స్వాగతం లో సునామీ -కవిత ,నిరసన గళం వినిపించిన కవిత -,అమరుడు కాదు అర్జునుడు

Inline image 1  Inline image 2
Inline image 3

Posted in కవితలు | Tagged | Leave a comment

మైరావణ పాత్ర ఎక్కడిది ?భూమి -ఆశీత -ఆకు పచ్చని సంతకం అద్దేపల్లి ,నిగూఢ భావ వ్యాసాలు

Inline image 1
Inline image 2
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పవిత్ర నాగ వల్లీ దళం (తమల పాకు ),గో రక్షకుడు భరద్వాజుడు

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు” బంగ్లా ”జ్యోతి ,త్రికాలాన్వేషణే సాహిత్యం,అమెరికాలో హిందూ సంస్కృతీ సౌరభం

Inline image 3

Inline image 2
 
Inline image 4
 
 
Inline image 5
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అగ్ర వర్ణ ఏం ఏ లను అలా అన గలదా ?అనిత ఆవేదన ,కోటలోనే ముష్కరులు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భాషా సంక్షోభం -ప్రపంచీకరణ ,ఇంటింటికీ ఇంటర్ నెట్

భాషా సంక్షోభం -ప్రపంచీకరణ ,ఇంటింటికీ ఇంటర్ నెట్

 

Inline image 1

Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘కెమో టాలజి పిత కొలచల సీతారామయ్య – పుస్తకావిష్కరణ

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ  -ఉయ్యూరు

— సరసభారతి ఆధ్వర్యం లో  నేను రాసిన ”కెమో టాలజి పిత కొలచల సీతారామయ్య (పుల్లేరు నుండి ఓల్గా దాక )పుస్తకాన్ని శాసన మండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర  ప్రసాద్ సౌజన్య సహకారాలతో ముద్రించి,జనవరి చివరి వారం లో ఆవిష్కరిస్తున్నామని తెలియ జేస్స్తున్నాను .

”పుల్లేరు కలువ  ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో  కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన  ఏమీరాబడి లేకుండానే  అతని  దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ హీనంగా భావించ కుండా  చేస్తూ శ్రద్ధగా  చదివి   కెమిస్ట్రిలో  మాస్టర్  డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి అభి వృద్ధి చెందుతున్న రష్యా  దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని  మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమో టాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రై బో  కేమిస్ట్రి ”బిరుదులు  పొంది సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి,రష్యాలో ఉన్నా   మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని గడిపిన ఉయ్యూరుకు చెందినసాహసి ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన  ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ”

పూర్తీ వివరాలతోకరపత్రం ఒక వారం తర్వాత అండ జేస్తాం –దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దురాచారాలపై సంకుల సంమరం,మనవ జీవిత వికాసం లో లలితకళలు

Inline image 2  Inline image 3

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హజారే అందరికి బేజారే

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పఠాన్ కోట పై పంజా -ఇండియన్ డాగ్స్ వస్తున్నాయి -ఇండియా విద్యార్ధులకు అవమానం

Inline image 1
Inline image 2
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంధుల అక్షర శిల్పి ,మానవ హక్కుల వైతాళికురాలు

 


Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భక్తీ యాగం రాజకీయ యోగం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలగిరి ప్రేమ తత్వమే జగతికి జ్యోతి –

Inline image 1

గబ్బిInline image 2ట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాల గర్భం లో 25 గ్రామాలు అగ్ని పరీక్షలో కమలం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొంత హాస్యం కొంత సందేశం ,చీకట్లో నారింజరంగు సాయం కాల అన్వేషణ

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇదే మనపాలిటి అయుత చండీయాగం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అభినందనలో ఉండాలి హృదయ స్పందన జగ్గీ వాసుదేవ్ ,మంగళ సూత్రం అంతరార్ధం

Inline image 1
Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యాభై ఏళ్ళక్రితం దేవత ఎవరికీ దక్కని సౌఖ్యం కుదిరిన జత

Inline image 1


Inline image 2
Inline image 3
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వానప్రస్థం మీ చేతుల్లోనే — అనంతం లో ఆనందం రవి శంకర్ ,అనుకోవడం..బాధపడటం ఎందుకు?యాంకర్ సుమ

వానప్రస్థం మీ చేతుల్లోనే
31-12-2015 23:34:03

వర్ణాశ్రమధర్మాలు అనే మాట పలు సందర్భాల్లో వింటూంటాం. వర్ణం మనకు తెలిసిందే, కానీ ఆశ్రమం పూర్తిగా ఆశ్రమమని అర్థం కాదు. ఏ విషయంపై మనం శ్రమతో దీక్షతో పనిచేస్తామో అది ఆ విషయానికి సంబంధించిన ఆశ్రమం. అనగా జీవితంలో ఒకానొకదశ.
వేదాలు మనిషి పుట్టిన సమయం నుంచి మరణించే వరకూ జీవితకాలానికి కావాలసినంత టైమ్‌టేబుల్‌ తయారు చేశాయి. ఇందులో నాలుగు భాగాలు లేదా పీరియడ్‌లు ఉన్నాయి. ఏ దశలో మనిషి ఏం చేయాలని నిర్దేశించాయి. ఈ టైమ్‌టేబుల్‌లో ఒక పీరియడ్‌ వానప్రస్థం.
మనుస్మృతిలాంటి పుస్తకాల్లోనూ, ఇతిహాస, పురాణాల్లోనూ ఆశ్రమాల గూర్చి చర్చ విస్తారంగా ఉంది. మహాభారతంలో అనేకచోట్ల, ముఖ్యంగా శాంతి పర్వంలో మనిషి జీవితంలోని నాలుగు దశలు, ఆయా దశల్లో వ్యక్తి చేయాల్సిన పనులు వివరంగా కనిపిస్తాయి. విద్య నేర్చుకునే దశను బ్రహ్మచర్యాశ్రమం అనీ, వివాహ జీవితాన్ని గృహస్థాశ్రమం అనీ, వయస్సు మళ్లిన తర్వాత క్రమక్రమంగా తన బాధ్యతలను పిల్లలకు అప్పగించడం, జ్ఞానం పట్ల ఆసక్తి చూపడం, సమాజానికి ఉపయోగించే పనులు చేయడం అనేది మూడో దశ. దీనికే వానప్రస్థాశ్రమం అని పేరు. వనం అంటే అరణ్యం. ప్రస్థం అంటే ప్రయాణం. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఉండే రణగొణ ధ్వనులు లేని ప్రాంతమే అరణ్యం (రణం అంటే శబ్దం). పూర్వం నిజంగానే అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ సాధారణ జీవితం గడపడం ఇందులోని లక్ష్యం. ఈ దశ నుంచి పూర్తిగా తప్పుకుని పరివ్రాజకుడిగా (సంన్యాసి) ఉండటం అనేది చివరి దశ.
ఆధునిక జీవనంలో మనం ఈ మూడు దశలనే చూస్తాం. బాల్యంలో విద్యాభ్యాసం, తర్వాత ఉద్యోగం చేయడం, కొంత కాలానికి ఆ ఉద్యోగం నుంచి ఇష్టంగానో, అయిష్టంగానో విరమించడం అనే మూడు దశలు. మొదటి రెండు దశల్లోని వ్యక్తి జీవితం శ్రమతో నిండి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు కూడా శ్రమతో కూడినవే. అయినా వీటి నుంచి విరమించడానికి చాలామందికి చాలా మందికి మనసొప్పదు. చాలామంది ఎంతో బాధతో పదవీ విరమణ చేయడం, జీవితంలో శూన్యత్వాన్ని అనుభవించడం జరుగుతుంది. జీవితంలో ఎంతో సాఫల్యం పొంది, ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తులు కూడా నిరాశకు, మానసిక క్షోభకు గురికావడం కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవడం కూడా చూస్తూంటాం. మధ్య వయసులో విసుగు (boredom ) ఎలా తొలగించాలి అనేది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎదుర్కొంటున్న ఒకానొక ముఖ్య సమస్య.
పూర్వీకులు చెప్పిన వానస్రస్థానికీ, ప్రస్తుత విశ్రాంత (రిటైర్డ్‌) జీవనానికీ కొంత పోలిక ఉంది. రెండింటిలోనూ వ్యక్తి ఒక బాధ్యత నుంచి వైదొలగడం, కొత్త జీవనాన్ని ప్రారంభించడం ఉంది. సమయాన్ని ఏ రీతిలోనైనా గడిపే స్వేచ్ఛ ఉంది. అయినా ఈ రెండింటి మధ్య భేదం చాలా ఉంది. వానప్రస్థం స్వచ్ఛందంగా తీసుకున్న మార్గం.
పదవీవిరమణ బలవంతంగా వచ్చిన విశ్రాంతి. వానప్రస్థంలో త్యాగమనే అంశం ఉంది. ఇదివరకు అనుభవించిన అధికారాన్నీ, సుఖాన్నీ, బాధ్యతల్నీ స్వతంత్రంగా వదలడం. ఈనాటి విశ్రాంత జీవనంలో త్యాగం అనే అంశం లేదు. వానప్రస్థంలో శరీరాన్నీ, మనసు, ఇంద్రియాలను నిగ్రహించి ధార్మికంగా ఉండటం, సమాజం కోసం పని చేయడం, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం అన్నది లక్ష్యం. రిటైర్మెంట్‌లో ఈ ధార్మికత అనే ప్రస్తావన లేదు. వానప్రస్థానికి వెళ్లిన వ్యక్తి అహింస, సత్యం వ్రతంగా ఉంచుకుని నిప్పులాంటి జీవనం గడపాలని శాంతిపర్వం చెబుతుంది. రాజులు కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థానికి వెళ్లడం పరిపాటిగా ఉండేది. బహుశా అందువల్లనే మన చరిత్రలో పాశ్చాత్యదేశాల్లోలాగా తండ్రులను బంధించిన సంఘటనలు కనిపించవు. రాజులే కాకుండా మిగతావారికీ కూడా ఈ వానప్రస్థం ఉండేది. పుత్రుడికి పుత్రుడు కల్గిన తర్వాత గృహస్థు వానప్రస్థానికి వెళ్లాలి (శాంతిపర్వం). అతిథులను ఆదరించడం కోసం అవసరమైన ధనాన్ని పెట్టుకోవడం తప్పుకాదని కూడా చెప్పారు.
వేదాలు అనేక కర్తవ్యాలు, కర్మలు, వ్రతాలు అనే పేరిట మనిషికి ధార్మిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంచింది. అందువల్ల వానప్రస్థానికి వెళ్లిన వ్యక్తి కూడా ఎలాంటి మానసిక సంక్షోభం, నైరాశ్యం లేకుండా దాన్ని ఒక ధర్మంగా భావించి సంతోషంగా ఉండేవాడు. సుఖాలను వదిలివేయడం కూడా ధర్మమే అన్నప్పుడు వ్యక్తికి నైరాశ్యం ఉండదు. పదవీ విరమణలో ధర్మమనే అంశం లేనందున ఒక వ్యక్తికి స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా తన ప్రాధాన్యాన్ని పోగొట్టుకోవడంగా భావిస్తాడు. దీనివల్ల అశాంతి, నిరాశలతో పాటు జీవన గమ్యం లేకపోవడం జరుగుతుంది.
జీవితంలో ఆనందం ఎలా నింపుకోవాలి అన్నది మామూలు మనిషితో పాటు శాస్త్రవేత్త, తత్వవేత్త అందరూ ఆలోచించే విషయం. మనిషి తన వ్యక్తిగత సుఖాన్ని పొందుతూనే ఇతరుల మేలుకై పనిచేయడాన్ని ధార్మిక జీవనం అంటారు. మనిషి కొంతైనా ధార్మిక మార్గంలో లేనపుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందో తైత్తరీయ ఉపనిషత్తు వర్ణిస్తుంది. అయ్యో నేను మంచి మార్గంలో ఎందుకు నడవలేదు, ఎందుకు చెడు పనులు చేస్తూ వచ్చాను అని ఎంతో కొంత ఆవేదన ప్రతిమనిషీ పడతాడని రుషి భావన. చాలామందిలో ఇలాంటి ఆవేదనను మనం చూస్తూంటాం. చిన్నతనంలో ఫలానా విషయాలు తెలుసుకుని ఉంటే బాగుండేది. ఫలానా విధంగా ఉంటే పిల్లలు క్రమశిక్షణతో పెరిగి ఉండేవారు అని విచారించడం చూడగలం.

వానప్రస్థంలో ఉన్న కొన్ని అంశాలను ఈనాటి విశ్రాంత జీవన విధానంలో చేర్చుకోగలం. అరణ్యానికి పోకపోయినా మనం చేస్తున్న పనులను చాలామటుకు తగ్గించుకోగలం. అనవసరమైన పనులను చాలావాటిని మానేయగలం. మనం ఉన్న చోటే అరణ్యం (నిశ్శబ్దంగా ఉన్న స్థలం)గా మార్చుకోవచ్చు. ఏకాంతాన్ని శాపంగా కాకుండా వరంగా భావించుకోవచ్చు. విశ్రాంత జీవితంలో ఉన్న వేలాది మంది అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, వారి మేధోసంపదను వృథా చేయడం చూస్తూంటాం. వీరిలో ప్రతి ఒక్కరూ అనేక మంది బాలబాలికలను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దగలిగారు. ఇటీవల కొన్ని చోట్ల వయోజనుల నివాసం (community for elderly)లో బాలల హాస్టల్‌ నిర్వహిస్తూ ఉండటం మంచి ఉదాహరణ. సమాజ శ్రేయస్సుకై ఈశ్వరార్పణ బుద్ధితో చేసే పనిని కర్మయోగం అంటారని ఇదివరలో తెలుసుకున్నాం. ఈ విశ్రాంత దశలోనైనా మనం కొంత వరకు కర్మయోగాన్ని ఆచరిస్తే జీవితానికి కొత్త నిర్వచనం ఇచ్చిన వాళ్లం అవుతాం.

డాక్టర్‌ కె. అరవిందరావు
రి

టైర్డు డీజీపీ

 

 

అనంతంలో ఆనందం
31-12-2015 23:45:55

ఐదు యమాల్లో రెండింటి గురించి తెలుసుకున్నాం. మిగతా మూడు అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. అస్తేయ అంటే దొంగతనం చేయకుండా ఉండటం. అందంగా కనిపించిన వ్యక్తిని చూడగానే.. అంత అందంగా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటారు. అయితే అలా అనుకోవడంతోనే వారి రూపాన్ని దొంగలిచ్చినట్టు. ఈ దొంగలించడం అసూయను పుట్టిస్తుంది. నచ్చిన దానిని పొందాలనే కోరికను పుట్టిస్తుంది. అస్తేయ- అసూయను తొలిగిస్తుంది. దొంగతనం చేయాలనే కోరికను రానివ్వదు.

బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్యలాభః

బ్రహ్మ అంటే అనంతం. బ్రహ్మచర్యం అంటే అనంతంలో చరించడం. అనంతమైన నీ స్వభావాన్ని గుర్తించినపుడు దీపపు వెలుగులా ప్రసరిస్తావు. అపుడు బ్రహ్మచర్యం సహజంగా జరుగుతుంది. గాఢమైన ధ్యానంలో కూర్చున్నపుడు నీ శరీరాన్ని గురించిన స్పృహ ఉండదు. ఎంత ఎక్కువ ఆనందంగా ఉంటే అంత తక్కువగా నీ శరీరం ఎరుకలో ఉంటుంది. అనంతమైన జ్ఞానంలో ఉన్నపుడు ఒత్తిడులు, శరీరపు భారం, శరీరం ఉన్నదనే ఎరుక ఉండవు. ఇది బ్రహ్మచర్యం. ఆకాశం లేదా అనంతం అనే ప్రకృతిలో నీవు ఉన్నపుడు అత్యధికమైన శక్తి, ధైర్యసాహసాలు నీకు లభిస్తాయి. ఎప్పుడూ అటూఇటూ చూస్తూ, ఎవరు అందంగా ఉన్నారో గమనిస్తూ లేదా ఎవరితో సంగమించాలని వెతుక్కుంటూ తిరిగేవారిలో శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఎవరినీ ప్రభావితం చేయలేరు.

అపరిగ్రహస్తేయ జన్మకథాయాంతాసంబోధః

నీకంటూ సమకూర్చుకోకుండా జీవించినపుడు నీ పూర్వజన్మల జ్ఞానం, ఇతర జీవాలను గురించిన జ్ఞానం నీకు లభిస్తుంది. మరింత కావాలనే కోరిక ఉన్నప్పుడు, ఆలోచనలు కేవలం తన గురించే వస్తూ ఉంటాయి. వాటితోపాటు భయం కూడా వచ్చి చేరుతుంది. జీవితపు అనంతత్వం అనేది తెలియకుండా పోతుంది. నీకంటూ లేకుండా ఉండటం అంటే నీ ఉనికిలో ఆత్మవిశ్వాసం, నీ సామర్థ్యంపై విశ్వాసం, నీవెవరో తెలుసుకుని ఉండటం. నీకు రొట్టెలు చేయడం ఎలాగో తెలిసినపుడు ఏడాదికి సరిపడా ఒకేసారి చేసి ఉంచుకోవు కదా. తమ శక్తి తెలియనివారు, స్వార్థపరులు అన్నిటినీ కూడబెడుతుంటారు. ఇలా కూడబెడుతూ, కూడబెడుతూ చివరకు కన్నుమూస్తారు. ధనాన్ని పొదుపు చేయవద్దని, కూడబెట్టవద్దని చెప్పలేదు పతంజలి మహర్షి. అలా కూడబెట్టిన దాని ప్రభావం ఏమిటో ఆలోచించమంటున్నాడు.

అపరిగ్రహ- అంటే ప్రజల నుంచి ఏదీ గ్రహించకుండా ఉండటం. కూడబెట్టకుండా ఉండటం. దీనికి పూర్తి వ్యతిరేకం పరిగ్రహ- అంటే అన్నిటినీ స్వీకరించడం, వాటి గురించి ఆశ్చర్యపోవడం, ఆనందంగా ఉండటం. ఎవరి నుంచీ ఏమీ స్వీకరించకుండా జీవించడం ఈ ప్రపంచంలో సాధ్యం కాని పని. దీనిని కూడా సాధన చేసేవారు అక్కడక్కడా ఉంటారు. ఈ ఐదు యమాలు మహావ్రతాలు. సాధనను బట్టి ఫలితం వస్తుంది.

శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌
ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, వ్యవస్థాపకులు
ఆమెకు చిన్నా పెద్దా, ఆడ మగా అందరూ అభిమానులే. ‘సుమ’ధురంగా మాటల సెలయేరులో ప్రేక్షకుల్ని పయనింపచేయడం ఆమె ప్రత్యేకత. అదే స్టేజిషోలయితే సమయస్ఫూర్తితో… కొన్ని సెటైర్లు, మరికొన్ని పంచ్‌లు వేస్తూ, చమక్కులు విసురుతూ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తారామె. 2015 తనకెలాంటి అనుభవాల్ని మిగిల్చింది. అలాగే ఈ నూతన సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారో సుమ కనకాల చెప్పిన మాటల ముచ్చట్లు…

‘‘పోయిన ఏడాదిలో శని, ఆదివారాలు పని చేయకూడదని నిర్ణయించుకున్నాను. పనిచేయకుండా ఉన్న ఆ రెండు రోజుల్ని పిల్లల కోసం కేటాయించేశాను. ఆడియో లేదా అవార్డ్‌ ఫంక్షన్‌లు ఏవైనా ఉంటే మాత్రం యాంకరింగ్‌ చేస్తున్నాను. 2016లో కూడా అదే కంటిన్యూ చేస్తాను.

గడిచిందిలా

2015 సంవత్సరం ఎలా గడిచింది అని మీరడిగితే 2013, 14 సంవత్సరాల్లాగే అనేది నా సమాధానం. చెప్పాలంటే ప్రేక్షకుల ఆదరణ ఇంకా బాగా పెరిగింది. చిన్నపిల్లల దగ్గర్నించి పెద్ద వారి వరకూ అందరూ నన్ను వాళ్ల కుటుంబంలో ఒక సభ్యురాలిగా చూస్తున్నారు. దాంతో నా ఎనర్జీ మరింత పెరిగింది. కొత్తగా నేర్చుకున్న అంశం పాజిటివ్‌గా ఉండటం. కొన్ని ప్రభావాలు, ఇబ్బందులు నాపై పడినప్పటికీ మానసికంగా సమతుల్యత పాటించటం నేర్చుకున్నా. నా ఎనర్జీ నేనే (‘నీ ఎనర్జీ నేను’ అంది కూతురు మనస్విని. వెంటనే ‘అవునవును’ అన్నారు సుమ).

మనసు పడిన బాధ

మన జీవితంలో ఎదురయ్యే కొన్ని ఘటనలే కాకుండా ఇతర దేశాల్లో యుద్ధాల్లో మరణించే వారి గురించి ఆలోచించినపుడు కూడా బాఽధగా అనిపిస్తుంది. ఇటీవల రంగనాథ్‌ గారు, కొరియోగ్రాఫర్‌ భరత ఆత్మహత్య చేసుకోవడం వంటి దుర్ఘటనలు మనసును విపరీతంగా బాధించాయి.

సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

మా పిల్లలు సర్‌ప్రైజ్‌ బహుమతులు ఇచ్చే అవకాశం నాకు ఇవ్వరు. రోషన్‌, మనస్విని ముందుగానే ప్లాన్‌ చేసుకుని మరీ వాళ్లకి కావాల్సినవి నాతోనే కొనిపించుకుంటారు. మనస్విని మాత్రం నాకోసం గ్రీటింగ్‌ కార్డులు తయారుచేస్తుంది. వాటిని మా హాల్లో గోడలకు అందంగా అతికిస్తుంది. రాజీవ్‌కు అయితే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఏమీ ఇవ్వలేదు. రాజీవ్‌ బర్త్‌డేకి మాత్రం గ్రీటింగ్‌ కార్డ్‌ కొని.. దాని మీద విషెస్‌ రాసి ఇచ్చాను. గ్రీటింగ్‌ కార్డులో విషెష్‌ రాసి చెప్పడంలో భిన్నమైన అనుభూతి కలుగుతుంది. అది ఎంతకాలమైనా పదిలంగా ఉంటుంది కూడా.

నేర్చుకున్నవి… చదివినవి… నచ్చినవి

20 నుంచి 30 ఏళ్ల వరకూ లెర్నింగ్‌ పీరియడ్‌ అంటారు. గురువు దగ్గర ఉండి నేర్చుకోవాలి. అంటే 30 ఏళ్లలోపు కెరీర్‌ను డిసైడ్‌ చేసుకోవాలి.. 30-40 సంవత్సరం వరకూ మనం మెరుగుపడాలి. 40 నుంచి 50 వరకూ అందులోనే ఉండటం మంచిదట. 2015 నాకు 40వ సంవత్సరం. ఇదే ప్రొఫెషన్‌నే కంటిన్యూ చేస్తాను. ఇక 50-60 వరకూ మనం వేరే వారిని తయారుచేసుకోవచ్చు. పాట, నాట్యం వంటివాటిలో దేవుడు నాకు కొద్దిగా ప్రావీణ్యం ఇచ్చాడు. యాంకరింగ్‌లో అదే చేస్తున్నాను.

‘ఐ యామ్‌ మలాలా’ పుస్తకం చదివాను. ఆ పాకిస్తానీ అమ్మాయి ఎన్ని కష్టాలొచ్చినా చదువుపై ప్రేమ పెంచుకుంది. గ్రేట్‌ గర్ల్‌. సాధారణంగా షూటింగ్‌ గ్యాప్‌లో బుక్స్‌ చదువుతుంటాను. ప్రతిరోజూ న్యూస్‌పేపర్స్‌లో కనీసం హెడ్‌లైన్స్‌ చదువుతాను. టెక్నాలజీ విషయానికి వస్తే చూపుడువేలుపైనే ప్రపంచం నడుస్తోందిప్పుడు. నేనయితే ఫేస్‌బుక్‌ ఎక్కువగా చూస్తుంటాను.
మనమెంత అనిపించింది

అమెరికాలో క్రూజ్‌ వెకేషన్‌కు వెళ్లటం మంచి ఎక్స్‌పీరియన్స్‌. లాస్‌ఏంజిల్స్‌ నుంచి మెక్సికోకి వెళ్లే నౌకలో మూడురోజులు కుటుంబమంతా కలిసి ప్రయాణించాం. చుట్టూ సముద్రపు నీరు, రాత్రిపూట చిమ్మచీకటిని చూస్తుంటే.. మనమెంత అనిపించింది. అలాగే ఈ లోకం పెద్ద వింత అనిపించింది. ప్రకృతి నుంచి దూరం వెళ్లే కొద్దీ మనం అనే అహం పెరుగుతుంది. ప్రకృతి దగ్గరికి వెళ్లే కొద్దీ భయం పెరిగి అహం తగ్గిపోతుంది.

హాయిగా నవ్వుకున్నాను

తిరువన్నామలై వెళ్లినపుడు మా అమ్మతో పాటు నేను, పిల్లలూ రమణభగవాన్‌ కొండకు వెళ్లాం. కొండ నుంచి కిందకు దిగుతుంటే కోతులు అడ్డొచ్చాయి. మా అబ్బాయిని ‘కోతి కళ్లల్లోకి చూడొద్దు’ అన్నాను. ‘కోతి కళ్లల్లోకి నేను చూడలేదు, కోతే నా కళ్లలోకి చూస్తోంది’ అన్నాడు. ఈలోపు ఓ కోతి వచ్చి మా అమ్మ చీర కొంగును లాగుతుంటే.. మా అమ్మ ‘వద్దు రమణా’ అంటోంది. ఆ సన్నివేశం చూశాక నవ్వాపుకోలేకపోయాను. ఆ తర్వాత కొండదిగామో లేదో వానరమూక మమ్మల్ని అడ్డగించి, అడిగి మరీ వాటర్‌బాటిల్స్‌ తీసుకెళ్లాయి.

టెన్షన్‌ అనవసరం

నిర్మాత స్రవంతి రవికిషోర్‌ గారి చిత్రం ఆడియోఫంక్షన్‌కి యాంకరింగ్‌ చేశాను. ఆ ఫంక్షన్‌లో నాలుగో పాటకు డాన్స్‌ చేస్తారు అని చెప్పడం మర్చిపోయి ఐదో పాట చెప్పేశాను. దాంతో రవికిషోర్‌ గారితో ‘సారీ సర్‌’ అన్నాను. అందుకు ఆయన ‘ఏమైందమ్మా ఇప్పుడు. ఎవరైనా అరె్‌స్టచేస్తారామ్మా’ అన్నారాయన. ఆ మాటతో ఇన్ని సంవత్సరాలనుంచి యాంకరింగ్‌ చేస్తున్న నేను అంత టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదనుకున్నా.

చేయాలనుకుని మిగిలిపోయినవి

అది చేయాలి. ఇది చేయాలి అని ముందుగానే అనుకుని ప్లాన్‌ చేసుకునే అలవాటు లేదు. ఖమ్మంలో ఓ ఓల్డేజ్‌హోమ్‌కు మూడేళ్లనుంచీ సపోర్టు చేస్తున్నాను. ఈ ఏడాది దానికి సొంతంగా బిల్డింగ్‌ కడుతున్నారు.

ఎంతో ఇష్టం

ఉదయం ఏడున్నరకు పిల్లలు స్కూల్‌కి వెళ్తారు. అదే టైంలో నేను షూటింగ్‌లకు బయల్దేరి వెళ్లిపోతాను. పిల్లలకి నచ్చిన ఫుడ్‌ చేయటం నాకు సరదా. కొత్తగా కుండబిర్యానీ వండడం నేర్చుకున్నా. దాన్ని వండిపెడితే ఇంటిల్లిపాదీ బాగుందని మెచ్చుకున్నారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, వాళ్లని సంతోషపెట్టే విషయాలకోసం సమయం కేటాయించటం నాకు చాలా చాలా ఇష్టం. అలాగే ఎప్పుడూ ‘శ్రీరామ నీ నామమెంతో రుచిరా..’ పాట పాడుతుంటాను’’ అని గడిచిన ఏడాది గురించి చెప్పారు సుమ.

ఫెయిల్యూర్‌ తట్టుకోలేను
2016 ఎలా ఉండాలి అనుకుంటున్నారు, సెలబ్రేషన్స్‌ ఎక్కడ అని అడిగితే ‘‘నాకు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండవు. ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటే ఒత్తిడి వస్తుంది. ఫెయిల్యూర్‌ను తట్టుకోలేను. అందుకే దేని గురించీ ఆలోచించను. కెరీర్‌ పరంగా వచ్చేది సక్సెస్‌ కాదు. వ్యక్తిత్వపరంగా, మానసికంగా వచ్చేదే సక్సెస్‌. నా షో హిట్‌ అయితేనే సక్సెస్‌ అనుకోను.
గత నాలుగేళ్లనుంచీ కొత్తసంవత్సరం రోజున ప్రోగ్రామ్స్‌ చేసేందుకు వెళ్లడం మానేశాను. మా ఇంట్లో వాళ్లందరం కలిసి ఇంట్లోనే వేడుక చేసుకుంటాం. సరదాగా అందరం కలిసి బయటకు వెళ్తాం’’ అన్నారు.

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చైనా సవాలుకు మోడీ జవాబుకాలం తో కదులు

Inline image 1
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ చిత్తం -14 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -14

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

పేజి -136,పేరా 2

యూక్లిడియన్ స్పేస్ టైం,అనంత ఊహాత్మక టైం కు పాకితే ,లేక ఎక్కడో సింగ్యులారిటీ(ఏకత్వం ) లో ఇమాజినరి కాలం లో మొదలైతే , విశ్వావిర్భ కాలాన్ని చెప్పే సంప్రదాయ సిద్ధాంతం ఉన్న సమస్యలే మళ్ళీ ఎదురౌతాయి .దేవుడికి విశ్వం ఎలా ప్రారంభమైందో తెలుసు ,మనం అది ఎలా పురుడు పోసుకోన్నదో వివరించే ఏ ఒక్క కారణాన్నిచెప్పలేం .పైగా  క్వాంటం దీరీ ఆఫ్ గ్రావిటికొత్త అవకాశాన్ని ఆవిష్కరించింది. దాని ప్రకారం స్పేస్ టైంకు సరిహద్దు లేదు ,అందుకని సరిగాద్దు వద్ద ప్రవర్తన ఎలా ఉన్నదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు .సైన్సు సూత్రాలు విచ్చిన్నమయ్యే సిన్గ్యులారిటీలు లేవు . దేవుడిని  ప్రార్ధించ టానికి ఉండే సరిహద్దు అంచు లేదు   లేక స్పేస్ టైం కు కొత్త సరిహద్దు నిబంధనలు ఏర్పాటు చేయమనటానికీ వీలు లేదు .’’విశ్వానికి సరిహద్దు నియమం అంటే దానికి బౌండరీయే లేదు ‘’అన్న ఒక్క సత్యాన్ని మాత్రం  నిశ్చయం గా చెప్ప గలం .విశ్వం పూర్తిగా స్వయం సమృద్ధం,స్వయం నియంత్రణం  (సెల్ఫ్ కం టైండ్).దానిని బయటి విషయం ఏదీ ప్రభావితం చేయలేదు .విశ్వం సృజింప బడదు ,నశింప బడదు ,ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది (బి ).

శాస్త్రి గారి భాష్యం –హాకింగ్ శాస్త్ర వేత్త గారి సైన్సు ఈ రకమైన నిర్ణయాలకు  వచ్చినందుకు అభినందించాలి .ఇది ఉపనిషత్,,బ్రహ్మ సూత్రాల  భావాలనే ప్రతి బింబిస్తోంది .వేదాంతం ప్రకారం ఆత్మ అనేది అనంత మైనది .’’సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ‘’అనేది ఉపనిషద్వాక్యం .సృష్టికి కారణం అనేది శాశ్వతమైనది (ఎటర్నల్ ),సర్వజ్ఞమైనది(ఆమ్ని సెంట్ ) ,అనంతమైనది (ఇంఫినిట్ ).చూసేది అదే కనుక ఎప్పుడూ సృష్టింప బడదు .

వేరొకటి ఏదీ దాన్ని చూడలేదు .అందుకే అది’’ ద్రష్ట ‘’అయింది .అంటే చూసేదేకాని చూడ బడేది కాదు ‘’నతు దృశ్యతే ‘’.అది చూడబడదు ,తెలియ బడదు ,దాన్నిఆత్మ జ్ఞానం వలన  అనుభవించటం ద్వారా నే  తెలియ బడుతుంది .అంటే చూసేవాడు చూడబడే వాడితో ఐక్యమైనప్పుడే ఇది సాధ్యమౌతుంది .అంటే ఆత్మ పరమాత్మ లో చేరినప్పుడే .అదే మొత్తుకొన్నాడు హాకింగ్ శాస్త్ర వేత్త –‘’it would just Be ‘’అంటూ .ఈ విషయాన్ని అద్వైత సిద్ధాంత వ్యాపకులు శంకరాచార్య స్వామి బాగా ప్రచారం చేశారు .ఇదే  ఏకత్వం లేక అద్వైతం .దానిప్రకారం సృష్టి కర్త బ్రహ్మం ఒక్కడే .రెండో వాడు లేడు.దీని ప్రాతిపదికమీద సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తూ ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది అంటే’’ నిత్యం ‘’అని ముగించారు .ఆత్మ సృష్టింప బడదు , నశింపబడదు .కారణం అదెప్పుడూ సృష్టింప బడలేదు కాబట్టి .  దృశ్య ప్రపంచామంతా భౌతిక దృష్టికి చెందినదే .హాకింగ్ చెప్పిన ఏకత్వ సిద్ధాంతం కూడాఇదే  ‘’విశ్వం స్వయం సృష్టి (సెల్ఫ్ కన్తైండ్),దీనిని బయటి శక్తులేవీప్రభావితం చేయలేవు .అది ఎప్పటికీ సృష్టింప బడదు .నశించదు ఎప్పుడూ ఉంటూనే ఉంది ‘’.

మన మహర్షులు ఆత్మను యెంత స్పష్టంగా దర్శించి వివరించారో తెలుస్తోంది  విశ్వం అంటే  స్వయం నియంత్రణ కలది  .ఆత్మను శంకరులు గొప్ప పోలిక తో చెప్పారు .అదే రజ్జు సర్ప భ్రాంతి .తాడును చూసి పాము అనుకోవటం దీని గురించి ఇది వరకే చెప్పుకొన్నాం .దేవుడు మానవులకు ఈ విశ్వ రూపం లో కనిపిస్తాడు .ఇంద్రియ నిగ్రహంతో స్థిరమైన మనసుతో ఉంటె మనకు కనిపించేది వస్తు సముదాయం కాదు పరమాత్మయే .,అంటే సృష్టి కారణ భూతుడే ,కాని అప్పుడుసృష్టి కనిపించదు అంటే ప్రభావం (ఎఫెక్ట్ ) కనిపించదు అన్న మాట .ప్రపంచం సృష్టింప బడినట్లు  నాశనమైనట్లు  భ్రాంతి పొందుతాం .వాస్తవానికి సృష్టీ లేదు వినాశానమూ లేదు .కనుక విశ్వావిర్భావమూ లేదు ,అంతమూ లేదు .అది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంది ,ఉంటుంది .స్టీఫెన్ హాకింగ్ దృష్టిలో అదే ‘’ఇట్ జస్ట్ వుడ్ బి’’.

అందుకే మన ఉపనిషత్తులు’’ సృష్టికర్త ‘’అనే మాట వాడకుండా  చాలా జాగ్రత్త పడ్డాయి .అవి ఎప్పుడు చెప్పినా ‘’సృష్టికి కారణం ‘’అనే చెప్పాయి . మనకు సృష్టికారణం భ్రాంతిగా భాసిస్తుంది .అంటే మనమనసులలోనే ఏర్పడుతుంది దైవం ఎప్పుడూ సృష్టి చేయాలని సంకల్పించడు దీనికి కారణం అయన సంకల్ప ,వికల్పాలకు అతీతుడు .అయన నిర్వి కల్పుడు .ఇదే హాకింగ్ మాటలలో ‘’సెల్ఫ్ కంటైండ్అండ్ నాట్ ఎఫెక్తేడ్ బై ఎని థింగ్ అవుట్ సైడ్ ఇట్ ‘’.మన పురాణాలు కూడా దీనిని బాగానే వివరించాయి .వేద,ఉపనిషత్ ల ను అర్ధం చేసుకోవటానికే పురాణాలు తోడ్పడుతాయి సృష్టి కర్తలలో ఒకరైన శివుని గురించి పురాణం చెప్పింది .ఆయనవస్తుతహా ’’ అభవుడు ‘’అంటే పుట్టుక లేనివాడు లేక పుట్టని వాడు ఆయనకు చావులేదు కనుక ‘’మృత్యుంజయుడు ‘’.పుట్టనివాడికి చావు లేదు కదా .పుట్టుక ,నాశనం లేని దానికి ‘’స్వభావం ‘’(నేచర్ ) ఏమిటి ?ఎప్పుడూ ఉండటమే –అదే హాకింగ్ గారి మంత్రం –‘’ఇట్ వుడ్ జస్ట్ బి ‘’.

పేజి -139,పేరా-2

అందుకని మనంఅనుకొనే  ఇమాజినరి టైం(ఊహా కాలం )నిజంగా ఎక్కువ ఆధార పడేదిగా కనిపిస్తోంది .మనం అనుకొనే వాస్తవం అనుకొన్న విశ్వాన్ని వివరించటానికిమనం సృష్టించుకొన్న అయిడియా అది .నేను మొదటి అధ్యాయం లో చెప్పినట్లు శాస్త్రీయ సిద్ధాంతం అనేది ఒక గణిత ప్రతిరూపమే (మోడల్ ).ఈ మోడల్ తో మన పరిశీలనలను వివరిస్తాం .ఇది మన మనసులలో మాత్రమె ఉంటుంది .కనుక వాస్తవ ,ఊహాత్మక కాలం ఏది అని ప్రశ్నించటం అర్ధ రహితం .కనుక అదే పనికొచ్చే వర్ణన చేయటానికి సహాయ పడే విషయం .

శాస్త్రి గారి కామెంట్ –సైంటిస్ట్ లు నిజాయితీగా ఆలోచించేవారు .వారు ఒకసారి సైన్స్ అనేది మనసు లేక మెదడు (మైండ్ )లోనే ఉంటుంది అంటారు .కనుక అది సత్యానికి బద్ధం కాదు .స్వతంత్రమైనది శాస్త్రమే అయిన పదాలు ,భాష మానవుడు తయారు చేసిందే .అవి సంఘటనలను మాత్రమె వర్ణించ గలవు .అవి కాలం నిజమైనదా  ఊహా జనితమా  అనేది చెప్పలేవు .కాలం భగవత్ సృష్టిలో మొదటిది కనుక మాటలు దైవాన్ని  వర్ణించ లేవు  .’’మాటలు మనసుతో కలిసి దేవుని సమీపానికి చేరి ,తిరి గోస్తాయి కాని దేవుని వర్ణించ లేవు ‘’ అని ఉపనిషద్వాక్యం .దీనికి సంబంధించిన శ్లోకం –

‘’యతో వాచో నివర్తం తే  అప్రాప్య మనసా సహా ‘’.

పేజి -140,లో  చివరి వాక్యం, 141పేజీ లో వాక్యాలు

సృష్టికి ఆరంభం ఉంది అనుకొంటే ,దాన్ని సృష్టి చేసిన వాడు ఒకరు ఉండాలి .కాని విశ్వం స్వీయ నియంత్రమైతే (సెల్ఫ్ కంటైండ్ ),సరిహద్దే లేక పొతే ,అంచు ఉండకపోతే ,దానికి ఆది అంతం ఉండదు .అది అలా ఉంటూనే ఉంటుంది .అప్పుడు సృష్టి కర్త కు స్థానం ఉండదు కదా .

శాస్త్రి గారి వ్యాఖ్యానం-ఉపనిషద్వేదాంతం ఈ సమస్యను  సృష్టి కర్త ను సృష్టి తో గుర్తించి (ఐడెంటి ఫై )పరిష్కరించింది .అదే సెల్ఫ్ లేకఆత్మ.మనం ప్రపంచాన్ని చూస్తున్నా ప్రపంచం లో ఒకరం అయిన  ,మనల్ని మనమే చూసు కొంటున్నామనం చూస్తున్నది ఆత్మనే .ఈ విషయం లో సైంటిస్ట్ హాకింగ్ ఒక  అడుగు ముందుకు వేసి సృష్టి, సృష్టి కర్త ఒకరే అనేశాడు .అలా చెప్పి ఉండకపోతే సైన్సు ,,ఆధ్యాత్మికత వేరు వేరే అనేది రుజువు చేసినట్లు అయ్యది . ఆ సందేహం రాకుండా స్పష్టంగా చెప్ప్పాడు ధైర్యంగా .మతపరమైన అనుభవాలు  సైంటిఫిక్  వాదాల జోలికి వెళ్ళ కుండా నిషేధానికి గురి అయ్యేవి .సాధారణంగా సైంటిస్ట్ లకు మత దృక్పధం ఉండదు .కాని నా ద్రుష్టి లో హాకింగ్ సైంటిస్ట్ దేవుడు ఉన్నాడని నమ్ముతాడు అని పిస్తుంది .ఆయన రాస్సిన ఈ పుస్తకం ఎక్కడ చెప్పినా భగవంతుడు ఉన్నాడు అన్న భావమే గోచరిస్తుంది .అది ‘’టేకెన్ ఫర్  గ్రా౦ టెడ్’’’’అనుకోవచ్చు మనం .అంటే మనం అనుకోన్నది ఆయనకు అంగీకారమే నని అర్ధం . తన నిజాయితీ అనుమానాన్ని ప్రశ్నించాడు .

భారతీయ తర్క శాస్త్రం కూడా దేవుడు ఉన్నాడనే అన్నది. కాని ఆయన ఉనికి ని రుజువు చేసే జోలికి పోలేదు. అదే తెలివైన పని

లాజిక్ అంటే తర్కం ‘’ఏ సంఘటన జరగాలన్నా నాలుగు ముఖ్య కారణాలు ఉంటాయని చెప్పింది .అవి -1-ఈశ్వరుడు  2-అదృష్ట౦ 3-దేశ౦  4-కాలం .ఇందులో మొదటిదే దైవం .

 

సశేషం

2016 నూతన సంవత్సర శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2016-ఉయ్యూరు

 

 

 

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

2016నూతన సంవత్సర శుభా కాంక్షలు

2016నూతన సంవత్సర శుభా కాంక్షలు

 

Inline image 1  Inline image 2


Inline image 3
 
Inline image 4
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆజాద్ ఉచ్చులో మరి కొందరు విశ్రాంతి లో క్రికెట్ లెజెండ్స్

Inline image 1
Inline image 2
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అఖండ భారతం అనాది వాస్తవం ప్రయోగాల హోరు ,కధలకు జోహారు

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డా.శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారి 2016నూతన సంవత్సర శుభా కాంక్షలు

శ్రీ వెంకటేశ్వర శర్మగారికి ఈ ఉదయం ఫోన్ చేసి కొత్త సంవత్సరం పై కొత్త పద్యం ఏదైనా ఉంటె చెప్పమని అడిగితె వెంటనే ఫోన్ లోనే 8 పంక్తుల తేట గీతి పద్యాన్ని చెప్పారు .మీకోసం వారి పద్యాన్ని అందిస్తున్నాను –  నూతన సంవత్సర శుభా కాంక్షలతో –దుర్గా ప్రసాద్

-తే .గీ -”రెండు వేల పదారును నిండు గాను

          కలిపి చూచిన(2+0+1+6) నవ (9)సంఖ్య కాదెయిద్ది !
         ఇంక పదహారు నిలువెల్ల పొంక మొప్ప
         యౌవనం గదోయి అమృత సమము
         నడుగు నడుగున తోడ్పడి అన్ని గతుల
         అన్ని విషయాల యందున అద్భుతముగ
         అలరు గాక మీ కానంద మంద జేసి
          వే౦క టేశ్వర -శర్మ ద వీక్షణములు ”
  డా .శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ -గుంటూరు -9866944287


Inline image 2
Posted in కవితలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -13 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -13

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

పేజి -123 ,124 చివరి వాక్యం తరువాత

మృదువైన  ప్రదేశాలలోనే నక్షత్రాలు గేలాక్సీలు ఏర్పడ్డాయని అనుకొంటే,,మనలాంటి స్వయం ప్రత్యుత్పత్తి చేయగల జీవుల అభి వృద్ధికి తగిన  పరిస్థితులు ఉన్నాయనుకొంటే ,వారికి ప్రశ్నించటం వస్తే’’ఎందుకు ఈ విశ్వం మృదువుగా ఉందని అడిగితె ?ఇదే  సంబంధ సిద్ధాంతం (యాన్త్రోపిక్ ప్రిన్సిపల్)కు ఉదాహరణ గా నిలుస్తుంది .దీనికి వివరణ ఇలా ఉంటుంది –‘’ఈ విశ్వాన్ని అది ఉన్న స్థితిలో చూస్తున్నాము అంటే మాకు ఉనికి(ఎక్సిస్ట్ )   ఉన్నట్లే ‘’.

శాస్త్రి గారి వ్యాఖ్యానం –ఇక్కడ మృదువుగా (స్మూత్ ) అనే మాటను  జాగ్రత్త గా అర్ధం చేసుకోవాలి .అంటే శత్రు సంబంధమైనదికాదు(నాట్ హోస్టైల్ల్).దీనికే వేదం ‘’శం ‘’అనే మాటను ఉపయోగించింది .శివుని శరీరమే విశ్వం కనుక ఆయనను ‘’శంకరుడు ‘’అన్నారు .శం కరోతి అంటే శాంతినిచ్చేవాడు లేక శాంతియే తానూ అయినవాడు .దేవుడు వస్తుతహా క్రూరుడు అంటే రుద్రుడుఅంటే అతి శక్తి మంతుడు . ,కాని ఆయనను ప్రార్ధిస్తే శంకరుడు గా మారుతాడు –అంటే తనలోని ఉష్ణాన్నితగ్గించుకొంటాడు –ఎలా అంటే కణాలు మిగిలిన కణాల ఆకర్షణలోకి  పోకుండా ఉండటం .ఈ విశ్వం లో  అత్యుష్ణ పరిస్తితులు  అంటే ఎక్కువ వేడి ,ఎక్కువ కణాలు ఉన్నప్పుడు ,అవి ఒకదానికొకటి దూరంగా పరిగెత్తుతున్నప్పుడు ,చల్లబడి ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిపోతుంది .అప్పుడు నీరు ఏర్పడి స్వయం పునరుత్పత్తి చేయగల జీవ రాసి సృష్టింప బడుతుంది .హైడ్రోజెన్ హీలియం గా మారి ,కార్బన్ ,ఆక్సిజన్ మూలకాలుగా  విచ్చేదం చెందుతుంది .హైడ్రోజెన్ ఆక్సిజన్ లుకలిసి నీరుగా మారుతాయి .గడ్డిలో మొక్కలు ,వృక్షాలలో  ముఖ్య భాగం గా కార్బన్ మారిపోతుంది .శివుని మొదటి రూపం వృక్ష౦ ,గడ్డి యే(సస్పింజర ).దీనికి ఉదాహరణ యజుర్వేదం లోని నాలుగవ కాండ మంత్రం –

‘’నమో వృక్షేభ్యో హరి కేషేభ్యో పశూనాం పతయే నమః –సస్పింజిరాయ త్విషీమతయే పతీనాం పతయేనమః ‘’ఈ విషయాన్ని ఇదివరకే ఒక సారి చెప్పుకొన్నాం .హాకింగ్ వంటి గొప్ప శాస్త్రజ్ఞుడు ‘’స్మూత్ ‘’అనే మాటను ఉపయోగించటం ,వేదం చెప్పిన ‘’శం (శాంతి )‘’పదానికి సరిపోతోంది .అంకిత భావం తో శాస్త్రజ్ఞులు చేసిన కృషిని తక్కువ గా అంచనా వేయ కూడదు .

పేజి 129,పేరా 1

కాని ,దీనికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ?అనే ప్రశ్న వస్తుంది .

వ్యాఖ్య –వేద ఋషులు దీనికి సమాధానం చెప్పారు .వేదం ఎందరో దేవతల గురించి చెప్పింది .వీరికి శక్తి అంతా ‘’అమ్మవారి ‘’(మదర్ గాడెస్ ) ‘’నుంచే లభిస్తుందని చెప్పింది.శ్రీ లక్ష్మీ దేవిని స్తుతించే స్తోత్రం లో మంత్రం దీనికి సమాధానం –

‘’లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం –శ్రీ రంగ దామేశ్వరీం దాసీ భూత –సమస్త దేవా వనితాంలోకైక దీపాంకురాం –శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్  బ్రహ్మేంద్ర గంగాధరాం ‘’

భావం –బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వర మొదలైన దేవతలు తమ శక్తులను శ్రీ లేక లక్ష్మీ దేవి నుండి పొందుతారు .సంస్కృతం లో శ్రీ అంటే ఆమె అని అర్ధం .ఆమెయే అందరికి శరణ్యం .

పేజి 129,పేరా 2

‘’గుత్ ‘’శాస్త్ర వేత్త’’ఉచిత భోజనం అనేదిలేదు .కాని ఈ విశ్వం అంతిమ భోజనం ‘’అని   చెప్పినట్లు –

శాస్త్రి గారి భాష్యం –ఉపనిషత్తులు ‘’ఆత్మ విశ్వంగా కనిపిస్తుందిఅన్నాయి . .అది 1-ఉపాదాన కారణం గా 2-నిమిత్త కారణంగా రెండు విధాల కనిపిస్తుంది .ఆత్మ అనేది ఒకప్పుడువిశ్వానికి  మూలంగా,తయారు చేసేదిగా , ఆకారం ఏర్పరచేదిగా ఉండేది . సైంటిస్ట్ లు తీవ్రంగా సమర్పణ భావం తో  తమ తార్కిక శాస్త్రీయ విధానం లో కృషి చేసి ,మన వేద ఋషులు వేలాది సంవత్సరాల క్రితం

చెప్పిన సత్యాలనే  తేల్చి చెప్పటం అత్యంత  మనోహరంగా ఉంది.

 

పేజి -129-చివరి పేరా

విశ్వం ద్రవ్యోల్బణం లాగా విస్తరించలేదు .దీనికేదో  విధానం  ఉండి ఉండాలి .ఆవిధానం అతి పెద్ద ప్రభావశీల విశ్వోద్భవ స్థిర గుణకాన్ని తొలగించటానికి సాయ పడి  ఉండాలి.అందుకని విస్తరణ రేట్ ను,వేగవంతమైన స్తితినుండి ,గురుత్వ బలం వలన  నిదానం గా మారేట్లు చేసి   ,ఇప్పుడు మనం చూస్తున్న స్థితిలోకి తెచ్చి ఉంటుంది  .

శాస్త్రి గారి వ్యాఖ్యానం-  సృష్టి రహస్యం అంటే ఇదే .వేదం దీన్ని గమనించింది .ఈ నెమ్మది తనాన్ని ఛందస్ అంది .దీన్నే ఇగ్లీష్ లో సమానార్ధకంగా ‘’ప్రాసడి’’అన్నారు .ఇదే పద్యానికి జీవం .ఇదంతా ఒక రకమైన గణనం .ఆ గణాల ప్రకారమే పద్యాలలో  పంక్తులు మళ్ళీ మళ్ళీ వస్తాయి .ముక్త పద్యం(బ్లాంక్ వెర్స్ ) దీనికి ఉదాహరణ .కదలిక సృష్టికి కారణభూతం .విశ్వ వ్యాప్తికూడా కదలికయే కదా .కవిత్వం లోని లయ వంటిది ఇది ..ఇలాంటి వివిధమైన 7రకాల  ఛందస్సు లు విశ్వం లో ఉన్నాయని వేదం చెప్పింది.ప్రతి ఛందస్సు కు  అధి దేవత ఉంటుంది .దానికి పేరు ఉంటుంది .ఆ దేవత ఒకానొక రకమైన సృష్టికి కారణ భూతమవుతుంది .ఉదాహరణకు ‘’శక్వరి ఛందస్సు ‘’ను తీసుకొందాం .ఈ ఛందస్సు ఆహారం ,జంతువులు ,మానవుల సృష్టికి కారణం అవుతుంది .’’పంక్తి ‘’అనే ఛందస్సు జంతు సృష్టికి కారణమౌతుంది .ప్రసిద్ధమైన ‘’గాయత్రి ఛందస్సు’’ అన్ని రకాల గోవులను సృష్టిస్తుంది .ఇది చాలా విస్తృతమైన విషయం .దీన్ని విడిగా తెలుసుకోవాల్సిందే .

సశేషం

2016 నూతన సంవత్సర శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-12-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రపంచం లో శక్తి వంతమైన తోలి మహిళా ప్రధాని -సిరిమావో బండారు నాయకే

Inline image 1

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాశి కోక జ్యోతిర్లింగం ,వీర వనిత అన్నపూర్నా దేవి

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆక్రమిత కాశ్మీర్ లో ఏం జరుగుతోంది ?భూమి ,పట్టు వీడని ఆజాద్ – రెబెల్స్ తో మోధీ

Inline image 1
 
Inline image 2
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపురూప స్వర మాంత్రికుడు నేదునూరి ,తాళ్ళూరి రామేశ్వరి అంతరంగం

Inline image 1
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమరావతి ఆత్మ ఏది ?/అఖండ ఆలోచన కెసిఅర్ చండీ యాగం

Inline image 1


Inline image 2
 
 
 
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ చిత్తం -12 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -12

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

పేజి -119,పేరా -2

అధిక ద్రవ్య రాసి గల తారలు  గురుత్వాకర్షణ లను  సమతుల్యం చేయటానికి  ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం ఉంది .అప్పుడే న్యూక్లియర్ చర్యలు అధిక వేగంగా కొనసాగి తమలోని హైడ్రోజెన్ ను  వంద మిలియన్ సంవత్సరాలలో నశింప జేసుకొంటాయి.అప్పుడు కొద్దిగా సంకోచం చెంది ,ఇంకా వేడిని గ్రహిస్తే హీలియం ను భారమైనకార్బన్ లేక ఆక్సిజన్  మూలకాలుగా  మార్పు చెందిస్తూ ఉంటుంది .

శాస్త్రి గారి వ్యాఖ్యానం –మొదటిసారిగా  సృష్టి పొందిన వి  హైడ్రోజెన్ ,కార్బన్ ,ఆక్సిజన్  లు అయితే విశ్వ స్వరూపం ను తెలియ జేస్తాయి .రుద్రాధ్యాయం లో  కర్బనాధారంగా  గడ్డి మొక్క మొట్టమొదట సృష్టి చేయ బడింది .అందులోనే రెండవ అనువాకం  సృష్టి ప్రారంభ దృగ్విషయాన్ని తెలియ  జేసింది  ఆమంత్రాలు –‘’నమో వృక్షేభ్యో హరి కేశేభ్యో –పశూనాం పతయే నమో నమో సస్పింజరాయ త్విషీ మతేపతీనాం పతయే నమో ‘’-దీని భావం – వృక్ష రూపం లో ,వాటి ఆకులు జటలుగాఉన్న  రుద్రులకు నమస్కారం  .గడ్డి రూపం లోపసుపు ఎరుపులలో  ప్రకాశించే రుద్రులకు నమస్కారం .

పేజి -122,పేరా -3

‘’అన్ సర్టేనిటిసూత్రం’’ చెప్పిన సూత్రాల   పరిమిత కి లోబడి సైన్సు కొన్ని సూత్రాలను  చెప్పింది .ఏదో ఒక కాలం లో దాని స్థితి తెలిస్తే వీటి ప్రకారం విశ్వం ఎలా కాలం తో అభి వృద్ధి చెందుతుందో చెప్పగలం. ఈ సూత్రాలను అసలు దేవుడే నిర్దేశించాడు .తరువాత విశ్వానికి ఆ సూత్రాలపై పరిణామం   చెందే స్వేచ్చనిచ్చాడు .తాను  మళ్ళీ ఇందులో జోక్యం కల్పించుకో లేదు .ఆయన ఎలావిశ్వం యొక్క  ప్రారంభ స్థితిలేక ఆకృతిని  ఎంచుకోన్నాడో ? కాల ప్రారంభం లో సరిహద్దు నియమాలేమిటి ?ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి .సాధ్యమైన ఒక సమాధానం ఏమిటీ అంటే మనకు అంతుబట్టని ,అర్ధం చేసు కోలేని కారణాలతో  విశ్వ ప్రారంభాక్రుతిని దేవుడు ఎంచు కొన్నాడు అని .

శాస్త్రీజీ కామెంట్ –ఇంత  గొప్ప పుస్తకం లో అంత పెద్ద  సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్ నిర్ణయానికి రాగలడు అని మనం ఊహించలేము .ఉన్న వాస్తవ పరిస్థితిని ఆయన నిర్మోహ మాటం గా అత్యంత వినయంగా ఒప్పుకొని చెప్పాడు .ఇది దేవుడికి లొంగి పోవటమా?కాదు కానే కాదు .అది యదార్ధ సత్యాన్ని  గ్రహించటమే .  ‘’ భగ వంతుని ఎవరు తాము చూడ లేమని చెబుతారో వారికే తెలియ బడతాడు ‘’అని కేనోపనిషత్ చెప్పింది (విజ్ఞాతం అవిజ్ఞానతాం ).జ్ఞానానికి ఒక సరిహద్దు రేఖ ఉంటుంది .దీన్ని దాటి సైన్సు వెళ్ళలేదు .కానివేదంఎప్పుడో చెప్పింది –‘’విశ్వ జీవితం యొక్క ప్రతి క్షణం దేవుని ఆజ్ఞకు లోబడే  ఉంటుంది ‘’అన్నది .మరొక రకం గా దేవుడు ఈ క్షణం లో లేక పొతేఅన్నది అన్ని సిద్ధాంతాలకు అనుభవాలకు వ్యతిరేకం .వేద విధిలో మొదట్లోనే ‘’మహా విష్ణో రాజ్ఞయా ప్రవర్త మానస్య ‘’అని మంత్రం చెప్పుకొంటాం .దాని అర్ధం ఇదే .-అంటే విష్ణుమూర్తి ఆనతి ప్రకారం ఈ విశ్వం కదులుతోంది .దేవుడు విశ్వాన్ని వదిలి పెట్టలేదు .ఆయన కారణ ప్రభావాలలో (కాజ్ అండ్ ఎఫెక్ట్ ) తో కనిపిస్తున్నాడు .విశ్వం కారణ,ప్రభావాల  చేత పరిపాలింప బడాలని భావించాడు భగవాన్ . కాని ఆయన ఉపాదాన కారణం అవటం వలన –అంటే ప్రపంచానికి ఆయన పదార్ధ ప్రదాత .కనుక ఆయనే కారణం ప్రభావం కూడా .ఈ సూత్రాల గురించే హాకింగ్ శాస్త్ర వేత్త మాట్లాడుతున్నాడు

పేజి 123,పేరా -2

ఒక అవకాశం ఏమిటంటే అస్తవ్యస్తమైన (కయాటిక్ ).సరిహద్దు నియమాలు .వీటివలన విశ్వం అనంతం గా నైనా ఉండాలి లేక అనంతమైన విశ్వాలు ఉండి  ఉండాలి .

వ్యాఖ్య –భారతీయ వేద,పురాణాలు ఒకే ఒకఅనంతమైన  విశ్వం ‘’బ్రహ్మాండం ‘’ఉన్నదని చెప్పాయి .అది గుడ్డు ఆకారం లో ఉంటుంది కనుక బ్రహ్మాండం అన్నారు .ఈ గుడ్డు ఆకారమే దాని సరి హద్దును చూచిస్తుంది .ఒక కల్పం లో బ్రహ్మాండానికి ఒక సరిహద్దు పరిమితమై ఉంటుంది .విశ్వానికి కాదు .ఎందుకంటె విశ్వం అంటే ఆత్మయే.మొత్తం మీద తేలింది ఏమిటి అంటే విశ్వం దేశాకాలలలో అనంతమైనది అని .కాని ప్రపంచాలు లేక సప్త  లోకాలు సృష్టి చెంది నశిస్తాయి ,మళ్ళీ జన్మిస్తాయి లయం చెందుతాయి ఇది అంతా ఒక అంతులేని అనంత ప్రక్రియ .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-30-12-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -11 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

—    దైవ చిత్తం -11

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

పేజి-116,పేరా -2

ఈ భావాలను వివరించటానికి ఇతరులు క్వాంటం మెకానిక్స్ఏ విధంగా  విశ్వ ఆవిర్భావ ,భవిష్యత్ లపై ప్రభావితం చేస్తాయో  తెలియాలి.ముందుగా అందరూ విశ్వాన్ని గురించిన చరిత్ర , దానిపై ఉన్న  సాధారణ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోవాలి . ఇదే ‘’హాట్ బిగ్ బాంగ్ మోడల్ ‘’ఇది ఫ్రీడ్ మాన్ సైంటిస్ట్ వర్ణించిన మోడల్ ను బిగ్ బాంగ్ దీరీకి ముందే ఊహించింది .ఈ మోడల్స్ లో ఈ విశ్వ వ్యాపన లో అందులోని ద్రవ్య రాశి ,లేక రేడియేషన్ చల్ల బడుతుంది .విశ్వం రెట్టింపు అయితే ,దాని ఉష్ణోగ్రత సగానికి పడి  పోతుంది .ఉష్ణోగ్రత కణాల సగటు శక్తి  లేక వేగాన్ని  కొలిచేదేఅయినప్పుడు ఈ చల్లదనం విశ్వం లోని పదార్ధం పై పెద్ద ప్రభావాన్నే కలుగ జేస్తుంది .ప్రతి అధిక ఉష్ణోగ్రత వద్ద ,కణాలు న్యూక్లియర్ లేక ఎలక్ట్రో మాగ్నెటిక్ శక్తుల వలన ,పరస్పర  ఆకర్షణకు లోను కానంత వేగంగా, భ్రమణం చెందు తాయి .ఒక వేళ అవి బాగా చల్లబడి పొతే ,ఆకర్షించుకొనే కణాలు ముద్దలా (క్లంప్ )అయి పోతాయి .ఇదే కాక విశ్వం లో ఉండే కణాలు ఉష్ణోగ్రత పైనే ఆధార పడి ఉంటాయి .అవసరమైన అత్యుష్నోగ్రతల వద్ద కణాలు అధిక శక్తిని కలిగి , ఢీకోన్నప్పుడు అనేక రకమైన కణాలు ,వ్యతిరేక కణాల జంటలేర్పడి ,అందులోకొన్ని యాంటి పారికల్స్ ను తగిలినపుడు కొన్ని అంతమొందినా ,మళ్ళీఅంత మొందిన వేగం కంటే  మరింత  వేగంగా మళ్ళీ ఏర్పడుతూ ఉంటాయి .  తక్కువ  ఉష్ణోగ్రత ల వద్ద ఈ డీ కొనే కణాలు తక్కువ శక్తిని కలిగి ఉంటాయి. కణ జంటలు (కణాలు ,యాంటి కణాల జంటలు  )  తక్కువ వేగం లో ఏర్పడి ,పుట్టిన0త వేగం కంటే అత్యంత వేగం గా అంతమొందు తాయి .

శాస్త్రి గారి భాష్యం –యజుర్వేదం లోని రుద్రాధ్యాయం లో నాలుగవ ఖండం లో సృష్టి కర్తను ‘’మహాగ్ని ‘’గా అంటే ‘’రుద్రుడు ‘’గా చెప్ప బడినాడు .మంత్రాలు స్తోత్రాలు ఈ రుద్రునికే చేస్తూ చల్లబడి విశ్వ సృష్టిని చేయమని ప్రార్ధిస్తారు .కోపంగా ఉండ వద్దని అర్దిస్తారు .తర్వాత సృష్టి మొత్తాన్ని వర్ణించారు .భక్తుడు రుద్రుని తను కావించిన ఈ విశ్వాన్ని సర్వతో భద్రం గా ,సంక్షేమ సౌభాగ్యాలతో వర్ధిల్ల జేయ వలసినదిగా  వేడుకొంటారు.కనుక వేదం లో అగ్నికి గొప్ప ప్రాధాన్యం ఉంది .పాశ్చాత్యులు ,భారతీయులుకాని చరిత్రకారులు వేద సంస్కృతిని అర్ధం చేసుకోకుండా మనది ఆటవికమని ,సంచార సంస్కృతీ అని ఈస డించారు .వ్యతిరేక కణాలను మించి కణాల ఉత్పత్తి జరగాలంటే ఒక క్రిటికల్ టే0ప రేచర్(క్లిష్ట ఉష్ణోగ్రత )అవసరం .కనుక వ్యతిరేక కణాల ను జయించటానికి కణాలకు అగ్ని సాయం కావాలి . అందుకే పురాణాలలో దేవతలు ఏ ఆపద వచ్చినా శివుడు,కుమారస్వామి ,విష్ణువు మొదలైన వారి  దగ్గరకు పరిగెత్తి కాపాడమని మొరపెట్టుకొని రాక్షస సంహారం చేసి తమను రక్షించమని ,యుద్ధం లో విజయం ప్రసాదించమని కోరుకొంటారు  ..శివుడు రుద్రుడే అని ముందే తెలుసుకొన్నాం .కుమారస్వామి అగ్ని తేజస్సు .  .విష్ణువు అంటే ‘’ఆహవనీయాగ్నిఅంటే సూర్యుడు  ‘’.అంటే ఈ ముగ్గురూ అగ్నికి ప్రతి రూపాలే .

ఈ సందర్భం లోనే వేదం ఈ ప్రపంచం యజ్ఞం వలన సృష్టింప బడింది అని చెప్పింది .అంటే సంఘటీకరణం వలన ఏర్పడింది అని భావం .ఖచ్చితమైన వర్ణన కల  శ్లోక తాత్పర్యం –ఒక దాని నొకటి ఆకర్షించే కణాలు ముద్ద గా మారిపోతాయి ‘’.అదే దేవతల కార్యం .అందుకనే దేవతలను కణాలుగా వర్ణిస్తారు .వాళ్ళు అందరూకలిసి సృష్టి చేస్తారు .వ్యతిరేక కణాలు –యాంటి పార్టికల్స్ అంటే రాక్షసులు కణాలను విధ్వంసం చేస్తాయి అంటే సృష్టిని ధ్వంసం చేస్తారు .పార్టికల్స్ సంఖ్య కంటే యాంటి పార్టికల్స్ సంఖ్య  చాలా ఎక్కువ కనుక సృష్టి నిరాఘాటం గా కొన సాగుతుంది .నిజానికి రాక్షసుల సంఖ్య దేవతల సంఖ్య కంటే ఎక్కువే. అందుకే ఎప్పుడూ అసురులు సురులపై దాడి చేస్తూ  ఓడించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .సురులు భరించలేక అగ్ని ప్రతీకాత్మమైన శివుడి నో విష్ణువు నో రక్షించమని  యుద్ధం లో గెలిపించమని పరిగెత్తు తారు .ఇది ప్రతీకాత్మకంగా అన్యాపదేశం గావేద పురాణాలు  ఇచ్చిన విజ్ఞాన సందేశం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -10 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -10

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

ఏడవ అధ్యాయం –  బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు )అంత నల్లగా ఉండవు

పేజి -105,పేరా -2

మనం అనుకొనే ఖాళీ జాగా (ఎంప్టి స్పేస్ )పూర్తిగా ఖాళీ ది కానక్కర లేదు .అలాఉంటే గురుత్వాకర్షణ ,విద్యుదయస్కాంత క్షేత్రాలు మొదలైనవన్నీ శూన్యం అయి పోవాలి .

పేజి -106,పేరా -2

శూన్యం నుంచి శక్తి ణి ఉత్పత్తి చేయలేము .కణం లో  మరో వ్యతిరేక కణం (యాంటి పార్టికల్ )ఉంటుందని తెలుసు .మొదటి దానిపై ధనాత్మక శక్తి , రెండవ దానిపై ఋణాత్మక శక్తి  ఉంటాయి.

శాస్త్రీ జీ వ్యాఖ్య –ఈ అత్యంత ఉత్కృష్ట సాంకేతిక చర్చలు రేడియేషన్ ఉద్గారానికి దారి తీసింది .ఖాళీ గా కనిపించే ది  నిజమైన  ఖాళీ ప్రదేశం కాదు .అది కంటికి కనిపించని  రుణ లేక ధనాత్మక శక్తి మాత్రమె .ప్రతి అవతార పురుషుడు ,లేక మహా సన్యాసి సమాధి అవటం ,వారు మహా శక్తిలో సంలీనం కావటం మనకు తెలుసు జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్య చివరకు శక్తి స్వరూపమైన పరమేశ్వరి సాన్నిధ్యం చేరారని మనకు తెలిసిన సంగతే .కారణం ఏ ద్రవ్య రాశి కూడా శక్తి లేక ప్రభవించదు . ద్రవ్య రాశి శక్తి పరస్పర వినిమయం అవుతాయి అనటానికి  ఉదాహరణ .ద్రవ్య రాశి సృష్టి అంటే దేవుని కార్యమైన సృష్టి మాత్రమె .దీనికి సృస్తికర్తకైనా శక్తి అవసరమే .శంకరుల శివానంద ,సౌందర్య లహరి లలో ఈ శక్తిని ‘’చిచ్చక్తి ‘’అన్నారు .అంటే స్పేస్ మరియు శక్తి అంటే జ్ఞానం శక్తి అని భావం .జగద్గురువులు యెంత దాకా వెళ్ళారంటే –శివుడు శక్తి సహకారం లేకుండా ఒక్కడుగు కూడా ముందుకు వేయ లేడు.-‘’శివ శక్త్యో యది భవతి ‘’.శక్తి అనేది ద్వంద్వా తీతమైనది .అంటే ద్వంద్వానికి ఆవలిది .భౌతిక పరిభాషలో ధన ,రుణ శక్తులకు అతీతమైనది .ఇవి తెలివైన వారికే కాక సామాన్యులకు కూడా అర్ధమయే విశేషాలే .

పేజి-107,పేరా 2

బ్లాక్ హోల్ అతి చిన్నదైనప్పుడు ,(ఇది ఇంకా పూర్తిగా తెలియని విషయమే )అనుభవమైన ఊహ ప్రకారం  మిలియన్ల సంఖ్యా లో ఉన్న హైడ్రోజెన్ బాంబుల విస్ఫోటనం తోసమానమైన ఒక బ్రహ్మాండమైన అంతిమ ప్రేలుడులో అది పూర్తిగా అదృశ్యమై పోతుంది .

శాస్త్రి గారి వ్యాఖ్యానం –దీనినే మనం  పరంపరా గతం గా  వస్తున్న ‘’భస్మాసుర కద ‘’తో పోల్చవచ్చు .విష్ణు మూర్తి మోహిని అవతారం దాల్చి భస్మాసురుడిని మొహించినట్లు నటించి వాడి చేతుల తోనే వాడి నెత్తి మీద చేతులు పెట్టుకొని భస్మమైపోయేట్లు చేసింది   .రాక్షసులు బ్లాక్ హోల్స్ వంటివారు .వీటి  స్పైరల్ కదలిక వలననే నక్షత్రాలు కదులుతాయి .గజా సురుడిని పెద్ద బ్లాక్ హోల్ గా భావించి ఇది వరకే చెప్పాను .ఈ రాక్షసులు సృష్టికి ఆటంకం కలిగిస్తారు .రాక్షసులను వ్యతిరేక అయస్కాంత శక్తులుగా భావించాలి .కారణం వారు ఎప్పుడూ సమీకృత దేవ కార్యాలైన యజ్ఞాలకు  విఘ్నాలు కలిగించటమే .పదోత్పత్తి శాస్త్రాన్ని (ఎటిమలాజికల్ )బట్టి యజ్ఞం అంటే దేవ పూజ ,దానం ,సంఘటీకరణం .ఇదిసృష్టి కోసం  అన్నిటినీ కలిపేది ,ఏకీకృతం చేసేది ,ఉండలు ఉండలుగా మార్చేది అని భావం .  సంకర్షణం అంటే అయస్కాంత శక్తి .

ఎనిమిదవ అధ్యాయం –విశ్వానికి ఆరంభం ,దాని భవిష్యత్తు

పేజి -115,పేరా -1

అయిన్ స్టీన్ శాస్త్ర వేత్త దీరీ ఆఫ్ రిలేటివిటి ప్రకారం స్పేస్ టైం –బిగ్ బాంగ్ ఏకత్వం ( సింగ్యులారిటి )తోప్రారంభమైంది .అది అతిపెద్ద ఏకీకృత  ప్రేలుడు(బిగ్ క్రంచ్ సింగ్యు లారిటి) తో అంతమౌతుంది .విశ్వం అంతా మళ్ళీ వినాశన మవటం  లేక ఒకే సారి బ్లాక్ హోల్ లో ద్వంసమైపోవటం జరుగు తుంది .ఈ బిలం లో పడిన ప్రతి వస్తువుఒకే సారి  నాశనమై పోతుంది. కాని గ్రావిటేషనల్ ప్రభావం బయట ఉంటుంది .ఇలాకాక క్వాంటం ప్రభావాన్ననుసరిస్తే పదార్ధ ద్రవ్య రాశి లేక శక్తి మళ్ళీ మిగిలిన విశ్వం లోకి ప్రవేశిస్తుంది .ఇది రాక్షసుల పునర్జన్మ లాంటిదే .బ్లాక్ హోల్ ఒకే సారి ఆవిరి యై అదృశ్యమై పోతుంది .క్వాంటం మెకానిక్స్ ఇలాంటి నాటకీయ ప్రభావం బిగ్ బాంగ్ క్రంచ్ సింగ్యులారిటిచూపగలదా?విశ్వావిర్భ తొలికాలం లో ను ఆ తర్వాత,గ్రావిటేషనల్ క్షేత్రాలు బాగా బలీయంగా ఉన్నప్పుడు ,క్వాంటం ప్రభావాలను విస్మరించ లేనపుడు  అసలేమి జరిగింది ?అసలు ఈ విశ్వానికి మొదలు ,తుది ఉందా ?ఒక వేళ ఉంటె అవి ఎలా ఉన్నాయి ?

శాస్త్రీజీ భాష్యం –వీటినే పురాణాలు వేదాలు చెప్పాయి .సృష్టి జీవితాన్ని కల్పం (సృష్టి)అంటారు .దీన్ని మహా యుగాలుగా విభ జించారు .వాటిని యుగాలుగా ,వీటిని మళ్ళీ లక్షలాది సంవత్సరాలుగా సూక్ష్మ విభజన చేశారు .ఇప్పుడు మనం ఉన్న కల్పం (acon )శ్వేత వరాహ కల్పం .ఇది భూమికి సంబంధించినంతవరకు చాలా దూరం శ్వేత వరాహ కల్పం ప్రారంభం లోనే భూమి కన్యా రాశి లో లేక వరాహ  నక్షత్ర కూటమి లో సృష్టింప బడింది అని ఇదివరకే తెలుసుకొన్నాం .అంటే మన భూమి ,వరాహ నక్షత్ర కూటమి ఒకే సారి సృష్టింప బడినాయి .ఇది ముందే నిర్దేశింప బడిన కాలం వరకు ఉండి,గ్రహ నక్షత్రాలతో మళ్ళీ అంతమౌతుంది .

మన పురాణాలు ఈ కూటమిని  పరిమితమైన కోణం లోనే చెప్పాయి .మిగిలిన గెలాక్సీల విషయం లోనూ ఇదే విధానం .అవికూడా ఇలాగే పరిణామం చెంది శక్తిలో లయం పొంది నిద్రాణ స్థితిలో (డార్మంట్ )కనిపించకుండా స్పష్టమైన  శూన్యం (అపరెంట్ ఎంప్టి నెస్)అనబడే ఆకాశం లో ఉండి,మళ్ళీ ప్రారంభ విధానం లో పాల్గొంటాయి .కనుక సృష్టి అనేది ఒకే సారి (వన్ టైం )జరిగింది కాదని స్పష్ట మౌతోంది .ఇది టైం ,స్పేస్ లో అంతు ,లేనిదని ,అనంతమైనదని స్పష్టం .ఇదే విషయాన్ని హాకింగ్ శాస్త్రజ్ఞుడు 116వ పేరాలో స్పష్టంగా చెప్పాడు . క్రిస్టియన్ మత గురువు పోప్ గారు ఏర్పరచిన సైంటిస్ట్ ల సమావేశం లో –‘’సైంటిస్ట్ ల సిద్ధాంతాలు బైబిల్ సిద్ధాంతాలతో ఘర్షణ పడుతున్నాయా ‘’?అని అడిగినప్పుడు   హాకింగ్ తెలియ బరచాడు .

పేజి 116,పేరా -1

మనం మాట్లాడుకొనే సబ్జక్ట్ విషయం ఆయనకు తెలియదని సంతోషించాను .కాన్ఫరెన్స్ లో నేనిలా చెప్పాను –స్పేస్ టైం సంభావ్యత స్పస్ట మనిపరిమితమైనదని(ఫైనిట్ )దానికి  సరిహద్దు (బౌడరి )  రెండూ లేవని  అంటే దానికి ప్రారంభం ,అంతమూ లేదని సంపూర్ణం (ఆబ్సల్యూట్ )కాదని భావం .స్పేస్ ,టైం లకు సరిహద్దు లేదు.సృష్టి ఏర్పడిన క్షణం (మూమెంట్ ఆఫ్ క్రియేషన్ )కూడా లేదు .

శాస్త్రిగారి వ్యాఖ్య –ఇది అచ్చంగా మన భావనలనే ప్రతి బిమ్బిస్తున్నాయి .సృష్టి ఒకే కాలం లో జరిగిన తంతు కాదు .అది పరిపూర్ణమూ (ఆబ్సల్యూట్ )కాదు .స్పేస్ ,టైం లకు సరిహద్దు లేదు . అవి సరళ రేఖాత్మకం(లీనియర్ ) కాదు ,.అవిస్వభావ రీత్యా  చక్రీయమైనవి (సైక్లిక్ )  ,అంటే అవి ఎప్పుడూ కనిపిస్తూ మళ్ళీ ప్రత్యక్ష మౌతూ  ఉంటాయని అర్ధం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27 12-15- కాంప్ –మల్లాపూర్ =హైదాబాద్

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆత్మ జ్యోతి జనవరి లో ప్రచురితమైన కోటప్ప కొండ – వ్రాత్చ్య

005300540055 0056 0057 0058 0059 0060కోటప్ప కొండ 

0107 0108 0109 0110


0112

 

 

 








 

 

 

 

 

 

 

 

0113 0114

Posted in రేడియో లో | Tagged | Leave a comment

మా మనవడు ఛి సంకల్ప్ 26-12-15 న అమెరికా ప్రయాణం

మా మనవడు ఛి సంకల్ప్ 26-12-15 న అమెరికా ప్రయాణం

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తెలుగు త్రైలింగ స్వామి వయసు 300 ఏళ్ళు ,సౌందర్య పరి పూర్ణుడు శ్రీ కృష్ణుడు సుందర శిల్పాల రాచ కొండ ,నాటక రంగ సేవలో శేషాచార్య ,కావ్య కదా స్వరూపం ”శేష ధర్మాలు

Inline image 1Inline image 1


Inline image 2
 
 
 
 
Inline image 3


 
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వదేశీ కాలేరా మోడీ ,మొదీఇజమ్ లో

Inline image 1


Inline image 2

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అసెంబ్లీ పరువు గంగ పాలు ,నాగయ్య గారిలో మన మహా పురుషులు అదిరేలా అమరావతి

Inline image 1Inline image 1

Inline image 2

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com

నవ్య సృజనకే పట్టం!

– మామిడి హరికృష్ణ24/12/2015

సాంకేతికంగా, సృజనాత్మకతపరంగా, వాణిజ్యపరంగా తెలుగు సినిమా చేరుకున్న అత్యున్నత స్థితికి సాక్షీభూతంగా నిలిచిన సంవత్సరం 2015! జాతీయ స్థాయిలోనూ అందరూ తెలుగు సినిమా ‘స్టామినా’ను చూసి ఆశ్చర్యపోయేంత సంచలనానికి కారణమైన ఏడాదిదే. జనాల్లో సినిమాకి ఉన్న వినోదాత్మక విలువస్థాయిని చూపించడంలోనూ, సామాజికంగా ప్రేరణని అందించడంలో అది చూపించే ప్రభావాన్ని సాక్షాత్కారం చేయడంలోనూ సినిమాకి సినిమాయే సాటి అని మరోసారి నిరూపించిన సంవత్సరమిది!!

‘లయన్’, ‘బెంగాల్ టైగర్’, ‘షేర్’లు ప్రేక్షకులకు ‘కిక్’ని ఇవ్వలేవని, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఎంత ‘టెంపర్’తో ‘బ్రూస్‌లీ’ లెవల్‌లో కనిపించినా ‘పండగ చేస్కో’ లేమని ఆడియెన్స్ తెగేసి చెప్పారు…! ‘సినిమా చూపిస్త మావ’ అని వచ్చిన ‘రుద్రమదేవి’కి ‘కంచె’ లేవీ అడ్డుకావని, ‘శంకరాభరణం’, ‘సితార’లకు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అనీ, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే ప్రశ్ననీ, ‘భలే భలే మొగాడివోయ్’ అనే ఆశ్చర్యాలని సృష్టించగలిగిన ‘జాదూగాడు’, అసలైన ‘శ్రీమంతుడు’ ప్రేక్షకుడే అని మరోసారి నిరూపణ అయిది. 84 ఏళ్ళ తెలుగు సినీ ప్రస్థానంలో 2015 ‘బాహుబలి నామ సంవత్సరం’గా చెరిగిపోలేని ముద్రని వేసింది!

సినిమా అంటే మేకింగ్ పరంగా 24 క్రాఫ్ట్‌ల సమ్మేళనమే. కానీ ‘కంటెంట్’పరంగా మాత్రం అది నవరసాల సంగమం. తెలుగు సినిమా 1931లో తొలిసారి అడుగు వేసింది మొదలు, ఇప్పటివరకూ చేసిన ప్రయాణంలో కామెడీని, ఎంటర్‌టైన్‌మెంట్‌నీ, హారర్‌నీ, యాక్షన్‌నీ, లవ్- రొమాన్స్‌నీ, ఫ్యామిలీ సెంటిమెంట్‌నీ… ఇలా అన్ని రకాల రసాలని ప్రేక్షకుల అనుభవంలోకి తెచ్చింది. అయితే 2015 ప్రధానంగా ‘అద్భుతరసం’లోని ‘విస్మయం’ అనే అనుభూతిని వెండితెరపై సృష్టించి, ‘లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్’ సూత్రంతో యాక్షన్ -కామెడీలు రాజ్యమేలుతున్న సినీలోకంలోకి కొత్త విస్మయ ప్రపంచాన్ని పరిచయం చేసింది. అయితే ఈ ‘విస్మయానుభూతి’ ఈసారి రెండు రకాలుగా ప్రేక్షకుల అనుభవంలోకి రావడం విచిత్రం. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక హంగుల కారణంగా తెరమీద సృష్టించబడిన మాయాజాలం వల్ల కలిగిన ‘విస్మయం’ ఒక రకంకాగా, డిఫరెంట్ కథ -కథనంతో సున్నిత మానవ సంబంధాల నేపథ్యంగా ఆవిష్కరించిన ‘విస్మయం’ మరో రకం! ఏదేమైనా ఈ సంవత్సరపు సినీ సక్సెస్ ఫార్ములా ‘విస్మయం’ అని వెల్లడయింది!!
హీరోల ప్రోగ్రెస్ రిపోర్ట్
ఈ ఏడాది సంఖ్యాపరంగా మూడేసి సినిమాలతో ముందు వరసలో ఉన్న హీరోలు ముగ్గురు. వారిలో నాని (ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు, భలే భలే మొగాడివోయ్); సుధీర్‌బాబు (మోసగాళ్ళకు మోసగాడు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ… భలే మంచిరోజు); అల్లరి నరేష్ (జేమ్స్‌బాండ్, బందిపోటు, మామ మంచు -అల్లుడు కంచు) తమదైన పంథాలో సినిమాలను చేశారు. కాగా, కళ్యాణ్‌రామ్ (పటాస్, షేర్); రామ్ (పండగ చేస్కో, శివం); గోపీచంద్ (జిల్, సౌఖ్యం); రాజ్‌తరుణ్ (సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్); సాయిధరమ్ తేజ్ (రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేర్); రానా (బాహుబలి, రుద్రమదేవి); నిఖిల్ (సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం); వరుణ్‌తేజ్ (కంచె, లోఫర్); వరుణ్‌సందేశ్ (పడ్డానండీ ప్రేమలో మరి, లవకుశ); సందీప్ కిషన్ (టైగర్, బీరువా); సుమంత్ అశ్విన్ (కేరింత, కొలంబస్); రవితేజ (బెంగాల్ టైగర్, కిక్-2) రెండేసి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ఇక, పవన్‌కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ ‘గోపాల గోపాల’తో, ఎన్టీఆర్ ‘టెంపర్’తో, రామ్‌చరణ్ ‘బ్రూస్ లీ’,; అల్లు అర్జున్ ‘డ/్య. సత్యమూర్తి’, ‘రాణి రుద్రమదేవి’తో, రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్’తో, మంచు విష్ణు ‘డైనమైట్’తో, నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’తో, నాగచైతన్య ‘దోచెయ్’తో, శర్వానంద్ ‘మళ్ళీమళ్ళీ ఇదిరాని రోజు’తో, నారా రోహిత్ ‘అసుర’తో, సంపూర్ణేష్ బాబు ‘సింగం 123’తో, నాగశౌర్య ‘జూదగాడు’తో థియేటర్‌లలోకి వచ్చారు. సీనియర్ హీరో బాలకృష్ణ ‘లయన్’తో రాగా, నాగార్జున సినిమా ఏదీ ఈ ఏడాది విడుదల కాకపోవడం విశేషం. అయితే ఆయన పుత్రుడు ‘అఖిల్’ హీరోగా పరిచయమైన సినిమా ఎంతో హైప్‌తో వచ్చింది. అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ మిత్రుడు ఆకాశ్‌పూరి పరిచయ చిత్రం ‘ఆంధ్రాపోరి’ కూడా విడుదలైంది. కాగా, హీరో కళ్యాణ్‌రామ్ నిర్మాతగా ‘కిక్-2’ సినిమా వచ్చింది. ఇక, మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’, ప్రభాష్ ‘బాహుబలి’ సినిమాలు వారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లుగా, వారి ఇమేజ్‌ని బాక్సాఫీస్ స్టామినాని మరింత పెంచిన సినిమాలుగా నిలిచాయి.
హీరోయిన్‌ల పరిస్థితేంటి?
తెలుగు సినిమా ప్రధానంగా హీరో డామినేటెడ్ సినిమా అని చెప్పాలి. అందువల్ల హీరోయిన్‌ల పాత్ర కౌశలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం అయిందనేది సత్యం. అయితే కొంతమంది హీరోయిన్‌లు ‘గ్లామర్ డాల్’గా ఉంటూనే, తమదైన తరహాలో ప్రత్యేక ముద్రతో వెళ్తున్నారు. అలా ఈ సంవత్సరం అనుష్క (బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో) హీరోలకు ఉండేంతటి క్రేజ్, ఫాలోయింగ్‌తో ప్రత్యేకతను చాటుకుంది. కాగా, శ్రుతిహాసన్ (శ్రీమంతుడు), కాజల్ (టెంపర్), శ్రీయ (గోపాల గోపాల), నిత్యామీనన్ (మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు), సమంత (S/o సత్యమూరి), త్రిష (లయన్, చీకటిరాజ్యం), ఛార్మీ (జ్యోతిలక్ష్మి), నందిత (శంకరాభరణం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ), తమన్నా (బెంగాల్ టైగర్, బాహుబలి), రెజీనా (సుబ్రహ్మణ్యం ఫర్ సేల్), లావణ్య త్రిపాఠీ ( భలే భలే మొగాడివోయ్), ప్రణీత (డైనమైట్), రాశిఖన్నా (శివం, జిల్), రకుల్ ప్రీత్‌సింగ్ (కిక్-2, బ్రూస్ లీ, పండగ చేస్కో), కలర్స్ స్వామి (త్రిపుర), అవికాగోర్ (తను నేను), సాక్షిచౌదరీ (జేమ్స్‌బాండ్), అమలాపాల్ (జెండాపై కపిరాజు), పూర్ణ (అవును-2), శ్రీదివ్య (వారధి, కేరింత), యామీ గౌతమ్ (కొరియర్‌బాయ్ కళ్యాణ్) నటించిన సినిమాలు విడుదలయ్యాయి. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా తెలుగు తెర కొత్త హీరోయన్‌లతో కళకళలాడింది వారిలో సాయేషా సైగల్ (అఖిల్), ప్రజ్ఞా జైస్వాల్ (కంచె), దిశా పటానీ (లోఫర్), హీబా పటేల్ (కుమారి 21ఎఫ్), సయామీ ఖేర్ (రేయ్), శ్రుతిసోథీ (పటాస్), నితికా శేరు (పడ్డానండీ ప్రేమలో మరి), త్రిథా చౌదరి (సూర్య వర్సెస్ సూర్య), మాళవికా నాయర్ (ఎవడే సుబ్రహ్మణ్యం) చెప్పుకోదగిన ముద్రని వేశారు. వీరిలో ప్రజ్ఞా జైస్వాల్ ఆకట్టుకునే అందంతోనూ, మాళవికా నాయర్ అభినయంతోనూ, హెబా పటేల్ ఆమె పోషించిన పాత్రలోని నవ్యతతోనూ యువతరాన్ని ఆకట్టుకోగలిగారు.
డిఫరెంట్ సినిమాకి పట్టం:
ఎన్ని చెప్పినా తెలుగు సినిమా అంటేనే రొటీన్ ఫార్ములా సినిమాగా, మాస్, మసాలా సినిమాగానే పేరు సంపాదించుకున్న మాట వాస్తవం. అయితే ప్రతీ సంవత్సరం అన్ని ఫార్ములా సినిమాల మధ్య కొన్ని వైవిధ్య చిత్రాలు, కంటెంట్ -బేస్డ్ సినిమాలు కూడా రావడం, వాటిని సైతం ప్రేక్షకులు ఆదరించి, తమలో అభిరుచి కలిగిన ప్రేక్షకులు ఉన్నారని నిరూపిస్తుంటారు. అలా ఈ ఏడాది కూడా కథ, కథనం, పాత్రల చిత్రణలలో విభిన్నతని చూపించిన సినిమాలు వెండితెరని పలకరించాయి. వాటిలో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వచ్చిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ కాలాలకు, ప్రదేశాలకు అతీతంగా నిలిచే శాశ్వత ప్రేమ భావనని సున్నితంగా చూపించగా, మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘్భలే భలే మగాడివోయ్’ సినిమా షార్ట్ మెమరీ ఉన్న యువకుడు తన ప్రేమని గెల్చుకున్న తీరును సెన్సిబుల్ హ్యూమర్‌తో అందించింది. అలాగే, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా మనిషిలోని అంతర్గత అనే్వషణ అనే తాత్విక అంశాన్ని ప్రకృతి నేపథ్యంలో చక్కగా ఆవిష్కరించింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో వచ్చిన ‘సూర్య ఒ సూర్య’ సినిమా – సూర్యుని కిరణాలు పడని ప్రత్యేక ఆరోగ్య స్థితి ఉన్న యువకుడి జీవితంలోని కోణాలని తెరకెక్కించగా, ప్రేమ్‌సాయి నిర్దేశనలో వచ్చిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ థ్రిల్లర్ కథాంశంగా వచ్చింది కాగా, కోవలెమూడి సూర్య ప్రకాష్‌రావు దర్శకత్వంలో బైలింగ్వుల్‌గా వచ్చిన ‘సైజ్ జీరో’ సినిమా మెట్రో అర్బన్ నగర జీవితాలలోని అమ్మాయిలలో సన్నగా ఉండటమే సౌందర్యం అనుకునే భావనని, దానిని ఆసరా చేసుకుని మార్కెట్‌లో జరుగుతున్న మోసాలని కొత్త తరహాలో ప్రజెంట్ చేసింది. అలాగే సుకుమార్ రచనలో సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమా సమకాలీన యువతీ యువకుల ఆలోచనలని, అనుమానాలని, అపనమ్మకాలని కథాంశంగా అల్లుకుని, ఉదాత్తమైన ప్రేమని ఆవిష్కరించి అమ్మాయిల ప్రవర్తనలోని కొత్తకోణాన్ని ఆకట్టుకునేలా ప్రత్యక్షం చేసింది. యువ ప్రేక్షకుల మనసు దోచుకుంది.
అలాగే, కొన్ని దశాబ్దాల కాలంగా తెలుగు తెరపై కనుమరుగై పోయిన హిస్టారికల్ పీరియడ్ సినిమా మళ్ళీ ‘రుద్రమదేవి’తో దర్శనమిచ్చింది. కాగా, తెలుగు సినిమా ‘జెనార్’లలో ఇప్పటివరకూ రాని ‘వార్ ఫిల్మ్ జెనార్’ ఈ సంవత్సరం జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహించిన చిత్రం ‘కంచె’తో పరిచయం అయింది. ఈ సినిమా ‘వార్ ఫిల్మ్’ గానే కాక, పీరియడ్ ఫిల్మ్‌గా 1940 దశకపు వాతావరణాన్ని, కాస్ట్యూమ్స్‌నీ, సెట్టింగ్‌లనీ తెరపై రీక్రియేట్ చేసి అందమైన ప్రేమకథతో నవ్యతని చూపించింది. ఇక జానపద వస్తువుని, కాల్పనిక శైలిని కలగలిపి ‘్ఫక్ ఫాంటసీ జెనార్’లో వచ్చిన ‘బాహుబలి’ సినిమా ఈ శైలిపరంగా తెలుగు ఫార్ములా సినిమాలకు పూర్తిగా భిన్నమైనదే. అంతేకాక, ‘2-పార్ట్‌మూవీ’ అనే స్టైల్‌కు ‘రక్తచరిత్ర’ తర్వాత ఆ శైలిలో వచ్చిన సినిమాగా కూడా ప్రత్యేకతను సాధించింది.
100 కోట్ల క్లబ్
ఎన్నో ఏళ్ళుగా తెలుగు సినిమాని ఊరిస్తున్న ‘‘100 కోట్ల క్లబ్’ కల ఈ సంవత్సరం సాకారమయింది. నెలరోజుల వ్యవధిలో విడుదలైన బాహుబలి (జూలై 10 విడుదల), శ్రీమంతుడు (ఆగస్టు 7 విడుదల) సినిమాలు రెండూ కలెక్షన్లపరంగా 100 కోట్ల మైలురాయని దాటేసి, ఆ రికార్డ్ సృష్టించిన బాలీవుడ్, కోలీవుడ్ తర్వాత మూడో ఫిల్మ్ ఇండస్ట్రీ స్థానాన్ని టాలీవుడ్‌కు కట్టబెట్టాయి.
ఆ మూడు ‘సిత్రాలు’:
2015 సంవత్సరంలో రిలీజైన సినిమాలలో మూడు చిత్రాలు మాత్రం అన్ని రకాలుగానూ తెలుగు సినిమా ప్రతిష్టనూ, ఖ్యాతినీ దశదిశలా చాటాయని చెప్పాలి. వాటిలో గుణశేఖర్ దర్శకత్వం చేసిన ‘రుద్రమదేవి’ సినిమా 12వ శతాబ్దం నాటి కాకతీయ సామ్రాజ్జ రాణిరుద్రమదేవి జీవిత కథగా తెరకెక్కింది. హిస్టారికల్ డ్రామాగా, బయోపిక్‌గా, 3-డిలో వచ్చిన తూలి హిస్టారికల్ చిత్రంగా, హీరోయిన్ – ఓరియెంటెడ్ చిత్రంగా ఎనె్నన్నో విశిష్టతలను సంతరించుకోవడమే కాక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే వినోదపు పన్ను మినహాయింపును పొందింది.
అలాగే, కొరటాల శివ దర్శకత్వంలో గ్రామాలను దత్తత తీసుకోవడం అనే కథాంశంతో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంతోమంది ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకొనేందుకు స్ఫూర్తినిచ్చింది. ప్రభావవంతమైన మాధ్యమంగా ప్రజల ఆలోచనలను సామాజిక ప్రయోజనం దిశగా మళ్ళించడంలో ఎంతకీలకమైన పాత్ర పోషిస్తుందో మరోసారి ఈ సినిమా నిరూపించింది. అలాగే సంస్కరణలు, ఆదర్శాలు, సందేశాత్మక భావనలతో కూడిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా వర్కవుట్ కావు అనే అభిప్రాయం తప్పు అని ఈ సినిమా, తెరసాక్షిగా వెల్లడించింది.
ఇక, రాజవౌళి దర్శకత్వంలో విజయేంద్రప్రసాద్ రచనలో వచ్చిన ‘బాహుబలి’ సినిమా ఎన్నో రకాలుగా తెలుగు సినిమా రేంజ్‌ని, ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింప చేసింది… ఫోక్ ఫాంటసీ చిత్రంగా, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన ‘గ్రాఫికల్ వండర్’గా, తెలుగు సినీ చరిత్రతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా (దాదాపు 150 కోట్లు), అత్యధిక వసూళ్ళు చేసిన చిత్రంగా (దాదాపు 150 కోట్లు ఒక్క తెలుగులోనే), అత్యధిక భాషలలోకి ‘డబ్’ అయిన చిత్రంగా, అంతర్జాతీయంగా దాదాపు 530 కోట్ల (అన్ని భాషల వర్షన్‌లూ కలిపి) కలెక్షన్‌లను సాధించిన ఏకైక తెలుగు చిత్రంగా, ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో ‘‘బజ్‌రంగీ భాయిజాన్’ తర్వాత రెండో సూపర్‌హిట్ చిత్రంగా ఎన్నెన్నో రికార్డులను, విశిష్టతలను సాధించింది. 2015 సంవత్సరాన్ని టాలీవుడ్‌కి ‘బాహుబలి నామ సంవత్సరం’గా మిలిచింది.
రీమేక్‌లు.. సీక్వెల్‌లు.. హారర్‌లు
ఈ ఏడాది కూడా రీమేక్‌లు, సీక్వెల్‌లు, డబ్బింగ్ చిత్రాలు వచ్చాయి. వాటిలో మళ్టీస్టారర్‌గా వచ్చిన ‘గోపాల గోపాల’ హిందీ సినిమా ‘ఓ మైగాడ్’కు రీమేక్‌గా వచ్చింది. ‘గడ్డం గ్యాంగ్’ కూడా ఈ కోవలోకే చేరింది. అలాగే ‘కిక్-2’, ‘అవును-2’ సీక్వెల్స్‌గా కొత్తకథలతో వచ్చాయి. ఇక పాతతరం చిత్రాల పేర్లతోకూడా కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో శంకరాభరణం, సితార చిత్రాలు ఆ కోవలోనివే. అయితే, సినిమాలు గత చిత్రాలకున్న ఉన్నతత్వాన్ని ఇబ్బందిపెట్టాయనే విమర్శలు ఎదుర్కొన్నాయి. ఇక కొత్త కథనాలకు, దర్శకులకు, లోబడ్జెట్ మేకింగ్‌లకు కేరాఫ్‌గా చెప్పుకునే సినిమాలు హారర్ చిత్రాలు ఇటీవలి కాలంలో తెలుగు తెరపై హారర్ కామెడీలు హిట్టవ్వడంతో ఆ వరుసలో ఈ ఏడాది కూడా ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. కాలింగ్‌బెల్, చంద్రిక, త్రిపుర, అవును-2 సినిమాలు ఆ కోవలోనివే. రాజుగారిగది సినిమా ఓ ప్రేక్షకుడు మరణించడం చర్చనీయాంశమైంది.
కొత్తపాఠం:
2015లో రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు తమ ఆదరణ నిరాదరణతో మరోసారి తన తీర్పును చెప్పకనే చెప్పారు. కొత్తదనాన్ని, ప్రయోగాత్మకతను, కథ కథనాల్లో నవ్యతని ఫిల్మ్‌మేకింగ్‌లో అద్భుత ప్రతిభని ప్రదర్శించిన సినిమాలని, సామాజిక చైతన్యాన్ని అందించిన సినిమాలని, సున్నిత వినోదాన్ని అందించిన సినిమాలను నెత్తికెత్తుకున్నారు. వంశాలు, వారసత్వాలు పేరుతో ఊదరగొట్టినంత మాత్రాన సినిమాల్లో విషయం లేకపోతే అపజయం పాలుకాక తప్పదని గట్టిగా హెచ్చరిక చేశారు. సినిమా సక్సెస్‌ని ఫార్ములా కన్నా క్రియేటివిటీయే ఫైనల్ అని, అలాంటి సృజనాత్మకతకు పట్టంగట్టడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని కూడా చెప్పకనే చెప్పారు. మొత్తంమీద ఈ కొత్తపాఠం వెల్లడిచేస్తున్న సత్యాల బాటలో రాబోయే సంవత్సరంలోనూ తెలుగు సినిమాలు రూపొందుతాయని ఆశిద్దాం.

**

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భలే మంచి రోజు, జత కలిసింది

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆబాల గోపాల రత్నం ,ఊర విస్క ,టాల్ స్టాయ్ – చెట్టే కొడుకు మొక్కలే పిల్లలు ఆమె

Inline image 1Inline image 1


Inline image 2
గబ్బిట దుర్గా ప్రసాద్
Inline image 3
 
 

 


Inline image 2
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హఠాత్తుగా పాక్ కు మోడీ ,కాంగ్రెస్ యెంత పత

Inline image 2

Inline image 1


Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ చిత్తం -8 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -8

శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్ )

పేజి -82,పేరా 3

చాలా విపరీత0 గా ఉన్న వాయువు ,ముఖ్యం గా హైడ్రోజెన్ వలన నక్షత్రం ఏర్పడుతుంది .నక్షత్రం దాని భారానికి అదే గురుత్వాకర్షణ వలన కూలి పోతుంది .

శాస్త్రిగారి కామెంట్ –హైడ్రోజెన్ అంటే నీటిని ఏర్పరచే ఒక మూలకం . వేదవిజ్ఞానం ఉన్న  వారందరికీ ప్రపంచం నీటి తో ఏర్పడిందన్న విషయం తెలుసు .వేదమంత్రాలలో ఈ విషయం చాలా సార్లు చెప్ప బడింది .’’ఆపోవా ఇదగం సర్వం ,సర్వా భూతా న్యాపహః ‘’భావం –విశ్వం అంతా నీరే .ప్రాణులన్నీ నీరే .ప్రపంచం లోని లయ లన్నీ జలమే ..ప్రపంచం లోని కాంతి అంతా  నీరే .ప్రపంచం లోని ప్రతిదీ నీరే .అందుకే సృష్టి నీటి తో ఉన్న నక్షత్రాలనుండే ప్రారంభ మైంది .విశ్వం అంతా తారా సముదాయమే అంటే నీటి సముదాయమే .మహా విష్ణువు అన్నిటా పరి వ్యాపకమై ఉంటాడు కనుక ,అన్నీ తానె కనుక ,విశ్వం తానె అయి ఉన్నాడు కనుక ‘’నారాయణుడు ‘’అయ్యాడు సంస్కృతం లో నార అంటే నీరు అని అర్ధం .అయన అంటే సన్నిధి .ఇదే విషయాన్ని మిగిలిన వారు ,గణేశాది దేవతలందరికీ వర్తిస్తుంది .వేద,పురాణాలలో నీటిని ,దాని ప్రాముఖ్యాన్ని గూర్చి ఎన్నో ఆసక్తికర కధలున్నాయి .ఋగ్వేదం లో వరుణ దేవత అంటే కోరికలు తీర్చే వాడు అని ఉంది .అన్నిటినీ తీర్చేది,ఇచ్చేది  నీరు అనే విషయం మనకు తెలిసిందే .చెట్లు ,జంతువులూ ,,మానవులు పెరగటానికి నీరే ముఖ్య పదార్ధం అనే ఈ మహా విజ్ఞానాన్ని  దార్శనికులైన మన మహర్షులు  ఎప్పుడో మనకు అందజేసినందుకు మనం ఏమిచ్చి వారి ఋణం తీర్చుకోగలం ?సర్వదా వినయం తో కృతజ్ఞతతో ఉండటం తప్ప .  పేజి 87 పేరా -2..

ఒక నక్షత్రం కూలి పోయి బ్లాక్ హోల్ గా మారటం చూస్తె ,రిలేటివిటి దీరీ ప్రకారం ఆబ్సల్యూట్ టైం అనేది లేదని తెలుస్తోంది .అయితే ప్రతి పరిశోధకుడికి అతనికి సంబంధించిన కాలం ఉంటుంది .

శాస్త్రిగారి వివరణ –పూర్వపు భారతీయ తార్కికులు దీన్ని ఎప్పుడో గుర్తించారు .వాళ్ళు కాలాన్ని ‘’విభు ‘’అన్నారు అది నేచర్ సూత్రాలకు బద్ధం కాదు .కారణం అదే ప్రకృతిని సృష్టిస్తుంది కనుక .కనుక ఆబ్సాల్యూట్ టైం అనేది ఉండదు .మనం చేయాల్సింది ఏమిటంటే ఒక ఏక పక్ష (ఆర్బిట్రరి ) బి౦దువునుండి సాపేక్షం గా మాత్రమె గణించ గలం  .అందుకే ఇండియాలో మనకు నాలుగైదు రకాల పంచా౦గా లున్నాయి ..ఇందులో ఒకటి చంద్ర గమనం పైనా(చాంద్రమానం ) ,మరొకటి సూర్య గమనం ఆధారంగా (సూర్య మానం )మరొకటి గురు సంచారం ఆధారంగా (బార్హస్పత్య మానం )పంచాం గాలున్నాయి .యజ్న యాగాదు లకు చా0ద్రమానాన్నే పరి గణన లోకి తీసుకొని ముహూర్త నిర్ణయం చేస్తారు . వేదం లో చంద్రుని ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలుస్తుంది .భూమిపై  సృష్టి చంద్రుని నుంచి అంటే చంద్రోదయం నుండి ప్రారంభమైనదని వేదం గుర్తించింది. భూమిపైన ఏర్పడిన నీరు చంద్రుడు కనపడిన తర్వాతే ఏర్పడింది .అందుకే కృష్ణ పక్షం లో అమావాస్య  ,శుక్ల పక్షం లో పౌర్ణమి ఈ రెండూ వేద కర్మలకు ముఖ్యమైనవి .

పేజి 89,పేరా -3

తప్పించుకోవటానికి అసాధ్యమైన   దిక్చక్ర సంఘటన (ఈవెంట్ హోరైజన్ ),స్పేస్ టైం  సరిహద్దు ఒక రకం గా బ్లాక్ హోల్ చుట్టూ  పొరలా వ్యాపించి ఉంటుంది .అజాగ్రత గా ఉంటె అంత రిక్ష యాత్రికుడుబ్లాక్ హోల్ లోని  ఈవెంట్ హోరైజన్ లోకి పడిపోయి ,మళ్ళీ బయటికి రాలేడు.

శాస్త్రి గారి వ్యాఖ్యానం –ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి .అదే గణేశ విషయం.మానవ లోకం లో  ప్రక్రుతి సూత్రాలకు లొంగని చాలా బలమైన శత్రు బలం ఉన్నదని ,ఈవెంట్ హోరైజన్ అనేది మన వాళ్ళు అన్యార్ధం (ఎలిగరి ) గా చెప్పారని అనిపిస్తోంది .వినాయక చవితినాడు ఈ కధను చదివి చెప్పుకొంటాం .దీన్ని మరికొంచెం వివరంగా తరచి చూద్దాం –

గజాసురుడు అనే రాక్షసుడు ఉండే వాడు .తపస్సు చేశాడు .తపస్సులో ఉష్ణం ఉత్పత్తి అవుతుంది .ఇదే ఇంద్రియాలను జయించటం .నిరాహారం గా ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి మనసును సృష్టి కర్తపై లగ్నం చేసి  శివుడిని మెప్పించి సాక్షాత్కారం పొందాడు .వరం కోరుకోమనగా తన కడుపులో శివుడు ఉండిపోయే వరం కోరాడు .టైం స్పేస్ సరిహద్దు ఒక రకంగా పొర.అందుకేవిశ్వం లో  బయట ప్రపంచానికి శివుడు కనిపించ లేదు .ఇది వరకే చెప్పినట్లు వేద విజ్ఞానం అయస్కాంత బలాన్ని గజ బలం తో పోల్చింది .అదొక ప్రతీకాత్మక విషయం .దీనికి కారణం ఏనుగు తనబలీయమైన  తొండం తోఅన్ని శక్తులను పరాస్తం చేసి విజయం సాధిస్తుంది .ఇదే పదార్ధాలను ఆకర్షించే అయస్కాంత శక్తి .మహా శివుడే  నక్షత్రాలు గేలాక్సీలు ,గ్రహాలూ ఉన్న విశ్వం .శివుడు గజాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం గజాసుర గర్భాస్తమయ్యాడు .అంటే సకల విశ్వం గజాసురుని గర్భం లో ఉండి పోయింది .ఏనుగు  ఒకే ఒక రంగు ఉంటుంది .అది నల్లగా ఉండి,అయస్కాంత క్షేత్రంగా ఉంటుంది .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విదుషీమణి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ -కొంపెల్ల శర్మ

ఆంధ్ర విదుషీకుమారి, ఆంధ్ర సరస్వతి, సాహితీ రుద్రమ, ఊటుకూరి లక్ష్మీకాంతం – జయంతి (25 డిసంబర్ 1917) – రాబోయే సంవత్సరం ఊటుకూరి లక్ష్మీకాంతం గారి “శతజయంతి” ఉత్సవాలు ప్రారంభం (1916-17 డిసంబర్ 25)

విద్వత్కవయిత్రి, ఆంధ్ర విదుషీకుమారి, తెలుగు మొలక, ఆంధ్ర సరస్వతి, కవయిత్రీ తిలక
కళాప్రపూర్ణ, ప్రముఖ కవయిత్రి, సమాజసేవకురాలు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ జయంతి – 25 డిసంబర్ (1917)

ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ (1917 – 1996) కవయిత్రీ, పరిశోధకురాలు. ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకున్నారు. ఈమె తండ్రి ప్రముఖ పాత్రికేయులు నాళము కృష్ణారావు. తల్లి ప్రముఖ సంఘసేవకురాలు, ఆంధ్రమహిళాగానసభ స్థాపకురాలు నాళము సుశీలమ్మ. ఈమె పింగళ నామ సంవత్సరం డిసెంబరు 25, 1917 న ఏలూరులో జన్మించింది. ఈమె విద్యాభ్యాసము రాజమండ్రిలోని వీధిబడిలో ప్రారంభమైంది. తరువాత వైశ్య సేవాసదనము యువతీ సంస్కృత కళాశాలలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ఉభయభాషాప్రవీణ 1935లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలయింది. యల్లాప్రగడ జగన్నాథము పంతులు ఈమెకు ఆధ్యాత్మక గురువు. ఈమెకు తన పదమూడవ యేట మార్చి 24, 1930లో హయగ్రీవ గుప్తతో వివాహం జరిగింది. ఈమె తన ఎనిమిద యేటనుండి 18 సంవత్సరాలు వీణావాదన నేర్చుకుంది. త్యాగరాయ కృతులు నేర్చుకుంది. మొదట ఈమె విష్వక్సేన గోత్రురాలు. వివాహమైన పిమ్మట ఈమె గోత్రము సుకాంచన అయ్యింది. దేవీ ఉపాసకురాలు.

ఈమె రచనలు గృహలక్ష్మి, భారతి, ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రమహిళ, కృష్ణాపత్రిక, నవోదయ మొదలైన పత్రికలో ప్రచురింపబడ్డాయి. విజయవాడ, మద్రాసు రేడియోలలో ఈమె రచనలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

ఆంధ్రులు నిత్యం గర్వించదగ్గ మహా కవయిత్రి, విదుషీమణి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారికి నమస్కృతులు ప్రస్తుతిస్తూ, సారస్వత నీరజనాల్ని అందించడం మనందరి విధి.

కొంపెల్ల శర్మ. Kompella Sarma.

Kompella Sarma's photo.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ చిత్తం -7 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు కు నా స్వేచ్చానువాదం

దైవ చిత్తం -7

శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు కు నా స్వేచ్చానువాదం

పేజి -69,పేరా -2od)

‘’చివరగా భౌతిక శాస్త్ర వేత్తలలో ఎక్కువ మంది ఒక ఏకీకృత సూత్రం ఏర్పడుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు .ఆ సూత్రం ఆ నాలుగు సూత్రాలు ఒకే శక్తికి ఉన్న నాలుగు విభిన్న అంశాలుగా వివరించవచ్చని అనుకొన్నారు .ఇదే ఈ నాటి భౌతిక శాస్త్ర లక్ష్యం గా కని పిస్తోంది .ఇటీవలే మూడు రకాల శక్తుల ఏకీకరణ విజయ వంతమైంది .ఈ విషయాన్ని ఈ అధ్యాయం లోనే వివరిస్తాను. మిగిలిన దాని విషయమై తర్వాత ఆలోచిద్దాం ‘’అన్నాడు సైంటిస్ట్ స్టీఫెన్ హాక్ .

వివరణ –వేదం ఈ సూత్రాలను ఎప్పుడో ఏకీకృతం చేసింది .ఇవే గురుత్వాకర్షణ ,విద్యుదయస్కాంత శక్తి ,బలహీన న్యూక్లియర్ శక్తి ,శక్తి వంతమైన న్యూక్లియర్ శక్తి .వీటిని దైవీ శక్తులుగా పేర్కొన్నది అందుకే ప్రతి శక్తినీ దేవతా స్వరూపంగా భావించి చెప్పింది.  ప్రతి వస్తువు లేక దైవ శక్తి వీటిని కలిగి ఉన్నట్లు చెప్పి ,ఆహ్వానించి పూజించేట్లు చేసింది .ఈ సంయుక్త శక్తిని  అది దేవతగా చెప్పింది .ఉదాహరణకు రవి చంద్ర భూమీ మొదలైనవి .ఇందులో ప్రతిదీ ఒక దేవతయే .కారణం ఈ దేవత నాలుగు శక్తులను ఏకీకృతం చేసి తనలో ఉంచుకొని ,వాటితో విభిన్న కార్యాలను చేయిస్తుంది .గ్రావిటి,విద్యుదయస్కాంతం ,పదార్ధాన్ని బంధించి ఉంచే న్యూక్లియర్ ఫోర్స్,రేడియో యాక్టివిటి ,అనేవి ఇవే .వీటినే తర్వాత శక్తి కి ప్రతీకగా ఒకోసారి పరస్పర ఖండన ,వ్యతిరేకతలున్నా భావించారు .

ఒక ఋగ్వేద సూక్తం ‘’ఇంద్రం మిత్రం వరుణం అగ్ని మాహు హు ఔతో దివ్యహ –సుపర్ణో గరుత్మాన్ ఏకం –సత్ విప్రా బహుదా వదంతి అగ్నిం –యమాన్ మాత రిష్వాన  మాహుహు ‘’

ఈ సత్యాన్ని ఇంద్ర ,మిత్ర ,వరుణ ,అగ్ని ,సుపర్ణ ,యమ ,మాత రిశ్వ అంటే వాయువు గా పిలుస్తారు. కాని  సత్యం ఒకటే .వివిధ నామాలతో పిలువ బడుతోంది .ఈ ఏకీకృత శక్తి నే వేదం ‘’సత్ ‘’అన్నది .అందుకే వేదం ‘’ఏక మేవా ద్వితీయం బ్రహ్మ ‘’అంటే సృష్టి కర్త ఒక్కడే .రెండవదైన వేరొక శక్తి అంటూ ఏదీ లేదు  అని అర్ధం .

పేజి 70,పేరా-1

సూర్యునికి భూమికి మధ్య ఉన్న  ఆకర్షణ శక్తి –ఈ రెండు పదార్ధాల మధ్య గురుత్వాకర్షణ పరస్పర మార్పు వలన ఎర్పడేదిగా  పరిగణింప బడుతుంది .ఈ మార్పు చెందిన కణాలు వర్చువల్ పార్టికల్స్.అవి తప్పని సరిగా గణింప దగిన ప్రభావాన్ని కలిగిస్తాయి .ఇవే భూమిని సూర్యుని చుట్టూ తిరిగేట్లు చేస్తాయి .వాస్తవ గురుత్వాకర్షణలు క్లాసికల్ ఫిజిసిస్ట్ ల దృష్టిలో గురుత్వాకర్షణ తరంగాలు .ఇవి బలహీనం గా  ఉండి,కని పించ నంత ,లేక గుర్తింప బడ నంత గా ,ఇంత వరకు గమనింప బడనివిగా ఉన్నాయి .

శాస్త్రి గారి కామెంట్ –కనుక చివరికి సైన్సు వర్చువల్ పార్టికల్స్ ఉన్నాయనే నిర్ణయానికి వచ్చింది .గెలాక్సీల కదలికలు ఈ కణాల పరస్పర మార్పు వలన జరుగుతాయని నిర్ణయానికొచ్చారు .దీనివలన దేవతలు అంటే శక్తులు కంటికి కనిపించవని తేలింది. ఇది భౌతిక వాదుల పిడి వాదానికి సరైన సమాధానం .చూడబడని వాటిని ఎవరు ఎలా చూడ గలరు ?ఇవి అనుభవైక వేద్యాలే .దీనికి సమాధానంగా యజుర్వేద మంత్రం ఉండనే ఉంది యజుర్వేదం లో ఒకటవ అనువాకం లో ఆరవ కాండలో యజ్ఞం చేసే యజమాని ఒక దీక్ష తీసుకోవాలని ,దీక్షా వస్త్రం గా అతి స్వచ్చమైన తెల్లనివి ధరించాలని ,ధరించే ముందు ఆ వస్త్రానికి వేద మంత్రాలతో నమస్కరించాలని ఉంది –

‘’సోమస్య తనురసి ,తనువం మే పాహి –నక్షత్రాణాం అతీక సాత్ పాహి ‘’—దీని అర్ధం –ఓ!స్వచ్చ వస్త్రమా !నువ్వే సోమ అనగా చంద్ర రూపానివి .నా శరీరాన్ని రక్షించు .నన్ను నక్షత్రాల మహా కాంతి శత్రువు నుండి కాపాడు .

అంత రిక్ష పదార్ధాల అదృశ్య శక్తుల ఆకర్షణ  బలాలను వేదం ఎప్పుడో గుర్తించి చెప్పింది .భౌతిక వాదులు వేదాలను నమ్మక పొతే సైన్సును నమ్మినా ఇదే అభిప్రాయానికి రావటం ఖాయం .

పేజి 75,పేరా -3

యాదృచ్చిక (స్పాంటేనియస్ )ప్రోటాన్ శిదిలత ను ఇంతవరకు ఎవరూ ప్రయోగాలలో  పరిశీలించలేక పోయినా ,ప్రోటాన్ జీవితకాలాన్ని ఉజ్జాయింపుగా పది మిలియన్ మిలియన్ మిలియన్ మిలియన్ మిలియన్ సంవత్సరాలుగా ఊహించారు .అంటే ఒకటి తర్వాత ౩1 సున్నాలున్నమాట .ఇది సరళ ఏకీకృత సిద్ధాంతం చెప్పిన కాలం కంటే ఎక్కువ .ఇంకా ఎన్నో పరిశోధనలలో ఈ కాలం పెరిగిందేకాని తగ్గ లేదు .ఇంకా సున్నితమైన ప్రయోగాలు మహా  పదార్ధాలున్న వాటిపై జరిపి  నిగ్గు తేల్చాలి .

శాస్త్రి గారి వ్యాఖ్యానం –ప్రధానం గా పంచ భూతాత్మక దేవతలు ,సాపేక్షంగా అమర్త్యులు .హాకింగ్ చెప్పిన కాలం అంటే ఒకటి తర్వాత 31సున్నాలున్న సంవత్సరాలు దేవతలా జీవిత కాలం .అందుకే వేదం దేవతల జీవిత కాలం కల్పాలతోఅంతమౌతుంది అని చెప్పింది .కనుక వారిని ‘’త్రిదశులు ‘’అన్నది అంటే –వారెప్పుడూ ౩౦ ఏళ్ళ వయసున్న వారుగానే బలీయంగా  కనిపిస్తారు . కారణం ప్రళయం దాకా పంచ మూలకాలు మొదట్లో యెంత శక్తి వంతంగా బలం గా ఉంటాయో చివర్లోనూ అలాగే ఉండటం .ప్రోటాన్ శిధిలం కావటానికి పట్టే కాలాన్ని దీనితో పోల్చి చెప్పచ్చు .ఇదే అనంతకాలం లో తుది సమయం .ప్రోటాన్ శిధిలం అవటం అనే సంఘటన అని అర్ధం చేసుకోవాలి .

పేజి 78,పేరా 3

పదార్ధ కణాలు ,గురుత్వాకర్షణ బలాలు మిగిలిన వాటిపై పెత్తనం చేస్తాయి .అందుకే గురుత్వాకర్షణవిశ్వ  పరిణామాన్ని నిర్ణ యించేదిగా  ఉంది .

శాస్త్రీ జీ భాష్యం –ఇదంతా విష్ణుమూర్తి దశావ తారాలలో ఒకటైన  వరాహావతారాన్ని గుర్తుకు తెస్తుంది .వేద ఖగోళం లో ద్వాదశ రాశులలో ఒకటి అయిన కన్యా రాశి లో జరిగింది  వరాహవాతారం .ఇదే ఆధునికులు చెప్పే వరాహ నక్షత్ర కూటమి (బోర్ కాన్ష్టి లేషన్ ).విష్ణువు ఆదివరాహ రూపం లో హిరణ్యాక్ష రాక్షసుడిని వదించటానికి ముందు ,భూమికి ఆకారమే లేదు .ఈ మహా కూటమి గురుత్వాకర్షణ బలం వలన భూమికి గోళాకార ఆకృతి ఏర్పడింది .వరాహవతార విగ్రహాన్ని చూస్తె వరాహం కోరపై పై వర్తులాకార విశ్వం కనిపిస్తుంది .దీని వలన అంతకు ముందు భూమికి ఆకారం లేదని ,అందుకే పరిణామం  జరగటం ఆలస్యమైందని సూచిస్తోంది .అప్పుడు దేవుడు లేక సృష్టి కర్త భూమి రూపం దాల్చాలని ,అప్పుడే దానిపై జీవావిర్భావం జరగాలని నిర్ణయించాడు .

అందుకే ఆయన ఈ కూటమిని సృష్టించి అయస్కాంత క్షేత్రం ఎర్పడేట్లు చేశాడు .హిందువులకు శ్వేత వరాహ కల్పం ను గుర్తించగలరు .దీని అర్ధం తెల్ల వరాహం నుండి ప్రారంభమైన సృష్టి అని భావం .

సశేషం

క్రిస్మస్ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25 -12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment