20-3-16 ఆదివారం సాయంత్రం ఉయ్యూరులో కృష్ణా జిల్లా నందిగామ దగ్గరున్న45ఏళ్ళకు పూర్వం నేను పనిచేసిన ముప్పాళ్ళ గ్రామ వాస్తవ్యులు ,ప్రస్తుతం కొత్తగూడెం డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ దుర్భాకుల వెంకట సుబ్రహ్మణ్యం దంపతులు మా ఇంట్లో –

20-3-16 ఆదివారం సాయంత్రం ఉయ్యూరులో  కృష్ణా జిల్లా నందిగామ దగ్గరున్న45ఏళ్ళకు  పూర్వం నేను పనిచేసిన ముప్పాళ్ళ గ్రామ వాస్తవ్యులు ,ప్రస్తుతం కొత్తగూడెం డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ దుర్భాకుల వెంకట సుబ్రహ్మణ్యం దంపతులు మా ఇంట్లో –

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -120

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -120

50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం నేనినిజం కు మార్గ దర్శి –లెనిన్

నికోలాయ్ లెనిన్ గా ప్రసిద్ధుడై న లెనిన్ అసలుపేరు వ్లాడిమిర్ ,ఇలిచ్ ఉలినోవ్ –షార్ట్ కట్ గా వి ఐ .లెనిన్ .1870లో ఏప్రిల్ 9 న రష్యా లో సిం బిర్క్స్ నగరం లో జన్మించాడు తండ్రి ఇల్యా నికోవిచ్ ఉలినోవ్ ,స్కూల్ మాస్టర్ .తరువాత స్కూళ్ళ ఇన్స్పెక్టర్ అయి ,జిల్లా స్కూళ్ళ సూపరింటే౦డెంట్ గా ఎదిగాడు .తల్లి మేరియా అలేక్సా౦ డ్రో వ్నా డాక్టర్ కూతురు .సుఖమయ జీవితాన్ని  పుట్టింట్లో గడిపింది .ఆమెకు తండ్రితాలూకు కొంత ఆస్తి సంక్రమించి  భర్తకు ఆసరాగా ఉండి , కుటుంబాన్ని కొంత సుఖ శాంతులతో  మిగిలిన బ్యూరోక్రాట్ల కంటే హాయిగా ఉండేట్లు చేయగలిగింది  .ఆరుగురు పిల్లలలో వ్లాడిమిర్ మూడవ వాడు .పెద్దమ్మాయి అన్నా ,తర్వాత అలేక్సాండర్ .చివరి ముగ్గురూ ఓల్గా ,మన్యాషా ,డ్మిత్రి.

వీరి కుటుంబం ప్రక్కవారికంటే కొంచెం విభిన్నంగా ఉండేది .ఇన్స్పెక్టర్ ,డాక్టర్ కూతురు ల సంతానం తెలివైనదే కాని ,ఉండాల్సినంత తెలివి తేటలు వారిలో లేవు కనుక వారి విద్యా విధానం లో అంత ఆశాపూరిత వాతావరణం లేదు .వారి సంరక్షణ ప్రమాదం లో పడింది . వ్లాడిమిర్ పదహారవ ఏట తండ్రి చనిపోయాడు .తల్లి ఆదాయం తో ఏదో రకం గా నెట్టుకోస్తుంటే ఇంటి పరిస్తితి నరక ప్రాయమైనది .రెండవ విషాదం అలుము కొన్నది అలేక్సాండర్ సెయింట్ పీటర్స్ బర్గ్ యూని వర్సిటిలో సైన్స్ చదువుతూ ,19 వ శతాబ్దం లో విద్యార్ధులలో సాధారణమైన విప్లవ కారులతో కలిసి మూడవ జార్ చక్రవర్తి అలేక్సాండర్ ను చంపే కుట్రలో పాల్గొనగా ,అరెస్ట్ చేసి ఉరి తీశారు .అన్న అలేక్సాడర్ నాయకుడైన దళం పేరు ‘’లెనిన్ ‘’.దీనినే తమ్ముడు వ్లాడిమిర్ తన పేరుగా మార్చుకొని వ్లాడిమిర్ లెనిన్ అయ్యాడు .

కుటుంబం లో చేతికి అందివచ్చిన కొడుకు అంతకు ముందు భర్త మరణించటం తో లెనిన్ తల్లి తట్టుకోలేక పోయి అనారోగ్యం పాలైంది .ఉలినోవ్స్ కుటుంబ సభ్యులను సంఘం సాంఘికంగా అంగీకరించలేక పోయింది .కాని లెనిన్ పట్ట్టు వదలక చదివి గ్రాడ్యుయేషన్ లో బంగారు పతకం సాధించాడు .కుటుంబం మీద పడిన నిందను తప్పించుకోవటానికి కాని ,వ్లాడిమిర్ ను యూని వర్సిటీ లో చదివించే ఉద్దేశ్యం తోకాని కుటుంబం కజాన్ కు మారింది .అక్కడ లా చదవటం ప్రారంభించాడు కాని కొద్దికాలానికే రాడికల్ స్టూడెంట్  యాక్టి విటీలలో పని చేస్తున్నాడని బహిష్కరించారు .దేశ ద్రోహ నేరం కింద వ్లాదిమిర్ తో పాటు 38 మంది మీద కేసు పెట్టి ,అతనిని ఒక మారుమూల గ్రామం లో ఉండేట్లు బహిష్కరించారు .ధైర్యం చెడని వ్లాడిమిర్ స్వయంగా  లా చదువుతూ 21వ ఏట సేయింట్ పీటర్స్ బర్గ్ యూని వర్సిటీ లో పరీక్ష రాసి పాసై ,ఒక ఏడాది తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించాడు .

అటార్నీ గా విజయం సాధిస్తున్నా ,విప్లవ కారుడిగా నే వ్యవహరించాడు .అప్పటికే కారల్ మార్క్స్ గ్రంధాలను సేకరించి చదివాడు .కొద్దికాలానికి మార్క్స్ ఫిలాసఫీ వంట బట్టింది .పీటర్స్ బర్గ్ కు చేరి రివల్యూషనరీ గానే గడుపుతున్నాడు .వైట్ కాలర్ దువ్విన వాన్ డై క్ గడ్డం ,జుట్టును చూస్తె అతను ఒక అకౌంటే౦ట్ గానో ,,వ్యాపారిలాగానో , ,చిన్న సైజు గాయకుడుగానో , ,ఫిజిక్స్ మాస్టారు లాగానో అనిపించేవాడు .న్యాయ పరంగా తన వ్లాడిమిర్ పేరును వాడుకొనే వాడు .ప్రచారానికి  విప్లవ బోధనకు ,ఉపన్యాసాలకు,అండర్ గ్రౌండ్ కార్యకలాపాలకు  ‘’నికోలాయ్ లెనిన్ ‘’పేరును ఉపయోగించేవాడు .

రష్యాలో పరిస్థితులు రోజు రోజుకూ అధ్వాన్నంగా మారి పోతున్నాయి .జనం తిండి గుడ్డకు అల్లల్లాడిపోతున్నారు .ఇప్పుడు వారి పరిస్తితి చెప్పటానికి వీలు లేనంత దారుణంగా తయారైంది జార్ చక్రవర్తి  రాజ కీయ ,అధికార కుటుంబాలు నిర్లక్ష్యంగా విలాసమైన జీవితాలు గడుపుతూ ప్రజా క్షేమాన్ని అలక్ష్యం చేస్తున్నారు .అధిక భూభాగాలు హస్త గతం చేసుకొన్నా భూస్వాములు ,సోమరితనం తో  ధన వంతులయ్యారు ఫాక్టరీలు విస్తరిస్తూనే ఉన్నాయి వాటి యజమానులు లాభ పడుతు,మరింత సంపన్ను లౌతున్నారు .దీనికి విరుద్ధంగా సామాన్య రైతులు, కార్మికుల జీవన స్థితి రోజు రోజుకూ దిగజారి  పోతోంది .జార్ చక్ర వర్తిని అందరూ ‘’లిటిల్ ఫాదర్ ‘’అని పిలుస్తారు .కాని తండ్రి గా ఆయన బాధ్యత ప్రజల్ని మరింత దండించటం శిక్షించటం మాత్రమే  అయింది .ప్రజలు తనకు పిల్లలు అనుకొంటూ వాళ్ళు ఏమాత్రం అసౌకర్యం కలిగించినా విరుచుకు పడుతున్నాడు 1891నాటి కరువు లో వేలాది రైతులు ఆకలి బాధతో అలమటించి చనిపోయారు .రైతులు కూడా ఫాక్టరీ కార్మికులలాగానే అణచ బడుతున్నారని లెనిన్ గ్రహించాడు .దీనికి పరిష్కారం సోషలిస్ట్ విధానమే అని నమ్మాడు .కనుక కర్షకులు కూడా ,శ్రామిక వర్గం తో పాటు చేతులు కలిపి పేద ల పోరాటం లో భాగ స్వాములు అయితేనే సోషలిస్ట్ రాజ్యమేర్పడుతు౦దన్నాడు

25ఏళ్ళ వయసులో విప్లవనాయకుడిగా ఎదిగిపోయాడు లెనిన్ .అప్పటికే ‘’రష్యా సోషలిజం పిత ‘’అని గౌరవంగా పిలువ బడుతున్న జార్జి ప్లెఖనోవ్ ను కలుసుకొని చర్చించాడు .శ్రామిక విముక్తిఐక్య  సంస్థ (యూనియన్ ఫర్ లిబరేషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ )  ను ఏర్పరచి వార్తాపత్రికలను ముద్రిస్తూ అరెస్ట్ అయి 27వ ఏడు అంతా జైల్లోనే గడుపుతూ రాస్తూ చదువుతూ జైల్లో నుంచే బయటి ఉద్యమాలను నడిపిస్తూ సీక్రెట్ కోడ్ తో ఉద్యమ నాయకులతో మాట్లాడుతూ  విచారణ కోసం ఎదురు చూస్తున్నాడు .అతని బృందం లోని నఢేదా కాన్ స్టాంటి నోవా క్రప్స్కావా అనే విద్యా వంతురాలు ,రష్యా మధ్యతరగతి అమ్మాయి లెనిన్ సీక్రెట్ వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించింది .ఆమెకు లెనిన్ అంటే పిచ్చ ఆరాధనా భావం. జైలు లో అతనితో కలిసిమాట్లాడటానికి అనుమతి పొందింది  .లెనిన్ కు సైబీరియాలో మూడేళ్ళ ప్రవాస శిక్ష పడింది .ఒక రకంగా లెనిన్ కు ఇది అతి తేలిక శిక్ష యే.కారణం అతనిది ఉద్దేశ్యమే కాని నిబద్ధత (కమిట్మెంట్ )కాదని కోర్టు అభిప్రాయ పడింది .కొన్ని నెలలకు నడేదాకూడా అరెస్టయి ప్రవాస జీవితం గడిపింది .తనకు లెనిన్ అంటే అభిమానం ఎక్కువనీ ,మార్క్సిస్ట్ ఫిలాసఫీ అధ్యయనం కోసం తనను లెనిన్ దగ్గరకు పంపమని అర్జీ పెట్టింది .విచారించిన జడ్జి అప్పటికే ఎనిసీ ప్రాంతం లో ప్రవాసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఇంకా పెరిగితే రక్షణకు ఇబ్బంది అని ఒక వేళ ఆమె లెనిన్ ను పెండ్లి చేసుకొంటే ఇద్దరినీ కలిపి ఒకరుగా భావించే వీలు ఉంటుందని చెప్పాడు .అప్పుడు లెనిన్ కు 28,ఆమెను పెళ్లి చేసుకొన్నాడు ఆమె తల్లి కూడా వచ్చి ఇక్కడే ప్రవాసం లో చనిపోయేదాకా ఉండి పోయింది .గత్యంతరం లేక కోర్టు కోసం ఇద్దరూ పెళ్లాడినా ఒకరికొకరు అంకిత భావం తో జీవించారు .ఆమెఅతనికి విశ్వసనీయురాలైన అనుచరురాలు మాత్రమే కాదు , అనుకూలమైన, ఆధార పడ తగిన భార్య కూడా

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-20-3-16-ఉయ్యూరు .

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -119

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -119

49-ఫ్రెంచ్ క్లాసికల్ పెయింటింగ్ సంప్రదాయ పరిరక్షకుడు –హెన్రీ మాటిస్సే-2(చివరిభాగం )

, జేట్రూడ్ స్టెయిన్ ఆమె సోదరుడు లియో లు మాటిస్సే ను పేదరికం నుండి బయట పడేశారు .అతని చిత్రాలను అధిక సంఖ్యలో కొని ,ప్రచార ఉద్ద్రుతీ కల్పించారు .అమెరికన్ లను కొనమని ప్రోత్సహించారు . సమతల దివ్య కూర్పుల  విషయం లో వ్యవహారమూ నడిపారు .దీనితో మనో ధైర్యం కలిగి ,ఆశించని,నమ్మలేని  ఉత్తమ ఫలితాలు రాగా చిత్రకారులకోసం మాటిస్సే ఒక వర్క్ షాప్,  స్టూడియో నిర్వహించాడు .తన చిత్ర ప్రయోగాల సందర్భంగా ఒకసారి ‘’ప్రకృతికి కట్టుబడి యధాతధంగా చిత్రించటం   అంటే మీరు ఆత్మ హత్య చేసుకొన్నట్లుగా భావించ కండి .మొదట్లో నేచర్ పైనే అందరం ఆధార పడాలి దాని ప్రభావాన్ని పొందాలి కూడా .ఆ తర్వాత ఆ ప్రకృతినే  చైతన్య పరచి (మోటివేట్ )మరింత అందంగా ఆకర్శ ణీయం గా చేయాలి .కాని తాడుమీద నడిచే ముందు  మీరు గట్టిపట్టు తో నేల మీద  నడవాలి .’’అని తన విద్యార్ధులకు బోధించాడు .

నలభై వ ఏడు వచ్చేసరికి మేధావి అనిపించాడు .ఎత్తైన నుదురు ,పలుచబడిన జుట్టు ,వింత నోరు ,తీవ్రమైన కళ్ళు ,పెద్ద కళ్ళ జోడు తో కనిపించాడు .గణిత ప్రొఫెసర్ లాగా ,చిరుఆఫీసర్ లా ,గ్రామీణ వైద్యునిలా అనిపించేవాడు .ఊహాత్మక భావ ధోరణి మాత్రం ఆయన్ను80వ ఏడాది వరకు  వదలలేదు .యాత్రలలో ఆనందాన్ని అనుభూతిని పొందాడు 1917లో నైస్ లో స్థిర నివాసం ఏర్పరచుకోనేదాకా  మొరాకో ఉత్తర ఆఫ్రికాలో  వింటర్ ను గడుపుతూ అక్కడి పండ్లు తోటలు ,పుష్పాల అందాలను చిత్రించాడు .1930లో గాజిన్ ప్రవేశ ద్వారాన్ని పర్య వేక్షి౦చటానికి తాహితి కి వెళ్ళాడు అమెరికా కూడా వెళ్లి ,కార్నెజీ ఎక్సి బిషన్ లో జడ్జీగా కూడా ఉన్నాడు .

అరవై దాటాక మాత్రమే అతని చిత్ర రచనా సామర్ధ్యానికి గుర్తింపు కలిగి మెచ్చుకోవటం ప్రారంభించారు .ఫ్రెంచ్ క్లాసి చిత్రకారుడని శ్లాఘించి సిజన్నే తో సరి సమానం అన్నారు .సిజన్నే అంటే యవ్వనం లో మాటిస్సేకి వీరాభిమానం ఉండేది .ఒకే తరానికి చెందినా ఇద్దరు పెయింటర్స్ లో భేదం పెద్దగా ఉండదు మాటిస్సే ఏనాడు ఆడవారిని చిత్రి౦చక పోయినా  అవసరమొస్తే వారిని గొప్ప అభిరుచిలేకుండానే ,వ్యక్తిత్వం లేకుండా నే  చిత్రించాడు .సిజన్నే లాండ్ స్కేప్ చిత్రాలలో అద్వితీయడని పించాడు .మాటిస్సేతన పాత్రలను లాండ్ స్కేప్ లకంటే వ్యక్తిత్వసంబంధం లేకుండా గీశాడు .సిజాన్నే లాగా కాకుండా మాటిస్సేమానవ శరీరానికి కి ప్రాధాన్యమిచ్చి ,అంతులేని  లయలు అనేకానేక రూపాలు   వాటిలో కనిపించేట్లు చూపాడు .దృష్టికోణం లో భేదం ఇది .అతని నగ్న చిత్రాలుఆ శతాబ్దపు  సెక్స్ కు అతీతంగా ఉంటాయి .ఇది ఒక వింత విషయమే

.మాటిస్సే’’చిత్రకారుని రంగు యొక్క ఉద్దేశ్యం భావ వ్యక్తీకరణను సాధ్యమైనంత ఎక్కువగా చూపించటం ‘’అని రాశాడు .అతనే ‘’ A work of art must carry in itself its complete significance and impose it upon the beholder even before he can identify the subject matter .What I dream of  is ,an art of balance of purity and serenity devoid of troubling or depressing subject matter ,an art which  might be for ever mental worker like an appeasing influence ,like a mental soother ,something like a good arm chair in which to rest from physical fatigue ‘’అని ఆర్ట్ పై తన హార్ట్ ఓపెన్ చేసి చెప్పాడు మాటిస్సే.

మాటిస్సే చిత్రాలలో వర్ణ౦ అంటే కలర్  ఆయువు పట్టు .రంగు సంఘటిత పరచే ప్రతినిధి మాత్రమె ,  కాకుండా,చాలాసార్లు ఆసక్తి కరంగా పునరా వృత్త పరికరమే అయి మొత్తం నమూనానే మార్చేస్తుంది  .మాటిస్సే ప్రాముఖ్యం ఉన్న ఆకృతుల లోతులను ఏవ గించుకొనే రియలిజం ,రూపకల్పనలో కేంద్రీకరణ లతో సాధించాడు .ఒక రూపానికి ప్రాముఖ్యం ఇవ్వటానికి ముందుగా నల్ల గీతలతో ఆకారం(అవుట్ లైన్ ) కల్పించి  ,సాంప్రదాయ విరుద్ధంగాఆరంజ్ , పింక్ ,స్కార్లెట్  పర్పుల్ రంగుల  కలయికలతో  బహిర్గతం చేస్తాడు .అనుభూతి వాదులలాగా  మాటిస్సే సాధారణ షేడింగ్,మృదు క్రమాలను వదిలేసి ,ఆకస్మిక విరుద్ధ రంగులతో సూటిగా రూపాన్ని ఆవిష్కరిస్తాడు .చూసేవాడికి భౌతిక ప్రభావం తక్షణమే కలిగి ఆనందం అనుభవించి ,అనుభూతికి లోనౌతాడు .డిజైన్ పై అతనికి అపారమైన నమ్మకం ఉంది అది ఒక అందమైన  చేతి వ్రాతలాగా,విభిన్న మైన పాయలతో ,చాలా అర్ధ వంతంగా ఉంటుంది .

ఎనభైవ ఏట  వెనిస్లో  తన స్వగ్రామం  నైస్ కు దగ్గర లో  ప్రార్ధనాలయాన్ని (చాపెల్ )పూర్తిగా డిజైన్ చేసి ,అలంకరించాడు .ద్వారాలు ,స్టేయిండ్ గ్లాస్ కిటికీలు ,క్రాస్ లు ,గాన ,వాద్యాల నిలయం   ,కాండిల్ స్టిక్స్ ,క్రూసి ఫిక్స్ ,పై పెంకు ,ప్రీస్ట్ గారి స్లీవ్లెస్ ఔటర్ కోట్ ,అన్నీ తానే డిజైన్ చేశాడు .83వ ఏట కేన్సర్చి వచ్చి  ప్రేగుకు   ఆపరేషన్ జరిగి ,ఒంగిపోయాడు .మంచమే శరణాగతి అయింది .అయినా కళాత్మక కృషి మాన లేదు .ఇప్పడు ప్రపంచం అంతా మాటిస్సే ఆ నాటి సజీవ చిత్రకారులలో మహోన్నత చిత్రకారుడని గుర్తించి బహుదా ప్రశంసించారు .ఒక్కఫిలిస్టైన్లు మాత్రం అంగీకరించలేదు .అప్పుడప్పుడు ఎవరో ఒక విమర్శకుడు యదార్ధత నుంచి పారిపోయి ,ఎంబ్రాయిడరీ ,టైలరింగ్ కి ప్రాధాన్య మిచ్చాడని సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు .

తనను చులకనగా చూసే వారిని  మాటిస్సే పట్టించుకోలేదు.85వ ఏట ఒక వ్యాసం రాస్తూ ‘’The artist is a man who succeeds in arranging ,for their appointed end ,a complex of activities of which the work of art is the outcome ‘’అని స్పష్టం చేశాడు .కాంప్లెక్స్ ఆఫ్ యాక్టివిటీస్ అని చెప్పినదానిలో వక్ర ద్రుష్టి కూడా  ఉంది .’’The average observer sees everything more or less distorted by acquired habits prejudices ,points of view ‘’అని అభిప్రాయ పడ్డాడు .ఆర్టిస్ట్ అనేవాడు జీవితాన్ని తనలాగే తన చిన్నతనం లో చూసినట్లు  పక్షపాతం లేకుండా దర్శించాలని , హితవు చెప్పాడు .అది కోల్పోతే ఆర్టిస్ట్ తన భావాలను సృజనాత్మకంగా ప్రదర్శించ లేడని అన్నాడు .ఈ స్వభావాన్ని జీవితాంతం అమలు పరచి సార్ధక జీవితం గడిపి ,గుండె పోటుతో 3-11-1954న 85ఏళ్ళ  చిత్రకారుడు హెన్రి మాటిస్సే మరణించాడు .

మాటిస్సే ను విమర్శించే వారుకూడా ఆతను తన రంగులను తాను  ఎన్నుకొనే స్వేచ్చ ,ధైర్యం తీసుకొన్నప్పటికీ వాటిని అత్యంత ప్రతిభా వంతంగా ,నిర్దుష్టంగా ఉపయోగించాడని మెచ్చుకొన్నారు .అతని రంగుల కలయిలలో ఘర్షణ లేదు .ఏదీ మొరటుగా ,ఒత్తిడి పెంచేదిగా ఉండదు.ప్రతిదీ అత్యంత సూటిగా ఉండటం అతని ప్రత్యేకత .అతను పెట్టింది  సంప్రదాయానికి మెరుగులే  .చూసేవాడు విషయాన్ని మర్చిపోయి ,మాటిస్సేఅసాధారణ  భావ వ్యక్తీకరణకు జోహార్లు అనాల్సిందే .

ఫావిజం ఉద్యమ శైలి 19౦౦ లో ప్రారంభమై పదేళ్ళు బతికింది .1930లో మాటిస్సే అమెరికాలోని ఫిలడెల్ఫియాలో బార్న్స్ ఫౌండేషన్ కోసం కుడ్యచిత్రాలు   ‘’డాన్స్ ‘’రూపొందించి ,అమెరికాకు విముక్త పెయింటింగ్ ల సృజనలో ,తరువాత వచ్చిన పొలాక్ మొదలైన వారికి మార్గ దర్శిగా నిలిచాడు .వందలాది పేపర్ కటౌట్లను రూపొందించి ఆర్ట్ లో కొత్తదనం తెచ్చాడు .క్యూబిజం ప్రభావం తో అతని చిత్రాలు రేఖీయ తీవ్రత తో మెరిశాయి .ప్రముఖ నైరూప్య చిత్రకారుడు పాబ్లో పికాసో మాటిస్సే కంటే 11ఏళ్ళు చిన్నవాడు .మొరాకో లో ఒక ఏడాది గడిపి 24పెయింటి౦గులు ,అనేక డ్రాయింగులు వేశాడు .అతని చిత్రాలలో ప్రసిద్ధమైనవి –వుమన్ విత్ హాట్ ,నుబ్లు ,లాడాన్స్ .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -118

 

49-ఫ్రెంచ్ క్లాసికల్ పెయింటింగ్ సంప్రదాయ పరిరక్షకుడు –హెన్రీ మాటిస్సే

హెన్రి ఎమిలి బెనాట్ మాటిస్సే జీవిత చరిత్ర అంటే అతని పెయింటింగుల కేటలాగ్ అవుతుంది .కళ నే జీవితంగా జీవి౦చినవాడు ,నిజంగా చెప్పాలంటే ‘’కాన్వాస్ పైనే జీవించాడు ‘’.31-12-1869 న ఫ్రాన్స్ లో ని పెకార్డీ  లో ఉన్న ఫ్రాన్స్ –ఫ్లాన్దర్స్ తో కలిసే చోట లీ కాత్యూ అనే చిన్న పట్టణం లో జన్మించాడు .తండ్రి ధాన్య వ్యాపారి .పెద్దకొడుకైన హెన్రీ లాయర్ కావాలని తండ్రి కోరాడు .దీనికి అనుగుణంగానే కొడుకు చదువు ప్రారంభించాడుకాని అనారోగ్యం వలన కోన సాగించ లేక పోయాడు .కోలుకొంటున్న స్థితిలో తన చుట్టూ ఉన్న వస్తువుల స్కెచ్ లు గీశాడు .అప్పుడే అతని దృష్టిలో ‘’హౌ టు పెయింట్ ‘’అనే పుస్తకం పడింది .తలిదండ్రులకు ఇష్టం లేకపోయినా లా కు నీళ్ళోదిలి ఆర్టే హార్ట్ గా భావించి ముందడుగే వేశాడు .కమ్మర్షియల్ డిజైన్ లో పాఠాలు నేర్చాడు .దీన్ని ఎంబ్రాయిడరీ కోసం వాడుతారు .కాని 23 ఏళ్ళు వచ్చేసరికి ఆర్ట్ ను క్రమ పద్ధతిలో నేర్వటం ప్రారంభించాడు 29వ ఏట టౌలస్ కు చెందిన ఎమిలీ పెయేరే ను పెళ్ళాడాడు .ఇద్దరుకొడుకులు  జీన్ ,పియరే లు పుట్టారు .

సాంప్రదాయ విద్యా విధానాన్ని తిరస్క రించే రాడికల్ గా పెయింటింగ్ జీవితం ప్రారంభించ  లేదు హెన్రి .అతని మొదటి గురువు  స్పాంజి కేక్  పింక్ ,షుగర్ లతో వనదేవతలను చేయటం లో ప్రసిద్ధుడైన బోగురే .ఇది మూడో తరగతి ఆర్ట్ గా భావించి ,గుస్టీవ్ మొరువా  స్టూడియో లో చేరాడు . .  గుస్టేవ్ గొప్ప ఆర్టిస్ట్ కాకపోయినా హేన్రిపై ప్రభావం చూపించాడు .ఈయనే రౌవాల్ట్ ,డూఫీ ,మాటిస్సే లను అరువు తెచ్చుకొన్న శైలిని వదిలేసి ,స్వంత స్టైల్ ను  జాతీయతను ఏర్పాటు చేసుకోమని సూచించాడు .మాటిస్సే స్వతంత్ర విధానం లోకి మారటానికి ఎక్కువ కాలం పట్టింది .పూర్వపు ప్రసిద్ధ ఆర్టిస్ట్ ల చేతలను కాపీ చేయటం మొదలు పెట్టి మ్యూజియం లలో ఉంచటానికి అమ్ముకొంటూ డబ్బు సంపాదించేవాడు .తర్వాతకాలం లో అరాచక వాది అని పించుకొన్నా ,ఎన్నడూ సంప్రదాయాన్ని నిరాకరించలేదు .తన పూర్వ ఆర్టిస్ట్ ల నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ,,తన భావ దోరణి ని వాటిలో ప్రవేశ పెడుతూ ,అకాడెమీలో నేర్చిన విషయాలను చొప్పిస్తూ  ఎదిగాడు .అందుకే ఆతను ‘’నేనెప్పుడూ ఒక పాదం  లావ్రే లోను,భవిష్యత్తులో సాహసాలు చేయాల్సి వస్తే ,నా’’ లంగరు ‘’ నా స్వంత ఊరులోను ఉంచుతాను ‘’అన్నాడు హెన్రి .

ఈ యాంకర్ అంటే లంగరు తాత్కాలికంగా వదిలేసి ,అనుభూతి వాదులతో (ఇంప్రెష నిస్టులు ),తర్వాత వారినీ అధిగమించి ముందుకే మున్ముందుకే దూసుకు పోయాడు .1897లో ముప్ఫై ఏళ్ళకు పెయింటర్ మొరువా ఊహించి ‘’మాటిస్సే ఏదో ఒక రోజు పెయింటింగ్ ను సరళీకృతం చేస్తాడు ‘’అని ముందే చెప్పిన మాట కొంతవరకు యదార్ద్ధమయింది . వివరంగా చెప్పాలంటే అతని లాడేసేర్టే పూర్తిగా సృజనాత్మకమైనదే .ఇది సెలూన్ డీ లా సొసైటీ నేషనేల్ వారికి కారం రాసినట్లని పించింది .ఈ మరపు రాని విషయాన్నే జెట్రూడ్ స్టెయిన్ ‘’మాటిస్సే శీతాకాలం అంతా ఒక స్త్రీ ఒక టేబుల్ ను సర్దుతూ ,దానిపై అద్భుతమైన డిష్ లో పండ్లు ‘’ఉన్న   ఒక పెద్ద చిత్రాన్ని గీస్తూగడిపాడు .ఈ పళ్ళను ఎలాగైనా కొనమని తన కుటుంబం వారిని కోరాడు ఆ రోజుల్లో పారిస్ లో పళ్ళు అంటే విపరీతమైన అభి రుచి ఉండేది .మామూలు పళ్ళు అంటేనే మహా ఇష్టంగా ఉండేవారు జనం. అలాంటిది ఇంతటి అపూర్వ సృష్టి అయిన మాటిస్సే పళ్ళు అంటే మహా ముచ్చట పడ్డారు కళా ప్రియులు సామాన్యులు కూడా .ఆ ఫలాల తాజాదనాన్ని అలాగే కాపాడటానికి పెయింటింగ్ స్టూడియో లో చల్లదనం కలిపించారు ,పారిస్ వింటర్ లో అది పెద్ద అసాధ్యమైన విషయం కాదు .ఈ చిత్రాన్ని మాటిస్సే ఓవర్ కోట్ వేసుకొని ,చేతులకు గ్లోవ్స్ తో చలికాలమంతా శ్రమించి చిత్రించాడు .ఇంత కష్టమూ పడి గీసి సెలూన్ కు పంపితే తిరస్కారానికి గురైంది .అవి చాలా చీకటి రోజులు ,ఆతని ఉత్సాహం నీరుకారింది ‘’అని రాశాడు .కొత్త చిత్రాలను అమ్మి పొట్ట గడుపుకో లేక పోయాడు .శిల్పిగా జీవితం ప్రారంభించాలను కొన్నాడు .భార్య టోపీలు తయారు చేసి అమ్మి కొంత డబ్బు సంపాదించేది .

1904లో  అద్భుతమైన వ్యాపార ద్రుష్టి ఉన్న సేజాన్నే లోని కళను గుర్తించి లోకానికి పరిచయం చేసిన  ఆంబ్రోస్ వోలార్డ్   మాటిస్సే చిత్ర ప్రదర్హన ఏర్పాటు చేశాడు .ఆర్ధికం గా అది విజయం సాధించలేదు వోల్లర్డ్ ఒకే ఒక కాన్వాస్ ను అమ్మగాలిగాడు .దానివలన మాటిస్సే కి దక్కింది కేవలం వంద ఫ్రాంకులు మాత్రమే .కాని కొత్త తరహా ఆలోచన ,భావ వ్యక్తీకరణ,తెలివి తేటలు ఉన్న నూతన ఆర్టిస్ట్ లభించాడని  అందరూ సంతోషించారు .పారిస్ లో దర్శనమిచ్చిన అనేక జపనీస్ ప్రింట్ లకు ఆకర్షితుడై వాటిని  వాటి ప్రభావం నీడ లను పడనీయ కుండా తమాషాగా అనుకరించాడు .36 వ ఏట 1905లో ఇంకొక అడుగు ముందుకేసి ,కొత్త ప్రదేశం లో కాలుపెట్టాడు .యువ రాడికల్స్అనబడే వైల్డ్ బీస్ట్’’ల  తో కలిసిసగం గర్వం సగం ఎదిరించే  ‘’ఫావిజం ‘’పాత్ర చిత్రీకరణ ను అంగీకరించి నడిచాడు .అదంతా ఇజాల కాలం .ఫావిజం నుంచి ఇంప్రెష నిజం వచ్చింది తర్వాత పోస్ట్ ఇంప్రెషనిజం ,డివినిజం ,పాయింటి లిజం లు వచ్చి చేరాయి .దీనితర్వాత జర్మనీలో ముఖ్యంగా  ఎక్స్ప్రెష నిజం వచ్చింది .ఫాచురిజం  ఇటలీని ఊపేసింది .ఇంగ్లాండ్ ను వోర్టి సిజం ,ఇంగ్లాండ్ ను కట్టి పడేసింది .సర్రియలిజం అబ్ స్ట్రాక్షనిజం ప్రపంచమంతా రాజ్యమేలాయి .

ఫ్రాన్స్ లో వైల్డ్ బీస్ట్ లు వస్తు విషయం లో స్వేచ్చ తీసుకొన్నారు .వాళ్ళు వస్తువులనుకాకుండా ఆలోచనలనే (ఐడియాస్ )పెయింట్ చేశారు .మానసిక స్థితి (మూడ్ )ను వ్యక్తీకరించటానికి ఆకారాలను ఏకపక్షంగా మార్చేశారు .భావ వ్యక్తీకరణకు దట్టమైన హింసాత్మక (వయోలేంట్ )రంగుల్ని,అంతకు  పూర్వం ఎవరూ కూడా వాడని వాటిని  వాడారు .వీళ్ళని ప్రక్రుతిఅంటే ఏమిటో తెలియని   ‘’పిచ్చోళ్ళు ‘’ దిగజారినజనం ,నేరగాళ్ళు  బుద్ధిలేని నమ్మక ద్రోహులు అని గేలి చేశారు . పబ్లిక్ నుఅవమానిస్తూ  దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ,మాన మర్యాదలు మంట గలుపుతూదేశ ద్రోహం చేస్తున్నారని వీరిపై అభియోగం మోపారు .

మాటిస్సేచేస్తున్న సరళీకరణ, రంగుల విధానం విమర్శకులకు విపరీతమైన కోపం తెప్పించింది అతన్ని అరాచకునిగా   అన్ని సంప్రదాయాలను విధ్వంసం చేసేవాడిగా, దోషిగా ప్రకటించారు .’’మాటిస్సే ఒక విషం .అతడు ఆల్కహాల్ కంటే ఎక్కువ హాని చేస్తాడు .,పిచ్చితనానికి అతడు పరాకాష్ట ‘’అన్నారు .క్రమంగా అతని కీర్తి వ్యాపించాక హెన్రి మెక్ బ్రైడ్   అనేఅమెరికన్ విమర్శకుడు ‘’ఆర్టిస్ట్ గా జీవితం ప్రారంభిన సమయం లో మాటేస్సే ఉత్సాహం కోసం తననే చూసుకొని స్వేచ్చ,వ్యక్తీకరణ లకు కోసం చిన్నపిల్లల బొమ్మలేశాడు .తాను  పిల్లాడు కాకపోయినా అది అవసరమనిపించి  స్కూలులో బోధించే అనేక రకాల మేనరిజం ల సృజనకు తోడ్పడింది .తరువాత బేఫర్వాగా పెయింటింగ్ చేయటం నేర్చాడు .మాటిస్సేగొప్ప చిత్రాలన్నీ సంసిద్ధతను దాచి ,అభి వృద్ధి చెందే దిశలో ఉన్నట్లు అనిపిస్తాయి .

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-19-3-16-ఉయ్యూరు

,

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -117

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -117

48- అమెరికన్ నేటివిజాన్ని నెత్తి కెత్తుకొన్న ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ -2(చివరిభాగం)

అకస్మాతుగా ఎడ్విన్ గార్దేనర్  లో నిలబడలేక కూర్చోలేక నిద్రరాక ,పని చేయలేక పోయాడు .అక్కడి వాతావరణాన్నే తట్టుకోలేక పోయాడు .హీర్మాన్ భార్య  అయిన వదిన తో ‘’నలభై ఏళ్ళు దాటి నేను బతుకుతాననుకోవటం లేదు .కనుక చేయాల్సిందంతా ఈలోపలే చేయాలి ‘’అని చెప్పాడు .తండ్రి ఎస్టేట్ లో తనకు దక్కిన వాటా కొన్ని వందల డాలర్లు మాత్రమే .దీన్ని తీసుకోని న్యూయార్క్ చేరాడు .అప్పడు అతని ఆకారం ‘’పలుచటి శరీరం ,నిటారు మనిషి ,అతని వంశపు చిహ్నాలు కొట్టొచ్చినట్లు ఉండే రూపం తో ఉండేవాడని పరిచయమున్న స్నేహితుడు చెప్పాడు .ఒకవేళ చూసేవాళ్ళకు ఇవి ఆనక పొతే అతని ముఖం లో కనిపించే విద్యా ,మిరుమిట్లు గొలిపే కంటి చూపు అతని ప్రత్యేకతను చాటి చెప్పేవి .కొత్త సుదీర్ఘ కవిత ‘’కెప్టెన్ క్రైగ్ ‘ను ’స్క్రిబ్నర్ పత్రిక తిరస్కరించింది .దీని వ్రాత ప్రతిని స్మాల్, మే నార్డ్ పత్రికలకు పంపితే ఆహ్వానించాయి .కాని దీన్ని ఆ పత్రిక సంపాదకులలో ఒకడు ఒక వేశ్యా వాటికలో మర్చిపోతే చివరికి ఎప్పుడో అది బయట పడింది .తీరా అది వెలుగు చూశాక దాన్ని ముద్రించటానికి కొత్త సంపాదక వర్గం ఒప్పుకోలేదు .అతని ఇద్దరు మిత్రుల ధన సాయం తో ముద్రణ భాగ్యానికి నోచుకొని అతని అచ్చయిన మూడవ పుస్తకంగా నిలిచింది .ఒంటిమీదకు 33ఏళ్ళు వచ్చాయి ఇప్పటిదాకా రచనలవల్ల సంపాదించింది ఇదివరకు పో కవి పై రాసిన సానెట్ కు వచ్చిన కేవలం ఏడు డాలర్లు మాత్రమే..చాలా నాజూకుగా సున్నితమైన కవితలల్తో వెలువడే ఆ మేగజైన్ ఇతని కర్కశ శరాఘాత పదజాల కవిత్వాన్ని వేసుకోవటానికి ససేమిరా అంది .

పొట్ట గడవక చేతిలో చిల్లిగవ్వ లేక న్యూ యార్క్ లో ఒక అపార్ట్ మెంట్ నుంచి,అంతకంటే చిన్నదైన  వేరొక అపార్ట్ మెంట్  కు ,మరీ చిన్నవాటికీ ,మురికి కూపాలుగా ఉన్నవాటికీ మారుతూనే ఉన్నాడు ..దరిద్రాన్ని తట్టుక లేక మానసిక శాంతికోసం సెలూన్లలో విస్కీ  తో పాటు ఉచితంగా అందించే భోజనం తో బతుకుతూ తిరిగాడు .ఖరీదైన సూట్ లేక పోవటం వలన,చిల్లులు పద్డ్డమురికి బట్టలు వేసుకోవటం వలన  అతన్ని అతని స్నేహితులే అతనితో తాగి తందానాలాడటానికి అంగీకరించటం లేదు .విసిగి వేసారి గంటకు ఇరవై సెంట్ల జీతం తో రోజుకు పది గంటలు పని చేసే ఒక ఉద్యోగం లో చేరాడు .ఈ ఉద్యోగం న్యూ యార్క్ సబ్ వే లో చేసేవాడు .అండర్ గ్రౌండ్ లోఉంటూ  వచ్చిన సరుకును లెక్క పెడుతూ గడిపాడు ఈ జీవితాన్నే ఎడ్విన్ ‘’నరకం లో గడిపాను ‘’అని రాశాడు .తొమ్మిది నెలలకే సబ్ వే నిర్మాణం పూర్తీ అయి ఉద్యోగం ఊడింది .చలి పులి విపరీతంగా గాండ్రించి దూకుతున్నకాలం లో ఒంటరిగా ఏ ఆచ్చాదనా లేకుండా దయనీయ జీవితం గడిపాడు .ఒక తీవ్రమైన ప్రమాదం నుండి త్రుటి లో తప్పించుకొన్నాడు .అదొక మిరకిల్ అంటాడు .

ఇంతలో అదృష్టం అతని తలుపు తట్టింది .ఆ నాటి ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ కొడుకులలో ఒకరికి రాబిన్సన్ రాసిన ‘’ది చిల్ద్రెన్ ఆఫ్ ది నైట్ ‘’కంట బడి ,తండ్రికి పంపాడు .అది చదివి సాహిత్యాభిమాని అయిన ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ ఆ రచనకు ఆశ్చర్య పడి,చలించి ,పిలిపించి ,ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ లో ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇచ్చాడు .అమెరికా ఇలాంటి ప్రతిభా వంతులైన కవులకు నిలయంగా ఉండాలని భావించి ఎడ్విన్ ను న్యు యార్క్ కస్టమ్స్ హౌస్ లో స్పెషల్ ఏజెంట్ గా ఏడాదికి రెండు వేల డాలర్ల జీతం తో  నియమిస్తూ ‘’నువ్వు కవిత్వాన్ని గురించి ముందు ఆలోచించి ఆ తర్వాతే కస్టమ్స్ ఉద్యోగం గురించి ఆలోచించు ‘’అని హితవు చెప్పాడు .మహాదానందమేసింది కవి ఎడ్విన్కు . కృతజ్ఞత తెలియ జెప్పుకొన్నాడు ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ కు .

హాయిగా స్వేచ్చగా ఇదివరకు రాయలేక పోయిన భావాలన్నిటికీ  కవితలల్లాడు రాబిన్సన్ .ఇదివరకటి కంటే కొంచెం వసతిఉన్న ఇంట్లో కొంచెం ఎక్కువ సుఖాలతో గడిపాడు .’’ ఇప్పుడు నాకు రెండుజతల బూట్లున్నాయి’’అని గర్వంగా ఫ్రెండ్ కు జాబు రాశాడు .ప్రెసిడెంట్ -ఎడ్విన్ కు జీవికను కల్పించటమేకాదు ,ది అవుట్ లుక్ ‘’పేపర్ లో అతని నిప్రశంసిస్తూ ఆర్టికల్ రాసి ,అతనికి ఆడిఎన్స్ పెంచాడు .నాలుగేళ్ల తర్వాత రూజ్ వెల్ట్ పదవీకాలం పూర్తికాగానే రాబిన్సన్ ఉద్యోగం హుళక్కి అయింది .మరొక కవితా సంపుటి ‘’ది టౌన్ డౌన్ ది రివర్ ‘’వెలువరించాడు .కొంతవరకు ప్రొత్సాహక మైన  కామెంట్లు వచ్చినా అతని అపక్వ ,భావనలను ,మూఢత్వాలను ,అసహజత్వాన్ని  ఈసడించారు  .మళ్ళీ ఒంటరి జీవితం ,’’దేవదాసు’’ అవతారం.తో పూటుగా తాగుతూ బతుకుతున్నాడు  .తన  బోహీమియన్ స్నేహ బృందం దగ్గర డబ్బు అప్పు తీసుకొన్నాడు .మరోసారి కస్టాల కడలి దాటించే మరో తెప్ప దొరికింది హెర్మన్ హేగడర్న్అనే జీవిత చరిత్రకారుని  రూపం లో .కవిని కవులపాలిటి స్వర్గమైన మాక్దోవేల్ కాలనీ కి తీసుకొని వచ్చి వసతి కలిపించాడు .

ముసలితనం మీదపడుతోంది వేసవిని న్యూయార్క్ లో చలికాలాన్ని బోస్టన్ లో గడుపుతున్నాడు .కవిత్వం అంబ పలుకుతోంది .కవితా ప్రవాహం యధేచ్చగా జాలువారి పుస్తక రూపాలను సంతరించు కొన్నది .’’ది మాన్ ఎగైనెస్ట్ ది స్కై’’శీర్షికతో ,మరికొన్ని అతని ప్రసిద్ధ కవితలు ‘’ది త్రీ ట్రావేర్న్స్ ,’’అనే మూడు పుస్తకాల సైజు కధనాల కవితలతో  ముఖ్యంగా ‘’ఆర్దూనియన్ లెజెండ్ లని పిలువబడే మెర్లిన్ ,లాన్సేలాట్ ,ట్రి స్టాం,హావెంస్ హార్వెస్ట్ ,రోమన్ బార్త్ లో కవితలతో ప్రచురించాడు .1921లో రాబిన్సన్ కవితా సంపుటికి పులిట్జర్ బహుమతి లభించింది .మరో రెండు సార్లు గౌరవప్రదమైన బహుమతులను అందుకొన్నాడు .1924లో’’ ది మాన్ ట్వైస్ డైడ్’’కు ,1927లో ‘’ట్రిస్టాన్’’కు ఈ అవార్డ్ లు అందుకొన్నాడు .ట్రిస్టాన్ ను ‘’లిటరరీ గిల్డ్ బుక్ ‘’సంస్థ లక్షలాది తన  క్లబ్ సభ్యులకు  అందజేసి రికార్డ్ సృష్టించింది అరుదైన గౌరవం ఇది .దీని తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలగలేదు రాసిన వన్నీ అద్భుత విజయాలే సాధించి కీర్తి ప్రతిష్టలు పెంచాయి .అరవై ఏళ్ళు వచ్చేసరికి సుదీర్ఘమైన శ్రమ పడుతూనే ఉన్నాడు .రాబడికోసం రాస్తున్నాడు .గత జీవితం ,భవిష్యత్తు ఏమౌతున్దోనన్న భయం ఆవరించాయి అతన్ని .వార్షికంగా రచనలు చేయాలనే సంకల్పం లోనే ఉన్నాడు  అలానే రాశాడు కూడా

ఏడేళ్ళు ప్రతి ఏడాది ,చివరికి చనిపోవటానికి ఒక నెల ముందువరకు  కధనాత్మక కవితల్ని విడవ కుండా రాశాడు .దీనితో అధిక శ్రమ కలిగి అలసట చెందాడు .ఇందులో ‘’అమరాంత్ ‘’వంటివి పగటికలల కవితలున్నాయి ‘’నీకో డెమాస్ ‘’లో భరించ రాని శబ్ద ఘోష ప్రతిధ్వనించింది .దెయ్యాల వయ్యారం భయ పెట్టింది .కొన్ని అన్యార్ధ ప్రాతిపదికలు గా ఉన్నాయి .గతకాలపు తన జీవితాన్ని నీడలుగా చూపుతున్నాడో ,లేక వాటిని సెటైర్ గా రాస్తున్నాడో అర్ధం కాకుండా ఉంది .తనపాత్రలకు చిరస్మరణీయమైన పేర్లు పెట్టాడు .కాని మాల్కం కౌలీ అధ్యయనం ప్రకారం ‘’ఎడ్విన్ ఒక్కోసారి ఆ పాత్రలకు ముఖాలను అమర్చటం మర్చే పోయాడు ‘’.తరువాత కాలం లో స్నేహ బృందం యెడల చాలా ఓపికతోను ,కొందరు మగాళ్ళను నమ్మకు౦ డాను ,అసలు ఆడవాళ్ళపై నమ్మకమే లేకుండానూ గడిపాడు .ఎవరినీ ప్రేమించలేదు ఎవ్వర్నీ పెళ్లాడ లేడుకూడా .ఇసడోరా డంకన్ అనే డాన్సర్ అతన్ని లొంగ దీసుకొని ముగ్గులో దింపే ప్రయత్నం చేసింది .ఆమె నంగనాచి మాటలకు ,వెకిలి చేష్టలకు లొంగిపోయాడు .అరవై వ ఏట మళ్ళీ ఒంటరితనమే .గదిలోంచి బయటకు వచ్చేవాడే కాదు .అతని చివరి శీతాకాలాలు భరించరాని బాధలతో గడిచాయి  66వ ఏట మరింత బలహీనుడై  క్లోమ గ్రంధి వ్యాకోచించి దారుణ స్థితిలో న్యూయార్క్ హాస్పిటల్ లో చేరాడు .అతనికి ఆపరేషన్ చేసి బతికించటం కస్టమన్నారు డాక్టర్లు .హాస్పిటల్ లోనే  ఎడ్విన్ ఆర్లింగ్టన్. రాబిన్సన్ 6-4-1935న చనిపోయాడు .

చని పోయిన తర్వాతనే రాబిన్సన్ గొప్పతనం బాగా వెలుగులోకి వచ్చింది అతడు అంకితమైన ఒకే ధోరణిని మెచ్చారు .అతని చెదరని ఏకాగ్రతకు జోహార్లు అర్పించారు .తన కీర్తిని గౌరవంగా లిఖి౦చు కొన్న అతని ని అభిమానించారు .అతని భయంకర ,నిరాశావాదాన్ని అతన్ని విస్తృత ప్రేక్షకులకు దూరం చేసినా ట్రిస్టాన్ తో జనర౦జకవి అయ్యాడు  .అయినా అతన్ని నిరాశావాద కవి అనే ముద్ర వేసింది లోకం .రాబిన్సన్ ‘’ఈ లోకం జైలు గది కాదు  అదొక అద్భుత ఆధ్యాత్మిక కిండర్ గార్టెన్ .అందులో తికమక పడే లక్షలాది శిశువులు దేవుడు అంటూ తప్పు దోవన పడుతున్నారు ‘’అన్నాడు .అతని సిద్ధాంతం నిరాశ కాదు ,ఒంటరి తనం మాత్రమే. అతని గుండె కలలకు నోచుకోని తాగుబోతుల కు బాసట .భ్రాంతిలో అపజయం పాలైన వారికి ఊరట .వారందరిలో తనను చూసుకొన్న కవి రాబిన్సన్ .సరికొత్త పూర్ర్తి అమెరికన్  బొమ్మల కొలువు (గాలరీ ) సృష్టించాడు .అతని పాత్రలు ఎలా ఉన్నాయో విశ్లేషకుల భాషలోనే తెలుసుకొందాం .’’Richard Cory who ‘’glittered when he walked ‘’and fluttered pulses butwho ,one calm summer night ,’’went home and put a bullet through his head ‘’.Miniver Cheevy ,born too late ,in love with the past ,sighing ‘’for what was not ‘’who coughed ‘’and called it fate ,and kept on drinking ‘’

రాబిన్సన్ కవితా మాణిక్యాలు కొన్ని చూద్దాం –‘’where strangers would have shut the many doors –that many friends had opened long ago ‘’.రాబిన్సన్ పాత్రలు -న్యు ఇంగ్లాండ్ ప్రతిభ తో వెలుగులు వెదజల్లుతాయి .సానుభూతి ,వ్యంగ్యం తో రాణిస్తాయి .కాని అక్కడి ముతక హాస్యం తో నవ్వు తెప్పిస్తాయి .నిజమైన నవ్వు కు దూరమైనట్లు కనిపిస్తాయి .సున్నితత్వం బాధ లతో ఆ పాత్ర పోషణ చేశాడు .మనిషికి ఉన్న నిర్దయ ,క్రూరత్వం ,అవినీతి ,సాటిమనిషిపై ప్రేమ లేకపోవటాన్ని తన కవిత్వం లో ఎండ కట్టాడు –‘’tell me o Lord –tell me ,o lord ,how long –Are we to keep Christ writhing on the Cross ‘’

రాబిన్సన్ సృజన శీలి కాడు.కొత్త టెక్నిక్ ను ప్రవేశ పెట్టిందీ లేదు .సంప్రదాయ కవిత్వానికి కొత్త రూపు కల్పించిన వాడూ కాదు .పాత రూపాలను పునరుజ్జీవింప జేసినవాడు .సానెట్ లకు సాన పెట్టి కొత్త వెలుగులు తెచ్చినవాడు .ఫ్రెంచ్ పద్ధతులను అమెరికన్ కవిత్వం లో ప్రవేశపెట్టి బాలడ్,విల్లనేల్లె లను రూపొంది౦చినవాడు .తేలికైన కవిత్వానికి సీరియస్నెస్ ను అద్దినవాడు .ప్రేయేడ్,,డాబ్సన్ ల కధనాత్మక విషాదాలకు  ,శైలికి పరి పుష్టి చేకూర్చాడు .అమెరికాలో అంతవరకు ఏ కవీ చేయని సంక్షిప్త చిత్ర రూప కవిత్వాన్ని ఆవిష్కరించాడు .అతని అభిరుచి, శ్రద్ధ శ్లాఘనీయమైనాయి ..చమత్కార చాటు రూపక కవిత్వానికి పట్టాభి  షేకం చేశాడు .సంప్రదాయ కవిత్వానికి కొత్త సోకులు సొబగులు జవం జీవం తాజాతనం  చేకూర్చాడు .అతని ప్రశాంతత బాధల్లోనుంచి ఉద్భవించింది .అతని యవ్వన జాతీయాలు వేధించే పోరాటం లోంచి ప్రభవి౦చినవే .ఆతను ఉన్న సమకాలీన అంగీకృత విలువలను నిరాకరించి ,భౌతికతను కాదని అసలైన అస్తిత్వాన్ని ప్రదర్శించాడు  .తన వైఫల్యాలను  ఆర్భాటంగా ప్రదర్శించాడు .అట్టడుగుప్రజల ,అణగారిన ప్రజల,అలక్ష్యం చేయబడిన ,తిరస్కృతుల ,పీడితుల   వాణిగా నిలిచాడు ,ప్రతినిధిగా గౌరవం పొందాడు . ఓటమి నుంచి ఒకింత చేదు  విజయాన్ని పొందిన కవి రాబిన్సన్ .దాదాపు 25కవితాసంపుటులు వెలువరించాడు .రెండునాతకాలు మూడు లేఖా సంపుటులు ,కొంత కలగూర గంప రాశాడు

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-3-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -116

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -116

48- అమెరికన్ నేటివిజాన్ని నెత్తి కెత్తుకొన్న ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్

కవిత్వం లో ను , మాటల్లోను  అసాధారణ సంక్షిప్తత  ,సిగ్గుపడే మనస్తత్వం ఉన్న అమెరికన్ కవి ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ .సమకాలీన విలువలను   చాలెంజీ చేసి ,పొందిన విజయాలను ప్రశ్నించి ,ఆనాటి వరకు ఎవరూ ఎదిరించని కలం వీరుడిగా చరిత్రలో స్థానం పొందాడు .యవ్వన దశలోనే తాను  ఈ ప్రపంచం లో నిత్య పోరాటం తో ,తప్పించుకోరాని  సంఘటనల మధ్య జీవించాల్సి ఉంటుందని  గ్రహించాడు .22-12-1869 న అమెరికాలోని లింకన్ స్వరాష్ట్రం మెయిన్ లో హెడ్ టైడ్అనే గ్రామం లో జన్మించాడు .పుట్టిన ఏడాదికే తండ్రి కుటుంబాన్ని దగ్గరలోనే ఉన్నఉత్పత్తికేంద్రం ,నాలుగు వేల జనాభా ఉన్న  గార్డేనర్ కు మార్చాడు. 27 ఏళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉండిపోయాడు .ఈ అనుభవాలను తన కవిత ‘’టిల్బరీ టౌన్ ‘’లో నింపాడు .ఇక్కడున్నకాలం లో దాదాపు ఒంటరిగా ,ఎక్కువకాలం ఇంట్లోనే ఉన్నాడు .తండ్రి షిప్ కార్పెంటర్ గా పని చేశాడు .ఒక జనరల్ స్టోర్స్ కూడా ఉండేది .ఎడ్విన్ యవ్వన దశవరకూ ఆ కుటుంబం సంపన్న కుటుంబం గానే ఉండేది .తండ్రి లాండ్ ఓనర్ ,స్టాక్ హోల్డర్ ,కౌన్సిలర్ ,బాంక్ డైరెక్టర్ కూడా కావటం తో సంపన్న ధనిక కుటుంబంగా ఉన్నారు .ఎడ్విన్ ఇద్దరు అన్నయ్యలలో ‘’డీన్ ‘’ను డాక్టర్ చేయించాలని చదివించారు .రెండోవాడు హీర్మన్ ను బిజినెస్ మాన్ గా మార్చాలని తండ్రి భావించాడు .ఎడ్విన్ చిన్నప్పటినుండి చాలా ప్రశాంతంగా ఉండేవాడు .చుట్టూ ఉన్న ప్రపంచం లో పోరాడి ,విజయం సాధించాగలిగితేనే బతకగలం అనే అధైర్యమేర్పడి ,పోటీ పడటానికేప్పుడూ వెనకడుగే వేసేవాడు .

అయిదవ ఏటనే కవిత్వం చదివి అర్ధం చేసుకొని ,పదకొండవ ఏట కవిత్వం రాయటం ప్రారంభించాడు రాబిన్సన్ .ఎడ్విన్’’ టీన్’’ వయసు నుంచి బయట పడే లోపే తండ్రి ఆరోగ్యం క్షీణించి,నిత్యం చావు బతుకుల్లో గడిపాడు .తెలివిగలా అన్న  ‘’డీన్’’ మెడికల్ ప్రాక్టీస్ మానేసి ,మత్తుమందుకు బానిసై ,నరాల వ్యాధితో నరకమే అనుభవించేవాడు .మేజర్ అయిన ఆర్లింగ్టన్ ,రాబోయే భవిష్యత్తు యెంత దారుణంగా ఉండ బోతుందో ఊహించుకోగలిగాడు .స్వీయ అస్తిత్వం లేకుండా ,,నిరాశ నిస్పృహలతో ఒంటరి జీవిగా కు౦గి పోయాడు .’’నేను దాదాపు ఇరవై రెండేళ్ళు గార్దినర్ లో ఉన్నానన్న మాటే కాని ఇల్లువదిలి బయటకు వెళ్ళిన పాపాన పోలేదు ‘’అని తర్వాతెప్పుడో రాసుకొన్నాడు .ఒంటరితనం వ్యక్తిత్వ వికాసానికి ఎక్కువగా తోడ్పడుతు౦దని ,తన అపజయాలకు అది సానుభూతి చూపుతుందని  అనుకొన్నాడు .ఏదో తెలీని అదృశ్య శక్తి యాదృచ్చికంగా తన జీవిత నావను నడిపిస్తుందని నమ్మాడు .

1891  ‘’ఫాల్’’ సీజన్ లో హార్వర్డ్ లో చేరి ,రచయితకావాలని అనుకొన్నాడు .హార్వర్డ్ మాసపత్రికకు డజన్ కవితలు పంపాడు .అందులో చాలా ఇప్పుడు అధిక ప్రాచుర్యాన్ని పొందినా ,ఆనాడు ఆ పేపర్ వాటిని తిరస్కరించింది .రెండేళ్ళ తర్వాత కాలేజీ చదువుకు స్వస్తి చెప్పాడు .మిల్లులన్నీ మూతపడ్డాయి .బ్యాంకులు కట్టేశారు .బాగా వ్యవస్తీక్రుతమైన ఫరములు  కూడా   దివాలా తీశాయి  .నలభై లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు .కొక్సీ నిరుద్యోగ సైన్యం వాషింగ్టన్ పై దాడి చేసింది .రాబిన్సన్ అదృష్టమూ దీనితో తలక్రిందులైంది .తండ్రి చనిపోయాడు .అన్న డీన్ భ్రమలలో బతుకుతున్నాడు .మరో అన్న హీర్మాన్ తెలివి తక్కువగా పనికిరాని వాటిలో పెట్టుబడులు పెట్టి,కలిసిరాక తాగుడుఅలవాటై ,కలల్లో తెలిపోతున్నాడు  .ఈ పరిస్తితులలో తన కాళ్ళ మీద తానూ నిలబడాల్సిన పరిస్తితి ఉందని ఎడ్విన్ గ్రహించాడు .ప్రపంచం చెప్పే వ్యాపార ద్రుష్టి తనకు లేదని తెలుసుకొని వినయంకలిగి ,అజ్ఞాతంగా ఉండి పోయిన ,జనం మర్చి పోయిన వారి గురించి  చిన్నకధలు రాస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాడు .మధ్య మధ్యలో సానేట్లు ,19పంక్తులతో ,రెండు రైమ్స్ ఉన్న’’విల్లనేల్లెస్ ‘’ కవితలు రాశాడు.తర్వాతి జీవితం లో  అడపాదడపా నాటికలు గిలికే ప్రయత్నమూ చేశాడు ..ఇవేవీ తనకు అచ్చి రావని గ్రహించి కవిత్వమే తనకు దిక్కు అనే నిశ్చయానికి వచ్చేశాడు .

చిన్నతనం లోనే చెవి ఎముకకు ఇన్ఫెక్షన్ సోకి ,లోపలి చిన్న ఎముకలను నాశనం చేసింది .వినికిడి పోతుందేమోనని విపరీతంగా భయ పడ్డాడు .కళ్ళు కూడా చాలా బలహీనం గా ఉండేవి .కళ్ళు చెవి లపై తీవ్ర ఆందోళన చెందేవాడు .తనకు ఎవరో ఒకరు ఆసరాగా ఉంటేగాని జీవి౦చలేననే అధైర్యమేర్పడింది .స్నేహితుడికి ఉత్తరం రాస్తూ 24 ఏళ్ళ తాను  ప్రతి సెంటు డబ్బుకోసం, తినే  ప్రతి ముద్ద కోసం  తల్లిపై ఆధార పడాల్సి రావటం సిగ్గుగా ఉందని,.ప్రపంచం తనను భయపెడుతోందని  తెలియ జేశాడు .ఏదైనా వచనం లో రాసిపంపితే పేపరు వాళ్ళు తిరుగు టపాలో మొహాన కొట్టేస్తున్నారు .అతని బాగా ప్రసిద్ధమైన కవిత ‘’ది హౌస్ ఆన్ ది హిల్ ‘’ను ఒక పత్రిక స్వీకరించి౦ది కాని ఒక్క సెంటు కూడా విదల్చలేదు .ఇంకోటి మరో మేగజైన్ లో అచ్చు అయి ,ఒక ఏడాది పాటు ఆ పత్రికను ఉచితంగా పంపింది అంతే.కాని 1895లో మాత్రం ఎడ్గార్ అల్లెన్ పో పై రాసిన సానెట్ ను ‘’లిప్పిన్ కాట్స్ మేగజైన్ ‘’ప్రచురించి 7 డాలర్ల పారితోషికాన్నిచ్చి  ఉత్సాహం నింపి ,ఆర్ధికంగా సాయపడింది .అదే 26 వ ఏట అతని మొదటి సంపాదన అయింది .

1896లో వందపెజీల  ‘’దిటారెంట్ అండ్ ది నైట్ బిఫోర్ ‘’ వ్రాతప్రతిని రాసి పంపిస్తే ,రెండు సార్లు తిరస్కరింపబడింది ..చివరికి రివర్ సైడ్ ప్రెస్ లో ముద్రించి అతని అంకుల్ ఒకడు 312పేపర్ బౌండ్ కాపీలను 52 డాలర్లకు అందజేశాడు .దీన్ని ‘’To any man ,woman ,or critic who will cut the edges of it –I have done the top ‘’అని స్వీయ చేతనతో అ౦కి తమిచ్చుకొన్నాడు .దీనిపై వచ్చిన స్పందన స్వల్పమే .కొన్ని విమర్శలు అనుకూలంగానే వచ్చినా ఇంకా ఎక్కు మందికి అందేలా రచయిత ప్రయత్నించాలని సలహా నిచ్చారు .గర్విష్టి అయిన ఒక పబ్లిషర్ రిచర్డ్ సి బాడ్జేర్ అతి తక్కువ ధరకే పుస్తకంకొత్త ప్రచురణ  అచ్చు వేస్తానన్నాడు .కొన్ని కవితలు వదిలేసి కొన్ని కొత్తవి చేర్చినానా కంగాళీ చేసి ,ఎడ్విన్ స్నేహితుడు డబ్బు అడ్వాన్స్ గా ఇస్తే ‘’ది చిల్ద్రెన్ ఆఫ్ ది నైట్ ‘’నుప్రచురించి అందులో కొన్ని రాబిన్సన్ పోర్ట్రైట్లు కూడా చేర్చి 1897లో విడుదల చేశాడు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-3-16-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -7(చివరిభాగం

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -7(చివరిభాగం)

86-‘’ఎవరిని పండితుడు అనాలి “”?

‘’ధర్మం తెలిసిన వాడినే ‘’

87-‘’నాస్తికుడెవడు ‘’?

‘’’’పరలోకం లేదనే వాడు ‘’

88-‘’కామం అంటే ‘’?

‘’సంసార హేతువు ‘’

89-‘’మత్సరం ‘’?

‘’హృదయ తాపం ‘’

90-‘’అహంకారం ?’’

‘’తీవ్ర మైన అజ్ఞానం ‘’

91-‘’దంభమంటే ‘’?

‘’’’ధర్మాత్ముడిగా ప్రకటించుకోవటం ‘’

92-‘’పరదైవమెవరు ‘’?

‘’దానఫలం ‘’

93-‘’పిశునత్వమంటే “”?

‘’పరదూషణం ‘’.

ఇక్కడ కొంత వివరణ నిచ్చారు శ్రీ జి వి ఎస్ .-అహంకారమంటే నేను ,నాది అనే స్వీయ కేంద్ర ప్రవ్రుత్తి అని ,దీనికి మూలం అవిద్య ,అజ్ఞానమని ,తీవ్రమైన అజ్ఞానమే అహంకారమని ధర్మ రాజు నిర్వచనం .ధర్మాత్ముడుగా ఉండటానికి ప్రకటన అక్కర్లేదు .జీవించే విధానమే ధర్మాత్ముడిని చేస్తుంది. దానం ఎలా ప్రకటించుకో రాదో ధర్మాన్నీ అలానే ప్రకటించుకోరాదని అర్ధం .దైవాలకే దైవం –పర దైవం అని చెప్పకుండా యుధిష్టిరుడు-దానఫలాన్ని పరదైవంగా  నిర్వచించి చెప్పాడు .ధర్ముడి సమాధానాలన్నీ చాలా విస్త్రుతార్ధం లోనూ మూలార్ధం లోను ఉండి అతని వివేక సంపత్తిని ఆవిష్కరిస్తాయి .ఇప్పుడు మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలను సంధిస్తున్నాడు యక్షుడు –

94-‘’ధర్మ రాజా !ధర్మార్ధ కామాలు పరస్పరం విరోధించేవి గా కనిపిస్తాయి కదా ,మరి అవి ఎక్కడ కలుస్తాయి ?’’

‘’ధర్మం –భార్య  పరస్పరం విరోది౦చ కుండా  మానవుడికి వశమైనప్పుడు ధర్మార్ధ కామాలు ఒకే చోట కలుస్తాయి ,నిలుస్తాయి ‘’

95-‘’అక్షయ నరకాన్ని ఎవరు పొందుతారు “”?

‘’పరమ దరిద్రుడైన యాచక బ్రాహ్మణుడిని ,ఆహ్వానించి ,లేదు పొమ్మనే వాడు నరకం లోనే శాశ్వతంగా ఉండి పోతాడు ‘’

96-‘’కులం ,నడవడి స్వాధ్యాయన,పా0డిత్యాలలో దేనివల్ల బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది ‘?

‘’మహాత్మా !కులం ,స్వాధ్యయనం ,పా౦డిత్యాలు బ్రాహ్మణత్వానికి కారణాలు కావు .ఉత్తమమైన నడవడి మాత్రమే బ్రాహ్మణత్వానికి ప్రధానకారణం .బ్రాహ్మణుడు సదాచారం పాటిస్తూ బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోవాలి .చతుర్వేదాలు చదివినా ,సదాచార పరాయణుడు కాని వాడు శూద్రుని కంటే హీనాతి హీనుడు .ఇంద్రియ విజయాన్ని సాధించిన వాడెవడైనా బ్రాహ్మణుడే .’’నిర్మొహమాటంగా ధర్మ రాజు సమాధానం చెప్పాడు .శీలమే బ్రాహ్మణత్వానికి ముఖ్య కారణం అని స్పష్టం గా చెప్పాడు .బుద్ధుడు కూడా ‘’ఉత్తమ శీలాన్ని సాధించిన అర్హతులను బ్రాహ్మణుడు’’అన్నాడు .

97-‘’ప్రియంగా మాట్లాడేవాడు దేన్ని పొందుతాడు ‘’?

‘’ పరమ హితాన్నిపొంది  అందరికీ  ఇస్టు డౌతాడు ‘’

98-‘’ఆలోచించి పని చేసేవాడు “”?

‘’ఎక్కువగా విజయాలు సాధిస్తాడు ‘’

99-‘’స్నేహితులెక్కువగా ఉన్నవాడు దేన్ని పొందుతాడు “?

‘’సుఖాన్ని పొందుతాడు ‘’

100-‘’ధర్మ పరుడు పొందేది ?’’

‘’సద్గతి ‘’

101-‘’ఎవడు ఆనందిస్తాడు “”?

‘’అయిదు రోజులకొక సారి కూర వండుకొన్నా ,,అప్పులేని వాడు ,పర దేశం లో లేని వాడు ఆన౦దిస్తాడు ‘’

102- “”ఆశ్చర్య కరమైనది ఏది “”?

‘’చావకుండా స్థిరంగా ఉంటాము అనుకోవటమే ‘’

103-‘’ఏది మార్గం “”?

‘’మహా పురుషులు నడిచిన మార్గమే ‘’

104-‘’ఏది వార్త ?

‘’’’ఈ బ్రహ్మాండ భాండం మోహ మయం .దీనిలో సూర్యుడిని అగ్నిగా నిలిపి ,రాత్రి ,పగలు ఇంధనంగా చేసి ,ఋతువులు ,మాసాలను గరిటలుగా చేసి కాలం ప్రాణుల్ని పక్వం చేస్తుంది ‘’అన్నదే వార్త మహానుభావా !

105-‘’పురుషుడెవరు””?

‘’ఎవడి పుణ్య కార్యాలను ప్రజలు పొగుడుతున్న ధ్వని స్వర్గాన్నీ ,భూమినీ తాకుతూ ఉంటుందో  వాడు పురుషుడు అనబడతాడు ‘’

106-‘’సర్వ శ్రేష్ట ధన వంతుడు ఎవరు “”?

‘’ప్రియాప్రియాలను సమానంగా స్వీకరించేవాడూ ,భూత భవిష్యత్తులను సమానంగా భావించే వాడూ సర్వ శ్రేష్ట ధనవంతుడు మహాత్మా !’’

Inline image 1

యక్ష ప్రశ్నలు సంపూర్ణం

ఆధారం – శ్రీ జి వి .సుబ్రహ్మణ్యం గారి రచన –‘’భారతం లో రసవద్ఘట్టాలు –సమీక్షలు’’ –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-16-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -6

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -6

66-ధర్మ రాజు   సామాన్య మానవులు ఊహించలేని లోతులకు వెడుతు సమాదానాలిస్తున్నాడు  .యక్షుడి ప్రశ్నలూ అలాగే ఉన్నాయి .

‘’తపస్సు లక్షణం ఏమిటి ?’’యక్ష ప్రశ్న

‘’స్వధర్మాచారణమే ‘’యుధిష్టిర సమాధానం .

67-‘’దమం అంటే’’ ?

‘’ మనసుని అదుపు చేసి ఇంద్రియ నిగ్రహం సాధించటం ‘’

68-‘’శిఖర ప్రాయమైన క్షమఏది ?’’

‘’ద్వంద్వాలను సహించ గలగటం ‘’

69-‘’ఏది సిగ్గు ?’’

‘’చెడు పనుల పట్ల విముఖత ‘’

70-‘’జ్ఞానం ఏది “?

‘’పరతత్వ జ్ఞానం ‘’

71-‘’శమం అంటే ?’’

‘’  చిత్త ప్రశాంతి ‘’

72-‘’శిఖర ప్రాయమైన దయ ఏది “”?

‘’అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవటం ‘’

73-‘’ఏది రుజుత్వం””?

‘’ సమ చిత్తత ‘’

74-‘’మనిషికి అసాధ్యుడైన శత్రువు ఎవరు “?

‘’క్రోధమే ‘’

75-‘’అంతులేని వ్యాధి “”?

‘’ఇతరుల సొమ్ము తనదికావాలనే లోభం  ‘’

76-‘’ఎవరు సాధువు ‘’?

‘’సర్వ ప్రాణ హితం కోరేవాడు ‘’

77-‘’అసాధువు “?

‘’’’దయ లేని వాడు ‘’

78-‘’మోహం అంటే ?’’

‘’ధర్మ మూఢత్వమే మోహం ‘’.

ధర్మ మూఢత్వం అంటే-ఏది ధర్మమో ,దేన్నీ ఆచరి౦ చాలో ,ఏది చేయకూడదో తెలియక ఎటు పడితే అటు కొట్టుకు పోవటం .జ్ఞాన దీపం వెలగని చోట మూఢత్వంఅనే చీకటి  చిక్కగా వ్యాపించి ఉంటుంది. .భావావేశం కూడా మోహానికి చెందినదే  .అహం మోహాన్ని పెంచి ,తమో గుణానికి దారి తీసి వినాశ కారణత్వం అవుతుంది .శకుని మోహ పురుషుడైతే ,ద్రుత రాష్ట్రుడి  మనసు అటూ ఇటూ ఊగి చివరికి మోహం లోనే నిలుస్తుంది .ధర్మ పాలన దక్షత లేని వాడు గుడ్డిరాజు .రుజుత్వానికి మూర్తీభవించిన ఉదాహరణ విదుర మహాశయుడు .అంతులేని వ్యాధితో బాధ పడేవాడు దుర్యోధనుడు .ధర్మ రాజు సాధువు అని శ్రీ జి వి .సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు .మళ్ళీ ప్రశ్నా పరంపర కొనసాగింది .

79-‘’మానం అంటే ఏమిటి ధర్మ రాజా “?

‘’ఆత్మాభిమానమే మహాత్మా “’

80-‘’ఏది అలసత్వం “”?

‘’ధర్మాన్ని పాటించక పోవటాన్ని మించి అలసత్వం లోకం లో లేదు ‘’

81-‘’ఏది శోకం “”?

‘’అజ్ఞానమే శోకం ‘’

వీటిపై శ్రీ జి వి ఎస్ గారి వివరణ చూద్దాం –ధర్మాన్ని ఆచరించటానికి దక్షత కావాలి .దృఢ మైన దీక్ష లేక పోవటం అలసత్వం .అలసత్వం ఆలస్యానికి కారణమవుతుంది .బ్రాహ్మణ ఆచారాన్ని పాటించటం అంటేనే తపస్సు .ధర్మ శాస్త్రం ప్రతి ఒక్కరికీ వాళ్ళ కార్య క్షేత్రాన్ని నిర్దేశించింది .ఆ క్షేత్రం లో ఏమరుపాటు ,నిర్లక్ష్యం  లేకుండాజీవించటమే స్వధర్మాచరణం .సమాజం లో అలసులు ఎక్కువైతే పతనం చెందుతుంది .అజ్ఞానం అంటే శాస్త్ర పాండిత్యం లేక పోవటం ఒక్కటే కాదు ,సత్యాసత్య పరిజ్ఞానం లేక పోవటం .తత్వ దర్శనమైతే శోకం నశించి ,సమచిత్తత కలుగుతుంది .

82-‘’ఋషుల దృష్టిలో ఏది స్థైర్యం “”?

‘’’స్వధర్మం లో నిశ్చలంగా నిలబడటం ‘’

83-‘’దేన్ని ధర్యం అంటారు “?

‘’ఇంద్రియ నిగ్రహాన్ని ‘’

84-‘’ఉత్తమ స్నానమేది “”?

‘’మనసు  నిర్మలంగా ఉంచుకోవటమే ‘’

85-‘’ఉత్తమ దానం “”?

‘’భూత సంరక్షణ ‘’

ధర్మ రాజు ఇంద్రియ నిగ్రహాన్నే ధైర్యం అని జవాబు చెప్పాడు .యుద్ధ వీరుల ధైర్యం కంటే ఇదే శ్రేష్టమైనది అని భావం –‘’బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంస మపి కర్షతి’’-అంటే ఇంద్రియ సమూహ బలం అసాధారణ మైనది .విద్వా౦సు డినైనా అది లాగి పారేస్తుందని అర్ధం .కనుక ఇంద్రియ నిగ్రహమే ధైర్యం .త్రిషవణ స్నానాలు ,తీర్ధ స్నానాలకంటే  మనసును నిర్మలంగా ఉంచుకోవటమే ఉత్తమోత్తమ స్నానం .ఇదే అంతరంగాన్ని పరిశుద్ధి చేస్తుంది మామూలు స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తే చేయవచ్చు కాని మనో మాలినాన్ని కడిగి పార వేయ లేదు  మనసు పరిశుద్ధం కాకపొతే మనిషి ఉత్తమ గతి సాధించలేడు .సర్వ భూత రక్షణ మే ధర్మ దానం –దీనినే బుద్ధ భగవానుడూ చెప్పాడు .యక్ష ప్రశ్నలు, ధర్ముడి సమాధానాలు ధర్మ సూక్ష్మాలు .ధర్మ మర్మాలను తెలియ జేసేవి .తల స్పర్శ కాదు లోతుగా అధ్యయనం చేయాల్సినవి అంటారు శ్రీ జీ వి ఎస్ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-16-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ధన్యవాదాలు

నమస్తే కోటేశ్వర రావు గారు -సరసభారతి కోసం మీరు పంపిన5,000 రూపాయల  స్టేట్ బాంక్ చెక్  ఇప్పుడే అందింది .సరసభారతిపై మీకున్న నమ్మకం ఆ కార్యక్రమాల పై ఆసక్తి ,బ్లాగ్ విషయాలపై మీకున్న అభిరుచికి ఇది నిదర్శనం . మీ ప్రోత్సాహం మాకు మరింత బలం చేకూర్చి ముందుకు నడిపిస్తుందని ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను -దుర్గా ప్రసాద్ -ఉయ్యూరు -15-3-16  sunkara 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతికి విజయవాడ తుమ్మిడి బ్రదర్స్ శ్రీ శ్రీనివాస్ శుభాభినందనలు

సరస భారతికి విజయవాడ తుమ్మిడి బ్రదర్స్ శ్రీ శ్రీనివాస్ శుభాభినందనలుtummidi 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వేసవిలో ఒక చల్లని కదా సాయంత్రం

వేసవిలో ఒక చల్లని కదా సాయంత్రం

శ్రీ అనిల్ అట్లూరి చాలాకాలం నుంచి నెట్ ద్వారానే పరిచయం .ప్రతి మొదటి ఆదివారం సాయంత్రం ఏదో సాహిత్య చర్చ ను ‘’వేదిక –సాహిత్యం కోసం మనం ‘’వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరితో పాటు నాకూ పంపటం చూసీ చూడనట్లు నేను వదిలేయటం మరీ మంచి కార్యక్రమం అయితే బాగా జరగాలని కోరటం దానికి ఆయన ఒక ఆదివారం హైదారాబాద్ లో ఉన్నప్పుడు వీలు చూసుకొని రమ్మని రాయటం జరిగింది .ఆ అవకాశం ఇంతవరకురాలేదు .ఉయ్యూరు నుంచి ఆదరాబాదరా హైదరాబాద్ రావటం .పని అవగానే పరుగెత్తుకొని వచ్చి ఉయ్యూరులో వాలటం జరుగుతోంది .

12-3-16 శనివారం సాయంత్రం 5గం లకు కూకట్ పల్లి లో శ్రీ అనిల్ అట్లూరి నిర్వహించిన ”వేదిక -సాహిత్యం తో మనం ”లో అఫ్సర్ కద”చమ్కీ పూల గుర్రం ”కధపై చర్చ ,శ్రీ ఆడెపు లక్ష్మీపతి కధలపై శ్రీ ఏ వి భాస్కర రావు విశ్లేషణ చిత్రాలు

మార్చి 10 నుండి 13 వరకు ఈ సారి మా రెండో అబ్బాయి శర్మవాళ్ళ ఇంట్లో బాచుపల్లిలో ఉన్నాం .12వ తేదీ శనివారం సాయంత్రం దాకా ఏదో నెట్ లో రాస్తూనే ఉండగా మా వాడు అనిల్ అట్లూరి గారి కార్యక్రమానికి  వెళ్దాం రెడీ అవమనటం,అవటం కారులో కుకట్ పల్లి కల్యాణి జూయలర్స్ దగ్గరున్న ఒక విద్యాలయంలో ‘’వేదిక ‘’జరుగుతోందని అది ప్రతి రెండవ శనివారానికే కూకట్ పల్లి కి  మార్చినట్లుతెలిస్సింది  .సుమారు పావు తక్కువ అయిదింటికి వెళ్లాం ఇద్దరం.  అనిల్ గారితో సహా  ఒక ఆరు,మందే కనిపించారు హైదరాబాద్ లోనూ శ్రోతలకు కరువా అను కొన్నా .క్రమంగా వాలటం ప్రారంభించారు .అయిదున్నరకు ఒక ఇరవై ఆ తర్వాతా ముప్ఫై మందీ అవటం ఆనందం కలిగించింది .తలనెరిసిన నాలాటి వారితో బాటు జుట్టేలేనివారే ఎక్కువగా ఉన్నా ,ఒక అరడజను యువకులు కనిపించగానే ఉత్సాహం రెట్టింపయ్యింది .అనిల్ గారు మౌన వ్యాఖ్యాతగానే ప్రేక్షక పాత్రే ఎక్కువగా పోషించారు .స్వీటు హాటు టీలు అందరికీ అందాయి .

ఆ నాటికార్యక్రమం లో ముఖ్య విషయ౦ శ్రీ అఫ్సర్  రాసిన ,ఆంధ్రజ్యోతిలో పడిన ‘’చమ్కీ పూల గుర్రం ‘’పై చర్చ.కధను ఒక కుర్రాడు మొబైల్ లోంచి చదివి వినిపించాడు బాగా చదివాడు కూడా . ఈకద పై చర్చలో పాల్గోనేవ నెటిజన్ లకు ముందే లింక్ లతో  అందజేశారు .చదివి సిద్ధమై రావాలని అనిల్ గారి హృదయం .కాని అందరూ చదివి వచ్చారని  నాకు అనిపించలేదు . కద పై సభ్యుల స్పందన .సూది తీసి దూలానికి గుచ్చినట్లు మోడీ మీద ,బి జెపి,ఆర్ ఎస్ ఎస్ ల పైనా విమర్శ జడివాన కురిసింది .ముస్లిం లు అభద్రతా భావం లో పడిపోవటం దీని వెనుక ఉందని ఒకాయన అంటే ,యునాని ఆయుర్వేదాలలో ముస్లిం లను తీసుకోరని ప్రచారం సాగుతోందని మరొకరు అన్నారు .వాళ్ళను పరిచయం చేయ లేదుకనుక పేర్లు రాయలేదు . మోడీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా దర్గాలకు హిందువులు వెడుతూనే ఉన్నారని ,ఎక్కడా స్పర్ధలు కనిపించలేదని అన్నాను .కాని మా ఉయ్యూరు కాలేజి రిటైర్డ్ తెలుగు లెక్చరర్ శ్రీ ఏ ఎస్ ప్రసాద్ తమ్ముడు శ్తీ ఏ వి భాస్కరరావు గారు చురుగ్గా చర్చలో పాల్గొన్నారు .ఇంతలో శ్రీ  వడ్డేనవీన్ ,శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ కూడా రావటం నిండు దనాన్నిచ్చింది .మహిళలూ లెక్కింప దగిన సంఖ్య  లో హాజరవటం శుభ సూచకం .కాని వారెవరూ చర్చలో పెద్దగా పాల్గొనలేదు .ఈ కధకు ముగింపు గురించి కొద్ది సేపు చర్చ జరిగింది .ఇటీవలే అమెరికానుంచి వచ్చిన శ్రీ బ్రహ్మానందం గారు అసలు ప్రపంచ కధలలో తొంభై శాతం కధలలోముగింపు ఉండదని చెప్పారు. శ్రీ నవీన్ ముగింపు ఉండాలన్న నియమమం ఏదీ కధకు లేదన్నారు .మహా కధకుడు శ్రీ ఆజాద్ దేనికీ స్పందించలేదు .

రెండవ విషయం గా శ్రీ ఆడెపు లక్ష్మీ పతి ‘’నాలుగు కధలు ‘ను  శ్రీఏ.వి  భాస్కర రావు బాగానే విశ్లేషించారు .లక్ష్మీపతి చేనేతకార్మికుడని ,తర్వాత బొగ్గు గనిపనిలో చేరాడని ,కొద్ది కధలే రాసినా లోతుగా అధ్యయనం చేసి రాశాడని ,ఆంప శయ్య ననీన్ లాగా ‘’చైతన్య స్రవంతి ‘’లో కధలు నడిపాడని ,సాంకేతిక పదజాలాన్ని బాగా గుప్పించాడని ,అది చదువరులకు మింగుడు పడటం కష్టమని ,అయినా చదివి తీరాల్సిన కదలనీ వివరించారు .స్పష్టంగా ముందు వెను కధలను కలుపుతూ వినేవారికి కన్ఫ్యూజన్ లేకుండా భాస్కర్ మాట్లాడిన తీరు ఆకట్టుకొంది .ఆడెం కధలకు పెట్టె పేర్లు కూడా తమాషాగా ఉంటాయని ‘’ముసలమ్మ మూట ‘’తిర్య్గ గ్రేఖ ‘’కధలను విశ్లేషించిన తీరు బాగుంది . అంతావిన్నారే కాని తిర్యగ్రేఖ అంటే ఏమిటో ఎవరికీ పెద్దగా తెలిసినట్లు లేదు .దాచుకోకుండా ఈ విషయాన్ని శ్రీ టి భాస్కర రావు గారు అడిగారు .అప్పుడు నేను ఒకటి లేక ఎక్కువ రేఖలను ఖండి౦చే రేఖను  తిర్యగ్రేఖ అంటారని ,చేదన రేఖ అనే పేరు కూడా ఉందని  పదవ తరగతి వరకు రేఖా గణిత సిద్ధాంతాలలో ఈ పదం వస్తుందని చెప్పి ‘’రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ  ఖండించగా ఏర్పడు ఏకాంతర కోణాలు సమానమని తిర్యగ్రేఖకు ఇరు వైపులా ఉన్న కొణాల మొత్తం 180డిగ్రీలు ‘’అన్న సిద్దాంతాన్ని చెప్పాను .అందరూ చదివి౦దే కాని దాని అవసరం లేక మర్చి పోయి ఉండచ్చు .

శ్రీ భాస్కర్- లక్ష్మీపతి చాలామంది పాశ్చాత్య రచయితలను చదివాడని వారి సాహిత్య ప్రభావం అతనిపై ఉందని అన్నారు .అప్పుడు నేను ‘’విలియం కార్లోస్ విలియమ్స్ ,దారంటన్,సామ్యుయల్ బెకెట్ ల ధోరణి ఇలాగే ఉంటుందని చెప్పాను . మొత్తం మీదా హాపీ హాపీగా సాహిత్యం లో మమేకమయ్యే మంచి కార్యక్రమం .వీలు ఉన్నవారందరూ హాజరై నిర్వహించేవారికి మరింత ఉత్సాహం కలిగించాలని నా కోరిక .చివరగా అందరితో గ్రూప్ ఫోటో దీనికి హై లైట్ అయి మధురానుభూతిని మిగిల్చి చిరస్మరణీయం చేసింది  .వేదిక పదికాలాలు వృద్ధి చెంది సాహిత్య పరిమళాలను సమాజం లో వెదజల్లాలని కోరుతున్నాను .

కొసమెరుపు –వేదిక నిర్వహణకు అధ్యక్షుడు లేకపోవటం, అందరికి  ప్రాతినిధ్యం ఉండటం ప్లస్ పాయింట్ అయితే కొత్తవారిని సభ్యులకు పరిచయం చేయటం వారు నిర్వహిస్తున్న సాహితీ కార్య క్రమాల వివరాలు తలియ జెప్పే ప్రయత్నం చేయకపోవటం గొప్ప వెలితి .అలాగే హాజరైన వారందరూ అందరికీ తెలియక పోవచ్చు ఎవరికి వారు స్వ పరిచయం చేసుకొని ఉంటె ఆత్మీయత మరింత పెరుగుతుంది అనిపించింది .

నేను తీసుకొని వెళ్ళిన ‘కేమో టాలజీ పిత కోలాచల సీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’4 పుస్తకాలను శ్రీ అనిల్ ,భాస్కర ద్వయం ,ఆజాద్ లకు   అందజేశాను .సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకల ఆహ్వాన పత్రాలను అందరికి ఇచ్చాను . ఆజాద్ గారి దగ్గర చేరి నేను దుర్గాప్రసాద్ –ఉయ్యూరు అనగానే గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు ఆజాద్ మాట అన్నా కద అన్నా ,కద చదివే తీరు అన్నా నాకు ,మా శ్రీమతికి అమిత ఇష్టం .రేడియోలో కద చదవగానే వెంటనే స్పందించి ఫోన్ చేసేవాడిని .సుమారు 5 ఏళ్ళ క్రితం మేము మద్రాస్ లో ఉండగా ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు .రాదా -మధు సీరియల్ లో అయన పాత్ర మరీ ఇష్టం .చానెళ్ళలో కనబడటం లేదేమని అడిగాను .నవ్వి రెండు నవలలు రాస్తున్నానని త్వరలో రిలీజ్ చేస్తానని చెప్పారు . నవీన్ విపుల నిర్వహించిన కధలపోటీలో తానూ కారా మాస్టారు అబ్బూరి చాయాదేవిగారు జడ్జీలుగా ఉన్నామని మేష్టారు తానూ లక్ష్మీపతి కధకే మొదటి బహుమతినివ్వాలని నిర్ణయించామని చాయాదేవిగారు ఆ కద అందరికి అర్ధం కాదని,అందుకే తనకు అభ్యంతరం అని చెప్పారని చివరికి అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆ కధకు మొదటి బహుమతినిచ్చామని ఫ్లాష్ బాక్ కద చెప్పారు .

మొత్తం మీద నడి వేసవి లాంటి మార్చి వేసవిలో  ఈకార్యక్రమం ఆహ్లాదాన్ని ,ఆనందాన్ని చల్లదనాన్ని కల్గించింది ఏర్పాటు చేసిన శ్రీ అనిల్ గారికి ,పాల్గొన్న సాహిత్యాభిమానులకు అభినందనలు –

గబ్బిట దుర్గా ప్రసాద్ -14-3-16-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వేదిక – సాహిత్యం తో మనం – హైదరాబాద్ –

This gallery contains 26 photos.

More Galleries | Tagged | Leave a comment

11-3-16 శుక్రవారం హైదరాద్ లో మా బావమరది ఆనంద్ఇంట్లో మనవరాలు (కూతురు ఛి సౌ స్పందన కుమార్తె )బారసాల చిత్రాలు 

11-3-16 శుక్రవారం హైదరాద్ లో మా బావమరది ఆనంద్ఇంట్లో  మనవరాలు (కూతురు ఛి సౌ స్పందన కుమార్తె )బారసాల చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమెరికాలో విద్యా వ్యవస్థలో అత్యున్నత పదవి పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ మేరీ చర్చ్ టెరెల్ (విహంగ కు ప్రత్యేకం )

అమెరికాలో విద్యా వ్యవస్థలో అత్యున్నత పదవి పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ మేరీ చర్చ్ టెరెల్ (విహంగ కు ప్రత్యేకం )

అమెరికాలోని మెంఫిస్ రాష్ట్రం లో టెన్నెసీలో మేరీ చర్చ్ రాబర్ట్ రీడ్ చర్చ్,లూసియా ఏయర్స్ కు మేరీ చర్చ్23-9-1863న జన్మించింది .ఇద్దరు పూర్వపు మిశ్రమజాతి బానిసలే .మేరీ కి ఆరేళ్ళు వచ్చేసరికి ఇద్దరూ ఆమె విద్య నేర్చుకొని ఎదగాలని భావింఛి ఒహాయ్ రాష్ట్రం లోని ఎల్లో స్ప్రింగ్స్ లో ఉన్న  యాంటి యాక్ కాలేజ్ .మోడల్ స్కూల్ లో చేర్పించారు .అక్కడే సెకండరీ స్థాయివరకు చదివింది .తలిదండ్రులు విడాకులు పొందటం తండ్రి మళ్ళీ రెండు సార్లు పెళ్లి చేసుకోవటం మేరీ జీవితానికి కొన్ని అడ్డ౦కు లైనాయి .అన్ని జాతులకు ఆహ్వానం పలికే   ఓబెరిన్ కాలేజి లో మగ పిల్లలతో సహ విద్యాభ్యాసం చేసి  మేరీ క్లాసిక్స్ చదివింది .తన క్లాస్ పొయెట్ గా ఎంపికై ,తర్వాత కాలేజి లోని రెండు సాహిత్య సొసైటీలకు ఎన్నికైంది .ఒబెరియన్ రివ్యు పత్రికకు సంపాదకురాలై గుర్తింపు పొందింది .1884లో అమెరికాలో బాచిలర్ డిగ్రీ పొందిన   మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళలో ఒకరుగా  గుర్తింపు పొందింది .నాలుగేళ్ల తర్వాత మాస్టర్ డిగ్రీ కూడా సాధించింది .

వాషింగ్ టన్ డి.సి.లో బ్లాక్ సెకండరీ స్కూల్ లో ఉపాధ్యాయ జీవితం ప్రారంభించింది .తరువాత మేధడిస్ట్ చర్చ్,ఆఫ్రికన్ మెధడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ సంయుక్తంగా ఒహాయో లో నల్ల జాతి వారికోసమే ప్రత్యేకంగా స్థాపించిన చారిత్రాత్మక విల్బర్ ఫోర్స్ కాలేజి లో విద్యా బోధన చేసింది .అమెరికా అంతర్యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆఫ్రికన్ మేధడిస్ట్ చర్చ్ కాలేజీని కొన్నది .అప్పుడు మేధదిస్ట్ చర్చ్ కాలేజీ నిర్వహణ నుంచి విడుదల పొంది మొదటి బ్లాక్ పాలనా సంస్థగా నిర్వహించింది .ఇక్కడ మేరీ చర్చ్ కొంతకాలం   పని చేసి యూరప్ వెళ్లి రెండేళ్ళు చదివి ,ఫ్రెంచ్ ,జర్మన్ ,ఇటలీ భాషలలో సామర్ధ్యాన్ని గడించింది . తిరిగి వచ్చి తాను పని చేసిన హైస్కూల్ ప్రిన్సిపాల్ అయింది .

మేరీ  18-11-1891లో  రాబర్ట్ హెర్బర్టన్ టెర్రెల్ అనే లాయర్ ను వివాహ మాడింది .రాబర్ట్ వాషింగ్ టన్ డి.సి.లో మొట్టమొదటి నల్ల జాతి మునిసిపల్ కోర్ట్ జడ్జి.మేరీ ఏం.స్ట్రీట్అనే ఉన్నత ప్రమాణాలున్న  హైస్కూల్ లో బోధిస్తూ ప్రిన్సిపాల్ పదవి లో రాణించింది .ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కలిగినా చిన్నతనం లో ఇద్దరు చనిపోగా  ఫిలిస్ అనే కూతురు మాత్రమే దక్కింది . ఈమెకు తోడుగా మేరీ  అనే మరోకమ్మాయిని  పెంచుకొన్నారు .

మేరీ చర్చ్ తండ్రి ద్వారా నల్ల జాతి నాయకుడు  ఫ్రెడరిక్ డగ్లాస్ ,అలబామా లోని టస్కేగీ ఇన్ స్టి .ట్యూట్ డైరెక్టర్       బుకర్ టి.వాషింగ్ టన్ లతో  పరిచయం కలిగింది .అనేక పౌరహక్కుల ఉద్యమాలలో వారితో కలిసి పని చేసింది .ఉద్యమాలు వదిలి కుటుంబం పై ద్రుష్టి పెట్టాలను కొన్నది. కాని డగ్లాస్ ఆమె లాంటి ప్రతిభా మూర్తులు ఉద్యమానికి చాలా అవసరమని నచ్చ చెప్పి ఉద్యమ భాగ స్వామిని చేశాడు .

1896లో టెర్రెల్’’ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కలర్డ్ విమెన్ ‘’కు మొదటి ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడింది .ఈ సంస్థ నర్సరీలు , కిండర్ గార్డెన్  స్కూళ్ళను  స్థాపించి నడిపింది  .అనాధల ఆలనా పాలనా చేబట్టింది .1896లో మేరీ ‘’నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ విమెన్ ‘’ఏర్పాటు చేసి నడిపింది తరువాత ఇదే ‘’నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యూని వర్సిటి విమెన్ ‘’గా ఎదిగింది .ట్రెయినింగ్ కార్యక్రమాలనూ ఈ సంస్థ ప్రారంభించింది .సమర్ధ వంతంగా స్కూల్స్ ను నిర్వహించటం విద్యా వ్యాప్తికి కృషి చేయటం గుర్తించిన ప్రభుత్వం ఆమెను ‘’డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ‘’లో గౌరవ స్థానం కల్పించి౦ది .ఇందులో ఆమె  1895-1906వరకు 11సంవత్సరాలు సేవలందించింది .అమెరికా చరిత్రలో ఇంతటి ఉన్నత పదవి అందుకొన్న తొలి నల్లజాతి మహిళ గా రికార్డ్ స్థాపించింది .నేషనల్ ఉమెన్ సఫ్రేజ్ అసోసియేషన్ లో  మేరీ టెర్రేల్ ప్రముఖ పాత్ర పోషించింది .ఇందులో పని చేస్తూనే నల్లజాతి స్త్రీలకూ ఓటు హక్కు కోసం పోరాడింది .వీరి హక్కుల కోసం ఆఫ్రో అమెరికన్ ఉమెన్ ఫెడరేషన్ ను స్థాపించింది .

మేరీ టెర్రెల్ సాధించిన విజయాలన్నీ అమెరికా ప్రగతి శీల కాలం (ప్రోగ్రెసివ్ ఎరా )లో సాధించినవే .జర్నలిస్ట్ గా కూడా ఆమె పేరు పొందింది .’’యుఫెమియా కర్క్’’అనే కలం పేరుతొ రచనలు చేసేది .ఆఫ్రికన్ అమెరికన్ వుమెన్స్ క్లబ్ ఉద్యమం ఆర్ధిక సాయం కోసం నల్లజాతి వారి ,తెల్లజాతి వారి ప్రెస్ లలో తన రచనలను ముద్రించింది  చర్చ్ .రివ్యు ఆఫ్ ఫిల డెల్ఫియా.,ఇండియానా పోలిస్ ఫ్రీ మన్, ఆఫ్రో అమెరికన్ ,వాషింగ్ టన్ ట్రిబ్యూన్ ,,న్యూ యార్క్ ఏజ్ ,వాయిస్ ఆఫ్ ది నీగ్రో ,వాషింగ్ టన్ ఈవెనింగ్ స్టార్ మొదలైన ప్రసిద్ధ  పత్రికలలో వ్యాసాలూ రాసింది .ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్స్ క్లబ్ మువ్ మెంట్ లో చేరి నల్లజాతి స్త్రీ హక్కుల కోసం నల్లజాతి వారికి సమాన హక్కులకోసం   పోరాడింది .వాషింగ్ టన్ డి.సి.లోని బ్లాక్ డిబేట్ ఆర్గనైజేషన్  ‘’బెతేల్ లిటరరీ అండ్ హిస్టారికల్ సొసైటీ ‘’కి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఎన్నికై చరిత్ర సృష్టించింది .

1904లో జర్మనీలోని బెర్లిన్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఉమెన్ సభలో ప్రసంగించటానికి  మేరీ ని  ఆహ్వానించారు .ఆ సభలోమాట్లాడిన వారిలో  మేరీ టెర్రెల్ ఒక్కరే నల్లజాతి మహిళ అవటం విశేషం .జర్మనీ భాషలో మాట్లాడి అందరి ప్రశంసలను గౌరవాన్ని సత్కారాన్నిపొందింది .సభ యావత్తూ లేచి నిలబడి(స్టాండింగ్ ఒవేషన్) కరతాళ ద్వానులతో ఆమెను అభినందించటం ఒక చారిత్రిక సంఘటన .  తర్వాత ఫ్రెంచ్ భాషలో కొంతసేపు మాట్లాడి చివరకు ఇంగ్లీష్ తో ముగించింది .1909లో ఇడా.బి.వేల్స్ బార్నెట్ అనే మరో ప్రముఖ నల్లజాతి ఉద్యమ నాయకురాలితో కలిసి నల్లజాతిహక్కులకోసం ‘’కాల్ ‘’అనే అనే విజ్ఞాపన పత్రం పై సంతకం పెట్టి ,’’నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ ‘’సభలో పాల్గొన్నది .1913-14లో ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా పదివీ బాధ్యతలు నిర్వహించింది .నల్లజాతి మహిళకు’’ కోడ్ ఆఫ్ కాండక్ట్ ‘’అంటే ప్రవర్తన నియమావళి రాసింది .

మొదటి ప్రపంచ యుద్ధం లో వార్ కాంప్ కమ్యూనిటి సర్వీస్ లో పనిచేసి వినోదకార్యక్రమాల అవసరాన్ని తెలియ జేసింది .యుద్ధం తర్వాత కూతురు ఫిలిస్ తో కలిసి ఆలిస్ పాల్ ,లూసీ బర్న్స్లతో సంయుక్తంగా    స్త్రీ వోటుహక్కు ఉద్యమాలలో పని చేసింది  వైట్ హౌస్ ను ఎదుట పికెటింగ్ చేసి  నల్లజాతి ముసలివారికి ఉద్యోగాలకోసం నినాదాలు చేసింది .అంతర్జాతీయ శాంతి సమావేశానికి సభ్యురాలుగా హాజరై ,ఇంగ్లాండ్ లో ప్రముఖ రచయిత హెచ్ జి వేల్స్ దంపతుల  ఆహ్వానంపై వారిని కలిసి మాట్లాడింది .మహిళా ఓటు హక్కు ఉద్యమం లో కీలక పాత్ర వహించింది .దీని ఫలితంగా  అమెరికా రాజ్యంగా 19 వ సవరణ జరిగి ఓటు హక్కు లభించింది .1920 వారెన్ హేస్టింగ్స్ ప్రెసిడెంట్ గా పోటీ చేసినప్పుడు  రిపబ్లికన్ పార్టీలో చురుకైన కార్య కర్తగా పని చేసి వుమెన్ రిపబ్లిక్ లీగ్ కు ప్రెసిడెంట్ గా పని చేసింది .ఈ ఎన్నికలోనే మొట్టమొదటి సారిగా అమెరికాలో స్త్రీ ,పురుషు లందరికి  సమానంగా  ఓటు హక్కు లభించింది .ఈ సందర్భంగా ఆమె రిపబ్లికన్ పార్టీ నల్లజాతి వారికి  అన్ని హక్కులను ప్రసాదిస్తుంది అని నమ్మకంగా చెప్పింది .కాని దక్షిణ రాష్ట్రాలలో మెజారిటీ ఉన్న డెమోక్రాట్లు మాత్రం 1990-98కాలం లో నల్లజాతి వారి ఓటు హక్కు  నమోదు వినియోగాలపై నిషేధం విధించింది .1925లో ఓటింగ్ హక్కు చట్టాన్ని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన తర్వాత అన్ని చోట్లా నల్లవారికి సమానంగా ఓటు హక్కు లభించింది .

1940లో టెర్రేల్ తన జీవిత చరిత్రను ‘’తెల్ల ప్రపంచం లో నల్ల మహిళ’’(ఎ కలర్డ్ వుమన్ ఇన్ ఎ వైట్ వరల్డ్ )గా రాసుకొన్నది .1950లో కొలంబియా జిల్లా లో ఆహార పదార్ధాల విక్రయ శాలలను ఏకీకృతం చేసే మహా ప్రయత్నం లో విజయం సాధించింది .కాని 1890లో కొలంబియా జిల్లా దక్షిణ రాష్ట్రాల దారి పట్టి వర్ణ విద్వేషం చూపింది .దీనిపై మళ్ళీ పోరాటం సాగించి న్యాయం కోసం కోర్టు లో వ్యాజ్యం వేసింది .కోర్టు విచారించి టేర్రేల్.కు న్యాయం చేసి ,విచక్షత  రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు నిచ్చింది .అందరూ కలిసి తినే సంస్కరణ లను వ్యతిరేకించే వారి పై వెయ్యి డాలర్ల అపరాధ రుసుము విధించారు .ఆమెది మౌన పోరాటం .పికెటింగులు ,బాయ్ కాట్లు ,మౌనంగా కూర్చోవటం తో అనుకొన్నవన్నీ  సాధించింది .ఇదే మన  గాంధీ గారికీ ఆదర్శమైంది .చివరగా 8-6-1953న కోర్టు వాషింగ్ టన్ డి.సి.లో అమలౌతున్న  హోటళ్ళలో వర్ణ విచక్షణ కూడదని ,రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ప్రకటించింది .ఇంత పోరాటం చేసి  విజయం సాధించింది .

80ఏళ్ళు మీద పడినా, మేరీ చర్చ్  సినిమా హాళ్ళు ,హోటళ్ళు,మొదలైన పబ్లిక్ ప్రదేశాలలో విచక్షణకు వ్యతిరేకంగా   పికెటింగ్ లలో పాల్గొన్నది..మౌన ప్రదర్శనలు నిర్వహించింది .జీవితం చివరి ఘట్టం లో కూడా ఆమె పోరాట పటిమ తగ్గలేదు .చివరగా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూని వర్సిటి ఉమెన్ లో నల్లవారిని సభ్యులుగా తీసుకొనేట్లు చాప్టర్ కమిటీని ఒప్పించి  చేయగలిగింది .పబ్లిక్ స్కూల్స్ లో వర్ణ వివక్షత రాజ్యాంగ విరుద్ధమని బ్రౌన్ వి బోర్డ్ ఎడ్యుకేషన్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును విన్న అదృష్ట వంతురాలు మేరీ .నిరంతర పోరాటాలలో నలిగి ,అలసిపోయి ,విజయాలు సాధించి ,తన జాతి గౌరవాన్ని ఇనుమడింప జేసిన  మేరీ చర్చ్ టెర్రేల్  90 వ ఏట 24-7-1954న శాశ్వత కీర్తి నార్జించి అన్నే అరండల్ జనరల్ హాస్పిటల్ లో ఒక వారం లో ఆమె స్వంత పట్టణం అన్నా పోలిస్ లోఆమె ఆధ్వర్యం లో  యెన్ .ఏ.సి.డబ్ల్యు సమావేశాలు జరుగుతాయనగా  మరణించింది .

టెర్రేల్ కు అనేక వార్డులు రివార్డులు లభించాయి .ఒబెరిన్ కాలేజి శత జయంతిలో అవార్డు ,అలాగే ఆ కాలేజి కి చెందిన100మంది ప్రముఖులలో ఒకరుగా ఎన్నికైంది .ఒబెరిన్ కాలేజి  ఆమె కు ‘’ఆనరరీ డాక్టరేట్ ఆఫ్ హ్యూమన్ లెటర్స్ ‘’అందించింది . ఆమె రచనలూ చాలా ప్రసిద్ధి చెందాయి .12పుస్తకాలు రాసింది .అందులో ఆమె జీవిత చరిత్ర తో పాటు – ‘’డ్యూటీ ఆఫ్ ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కలర్డ్ ఉమెన్ టు ది రేస్ ‘’,ఐ రిమెంబర్ ఫ్రెడరిక్ డగ్లాస్ ‘’’’పాల్ లారెన్స్ డన్బార్,’’మొదలైనవి ఉన్నాయి .నల్ల జాతి వారి వేగు చుక్క ఆమె .

గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -5

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -5

కామాన్ని త్యాగం చేస్తే మనిషి అర్ధ వంతుడవుటాడని ,కోరికలను వదిలేస్తే సంపన్నుడౌతాడని ధర్మరాజు భావం .నిరంతర కోరికలు నిరంతర దరిద్రానికి హేతువులు .కోరిక ఆగిపోతే మిగిలేది సంపన్నత ,అదీ ఆత్మ సంపన్నత .అదే అందరికీ కావాలి .తర్వాత దానం విషయమై ప్రశ్నిస్తున్నాడు యక్షుడు .

49-‘’బ్రాహ్మలకు దానం ఎందుకు ?’’

‘’ధర్మం కోసం ‘’అని ధర్మరాజు సమాధానం  .

50’’-నటులకు నాట్యం చేసేవారికి దానం ఎందుకు ?’’

‘’కీర్తికోసం ‘’

51-‘’సేవకులకు దానం ఎందుకు ‘’?

‘’పోషణ కోసం ‘’

52-‘’రాజులకు దానం ఎందుకు ‘’?

‘’భయం వలన ‘’

53-‘’లోకాన్ని ఆవరించి ఉన్నదేది ‘’?

‘’అజ్ఞానం ‘’

54-‘’అది ఎందుకు ప్రకాశించదు’’?

‘’అజ్ఞానం వలన ‘’

55-‘’మనిషి మిత్రుల్ని ఎందుకు విడిచిపెడతాడు ‘’?

‘’లోభం వలన ‘’

56-ఏ కారణం వలన స్వర్గానికి పోలేరు ?’’

‘’విషయాసక్తి వలన ‘’

‘’లోకం లో తలిదండ్రులు ,మిత్రుడు ఈ ముగ్గురే  హితులు .తక్కినవాళ్ళు ప్రయోజనాన్ని బట్టి హితులౌతారు ‘’అని పంచ తంత్రం హితవు చెప్పింది .మిత్రులను సంపాదించుకోవాలి నిలుపుకోవాలి .కర్ణ దుర్యోధనులు ప్రయోజనం కోసం మిత్రులయ్యారేకాని అసలు మిత్రులుకారు. అసలు మిత్రులు కృష్ణార్జునులు .అర్జునుడి కోసం  కృష్ణుడు ప్రాణాలిస్తాడు .అవసరమైతే మందలిస్తాడు .కార్యోన్ముఖుడిని చేస్తాడు .దుఖం నుండి బయట పడేస్తాడు కర్తవ్యమ్ బోధిస్తాడు .ప్రతిజ్ఞను నిలబెట్టుకొనే ధైర్యమిస్తాడు .దుర్యోధనుడికి కర్ణుడు ‘’తందాన తాన గాడు ‘’.మార్గ దర్శనం చేసే శక్తి లేనివాడు .లోభం వలన మిత్రుల్ని పోగొట్టుకొన్నవాడు గుడ్డి రాజు .లోభం కూడా ఒక స్వీయ కేంద్ర ప్రవృత్తే అన్నారు జి వి ఎస్ .గారు .తరువాత యక్షుడు మృతలక్షణం పై ప్రశ్నలను సంధించాడు .

57-‘’ .మనిషి మృతుడు ఎలా అవుతాడు “”?

‘’దరిద్రం వలన ‘’

58-‘’రాష్ట్రం ఏ విధంగా మృతం అవుతుంది ‘’?

‘’రాజు లేక పోవటం వలన ‘’

59-‘’శ్రాద్ధ కర్మ ఏ విధంగా మృతమౌతుంది ?’’

‘’శ్రోత్రియుడు లేక పోవటం వలన ‘’ ‘’

60-‘’యజ్ఞం ఏ విధంగా మృతం అవుతుంది ‘’?

‘’దక్షిణలు లేక పోవటం వలన ‘’

మృతం అంటే ప్రాణం లేక పోవటమేకాదు.నిష్ప్రయోజనం అని కూడా అర్ధం .రాష్ట్రం అంటే రాజ్యం అని అర్ధం .ధృత రాస్ట్రుడు అంటే రాజ దండాన్ని ధరించి రాజ్యం లో ప్రజలకు రక్షణ కల్పించేవాడని అర్ధం ఈ ధర్మాన్ని పాటించక పొతే రాజ్యం మృతమే అవుతుందని యుదిస్ష్టిరుని విశ్వాసం .రాజదండం ధార్మిక ప్రయోజనాన్ని కోల్పోతే రాజ్యం మృతమే అవుతుంది .కనుక రాజు బాధ్యత గొప్పది .ధర్మ రాజుకు రాజధర్మం విస్పష్టంగా తెలుసు .ఇప్పుడు అవీఇవీ ప్రశ్నలు అడుగుతున్నాడు యక్షుడు .

61-‘’రాజా ! దిక్కు ఏది ‘’?

‘’మహాత్మా !లోకానికి సజ్జనులే దిక్కు .’’

62-‘’ఉదకం ఏది “”?

‘’ఆకాశమే ఉదకం .’’

63-‘’అన్నం ఏది ‘’?

‘’గోవు ‘’

64-‘’విషం ఏది ‘’?

‘’  కోరిక ‘’

65-శ్రాద్ధానికి తగిన కాలం ‘’?

‘’సద్బ్రాహ్మండు వచ్చిన సమయమే ‘’

ప్రజలు ఆపత్సమయం లో సజ్జనులనే ఆశ్రయిస్తారు .సజ్జనుడే పాలన చేయాలని అభిలషిస్తారు .ఆకాశమే జలం అనటం లో లోతైన భావన ఉంది .ఆకాశమే జలాన్ని ధరించి భూమికి దానం చేస్స్తుంది .కనుక ఆకాశానికి జలానికి భేదమే లేదు .ఆవు అన్నం అనటానికి కారణం –ఆవుపాలు సిద్ధాన్నం కావటమే .గో సంపద ధన సంపదను సృష్టించి అన్నాన్ని సృష్టిస్తుందని భావం .కోరికలో మృత్యు లక్షణం ఉంది .తీరనికోరిక దుఖాన్నే ఇస్తుంది .దుఖమే మృత్యువు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-16-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు -3-4-16 ఆదివారం -మధ్యాహ్నం 3-30గం

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు -3-4-16 ఆదివారం -మధ్యాహ్నం 3-30గం1durmukhi ugadi vedukalu- 001 2durmukhi ugadi vedukalu 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -4

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -4

యక్షుడు  గూఢమైనవేకాక గాఢమైన మైన ప్రశ్నలూ వేశాడు. అంతే దీటుగా  ఘాటుగా లోతైన సమాధానాలు చెప్పాడు యుధిష్టిరుడు-ఆ వైనం చూద్దాం –

33-మానవుడికి ఆత్మ ఏది ?ప్రశ్న

‘’కొడుకే ఆత్మ’’ జవాబు

34-‘’మనిషికి దేవుడు అనుగ్రహించిన మిత్రుడెవరు’’ ?

‘’భార్య ‘’

35-‘’మనిషికి జీవనమార్గం ఏది ?’’

‘’మేఘం ‘’

36’’-మానవుడికి పరమాశ్రయం ఏది ‘’?

‘’దానం ‘’

స్మ్రుతి సమ్మతంగా ధర్మ రాజు సమాధానాలున్నాయి .భార్యాభర్తలు మంచి స్నేహితులుగా మెలగాలన్నదే నేటి దాంపత్య  వికాస సూత్రం .ధర్మం సనాతనం ‘అంటే ప్రాచీనమైనది అని అర్ధం కాదు శాశ్వతమైంది అని అర్ధం .గృహస్థ ధర్మం లో భార్య స్థానం అద్వితీయమైనది .దీని మూలం తెలిసినవాడు కనుక ధర్మ రాజు చక్కని సమాధానమే చెప్పాడు .దుష్యంతుడికి శకుంతల మిత్ర స్థానమేమిటో ఆయన కొలువులోనే విస్పష్టంగా చెప్పిన విషయ౦  తెలిసిందే .జీవన మార్గం అంటే ప్రాణాధారం .అందుకే మేఘం అన్నాడు .నీరు లేక ప్రాణం నిలవదు. దానికి మేఘం ఆధారం కదా .మనం ఇచ్చిందే మనల్ని నిలబెడుతు౦ది కనుక దానం పరమ ఆశ్రయం అని గొప్ప జవాబు చెప్పాడు అని విశ్లేషించారు శ్రీ జి వి సుబ్రహ్మణ్యం .

ఇప్పుడు ఉత్తమ విషయ ప్రస్తావన చేస్తున్నాడు యక్షుడు –

37-‘’ధన్యులైనవారిలో ఉత్తమ గుణమేమిటి?’’

‘’దక్షత ‘’అని సూటిగా సమాధానమిచ్చాడు యుధిష్టిరుడు .

38-ధనాలలో ఉత్తమమైనది ?

‘’పాండిత్యం ‘’

 

39-‘’ఉత్తమ లాభం ?’’

‘’ఆరోగ్యం ‘’

40-‘’ఉత్తమ సుఖం ?’’

‘’సంతృప్తి ‘’

ధర్మ రాజు చెప్పిన దానిలో దక్షత అంటే పని చేయటం లో నేర్పు మాత్రమె కాదు ,ధర్మాన్ని ఆచరించటం లో సామర్ధ్యం .అజ్ఞాతవాసం లో పాండవులను  వారి పాండిత్యమే కాపాడింది .రాజ్య లాభం కంటే ఆరోగ్యమే చాలా ఉత్తమం అన్నాడు .స్వకీయానుభావం తోదీనికి సమాధానం చెప్పాడు  హస్తినకు రాజైనా విచిత్ర వీర్యుడు అనారోగ్యం తో చనిపోయాడు .భీష్ముడు,విదురుడి కి  రావాల్సిన వాటాలో ధనం ఇస్తానని చెప్పినా ,వద్దని చెప్పి విదురుడు సంతృప్తిగా జీవించాడు కదా .

41-‘’లోకం లో శ్రేష్ట మైన ధర్మం ఏది ?’’

‘’దయ ‘’అన్నాడు ధర్మ రాజు .

42-‘’నిత్యం సత్ఫలితాలిచ్చే ధర్మం ఏది ?’’

‘’వేద ధర్మం ‘’

43-‘’దేన్ని  అదుపులో పెడితే దుఖం ఉండదు ‘’?

‘’మనసును అదుపులో పెడితే దుఖం ఉండదు ‘’

44-‘’ఎవరితో మైత్రి శాశ్వతం ?’’

‘’సజ్జన మైత్రి ‘’సమాధానం .దీనినే బుద్ధుడుకూడా ‘’కళ్యాణ మైత్రి ‘’అన్నాడు అన్నిటినీ నడిపించేది మనసు .మనసుకున్న ప్రాధాన్యాన్ని సనాతన ధర్మం చాలా రకాలుగా చెప్పింది ..అందుకని మనస్సు శ్రేష్టమైనది .తర్వాత త్యాగానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు యక్షుడు –

45-‘’దేన్ని  వదిలితే మానవుడు ఇష్టుడు అవుతాడు ?’’

‘’మానాన్ని (అభి )వదిలేస్తే మనిషి అందరికీ ప్రేమ పాత్రుడౌతాడు ‘’

46-‘’దేనిని త్యాగం చేస్తే ఏ బాధా ఉండదు ?’’

‘’క్రోధాన్ని ‘’

47-‘’దేన్ని త్యాగం చేస్తే అర్ధ వంతుడు అవుతాడు ‘’?

‘’కామాన్ని ‘’

48-‘’దేన్ని విసర్జిస్తే సుఖంగా బతుకుతాడు ?’’

‘’లోభాన్ని ‘’

త్యాగ బుద్ధితో జీవించమని సనాతన ధర్మం బోధించింది .త్యాగం అంటే బంధనం లో చిక్కుకొని విడుపు అని అర్ధం .త్యాగం చేయాల్సిన వాటిలో మొదటిది మానం .అంటే ఆత్మాభిమానం రోషం ,పౌరుషం .ఆత్మ అంటే తాను .ఆత్మీయం అంటే తనకి చెందింది .అభిమానం అంటే ఆత్మ గౌరవం .రూపం దానం ,విద్యా వల్లకలిగే దర్పాన్ని కూడా అభిమానం అనే అంటారు. అహంకారం అనే అర్ధమూ ఉంది .కనుక మానం అంటే స్వీయ గౌరవానికి సంబంధించినది .ఇది స్వీయ కేంద్ర ప్రవృత్తికి సంబంధించింది .దుర్యోధనుడు దీనికి గొప్ప ఉదాహరణ .సుయోధనుడు తన కేంద్రం లోకి కొందర్నే తీసుకొన్నాడు .కొందర్ని దూరంగా ఉంచాడు .తమ్ముడే అయినా వికర్ణుడిని దూరంగా ఉంచాడు .లక్క ఇల్లు కాల్చిన పరమ కిరాతకుడు  పురోచనుడు ఆ లక్క ఇంట్లోనే కాలి బూడిద అయితే దుఖం తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు  దుర్యోధనుడు .అతని కోటరీ లోకి కర్ణుడు, శకుని ,దుశ్శాసనుడు లకు   మాత్రమే ప్రవేశం .వీళ్ళనే దుస్ట చతుస్టయం అన్నారు  .మనదే అయిన వ్యక్తిత్వాన్ని స్వభావం అంటారు .దీన్ని దాటటం కష్టం .స్వభావానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఈర్ష్య ద్వేషం వంటివి ప్రకోపించి మనసును మండింప జేస్తాయి..ఇవే రోషం ,పౌరుషం .ఇవి విజ్రు౦భి స్తే వాడు సర్వనాశనమౌతాడు .ఎదుటివాడి నాశనానికి  సర్వ ప్రయత్నాలు చేస్తాడు .

కాని దీనికి విరుద్ధంగా ప్రేమ అనేది అందరిలోనూ విస్తరిస్తుంది .మానం భయస్తుడి లక్షణం అయితే ప్రేమ ధీర లక్షణం .మనకు భయమే ఎక్కువ కాబట్టి మానవంతులంగా మిగిలి రోష పడుతూ ఉంటాం .సుయోధనుడు అభిమాన ధనుడై ధార్మిక జీవితం లో నిర్ధనుడయ్యాడు .భీమసేనుడికీ ఈ లక్షణం బాగానే ఉంది .కనుకనే యుదిష్టిరుడు  భావావేశాలకు ఉద్వేగాలకు ,ఉద్రేకాలకు మానమే కుదురు కనుక మానాన్ని త్యాగం చేయాలని జవాబు చెప్పాడు .మానానికి దెబ్బ తగలటమే అవమానం .మానావ మానాలను త్యాగం చేస్తే మనస్సు నిర్మల మవుతుంది .ఆకాశమంత విస్తరిస్తుంది అని ధర్మ రాజు భావం .

మానం అంటే స్త్రీ మర్మావయవం అని అనుకోవటం మూర్ఖం .మానభంగం అంటే స్వీయ గౌరవానికి  దెబ్బతగలటం అని అర్ధం .కానిలోకం లో లై౦గి కమైన అర్ధం లోనే దీన్ని వాడుతున్నాం .వెకిలి చేష్టలతో స్త్రీని తాకటం ,అగౌరవ పరచటం మాన భంగమే .వెకిలి మాటలు, వెకిలి చూపులూ కూడా దీనికి చెందినవే. తన అనుమతి ,భాగస్వామ్యం లేకుండా తన శరీరం నుంచి ఆనందం పొందటం స్త్రీ తీవ్ర అగౌరవంగా భావిస్తుంది .మాన భంగం వ్యక్తిత్వ గౌరవానికి ,స్వేచ్చకు సంబంధించిన విషయ౦  .మాన భంగం లో శరీరం కంటే మనసు పొందే వేదన తీవ్ర తరమైనది .సుయోద నుడి కొలువులో జ్యూత  సమయం లో ద్రౌపది దుఖాన్ని చూసి కర్ణుడు ,దుర్యోధనుడు రాక్షసానందం పొందుతారు .ఆమె శరీరం పై కాముక నేత్రాలతో విక్రుతానందం పొందిన వారు సైంధవుడు ,కీచకుడు .ఇతరుల మానానికి బాధ కలిగించి ,వాళ్ళు బాధ, దుఖం లో ఉంటె ఆనందం పొందటం దుర్యోధనుడు వంటి మానవంతుల ఆనందం .మానిని అంటే ఆత్మాభిమానం కలిగిన స్త్రీ అని అర్ధం .దీన్ని అర్ధం చేసుకోకుండా కీచకాదులు మట్టిలో కలిసిపోయారు .సత్యభామలో ఈ అంశం కొంచెం ఎక్కువై ,వివేకం తగ్గి ఇక్కట్లు పడింది .మానిని అంటే దృఢ సంకల్పం ఉన్న స్త్రీ అనే అర్ధం ఉంది .కనుక లోకం లో మానిని అనే పదానికి ఏకైక ఉదాహరణగా ద్రౌపదీ దేవి మాత్రమె నిలిచింది .మానం లోతుపాతులు తరచినవాడుకనుక యుదిష్టిరుడు దాన్ని దూరం చేసుకొని లోకులకు ప్రీతి పాత్రుడయ్యాడు .అని శ్రీ సుబ్రహ్మణ్యంగారి విశేష విశ్లేషణ .ఇదంతా తెలుసుకోక పొతే యక్ష ప్రశ్నలలో ఉన్న మర్మం తెలియదు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మహాశివ రాత్రి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు  7-3-16 సోమవారం మహా శివ రాత్రి పర్వ దిన శుభా కాంక్షలు -దుర్గాప్రసాద్

 

Inline image 1Inline image 2

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీకాకుళం దేవాలయాల సందర్శనం ,5-3-16 శనివారం మరియు శ్రీ శంకర మఠంలో శ్రీసుందర కాండ పారాయణ పరి సమాప్తి సందర్భంగా శ్రీ సీతారామ శాంతి కల్యాణం -చిత్రమాలిక 

శ్రీకాకుళం దేవాలయాల సందర్శనం ,5-3-16 శనివారం  మరియు శ్రీ శంకర మఠంలో శ్రీసుందర కాండ పారాయణ పరి సమాప్తి సందర్భంగా శ్రీ సీతారామ శాంతి కల్యాణం -చిత్రమాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

5-3-16శనివారం మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గారి స్వగ్రామం కూడేరు (ఐలూరు దగ్గర )లో వారి స్వగృహం లోను ,వారి ఇలవేల్పు శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ కాంప్లెక్స్ లో మేము 

5-3-16శనివారం మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గారి స్వగ్రామం కూడేరు (ఐలూరు దగ్గర )లో వారి స్వగృహం లోను ,వారి ఇలవేల్పు శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ కాంప్లెక్స్ లో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాకుళంశంకర మఠం లో 4-3-16శుక్రవారం 9వ చివరి రోజు శ్రీ సుందర కాండ పారాయణ ,అనంతరం శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం

కాకుళంశంకర మఠం లో 4-3-16శుక్రవారం 9వ చివరి రోజు శ్రీ సుందర కాండ పారాయణ ,అనంతరం శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -3 యక్షుడు యజ్న సంబంధమైన ప్రశ్నలను ధర్మ రాజును అడుగుతున్నాడు – 10-రాజా ! యజ్ఞానికి సంబంధించి ఉన్న ఏకైక సామం ఏది ? ధర్మ రాజు –ప్రాణమే యజ్ఞానికి సంబంధించిన ఒకే ఒక్క సామం . 11-‘’తపస్సుకు ,యజ్ఞానికి చెందిన ఒకేఒక్క యజుస్సు ఏది ?’’ ‘’మనస్సు యజ్ఞానికి తపస్సుకు చెందిన ఏకైక యజుస్సు .’’ 12-‘’యజ్ఞాన్ని కోరే ఒకే ఒక విషయం ఏది ? ‘’రుక్కు యజ్ఞాన్ని వరిస్తుంది . 13-యజ్ఞం దేన్ని అతిక్రమించదు? ‘’రుక్కు ను యజ్ఞం అతిక్రమించదు . క్షత్రియ సత్పురుషుల ధర్మం యజ్ఞం అని ఇదివరకే ధర్మ రాజు తెలియజేశాడు .కనుక యజ్న పరిజ్ఞానం లోతులను తరచి అడిగాడు యక్షుడు .లోతైన సమాధానాలే చెప్పి ఒప్పించాడు యుదిస్టిరుడు .ఇపుడు శ్రేష్ట విషయాలపై ప్రశ్నలను సంధించ బోతున్నాడు . 14-రైతుకు ఏది శ్రేష్టమైనది ? ‘’ వర్షమే కృషీవలుడికి శ్రేష్టమైనది ‘’ 15-బీజావాపనం చేసే వారికి ఏది శ్రేష్టం ? ‘’విత్తనం ‘’ 16-ప్రతిజ్ఞా వంతులకు శ్రేస్టమైనదేది .? ‘’గోవు ‘’ 17-సంతాన వంతులకు ఏది శ్రేష్టం ? ‘’పుత్రుడే సర్వశ్రేస్టం.’’ ఇప్పుడు యక్షుడు ఎవరు ఏ సందర్భం లో మిత్రుడుగా ఉంటారో చెప్పమని అడుగుతున్నాడు . 18-ప్రవాసం లో ఉన్నవారికి మిత్రుడు ఎవరు? ‘’తనతో బాటు ప్రయాణం చేసేవాడే మిత్రుడు ‘’ 19-గృహస్తుకు మిత్రుడు ? ‘’ఇల్లాలే గృహమేదికి మిత్రుడు . 20- రోగికి ఎవరు స్నేహితుడు ? ‘’వైద్యుడే రోగికి మిత్రుడు ‘’ 21-చనిపోయేవాడికి మిత్రుడేవరు ? ‘’తాను చేసిన దానమే తన వెంట ఉండే మిత్రుడు .’’ లోకం లో స్నేహితుడు అన్నదానికి ఉన్న సాధారణ అర్ధాన్ని దాటి ధర్మ రాజు ధార్మిక సమాధానాలిచ్చి ,మార్మికత ను చమత్కారంగా అర్ధం చేసుకోవటమే విశేషం .ఇది పాండిత్య పరీక్ష కాదు .జిజ్ఞాసకు సంబంధించింది ;ధార్మిక విషయాలను జీవితాను భవాలకు అన్వయించి చెప్పాల్సిన సమాధానాలివి .తన కన్నా గొప్ప వాళ్ళ సత్సాంగత్యం వలన జ్ఞానాన్ని ఉన్నతీకరించు కొంటూ పరిణతి సాధించిన వాళ్ళు మాత్రమే చెప్పగల సమాధానాలివి .అంతటి పరిణతి ధర్మ రాజుకు ఉన్నదికనుక తేలికగా జవాబులు చెప్పాడని విశ్లేషకులు శ్రీ జి వి సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం సమంజసమైనదే . ఇప్పుడుధర్మ రాజుకు పంచ భూతాలపై ఉన్న పరిజ్ఞాన౦పై ప్రశ్నలను యక్షుడు అడుగ బోతున్నాడు . 22- ‘’రాజా !ఒంటరిగా తిరిగేది ఏది ?’’ ‘’యక్షుడా !ఒంటరి సంచారం చేసే ధీరుడు సూర్యుడు .’’ 23-‘’పుట్టి ,మళ్ళీ పుట్టేది ఏది ?’’ ‘’మళ్ళీ మళ్ళీ పుట్టేవాడు చంద్రుడే ‘’ 24-‘’శీతలత్వానికి మందు ?’’ ‘’అగ్నియే శీతలత్వానికి మందు . 25-మహా పాత్ర ఏది ? ‘’భూమి కంటే మహా పాత్ర వేరేది లేదు ‘’ 26-ప్రాణులన్నిటికి అతిధి ఎవరు ? ‘’అగ్ని ‘’ 27-‘’సనాతన ధర్మమేది ?’’ ‘’పాటించాల్సిన నిత్య ధర్మమే సనాతన ధర్మం ‘’ 28-జగత్తు అంతా వ్యాపించి ఉండేది ఏది ? ‘’వాయువు ‘’ ఇప్పుడు ఏ ఏ విషయాలు ఎక్కడ ఉంటాయో ప్రశ్నిస్తున్నాడు . 29-ధర్మానికి ముఖ్య స్థాననమేది ? ‘’దక్షత అనేది ధర్మానికి ముఖ్య స్థానం 30-కీర్తికి మూల స్థానం ? ‘’దానం . 31-స్వర్గానికి మూల స్థానం ?’’ ‘’సత్యం ‘’ 32-సుఖానికి ప్రధాన నెలవు ? ‘’శీలం ‘’ యక్షుని ప్రశ్నలలో మూల స్థానం అంటే మూల కారణం అన్నమాట . ఒకసారి యుదిస్టిరుని సమాధానాలను పర్యావలోకనం చేస్తే –ధర్మం దక్షతలో ఉందని ధర్మ రాజు చెప్పాడు .దక్షత అంటే నిర్వహణ సామర్ధ్యం .ధర్మం తెలిస్తే చాలదు అది ఆచరణ రూపం లోనే సార్ధక మవుతుందని వివరణ .ధర్మ౦ ధర్మ శాస్త్రాలలో ఉండదు జీవిత ఆచరణ లో కనిపిస్తుంది .అలాగే దానం చేయాల్సింది స్వయం గా సంపాదించిన కష్టార్జితాన్నే అని చెప్పాడు .దానం లో సృజన శీలం ఉండాలి. దాంతో తనను ,ఇతరులను నిర్మించుకోవాలి .దానం కీర్తికారకం .స్వర్గం సత్యం లో ఉందన్నాడు అంటే ఉన్నదాన్ని యదా తధంగా దర్శించటం అని అర్ధం .సుఖం అంటే భౌతిక పరమైనదికాదు .ధర్మ రాజు దృష్టిలో ధార్మిక పరమైనది .ఉత్తమ ప్రశ్న వేయటం సామాన్యులకు సాధ్యం కాదు .సంక్షిప్తంగా ప్రశ్న అడగాలి అంటే సమగ్ర పరిజ్ఞానం ఉండాలి .సంగ్రసమాధానం చెప్పాలన్నా ఇదే కావాలి కనుక ఇక్కడ ప్రశ్నించేవాడు సమాధానాలు చెప్పేవాడూ ఇద్దరూ ఇద్దరే .సరి జోదులు .అందుకే యక్ష ప్రశ్నలకు ఈనాటికీ అంతటి క్రేజ్ ఉంది .ప్రతి దాన్ని మూల తత్త్వం లోకి తీసుకు వెళ్లి సమాధానం చెప్పటం యుదిస్టిరుని గోప్పతనమే కాదు అభి రుచి కూడా . సశేషం మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-16-ఉయ్యూరు

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -3

యక్షుడు యజ్న సంబంధమైన ప్రశ్నలను ధర్మ రాజును అడుగుతున్నాడు –

10-రాజా ! యజ్ఞానికి సంబంధించి ఉన్న ఏకైక సామం ఏది ?

ధర్మ రాజు –ప్రాణమే యజ్ఞానికి సంబంధించిన ఒకే ఒక్క సామం .

11-‘’తపస్సుకు ,యజ్ఞానికి చెందిన ఒకేఒక్క యజుస్సు ఏది ?’’

‘’మనస్సు యజ్ఞానికి  తపస్సుకు చెందిన ఏకైక యజుస్సు .’’

12-‘’యజ్ఞాన్ని కోరే ఒకే ఒక విషయం ఏది ?

‘’రుక్కు యజ్ఞాన్ని వరిస్తుంది .

13-యజ్ఞం దేన్ని అతిక్రమించదు?

‘’రుక్కు ను యజ్ఞం అతిక్రమించదు .

క్షత్రియ సత్పురుషుల ధర్మం యజ్ఞం అని ఇదివరకే ధర్మ రాజు తెలియజేశాడు .కనుక యజ్న పరిజ్ఞానం లోతులను తరచి అడిగాడు యక్షుడు .లోతైన సమాధానాలే చెప్పి ఒప్పించాడు యుదిస్టిరుడు  .ఇపుడు శ్రేష్ట విషయాలపై ప్రశ్నలను సంధించ బోతున్నాడు .

14-రైతుకు ఏది శ్రేష్టమైనది ?

‘’ వర్షమే కృషీవలుడికి శ్రేష్టమైనది ‘’

15-బీజావాపనం చేసే వారికి ఏది శ్రేష్టం ?

‘’విత్తనం ‘’

16-ప్రతిజ్ఞా వంతులకు శ్రేస్టమైనదేది .?

‘’గోవు ‘’

17-సంతాన వంతులకు ఏది శ్రేష్టం ?

‘’పుత్రుడే సర్వశ్రేస్టం.’’

ఇప్పుడు యక్షుడు ఎవరు ఏ సందర్భం లో మిత్రుడుగా ఉంటారో చెప్పమని అడుగుతున్నాడు .

18-ప్రవాసం లో ఉన్నవారికి మిత్రుడు ఎవరు?

‘’తనతో బాటు ప్రయాణం చేసేవాడే మిత్రుడు ‘’

19-గృహస్తుకు మిత్రుడు ?

‘’ఇల్లాలే గృహమేదికి మిత్రుడు .

20- రోగికి ఎవరు స్నేహితుడు ?

‘’వైద్యుడే రోగికి మిత్రుడు ‘’

21-చనిపోయేవాడికి మిత్రుడేవరు ?

‘’తాను చేసిన దానమే తన వెంట ఉండే మిత్రుడు .’’ లోకం లో స్నేహితుడు అన్నదానికి ఉన్న సాధారణ అర్ధాన్ని దాటి ధర్మ రాజు ధార్మిక సమాధానాలిచ్చి ,మార్మికత ను చమత్కారంగా అర్ధం చేసుకోవటమే విశేషం .ఇది పాండిత్య పరీక్ష కాదు .జిజ్ఞాసకు సంబంధించింది ;ధార్మిక విషయాలను జీవితాను భవాలకు అన్వయించి చెప్పాల్సిన సమాధానాలివి .తన కన్నా గొప్ప వాళ్ళ సత్సాంగత్యం వలన జ్ఞానాన్ని ఉన్నతీకరించు కొంటూ పరిణతి సాధించిన వాళ్ళు మాత్రమే చెప్పగల సమాధానాలివి .అంతటి పరిణతి ధర్మ రాజుకు ఉన్నదికనుక తేలికగా జవాబులు చెప్పాడని విశ్లేషకులు శ్రీ జి వి సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం సమంజసమైనదే .

ఇప్పుడుధర్మ రాజుకు  పంచ భూతాలపై ఉన్న పరిజ్ఞాన౦పై  ప్రశ్నలను యక్షుడు అడుగ బోతున్నాడు .

22- ‘’రాజా !ఒంటరిగా తిరిగేది ఏది ?’’

‘’యక్షుడా !ఒంటరి సంచారం చేసే ధీరుడు సూర్యుడు .’’

23-‘’పుట్టి ,మళ్ళీ పుట్టేది ఏది ?’’

‘’మళ్ళీ మళ్ళీ పుట్టేవాడు చంద్రుడే ‘’

24-‘’శీతలత్వానికి మందు ?’’

‘’అగ్నియే శీతలత్వానికి మందు .

25-మహా పాత్ర ఏది ?

‘’భూమి కంటే మహా పాత్ర వేరేది లేదు ‘’

26-ప్రాణులన్నిటికి అతిధి ఎవరు ?

‘’అగ్ని ‘’

27-‘’సనాతన ధర్మమేది ?’’

‘’పాటించాల్సిన నిత్య ధర్మమే సనాతన ధర్మం ‘’

28-జగత్తు అంతా వ్యాపించి ఉండేది ఏది ?

‘’వాయువు ‘’

ఇప్పుడు ఏ ఏ విషయాలు ఎక్కడ ఉంటాయో ప్రశ్నిస్తున్నాడు .

29-ధర్మానికి ముఖ్య స్థాననమేది ?

‘’దక్షత అనేది ధర్మానికి ముఖ్య స్థానం

30-కీర్తికి మూల స్థానం ?

‘’దానం .

31-స్వర్గానికి మూల స్థానం ?’’

‘’సత్యం ‘’

32-సుఖానికి ప్రధాన నెలవు ?

‘’శీలం ‘’

యక్షుని ప్రశ్నలలో మూల స్థానం అంటే మూల కారణం అన్నమాట .

ఒకసారి యుదిస్టిరుని సమాధానాలను పర్యావలోకనం చేస్తే –ధర్మం దక్షతలో ఉందని ధర్మ రాజు చెప్పాడు .దక్షత అంటే నిర్వహణ సామర్ధ్యం .ధర్మం తెలిస్తే చాలదు అది ఆచరణ రూపం లోనే సార్ధక మవుతుందని వివరణ .ధర్మ౦  ధర్మ శాస్త్రాలలో ఉండదు జీవిత ఆచరణ  లో కనిపిస్తుంది .అలాగే దానం చేయాల్సింది స్వయం గా సంపాదించిన  కష్టార్జితాన్నే అని చెప్పాడు .దానం లో సృజన శీలం ఉండాలి. దాంతో తనను ,ఇతరులను నిర్మించుకోవాలి .దానం కీర్తికారకం .స్వర్గం సత్యం లో ఉందన్నాడు అంటే ఉన్నదాన్ని యదా తధంగా దర్శించటం అని అర్ధం .సుఖం అంటే భౌతిక పరమైనదికాదు .ధర్మ రాజు దృష్టిలో ధార్మిక పరమైనది .ఉత్తమ ప్రశ్న వేయటం సామాన్యులకు సాధ్యం కాదు .సంక్షిప్తంగా ప్రశ్న అడగాలి అంటే సమగ్ర పరిజ్ఞానం ఉండాలి .సంగ్రసమాధానం చెప్పాలన్నా ఇదే కావాలి కనుక ఇక్కడ ప్రశ్నించేవాడు సమాధానాలు చెప్పేవాడూ ఇద్దరూ ఇద్దరే .సరి జోదులు .అందుకే యక్ష ప్రశ్నలకు ఈనాటికీ అంతటి క్రేజ్ ఉంది .ప్రతి దాన్ని మూల తత్త్వం లోకి తీసుకు వెళ్లి సమాధానం చెప్పటం యుదిస్టిరుని గోప్పతనమే కాదు అభి రుచి కూడా .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -2

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -2

మరింత లోతైన ప్రశ్నలను అడిగే ప్రయత్నం లో ఉన్నాడు యక్షుడు .

5-‘’ఇంద్రియ భోగాలు అనుభావిస్తూ ఊపిరి  పీలుస్తూకూడా నిర్జీవుడైన వాడేవడు?

‘’దేవతల్ని ,అతిధుల్ని ,స్వంత కుటుంబ సభ్యులని ,తండ్రి తాతల్ని ,చివరికి తనను తాను పోషించుకోలేని వాడే ,ఊపిరి పీలుస్తున్నా ,నిర్జీవుడు ‘’అన్నాడు ధర్మ రాజు .మళ్ళీ యక్షుడు –

6-‘’భూమికన్నా పెద్దది ,ఆకాశం కంటే ఎత్తైనది ,గాలికంటే వేగమైనది ,గడ్డి కంటే దట్టమైనది ఏది ?’’

పాండవ ప్రధముడి సమాధానం –‘’భూమికన్నా భారమైంది తల్లి .ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి .గాలికంటే వేగ వంతమైనది మనసు .గడ్డికంటే దట్టమైంది చింత ‘’చెప్పాడు ధర్మ రాజు .

7-‘’నిద్రిస్తూ కూడా కళ్ళు మూయనిది ,పుట్టినప్పటి నుండి చలనం లేనిది ,ఏది ?హృదయం లేని వాడెవడు?వేగం వలన వృద్ధి పొందేది ఏది ?

‘’నీటి లోని చేప నిదిస్తున్నా కళ్ళు మూసుకోదు .తల్లి పొట్టలోంచి బయట పడినా గుడ్డు కదలదు .హృదయం లేనిది రాయి .వేగం వల్ల నది వృద్ధిపొందుతుంది ‘’అని తెలివైన సమాధానాలు చెప్పాడు .

8-ధర్మ రాజు చెప్పే ప్రతి సమాధానానికి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాడు.పరమానందం పొందుతున్నాడు  యక్షుడు .ఉత్సాహం పెరిగిపోతోంది .ఇక అతని వివేకాన్ని తెలుసుకొనే ఉద్దేశ్యం తో –

9’’-రాజా !నీ జవాబులు పరమ తృప్తికరంగా ఉన్నాయి .కనుక నీ తమ్ములలో లో ఒకరిని మాత్రం బతికిస్తాను .ఎవర్ని బ్రతికి౦చ మంటావు?’’అడిగాడు యక్షుడు

‘’’’నకులుడిని బ్రతికించండి ‘’అన్నాడు వెంటనే ఏమీ ఆలోచి౦చకుండా  .ఆశ్చర్య పడ్డ యక్షుడు ‘’నీ కోరిక విడ్డూరంగా ఉంది .భీముడు అంటే నీకు ప్రేమ అర్జునుడు అంటే నీకు అండా దండా కదా .వీల్లిద్దర్ని బతికించమని కోరుకోకుండా సవతి తల్లి కొడుకు ను బతికి౦చ మనటం లో నీ ఆంతర్య  మేమిటి ?’’సూటిగా అడిగాడు.

యుధిష్టిరుడు’’-‘’మహాత్మా !నీకు తెలియని ధర్మం లేదు .ధర్మాన్ని  చంపితే అదిమనల్ని వదిస్తుంది .ధర్మ రక్షణ చేస్తే అదిమనల్ని రక్షిస్తుంది  .ధర్మ౦ దెబ్బతిని మనల్ని అది తిరిగి దెబ్బ తియ్య రాదు –‘’ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః –తస్మాత్ ధర్మం నత్యజామి మానో ధర్మో హతో వదీత్ ‘’అన్నాడు .’’కరుణ పరమ ధర్మ మైనది.అందుకే సమ ద్రుష్టి తో ఆలోచించాను నా తండ్రికి కుంతీ ,మాద్రి ఇద్దరు భార్యలు .ఇద్దరి బిడ్డలూ బ్రతికి ఉండటం సమన్యాయం ‘’అని  యుధిష్టిరుడు సుస్థిరంగా జవాబు చెప్పాడు .

ఈ సమ దృష్టికి మహానందపడి యక్షుడు ‘’నీ సమ దృష్టి  నాకు మహాదానందాన్నిచ్చి౦ది కనుక నీ తమ్ముళ్ళను అందర్నీ బ్రతికిస్తున్నాను ‘’అంటూ వాళ్ళను పేరు పేరునా పిలువగా ,వాళ్ళంతా నిద్ర లోంచి లేచినట్లు లేచారు .ధర్మ రాజు యక్షుని విశాల హృదయానికి కృతజ్ఞత చూపించి ‘’మీరు మహనీయులలో మహోత్క్రుస్టు లని తెలిసింది .మీ నిజ రూప దర్శనం తో నాకు ఆనందం కల్గించండి’’ అని చేతులు జోడించి ప్రార్ధించాడు .

అప్పుడు యక్షుడు ‘’ధర్మ రాజా ! నేను ధర్మ దేవతను .నిన్ను చూడాలనే వచ్చాను.కీర్తి ,సత్యం ,శ్రమం ,దమం ,శౌచం ,రుజు వర్తనం ,దానం ,తపస్సు,బ్రహ్మ చర్యం వంటి మహనీయ ధర్మా లన్నీనా రూపాలే .అహింస ,సమతా ,కరుణ ,మత్సరం లేక పోవటం మొదలైన పవిత్ర మార్గాలే నన్ను చేరుకొనే దారులు. శమ ,దమ ఉపరతి,తితిక్ష ,సమాధానం అనే అయిదూ నీలో సుస్థిరంగా ఉన్నాయి .,ఆకలి ,దప్పులు ,శోక మోహాలు ,జర,మృత్యువు అనే  ఆరింటిని నువ్వు పూర్తిగా జయించావు .నా భక్తులకు దుర్గతి ఏ నాడూ కలుగదు .నీకో వరం ఇస్తా కోరుకో ‘’అడిగాడు .ధర్మ రాజు ధర్మ దేవతను ‘’బ్రాహ్మణుడిఆరణి మంధన కాస్టాలుఇప్పించండి ‘’అని కోరాడు .’’అవి నీకు ఇవ్వటానికే నిన్ను ఇక్కడికి రప్పించాను ‘’అని చెప్పి వాటిని అప్పగించి ‘’నీకు ఇష్టమైన కోరిక ఏదైనా కోరుకో ‘’అన్నాడు .ధర్మ రాజు ‘’మహాత్మా !మా అజ్ఞాత వాసం ఏ విఘ్నం జరుగ కుండా పూర్తీ అయ్యేట్లు అనుగ్రహించు ‘’అని కోరాడు .ధర్మ దేవత ‘’మీ అజ్ఞాత  వాసాన్ని భగ్నం చేయ గల వారెవరూ లేరు .ముగిసే దాకా మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు .విరాట నగరం లో అజ్ఞాతవాస కాలం గడపండి. మీకు అక్కడ అన్నీ కలిసి వస్తాయి ‘’అన్నాడు .వినమ్రంగా రాజు నమస్కరించాడు ‘’మరో వరం కోరుకో ‘’అన్నాడు ధర్మ దేవత .ధర్మరాజు ‘’నా మనస్సు దానం ,తపస్సు ,సత్యం అనే ఉత్తమ విషయాల మీద సదా నిలిచి ఉండేట్లు  అనుగ్రహించండి ‘’అని ప్రార్ధించాడు .’’తధాస్తు ‘’అంటూ ఆశీర్వదించి ధర్ముడు అంతర్ధానమయ్యాడు .తమ్ములతో ఆశ్రమానికి తిరిగి వచ్చిన ధర్మ రాజు బ్రాహ్మణుడికి ఆరణి,మంధన కాస్టాలను అంద జేసి ఆశీస్సులు పొందాడు .

ఈ యక్ష ప్రశ్నలు మార్మికత తో ఉన్న ధార్మిక ప్రశ్నలు .ధర్మ రాజు శోకమోహాలను ప్రక్కన పెట్టి స్థిర చిత్తం తో 100ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ,తన సమచిత్తతను ,తిక్కన మహా కవి చెప్పినట్లు వశీకృత  చిత్త్తాన్ని ప్రదర్శించాడు .ధర్మ దేవత కూడా రాబోయే అజ్ఞాత వాసానికి ,కురుక్షేత్ర మహా సంగ్రామానికి పాండవులను సిద్ధం చేసే ప్రయత్నమే ఇది అని దీనిపై చక్కని సమీక్ష చేశారు   శ్రీ జి వి సుబ్రహ్మణ్యం గారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-3-16-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత

యక్ష ప్రశ్నల సమాదానలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత

పాండవులు ద్వైత వనం లో ఉండగా దాహార్తి తీర్చటానికి సమీపం లో ఉన్న సరస్సునుండి నీరు తెమ్మని ధర్మ రాజు వరుసగా నకుల ,సహదేవ ,అర్జున భీములను పంపగా వారెవ్వరూ తిరిగి రాక పోయేసరికి అనుమానించి తానె స్వయంగా బయల్దేరాడు .అక్కడ విగత జీవులుగా కనిపిస్తున్న సోదరుల్ని చూసి అంతటి యుదిస్తిరుడు దుఖం ఆపుకోలేక పోయాడు .కొలను చేరి దోసిలితో నీళ్ళు త్రాగాబోయాడు అప్పుడు ఒక కొంగ తానూ చేపల్ని తినేదాన్నని తన సోదారుల్ని యమలోకానికి పంపింది కూడా తానేనని చెప్పి తానూ సంధించే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నీరు త్రాగా మన్నది .సూక్ష్మ బుధి గల ధర్మ రాజు ‘’అయ్యా !నువ్వేవరవో చాలా గొప్పవాడివి తప్ప కొంగవు కావు .ఇంతటి సాహసం ఒక పక్షి చేయలేదు .నా సోదరులు నలుగురు హిమాలయ ,పారియాత్ర ,వింధ్య ,మలయా పర్వతాల వంటి వారు .వాళ్లకు ఈ గతిపట్టించటం సామాన్యులకు సాధ్యం కాదు .నువ్వెవరివో ముందు చెప్పు ‘’అన్నాడు .అప్పుడా కొక్కెర ‘’యుదిస్టిరా !నువ్వు చాలా బుద్ధిమంతుడివి .నేను కొంగనుకాను .యక్షుడిని .నీ సోదరులు నా మాట వినకుండా అపాయం కొని తెచ్చుకొన్నారు .నేనే వారిని చంపాను ‘’అన్నాడు ధర్మ రాజు హృదయం విల విలలాడింది కర్తవ్యమ్ తోచలేదు .యక్షుడిని సమీపించి అతని భీకర ఉన్నత ఆకారం చూసి మహిమగలవాడని గ్రహించి ‘’యక్ష ప్రశ్నలకు ‘’సమాధానాలు చెప్పటానికి సిద్ధ పడి ‘’యక్షా !నీ అధికారాన్ని ప్రశ్నించటం లేదుకాని నీ ప్రశ్నలేమితో వినాలని మహా కుతూహలంగా ఉంది .ప్రశ్నించు .నా బుద్ధిబలాన్ని ఉపయోగించి సమాదానమిస్తాను ‘’అన్నాడు అతి వినయం గా సుస్థిర చిత్తం తో సిద్ధ పడ్డాడు .

1-రాజా !సూర్యుడు ఉదయిన్చాతానికి కారణం ఏది ?ఆయన చుట్టూ ఎవరు తిరుగుతారు ?సూర్యుడు దేనివలన అస్తమిస్తాడు ?ఆయన దేనిలో ప్రతిష్టింపబడి  ఉంటాడు ?’’అని తేజస్సుకు సంబంధించిన నాలుగు ప్రశ్నలను ఒకే సారి అదిగాదూ యక్షుడు .

ధర్మ రాజు ‘’మహానుభావా !బ్రహ్మ వలన సూర్యుడు ఉదయిస్తాడు .దేవతలు ఆయన చుట్టూ పరిభ్రమిస్తారు .ధర్మమే సూర్య అస్తమయానికి కారణం  .సూర్య భగవానుడు సత్యం లో సుస్థిరంగా ప్రతిస్టింప బడి ఉంటాడు ‘’అని తడుముకోకుండా యుదిస్తిరుడు సమాధానాలు ఇచ్చాడు .

2-లోపల సంతోషిస్తున్నా దాన్ని ప్రకతనం కానీకుండా యక్షుడు శ్రోత్రియత్వం గురించి ప్రశ్నలను సంధించాడు .’’రాజా ! మనిషి ఏ రకంగా శ్రోత్రియుడు కాగలుగుతాడు ?దేని వలన పరమపదాన్ని పొందుతాడు ?దేని వలన సహాయ భూతుడు కాగలడు?దేనివలన మానవుడు సంపూర్ణ బుద్ధి మంతుడు అవుతాడో చెప్పు ?’’

పాండవాగ్రేసరుడు ‘’మహాత్మా !వేదార్ధాన్ని తెలుసుకొన్నవాడు శ్రోత్రియుడు అవుతాడు .తపస్సు చేస్తే వచ్చే జ్ఞానంతో మహిమాన్విత పదవి పొందగలడు శ్రోత్రియుడికి సహాయం గా నిలిచేది ధీరత్వమే .ధర్మార్ధాలు త్లిసిన పెద్దల సేవ వలన సంపూర్ణ జ్ఞాని అవుతాడు మానవుడు ‘’అనిసుసంగతమైన  జవాబు చెప్పాడు .

3-తర్వాత -బ్రాహ్మణ సదాచారం గురించిన ప్రశ్నలను యక్షుడు అడుగుతున్నాడు –‘’బ్రాహ్మణులకు దైవత్వం గా దీన్ని భావించాలి ?మానవత్వంగా దేన్నీ భావించాలి ?బ్రాహ్మణా సత్పురుషుల ధర్మం ఏమిటి ?అసత్పురుషులు ఎలా ప్రవర్తిస్తారు ?’’అని ప్రశ్నించాడు .

యక్షుడా !స్వాధ్యాయం లో ఏమరు పాటు లేకుండా ఉండటమే బ్రాహ్మణులకు దైవత్వాన్ని సిద్ధింప జేస్తుంది .మరణం అనేది వారికి సహజ మానుషత్వం .బ్రాహ్మణ సత్పురుషులు తపస్సు చేయటమే ధర్మం .పరనింద అసత్పురుష మార్గం ‘’అంటూ సద్బ్రాహ్మనత్వాన్ని ధర్మ రాజు ఆవిష్కరించి నిష్కర్షగా తెలియ జేశాడు .

4-ఇప్పుడుక్షత్రియ  ధర్మం గురించి ప్రశ్నా సంధానం చేస్తున్నాడు యక్షుడు .’’ధర్మ రాజా !క్షత్రియులకు దైవత్వాన్ని కల్గించేది ఏది ?వాళ్లకు మానుషత్వం ఏది ?క్షత్రియ సత్పురుష ధర్మమేమిటి ?వారిలో అసత్పురుషుల మార్గమేమిటి ?

యుదిష్టిరుడు ‘’పుణ్యాత్మా !సర్వ రక్షణ కోసం ఉపయోగించే ఆయుధ విద్యయే క్షత్రియులకు దైవత్వాన్నిస్తుంది .భయం క్షత్రియునికి మానుషత్వాన్నిస్తుంది .క్షత్రియ సత్పురుషులకు యజ్ఞాచరణమే ధర్మం .బాధ పడే వాళ్ళని పట్టించుకోకుండా స్వసుఖం లో గడిపితే అదే అసత్పురుష మార్గామవుతుంది క్షత్రియులకు ‘’అని ఉత్తరమిచ్చాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-3-16-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీకాకుళం లో 3-3-16 గురువారం శ్రీ సుందర కాండ 8 వ రోజు పారాయణ

శ్రీకాకుళం లో 3-3-16 గురువారం శ్రీ సుందర కాండ 8 వ రోజు పారాయణ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ,రోటరీక్లబ్ -ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ,రోటరీక్లబ్  -ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు

90 వ సమావేశం –ఆహ్వాన పత్రిక

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలను సంగీత కచేరి, ఉగాది పురస్కారాలు ,పుస్తకావిష్కరణ ,కవి సమ్మేళనం లతో  సరసభారతి 90వ సమావేశం గా స్థానిక రోటరీక్లబ్ వారితో కలిసి సంయుక్తంగా ఉగాదికి (ఏప్రిల్ 8) అయిదు రోజులు ముందు అంటే 3-4-2016 ఆదివారం మధ్యాహ్నం గం3-30ని లకు కే.సి పి.షుగర్ ఫాక్టరీ దగ్గరలో ఉన్న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో నిర్వహిస్తోంది .సంగీత సాహిత్యాభిమానులకు ,కవులకు ,కళాకారులకు ,అతిధులకు ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని ,జయప్రదం చేయ ప్రార్ధన .

 

సభాధ్యక్షులు ; శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు ; శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,సరసభారతి గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి ;శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని –దూరదర్శన్ ప్రొడ్యూసర్ –హైదరాబాద్

గౌరవ అతిధి ;శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య ,కవి ,రచయిత,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘాధ్యక్షులు ,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, గుంటూరు

ఆత్మీయ అతిధులు ;శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు

శ్రీ జి వెంకటేశ్వర రావు ,సి.ఇ.వో.-కె .సి.పి.,మరియు రోటరీ క్లబ్ గౌరవాధ్యక్షులు

శ్రీ చలపాక ప్రకాష్ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల ప్రధాన కార్య దర్శి ,రమ్య భారతి సంపాదకులు

కార్యక్రమ  నిర్వహణ –శ్రీమతి మది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్య దర్శి

కార్య క్రమం

1-మధ్యాహ్నం -3-30 గం .నుండి 4-30 వరకు –శ్రీమతి వి .శాంతిశ్రీ గారిచే ‘’గాత్ర సంగీత కచేరి ‘’

2 –సాయంత్రం 4-30గం నుండి -5-00గం వరకు  -శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచన  -‘’దైవ చిత్తం ‘’గ్రంధా విష్కరణ

కృతిస్వీకర్త మరియు గ్రంధ ప్రాయోజకులు –శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )

గ్రంధావిష్కరణ –శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారు

గ్రంధ పరిచయం ‘’–దైవ చిత్తం ‘’కు ఆంగ్ల మూలం ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’రచయిత-శ్రీ ఎ .సి.పి.శాస్త్రి గారు

3-సాయంత్రం 5గం నుండి -6-30గం .వరకు –ఉగాది పురస్కార ప్రదానం

1-స్వర్గీయ గబ్బిట భవానమ్మ,మృత్యుంజయ శాస్త్రి గారల  స్మారక ఉగాది పురస్కార ప్రదానం

పురస్కార గ్రహీతలు -1-శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారు  –హైదరాబాద్

2-డా.రావి మోహన రావు,శ్రీమతి కృష్ణ కుమారి  దంపతులు – ఆత్మ జ్యోతి మాసపత్రిక గౌరవ సంపాదకులు ,సుమారు 150 సంస్కృత గ్రంధాలను స్వంత ఖర్చుతో ముద్రించిన రిటైర్డ్ బాటనీ లెక్చరర్ (చీరాల)

3-శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు –పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బహు గ్రంధ కర్త (పొన్నూరు )

4-శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారు –పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులు ,తత్వ శాస్త్ర పారంగతులు (విజయవాడ )

5-డా.నాగ రాజు అలిసేటి గారు –యు.జి.సి.పోస్ట్ డాక్టోరల్ రిసెర్చర్ ,హైదరాబాద్ యూని వర్సిటి –హైదరాబాద్

6-శ్రీమతి మద్దాలి (వై )సుశీల గారు  –ప్రముఖ హరికధా భాగవతారిణి-విజయవాడ

7-శ్రీ ఏ.సి.పి.శాస్త్రిగారు  –సంగీత భూషణ ,నటులు ,నాటక రచయిత, ,’’భువన విజయ భట్టు మూర్తి ఫేం’’ –హైదరాబాద్

8-శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య –సోమేపల్లి  కదా పురస్కార ప్రదాత –గుంటూరు

2-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కార ప్రదానం

పురస్కార గ్రహీతలు –1-శ్రీ పి.నందకుమార్ –అమరవాణి హైస్కూల్ సంస్థాపక ,నిర్వాహకులు-ఉయ్యూరు

2-కుమారి చతుర్వేదుల యశస్విని-యువ ఆర్కి టెక్ట్ –హైదరాబాద్

3-చి వీర్ల  ప్రసాద్ –  అందులకు కంప్యూటర్ విద్య నేర్పుతున్న  అంధ ఉపాధ్యాయుడు –ఉయ్యూరు

4-సాయంత్రం 6-30గం నుండి రాత్రి 8 గం వరకు –కవి సమ్మేళనం

విషయం –‘’మా అన్నయ్య ‘’-ఆత్మీయ కవి సమ్మేళనం

‘’అనుబంధానికి ఆరంభం నాన్న .వాత్సల్యానికి  చిరునామా తమ్ముడు  .ఈ ఇద్దరి నడుమ   ఆత్మీయత వర్షించే  మహా వ్యక్తిత్వం అన్నయ్య . .ఎవరి దృష్టీ సోకని ,ఏ కవి ఆలోచనలకు అందని ఆ అన్నయ్య వ్యక్తిత్వపు ఆవిష్కరణే ఈ ఆత్మీయ  కవి సమ్మేళనానికి స్పూర్తి ..

మనవి –పద్యాలు అయితే -5,వచన కవిత్వం అయితే 15 పంక్తులకు ఎట్టి పరిస్థితి లోను మించ రాదని మనవి .స్వయం నియమం ,సమయం పాటించి సహకరించి జయప్రదం చేయవలసినదిగా కవి మిత్రులకు వినతి .చదివిన కవిత కాపీని సరసభారతికి అందజేయటం మరువ వద్దని ప్రార్ధన .

కవి సమ్మేళనం నిర్వహణ—డా. శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి –పొన్నూరు

శ్రీమతి –వి.శ్రీ ఉమామహేశ్వరి –విజయవాడ

శ్రీమతి కె.కనక దుర్గ మహా లక్ష్మి –మచిలీపట్నం

పాల్గొను కవిమిత్రులు –

శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,భమిడిపాటి బాలా త్రిపుర సుందరి ,లక్ష్మీ సుభద్ర ,,పి శేషుకుమారి ,కొమాండూరి కృష్ణ ,మద్దాలి నిర్మల ,సింహాద్రి వాణి,టి అమూల్య ,మందరపు హైమవతి ,పి.పద్మావతీ శర్మ ,కోకా విమలకుమారి వేలూరి సుధారాణి ,ఎస్.అన్నపూర్ణ ,లక్కరాజు వాణీ సరోజిని ,ఎస్.శైలజ ,యర్రం శెట్టి పాప ,నందిఘట్ల నందిని ,స్మితశ్రీ చింతపల్లి నాగేశ్వర రావు   పొన్నాడ సత్య ప్రకాష్ ,తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు ,చలపాక ప్రకాష్ ,ఏ.ఏ,ఎమ్.కుమార్  వేలూరి కౌండిన్య,విష్ణుభొట్ల రామ కృష్ణ ,ఎరుకలపూడి గోపీనాధ రావు ,కే ఆంజనేయ కుమార్ ,బందా వెంకట రామారావు ,కానుకొల్లు బాలకృష్ణ ,పంతుల వెంకటేశ్వర రావు ,కే ఎస్.రామారావు ,యద్దనపూడి సత్యనారాయణ మూర్తి ,కుంతం శ్రీనివాస్ (విజయవాడ )డా.శ్రీ జి విజయకుమార్ (నందిగామ )శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు )శ్రీమతి కోగంటి విజయ లక్ష్మి ,(గుడివాడ ) శ్రీమతి వారణాసి సూర్య కుమారి , ,జి మేరీ కృపాబాయి ,చిల్లరిగె ప్రమీల ,కందాళ జానకి, కె. కనక దుర్గా మహాలక్ష్మి, గుడిపూడి రాదికారాణి,గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీ దండిభోట్ల దత్తాతేయ శర్మ (మచిలీపట్నం )శ్రీమతి సింహాద్రి పద్మ ,(అవని గడ్డ )శ్రీమతి ఎస్ .ఉషారాణి మాదిరాజు శివలక్ష్మి ,ఛి ఎం. బిందు దత్తశ్రీ ,శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ , నవులూరి రమేష్ ,చిత్తజల్లు భవానీ శంకర్ ,పి. విజయ సారధి ,కూచిభొట్ల శ్రీరామ చంద్ర మూర్తి ,ఎం.శ్రీనివాస శర్మ ,గుంటక వేణు గోపాల రెడ్డి,అగ్నిహోత్రం శ్రీ రామ చక్ర వర్తి ,వేదాంతం శ్రీధరాచార్యులు  (ఉయ్యూరు )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (ఆకునూరు )  శ్రీ కందికొండ రవికిరణ్ (కంకిపాడు ),

సభా నిర్వహణ సహకారం –డా.దీవి చిన్మయ ,శ్రీ గబ్బిట రామ నాద బాబు ,శ్రీ ఏం .శ్రీనివాస శర్మ ,శ్రీ జి వేణుగోపాల రెడ్డి ,శ్రీ కే చంద్ర శేఖర రావు శ్రీమతి ఎస్ మల్లికాంబ ,శ్రీ ఏం బాలాజీ ,శ్రీ చౌడాడ అప్పల నాయుడు

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

మరింత సమగ్రంగా ఆహ్వానపత్రికను మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి

ఉగాది శుభాకాంక్షలతో

జోశ్యుల శ్యామలా దేవి –మాదిరాజు శివలక్ష్మి    గబ్బిటవెంకట రమణ — గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు         కార్య దర్శి               కోశాధికారి               సరసభారతి అధ్యక్షులు -9989066375

.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీకాకుళం శంకర మఠం లో 2-3-16 బుధవారం 7 వ రోజు శ్రీ సుందర కాండ పారాయణ

శ్రీకాకుళం శంకర మఠం లో 2-3-16 బుధవారం 7 వ రోజు శ్రీ సుందర కాండ పారాయణ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీకాకుళం లోశ్రీ ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి దేవాలయం -మరియు28-2-16 ఆదివారం నాలుగవ రోజు శ్రీ సుందర కాండ పారాయణ 

This gallery contains 36 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీకాకుళ ఆంద్ర మహా విష్ణు దేవాలయం -లో అముక్తమాలద్య మండప0 -రాయల విగ్రహం ,కాసుల పురుషోత్తమకవి విగ్రహం తో బాటు 27-2-16 శనివారం శ్రీ సుందర కాండ మూడవ రోజు పారాయణ చిత్రాలు

శ్రీకాకుళ ఆంద్ర మహా విష్ణు దేవాలయం -లో అముక్తమాలద్య మండప0  -రాయల విగ్రహం
,కాసుల పురుషోత్తమకవి విగ్రహం తో బాటు 27-2-16 శనివారం శ్రీ సుందర కాండ మూడవ
రోజు పారాయణ చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆత్మ జ్యోతి మార్చి -2016 లింగార్చన ఎందుకు ?

Aatmajyothi March 20160038 0039 0040 0041

Posted in రచనలు | Tagged | Leave a comment

25-2-16 గురువారం మా ఇంట్లో మా అమెరికా మేనల్లుడు శాస్త్రి అత్తగారు శ్రీమతి మారుతి ,ఆమె పెదఒగిరాల మిత్ర బృందం ఒగిరాల

25-2-16 గురువారం మా ఇంట్లో మా అమెరికా మేనల్లుడు శాస్త్రి అత్తగారు శ్రీమతి మారుతి ,ఆమె పెదఒగిరాల మిత్ర బృందం ఒగిరాల

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -115

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -115

47- భారత జాతి పిత మహాత్మా గాంధి -5(చివరి భాగం కొనసాగింపు )

‘’భూమిమీద గాంధీ లాంటి మానవుడు జన్మించి జీవించి జాతిని ప్రపంచాన్ని ప్రభావితం చేశాడంటే భవిష్యత్తరాలు నమ్మ వేమో”’అన్నాడట ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ అయిన్ స్టీన్.నిజమే అంతటి చరిత్రనే సృష్టించాడు గాంధి .తన జీవిత చరిత్రను ‘’ది స్టోరి ఆఫ్ మై ఎక్స్పరిమేన్ట్స్ విత్ ట్రూత్’’ (సత్య శోధన )’గా రాసుకొన్నాడు దీన్ని తెలుగులోకి తెనుగులెంక శ్రీ తుమ్మల సీతారామ మూర్తిగారు ,శతావధాని శ్రీ వేలూరి శివ రామ శాస్త్రిగారు అనువదించారు .ఎన్నో భాషలలోకి అనువాదం చెందిన పుస్తకం అది ఎందరెందరికో కర దీపికగా భాసించింది .గాంధీపై రస్కిన్ దోరో టాల్ స్టాయ్ ప్రభావం ఉంటె గాంధీ ప్రభావం నల్ల జాతి అమెరికా నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ పై అమితంగా ఉంది. లక్షలాది నల్లజాతి ప్రజలతో లాంగ్ మార్చ్ నిర్వహించి తన జాతి వారి హక్కులు సాధించాడాయన .అహింసా సిద్ధాంతాన్నే నమ్మి ఉద్యమించాడు .

బాల్యం లో సత్య హరిశ్చంద్ర నాటకం చూసి ప్రభావితుడై సత్యానికి జీవితాంతం కట్టుబడ్డాడు గాంధి .శ్రావణ పితృ భక్తీ ఆయన్ను ఏంతో బాగా ఆకర్షించింది .భగవద్గీత ఆయన ఆరవ ప్రాణం. తనకు ఏ  సందేహం వచ్చినా  అదే తీరుస్తుందని చెప్పేవాడు .పుతలీబాయ్ ,కరం చంద్ ల చివరి  పుత్రుడైన మోహన్ దాస్  గాంధి బొంబాయిలో లాయర్ గా ఫెయిల్ అయి దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ లాయర్ గా ఇండియన్ ప్రజా నాయకుడిగా సక్సెస్ అయ్యాడు .1906లో అక్కడి ప్రభుత్వం జూలూ రాజ్యం పై నటాల్ లో    యుద్ధం ప్రకటిస్తే  భారతీయులను సైన్యం లో చేర్చుకోమని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాడు .సరేనని 20మంది స్వచ్చంద సేవకుల్ని స్త్రేచర్ మోయటానికి   నియమించి గాయపడిన బ్రిటిష్ సైనికులకు వైద్య సహాయం అందించటానికి   వినియోగించుకోన్నది .దానికి   గాంధీ నాయకత్వం వహించి రెండు నెలకు పైగా పని చేశారు .ఈ ఉదంతం వలన బలీయమైన సైన్యం ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం తో తలపడటం కష్టం అని తెలుసుకొని నెమ్మదిగా అహింసా విధానం లో ,నిరసన ,,సమ్మె లతో వారి మనసు మార్చాలని నిర్ణయించాడు .

ఇండియాలో లోమితవాదభావాలున్న  గోపాల కృష్ణ గోఖలే నాయకత్వం లో శిష్యుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో పని చేశాడు .బ్రిటిష్’’ విగ్గిష్ ‘’విధానాన్ని అనుసరించి పార్టీని పూర్తీ స్వదేశీయంగా మార్చాడు .1920లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై 1930భారత స్వాతంత్రం కోసం జాతికి పిలుపు నిచ్చాడు .1939 బ్రిటిష్ ప్రభుత్వం జర్మనీపై యుద్ధానికి దిగినప్పుడు గాంధీ ,కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు .సమ్మెలు హర్తాళ్ళతో దేశాన్ని హోరెత్తి౦ చాడు.  గాంధీమాటే మంత్రం అయింది .1942లో ఇండియాకు అత్యవసరంగా స్వేచ్చను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు .

1918లో మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో బ్రిటిష్ ప్రభుత్వ వైస్ రాయ్ గాంధీని ఢిల్లీలో జరిగే  యుద్ధ సమావేశానికి  ఆహ్వా నిస్తే  వెళ్ళాడు .వారిమనసు దోచుకొని స్వాతంత్ర్యాన్ని పొందచ్చు ననే ఆలోచన ఆయనది .భారతీయులను సైనికులుగా చేర్చుకోవటానికి ఒప్పుకున్నాడు .ఇది ఆయన అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకమే కాని తానుకాని తన వాల౦ టీర్లుకాని యుద్ధం లో పాల్గొని ఏ ఒక్క సైనికుడినీ చంపము అని వైస్ రాయ్ సెక్రేటరికి విజ్ఞాపన రాసి పంపాడు .అందుకే ఆమ్బులన్స్ లో ఉండి క్షత గాత్రులకు సేవలందించారు .బీహార్ లోని చంపారాన్ ,గుజరాత్ లోని ఖేడా ఉద్యమాలలో  రైతులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకం గా ప్రభుత్వం పై ఆహి౦సా  విధానం లో  పోరాడాడు .రైతులకు న్యాయం చేకూర్చేట్లు ప్రభుత్వాన్ని ఒప్పించాడు .గుజరాత్ లోని నాడియా జిల్లా ఖేడా లో జరిగిన ఉద్యమానికి వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించాడు .ప్రజలతో సంతకాల ఉద్యమం చేయించాడు .శిస్తులు కట్టవద్దని రైతులకు చెప్పి ఒప్పించాడు .అయిదునెలలు తీవ్రంగా ప్రతిఘటించి ప్రభుత్వం దిగోచ్చేట్లు చేసి రైతు హక్కులు కాపాడాడు .దీనితో పటేల్ నాయకత్వాన్ని మెచ్చి ‘’సర్దార్ ‘’బిరుదు ప్రసాదించాడు .1919లో ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్వహించి ముస్లిం లకు న్యాయం జరిగేట్లు చేశాడు

1909లో గాంధీ ‘’హింద్ స్వరాజ్ ‘’పుస్తకం రాశాడు .ఇందులో ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సహాకారం వల్లనే ఏర్పడి బతుకుతోందని ఇప్పుడు ప్రజా సహకారం లేనందున భారతీయులకు అధికారం అప్పగించి వెళ్ళిపోవాలని తీవ్ర స్వరం తో రాశాడు .తన హరిజన్ పత్రిక, య౦గ్ ఇండియా  లోనూ ప్రజాసమస్యలపై స్పంది౦చి రాసేవాడు..పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ మారణకాండ తో ఆయనలో ఉద్రేకం పెరిగింది .1921లో కాంగ్రెస్ పార్టీ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆచరణాత్మక ప్రణాళిక రూపొందింప జేసింది .పార్టీని పునర్నిమించాతానికి సూచనలు చేసి ‘’స్వరాజ్ సభ్యత్వం ‘’అందరితో తీసుకొనేట్లు చేశాడు . డబ్బుకట్టి సభ్యులుగా చేర్చే పని ప్రారంభించాడు .అహింసా సహాయ నిరాకరణ శాసనోల్ల౦ఘన లతో బాటు స్వదేశీ విధానాన్ని చేర్చాడు .విదేశీ వస్త్ర ,వస్తు బహిష్కరణ చేయించాడు. వాటిని పబ్లిక్ ప్రదేశాలలో ప్రజలు స్వచ్చందంగా దహనం చేసి పూర్తీ మద్దతు పలికారు .రాట్నం పై తానూ నూలు వడుకుతూ ప్రజల చేత వడికిస్తూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ‘’వణికేట్లు ‘’చేశాడు .బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులూ సత్కారాలు త్యజించారు నాయకులు .ఇప్పుడు అంతాస్వదేశీయే .ఖద్దరు దుస్తులే కట్టారు.తెల్లని  గాంధీటోపిపెట్టి ప్రాభుత్వానికి ‘’టోపీ పెట్టె ‘’పనిలో పడ్డారు ప్రజలు . ఎక్కడికైనా మడిచి  తేలికగా మోసుకు వెళ్ళేటైప్ రైటర్ సైజ్ లో చిన్న  పోర్టబుల్ రాట్నాన్ని గాంధీ స్వయం గా తయారు చేశాడు .

గాంధీ ప్రమేయం లేకుండా కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలింది .ఒక దానికి చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ లు రెండవదానికి రాజగోపాలాచారి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ నాయకులు .కలిసి పనిచేసిన హిందూ ముస్లిం లు క్రమంగా దూరమైపోయారు ,దీనికి నివారణగా 1924లో గాంధీ మూడువారా ల నిరాహార దీక్ష చేశాడు .ఆయన ఆశించిన ఫలితం రాలేదు .ఆ ఏడాది కాంగ్రెస్ మహాసభను బెల్గాంలో జరపాలని చెప్పాడు .అందరూఆయనే అధ్యక్షత వహించాలని కోరగా కాంగ్రెస్ కార్యకర్తలంతా చేతితో వడికిన నూలుతో నేసిన వస్త్రాలు ధరిస్తామని ప్రతిజ్ఞచేస్తే అభ్యంతరం లేదన్నాడు .అందరూ ఆమోదించగా   అసభకు గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇదే ఆయన అధ్యక్షతలో జరిగిన ఒకే ఒక్క సమావేశం .స్వరాజ్ పార్టీకి కాంగ్రెస్ కూ ఉన్న విభేదాలను చర్చలతో పరిష్కరించాడు .1928లో గాంధీ మళ్ళీ పూర్తీ ఉత్సాహం తో ఉద్యమించాడు. ప్రభుత్వం నియమించిన సైమన్ కమీషన్ ను ‘’గోబాక్ ‘’ఉద్యమంతో సాగ న౦పాడు .యువనేతలు నెహ్రూను సుభాస్ చంద్ర బోస్ ను దగ్గరకు తీశాడు .వాళ్ళు స్వరాజ్యం వెంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు .రెండేళ్లలో తానె దాన్ని ప్రకటిస్తానని చెప్పి చివరికి ఒక్క ఏడాది గడువుతో సరిపుచ్చుకోన్నాడుగాంది .

31-12-1929న లాహోర్ లో భారత జాతీయ పతాకాన్ని  ఎగరేశారు .1930జనవరి 26ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా సంబరాలను కాంగ్రెస్ లాహోర్ లో సభ జరిపి నిర్వహించింది . 1930మార్చ్ లో గాంధి ఉప్పు సత్యాగ్రహానికి పిలుపు నిచ్చాడు ..మార్చ్ 12నుంచి ఏప్రిల్ 6వరకు గాంధీ అహమ్మదాబాద్ లో బయల్దేరి 388కిలో మీటర్లు నడిచి సముద్ర తీరగ్రామం దండి చేరాడు .ప్రజలు బ్రహ్మరధం పట్టారు దేశం లో ప్రతి చోటా ఉప్పు సత్యాగ్రహాలలో ప్రజలు పాల్గొని ప్రజా బలం నిరూపించాగా బ్రిటిష్ ప్రభుత్వం ఇక అణచి ఉంచటం అసాధ్య మని గ్రహించింది మద్రాస్ లో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు బ్రిటిష్ వారి తుపాకీకి చాతీ ఎదురుగా పెట్టి కాల్చమన్నాడు ..ఉద్యమాలలో మహిళలను స్వచ్చందంగా పాల్గోనేట్లు చేశాడు .సరోజినీ ,కమలానెహ్రు ,దుర్గాబాయి దేశముఖ్ వంటి వారెందరో ఉద్యమించారు మహిళా చైతన్యం కలిగించారు .గాంధీ ఒక ‘’ప్రవక్త ‘’అయ్యాడు జనాలకు .ఆయన చెప్పిందే వేదం. ఆయన నడచిన బాట ఆదర్శం .ఆయనపై పాటలు పద్యాలు గేయాలు కధలు నవలలు నాటకాలు వచ్చాయి .1931లో గాంధీ -ఇర్విన్ ఒడంబడిక ఏర్పడింది .ఖైదీలన్దర్నీ ప్రభుత్వం విడుదల చేసింది .లండన్ లో రౌండ్ టేబుల్ కాన్ఫ రెన్స్ కు ఆహ్వానిస్తే వెళ్లి నిష్కర్షగా స్వతంతం ఇవ్వాల్సిందేనని చెప్పాడు .బ్రిటిష్ ప్రధాని చర్చిల్ గాంధీ చర్యలను నిందించేవాడు ‘’.అర్ధనగ్న సన్యాసి’’ అని  అవహేళన చేశాడు .

దళితుల పక్షాన అంబేద్కర్ నిలబడి అంటరానితనాన్ని రూపుమార్చాలని కోరాడు .1934లో గాంధీ కాంగ్రెస్ కు రాజీనామా చేశాడు .రెండేళ్ళ తర్వాత మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నాడు .రెండేళ్ళ తర్వాత సుభాస్ బోస్ కాంగ్రెస్ అధ్యక్షుడై పట్టాభి సీతారామయ్య ఓడిపోతే పట్టాభి ఓటమి తన ఓటమి అన్నాడు గాంధి. బోస్ కు దూరమైనాడు .గాంధీకి ఇష్టం లేకపోయినా బోస్ రెండవ సారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచాడు .గాంధీ మార్గాన్ని కాదని ముందుకు బోస్ వెడుతున్నాడని కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా రాజీనామా చేశారు .

1942క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహా ఉధృతంగా నడిపాడుగాంది .’’ordered anarchy of the present system of administration was worse than real anarchy ‘’అన్నాడు .స్వాతంత్ర్యం వచ్చినా గాంధీ సంతోషంగా లేడు. అన్నదమ్ములు విడిపోయినందుకు బాధపడ్డాడు .ఉత్సవాలకు పదవులకు దూరంగా ఉన్నాడు .నెహ్రూ ను ప్రధానిగా పటేల్ ను ఉపప్రధానిగా ఉండాలని హితవు చెప్పాడు .

గాంధీ నడచిన మార్గాన్నే’’ గాంధీ యిజం’’అన్నారు .అదే అందరికి ఆదర్శమైంది . There is no such thing as “Gandhism”, and I do not want to leave any sect after me. I do not claim to have originated any new principle or doctrine. I have simply tried in my own way to apply the eternal truths to our daily life and problems…The opinions I have formed and the conclusions I have arrived at are not final. I may change them tomorrow. I have nothing new to teach the world. Truth and nonviolence are as old as the hills.[1

గాంధీయిజం అనేది కొత్తదికాదని అనాదిగా ఈదేశం లో వస్తున్నదాన్నే తానూ అమలు చేశానని చెప్పాడు .గాంధీ అంటే రవీ౦ద్రనాద్ టాగూర్ కు వీరాభిమానం .టాగూర్ నా గురువు అనేవాడు గాంధి .మహాత్ముడన్నాడు టాగూర్ .విద్యావిధానం చదువుతూ ఆర్జి౦చేదిగా  ఉండాలని కోరాడు. అందుకే ‘’నయీ తాలిం ‘’అంటే బేసిక్ ఎడ్యుకేషన్ కోసం శ్రమించాడు. దీనిపై జకీర్ హుసేన్ చేత పుస్తకం రాయించాడు.ఆయనది ‘’సర్వోదయ సిద్ధాంతం ‘’అందరి సంక్షేమం కావాలన్నదే ధ్యేయం .గాంధీ  ప్రభావం మార్టిన్ లూధర్ కింగ్ ,జేమ్స్ లాసన్ ,జేమ్స్ బావెల్ పై అధికం .ఖాన్ అబ్డుల్ గఫార్ ఖాన్ గాంధీని అనుసరించి’’ సరిహద్దు గాంధీ’’ అనిపించుకొన్నాడు .దక్షిణాఫ్రికా స్వాతంత్ర్యం కోసం ఉద్యమించి సంపాదించిన నెల్సన్ మండేలా ,బర్మా నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ ,స్టీవ్ బీకోలు  గాంధీ వల్ల ప్రేరణ పొంది అదేమార్గం లో పని చేసి లక్ష్యాలు సాధించారు .రోమిన్ రోలాండ్ ,బ్రెజిల్ లీడర్ మేరియా లేసెర్డా డీ మోరా లపై గాంధీ ప్రభావం చాలాఉంది ఆయన్ను స్తుతించి కీర్తి౦చిన వారే వీళ్ళు .

గాంధీపై అటన్ బరో  గొప్ప సినిమా తీశాడు. బెన్ కింగ్స్లీ గాంధి పాత్రను గొప్పగా పోషించాడు .గాంధీ మరణించిన జనవరి 30వ తేదీని ‘’అమర వీరుల దినోత్సవం ‘’గా ప్రభుత్వం నిర్వహిస్తోంది .కల్లుతాగద్దని బోధించిన గాంధీ బొమ్మల ఎదుటే ఇవాళ కల్లు,సారా దుకాణాలు వెలిసి ప్రభుత్వానికి ధనం సంపాదించి పెడుతూ ఉండటం ఆశ్చర్యకరం  గాంధీ ఒక మహాత్ముడు .మార్గ దర్శి భారత జాతి పిత .

Inline image 1Inline image 2 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -114

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -114

47- భారత జాతి పిత మహాత్మా గాంధి -4(చివరి భాగం )

దేశం విషయం లో తీవ్రంగా స్పందించిన గాంధి తన స్వంత కుటుంబ విషయం లో కూడా చాలా గట్టిగానే  వ్యవహరించాడు .స్ట్రిక్ట్ డిసిప్లిన్ అంటూ పిల్లలపై ఆంక్ష పెట్టాడు .ఆయన పాత పద్ధతులు వాళ్లకు నచ్చలేదు .హరిలాల్ పెద్ద తాగు బోతు అయ్యాడు .జల్సా గాడై డబ్బు దుబారా చేశాడు .చివరికి మహమ్మదీయ మతం లోకి మారాడు .తన గొప్పతనాన్ని గాంధీ దాచుకొన్నా ,ఆయన్ను ప్రజలు ‘’మహాత్ముడు ‘’అన్నారు .గుడ్డినమ్మకాలతో ఆయన ప్రజల్ని నమ్మించలేదు .ప్రజలలో చైతన్యం ,జాగృతి కల్పించి మనసుల్ని దోచాడు .’’తన చుట్టూ ఉన్న సామాన్యులను నాయకులుగా అమర వీరులుగా మార్చిన మహా మహర్షి గాంధి అన్నాడు గోపాల కృష్ణ గోఖలే .ఆయన భాషణలు సెర్మన్ ఆన్ ది మౌంట్ లాగా గొప్ప ప్రభావం కలిగించాయి .చెడుకు మంచి గా స్పందించిన మహానుభావుడు .చాలామంది అంతకు పూర్వమే ‘’నిష్క్రియాత్మక ప్రతిఘటన (పాసివ్ రెసిస్టన్స్ )బోధించినవారే ,కానీ గాంధి ఆహి౦సాత్మకంగాశాసన ఉల్లంఘన కార్యక్రమం చేబట్టి ప్రభుత్వాన్ని లొంగ దీసి చరిత్రలో చిరస్మరణీయ విజయాలను సాధించాడు .

తన అనుచరులను ఆయుధం పట్ట వద్దని గాంధీ ఆదేశించినా ,ఆయన చేతుల్లో అనేక ఆయుధాలున్నాయి .అందులో ఒకటి’’ హర్తాల్ ‘’. స్వచ్చందంగా సమ్మెచేసి ,దుకాణాలు  బందు  చేసి ,పని వాళ్ళు దేవుని ప్రార్ధిస్తూ నిరాహార దీక్ష చేస్తూ  ఇంట్లోనే గడపటమే హర్తాల్ అంటే -1919లో బ్రిటిష్ ప్రభుత్వం పరిమిత చట్టం ( రెస్ ట్రి స్టివ్ యాక్ట్  )తెచ్చినప్పుడు గాంధి హర్తాల్ ఆయుధం మొదటి సారి ప్రయోగించాడు.దాని విజయం దాదాపుగా నమోదై ,28ఏళ్ళ తర్వాత బ్రిటిష్ పాలనకు చరమ గీతం పాడించింది .1919-47మధ్యకాలం లో గాంధీ రాజకీయ ఆధ్యాత్మిక కార్య క్రమాలలో మునిగి తేలాడు .సన్నబడి బలహీనంగా కట్టె పుల్లగా నల్లకళ్ళతో పెద్ద గుండ్రని స్టీల్ రిం  ఫ్రేం కళ్ళజోడుతో ఉన్నాడు. అరవై వచ్చేసరికిపళ్ళూడి పోయి ’’ బోసి నోటి బాపు ‘’అయ్యాడు .జుట్టులేకుండా బట్ట తలతో ,శరీరం వంకర్లు పోయి చాలా దారుణంగా తయారయ్యాడు .చేతులు మాత్రం యవ్వనం లో ఉన్నట్లు కనిపించాడు .కాని ఆయన ఆత్మ శక్తికి ఏ అడ్డూ ఆపూ లేదు .ఇది వరతికంటే మరింత ప్రేరితం చేస్తూ ప్రాజల్ని ప్రభావితం చేస్తున్నాడు .ఇండియా అంతా తిరిగి ప్రజలభాషలో ప్రజలకు అర్ధమయ్యేట్లు వందలాది సభల్లో వేలాది ప్రజలకు ప్రబోధించాడు .బాగా అలసిపోయి ఉంటె వేదికపై కాళ్ళు ముడిచి మౌనంగా ఉండి పోయేవాడు .ప్రేక్షకులు కూడా ఆయన మనో భావాన్ని అర్ధం చేసుకొని ఆనందించేవాళ్ళు. ఆయన మాట యెంత ప్రభావితం చేసేదో మౌనం కూడా అంతగానే ప్రభావితం చేసింది .ఆయన మౌన ముద్ర మౌన గురువు దక్షిణామూర్తి ప్రబోధంలాగా ఉండేదన్నమాట .

ఒక వేళ హర్తాల్ పిలుపు తో హింస ప్రజ్వరిల్లితే ,ప్రజలకు శాసనోల్లంఘనలో సరైన శిక్షణ లభించలేదని సమ్మెను ఆపెయ్యాలని వెంటనే ఆదేశించేవాడు .అమృత సర్ లో బ్రిటిష్ నరమేధం చేసినప్పుడు హోమ్ రూల్ లీగ్ అధ్యక్షుడుగా ఉన్న గాంధి ,మరింత తీవ్రంగా సహాయ నిరాకరణ చేశాడు .అరెస్టయి జైలుకెళ్లాడు .జైల్లో నిరాహార దీక్ష చేసి తిరుగుబాటు చేయమని ఆదేశించాడు .ఇలాంటి విధానాలను ఒక దశాబ్ద కాలం నిర్వహించాడు .61ఏళ్ళ బాపు ఇరవై నాలుగు రోజులు నడిచి సముద్ర తీరం దండీ లో ఉప్పు వండాడు ఇదే ఉప్పు సత్యాగ్రహం  .ఇది దేశ ద్రోహం గ భావించి అరెస్ట్ చేస్తే ఆసియాలోనే కాదు పడమటి దేశాలన్నీ బ్రిటిష్ దౌర్జన్యాన్ని ఖండించి ఇండియన్ లకు స్వాతంత్ర్యం ఇవ్వాల్సిందేనని ఘాటుగా తెలియ జేశాయి .దీని ఫలితంగా గ్రేట్ బ్రిటన్ చర్చలు జరపటానికి తీవ్రంగా సిద్ధ పడింది .లండన్ కు ఆహ్వానించారు .అక్కడ అయిదవ జార్జి రాజు తోనూ  క్వీన్ మేరీ తోనూ కలిసి బకింగ్ హాం పాలస్ లో టీ త్రాగాడు .ఇండియాలో ధరించే అన్గోస్త్రం ,పై పంచతో చర్చలకు వెళ్ళాడు .రాజు గారి తో భేటీకి ఈ డ్రెస్ సరి కాదుకదా అని ఒకరు వ్యాఖ్యానిస్తే  ‘’రాజు మా ద్దరికి సరిపడిన దానికంటే ఎక్కువ దుస్తులే ధరించాడు కదా ‘’అన్నాడు బోసినవ్వుల బాపు .ఇండియా వదిలి వెళ్ళేదాకా బ్రిటిష్ వాళ్ళు భీష్మించుకొనే కూర్చున్నారు. అంతకంటే మొండిగా గాంధీ కూడా పట్టు వదలలేదు .మళ్ళీ మళ్ళీప్రజల చేత  శాసనోల్లంఘన చేయించాడు జైలుకెళ్ళాడు  నిరాహార దీక్ష చేశాడు .హిందూ ముస్లిం లమధ్య సయోధ్య కుదిర్చాడు .అంటరాని తనాన్ని రూపు మాపాడు .పుట్టుక బట్టికులంకాదు ప్రవర్తన బట్టి అన్నాడు .బ్రిటిష్ ప్రభుత్వ నక్క జిత్తులు గాంధి ముందు పారలేదు .గాంధీని నియంత్రించటం అసాధ్యం అని గుర్తించింది తెల్ల జాతి ప్రభుత్వం .లక్ష్యం ఏమిటో 1942లో  క్రిప్స్ రాయబారం వలన ఇస్తామన్న రాజ్యాంగ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్ )చాలదని పూర్తీ అధికారం తో స్వాతంత్ర్యం ఇచ్చి దేశం విడిచి బ్రిటిష్ వారు వెళ్ళిపోవాలని చెప్పాడు .

కాని దేశం లో ఐక్యత సాధించటం కష్టంగా ఉంది .రాత్రింబవళ్ళు హిందూ ముస్లిం ఐక్యత కోసమే శ్రమించాడు .పాకిస్తాన్ లో ముస్లిం లు ఎక్కువ .మిగతా దేశం లో హిందువులది మెజారిటీ .నాయకులతో 73ఏళ్ళ వయసులో కూడా పరిష్కారం కోసం నిరంతర సంభాషణలు జరుపుతూనే ఉన్నాడు ఓపికగా.అసూయ ,బదులు ప్రేమతో ఉండమన్నాడు ప్రతిఘటన వదిలి సహకరించాలని కోరాడు .కాని ఆయన ప్రయత్నం విఫలమైంది .రెండు మతాలమధ్య చిచ్చు రగిలింది .హింస ప్రజ్వ రిల్లింది .కానీరాజీ అనేది గాంధీ ముఖ్య సిద్ధాంతం .మెజారిటీ వైపే మొగ్గాడు .చివరిసారిగా ఎక్కువకాలం నిరాహార దీక్ష చేశాడు  .దాదాపు చావు అంచుకు చేరాడు .ఢిల్లీ లో చర్చలు జరిపి ఇండియాపాకిస్తాన్ లు ఏర్పడాలని ముస్లిం లు పట్టు బట్టారు .చర్చులు విఫలమైనాయి .ఒప్పుకోక తప్పలేదు .1947ఆగస్ట్ 15 ఇండియా స్వతంత్రం పొందింది పాకిస్తాన్ విడిపోయింది  మళ్ళీ గాంధి విఫలమైనాడు .సయోధ్యకోసం ప్రయత్నించే సమయం ఇక లేదు .25-1-1948న ..ఆదివారం దీక్ష అయిపోగానే ఒక ప్రార్ధనా సమావేశానికి హాజరయ్యాడు .మామూలుకంటే అధికంగా జనం హాజరౌతున్నారు ప్రార్ధనలకు .౩౦-1-1948న ప్రార్ధనా సమావేశానికి వెడుతూ ఉండగా నాధూరాం గాడ్సే అనే హిందూ మహాసభ సభ్యుడు గాంధీకి నమస్క రిస్తున్నట్లుగా  వంగి చేతిలోని రివాల్వర్ తో అతి దగ్గరగా మూడు సార్లు కాల్పులు జరిపాడు .’’ హే రాం ‘’అంటూ కుప్ప కూలి ప్రాణం విడిచాడు జాతిపిత మహాత్మా  గాంధీజీ .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -113

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -113

47- భారత జాతి పిత మహాత్మా గాంధి -3

డబ్బు బాగా వస్తోంది . అందులో ఎక్కువ భాగం సాంఘిక అభివృధికి ఖర్చు చేసేవాడు గాంధి .దక్షిణాఫ్రికా భారతీయులకోసం ఒక నిది ఏర్పాటు చేశాడు .రస్కిన్ ఆలోచనలతో తన జీవిన విధానాన్నీ మార్చుకొన్నాడు .రస్కిన్ సూక్తి ‘’the life of labor ,the life of the tiller of the soil and the handi craftsman  is the life worth living’’బాగా వంట బట్టింది .ఏ విధానమైనా పరస్పర సహకారం లేకపోతె అర్ధ రహితమౌతుంతుని నమ్మాడు .కళ,కార్యం ,ప్రేమ జీవితపరమార్ధం అని గ్రహించాడు .ఫారం ఏర్పాటు చేసి అందులో భాగస్వాములుగా అందరినీ  చేర్చి తన తో పాటు పని చేసేట్లు చేశాడు .అందరుకలిసి పని చేసి ఉత్పత్తి చేసి సమానంగా అనుభవించటం అనేదాన్ని ప్రయోగాత్మకంగా విజయవంతం చేశాడు .తాను శాకాహారిగా నే ఉన్నాడు .కొద్దిగా కాయలు ,పళ్ళ తో జీవించటం అలవాటు చేసుకొన్నాడు .బ్రహ్మ చర్యాన్ని పాటించాడు .37వ ఏట నలుగురు పిల్ల తండ్రి గాంధి దాంపత్య శృంగార వ్యవహారాలకు ఇష్టంగా నే దూరమయ్యాడు .జీవితాంతం దీన్ని కొనసాగించాడు .దీనివల్ల ఏంతో శక్తి ఆదా అయి ఆయన సేవాకార్యాలకు ఉపయోగించింది .స్వయం నియంత్రణ ఆయన పధ్ధతి .మంచి చేయటం మంచిగా ఆలోచించటం తో మహాత్ముడైనాడు .

గాంధీ పత్రికా సంపాదకుడై జీవితాంతం గడిపాడు .సంస్కరణకోసం జర్నలిజం ను వాడుకొన్నాడు .ప్రయోగాలకు అది పనికి వచ్చింది. తప్పులు తెలుసుకోవటానికి సహకరించింది .38వ ఏట భారతీయు లందరి పేర్లు రిజిస్టర్ చేసి వేలి ముద్రలు తీసుకోవాలన్న చట్టం పెండింగ్ లో ఉన్నప్పుడు  జోహాన్స్ బర్గ్ లో భారీ  నిరసన సభ నిర్వహించాడు . ప్రతి ఒక్కరిని ఒప్పించి ఆచట్టాన్ని వ్యతిరేకించాలని ,అవసరమైతే అరెస్ట్ అయి జైళ్లకు వెళ్ళినా దెబ్బలు తిన్నా ప్రాణాలు పోయినా  అంగీకరించరాదని తెలియజేశాడు .మొదటి సారిగా ఇక్కడ ప్రారంభించిన ఈ నిరసన తర్వాత ఇండియాలో చాలాసార్లు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎదురు నిల్చి ఉద్యమించాడు దీనికే సత్యాగ్రాహం అని పేరు పెట్టాడు గాంది .ఇదే సత్య శక్తి లేక సత్య ప్రేమ .అక్కడి ప్రభుత్వం గాంధి ప్రొటెస్ట్ ను లెక్క చేయలేదు .చట్టం పాసైంది .గాంధీ వ్యతిరేకించి అరెస్ట్ అయ్యాడు .’’ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధి ‘’అనే అత్యద్భుత గ్రంధం రాసిన లూయీ ఫిషర్ తో గాంధీ ‘’జైలు నేరగాళ్లకు దొంగలకు అందరికీ జైలే .నాకు మాత్రం అదొక భవనం .దోరో ను చదవక ముందు నుంచే నేను జైలు కు వెళ్లాను ‘’అని చెప్పాడు

జైలు లో ఉండగానే గొప్ప రచనలు చదవటం పై మనసు కేంద్రీకరించాడు .దక్షిణాఫ్రికా జిల్లాలో గాంధి 249రోజులున్నాడు .ఇండియా జైళ్లలో,2089రోజులు గడిపాడు .ప్రజావ్యతిరేక చట్టాలను ప్రజలందరూ వ్యతిరేకిస్తే ప్రభుత్వం ప్రజలందరినీ జైళ్లలో పెట్టలేదని ,చివరికి దిగివచ్చి ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని అన్నాడు .ఆయన ఫిలాసఫీ  తర్వాత నిజంగానే రుజువైంది .దక్షిణాఫ్రికా నాయకుడు జనరల్ స్మట్స్ కొంత దిగొచ్చి ,ఇండియన్లు స్వచ్చందంగా  పేర్లు నమోదు  చేసు కొంటామని చెబితె చట్టాన్ని ఉప సంహరిస్తామని   ప్రకటించాడు .దీనికి అందరూ వ్యతిరేకించినా గాంధీ అంగీకరించాడు .అందరిలాగానే గాంధీకి కూడా స్మట్స్ పై అనుమానం ఉన్నా’’ ప్రేమ సత్యం నమ్మకాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండేవని చెప్పాడు .దేనికైనా ప్రాతి పదిక నమ్మకమే .ఒక వేళ స్మట్స్ మోసం చేస్తే మళ్ళీ ఉద్యమిద్దాం .నమ్మకం లేక పొతే భవిష్యత్తు లేదు .’’అని అందరికి చెప్పి తానె మొదట తన పేరును నమోదు చేసుకొన్నాడు.కాని ఇప్పటిదాకా ఆయన్ను నమ్మి అనుసరించిన వారే గాంధీ మోసగించాడని తిట్టారు ,అసహ్యి౦చు కొన్నారు ,కొట్టారు కూడా .దాదాపు చంపినంత పని చేశారు ఇదే ఆయన ఎదుర్కొన్న సత్య పరీక్ష .

అనుకోన్నట్లే స్మట్స్ తన వాగ్దానం నిలబెట్టుకోలేదు. చట్టాన్ని ఉపసంహరించ లేదు.గాంధీ వ్యూహా సంచారి అయి ఉంటె ఈ సంఘటన తో మట్టి గరచి ఉండేవాడు .కానీ ఆయన కలల బేహారి కాడు.ఒక ఆచరణ శీలి అయిన రాజకీయ నాయకుడు .ఒకసారి మొదలు పెట్టాక ఆగటం అసాధ్యం అని తెలిసినవాడు .స్మట్స్ ను నమ్మి చేసిన  పొరబాటు ఆయన్ను నాశనం చేసి ఉండాలి .’’ సత్యాగ్రహ బలం ఏమిటో ప్రపంచానికి తెలిసింది .మనలను వ్యతిరేకి౦చే వాడికి పరిస్తితులనుపూర్తిగా  అర్ధం చేసుకోవటానికి  మరో అవకాశం ఇద్దాం.’’అని చెప్పి ,మళ్ళీ ప్రజా సమీకరణ చేశాడు. ఈ సారి అందరూ ఆయనపై పూర్తీ విశ్వాసముంచి ముందుకు కదిలారు .అప్పటిదాకా ధరించిన యూరోపియన్ వేషాన్ని తీసి పారేశాడు .  తెల్లని  పంచ ,అంగోస్త్రాన్ని కట్టాడు,మామూలు చెప్పులు తొడిగాడు  .అసలైన భారతీయుడిలా కనిపించాడు .వేలాదిగా పురుషులు స్త్రీలు పిల్లలతో బ్రహ్మాండమైన ప్రొటెస్ట్ మార్చ్ నిర్వహించాడు .గని యజమానులు సానుభూతి చూపారు .రైల్ రోడ్ ఉద్యోగులైన  తెల్లవారు కూడా సమ్మెలో చేరారు . .పరిస్థితులు చేయి దాటి పోతున్నాయని ప్రభుత్వానికి అర్ధమైంది .స్మట్స్ దిగొచ్చి మరోమారు సంప్రదింపులు జరిపాడు .’’ఇండియన్ రిలీఫ్’’ గాంధీకి అద్భుత విజయాన్ని కట్ట బెట్టింది .అనుకొన్నది సాధించి తిరుగులేని ప్రజానాయకుడు, ప్రజా బంధువు అయ్యాడు గాంధి .

46వ ఏట గాంధి  బ్రిటిష్ కబంధ హస్తాలనుండి ఇండియాకు విముక్తి కలిగించాలన్న ధ్యేయం తో ఇండియాకు  తిరిగొచ్చాడు .మొదట్లో అది అసాధ్యమని పించింది .ఇండియా చాలా పెద్ద దేశం అనేక కులాలు వర్గాలు భాషలతో ఉన్న దేశం .హిందూ ముస్లిం ల మధ్య సఖ్యత లేదు .కులాల వారీగా హిందూ సమాజం చీలి పోయి ఉంది .దక్షిణాఫ్రికాలో విజయం సాధించినట్లుగా ఇక్కడ విజయం పొందటం చాలా కష్టం .కాని అసాధ్యం మాత్రం కాదు .ఇండియా రాగానే మొదటగా  ప్రజలకు తమ  గౌరవాన్ని గుర్తు చేశాడు .వారికున్న సంస్కృతీ అనాది అని దాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశాడు .అన్నికులాలుసమానమేనని తెలిపాడు .అందరూ గౌరవం గా సహకారం తో నమ్మకం తో జీవి౦చా లన్నాడు .అసమానత తొలగిపోవాలి .నిరక్షరాస్యత రూపు మార్చాలి .స్వయం గా వేసుకొన్న బంధనాలనుండి అందరూ ముందుగా విముక్తి పొందాలి. తర్వాత భారతమాత దాశ్య శృంఖలాలను చేదించి స్వతంత్రం సంపాదించాలి .స్వేచ్చ స్వాతంత్ర్యాలు అందరి అభి వృద్ధికీ తోడ్పడాలి .భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడై దేశమంతా సంచరించి పరిశుభ్రత పాటిస్తేనే జీవన వృద్ధి జరుగుతుందని బోధించాడు .అంటరాని తనం భారతీయ సమాజానికి చేటు అని దాన్ని రూపు మాపాలని తీవ్రంగా ప్రచారం చేశాడు. తానే ముందుగా తన ఆశ్రమం లో ఒక నిరుపేద అంటరాని కులానికి చెందిన అమ్మాయికి ఆశ్రయమిచ్చి   అందరికి మార్గదర్శి అయ్యాడు .పారిశ్రామీకరణ భారతీయ కుటీర పరిశ్రమలకు హాని చేసిందని ,మన కుటీర పరిశ్రమలకు చేయూత నిచ్చి కాపాడుకోవాలని ఉద్బోధించాడు .గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహం కలిగించాలన్నాడు .చేనేతకు అధిక ప్రాధాన్యమిచ్చి స్వయంగా రాట్నం పై  తన వస్త్రాలకు సరిపడా నూలు తీశాడు .దీనితో  ప్రతి ఇంటా రాట్నం వెలిసింది .చేతి పరిశ్రమలకు ఊతమొచ్చింది .పల్లె టూళ్ళు ప్రగతి పదంలో చేరాయి గ్రామీణాభి వృద్ధే దేశాభి వృద్ధికి రాచబాట అన్నది గాంధీ పిలుపు .

గాంధీ  నాయకత్వం తో జాతీయోద్యమం పరవళ్ళు తొక్కింది  బ్రిటిష్ ప్లా౦టర్స్ భారతీయ రైతులను పీల్చి పిప్పి చేస్స్తుంటే చంపారాన్ కు వెళ్ళాడు .గాంధీని జోక్యం కలిగించుకోకుండా బ్రిటిష్ ఆఫీసర్లు అడ్డం పడ్డారు .చట్టాన్ని వ్యతిరేకి౦చాడని కేసుపెట్టి ఇబ్బందికలిగించారు .అదొక గొప్ప సంఘటనగా చరిత్రలో నిలిచి పోయింది .ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది .ఇంపీరియల్ ప్రభుత్వం ఇండియా పౌరుడిని రౌడీ గా చిత్రి౦చ లేదని గ్రహించింది .చంపారాన్ పోరాటం పై లూయీ ఫిషర్ రాస్తూ ‘’it did not begin as an act of defiance ,It grew out of an attempt to alleviate the distress of large numbers of poor peasants .This was typical Gandhi pattern .His politics were intertwined  with the practical day –to-day problems of the millions His was a loyalty to living human beings but not a loyalty to abstractions .In every  thing Gandhi did  ,he tried to mold a new free Indian who could stand on his own  feet and thus make India free .He was a natural fighter and a born peace maker He had the might of a dictator and the mind of a democrat ‘’అంటూ చక్కగా విశ్లేషించి మహాత్ముని గొప్పతనాన్ని ఆవిష్కరించాడు .ఆయన యంత్రాలను నమ్మక పోవటానికి కారణం ఆయన మాటలలోనే ‘’the human today is a most delicate piece of machinery ‘’.అనేకులపై ఎక్కి యంత్రం స్వారిచేస్తూ కొద్దిమందికే ఉపయోగ పడుతుంది ‘’అన్నాడు .మార్క్స్ చెప్పిన లేబర్ సర్ప్లస్ విలవ ను నమ్మాడు. కార్మికులు యజమాని మధ్య ఘర్షణ అర్ధం చేసుకొన్నాడు .కాపిటలిజం తగదన్నాడు .భౌతిక ,ఆధ్యాత్మిక స్వేచ్చ ను గాంధి ప్రచారం చేశాడు .చర్చించాడు రాశాడు నచ్చ చెప్పాడు ,మందలించాడు వినక పొతే చివరి ఆయుధంగా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు .వ్యతిరేకులకు భయం కలిగించటానికో ,ప్రచారం  కోసమో నిరాహార దీక్ష చేయలేదు .తనను నమ్మిన వారినందరినీ ఏకం చేయటానికి వారి ద్రుష్టి కేంద్రీకరణకోసం  మాత్రమే చేశాడు  .సమస్యపై పలు కోణాలలో అధ్యయనం చేసి దాన్ని సాధించటానికి ఒక మార్గం గా చనిపోవటానికైనా తాను సిద్ధం అని తెలియ జేసిన వాడు గాంధీ మహాత్ముడు

.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-16-ఉయ్యూ

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -112

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -112

47- భారత జాతి పిత మహాత్మా గాంధి -2

1891లో బార్ ఎట్ లా పాసై గాంధి ,ఇండియాకు తిరిగి వచ్చి లాయర్ గా ప్రాక్టీస్ లో సఫలం కాలేక పోయాడు .ఇక్కడి కపటనాటకం ,సంస్థానాల అవినీతి నిరాశ పరచాయి .ఒక వ్యాపార సంస్థ తమ న్యాయ వ్యవహారాల కోసం  గాంధిని దక్షిణాఫ్రికాకు పంపిస్తే సంతోషంగా వెళ్ళాడు .ఆ పని కొద్దికాలమే అయినా ఇరవై  ఏళ్ళు అక్కడే లా ప్రాక్టీస్ చేశాడు .24వ ఏట దక్షిణాఫ్రికావెళ్లి అక్కడి భారతీయులకు జరుగుతున్నా అన్యాయాలను  వర్ణ విచక్షతనుహీనంగా చూడటాన్ని  గుర్తించాడు .అమెరికాలోని జిమ్ క్రో నిబంధనలాగానే అక్కడ బ్రిటీష్ వాళ్ళు ఇండియన్స్ ను అవమానిస్తున్నారు .ఒక కేసులో వాదిస్తున్నప్పుడు నెత్తిమీదున్న  టర్బన్( తలపాగా )తీసేయమంటే తిరస్కరించాడు గాంధి . .గాంధీని ‘’కూలీ బారిస్టర్ ‘’అని ఎద్దేవా చేసేవాళ్ళు .ఫస్ట్ క్లాస్  పెట్టెలో ఎక్కితే దింపి మూడవ తరగతి పెట్టెలో కూచో మనేవారు .ఒకసారి ఎదురు తిరిగితే బయటికి నెట్టేసి కొట్టారు కూడా .చూసీ చూడనట్లు ఉండటం అసాధ్యమని పించింది .ఉపేక్ష ఇక పనికిరాదనుకొన్నాడు .అక్కడి ప్రజల భవ్య భవిష్యత్తు కోసం దక్షిణాఫ్రికా ఇండియన్ల సంఘం ఏర్పాటు చేశాడు .తమను ప్రభుత్వం గౌరవించే స్థాయి కలిగి ఉండే ట్లు ప్రవర్తించాలని ప్రజలను కోరాడు .గాంధీ ఒక్కడే .అయినా వారిని కదిల్చాడు వారి ఆలోచనలో మార్పు తెచ్చాడు .దీనికి ఆయన విశుద్ధ ప్రవర్తన ముక్కు సూటి తనం  మనోధైర్యం బాగా తోడ్పడ్డాయి . వాళ్ళంతకు వాళ్ళు చేయలేని దాన్ని గాంధీ దగ్గరుండి చేసేట్లు చేశాడు .అంతటి గొప్ప పరివర్తన వారిలో వచ్చింది .

పాతికేళ్ళ దక్షిణాఫ్రికా జీవితం లో గాంధీని ప్రభావితం చేసినవారిలో రష్యన్ నవలా కారుడు లియో టాల్ స్టాయ్,ఆంగ్ల విమర్శకుడు జాన్ రస్కిన్ ,అమెరికా రచయిత హెన్రి డేవిడ్  థోరో.టాల్ స్టాయ్ రచన ‘’ది కింగ్డం ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ యు ‘’చదివి సాంఘిక విషయాలలో ప్రతిఘటన లేకుండా నిరసన వ్యక్తం చేయటం ఎలాగో తెలుసుకొని అమలు చేశాడు .ధోరో శాసనోల్లంఘన ,హక్కులు తెలియ జేశాడు .కాని గాంధీని అత్యంత ప్రభావితం చేసిన వాడు రస్కిన్ మాత్రమె .రస్కిన్ రచన ‘’అన్ టు దిస్ లాస్ట్ ‘’చదివి పనిలోని గౌరవాన్ని –డిగ్నిటి ఆఫ్ లేబర్  అర్ధం చేసుకొన్నాడు .సహజం గా హిందూ జీవితం లో పురుషులకు సమాన వ్యక్తిత్వం అనాదిగా ఉన్నా కుల వ్యవస్థ వారిని దిగ జార్చింది .ఎవరూ చేయని అతి తక్కువ స్థాయి పనులను చేసేవారిని అస్ప్రుస్యులు గా సమాజం చూసి వారిని దూరంగా పెట్టింది .రస్కిన్ ను అర్ధం చేసుకొన్న గాంధి వీటిపై గొప్ప మార్పులు రావాలని తలచి దీక్షగా ముందుకు కదిలాడు .తానూ మారటమే కాదు యావత్తు సమాజాన్ని మార్చాలను కొన్నాడు .తాను  దివ్య జీవితం గడుపుతుతూనే ఉన్నాడు .కాని ఇప్పుడు తీసుకొనే నిర్ణయాలు చాలా తీవ్రమైనవి సమాజ మూలాలను పూర్తిగా మార్చేవి .దీనికి ఆర్ధిక సహకారమూ కావాలి అప్పుడే సాధ్యం .

తన సంకల్పాన్ని అమలు చేయటానికి ఒక వరుసగా కార్యక్రమాలు చేబట్టాడు .మొదట అందరికి విజ్ఞప్తి చేశాడు .ఉత్తరాలు వ్యాసాలూ కరపత్రాలు పేపర్లలో వ్యాసాలూ రాసి తన మోభావాలను ప్రజలకు తెలియ జేశాడు .దక్షిణాఫ్రికా లో తన పని పూర్తికావటానికి ఇంకా చాలాకాలం పడుతుందని గ్రహించి గాంధి ఇండియా తిరిగి వచ్చేశాడు .అప్పటికే రెండోకొడుకు మణిలాల్ జన్మించాడు .గాంధీ వ్యాసాలూ చదివిన జనం ఆయన చెడిపోయాడని కనుక ఆయన ఎక్కి వచ్చిన నౌకను నౌకాశ్రయం లో ఆపటానికి వీల్లేదని ఆందోళన వచ్చింది .23రోజులు అలాగే ఓడ లో ఉండి చివరి పరిస్తితులు సర్దుకున్నాక బయటికి రావటానికి ఒప్పుకొన్నారు కాని ఆయన చీకట్లో రహస్యం గా రావటానికి ఇష్టపడలేదు .పగటి పూట సముద్ర తీరంపైకి చేరగా అక్కడ చేరిన జనం ఆయనపై దాడి చేశారు .రాళ్ళతో చెప్పులతో కొట్టారు కింద పడేశారు తన్నారు .శరీరభాగాలేవీ దెబ్బతిన కుండా పోలీసుల జాగ్రత్త వలన బతికి బయట పడ్డాడు .దీనిపై కేసు పెట్టమని చాలా మంది ఒత్తిడి తెస్తే అలాచేయటానికి గాంధి ఒప్పుకోలేదు .హింసాత్మక చర్యలతో తన మనో దీక్షను బలహీన పరచటం ఎవరికి సాధ్యం కాదని రుజువు చేశాడు .

గాంధీ 32వ ఏట బోయర్ యుద్ధం వచ్చింది .బోయర్ల పై సహజంగా సానుభూతి ఉన్నా బ్రిటిష్ ప్రభుత్వం లో ఉన్నాం కనుక ప్రభుత్వానికి సహకరించాలను కొన్నాడు .ఇది ఆయన నమ్మిన  అహింసా సిద్దా౦తానికి  విరుద్ధం . ఇలా గాంధీ కొన్ని విషయాలలో విరుద్ధంగా ప్రవర్తించాడు .మొదటి ప్రపంచయుద్ధం లో ప్రభుత్వానికి సహకరించాడు .నిజంగా యుద్ధం లో పాల్గొనక పోయినా అంబులెన్స్ లో ఉండి పని చేశాడు .బోయర్ యుద్ధం ముగిసాక ,తన స్వగ్రామం లో ఉండిపోవాలనుకొన్నాడు కాని దక్షిణాఫ్రికా నుండి పిలుపు వచ్చింది .అక్కడ ఆయన ప్రజానాయకుడుగా లాయర్ గా బాగా విజయాలు సాధించాడు .ధనం బాగా వచ్చినా ,అసమానత పై ద్రుష్టి మారలేదు .సాంఘిక పోరాటాలలో మరింత దీక్షగా పని చేశాడు . రోజు వారీ జీవితం పై ప్రభావం కలిగించాడు .అంటరాని వారితో కలిసి పని చేశాడు. తన కుటుంబం వారికి ఆ విషయమై అవగాహన కలిగించి ఒప్పించి వారిలోనూ మార్పు తెచ్చాడు .ఎవరిపని వారు చేసుకోవటం నేర్పాడు .పాకీ దొడ్లు కదిగాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-2-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భరతమాతకు ఖ్యాతి – రేపటి పౌరులకు స్పూర్తి -కొలచల సీతారామయ్య

 

Untitled

 

0001
\

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -111

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -111

47- భారత జాతి పిత మహాత్మా గాంధి

భారత్ అంటే ఇరవయ్యవ  శతాబ్దం ప్రారంభం నాటి తొలి సంవత్సరాల వరకు సామాన్య పడమటి దేశీయులకు పట్టనే లేదు .దూరం ఒక కారణం కావచ్చు .కాని 1940 నాటికి ఇండియా ను గురించి ప్రపంచ మంతా గొప్పగా చెప్పుకొనే స్థితి వచ్చింది .దీనికి కారణం ఒకే ఒక్కడు .ఆయనే మోహన్ దాస్ కరం చంద్ గాంధి .అతి సామాన్యంగా ఉండి ,అణకువ ,హిందూ  మతం పై గాఢమైన అభి వ్యక్తీ కలిగి ,రాజకీయాలలోకి వచ్చిన ముని అని పించుకున్నవాడు .సత్యాన్ని నమ్మి ఆచరించినవాడు .

గాంధి 2-10-1869న బొంబాయి సంస్థానం లోని చిన్న సముద్ర  తీర పట్టణం పోర్ బందర్ లో జన్మించాడు .అక్కడి ప్రజల మాతృభాష  గుజరాతీ .తాత పోర్బందర్ కు దివాన్ అయినా ,తండ్రి రెండు చిన్న సంస్థానాలలో అదే ఉద్యోగం చేశాడు .ఈ ఇద్దరూ విధి నిర్వహణలోనే గడిపారుకాని దౌత్య వేత్తలు రాజకీయ వేత్తలు  కాలేదు ..

హిందువుల విధానం లో సంఘం లో నాలుగు కులాలుంటాయి .బ్రాహ్మణులు చదువు తో తెలివి తేటలు గలవారుగా గుర్తింప బడేవారు .తరువాతవారు సమాజ, దేశ రక్షణ లో ఉండి యుద్దవీరులుగా ,రాజులుగా ఉన్న క్షత్రియులు .తరువాతి వారు వర్తక వ్యాపారాలు చేసే వైశ్యులు .అందరిక౦టే అట్టడుగు వారు కూలీ పని చేసే శూద్రులు .గాంధి కుటుంబం మూడవ జాతి వైశ్య కుటుంబం .గాంధి అంటే నే కిరాణా వ్యాపారి అని అర్ధం .కాని వీరు విలాసాలకు చేరువలో సకల సుఖాలతో జీవించారు .ఇంటిలో పాశ్చాత్య వ్యామోహం లేదు కాని ఇంటినిండా పుస్తకాలు దంతపు సామాను ,సంగీత వాద్యాలు ,న గా నట్రా బంగారం ఘనంగా ఉండేవి .తండ్రి నాలుగవ భార్యకు నాల్గవ సంతానం గాంధి .బాలగా౦ధి ని చూసుకోవటానికి ప్రత్యేకం గా ఒక నర్సు ఉండేది .గాంధి బాల్యం పవిత్రంగా సురక్షితంగా గడిచింది .కొన్ని బలహీనతలలో చిక్కుకున్నాడు .కొన్ని సార్లు పొగ తాగాడు ,మాంసం తిన్నాడు అన్నగారి డబ్బు తస్కరించాడు .15వ ఏట తాను  చేసిన తప్పులనుతండ్రికి చెప్పి  ఒప్పుకొన్నాడు .ఏ శిక్షకైనా సిద్ధ పడ్డాడు .తండ్రి ఏడుస్తూ కొడుకును మన్నించి పెనాల్టీ విధించకుండా శిక్షించకుండా క్షమించాడు .దీనితో మోహన్ దాస్ మారిపోయాడు .హిందూ ధర్మాలైన ప్రేమ ,సత్య భావనలు ఉత్కృష్ట మైనవిగా అర్ధం చేసుకొన్నాడు .అప్పటి నుంచే వాటిని ఆచరణలో పెట్టటం ప్రారంభించి జీవితాంతం ఆచరిస్తూనే ఉన్నాడు .

ఆ నాటి సంఘాచారం ప్రకారం గాంధీకి 13ఏట వివాహం చేశారు .పోర్బందర్ వ్యాపారి  కుమార్తె కస్తూరి బాయి ఆయన భార్య. సమాన వయస్కురాలు .ఆమెతో జీవితాంతం కాపురం చేశాడు .ఈ బాల్య వివాహాలు ఆర్ధిక సౌకర్యం కోసం జరిగేవి .వివాహం విద్య నాశాయ అన్నట్లు ఒక ఏడాది చదువు గుంట కొట్టింది .భార్య కాపురానికి వచ్చింది .తనకు తెలిసిన చదువు కస్తూర్బా కు బోధించాడు .ఆమెకు గుజరాతి లో ప్రాధమిక విద్య తప్ప ఏమీ రాదు .కాని ఆమెను ఆరాధించి ప్రేమించి జీవనం సాగించాడు .యవ్వన మదం దిగలేదు .తండ్రి చనిపోయినప్పుడు ,ఆయన ప్రక్కన ఉండి సేవ చేయకుండా ,హాయిగా భార్య తో గదిలో శృంగారం లో మునిగి తేలాడు .మొదటి సంతానం పుట్టి వెంటనే చని పోయే నాటికి గాంధి దంపతులకు కేవలం 15 ఏళ్ళు మాత్రమే .మొదటి సారిగా తనకున్న వ్యామోహం పై ఏవగింపు కలిగింది .

తండ్రి మరణం తర్వాత    19వ ఏట గాంధీని లా చదవటానికి ఇంగ్లాండ్ పంపారు .గాంధికి మెడిసిన్ చదవాని ఉంది .కాని లా చదివితే సంఘం లోపలుకుబడి వ్యవహారాలను చక్క బెట్టె నేర్పు వస్తాయని కుటుంబం పట్టు బట్టింది .రెండో కొడుకును, భార్యను వదిలి 1888లో లండన్ చేరాడు .20ఏట తీసుకొన్న ఫోటో అప్పటికి గొప్ప .నల్లని జుట్టు ఒకప్రక్కకు ఒరిగి ,నల్లటి కళ్ళతో తీక్ష్ణ మైన ద్రుష్టి తో ఉండేవాడు .దొప్పల్లాంటి పెద్ద చెవులు పొడవైన కొంగ ముక్కు ,మొరటు  పెదవులు .మొదటి సారి లండన్ వెళ్ళినప్పుడు పడమటి వాసన తో అల౦క రించుకొన్నాడు .చొక్కా కాలర్లకు పిండి పెట్టి స్టిఫ్ గా ఉంచుకోనేవాడు ,మార్నింగ్ కోట్ వేసేవాడు .తోలు చెప్పులు ధరించాడు .పెద్ద సిల్క్ టోపీ పెట్టేవాడు .చేతులకు గ్లోవ్స్  విలాసంగా చేతిలో  కర్ర .వీటికి విరుద్ధంగా చాలా సాధారణ జీవితమే గడిపేవాడు .మైళ్ళకొద్దీ దూరం రోజూ నడిచే వెళ్ళేవాడు .కొద్దిమందే స్నేహితులు .లా తో పాటు లాటిన్ ,ఫ్రెంచ్ ,ఫిజిక్స్ లు కూడా చదివాడు .ఇంగ్లీష్ అమెరికన్ సాహిత్యాన్ని బహు ఇష్టంగా చదివాడు .తూర్పు ,పడమటి దేశాల మతాలు వాటిలోని తేడాలు అధ్యయనం చేశాడు .తమాషా ఏమిటి అంటే ఇంగ్లాండ్ లోనే మొదటి సారిగా  భగవద్గీత ఇంగ్లీష్ అనువాదాన్ని  చదివాడు .గీత నుండి తన జీవిత ఫిలాసఫీ ని నిర్ణయించుకొని ఆచరణ లో పెట్టాడు .

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి మరియు  ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో  శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలను ఉగాది (8-4-16)కు  అయిదు రోజుల ముందు 3-4-16ఆదివారం  మధ్యాహ్నం 3-30గం ల నుండి నిర్వహిస్తున్నాం  .ముందుగా శ్రీమతి వి .శాంతిశ్రీ గారిచే  సంగీత కచేరి నిర్వహింప బడును .తరువాత శ్రీ ఏ సి .పి.శాస్త్రి గారు(హైదరాబాద్ ) ఆంగ్లం లో రాసిన ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’పుస్తకానికి  సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ‘’దైవ చిత్తం ‘’గా తెలుగులోకి అనువదించిన గ్రంధాన్ని సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల వారి కుమార్తె ,దూర దర్శిని ప్రొడ్యూసర్ శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని ముఖ్య అతిధిగా విచ్చేసి ఆవిష్కరిస్తారు   .దీనికి ముందు మాటలను శతాధిక  చారిత్రిక నవలా రచయిత,చారిత్రక నవలా చక్రవర్తి , ప్రముఖ విమర్శకులు  డా .శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారు రాయటం విశేషం .ఈ గ్రంధానికి ప్రాయోజకులు ,కృతి స్వీకర్త  సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా ) అవటం మరో గొప్ప విషయం .

ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు ,సుప్రసిద్ద కవి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గుంటూరు(పులిచింతల ) శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు  గౌరవ అతిధి గా ,రమ్యభారతి సంపాదకులు ,శాసనమండలి సంభ్యులు శ్రీ వై వి బి రాజేంద్రప్రసాద్ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి ,ప్రముఖ కవి, రచయితా, విమర్శకులు శ్రీ చలపాక ప్రకాష్ గారు , కే.సి.పి-సి ఇ.ఒ. మరియు రోటరీ క్లబ్ గౌరవాధ్యక్షులు శ్రీ జి.వెంకటేశ్వరరావు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటారు .

సుప్రసిద్ధ సాహితీ మూర్తులు,ఆత్మ జ్యోతి మాసపత్రిక గౌరవ సంపాదకులు ,సుమారు 150 సంస్కృత గ్రంధాలను స్వంత ఖర్చులతో ముద్రించినవారు   డా.శ్రీ రావి మోహన రావు దంపతులకు (చీరాల ), ,పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, బహు గ్రంధ కర్త  డా శ్రీ  డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి  (పొన్నూరు )గారికి ,శ్రీ పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులు  ,తత్వ శాస్త్ర పారంగత శ్రీ గరిమెళ్ల సోమయాజులు శర్మ(విజయవాడ ),గారికి,డా.నాగ రాజు అలిసేటి (యు.జి.సి.పోస్ట్ డాక్టోరల్ రిసెర్చర్, హైదరాబాద్ యూని వర్సిటి )గారికి , ప్రముఖ హరికధా భాగవతారిణి శ్రీమతి మద్దాలి (వై )సుశీల (విజయవాడ ) గారికి ,,పులకేశి, నలచరిత్ర,’ నాటక కర్త, నటులు  , సంగీత భూషణ ,’’ది మైండ్ ఆఫ్ గాడ్’’  రచయిత శ్రీ ఎ.సి.పి.శాస్త్రి(హైదరాబాద్ ) గారికి    ,  స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారాలు అందజేయ బడును . శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు ఏర్పాటు చేసిన  ‘’స్వయం సిద్ధ’’ పురస్కారాన్ని అమర వాణి హైస్కూల్ వ్యవస్థాపక నిర్వాహకులు శ్రీ పి.నందకుమార్ గారికి ,యువ ఆర్కిటెక్ట్ కుమారి చతుర్వేదుల యశస్విని కి ,అంధుడై అందులకు కంప్యూటర్ విద్య నేర్పిస్తున్న ఛి . రామారావు కు అందజేయ బడుతుంది .

తరువాత  ‘’మా అన్నయ్య ‘’శీర్షికపై జిల్లాలోని ప్రసిద్ధ కవి మిత్రులచే ‘’కవి సమ్మేళనం ‘’జరుగుతుంది .

సాహిత్య ,సంగీతాభిమానులు ఈ కార్య క్రమం లో పాల్గొని విజయవంతం చేయ వలసినదిగా మనవి .పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం మార్చి రెండవ వారం లో అంద జేయ బడును .

జోశ్యుల శ్యామలాదేవి   మాది రాజు శివ లక్ష్మి   గబ్బిట వెంకట రమణ      గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు            కార్య దర్శి              కోశాధికారి                     సరసభారతి అధ్యక్షులు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -110

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -110

46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -4 (చివరి భాగం )

జపాన్ కు వెళ్ళే ముందే రైట్ మిరియం నోయెల్ అనే ఆవిడతో పరిచయం పెంచుకొన్నాడు .ఆమె క్రిస్టియన్ సైంటిస్ట్ ,శిల్పి .ఆమెకు ఒకే కంటిగ్లాస్ తో ఉండేది .  .ఇద్దరుపెద్ద పిల్లలు కూడా .స్వయం సిద్ధంగా  కలిసి ఉండాలని ఇద్దరూ అవగాహన కొచ్చారు .ఒరిఎంట్ హోటల్ పనిలో నాలు గేళ్ళుఉన్నాడు. మొదటిభార్య కేధరిన్ విడాకులకు ఒప్పుకోగా విడిపోయారు .అప్పుడు మిరియం ను మారేజ్ చేసుకొన్నాడు .దురదృష్ట వశాత్తు ఈ బంధం మొదటి నుండి తప్పటడుగులతో నడిచింది .మిరియం కు చాలాకాలం గా మానసిక వ్యాధి ఉంది .జపాన్ వదిలే ముందు మిరియం నూ వదిలేశాడు .అమెరికా తిరిగొచ్చాక మరో దురదృష్టం వెంటాడింది .రెండో సారి కట్టిన కవి భవనం టాలీసిన్ అగ్నికి ఆహుతై కూలి పోయింది .పట్టు వదలని విక్రమార్కుడిగా మూడో సారి దాన్ని నిర్మించాడు రైట్ ..

బిల్డింగ్ ల కంటే నగరాల నిర్మాణం చేయాలనే కోరిక కలిగింది .ఆధునిక మానవుడు యాంత్రిక జీవితం గడుపుతూమరణించిన  గతకాలపు పురాతన విధానాలలో బతుకు తున్నాడని గ్రహించాడు  అంతర్జాతీయ శైలి అనే అసేంద్రియ ,యాంత్రిక కార్య కారణ పధ్ధతి పై ఏవగింపు కలిగింది .’’యంత్రం భవనాన్ని కడుతుంది కాని బిల్డింగ్ కూడా ఒక యంత్రమే అవుతుంది ‘’అన్నాడు .తన మోడల్ అయిన ‘’బ్రాడ్ కేర్ సిటి ‘’ని వికేంద్రీకరణ విధానం లో అప్పటికి ఇంకా ఆర్కిటెక్ట్  నిర్మించటానికి సిద్ధంగా లేడు .రైట్ మాత్రం మరింత తెలివి  తేటలతో మానవ వారసత్వాన్ని అంటే భూమినే నమ్మినిర్మించాడు  .అతని ఆలోచన ‘’in the ideal community every one could enjoy his birth right with an acre of land for each person ‘’.క్రిక్కిరిసే, కేంద్రీకరణ అంటే రైట్ కు ఇష్టం లేదు. కనుక తన ఆలోచనలకు కార్య రూపం లో సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు ఇంతలో ఓల్గా లాజో విచ్ తో పరిచయం ప్రేమకు దారి తీసింది .ఆమె నల్ల గా ఉన్నా అందాల రాశి .తెలివి ,సంస్కృతీ ఉన్నావిడ .విడాకులు పొంది ఒక కూతురు తో ఉన్నది .ఈవిడతో రైట్ కలిసి ఉన్నాడని తెలిసి మిరియం కోర్ట్ కు వెళ్ళింది .అన్ని రకాలుగా ప్రైవేట్ గా  పబ్లిక్ గా  ఇబ్బంది పెట్టింది. పేపర్ల వాళ్లకు కావలసి నంత కలహ భోజనం దొరికింది .ఓల్గా రైట్ దంపతులు అరెస్ట్ అయ్యారు .కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చి వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు

రాజీ లేని ధోరణి  రైట్ ది..ప్రతి ఆర్కిటెక్చర్ విభిన్నంగా ఉండటం అతని ప్రత్యేకత. పెనిసిల్వేనియాలో బేర్ రాన్ లో ‘’ఫాల్లింగ్ వాటర్’’,రీ ఇంఫోర్సేడ్ కాంక్రీట్ తో కట్టిన మొదటి బిల్డింగ్. ఆరిజోనాలో దీనికి భిన్నంగా వేరొక స్టైల్ లో కట్టాడు .రెసిన్ లో జాన్సన్ లాబ రేటరి ని ముష్రుం టైప్ ఫ్లోర్ స్లాబ్ లను కాంటి లీవర్ లను వాడి నిర్మించాడు .  శాన్ ఫ్రాన్సిస్కో లో     గిఫ్ట్ షాప్ ని కిటికీలు లేకుండా   ప్లాస్టిక్ బబుల్ స్కై టాప్ తో డిజైన్ చేశాడు .ఫ్లారిడాలో లేక్ లాండ్ లోని సదరన్ కాలేజి ‘’the gayest ,airiest ,and most un conventional campus in America ‘’గా నిర్మించాడు .న్యూయార్క్ ఫిఫ్త్ ఎవేన్యు లో గగన్ హీం మ్యూజియం ఒక బృహత్ గోళాకార స్పేస్ తో స్పైరల్ ఆకార  రాంపులు బయటి దారులు ఒకే నిరంతర(కంటిన్యుయాస్ ) ఫ్లోర్ గా ఏర్పాటు చేశాడు .తన ప్రనణాళికలన్నిటిని పుస్తకాలుగా తెచ్చాడు .

Wright ;s conviction that organic buildings are  always of  the land .was amplified to read ‘’and from the land ‘’.రైట్ ని పిలిచి పని అప్పగించటం గొప్ప ప్రివిలేజ్ ఆ నాడు .అందరూ’’ రైటో రైట్ ‘’అన్నారు .

డెబ్భై ఏళ్ళు వస్తున్నాయనగా గౌరవాలు రైట్ పై వర్షించటం ప్రారంభ మయ్యాయి .1941లో రాయల్    ఇన్స్తిట్యూట్ ఆఫ్ ఆర్కి టెక్ట్స్  రైట్ కు గోల్డ్ మెడల్ అందజేసింది .ఎనిమిదేళ్ళు జాగ్రత్త గా గమనించి అమెరికన్ ఇన్స్తి ట్యూట్ ఆఫ్ ఆర్కి టెక్ట్స్ గోల్డ్ మెడల్ ఇచ్చింది .15దేశాలలో వివిధ అకాడేమీలలో గౌరవ సభ్యత్వం అందించారు 1953లో నేషనల్ ఇన్స్తి ట్యూట్ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్ బహూకరిస్తూ సన్మానించి ‘’you have created an archi tecture in which you have been thoughtfully aware of the powerful forces implicated in the new inventions and ,though philosophically concerned with the machine ,you have never held that it should heedlessly produce more machines or more machine –like objects .on the contrary ,you have felt that it should be used to make a world in which function may be controlled so as to emancipate enslaving forms and to increase the possibilities for new founded cities whose broad acres will furnish that beauty of life for which man has ever sought ‘’అని ప్రశంసించింది .

ఈరకమైన బిరుదులూ గౌరవాలు తనలోని వినయానికి హాని  చేస్తున్నాయని అనుకొన్నాడు .ఎనభై ఏళ్ళు వచ్చాయి .సీరియస్ గా మాత్రం లేడు.తన దగ్గరకు వచ్చే విద్యార్ధులకు మెళకువలు బోధించేవాడు సృజనను అలవాటు చేసుకోమని హితవు చెప్పేవాడు. రొటీన్ వదిలి కొత్తది తయారు చేయాలని బోధించాడు .ఒక సందర్భం లో ‘’ we have no culture .we have civilization  .we have power ,the consequence of excess .but excess is artificial .it should not be confused with exuberance ‘’అని చెప్పేవాడు .85 ఏళ్ళ’’ఎంఫాంట్ టేర్రిబుల్’’అయిన రైట్  విలియం బ్లేక్ కవి చెప్పిన ‘’బ్యూటీ ‘’కి తల ఊపాడు .రైట్ నిర్మించిన 650అత్యున్నత నిర్మాణాలు ఆయన అవిశ్రాంత  అభి వృద్ధి అతిశయోక్తికి ,తాజా ఆర్గానిక్ జీవితానికి ప్రత్యక్ష సాక్ష్యాలు గా నిలిచి పోయాయి . 19-4-1959న 91వ ఏట అద్వితీయ  ఆర్కిటెక్ట్  ఫ్రాంక్ లాయడ్ రైట్ మరణించాడు .

1893-నుంచి ఏడేళ్ళు రైట్ నిర్మాణం లో ప్రయోగాలు చేశాడు .1901నాటికి 50 ప్రయరీ హౌసెస్ నిర్మాణం చేశాడు .దీనికే ప్రయరీ స్టైల్ అనే పేరొచ్చింది .1920లో కాలి ఫోర్నియాలో హాలీ వుడ్ లో ‘’ప్రీకాస్ట్ టెక్స్ స్టైల్ కాంక్రీట్  బ్లాక్ రీ ఇంఫోర్స్ మెంట్ భవనాలు నిర్మించాడు . ఇవి సినిమాలకు ,టి వి లకు ఉపయోగిస్తున్నారు .1930 నాటికి అయన చేబట్టిన ఆర్గానిక్ స్టైల్ కు పరిపూర్ణత లభించింది .’’అసోనియన్ హౌస్ ‘’అనే కొత్త నమూనాతో మిన్నేసాపోలిస్ లో భవనాలు కట్టాడు .ఇవి మధ్యతరగతి ప్రజల స్వర్గ గృహాలే .ఆయనకట్టిన 400 స్ట్రక్చర్స్ లో 2005నాటికి 300ఇంకా సజీవంగా ఉన్నాయి .రైట్ ఆర్కి టేక్చర్ తో పాటు గ్లాస్ పరిశ్రమ కూడా అభి వృద్ధి చెందిన కాలం అది .తన ఫిలాసఫీకి గ్లాస్ తగినది అని నమ్మి దాన్ని చాలా బాగా ఉపయోగించాడు .పైరేక్స్ గ్లాస్ కు పెద్ద పీట వేశాడు .గ్లాస్ వాడకం లో తేలికైన ఉల్లాసవంతమైన భవనాలు తయారయి నాయి .అవే ఇంటర్నల్ డెకరేషన్ కు ఎంతో గొప్పగా తోడ్పడ్డాయి .20వ శాతాబ్దం లో భవనాలకు కొత్త వెలుగు తెచ్చిన వాడు రైట్ .అతను గొప్ప ఫాషన్ డిజైనర్ తన దుస్తులను తానె డిజైన్ చేసి అత్యంత ఖరీదైనసూట్ ,వేలాడే నెక్ టై  ధరించేవాడు .1909లో మొదటి ఫాషన్ కారు ‘’స్తార్దర్డ్ డేటాన్’’కొన్నాడు ఆతర్వాత అనేక మైన కార్లను వాహనాలను కొన్నాడు .1950లో వోక్స్ వాగన్ ,చేవ్రోలేట్ మొదలైన నాలుగు కార్లున్నాయి .అప్పటినుంచి చనిపోయేదాకా 50కార్లు వాడాడు .స్వీయ వ్యక్తిత్వానికే ప్రాదాన్యమిచ్చేవాడు .80ఏళ్ళ వయసులోనూ బిజీ బిజీగా జీవించాడు .ఆయన డిజైన్ చేసిన ఏకైక స్కై స్కేపర్ ఓక్హ్లహామాలోని బార్తిల్ విల్ లోని   19అంతస్తుల’’ ప్రైస్ టవర్’’ .ఇది వర్టికల్ నిర్మాణం .

రైట్ డిజైన్ చేసిన కమ్మ్యూనిటీ ప్లాన్ లలో ఇల్లినాయిస్ లోని ఓక్ పార్క్ లోని –క్వాడ్రూపుల్ బ్లాక్ ప్లాన్ లో ఉన్న 24గృహాలు .,మొన్టానాలోని కోమో ఆర్చర్డ్ సమ్మర్ కాలని ,చికాగో క్వార్టర్ సెక్షన్ ,ఆటో వర్కర్స్ ,టీచర్స్ కోసం నిర్మించిన కో ఆపరేటివ్ హోమ్ స్టేడ్స్ మొదలైనవి ఉన్నాయి .తాను  గొప్ప ఆర్కి టెక్ట్ అయినా జపాన్ ఆర్ట్ అయిన ‘’వుకియో –ఇ వుడ్ బ్లాక్ ప్రింట్ అంటే మోజు పడి వాటినీ తన నిర్మాణాలలో వాడాడు .జపనీస్ ప్రింట్ లన్నీ సేకరించి భద్రపరచి ,టీచింగ్ ఎయిడ్స్ గా ఉపయోగించాడు .

Inline image 1 Inline image 2

రైట్ డిజైన్ చేసిన కిటికీ

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -109

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -109

46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -3

రైట్ కున్న సహజమైన విజ్ఞానం ,వస్తుజాలం పై ఉన్న అవగాహన వలన అధికారులు ఆయనకు ఇబ్బందులు కలిగించేవారు .ఆయన నూతన విధానాలకు తగినంత సహకారం లభించేదికాదు .రైట్ లెక్కలే రైట్ అనీ ఎక్స్పర్ట్ ల లెక్కలే తప్పులని నెమ్మది మీద తెలుసుకొన్నారు .విస్కాన్సిన్ లో రెసిన్ లోని జాన్సన్ వాక్స్ కంపనీకోసం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇచ్చిన డిజైన్ ను బిల్డింగ్ ఒవర్సీర్లు సురక్షితం కాదని అభి ప్రాయ పడ్డారు .తేలిక స్తంభాలు పెట్టి అనుకొన్న బరువుకంటే ఎక్కువ బరువు మోసేట్లు చేసి చూపించి వారిని కంగు తిని పించాడు .తరువాత అంతటి బలిష్టమైన బిల్డింగ్ లేదని రుజువు చేశాడు కూడా .  పాతవాటికి కొత్త ఆలోచనతో కొత్త రూపు నిచ్చె  ఆయన డ్రాయింగ్ లు అద్భుతమని పించాయి .మానవ నాగరకాభి వృద్ధికి అవి నిదర్శనాలుగా నిలిచాయి .’’కాంటి లీవర్’’వ్యవస్థ రావటం తో ఆయన నిశిత బుద్ధి మరింత పదు నెక్కింది .మూస రకాలకు పూర్తిగా స్వస్తి పలికాడు .భారం అంతా మధ్య  బీం మీద వేసి కార్నర్ల మధ్య దూరాన్ని తగ్గించి ,సపోర్ట్ లను లోపలి వచ్చేట్లు చేసి ,మూలలను ఓపెన్ గా ఉంచాడు .ఇప్పుడు గోడలు స్క్రీన్లు గా మాత్రమె ఉంటాయి .కార్నర్ లను హాయిగా చూడచ్చు .ఇది వరకెప్పుడూ ఇలాంటి వీలు ఉండేదికాదు .పూర్వం  సమాంతరంగా ఉండేది ఇప్పుడు నిలువుగా కార్నర్లు దర్శన మిస్తున్నాయి .కనుక రైట్ ప్లాన్ లన్నీ ఓపెన్ ప్లాన్ గా పేరు తెచ్చుకోన్నాయి .సహజత్వం సాక్షాత్కరించింది .అతని దృష్టిలో ‘’the life of the individual is broadened and enriched by the new concept of Archidtecture  by light and the sense of liberty attained through freedom of space ‘’

రైట్ కు 40వ ఏట  కుటుంబ వ్యవహారాల్లో  ఇబ్బంది వచ్చింది .భార్యను విదాకులిమ్మని కోరాడు .ఒక ఏడాది తర్వాత కూడా అదే ఆలోచనలో అతడు ఉంటె అప్పుడు ఇస్తానని జవాబు చెప్పింది .ఏడాది అవగానా మళ్ళీ విడాకులకై పట్టు బట్టాడు రైట్ .ఆమె మాత్రం మనసు మార్చు కొన్నది .కోపం తారాస్థాయికి చేరింది .ఇల్లు,దేశమూ  వదిలి ఇటలీ చేరాడు.ఒక్కడే వెళ్ళలేదు మామా బూటన్బారత్ విక్ చేనే తో కలిసి వెళ్ళటం విశేషం .పేపరు వాళ్ళు వెంట పడ్డారు .ఎవరికీ కనిపించకుండా రెండేళ్ళు ప్రవాసం ఉన్నాడు .1911లో విస్కాన్సిన్ తిరిగొచ్చి స్ప్రింగ్ గ్రీన్ చేరాడు .ఇక్కడ ఆయనకు కొంత ఆస్తి ఉంది .అక్కడ ఫ్రెంచ్ కవి టాలీసిన్ పేర ఒక బిల్డింగ్ కట్టాడు  .టాలీసిన్ అంటే’’ మెరిసే  కను బొమ్మ ‘’(షైనింగ్ బ్రో)అనే అర్ధం కూడా ఉంది .అసలైన పోరాటం ఇంకా తనకు ఉండి పోయింది అని చెప్పాడు .

కొత్తావిడ’’ చేనే’’ సహవాసి మాత్రమె కాక సహచరి కూడా అయింది .ఇద్దరూ కలిసి ఎల్లెన్ కీ రాసిన ‘’లవ్ అండ్ ఎదిక్స్ ‘’ను అనువదించారు .ఆమెకున్న ఇద్దరు పిల్లలూ ఈ ఇద్దరితోనే ఉన్నారు .ఇంతలో చికాగో లో ‘’మిడ్ వె గార్డెన్ ‘’నిర్మాణానికి ఆహ్వానం వచ్చింది .వెళ్లి ఆ పనులు ఇంటికి దూరంగా ఉండి పర్య వేక్షిస్తుండగా గొప్ప విషాదం జరిగి పోయింది .ఒక నీగ్రో బట్లర్ తనకు దేవుడు ఆవ హించాడని ,కిరోసిన్ తో తడిపిన కాగడాలు చేనే  ఉంటున్న టేలీసిన్ బిల్డింగ్ రూమ్  లోకి 1914 ఆగస్ట్ లో ఒక రాత్రి వేళ విసిరేశాడు . ,పొగ వ్యాపించి ఉక్కిరి బిక్కిరి చేశాయి .భయం తో పరుగెత్తే వారిని వాడు గొడ్డలితో అడ్డంగా నరికేశాడు .చంప బడిన వారిలో చేనే,ఆమె ఇద్దరు పిల్లలు  కూడా ఉండటం దారుణం .ఈ వార్త తెలిసి దుఖం ఆపుకోలేక పగతో మళ్ళీ ఆ బిల్డింగ్ ను నవ్యాతి నవ్యం గా నిర్మించాడు .

తర్వాత జపాన్ ప్రబుత్వం రైట్ ను ‘’ఇంపీరియల్ హోటల్ ‘’నిర్మించమని కోరింది .అది సాంఘిక కేంద్రంగా ,సామ్రాజ్య స్మ్రుతి చిహ్నంగా ఉండాలని కోరింది .జపాన్ వెళ్లి అక్కడి భూకంప పరిస్తితులను అధ్యయనం చేసి భూకంప తరంగాలకు లొంగ కుండాతట్టుకొని  స్థిరం గా నిలబడే బిల్డింగ్ నిర్మిచి తన సామర్ధ్యాన్ని చూపాడు .రాళ్ళ మీద నిల బెట్ట కుండా ,తేలి యాడేట్లు నిర్మించటం ఇందులోని ప్రత్యేకత .’’he realized instead of rigidity .flexibility and resiliency must be the answer to the over recurring nightmare threat ,he designed a building that could ‘’flex and return to normal ‘’.అదీ రైట్ మేధో విజ్ఞానం .ఈ హోటల్ నిర్మాణం పూర్తీ అయిన చాలా ఏళ్ళ తర్వాత 1924లో జపాన్ రాజధాని టోక్యో ను భయానక భూకంపం కుదిపేసింది కాని రైట్ కట్టిన ఇంపీరియల్ హోటల్ చెక్కు చెదరకుండా ఆయన స్థిర సంకల్పం లా నిలిచి ఉంది .దీనిపై న్యూ యార్కర్ పేపర్ కధనం రాస్తూ ‘’as the temblor passed ,settled quietly back into position which no crack or dislocation ‘’అని రైట్ సామార్ధ్యాన్ని మహా మెచ్చుకొన్నది .రెండవ ప్రపంచ యుద్ధం లో బాంబు దాడులలోమాత్రమె ఈ హోటల్ విధ్వంసమైంది .ఆ భూకంపానికి  ఈ హోటల్ రక్షణ కేంద్రంగా ప్రజలకు ఉప యోగ పడింది .పట్టణ ప్రజలంతా ఇక్కడికే చేరి తల దాచుకొని భూకంపాన్ని వెక్కిరించారు .అని పేపర్లు రాశాయి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-2-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -108

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -108

46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -2

ఇరవై వ ఏడు వచ్చే లోపే ఫ్రాంక్ కు అడ్లర్ ,సల్లివాన్ ఫార్మ్ లో డ్రాఫ్ట్స్ మాన్ డిజైనర్ గా ఉద్యోగం వచ్చింది .చికాగో లో నే కాక అమెరికా అంతటిలోను లూయీ సల్లివాన్ గొప్ప అభ్యుదయ ఆర్కిటెక్ట్ .అతని దగ్గర పని చేయటం చాలాకస్టమే కాని రైట్ అంకిత భావం తో యజమాని సందేశం ‘’ఫారం ఫాలోస్ ఫంక్షన్ ‘’ను అనుసరించి  పని చేశాడు .ఫ్రాంక్ ఆయన్ను ‘’లీబల్ మీస్టర్ ‘’అని గొప్పగా చెప్పుకోనేవాడు .అది అతనికి మాంచి యవ్వనోద్రేక కాలం .కేధరిన్ టోబిన్అనే అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు .పెళ్లి అయ్యే నాటికి కుర్రాడికిఇంకా  21రాలేదు .ఆమెకు 18మాత్రమే .సల్లివాన్ ఫ్రాంక్ కు డబ్బు అప్పు ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నాడు .మనవాడు అయిదేళ్ళ కాంట్రాక్ట్ రాసి నెల వారీ వాయిదాలలో అప్పు తీరుస్తానని రాశాడు .వంట ఇంటి మీద ‘’truth is life  ‘’అని ము౦దు రాసి తర్వాత ‘’it occurred to me that Life is Truth ‘’అని కలిపాడు .

ఆరుగురు పిల్లలు పుట్టారు .మామూలు తండ్రిగా ఉండటానికి ఇష్టంగా ఉండేదికాదు .ఆదర్శమైన తండ్రి గా ఉండాలని భావించాడు .ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సంగీత వాయిద్యాలలో శిక్షణ ఇప్పించాడు .భార్య పియానో బాగా వాయించేది .కొడుకు జాన్ తండ్రి గురించి చెబుతూ ‘’నాన్న బీతొవెన్ లా ఉండేవాడు .కొడుకులు గుర్తింపు పొందే జీవితాలతో రాణించాలని ఆయన కోరిక .సౌందర్యారాధన ఉండాలని కోరేవాడు .అది ఇంట్లో నుంచే ప్రారంభమవాలని చెప్పేవాడు ‘’అని రాశాడు .ఇంకా కాంట్రాక్ట్ కాలం ఉన్నా నెమ్మది నెమ్మదిగా ప్రైవేట్ పనులు చేయటం మొదలు పెట్టాడు .యజమానికి తెలిసి కోప పడ్డాడు .అయినా లెక్క చేయకుండా ఉద్యోగానికి నీళ్ళు ఒదిలేశాడు .తర్వాత తానూ చేసింది తప్పు అని తెలుసుకొని సల్లివాన్ తో చనువుగానే ఉండేవాడు .25వయసు వచ్చేనాటికే చికాగో లో ప్రైవేట్ ప్రాక్టిస్ ప్రారంభించాడు .కమిషన్లు మాత్రం వదలలేదు .ఆతను డిజైన్ చేసిన భవనాలు ప్రత్యేకతతో  ఆకర్ష ణీయంగా చూడ ముచ్చటగా ఉండేవి .అందరూ వీటిపై మోజు చూపించారు .అతనికి క్లెయింట్ లెవ్వరూ లేరు .అభిమానులూ ఆరాధకులే ఎక్కువ గా ఉండేవారు .డబ్బు విషయం లో అజాగ్రత్త వలన దివాలా పరిస్థితి ఏర్పడింది .భార్య భర్తలిద్దరూ చెక్కులపై సంతకాలు చేసి ఇస్తే బౌన్స్ అయి పరువు పోయేది చాలినన్ని నిధులు లేక పోవటం వలన .ఇక బ్యాంక్ లో డబ్బు లేదని   తెలుసుకొని ‘’God give me the luxuries of life ,and I will willingly do without the necessities ‘’అని ప్రార్ధించిన గడుసు పిండం రైట్ .

పనిలో విజయాలుఉన్నా దేశం లో  గుర్తింపు నెమ్మదిగా వచ్చింది .ఎవరో ఒకరిద్దరు తప్ప అతని సహ ఆర్కి టెక్ట్ లు ఫ్రాంక్ సృజనను తక్కువ గా అంచనా వేశారు .యెగతాళి చేశారు ,చెత్త అన్నారు .అతని డిజైన్ లు ఆచరణ సాధ్యం కావని తిరస్కరించి  పక్కన పడేశారు .స్వయంగా ఆతను చూపిన చొరవను అర్ధం చేసుకోలేక పోయారు .ఫ్రాంక్ కు నలభై ఏళ్ళు వచ్చేసరికి యూరప్ లో అతని పనితనం ను ప్రస్తుతించి అభిమానించి నెత్తి కెత్తు కొన్నారు . అతను సాధించిన మహోన్నత విజయాలను జెర్మనిలోని  ఒక పబ్లిషింగ్ హౌస్ రికార్డ్ గా ప్రచురించి ప్రపంచానికి అతని సృజనాత్మక శక్తిని తెలియ జేసింది .సమకాలీన ఫాషన్ లను త్రోసి రాజని ,కొత్త అభి వృద్ధి విధానాలతో అతనికే ప్రత్యేకమైన ‘’ఆర్గానిక్ అర్కి టేక్చర్ స్టైల్’’ఆవిర్భవించింది .అనవసర నగిషీలు ,విదేశీ బాణీలు వదిలేసి ఉన్నత పవిత్ర శైలిని పక్కకు పెట్టి ,సంపూర్ణ స్వయం సిద్ధ ఆక్రుతులకు రూప కల్పన చేశాడు .రాజీ లేని మనస్తత్వం అతనిది .’’principle is the only safe precedent ‘’అనేదే అతని ఆదర్శం .రైట్ స్వయం గా డిజైన్ చేసినమొట్టమొదటి  భవనం చాలా చిన్నదేకాని విప్లవాత్మకమైనది .1893నాటికి ఇళ్ళు అన్నీ ఎత్తైన బేస్ మెంట్ లతో ,అటకలతో ,ఇంటికి మించి చూరు తో ,వాలు రూఫింగ్ లో నిలువుగా ఉండే కిటికీలతో పెట్టెల లాగా ఒక పెట్టెలో ఎన్నో పెట్టెలు లాగా ఉండేవి .గదులన్నీ  ,డోర్లతో  పార్టిషన్ లతో ,హాళ్ళు  చీకటి గుయ్యారాల్లా ఉండేవి .ముందుగా అసహ్యంగా కనిపించే బేస్ మెంట్ కన్నాలను తీసి పారేశాడు .అటకలను ఎత్తేశాడు .గదులను విశాలంగా నివాస యోగ్యం గా మార్చాడు .ఫైర్ ప్లేస్ ఏర్పాటు చేశాడు .ఇంటికి ఇంటీరియర్ స్పేస్ అనేది కొత్తగా కల్పించాడు .దీనితో  ‘’ఆర్గానిక్ ఆర్కి టేక్చర్’’ కు ప్రాణ ప్రతిష్ట చేశాడు .వంట గది సకల సదుపాయాలతో ఆకర్షణీయంగా వచ్చింది .డైనింగ్ ఏరియా కు లివింగ్  రూమ్ కు స్థానం కల్పించాడు .దీనినే ‘’ఓపెన్ ప్లాన్ ‘’అన్నారు .ఫర్నిచర్ కు వీలు ఉండేట్లు ఫ్లోర్ స్పేస్ లన్నీ లివింగ్ రూమ్స్ అయ్యాయి .టేర్ర్రేసులు , బాల్కనీలు  కొత్తగా వచ్చాయి .ఇంటా బయటా విశాల మైన ఆవరణ ఏర్పడి ముచ్చటగా ఉంది .తరువాత అనేక మార్పులు పొందాయి .’’sense of spacious ness ‘’కు అధిక ప్రాదాన్యమిచ్చాడు రైట్ .

వస్తువుకు ,డిజైన్ కు ఒక చక్కని సంబంధమేర్పడింది. గొప్ప నాటకీయ మార్గ దర్శి గా .విజేతగా ఆర్కి టేక్చర్ లో స్థిరపడ్డాడు రైట్ .ఒకే నమూనాకు మూసపద్ధతిలో ఉండిపోకుండా అవసరాన్ని బట్టి విధానం మార్చాడు .కాని సమకాలికులు మాత్రం మార్పులు చేర్పులతో కాల క్షేపం చేశారు .న్యు యార్క్ లోని సస్పెండేడ్ గ్లాస్ వాల్డ్’’లీవర్ హౌస్ ‘’ఫ్రాంక్ రైట్ సృజనకు పరాకాష్ట .కాని దీన్ని ‘’కర్రలపై పెట్టె ‘’అని గేలి చేశారు .కారణం ఒకహామా లోని  బార్తిల్స్ విల్ ‘’ఆకాశ హర్మ్యం ‘’ముందు వాళ్లకు ఇది ఆనలేదు .ప్రతి కొత్త చోటా నూతన విధానం లో సృజన మేళ వించి డిజైన్ చేసి నిర్మింప జేశాడు .నిత్య నూతనత్వం అతని ప్రత్యేకత .

రైట్ వినూత్న విధానం లో కొంత భాగం ఆతను వాడే మెటీరియల్ కూ ,భాగస్వామ్యం ఉంది .రాయికి ఉన్న శక్తిని ఆయన గుర్తించాడు .గుళ్ళు గా ఉండేవాటి తో తరంగ ఆకృతులను కల్పించాడు .బఫ్ఫెలో లో 1904లో కట్టిన ‘’లార్కిన్ బిల్డింగ్ ‘’రాయి సున్నాన్ని వాడి ఆశ్చర్య పరచాడు .అతి ఆడంబరాన్ని తగ్గించాడు .వస్తువుల స్వభావం తెలుసుకొని వాటిని విని యోగించాడు .

 

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107

46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్

యవ్వనం లోనే ‘’నేను నిజాయితీ ఉన్న అహంకారి ,కపట మానవత్వం ఉన్న వాళ్ళలో దేనిని ఎంచుకోవాలను కొంటె ,నేను ఆనేస్ట్ ఆరోగెన్స్ నే ఎంచు కొంటాను దీనిలోంచి మారటానికి నాకేమీ కారణం కనిపించలేదు ‘’అని ధైర్యంగా చెప్పిన వాడు ,’’ఇంత వరకు నా లాంటి మహా గొప్ప ఆర్కిటెక్ట్ పుట్టలేదని ,ఇక పుట్టడని ,నేను చరిత్రలో ఎన్నడూ జన్మించని అతి  గొప్ప ఆర్కిటెక్ట్ గా నిలబడి పోతాను ‘’అని చాలెంజీగా చెప్పిన వాడు దాన్ని రుజువు చేసుకొన్న వాడూ ఫ్రాంక్ లాయడ్ రైట్ .ఆయనకు 70ఏళ్ళు వచ్చేసరికి అభిమానులు పొంగిపోయారు ,విమర్శకులు ఆయన అహంకారం చాలా నిజాయితీతో  కూడినదే నని అంగీకరించారు .80వ ఏట ఆయన లాంటి ఆర్కిటెక్ట్ కొత్త ప్రపంచం లో జన్మించనే లేదనీ ,అత్యంత సృజన శీలి ,అన్నికాలాకు ఆయనే జీనియస్ అని ఏకగ్రీవ నిర్ణయానికి అందరూ వచ్చారు .ఆయనను ‘’ఫుజియామా ఆఫ్ అమెరికన్ అర్కి టేక్చర్ ,ప్రకాశించే అత్యున్నత శిఖరం ‘’అని ప్రశంసించారు .

ఫ్రాంక్ లాయడ్ రైట్ 8-6-1869న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం లో ఉన్న రిచ్ లాండ్ సెంటర్ లో పుట్టాడు .తల్లి అన్నా లాయడ్ జోన్స్ వెల్ష్ హాటర్ ,యునిటేరియన్ ప్రీచర్ విస్కాన్సిన్ కు వలస వచ్చిన  ఆయన కూతురు .తండ్రి విలియం రసేల్ కారీ రైట్ ఇంగ్లీష్ వాడు .కనెక్టి కట్ లోని హార్ట్ ఫోర్డ్ నుంచి వచ్చాడు .తండ్రి లా ,మెడిసిన్ చదివి తర్వాత రెండూ వదిలేశాడు .డజను కు పైగా ఉద్యోగాలలో వేలుపెట్టాడు కాని ఎందులోనూ నిలబడలేక చివరికి సంగీతం నేర్చి మినిస్టర్ అయ్యాడు .విస్కాన్సిన్ లో సంగీత ప్రచారం చేస్తూ అన్నా ను కలిశాడు .ఆమెను పెళ్లి చేసుకొన్నాకే ప్రీచర్ అయ్యాడు .వారి మొదటి సంతానమే ఫ్రాంక్ .ఇద్దరు ఆడపిల్లలు జెన్నీ ,మాగినేల్ లు .ఫ్రాంక్ కు మూడో ఏడు వచ్చాక తండ్రిని బోస్టన్ చర్చ్ కు  ఆహ్వానించారు .అక్కడకు వెళ్ళినా ఎక్కువ కాలం ఉండక బాక్ టు పెవిలియన్ గా విస్కాన్సిన్ కు తిరిగోచ్చేశాడు .మాడిసన్ లో మ్యూజిక్ కన్సర్వేటరి ప్రారంభించాడు .ఇందులో చెయ్యి కాల్చుకొని ఎందులో వేలేట్టినా,వివాహం తో సహా ఏదీ  కలిసిరాక ఫైల్యూర్ గా మిగిలిపోయాడు .తల్లి మాత్రం ఫ్రాంక్ మీదే ద్రుష్టి పెట్టింది .తల్లి గారాల కూచి అయ్యాడు ఫ్రాంక్ లాయడ్ రైట్ .అతనిలో ఆమె జీవించింది అంటే అతిశయోక్తి కాదన్నాడు చరిత్ర కారుడు .తలిదండ్రుల మధ్య సయోధ్య సాగ లేదు .విడిపోయారు .తండ్రి ఇల్లు విడిచి వెళ్లి, మళ్ళీ కనిపించ నే లేదు .

తల్లి అన్నాకు పెద్ద పెద్ద భవనాలంటే మహా ఇష్టంగా ఉండేది .ఫ్రాంక్ కడుపులో పడినప్పుడే  దరిద్రం తో బాధ పడుతున్నా ,తనకు మొదటి సంతానం మగపిల్లాడే కలగాలని వాడు ఆర్కిటెక్ట్ కావాలని కోరుకొన్నది .ఏంతో  త్యాగం చేసి కొడుకును చదివించింది .కాని 14ఏళ్ళ వయసులో అతడు దారి చూపెవాడుకాని ,స్వంతకాళ్ల పై  నిలబడేవాడు గా కాని అని పించలేదు .అతని అంకుల్ ఫారం లో పని చేసి ఏదో కొంత సంపాదించేవాడు .కాలేజి లో చేరి ,మధ్యాహ్న సమయాలలో ఒక ఆర్కిటెక్ట్ ఆఫీస్ లో పని చేస్తూ ఫీజుకు సరిపడా డబ్బు సంపాదించేవాడు .విస్కాన్సిన్ యూని వర్సిటి లో ఆర్కిటెక్చర్ కోర్సు లేనందున సివిల్ ఇంజినీరింగ్ లో చేరాల్సి వచ్చింది .దానికి విచారించలేదు .పైగా ఇమిటేషన్ వలన ఆర్కి టేక్చర్ మీద మోజు  మరింత  పెరిగిందన్నాడు .

యూని వర్సిటీ లో చదువుతూనే ,ఏదో పని చేస్తూనే ఉన్నాడు .ఇక ఇక్కడ చదవటం వృధా కాల క్షేపమే అని పించింది .ఇంటి దగ్గరే ఏదో స్వయం గా సాధిస్తూ జీవికకు డబ్బు సంపాది౦చాలను కొన్నాడు .తల్లి చెప్పినట్లు మాడిసన్ చికాగోలకు  వెళ్ళాడు కాని ఉపయోగ పడలేదు .ఆర్కి టేక్చరల్ ఫార్మ్స్ లో పని చేస్తూ వదిలేస్తూ వారానికి ఎనిమిది డాలర్లు ఆర్జిస్తూ ,పది డాలర్లు అప్పు తీసుకొని వారానికి రెండు డాలర్లు తీరుస్తూ తల్లికి ఆర్ధిక సాయం అందించాడు .ఇప్పుడే జీవితం లో సరైన నిర్ణయం తీసుకో గలిగానని సంతృప్తి చెందాడు ఫ్రాంక్ .జీతం పెంచమని కోరితే తిరస్కరిస్తే ,ఉద్యోగం వదిలేసి మరో కొత్త ఉద్యోగం లో ఎక్కువ జీతం లో చేరుతూ గడిపాడు .తాను  జీతానికి కాని ,పనికి కాని పనికి రానని తేల్చుకొన్నాడు .మళ్ళీ పాత ఫార్మ్ లోనే చేరుతానని చెప్పి అంగీకరించగా చేరి బాగానే సంపాదిస్తూ తల్లిని చెల్లెళ్ళను చికాగో కు తెచ్చి తనతో పాటు ఉండేట్లు చేశాడు .కుటుంబం ఓక్ పార్క్ లో స్థిర పడింది

 

Inline image 1 Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి మరియు  ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో  శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలను ఉగాది (8-4-16)కు  అయిదు రోజుల ముందు 3-4-16ఆదివారం  మధ్యాహ్నం 3-30గం ల నుండి నిర్వహిస్తున్నాం  .శ్రీమతి వి .శాంతిశ్రీ గారిచే ముందుగా సంగీత కచేరి నిర్వహింప బడును .తరువాత శ్రీ ఏ సి .పి.శాస్త్రి గారు(హైదరాబాద్ ) ఆంగ్లం లో రాసిన ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’పుస్తకానికి  సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ‘’దైవ చిత్తం ‘’గా తెలుగులోకి అనువదించిన గ్రంధ౦  ఆవిష్కరణ జరుగుతుంది .దీని కి ముందు మాటలను శతాధిక  చారిత్రిక నవలా రచయిత, ప్రముఖ విమర్శకులు  డా .శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారు రాయటం విశేషం .ఈ గ్రంధానికి ప్రాయోజకులు ,కృతి స్వీకర్త  సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా ) అవటం మరో గొప్ప విషయం . పిమ్మట సుప్రసిద్ధ సాహితీ మూర్తులకు స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారాలు అందజేయ బడును .  తరువాత  ‘’మా అన్నయ్య ‘’శీర్షికపై జిల్లాలోని ప్రసిద్ధ కవి మిత్రులచే ‘’కవి సమ్మేళనం ‘’జరుగుతుంది .

సాహిత్య ,సంగీతాభిమానులు ఈ కార్య క్రమం లో పాల్గొని విజయవంతం చేయ వలసినదిగా మనవి .పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం మార్చి రెండవ వారం లో అంద జేయ బడును .

జోశ్యుల శ్యామలాదేవి   మాది రాజు శివ లక్ష్మి   గబ్బిట వెంకట రమణ      గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు            కార్య దర్శి              కోశాధికారి                     సరసభారతి అధ్యక్షులు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని-2(చివరిభాగం )

mulukutla avadhani 001గీర్వాణ కవుల కవితా గీర్వాణం-

రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని-2(చివరిభాగం )

శ్రీ ములుకుట్ల నరసి౦హావధాని గారు ప్రతి కాండకు’’ న్యాస ప్రకారం’’ తో బాటు ప్రతి శ్లోకానికే వారే సుబోధకం గా తెలుగులో తాత్పర్యమూ రాశారు .  .అవసరమైన చోట్ల వివరణలూ ఇచ్చారు . .అయోధ్యాకాండ ప్రారంభం లో శ్రీరాముని స్తుతిస్తూ –‘’ప్రసన్నతాం యా న గతాభి షేక -తస్తదా న మమ్లౌవనవాస దుఖితః –ముఖా౦బుజ శ్రీ రఘు నందనస్య –సదాస్తుసా మంజుల మంగళ ప్రదా.’’శౌర్య ధైర్య స్తైర్య,గాంభీర్య ,సౌందర్య ,మాధుర్య ,చాతుర్య ,ఔదార్య వాత్సల్య ,సౌశీల్య ,ఆనుకూల్య ,నైర్మల్య ,ఔజ్వల్య ,అకౌటిల్య ,అచాపల్య ,తారుణ్య ,కారుణ్య వాల్లభ్య ,సౌలభ్య ,సౌభాగ్యాలకు చక్కని  నిర్వచనాలు చెప్పారు .వనవాసానికి వెళ్ళబోతూ రాముడు సీతా గృహానికి వెళ్లి కొన్ని విషయాలు చెబుతూ ‘’భరతుడికి ఎప్పుడూ అప్రియం చేయకు ,ఈ దేశానికి అతడే ప్రభువు ‘’అని చెప్పాడు –‘’విప్రియం నచ కర్తవ్యమ్ భరతస్య కదాచన –సహి రాజా ప్రభుశ్చైవ  దేశస్యచ ,పురస్యచ ‘’అన్నాడు .

మంగళ శ్లోకం లో –‘’పితృ సత్య ప్రతిజ్ఞాయ కైకయ్యా వచనాదపి –చిత్ర కూత నివాసాయ సీతారామయ మంగళం ‘’అంటూ 8 మంగళ శ్లోకాలు చెప్పారు .

అరణ్య కాండ ప్రారంభ శ్లోకం –‘’సాన్ద్రానంద పయోద సౌభగత నున్చీరా౦బర సుందరం –పాణౌ బాణ శరాసనం కటి లసత్తూణీర భారం వరం –రాజీవాయత లోచనం ద్రుత జటాజూటేన సంశోభితం –సీతా లక్ష్మణ సంయుతం పది గతం రామాభి రామం భజే ‘’ఈ కాండలో భూగోళం గురించి’’భూగోళ విన్యాసం ‘’లో  వివరించారు .8గోధుమ గింజలను వరుసగా పెడితే వాటి మధ్య దూరం అంగుళం లేక వ్రీహి. 12అంగుళాలు ‘’వితస్తి ‘’.రెండు వితస్తులు హస్తం .4హస్తాలు దండం .రెండు వేల దండాలు క్రోసు .నాల్గు క్రోసులు యోజనం .ఇదే మూడు మైళ్ళ అరవై అడుగులకు సమానం .మన భూమి యాభై కోట్ల యోజనాల వైశాల్యం కలది .ఆధునికులు ఉత్తర ధృవాన్ని మేరు పర్వతం అంటున్నారు .అక్కడ పర్వతాలేవీలేవు .మేరు పర్వతం లేదనటం పొరబాటు .వారి అవగాహనా రాహిత్యమే .పౌరాణిక భూ మేరువు ,సిద్ధాంత ఖగోళాన్ని బట్టి మహా మేరువు అని రండు మేరువులున్నాయి సిద్ధాంత మేరువే నార్త్ పోల్ .జంబూద్వీపం లోని పామీరు పీఠ భూమికి తూర్పున ఉన్న ‘’దియన్ షన్ ‘’అనే పేరున్నదే మేరు పర్వతం .దియంసన్ అంటే దేవ పర్వతం .

హరి వర్షం అంటే మంచి వెండి రంగు గల మనుషులున్న ప్రదేశం .ఇదే చైనా టర్కీ ప్రాంతం రష్యా టర్కీ స్థానం ,పర్షియా టర్కీ స్థానం ,అరేబియా ఆఫ్రికా లలో కొంతభాగం .ఇలావ్రుతం. అంటే సూర్య చంద్ర నక్షత్రాలు  ప్రకాశించని భూమి .రోగాలు ఉండవు చిరంజీవులు ఉంటారు .రమణ వర్షం తెల్లని దీవులలో ఉండే వారున్న ప్రాంతం అవే సైబీరియా ,రష్యా ఆస్ట్రియా ,హంగేరి ఫ్రాన్స్ ప్రాంతాలు .హిరణ్యాక వర్షం అంటే ధన వంతులు సౌందర్య వంతులు ఉండే కామచాత్కా ,సైబీరియా ,జర్మనీరశ్యా బెల్జియం లు .

ఆంద్ర దేశం అంటే –కృష్ణా గోదావరీ నదుల మధ్య ప్రాంతం .దీనికి ‘’సింధు యుగ్మాంతరం ‘’,’’షట్సహస్ర జగతి ‘’అనే పేర్లున్నాయి .సింధు అంటే నదికి పేరు .ఆరు వేల గ్రామాలున్నాయి .వీరినే ఆరువేలనియోగులు  అంటారు .వరంగల్ ప్రాంతం లోని ‘’త్రిలింగాయన ‘’దగ్గరున్న వారినే తెలగాన్యులు అంటారు .గోదావరీ తీర ప్రాంతం వారిని వెలనాటి నియోగులు అంటారనిఅవధానిగారు తెలియ జేశారు ‘

రామ లక్ష్మణులు ఋష్య మూక పర్వతం చేరటం తో అరణ్య కాండ పూర్తీ అవుతుంది .చివరి శ్లోకం –‘’తతో మహాద్వర్త్మ సుదూర సంక్రమః క్రమేణగత్వా ప్రతి కూల ధన్వనం ,దర్శ పంపాంశుభ దర్శకాననా మానేక నానా విధ పక్షి జాలకాం’’

ఫలశ్రుతి లో ‘’యో విరాధ వధ౦ నిత్యం శ్రుణోతి శ్రావ యేతవా-తస్య పాపాని సర్వాణి వినస్టాని న సంశయః ‘’

మంగళ శ్లోకాలలో ఒకటి-మచ్చుకి –‘’మతంగాశ్రమ వాసాయ శబరీ సేవితాయచ –పంపాదర్శన తోషాయ  భవ్య రూపాయ మంగళం ‘’

మనవి –14-2-16 ఆదివారం రధ సప్తమి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో జరిగిన సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతానికి ముఖ్య అతిధిగా ,విచ్చేసి ,ధార్మిక ప్రసంగం చేసి ,వారి రచన ‘’శ్రీరామ వాణి’’పుస్తకాన్ని సరసభారతి ప్రచురించగా నాచేత ఆవిష్కరణ చేయించి పొన్నూరు నుండి అతి విలువైన బ్రహ్మశ్రీ ములుకుట్ల నరసింహ సిద్ధాంతి గారి ‘’రామాయణ సారోద్ధారం ‘’7 భాగాలను నాకు అందజేసిన శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తిశాస్త్రి  గారి సహృదయత ,సౌజన్యాలకు నమస్సులు పలకటం తప్ప నేను ఏమిచ్చి ఋణం తీర్చుకో గలను ? అందుకే ములుకుట్ల వారిపై రెండు భాగాలలో వ్యాసం రాసి  దాన్ని శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారికి  వారిని అడగకుండా చెప్పకుండా ‘’ఆన్ లైన్ ‘’అంకితమిచ్చి కొంత వరకు రుణ భారం తగ్గించు కొన్నాను .శాస్త్రిగారు పెద్దమనసుతో మన్నిస్తారని భావిస్తాను –దుర్గాప్రసాద్

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-16-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-

రామాయణ సారోద్ధరణం చేసిన శ్రీ ములుకుట్ల నరసింహావ దాని

పురాణ ప్రవచనం చేసి ,పౌరాణిక విశారద బిరుదు పొంది ,సమస్త రామాయణ సారాన్ని ఒక చోట చేర్చి రామాయణ సారోద్ధారం రచించి ,రామాయణ సుధా సాగర బిరుదాంకి తులై న బ్రహ్మశ్రీ ములుకుట్ల నరసింహ శాస్త్రి గారు గుంటూరు మండలం సత్తెనపల్లి తాలూకా నుదురుపాడు గ్రామం లో  నందన నామ సంవత్సర  శ్రావణ శుక్ల నవమీ జయ వాసరం ,అనూరాధా నక్షత్ర యుక్త తులా లగ్నం లో శ్రీ ములుకుట్ల శంకరనారాయణావధాని ,శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు .ఐదో ఏడు వచ్చాక స్వగ్రామం లోనే అక్షరాభ్యాసం జరిగి ,తర్వాత మేనమామ ఇంట చేబ్రోలు లో ఆంద్ర ,ఆంగ్ల భాషలను కొన్నేళ్ళు చదివారు .

ఉపనయనానంతరం కృష్ణా జిల్లా బెజవాడ లో శ్రీ గంటి వెంకటేశ్వరావధాని గారి శిష్యులై వేదాధ్యయనం చేశారు .తర్వాత కన్నడ దేశం లోని బెంగుళూరు చేరి శంకర మఠం లో కావ్య నాటక జ్యోతిష్యాదులు నేర్చారు .విజయవాడ వచ్చి వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ మల్లాది రామ కృష్ణ విద్వత్ చయనులు  వద్ద  అంతేవాసులై వేదాంత భాష్యం అభ్యసించారు .తమిళనాడులోని కుంభ కోణం లో వేద పరీక్ష నిచ్చి 16-5-1918న ఉత్తీర్ణులై స్వర్ణ పతకం పొందారు .శ్రీమతి సీతారామాంబ ను వివాహమాడారు . .1927లో చీరాలలో శ్రీ మదాంధ్ర మహా భారత పురాణ కాలక్షేపం చేసి ,శ్రోతల ప్రశంసలు పొంది స్వర్ణ సింహ లలాట ,కంకణద్వయాన్ని కానుకగా అందుకొన్నారు .తమిళనాడు లోని తిరుచిరాపల్లి మండలం లో ఉన్న కరూరులో  తాము శ్రమతో సంతరించిన ‘’రామాయణ సారోద్ధారం ‘’ప్రవచనం చేసి పండిత పామరజన రంజనం చేశారు .అమూల్య బహుమతులతో పాటు సింహ లలాటాంకిత సువర్ణ ఘంటా కంకణ ద్వయాన్ని అందుకొన్నారు .

24-7-1931నుండి 19-9-33వరకు రెండేళ్ళు బెజవాడ రామ మోహన పుస్తక భాండారం లోను ,శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం,శ్రీ కోదండ రామాలయం ,శ్రీకన్యకాపరమేశ్వరి ,కొత్త గుళ్ళు  లోను  రామాయణ సారోద్ధార ప్రసంగాలు సభా రంజకం గా చేశారు .అప్పుడు వచ్చిన గోదావరీ పుష్కరాలలో భద్రాచలం లో శ్రీ సీతా రామ చంద్ర స్వాముల సన్నిధానం లో రామాయణ సారోద్ధారం బాలకాండ పురాణ ప్రవచనం చేసి భక్తి భావ లహరి ప్రవహింప జేశారు .వైష్ణవ పండితుల అభినందన పురస్కారాలను అందుకొన్నారు .

అవధానిగారి పెద్దన్నగారు,సనాతన భాగవత భక్త సమాజ కార్య దర్శి  శ్రీ లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు సుప్రసిద్ధ కవి పండితులు  బ్రహ్మశ్రీ బెల్లం కొండ రామ రాయ కవి గారి శిష్యులై వ్యాకరణ ,వేదా౦తాలను అభ్యసించారు .తమ్ముడు శ్రీ గోపాల కృష్ణ శాస్త్రి ఉభయ భాషా ప్రావీణ .చీరాల పురపాలకోన్నత పాఠ శాలలో తెలుగు పండితులు .వీరి సోదరి రామ సుబ్బాంబ.

అవధానిగారు బహు శ్రమకోర్చి అనేక రామాయణ గాధలను కూలంకషంగా పరిశీలించి సంస్కృతం లో ఉత్తరకాండ తో సహా రామాయణ సారోద్ధారం అనే బృహత్ ప్రబంధాన్నిసరళ సంస్కృతం లో  రచించారు .ముఖ్యంగా వాల్మీకి రామాయణాన్ని భూమిక గా తీసుకొని శతకోటి రామాయణం దగ్గర్నుంచి ఏక శ్లోకీ రామాయణం వరకు దేనినీ వదలకుండా వాటిలోని సారాన్ని  అమృతోపమానంగా అందించారు .కుశలవ రామాయణం ,ఆధ్యాత్మ రామాయణం ,యోగ  వాసిస్టం ,దుర్వాస రామాయణం ,మార్కండేయ రామాయణం ,తత్వసంగ్రహ రామాయణం ,హనుమద్రామాయణం ,నారద రామాయణం ,ఆనంద రామాయణం ,అద్భుత రామాయణం ,అగస్త్య రామాయణం,తార సార రామాయణం ,బోధాయన రామాయణం ,బ్రహ్మ రామాయణం ,భారద్వాజ రామాయణం ,శివ రామాయణం ,యాజ్న్య  వల్క్య రామాయణం ,విశ్వా మిత్ర రామాయణం ,బృహద్రామాయణం ,శ్వేత కేతు రామాయణం ,సుతీక్ష్ణ రామాయణం ,పులస్త్య రామాయణం ,జైమిని రామాయణం ,దేవీ రామాయణం అనే 24రామాయణాలను  విపులంగా శోధించి వాటి సారాన్ని మధుర మనోజ్న సంస్కృత శ్లోకాలలో నిక్షిప్తం చేసి మనకు అందించిన పుణ్యాత్ములు శ్రీ నరసి౦హావధాని గారు .అలాగే అష్టాదశ పురాణాలలో ఉన్న రామ కధను రామాయణ రత్నాకరం ,ఉమా సంహిత ,అగస్త్య సంహిత ,పంచ రాత్రాగమ స్థిత పద్మ సంహిత ,పరాశర సంహిత ,శ్రీ రామ పూర్వోత్తర పితానుపనిషత్ ,తార సారోపనిషత్ ,రామ చంద్ర కదామృతం ,రసాన్న రత్నావళి ,రామాయణ సార సంగ్రహం ,కాల విధానం ,కాల నిర్ణయ మహోదధి ,మనవాది స్మృతులు ,మధ్వన్యక్కారం ,శివ తత్వ వివేకం ,పురాణ తామసత్వ నిరాకరణం ,ధర్మా కూతం ,కాల ప్రకాశిక ,హోరానుభవ దర్పణం ,సూర్య సిద్ధాంతం ,,ఆర్య భటం ,శ్రీ మహా భారతం ,శ్రీ శంకర భాష్యం ,ఆపస్తంభ బోధాయన సూత్రం మొదలైన వాటిలోని ప్రమాణ వాక్యాలను గ్రహించి సంతరించారు .ఇవికాక అగ్ని వేష రామాయణం ,విచిత్ర రామాయణం మొదలైనవాటినీ మధించారు .ఇంతటి గొప్ప పరి శోధన చేసి ఆస్తిక జన హృదయోల్లాసంగా రామాయణ సార సంగ్రోద్ధారం రచించారు వారికి జాతి ఏమిచ్చి ఋణం తీర్చు కోగలదు ? ‘

అయోధ్య కాండ లో  సుమారు 80పేజీలలో పండిత, మహాపండిత అభిప్రాయాలన్నిటినీ క్రోడీకరించి ప్రచురించటం చాలా విశిష్టం గా ఉంది .గ్రంధ గౌరవాన్ని మరింత ఇనుమడింప జేసింది .అవధాని గారిని మనస్పూర్తిగా అభినందించిన మహానుభావులలోమహా మహోపాధ్యాయ  శ్రీ ముదిగొండ నాగ లింగ శాస్త్రి ,రాజా విక్రమ దేవ వర్మ,వావికొలను సుబ్బారావు ,శ్రీ పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి ,రాజా మంత్రి ప్రగడ భుజంగ రావు ,శ్రీ ఆది భట్ల నారాయణ దాసు  ,శ్రీ వడ్డాది సుబ్బారాయుడు ,శ్రీ రాణీ వెంకట నృసింహ చయనులు,వ్యాఖ్యాన వాచస్పతి శ్రీ మల్లాది రామ కృష్ణ విద్వత్ చయనులు ,న్యాయవాది శ్రీ పెద్ది భొట్ల వీరయ్య ,శ్రీ మరుధూరి తాతాచార్యులు ,తర్క వేదాంత విశారద శ్రీ ముదిగొండ వెంకట రామ శాస్త్రులు ,ఆమ్నాయ తర్క వేదాంత పండిత శ్రీ శ్రీపాద లక్ష్మీ నృసింహ శాస్త్రి వంటి ఉద్దండులున్నారు .వీరిలో ఎక్కువ మంది స్వచ్చమైన గీర్వాణ భాషలోనే అభినందనలు రాసి పంపారు .

శాస్త్రిగారు ఆ నాటి దేశాలను వాటికీ సంబంధించిన ఈ నాటి పేర్లతో వివరించి తెలియ జెప్పటం గొప్పగా ఉంది .ఉదాహరణకు కోసల దేశం అంటే –ఉత్తర ,దక్షిణ కోసలాలు .ఉత్తర కోసలం లో ముఖ్యపట్టణం అయోధ్య దీన్నే ఓద్అంటారు దక్షిణ కోసలలో గుజరాత్ లోని కుశస్తలి రాజధాని .అది గంగానది దక్షిణ తీరం లోని నాగ పూర్ లో ఉంది .కౌసల్య తండ్రి భాను మంతుడు ఉత్తర కోసల రాజు. అదే ఇప్పుడు గౌడ దేశమైంది .దీని రాజధాని శ్రావస్తి .భారత కాలం లో గంగ కు దక్షిణం లో ఉన్న దక్షిణ కోసల ఇప్పుడు ఉత్తర కోసల అయిందని వివరించారు .మగధ దేశం మాగధ అని పిలువ బడింది .ప్రస్తుతం ఇది దక్షిణ బేరార్ లో ఉంది. దీనికి పడమర శోఢా నది,ఉంది. రాజగిరి ముఖ్య పట్టణం .ఇప్పుడు మధ్య పరగణాలు అనే మధ్య ప్రదేశ్ లో ఉంది .

బాల కాండ లో సీతా దేవి జన్మ వృత్తాంతాన్ని శాస్త్రిగారు వర్ణించిన కొన్ని శ్లోకాలు –

‘’సీతా జన్మ ప్రవక్ష్యామి యదుక్తం గ్రంధ కొభిః – ఆసీ త్పురా నృపః కస్చిత్పద్మాక్ష ఇతి విశ్రుతః

స్వాదీయసీం గుణ సుధాం సీతా పిబతి తే ప్రభో-తత్రాక్షిపద్విషం మారస్త్వం భిష గ్రామ రక్ష తాత్  ‘’

శ్రీ రామ సద్గుణ సుదారాసాన్ని సీతమ్మ గ్రోలు తోంది .మన్మధుడు అనే అసూయ ఉన్నవాడు సుధారసం లో విషం కలిపాడు .రామా నువ్వు విష వైద్యుడవై సీతనుకాపాడు .

ఇలా సారోద్ధారం సాగుతుంది .

అవధాని గారి ఫోటో కింద జత చేశాను చూడండి

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments