గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్

గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్

 

ఏథెన్ ల స్వర్ణయుగం డేమిస్తో క్లెస్ తో ప్రారంభమైంది .గొప్ప రాజకీయ వేత్త మహా నావికుడు దార్శనికుడు ,యుద్ధ తంత్ర నిపుణుడు అయిన ఇతను క్రీ పూ 48 0లో పెర్షియన్ సైన్యాన్ని చిత్తుచిత్తుగా సలామిస్  యుద్ధం లో ఓడించాడు . ఆతర్వాత గ్రీకుల ప్రాభవం పెరిక్లేస్ వలన వచ్చింది .ఇక ఫిలిప్ అలేక్సాందర్ ల సంగతి చెప్పనక్కర్లేదు. విశ్వ విజేత అనిపించాడు అలెక్సాండర్.దీనికంతటికీ ప్రాధమిక శక్తి నిచ్చినవాడు డేమిస్తో క్లెస్ .మహా మేధావిగా ,అకస్మాత్తుగా విరుచుకు పడే ఆపత్సమయం లో బుర్ర పాదరసం లా పనిచేసి ప్రతిక్రియ చేసే పోరాట యోధుడిగా పేరు పొందాడు .ఎమర్జెన్సీ నిఎదుర్కోగల సర్వ సత్టాక ఉన్నవాడు .

 క్రీ .పూ .5 23లో ఎదేన్స్ ఈశాన్య భాగం లో ఆటిక్ జిల్లాలో పుట్టాడు .తండ్రిపేరు నియోక్లాస్ అంటే కొత్త కీర్తి .అరిస్టాక్రాట్ భూస్వామి. తల్లి విదేశీయురాలు .ఉత్తర గ్రీసులో త్రేస్ లో పుట్టింది .ఆమె ఏసియా మైనర్ కు చెందిందని బానిస అని కూడా అంటారు .చిన్నప్పటి నుంచి విజయాలు సాధించి పేరు ప్రఖ్యాతులు పొందాలని భావించాడు .ఆల్కేమేయోనిడ్స్ కు చెందిన ఆర్చిప్ ను పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఆమె అయిదుగురు కొడుకుల్ని ముగ్గురు కూతుళ్ళను కని పెట్టింది ..అప్పటికే సోలోన్ తెచ్చిన సంస్కరణలవలన సామాన్యులు కూడా పార్టీ సభ్యులయ్యారు కింది మధ్య తరగతి వారి చేతుల్లో అధికారం ఉన్నా అరిస్తోక్రాట్ ల ప్రభావం జాస్తీగానే ఉండేది .

 క్రమగా ఎదీనియన్ రాజకీయాలలో ప్రవేశించి సమాజం లో గుర్తింపు పొందాడు .493బి సి లో మొదటిసారిగా ఆర్కాన్ కు  చీఫ్ ఆర్కాన్ గా ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశాడు .ఇక వెనకడుగు వేయలేదు .ముందుకే మును ముందుకే దూకాడు ..ఈ యువ  వయసులోనే తాను   విజన్ ఉన్న నాయకుడిగా అందరికి అభిప్రాయం కలిగించాడు .ఎదేన్స్ కు అయిదు మైళ్ళ దూరం లో శతాబ్దాలకాలం ఫెలేరాన్ బే చాలా బహిరంగం గా ఉండి పోయింది .నైరుతి భాగాన ఉన్న ఇదే ఓడ రేవు .దూర  దృష్టికల డేమిస్తో   ప్రక్రుతి సిద్ధమైన మూడు పైరేయాస్ హార్బర్ లుబాగా వృద్ధి చెందితే  శత్రువులనుంచి రక్షణకు చాలా అనుకూలంగా ఉంటుందని భావించాడు .ఇది అయితే బోర్లించిన కప్పు ఆకారంగా ఉండి శత్రువులను నివారించటం సులభం అన్నాడు .అందుకని హార్బర్ ను అంతటినీ ఒక సన్న గోడ ద్వారా అప్పర్ సిటీకి అనుసంధానం చేస్తే వాల్లెడ్ కారిడార్ ఏర్పడి దేశానికి ప్రమాదం ఉండదని నచ్చ చెప్పాడు  కాని ఇది కొంతకాలానికి కాని సాధ్యపడలేదు .ఆతను ముఖ్య ఆర్కాన్ కాక ముందు ఒక ఏడాది క్రితం పెర్షియన్ నౌకలు గ్రీకు సంయుక్త బలగాలను విపరీతంగా ధ్వంసం చేసి అలీనియా మిలీతియాస్ పట్టణాలను లోబరచుకున్నాయి .దీనితో గ్రీకు ప్రపంచం ఒక్కసారిగా హడలి పోయింది .క్రీ పూ 4 90లో మళ్ళీ పర్షియన్లు గ్రీకు భూభాగం మరాతాన్ పై దాడి చేసి న సందర్భం లో సేనాని మిలిటి యేడ్స్ వెనక ఉన్న పది మంది ఎన్నికైన జనరల్స్ లో ఒక్కడుగానే ఉన్నాడు .ఇంకా రంగ ప్రవేశం చేయలేదు .

 ఎదీనియన్లు తమను మోసం చేసినందుకు శిక్షగా మిల్టాడియాస్ ను తొలగించి చాలా మందిపై ప్రయోగాలు చేశారు కాని చివరికి దెమిస్తో క్లెస్ అందరి దృష్టినీ ఆకర్షించి ఒకరిద్దరు ప్రముఖులలో ఒకడుగా నిలిచాడు .పగ్గాలు అప్పగించారు మరాతాన్ యుద్ధం లో దెబ్బతిన్న పర్షియా మళ్ళీ కాలుదువ్వదని అందరూ నమ్మారు కాని దాని స్వభావం తెలిసిన ఇతను మాత్రం సమయం చూసి మళ్ళీ పర్షియా విరుచుకు పడుతుంది అన్నాడు .చివరికి అందరూ అంగీకరించి తక్షణ కర్తవ్యం ఏమిటో చెప్పమన్నారు .ఎదేన్స్ నౌకా బలగాన్ని బాగా అభి వుద్ది చేసుకోవటం ఒక్కటే మార్గమని చెప్పాడు .కొత్త యుద్ధ నౌకలు నిర్మించటం నావికులకు శిక్షణ నివ్వటం తప్పనిసరి అన్నారు .అతని ది ఎదేన్స్ ది అదృష్టం బాగుండి  వెండి గనులు బంగారు గుడ్లు పెట్టి విపరీతమైన  లాభాలు చేకూర్చాయి .ప్రజలందరూ దాన్ని తలాకాస్తా పంచుకుందాం అన్నారు

.అలా పంచుకొంటే ఒక్కోమనిషికి10 ద్రాక్మాలు వస్తాయి .అందుకని దెమిస్తో క్లెస్ వాళ్లకు నచ్చ చెప్పి ఆ మొత్తం లాభాలను రెండు వందల యుద్ధ నౌకలు నిర్మించటానికి ఉపయోగిద్దామని చెప్పాడు .’’వాకే’’ అన్నారు అంతా .

 అనుక్న్న నౌకానిర్మాణం కోటల పతిస్టీకరణ సైనిక శిక్షణ ,పైరేశియాస్ వద్ద హార్బర్ విస్తరణ జరిగిపోయాయి .చివరికి ఆతను చెప్పినట్లే పర్షియా సైన్యం ఏసియా మైనర్ మీదుగా హీల్స్ పాయింట్ కు 4 8 ౦ లో రెండులక్షల సైనికులు ,80౦ మంది ఆశ్విక దళం  వెయ్యి దాకా యుద్ధ నౌకలతో ఒక లక్షా యాభై వేలమంది నావికులతో దాడికి దిగింది .మొత్తం 3 లక్షలమంది అని చరిత్రకారులు రాశారు . అవాక్కయింది దేశం .డెల్ఫీ వెళ్లి దేవతను సలహా అడగాలని వెళ్ళారు .అక్కడ ప్రీస్ట్ ద్వారా దేవత ‘’ఒక్క కర్ర గోడ మాత్రమె మిమ్మల్ని  మీ సంతానాన్ని రక్షిస్తుంది’’ అని జోశ్యం చెప్పింది .కొయ్య గోడ అంటే ఏమిటో అని అందరూ బుర్రలు బద్దలు కొట్టుకున్నారు .తలోమాటా చెప్పారు అప్పుడు దెమిస్తో క్లెస్ అది తాము నిర్మించిన కొత్త నౌకాదళం అని చెప్పాడు అప్పుడు అందరూ నమ్మారు .అంతేకాదు ‘’స్త్రీ కొడుకులు సలామిస్ లో చనిపోతారు అని చెప్పినదానికి  పర్షియన్లు  ఓడిపోవటం ఖాయం అనీ అర్ధం వివరించి చెప్పాడు .

 పర్షియన్ దాడి ప్రమాదానికి అప్రమత్తమైన దెమిస్తో క్లెస్ చుట్టుప్రక్కలున్న సిటీ స్టేట్ ల నాయకులతో సంభాషణ జరిపి దక్షిణ గ్రీసును ఎలాకాపాడుకోవాలో చర్చించాడు .జేర్జియాస్ నాయకత్వం లోని అతి పెద్ద యుద్ధ సమూహాలను భూసైనికులతో పోరాటం అచ్చి రాదనీ ,పెర్షియన్ యుద్ధ నౌకల ద్వంసమే తక్షణ కర్తవ్యమని తెలియ బర్చాడు ,వారి నౌకాబలగం క్షీణిస్తే ఆహార పదార్ధాల  సరఫరా  రాక  లోన్గిపోవటమో పారిపోవటమో చేస్తారు అని యుద్ధ వ్యూహం వివరించాడు

 క్రీ పూ 48 ౦ సెప్టెంబర్ లో పర్షియా సైన్యం గ్రీసు దక్షిణభాగం పై దాడి చేసి ఎదేన్స్ వైపుకు దూసుకు వస్తోంది .వెంటనే మెరుపులా ఆలోచనవచ్చి ఎదేన్స్ ను తక్షణం ఖాళీ చేయవలసిందిగా ఎమర్జెన్సీ ఆర్డర్ జారీచేశాడు .సిటీ గార్డియన్ ఎతేనా కు అప్పగించి పిల్లలు స్త్రీలను పెలో పోనిసియాన్ తీరానికి ,ముసలి వారు బానిసలను సలామిస్ కు పంపించాడు  .మిలిటరీ లో చేరే వయసున్నవారందరినీ తమ రెండు వందల యుద్ధ నౌకలకు కాపలాగా ఉంచాడు .సెప్టెంబర్ 17 న పర్షియన్ సైన్యం ఎదేన్స్ చేరి అంతా  నిర్మానుష్యఎడారిగా ఉండటం చూసి కేరింతలతో రాజు జేర్జేస్ కు జేజేలు కొట్టి ఇంతసులభంగా ఎదేన్స్ స్వాదీనమయినదుకు తమలో తాము అభినందిన్చుకొన్నారు ..ఇదే సమయం లో గ్రీకు జనరల్స్ యుద్ధ నౌకల పనిలో పడ్డారు .ఇదే దేమిస్తోక్లేస్ కు బంగారు గడియలు అయ్యాయి .మిగిలిన జనరల్స్ అట్టికా ఖాళీ చేసి కోరింత్ వద్ద ఇస్తమస్ లో రక్షణ కవచంగా ఉన్నారు .కాని ఆతను ‘’గ్రీసును రక్షించాలి అంటే సలామిస్ దగ్గరే యుద్ధం చేయాలి కాదని అక్కడ చేస్తే బహిరంగ  సముద్రం లో యుద్దమై మనకు విజయాన్ని ఇవ్వదు మనం నారో వాటర్స్ లో యుద్ధం చేస్తేనే అంత పెద్ద సైన్యాన్ని గెలవగలం అన్నాడు .కొందరు సైన్యాధికారులు గోణుక్కున్నా తీవ్రం గా హెచ్చరించి తానూ చెప్పినట్లే చేయాలని   లేక పొతే ఇటలీ వెళ్లి అక్కడ మన నౌకాదళం లేక  నెత్తిమీద చెంగేసు చెంగేసుకోవాలి’’అని   హుకం జారీ చేశాడు

సెప్టెంబర్ 20 జేర్జేస్ నారో వాటర్ ఉన్న సలామిస్ జలసందిలోనే యుద్ధం చేయమని  ఆజ్న ఇచ్చాడు .దగ్గర ఉన్న ఎత్తైన కొండ ఎక్కి యుద్ధం చూస్తున్నాడు ..తమకున్న 600యుద్ధనౌకలతో మొత్తం35 0కూడా లేని  గ్రీకు యుద్ధనౌకలు  ఏమాత్రం నిలవరించలేవని గర్వపడ్డాడు .పెర్షియన్ సైన్యం ఆ ఇరుకు బొక్కలో యుద్ధం చేయలేక బోనులో పడ్డ ఎలుకల్లా అగ్నిలో పడ్డ మిడతల్లా గ్రీకు యుద్ధ నౌకలకు ఆహుతయ్యారు ..దొరికిన వాళ్ళను దొరికినట్లు ఊచకోత కోసింది గ్రీకు సైన్యం  దీనితో గ్రీకును విజయ తీరాలకు చేర్చి పెర్షియన్ సైన్యం పలాయనం చిత్తగించేట్లు చేశాడు .

 గ్రీకు విజయానికి దేమి క్లెస్ యుద్ధ నీతి మాత్రమె ఫలించింది .ఈ విజయానికి పొంగిపోక స్పార్టా ఎప్పుడూ పక్కలో బల్లెం గానే ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు నమ్మలేదు చాలామంది . స్పార్టా తో చర్చలు జరుపుతున్నట్లు నటించి ఆదేశం వెళ్లి మరింత లోతుగా చర్చలు చేసి తిరిగి వచ్చేసరికి యువకులంతా నడుం బిగించి యుద్ధంలో దెబ్బతిన్న గోడలన్నీ మళ్ళీ కట్టారు .ఈ విధంగా ఎదేన్స్ నావికా దళాన్ని వృద్ధి చేసి ఎదురు లేని నావికా దళం గా నిలబెట్టి నావికా దళ పిత అనిపించుకొన్నాడు దెమిస్తో క్లెస్ .క్రీ పూ 4 7 0 కి ఎదేన్స్ సామ్రాజ్యం బలంగా రూపు దాల్చింది .స్పార్తాకు బద్ధ విరోదిగానే ఉన్నాడు .మిల్తి యేడ్స్ కొడుకు సైమన్ అధికారం పొందాడు .ఇతన్ని దేశ బహిష్కరణ చేశాడు .పర్షియా రాజుతో లోపాయకారీగా ఒప్పందం చేసుకోన్నాడని అభి యోగం మోపారు .అతని దురదృష్టం వలన ఎక్కువమంది ప్రజలు దాన్ని నమ్మారు .ఇక్కడినుంచి అనేక ప్రాంతాలు తిరుగుతూ వలస జీవితం అనుభవించాడు మహా వీరుడు   పర్షియన్ రాజు  జేర్జేస్ ను కలిస్తే ఆయన ఆర్కాన్ చీఫ్ ను చేశాడు .ఏసియా మైనర్ లో ఉన్న మాగ్నేసియా సిటీ గవర్నర్ పదవి ఇచ్చాడు

ఇన్‌లైన్ చిత్రం 1 ఇన్‌లైన్ చిత్రం 2

ఇన్‌లైన్ చిత్రం 3

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేతి–నేతి-’’ఏతి’’

నేతి–నేతి-’’ఏతి’’

పరబ్రాహ్మం ను తెలుసుకోవటానికి ఇదికాదు అదికాదు అంటే నేతి నేతి -అంటే నా ఇతి ఇదికాదు అంటూ పోయి చివరికి ఆత్మయే పరమాత్మ అని తెలుసుకోమని వేదం ఉపనిషత్తులు బోధించాయి .ఇదే ఎలిమినేషన్ పధ్ధతి . అలాగే సుమారు 25 ఏళ్ళక్రితం హిమాలయాలలో మంచు మనిషి ఉన్నాడని అక్కడ కనిపించాడు ఇక్కడ కనిపించాడని పరిశోధకులకు ప్రోత్సాహం కలిగించి వాళ్ళందరూ వెళ్లి చూసి మంచుమనిషి ఉన్నదని కొందరు లేరని కొందరూ ఎటూ తేల్చలేక పత్రికలకు కావలసినంత మేత పడేశారు . పత్రికలూ పతాక శీర్షికలతో హల చల్ చేసినసంగతి మనకు తెలుసు .యదార్ధం ఏమిటో ఇప్పటికీ బ్రహ్మ పదార్దమే . ఏతి అంటే మంచుమనిషి .దానికే ‘షాంగ్రిల ‘’అనే పేరు .హిమాలయ సానువులలో జన్మించి సుమారు 5 0 ఏళ్ళు హిమాలయ పర్వతాలను ఆ చివర నుంచి ఈ చివర దాకా శోధించి అన్ని ఎత్తులలోను కాలినడకన సంచరించి గుహలలో తపస్సు చేసి హిమాలయాలే తనకు పాశాలలు అని తన అనుభవాలను ‘’లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ ‘’గా రచించిన స్వామి రామ మంచుమనిషి అనేది లేదని అదొక భ్రమ అని తేల్చి చెప్పారు . ఆ విషయాలే మీకు తెలియ జేస్తున్నాను .

 పాశ్చాత్యులకు హిమాలయాలలో ఏతి -శాంగ్రిల అనే మంచుమనుషులుఉన్నారని భ్రమపడి ఎన్నో పరిశీలనలు చేశారు .వీరికి స్థానిక షెర్పాలు సామాను మోయటానికి దారి చూపటానికి సాయపడే వారు ఏ షేర్పా కూడా తానూ యేతి ని చూసినట్లు ఇంతవరకు చెప్పలేదు వాళ్ళు ఎక్కలేని ఎత్తు లేనేలేదు .

 అయితే ఈ నమ్మకానికి కారణం హిమాలయాలలో చాలా ఎత్తున ఉన్న రెండు పురాతన మొనాస్ట రీస్ అంటే’’గుహా  మఠాలు.’’ ఇవి అనుశ్రూతంగా తపస్సుకు అత్యంత అనుకూలమైన ప్రదేశాలుగా చెప్పబడ్డాయి .ప్రశాంతమైన వాతావరణం ,తపస్సుకు ఎలాంటి భంగమూ కలిగించని పరిస్తితులు ఇక్కడ ఉండటం వలన యోగులు ఇక్కడిదాకా కస్టపడి వచ్చి ధ్యానం తపస్సులతో ఆత్మ జ్ఞానం పొందేవారు .ఇందులో ఒక మఠం లేక ఆరామం కాంచనగంగ శిఖరం పై సుమారు 14 వేల అడుగుల ఎత్తున ఉన్నది ,రెండవది హిమాలయ అంతర్భాగం లో టిబెట్ -గార్వాల్ సరిహద్దులో ఉంది .ఈ గుహాకార ధ్యాన మందిర౦  లేక మఠ౦  చాలా మంది ఉండటానికి అనువుగా ఉంది .ఇది సుమారు 12 వేల అడుగుల ఎత్తులో ఉంది. చాలా కొద్దిమంది మాత్రమే ఇక్కడికి చేరుకోగలరు .ఇది ఇప్పటికీ ఉంది .ఈ గుహా మఠం లో సంస్కృత ,టిబెట్ ,సంధ్యాభాష వ్రాత ప్రతులు లభిస్తాయి .

  సాధారణంగా విదేశీయులు డార్జిలింగ్ వచ్చిషెర్పాల సహాయం తో  హిమాలయాలు చూస్తారు  .వాళ్ళ పరిశోధనలో షా౦గ్రిల లేక ఏతిఅనే మంచుమనిషి ప్రస్తావన వస్తుంది .అందర్నీ అడుగుతుంటారు మీరు చూశారా మీరు చూశారా అని అదొక ఉత్కంఠ వాళ్లకు .అయితే  వీళ్ళకేవ్వరికీ గోచరించని హిమాలయ ప్రాంతాలున్నాయి. వీళ్ళు ఎవరూ అక్కడికి వెళ్లి శోధన చేయలేదు చేయలేరుకూడా ..ఒకసారి ఒక అమెరికా  ధనవంతుడు మంచుమనిషి ని అన్వేషి౦చ టానికి వచ్చి స్వామి రామా ను అడిగాడు .స్వామి తనకు అలాంటి మనిషి ఎక్కడా ఇన్నేళ్ళలో కనిపించలేదని రామా చెప్పారు ..నాలుగునెలలు ఉండి ౩౩ వేల డాలర్లు ఖర్చు చేసి ఎలాంటి ఫలితమూకనిపించక తిరిగి వెళ్ళిపోయాడు .ఢిల్లీ వెడుతూ దారిలో ఒక నేపాలీ సాధువును ఫోటో తీసి ఆయనే మంచుమనిషి అని చెప్పి పేపర్లలో ప్రచురించాడుకూడా .మరో పాశ్చాత్య మహిళా సిక్కిం నుంచి హిమాలయాలకు షేర్పా లసాయం తో వచ్చింది .డార్జిలింగ్ లో ఉంటూ మూడు సార్లు ప్రయత్నించి స్నోమాన్ ను కనుక్కోలేక పోయింది

 తానూ చిన్నతనం నుంచి హిమాలయాలలో సంచరిస్తున్నా తనకు ఎప్పుడూ మంచుమనిషి  షంగ్రిలా అనే ఏతి కనిపించలేదని స్వామి రామా చెప్పారు ..కాని హిమాలయ వాసులు వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మల వలన మంచుమనిషి కధలు గాధలూ ప్తరతరాలుగా వింటున్నారని అన్నారు .మానవుడికి ఫాంటసి అతి ప్రాచీనకాలం నుండే అలవడింది. అప్పటినుంచీ మంచుమనిషి కధ ప్రచారం లో ఉంది ..హిమాలయాలలో మంచు దట్టంగా ఉన్నప్పుడు మన చూపు కు ఆటంకమేర్పడి వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి .అప్పుడు అతి అరుదుగా కనిపించే ఎలుగు బంట్లు దూరం నుంచి చూస్తే మంచు మనుషులు అనిపిస్తాయి .కంటి దోషమేకాని యదార్ధంగా మంచు మనిషి కాదు .ఈ ఎలుగులు చాలా ఎత్తైన ప్రదేశాలలో మాత్రమే ఉంటాయి .పరిశోధకుల ఆహార పదార్ధాలను ఎత్తుకు పోయి తినేస్తాయి .అప్పుడు వాటి పాదాల గుర్తులు మానవ పాదం గుర్తులులాగా మంచులో దిగి చాలా పెద్దగా కనిపిస్తాయి .కనుక పరిశోధకులు ఈ పెద్దపాదాలను మంచుమనిషి పాదాలుగా భ్రమ పడుతారు .భ్రమ వలన కలిగే పొరబాటు ఇది .అంతేకాదు ఎలుగుబంటి మంచుపై వేగంగా పరుగెత్తినా,ఎత్తుకు ఎక్కుతున్నా  కిందికి దిగుతున్నా  దాని పాద ముద్రలు మామూలుకంటే చాలా పెద్దవిగా కనిపించటం సహజ౦ .తాను పెంచుకున్న ఎలుగు బంటి పాదముద్రలు కూడా ఇలాంటి సందర్భాలలో పెద్దవిగా చూడటం ఆశ్చర్య పోవటం జరిగింది అని స్వామి తెలియ జేశారు .దీనినే స్వామిరామ ‘’హిమాలయ మాయ ‘’అన్నారు .

 అంతా బాగానే ఉందికాని అసలు ఈ ఏతిఅనే మాట ఎక్కడిది ,ఎందుకు వచ్చింది ?ఏతి కాదు అసలు పేరు ‘’యతి ‘’అంటే సన్యాసి ,యోగి అని అర్ధం .అది అపభ్రంశమై ఏతి గా మారింది .శంకరాచార్యస్వామి శిష్యులను యతులు అంటారు .వీరు ఈ  అత్యంత ఎత్తైన  హిమాలయాల గుహలలో తపస్సు చేసుకుంటారు . ఈ యతులు సాధారణం గా గుహలలో ఉంటారు బయటికి రారు ఎప్పుడైనా వీరు బయటికి వచ్చి కనిపిస్తే ఈ యతులను ఏతులు గా అంటే మంచు మనుషులుగా షంగ్రిలాలుగా భ్రమ పడుతారు అదీ అసలు రహస్యం

 19 వ శతాబ్దికి పూర్వం నుంచే యేతిపదం ప్రచారం లో ఉంది .19,20  21 శతాబ్దాలలోకూడా చాలామంది చాలా దేశాలనుంచి వచ్చి మంచుమనిషిపై  హిమాలయాలలో పరిశోదిన్చారుకాని అని ఫలితం శూన్యం .20 04 ,7 ,8 11 .లలో కూడా కష్టపడ్డారు .రష్యాలో 20 11 లో ఒక కాన్ఫరెంస్ జరిగి సైంటిస్ట్ లు తాము సేకరించిన  సాక్ష్యాదారాలలో తొంభై ఐదుశాతం యేతి ఉన్నట్లు రుజువైందని చెప్పారు .కాని అందులో పాల్గొన్న అమెరికన్ ఆన్త్రో పాలజిస్ట్ ,అనాటమిస్ట్ జెఫ్రీ మెల్ డ్రంమాత్రం వారితో ఏకీభవించక అదంతా స్థానికులు ప్రచారం కోసం చేసిన స్టంట్ అని తెల్చిపారేసి వాళ్ళ ఆశలపై నీళ్ళు కుమ్మరించాడు .కనుక ఇప్పటికి’’ ఏతి’’ నేతి నేతి గా నే ఉంది .’’యతి ‘’అనుకొంటే మళ్ళీ సందేహాలు రావు .బ్రహ్మ పదార్ధం సిద్దించినట్లే .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం

 

హిమాలయాలలో కొన్ని గుహలలో నాలుగైదు మంది ఉండే అవాకాశం ఉంది .అక్కడ పవిత్ర జీవనం హాయిగా నిరాటంకం గా గడపవచ్చు .ఇక్కడ  సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది .కొన్ని పెద్ద గుహాంతర ఆశ్రమాలు మొనాస్టరీ లుఉంటాయి .వీటిలో సంప్రదాయం అయిదు వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది .అందులో చేరిన మొట్టమొదటి గురువు ఎవరో ఆ తర్వాత వచ్చిన వారెవరెవ్వరో ,సంప్రదాయం ఎలా అక్కడ ప్రారంభమైందో రికార్డ్ లున్నాయి .

ఈ మఠాలనబడే గుహాశ్రమాలలో అనేక గదులు ఉంటాయి .శతాబ్దాలుగా అవి ప్రకృతి చేత స్వయం సిద్ధంగా తయారు చేయబడి చాలా మంది విద్యార్ధుల జ్ఞాన సముపార్జనకు తోడ్పడుతున్నాయి .అందులో తరతరాలుగా ఉన్నవారు సౌకర్యం ప్రశాంతత ల  కొరకు వాటిని తీర్చి దిద్దుకున్నారు . అయితే ఆధునిక హ౦గు లేమీ ఉండవు ..స్నానాలగది, వంటగది వంటివి ఉండవు .కాని హాయిగా జీవనం గడపటానికి సరిపోతాయి .గుహ అంటే నే చీకటి గుయ్యారం అని అనుకొంటాం. కాని ఈ గుహలలో దూప్ అనే పేరున్న పొడవైన కర్రలు వనమూలికలతో చేయబడి ఉంటాయి ..దాన్ని వెలిగిస్తే కా౦తినిస్తుంది   ఆర్పితేసువాసన వెదజల్లుతుంది నాలుగు అంగుళాల పొడవు అంగుళం మందం తో దూప్ తయారు చేస్తారు ..దానికాంతిలో కంటికి ఏ మాత్రం శ్రమ లేకుండా వేదం శాస్త్ర గ్రంధాలను అన్నీ హాయిగా చదవ వచ్చు .దాన్ని ఆర్ప్గగానే సుగంధ పరిమళం వ్యాపించి మానసిక హాయి నిస్తుంది .ఇది కాక పొతే పైన్ ,దేవదారు వృక్షాల కొమ్మలను తెచ్చి వెలిగించి కాంతిని పొందుతారు .వీటిలో  ప్రకృతిసిద్ధమైన జిగురు పదార్ధం -రేజిన్ ఉండి మంట నిరనతరం గా మండటానికి దోహదం చేస్తుంది .ఇవే టార్చి లైట్లు గుహలో .గుహ   నిరనతరం  వెచ్చగా ఉండటానికి ‘’ధుని ‘’ఏర్పాటు చేస్తారు .అంటేలావుపాటి దుంగలను మండిస్తారన్నమాట .పెద్ద పెద్ద కొయ్య దుంగలను వేసవికాలం లోనే నరికి పోగు చేసి గుహలో లాట్లు గా పేరుస్తారు కట్టెల అడితీ లోలాగా .

 

కొన్ని రకాల పుట్టగొడుగులు ,లింగోరా ,ఓగల్ అనే అత్యధికంగా దొరికే  కాయ గూరలను  దుంపలను ,వ్రేళ్ళను వండుకొని లేక పచ్చివి తింటారు .ఇందులో తరూర్ ,గెంతి ముఖ్యమైనవి .మిగిలినవి చిలగడ దుంపలు లాగా బాగా తియ్యగా ఉంటాయి .బార్లీ బంగాళాదుంప ,గోధుమ ,పప్పు ధాన్యాలు ,మొక్కజొన్న ,లు హిమాలయాలలో 6 ,500 అడుగుల లోపు ఎత్తుప్రదేశాలలో పండుతాయి .వీటినీ వాడుతారు .ప్రతిగ్రామం లో కుటీర పరిశ్రమ ఉంటుంది .అక్కడ నాణ్యమైన ఉలెన్ దుప్పట్లు జంపఖానాలు  వేడి నిచ్చే దుస్తులు లభిస్తాయి .నీటికి  ఇబ్బంది ఉండదు చిన్న చిన్న నీటి ప్రవాహాలు ప్రతి గుహ దగ్గరా ,గుహలో కూడా ప్రవహిసాయి .నవంబర్ డిసెంబర్ నెలలో నీరు గడ్డ కడితే మంచు కరిగించి నీటిని వాడుతారు .మనాలి లాంటి ప్రదేశాలలో స్వచ్చమైన నీరు దొరకదు .మూడు నాలుగు మైళ్ళు నడిచి మంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది .  ఇప్పటికీ హిమాలయాలలోని కొన్ని గుహా౦తర ఆశ్రమాలలో గురువులు సంప్రదాయ పద్ధతిలో విద్య బోధిస్తూ కనిపిస్తారు .దేశం లోని అనేక ప్రాంతాలనుండి శిష్యులు వచ్చి విద్య నేర్చుకొంటారు .అంతఎత్తు ఎక్కి గురువుల వద్ద విద్య నేర్వటం చాలాకస్టమే. కాని దీక్షా పట్టుదల ఆసక్తి ఉన్నవారికి అది అసాధ్యం అనిపించదు .హిమాలయాలు గురుశిష్యులను జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటాయి .విద్యార్ధులు ఇంటినుంచి బయల్దేరి ఉత్తమ గురువును అన్వేషిస్తూ వారిని దర్శించి విద్యను  అభ్యాసం చేస్తారు. అలాంటి శిష్యులకోసం గురువు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు .హిమాలయ అంతర్భాగం లో మహా  మహి మాన్విత ఋషులు తపస్సు ,ధ్యానం చేస్తూ వారికి దర్శన మిస్తారు. వారి జన్మ తరించినట్లు భావితారు .

 గృహాశ్రమాలలో విద్యా బోధనప్రయోగాత్మక పద్ధతిలో -డిమాన్ స్ట్రేషన్ విధానం  లో ఉంటుంది .బోధన నిర్నీతకాలాలలో జరుగుతుంది .కొంత విద్య నేర్చిన తర్వాత గురువు శిష్యులను తమ ప్రావీణ్యం ప్రదర్శించ మని కోరుతాడు .ఒక్కోసారి మౌనంగా నే బోధ ఉంటుంది .మౌన గురువు అని దత్తాత్రేయ స్వామికి పేరున్న సంగతి మనకు తెలుసు .మౌన వ్యాఖ్యానమే ఆయన  ఆయన పధ్ధతి .శిష్యులు విద్య బాగా గడించాక గురువు ‘’మీ జీవిత కాలం అంతా ఇక్కడే గుహలో చదువులో గడిపితే యోగుల వద్ద మిగిలిన వారు ఎప్పుడు నేర్చు కుంటారు ?’’అని అడుగుతారు .కనుక కొన్నేళ్ళ తర్వాత వాళ్ళు గుహాశ్రమం నుండి బయటికి విశాల ప్రపంచం లోకి అడుగు పెట్టి మరింత విజ్ఞానం సాధిస్తారు ..

 వ్యక్తీ సృజనతో ,పరోపకారంగా జీవించాలి .దీనికి అంతర్ దృష్టి ,మనసుపై నియంత్రణ సాధించాలి .వీటిని గుహాశ్రమాలలో క్షుణ్ణంగా నేర్చుకొంటే ,తరువాత వీటిని సాధన చేస్తే జీవిత పుష్పం నిరంతరం వికసించి ఫలితం కలిగిస్తుంది .ఇది సాధిస్తే జీవితం లో   కస్టాలు సమస్యలను అవలీలగా ఎదుర్కొని ముందుకు సాగి అభివృద్ధి చెందవచ్చు .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానం బెట్టిదనిన –

విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానం బెట్టిదనిన –

నవ్వు హాస్యం  చెణుకు వ్యంగ్యం శ్లేష ,రిపార్టీలకు చలించని మనిషి ఉండకపోవచ్చు ఎవరైనా ఉన్నా ఎక్సేప్శనల్ కేసులుగా భావిస్తాం .అసలు నవ్వటానికి కారణాలు చెప్పచ్చుకాని ఎందుకు నవ్వుతామో చెప్పలేము .నవ్వు ‘’కలలు’’వంటిది అన్నారు  .అయిదు వేల ఏళ్ళక్రితం అంటే క్రీ.పూ 29౦౦ లో ప్రాచీన ఈజిప్ట్ లో నవ్వు కు ఒక  చిత్ర లిపి -ఈరోగ్లిఫ్ కనిపించింది .అందులో ఒక వంకర కర్ర దానిపక్కన పాదం ఆకారం తో కాలు ,తర్వాత  పడుకోబెట్టిన వంకరకర్ర పైన అర్ధ చంద్రాకారం దానిప్రక్కన కూర్చున్న మనిషి చిత్రాలున్నాయి ఇదే నవ్వుకు మొదటిసారిగా కనిపించిన ఆధారం అని చెబుతారు .ఈజిప్ట్ గ్రామర్ ,స్క్విగిల్స్ పై దిట్టయైన సర్ అలాన్ గార్దేనర్ తాను హీరోగ్లిఫ్ గీస్తున్నప్పుడల్లా  వాటిని చూసి నవ్వు ఆపుకోలేక పోయానని రాశాడు .ఓల్డ్ టెస్టమెంట్ లో 26నవ్వు సందర్భాలున్నాయి .అయితే వీటివలన నవ్వు ఎందుకు వస్తుందో తెలియదు .ఇందులో  నాటు హాస్యం ఒకటి ఉంది ముసలివారయిన అబ్రహాం సారా  దంపతులకు సంతానం లేదు .ఒక రోజు  ఒక దేవత దేవునిలా ప్రత్యక్షమై అబ్రహాం గుడారం బయట ఉన్నప్పుడు ,భార్య లోపల అతిధులకు వంట చేస్తున్నప్పుడు అబ్రహాం తో ‘’నీభార్య సారా కు కొడుకు పుడతాడు ‘’అని చెప్పింది ఈ మాట లోపల ఉన్న భార్య సారాకు వినిపించింది .ఆమె పగలబడి నవ్వింది .కాటికి కాళ్ళు చాచుకున్న ముదిమి వయసులో  ఆయనతో శృంగారం ఏమిటి సుఖమేమిటి  పిల్లలు యెట్లా పుడతారరు?..ఈ నవ్వు దేవుడికి తనను అవమానించినట్లు అనిపించింది .’’దేవుడికి అసాధ్యం ఉన్నదా ?’’అడిగాడు ఆమె నవ్వు ఆపి ‘’నవ్వేట్లు చేసింది నువ్వే ‘’  ‘’అంది .ఆమె నవ్వుకు ఆమె కారణం చెప్పలేదు .ఊహించాలి .ఆమె మాటల అంతరార్ధం తెలిస్తే మనమూ నవ్వుతాం .ఇదే మొదట రికార్డ్ అయిన’’ డర్టీజోక్ ‘’గా భావించారు .అంటే అబ్రహాం కు అంగం నిక్కబోడుస్తుందా ,దానితో తానూ సుఖించి సంతానం పొందగలనా అని సారా భావం .కనుక నవ్వుకు ఏ చిన్నవిషయమైనా చాలు .కలిసికట్టుగా నవ్వితే కొందరికి బాధ అసూయ కలగవచ్చు .హోమర్ రాసిన ఇల్లియడ్లో పాగాన్ దేవతలు చాలాసార్లు నవ్వారు ..మనుషుల అనుమానానికి భయానికి నవ్వారు వాళ్ళు .చివరికి అందరు మానవుని ప్రమాదానికి నవ్వారు ..అకస్మాత్తుగా జరిగిన మంచి కాని  చెడుకాని నవ్వుకు కారణం అవుతు౦ది .

ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ నిఘంటువులో ‘’లాఫ్టర్ ‘’కు 36రకాల స్పెల్లింగ్ లున్నాయి .కింగ్ ఆర్ధర్ 8 9 7 ,చాసర్ 13 8 5 రకాలుగా చూపారు.షేక్స్పియర్ కు ‘’లాఫ్ఫే ‘’బాగా నచ్చినమాట .ఇది వార్విక్ షైర్ ఉచ్చారణ .పబ్లిక్ హాస్యం లో రెండు విషయాలున్నాయని మాక్స్ బీర్బోం అన్నాడు .అందులో ఒకటి ఇతర దేశీయులను లేక కొత్తవారు కనిపిస్తే చూసి నవ్వటంఅవతల వాడు బాధలో ఉంటె వికృతంగా కనిపిస్తే నవ్వటం .విశ్లేషిస్తే హాస్యం జోక్ కాదు .కలహారి ఎడారిలోని ఆదిమ బుష్ మెన్ లు  నవ్వు పుట్టించారని ఆర్ధర్ కోస్ట్లర్ అన్నాడు. ఆయన ‘’నవ్వు విలాసవంతమైన అసంకల్పిత ప్రతిక్రియ ‘’అన్నాడు .’’ఇన్ లాఫ్టర్ ‘’రాసిన ఫ్రెంచ్ జ్యూయిష్ ఫిలాసఫర్ హెన్రి బెర్గ్ సన్’’మన పొరుగువాడి తప్పులు సరిచేయటానికి నవ్వుతాం .దీనినే ‘’the collective punishment of society on the un sociable individual ‘’అన్నాడు .జీన్ పాల్ సాత్రే తనకు చూపు తక్కువ కావట వికారంగా చదువు ఆటలలో ముందు ఉండలేక పోవటం తో అందరూ తనను చూసి నవ్వకుండా అందర్నీ తానే నవ్వుల్లో ముంచి మంచి చేసుకోనేవాడినని చెప్పాడు .’’laughter is a respiratory gymnastics ‘’అన్నాడు స్పెన్సర్ .కోస్ట్లర్ ‘’it is trigger releasing ,detonating vast amounts of stored emotions ,derived from various often un conscious sources

  కొందరు మహానుభావులు ఎదుటివారు నవ్వితే భరించలేరు సాహిన్చాలేరుకూడా . .శ్లేష హోమర్ కంటే పూర్వమే ఉన్నా కారల్ మార్క్స్ దాన్ని ‘’ఇంటలేక్త్యువల్ లంపెన్ ప్రోలటేరియట్ ‘’అన్నాడు .ఎంగెల్స్ నవ్వుతుంటే సహిన్చేవాడుకాడు . మిల్టన్ హాస్య  కవి కాకపోయినా సందర్భాను సారం ‘’పన్ బన్’’ బాగానే తయారు చేసేవాడు .ఇక ఫ్రాయిడ్ మహాశయుడు పన్ కు ఫుల్ స్టాప్  పెట్తమని క్రిస్మస్ సీజన్ ను ‘’ది ఆల్క హాలిడేస్ ‘’అన్నాడు .జీవిత మాధుర్యానికి పన్ త్రిపాద స్టాండ్ లో ఒకపాదం అయితే మిగిలినవి పొగ తాగటం జిమ్ తాగటం అన్నాడు   లాంబ్. మాక్స్ ఈస్ట్ మాన్ ‘’అది పన్ కాదు అది ప్యునిటివ్ ఎక్క్స్పేడి షన్ -అంటే దండించే సాహస యాత్ర ‘’అన్నాడు .కొందరు దేన్నీ చూసినా నవ్వలేరు .విలియం హొగార్హ ,,హోరేస్ వాల్ పోల్ నవ్వులు పూయించారు ..లార్డ్ చాటన్ ‘’పెద్దమనుషుల నవ్వు కు అనుమతి లేదు నవ్వు కింది తరగతి వాళ్ళ పని  ‘’అని తేల్చాడు .ప్రైడ్ అండ్ ప్రిజుడిస్  సెన్స్ అండ్ సేన్సిబిలిటిరచనలలో జేన్ ఆస్టిన్ ‘’మనిషి నవ్వే తీరును బట్టి అతడు మర్యాద సొసైటీకి తగినవాడా లేక ఆమె నిజంగా స్త్రీయేనా తేల్చి చెప్పవచ్చు అంటుంది .

 యార్క్ షైర్ లో లాగానే జెర్మని లో కూడా ఒక స్థాయి లేక రాంక్ ఉన్నవారికి నవ్వే అవకాశం లేదు మహాకవి గోదే నవ్వగా ఎవరూ చూడలేదట . అక్కడ స్త్రీలు నవ్వితే మగాళ్ళు పళ్ళు బిగ బెట్టుకొని స్టిఫ్ గా కూచోవాలట 19  వ శతాబ్ది ప్రష్యన్ స్త్రాట జిస్ట్  ఫీల్డ్ మార్షల్ హేల్మత్ జీవితం లో రెండే రెండు సార్లు ఇకిలించాడట .మొదటిసారిగా ఒక ఫ్రెంచ్ కోట ఆక్రమించటం దుర్భేద్యం అని  చెప్పినప్పుడు రెండోసారి అత్తగారు చనిపోయిందని వార్త చెప్పినప్పుడు నవ్వాడట .ఇంతకంటే మరో ఘన పదార్ధం సారీ ఘనుడు 12 వ శతాబ్దానికి చెందినా ఫిలాసఫర్ మార్టిన్ హీ డిగ్గర్ జీవితం లో ఒకే ఒక్కసారి నవ్వాడట .ఒకసారి మొదటి ప్రపంచ యుద్దానికి ముందు ‘’డెత్ హెడ్ ‘’కు ఆఫీసర్ అయిన హస్సార్స్ కెప్టెన్ రాంక్ కన్నా కిందివారిని సమావేశపరచి ‘’కుర్ర ఆఫీసర్లూ  మీరు పదే పడదే పగలబడి నవ్వటం నాకస్సలు ఇష్టం లేదు .ఇకిలి౦పు లు సకిలింపులు నాకు నచ్చవు .కావల్రి ఆఫీసర్లు అందరూ ఒకే విధంగా ‘’హా హా ‘’అని మూడు సార్లు మాత్రమే నవ్వాలి అంతకంటే నవ్వితే ఊర్కోను  దీన్ని బాగా ప్రాక్టీస్ చెయ్యండి ‘’అని బెదిరించాదట .బయటికొచ్చి బహుశా అంతా పగలబడి హహ్హహ్హా అని నవ్వుకొన్నారేమో ?స్టీఫెన్ స్పెండర్ రచయిత’’జర్మన్ జోకులన్నీ స్పాంటేనియస్ గా వచ్చినవే ‘’అని రాశాడు .

 అకస్మాత్తుగా వచ్చిన నవ్వు చాలమంచిది ఆరోగ్యకరమైనది ,ఆహ్వానించదగినది ..గ్రీకు సిటి స్టేట్ లన్నీ ‘’హిత్తీస్’’నుంచి హాస్యాన్ని సరఫరా చేసుకున్నాయి .వారి క్లౌన్లు ,టంబ్లర్లు ,ఆక్రోబాట్స్ రంగస్థలంపై హాస్యం కురిపించారు .డార్క్ ఏజ్ నుంచి క్రిస్టియన్ యూరప్ ఆవిర్భవించింది .ఆంగ్లో సాక్సన్ రాజులకోలువులో కోర్ట్ జస్టర్ర్ లు విదూషకులు ఉండేవారు .ఇంగ్లాండ్ లో ట్యూడర్ రాజ్యపాలన14 8 5 నుంచి 15 47వరకు వృత్తిపరమైన వినోదం వచ్చింది. అది ‘’ఆఫీస్ ఆఫ్ దిరేవేల్స్ ‘’వద్ద ఉండేది .7 వ హెన్రి రాజు చాలాకాలం ప్రవాసం లో ఉండిబాస్వర్త్ లో జరిపిన తీవ్ర యుద్ధం లో గెలిచి సింహాసనం దక్కించుకున్నాడు .ఈయన నవ్వేకాదు చిరునవ్వుకూడా చిలికించిన పాపాన్ని ఎవరూ చూడలేదట .దేశ ఆర్ధిక స్థితిని పటిష్టం చేయటం పైనే ద్రుష్టి పెట్టాడట .రాయల్ అకౌంట్స్ స్వయం గా చూసి ప్రతిపేజీ మీదా సంతకం చేసేవాడట ..కాని వినోదం అవసరమని గ్రహించి 14 90 లో రావేల్స్ ఆఫీస్ ఏర్పరచి రాజాస్థానం లో వినోదానికి అవకాశం కల్పించాడు .దీని పర్మినెంట్ ఆఫీసర్ గా రిచార్డ్ గిబ్సన్ అనే నటుడు ,ప్రొడ్యూసర్ మేనేజర్ ఉండేవాడు .అతని గ్రూప్ ను’’ కింగ్ ప్లేయర్స్ ‘’అనే వారు .ఇతనే హెన్రి 8 కి మొదటి చార్లెస్ కు శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించాడు .15 20 లో జరిగిన ఈ సంఘటనను ‘’ఫీల్డ్ ఆఫ్ దిక్లాత్ ఆఫ్ గోల్డ్ ‘’గా పిలువబడింది మహా ఆడంబరం గా మందుగుండు సామగ్రి తాగినంత తిన్ననత పదార్ధాలు వినోదాలు ,ఒక ఫౌంటెన్ నుంచి వైన్ నిరంతర ధారగా కారేట్లు చేశారు గిల్బర్ట్ జీవితం లో ఒకసారైనా నవ్వటం ఎవరూ చూడలేదని అంటారు కాని అందర్నీ నవ్వించటం అతని నేర్పు .

 షేక్స్పియర్ చాలా జోకులు నవ్వులు పండించాడు .అతని నవ్వు ‘’హా హా హో హో హో ఓహ్ లా ‘’రకం .జాన్ లిస్టన్ త్ట్రాజేడి నటుడు గిట్టక కామెడికి మారి ఎక్కువ డబ్బు సంపాదించాడు .విలియం డాడ్ గొప్ప హాస్యనటుడు ..హిట్లర్ ఆర్కిటెక్చర్ పై అందరికంటే ఎక్కువ ద్దృష్టిపెట్టాడు .కలలో కూడా నవ్వి ఉండడు .కల్లోల పరిస్తుతులనుంచి హాస్యం పుడుతుంది.డికెన్స్  నోయెల్ కవార్డ్ చార్లీ చాప్లిన్ లాత్రేస్ ,షా , చేష్టర్తాన్, వుడ్ హౌస్ మొదలైన వారంతా పుష్కలం గా హాస్యం పండించినవారే .జేమ్స్ దర్బార్  హాస్యం ఉడికిస్తే బెంజమిన్ ఫ్రాన్క్లిన్ అమెరికా హాస్యం సృష్టించి పూయించి పండించి ఫలి౦ప జేశాడు .అతని  ఆల్మ నాక్  లో ఎన్నో ఒకే వాక్య హాస్యగులికలున్నాయి .నేటివ్ హాస్యానికి ఆద్యుడు ఫ్రాన్క్లిన్ .  డికెన్స్ పాత్ర మిసె గామ్ప్ ‘’what a blessed thing it is -living in a wale -to be contented ‘’అంటే కొరడా దెబ్బల మధ్య సంతృప్తి పడటం .ఇలా విదేశే హాస్యం ఈజిప్ట్ లో ప్రారంభమై అన్ని చోట్లా ప్రవహించి ముంచి తేల్చింది .

       ఇన్‌లైన్ చిత్రం 1

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-17- కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ?

ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ?

‘’ట్రాయ్ పట్టణాన్ని వశపరచుకోవటానికి గ్రీకులు పదేళ్ళపాటు యుద్ధం చేసినా, దక్కించుకోలేక పోయారు .అందుకని ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు ఒక ట్రిక్ పన్నారు .ఊహించలేనంత అతిపెద్ద కొయ్య గుర్రం అంటే ట్రోజన్ హార్స్ ను చక్రాలున్న బల్లపై ఎపియస్ అనే వాడితో మూడు రోజుల్లో నిర్మాణం చేయించి అందులో ముఖ్యులైన గ్రీకు సైనికులను దాచి ,ఓడిస్ససా అనే వాడిని ఒక్కడినే బయట ఉంచి ,తామంతా ఓడలలో బయల్దేరి గ్రీసుకు వెళ్ళినట్లు నటించారు . ఓడిస్సియాస్ ఆ గుర్రం ట్రాయ్ కు కానుకగా వదిలి వెళ్ళారని అందరికి చెప్పాడు  . గుర్రం బయట వైపున ‘’గ్రీకులు ఇంటికి తిరిగి వెడుతున్న సందర్భంగా ఎతీనా దేవతకు  కు కానుక ‘’అని రాయి౦చారుకూడా .గ్రీకులు తమ గుడారాలను అన్నిటినీ తగలబెట్టి టేనేడాస్ కు బయల్దేరారు . సినాన్ అనే వాడిని వేగుగా ఉంచి కొయ్య గుర్రం లోని సైనికులు బయటపడగానే సిగ్నల్  లైట్ వెలిగించమని చెప్పారు .వాడు దొంగ ఏడుపులు ఏడుస్తూ తనను ఒక్కడినే వదిలేసి గ్రీకులు పారిపోయారు అని  కొయ్యగుర్రం గ్రీకు దేవతః ఎతీనాకు కానుకగా వదిలి వెళ్ళారని కల్లబొల్లి మాటలు చెప్పి నమ్మించాడు ట్రోజన్లను . . ఇది కపటం మాయోపాయం అని ట్రోజన్ ప్రీస్ట్ ‘’లోకూన్ ‘’నెత్తీ నోరు పెట్టుకొని వారించాడు మూర్ఖంగా తట్రోజన్లు కేరింతలతో గుర్రాన్ని సిటీలోకి లాక్కు వెళ్ళారు .ఎఖీయన్ లలో 32మంది వీరాధివీరులు గురం కడుపులో ,నోటిలో ఇద్దరు గూడచారులుదాక్కుని ఉన్నారు .ముఖ్యులలో ఓడిస్సియాస్ నాయకుడు అకామాస్ ,ఆగా పెనార్  తయారుచేసిన ఈములాస్ మొదలైన వారున్నారు .ఆ రోజు అర్ధ రాత్రి కొయ్య గురం లో దాక్కున్న వారనతా బయటకు వచ్చి నగరం గేట్లు తెరిచి వెళ్ళిపోతున్న గ్రీకు సైనికులకు బీకన్ లైట్ ద్వారా వర్తమానం పంపారు . సిగ్నల్ అందుకున్న సైనికులు  వెంటనే వెనక్కి తిరిగి ట్రాయ్ నగరం ప్రవేశించి భీకర యుద్ధం చేసి ట్రాయ్ నగరాన్ని సమూలంగా నాశనం చేసి పదేళ్ళ యుద్ధానికి స్వస్తి పలికారు ‘’అని మనం గ్రీకు కవి హోమర్ రాసిన ఒడిస్సే  వర్జిల్ రాసిన ‘’ఎనీడ్’’ఆతర్వాతకాలం లో అగస్తస్ రాసిన ‘’లాటిన్ ఎపిక్ పోయెమ్స్ ‘’లో చదివాం .

   ఆతర్వాత చరిత్రకారులు ,పరిశోధకులు అసలు ట్రాయ్ నగరం ఉందా ,ఎక్కడ ఉంది ట్రోజన్ వార్ జరిగిందా ట్రోజన్ హార్స్ ఉన్నదా అనే విషయాలపై విస్తృత పరిశోధనలు చేశారు త్రవ్వకాలు కూడా చాలా లోతుగా చేశారు .ఇందులో అనేకుల పాత్ర ఉన్నది . వాటి సారాంశాన్ని మాత్రమే తెలుసుకొందాం ..అనేక మంది పరిశోధకులు ట్రోజన్ హార్స్ నిజంగా యుద్ధ పరికరమేనని లేక యుద్ధానికి పనికి వచ్చే ఒక యంత్రం అయి ఉండాలని ఖచ్చితంగా అభిప్రాయ పడ్డారు .కాని జర్మన్ విద్యావేత్త ఫ్రిట్జ్ స్క్రాచర్ మేయర్ ‘’ట్రోజన్ హార్స్ ఒక యుద్ధ యంత్రం కాదు .అది హోమర్ మొదలైన కవులు భూకంపానికి ప్రతీకగా చేసిన కల్పన.ప్రోసిడాన్అనే గ్రీకు దేవత భూకంప దేవత .ఆ దేవతను గ్రీకులు గుర్రం ఆకారంగా చిత్రిస్తారు భావిస్తారు ..ఎలాగంటే ఎతీనా దేవతను గుడ్లగూబగా భావించినట్లు పోసిదాన్ దేవతను రధం మీద ఊరేగిస్తుంటే ,సముద్రకెరటాల ఘోష తోపాటు భీకర భయంకర భూకంప శబ్దాలు ఏర్పడుతాయని గ్రీకుల ప్రబల విశ్వాసం .కనుక హోమర్ కవి పోసిదాన్ దేవత భూకంపాన్ని సృష్టించి ట్రాయ్ పట్టణం గోడలను సరి చేయించి ఉండవచ్చు . .దీనినే మెటాఫరికల్ గా హోమర్ ట్రోజన్ హార్స్ అని కల్పన చేశాడు .ఇది నా ఊహ ,సలహా మాత్రమే.దీనిపై నిగ్గు తేల్చాల్సింది భవిష్యత్ కాలమే ‘’అని రాశాడు .

 ట్రోజన్ వార్స్ ఎన్ని జరిగాయి అనేది కూడా చర్చనీయాంశమే .కనీసం నాలుగు  జరిగాయి .క్రీ పూ 15 వ  శతాబ్దం  లో అస్సువా రెబిలియన్  దానితర్వాత  13 బిసి లో విలూసా రాజు  వాల్ము ను పదవి నుంచి తొలగించటం  జరిగిన యుద్ధాలు ,ఆర్కియాలజీ వాళ్ళ లెక్కప్రకారం ట్రాయ్ లేక హిసారిక్ రెండు సార్లు పూర్తిగా 13౦౦ -1000వరకు యుద్ధాలలో ధ్వంసమైంది .అయితే ఇవన్నీ ఖచ్చితంగా చెప్పబడనివే ..ఇంకా వీటిపై త్రవ్వకాలు పరిశోధనలు జరిపి నిగ్గు తేల్చాలి  అంటున్నారు .

 అసలు ట్రాయ్ అనేది ఒకే ఒక పట్టణం కాదు .ఒకదానిపై ఒకటి ఉన్న మొత్తం 8 పట్టణాలు .మన పాత ఢిల్లీ లాగా .అట్టడుగు ట్రాయ్ దాకా ఇంకా త్రవ్వకాలు జరగలేదు ఇప్పటివరకు .

హిత్తీ ప్రిన్స్  హెలెన్ కోసమే పదేళ్ళు ట్రోజన్ యుద్ధాలు జరిగాయి అన్నది సత్యం కాదు అంతర్ సంఘర్షణలు భూకంపాలు వలన కూడా ట్రాయ్ ధ్వంసమైంది .ట్రాయ్ మైసీనియన్ సామ్రాజ్యం ,హిత్తీ సామ్రాజ్యంలకు అంచున ఉండటం వలన వాటి మధ్య నిరంతర పోరాటాలు ట్రాయ్ వశపరచుకోవటానికి జరిగాయి .రెండు వృషభాల  పోరాటం లో మధ్య నలిగిన తోడేలు లేక జిన్కలాగా ఈ రెండు సామ్రాజ్యాల యుద్ధం లో ట్రోజన్లు నలిగి శలభాలై పోయారుపాపం

20 02ఫిబ్రవరిలో జార్జి వాషింగ్టన్ యూని వర్సిటిలో డైరెక్టర్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్ అండ్ సివిలిజేషన్స్ మరియు ఆర్మగార్డెన్త్రవ్వకాల కో డైరెక్టర్ ఎరిక్ హెచ్ క్లినే ఆధ్వర్యంలో రోజుకు ఎనిమిది వందలమంది హాజరైన  అరవైకి పైగా జర్నలిస్ట్ లున్న సదస్సులో పూర్వం ట్రాయ్ పరిసరాల్లో త్రవ్వకాలు చేసిన కోర్ఫ్ మాన్  అండ్ కోల్బ్ లు ట్రాయ్ గురించి చెప్పినది అంతా యదార్ధమే నని అంగీకరించారు .బ్రాంజ్ ఏజ్ లో ట్రాయ్ ద్వంసమై౦ది అన్నది సారాంశం .ఇంతకీ కోర్ఫమాన్ యేమని ఉవాచ ?

‘’ట్రాయ్ 6 హెచ్ కు 7 ఏ కు మధ్య సాంస్కృతిక విచ్చిన్నం జరగలేదు అది అలా నిలబడి ఉంది 7 ఏ ట్రాయ్  ఒక శతాబ్దం పాటు సురక్షితంగా ఉన్నది .ట్రాయ్ 7 ఏ13 ౦౦ బి సి లో  ప్రారంభమై 11 8 0 బి సి దాకా వర్ధిల్లింది .తర్వాత తీవ్ర యుద్ధం లో ధ్వంసమైంది .ట్రాయ్ 7 ఏ లోని కింది సిటి యుద్ధం, అగ్నిప్రమాదాలలో నాశనమైంది త్రవ్వకాలలో కాలిన శవాలు తూటాలు అస్తిపంజరాలు ఉన్నాయి .ట్రాయ్ 7 ఏ లోని కోర్ట్ యార్డ్ హౌస్ ట్రాయ్ 6 హెచ్ నుంచి వచ్చిందే .ఇది ఇప్పుడుపూర్తిగా తగలబడి నాశనమైంది 6 హెచ్ ట్రాయ్ భూకంపం వలన నాశనమైంది త్రవ్వకాలలో 16 ఏళ్ళ అమ్మాయి సగం కాలి  శిదిలాలమధ్య కూరుకు పోయి ఉంది .ట్రాయ్ ను ద్వంస౦  కాకుండా పోరాటం జరిగినట్లు ఆనవాల్లున్నాయి కాని విధివశాత్తు ఓడిపోయారు .

 కాని అడుగు సిటీ ఎలా నాశానమైనదో  తెలియటం లేదు .మైసీనియన్లు వాడిన కంచు బల్లెం మొనలు కనిపించాయి .వీటిని ‘’సీపీపుల్ ‘’కూడా వాడి ఉండవచ్చు ..11 8 ౦ బిసి లో ఇది పూర్తిగా ధ్వంసం అయింది .ఇది సీపీపుల్ వారి రెండవ దాడి కావచ్చు లేక మైసీనియన్ రాజు మూడవ రామ్సే కాలం లో కానూ వచ్చు ‘’అని కోర్ఫ్ మాన్ రాశాడు . కనుక మనం కూడా ఈ త్రవ్వకాలలోంచి బయట పడి ఊపిరి పీల్చుకుందాం .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

ఇన్‌లైన్ చిత్రం 3

   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్  -20-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -౩ 111- రవీంద్రుని భావ ప్రచారకుడు -కే టి.పాండురంగి (1918)

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -౩

111- రవీంద్రుని భావ ప్రచారకుడు -కే టి.పాండురంగి (1918)

పాండురంగి 1918లో ఫిబ్రవరి 1న జన్మించి వేదా౦తవిద్వాన్ అయ్యాడు .మీమామ్సశిరోమణి , సంస్కృతం లో ఏం ఏ సాధించాడు ..మహామహోపాధ్యాయ కుప్పుస్వామి శాస్త్రి గారి శిష్యుడు .దార్వార్ శంకరాచార్య పాఠశాల ,పూనా శ౦కరేశ్వర మఠ్ లో  మైసూర్ మహారాజాకాలేజి ,అన్నామలై ,బెనారస్ హిందూ యూని వర్సిటీలలో చదివాడు .కర్నాటకకాలేజి  దార్వార  కోలారు ప్రభుత్వ  కాలేజీలలో పని చేసి  బెంగుళూర్  యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాడు .’’విశ్వ మంగళ’’కలం పేరుతొ సంస్కృత రచనలు చేశాడు .దర్శన రత్న ,మీమాంస విభూషణ ,శాస్త్ర నిధి ,పండిత రత్న విద్యామాన్య ప్రశస్తి ,బిరుదులతోపాటు ఉత్తరప్రదేశ్ సంస్కృత సంస్థాన్ నుంచి విశిష్ట పురస్కారం ,తిరుపతి సంస్కృత విద్యా సంస్థాన్ నుంచి  రాష్ట్రపతి నుంచి ప్రతిభా పురస్కారాలు అందుకున్నాడు .

     తన సంస్కృత రేడియోనాటికలను  ‘’నభోవాణి రూపకాని’’గా తెచ్చాడు .రవీంద్రుని నాటికలను సంస్కృతీకరించి ‘’రవీంద్ర రూపకాని ‘’గా వెలువరించాడు .సంస్కృత పత్రికాని ఇతిహాసః ,చంద్రం గతోమానవః ,భారత భాగ్య చక్రం రాశాడు కన్నడం లో కూడా మంచి రచనలే చేశాడు తన రచనలన్నిటిలో ఉపనిషద్ భావాలను ప్రకాశి౦ప జేయటం  పాండురంగి ప్రత్యేకత .రవీంద్ర సందేశాన్ని ఆయన నాలుగు నాటికలు సన్యాసి మాలిని నృప మహిషాచ ,,

కర్నా -కుంతీ చ గా సంస్క్రుతానువాదం  చేసి వ్యాప్తి చేశాడు రంగి . .కుమార సంభవం 5 వ కాండ ను ‘’తపః ఫలః రెడియోనాటి కగా తీర్చిదిద్దాడు .సీతాత్యాగః ఏకాంకిక మూడు దృశ్యాలతో సీత పరిత్యాగ కదగ, తన 35కవితలను ‘’కావ్యాన్జలి’’గా తెచ్చాడు .ప్రాచీన ఆధునిక సంస్కృత సాహిత్య వారధి  పాండురంగి .ఆయనలో శాస్త్రీయ భావన  కవితా వేశం పుష్కలంగా ఉన్నాయి . ,

ఇన్‌లైన్ చిత్రం 1

112-స్తోత్రాల -బాలగణపతి భట్ట(1919)

  బాలగణపతి భట్ట 1919 జ్జనవరి6న శృంగేరిలో పుట్టి ,సాహిత్య విద్వాన్ కన్నడ పండిట్ రాస్త్రభాషా విశారద డిగ్రీలు పొందాడు ..చామరాజ కాలేజి లో బోధించాడు .లెక్కలేనన్ని భక్తీ రచనలు సంస్కృతం లో చేశాడు .ఇందులో గణపతి సుప్రభాతం ప్రసిద్ధి చెందింది .-

‘’దశభుజ యుత దేవం సింహవాహం క్రుతే త్వం -భజతి శిఖి సువాహనం సిద్ధిదం బాహు సత్జ్యం-యుగ కర సహితం త్వం రక్షకాయం  గజాస్యం -యుగయుగం అఖిలో వై హస్తయుగ్మం సితాంగం’’

భావం -కృతయుగం లో జనం నిన్ను 10 భుజాలవానిగా  సింహవాహనునిగా ,త్రేతాయుగం లో ఆరు చేతులు నెమలివాహన౦ ఉన్నవాడిగా ,,ద్వాపరంలో నాలుగుబుజాలు ఏనుగు ముఖం తో ఉన్న నిన్ను పూజించారు .కలియుగం లో ద్విభుజునిగా శ్వేత వర్ణం గలవానినిగా నిన్ను అర్చిస్తున్నారు .

శ్రీ సత్యనారాయణ సుప్రభాతం శ్రీ గంగా ధర సుప్రభాతంకూడా రాశాడు బాలభట్టు -గజారిహరి నాగ జాతిహారి -గజాస్య మోదో.నగజాస్తామదః

ఇన్‌లైన్ చిత్రం 2

113-ఏం జి .నంజు౦డారాధ్య (19 19 )

19 19 ఆగస్ట్ 1 న పుట్టిన నంజుండా రాధ్యతలిదండ్రులు వీరమ్మ గంగాధరయ్య .సిద్ధనగ్ర  బెంగళూర్ జయచామరాజ కాలేజీలలో సంస్కృతం నేర్చి సాహిత్యం లోనూ శక్తి విశిష్టాద్వైతం లోను మాస్టర్ డిగ్రీలు పొందాడు .కన్నడ హిందీ డిగ్రీలు సాధించాడు .సంస్కృతం లో ‘’మేదర చన్నయ్య ‘’నాటకం తో భక్తిగీతాలు చాలా రాశాడు .వీటిని సుప్రభాతాలు స్తోత్రాలుగా పేర్లు పెట్టాడు ..శ్రీకర భాష్యం రెండుభాగాలుగా రాశాడు .ముండక ,కైవల్య ఉపనిషత్తులను సదాశివ భాష్యం రేణుకా గీత భాష్యం లుగా వీర శైవ ప్రయోగ మంత్రం ,శ్రీకరభాష్య౦  చతుశ్లోకీ మొదలైనవి ప్రచురించాడు .మైసూర్ మహారాజా  ఆస్థాన విద్వాంసుని చేసి గౌరవించగా ,,కర్నాటక రాష్ట్రం అవార్డ్ ను ,ఇవ్వగా సాహిత్య రత్న ,శివ  తత్వ చింతామణి  శివాద్వైత భూషణ ,విద్యావారిది బిరుదులూ తన విద్వత్తుకుకు తగినవి గా పొందాడు .సంస్కృత కన్నడ సాహిత్యాలకు తన రచనా పతిభ వలన నంజుండా రాధ్య పరిపుష్టి కలిగించాడు .

114-దేవీ విలాస ఖండకావ్య కవి -కే.ఎస్.భాస్కర భట్ట -(19 20)

1920 లో కర్నాటకసాగర్ తాలూకా భీమన కొనే గ్రామం లో భాస్కర భట్ట జన్మించాడు .అలంకార శాస్త్రం లో విద్వాన్ ,కన్నడం లో పండిట్ అయ్యాడు .చాలా స్కూళ్ళలో పనిచేసి రెండూ బోధించాడు .అయోధ్య సంస్కృత పరిషత్ సాహిత్య భూషణ ,ఇస్తే లింగరాజు సంస్థ ప్రైజ్ మైసూర్ మహారాజు దేవీ విలాస ఖండకావ్యానికి ప్రదానం చేశాడు .దీనితోపాటు గురు క్రుపాతరంగిణి రాశాడు .రామచంద్ర మఠంలోని శ్రీరాముని వర్ణిస్తూ

‘’యన్నామ సంకీర్తన రసప్లవ చిత్త వృత్తీ -నిష్కల్మషః కులపథిహ్ ప్రధమః కవీనాం

రామాయణం నవవరాంబునిదిం వ్యతాన్తీ-తం రామ చంద్ర మనీషంప్రణమామి . శాంతరసానికి ప్రాధాన్యత నిచ్చాడు .అవసరమైన చోట్ల మంచి శుభాషితాలను కూర్చాడు

‘’కర్మాణి స్వతహా ప్రవృత్తిం  అపూర్వ న్త్యకా మానవాః -వీత రాగిణా పరార్ధ సాధకా హిసర్వవదా

వేదాంత భావన అపూర్వ పద సమ్మేళనం తో పరవశం కలిగించేశ్లోకాం –

‘’కేవలం నిరంజనం నిరాకారం నిరీహికం -జన్మ మృత్యు నాశకం భావార్నస్య తారకం -నిత్య శుద్ధ బుద్ధ ముక్తం అనుభావికం పరం -తత్ పదం నిజ స్వరూపం ఆపనుయాం అహం కదం ?కవిపై వాల్మికి కాళిదాస జయదేవుల ప్రభావం ఉన్నది .

115- లజపతి తరంగిణి కర్త -హరిశ్చంద్ర రేన పుర్కార్ (1924)

1924లో మహారాష్ట్రలో రేనాపూర్ గ్రామం లో 19 24 సెప్టెంబర్ 17 న హరిశ్చంద్ర రేన పుర్కార్ జన్మించాడు .సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ పొంది కర్నాటక, ఆంధ్రా కాలేజీలలో బోధింఛి ప్రస్తుతం గుల్బర్గా లో ఉంటున్నాడు .ఎన్నో సంస్క్రుతపత్రికలలో రచనలు చేసి పేరు పొందాడు .ప్రస్తుతం సంఘ విలువలు దిగజారి పోతున్నందుకు వ్యధ చెందాడు .జాతీయ నాయకులైన దయానంద గాంధి నెహ్రు సత్వలేకర్ ఇందిరా గాంధీ మొదలైనవారిపై కవితలల్లాడు .భారతీయ స్వాతంత్ర సమరం పై లజపతి తరంగిణి అనే 89శ్లోకాల కావ్యం  రాశాడు . . .శాస్త్రి శ్లోక లహరి, ఇందిరా  హౌతమ్యం కూడా రాశాడు ..దేశం లోని దారుణ కరువుపై ‘’భీషణం దుర్భిక్షం . ‘’కవిత రాశాడు .సమకాలీన విషయాలపై పుంఖాను పుంఖంగా పారిజాతం సంస్కృత భవితవ్యం మొదలైన మేగజైన్ లలో కవితలు రాశాడు

ఇన్‌లైన్ చిత్రం 3

.116-కావ్య తరంగిణి -కర్త -సి జి పురుషోత్తం (19 25)

పురుషోత్తం 19 25లో జన్మించి ,చుంచున కట్టే గురుకులం లో చంద్ర శేఖర భట్ట ,రంగా చార్ లవద్ద సంస్కృతం నేర్చి సంస్కృతం చరిత్రలలో ఏం ఏ అయ్యాడు .మైసూర్ మహారాజా కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .రెండుభాగాలుగా కావ్య తరంగిణి ,ఆది చుంచు గిరి సుప్రభాతం ,సర్వజన వచనాని రాశాడు .కన్నడ మహాకవి ‘’కువెంపు ‘’కవితలతో పాటు అనేక కన్నడ హిందీ  కవితలను సంస్కృతం లోకి అనువదించి కావ్య తరంగిణి రాశాడు .నాలుగవ భాగం లో తన స్వంత కవితలను రాశాడు .ఆది చుంచు సుప్రభాతం లో 27శ్లోకాలున్నాయి .ఇవి 27 నక్షత్రాలకు ప్రతీక. తారావళి అనచ్చు .కర్నాటక స్టేట్ అవార్డ్ ,చుంచుగిరి మఠపురస్కారం పొందాడు .కువెంపు కవి కన్నడ నాటకాలను కూడా గీర్వాణ౦ లోకి అనువదించి సంస్కృత సేవ చేశాడు .

ఇన్‌లైన్ చిత్రం 4

117-మదిరా విలాస ప్రహసనకర్త -నారాయణ మధ్యస్థ (19 30)

19 30 జనవరి 10 న లో కేరళలోనీల్చర్లులో  పుట్టిన నారాయణ మధ్యస్త సంస్కృత సాహిత్య శిరోమణి కన్నడ పండిట్ హిందీ రాష్ట్ర భాషా విశారద .సంస్కృతం లో మదిరావిలాస ప్రహసనం ,అఖండ పురాణం ,కాలే వర్షతు పర్జన్య  .అనే మూడు నాటకాలు రాశాడు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత సొలోన్

గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత సొలోన్

 ఎధేన్స్ కవి రాజకీయ వేత్త సోలోన్ క్రీ .పూ 630 లో  సంపన్న  అరిస్టోక్రాటిక్ కుటుంబం లో పుట్టాడు ..తండ్రి ఎక్సేస్ట్నిస్ రాజవంశీకుడు . అతని చిన్నతనం గురించి తెలియదుకాని వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు . సంచార వ్యాపారవేత్త . ఆనాటి సంఘం లో ప్రముఖుడయ్యాడు .ఎధేన్స్ ,మగరా లు యుద్ధ ప్రయత్నాలలో ఎప్పుడూ ఉంటే వారిని కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేసి శాంతి కలిగించాడు .దీనిపై కవిత కూడా చెప్పాడు .. ధనవంతులదే రాజకీయ పెత్తనం అయి సామాన్యులకు స్థానం లేకుండా పోయింది  .రాజకీయ సాంఘిక విద్వేషాలకు చెక్ పెట్టమని సొలాన్ ను కోరారు .. అందరికి సమాన న్యాయం కోసం సంస్కరణలు చేయాల్సిన బాధ్యత సోలోన్ పై పెట్టారు .. యెరొపెయాగస్ అనే సంఘ సభ్యుడు డ్రాకో కు వ్రాత రాజ్యా0గేమ్ తయారు చేయమన్నారు . కానీ ఆత ను రాసింది చాలా కఠినంగా ‘’రక్తం తో రాశాడుకాని సిరా తో కాదు ‘’అని పించింది .అప్పుల ఊబినుంచి గట్టెక్కే ఉపాయం ఏదీ అతడు చెప్పక పోవటం తో అంతా  వ్యతిరేకించారు . పేదలు  అప్పుల్లో కూరుకుపోయి చెల్లించలేని స్థితిలో ఎదురు తిరగాల్సి వచ్చింది .ఈ పరిస్థితులలో బాధ్యత సోలోన్ పై పెట్టాల్సి వచ్చింది . కొద్దిమంది చేతుల్లో అధికారం ఉండరాదని ఆత ను నిర్ణయించాడు .తనకున్న మేధస్సును లౌకికజ్ఞానాన్ని అనుభవాన్ని రంగరించి సంస్కరణలకు ఆద్యుడని పించాడు ..

ప్రభుత్వానికి కానీ ప్రయివేట్ వ్యక్తులకు కానీ  అప్పులు చెల్లించవలసిన వారి అప్పులను ముందుగా రద్దు చేశాడు . దీనినే షేకింగ్ ఆఫ్ బర్డెన్స్ అన్నారు ..డ్రోకో  పెట్టిన కఠిన నిబంధనలను సరళీకృతం చేశాడు పగ ,ప్రతీకారం శిక్షలపేరుతో చంపటాలు దౌర్జన్యాలను చేయిక చట్టాన్ని సంప్రదించాలని హితవు చెప్పాడు ..పాత కొత్త మేలుకలయికతో విధానం రూపొందించాడు ..సంవత్సరాదాయం 500 బుషెల్స్ ఉన్నవారు మొదటి తరగతివారుగా 300 నుంచి 500 వరకు ఆదాయం ఉన్నవారికి గుర్రం కొనే సామర్ధ్యం ఉంటుందికనుక నైట్స్ -హిప్పీపస్ అని ,200 ఆదాయం వారు రైతులు అంతకు తక్కువ వార్షికఆదాయం ఉంటె కూలీలు గా విభజన చేశాడు .దీనివలన అంతకు పూర్వం అతి తక్కువగా కానీ అసలు లేక కానీ అవకాశాలు లేనివారికి మంచి అవకాశాలు వచ్చాయి . పైతరగతివాళ్ళు అరిస్టోక్రాట్స్ గా జనం వలన సంపదవలన అయ్యారు ..ఇప్పటిదాకా వీళ్లదే పెత్తనం దీనినే ‘’’’టీమోక్రసి’’అన్నారు అంటే ధనవంతులపాలన . ఈ సంస్కరణాలప్రకారం కింది తరగతి వారు అంటే పొలం పుట్రా  లేనివాళ్లు కూడా ఓటు హక్కు పొందారు .ప్రభుత్వోద్యాగాలలో నియామకం లో వీరి ఓటుకు ప్రాధాన్యత లభించింది అంతకుపూర్వం సంపన్నులు ఎవరి పేరు చెబితే వారే అధికారులు అయ్యేవారు ..ఈ విధంగా సోలోన్ ప్రజాస్వామ్య సంస్కరణలు చేసి బౌల్ అంటే కౌన్సిల్ ను ఏర్పాటు చేశాడు . ఎధేన్స్ లోని నాలుగు ప్రాచీన తె గల నుండి ఒక్కో తెగకు వందమంది చొప్పున లాటరీ పద్ధతిలో దీనిలో సభ్యుల్ని చేశాడు .దీనికి కిందితరగతి వారి వోటుతోపని లేదు .వీరిపదవీకాలం ఒక ఏడాది .ఈ రాజీ ఫార్ములాకు సోలోన్ ఒక ఆర్చ్ టైప్ గా అంటే మోడల్ గా నిలిచాడు .దీనికి ఉన్నతవర్గాలనుండి వ్యతిరేకత వచ్చింది భూమి పంచిఇవ్వలేదని కిందివర్గాలు రుసరుసలాడాయి .అయినా చక్కగా అందరినీ సమాధాన పరచాడు .తరువాత ఎన్నో ఏళ్ళు మధ్యధరా ప్రాంతమైన సైప్రస్ లిడియా అంటే ఏసియా మైనర్ మొదలైన ప్రదేశాలు తిరిగి వచ్చాడు . ఎధేన్స్ కు తిరిగివచ్చేసరికి  శిరసా కు  టి రంట్  గా పిసిస్ట్రాటస్ కీ పూ 561 కి ప్రకటించుకున్నాడు  వృద్ధాప్యం లోనూ సిలోన్ అతనికి సలహాలిచ్చారు  గ్రీసులో మొదటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనతసోలోన్ కి దక్కింది .అతని ‘’టెన్ ఏజెస్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మాన్ ‘’కవిత షేక్స్పియర్ రాసిన డది  సెవెన్ ఏజెస్ ఆఫ్ మాన్ ‘’తో సమానంగా ఉందనిపిస్తుంది .సోలోన్ కవితను ఆస్వాదిద్దాం –

‘’బాలుడి  బాల్యం లోనే  పాలపండ్లు పెరిగి ఏడేళ్ళకే  ఊడిపోతాయి

వాడికి పద్నా లు  గేళ్లప్పుడు  పరిణతి పొందుతాడు

మూడవ సప్తకం లో అవయవాలు పెరిగి గడ్డం మీసం తయారై శరీరం మగతనాన్ని చూపిస్తుంది

నాలుగవ సప్తకం లో బలం శక్తితో మగసిరి ఉట్టిపడుతుంది

పంచమ సప్తకం లో యువకుడై పెళ్లి , పిల్లలకై తపన వస్తుంది

ఆరవ సప్తకం లో అతని బుద్ధి వికసించి అన్నిటా మంచి శిక్షణ పొంది ఏదీ అసాధ్యం కాదనిపిస్తుంది

ఏడవ  ఎనిమిదవ సప్తకం లో చక్కగా నిర్దుష్టంగా సంభాషించి మెప్పు పొందుతాడు

తొమ్మిదో సప్తకం లో ఇంకా మంచిపనులు చేస్తాడుకాని అతని ఆలోచనలు మాట తగ్గిపోతాయి

పదవ సప్తకం అంటే డెబ్బై ఏళ్లకు చావు సమీపిస్తోందని పిస్తుందికాని అంతత్వరగా రాదు

ఇన్‌లైన్ చిత్రం 1

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-17 – కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 106-ఉన్మత్త కీచకం నాటకం రాసిన -కె .ఎస్ .నాగరాజన్ (1911)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

106-ఉన్మత్త కీచకం నాటకం రాసిన -కె .ఎస్ .నాగరాజన్  (1911)

ఆంద్ర ప్రదేశ్ లో సోఢ0 గ్రామంలో1911 ఏప్రిల్ 11 న నాగాంబికా శేషం అయ్యంగార్ లకు నాగరాజన్  జన్మించాడు .సంస్కృత సాహిత్యం లో కాశ్మీర్ పాత్ర ‘’అనే అంశం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు . రాష్ట్ర అకౌంట్ జనరల్ ఆఫీస్ లో అకౌంటంట్ జెనరల్ గా పనిచేశాడు .ఆధునిక సంస్కృత సాహిత్యాన్ని తన అమోఘ రచనలతో సుసంపన్నం చేశాడు .శ్రీ సీతాభ్యుదయం అనే 16 కాండలకావ్యం రామాయణం ఆధారంగా రాశాడు  శ్రీ శబరీ విలాసం అనే ఖండకావ్యం ,,ఉన్మత్త కీచకం అనే అయిదుఅంకాల నాటకం ,భారత వైభవం అనే దేశభక్తి గీతం ,గాంధీ విజయం అనే అయిదంకాల నాటకం ,లవలీ పరిణయం నాటకం ,6 అంకాల గురుశాపం ,భారత దేశ భక్తలగురించి ‘’భారతీయ దేశ భక్త విజయం ,రాశాడు . కన్నడం లోసాహిత్య విచార ,సుభాషిత మంజరి  భాస్కరాచార్యుని లీలావతి అనువాదం ఃచేశాడు .సుభాషితాలు సుభాషిత వాణిగా  ఇంగిలీషు లోకి అనువదించాడు .సాహిత్యాలంకార ,బిరుదు అయోధ్య సంస్కృత అకాడెమి ,కవిభూషణను శ్రీ ద్వారకా శంకరాచార్య ప్రదానం చేశారు .వ్యాఖ్యాన వాచస్పతి అనేది ఆయన పాండితీ ప్రకర్షకు లభించిన విశేష బిరుదు .

 ఉన్మత్త కీచకం నాటకం -లో కీచకుడు ఉత్తముడు నిజంగానే ద్రౌపదిని ప్రేమిస్తాడు .భీముడు సహించలేక కీచకవద చేస్తాడు .వాడి చావుకు ద్రౌపది కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది .మొదటి అంకం లో కీచక స్తుతి  నాలుగులో విరాట స్తుతి ఉన్నాయి .ఇద్దర్నీ స్తుతిస్తూ చెప్పిన శ్లోకాలు –

‘’జయతు విజయ లక్ష్మీ శీలస్త సర్వాంగ శోభాహ్ -జయతు పశుబలానాం వృద్ధికారా బలి స్టాః – జయతు జయ పతాకాల౦క్రుత స్వీయ మార్గే -జయతు పరబలాంతఃకీచః ఖ్యాత కీర్తిః’’

 జయతు నరవరేణ్యసత్యదామ ప్రతిస్టో-జయతు జన సుఖానాం వ్రుద్ధికర్తా దయాళుః-జయతు గుణగణానాం సన్నిదిర్ దీన బందూ -జయతు చిరమిల్యాం మత్స రాజో విరాటః’’

 ఈనాటకం లో కీచకుడు విషాదాంత నాయకుడు చనిపోయే ముందు కీచకుడు మాట్లాడిన మాటలు హృదయాన్ని తరుక్కు పోయేట్లు చేస్తాయి కన్నీరు తెప్పించి అతనిపై సానుభూతి కలిగిస్తాయి ….

 గురూపదేశం పౌరాణికకద దేవరాజ బహదూర్ ప్రైజ్ పొందింది తనకు ప్రేరణ ఉత్తేజం కలిగించిన కైలాసం కు అంకితమిచ్చాడు నాగరాజన్ ఇందులో హీరో కర్ణుడిని ఉదాత్తంగా చిత్రించాడు  నిమ్న కుల సంజాతుడు అయినందువల్ల అణగాతొక్కబద్దాడని చెప్పాడు భాసుడు చెప్పిన .’’చక్రారాప ణీకీర్తిర్  ఇవ గచ్చతి భాగ్యప౦క్తి ః’’అన్నదాన్ని ‘’భాగ్య పంక్తిర్ఇవ సర్వ నరాణాం చంచలేతి విదితా మనులోకే ‘’ అని చెప్పాడు మనిషికి విలువ గుణం బట్టికాని జన్మ బట్టికాదుఅని బోధిస్తూకవి -గుణతాః పూజ్యతే లోకే మానవో న తు జన్మతః -తదాదీన గుణాః సర్వే జన్మ దైవ వశే భవేత్ ‘’దీనికి స్పూర్తి భవభూతి చెప్పిన .’’గుణాః పూజ స్థానం గుణిషు నచ ణ లింగం న వయః ‘’బాణుని వేణీసంహారం లోని కర్ణుని వచనాలు స్పూర్తిగా తీసుకున్నాడునటరాజన్

 శ్రీ శబరీ విలాసం లో శబ్దార్ధ సౌందర్యంతో కవితాత్మకంగా రాశాడు . గాంధీ మహిమ లో ‘’ఏకో దేవో నేక రామాభిరామః -రామో బుద్దా కృష్ణా అల్లాఇతీహ -నానారిత్యా దృశ్యతే పూజ్యతేచ ‘’అంటూ ఋగ్వేదం లోని ‘’ఏకం విప్రా బహుద వదంతి ‘’నివివరించి చెప్పాడుకవికి సంస్క్రుతంపై వీరాభిమానం .-అందుకే ;;’’ఏతి సంస్కృతం మృతేతి వదంతి తే ఏవ మృతాః’’అని బల్లగుద్ది సంస్కృతం చనిపోయి౦ది అనే వారు నిజమగానే చనిపోయినవాళ్ళు అన్నాడు

‘’జయతు జయతు ధన్యా భారతాంబా పవిత్రా -జయతుజయతు గాంధీ సత్యమార్గాను వర్తీ -జయతు జయతు యుద్ధం  చస్మాద్రియంనవీనం -జయతు జయతు సర్వో భారతీయాః ప్రపంచాః’’అని ఉదాత్తమైన ఉపదేశం చేశాడు సంప్రదాయ పద్ధతిలో సంస్కృతం చదివినవాడుకాకపోయినా ఒక సంస్తా నిర్వాహకుడుగా తీరిక లేకున్నా సంస్కృతం లో సృజనాత్మక రచనలు చేసి విఖ్యాతుదయ్యాడు నాగరాజన్ జాతీయ సమైక్యతా .,సర్వ మానవాభ్యుదయం  ధ్యేయంగా  పౌరాణిక కధలను ఆధునిక విధానం లో వ్యాఖ్యానించాడు .

 ఇన్‌లైన్ చిత్రం 1

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్  -18-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -2 (9-4-17 నుండి 16-4-17 వరకు )

వీక్లీ అమెరికా -2   (9-4-17 నుండి 16-4-17 వరకు )

 

9వ తేదీ సోమవారమ్ వరకు ఒకటవ ఎపిసోడ్ లో రాసేశాను . ఆ సోమవారం సాయంత్రం కేరీ నుంచి డా యల్లాప్రగడ రామ మోహనరావు గారు ఫోన్ చేసి మాట్లాడిన వివరాలూ అందులో రాశాను .ఆ తరవాత మాసా చూసెట్స్ లోని ఆస్టిన్ నుంచి శ్రీ డొక్కా రామ భద్ర ఫోన్ చేశారు .దాదాపు నాలుగేళ్లు అయింది ఆయన ఫోన్ లో మాట్లాడి .  అపర అన్న పూర్ణ నిరతాన్న ప్రదాత శ్రీమతి డొక్కా సీతమ్మగారి ముని మనవాడిగారి అబ్బాయి అంటే ఇని మనవడు ఇక్కడ సాఫ్ట్ వేర్ లో పనిచేస్తున్నారు .ఒకసారి ఇద్దరం ఫ్లాష్ బాక్ కి వెళ్లాం .సుమారు నాలుగేళ్లక్రితం చాగంటి వారి ప్రవచనాలతో డొక్కా సీతమ్మగారి వితరణ గురించి మరోమారు విని సరసభారతి తరఫున విద్యార్థులకు ఆమె జీవితం అన్నదానం పై వ్యాసరచన ఏర్పాటు చేసాం . దీన్ని నెట్ ద్వారా ను మా మిత్రుడు శ్రీ కోసూరి ఆదినారాయణ ద్వారా తెలుసుకున్న రాంగారు నాకు ఫోన్ చేసి అభినందించటం  తాము అమెరికాలో ఆమె పై కార్యక్రమాలు చేస్తున్నామని ,కానీ ఆమె పుట్టిన గడ్డ ఆంధ్రాలో మేము చేయటం సంతోషంగా ఉందని మాకేదైనా ఆర్ధిక సాయం కావాలంటే చేస్తామని చెప్పారు .మాకు ఏ రకమైన సాయం వద్దని ఆమె మీద గౌరవం తో చేస్తున్నామని చెప్పాను ఆయన వదలకుండా అయితే పేద విద్యార్ధులకు సీతమ్మగారి పేరుమీద స్కాలర్షిప్ లు ఇద్దాం డబ్బు పంపిస్తాను అనగానే సరే నని మూడు హై స్కూళ్ళ  హెడ్ మాస్టర్ లకు తెలియజేసి పద వ తరగతి లో బాగా చదువుతూ ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధులపేర్లను నిష్పక్ష పాతం గా విమర్శలకు అతీతంగా తయారు చేసి పంపని చెప్పాం అలాగే ముగ్గురు అమ్మాయిలూ ముగ్గురు అబ్బాయిలు లను సెలక్ట్ చేసి రామ్ గారు పంపిన 10 వేల  రూపాయలు అందరికి సమానంగా ఇవ్వాలని నిర్ణయించి మరో కార్యక్రమం ఏర్పాటు చేసాం .దీనికి రామ్ గారి తలిదండ్రులు శ్రీ డొక్కా సూర్యనారాయణగారు శ్రీమతి లలితకుమారి ?గారు హైదరాబాద్ నుంచి వచ్చారు .ఆరోజంతా జోరన వాన .సాయంత్రం కాస్త తెరిపిచ్చింది మా ఇంటికి ముందు ఆ దంపతులు వచ్చి కాఫీ త్రాగి అందరం శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం చేరాం . శ్రీ గుంట క వేణు గోపాల రెడ్డి తో పానుగంటివారి హాస్యం పై ప్రసం గింపజేసి ఆతర్వాత శ్రీ డొక్కా దంపతుల చేతులమీదుగా విద్యార్థినీ విద్యార్ధులకు ఒక్కొక్కరికి 1667 రూపాయలు సమానంగా అందజేశాము . ఆ దంపతులకు  రామభద్రగారికి సరసభారతిపుస్తకాలు రెండు సెట్లు శ్రీ సువర్చలాన్జనేయస్వామి ఫోటోజ్ఞాపిక ఇచ్చి ఆలయ మర్యాదలతో సత్కరించాం వారిద్దరూ పరమానందం పొంది వారిమాటలలో సభా ముఖంగా వ్యక్తం చేశారు . ఆ తర్వాత ఒక సారి రామ్ గారు ఫోన్ చేశారు అని   జ్ఞాపకం సరసభారతి మెయిల్స్ అన్నీ వారికి పంపేవాడిని ఒక్కోసారి రిప్లై ఇచ్చేవారు .ఆ తర్వాత గాప్ వచ్చింది . ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకం రాసి ప్రచురించినప్పుడు మొదటివ్యాసంగా డొక్కా సీతమ్మగారిదే వేసాం .దీనికి స్పాన్సర్ శ్రీ మైనేని గోపాల కృష్ణగారని వారి శ్రీమతి శ్రీమతి సత్యవతి గారికి అంకితమిచ్చామని దీని ఆవిష్కరణ విజయ వాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారు చేశారని ఆ రోజు ప్రపంచ ప్రముఖ ఈల విద్వావంసులు  శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారు తమ బృందం తో వచ్చి రెండు గంటల సేపు కచేరీ చేసి గాంధర్వ లోకాలకూ తేలించారని ఒక్క సారి జ్ఞాపకానికి వచ్చింది . బహుశా సరసభారతి తప్ప ఆంద్ర దేశం లో ఏ సాహిత్య సంస్ధ సీతమ్మగారిపై ఏ కార్యక్రమం జరపలేదని ఆ అదృష్టం మాకే దక్కిందని చెప్పుకున్నాం .

ఇప్పడు రామభద్ర గారు ఫోన్ చేసి మాట్లాడినదానిలో మన మెయిల్స్ అన్నీ రెగ్యులర్ గా చదువుతున్నామని చెప్పారు వారి తలిదండ్రులు అట్లా0 టలో తమ్ముడు శ్రీ ఫణి గారి దగ్గర ఉంటున్నారని మేనెలలో ఆస్టిన్ వస్తారని అప్పుడు ‘’మా బడి ‘’కార్యక్రమం నిర్వహిస్తామని అట్లా0టా లో తమ్ముడు తెలుగు కార్యక్రమాలు చేస్తూ ఉంటారని చెప్పి మా ప్రోగ్రామ్ సంగతి అడిగారు .ఇంకా ఏమీ ఆలోచించ లేదని కార్తీ కి శ్రీ రామమోహనరావు గారు వచ్చి తీసుకు వెడతామని ఫోన్ చేశారని చెప్పాను ఆస్టిన్ ఆలోచన ఉంటె స్వాగతం అన్నారు అక్కడే మా ఆదినారాయణ గారి అమ్మాయి మా అమ్మాయి పాలిటెక్నీక్ క్లాస్ మేట ఉన్నది .

మైనేనిగారు పంపిన వరద కవనకుతూహలం వరద కాలం చదివేశాను ..దానిపై ‘’వరదలో తేలి (రి )న తేట ఊట రాయటం ప్రారంభించి 7 ఎపిసోడ్లు మహాదాత దహదం ‘’లక్ష్మీనారాయణపై ఒక ఆర్టికల్ రాశాను .   ..మేనల్లుడు శాస్త్రి మంగళవారం కాలిఫోర్నియా నుంచి ఫోన్ చేయి తాము యూరప్ వెళ్లి ముందురోజు రాత్రికే వచ్చామని మా ప్రయాణం లో  పదనిసలు చదివానని చెప్పాడు . బిజెపి అధ్యక్షుడు అమిత్ షా  యెన్ డి  ఏలోని 32 పార్టీల వారిని సంప్రదించి రాష్ట్ర పటి ఉపరాష్ట్ర పతి  పదవికి ప్రధాని మోడీ ప్రకటించేపేరును ఆమోదించేట్లు చేశాడని వార్త చదివాను . అద్దాడలో   శిష్యురాలైన కోడూరి పావనికి ఫోన్ చేసి మాట్లాడా వాళ్ళు ఒక రెండునెలలో ఉన్నచోటి నుండి మారాల్సి రావచ్చునని చెప్పింది పిల్లలతో మాట్లాడించింది చక్కగా తెలుగులో మాట్లాడారు ఆ అమ్మాయి చదువులోనేకాక సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చాలా ముందు ఉండేది మంచిపిల్ల .

 రమణ ఎమ్యెల్సీ రాజేంద్ర తో తిరుపతి వెళ్లానని అక్కడ శివప్రసాద్ గారు కనిపించి మాట్లాడారని చెప్పాడు ఒంటిమిట్ట కూడా చూసి ఇంటికి వచ్చాడు . మా కొడాక్ కెమెరా ను దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో తీసేసుకొని విడిగా పాక్ చేసి  డెస్టి నేషన్ లో కలెక్ట్ చేసుకోమని చెప్పారు అంటే షార్లెట్ అనుకొన్నాను న్యూయార్క్ లోనే తీసుకోవాలిట మా బాగేజ్ తో పాటు కనిపించలేదు 12 ఏళ్ళనుండి వాడుతున్నాం కదా పొతే పోయిందని కున్నా .కానీ ఎమిరేట్స్ వాళ్ళు ఫోన్ చేసి న్యూయార్క్ లో కెమెరాఉంద ని డెమరేజ్ కట్టి తీసుకోమని విజ్జికి ఫోన్ చేస్తే మా వాళ్ళు 15 గంటలు ఎయిర్ పోర్ట్ లో పడిఉన్నారు ఎవరూ వాళ్లకు ఆ సంగతి చెప్పలేదుకనుక మీరే మీ ఖర్చులతో   షార్లెట్ కు పంపమని చెప్పింది సరే అన్నారట .

 గురువారం మధ్యాహ్నం చరణ్ కు ఫోన్ చేసాం ఫస్టియర్ రిజల్ట్స్ వచ్చాయి 60 శాతం మార్కులు వచ్చాయని చెప్పాడు . మనగుడి’’ బడ్డీ బుడ్డి ‘’పెళ్లి కుదిరిందని మే 17 న ధార్మిక భవనం లో పెళ్లి అని రమణ మెసేజ్ పెట్టాడు  చాలామంచి వాడు కార్తీకమాసం లో దీపాలంకరణకు బొమ్మలు వేయటం దీపాలు అలంకరించటం గుడిని జాగ్రత్తగా కాపాడటం లో అత్యంత విశ్వాసంగా ఉంటున్నాడు .వాడితోపా టు సహకరించినవారికి అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి .ఇక మిగిలింది శ్రీదేవి ,ఇంకో అమ్మాయి చంద్ర శేఖరరావు గారి అబ్బాయి ఉన్నారు .స్వామి అనుగ్రహంతో  వాళ్ళ పెళ్లిళ్లు కూడా త్వరలో జరగాలి ..రాత్రి భాను చంద్ర సుమన్ ల ఇంటర్వ్యూలను యు ట్యూబ్ లో చూశాం బాగున్నాయి దాపరికం లేకుండా మాట్లాడారు . గురువారం సాయంత్రం స్పీడ్ పోస్ట్ లో ఎమిరేట్స్ వాళ్ళు పంపిన కొడాక్ కెమెరా నాకు క్షేమంగా చేరింది బుజ్జిముండ ఇప్పటికి ఎన్ని వేల  ఫోటోలు తీసిందో లెక్క లేదు ..ఈ విషయాన్ని మైనేనిగారికి ‘’విడ్డూరం ‘’అని రాస్తే జవాబుగా ‘’విడ్డూరాతి విడ్డూరం ‘’అని రాశారు . .రాత్రి సుడిగాడు సినిమా చూసాం మొదట్లో బానే ఉన్నది .

 సాయంత్రం వేలూరి పవన్ భార్య రాధ వచ్చారు . కెమెరా సంగతి చెబితే అందులోని మెమరికార్డ్ లాక్ అయిందని చెప్పి తీసి పని చేసేట్లు చేశాడు .శతకత్రయం వాళ్లకు ఇచ్చాను .అవధాని గారి శిష్యులు వచ్చి ఆయనవద్ద వేదం నేర్చుకున్నారు రాత్రి విజ్జి స్నేహితురాలు గోసుకోండ వారమ్మాయి వచ్చి పలకరించింది .మళ్ళీ ఒక సారి 70 ఏళ్ళు ఫ్లాష్ బాక్ కు వెళ్లి మాట్లాడుకున్నాం మా చిన్నప్పుడు శ్రీ గోసుకోండ వాసుదేవ శాస్త్రిగారు గురజాడ నుంచి వచ్చి వంగలవారి ఎత్తరుగుల ఇంట్లో ఉన్నారు ఆయన భార్య సావిత్రమ్మగారు మా అమ్మకు గురువు అంటే సలహా సంప్ర దింపులు  వగైరా లకు వాళ్ళబ్బాయి రామ చంద్రుడు ఫాక్టరీలో స్టోర్స్  లో పని .నత్తి ఎక్కువ మాకు కాఫీపొడి పంచదార తెచ్చిపెట్టేవాడు .భార్య రుక్మిణమ్మ మాకు అక్క లాంటిది .  ఆతర్వాత శాస్త్రిగారు భార్య పోవటం ,రుక్మిణమ్మకూతుళ్ళు  నాదగ్గర ట్యూషన్ చదవటం మామామయ్యా అని అత్తయ్యా అని మమ్మల్ని ఇద్దర్నీ పిలవటం వాళ్ళపేర్లు భ్రమరాంబ సావిత్రి కావటం గుర్తు చేసుకున్నాం రుక్మిణమ్మ కు ఊరంతా పరిచయం ఎవరికి ఏసాయం చేయాలన్నా చేసేది /చిట్కా వైద్యం బాగా తెలుసు మందు వేస్తె తగ్గి పోవాల్సిందే .

 ఆదివారం శ్రీ హేవిళంబి హనుమజ్జయంతి కార్యక్రమం రాసి రమణకు పంపాను . రెండుపూటలా వాకింగ్ చేస్తున్నాను . రాత్రి రాంగోపాల వర్మ ‘’సత్య -2 ‘’సినిమా చూశా శర్వానంద్ హీరో .చాలాబాగుంది ప్లాట్  విషయం ప్రక్కన పెడితే ట్రీట్ మెంట్ అమోఘం . హీరోయిన్ అందాలు బాగా ఆరబోసింది . అందరిలో ‘’నటన రసాన్ని ‘’ వర్మ  పిండేసి ఇక వాళ్ళదగ్గర ఏమీ మిగలకుండా చేశాడేమోనని పించింది .ప్రతిపాత్రనూ సమర్ధవంతంగా తీర్చిదిద్దాడు .కెమెరా వర్క్ సూపర్బ్ ,మంచి అందమైన లొకేషన్లు . ప్రతి షాట్ పెర్ఫెక్ట్ గా ఉన్నది కనులపండువుగా చూపించాడు .ఎన్నో ఏళ్లయింది వర్మ సినిమా చూసి మనీ మనీ  తర్వాత ఇదేనేమో చూడటం .అగ్ర శ్రేణి దర్శకుడని ఎందుకు అంటారో అర్ధమయింది . అతని  సమర్ధతకు హేట్సాప్ .ఇన్నేళ్లకు ఒక పెర్ఫెక్ట్ సినిమా చూశానన్న సంతృప్తి కలిగింది .

 ఉయ్యూరులో బయల్దేరేటప్పుడు రసాలు తినటం ప్రారంభించి హైదరాబాద్ లోనూ వచ్చేదాకా లాగించి ఇక్కడికి వచ్చాక కూడా మా అమ్మాయి తెస్తున్న నీలాలు తోతాపురి బ్లెండ్ చేసి చిన్న రసం ఆకారం లో సృష్టించిన పళ్ళు తింటున్నాం బాగానే ఉన్నాయి చెట్టులేని చోట–అన్నట్లు .

 మొదట్లో నీళ్లు పూలు లేకుండా పూజ చేసినా కిందటి ఆదివారం నుండి నీటితో సంధ్యావందనం పూలతో పూజ దీపారాధన ,అగరువత్తిల తో పూజ చేస్తున్నాను .రామకోటి రాసి భగవద్గీత చదువుతున్నాను . .ఇంకా లైబ్రరీ దర్శనం కాలేదు ఇవాళ సాయంతరం వెళ్ళవచ్చు .కానీ ఇంట్లో ఉన్న బ్రాహ్మణ సంక్షిప్త చరిత్ర  చదివా . అయిదేళ్లక్రితం మైనేనిగారు పంపిన జార్జ్ ఆర్వెల్ రాసిన యానిమల్ ఫారం  . మామనవళ్ల పాఠ్యగ్రంధం Elie Wieselsఅనే నాజీ దురాగతాలపై చిన్నపుస్తకం ఖాళీ ఉన్నప్పుడు చదువుతున్నా .  మా ఇద్దరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి . మా శ్రీమతికి మంచి విశ్రాంతి దొరికింది . నా పని అక్కడా ఇక్కడా ఒకటే తేడా ఏమీ లేదు దినపత్రికలు ఆన్ లైన్ లో చదువుతున్నాను . శ్రీ దేవినేని నే హ్రూ  అకస్మాత్తుగా మరణించినట్లు వార్త చూశాను  తెలుగు దేశం లోకి చేరి కొన్ని నెలలే అయింది . ఈ వారానికి  ఇంతే  .

    మీ-గబ్బిట దుర్గా  ప్రసాద్ -17-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

           


Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 103-ధ్రువ చరిత్ర కావ్య రచయిత -కానరాది విఠలోపాధ్యాయ (1910

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

103-ధ్రువ చరిత్ర కావ్య రచయిత -కానరాది  విఠలోపాధ్యాయ (1910

కానరాది విఠలోపాధ్యాయ 1910లో కర్ణాటక కానరాది లో సుబ్బలక్ష్మీ అమ్మ సుబ్రహ్మణ్య ఉపాధ్యాయ లకు జన్మించాడు .ఉడిపి సంస్కృతకాలేజిలో శ్రీనివాస భట్టు వద్ద సంప్రదాయ విధానం లో స్సంస్కృతం చదివాడు .ధ్రువ చరిత్రం ,ప్రహ్లాద చంపు ఆయన సంస్కృత రచనలు .కన్నడం లో గోపాల దండకం ,మంగళాష్టకం రాశాడు . ధ్రువ చరిత్రం 15 ఆశ్వాసాల కావ్యం .ధ్రువుడు కుబేరునితో చేసిన వీరోచిత పోరాటాన్ని చక్కగా చిత్రించాడు .ధ్రువుని ప్రజారంజకపాలన అతను నక్షత్రమవ్వటం తో సమాప్తం .కావ్యం ఆధ్యాత్మిక వీర రసకావ్యం .రెండు విషయాలను చక్కగా నిర్వహించాడు .ఋగ్వేదం లోని -ధ్రువాద్యోర్ ధృవ పృధ్వీ  ధ్రువ  శ్చ పర్వతఇమే -ధృవం విశ్వం ఇదం జగద్ ధ్రువో రాజా విశా మయం -ధ్రువ0   తే రాజా వరుణో ధృవం దే వొ బృహస్పతిహ్  -ధృవంతే  ఇంద్రాచా గ్నిశ్చ రాష్ట్రం ధార్యతాం ధృవం ;;అనే మంత్ర భావార్ధాలను కావ్యం లో నిక్షిప్తం చేశాడు .కాళిదాస భవ భూతులలాగానే శ్రీ తో కావ్యారంభం చేశాడు –

‘’శ్రియం త్రయా ప్రతి ప్రజా శాంతికారణం -ధ్రువస్య పదాంబు జయోర్ హృది –

నిధాయ బాఢ0 కరవాని  వందనం-గురుస్త్రై లోకస్య భారతి పతేహ్.’’

చక్కని సుభాషితాలు చెప్పాడు -ప్రాక్తేర్ యువ జనస్యహి    లుబ్ధా ,గుణవతః సకలం  హాయ్ గుణాన్వితం ‘’

భక్తితో ఊగిపోయేట్లు రచన చేశాడు కవి -’’జగన్నిదానం హరిమాదిదేవమ్ -జగన్నివాసం ప్రలయే ప్యనంతం -జగద్గ్రశాన్తం రమయా  లసంతం  -జగన్నివాన్తారం అహం నమామి ‘’

8 వ ఆశ్వాసం లో చిత్రకావ్య విధానాలన్నీ గుప్పించాడు .ధ్రువుని తీవ్ర తపస్సును దాన్ని భగ్నం చేయటానికి జంతువులు  చేసిన విఫలప్రయత్నాలను నిర్జర ఏకాంత  అరణ్య సౌందర్యాన్ని బహు చక్కగా వర్ణించాడు .శాంతరసం తోకావ్యం భాసించి చారిత్రాత్మకంగా నిలిచింది .ప్రహ్లాద చంపు ను భక్తి భావ   బంధురం  గా శార్దూల మాలిని స్రగ్ధర ,వంశస్థ స్వాగత ,వసంతతిలక ,భుజంగ  ప్రయాత   పృథ్వి ,వియోగిని ,ప్రహర్షిణి  శా లిని ,స్రగ్విణి ,హర్షిణి  ,,రదోద్ధత మున్నగు ఛందస్సులతో రసప్లా వితం చేశాడు .నిజమైన భక్తుడుగా ఉపాధ్యాయ తనకవిత్వాన్ని దైవానికి అంకితం  చేసి ధన్యజీవి అయ్యాడు

104- ధ్వన్యను కరణ కవి-కె నంజుండ ఘనపాఠి -(1910)

కార్ణాటక లోని కూడలి లో 5-8-1910 న నంజుండ  జన్మించాడు .లక్ష్మీదేవి కృష్ణ ఘనపాఠి తలిదండ్రులు .సంస్కృత సాహిత్యం అద్వైత వేదాంతం లలో విద్వాన్ అయ్యాడు .వేదాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేశాడు .భద్రావతిలోని భద్ర సంస్కృతకాలేజిలో సంస్కృతం బోధించాడు .శృగేరి ద్వారకా ,కూడలి పీఠాధిపతులచే సన్మానాలు పొందాడు .గౌరీకళ్యాణం భక్త మయూరధ్వజ చరిత్రం అనే రెండుఖండకావ్యాలు సంస్కృతం లో రాశాడు .

గౌరీ కళ్యాణం శతకకావ్యం .దేవతా స్తుతి చేశాక గిరిజా దేవి కళ్యాణ మండపానికి రావటానని గొప్పగా వర్ణించాడు .ధ్వన్యనుకరణ ను అమోఘంగా నిర్వహించాడు –

‘’ఝాన జిహానాత్ కరణ నూపురాద్య -సుమాల్య వస్త్రాభనైర్ ఉపేతా -సుమంగళీ సంస్తుత దివ్య శీ లా – మన్దమ్ శివా ప్రాప వివాహ వేదిం ‘’

నముల్ ప్రత్యయాన్ని అద్భుతంగా ప్రయోగిస్తూ -భోజం భోజం భక్ష్య భోద్యాని నిత్యం  -పాయం పాయం పాయసాదిన్ సుపే యన్-దర్శం దర్శం దైవతా శైవ లీలాః -భారం భారం శైలరాజం సాసాంసుహ్’’

జైమిని భారత అశ్వ మే ద పర్వం లోని మయూరధ్వజ చరిత్రలో వేద వేదాంత సాహిత్యాల త్రివేణీ సంగమంగా రచించాడు  సంప్రదాయాన్ని చక్కగా పాటించి భారతీయ ఆధ్యాత్మిక ఆముష్మిక విలువలకు ఎత్తిన పతాకగా తీర్చి దిద్దాడు

105-కవి శేఖర హెచ్ .వి నారాయణ శాస్త్రి -(1910)

కర్ణాటక హళ్లి మైసూర్ లో వెంకటరామ నవధ్వని ,తిమ్మామ్ బికల కు 19 10 లోఆగస్టు 15 న  నారాయణ శాస్త్రి జన్మించాడు .బెంగళూర్ చామ  రాజేంద్ర కాలేజ్ నుంచి సంస్కృత సాహిత్య రత్న పొంది ,అక్కడే లెక్చరర్ అయ్యాడు శ్రీశైల జగద్గురువులచేత కవిశేఖర బిరుదును కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని  పొందాడు .సంస్కృతం లో శ్రీశైల జగద్గురు చరిత ,శ్రీనాచరమ్మా విజయం,శ్రీ కృష్ణ భిక్ష ,గుణ పరీక్షణం ,,సోదర స్నేహ  నాటకాలు ,శ్రీ విద్యారణ్య కదా తరంగిణి కావ్యం ,శ్రీ లక్ష్మీ కేశవ సుప్రభాతం ,కర్ణాటక మహిమ్న స్తోత్రం ,కాశీ విష్వఈశ్వర సుప్రభాతం రాశాడు .

శ్రీ నాచ రమ్మ విజయం -ఇది సాంకేతి బ్రాహ్మణ చరిత్ర .వారి పుట్టుపూర్వత్తరాలు  నివాసం మొదలైనవి చారిత్రిక ఆధారంగా రాశాడు .ఇందులోతమిళనాడుకు చెందిన  నాచారమ్మ అనే సదాచార మహిళా కద ఉన్నది .ఆమె విజయనగర రాజ్యస్థాపకులైన శ్రీ విద్యారణ్య స్వామి సమ కాలికురాలు . నాచారమ్మ సాక్షాత్తు సరస్వతీ దేవి అవతారం .ఆమె విద్వత్తుకు అసూయ చెందిన ఆనాటి బ్రాహ్మణ పండితులను చూసి తమిళనాడునుండి కర్ణాటకకు భర్తతో సహా వెళ్లి స్థిరపడింది .ఆమెను అక్కడివారందరూ దేవీ సమానంగా భావించి ఆరాధించారు  .అనేక సంఘటనలను అత్యంత రమణీయంగా శాస్త్రి వర్ణించి కావ్య గౌరవం కలిగించాడు .

గురు పరీక్షణం -5 అంకాల నాటకం .కట్నాలు కానుకలు ,లంచాలు  నిరుద్యోగం లపై రాశాడు .నాలుగవ అంకం లో ఆత్మహత్య ఉంది .హాస్య  వ్యంగ్యాలను  దట్టించి రాశాడు .చిదంబర అనే జ్యోతిష్యుని వికటంగా చిత్రించాడు .అతని మాటలు – ఘ్రాణం పాతుం నశ్యా దేవ -నశ్యం జాతం ఘ్రాణా దేవ -ఉదరం జాతం కోఫీమ్ -కోఫీ జాతా ఉదరం గన్తుమ్ ‘’సంస్కృతం పై గొప్పనమ్మకం తో నాటకం రాశాడనిపిస్తుంది .విదేశీ సంస్కృతీ వ్యామోహాన్ని బాగా ఎండగట్టిన నాటకం

శ్రీ విద్యారణ్య కథా తరంగిణి 14 తరంగాల కావ్యం .విద్యారణ్యస్వామి బహుముఖీన ప్రతిభకు పట్టం కట్టిన రచన .కధావతరణం కర్ణాటక వర్ణనం మాధవ జననం  విజయనగర నిర్మితి మొదలైన అధ్యయాలు న్నాయి  తాను చెప్పిన ప్రతివిషయాన్ని అదో సూచికలతో సమర్ధించాడు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

           

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 99–చతుర్భాషా పండితుడు విద్యావిశారద-గోటూర్ వేంకటాచల శర్మ (1894)

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం -3

99–చతుర్భాషా పండితుడు విద్యావిశారద-గోటూర్ వేంకటాచల శర్మ (1894)

తమిళనాడు  డంకిని కోటలో జన్మించిన గోటూర్  వేంకటాచల శర్మ చామరాజేంద్ర సంస్కృత కాలేజీ నుండి సాహిత్య విద్వాన్ పొందాడు .పండిత రత్న ,విద్యా విశారద ,సరస కవి రత్న బిరుదులు  అందుకున్నాడు .సంస్కృతం తెలుగు ఇంగిలీషు  కన్నడ  భాషలో రచనలు చేశాడు .సంస్కృతం లో గణేశ గీతమాలాస్తోత్రం ,శ్రీ చౌడేశ్వరీ గీతాకాదంబకం ,స్తోత్రమాల భగవాన్ గీత మాలికవంటి వి రాశాడు .సుబ్రహ్మణ్య శాస్త్రి ఆఫ్ ఆనెకాల్ జీవిత చరిత్ర ఇంగిలీషు లో రచించాడు .మోహ ముద్గరం కు కన్నడ వ్యాఖ్యానం ,తెలుగులో ఆటవెలది గీతమాల రాశాడు .

Inline image 1

100-కాశ్మీర సమస్యపై నాటకం రాసిన -నిరాపజే  భీమదత్త -(1903)

కర్ణాటకలో దక్షిణకన్నర జిల్లా కాన్యన్ గ్రామం లో 1903 లో భీమదత్త నిరాపేజీ జన్మించాడు .తండ్రి శంకర భట్ .కాశ్మీర సంధాన సముద్యమ ,హైదరాబాదా విజయ అనే రెండునాటకాలు సంస్కృతం లో రాశాడు .మొదటిది విద్యార్థి దశలోనే రాసిననాటకం .చారిత్రాత్మక రాజకీయనాటకం .7 ఆంకాలలో కాశ్మీర సమసిపై రాశాడు .సమకాలీన రాజకీయాన్ని ప్రతిబింబించిననాటకం స్త్రీ పాత్రలేని నాటకం కూడా .రెండవదైన హైదరాబాద విజయం నాటకం లో భారత స్వాతంత్ర అనంతర  పరిస్థితులు హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్ లో చేరటంమొదలైన పది దృశ్యాలున్న  కదాఉన్న నాటకం .ఈ రెండు నాటకాలలో నిరాపజే  భారత దేశ  సమగ్రతను గట్టిగా సమర్ధించి దేశభక్తిని చాటాడు

101-హి ట్ఠనహళ్లి గోవింద భట్ట (1905).

హిట్టనహళ్లి గోవిందభట్ట 1905 లో కర్ణాటక లో దక్షిణ కెనరా జిల్లా మారుమూల గ్రామం లో జన్మించాడు .తండ్రి నీలకంఠ భట్ తల్లి భాగీరధి .హోసమానే రామచంద్ర శాస్త్రి గణేశా శాస్త్రీలవద్య కూలంకషంగా శాస్త్రాధ్యయనం చేశాడు .శ్రీ సర్వజ్ఞేన్ద్ర చంపు ను శ్రీ బ్రహ్మానంద గణేశా యోగేశ్వరాణాం జీవన చరితం అనే చారిత్రాత్మక రచన చేశాడు

శ్రీ సర్వజ్ఞేన్ద్ర చంపు అనంత భట్టు చంపూ భారతాన్ని అనుకరించి రాసింది .ఇది చారిత్రిక చంపు .స్వర్ణవాలి మఠ  చరిత్ర ఉన్నది .వేదాంతానికి దీన్ని అంకితమిచ్చాడు -ఇలామొదలౌతుంది –

‘’కవితా సవితానాహం కిమపి లేహ్యం లిఖేచ్చమే హస్తా -తదపిచ విబుధైర్  దయయా పరుగుణ పరమాణుతుస్థిర అభిగ్రాహ్యం

మరో మనోజ్ఞ చంపు –

‘’తహా యతీన్ద్రో వ్యవహార దుర్యహ్-తహా తపస్యయా   వాపి దుర్య దుర్యహ్ -యధా మృగేన్ద్రో మృగరాజా రాజా హ్ -తదా యతీన్ద్రో నటరాజ ఆసీత్ ‘’

శ్రీయ బ్రహ్మానంద గణేశయోగేశ్వరాణాం జీవన చరితం లో 8కాండలు ఉన్నాయి .బ్రహ్మానంద యతీశ్వరులే కథానాయకులు

102-విఘ్నేశ్వర శర్మ (1909)

.తండ్రి వెంకట రమణ పండిట్ .గురువు సుబ్బన్న భట్ .ఇతని రచనలు -సంస్కృతం లో సృజన రచనలు ,కన్నడ రచనలు ,,పాటలు కలగూర అని విభజించారు  .చనిపోయే నాటికి వెలుగు చూడలేదు .

సంస్కృతంలో రాసిన ఉషానిరుద్ధంనాటకం  అచ్చుకాలేదు .రత్నాఙ్గులీయకం హాస్య రచన హస్త కౌస్తుభం ,ధర్మ విప్లవం ,కామినీ కౌరవమ్ .భార్గవి చారిత్రాత్మకనాటకం ప్రచురణకాలేదు .ఇందిరా  వైభవం ఖండకావ్యం -ఇందిరాగాంధీ జీవిత చరిత్ర .ఇందిరాగాంధీ పై చాలాశ్లోకాలు గీతాలు రాశాడు .మూకాంబికాస్తుతి ,శివ గౌరీ స్తుతి ,వానీవందనం మొదలైనవి చాలారాశాడు .రేణుకాఖండకావ్యం రాశాడు విఘ్నేశ్వర శర్మకవిత్వం లో సంగీతం ప్రతిధ్వనించి చెవులకు పరమానందం కలిగిస్తుంది

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-17 కాంప్ -షార్లెట్ -అమెరికా .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 97- యక్ష ప్రశ్న నాటక రచయిత -జగ్గు సింగరార్య(1891-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 \

97- యక్ష ప్రశ్న నాటక రచయిత -జగ్గు సింగరార్య(1891-

జగ్గు తిరునారాయణ అయ్యంగార్ వెంగడాంబ  కు 20-11-1891 న కర్ణాటకలోని మేల్కొటే లో జగ్గు సింగరార్య జన్మించాడు . .మైసూర్ మహారాజా సంస్కృతకాలేజి  మేల్కొటే  సంస్కృత కాలేజీలలో చదివాడు .సంస్కృతం లో అమోఘ పాండిత్యం సాధించి యదునాధ చంపు కృష్ణ కథారహస్య కావ్యం ,దాశరధి దర్శన కావ్యం ,,వెంకటే శ పాదా వలంబన స్తోత్రం ,కావ్యకల్పకం యక్షప్రశ్న నాటకం,శిబి  వైభవం  శౌరి శౌర్యం నాటకాలు ,ధర్మవ్యాధి దర్శనం ఏకాంకిక ,అతిమానుష స్తవం ,కావ్యకల్పకం మొదలైన  ,  చాలగ్రంధాలు రచించాడు . కన్నడం లో నిధి సర్వావలి బాలినాభాగ్య ,వైరముడి వైభవం  ,రాశాడు . మైసూర్ మహారాజా నలువది కృష్ణ రాజా వడియార్ ,శృంగేరి పీఠాధిపతి శ్రీ చంద్ర శేఖర స్వామి ,ఉడిపి పెజావర్ స్వామి మున్నగు వారి చేత సత్కరింపబడ్డాడు .కర్ణాటక రాష్ట్ర పురస్కారం తో బాటు అనేక సాహిత్య సంస్థల నుండి సన్మానాలు  పొందాడు .అభినవ భవభూతి ,నూతన కాళిదాస ,కులభూషణ బిరుదులూ అందుకున్నాడు .

  ఆయన రాసిన యదు శైల చంపు తన ష్వగ్రామం  మేల్కొటే పై ఆరు అధ్యాయాలలో సత్పురపంచ పేరిట రాస్శాడు .కృష్ణకదా రహస్యాన్ని కన్నడ తెలుగులలో ముద్రించాడు .ఇది ఎస్ ఎస్ ఎల్ సి కి పాఠ్య గ్రంధంగా ఉన్నది  .మూడు ప్రపంచాలతో దాశరధి దర్శనం రాశాడు .మొదటి అధ్యాయానికి పాదుకా పట్టాభి షేక ,రెండవ ప్రపంచకానికి చిత్ర కూటోదంతా ,మూడవడానికి రామ పట్టాభి షేకం అని పేర్లు పెట్టాడు .మహాభారత ధర్మవ్యధ ఉపాఖ్యానాన్ని ధర్మవ్యధ దర్శన నాటకం గా రచించాడు .మొహాన్ని శ్లేషలో వర్ణించాడు -’’పత్నీ మోహ పుత్రమోహార్హమోహః -పృధివీ మోహో దేహగే హాది మోహః -ఏవం మోహైర్నాపి నాపై సౌఖ్యం నాశాంతిహ్ -జ్ఞాని తస్మాన్ నైవ ముహ్యత్త్విహ యేసు ‘’.వీరి శిబి వైభవాన్ని సాహిత్య అకాడెమి ముద్రించింది .శౌరి శౌర్యం భాగవత కృష్ణకధ .

 

98-34 వ శృంగేరి పీఠాధిపతి -శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతి స్వామి (1892- 1954)

16-10-1892 న గోపాల శాస్త్రి లక్ష్మమ్మ దంపతులకు నరసింహ గా శ్రీ చంద్ర శేఖర భారతీ తీర్ధ స్వామి జన్మించారు .6–4-19 12 న 20 వ ఏటా శృంగేరిశారదా పీఠ  34 వ పీఠాధిపతిగా అభిషిక్తులయ్యారు . అనుక్షణం ఆత్మ దర్శనం పొందుతూ సమాధి స్థితిలో ఉండేవారు .ఛందస్సు పై అపూర్వ అధికారం ఉండటం వలన అలవోకగా ఎన్నో శ్లోకాలు చెప్పేవారు వాటిని భక్తులకు అందుబాటులోకి తేవటానికి ముద్రించారు .వాటిలో పాదా వలంబన స్తుతి ,నవరత్నమాల ,తోటకాస్టో త్తరం ,శ్రీమదాచార్యే 0ద్ర   స్తవం ,ఆచార్య పాదా వలంబన స్తుతి ,దత్త నవరత్న మాలిక .దక్షిణామూర్తి మంత్రమార్క స్తవం ,సన్ముక్త భుజంగ స్తుతి మొదలైనవి .శంకరాచార్యుల వివేకా చూడామణికి వ్యాఖ్యానం ,భగవద్గీతకు శంకరభాష్యం పై వ్యాఖ్యానం మొదలైన శాస్త్ర గ్రంథ రచన చేశారు .

పాదా వలంబన  స్తుతి లో -’’స్థితే నూపురమకరాండ పూర్ణే -జగద్గురోహ్  పాద సహస్ర  పాత్రే – కిమన్యతో ధా వసి చిత్త  భృంగ -ప్రయాహి తత్రైవ  రామస్వ నిత్యం .’’భావం -ఓ మనస్సనే తుమ్మెదా !అనుగ్రహ గురు పాదపద్మ0 ఉండగా అటూ ఇటూ దేనికోసమో వెతుకుతావేమిటి .ఆపాదపద్మాలపైనే వ్రాలి చిరకాలం ఉండిపో

నవరత్నమాల -’’కామాది  శృంగి పరిచ్చేదన వజ్ర పాణే -నామావధూత నిఖిలా ఘ  చయో మనశ్వీ-సామాది గీర్శు పరిగీత నిజ స్వరూపః -దృగ్గోచరో భవతు దేశికరాన్ మమాసు ‘’  –భావం -గురు దేశికులు తక్షణం ప్రత్యక్షం కావాలి .ఇంద్రుడు పిడుగును సంహరించినట్లు నా ఆరుగురు లోపలి శత్రువులను దునుమాడి ,ఉపనిషత్ సా ర సంగ్రహమైన గురుదేవుడు ప్రత్యక్షం కావాలి .

 స్వామిజీ జీవితకాలం లో అనేక అద్భుతాలు ప్రదర్శించారు .కళ్ళు లేనివారికి నేత్ర జ్ఞానం బాధితులకు వినికిడి వారి స్పర్శవలన లభించేవికనుక వారిని ‘’స్పర్శామాత్ర గురుదేవులు ‘’అని అందరూ చెప్పుకునేవారు .వీరు పీఠాధిపతులుగా ఉన్నకాలం లో శృంగేరి శారదా పీఠం పరమ వైభవాన్ని సాధించింది .ఎంద రెంద రో తత్వ వేత్తలు శాస్త్ర వేత్తలు విద్యాధికులు పండితులు రాజకీయ ప్రముఖులు స్వామీజీ సందర్శనం చేసి ఉపశమనం పొందేవారు .అలాంటివారిలో డా రాజేంద్ర ప్రసాద్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ,కృష్ణరాజ ఒడియార్ వంటి ప్రముఖులున్నారు 26-.-9-19 54 న స్వామీజీ మహా సమాధి చెందారు .

Inline image 1

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-4-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 95- సతీష్ చంద్ర విద్యాభూషణ్ (1870-1920)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

95- సతీష్ చంద్ర విద్యాభూషణ్  (1870-1920)

మహామహోపాధ్యాయ డా సతీష్ చంద్ర విద్యాభూషణ్ 30-7-1870 న ఇస్లామిక్ బంగ్లాదేశ్ లో ఫరీద్ పూర్ లోని కాల్కువ గ్రామం లో జన్మించాడు తండ్రి పీతాంబర విద్యా వాగీశుడు ప్రముఖ సంస్కృత పండితుడు .అన్న విశ్వంభర జ్యోతిష్ర్ణవ ఇతనికంటే 12 ఏళ్ళు పెద్ద .మిడ్నపూర్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ గంగాధర ఆచార్య కుమార్తెను 18 89 లో పెళ్లి చేసుకున్నాడు .అయిదవ ఏటనే విష్యాభ్యాసం ప్రారంభించి తోటి వారిలో తలమానికంగా నిలిచాడు .ప్రవేశ పరీక్షలో ఆ డివిజన్ ఫస్ట్ వచ్చి నవద్వీప్ లో హిందూ స్కూల్ లో చేరాడు . 1888లో కలకత్తా యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్ష పాసై స్కాలర్షిప్ పొంది సిటీ కాలేజీలో చేరాడు .ఎఫ్ ఏ పాసై కృష్ణానగర్ కాలేజీ కు వలసవెళ్లాడు . 1892 లో సంస్కృతం లో బి ఏ ఆనర్స్ పొందాడు . 1893 లో కలకత్తా యూ ని వర్సిటీనుంచి ఏం ఏ సాంస్క్రిట్ డిగ్రీ సాధించాడు .నవద్వీపం లోని విదగ్ధ జనని సభ నిర్వహించిన సంస్కృత భాషా సాహిత్య పోటీలో విజయం సాధించి ‘’విద్యాభూషణ ‘’పొందాడు . 1893-నుండి రెండేళ్లు సంస్కృతకావ్యాలను మహామహోపాధ్యాయ అజిత్ నాధ న్యాయ రత్న వద్ద అభ్యసించాడు .సంస్కృత న్యాయ శాస్త్రాన్ని మహామహోపాధ్యాయ జరునాధ సార్వ భౌమవద్ద చదివాడు 1897 -1900 వరకు టిబెట్ భాషను ప్రముఖ లామా ఫంగ్ చాంగ్ వా0గ్ డాన్ వద్ద లాసా లో నేర్చాడు . 1901 లో పాళీ భాషను శ్రీలంక బర్మా షర్మాన్ వద్ద చదివి పాళీ లో ఏం ఏ సాధించాడు

 1893 లో కృష్ణానగర్ సంస్కృతకాలేజిప్రొఫెసర్ గా చేరి ,బౌద్ధ సొసైటీ ఆధ్వర్యం లో పాళీ భాషలో పుస్తకాలకు సంపాదకత్వం లో ప్రచురించాడు 1897-90 వరకు డార్జిలింగ్ లో గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో టిబెటన్ -ఇంగిలీషు నిఘంటు నిర్మాణం చేశాడు . 1900 లో కలకత్తా వచ్చి కలకత్తా కాలేజీ సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు . 1906 లో గవర్నర్ జనరల్ మహా మహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేశాడు 1908లో కలకత్తా యూనివర్సిటీ పి  హెచ్ డి నిచ్చింది . 1910 లో సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ అయ్యాడు

సతీష్ చంద్ర 1897 లో బెంగాల్ భాషలో ఆత్మతత్వ ప్రకాశం రాశాడు .తరువాత వరుసగా భవభూతి అండ్ హిజ్ డ్రామా ,లంకావతారసూత్ర ,,కాత్యాయన్స్ పాళీ గ్రామర్ , టిబెటన్ ప్రీమియర్ రెండుభాగాలు ,రత్న నౌట్ట ,,నోట్స్ ఆన్ రత్నావళి గ్రిమ్స్ ఫోనెటిక్ లా ఆఫ్ ఇండో-యూరోపియన్ లాంగ్వేజెస్ ,బుద్ధ స్తోత్ర సంగ్రహ ,స్రగ్ధర స్తోత్ర ఆఫ్ సర్వజ్ఞ మిత్ర ,హిస్టరీ ఆఫ్ మిడీవల్ స్కూల్ ,ఆఫ్ లాజిక్ ,అమరకోశ సాంస్క్రిట్ విత్ టిబెటన్ వెర్షన్ రెండుభాగాలు ,అమరాఠికా కామధేను ,అవధాన కల్పలత ,న్యాయ సూత్ర ఆఫ్ గౌతమ , బై లింగ్యువల్ ఇండెక్స్ ఆఫ్ న్యాయ బిందు ,హిస్టరీ ఆఫ్ ఇండియన్ లాజిక్ మొదలైన ఉద్గ్రంధ రచయిత సతీష్ చంద్ర .-25-4-1920  న యాభై ఏళ్లకే మహామహోపాధ్యాయ సతీష్ చంద్ర విద్యాభూషణ్ పరమపదించాడు ..

Inline image 1

96-తాంత్రిక బౌద్ధ  గ్రంథ రచయిత-సర్వజ్ఞ మిత్ర (8 వ శతాబ్దం )

స్రగ్ధర సూత్రం రాసిన సర్వజ్ఞ మిత్ర కాశ్మీర్ వాడు .ఇదిటిబెటన్ తాంత్రిక దేవత   తార అనబడే  శ్రోలమ పై  చెప్పిన 37 మంత్రాల సముదాయం .దీనికి జైన రక్షితుడు స్రగ్ధరా స్తోత్ర టీకా అనే వ్యాఖ్యానం రాశాడు .ఆనాటి ప్రభువుకు సహాయకారిగా ఉన్న విక్రమశిల బౌద్ధారామం లో భిక్షువు .రక్షితుడు రాసిన వ్యాఖ్యానాన్ని బట్టి సర్వజ్ఞ మిత్ర కాశ్మీర్ కు చెందిన మహా కవి దాత .తనకున్న సర్వస్వాన్ని త్యాగం చేసి దేశ సంచారం చేస్తూ వజ్రముకుటు ని రాజ్యం లో ప్రవేశించాడు .దారిలో అతిపేదబ్రాహ్మణుడు కూతురి పెళ్ళికి డబ్బు లేక బాధ పడటం చూశాడు .ఆ బ్రాహ్మణుడు మ హా దాత అయినాసర్వజ్ఞ  మిత్ర ను దర్శించి తన గోడు చెప్పుకొందామనుకొని ఆయనే సర్వస్వము దానం చేసి భిక్షాపాత్ర, పైన ఉత్తరీయం తో తిరుగుతున్నాడని తెలిసి హతాశుడయ్యాడు .దయాళువైన సర్వజ్ఞుడు ఓదార్చి తాను తప్పక సాయం చేస్తానని మాట ఇచ్చాడు .అదే సమయం లో రాజు వజ్రముకుతటుడికి ఒకడు ఆయన కోరికలన్నీ తీరాలి అంటే అప్పటికప్పుడు వంద శరీరాలనుండి వేరు చేయబడిన కపాలాలపై కూర్చుని స్నానం చేస్తే తీరుతాయి అని సలహా ఇచ్చాడు .అప్పటికే 99 సంపాదించిన రాజు సర్వజ్ఞమిత్రనుఅతని బరువుతో సమానమైన  బంగారంతో తూకం వేసి కొని   కొని వందా  పూర్తి చేశాడు .ఆ బంగారాన్ని అంతటిని సర్వజ్ఞుడు ఆ పేద బ్రాహణుడికి దానం  చేసేశాడు

 

 సేకరించిన వందమందిని సర్వ్జ్ఞమిత్ర తో సహా వధ్యస్థలానికి రాజభటులు తీసుకు వెళ్లారు .తప్పించుకొనే దారి తోచక సర్వజ్ఞుడు 37  స్రగ్ధరా శ్లోకాలు ఆర్య తారా దేవిపై ఆశువుగా చెప్పాడు  .అకస్మాత్తుగా వందమంది మృత్యువు నుంచి తప్పించుకొని స్వగృహాలకు చేరారు .సర్వజ్ఞుని మహా భక్తికి ఆశ్చర్యపోయిన రాజు క్షమాపణ వేడి శిష్యుడైపోయాడు .ఇలాంటిదే మరొకధ  సర్వజ్ఞమిత్రాపై టిబెటన్ భాషలో ప్రచారం లో ఉంది .దీనిప్రకారం సర్వజ్ఞుడు కాశ్మీర్ లో పుట్టినా నలంద  విశ్వ విద్యాలయ విద్యార్థి ..అక్కడ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు .స్రగ్ధరా స్తోత్ర టీకలో సంస్కృతంలో రాజుపేరు వజ్ర ముకుటుడు పేరుకు బదులు      ‘’శరన ‘అని టిబెటన్ భాషలో ‘’పాగ్ సాం సాన్ జంగ్ ‘’’అంటారని ఉన్నది .సర్వజ్ఞ మిత్ర కాలం ఎనిమిదవ శతాబ్ది పూర్వార్ధంగా నిర్ణయించారు

.Inline image 2

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 94-స్వామి సత్యసంగా నంద సరస్వతి -(1953_

—

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3

94-స్వామి సత్యసంగా నంద  సరస్వతి -(1953_

1953 లో పశ్చిమ బెంగాల్ చందర్ నగర్ లో జన్మించిన స్వామి సత్య సంగానంద సరస్వతిని ‘’స్వామి సత్సంగీ ‘’అని గౌరవంగా పిలుస్తారు.చిన్నతనం నుంచి ఆధునిక సంప్రదాయం వేషభాషలలో పెరిగినా ఆమెకు అనేకమైన ఆధ్యాత్మికానుభవాలు దర్శనమవటం తో అన్నీ పరిత్యజించి స్వామి సత్యానంద సరస్వతి గురువు అనుగ్రహం తో దశమి విధానం లో 6-7-19 82 లో సన్యాసిని అయింది  .తరువాత గురువు సత్యానందం తోకలిసి దేశమంతటా విదేశాలలోని విస్తృతంగా పర్యటించింది .గురువు అనుగ్రహం పుష్కలంగా లభించటంవలన మంత్రం తంత్ర వేదం తత్వ శాస్త్రాలలో మహా నిధి అయింది .యోగం తంత్రం లపై అద్భుతమైన గ్రంధాలు రాసి వాటికి అందరికీ కరతలామలకం చేసింది .ఆమె రాసిన ‘’విజ్ఞాన భైరవ తంత్ర ‘’చాలా ప్రసిద్ధమైంది .శ0కరాచార్యుల వారి ఆధ్యాత్మిక గ్రంధ0 సౌందర్య లహరి కి అనుభూతిపరమైన  గొప్ప వ్యాఖ్యాన0  రచించింది .’’తత్వ శుద్ధి ‘’అన్న ఆమె గ్రంధం చాలా వ్యాప్తి చెందింది .’’ది  తాంత్రిక్ సైన్స్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్ ‘’గ్రంధం లో ఆంతరిక శుద్ధిని చక్కగా వివరించింది .పరంపరాగతం గా వస్తున్న యోగ తంత్రాలను ఆధునికకాలానికి అన్వయిస్తూ ఆమె చెప్పిన తీరు బహుధా ప్రశంశనీయం

 19 89 లో స్వామి సత్యానందం తన అంతర్  దృష్టిలో దర్శించిన జార్ఖండ్ లోని రిఖియా అనే ప్రదేశానికి వెళ్లి అక్కడ నిర్జన ప్రదేశం లో ఒక ఆశ్రమాన్ని నిర్మించి యోగ సాధన  చేయాలని సంకల్పించాడు .అదే సత్యానందం తపోభూమి అయింది .దానికి దారి రోడ్డు ఫోను కరెంట్ కూడా లేని అతి చిన్న ప్రదేశం .  21 వ వ శతాబ్దపు ఆధునీకతకు  కు అత్యంత సుదూరం లో ఉన్నది .1 989 లో రిఖియా గ్రామం దర్శించి గురువుగారి రాకకు అన్ని ఏర్పాట్లు చేసింది .అప్పటినుంచి అక్కడే ఉండిపోయి సమాజం చేత బహిష్కరింపబడిన సమాజం దృష్టిలో లేని అదో జగత్ సహోదరులకు అన్నీ తానె అయి వారి సర్వతోముఖాభి వృద్ధికి తీవ్రంగా కృషి చేసింది .ఆ ఆశ్రమానికి శివానంద మఠం అని పేరుపెట్టింది .ముంగేరులో ఉన్న ఆ ప్రాంతం ఆమె అవిరళ కృషివలన గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది .

 2007 లో సత్య సంగానంద సరస్వతి రిఖియా పీఠ్ కు పీఠాధిపతి అయింది .శివానంద సరస్వతి బోధించిన సేవ ,ప్రేమ దానం అనే మూడింటిని త్రికరణ శుద్ధిగా అనుసరించి అక్కడి ప్రజల భౌతిక ఆధ్యాత్మిక అభి వృద్ధికి అంకిత భావం తో కృషి చేస్తోంది .గురు వరేణ్యులైన శివానంద సత్యానంద  సరస్వతుల అడుగు జాడలలో నడుస్తూ దేశ విదేశాలలో వారి భావ ధా రను వ్యాప్తి చెందిస్తూ గురువుకు తగిన శిష్యురాలుగా సేవలందిస్తోంది  .

Inline image 1

 సశేషం

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలతో –

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 93-తర్క తీర్ధ పద్మవిభూషణ్ లక్ష్మణ శాస్త్రి జోషి (1901-1994)

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3

93-తర్క తీర్ధ పద్మవిభూషణ్ లక్ష్మణ శాస్త్రి జోషి  (1901-1994)

బ్రాహ్మణ కుటుంబం లో అర్చకత్వ శాఖలో 1901 లో జన్మించిన లక్ష్మణ శాస్త్రి జోషి 14 వ ఏటకృష్ణానదీ తీరాన ఉన్న  దేవాలయాలకు నిలయమైన’’ వాయి ‘’గ్రామం చేరిసంస్కృతంలో , హిందూ ధర్మ తత్వశాస్త్రాలలో నిధి అయ్యాడు . అక్కడ సంస్కృత పాఠశాల నెలకొల్పాడు దీనిలో సంస్కృతం నేర్పటానికి ఆంద్ర నుంచి సంస్కృత పండితులు వచ్చేవారు . తర్క శాస్త్రం లో ప్రావీణ్యం పొంది తర్క తీర్ధ అయ్యాడు . భారత స్వాతంత్రానంతరం ఏం యెన్ రాయ్ వంటి వారి ప్రభావానికి గురై ,పాశ్చాత్య తత్వ శాస్త్రాన్ని అవలోడనం చేశాడు .ఆనాడు సంస్కృతం లో పేరున్నవారు ,వారిని అనుసరిస్తున్నవారు నిజమైన హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారా అనే ఆలోచనలతో ‘’వైదిక్ సంస్కృతీ చ వికాస్ ‘’అనే గ్రంధాన్ని 19 51 లో రాశాడు .ఇవి పూనా యూనివర్సిటీలో ఇచ్చిన ఆరు ఉపన్యాసాల సారాంశం .వేద సంస్కృతీ ఆవిర్భావం భారత దేశం పై దాని ప్రభావాలను ఇందులో వివరించాడు . ఆధునిక భారతీయులు భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్య నలిగి పోతూ దారి తెలియక బలహీనులై పోతున్నారని చెప్పాడు .దీనివల్ల సామరస్యం కోల్పోయి కులమత వర్గాలలో కూరుకు పోయారని వ్యధ చెందాడు . తన మేధో వికాసనాన్ని చూపినందుకు 19 55 లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు పొందాడు .సాంప్రదాయ చాందస భావాలను త్యజించాలని పిలుపు నిచ్చాడు జోషీ .

  సంప్రదాయాన్ని ధిక్కరించి గాంధీ మహాత్ముని అనుచరుడై ఉద్యమించాడు .అస్పృశ్యత నివారణకు హరిజనుల దేవాలయ ప్రవేశానికి పూనుకొని సఫలుడయ్యాడు . హిందూ ధర్మం పై ఎవరికి ఏ సందేహం వచ్చినా జోషీ తీర్పు ఫైనల్ గా ఉండేది .  1932 లో ఆయన 29 వ ఏట స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకు  బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలు లో పెట్టింది .  జైలులో ఉండగా హిందూ ధర్మ పండితునిగా దేశవ్యాప్త కీర్తి పొందాడు .వినోబాభావే వాయి గ్రామం వచ్చినప్పుడు ఆయన సలహాతో కేవలానంద సరస్వతి వద్ద ఇంగిలీషు నేర్చాడు .గాంధీ గారు  కోమటి కులానికి చెందిన తనకుమారుడు రామ దాసుకు బ్రాహ్మణ కులానికి చెందిన చక్రవర్తుల రాజగోపాలాచారి గారి కూతురు లక్ష్మి నిచ్చి కులాంతర వివాహం చేస్తే హిందువులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు .రెండవ గవర్నర్ జనరల్ గా ఉన్న రాజాజీ యువకుడైన జోషీ పండితుని ఈ వివాహం హిందూ ధర్మసమ్మతమమో  వ్యతిరేకమో  తేల్చి చెప్పమని కోరాడు .సర్వ శాస్త్ర పారంగతుడైన జోషి అది హిందూ ధర్మ సమ్మతమేనని తీర్పు చెప్పటమేకాక దగ్గరుండి వివాహం జరిపించి చరిత్ర కెక్కాడు .

19 60 లో మరాఠీ భాషా బి వృద్ధికోసం జోషీ ‘’మరాఠీ కోశం ‘’తయారు చేశాడు .’’విశ్వ కోశం’’ అనే విజ్ఞాన సర్వస్వాన్ని సంకలనం చేశాడు . .వేదమంత్రాల నాధారంగా మరా ఠీ  భాషలో ‘’ధర్మకోశం ‘’రాశాడు .లక్ష్మణశాస్త్రి జోషీ విద్వత్తును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1976 లో పద్మ భూషణ్ ను ,19 92 లో పద్మ విభూషణ్ పురస్కారాల నిచ్చి గౌరవించింది .బాంబే యూని వర్సిటీ  ఎల్ ఎల్ డి డిగ్రీ ప్రదానం చేసింది .ప్రధమ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రు ఉన్నత విద్యకు, భారీ పరిశ్రమలకు కేటా యిస్తున్న నిధులపై హర్షం వ్యక్తపరచిన దూర దర్శి జోషి . 94 వ వ ఏట 1994 లో జోషీ పండితుడు మహా ప్రస్థానం చెందాడు .

 జోషీ పండితుడు ప్రప్రధమంగా సంస్కృతం లో ‘’శుద్ధి సర్వస్వము ‘’అనే గ్రంధాన్ని రాసి  కులాంతీ కరణ ఎలా చేయాలో వివరించాడు . 26 భాగాలతో 18 వేల పేజీలతోక్రీ పూ 1500 కాలం నుండి 18 వ శతాబ్దం వరకు ఉన్నా హిందూ ధర్మాన్నిసకల  వేదం శాస్త్రాలు వాటి వివిధ వ్యాఖ్యానాలు కూలం కషంగా   అధ్యయనం చేసి నిగ్గు తేల్చి   ‘’ధర్మ కోశం ‘’అనే ఉద్గ్రంధాన్ని రచించాడు . మరాఠీ భాష లో ‘’ఆనంద- మీమాంస’’ అనే గ్రంధాన్ని రసం సౌందర్యం లను చర్చిస్తూ రాశాడు . 1940 లో సంస్కృతం లో’’ హిందూ ధర్మం ‘’ గ్రంథ రచన చేశాడు .భారత ,పాశ్చా త్య దేశాలలో భౌతిక ప్రవ్రుత్తి  తత్వ శాస్త్ర విధానాలపై తులనాత్మక పరిశోధన చేసి హిందూ యిజం జాద్వాడ్ పుస్తకం 1941 లో రాశాడు . 1958 లో ‘’వైదిక సాంస్కృతిచ వికాస్ ‘’గ్రంధం రాశాడు . .1 8 ఉపనిషత్తులను మరాఠీ లోకి అనువదించైనా సాహితీ మూర్తి జోషీ .

Inline image 1

  సశేషం

బాబాసాహెబ్ అంబే ద్కర్  జయంతి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం )

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం )

34-తర్క తీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి -మహారాష్ట్ర సతారా జిల్లా ‘’వాయి ‘’గ్రామం లో ప్రముఖ సంస్కృత పాఠ శాల ఉన్నది .అక్కడ సంస్కృతం నేర్పటానికి తెలుగు దేశం నుండి పండితులు వెళ్లి నేర్పారు .దాన్ని తీర్చి దిద్దినవాడు తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి . అబ్బూరి కి మంచి మిత్రుడు . ఇద్దరూ సంస్కృతం లోనే మాట్లాడుకునేవారు .ఆయనకు పిలక ఉండేది . 1940 లో ఇద్దరూ కలకత్తా వెళ్లి  ఒక రెస్టారెంట్ లో విస్కీ కొడుతున్నారు ..జోషిగారిపిలక ,పండితవేషం విస్కీ తాగటం జనం విడ్డూరంగా చూశారు .. అబ్బూరి వెంటనే రెస్స్టారెంట్ యజమాని నుంచి కత్తెర తెచ్చి జోషీ పిలక కత్తిరించారు .అప్పుడాయన ‘’కామ్రేడ్ రామ కృష్ణారావు ! ఈ దేశం లో ఏదీ బహిరంగం గా చెయ్యరాదు ‘’అన్నాడట .. జోషీ గాంధీకి కూడా సన్నిహితుడు .  ఆయన పాండిత్యం లో బ్రహ్మదేవుడంతటివాడని అంటారు . హరిజన దేవాలయ ప్రవేశం కోసం గాంధీ ఆయన్ను కాశీలో పండితులతో తర్కించమని పంపారు .కాశీ పండితులు వ్యతిరేకించారు .రాయుడు శాస్త్రిగారు జోషీని సమర్ధించగా పండితులు కిమిన్నాస్తి అయ్యారు .. హరిజన దేవాలయ ప్రవేశం యధా విధిగా జరిగిపోయింది

35-దుగ్గిరాల గురించి మరిన్నీ విషయాలు -దుగ్గిరాల వారి ‘’రామదండు ‘’దుష్టసమాసం అన్నాడు రామ సుబ్బయ్య ..వెంటనే ‘’మీ పేరు లో ఏ సమాస0  ఉంది ?అని ఎదురుప్రశ్నించాడు ..రామదండు సభ్యులందరూ కాషాయ వేషం  తలపాగా రుద్రాక్షలు ,నుదుట కుంకుమ ధరించేవారు .బెజవాడ అఖిలభారత కాంగ్రెస్ సభకు రామదందే వాలంటీర్లు .వేల  సంఖ్యలో ఉన్న వీరించి చూసి మహమ్మదాలీ ‘’రెడ్ ఆర్మ్ ‘’అన్నాడు ..దుగ్గిరాలవంటి మహా వక్త నభూతో అంటాడు వరద .చీరాలలో పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వ ప్రతినిధులువచ్చారు .సభ పెట్టారు .పోగేసుకొచ్చిన జనం పారిపోకుండా ప్రాంగణం చుట్టూ కంచెవేసి పోలీసు పహారా పెట్టారు ..సంగతి తెలిసిన దుగ్గిరాల ప్రాంగణం ప్రక్కనే ఉన్న తాటి తోపు లోకి వెళ్లి తాటి చెట్లను సంబోధిస్తూ ఉపన్యాసం మొదలు పెట్టారు .ఇంకేముంది చెవిన పడిన జనం క0చె దూకి తాటితోపు కు పరుగులు తీశారు.  అవాక్కయింది బ్రిటిష్ ప్రభుత్వం .’’నర చరిత్రలో జరగని గొప్ప విశేషం ‘’అన్నాడు దీన్ని కట్టమంచి  .

 గాంధీతో అభిప్రాయం భేదాలున్న గోపాల కృష్ణయ్యగారు ‘’మన ఇతిహాసం లో సత్యాగ్రహ సాధనాన్ని మొదట ప్రయోగించినవాడు ప్రహ్లాదుడు .తండ్రి హిరణ్యకశిపుడు ఎంత బాధ హింసా పెట్టినా కొంచెం కూడా చలించలేదు .అహింసాత్మకంగా సత్యాగ్రహం చేసిన ప్రహ్లాదుని లక్ష్యం ఎలా ఫలించింది ?ప్రపంచం లోనే కనీ వినీ ఎరుగని హింసా స్వరూపం తో నృసింహావతారము ప్రత్యక్షమైంది .కనుక అహింసను మనం ఆరాధిస్తే హింస ప్రత్యక్షం కాక మానదు ‘’అన్నారు ..గాంధీ గారికి ఈ వార్త చేరి మైండ్ బ్లాకై ‘’దుగ్గిరాలను ఇలా ఇకనుంచి అహింసా సిద్ధాంతం పై మాట్లాడవద్దు ‘’అని చెప్పమని కొండా వెంకటప్పయ్య గారికి జాబు రాశాడు .

గోపాల కృష్ణయ్యగారు శ్రావ్యమైన కంఠం తో పాడేవారు .ప్రతి బహిరంగ సభలో సాయంత్రం ‘’సాయంకాలే  వనాంతే’’అనే శ్రీ కృష్ణ కర్ణామృతం లోని శ్లోకం పాడేవారు ..ప్రేక్షకులు ముగ్ధులు వశ్యులు అయ్యేవారు .ఆతర్వాత ఆయన ఏది చెప్పినా వేదవాక్యంగా విని అనుసరించేవారు .అంతటి జన వశీకరణ శక్తి ఆయనది . ఆయన పాట పాడే తీరును మహానటులు శ్రీ అద్దంకి  శ్రీరామ మూర్తిగారు అనుకరించారు బాగా ..మంచి హాస్యప్రియులైన దుగ్గిరాల ఛలోక్తులు నిలయం నవ్యకవులను ‘’కొత్తిమేర కవులు ‘’అనేవారు .ఆశువుగా హాస్యంగా పద్యాలు చెప్పేవారు .ఆయన ప్రభావం పడని  నవ్యకవులు లేరు ..ఆయన సన్నిహితులు భట్టిప్రోలు సూర్య ప్రకాశరావు .రావు గారితో పద్యాలు  చెప్పించాలని  ఎందరు ప్రయత్నించినా కుదర్లేదు ..ఒక రోజు అబ్బూరి ని రెచ్చగొడితే గోపాలకృష్ణయ్య గారిపై ఆశువుగా ‘’

ఉపమాపై పెసరట్టు పై ఇడి లిపై  హుమ్మంచు చూపించు నీ-జపసంబద్ధ పరాక్రమ క్రమ కటాక్ష శ్రేణి మన్నించి శు -భ్రపు జిల్లే బీ ,పకోడీ  లడ్వ గయిరాపై కొంత రానిమ్ముశ్రీ -చపలా0గ సితాంగ నా హృదయ పాశా పూజ్య వస్తుప్రియా ‘’అని చెప్పారు ..గిలగిలా లాడిపోయిన రావు గారు . నేనూ చెబుతా కాసుకోండి అని –

‘’కొండ వెంకటప్ప మొండుపన్యాసంబు -సీతారామ శాస్త్రి జ్యోతిషంబు -అడివి బాపిరాజు అడివి కవిత్వంబు -ఎరగనట్టు ఆంద్ర ఎదవ ఎవడు ‘’అని చదివారు . వరదను గోపాల ఎత్తుకొని ఆడించారు చిన్నప్పుడు . అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ రూథర్ ఫర్డ్ .ఆయనకు డిప్యూటీ కలెక్టర్ గా అబ్బూరి మేనమామ రావు సాహెబు వడ్లమూడి బ్రహ్మయ్య పంతులు ఉండేవాడు .అందుకని మేనల్లుడు అబ్బూరిని అరెస్ట్ కాకుండా కాపాడేవాడు .అబ్బూరి ఎన్నిప్రయత్నాలు చేసినా అరెస్ట్ కాలేదు .జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని బుర్రకధగా రాసి ప్రచురించారు .అచ్చు వేసిన వాడిని అరెస్ట్ చేసి అబ్బూరి జోలికి రాలేదు .. తనను ఎందుకు అరెస్ట్ చేయటం లేదో అబ్బూ రికి అర్ధమయ్యేదికాదు . 35 ఏళ్లతర్వాత రూథర్ ఫోర్డ్ మద్రాసులో గవర్నర్ సలహాదారుగా ఉండేవాడు ..ఆయన ఈయన్ను గుర్తుపట్టి చీరాల వ్యవహారాలూ చెబుతూ అరెస్ట్ చేయకపోవటానికి కారణం చెప్పేదాకా అబ్బూరి ఆ రహస్యం తెలియదు అన్నాడు వరద .తాను  జైలుకు పోలేక పోతున్నానే అని తెగ మధానపడేవారు అబ్బూరి .

గోపాలకృష్ణయ్య గారి మరణంపై బసవరాజు అప్పారావు చిరస్మరణీయ గీతాలు రాశారు –

‘’కాలక్రమము గతి గడచి తెనుంగు భావి భాగ్యమెల్ల పండిన వెనుక -ఆనాటి కెవరైననడుగగా పోరు -గోపాలకృష్ణుడే గోష్ఠి వాడంచు-భాగ్య వశమ్ము న భావికాలాన అమృత తుల్యమ్ములు నతి   భావ భరిత -ములు నైన నా గీతములు వినినంత గోపాల కృష్ణుని గొప్ప దీపించు ‘’

దటీజ్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య .

దుగ్గిరాలవారి ‘’రామనగరం ‘’లో కులాలు లేవు అందరిదీ ఒకటే కులం ‘’నాన్ బ్రాహ్మిన్ కు అర్ధం లేదు ‘’అన్నారు .జాగర్లమూడి కుప్పుస్వామి జస్టిస్ పార్టీ నాయకుడు దుగ్గిరాల అవసాన దశలో వచ్చి చూశాడు .రామనగరులో పూరిపాకలో చిక్కి శల్యావశిస్టం గా  పడి  ఉన్నారు చౌదరిని పలకరించటానికి లేవ బోయారు .సహాయం చేస్తానన్నాడాయన లేవటానికి .. నవ్వుతూ ‘’నడుం లో నాన్ బ్రాహ్మినోయ్ ‘’అని చమత్కరించారు .ఆయన ఆపుకోలేక పగలబడి నవ్వాడు . అప్పటికి నాలుగు రోజులనుంచి నడుం నెప్పితో బాధ పడుతున్నారు దుగ్గిరాల . వెళ్లిపోతుంటే ‘’రామార్పణం ‘’అన్నారు .వాళ్ళు వెళ్ళాక అవుటపల్లి నారాయణ రావు తో ‘’ఒరే  శ్రీరామ చంద్రుడు చిత్తు  కాగితం పంపించారురా .కానీ ఆ దూతకు తగిన ఆతిధ్యం ఇవ్వలేక పోఇందిరా ఈ ఘటం ‘’అన్నారు గోపాల .ఆ చిత్తుకాగితం వంద రూపాయల నోటు

36- కొండా వెంకటప్పయ్య -అంతః కక్షలకు దూరంగా ఉండేవారు .పెద్దమనిషి తరహా . సాధువుగా మాట్లాడినా కోపం విసుగూ ఎక్కువ .అణ చు కోలేక పోతున్నానని బాధ పడేవారుకూడా  దుగ్గిరాల కొండా పై ‘’కొండెం కటప్పయ్య కొండంత కోపాన -చిర్రు బుర్రు మనుచు చిందులేసే ‘’అని అందరికీ తెలిసేట్లు పద్యం లో శాశ్వతం చేశారు .అతి నిరాడంబర జీవి సుఖాలకు అతి దూరం గాంధీ కి అత్యంత సన్నిహితుడు . అందుకే ఆయనకు ఒక ప్రత్యేక హోదా ఏర్పడేది ..లక్నో కాంగ్రెస్ కు వెళ్లి స్నానం చేద్దామనుకొంటే వేడినీళ్లు పెట్టిస్తాం అంటే ‘’మేమంత నాజూకు వాళ్ళం కాదు .మహాత్ముని అనుచరులం .మాకు వేన్నీళ్ళ భోగం అనవసరం ‘’అని చెప్పినా వినకుండా చన్నీటి స్నానం చేసి స్నానాల గదిలో కొయ్యబారి పోయారు . చాలాసేపటి కానీ ఎవరూ గుర్తించలేదు.  అప్పుడు హాస్పిటలూ ట్రీట్ మెంట్ జరిగింది .దీనితో ‘’గాంధీకి మనోవాక్కాయ కర్మల సన్నిహితుడిని అనే అహంభావం పోయింది ‘’అన్నారు .’’యవ్వనం లో నాటకాలు వేసి ఒప్పించాను మెప్పించాను నమ్మించాను కానీ ఇప్పటి నాటకం లో పాత్ర రక్తి కట్టలేదు ‘’అని వ్యధ చెందారు .

37-చిత్ర నళీయం -యడవల్లి సూర్యనారాయణ నలుని పాత్ర బాగా పోషించేవాడు ఉప్పులూరి సంజీవరావు దమయంతి వేషం కట్టేవాడు అల్లం మస్తాన్ అనే వస్తాదు  బాహుకుడిగా వచ్చి పెద్ద సైజు కట్టెల్ని తొడమీద పెట్టి  తేలికగా  విరిచి పారేసేవాడట .నలుడు బాహుకుడుగా మారితే చిక్కి శల్యం అవ్వాలికాని ఇంతబలం ఎక్కడిది అని ప్రేక్షకులు చెవులు కొరుక్కునేవారట .యడవల్లి నలునిపాత్రపై అబ్బూరి –

‘’యడవల్లి సూర్యనారాయణ -చెడ దొబ్బెను నలుని పార్టు ఛీ !ఏ ముండా -కొడుకిచ్చే వీనికిం ,బలి -చెడుగుడు నాట్యమ్ము కొరకు చీనాంబరరముల్ ‘’అని  చెడ  తిట్టారట –

వరద లో తేలి (రి )న తేట ఊట ఇంతటితో సమాప్తం

 

ఈ 7వ ఎపిసోడ్ కు ఆధారం ‘’వరదకాలం ‘’ మిగిలిన 6 ఎపిసోడ్ లకు ‘’కవన కుతూహలం ‘’ఆధారం అని మరోక్క్కమాఱు వినయంగా తెలియ జేస్తున్నాను .

ఇందులో చాలామంది చాలామందికి తెలిసే ఉంటారు .కానీ లోతులు తెలిసిఉండవు నేను తెలుసుకొని ఆనందించి మీరూ అనుభూతికి లోనవుతారని రాశాను . నేనేదో ఇది చదివానని మీరు చదవలేదని చెప్పటానికి కాదు మహా  మహుల  సంస్మరణం శ్రేయోదాయకం అని నమ్మి రాశాను

 

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద లో తేలి (రి)న తేట ఊట -6

వరద లో తేలి (రి)న తేట ఊట -6

 

31-కృష్ణశాస్త్రి -’’నా కఠినపాద శిలల కింద బడి నలిగి -పోయే నెన్నియో మల్లెపూలు మున్ను ‘’

ప్రాణ సఖుడె నాకోసమే పంపినాడు -పల్లకీ అన  హృదయమ్ము జల్లుమనును .’’

ఆకాలం కవులందర్నీ ఇంటిపేరుతో పిలిస్తే శాస్త్రిగారినోక్కరినే కృష్ణ శాస్త్రి అని పిలిచేవారు దీనికి కారణం ఏమిటని ఆయన్నే వరద అడిగితె ‘’వాళ్ళు అంటే వాళ్ళ కవిత్వమే గుర్తుకు వస్తుంది కృష్ణ శాస్త్రి అంటే కవిత్వం తోపాటు నా వేషం కూడా గుర్తుకు వస్తుందని కుంటా ‘’అన్నారు .

అబ్బూరి ,చలం ,కృష్ణ శాస్త్రి ముగ్గురే ప్రతిభావంతులైన హాస్యప్రియులు అన్నాడు వరద ..చలం మాట్లాడుతుంటే నవ్వలేక ఆకలేసి అరటి పళ్ళు ఆరగా ఆరగా తినేవాడట పోలేపెద్ది సుబ్బారావు ..చలం శాస్త్రిగారు కూచుని మాట్లాడితే ఆకాశమే నవ్వేది అన్నాడు వరద .సమయస్ఫూర్తితో హాస్య ప్రసక్తి చేయగల నేర్పు శాస్త్రిగారిది . తెలుగు జాతికి హాస్య స్ఫూర్తి తక్కువ అని అబ్బూరి కృష్ణశాస్త్రి భావించేవారు .  ఈ హాస్య త్రయం ఆంద్ర దేశానికి బయటే మరణించటం యాదృచ్చికం ‘శాస్త్రిగారు పద్యం చదువుతుంటే ఒక విచిత్రానుభూతికి లోనవుతాం .అయన పద్య పఠనం రికార్డ్ కాకపోవటం దురదృష్టం .

 అశ్లీలాల  తోకూడా హాస్యం గా పద్యాలు రాశారు .

 శ్రీ తిరుపతి గారిపై –

‘’ముదియొకడు బాహుమూలల్లో మరోరెండు -దాడి యొకడు ,తమిళనాడొకండు -వెరసి పంచ శిఖలు తిరుపతి యోగికి -విశ్వ దాభిరామ వినుర వేమ’’అని సరదా పద్యం చెప్పారు .

శాస్త్రిగారి ప్రముఖ పద్యం -’’నాకనుల క్రాగు చీకట్లు ప్రాకు చోట -లేదు నెత్తావి ,మధువేని  లేదు ,లేదు -ప్రాణ ,మొక్క లావణ్యమ్ము లేదు -యేను రుజనైతి ,జర నైతి  ,మృత్యువైతి ‘’ఈ పద్యానికి ప్రతిరూపంగా స్టీఫాన్ జ్వీ గ్  రాసిన ‘’ఏ లెటర్ ఫ్రేమ్ ఆన్  నోన్ ఉమన్ ‘’ లో ఉత్తరం రాసిన ఆ స్త్రీ ని తలచుకొంటే శాస్త్రిగారి పై పద్యం గుర్తుకు వస్తుందని వరద తో పాటు శాస్త్రిగారూ అన్నారు .

వరద జైలులో ‘’చెరకాలం ‘’రాస్తూ శాస్త్రిగారిపై -’’ఆశలే చివురించని శైశవాన -మీ కవిత్వాన్ని నేనెంత మెచ్చుకొంటి -ఊర్వశీ ప్రవాసమ్మున పూర్వ గతిని -కంఠ పాఠ మ్మొనర్చిన గాథ కలదు ‘’అని రాశాడు

‘’మీ శిరోజాలు రోజాల రాశివో లె -మ్మారిపోయిన ప్రాయాన మంచి మంచి -పాట లెన్నేని  వ్రాసిరి నేటి దనుక -మరల నా యభిమానమ్ము తిరిగి వచ్చే .’’

‘’నేడు చెరసాల మృత్యు సాన్నిధ్యమందు -నా కొరకు నా విచిత్ర  దైన్యమ్ము జూచి -చెమ్మగిలు నయనమ్మేని చెంత లేదు -ఏ లకో నా యెడంద మీ మ్రోల  వ్రాలి పోవు ‘’వీటిని శాస్త్రిగారికి పంపాడు ఆయన మళ్ళీ పద్యాలు రాసిపంపారు ..అందులో ఒకటి –

‘’కారు మబ్బు వానకారు ,వాగులు పొంగి -నిండినదులు  వరద నింగి కెగసె -వానలోన నీవు ,వాన కావల నేను -అంతే  బతుకు ,చివరికంతె ,అంతే ‘’

32-మాధవ పెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి -పద్యం చదవటం లో చెళ్ళపిళ్ళ ,విశ్వనాధ  వేలూరి ని మించిన ప్రఙ్ఞకలవాడు .ఆయన శైలి అనితర సాధ్యం .హాస్య చతురోక్తులలో అందెవేసిన చెయ్యి ..వెంకట శాస్త్రిగారి శిష్యులలో సంగీత నిష్ణాతులు బుచ్చి .. కవిత్వం వలన తెలుగునాట బతకటం కల్ల అని నమ్మాడు ..తెనాలి అంటే పంచప్రాణాలు  వదిలి ఉండేవాడుకాదు.’’స్వర్గం ఎలా ఉంటుందో తెలియదుకనుక దానికి వెళ్ళను .నరకం ఎలా ఉంటుందో స్వానుభవం వలన తెలుసుకున్నాకానుక నరకానికి పోతా ‘’అనేవాడు .

‘’రసజగన్నాధనటరాజ రంజమాన  -మంజుతారాళి అద్దియే మా తెనాలి ‘’అని చాటువు చెప్పాడు .

ఒకసారి కాలువగట్టు వెంట నడుస్తుంటే మూడు బొమికలు కనిపిస్తే ఆయన ఆకాశం వెనక చూసి ఆశువుగా పద్యం చెప్పాడు –

‘’చూడ0జూడ  మహాశ్మశాన మనిపించున్ -నాకు నీ లోక ,మిం -దేడన్ గాలిడ బోవ నేరపయినో -యే  వేయు చున్నట్టులే -లో డక్క య్యెడి గాని నీ మహిమ -యాలో నే నివారించి ,నీ -క్రీడా రంగమటన్న మాట స్మృతికి0 -గీలించు  మృత్యుమ్ జయా ‘’

అని చెప్పి గట్టిగా నవ్వి వెనక్కి పోదాం పద -జీవితం లో ఎప్పుడూ ముందుకు పోలేం ‘’అని విరక్తిగా అన్నాడు వరదతో   .

33-అబ్బూరి రామ కృష్ణారావు -1919 లో  కలకత్తా వంగ దేశీయాంధ్ర సమితి వార్షికోత్సవం లో అధ్యక్షుడైన సర్ సి వి రామన్  ప్రక్క ఉపాధ్యక్ష స్తానం లో ఒక విద్యార్థిగా రామ కృష్ణారావు ఉండి ముఖ్య అతిధి ,ఏ హిస్టరీ ఆఫ్ ఇండియన్ లాజిక్ ‘’అనే మహా గ్రంధాన్ని రాసిన విఖ్యాత తర్క శాస్త్ర వేత్త సతీష్ చంద్ర విద్యాభూషణ్  సమక్షం లో అరగంట సేపు సంస్కృతం లో అనర్గళం గా ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపడేట్లు చేశారు . రామన్ ,అబ్బూరి భుజంతట్టి ‘’దక్షిణ భారత దేశ గౌ రవాన్ని నిలబెట్టావు ‘’అని అభినందించాడు . ఆసభలో ఉప్పల లక్ష్మణరావు మాగంటి బాపినీడు వంటి ప్రముఖులున్నారు .

రెండేళ్లు మైసూరు సంస్కృత కాలేజీలో చదివి అప్పటికి కలకత్తా వచ్చారు అబ్బూరి .రాళ్లపల్లివారు మైసూర్ లో సహాధ్యాయి .అప్పుడే రాసిన ‘’మల్లికాంబ ‘’ప్రచురితం .ఆంద్ర భారతి లో గురజాడ అబ్బూరి రాయప్రోలు రాసేవారు ..దీని తర్వాత ఆంద్ర గ్ర 0ధాలయ సర్వస్వము వస్తే అందులో ఖండకావ్యాలు రాశి ప్రచురించారు ..అయ్యంకివారు సంపాదకులు . అయ్యంకి ‘’ఆధునిక కవిత్వానికి గురజాడ అబ్బూరి రాయప్రోలు కవిత్రయం ‘’అన్నారు . కలకత్తా లో ఉండగా కొన్ని పద్యాలు రాశారు

‘’నోటి నిండుగ భుజింపఁగనోచుకొ నము-ఉదయ గీతులుపాడ  నో పెదముగాని -కన్నతల్లుల ప్రేమమార్గమ్ము గనము -లలితగతి వీణ వాయింపగలము గాని -తొడిమ లెడ   సేయగా రాలిపడిన పూల -వలపు లేవి ?భిక్షా0 దేహి భవతి భవతి ‘’

కలకత్తా యూ ని వర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన పద్య సంకలనం’’ఊహాగానం ‘’ మద్రాస్ నుంచి1918 లో  వెలువడింది .ఆధునికాంధ్ర కవిత్వానికి శ్రీకారం చుట్టిన కొద్దిపుస్తకాలలో  ఒకటయ్యిందిఅది .దుష్ట సమాసమే అయినా ఎవరూ ఆక్షేపించలేదు ఆయన సంస్కృత ఆంద్ర విద్వత్తును చూసి ..విప్లవాత్మక పద్ధతిలో పద్యాల పేర్లు తీసేశారు మొట్టమొదటిసారిగా .తరువాత చాలామందికవులు దీన్నే అనుసరించారు .

ప్రముఖ మల్ల యోధుడు కోడి రామ మూర్తిమీద అబ్బూరి పద్యాలు రాశారు .వాటిని ఆయన రుమాళ్ల మీద అచ్చు వేయించి అందరికి పంచిపెట్టాడు ..ఆయన ప్రదర్శనలో ముందువరుస రెండు కుర్చీలు అబ్బూరి దంపతులకు కేటాయించి భక్తి ప్రకటించేవాడు ..కలకత్తా లో డిగ్రీ పొంది కొంతకాలం శాంతి నికేతన్ లో గడిపి ఇంటికి వచ్చారు .

కొడవటి గంటి వెంకట సుబ్బయ్య  రాసిన పద్యాలను వరద ప్రసిద్ధ ఆంగ్లకవి డబ్ల్యు హెచ్ ఆడెన్  కు చదివి వినిపించాడు అమెరికా  లో –

‘’ఈ అతి లోక మోహన మహీతల మందున తోడులేక పా-ధేయము లేక సిగ్గిలి మదీయ మనోహర భావ పల్లవ -చ్చాయలలోన వ్యర్ధపు విచారము తో నవవాప్త కామ్యముల్ -రోయుచు భగ్నమాలికలు ప్రోవులు సేయుచు సంచరించెదన్ ‘’

 దుగ్గిరాల వారి పరిచయం తో అబ్బూరివారి జీవితం మారిపోయింది -రాజకీయ ప్రవేశం జరిగి రచన  వెనకబడింది  దుగ్గిరాలకు యమునా కల్యాణి అంటే మహా ప్రాణం

 

మళ్ళీ పుంజుకొని గజళ్ళను మొదటిసారిగా తెలుగులో రాశారు  భుజంగ ప్రయాతాన్ని రగడ ను మధ్యాక్కరను విభిన్న ధోరణిలో ప్రయోగించారు . ఇన్ని చేసినా అక్కిరాజు ఉమాకాంతం ‘’నేటికాలపు కవిత్వం ‘’లో అబ్బూరిని ముట్టుకోలేదు .అలా ఎందుకు చేశారు అని గంటి సూర్యనారాయణ గారు అడిగితె ‘’చక్కని భాషా అలంకార  జ్ఞానం  కవన ప్రజ్ఞా ఉండటం లోపాలు లేకపోవటం వలన వదిలేశాను ‘’అని ఉమాకాన్తమ్ ఉవాచ .

దుగ్గిరాలవారి చీరాల సత్యాగ్రహానికి అబ్బూరి కుడిభుజంగా నిలిచారు . దీనికి పిత్రార్జితం అంతా ‘’కరారావుడి ‘’చేసేశారు ..చీరాల విఫలమైనతర్వాత మద్రాస్ వెళ్లి చందమామ అనే బాలల పత్రిక కోసం ప్రయత్నించారు .దానికి ప్రమోదకుమార ఛటర్జీ గుర్రం మల్లయ్య రహ్మాన్ చుగ్తాయ్ వంటి ప్రసిద్ధ చిత్రకారులు చిత్రాలు వేసిపంపారు . దానికోసం కొన్న ఖరీదైన పేపరు ఆంద్ర పత్రికా ఫీసు లో చెదలుపెట్టి పనికిరాకుండా పోయింది .ముఖ చిత్రం ఒక్కటే అచ్చయింది తర్వాత చక్రపాణి దాన్ని తెచ్చాడు .ఈ నాడు అనే పేరుతో దినపత్రిక తేవటానికి కర్నూలు మిత్ర బృందం వారికి డిక్లరేషన్ తెప్పించారు అబ్బూరి  . తర్వాత అది రామోజీ రావు కు దక్కింది .

‘’అసలు నేనెందుకు రాయాలి /’’అనే శీర్షిక పెట్టి ఎందరెందరితోనో రాయించారు అబ్బూరి.

  విశాఖలో ఆంద్ర విశ్వ విద్యాలయగ్రంథాలయాన్ని  ఒకే పుస్తకం ఒకే కుర్చీతో అబ్బూరి ప్రారంభించారు . జగన్నాధ పండితరాయలు ఢిల్లీ దర్బారులో లో ‘’లవంగీ దృగంగీ కరోతు ‘’అని చెబితే దుగ్గిరాల ‘’ఫరంగీ ఫరంగీ దృగంగీ కరోతు ‘’అని పేరడీ చేశారు . అబ్బూరి చివరి రోజుల్లో ఢిల్లీలో వరద ఇంట ఉన్నాడు .స్నానాల గదిలో జారిపడికాలు విరిగి మంచానికే అతుక్కుపోయారు .పురాణం సుబ్రహ్మణ్య శర్మ వచ్చి ఆయన చాటువుకులన్నీ చంకనేసుకు పోయాడు .పత్రికలో ప్రచురణకు .,ఎజ్రాపౌండ్ జైలు జీవితం పై పుస్తకాన్ని ,ఆల్డస్ హాక్స్లీ భార్య లోరా రాసిన గ్రంధాన్ని చదివి వినిపించుకొనేవారు ..మంచం లో ఉండగా అబ్బూరి చెప్పిన చివరి పద్యం –

‘’చచ్చి పోయి జీవి ఎచ్చటి కేగునో -ఏమి యగునో ఎవరికెరుకరాదు -ఎరుక లేని వార లేమెమో చెప్పగా -విని తపించువారు వేనవేలు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద ´లో తేలి (రి )న తేట ఊట -5

వరద ´లో తేలి (రి )న తేట ఊట -5
—

25-ముద్దు కృష్ణ -సామి నేని ముద్దుకృష్ణ స్థిరంగా ఒక్క చోట ఉండేవాడుకాదు .ఎక్కడ కవులు వాలితే అక్కడ వాలిపోయేవాడు ..పెళ్లి చేసుకోలేదు ..ఎక్కువకాలం కాకినాడ రాజమండ్రి లో గడిపాడు ..కవిత్వం రాశాడు కానీ అచ్చేసుకోలేదు ..ఏదో కొత్తదారి తొక్కాలని కాంక్ష ఉండేది . సంచలనం కల్గించాలని తపన . తెలుగు కవిత్వం లో మంచివన్నీ ఏరి సంకలనం గా ”వైతాళికులు ”తెచ్చిన ఘనత ఆయనదే .దీన్ని శ్రీశ్రీ మెచ్చలేదు .ఎంపిక కృష్ణ శాస్త్రి చేశారని ముద్దుకృష్ణకాదని ఆయన అభియోగం .ఇందులో కొంత నిజం లేకపోలేదన్నారు వరద .
  ఆధునిక సాహిత్యానికి కృష్ణ శాస్త్రి చేసి పెట్టినంత ప్రచారం వేరెవ్వరూ చెయ్యలేదు .ఆధునిక కవులపద్యాలు గేయాలు ఊరూరా పాడి వినిపించింది శాస్త్రిగారే . ఆయనపాడిన వాటిలో తొంభై శాతం వైతాళికులు లో చేరాయి ..ఇంగిలీషు లో వచ్చిన ”గోల్డెన్ ట్రెజరీ ”ని మనసులో పెట్టుకొని వైతాళికులు తెచ్చానని ముద్దుకృష్ణ అన్నాడు . ఎన్నో ముద్రణలకు నోచుకున్నది
 ముద్దుకృష్ణ మాత్రాఛందస్సులో ప్రయోగాలు చేశాడు –
”వేయరా మగ్గం -నేయరా -నేయరా గుడ్డా -చేయరా -చేయరా సేద్యం
కాయండి యువకులు -కాయండి భుజములు కష్టంగా ఉంటుంది -కానీ తప్పదు మనకు
 బెజవాడలో ”జ్వాల”పత్రిక నడిపాడు అందులోనే శ్రీశ్రీ ”మరో ప్రపంచం ”మొదటి సారి అచ్చు ముఖం చూసింది .ఆపత్రికలో ”ఎవరైనా అక్రమ సంబంధం వలన చాటుగా పిల్లల్ని కంటే ఆదుకుంటాం ”అనే ప్రకటన ఉండేదని వరద గుర్తు చేశాడు . హరీన్ ఛట్ఠో ప్రభావం తో నాటకాలలో వేలు పెట్టాడు .అనార్కలి అశోకం అనే రెండు నాటికలు రాశాడు ముద్దు .వీటికి పూర్వమే చలం హరిశ్చంద్ర రాశాడు అయితే చలం నాటకం ఎక్కడా ప్రదర్షింపబడలేదన్నాడు వరద .
 గుంటూరులో అశోకం నాటకం ఆడుతుంటే సీత రావణుడికి అతి దగ్గరగా రావటం చూసి ప్రేక్షకులు సహించలేక వారి మద్దరి మధ్యా వెళ్లి కూర్చున్నారని నాటకం ఆగిపోయిందని వరద అన్నాడు ”ఈ నాటకాలను ముందు ప్రజలచేత చదివించి తరువాత ప్రదర్శించాల్సి ఉంది ”అన్నాడు ముద్దు వార తో
  తన సాహిత్య స్మృతులు రాసి పుస్తక రూపం లో తెద్దామనుకొన్నాడు .కానీ రాసింది మాయమై పోయింది .తరువాత వరద అడిగితె ”మంచిపనే జరిగింది వరదా .నాకు తెలిసినకవుల వెధవపనులన్నీ గుర్తున్నాయి వాటిని రాసి ఉంటె మనల్నీ తిడతారు .వాళ్ళ కవిత్వాన్ని మెచ్చుకొందాం లే ”అన్నాడు .
మిత్తులు బెజవాడలో సన్మానం చేద్దామనుకొంటే వారితో ”పెళ్లికాని వాడిని .నాకో మానం ఇప్పించండి సన్మానం వద్దు ”అని చమత్కరించాడు .ముద్దుకృష్ణ తాత ముద్దు నరసింహం గారు ”హిత సూచీని ”గ్రంధాన్ని 1840 లో రాసి వీరేశలింగానినికి పరోక్ష మార్గ దర్శకులయ్యారని వరద ఉవాచ అందులో వితంతు పునర్వివాహాన్ని సమర్ధించారు .శిష్ట వ్యావహారిక రచన .ముద్దు కృష్ణకూ సంఘ సంస్కరణాభిలాష వారసత్వంగా వచ్చింది .
26-తురగా వెంకట రామయ్య -”లోకాలు నాకెలానే -కోకిలా -బాలకృష్ణుడే చాలునే ”వంటి గేయాలు రాశాడు దీన్ని ద్వారం వారు ఫిడెల్ మీద వాయించి చిరస్మరణీయం చేశారు . దరిద్రం అనుభావిస్తున్నా ముఖం లో కొంటె తనం ఉండేది .బసవరాజు అప్పారావు తర్వాత గేయరచనలో తురగా సిద్ధ హస్తులు అన్నాడు వరద .శ్రీశ్రీ మీద ఆయన ప్రభావం ఉన్నది .పొల్లు లేని రచన ఆయనది
”దున్నరా ఈ భారత భూమిని -తొలకరించిన పుణ్య భూమిని -కరువు లేనీ స్వర్గ రాజ్యపు -దొరవు నీ వయ్యెదవురా ”
 తురగా వారిమీద వరద ”తురగ వెంకట రామయ్య -కొరగాని కవిత్వ మేల కొలిచెదవయ్యా ”అని ఆశువుగా చెప్పాడు వరద తలనిమిరి ”పద్యం బాగుండకపోయినా నిజం చెప్పావు నాయనా ”అన్నారట ..పిల్లలకోసం ఒక రాత పత్రిక ”జాబిల్లి ”తెస్తూ వరద ముఖ చిత్రం పై తురగావారి చేత
”ఆడుకొనుము పాడుకొనుము -ఆనందముతో వత్సా !తెలుగుతల్లి దీవెనలం -దించి మెచ్చన్ ”గేయం రాయించి వేశాడు ..ఆయన కావ్య సంకలనానికి ఎవరైనా పూనుకొని పుణ్యం కట్టుకోమని వరద గోల చేశాడు .
27-పురిపండా అప్పలస్వామి -విశాఖలో ఖద్దరు షాపు ఉండేది ఆయనకు .”కలాపహాడు అనే ఒరియా నాటకాన్నితెలుగులో అనువదించి ప్రచురించారు  భావకవిత్వం రాశారు . కృష్ణ శాస్త్రి ప్రభావం ఎక్కువ  ఆ వయసులోనూ ఇంగిలీషు ను సబినవీసు కేశవరావు గారిదగ్గర నేర్చుకునేవారు ఒకరోజు రాత్రి పిడుగులతో పడిన వర్షానికి ఆయన గది గోడమీద పిడుగుపడి ఎదుటి గోడకు కన్నం వేసింది ఈ అనుభవాన్ని ఆయన మర్నాడు కవిత్వీకరించారు .అదే ”సౌదామిని ”ఈ పేర సంకలనం తేవాలనే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు ..కట్టమంచి తో ముందుమాట రాయించామని వరద నాన్నగారికి చెబితే ఆయనకిస్తే ,రామ కృష్ణారావు రాయలేదుకనుక తానెందుకు రాయాలని వ్రాతప్రతిని కూడా తిరిగి పంపలేదు .తర్వాత శ్రీ శ్రీ అందులో కొన్ని గీ తాలను ఇంగిలీషు లోకి తర్జుమా చేసి చిన్న పుస్తకం గా తెచ్చాడు ..సాహిత్యానికి అంకిఅతమైన జీవి స్వామి .శ్రీశ్రీ లాంటి వారెందరినో ప్రోత్సహించారు ..మాత్రా ఛందస్సులో అపురూప ప్రయోగాలు చేశారు స్వామి .అందులో ”మల్లెమడుగు ”పదికాలాలు నిలిచెరచన అని వరద విశ్వాసం .విశాఖ లో కవుల ఛాయా చిత్ర ప్రదర్శన మొట్టమొదటి సారి నిర్వహించింది అప్పలస్వామిగారే ఇది గ్రంథ రూపం పొందాలని వరద కోరాడు

28-నళినీ కుమార్ -అసలుపేరు ఉండవల్లి సూర్య నారాయణ ..శ్రీ శ్రీ మహా ప్రస్థానాన్ని అచ్చు వేసినవాడు నళినీయే .విశ్వనాధ కూడా తన రస తరంగిణి ప్రెస్ లో అచ్చు వేద్దామని ప్రయత్నించారు . జీవితం వికృతి అని భావించాడు .”పణ  విపణి ”కావ్యం రాశాడు .
”ముండ్లు లేని గులాబీ ల -చెండ్లకు దారమ్ము లేదు -క్రీనీడలు లేని వెలుగు -తానీషాలైన కనరు
శృతి కలియని పాటలతో -బ్రతుకంతయు చితికినది -ఏనాటికి వ్రాసినదో -ఈ నాటికి సుఖాంతమ్ము
యాచకులై ఎంచుకొనగా -నావకాశము కోరు టెట్లు ?జీవులెల్ల యాచకులే -జీవనమొక కబళ మ్ము ”
29- శ్రీరంగం నారాయణ బాబు -బుజం మీద దిగజారిన జుట్టూ ,చెంపలమీద నున్నగా దువ్వుకున్న గిరజాలు ,చిన్న చక్కని మీసం ,కళ్ళజోడు ,చాతీకి ఎడమవైపు ఖాజాలతో లాల్చీ , బెంగాలీ ధోవతి నారాయణబాబు ఆహార్యం ..నటాలిలో ఉద్యోగించాడు ..చెకోవ్ రాసిన చెరీ ఆర్చర్డ్ ను నాటకంగా అనువాదం చేయమని ఇస్తే చేశాడు కానీ అబ్బూరి నచ్చక శ్రీ శ్రీ వరదలకిస్తే ”సంపంగి తోట గా అనువదించి ప్రదర్శించారు .దీనిపై పెద్ద దుమారం లేపాడు దీనికి వేదిక ”నవోదయ వారపత్రిక ”లో నీలంరాజు వెంకట శేషయ్యకల్పించాడని వరద అంటాడు బాబు అమాయకుడేకాక భాష మీద అధికారం సాధించలేదన్నాడు వరద
30-అరసం -అభ్యుదయ రచయితల సంఘం ను అబ్బూరి ”మనం నాద బ్రహ్మను ఆశ్ర యిస్తే వాళ్ళు నినాద బ్రహ్మ ఆరాధిస్తున్నారు మనకి కుదరని వ్యవహారం ”అన్నారు .అరసం కమ్యూనిస్ట్ వాసన వేస్తోందని తెలిసి చాలామంది తప్పుకున్నారు .
విశ్వనాథను వరద ”మీ తోటికవులు అంతా అభ్యుదయ వాదులైతే మీరొక్కరే ఒంటరై పోయారేం /అని అడిగితె ఆయన –
”అరసంఘమే పెద్ద -అక్షయ పాత్ర -అడ్డమైన కవితే -అన్నపూర్ణాదేవి ”అన్నారు అప్పుడే కృష్ణ శాస్త్రి అరసం మీటింగ్ లో అధ్యక్షోపన్యాసం చేస్తున్నారని వరద  చమత్కరించాడు . .
  సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద ´లో తేలి (రి )న తేట ఊట -4

వరద ´లో తేలి (రి )న తేట ఊట -4

17-అడవి బాపి రాజు -బాపి రాజు గారికి రాయటమే ప్రధానం అనిపిస్తుందని వరద జోక్ చేశాడు .దానికాయన ”ఏదైనా మనసుకు గోచరిస్తే మాటలే ప్రధానం నాకు .అవెలా తట్టితే అలా రాస్తాను .భాషతో నాకు నిమిత్తం లేదు .. నేను సహజకవిని ”అన్నారు .”వాగాడంబరం నాకు సయించదు .నా కవిత్వం నాది .ప్రకృతికి నాకు ప్రత్యక్ష సంబంధం .మొదట్లో కవిత్వం వద్దనుకున్నా తర్వాత ఎందుకు రాయకూడదు అని రాశా .;లలిత కళ ల న్నిటా ప్రావీణ్యం పొందితే కవిత్వం అత్యంత సహజ సుందరమవుతుంది ”అన్నారు .ఆయనది గుప్త మోహనమైన అమాయకత్వం అన్నాడు వరద . అదే అందరినీ ఆకర్షించింది .దుగ్గిరాల వారు ఆశించి నట్లు బాపిబావ విశ్వ విఖ్యాత చిత్ర రచన చేయలేకపోయారు ..

18- బసవరాజు అప్పారావు -”కొల్లాయి గట్టి తేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి ”పాటతో జగత్ప్రసిద్ది చెందారు ..కవిత్వం కోసం జీవిద్దామని భ్రమలో ఉండేవారు .. దుగ్గిరాల ప్రభావం బసవరాజు పై ఎక్కువ … ”హృదయాన్నే మాటల్లో పెట్టె శక్తి అప్పారావు ఒక్కరే సాధించారు .

దుగ్గిరాల మరణిస్తే -”ఏల పాడనింక యమునా కల్యాణి -నే లీలా మానవుడు గోపాలుడు లేడాయె -బంగారు గనులలో చెంగలించేవేళ -పిడుగు బోలిన వార్త వినిపించే నాకయ్యొ ”అని కన్నీరు మున్నీరుగా విలపించారు … ఆయన ప్లీడర్ వృత్తి సరిగ్గా సాగలేదు బెజవాడ అంటే విరక్తి కలిగింది . భారతి ,పత్రికలలో సబ్ ఎడిటర్ ..

ఢిల్లీ లో కుతుబ్ మినార్ అశోక స్తంభం ,మసీదు ఆర్య దేవాలయం ప్రక్క ప్రక్కనే ఉండటం చూసి చలించి -వెంటనే

”ఇది మొగల్ దివాణమా ? ప్రళయ శివ మహా స్మశానమా ?ఇది విజయ స్థంభమా ?చల విద్యుఛ్చ0ద్ర చూడ దంభమా ?ఇవి జీర్ణ సమాధులా ?ప్రమాద గణ నివాస వీధులా ?ఇది యవన వికాసమా ?నటేశ తాండవ విలాసమా ?”అని గేయం రాశారు ఇదే ఆయన ఆఖరి గీతం …ఢిల్లీలో ఆయనకు మతి తప్పింది అనుకున్నారు మిత్రులు -ఆయన ఆశించినట్లు –

”బతుకు బరువు మోయలేక -చితికి చితికి డస్సి వాడి -ఫికరు పుట్టి పారిపోయి -ఒకడనే యే తోటలోనో -పాట పాడుతుండగనా -ప్రాణి దాటి యేగేనా ?ప్రాణి దాటి యేగు చుండ -పాట నోట మోగేనా ?”అంతిమ క్షణం అలానే జరిగింది ..

19- కవిగారు -మారేపల్లి రామ చంద్ర శాస్త్రిగారు కృష్ణా జిల్లా కనక వల్లి నుండి విశాఖ చేరి అదే కార్య క్షేత్రంగా గడిపారు . కాళ్లకు చెప్పులు ఉండేవికావు.తనను చూసి విష జంతువులూ దూరం పోతాయనేవారు శుద్ధ శ్రోత్రీయ బ్రాహ్మణ వేషం ..విశాఖ లో ఆబాలగోపాలం ఆయన్ను కవిగారు అనేవారు ..ఆయన కవితాసమితికి ఆజీవ అధ్యక్షులు ..” తెలుగు నుడి ”ని సేకరించి ”నుడికదలి ”నిఘంటువు తయారు చేయాలన్నది ఆయన ఆశయం . అచ్చ తెలుగు ను ఆరాధిస్తే అందరికీ దూరమై పోతామేమో నని చాలా మంది సంశయం వెలి బుచ్చారు .అందుకనే పెద్దగా సహాయ సహకారాలు అందలేదు .అమాయకత్వం వినయం ఆయన సొమ్ము .ఘోషా ఆస్పత్రి దగ్గర చిన్న పూరిపాకలో నివాసం .దానిలోనే లైబ్రరీ .సాంబ నిఘంటువు సంపాదించి దానిపై పరిపూర్ణమైన అధికారం సాధించారు . బాలికా విద్య కోసం శ్రమించారు . సంస్కరణలు తెచ్చారు .. యాంత్రిక నాగరికత నచ్చేదికాదు .. మైకుల్లేని రోజుల్లో వేలాది మందిని తన ఉపన్యాస0 తో ఆకట్టుకొనేవారు . జాతీయోద్యమం లో గాంధీ వెంట ఉన్నారు .

కవి గారి షష్టి పూర్తి 19 33-34 లో జరిగింది .ఆయన ఆశ్రమం నుంచి ఊరేగింపుగా సభామండపానికి తెన్నేటి విశ్వనాథంగారు కారులో కూర్చోబెట్టుకొని తీసుకు వచ్చారు .విశాఖ యావత్తూ ఊరేగింపులో పాల్గొన్నది .అంతటి భారీ ఊరేగింపు విశాఖ లోనే కాదు మరే పట్టణం లోను జరగలేదని వరద ఉవాచ .ఆయన సభలో ప్రసంగిస్తుంటే ఆయన చెక్కులమీద ఆనంద బాష్పాలు ధారగా కారిపోయాయి .అంతటి పరవశం కల్గించారు విశాఖ ప్రజలు .అంత చక్కని ఉపన్యాసాన్ని తానెన్నడూ వినలేదన్నాడు వరద

కవి గారికి వ్యాపకాలు ఎక్కువ దానితో నుడికదలి మందగించింది .ఉత్తరాల్లో కూడా అచ్చ తెలుగే రాసేవారు ..శుభం అని రాయటానికి బదులు ”మేల్ ”అని రాసేవారు ..ఆయనకు దేవుడు కు అచ్చ తెలుగు పదం దొరకలేదు .చివరికి కొత్త పదం ”ఎల్లడు ”ను సృష్టించారు . దీన్ని శ్రీ శ్రీకి వినిపిస్తే పగలబడి నవ్వాడు పురిపండా ముక్తసరిగా ”బావుంది ”అన్నాడు .

20-నాయని సుబ్బారావు -అగ్ర శ్రేణి కవి . కానీ తగినంత ప్రాశస్త్యం రాలేదు .. ”మాస్ మీడియా వచ్చి సాహిత్యాన్ని బతకనీయటం లేదు ఒక వేళ బతికినా జీవచ్ఛవంగా ఉంది ”అని ఆయన అభిప్రాయం .

21-బొడ్డు బాపిరాజు -చదునైన ముఖం ,చిన్న మీసాలు ,ఎడం పాపిట ,ధోవతి లాల్చీ వెడల్పాటి అంచు ఉత్తరీయం తో ఉండేవాడు . ప్రచార భాగ్యం శిష్య వర్గం లేని కవి .. బహుమాన సత్కారాలూ లేవు . 1973 లో ఒక చిన్న సభ జరిపి అభినందిస్తే కవిత్వానికి గౌరవం కల్పించారని పొంగిపోయి ,ఆనంద పారవశ్యం తో అక్కడికక్కడే చనిపోయాడు .-అతని కవిత్వానికి మచ్చుకు –

”ఓయి ప్రభూ తపింతునిట -లుర్వి ధరాగ్రము నెక్కి ఎన్ని య -ధ్యాయములేగె లోక కథ -యంతయునుం దిలకించినావె ?యధ్యాయము లయ్యె నేమి భవదీయ -జగద్ధిత మార్గముల్ దయా -తోయధి వౌచు కొండా దిగె -దో యొక గట్టుకు జేర్చువో భువిన్ ”.

22- మాచిరాజు దేవీ ప్రసాద్ -భావ కవుల్ని ఎద్దేవా చేస్తూ పారడీలు రాశాడు ..దీన్ని బాగా పండించాడు జలసూత్రం . 1949 లో కృష్ణ శాస్త్రి పఠాభి ,అబ్బూరి ,దేవిప్రసాద్ పద్ధతులలో రాసి పేరు లేకుండా మల్లవరపు విశ్వేశ్వర రావు సహాయం తో శ్రీశ్రీ ద్వారా భారతిలో అచ్చు వేయించారు . కొన్ని –

”అసలు శ్రావణమాస మధ్యమ్ము నందు -కురిసి తీరాలి వర్షాలు ,కొంచె కొంచె -మేని రాలాలి తుంపరలేని ,కాని -ఉక్కమాత్రమేమాత్రమూ ఉండరాదు .

ఇపుడు నా వొళ్ళు కొంత లావెక్కి సుంత -కదిలితె చెమట వాసనలు కక్కుతుంది -నేనె వర్షపు మేఘమైతేను ,పైని -ఒట్టిపోయింది కొండపై ఉత్తమబ్బు ”

కర్ణ పేయంగా కవిత్వాన్ని మలచిన కీర్తి దేవి ప్రసాద్ కె దక్కుతుంది ఇలాంటి ధోరణి ని పఠాభి ప్రారంభించినా ,పెద్ద అబ్బూరి నిర్దేశించినా ,విశిష్ట రూపాన్ని సంతరించినవాడు దేవీ ప్రసాద్ ..కృష్ణశాస్త్రిగారు దేవీ ప్రసాద్ ను చిరంజీవిని చేశారు భారతి లో ప్రచురించేట్లు చేసి –

”అతడు ప్రియురాలిగా0చు బ్రహ్మా0డ మందు -అచ్చ మామె నె గాంచు ప్రత్యణువులోన- పువ్వులో ,నుర్వులో గాలి పర్వు లోన -రెక్కలో రిక్కలో పందికొక్కులోన .

ఆ కళా0బోధి ఊహా విలోకనాన -లోల లోచనాల్విధు మండలాన కలదు -ఆమె లోలాక్షి వికచతోత్పలాయ తాక్షి -కాని అసలులో ఆమె కో కన్ను మెల్ల ”

23- చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి – కవిత్వానికి ప్రత్యేకంగా ”ధ్వని ”అనే ఒక పత్రిక పెట్టాలని శ్రీశ్రీ భావించి దాని ముఖ చిత్రంగా శాస్త్రిగారి చేతులను ఫోటో పెట్టాలని భావించి శాస్త్రిగారి చేతులు ఫోటో తీయించి ,ఆయన ఎందుకు అని అడిగితె ”మీకవిత్వం చేత్తో రాస్తారుకనుక ”అని చెబితే ఆయన ”నేను కవిత్వం చెప్పా . నిజమే .రాసింది తక్కువ .నాకు న్యాయం చేయాలనుకొంటే నా మేధస్సుని ,హృదయాన్ని గాత్రాన్ని ఫోటో తీసి పెట్టండి ”అన్నారు .అప్పుడు వరద ”అలా కుదరదుకనుక మీ చేతులేశరణ్యం ”అనగానే అందరూ నవ్వారు ‘

శాస్త్రిగారికి బందర్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని ఆవిడకు చిన్న హోటలువుండేదని శాస్త్రిగారూ శిష్యులు పింగళి కాటూరి వగైరా అక్కడే టిఫిన్ చేసేవారని అక్కడ పెసరట్టు అదుర్స్ అని చెప్పుకొనేవారని ,అది తెలుసుకోవటానికి కోలవెన్ను రామ కోటేశ్వరరావు గారు రహస్యంగా వెళ్లి చూస్తే ,పెసరట్టు వేసేవాడు వేడి అట్లకాడ తన పిక్క మీద కాసేపు పెట్టుకొని దానితో అట్టు తిరగేసి ఆకులో వేసేవాడని ,వాడి కి పిక్క తామర ఉండటం వలన వేడి కాడ పిక్క మీద పెట్టుకొనేవాడని గ్రహించారని మాధవ పెద్ది బుచ్చి సుందరరామయ్యగారు చెప్పారు .ఆ హోటలుకు వీళ్ళు ”సాహిత్య తామర విలాస్ ”అని పేరుపెట్టి సాహిత్య తామర ఉన్నవాళ్లే అందులో పెసరట్టు అదుర్స్ అంటారని ప్రచారం చేశారట . ఈ కథను శాస్త్రిగారి చెవిన వేశాడు వరద .ఆయన ఫక్కుమని నవ్వి ”ఆ రోజుల్లో నా మీద అనేక అబాండాలు వేసేవాళ్ళు అభిమానంతో కొందరు అసూయతో మరికొందరు .ఒకసారి ఒక సంస్థానం లో అవధానానికి వెళ్లాం .అక్కడ చదువుకున్న వేశ్య నాకొక పద్యం రాసి పంపింది తానూ కవిత్వం చెబుతానని నేను వినాలని .తిరుపతి శాస్త్రి మండి పడ్డాడు .ఎక్కడికి పోయినా నీకో పేరుందని తెలిసి పోతుందన్నారు. నిజానికి ఆమె పద్యానికి నేనెలా బాధ్యుడిని /ఇలాంటివి బోలెడు జరిగాయిలే ”అన్నారట .

80 వ పడిలో మంచం మీద ఉండగా వరద వగైరా చూసి ఏవైనా పద్యాలు చెప్పమంటే చెప్పారు అందులో కొన్ని –

”నన్ను వృద్ధుడంచు బన్నెమ్మునకు మీరు -గౌరవింతు ,రేను దారమైన -మీ సపర్య లెలమిఁ మెచ్చి కైకొనియెద -గవిని నేను కాను కాను కాను .

ఇరువురొ ముగురొ కవులుం -దురు కబ్బంబులు నంతె ,దోషజ్ఞులు ధీ -పరమాన్యులు తితక వులై -పరి శీ లించు నెడ బైకి వచ్చెడి సుకృతుల్ .

కవిత వలన బన్నెము గూడ గలిగెనేని -గలుగునిండా వశ్యకము గాదు ,రామ -కోటి వలె నుండు రచనలు కోవిదులకు -నచ్చ నీ రహస్యమ్ము ”విన్నాణి ”యెరుగు . ‘

శాస్త్రి గారి దర్శనమే ఒక మహా విభూతి ,అపురూపమైన అనుభూతి .ఆయనలాంటి సాహిత్య మూర్తి నభూతో నభవిష్యతి ”అని కైమోడ్పు ఘటించాడు వరద .

24-మల్లాది రామ కృష్ణ శాస్త్రి -పెద్ద అబ్బూరి కి ప్రాణ స్నేహితుడు ..అబ్బూరి పిల్లలు బందరులో జబ్బు పడ్డప్పుడు ఆయన ఆశువుగా ఒక నవల చెబితే తెల్లార్లూ రాశారు మల్లాది .అదే మంగళ సూత్రం నవల అదొక్కటే అబ్బూరి నవల ..అబ్బూరి ప్రోత్సాహంతో సాహిత్యం లో దిగారు మల్లాది .శాస్త్రిగారితో తిరగడం ఒక ఎడ్యుకేషన్ అన్నాడు వరద .కధ మల్లాది చేతి లో పరిపక్వమైంది .ఆయన సాహిత్య విమర్శ అత్యంత నిర్దుష్టం ఆమోదయోగ్యం .సునిశిత వ్యంగ్యం ఆయన సొమ్ము . ఖాళీ దొరికితే కీర్తనో జావళీయో రాసేవారు అక్షర రమ్యత ఆయనకు ఇష్టం . సముద్రాల సీనియర్ కు సినిమా పని ఎక్కువైతే ఎవరినైనా సాయం పంపమంటే వరద వగైరా శాస్త్రిగారిని బలవంతం మీద పంపారు ఆయన అక్కడ స్థిరపడ్డారు . వరద రాసిన ”ప్రతిమా సుందరి ”నాటాకాన్ని పంతం మీద ఒక్క రాత్రిలో అచ్చు వేయించి కూర్మా వేణు గోపాల స్వామి గారి పైరవీ నాటకానికి చెక్ పెట్టించారు ..దీనికి ముందుమాట రాస్తూ శాస్త్రిగారు ”తెలుగులో ఔచిత్యం ,విచక్షణ ,జిజ్ఞాస కు హాయి కలిగించేది వరద రాసిన ప్రతిమా సుందరి ”అన్నారు

ఒకసారి బెజవాడలో సినిమా చూడటానికి వెళ్లిన శాస్త్రిగారిని ఒక ప్రౌఢ బుగ్గ పట్టుకొని ”ఏం పంతులూ తేరగా ఉన్నామా మా మీద రాసెయ్యటానికి ”అంది .ఆమె ఒక పేరుమోసిన వేశ్య కూతురు .శాస్త్రిగారు ఫకాలుననవ్వి ”నా కధలు వీళ్లూ చదువుతున్నారన్నమాట ”అన్నారు .శాస్త్రిగారు కృష్ణా పత్రికలో ”నా కవి మిత్రులు ”అనే శీర్షికలో పది వ్యాసాలూ అద్భుతంగా రాశారు .

మరోసారి ఉమాయ్ శాస్త్రిగారు సినిమాకు రాసిన పాట పాడి వినిపిస్తే శాస్త్రిగారికి కోపం నషాళానికి అంటి ”మనం చాలా సరదాగా మాట్లాడుకొంటున్నప్పుడు సినిమాలకి రాసే మల్లాది గురించి మాట్లాడకండి .ఆ మల్లాది ఎవడో నాకు తెలియదు .నేను మీ అందరికీ తెలిసిన వాణ్ని అర్ధమయిందా అన్నారు .అంటే ఆయనకు సినిమాల్లో చేసే వృత్తిమీద అంత అసహ్యం అన్నమాట ..నిజంగా ఆయన అంత బాగా సినిమా పాటలు రాసిన వాళ్ళు లేరు . ఆయనే ఒకసారి ”మెప్పుకోసం ఉప్పుకోసం రాసింది సాహిత్యం కాదు .సాహిత్య ప్రాయోజనం సాహిత్యమే ”అన్నారు .

వరద ను ”ఏమైనా రాస్తున్నావా ?”అని అడిగితె ”రాస్తున్నా -వరద అంత్యక్రియలు ”అన్నాడు . అవాక్కయ్యారు మల్లాది .వివరణ ఇస్తూ వరద ”ప్రతి పాదాంతం లోను క్రియ వచ్చేట్లు రాస్తున్నా .అంచేత అంత్యక్రియలు అయింది ”అన్నాడు .శాస్త్రిగారు ”నీ అంత్య క్రియలను ముందుగా నా చేత చదివించునాయనా ”అన్నారట .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణ రాజాధి రాజు -గౌతమీ పుత్ర శాతకర్ణి -కొన్ని విశేషాలు

బ్రాహ్మణ రాజాధి రాజు -గౌతమీ పుత్ర శాతకర్ణి -కొన్ని విశేషాలు

మౌర్య చక్ర వర్తి అశోకుని మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని పూరిస్తూ మొదటి ఆంద్ర దేశాన్ని స్థాపించి క్రీ పూ 225 నుంచి క్రీ శ 225 వరకు అంటే 450 ఏళ్ళు అప్రతిహతంగా పరిపాలించిన వారు శాతవాహనులు ఆరు వేల  నియోగి బ్రాహ్మణులని అంటారు .ఇందులో ముఖ్యడు గౌతమీపుత్ర శాతకర్ణి క్రీ శ  78 నుండి 102 వరకు పాలించాడు .ఇతనికి  ”నివర్తిత చతుర్వర్ణ సంకరస్య ”అంటే నాలుగు వర్ణాలలో సంకారాన్ని నివారించినవాడు అనే బిరుదు ఉండేది అని అతని తల్లి గౌతమీ బాలశ్రీ మహారాష్ట్రలోని నాశిక్ వద్ద వేయించిన శాసనం లో పేర్కొన్నది .ఆయన ”ఆగమానాం నిలయస్య ”అంటే వేదాలకు నిలయమైనవాడు అని ”ఏక బ్రాహ్మణస్య ”అంటే ఏకైక బ్రాహ్మణుడని  ”ద్విజకుల వర్ధనుడని ,,”వర్ణాశ్రమ ధర్మ  పరిత్రాత”అని బిరుదులు పొందాడు .వీరి వంశం లో పాలించిన రాజులు 30 మంది .వీరినే సాతవాహనులు లేక శాతవాహనులు అంటారు . ఇది వంశనామం .శాతకర్ణి వీరి గోత్రనామం అని ఖండవల్లి లక్ష్మీ రంజనం గారు అన్నారు .అంటే అప్పటికే బ్రాహ్మణ కులం విస్తృతంగా వ్యాపించి ఉందని గ్రహించాలి . ఇదే శాసనం లో బాలశ్రీ తనకొడుకు గౌతమీపుత్ర శాతకర్ణి -నహుషుడు ,నాభాగుడు ,దిలీపుడు ,బలరాముడు ,కేశవుడు ,రాముడు ,అర్జునుడు వంటి పురాణ పురుషులకు దీటైన వాడు అని రాయించింది .అంటే ఆపస్తంబుడికాలం లోనో కొద్దిగా  అటూ ఇటూగానో పురాణాలు రచించటం పూర్తయి బాగా ప్రాచుర్యం పొందాయని భావించవచ్చు .అని ఈశాసనం  వలన అర్థమౌతోంది .
  శ్రీముఖుని కుమారుడే గౌతమీ పుత్ర శాతకర్ణి . మొదటి శాతకర్ణి అంటారు .యితడు ఎన్నెన్నో క్రతువులు చేసినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి . అందులో ”అగ్న్యాధేయ ,అ నారంభణీయ ,భగలా దశరాత్ర , గర్గ త్రిరాత్ర ,గవామాయన ,అప్త్యూర్యామ ,అంగిరసాయన ,శత  త్రిరాత్ర  ,చందోమ పవమాన ,త్రిరాత్రి మొదలైన క్రతువులు ,అశ్వ మేధ ,రాజ సూయ మొదలైన యాగాలు ఉన్నాయి .. ఇతని భార్య నాగానిక నానాఘాట్ లో వేయించిన శాసనం లో తాను ”దీక్ష వ్రత యజ్ఞ సుందరయా ”అంటే దీక్ష వ్రతం లో యజ్ఞం చేసిన సౌందర్య వతిని   ”అని ”యజ్ఞ హుత  ధూపన సుగంధాయ ”అంటే యజ్ఞ సమయం లో వెలువడిన ధూపాలు వదిలిన సుగంధాలుకల పరిమళ ”అని  చెప్పుకున్నది .కనుక ఈ జంట బిడ్డ ”వేదశ్రీ ”సార్ధక నమ ధేయుడు అయ్యాడు ..ఈ వంశం లోనే యజ్ఞశ్రీ శాతకర్ణి సుప్రసిద్ధుడు .అనగా ఆకాలానికే వేదాలు సుప్రసిద్ధం ,యజ్ఞాలు బాగా జరిగేవి అని స్పష్టం .
 శాతవాహన రాజ్యపాలన క్రీ పూ 225లోనే ప్రారంభం అయినా ,శాతవాహన శకం గౌతమీపుత్ర శాతకర్ణి విజయరాజ్య పాలన తోనే అంటే క్రీ శ 78 తోనే ప్రారంభమైంది .ప్రాచీన భారత దేశం లో రెండే రెండు శకాలున్నాయి.  మొదటిది క్రీ పూ 58 నుండి ప్రారంభమైన విక్రమాదిత్య శకం కాగా రెండవది క్రీ శ 78 నుంచి ప్రారంభమైన శాలివాహన శకం .శాలివాహన శకం బ్రాహ్మణ పరంగా గుర్తింపు పొందిన శకం .సియాం కాంబోడియాలలో శాలివాహన శకం ప్రాచుర్యం లో ఉందని సుప్రసిద్ధ చారిత్రిక పరిశోధకులు శ్రీ బి యెన్ శాస్త్రి గారు ”ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ”రాశారు .
కాళిదాసమహాకవి రఘువంశం లో 13 వ సరిగా 34 వ శ్లోకం లో శాతకర్ణి అనే బ్రాహ్మణ ఋషి ప్రస్తావన ఉన్నది .ఆయన సంతతివారే శాతవాహనులై ఉండవచ్చు నాని డా మారేమండ  రామా రావు గారు ”సాత వాహన సంచిక ”’లో అభిప్రాయం పడ్డారు .
 సరే శాతవాహనులు బ్రాహ్మణులే నో డౌట్ .అయితే ఏ శాఖ ?నియోగులు అన్నది లోకనానుడి .ఐతే అప్పటికి నియోగి వైదీకి భేదాలు ఏర్పడలేదు .ఈ భేదాలు 11-12 శతాబ్దాలలో వచ్చి ఉండచ్చు .
   ఆంద్ర దేశాన్ని పాలించిన ఇక్ష్వాకులు కూడా  బ్రాహ్మణులే .మొదటి ఇక్ష్వాకు మహా రాజు చాంతమూల మహారాజు మాఠరీ గోత్ర సంభవ అయిన ఒక విప్ర కన్య ను పెళ్లి చేసుకోవటం వలన వీరు బ్రాహ్మణులే అని బి.యెన్ శాస్త్రి గారు తేల్చారు.అతడు అగ్నిష్టోమ యాగం చేశాడు  బ్రాహ్మణులే దీన్ని చేస్తారు .క్షత్రియులు చేసేదాన్ని ”జ్యోతిష్టోమయాగం ”అంటారు  . ఆంధ్రాను క్రీ శ 270-285 లో ఏలిన బృహత్పలాయనాలు కూడా బ్రాహ్మణులే . వీరి రాజధాని కృష్ణాజిల్లా ఘంటసాల కు 20 మైళ్ళ దూరం లోని కోడూరు . ఆతర్వాత క్రీ శ 300-440 వరకు పాలించిన ఆనంద గోత్రీయులూ బ్రాహ్మణులే .గోత్రనామమే వీరి వంశనామం .. వీరు విశ్వామిత్రుని సంతతికి చెందిన శాలంకాయన వంశీకులు అనే వాదం ఉంది . బృహత్పలాయనులు ఆనంద గోత్రీకులు పల్లవులలాగానే పేరు చివర ”వర్మ ”పెట్టుకున్నారు . కనుక పల్లవులూ బ్రాహ్మణులేనన్నారు .”సాన్ లన్ క్రోన్ ”అనే ఒక శాలంకాయన రాజు బర్మాలోని ఐరావతీ నదీ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తోంది .వీరివలననే బర్మాలో బౌద్ధం వ్యాపించింది అని జర్నల్ ఆన్ ఓరియంటల్ రీసెర్చ్ చెబుతోంది .
  ”భరద్వాజస గోత్రాణాం పల్లవానాం ”అని పల్లవులు చాటుకున్నారు . తాము అశ్వత్ధామ ,మదన అనే అప్సరస కు జన్మించామని ఒక గాథలో తెలిపారు .భరద్వాజుని కుమారుడు ద్రోణుడు ,అతడికొడుకే అశ్వత్ధామ కనుక పల్లవులూ బ్రాహ్మిన్సే .వీరిలో శివ స్కంద వర్మ (క్రీ శ 310-335 )హిరగడ గళ్లి  శాసనం లో అగ్నిష్టోమ ,వాజపేయి ,అశ్వమేధ యాగాలు చేసినట్లు తెలియ జేస్తోంది
పల్లవ వంశ స్థాపకుడైన వీర కూర్చ వర్మ పదవ రాజ్య సంవత్సరం లో మైదవోలు లో వేయించిన శాసనం లో తాము బ్రాహ్మణులమని భరద్వాజ గోత్రీకులమని తెలియ జేశాడు . ఇక్కడా ఎక్కడా నియోగి వైదిక శబ్దాలు కాన రాలేదు .
 మన దేశం లోనే కాక ఇతర దేశాలనూ బ్రాహ్మణులు రాజ్యమేలారు .బర్మాలో పూనన్  రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశం ”కౌండిన్య సోమ వంశం ‘గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన కౌండిన్యుడు అనే బ్రాహ్మణుడు పుమాన్ లోని సోమా అనే యువతిని పెళ్ళాడి ఈ వంశ స్థాపకు డయ్యాడు అని మారేమండ వారు తెలియ జేశారు .క్రీ శ . 657 లో వియత్నాం దేశం లో రుద్రవర్మ ,క్రీ శ 781 లో కంపూచియా అంటే ఒకప్పటి కాంబోడియా లేక కాంభోజ దేశం పాలించిన ఒకటవ జయవర్మ సైతం బ్రాహ్మణుడే .
  ఆచార్య నాగార్జునుడు విదర్భ బ్రాహ్మణుడు. బసవేశ్వరుడు బ్రాహ్మణుడు  బ్రహ్మనాయుడి  పలనాటి సేనాని అనపోతరాజు బ్రాహ్మణుడు .కాకతీయ రుద్రమ దేవి సేనాని  బెండపూడి అన్నయ  బొమ్మన్  .కాళిదాసు ,పాణిని చాణక్యుడు ,బాణభట్టు  నోబెల్ లారీయేట్లు నేటి రవీంద్రనాధ టాగోర్ ,సివి రామన్  ,ఎస్ చంద్ర శేఖర ,నవలా కారుడు శరత్ ,బంకిం ,సత్యజిత్ రే ,స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే ,రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ రాధా కృష్ణన్ ,గిరి ,వెంకట్రామన్ శంకర్ దయాళ్ శర్మ ప్రణబ్ ముఖర్జీ ,ప్రధానులు నెహ్రు ,మొరార్జీ ,వాజపేయి ,పి  వి నరసింహారావు ,ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ శీలా దీక్షిత్  మంత్రులు సుష్మాస్వరాజ్ అరుణ్ జైట్లీ  ఇన్ఫోసిస్ నారాయణ  మూర్తి నందన్ నీలేకని , కిరణ్ మజుందార్ , విజయ్ మాల్యా మొదలైన దిగ్గజాలందరు బ్రాహ్మణులే ..
  ఆధారం -అమెరికాలో మా అల్లుడుఅవధాని కొని సేకరించి భద్ర పరచిన డా పాలకోడేటి సత్యనారాయణ రావు గారి రచన – సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర ”
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -3

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -3

13-విశ్వ నాథ -విశాఖ హై స్కూ ల్ లో వరద కోరిక పై  విశ్వనాధ కొన్ని పద్యాలు చదివారు -అందులో రెండు –
”ఓయి నృపాల!ఈ బుడుత -యొక్కడు నాదు కులంబు తేవ నీ -ఓ అతి ధర్మరాజువయ-యో !ఇది వినుటయా !గతానువై -ఈయను గేగె బో తినుట -కేమిక నున్నది  నాకు నేమి నే-డే యిదె !వీని వెంటబడి -యేగెద కోడలి కేమికా వలెన్ ?అనే పద్యాలను  వయో వృద్ధురాలైన ఒక స్త్రీ స్వరాన్ని అనుకరిస్తూ రుద్ద కంఠం తో చదివితే మేష్టారు విద్యార్థులూ అందరూ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఆయన వంక  అలానే చూస్తుండి పోయారట ..
వర్షం కురుస్తున్న తీరును వర్ణించే -”నట శివ సాయం సంధ్యా -చ్ఛటా  ఘటా నూపురమణి  సంభవ కాంతి -స్ఫట ‘చిట  చిట  చిట ”నినాదో  -ద్భట  కనకము విజయవాటి వర్షము కురిసెన్ ”పద్యం చదువుతుంటే అసలు వర్షం కురుస్తున్నదే మో నన్నంత భావన కలిగిందట ..
బయటికి వస్తూ ”బాగుందా ”అని అడిగితె ”బలే ఏడిపించారండీ ”అన్నాడు వరద .”ఇదా ఆఖరికి ”అన్నారట విశ్వనాథ ..
విశ్వనాధ దాసు శ్రీరాములు కవిని బాగా మెచ్చేవారట ..ఆయన రాసిన ”తెలుగునాడు ”లోని పద్యాలన్నీ విశ్వనాథకు తమ్ముడు వెంకటేశ్వర్లుకు కంఠతా వచ్చు . శ్రీరాములుగారు పాండిత్యాన్ని తమగురువు వెంకట శాస్త్రిగారే తెగ  మెచ్చుకొని వారట . రాములుగారు తెలుగు సంసారాన్ని అతి కూలంకషంగా పరిశీలించి రాసిన కావ్యం అది విభిన్న శాఖలు ,వర్ణాలు పరిశీలించి మన సమాజం ఎలా విచ్చిన్నమైందో వివరించారు

— ”తెలుగు నాట ఈ వైదీకి ,నియోగి గోల ఏమిటో ?అన్నారు మల్లాది రామ కృష్ణ శాస్త్రి .వెంటనే విశ్వనాధ ”ఆదో  చమత్కారం .పోటీ పడి  రాస్తారని ”అని -”తొ లి నియోగులే కవులు తెలుగునాట -నేటికిని వారె సాహితీ నేత లైరి ”అన్నారు ఆశువుగా .,కొప్పరపు సోదరులు బెజవాడలో అవధానం చేయగా మెచ్చి -”తొ లి నియోగులు సిసలైన తెలుగు కవులు -తెలియ పలనాడు చిక్కని తెలుగుగడ్డ -ఆశుకవనంబులో మీ ఇంటి ఆడు బిడ్డ -యే ను దీవన లిత్తు నెన్నే ని  మీకు ”అని ఆశీర్వ దించారు .

ఒక రోజు రైలు ప్రయాణం లో ఇద్దరు విద్యార్థులు విశ్వనాధ కవితా మహత్వాన్ని వారిలో వారు చెప్పుకుంటూ మెచ్చుకోవటం పై బెర్త్ పై పడుకున్న విశ్వనాధ విని వరద జరుక్ లతో ”నాకు దుఃఖం కూడా వచ్చింది .నన్ను మెచ్చుకునే వాళ్ళు ఈ దేశం లో ఉన్నారు -ఒక్క తిట్టే వాళ్ళే కాక ”అన్నారట ఆనందంగా ..
  ఆధునిక కవుల చాటు పద్యాలన్నీ సేకరించి అచ్చు వేయాలని శ్రీ శ్రీ ,వరద కలలు కన్నారు .అప్పటికి వాళ్ళు రాసింది పదే .విశ్వనాధ ను అడిగితె తనవి అయిదారు వందలు ఉంటాయన్నారు .
వరద మేనత్తకు విశ్వనాధ రాసిన దయాంబుధి పద్యాలు నోటికి బాగావచ్చి ఎప్పుడూ చదువుకొంటూ ఉంటుంది .అవి వరాద కూ ఇష్టమే –
1-నా  కనుల యెట్టయెదటన నా జనకుని -నా జనని కుత్తుకలను కోసి నన్నడిగె  న-తండు ”నే దయాంబుధిని కాదా ”యటంచు -ఓ ప్రభూ !యగునంటి నే నొదిగి యుండి ”
2-నా కనుల ఎట్ట యెదుటన నా లతాంగి – ప్రాణములు నిల్వునం దీసి యడిగె నను న -తండు ”నే దయాంబుధిని కాదా ”యటంచు -ఓప్రభూ!యగు నటి నే నొదిగి యుండి ”
3-కన్నుల ఎట్ట ఎదుట నా యనుంగు -తనుజు  కుత్తుక నులిమి తా నను నడిగె ,న -తండు ”నే దయాంబుధి ని కాదా ”యటంచు -ఓ ప్రభూ !నీవ య0టి నే నొదిగి పోయి ”. విశ్వనాథ అతి సామాన్యమైన ,సార్వ జనీనమైన లోక వృత్తాన్ని ,మానవ హృదయం విహ్వ లించేట్టు తన పద్యాలలో దర్శనం చేయించారని వరద విశ్లేషించాడు .. అలాగే ఆయన ”అంధ భిక్షువు ”కూడా .
14-దువ్వూరి రామి రెడ్డి -భాష మీద అధికారం ,భావ శబలత,ఛందస్సుసౌందర్యం లో ప్రావీణ్యం సమపాళ్లలో ఉంటె శ్రవణ యోగ్యమైన హృదయ స్పందన కవిత్వం వస్తుంది అని రెడ్డి గారి నమ్మకం . నిజంగానే ఆయన పద్య నిర్మాణం లో సౌందర్యాన్ని సాధించారు అన్నాడు వరద..ఫిరదౌసి కి ఫిట్జరాల్డ్ చేసిన ఆంగ్ల అనువాదం దోష భూయిష్టంగా ఉందని దానికి కారణం అతనికి పారసీక భాషాజ్ఞానం తక్కువని రెడ్డిగారి నిశ్చితాభిప్రాయం . మరో పారసీక భాషా వేత్తతోను ,ప్రసిద్ధ ఆంగ్లకవి రాబర్ట్ గ్రేవ్స్ చేత అనువాదం చేయించి లండన్ లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఉమర్ ఖయ్యామ్ రుబాయిలను ప్రచురించింది .కానీ ఫిటీజెరాల్డ్ అనువాదమే గీటు రాయిగా నిలిచింది .
15-బలిజే పల్లి లక్ష్మీ కాంతం -సత్య హరిశ్చంద్రీయ నాటక కర్త . సినిమా వేషాలకు మద్రాస్ వెళ్లారు  .తానూ అబ్బూరివారి నటాలి లో వేషాలు వేయాలని ఉబలాటం .అప్పుడు అబ్బూరి సీనియర్ మద్రాస్ లో కన్యా శుల్కం నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు .బలిజేపల్లికి అగ్ని హోత్రావధాన్లు పాత్ర ఇచ్చారు .మధుర వాణి పాత్రకోసం వెదుకుతున్నారు .రాజమండ్రి లో ఒకమ్మాయి ఉందని ఆమె  పోలీస్  ఇన్స్పెక్టర్” ఇలాకా ”అని ఆయనకు ఆమెను నటిని చేయాలనే ఉబలాటం ఉందని తెలిసి వెళ్లారు .ఆమె లావుగా బొద్దుగా మొహం మీద అద్దకం తో కొంచెం కృత్రిమంగా ఉంది .ప్రశ్న అడిగితె జవాబు ఇన్స్పెక్టర్ చెబుతున్నాడు . ఆమె సమాధానం లేదు .’పాడగలదా  అని అడిగితె ఆమెకు వినిపించకపోతే ఇన్స్పెక్టర్ ఇల్లు దద్దరిల్లేట్లు ఆవిడ చెవి దగ్గర అరచి చెప్పాడు .ఆవిడ నవ్వింది అంతే .ఇక చాలుబాబోయ్ అనుకోని నెత్తిన గుడ్డ వేసుకొని చెన్నై చెక్కేశారు
దీనిపై కాంతంగారు ఆశువుగా -”మధురవాణి కాదు మంచి బధిరవాణి -కామ కృతికి తగ్గ కాంత యిద్ది -రంగతల మనంగ రంగ స్థలము కాదు -మరి తిరోగమనమె మనకు దిక్కు ”
15-రాయప్రోలు సుబ్బారావు -”వేగాతి  వేగోక్తి దుర్వ్యసనం ”లో నుంచి బయట పడ్డారు ..ఆశుకవిత్వం అవధానాలు స్వస్తి చెప్పారు . జన్మ స్థానం వెదుళ్లపల్లి .ఆయనతో వంశీగానం తెలుగు కవిత్వం లో ప్రారంభమైందని పెద్ద అబ్బూరి అన్నారు -దానికి దీటుగా తెలుగు గొప్పదనాన్ని రాయప్రోలు –
”వంశీన్  వంచి ,మృణాలమున్ మెలిచి ,పక్వ ద్రాక్ష నెండించి ,వా -గ0శల్ మార్దవ మాధురీ ,సుభగ విన్యాసంబు జిల్కన్ ,దశ -త్రి0శ ల్లక్ష జన ప్రసన్న రసనా దేవాలయా భ్యంతర  -ప్రాంశు ప్రార్ధన గీతమైన తెలుగు బల్కున్ ప్రసంశించెదన్ ”అన్నారు జోరు చప్పట్ల మధ్య ..
శివ శంకర శాస్త్రి రాయప్రోలు వారి తృణకంకణం ఆధునిక కవిత్వానికి ఆది గ్రంధం అన్నారు . కాదు వెంకట పార్వతీశ్వరకవుల ”ఏకాంత సేవ ”అన్నారు కొందరు .
వెంకట శాస్త్రిగారు ”అందమైన పద్యమ్ము నల్లు నతడు-నునుపు బోగుల  పట్టు నేసిన విధాన ”అని రాయప్రోలుకవిత్వాన్ని మెచ్చారు ..
వరదతో రాయప్రోలు ”ఆధునిక ఆంద్ర కవిత్వానికి నేను ఆద్యుడిని అని నేను ఎప్పుడూ చెప్పుకోలేదు .ఒకే ముహూర్తాన కొంచెం అటూ ఇటూగా గురజాడ నేనూ ,మీనాన్న రామ కృష్ణారావు తెలుగు కవిత్వం లో రాచబాట వేసాం .ఆధునిక కవిత్వ శకారంభానికి ఎందరో మహానుభావులు రాచబాట వేశారు .అందరూ చిరస్మరణీయులు . పూజ్యులే సభాపతి తృణకంకణం ఆధునిక కవిత్వానికి ఆది గ్రంధమన్నాడు . భావకవిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అతడు అలా అని ఉంటాడు అదీ కొంతవరకే నిజం .కవిత్వం గురించే మాట్లాడుకోవాలికాని ఎవరాద్యులు అనేది అనవసరం ”అని వినయంగా చెప్పారు .
  సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2

8-బైరాగి -తెనాలి రత్నా టాకీసులో బైరాగి ఒకసారి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారిని విమర్శిస్తూ ´మనమంతా వర్ణాశ్రమ వ్యవస్థను విచ్చేదించాలని చూస్తుంటే త్రిపురనేని ప్రతికూలం లోనూ మరో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశ పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు ´అన్నాడు .బైరాగి మొదటికవిత-´నగరమ్ము న పన్నగమ్ము -నదీ నదమ్ముల విపద్రవమ్ము -చిర పరిచిత పాంధులారా-పతిత జీవ బంధులారా ´ఇది అచ్చు కాలేదు .అతని ´నూతిలో గొంతుకలు ´మంచి పేరు పొందింది .ఎందులోనూ స్థిరంగా ఉండలేక పోయాడు దరిద్రం బాగా పీడించింది .ఢిల్లీలో వరద ను రైలు ఎక్కించమని కోరి ఎక్కుతూ ´రైలు నించి దిగటం సులభం -ఎలా దిగామో తెలియదు -మళ్ళీ ఎక్కడమే బాధ ´అన్నాడు నవ్వుతూ .అదే ఆఖరి  నువ్వేమో .
  శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ´ప్రబుద్ధాంధ్ర ´పత్రిక నడిపారు .దాని సాలు సరి చందా ఒక్క రూపాయ .కనీసం 10 మందినైనా రోజూ చందా దారులుగా చేర్పించేవారు .దొరక్కపోతే భోజనం మానేసేవారు .
9-కొంపెల్ల జనార్దనరావు -తూ  గో జి .గంగలకుర్రు  స్వగ్రామం .స్వయం గా ఇంగిలీషు నేర్చాడు ఆంగ్లేయ కాల్పనిక కవులంటే ఇష్టం భారతి లో సబ్ ఎడిటర్ .ఆదర్శ పత్రిక పెట్టాలని ఉబలాటం .తో ´ఉదయిని ´పెట్టి మొదటి సంచిక తెచ్చాడు . గూడవల్లి రామ  బ్రహ్మం గారి ´ప్రజామిత్ర ´లో  వేలూరి శివరామ శాస్త్రిగారు దాన్ని చెణుకులు పేరుతో తూర్పారబట్టారు . నిరుత్సాహపడ్డాడు కొంచెం కొంపెల్ల ..ఆర్ధిక బాధలేకాక  క్షయ రోగం బాధించింది .ఎందరికో ఎన్నో ఉత్తరాలు రాసేవాడు .అదులో కవిత్వమూ చిలికేవాడు –
´సతత నూతన మృదువిలాస ప్రభాత -తావక మనోజ్ఞ లాస్య సందర్శనమున -నాడు భావాలు మధుర గానమ్ము సలిపె -ప్రక్రుతి ఆనంద తన్మ యత్వమున మునిగి ´-ఏది చూసిన యెద గుబాలించు వలపు ´అన్నాడు ..´నేనొక మహాత్ముడిని అవుతున్నాను .ఆ మహత్వానికి నిలిచే రాత రాయలేక పోతున్నాను ´అని బాధ పడ్డాడు .అతని ఆయుష్షు అల్పం ఆశయాలు అనంతం అన్నాడు వరద ..
10- గిరాం మూర్తి -విజయనగరం లో బుర్రా శేషగిరిరావు ´ఆంధ్ర భారతీ తీర్ధ ´సంస్థ స్థాపించారు ఇంగిలీషు లో దీనికి ´ఆంధ్రా రీసెర్చ్ యూని  వర్సిటీ ´అని పేరుపెట్టారు ..రాజా విక్రమ దేవా వర్మ ఛాన్సలర్  బుర్రా వైస్ ఛాన్సలర్ .స్నాతకోత్సవం విశాఖ ఏ వి యెన్ కాలేజీ లో జరిపారు . పండితులంతా వచ్చారు .రెండవ రోజు బిరుదు ప్రదానం చేశారు .జాషువాకు ´కవితా  విశారద ´ఇచ్చారు .
 గిడుగువారు ´చెవికి సీనా రేకు తో చేసిన గొట్టాన్నీ పెట్ట్టు కొని విన్నారు .వరద ´తపో భంగం ´నాటిక రాసి చదివాడు .గిడుగు మెచ్చి ´నేను తలపెట్టిన ఉద్యమం సఫలమైంది .ఈ చిరంజీవి రచన విన్నారుకదా .ఎంత సహజంగా వ్యావహారిక భాషని వాడి చూపించాడు !మీరు చేస్తున్న సన్మానం నా పాండిత్య కృషికి కాక నా ఉద్యమాన్నీ గుర్తించడం వలన చేస్తున్నారు ..గౌరవాన్ని తిరస్కరించటానికే వచ్చాను .కానీ ఈ చిరంజీవి నాటకం చదివాక స్వీ కరించటానికి నిర్ణయించుకున్నాను ´అన్నారు కరతాళ ధ్వనుల మధ్య ..గిడుగుకు ´మహోపాధ్యాయ ´బిరుదు ప్రదానం చేశారు .
అప్పుడు ఇంటర్ లో స్వర్ణ పతకం ఉండేది .దివాకర్ల వెంకటావధానిగారు వరద దాన్ని సాధించాలని ప్రోత్సహించేవారు .కానీ గిడుగుమాట విని వరద వ్యాకరణం రాయనని చెప్పి గిడుగు గారిపై భక్తిని ప్రదర్శించాడు .. పంతులు గారి వాక్పటిమ అమోఘం వెయ్యి మంది జనానికి కూడా వినబడేట్లు అనర్గళంగా ఉపన్య సించేవారు.
 ఒక సారివరద గిడుగును ´విశ్వనాధ ,రాయప్రోలు లను వ్యావహారిక భాషలో రాయమని మీరు ఎందుకు చెప్పరు?´అని అడిగితె ఆయన -´వ్యవహారికం అంటే ముందుగా మనం విజ్ఞాన వ్యాప్తికోసం కృషి చేయాలి .కవిత్వం కాదు .ఎందులోనన్నా రాసుకో .నాకు అభ్యంతరం లేదు .చదివేవాళ్ళు చదువుతారు లేకపోతె లేదు .ఇతర సాధనాలకు మాత్రం వ్యావహారికం తప్పదు .సాహిత్యం లో కధలకి నాటకాలకి వ్యావహారికమే ఉండాలి అని నా ఆశయం ´అన్నారు ..
11-సెట్టి లక్ష్మీ నరసింహం – సెట్టి మేస్టారుగా ప్రసిద్ధులు .హైస్కూల్   హెడ్ మాస్టర్ చేసి రిటైరయ్యారు . ఉద్యోగం లో ఉండగానే ´శృంగార పంచకం ´అనే బూతు పద్య సంకలనం తెచ్చారు .కమిటీ వాళ్ళు ఉద్యోగం లోంచి తీసేసే ప్రయత్నం చేస్తుంటే తానె రాజీనామా ఇచ్చారు .లా చదివి లాయర్ అయ్యారు
ఆయన మృచ్ఛకటిక నాటకాన్ని వసంత సేన నవలగా రాశారు . విక్రమ దేవ వర్మకు ముఖ్య స్నేహితులు . శెట్టి మాస్టారు వందలాది చాటువులు శృంగార పద్యాలు రాశారు -అందులో ఒకటి –
´ముప్పది యేండ్లు నాకు ఐదు -మూడవ ఏడుది మాదు  చెల్లి -మీ మిప్పుడు పూటకూళ్ళ నుతి -కెక్కినారము దబ్బ కాయాయో -చెప్పుడు నిమ్మ కాయో తమ -చిత్తము వచ్చిన నుండు ,రాత్రికి0 -దప్పక రండ నున్ నవ వితంతు  వొకర్తుక బాటసారులన్ ´
12- జాషువా -శ్రీ శ్రీకి జాషువా అంటే పడేదికాదు . ఆయన ఫిరదౌసి గాథా పద్యం తెలుగులో అరుదైనకావ్యం .
 సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద ´లో తేలి (రి )న తేట ఊట

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -1

1-బెల్లం కొండ రామ దాసు ´త్రిపుట ´కవితలో
´నాడు శాంతి వివస్త్రగా వీధి వెంట నడిచింది లేదు -మనసు చెట్టుకు ఉరితాడుకట్టి మనిషిని ఉరితీసింది లేదు -అమ్మని మారు పేరు పెట్టి తనివి తీర తిట్టుకుంది లేదు -నిప్పు మండుతూ ఉండేది -నీతి నిండుగా ఉండేది
నేడు-పాపం పట్టు పరుపులా పరుచుకుంది -ఇప్పుడు నిన్ను చూస్తూ నన్ను చూడవు -నేను నిన్ను గుర్తించను . కళ్ళలో గుడ్డి  ముళ్ళు మొలిచాయి -మన మధ్య మెయిలు రాళ్లకు అందని దూరం ఉంది-నదిలో రెండు శవాలు -అలా కలిసాం .-నీ గొంతు గుడ్లగూబ వినిపిస్తూనే ఉంది ´
2-దేవర కొండ బాల గంగాధరతిలక్ -స్వయం కృషితో ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు .దీనికి కారకుడు పాలగుమ్మి పద్మ రాజు …ఒకసారి వరద ´వచనకవిత్వం మిల్లు ఖద్దరు లాంటిది ´అని తిలక్ కు జాబు రాస్తే ´ఇంత చక్కని పదం నాకు తట్టలేదు ´అని జవాబు రాశాడు . ఈడిపస్ నాటకాన్ని తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేశాడు తిలక్ .కానీ చేయలేదు చేస్తే అబ్బూరి రామకృష్ణా రావు ప్రదర్శించి ఉండేవారు .
3-పాలగుమ్మి పద్మ రాజు -పద్మ రాజు చిన్నతనం లో రాసిన కవిత్వం విని చెళ్లపిళ్లవారు ´నువ్వుకవిత్వం రాయగలవు .నీకు సామర్ధ్యం ఉంది పో ´అని ఆశీర్వదించారు . అతనిమీద కవిత్వం చెప్పమని జలసూత్రం అడిగితె -´వీడెవడి పా .ప. రా -ఊయేల ఊపరా -చనుబాలు చేపరా ´అని చెప్పాడు వరద .
4-బైరాగిని కవిత్వం లోకి దించిన పాపం నాదే అన్నాడు వరద .కవిత్వాన్ని నమ్మకుండా ఆరాధించినవాడు బైరాగి
5-శిష్ట్లా ఉమామహేశ్వరరావు -´ప్రాహ్లాద కవిత్వ ´వ్యాప్తి కోసం తంటాలు పడ్డాడు .శ్రీ శ్రీ ఇష్టపడేవాడుకాదు ´శాంతిని ´అనే పత్రిక నడిపాడు ఉమాయ్ .సైన్యం లో కూడా చేరాడు .ఎప్పుడూ ఫుల్ గ మందు కొట్టి ఊగిపోతూ ఉండేవాడట .నవయుగాని కి తాను  ద్రష్ట అని భ్రమించేవాడు .ఒక రోజు ఉమాయ్ ,శ్రీ శ్రీ లు మద్రాస్ డేవిడ్ కపే  లో మాటమాటావచ్చి చొక్కాలు పట్టుకున్నారట . ఆ కోపం లో శ్రీ శ్రేణి చంపేదాకా నిద్రపోను అన్నాడట
  ´వెర్స్ లిబర్ ´అనేది శిష్ట్లా తోనే ప్రారంభం .కానీ అందులో పరిపూర్ణ ప్రావీణ్యం సంపాదించకుండా ప్రయోగాలు చేశాడు అంటాడు వరద .ఆంగ్ల సాహిత్యాన్ని అవపోసన పట్టాడుకాని తెలుగు సాహిత్యం లో ప్రవేశం తక్కువ ఉమాయ్ కి ..తెలుగు సాహిత్యం లో నిర్దేశిస్తున్న నవీన మార్గానికి మార్గదర్శి అనే అహంభావం ఉన్నవాడు .మార్గ దర్శిగా ఉన్నాడుకాని అందులో ప్రయాణించలేకపోయాడని వరద బాధ .,శివ శంకర శాస్త్రి,విశ్వనాధ కితాబిచ్చారు .ఆతను రాసిన కొద్దికవితలు కలకాలం నిలిచిపోయేవే ;´జ్ఞాపకాలు ´అనే గీతం  వెర్స్  లిబ్ర్  ´లో తలమానికం ఎజ్రా పౌండ్ గుర్తుకొస్తాడు . శతాబ్ది చైనా కవి ´రిహాకు ´రాసిన పాటల్ని ఉమాయ్ ఇంగిలీషు లో అనువదించాడు .అందులో ´నదీ వ్యాపారి భార్య ,ఉత్తరం ´అద్భుతం .ఆతను చదివే తీరు చాలా గొప్పగా ఉండేది .ఆతను తాదాత్మ్యం చెంది పాడుతుంటే గుండె కదిలి కరిగిపోయేది అన్నాడు వరద
´జ్ఞాపకాలు ´లో కొన్ని చరణాలు -నా పేరు లీల -ఆ ఊరి గోల పడలేక నేను పొరుగూరొ  -చ్చాను -అందాలావాడే అడవిలో  ముంచాడు -అందర్నీ తలచుకొని అల్లాడుతున్నాను —´ఉయ్యాలలో పిల్ల ఉబుసులేలేవు -నా చన్నులో పాలు జున్ను లెత్తాయే -హాయమ్మ కెవ్వరూ హాయన్న వారూ -నీలాల సంద్రములో నిప్పచ్చరం నేలపై -రాయినై అహల్యనయ్యాను -శ్రీరామ చంద్ర మూర్తీ రామ రామ నా పేరు లీల ´
6- కుందుర్తి ఆంజనేయులు -విశ్వనాధ శిష్యుడు ఆన్జనేయులు మా ర్క్సిస్టు అయ్యాడు .అనిసెట్టి బెల్లం కొండా లతో కలిసి కొత్తరకం గా రాసేవాడు శ్రీశ్రీ సంప్రదాయ మాత్రాఛందసునే వాడాడు . కుందుర్తి అభ్యుదయ కవిత్వం లోకి దిగాడు .గురువుగారి చాదస్త0 పట్టుకున్నది.  తనది ´వచన కవిత్వం ´అన్నాడు
´మీరందరూ రాయటం మానేశారు .మొత్తం నా మీదే పడింది భారం ´అన్నాడు వరద తో .సాధించి తీరుతానన్నాడు .వరద ´నీకు ప్రతిభ ఉంది భాష మీద అధికారం ఉంది .వ్యర్థం చేసుకోకు .నీ సంగతి నువ్వు చూసుకొనిరాణించు ´అని వరద సలహా ఇచ్చాడు .వచనకవితలో భారత ,భాగవతాలు రాస్తే అది నిలబడుతుందని ఊహించాడు .వచనకవిత రాసిన ప్రతివాడి నీ బుజం తట్టి ప్రోత్సహించాడు .భావకవిత్వం పై ఎలర్జీ పెంచుకున్నాడు .యెంత వచనకవితా రాసినా విశ్వనాధపై ఆరాధనా భావం ఇసుమంతకూడా తగ్గలేదు .ఆయన కవిత్వాన్ని ఆరాధిస్తూ చిరస్మరణీయ పద్యం చెప్పాడు కుందుర్తి –
´నీ వాంధ్రాఖిల నీవృతా దృతుడవై నీలో కవిత్వాపగల్ -ప్రోవుల్ పడ్డ రసాత్మవై మృదులంతా ముగ్ధంబులున్ -భావ ప్రౌఢములైన నీ పలుకులాస్వాదించి ,నీ
ఈ వైదగ్ధ్యము లోన  నొక్కను వుగా  నీ కావ్య ముప్పొంగితిన్ ´అని కీర్తి శిఖరం ఎక్కించాడు . ఈ పద్యాన్ని నేను నిరుడు ఫిబ్రవరి లో బెజవాడలో జరిగిన విశ్వనాధ సాహితీ వైభవం ´సదస్సులో నా పరిశోధన పత్రం ´విశ్వనాధ -యువతపై ప్రభావం ´లో ఉదాహరించాను ..
   కుందుర్తి ´హంస యెగిరి పోయింది ´ఖండిక అతని ప్రతిభా సంపదకు గీటు రాయి అన్నాడు వరద .దీనిలో  మనిషికి కవిత్వానికి కావాల్సింది మానవత్వం కానీ మార్క్సిజం కాదు అని రుజువు చేశాడు కుందుర్తి .మరో సారి గురుపాదుల అడుగు జాడలలో నడిచాడు  . 

7- జల సూత్రం రుక్మిణీనాథ శాస్త్రి -ఒక సారి ద్రౌపదీ మాన సంరక్షణ నాటకం చూస్తున్నారు జరుక్ శాస్త్రి , వరద వగైరా ,ద్రౌపది ´సహించరా సహింతురా ´అని పాడుతోంది.  జరుక్ వెంటనే పేరడీగా ´రమింతురా రమింతురా రాజాధిరాజుల్ ´అని గట్టిగా పాడాడు .ప్రక్కవాళ్ళు కేకలేసినా ఆగలేదు . పాండవ పక్షపాతి నోర్ముయ్ అన్నాడు శాస్త్రి .వరద ´నువ్వే నోర్మూసుకో ´అన్నాడు అందరూ గోల చేశారు .పోదాం పద అని బయటికి దారి తీశాడువరద ఆగలేక శాస్త్రి ´ద్రౌపది వీ ళ్ల పెళ్ళాం గాఉల్ను  ´అన్నాడు .అంతే అందరూ కలిసి బలవంతాన ఇద్దర్నీ  హాలుబయటికి నెట్టేశారు ´ఈ వెధవలకి సాహిత్యం మజా ఏం తెలుసు ?;´అన్నాడు శాస్త్రి -ఇంటికి వెళ్లి ఈ విషయం అంతా  చలం గారికి చెప్పారు .ఆయన నవ్వుతూ చింతా దీక్షితులుగారికి చెప్పి శాస్త్రితో ´ఈ దేశం లో పబ్లిక్ గా యెగతాళి చేయరాదని ఇప్పటికైనా తెలుసుకున్నావా ´అన్నారు .
  స్వామి శివ శంకర శాస్త్రి ఒక పద్యం లో ´నీవు స్త్రీ జాతి యందు జనించు కతన ´అని రాస్తే జరుక్ ´అదేం జాతి అయ్యా ఎక్కడైనా విన్నావా ´అని నవ్వి అబ్బూరి రామకృష్ణారావు బందరులో చెప్పిన పద్యం చదివాడు –
´చాలా సామ్యంబు కలదట సాహితీ స -భాపతికిని ,మన ´రాసభా´పతికిని -అర్ధ మెరుగని శబ్దమ్ము లతడు మోయు -తావి ఎరుగని గంధ మీతడు వహించు ´అన్న పద్యం చదివితే చలం గారు పకపకా నవ్వారు .
  జరుక్ రాసినవి చాలా కాలగర్భం లో కలిసిపోయాయి .రాసినవి అచ్చు వేయాలనే తపన ఉండేదికాదు .శాస్త్రీమీద వరద ´రుక్కుటేశ్వర శతకం ´రాశాడు -శతక  మంజరి లోని వివిధ శతకాలలో పంక్తులు తీసుకొని శాస్త్రికి అన్వయించి ´రుక్కుటేశ్వరా ´అని తగిలించి రాసిన శతకమిది  .ఇందులో ఒక్కటే వరద   సొంత పద్యం.  ఇదొక కొత్త ప్రయోగం . అందరూ మెచ్చారు .దీన్ని శ్రీ శ్రీ స్తే ఎక్కడో పారేశాడు .
´వైదికులు పరిభాష ´అనే విషయం పై పెద్ద పుస్తకం రాసే ప్రయత్నం చేశాడు జరుక్ .శాస్త్రిపై వరద చెప్పిన పద్యం బాగుంది –
´దూకుడు దూకుడై నడక దుందుడు కొప్పగ చూపు ,నోట,వై
 దికుల పల్కు వేట ,కర దీపముగా సిగరెట్టు  దాల్చి ,మా
ఈ కవి మూక జేరితివి ఇంతటితో సరిపెట్టి మమ్ము ,కా
ఫీ  కయి కొంప పీకకు ,శపింపకు ,చంపకు రుక్కుటేశ్వరా ´
  తర్వాత ఎప్పుడో శ్రీశ్రీ ,ఆరుద్ర కలిసి రుక్కుటేశ్వర శతకం ప్రారంభించి కొన్ని పద్యాలు  అచ్చేశారు .అందులో మొదటిది –
´వచియించె´వరద ´లోగడ -రచియింతునని ఋక్కుటేశ్వర  శతక మును ,మే
 మచలిత ధైర్యమ్మున నా -మ చౌర్య మొనరించినాము మన్నించు జరూ ´
  శాస్త్రి అన్నిట్లోనూ వేలు పెట్టాడు అభ్యుదయకవులతో తిరిగాడు అతి వాస్తవిక ధోరణి అనుసరించాడు .ఇంగిలీషు రాలేదని బాధ గా ఉండేది .ఎన్నికలలో శ్రీ శ్రీ కి మతి పోయినప్పుడు శాస్త్రి చాలా బాధ పడ్డాడు . ´దారి తప్పిన పిల్ల ´అనే సుదీర్ఘ కావ్య ఖండాన్ని  రాస్తున్నట్లు వరదకు జాబు రాశాడు .రాశాడో లేదో తెలియదు .´మైల నిఘంటువు ´అనే పల్లె .పట్టణాల పేర్లు అశ్లీల పదాలకు పర్యాయ పదంగా సమకూర్చాడు శాస్త్రి . అదెక్కడాఅంతర్ధానం అయిందో తెలీదు. అతి వాస్తవిక ధోరణిలో ´లింగ తాండవం ´లఘుకావ్యం రాశాడు .దీన్ని శ్రీరంగం నారాయణ బాబు కు అంకిత మిచ్చాడు .ఇది చెప్పుకోదగ్గ కావ్యమన్నాడు వరద . ఇందులోని కవిత్వం అంతా  శ్రీ శ్రీకి కంఠతా వచ్చట.  రుక్మిణీనాథ శాస్త్రికి సాహిత్యం ముఖ్యంగా కవిత్వం పై ఉన్న అభిరుచి వైనం ఆ రోజుల్లో మారెవ్వ రికీ  లేదు అని వరద తీర్మానం చేశాడు .చెళ్ళపిళ్ళ వారి భాషలో ´జలసూత్రం అంత ´విన్నాణి ´ని మనం చూడం .
ఆధారం -వరద రాసిన ´కవన కుతూహలం ´
  సశేషం
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లి అమెరికా -1

 వీక్లి అమెరికా -1
అమెరికా లో నార్త్ కరోలినా లో ఉన్న షార్లెట్ కు 6 రాత్రికి రావలసినవారం 7 మధ్యాహ్నానికి చేరాం .ఆ ప్రహసనం అంతా ముందే రాశా . ఇక నుంచి ప్రతి సోమవారం ఆ వారం లో జరిగిన విషయాలను ” వీక్లీ  అమెరికా ”శీర్షిక లో రాయాలనుకొని మొదటి వారం విషయాలు సంక్షిప్తంగా రాస్తున్నా .
  న్యూ యార్క్ లో వాషింగ్టన్ కు వెళ్లే జెట్ బ్లూ ఫ్లయిట్ 4 గంటలు లే ట్ అయినందున ప్రయాణీకులకు ఒక్కో టికెట్ కు 16 డాలర్ల ఫుడ్ ఐటమ్స్ ఫ్రీ గా కొనుక్కోమని కూపన్లు ఇచ్చారు .మాకిచ్చిన 32 డాలర్లకు మంచినీళ్లు  స్ఫ్రీ ట్ , కోలా, లే   మింట్ వగైరా కొన్నా . ఎమిరేట్ ఫ్లయిట్స్ లో ఫుడ్ బాగానే పెట్టారు జైన్ వెజిటేరియన్ అడిగాం .నానబెట్టినవి ఉడకబెట్టినవి సెనగలు బఠాణీలు పెట్టారు . బ్రేడ్ బటర్ మామూలే .కాఫీ పైనాపిల్ బాగానే ఇచ్చారు . న్యూయార్క్ నుంచి డి సి విమానం లో వాటర్ బాటిల్ ,చిప్స్ పాకెట్ ఇచ్చారు . కస్టమ్స్ క్లియరెన్స్ కూడా వేగంగానే జరిగింది . 6 నెలలు ఉండటానికి వీసా ఇచ్చారు . తోపుడు బండి -వీల్ చైర్ వలన చకచకా పనులు జరిగాయి .లేకపోతె ఎటు బయల్దేరి ఎటు వెళ్ళాలో తెలుసుకోవటం అగమ్యంగా ఉంటుంది . వాళ్ళూ మంచి వాళ్ళే దొరికారు . అయితే కొంతచేయి తడపాల్సి వచ్చింది అంతే తప్పదు . డిసి లో కారులో బయల్దేరి ఒక చోట కాఫీ తెచ్చుకొని తాగాం ఆ తర్వాత నాన్ స్టాప్ ప్రయాణం .
  షార్లెట్ రాగానే మా అమ్మాయి కాఫీ కాచి ఇచ్చింది . తాగి కొంత సామాను సర్దామ్ . దారిలో మైనేనిగారికి రెండు సార్లు ఫోన్ చేసాం లిఫ్ట్ చేయలేదు . భోజనం చేసి విశ్రాంతి తర్వాత మిగిలిన బాగేజ్ విప్పి సర్దేశామ్ . వరద పుస్తకం చదివా  5 పేజీలు . రాత్రి నిద్రపోదామని ప్రయత్నిస్తే కాళ్ళు కొంకర్లు పోయాయి భయమేసింది .నెమ్మదిగా మంచం దిగి కాసేపు నడిచి ,హాలులో సోఫాలో పడుకుంటే కొంత త గ్గి నిద్ర బాగా పట్టింది తరువాతనిద్రకు ఇబ్బందికలగ లేదు పిలిస్తే పలుకుతోంది .
  శనివారం  మైనేని గారు ఫోన్ చేశారు . సంధ్య పూజ డ్రైగా అంటే నీళ్లు లేకుండా పూలు లేకుండా చేశా . విజ్జి ద్యూటీకి వెళ్ళింది సాయంత్రం అల్లుడు అవధాని నన్నూ మా మనవళ్ళు ఆశుతోష్ పీయూష్ లను లక్ష్మి రవి ఇంటికి అరగంట డ్రైవ్ చేసి తీసుకు వెళ్ళాడు .అక్కడ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభి షేకం జరుగుతోంది .లక్ష్మి ద్సపతులను అయిదేళ్ల తర్వాత ఇదే మళ్ళీ చూడటం చాలా మర్యాదగా ఆహ్వానించారు . ఇక్కడ  హిందూ  సెంటర్ లో 16 ఏళ్ళు చీఫ్ ప్రీస్ట్ గా ఉన్న ఆరవాయన గ్రీన్ కార్డు రాగానే మానేసి వైదికం చేస్తున్నాడు ఆయన ఆధ్వర్యం లో అభిషేకం జరుగుతోంది .ఉత్సాహ వంతులైన యువకులు మా అల్లుడూ స్వరం కలిపారు . 8 వ రుద్రంనుంచి నేనూ జత కలిశాను .అయేసరికి రాత్రి 8 అయింది .భోజనాలు ఏర్పాటు చేశారు 30 మందిదాకా వచ్చారు అమెరికన్ లేడీస్ కూడా  ఉన్నారు . లక్ష్మి దంపతులకు సరసభారతి ప్రచురణలు -సువర్చలాన్జనేయ శతక త్రయంకొ లచల సీతారామయ్య ,దైవ చిత్తం ,సిద్ధ యోగ పుంగవులు కానుకగా ఇచ్చాను .మా అమ్మాయి సాయంత్రం ఆరున్నరకు ద్యూటీఅయ్యాక యూని వర్సిటీ నుంచి మా పెద్దమనవాడు సంకల్ప్ ను పికప్ చేసుకొని వాళ్ళ అమ్మను  పెద్దకొడుకు శ్రీకేత్ ను తీసుకొని వచ్చింది .అందరం భోజనం చేసి ఇంటికి రాత్రి 9 30 కు చేరాం  రాత్రి కాసేపు వరద ను చదివా
  ఆదివారం  విజ్జికి సెలవు యధా ప్రకారం పట్టుబట్టకట్టి సంధ్య పూజాదులు చేశా . వీలున్నప్పుడల్లా వరద చదివా .ఇండియాకు ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడాం . సాయంత్రం మనవడిని రైల్వే స్టేషన్ దగ్గర దింపి మా అమ్మాయి నేను  సామ్స్ కు  వెళ్లి కావలసిన పాలు వగైరా కొని ఇంటికి వచ్చాము .
  ఇవాళ సోమవారం యధా ప్రకారం పూజ చేసి నాకు ఇచ్చిన లాప్ టాప్ సహాయం తో రాయటం మొదలు పెట్టా .ముందుగా అమెరికా ప్రయాణం లో పదనిసలు రాశా . మధ్యాహ్నానికి వరద చదవటం పూర్తి చేసేశా .సాయంత్రం దహగం లక్ష్మీ నారాయణ పై ఆర్టికల్ రాశా .
  కారీ నుంచి డా యల్లాప్రగడ సుబ్బారావు గారి మనవడు డా రామ మోహన రావు గారు ఫోన్ చేసి మాట్లాడారు .అయన బావ గారు డా. బండారు వారికి  హార్ట్ ఎటాక్ వచ్చి 3 స్టెంట్ లు వేయాల్సి వచ్చిందని ,ఇంటికి వచ్చారని కులాసా అని అందుకని మేము రాగానే ఫోన్ చేయలేక పోయానని అన్నారు .వారిది రేపల్లె .మా బాబాయి రాయప్రోలు శివరామ దీక్షితులు గారింటి ప్రక్కనే వారిల్లుట .బాబాయి పిన్నీ కొడుకు సుబ్బులు కూతురు పిచ్చాలు అందరూ బాగా తెలుసాయనకు . మా బాబాయి గొప్పతనం గురించి మురిసి పోతూ చెప్పారు ,
  మమ్మల్ని తాము వచ్చి వారింటికి కారీకి స్వయం గా తీసుకు వెడతామని ,మైనేని దంపతులనూ ఆహ్వానించానని అందరం అక్కడ కలుద్దామని అన్నారు చాలా సంతోషం అన్నారు . మన పుస్తకాలన్నీ మైనేని గారు పంపగా చదివానని గొప్ప కృషి అని అన్నారు .వారి బావగారు బండారు వారికే గీర్వాణ కవుల కవితా గీర్వాణం -మూడవ భాగం అంకితం చేయాలని మైనేని గారికి చెప్పటం నేను ఓకే అనటం ,దాని ముద్రణకు రామమోహన్ రావు గారే స్పాన్సర్ అని మైనేని గారు ముందే చెప్పారు .ఈ విషయం శ్రీ హేవిళంబి ఉగాది  వేడుకలలో ప్రకటించామని మీకు గుర్తు ఉండేఉంటుంది . అలాగే ”ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”పుస్తకాన్ని మైనేనిగారి బావమరిది గారు డా పరుచూరి రామ కృష్ణయ్యగారికి అంకితం చేస్తున్నట్లు దాని ముద్రణ ఖర్చు రామ క్రిష్నయ్య ఫౌండేషన్ ట్రస్ట్ స్పాన్సర్ గా ఉంటుందని ట్రస్ట్  నిర్వాహకులు శ్రీ పరుచూరి శ్రీనాధ్ గారు ఉగాది వేడుకలలో తెలియ జేసిన సంగతి మీకు తెలుసు .మంచి పనికి ఎందరు ఎన్ని విధాలుగా సాయం చేస్తారో మనకు తెలియదు వారి సౌజన్యం అలాంటింది .పుస్తకాలు ముద్రించాలని నేను రాయలేదు విషయాలు అందరికి తెలియాలని నెట్ లో రాశాను . అవి పుస్తక రూపం దాల్చటం యాదృచ్చికం దైవ నిర్ణయం ,సహృదయ  స్పందనం .నేను నిమిత్త మాత్రుడిని .  మేము షార్లెట్ వచ్చి అప్పుడే నాలుగు రోజులయింది .
 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నాగపూర్ మైకా గనుల యజమాని అయిన ఆంధ్ర వితరణ శీలి శ్రీ దహగం లక్ష్మీ నారాయణ

నాగపూర్ మైకా గనుల యజమాని అయిన ఆంధ్ర వితరణ శీలి శ్రీ దహగం లక్ష్మీ నారాయణ
తెలంగాణలో  కరీమ్ నగర్ జిల్లా  మంధెన గ్రామం లో సుమారు 200 ఏళ్ళక్రితమ్ ఒక బ్రాహ్మణ పురోహితుడు ఆ నాటి మధ్య రాష్ట్రాలు అని పిలువబడిన సెంట్రల్ ప్రావిన్స్ కు పొట్ట పోషించుకోవటానికి వలస వెళ్ళాడు . ఆయన ఇంటిపేరు దహనం . పే రు పుల్లయ్య .
కాంప్టి పట్టణం చేరి పౌరోహిత్యం చేశాడు . అక్కడ అప్పటికే ఉన్న తెలుగు వారితో సౌమనస్యంగా గడిపి పేరు తెచ్చుకున్నాడుపుల్లయ్య . .విధి వక్రించి అకస్మాత్తుగా చనిపోయాడు . పుల్లయ్య భార్య అహరహం కష్టించి  ఒక తెలుగు వారింట వంటపని చేస్తూ పిల్లల్ని పెంచి పోషించింది .యజమాని చిరువ్యాపారి  మంచివాడు కావటం తో పుల్లయ్య పిల్లలకు చదువు చెప్పించాడు .ఆ పిల్లల్లో పెద్దవాడు లక్ష్మీ నారాయణ . చురుకుదనం కల కుశాగ్ర బుద్ధి . బాగా చదివి నాగపూర్ వెళ్లి అక్కడ హిస్టాఫ్ కళాశాల లో ఇంటర్ చదివి ,అక్కడి మైకా గనుల వ్యాపారం పై ఆకర్షితుడయ్యాడు . తన కుటుంబానికి సాయం చేసిన ఆయన కు మైకా వ్యాపారం లో సాయం చేశాడు . గృహస్తు వ్యాపారం లో  సాయం చేయటానికి  చదువు మానేశాడు . మైకాను దూర ప్రాంతాలకు రవాణా చేస్తే లాభాలు బాగా వస్తాయని గ్రహించి  గృహస్తుకు నచ్చ జెప్పాడు .ఆయన అలాగే చేసి సంపన్నుడయ్యాడు . లక్ష్మీ నారాయణ మీద ఉన్న నమ్మకం తో వ్యాపార పురోగతి బాధ్యతను అతనికే అప్పగించాడు .
   క్రమంగా నారాయణ మైకా గనులను లీజు కు తీసుకొని వ్యాపారం లో స్థిరపడి బాగా సంపాదించాడు . ఇంతలో యజమాని మరణించటం ,అయన యావదాస్టి లక్ష్మీ నారాయణకు దక్కటం జరిగాయి .అప్పటిదాకా మనదేశం లో ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయటం అనేది ఇంగిలీషు వారి చేతుల్లోనే ఉండేది .ప్రతి చిన్న సాంకేతిక సమస్యకూ వాళ్ళ మీదే ఆధార పడాల్సి వచ్చేది .దీనిపై ఆలోచించిన నారాయణ సాంకేతిక నైపుణ్యం గల ఇంగిలీషు వారిని తన కింద ఉద్యోగులుగా నియమించుకొని విదేశీ వ్యాపారం సాగించి కూడు గుడ్డ లేనివాడు కోట్లకు పడగ లెత్తాడు .
  క్రమంగా ప్రజాహిత కార్య క్రమాలలో ప్రవేశించి జిల్లా బోర్డు సభ్యుడై ,మధ్య రాష్ట్రాల ఇండస్ట్రియల్ బోర్డు మెంబర్ అయి ,నాగ పూర్ పయోనీర్ ఇన్సూరెన్స్ అధ్యక్షుడుగా ఎదిగాడు . 1920 లో మధ్యరాష్ట్రాల శాసన సభ్యుడు కూడా అయ్యాడు . 1930 లో లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు బ్రిటిష్ ప్రభుత్వం ”రాయబహదూర్ ”బిరుదు నిచ్చింది .ఇంతకాలం మధ్య ప్రదేశ్ లో ఉన్నా లక్ష్మీ నారాయణకు ఆంద్ర దేశం పై విపరీతమైన అభిమానం ఉండేది
  19 27 లో ఆంద్ర విశ్వ విద్యాలయం ఏర్పడుతోందని చాలా సంతోషించాడు .తనకున్న యావదాస్తిని దానికి రాసివ్వాలని నిశ్చయించాడు .ఈ విషయాన్ని ఆనాటి గవర్నర్,విశ్వవిద్యాలయ వైస్ చాన్సెలర్ కట్టమంచి రామ లింగా రెడ్డిగార్లకు లిఖిత పూర్వకంగా తెలియ జేశాడు కూడా .తానిచ్చే నిధిని ఎలా సద్వినియోగం చేయాలో కూడా సూచించాడు . అయితే  లింగా రెడ్డి దీనిపై తగినంత శ్రద్ధ తీసుకోలేదు .తనకున్న విద్యా గర్వం తో నారాయణ ను చాలా చిన్న చూపు చూశాడు .కానీ ఉండబట్టలేని నారాయణ  రెడ్డికి ముందే తెలియజేసి బెజవాడ వచ్చాడు .ఆయన్ను  స్టేషన్ లో రిసీవ్ చేసుకోవటానికి విశ్వ విద్యాలయ అధికారులెవరూ రాలేదు .అయినా ఓపికగా వెయిటింగ్ రూమ్ లో నిరీక్షించాడు చాలా సేపు .తర్వాత ఎప్పుడో ఒక చిన్న ఉద్యోగి వచ్చి రెడ్డిగారికి తీరిక లేదని ,విశ్వ విద్యాలయం ఇంకా బెజవాడలో రూపు దిద్దుకోలేదని అందుకని రెడ్డి ,నారాయణ ను చూడటానికి అవసరరం లేదని భావించాడని చావు కబురు చల్లగా చెప్పాడు .ఎంతో ఆశతో వచ్చిన వితరణ శీలి లక్ష్మీ నారాయణ హతాశుడై తిరిగి నాగ పూరు వెళ్లి పోయాడు .
  తనదగ్గర ఉన్న సంపదను 35 లక్షల రూపాయలను  నాగ పూర్ విశ్వ విద్యాలయానికి దానం చేశాడు నారాయణ .”లక్ష్మీ నారాయణ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్  టెక్నాలజీ ”అనే సంస్థను స్థాపించాడు ..నాగపూర్ లా కాలేజీకి ,విశ్వ విద్యాలయానికి ఉచితం గా నివేశన స్థలాలను దానం చేశాడు .అక్కడ ఏర్పడే ప్రతి విద్యాలయం లో తెలుగు విద్యార్థులకు ప్రత్యేకం గా హాస్టల్ ఉండాలని నిబంధన పెట్టి తన ఆంధ్రాభిమానాన్ని చాటుకున్నాడు
.   ఆంధ్రులు ,కట్టమంచి తలపొగరుగా వ్యవహరించినా లక్ష్మీ నారాయణకు  తెలుగు దేశం పై అభిమానం వీసమంతా కూడా తగ్గలేదు .అందుకే ఆంధ్రా యూని వర్సిటీకి తనవద్ద ఉన్న అమూల్య పుస్తకాలన్నీ ధారా దత్తం చేశాడు .  ఆ నాటి ఆంద్ర యూని వర్సిటీ లైబ్రేరియన్ శ్రీ అబ్బూరి రామ కృష్ణా రావు నాగపూర్ వెళ్లి  లక్ష్మీనారాయణ ఇంట్లో అతిధిగా ఉండి స్వయం గా ఆ పుస్తకాలను బెజవాడ తీసుకొని వచ్చి యూ ని వర్సిటీ లైబ్రరీకి అందజేశారు .ఆ పుస్తకాల జాబితాయే ఆంద్ర విశ్వ విద్యాలయ ప్రధమ ప్రచురణ . 
  వితరణ శీలి  దహగం లక్ష్మీ నారాయణ 19 30లో మరణించాడు . లక్ష్మీ నారాయణ విషయం  శ్రీ అబ్బూరి వరద రాజేశ్వర రావు తన ”వరద కాలం ”లో రాసే దాకా ఆంధ్రులెవరికీ పెద్దగా తెలియదు .అందుకే దీన్ని అందరికి తెలియాలని నేను మీకు అందజేస్తున్నాను 
  నేను అమెరికా వచ్చేటప్పటికి నాకు వరద రాసిన కవన కుతూహలం ,వరద కాలం అందేట్లు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపేట్లు చేయమని నా ఆర్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణగారికి కోరటం వారాపని చేయటం 7 మధ్యాహ్నం మేము చేరేటప్పటికి పుస్తకం ఉండటం జరిగింది .ఆ రోజు రాత్రి 5 పేజీలు మాత్రమే చదివి నిన్నా ఇవాళ ఉదయం మొత్తం 370 పేజీలు పూర్తి చేశాను అందులో దహగం వారి ఆర్టికల్ బాగా  ఆకర్షించి  ఋణం తీర్చుకున్నాను .శ్రీ మైనేని వారికి కృతజ్ఞతలు .మిగిలిన విశేషాలు  వీలు వెంట తెలియ జేస్తాను 
 ఆధారం -కవన కుతూహలం మరియు వరద కాలం -అబ్బూరి వరద రాజేశ్వర రావు  
 
Inline image 1Inline image 2
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -కాంప్ -షార్లెట్ -అమెరికా -10-4-17 –
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అయిదవ సారి అమెరికా ప్రయాణం లో పదనిసలు

అయిదవ సారి అమెరికా ప్రయాణం లో పదనిసలు
సుమారు నెలన్నర కిందట మయ అమ్మాయి విజయలక్ష్మి మయ ఇద్దరికి అమెరికా ప్రయాణం టికెట్లు కొని ఆశ్చర్య పరచింది .అప్పటి నుంచే ప్రయాణం ఏర్పాట్లు మొదలు .అయితే వారం ముందుదాకా ఎవరికీ చెప్పలేదు .శ్రీ హేవలంబి ఉగాది వేడుకలనాడు సరసభారతి సమావేశం లో 26-3-17 న అందరికి తెలియ జేశాం
 ఏప్రిల్ 1 శనివారం మేమిద్దరం మయ మనవడు చర ణ్ కారులో బయల్దేరి హైదరాబాద్ కు మధ్యాహ్నంమయ ఆపెద్డబ్బాయి శాస్త్రి ఇంటికి  చేరామ్. మర్నాడు నేను  మయ అబ్బాయి శాస్త్రి మనవడు కాబ్ లో బయల్దేరి ఓల్డ్ బోయిన్ పల్లి లో మయ అక్కా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని  బాచుపల్లి లో మయ రెండో అబ్బాయి శర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్న మల్లంపేట శ్రీ ఆంజనేయ స్వామి  పక్కనే ఉన్న శివాలయం దర్శించి  మియాపూర్ వెళ్ళి మయ అమ్మాయి వాళ్ళ ఫ్లాట్ చూసి  శర్మా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని శాయ్‌ంత్రం నాలుగుకు బయల్దేరి మల్లాపూర్ చేరామ్ .
  5 వ తేదీ బుధవారం శ్రీ రామ నవమి రాత్రి 12 గం లకు శాస్త్రి బాస్ బామ్మర్ది గారి కారులో అందరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరి ,బాగెజ్ అప్పగించి వీల్ ఛైర్ సహాయం తో హాయిగా తెల్లవారుజామున (6) ఎమిరేట్స్ ఫ్లైట్ లో బయల్దేరి దుబాయ్ ఉదయం చేరామ్ .రెండు గంటల తర్వాత న్యూ యార్క్ ఫ్లైట్ లో 14 గంటలు ప్రయాణించి 6 వ తేదీ మధ్యాహ్నం రెండున్నరకు న్యూ యార్క్ చేరామ్ .అప్పటికే విపరీతం గేయా వర్షం పది ఆగింది సాయంత్రం 5 గం ల శార్లెట్  ఫ్ఫ్లైట్ కేన్సిల్ అయింది .ఆదివారం దాకా లేవన్నారు .ఎవరిదో ఫోన్ సహాయంతో మయ అమ్మాయికి ఫోన్ చేసి విషయం చెప్పాం .అప్పటికప్పుడు ఎమిరేట్స్ వాళ్ళతో మాట్లాడి వాషింగ్టన్ డిసీకి టికెట్లు మార్పిస్తే ఆ విమానం రాత్రి 10 గం లకు బయల్దేరాల్సింది నాలుగు గంటలు లేట్ అయి రాత్రి 3 గంటలకు బయల్దేరి నాలుగున్నరకు చేరింది .మా అమ్మాయి మా మనవడు శంకల్ప్ ను తీసుకొని రాత్రి 9 కి బయల్దేరి 600 మైళ్ళు డ్రైవ్ చేసి దీసి లీ తెల్లవారు జామున 3 కు చేరింది .సామాను కలెక్ట్ చేసుకొని అందరం అయిదున్నర కు బయల్దేరామ్ . మలీ 600 మైళ్ళు డ్రైవ్ చేసి అంటే రాను పోను 1200 మైళ్ళు అంటే 1800 కిలో మీటర్లు డ్రైవ్ చేసింది మయ అమ్మాయి .దారిలో మానవాడిని యూనీ వర్సిటీలో దింపి ఇంటికి చేరే సరికి మధ్యాహ్నం రెండు .స్నానాదికాలు పూర్తి చేసి భోజనం చేసే సరికి 3 .కాసేపు రెస్ట్ తీసుకొని టెక్చిన సామానౌు అంతా  సర్ది రాత్రి భోజనం  10 అయింది .అంటే న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో దాదాపు 12 గంటలు పడి ఉన్నాం .హైదరాబాద్ నుంచి టెక్చుకున్నవి తిన్నాం కనుక సరిపోయింది .లేకపోతే మయ పని ఖాళీ .24 గంటల్లో అమెరికా రావాల్సిన వాళ్ళం 36 గంటలకు చేరామ్ .ఇదొక కొత్త అనుభవం .అయితేనేం రెండు మహానగరాలు న్యూయార్క్ ంవాషింగ్టన్ లను విహంగా వీక్షణం చేసే వీలు కలిగింది రాత్రి వెలుగుల్లొ.అన్దుకె ఇది ´రెండు మహానగరాల కధ ;;అన్నాను -మీ దుర్గాప్రసాద్ -కాంప్ -శార్లెట్ -అమెరికా -10-4-17
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరి దేశ ప్రధమ మహిళా రాయబారి –రోసికా హ్విమ్మర్

ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరి దేశ ప్రధమ మహిళా రాయబారి –రోసికా హ్విమ్మర్

రోసికా ష్విమ్మర్ అని అందరూ పిలిచే రోసికా బడ్డీ ష్విమ్మర్ 11-9-1877 న హంగేరి లోని బుడా పెస్ట్ లో జ్యూయిష్ కుటంబం లో జన్మించిన ఫసిఫిస్ట్ ఫెమినిస్ట్ ,మహిళా ఓటు హక్కు ఉద్యమకారిణి .ప్రపంచ ప్రధమ మహిళా ఫెడరలిస్ట్ గా గుర్తింపు పొందింది .భాషా శాస్త్రాలను సంగీతాన్ని ఇష్టపడి చదివింది .కాని కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఛిన్నా భిన్నమవటం తో బుక్ కీపర్ గా ఉద్యోగం చేయాల్సి వచ్చింది .మంచి విషయాలపై ఆసక్తి ఉండటం వలన ,స్త్రీలకు జరుగుతన్న అన్యాయాలు ఆమె దృష్టి లో పడి మహిళాభ్యుదయానికి సేవ చేయాలని నిశ్చయించు కొన్నది.
1897 లో ఇరవై ఏళ్ళ వయసులోనే ‘’హంగేరియన్ వుమెన్ క్లెర్క్స్ అసోసియేషన్’’ ను నిర్వహించింది . ఏడేళ్ళ తర్వాత 1904 లో ‘’హంగేరియన్ ఫెమినిస్ట్ అసోసియేషన్ ‘’స్థాపించి ,’’హంగేరియన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వుమెన్ ‘’స్థాపనకు సహకరించింది . హంగేరియన్ పీస్ సొసైటి బోర్డ్ మెంబర్ అయింది .1909 లో హంగేరి ప్రభుత్వం ష్విమ్మర్ కు చైల్డ్ వెల్ఫేర్ గవర్నింగ్ బోర్డ్ లో పదవి నిచ్చి గౌరవించింది .
1913 లో ‘’ఇంటర్ నేషనల్ వుమన్ సఫ్రేజ్ అలయన్స్( ‘’ఐ .డబ్ల్యు. ఎస్ .ఎ.)కు కరెస్పాండింగ్ సెక్రెటరి అయింది .కారీ చాప్ మాన్ కాట్ తో యూరప్ అంతా విస్తృతంగా పర్యటించి మహిళా ఓటు హక్కు ప్రాధాన్యం పై అనేక బహిరంగ సభలలో ప్రసంగించి విషయాన్ని ప్రపంచ దృష్టి కి తెచ్చింది . ’’ఆనో ‘’(మహిళ)అనే మేగజైన్ కు సంపాదకత్వం వహించింది . 1914 లో లండన్ కు వెళ్లి అక్కడ చాలా ఐరోపా వార్తా పత్రికలకు కరెస్పా౦డెంట్ గా పని చేసింది . తర్వాత ఐ .డబ్ల్యు. ఎస్. ఏ. కు ప్రెస్ సెక్రెటరి అయింది .మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవటం తో స్వదేశానికి రాలేక పోయింది .ఘర్షణల నివారణకు ఉద్యమించింది .1914 లో అమెరికా పర్యటించి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ ను కలిసి యుద్ధ నివారణకు ఒక తటస్థ సమావేశాన్ని నిర్వహించమని డిమాండ్ చేసింది .1915 లో ‘’వుమెన్స్ పీస్ పార్టి ‘’స్థాపనకు కృషి చేసింది .
నెదర్ లాండ్ దేశం లోని ‘’ది హేగ్ ‘’లో 1915 లో ఏప్రిల్ 28 నుండి మే 10 వరకు జరిగిన ‘’ఇంటర్ నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ వుమెన్ ‘’సదస్సులో యుద్ధం లో పాల్గొంటున్న దేశాలమధ్య ఘర్షణ నివారణకోస౦ ష్విమ్మర్ ప్రవేశ పెట్టిన ‘’న్యూట్రల్ కాన్ఫరెన్స్ ఫర్ కంటిన్యుయస్ మీడియేషన్ ‘’తీర్మానం ఆమోదింపబడి ఆమె స్పందనకు విశేష గౌరవం కల్పించారు .అదే ఏడాది చివర స్టాక్ హోం కు ‘’పీస్ షిప్ ‘’చాప్టర్ విషయమై హెన్రి ఫోర్డ్ సమర్ధన సాధించింది .కాని ఫోర్డ్ మాట నిలబెట్టుకోక పోవటం తో 1916 జూన్ లో అత్యవసర ఘర్షణ నివారణకు మధ్యవర్తిత్వం వహించాలని అంతర్జాతీయ సంస్థపై తీవ్రమైన ఒత్తిడి తెస్తూ ఉద్యమం నిర్వహించింది .ఆమె ఆందోళన ఫలించి యుద్ధ విరమణ జరిగింది.అప్పుడామె ‘’వుమెన్స్ ఇంటర్ నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడం ‘’సంస్థ ఉపాధ్యక్షురాలైంది .
ఆస్ట్రియా నుండి హంగేరి విడిపోయి 1918 లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత ప్రధాని మిహలి కరోల్యి స్విట్జర్లాండ్ కు ష్విమ్మర్ ను రాయబారి గా నియమించి ఆమె విశేష కృషికి గౌరవం కలిగించాడు .ఈమెయే ప్రధమ మహిళా రాయబారి అయి రికార్డ్ సృష్టించింది . ఏడాది తర్వాత 1919 లో కమ్యూనిస్ట్ పాలన ఏర్పడి నప్పుడు వారిని ఆమె ద్వేషించటం తో ఆమె పౌరహక్కులు కోల్పోయింది .1920 లో మిక్లాస్ హోర్తీ ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని పడ దోసినప్పుడు ఆమె వియన్నాకు పారి పోయింది .1921 లో అమెరికా చేరి చికాగో లో స్థిరపడి మళ్ళీ హంగేరి మొహం చూడలేదు .చికాగోలోనే ఉంటూ’’హంగేరి లో స్త్రీల రాజకీయాల ‘’కోసం శ్రమిస్తూనే ఉంది .
అమెరికాలో ష్విమ్మర్ ఫసిఫిస్ట్ భావాలకు సోషలిస్ట్ భావాలుగా ముద్ర వేశారు . తన వ్యక్తిత్వం పై వేసిన అపవాదు నుండి బయటపడటానికి పోరాడుతూనే ఉంది . ఫ్రెడ్ మార్విన్ ఆమెను జర్మని గూఢ చారి అని బోల్షేవిక్కుల ఏజెంట్ అని అభియోగం మోపినప్పుడు ఆమె పరువు నష్టం దావా వేసి 17, 000 డాలర్ల నష్ట పరిహారం పొందింది .అయినా ఆమె ఫాసిస్ట్ భావాలవలన ఆమెకు అమెరికా పౌర సత్వం లభించలేదు .అమెరికా సుప్రీం కోర్ట్ అమెరికా కు ఆమెకు జరిగిన న్యాయ పోరాటం లో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు నిచ్చింది .1946లో అమెరికాకు జిరౌర్డ్ కు మధ్య నడిచిన కేసు లో ఆమెకు ఊరట లభించింది .జీవితాంతం అమెరికాలో’’ స్టేట్ లెస్ సిటిజన్ ‘’ గా ఉండి పోయింది .
జీవిత చరమాంకం లో ష్విమ్మర్ ‘’ప్రపంచ ప్రభుత్వం ‘’కోసం కృషి చేసింది .1935 లో ‘’వరల్డ్ సెంటర్ ఫర్ వుమెన్స్ ఆర్కైవ్స్ ‘’ను మేరీ రైటర్ బియర్డ్ తో కలిసి స్థాపించింది .1937 లో ష్విమ్మర్ కు ‘’ప్రపంచ శాంతి ‘’బహుమతి నిచ్చి గుర్తించి గౌరవించారు .అదే ఏడాది లోలా మేవరిక్ లాయడ్ తో కలిసి ‘’ప్రపంచ ప్రభుత్వం ‘’కోసం ప్రచారం ప్రారంభించింది .20 వ శతాబ్దం లో ఇదే ప్రపంచం లో’’ మొట్టమొదటి ఫెడరలిస్ట్ ఆర్గ నై జేషన్ ‘’.20 వ శతాబ్దం లో ఫెడరలిస్ట్ ఉద్యమం బాగా ఊపు అందుకొని ‘’అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఏర్పాటు ‘’కు ఊతమిచ్చింది .ఈ ఖ్యాతి అంతా ఆమెకే దక్కాలి .కాని దీనికి కారణ భూతురాలైన ష్విమ్మర్ ను గుర్తుంచుకున్నవారు అరుదైపోవటం విడ్డూరం అనిపిస్తోంది .1947లో ఆమె పేరు ను ‘నోబెల్ శాంతి బహుమతి’’కోసం ఎంపిక చేసి పంపారు .కాని దురదృష్ట వశాత్తు మరుసటి ఏడాది శాంతి బహుమతిని ఎవరికీ ప్రకటించక పోవటం తో ఆమెకు అందుకొనే అదృష్టం చే జారి పోయింది .
71 వ ఏట న్యుమోనియా సోకి న్యూయార్క్ లో 3-8-1948 న ప్రపంచ శాంతి కపోతం రోసికా ష్విమ్మర్ అసువులు బాసింది .
-గబ్బిట దుర్గా ప్రసాద్

————————————

Posted in రచనలు | Tagged | Leave a comment

నాగయ్య గారి త్యాగయ్య రామ సుధారస పానం

నాగయ్య గారి త్యాగయ్య రామ సుధారస పానం

ఇవాళ తెల్లవారు జామున మూడింటి దాకా మాంచి నిద్రట్టేసింది .మూడింటికి మెలకువ వచ్చి మళ్ళీ నిద్రలోకి జారే ప్రయత్నం చేశా. కాని నిద్రరాలేదు. అలాగే అయిదింటి దాకా పక్కమీద దొర్లుతూ ,అప్పుడే ప్రారంభమయే ఎఫ్ ఏం రేడియో ఆన్ చేసి శ్రీరామనవమి కనుక హాయైన రామ నామ కీర్తనలతో కాలక్షేపం చేద్దామనుకొని ,పక్కలోని ఆ బుజ్జి ము౦డను గిల్లుతూ తిప్పుతూ  నెత్తిమీద మోదుతూ స్టేషన్లు మార్చినా ఒకటి రెండు బాలమురళి కీర్తనలు తప్ప మనసుకు హాయని పించే పాటలే రాలేదు .కాని అంతకంటే చేసేది ఏమీ లేదు కనుక ఏదో మా గన్నుగా వింటూ తిట్టుకొంటూ తిడుతూ ఆరున్నర దాకా కాలక్షేపం చేశా .ఏదో వెలితి బాధిస్తూనే ఉంది .పండగ రోజున సుప్రభాత సమయాన ఇలా జరిగిందేమిట్రా అని గుసగుస లాడుతున్నా. ఇక లాభం లేదని లేచి నిత్యకృత్యాలు ,సంధ్య ,శ్రీరామనవమి పూజాదికాలు పూర్తి చేసి ,సామాను ఒక సారి మళ్ళీ సర్ది ,అంతా ప్రయాణానికి ఓకే అనుకోని మా వాళ్ళు చేసిన పులిహోర తిందామని ప్రయత్నం చేస్తే మా ఉయ్యూరు దబ్బ కాయ పులుపు నషాళానికి అంటి ,ఏదోకతికి మందేసుకొన్నా-సారీ మందులు వేసుకొని రెండో సారి కాఫీ తాగి ,ఏమీ తోచక ఎప్పుడూ ఉయ్యూరులో టి వి మీద ధ్యాస ఉండని నేను చానల్ళు మారుస్తూ ఏదైనా ఆనందం కలిగించేది దొరుకుతుందేమో నని ప్రయత్నించా .భద్రాచల శ్రీ రామనవమి కల్యాణం చప్ప చప్పగా ఉందని పించింది .మా వాళ్ళ ఇంటి దగ్గరే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం లో శ్రీ సీతారామ కల్యాణం ప్రారంభమౌతుందేమో అని ఆతురత పడితే అక్కడ వాళ్ళుమధ్యాహ్నం  ఒంటి గంటకు పైన కాని మొదలు పెట్టరని తెలిసింది  .సరే నని ఉసూరు మంటూ చానళ్ళు కిందికీ పైకీ మారుస్తుంటే అప్పుడు ఒక అద్భుతం ఈ టి. వి. లో  ఆవిష్కార మైంది . .అదే చిత్తూరు వి నాగయ్య గారి ప్రతిభాసర్వస్వం అయిన త్యాగయ్య సినిమా .ఇదివరకు చాలా సార్లు చూశా కాని ఇప్పుడున్న అసంతృప్తికి అదొక గొప్ప విరుగుడు మానసిక ప్రశాంతికి దోహదంగా   కనిపించింది .అంతే ఇక వేరే చానల్ జోలికి పోలేదు .అయ్యేదాకా అలా చూస్తూనే ఉండి పోయాం నేనూ మా శ్రీమతీ .

నాగయ్య గారి ముఖం లో ఎంతటి బ్రహ్మ వర్చస్సు కని పించిందో ఆశ్చర్యమేసింది .త్యాగయ్యగారి పాత్రకు జీవం పోశారు నాగయ్య .ఆయన మహానటుడు సంగీత కర్త  దర్శకుడు నిర్మాత గాయకుడు కథారచనలో   సంభాషణలలో  సముద్రాల రాఘవాచార్యులవారికి  చేదోడు  కూడా .అన్నీ తానే అయి తనప్రతిభా  సర్వస్వం ధార పోసి తీసి నటించి ‘’ఆల్ టైం క్లాసిక్ ‘’వైభవం తెచ్చారు .ఆనటనలో ఎంత తన్మయత యెంత భక్తి పులకరింత ఎంతటి వినయ విధేయతలు ,ఎంతటి ఔదార్యం ఎంతటి రామ నామ పానమహిమ ఉన్నాయో వివరించి చెప్పటం నలువకు, ఆదిశేషునికీ కూడా తరం కాదు అంటే ,కోన్ కిస్కా నేనెంత ? ఆ ఫీల్ ను మీతో పంచుకొంటే పొందే ఆనందం  అర్ణవమే . బ్రహ్మానంద సహోదరత్వమే .

కమ్మగా సాగే కమనీయ త్యాగబ్రహ్మ కథ.ఇల్లాలు కమలాంబ గా  హేమలతా దేవి ,ధర్మాంబ గా జయమ్మ , జపేశం గా ముదిగొండ లింగమూర్తి ,రాజనర్తకి చపల గా సరితాదేవి ,నారదునిగా వేదాంతం లక్ష్మీ పతి ,తంజావూర్ రాజుగా నారాయణ మూర్తి ,మొదలైన వారంతా శక్తి యుక్తులు ధారపోసి నటించారు ..పద్మనాభం ,లక్ష్మీ రాజ్యం లు కూడా ఉన్నారు .సంగీత దర్శకత్వం చేసిన నాగయ్యగారికి  జె.ఎ. రెహమాన్ సహకరించాడు .

భజ గోవిందం పాట పులకరింత తెస్తే ,ఆరగింపవే బ్రతిమాలి స్వామిని పాలు త్రాగి౦చి నట్లు ,దొరకునా పాట మళ్ళీ మనకు వినే భాగ్యం దొరుకునా అన్నట్లు ఉంది .’’ఎందరో మహానుభావులు ‘’వింటే ఎందరో లేరు మహానుభావులు నాగయ్య ఒక్కరే మహానుభావులు త్యాగయ్యలో ఒదిగిన పూర్ణ పురుషులు అనిపించక తప్పదు. జోజో శ్రీరామా జోలపాట వింటే రాముడు తప్పక నిద్రిస్తాడు .మనసా పాట ఆయన అంత రంగ మధనమే .నా మొర ఆలకింప వరద రాజ లు ఆ దేవుళ్ళను పలకరించి విన్నపాలు విన్నవించి కార్యోన్ముఖులను చేసేట్లుగా ఉంటాయి నాగయ్య గారి స్వరం లో సుస్వర మాధుర్యం తో .అందరూ మెచ్చేదే  అయినా ఆచరించ లేనిది ,త్యాగయ్యగారు ,పోతన్న గార్లు  మాత్రమే ఆచరించినది ‘’నిధి చాల సుఖమా ‘’లో రాముని సన్నిధి మాత్రమే సుఖమిస్తుందన్న ఎరుక కలిగిస్తుంది .తన్మయత్వం తో’’ నాగబ్రహ్మ’’త్యాగ బ్రహ్మ ‘’హృదయాన్ని ఆవిష్కరించారు .’’సంగీతజ్ఞానమూ ‘’వింటుంటే ‘’భక్తి వినా ‘’ మరేదీ లేదని పించింది .తెర అవతలనుంచు ని భక్తి భావ బంధురంగా ‘’తెరతీయగ రాదా ‘’అని పాడితే దేవ దేవుడే దిగివచ్చి లోని, బయటి తెరలుతొలగించి అజ్ఞాన తిమిరాన్ని పోకార్చి జ్ఞాన జ్యోతి దర్శనం చేయించింది .సామజ వర గమన ,బాలకనక మయ ,శివ శివ అనరాదే,రామ భక్తి సామ్రాజ్యం ,ఎవరని  నిర్ణయి౦చేరా  కృతులు నాగయ్య గారి కంఠం లో ఊపిరులు ఊది సమ్మోహనం చేసి ,భక్తి సామ్రాజ్య వైభవానికి ఎత్తిన పతాకలుగా స్థిరం గా నిలిచాయి .నాగయ్య గారి లాంటి మహానటుడు తెలుగు వాడై పుట్టటం మన అదృష్టం ఆయన దుర దృష్టం .ఆయన నటనకు సాటి రాతగిన వాడు హాలీవుడ్ నటుడు ‘’పాల్ ముని ‘’.అక్కడ మునికి బ్రహ్మ రధం పట్టారు .ఇక్కడ మన నట మహర్షి ,ముని చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసి  ఘంట సాల వంటి వారెందరినో  ప్రోత్సహించి పైకి తెచ్చిన మహా దాత కు గుర్తిపు లేదు . ఇవాళ త్యాగయ్య సినిమా చూస్తే నేను మా ఆవిడ పొందిన ఆనందం వర్ణనాతీతం . ఉయ్యూరులోమా శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం లో పీతల మీద కూర్చుని సీతారామ కల్యాణం చేసి తలంబ్రాలు పోసే  భాగ్యం అమెరికా ప్రయాణం వలన కుదరని మాకు  ,నిజంగా శ్రీరామనవమి మా ఇంట్లో చేసుకొన్నంత అదృష్టం దక్కిందని పించింది .

నాకు హృదయానికి తాకే సన్నివేశాలు చూస్తుంటే గుండె కరిగి పోతున్నట్లు అనిపించి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజల ధారాపాతంగా కారిపోతాయి .నన్ను నేను సంబాళించుకోలేని ఒక అపూర్వ అచేతన  స్థితి అది .అలా అయింది ఇవాళ త్యాగయ్య చూస్తుంటే. అంతటి మధురానుభూతికి లోనయ్యాను .విశ్వనాద్ సినిమాలు చూస్తే ఇలాగే ఉంటుంది నా పరిస్థితి మాయ బజార్ చూసినా మల్లీశ్వరి చూసినా ఇంతే .త్యాగయ్య సినిమా చూసి నేను ఇవాళ గొప్ప రిలీఫ్ పొందాను .తెల్లవారు జామున నుంచి ఉన్న అసంతృప్తి ,అసహాయత ,నీరసం ఒక్క దెబ్బతో దూరమైపోయాయి .ఎద నిండా ఆనందమే తాండవ మాడింది .ఆనంద రస సాగరం లో ముంచి తేల్చారు నాగయ్యగారు త్యాగయ్య లో . ఆ ఇద్దరి జీవితాలు ధన్యాతి ధన్యం .త్యాగయ్య కోసమే నాగయ్య జన్మించారనే అనిపిస్తుంది .పోతన్న కూడా తనకోసమే నాగయ్యగారు పుట్టారని భావించి ఉంటారు .ఇది చారిత్రిక సత్యం .73 ఏళ్ళు దాటాయి నాగయ్యగారి త్యాగయ్య వచ్చి .ఇప్పటికీ అదే స్వచ్చత అదే ,పవిత్రత, అదే రామ భక్తి సామ్రాజ్యం .ఆతర్వాత ఎన్నో వచ్చినా త్యాగ బ్రహ్మం గారి సంగీత సామ్రాజ్య వైభవానికి ఈ చిత్ర రాజం ఒక్కటే నిలువెత్తు దర్పణం గా నిలిచింది .ఈ అనుభూతినే మీతో పంచుకొన్నాను .

మధ్యలో ఒక సారి ప్రక్కనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో రామకల్యాణ౦  యెంత వరకు వచ్చిందో చూద్దామని వెళ్ళా .అప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట దాటుతోంది .కాని అక్కడ ఇంకా కల్యాణం శురూ కాలేదు . నేను స్వామిని దర్శించి బయటికి వస్తుంటే అప్పుడే కల్యాణం చేసే దంపతులు సీతారాముల విగ్రహాలతో మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి గుడిలోకి వెడుతున్నారు .కల్యాణం ఇంకాకాని ఆ సీతా రాములను దర్శించి నమస్కరించి ,ఇదే దక్కిందనుకొని ,మా త్యాగయ్య ఏమయ్యాడో అనే కంగారుతో ఇంట్లోకి వచ్చి పూర్తయ్యేదాకా చూసి తృప్తిగా భోజనం చేశాను .

Inline image 1

శ్రీరామమనవమి  శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0-3 92-తిలపర్వత దాన కర్త –కృష్ణన్ భట్టాద్రి పాద (1879-1964 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0-3

92-తిలపర్వత దాన కర్త –కృష్ణన్ భట్టాద్రి పాద (1879-1964 )

కృష్ణన్ భట్టాద్రి పాద  1879 లో కేరళలోని త్రిస్సూర్ జిల్లా పెరువనం దేశ మన లో కున్నట్టూర్ పడి నంజరే దాతుఅనే తంత్ర సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .తండ్రి పేరుకూడా కొడుకు పేరే .తల్లి చిత్తూరు మన నుండి వచ్చింది ,తొమ్మిది మంది సంతానం లో ఆరవ  వాడు .నలుగురు సోదరులు ,నలుగురు సోదరీమణులు .

ఉపనయనానంతరం ఋగ్వేదాన్ని కంఠోపాఠం చేశాడు .జీవితమంతా వేదం అధ్యన అధ్యాపనం లో గడిపాడు .అద్వాన్సేడ్ సంస్కృతాన్ని సాహిత్యాన్ని  చన్నమంగళం అయ్య శాస్త్రి వద్ద నేర్చాడు .కోడంగూర్ గురుకులం లో తర్కాన్ని అభ్యసించాడు . వంశ పారంపర్యంగా వస్తున్న తంత్ర శాస్త్రం లో నిష్ణాతుడై ,తచు శాస్త్రం లో మహా పాండిత్యాన్ని సాధించాడు .భట్టాద్రి పాద ముఖ్య శిష్యుడు 2000 వ సంవత్సరం లో చనిపోయిన తంత్ర మహా నిష్ణాత కలక్కూజ దివాకరాన్ నంబూద్రి .భట్టాద్రి ఆధ్వర్యం లో అరుదైన మహా గొప్ప తిలపర్వత యజ్ఞాన్ని నభూతో గా కొచ్చిన్ మహా రాజు కోరికపై నిర్వహించారు .ఈ మహా క్రతు విధానాన్ని సంపూర్ణం గా నంబూద్రి పుస్తకం గా రచించి ‘’తిలపర్వత దానం ‘’శీర్షికతో ముద్రించాడు .ఆయన రాసిన మరో గ్రంథం ‘’సాహిత్య చింతామణి .’’.ఇందులో ‘’త్రిసంధ ‘’,సంన్యాసక్రియ ‘’మొదలైన కర్మకాండ నంతటిని చక్కగా వివరించి రాశాడు .85 వ ఏట మరణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -౩-4-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -౩ 91-న్యాయాచార్య ,పండిత రాజ మండిత –కుంచు నంబూద్రి (1877-1959 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -౩

91-న్యాయాచార్య ,పండిత రాజ మండిత –కుంచు నంబూద్రి (1877-1959 )

శాస్త్ర శర్మ (కుంచు )నంబూద్రి కేరళలో 1877 లో సుబ్రహ్మణ్య నంబూద్రి కిరనా౦జల్ పార్వతి దంపతులకు జన్మించాడు .అన్న వాసుదేవ నంబూద్రి గొప్ప వ్యాకరణ వేత్త .తమ్ముడు సుబ్రహ్మణ్య నంబూద్రి న్యాయ శాస్త్ర వేత్త .7 వ ఏట ఉపనయనం జరిగి అన్నగారి వద్దనే వేదం నేర్చి తర్వాత త్రిస్సూరు బ్రహ్మస్వామి మఠంలో 15 వ తేడు వరకు చదువుకున్నాడు .ఆ సమయం లోనే వ్యాకరణ న్యాయ శాస్త్రాలను కిరంగాట్ మన లో ఉన్న ప్రసిద్ధ పండితుడు రామ స్వామి శాస్త్రి వద్ద  క్షుణ్ణంగా అభ్యసించాడు .న్యాయ శాస్త్రం లో అడ్వాన్సేడ్ ట్రెయినింగ్ ను కుడు౦గ ల్లూర్ గురుకులం లో విఖ్యాత భట్ట గోదావర్మ రాజ వద్ద నేర్చాడు .ఆయన మేనకోడలిని వివాహమాడాడు .

కొచ్చిన్ రాజు తర్కాలంకార బిరుదు ప్రదానం చేసి త్రిపుని తుర లోని సంస్కృత పాఠ శాలలో న్యాయ శాస్త్రా చార్యునిగా నియమించాడు .1931 వరకు అక్కడే పని చేసి, రిటైర్ అయినా కూడా తన విద్యావ్యాసంగాన్ని బోధనను మానకుండా చేశాడు .జీవిత కాలమంతా న్యాయ సదస్సులకు న్యాయ నిర్ణేతగా కొనసాగాడు .

న్యాయ శాస్త్రం లో ఆయన చేసిన కృషి అనిర్వచనీయం .నాచన్ రత్నమాలిక ,దీనిపై ‘’నూతనాలోకనం’’ అనే వ్యాఖ్య ,సుబోధినీ టీకా లను రచించాడు గంగాతరంగిణి అనే 24 తరంగిణులకు ఒక్కొక్కదానికి 14 శ్లోకాల కావ్యం  రాశాడు. కాశీ విశ్వేశ్వరునిపై అచంచల భక్తీ ఉన్న కుంచు నంబూద్రి వ్యాఖ్యాన టీకా ‘’ప్రసూనాంజలి’’ రాసి తన శివ భక్తి గరిమను చాటుకున్నాడు .చిన్నదే అయినా అత్యంత ప్రసిద్ధి చెందింది .చాతక సందేశం అనే సందేశ కావ్యాన్నీ రాశాడు .82 ఏళ్ళ వయసులో కుంచు నంబూద్రి 1959 లో శివసాయుజ్యం పొందాడు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

5-4-17 బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు

Image result for sri rama navami greetings in telugu
—

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

విషయం : పాత ఙ్ఞాపకాలు

నమస్తే -ఇది” సీతా రామయ్యాయణం ”తీపి గుర్తులు కానీ పిడకల వేట కాదు ఇంత  విలువైన సమాచారం మన పుస్తకం లో మిస్ అయ్యాము కదా అని బాధ పడుతున్నా . అయినా ఇబ్బంది లేదు శ్రీ ప్రేమ్ చంద్ గారి ఫ్రెండ్ గారి ఆంగ్ల అనువాదం లో చేర్చవచ్చునేమో కనుక్కోండి . ఇలోఆంటీ మీ అనుభవాలు నాకు రాస్తూ ఉండండి అందరికీ పంపి భాగస్వాములను చేద్దాం -మీదు
2017-04-01 20:54 GMT+05:30 Gopala Myneni <gmyneni008@gmail.com>:

అయ్యా, శ్రీ దుర్గాప్రసాద్ గారూ : “కడుపులో కెలుకుతూంటే  కక్కుంటే కక్కుంటే పోతుంది”, అనే సామె తను అడ్డం పెట్టుకుని ఈక్రింది విషయాలు మీకు చెప్పుకుంటున్నాను. వేరే ఆడ్ చేయమని కాదు, కరెక్ట్ చేయమని కాదు. నన్ను నమ్మండి . అవేమంటే:

1) మా బావమరిది రామక్రిష్ణయ్య గారు ఆఖరు దశలో, మంచంమీద ఉండగా నాకు ఫోన్ చేయించి , “గోపాలకృష్ణ గారూ , మెడిటేషన్  ఎలా చేయాలో చెప్తారా అని అడిగితె అవాక్కయ్యి , తేరుకుని , తప్పక రాసి పాముపుతా లెండి  అని చెప్పటం, ఆతరువాత నేను పనిచేసే యూనివర్సిటీ అఫ్  లూయివిల్ లో  , ఇంగీష్ డిపార్ట్మెంట్ హెడ్ (అమెరికన్)  మెడిటేషన్  మీద   వారానికోసారి ట్రైనింగ్ క్లాస్ ఇస్తున్నట్లు తెలిసి, వాకబుచేస్తే తేలిందేమంటే , నా చిన్నపుడు మానాయనమ్మ నేర్పించిన “హరే రామ , హరే రామ , రామ, రామ, హరే, హరే” మంత్రాన్నే వల్లె  వేయిస్తున్నారని తెలిసింది . అదే ప్రింట్ చేసి  నేను రామకృష్ణయ్య గారికి అదే వ్రాసి , “అది మీ పేరు నే మంత్రంగా వాడు కోవచ్చును, చాలా ఈజీ , మర్చిపోవటానికి వీల్లేని  మంత్రం” అని రాశాను.  తదుపరి , ఫోన్ చేసి కూడా చెప్పాను . కొలది రోజులకే అయన స్వర్గస్తు లయ్యారు .
2) కీ.  శే.  సీతారామయ్య గారు ఇండియా వచ్చినపుడు , నేను మొదటి సారి అమెరికా నుండి తిరిగి వచ్చి ఉయ్యూ రు   మా వరండా లో మా నాన్న గారు నేను  ఉదయం కూర్చుని ఉండగా , ఒకాయన రొప్పుకుంటూ  వచ్చి మా నాన్న గారిని ఉద్దేశిస్తూ  , ” అయ్యా  రష్యా నుండి వచ్చిన అనంతరామయ్య గారి తమ్ముడు మిమ్మల్ని గురించి వాకబు చేశారు “, అని చెప్తే , నేను మా నాన్న గారు రిక్షా లో వెళ్లి అయన తోటలో ఇంటి వరండాలో , జనాలు చుట్టి  ముట్టి  ఉండడం చూస్తుంటే , వారి మనుమడి మమ్మల్ని తీసికొని వెళ్లి తాతగారి దగ్గర ఎదురుగా కుర్చీల్లో కూర్చోపెట్టారు . మానాన్న గారిని , “వెంకట నరసయ్య గారు , వారి అబ్బాయి గోపాలకృష్ణ ఆమ్నెరికానుండి తిరిగి వచ్చారు ” అని చెప్పగా , సీతారామయ్య గారు ఆశ్చ ర్యంగా ”  చిన్నపుడు మనిద్దరం కలసి అన్నయ్య దగ్గర చదుకునే వాళ్ళం , గుర్తున్నానా నర్సయ్యగారూ , చాలా మారిపోయారు , ఎక్కడ్నించి , కు మ్మమూరు నుంచేనా  రావడం ” అని అడిగితె , మా నాన్న గారు అయన ముఖంలో చూస్తూ  “ఊఁ ” అన్నారు. అపుడు ఎవరో “లేదండీ , ఇపుడు ఉయ్యూరు లోనే ఉంటున్నారు ” అని చెప్పారు. అప్పటికే , మా నాన్న గారు మౌన ముద్ర దాల్చి మాట్లాడటం లేదు, అత్యవసరం అయితే కానీ. ఉదాహరణకు .ఉయ్యూరు లో ” బండెక్కు మామ ” అనే ఒక చిల్లర కొట్టు  వైస్యులు ఉండేవారు . అయన వచ్చి మా నాన్న గారి తో “మా డా బా  అమ్మకానికి పెట్టదల్చుకున్నామండీ , మీకేమైనా కొనే ఉద్దేశ్యం ఉందా “, అంటే “ఊ ” అనటం మా అమ్మగారు విని , ఆయన్ను తిప్పిపంపించేయటం లాంటివి ఎన్నో. డబ్బంతా హరించుకు పోయి , మా అమ్మ గారి మిగిలిన దాని తో మా చదువులకూ ఇంటి ఖర్చుకూ సతతమవుతుం డేవారు . నాన్న గారికి ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా , పిలిస్తేనే స్నానం , భోజంనం చేయటం చేసేవారు . అయన గారు, ఉయ్యూరు బిల్డింగ్ సొ సై టీ కి , గన్నవరం జైలు విసిటింగ్ కమిటీ (జైళ్లలో ఉన్నవారిని హింసకు గురి చేయకుండా ఉండేందుకు)కి ప్రెసిడెంట్ గా ఉండేవారు . ఆ కమ్యూనికేషన్స్ మెయిల్ లో వస్తే చూడకుండానే పారవేయటం చూసి రెసిగ్నే షన్  చేయించాము . ఇదంతా వేరే విషయం , దారి మళ్లింది .
సీత రామయ్య గారు నన్ను “అమెరికాలో నేనుండగా (అంటే అయన ఉండగా ) నల్ల వాళ్ళను బాగా వెలివేసి వారు , ఇపుడు కూడాఅ లానే  ఉందా ” అని అ డి గితే , నేను నీళ్లు నమలడం చూసి . అయన ” తెలుగు లో ఎక్ష్ప్రెస్స్ చెయ్యటానికి ఇబ్బందిగా ఉంటె , ఇంగిలీషులోనే చెప్పండి”  అని అచ్చ తెలుగులో అంటే అవాక్కయ్యాను . ఇంకా నానుండి  ఏమీ మాట పిగల  లేదు. నా అవస్థ చూసి వదిలేశారు .  ఇంతలో యాకమూరు చొప్పరపు సుబ్బారావు (కెసిపి యూనియన్ ప్రెసిడెంటు ), ” అక్కడ , దేవుడ్ని నమ్మరంటగా , మనుషుల్ని 60 సంవత్సరాలు పైబడగానే చంపేస్తారంటగా ” అని ప్రశ్నలవర్షం (కమ్యూనిస్టుల పై వ్యంగ్య  ధోరణిలో) కురిపించగా , సీతారామయ్యగారి సమాధానం :” ఇక్కడ మీరు నమ్మిచెడినవారూ లేరు, నమ్మక చెడిపోతే  పొయ్యారు ” అంటే “రష్యాలో ” నమ్మక చెడిపోయినవారూ లేరూ , నమ్మిచెడిపోతే పొయ్యారు ” అంటారు . అదే తేడా “. మరి మీ రీడు ప్రశ్న ” 60 వయసు పైబడ్డ వాళ్ళ సంగతి , అదే నిజమైతే నేను బ్రతికి బట్టకట్టి మీముందుండటమే సమాధానం . నేను వేరే ఏమీ చెప్పనవుసరం లేదు ” అని ముగించారు.
మాట్లాడినంత సేపూ , చార్మినార్ సిగరెట్ వేళ్ళ మధ్య కాలుతూనే ఉంది . అపుడపుడూ పొడిదగ్గు వస్తుంటే అన్నగారి మనుమడు ఎదో రసం ఇస్తూడేవారు .  కాసేపటికి మేము తిరిగి రిక్షాలో ఇంటికి బయలుదేరి వెళ్ళాం .
ఇవి సార్ నా గుర్తులు . ఇవి మీకు నేను నన్ను ఏమైనా పరిచయవాక్యాలు రాయ మంటే రాయ నందుకు ఇప్పటివరకూ అపుడపుడూ బాధిస్తూ గుర్తుకొస్తుంటాయ్ సార్. ఆఖరుకు మీరే ఎదో నాతరఫున వ్రాసి సరిపెట్టుకున్నాం. కనీసం నాకు తెలిసిన విధంగా వ్రాసి పంపినా మీరు దాన్ని ఎడిట్ చేసి పెట్టి ఉండేవారని ఇపుడు తెలిసివచ్చింది . నా కంటే, మా సిస్టర్ ఒకావిడ , ప్రేమచంద్ గారు వ్రాసింది చూసి , కొద్దిగా జెలసి(అసూయ ) తో .” వాళ్ళ నాన్న కన్నా , మన నాన్న కే   ఎక్కువగా పరిచయంగా, అనంతరామయ్య గా రితో, సీతారామయ్య గారితో కూడా, మరి నువ్వెందుకు రాయ లేదు  ”  అని మందలించినట్లు గుర్తు.
అయ్యా, నన్ను క్షమించాలి. “నేను ఇపుడు ఇoత  హడావుడిగా అమెరికా ప్రయాణంలో  ఉంటె ఈయన  , రామాయణం లో పిడకల వేట లా , పానకం లో పుడ కలా” తగులుకున్నారు”  అనుకుంటే మీ తప్పులేదు . ఇక మళ్లీ  మీరు అమెరికా వచ్చి , విశ్రాంతి తీసికొని , టైం లాగ్ దాటి న  తదుపరి మాట్లాడుకుందాం . అప్పటి వరకూ , మీ.  గో
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 84-ముస్లిం మహిళకు వేదాంత౦లొ పి హెచ్ డి కి మార్గ దర్శి –డా.ఆర్ .గంగాధర నాయర్ (19 46)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

84-ముస్లిం మహిళకు వేదాంత౦లొ పి హెచ్ డి కి మార్గ దర్శి –డా.ఆర్ .గంగాధర నాయర్ (19 46)

2-10-19 46న కేరళలోని వజ్హూర్ లో జన్మించిన గంగాధర నాయర్ సంస్కృత పండిత వంశం వాడు. తండ్రి స్వాతంత్ర సమర యోధుడు ,సంస్కృత విద్వాంసుడు దేశీయ వైద్యుడు అయిన వి. కె .గోపాల పిళ్లే.నాయర్ చత్తంపి స్వామికల్ ప్రశిష్యుడైన స్వామి విద్యానంద తీర్ధ పాద వద్ద సంప్రదాయ పద్ధతిలో సంస్కృత వ్యాకరణం నేర్చాడు .సంస్కృత వ్యాకరణాన్ని ఇటు ఓరియెంటల్, అటు పాశ్చాత్య విధానం రెండిటి లోనూ తిరువనంతపురం లోని ప్రభుత్వ సంస్కృత కళా శాలలోను ,కేరళ యూని వర్సిటి లోను అధ్యయనం చేశాడు .కేరళ యూని వర్సిటిలోని రష్యన్ డిపార్ట్ మెంట్ ద్వారా రష్యన్ భాషా సాహిత్యం పై మాస్టర్ డిగ్రీ పొందాడు .ప్రొఫెసర్ ఎం .ఎస్ .శాస్త్రి ఆయన గురువు .గురువుతర్వాత నాయర్ ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రొఫెసర్ అయ్యాడు .ప్రొఫెసర్ వెంకట సుబ్రహ్మణ్య అయ్యర్ ,డా ఆర్ కరుణాకరన్ లవద్ద సంస్కృతం లో ప్రాచీన సంస్కృత శబ్ద వ్యుత్పత్తి శాస్త్ర గ్రంధాలలోని  లో ‘’ఊనాది సూత్రా ల‘’పై పరిశోధన చేసి పి. హెచ్ .డి .అందుకున్నాడు . .

  కాలడి లోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వ విద్యాలయం సంస్కృత వ్యాకరణ విభాగం అధిపతిగా ,ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ శాఖ డైరెక్టర్ గా పని చేశాడు .కొచ్చిన్ యూని వర్సిటి సైన్స్ అండ్ టెక్నాలజీ సెనేట్ మెంబర్ గా ,తిరుపతి రాష్ట్రీయ సంస్కృత యూనివర్సిటి  సెనేట్ మెంబర్ గా కూడా ఉన్నాడు .మధ్య ప్రదేశ్ లోని రేవాలో ఉన్న ఓరియెంటల్ స్టడీస్ ఆఫ్ ఏ .పి .సింగ్ యూని వర్సిటి ఫాకల్టి  ఎక్పర్ట్ మెంబర్ గా పని చేశాడు .కలకత్తాలోని రవీంద్ర భారతి యూని వర్సిటి డి .ఆర్. ఎస్. ప్రోగ్రాముల సలహా సంఘానికి యు జి సి నామినేట్ సభ్యుడు .కాలడి సంస్కృత యూని వర్సిటి డీన్ గా పని చేసి రిటైర్ అయ్యాడు .కొచ్చిన్ లోని సుక్రుతీంద్ర ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ అకాడెమిక్ కౌన్సిల్ చైర్మన్ .దాని మేగజైన్ కు సంపాదకుడు .పురాతన సంస్కృత పత్రాల విశ్లేషణలో అవిశ్రాంతంగా విశేష  కృషి చేసి ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందినవాడు గంగాధర నాయర్ .నారాయణ భట్ట పై  పాణినీయేతర ప్రభావం అన్న ఆయన విశ్లేషనణాత్మక వివరణాత్మక పరిశోధన పెద్ద గుర్తింపు తెచ్చింది .ఇది పాణిని వ్యాకరణ అధ్యయనానికి కొత్త దారులు చూపింది .

 కాలడి యూని వర్సిటి లో రిటైర్ అయ్యాక నాయర్ ప్రపంచ వ్యాప్తంగా సంస్కృతాన్ని వాడుక భాషగా మలచటానికి తీవ్ర కృషి చేస్తున్నాడు .ఇండియా అమెరికాల యూని వర్సిటీలలో విస్తృతంగా పర్యటించి ప్రసంగాలు చేస్తూ   సంస్కృతాన్ని జీవద్భాషగా, ప్రజలు మాట్లాడుకొనే భాషగా మార్చటానికి సర్వ శక్తులు ధార పోస్తున్న సంస్కృతాభిమాని నాయర్ .తాను పదవిలో ఉండగా ఎంతో ధైర్యం తో ఒక ముస్లిం మహిళ శ్రీమతి  ఫాతిమా బీవి  కు భారతీయ వేదాంతం లో పి. హెచ్. డి .పొందటానికి రిసెర్చ్ గైడ్ గా నాయర్ ఉండి అందరి అభిమానాన్ని పొందాడు .

85-కాశికా వృత్తిపై వ్యాఖ్యానించిన –పదమంజరి (11 వశతాబ్దం )

11 వశతాబ్ది కి చెందిన పదమంజరి పాణిని వ్యాఖ్యానమైన కాశిక వృత్తికి వ్యాఖ్యానం రాసినట్లు తెలుస్తోంది .ఈ కీర్తి హరిదత్తు నిది అనే వాదం కూడా ఉంది .హరిదత్తుడు ఆపస్థంభ ధర్మ సూత్రాలు ,గౌతమ ధర్మ సూత్రాలు మొదలైన వాటిపై వ్యాఖ్యానం రాశాడు .

86-మీమాంసలో తన స్వంత మార్గాన్ని ఏర్పరచిన –ప్రభాకరుడు (7 వ శతాబ్ది )

భారతీయ తత్వవేత్త వ్యాకరణ వేత్త అయిన ప్రభాకరుడు 7వ శతాబ్దపు కవి .కుమారిల భట్టు మీమా౦స పై ఖండనం చేసి తన మార్గం ను వేరుగా ఏర్పాటు చేసుకొన్నాడు .ఇదే ప్రభాకర విధానం (ప్రభాకర స్కూల్ )అని పిలువబడుతోంది .8 వశతాబ్దం లో శైలకాంత ప్రభాకర సిద్ధాంతం పై వ్యాఖ్యానించాడు .పూర్వ మీమాంస సిద్దా౦త కర్తగా ప్రభాకరుని గుర్తిస్తారు .

  ప్రభాకరుని సిద్ధాంతం ప్రకారం -పదాలు సూటిగా అర్ధాన్ని ఇవ్వలేవు .మిగిలిన శబ్దాలతో సంబంధం ఉన్నప్పుడే దాని అర్ధం తెలుస్తుంది .దీనికే అన్వితాభిధానం అన్నాడు. అన్వితఅంటే అనుసంధానమైనది అని అర్ధం .అభిద అంటే వ్యక్తీకరణ అని అర్ధం . వాక్యం లో పదం ఏ సందర్భంగా ప్రయోగింప బడిందో తెలియాలంటే మిగతా పదాలమధ్య సంబంధం తెలియాలి .అప్పుడు ఆ వాక్యం మొత్తం భావం అవగాహన అవుతుంది .ఇది ఆధునిక లింగ్విస్టిక్స్ లోని ‘’అండర్ స్పెసిఫికేషన్ ‘’అన్నమాట .అనగా నిర్దేశిత ప్రయోజనం .

 ప్రభాకర వాదాన్ని భట్టకులు వ్యతిరేకించారు . అభిహితాన్వయం ను  వాళ్ళు అంగీకరించారు .అంటే ప్రతి పదం యొక్క అర్ధం తెలిస్తేనే వాక్యం యొక్క మొత్తం భావం తెలుస్తుంది అని వీళ్ళ వాదం .వీరి భావనలో శబ్దాలు స్వతంత్రమైనవి ,సంపూర్ణ స్వరూపమైనవి .ఇది ఈ నాటి ‘’ఫోడోరియన్’’వాదానికి దగ్గర లో ఉంది .

87-ప్రకరణ పంచిక కర్త  –శైలకాంత(క్రీ.శ.900)

 7 వ శతాబ్దానికి చెందిన ప్రభాకరుని అనుయాయుడు 9 వ శతాబ్ది శైలకాంత .భట్టవాద వ్యతిరేకి .ప్రభాకరుని పూర్వ మీమాంస పై విపులమైన వ్యాఖ్యానం’’ ప్రకరణ పంచిక ‘’ రాశాడు .ప్రభాకర సిద్ధాంతాన్ని పూర్తిగా తెలుసుకోవటానికి శైల కాంత వ్రాసిన ప్రకరణ పంచిక ఒక్కటి మాత్రమే మిగిలింది .

88 –గణిత మేధావి –విరహంక (6 వ శతాబ్దం )

6 వ శతాబ్దికి చెందిన విరహంక  గొప్ప ఛందస్ శాస్త్ర వేత్త ,గణిత మేధావి .8 వ శతాబ్దం వాడు అనే అభిప్రాయమూ ఉన్నది .క్రీ పూ. 4 వ శతాబ్దానికి చెందిన పింగళ కుని ఛందస్సూత్రాల నాధారంగా ఛందశ్శాస్త్రం  రాశాడు .దీనికి వ్యాఖ్యానాన్ని 12 వ శతాబ్దానికి చెందినగోపాలకవి రాశాడు .

89-ఛందశ్శాస్త్ర కర్త పింగళ –(క్రీ పూ. 4 వ శతాబ్దం )

చందశ్శాస్త్రం పై వెలువడిన అతి ప్రాచీన గ్రంధాన్ని పింగళ క్రీ పూ 4 వశతాబ్దం లో రాశాడు .పాణిని తమ్ముడుగా లోక ప్రసిద్ధి .లేకక్రీ పూ .2 వ శతాబ్దం లో  మహా భాష్యం రాసిన పతంజలి సోదరుడు .8 అధ్యాయాల ఈ చందో శాస్త్రం లోని సూత్రాలను అర్ధం చేసుకోవాలంటే వ్యాఖ్యానం తప్పనిసరి గా ఉండాల్సిందే . ఈ గ్రంథం క్రీ పూ లో చివరికాలం లో కాని క్రీ.శ .ప్రారంభ కాలం లో కాని రాయబడి ఉంటుందని ఊహిస్తున్నారు .అంటే వేద ఛందస్సుకు ,లౌకిక ఛందస్సుకు మధ్యకాలం లో సంధియుగం లో  రాయబడి ఉండాలి .మౌర్యకాలానికి దగ్గర లో ఉండి ఉంటుంది .10 వ శతాబ్దికి చెందిన హలయూథ దీనిపై వ్యాఖ్యానం రాయటమేకాక విస్తృత పరచాడు కూడా . .

  ఛందశ్శాస్త్రంలో గురు,లఘువుల చర్చ ఉన్నది .ద్విసంఖ్యామానం ఆధారంగా రాశాడు .వివిధ ఛందస్సులు వాటి కలయికలు చూస్తే  బైనామియన్ ధీరం (ద్విపద సిద్ధాంతం )గుర్తుకు వస్తుంది .దీనికి హలయూధుని ‘’మృతసంజీవిని ‘’వ్యాఖ్యానం చూస్తుంటే’’ పాస్కల్  త్రిభుజం ‘’ గుర్తుకు వస్తుంది .ఈ శాస్త్రం లో ‘’మాత్రా మేరు లేక మేరు ప్రస్తార ‘’విధానం ఈ నాటి గణితం లోని ‘’ఫైబో నాసి నంబర్ ‘’లను పోలి ఉంటుంది .  Pingala’s system ranks binary patterns starting at one (four short syllables—binary “0000”—is the first pattern), the nth pattern corresponds to the binary representation of n-1 (with increasing positional values). Positional use of zero dates from c. the 7th century (Brahmagupta) and would have been known to Halāyudha but not to Pingala.

90-మృత సంజీవిని రాసిన –హలయూధుడు (10 వ శతాబ్దం )

గణిత మేధావి అయిన హలయూధుడు 10 వ శతాబ్దానికి చెందినవాడు .పింగళుని చందశ్శాస్త్రానికి ‘’మృత సంజీవిని ‘’వ్యాఖ్య రాశాడు .ఇది ఈనాటి పాస్కల్ త్రిభుజానికి ఆనాడే చెప్పిన సిద్ధాంతం .ఈ కవి రాష్ట్ర కూట రాజుల రాజధాని ‘’మాన్య ఖేట ‘’లో నివసించాడు .రాష్ట్ర కూట రాజు  మూడవ కృష్ణుని ఆస్థానం లో ఉండి ఈ వ్యాఖ్యానం రాశాడు .ఈ కవి రాసిన ‘’కవి రహస్యం ‘’రాజు మూడవ కృష్ణుని స్తుతిస్తూ రాసినదే .తరువాత ఉజ్జయినికి పారమార రాజులకాలం లో చేరాడు .పారమార రాజు ముంజ ను స్తుతిస్తూ  మృతసంజీవని వ్యాఖ్య రాశాడు .పై రెండు గ్రంధాలే కాక ‘’అభిదాన రత్నమాల ‘’ అనే సంస్కృత నిఘంటువు కూడా హలయూధుడు కూర్చాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-3-17 –ఉయ్యూరు

 

  

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వసుధైక కుటుంబం పై కవితలు

అందరికి వందనం -సరసభారతి అనేకమంది కవులను ఆహ్వానించి వసుధైక కుటుంబం పై కవి సమ్మేళనం ను హేవిళంబి ఉగాది వేడుకలనాడు నిర్వహించిన సంగతి అందరికి తెలుసు .ఆ కవితలను పుస్తక రూపం గా తెచ్చే ప్రయత్నాన్ని శ్రీ వసుధ బసవేశ్వర రావు గారికి అప్పగించాం .ఇంకా ఎక్కువ మంది కవుల కవితలను కూడా చేర్చాలనే సంకల్పం కలిగింది . మీరు కూడా ఆ శీర్షికపై కవితలు అల్లండి. మీ మిత్రుల ను ప్రోత్సహించి రాయించండి . ఈ కవితలన్నీ ఈ క్రింది చిరునామాకు కానీ ,ఇమెయిల్ కు కానీ ఏప్రిల్ 15 లోపు పోస్ట్ చేయండి .మీరూ పాల్గొనే అపూర్వ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోండి,అద్భుత అపూర్వ కవితా సంకలనానికి సహకరించండి  -గబ్బిట దుర్గా ప్రసాద్ 

శ్రీ వసుధ బసవేశ్వరరావు -ఆంధ్రా బాంక్ మేనేజర్ -హిందూకాలేజి high school  బ్రాంచ్
  బచ్చు పేట (పో.ఆ ) )   మచిలీ పట్నం -1 
 సెల్ నంబర్ -9490832 787
email -vasudha@gmail .com 
Posted in కవితలు | Tagged | Leave a comment

28-3-17 మంగళవారం రాత్రి మా ఇంట్లోనూ ,శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లోనూ శ్రీ బొడ్డపాటి చంద్ర

28-3-17 మంగళవారం రాత్రి మా ఇంట్లోనూ ,శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లోనూ శ్రీ బొడ్డపాటి చంద్ర

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉగాది’’ పచ్చడి పచ్చడి ‘’తిన్న వాళ్ళు

ఉగాది’’ పచ్చడి పచ్చడి ‘’తిన్న వాళ్ళు

 ఉగాది’’ పచ్చడి పచ్చడి ‘’తిన్న వాళ్ళు

దుర్ముఖి వెడుతూ వెడుతూ చాలామందిని’’ పచ్చడి పచ్చడి’’ చేసి  చేదు పంచి వెళ్ళింది .కొందరికి హాట్ హాట్ స్వీట్ పెట్టింది .కొందరికి బంపర్ ఆఫర్ తో హేపీ ఇస్తే కొందర్ని పాపర్లను చేసి,అన్ హేపీ టోపీ పెట్టింది  .అందులో ఈ మధ్యనే జరిగిన పంచ రాష్ట్రాల ఎన్నికలలో ప్రజల చేత పంచెలు ఊడ పోగొట్టుకొన్నవారు కొందరైతే, కొత్త పంచలు కానుకగా పొందిన వారు మరికొందరు . .ఇదీ ఎన్నిక బాగోతం .దూషణ భూషణ తిరస్కారాల కాటా దెబ్బ తిన్న వాళ్ళే గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ లేచి ఎగురుతారు .లేకపోతె చతికిలబడి పోతారు గోడకు కొట్టిన పిడకలాగా .పిడకల వేట ఆపి అసలు విషయానికి వస్తాను .అసలు ఈ ఉగాది ఎవరికి  ఎలాటి ఉగాది పచ్చడి రుచులు  చూపించిందో చూద్దాం .

      భూమి పుత్రులం మేముండగా దత్త పుత్రులెందుకు దండగ అని భేషజాలు పలికిన అఖిలేష్, వాళ్ళ బాబుయాదవ్  ,రాహుల్ ,సోదరి  ,కమ్మీ  లాలూ ముఠా అండ్ కో పాపం పండి ,మోడీ చేతిలో పీటీ దెబ్బ తిని ,సర్వం కోల్పోయి  ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదుమాత్రమె మింగి కూలబడ్డారు .సైకిల్ గాలిపోయి పంచరయి రిమ్స్ బెండ్ అయి , ‘’సీటు ‘’,అధికార సీటూ గోవిందా అయి కూలబడ్డారు .

ఇక’’ ఏనుగు’’ బొమ్మావిడ రాష్ట్రమంతా తన శిలా విగ్రహాలు భారీ లెవెల్ లో పెట్టించి పూజలు చేయించుకొని ,జనానికి విసుగు పుట్టించి పార్టీ ఎవరిని ఉద్ధరించటానికి పుట్టిందో మర్చి పోయి అరిస్టో  క్రాట్ గా వ్యవహరిస్తే ,చీదరించు కొని ,ఏవగించుకున్న చీపురు పుల్లలాగా ఏరిపారేస్తే ఉగాది పచ్చడిలో కారం తింటూ నోరుమండి నీళ్ళు  తాగుతోంది వేసవి అప్పుడే వ విజ్రుంభించినట్లు పాపం .అధికారం ఉండటం కాదు దాన్ని పదిలం గా ప్రజానుమతంగా మలచుకోవాలి .

 రెండున్నర ఏళ్ళక్రితం అసలు పాదమే మోపటానికి స్థానం లేని యు .పి లో చక్కని వ్యూహం పన్ని దాదాపు అన్ని లోక్ సభ స్థానాలు సంపాదించిన మోడీ పార్టీ ,ఈ శాసన సభ ఎన్నికలకు అప్పటి నుంచే పకడ్ బందీ వ్యూహం పన్ని ,అంతా తానే అయి అమిత్ షాదూసుకు వెడితే ,పార్టీ పెద్దలందర్ని దూరం పెట్టి తానే సర్వ సైన్యాధ్యక్షుడై ఢిల్లీ నుంచి గల్లీ దాకా సుడిగాలి పర్యటన చేసి వైరి శిబిరంలో ప్రకంపనలు ,భయోత్పాతం పుట్టించి ఒణుకు తెప్పించి ,వోటరు నాడిని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం వోట్లన్నీ దండుకొని  మూడువంతుల మెజారిటీ సాధించి పెట్టిన మోడీ అండ్ కో కు ప్రజలు బ్రహ్మ రధం పడితే ,ఈ ఉగాది వేళ ఉగాది పచ్చడిలో బెల్లం చెరుకు ముక్కల కమ్మని స్వీటు తింటున్నారు.గెలుపు మధు రసాస్వాదన చేస్తున్నారు .

   పెద్ద నోట్లరద్దు దండగ  సాధించిందేమీ లేదు ,బ్యాంకుల దగ్గర భారీక్యూలు ,ప్రజల ఇక్కట్లు గట్టెక్కవు అని కాకిగోలతో ఊదర కొట్టి ప్రజల్ని భయకంపితుల్ని చేసి ,ఢంకా బజాయించిన వార్తా పత్రికలూ ఎలక్ట్రానిక్ మీడియా అంచనాలు తలక్రిందై  కుదేలై ,రెండు నెలల్లో అంతా సర్దు బాటులోకి వస్తే ,మి౦గా లేక కక్కాలేక మోడీ వ్యూహం తెలియలేక తమబాకాలు కాకాలు పని చేయక లబో దిబో మని  చతికిలబడి ఈ ఉగాదినాడు ఉగాదిపచ్చడిలో  చింతపండు పులుపు మాత్రమే దక్కి ,తిని బావురు మంటున్నారు.ఇందులో ఒక తెలుగు దినపత్రిక మీడియా కూడా ఉన్నాయన కు 400 కోట్ల నల్లదనం’’ రద్దు చెదలు’’ తినేయటం తో  మరీ విరుచుకు పడ్డాడు ఆసమయం లో .పాపం ఎవరికి ఎంత దక్కాలో అంతే కదా దక్కేది బాస్ !

  మణిపూర్ ఏమిటి  కాషాయం ఎగరేయటం ఏమిటి,గొడవల గోవా ఏమిటీ మెజార్టీ రాకపోయినా వ్యూహం ఫలించి కమలం అధికారం లోకి రావటం ఏమిటి ,అందరి అంచనాలను తలక్రిందు చేయటం కలలో కూడా ఊహించలేనిది .కాని ‘’కలనిజమాయేగా కోరికా తీరెగా’’అన్న పాతః పాట నిజమైంది .ఇక్కడ ఉగాదినాడు ఉగాది పచ్చడిలో వగరు కాంగీ తింటుంటే ,పారీకర్  బీరేన్ సింగ్ లు షడ్రుచుల సమ్మేళననాన్ని హాయిగా  తింటూ అనుభవిస్తున్నారు  .ఉత్తరాఖండ్  లో మొదటినుంచి దూకుడుగా ఉన్న కమలం జెండా రెట్టింపు ఉత్సాహం తో రెప రెప లాడింది .రావత్ అండ్ కో పంచ భక్ష్య పరమాన్నం తో అన్నిరుచుల ఉగాది పచ్చడి ఉగాది నాడు  భోంచేస్తున్నారు .

 పంజాబ్ మనదే అనుకొన్న అం ఆద్మీ క్రేజీ కేజ్రీ ధమాల్ మన్నాడు . అక్కడి అవినీతి కి బలై కమలం పూర్తిగా వాడి అధికారం కోల్పోయి వల వలా విల విలా .ఈ ఉగాది నాడు అక్కడ కెప్టెన్ వ్యూహం ఫలించి ‘’పంచ ఆబ్ ‘’లను కలిపి గద్దెనెక్కి హేపీ ఉగాది జరుపుకొంటూ ఉగాది ఫలరసాన్ని హాయిగా  తోటివారితో అనుభవిస్తున్నాడు .ఆం లేదు ఆద్మీ లేడు హాం ఫట్ లేదు ,షా పధకం పారనూలేదు .కనుక వీళ్ళంతా ఈ ఉగాదికి చేదు కారం వగరు పులుపు తింటూ గత స్మృతులను నెమరేసుకొంటున్నారు .

  అసలు గెలుగువాడి ఉగాదిని వదిలి ఉత్తరభారత౦ హరికధ ఎందుకు అంటారని తెలుసు .వస్తున్నాఅక్కడికే .చిన్ననాటి నుండి తండ్రి చాటుబిడ్డ గా ఉండి ,తండ్రిని చాటుకు పంపేసి ఆయ౦డగానే అధికారం చెలాయించి ,పోగానే ఆ గద్దె నాదేనన్న ఊహాలోకం లో తేలుతూ ,ఎన్నికలలో బోర్లాపడి ,ఉప ఎన్నికల్లో కళ్ళూ కాళ్ళూ పోగొట్టుకొని నమ్మిన మంది నట్టేట ముంచి నాలుగోవంతు ఖాళీ అయితే ,నోట్ల రద్దు ఎన్ని వేల కోట్ల బొక్క పెట్టిందో తెలియక ,చేదే అలవాటు చేసుకొని వేపకాయలే తిని తిని   వాచాలత్వం ముదిరి తానే సి ఎం అనుకొంటూ పగటి కలలు కంటున్న యువ నాయకుడిని జనం సభలో బయటా చీదరించుకొంటు౦టే మి౦గా లేక కక్కాలేక  సి ఎం నే ఎంతమాట అంటే అంతమాట అంటూ పరువు గంగలో కలిసిన’’ దేనిమీదో ‘’వానపడ్డట్టు  దులుపుకు తిరుగుతూ ఈ ఉగాది నాడు ఉగాది పచ్చడిలో వేపపూవే మధురసం గా తింటూ మరింత వెర్రి పెంచు కొంటున్నాడు .బాబు మాత్రం చిద్విలాసంగా షడ్రుచుల ఉగాది పచ్చడిని అందరితోకలిసి ఆరగించి పండగ చేసుకొంటున్నాడు .

 మరో యువ సినీ రాచకీయ సేనాని దూకేస్తా దూకేస్తా నంటూ  దేని లోనికి దూకుతాడో తెలీక కంగారు పడుతూ పడేస్తూ అటు సినిమాలూ అచ్చిరాక ఇటు రాచకీయం పడక ఉగాదినాడు  దిగాలు పడుతూ ఉగాది చెట్నీలో పులుపు,వగరు, కారం  చేదు మాత్రమే మింగుతూ ఆకాశానికి నిచ్చెన లేస్తూ పగటి కలలు కంటున్నాడు .

 ఇంతమందికి ఉగాది పచ్చడి ఇన్ని రకాల అనుభవాలను అను భూతులను మిగిల్చింది .సవ్యం గా ఆలోచించి సరైన ప్రణాళికతో ము౦దు కెడితే చేదే తీపి కారమే తీపి వగరే పొగరు పవరు అయి ఊరడిస్తుంది  .

 శ్రీ హేవళంబి ఉగాది శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-17 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ హేవిళంబి ఉగాది శుభా కాంక్షలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు –సమీక్ష

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు –సమీక్ష

https://plus.google.com/photos/107563242221333034923/album/6402024555658028593/6402024554504284338?authkey=CJeo7Ofyot2q9AE

సరసభారతి 103  వ సమావేశం గా ఉగాది వేడుకలు ఉగాదికి మూడు రోజులముందు 26-3-17 ఆదివారం సాయంత్రం స్థానిక ఏ .సి .లైబ్రరీలో నా అధ్యక్షత న జరిగాయి .ప్రముఖ గాయని శ్రీమతి శాంతిశ్రీ గారి ప్రార్ధనతో కార్యక్రమం ప్రారంభమైంది .అధ్యక్షోపన్యాసం లో నేను సరసభారతి గత ఏడేళ్ళ, నాలుగు నెలల కృషిని తెలియజేశాను .ముఖ్యఅతిధి శాసన మండలి సభ్యులు  శ్రీవై .వి .బి .రాజేంద్ర ప్రసాద్ మా ట్లాడుతూ ‘’ సరసభారతి ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించటం , వందకు పైగా సాహితీ వేత్తలు హాలు క్రిక్కిరిసేలా హాజరవటం, సాహిత్యం లో లబ్ధ ప్రతిస్టు  లైనవారికి ఉగాది పురస్కారాలు అందజేయటం ,దాదాపు 50 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించటం అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే  .ఈ వయసులో కూడా మా మాస్టారు ఇంత పకడ్బందీగా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించటం పుస్తకాలు రాసి ,రాయించి ప్రచురించటం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది .అందరూ ఆయనకు మంచి సహకారం అందించి ప్రోత్సహిస్తున్నారు .అందరికి అభినందనలు .’’అన్నారు . నేను మాట్లాడుతూ ‘’లైబ్రరీ పై అంతస్తు పూర్తికాలేదు .సెక్రెటరి గారిని ఫిబ్రవరిలో కలిసి మాట్లాడినప్పుడు ఈ విషయం వారి దృష్టికి తెచ్చాను .ఆయన ‘’ఫండ్స్ ఉన్నాయి. కాంట్రాక్ట ర్లే ఎవరూ ముందుకు రావటం లేదు ‘’అని చెప్పారు ‘’అన్నాను శ్రీ రాజేంద్రతో .ఆయన ‘’మరొక సారి ప్రయత్నిద్దాం .ఎవరూ రాకపోతే మనమే ఎవరో ఒక పేరుమీద కాంట్రాక్ట్ తీసుకొని చక్కగా అన్ని వసతులతో కట్టిద్దాం .సాహిత్య కార్యక్రమాలు పైనే హాయిగా జరుపు కోవచ్చు ‘’అన్నారు .అందరూ హర్షధ్వానాలు చేశారు .

మా తలిదంద్రులైన స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీమతి భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారాలను

1-విద్యా వార్రిది ,బహు సంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు ,జ్యోతిష్య శాస్త్ర వేత్త డా. శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి 2-అవధాన భారతి,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్క్రుతోపన్యాసకులు  విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజా రావు గారికి 3-నవ భారత సాహితీరత్న ,సాహితీ విశిష్ట ,వానమామలై స్మారక ,సోమనాథ కళా పీఠ పురస్కార గ్రహీత ,శ్రీ లేఖ సాహితీ సంస్థ అధ్యక్షులు ,సంస్థ తరఫున తమ సంపాదకత్వం లో 116 వైవిధ్య భరిత గ్రంథ ప్రచురణ కర్త ,విద్వత్ కవి ,విమర్శకులు ,40 కి పైగా గ్రంధాలను రచించిన గ్రంథకర్త ,విశ్వనాథ వారి కృష్ణ కావ్యాల పరిశోధకులు డా శ్రీ టి .శ్రీరంగ స్వామికి గారికి అందజేశాము .ముగ్గురకు గంధ తాంబూలాలతో .పన్నీరు ,సెంట్ సుగంధ పరిమళాలతో సత్కరించి నూతన వస్త్రాలు ,శాలువా ,పుష్పహారం ,వసుధైక కుటుంబం జ్ఞాపిక లతో పాటు ఒక్కొక్కరికి 5 వేల రూపాయల నగదు కానుకగా అంద జేశాము .

‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాన్ని –ఐ టి ఐ .ఐ టి సి కోర్సులకు గ్రంథాలను,పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యలకు రిఫరెన్స్ పుస్తకాలను స్వంత ఖర్చులతో ముద్రించి ,ప్రభుత్వాలనుండి ఏ రకమైన సహాయ ప్రోత్సాహకాలు లభించని సాంకేతిక విద్యా వేత్త ,రిటైర్డ్ డిప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ళ శ్యామ సుందరరావు గారికి అందజేశాము .వీరికీ పై విధంగానే చందన తాంబూలాలు ,నూతనవస్త్రాలు ,శాలువా, పూల దండ , వసుధైక కుటుంబం జ్ఞాపిక  శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )అందజేసిన 3 వేల రూపాయలు ,సరసభారతి అందజేసిన 2 వేల రూపాయలు మొత్తం 5 వేల రూపాయల నగదు కానుకగా అందించాం .

సన్మాన గ్రహీతలు తమ సంతోషాన్ని ,కృతజ్ఞతను ,తమ సాహిత్య వ్యాసంగాన్ని వివరంగా తెలియ జేశారు .శ్రీ నిష్ఠల వారు తమ బహుముఖ పాండిత్యాన్ని సంస్క్రుతరచనలో తమ అనుభవాన్ని ఉదాహరణ పూర్వకంగా తెలియ జేశారు.తమ రచనలను ఆసక్తికలవారికి పంచిపెట్టారు . .శ్రీ చక్రాలవారు తాము ఈ ప్రాంతానికి రావటం ఇదే మొదటి సారి అని తమను ఎంతో ఆత్మీయం గా ఆదరించారని చెప్పి తాము రచించిన ‘’రుక్మిణీ పరిణయం ‘’కావ్యం లోని సొగసులను వివరిస్తూ ఈ కావ్యం లో 400కు పైగా వివిధ ఛందస్సులను సందర్భాన్ని బట్టి ప్రయోగించానని అందరు చదివి ఆనందించాలని చెప్పి అక్కడ కవిత్వం ప్రయోగం మీద ఆసక్తి ఉన్న వారికి కావ్యాన్ని తమ చేతుల మీదుగా అందజేశారు. శ్రీ రంగస్వామి తాను ఉయ్యూరు రావటం మహదానందంగా ఉందని దుర్గా ప్రసాద్ గారితో 23 ఏళ్ళుగా పరిచయం ఉందని చెప్పి తమ సాహితీ సేవలను తెలియ జేశారు .శ్రీ నాదెళ్ళ తాము పుస్తక రచనలో పడిన ఇబ్బందులను ,ప్రభుత్వాల ఉదాసీనతను అందరి దృష్టికి తెచ్చారు .

గౌరవ అతిధిగా వచ్చేసిన ‘’ప్రముఖ అంతర్జాతీయ గణిత( స్టాటిస్టిక్స్ )శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ డా శ్రీఅరుచూరి రామ కృష్ణయ్యఫౌండేషన్  ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ పరుచూరి శ్రీనాథ్ గారు తమ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలను వివరించారు .అప్పుడు నేను మాట్లాడుతూ ‘’ఆహ్వాన పత్రం లో నేనూ శ్రీనాథ్ గారు సంయుక్తంగా ఒక ప్రకటన చేస్తా౦ ‘’అని తెలియ బరచాం  ‘’అని గుర్తు చేసి ‘’లూయీ అంటర్ మేయర్ అనే అమెరికా సాహితీ వేత్త ‘’మేకర్స్ ఆఫ్ దిమోడరన్  వరల్డ్ ‘’అనే గ్రంధాన్ని- కవిత్వం ,నాటకం ,సినిమా, చిత్రలేఖనం, సైన్స్ ,టెక్నాలజీ, శిల్పం ,నాట్యం, రాజకీయం మున్నగు వివిధ రంగాలలో చరిత్రను తమ సృజన లతో మలుపు తిప్పి న  92మంది ప్రముఖులపై రాశాడని ,దాన్ని శ్రీ మైనేని గోపాల కృష్ణగారు నాకు పంపారని దాన్ని చదివి ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’పేరిట ఇంటర్ నెట్ లో రాశానని అది పూర్తికాగానే శ్రీ గోపాల కృష్ణగారు ఇంతటి ఉద్గ్రంధాన్ని తమ బావమరది ప్రముఖ గణిత శాస్త్ర మేధావి స్వర్గీయ  డా శ్రీ పరుచూరి రామ కృష్ణయ్య గారికి అంకితం ఇస్తే సముచితంగా ఉంటుందని సూచించారని దాని ముద్రణ ఖర్చు  విషయం  శ్రీ శ్రీనాథ్ గారితో మాట్లాడానని తెలియ జేశారని  ఇప్పుడు శ్రీనాథ్ గారు ఆ విషయమై ప్రకటన చేస్తారని అన్నాను .శ్రీ శ్రీనాథ్ గారు ‘’మా అన్నగారికి ఈ పుస్తకం అంకితం ఇస్తున్నందుకు చాలా సంతోషం .దీనిని సరసభారతి తరఫున ముద్రించటానికి అయ్యే మొత్తం ఖర్చు డా పరుచూరి రామకృష్ణయ్య ట్రస్ట్ అందజేస్తుంది ‘’అని అందరి కరతాళ ధ్వనుల మధ్య తెలియజేశారు . అంతే కాక సరసభారతి భవిష్యత్తులో  నిర్వహించే ఏ మంచి కార్యక్రమానికైనా ట్రస్ట్ అండగా నిలుస్తుందని ,విద్యార్ధులకు స్కాలర్షిప్ లను అందజేయాలనుకొంటే తాము ట్రస్ట్ ద్వారా అందించగలమని శ్రీ నాథ్ చెప్పి అందరిలో ఉత్సాహాన్ని కలిగించారు .

ఈ సందర్భం లోనే నేను మాట్లాడుతూ ‘’నిన్ననే శ్రీ మైనేని గారు ఒక మెయిల్ రాశారు .నేను  ఇంటర్నెట్ లో రాస్తున్న మూడవ గీర్వాణం ను పూర్తి చేయగానే అమెరికాలోనార్త్ కారోలీనా లోని ’’ కారీ’’ లో ఉంటున్న ప్రపంచ ప్రఖ్యాత బయో కెమిస్ట్  స్వర్గీయ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారి కుమారులు శ్రీ రామ మోహన రావు గారి ఈ గ్రంథాన్ని-ఆధ్యాత్మిక వేత్త అయిన  తమ బావగారు శ్రీ భండారు రాధాకృష్ణ మూర్తి గారికి  అంకిత మిస్తే బాగుంటుందని సూచించారని, గ్రంథ ముద్రణకు శ్రీ రామ మోహన రావు  గారు స్పాన్సర్ గా ఉంటామని తెలియ జేసారని ,నాకు ఎంతో ఆనందం కలిగిందని ,ఒక మంచి పుస్తకం రావటానికి ఇంతమంది సహృదయాలు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పటం తప్ప ఏమీచేయ లేక పోతున్నానని  తెలియ జేయగా అందరూ ఆనందం తో చప్పట్లు మోగించారు .

తారువాత ‘’వసుధైక కుటుంబం ‘’పై కవి సమ్మేళనం ను మినీ కవిత్వ సారధి ,విమర్శకులు మచిలీ పట్నం ఆంధ్రా బాంక్ మేనేజర్ శ్రీ వసుధ బసవేశ్వర రావు ,విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తెలుగుపండిట్ శ్రీ పంతుల వెంకటేశ్వరరావు ,మచిలీపట్టణం హైస్కూల్ టీచర్ కవి విశ్లేషకురాలు బాల సాహిత్య రచయిత్రి  శ్రీమతి గుడిపూడి రాధికా రాణి 2 గంటల పాటు సమర్ధంగా నిర్వహించారు .కృష్ణా జిల్లాలోని నలుమూలలనుండి  గుంటూరు,పశ్చిమ గోదావరి జిల్లాలనుండి కవులు కవయిత్రులు అన్ని వయసుల వారు  అత్యుత్సాహంగా పాల్గొని కవిత్వాన్ని చదివి వినిపించి మురిపించారు .కవిమిత్రులందరికీ వసుధైక కుటుంబం జ్ఞాపిక అంద జేశాము .

నేనూ నా శ్రీమతి ఏప్రిల్ 6 న అమెరికాకు 5 వసారి వెడుతున్నాం .మీ అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు కోరుతున్నాం అనగానే అందరూ హర్షం తో కరతాళ ధ్వనులు చేసి అభినందించారు .

ఈ  వసుధైక కుటుంబం కవి సమ్మేళన కవితలను ముద్రిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వచ్చి శ్రీ వసుధ గారిని సంప్రదించాను .ఆయన మంచి నిర్ణయం అన్నారు .వెంటనే వసుధగారికే  పుస్తకం తెచ్చే బాధ్యతను స్వీకరించమని కోరగాఆన౦ద౦ గా హర్ష ధ్వానాలమధ్య  అంగీకరించారు .కనుక కవి సమ్మేళనానికి రాలేక పోయిన కవులు తమ కవితలను వసుధ గారికి పోస్ట్ లోకాని లేక vasudha@gmail.com కు మెయిల్ ద్వారా పంపమని వసుధ, నేనూ అందరికి  విజ్ఞప్తి  చేస్తున్నాం .

సరసభారతి అధ్యక్షురాలు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవిగారు ఫినిషింగ్ టచ్ గా ఒక గీతాన్నికమ్మగా పాడి కార్యక్రమానికి సమాప్తి పలికారు .

సభ ప్రారంబానికి ముందు అందరికి  గారె టిఫిన్ గా అందజేసి మధ్యలో పైనాపిల్ జ్యూస్ ఇచ్చాం , కార్య క్రమం లో పాల్గొన్న వారందరికీ లైబ్రరి పై అంతస్తులో శ్రీమతి శ్యామలాదేవిగారు కమ్మని విందు భోజనం ఏర్పాటు చేశారు .సాయంత్రం 5 నుండి రాత్రి 9 వరకు 4 గంటలపాటు సరసభరతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు అత్యంత ఆనదోత్సాహాల మధ్య జరగటం చారిత్రాత్మక విషయం .అందరికి అభినందలు .ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని అన్నీ తానే అయి నిర్వహించిన సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి సమర్ధతకు ధన్యవాదాలు .కార్యక్రమం దిగ్విజయం చేయటానికి సహకరించిన కోశాధికారి చి .జి. వి .రమణ,సాంకేతిక సలహాదారు శ్రీవి. బి .జి .రావు ,మిగిలిన కార్య వర్గ సభ్యులకు ధన్యవాదాలు .

శ్రీ చక్రాలవారు ఫోన్ లో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రావటం ఇదే ప్రధమం అని చెప్పగా వారిని  వారి కుటుంబం తో సహా మా ఇంట్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని ఆతిధ్యం స్వీకరించమని కోరగా విచ్చేసి మమ్మల్ని ఆన౦ద  పరచారు .మా ఇంట భోజన ఏర్పాట్లన్నీ మా కోడలు శ్రీమతి రాణి ,మా ఇంటి ఆడపడచులు అను కొనే  శ్రీమతి మల్లికాంబ గారు  శ్రీమతి భవానిగారు ,శ్రీమతి శివలక్ష్మి కుటుంబం చేశారు .వారు విశ్రాంతి తీసుకోవటానికి  తమ గృహం ఇచ్చారు శ్రీమతి  శ్యామలాదేవిగారు  . మా మనవడు ఛి చరణ మనవరాలు ఛి రమ్య చక్కని సహకారం అందించారు ..

సాయంత్రం అందరికంటే ముందే మూడున్నరకే వచ్చిన శ్రీ నిష్టల దంపతులను ,వారి మిత్రులను ,శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ను మా ఇంటికి సాయంత్రం ఆహ్వానించి బిస్కెట్ ,టీ ఇచ్చి వారి ప్రయాణపు బడలికను కొంత తగ్గించాగలిగాం . శ్రీ చక్రాల వారు శ్రీ నిష్ఠల  వారు మా ఇంటికి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాము .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-17 –ఉయ్యూరు

 


Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

26-3-17 ఆదివారంమధ్యాహ్నం మా ఇంట్లోవిద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారి కుటుంబం

This gallery contains 18 photos.

More Galleries | Tagged | Leave a comment

26-3-17 ఆదివారం సాయంత్రం మా ఇంట్లో డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి సతీమణి స్నేహితులు

26-3-17 ఆదివారం సాయంత్రం మా ఇంట్లో డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి సతీమణి స్నేహితులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వసుధైక కుటుంబం

 వసుధైక కుటుంబం

మిత్రులారా మిత్రత్వం తో సేవ చేద్దాం రండి

అందరి హృదయాలను గెలుద్దాం రండి

ఇతరులూ మనలాంటి వారేనని గ్రహిద్దాం

 స్పర్ధ ,ఘర్షణ శాశ్వతంగా విడనాడుదాం

అనవసర పోటీ మనస్తత్వాన్ని త్యజిద్దాం

సాటివాడి సర్వస్వాన్నీ బలం జులుం తో

దోచుకొనే ఆలోచనకు స్వస్తి చెబుదాం

మన భూమాత సకలం ఇచ్చే కల్ప వృక్షం

కోరికలు తీర్చే కామ ధేనువు

మనతండ్రి పరమాత్మ పరమ దయాళువు

హద్దులలో ఉందాం ముద్దుగా బతుకుదాం

దాన ధర్మాలు చేస్తూ ప్రేమ ,దయా వర్షం కురిపించి

వసుధ లోని సకల మానవాళినీ మనవాళ్ళను చేద్దాం

మానవులంతా పరమానందం తో మనుగడ సాగించాలి

అందరం సుఖ శాంతులతో వర్ధిల్లాలి

ఇలలో స్వర్గం వికసించాలి

‘ఇదే వసుధైక కుటుంబం  

 

’శ్రేయో భూయాత్ సకల జనానాం

అయం నిజః పరో వేది గణనా లఘు చేతసాం

ఉదార చరితానాం తు పురుషాణా౦

వసుధైక కుటుంబకం ‘’.

   గబ్బిట దుర్గా ప్రసాద్ -26-3-17 –ఉయ్యూరు 

Posted in కవితలు | Tagged | Leave a comment

ర్వాణ కవుల కవితా గీర్వాణం -3 –81- శ్రుతి సార సముద్ధరణ రాసిన తోటకాచార్య (8 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 –

81- శ్రుతి సార సముద్ధరణ రాసిన తోటకాచార్య (8 వ శతాబ్దం )

ఆదిశంకరాచార్యులవారి  శిష్యుడు తోటకాచార్య .ఉత్తరాభారతదేశాన బదరీనాధ క్షేత్రానికి దగ్గరలో ఉన్న జ్యోతిర్మఠ పీఠాధిపతి .అంతకు పూర్వం కేరళలో వాడక్కే మఠ స్థాపకుడు . ఆదిశంకరాచార్య శృంగేరిలో ఉన్నప్పుడు గిరి అనే మూగ  బాలుడు వారిని దర్శించాడు .తమ శిష్యునిగా స్వేకరించారు . చాలా  కస్టపడి చదువుతూ సేవ చేస్తూ గురు అనుగ్రహం  అభిమానం పొందాడు .అంతగా తెలివి తేటలు లేని గిరి కి ప్రాదాన్యమిస్తున్న గురువుగారిపై మిగతా శిష్యులకు కోపం గిరిపై ఈర్ష్య అసూయలు కలిగాయి .శిష్యులకు అద్వైత వేదాంతాన్ని బోధి౦చ టానికి కూర్చునే సమయం లో శిష్యుడు గిరి గురువుగారి వస్త్రాలను ఉతుకుతూ౦డేవాడు .గిరివచ్చేదాకా పాఠం ప్రారంభించేవారు కాదు శంకరులు .ఒక రోజు పద్మపాదుడు గురువుగారికి ఎదురుగా ఉన్న గోడను చూపిస్తూ ,దానికి పాఠం చెప్పటం ఎలాంటిదో గిరి కి బోధించటం అలా౦టినిది అని ఎద్దేవా చేశాడు .

           శిష్యుని గురుభక్తికి ,వినయ విదేయతలకు సంతోషించిన శ్రీ శంకరులు అతనిని అనుగ్రహించాలను కొన్నారు .మానసికంగా నే శిష్యుడుగిరికి సర్వ శాస్త్రాలను బోధించేశారు .గుర్వనుగ్రహం తో సకలశాస్త్ర పారంగతుడైన గిరి  అకస్మాత్తుగా తోటక ఛందస్సులో గురువు శంకరులపై అష్టకం ఆశువుగా చెప్పాడు. అదే తోటకాస్టకం గా లోకం లో ప్రాచుర్యం పొందింది .మూగ గిరి తోటకాచార్యుడై ప్రసిద్ధి చెందాడు .తోటకాస్టకం లో కొన్ని రుచి చూద్దాం –

1-విదితాఖిల శాస్త్ర సుధాజలధే –మహితోపనిషతకధి తార్ధ నిధే –హృదయే కలయే విమలం చరణం –భవ శంకర దేశిక మే శరణం .

భావం –నేను శంకరుని శరణు వేడుతున్నాను .ఆయన దయామృత సాగరుడు .ఉపనిషత్ సారాన్ని గ్రహించి గ్రంధ రచన చేసిన శేముషీ విభవ సంపన్నుడు .

చివరి శ్లోకం

8-విదితా న మయా విశదైకకలా  -న చ కించన కాంచన మస్తి గురో .-ద్రుతమేవ విదేహి కృపాం సహజం –భవ శంకర దేశిక మే శరణం .

భావం –నేను శంకరుని శరణు వేడుతున్నాను . బుద్ధీ ,జ్ఞానం లేని చేతిలో దమ్మిడీ కూడా లేని ఈ నాపై ఆయన  కృపాకటాక్షం  ప్రసరించాలి .

Inline image 2

82- అజ్ఞాని జ్ఞాని గా  మారిన -హస్తామలకాచార్య (8 వ శతాబ్ది )

అద్వైత బోధకులు ఆది శంకరాచార్యులవారి మరో శిష్యుడే హస్తామలకాచార్యులు .ద్వారకామ్నాయ పీఠాధిపతి .అంతకు పూర్వం కేరళలోని త్రిశూల్ లో ఇడయిల్ మఠాన్ని స్థాపించాడు .కర్నాటక లోని కొల్లూర్ లో  ఆదిశంకరులున్నప్పుడు ఒకసారి భిక్షాటన చేస్తూ ఇప్పుడు శివల్లి అని పిలువబడే శ్రీ బాలి గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి ఇంటిలోనూ అగ్ని హోత్రపు సుగంధం పరవశి౦ప జేసి ప్రతి ఇల్లు భిక్షకు ఆహ్వానించింది .రెండు వేలకు పైగా ఉన్న ఆ గ్రామ బ్రాహ్మణులు వేద వేదాంగ, శాస్త్రాలలో నిష్ణాతులు ,వేద విధానం లో యజ్న యాగాలు చేసేవారు .అక్కడ శివ పార్వతులు కొలువైఉన్న ఒక శివాలయం ఉన్నది .ఆ గ్రామం లో ప్రభాకరుడు అనే బ్రాహ్మణుడు అన్నీ తెలిసిన మహా జ్ఞాని .కాని ఆయన కొడుకు అందగాడే కాని శుద్ధ  తెలివితక్కువ దద్దమ్మ  .ఉపనయనం జరిగింది కాని వేద విద్య ప్రారంభం కాలేదు .ఊరికే రికామీగా సోమరిగా స్తబ్దుగా ఉండేవాడు .

 శంకర భగవత్పాదులు తమగ్రామ౦  వచ్చారని తెలిసి ప్రభాకరుడు కుమారునితోసహా  వారిని దర్శించి ,అమాంతం వారి పాదాలపై తండ్రీ కొడుకులు  వాలిపోయి సాష్టాంగ నమస్కారం చేశారు .కరుణా శంకరునికి తన కొడుకు  గోడు విన్నవించుకొన్నాడు  .శంకరులకు ఆకుర్రాడిపై వాత్సల్యం కలిగి ‘’నువ్వు ఎవరు ‘’’?అని ప్రశ్నించారు .అప్పటిదాకా లోకం ఏమిటో ,తన చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వారో  కూడా తెలియని అతడు అకస్మాత్తుగా ఆశువుగా 12 శ్లోకాలలో అద్వైత పరమార్ధాన్ని చెప్పేశాడు .ఆన౦దించిన శ్రీశంకరులు అతడిని శిష్యునిగా స్వీకరించి ‘’హస్తామలకాచార్య ‘’అని నామకరణం చేశారు .అరచేతిలో ఉసిరికాయ లాగా అతనికి సర్వ విజ్ఞానం ఒక్కమారు లభించినందున సార్ధకంగా ఆ పేరు పెట్టారు .

  హస్తామలకుని ప్రతిభా పాండిత్యాన్ని గ్రహించిన శంకరులు ఆయను తన సూత్ర భాష్యం పై వార్తికం రాయమని ఆదేశించారు .అలాగే హస్తామలకుడు రాసి పూర్తి చేశాడు .ఇక్కడ ఒక ఫ్లాష్ బాక్ కథ ఉంది.తెలుసుకొందాం

ఒక సారి యమునా నదీ తీరం లో ఒక ముని తపోధ్యానం లో ఉన్నాడు ,బ్రాహ్మణ స్త్రీలు స్నానం చేయటానికి వచ్చారు .అందులో ఒకావిడ తన రెండేళ్ళ పిల్లాడిని ఆముని దగ్గర వదిలి జాగ్రత్తగా చూడమని చెప్పి యమునా నదీ స్నానికి వెళ్ళింది .ఆపిల్లాడు నెమ్మదినెమ్మదిగా జారి యమునా నదిలో పడి  మునిగిపోయాడు .తల్లి  వచ్చి విషయం తెలిసి నిర్ఘాంత పోయింది .సమాధి నిస్టు డైన ముని  కళ్ళు తెరిచి చూశాడు .రోదిస్తున్న ఆ మాతృమూర్తి వేదనకు చలించిపోయాడు .తన  శరీరాన్ని  త్యాగం చేసి ఆ బాలుడిలో చేరిపోయాడు .మునిగి చనిపోయాడు అనుకొన్న బాలుడు బ్రతికి బయటికి వచ్చాడు .ఆ బాలుడే హస్తామలకాచార్య .అందుకే ఆయన లో అంత అగాధమైన జ్ఞానం నిండి ఉన్నది .అది శంకర కరుణతో ఉబికి బయటికి వచ్చి,అద్వైత ధార గా  ప్రవహించింది .

Inline image 1

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-17 –ఉయ్యూరు

  

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 79-మాండూక్య కారిక ను సంతరించిన -గౌడపాదాచార్య (6 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

79-మాండూక్య కారిక ను సంతరించిన -గౌడపాదాచార్య (6 వ శతాబ్దం )

శంకరా చార్యుల గురువు గోవింద భాగవత్పాదులవారి గురువు గౌడపాదాచార్య క్రీ.శ .6 వ శతాబ్దికి చెందినవారుగా పరిగణిస్తారు .మధ్యయుగం లో వేదానత శాస్త్ర వ్యాప్తి చేసినవారు ఆయన .ఆది శంకరులు వారిని ‘’పరమాచార్య ‘’గా పేర్కొని గౌరవించారు .మాండూక్య కారిక ను సంతరించిన మహాను భావులు  గౌడపాదులవారు .దీన్ని గౌడపాద కారిక ,అని ఆగమ శాస్త్రం అని  కూడా పిలుస్తారు .ఇది 4 అధ్యాయాల గ్రంధం .లేక నాలుగు భాగాల పుస్తకం .ఇందులో నాలుగవది బౌద్ధ పదజాలం తో ఉంటుంది కనుక బౌద్ధ ప్రభావం తో రాయబడిందని అంటారు .కాని ఆచార్య స్వామి రాసింది హిందూ వేద ధర్మమే కాని బౌద్ధ ధర్మ౦  కాదు .మొదటి మూడుభాగాలు అద్వైత భావ వ్యాప్తికి దీప్తికి పట్టు గొమ్మలు .ఇందులో మొదటిభాగం లో మాండూక్య ఉపనిషత్ ఉన్నది ఇది ద్వైత ,విశిస్తాద్వైతులకూ ఆరాధనీయమే .

మాండూక్య కారిక కేవలం 12  వాక్యాల చిట్టి  గ్రంధం .శంకరుల ముందుకూడా మాండూక్య ఉపనిషత్ ‘’శ్రుతి ‘’గా పేర్కొన బడేది .దీని వ్యాప్తి అనంతం ప్రభావం చెప్ప తరం కానిది .ఉపనిషత్ సారం  అంతా వడకట్టి ఇచ్చింది .ఇందులోని మొదటిభాగం  –ఆగమ ప్రకరణం(29 శ్లోకాలు )  2-వైతత్య ప్రకరణ (38 శ్లోకాలు )3-అద్వైత ప్రకరణ (48 శ్లోకాలు )4-అలతశాంతి ప్రకరణ (100 శ్లోకాలు )

ఆగమ భాగం లో ఆత్మమనిషి శరీరం లో 1-విశ్వ 2-తైజస 3 –ప్రజ్నఅనే మూడు రూపాలో ఉంటుందని చెబుతుంది రెండవ ప్రకరణం వైతత్య అంటే అసత్యం లో బృహదారణ్యక ఉపనిషత్తు ఉంది .మూడులో అద్వైత విషయాలన్నీ క్రోడీకరించి ఉన్నాయి నాలుగవ ప్రకరణ అలత శాంతి అంటే అగ్ని,శాంతి లో ప్రముఖుల సూక్తులు ఉన్నాయి .ధర్మం ,సాంఖ్యం ,అజాతివాదం ,సంసారం ముక్తి విషయాలపై వివరణ ఉంది.

80-పంచపాదిక రాసిన పూరీ పీఠాధిపతి-పద్మ పాదాచార్య (8 వ శతాబ్దం )

శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి ఙ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు,సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోదృగ్గుడై శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికిన ఆదొంగలనాయకునిపై ఎటునుండొ హటాత్తుగా ఒక సింహము దాడి చేసినది అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.

శ్రీ శంకరులు స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో పూరీ గోవర్ధన మఠానికి పద్మపాదాచార్యులు పీఠాది పతిని చేశారు .శంకరాచార్యులవారు . అసలు ఆయన కేరళలో తెక్కే మఠం అనేదాన్ని స్థాపించాడని కొందరు అంటారు కాదు ఆయన దక్షిణ భారతం లో చోళప్రాంతం వాడని కొందరి అభిప్రాయం .సురేశ్వరాచార్యులతో కలిసి పద్మపాదుడు వివరణ భాష్యకారుడిగా గుర్తింపు పొందాడు .ఆయన రాసిన గ్రంధాలలో ఒకే ఒక్కటి ‘’పంచ పాదిక ‘’లభ్యం .శంకరులు తాను రచించిన బృహదారణ్య భాష్యం పై  వివరణ వ్యాఖ్య  రాయమని కోరితే పద్మ పాదుడు దీన్ని రాశాడు .అసూయతో ఉన్నమేనమామ దీన్ని తగలబెడితే శంకరాచార్యులవారి అమోఘ జ్ఞాపక ధారణా శక్తి వలన ఇప్పుడున్న రూపం లో మళ్ళీ పద్మపాదుడు రచించాడు .పద్మపాదుడు గురువే సర్వం గురువును మించినది లేదు అని అభిప్రాయపడ్డాడు .శంకర –పద్మ పాదుల గురు శిష్య బంధం మహా ఆదర్శప్రాయమైంది లోకం లో .

శంకరుల ‘’అధ్యాస ‘’భావాన్ని పద్మపాదుడు పంచ పాదిక లో సంపూర్ణంగా ఆవిష్కరించాడు .జీవ బ్రాహ్మలు ప్రతిబింబ బింబాల వంటి వారు అని ఇందులో సారాంశం .

 

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 76 –ఆది శంకరుల గురు పాదులు –గోవింద భగవత్పాదులు( 8 వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

76  –ఆది శంకరుల గురు పాదులు –గోవింద భగవత్పాదులు( 8 వ శతాబ్దం )

అద్వైత మత స్థాపకులు శ్రీ శంకర భగవత్పాదుల గురువు గారే గోవింద  భగవత్పాదుల వారు .ఆయన జీవితం రచనల గురించి పెద్దగా లోకానికి తెలియదు .కాని శంకరాచార్యులవారు తమ రచనలో వారి ప్రస్తావన చేశారు .శంకర విజయం లో కూడా ఆయన గురించి సమాచారం లేదు .గోవింద పాడుల గురువు గౌడపాదులవారు .శంకరాచార్య ప్రకరణ గ్రంథం వివేక చూడామణి మొదటి శ్లోకం లో గోవింద భగవత్పాదుల గురించి లో పేర్కొన్నారు .శృంగేరి శారదా పీఠం గురు పరంపరలో గౌడపాదుల తరువాత గోవింద భగవత్పాదుల ను తర్వాత శంకరాచార్యులను పేర్కొంటారు .

  మాధవీయ శంకర విజయం ప్రకారం కేరళను వదిలి వెళ్ళిన ఆది శంకరులు నర్మదా నది తీరం లో ఉన్న ఓంకార క్షేత్రాన్ని చేరి అక్కడ కొండపై ఉన్న చిన్న గుహలో ఉంటున్న గోవింద భగవత్పాదుల దర్శనం చేశారు .శంకర విజయం ప్రకారం ఒకనాడు రేవా నదికి అకస్మాత్తుగా విపరీతంగా వరదలు వస్తే ,శంకరులు తన కమండలాన్ని అడ్డం పెట్టి వరద ను ఆపేసి సమాధిలో ఉన్న గురువుగారికి తపో భంగం కాకుండా కాపాడారని ఉన్నది  .ఇప్పటికీ ఆగుహను మనం దర్శించవచ్చు .ఓంకార క్షేత్రం లో ఓంకార మహా శివుడు కొలువై ఉంటాడు .గోవింద పాదులు శంకరుని చూడగానే ‘’నువ్వు ఎవరు /?అని ప్రశ్నిస్తే

‘’న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం’’అని శ్లోకం చెప్పారు .ఇదే దశ శ్లోకి గా లోకం లో ప్రసిద్ధి చెందింది .భావం –
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.

ఇది విన్న గురువు చాలా సంతోషించి ఆయన అద్వైత వైదుష్యానికి అబ్బురపడి తన శిష్యునిగా స్వీకరింఛి సన్యాస దీక్ష అనుగ్రహించారు .గురువు గోవిందపాదుల ఆదేశం తో శ్రీ శంకరులు బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాయటం ప్రారంభించారు .

Inline image 1

77- హిందూ మత పరిరక్షణకు బౌద్ధం స్వీకరించి ప్రాయశ్చిత్తం చేసుకున్న -కుమారిల భట్టు (భట్టిపాదుడు )(8 వ శతాబ్దం )

తన 15 వ ఏట, ఆది శంకరాచార్యులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుని దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరుడు “శివుని పుత్రుడైన కుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు” అని కోరాడు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరునితో చెప్పాడు.

భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన ఙ్ఞాని. అతడు పుట్టేనాటికి భౌద్దమతం వ్యాప్తి జరిగి ఉంది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు భౌద్దం గురించి తెలుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని భౌద్ద బిక్షువుగా వేషం ధరించి ఒక భౌద్ద మతగురువు వద్ద భౌద్ద శాస్త్రాల గురించి తెలుసుకోసాగాడు. ఒక నాడు ఒక భౌద్ద బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోతుంది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా భౌద్ద సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం బోధించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపున ఉండగా జరిగింది. మీరు ఇపుడు పరీక్షీంచవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాడుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక కాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహావిష్ణువు ఉన్నాడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమాణముగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని భౌద్ద బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు.దానితో అతని గురువుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, భౌద్దంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరుడు అక్కడకు వచ్చి వారిస్తాడు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమని అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుని చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగా శంకరుడు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్తి ప్రసాదిస్తాడు.

 78-మీమాంస ,అద్వైత దర్శనాలపై రచనలు చేసిన సురేశ్వరాచార్యులే మండన మిశ్రులు(8 వ శతాబ్దం )మండన మిశ్రుడు 8వ శతాబ్దపు హిందూ తత్వవేత్త, ఆది శంకరాచార్యుని శిష్యుడు. మీమాంస, అద్వైత దర్శనాలపై రచనలు చేశాడు. కర్మ మీమాంస పై అధారిటీ .స్పోట వాదానికి ప్రాణ ప్రతిష్ట చేసినవాడు .ఈయన సన్యాసము స్వీకరించిన తర్వాత సురేశ్వరాచార్యుల అను పేరుతో ప్రసిద్ధిపొందాడు. శంకరాచార్యులను తర్క గోష్ఠిలో ఓటమి పాలై శంకరులను గురువుగా అంగీకరిస్తారు. ఆ ఓటమి సురేశ్వరాశ్వరాచార్యులకు విజయవంతమైన ఓటమి ఎందువలనంటే అ ఓటమి వల్ల జగద్గురువైన శంకరులకు శిష్యరికం చేసే అవకాశం దొరికింది. శంకరాచార్యులకు అత్యంత ప్రీతి పాత్రులైన శిష్యులలో సురేశ్వరచార్యులు ఒకరు. శంకరాచార్యులు అందువలన దక్షిణామ్నాయ మఠమైన శారదా మఠానికి మెదటి పీఠాదిపతిగా నియమిస్తారు. సురేశ్వరాచార్యులకు ఒక ప్రత్యేక ఉన్నది. సాధారణంగా గురువుల వయస్సు శిష్యుడి వయస్సు కంటే ఎక్కువగా ఉంటుంది. కాని సురేశ్వరాచార్యుల విషయంలో సాధారణానికి భిన్నంగా శిష్యుడి వయస్సు గురువు కన్నా ఎక్కువ. వేదాంత సంస్కృతిని అనుసరించి రెండు రకాలా మీమాంసలు ఉన్నాయి. ఒకటి పూర్వ మీమాంస ( మీమాంస అని అంటే దాని అర్థం పూర్వమీమాంస) రెండొ మీమాంస ఉత్తర మీమాంస దీనినే వేదాంత విద్య అని కూడా పిలుస్తారు. వేదాంత విద్య అంటే వేద=జ్ఞనం అంత = అంచులు జ్ఞానం అంచులు తెలిపేది పూర్ణ జ్ఞానం). ఫుర్వమీమాంస అనుసరించి వైదిక కర్మ కండ,యజ్ఞ యాగాదులు నమ్మకాలు ఉంటాయి. ఉత్తర మీమాంస అంతా ఉపనిషత్తుల సారం , జ్ఞాన సముపార్జన గురించి ఉంటుంది.

   మండన మిశ్రులు బీహారీ బ్రాహ్మణుడు .బీహార్ లోని మహేశీ ప్రాంతం లో నివశించాడు .ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మం డలేశ్వర్ అంటారు.గుప్తేశ్వర మహా శివాలయం లో శంకరాచార్యుల వారితో వాదం చేశాడు .అందుకనే ఈ పట్నం ఆయన పేరుమీద నే పిలువ బడుతోంది . కుమారిలభట్టు ప్రచారం చేసిన మీమాంస సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు మండన మిశ్రుడు .అద్వైత భావనలతో ‘’బ్రహ్మ సిద్ధి ‘’ గ్రంథంరాశాడు .బ్రహ్మ సిద్ధి మండన మిశ్ర గా ప్రసిద్ధుడయ్యాడు .కర్మ మీమా౦సపై అత్య౦థ అభిమానం ఉన్నందున గొప్ప కర్మిస్టి గా మారి పోయాడు .వేదం లో చెప్పబడిన కర్మకాండలను తుఛ తప్పక పాటించాడు .మండన మిశ్రుని బ్రహ్మ దేవుని అవతారంగా భావిస్తారు .అయన భార్య ఉభయ భారతి సాక్షాత్తు సరస్వతీ దేవి యే.

Inline image 2

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-24-3-17 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 74 –నాట్య శాస్త్ర నిధి –కమలేశ్ దత్త త్రిపాఠి (19 36

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

74 –నాట్య  శాస్త్ర నిధి –కమలేశ్ దత్త త్రిపాఠి (19 36

త్రిపాఠి అంటే నే మహా పండితుడు అనే అర్ధం లోకం లో ఉంది కమలేశ్ త్రిపాఠి నాటక నాట్య రంగ ప్రముఖుడైన సంస్కృత విద్వాంసుడు .బెనారశిండు విశ్వ విద్యాలయ౦ లో డిపార్ట్ మెంట్ ఆఫ్ రెలిజియన్స్ అండ్ ఆగమిక్ స్టడీస్ లో   ఎమిరిటస్ ప్రొఫెసర్ . ఇందిరా గాంధి నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ కు 20 07 లో సలహాదారు .యూరప్ లో అనేక దేశాల యూని వర్సితీలలో విజిటింగ్ ప్రొఫెసర్ .జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో విస్తృతంగా ఫిలాసఫీ  నాటకం సాహిత్యం లపై రచనలు చేశాడు .’’అమరు శతకాన్ని హిందీలోకి అనువదించాడు .చాలా సంస్కృత గ్రందాల ప్రచురణకు సంపాదకత్వం వహించాడు .సంస్కృత నాటక రంగం ఆయన కృషికి ఎంతో రుణ పది ఉంది.కమలేశ్ అంటే నాట్య నాటక రంగాలే గుర్తుకు వస్తాయి అంతటి విశిష్ట సేవ చేశాడు .ఆయన నాట్య వ్యాప్తి  కుటియాట్టం నుంచి అస్సాం లోని అ౦కీయ నాట్ వరకు విస్తరించింది .సంప్రదాయం అన్నిటా కొత్త వచ్చి నట్లు దర్శనమిస్తుంది అదే ఆయన ప్రత్యేకత ,నిబద్ధత .

  సంస్కృత నాటక రంగాన్ని ఆధునికం చేయటం లో గొప్ప కృషి చేయటానికి పండిట్ మధురా ప్రసాద్ దీక్షిత్ తోడ్పాటు పొందాడు . అభిజ్ఞాన శాకుంతలం ,మాలవికాగ్ని మిత్రం ,ఉత్తర రామ చరితం, ముద్రా రాక్షసం  వేణీ సంహారం మొదలైన సంస్కృత నాటకాలను ప్రదర్శించటం లో ఎన్నో మెళకువలు తీసుకున్నాడు .డి.ఫిల్ పొంది ,వారణాసి లోని సంపూర్ణానంద యూని వర్సిటి నుంచి ఆచార్య బిరుదు అందుకొన్నాడు .అక్కడే తబలా వాయి౦చటమూ నేర్చాడు .

   ఉజ్జైన్  కాళిదాస అకాడెమి చైర్మన్ గా సమకాలీన సంస్కృత గ్రంధ వ్యాప్తికి ప్రచురణకు అద్వితీయ కృషి చేశాడు .భాస  ,కాళిదాస కవుల నాటకాలను పూర్తిగా అర్ధం చేసుకొని అంకిత భావం తో  వందలాది ప్రదర్శనలను చేసిన సంస్కృత నాటక పరివ్యాప్తి దీక్షా తత్పరుడు .భాసుని నాటకాల గొప్ప తనాన్ని   ఆధునికులు అర్ధం చేసుకోవటానికి వీలుగా ‘’బాల చరిత్ర ‘’మొదలైన వాటిని హిందీలో రాశాడు .ప్రొఫెసర్ కమలేశ్ దత్త త్రిపాఠి  నాట్య శాస్త్ర నిదిగా గుర్తింపు పొందాడు . 2006 లో సాహిత్య అకాడెమి పురస్కారం 20 07 లో భారత రాష్ట్ర పతి ప్రశంసా పత్రం అందుకొన్నాడు .2008 లో స్వామి హరిహరానంద  సరస్వతి సమ్మాన్ అందుకొన్నాడు .ప్రయాగ హిందీ సాహిత్య సంమేలన్ ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు ప్రదానం చేసి గౌరవించింది .నాటక ,నాటక రంగాలలో అపార అనుభవం, వైదుష్యం ఉన్నందున కైలాస్ నాధను  సంగీత నాటక అకాడెమి ఫెలో ను చేసి గౌరవించింది .

Inline image 2

75 –మహమ్మద్ ప్రవక్త చరితను సంస్కృతం లో రాసిన –కె .ఎస్.నీల కంఠన్ ఉన్ని( 1895 -1990)

మళయాళ ,సంస్కృతాలలో ఉద్దండ పండితుడు నీలకంఠన్ ఉన్ని 1895 లో కేరళలో కొట్టాయం జిల్లా కావిల్ మదం గ్రామం లో జన్మించాడు .ఈ వంశంవారు  తెక్కునూర్ రాజ వంశానికి రాజ గురువులు .స్వగ్రామం లో కన్నం పల్లి మధు ఆసాన్ వద్ద ప్రాధమిక విద్య నేర్చి ,తిరువాన్కూర్ రాయల్ సంస్కృత కాలేజి లో చదివి శాస్త్రి, మహోపాధ్యాయ డిగ్రీలు సాధించాడు .మలయాలంమున్షి గా 35 ఏళ్ళు వివిధ విద్యా సంస్థలలో పని చేశాడు .కొట్టాయం లోని ఎం డి సేమినరి హైస్కూల్ లో  రిటైర్  అయ్యాడు .

   ఉన్ని ఎన్నో మళయాళ గ్రంథాలు రాశాడు .దేవాలయాలు ఉత్సవ సంప్రదాయాలు ,ప్రాచీన విధానాలపై విస్తృతంగా వ్యాసాలూ రాశాడు .కాళిదాస కవి శాకుంతలం మేఘ దూతం లను మలయాళం లోకి అనువాదం చేశాడు .ఆయన కూర్చిన ‘’పంచ మహా నిఘంటు ‘’చాలా ప్రఖ్యాతమైంది .కథాకలి లో వాడే మూడు అట్టకాలు రచించాడు .

 మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను సంస్కృత కావ్యం గా రాసిన ఘనత ఉన్ని ది .దీనికి ‘’విశుద్ధ నబి చరితం ‘’అని సార్ధక నామం పెట్టాడు .అయోధ్య సంస్కృత పరిషత్ ఉన్ని సంస్కృత సేవకు ‘’సాహిత్య రత్న ,విద్యా భూషణ్ బిరుదులిచ్చి సత్కరించింది .1890లో ఉన్ని 95 వ ఏట మరణించాడు .ఆయన మరణానంతరం 4-4-2011 న ఆయన సంకలం చేసిన అద్భుత గాధలను ‘’ఐతిహ్య కదాకల్ ‘’పేరిట ప్రచురించారు .ఇది కొట్టారతి సంకున్ని సంకలం చేసిన ‘’ఐతిహ్య మాల ‘’తర్వాత అంతటి ప్రాచుర్యం పొందింది .

Inline image 1

         సశేషం

ప్రపంచ కవితా దినోత్సవ శుభా కాంక్షలతో  

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-17 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment