దైవ చిత్తం -14
శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం
పేజి -136,పేరా 2
యూక్లిడియన్ స్పేస్ టైం,అనంత ఊహాత్మక టైం కు పాకితే ,లేక ఎక్కడో సింగ్యులారిటీ(ఏకత్వం ) లో ఇమాజినరి కాలం లో మొదలైతే , విశ్వావిర్భ కాలాన్ని చెప్పే సంప్రదాయ సిద్ధాంతం ఉన్న సమస్యలే మళ్ళీ ఎదురౌతాయి .దేవుడికి విశ్వం ఎలా ప్రారంభమైందో తెలుసు ,మనం అది ఎలా పురుడు పోసుకోన్నదో వివరించే ఏ ఒక్క కారణాన్నిచెప్పలేం .పైగా క్వాంటం దీరీ ఆఫ్ గ్రావిటికొత్త అవకాశాన్ని ఆవిష్కరించింది. దాని ప్రకారం స్పేస్ టైంకు సరిహద్దు లేదు ,అందుకని సరిగాద్దు వద్ద ప్రవర్తన ఎలా ఉన్నదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు .సైన్సు సూత్రాలు విచ్చిన్నమయ్యే సిన్గ్యులారిటీలు లేవు . దేవుడిని ప్రార్ధించ టానికి ఉండే సరిహద్దు అంచు లేదు లేక స్పేస్ టైం కు కొత్త సరిహద్దు నిబంధనలు ఏర్పాటు చేయమనటానికీ వీలు లేదు .’’విశ్వానికి సరిహద్దు నియమం అంటే దానికి బౌండరీయే లేదు ‘’అన్న ఒక్క సత్యాన్ని మాత్రం నిశ్చయం గా చెప్ప గలం .విశ్వం పూర్తిగా స్వయం సమృద్ధం,స్వయం నియంత్రణం (సెల్ఫ్ కం టైండ్).దానిని బయటి విషయం ఏదీ ప్రభావితం చేయలేదు .విశ్వం సృజింప బడదు ,నశింప బడదు ,ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది (బి ).
శాస్త్రి గారి భాష్యం –హాకింగ్ శాస్త్ర వేత్త గారి సైన్సు ఈ రకమైన నిర్ణయాలకు వచ్చినందుకు అభినందించాలి .ఇది ఉపనిషత్,,బ్రహ్మ సూత్రాల భావాలనే ప్రతి బింబిస్తోంది .వేదాంతం ప్రకారం ఆత్మ అనేది అనంత మైనది .’’సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ‘’అనేది ఉపనిషద్వాక్యం .సృష్టికి కారణం అనేది శాశ్వతమైనది (ఎటర్నల్ ),సర్వజ్ఞమైనది(ఆమ్ని సెంట్ ) ,అనంతమైనది (ఇంఫినిట్ ).చూసేది అదే కనుక ఎప్పుడూ సృష్టింప బడదు .
వేరొకటి ఏదీ దాన్ని చూడలేదు .అందుకే అది’’ ద్రష్ట ‘’అయింది .అంటే చూసేదేకాని చూడ బడేది కాదు ‘’నతు దృశ్యతే ‘’.అది చూడబడదు ,తెలియ బడదు ,దాన్నిఆత్మ జ్ఞానం వలన అనుభవించటం ద్వారా నే తెలియ బడుతుంది .అంటే చూసేవాడు చూడబడే వాడితో ఐక్యమైనప్పుడే ఇది సాధ్యమౌతుంది .అంటే ఆత్మ పరమాత్మ లో చేరినప్పుడే .అదే మొత్తుకొన్నాడు హాకింగ్ శాస్త్ర వేత్త –‘’it would just Be ‘’అంటూ .ఈ విషయాన్ని అద్వైత సిద్ధాంత వ్యాపకులు శంకరాచార్య స్వామి బాగా ప్రచారం చేశారు .ఇదే ఏకత్వం లేక అద్వైతం .దానిప్రకారం సృష్టి కర్త బ్రహ్మం ఒక్కడే .రెండో వాడు లేడు.దీని ప్రాతిపదికమీద సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తూ ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది అంటే’’ నిత్యం ‘’అని ముగించారు .ఆత్మ సృష్టింప బడదు , నశింపబడదు .కారణం అదెప్పుడూ సృష్టింప బడలేదు కాబట్టి . దృశ్య ప్రపంచామంతా భౌతిక దృష్టికి చెందినదే .హాకింగ్ చెప్పిన ఏకత్వ సిద్ధాంతం కూడాఇదే ‘’విశ్వం స్వయం సృష్టి (సెల్ఫ్ కన్తైండ్),దీనిని బయటి శక్తులేవీప్రభావితం చేయలేవు .అది ఎప్పటికీ సృష్టింప బడదు .నశించదు ఎప్పుడూ ఉంటూనే ఉంది ‘’.
మన మహర్షులు ఆత్మను యెంత స్పష్టంగా దర్శించి వివరించారో తెలుస్తోంది విశ్వం అంటే స్వయం నియంత్రణ కలది .ఆత్మను శంకరులు గొప్ప పోలిక తో చెప్పారు .అదే రజ్జు సర్ప భ్రాంతి .తాడును చూసి పాము అనుకోవటం దీని గురించి ఇది వరకే చెప్పుకొన్నాం .దేవుడు మానవులకు ఈ విశ్వ రూపం లో కనిపిస్తాడు .ఇంద్రియ నిగ్రహంతో స్థిరమైన మనసుతో ఉంటె మనకు కనిపించేది వస్తు సముదాయం కాదు పరమాత్మయే .,అంటే సృష్టి కారణ భూతుడే ,కాని అప్పుడుసృష్టి కనిపించదు అంటే ప్రభావం (ఎఫెక్ట్ ) కనిపించదు అన్న మాట .ప్రపంచం సృష్టింప బడినట్లు నాశనమైనట్లు భ్రాంతి పొందుతాం .వాస్తవానికి సృష్టీ లేదు వినాశానమూ లేదు .కనుక విశ్వావిర్భావమూ లేదు ,అంతమూ లేదు .అది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంది ,ఉంటుంది .స్టీఫెన్ హాకింగ్ దృష్టిలో అదే ‘’ఇట్ జస్ట్ వుడ్ బి’’.
అందుకే మన ఉపనిషత్తులు’’ సృష్టికర్త ‘’అనే మాట వాడకుండా చాలా జాగ్రత్త పడ్డాయి .అవి ఎప్పుడు చెప్పినా ‘’సృష్టికి కారణం ‘’అనే చెప్పాయి . మనకు సృష్టికారణం భ్రాంతిగా భాసిస్తుంది .అంటే మనమనసులలోనే ఏర్పడుతుంది దైవం ఎప్పుడూ సృష్టి చేయాలని సంకల్పించడు దీనికి కారణం అయన సంకల్ప ,వికల్పాలకు అతీతుడు .అయన నిర్వి కల్పుడు .ఇదే హాకింగ్ మాటలలో ‘’సెల్ఫ్ కంటైండ్అండ్ నాట్ ఎఫెక్తేడ్ బై ఎని థింగ్ అవుట్ సైడ్ ఇట్ ‘’.మన పురాణాలు కూడా దీనిని బాగానే వివరించాయి .వేద,ఉపనిషత్ ల ను అర్ధం చేసుకోవటానికే పురాణాలు తోడ్పడుతాయి సృష్టి కర్తలలో ఒకరైన శివుని గురించి పురాణం చెప్పింది .ఆయనవస్తుతహా ’’ అభవుడు ‘’అంటే పుట్టుక లేనివాడు లేక పుట్టని వాడు ఆయనకు చావులేదు కనుక ‘’మృత్యుంజయుడు ‘’.పుట్టనివాడికి చావు లేదు కదా .పుట్టుక ,నాశనం లేని దానికి ‘’స్వభావం ‘’(నేచర్ ) ఏమిటి ?ఎప్పుడూ ఉండటమే –అదే హాకింగ్ గారి మంత్రం –‘’ఇట్ వుడ్ జస్ట్ బి ‘’.
పేజి -139,పేరా-2
అందుకని మనంఅనుకొనే ఇమాజినరి టైం(ఊహా కాలం )నిజంగా ఎక్కువ ఆధార పడేదిగా కనిపిస్తోంది .మనం అనుకొనే వాస్తవం అనుకొన్న విశ్వాన్ని వివరించటానికిమనం సృష్టించుకొన్న అయిడియా అది .నేను మొదటి అధ్యాయం లో చెప్పినట్లు శాస్త్రీయ సిద్ధాంతం అనేది ఒక గణిత ప్రతిరూపమే (మోడల్ ).ఈ మోడల్ తో మన పరిశీలనలను వివరిస్తాం .ఇది మన మనసులలో మాత్రమె ఉంటుంది .కనుక వాస్తవ ,ఊహాత్మక కాలం ఏది అని ప్రశ్నించటం అర్ధ రహితం .కనుక అదే పనికొచ్చే వర్ణన చేయటానికి సహాయ పడే విషయం .
శాస్త్రి గారి కామెంట్ –సైంటిస్ట్ లు నిజాయితీగా ఆలోచించేవారు .వారు ఒకసారి సైన్స్ అనేది మనసు లేక మెదడు (మైండ్ )లోనే ఉంటుంది అంటారు .కనుక అది సత్యానికి బద్ధం కాదు .స్వతంత్రమైనది శాస్త్రమే అయిన పదాలు ,భాష మానవుడు తయారు చేసిందే .అవి సంఘటనలను మాత్రమె వర్ణించ గలవు .అవి కాలం నిజమైనదా ఊహా జనితమా అనేది చెప్పలేవు .కాలం భగవత్ సృష్టిలో మొదటిది కనుక మాటలు దైవాన్ని వర్ణించ లేవు .’’మాటలు మనసుతో కలిసి దేవుని సమీపానికి చేరి ,తిరి గోస్తాయి కాని దేవుని వర్ణించ లేవు ‘’ అని ఉపనిషద్వాక్యం .దీనికి సంబంధించిన శ్లోకం –
‘’యతో వాచో నివర్తం తే అప్రాప్య మనసా సహా ‘’.
పేజి -140,లో చివరి వాక్యం, 141పేజీ లో వాక్యాలు
సృష్టికి ఆరంభం ఉంది అనుకొంటే ,దాన్ని సృష్టి చేసిన వాడు ఒకరు ఉండాలి .కాని విశ్వం స్వీయ నియంత్రమైతే (సెల్ఫ్ కంటైండ్ ),సరిహద్దే లేక పొతే ,అంచు ఉండకపోతే ,దానికి ఆది అంతం ఉండదు .అది అలా ఉంటూనే ఉంటుంది .అప్పుడు సృష్టి కర్త కు స్థానం ఉండదు కదా .
శాస్త్రి గారి వ్యాఖ్యానం-ఉపనిషద్వేదాంతం ఈ సమస్యను సృష్టి కర్త ను సృష్టి తో గుర్తించి (ఐడెంటి ఫై )పరిష్కరించింది .అదే సెల్ఫ్ లేకఆత్మ.మనం ప్రపంచాన్ని చూస్తున్నా ప్రపంచం లో ఒకరం అయిన ,మనల్ని మనమే చూసు కొంటున్నామనం చూస్తున్నది ఆత్మనే .ఈ విషయం లో సైంటిస్ట్ హాకింగ్ ఒక అడుగు ముందుకు వేసి సృష్టి, సృష్టి కర్త ఒకరే అనేశాడు .అలా చెప్పి ఉండకపోతే సైన్సు ,,ఆధ్యాత్మికత వేరు వేరే అనేది రుజువు చేసినట్లు అయ్యది . ఆ సందేహం రాకుండా స్పష్టంగా చెప్ప్పాడు ధైర్యంగా .మతపరమైన అనుభవాలు సైంటిఫిక్ వాదాల జోలికి వెళ్ళ కుండా నిషేధానికి గురి అయ్యేవి .సాధారణంగా సైంటిస్ట్ లకు మత దృక్పధం ఉండదు .కాని నా ద్రుష్టి లో హాకింగ్ సైంటిస్ట్ దేవుడు ఉన్నాడని నమ్ముతాడు అని పిస్తుంది .ఆయన రాస్సిన ఈ పుస్తకం ఎక్కడ చెప్పినా భగవంతుడు ఉన్నాడు అన్న భావమే గోచరిస్తుంది .అది ‘’టేకెన్ ఫర్ గ్రా౦ టెడ్’’’’అనుకోవచ్చు మనం .అంటే మనం అనుకోన్నది ఆయనకు అంగీకారమే నని అర్ధం . తన నిజాయితీ అనుమానాన్ని ప్రశ్నించాడు .
భారతీయ తర్క శాస్త్రం కూడా దేవుడు ఉన్నాడనే అన్నది. కాని ఆయన ఉనికి ని రుజువు చేసే జోలికి పోలేదు. అదే తెలివైన పని
లాజిక్ అంటే తర్కం ‘’ఏ సంఘటన జరగాలన్నా నాలుగు ముఖ్య కారణాలు ఉంటాయని చెప్పింది .అవి -1-ఈశ్వరుడు 2-అదృష్ట౦ 3-దేశ౦ 4-కాలం .ఇందులో మొదటిదే దైవం .
సశేషం
2016 నూతన సంవత్సర శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2016-ఉయ్యూరు
.
