గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 73-జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత –సత్యవ్రత శాస్త్రి (1930 )

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం -3

73-జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత –సత్యవ్రత శాస్త్రి (1930 )

              ఇంతింతై

29-9-1930 న సంస్కృత మహా పండితుడు చారుదేవ శాస్త్రి కుమారుడు గా జన్మించిన  సత్యవ్రత శాస్త్రి తండ్రిని మించిన పాండిత్యం ఉన్నవాడు .వారణాసి వెళ్లి పండిట్ సుఖదేవ్ ఝా ,డా.సిద్దేశ్వర వర్మ ల వద్ద విద్య నేర్చాడు .పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతం లో బి. ఏ. ఆనర్స్ ఎం. ఏ. లను బెనారస్ హిందూ యూని వర్సిటి నుండి పి .హెచ్ .డి .పొందాడు .ఢిల్లీ యూని వర్సిటి లో సంస్కృత ఉపన్యాసకుడుగా చేరి హెడ్ గా  పండిట్ మన్మోహన  నాద దార్ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ గా  డీన్ గా  45 ఏళ్ళు పనిచేశాడు .తర్వాత పూరీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయ వైస్ చాన్సెలర్ గా సేవలందించాడు .బాంగ్ కాక్ లోని చూల లొంగు కారన్ ,సిల్పకారన్ యూని వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు ,నార్త్ ఈస్ట్ బుద్ధిష్ట్ యూని వర్సిటి ,ధాయ్ లాండ్ , జెర్మని  ,బెల్జియం లోని కేధలిక్ యూని వర్సిటి ,కెనడాలోని అల్బర్టా యూని వర్సిటి ,లకు కూడా విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .ధాయ్ లాండ్  ప్రిన్సెస్ మహా చక్రి సింధు కారన్ కు సంస్కృతం నేర్పాడు .

           మహా రచన

   శాస్త్రి   సంస్కృతం లో  3 మహా కావ్యాలు ,3 ఖండ కావ్యాలు ,1 ప్రబంధం ,ఒక పత్ర కావ్యం ,5 విశ్లేషణాత్మక గ్రంధాలు రాశాడు .అందులో రామకృతి మహాకావ్యం ,బృహత్తర భారతం ,శ్రీ బోధి సత్వ చరితం ,వైదిక వ్యాకరణం ,శర్మణ్యా దేశ సూత్ర౦ విభాతి ముఖ్యమైనవి .అనేక భాగాలుగా ‘’డిస్కవరీ ఆఫ్ సాంస్క్రిట్  ట్రెజర్స్ ‘’ఒక గొప్ప ఉద్గ్రంధం .ధాయ్ లాండ్  రామాయణం రాయల్ ధాయ్ ను రాజు అభ్యర్ధనపై సంస్కృతీకరించి శ్రీ రామ కృతి మహాకావ్యంగా రాశాడు .దీనికి ముందుమాట మహారాణి రాసింది .ధాయ్ లాండ్ లోని హిందూ దేవాలయాలు ,వాటిలోని సంస్కృత లిపి పై పరిశోధన చేశాడు .కాళిదాస రచనలపై గొప్ప వ్యాఖ్యానం రాశాడు .యోగ వాసిస్టం  కు వివరణ రాసి ప్రచురించాడు .ఈశాన్య ఆసియాలో సంస్కృత పదజాలం ,శ్రీరాముడు ల పై విస్తృత పరిశోధన చేశాడు .న్యు ఢిల్లీ లోని’’ జవహర్ లాల్ నెహ్రు స్పెషల్ సెంటర్ ఫర్ సాంస్క్రిట్ ‘’కు గౌరవ ప్రొఫెసర్ గా శాస్త్రి ఉన్నాడు .

 

                  అంతర్జాతీయ పురస్కార వైభవం

సత్య వ్రత శాస్త్రి కి రాయల్ నేపాల్ అకాడెమి గౌరవం ,బెల్జియం యూని వర్సిటి విశిష్టపతకం ,కెనడాలోని అట్టావా అంతర్జాతీయ ఫెలోషిప్ ,బాంగ్ కాక్ యూని వర్సిటి గౌరవ దాక్ట రేట్ ,ఇటలి లోని సివిల్ అకాడెమి అవార్డ్ ,కెనడా వారి కాళిదాస సమ్మాన్,ఇటలి లోని టోరినో వారి స్పెషల్ అవార్డ్, గోల్డెన్ ప్రైజ్ , ,ఇండొనీషియా ప్రభుత్వ అవార్డ్ ,ధాయ్ లాండ్  రాయల్ డెకరేషన్ ,రోమానియా ప్రభుత్వ ఎక్సెలెన్స్, అవుట్ స్టాండింగ్ టీచర్  అవార్డ్ లు ,, ఇటలి లోని అగ్రి గెంటో నుండి ఫెలోషిప్ ,డాక్టర్ ఆఫ్ ఆనర్ వంటివి లెక్కలేనన్ని అంతర్జాతీయ  అవార్డ్ లు లభించాయి .

                       జాతీయ పురస్కార హేల

   సాహిత్య అకాడెమీ పురస్కారం ,ఢిల్లీ లోని సాహిత్య కళా పరిషత్ గౌరవం ,సిఖ్ గురుద్వారా పురాస్కారం ,భారత రాష్ట్ర పతి పురస్కారం ,శిరోమణి సంస్కృత సాహిత్య కార్ ,విశిష్ట సాహిత్య పురస్కార ,గీతా రాణా పురస్కార ,సాంస్క్రిట్ సేవా సమ్మాన్ ,సాంస్క్రిట్ సాహిత్య పురస్కార ,ఇందిరా బెహరే గోల్డ్ మెడల్ ,పండిత జగన్నాధ పద్య రచన పురస్కార్,కాళిదాస పురస్కార ,పండిట్ క్షమా రావు పురస్కార ,వాగ్విభూషణ బిరుదు ,దేవ వాణీ రత్న సమ్మాన్ ,రాజస్థాన్ వారి అఖిలభారత సంస్కృత తొలి పురస్కార ,వాచస్పతి పురస్కార ,మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వ పురస్కారాలు, మహా మహోపాధ్యాయ బిరుదు ,జ్ఞాన పీఠ పురస్కారం ,పద్మ భూషణ్ వంటి జాతీయ పురస్కారాలు  76 వరకు అందుకొన్న సాహితీ మూర్తి శ్రీ సత్యవ్రత శాస్త్రి .ఆయన్ను సన్మానించి గౌరవించని సాహిత్య సంస్థ ,ప్రభుత్వం లేదు అంటే అతిశయోక్తి కాదు .

                    సాహిత్య సరస్వతి

పైన చెప్పిన గ్రంధాలే కాక హ్యూమన్ వాల్యూస్ డెఫినిషన్స్,సంస్కృత రైటింగ్స్ అండ్ యూరోపియన్ స్కాలర్స్ ,వర్డ్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ సాంస్క్రిట్ వంటి 15 ఎకడమిక్ రచనలు చేశాడు .’

  బృహత్ భారతం శ్రీ బోధి సత్వ చరితం ,ఇందిరా గాంధి చరితం ,ధాయ్ దేశ విలాసం , న్యు ఎక్స్ పరి మెంట్స్ ఇన్ కాళిదాస ,చాణక్య నీతి ,భవి తవ్యనం ద్వారానీ భవంతి సర్వత్ర ‘’అనే స్వీయ చరిత్ర మున్నగు సాహిత్య పరమైన 12 రచనలు చేశాడు .

Inline image 1

ప్రపంచ కవితా దినోత్సవ శుభా కాంక్షలతో

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 72 –మిలీనియం సంస్కృత పురస్కార గ్రహీత –పద్మశ్రీ దేవి దత్తశర్మ (1924 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

72 –మిలీనియం సంస్కృత పురస్కార గ్రహీత –పద్మశ్రీ దేవి దత్తశర్మ (1924 )

డోగ్రీ సాహిత్యాన్నీ హిమాలయ పర్వత ప్రాత సాహిత్యాన్ని పెంచి పోషించిన సంస్కృత పండితుడు కవి దేవీ దత్త శర్మ 23-10-1924 న ఉత్తరాఖండ్ లోని కుమాన్ జిల్లాలో జన్మించాడు .ఆగ్రా యూని వర్సిటి నుండి ఎం ఏ డిగ్రీపొంది ,బనారస్ ,పంజాబ్ యూని వర్సిటీల నుంచి రెండు డాక్టోరల్ డిగ్రీలు సాధించాడు .పంజాబ్ యూని వర్సిటి నుండి డి.లిట్ అందుకొన్నాడు .28 గ్రంధాలు ,200 పరిశోధనా పత్రాలు ,రచించాడు .56 రిసెర్చ్ గ్రంధాలలు  వారి విద్వత్తును చాటుతాయి .ఆయన 8 భాగాలుగా రాసిన ‘’సోషియో కల్చర్ ఆఫ్ ఉత్తరాఖండ్ ‘’గొప్ప ప్రాచుర్యం పొందింది .మూడు భాగాల’’ జ్ఞాన కోశం ‘’ సంతరించాడు .

చండీగర్ లోని పంజాబ్ యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా దీర్ఘకాలం పని చేసిన అనుభవం దేవీ దత్త శర్మ ది .

ఆయన విద్వత్తు కు తగిన గౌరవ పురస్కారాలు లభించాయి .గర్వాల్ యూని వర్సిటి ‘’జీవిత సాఫల్య పురస్కారం ‘’,న్యు ఢిల్లీ లోని గ్యాన్ కళ్యాణ్ దత్వ్య న్యాస్ సంస్థ ‘’అఖిలభారత విద్వత్ సమ్మాన్ ‘’ను ,సంపూర్ణానంద  సంస్కృత విశ్వ విద్యాలయం ‘’సంస్కృత విద్వత్ సమ్మాన్ ‘’,కేంబ్రిడ్జి లోని ఇంటర్నేషనల్ బయాగ్రాఫికల్ సెంటర్ ‘’2000 సంవత్సరం లో ‘’మిలీనియం అవార్డ్ ‘’ను ,అదే ఏడాది  భారత ప్రభుత్వం ‘’మిలీనియం సంస్కృత పురస్కారం ‘’,2001 లోభారత రాష్ట్ర పతి  గౌరవ సర్టిఫికేట్ ,2011 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసి సత్కరించాయి .

సశేషం

Inline image 1

అంతర్జాతీయ కవితా దినోత్సవ శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 71-చాణక్యుని అర్ధ శాస్త్రం కనుగొని ముద్రించిన –రుద్ర పట్నశ్యామ శాస్త్రి (1868 -1944)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

71-చాణక్యుని అర్ధ శాస్త్రం కనుగొని ముద్రించిన –రుద్ర పట్నశ్యామ శాస్త్రి (1868 -1944)

1868 లో కర్నాటక రాష్ట్రం కావేరీ తీరాన రుద్రపట్నం గ్రామం లో  శ్యామ శాస్త్రి జన్మించాడు  ,సాంకేతి బ్రాహ్మణుడు .పుట్టిన చోటే చదివి మైసూర్ వెళ్లి సంస్కృత పాఠశాలలో చదివి సంస్కృత విద్వత్ –డిగ్రీ ఉత్తమ శ్రేణి లో పొందాడు .ఆయన ప్రతిభను గుర్తించిన మద్రాస్ యూని వర్సిటి సంస్కృతం లో బి ఏ డిగ్రీ ఇచ్చింది .మైసూర్ రాజ్య దివాన్ శేషాద్రి అయ్యర్ ప్రోద్బలం తో  శాస్త్రి ప్రభుత్వ ఓరియెంటల్ లైబ్రరి లో లైబ్రేరియన్ గా చేరాడు .ఇక్కడపని చేస్తూ వేద ,వేదాంగాలను  క్లాసికల్ సంస్కృతాన్ని,ప్రాకృత ,ఇంగ్లీష్ ,కన్నడ ,జర్మన్ ,ఫ్రెంచ్ భాషలను  స్వయంగా అభ్యసించి గొప్ప వాడయ్యాడు .

1891 లో  ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి  ట్యూట్’’  మైసూర్ ఓరియెంటల్ లైబ్రరి ‘’గామారింది .అందులో వేలాది సంస్కృత  తాళ పత్రా గ్రంధాలున్నాయి .నిత్యం వీటిని పరీక్షిస్తూ వీటిని కేటలాగ్ చేస్తూ వాటిలోని విషయాలను సేకరించాడు .  ఆ కుప్ప లో 1905 లో అర్ధ శాస్త్రం ఆయన కంట బడింది . మూడేళ్ళు కస్టపడి శిధిలమౌతున్న దానిని ఓపికగా కాగితాలపై రాసి తన సంపాదకత్వం లో ముద్రించి లోకానికి మొట్ట మొదటి సారిగా కౌటిల్యుని అర్ధ శాస్త్రాన్ని తెలియ బరచాడు .దానిని తానే ఇంగ్లీష్ లోకి అనువదించి 1915 లో ప్రచురించాడు .ఇక్కడ అర్ధ శాస్త్రం మూల గ్రంధ రూపం లో లభిస్తే ,దేశం లోని ఇతర ప్రాంతాలలో దాని నకళ్ళు దొరికాయి .దీనిని తంజావూర్ లోని ఒక సంస్కృత పండితుడు ఈ లైబ్రరీకి ఎప్పుడో ఇచ్చాడట .ఇప్పటి దాకా అర్ధ శాస్త్రం దండి ,బాణుడు ,విష్ణు శర్మ ,మల్లినాద సూరి మెగస్తనీస్ మొదలైన వారు వారి రచనలలో ఉదాహరించినదే అందరికి  తెలుసు .అసలు అర్ధ శాస్త్రం గ్రంధ రూపం లో శ్యామ శాస్త్రి ప్రచురించి మహోపకారం చేశాడు .ఇది ఒక చారిత్రాత్మక సన్ని  వేశంగా నిలిచింది .తరువాతనే ఫ్రెంచ్ జర్మన్ మొదలైన భాషలలోకి అనువాదం పొందింది అర్ధ శాస్త్రం .

శాస్త్రి మైసూర్ ఓరియెంటల్ లైబ్రరీలో 1912 వరకు పని చేసి తర్వాత బెంగుళూరు లోని శ్రీ చామ రాజేంద్ర సంస్కృత పాఠ శాల ప్రిన్సిపాల్ అయి 1915 వరకు ఉన్నాడు .1918 లో మళ్ళీ పాత స్థానం చేరి ,క్యురేటర్ అయి ,మైసూర్ లోని ఆర్కిలాజికల్ రిసేర్చేస్ కు డైరెక్టర్ అయి 1929 వరకు రిటైర్ అయ్యేదాకా పని చేశాడు .అర్ధ శాస్త్రాన్ని కనుక్కోవటం తో  ఆగి పోకుండా శ్యామ శాస్త్రి వేద కాలం ,వేద ఖగోళం మొదలైన విలువైన విషయాలపై పరిశోధన చేశాడు .క్రీ పూ.8 శతాబ్దానికి చెందిన’’వేదాంగ జ్యోతిషం ‘’,గ్రహణాలపై ‘’ద్రప్స’’ ,ఎక్లిప్స్ కల్ట్ ఇన్ వేదాస్ కొరాన్ అండ్ బైబిల్ అనే ద్రప్స కు అనుబంధ గ్రంధం ,వేదకాలం పై ‘’గవ౦ అయన ‘’,ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ పాలిటి ,ది ఆరిజినల్ ఆఫ్ దేవ నాగరి ఆల్ఫబెట్స్’’అనే గొప్ప రచనలు చేశాడు శ్యామ శాస్త్రి .వీటిని దేశీయ ,విదేశీయ సంస్కృత విద్వాంసులు అందరూమహోన్నత రచనలుగా కీర్తించారు .భారత దేశం లో ఆశుతోష్ ముఖర్జీ ,రవీ౦ద్ర నాథ టాగూర్ బాగా మెచ్చారు .1927 లో శాస్త్రి గాంధీ జీని నంది హిల్స్ లో కలిశాడు .శాస్త్రి పరిశోధనలవలన మైసూర్ ఓరియెంటల్ లైబ్రరీకి అంతర్జాతీయ గుర్తింపు గౌరవం దక్కాయి .

ఇండాలజిస్ట్ లు ,ఓరిఎంటలిస్ట్ లు అయిన  జూలియస్ జాలీ ,మొరిజ్ విత్నిజ్ ,ఎఫ్ డబ్ల్యు ధామస్ ,పాల్ పెల్లి  యాట్ ,ఆర్ధర్ బెర్రిన్ గ్దేల్ కీత్ ,స్టెయిన్ కొ నోవ్ మొదలైన వారు శాస్త్రి కృషికి నీరాజనాలు అందించారు .జే. ఎం .ఫ్లీట్ ‘’భారత దేశ సామాన్య చరిత్రను అందజేసిన౦దుకు శ్యామ శాస్త్రి కి  మనం ఎల్లప్పుడు రుణ పడి ఉండాలి ‘’అన్నాడు .వాషింగ్టన్ డిసిలోని ఓరియంటల్ యూని వర్సిటి 1919 లోను ,1921 లో కలకత్తా యూని వర్సిటి శ్యామ శాస్త్రికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి .రాయల్ ఏషియాటిక్ ఫెలో ను చేసి గౌరవించారు .కాంప్ బెల్ మెమోరియల్ గోల్డ్ మెడల్ ప్రదానం చేసి సత్కరించారు .

శ్యామ శాస్త్రి కృషికి ‘’అర్ధ శాస్త్ర విశారద ‘’,బిరుదును మైసూర్ మహా రాజా ఇస్తే ,భారత ప్రభుత్వం ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదును ,వారణాసి సంస్కృత మండల్ ‘’విద్యాలంకార ,పండిత రాజ ‘’బిరుదులూ ప్రదానం చేసి ఆయన కీర్తిని పెంచాయి .ఆయన అంతర్జాతీయ కీర్తి కి ఉదాహరణ గా ఒక ఉదంతాన్ని అందరూ చెప్పుకొంటారు –ఒక సారి మైసూర్ మహా రాజు నాలుగవ జయ చామరాజ ఒడియార్ జర్మనీ సందర్శించినప్పుడు ఒక యూని వర్సిటి వైస్ చాన్సెలర్ ‘’మీరు శ్యామ శాస్త్రి గారి మైసూర్ నుంచి వచ్చారా “’అని ఆశ్చర్యంగా అడిగాడట .రాజు మైసూర్ కు తిరిగి వచ్చి శ్యామ శాస్త్రిని న భూతో గా సత్కరించి ‘’మేము మైసూర్ లో మహా రాజులం మీరు మా పౌరులు .కాని జర్మనీ లో మీరు గురువులు ,మీ వలననే మేము ,మా ప్రజలు గౌరవం, కీర్తి  పొందాము ‘’అని  అత్యంత  వినయంగా గౌరవం గా అన్నారట .

శ్యామ శాస్త్రి తర్వాత కూడా ఇండాలజీ సమస్యలపై పరిశోధనలు కొన సాగించి క్యురేటర్ అయ్యాడు .మైసూర్ రాజ్య ఆర్కి యాలజి డైరెక్టర్ గా ఉంటూ ఎన్నెన్నో శిలా ఫలకాలు, రాగి రేకులుకనిపెట్టాడు . మైసూర్ చాముండి పురం లోనితన స్వగృహానికి  ఆశుతోష్ ముఖర్జీ గౌరవార్ధం ‘’ఆశుతోష్ ‘’అని  నామ కారణం చేశాడు శ్యామ శాస్త్రి .1944 లో 76 వ ఏట అర్ధ శాస్త్రాన్ని  కనుగొని లోకానికి అందించిన  రుద్రపట్నం శ్యామ శాస్త్రి మహా రుద్ర సన్నిధానానికి చేరుకున్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 దినచర్య (డైరీ )ను సంస్కృతం లోనే రాసుకొన్న’’ యాత్రా సాహిత్య పిత ‘’-రాహుల్ సాంకృత్యాయన్ (1893 -1963 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

దినచర్య (డైరీ )ను సంస్కృతం లోనే రాసుకొన్న’’ యాత్రా సాహిత్య పిత ‘’-రాహుల్ సాంకృత్యాయన్ (1893 -1963 )

             కేదార్ నాథ పాండే –రాహుల్ సాంకృత్యాయన్

మహా పండిత  రాహుల్ సాంకృత్యాయన్ అంటే నిరంతర యాత్రాశీలి ,వ్యాసకర్త యాత్రకు సాహిత్య గౌరవం కలిగించిన  బహుభాషా వేత్త .9-4-1893 న తూర్పు ఉత్తర ప్రదేశ్ లోఅజాం ఘర్ జిల్లాలో   కేదార్ నాథ్ పాండే గా జన్మించాడు .స్థానికంగా విద్య ప్రారంభించినా  తర్వాత సంస్కృత హిందీ ఇంగ్లిష్ ,పాళీ భోజ్ పూరి ,ఉర్దూ ,పర్షియన్ అరబిక్ ,తమిళం కన్నడ ,టిబెటన్, సింహళీస్, ఫ్రెంచ్ ,రష్యన్ భాషలు నేర్చి రాయగల సమర్ధత సాధించిన బహు భాషా వేత్త .ప్రారంభం లో ఆర్య సమాజం దయానంద సరస్వతి బోధనలపై ఆకర్షణ ఉండేది .తర్వాత బౌద్ధం అతనిని పూర్తిగా మార్చేసింది .దేవునిపై నమ్మకం లేకపోయినా పునర్జన్మ ను విశ్వసించాడు .తర్వాత మార్క్సిస్ట్ సోషలిజం మోజులో పడి దాన్నీ వదిలేశాడు .ఆయన రాసిన ‘’దర్శన్ – దిగ్దర్శన్ ‘’గ్రంథం ప్రపంచ తత్వ శాస్త్రాన్ని కూలంకషం గా వివరించింది .ఇందులో రెండవ భాగం –‘’ధర్మ కృతి ప్రమాణ వార్తికం’’ కు అంకితమై రాసినట్లు కనిపిస్తుంది .దీని మూలాన్ని టిబెట్ ఆ భాషలో ఉంటే సేకరించాడు ..

                        విస్తృత యాత్రికుడు

         విస్తృత నిరంతర యాత్రికుడైన సాంకృత్యాయన్ లడక్ ,కిన్ననూర్, కాశ్మీర్ ,నేపాల్ టిబెట్ ,శ్రీలంక ఇరాన్ ,చైనా రష్యా లను సందర్శించాడు .చాలాకాలం బీహార్ లో శరన్ జిల్లా పరసాగడ్ లో ఉన్నాడు .ఈ గ్రామ ప్రవేశ ద్వారానికి’’ రాహుల్ గేట్ ‘’అని పేరు పెట్టారు .టిబెట్ కు బౌద్ధ సన్యాసిగా వెళ్ళాడు. చాలా సార్లు టిబెట్ వెళ్లి విలువైన పాళీ ,సంస్కృత వ్రాత రాతులను, చిత్రాలను సేకరించి తెచ్చుకొన్నాడు .ఇవి విక్రమశిల ,నలందా విశ్వ విద్యాలయాలకు చెందినవి .వీటిని ఇండియాకు   23 కంచర గాడిద లపై తెచ్చి పాట్నా మ్యూజియం లో భద్ర పరచాడు .

                        బహుభాషా గ్రంధ రచన

అనేక భాషలలో నిష్ణాతుడైన రాహుల్ గొప్ప సృజన శీలి .20 లలో రచన ప్రారంభించి దాదాపు 100 పుస్తకాలు అనేక విషయాలపై-సోషియాలజీ ,హిస్టరీ ఫిలాసఫీ ,బౌద్ధం టిబెటాలజీ ,లేక్సికోగ్రఫీ  వ్యాకరణం ,సైన్స్ జానపదం  నాటకం వ్యాసం రాజకీయం మొదలైన వాటిపై  రాశాడు . ప్రాకృతం  లోని ‘’మైఝిమ నికాయ్ ‘’ను హిందీలోకి అనువదించాడు .రాహుల్ ప్రసిద్ధ రచన హిందీలో రాసిన ‘’ఓల్గా సే గంగ ‘’.చార్తిత్రాత్మక ఫిక్షన్ .ఇందులో క్రీ పూ 6000 కాలం నుండి 1942వరకు గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం వరకు చరిత్ర ఉంది .అన్నిభాషలలోకి అనువాదం పొంది ప్రపంచ ప్రసిద్ధమైంది .ఆయన రాసిన పుస్తకాలు 10 కి పైగా బెంగాలీ లోకి అనువాదం పొందాయి .చరిత్ర కారుడు  కాశీ  ప్రసాద్ జైస్వాల్ సాంకృత్యాయన్ ను గౌతమ బుద్దునితో సమానం అన్నాడు .స్కూలు విద్య లేకపోయినా అన్నీ స్వయంగా సాధించాడు. సోవియెట్ రష్యా వెళ్లి లెనిన్ గ్రాడ్ యూని వర్సిటి లో  ఇండాలజీ ప్రొఫెసర్ గా 1937 -38 వరకు మళ్ళీ 1947-48వరకు పని చేశాడు .

                            వివాహం వగైరా

బాల్యం లోనే రాహుల్ వివాహం ‘’సంతోషి’’ తో జరిగింది . ఆతర్వాత ఆ బాల వధువు ఏమైందో ఆయనకు తెలియదు .వయసు 40 లలో రెండో సారి రష్యా వెళ్ళినప్పుడు సంస్కృత, ఫ్రెంచ్, ఇంగ్లీష్ ,రష్యన్ భాషలలో ప్రవీణురాలైన మంగోలియన్ స్కాలర్ ‘’లోలా’’ తో సన్నిహితం గా ఉన్నట్లు ఆయన డైరీ వలన తెలుస్తోంది .టిబెటన్ –సంస్కృత నిఘంటు నిర్మాణానికి ఆమె ఆయనకు తోడ్పడింది .ఇద్దరూ పెళ్ళిచేసుకొని ‘’ఇగార్’’ అనే కొడుకుకు జన్మనిచ్చారు .ఆయనతో వాళ్ళిద్దరూ ఇండియా రావటానికి స్టాలిన్ రష్యా  అనుమతి నివ్వ లేదు  .తర్వాత కమల అనే ఇండియన్ నేపాలీ ని పెళ్లి చేసుకొని జయ ,జేత అనే అమ్మాయిని అబ్బాయిని సంతానంగా పొందాడు .జేత నార్త్ బెంగాల్ యూని వర్సిటిలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. జయ డెహ్రాడూన్ లో ఉండేది .

                  సుదీర్ఘ యాత్ర

 రాహుల్ శ్రీలంక యూని వర్సిటి లో పని చేస్తుండగా విఅరీతమైన మాదుమేహ వ్యాధి,  అతి రక్తపు పోటు  వలన  గుండెపోటు వచ్చి డార్జిలింగ్ లో 1963 ఏప్రిల్ 14 న 70  వ ఏట  సుదీర్ఘ యాత్ర లో సుదూర తీరాలకు చేరుకొన్నాడు .ఆయన పేర అవార్డ్ లను అందజేస్తున్నారు .

                 సాంకృత్యాయన్ సాహిత్య సర్వస్వం

హిందీలో దివోదాస్ ,మధుర స్వప్న ,విస్మృతి యాత్ర మొదలైన 8 నవలలు ,వోల్గా సే గంగ ,బహురంగి మధుపురి వంటి 4 కథా సంపుటులు ,3 భాగాలుగా ‘’మేరీ జీవన్ యాత్ర ‘’అనే స్వీయ చరిత్ర ,సర్దార్ ప్రిద్వి సింగ్ ,బచ్ పన్ కి స్మ్రుతి యాన్ ,కప్తాన్ లాల్ ,మహామానవ్ బుద్ధ , స్టాలిన్ ,లెనిన్ ,మొదలైన 16 జీవిత చరిత్రలు ,మాన్సిక్ గులామీ ,రుగ్వేదిక్ ఆర్య ,ఘుమక్కార్ శాస్స్త్ర ,దర్శన్ –దిగ్దర్షన్ ,మధ్య ఆసియా కా ఇతిహాస్ సామ్యవాద్ హి కోన్ వంటి ఇతర రచనలు ,భోజ్పురి భాషలో 2 ,నేపాలీ భాషలో 1 ,టిబెటన్ భాషలో 7 పుస్తకాలు రచించాడు .

  బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేసినందుకు మూడు సార్లు అరెస్ట్ అయిన జాతీయ వాది రాహుల్  .ఆయన విజ్ఞానం  మహా పండితుని విజ్ఞానం .1963 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం అందజేసి సన్మానించింది .తన దిన చర్య ను డైరీలో నిత్యం సంస్కృతం లోనే రాసుకోనేవాడు .దీని ఆధారంగానే అనేక రచనలు చేయగలిగాడు సాంకృత్యాయన్ .

Inline image 1

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-3-17 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

69-హేమచంద్రుని ప్రమాణ మీమాంసకు సంపాదకత్వం వహించిన జైన విద్యావేత్త –సుఖలాల్ సంఘ్వి(( 18 80  -1978 )

పండిట్ సుఖలాల్జీ అని అందరూ గౌరవంగా పిలిచే సుఖలాల్ సంఘ్వి జైన విద్యావేత్త ఫిలాసఫర్ .జైనం లోని స్తనక్ వాసి సంప్రదాయం వాడు .చిన్నప్పుడే విపరీతంగా మసూచికం బారి పడి నెమ్మదిగా కోలుకొని జైన గ్రంధాలలోని తర్క గ్రంధాలు చదివి బెనారస్ హిందూ యూని వర్సిటి లో ప్రొఫెసర్ అయ్యాడు .జైన మతాన్ని అద్భుతం గా వివరించి చెప్పగల సామర్ధ్యం సంఘ్వికి బాగా ఉన్నదని పాల్ దండాస్ అన్నాడు .ప్రసిద్ధ జైన విద్యా వేత్త పద్మనాభ జైన్ కు మార్గ దర్శి .సాహిత్య అకాడెమి అవార్డ్ ,పద్మ భూషణ్ పురస్కారం అందుకొన్నాడు .

గుజరాత్ లోని సౌరాస్ట్రలో లిమ్డి గ్రామం లో 8-12-1880  న జన్మించాడు .వణిక్ కులానికి చెందినవాడు .తండ్రి తల్సి సంఘ్వి.తల్లిమణిబెన్.నాలుగో ఏట తల్లి చనిపోయింది .దూరపు బంధువుల పెంపకం లో పెరిగాడు .జైన గురువుల బోధలు శ్రద్ధగా వినేవాడు .బెనారస్ లో యశో విజయ జైన్ సంస్కృత పాఠ శాలలో చేరి మూడేళ్ళలో సిద్ధ హేమ వ్యాకరణం ,తర్క సంగ్రహ ,ముక్తావళి ,వ్యాప్తి చంద్రిక లను అనేక వ్యాఖ్యానాలతో సహా చదివాడు .రఘువంశం ,మేఘ సందేశం ,నైషధీయాలను ఆమూలాగ్రం చదివేశాడు .అలంకార శాస్త్రాలు కోశాల ను అధ్యయనం చేసి సాధించాడు .1911 లో మిధిల, కాశీ లకు వెళ్లి సాహిత్యం ,ఫిలాసఫీ నేర్చాడు .ఆగ్రా వెళ్లి ‘’పంచ ప్రతిక్రమణ ‘’అనే దేవేంద్ర సూరి నాలుగు కర్మ గ్రంధాలలో మొదటి దానిని తన సంపాదకత్వం లో వెలుగు లోకి తెచ్చాడు .హరి భద్ర సూరి రాసిన యశో దర్శన ,యోగ వి౦శిక లను కూడా ప్రచురించాడు .న్యాయా చార్య పరీక్ష పాసై జైన పాఠశాలలో బోధించి ముని జిన్ విజయ ,ముని లలితా విజయ ,ముని పుణ్య విజయలకు గురువై బోధించాడు .

1922 లో గుజరాత్ విద్యా పీఠంలోని   పురాతత్వ మందిర్ లో భారతీయ తత్వ శాస్త్రం బోధించాడు .సిద్ధ సేన దివాకరుని 5 భాగాల సన్మతి తర్క కు సంపాదకత్వం వహించి ముద్రించాడు .1933 నుంచి 10 ఏళ్ళు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో జైన ఫిలాసఫీ ప్రొఫెసర్ గా ఉన్నాడు .సంస్కృత హిందీ గుజరాతీ భాషలలోని విలువైన గ్రంధాలకు అనువాదాలకు ఎన్నిటికొ ఎడిటర్ గా ఉన్నాడు. తత్వార్ధ సూత్రా ,న్యాయావతార లను గుజరాతీ భాషలోకి అనువాదం చేశాడు .హేమ చంద్ర సూరి రచన ప్రమాణ మీమాంస కు సంపాదకుడుగా ఉన్నాడు. జయ రుషి రాసిన తతావప్లవ  ను వెలుగులోకి తెచ్చి గొప్ప కీర్తి పొందాడు .ఇది చార్వాకం పై ప్రసిద్ధ గ్రంధం .బౌద్ధ తత్త్వం పై కొత్త వెలుగులు ప్రసరింప జేశాడు .1944 లో రిటైరై  భారతీయ విద్యా భవన్ లో చేరి జైనముని ఆచార్య జినవిజయాజి వద్ద పని చేశాడు .1957 లో బరోడా లోని ఎం .ఎస్ .యూని వర్సిటి ఆహ్వానం పై భారతీయ తత్వ శాస్త్రం పై 5 గొప్ప ఉపన్యాసాలు చేశాడు .ఇవి గుజరాతీ ,హిందీ ఇంగ్లీష్ లలో  ప్రచురింపబడ్డాయి . ఆత్మ –పరమాత్మ ,సాధన ల పై ఆయన గుజరాత్ విద్యా సభలో చేసిన  ప్రసంగాలను బాంబే యూని వర్సిటి ‘’ఆధ్యాత్మ విచారణ ‘’పేర ముద్రించింది .

నాధూరాం ప్రేమి ప్రభావం ఈయనపై ఎక్కువ దిగంబర జైనులతో కూడా చాలాస్నేహం గా ఉండేవాడు .జైనం బాగా అర్ధం కావాలంటే పాళీ భాష బాగా నేర్వాలి అనేవాడు .ఎందరో యువకులను మార్గ దర్శనం చేశాడు ఆయన అశేష శేముషి అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈయన  విద్వత్తుకు తగిన బిరుదులూ పురస్కారాలు లభించాయి .విజయ ధర్మ సూరి జైన్ సాహిత్య స్వర్ణపతకం ,మద్రాస్ యూని వర్సిటి డి.లిట్,1958 లో కేంద్ర సాహిత్య  అకాడెమి  పురస్కారం ,1961 లో కేంద్ర ప్రభుత్వం సంస్కృత సేవకు యోగ్యతా పత్రం ,1974 లో పద్మ భూషణ్ అవార్డ్ ,1975 లో బీహార్ నవ నలంద విహార్ నుండి విద్యా వారిధి బిరుదు పొందారు. డా సర్వేపల్లి రాదా కృష్ణన్ సంఘ్వి ని జ్ఞాన యజ్ఞం చేస్తున్న మహానుభావుడు అని అభివర్ణించారు .97 వ ఏట 2-3-1978 న పండిట్ సుఖలాల్జి సంఘ్వి మరణించాడు .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-17 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ట్రిప్ చేజెర్ల -2

ట్రిప్ చేజెర్ల -2

—                54 ఏళ్ళ క్రితపు స్నేహితులు   బాబాయ్,అబ్బాయ్ ల సందడే సందడి

1962- 63లో రాజమండ్రి లో నా బి ఎడ్  ట్రెయినింగ్ మిత్రులు శ్రీ వేదాంతం కృష్ణ మూర్తి శ్రీ వారణాసి సుబ్బయ్య శర్మ. ఇద్దర్నీ కలిపి మళ్ళీ చూడటానికి 54 ఏళ్ళు పట్టింది . వాళ్ళిద్దరూ నన్ను’’ బాబాయ్’’ అనేవాళ్ళు నేను ‘’అబ్బాయ్ ‘’అనే వాడిని .అదీ మా స్నేహ బాంధవ్యం . కిస్టాయ్కి  అప్పటికే పెళ్లి అయింది .1964 లో నా పెళ్ళికి సుబ్బయ్య వచ్చాడు .తర్వాత అతని పెళ్లి మన ఘంటసాల లో జరిగితే నేను వెళ్లాను .తర్వాత ముగ్గురం జిల్లా పరిషత్ సెలెక్షన్ లలో కలిశాం .నాకు గుంటూరు జిల్లాలో రెంట చింతల అనే ఎండలు రికార్డ్ గా ఉండే ఊర్లో పోస్టింగ్ ఇస్తే , సుబ్బయ్యను కృష్ణా పరిషత్ లో ముసునూరు ,కృష్ణ మూర్తికి వత్సవాయి ఇచ్చారు .వాళ్ళూ చేరలేదు నేనూ చేరలేదు. అప్పటికే నేను కృష్ణా లోమోపి దేవి లో ఉద్యోగం చేస్తున్నాను .కృష్ణ లెక్కల వాడు .సుబ్బు బయాలజీ వాడు .కృష్ణ గుంటూరు జిల్లాపరిషత్ లో హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయితే ,సుబ్బాయ్ ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాడు .కృష్ణ మూర్తి నేను 1963 నుండి కనీసం పదేళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపు కొనే వాళ్ళం .ఇన్లాండ్ కవర్ లో ఒక్క మిల్లీ మీటర్ కూడా ఖాళీ లేకుండా రాసుకునేవాళ్ళం .ఆ తర్వాత ఒక సారి చందోలు వెళ్లి కిస్టాయ్ ఇంట్లో ఒక రోజు ఉండి ,వాళ్ళమ్మ గారి ఆతిధ్యం కూడా పొంది ,ఖాజీపాలెం  సుబ్బాయ్  ని ఇద్దరం కలిసిచూసి అక్కడి నుంచి నేను రేపల్లె వెళ్ళి మా రాయ ప్రోలు శివ రామ దీక్షితులు బాబాయి వాళ్ళింటికి వెళ్లి చూసి వచ్చాను .బాబాయ్ ‘’ఒరే నీ జీతం ఎంత ?’’అని అడిగితె ‘’145 ‘రూపాయలు ‘’అని చెబితే బోల్డు ఆశ్చర్య పోయి ‘’మేస్టర్లకు అంత జీతమిస్తారా “’అని అడిగితే అవాక్కయ్యా .సుమారు 20 ఏళ్ళ క్రితమ 1997 లో నేను అడ్డాడలో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు కిస్టాయ్  ఒక సారి పామర్రు బస్ స్టాండ్ లో కనిపించాడు .ఒకటి రెండు ఉత్తరాలు  రాశా .జవాబు లేకపోతే  వదిలేశా .సుబ్బయ్య జాడ మళ్ళీ లేదు .2016 కార్తీక మాసం లో శివాలయం లో కొత్త బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యం లో జరిగిన కార్తీక వనభోజనాలలో సుబ్బయ్య అల్లుడి  తమ్ముడు ఉయ్యూరులో రాయప్రోలు ముక్కోటి శాస్త్రి అల్లుడు పలకరించి సుబ్బయ్యగారు మిమ్మల్ని అడగమన్నారు అంటే  ఎలా అని ఆరాతీసి ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్ ద్వారా సుబ్బాయ్ కి ఫోన్ చేసి కిస్టాయ్ ఫోన్ నంబర్ తీసుకొని మళ్ళీ’’ టాకటం ‘’ మొదలు పెట్టాం .సరసభారతి పుస్తకాలు కార్యక్రమాల ఆహ్వానాలు పంపుతూనే ఉన్నా .సుబ్బయ్య భార్య తో సహానిరుడు  జనవరి 25 న జరిగిన కొలాచల సీతారామయ్యగారి పుస్తకావిష్కరణ కు  వచ్చాడు  .ఇన్నేళ్ళకు కలుసుకొన్నందుకు అందరం ఎంతో సంతోషించాం .వేదికపైకి ఆహ్వానించి మాస్నేహం అందరికి చెప్పి శాలువా కప్పి జ్ఞాపిక అద జేశా .భోజనాల తర్వాత  ఇంటికి దంపతులు వచ్చారు .ఇద్దరికీ బట్టలు పెట్టాం. వాళ్ళూ మాకు పెట్టారు .మళ్ళీ ఇన్నేళ్ళకు ఇన్నాళ్ళకు ముగ్గురం దంపత్యుక్తంగా కలుసుకొనే మహా భాగ్యం కలిగింది .

పొన్నూరు నుంచి సరాసరి చందోలు వచ్చాం . శ్రీ చెన్న కేశవ స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న కృష్ణ మూర్తి ఇంటికి వెళ్లాం .దంపతులు  ఎంతో  సంతోషించారు .పది రోజులక్రితమే  ఇలా వస్తున్నట్లు ఫోన్ లో చెప్పా .టిఫిన్ కాఫీలు అయ్యాక కిస్టాయ్ తమ దేవాలయం లోమా సమక్షం లో  మా పేర పూజ చేసి ప్రసాదం ఇచ్చాడు .మా ఇద్దరికీ నూతన వస్త్రాలు  శాలువా అందజేశాడు .మేమూ ఆ దంపతులకు అలాగే సత్కారం చేసి దబ్బ కాయ ఇచ్చాం . కిస్టాయ్ సరసభారతికి, శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారలకు 2,1 1 6 రూపాయలు అంద జేశాడు .అక్కడే ఎదురుగా ఉన్న శ్రీ లింగోద్భవ దేవాలయం సందర్శించాం .ఈ స్వామి మీదనే శ్రీతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి దౌహిత్రులుశ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు 8 వ ఏట సంస్కృతం లో లింగోద్భవ వృత్తమాలిక రాసి తమ ప్రతిభను చూపారు .స్వామి ముందు మొదటి సారి అష్టావధానం చేశారాట.

చందోలు అనగానే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు గుర్తుకు వస్తారు. వారు నడయాడిన పవిత్ర స్థలం చూశాం .వారిని కంచి పరమాచార్యులవారితో కలిసి ఉయ్యూరు లో 1969 లో చూసిన జ్ఞాపకం .శ్రీ బాలా త్రిపుర సుందరీ ఉపాసకులు వారు .పరమాచార్యులవారికి అంతరంగికులు .తనకోసం రావద్దని శాస్త్రి గారిని చూస్తే  చాలని వారు భక్తులకు చెప్పే వారట .అంతటి మహనీయులు శాస్త్రి గారు . ఆదంపతుల విగ్రహాలు చూశాం .జీవ కళ తొణికిస లాడుతూ ముచ్చటగా ఉన్నాయి. అక్కడే పరమాచార్యులవారు కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహం చూసి పులకించని వారు ఉండరు .శాస్త్రిగారి తమ్ముడుగారి అబ్బాయి , వీరి కుమారుడు అక్కడే ఉండి ఆ భవన బాధ్యతలు చూస్తున్నారు. వారు స్థాపించిన వేద పాఠ శాల విద్యార్ధులు లేక ఖాళీ గా ఉంది.శాస్త్రిగారి కాలం లో పరమ వైభవంగా ఉన్న ఈ ప్రదేశం ప్రస్తుతం బోసి పోయినట్లు ఉన్నది .శాస్త్రి గారి పూజా గృహమూ చూశాం .జన్మ ధన్యం అయింది  .

అక్కడి నుంచి కృష్ణ మూర్తి తో సహా ఖాజీ పాలెం చేరాం .సుబ్బయ్య ఇల్లు శివాలయం ప్రక్కనే. ఆతను ఇందులో పూజారికూడా. సంవత్సరం లో 4 నెలల వంతు .ఇల్లు ముచ్చటగా ఉంది .ముగ్గురం కలిసి 54 ఏళ్ళు .మళ్ళీ గలగలా మాట్లాడుకొంటూ పాత విషయాలు గుర్తు చేసుకొంటూ బి ఎడ్ అనుభవాలు చెప్పుకొంటూ ఒక గంట గడిపాం .రాజమండ్రి లో ఎన్నో సినిమాలు కలిసి చూసిన కబుర్లు ,సాయంత్రాలలో  గోదారి ఒడ్డున తిరిగిన విశేషాలు ,వరద రాజు హోటల్ ఇడ్లీ రుచి, పంచవటి హోటల్ పేపర్ అట్టు జ్ఞాపకం చేసుకోన్నాం. కాలేజి గురువులు ప్రిన్సిపాల్ శ్రీ హాబి బుల్లా ,లెక్కల లెక్చరర్లు శ్రీ డి.వీరభద్ర రావు ,శ్రీ డి సూర్యనారాయణ ,తెలుగు హెడ్  ఫిజిక్స్ నటరాజన్ బయాలజీ సుబ్బమ్మ కేమిస్త్రి అప్పారావు (చెంబిస్త్రి) బేసిక్ ఎడ్యుకేషన్ రాజు గార్లను  గుర్తుకు తెచ్చుకున్నాం. క్లాస్ మేట్ లు  లలితా వరలక్ష్మి  విశాలాక్షి ,నాగే౦ద్రనాథ్ (కాకినాడ )రూమ్ మేట్ల ను(వెంకట రెడ్డి-అద్దంకి  ,పాల్ -మైలవరం )లను   మరోసారి హృదయ ఫలకం పై ఆవిష్కరింప జేసుకొన్నాం. ఆ రోజులు తిరిగి  రావు అని  ఆనంద పడ్డాం . కిస్టాయ్ జోకుల కేకర్లకు మల్లికాంబ గారు పగల బడి నవ్వారు . మా దంపతులకు సుబ్బయ్య ద౦పతులు బట్టలు పెట్టారు. సుబ్బయ్య భార్యకు మేము చీరా జాకెట్ పెట్టాం. దబ్బకాయ ఇచ్చాం .సుబ్బాయ్ సరసభారతికి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు 2 వేల రూపాయలు అందజేశాడు .వాళ్ళు పెట్టిన  పండ్ల ముక్కలు తిని, కాఫీ త్రాగాం .విష్ణు పూజారి కృష్ణ మూర్తి ,శివ పూజారి సుబ్బయ్య .విష్ణు శివ అవతారాలు అనుకొంటే ఏదో కొంత సాహిత్యం సృష్టిస్తున్న నేను బ్రహ్మనే కదా .కనుక ముగ్గురం ఆ త్రిమూర్తుల ప్రతి రూపాలమే అని పిస్తుంది. ,శివాలయ దర్శనం చేసి రాత్రి 7 -30 గం లకు బయల్దేరి రేపల్లె చేరి పెనుమూడి వంతెన దాటి ,కృష్ణ కరకట్ట ఎక్కి దేవరపల్లి మీదుగా రాత్రి 9-30 గం లకు ఉయ్యూరు చేరాం .మా డ్రైవర్ ఈసా ముస్లిం .అయినా ఒక్కడే దేవుడు అన్న విశ్వాసం ఉన్నవాడు .ఒక ముస్లిం మత గురువు ఉపన్యాసాల రికార్డ్ వినిపిస్తూ తానూ అన్నీ చెబుతూ అందర్నీ ఆకట్టుకొన్నాడు .అతనితో దాదాపు 25 ఏళ్ళ పరిచయం ఉంది  మా ‘’లూనా’’ కు గాలి కొట్టి౦చటానికి  రిజిస్త్రార్ ఆఫీస్ ఎదురుగాఅతనూ సోదరులు నడిపే టైర్ రిపేర్ షాప్ కు  కు వెళ్ళేవాడిని. అదే పరిచయం .అతని భావ తీవ్రతకు ముగ్ధుడ నై 26 వ తేదీ ఉగాది వేడుకలకు తమ్మని ఆహ్వానం ఇచ్చి శాలువా కప్పుతాను అని చెప్పాను .ఉదయం 5 గం నుంచి ప్రయాణం లో ఉన్నా ఎక్కడా అలసట అనిపించ లేదు స్నేహబంధం ఆరోగ్యకరం ఆనంద కారణమూ  అయి  మనసుకు ఉల్లాస ఉత్సాహాలనిచ్చింది . సంతృప్తికలిగింది . .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-17 –ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ట్రిప్ చేజెర్ల -1

ట్రిప్ చేజెర్ల -1

18-3-17 శనివారం ఉదయం 5 గం లకే నేనూ  నా శ్రీమతి ప్రభావతి ,మనవడు చరణ్ మా కుటుంబ మిత్రురాలు శ్రీమతి మల్లికాంబ గారు కలిసి కారు లో బయల్దేరి గుంటూరు జిల్లాలోని  చేజెర్ల ,కోటప్పకొండ దేవాలయ సందర్శనం పొన్నూరులో శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి ,శ్రీ నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గార్ల ను దర్శించి ,54 ఏళ్ళ క్రితం నాతో రాజమండ్రి బి ఎడ్ కాలేజి లో   ట్రెయినింగ్  మిత్రులైన  చందోలులో ఉంటున్న శ్రీ వేదాంతం కృష్ణ మూర్తి  ,ఖాజీపాలెంలో ఉంటున్న శ్రీ వారణాసి సుబ్బయ్య శర్మ స్వగృహాలలో  వాళ్ళను చూసి ,రేపల్లె మీదుగా  పెనుమూడి వద్ద శ్రీ మండలి వెంకట కృష్ణా రావు వారధి దాటి ,కృష్ణ కరకట్ట మీదుగా ప్రయాణం చేసి దేవరపల్లి మీదుగా రాత్రి 9-30 గం లకు ఇంటికి చేరాం .ఆవిశేశాలు .

చేజెర్ల కపోతేశ్వరాలయం

శిబి చక్రవర్తి కాశ్మీర్ దేశాన్ని పాలిస్తున్న రోజులలో ఆయన తమ్ముళ్ళు  మేహా డంబరుడు, జీమూత వాహనుడు ఉన్నారు .మేహా డంబరుడు అన్న గారి అనుమతి తీసుకొని  కొందరు మునులతో ఇప్పటి చేజెర్ల అని పిలువ బడే చేరం చోర్ల వచ్చి అక్కడి ప్రకృతి కి పరవశుడై   ‘’దేవర కొండ ‘’పై శివునికై  తపస్సు చేసి లింగాకారం పొందాడు .వార్త తెలుసుకొన్న జీమూత వాహనుడు అన్నగారి జాడ తెలుసుకోవటానికి కొందరు మునులతో ఇక్కడికి వచ్చి తానూ అన్నగారి దారిలో తపస్సు చేసి కైలాసం చేరాడు .ఇద్దరు తమ్ముళ్ళ జాడ తెలియని శిబి చక్రవర్తి ససైన్యంగా ఇక్కడికి వచ్చి తానూ ఇక్కడి ప్రకృతి అందాలకు పులకి౦చి త్రయాగం అంటే 100 యజ్ఞాలు చేయ టానికి నిశ్చయించి 99 పూర్తీ చేసి నూరవ యజ్ఞం చేస్తుండగా ,వంద యజ్ఞాలు పూర్త యితే బ్రహ్మ పదవి కి అర్హుడౌతాడుకనుక అతనిని పరీక్షించటానికి త్రిమూర్తులు నిర్ణయించుకొని శివుడు వేటకాడుగా బ్రహ్మ ఆయన బాణం గా విష్ణు మూర్తి పావురం గా మారి ఇక్కడ ఉన్న రూపన గుంట్ల గ్రామానికి వస్తారు   .శివుడి బాణం దెబ్బకు  గాయ పడిన కపోతం   శిబి పాదాలపై పడి ఆయన ను శరణు కోరుతుంది .ఆయన అభయమిస్తాడు .వేటకాడు వచ్చి తాను కొట్టిన పావురం తనకు ఆహారం గా కావాలంటే ,దాని ప్రాణ రక్షణ చేస్తానని అభయమిచ్చాను కనుక వదలను అంటాడు శిబి .చివరకు కపోత రక్షణ  కోసం శిబి, పావురం బరువుతో సమానంగా తన శరీరం లోని మాంసాన్ని  కోసిస్తాను అంటే వేటకాడు శివుడు ఒప్పుకుంటాడు .త్రాసు తెప్పించి పావురాన్ని ఒక వైపు ఉంచి తన శరీర మాంసాన్ని కోయటం ప్రారంభిస్తాడు .ఎంత కోసినా తూకం సరి పోవటం లేదు. చివరికి తన శిరస్సును ఖండించు కొబోగా త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆయన శరణాగత ధర్మానికి మెచ్చి నూరవ యజ్ఞాన్ని దగ్గరుండి జరిపించి బ్రహ్మ పదవి నిస్తారు .శిబి ఆప్రదేశాన్ని అపర కైలాసం గా వర్ణిస్తాడు శివుని ఆజ్ఞతో తాను శివలింగా కృతి పొంది పావురం పేరు మీద ‘’కపోతేశ్వర లింగం ‘’అవుతాడు. అతని తో బాటు మిగిలిన వారూ లింగాలుగా మారిపోతారు .లింగం పై భాగాన రెండు రంధ్రాలు ఉంటాయి .అవి శిబి చక్రవరి కళ్ళు .ఆ రంధ్రాలనుంచి అభిషేక తీర్ధం ఎక్కడికి వెడుతుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు .లింగం వద్ద ఇప్పటికీ మాంసం వాసన రావటం ఆశ్చర్యమే కాక చారిత్రిక సత్యంగా భావిస్తారు .శిబి తండ్రి మాంధాత ఆయన తండ్రి యయాతి అని మనకు తెలిసిందే .

శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ఈ స్వామిపై ‘’కపోతేశ్వర శతకం ‘’రాశారు .రెండేళ్ళ క్రితం నాకు పంపగా చదివి ఆనందించి ఈక్షేత్ర దర్శనం చేయాలని ఉవ్విళ్ళూరాను .ఇదిగో ఇప్పటికి కుదిరింది .ఆలయం చాలాపురాతనమైనది  సుమారు 17 వందల ఏళ్ళ నాటిది .రాతి శిలాఫలకాలపై చరిత్ర ఉంది .లింగం తెలుపు పాలరాయి. మేము వచ్చేసరికిపూజారి గారు అభిషేకం చేస్తున్నాడు .అయిదారుగురు భక్తులున్నారు .మా కొబ్బరికాయ కొట్టి హారతి తీర్ధ ప్రసాదాలు ఇచ్చాడు .ఇక్కడే ప్రక్కన ఉన్న అరుగుమీద మాతో తెచ్చుకున్న ఇడ్లీలు తిన్నాం .

‘’ మా అమ్మాయి ‘’

శ్రీమతి బెల్లంకొండ శివకుమారి నరసరావు పేట లో ఉంటుంది .భర్త లెక్చరర్ .ఆమె విశ్వనాథ వారి ‘’ఏక వీర ‘’నవలపై పై గొప్ప అధారిటి .చాలా చక్కగా ఎన్ని గంటలైనా పుస్తకం సహాయం లేకుండాఅనర్గళంగా  దానిపై మాట్లాడుతుంది .ఉయ్యూరు లో రెండు సార్లు నేను ఆమెతో మాట్లాడించా .బెజవాడ లో గత ఏడాది జరిగిన విశ్వ నాథ సాహితీ వైభవం లో కూడా పూర్ణ చంద్ గారికి చెప్పి ఆమెను పిలిపించి మాట్లాడించా .ఆమె నన్ను ‘’నాన్న గారు ‘’అని మాశ్రీమతిని ‘’అమ్మా ‘’అనిఎంతో ఆప్యాయంగా, గౌరవం గా కలిసినప్పుడు, ఫోన్ లో మాట్లాడినప్పుడూ సంబోధించటం ఆమె సంస్కారం .మేము చేజెర్ల వస్తున్నామని నరసరావు పేట రాగానే ఆమెకూ, శ్రీమతి యడవల్లి మనోరమ కు ఫోన్ చేస్తే మనోరమలిఫ్ట్ చేయలేదు శివకుమారి తాను చేజెర్ల దారిలో ఉన్న రెడ్డి పాలెం హైస్కూల్  కు వస్తున్నానని  అక్కడ పోలేరమ్మ గుడి దగ్గర ఉండమని అంటే ఆగాం. భర్త తో  కలిసి వచ్చి అమాంతం నా పాదాలపై వాలి’’ నాన్న గారూ ! మళ్ళీ ఎన్నాళ్ళకు  అమ్మను ,మిమ్మల్ని చూడగలిగాను ‘’అని ఆనందం తో పరవశించింది .మాకూ ఎంతో ఆనందం కల్గింది భర్తకూడా అదే  విధంగా  పాదస్పర్శ చేసి నమస్కరించాడు మా ఇద్దరికీ . సంస్కారం మూర్తీభవించిన ఆడంపతుల్ని చూసి పులకించి పోయాం అందరం . శివ కుమారి సామర్ధ్యాన్ని నాకు తెలియ జేసిన వారు  ప్రముఖ కథా రచయిత,  నరసరావు పేటవాస్తవ్యులు శ్రీ గంధ౦  యజ్న వల్క్య శర్మ గారి అన్నగారు .నాకు సరసభారతికి ఆప్తులు ‘’అమృత హస్తాలు ‘’ ‘’కథా సంపుటి రచయిత స్వర్గీయ గంధం  వేంకా స్వామి శర్మగారు  .వారే డా.శ్రీ మడక సత్యనారాయణ గారినీ మా పాపాయి పిన్ని మేనకోడలు  నరసరావు పేట లో తెలుగు లెక్చరర్ శ్రీమతి యడవల్లి మనోరమ ను కూడా పరిచయం చేశారు. మనోరమ నన్ను ‘’బాబాయి గారు ‘’అంటుంది మావిడను ‘’అమ్మా ‘’అంటుంది .శివకుమారి మనోరమకు ఫోన్ చేసి  మా చేజెర్ల ప్రయాణం సంగతి చెబితే అప్పుడు ఫోన్ చేసి సారీ చెప్పి  మాట్లాడింది .శివకుమారిని చూసిన ఆనందం తో చేజెర్ల కపోతేశ్వర దర్శనం మరింత మధురమని పించింది .

కోటప్పకొండ

రెండేళ్ళ క్రితం మొదటి సారిగా కోటప్ప కొండకు వెళ్లి వచ్చాం .దారిలోనే కదా అని మళ్ళీ  శ్రీ త్రికోటేశ్వర స్వామి ‘’దర్శనం చేసుకొని  ఇక్కడి స్పెషల్ ప్రసాదం అయిన ‘’నేతి అరిసెలు ‘’కొన్నాం .శ్రీ కోడెల శివ ప్రసాద్ గారి వల్లనే కోటప్ప కొండ అభి వృద్ధి బాగా జరిగింది. పైకి కారు వెళ్ళే రోడ్డు వేశారు .వసతులు బాగా కల్పించారు .కోటప్పకొండ ప్రభలు చాలా ప్రసిద్ధం .కొండకింద ‘’గబ్బిట కోటయ్య గారి బ్రాహ్మణ అన్నదాన సత్రం ‘’చూసి అక్కడి వాచ్ మన్ ద్వారా దాన్ని నిర్వ హించే శ్రీ  గబ్బిట బాలు గారు చిలకలూరి పేటలో లో ఉంటారని తెలుసుకొని ఆయన ఫోన్ నంబర్ తీసుకున్నాం. చిలకలూరి పేట లో’’గబ్బిట వారి వీధి ‘’ఉందని వాచ్ మన్ చెబితే  ఎంతో సంతోష పడ్డాం . ఈ సత్రం బ్రాహ్మణుల కోసమే .శివరాత్రికి వచ్చే  బ్రాహ్మణ   భక్తులకు మూడు రోజులు ఉచితంగా భోజనం పెడతారు .మిగిలిన కులాల వారికీ  సత్రాలున్నాయి .దీనికి గాను చందాలను వసూలు చేయటానికి ఒక బ్రాహ్మణుడు రసీదు పుస్తకాలతో ఉయ్యూరు వచ్చి సేకరించి తీసుకొని వెళ్ళేవాడు .దాదాపు 25 ఏళ్ళ నుంచి ఎవరూ చందాల కోసం రావటం లేదు .చిన్న సత్రమే అయినా సేవ ఘనం .అందులోనూ మా గబ్బిట వారిది అని గర్వ పాడుతాం వారికి మాకూ పరిచయాలు లేక పోయినా .అప్పుడు మేమిచ్చిన చందా మొదట్లో 2 ,తర్వాత 5 చివర్లో 10 రూపాయలు మాత్రమమే తలచుకొంటే ఇప్పుడు సిగ్గేస్తుంది .కాని అప్పటికి అదే గొప్ప .వసూలు చేసే బ్రాహ్మణుడు మా ఇంట్లోనే భోజనం చేసి ఊర్లోకి వెళ్లి చందాలు వసూలు చేసేవాడు .మా అమ్మా నాన్నా తర్వాత నా తరం వరకూ అలా జరిగింది. తర్వాత వాళ్ళే రావటం మానేశారు .నిధులు సంతృప్తిగా ఉన్నాయేమో .

పొన్నూరు లో సాహితీ మూర్తుల దర్శనం

కోటప్పకొండ నుంచి చిలకలూరి పేట మీదుగా ,పెదనందిపాడు దాటి పొన్నూరు కు బయల్దేరాం. దారిలో  నీడ ఉన్న ప్రదేశం లో మేం తెచ్చుకొన్న మామిడికాయ పప్పు ,కొబ్బరి మామిడి పచ్చడి, కారం పొడి గడ్డ పెరుగు తో భోజనం లాగించాం డ్రైవర్ ఈసా తో సహా.మధ్యాహ్నం 1-30 కు పొన్నూరు చేరి శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారింటికి వెళ్లి ,వారి శ్రీమతికి చీరా జాకెట్ పెట్టి ,మా దొడ్లో కాసిన దబ్బకాయ ఇచ్చి ,శాస్త్రిగారు పెట్టిన టీ తాగి ,ప్రక్కనే ఉన్న రిటైర్డ్ సంస్కృత లెక్చరర్ ,జ్యోతిష శాస్త్ర వేత్త బహు  గ్రంథ కర్త మన హేవళంబి ఉగాది వేడుకలలో ఉగాది పురస్కారం అందు కొబోతున్న    డా శ్రీ నిష్టల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారినీ  దర్శించి ,వారి శ్రీమతికీ చీరా జాకెట్   దబ్బకాయ ఇచ్చి పొన్నూరు వచ్చిన ఫలితం పొందాం . వారి సతీమణి మా శ్రీమతికి ,మల్లికాంబ గారికి జాకెట్ పీస్ లిచ్చి సత్కరించారు.  దక్షిణా మూర్తి గారివల్లనే నేను రండవ గీర్వాణం లో చాలామంది సంస్కృత కవుల పై రాయగలిగాను .ఎ0దరినో నాకు పరిచయం చేసి ఎన్నో పుస్తకాలు పంపి రాయటానికి సహకరించి ప్రోత్సహించిన మహానుభావులాయన .

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-17 -ఉయ్యూరు


Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -2 (చివరి భాగం )

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -2 (చివరి భాగం )

అన్యోన్య దాపత్యం

శ్రీ చర్ల గణపతి శాస్త్రిగారు శ్రీమతి సుశీల గారు చాలా అన్యోన్యంగా కాపురం చేశారు .శాస్త్రిగారు శతాధిక గ్రంధ కర్త 1988 లో వారికి కళాప్రపూర్ణ బిరుదు నిచ్చి ఆంధ్రా యూని వర్సిటి సత్కరిస్తే ,కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రదానం చేసింది  .అయినా ఏమాత్రం గర్వం ఆయనలో లేదు .సుశీలగారు వారి గ్రంధాలను అత్యంత శ్రద్ధాసక్తులతో చదివారు వారామెతో ‘’బాల రామాయణం ‘’రచింప జేయించారు .అది అలభ్యం .శాస్త్రి గారి ఆకాశమంత పాండిత్యాన్ని చూసి తాము రచించటం మానేశారు .వారి సాహిత్యం పై ప్రసంగించేవారు సుశీల .తండ్రి గారి గ్రందాలప్రచారం చేయమని కూతుళ్ళను ప్రోత్సహించారు .స్త్రీల కోసం ‘’మాతృశ్రీ స్తోత్ర రత్నాలు ‘’సంకలనం చేసి ప్రచురించారు.గాంధీ పైఒక మంగళహారతి రాశారు .’’మంగళమని మంగళమని మంగళమనరే –మంగళమని పాడరే మహాత్మా గాంధీకి ‘’అనేది ఆపాట .’’బీదలకు నేను సేవ చేస్తే నా పిల్లలకు భగవంతుడు సహకరిస్తాడు ‘అనే నమ్మకం ఆమెది .స్వాతంత్ర సమర యోధులైన శాస్త్రిగారు జైలు కు  వెళ్ళినప్పుడు, వినోబా తో పాద యాత్ర చేసినపుడు ధైర్యంగా పిల్లల ఆలనా పాలనా చూసుకోనేవారు .భర్త గారికి జున్ను ఇష్టం అని బకెట్ నిండా జున్ను వండి జైలుకు తీసుకు వెళ్లి పోలీసులను కూడా తినమనే వారు .మన ‘’మామయ్యలు’’ మాయ గాళ్ళు  కదా ,వారికి పెట్ట కుండా అంతా తామే ‘’జుర్ర్రేసే’’వారు .తెలిసినా ఆమె వారిని ఏమీ అనేది కాదు .పిల్లలకు ఇంగ్లీష్ నేర్పకుండా తెలుగు హిందీ నేర్పించారు .శాస్త్రి గారి పుస్తకాలను పిల్లలు అమ్మి ,కొన లేని వారికి ఉచితంగా ఇచ్చేవారు .భర్తల ఆశయాలకు అనుగుణంగా మసలు కొనేవారు .నగలు లేక పోయినా ,తెల్ల ఖద్దరు చీర ధరించి మెడలో నల్లపూసల దండతో అసలైన భారత నారిగా కని పించేవారు .

భూదాన ఉద్యమానికి భర్త 5 ఎకరాలు దానం చేసినప్పుడు ,ఆమె సహకరించారు . తర్వాత తర్వాత కొడుకు కూతుళ్ళు ఆంగ్ల విద్య నేర్చి ఎంతో అభి వృద్ధి సాధించారు .కుమారుడు ఆంధ్రా యూని వర్సిటి లో ఎం ఎస్ సి పాసయ్యాడు కమల అక్కడే ప్రొఫెసర్ అయింది .పెద్దమ్మాయి సంస్కృతం హిందీలలో ఎం ఏ .చేసి సంస్కృత లెక్చరర్ గా రిటైర్ అయింది రెండవ కూతురు హిందీ లో ఎం ఏ పి హెచ్ డి.. మిగిలిన ఇద్దరూ ఎం ఏ పి హెచ్ డిచేసి ఉద్యోగాలు చేసి స్వంత కాళ్ళపై నిల బడ్డారు .శాస్త్రి గారు హైదరాబాద్ మకాం మార్చి లలితా ఆర్ట్ ప్రెస్ పెట్టి నడిపారు .కస్తూరి బాయ్ సమాజం  26 ఏళ్ళు నిరాఘాటం గా నడిచింది .సుశీలగారు స్పురద్రూపి .భవిష్యత్ జ్ఞానం బాగా ఉండేది .నలుగురైడుగురను తీసుకుని  తరచుగా తీర్ధ యాత్రలు చేసేవారు .సత్య సాయి పై ఆరాధన ఏర్పడింది. ఆయనకూ ఈమె సేవా విషయాలు తెలిసి నిర్వహణకు ధనం ఇచ్చేవారు .బాబాపై పద్యాలు కూడా రాశారు .1976  డిసెంబర్ లో ఒక్కగానొక్క కొడుకు హార్ట్ ఎటాక్ తో చని పోయాడు ఇది దంపతులను బాగా కుంగ దీసింది .శాస్త్రి గారి మరణం తర్వాత సుశీలగారు 1976 లో 65 ఏళ్ళ వయసులో చనిపోయారు .

శాస్త్రిగారు సుశీల దంపతులు నిడద వోలులో కస్తూరి బాయి ఆశ్రమాన్ని స్థాపించి కుట్లు అల్లికలు హిందీ నేర్పించారు .కార్తీకమాసం లో అన్నదానం తో పాటు వస్త్ర దానమూ చేసిన ఉత్తమ మహిళ.నిరాడంబర జీవి .ఉన్నత సంస్కారం ఆధ్యాత్మిక భావ సంపదా ఉన్న ఉత్తమా ఇల్లాలు .సుశీల గారు అమృత వర్షిణి అంటారు అందరు .ఆమె గారి స్పూర్తితో ఎందరో అనాధ ఆశ్రమాలు  పెట్టి నిర్వహించారు .ఆమె సంతానాన్ని ఆణి ముత్యాలుగా తీర్చి దిద్దిన మహిళా మాణిక్యం .శాంత స్వరూపిణి సుశీలగారు .వారి కుమార్తె విదుల ‘’అమ్మ అంటే అమృతం .త్యాగం అనే కొవ్వొత్తి .తను కరిగిపోతూ ఇతరులకు వెలుగు నిచ్చేదేవత .మూర్తి రాజు సంస్థల అధ్యక్షులు శ్రీ మూర్తి రాజు ఆమెకు బంగారు గొలుసు కానుక గా ఇస్తాను అంటే ‘’మళ్ళీ మీరు గొలుసు ఏదీ అని అడగ వద్దు .ఎవరైనా బాగుంది అంటే ఇచ్చేస్తాను ‘’అన్నారు .విదుల ‘’చర్ల సుశీల వృద్ధాశ్రమం ‘’పెట్టి  150మందితో నడుపుతున్నారు .మనిషిలోని ప్రతిభను గుర్తించి సాయం చేసే దొడ్డ గుణం ఆమెది .ఏ కొత్తపాట విన్నా నేర్చుకొనే వారు నేర్పే వారు .తెల్లవారు ఝామున 4 గంటలకే లేచి ధ్యానం చేసేవారు .తర్వాత అన్నం ,మజ్జిగ  ఊరగాయ తీసుకొని రైలు గేటు దగ్గర రిక్షా వాళ్లకు ,ముష్టి వాళ్ళకూ పంచి ఇచ్చేవారు .ఎందరో పేద పిల్లలకు ఫీజులు కట్టి చదివించి ,ఉద్యోగాలు ఇప్పించిన మహా ఇల్లాలు .సుశీల గారు లాంటి మనిషి ఉంటారా అని ఆశ్చర్య పోతాం .అంతటి ఉత్తమ మహిళా ఆదర్శ మూర్తి శ్రీమతి చర్ల సుశీల గారు .

ఆధారం –శ్రీ మంగు శివరామ ప్రసాద్ గారు విశాఖ లో నాకు అందజేసిన –సుశీల గారి 103 జయంతికి పుస్తక రూపం లో వచ్చిన ‘’మమతామయి శ్రీమతి చర్ల సుశీల గారి జీవిత చరిత్ర ‘’

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 –ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -1

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -1

పుట్టుక విద్యాభ్యాసం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కాకర పర్రు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం .ఇక్కడే శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారు అనే మహా కవి పండితుడు జన్మించి ప్రతాపరుద్రీయం ,ప్రాణ త్యాగం ,,బంగారం , నిందాపహరణం మొదలైన గ్రంథాలు రాశారు .తణుకు బోర్డ్ హైస్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయుడు .వీరి రెండవ కుమార్తె  సుశీలాంబ  1-1-1911 న జన్మించారు .చలాకీ ఉత్సాహం ఉన్న పిల్ల .మగ పిల్లవాడు లేని తండ్రి ఆమెను కొడుకుగా పెంచారు .ఆమె సైకిల్ తొక్కేది, కాలవలో స్నానం చేసి ఈత కొట్టేది .బంగారు నగలపై మోజు ఎక్కువ .తండ్రి గారు తాను రాసిన కథ ‘’బంగారం ‘’చదివి వినిపించి బంగారం పై వ్యామోహం ఎంతటి అనర్ధమో తెలియ జేశారు. అప్పటి నుంచి ఆమెకు  నగలపై  విరక్తి కలిగింది .తండ్రి గొప్ప సంఘ సంస్కర్త .క్విట్ ఇండియా ఉద్యమలో ఆయనతో పాటు సుశీలకూడా పాల్గొన్నది .పెద్దగా చదువు లేకపోయినా జ్ఞాన వంతురాలు .వక్తగా విదుషీమణి గా పేరు పొందారు .శ్రావ్యమైన కంఠం తో  మధురంగా పాడేవారు .తల్లి గయ్యాళి. ఎప్పుడూ తగాదాలే భర్త తో.అన్నం కూడా వందేదికాదు .శాస్త్రిగారు ఊరి చివర కాలువ గట్టున పాక వేసుకొని పండ్ల తోటలు పెంచుతూ పళ్ళు, మరమరాలు  సెనగపప్పు, తిని బడికి వెళ్ళేవారు కాని భార్యను పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు అంతటి ఉత్తములు .

వివాహం

కాకర పర్రు లోనే శ్రీచర్ల నారాయణ శాస్త్రి గారనే బహు భాషా కోవిదులున్నారు .వ్యాకరణ నిఘంటు కర్త .నారాయణా౦ద్రీ వ్యాకరణ౦ రాశారు  .మహిష శతకం ,మహా భారత మీమాంస రచించారు.   భారత మీమాంస గ్రంధాలు సీరియల్ గా ఉండేవి .వీటిని వీరి మనవరాళ్ళు హైదరాబాద్ లో అసెంబ్లీ భవనం దగ్గర ,తెలుగు యూని వర్సిటి దగ్గర అమ్ముతూ ఉంటె సుమారు 25 ఏళ్ళ క్రితం నేను కొని చదివాను. అద్భుతమైన పరిశోధనాత్మకమైన గ్రంథాలు అవి .వాటిని ఆధారం గా చేసుకొని కొన్ని వ్యాసాలు  రాస్తే శ్రీ శుభం పత్రిక  ప్రచురించింది .పిఠాపుర ఆస్థానం లో కొద్దికాలం ఉండి రాజు కోరికపై ‘’ఆంద్ర నిఘంటువు ‘’కూర్చి బయటి కొచ్చారు .సుశీల గుణ గణాలు తెలిసి ఆయన ఆమెను తమ కుమారుడు శ్రీ చర్ల గణపతి శాస్త్రి  గారి తో వివాహం 1921 లో ఆమె 10 వ ఏట  జరి పించారు .ఉభయుల అంగీకారం తో కట్న కానుకలు లేవు .గణపతి శాస్త్రి గారు ఉపనయన ,వివాహ విధి ,సులభ సంస్కృత చంద్రిక  బ్రహ్మ మీమాంసా దర్శనం రాశారు. బౌద్ధం మీద అనురక్తికలిగి బుద్ధుని కథలు రాశారు .శాస్త్రి గారు చెవులకు బంగారు పోగులు ధరించేవారు .దొంగలభయం తో ఆరు బయట పడుకున్నప్పుడు చెవులకు గుడ్డ కట్టుకొనే .వారు చివరికి దానిపై మోహం పోయి ఆయనా నగలకు వ్యతిరేకు లయ్యారు .భార్య పేరును సుశీలగా మార్చేశారు .ఈ దంపతులకు ఒక కొడుకు నలుగురు విమల ,కమల ,విదుల ,మృదుల అనే కూతుళ్ళు .తల్లి  పేరు లోని ‘’ల’’కారం వీరిలో ప్రతిధ్వని౦చేట్లు పేర్లు పెట్టారు .కొడుకు పేరు బుద్ధ నారాయణ శాస్త్రి .

చారు శీల సుశీల – ఇంట సాత్వికాహారం

మాతృమూర్తి సుశీల కరుణామయి. ఆకలితో ఉన్నవారికి ఇంత అన్నం పెడితేకాని తినేదికాదు .ఆర్ధికం గా పుష్టి లేని వారి ఇళ్ళకు   వెళ్లి వారికి తెలియకుండా కూరగాయలు, బియ్యం గుమ్మాల వద్ద పెట్టి వచ్చేది .రహదారి పడవలు నడిపే వారి శ్రమ గుర్తించి ,వారి కి పెరుగు అన్నం పెట్టి చెట్టు కింద విశ్రాంతి తీసుకోమని చెప్పేది .గణపతి శాస్త్రిగారు గాంధీ అనుయాయులు .ధర్మ పత్నిగా ఆమె ఆయన్ను అనుసరించింది .భర్త రాసిన తెలుగు భగవద్గీత గీతాలను ఉదయం 5 గంటలకే లేచి పారాయణ చేసేది .బ్రహ్మ సమాజం పాటలు భక్తీ గీతాలు  రాట్నం మీద నూలు వడుకుతూ ఆలపించేది .ఇంటిలో సత్సంగం జరిపేది .కుటుంబం అంతా ఆవుదగ్గర గుమ్మ పాలు త్రాగే వారు .అల్పాహారం లో పెసలు అరటి పళ్ళు ,మధ్యాహ్న భోజనం లో పుచ్చకాయ ముక్కలు ,సీతాఫలాలు ,జామ పళ్ళు పెరుగు .పచ్చి దొండ బెండ సొరకాయ ,టమేటా, బీరకాయ  ముక్కలు తినేవారు .సాయంత్రం నూకల జావలోకారం లేని ఆవకాయ ,పెరుగు కలిపి తీసుకొనేవారు .వారు పెట్టిన కారం లేని ఆవకాయ సంవత్సరం నిలవ ఉన్నా చెడి పోయేది కాదు. కారం లేని ధనియాల ఆవకాయ వారింట్లో స్పెషల్ .రాత్రి 6 గంటలకే భోజనం గా జావ తాగి ఆరుబయట మంచాలు వేసుకొని పడుకొనే వారు .సుశీల పిల్లలకు చద్దన్నం లో పెరుగు పోసి బ్రేక్ ఫాస్ట్ గా మది బట్టలు కట్టించి మొదట్లో ఇచ్చేది.భర్త మాట విని ఆ పధ్ధతి మార్చుకొని చద్ది కూడు , మదడి బట్టలకు స్వస్తి చెప్పింది .చాదస్తంగా ఎప్పుడూ మడి బట్టలతోనే ఉండేది .మాలవాళ్ళను చూసేదికాదు . ఇతర కులస్తులను ఇంటికి రానిచ్చేదికాదు.భర్త అనునయంగా నచ్చ చెప్పి అన్నీమానిపించాడు  .శాస్త్రి గారు కాపు వాడితో ఇంట్లోకి నీళ్ళు తెప్పించి ,పిల్లలతో మొక్కలకు నీళ్ళు పోయి౦చే వారు .పెరడు ప్రకృతి నిలయంగా అన్ని రకాల కాయ గూరలు ,పండ్ల చెట్లు, పూల చెట్ల తో కళకళ లాడేది .తేనె టీగలను పెంచి తేనే తీసేవారు .ఆవులు గేదెలు ఉండేవి .పాలు పెరుగు అనాధలకు  బీదలకు పోసేవారు .

శాస్త్రి గారిల్లు పూరి గుడిసె మాత్రమే  .తర్వాత పెంకుటిల్లు .నుయ్యి ,కొబ్బరి చెట్లు ధాన్యం నిలువకు’’ గాదె’’తో  చూడ ముచ్చటగా ఉండేది .నూలు వడికి అందరూ ఖద్దరు బట్టలే కట్టేవారు .ఎక్కడికి వెళ్ళినా’’ తకిలీ ‘’తమతో తీసుకు పోయేవారు పిల్లలతో సహా .’’సూత్ర యజ్ఞం ‘’పేరు తో ఇంటి వారు, బయటివారు రోజూ కనీసం మూడు గంటలు నూలు వాడికే వారు .సుశీల గారు రాజమండ్రి నుంచి ఖద్దరు బట్టలు కొనుక్కు వచ్చి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేవారు .ఆడా మగా అందరి చేత ఖద్దరు కట్టించేవారు .పండగలకు పిల్లలకు కొత్త బట్టలు కొనేవారు కాదు .సామాన్యులు పుట్టిన రోజు చేసుకో కూడదని మహాత్ముల పుట్టిన రోజులే చేయాలని పిల్లలకు నచ్చ చెప్పేవారు .దంపతులు తాము ఆచరించి తర్వాత ఇతరులకు చెప్పేవారు అంతటి ఆదర్శం వారిది .

మధుర భాషిణి సుశీల

మధుర భాషిణి ,మధుర గాయని సుశీల గారు అనర్గళంగా ఉపన్యాసాలిచ్చేవారు .ఒక సారి దుర్గా బాయ్ దేశముఖ్  సభలో 5 నిమిషాల సమయం ఇచ్చి మాట్లాడమంటే సుశీలగారికిమరో  10 నిమిషాల దాకా ఇచ్చి ఆమె వాగ్ధాటికి ఆశ్చర్య పోయింది దేశ్ ముఖ్ .కోమల భావాలు సేవా దృష్టి ఉన్నందున అన్ని రంగాలలో దూసుకు పోయింది .ఒక రైతు కొడుకు తమ ఇంట్లో  దొంగతనం చేసి పట్టుబడితే పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్రతిమిలాడి వాడు చిన్నపిల్లాడు వదిలేయమని విడిపించుకొని వచ్చి వాళ్ళు కొట్టిన దెబ్బలకు నూనె రాసి కట్టు కట్టిన దయామయి .శాస్త్రి దంపతులు హరిజన వాడకు వెళ్లి శుభ్రత గురించి తెలియ జెప్పేవారు .తమ పిల్లలనూ తీసుకొని వెళ్లి వాళ్ళ చేత ఉత్తరాలు రాయించేవారు ,రాయటం చదవటం నేర్పించారు .రోగాలకు హోమియో మందులు ఇచ్చేవారు .’’కళ్ళు మాన౦డోయ్ –కళ్ళు తెరవం డోయ్ ‘’అని పాడుతూ వారి అలవాట్లను మాన్పించిన  సంస్కారులు  .

కస్తూరి బాయి మహిళా సమాజ స్థాపన

శాస్త్రిగారు ‘’శ్రీ కస్తూరి బాయి మహిళా సమాజం ను 1950 లో స్థాపించారు .అనాధ ,అసహాయ ,పతితలకు , , పెళ్లి కాని యువతులకు , భర్తను కోల్పోయినవారికి ఉపాధి కల్పించటమే వీరి ఆశయం .సుశీల గారు దీని చైర్మన్ .విద్యార్ధి సంఘానికి కూతురు కమల ప్రెసిడెంట్ .తండ్రీ కూతుళ్ళు హిందీ నేర్పేవారు .భవన నిర్మాణం కోసం పిల్లలు ఇంటింటికీ తిరిగి పావలా వంతున ఒక లక్ష రూపాయలు సేకరించి భవనం నిర్మించిన  దీక్ష వారిది .హిందీ తోపాటు కుట్టుపని ,ఎంబ్రాయిడరీ క్లాసులు నిర్వహించేవారు .ఖాళీ స్థలం లో కూరలు పండించి వేలం వేసి డబ్బు కూడ బెట్టేవారు .కొడుకు కూడా వీరితో పాటు కష్టపడేవాడు. అయితే అతన్ని భవనం లోకి వెళ్ళకుండా కట్టడి చేశారు శాస్త్రి గారు అదీ పధ్ధతి అంటే . బయట ఉండే సేవలు చేసేవాడు .మొదటి ఏడాది వార్షికోత్సవం 3 రోజులు ఘనం గా చేసి వక్తల నాహ్వానించి స్పూర్తి కలిగించారు .శాస్త్రిగారు రాసిన ఝాన్సి లక్ష్మి బాయి ,భారత మాత ,మీరాబాయి నాటకాలను వేయించారు .ప్రతి ఏడాది వార్షికోత్సవం జరిపి తాము రాసిన పొట్టి శ్రీరాములు ,బాపూజీ అల్లూరి బుర్రకధలను చెప్పించేవారు .సుశీలమ్మ గారి సమాజం అంటే ఆడ పిల్లలకు భయం లేదని తలిదండ్రులు నమ్మేవారు .హిందీ పరీక్షలకు రాజమండ్రి తీసుకు వెళ్లి ఎక్కడా ఉంచకుండా బంధువు భారతమ్మ గారింట్లో ఉంచిపరీక్ష రాయించేవారు .ఆడపిల్లల రక్షణ విషయం లో అంతటి శ్రద్ధ తీసుకొనే వారు .‘

శ్రీమతి చర్ల సుశీల గారి  ఫోటో జత చేశాను చూడండి

ఆధారం –శ్రీ మంగు శివరామ ప్రసాద్ గారు విశాఖ లో నాకు అందజేసిన –సుశీల గారి 103 జయంతికి పుస్తక రూపం లో వచ్చిన ‘’మమతామయి శ్రీమతి చర్ల సుశీల గారి జీవిత చరిత్ర ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 -ఉయ్యూరు

‘’

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి

కవి సార్వ భౌమ  ,మహా మహోపాధ్యాయ  కవిరాజ  ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి

శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -2(చివరి భాగం )

శ్రీనాధుని ‘’చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు ‘’పద్యం లాగానే శాస్త్రిగారు కూడా తన గ్రంధ రచనలను పరామర్శించి ‘’సీసం’’ లో కరగించారు –

‘’నే పది యారేండ్ల లోపల సత్య కధయు,సా –విత్రీ చరితంబు ,చిత్ర శతక –మిరువదేడు ల లోన వర గౌతమీ మహాత్మ్య ము,కాళిదాస వృత్తాంత వచన

మిరువదై దేండ్లలో  నేకావళియు  జగ –న్నాధ చరిత ,గజానన విజయము –ముప్పదేడులలోన మునుమున్న కావేరి కథ,వధూ విజయము ,కనకగిరియు

నవల శ్రీ వేంకటేశ్వ రీయమును వీర –రుద్ర విజయము ,ప్రద్యుమ్న చరిత

బొబ్బిలి యు, వేణిసంహారము  కలభాషి –ణియు ను రాజ భక్తి యును

కమలినియును ,నానందోదయమును ,వీర –సేన విజయము లోనుగా జెప్పనైన

కృతులు శతకాస్ట కంబులు ,కృతి విమర్శన –నంబులు బెక్కు లొనరించి నాడనేను ‘’

తాను భారత భాగవత రామాయణాలను  తెనిగించటం లో ‘’వాళ్ళ కంటే బాగా రాస్తానని కాదు ,కేవల చాపల్యం వల్ల  రాస్తున్నాను ‘’అంటూ పద్యం చెప్పారు –

‘’నన్నయ తిక్కనాది కవి నాథుల కన్నను మిన్నగా తెలుం –గున్నుడు వంగ లాడ  నధికుండను నేనని కాదు ,గ్రంథమం

దున్నెరసుల్ ,కొరంతలును  దోచు నటంచని కాదు ,వెండియున్ –బన్నుట భారతేస్టతను బట్టిన చాపల మంచు  నెంచుడి’’అని వినయంగా చెప్పారు .మూలాన్నివీసం కూడా  దాట కుండా అనువదించారు .

శ్రీనాధుని లా వ్యవసాయం చేసి చేతికి చిప్ప మిగుల్చుకొని ఆయన బాధపడిన గతవైభవస్పురణ ‘’కవి రాజు కంఠంబుకౌగిలించెను గదా !పురవీధి నెదు రెండ బొగడ దండ ‘’సీసం లాగా మన కవి రాజు కూడా –సీసం లోనే –

‘’గౌతమీ మహత్మ్య కర్త కంఠము చుట్టు –కొని యు౦డెగదా !ఋణము చిలువ –కవి మిత్రుల మేనెల్ల చివికించే గదా –అప్పుల వారి వాక్యాయుధములు ‘’అంటూ చివరగా ‘’పేట లంకల పాట నీ పాటు దెచ్చె-మాల పురువుల పాలయ్యె మరి పొగాకు –అప్పు ముప్పది వేల రూప్యంబులింక –నెట్లు దీర్చెడు శ్రీ పాద కృష్ణ మూర్తి ‘’’అని పురుగు పంటలనే కాక తననూ నాకి పారేసిందని వ్యధ చెందారు .

ఒక అవధానం లోశాస్త్రి గారికి ‘’వడ్డాణ మలంకరించె వనిత కుచంబుల్ ‘’అని సమస్యనిస్తే క౦ద౦ లో అందంగా వండారు-

‘’షడ్డకులు పోరుచో భూ -రాడ్డమ్మున నుడువనే గుర భవనంబునన్

నడ్డాక దెగుడు  మెడగొను-వడ్డాణ మల౦కరించె వనితా కుచంబుల్ ‘’

తన కవితా సామర్ధ్యాన్ని గూర్చి చెబుతూ శాస్త్రి గారు –

‘’గడియకు నూరు పద్యములు కల్పన జేయగ జాలి ఎంతయే-గడు నవధానముల్ సలుపు వాడనయై .కవి రాజ నామమున్

బడసి ప్రశంస కెక్కగ బ్రబంధము లెన్నొరచించి ,మించు నే –నుడివెద కృష్ణ మూర్తి నని నూత్న కవీ౦ద్రు లెరింగి కో నిటన్ ‘’

రాజ మండ్రిలో శాస్త్రి గారి స్వగృహం పేరు ‘’సుదర్శన భవనం ‘’.అందులో పై అంతస్తులో పద్మాసనం వేసుకొని కూర్చునే వారు .సందర్శకులు ఎదురుగా చాపల పై ఆసీను లయ్యేవారు .దీన్ని వర్ణిస్తూ శ్రీ ఆర్ .ఎం చల్లా ఆంగ్లం లో ‘’this is the Vatican of the poetic pontiff .The poet and his wife are a hospitable couple .What Words worth said of Milton was true of Krishna Murty  Sastry –

‘’thy soul was like a star  ,and dwelt apart –thou hadst a voice whose sound was like the sea ‘’అన్నారు .ఇన్ని ఉద్గ్రంధాలు రాసి,అందరిలో ప్రధములుగా ఉన్నా’’his work is much praised and less read .He perhaps ranks  first .i can admonish the Andhra reading public  for their indifference to Sripada ;s writings ‘’అని బాధ పడ్డాడు చల్లా .

శాస్త్రి గారి కృష్ణ భారత కవిత్వాన్ని మెచ్చుకుంటూ శ్రీ కాశీ కృష్ణాచార్య ‘’ధారా శుద్ధికి జహ్ను కన్య ,పద సందర్భంపు పూదోట ,భాషా రామామణి దర్పణంబు ,కవితా సామ్రాజ్య సింహాసనం బౌరా –సర్వ రసామృదాంబునిధి ,శయ్యా పాక వ్రుత్యాద్యలం –కారాగారము కృష్ణ భారత మనంగా నెన్న సామాన్యమే ‘’ అన్నారు .శ్రీ మంగు శివరాం ప్రసాద్ శాస్త్రి గారిని ‘’సాహితీ వాచస్పతి ‘’అంటే ,డా దామెర వెంకట సూర్యా రావు ‘’శాస్త్రి గారిని వారిని వరించిన  బిరుదులూ ,పురస్కారాలు ఏ కవికీ దక్కలేదేమో ‘’అన్నారు .

‘’నాకు జాతి మత ద్వేషం లేదు .సర్వమత సమ్మతుడనని చెప్పగలను .పూర్వా చార పరాయణుడనైననూ కాలమును బట్టి సమయోచితముగా ప్రవర్తి౦తు ను ‘’అని చెప్పుకున్నారు శ్రీపాద .శాస్త్రి గారికి శ్రీ జగన్నాధం లో ఇంద్ర ద్యుమ్నం దగ్గర పదేళ్ళ బాలుడు బంగారు బొమ్మవంటి పిల్లగాడు చిన్న గోచీ తో గంజాయి తాగుతూ హిందీ లో తనతో వస్తే అరణ్యం లో లోకాన్ని రక్షించే సింహ రాజాన్ని చూపిస్తాను ‘’అన్నాడట .ఇలాంటి వాళ్ళు మోసగాళ్ళు అని భావించి శాస్త్రి గారు నీటిలో దిగి స్నానిస్తుంటే బాలడు అదృశ్యమయ్యాడట  .అతనికి కొన్ని వేల సంవత్సరాలు ఉండి ఉంటాయని నరసింహ ఉపాసకుడు అని శాస్త్రి గారు గ్రహించారు .మరొక సారి పెద్దపల్లి నుంచి హనుమకొండకు వెడుతుంటే దొంగలు బండీని ఆపి దిగమని హెచ్చరిస్తే ,అకస్మాత్తుగా ఒక పోలీసు సాయుధుడు గా వచ్చి దొంగలను భయపెట్టి  హనుమకొండకు చేర్చి మాయం అయ్యాడట . తనపాలిటి దేవుడే ఆ పోలీసు అనుకొన్నారు.శాస్త్రి గారు రెండు మూడు అచ్చు యంత్రాలు స్థాపించి అనేక పురాతన గ్రంధాలు ప్రచురించి లోకోపకారం చేశారు .’’రోజుకు కనీసం  ఒక ప్రబంధం అయినా రాయగలను ‘’అని చెప్పుకొన్నారు .వారి   అవధానాలలో వ్యస్తాక్షరి ,న్యస్తాక్షరి ,లిఖితాక్షరి ,నిషేధాక్షరి ,దత్తాక్షరి ,ఆకాశ పురాణం,సహ పఠనం ముఖ్యమైన  అంశాలు .వీరు సుందర కాండ రాస్తుంటే ఒక వానరం ఇంట్లో ప్రవేశించి గ్రంధం చుట్టూ తిరిగి ,వీరు చూసేలోపు అంతర్ధానం అయిందట .శాస్త్రిగారికి ప్రధమ కోపం ఎక్కువ .ఆ తర్వాత  ఎంతో మర్యాద చేసేవారట .హృదయం లో కల్మషం ఉండేదికాదు .కాని గ్రాంధిక భాషను మాత్రం వదిలి పెట్టే వారు కాదు .అప్పు చేసి కూడా దాన ధర్మాలు చేసిన పుణ్య మూర్తి .వెంకట శాస్త్రిగారు వీరి శిష్యులే అయినా వ్యవహారం లో షస్టాస్టకం.ఒక సారి గురూ గారితో తగాదా పరిష్కరించుకొందామని వచ్చారు .శాస్త్రి గారు అమాంతం లేచి వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకొని ఆశీర్వదించి భోజనం చేయందే వదలను అన్నారు .’’మన తగాదాల గూర్చి మాట్లాడటానికి నేను వచ్చాను. అది అయితేనే భోజనం ‘’అన్నారు వెంకట శాస్త్రి గారు ‘’నువ్వు భోజనం చెయ్యక పొతే అసలు నీతో నేను మాట్లాడను ‘’అన్నారు శాస్త్రి గారు .భోజనం చేసి మాట్లాడుకొని తగవు పరిష్కరించుకున్నారు. అంతటి వాత్సల్య పూర్ణులు శాస్త్రి గారు .ఒక రామ చిలకను పెంచేవారు .అది పంజరం నుంచి ఎగిరిపోయినా మళ్ళీ వీరింటికి వచ్చి చేతిపై వాలేదట .

‘’వ్యాసుడే మళ్ళీ  రాజమండ్రిలో కృష్ణ మూర్తి శాస్త్రి గారిగా పుట్టారు ‘’అన్నారు శ్రీ బోయి భీమన్న .తాను హరిజనుడను అని చెబితే నమ్మలేదట శాస్త్రిగారు ‘’కులాన్ని బట్టి భాష ఉండదు.గ్రామం లో  ప్రతికులం వారు ఒకే భాష మాట్లాడుతారు .పాత్రోచిత భాష నాకు నచ్చదు ‘’అన్నారట భీమన్నగారితో .శాస్త్రి గారికి కోపం జాస్తి అని అందరూ అంటారు. ఎన్నో కోర్టు కేసులు ఎందరిమీదో వేసి కోర్టు పక్షి అని పించుకొన్నారు .మద్రాస్ ఉమ్మడి రాష్ట్ర మంత్రి శ్రీ బెజవాడ గోపాల రెడ్డితో శాస్త్రిగారు శ్రీ ప్రోలాప్రగడ వారి ఆఫీసుకు వచ్చి ఫోన్ లో మాట్లాడేవారట .ఒక సారి చలికాలం వచ్చి మాట్లాడుతుంటే దంతాలు టకటక శబ్దం చేశాయట –రెడ్డిగారితో ‘’అబ్బాయీ !మనకు ఆస్థానకవి పదవి వచ్చేసినట్లే .కళ్ళు ,పళ్ళు సరిగ్గా లేని వాళ్లకు ఆ పదవి ఇవ్వద్దు అన్నాడట రాజాజీ .మనకి కళ్ళు శుభ్రంగా కని  పిస్తున్నాయి. పళ్ళు ఊడే ప్రసక్తే లేదు కట్టుడు దంతాలు కనుక .కనుక పదవి గారంటీయే ‘’అని పకపక-సారీ ‘’టకటక’’నవ్వారని శ్రీ ప్రోలాప్రగడ చెప్పారు .

శాస్త్రి గారు తిలక్ ,గాంధీజీ లపై నాటకాలు రాస్తే  బ్రిటిష్ ప్రభుత్వం కేసులు పెడితే కోర్టు కొట్టేసిందని ,పంచమ జార్జి చక్రవర్తి పై శ్రీ పాద గ్రంధం రాయటమేకాక పంచ వర్ష ప్రణాళికలు పైనా నాటకం రాసిన బుద్ధి శాలి అని డా .పి ఎస్ ఆర్ అప్పా రావు గారు తెలిపారు .’’వారి పద్య గద్య నాటకాలు సంగీత ప్రధానమై ,ప్రాచ్య ,పాశ్చాత్య లక్షణాలను స్వతంత్ర మార్గం లో ఏర్చికూర్చినవి ‘’అన్నారు శ్రీ ఐ. శ్రీనివాసరావు .శ్రీ విశ్వనాథ ‘’శాస్త్రి గారు పోతే కర్మను మించిన ప్రశ్నవచ్చి దుఖించాల్సి వస్తుంది .రేపు చనిపోతారనగా ఇవాళ కూడా రాసిన మహానుభావుడు .శ్రీపాద, మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఇద్దరూ మహా పురుషులు ,దీర్ఘాయుష్మంతులు  .మన శాస్త్రాలు నిజమైతే ఆయన స్వర్గం లోనే చిరకాలం ఉంటారు ‘’.అన్నారు . శ్రీ తాపీ ధర్మారావు ‘’యువకవులను  ,వృద్ధి లోకి వచ్చే వారిని వారెన్నడూ చిన్న చూపు చూసి ఎరుగరు .’’అనగా ,శ్రీ దాశరధి ‘’ప్రాచీన సాహిత్యానికి ఎంత ప్రతినిధియో ,ఆధునిక సాహిత్యం పట్ల అంత మక్కువ ఉన్న వారు .ప్రాచీన ,ఆధునిక సాహిత్య వారధి శ్రీపాద .ఆయన స్థానాన్ని ఎవరూ పూరించలేరు .ప్రబంధ యుగానికి ఆయనే ఆఖరిమహా కవి ‘’‘’అని కీర్తించారు .

ఇంతటి కీర్తి కాయుని జన్మదినాన్ని ప్రభుత్వం నిర్వహించాలని ,వారి ప్రచురణలు వెలుగులోకి తేవాలని ,వారిజీవిత చరిత్ర ,రచనలను  పాఠ్య అంశాలుగా  చేర్చాలని ,వారి శిలా విగ్రహాన్ని పునరుద్ధరించాలని ,విశాఖ మ్యూజియం లో ఉన్న వారి గండ పెండేరం ,మణి కిరీటం ,మొదలైన వాటిని ప్రజల దర్శనార్ధం ఉంచాలని ,వారి పేర సారకోపన్యాసాలు ఇప్పించాలని ,వారి స్వగృహం ‘’సుదర్శన భవనం ‘’ను ప్రభుత్వం  స్మృతి మందిరంగా మార్చాలని ,వారి అముద్రిత గ్రంధాలను ముద్రించాలని వారి జీవిత చరిత్రను  ఆంధ్ర ,కేంద్ర సాహిత్య అకాడెమీలు ప్రచురించాలని సాహిత్యాభిమాను లందరూ కోరు కొంటున్నారు .

‘’ఒక నన్నయ్యయు ,నొక తిక్కన్న యమాత్యుం డొక్కయెర్రన్న,తా-నొక శ్రీనాధుడు ,నొక్క పోతనయు ,నీ యుర్విం బెడంబాసి ,తా

నకలంకంబుగ కృష్ణ మూర్తి మహనీయాకారము౦ దాల్చి ,యాం –ధ్రికి సేవల్ పొనరించి రంచు దలతున్ శ్రీ పాద  వంశోన్నతున్ ‘’

‘’పునర్జీవిత శ్రీ నాథః-అపరా౦ ద్రీసరస్వతి –రాశీ భూతాత్మ విశ్వాసః –కృష్ణ శాస్త్రీ ర్మహా కవిః’’

ఆధారం – నాకు 15- 3- 17 విశాఖలోఆచార్య సార్వ భౌమ  శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారింట్లో శ్రీ మంగు శివరాం ప్రసాద్ గారు కానుక గా అందజేసిన- శ్రీపాద వారి ప్రపౌత్రులు శ్రీ కల్లూరి శ్రీరాం గారు –(విశ్రాంత ముఖ్య అధికారి –హిందూస్తాన్ షిప్ యార్డ్ –విశాఖ పట్నం )గారు శ్రీపాద వారి 150 వ జయంతి సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -1

కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -1

 

కవి సార్వ భౌమ  ,మహా మహోపాధ్యాయ  కవిరాజ  ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి

శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -1

శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి శత జయంతిఉత్సవం 1966 లో ,150 వ జయంతి వేడుకలు  2016 లో జరిగాయి .వారి అపూర్వ విద్వజ్జీవితం ఈ తరం వారికి తెలియ జేసే ఉద్దేశ్యం తో కొన్ని ముఖ్య విశేషాలు రాస్తున్నాను .

సాక్షాత్తు సరస్వతీ దేవి శ్రీ కృష్ణ మూర్తి శాస్త్రి గారి అవతారం దాల్చిందేమో నని పిస్తుంది .వారొక్కరే భారత రామాయణ భాగవతాలను మూల గ్రంధాలకు ఏ మాత్రం తేడా లేకుండా అనువాదం చేసి శ్రీ కృష్ణభారతం శ్రీ కృష్ణ రామాయణం శ్రీ కృష్ణ భాగవతం అని నామకరణం చేశారు  .శ్రీ నాధుని కవి సార్వ భౌమ బిరుదం శాస్త్రి గారికీ అన్వర్ధమే కాక ఆయనకు బాగా ఇష్టమైన బిరుదు అది .1866 అక్టోబర్ 29 పశ్చిమ గోదావరి జిల్లా ఎర్న గూడెం దగ్గర దేవర పల్లి గ్రామం లో శ్రీపాద వేంకట సోమయాజులు ,శ్రీమతి వేంకట సుబ్బమ్మదంపతులకు జన్మించారు .గారాబం గా స్వేచ్ఛ గా పెరిగారు .చిన్ననాట చదరంగం,గుర్రపు స్వారి లలో మేటి అనిపించారు  .కవిత్వమూ కావ్య నాటక శాస్త్ర జ్ఞానమూ అబ్బింది షోడశ కర్మాంత స్మార్తాన్ని ,చయనానంతశ్రౌతాన్ని ,సోమ పంచకాన్ని అభ్యసించారు .తండ్రి గారికి యజ్న నిర్వహణ లో తోడ్పడ్డారు .12 ఏళ్ళకే కుమార సంభవం  నైషధం లను నేర్చి ,శ్రీనాధునిపై అభిమాన మేర్పడి 16 వ ఏట ‘’సత్యనారాయణో పాఖ్యానం ‘’రాశారు .

ఇతరుల కింద ఉద్యోగం  ఇష్టం లేక గోదావరి లంక  భూముల్ని కౌలుకు తీసుకొని పంట పండక విపరీతంగా పీకలలోతు అప్పుల్లో మునిగి పోయారు .అప్పుల నుంచి బయట పడటానికే అవధానాలు ,కవిత్వం లోకి దిగారు అస్టావ ధాన శతావధాన ,చిత్రావధానాలు చేసి మెప్పు పొందారు .మొత్తం 225  గ్రంథాలు రాశారు .98 పద్య కృతులు ,32 నాటకాలు ,5 శతకాలు ,8 5 వచన రచనలు ,21 విమర్శన గ్రంథాలు ,5 ప్రహసనాలు 9 సంస్కృత గ్రంథాలు  రాసిన ఘనత వారిది .వీరి చివరి కృతి రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారిపై రచించిన సంస్కృత కృతి ‘’రాజేంద్రాభ్యుదయం ‘’.శ్రీ పాద వారు సంపాదకులుగా ‘’గౌతమి ‘’అనే తొలి తెలుగు దిన పత్రిక నడిపారు .వజ్రాయుధం ,కళావతి  ,మానవ సేవ మాస పత్రికలు ,స్వరాజ్యోదయం ,వందే మాతరం అనే పక్ష పత్రికలూ నడిపారు .వారి బొబ్బిలి యుద్ధం నాటకం బహుళ ప్రసిద్ధి పొందింది యజ్న ఫలం నాటకం ఇంటర్ కు బోధనా గ్రంథంగా ఉండి నేను ఇంటర్ మొదటి సంవత్సరం లో దాన్ని నాటకం గా చదువుకొన్నాను .శ్రీ  చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు శ్రీపాద వారి వద్ద చదరంగం ,కొంత సంస్కృత సాహిత్యమూ నేర్చారు .

1930 లో పాలకొల్లు లో శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారికి సువర్ణాభిషేకం ,జరిగింది .1933 లో రాజమండ్రి లో సువర్ణ గండ పెండేరం  ప్రజా సమూహం నిర్వ హించింది .1936 లో విజయవాడ ,సాలూరు లలో గజారోహణ జరిగితే ,1945లో విజయవాడలో మణికిరీట ధారి అయ్యారు .మయూర్భంజ్ లో గజా రోహణ సన్మానం ,1954 లో గుడివాడ లో సువర్ణ పుష్ప పూజ అందుకున్నారు .1950 లో మద్రాస్ ప్రభుత్వం ‘’ఆంధ్ర ఆస్థాన కవి ‘’గా నియమించి గౌరవించింది .ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక వీరిని ఆజీవిత ఆస్థాన కవి గా నియమించింది ,1958 లో రాష్ట్ర పతి ఆ జన్మాంత సంస్కృత పండితునిగా పేర్కొని ‘’సనద్ ‘’పట్ట ప్రదానం చేసి , సంవత్సరానికి 15 00రూపాయల గౌరవ భ్రుతి  కల్పించారు .రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రి పురపాలక సంఘం వారికి ‘’స్వేచ్ఛా పౌరసత్వం ‘’ప్రసాదించాయి .1941 శ్రీపాద వారి శిలా విగ్రహాన్ని రాజమండ్రి పురపాలక సంఘ ఆవరణలో నెలకొల్పి గౌరవించారు .శాస్త్రి గారు 94 వ ఏట 29-12-19 60న శ్రీ పాద పీఠం చేరుకున్నారు .1966 లో శ్రీపాద వారి శత జయంతి వేడుకలను ప్రభుత్వం మూడు రోజులు ఘనంగా నిర్వహించింది .

శాస్త్రి గారి దౌహిత్రులు శ్రీ కల్లూరి సత్యనారాయణ మూర్తి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కార్మిక శాఖలో అధికారిగా పని చేసి ప్రతి ఏటా తాతగారి జయంతిని నిర్వహించారు .శాస్త్రి గారి కోరికపై వారి లభించిన అమూల్య గౌరవ పురస్కారాలను శత జయంతి నాడు  ఆంధ్రవిశ్వ విద్యాలయానికి బహూకరించారు .విశాఖ లో మ్యూజియం ఏర్పడినప్పుడు వీటిలో కొన్నిటిని ఆంధ్రా యూని వర్సిటి వారు 1992 లో వస్తు ప్రదర్శన శాలకు తరలించి ప్రజలు ఈ అమూల్య ఆభరణాలను దర్శించటానికి వీలు కల్పించారు .

ఆధారం – నాకు 15- 3- 17 విశాఖలోఆచార్య సార్వ భౌమ  శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారింట్లో శ్రీ మంగు శివరాం ప్రసాద్ గారు కానుక గా అందజేసిన- శ్రీపాద వారి ప్రపౌత్రులు శ్రీ కల్లూరి శ్రీరాం గారు –(విశ్రాంత ముఖ్య అధికారి –హిందూస్తాన్ షిప్ యార్డ్ –విశాఖ పట్నం )గారు శ్రీపాద వారి 150 వ జయంతి సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక.

సశేషం

సంచిక కవర్ పేజీలు  జత చేశాను చూడండి –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా విశాఖ విజిట్

మా విశాఖ విజిట్

చాలా రోజుల నుండి విశాఖ పట్నం వెళ్లి  మా మైనేని గోపాల కృష్ణగారి అక్క బావా ,డాక్టర్ దంపతులైన శ్రీ రాచ కొండ శర్మ శ్రీమతి అన్నపూర్ణా దేవి గార్లను చూడాలని ఉంది .సుమారు  రెండేళ్ళ క్రితం పరిచయమైన ఆచార్య సార్వభౌమ  శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారినీ దర్శించాలనే కోరిక ఉంది. ఒక సారి మైనేనిగారు కా .రా .మాస్టారి కథానిలయం కు విరాళం ను సరసభారతి ద్వారా చెక్కు రూపం లో అందజేయమని డబ్బు పంపినపుడు నేనే స్వయం గా వెళ్లి శ్రీకాకుళం లోని మాస్టారికిచ్చి ,వచ్చేటప్పుడు శర్మ గారి దంపతులను చూసి వద్దామనుకొన్నా .కాని అప్పుడు అకస్మాత్తుగా శర్మగారికి ఆరోగ్యం బాగుండక హాస్పిటల్ లో ఉన్నందున ఆ ప్రయత్నం మానుకొని పోస్ట్ లోనే కారా మాస్టారికి చెక్కు పంపా . ఈ మధ్య ఒక ఇరవై రోజుల క్రితం మళ్ళీ విశాఖ వెళ్లాలని పించటం, మైనేని వారిద్వారా శర్మ గారికి తెలియ జేస్తే ,వారు  ఆనందించటం, శ్రీ శాస్త్రిగారికి ఫోన్ లో వస్తున్నాననిచెబితే ఎప్పుడు వచ్చినా స్వాగతం  మా మహద్భాగ్యం  అని తెలియ జేయటం జరిగింది .మా అబ్బాయి శర్మ ద్వారా రైల్ టికెట్స్ 15 -3-17 బుధవారం విజయవాడ నుండి విశాఖ కు రత్నాచల్ లో ఏ. సి. చైర్ కార్ లో మా ఇద్దరికీ మనవడు చరణ్ కు , వచ్చేటప్పుడు అదే రోజు రాత్రి విశాఖ లో రాత్రి 8 -30 గం లకు బయల్దేరే గరీబ్ రధ్ లో బుక్ చేసేయటం చకచకా జరిగి పోయింది .నిన్న ఆప్రోగ్రాం ప్రకారం 24 గంటల వ్యవధిలో ఉయ్యూరు నుంచి ఉదయం 4 గంటలకే కారులో  బయల్దేరి విజయవాడ స్టేషన్ చేరటం 6 గంటల రత్నా చల్ లో బయల్దేరటం ,విశాఖ 12 గం లకు చేరటం ,దారిలో ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్  ఉదయం 7 గం లకు, విశాఖ స్టేషన్ లో మేము తెచ్చుకున్న అన్నం తినేయటం ,వెంటనే ఆటో లో శర్మగారింటికి వెళ్ళటం ,అక్కడ 4 -30 దాకా గడిపి శ్రీ శాస్త్రి గారింటికి అటో లో వెళ్ళటం అక్కడ వారి ఆత్మీయతను అందుకోవటం ,బిగ్ బజార్ లో షాపింగ్ చేసి స్టేషన్ చేరి రాత్రి 8-30’’గరీబోడి రధం ‘’(ఫుల్ ఏ .సి .)ఎక్కి పడుకొని అలసట తీర్చుకొని ,రాత్రి 2 గం లకు బెజవాడ చేరటం కారులో 3 -30 కు ఇంటికి రావటం జరిగింది . శర్మ ,శాస్త్రి గార్ల ఇంటిలో మా అనుభవాలను ఇప్పుడు తీరికగా తెలియ జేస్తా .http://wp.me/p1jQnd-aqT

93 ఏళ్ళ వృద్ధ డాక్టర్ దంపతులు డా .శ్రీ రాచకొండ నరసింహ శర్మగారు ,డా శ్రీమతి అన్నపూర్ణాదేవిగార్లు

ఇద్దరికీ 93 ఏళ్ళు .పైకి ఆరోగ్యంగా నే కనిపిస్తున్నారు .ఆమెకు ఏ రకమైన వ్యాధి అంటే బి .పి ,షుగర్ ల వంటివి ఏవీ లేవు   ఒక్క మందు బిళ్ళ కూడా మి౦గాల్సిన అవసరం లేకపోవటం  ఎంతో అదృష్టం .కొద్దిగా వినికిడి తక్కువ .రోజూ కనీసం రెండు గంటలు ఏదో ఒకటి చదవటం ఆమెకు ఇష్టం .చదవకుండా ఉండలేరామే.కొంత జ్ఞాపక శక్తితగ్గింది .చక్కగా తానే లేచి నుంచొని ,నడవటం చేస్తారు .అయినా శర్మగారు ఆమె ఆరోగ్య విషయం లో అత్యంత శ్రద్ధ చూపించి 24 గంటలూ షిఫ్ట్ పద్ధతిలో ఒక నర్స్ ఆమెను జాగ్రత్తగా కాపాడుతూ ఉండే ఏర్పాటు చేశారు .ఆమె అంటే ఆయనకు ప్రాణం .ఆమెకూ ఆయనంటే గొప్ప ఆరాధ్యం .అందుకే ఆ దంపతులు హాయిగా మానసికంగా చాలా బలంగా శారీరకం గా దృడం గా లేకపోయినా మానసికం గా మహా బలం గా ఉండి జీవితం కొన సాగిస్తున్నారు .పిల్లందరూ ఎదిగి డాక్టరీ చదివి వివాహాలు అయి అమెరికాలో స్థిర పడ్డారు .వీరిద్దరూ డాక్టర్ వృత్తిలో విశాఖ ,ఇతర ప్రాంతాలలో ఐతర దేశాలలో సేవలు అందించి 2004 నుండి విశాఖ లో స్వంత ఇల్లు ‘’రాచకొండ రెసిడెన్సి ‘’లో ఉంటున్నారు .2008లో ఈ దంపతులు అమెరికా లో పిట్స్ బర్గ్ లో ఉన్నారు అప్పుడు మేము మూడో సారి అమెరికా వెళ్లి మిచిగాన్ లో స్టెర్లింగ్ హిట్స్ లో ఉన్న మా అమ్మాయి చి. సౌ విజయలక్ష్మి,అల్లుడు  శ్రీ అవధాని గార్ల ఇంట్లో ఉన్నాం .శర్మగారు నాకు కవితలు ,పుస్తకాలు పంపటం ,నేను వెంటనే చదివి తిరుగు మెయిల్ టపాలో వాటిపై స్పందించటం జరిగేది .దానికి ఆయన చాలా ఆశ్చర్య పోయేవారు .వారితో పరిచయమూ తమాషాగానే జరిగింది .

శ్రీ మైనేని గారు ఉయ్యూరు శాఖా గ్రంథాలయానికి భూరి విరాళం అందించటం ,దాన్ని ఏ .సి .లైబ్రరీగా కట్టే ప్రయత్నం లో ఎం .ఎల్. సి  శ్రీ రాజేంద్ర ప్రసాద్ నన్ను కన్వీనర్ గా చేసి ఒక కమిటీ ఏర్పాటు చేయటం మైనేని గారి అన్నగారు శ్రీ తాతయ్య గారూ  నేనూ కలిసి బిల్డింగ్ వర్క్ చూసి అతి తక్కువ కాలం లోనే పూర్తి చేయటం,2004 లో దాని ప్రారంభోత్సవానికి మైనేని గారు రావటం ,అప్పుడే శర్మగారూ రావటం తో ఇద్దరితో ఒకే సారి పరిచయం కలిగింది  .అప్పటినుంచి శర్మగారి ఆ౦తరంగికులలో నేను చేరిపోయాను మైనేని వారితో బాటు .శర్మగారి 90 వ జన్మ దినోత్సవం నాడు నేను రాసిన ‘’పూర్వా౦గ్ల కవుల ముచ్చట్లు ‘’వారికే అంకితమిచ్చి ఆవిష్కరణ జరిపాం. ఖర్చు అంతా మైనేని వారిదే .ఇలా  వృద్ధి  పొందిన ఆత్మీయత క్రమంగా బలపడి వారు సరసభారతికి అప్పుడప్పుడు విరాళం పంపటం నేను కృతజ్ఞతలు చెప్పి స్వీకరించి వారి పేరును పుస్తకాలో ప్రచురించటం జరుగుతూ మన పుస్తకాలు వారికి పంపటం వారి పుస్తకాలు నాకు పంపటం జరుగుతోంది .ఈబంధమే వారిని మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత కలుసుకోవటానికి ఆతురత చూపించింది .మైనేని వారిని అప్పుడూ ,ఆతర్వాత నాలుగో సారి అమెరికాకు 2012 లోమేము  వెళ్ళినప్పుడు నన్నే వారి వేటపాలెం (హాంట్స్ విల్ )కు పిలిపించుకోవటం మూడు రోజులు వారింట్లో ఉండటం తో ,రెండవ మారు చూసే అదృష్టం కలిగింది .నిత్యం’’ మెయిల్ మొయిల్ ‘’ద్వారా కలుస్తూనే ఉంటాం .అది వేరే విషయం .

శర్మ గారింట్లో నిన్న వారి చెల్లెలు , విశాఖ ప్రభుత్వ మెడికల్ కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ ,ఆమె కుమారులు అ౦తర్జాతీయ ప్రముఖ డాక్టర్ శ్రీ శ్రీధర్ గార్ల పరిచయం కలిగింది .అందరూ అందరే మహా ప్రతిభా సంపన్నులు .శర్మ గారి అన్నగారు రా .వి .శాస్త్రి , ప్రోలిటరేటియట్లపై అద్భుత కథా ప్రముఖ కథా, నవలా రచయితా ,  పేదలకు రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా కేసు చేబట్టి న్యాయం చేకూర్చిన ఆడ్వోకేట్, స్వర్గీయ రాచకొండ విశ్వ నాద శాస్త్రి  గారు .శర్మ గారి అన్నగారు ప్రసిద్ధ రైల్వే ఇంజనీర్ ఎన్నో నూతన రైలు మార్గాలను నిర్మించిన ఆదర్శ ఇంజనీర్ .లంచానికి ఆమ్యామ్యా కి అతి దూరం. నిర్దుష్టంగా విధి నిర్వహణ చేసినవారు .శర్మ గారి తండ్రిగారు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు ఇతరులకు మేలు చేసి ఆస్తి హారతి కర్పూరం చేసుకొన్న వదాన్యులు మాస్టర్ సి వి గారి ముఖ్య శిష్యులు . .ఇప్పుడు  శర్మ గారి రాచకొండ రెసిడెన్సి వారి తండ్రి గారి నుంచి సంక్రమించిన  స్థలం లో నిర్మించినదే .దీనికి ఎదురుగా దాదాపు సముద్ర తీరం వరకు ఒకప్పుడు వీరి జమానాలోనే ఉండేదట .శర్మ గారి మేనల్లుళ్ళు ,అన్నగారి కుమారులు అందరూ ఇక్కడే ఫ్లాట్ లలో ఉంటూ హాస్పిటల్ నిర్వహిస్తూ ప్రజా సేవలో ఉన్నారు .   ‘’మా అన్నయ్య అందరికీ మంచి ఆరోగ్య సూత్రాలు బోధిస్తాడు .కాని తాను ఆచరించిన పాపాన పోలేదు .అందుకే కంటి చూపు దాదాపు లేదు .తన విషయం లో విపరీతమైన తాత్సారం అశ్రద్ధ . అదే మా  వదిన  విషయం లో కాని, మా విషయం లో కాని ,తాత్సారం చేయడు మమ్మల్ని చేయ నివ్వడు ‘’అని మొత్తుకున్నారు శర్మగారి సోదరి .’’రోజూ ఇంత గోధుమపిండి నీళ్ళలో కలుపుకొని హోటల్ నుంచి చప్పిడి రుచి లేని కూరలు తెప్పించుకొని   ఆ సూప్ లాంటి దానిలో నంచుకొని తింటాడు .ఇంక బలం ఏమి వస్తుంది “’అని బాధ పడ్డారామే .కంప్యూటర్ పనికి ,తాను చెప్పింది టైప్ చేయటానికి ఒక కుర్రాడిని పెట్టుకున్నారు . వీరి కుమార్తెలు  తలిదండ్రులను అమెరికా తీసుకు వెళ్ళే ప్రయత్నం లో ఉన్నారు . అన్నపూర్ణ గారు ‘’ఇక్కడే బాగుంది అక్కడికి ఎందుకు ‘’?అంటున్నారట .ఈ లోగా తాను ఇన్నేళ్ళుగా సమకూర్చుకున్న అతి విలువైన గ్రంధాలయం లోని పుస్తకాలను శర్మ గారు స్థానిక లైబ్రరీలకు ఉదారం గా ఇచ్చేసి కొంత బరువు తగ్గించుకొంటున్నారు .నాకు కావాల్సినవేవైనా తీసుకోమని అంటే ‘’సామల సదాశివరావుగారి ప్రత్యేక సంచిక ఏప్రిల్- సెప్టెంబర్ ‘’ జయంతి ‘’సంచికను ,జాన్ మాకే రాసిన ‘’ది స్టోరీస్ ఆఫ్ దివరల్డ్స్ లిటరేచర్ ‘’గ్రంథాన్ని వారికి చెప్పి ‘’నోక్కేశాను .’’

శాస్త్రి గారికి ఒక ఉత్తరీయం కప్పి దంపతులిద్దరికీ శాలువా కప్పి సరసభారతి తరఫున మా దంపతులం వారి సోదరి మేనల్లుడు ల సమక్షం లో  సత్కారం చేశాం  .శర్మగారు మా మనవడిని ఆశీర్వ దించి 5 వేల రూపాయలు నగదు బహుమతిని అందజేశారు .ఆ వృద్ధ దంపతులకు శిరసు వంచి మేము పాదాభి వందనం చేసి అదృష్ట వంతులమయ్యాం . ‘’శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి ‘’గారి శతజయంతి సందర్భం గా శాస్త్రి గారిపై ,డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారిపై  రాసిన వ్యాసాలతో వెలువరించిన  ప్రత్యెక సంచిక ,సరసభారతి శ్రీ హేవలంబి ఉగాది వేడుకల ఆహ్వాన పత్రం అంద జేశాను .

మా కోసం స్వీటు పళ్ళు తెప్పించారు. విశ్రాంతికి గది ఏర్పాటు చేశారు .మా మనవడు బీచ్ చూస్తానంటే వారి అసిస్టంట్ నిచ్చి పంపించి చూసే ఏర్పాటు చేశారు శర్మగారు .వారు ప్రస్తుతం డా .యెన్ .గోపి గారి ఎన్నో కవితలను ఆంగ్లం లోకి అనువదిస్తున్నారు .కంటి చూపు లేకపోయినా మైక్రోస్కోపిక్ గ్లాస్ సహాయం తో .అదీ వారి సాహితీ దీక్ష .వైద్య రంగం లో ,విద్యా సాహిత్య రంగం లో రెండింటిలోను సవ్య సాచి డాక్టర్ శ్రీ శర్మగారు .ఎన్నో సాహితీ సంస్థలతో సంబంధాలున్నాయి .12 వ తేదీన వారి పుస్తకం ఒకటి ఆవిష్కరణ జరిపించారు .అందుకని నన్ను వారి సాహితీ మిత్రులకు పరిచయం చేయాలనే తహతహ తో ఎందరికో ఫోన్ మీద ఫోన్ చేసి వారింటికి వచ్చెయ్యమని కోరారు .ఎవరి పనిలో వారుంటారు కదా ,ఇంతలో మమ్మల్ని శ్రీ వేదుల వారు వారింటికి సాయంత్రం 5 గంటలకు తప్పక రమ్మని  ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు .కనుక శర్మ గారి మిత్రులిద్దరూ అక్కడే శాస్త్రి గారింట్లో నే కలుస్తామని వీరికి చెప్పారు . శ్రీ శర్మగారి దంపతులు ‘’శతమానాధికం ‘’ ‘’జరుపుకోవాలని వారి ఆరోగ్యాలు సుస్థిరంగా ఉండాలని  వారి మానసిక బలానికి జేజేలు పలుకుతున్నాను .శర్మ గారి దంపతులకు సాదర కృతజ్ఞతలు తెలియ జేసి మేముముగ్గురం వారి అసిస్టెంట్ సాయం తో ఆటో లో బయల్దేరి శ్రీ శాస్త్రి గారి గృహం చేరాం .ఆ ముచ్చట్లు కింద రాస్తున్నాను .

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

శ్రీ శాస్త్రి గారు సుమారు రెండేళ్ళ క్రితం వారి అమూల్య గ్రంధాలను నాకు పంపారు .అందిన వెంటనే  అందులో ఉన్న వారి ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి పుస్తకాలు అందాయని ధన్యవాదాలు తెలియ జేసి ‘’నా గురించి మీకు అసలు ఎలా తెలిసింది అడ్రస్ ఎలా తెలుసుకున్నారు ‘’అని ఆశ్చర్యంగా అడిగాను .’’ఎలాగోలా తెలుసుకున్నాను .మీ గురించి ఇక్కడి మా వాళ్లకు చాలామందికి తెలుసు .వారి ద్వారా తెలుసుకొని మీకు పంపాను ‘’అన్నారు అవాక్కయ్యాను .అదిగో అప్పటి నుంచి వారితో పరిచయం పెరగటం మా సరసభారతి పుస్తకాలు వారికి పంపించటం వారు రాసినవి నాకు పంపటం .అందుకని రెండవ గీర్వాణం మొట్టమొదటగా వారి గురించే రాశాను నెట్ లో. అది పుస్తక రూపం దాల్చినప్పుడు కవుల కాలం బట్టి కూర్చటం తో ఆ వరుసలో వారి గురించి వ్రాసింది వచ్చింది. వారి గురించి రాశానని చెప్పాను చాలా ఆనందించి ఆ పుస్తకం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు .మొదటి రెండు భాగాలు చదివి వారు ‘’మీ రచనలో గొప్ప రీడబిలిటి ఉంది .అది నన్ను చకితుడిని చేస్తోంది. వాటిలో రోజూ ఏదో ఒక వ్యాసం చదవకుండా నేను ఉండలేక పోతున్నాను ‘’అని ఫోన్ లో తలియ జేసి ఆశీర్వదించి అభినందించిన సజ్జన వరేణ్యులు శాస్త్రిగారు . ఈ మధ్యనే వారు తాత్పర్య సహితంగా రాసిన పుష్పదంతకవి ‘’శివ మహిమ్న స్తోతం ‘’నాకు పంపటం దాన్ని అంతర్జాలం లో ఇంకొంచెం సులభతరం చేసి సీరియల్ గా రాయటం జరిగింది .శాస్తిగారు ప్రసన్న భారతి మాసపత్రిక లో ‘’రెండవ గీర్వాణమ్ ‘’పై  సంక్షిప్తంగా చక్కని వ్యాసం రాశారు .అలాగే ఆపత్రికలోను ,కళా గౌతమి లోను నేను వారిపై అందులో వ్రాసిన వ్యాసాన్ని ప్రచురించారు .వారి శ్రీమతి గారు కూడా గొప్ప విదుషీమణి . భర్త కు  అన్నివిధాలా సాహిత్యం లో చేదోడు వాదోడుగా ఉంటారు .

శాస్త్రి గారి దంపతులకుమేము ముందు సన్మానం చేద్దామని సిద్ధమవుతుంటే వారు వారించి ‘’మీరు మా అతిధులు ముందు మా సత్కారం మీరు స్వీకరించాలి ‘’అని నచ్చ జెప్పారు .కాదనలేక పోయాం .వారు మా ఇద్దరినీ ఆత్మీయంగా సత్కరించాక మేమిద్దరం ఆ దంపతలకు గౌరవ సన్మానం  సరసభారతి తరఫున చేసి పాదాభి వందనం చేసి వారి ఆశీర్వచనాలు అందుకున్నాం. ఎన్నో రోజుల కల ,కోరిక ,ఈ నాడు నెరవేరింది .ఉగాదికి ముందే ఒక విద్వత్ కవి పండిత  శ్రేష్టులను సత్కరించే అదృష్టం మాకు దక్కింది. చాలా ఆనందం కలిగింది . ‘’శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి ‘’గారి శతజయంతి సందర్భం గా శాస్త్రి గారిపై ,డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారిపై  రాసిన వ్యాసాలతో వెలువరించిన  ప్రత్యేక సంచిక ,సరసభారతి శ్రీ హేవళంబి  ఉగాది వేడుకల ఆహ్వాన పత్రం అంద జేశాను .

శర్మ గారి కోరిక పై నన్ను కలవటానికి శాస్త్రి గారింటికి వచ్చిన విశాఖ సారస్వత వేదిక నిర్వాహకులు శ్రీ మంగు శివరామ ప్రసాద్ ,ప్రసన్న భారతి సంపాదకులు శ్రీ డి. వి .సుబ్బారావు గార్లతో ఆత్మీయ పరిచయం కలిగింది .వారికి సరసభారతి గురించి ,నా గురించి శ్రీ శర్మగారిద్వారా బాగా తెలుసునని అన్నారు .అలాంటి సాహితీ మిత్రులను చూచినందుకు మహదానందం కలిగింది .వారిద్దరూ ‘’ఈ సారి విశాఖ కు మీరు మా ఆహ్వానం పై రావాలి మాతో గడపాలి మీ ప్రసంగం మేము వినాలి ‘’అని కోరారు .తప్పక వస్తానని అది నా కర్తవ్యమని చెప్పాను .వారిద్దరు బహు విలువైన ఒక రకం గా అమూల్యమైన గ్రంధాలు -1-శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి జయంతి విశేష సంచిక 2-శ్రీడి .వి .సూర్యారాగారి ‘’సద్గమయ ‘’3-ఆర్ష విజ్ఞాన పరిషత్ ప్రచురణ ‘’మృదుల ‘’గారి భావ వీచికలు 4-శ్రీమతి చర్ల సుశీల గారి జీవిత చరిత్ర 5-‘’కవిగారు ‘’శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారి జీవిత చరిత్ర ‘’కవిగారి మనుగడ ‘’6-శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి ‘’భగవద్గీత ‘’అనువాదం  ‘’7-శ్రీమతులు చర్ల విమల ,మృదుల రాసిన ‘’గీతామృతం ‘’8-ప్రసన్న భారతి ‘’జనవరి సంచిక అందజేశారు . వారికి ఎంతో కృతజ్ఞుడను .

ఇలా పండిత శ్రేస్టులు మహా కవి విమర్శకులు  డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు డా శ్రీ గుమ్మా సాంబశివ రావు గారు మొదలైన వారెందరికో పి. హెచ్ .డి .కోసం మార్గ దర్శనం చేసిన ఆచార్య సార్వ భౌముల దర్శనం చేయటం వారు మాకు ఆత్మీయ సత్కారమందించటం వారిని సన్మానించే గొప్ప అదృష్టం మాకు లభించటం మా భాగ్య గరిమ గా భావిస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-3-17 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

15-3-17 బుధవారం విశాఖ లో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గ్గరి ”శారదా పీఠం ”లో వారితో మేము

15-3-17 బుధవారం విశాఖ లో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గ్గరి ”శారదా పీఠం ”లో వారితో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవ సమీక్ష

శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవ సమీక్ష

‘’రాయికైనా ఆయన పాఠం చెబితే రావాల్సిందే –రాకపోవటం అనేది లేదు ‘’అని ప్రసిద్ధి పొందిన  వారు మహా మహోపాధ్యాయ శ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రి గారు .కంచి పరమాచార్యులకు అత్యంత సన్నిహితులు . ద్వైత అద్వైత విశిష్టాద్వైతు లందరికీ ఆదర్శ గురు మూర్తి .వారి౦టి లోనే  ఉండి చదువుకొన్నవారెందరో శిష్యులున్నారు .వారి శిష్యపరంపర అగణితం .అందరూ వివిధ శాస్త్రాలలో అమోఘ   పాండిత్యం ఆ గురు మూర్తి వలన పొంది లబ్ధ ప్రతిష్టులై,అత్యున్నత పదవులలో రాణిస్తున్నారు .ఆయన జీవితకాలం లోనే శిష్యులందరూ కూడి ఫాల్గుణ బహుళ పాడ్యమి శాస్త్రి గారి జన్మ దినం రోజు ,శాస్త్రార్ద చర్చలు ,పండిత పురస్కారాలు చేస్తూ చక్కని పర౦పరను సృష్టించారు .ఇప్పడు శ్రీ మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలను దేశం లోని  అనేక రాష్ట్రాలలో ,రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలలో ఉన్న శిష్య బృందం అందరూ కలిసి ఘనం గా 11-3-17 నుండి 13 -3-17 వారి జన్మ దినం ఫాల్గుణ బహుళ పాడ్యమి వరకు  మూడు రోజుల పాటు ఘనంగా విజయవాడలోని శివ రామ కృష్ణ క్షేత్రం లో అంటే మాణిక్య శాస్త్రి గారు 30 సంవత్సరాలు ఏకధాటిగా  సకల పురాణ ప్రవచనం చేసిన  కార్య క్షేత్రం లో నిర్వహించారు .

11-3-17 –శనివారం     మొదటి రోజు ఉదయం గో పూజ ,గురుపూజ నిర్వహించి, అంతకు ముందు రెండు  రోజులుగా నిర్వహించిన హోమానికి   పూర్ణా హుతి జరిపారు .ఉదయం 9 గం లకు  సభ ప్రారంభమైనది .ఉదయం 10-45 వరకు ‘’తైత్తిరీయ ఉపనిషత్ ‘’భాష్య ప్రవచనం ,అద్వైత సిద్ధిలో ‘’అనుమాన బాదోద్ధార ‘’విచారం శాస్త్ర చర్చ జరిగింది .ఉదయం 11 గం లకు మాణిక్య శాస్త్రిగారి ముఖ్య శిష్యులు ,ప్రస్తుత బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ న్యాయ శాఖ ప్రొఫెసర్ డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి  గారు- నేను రచించిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ బాగం ‘’నుండి మాణిక్య శాస్త్రి గారి పై ,శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి పై రాసిన వ్యాసాలను సంగ్రహించి ఒక ప్రతేక సంచిక (బుక్ లెట్)గా సరస భారతి చేత రూపొందించి స్వంత ఖర్చులతో ముద్రించి ఉదయం  శ్రీ మాణిక్య శాస్త్రి గారి పెద్దకుమారులు శ్రీ సూర్యనారాయణ ఘనపాటి గారిచే ఆవిష్కరణ జరిపించి ,అందరికి పంచిపెట్టించారు . మధ్యాహ్నంవిందు భోజనం .చేతి వ్రేళ్ళ సందులలోనుంచి జారిపోయేట్లు ‘’స్నేహం ‘’అంటే నెయ్యి వడ్డించి శుస్టు గా ,అందరూ సంతృప్తిగా భుజించేట్లు కొసరి కొసరి వడ్డించి ,తినిపించి ఆనందించారు .

మధ్యాహ్నం 3 గం నుండి 5 గం వరకు శాస్త్రార్ద చర్చ ఆ తర్వాత 6 -30 నుండి 8 గం వరకు సంగీత విభావరి జరిగాయి .    రెండవ రోజు 12-3-17 ఆదివారం ఉదయం 8-30 గం నుండి 10 గం వరకు బ్రహ్మ సూత్ర శంకర భాష్యం లో’’ఈక్ష్త్యత్యధికరణ ప్రవచనం .10 గం నుండి 12-30 వరకు అద్వైత సిద్ధిలో అనుమాన బాధోద్ధార –విచారణ

మధ్యాహ్నం 3 గం నుండి 5-30 గం వరకు ‘’శాస్త్రార్ధాలు ‘’.సాయంత్రం 6-30 గం నుండి ‘’పండితోపన్యాసాలు ‘’

జరుగుతాయని ఆహ్వాన  పత్రిక లో ఉంది .నేను ఆ రోజు వెళ్ళ లేదు కనుక  జరిగే ఉంటాయి .

మూడవ రోజు 13-3-17 సోమవారం శ్రీ మాణిక్య శాస్త్రిగారి జన్మదినం –ఉదయం 8-30 నుంచి 10 గం వరకు భగవద్గీత లో అస్టమాధ్యాయం .10 గం నుండి 12 -30 వరకు ‘’సిద్ధాంత బిందు టీక’’లో విచారము .

మధ్యాహ్నం 3 గం నుండి 5-30 వరకు శాస్త్రార్ధాలు .జరిగే ఉంటాయి .

సాయంత్రం 6 30 నుండి 7-30 వరకు సమాపన ఉత్సవం –గురువరేణ్యు లు శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శేముషీ వైభవం పై పండితుల ,శిష్యుల ఉపన్యాసాలు .రాత్రి 7-30 గం లకు పండిత సత్కారాలు , వేద స్వస్తి ,వందన సమర్పణ .

నిన్న అంటే 13 వ తేది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు ,శ్రీ మద్దులపల్లి దక్షిణామూర్తి గారు ఫోన్ చేసి’’ సాయంత్రం పండిత సత్కారం లో మీకు కూడా సత్కారం చేయాలని అనుకొంటున్నా౦ దంపత్యుక్తంగా రావలసినదని ఆహ్వానించారు .పెద్దల ఆహ్వానం శిరోధార్యం కనుక ,నేను ఏ రకంగానూ పండితుడిని కాదు కనుక ,పండితుల సమక్షం లో సన్మానం కనుక ,జిహ్వ చాపల్యమూ ఉంది కనుక, వస్తాను అని చెప్పి మేమిద్దరం మా మనవడు చి చరణ్ తో కలిసి 5-30 గం లకు శివ రామ కృష్ణ క్షేత్రం చేరాము .అప్పటికి ఇంకా ఉపన్యాసాలు జరుగుతున్నాయి .వారెవరో పేరు తెలియదుకాని అనర్గళం గా గంగా ప్రవాహ సదృశంగా గీర్వాణ భాష లో మాట్లాడి సభా రంజనం చేశారు  .వారికి నా నమస్సులు .మద్దుల పల్లి వారి శిష్యులు వారి వారి అనుభవాలను మనసుకు హత్తు కోనేట్లు వివరించి చెప్పారు .అందులో నేను అంతర్జాలం లో  మూడవ గీర్వాణం లో రాసిన డా వెంపటి కుటుంబ శాస్త్రి గారు కూడా ఉండటం మహా దానందం కలిగించింది .తనకేమీ తెలియదని మొదలు పెట్టి ,చివరికి మనకేమీ తెలియ దన్నట్లు గా వారు ప్రసంగించిన తీరు అద్భుతం అని పించింది .శ్రీ గబ్బిట వారూ   అంతేవాసిగా తమ అనుభవాలను  గుదిగుచ్చి చెప్పారు .డా ధూళిపాళ రామ కృష్ణ గారూ గురువుగారి  పరిపూర్ణ కటాక్షాన్నివివరించారు . మాణిక్య శాస్త్రిగారి కుమారుడు శ్రీ  దత్తాత్రేయ  శాస్త్రిగారు తండ్రి గారి బాణీలో ,అదే స్వరం తో వారు ప్రవచనం చెప్పి నట్లు అర్ధవంతమైన ప్రసంగం చేసి ఆకట్టు కొన్నారు .సభా సంచాలనం శ్రీ విశ్వ నాథ గోపాల కృష్ణ గారు చేశారు .అంతా విన్న తర్వాత నా మనసులో ఒక మాట మెదిలి  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి చెవిలో  చెబితే ‘’ఆ మాట ఈ ముఖతా చెబితే గౌరవం గా ఉంటుంది ‘’అని నన్నే చెప్ప మన్నారు .నేను ‘’అందరికీ నమస్కారం .అందరూ మహానుభావులు .దిగ్దంతులైన పండిత శ్రేస్టులు .నేను మాణిక్య శాస్త్రి గారి గురించి రెండవ గీర్వాణం లో రాయటానికి ఎంద రెందరినో ఆశ్రయించాను. ఎవరి వద్దా సరైన సమాచారం లేదు .చివరికి శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి వలన మద్దు లపల్లి వారబ్బాయి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి పరిచయం కలిగి ,వారు పంపిన రెండు పుస్తకాల నుండి విషయ సేకరణ చేసి రాశాను .ఇక్కడ ఈ మూడు రోజులుగా మీరందరూ మాణిక్య శాస్త్రి గారి ప్రతిభా విశేషాలను ఎవరి అనుభవాన్ని బట్టి వారు చాలా వివరం గా తెలియ జేశారు .ఇంతమంది విద్వజ్జనం ఈ సభకు రావటం ఆశ్చర్యం .అది శాస్త్రి గారి పై ఉన్న విశేష అభిమానానికి చిహ్నం .మీరందరి ప్రసంగాలను వ్రాత పూర్వకం గా ఇక్కడి నిర్వాహకులకు అందజేసి వాటిని ఒక పుస్తక రూపంగా తెస్తే మాణిక్య శాస్త్రి గారి పై కొంతవరకు సమగ్రమైన పుస్తక౦ వస్తుంది. ఆ ప్రయత్నం అందరూకలిసి చేసి సమగ్ర గ్రంధాన్ని ఆ మహానీయునిపై త్వరలో తీసుకు రావలసినదిగా అభ్యర్ధిస్తున్నాను .నేను రాసింది ఆవగింజలో అరవై వ భాగమే .ప్రస్తుతం అదే అందరికి కర దీపిక గా ఉండటం  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి పూనికా నా అదృష్టం’’అన్నాను .అంతా బాగానే ఉందన్నారు .నిజంగా అందరూ కలిసి ఆలోచించి పని చేసి ఉంటె ఈ సభలోనే మాణిక్య శాస్త్రి గారి పై ప్రత్యెక సంచిక సమగ్రంగా సర్వ విషయాలతో ఆకర్షణీయంగా రూపొండేది ఆ ఆలోచన ఎందుకు చేయలేక పోయారో నిర్వాహకులు అంతు చిక్క లేదు .

శ్రీ ఆంజనేయ శాస్త్రిగారు తమ గురు వరేణ్యు లు శ్రీ మాణిక్య శాస్త్రి గారి కుమారులకు వస్త్ర ,ధన రూపం గాసత్కరిస్తూ ,పనిలో పనిగా నాకూ ఆ సత్కారం చేసి నన్ను రుణ గ్రస్తుడిని చేశారు  . మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారు అన్నట్లు ’’ వేద పండు ‘’ లు ఇందరి ముందు నాకు సన్మానం చేయటం ఆంజనేయ శాస్త్రి గారి విశాల హృదయానికి తార్కాణ,నాపరమ అదృష్టం .ఈవిధంగా సుమారు 100 మందికి పైగావేద, శాస్త్ర విద్వాంసులను ఘనంగా సత్కరించి  శత జయంతికి ఘనత చేకూర్చారు .ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు .

కొసమెరుపు –శత జయంతి ఉత్సవాలు షడ్ర సోపేత భోజనాదులతో  వైభవంగానే జరిగాయని పించాయి .ఆహ్వానాలు అందరికీ అందలేదని కొందరికి మాత్రమే చేరాయని  ఆహ్వానాలు వేరు కరపత్రాలు వేరుగా ఉన్నాయని ,వాట్సప్ లో   పంపి చేతులు దులుపుకున్నారని గుసగుసలు వినిపించాయి .   ఆహ్వానం లో ఎవరెవరు వచ్చి పాల్గొంటున్నారో వారి వివరాలు రాయక పోవటం దారుణం .మూడు యూని వర్సిటీ లకు వైస్ చాన్సలర్ గా పని చేసి ,పారిస్ లో ఉన్న ’’ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్’’కు అధ్యక్షులుగా ఉన్న శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారి పేరే ఆహ్వాన పత్రికలో లేక పోవటం చాలా వింతగా ఉంది. సంగీత కచేరీ చేసిన ఆమె పేరూ ముద్రించక పోవటం బాధ్యతా రాహిత్యం అని పించుకోదా?వేదికపై పసంగించేవారు వారి ధోరణలో వారు సంస్కృత లోకం లో విహరిస్తూ ఉంటే ప్రేక్షక స్థానం లో ఉన్నవారు ఎవరి వ్యాసంగం లో వారు ఉండి పోయి, వక్తకు నిరాశే మిగిల్చారు .

మూడు రోజుల కార్య క్రమ౦ లో శాస్త్ర చర్చలు అందులో నిష్ణాతులకు మాత్రమే కదా,మిగతావారికి అందులో ఆహ్లాదం ఉండక పోవటం సహజం .కనుక మధ్యమధ్యలో వారి ప్రసంగ సారాంశం తెలుగు లో చెప్పి ఉంటె కొంత ఆకర్షణ ఉండేది .

ఇంత పెద్ద కార్యక్రమం  ఇద్దరు పీఠాది పతుల ఆశీస్సులతో నిర్వహిస్తూ కూడా మీడియా వారికి తెలియ జేయక పోవటం ఇక్కడ జరిగిన విషయాలు పత్రికా ముఖంగా ప్రచురణ భాగ్యానికి నోచుకోక పోవటం ఆశ్చర్యం .దీనికి బాధ్యులెవరు ? వేదిక మీద ఎప్పుడూ ఒకే పెద్దాయన ఉండి మిగిలిన వారికి సరైన గౌరవం దక్కలేదనే  నిట్టూర్పులు వినిపించాయి .లక్షలు ఖర్చు పెట్టి చేసిన కార్యక్రమం అందరి తోడ్పాటుతో ,అందరి ప్రాతినిధ్యం తో ,ఎంతో స్పూర్తి దాయకం గా పరి సమాప్తి కావాల్సింది .అలాజరగ లేదనే అని పించింది .ఇంతటి కార్య క్రమాన్ని వీడియో తీయించలేక పోవటం, రికార్డ్ చేయించలేక పోవటం ప్రసార మాధ్యమాల విలువ విపరీతం గా ఉన్న ఈ కాలం లో నచ్చని పని .అయితే కొందరు ఉత్సాహ వంతులు స్వంత వీడియో కెమెరాలతో వారికి కావలసినవి వీడియో తీసుకున్నారు .ఇప్పటికైనా మించి పోయింది లేదు వారి వద్ద సేకరించి ఒక సమగ్ర సి .డి. గాతీసి చానల్ వారికిస్తే ప్రపంచ వ్యాపితంగా కార్యక్రమ౦ తెలుస్తుంది .

వీటన్నిటికి మించి మరొక పెద్ద లోపం –చివరి రోజు సాయంత్రం సభను బహిరంగ సభగా నిర్వహింఛి  బెజవాడలోవివిధ రంగాలలో ప్రముఖులను కూడా ఆహ్వానించి వారి ఉపన్యసాలనూ ఏర్పాటు చేస్తే, మాణిక్య శాస్త్రి గారి మాణిక్య ప్రభా విశేషం లోక విదితమయ్యేది . ఈ ఆలోచన రాక పోవటం విడ్డూరం .

మొదటి రోజు నేను వెళ్ళినప్పుడు ఒక 70 ఏళ్ళ ముసలావిడ ‘’బాబూ ! ఉదయం 6 అయిందంటే ఇక్కడ మేమందరం కనీసం మూడు వందలమంది మాణిక్య శాస్త్రి గారి ప్రవచనం వినటానికి హాజరయ్యేవారం .ఆ అభిమానమే మళ్ళీ ఇక్కడికి మమ్మల్ని రప్పించింది ‘’అన్నది .ఆమె మాటలకు నాకు ఒళ్ళు గగుర్పొడిచింది. అంతటి అభిమానం సంపాదించారు శాస్త్రి గారు .

లోపాలను చూపటమే ధ్యేయం కాదునాది .మరింత స్పూర్తిదాయకం గా నిర్వహిస్తే సంతృప్తి ఆనందం దక్కేదికదా అని మాత్రమే .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –  14-3-17 -ఉయ్యూరు

 

 

 

 

 

—

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు

అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు

1-ఆకాంక్ష ఫౌండేషన్ వ్యపస్థాపకురాలు -షహీన్ మిస్త్రి

బొంబాయిలో పార్సీ కుటుంబానికి చెందిన షహీన్ మిస్త్రి స్త్రీ విద్య కోసం పాటుపడిన మహిళ.మహిళకు పురుషులతో పాటు సమాన హక్కులు ఉండాలని ఉద్యమించిన నారి .ఆమె పెంపకం అనేక దేశాలలో జరిగింది .ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ యూని వర్సిటి నుండి విద్య లో మాస్టర్ డిగ్రీ పొందింది .కాని బొంబాయి లోని మురికివాడల ప్రజలు విద్యలో చాలా వెనుకబడి ఉన్నారని ,నాణ్యమైన విద్య వారిక౦దటం లేదని ,వారు మిగిలిన వర్గాల వారితో చదువులో పోటీ పడలేక పోతున్నారని గ్రహించింది .వారికి ఆసరా ,విద్య పై మక్కువ కలిగించి జనజీవన స్రవంతిలో చేర్చిఈ పోటీ ప్రపంచం లో ధైర్యంగా నిలబడి తమ సత్తా చాటి చూపాలని భావించింది షహీన్ .
తన ఆలోచనలకు అనుగుణంగా 1898 లో ‘’ఆకాంక్ష కేంద్రం ‘’అనే లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థను నెలకొల్పింది .దీని ద్వారా అల్పాదాయ వర్గాల పిల్లలకు స్కూల్ అయిపోయాక ట్యూషన్లను ఏర్పాటు చేసింది .ఆమె కృషి ఫలించి మంచి గుర్తింపు రావటం తో మరింత వ్యాప్తి చేయటానికి 2008 లో ‘’టీచ్ ఫర్ ఇండియా ‘’ఏర్పాటు చేసి మరిన్ని ప్రయోజనాత్మక కార్యక్రమాలను చేబట్టింది .అప్పటి నుంచిదాదాపు 2 వేలమంది పిల్లలను చేర్చుకోవటం ,శిక్షణనివ్వటం ,ఉద్యోగ సదుపాయాలూ కల్గించటం చేసింది .ఆమెనిరంతర విద్యా సేవకు 2001 లో ‘’అశోకా ఫెలో ‘’అవార్డ్ ,2002 లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘’గ్లోబల్ లీడర్ ఫర్ టుమారో ‘’అవార్డ్ నిచ్చి గౌరవించారు .2006 లో ‘’ఏషియా సొసైటీ 21 లీడర్ ‘’పురస్కారం అందుకొన్నది .అనేక విద్యా బోర్డ్ లలో ఆమెకు స్థానం కలిపించి సలహాలు తీసుకొంటున్నారు .

2- బాలికల పై యాసిడ్ దాడికి వ్యతిరేక పోరాటం చేస్తున్న –లక్ష్మీ అగర్వాల్

15 వ ఏట 35 ఏళ్ళ ‘’మృగాడు ‘’ బరి తెగించి ప్రవర్తిస్తుంటే ,తనకు ఇష్టం లేదని మొత్తుకొంటున్నా హద్దు మీరి ప్రవర్తిస్తుంటే తీవ్రంగా వ్యతిరేకించినందుకు లక్ష్మీ అగర్వాల్ ముఖం పై యాసిడ్ పోసి తన వికృత చేస్ట కు పరా కాస్ట గా నిలిచాడు.హిందూ స్థాన్ పత్రిక లక్ష్మి పై జరిగిన యాసిడ్ దాడి ఉదంతాన్ని సీరియల్ గా ప్రచురించి ప్రజలలో చైతన్యం కలిగించింది .తనకు జరిగిన ఈ క్షోభ మరే ఆడపిల్లకూ జరుగ కుండా చేయాలని లక్ష్మి నిశ్చయించుకొని ,యాసిడ్ దాడికి వ్యతిరేకంగా 27 వేలమందితో సంతకాలు చేయించి సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసి,ప్రజా ఉద్యమానినికి నాంది పలికింది .సుప్రీం కోర్ట్ ధర్మాసనం వెంటనే చర్య ప్రారంభించి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ పెట్టమని ,యాసిడ్ దాడికి పాల్పడిన వారిపై సత్వరం కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ జారీ చేసింది .
యాసిడ్ దాడి లో ప్రాణాలతో బతికి బయట పడిన వారి సంరక్షణ కోసం లక్ష్మీ అగర్వాల్ ‘’చాన్వ్ ఫౌండేషన్ ‘’ఏర్పాటు చేసి సేవలందిస్తోంది .20 14 లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా సతీమణి ,అమెరికా ప్రధమ పౌరురాలు లేడీ మికిల్లీ ఒబామా చేతులమీదుగా లక్ష్మీ అగర్వాల్ ‘’ఇంటర్ నేషనల్ వుమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్ ‘’ను అందుకున్నది .’’ఎన్ .డి .టి .వి .ఇండియన్ ఆఫ్ ది యియర్’’పురస్కారమూ లభించింది .వీవా దీవా ప్రకటనలలో ఆమె ముఖ చిత్రం ప్రచురించి బాలికలకు బాహ్య సౌందర్యం కంటే అంతస్సౌ౦దర్యం ముఖ్యమని గ్రహించేట్లు చేశాయి .

3- గృహ హింసపై ఉద్యమిస్తున్న లాయర్ –ప్రమీలా నేసర్గి

ప్రమీలా నేసర్గి తల్లి స్వాతంత్ర సమర యోధురాలు తండ్రి .స్వయం కృషితో ఎదిగినవాడు ఆమె పై తలిదండ్రుల ప్రభావం చాలా ఎక్కువ ..అతితక్కువ వయసు లోనే న్యాయ శాస్త్రం చదివి పాసై లాయర్ వ్రుత్తి చేబట్టింది .ధైర్య సాహసాలు స్వతంత్ర భావాలు ఉన్న మహిళా న్యాయవాది గా పేరు పొంది౦ది.ఎక్కడ స్త్రీకి అన్యాయం జరిగినా వారి తరఫున వాదించి న్యాయం చేకూర్చటం ఆమె లక్ష్యం .బాలకార్మికులు ,గృహయాజమాన్యం ,గృహ హింస ,కార్యాలయాలలో సెక్సువల్ వయోలెన్స్ ,ఖైదీల దయనీయ స్థితులు వంటి అతి సున్నితమైన సమస్యలపై ఆమె గళం విప్పి బాధితుల పక్షాన న్యాయం కోసం నిరంతరం పోరాడే యోధురాలు .అసంఘటిత వర్గాలను ఐక్యపరచి ఒకే వేదికపై నిలిపి పోరాటం చేయిస్తున్న మార్గ దర్శకురాలు .ఇంగ్లీష్ –కన్నడ అనువాద నిఘంటు కమిటీలో సభ్యురాలు .50 ఏళ్ళ కన్నడ బార్ కౌన్సిల్ కు బార్ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైన ప్రధమమహిళా లాయర్ ప్రమీలా నేసర్గి .అతి పెద్ద కేసు నుంచి అతి చిన్న కేసు దాకా స్వీకరించి సమర్ధంగా వాదించి గెలిపించే నేర్పు ఆమె ప్రత్యేకత ..

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

—

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ మాణిక్య శాస్త్రిగారి శాత దినోత్సవం లో13-3-17 రాత్రి నాకు సన్మానం చేసిన డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి సందర్భంగా వెలువరించిన బుక్ లెట్

మహా మహోపాధ్యాయ స్వర్గీయ  బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలు విజయవాడ శివ రామ క్షేత్రం లో 11-3-17 నుండి 13-3-17 వరకు వారి శిష్యులలో ప్రముఖులు శాస్త్ర విద్వన్మణి,ఆర్ష విద్యాభూషణ ,న్యాయ రత్న ,భాషా శాస్త్ర వేత్త ,న్యాయ విద్యా ప్రవీణ, వేదా౦తాచార్య  ప్రస్తుత బెనారస్ హిందూ సంస్కృత విశ్వ విద్యాలయ న్యాయ శాఖ ఆచార్యులైన డా  శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు మొదలైన  శిష్య బృందం ఘనం గా నిర్వ హిస్తున్న సందర్భం గా , శ్రీ మాణిక్య శాస్త్రి గారి జీవితం, సాహిత్యం  పైనా ,శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి జీవిత సాహిత్యాలపైన నేను ”గీర్వాణకవుల కవితా గీర్వాణం -రెండవ భాగం ”లో రాసిన వ్యాసాలను సంగ్రహించి ,కొత్త విషయ విశేషాలు  చేర్చి రాయగా   ప్రత్యేక  బుక్ లెట్ గా  సరస భారతి తరఫున స్వంత ఖర్చులతో శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు   ప్రచురించి మొదటి రోజు 11-3-17 శనివారం శ్రీ మాణిక్య శాస్త్రిగారి పెద్దకుమారుల చేత ఆవిష్కరింప జేసి సభ లో పాల్గొన్న వారందరికీ ఉచితం గా అందజేసి తమ గురు భక్తిని చాటుకున్నారు . ఇందులో  నాది ఉడత సాయం మాత్రమే -మీ దుర్గా ప్రసాద్ 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 68 –‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦ జనం’’కు సంపాదకత్వం వహించిన డా .ఇనగంటి ఉమా రామా రావు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

68 –‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦ జనం’’కు సంపాదకత్వం వహించిన డా .ఇనగంటి ఉమా రామా రావు

డా ఇనగంటి ఉమా రామారావు 10-8-1956 న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు కు దగ్గర లోని త్యాజం పూడి గ్రామం లో శ్రీ ఇనగంటి సీతారామ మార్కండేయ శర్మ ,శ్రీమతి సూర్య ప్రకాశమ్మ దంపతులకు జన్మించారు .సంప్రదాయ విద్య ను కొవ్వూరు లోని ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠం లోను తిమ్మ సముద్రం లోని శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత విద్యా పీఠం లోను అభ్యసించారు .వీరి న్యాయ ,అలంకార శాస్త్ర గురువులు వీరి తండ్రిగారి తోపాటు ,శ్రీ బొక్కా వీరభద్ర శాస్త్రి ,శ్రీ రామ చంద్ర కోటేశ్వర శర్మ ,,శ్రీ దోర్బల ప్రభాకర శర్మ ,శ్రీ దుర్భా శ్రీ రామ చంద్ర మూర్తి గార్లు .శ్రీ రామారావు న్యాయం లో విద్యా ప్రవీణ ,అలంకార శాస్త్రం లో ఎం. ఏ. డిగ్రీలను ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి పొందారు .తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం నుంచి విద్వాన్ పట్టా అందుకున్నారు . వీరికి న్యాయ శాస్త్ర బోధనలో 36 సంవత్సాల అనుభవం ఉన్నది .ప్రస్తుతం తిమ్మ సముద్రం సంస్కృత విద్యా  పీఠం  ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు . ‘’విష్ణు ధర్మోత్తర పురాణం ‘’ను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్ట్ లో భాగం గా ఇప్పుడు అనువాదం చేస్తున్నారు .

శ్రీ ఉమా రామారావు 2015 లో కులపతి ఆచార్య హరే కృష్ణ శత పథి ముఖ్య సంపాదకులుగా ,తాము సంపాదకులుగా శ్రీ అన్నం భట్టు విరచిత ‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦జనం ‘’(మంగల వాదః ) గ్రంధాన్ని ప్రచురించారు .దీనిని  తిరుపతి లోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రచురించింది .  ఈ గ్రంధం  17 వ శతాబ్దికి చెందిన అన్నం భట్టు రచించిన ‘’సిద్ధాంజనం’’ ఇప్పటి వరకూ ప్రచు రింప బడని వ్రాత ప్రతి నాధారం గా ప్రచురింప బడింది .ఇది 13 వ శతాబ్దానికి చెందిన గంగేశ ఉపాధ్యాయ రచించిన నవ్య న్యాయ పాఠ్య గ్రంధం పై పక్షాధర మిశ్ర అనబడే జయదేవ   ‘’ఆలోక ‘’పేరిట రాసిన ఉప వ్యాఖ్యానం .

తత్వ చింతామణి లోని ‘’మంగల వాదం ‘’ అనేది  తత్వ చింతామణి కి ప్రత్యక్షర ఖండం లో ఒక భాగం  ఇందులో అనేక విషయాలపై చర్చ ఉన్నది .పూర్వపు విద్యా వేత్తలైన పక్షధార ,నరహరి ,రుచిదత్త ,మహేశ ,మధు సూదన  ల సిద్ధాంతాలపై అన్నం భట్టు చేసిన ఆలోచనాత్మక  విశ్లేషణాత్మక వివరణమే ఇది .వీటిని అన్నిటినీ తులనాత్మకంగా పరిశీలించి నిగ్గు తేల్చిన గ్రంధం .ఈ గ్రంధం లో మరో విశేషం –తత్వ చింతామణి  ఆలోక వ్యాఖ్యానాల మూల రూపాలను యధా తధం దీనితోపాటు చేర్చి  ప్రచురించి చదువరులకు సౌలభ్యం కలిగించటం .సంక్షిప్త ఉపోద్ఘాతం  నోట్స్ వగైరా అందజేయటంకూడా లాభించింది .

ఆధారం -11-3-17 న విజయవాడ శివ రామ క్షేత్రం లో మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రి గారి శతజయంతి మూడు రోజుల ఉత్సవాల మొదటిరోజున నన్ను శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు తమ  వెంటబెట్టుకొని సభలో పాల్గోనేట్లు చేయగా , నేను రచించిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవభాగం ‘’నుండి శ్రీ మాణిక్య శాస్త్రి గారు,శాస్త్ర విద్వాన్మణి,ఆర్ష విద్యా భూషణ ,న్యాయ రత్న  భాషా శాస్త్ర వేత్త ,న్యాయ విద్యా ప్రవీణ  వేదా౦తాచార్య  డా . శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గార్ల పై నేను  రాసిన వ్యాసాలను సంగ్రహించి ప్రత్యేక బుక్ లెట్ గా ప్రచురించి ,ఈ రోజు ఆవిష్కరణ చేసిన సందర్భంగా డా శ్రీ ఇనగంటి ఉమా రామా రావు గారు  పరిచయమై నాకు అందజేసిన ‘’తత్వ చంతామణ్యాలోక సిద్దా౦జనం ‘’ గ్రంథం .

ఈ సందర్భం గా భోజనాల సమయం లో అక్కడ చేరిన సంస్కృత విద్వా౦సు లందరినీ నేను సంస్కృత కవుల పై తెచ్చిన రెండు గ్రంథాలను వివరించి మూడవదానినీ నెట్ లో రాస్తూ ఇప్పటికి 67 మంది గురించి రాశానని  ,కనుక ఇక్కడ ఉన్నవారు తమ బయోడేటా, గ్రంథ రచన విషయాలను మాణిక్య శాస్త్రి గారిపై అందజేసిన బుక్ లెట్ లో ఉన్న నా చిరు నామాకు పంపించి వారిని గురించి రాసే అదృష్టం కలిగించమని ప్రార్ధించాను .చూడాలి ఎందరు  స్పందిస్తారో .

.

సశేషం

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -11-3-17 –ఉయ్యూరు .

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 67 –‘’ప్రాతిశాఖ్యానాం పరిచయః – రచించిన-విద్యా వారిధి డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి

  గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

67 –‘’ప్రాతిశాఖ్యానాం పరిచయః – రచించిన-విద్యా వారిధి డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి

                   కుటుంబ నేపధ్యం

తండ్రి ,అన్న మహా న్యాయ మీమాంసా చార్యులులైన డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా గబ్బిట జయమాణిక్య శాస్త్రి గారల కుటంబం లో జన్మించిన గబ్బిట శ్రీని వాస శాస్త్రి ఇంగువ కట్టిన గుడ్డ గా అదే వైదుష్యాన్ని సాధించి గబ్బిట వారి వంశ కీర్తిని ఉత్తరాదిన వెదజల్లుతున్నాడు .ముగ్గురూ ముగ్గురే .ఆ తండ్రీ తనయుల అనుబంధం ,సంస్కృత విద్యా వైశిష్ట్యం ఎంత చెప్పుకున్నా తరగని గని .ఆంజనేయ శాస్త్రి గారి ముగ్గురు కుమారులలో చివరివాడైన శ్రీనివాస శాస్త్రి గీర్వాణ కవితా గీర్వాణ విశేషాలను తెలుసు కొందాం .

                                   జనన విద్యాభ్యాసాలు  వివాహం

గబ్బిట శ్రీనివాస శాస్త్రి శ్రీ గబ్బిట ఆంజనేయ  శాస్త్రి ,శ్రీమతి పద్మావతి దంపతులకు 19-4-1987 న జన్మించాడు .శాస్త్రిగారిది కృష్ణా జిల్లా యలమర్రు స్వగ్రామం .తండ్రిగారు వారణాసిలో సంస్కృత విశ్వవిద్యాలయం లో న్యాయ శాఖ ప్రొఫెసర్ గా ఉండటం వలన శ్రీనివాస్ విద్య కూడా అక్కడే ఆరంభమైంది .2001 లో ‘’పూర్వ మధ్యమ’’ (టెన్త్ )సంపూర్ణానంద్ సంస్కృత విశ్వ విద్యాలయం లో చదివి ఉత్తీర్ణు డయ్యాడు.2005 లో’’ ఉత్తర మధ్యమ ‘’(12)ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి అందుకొని ,2008 లో కొత్త ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుంచి శుక్ల యజుర్వేదం లో ‘’శాస్త్రి ‘’(బి ఏ .) డిగ్రీ ప్రధమ శ్రేణి లో పొందాడు .శుక్ల యజుర్వేదం లోనే 2010 లో ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి ‘’ఆచార్య ‘’(ఎం .ఏ .)’’నూ  20 15 లో వేదం లో  ‘’విద్యా వారిది ‘’(పి.హెచ్ .డి.)ని కాంచీపురం డీమ్డ్ సంస్కృత విశ్వ విద్యాలయం నుంచి అందుకున్నాడు .కంచి కామకోటి పీఠాధి పతుల వద్ద వేద విద్యనూ అధ్యయనం చేశాడు .శ్రీమతి శ్రీకళను శ్రీనివాస శాస్త్రి వివాహమాడి సంతానం గా శ్రీ యజ్ఞ సరస్వతి అనే  కూతురును పొందాడు .

. శాస్త్రి గురువులలో ముఖ్యమైన వారు తండ్రి శ్రీఆంజనేయ శాస్త్రి గారితో పాటు , శ్రీ దెందుకూరి సుబ్రహ్మణ్య సోమయాజులు గారు ,శ్రీ కాశీ కృష్ణ మూర్తి ఘనాపాఠీగారు , శ్రీ ఆర్.వెంకట రామ ఘనాపాటీగారు , ,శ్రీ కె. వి .యెన్ .అవధాని గారు ,ఎం .స్వామి నాధన్ గారు (వేద భవన్ .                         గీర్వాణ రచనా సామర్ధ్యం

తిరుపతి వేద విశ్వ విద్యాలయం లో జరిగిన అంతర్జాతీయ వేద సభ లో ‘’ప్రాతిశాఖ్యానం –పరిచయః ‘’పై పరిశీలన పత్రాన్ని రచించి ప్రచురించాడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం –అఖిల భారతీయ శాస్త్ర సంగోస్టి ఫాకల్టి లో’’’’కృష్ణ యజుర్వేదే అర్ధ వాద వ్యాఖ్యానం ‘’అనే పత్ర సమర్పణ చేశాడు . వారణాసి బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ‘’సంస్కృత విద్యా పత్రిక ‘’లో ‘’శ్రౌత స్మార్త కర్మాణి ‘’శీర్షిక తో వ్యాసాలను,’’మీమాంస సార౦ ’’ పైనా  రాశాడు .ఇవి గాక ’’ఆపస్తంభీయ పంచ దశ కర్మాను క్రమణిక ‘’ రచించాడు .

పురస్కారాలు

2000 సంవత్సరం లో 15 వ ఏటనే  లక్నో లోని ఉత్తర ప్రదేశ్  సంస్కృత సంస్థాన్ వారి ‘’వేద పండిత పురస్కారం ‘’,రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణు కాంత శాస్త్రి గారి చేతులమీదుగా  శ్రీనివాస శాస్త్రి అందుకొన్నాడు. వారణాసి లోని దేవాలయ ,మఠాలలో నిత్య వేద పారాయణ చేస్తున్నాడు   ,కృష్ణ యజుర్వేద క్రమాంత పరీక్ష మొదటి తరగతిలో కృష్ణా జిల్లా మచిలీ పట్నం బృందావన పురం లోని కామ కోటి శంకర మఠంనుండి ఉత్తీర్ణుడయ్యాడు .తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రిని వేద పారాయణ దారునిగా నియమించగా అందులో పని చేస్తూ ఉన్నాడు ..

ప్రస్తుతం శ్రీనివాస శాస్త్రి తండ్రిగారికి సహాయంగా  వారణాసి లో ఉంటూ శ్రౌత స్మార్త కర్మలను ఆచరిస్తున్నాడు .

శ్రీ శ్రీనివాస శాస్త్రి ఫోటో జత చేశాను చూడండి 

           సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మాఇంట్లో యలమర్రు గబ్బిట వారు

8-3-17 బుధవారం ఉదయం మా ఇంటికి  యలమర్రు కు చెందిన వారు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ0 లో 30సంవత్సరాలనుండి   భాషా శాస్త్ర వేత్తగా ,న్యాయ విద్యా ప్రవీణగా  ,వేదాంతాచార్యగా సేవలు అందిస్తున్న డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు ,వారి కుమారులు డా శ్రీ గబ్బిట శ్రీనివాస   శాస్త్రి గారు .రావటం మా సుకృతం .

  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారు   తమకు తర్క న్యాయ మీమాంసాది శాస్త్రాలు బోధించిన విజయవాడ వాస్తవ్యులు మహా మహోపాధ్యాయ స్వర్గీయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలను  అత్యంత భక్తి శ్రద్ధలతో 11-3-17 నుండి 13-3-17 వరకు మూడు రోజులు విజయవాడ శ్రీ శివ రామ కృష్ణ క్షేత్రం లో  మాణిక్య శాస్త్రిగారి శిష్య బృందం తో కలిసి ఘనం గా నిర్వహిస్తూ ,ఆహ్వానాన్ని నాకు అందజేయటానికి ఉయ్యూరు వచ్చిన సందర్భం ఇది .
   స్థానిక ఛానల్ వారు మా ఇంట్లోనే శ్రీ శాస్త్రిగారిని ఇంటర్వ్యూ చేశారు . సంస్కృత భాషా వైభవాన్ని  తమ వైదుష్యాన్ని భాష చిరంజీవిగా వర్ధిల్లటానికి చేయవలసినదానిని వారుచక్కగా వివరించి చెప్పారు .
  శ్రీ మాణిక్య శాస్త్రి గారిపైన ,శ్రీ ఆంజనేయ శాస్త్రి గారిపైనా నేను గీర్వాణ కవుల కవితా గీర్వాణం -రెండవ భాగం లో రాయటం నా అదృష్టంగా భావిస్తున్నాను . వాటినే ఉపయోగించి మాణిక్య శాస్త్రిగారి శత జయంతికి ఫోటోలతో సహా ఒక చిన్న బుక్ లెట్ ను ప్రచురించి ,సభలకు విచ్చసే వారందరికీ అంద  జేయాలన్నది శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి సంకల్పం . ఆ బుక్ లెట్ తయారీ కూడా మా అబ్బాయి రమణ సహాయం తో ఇక్కడే రూపు  దాల్చటం  సరసభారతి అదృష్టం . గురు భక్తి కి నిలువు దర్పణం డా  శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు . అందరికీ ఆదర్శ ప్రాయులు ఆ గురు శిష్యులు . -దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహామహోపపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిగారి శత జయంతి ఉత్సవాలు -11-3-17 -13-3-17 విజయవాడ శివరామకృష్ణ క్షేత్రం లో

మహామహోపపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిగారి శత జయంతి ఉత్సవాలు -11-3-17 -13-3-17 విజయవాడ శివరామకృష్ణ క్షేత్రం లో


Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి(1956 )

-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య  శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి(1956 )

డా. శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి 15-8-1956 న కృష్ణా జిల్లా పెదపారు పూడి మండలం  యలమర్రు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ గబ్బిట మేధా దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,తల్లి శ్రీమతి భ్రమరా౦బాసావిత్రి  గారు .కొవ్వూరు  ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠంలో చదివి ఆంధ్ర విశ్వ విద్యాలయం లో చేరి 1980లో ఏం .ఏ . పాసైనారు . 1979లో శ్రీమతి పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు .వీరికి ముగ్గురు  కుమారులు –శ్రీ సుబ్రహ్మణ్య సీతా రామ శర్మ ,జయ మాణిక్య శాస్త్రి ,శ్రీ శ్రీనివాస యజ్ఞ దక్షిణా మూర్తి శాస్త్రి .82లో గుంటూరు విద్వత్ పరిషత్ ,గౌరవ డాక్టరేట్ నిచ్చి గౌరవించింది .తిరుపతి .కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం 1985లో గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పురస్కారమిచ్చి సన్మానించింది .   .

గుంటూరు లో డాక్టర్ శ్రీ కొలచల వెంకట కృష్ణ శాస్త్రి గారి సంస్కృత కళాశాలలో 1977నుండి 83వరకు లెక్చరర్ గా పని చేసి  1983-88 కాలం లో  తిరుపతిలోని న్యాయ సంస్కృత విద్యా పీఠంలో సేవలందించి ,తర్వాత బెనారస్ లోని  న్యాయ వైదిక దర్శన సంస్కృత కళాశాలలో రీడర్ గా ఉన్నారు .1988నుండి బెనారస్ హిందూ సంస్కృత విశ్వ విద్యాలయం లో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేస్తున్నారు ..1997 నుంచి తర్క ,వేదాంత శాస్త్రాలలో  ప్రొఫెసర్గా ఉన్నారు .

శాస్త్రి గారి గీర్వాణ రచనలు -1982లోజగదీశ భట్టా చార్య తర్కామృతం పై  ‘’మాణిక్య ప్రభ ‘’రాశారు .1995మాధురీ గాదాధరీ మత భేద విమర్శ రచించారు .1987 లో’’ పంచలక్షణ శత కోటి’’కి సంపాదకత్వం వహించారు .రామ రుద్రీయ వ్యుత్పత్తి వాద౦ మొదలైన వాటిపై  ధారా వాహికం గా 1978నుండి 1981వరకు నాలుగేళ్ళువిజయవాడ ఆకాశ వాణి లో   తర్క శాస్త్ర వైభవం ,అనిత్యః శబ్దః ,పరమాణు స్వరూపం ,వ్యక్తి వివేక విమర్శనం మున్నగు అంశాలపై  ప్రసంగాలు చేశారు .

శ్రీ  ఆంజనేయ శాస్త్రిగారు 1984-88వరకు తిరుమల తిరుపతి దేవస్థాన ఉపన్యాసకులుగా ఉన్నారు .వారణాసి కే .కే. డి.లో ,హైదరాబాద్ లోని డివైన్ లైఫ్ సొసైటీలో సభ్యులు, వక్తలు గాఉండి భాగవత ,రామాయణ ,స్కాంద పురాణా౦ తర్గత కాశీఖండాలపై  ప్రవచనం చేశారు .సంప్రదాయ న్యాయ మీమాంస  వేదాంత శాస్త్రాలను బోధించటమే శాస్త్రిగారి ముఖ్య అభిరుచి .ఈ శాస్త్రాలలో వీరికి గురువులు మహా మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి  గారు ,పండిత రాజ ఎస్.సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ,పండిత రాజ,పద్మభూషణ్  పి .యెన్ .పట్టాభి రామ శాస్త్రి గారు ,న్యాయ వేద వేదాంత విద్వాన్ శ్రీ ధూళి పాళ రామచంద్ర శాస్త్రి గారు ,కవితార్కిక చక్రవర్తి శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు .

1670 కాలపు వాడైన నాగేశ భట్టు భట్టోజీ దీక్షితుల భారతీయ పంచాంగం  ప్రకారం  కాల ,తిధి నిర్ణయం పై ‘’తిధినిర్ణయం ‘’ అనే సంస్కృత శాస్త్ర గ్రంథాన్ని ప్రకాశింప జేశారు  .జగదీశ భట్టాచార్యుడి  తర్కామృత గ్రంథంపై సంస్కృతం లో శాస్త్రిగారు ‘’ మాణిక్య ప్రభ సంస్కృత వ్యాఖ్యా విభూషితం’’చేశారు . శాస్త్రిగారి ద్వితీయ పుత్రులు ,పూరీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం లో తర్క శాస్త్రం లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన శ్రీ జయమాణిక్య శాస్త్రి  ‘’మణిప్రభ హిందీ వ్యాఖ్య’’సంవలితం ‘’చేశారు . దీనిని వారణాసి శారదా సంస్కృత సంస్థానం 2012లో ప్రచురించింది .ఇది న్యాయ తత్వ శాస్త్రం పై మహా వ్యాఖ్యానం .జ్యోతిశ్శాస్త్రం పై కాళిదాసు ని ‘’కాలామృతం ‘’కు చింతలపాటి వెంకట యజ్వ  రచించిన ‘’ఉజ్వలా వ్యాఖ్యానం ‘’ను శాస్త్రి గారు సంపాదకులుగా వెలువరించారు . .దీన్ని తిరుపతి వేద విశ్వ విద్యాలయం ముద్రించింది .క్రీ. శ.1600 కాలం వాడైన మధురానాథ తర్క వాగీశుని ‘’మాధురీ ‘’17,18శతాబ్దాలకు చెందిన గదాధర భట్టాచార్య రాసిన ‘’గాదాధరీ ‘’,13వ శతాబ్దికి చెందిన  గంగేశుని  ‘’తత్వ చింతామణి ‘’వ్యాఖ్యానాలను తులనాత్మకంగా పరిశోధించి శాస్త్రిగారు ‘’మాధురీ గాదాధర్యోర్మత భేద విమర్శ ‘’అనే ఉద్గ్రంధాన్ని రాశారు .దీన్ని తిరుపతి పద్మావతీ ప్రకాశన సంస్థ  ప్రచురించింది .రామరుద్ర భట్టాచార్యులు  రాసిన ‘’ వ్యుత్పత్తి వాద వ్యాఖ్యానాన్ని ’ మద్రాస్ లోని అడయారు లైబ్రరీ నుంచి  కంచి కామ కోటి పీఠ ఆస్థాన విద్వాంసులైన  మహా మహోపాధ్యాయ  శ్రీ ఎస్ .ఆర్ .కృష్ణ మూర్తి శాస్త్రిగారి ద్వారా తెప్పించి   ‘’వ్యుత్పత్తి వాదః –రామ రుద్రీయ వ్యాఖ్యన సహితః ‘’ అని ప్రకాశనం చేశారు .. దీనిని న్యు ధిల్లీ సంస్కృత సంస్థానం ముద్రించింది .ఆదిత్యాచార్య వైదిక కర్మకా౦డలపై రాసిన ‘’షడ శీతి ‘’పై నంద పండిత వ్యాఖ్యాన పరామర్శ రాశారు .దీన్ని ఉజ్జైన్  లోని ఇండలాజికల్ రిసెర్చ్ సంస్థ ముద్రించింది .

డా.శ్రీ ఆంజనేయ శాస్త్రిగారు అనేక మంది విద్యార్ధులకు తర్క ,వేదాంత ,మీమాంస శాస్త్రాలను బోధిస్తూ పరిశోధనకు ప్రోత్సహిస్తూ సుమారు 25 మంది చే తర్క వేద వేదాంత శాస్త్రాలలో పి .హెచ్ .డి .సాధించటానికి మార్గ దర్శనం చేశారు .ప్రస్తుతం వీరి మార్గ దర్శనం లో 10 మంది పి .హెచ్. డి.,పి .డి.ఎఫ్ .చేస్తున్నారు .  కంచి కామకోటి పీఠాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి వారి సన్నిధిలో శాస్త్రిగారు శాస్త్రార్ధం చేసి స్వర్ణపతకం పొందారు .శ్రీ వారి అనుగ్రహం తో శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారికి తర్క శాస్త్రాన్ని వినిపించారు . ఆంధ్ర పీఠమైన పుష్పగిరి శంకరాచార్యులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి ఆదేశం తో వారి ఉత్తరాధికారి ,ప్రస్తుత పీఠాదిపతి శ్రీ విద్యా శంకర భారతీ స్వామివారికి తర్క వేదాంత శాస్త్రాలను కాశీ లో  శ్రీ శాస్త్రి గారి ఇంటి వద్దనే శ్రవణం చేయించారు .అనేక మంది పీఠాదిపతుల వద్ద గోలోక౦ ,కాళీ శాంకరి ,బచ్యాఝా ‘’ అద్వైత సిద్ధి ,బ్రహ్మాన౦దీయ క్రోడ పత్ర’’విషయాలపై  శాస్త్రార్ధాలు చేసి జగద్గురువుల అనుగ్రహం పొందారు .కంచి ,శృంగేరి, ద్వారక ,పుష్పగిరి ,ఉడిపి పీఠాలలో శాస్త్రార్ధ చర్చ చేసి ‘’శాస్త్ర విద్వన్మణి’’, ‘’న్యాయరత్న ,’’ఆర్షవిద్యా భూషణ’’ బిరుదులను అందుకున్నారు . శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆజ్ఞానుసారం మహా మహోపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి ఇంటిలో  అంతేవాసిగా ఉండి తర్క వేదాంత శాస్త్రాలను ఆపోసన పట్టారు .

‘’న్యాయ విద్యా ప్రవీణ ‘’ మరియు వేదా౦తాచార్య ‘’బిరుదులు  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి న్యాయ, మీమాంసా శాస్త్ర పాండిత్యానికి  ,వేదాంత ప్రతిభకు సార్ధకతను చేకూర్చాయి .

శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి ఫోటో జత చేశాను చూదాండి

గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-2017 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ హేవిళంబి ఉగాది వేడుకలకు సాదర ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

56-ఆధునిక సాహిత్య రధ సారధి – జెర్ ట్రూడ్ స్టెయిన్-1(1974-1946)

56-ఆధునిక సాహిత్య రధ సారధి – జెర్ ట్రూడ్ స్టెయిన్-1(1974-1946)

  జెర్ ట్రూడ్ స్టెయిన్ పై రెండు వర్గాలమధ్య  రేగిన విపరీత మైన దుమారం అంతా ఇంతా కాదు .మధ్యే మార్గమే లేదు .ఆమె వ్యతిరేకులు ఆమెనుఒక ఫ్రాడ్ గా ,ఆమె చెప్పిన ఆటోమాటిక్ రైటింగ్ ఒక అవహేళనగా భావించారు .ఆమెది ‘’క్లినికల్ కేస్ ఆఫ్ మేగలోమానియా ‘’అన్నారు .కొద్దిమంది ఆమెను  రచయిత్రిగా కంటే ఆమె ఒక ఒకమతం గా ,దేశం లో అత్య౦త  విప్లవాత్మక సృజన శీలిగా  సాహిత్యం లో శాస్త్రీయ దృక్పధం ఉన్న విద్యార్ధినిగా,ప్రపంచాన్నే మార్చేసిన ఏక వ్యక్తి విప్లవ వనితగా   ఆరాధించారు .మిగిలిన చాలా మందికి ఆమె నిరంతర వివాదాస్పద వ్యక్తి .ఎవరేమనుకొన్నా ఆమె తిరుగులేని ఉన్నత స్థాయి మతాధికారి .

  3-2-1874 నా అమెరికాలో పెన్సిల్వేనియా లోని అల్లెఘేని లో డేనియల్ ,అమీలియా కేజర్ స్టెయిన్ దంపతులకు జన్మించింది .తండ్రిసంపన్నమైన  స్ట్రీట్ రైల్వే  వైస్ ప్రెసిడెంట్,నిరంతర సంచారి .పెద్దన్న లియో తో ఆమే వియన్నా ,పారిస్ కాలి ఫోర్నియా  లలో బాల్యం గడిపింది . చిన్నతనం నుంచే పుస్తకాల పురుగు .లైబ్రరీలకు వెళ్లి దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివేసింది .తర్వాత స్మోల్లేట్ ,స్కాట్ ,షేక్స్పియర్ ,బన్యన్ ,ఫీల్డింగ్ వర్డ్స్ వర్త్ రచనలతో పాటు ‘’కాంగ్రెషనల్ రికార్డ్స్ ‘’కూడా ఊది పారేసింది .19  వ ఏట రెడ్ క్లిఫ్ లో సైకాలజీ ప్రత్యేకంగా చదివి  విలియం జేమ్స్ కు శిష్యురాలైనది .పరీక్ష ముందు రోజు రాత్రి ఒపేరా హౌస్ కు వెళ్లి ,అక్కడి నుంచి అర్ధ రాత్రి లేట్ పార్టీ లో ఉండి ఇంటికి వచ్చింది .పరీక్ష లో సమాధానం పేపర్ పై భాగాన ‘’డియర్ ప్రొఫెసర్  జేమ్స్ నేనుఫిలాసఫీ పేపర్ రాయలేక పోతున్నందుకు మన్నించండి ‘’అని రాసింది .దానికి సమాధానంగా జేమ్స్ ‘’డియర్ మిస్ స్టెయిన్ –నిన్ను పూర్తిగా అర్ధం చేసుకొన్నాను .అప్పుడప్పుడు నేను అలానే చేసేవాడిని .’’అని రాసి ఆమెకు అతి ఎక్కువ మార్కులు వేశాడు .

  రెడ్ క్లిఫ్ లో ఉండగానే ఆటోమాటిక్ రీడింగ్ ,రైటింగ్ లో ప్రయోగాలు చేసింది .లియాన్ సాల్మన్ అనే గ్రాడ్యుయేట్ విద్యార్ధి తోకలిసి సృజన కార్యం  అంతశ్చేతన తో కాకుండానే సాధ్యం అని రుజువు చేసి తమ పరిశోధన వివరాలను 1896 లో   ‘’నార్మల్ మోటార్ ఆటో మాటిజం’’అనే శీర్షికతో  ‘’సైకలాజికల్ రివ్యు ‘’లో ప్రచురించింది . అదే ఆమె మొట్టమొదటి ప్రచురణ వ్యాసం .దీనిపై విస్తృతంగా రాస్తూ ఆ తర్వాత బాగా ప్రసిద్ధి చెందింది .ఆ తర్వాత కాలం లో ‘’ఇందులో మాటలూ వాక్యాలు సరైనవే కాని ఒక దానికొకటి సంబంధం సరిగ్గా లేదు ‘’అని చెప్పు కొన్నది .రెడ్ క్లిఫ్ పరిశోధన జరిగిన 38 ఏళ్ళ తర్వాత ప్రొఫెసర్ బి .ఎఫ్ .స్కిన్నర్ ఆ పత్రాన్ని కనుగొని ‘’హాజ్ గెట్రూడ్ స్టెయిన్ అ సీక్రెట్ ‘’అనే దానిలో ఆమె సైకలాజికల్ రివ్యు లో రాసిన దానిలో అది చాలా పాక్షికంగా ఉన్న పేపర్ మాత్రమే అని రాశాడు .అచేతన స్థితిలో రాసిన రాత అన్నాడు .స్టెయిన్ కూడా ఆ తర్వాత తన స్వీయ చరిత్రలో తన ప్రయోగం విజయవంతం కాలేదని ,ఆటోమాటిక్ రెస్పాన్స్ కు తగిన సరైన సాక్షాలు లేవని రాసింది .’’ఇది ఆటోమేటిక్ అని నేననుకోలేదు ,ఇప్పుడు కూడా అనుకోను .విశ్వ వ్యాప్తంగా ఏ విద్యార్ధి అయినా దీనిపై ఇంకా పరిశోధించి నిగ్గు తేల్చవచ్చు మనిషి మనసులో ఉన్నది ఏదో ,సరైన పదాలతో ఆ భావోద్వేగం  రాత వలన బయటికి వస్తుంది ‘’అని చెప్పింది .ఇదంతా భాషా శాస్త్ర వేత్తల దృష్టి ని ఆకర్షించింది . .  దీనిని ఆమె గురువు విలియం జేమ్స్ బాగా ప్రోత్సహించాడు .ఆయన రాసిన ‘’సైకాలజీ ‘’గ్రంధం లో ‘’స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్’’అధ్యాయం లో సాహిత్యం లో ఈ కొత్త పదాన్ని సృష్టించి వాడాడు .ఇందులో ప్రతి ఆలోచనా విడి విడిభాగాలుగా బయటికి వస్తుంది .ప్రతివాక్యం ఒక  కాల అవధికి సంబంధించింది అవుతుంది .ఇది స్టెయిన్ ను బాగా ఆకర్షించింది .ఇందులో సెన్స్ ఆఫ్ టైం అంటే ఆమెకు బాగా ఇష్టమైంది .

  23 వ ఏట ఆమె జాన్స్ హాప్కిన్స్ యూని వర్సిటి లో చేరినాలుగేళ్ళు మెడిసిన్ చదివింది .అన్నిటా బాగా మార్కులు వస్తున్నా ,డిగ్రీ పొందకుండానే మానేసింది .మార్కులకంటే చదువే ముఖ్యంగా భావించింది .లండన్ వెళ్లి జీవిత గమనాన్ని మలుపు తిప్పు కొన్నది .ఎలిజబెతన్ ప్రోజ్  కు అంకితమైంది .20 వశతాబ్ది ప్రారంభం లో పారిస్ మేధావులకు కేంద్ర నిలయ౦ గా ఉండేది . .1903  లో పారిస్ చేరి ,ఆలిస్ బి .టోక్లాస్ అనే సాన్ ఫ్రాన్సిస్కో స్నేహితురాలితో పరిచయం చేసుకొని స్నేహాన్ని జీవితాంతం నిలుపు కొన్నది .ముప్ఫై ఏళ్ళలో ఒక్క సారి మాత్రమే చుట్టపు చూపుగా అమెరికా వెళ్లి వచ్చింది .మిగాతాకాలం అంతా పారిస్ లోనే .సోదరుడు,’’ ది ఎ.బి.సి .ఆఫ్ అద్లేటిక్స్ రచయితా అయిన  లియో తో ఉన్నది .వీరి భావాల మధ్య వైరుధ్యం ఉన్నందున తరచూ కీచులాడుకోనేవారు .కొత్త ,అంతగా పేరు లేని పెయి౦టర్స్ నుగుర్తించి  చిత్రాలను అతను సేకరించి భద్ర పరిస్తే ,తానే వారిని కనుక్కున్నానని  ఆమె పోట్లాడేది .ఆమె రాసే విధానమూ అతనికి నచ్చేదికాదు .ఆమె రాతలో స్పష్టత లేదని ,పునరుక్తులు ఎక్కువని ఈసడించేవాడు .ఆమె పురుష వేషం  మాట విధానం అతనికి ఏవగింపు .బిగుతు ,పొట్టి బట్టలను అతడు వద్దనే వాడు .జుట్టు కత్తిరించుకోవటం గిట్టేదికాదు .చురుకైన నళ్ళకళ్ళ చిన్నదిఆమె . పికాసో ఈమె చిత్రాన్ని అర్ధ నిమీలిత ధ్యాన యోగం లో  సగం వాదం లో ముందుకు వంగి  ప్రత్యర్ధి ని ఉచ్చులో పడేస్తున్నట్లు  గొప్పగా చిత్రించాడు .అయితే పికాసో చిత్రించిన దానికి భిన్నంగా ఆమె కవళికలు ఉండేవి .ఆమె ముఖం ఆవేశ పూరితుడైన బుద్ధుని ముఖంలా లేక ఉలెన్ బట్టలలో చుట్టబడిన రోమన్ సెనేటర్ ముఖంలా అనిపించేది .ఆమె డామినేటింగ్ నేచర్ కు కొంపలో ఇద్దరు ఆడ వాళ్ళ మధ్య ఉండటం భరించలేక లియో అక్కడి నుంచి మారి వేరే చోట ఉన్నాడు .స్టెయిన్ అతనికి ‘’prolonged disease ,a kind of mild insanity ‘’తో బాధ పడుతున్నదానిలా అనిపించింది .

Inline image 1

   మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -5-3–17  -ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు పూర్తి వివరాలతో

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు పూర్తి వివరాలతో

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి  3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు  శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక  ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో  ,ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,ఉగాది కవి సమ్మేళనం  గా  నిర్వహిస్తున్నాము .

అతిధులకు  కవి మిత్రులకు ,సాహితీ బంధువులకు ఉగాది శుభాకాంక్షలతో సాదరం గా ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని జయ ప్రదం చేయండి .

సభాస్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు

గౌరవ అతిధి –శ్రీ పరుచూరి శ్రీనాథ్ –ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ పరుచూరి రామ కృష్ణయ్య  ఫౌండేషన్ ట్రస్ట్ –నిర్వాహకులు (అమెరికా )

ఆత్మీయ అతిధులు –శ్రీ చనుమోలు సత్యనారాయణ ప్రసాద్ –ప్రముఖ సంఘ సేవకులు ,స్వచ్చంద సంస్థల నిర్వాహకులు ,స్వచ్ఛ.భారత్ కార్యకర్త (విజయ వాడ )

శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి సంపాదకులు ,’’నానీ కవితా ప్రక్రియ ‘’పరిశోధకులు (విజయవాడ )

విశేష అతిధి-డా.శ్రీమతి ఆర్.భార్గవి –ప్రముఖ వైద్యులు మరియు సాహితీ వేత్త (పామర్రు )

మనవి-ఈ వేదిక పై శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,శ్రీ  పరుచూరి శ్రీ నాథ్ గార్లు  సంయుక్తంగా ఒక ముఖ్య ప్రకటన చేస్తారు .

కార్య క్రమ౦

మధ్యాహ్నం -3-30 నుండి 4 వరకు –అల్పాహార విందు

సాయంత్రం -4 గం నుండి -5 గం వరకు –ఉగాది పురస్కార ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం –అతిధుల అభిభాషణం

స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కార౦ ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రాసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతులు

స్వీకర్తలు -1-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిశ్శాస్త్ర వేత్త       శ్రీ నిష్ఠల  వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (పొన్నూరు )

2- అవధాన భారతి ,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్కృతోపన్యాసకులు – విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారు (హైదరాబాద్ )

3-నవ భారత సాహితీ రత్న ,సాహితీ విశిష్ట  వానమామలై స్మారక పురస్కార ,సోమనాధ కళా పీఠ పురస్కార గ్రహీత -శ్రీ లేఖ సాహితీ సంస్థ అధ్యక్షులు  సంస్థ తరఫున తమ సంపాదకత్వం లో 116 వైవిధ్యభరిత గ్రంధ ప్రచురణ కర్త  ,విద్వత్ కవి , విమర్శకులు ,బహు(40 కి పైగా ) గ్రంథకర్త  విశ్వనాథ వారి క్రష్ణ కావ్యాల పరిశోధకుకులు –  డా. శ్రీ రంగ స్వామి (వరంగల్ )

స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతులు  మరియు శ్రీ మైనేని గోపాల కృష్ణ, శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)

స్వీకర్త – .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య  లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి  స్వ౦త  ఖర్చులతో ముద్రించి,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావుగారు  (విజయవాడ )

కార్య క్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి

సాయంత్రం -5 గం నుండి 6 -30 గం వరకు  ‘’వసుధైక కుటుంబం ‘’   అంశం పై   ప్రముఖ కవి మిత్రులచే కవి సమ్మేళనం

పద్యాలు అయితే 5 కు , వచన కవిత అయితే 15 పంక్తులకు పరిమితం .చదివిన కవిత కాపీ ని సరసభారతి కి అందజేయ మనవి .

నిర్వహణ –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు ,(విజయవాడ ) శ్రీ వసుధ బసవేశ్వరరావు (గుడివాడ )శ్రీమతి కె .  కనక దుర్గా మహాలక్ష్మి ,  శ్రీమతి గుడిపూడి రాధికా రాణి (మచిలీ పట్నం )

 

. జోశ్యుల శ్యామలాదేవి  మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ  గబ్బిట దుర్గాప్రసాద్

గౌరవాధ్యక్షులు         కార్య దర్శి                  కోశాధికారి                  అధ్యక్షులు -సరసభారతి

,                                                                                          3–3–2017

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

ఉగాది శుభాకాంక్షలు

నిర్వహణ సహకారం –డా.గుంటక వేణు గోపాల రెడ్డి, డా దీవి చిన్మయ ,శ్రీ వి .బి.జి.రావు ,శ్రీ కోనేరు చంద్ర శేఖర రావు ,శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మండా బాలాజీ ,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అప్పలనాయుడు

‘’వసుధైక కుటుంబం ‘’కవి సమ్మేళనం లో పాల్గొను కవి మిత్రులు

డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి (పొన్నూరు )డా.శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ  శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు (గుంటూరు ) డా .సర్వా చిదంబర శాస్త్రి (జగ్గయ్య పేట) శ్రీ దొంతా భక్తుని రామ నాగేశ్వరరావు (భీమవరం )డా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,డా శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ , శ్రీవలి వేటి వెంకట శివ రామ కృష్ణ మూర్తి ,శ్రీ ఖండాపు మన్మధ రావు ,శ్రీ టేకు మళ్ళ వెంకటప్పయ్య ,శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి ,శ్రీ జి.వి.ఎస్.డి.ఎస్ .వర ప్రసాద శర్మ, శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,,శ్రీ ఆంజనేయ రాజు ,శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు  శ్రీదండిభొట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీ విష్ణు భొట్ల రామ కృష్ణ ,శ్రీ పాణి గ్రాహి రాజ శేఖర్ ,శ్రీ సి హెచ్ వి .బృందావన రావు శ్రీ ఎరుకలపూడి గోపీ నాధ రావు ,లయన్ శ్రీ బందా వెంకట రామారావు ,శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ ,శ్రీ మునగంటి వెంకట రామాచార్యులు ,శ్రీ ఎం .అంజయ్య ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,డా.శ్రీమతి వి.శ్రీ ఉమా మహేశ్వరి ,శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి కోనేరు కల్పన ,డా శ్రీమతి కొమా౦డూరి కృష్ణా ,డా,పి.పద్మావతీ శర్మ ,శ్రీమతి మద్దాలి నిర్మల, శ్రీమతి సామినేని శైలజ శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ ,శ్రీమతి ఎస్ .అన్నపూర్ణ , (విజయవాడ )శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లి ) డా శ్రీ జి.విజయకుమార్ (నందిగామ )శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు) ,శ్రీ వంగివరపు రాఘవాచార్యులు (గుడివాడ )  శ్రీ శిస్టి శ్రీనివాస శాస్త్రి (నిమ్మ కూరు )శ్రీమతి వారణాసి సూర్య కుమారి ,శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీమతి కందాళ జానకి,(మచిలీపట్నం ) డా.శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ ,శ్రీమతి సింహాద్రి పద్మ (అవని గడ్డ )శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అగ్ని హోత్రం శ్రీ రామ చక్ర వర్తి ,శ్రీ సి హెచ్ .భవానీ శంకర రావు ,శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (అకునూరు )

Inline image 2

‘’జననీ పృధ్వీ కామ దుఘాస్తే-జనకో దేవా సకల దయాళూ

దామ్యతా దత్తా దయాద్వం జనతాః-శ్రేయో భూయాత్ సకల జనానాం ‘’

( కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి )

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి  3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు  శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక  ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో  ,ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,ఉగాది కవి సమ్మేళనం  గా  నిర్వహిస్తున్నాము .

అతిధులకు  కవి మిత్రులకు ,సాహితీ బంధువులకు ఉగాది శుభాకాంక్షలతో సాదరం గా ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని జయ ప్రదం చేయండి .

సభాస్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు

గౌరవ అతిధి –శ్రీ పరుచూరి శ్రీనాథ్ –ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ పరుచూరి రామ కృష్ణయ్య  ఫౌండేషన్ ట్రస్ట్ –నిర్వాహకులు (అమెరికా )

ఆత్మీయ అతిధులు –శ్రీ చనుమోలు సత్యనారాయణ ప్రసాద్ –ప్రముఖ సంఘ సేవకులు ,స్వచ్చంద సంస్థల నిర్వాహకులు ,స్వచ్ఛ.భారత్ కార్యకర్త (విజయ వాడ )

శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి సంపాదకులు ,’’నానీ కవితా ప్రక్రియ ‘’పరిశోధకులు (విజయవాడ )

విశేష అతిధి-డా.శ్రీమతి ఆర్.భార్గవి –ప్రముఖ వైద్యులు మరియు సాహితీ వేత్త (పామర్రు )

మనవి-ఈ వేదిక పై శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,శ్రీ  పరుచూరి శ్రీ నాథ్ గార్లు  సంయుక్తంగా ఒక ముఖ్య ప్రకటన చేస్తారు .

స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కార౦ ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రాసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతులు

స్వీకర్తలు -1-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిశ్శాస్త్ర వేత్త       శ్రీ నిష్ఠల  వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (పొన్నూరు )

2- అవధాన భారతి ,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్కృతోపన్యాసకులు – విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారు (హైదరాబాద్ )

స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతులు  మరియు శ్రీ మైనేని గోపాల కృష్ణ, శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)

స్వీకర్త – .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య  లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి  స్వ౦త  ఖర్చులతో ముద్రించి,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావుగారు  (విజయవాడ )

కార్య క్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి

 

‘’వసుధైక కుటుంబం ‘’   అంశం పై   ప్రముఖ కవి మిత్రుల చేత కవి సమ్మేళనం నిర్వ హి౦ప బడును

పద్యాలు అయితే 5 కు , వచన కవిత అయితే 15 పంక్తులకు పరిమితం .చదివిన కవిత కాపీ ని సరసభారతి కి అందజేయ మనవి .

నిర్వహణ –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు ,(విజయవాడ ) శ్రీ వసుధ బసవేశ్వరరావు (గుడివాడ )శ్రీమతి కె .  కనక దుర్గా మహాలక్ష్మి ,  శ్రీమతి గుడిపూడి రాధికా రాణి (మచిలీ పట్నం )

 

. పూర్తి వివరాలతో ఆహ్వానం మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి చేస్తున్నాము

జోశ్యుల శ్యామలాదేవి  మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ  గబ్బిట దుర్గాప్రసాద్

గౌరవాధ్యక్షులు         కార్య దర్శి                  కోశాధికారి                  అధ్యక్షులు -సరసభారతి

,                                                                                   1–3–2017

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

ఉగాది శుభాకాంక్షలు

నిర్వహణ సహకారం –డా.గుంటక వేణు గోపాల రెడ్డి, డా దీవి చిన్మయ ,శ్రీ వి .బి.జి.రావు ,శ్రీ కోనేరు చంద్ర శేఖర రావు ,శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మండా బాలాజీ ,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అప్పలనాయుడు

‘’వసుధైక కుటుంబం ‘’కవి సమ్మేళనం లో పాల్గొను కవి మిత్రులు

డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి (పొన్నూరు )

డా.శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ  శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు (గుంటూరు )

డా .సర్వా చిదంబర శాస్త్రి (జగ్గయ్య పేట)

శ్రీ దొంతా భక్తుని రామ నాగేశ్వరరావు (భీమవరం )

డా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,డా

శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ ,

శ్రీవలి వేటి వెంకట శివ రామ కృష్ణ మూర్తి ,

శ్రీ ఖండాపు మన్మధ రావు ,శ్రీ టేకు మళ్ళ వెంకటప్పయ్య ,శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి ,శ్రీ జి.వి.ఎస్.డి.ఎస్ .వర ప్రసాద శర్మ, శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,కె ఆంజనేయ కుమార్,శ్రీ ఆంజనేయ రాజు ,శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు  శ్రీదండిభొట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీ విష్ణు భొట్ల రామ కృష్ణ ,శ్రీ పాణి గ్రాహి రాజ శేఖర్ ,శ్రీ సి హెచ్ వి .బృందావన రావు శ్రీ ఎరుకలపూడి గోపీ నాధ రావు ,లయన్ శ్రీ బందా వెంకట రామారావు ,శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ ,శ్రీ మునగంటి వెంకట రామాచార్యులు ,శ్రీ ఎం .అంజయ్య ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,డా.శ్రీమతి వి.శ్రీ ఉమా మహేశ్వరి ,శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి కోనేరు కల్పన ,డా శ్రీమతి కొమా౦డూరి కృష్ణా ,డా,పి.పద్మావతీ శర్మ ,శ్రీమతి మద్దాలి నిర్మల, శ్రీమతి సామినేని శైలజ శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ ,శ్రీమతి ఎస్ .అన్నపూర్ణ , (విజయవాడ )శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లి ) డా శ్రీ జి.విజయకుమార్ (నందిగామ )శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు) ,శ్రీ వంగివరపు రాఘవాచార్యులు (గుడివాడ )  శ్రీ శిస్టి శ్రీనివాస శాస్త్రి (నిమ్మ కూరు )శ్రీమతి వారణాసి సూర్య కుమారి ,శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీమతి కందాళ జానకి,(మచిలీపట్నం ) డా.శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ ,శ్రీమతి సింహాద్రి పద్మ (అవని గడ్డ )శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అగ్ని హోత్రం శ్రీ రామ చక్ర వర్తి ,శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (అకునూరు )

 

‘’జననీ పృధ్వీ కామ దుఘాస్తే-జనకో దేవా సకల దయాళూ

దామ్యతా దత్తా దయాద్వం జనతాః-శ్రేయో భూయాత్ సకల జనానాం ‘’

( కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి )


Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 67 -ప్రాచ్యసాఖ్యానం రచించిన-విద్యా వారిది డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి

  గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

67 -ప్రాచ్యసాఖ్యానం రచించిన-విద్యా వారిది డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి

                   కుటుంబ నేపధ్యం

తండ్రి ,అన్న మహా న్యాయ మీమాంసా చార్యులులైన డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా గబ్బిట జయమాణిక్య శాస్త్రి గారల కుటంబం లో జన్మించిన గబ్బిట శ్రీని వాస శాస్త్రి ఇంగువ కట్టిన గుడ్డ గా అదే వైదుష్యాన్ని సాధించి గబ్బిట వారి వంశ కీర్తిని ఉత్తరాదిన వెదజల్లుతున్నాడు .ముగ్గురూ ముగ్గురే .ఆ తండ్రీ తనయుల అనుబంధం ,సంస్కృత విద్యా వైశిష్ట్యం ఎంత చెప్పుకున్నా తరగని గని .ఆంజనేయ శాస్స్త్రి గారి ముగ్గురు కుమారులలో చివరివాడైన శ్రీనివాస శాస్త్రి గీర్వాణ కవితా గీర్వాణ విశేషాలను తెలుసు కొందాం .

     

                              జనన విద్యాభ్యాసాలు  వివాహం

గబ్బిట శ్రీనివాస శాస్త్రి శ్రీ గబ్బిట ఆంజనేయ  శాస్త్రి ,శ్రీమతి పద్మావతి దంపతులకు 19-4-1987 న జన్మించాడు .శాస్త్రిగారిది కృష్ణా జిల్లా యలమర్రు స్వగ్రామం .తండ్రిగారు వారణాసిలో సంస్కృత విశ్వవిద్యాలయం లో న్యాయ శాఖ ప్రొఫెసర్ గా ఉండటం వలన శ్రీనివాస్ విద్య కూడా అక్కడే ఆరంభమైంది .2001 లో ‘’పూర్వ మధ్యమ’’ (టెన్త్ )సంపూర్ణానంద్ సంస్కృత విశ్వ విద్యాలయం లో చదివి ఉత్తీర్ణు డయ్యాడు.2005 లో’’ ఉత్తర మధ్యమ ‘’(12)ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి అందుకొని ,2008 లో కొత్త ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుంచి శుక్ల యజుర్వేదం లో ‘’శాస్త్రి ‘’(బి ఏ .) డిగ్రీ ప్రధమ శ్రేణి లో పొందాడు .శుక్ల యజుర్వేదం లోనే 2010 లో ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి ‘’ఆచార్య ‘’(ఎం .ఏ .)’’నూ  20 15 లో వేదం లో  ‘’విద్యా వారిది ‘’(పి.హెచ్ .డి.)ని కాంచీపురం డీమ్డ్ సంస్కృత విశ్వ విద్యాలయం నుంచి అందుకున్నాడు .కంచి కామకోటి పీఠాధి పతుల వద్ద వేద విద్యనూ అధ్యయనం చేశాడు .శ్రీమతి శ్రీకళను శ్రీనివాస శాస్త్రి వివాహమాడి సంతానం పొందాడు .

   శాస్త్రి గురువులలో ముఖ్యమైన వారు తండ్రి శ్రీఆంజనేయ శాస్త్రి గారితో పాటు ,శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శిష్యులైన డా .ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి గారు వంటి ప్రముఖులున్నారు .వీరితోపాటు శ్రీ ఆర్.వెంకట రామ ఘనాపాటీ ,శ్రీ కె వి యెన్ అవధాని ,ప్రొఫెసర్ శ్రీ పి కె ముఖోపాధ్యాయ గురు పరంపర వద్ద శాస్త్రి విద్య నేర్చాడు .

            గీర్వాణ రచనా సామర్ధ్యం

తిరుపతి వేద విశ్వ విద్యాలయం లో జరిగిన అంతర్జాతీయ వేద సభ లో ‘’ప్రతిషఖ్యానం –పరిచయః ‘’పై పరిశీలన పత్రాన్ని రచించి ప్రచురించాడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం –అఖిల భారతీయ శాస్త్ర సంగోస్టి ఫాకల్టి లో’’’’కృష్ణ యజుర్వేదే అర్ధ వాద వ్యాఖ్యానం ‘’అనే పత్ర సమర్పణ చేశాడు . వారణాసి బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ ‘’సంస్కృత విద్యా పత్రిక ‘’లో ‘’శ్రౌత స్మార్త కర్మాణి ‘’శీర్షిక తో వ్యాసాలను,’’మీమాంస సార౦ ’’ పైనా  రాశాడు .ఇవిగాక ‘’ప్రాచ్య సాఖ్యాయనం వివరణం’’,,’’ఆపస్తంభీయ పంచ దశ కర్మాను క్రమాణిక ‘’ రచించాడు .

               పురస్కారాలు

2000 సంవత్సరం లో 15 వ ఏటనే  లక్నో లోని ఉత్తర ప్రదేశ్  సంస్కృత సంస్థాన్ వారి ‘’వేద పండిత పురస్కారం ‘’,రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణు కాంత శాస్త్రి గారి చేతులమీదుగా  శ్రీనివాస శాస్త్రి అందుకొన్నాడు వారణాసి లోని దేవాలయ ,మఠాలలో నిత్య వేద పారాయణ చేస్తున్నాడు   ,కృష్ణ యజుర్వేద క్రమాంత పరీక్ష మొదటి తరగతిలో కృష్ణా జిల్లా మచిలీ పట్నం బృందావన పురం లోని కామ కోటి శంకర మఠంనుండి ఉత్తీర్ణుడయ్యాడు .తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రిని వేద పారాయణ దారునిగా నియమించింది .ఇందులో రెండేళ్ళు పని చేశాడు .

  ప్రస్తుతం శ్రీనివాస శాస్త్రి తండ్రిగారికి సహాయంగా  వారణాసి లో ఉంటూ శ్రౌత స్మార్త కర్మలను ఆచరిస్తున్నాడు .

 సశేషం 

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-1-3-17 -ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆంజనేయుడంటే వాళ్లకు కోపం

ఆంజనేయుడంటే వాళ్లకు కోపం

ఇండియాలో ఉత్తరాఖండ్ లోని ద్రోన్ గ్రామం లో భూటియా అనే తెగ వారికి హనుమంతుడు అంటే విపరీతమైన కోపం .దీనికి కారణమూ ఉంది . రామ రావణ యుద్ధం లో ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛ పోయాడు .హనుమంతుని సంజీవి మొక్క తెమ్మని  పంపితే దాన్ని గుర్తు పట్టలేక ఏకంగా డ్రోన్ గ్రామ లో ఉన్న సంజీవ పర్వతాన్నే పెకలించుకు  లంకకు తీసుకొని వెళ్ళాడట .సంజీవ పర్వతం ఆ గ్రామస్తుల ఆరాధ్య దైవమట.అందరి ప్రాణాలను కాపాడే తమ దేవుడైన ఆ కొండను హనుమ ఒంటి  చేతితో ఎత్తుకు పోవటం ఈ గ్రామం వారికి  ఆయనపై విపరీతమైన ఆగ్రహం కలిగించింది .కొత్త గా ఆ ఊళ్లోకి వచ్చే వారెవరూ ‘’జై బజరంగ భళి ‘’అనటానికి వీల్లేదు .

కొరియన్ల రాణి స్వగ్రామం అయోధ్య

కొరియన్ మహా రాజు కిం సురో కరక్ వంశాన్ని స్థాపించాడు .ఆయన భార్య మహారాణి ‘’హర వాంగ్ ఓక్ ‘’.ఈమెను ‘’సురి రత్న ‘’అంటారు .ఈ రాణి పుట్టిల్లు మన అయోధ్య .ఇక్కడి నుంచే క్రీ శ.48 లో పడవ ద్వారా ఆమె అయోధ్య నుంచి దక్షిణ కొరియా కు వెళ్లి కిం సురో రాజును పెళ్ళాడి ‘’గం వాన్ గయా ‘’రాజ్యాన్ని స్థాపించిందని కొరియన్ల నమ్మకం .పదేళ్ళప్పుడు ఆమెకు వివాహం జరిగింది .పది మంది పిల్లలకు తల్లి అయింది .వీరి ను౦చే కరక్ వంశం ఆవిర్భవించింది .రాణి వాంగ్ ఒక్ 157 ఏళ్ళు జీవి౦చిందట .ఒక  రోజు దేవుడు ఆమెకు కలలో కనిపించి ,కొరియాలో భార్య దొరక్క విలపిస్తున్న సురో రాజు ను చేరుకొని పెళ్లి చేసుకోమని చెప్పాడట .దక్షిణ కొరియాలో ఈ తెగవారు దాదాపు 60 లక్షల మంది ఉన్నారు .కరక్ తెగవారికి అందుకే తమ రాణి పుట్టిన పవిత్రస్థలం  అయోధ్య అంటే వాళ్ళకి వల్ల మాలిన అభిమానం .అందుకే ప్రతి ఏటా వందలాది మంది ఆ తెగవారు అయోధ్యకు యాత్రకు వచ్చి వెడుతూ ఉంటారు  కొరియాలో రాణి సమాధిని కట్టటానికి రాళ్ళను అయోధ్య నుంచే తీసుకు వెళ్లి నట్లు ఆమె సమాధిపై రాసి ఉంది.దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోది ని వారు అయోధ్యలో తమ రాణి వాంగ్ ఒక్ పేరిట ఆలయాన్ని కట్టమని కోరారు .అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రినీ కోరారు ఇద్దరూ సానుకూలంగా స్పందించారు .త్వరలో రాణి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ఆశిద్దాం .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-2-17 –ఉయ్యూరు

ఆధారం -6-11-16  ఆంద్ర జ్యోతి ఆదివారం స్పెషల్ .

 

 

 

 

 

 

 

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి  3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు  శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక  ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో ఉగాది కవి సమ్మేళనం ,ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,ఉగాది కవి సమ్మేళనం  గా  నిర్వహిస్తున్నాము .

సభాస్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు

గౌరవ అతిధి –శ్రీ పరుచూరి శ్రీనాద్ –ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ పరుచూరి రామ కృష్ణయ్య  ఫౌండేషన్ ట్రస్ట్ –నిర్వాహకులు (అమెరికా )

ఆత్మీయ అతిధులు –శ్రీ చనుమోలు సత్యనారాయణ ప్రసాద్ –ప్రముఖ సంఘ సేవకులు ,స్వచ్చంద సంస్థల నిర్వాహకులు ,స్వచ్ఛ.భారత్ కార్యకర్త (విజయ వాడ )

శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి సంపాదకులు ,’’నానీ కవితా ప్రక్రియ ‘’పరిశోధకులు

స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కార౦ ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రాసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతులు

స్వీకర్తలు -1-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిశ్శాస్త్ర వేత్త       శ్రీ నిష్ఠల  వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (పొన్నూరు )

2- అవధాన భారతి ,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్కృతోపన్యాసకులు – విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారు (హైదరాబాద్ )

స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతులు  మరియు శ్రీ మైనేని గోపాల కృష్ణ, శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)

స్వీకర్త – .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య  లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి  స్వ౦త  ఖర్చులతో ముద్రించి,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావుగారు  (విజయవాడ )

కార్య క్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి

 

‘’వసుధైక కుటుంబం ‘’   అంశం పై   ప్రముఖ కవి మిత్రుల చేత కవి సమ్మేళనం నిర్వ హి౦ప బడును

పద్యాలు అయితే 5 కు , వచన కవిత అయితే 15 పంక్తులకు పరిమితం .చదివిన కవిత కాపీ ని సరసభారతి కి అందజేయ మనవి .

నిర్వహణ –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు ,(విజయవాడ )శ్రీమతి కె . లక్ష్మీ కనక దుర్గ  (మచిలీపట్నం )

 

సాహిత్యాభిమాను లందరు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

పూర్తి వివరాలతో ఆహ్వానం మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి చేస్తున్నాము

జోశ్యుల శ్యామలాదేవి  మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ  గబ్బిట దుర్గాప్రసాద్

గౌరవాధ్యక్షులు         కార్య దర్శి                  కోశాధికారి                  అధ్యక్షులు -సరసభారతి

,                                                                                   27–2–2017

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు -2(చివరిభాగం )

పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు -2(చివరిభాగం )

చాలామంది కవులు సందర్భానికి బాగానే స్పందించి  తమ శక్తి యుక్తుల్ని కూడా దీసి  తమ కిస్టమైనన్ని పద్యాలు రాసి  తమదైన బాణీలో కంచు కంఠాలతో  దిక్కులు పిక్కటి ల్లేట్లు చదివే ప్రయత్నం చేశారు .కానీ సరైన విధానం అవలంబించక పోవటం వలన ,ఎవరు ఏ రోజు ఏ సమయం లో పద్యాలు చదవాలో ముందే తెలియ జేయక పోవటం వలన  మధ్యలో మంత్రులకు స్వాగతాలు వాళ్ళు యదా ప్రకారం ఆలస్యంగా రావటాలు, వాళ్ళకోసం ప్రోగ్రాం కుది౦చటాలతో కవులందరికీ సమానమైన సమయం దక్కలేదు .చాలా నిరుత్సాహ పడ్డారు కూడా .దీనికి తోడు’’మీ కవితలు ఎలాగో పుస్తకం లో ప్రచురిస్తారు కదా ఒక్క పద్యం చదవండి చాలు’’ అని ‘శ్రీ పాలపర్తి వారు పదే పదే అనటం కవులకు బాదే కలిగించింది.’’ అంతకాడికి పద్యాలు మీకే పంపించేవాళ్ళం కదా మళ్ళీ ఈ వేదిక ఎందుకు ?’’అని గొణుగుళ్ళూ  వినిపించాయి . మొదటి రోజు సభ ఆలస్యంగా ప్రారంభమవట౦ తో కవులకు సమన్యాయం దక్కలేదు .హడావిడిగా  ముక్కు చీదినట్లు చీదేశారుపాపం  .ఎక్కడో  విశాఖ  నుంచి ,కడపనుంచి వచ్చిన వారికి చాలా నిరాశా నిట్టూర్పే మిగిలింది .ఆ రోజు ఉదయం చివరగా చదివిన కవులకు శ్రోతలే లేరు అందరూ’’ ఫుడ్ కోర్ట్ లో బాటింగ్’’లో మునిగి పోయి ఉన్నారు .శ్రోతలు లేనప్పుడు కవులకు స్పూర్తి ఎలా కలుగుతుంది ? ఈ విషయం నిర్వాహకులు ఆలోచించలేక పోయారు .మధ్యాహ్న కవులకూ అదే పరిస్థితి . కవులు కూడా కొత్తదనం కోసం పాకు లాడింది తక్కువే అని పించింది .రొటీన్ రోడ్ద కొట్టుడు కొంత ఇబ్బంది అయింది .చమక్కులు లేవు .ప్రేలుళ్ళు లేవు .హాస్యపు వరద లేదు .చతురతా తక్కువే అనిపించింది . ఎత్తుగడా ,ముగి౦పులలో మెరుపులు లేవు .

రెండవ రోజు డా .శ్రీ తిరుమల శ్రీనివాసాచార్య ప్రసంగం ఆద్యంతం రక్తి కట్టింది .దిశా నిర్దేశామూ చేసింది .ఆయన రాసి చదివిన పద్యాలకూ గొప్ప సార్ధకత కనిపించింది .అవి నాకు బాగా నచ్చి అయన వెంట బడి స్క్రిప్ట్ తీసుకొని కాపీ చేసే దాకా వదలలేదు నేను. ఆయనా నవ్వుతూ నా కోరికను తీర్చారు .మర్నాడు ఆచార్య వర్య ను బెజవాడ మనోరమ హోటల్ వద్ద మేము పోలవరం యాత్ర సందర్భంగా కలువగా వారికినేను రాసిన  ‘’కేమటాలజి పిత కొలచల సీతారామయ్య –(పుల్లేరు నుంచి ఓల్గా దాకా )పుస్తకం అందజేస్తే చాలా ఆనందించారు. ఆ చిరునవ్వు  మనో ఫలకం పై ముద్ర పడింది . వీరిని మళ్ళీ సాయంత్రం వేదిక నెక్కించి మాట్లాడమనటం ,శ్రీ ఇనాక్ గారినీ ,మళ్ళీ వాయి౦చ మనటం చూసే వాళ్ళకే కాక వారిద్దరికీ కూడా  ఇబ్బంది కలిగించినట్లు అనిపించింది .దీన్ని అవాయిడ్ చేసి ఉండాల్సింది .

ఇప్పుడు డా. శ్రీ తిరుమల శ్రీనివాసా చార్య గారి పద్యాలను ఆస్వాదిద్దాం –

1-శ్రీ కృష్ణ దేవరాయల –యాకృతి నామమ్ములందు నద్భుత మేదో

ప్రాకటముగ భాసి౦చును –తాకిన నాముక్త మాల్యదను మన చేతన్ .

2-శబ్ద యోజన చూడ పాషాణ భంగి –కాని పించును రాయల కాయ మట్లు

అర్ధమారసి చూడగా  నమృత మట్లు-యెదల నూరించు  రాయల హృదయ మట్లు

3- ఆతని కావ్యము చదివిన –చేతస్సున నిండి పోవు చిన్మయ శక్తుల్

ఆతని వీరత గాంచిన –చేతుల చప్పట్లు కొట్టు జేజే లగుచున్ .

4-ఆతడెత్తిన కత్తి కెదురేది బెదురేది –అరి వర్గ మెల్లెడ శిరసు వంచె

ఆతడెక్కిన గుర్ర  మడ్డులన్నిటి ద్రొక్కి –పరుగు లెత్తగ గిరుల్ శిరసు వంచె

అతడు పన్నిన వ్యూహ చతురతల్ దిలకించి –పులకించి కోటలు తలలు వంచె

అతడు సల్పిన ధాటి నరి కట్ట లేని తు-ర్కల సైన్య మెల్ల శీర్షమును వంచె

రాత్రి పగలును భయద గర్జనలు సలిపి –యుద్ధ సైన్యాల నెపుడు సముద్ధరించి

గజపతుల నెల్ల నోజంబు ‘’కటక ‘’నూది-దక్షిణావని నేలిన దక్షు డతడు.

5-సంస్కృతాంధ్రములందు  సమ కౌశలము దెల్పు –రాయల మీసముల్ రమణ కెక్కె

శైవ వైష్ణవముల  సమదృష్టి  బ్రకటించు –రాయల మీసముల్ రమణ కెక్కె

శాత్రవ దమనము సత్ఫలనము జాటు –రాయల మీసముల్ రమణ కెక్కె

సతు లిద్దరను భావ సములని సూచించు –రాయల మీసముల్ రమణ కెక్కె

కృతులు రచియించుట –కవి కృతులు గొనుట

భువన విజయమ్ము నందును కవన విజయ మందు సమమని

మెరయించి యంద గించి –కృష్ణ రాయలకు సముల్  కెరలు చుండు.

6-ఒక చేత రాజ్య లక్ష్మికి స్వర్ణ మకుటాన –ముద్దుగా నవ రత్నములను పొదిగి

ఒక చేత రాజ్య లక్ష్మికి స్నిగ్ధ చికురాల –పొలుపుగా  అందాల పూలు ముడిచి

ఒక చేత విజయ లక్ష్మికి పాదముల నీడ –పరరాజ శిరముల వంచి నిలిపి

ఒక చేత వర లక్ష్మికి సంతసము గూర్చు – శంఖ భేరీ పృధు స్వనము వినిచి

తుళువ వంశ సంజాత చతుర్భుజుడయి –చతుర మతితోడ సాహితీ సమర రంగ

సార్వ భౌముడై తెలుగుల స్వాంత సీమ –వెలుగు శ్రీ కృష్ణ దేవరాయల నుతింతు .

7-ఖడ్గ మెత్తి నట్టి కఠిన కరమ్మున –కలము నెట్లు పట్టి లలిత రీతి

స్వప్నమందు గన్న  జ౦జాక్షు డే నిల్చె-ఖడ్గమందు ,అతని కలము నందు .

8-అంత గొప్ప కావ్య మాముక్త మాల్యద –కృష్ణ దేవ రాయ లెట్లు వ్రాసె

వింత ఏమి ?స్వప్న వేళాగమ౦దైన –ఆంద్ర విష్ణువు మహిమ యని తలంతు.

9-సరిలే రెవ్వరు విష్ణు కావ్య రచనా శైలీ విలాసమ్మునన్ –సరి లేరెవ్వరు ,సౌమ్య రాజ్య జనతా సౌఖ్య ప్రదానమ్మునన్

సరి లేరేవ్వరు ,దివ్య వేంకట గిరీశ స్వర్ణ సంపూజలన్ –సరిలే వెవ్వరు కృష్ణ రాయలకు అస్టైశ్వర్య భోగమ్మునన్ .

ఇలాంటి కలకండ వంటి పద్యాలను ఈ బ్రహ్మోత్సవం లో కవులు రాశారేమో తెలియదు –కారణం అన్నీ వినే అదృష్టం కల్పించక పోవటం ,కొంత మేము అక్కడ లేక పోవటం కూడా .పద్య వరద పారించి కృష్ణా  కూలంకష కు వరద తేవాలన్న అందరి సంకల్పం నెరవేర్చే మంచి ప్రయత్నమే ఇది .ఇంకొంచెం వ్యూహ రచన చేసి ఉంటే ఇంకా బాగా రాణించేది . 130 మంది కవులలో తలలు నెరిసిన వారే దాదాపు 120 మంది ఉంటారు .యువతను ప్రోత్సహించాలన్న ధ్యేయం సాధించ లేదు . కాలేజీ స్థాయిలో వారికి వేరే పద్య ప్రయత్నం చేసి ,ప్రోత్సాహకాలు అంద జేస్తే కొంత ప్రయోజనం ఉండేది ..

కవులు కావ్యాలు రాస్తే గొప్ప పారితోషికమిచ్చి వెంటనే ప్రచురిస్తామని ప్రభుత్వం తరఫున భాషా సాంస్కృతిక శాఖ కార్య దర్శి ,మంత్రి గారు ,శ్రీ బుద్ధప్రసాద్ వేదికపై చాలా సార్లు ప్రకటించారు .అది త్వరగా సఫలం అవుతుందని ఆశిద్దాం .కవులు మంచి రచనలు చేసి ,సమర్ధత చాటి ,ముద్రణ భాగ్యం పొందాలని ఆశిద్దాం .ప్రభుత్వాలు ప్రకటించినట్లు పనులు జరగటానికి ఏళ్ళూ పూళ్ళూ పడతాయి .కవులను ప్రభుత్వ౦ తమ  కటాక్షం కోసం చాతక పక్షుల్లా వేచి చూడనీయకుండా ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకొని అన్నమాట నిలబెట్టుకోవాలి .పైరవీలు ,పక్షపాతాలకు తావు లేకుండా సంర్ధతకు ,ప్రతిభకు విలువ నిచ్చి ప్రోత్సహించాలి .అప్పుడే పద్య కవితా బ్రహ్మోత్సవ కల సాకారమై అందరికి విస్తృత ప్రయోజనం లభిస్తుంది .యువత పోటీ పడి అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి .తెలుగు దేశం లో అందర౦  కలిసికట్టుగా  వారసత్వంగా వచ్చిన పద్యానికి పట్టాభి షేకం చేసే ప్రయత్నం చేసి తెలుగు తళ్లి ఋణం తీర్చుకుందాం .

ఇంతటిభారీ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించిన వారందరికీ అభినందనలు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-2-17 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

22-2-2017నాడు మాతృభాష దినోత్సవ చిత్రాలు

ది 22-2-2017నాడు మాతృభాష దినోత్సవ చిత్రాలు
విజయవాడ సంగీత కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – భాషా సాంస్క్రతిక శాఖ వారు నిర్వహించిన సభలో సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, కార్యదర్శి శివలక్ష్మిలను రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాధ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు సన్మానించారు.

https://plus.google.com/photos/115752370674452071762/album/6390280344072640465/6390280343547219618?authkey=CJWTrf6gkdaywQE

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వరద ‘’కవన కుతూహలం ‘’-3(చివరిభాగం )

వరద ‘’కవన కుతూహలం ‘’-3(చివరిభాగం )

శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ‘’మూడు తరాల రచయితల స్పందనలకీ సృష్టికీ ప్రత్యక్ష సాక్షి వరద .అవతలి తరం గి .రాం .మూర్తి నుంచి,తనతరం  బైరాగి వరకు 33 మంది పై వరద కవితా స్పందన .కేటలాగులు పట్టీలు లాగా కాకుండా రచయితల ఆలోచనా తీరుకు ప్రవర్తనల తీరుకు పరిశీలించి ఆత్మీయంగా రాసిన విశేషాలివి .వారి తరం వాటి ఊపిరి చప్పుళ్ళు వినిపించాడు వరద .రచయిత రచనా సామర్ధ్యం ,ప్రేరణ వెనుక ఉన్న వైయక్తిక జీవిత నేపధ్య విలువ తెలిపాడు .ఆయన చెపితేనే మనకు మారేపల్లి ,బొడ్డు ,ముద్దు కృష్ణ ,పురిపండా ,మాచిరాజు ,తురగా ,నలినీకుమార్ లగురించి పూర్తిగా తెలిసింది .వారి అనుభవాలు ‘’స్వ ఘోషలు ‘’కావు .వారి స్థాన నిర్ణయాల కు ఆకరాలు(రిఫరెన్స్ లు ) .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య ఆకాడెమీ ఆవిర్భావానికి పూర్వ రంగం ,అ.ర స .ఆవిర్భావ నేపధ్యం ,విలువైన డాక్యు మెంట్లు అన్నాడు శ్రీకాంత శర్మ .అంతకు మించి వరద ‘’కదన శైలి ‘’మరో ఎత్తు .కబుర్లు చెప్పినట్లు రాయటం చదివే ధోరణి పెంచేందుకు బాగా తోడ్పడింది .పాఠకుడిని మార్చే నైపుణ్యం ఉంది ఇందులో .పది పరిశోధన గ్రంధాలు ఇవ్వలేని సారాన్ని అయిదారు పేజీలలో తేల్చాడు వరద .అయన రుచి భేదం మనకు నచ్చకపోవచ్చు కాని అభిరుచిని కాదనలేం .అన్నాడు శర్మ .

‘’ఉన్మత్త భావ శాలుర జఠరాగ్నిని ని కవన కుతూహలం ఎట్టకేలకు చల్లార్చింది ‘’అన్నాడు అంబటి సురేంద్ర రాజు .కవుల వ్యక్తిగత జీవితం లోని ఔన్నత్య,సత్య సంధత,ఆదర్శం ,నిర్భీతి ,వ్యక్తిత్వం విలువలకోసం తపన మనముందుంచి కళ్ళు తెరిపించాడు వరద అన్నాడు రాజు రాజా లాంటి మాట .ఇది అసంపూర్తి గానే ఉంది .అప్పుడే అయిపోయిందా అనే ఉత్కంఠ మిగిల్చాడు .అన్ని వ్యాసాలూ ‘’జీవన శకలాలే ‘’.రెప్పపాటుకాలం లో గొప్ప కాంతి ప్రజ్వరిల్ల జేశాయి .శైలీ విన్యాసమే దీనికి గొప్పకారణం .పాఠకుడిని ‘’నిర్నిమేషుడిని ‘’చేసింది .బెల్లం కొండ ‘’త్రిపుట ‘’,తాగు బోతూ చెల్లెలా ‘’పాప’’ యెర్ర జీర ‘’రాయప్రోలు రాజశేఖర్ ‘’నివాళి ‘’’’శిష్ట్లా జ్ఞాపకాలు ‘’ఉచితంగా ఇచ్చినందుకు అబ్బూరికి ధన్యవాదాలు చెప్పాడు రాజు .’’సాహిత్య శిరో వేదన తో బాధ పడుతున్న ‘’సమకాలీన కవితా బాధితులకు ‘’కవన కుతూహలం ‘’ఒక ఉప శాంతి ‘’అన్నాడు అజంతా .అంతే కాదు ‘’సైద్ధాంతిక శిరో ముండనానికి  ఇది విరుగుడు కూడా ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు  సురేంద్ర రాజు .

‘’నారాయణ బాబు వట్టి అమాయకుడు అనుకొనే వాడిని ‘’అన్న వరద మాటల్లో బాబు ఉత్త తెలివితక్కువ దద్దమ్మ అన్న భావం ఉంది ‘’అన్నాడు ఏ బి కె .శ్రీ శ్రీ కవిత్వం మీదే సదభిప్రాయం లేని వరద, బాబు గురించి ఇంతకంటే ఏమంటాడు అన్నాడు ప్రసాద్ .’’ఆధునిక కవిత్వానికి స్వర్ణయుగం –ఒక రమ్యా లోకం ‘’అన్నది ఎందరికో నచ్చినమాట  అంటాడు  ‘’ఆర్ ‘’.ఆనాటి నవ్య కవులు 1920 లోపు కంటే 19 21-30 మధ్యనే గొప్పకవిత్వం అంతా రాశేశారు .కనుక 1910-1930  కాలం స్వర్ణయుగం అనాలి అని సవరణ చేశాడు ఆర్ .వరద కవన కుతూహలం చూస్తే ,చదివితే ఆనాటి సాహిత్య వాతావరణం మళ్ళీ వస్తే బాగుండును అనే ‘’నాస్టా ల్జియా ‘’కలుగుతుందన్నాడు ఆర్ .ఈ స్కెచెస్ కవుల జీవిత చరిత్రలుకావు తనజ్ఞాపకాల కధనం .విభిన్న వ్యక్తిత్వాల సజీవ సందర్శనం .శేషేంద్ర శర్మ కూడా పద్యాన్ని వరదలానే నెత్తికి ఎత్తు కోన్నవాడే తర్వాత వచనకవితలో పండిపోయాడు .

‘’ముద్దుకృష్ణ రాస్తాను అన్నాడు రాయలేదు.ఇది ముద్దు కృష్ణ రాయాల్సిన పుస్తకం అని వరద అనటం ఆయన మర్యాద ..రావి శాస్త్రి కూడా ప్రేరకుడు .ఈ వ్యాసాలూ హోమియోపతి మందులాగా ‘’విగరు, పొగరు ,పోటేన్సి ‘’కలిగి ఉన్నాయి అన్నాడు పురాణం .వరదను జీనియస్ అని రావి శాస్త్రి ఎప్పుడూ చెప్పేవాడని చందు సుబ్బారావు జ్ఞాపకం చేశాడు .

ఇంతటి కుతూహలం పుట్టించింది వరద ‘’క’వన కుతూహలం  ‘’

మహా శివరాత్రి శుభా కా౦క్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-17 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 స్వర్గీయ రాళ్ళ బండి కవితాప్రసాద్ ‘’ఒంటరి పూల బుట్ట ‘’కు సంస్కతాను వాదం చేసిన- డా.రాణీ సదాశివ మూర్తి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

66 –స్వర్గీయ రాళ్ళ బండి కవితాప్రసాద్ ‘’ఒంటరి పూల బుట్ట ‘’కు సంస్కతాను వాదం చేసిన- డా.రాణీ సదాశివ మూర్తి

Inline image 1

తూర్పు గోదావరిజిల్లా ఏనుగల మహల్ లో శ్రీ రాణీ సదాశివ మూర్తి జన్మించారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృతం చదివి ఎం ఏ .పొందారు .’’వైదిక ఛందస్సు ‘’పై పరిశోధన చేసి పి హెచ్ డి అందుకొన్నారు . వీరి డిగ్రీలను చూస్తె దిమ్మ తిరిగి పోతుంది .సంస్కృత, ఇంగ్లీష్లలో ఎం ఏ ., వేదాంతవిద్యా ప్రవీణ ,జ్యోతిష ఆచార్య .పొయేటిక్స్ ,వేదిక్ ప్రాసడి,తంత్ర సంస్కృత సైన్స్ లలో పట్టభద్రులు.ఎం బి ఏ కూడా చేశారు . సంస్క్రుతాధ్యాపకులుగా చేరి పని చేశారు .2000  సంవత్సరం లో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం సంస్కృత ఆచార్యులు గా లో చేరి పని చేస్తున్నారు .శ్రీ సదాశివ మూర్తి గారు ఇప్పటిదాకా 40 కి పైగా గ్రంధాలు రాశారు .ప్రాచీన గ్రంధాలలోని అనేకానేకమైన వైజ్ఞానిక విశేషాలను ఎన్నో వ్యాసాల ద్వారా తెలియ జేశారు. దేశ విదేశాలలో జరిగిన 80 కి పైగా  జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని విలువైన పరిశోధనా పత్రాలను సమర్పించారు .15 కు పైగా సదస్సులకు తామే నేతృత్వం వహించారు .ఆయన ప్రచురించిన పరిశోధనా వ్యాసాల సంఖ్య 50 కి పైమాటే .రాష్ట్రీయ విద్యా పీఠం కు శ్రీ సదా శివ మూర్తి చేసిన కృషికి  గుర్తి౦పుగా  2007 లో ‘’వ్యాసభారతి ‘’జాతీయ పురస్కారాన్ని,ప్రజ్ఞా భాస్కర బిరుదు అందుకున్నారు

నాట్యం లో మంచి ప్రావీణ్యం ఉన్నవీరిని .నాట్య రవళి వంటి పలుసంస్థలు  సత్కరించాయి . సంస్కృత నృత్య నాటికలు రచించారు . నాటకాలు రాశారు ..అనేక అరుదైన గ్రంధాలకు సంపాదకత్వం వహించారు .వీరి సంస్కృత భాషా సేవను గుర్తించిన సాహిత్య అకాడెమి ఇటీవలే పురస్కారం అందించింది .ఆంద్ర ప్రదేశ్ భాషా  సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా పని చేసిన  ద్విశతావదాని , బహు గ్రంధ కర్త స్వర్గీయ డా .రాళ్ళ బండి కవితా ప్రసాద్ రచించిన ‘’ఒంటరి పూల బుట్ట ‘’కవితా సంకలనాన్ని శ్రీ రాణీ సదాశివ మూర్తి సంస్కృతం లోకి అనువదించారు .దీనికి కేంద్ర సాహిత్య అకాడెమి 50 వేల రూపాయల నగదు  పురస్కారాన్ని ప్రకటించింది . ఈ పురస్కారాన్ని,తామ్ర పత్రాన్ని త్వరలో ఢిల్లీ లో జరిగే ప్రత్త్యేక కార్యక్రమం లో సదాశివ మూర్తి గారికి అందించి సత్కరిస్తారు .’’ఇంతటి గుర్తింపు ,గౌరవం దక్కటం జీవితం లో మరిచి పోలేను .ఇన్నాళ్ళు గా నేను సాగించిన సాహిత్య కృషి  ఫలించింది అని భావిస్తాను ‘’అని శ్రీ రాణీ సదాశివ మూర్తి అత్యంత వినయంగా చెప్పారు .

‘’హిడింబ భీమ సేనం ‘’అనే సంస్కృత ఫీచర్ ఫిలిం కు  ప్రొఫెసర్ సదాశివ మూర్తి దర్శకత్వం వహించారు .’’ఎలెక్ట్రానిక్ సెర్చ్ ఆఫ్ మహా భారత ‘’అనే వీరి పరిశోధన చాలా విపులం మూలాలకు  అత్యంత  సమీపం గా ఉన్నది అందులో 18 విషయాలపై పరిశోధన ఉన్నది .అవి –పర్వ ,ఉపాఖ్యాన ,అధ్యాయ,శ్లోక పరిశోధన ,సారాంశ ,చిత్ర ప్రదర్శన ,అస్త్ర ,యుద్ధ వ్యూహ మొదలైన వాటిపై విపుల పరిశోధన ఇది .అంతేకాదు   హరివంశం తో కూడా కలిసిఉన్న 1 లక్షా పది వేల శ్లోకాల మహా భారత౦ పై  మహా పరిశోధన ఇది.ఇందులో వారి కుశాగ్రబుద్ది’’ రాణీ ‘’గా రాజ్య మేలింది.దీనికి ప్రొఫెసర్ శ్రీపాద శ్రీ పాద సత్యనారాయణ మూర్తి ప్రిన్సిపల్ ఇన్వెస్టి గేటర్ అయితే ,ఆచార్య సదాశివ మూర్తి కొ ఆర్డినేటర్ .ఒకే ఒక్క ఏడాదిలో ఈ బృహత్ పరిశోధన పూర్తీ చేయగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది .

సంస్కృతం లోనే కాక పాశ్చాత్య భాషా విమర్శన లోనూ నిపుణులు .

జాతీయ స్థాయిలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు వ్యాఖ్యాతగా గొప్ప ప్రసిద్ధి పొందారు .

ఆధారం -23-2-17 ఆంద్ర జ్యోతి

సశేషం

మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-17 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు

పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు_

పద్యం అవుట్ డేటెడ్ దానికి మనుగడ లేదు అనే అభిప్రాయాన్ని మార్చాలన్న ఆలోచనతో ,పద్యానికి పునర్ వైభవం కల్పించాలన్న సదుద్దేశ్యం తో ,యువకులలో పద్యం పై మక్కువ కలిగించాలన్న ధ్యేయం  తో ఆంద్ర ప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ,ఆంద్ర ప్రదేశ్ పర్యాటక శాఖ ,ఆంద్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ,దివి ఐతిహాసిక మండలి సంయుక్త ఆధ్వర్యం లో ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి పూనిక ,ప్రేరణతో ,ఆంధ్రుల తొలి రాజధాని ,తెలుగు భాషకు మాత్రమే ఉన్నఒకే  ఒక దేవుడైన ఆంధ్ర మహా విష్ణువు దేవాలయం లో తెలుగు భాషా సంస్కృతులకు ఇతోధికంగా తోడ్పడిన ఆముక్త మాల్యద రచనకు స్వీకారం చుట్టిన ఆంద్ర భోజుడు సాహితీ సమరాంగణ సార్వ భౌముడైన  శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహ సమక్షం లో ఫిబ్రవరి 18 19 శని ఆదివారాలలో శ్రీ కృష్ణ దేవరాయ మహోత్సవం లో భాగం గా రెండు రోజుల’’ తెలుగు కవితా బ్రహ్మోత్సవాలు’’ జరిగాయి . పద్యం హోరులో స్తబ్దత దూరానికేక్కడికో కొట్టుకు పోయింది .పిలిస్తే పద్యం, పలకరిస్తే పద్యం గా సాగింది .రెండు రోజుల్లోనూ కనీసం 130 మంది లబ్ధ ప్రతిష్టు లైన కవులు నవ్యాంధ్ర లో ఉన్న 13 జిల్లాల నుండి వచ్చిపాల్గొన్నారు అంటే దీని విజయానికి అంతకంటే నిదర్శనం ఏమి కావాలి ?ఈ మొత్తం కార్యక్రమానికి సమన్వయ కర్తగా కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డాజి వి పూర్ణ చంద్ వ్యవహరించి సర్వ సమర్ధతతో నిర్వహించారు .దీనికి సాంస్కృతిక శాఖ కార్య దర్శి ప్రముఖ రచయిత  శ్రీ డి.విజయభాస్కర్ తోడ్పాటు  మిక్కిలి  శ్లాఘనీయం .

మొదటి రోజు 18 వ తేదీ శనివారం ఉదయం  శ్రీ విజయభాస్కర్ ఆహ్వానం ,సమన్వయము తో సభ జరిగింది .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి ప్రారంభోపన్యాసం అందరినీ ఆకర్షించింది శ్రీకాకుళం ప్రాశస్త్యాన్ని ,పద్య వైభవం ఆవశ్యకతను చక్కగా వివరించారు ,ఉప ముఖ్యమంత్రి శ్రీ నిమ్మకాయల చిన రాజప్ప్ప సభా ప్రారంభం చేశారు .జ్ఞానపీఠ మూర్తి దేవి పురస్కార గ్రహీత ఆచార్య శ్రీ కొలకలూరి ఇనాక్ గారికి మంత్రి గారి చేతుల మీదుగా  ఆత్మీయ సత్కారం జరిగింది .ఆత్మ కూరి మొల్ల రాసిన రామాయణం కు శ్రీ మున్నెల్లి శివ శంకరయ్య ,శ్రీమతి దగ్గుపాటి శ్రీదేవి రచించిన వ్యాఖ్యానం ను శ్రీ ఐలాపురం వెంకయ్య ఆవిష్కరించారు .శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఉత్సవ విశేషాలను వివరించారు .పద్య కవితగా  కావ్యమో నాటకమో ,ప్రబంధమో రాసిన కవులకు గోప్పపారితోశికం తోపాటు ప్రభుత్వమే ప్రచురణ బాధ్యతా చేబడు తుంది అని అందరూ ప్రకటించటం కవులకు గొప్ప ఊరట ప్రేరణ ,స్పూర్తి గా ఉంది.

తరువాత  అవధాన సరస్వతి శ్రీ పాలపర్తి శ్యామలా నంద ప్రసాద్ ఆధ్వర్యం లో 40 మంది కవులు తాము రచించిన పద్యాలను గానం చేసి మెప్పించారు .భోజన విరామం తరువాత మరో 30 మందికవుల పద్య గానం జరిగి .అందరినీ అలరించింది .కవులందరికీ శాలువాలతో శ్రీ బుద్ధప్ర సాద్,శ్రీ విజయ భాస్కర్ లు సత్కరించి ఆంద్ర మహా విష్ణువు జ్ఞాపికను ‘’కృష్ణా తీరం ‘’బృహత్ గ్రంధాన్ని కానుకగా అంద జేశారు . సాయంత్రం కళారత్న ,నాట్యా చర్య శ్రీ కె వి సత్యనారాయణ బృందం ‘’శ్రీ కృష్ణ దేవరాయ గోసంగి ‘’కూచి పూడి నృత్య రూపకం ప్రదర్శించారు .విద్యార్ధినీ విద్యార్ధులు స్థానికులు ప్రజాప్రతినిధులు  అత్యధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేశారు .డప్పు కోలాటం రంగ వల్లి ప్రదర్శన ఆకర్షనీయం గా ఉన్నాయి .దేవాలయం లో గోదాదేవి మూర్తి ఉండాలన్నఒక  కవి సూచనను అందరూ సమర్ధించారు .నన్ను పద్యం రాయమని శ్రీ పూర్ణ చంద్ ప్రోత్సహించాగా 5 ఆటవెలదులతో సయ్యాట లాడి శ్రీ రామ లక్ష్మణాచార్యులగారిచే పరిష్కరింప జేసి ‘’ముదిమి వయసున ఆటవెలది తో సయ్యాట ‘’శీర్షిక గా చదివి ఒకప్పుడు శ్రీకుళానికి ప్రసిద్ధి తెచ్చిన ఆటవెలదులు అంటే దేవ దాసీలకు పద్య పంచ రత్నాలను అంకితం చేస్తున్నట్లు ప్రకటించాను .బహుశా వారిని ‘’వాడు కున్న వారే ‘’కాని వారికి అంకిత మిచ్చిన వారెవ్వరూ ఉండి ఉండరు .నేనే ‘’ఆ పని ‘’అంటే అంకితం చేశాను .

19- వ తేదీ రెండవ నాటి కార్యక్రమం లో శ్రీ తిరుమల శ్రీని వాసా చార్య ప్రసంగం ఆసాంతం ఆహ్లాదంగా విషయ వివరణ పరంగా రాయల మహత్తర శక్తి కి దర్పణం గా సాగింది. వారి పద్యాలు చాలా రస స్పూర్తిగా ఉన్నాయి .60  మందికవులు పద్య కవితలు వినిపించి సత్కారం అందుకున్నారు .భోజనానతరం మంత్రులు శ్రీ దేవినేని ఉమా మహేశ్వర రావు శ్రీ పల్లె రఘునాధ రెడ్డి శ్రీ పైడి కొండల మాణిక్యాల రావు పాల్గొని దిశా నిర్దేశం చేశారు .శ్రీగుమ్మడి గోపాలకృష్ణ ,శ్రీ అన్నవరపు రామస్వామిగార్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .శ్రీ ఉమా గారి ప్రేరణతో నే మర్నాడు 20 వ తేది సోమవారం కవులందరం పోలవరం టూర్ చేశాం .సాయంత్రం 4 గం లకు శ్రీమతి పుల్లా భొట్ల శాంతి స్వరూప్ ,శ్రీతాతా సంజీవ శర్మ లు యువ జంట అష్టావధానం నిర్వహించారు .ఆశువు స్థానం లో నేను ‘’104 ఉపగ్రహాల ను ప్రయోగించిన రాకెట్టు ,దాన్ని నిర్మించి ప్రయోగించిన శాస్త్ర సాంకేతిక నిపుణులపై ‘’రాకెట్ వేగం తో నడిచే పద్యం చెప్పమని అడిగితే ద్విపదలో  చెప్పారు .పంచచామరం లో చెబితే అదిరేది .మరోఆశువుగా ఈ పద్య బ్రహోత్సవాలను తిరుమల  వేంకటేశ్వరుడు తన బ్రహోత్సవాలతో పోల్చుకొని ఎలా  ఆనంది౦ చాడో చెప్పమని అడిగాను. మంచి పద్యమే చెప్పారు .ఈ అవధానం లో ఘంటా నాదం చాలా ప్రత్యేకంగా ఉంది  .ఒక పృచ్చకుడు సుమారు 10 అక్షరాల వాక్యం ఇస్తే ఒక అవధాని దాన్ని పళ్ళెం మీద  గరిటె తో కొడితే దాన్ని విని మరో అవధాని ఆ మాటలను తెలియ జేయాలి .బాగా చేశారు ఇద్దరూ. అప్రస్తుతం కొంచెం డోసు మించినా బాగుంది .మంచి అవధానం చూశామన్న సంతృప్తి అందరికి కలిగింది .  శ్రీ మీగడ రామస్వామిగారి  ప్రత్యేక రాగాలతో చేసిన  పద్యగానం గొప్ప ఆకర్షణ .ఈ రెండు అవధానాలతో ‘’పద్యకవితా  బ్రహ్మోత్సవం’’ ,’’పద్య కవితా మహా  బ్రహ్మోత్సవం’’గా మారి మహాద్భుతమైన విజయాన్ని చేకూర్చింది .పూర్వ కవుల ముఖ్యమైన పద్యాలను సేకరించి మీగడ రామస్వామి వంటి గాయకులతో స్వర రాగ యుక్తంగా గానం చేయించి సి డి.లుగా తెచ్చి భవిషత్ తరాలకు భద్రపరచాలన్న సూచన అందరికి ఆమోద యోగ్యమైంది .అమలు జరగాలని ఆశిద్దాం   దివి సీమ ముడుబిడ్డ శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి  వేటూరి రాసిన దివిసీమ జాతీయ గీతాన్ని గానం చేసి సి డి విడుదల చేయించారు భగవద్గీతా గానమూ చేశారు. చివరగా కుమారి అంబిక నృత్య ప్రదర్శన తో కార్యక్రమాలు పూర్తీ అయ్యాయి . కొస మెరుపు –మొదటి రోజు కాఫీ టిఫిన్లు బాగానే ఉన్నాయి మధ్యలో మజ్జిగా ఇచ్చారు .సాయంత్రం వేదికపై ఉన్న అతిదులకే కాని కవులకు కనీసం టీ కూడా ఇవ్వలేదు .బిస్కట్లూ లేవు .ఉదయం కాఫీ కూడా కొద్దిమందికే అందాయి .రెండవ రోజు ధద్ధ్యోజనం ,పులిహారే టిఫిన్లు బాగా లేవు .శ్రీకాకుళం అంటే చక్ర పొంగలికి ప్రసిద్ధి .దాని రుచికాదు కదా  వాసన కూడా తగల క పోవటం పెద్ద లోపం . కాఫీ అసలు లేదు .కాఫీ గత ప్రాణులు చాలా ఇబ్బంది పడ్డారు .మధ్యాహ్నం భోజనం స్వీటు హాట్ తో బాగానే ఉంది .ఆ తర్వాత కవులను పట్టించుకున్న నాధుడు లేడు.ఎండ వేడిభరించలేనిది .మజ్జిగ ఇస్తే ముసలి ప్రాణాలకు ఊరటగా ఉండేది .సాయంత్రం టీ కాని ,స్నాక్స్ కాని’’ గెస్ట్ ఆఫ్ ఆనర్’’ లకు తప్ప ఎవరికీ లేవు .ఇలా  ఏ సాహితీ సభలోనూ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు .కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించే జాతీయ ,అంతర్జాతీయ సభలలో ఎవరికీ ఏ లోటూ ఉండేదికాదు .ఇలా ఇక్కడ జరుగ కుండా ఉండాల్సింది .ఇవి చంద్రునిలో చిరుమచ్చలే.చంద్రుని  ఆహ్లాద వెన్నెల ముందు ఇవి లెక్కలోకి రావు .

ఇంతటిభారీ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించిన వారందరికీ అభినందనలు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-1-17 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -3(చివరిభాగం)కొనసాగింపు

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ –  తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -3(చివరిభాగం)కొనసాగింపు

అనుకొన్నవన్నీ కావు .అనుకోకుండా నిమిషాలపై నిర్ణయం తీసుకొన్నవి ఒక్కోసారి అద్వితీయ విజయాలను ఇస్తాయి .అలాంటిదే మా పోలవరం టూర్ .ప్రకటించిన పది నిమిషాలకే శ్రీ పూర్ణ చంద్ గారు టూర్ కు వచ్చే వారి పేర్లు సేకరించటం ,మర్నాడు ఉదయమే ఏర్పాటు అవటం ,మేము ఉయ్యూరునుంచి ఆరుగురం పాల్గోవటం అంతా చక చకా జరిగి పోయాయి .ఇంకా ఎవరైనా వస్తారేమో నని పూర్ణ చంద్ గారు తెలిసిన వారందరికీ బస్ బయల్దేరే దాకా  ఫోన్ మీద ఫోన్ చేయటం నాకు తెలుసు .ఏదో ఒక కారణం చెప్పి రాలేమన్నవారే ఎక్కువ .అనుకున్నాం కనుక పాతికమందైనా వెళ్ళాలి అనుకోని బయల్దేరాం .రాలేని వాళ్ళు ఫేస్ బుక్ లో మాతో ఆనందం పంచుకొన్నవారే అధికం .ఒకరిద్దరు అసహనం చూపారు .

నాకు తెలిసినంతవరకూ కేరళ ప్రజా కవి అచ్చప్పన్ జయంతిని  ప్రతి ఏటా ఫిబ్రవరిలోవారం రోజులు  ఘనంగా జరుపుతారు .దేశ విదేశాలనుండి దేశం లోప్రతి  మూల నుండీ కవులు రచయితలూ పాల్గొని అనుభూతి పొందుతారు .అలాగే రెండేళ్ళ క్రితం అచ్చప్పన్ జయంతి సభలకు వెళ్లాలని ఒక ఆలోచన వచ్చింది .కాని ఈ నాటి వరకు అమలు కాలేదు .ఇప్పటికైనా ఏదైనా ఉత్సాహం ఉరకలు వేసే సాహితీ సంస్థ ఆ టూర్ ను ఏర్పాటు చేస్తే నేను కూడా రావటానికి సిద్ధమే .పూను స్పర్ధలు విద్యలందే కాదు కృషిలో ,సేవలో కూడా ఉండాలి అప్పుడే మంచి ఫలితం వస్తుంది .నిన్ననే నేను రాసినట్లు మేమెవరమూ గవర్నమెంట్ బాండ్ వాగన్ గాళ్ళం కాదు .మంచిని మెచ్చేవాళ్ళం సమర్ది౦చే వాళ్ళం మాత్రమే.అత్యాధునిక టెక్నాలజీ కొద్దోగొప్పో తెలిసినవాళ్ళం .ఆ రంగం లో అభి వృద్ధిని ప్రోత్సహించేవాళ్ళం .మా టూర్ బాచ్ లో బి టెక్ విద్యార్ధిని కుమారు బిందు తోపాటు ,యువ కవులు పత్రికా రచయితలూ నా బోటి ముసలివారు ,మహిళలూ ఉన్నారు కనుక ఒక చక్కని బాలన్స్ ఉన్న టూర్ .

ఆధునిక టెక్నాలజీ అందుకొని బస్ బయల్దేరాక అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకొంటూ అప్పటి కప్పుడు ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయించిన బిందు ,శ్రీ చలపాక అభినందనీయులు .అలాగే తిరిగి వచ్చేటప్పుడూ మా అనుభవాలను చెప్పించి ఫేస్ బుక్ లో  లైవ్ ప్రోగ్రాం గా వాళ్ళిద్దరూ నిర్వహించి ఈ టూర్ కు ఒక అత్యంత ఘనతను చేకూర్చారు ఇది టేక్నాలజి విజయం .వందలాదిమంది చూసి అభినందించారు అందరినీ .పట్టిసీమ ,పోలవరం పనులు అత్యంత ఆధునిక టెక్నాలజీ తో చేస్తున్నారు .దాన్ని తెలుసుకోవటానికే మేము వెళ్లి , మా టెక్నాలజీ తో లోకానికి ఆన్ ది స్పాట్ ఇన్ ఫర్మేషన్ ఇచ్చాం .ఇదో మైలురాయి .

అయితే మాకు కనిపించిన కొన్ని లోపాలు మంత్రి శ్రీ ఉమా గారికి ప్రయాణం లోనే చెప్పేశాం  .అవి పట్టి సీమ ,పోలవరం లలో అక్కడి పనుల విషయమై వివరించే బ్రోచర్లు లేవు .అడిగితె ఇంగ్లీష్ లో ఉన్న ఒక్కటి మాత్రమె పూర్ణ చంద్ గారికి ఇచ్చారు .సందర్శకులకు బ్రోచర్స్ చేతికిస్తే అక్కడి నిర్మాణపు పనుల వైశిష్ట్యం తెలుస్తుంది .అలాగే పోలవరం లోనూ అంతే.వీడియో లద్వారా జరిగిన, జరుగుతున్న, జరుగ బోయే పనులను ,ప్రొజెక్టర్ లద్వారా చూపిస్తే మరీ హృదయానికి తాకి మురిసి పోతారు .ఆ ఏర్పాటు ఇక నుంచైనా అక్కడ జరగాలి .తిరిగి వచ్చాక శ్రీ ఉమా గారు ఏర్పాటు చేసిన సభలో బ్రోచర్లు లేవని మేము చెబితే ,పట్టిసీమ పై తమ ఆఫీసులో ఉన్న చిన్న చిన్న హాండ్ బుక్ లను అంద జేశారు .అది సర్వ సమగ్రంగా ఉంది .కాని పోలవరం పై సమగ్రమైన బుక్లెట్ రావాలి. హా౦డీగా,పూర్తి వివరాలతో ఇలాగే తెలుగులో రూపొందింఛి అందించాలి . . ఇవి చెప్పాల్సిన బాధ్యతా మాది  .మొహమాటం లేకుండా మంత్రిగారికే తెలియ జేశాం సభా ముఖంగా .అయన సంతోష పడి, తమ దగ్గర మెకంజీ మాన్యువల్ ఉందని ,దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే వెంటనే ప్రచురిస్తామని చెప్పారు .పూర్ణ చంద్ గారు తప్పక అనువాదం అతి త్వరలో  అంద జేస్తామన్నారు .ఇది కూడా చాలా సమగ్రమైన పుస్తకం అవుతుంది .అభి వృద్ధి విషయం లో మెకంజీ ఆలోచనలు అందరికి తెలుస్తాయి .                   మరొక్క సారి నాతో ఈ పర్యటనలో పాల్గోన్నవారికీ ,ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి అధికారులకూమా పూర్ణ చంద్ గారికీ  అందరికీ కృతజ్ఞతలు .ఇది వినోద యాత్ర కాదు .శాస్త్ర సాంకేతిక విజ్ఞాన యాత్ర .ఫలప్రద యాత్ర .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-2-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -2(చివరిభాగం )

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ –  తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’ -2(చివరిభాగం )

https://plus.google.com/photos/115752370674452071762/album/6389572083020488849?authkey=CMfb3Ia3zPaC7gE

పట్టి సీమ ఎత్తి పోతల పధకం

‘’ధనమేరా అన్నిటికి మూలం ‘’కాదు ,’’జలధనమేరా అన్నిటికి మూలం –ఆ జలము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ‘’అన్నది సూక్తి కావాలి .’’జలసిరి  ఉంటేనే  సర్వ  సిరుల సమాహారం లభిస్తుంది . జీవాధారం, జీవనాధారం అయిన నీరు  అతి పవిత్రం . దాన్ని సేకరించి నిల్వ చేసుకోవాలి .లేకుంటే ప్రగతి అధోగతి పాలౌతుంది .

ఇటీవలకాలం లో కృష్ణ గుంటూరు సీమలలో  కృష్ణ నదీ జలాలు అందక ‘’క్రాప్ హాలిడే ‘’ప్రకటించబడి అన్నపూర్ణ అయిన ఈ రెండు జిల్లాల పరిస్థితి దారుణమై రైతుల పాలిటి హృదయ శల్యమై బాధిస్తోంది .దీని నుంచి రైతులకు విముక్తి కలిగించకపోతే ఆంద్ర దేశానికి మనుగడ ఉండదు .ఈ విషయాన్ని కనిపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ,పోలవరం వచ్చేదాకా ఆగకుండా ,సాగు తాగు నీరు అందించే పధకం గా లిఫ్ట్ ఇర్రిగేషన్ ద్వారా గోదావరి నీళ్ళను కృష్ణ లో బెజవాడ అవతల  ఇబ్రహీం పట్నం దగ్గరున్న ఫెర్రీ లో సంగమించే పధకం ఆలోచించి అత్యంత వేగంగా అమలు జరిపి అందరినీ ఆడుకున్నారు .దీనివలన గోదావరి జిల్లాకు ఏ రకమైన నష్టం ఉండదు కారణం గోదావరి వరద జలాలను మాత్రమే పట్టిస గ్రామం వద్ద నిర్మించిన 24 మోటార్ల నిలువు మోటార్లతో తోడి పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణా నదికి చేరేట్లు చేయటం సాహసం అద్భుతం .పోలవరం నిర్మాణానికి మనపైనున్న రాష్ట్రాల అభ్యంతరాలు నిదుల కొరత ,కేంద్ర సాయం అంత త్వరగా పరిష్కారం అయ్యే వికావు కనుక అంతదాకా అన్నదాతలను పస్తుపడుకో బెట్టటం ఇష్టం లేక పట్టుబట్టి చేబట్టిన దీపట్టిసీమ ఎత్తి పోతలపధకం .

పట్టిసీమకు ఒక ప్రత్యేకత ఉంది ద్రాక్షారామం లోదక్ష ప్రజాపతి అల్లుడైన శివుని ఆహ్వానించకుండా యజ్ఞం చేసి ,పిలువని పేరంటంగా వచ్చిన స్వంత కూతురు సతీ దేవిని అవమానిస్తే ,ఆమె అక్కడే యోగాగ్నిలో దగ్ధమైతే ,శివునికి తెలిసి జటాజూటం నుంచి వీర భద్రుని సృష్టించి దక్షాధ్వర విధ్వంసం చేయించాడు .హాజరైన దేవతలందరికీ తగిన శాస్తి చేసి తన’’ పట్టిస ‘’అనే ఆయుధం తో  దక్షాదులను సంహరించి  ,ఆ పట్టిస ను గోదావరి నీటిలో కడిగిన ప్రదేశమే పట్టిస .అదే పట్టి సీమ .గోదారి మధ్యలో శ్రీ వీర భద్రేశ్వరాలయం చిన్న గుట్ట మీద ఉంటుంది .బోటులలో వెళ్లి దర్శించాలి .శివరాత్రికి ఇక్కడికి వేలాది భక్తులు వచ్చి దర్శనం చేసుకొంటారు .అంతటి పురాణ ప్రసిద్ధ ప్రదేశం పట్టిస .అక్కడే మన ఎత్తి పోతలపధకం ఉన్నది .అదిఅప్పుడు  ‘’వీర భద్ర విజయం’’ అయితే ఇప్పుడిది’’ చంద్ర బాబు విజయం ‘’..

పోలవరం పనులు యదా ప్రకారం జరుపుతూనే దీనికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చారు .పట్టిస గ్రామం పోలవరానికి అతి దగ్గరలో ఉండటం కుడికాల్వ సమీపం లో ఉండటం దీన్ని ఎంచుకోవటానికి ముఖ్య కారణాలయ్యాయి .వరదకాలం లో సుమారు 80 టి ఎం సి లనీటిని ఎత్తిపోస్తారు  .24 మోటార్లు అంటే  వర్టికల్ టర్బైన్ పంపులుఉపయోగించారు .ఒక్కో మోటారు 354 ఘన అడుగుల -10 ఘన మీటర్ల నీరు ఎత్తి పోస్తుంది .ఒక్కో మోటార్ హార్స్ పవర్ 6300 .పోలవరం కుడికాల్వ లోకి నీరు  మళ్ళించ టానికి తా 95అడుగుల ఎత్తుకి నీటిని తోడిపోస్తారు .ఒక్కో మోటారు విద్యుత్ సామర్ధ్యం 4.7 మెగా వాట్లు .మొత్తం 113 మెగా వాట్ లవిద్యుత్తూ అవసరం అవుతుంది .ఈ పధకానికి అక్కడ రైతులనుంచి స్వచ్చందంగా సేకరించిన భూమి 186 .5 ఎకరాలు .గోదావరి ఒడ్డునే పట్టిసం గ్రామం లో పంప్ హౌస్ కట్టారు .14 మోటార్లను బి హెచ్ ఇ ఎల్ సమకూరుస్తే  గడువు లోపు పని పూర్తీ అవటానికి మరో 14 చైనా నుంచి తెప్పించి వాడారు .

డయాఫ్రం వాల్ నిర్మాణం ఇక్కడి ప్రత్యేకత .మోటారు,పంపులు అమర్చటానికి లోతుగా బావిని తవ్వి అంచులు కూలి పోకుండా గోడలు కట్టే బదులు భారీ ప్రత్త్యేక యంత్రాలతో నాలుగు వైపులా మందపాటి గోడను కడతారు ఇదే డయాఫ్రం వాల్ .వీటి మధ్యలో ఉన్న మట్టిని త్రవ్వి తీసి బావులు నిర్మించారు ఇది అత్యంత అధునాతన ప్రయోగం అత్యన్తరక్షణ కరం కూడా. పనీ అతి త్వరగా పూర్తీ అయింది .221మీటర్ల పొడవు 33 మీటర్ల వెడల్పు స్థలం లో గోదారి ఒడ్డునే పంప్ హౌస్ నిర్మించారు .దీనికి కుడి కాలువ కేవలం 4 కిలో మీటర్ల దూరం లోనే ఉంది.ప్రత్యేకమైన 12 వరుస పైప్ లైన్ ల ద్వారా నీరు వస్తుంది .ఒక్కో పైప్ లైన్ 3.2 మీటర్ల అంటే దాదాపు 10 మీటర్ల వ్యాసం కలిగి న పైప్ లైన్లను ఈ నాలుగు కిలో మీటర్ల పొడవునా 12 వరుసలలో అమర్చారు .ఒక్కో వరుస పైప్ లైన్ రెండు పంపులు తోడిన నీటిని మోసుకు వెడుతుంది .అంత లావు గోట్టాలనుంది నీరు కాలవలోకి పోస్తే గట్లు కొట్టుకు పోకుండా ప్రత్త్యేక డెలివరి సిస్టర్న్ లను  రెండు ఎకరాల స్థలం లో ఏర్పాటు చేశారు .ఈ పైప్ లైన్ లద్వారా కుడికాలువకు చేరిన నీరు అక్కడి నుండి త్రవ్విన177 కిలోమీటర్ల  ప్రత్యేకకాలువ గుండా కృష్ణా నదికి చేరుతాయి .కాలువలోకి నీరుపడే దాకా మనకు ఎక్కడా గొట్టాలు భూమి పైన కానీ పించకుండా లోతుగా అమర్చటం మరో ప్రత్యేకత .ఈ కాలువ ప గొ జిల్లాలో 12 1 కిలో మీటర్లు ,కృష్ణ జిల్లాలో 56కి మీ ప్రయాణం చేస్తుంది .ఈ కుడికాలవ పోలవరం జలాశయం దగ్గర లో ఉన్న ‘’తోట గొంది ‘’గ్రామం లో ప్రారంభమై ,కృష్ణా జిల్లా వెలగలేరు గ్రామం వద్ద అంతం అవుతోంది .ఈ కాలువ ప గొ జి లో 9 మండలాలు –పోలవరం ,కొవ్వూరు ,గోపాలపురం ,దేవరపల్లి ,నల్ల జర్ల ,ద్వారకా తిరుమల ,పెదవేగి ,దెందులూరు పెదపాడు మండలాలలో  ,43 గ్రామాలు,-పోలవరం ,వి౦జపురం ,ప్రగడ పల్లి ,గంగోలు ,కొవ్వూరు పాడు ,గుడ్డిగూడెం ,భీమోలు ,వెల్ల చింతల గూడెం ,చిట్యాల ,వెంకట రాయ పాలెం ,చెరుకు మిల్లి ,బందాపురం ,దేవరపల్లి ,దీమంతుని గూడెం ,యర్న గూడెం ,వీరవల్లి ,సంజీవ పురం అనంతపల్లి ,నల్లజర్ల ,మరెళ్ళమూడి ,ఆవపాడు ,ఉంగుటూరు రిజర్వ్ ఫారెస్ట్ ,నల్లమాడు  ,గున్నంపల్లి ,నారాయణ పురం ,యం.ఎస్ పల్లి ,పంగిడిగూడెం ,పోలసానిపల్లి ,సి సి పూడి ,రామారావు గూడెం అగ్రహారం,ముండూరు ,చక్రాయ గూడెం ,జి .గుంట,పెదవేగి ,కావవ గుంట ,చోది మేళ్ళ,ఒంగూరు ,జగన్నాధ పురం ,పినకడిమి ,కొప్పాక ,భోగాపురం ,వేంపాడు ,కొక్కిరపాడు గ్రామాల గుండా  కృష్ణా లో 5 మండలాలు –నూజివీడు ,బాపులపాడు ,గన్నవరం ,విజయవాడ రూరల్ ,జి కొండూరు ,మండలాల గుండా 25 గ్రామాలు –పల్లెర్ల మూడి ,సీతారాం పురం ,వేలేరు ,రేమల్లె ,రంగన్న గూడెం ,వీరవల్లి ,సూరవరం ,బండారు గూడెం కుందావారి కండ్రిక ,పాతపాడు ,పి నైనవరం ,జక్కంపూడి ,వేమవరం ,కొత్తూరు తాడేపల్లి ,తాడేపల్లి వెలగలేరు ,బల్లిపర్రు ,తెంపల్లి ,వీరపనేని గూడెం చిక్కవరం ,గొల్లనపల్లి ,గోపువారి గూడెం ,కొండపావులూరు , గుండా ప్రవహి౦చి ఇబ్రహీం పట్నం వద్ద ఫెర్రీలో కృష్ణా నదిలో గోదావరికలిసి గోదా కృష్ణ రూపు దాల్చింది .కృష్ణా పుష్కరాలకు ఈ అసాధ్యం సుసాధ్యమైంది .రైతులకు సకాలం లో నీరు అందించటమే దీని ప్రధాన ఉద్దేశ్యం .

కుడికాలువ కృష్ణా జిల్లా పల్లెర్ల మూడి వద్ద మొదట ప్రవేశిస్తుంది .రైతులతో ముఖ్యమంత్రి చర్చించి సానుకూలంగా స్పందింపజేసి ,తగినంత నష్టపరిహారం ఇచ్చి ఈ భూములు తీసుకొన్నారు .కావాల్సిన 12 ,543 ఎకరాలలో 10 ,695 ఎకరాలు సేకరించారు ఇంకా 1848 ఎకరాలు సేకరించాలి .కోర్టు కేసులలో ఉండటం వలన ఈ సేకరణ జరగలేదు కుడికాలువ పనులన్నీ 60 రోజుల్లో పూర్తీ చేయటం విశేషం.అప్పటికే గతప్రభుత్వం కాలువలను కొంతమేరకు త్రవ్వటం వలన యిది సాధ్యమైంది .మొత్తం 13 6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని 438 ఎక్స్ వేటర్లు ,10 25 టిప్పర్లు ఉపయోగించి తవ్వారు .వేగం గా పని ముగియటానికి తాత్కాలికంగా85 మంది ఇంజనీర్లను కేటాయించారు .మొత్తం మీద 141 మంది ఇంజనీర్లు ,181 మంది సాంకేతిక నిపుణుల వేలాదికార్మికుల  సేవలను వినియోగించారు .కల్వర్టులు అండర్ టన్నేళ్ళు  , ఆక్వి డేక్ట్ ,ఇన్ లెట్ ,అవుట్ లెట్ లద్వారా వాగులు వంకల అవరోధాలను అధిగమించారు .రవాణా సౌకర్యానికి ఇబ్బందిలేకుండా కాలువలో పెద్దపెద్ద పైపులు వేసి తాత్కాలిక  వంతెనలు  వేశారు  .తవ్విన మట్టిని కాలువ గట్ల పటిష్టతకు ఉపయోగించారు  .

పోలవరం పూర్తీ అయితే పట్టిసీమ యంత్రాలను మరొక చోట కు తరల్చి ఉపయోగిస్తారు .13 00కోట్ల రూపాయల పట్టి సీమ ఎత్తి పోతలపధకం వలన ఏటా రైతులకు 1000కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తుంది .దీనివలన కృష్ణా ఆయకట్టులో 13 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది .ముందే చెప్పినట్లు గోదావరి వరద నీరు మాత్రమే అందులోనూ కొద్దిభాగం మాత్రమే దీని ద్వారా ఉపయోగిస్తున్నాం .పట్టిసీమలో 14 మీటర్ల నీటి మట్టానికి మించి వరద వస్తేనే కృష్ణాకు నీరు తరలిస్తారు కనుక గోదావరీ తీర ప్రాంత రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు .ధవళేశ్వరం బ్యారేజి పూర్తీ స్థాయి నీటి మట్టం 13 .6 7 మీటర్లు పైన .అంతకంటే ఎక్కువ నీరువస్తే కిందకి వదులుతారు .కనుక పట్టి సీమ వద్ద నీరు తోడాలి అంటే 14 మీటర్ల పైన నీరు వస్తేనే అది వరదనీరై కృష్ణాకు నీరు అందుతుంది అని అందరూ గ్రహించాలి . కృష్ణా జిల్లాలో జి కొండూరు మండలం వెలగలేరు వద్ద కుడికాలువ ద్వారా నీరు తెప్పించి అక్కడినుంచి బుడమేరు మళ్లింపు ద్వారా కృష్ణ లోకి నీళ్ళు మళ్ళించి బుడమేరును సద్వినియోగం చేస్తారు .

ప్రకాశం బారేజి కెపాసిటి 3 టి ఎం సీ లు మాత్రమే .మరి గోదావరి నుంచి వచ్చి చేరే 80 టి ఎం సి లనీటిని  నిల్వ చేయకుండా కృష్ణా డెల్టా కాలువలకే ఆయకట్టు నీరు అందించటానికి విడుదల చేసి బారేజ్ ను కాపాడుతారు .కృష్ణా గోదారులకు ఒకే సారి వరదలు వస్తే గోదారి జలాన్ని అసలు తరలించనే తరలించారు. సముద్రం పాలుకావాలి లేక పోలవర జలాశయం లో నిలవ చేస్తారు .డెలివరి సిస్టం పని సామర్ధ్యానికి కావాల్సిన విద్యుత్ ప్రాజెక్ట్ లో భాగంగా 11 కె వి ళ సబ్ స్టేషన్ నిర్మించి .పల్లంట్ల గ్రామం వద్ద 400 కె వి సబ్ స్టేషన్ నుంచి ప్రత్యెక ట్రాన్స్ మిషన్ లైన్లద్వారా విద్యుత్ అందిస్తారు .కాలువ దారిలో ఉన్న వాగులలోని నీటినీ వాడుకొనే ఏర్పాటు చేశారు .పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ,పంపిణీ కాలువల  వ్యవస్థ ఏర్పడ్డాక రాయలసీమ పొలాలకు నీరు అందజేస్తారు .కుడికాలువ కు ఇచ్చిన భూమికి గాను రైతులకు 700కోట్ల నష్ట పరిహారం చెల్లించి సంత్రుప్తిపరచారు .కరువుకాటకాలను తట్టుకొని నిలబడటానికిడెల్టా శిల్పి  సర్ ఆర్ధర్ కాటన్ సూచించిన నదుల అనుసంధాన విధానాన్నే మన ప్రభుత్వం భారత దేశం లో మొట్టమొదటి సారిగా అమలు చేసి అసాధ్యాన్ని అత్యన్తసుసాధ్యం చేసి చూపించింది .దీనికి అందరూ అభినందనీయులే .

కుడికాలువ రహదారులు దాటే చోట మొత్తం 41 వంతెనలు నిర్మించారు .పోలవరం కాలువ గుండేరును కవ్వగుంట వద్దా  ,తమ్మిలేరును జానం పేట ,రామిలేరును పల్లెర్ల మూడివద్ద దాటుతుంది .పట్టిసీమ ప్రాజెక్ట్ పనిని ‘’మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ ‘’కు అప్పగించారు .పట్టిసీమ పనులు ప్రారంభించిన 139  రోజుల్లోనే గోదావరి  కృష్ణ లను 16-9-20 16 న  అనుసంధానం చేసి రికార్డ్ సృష్టించారు.

గోదావరి నదీ గర్భం లో  కట్టే పోలవరం డాం నిర్మాణానికి అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరికారాలను ఉప యోగిస్తున్నారు. జర్మన్ టెక్నాలజీ దీనికి గొప్పగా సహకరిస్తోంది .డయాఫ్రం వాల్ నిర్మాణమే ఒక అత్యద్భుతం .ప్రత్యేకంగా చూశాముకనుక మహదానందం వేసింది  ఇక్కడ వాడే భారీ పరికరాలన్నీ మన దేశం లోనే తయారు చేసినవే .యంత్రాల నిర్మాణం ,ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అంతా ఎల్ అండ్ టి వారిదే అవటం తో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి .అయినా చంద్రబాబు ఇంకా అసంత్రుప్తిగానే ఉన్నారు .వారానికి జరగాల్సిన పనులలో నలభై శాతమే అవుతున్నట్లు నిన్న చాలా తీవ్రంగా స్పందించారు .. కాని అక్కడి ఇంజనీర్లు చాలా ఆత్మ విశ్వాసం తో పని చేస్తూ ,గడువుకు ముందే ప్రాజెక్ట్ పూర్తీ చేస్తామని గర్వంగా మాతో అన్నారు .నిజమే అని పించింది .డాం నిర్మాణం తర్వాత అటు 150మీటర్లు ఇటు మరో 150మీటర్ల ఏటవాలు రోడ్డును వంద అడుగుల లోతు నుండి నిర్మించి పై భాగాన రెండు వైపులా 50 మీటర్ల వెడల్పు ఉండేట్లు నిర్మిస్తారు .కొండలు గుట్టలు త్రవ్వి తీసిన రాయి రప్పా మట్టి అంతటిని  ప్రాజెక్ట్ బలోపేతానికి వినియోగిస్తారు . ఏర్పరచే కాఫర్ (మట్టి ) డాం నిర్మాణమూ అపురూపమైనదే .మరొక మూడేళ్ళలో ప్రాజెక్ట్ మొత్తం పూర్తీ అయి బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ గా అబ్బుర పరుస్తుంది . వచ్చే జూన్ నాటికి పోలవరం నీరు కృష్ణానదిలోకి చేర్చే భగీరధ ప్రయత్నం లో అందరూ తలమునకలై పని చేస్తున్నారు .మన సాంకేతిక పరిజ్ఞానానికి జోహార్లు అందించాలి .భారత దేశం లో ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ కూ ఉపయోగించని అత్యాధునిక శాస్త్ర సాంకేతికతను పోలవరం ప్రాజెక్ట్ కు విని యోగించటం దీని అతి ముఖ్య మైన విషయం విశేషం .ఇంతటి బృహత్తర నిర్మాణాన్ని మన రాష్ట్ర ప్రభుత్వమే ఎవరి కోసమూ ఎదురు చూడకుండా ప్రారంభించింది .తర్వాత భారత ప్రభుత్వం మొత్తం ఆర్ధిక బాధ్యత సమ కూర్చటానికి ముందుకురావటం ,పైన ప్రధాని శ్రీ మోడీ ,జలవనరుల మంత్రి శ్రీమతి ఉమా భారతి  ,ఇక్కడ రాష్ట్రం లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ,జలవనరుల మంత్రి శ్రీ ఉమా మహేశ్వర రావు ల సంయుక్త ఆలోచన మద్దతు పూర్తీ స్థాయిలో లభించి  ,ఫలితాలను త్వరలో అందుకో బోతున్నాం .ఏ ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఇదే వేగం తో పనులు జరిగి ప్రాజెక్ట్ అతి త్వరలో అన్ని లక్ష్యాలతో  సాకారం  కావాలని  సర్వ దేవతలనూ ప్రార్ధిద్దాం . శుభం భూయాత్ .ఈ బృహత్తర అత్యంతాధునిక దేవాలయ నిర్మాణానికి  రాళ్ళెత్తి న కూలీ లందరికి వందనం అభి వందనం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-2-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’

అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ –  తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’

Photo:
Photo:
Photo:

కొందరు తమ స్వీయ సేవాభాగ్యం తో చరితార్దులౌతారు ,చరిత్రనూ సృస్టిస్తారు ,భావి తరాలకు మహా మార్గ దర్శకులై  తేజో మూర్తులని పించుకుంటారు .పనిలో కసి ,కృషిలో నైశిత్యం ,ఆలోచనలో నవీనం ,శ్రేయస్సులో యశస్సు ఉన్న వాడే మన నవ్యాంధ్ర ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు .ఆయన మంత్రి వర్గ సహచరులలో అదే దీక్షతో అదే తపనతో ,ఆయన పదంలో పదం కలిపి అంతే అంకిత భావం తో పనిచేస్తు కలల సాకారానికి కృషి చేస్తున్న  మన జల వనరుల మంత్రి శ్రీ దేవి నేని ఉమా మహేశ్వర రావు ఆయనకు సరి జోడు .ఇద్దరూ కలిసి’’ టు ఇన్ వన్’’. అందుకే పట్టి సీమ ఎత్తిపోతల పధకం అంత త్వరలో రూపు దిద్దుకొని ,విభజన వలన అన్నపూర్ణ వంటి కృష్ణా  గుంటూరుజిల్లాల  అన్నదాతలు  నీళ్ళో రామచంద్రా అని మొత్తు కోకుండా ,దశాబ్దాల  సుప్త స్థితిలో ఉన్న పోలవర జలాశయ నిర్మాణం ప్రారంభించినా, దానికి ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలవలన అసలుకే మోసం వస్తుందేమో అనే ముందు చూపుతో దాని పని దాన్ని సాగిస్తూ ,ఆపద్ధర్మగా పట్టిసీమ ఎత్తి పోతల పధకం బాబు మస్తిష్కం లో తళుక్కున మెరవటం ,సాధన సంపత్తి చేకూర్చుకొని అసహాయ సూరునిలా కార్య రంగం లో దిగి గోదారమ్మను రికార్డ్  టైం లో క్రిష్ణమ్మలో అను సందానించి ‘’గోదా కృష్ణ ‘’లేక క్రిష్ణావరి ‘’ని సాధించి రైతన్న వదనాలలో దరహాసాలు పూయించి ,వరిలో రికార్డ్ ఉత్పత్తి సాధించేట్లు చేయగలిగి  స్వర్ణాంధ్ర కు నాంది పలికాడు .లేక పోతే అసలే కర్నాటక డాములవలన బక్క చిక్కిన కృష్ణా నది బెజవాదదాకా కూడా వచ్చే అవకాశం ఉండేదికాదు .ఇదీ దార్శనికుడైన పాలకునికి  ఉండాల్సిన లక్షణం .ఆ లక్షణాలు పూర్తిగా మూర్తీభవించిన వాడు చంద్రబాబు . ఈ కలల సాకారానికి మరింతసమర్ధతతో కృషి చేసి తామూ ఏమాత్రం తీసి పోనీ వారమని రుజువు చేశారు ఇంజనీర్లు ,సాంకేతిక నిపుణులు ,కార్మికులు ..ఇందరి సమైక్య ,సమష్టి కృషి ఫలితం మనం ఒక్క ఏడాదిలో నే అనుభవించాం .నిరంతర పర్యవేక్షణ ,సముచిత సలహాలు ఎదురయ్యే అడ్డంకుల్ని ముందే పసిగట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం విజన్ ఉన్న వారికే సాధ్యమౌతుంది .ఆ విజన్ ఉన్న వాడు మన చంద్ర బాబు .అపర భగీరధుడు అనేది రొటీన్ మాట కనుక నేను చంద్ర బాబు ను ఇంజనీర్ కాకపోయినా ‘’ఆంధ్రా కాటన్ ‘’అంటాను .ఈ కాంబి నేషన్ ఇలాగే సమర్ధంగా పని చేస్తే మన కళ్ళ ముందు ‘’స్వర్ణాంధ్ర ‘’మెరిసిపోతూ దర్శన మిస్తుంది .క్షణం లో సరైన నిర్ణయాలు తీసుకొని వాటిని సమర్ధవంతంగా అమలు జరపాలి .అప్పుడే ఫలితాలు అతి త్వరగా అందరికీ అందుతాయి .దీనికి మరో ఉదాహరణ చూద్దాం –

ఆంధ్ర మహా విష్ణువు ఏలుబడిలో ఉన్న ప్రధమాంధ్ర రాజధాని శ్రీకాకుళం లో కృష్ణ దేవరాయల మహోత్సవాలతో ‘’పద్య కవితా బ్రహ్మోత్సవాలు ‘’ను ఈ నెల 18 19 తేదీలలో నిర్వహించి తెలుగు పద్యానికి బ్రహ్మ రధం పట్టించిన సంగతి మనకు తెలుసు .రెండవ రోజు సభకుమంత్రి  శ్రీ దేవినేని రావటం ,ఉత్సవాలు జరుగుతున్న తీరుకు పులకి౦చి పోవటం, అక్కడ హాజరైన అన్నదాతల ముఖాలలో  వెలిగిన నవ్వులను చూసి స్పందించటం ,కవులందరూ పట్టి సీమ పోలవరం ప్రాజెక్ట్ లను తప్పని సరిగా చూసి స్పందనలు తెలియ జేయాలని కోరటం, అప్పటికప్పుడు  ఆర్టీసి  ఎం. డి.శ్రీ మాలకొండయ్య తో మాట్లాడటం దాన్ని సవాలుగా తీసుకొన్న’’కత్తి’’లాంటి  సాంస్కృతిక శాఖా సంచాలకులు శ్రీ దీర్ఘాసి (దీర్ఘాసి అంటే పెద్ద కత్తి అని అర్ధం )విజయభాస్కర్ రేపే మనకవులు పట్టిసీమ పోలవరం సందర్శిస్తారని చెప్పటం ,20 వ తేదీ సోమవారం ఉదయం  అందరం బెజవాడ చేరటం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన గరుడ బస్ లో డా జి .వి. పూర్ణ చంద్ గారి నాయకత్వం లో ప్రయాణించి పట్టి సీమ ఎత్తి పోతల పధకాన్ని ,అక్కడికి 6 కిలో మీటర్ల దూరం లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ను అక్కడి ఇంజినీర్లు మాకు ప్రతివిషయాన్ని దగ్గరుండి పూస గుచ్చి నట్లు వివరిస్తే తెలుసుకోవటం  ,కమ్మని ఆతిధ్యం అందజేయయం ,డాం నిర్మాణం జరిగే నదీ గర్భానికి తీసుకువెళ్ళి భారత దేశం లోనే ఎక్కడా ఇంతవరకు జరగని ,లేని  అత్యాధునికమైన శాస్త్ర సాంకేతిక సాయంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచేట్లు నిర్మిస్తున్న పోలవరం రిజర్వాయర్ ,బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా చూసే గొప్ప అనుభవం పొందటం ,తిరిగి వచ్చేటప్పుడు పోలవరం కాలువా  పట్టి సీమ ఎత్తి పోతల కాలువా అనుసంధానం అయ్యే చోటు చూడటం ,రాత్రి బెజవాడ వస్తుండగా మంత్రి శ్రీ ఉమా మమ్మల్ని వారి ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విందుకు ఆహ్వానించటం ,అక్కడ విందు తర్వాత మమ్మల్ని అందరిని గౌరవంగా వేదిక పై ఆసీనులను చేయటం అక్కడ అప్పటికే హాజరై ఉన్న అన్నదాతలకు మా అందరి అనుభవాలను గంటన్నర సేపు  తెలియ జెప్పించటం ,ఆ ప్రాజెక్ట్ లపై మేము రాసిన  కవితలు  వినిపింప జేయటం , వారంతా అత్యంత  శ్రద్ధగా వింటూ చప్పట్లతో మమ్మల్ని  అభినందించటం ,మంత్రిగారు  మాకు అందరికి  స్వయం గా శాలువాలు కప్పి సన్మానించటం  ,అంతా రాత్రి 11-30 గంటలు అయినా  దాదాపు 5 వందల కిలో మీటర్లు ప్రయాణం చేసిన మాకు కాని ,పొద్దుటినుంచి  రైతులతో ,జలసంఘాలవారితో భేటీలో ఉన్నా మంత్రిగారికి కాని, అర్ధ రాత్రి అవుతున్నా అన్నదాతలకు కాని విసుగు అని పించకుండా కార్యక్రమం అంతా ఒక్క రోజులో జరగటం చూస్తే కలయో వైష్ణవ మాయయో అనిపించింది .అంతటి బృహత్తర నిర్మాణ దశలను ప్రత్యక్షంగా చూడటం మా అదృష్టం  శ్రీ శైలం ప్రాజెక్ట్ నిర్మాణానికి భారత ప్రధాని నెహ్రు శంకుస్థాపన చేసిన వారానికే నేను ,మా అమ్మా శ్రీశైలం  సందర్శింఛి అక్కడ దాదాపు పది హీను రోజులున్న విషయం జ్ఞాపక మొచ్చింది .ఇదీ నిన్నటి మాపర్యటన  సారాంశం .వివరాలు తరువాత తెలియ జేస్తాను .మా పర్యటనలో మాతోపాటు ప్రపంచ ప్రసిద్ధ నైరూప్య చిత్రకారులు ,ఆధునిక పికాసో,పద్మశ్రీ ఎస్వి .రామారావు గారు ,పత్రికా రంగానికి చెందిన శ్రీ చలపాక ప్రకాష్ , వంటి వారు ఉండటం చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది . ఈ సమావేశాన్ని   ‘’జలదాతలు,అన్నదాతలు అక్షరాదాతల’’  సంయుక్త సమావేశం కనుక సత్ఫలితాలనిస్తుంది ‘అని నా కవిత వినిపించాను-  .కవులమైన మేము రాసింది ,రాస్తున్నదీ ,రాయబోఏదీ ప్రభుత్వానికి భజన కాదు వ్యక్తులకు డప్పు కొట్టటం కాదు ,అక్కడ జరుగుతున్న అభివృద్ధిని,మేం చూసిన కళ్ళతో తెలియ జేయటమే . ప్రాజెక్ట్ పూర్తీ అయితే ఎంతటి మహోత్క్రుస్టం గా రాష్ట్రం ఉండబోతోందో ,ఎంత నిబద్ధతగా ఇరావైనాలుగుగంటలూ, వారానికి ఏడు రోజులు పని చేస్తూ  అనుకున్న సమయానికి నిర్మాణ౦ పూర్తీ చేసి ఆంద్ర జాతికి అంకిత మిచ్చే కృషిలో అందరూ భాగ స్వాములవుతున్నారో ,కళ్ళున్నా చూడలేని ,చెవులున్నా వినలేని  ,అభి వృద్ధి ఉన్నా లేదని బుకాయించే వారికి తెలియ జెప్పటానికి మాత్రమే.ప్రభుత్వానికి మేం ప్రచార సారదులం కాము కాము కాము అని విన్న విస్తున్నాం .సత్యానికి మాత్రమే మా ప్రచారం .

                పట్టిసీమ

పట్టి సీమ

 బాబు పట్టు బట్టిన

 సృష్టి సీమ

ఎత్తిపోతల జల వృష్టి సీమ

ఆంధ్ర అన్నదాతల  సంతుష్టి సీమ

పంటలకు ,సౌభాగ్య పుష్టి సీమ

శాస్త్ర సాంకేతిక  సమష్టి కృషి సీమ

సస్య శ్యామలాంధ్ర పునః సృష్టి సీమ .

  పోలవరం

ప్రాజెక్ట్ పోలవరం

దశాబ్దాల కాంక్షల కలవరం

సాకార మౌతున్న ‘’జల pool వరం ‘’

భగీరధుని కన్నా మిన్న

విజన్ ఉన్న చంద్ర బాబు

‘’ఆంధ్రా కాటన్ ‘’ అనటం సబబు .

ఇవి  నవ్యాంధ్ర జనవనరుల బ్రహ్మోత్సవాలు

ఆనందం తో నర్తించే మన  హృదయ పులకా౦కితాలు .

మిగిలిన వివరాలు తరువాత వ్యాసం లో

సశేషం

  మాతృభాష దినోత్సవ శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-2-17 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణాజిల్లా ఘంటశాల మండలం శ్రీకాకుళంలో ఈనెల ఫిబ్రవరి ది : 18,19వ తేదీలు ఆంధ్రప్రదేశ్ అధికార, సాంసృతిక శాఖ సంయుక్త అధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు

కృష్ణాజిల్లా ఘంటశాల మండలం శ్రీకాకుళంలో ఈనెల ఫిబ్రవరి ది : 18,19వ తేదీలు ఆంధ్రప్రదేశ్ అధికార, సాంసృతిక శాఖ సంయుక్త అధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయుల మహోత్సవాలు అద్భుతంగా నిర్వహించారు. పద్య కవితలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఉయ్యూరు సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, సంస్థ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు

 

https://plus.google.com/photos/115752370674452071762/album/6388878366129191521?authkey=CNX_8u3JjffLGw

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

7-2-17 శనివారం శ్రీకాకుళం లో మొదటి రోజు పద్య కవితా బ్రహ్మోత్సవచిత్రాలు 

7-2-17 శనివారం శ్రీకాకుళం లో మొదటి రోజు పద్య కవితా బ్రహ్మోత్సవచిత్రాలు

https://plus.google.com/photos/115752370674452071762/album/6388403928901391857?authkey=CO_k9r3CoezWMA

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

వరద’’ కవన కుతూహలం ‘’-2

వరద’’ కవన కుతూహలం ‘’-2

‘’వరద కాదు అది సెలయేరు కలకలం .’’సెలయేరుల కలకలముల –చిరుగాలుల మృదుగీతుల –మంజులమగు నీ పలుకులె-మదికి దోచురా!’’అని వరద మాటలలోనే అనుకొంటూ ఉందామన్నాడు ఏ బి కె .’’ఏల్చూరి మురళీధరరావు ‘’మంచి పుస్తకాలలో మరీ మంచి పుస్తకం .తెరమరుగున దాగిన అనేక రసవత్తర సన్ని  వేశా(షా )లకు తెర తీశాడు .తనచిన్ననాటి జ్ఞాపకాలను ‘’జీవన ప్రద గాధలు ‘’గా రాశాడు .సమకాలం లోవిలుప్తమైన  విదగ్ధ కళా ప్రపంచాన్ని కన్నులకు కట్టినట్లు చూపాడు .అభ్యర్ణ ఆంద్ర  సారస్వత భువన కోశం ఆ౦గికకమై ,,రమ్య కవితా బహువ్రీహి పండిన ఆనాటి వాజ్మయమంతా వాచికమై ,ఆ మహా కవి యశః పారిజాతాల మాల ఆహార్యమై రూపొందించిన తరంగ ప్రతి బింబ న్యాయంగా వరద సాహితీ వరద పారించాడు ‘’అంటూ నాటకీయ భాషలో కవితాత్మకంగా ప్రశంసించాడు .సాహిత్య అకాడెమీ ,అరసం ఆవిర్భావం ,కాలదోషం వ్యాసాలూ జ్ఞాన తృష్ణను తీరుస్తాయి .పుస్తకం లో ఆత్మీయత ,తేజోమయ వాతావరణం వెల్లి విరిశాయి .మూర్తి చిత్రణ –కారికేచర్ లో వరద ను మించిన వారు లేరు .విశ్వనాధ ‘’ఆంద్ర ప్రశస్తి ‘’లోని శిల్పం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తుంది .

‘’కవిత్వం మీదమీ అభిప్రాయం ఏమిటి ‘’అని శ్రీ శ్రీ -చెళ్ళపిళ్ళవారిని అడిగితే ‘’నేనూ కవినేనా ?’’అని మొదలు పెట్టి చెప్పిన గాంభీర్య విషయాలు,’’ఉదయిని ‘’కోసం వ్యాసం రాయమంటే అబ్బూరి రామకృష్ణారావు ‘’నేనెందుకు రాయాలో చెప్పు ‘’అన్న అబ్బూరి పూర్ణ పురుషత్వం ఇందులో ప్రత్యక్షం .శ్రీ శ్రీ   వైరశుద్ధికి హత్యా ప్రయత్నం చేసిన   శిష్ట్లా ఉమామహేశ్వరరావు జీవిత విశ్లేషణ  ,తెలుగు జీవితాన్ని ఆమూలాగ్రం తరచి చూసి,కవిత్వం లో అనేక ప్రయోగాలు చేసిన విశ్వనాధ ‘’మనిద్దరం సమకాలికులం రాజేశ్వర రావూ ‘’అన్నప్పటి విదగ్ధత ,జరుక్ శాస్త్రి హాస్య ధోరణి ,జీవితాన్ని కవితా యజ్ఞం లో వ్రేల్చి సన్మాన సభలో సరస్వతీ సమారాధకునిగా మృతి చెందిన బొడ్డు బాపిరాజు విశిష్ట కదా కధనం ,కుందుర్తి వచనకవితా మహోద్యమం ,సాహిత్యానికే అంకితమైన బెల్లంకొండ రామదాసు ,దువ్వూరి ,మారేపల్లి, మాధవ పెద్ది మొదలైనవారి స్వభావ నైర్మల్యం అపురూపంగా మలచాడు వరద .’’సన్నివేశాల అలంకారానికి వరద స్వీకరించిన పద్యాలు అనర్ఘ రత్న ఉపహారాలు .కవిత్వం శబలిత భావ సంసక్తమై రసనాగ్ర నర్తకి గా ఉండాలన్న వరద దృక్పధానికి పద్యగేయాలన్నీ విశేషణమైన భూషణాలే’’అని ఏల్చూరి చెప్పింది ఏమాత్రం సందేహి౦పరానిదే .’’ఆధునిక చరిత్ర ‘’కాధి కులలో  వరద కు ఈ గ్రంధం సముచిత స్థానాన్ని కల్పిస్తుంది అని చక్కగా చెప్పాడు ఏల్చూరి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-2-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద’’ కవన కుతూహలం ‘’

వరద’’ కవన కుతూహలం ‘’

1986 లో వరద ఆంద్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో’’ కవన కుతూహలం ‘’ధారావాహిక రాస్తే ,అది పుస్తక రూపం గా 198 9 లో  వచ్చింది .దీన్ని రా వి .శాస్త్రి గారికి అంకితమిచ్చాడు వరద .

కవన కుతూహలం మహా కుతూహలం గా సాగింది .కొన్ని దశాబ్దాల క్రిందటి విషయాలను గుర్తు చేసుకొని ,మననం చేసుకొని రాసిన అనుభవ జ్ఞాపకాలు .ఆయన ధారణ’’రసనాగ్ర నర్తకి ‘’అన్నాడు ఏ బి కె .శ్రీపాద వారి’’ అనుభవాలు –జ్ఞాపకాలు’’ ,శ్రీ శ్రీ ‘’అనంతం ‘’,ఇంద్రగంటి ‘’గౌతమీ గాధలు ‘’తర్వాత చెప్పుకో దగింది కవన కుతూహలం .’’యుద్ధం లో ‘’కదన’’ ,సాహిత్యం లో ‘’కవన’’కుతూహలాలు ఒకే కోవకు చెందినవి .’’ఇది ఆధునిక ఆంద్ర సాహిత్యం లో ఒకటి ,రెండు శతాబ్దాలకు పూర్వం ‘’స్వర్ణ యుగం ‘’గా భావించిన ‘’ఒక మహోజ్వల ఘట్టం తో సంబంధం ఉన్న సాహితీ  స్రస్టలగురించి జ్ఞాపకాలు మాత్రమే కాదు ,పర నింద కాదు,రొడ్ద కొట్టుడు ఆత్మ కద అంతకంటే కాదు  రెండు దశాబ్దాలకే పరిమితమూ కాదు  లెక్కలేనంత మంది కవులు ,రచయితలూ నాటక కర్తలు బారులు తీరి పాఠకులకు అజ్ఞాన నేత్రదర్శనం చేయటానికి క్యూ కట్టారు .అందుకే ఇది ఐదు దశాబ్దాల సాహిత్యావలోకనం ‘’అన్నాడు ఏ బి కె .అంతేకాదు ‘’వరద సాహిత్య సిద్ధాంత  రాద్ధా౦తాలతో బాధించకుండా ,తన సహజ చతురిమ ,హేళన అని పించని పరిమిత అవహేళనతో ,పరదాలు తొలగించి సరదాగ సాధించాడు .సాహిత్య వివేచనా ,విమర్శన ,హాస్య ప్రియత్వం కల బోసిన రచన .తెలుగు సాహిత్యం బతికున్నంత కాలం పాఠకులపై చెరగని ముద్ర వేయగల అరుదైన సాహిత్య క్రీడ కవన కుతూహలం ‘’అని సరైన తూకపు రాళ్ళతో తూచి నిక్కచ్చిగా నిగ్గు తేల్చాడు . తండ్రి అబ్బూరికి సరైన సాహితీ వారసుడు వరద .

ప్రాచీన ,అర్వాచీన ,పాశ్చాత్య సాహిత్యోద్యమాలతో ,కవితా ధోరణులతో మునిగి తేలే వారంతా ,వరద రచనా విశిస్టతతో మనకు పరిచయం ఉన్న వారుగా కనిపిస్తారు .’’ఇది కొద్ది మందికే పరిమితమైన అనుభవ పేటిక కాదు . ఆంద్ర దేశమంత వెడల్పూ ,తెలుగు సాహిత్యమంత లోతు ఉన్న అపురూప రచన ‘’అన్న ఏ బి కె మాట ప్రత్యక్షర సత్యమే .రచనా పద్ధతీ శైలీ ,ధారా శుద్ధి ప్రశంసనీయం .పరిచయమైతే వదలి పెట్టని రకం వరద .వరద అంటే ‘’అబ్ది ఘోష లో శబ్ద తరంగం ‘’ఓకే తరానికి తండ్రి తోపాటు కౌమార దశ లోనే కవి కుమారుడై తనతరానికి ఒక ఇన్ స్పి రేషన్ అయ్యాడు వరద ‘’.ప్రముఖుల జీవిత రసవత్తర సన్నివేశాలను ,వచో వైభవ స్మ్రుతి విశేషాలను అనితర సాధ్య రీతిలో వరద గ్రంథస్థం చేశాడు ‘’అన్నాడు అజంతా కవి .వరద’’ కుతూహం’’చూస్తుంటే బెర్నార్డ్ లెనిన్ ‘’కండక్టేడ్ టూర్ ‘’అందులో యూరప్ లోని 12 సంగీతోత్సవాలకు హాజరై రాసినదీ ,పారిస్ కి చెందిన సిల్వియా బీచ్ ‘’షేక్స్ పియర్ అండ్ కంపెని ‘’ హెమింగ్ కోహెన్ ‘’లాండ్ మార్క్స్ ఇన్ అమెరికన్ రైటింగ్ ‘’గుర్తుకు వస్తాయి అన్నాడు ప్రసాద్ .అయితే వచనకవితను వరద తక్కువగా చూడటం హేళన చేయటం మంచిదికాదన్నాడు ఏ బి కె .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు

సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి  3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం 3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు  శ్రీ మైనేని వెంకట నరసయ్య,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక  ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో ఉగాది కవి సమ్మేళనం ,ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,ఉగాది కవి సమ్మేళనం  గా  నిర్వహిస్తున్నాము ..

స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కార౦ ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రాసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతులు

స్వీకర్తలు -1-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిశ్శాస్త్ర వేత్త       శ్రీ నిష్ఠల  వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (పొన్నూరు )

2- అవధాన భారతి ,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్కృతోపన్యాసకులు – విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారు (హైదరాబాద్ )

స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు

స్వీకర్త – .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య  లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి  స్వ౦త  ఖర్చులతో ముద్రించి ,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావుగారు  (విజయవాడ )

‘’వసుధైక కుటుంబం ‘’   అంశం పై  జిల్లాలోని ప్రముఖ కవి మిత్రులచేత కవి సమ్మేళనం నిర్వ హి౦ప బడును

పద్యాలు అయితే 5 కు , వచన కవిత అయితే 15 పంక్తులకు పరిమితం .చదివిన కవిత కాపీ ని సరసభారతి కి అందజేయ మనవి .

 

ఈ సమావేశం లో ముఖ్య అతిధిగా శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు ,ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ  శ్రీ పరుచూరిరామ కృష్ణయ్య ఫౌండేషన్  ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ పరుచూరి శ్రీనాధ్ గారు (అమెరికా ) గౌరవ అతిధి గా ,ప్రముఖ సంఘ సేవకులు స్వచ్చంద  సంస్థల నిర్వాహకులు , స్వచ్ఛ భారత్ కార్య కర్త ,పెద్దలు శ్రీ చనుమోలు సత్యనారాయణ ప్రసాద్ గారు(విజయవాడ )  ఆత్మీయ అతిధిగా పాల్గొంటారు .

సాహిత్యాభిమాను లందరు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

పూర్తి వివరాలతో ఆహ్వానం మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి చేస్తున్నాము

జోశ్యుల శ్యామలాదేవి  మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ  గబ్బిట దుర్గాప్రసాద్

గౌరవాధ్యక్షులు         కార్య దర్శి                  కోశాధికారి                  అధ్యక్షులు -సరసభారతి

,                                                                                   18-2-17

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పద్య కవితా బ్రహ్మోత్సవాలుపద్య కవితా బ్రహ్మోత్సవాలు శ్రీకాకుళం -17-2-17 ,18-2-17 ముదిమి వయసున ఆటవెలది తో సయ్ రచన -గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు

పద్య కవితా బ్రహ్మోత్సవాలు

                                              శ్రీకాకుళం -17-2-17 ,18-2-17

ముదిమి వయసున ఆటవెలది తో సయ్యాట –

                                         రచన -గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు

1-అలతి అలతి పదము  లల్లిక బిగి చేత

 అలర రాజ నియతి నందమొప్ప

ఇలను ‘మెచ్చ ’యాము’’డింపు గా బల్కెను

పలుకు రాయలదని ప్రణతు లిడుదు .

2-రాయలేలినట్టి రాజ్యమ్ము మనదిరా

రాయ వాచకమ్ము రసన కింపు

రాయ కవన సొంపు ర౦జిల్లు మనసున

రాయ !కృష్ణ రాయ !.రమ్య తేజ .

3-తెలుగు భాషకు గుడి ,తెలుగు భాషపు నుడి

తెలుగు పలుకు తీపి తెలియ జెప్పి

తెలుగు రాయలకును దీటెవ్వ రనగను

తెలుగు కీర్తి జగతి నిండ నిలిపె  .

4-అమ్మ భాష నీవు అబ్బుర పడు రీతి

కమ్మగాను బల్కి కాచి నిల్పు

చెమ్మ దగులు మదికి చేయెత్తి జైకొట్ట

అమ్మ నెపుడు నీవు  ఆదరించు  .

5-ఆట వెలది తోడ ఆట లాడ౦గను

తీట బుట్టె ముదిమి తీరి దేమొ

మాట కదలకుండ మారాము చేసినా

పంచ రత్నములను కొంచ కిచ్చె..

గబ్బిట దుర్గా ప్రసాద్ –అధ్యక్షులు –సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ –

2-405 –శివాలయం వీధి -ఉయ్యూరు -5 21 16 5 –కృష్ణా

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పన్నీరు కన్నీరు మున్నీరు

  పన్నీరు కన్నీరు మున్నీరు

    1-  సెల్వం పన్నీరు

         కాల్వల కొద్దీ కన్నీరు

         కార్చినా  చివరాఖరు

         కు మునిగాడు మున్నీరు .

2- ఎవడో వేసిన ఎరకు

గురై  తన్నుకున్నాడు  గిలగిల

పధకం బెడిసి కొట్టి మళ్ళీ

వలవలా విలవిలా.

3-బలం తనది కాదని

 అమ్మదని తెలుసుకోక

ఆశ పడ్డాడు కాని

తోసిరాజై  తీసేసిన

 కరేపాకై షాకయ్యాడు .

4-‘’అమ్మ’’ ఉన్నా లేకున్నా

 రాజ్యం నడిపేది  ‘’చిన్నమ్మే’’

జనాన్ని కదిలించి ఒక్క ఓటు

కూడా తేలేని దేబి ముకాలకు

గద్దె ఎక్కే హక్కు లేదని తెలీదు పాపం .

5-పాదుకలు మోసి మోసి

అమ్మ కరుణా కటాక్షం తో

 ఆపద్ధర్మ౦గా అనేకమార్లు

  గద్దె అనుభవించి  ఎదురు తిరిగితే

 పాద  ప్రక్షాళనమే మిగిలింది .

6-పాతిక మంది వెనకలేని

పన్నీర్ ను వెనకేసుకొచ్చి

మీడియా చాలా తప్పు చేసింది

దిశా నిర్దేశం చేసే పత్రికలే ప్రజల్ని

వక్రమార్గం పట్టిస్తే దేశానికి దిక్కేది ?

7- నమ్మిన బంటు’’ పళని’’కి

  ‘’ పదవి పళని విభూతి ‘’దక్కితే

కల్ల బొల్లి  ఏడ్పుల పన్నీర్ కు

‘’వల్ల కాట్లో విబూది’’మాత్రమే దక్కింది .

8-అరవై అయిదు కోట్ల అక్రమార్జన

అంటూ శిక్షించటం న్యాయమే అయినా  ,

ఇన్నేళ్ళు కేసు దేకి అందలం లో

కూర్చున్నవారు ఎన్ని వేలకోట్లు

మళ్ళీ దాచారో ఎవరు లెక్కిస్తారు ?

దీనికి శిక్ష ఎవరనుభవించాలి ?

అనేది జవాబు లేని ప్రశ్న .

9-వందకు పైగా ఉపగ్రహాలు

విసిరి౦ది మన  రాకెట్టు

 సాటిలేరు మనకేవ్వరూ ఒట్టు మీద ఒట్టు

ఈ విజయం సాధించిన మన శాస్త్రజ్ఞులు

శాస్త్ర సా౦కేతికాలలో  కడు విజ్ఞులు .

10-మినీ ఎన్నికలు ముగుస్తున్నాయ్

  మునిగే దెవ్వరో తేలేదేవ్వరో

తేలేది మార్చి మొదట్లో నే

అప్పటిదాకా రొంబ టెన్షనే టెన్షను

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-17-2-17 –ఉయ్యూరు  .

 

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

Sri Krishnadevaraya

sri-krishnadevaraya-17021819_0004 sri-krishnadevaraya-17021819_0005 sri-krishnadevaraya-17021819_0006 sri-krishnadevaraya-17021819_0007 sri-krishnadevaraya-17021819_0008 sri-krishnadevaraya-17021819 sri-krishnadevaraya-17021819_0001 sri-krishnadevaraya-17021819_0002 sri-krishnadevaraya-17021819_0003

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment