శృతి లపై విస్తృతంగా చర్చించాడు .బృహద్దేషి ప్రేమలతా శర్మ సంపాదకత్వం లో వెలువడింది .తెలుగులో కూడా శ్రీ ద్వారం భావనారాయణ  వ్యాఖ్యానం  రాసి 20 02 లో ప్రచురించారు  .

           సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 12 6 -శ్రాద్ధ -హాస్యనాటక రచయిత -ఎస్.జగన్నాధ (19 5 6 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

12 6 -శ్రాద్ధ -హాస్యనాటక రచయిత -ఎస్.జగన్నాధ (19 5 6 )

ఎస్ .జగన్నాధ 19 5 6 అక్టోబర్ 12 కర్ణాటకలో జన్మించి ,సంస్కృతం లో ఏం ఏ ఫ్లూట్ లో విద్వాన్ అయ్యాడు .సంస్కృతం లో ‘’అంధకాసుర సంహారం  కౌటి ల్యాభరణం ‘’నృత్య నాటికలు రాశాడు .శ్రాద అనే హాస్య హాస్యనాటకమూ రాశాడు .కాదంబరి ని ‘’పుండరీకం ‘’పేరుతొ పిల్లలకోసం  రాశాడు .మందా క్రాంత వృత్తం లో ‘’తీరం ‘’ఖండకావ్యం ,కాళిదాస మేఘ దూతం కు పేరడీగా ‘’మేఘదూతం శంకరాచార్యుల ప్రస్థాన త్రయ భాష్యం పై ‘’బ్రహ్మ కావ్య ‘’అనే పురాణకావ్యం ,అర్దాలంకారాలపై 111 అలంకారాలను ఉదాహరిస్తూ వ్యాఖ్యానం తో ‘’లోకాలంకార పాణి కీయం ‘’,’’ఆభానక జగన్నాధ ‘’పేరిట 500  కొత్త సంస్కృత సామెతలను రాస్శాడు .

 బాల సాహిత్యం గా ‘’రుజు రోహిత ‘’అనే 21 కధలు ప్రబంధ సౌద అనే వ్యాస సంపుటి ,వందనామాలిక అనే సంగీత కృతులు ,ఉత్తరాలు ఎలా రాయాలో తెలియ జేస్తూ ‘’పత్ర సౌదః ‘’బసవేశ్వరుని 200 వచనాలను ‘’వీచి మాలికా ‘’గా సంస్కృతం లో రాశాడు .భాష  శిల్పాలపై గొప్ప పట్టు ఉన్నవాడు జగన్నాధ .

12 7 -భోజ విలాస ఏకాంకిక రచయిత -వాసుదేవ భాల్లాల (19 5 2

కర్నాటక ఉడిపి లోని అమ్బలపడి లో వాసుదేవ భాల్లాల పుట్టాడు .బెంగుళూరు సరస్వతి విద్యామందిర్ హై స్కూల్ లో బోధించాడు 19 7 6 లో ‘’భోజ విలాసం ‘’అనే ఏకాంకిక రాసి ప్రచురించాడు .భోజమహారాజు జీవితం సాహిత్యం పాలన  వివరిచాడు .ఇందులో 6 దృశ్యాలున్నాయి .

12 8- స్వామి శివానంద విలాస మహాకావ్య కవి -రామ కృష్ణ భట్టు (19 50

వెంకమ్మ కృష్ణ భట్టులకు మంగుళూరు  వద్ద కు౦బ్లాలో రామ క్రిష్ణభట్టు జన్మించాడు .ఢిల్లీ హిందూకాలేజీ లో సంస్కృత ప్రొఫెసర్ గా ఉన్నాడు .విద్యాభాస్కర విద్యా సాగర కవితా చతుర బిరుదులను స్వామి శివానంద  ,ద్వారకా శ౦కరాచార్యుల నుండి పొందాడు .సంస్కృతం లో 11 కాండల ‘’శివానంద విలాసం ‘’పురాణకావ్యం ,గీతికావ్యంగా ‘’శ్రీరామ దాస గీత ‘’శ్రీ రామ కృష్ణ సహస్ర నామ స్తోత్రం ,గురు చరితం   గురు సపర్య భక్తీ గీతాలు ,అర్జున అనే వచన పుస్తకం ,కావ్యోద్యానం ,కావ్య మంజరి అనే స్వీయ సంస్కృత శ్లోక కదంబం రాశాడు .వరాహ మిహిరుని ‘’బ్రహ్మ సంహిత ‘’కు సంపాదకత్వం వహించాడు .

 కావ్యమంజరిలోని రెండు స్తబకాలలో 2 వేల శ్లోకాలు రాశాడు .మొదటి స్తబకం లో ఆరు భాగాలకు బాహ్య పుష్ప ,పాంచజన్య పుష్ప ,ఆతపత్ర పుష్ప ,సుమానుష పుష్ప ,సూనృత పుష్ప అని పేరుపెట్టాడు .రెండవ స్తబకాన్ని శతక స్తబకం అన్నాడు .ఇందులో వియోగినీ శతకం ,మందా క్రా౦త శతకం , ,ఉపజాతిశతకం ,మృత్యు పాశీయం అనే 4 శతకాలున్నాయి .

శివానంద విలాసం స్వామి శివానంద జీవిత చరిత్ర .మహాకావ్య లక్షణాలన్నీ పుష్కలంగా ఉండి,మంచి శైలీ విన్యాసంతో భక్తీ భావ బంధురంగా రచించాడు .అర్జున వచనరచన హృద్యంగా ఉంటుంది . కావ్యోద్యానం లో భాగవతం సారస్వతం పత్ర పుష్పం ,సాప్తపదీనం ,మౌక్తికం భాగాలున్నాయి .వైవిధ్యభరిత రచన ఇది .అతని వైదుష్యానికి ప్రతీకగా నిలుస్తుంది

12 9-సిద్ధ లింగ మహా కావ్య కవి -బసవ రాజ శాస్త్రి (19 50)

బసవ రాజ శాస్త్రి సంగమాంబ ,రుద్ర మూర్తి దంపతులకు 19 50 లో కర్ణాటకలో జన్మించి వ్యాకరణ తీర్ధ ,వ్యాకరణ శాస్త్రి  సాహిత్య శిరోమణి డిగ్రీలనుపొందాడు .19 7 1 లో 26 కాండల   4 వేల శ్లోకాల  ‘’సిద్హ లింగ మహా కావ్యం ‘’సిద్ధ లింగేశ్వరుని జీవితం పై రాశాడు .శక్తి విశిష్టాద్వైతాన్ని ,శక్తి స్థల మహాత్మ్యాన్ని చాలా గొప్పగా  వర్ణించిన కావ్యం .ఇంద్ర వజ్ర ,ఉపేంద్ర వజ్ర ,ద్రుత విలంబిత ,మందా క్రాంత వృత్త శ్లోకాలతో రామణీయకత కల్పించాడు .కవి పొందిన డిగ్రీలకు గొప్ప సార్ధకత కల్పించిన మహా కావ్యమిది .

130- గాంధి సంస్మరణ సంభ్రమ ఏకాంకిక రాసిన -ఎస్.ఆర్ .లీల (19 5 2 )

  ఇంగ్లీష్ లో ప్రసిధ ఏకా౦కి కలైన ‘’ది వాలియేంట్’’,’’రిమెంబర్ సీజర్ ‘’లను ఎస్ ఆర్ లీల  ‘’అమరానాయకం ‘’గాంధీ స్మరణ సంభ్రమం ‘’గా సంస్కృతం లోకి అనువర్తనం చేసింది . దానిని బెంగుళూర్ కే వి  ఆర్ మహిళా కాలేజి 19 91లో ‘’సంప్రయోగం ‘’పేరుతో ప్రచురించింది .

13 1-యమ గోపాల రాసిన -సి జి .పురుషోత్తం (19 50

 మైసూర్ కు చెందిన పూర్వపు సంస్కృత ప్రొఫెసర్ కు వెంపు అనబడే కే వి పుట్టప్ప అనే కన్నడ రచయితరాసిన ‘’నంద గోపాల ‘’ను సంస్కృతం లో ‘’యమగోపాల ‘’గా అనువదించాడు .దీనిని బెంగుళూర్ జయ మూర్తి ప్రకాశాన్ 19 92లో అచ్చు వేసింది .

13 2-సోక్రటీస్ నాటకం రచయిత -ఆత్మా రామ శాస్త్రి (19 6 2

 గ్రీకు తత్వ వేత్త సోక్రటీసు జీవితం పై సంస్కృతం లో ‘’సోక్రటీస్ ‘’నాటకం రాశాడు సంస్కృత ప్రొఫెసర్ ఆత్మా రామ శాస్త్రి .బొంబాయ్ భారతీయ విద్యాభవన్ మేగజైన్ ‘సంవిత ‘’ఆగస్ట్ సంచికలో ప్రచురితం .

13 3-సాక్షి శీల నాటక కర్త -హెచ్ వి సత్యనారాయణ శాస్త్రి(19 54)

గో.రు .చన్నబసప్ప కన్నడ నాటకం ‘’సాక్షికల్లు ‘’ను హెచ్ వి నారాయణ శాస్త్రి ‘’సాక్షి శీల’’గా సంస్క్రుతీకరించ గా బెంగుళూరు పల్లవ ప్రకాశన్ 19 8 9 లో ముద్రించింది ..

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా   –

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బైజాంటిన్ నాగరకత -3 (చివరి భాగం )

బైజాంటిన్   నాగరకత -3 (చివరి భాగం )

బైజాంటిన్ సామ్రాజ్యకాలం లో అది ప్రపపంచ మార్కెట్ ను శాసించింది . కాన్ స్టాంటి నోపిల్ ను గోల్డెన్ సిటి అని పాలనకాలాన్ని స్వర్ణయుగమని అన్నారు .క్రిసేండం లో జ్యుయేల్ అనేవారు .విశాల మైన రాజవీదులు ,ఎత్తైన ప్రాకారాలు అందాల భవనాలు మంచినీటి సౌకర్యం తోపాటు మురికి నీటి పారుదల ఏర్పాట్లు గొప్పగా ఉండేవి .బంగారు కిరీటాల గదులు  విందు వినోద మందిరాలు ఫల పుష్ప ఉద్యానవనాలు ,పోలో గ్రౌండ్  ,గుర్ర౦ స్వారీ నేర్పే స్కూళ్ళు  చెత్త పారవేసే పకడ్బందీ ఏర్పాట్లు ఉం బైజాది .పడమటి యూరప్ లో ఎక్కడా ఇలాంటి ఏర్పాట్లు లేవని చరిత్ర కారులు రాశ్హారు .స్వర్ణయుగమే కాదు బంగారు గనికూడా .అందుకే శత్రువుల కళ్ళు ఎప్పుడూ దీనిపైనే ఉండేవి .ఓడ రేవులలో వ్యాపారం ,అన్ని రకాల బోట్లు , వీదులనిండా  స్కాండి నేవియన్లు   ఫ్రాంకులు ,ఈజిప్షియన్లు ,బెర్బెర్లు ,ఉత్తర ఆఫ్రికా ,పెర్షియన్ జనాలతో కళకళ లాడుతూ జన   సమ్మర్దం గా  ఉండేవి .అరుదైన బంగాగారు ఆభరణాలు నగా నట్రా ,దంతపు బొమ్మలు ,సున్నిత చర్మ వస్తువులు  సుగంధ ద్రవ్యాలు సెంట్లు  నాణ్యమైన గాజు పింగాణీ  వస్తువులు  షాపుల్లో దర్శన మిచ్చేవి .ఒక ఆరకంగా నగరం ధగ ధగ మెరిసిపోతూ ఇతర దేశీయులకు అసూయ కలిగించేది .

 బైజాంటిన్ లకు రధాల స్వారీ పందాలు మహా ఇష్టం .అక్కడ కోడి గుడ్డు  ఆకారపు స్టేడియం లుండేవి .60 వేల మంది ప్రేక్షకులు కూర్చుని చూచే ఏర్పాటు ఉంది .అవినీతి అధికారులపై ప్రజలు తిరగ బడేవారు .వారిలో బ్లూస్ అని గ్రీన్స్ అని రెండు గ్రూపులు ఉండేవి .ఒకసారి శత్రురాజు రధాన్ని ప్రశంసిస్తూ చక్రవర్తి  జస్టినియన్ ను యెగతాళి చేయటం జరిగితే సహించలేక మూడు వేలమంది సైన్యాన్ని హిప్పోడ్రోం ప్రదర్శన శాలకు పంపి ,తలుపులన్నీ మూయించి 30 వేలమందిని ఊచకోత కోయించాడు . దీనినే నీకా ఆందోళన అన్నారు .దీనితో బ్లూ గ్రీన్ గ్రూపులు అంతరించాయి .

 దాదాపు లక్షన్నర సైన్యం ఉండేది 7 నుంచి 12 వ శతాబ్ది వరకు అది అత్యంత క్రమశిక్షణ మెరుగైన శిక్షణ ఉన్నదిగా పేరు పొందింది అదే లేకపోతె సామ్రాజ్యం చిక్కుల్లో పడేది .ఆశ్విక దళం సర్వ సమర్దమైంది .దాదాపు ఆత్మ రక్షణకే సైన్యాన్ని ఉపయోగించారు .వారి పవర్ ఫుల్ ఆయుధం ‘’గ్రీక్ ఫైర్’’ఇది అకస్మాత్తుగా అంటుకొని ఒక గొట్టం గుండా ప్రయోగిస్తే యుద్ధ నౌకలపై పడి మండించేది .నీటిలో పడినా ఇంకా కాలుతూనే ఉండేది .దీన్ని చూస్తే శత్రువుల గుండెల్లో  రైళ్ళు పరిగెత్తేవి . .దీన్ని పట్టణాన్ని ఆరబ్ ముస్లిం ల దండయాత్ర లో కాపాడుకోవటానికి మొట్టమొదట తయారు చేశారు .రష్యా నౌకల్ని దగ్ధం చేసి లోనికి ప్రవేశించకుండా పట్టణాన్ని కాపాడింది .ఇందులో గంధకం ,సాల్ట్ పీటర్ ,నాఫ్తా  లిక్విడ్ పెట్రోలియం ఉపయోగిస్తారని ఊహించారు తప్ప ఇప్పటికీ దాని రహస్యం ఎవరికీ తెలియదు అంత సీక్రెట్ గా కాపాడుకొన్నారు .  సామ్రాజ్యం గ్రీకు –రోమన్ సంస్కృతి నాగరకత లకు  నిలయమైంది ముఖ్యమైన సిటి గా పాగాన్ ఆరాధనా నిలయంగా ఉండి తర్వాత కాలం లో విగ్రహారాధన నిషేధింప బడింది .క్రైస్తవాన్ని విస్తరింప జేయటానికి బలీయమైన ఆఫీసర్లను నియమించారు .రోమ్ లో బిషప్పులు ఉన్నతాదికారులైతే ఇక్కడ  పాట్రియార్క్ బిషప్పులపైన ఉన్నతాధికారి .చక్రవర్తి ,పాట్రి యార్క్  నిర౦తర సంప్రదింపులు జరిపేవారు .బైజాంటిన్ సామ్రాజ్యం అంటే ‘’హెవెన్ ఆన్ ఎర్త్ ‘’అంటే అందరికి సమానావకాశాల కల్పనా, యేసు పేరుతో అందరూ కలిసి ఉండటం .ఆయనే ‘’ప్రిన్స్ ఆఫ్ పీస్ ‘’చక్రవర్తి దైవాంశ సంభూతుడు పాగాన్ దేవతలలో ఒకడు. దైవ ప్రతినిధి .దేవుడే ఎంపిక చేసి భూమికి పంపాడని నమ్మకం .ఆయన ఎవరికీ బాధ్యుడుకాడు .దైవం పై నమ్మకం తో ఆయన ప్రవర్తిస్తాడు సామ్రాజ్యం పూర్తీ ఆటోక్రసీ కేంద్రం .చక్రవర్తితో సహా అందరూ యుద్ధాన్ని కోరని శాంతిప్రియులు .విదేశీ దండయాత్ర చేయరు .బైజాంటిన్ అనే మాటకు రెండు అర్ధాలున్నాయి వంచకుడు ,రహస్య ప్రవర్తకుడు ,అని. అందుకే శత్రువుని నయానా భయానా బెదిరిస్తారు. ముందు ,చర్చలు జరుపుతారు ,డబ్బు ఇచ్చి మచ్చిక చేసుకొంటారు .బంగారం నగదు ఇచ్చి వశ పరచుకొంటారు .వీరి ప్రవర్తన చాలా సంక్లిష్టంగా ఉంటుంది .దీనికి కారణం అతిపెద్ద బ్యూర్రాక్రాసి ఉండటం .వీరి తెలివి తేటలతో చక్రవర్తికి మంచి మార్గం చూపిస్తారు లేక కపటం తో ముంచుటారు .కనుక ద్విస్వాభువులు. లోకం లో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే ‘’బైజాంటిన్ ప్రవర్తన ‘’అనే పేరు స్థిరపడింది .

 ఒక బైజాంటిన్ చక్రవర్తి పేరు ‘’బేసిల్ బల్గారో క్తానాస్ అంటే బల్గర్లను వధించిన బేసిల్ .9 7 6 రెండవ బేసిల్ అధికారానికి వచ్చాడు పొట్టిగా రాజ ఠీవి లేకుండా సామాన్య దుస్తులతో ఉండేవాడు గుర్రపు సవారిలో ఎక్స్పర్ట్ .క్రమంగ్గా పాలన అంతా నేర్చి సైన్యాన్ని నడిపించటం తెలుసుకొన్నాడు .అతని జీవితమంతా యుద్దాలతో గడిచింది .బాగ్లర్లు అనే ఆటవిక జాతి సమర్ధుడైన వాడి నాయకత్వం లో 9 8 6 లో బేసిల్ చక్రవర్తిపై దాడి చేశారు .చాలా యుద్ధాలు చేశాడు గట్టి సైన్యం కూర్చుకున్నాడు చివరికి 10 14 లో వారిని ఓడించి 15 వేలమందిని బందీలను చేసి అందరి కళ్ళు పోడిపించి వందమందికి ఒక్కకన్ను మాత్రమె ఉంచి పంపించేశాడు .బర్గ్లర్ రాజు ఈ షాక్ తో చచ్చిపోయాడు .వాళ్ళ ధైర్యం సడలిపోయి బైజాన్టిక్ పాలనలోకి వచ్చారు అందుకే బేసిల్ ను బేసిల్ ది బగ్లర్ కిల్లర్ ‘’అన్నారు

 మొదటి కాన్ స్తాన్తిన్ ‘’చర్చ్ ఆఫ్ ది హోలీ  విస్డం ‘’ను చాలా ఎత్తైన ప్రదేశం లో రాజధానిలో కట్టించాడు .అయిదేళ్లపాటు నిర్మాణం జరిగి 5 37లో పూర్తయింది .21 ఏళ్ళ ఆతర్వాత చర్చి డోమ్ భూకంపం వలన కూలింది .శిల్పి నిరాశ చెందక మరింత పెద్దది కట్టాడు .ఇప్పటికీ ఇది ఉంది .సున్నిత రిం విండో లపై ఇది బహు నాజూకుగా ఉంటుంది .గాలిలో తేలుతున్నట్లే ఉంటుంది 18 ౦ అడుగుల ఎత్తులో  100 అడుగుల వ్యాసం తో .చర్చి అంతా బంగారం వెండి దంతం కళ్ళు చెదరే మొజాయిక్ తో సుందరాతి సుందరం గా ఉంటుంది వేలకొలది దీపాలతో ధగ ధగ లాడుతుంది .ఈ చర్చినే ‘’హేగియా సోఫియా ‘’అంటే సోఫియా ముని అంటారు .సోఫియా జ్ఞాపకార్ధం హోలీ  విస్డం అనే ఈ చర్చిని కట్టించాడు .14 53లో టర్కీల ఆక్రమణ తర్వాత ఇదే మసీదుగా మారింది

  జోర్డాన్ లో 2 వేల ఏళ్ళనాటి పెట్ర నగరం త్రవ్వకాలలో ఈ మధ్య బయట పడింది .అది పెద్ద సంపన్న వ్యాపార పట్టణం ఆరబబుల  రాజధాని పేరు నేబతెనియన్స్ .తర్వాత రోమన్ సామ్రాజ్య వశమైంది .ఇప్పటిదాకా పెట్రా నగరం భూకంపం వలన నాశనమైందని భావించారు ఈ త్రవ్వకాలలో అసలు విషయం తెలిసింది ఇది ప్రాచీన బైజాంటిన్ సామ్రాజ్యం లో ఉండేది .ఇందులోని చర్చి లోపలి గదులలో పాపిరస్ చుట్టలు కనిపించాయి.అగ్నిలో కొంతభాగం కాలి ఉన్నాయి ఇప్పటికీ వాటిని చదివే వీలు ఉంది ఈ వ్రాత ప్రతులు 53 7-5 9 4 కాలానివి .వేటిలో వీలునామాలు రసీదులు కాంట్రాక్ట్ పత్రాలు కనిపిస్తాయి .ధనవంతుల ఇళ్ళుఉన్నాయి  ఈ ప్రజలు చర్చి హాస్పిటల్ స్కూల్స్ నిర్మించటానికి ఆర్ధిక సాయం చేసిన దాఖలాలు కనిపిస్తాయి కొందరు మిలితరిలో పని చేసినట్లు ,బలమైన కోతలు ఉన్నట్లు  35 ౦ మంది బానిసల పేర్లున్నాయి అందులో ఆడవారు 27 మందిమాత్రమే   ఆకాలం లో పేత్రా ఆదాయం వర్త్కమేకాక వ్యవసాయం కూడా .6 వ శతాబ్దానికే అది విడిచి పెట్టబడిన నగరం కాలేదని ఆతర్వాత చాలా ఏళ్ళు నిలబడి ఉందని 19 93 త్రవ్వకాల ద్వారా తెలిసింది ఇంత సుదీర్ఘ సంస్కృతీ నాగరక చరిత్ర ఉన్నది బైజాంటిన్ సామ్రాజ్యం లో

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

ఇన్‌లైన్ చిత్రం 4.ఇన్‌లైన్ చిత్రం 5ఇన్‌లైన్ చిత్రం 6

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-17-కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బైజాంటిన్ నాగరకత -2

బైజాంటిన్  నాగరకత -2

క్రీ.పూ.6 5 8 లోనే బైజాంటిం లో గ్రీకు కాలనీ వాసులు స్థావరాలు ఏర్పరచుకున్నారు .క్రీ శ.2 93లో డయోక్లిటాన్ రోమన్ సామ్రాజ్యాన్ని వ్యవస్థీ కృతం చేశాడు 30 6 లో కాన్స్తాన్తిన్ చక్రవర్తి అయ్యాడు .312లో క్రైస్తవ మతం స్వీకరించాడు .32 4 లోమొత్తం రోమన సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుని బైజాంటిం  ను రాజధాని చేసుకొని పాలించాడు ౩౩ ౦ లోదానికి  కాన్ స్టాంటి నోపిల్  అని పేరు పెట్టి  రోమన్ సామ్రాజ్యానికి నూతన రాజధాని చేసి పాలించాడు  .అంతకు అయిదేళ్ళక్రితం నికియాలో మొదటి ఎక్యూమేనికల్ కౌన్సిల్ సమావేశమై ఆర్ద డాక్స్ క్రిస్టియన్ మత౦  పై విశ్వాసం ప్రకటించింది . 392 లో పాగాన్ మతాన్ని ,దేవతలను దేవాలయాలను నిషేధించారు .413-434 మధ్య రెండవ ధియో డో సియస్ అనేకమైన నగర గోడలను కట్టించాడు 476లో రోమ్ఆస్ట్రో గోతస్ వశమై పడమటి రోమన్ సామ్రాజ్యం అంతమైంది .ఇక్కడ కాన్స్తాన్తిన్ తర్వాత జస్టినియన్ రాజ్యానికి 5 27 న వచ్చి 6 5 వరకు పాలించాడు .తరువాత చాలామందిపాలించారు 14 5 3 లో బైజాంటిన్ సామ్రాజ్యం కాన్ స్టాంటి నోపిల్ పట్టణం  అట్తోమాస్ టర్కుల స్వాధీనమై బైజంటిన్ సామ్రాజ్యం కను మరుగైంది . ఆ సంస్కృతిలో సాహిత్య విశేషాలు ఇంతకూ ముందే తెలుసుకున్నాం .

                                  చట న్యాయాలు

 ఇప్పుడు చట్ట న్యాయాలు తెలుసు కొందాం .చట్ట ప్రకారం అందరూ నడవాలన్నది  ముఖ్య విధి .రోమన్ ల ను సంక్రమించిన అనేక చట్టాలు సూత్రాలు ఎలా మార్చాలన్న దానిపై మొదటి జస్టి నియాన్ చక్రవర్తి నిష్ణాతులైన వారితో ఒక కమిటీ వేసి తేల్చమన్నాడు .వారి సలహాలతో ఒక చట్టం ఏర్పరచాడు దీన్ని కోడ్ ఆఫ్ జస్టి నియాన్ అన్నారు .చట్టాలలో మానవత్వానికి అధిక ప్రాధాన్యత నిచ్చాడు .యేసు చెప్పిన సోదర ప్రేమ కు విలువ కల్పించాడు .వీటివలన స్త్రీలకు బానిసలకు ,అప్పులవాళ్ళకు అధికారానికి దూరంగా ఉన్న వర్గాలవారికి వెసులు బాటు కలిగింది .బలహీనులకు వెనుకబడిన వారికి బలవంతులు అధికార వర్గాలవలన బాధ తగ్గింది .మరణ శిక్ష అరుదు గా ఉండేది .ఒక వేళ మరణ శిక్ష విధిస్తే ప్రజలందరి సమక్షం లో అమలు చేసేవారు చాలా నేరాలకు శిక్ష అంగవైకల్యం కలిపించటమే .అంటే చెయ్యో కాలో కన్నో తీసెయ్యటం .అతి సహజమైన శిక్ష కళ్ళు తీసెయ్యటం ..దీనివలన బలమైన శత్రువు భయపడి మీద పడటానికి జంకేవాడు .బైబిల్ లో చెప్పిన ‘’ఇతరులను చంపే అధికారం నీకు లేదు ‘’అన్నదాని ని బాగా అమలు చేసేవాళ్ళు చావుకంటే వాడి మానాన వాడిని పోనిద్దాం అనే ఉదార బుద్ధి ఉండేది .క్రిస్తియన్లు ఒకరికొకరు సాయం చేసుకోవాలని ముఖ్యంగా బీదలను ఆదుకోవాలని ఉండేది .దీనికోసం స్కూళ్ళు హాస్పిటళ్ళు ,అనాధ శరణాలయాలు కట్టించారు ముసలివారికి  అదృష్ట హీనులకు ఆదుకోవటానికి ఆశ్రమాలు ఉండేవి .రెండవ జాన్ కంయునాస్ చక్రవర్తి 50 పడకల ఆసుపత్రి కట్టించి అందులో గదులు ఆపరేషన్ దియేటర్ ఏర్పరచాడు ఈ విషయం లో బైజాంటిన్ సామ్రాజ్యం పశ్చిమ యూరోపియన్ సామ్రాజ్యం కంటే చాలా ముందు చూపుతో వ్యవహరించి బాధిత దుఖిత జనాలను గొప్పగా ఆదుకోన్నది .

                                సంగీతం

  బైజాంటిన్ నాగరకత లో సంగీతానికీ ప్రాధాన్యం ఉన్నది .మత ఉత్సవాలలో గాయక స్వరం మాత్రమే ఉండేది .వాయిద్యాల  హోరు  ఉండేవికావు .ఆకాలం లో ఫ్లూట్ ,వయోలిన్ ,డ్రమ్స్ ,కొమ్ము బూరాలుమొదలైన వాద్యాలను మతేతర ఉత్సవాలలో మాత్రమే వాడేవారు .దియేటర్ ,బాన్కేట్ ,వినోదాలలో వాద్య సంగీతం బాగా ఉండేది .సంగీత కర్తలు మ్యూజికల్ నోటేష న్స్స్ రాసేవారు  .ఆకాలపు సెక్యులర్ సంగీతం ఇప్పుడు కనిపించదుకాని మత సంగీతం భద్రంగానే ఉంది .సంగీత సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగించారు .తూర్పు యూరప్ ఆర్ధడాక్స్ చర్చి లలో ఇంకా బైజాన్టిక్ సంగీతం వినిపిస్తుంది

                            కళ,నిర్మాణం

బైజాంటిన్ కాలపు సెక్యులర్ ఆర్ట్ ఇప్పుడు లేదు .ఎక్కడో కాన్ స్టాంటి నోపిల్ లోని రాజ ప్రాసాదాలలో మాత్రమె గోచరిస్తుంది .అదృష్టవశాత్తు మత సంబంధ కళ సజీవంగా నే ఉంది .కాన్ స్టాంటి నోపిల్ ను క్రైస్తవ మత కేంద్రంగా చేయాలని కాన్ స్తాన్తిన్ చక్రవర్తి తీవ్రంగా కృషి చేశాడు సృజనకు  మేధస్సుకు  చర్చి నిర్మాణాలకు చాలా డబ్బు ఖర్చు చేశారు .. చర్చి  విభిన్నంగా మధ్యలో చతురస్రాకారం పైన అతి పెద్ద డోమ్ ఉంటుంది .చర్చి లోపల ఉన్నవారికి తాము స్వర్గ ఖండం లో ఉన్నామని పిస్తుంది డోమ్ లోపలి భాగమంతా అందమైన చిత్రాలతో కళాక్రుతులతో స్వర్గమే నని పిస్తుంది .చర్చి లలో మేరీ కన్య ఒడిలో బాల యేసును పెట్టుకున్న శిల్పాలు చిత్రాలు ఎక్కువగా ఉంటాయి .యేసు క్రీస్తు క్రాస్ అనేది ఎక్కడా ఉండదు .ఇది ఆర్ద డాక్స్ చర్చి ప్రత్యేకత .మేరీ ముఖం లో విధాదం కనిపించటమూ వింతగానే ఉంటుంది .ఏదైనా చాలా హుందాగా ఉంటాయి

 బైజాంటిన్ నాగరత ప్రత్యేకత దాని మొజాయిక్ ఆర్ట్ ..చిత్రాలు కాని శిల్పాలు కాని దానితోనే చేస్తారు .చైనా చిన్న రంగు  క్యూబ్ లతో వీటిని కూరుస్తారు .అద్భుత రంగుల ప్రదర్శన తోబాటు బంగారు నగిషీ కూడా గొప్ప అందాన్ని చేకూరుస్తాయి .ప్లాస్టర్ పై పెయింటింగ్ ళు వేసి చక్కగా అతికిస్తారు .రోమన్ కళలో పాగాన్ మైదాలజి గాధలకు ప్రాముఖ్యం ఎక్కువ .నీటి జంతువులూ జంతువులతో హీరో పోరాటాలు ఎక్కువ . రోమన్ మొజాయిక్ ఆర్ట్ నేలమీద ఎక్కువగా ఉంటుంది .కాని బైజాంటిన్ మొజాయిక్ ఆర్ట్ గోడలపై ఎత్తైన డోమ్ లపై అద్భుతంగా రాణిస్తుంది .మొజాయిక్ ఆర్ట్ లో వాడే చిన్న చిన్న చతురస్రాకార ముక్కలను రాళ్ళనుందడి  రంగు గ్లాస్ నుంచి  సేరామిక్ నుంచి కోసి చేస్తారు .దీనినే  ‘’టేస్సేరా’’అంటారు .గోడలకు ప్లాస్టర్ బాగా పూసి తర్వాత ఇంకో రకమైన పేస్ట్ పూసి దానిపై డిజైన్ గీసి టేస్సేరా ముక్కలను దానిపై కలర్ ఫుల్ గా అ౦టిస్తారు .ఇదే మొజాయిక్ ఆర్ట్ .బైజాంటిన్ మొజాయిక్ ఆర్ట్ ప్రత్యేకత విపరీతంగా బంగారు రేకులను వాడటమే.వీరి ఈ కళఎక్కువగా గోడలపై డోమ్ లోపలా కనిపించినా ఇటీవల ఇస్తాంబులో అంటే పాత కాన్ స్టాంటి నోపిల్ లో త్రవ్వకాలలో 6 వ శతాబ్దికి చెందిన భవనం బయట పడి జంతువులూ  పురాణ చిత్రాలు   వేటగాళ్ళు చెట్లూ ఆడుకొనే పిల్లలు ,అనేక పనులలో నిమగ్నమైన వారు కళలో కనిపించారు నేలమీద కూడా బైజాన్టిక్ మొజాయిక్ ఆర్ట్  దర్శనమిచ్చి ఆశ్చర్య పరచింది .చక్ర వర్తులు మొజాయిక్ ఆర్ట్ ద్వారా బైజాన్టిక్ సంస్కృతిని సామ్రాజ్యమంతటా వ్యాపింప జేయాలని భావించారు .దూర ప్రదేశాలలో చర్చి నిర్మాణానికి టేస్సేరా పంపేవారుకాదు. శిల్పులనే పంపి అక్కడే తయారు చేయించేవారు .డమాస్కస్ లోని గ్రేట్ మాస్క్ లో ఇప్పటికీ బైజాన్టిక్ మొజాయిక్ ఆర్ట్ ,అందులో చెట్లు ,నదులు ,భవనాలు మరింత అందంగా కనిపిస్తాయి .

 బైజాంటిన్ ఆర్ట్ లో పుణ్య పురుషుల విగ్రహాలకు ప్రత్యేకత ఉంది వీటిని చెక్కపై చక్కగా చెక్కారు .చర్చి లలోనే కాక ఇళ్ళల్లోనూ వీటిని ఉంచుకోనేవారు .ఇవి చిన్నవిగా ఎక్కడికైనా తీసుకు పోవటానికి వీలుగా ఉండేవి .బైజాంటిన్ ఆర్ట్ లో చిత్రాలను చూస్తే మొదట్లో మనకు ఆశ్చర్య మేస్తుంది అవి చిన్నపిల్లలా చేస్టల్లాగా ఉంటాయి .వికృతంగా కనిపిస్తాయి .ఏమిట్రా బాబూ ఇది కళా లేక కాకర కాయా అని పిస్తుంది .కాని కళ పరమార్ధం వారికి వేరు గా ఉంటుంది అది మతానికే అరిమితం .ఏదైనా పవిత్రంగా ఉండాలి .అందుకని మానవాక్రుతులలో నిజం కంటే ఆబ్ స్ట్రాక్ట్ ఆర్ట్ ఉంటుంది .దేవతలు చక్రవర్తుల ఖరీదైన దుస్తులతో కిరీటాలతో  ధగ ధగ మెరిసే అలంకారాలతో వ్యక్తుల్గా కాకుండా గొప్పతనానికి చిహ్నాలుగా తయారు చేస్తారు .

 ఆవ శేషాలు లేక రేలిక్స్ లో బైజాంటిన్ కళ మూఢ నమ్మకాలు కనిపిస్తాయి .కలలు,అద్భుతాలు జోస్యాలను బాగా నమ్మేవారు .సన్యాసులను పవిత్ర శీలురుగా భావించేవారు .వారికి దివ్య శక్తులున్నాయని నమ్మేవారు .ఎప్పుడూ ఏదో ప్రమాదం అకస్మాత్తుగా మీద పడుతుందనే భయం వారిలో ఉండేది .నిరంతరం టెన్షన్ లో ఉండి,అతీత శక్తులు కాపాడాలని భావించేవారు ..

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4ఇన్‌లైన్ చిత్రం 5

 సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బైజాంటిన్ నాగరకత

బైజాంటిన్ నాగరకత

రోమన్ సామ్రాజ్యం రోమ్ నగరం నుండి పాలి౦ప బడింది .అందులో యూరప్ ,ఉత్తర ఆఫ్రికా ,పడమటి ఆసియా లున్నాయి .యూరప్ లో జర్మన్ కొండ జాతులు సరిహద్దులను ఆక్రమించటం ,సిరియా ,ఈజిప్ట్ లు రోమన్ రాజ్యాన్ని వ్యతిరేకించటం తో కల్లోలం సంక్షోభామేర్పడి రోమన్  సామ్రాజ్యం ప్రాభవం కోల్పోయింది .క్రీపూ 28 4 లో దియోక్లిటన్ అనే బలమైన చక్రవర్తి కల్లోల రోమ్ నగరం వదిలి పడమర వైపున్న అనటోలియా నుండి పాలన సాగించాడు .తర్వాత సామ్రాజ్యానికి ఇద్దరు చక్రవర్తుల ఉండాలని ప్రకటించాడు .పడమటిభాగామైన ఇటలి ,పడమటి యూరప్   బ్రిటన్ ఉత్తర ఆఫ్రికాలకు ఒక రాజు  తూర్పు భాగమైన బాల్కన్స్  అనటోతోలియా  సిరియా ,పాలస్తీనా ,ఈజిప్ట్ లకు మరో రాజు ఉండాలని ప్రతిపాదించాడు ..30 5 లో దయోక్లిటాన్ స్వచ్చందంగా  పదవి  నుంచి తప్పుకున్నాడు .పడమటి సామ్రాజ్యం లో బ్రిటన్ చక్రవర్తి 30 6 లో చనిపోగా సైన్యాధికారులుఅతనికొడుకు   యువకుడైన  కాన్ స్టాన్ టిన్ ను ను వారసునిగా ప్రకటించింది .ఆతను ఆతర్వాత 18 ఏళ్ళు ఏక చట్రాదిపత్యంగా రోమన్ సామ్రాజ్యాన్ని పాలించాడు .తూర్పు భాగం లోనే ఉంటానని కొత్త రాజధాని కావాలని భావించి  బైజాంటిం అనే అనువైన చోట మహానగరం నిర్మించి అన్ని సౌకర్యాలు కలిపించాడు  .ఈ నగరం ఎన్నో ఆటు  పోట్లకు గురై నిలబడింది. ఇది ఆగాన్ సముద్రం నల్ల సముద్రం మధ్య  స్ట్రాటేజిక్ పాయింట్ గా ఉన్నది .గొప్ప హార్బర్ ఉండటం అదృష్టం .ఈ నగరానికే తర్వాత తనపేరు కలిసోచ్చేట్లు కాన్ స్టాంటి నోపిల్ అని పే రుమార్చాడు .అతనిని” కాన్ స్టాన్ టిన్ ది గ్రేట్ ”అన్నారు . ” దీన్ని గోల్డెన్ సిటి అనేవారు . అప్పటి నుంచి  నుంచి దీన్ని  బైజాన్టిక్ సామ్రాజ్యం  లేక బైజాంటిం అన్నారు .క్రీ శ 14 53 లో 9 వ కాన్ స్టాంటి న్ తో బైజాన్తిక్  సామ్రాజ్యం  పూర్తిగా నాశనమైంది . కాని అది ఏర్పరచిన కళా సంస్కృతీ నాగరకత తరతరాలుగా నిలిచి దాని ప్రాభవాన్ని చాటింది .

 భూమిపై భగవంతుని రాజ్యమేర్పరచాలన్న ధ్యేయం తో సామ్రాజ్యం ప్రారంభమైంది .క్రైస్తవమతమే రాజుకు ప్రజలకు మతం .వేష భాషలన్నీ గ్రీకు తరహా .మొజాయిక్ కళ దీని ప్రత్యేకత .అనేక చర్చిలు ధ్యానమందిరాలు నిర్మాణమయ్యాయి వివాహం సంతానం  విద్య తో సామ్రాజ్యం వికసించింది .రోమ్ లో కేధలిక్ మతం ఉంటె ఇక్క ఆర్ధడాక్స్ క్రైస్తవ మతం ఉంది .సరైన విశ్వాసం ఉంటె మతం ద్వారా స్వర్గానికి వెళ్ళవచ్చు అని ప్రజలూ నమ్మారు ఆచరించారు .దీనిపై పబ్లిక్ గా  చర్చలూ జరిగేవి మెజారిటీని అనుసరించారు రాజు దైవ ప్రతినిది .తమ పూర్వ వారసత్వ సంపదను తరతరాలుగా కాపాడుకోవటం వీరు చేసిన మంచిపని .సాహిత్య ,తత్వ శాస్త్ర  సైన్స్ ,చరిత్ర లన్నీ ప్రాచీన గ్రీకు ,రోమన్ల లనుండి సంక్రమించాయి  .తమ నాగరకతను చూసి గర్వపడే వారు బైజాన్టిక్ స్కూళ్ళు  యూని వర్సిటీలు క్లాసికల్ రచయితల రచనలతో ఉండేవి విద్యార్ధులు వీటినాదారంగా విజ్ఞానం పొందేవారు .ధనవంతులు ఇంటివద్దే విద్య నేర్చేవారు .425 లో ప్రారంభమైన కాన్ స్టాంటి నోపిల్ యూని వర్సిటి ధర్మ శాస్త్రం  మానవీయ విజ్ఞానం లను బోధించింది .సంఘం లో అన్ని తరగతుల వారూ విద్య కొద్దోగొప్పో నేర్చుకొనేవారు .చదువుకోవటం గొప్ప గౌరవం అని భావించేవారు .దేనిలో నైపుణ్యం ఉంటె వారితోనే ఆపని చేయించేవారు .మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలూ చదువుకునేవారు పై అంతస్తు మహిళ౦దరికి చదవటం రాయటం వచ్చు సాహిత్య పరిజ్ఞానం ఉండేది మగవారితో సమానంగా విషయాలపై చర్చించేవారు .

 వీరి సాహిత్యం ఎక్కువభాగం గ్రీకులోనే ఉంది పెద్ద పెద్ద భవంతులలో ప్రాచీన వ్రాత ప్రతులు అనేక గదులలో ఉండేవి .సాహిత్యం లో ఎక్కువభాగం మతానికి సంబంధించిందే ఉన్నా నిఘంటువులు విజ్ఞాన సర్వస్వాలూ  తేనే టీగల పెంపకం ,మిలిటరీ సైన్స్ పుస్తకాలున్నాయి .కవిత్వమూ ప్రచారం లో బాగానే ఉంది .ప్రేమ గీతాలు కథా గీతాలు  వీరుల గీతాలు ఉన్నాయి స్త్రీ కవులలో కాస్సియా ప్రసిధి చెందింది అంద౦గా ఉండటం వలన రాజు ఆమెను రాణీ ని చేసుకొందామనుకొన్నాడు కాని ఆమెకు అతీంద్రియ శక్తి ఉన్నందున గ్రహించి ఆ ప్రతిపాదనను తిరస్కరించి  కాన్ స్టాంటి నోపిల్ లో ఒక కాన్వెంట్ స్థాపించి అక్కడే చదువుకొంటూ రాసుకొంటూ జీవితం గడిపింది .ఆమె కవితలు చాలా భావ గర్భితంగా మతాతీతంగా ఉండేవి అందంగా ఉండటం లో తప్పూ ఒప్పూ గురించీ రాసింది

 పూర్వం వారి చరిత్రలను భద్ర పరచుకోవటం వారికిష్టం .ఆ వ్రాత ప్రతులను భద్ర పరుస్తారు .ప్రాచీన గ్రీకు రోమన్ చరిత్ర కారులైన హియర్ దోటాస్,తూసి డైడ్స్ తాసిటస్ ల  ప్రభావం ఎక్కువ .అనేక చోట్ల నుండి విషయాలు సేకరించటం ,ఇతర రచయితల రచనలు కాపీ చేసి ఉంచుకోవటం వారికి ఇష్టమైన పని కాని ఎందులో నుండి ఎవరి రచన కాపీ చేశారో రాయరు .బైజాన్ టిన్ విద్యావేత్తలు తమకాలపు విషయాలన్నీ రాసి భద్ర పరచారు .వీరి చరిత్రకారులలో ప్రసిద్ధుడు ప్రోకోపియాస్ మొదటి  జస్టినియన్ చక్రవర్తికాలపు వాడు చక్రవర్తి కట్టించిన భవనాలు రాజప్రాసాదాలు చర్చిలు ,యుద్ధాల గురించి విస్తృతంగా రాశాడు .అతని కలా నికి రెండు వైపులా పదును ఉంది .రాజుగారి చీకటి కోణాన్నీ’’సెక్రెట్ హిస్టరీ గా  వెలుగులోకి తెచ్చాడు .అందమైన  ,స్థిర చిత్తం గల రాణి దియోడ్రాపై ఆశ్చర్యకరమైన అశ్లీల కట్టుకథలూ రాశాడు .11 వ శతాబ్దికి చెందిన విద్యా వేత్త మైకేల్ సెల్ల్స్ తెలివిగాలవాడే కాని విద్యా గర్వం ఉన్నవాడు .యూని వర్సిటి లో పని చేసి చారిత్రిక విషయాలు రాసి పత్రికలూ ప్రచురించాడు .రాజుల వద్ద మెప్పుపొంది రాజకీయం చలా యించేవాడు .చక్రవర్తులలో ఏడవ కాన్ స్టాంటి న్, మాన్యుయల్ కామస్ లు గొప్ప విద్యా వేత్తలు కొందరు రాయటం  చదవటానికే  సమయం ఎక్కువ ఇచ్చి పాలన పక్కన బెట్టేవారు .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెంగమాంబ ,మొల్ల ,విశ్వనాధ పోస్టల్ స్టా0ప్ లు విడుదల

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 4-క్షణ విముక్తి నవల రాసిన -హెచ్ వి .నాగ రాజా రావు (19 42)

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3

12 4-క్షణ విముక్తి నవల రాసిన -హెచ్ వి .నాగ రాజా రావు (19 42)

నాగారాజారావు 10-9-19 42నకోలారు జిల్లా సోమేన హళ్లి లో జన్మించాడు .వెంకట నారాయణప్ప  లక్ష్మమ్మ తండ్రీ తల్లి .మైసూర్ సంస్కృత కాలేజి నుంచి వ్యాకరణ ,అలంకార శాస్త్రాలలో విద్వాన్ అయి ,మైసూర్ యూని వర్సిటి ,అమెరికాలోని సియాటిల్ యూని వర్సిటీల నుంచి ఏం ఏ అయి ,మైసూర్ ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో సీనియర్ రిసెర్చ్ స్కాలర్ అయ్యాడు .సంస్కృతం లో విదులాపుత్రీయం ,సముద్యతా ,,దాంపత్య కలహం అనే నాటకాలు రాశాడు .బొంబాయ్ భారతీయ విద్యాభవన్ వీటిని ప్రచురించింది .వరన్వేషణం ,మాలవికధ అనే రెండు కధలుకూడా రాశాడు .క్షణ విముక్తి నవల ,శారదా దర్శనం అనే యాత్రిక సాహిత్యం ,ఉపాఖ్యాన యుగ్మకం అనే వచన రచన ,సిద్ధ గంగాయాః సుధా చేతనాఃఅనే సిద్ధ గంగ స్వామీజీ జీవిత చరిత్ర రాశాడు .

 వేంకటాధ్వరి సుభాషిత కౌస్తుభం ,అన్యాపదేశ శతకం  నీలకంఠ దీక్షితుని ఆనంద సాగర స్తవం,లకు సంపాదకత్వం చేశాడు .వేడ వేదాన్గాలపై ఆయన రాసిన పరిశోధనా  పత్రాలను బెంగుళూర్ భారతీయ విద్యాభవన్ ప్రచురించింది .హెచ్ ఏం నాయక కన్నడ రచన ;;నమ్మ మనేయ దీప ‘’ను’’అస్మాకం గృహం దీపః ‘’గా  సంస్క్రుతీకరించాడు .చిన్న కధలు రాసే ప్రసిద్ధ కధకుల చేత కధలురాయించి ‘’విపంచిక ‘’గా ప్రచురించాడు .అలాగే అప్పయ్య దీక్షితుని వరద రాజ స్తవం ,నీల క౦ఠదీక్షితుని రామాయణ సంగ్రహం ,రఘు వంశ స్తుతి ,గౌరీ శంకరస్వామి భావనా లహరి ,శంకరాచార్యుల ‘’శివ పాదాది కేశాంత స్తోత్రం ‘’లను కన్నడీకరించాడు .

 శేఖావతీ సంస్కృత యూని వర్సిటి ‘’వేద వ్యాస ప్రశస్తి పురస్కారం అందజేసింది విజిటింగ్ ప్రొఫెసర్ గా చికాగో ,విస్కాన్సిన్ జెరూసలెం యూని వర్సిటీలకు వెళ్లి బోధించాడు .వరాన్వేషణం లో కట్నాలు ఇవ్వలేక పెళ్లి కొడుకులు దొరక్క తల్లి దండ్రులు పడే బాధలు చూపాడు .ఉద్యోగ పర్వం లోని విదుల అనే ఉత్తమ స్త్రీ కద ‘’విదులా పుత్రీయం ‘’.వార్తాపత్రికలలో వచ్చే సమకాలీన విషయాలపై రాసింది ‘’సముద్యతా ‘’.భార్యా భర్తల ‘’డిషుం  డిషుం’’కథ’’దాంపత్య కలహం ‘’.ఊర్వశి ,శకుంతల ల గురించి ఉపాఖ్యాన యుగ్మకం వచనం లో రాశాడు .ఎవరూ ముట్టుకొని ,ఎవరూ రాయని అరుదైన విషయాలపై రాయటం నాగ రాజారావు పత్యేకత .

ఇన్‌లైన్ చిత్రం 1

125- పంచ భాషా కవితా వల్లభ-ఆర్యార్ శ్రీ రామ శర్మ -(19 43 )

కర్నాటక లోని మెల్కోటే లో ఆర్యార శ్రీరామ శర్మ 19 43 ఆగస్ట్ 28 జన్మించాడు .తండ్రి శ్రీనివాస అయ్యంగార్ .సాహిత్య ,న్యాయ ,విశిస్టాద్వైతాలలో ఏం ఏ .మెల్కోటే సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ పంచ భాషా కవితా వల్లభ ,బిరుదు సంస్కృత ప్రాకృత కన్నడ తమిళ హిందీ భాషలలో రచనలు చేయటం వలన పొందాడు .సంస్కృతం లో అస్మత్ చంపు ,కదా కదంబకం  కథా సాహిత్యం గాలి శతకం ,పాంచ జన్య శతకం ప్రకీర్ణ కల్లోలిని హంస ప్రతి సందేశః ,క్షుద్రకాంత ,క్షుద్ర కాదంబరి శ్రీ విజయ ధ్వని మొదలైనవి రాశాడు .

 సంస్కృత విమర్శన గ్రంధాలుగా సంస్కృత కదా ప్రబంధం ,శాస్త్ర ప్రబంధం ,లఘుకావ్య ప్రబంధం ,సంశోధన ప్రబంధం విమర్శన ప్రబంధం ,ధ్యాని ప్రబంధం ఇతిహాస ప్రబంధం ,సాహిత్య మాత్రిక రాశాడు .ప్రాకృతం లో ప్రాకృత ముక్త వచయః ,ప్రాకృత పుష్పా పచయః రాశాడు ప్రాకృతం లో విశ్లేషణాత్మక విమర్శనాత్మక రచనలూ చేశాడు .రాజ శేఖరుని కావ్య మీమాంసను కన్నడీకరించాడు .కన్నడం లో విస్తృత కవితలు వ్యాసాలూ రాశాడు .పింగళ భారత ,రహస్య రత్నమాల మొదలైన తమిళ రచనలు ,హిందీలో చాలా వ్యాసాలూ రాసి సంపుటులుగా తెచ్చాడు .

 కావ్య కల్లోలిని  స్వయం సంస్కృత కవితలు వాటిని7  కల్లోలాలు అంటే7  అధ్యాయాలు-మంగళ ,వస్తు గీత ,కథ ,సంస్కృత ,,శృతి ,ప్రకీర్ణ కల్లోలాలుగా గా విడగొట్టాడు వీటిని శృంగారం అంగారం దేశభక్తి సమకాలీనత ,ఆధ్యాత్మికత ,హాస్యం అన్నీ రంగరించి రాసినవి .అస్మత్ చంపు లో  సాంప్రదాయత ఆధునికత జోడించాడు .రామానుజా చార్యుల జీవితం ,విశిష్టాద్వైత మత విషయాలున్నాయి .చివరిది ‘’నిద్రా వైభవం ‘’లో విష్ణు మూర్తి దశావతారాలు వివిధ భంగిమలు వర్ణిస్తూ  మానవుని మేల్కొలపటానికి జాగృత పరచటానికి రాశాడు

ఇన్‌లైన్ చిత్రం 2

.

 సశేషం

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 0- భూకైలాస నాటక కర్త -సాంబ దీక్షిత్ (19 34 )

 గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3

12 0- భూకైలాస నాటక కర్త -సాంబ దీక్షిత్ (19 34 )

 19 34 ఫిబ్రవరి 14 న సాంబ దీక్షితులు కర్నాటక లోని గోకర్ణ క్షేత్రం లో జన్మించాడు .తండ్రి దామోదర దీక్షితులు .ఋగ్వేద ఘనాపాటి ,వ్యాకరణ విద్వాన్ .భాష్య కావ్య తీర్ధ ,హిందీ సాహిత్య విశారద .గోకర్ణ మేధా దక్షిణామూర్తి సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ గా  మహర్షివేద యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా ఉద్యోగం .బెంగుళూరు వేద ధర్మ పరిపాలన సభ ‘విద్యా వారిది’’,,గోకర్ణం విద్వత్ సభ ‘’వేద విద్వాన్ ‘’ బెంగుళూరు భారతీయ విద్యాభవన్ ‘’వేద రత్న ‘’పురస్కారాలు ఇచ్చాయి .

 దీక్షితులు సంస్కృతం లో ‘’నిత్యానంద చరితం ‘’లఘు కావ్యం  తోపాటు మూడు నాటకాలు -మహాగణపతి ప్రాదుర్భావం ,భూకైలాస శతకం ,వర దక్షిణనాటకం రాశాడు చివరిది సాంఘిక నాటకం ,అగ్ని సహస్రనామాలు అగ్ని రాజసూయం ,గృహ్యాగ్ని జార ,వాయుజ సహస్ర నామ స్తోత్రాలను తన సంపాదకత్వం లో ప్రచురించాడు .మహారాష్ట్రలోని స్వామి నిత్యానంద ఆశ్రమమహిమలను వివరించినదే ‘’నిత్యానంద చరితం ‘’.గోకర్ణ క్షేత్ర పురాణగాధ ఆధారంగా ‘’భూకైలాసం రాశాడు .సాంబ దీక్షితులు నిత్యాగ్ని హోత్రి .మహా వేద విద్వాంసుడు .

121-బసవ భాస్కరోదయ  మహా కావ్య కర్త –పరాడ్డి మల్లికార్జున (19 40 )

పరాడ్డి మల్లికార్జున 19 40 లో కర్ణాటకలో సావడి లో పుట్టి ,సంస్కృతం లో ఏం ఏ పి హెచ్ డి చేసి దార్వార్  సంస్కృత యూని వర్సిటి ప్రొఫెసర్ అయ్యాడు .బసవ భాస్కరోదయం అనే మహా కావ్యం,గంగాధర ,చెన్న విలసదమొదలైన శతకాలు ,సంస్కృత కావ్యమాలిక ,సంస్కృత కావ్య మందాకినీ కావ్యాలు రాశాడు .కబీర్ కవితల్ని కబీర్ దా శతక గా అనువదించాడు .దీనికి సాహిత్య అకాడెమి అవార్డ్ పొందాడు .అక్కమహాదేవి ,బసవేశ్వర శతకాలు కన్నడం నుంచి సంస్కృతంలోకి మార్చినవి   .మల్హనా స్తోత్రం చిత్రగ్రీవ విజయం ,జగద్గురు సిద్దేశ్వర చంపు లకు సంపాదకత్వం వహించాడు .విశ్వారాధ్య విశ్వ భారతీ పురస్కార గ్రహీత మల్లికార్జున .

 బసవ భాస్కరోదయం 16 కాండల బసవని చరిత్ర కావ్యం.వైవిధ్య ఛందస్సులతో రాసీభూత రసానందం కలిగించాడు .గంగాధర శతక నాయకులు గంగాధర రాజ యోగీంద్రులు . 16 వ జనం దినం నాడు రాశాడు .స్వామీజీ బహుభాషా పాండిత్యాన్ని తెలియ జేశాడు .స్వామి నిర్మించిన సత్రాలు లైబ్రరీలు హాస్పిటల్స్ హాస్టల్స్ వివరాలన్నీ పేర్కొన్నాడు .మతసామరస్యానికి సంస్కృత వ్యాప్తికి స్వామీజీ చేసిన కృషి వివరించాడు .సంస్కృత కావ్య మందాకినీవివిధ అంశాలపై రాసిన  32 శ్లోకాల సమాహారం .’’విరలో మనీషా ‘’అనేది డా సర్వే పల్లి రాదా కృష్ణన్ మహోన్నత వ్యక్తిత్వాన్ని తెలియ బరచే ఘన నివాళి .శైవు డైన మల్లికార్జున పరాడ్డి గొప్ప కవి అనువాదకుడు ,పరిశోధకుడు ..ఆధునిక సంస్కృత మహా విద్వాంసుడు కవి’’ అభి రాజేంద్ర మిశ్ర ‘’మచ్చ రాదేయం సుకవి సుహ్రుదయం చ పి సౌమ్యం పరాడ్డిం’’అని ఘనంగా మల్లికార్జునుని కీర్తించాడు .

12 2 -ధర్మ శాస్త్ర విద్వాన్ -గణపతి పాథక్(19 41)

శంకర గణపతి పాధక్ 19 40 లో కర్ణాటకలో జన్మించాడు సాహిత్యం లో శిరోమణి ,ధర్మ శాస్త్రం లో విద్వాన్ .,సంస్కృతం లో ఏం ఏ .సంస్కృతం లో శ్రీ హరి హరేశ్వర సుప్రభాతం హర నర్తన ,వసంత తిలక ఛందస్సులో 38శ్లోకాలతో పాటు దండకం తో  కావ్యం  రాశాడు .కర్ణాటకలోని కారకాలలో ఉన్న హరిహర నాద  దైవం పై రాసిన కావ్యమిది .మహా రాష్ట్ర నుంచి వచ్చి స్తిరపడిన చిత్పావన బ్రాహ్మాణుల గ్రామం ఇది  వేదాధ్యయనానికి బాగా ప్రసిద్ధి .చిత్పావనుల ముఖ్యఆరాధ్య  దైవం హరిహరనాధుడు .సుప్రభాతం లో స్వామి మహిమ ఈ క్షేత్ర మహిమ  అంతా కళ్ళకు కట్టినట్లు ఉంటుంది .కవి దీనిని కన్నడం లోకి కూడా అనువదించాడు .

12 3 -తేజస్సంక్రమం  కర్త -గురుపాద హెగ్డే (19 41)

గురుపాద హెగ్డే 19 41 లో మే 18 నజన్మించి ,సాగర్ లోని లాల్ బహదూర్ శాస్త్రి కాలేజిలో విద్యాబోధన చేశాడు .-సంస్కృతం లో ‘’తేజస్సంక్రమః ‘’అనే నాటకం ,ఆధ్యాత్మ సోత్ర మంత్రం భావ గీతం రాశాడు సంస్కృత సాహిత్య విమర్శగా ‘’శ్లేష సిద్దాన్తః ;;మరియు కన్నడ వాజ్మయ వికాసే సంస్క్రుతస్య ప్రభావః ‘’రచించాడు .కొన్ని గీతికావ్యాలు రాశాడు .కన్నడ రచనలూ చేశాడు .సంస్కృతం లో ‘’పన్ అండ్ శ్లేష ఇన్ సాంస్క్రిట్ ‘’రాశాడు .కర్నాటకరాస్త్ర పురస్కారం పొందాడు .తేజస్సంక్రమః ఏకాంకిక .రామ పరశురామ సంవాదం రేడియోలో ప్రసారమైంది అనేక చోట్ల ప్రదర్శింప బడింది  భావగీతాలు హెగ్డే రాసిన భక్తీ గీతాలు .

  సశేషం

 మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -25-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ లో శ్రీశంకర జయంతి

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

—

జగద్గురు శ్రీ శంకరాచార్య జయంతి -ఆహ్వానం

వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి ,ఛి సౌ విజయలక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సా౦బావధాని స్వగృహం లో 29-4-17 శనివారం నాడు శ్రీ శంకరాచార్య జయంతిని నిర్వహిస్తున్నారు .

                                   కార్య క్రమం

ఉదయం 7 గం లకు -సుప్రభాతం -శ్రీమతి సౌమ్య

                8 గం లకు -గణపతి అధర్వ శీర్షం ,నవగ్రహ నక్షత్రేస్టి

                10 గం లకు -ఉపనిషత్ సూక్త పఠనం -శిక్షా ,ఆన౦ద  భ్రుగు ,మన్యు ,శ్రీ దుర్గా ,పురుష సూక్తాలు

                11-30 లకు -నమక ,చమక  శత రుద్రీయం

మధ్యాహ్నం 1.గం లకు – అరుణం ,ఆదిత్య హృదయం పారాయణ

                     2-30 గం లకు -ఆధ్యాత్మ ప్రసంగం  -శ్రీ ,సిద్ధార్ధ శర్మ

                     3 గం లకు -ప్రార్ధానా గీతాలు -పిన్నలు ,పెద్దలు

సాయంత్రం 4-30 గం లకు -శంకరా చార్య అష్టోత్తర పూజ -శ్రీ శంకర స్తోత్ర పఠనం

                      6గం – లకు -నైవేద్యం హారతి ,మంత్రం పుష్పం

                      6-30 గం లకు -మహా ప్రసాదం

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 119-సోమలతను గుర్తించిన ఆధునిక వైద్యుడు -వైద్య భైరవ దత్త (19 40 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

119-సోమలతను గుర్తించిన ఆధునిక వైద్యుడు -వైద్య భైరవ దత్త (19 40 )

వైద్య భైరవ దత్త హిమాలయ మూలికలపై సాధికారత కలవాడు .లివింగ్ అధారిటి .ఒకసారి స్వామి రామాతో తాను సోమలత ను తెస్తానని దాని ఫలితాలు చూపిస్తానని అంటే స్వామి డబ్బు ఇచ్చి పంపాడు సోమలత హిమాలయాలలో 11 వేల అడుగుల ఎత్తుప్రదేశాలలో ఒకటి రెండు చోట్ల మాత్రమేపెరుగుతుంది .యజ్ఞాలలో సోమరసం వాడటం అందరికి తెలిసిన విషయమే .వేదం లో చాలాసార్లు దాని ప్రస్తావన వస్తుంది .అన్నట్లుగా నే దత్త ఒక పౌను  బరువు గల సోమలతను శోధించి సాధించి తెచ్చాడు

  సోమలత నుంచి సోమ తయారు చేసి మార్జువానా ,హషీష్ లకు అలవాటు పడిన సాదువులపై ప్రయోగించారు .అది వారిలో  భయ రాహిత్యాన్ని కలిగించింది .పాశ్చాత్యులు ‘’సైకేడిలిక్ మష్రూమ్స్ ‘’ పై పరిశోధించి చెప్పినట్లే ఈ సాధువులూ ప్రవర్తించారు . అయితే హిర్బాలజిస్ట్ దత్త మాత్రం అనేక రకాల మష్రూమ్స్ ఉన్నాయని అవీ ఇలాంటి ప్రబావాన్నే కలిగిస్తాయని సోమలత ఆ కుటుంబానికి చెందిన్దికాదని ఇది ప్రత్యేకమైనదని తెలియ జేశాడు సోమలత కుంచించుకు పోయే స్వభావం ఉన్న జాతికి చెందినది అన్నాడు . .అనేక ఆయుర్వేద గ్రంధాలలో వివిధ పుట్టగొడుగుల విషయాలన్నీ ఉన్నాయి వాటిని వాడిన వారికి సైకిక్ అనుభవాలు కలుగుతాయి అని చెప్పబడింది .కాని వాటిలో సోమలత పేరు లేదు .మిగతా ముడుచుకుపోయే రకాలు ఈ ప్రభావాన్ని కలిగించవు .అగారికస్ హైషిమస్ .స్ట్రామోనియం అనేవి విష పూరితమైనవి కాని కొద్ది మోతాదులో సేవిస్తే  భ్రాంతి విభ్రమ కలిగిస్తాయి .సరైన మొతాదులోనే వాడాలి లేకపోతె వీటివలన ప్రాణ హ్హాని తప్పదు .

  సోమ ,పాదరసాలను ఎలా వాడాలో అనేక రకాలుగా మనవాళ్ళు వర్ణించి వివరించారు .యోగ విధానం లో ఇలాంటి బయటి ప్రేరకాల వాడుక నిషేధం .కొద్దిమంది కింది స్థాయి సాధువులు వీటిని వాడి మత్తుగా స్తబ్దుగా ఉండిపోతారు తప్ప యోగ సాధనలో వృద్ధి పొందలేరు .అలాగే హోమియోపతి వైద్యం లో ఆర్సెనిక్ 10 ఏం, గరళం అతి తక్కువ డోసు లో  చనిపోయే రోగికిస్తే భయం నుంచి బయట పడతారు ..గ్రీకులు ఈజిప్ట్ వారూ దీన్ని రోగులపై ప్రయోగించారు .అలాగే సోమ రసాన్ని వాడితే మనసు  అంతర్ముఖమఔతున్దని హిమాలయ హీర్బాలజిస్ట్ లు వాడుతూ ఉంటారు .వారి ఉత్సవాలలో కూడా దీన్ని పవిత్రంగా వాడి నట్లు ఆర్యుల చరిత్రలో ఉన్నది .

 పతంజలి మహర్షి కూడా యోగ సూత్రాలలో నాలుగవ అధ్యాయం మొదటి శ్లోకం లో ఔషధీ వనమూలికల నుండి తయారు చేయబడిన మందు మానసిక అనుభావలనిస్తుంది అని చెప్పాడు .అయితే ఇది తాత్కాలికమే కనుక దీనిపై ఆధారపదరాదన్నది ముఖ్య విషయం. సాధనే దారి .ప్రాచీన సాహిత్యం లో సోమరసాన్ని తెలివి తక్కువ విద్యార్ధులకు అంటే  కుదురుగా  ఆసన బద్ధులుగా ఎక్కువ సేపు కూర్చోలేని వారికి  ఇస్తే ,అది వారి నాడీ వ్యవస్తపై ప్రభావం చూపి ,అనేక విధాలుగా పరిగెత్తే మానసిక ఆలోచనలు ఏకీక్రుతమౌతాయని చెప్పబడి ఉంది .అప్పుడు శరీరం స్వాధీనమై చెప్పినట్లు విని బాధ లేకుండా కూర్చోవటానికి వీలవుతుంది .కనుక ఇలా నిష్టగా ఆసన బద్దులు కాలేని వారు సాధనకు ముందే చేసే కొన్ని కార్య క్రమాలలో సోమరసాన్ని తీసుకుంటారు .దీని వాడకం ఇష్టం వచ్చినట్లు చేయరాదు హిర్బాలజిస్ట్ సలహాపైనే వాడాలి

 వైద్య  భైరవ దత్త ఇలాంటి ప్రేరకాలను మంత్రాలతో జోడించి రోగులకు వాడుతాడు .ఈ మంత్రాలను ఒంటరిగా ఉండి ఉపవాసం తో చదువుతాడు .దీనికి తోడూ కొన్ని తంత్ర క్రియలూ చేస్తాడు .కొందరు సాధువులు ఈ ప్రక్రియలో చాలా అనుభవం సాధించిన వారున్నారు .ఈ విధానం అంతా లేకుండా వాటిని వాడితే పరమ ప్రమాదం .నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి .భ్రమలు పెరిగి సైకిక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ..కొందరికి భావాతీత అనుభవాలు కలగవచ్చు కాని యోగికి అవి సహకరించవు .తరువాత వ్యతిరేక ప్రభావం కలిగిస్తాయి .

 భైరవ దత్త తానూ చాలా సార్లు సోమ రసాన్ని నిర్భయంగా వాడానని మంచి ధనాత్మక ఫలితాలిచ్చాయని ఉన్నత స్తితికలిగిందని చెప్పాడు స్వామి రామ తో .కాని దాన్ని పదే పదే వాడితే వ్యతిరేక ఫలితం కలగటం ఖాయమని చెప్పాడు  మానసిక రోగాలు వస్తాయన్నాడు ..

 ఒక రోజు ఉదయం దత్త’’ అస్టావర్గ’’రసం తయారు చేసి దానిలో సోమరసం కలిపి స్వామితో సహా అందరికీ ఇచ్చాడుతాగమని .స్వామికి అది చేదుగా వగరుగా అనిపించింది .భైరవ దత్త మంత్రాలు చదువుతూ ఊగిపోతూ డాన్స్ చేయటం ప్రారంభించాడు .చివరికి బట్టలన్నీ విప్పి విసిరిపారేసి కరాళ నృత్యం చేశాడు .స్వామి రామ్ కు తలనొప్పి వచ్చింది కాసేపటికి .శిష్యులకు ఎందుకు వీళ్ళు అలా ప్రవర్తిస్తున్నారో తెలియలేదు .హీర్బాలజిస్ట్ భారవ దత్త డాన్స్ చేస్తూ ‘’నేను శివుడిని  ఈ విశ్వానికి అధిపతిని నా పార్వతి ఎక్కడ ఆమెతో శృంగారం చేయాలి ‘’అని అరిచాడు .అయిదుగురు ఆయనను ఆపటానికి ప్రయత్నం చేసినా ఆపలేక పోయారు .వాళ్ళని ఒక్కొక్కరిని తోసిపరేశాడు .ఈ ఉదంతమంతా స్వామి రామా ఉత్తర కాశిలో ఉజాలి  ఆశ్రమం లో జరిగిందని రాశాడు .ఇలాంటి అనేక అనుభావాలవలన స్వామిరాం  ఈ హెర్బల్ మూలికలు కొద్దిగా మంచి చేస్తే చేయవచ్చునేమోకాని ఎక్కువగా కీడు చేస్తాయని తెలియ జేశాడు

 దక్షిణ భారత దేశం లో ఆయుర్వేద  ,సిద్ధ ఔషధాలలో సోమలత వాడకం ఉన్నది దీని బొటానికల్ పేరు ‘’సార్కో స్టెమ్మా అసిడం’’ .ఋగ్వేద హోమాలోనే కాక ఇరాన్ దేశ హోమాలలో కూడా సోమలతను వాడారు .మనవాళ్ళు ‘’దేవతలకోసం దేవుడు ‘’అని సోమలతను అన్నారు .ఋగ్వేదం ‘’దేవుళ్ళను  సృష్టి౦ చేదిసోమలత’’అన్నది .ఇంద్రునికి సోమలతకు అవినా భావ సంబంధం ఉన్నది .రాక్షసులపై యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారీ సోమ రసం పుచ్చుకొని  వెళ్ళేవాడని  మంచి ప్రేరకంగా పని చేస్తుందని ఉన్నది .తపస్సుకు ముఖ్యమని చెప్పబడింది .కాంతికీ సోమలతకు సంబంధం ఉన్నదని అందుకే కాంతి అధిదేవత ఇంద్రునికి అది ఇష్టమైనది అని ఋగ్వేదం లో ఉంది ..ఇక  చలించి  సోమమత్తులో నుంచి బయట పడదాం

ఇన్‌లైన్ చిత్రం 1

  సశేషం

   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-3 118-సాయి గాయత్రి మంత్రం రాసిన -శ్రీ ఘండి కోట వెంకట సుబ్బారావు (19 26 -20 03 )

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-3

118-సాయి గాయత్రి మంత్రం రాసిన -శ్రీ ఘండి కోట వెంకట సుబ్బారావు (19 26 -20 03 )

బ్రహ్మశ్రీ ఘండికోట వెంకట సుబ్బారావు గారు 7-11-19 26 న రాజమండ్రి లో జన్మించారు .తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి శ్రీమతి రామ లక్ష్మి .భారద్వాజ గోత్రం కృష్ణ యజు శ్శాఖ .తండ్రి వేద వేదా౦తా లలో  క్రతు నిర్వహణలో నిష్ణాతులు. కొడుకు జన్మించాలని  పుత్ర కామేష్టి చేసిన కర్మిస్టి.విజయనగర మహారాజు తన  ఆస్థాన విద్వాంసుని చేశాడు శాస్త్రి గారిని .విజయనగరం చేరి కొడుకుకు ఆంగ్ల ,భారతీయ విద్యా విధానం లో విద్య నేర్పించారు .తండ్రి గారు మహా రాజాతో పాటు ప్రయాణాలు చేయటం వలన రావు గారు విజయనగరం మద్రాస్ బెంగుళూరు లలో చదివారు .19 40 లో స్వాతంత్ర ఉద్యమకాలం లో భారత దేశ కీర్తి వైభవాలను కీర్తిస్తూ సైన్యాన్ని బ్రిటిష్ వారిని ఎదిరించమని కోరుతూ  పాటలు రాసి అచ్చు వేయించి కంటోన్ మెంట్ ప్రాంతం లో పంచి పెట్టారు .ప్రభుత్వం అరెస్ట్ చేసి౦దికాని కుర్రాడుకదా అని వదిలేసింది .మొదటి నుంచి సంప్రదాయ పద్ధతిలో విద్య నేర్చిన రావు 20 వ ఏట తల్లి మరణం బాధ కల్గించింది .19 42లో శ్రీమతి తంగిరాల లక్ష్మీ దేవిని వివాహమాడారు .62ఏళ్ళు వివాహ జీవితం అవిచ్చిన్నంగా సాగింది అయిదుగురు  మగపిల్లలుకలిగారు .

మద్రాస్ లయోలా కాలేజి నుంచి  ఎకనామిక్స్ లో బి ఏ ఆనర్స్  డిగ్రీ పొంది , విజయనగరం లో ఏం ఏ అయి అక్కడే లెక్చరర్ గా కొంతకాలం పని చేశారు .19 4 9 లో అమెరికా లోన్యూయార్క్ లోని  కొలంబియా యూని వర్సిటిలో ఏం ఏ పి హెచ్ డి చేశారు .ప్రొఫెసర్ సిఫార్స్ తో న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్స్ సెక్రెటేరియట్ లో ఎకనామిక్స్ వ్యవహారం చూసే బాధ్యత 19 5 1 లో తీసుకున్నారు ..34ఏళ్ళ సుదీర్ఘకాలం ప్రపంచ వ్యవహార సంస్థలో సేవలందించారు తెలుగు బిడ్డ .భారతీయ విదాననాన్ని ఏమాత్రం మర్చి పోకుండా దంపతులు జీవించారు పిల్లలను అలాగే పెంచారు .భార్య ఇరగవరానికి చెందిన  తంగిరాలవారి ఆడబడుచు .వారిల్లు గురుకులం గా ఉండేది .నాలుగేళ్ళు ఇక్కడ పని చేశాక రావు గారిని బాంగ్ కాక్ లోని  యు యెన్ అకాడెమిక్ కమిషన్ కు బదిలీ చేశారు .డాగ్ హామార్ షెల్ద్ యు దాంట్ లు రావుగారి సహోద్యోగులు .19 5 8 లో మళ్ళీ న్యూయార్క్ లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ లో పని చేశారు .యువ ఆర్ధిక వేత్తగా గొప్ప గుర్తింపు పొందారు .

 19 6 ౦ లో ఇండియా వెళ్లి కుటుంబంతో గడుపుతుండగా అప్పటికే తండ్రి శాస్త్రిగారు సత్యసాయిబాబా ముఖ్య శిష్యులై  సలహా దారై సాయి భగవానుని అవతారమని ప్రచారం చేస్తున్నారు .రావు గారి నాలుగుతరాల కుటుంబ సభ్యులు పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు .శాస్త్రిగారిని బాబా ప్రశాంతి నిలయ ఆస్థాన విద్వాంసుని చేశారు .ఆయన ఆధ్వర్యం లో దసరాలలో యజ్ఞం నిర్వహించారు కూడా .

 19 6 1 లో రావు గారు ఢిల్లీ లో యునిసెఫ్ లో పని చేశారు .సీనియర్ ప్లానింగ్ ఆఫీసర్ అయ్యారు .దక్షిణ ,  ఆగ్నేయ ఆసియాలో  స్త్రీ శిశు పోషకాహారం కౌమార ,యవ్వన విషయాల సమస్యల పరిష్కార౦ పై పని చేశారు .వేదోపనిషత్ లపై సాధికారత సాధించి బదరీనాద్ కేదార్ నాద వంటి పుణ్య స్థల దర్శనం చేశారు .ఇండియాలో యునిసెఫ్ పని పూర్తవగానే మళ్ళీ న్యూయార్క్ వెళ్లి ఎనర్జీ సెక్షన్ హెడ్ అయ్యారు .ఇరవై ఏళ్ళు దీనిలో పని చేసి ఆయిల్ ఎకనమిస్ట్ గా ప్రపంచ ప్రసిద్ధి పొందారు .ఒపెక్ సంస్థలతో నిరంతర చర్చలు జరుపుతూ 19 73 లో వచ్చిన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు .అలగప్పన్ అనే అతనితో కలిసి న్యూయార్క్ లో ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ‘’నార్త్ అమెరికా  టెంపుల్ హిందూ సొసైటీ ‘’స్థాపించారు .తిరుమల తిరుపతి దేవస్థానం వారితో సంప్రదించి న్యూయార్క్ లోని ఫ్లాషింగ్ లో గణేష్ దేవాలయం ను సంప్రదాయ హిందూ పద్ధతిలో నిర్మించారు .అప్పటికే సాయి భజన ఇంటివద్ద చేస్తున్నారు దానిని దేవాలయానికి మార్చారు .ఉత్తర అమెరికాలో ఇదే మొట్టమొదటి హిందూ దేవాలయం .ఇదే ఆతర్వాత ఎందరికో ప్రేరణ కలిగించి అనేక దేవాలయాలు ఎర్పడేట్లు చేసింది .ఇది సుబ్బారావు గారి పుణ్యమే .వ్యవస్థాపక అధ్యక్షులుగా నిర్విరామ కృషి చేసి ఎన్నో అభి వృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు .ప్రతివారం తాననే వేద ఉపనిషత్ గీతలపపై ప్రేరణాత్మక ప్రసంగాలు చేసేవారు .అన్ని మత విశ్వాసాల కు ఆలవాలంగా ‘’సత్య సాయి సర్వ ధర్మ ‘చిహ్నం ‘’ఏర్పాటు చేశారు .  మొదటిసారిగా సత్య సాయి స్టడీ సర్కిల్అమెరికాలో ఏర్పరచి .భారతీయ విద్యాభవన్ నిర్మాణానికి కృషి చేశారు స్వామి చిన్మయానంద ప్రభుపాద రామకృష్ణ పరమహంస వివేకానంద  మహేష్ యోగి బోధనలన్నీ క్షుణ్ణంగా చదివి జీర్ణించుకొన్నారు .న్యు యార్క్ లో మొట్టమొదటి ‘’తెలుగు సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘’ఏర్పరచారు .ప్రతి ఉగాదినాడు పంచాంగ శ్రవణ౦ చేసేవారు .

  రెండేళ్ళ కోసారి కుటుంబం తో ఇండియా వచ్చి తప్పని సరిగా బాబా దర్శనం  స్పర్శనం సంభాషణం చేసేవారు .19 8 1 రావు గారి నాలుగవ కొడుకు సంజయ్ ఉపనయనం పుట్టపర్తిలో చేసి బాబా యజ్ఞోపవీతం సృష్టించి ఇస్తే వేయించి గాయత్రీ మంత్రోప దేశం చేయించారు అతనికి అక్కడే సత్యసాయి హయ్యర్ ఎడుకేషన్ సెంటర్ లో సీటు ఇచ్చారు .మరొక అబ్బాయి రవి శంకర్  కూడా అక్కడే చదివి బాబా గారి బెంగళూర్ బృందావన్ కాలేజి లెక్చరర్ అయ్యాడు ఇదీ ఆకుటుంబానికి బాబాకు ఉన్న అనుబంధం .

  19 8 4 లో ఇండియాకు వచ్చినప్పుడు 90 ఏళ్ళ తండ్రి శాస్త్రిగారు ‘’ఇండియాకు ఎప్పుడు వచ్చేస్తావు ?అని అడగటం బాబా అనుగ్రహం తో రావుగారిని బాబా ప్రశాంతి నిలయానికి రమ్మని ఆహ్వానించటం జరిగిపోయి  19 8 5 లో యుయెన్  సర్వీస్ నుండి 5 8 వ ఏట రిటైర్ అయి ,మెరిట్ సర్వీస్ అవార్డ్ పొంది ,పుట్టపర్తిలో ఉన్న  తండ్రి గారి  సేవలో బాబా సేవలో 18 సంవత్సరాలు గడిపారు .తండ్రిగారు రావు గారి చేతులమీదుగా చనిపోయారు .స్వామి పుస్తక ప్రచురణ విభాగం లో రావుగారు పని చేశారు పిల్లలకు బాబా కాలేజీలలో ఉద్యోగాలు ఇచ్చారు .ఆశ్ర మ మేగజైన్ ‘’సనాతన సారధి ‘’లో తెలుగు ఇంగ్లీష్ లలో వ్యాసాలూ రాస్తూ  సంపాదకత్వం వహిస్తూ సేవ చేశారు పితృ ఋణం తీర్చుకున్న  రావుగారు మిగిలిన కాలమంతా బాబా సస్న్నిధిలో సేవలోనే గడిపారు .విదేశీ భక్తులకు ఇంగ్లీష్ లో రావుగారు అనర్గళ ఉపన్యాసాలు ఇస్తూసాయి భావాలను సులభంగా అర్ధమయేట్లు చెప్పేవారు .అప్పటికే ముగ్గురు కుమారుల వివాహాలు చేసిన రాగారిని బాబా మిగిలిన ఇద్దరు అబ్బాయిల పెళ్ళిళ్ళు త్వరగా చేయమని చెప్పి ఎర్రమిల్లి సత్యమూర్తి గారి అమ్మాయిలు ఆహ్లాదిని ,సుమన లను కుదిర్చితన నివాసం ‘’త్రయీ బృందావన ‘’లో ఎంగేజ్ మెంట్ జరిపించి బెంగుళూరు బృందావన్ లో అన్ని ఖర్చులు తామే భరించి అత్యంత వైభవం గా తమ చేతులమీదుగా ఏప్రిల్ 20 నవివాహాలు జరిపించారు ఘండికోట కుటుంబీకు లందరూ పాల్గొని ఆశీర్వదించారు .మంగళసూత్రాలను స్వామి సృష్టించి వారికి అందజేశారు .

 భగవాన్ బాబా తనపై కురిపించిన అపూర్వ దయా వర్షానికి పులకితులైన సుబ్బారావు గారు దాన్ని సార్ధకం చేసుకోవాలని భావించి 21 వ శతాబ్ది ప్రారంభం లో భక్తులు సులభంగా అర్చించ టానికి ‘’’’సాయి యంత్రం ‘’తయారు చేశారు .సాయి త్రిచక్రాలు అంటే సత్య సాయి గాయత్రి సత్యసాయి సూర్య గాయత్రి సత్యసాయి హిరణ్య గర్భ గాయత్రి లను 19 7 7 ,19 9 7 ,19 9 9 లలో రచించి అందజేసి తన జీవితం ధన్యమైందని భావించారు .భగవాన్  వీరి కృషిని హృదయపూర్వకంగా మెచ్చి హర్షించారు .వీటినే రావుdగారు -’’త్రి సాయి -మంత్రం యంత్రం తంత్రం ‘’అనిరాశారు సంస్కృతం తెలుగు  స్పానిష్ మొదలైన అనేక భాషలలోకి ఇవి అనువాదమయ్యాయి

 భారతీయ సంప్రదాయం సంస్కృతులను పూర్తిగా అనుసరిస్తున్న రావుగారిని మనసారా అభినందించిన బాబా ఆయన ముగ్గురి మనవళ్ళఉపనయనాలు కూడా తానే దగ్గరుండి జరిపించారు .మూడు యజ్నోపవీతాలను సృష్టించి గాయత్రీ మంత్రోపదేశం తో చేశారు . .29-3-20 03 ఉదయం  ఘండికోట వెంకట సుబ్బారావు గారు 7 4 వ ఏట సత్య సాయి బాబాలో ఐక్యంయ్యారు .కర్మ కాండ లన్నీ యధావిధిగా జరిపించారుబాబా 13 వ రోజు కుటుంబ సభ్యులకు ఏదికావాలో అడిగి వాటితో సంతృప్తిగా భోజనం పెట్టారు .17 00 మందికి ‘’నారాయణ సేవ ‘’గా భోజనాలు పెట్టించారు . ప్రాత్య పాశ్చాత్య సంస్కృతీ మేళనం సుబ్బారావు గారు అనిబాబా మెచ్చుకొనేవారు .20 04 జనవరి 17 న రావుగారి చితా భస్మాన్ని మద్రాస్అడయార్ లో ఉన్న  అష్టలక్ష్మి దేవాలయం వద్ద  బీచ్  లో నిమజ్జనం చేయమని చెప్పి చేయించారు .

 సుబ్బారావు గారు రాసిన పుస్తకాలు -మాన్ విత్ మైటీ మిరకిల్స్ ,మైండ్ బొగ్లింగ్ మిరకిల్స్ ఆఫ్ సత్యసాయి ,ఇంటర్వ్యూస్ ,ఇన్నర్ మోస్ట్ విస్టాస్ అండ్ ఇన్ మోస్ట్ విజన్స్’’

   సుబ్బారాగారు రాసిన సాయి మంత్రాలు –

1-సాయి (ఈశ్వర) గాయత్రి–ఓం సాయీశ్వరాయ విద్మహే -సత్య దేవాయ ధీమహి -తన్నో  సర్వాః ప్రచోదయాత్  (24-12-19 7 7 )

2-సాయి సూర్య గాయత్రి –ఓం భాస్కరాయ విద్మహే -సాయి దేవాయ ధీమహి -తన్నోః సూర్యాః ప్రచోదయాత్ (22-9-19 9 7)

3-సాయి హిరణ్య గర్భ గాయత్రీ-ఓం ప్రేమాత్మనాయ  విద్మహే -హిరణ్య గర్భాయ ధీమహి -తన్నః సత్యాఃప్రచోదయాత్ ‘’(15-2-19 9 9 )

4-సాయి పంచాక్షరి -సాయి శివోహం 15-2-19 9 9 )

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-17 -కాంప్  -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికాలో షార్లెట్ లోని మా అమ్మాయి ఇంట్లో తెలుగు క్లాసులు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -3 -2 (చివరిభాగం )

—

వీక్లీ అమెరికా -3 -2 (చివరిభాగం )

17-4-17 నుండి 23-4-17 వరకు

భగవాన్ పుట్టపర్తి సాయిబాబా 24-4-20 11 న సమాధి చెందిన సందర్భంగా ఆరవ ఆరాధనోత్సవాన్ని షార్లెట్ లోని సత్యసాయి సెంటర్ వారు రెండు రోజుల ముందే శలవు రోజు 22-4-17 శనివారం హిందూ సెంటర్ లో రాలీ  యాన్దర్సన్ గ్రీన్స్ బరీ సాయి సెంటర్ వారిని కూడా ఆహ్వానించి ఘనంగా నిర్వహించారు .సుమారు రెండు వందల మంది సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కు ఉదయం టిఫిన్ కాఫీ మధ్యాహ్నం ,రాత్రి భోజనాలు సాయంత్రం స్నాక్స్ టీ ఏర్పాటు చేశారు .మా అమ్మాయి విజయలక్ష్మికి  భోజనం వగైరా ఏర్పాట్లకు కో ఆర్డినేషన్ బాధ్యత ను సమావేశ నిర్వహణ బాధ్యత జయ అనే ఆవిడకు అప్పగించారు .మా అమ్మాయి అందరితో సంప్రదింపులు ఫోన్ ద్వారా జరుపుతూ ఏ లోపం లేకుండా శ్రమించి  నిండు దనం  తెస్తే జయ సభా నిర్వహణ చక్కగా చేసింది అందరూ మంచి సపోర్ట్ గా నిలబడి విజయ వంతం కావటానికి దోహదపడ్డారు .ఇందులో నిర్వాహకులు సుబ్బు సత్య ,పవన్ ,రవి పాత్ర మరువలేనిది .

  ఉదయం 8-30 కి నన్నూ మా మనవాడు పీయూష్ ను ఇంటి వద్ద తయారు చేసిన మైసూర్ పాకులు ,సాంబారు వగైరా ను తీసుకొని కారులో తీసుసుకొని వెళ్ళింది. హిందూ సెంటర్ కు 9-30 కి చేరాం .అక్కడ అప్పటికే ఉన్న డా సర్వేశ్ దంపతులు సత్య సుబ్బు అయిదేళ్ళతర్వాత మళ్ళీ మేము రావటం తో సంతోషంగా పలకరించారు .అప్పటికే ఆ రోజు ముఖ్య అతిధి  వక్త కరణం బాల సుబ్రహ్మణ్యం అనే బ్రదర్ బాలు కూడా వచ్చి ఉన్నారు . మా రెండవ బావగారి అన్నగారి అబ్బాయి వేలూరి పవన్  ఏర్పాట్ల విషయం చూస్తున్నాడు .ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఉప్మా ,కేసరి పొంగల్  ,తిని కాఫే తాగాను .పదింటికి ఉష భర్త రాం ప్రసాద్ అనే రాంకీ మా శ్రీమతిని మనవడు అశుతోష్ ను తీసుకు వచ్చాడు . అందరూ సరదాగా ఉన్నారు కార్యక్రమాలతో నవ్వుతూ పలకరిస్తూ రమ్య ,సుచిత్ర ,పవన్ భార్య రాధ  జయ సందడి చేస్తూ అందర్నీ బ్రేక్ ఫాస్ట్ చేయమని కోరుతూ నా బోటి వాళ్లకు కాఫీ కలుపుకోవటం రాకపోతే సహకరిస్తూ సాయం చేస్స్తున్నారు . దాదాపు ఆడవాళ్ళు చీరలతో సంప్రదాయ బద్ధంగా వచ్చారు .తెలుగు కన్నడం మలయాళం గుజరాతీ మహారాష్ట్ర  అమెరికన్ లు కూడా పాల్గొని ప్రపంచం చిన్నది అనిపించారు .ఆకాశం లో సగం అనుకొనే మహిళలు చాలా ఎక్కువ మందే పాల్గొన్నారు .

  గాంధి భవన్ లో ఉదయం 10 30 కి భజనలతో కార్య క్రమం ప్రారంభమైంది . జయ ,సౌమ్య విజ్జి  సుబ్బు రవి మొదలైనవారు భజనలు పాడారు .వేదికపై పెద్ద సత్య సాయి బాబా ఫోటో దానికి రెండు వైపులా  అట్టలతో నెమలి బొమ్మలు కలర్ ఫుల్ గా చేసి పుష్పాలతో హారాలు వేసి అలంకరించారు .ఎన్ని రోజులనుండి దీన్ని చేశారో ?

 ఉదయం 11 గంటలకు కరణం బాల సుబ్రహ్మణ్యం ప్రసంగం ప్రారంభమైంది .ఆయన పుట్టపర్తి దగ్గర పల్లె టూరి వాడు .పల్లె చదువు పూర్తీ చేసి ,పుట్టపర్తి లో సత్య సాయి విద్యా సంస్థలలో  ఏం ఎసి సి  చదివి పి.హెచ్ డి చేసి కొద్దికాలం అక్కడే పని చేస్సి ఇప్పుడు అమెరికాలో అట్లాంటాలో కేమి స్ట్రి లెక్చరర్ గా ఉన్నాడు .మంచి వక్త ,కవి .బాబాతో చాలా ఏళ్ళ అనుబంధమున్నవాడు .కవితలతో బాబాను మెప్పించినవాడు . ఈ నాటి అన్నికార్యక్రమాలలో ఒక్కటే అంశం ‘’హృదయ పరి వర్తన ‘’అనేది. దీనిపై చాలా స్పాంటేనియస్ గా  స్క్రీన్ పై ప్రదర్శనాత్మకంగా   మాట్లాడాడు . మధ్యాహ్నం పానెల్  డిస్కషన్ తర్వాత కూడా ఆయన  మళ్ళీ మాట్లాడాడు .అందులోని సారాంశం అందరూ తెలుసుకోవాలి .అయన మాటలను ఎప్పటికప్పుడు నోట్ బుక్ లో రాసుకున్నా ఆ సారమే ఈ ప్రసారం –

‘’హృదయం అనే మాటకు బాబా దయ కలిగింది అని అర్ధం చెప్పారు .దైవం అంటే ప్రేమ ..అందరికీ’’ కంపాషన్’’ఉండాలే తప్ప కంపు ఫాషన్ కాదు ..’’అద్వితీయమ౦దంగ ప్రేమకాక వేరొకటి ఏల ?బాబా అనుగ్రహం ఎవరిమీదైనా కలిగితే ‘’తాంబూలం ఇస్తా .తీసుకో ‘’అనేవారు .తాంబూలం అంటే పళ్ళెం లో పళ్ళూ తమలపాకులు వక్కలు  వస్త్రాలు డబ్బు కానుకగా ఇవ్వటం .ఆయన నడిపే స్కూల్ లో ఎప్పుడూ విద్యార్ధులకు పుట్టపర్తిలో దొరకని ఆపిల్స్ ఫలహారాలు  భోజనాలు సమకూర్చేవారు .ఇది తెలిసి ఇక్కడే చదవాలనుకొన్నాడు బాలు .

మొదటిసారి బాబాను చూసి స్పందించి ‘’కంటి నఖిలాండ మూర్తిని గంటి -మదములు పోగొట్టుకొంటి ‘’అని పించింది .ఎవరిన్తికైనా గృహ ప్రవేశం చేయమని  బాబాను ఆహ్వానించేవారు వారికి తాంబూలం ఇచ్చి పాలలో వ్రేలు పెట్టి గృహ ప్రవేశం చేయిన్చేవారట. బాబా .పుట్టపర్తి స్టేట్ బాంక్ ప్రారంభోత్సవాన్ని కూడా ఇలాగే చేసి బ్యాంకులో డబ్బులు ధర్మవరం నుంచి ఇంకా రాకపోతే బంగారు నాణాలు సృష్టించి లాకర్లలో పెట్టించిన మొదటి ఖాతా  దారు బాబా యే..బాబా ఎప్పుడూ ‘’నేను డ్రిల్ మాస్టార్ని జాగ్రఫీ టీచర్నికాదు మీ శరీఅరానికి మనసుకు ఎక్సర్ సైజ్ లు ఇచ్చేవాడిని నేర్పే వాడిని ‘’అనేవారు .విజయం అంటే మన పరిశ్రమ ప్లస్ స్వామి దయ అని నిర్వచి0చేవారు.’’తనను తానూ తెలుసుకోవటం తనువుకు లక్ష్యం ‘’అనేవారు .

 బుక్కపట్నం లో వేంపల్లి జయమ్మ బాబా క్లాస్ మేట్.ఆమె బాలుకు బాబా సాక్షాత్తు పరమాత్మ అని చెప్పి ఆయన్ను నమ్ముకొంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని బోధించింది .ఆమె ప్రతి పుట్టిన రోజు ను జ్ఞాపకముంచుకొని బాబా ఆమె ఇంటికి ఘనంగా కానుకలు పంపేవారు .ఎవరైనా బాబా దగ్గర కొచ్చి ‘’నేను పాడుతాను ‘’అంటే ‘’మంచిది పాడు ‘’అనేవారు అంటే సరే నాయనా పాడు అని ఒకర్ధం మంచి పాటలు పాడు అని వేరోకర్ధం .’’singers who sing with ego are sinners ‘’అనేవారు .’’సాయి దర్శనం సుదర్శనం ‘’అని బాలు రాసి చూపాడు .’చావు లేని చదువు చదువ వలెను ‘’అని చెప్పేవారు .పుట్టపర్తిలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మన గవర్నమేంట్ బడులలో ఉన్న లెస్ ఎడ్యుకేషన్ కాదు బెస్ట్ ఎడ్యుకేషన్ ‘’అన్నాడు బాలు .సాయి చిరుకోపంవస్తే దున్నపోతా బక్కోడా బండోడా  అనేవారు సాధారణంగా అందర్నీ ‘’బంగారూ ‘’అనే సంబోధించేవారు .’’సాయి నీ హృదయ స్థాయి -తెలుసుకొంటే మనసుకు హాయి ‘’అనేవారుబాబా  .మరోసారిబాలు ‘’స్వామితో మాట్లాడితే ఆనంద బాష్పాలు కారు ‘’అని కవిత వినిపిస్తే ‘’కపిత్వం ‘’బాగానే అబ్బిందే అని మేలమాడారు .బాలు ‘’కోదండ పాణి నువ్వైతే కపి(హనుమాన్ )ని నేను ‘’అన్నాడు .పద్యాలన్నీ విని ‘’నీకేం కావాలో తీసుకో ‘’అన్నారట .ఆయనతో గడపటం ‘’లివింగ్ విత్ లవింగ్ గాడ్ ‘’అన్నాడు బాలు .. ఎవరైనా భయమేస్తోందిబాబా అంటే ‘’నువ్వు చేస్తుంటే భయం -బాబాకు వదిలేస్తే అభయం ‘’అనేవారు

             మధ్యాహ్నం 2 కు మళ్ళీ ప్రసంగిస్తూ బాలు ‘’టెక్నాలజీ ఈజ్ ట్రిక్నాలజి ‘’అని బాబా అనేవారని ,బాబా అల్కెమిస్ట్ అని గోల్డ్ స్మిత్ విత్ లవ్ అని వర్ణించాడు .ఒక సారి అసలు పుష్పించని చెట్టునుంచి పూలు పళ్ళు కాయించి ఇచ్చారు .’’ఇన్ని విషయాలు మీకు ఎలా గుర్తు ఉంటాయి ?’’అనియా అడిగితే ‘’నీకు కావాల్సినప్పుడు అవే గుర్తుకు వస్తాయి ‘’అనేవారు .భగవద్గీత మొదటి శ్లోకం చివరి శ్లోకం లలో ధర్మ మన ఉన్నాయి అదే దాని పరమార్ధం నీడ్యూటీ నువ్వు చెయ్యి అని గీత సారం.కురుక్షేత్రం లో గీత బోధించినప్పుడు  అర్జునునివయసు 7 5 ,శ్రీ కృష్ణుని వయసు 8 0అని బాబా చెప్పారు ‘’నిజమైన ఆనందం నీలోనే ఉంది -అది చూపించటానికే వచ్చాడు సాయి ‘’అనేవారు బాబా ..సాయిబాబా సంస్థలలో ‘’స్టెప్పింగ్ డౌన్’’అనేది లేదు స్టెప్పింగ్ అప్ మాత్రమె ఎప్పుడూ .

 ‘’పాపాత్మా పాపసంభావానామ్ పాప కర్మాణానాం’’అనే శ్లోకాన్ని మార్చి బాబా ‘’ప్రాప్తోహం  ప్రాప్త సంపన్నానాం ‘’అని చెప్పించేవారు .ఈ దేహం నాకు వచ్చింది దాన్ని సార్ధకం చేసుకొంటాను అని అర్ధం ..ఎవరో ‘’సాయి కి వేదం తెలుసా ?’’అని అడిగితె ‘’సాయి చెప్పిందేవేదం ‘’అన్నారు ఆయనవద్ద ఉన్న మహా వేదవేదాంత శాస్త్ర విజ్ఞానులు .

 బాబాకు అపత్ సమయం లో ఎలా ఆదుకోవాలో తెలుసు.బాలు అక్క పెద్దగ చదువుకోలేదు పెళ్లి అయి రెండో ప్రసవం లో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళింది ,ఇంట్లో వాళ్ళందరూ బాబాకు చెప్పమన్నారు ఆలోచించి ఆలోచించి బాబాకు బాలు విషయం చెప్పాడు మర్నాడే ఆమెను అమ్మనూ తీసుకుని రమ్మని జేబులో డబ్బు పెట్టి పంపారు మర్నాడు వాళ్ళు వచ్చ్చారు .బాబా ‘’వచ్చారా ‘’అని అడిగితె అంత మంది జనం లో ఎక్కడున్నారా అని చూస్తుంటే ‘’అదిగో అక్కడ ఉన్నారని చెప్పి ‘’వాళ్ళను లోపలి తెప్పించారు ఒక శివలింగం సృష్టించి దాన్ని  గ్లాసు నీళ్ళలో  వేసి ఏడు రోజులపాటు తీర్ధంగా అక్కకు ఇస్తే తగ్గిపోతుందని చెప్పి తే అలా చేయగానే తగ్గిపోతే కుటుంబం అంతా బాబా దగ్గరకు వచ్చి  కృతజ్ఞతలు  చెబితే అక్క బాలు సంగతి చూడమని అంటే ముందు నీ పిల్లల ఆలనా పాలనా చూసుకో అని చెప్పి బావనూ పిలిచి ఆమె నీకు సేవ చేసినట్లు నువ్వు ఆమెకు సేవ చేయి అని బోధ చేశారని బాలు తన అను భవాన్ని  తెలియ జేశాడు

 బాబా పై తనకు అత్యంత భక్తి అనిబాలు బాబాతో అంటే ‘’ కాన్ష స్ లో కాన్ఫిడెన్స్ ఉండాలి ‘’అని బోధించారు   బస్ బయల్దేరితే డస్ట్ కూడా దాని వెనక వచ్చి బస్సు ఆగితే ఆగి పోతుంది .కనుక సాధన నిరంతరం సాగాలి .అమెరికాలోని  అలబామా రాష్ట్రం లోని మాంట్ గోమరీలో ఉన్న ఒకాయన 35  ఏళ్ళనుంచీ దిగ్విజయం గా ఎక్కువ మంది సాధకులతో సాయి సెంటర్ నడుపుతున్నాడని ఆయన జీవితం లో కనీసం ఒక్క సారికూడా బాబాను సందర్శించలేదని ఇదొక అద్భుత అపూర్వ విషయమని బాబా స్పూర్తి అలాంటిదని  బాలు అన్నాడు .‘’మనసుకొంతయు నిచ్చి -స్వామి కరుణ అందరాని సుఖము నందగలరు ‘’అంటూ తన ట్రాన్స్ ఫర్మేషన్ కు బాబా ఎలా దోహద పడ్డారో సోదాహరణం గా ప్రసంగించి  అందరి ప్రశంశలు అందుకున్నాడు బాలు .

 మధ్యాహ్నం వివేకా హాల్ లోనే లంచ్ .పప్పు రెండు కూరలు పులిహోర ఫ్రైడ్ రైస్ ,ఆవకాయ ,టమేటా చట్నీ ,సాంబారు పెరుగన్నం ,లడ్డూ అరటిపండు  లతో భోజనం .అందరూ సంతృప్తిగా తిన్నారు అన్నీ బాగానే ఉన్నాయి .కావాల్సినవారికి పూరీ చానా మసాలా కూడా పెట్టారు .

      భోజనం తర్వాత మధ్యాహనం 1-30 కి కాసేపు భజనలు .తర్వాత హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ‘’పై పానల్ డిస్కషన్ .ఇందులో నస్రిన్ అనే ఇరానీ పి.హెచ్ డి అమ్మాయి రుద్రం అద్భుతంగా కంటో పాఠ౦ గా వచ్చినమ్మాయి ,అరుణ ,రవి ,రాజారావు శంకర్ లు పాల్గొన్నారు మోడరేటర్ గా బాలు వ్యవహరించాడు .వీరందరి చర్చ సారాంశం -పరివర్తన అంటే కామ క్రోధాదులను దూరం చేసుకోవటం గ్రోయింగ్ టువర్డ్స్ గాడ్ .చేంజ్ ఆఫ్ నో రికగ్నిషన్ . ఫిజికల్ వరల్డ్ నుంచి స్పిరిట్యువల్ వరల్ద్ కు ప్రయాణం   భౌతిక హృదయం ఆధ్యాత్మిక హృద్యంగా మారటం . ఇందులో పాల్గొన్న వారు వారి అనుభవాలు వివరించారు .ఒక సారి సాయిమందిరం లో పెయింటింగ్ వేయాల్సివచ్చింది .నిరంతరం భక్తుల ప్రవాహం వలన  పెయింటర్ లకు   అర్ధ రాత్రికాని వీలు చిక్కేదికాదు .సమయం దగ్గర పడుతోందని బాబా హెచ్చరిక .ఒక రోజు  అందరూ ఒక కుర్రాడిమీద వదిలేసి విసుగొచ్చి వెళ్లి పోయారు. వాడు తెల్లవార్లూ వేస్తూ బాబాకు కనిపించాడు .మర్నాడు వాడిని పిలిపించి తాంబూలం ఇచ్చారు. వాడు ఈ అదృష్టానికి వలవలా ఏడ్చేశాడు ఇది తెలిసిన మిగిలిన వాళ్ళు కూడా అప్పటిదాకా సాయిని చూడని వాళ్ళు అందరూ బాబా పాదాలపై పడ్డారు. వారందరికీ కానుకలు ఇస్తే అక్కడే వదిలి పాద స్పర్శ తప్ప తమకు ఏమీ వద్దన్నారు . వాళ్లకు నచ్చ చెప్పి కానుకలు మళ్ళీ ఇప్పించారు బాబా

           తరవాత టీ బ్రేక్ -మరమరాలు పళ్ళముక్కలు  బిస్కట్లు జ్యూస్లు టీ ఇచ్చారు .

సాయంత్రం 4 గం లకు సాంస్కృతిక కార్యక్రమాలు .ఇందులో కూడా హృదయ పరివర్తనమే సబ్జెక్ట్ .గ్రీన్ బరో వాళ్ళు శ్రీరామ వనవాసం చిత్రాలతో ‘’పప్పెట్ షో’’చేశారు బాగుంది . యాం డర్సన్ వాళ్ళు లఘు చిత్రాలు ‘’డజ్ గాడ్ ఎక్సిస్ట్ ,వాట్ ఈజ్ వర్షిప్ ,ది గెస్ట్ లు ప్రదర్శించారు .

 మొదటి సారిగా షార్లెట్ సెంటర్ వారు మగవాళ్ళందరూ కలిసి నాలుగు చిన్న నాటికలు ప్రదర్శించారు .మొదటి ది- వాల్మీకి -బోయ రత్నాకరుడు వాల్మీకిగా రూపాంతరం చెందటం రెండవది ప్రాఫెట్ మొహమ్మద్ ను ఎవగించుకొనే  వీధులు ఊడ్చే ముసలి వాడిలో ఆయన కరుణ వలన హృదయ పరివర్తన రావటం ,యేసు క్రీస్తు ను ఆరాధించే ధనవంతుడిపై అసూయ చెందినవారు ఆయన అంతరంగాన్ని తెలుసుకోవటం అధనవంతుడు తన సంపద  వీళ్ళకు ఇచ్చి  యేసు భక్తుడుగా మారటం ,నాలుగవది కల్పగిరి అనే ఖైదీ బాబా కు తన గోడు జాబులో తెలియ జేస్తే ఆయన అనుగ్రహం తో శిక్షాకాలం తగ్గి విడుదలవటం ఇందులో మా బంధువు వేలూరి పవన్ ఖైదీగా గొప్ప నటన ప్రదర్శించాడు .మరోనాటిక కేరళకి చెందిన వీర కమ్యూనిస్ట్ హిందూ మత ప్రచారకులు అంటే గిట్టక బాబాను అర్ధ రాత్రి చంపటానికి పుట్టపర్తి చేరి బాబాతో పాటు నిద్రించగా బాబా ‘’ఇంకా సమయం కాలేదా “‘?అని అడగటం తో తప్పు తెలుసుకొని బాబా అనుగ్రహం తో మారి అక్కడే ఉండిపోవటం ‘’లవ్ ఈజ్ గాడ్ ;;అనే సందేశం .

 ఈ నాటికలలో పాల్గొన్నవారంతా బాగా నటించారు పవన్ మాత్రంనటనతో  జీవించాడు అని చెప్పక తప్పదు. ఎక్కడా బోర్ కొట్టకుండా చక చక సాగిపోయాయి. ఉన్నంతలో రంగాలంకరణ అన్నీ బాగా చేశారు అందరూ ఉద్యోగస్తులే పిల్లా పాపా ఉన్నవారే .పిల్లల చదువులతో తీరిక లేనివాళ్ళే అయినా గొప్ప సంకల్ప బలంతో దీన్ని సాధించారు అందరూ అభినందనీయులే .

   బ్రేక్ ఫాస్ట్ లంచ్ చేసిన వివేక్ హాల్ ను మధ్యాహ్నం ఒంటిగంటకు గుజరాతీ సభ జరిపే వారికి అప్పగించాలి .అందుకని భోజనాలు అవగానే ఆడ మగా అందరూ త్వరత్వరగా సామాన్లు తీసుకొని గాంధీ భవన్ కింద అంతస్తు లోకి చేరవేయటం ,క్లీన్ చేయటం చేసేశారు వాలంటరీ వర్క్ అంటే ఎలా ఉంటుందో రుజూవు  చేశారు  . వాళ్ళ ఓర్పుకు సాయానికి హేట్సాఫ్.నేనేదైనా చేద్దామనుకొంటే నన్ను చేయనివ్వలేదు .

   సాంస్కృతిక  కార్యకరమాలు కాగానే డౌన్  స్టేయిర్ లో డిన్నర్ .దూర ప్రదేశాల నుండి వచ్చినవారికి బాక్స్ లలో చపాతీ కూరా పులిహోర ,మైసూర్ పాక్ ,బిర్యానీ సర్ది ఇచ్చారు ఆడవాళ్ళు .తినే సమయం ఉన్నవారు ఇక్కడే తిన్నారు .అంతా అయేసరికి ,ఊడ్చి బాగు చేసేసరికి సామాన్లు సర్దుకొని ఎవరిసామాను వాళ్ళు తీసుకు పోయేసరికి రాత్రి తొమ్మిదయింది .అప్పుడు బయల్దేరి అందరం ఇంటికి చేరేటప్పటికి తొమ్మిదిన్నర .

 సందట్లో సడేమియా -వివేక్ హాల్ లో మధ్యాహ్నం 1 గంటనుండి గుజరాతీ వాళ్ళు ‘’దాదా భగవాన్ ‘’పై సత్సంగం చేశారు ఒకటి రెండు సార్లు వెళ్లి చూశాను .వాళ్ళూ భోజనాలు వగైరాలతో ఉన్నారు యాభై మంది దాటిలేరు ఆడామగా . ఇంతకీ ఎవరి గురించి అని ఒక పెద్దాయననుఇంగ్లీష్ లో అడిగితే చెప్పాడు నెలకోసారి ఇలా సమావేశామౌతారట మాట్లాడుకొంటారు భజనలు పాడతారు అవి సంస్కృతం లోనే ఉన్నాయి .ఫోటోలు తీసుకోవచ్చా అని అడిగి సరేనంటే  ఫోటోలు తీశాను .

 దాదా భగవాన్ అంటే గుజరాత్ లో 7-11-19 09లో బరోడా దగ్గర తరసలి లో జన్మించిన అంబాలాల్ ము౦జీభాయ్ పటేల్ .19 5 8 లో ఆత్మజ్ఞానం పొంది దాదా  భగవాన్ అయ్యాడు .జైనులు చెప్పే క్రమ పద్ధతిలో ఆత్మ జ్ఞానం పొందకుండా తక్షణ ఆత్మజ్ఞానంపొంది మోక్షం సాధించటానికి అంటే – ‘’అక్రం విజ్ఞాన్ ‘’పొందటానికి సాధనాలు చెప్పాడు దీన్నే వ్యాప్తి చేశాడు .తన అనుభవాలను అందరితోపంచుకోనేవాడు .ఒక సారి ఉగాండా నుంచి19 6 2 లో  చంద్ర కాంత పటేల్ అనే ఆయన వచ్చి ఈయన ప్రభావానికి లోనై రెండవ తక్షణ ఆత్మజ్ఞాని అయ్యాడు దాదా తర్వాత .దేశ విదేశాలలో పర్యటించి ‘’అక్రం విజ్ఞాన్ ‘’వ్యాప్తి చేశాడు .1-2-19 8 8 న ఆయన మరణించినప్పుడు 60 వేల మంది భక్తులు అంత్యక్రియలకు హాజరయ్యారు .ఈ విధంగా ఇవాళ మరో మహానుభావుడిని గురించి తెలుసుకొనే అదృష్టం కలిగిందినాకు .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

          మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -23-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 


Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -3 -1

 వీక్లీ అమెరికా -3 -1

                                     17-4-17-నుంచి 23-4-17 వరకు

వీక్లీ అమెరికా -2 సోమవారం రాసి మధ్యాహ్నం 3-15 కు మా పెద్ద మనవాడు శ్రీకేత్ తోకలిసి మేక్లిన్ బర్గ్ లైబ్రరీకి వెళ్లాను ఈ సరస్వతీ ఆలయాన్ని అయిదేళ్ళక్రితం చాలా పుస్తకాలు చదివి సార్ధకం చేసుకొన్నాను మళ్ళీ అక్కిడికి  రావటం గొప్ప అనుభూతి నిచ్చింది .మనవడు 5 గం నుంచి 7 వరకు     వాలంటరి చేశాడు  .అలా చేయాలట దానికి మార్కులు ఉంటాయట . .నేను అక్కడ మూడు పుస్తకాలు చదివాను . 10 పుస్తకాలు ఇంటికి తెచ్చుకున్నాను .అక్కడ చదివినవాటిలో మొదటిది -The art of x ray reading .దీన్ని ‘’రాయ్ పీటర్ క్లార్క్ ‘’రాశాడు .అందులో నాకు నచ్చిన వాక్యాలు మీ కోసం -డాంటే రాసిన’’ ఇంఫెర్నో ‘’లో బతికిఉన్నవారు చనిపోయిన వారూ ఒక ఫెర్రి లో అధోలోకానికి ప్రయాణం చేస్తారని దానినే హేడ్స్లేలేక హెల్ నరకం అంటారని ఫెర్రి నడిపే చరోన్ అనే వాడికి డబ్బు ముట్ట జెబితే బోటులో స్టైక్స్ రివర్ మీదుగా లివింగ్ అండ్ డేడ్ వరల్డ్ లను విభజించే చోటుకు తీసుకు  వెడతాడని ఉందట .గ్రీసు దేశం లో పూర్వం చచ్చిన వాడి నోరు ,కళ్ళ మీద నాణాలు పెట్టేవారని ,ఇది వాడి ఇతరలోక ప్రయాణానికి దారిఖర్చు ఆధునిక భాషలో’’ కాబ్ ఫేర్’ ఫర్ దిజర్నీ ఇంటూది నెక్స్ట్ వరల్డ్ ‘’.ఇంగ్లాండ్ లో కింగ్  ఆర్ధర్ చనిపోతే శవాన్ని బోటు లో పెట్టి ధనకనక వస్తు వాహనాలు అందులో ఉంచి దాన్ని పాతి పెట్టటమో ,సముద్రం లో వదిలేయటమో చేశారట .అది ఆయనకు ఉత్తమ లోకానికి దారి చూపిస్తుందని నమ్మకం .

 ఇందులోనే రచయిత రచయిత రచన ఎలా ఉండాలో మంచి సూచనలు చేశాడు అందరికీ శిరో దార్యమే అవి .-’’Your writing should move -move -move from concrete to abstract ,from specific to general ,from idea to example -from information to anecdote ,from expression to dialogue .A good book is a  perpetual motion machine that drives a story and lets the reader feel the energy ‘’అంటాడు .వ్లాదిమిర్ నేబోకోవ్ రాసిన ‘’లోలిత ‘’నవల లో నేబోకో ‘’సాహిత్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసి లాగి పీకి  అరచేతిలో నలిపి పెట్టి పీల్చాలి .నోటిలో వేసి నవలాలి అప్పుడే దాని ప్రయోజనం తెలిసి ,దానిలో చెప్పబడిన అసలు విషయం అవగతమై ,ఇందాక మనం చేసిన ముక్కలు చక్కలూ మన మైండ్ లో    అతుక్కుపోయి  రక్తగాతమై అనుభూతినీ ఆనందాన్ని ఇస్తుంది ‘’అన్నాడు .రాయ్ పీటర్ ‘’Lolita is a kind of love letter to English Literature ‘’అని గొప్ప నిర్వచనమిచ్చాడు .

 రెండవ పుస్తకం ‘’గ్రేటెస్ట్ ఆధర్స్ ఆఫ్ క్లాసిక్ హిట్ ‘’పుస్తకం Jeanne Nagle రాసింది .ఇందులో కొన్ని విషయాలున్నాయి .ఫ్లాబర్ట్ – మేడం బోవరి నవల రాసేటప్పుడు సరైన నిర్దుష్టమైన పదం కోసం రోజులతరబడి ఆలోచిన్చేవాడట .దీనినే అతనిమాటల్లోనే తెలుసుకొంటే బాగుంటుంది -My head reels and throat aches with chasting after ,slogging over ,delving into ,,turning around ,,gropping after and bellowing in a hundredth thousand different ways,a sentence that i have at last finished ‘’అని చెప్పాడు మనవాళ్ళు చెప్పిన కృత్యాద్యవస్థ అంటే ఇదే .

మూడవ పుస్తకం -Flights and wisdom of the ancient -అలేక్సాన్ద్రియా పబ్లిషింగ్ వాళ్ళది చిన్నపుస్తకం లో అనేక అద్భుత విషయాలు చదివాను .

పూర్వం మాయన్ ఖగోళ వేత్తలు సంవత్సరానికి 365.24 20 రోజులు అని చెప్పారు .ఇవాల్టి రోజుల్లో మనం 36 5 .24 25 గా రోజులుగా వాడుతున్నాం .హుండూరస్ శిధిలాలో ఈ కాలెండర్ రాతి మీద చెక్కబడి ఉంది దానిపై 1 day July 26 736 అని ఉందట .

 5 వేల ఏళ్ళ క్రితం సుమేరియాలో ఉన్నత వంశస్తులకే హై స్కూల్స్ ఉండేవట .బాటని జువాలజీ  మినరాలజి  జాగ్రఫీ లెక్కలు వగైరా నేర్పెవారట .రెండు వేల ఏళ్ళక్రితం బాగ్దాద్ లో ఒక మట్టి కుండలో సోల్దరింగ్ కాపర్ షీట్ ట్యూబ్ ఇక అంగుళం వెడల్పు ,నాలుగు అంగుళాల పొడవుతో కనిపించింది .అడుగున కాపర్ డిస్క్ ఇనుప కాడది ఉన్నాయి .దీనిలో యాసిడ్ పోస్తే బాటరీలాగా పని చేసేదట  .కైరో మ్యూజియం లో క్రీ పూ 200 లో  విమానం తయారు చేసిన దాఖలాలున్నాయట .బాబిలోనియాలో 5 వేల ఏళ్ళ క్రితం కాపర్ గ్రాఫైట్ ఎయిరోప్లేన్ భాగాలు కంపించాయట.40 8 బి సి లో గ్రీకు గణిత వేత్త  ఆర్బైటిస్ ఒక కర్ర పావురం తయారు చేసి ఎగిరెట్లు చేశాడట .లోపల ఇంజను రెక్కలు అన్నీ కూర్చాడట .ఇప్పుడు వాడుకం లో ఉన్న జెట్ ప్లేన్ ప్రిన్సిపల్ కూడా అతనే కానీ పెట్టాడని అంటారు .అతనిని ‘’సైంటిస్ట్ హీరో ‘’అని పిలిచేవారట .రొటేటింగ్ బాయిలర్ ను రొటేటింగ్ రిపల్సివ్ ఎఫెక్ట్ కోసం తయారు చేశాడు .ఇదే జెట్ ఫ్లేం కు దారి చూపింది ..చైనా రాజు షాన్ తలిదండ్రులు తనను చంపబోతున్నట్లు తెలుసుకొని ఒక విమానం తయారు చేయించుకొని పారిపోయినట్లు ఉన్నది .దీని తర్వాత 450 ఏళ్ళకు చింగ్ తాంగ్ చక్రవర్తి తన ఇంజనీర్ కి కుంగ్ -షి తో ఫ్లైయింగ్ చారియట్ తయారు చేయించాడు .నాలుగవ శతాబ్దం లో కో హాంగ్  ఫ్లైయింగ్ కార్ ఉన్నట్లు రాశాడు దాన్ని ఎద్దు చర్మం తో తయారు చేశారట .దానికి రొటేటింగ్ బ్లేడ్స్ ఇప్పటి హెలికాప్టర్ కు లాగా ఉన్నాయట .’

‘’సమర సూత్ర ధార’’గ్రంధం లో పక్షిలాగా ఎగిరేదాన్ని విమానం అని అన్నారు .మధ్య ప్రాచ్యం లో కంబోడియాలోని బొగోటా లో  ‘’gold trinket resting in a blank vault ‘’కనిపించిందట .ఇది సుమారు 6-9 శతాబ్దానికి చెందింది .రెండు అంగుళాలు పొడవు రెక్కలు అసాధారణ తోక ఒక పురుగు ఆకారం దాదాపు గబ్బిల౦  లాగా ఉండే ఎగిరే విమానం కనిపించింది ఇదే డెల్టా వి౦గ్ తో ఉన్న స్తీప్ క్లైమ్బింగ్ జెట్  ఫైటర్ నిర్మాణానికి దారి చూపి ఉంటుంది .

                  రాత్రి 7 గంటలకు మా అమ్మాయి డ్యూటీ నుంచి వచ్చి నన్ను మనవడిని ఇంటికి తీసుకు వచ్చింది .మిగిలిన విషయాలు ఇప్పుడు రాస్తాను

 మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రాత్రి 7-30 వరకు సూర్యుడు కనిపిస్తూనే ఉన్నాడు .పెద్దగా ఆశ్చర్యపడలేదు .కారణం మొదటి సారి అమెరికా టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ కు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు రాత్రి 10- 30 కు కూడా సూర్యుడు కనిపించేవాడు జూన్ నెలలో .ఈ సోమవారు డా.ఇన్నయ్యగారు ఫోన్ చేసిమాట్లాడారు ఆత్మీయంగా .

 నేను లైబ్రరి నుంచి తెచ్చుకున్న 10 పుస్తకాలలో మొదటిది ‘’ది ట్రోజన్ వార్ ‘’చదవటం ప్రారంభించా దానిపై ఒక వ్యాసమూ రాశాను .రాత్రి బ్రహ్మానందం కోవై సరళ కామెడీ బిట్స్ చూశాం .సాయంత్రం గంగాధరరావు గారికి ఫోన్ చేసిమాట్లాడా .మంగళవారం ఖాజీ పాలెం లో ఉన్న నా బి ఎడ్ మిత్రుడు వారణాసి సుబ్బయ్యకు ఫోన్ చేసిమాట్లాడితే పరమ సంతోషించాడు వాళ్ళ మనవాడి ఉపనయనం అనీ మా ఇద్దరి ఆశీర్వాదాలు  .కావాలని కోరాడు .తరువాత మన గుడి బడ్డీ బుడ్డి తో ,తూములూరు వారితో ,మనవడు చరణ్ తో ,వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారితో ఫోన్ చేసి మాట్లాడాను శాస్త్రిగారు మహదానందం తెలియబరచారు .రెండవ పుస్తకం ‘’లీడర్స్ ఆఫ్ ది ఎంసేంట్ గ్రీస్ ‘’చదవటం మొదలెట్టా .దీనిపై కూడా మూడు ఆర్టికల్స్ రాశాను .ఈల వీజిల్ పూర్తీ చేసి ,లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ స్వామి రాం రాసిన పెద్ద పుస్తకం ప్రారంభించి ఈ వారం లో సగం చదివా .మధ్యలోపాల్ జాన్సన్ రాసిన  ‘’హ్యూమరిస్ట్స్ –చదివి విదేశీ హాస్యం పై రాశా . మాస్టర్స్ పుస్తకం ఆధారం గా ఏతి పై నేతి నేతి యేతి ,హిమాలయ గుహాంతర ఆశ్రమ జీవనం రాశా .గ్రీస్ పుస్తకం ఆధారం గా గ్రీకు ప్రజాస్వామ్య పిత సోలోన్ ,నావికా దళపిత  స్టేమో క్లెస్ రాశా . ఇందులో ఇంకో విషయం ఒకటి బాగా నచ్చింది -మాసిడోనియన్లు గొప్ప భవన నిర్మాతలు అని ,వారు కట్టిన సిటడేల్స్-కోట ప్రహరీ గోడలు -10 అడుగుల మందంగా కట్టారని ,రాజ సమాధులను తేనెటీగ గూడు లాగా నిర్మించారని ,వాటి నిర్మాణానికి  12 0 టన్నుల బరువున్న కొండ రాళ్ళను ఉపయోగించారని తెలిసి కొంత ఆశ్చర్య పోయాను కాని మన బృహదీశ్వరాలయ నిర్మాణమూ ఇంత బృహత్తరమైనదే  నని సంతోషించాను .గ్రీకు దేశం లో బ్రాంజ్ ఏజ్ ను ‘’ఏజ్ ఆఫ్ హీరోస్ ‘’అంటారని తెలిసింది .12 00 బి సి లో ట్రాయ్ నగర పతనం తర్వాత ఎజియన్ ప్రాంతం ,తూర్పు భాగాలు అనుకోని సంక్షోభం లో పడిబలమైన  మైసీనియన్ సామ్రాజ్యం నాశానమై ఆర్ధిక రాజకీయ సంస్క్షోభాలలో కూరుకు పోయి ఆటవిక జాతులు సిటీలను ఆక్రమించి మైసీనియన్ నాగరకత  కనుమరుగైంది . .ఈ  11 ౦౦ -8 ౦౦ బి సి సంక్షోభ  కాలాన్ని ‘’డార్క్ ఏజ్ ‘’అన్నారు చరిత్రలో .మళ్ళీ -8 ౦౦-500 బి సి నాటికి గ్రీసు వైభవం మొదలైంది .దీన్ని ఆర్కాయిక్ ఏజ్ అన్నారు .క్రమగా ఈజిప్ట్ తో నౌకా వ్యాపారం సాగించారు .

 ఇక 22-4-17 శనివారం నాడు షార్లెట్ లో హిందూ సెంటర్ లో జరిగిన ‘’శ్రీ సత్యసాయిబాబా ‘’ఆరాధనోత్సవం ‘’పై వివరంగా రెండో భాగం లో రాస్తాను .

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment