గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39 17-పోస్ట్ ఇంప్రెష నిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ –పాల్ సిజేన్ (Paul cizanne)-(1838 -1906 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39

17-పోస్ట్ ఇంప్రెష నిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ –పాల్ సిజేన్ (Paul cizanne)-(1838 -1906 )

ఆధునిక కళాపిత

19 వ శతాబ్దపు కళా కృషికి ,దీనికి విరుద్ధమైన 20 వ శతాబ్దపు భావ తీవ్రవాదుల కళ కు యుగ సంధి కి చెందిన పోస్ట్ ఇంప్రెష నిస్ట్  ఫ్రాన్స్ దేశపు చిత్రకారుడు పాల్ సిజేన్ .అన్వేషణాత్మకమైన ,పదే పదే వాడే బ్రష్ స్ట్రోక్స్ తో అత్యంత విశిష్ట లక్షణాలతో ,ప్రత్యేకత తో అతని కళాఖండాలు వెలిగిపోతాయి .వర్ణ తలాలను చిన్న బ్రష్ స్ట్రోక్ లతో సంక్లిష్ట చిత్రాలుగా తీర్చి దిద్దాడు .చిత్రి౦పబడే వాటి అంతరిక ప్రవృత్తిని బహిర్గతం చేయటం అతని చిత్రాల ప్రత్యేకత .19 వ శతాబ్ది  ఇంప్రెషనిజం కు 20 వశతాబ్దిఅత్యాధునిక  క్యూబిజం కు సిజేన్ వారధి . ప్రఖ్యాత చిత్రకారులు మాటిస్సే పికాసో లు ‘’సిజేన్ మా కళా పిత ‘’అని ఆరాధనా భావం తో కీర్తించారు .

బాల్య విద్యాభ్యాసాలు

పాల్ సిజేన్ 19-1-1838 న ఫ్రాన్స్ లోని ఎక్స్ యెన్ ప్రావిన్స్ లో సెయింట్ సావియర్ పట్టణం లో జన్మించాడు .ఫిబ్రవరి 22 న ఎగ్లైజ్ డిలా మేడేలిన్ లో ,అమ్మమ్మ మేనమామ లు గాడ్ పేరెంట్స్ గా బాప్టైజ్  అయ్యాడు .తర్వాత కేధలిక్ మతానికి పూర్తిగా అంకిత మయ్యాడు .తండ్రి సెయింట్ జేకారి గ్రామస్తుడు .బాంకింగ్ ఫర్మ్ వ్యవస్థాపక భాగస్వామి .ఇదే మన కళాకారుడిని జీవితాంతం ఆదుకున్నది .ఆనాటి సాటి కళాకారు  లెవ్వరికి లేని ఆర్ధిక భద్రత,వారసత్వ సంపద  దక్కింది సిజేన్ కు .

తల్లి  ఆన్నె ఎలిజబెత్ ఆనరిన్ ఆబర్ట్ ఆకర్షణీయ ,చైతన్య స్పూర్తికల ,త్వరగా తప్పు కొనే స్వభావం కలది .తల్లిదగ్గర నుండే సిజేన్ జీవిత దృక్పధాన్ని,దృష్టి ని ఏర్పరచుకున్నాడు .చెల్లెళ్ళు మేరీ ,రోజ్ లతో కలిసి స్కూల్ కు వెళ్ళేవాడు .10 వ ఏట ఐక్స్ లో ఉన్న  సెయింట్ జోసెఫ్ స్కూల్ లో చేరాడు .1852లో బార్బాన్ కాలేజి లో చేరాడు .అక్కడే ప్రసిద్ధ రచయితలూ ఎమిలీ జోలా ,బాప్టిస్టిన్ బెయిలీ లతో గాఢ పరిచయమేర్పడింది. ఎక్కడ చూసినా ఈ ముగ్గురూ కలిసె కనిపించేవారు .ఈ ముగ్గురు మిత్రులను’’విడదీయ రాని త్రయం ‘’(ఇంసేపరబుల్ ట్రయో)అనేవారు.ఆరేళ్ళు ఆ కాలేజిలో చదివాడు చివర ఏడాది డే స్కాలర్ గా ఉన్నాడు .

కళ పై మక్కువ

18 5 7 లో ఐక్స్ లో ఉన్న ఫ్రీ మునిసిపల్ డ్రాయింగ్ స్కూల్ లో చేరాడు .స్పానిక్ ముని జోసెఫ్ గిల్బర్ట్ వద్ద డ్రాయింగ్ అభ్యసించాడు .తండ్రి సలహాపై 19 5 8 -61వరకు ఐక్స్ యూని వర్సిటి లా స్కూల్ లో  డ్రాయింగ్ క్లాసులకు హాజరౌతూనే లా చదివాడు  .

బాంకర్ అయిన తండ్రి మాటకు విరుద్ధంగా వారించినా ఆగకుండా ఐక్స్ వదిలేసి కళ పై విపరీతమైన వ్యామోహంతో1861 లో  పారిస్ చేరాడు . అతనినినిర్ణయం తీసుకొనేట్లు  బాగా ప్రభావితం  చేసింది అప్పటికే పారిస్ లో స్థిరపడిన ఎమిలీ జోలాయే .తండ్రి కూడా కొడుకు కోరికను మన్నించి ఆర్ధిక సాయం చేసి  ప్రోత్సహించాడు .తరువాత తండ్రి నుంచి భారీమొత్తం లో 4 లక్షల ఫ్రాంక్ లు వారసత్వ ధనం గా చేతికొచ్చింది .దీనితో చేసిన అప్పులన్నీ తీర్చి రుణ విముక్తుడయ్యాడు .

అర్కి టెక్చరల్ శైలి

పారిస్ లో కామిల్ పిసారియో అనే ఇంప్రెష నిస్ట్ ఆర్టిస్ట్ తో పరిచయాం కలిగింది సిజేన్ కు .1960  లో వారిద్దరి మధ్య గురు శిష్య సంబంధమేర్పడింది .ఈ యువ ఆర్టిస్ట్ పై పిసారో ప్రభావం బాగా పడింది .ఒక పుష్కర కాలం కలిసి లాండ్ స్కేపులు గీశారు .పెయింటింగ్ ఎక్స్ కర్షన్ లు చేశారు .క్రమ౦గా ఇద్దరు మమేకమయ్యారు .మడతలో సిజేన్ లాండ్ స్కేప్ లో బొమ్మ ఉండేది .తరువాత అనేక మంది కి చోటు కల్పించేవాడు .అతని ఒహ్హత్మకత సృజన అద్భుతమని పించేది .క్రమంగా రంగుల ప్రభావం తగ్గించి తేలిక గా చిత్రాలు గీశాడు .ఆతర్వాత శిల్పాకృత పెయింటింగ్స్ శైలి (ఆర్కి టేక్చరల్ స్టైల్ )కి  రూప కల్పన చేశాడు.తాను లోకం లో చూసిన దానిని చిత్రం లోఅత్యద్భుత౦ గా చూపేవాడు .తేలిక రంగులతో ఫలితాలు రాబట్టాడు .   “I want to make of impressionism something solid and lasting like the art in the museums”,[17]  అని చెప్పేవాడు .  his contention that he was recreating Poussin “after nature” underscored his desire to unite observation of nature with the permanence of classical composition..

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ హేవిళంబి ఉగాది వేడుకలు

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి  3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం 3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు  శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక  ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో నిర్వహింప బడుతాయి .
  ఈ సందర్భంగా1-  స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కారాన్ని-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిస్శాస్త్ర వేత్త  శ్రీ నిష్ఠల  వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (పొన్నూరు ) గారికి అందజేస్తున్నాం .
 2- .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య  లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి  స్వ0త  ఖర్చులతో ముద్రించి ,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావు (విజయవాడ )  గారికి ”స్వయం సిద్ధ ఉగాది పురస్కారం ”అంద జేస్తున్నాం
3- జిల్లా లోని ప్రముఖ కవులచే ”వసుధైక కుటుంబం ”అంశం పై కవి సమ్మేళనం  నిర్వహిస్తున్నాం
  ఈ సమావేశం లో ముఖ్య అతిధిగా శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు ,ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ  శ్రీ పరుచూరిరామ కృష్ణయ్య ఫౌండేషన్  ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ పరుచూరి శ్రీనాధ్ గారు (అమెరికా ) గౌరవ అతిధి గా పాల్గొంటారు .
  సాహిత్యాభిమాను లందరు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
పూర్తి వివరాలతో ఆహ్వానం మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి చేస్తున్నాము
జోశ్యుల శ్యామలాదేవి  మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ  గబ్బిట దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షులు         కార్య దర్శి                  కోశాధికారి                  అధ్యక్షులు -సరసభారతి
   ,                                                                                   14-2-17 

—

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వరద జ్ఞాపకాల వెల్లువే ‘’వరద కాలం ‘’

వరద జ్ఞాపకాల వెల్లువే ‘’వరద కాలం ‘’

1985 లో ‘’ఉదయం ‘’డైలీ లో వారం వారం ధారావాహికగా వరద రాసిన సాహిత్య  స్మృతులు ‘’వరద కాలం ‘’గా 1990లో పుస్తకంగా వచ్చింది .దీనికి ప్రేరకులు  ఎడిటర్ శ్రీ ఏ బి కె ప్రసాద్ .దీనిలో సాహిత్యం లో ఒక యుగం కళ్ళముందు నిలిపాడు వరద .వ్యక్తుల వ్యక్తిత్వ ఆవిష్కారం ,చరిత్రలో  వారి సంబంధం కనుమరుగు కాకుండా కాపాడి అందించాడు .ప్రయోక్త ,ప్రచురణకర్త ,కవి ,నాటకకర్త ,రచయితా ,పాత్రికేయుడు అయిన వరద నవ్య సాహిత్య చరిత్రకు ,ఆధునిక ఆంద్ర సాహిత్య చరిత్రకు ,కవితా విప్లవాలకు పూర్వ రంగాన్ని ,వాటి ఉత్దాన పతనాలను ప్రత్యక్ష సాక్షిగా నిలిచి రాసిన రచన .ఆయన అర్ధ శతాబ్దపు సాహితీ యానం .సాహితీ మూర్తుల హృదయ  వీణా తంత్రుల నిక్వాణ౦ .తెలుగు దేశం లో నాటక రంగస్థల నిర్మాణ ,నిర్వహణ ,నాటికా నాటకాల ప్రయోగ వైశిష్ట్యం ,తన ప్రత్యక్ష అనుభవ ,అనుభూతులు’’నాట్య గోష్టి ‘’గా  పొందు పరచాడు .’’రచనలో నైశిత్యం ,వాక్కులో చమత్కారం రధ చక్రాలుగా సాగిన శారదా మూర్తి ఈ గ్రంధం  ‘’అన్నాడు ఏ బి కె .గురజాడ గిడుగు ,రాయప్రోలు అబ్బూరి రామకృష్ణారావు ,కృష్ణ శాస్త్రి శ్రీ శ్రీ లకవితా రచనలకు చక్కని వ్యాఖ్యానం .ఈ తరానికి తెలియని ఎన్నో విషయాలు వివరించి చెప్పాడు .వ్రుత్తి పద ప్రయోగ కోశాలకు ,పత్రికా సారస్వతాను బంధాలకు ,రసమంజరీ నాదాలకు తొలి పూజ చేసిన తండ్రి బహు ముఖీన కృషికి అద్దంపట్టాడు .తొలి కదానికకు ఒరవడి పెట్టిన ఇద్దరిలో తండ్రీ ఉన్నాడు .’’మంగళ సూత్రం ‘’డిటెక్టివ్ నవలకు ,’’తెలుగు సంసారానికీ ‘’ఆయనే కర్త .హిందూ ఆంగ్లపత్రికలో పని చేసిన మొదటి తెలుగు వాడు కుందూరి ఈశ్వర దత్తు ,హిందూ పత్రిక వ్యవస్థాపకులలో ఒకడైన న్యా పతి సుబ్బారావు లగురించి విశేషాల కుంభ వృష్టి కురిపించాడు ‘’కవిత ‘’సంచికలకు ,మోడరన్ తెలుగు పోయెట్రి ‘’సంకనలాకు బాధ్యురాలు  వరద భార్య చాయాదేవి ..వర్కింగ్ జర్నలిస్ట్ ల భారతీయ సమాఖ్య,హైదరాబాద్ యూనియన్ల వ్యవస్థాపకులలో ఒకడు వరద .అక్కిరాజు ,దుగ్గిరాల, ,కొండా ,సుందరయ్య ,బసవ రాజు ,బళ్ళారి ,లంక సుందరం, చలం ,తాపీ ,మరో మధురవాణి లాంటి  దీప స్తంభాలను, వారి వెలుగులను గుమ్మరించాడు .ఎన్నెన్నో విశ్వ విద్యాలయాల విద్యా కేంద్రాల జ్ఞాపకాల గుబాళింపులతో పరవశం కలిగించాడు  .ఆంద్ర దేశ రాష్ట్ర కాంగ్రెస్ అభ్యుదయ పదానికి వరద సేవ చిరస్మరణీయం .’’వరద కాలం ‘’అందరికి కరదీపిక .రాజులదండ యాత్రలను యాత్రలుగానే చిత్రించి ,ఆత్మ గౌరవాన్ని చంపుకొన్న తెలుగు మేధావులనుఉమాకాంతం శఠించినందుకు వరద మెచ్చుకున్నాడు .రాజకీయాల పతనం ,డేమోక్రసిలో నామినేషన్ డామినేషన్ సంస్కృతీ ఎండ గట్టాడు వరద .’’మాతరం దిగ్గజాల్లాంటి రాజకీయ నాయకుల్ని ,గాయకుల్ని ,గాయకుల్ని ,పండిత ,కవుల్నీ ,నటుల్నీ చూసింది .ఆ నాడు పెద్దమనుషులే నిజాయితీ పరులే రాజకీయాలలోకి వచ్చేవారు .అప్పటికి రాజకీయం వృత్తి కాలేదు .తెలుగు వాడు దుర్యోధనుడు లాంటి వాడు .తనకేదీ కావాలనుకోడు .ఇతరులకు మాత్రం ఏమీ ఉండకూడదు అనుకొంటాడు .ముగ్గురు తెలుగువాళ్ళు కలిస్తే పార్టీ ,ఇద్దరుకలిస్తే ముఠా ,ఒక్కడే అయితే ప్రతి పక్షం పెడతారు .ఈ శతాబ్దపు రెండో దశాబ్దం లో కూడా తెలుగు వాడి మానసిక స్థితి అలానే ఉంది ‘’అని బాధ పడ్డాడు వరద .’’వరద రచన ఇంగ్లాండ్ లోని బ్లూమ్స్ బరీ గ్రూపు ప్రముఖుడు లిటన్ స్త్రాచీ సారస్వత వివేచనా తో ,ట్రూమన్ కపాటే ‘’ది మ్యూజేస్ ఆర్ హెర్డ్ ‘’తోనూ పోల్చదగినవి .’’అన్నాడు ఏ బి కె .వరద ఇల్లు ఒక శారదా నికేతనం .అందులో ఆతను ప్రేక్షకుడేకాడు పాత్ర దారికూడా  చతురంగా తగాదా పడటం వరద హాబీ .’’వరద మనకు అయిదు సంపుటాల ఆత్మ కద రాసిన లియోనార్డ్ ఉల్ఫ్ లాంటి వాడు ‘’.

‘’ వరద సత్యాన్వేషి .అతని కారెక్టర్ స్కెచెస్ స్ట్రాచీ చిత్రించిన ‘’ఎమినేంట్ విక్టోరియన్స్ ‘’.ను గుర్తుకు తెస్తాయి ‘’అన్నాడు గోపాల చక్రవర్తి .’’వరద చేసింది సాహితీ క్షీర సాగర మధనం .బిట్వీన్ ది లైన్స్ లో గొప్ప చరిత్ర ఉంది.అక్షర స్పేస్ షిప్ లో ప్రయాణించి గతకాల అనుభూతులను అందించాడు ‘’అన్నాడు పురాణం .వరద ,తండ్రీ ఇద్దరూ రాడికల్ హ్యూమనిస్ట్ లే.ఎం యెన్ రాయ్ అనుచరులే .ఇద్దరికీ పద్యమే ఇష్టం .అందులోనే రాశారు .వచనకవిత్వం పై సదభిప్రాయం లేని వాళ్ళే .అయినా అందరికీ దగ్గరయ్యారు .వరద కాలం ఒక సాహిత్య వరద గోదారి .చదివి తెలుసుకొని  ఆనందించా ల్సినవి ఎన్నో  ఉన్నాయి .నేను చేసింది అతి సూక్షం పరిచయం మాత్రమే.

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -14-2-17 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధృత రాష్ట్ర లో(కౌ)గిలి -3(చివరిభాగం )

ధృత రాష్ట్ర లో(కౌ)గిలి -3(చివరిభాగం )

భారతం లో వేదవ్యాసభగవానుడు ‘’భగవాన్ వాసు దేవో పి కీర్త్యతేత్ర సనాతనః ‘’అనిసనాతన వాసుదేవుడు ఈ కృష్ణుడు అన్నాడు .అలాంటి వాడు ‘’ఏను ‘’అంటే చాలు కాని భూసురులు ,  వేదాలు ఆయన తర్వాతవే .వాటి  గురించి ఆయన చెప్పక్కరలేదు .ప్రవర్తకులైన భూసురులు,వేదాలు ఆయన సనాతనత్వాన్ని చెప్పటానికి సాధనాలు మాత్రమే  .సాధ్యమైన పురుషోత్తముడే సిద్ధి౦చాక ,సాధనాల గురించి చెప్పక్కర లేదు .అయినా చెప్పాడు అంటే అందులో ఏదో విశేషం ఉంది అని మనం గ్రహించాలి అంటారు శలాక వారు .వాసుదేవుడు అంటే వాసుదేవుని కుమారుడు అని పురాణ అర్ధం కాదు .’’ఎల్ల యందు దావసించుట ,ఎల్లయును దనయందు వసి యించుటండ్రు వాసుదేవు డని పేరి కర్ధంబు’’అనే తాత్విక అర్ధం మనం గ్రహించాలి అన్నారు ప్రాచార్య శర్మగారు .ఈ తత్వానికి వ్యక్తిగత పక్ష పాతాలు ఉండవని ,ఉంటాయని భావిస్తే మనం తత్వ బాహ్యులం  అవుతామని శ్రీ శర్మగారు ఉవాచ .కనుక తేలింది ఏమిటి ?శ్రీ కృష్ణ నిర్ణయం సత్య నిర్ణయం .’’సత్య జ్ఞాన మనంతం బ్రహ్మ ‘’అని కదా శ్రుతి.శ్రీ కృష్ణుని భగవల్లక్షణాలను –పాండవులంత కాకపోయినా –ధృత రాష్ట్రుడు కొంత వరకు తెలిసిన వాడే అనటానికి ఆధారాలున్నాయి .కృష్ణుని అనుగ్రహం తోనే విశ్వ రూప సందర్శన అనుభూతి పొందాడు గుడ్డి రాజు .మళ్ళీ ఆ కళ్ళను మూసేయటం కూడా వాసుదేవుని అనుగ్రహం తోనే .దీన్ని బట్టి కృష్ణుని పక్షపాత రహిత దృష్టి ధృత రాష్ట్రు నికి బాగా తెలిసిందే .కనుక శ్రీ కృష్ణ ఉవాచ సర్వోపాదేయం అనే విషయం లో ఎవ్వరికీ సందేహాలు ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు శర్మ గారు .

ప్రమాణాలలో తలమానికం వంటిది శబ్ద ప్రమాణం .శబ్ద ప్రమాణం అంటే ఆప్త వాక్యం అని అర్ధం .రాగ ద్వేషం లేని స్వార్ధ దృష్టి లేని ,లోకతత్వం ,పరతత్వం బాగా తెలిసిన మహాత్ములు లోక హిత దృష్టితో ప్రతి పాదించిన సత్యాలే శబ్దాలు అంటారు శలాక శర్మ గారు .అవి తిరుగు లేని ప్రమాణాలు .గుడ్డిరాజు ఎదలోని కాపట్య౦  తెలుసుకోవటానికి ఈ శబ్ద ప్రమాణం బాగా గట్టిగా సహకరిస్తుంది . అదేమిటో వివరంగా తెలుసు కొందాం –

1-పాండురాజు మరణం తర్వాత పరలోక క్రియల అనంతరం వ్యాస భగవానుడు తన తల్లి సత్యవతికి ఏకాంతం లో

‘’మతి దలపగను సంసారం –బతి చంచల ,మెండ మావు లట్టులు ,సంప –త్ప్రతతతు లతి క్షణికంబులు –గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్’’.

2-‘’క్రూరులు ,విలుప్త ధర్మా –చారులు ధృత రాష్ట్ర సుతు లస ద్వ్రుతులు ,ని –ష్కారణ వైరులు ,వీరల –కారణమున నెగులు వుట్టు గౌరవ్యలకున్ ‘’

ఋషి,గ్రంధ ప్రణేత  భారత వంశ వివర్ధనుడు ,సాక్షాత్తు నారాయణుడు అనే పేరున్న వ్యాసుని మాటలు ఇవి .రెండవ పద్యం లో  గుడ్డిరాజు కొడుకుల లస్వభావం ,దాని ఫలితం విస్పష్టంగా వివరించాడు .’’ధృత రాష్ట్ర సుతులు ‘’అంటే షష్టీ సమాస౦ గా  అర్ధంగా తీసుకోరాదని ,’’ధృత రాష్ట్ర శ్చసుతాశ్చ’’అనిఅంటే ధృత రాష్ట్రుడు, సుతులూ అని   కవి హృదయంగా చెప్పుకోవాలని అంటారు ప్రాచార్య .  దీన్ని ఎలా సమర్ధించాలి ?’’దాని ధృత రాష్ట్రు౦డు తాన యనుభ వి౦చుం ,గానీ మీరీ దారుణంబు చూడక తపో వనంబున కరుగు౦డని చెప్పి చనిన ‘’అని అరణ్య పర్వం లో నన్నయ గారు వ్రాసిన మాటలు విచారిస్తే సత్యం బోధ పడుతుంది అన్నారు శర్మగారు .ధృత రాష్ట్రుడు మూల కారణం కనుక దాని ఫలం ఆయనే అనుభవిస్తాడు అని వ్యాసర్షి హృదయం .ఇంతకంటే పరమ ప్రమాణం ఏం కావాలని ఆచార్య ప్రశ్న .

2-ధృతరాష్ట్రు ని కాపట్యం గురించి అతని సతి గాంధారి ఇంకా స్పష్టంగా చెప్పింది .భారత స్త్రీ సాధారణంగా భర్త తప్పును సమర్ధిస్తుంది .ఏకాంతం లో ఏకి పారేసినా,పది మందిలో వెనకేసుకొస్తుంది .ఈగ వాలనీయదు భర్తమీద . కాని ఈ భారతం లోని స్త్రీ అయిన గాంధారీ దేవి నిండు సభలో ధృతరాష్ట్రు ని స్వభావానికి’’ గొప్ప నీరాజనమే’’పట్టింది .అందులో తన కొడుకులు చెడి పోతున్నారన్న ఆవేదన తప్ప మరో భావనే లేదు .ఎలాగంటారా-చూద్దాం రండి –

రాయబార కృష్ణుడు కరుసభలో చెప్పాల్సింది అంతా చెప్పాక ,దుర్యోధనుడు తన చతుస్టయం తో సభాసదు లందరికి అసహ్యం ఆశ్చర్యం జుగుప్సా పుట్టేట్లు సభనుంచి ‘’వాకౌట్ ‘’చేసేశాడు .కృష్ణుడు చీదరించుకొన్నాడు వాడి వింత ప్రవర్తనకు .ఆవేదనాపడ్డాడు .’’సత్కులము బాలి౦పగ వర్ణింప రాదే దుస్టాత్మకు నీచు నొక్కరిని బోదే భేద మీ జాతికిన్ ‘’అన్నాడు ఉద్యోగ పర్వం లో .’’మా వంశం లో కంసుడు ఇలాగే ప్రవర్తిస్తే ,మా వాళ్ళందరూ నాకు చెబితే ,నేను వాడిని అంతం చేసి వంశం కాపాడాను .మీరు కూడా ఆపని చేసి వంశం రక్షించు కో రాదా ?’’అన్నాడు ఈ మాటలతో ధృత రాష్ట్రు డికి ‘’గుండె జారి గల్లంతైంది ‘’.కృష్ణుడు అన్నంత పనీ చేసి కొంప ముంచు తాడేమోనని బెదిరి పోయాడు గుడ్డిరాజు .వెంటనే విడురుడిని పిలిపించి మనసులోమాట ఉండబట్ట లేక కక్కేశాడు –

‘’బుద్ధి మంతురాలు ,పొందుగ బలుకంగ-నేర్చు ,వచ్చి కొడుకు దేర్చి పోవు –గాన వేగ నీవు గాంధారి దోడితె-మ్మనుడు ,నరిగి యతడు నట్ల చేసె’’

భర్త పిలుపుతో గాంధారి సభలోకి ప్రవేశించింది .రాజు ‘’నీ తనూభవుడు దుర్వినియంబున జనియె నిట్టి వెంగలి గలడే?’’అన్నాడు తానేదో పత్తిత్తు అయినట్లు –

‘’నీవైన జెప్పి శాంతుం –గావింపగ నోపుదేని ,గౌరవ కుల మీ-గోవిందు శాసనము సం –భావి౦ప౦ గాంచి చెడక బ్రతుకుం జుమ్మీ ‘’అని నోరు జారేశాడు .కోపం వచ్చినప్పుడు మన ఇళ్ళలోనూ భార్య భర్తని ,భర్త భార్యని ‘’నీ కొడుకు ‘’అని దెప్పటం ఉందికదా .గుడ్డిరాజు నీకొడుకు అన్నమాట  రాజమాత కు ‘’ఎక్కడో ‘’కాలింది .ఇక చెడా మడా కడిగి పారేసింది నిండుసభలో –

‘’అనుడు ‘’నీ పుత్రడవి నీతుడగుట ఎరిగి ,వాని వశంబున నేల పోయె-దీవు ,పాండవులకు నేమి ఇచ్చితేని-నడ్డ పడ నెవ్వరికి వచ్చు నధిప!చెపుమ ‘’అని ఝాడించింది .అంటే ‘’రాజా !తప్పంతా నీదే .నువ్వు తండ్రివి .అధికారం అంతా నీ చేతుల్లోనే ఉంది .వాడు ఆడి౦చి నట్లల్లా ఆడటం నీ లోపం .పాండవులకు నువ్వు ఏది ఎంత ఇస్తే నిన్ను కాదనగలిగే గుండె ఎవరి కుంది ,ఎవరు కాదనగలరు ?’’అంటూ చివరగా ‘’అధిపా ‘’అని అంటించింది కొసరుమాటగా .మామూలు ఆడది అయితే ‘’నీ నిర్వాకం మండినట్లే ఉంది ‘’అన్నదానికి సమానార్ధం .’’అసలు వాడిని అలా తయారు చేసింది నువ్వే నీ పెంపకం లోనే వాడు త్రాస్టుడు భ్రష్టుడు,కులనాశకుడుఅయ్యాడు’’ అని ఈసడింపు .’’అలాంటి వాడికి తండ్రి వైన నువ్వు ‘’నీ  కొడుకు ‘’అని నన్ను అనటానికి నీ నోరెలా వచ్చింది ?’’అని రెట్టించింది .’’వాడు అచ్చంగా నీ కొడుకే ఫో ‘’అన్నది .ఎన్నాళ్ళనుంచో అమెమనసులో రగిలి పోతున్న సెగను, నగ్న సత్యాన్ని  ఒక్కసారి వెలిగ్రక్కి ఊపిరి పీల్చుకున్నది .ఏ సంకోచం లేకుండా ఆమె మనసులోని మాట అనేసింది .దటీజ్ గా౦ధారిమాత .గుడ్డిరాజు కపట స్వభావం ఎంత బాగా, ఎంత స్పష్టంగా గాంధారి చెప్పిందో మనకు తెలిసింది .భగవద్గీతలో మానవ సంబంధాలలో ఉన్న ఏడు రకాలను 1-సుహ్రుత్తు ,2-మిత్రుడు 3-అరి 4-ఉదాసీనుడు 5-మధ్యస్తుడు6-ద్వేష్యుడు 7-బంధువు అనే వారున్నట్లు చెప్పబడింది .వీళ్ళల్లో ఉదాసీన ,మధ్యస్థ ,బంధువు లఅభిప్రాయాలకు అనేక సందర్భాలలో విలువ ఎక్కువగా ఉంటుంది అంటారు శలాక వారు .గాంధారి దేవి ప్రాణ బంధువు అయిన భర్త స్వరూపం గురించి దాపరికం లేకుండా చెప్పిన మాట శబ్ద ప్రమాణంగా అత్య౦తవిలువైనదని  కురువంశ నాశనానికి గుడ్డిరాజే మూలకారణం అని స్పష్టమైంది అన్నారు సమాప్తి చేస్తూ ప్రాచార్య డా శలాక రఘునాధ శర్మ గారు .

వింటే భారతమే వినాలి అనటానికి ఈ ఘట్టం ప్రత్యక్ష నిదర్శనం ‘.

ఆధారం –ముందే చెప్పినట్లు శ్రీ శలాక రఘునాధ శర్మగారి ‘’వ్యాస భారత వరి వస్య  ‘’గ్రంధం లో ‘’భారత యుద్ధం –ధృత రాష్ట్రుడు’’వ్యాసం .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -13-2-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మైక్రో’’ నానీ’’పై మాక్రో పరిశోధన

మైక్రో’’ నానీ’’పై మాక్రో పరిశోధన

‘’బాబు చాలాబిజీ ‘’అన్న రేడియో మిర్చి లాగా అనుక్షణ సాహిత్య గవేషణలో చర్చలలో సాహితీ సభా నిర్వహణలో ,రమ్యభారతి పత్రికా ప్రచురణలో ,స్వంత పుస్తక ప్రచుణలతోపాటు  ఇతరు లెందరికోప్రచురణ సాయమందిస్తూ , మా సరసభారతి లాంటి సంస్థలకు పుస్తకాలను  డి .టి .పి .దగ్గర్నుంచి  ముద్రణ దాకా అన్నీ స్వయంగా చూసి ,పర్యవేక్షించి అందింస్తూ కవితలు ,కధలు రాస్తూ బహుమతుల౦దుకొంటూ ,వాటిల్లో పోటీలు పెట్టి బహుమతుల౦దిస్తూ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ కార్య దర్శి బాధ్యత అత్యంత సమర్ధంగా నిర్వహిస్తూ ,ప్రతి ఆదివారం ఏదో ఒక జిల్లాలో ఆకార్య వర్గ సమావేశానికి హాజరౌతూ ,తన వృత్తికి ఏ మాత్రమూ ఇబ్బంది కలుగకుండా చూసుకొంటూ, కత్తిమీద సాముచేస్తున్న కలం వీరుడు శ్రీ .చలపాక ప్రకాష్   .వామనుడైనా అన్నిటా త్రివిక్రముడు .లబ్ధ ప్రతిష్టులైన కవులు రచయితలెందరితోనో,  ఎన్నో సంస్థలతోనో పరిచయం , వర్ధమాన కవులకు ,రచయితలెందరి కో  ఆదర్శం ,ఆసరా  ప్రకాష్ .

ఇంత బిజీ జీవితం లో కూడా ఆయన దృష్టి అత్యాధునిక ప్రక్రియ నానీ పై  పడి, దానిలోతు పాతులను తరచి చూడాలనే సంకల్పం కలిగి ,నిర్విరామ౦గా కృషి చేసి ,తరచూ పత్రికలో నానీలపై వ్యాసాలు రాస్తూ,వాటిపై పరిశోధన పత్రం రచించే సామర్ధ్యం అర్హత ఉందని గుర్తింపు పొంది ,మిత్రుల ప్రోత్సాహం తో ‘’కేంద్ర సాహిత్య మంత్రిత్వ శాఖ వారి ఫెలోషిప్ ‘’కోసం దరఖాస్తు చేసి ,తన సామర్ధ్యానికి గీటురాయిగా ఆ సంస్థ ప్రకాష్ ను ‘’నానీ ప్రాజెక్ట్ ‘’రెండేళ్లలో పూర్తీ చేయటానికి జూనియర్ ఫెలోషిప్ కుఎంపిక చేసి ఒక లక్షా నలభై వేల రూపాయలు నగదు అవార్డ్ అందజేస్తున్నట్లు ప్రకటించటం ,’’నానీ రచన అంతటి వేగంగా’’ జరిగి పోయాయి .’’నానీ ల నాన్న’’ఆచార్య ఎన్.గోపీ గారు( ఎన్ అంటే నానీల అని కూడా అర్ధం తీసుకోవచ్చు)  ఫోన్ చేసి ‘’డా .ప్రకాష్ ‘’అని సంబోధించటం తో ప్రకాష్ కృషి ఫలించింది . ప్రతిభ ఉంటే అవకాశాలు ,పురస్కారాలు  ఏ రికమండేషన్లూ అక్కర్లేకుండానే వెతుక్కుంటూ వెంట పడతాయి అనటానికి చలపాక ఒక గొప్ప ఉదాహరణ .  కృష్ణా జిల్లా కలెక్టర్ నుండి   ‘’ఉత్తమ సాహితీ వేత్త ‘’పురస్కారం అందుకోవటం తో ప్రారంభమైన ఈ సాహితీ దిగ్విజయయాత్ర,అనేక సాహిత్య ,సాంస్కృతిక సంస్థలనుండి పురస్కారాలు ,మూడు పుస్తకాల ముద్రణకు తెలుగు విశ్వ విద్యాలయం నుండి ఆర్ధికసాయం అందుకోవటం ,జాతీయ , అంతర్జాతీయ  స్థాయి ,ఆటా ,,నాటా సంస్థల బహుమతుల వరకు కోన సాగుతూనే ఉంది .ఇది ప్రకాష్ ప్రతిభా సర్వస్వం .ఈ అర్హతలతోనే1997 నుండి మూడేళ్ళు  నానీల అంతు చూసి ,ఎవరూ  స్పృశించని లోతులు తరచి సమగ్రమైన పరిశోధన చేసి ‘’అత్యాధునిక కవితా రూప ప్రక్రియ –నానీ ‘’గ్రంధంగా ప్రచురించారు .దీనినే నిన్న 12-2-17 ఆదివారం సాయంత్రం గుంటూరు బ్రాడీపేట లోని ప్రజాశక్తి గ్రంధాలయ సమావేశ మందిరం లోగుంటూరు జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన సభలో  ఆచార్య శ్రీ ఎన్.గోపీ ఆవిష్కరించారు .వేదికపై శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య ,శ్రీమతి చిల్లర భవానీ దేవి వంటి ప్రముఖులున్నారు. శ్రీ గోపీ గారు  నానీ ప్రాదుర్భవాన్ని ,ఎదుగుదలనువివరించి  ప్రకాష్ కృషిని అభినందించారు .శ్రీమతి భవాని గ్రంధం లోని విషయాలను స్థూలంగా తెలియ జేశారు .

22 శీర్షికలో ప్రకాష్ నానీ పూర్వరంగం ,అత్యాధునిక ప్రక్రియ నానీ ,నానీ నిర్మాణం ,కొనసాగింపు ,నానీల వస్తు వైవిధ్యం ,ఏక వస్తు నానీలు ,వినూత్న ప్రయోగాలూ ,నానీలలలో సూక్తులూ ,సుభాషితాలూ ,వాటిలో హాస్య వ్యంగ్య చమత్కారాలు ,నానీ కవయిత్రులు ,ప్రసారమాధ్యమాలలో నానీలు ,నానీలపై జన వాక్యాలు ,వాదోపవాదాలు ,కవుల రచయితల అభిప్రాయాలు ,నానీసంపుటాలు ,అవార్డ్ లు ,కొత్త ప్రక్రియలకు స్పూర్తినిచ్చిన నానీ వగైరాలతో సమగ్ర పరిశోధనాత్మక గ్రంధంగా రచించారు .నాదృష్టిలో  ఇది ‘’నానీ సర్వస్వం ‘’.అంతే కాదు శ్రీ చలపాక ప్రతిభా సర్వస్వం (మేగ్నం ఓపస్ )కూడా .352 పేజీల ఈ నానీ పరిశోధనా బృహద్గ్రంధం చక్కని ముఖ చిత్రం తో పాలరాయి లాంటి తెల్లని కాగితాలతో కనుల విందు చేస్తోంది .దీని వెల కేవలం రూ.87 . అందరు కొని తప్పక చదవాల్సిన రిఫరెన్స్ పుస్తకం .

సభ జరుగుతున్నప్పుడు నా ప్రక్కనే కూర్చున్న గుంటూరులో ప్రముఖ వైద్యులు ,కవి, రచయితా, విమర్శకులు డా రమణ యశస్వి తో మాట్లాడటం మహదానందం వేసింది .కాగితం పై నాఅభిప్రాయాలను నానీల్లాంటి రూపం లో రాసి వారికి చూపిస్తుంటే వారి ప్రశంసలు ,హావభావాలు మర్చి పోలేనివైనాయి .వీటినే శ్రీ గోపీ గారికీ ,ప్రకాష్ సుబ్బయ్యగార్లకూ వినిపిస్తే వారూ ఎంతో సంతోషించారు .ఆచిలిపి నానీలు మీకోసం –

1-మైక్రో నానీ పై– మాక్రో పరిశోధన 2-నానీల పరిశోధన –సుఖ ప్రసవానికి –చలపాక –ఒక మంచి నర్సు .

3-‘’గోపీ ‘’నోట –‘’నానీ ‘’నాని –వట వృక్షమై –నేడు నిలబడింది .

నేను ఈ ప్రక్రియ పై అప్పటివరకు ఎప్పుడూ ప్రయత్నించేలేదు .సభ ప్రేరణగా రాసినవి ఇవి .ఇవి నానీలో నూనీలో నేనీలో నాకు తెలియదు .భావావిష్కరణకు నాకు తోడ్పడిన బుజ్జి పదాలు .

కొస మెరుపు -జిల్లా ముఖ్య పట్టణమైన గుంటూరు లో గుంటూరు జిల్లా రచయితల సంఘం నగరం నడి బొడ్డు బ్రాడీ పేటలో సభ నిర్వహిస్తుంటే  ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ అధ్యక్ష,కార్యదర్శులు , మాజీ వైస్ చాన్సలర్  ,ప్రముఖ సాహితీవేత్తలు వేదికపై పాల్గొనే ఈ సభలో గుంటూరుపట్టణం  వారు పట్టుమని పాతిక మంది లేక పోవటం ,ఇతర సుదూర ప్రాంతాలనుండి  వచ్చినవారు 15 మంది ఉండటం బాధ కలిగించింది .సాహిత్య సభలకు ఇలాంటి స్థితి రాకూడదు .పండుగ వాతావరణం లో జరగాల్సిన సభ నీరసంగా జతగటం ఊహించలేకపోయాను .ఈ విషయాన్నే డా రమణ యశస్వి గారితో చెవిలో నెమ్మదిగా చెబితే ‘’ఇక్కడ అంతేనండి .మీకు అక్కడ బాగా వస్తారా ?’’అంటే అవాక్కయ్యాను .

దీనితో పరిశోధనా గ్రంధం ముఖ చిత్రం జత చేశాను చూడండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-2-17 –ఉయ్యూరు

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

11-2-17 శనివారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరణాలలో మేమిద్దరం, మా మనవరాలు రమ్య

This gallery contains 9 photos.

More Galleries | Tagged | Leave a comment

బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు

బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు

gabbita-venkata-rao

గబ్బిట వారు సంగీత ,సాహిత్య రంగాలలో నిష్ణాతులు .శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒక సారి నాతో ‘’మీకు గబ్బిట దక్షిణ మూర్తిగారు తెలుసా ?’’అని అడిగితె నేను నోరు వెళ్ళ బెట్టాను .అప్పుడు ఆయనే చెప్పారు దక్షిణామూర్తిగారు మహా గొప్ప సంగీత విద్వాంసులు అని . అలాగే గబ్బిట వెంకటరావు గారు మా జ్ఞాతి అని మా మామ్మా నాన్న చెప్పే వారు కాని వారి గురించీ నాకు తెలియదు .మా మేనమామ గుండు గంగయ్యగారి పెద్దబ్బాయి పద్మనాభానికి గబ్బిట వెంకటరావు గారి భార్య చెల్లెలు శ్రీమతి వెంకట లక్ష్మి నిచ్చి ఆకిరిపల్లి లో వివాహం చేసినప్పుడు వారిని చూశాను. అంతకు ముందు మా చిన్నతనం లో మా ఇంటికి ఆయన వచ్చేవారని అమ్మా నాన్న చెప్పేవారు . తర్వాత ఆయన భార్య చనిపోయినప్పుడు ఆకిరిపల్లిలో కార్యక్రమం చేస్తే వెళ్లాం అప్పుడు చూశాను .2008  లో బాపు గారిని మద్రాస్ లో వారి౦టి వద్ద  మా మైనేనిగారి పరిచయం తో వెళ్లి సందర్శించాం .అక్కడే ఉన్న ముళ్ళపూడి రమణ గారి పరిచయమూ కలిగింది .వారిద్దరూ చూపిన ఆప్యాయత మర్చిపోలేనిది .అప్పుడు బాపుగారు నన్ను ‘’మీకు వెంకట రావు గారు తెలుసా ?’’అని అడిగితే మా బంధుత్వం చెప్పాను. ఆయన ఎంతో సంబర పడి ‘’తెలుగు పద్యం రాయాలంటే వెంకట రావు గారే రాయాలి ‘’అంతబాగా రాస్తారు నాకు నచ్చిన ,నేను మెచ్చిన కవి అన్నారు .‘’మహదానందం వేసింది .అలాంటి వెంకటరావు గారి  అమ్మాయి వివాహం బెజవాడలో జరిగితే మాకు ఆహ్వానం వస్తే వెళ్ళాము .అదే చివరి సారి ఆయన్ను చూడటం .వాళ్ళబ్బాయి మధు తో మంచి పరిచయం ఉంది.మేము మద్రాస్ వెడితే వాళ్ళ ఇంటికి  వెళ్లి వచ్చేవాళ్ళం .వాళ్ళు ఉయ్యూరు వస్తే తప్పక మా ఇంటికి వచ్చేవాళ్ళు. మధు కుమారుని  వివాహం రెండేళ్ళ క్రితం బెజవాడలో చేస్తే వెళ్లాం .మంచి ఆప్యాయతను ఆతను,అతని సోదరులూ చూపారు .

అలాగే శ్రీ డా.గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో న్యాయ శాఖ ప్రొఫెసర్. వారబ్బాయి శ్రీ డా.జయ మాణిక్య శాస్త్రి ఒరిస్సాలోని జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం లో న్యాయ శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ .చివరి అబ్బాయి శ్రీ డా.నివాస శాస్త్రి వారణాసిలో స్మార్తం లో దిట్ట సంస్కృత గ్రంధ రచయిత ఈ కుటుంబం పామర్రుదగ్గర ఎలమర్రు గ్రామానికి చెందినవారు .వీరిని డిసెంబర్ 4 న ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణం ‘’రెండవభాగం ఆవిష్కరణకు ఉయ్యూరు కు ఆహ్వానించగా అందర్నీ చూసే అదృష్టం కలిగింది . వీరందరి గురించి ఎవరో ఒకరు రాయక పొతే ఈ తరానికి తెలియదు .నా తపన అంతా దానికోసమే ‘.

గబ్బిట వెంకటరావు గారు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే’’ హనుమద్రామ సంగ్రామం ‘’నాటకం రాశారట .సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కదా ,పాటలు సంభాషణలు పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .అప్పటికే చాలా నాటకాలు నాటికలు రాసి సుప్రసిద్దులయ్యారు .అందులో అల్లూరి సీతారామ రాజు ,మనోహర ,వరూధిని ప్రసిద్ధి చెందాయి .వెంకట రావు గారు 15-3-1928న   శ్రీ గబ్బిట  దక్షిణామూర్తి, శ్రీమతిలక్ష్మీ నరసమ్మ దంపతులకు .పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు .కృష్ణా జిల్లా ఆకిరిపల్లి లో శ్రీ చల్లా శ్రీరాములు శ్రీమతి పేరమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి అన్నపూర్ణమ్మ ను వివాహమాడారు .సీనియర్ సముద్రాల ,జగ్గయ్యల ప్రేరణతో  సినీ రంగ ప్రవేశం చేసి బాపుగారి దృష్టిలో పడి ఆయన కోరికపై శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రానికి కదా మాటలు పాటలు  పద్యాలుస్క్రీన్ ప్లే రాసి బాపు ను మెప్పించారు .  సీతా కల్యాణం ,సంపూర్ణ రామాయణం లకు కూడా గబ్బిట వారి  రచన తోడ్పడింది. ఎన్టి రామారావు నటించిన బొబ్బిలి యుద్ధం మాయా మశ్చీంద్ర చిత్రాలకు స్క్రీన్ ప్లే కధ మాటలు రాశారు .బి ఏ సుబ్బారావు దర్శకత్వం చేసిన మోహినీ భాస్మాసురకూ సంభాషణలు రాశారు   .విష్ణుమాయ ,భలే మోసగాడు చిత్రాలు చేశారు .కన్నడం లో శ్రీ చాము౦డేశ్వరి మహిమ ,రాజనర్తకి రహస్యనిర్మించారు .,  ఒరియా భాషలో సి ఎస్ రావు డైరెక్ట్ చేసిన చిత్రం సత్య హరిశ్చంద్ర నూ నిర్మించారు  ,ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు .మళయాళ చిత్రం ను కొండవీటి మొనగాడు గా డబ్ చేశారు .భక్త అంబరీష మాటలు సమకూర్చారు

వెంకటరావు గారికి మధుమోహన్ ,ఉమకుమార్ శేషాద్రి ,సాయినాద్,లక్ష్మీ ప్రసన్న దక్షిణా మూర్తికుమారులు .   కుమార్తె  గౌరీ విజయ లక్ష్మి  .ఇంటి పేరుతో సహా వెండి తెర పై రచయితగా వెలుగొందిన గబ్బిట వెంకటరావు .కళామతల్లి ముద్దు బిడ్డ .శ్రీ వెంకటరావు గారు   శ్రీమద్భగవద్గీత లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్యం రచించి  శ్రీ సుసర్ల దక్షిణా మూర్తిగారి చే,స్వర కల్పన చేయించి,  శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారి చే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేసి రికార్డ్ నెలకొల్పారు .దీనితో సినిమా తీయాలని ఆయన సంకల్పం .ఇంతటి పూర్ణ ప్రజ్నులైన శ్రీ గబ్బిట వెంకటరావు గారు 11-10-1997 న 69 వ ఏట మద్రాస్ లో  పరమ పదించారు.

శ్రీ గబ్బిట వెంకటరావు గారి కుటుంబ చిత్రాన్ని జత చేశాను చూడండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-12-2-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధృతరాష్ట్ర లో(కౌ)గిలి -2

ధృతరాష్ట్ర లో(కౌ)గిలి  -2

భారత దేశ తత్వ వేత్తలు ఏదైనా ఒక అంశాన్ని పట్టు కోవటానికి 4 ప్రమాణాలను పాటిస్తారు .అవే ప్రత్యక్ష ,అనుమాన ,ఉపమాన ,శబ్ద ప్రమాణాలు .వీటిలో ఒక దానికంటే మరొకటి క్రమగా బలవత్తరాలు .సాధారణంగా వాదం లో స్వపక్షం ,పర పక్షం ,మధ్యమ పక్షం అనేవి ఉంటాయి .ఒక పక్షానికే చెందిన మాటలు యధా తధంగా ఆమోదించ టానికి వీలు కాదు .రెండు వైపులా ఉన్న ఉత్తమ స్వభావం గలవారి మాటలను ప్రమాణంగా తీసుకోవాలి . వాద ప్రతి వాదులలో అజ్ఞానం చేత ,ఆవేశం చేత తమ తప్పులు ఒప్పుకోవచ్చు .అప్పుడు స్వపక్షం నుంచి వెలువడిన అభిప్రాయాలను ప్రత్యక్ష ప్రమాణాలుగా స్వీకరిస్తారు .ఇలాంటివి మహా భారతం లో చాలా ఉన్నాయి మచ్చుకి కొన్ని చూద్దాం .

1-సంజయ రాయబారం అయిన కౌరవ కొలువులో అర్జునుడి మాటలన్నీ 50 శ్లోకాలో సంజయుడు వృద్ధ రాజుకు చెప్పాడు .భీష్మ ద్రోణాదులు ఆమాటల్ని ధ్రువీకరించారు .’’పాండవులు ఎవరి సాయం తో మామీదకు వస్తారు ?’’అని అడిగాడు గుడ్డిరాజు .ఆమాట సంజయుడికి ఒక విద్యుత్ ఘాతం లా తగిలి మూర్ఛపోయాడు .విదురుడు సంజయుడు మూర్ఛపోయాడని రాజుతో చెప్పాడు .సభలో ఉన్న పెద్ద లందరూ కురు వంశం సర్వ నాశనం అయి పోయింది అనుకున్నారు .అప్పుడు గుడ్డిరాజు ‘’ఆ ఏమీ లేదు .పాండవులు సంజయుడిని బాగా బెదిరించారు అందుకే మూర్ఛపోయాడు’’ అన్నాడు తాపీగా .తేరుకున్న సంజయుడు రాజుతో పాండవుల సహాయ సంపత్తులు బలం ,బలగం ఎంత గొప్పవో అన్నిటినీ పూస గుచ్చినట్లు వివరించాడు .అప్పుడు ధృత రాష్ట్రుడు –భీముని శక్తి సామర్ధ్యాలన్నీ వర్ణిస్తూ 60 శ్లోకాలో కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు .తన నోటితో తానే పాండవులకు చేసిన అన్యాయాలన్నీ ఏకరువు పెట్టాడు .భీముడి సాహసాన్ని పదే పదే గుర్తు చేసుకొన్నాడు. గుండె చెరువై పోయింది .కొంపలు అంటుకుంటున్నా రాజ్య భాగం గురించి ఒక్క మాట అయినా గుడ్డిరాజు నోటి నుంచి రాలేదు .యుద్ధం చేయటానికే నిశ్చయించాడు .

2- ‘’చావరు ,నొవ్వరు పాండవు –లేవురు నని నీవు చెప్పనిప్పలుకులు దుః-ఖా వేశములై ,చే-తో వ్రుత్తి గరంప జొచ్చె దుర్భర భంగిన్ ‘’అని శల్య పర్వం లో యుద్ధం దాదాపు పూర్తికావచ్చిన సందర్భం లో ధృత రాష్ట్రుడుఅన్నమాటలివి .తనవాళ్ళు అందరూ చచ్చినందుకు పడుతున్న బాధ కంటే ,పాండవులు చావలేదన్న వేదనఅత్యంత ప్రమాణంగా   ఆయన వెళ్ళ గక్కాడు .దీన్ని ఆధారంగా ఒక సారి ఫ్లాష్ బాక్ కు వెడితే గుడ్డిరాజు నిజస్వరూపం తెలుస్తుంది .యుద్ధాన్ని ఆయన ఎంతగా ఇష్టంగా కోరుకున్నాడో ,యుద్ధం ద్వారా ఎలాంటి ఫలితాన్ని అంటే పాండవుల సర్వ నాశనాన్ని ఎలా కోరుకున్నాడో అవగత మవుతుంది .ఇంతకంటే ధృతరాష్ట్రు ని లోగిలి అంటే అంతరంగానికి ప్రత్యక్ష ప్రమాణం వేరుగా ఇంకోటి ఏమీ అక్కర్లేదు అన్నారు ప్రాచార్య శర్మగారు .

అనుమాన ప్రమాణం ద్వారాకూడా గుడ్డి రాజు కపట వృత్తిని నిశ్చయింప వచ్చు  అన్నారు శర్మగారు .క్రియాశీలురు దుర్యోధనాదులే అయినా వారికి మూల శక్తి ముసలిరాజే .లోకం లో ప్రతి గ్రూపుకూ వీరాభిమానులు  చాలా మందే ఉంటారు .ఇక్కడ కౌరవ పక్షాన్నిమనస్పూర్తిగా ఆరాధించిన వాళ్ళు కనబడటం, కాని వారి పేర్లను పెట్టుకోవటం కాని మనకు కని పించదు.అంటే వాళ్ళ అ౦తరాంతరాలలో ఎక్కడో ఎవరు ఎలాంటి వారు అనే అభిప్రాయం గూడు కట్టుకొనే ఉంది అని ఊహించవచ్చు అంటారు శర్మగారు .

సమర్ధ మైన ప్రమాణంగా కవి ఉపమానాన్ని స్వీకరిస్తాడు .మహాభారతం లో రెండు పక్షాలవారినీ శ్రీ కృష్ణుడు ఉపమాన ప్రమాణం ద్వారాఉద్యోగ పర్వం లో  విస్పష్టంగా వివరించాడు –

‘’రోషమయ మహాతరువు సుయోధనుడు,రు –స్కంధ మందులో న గర్ణు డలరు-గొమ్మ సౌబలుడు ,గుసుమ ఫలములు ,దు –శ్శాసనుండు ,మూల శక్తి తండ్రి ‘’

‘’ధర్మజుండు ధర్మ తరు ,వర్జునుడు ఘన –స్కంధ ,మనిల సుతుడు శాఖ ,కవలు –పుష్ప ఫలము ,లేను ,భూసురులును ,వేద –ములు దదీయ మైన మూల చయము ‘’.

ఈ రెండు పద్యాలు చాలా బలమైనవి. భారత తత్త్వం అంతా వీటిలో బీజ ప్రాయంగా ఇమిడి ఉండి .దీనిలో ధృత రాష్ట్రు ని తత్త్వం విస్పష్టంగా కనిపిస్తోంది .’’మూల శక్తి తండ్రి ‘’అనటం లో నెపం దుర్యోధనుడి మీదకు నేట్టేయటానికి వీలు లేదు .ఈ చెట్టు ‘’అసారం ‘’అనీ రెండవ చెట్టు ‘’గాఢ సార సహితం ‘’అనీ శ్రీ కృష్ణ నిర్ణయం .ఇక్కడ అందరికీ ఒక అనుమానం రావచ్చు .పాండవ పక్షపాతి కదా నల్లవాడు ఆయన చెప్పిన మాట పక్షపాతం తో ఉండటం సహజం కదా అటువంటప్పుడు దాన్ని పట్టుకొని వేలాడటం భావ్యమేనా .అందుకే కృష్ణుడు చమత్కారంగా ‘’ధర్మ తరువునకు మూల చయం –ఏను ,భూసురులు ,వేదములు ‘’అన్నాడు దీన్ని తాత్వికంగా లోతుగా తరచి చూడాలి .

సశేషం

మీ-  గబ్బిట దుర్గా ప్రసాద్ – 12-2-17 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ధృతరాస్ట్ర లో(కౌ)గిలి

ధృతరాస్ట్ర లో(కౌ)గిలి

కురుక్షేత్ర యుద్ధానంతరం నిర్వేదనకు గురైన  ధృత రాష్ట్రుడు కౌరవ వంశాన్ని నిర్వంశం చేసిన భీముని పై ప్రతీకారం తీర్చుకోవాలని మనసులో భావించి పైకి భీముడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూ అతని కౌగిలి కోరటం ఈ దుష్టపన్నాగం గమనించిన శ్రీ కృష్ణుడు భీముడికి బదులు లోహ భీముడిని తయారు చేయించి కౌగలించుకోమనటం, ధృత రాష్ట్ర కౌగిలి లో  ఆ ఇనుప భీమ విగ్రహం పొడి పొడి అవటం మనం విన్నాం ,సినిమాలలోనూ చూశాం .అంతటి కాపట్య౦  ఉన్నవాడు గుడ్డిరాజు .మహాభారతానికి నాయకుడు ధర్మరాజు , నాయక నాయకుడు శ్రీ కృష్ణుడు .కృష్ణుడు ఆడించినట్లే భారతం నడిచింది అనిలోకం విశ్వ సిస్తుంది .కాని కురువంశ వినాశనానికి ముఖ్య  మూల కారణం అ౦బి కాతనయుడైన గుడ్డి రాజే అని  ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు తమ ‘’వ్యాస భారత వరి వస్య ‘’గ్రంధం లో ‘భారత యుద్ధం –ధృత రాష్ట్రుడు ‘’వ్యాసం లో చాలా లోతుగా పరిశీలించి వ్రాశారు .ధృత రాష్ట్రుని బాహ్య ప్రవృత్తి కౌగిలి లో బయట పడితే ,ఆ౦తరిక ప్రవ్రుత్తి హృదయం అనే గృహం అంటే లోగిలిలో బందీ గా ఉన్నది అని నాకు అని పించి, శలాక వారి  అభిప్రాయాలలోని ముఖ్య విషయాలను అందరూ తప్పక తెలుసుకోవాలన్న అభిప్రాయం తో మీకు అందించే ఉద్దేశ్యం తో శీర్షిక గా ‘’ధృత రాష్ట్ర లో(కౌ )గిలి ‘’అని రెండూ కలిసి వచ్చేట్లు పెట్టి రాస్తున్నాను .సాహసానికి మన్నించండి .

‘’ పారమార్ధిక దృష్టి లో చూస్తే భారత యుద్ధానికి మూలకారణం శ్రీ కృష్ణ పరమాత్మ .రాజకీయ దృక్పధం తో చూస్తే రాజ్యం పైఆశ .మానవత్వ కోణం లో చెప్పాలి అంటే సర్వ అనర్ధాలకు మూలకారణం ధృత రాష్ట్రుడే ‘’అన్నారు శ్రీ శలాక శర్మగారు .పరమార్ధం శరీరం ,శరీరి ,తత్త్వం మొదలైన అంశాలకు సంబంధించింది .భారతం తత్వ ప్రధాన గ్రంధం .ధృత రాష్ట్ర పక్షం అసుర భావాలకు ,పాండవ పక్షం దివ్య భావాలకూ ప్రతీకలు .ఈరెండిటికి శరీరం లోను ,విశ్వ శరీరం లోను నిత్య సంఘర్షణ ఉంటుంది .పరమాత్మను ఆశ్రయించిన దైవ సంపత్తి ,ఆసుర సంపత్తిని సర్వ నాశనం చేస్తుంది .దీన్ని ఆడించేవాడు పరమాత్మ .ఆయన కర్తవ్యాలు సాధు పరి రక్షణ ,,అసాధు శిక్షణ ,ధర్మ స్థాపన .మానవుని లో చెలరేగే దుస్ట భావాలు- అంటే సచ్చిదానంద తత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించే అజ్ఞానం మొదలైనవి అసాదువులు .వీటికి వ్యక్తిత్వం వస్తే ధృత రాస్ట్రుడు మొదలైన వారు ఏర్పడుతారు .ఆత్మ తత్వాన్ని ఆశ్రయించి ,కర్మాది యోగాలద్వారా స్వస్థితిని చేరుకొనే జ్ఞానాశిస్ట భావాలే సాదు శబ్దవాచ్యాలు .వీటికి రూపకల్పన జరిగితే పాండవులు అవుతారు .ధర్మ సంస్థాపన అంటే వేరే ఏదో కాదు –పై రెండు పనులు జరిగితే ఏర్పడే స్థితి .చీకటి తొలగి వెలుగు వచ్చినట్లు అన్నమాట .ఈదృష్టి  తో చూస్తే ,సర్వాంతర్యామి ,సర్వజ్ఞుడు ,సర్వ కారణుడు ,వాసుదేవ రూపం లో అవతరించిన పరమాత్మ మహా భారత యుద్ధానికి కర్త ,కారయిత ‘’అన్నారు మహా వ్యాఖ్యాన శిరోమణి శలాక శర్మగారు .సాక్షాత్తు అపర సూత మహర్షి అనిపిస్తారు .

యుద్ధానికి రెండవ కారణం రాజ్యాశ .నిజంగా ఇది రాజులకు దోషం కాదు .ఇక్కడ పాండవ కౌరవులలో రెండు పక్షాలు సర్వ నాశనం కాకుండా మధ్యే మార్గం సూచింపబడింది .అదే రాజ్యం లో సగభాగం .అదీ కుదరక పొతే అయిదు ఊళ్లు అయినా ఇవ్వటం .కాని కౌరవ పక్షం ‘’వాడి సూది మొన ఇంచుక మోపిన యంత మాత్రయున్ భూమి యొనర్చి ‘’ఇవ్వను ఫో అన్నది .ఇంకొంచెం దూకుడుగా ముందుకు వెళ్లి ‘’ఎవ్వరైన సంగ్రామమునన్ జయంబు గొని రాజ్యము చేయుట నిశ్చయించితి ‘’అనేదాకా వెళ్ళింది .అంతేనా ‘’ఆ మహా భోగం ‘’సిద్ధి౦చేదాకా పట్టిన పట్టు విడువకుండా అంగుళం కదలకుండా కూర్చున్నది .రాజ్యం వీరభోజ్యం అన్నంత మాత్రాన ధర్మం ,న్యాయం ఇచ్చి పుచ్చుకొనే పద్ధతీ ,సోదరత్వం మొదలైన మంచి లక్షణాలను మంట గలిసి పోయేలా ప్రవర్తి౦చటం వివేక వంతుల లక్షణం కాదు .వీటికోసం ఒక పక్షం అంటే పాండవ పక్షం  చేయవలసిన కృషి అంతా చేసింది .ఇంగ్లీష్ లో ‘’గివ్ హిం ఏ లాంగ్ రోప్ ‘’అన్నట్లు చాలా ఉదారంగా వ్యవహరించింది .ఎంతటి మహోన్నత త్యాగాలకైనా ,ఎన్ని విపత్తుల కైనా తట్టుకోవాలని దృఢ సంకల్పం తో ఉంది.  రెండవ పక్షమైన కౌరవ పక్షం వీటిని నామ రూపాలు లేకుండా ,తుడిచి పెట్టటానికి శాయ శక్తులా ప్రయత్నించింది.ఫలం అనుభవించింది .  మితిమీరిన అర్ధ లోభం ఎంత భయంకరంగా పరిణమిస్తుందో కురుక్షేత్ర యుద్ధం నిరూపించింది .ఈ దృష్టి లో మహా భారత యుద్ధానికి అసలు కారణం అధికార దాహం .ఇది కౌరవులలో కొండంత గా ఉంటె పాండవులలో గోరంత గా ఉన్నది .

తత్వానికీ ,అర్ధ లోభత్వానికీ మధ్యలో వాటితో విడదీయరాని సంబంధం ఉన్న మానవత్వం అనే ముడి ఒకటి ఉంది.అనేక కోణాలలో మానవుడు పశుతుల్యుడే ,కొన్ని కోణాలలో విశిష్టుడుగా కనిపిస్తాడు .ఈ కొన్ని కోణాలలో  నిలదోక్కుకుని నిలబడితేనే అతని మానవత్వం పరిగణన లోకి వస్తుంది .పైన చెప్పిన ధర్మం, న్యాయం మొదలైనవే ఆ కొన్ని కోణాలు .ఈ విషయాలలో ఒక నీతి ,నియమం ,లేకుండా ప్రవర్తించి సర్వ నాశనం తెచ్చుకున్నవారు  దుర్యోధనుడు  ,కర్ణుడు ,శకుని ,దుశ్శాసనుడు .నైతిక బలం తో, అధికార దృష్టితో ,పెద్దల మద్దతు తో ,వీరిని అదుపులో పెట్టుకొనే సమర్ధత ఉన్నా ,కన్నుకావని పుత్ర వాత్సల్యం తో ,దురాశ,సంకుచిత స్వభావం తో చాటుగా ,సూటిగా కూడా ప్రోత్సహించినవాడు ధృత రాష్ట్రుడు.అతని కపటత్వమే కురుక్షేత్ర సంగ్రామానికి మూల కారణమై౦ది .దీన్ని నిరూపించటానికి ప్రత్యక్ష ,పరోక్ష నిదర్శనాలున్నాయ౦టున్నారు శ్రీ శలాక వారు .వాటిని గురించి తరువాత తెలుసు కొందాం .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-2-17 –ఉయ్యూరు

—

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

11-2-17 శనివారం రాత్రి మా ఇంట్లో ఆకునూరు నేటివ్ ,అమెరికా లో మైనేనిగారి హాంట్స్ విల్ లో డాక్టర్ శ్రీ కాకాని ప్రసాద్

11-2-17 శనివారం రాత్రి మా ఇంట్లో ఆకునూరు నేటివ్ ,అమెరికా లో మైనేనిగారి హాంట్స్ విల్ లో డాక్టర్ శ్రీ కాకాని ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విజయవాడ నవ్య నాద నీరాజనం

మాన్యశ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి నమస్తే -విజయవాడ కార్యక్రమాన్ని నెట్ లో పంపటమేగాక విడిగా పోస్ట్ లో ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు . రెండేళ్ల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవటం మహదానందంగా ఉన్నది . నిన్నటి మీ నవ్య నాద నీరాజన0 లో  తబలా మోత  ,కీ బోర్డు హోరు మీ మాధుర్య గాత్రానికి గ్రహణం పట్టించాయేమో నని పించిందిInline image 1

.మీ ప్రయత్నం అద్వితీయం అనితర సాధ్యం .ఘంటసాల సంగీతానికి, స్వర మాధుర్యానికి మీరు మాట .పాట   ద్వారా చేస్తున్న విశ్లేషణ ,ప్రచారం అత్యున్నత స్థాయి లో ఉండి  మాస్టారిపై గౌరవం నేటికీ రోజు రోజుకూ పెరిగేట్లు ఉండటం మీద్వారా ఆ కృషి జరగటం వారిపై మీకున్న ఆరాధనాభావానికి, ,రసజ్ఞులలోవారిపై ఉన్న ఆదరణ భావానికి  నిలువెత్తు నిదర్శనం . బహుశా భారత దేశం లో ఏ సినీ సంగీతగాయకునికి ఘంటసాల మాస్టారు గారికి ఉన్న ఆరాధన ,దాన్నికార్య రూపం లోసప్తాహాలు ,ఏకాహాలు బృందగానాలు గా నిర్వహించటం జరుగుతున్న దాఖలాలు లేవు .  అది ఒక్క మాస్టారు గారికే లభించింది . మరీ ప్రత్యేకంగా వారి గాత్ర ,రాగ స్వర మాధుర్యాలను సభాముఖంగా విశ్లేషణ చేస్తూ ,ఆధునికతను జోడిస్తూ ,వాటిలోని శాస్త్రీయ సంగీతపు లోతులను తెలియ జేస్తూ మీరు చేస్తున్న ప్రచార వ్యాప్తి మరే  గాయకునికీ దక్కలేదు అని నిర్ద్వంద్వముగా చెప్పవచ్చు దీనిద్వారా మీరు తరిస్తూ రసజ్ఞ లోకాన్నీ  మీవెంట తీసుకొని వెడుతూ తరింప జేస్తున్నందుకు తెలుగు జాతి మీకు ఎంతో రుణ పడి  ఉంది .. మీ పరిశోధన ఏ విశ్వ విద్యాలయమూ చేయలేనంత బృహత్తర మైనది . ఘ0టసాలగారే పాడుతున్నారా ,వారే తమ స్వర రాగాలను విశ్లేషించి మనకు చెబుతున్నారా అన్నంత మమైక్యత సాధించి” అపర ఘంటసాల” అని పిస్తున్నారు .మీ జీవితం ధన్యం .వింటున్న, చూస్తున్న మా జీవితాలూ ధన్యాతి ధన్యం .ఈ పొడి మాటల పుష్పాలతో మీ సేవకు అర్చన చేస్తూ -మీ దుర్గా ప్రసాద్

—

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

10-2-17 శుక్రవారం ఘంటసాల సంగీత కళాశాలలోఘంటసాల వర్ధంతి సందర్భం గాశ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి నవ్య నాద నీరాజనం

This gallery contains 28 photos.

More Galleries | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీ ర్వాణం -3 62-సాహిత్య రత్న –కె..పి .నారాయణ పిశరోడి (1909-2004 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

62-సాహిత్య రత్న –కె..పి .నారాయణ పిశరోడి (1909-2004 )

95 ఏళ్ళు పూర్ణాయుస్సుతో వర్ధిల్లిన కె.పి. నారాయణ పిశరోడి 23-8-1909న కేరళలోని పాలకాడు జిల్లా పట్టా౦బి  దగ్గర పుతిస్సేరి పశుపతి నంబూద్రి ,నారాయణి పిశురస్యార్ దంపతులకు జన్మించాడు .మహా విద్వాంసులైన పున్నస్సేరి నంబి నీల కంఠ శర్మ  ,అత్తూర్ కృష్ణ పిశరోడి ల వద్ద సంస్కృత కావ్యాలు శాస్త్రాలు  అధ్యయనం చేశాడు.19 32 లో పట్టా౦బి  లోని సంస్కృత కళాశాల నుండి సాహిత్య శిరోమణి పరీక్ష ఉత్తీర్ణుడై చాలా స్కూళ్ళు ,కాలేజీలలో సంస్కృత ,మళయాళలను బోధించాడు ..కేరళ వర్మ కాలేజి లో రిటైర్ అయ్యాక యూని వర్సిటి గ్రాంట్స్ కమిషన్ ఫెలోషిప్ సాయం తో పరిశోధన చేశాడు .మణి దీపం, కళాలోకం , శ్రుతి మండపం ,ధనంజయం ,తోరణాయుధాంకం ,కాళిదాస హృదయం ,అత్తూర్ ,నాట్య శాస్త్రం (అనువాదం ) రచించాడు .సాహిత్య నిపుణ ,పండిత తిలకం ,సాహిత్య రత్నం బిరుదులు  పొందాడు కేరళ ప్రభుత్వసాహిత్యం సేవకు  అందజేసే  అత్యున్నత  ‘’ఎదు తచ్చన్ ‘’,పురస్కారం ‘’అందుకున్నాడు .20-3-2004 న 95 వ ఏట నారాయణ పిశరోడి నారాయణ లోకం వైకుంఠం చేరుకున్నాడు ..

63-వ్యాస మధ్వ ప్రతిష్టాన ట్రస్ట్ ఏర్పాటు చేసిన –వ్యాసంకర ప్రభంజనా చార్య

భారత దేశ అత్యున్నత సంస్కృత విద్వాంసులలో ఒకరుగా పేరెన్నిక గన్నవాడు వ్యాసంకర ప్రభంజనా చార్య .మధ్వాచార్యుల ద్వైత మత ప్రచారకుడు .మధ్వవేదాంత శాస్త్రం పై అనేక గ్రంధాలు రాశాడు .దేశ ,విదేశాలలోని ఎన్నో సంస్థలు ఆయనకు విశేష బిరుదులను ప్రదానం చేసి సన్మానించాయి .1994 లో బెంగళూర్ లో జరిగిన అఖిలభారత మధ్వ వేదాంత సభకు చైర్మన్ గా వ్యవహరించాడు .బెంగళూర్ లోని ఫస్ట్ గ్రేడ్ గవర్నమెంట్ కాలేజి ప్రిన్సిపాల్ గా పని చేశాడు .స్వచ్చందం  గా పదవీ విరమణ చేసి వేదాంత భావ వ్యాప్తికి జీవితాన్ని అంకితం చేశాడు  .’’జయతీర్ధ వ్రాత ప్రతి గ్రంధాలయం ‘’స్థాపించి అంతవరకూ ముద్రించని ,అరుదైన  భారతీయ తత్వ శాస్త్ర గ్రంధాలను ప్రచురించాడు .ప్రచురించిన వాటిలో భారత ,భాగవత ,భగవద్గీత వంటి విలువైనవి ఎన్నో ఉన్నాయి .

‘’ వ్యాస మధ్వ సంశోధన ప్రతిష్టాన ట్రస్ట్’’ నెలకొల్పి ,భారతీయ సంస్కృతీ, విలువలు ,సంప్రదాయాలను పరిరక్షింఛి  వ్యాప్తి చెందించే కార్య క్రమాన్ని చేబట్టాడు .’’ఐతరేయ ప్రకాశన ‘’అనే ముద్రణాలయం ఏర్పరచి ఎన్నో విలువైన గ్రంధాలను ముద్రించాడు .వైష్ణవ సంప్రదాయానికి చెందిన వందలాది స్తుతులను స్తోత్రాలను సేకరించి’’స్తోత్రమాలిక ‘’గా  వెలువరించాడు .శ్రీమతి జయశ్రీని వివాహమాడి ఒక కుమారుడిని పెంచుకున్నారు ..

ప్రభంజనాచార్య సంస్కృత సాహిత్య సేవకు భారత రాష్ట్ర పతి 2005 లో పురస్కారం అందజేశారు .ఆచార్యుల వారి  రచనా ప్రభంజనం –శ్రీ జయ తీర్ధ దర్శన ,బ్రహ్మ సూత్ర నామావళి,పూర్ణ ప్రజన దర్శన ,సదాచార వినోద ,శ్రీ వేద వ్యాస దర్శన ,శ్రీ బ్రహ్మణ్య తీర్దారు ,ప్రవచన భారతి ,శ్రీ మధ్వాచార్య కాల నిర్ణయ ,శ్రీ రాఘవేంద్ర దర్శన .

 

64-సంస్కృత ,సంగీత విద్వాంసుడు పద్మభూషణ్ –వి.రాఘవన్(1908 -1979 )

1908 లో జన్మించి 71 వ ఏట 1979 లో మరణించిన వి. రాఘవన్ సంగీతం లో సంస్కృతం లో సవ్య సాచి .అనేక గ్రందాల రచయిత, అత్యున్నన్నత పురస్కార గ్రహీత .120గ్రంధాలు ,1200 పరిశోధన వ్యాసాలు  రాసిన మహా రచయిత రాఘవన్ .1963 లో భోజుని బృహత్ గ్రంధమైన శృంగార ప్రకాశిక నుఅనువదించాడు .దీని అనువాదానికి ,అత్యున్నత వ్యాఖ్యానానికి 1966 లో సాహిత్య అకాడెమి అవార్డ్ పొందాడు .దీన్ని హార్వర్డ్ ఓరియెంటల్ సిరీస్ వారు మళ్ళీ ప్రచురించారు .రవీంద్రుని మొదటినాటకం ‘’వాల్మీకి ప్రతిభ ‘’నుఅనువదించాడు .బోయవాడు పరిణామం చెంది వాల్మీకి మహర్షిగా మారిన కధను టాగూర్ అపూర్వంగా సృష్టించాడు .మయూరజుని’’ఉత్తర రాఘవం ‘’నాటకాన్ని శోధించి సాధించి వెలువరించాడు .1958లో ‘’సంస్కృత రంగ ‘’అనే నాటక శాల స్థాపించి చాలా సంస్కృత నాటకాలు ప్రదర్శించాడు . కర్ణాటక సంగీతం లో ప్రావీణ్యం సాధించి మద్రాస్ మ్యూజిక్ అకాడేమికి 1944 నుండి మరణించేదాకా  సెక్రెటరి గా ఉన్నాడు .ఆయన కుమార్తె నందినీ రమణి గొప్ప కళా విమర్శకురాలు .ఆయన మరణానతరం ‘’వి .రాఘవన్ రిసెర్చ్ సెంటర్ ‘’ను నెలకొల్పారు .2008 లో రాఘవన్ ప్రధమ శత జయంతిని ఘనంగా నిర్వహించారు .రాఘవన్ పై ‘’స్మ్రుతి కుసుమాంజలి ‘’అనే ప్రత్యెక సావనీర్ నుప్రచురించారు .అందులో ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ ,వైస్ ప్రెసిడెంట్ వి.వి .గిరి గార్ల ప్రశంసలున్నాయి .ప్రముఖ రచయితా వ్యాఖ్యాత కపిలా వాత్సాయన్ ‘’ No work on Indian aesthetics is complete without its quoting Dr. Raghavan’’ అన్నమాటలు యదార్ధం .

65-ప్రబంధ సార న్యాయ గ్రంధ కర్త –గంగా సహాయ్(1840- వ శతాబ్దం )

రాజ పుటానాలోని షికార్ జిల్లా పటాన్ లో ఉన్నత బ్రాహ్మనవంశం లో సహాయ జన్మించాడు .అక్కడే చదివి పండితుల ప్రబోధం తో ఉన్నత విద్య కోసం కాశీ వెళ్ళాడు .అక్కడ గొప్ప పండితులవద్ద వేద ,శాస్త్ర ,పురాణ ఉపనిషత్తులను రెండేళ్లలో  అధ్యయనం చేసి తిరుగులేని మహా విద్వాంసుడు అని పించుకొన్నాడు .అక్కడి ఆచార్యులు సహాయ్  వైదుష్యానికి ఆశ్చర్య పడి ఆయన తమకు మరింత విజ్ఞాననం ప్రసాదింఛి మార్గ దర్శకం చేయాలని  కోరారు .బుండీ మహారాజు గంగా సహాయ ను దర్శించి తన బుండీ రాజ్య పాలన అత్యంత  సమర్ధ వంతంగా నిర్వ హించటానికి  మార్గ దర్శనం చేయమని అభ్యర్ధించాడు ..దీని తో సంస్కృత పండిత కవి గంగా సహాయ్.1877 నుంచి 1913 వరకు   బుండీ రాజ్యానికి దివాన్ గా వ్యవహరించాడు .

.న్యాయ శాస్త్రం లో మహా విద్వాంసుడు .భాగవత మహా పురాణాన్ని లిప్య౦తరీకరణ(ట్రాన్సిలరేట్ ) చేసి ,అనువదింఛి వ్యాఖ్యానించాడు  .అంటే పండితులకు మాత్రమె ఆ నాడు అర్ధమయ్యే రీతిలో ఉన్నభాషను  ఆధునికంగా అందరికి సులభంగా అర్ధమయ్యే రీతిలో రాశాడన్నమాట. దీనికి ఆయన ‘’అన్వితార్ధ ప్రకాశిక ‘’అనే సార్ధక నామాన్ని పెట్టాడు .1901 లో దీనిని బొంబాయి లోని వెంకటేశ్వర ప్రెస్ ముద్రించింది .

Inline image 2

1877 నుంచి 1930 వరకు ఆయన 127 గ్రంధాలు రాసి ప్రచురించాడు .ఇందులో బుండి రాజ్య చరిత్ర అయిన ‘’వ౦స్ ప్రకాష్ ‘’కూడా ఉంది .’’కాందార్ ,‘’పండిత ‘’బిరుదులు  పొందాడు .1880లో ‘’ప్రబంధ సార ‘’రచించాడు .రాజస్థాన్ లో ఇదే అతి ప్రాచీన న్యాయ శాస్త్ర గ్రంధం .అంతకు ముందు వరకు రాజస్తాన్ లో స్థానిక న్యాయ చట్టాలు సంప్రదాయం ,ఆచార వ్యవహారాలమీద ఆధార పడి ఉండేవి .బుండీ నగర ద్వారాల్లో ఒక దానికి ‘’పండిట్ గంగా సహాయ్ ‘’పేరు పెట్టి గౌరవించారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-2-17-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

.

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 61-‘’విద్యాధనం సర్వధనాన్ ప్రధానం ‘’గా జీవించిన –అత్తూర్ కృష్ణ పిశోరడి(1875-1964 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

61-‘’విద్యాధనం సర్వధనాన్ ప్రధానం ‘’గా  జీవించిన –అత్తూర్ కృష్ణ పిశోరడి(1875-1964 )

29-9-1875 న కేరళలో వాడక్కేదతునారాయణ  నంబూద్రి ,పాపికుట్టి పిశరస్యార్ దంపతులకు త్రిసూర్ జిల్లా అత్తూర్ అనే కుగ్రామం లో  కృష్ణ పిశోరడి జన్మించాడు . స్వగ్రామ౦ లోనే ప్రాధమిక విద్య పూర్తీ చేసి మేనమామ భారత పిశోరడి ప్రేరణతో సంస్కృతం నేర్చాడు .తర్వాత వ్యాకరణం ,కావ్యాలలో వెలదాతు రామున్నినంబియార్ వద్ద నేర్చి  పండితుడైనాడు .వెంగేరి వాసుదేవ నంబూద్రి  అనే బాబాయ్ తన ఇంటికి ఆహ్వానించి అలంకార వ్యాకరణ న్యాయ శాస్త్రాలలో నిష్ణాతుని చేశాడు .చేరువంనూర్ సభామఠంలో వృద్ధ పెదనాన్న నిర్వ హించే  వేద పాఠ శాల నిర్వహణలో రెండేళ్ళు సహాకయకుడుగా ఉన్నాడు .ఈ నిర్వహణ బాధ్యత ఇష్టం లేక దాచుకొన్న పాతిక రూపాయలతో కొడు౦గలూర్ కోవిలక్కం కు వెళ్ళిపోయాడు .

అప్పటికే అలంకార న్యాయ శాస్త్రాలావు ఉద్దండుడైన అత్తూర్ కృష్ణ భట్టాశ్రీ గోదావర్మ తమ్పురాన్ వద్ద న్యాయం లో ప్రత్త్యేక శిక్షణ పొందాడు .ఇక్కడ ఆయన జీవితాన్ని చక్కగా తీర్చి దిద్దుకున్నాడు .22వ ఏట పూర్ణ ప్రజ్ఞతో స్వగ్రామం చేరి సంస్కృత భాషను నేర్పటం ప్రారంభించాడు .తాను అద్దె కు ఉంటున్న ఇంటి యజమాని మూప్పి నాయరు కృష్ణ మొదటి శిష్యుడు .నాయర్ కు సంస్కృతం నేర్పుతూ ఆయనవద్ద వీణ నేర్చుకొన్నాడు .25 వ ఏట నన్ని కుట్టి ని వివాహమాడాడు .మామగారుభారత పిశోరడి గొప్ప వైణిక విద్వాంసుడు .కూతురూ మంచి వైణికురాలు .భార్య ,మామగారు వైణికులు అవటం తో అత్తూర్ వీణా సాధన అద్వితీయంగా సాగింది.వీరిఅన్యోన్య  దాంపత్యం 56 ఏళ్ళునిరాఘాటం గా కొనసాగింది .తరువాత భార్య మరణించింది .

అలట్టూర్ హై స్కూల్ లో టీచర్ గా జీవితం ప్రారంభించి ,తర్వాత 5 ఏళ్ళు త్రిసూర్ లోని భారత విలాసం ప్రెస్ లో పని చేశాడు .కేరళ పాణిని బిరుదాంకితుడైన ఎ.రాజరాజ వర్మ ఆహ్వానం పై తిరువనంతపురం మహా రాజా కాలేజి లో సంస్కృత ప్రొఫెసర్ గా వర్మ స్థానం లో  చేరాడు . ఓరియెంటల్ డిపార్ట్ మెంట్ కు 16 ఏళ్ళు అధ్యక్షుడిగా ఉన్నాడు .19 27 లో తిరువాన్కూర్ మహారాజుకు ట్యూటర్ గా నియమింపబడి అయిదేళ్ళున్నాడు . పదవీ విరమణతర్వాత స్వగ్రామం త్రిస్సూర్ వెళ్లి అనుక్షణ వ్యాపకం తో సుఖ జీవనం గడిపాడు . ‘’శ్రీ తిలకం ‘’అనే స్వగృహం నిర్మించుకొని దానిని సంగీత గురుకులంగా నిర్వహించి ఎందరికో సంగీత విద్య నేర్పాడు . కవి, సంగీతకారుడు ,నాటక రచయితా ,వ్యాసరచయిత మహా విద్వాంసుడు,పరిశోధకుడు సంస్కృత ,మళయాళ భాషా పండితుడు  అయిన కృష్ణ’’విద్యాధనం సర్వ ధన ప్రధానం ‘’అనే సూక్తిని ‘’విద్యా దదాతి వినయం ‘’అనే సూక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించినవాడు .వినయ౦ ,సర్వోత్కృష్ట గుణ సంపన్నుడు .నేర్పటం ఎంత ఇష్టమో ఇతరుల వద్ద నేర్చుకోవటమూ ఆయనకు అంతే ఇష్టం అని గురువు కె.పి నారాయణ పిశోరడి అన్నమాటలు పూర్తీ సత్యాలు .

భారత విలాసం ప్రెస్ లో పని చేసినప్పుడు ‘’మణి దీపిక ‘’పై వ్రాసిన సమీక్ష రాజరాజ వర్మ దృష్టిలో పడి మహా రాజా కాలేజి కి ఆహ్వానించాడు .రాజరాజ వర్మవద్ద పరిశోధనకు సంబంధించిన మెళకువలు గ్రహించాడు .భాస నాటకాలను వెలికి తీసి ప్రచురించిన గణపతి శాస్త్రి తో పరిచయం మంచి మార్పు తెచ్చింది .ప్రాధమిక వ్యాకరణ గ్రంధం ‘’బాలరత్నం ‘’రాసి ,చారిత్రిక భాషా సాహిత్య గ్రంధంగా ‘’లీలాతిలకం ‘’రచించాడు .అనేక విషయాలపై బహు గ్రంధాలు రాశాడు .’’రసిక రత్నం’’జర్నల్ స్థాపించి వెలుగు చూడని ఎన్నో కావ్యాలను వెలుగులోకి తెచ్చాడు .మహాకవి కాళిదాసు శాకుంతల నాటకం ను ‘’కేరళ శాకుంతలం ‘’గా 1937 లో రాసి ప్రచురించాడు .   దీన్ని మెచ్చిన కొచ్చిన్ మహారాజు ‘’పండిత రాజ  ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .

ఆయన ప్రతిభా  సర్వస్వం గా సంగీతం పై అనేక సంవత్సరాలు పరిశోధన చేసి రచించిన ‘’సంగీత చంద్రిక ‘’1954 లో ప్రచురించాడు.12అధ్యాయాలతో 700పేజీలున్న బృహత్ గ్రంథమిది .ఇందులో నాద, శ్రుతి స్వర ,వీణ గ్రామ మూర్చన ,మేళ తాళ , వర్ణాలంకార  , గమకస్థాయి ,,ప్రబంధ రాగ ,గీత అధ్యాయాలున్నాయి .1728 సూత్రాలకు మూలం, సూత్ర భాష్యం రాశాడు .చివరి అధ్యాయం’’ గీత ‘’లో రామాయణానికి సంబంధించిన కధలకు చెందిన  443 గీతాలు దేనికది ప్రత్యేక రాగ౦ ,,తాళం  లో న్నాయి .వీటికి సాహిత్యం స్వరమూ కూడా కూర్చాడు . .గ్రంధం అద్భుత విశ్లేషణాత్మక వివరణ గా ప్రత్యేకంగా రూపొందించాడు .ఇందులో భరతుని నుంచి ఆధునిక కాలం వారి వరకు ఉన్న వారి వ్యాఖ్యానాలన్నీ పొందు పరచాడు .

పిశోరడి రచనలు –సంగీత చంద్రిక ,భాష్యువుం ,సాహిత్యవుం ,కేరళ సాహిత్య చరితం ,కేరళ చరితం ,విద్యా వివేకం ,భాష దర్పణం ,ఉత్తర రామాయణం (అనువాదం ),శాకుంతలం (అనువాదం )లీలాతిలకం -వ్యాఖ్య .జీవిత౦ లో  చివరి రోజు వరకు సాహిత్య  సంగీత  కృషి చేస్తూనే 5-6-1964 న స్వగృహం ‘’శ్రీతిలకం ‘’లో బంధు మిత్రులందరి సమక్షం లో 89 వ ఏట మహా సంస్కృత సంగీత విద్వాంసుడు అత్తూర్ కృష్ణ పిశరోడి శ్రీ కృష్ణ లోకానికి చేరుకొన్నాడు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-2-17 –ఉయ్యూరు

 

 

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 48-సంస్కృతం లోనే సంభాషించే రెండు ఆడర్శగ్రామాలు –మత్తూరు ,హోసహళ్లి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

48-సంస్కృతం లోనే సంభాషించే రెండు ఆడర్శగ్రామాలు –మత్తూరు ,హోసహళ్లి

సంస్కృతభాషలో కవిత్వం ,నాటకం ,నవల ,వ్యాసం వ్యాఖ్యానం రాసి గీర్వాణ సేవ చేసిన  మహాను భావుల నెందరినో గీర్వాణ కవుల కవితా గీర్వాణం లో పరిచయం చేసుకోన్నాం .ఆ తర్వాత సంస్కృతం లో సినిమాలు తీసిన శ్రీ జి వి అయ్యర్ గురించీ తెలుసుకొన్నాం .అంతకంటే ఆశ్చర్యకరమైన మరో విషయం ఇప్పుడు తెలుసుకో బతున్నాం .అసలు సంస్కృతం మృత భాష ,దాన్ని ఎవరు చదువుతారు అందులో ఎవరు రాస్తారు ,చాదస్తంగా మీ లాంటి వాళ్ళు ఇంకా దాన్ని పట్టుకొని పాకులాడుతున్నారు అని చాలా మంది అనుకొంటారు .కానీ ఈ 21 వ శతాబ్దం లో ఎనిమోదో ,తోమ్మిదోదో అయిన వింత ఒకటి వింటే అవాక్కై పోతాం. అదే కర్నాటక రాష్ట్రం లో  మత్తూరు,హోసన హళ్లి అనే రెండు గ్రామాల ప్రజలు నిత్య వ్యవహారాలలో కూడా సంస్కృతంలోనే మాట్లాడు కొంటారని తెలిస్తే నాబోటి వాళ్ళం ఎగరలేక పోయినా గంతులేస్తాం .వారి సంస్కృతీ భాషా పరిరక్షణకు జేజేలు పలకాల్సిందే .

సంస్కృత గ్రామాలు

మత్తూరు ,హోసనహళ్లి.అనే రెండుగ్రామాలు కర్ణాటకలో తుంగా నదీ తీర౦ లో  శివ మొగ్గ కు దగ్గరలో  ఉన్నాయి .ఆ గ్రామాలను ‘సంస్కృత గ్రామాలు ‘’అంటారు అక్కడ గుడి, బడి ,అంగడి వీధులలో ,ఇళ్ళల్లో  చిన్నా పెద్ద ,ఆడా మగా అందరూ సంస్కృతం లోనే మాట్లాడుతారు .అలా మాట్లాడుతున్నందుకు వాళ్ళు చాలా గర్వంగా భావిస్తారు .కొత్తవారు ఈ గ్రామాలలోకి వెళ్ళంగానే వాళ్ళు ‘’భవత్ నాం కిం ?”’అని అడుగుతారు .అంటే ‘’అయ్యా ! తమ పేరేమిటి ?”’అని అర్ధం పేరు చెప్పాక ‘’కతమ్ ఆస్తి ‘’? అనగా ‘’తమరు ఎలా ఉన్నారు ?’’అని అడుగుతారు .ఇలాసంభాషణ కొనసాగిస్తారు .ఈ గ్రామస్తులకు సంస్కృతం తప్ప ఇంకా ఏభాషా తెలియదు  అనుకొంటే’’ భాషా పప్పు’’ లో కాలేసినట్లే మనం .వారికి తెలుగు కన్నడం మలయాళం హిందీ ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే ప్రావీణ్యం ఉంది .కుటుంబం లో ఒక్కరైనా ఇంజనీరింగ్ చదివి ఉత్తీర్ణులైన వారున్నారు .అయినప్పటికీ వారందరూ సంస్కృతం లోనే విధిగా మాట్లాడాలని దృఢ నిశ్చయం లో ఉన్నారు ..దీనికి కారణం భారత దేశం లో సంస్కృత భాషా వ్యాప్తికి కృషి చేస్తున్న ‘’సంస్కృత భారతి ‘’అనే స్వచ్చంద సంస్థ .

సంస్కృత భారతి సేవ

1981 లో సంస్కృత భారతి మత్తూరు గ్రామం లో ‘’సంస్కృత భాష గొప్ప దనం –ప్రస్తుతం దేశం లో దాని వైభవపతనానికి కారణాలు ‘’అనే అంశం పై 10 రోజులపాటు వర్క్ షాప్ నిర్వహించింది .చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు చాలా మంది వచ్చారు .ఈ వర్క్ షాప్ లో ఒకాయన ‘’సంస్కృతం లో ఒకడు అనర్గళంగా మాట్లాడితే అతడిని పండితుడు అంటారు .కానీ ఊరి వారంతా సంస్కృతం లో మాట్లాడితే ఏమనాలి ?అనే ప్రశ్న వేసుకొని అలా౦టిగ్రామాన్ని ‘’సంస్కృత గ్రామం ‘’అనాలి అని నిర్ణయించారు .సంస్కృత భారతి చెప్పిన ఈమాటను పై రెండు గ్రామాల వారికీ బాగా నచ్చి ,అందరూ సంస్కృతం నేర్చుకోవటం మొదలు పెట్టి సంస్కృతం లో మాట్లాడటం ప్రారంభించి సంస్థ ఆశయాన్ని ఆచరణలోకి తెచ్చి తమ ప్రత్యేకతను చాటి చెప్పి దేశం లోనే సంస్కృత భాషా పరంగా ఆదర్శ గ్రామాలు అని పించారు .సంస్కృతం తో పాటు మరొక మిశ్రమభాష ‘’సంకేతి ‘’ని కూడా వీరు మాట్లాడుతారు .ఇది సంస్కృత ,కన్నడ తెలుగు ,తమిళ మిశ్రమ భాష .ఇది వ్యావహారిక భాష .దీనికి లిపి లేదు  దేవ నాగరి  లిపినే వాడుతారు .సుమారు 6 00ఏళ్ళక్రితం కేరళనుంచి సంకేతి బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాయి .వీరి దినదిన జీవితమంతా సంస్క్రతం చుట్టూనే పరిభ్రమిస్తుంది . సంస్కృతమే అందరూ మాట్లాడుతారుకదా అని అందరూ పిలక పెట్టుకొని పంచె లేక లుంగీ తో ఉంటారు అనుకొంటే పొరబడ్డట్టే .జీన్స్ పాంట్ వాళ్ళూ చెవుల్లో సెల్లు లవాళ్ళూ మోటార్ బైక్ రాయుళ్ళూ అందరూ ఉంటారు .కాని మాట్లాదేదిమాత్రం సంస్కృతమే . ఒకరకం గా ఈ జంట గ్రామాలు పురాతన ఆధునికతలకు తీపి గుర్తులు .

గుడే బడి

ఈ గ్రామాల దేవాలయాలలో సంస్కృతం నేర్పించే పాఠశాలలుఉన్నాయి వీటిని ‘’వేద శాలలు ‘’అంటారు .శిధిలా వస్థలో ఉన్న ప్రాచీన తాళపత్ర గ్రంధాలను ఇక్కడే తిరగ రాసి ,కంప్యూటరైజ్ చేస్తారు .ఈ రెండు గ్రామాల వారే సంస్కృతం లో సంభాషిస్తున్నారు కాని ఇతర గ్రామాలవారెవ్వరూ ముందుకు రావటం లేదు .కాని జర్మని ,రష్యా వంటి విదేశీ యువత సంస్కృతం నేర్చుకోవటానికి అమితాసక్తి చూపిస్తున్నారు .జర్మనీ యూని వర్సిటీలలోని సంస్కృత కోర్సులకు ఏటా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నా వారిలో పదుల సంఖ్యలలోనే విద్యార్ధులను ఎంపిక చేస్తున్నారు .కారణం సంస్కృతం బోధించే ప్రొఫెసర్లు తగినంత మంది లేక పోవటమే  .అందుకే విదేశాలనుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి వచ్చి సంస్కృతం అభ్యసిస్తున్నారు  .ఈ జంటగ్రామాల గోడలపై రాతలూ సంస్కృతం లోనే ఉంటాయి ..

మహా పండితులకు జన్మస్థానం

ఇక్కడి ఈ జంట గ్రామాల ప్రజల జీవనాధారం వ్యవసాయం .ఇక్కడి ప్రధాన పంట వక్కలు (పోచెక్కలు ).మత్తూరు నుంచి 30 కి పైగా సంస్కృత పండితులు బెంగళూరు మంగళూరు ,మైసూరు మొదలైన ప్రాంతాలలో యూని వర్సిటి ప్రొఫెసర్లు గా ఉన్నారు .భారతీయ విద్యా భవన్ పాఠశాల నుఇక్కడ స్థాపించిన మత్తూరు కృష్ణ మూర్తి ,వయోలిన్ విద్వాంసుడు వెంకటరాం ,కన్నడ శాస్త్రీయ సంగీత కారుడు హెచ్ .ఆర్.కేశవ మూర్తి వంటివారు జన్మించిన భూమి మత్తూరు .

గమక సంగీత రూపక  సంప్రదాయ పునరుద్ధరణ

సంస్కృతాన్ని మాత్రమె పునరుజ్జీవింప జేయటం కాదు వీరి కన్నడ శాస్త్రీయ’’ గమక ‘’సంగీత రూపక సంప్రదాయ౦ అంతరించి పోతుంటే  వీరందరూ జాగరూకులై దాన్ని అంతరించి పోనివ్వకుండా పునరుజ్జీవింప జేసి కాపాడారు .గమక అంటే కన్నడ సంగీత రాగం లో కద ను వివరించటం .దీనినే ‘’కావ్య వచన ‘’అంటారు వీళ్ళు .కన్నడ దీశం లో గమక ప్రదర్శనకు జనం విపరీతంగా హాజరై ఆనందిస్తారు .

ప్రధాని నరేంద్ర మోడీ సి .బి .ఎస్. ఇ .సిలబస్ లో ఉన్న జర్మన్ భాష బదులు సంస్కృతం నుప్రవేశ పెట్ట్టే ప్రణాళికలో ఉన్నారని తెలిసి ఈ గ్గ్రామస్తులు పరమానంద భరితులవుతున్నారు .

Inline image 1Inline image 2

Inline image 3Inline image 4

ఆధారం –1-ఆంధ్ర జ్యోతి -29-1-17 ఆదివారం స్పెషల్ 2- వీకీ పీడియా

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-17 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారిచే ‘నవ్య నాద నీరాజనం’ (ప్రత్యేక వాయులీన-గాత్ర సంగీత విభావరి)

మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారిచే ‘నవ్య నాద నీరాజనం’ (ప్రత్యేక వాయులీన-గాత్ర సంగీత విభావరి)
       ప్రముఖ సాంస్కృతిక సంస్థలు యువ కళావాహిని,శ్రీ త్యాగరాయ గాన సభల ఆధ్వర్యవంలో ‘సంగీత జ్నానేశ్వర’.’లలిత సంగీత సుధాకర’
మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ఐ.బి.ఎస్ గారు నిర్వహించిన  ‘నవ్య నాద నీరాజనం'(ప్రత్యేక వాయులీన- గాత్ర సంగీత విభావరి)
 అత్యంత సమ్మోహనకరంగా సాగింది.
    ఈ జంత్ర గాత్ర సమ్మేళనంలో ఆదిత్య ప్రసాద్ వయొలిన్ పై వినిపించిన’ఆశూభరీహై’. ‘జోరుమీదున్నావు తుమ్మెదా'(యమన్),’దమ్ భర్ జో ఉధర్'(ఆవారా),ప్యార్ కియా దిల్ నే కహావో తుమ్’ ఫిలింగీతాలకు శ్రోతలు విశేషంగా స్పందించారు.
 ‘మౌనమె నీ భాష'(గుప్పెడు మనసు), ‘మానస సంచరరే’
(సదాశివ బ్రహ్మేంద్ర),అన్నపూర్ణే విశాలాక్షీ'(దీక్షితార్) కీర్తనలు ఆలపిస్తూ. సామ రాగం 19,20,21 శతాబ్దాలలో ఎలా రూపాంతరత చెందినదీ పరిశోధనాత్మకంగా వివరిస్తున్నప్పుడు శ్రోతలు అత్యంత అశ్చర్యంతో విన్నారు.
   ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’,
‘పిలచిన బిగువటరా’,’సారే జహాసే ఆఛ్ఛా’ పాటలు ‘కాపీ’ రాగంలో స్వర పరచ బడ్డాయని తెలిపి వయొలిన్ పై వినిపించినప్పుడు శ్రోతలు విశేషమైన ఆసక్తితో విన్నారు.
      అలాగే ‘పాట పాడుమా కృష్ణా’, ‘జీవితమే సఫలము’ పాటలు భీంప్లాస్ రాగంలో స్వర పరచబడ్డాయని తెలిపి వయొలిన్ పై వినిపించినప్పుడు శ్రోతలు ఎంతో ఆనందంతో విన్నారు..
   ఈ పాటలన్నింటినీ శ్రీ ఆదిత్య ప్రసాద్ తులనాత్మక పరిశోధనతో వ్యాఖ్యానించి విసిపించారు.
      ఈ సందర్భంగా జరిగిన సభలో తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ,యువ కళావాహిని ఆధ్యక్షులు వై.కె.నాగేశ్వర రావు,ప్రముఖ రచఇత్రి కె.వి.కృష్ణకుమారి, సంగీత విద్వాంసులు ఆయ్యగారి  శ్యామ  సుందరం, విన్నకోట మురళీ కృష్ణ, పాలగుమ్మి రాజగోపాల్ తదితరులు శ్రీ ఆదిత్య ప్రసాద్ ను ఆభినందించి  ఘనంగా సత్కరించారు.

dsc_0263 img_20170207_135131 dsc_0237

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఈ రోజు దినపత్రికల వార్తలు

ఈ రోజు దినపత్రికల వార్తలుcf22c22a-026d-46c6-8572-c32a78ed8539 8dc77d75-703f-40bd-aebd-4ec4ea577d94

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం ఆవిష్కరణ

శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం ఆవిష్కరణ

http://wp.me/p1jQnd-alE

దాదాపు రెండు నెలల క్రితం మనసులో మెదిలిన శ్రీ సువర్చలాంజనేయ స్వామి వారిపై శతకం –శతక త్రయం గా రూపు దాల్చి  నిన్న 5-2-17 ఆదివారం కార్యరూపం  ఆవిష్కరి౦ప బడి ఒక అద్భుతం అని పించింది .శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు గారు రాసిన శ్రీ సువర్చలా సుందర వాయునందన శతకం ,శ్రీమతి ముదిగొండ సీతా రావమ్మగారు  రాసిన శ్రీ సువర్చలా వల్లభ మారుతీ శతకం ,శ్రీ మంకు శ్రీను గారు రాసిన శ్రీ సువర్చేలేశ్వర శతకం నిన్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి దేవాలయం లో ఉదయం 8-30 గం.లకు సామూహికంగా పాలు పొంగించటం ,9-గం.లకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం  నేనే చేయించి .పూర్తీ అయ్యాక మధ్యాహ్నం 12 గం లకు శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ  రాజేంద్ర ప్రసాద్ ,శ్రీనివాసా విద్యాసంస్థల అధినేత శ్రీ పరుచూరి శ్రీనివాసరావు ,రోటరీ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గార్లు ఆవిష్కరించారు .ఆతర్వాత శతకత్రయాన్ని భక్తులకు అందజేయటం జరిగింది .

శతకం రచించిన కవులకు  ఆలయ మర్యాదలతో అర్చక స్వామి శ్రీ వేదాంతం మురళీ కృష్ణచేత  చందన తాంబూలాలతో పుష్పహారం తో  సత్కరింప జేసి  స్వామి వారి శేష వస్త్రాన్ని ఇప్పించాం. తరువాత సరసభారతి  ఒక్కొక్కకవికి  10 వేల రూపాయలు ,పట్టు బట్టలు ,కాశ్మీర్ శాలువా ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఫోటో జ్ఞాపిక తో పాటు వారి శతకాలను 25 కాపీలు ,మిగిలిన రెండు శతకాలు పదేసి కాపీలు అందజేశాం .ఉయ్యూరులో ఉన్న దేవాలయలయాలలో   ఏ స్వామి పైనా ఎవ్వరూ శతకం రచించినట్లు నాకు తెలిసినంతవరకు జరగలేదు .మరి 3 శతకాలు అంటే అసలు  ఊహించలేనిది  .అలాంటిది మా స్వామిపై 3 శతకాలు రచి౦పజేసి ,మూడూ ఒకే సారి ఆవిష్కరింప జేయటమూ చాలా అద్భుతమైన విశేషమే .ఆ అదృష్టం  సరస భారతి కి శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారల అనుగ్రహం తో దక్కింది .దీనికి కారణమైన భక్తులు ,స్వర్గీయ శ్రీ గోవిందరాజు పరబ్రహ్మానంద శర్మగారి జ్ఞాపకార్ధం వారికుమారులు శ్రీ శ్రీనివాస్, శ్రీ వేణు మాధవ్ సోదరులు ఒక శతకానికి స్పాన్సర్లు అవటం అదృష్టం .

పై కవిత్రయం శతకానికి ఎంత డబ్బు ఇస్తారు అని అడగకుండా  అత్యంత భక్తీ శ్రద్ధలతో స్వామి అనుజ్నగా భావించి  రచించటం  వారి సౌజన్యానికి ప్రతీక .  4-12-16 ఆదివారం నేను రచించిన గీర్వాణ కవుల కవితా గీర్వాణం రెండవ భాగం ఆవిష్కరింప జేసినప్పుడు జరిపిన ‘’గీర్వాణ భాషా వైభవం ‘’పై నిర్వ హించిన పద్య కవి సమ్మేళనం లో శ్రీ తుమ్మోజు వారి కవితకు విపరీతంగా ఆనంద పడిన సరసభారతి కి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతలు (అమెరికా )సరస భారతి ద్వారా శ్రీ తుమ్మోజు వారికి 5 వేల రూపాయలు అందజేయమని డబ్బు పంపారు. ఆ నగదు పారితోషికాన్ని నిన్న  అందజేశాము .నాకు తెలిసినంతవరకూ తెలుగు దేశం లో ఒకే ఒక కవితకు 5 వేల భారీ పారితోషికం అంద జేసిన వారెవ్వరూ లేరని అనుకుంటున్నాను .బహుశా భారత దేశం లోనూ కూడా అరుదేమో .ఈ రికార్డ్ శ్రీ మైనేనివారి ద్వారా సరసభారతికి దక్కింది . కిందటి నెలలో శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవం ను,శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారి సంస్మరణ కార్యక్రమాన్ని స్వర నీరాజనం గా అయిదుగురు గాయనీ మణుల చేత నిర్వహి౦ప జేసి ,ఒక్కొక్కరికి 1 ,11 6 రూపాయలను నగదు పారితోషికాన్ని ‘’శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారి స్మారక పురస్కారం ‘’గా మా అమ్మాయి శ్రీమతి కోమలి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ సా౦బా వధాని గార్ల (అమెరికా ) గారి సౌజన్యం తో అందజేశాం .బాలమురళీ కృష్ణ గారు మరణించిన రెండు నెలల లోపు వారి పేర స్మారక పురస్కారం ఏర్పాటు చేయటం ,వెంటనే అందించటం బహుశా  ప్రపంచం లోనే ఎవరూ చేయలేదు. ఆ గౌరవం సరసభారతికి దక్కి రికార్డ్ అయింది .అంతేకాదు శ్రీ బాపు గారు మరణించిన మూడు నెలలలోపే సరసభారతి ‘’బాపు –రమణ స్మారక పురస్కారం ‘’ఏర్పాటు చేసి మా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )సౌజన్యం తో మొదటి సారిగా శ్రీ వేదగిరి రాంబాబు గారికి ,శ్రీ శీలా వీర్రాజు గారికీ అందజేసి న అదృష్టం పొందాం

. శతక త్రయం ఆవిష్కరణ తరువాత  దాదాపు ౩౦౦ భక్తులకు స్వామి ప్రసాదంగా విందు ఏర్పాటు చేశాం .అందరూ చాలా సంతృప్తి చెందారు  .కార్య్కక్రమం, భోజనాలు పూర్తీ అయ్యేసరికి మధ్యాహ్నం 3 గంటలు అయింది .కార్యక్రమం జరిగిన తీరుకు తమ ఆనందాన్ని శ్రీ మంకు శ్రీను గారు ఒక కంద పద్యం లో బంధించి వెళ్ళే టప్పుడు నాకు అందజేశారు-

‘’అబ్బుర మందగ నెల్లరు-ఇబ్బడి ముబ్బడి కపీంద్రు డెన్నగ శతకాల్

గొబ్బున లిఖింప జేసిన-గబ్బిట దుర్గా ప్రసాదు గారికి వినతుల్ .’’

—————————————————————————————————-

ఎక్స్ రే సంస్థ కవి సమ్మేళనం

నిన్న సాయంత్రం6-గం లకు విజయవాడ శ్రీ చండ్ర రాజేశ్వర రావు లైబ్రరీలో ఎక్స్ రేసంస్థవారు ప్రతినెలా మొదటి ఆదివారం జరిపే ‘’నెల నెలా వెన్నెల ‘’కార్యక్రమం లో ‘’అద్భుతం ‘’అనే అంశం పై కవి సమ్మేళనం నిర్వహించి నన్ను సాహిత్య అతిధిగా ఆహ్వానించారు .శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ గారు సమ్మేళనం నిర్వహించారు .సుమారు 20 మందికవులు కవితలు అల్లి వినిపించారు . సంస్థ అధ్యక్షులు శ్రీ కొల్లూరి రాలేక పోయారు .వారి బదులు కార్యదర్శి శ్రీ ఆంజనేయ రాజు  ,ఉపాధ్యక్షులు శ్రీ కందికొండ రవికిరణ్ గార్లు జాగ్రత్తగా నిర్వహించారు. నేను ‘’అద్భుతోద్భుతః ‘’కవిత అక్కడికక్కడ రాసి చదివాను –‘’ఎక్స్ రే కంటికి నేను చిక్కటం ఒక అద్భుతం –నన్ను అతిధిని చేయటం పరమాద్భుతం –అంతే కదా ఎక్స్ రే కు చిక్కనిదేదీ లేదు –పరీక్షించి చూడటమే తపన అయితే –చిక్కనిది దక్కనిది ,నయం కానిదేముంది ?-అందుకే ఎక్స్ రే సంస్థ ఒక అద్భుతం –అందులో నెల నెలాపాఠశాల మరో అద్భుతం –దాని రేడియేషన్ ఉయ్యూరు దాకా పాకి –నేను పట్టుబడటం పరమాద్భుతం –అద్భుతోద్భుతః ‘’

తరువాత కవుల పేర్లతో చీటీలు లాటరీతీసి వచ్చిన 5 గురు కవులకు ఒక్కొక్కరికి వందరూపాయలు అందజేయటం అద్భుతమైన ఆలోచన . అతిధి నైన నాకూ  ,సమ్మేళనం నిర్వహించిన వాణీ గారికి   శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి సత్కరించారు .నేను ఎక్స్ రే సంస్థకు సన్మానం గా శ్రీ ఆంజనేయ రాజుగారిని శాలువాతో సత్కరించి  శతక త్రయాన్ని బహూకరించాను .అలాగే వాణీ గారికీ శతకత్రయం అందించాను .అందరికీ ఇడ్లీ ఊతప్పం తో టిఫిన్ ఏర్పాటు చేశారు .పొద్దున్నించీ పని ఒత్తిడిలో ఉన్నందున ఏమీ తిన బుద్ధికాలేదు . ఏదో తిన్నట్లు నటించాను .రాత్రి ఇంటికి చేరే సరికి 10 -30 గం అయింది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-2-17 –ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరులో “శ్రీ సువర్చలాంజ నేయ శతక త్రయం” ఆవిష్కరణ మహోత్సవం

ఈ రోజు ఉయ్యూరులో “శ్రీ సువర్చలాంజ నేయ శతక త్రయం” ఆవిష్కరణ మహోత్సవం సందర్భంగా, రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారిపై 1-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ ) గారు రచించిన ‘’శ్రీ సువర్చలా సుందర వాయునందన శతకము ‘’2- మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు(విజయవాడ) రచించిన ‘’శ్రీ సువర్చలా వల్లభ శతకము ‘’3-శ్రీ మంకు శ్రీను గారు(కొప్పర్రు –ప.గో. జి .) రచించిన ‘’శ్రీ సువర్చలేశ్వర శతకము ‘’ అనే శతక త్రయాన్ని ‘’సరసభారతి’’ ప్రచురించగా, ఆ పుస్తకాలను ఆవిష్కరించిన మన శాసన మండలి సభ్యులు గౌ”శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్ గారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షురాలు శ్యామలదేవి గారు, శ్రీనివాస విద్యాసంస్థల అధినేత పరుచూరి శ్రీనివాసరావు గారు, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం గారు, గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు, , కూనపురెడ్డి వాసు గారు, నాగరాజు గారు, పండు గారు, బాబి గారు, చిన్ని గారు మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

5-2-17 ఆదివారం ఆవిష్కరింపబడే శ్రీ సువర్చేలేశ్వర శతకం కవర్ పేజీలు

vayu3 vayu4 vayu1 vayu25-2-17 ఆదివారం ఆవిష్కరింపబడే శ్రీ సువర్చేలేశ్వర శతకం కవర్ పేజీలుsuvarchalesvara1 suvarchalesvar-2 suvarchalesvar-4 suvarchalesvar3

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 57-బ్రహ్మ సూత్ర భాష్య౦ లో పద భేద విచారణ చేసిన –వీరనారాయణ పాండు రంగి (1973)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

57-బ్రహ్మ సూత్ర భాష్య౦ లో పద భేద విచారణ చేసిన –వీరనారాయణ పాండు రంగి (1973)

4-7-1973నబెంగుళూర్ లో జన్మించి ,రాజస్థాన్ లో జైపూర్ లో సంస్కృత అధ్యాపకుడుగా పని చేసి  కర్నాటక సంస్కృత సాయంకాల కాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్న వీరనారాయణ పాండురంగి మహర్షి బాదరాయణ వ్యాస అవార్డ్ ను ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ నుండి 2011 లో అందుకొన్నాడు . ప్రస్తుతం రాజస్థాన్ జైపూర్ లోని జగద్గురు రామచంద్రాచార్య సంస్కృత యూని వర్సిటి దర్శన విభాగ డీన్ గా ఉన్నాడు .వీర నారాయణ దర్శన శాస్త్రం లో మహా ప్రసిద్ధుడు .

పాండు రంగి మార్తాండ దీక్షిత్ ,మాణిక్య శాస్త్రి ల వద్ద అధ్యయనం చేసి నవ్య న్యాయ ,ద్వైత వేదాంతాలలో విద్వాన్ డిగ్రీ ,పూర్వ మీమాంసలో విద్వాన్ మాధ్యమ డిగ్రీ ,,సాహిత్యం లో మాస్టర్ డిగ్రీ పొందాడు .ద్వైత వేదాంతం లో విద్యా వారధి (పి హెచ్ డి )ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి పొంది ,తిరుపతి సంస్కృత విద్యా పీఠం నుండి నవ్య న్యాయం లోనూ పి హెచ్ డిఅందుకొన్నాడు .బెంగుళూర్ లోని పూర్ణ ప్రజ్నవిద్యా పీఠ సంస్కృత కాలేజిలో 1995నుంచి 99వరకు నవ్య న్యాయ లెక్చరర్ గా ,1999నుండి 2005వరకు పాండిచేరి ఫ్రెంచ్ ఇన్ స్టి ట్యూట్లో రిసెర్చెర్ గా 20 05నుండి రామచంద్రా చార్య సంస్కృత విశ్వ విద్యాలయం లో దర్శన శాఖ అసిస్టంట్ ప్రొఫెసర్ గా 2007నుండి దానికి డీన్ గా  పని చేస్తున్నాడు .

8 గ్రంధాలను 20 కి పైగా రిసెర్చ్ పేపర్లను పా౦డురంగి రచించాడు .2006లో సంస్కృతం లో ‘’సమవాయ విమర్శను ‘’,బ్రహ్మ సూత్ర భాష్యే పదభేద విచారః ‘’లను రచించి ప్రచురించాడు .హిందీలో సదాచార స్మృతి ,క్రష్ణామృతార్ణవహః ,అనే అనువాద రచనలు చేశాడు .సంస్కృతం లో న్యాయ సుధా ,తాత్పర్య చంద్రిక ముక్తితత్వం ,తర్కనవనీతం శక్తివాద గ్రంధాలను తన సంపాదకత్వం లో ప్రచురించాడు .

Inline image 1

సశేషం

రధ సప్తమి శుభాకాంక్షలు

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-2-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పొనాకా సమస్యపై ఉద్యమించిన నేటివ్ అమెరికన్ మహిళ-సుసెట్టీ లా ఫ్లెషీ- గబ్బిట దుర్గాప్రసాద్

పొనాకా సమస్యపై ఉద్యమించిన నేటివ్ అమెరికన్ మహిళ-సుసెట్టీ లా ఫ్లెషీ- గబ్బిట దుర్గాప్రసాద్

సుసెట్టీని కాంతి కనుల కోమలి –‘’ఇంషటా తూంబా’’అంటారు .జోసెఫ్ లా ఫ్లేషీ ,మేరీ గేల్ అనే పోనాకా అమ్మాయిల అయిదుగురు సంతానంలో ఒకరు .తండ్రి ఫర్ వ్యాపారంలో బాగా సంపాదించి ధనికుడైన ఫ్రాన్స్ దేశ౦ నుంచి వచ్చినవాడు .తండ్రిని ‘’ఉక్కు కన్నులవాడు ‘ఇంస్టామాజా ‘’అని పిలిచేవారు.ఫ్రాన్స్ నుంచి అమెరికా కు వలస వచ్చి ,16 వ ఏటనే అమెరికన్ ఫర్ కంపెనీలో చేరి ఎప్పుడూ టూర్ లలో ఉండేవాడు. సుసెట్టీ కూడా తన 10 వ యేటనుండే తండ్రితో టూర్ లలో పాల్గొనేది ..భర్త ఎప్పుడూ ఇల్లు పట్టి ఉండక తిరుగుతూ ఉండటం తో భార్య అతన్నివదిలేసి౦ది ,కూతుర్నితన తల్లిదండ్రులు కుటుంబం ఒహామా లో ఉంటూ జాగ్రత్తగా పెంచింది .తల్లి మళ్ళీ పెళ్లి చేసుకొన్నది .తండ్రి  వేరే పెళ్లి చేసుకొన్నాడు .తండ్రి జోసెఫ్ మారుటి తమ్ముడు తెల్ల హంస అనబడే ఫ్రాంక్ లాఫ్ పోనాక్ చీఫ్ .ఆయన ప్రభావం సుసెట్టీ పై బాగా పడింది .
చదువు –పొనకా చైతన్యం
రిజర్వేషన్ ఉద్యమం లో ప్రెస్ బిటేరియన్మిషన్ స్కూల్ మూత పడటం తో సుసెట్టీ న్యూజెర్సిలోని ఎలిజబెత్ లో ఉన్న గర్ల్స్ స్కూల్ లో చేరి చదివింది .చెల్లెళ్ళు మార్గరెట్ ,సుసాన్ లు కూడా ఇక్కడే చేరి చదివారు .ఈ స్కూల్ లో ఉన్నప్పుడే ఆమె రచనా పాటవం బయట పడింది .అందరూ మెచ్చి ప్రోత్సహించారు .క్రమంగా రచయిత్రి గా పేరొచ్చింది .అన్ని రంగాలలోను దూసుకు వెళ్లి అగ్రస్థానం లో నిలిచింది. చెల్లెలు సుసాన్ లా ఫ్లేషీ పికోటీ మొట్టమొదటి నేటివ్ అమెరికన్ ఫిజిషియన్ అయింది ..నేటివ్ ఇండియన్ రిజర్వేషన్ లో మొట్టమొదటి ప్రైవేట్ హాస్పిటల్ ను స్థాపించి రికార్డ్ నెలకొల్పింది .మరో చెల్లెలు రోసేల్లీ ఒమాహా నేషన్ కు ఫైనాన్సియల్ మేనేజర్ అయి ,నివాస భూమి కాని ప్రదేశాలలో అంటే అదనంగా ఖాళీ గా ఉన్న స్థలాలలో గడ్డి పెంచటం లీజ్ కివ్వటం చేసి సంపాదనా పరురాలైంది .ఇంకో చెల్లెలు మార్గరేట్ యాక్టన్ సియోక్స్ రిజర్వేషన్ లో టీచర్ అయింది .ఇలా నేటివ్ అమెరికన్ కుటుంబం లోని వీరంతా బాగా విద్యా వ్యాపార రంగాలలో చక్కని అభివృద్ధి సాధించారు .ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ను సార్ధకం చేసుకొని తమ జీవితాల్లో  వెలుగులు నింపుకొని తమ జాతికి వెలుగు నిచ్చారు .మారుటిసోదరుడు ఫ్రాన్సిస్ లా ఫ్లేషీ –స్మిత్ సోనియన్ ఇన్ స్టిట్యూట్ లో మానవ జాతి శాస్త్ర వేత్త (ఎత్నాలజిస్ట్ ))అయి ,తమజాతులైన ఒమాహా, ఒసాజా లపై పరిశోధనాత్మక రచనలు చేశాడు .వారి సంప్రదాయ గీతాలను సంగీతాన్ని రికార్డ్ చేసి భద్ర పరిచాడు .
రాజకీయ రంగ ప్రవేశం
యవ్వనం రాగానే సుసెట్టీ రాజకీయ రంగ౦పై ఆసక్తికలిగి ఇంగ్లీష్ లో ఎలా చక్కగా మాట్లాడాలో మెళకువలు నేర్చుకొన్నది .మొదట టీచర్ గా ఒమాహా రిజర్వేషన్ లో చేరి పని చేసింది .నాయనమ్మ ,మేనమామలు పోనాకా అవటం వలన తండ్రితో విస్తృతంగా ఒక్లహామా లో పర్యటించి,నెబ్రాస్కా నుంచి తమ జాతిని బలవంతంగా ఇండియన్ సరిహద్దుకు తరలి౦పబడటానికి కారణాలను అన్వేషించి అర్ధం చేసుకొన్నది .అమెరికా ప్రభుత్వం మళ్ళీ నెబ్రాస్కలోని పోలాకా భూమిని గ్రేట్ సియోక్స్ రిజర్వేషన్ కు తిరిగి అప్పగించేసింది .ఒమాహా వరల్డ్ హెరాల్డ్ సంపాదకుడు ధామస్ ట్రిబుల్స్ తో కలిసి పనిచేసి దక్షిణ రిజర్వేషన్ ప్రాంతం లో ఉన్న ప్రజల పేదరికాన్ని ,సౌకర్యాలు లేకపోవటాన్ని ప్రజల దృష్టికి తెచ్చింది .పోనాకాలు అక్కడికి ఆలస్యంగా చేరుకోవటం వలన సకాలం లో పంటలు సాగు చేయ లేకపోయారు .ప్రభుత్వమూ ఆలస్యంగా స్పందించి వారి ఆరోగ్య పారిశుద్ద్య నివాసాల విషయమై పెద్దగా శ్రద్ధ చూపక పోవటం వలన అక్కడ మలేరియా వంటి అంటు వ్యాధులు ప్రబలాయి . మొదటి రెండేళ్లలో సుదూర ప్రయాణం, కొత్త ప్రాంతం లో జీవనం ,సదుపాయాల కొరత ,వ్యాధుల వలన ఆ జాతిలో మూడవ వంతు జనాభా మరణించారు .ముఖ్యనాయకుడైన ‘’స్టాండింగ్ బేర్ ‘’పెద్దకొడుకు ముసలితనం లో చనిపోయాడు .తన అనుచరుల సాయం తో కొడుకును తమ సంప్రదాయ నెబ్రాస్కా లో వారి పద్ధతులప్రకారం ఖననం చేయించాడు ముఖ్య నాయకుడు .ఫెడరల్ ప్రభుత్వ ఆజ్ఞల తో ప్రభుత్వం వీరిని నిర్బంధించి ఒమాహా కోట లో బంధించింది .యువ నాయకుడు ‘’స్టాండింగ్ బేర్ ‘’నాయకత్వం లో అటార్నీ జనరల్ ను ఏర్పాటు చేసుకొని అమెరికా ప్రభుత్వం పై అతని అరెస్ట్ కు కారణాలు తెలుసుకోవటానికి ‘’హెబియస్ కార్పస్ పిటిషన్’’వేశారు .
నెబ్రాస్కాలోని ఫోర్ట్ ఒహామాలో నిర్బంధం లో ఉన్న నాయకుని తరఫున సుసెట్టీ లా ఫ్లేషీ 1879 లో ముఖ్య దుబాసీ గా పని చేసింది .అక్కడి ప్రజల అసౌకర్యాలు వ్యాధులు చికిత్స కు సౌకర్యాలు లేకపోవటం అన్నీ ప్రభుత్వ దృష్టికి తెచ్చి స్టాండింగ్ బేర్ అరెస్ట్ కు ప్రాధమిక విషయాలేమీ లేవని నేటివ్ ఇండియన్ లు అమెరికా జాతీయ పౌరులేనని ,మిగిలిన అమెరికన్ లతోపాటు వారికీ సమాన హక్కులు ఉండాలని పోరాడి గెలిచి అతని విడుదలకు కృషి చేయగలిగింది . ట్రిబుల్స్ ఈ కేసుకు హాజరై వివరాలన్నీ రాసి మొత్తం దేశ ప్రజల దృష్టికి సమస్యను తీసుకొని వెళ్లి సంచలనం కలిగించాడు .ఈ కేసు సివిల్ రైట్స్ విషయం లో ఒక లాండ్ మార్క్ గా నిలిచింది .
విచారణ తర్వాత లాఫ్లెషీ ,ఆమె సోదరుడు ఫ్రాన్సిస్ స్టాండింగ్ బేర్ ఆధ్వర్యం లో తూర్పు అమెరికా ప్రాంతమంతా పర్యటించి ఆ జాతి సభలలో ఉపన్యాసాలు చేసి మద్దతు కూడా గట్టారు .సుసెట్టీ తన వాక్ పటిమతో అందరి హృదయాలను కదిల్చి గెలిచి జాతిప్రజలకు బాగా దగ్గరైంది .1880 లో జరిగిన కాంగ్రెషనల్ కమిటీ దృష్టికి పోనాకా గెంటివేత సమస్యను లాసేట్టీ, ట్రిబుల్స్ తీసుకొని వెళ్ళారు .నేటివ్ అమెరికన్ హక్కులకోసం లాసెట్టీ తీవ్రంగా పోరాడింది .అమెరికాలోని ప్రసిద్ధ రచయితలూ కవులు అయిన హెచ్ .డబ్ల్యు లాంగ్ ఫెలో ,హెలెన్ హంట్ జాక్సన్ లను కలిసి విషయాన్ని తెలియ బర్చి వారి సానుభూతి సహకారాలు పొంద గలిగారు .1881 లో జాక్సన్ ‘’ఏ సెంచరీ ఆఫ్ దిజానర్ ‘’పేరిట అమెరికాలో నేటివ్ అమెరికన్ ల కష్టాలు, బాధలు కన్నీళ్లు వారిపై జరిగిన అమానుష కృత్యాలు అన్నీ కళ్ళకు కట్టినట్లు రాసి ప్రచురించాడు .అలాగే దక్షిణ కాలి ఫోర్నియాలో ఇండియన్ ల సమస్యలపై 1884 లో ‘’రామోనా ‘’నవల రాశాడు .లాంగ్ ఫెలో కవి ‘’ది సాంగ్ ఆఫ్ ఇహవాతా ‘’కవితలో ‘’నేటివ్ ఇండియన్ హీరోయిన్ ‘’లోసేట్టీ ని ‘దిస్ కుడ్ బి మిన్నేహాహా ‘’అని శ్లాఘించాడు .
వివాహం –రచన –మరణం
లా ఫెట్టీ ట్రిబుల్స్ ను పెళ్లి చేసుకొని స్టాండింగ్ బేర్ తోకలిసి 10 నెలలు  ఇంగ్లాండ్ ,స్కాట్లాండ్ లలో స్పీకింగ్ టూర్ చేశారు .ముఖ్యనాయకుని ముఖ్య దుబాసీగా లాసేట్టీ కొనసాగుతూనే ఉంది .ఈ ముగ్గురివలన అమెరికన్ ఇండియన్ ల కన్నీటి కష్ట గాధలు ప్రజలు అర్ధం చేసుకోగలిగారు. టూర్ నుంచి తిరిగి వచ్చాక సుసెట్టీ దంపతులు తమ సంప్రదాయ ఘోస్ట్ డాన్స్ సియోక్స్ బాండ్ ఉద్యమం నిర్వహించారు .1890 లో ‘’పైన్ రిడ్జ్ ఏజెన్సీ ‘’కి వెళ్లి అక్కడి పరిస్థితులు , ‘’ఊండెడ్ నీ మాసకర్’’ గురించి విస్తృతంగా రాశారు . లాసెట్టీ జర్నలిజం కెరీర్ లో ఈ పుస్తకం హై లైట్ గా భావిస్తారు .1881 లో వివాహం చేసుకొన్న ఈ జర్నలిస్ట్ జంట రెండేళ్ళు వాషింగ్టన్ డి. సి .లో ఉన్నారు .ఎక్కువకాలం నెబ్రాస్కాలోనే గడిపారు నేటివ్ అమెరికన్ సమస్యలపై విస్తృతంగా రాస్తూ ,ప్రసంగిస్తూ లా సేట్టీ గడిపింది .అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ వుమెన్ పై ఉపన్యసిస్తూ నేటివ్ ఇండియన్ ల స్థానం,వృత్తి ,సంస్కృతీ పై ప్రధాన ప్రస౦గం చేసింది .భర్త మామగారి వ్యవసాయ భూములను,ఆస్తులను పరిరక్షిస్తుంటే లాసేట్టీ ప్రభుత్వం ఇచ్చిన ఒమాహా రిజర్వేషన్ భూమిలో పంటలూ , రచనలూ పండిస్తూ గడిపింది . .ఆమె రచనలలో ముఖ్యమైనవి –ఒమాహా లెజెండ్స్ అండ్ టెంట్ స్టోరీస్ ,నేడావి యాన్ ఇండియన్ స్టోరి ,ఇంట్రడక్షన్ టు పోనాకా చీఫ్ .ప్రసిద్ధ పత్రిక ఓమహా వరల్డ్ హెరాల్డ్ లోను భర్త నిర్వహిస్తున్న ప్రజా పత్రిక ‘’ది ఇండిపెండెంట్ ‘’లోను నిరంతరం వ్యాసాలూ రాస్తూ కాలమ్స్ నిర్వహించింది .1903 లో లాసెట్టే చనిపోయింది మరణానంతరం అమెరికా సెనేట్ ఆమెను ఘన౦గా ప్రస్తుతించి ఆమె సేవను శ్లాఘించింది .1983 లో నెబ్రాస్కా హాలాఫ్ ఫేం లో ‘’సుసెట్టీ (బ్రైట్ ఐస్ )లా ఫ్లషీ టిబిల్స్ ‘’కు గౌరవ స్థానం కల్పించారు .
-గబ్బిట దుర్గా ప్రసాద్

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 55-భాగవతాచార్య –వైశ్రవ నాద రామన్ నంబూద్రి (1940 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

55-భాగవతాచార్య –వైశ్రవ నాద రామన్ నంబూద్రి (1940 )

సంస్కృత విద్వాంసుడు ,గాంధీ అనుచరుడు వైశ్రవనాద రామన్ నంబూద్రి కేరళలో పాలఘాట్ జిల్లాలో జన్మించాడు .సంస్కృత ,మళయాళ ఉపాధ్యాయునిగా పని చేశాడు .తరువాతః భాగవతాచార్య గా మారాడు .భాగవత సత్రం ఆచార్యులలో చాలా ప్రముఖుడిగా గుర్తింపు పొందాడు .తర్క ,సైన్స్ శాస్త్రాలలో  లో ఎం .యే .డిగ్రీ . .వ్యాకరణ సిద్ధాంత మహా పండితునిగా ప్రసిద్ధుడు .100కు పైగా వేద,ఉపనిషత్ మొదలైన  సంస్కృత మహా గ్రంధాలను సరళ మళయాళ భాష లోకి అనువదించాడు .దీనివలన సామాన్య మలయాళీలకు వాటిలోని సారం అర్ధమయింది .భాగవతం లో చెప్పబడిన దశావతార వర్ణన వలన డార్విన్ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకో గలిగారు . ఇతర సంస్కృత విద్వాంసులతో కలిసి గురువాయూర్ వంటి ప్రముఖ దేవాలయాలలో   హరి జన ప్రవేశం కోసం చేసిన ‘’గురువాయూర్ సత్యాగ్రహం ‘’లో ప్రముఖ పాత్ర పోషించాడు .ఆలయాల వెలుపల భాగవత సప్తాహాలు చేసి ప్రజల దృష్టిని భాగవత సత్రం ఆకర్షించింది .అనంగ నాడి హయ్యర్ సెకండరి స్కూల్ లో ఆడిటోరియం నిర్మించి తన ఉపన్యాసాలకు తగిన వేదిక చేసుకొన్నాడు నంబూద్రి .ఆయన మరణా౦తరం దానిపేరు ‘’రామన్ నంబూద్రి స్మారక మందిరం ‘’గా మార్చి గౌరవం కల్పించారు .గాంధీ జీ పిలుపు మేరకు కేరళలోనూ గుజరాత్ లోని పోర్ బందర్ లోను రామన్ నంబూద్రి ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నాడు .

Inline image 2

56-మహా భాష్యాన్ని ఆంగ్లీకరించిన –డా.పి.ఎస్.సుబ్రహ్మణ్య శాస్త్రి(1890-1978)

సంస్కృత ,తమిళ భాషలలో అద్వితీయ పండితుడైన డా.పి.ఎస్. సుబ్రహ్మణ్య శాస్త్రి తమిళనాడు తిరుచిరాపల్లి లో చదివి గణితం లో డిగ్రీ పొంది ,తిరు వైయ్యార్ లో  శ్రీనివాసరావు హయ్యర్ సెకండరి స్కూల్ లో లెక్కల  మాస్టర్ గా చేరి ,తర్వాత తిరుచి లో నేషనల్ హైస్కూల్ లో పని చేశాడు .వ్యాకరణ తత్వ శాస్త్ర పండితుడైన నీల కంఠ శాస్త్రి వద్ద సంస్కృతం అభ్యసించి ,న్యాయ ,అలంకార శాస్త్రాలను ఎస్. కుప్పు స్వామి శాస్త్రి  వద్ద అధ్యయనం చేశాడు .బెనారస్ హిందూ యూని వర్సిటిలో చిన్నస్వామి శాస్త్రి దగ్గర మీమాంస శాస్త్రం నేర్చి ఎం. యే ,పాసై ,తర్వాత మద్రాస్ లో సైదా పేట ట్రెయినింగ్ కాలేజి లో  ఎల్. టి .పాసయ్యాడు . సంస్కృతం తో పాటు తమిళాన్నీ బోధించేవాడు .

కుప్పుస్వామి శాస్త్రి ఈయనకు ఇండో ఆర్యన్ భాషల కంపారటివ్ ఫైలాలజి ని క్షుణ్ణంగా బోధించాడు .ప్రేరణ పొందిన శాస్త్రి తమిళ భాషను,వ్యాకరణాన్ని  సంప్రదాయ బద్ధంగా బోధించేవాడు .’’హిస్టరీ ఆఫ్ గ్రమాటికల్ దీరీస్ ఇన్ తమిళ్ అండ్ దెయిర్ రిలేషన్ టు గ్రమాటికల్ లిటరేచర్ ఇన్ సాంస్క్రిట్ ‘’అనే పరిశోధన వ్యాసం రాసి 1930 లో మద్రాస్ యూని వర్సిటి నుంచి పి .హెచ్ .డి .అందుకొన్నాడు .తమిళం లో రాసిన ఈమొట్టమొదటి పరిశోధనకు మొట్టమొదటి పి హెచ్ డిని శాస్త్రి కి అందజేసింది రికార్డ్ కు కారణమైంది .

తిరుచి ఎస్. పి. జి .కాలేజి లో ప్రొఫెసర్ ఆఫ్ ఓరిఎంటల్ స్టడీస్ గా ఫాదర్  గార్డినర్ చేత నియమింప బడిన శాస్త్రి 1917 నుండి 1926 వరకు  9 ఏళ్ళు సేవ చేశాడు .మద్రాస్  యూని వర్సిటి ‘తమిళ లెక్సికన్ ‘’పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్ గా 1932 వరకు ఉండి,చివర్లో ఒక నెల ఎడిటర్ గా పని చేశాడు .తిరువయ్యూర్ రాజా కాలేజి ప్రిన్సిపాల్ గా 1932 నుంచి 42వరకు 10 ఏళ్ళు ఉన్నాడు .1942-47కాలం లో అన్నామలై యూని వర్సిటి సంస్కృత శాఖాదిపతిగా సేవలందించాడు .తాను చేరినప్పుడు సుప్తావస్థలో లో ఉన్న ఆనర్స్ కోర్స్ కు  పునరుజ్జీవనం కల్పించాడు .సంస్కృత ,తమిళ భాషా శాస్త్ర బోధనలను తులనాత్మక౦ గా బోధించి విద్యార్ధుల మనసులను ఆకర్షించేవాడు. ఇంగ్లాండ్ సంస్కృత విద్వాంసుడు ,ఆక్స్ ఫర్డ్ లో బోడేన్ ప్రొఫెసర్ ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటుకు సహా సంపాదకుడు అయిన టి .ధామస్ బర్రో అన్నామలై యూని వర్సిటీ లో శాస్త్రి సంస్కృత బోధనా క్లాసులకు హాజరై ఆనందాన్ని అనుభవించేవాడు

సుబ్రహ్మణ్య శాస్త్రి కి ‘’తోలక్కాప్పియం ‘’అంటే మహా అభి రుచి దానిని ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రపంచ దృష్టికి తెచ్చి ప్రపంచావ్యాప్త భాషా శాస్త్ర వేత్తల అభినందనలు అందుకున్నాడు .తోలక్కాప్పియం అంటే తమిళ సాహిత్యమూ భాషాశాస్త్రము . అందులో వర్ణక్రమం ,వర్ణ నిర్మాణం ,పద నిర్మాణం ,అర్ధ విచారం ,ఛందస్సు ఉన్నాయి .ఇదేకాక ‘’ఎఝుత్తు ‘’,పూను లాదికారం ‘’లను కూడా అనువదిస్తే కుప్పు స్వామి రిసెర్చ్ సెంటర్ ముద్రించింది .’’సోల్లాదికారం ‘’అనువాదాన్ని అన్నామలై యూని వర్సిటి ప్రచురించింది .తోలక్కాప్పియం కు శాస్త్రి ఇంగ్లీష్ ,రోమన్ భాషలలో చేసిన అనువాదాలు ప్రపంచ వ్యాప్త కీర్తి పొందాయి .అన్నామలై లో ఉండగా శాస్త్రి పతంజలి మహా భాష్యాన్ని రెండుభాగాలుగాతమిళం లో  ,ధ్వన్యాలోకానికి తమిళానువాదం ‘’తూని విలక్కు ‘’,హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ ‘’తమిళం లో ,రెండుభాగాలుగా ,ఇంగ్లీష్ లో తమిళ్ రీడర్ వంటివి రాశాడు .

ఉద్యోగ విరమణ తర్వాత తిరువయ్యూర్ వెళ్లి కంచి మహా స్వాములు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల ఆదేశం తో’’ మహా భాష్యం ‘’ను ఆంగ్లం లోకి 14 భాగాలుగా 4 వేల పేజీలలో అనువాదం ప్రారంభించి 1953లో పూర్తీ చేశాడు .మహా భాష్యం లోని ప్రతి సూత్రానికి ముందు విపులమైన ఉపోద్ఘాత౦ రాసి  అందులో వ్యాఖ్యానించ బోయే  విషయాలను తెలియ బరచి,మూలాన్ని దేవ నాగర లిపి లో  రాసి ప్రతి శ్లోకాన్ని అనువదించాడు .తన వ్యాఖ్యానానికి ఆధారం గా కయ్యాటుని ‘’ప్రదీప’’నాగేశ భట్టు రాసిన ‘’ఉద్యోత ‘’లలోని వివరాలను  అధో సూచికలలో పేర్కొన్నాడు .పాఠాంతరాలనూ తెలియ జేశాడు .పద సూచీ కూడా చేర్చి కొత్తదనం చేకూర్చాడు .

సుబ్రహ్మణ్య శాస్త్రి విద్వత్తు కు తగిన ;;విద్యా రత్న ,విద్యా నిధి ,విద్యా భూషణ ,మహా మహోపాధ్యాయ ,వాణీ –త్రివేణి బిరుదులూ పొందాడు .వాణీ –త్రివేణి బిరుద ప్రదానం చేస్తూ శ్రీ పరమాచార్య సంస్కృత ,తమిళ భాషలు గంగా ,యమునా నదులని ఇంగ్లీష్ అంతర్వాహిని అయిన సరస్వతి అని శాస్త్రి ఈ మూడునదుల త్రివేణీ సంగమం అని కొని యాడారు .నిరంతర పఠనం ,రచన ఉన్న మహా విద్వాంసుడు శాస్త్రి .శాస్త్రి జర్మన్ ఫ్రెంచ్ ,తెలుగు కన్నడ మలయాళం లలో కూడా గొప్ప పాండిత్యం ఉన్నవాడు .ఇంతటి మహా విద్వా౦సుడైన శాస్త్రి .అతి సామాన్య జీవితం గడిపేవాడు .పాకీ పని చేసుకొనే కార్మికుడికి రుగ్ ,యజుర్ ,అధర్వ వేదాలను బోధించి నేర్పిన మహా పురుషుడు,మహా సంస్కారి . పైన చెప్పినవే కాక మరొక 40పుస్తకాలు రాసిన విద్యా వేత్త . శ్రీ సుబ్రహ్మణ్య స్వామి  విద్యకు ప్రతీక .ఆ నామాన్ని సార్ధకం చేసుకొన్న డా సుబ్రహ్మణ్య శాస్త్రి 20-5-1973,న88 వ ఏట సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి చేరాడు .

Inline image 1

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .

 

,

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సూర్య నారా (నామా )యణ౦

శ్రీ సూర్య నారా (నామా )యణ౦

మాఘ శుద్ధ సప్తమి రధ సప్తమి .సూర్యుని పుట్టిన రోజు పండుగ .ఆయన ప్రత్యక్ష దైవం .అన్ని ఇంద్రియాలకు ఆయన తెలియ వస్తాడు .సర్వ జీవ కోటికీ పుష్టిని,తుస్టినీ ఇస్తాడు .కనుక ఆయన నామ రహస్యాన్ని తెలుసుకోవటం మన విధి .సూర్యునికి సంస్కృతం లో చాలా పర్యాయ పదాలున్నా  ‘’అమరకోశం ‘’లో –

‘’సూరా ,సూర్యార్యమాదిత్య ద్వాదశాదిత్య దివాకరాః-భాస్కరా హస్కర బ్రద్న ప్రభాకర విభాకరాః-భాస్వద్వివస్వ త్సప్తాశ్వహరి దశ్వోష్మ రస్మయః –వికర్తనార్క మార్తాండ మిహిరారుణ పూషణః-ద్యుమణి స్తరణిర్మిత్రశ్చిత్ర భాను ర్విరోచనః –విభావసు ర్గ్రహ పతి స్త్వషాంపతి రహర్పతిః-భానుర్హంస స్సహస్స్రా౦శు స్తపన స్సవితా రవిః’’అని చెప్పి ఇవికాక

‘’కర్మ సాక్షీ జగచ్చక్షు రంశుమాలీ త్రయీతనుః –ప్రద్యోతనో దినమణిః ఖద్యోతో లోక బాన్ధవః –సురోత్తమో ధామ నిధిః పద్మినీ వల్లభో హరిః’’అనీ చెప్పింది .

కనుక రధ సప్తమీ పర్వదినాన సూర్య నారా (నామా )యణ రహస్యాలను తెలుసుకొని తరిద్దాం .దీని వివరణ అంతా ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు తమ రచన ‘’కదంబ వనం ‘’లో ‘’ప్రత్యక్ష దైవం సూర్యుడు ‘’వ్యాసం లో తెలియ జేశారు .

సూర్యుని ముఖ్యనామాలు 37 .ఇవికాక మరో 12 తో కలిపి 49 పేర్లు ఉన్నట్లు పైన చెప్పబడిన శ్లోకాల ద్వారా తెలుస్తోంది .ఇవన్నీ గుణాలను బట్టి ఏర్పడ్డాయి .నామాధిక్యం గుణాదధిక్యానికి సూచన .పై పట్టిక లో ‘’ఇన’’శబ్దం లేదు .ముందు దాన్ని గురించి తెలుసుకొందాం ‘’ఏతి ఇతి ఇనః ‘’అంటే సంచరించేవాడు .సూర్యుడు స్థిరంగా ఉండి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని విజ్ఞానశాస్త్రం చెబుతోంది .కనుక సూర్య గమనం అంటే కిరణప్రసారం అనుకొంటే ఇబ్బంది రాదు అన్నారు  శర్మ గారు .సూర్య కిరణప్రసారం అన్ని వైపులకు అన్నికాలాలలో జరుగుతు౦ది కనుక అది గమన శీలమే .’’సర్వే గత్యార్దాః బుద్ధ్యర్ధః ‘’అనే వ్యాకరణ సూత్రం ప్రకారం సూర్యుడు జ్ఞాన ,విజ్ఞాన మూర్తి .కనుకనే ఆయనను గురూత్తమునిగా వానరోత్తముడైన హనుమ భావించి నవ వ్యాకరణాలు అధ్యయనం చేశాడు .తరువాత ‘’సూర ‘’శబ్దం.’’సరతి గచ్చతి ఇతి సూరః ‘’అని లింగా భట్టు చెప్పాడు .దీనికీ ఇన శబ్దార్ధమే .శూర అని అనుకొ౦టే విక్రమించేవాడు అవుతాడు .సూర్య అంటే సర్వ ప్రాణులకు చైతన్య ప్రదాత అని అర్ధం .తరువాత ‘’ఆర్యమ ‘’అన్నా గమనం ఉన్నవాడనే అర్ధం –‘’ఋ గతౌ ‘’అనే ధాతువు నుండి ఏర్పడిన శబ్దం ఇది .కశ్యప ప్రజాపతి భార్య అదితి కి పుట్టాడు కనుక ఆదిత్యుడు .ఆమె దేవతలకు మాత .దాతు చర్చలో ఆమె అఖండ బుద్ధి విశేషానికి ప్రతీక .గౌతమి పుత్ర శాతకర్ణి కి ముందే తల్లి పేరుతో చలామణి అయినవాడు ఆదిత్యుడు . ఇంద్ర ,ధాత ,పర్జన్య ,త్వష్ట ,పూష,ఆర్యమ ,భగ ,వివస్వత ,విష్ణు ,అంశుమంత ,వరుణ ,మిత్ర అనే 12 మూర్తులున్నవాడుకనుక ద్వాదశాత్ముడు .దివము అంటే పగలును చేసేవాడుకనుక దివాకరుడు .దిన భాగం లో ప్రాణులను చైతన్యం చేసేవాడనీ అర్ధం .’’భాసం కరోతి –ఇతి భాస్కరః ‘’అమేయమైన కా౦తినిచ్చేవాడు .ఆహాస్సును చేసేవాడు ఆహాస్కరుడు .నిజానికి సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు .ఆయన కాంతికి కొన్ని ప్రదేశాలలో అవరోధం కలుగుతుంది కనుక రాత్రి అవుతుంది .ఆ అడ్డంకి తొలగితే అహస్సు.  ‘’న జహాతి ప్రత్యాగమనమితి అహః ‘’అని లింగాభట్టు  విచిత్రమైన అర్ధం చెప్పాడు దీని అర్ధం తిరిగి రావటాన్ని విడువనిది .మరో అర్ధం –‘’సూర్యేణ న హీయతే ఇత్యహః ‘’అంటే సూర్యుడిని వదలి పెట్టి ఉండనిది .ఇలాంటి అహస్సును యేర్పరచేవాడు ఆహాస్కరుడు .ఇతర తేజస్సులను అడ్డుకోనేవాడు ,చీకటిని కట్ట కట్టి దూరంగా విసిరేసేవాడు కనుక ‘’బ్రద్నుడు ‘’.బంధించే వాడని భావం .

ప్రభ ,విభ అనే ప్రశస్త అత్యధిక కాంతి నిచ్చేవాడు కనుక ప్రభాకరుడు ,విభాకరుడు .సర్వ ప్రాణి కోటికీ దర్శన సామర్ధ్యం కలిగించటాన్ని ప్రశస్తత అంటారు .కిరణాల ద్వారా అన్నాదులను ఏర్పాటు చేయటం విశిష్టత .ఇలాంటి ప్రయోజనాలు ,అనేక లోకాలకు అనంత వెలుగులు కలిగించేవాడు కనుక భాస్వంతుడు .కాంతి తో సర్వాన్నీ కప్పేస్తాడు కనుక వివస్వంతుడు .’’వస ‘’అనే ధాతువుకు ఆచ్ఛాదనం అని అర్ధం .ఏడు గుర్రాలపై వస్తాడుకనుక సప్తాశ్వుడు .వ్యాపించే గుణం ఉండటం వలన గుర్రానికి అశ్వం అని పేరు .ఈ వ్యాపన శీలం అగ్ని ,విద్యుత్తూ ,దీపం మనకు సూర్య ప్రతిరూపంగా దర్శనమిస్తుంది అంటారు శర్మ గారు .సూర్యుడికి ఒకే ఒక అశ్వం ఉందని దానిపేరే ‘’సప్త ‘’అనీ ‘’గురుబాల ప్రబోధిని ‘’తెలియ జేస్తోంది .అయితే లోకం లో 7 గుర్రాలు అని వాడుక .7 అనేవి 1 ఎలా అవుతుంది?న్యూటన్ వర్ణ చక్రం ను వేగంగా తిప్పితే 7 రంగులు కలిసి తెల్ల రంగు అవుతుందని మనకు తెలుసు .అసలు తెలుపు కూడా కాదు యే రంగూ లేని తనం .సూర్య రశ్మి లో 7 రంగులుంటాయి కదా అలా .హరిదశ్వ అనే పదానికి పచ్చ గుర్రాలున్నవాడు అని అర్ధం .సృష్టి లోని పచ్చదనానికి సూర్యుడు ప్రతీక .ఈ పచ్చదనం సంపద,సౌభాగ్యాలకు ప్రతీక .

సూర్యుడికి ‘’ఉష్ణ రశ్మి ‘’ అనే పేరుంది .కిరణాలు కలవాడని అర్ధం .సూర్యుడు విశ్వ దేహానికి అవసరమైన వేడిని తగిన ప్రమాణం లో కిరణాల ద్వారా అందిస్తూ విశ్వాన్నిరక్షిస్తాడు .ఈ ఉష్ణం ప్రాణికోటికి కావాల్సిన వాటిని పచనం పాకానికి తెచ్చి పోషిస్తాడు .’’వికర్తనుడు ‘’అంటే ‘’వికృతంతి తమః ‘’-చీకటిని చీల్చేవాడు ,’’వికృత కర్మణా విక్రుతః ‘’అనే మరో అర్ధం లో విశ్వ కర్మ సూర్యుడిని సానబెట్టి ప్రతాపాన్ని సహ్యంఅంటే సహి౦చేట్లు  చేశాడని  అర్ధం వస్తుంది .ప్రాణికోటికి ఈ రెండూ కావాల్సినవే .భౌతికమైన చీకటి సరే లోపల చీకటి కూడా ఉంది .అదే అజ్ఞానం .ఈ రెండిటినీ చీల్చి ప్రయోజనం కలిగిస్తాడు .’’అర్కుడు ‘’లోకాల చేత అర్చించ బడేవాడు .మృతండ మహర్షి కొడుకు కనుక మార్తాండుడు .మరో అర్ధం –‘’మృతం బ్రహ్మాండం జీవయతీతి మార్తా౦డః’’.మృతమైన బ్రహ్మాండాన్ని జీవింప జేస్తున్నాడు కనుక మార్తాండుడు .’’మిహిరుడు ‘’అంటే మేఘ రూపుడై విశ్వాన్ని తడిపి జీవనం ప్రసాదించే వాడు .సూర్య కిరణాలు జలరాశిని ఆవిరి చేసి మేఘాలుగా మార్చి వర్షాన్ని స్తాయి కనుక మార్తాండ ,మిహిర శబ్దాలు సూర్యునికి పర్యాయ పదాలను చేశారు మన మహర్షులు .

నిరంతర సంచారి కనుక అరుణుడు.ఈ గమనం దేనికి అంటే ప్రాణి పోషణకు .అదే ‘’పూష’’.ఈ గమనం లో దివ్య జ్యోతులు కనిపిస్తాయికనుక ద్యుమణి .దీప్తి తుష్టి పుష్టి ఆరోగ్యాలను అందించే మణి.అందరికోసమే  ఆకాశం లో ఆయన అన౦త గమనం చేస్తాడు . ఆయన గమనం వలన ప్రాణులు చీకట్లను తరిస్తారు .ఆయన ఆకాశాన్ని తరిస్తాడు కనుక ‘’తరణి ‘’.సర్వ భూతరాశిపై స్నేహ భావం ఉండటం వలన ‘’మిత్రుడు ‘’..వివిధ  వర్ణాలున్నవాడుకనుక ‘’చిత్ర భానువు ‘’.సృష్టిలోని అన్ని రంగులు సూర్య కిరణ స్వరూపాలే .  విశేషంగా ప్రకాశించేవాడు కనుక ‘’విరోచనుడు ‘’ఆ కాంతి పు౦జ మే ఆయనకు ధనం అంటే వసువు అందుకే విభావసువు . ఆ ధనతత్వం ప్రాణుల ప్రయోజనం కోసమే కనుక దైవం అయ్యాడు .గ్రహాలకు నాయకుడుకనుక గ్రహ పతి .తన కిరణాలను ,ప్రతిరూపాలైన అగ్నులను ,ఓషధులను ,దేహం లోపలి జఠరాగ్నిమొదలైన వాటిని సంరక్షిస్తాడు కనుక ‘’త్విషాంపతి ‘’’’త్విట్టులుఅంటే కాంతులు అని అర్ధం .పగటికి ప్రభువుకనుక ఆహస్పతి.

‘’హంతి తమః ఇతి హంసః ‘’చీకట్లను రూపు మాపేవాడు కనుక హంస .అనంత కిరణాలున్నవాడు కనుక ‘’సహశ్రాం శువు ‘’.నిద్రించే వారిని మేల్కొల్పే వాడుకనుక ‘’సవిత ‘’-సువతి –సుప్తం ప్రేరయతి ‘’.ఇన్ని గొప్ప పనులు మనకోసం చేసేమహాత్ముడు కనుక ఆయన్ను స్తుతించాలి .స్తుతి అర్ధాన్నిచ్చే ‘’రు ‘’ధాతువు నుండి ఏర్పడినది ‘’రవి ‘’.లోకాలకు ఆయన కిరణాలు మాలలు మాలలుగా చేరుతాయి కనుక ‘’అంశుమాలి ‘’.మూడు వేదాలు అయన శరీరం గా ఏర్పడ్డాయి .వెలుగు అంటే విద్య కనుక .అవి ఆయన నుంచి వస్తున్నాయికనుక ‘త్రయీ తనువు’’.

14 లోకాలకూ వెలుగులివ్వ వలసిన వాడు కనుక ప్రకృస్టం గా ప్రకాశించాలి కనుక ‘’ప్రద్యోతనుడు ‘’.అందుకే దినమణి.ఆకాశం లో వెలిగేవాడుకనుక ‘’ఖద్యోతుడు ‘’.ఆపని లోక బాంధవ్యం కోసమేకనుక ‘’లోక బాంధవుడు ‘’.అన్ని రకాల మహోపకారాలు లోకాలకు చేసే ఉత్తమ దేవత కనుక ‘’సురోత్తముడు ‘’.ధామం అంటే కాంతికి నిదికనుక ‘’ధామనిది ‘’.తామర పూలను వికసింప జేసేవాడు కనుక పద్మినీ వల్లభుడు .తమస్సు హరించేవాడు కనుక ‘’హరి ‘’.

ఇదీ ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్య నారా (నామా )యణం’.ఇంతటి అర్ధ భావాలను విశదీకరించిన శ్రీ శలాక వారు నిజంగా ‘’శబ్ద దినమణి’’ .ఆయన వెలుగే ఇదంతా .

Inline image 1

రేపటి రధ సప్తమి కి శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-2-2-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

.

—

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రద సప్తమి ఎలా చేయాలి ?

రద సప్తమి ఎలా చేయాలి ?

మాఘ శుద్ధ సప్తమిని రధ సప్తమి అంటారు .రేపే 3-2-17 శుక్రవారం రధ సప్తమి .ఉదయం జిల్లేడాకులు లేక చిక్కుడాకులు,లేక రేగు పళ్ళు  తల పైనా ,బుజాలపైనా పొట్ట మీద ఉంచుకొని ఈ క్రింది శ్లోకాలు చదువుకుంటూ చన్నీళ్ళతో 3 సార్లు తలనిండా స్నానం చేయాలి

1-సప్త సప్తి ప్రియే దేవి –సప్త లోకైక పూజితే –సప్త జన్మార్జితం పాపం –హర సప్తమి సత్వరం

2-లోల కిరాణా సప్తమ్యాం-స్నాత్వా గంగాది సంగమం –సప్త జన్మ క్రుతైః పాపైః—ముక్తిర్భవతి తక్షణాత్

3-మాఘే మాసే సితే పక్షే –సప్తమీ కోటి భాస్కరా –కుర్వాత్ స్నారార్ఘ్యం దానాభ్యాం –ఆయురారోగ్య సంపదః

4-నమస్తే రుద్ర రూపాయ –రసానాం పతయేనమః –అరుణాయాచ నమస్తేస్తు-హరివాస నమోస్తుతే .

స్నానం చేసిన తర్వాత ,ఆరు బయట తులసి మొక్క దగ్గర ఆవు పిడకలపై పొంగలి వండి ,పాలు పొంగుతున్నప్పుడు ‘’నమో సూర్య నారాయణ ‘’అంటూ నమస్కరించి ,ఆ పొంగలిని 5 చిక్కుడాకులలో పెట్టి తులసి పూజ చేసి నైవేద్యం పెట్టాలి .మరొక 15 చిక్కుడుఆకులలో పొంగలి పెట్టి , సూర్యునికి నైవేద్యం పెట్టాలి .తర్వాత దీనినే ప్రసాదంగాకళ్ళకు అద్దుకొని  అందరూ స్వీకరించి తినాలి .సూర్య దండకమో ఆదిత్య హృదయమో ,చదువుకోవాలి . వస్తే అరుణ పారాయణ౦ చేయాలి . .

చిక్కుడు కాయలతో రధం చేసి దాన్నే సూర్య రధంగా భావించాలీ .అవి దొరక్క పొతే బియ్యపు పిండితో రధం ముగ్గు వేయాలి .రధ సప్తమి అంటే సూర్యుని జన్మ దినం అన్నమాట .ప్రభవ నామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో ,మాఘ శుద్ధ సప్తమి ఆదివారం అశ్వినీ నక్షత్రం లో సూర్యుడు జన్మించినట్లుపురాణాలు చెప్పాయి . మాఘ శుద్ధ సప్తమి ఉదయకాలం లో ఆకాశం లో గ్రహాలూ నక్షత్రాలు రధం ఆకారం లో కనిపిస్తాయి అందుకే రధ సప్తమి అనే పేరు వచ్చింది .సూర్యుడికి ఎరుపు రంగు ప్రీతి .అందుకే ఆయన పూజకు యెర్రని అక్షింతలు ,యెర్ర చందనం వాడాలి .సూర్యుడు సింహ రాశికి అధిపతి .ఆదివారం ఆయనకు చాలా ఇష్టం .దానినే భానువారం అంటారు .జగత్తుకు సాక్షి ,సర్వ సాక్షి ,ఆరోగ్య  ప్రదాత భాస్కరుడు .సూర్యనమస్కారాలు గొప్ప ఆరోగ్యాన్నిస్తాయి .ఏ శ్లోకాలూ రాని వారు 1-ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర –దివాకర నమోస్తుతే 2-సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం –శ్వేతపత్ర (ఏక చక్ర )ధరం దేవం –తమ్ సూర్యం ప్రణమామ్యహం ‘’చదువుకోవచ్చు .

రధ సప్తమినాడే ఆడవాళ్ళు కొత్త నోము నోయ టానికి పూను కొంటారు .నీనినే నోము పట్టటం అంటారు .ఇదీ రధ సప్తమి చేసే విధానం .

3-2-17  శుక్రవారం రధ సప్తమి శుభాకాంక్షలతో

Inline image 1Inline image 2

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-2-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

.

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

స.సు .మ.(కాసేపు నవ్వు కోవటానికే అని మర్చి పోరుగా!)

స.సు .మ.(కాసేపు నవ్వు కోవటానికే అని మర్చి పోరుగా!)

ఏమీ తోచక టి వి పెట్టి సిటీ వార్తలేవైనా చూద్దామను కొని రిమోట్ నొక్కా .స.సు. మ .అని ఒక చానల్ ప్రత్యక్షమైంది .ఇదేదో కొత్తగా ఉందే ఇంతవరకూ ఎప్పుడూ విన ,కన లేదే అనుకొంటూ నొక్కా .ఒక లావుపాటి గుంత పొంగనం లాంటి వాడు పళ్ళికిలిస్తూ అరుస్తున్నాడు ఎవరికోసమో,ఎందుకో తెలీదుకాని ,అవతలి వైపునుండి వెంటనే సమాధానం రాలేదు మనిషీ కనిపించలేదు .వీడు ఇక్కడ గీ పెడుతూనే ఉన్నాడు .కాని నో రిప్లై .కాసేపు గింజు కున్నాక బుజం మీద కెమేరాతో ఒక కల్పనా రాయ్ లాంటి శాల్తీ కనిపించింది .కుర్చీలో వాడు తల ముందున్న బల్లకేసి బాదుకుంటూ ‘’అరగ౦టయింది చానల్ తెరిచి కూర్చుని .ఒక్క న్యూస్ ఐటం కూడా నీ నుంచి రాలేదు .ఎక్కడున్నావ్ మబ్బూ ‘ అని గాండ్రిం చాడు .ఇకిలి వెకిలి నవ్వు నవ్వుతూ ఆ భామ ‘’సుబ్బూ !న్యూస్ కవరేజ్ కని బయల్దేర బోతుంటే ఎవరో ఫోన్ చేసి’’ బంజారాహిల్స్ లో  అద్భుతం ఒకటి ఉంది అర్జెంట్ గా వచ్చి కవర్ చేయండి ‘’అన్నాడు  .ఇక ఆగలేక ఆగమేఘాలమీద వచ్చి వాలేశాను .జనం పిచ్చగా గుమి గూడారు .వాళ్ళని తప్పించుకు వెళ్ళటానికే పావు గంట పట్టింది ‘’అంటూ కార్చిన  చెమట కర్చీఫ్ తో  తుడుచు కొంది.’’ఈ  సిటీ ఓళ్లకు పనీ పాటాలేదు. పిల్లి సమర్తాడింది అంటే చాలు  వాలిపోతారు ‘’అని’’ఇంతకీ అక్కడి విశేషమేంటి మబ్బూ ‘’అన్నాడు . డబ్బాలో రాళ్ళేసి మోగించినట్లు రాయ్  ‘’సుబ్బూ !నీకు సిక్స్త్ సెన్స్ ఉందేమో ?ఎలా పసికట్టేశావ్ ‘’అంది సిగ్గులు చిందిస్తూ .’’సిక్స్త్ సెన్సా వంకాయా ఊరికే అన్నా ‘’అన్నాడు పళ్ళు మరింత ఇకిలిస్తూ .’’అబ్బ సుబ్బూ !నే చెప్పలేను బాబూ సిగ్గేస్తోంది ‘’అంది ఒంకర్లు పోతూ జంబ లకిడి పంబ లో స్కూల్ లో విద్యార్ధినిగా ఉన్న కల్పనా రాయ్ ఉప్పు కప్పురంబు పద్యం మేష్టారుబాబూ మోహన్ కు అప్ప జెబుతూ చెబుతూ ‘’పురు –అబ్బ సిగ్గేస్తోంది బాబూ పురుషు –అయ్యో నే చెప్పలేను మాస్టారండీ  అని చివరికి పురుషులందు ‘’అనటానికి అరగంట పట్టినట్లు అభినయించింది ఇక్కడ మబ్బు . ‘’ఓసి నీ సిగ్గు చిమడా కవరేజ్ గాళ్ళకు సిగ్గూ ఎగ్గూ ఏంటి ?అసలు సంగతేడు’’అన్నాడు మండిపోతూ .’’సుబ్బూ సుబ్బూ ఇక్కడొక పిల్లి పిల్ల స—‘’అబ్బా నవ్వుస్తోంది నే చెప్పలేను బాబూ ‘’అంది మళ్ళీ .’’ఆహే పిల్లికేమైందో చెప్పి చావక  ఆ కులుకు లేంటి  ?’’సుబ్బుగోల .’’మరేమో మరేమోనే  మరి మరి పిల్లిపిల్ల నువ్వూహించినట్లే సమ –‘’అబ్బా నాకు బోల్డు సిగ్గేస్తోంది బాబూ ‘’అంది మళ్ళీ .’’చానల్ కట్టేసి వస్తావా ,అసలు విషయం చెబుతావా ఇప్పటికే స్టూడియోకి వందలాదిఫోన్లోచ్చి గగ్గోలుగా ఉంది ..టెన్షన్ తట్టుకోలేక వాళ్ళు ,ఊపిరాడక నేనూ ఉన్నాం’’ అన్నాడు మరీ కోపంగా .’’సుబ్బూ ! ఇక్కడ ఒక పిల్లి పిల్ల నిజంగానే సమర్తాడింది అబ్బ బాబోయ్ ఇక నే చెప్పలేను బాబూ నాకు బోల్డు సిగ్గు ‘’అంది మెలికలు ,మెలికలు తిరుగుతూ ,

సుబ్బు ‘’సరే మా౦చి హాట్ హాట్ న్యూస్ మబ్బూ .థాంక్యూ వెరీమచ్ .కొత్త చానల్ కు సరి కొత్త న్యూస్ ఐటం .ఇంతకీ ఆ పిల్ల సారీ పిల్లి పిల్ల పేరేంటి  ఎన్నేళ్ళు ,వయసు వచ్చాకనే అయిందా ? ప్రిమెచూరా? ఎవరిదాపిల్ల  ‘’?అడిగాడు  ‘’సుబ్బూ !అది ఊరపిల్లి .దాన్ని చూస్తే వయసు వచ్చాకే అయినట్లు అనిపించింది .పేరు ఎవరడిగినా ఎవరూ చెప్పటం లేదు సుబ్బూ !దాన్ని అడుగుదామంటే తొలి సమర్త కదా  మరీ సిగ్గు పడుతుందేమోనని పిస్తోంది ’’అంది మబ్బు .’’సరే మబ్బూ !దానికి రక్షణ కలిపించారా ?తాటాకులు కాని తాటాకు చాపలు కాని ప్రొవైడ్ చేశారా?’’సుబ్బు సూటి ప్రశ్న .’’అలాంటి వేమీ చేసినట్లు కనిపించటం  లేదు సుబ్బూ .జీవకారుణ్యం వాళ్లకు ఫోన్ చేయనా ,లేక మన స్టూడియో ఏదైనా ఫండ్ ప్రొవైడ్ చేస్తుందంటే నేనే అవి కొనిపించి ఏర్పాటు చేసి బిల్లు సబ్మిట్ చేస్తా ‘’అంది మబ్బు .’’ చానల్ అంటే మన డబ్బు ఖర్చు పెట్టేది కాదని నీ కింకా తెలీదనుకొంటా .మంది ని బాదుకొని పబ్బం గడపాలి .ఇక్కడిచ్చే జీతం ఎంత ?దీనికి తోడూ చేతి చమురు కూడానా ‘’అన్నాడు సుబ్బు .’’జీవకారుణ్యం వాళ్ళ సంగతి ?’’ప్రశ్నించింది మబ్బు .’’అమలా నాగార్జున్ వింటే డామేజ్ సూటేస్తుంది .ఒళ్ళు జాగ్రత్త ‘’అన్నాడు హెచ్చరి౦పుగా .

‘’అక్కడ జనాలకు మైక్ ఇవ్వు నేను కొన్ని  ప్రశ్నలడుగుతాను’’ ‘’అనగానే ఇచ్చింది .ఒక కాలేజి పిల్లాడు పాంట్  జుట్టూ సర్దుకొంటూ ముందుకొచ్చాడు –‘’హలో సార్ !ఈ ఇన్సిడెంట్ పై మీ స్పందన ఏంటి?’’అడిగాడు సుబ్బు .’’సార్.ఇది చాలా పెక్యూలియర్ సార్  .నేనెప్పుడూ ఇలా ప్రత్యక్షంగా చూడలేదు సార్.మీ చానల్ గ్రేట్ సార్.పాపం వాటికీ మనసుంటుందని గ్రహించి గొప్ప కవరేజ్ ఇచ్చి సబ్బూ చానల్ ను ఎలివేట్ చేశారు సూపర్ సార్ ‘’అన్నాడు .మరో’’ బామ్మ’’ లాంటి అంటే బాపూ బొమ్మ లాంటి అమ్మాయికి మైకిచ్చింది మబ్బు ‘’అమ్మా మీరేమనుకొంటున్నారు ?’’అన్న సుబ్బు ప్రశ్నకు బా–మ్మ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ‘’ఆకాశం లో సగమైన ఆడవాళ్లకే రక్షణ ,కవరేజ్ లేని ఈ కాలం లో మీ సబ్బూ చానల్ ,నోరు లేని మూగజీవాల రుతుధర్మాన్ని కూడా బహిరంగం గా చిత్రించి భలే మేలు చేశార్ సార్.ఈ సారి న్యూస్ ఐటం అవార్డ్ మీకే గారంటీ సార్ ‘’అంది .రెచ్చి పోయిన ఆనందం లో సుబ్బూ మబ్బూ లు గిలగిలలాడిపోయారు .’’మబ్బూ !ఫైనల్ గా మైక్ పెద్దావిడ ఆ బామ్మ గారికివ్వు ‘’అన్నాడు .ఇకిలి౦పులు సకిలింపు లతో మబ్బు బామ్మగారికి మైక్ ఇచ్చి ఆవిడ ఏం చెబుతుందో విని మైకం లో ఊగి పోవాలను కొన్నది .’’అమ్మా బామ్మ గారూ !ఈ న్యూస్ ఐటం మీకు బాగా నచ్చినట్లు మీ మొహమే చెబుతోంది నిస్సంకోచంగా మొహమాట పడకుండా  స్పందించండమ్మా మీ పేరు చెప్పుకుంటాం ‘’అన్నాడు సుబ్బు  . మైకందుకొన్న బామ్మగారు ‘’మహా సంతోషంగా ఉంది నాయనా నా జన్మ తరించింది  .చానళ్ళ పరమ ప్రయోజనం ఏమిటో ఇప్పుడే నాకు తెలిసింది .పూర్వం పని లేని మంగలి పిల్లి తల గొరిగాడు అని మా బామ్మ సామెత చెబితే అప్పుడు అర్ధమై చావలా నాకు .ఇప్పుడు పూర్తిగా అర్ధమైంది .ఆహా సబ్బూ సుబ్బూ మబ్బూ కలిసి జనాన్ని మబ్బులో పెట్టి చెత్త వార్తల సబ్బు రాసి గబ్బు పట్టిస్తున్నారు .పవిత్రమైన చానళ్ళను భ్రస్టు పట్టించి  అపవిత్రం చేసి పబ్బం గడుపుకొంటున్నారు .రెండు నిమిషాల టైమిస్తా .దుకాణం బంద్ చేసిపారి పోయారా సరి, లేకుంటే నేనే ఏదో ఒక చానల్లోమిమ్మల్ని దూదేకి నట్లు ఏకిపారేసి, చాకి రేవులో ఉతికి నట్లు ఉతికేసి  ఎండగడతా ‘’అని బామ్మగారు మైక్ కట్ చేయటం , మబ్బు మైకందుకొని పారిపోవటం, నా ఎదురుగా ఉన్న స.సు. మ.చానల్  అంటే సబ్బు సుబ్బూ మబ్బూ చానెల్ అదృశ్యమవ్వటం ఒక్క సారిగా జరిగి పోయాయి ..

వసంత పంచమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-2-17-

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వసంత పంచమి శ్రీ సరస్వతీ పూజ శుభా కాంక్షలు

Inline image 1       Inline image 2   Inline image 3Inline image 4

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

స్వస్తినః

స్వస్తినః

‘’స్వస్తిన ఇంద్రో వృద్ధ శ్రవాః-స్వస్తినః పూషా విశ్వ వేదాః-స్వస్తిన స్తార్ష్యోరిస్ట నేమిః-స్వస్తి నో బృహస్పతి ర్దదాతు’’

అనే ఋగ్వేద మంత్రం మనల్ని రక్షిస్తుంది .మంత్రం అంటే మననం చేసే వాడిని రక్షించేది అని అర్ధం .పై స్వస్తి మంత్రాన్ని స్నానం చేసేటప్పుడు జలజంతు బాధ లేకుండా ఉండటానికి జపిస్తారు ,అప్పుడే కాదు సర్వ కాల సర్వా వస్థలలో జపించి రక్షణ పొందవచ్చు .ఇంద్ర ,సూర్య ,గరుత్మంత ,బృహస్పతులు మనకు స్వస్తి చేకూర్చాలని ఇందులో భావం .ఇందులోని విశేషార్ధాలను తెలుసుకొని జపిస్తే ఇంకా ఆనందం .

ఇంద్రుడిని వృద్ధ శ్రవుడు అంటారు .అంటే కీర్తి బాగా పెరిగిన వాడు .లేక అన్నం కలవాడు అనీ అర్ధం .ఇంద్రుడు అంటే దేవ లోకాధిపతి అని సామాన్యార్ధం .కాని విశేషార్ధం లో పరమాత్మ .’’ఇది –పరమైశ్వర్యే ‘’అనే ధాతువు నుండి ఇంద్ర శబ్దం పుట్టింది .పరమైశ్వర్యం ఉన్న వాడు పరమాత్మ ఒక్కడే .ఇంద్రుడు పరమాత్మ కనుక వృద్ధ శ్రవుడు అయ్యాడు .శృతి స్మృతి పురాణాలన్నీ ఇంద్రుడిని కీర్తించాయి .’’ప్రభూత హవిర్లక్షణాన్నయుక్తః ‘’అనే అర్థాన్నీ వేదార్ధ వేత్తలు చెప్పారు .అంటే పరమాత్మకు ఇచ్చే హవిస్సు మానవుడు నిలువ చేసుకొన్న ధనం వంటిది .అగ్ని ద్వారా హవిస్సు పంచ భూతాలలో నిండి ,వర్షం మొదలైన అనుకూల వాతావరణం ఏర్పడటానికి కారణం అవుతుంది .దాని వలన  పంటలు సమృద్ధిగా పండుతాయి .లోకాలు సుఖ శాంతులతో వర్దిల్లుతాయి .కనుక పరమేశ్వరార్పణం గా ఇచ్చే హవిస్సు అనే అన్నం జగత్తుకు శ్రేయస్సును కల్గి౦చటానికే .దీనినే భగవద్గీత –

‘’సహా యజ్ఞాః ప్రజాః సృష్ట్వాపురోవాచ ప్రజాపతిః-అనేన ప్రసవిష్యద్వ మేషవో స్త్విస్టకామధుక్ –దేవాన్ భావయతా నేన దేవా భావయంతువః-పరస్పరం భావ యంతః శ్రేయః పర మావాప్స్యధ’’అని చెప్పింది

దీనిభావం –సృష్టి మొదట్లో ప్రజాపతి ప్రజలను యజ్ఞాలతో పాటు సృష్టింఛి ప్రజలతో ‘’యజ్ఞాలతో  మీ జాతి  వృద్ధి చేసుకోండి .ఇది మీ  కోరికలు తీర్చే కామధేనువు అవుతుంది .యజ్ఞాలతో దేవతలకు తృప్తి కలిగించండి .వాళ్ళు మిమ్మల్ని సంతృప్తి చెందిస్తారు .ఇలా ఒకరినొకరు తృప్తి పరచుకొని మహా శ్రేయస్సును పొందండి ‘’అని చెప్పాడు .దీన్ని బట్టి ఇంద్రుడు హవిర్లక్షణ రూప అన్న యుక్తుడు అని తెలుస్తోంది .

తరువాత విశ్వవేదుడైన పూషుడు మనకు స్వస్తి చేకూర్చు గాక అని రెండవ ప్రార్ధన .పూషుడు అంటే సూర్యుడు –‘’పుష్ణా తీతి పూషా ‘’-పుస్టిని ఇచ్చేవాడు .సూర్యుడు తపన శక్తితో సస్య సమృద్ధికి ,చీకటి నాశనానికి కావలసిన శక్తి నిస్తాడు .దేహ పుష్టి తో పాటు విజ్ఞాన పుస్టీ కలిగిస్తాడు .’’వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ ‘’అని ఉంది .హనుమ సూరుని వద్దనే నవ వ్యాకరణాలు నేర్చాడు .కనుక సమస్త మానవ కోటికి భౌతిక ,మానసిక పుష్టి నిచ్చేది సూర్యుడే .కనుక ‘’ప్రత్యక్ష దైవం ‘’అయ్యాడు .అందుకే పరమాత్మకు ప్రతిరూపం అన్నారు .దీనితో ‘’విశ్వ వేదుడు ‘’అయ్యాడు సూర్యుడు .అంటే సర్వజ్ఞుడు అని అర్ధం .పరమాత్మ తన మహిమాది శక్తులను సూర్యాదులలో నిక్షేపించి ,వారి ఆరాధనే తన ఆరాధన అని తెలియ జెప్పాడు .అందువల్ల సూర్య భగవానుడిని పరమేశ్వరునిగా భావిస్తాం .విశ్వ వేదుడుఅనే శబ్దానికి ఎక్కువ ధనం ఉన్నవాడు అనే అర్ధం కూడా ఉంది .నిఘంటువు జాత వేద శబ్దానికి అర్ధం చెబుతూ –‘’వేదో హిరణ్య మస్మాజ్జాత ఇతి జాత వేదాః ‘’అని చెప్పింది .వేదం అంటే హిరణ్యం అంటే బంగారం .దాని నుంచి పుట్టిన వాడు .అందుకని జాత వేదుడు అంటే సమస్తమైన ఐశ్వర్యమూ కలవాడు అని అర్ధం .ఇది కూడా పూషుని పరమేశ్వరతత్వాన్ని చాటుతున్నదే .మొత్తం మీద సమస్త ప్రాణికోటికీ పుష్టి తుష్టి ,దానికి కావలసిన ధనం అంటే శ్రేష్టమైన జ్ఞానధనం ప్రసాదించే ఆదిత్యుడు మనకు స్వస్తిని చేకూర్చుగాక అని అర్ధం .

మూడవ దానికొస్తే ‘’తార్ క్ష్యుడుఅంటే గరుత్మంతుడు .తృక్అనే మహర్షి కొడుకనుక అలా పిలువ బడ్డాడు .అతడు అరిస్టనేమి .దీనికి ‘’అనుప హింసిత ఆయుదః –‘’’’అప్రతి హత రదః’’అనే రెండు అర్ధాలున్నాయి .గరుత్మంతుని వద్ద ఉన్న ఆయుధం వంటివి ఇంకెవరి దగ్గరా లేవని భావం .అంటే సర్వ శక్తి మంతుడైన పరమాత్మ అని అర్ధం .నిజానికి గరుత్మ౦తుని  ఆయుధాలు ఆయన కాలిగోళ్ళే.అంతవాడి అయిన ఆయుధం ఇంకేదీ లేదు .ఈ గోళ్ళతోనే అమృతాన్ని హరి౦చేటప్పుడు సుర వీరుల౦దర్నీ తానొక్కడే ఓడించాడు .అమృత సాధన అంటే సర్వ దైవీ భావాన్ని అధిగమించటం .ఆయన అప్రతిహత రధుడు కూడా .అంటే ఆయన సంచరించలేని ప్రదేశం ఉండదని .అనగా సర్వాంతర్యామి అని అర్ధం .అన్నిటిలో చైతన్య రూపం గా ఉన్న పురుషుడు అనగా పరమాత్మ .కనుక అలాంటి గరుత్మంతుడు అందరకు స్వస్తి కలిగించాలని ప్రార్ధన .

 

చివరిది బృహస్పతి ప్రార్ధన  .దేవ గురువు బృహస్పతి .విశేషార్ధం లో దేవతలకంటే గురువు అంటే బ్రహ్మము .దేవా అంటే ద్యోతన శీలం కలది .పంచ భూతాలూ ,పంచేంద్రియాలు ఇంద్రాదులు దీని పరిధిలోకి వస్తారు .వీరందరికంటే గురువు అంటే శ్రేష్టుడు అని భావం అంటే పరతత్వ మైన పరబ్రహ్మమే నని అర్ధం .సామాన్యార్ధం లో –‘’బృహతానాం  దేవానాం పాలయితా ఇంద్ర పురోహితః ‘’అనగా గొప్ప వారైన దేవతలపాలకుడైన ఇంద్రుని పురోహితుడు బృహస్పతి .ఆయన స్వస్తి చేకూర్చు గాక అని ప్రార్ధన .

ఇంతకీ ఎలాంటి స్వస్తి కావాలి ?పరమాత్మ నుండి ఆశించే స్వస్తి ‘’పరమ స్వస్తి ‘’మాత్రమే అయి ఉండాలి .అంటే మోక్ష రూప బ్రహ్మానంద లబ్ది .దీనికి ఏం కావాలి ?ఏక సాధనమైన ఏకత్వ దర్శన రూప అద్వైత సిద్ధి .అలా అయితే ఇందులో ఎవరినో ఒకరినే ప్రార్ధించ వచ్చుగా –ఇందర్ని ఎందుకు ?ప్రపంచం లో నానాత్వాన్ని చూడటానికి అలవాటు పడిన మనకు నానాత్వం నుండి ఏకత్వాన్ని చూడాలని భావన .ఇది ఎలా సాధ్యం ?సర్వేశ్వరత్వ ,సర్వ పోషకత్వ ,సర్వ శక్తి మత్వ ,సర్వోత్క్రుస్ట లక్షణ సమాహార సమన్వయము వలన .అంతేకాదు మంత్రం లో ‘’నః’’,దదాతు పదాలు మహార్ధాన్ని వ్యంజనం చేస్తాయి ..’’నః ‘’అంటే సృష్టిలోని భూత జాలమంతా ఒక్కటే అనటాన్ని తెలియ జేస్తుంది .దదాతు అనేది ప్రార్ధనార్ధక క్రియ .దీనికి కాలావదులులేవు .అంటే సర్వ కాల సర్వావస్థలలో పర మేశ్వరుడు సర్వ ప్రాణి సముదాయాన్నీ ఒక్కటిగా ,తనతో అభిన్నంగా చేసి స్వస్తి సంధాయకుడు అవుతున్నాడు అనే మహార్ధం ఇక్కడ వ్యంగ్య రూపం లో ఉన్నది అని మహా గొప్ప వ్యాఖ్యానంగా స్వస్తి మంత్రాన్ని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ‘’కదంబ వనం ‘’లో ‘’స్వస్తినః ‘’వ్యాసం లో తెలియ బరచి మన కళ్ళ పొరలను తొలగించారు .

వసంత పంచమి శ్రీ సరస్వతీ పూజ శుభాకాంక్షలతో

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-2-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి పేరడీ

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి  పేరడీ

పెద్ద నోట్లన్ని  నువ్వు రద్దు చేశాకనూ

చేదు నిజాలెన్నో నీతొ పంచు కున్నానులే

జంట కట్టేసినా నువ్వు తుంట రోడా నీతో

కొత్త కష్టాలెన్నొ నెత్తికెత్తు కొన్నానుగా

రెండున్నరేళ్ళ ఆరటమై

వేచి ఉన్నాను హోదాకు నే

చెయ్యిచ్చి నూ మాట యేమార్చినా

నీ వెంట నే తిరుగుతున్నానుగా  

హోదా లేద౦టు నూ పాటా కొట్టాకనూ

నీ పాకేజికే  నేను తల ఊపానుగా.

మాయ గా నీ మాటల్ల  గారడీ లతో  

నన్ను లాగింది నువ్వే గ డెల్హీ సారూ   

కబుర్లతో కరిగించే వ్రత మేలరా

ఒత్తిడితో ఊపిరాడక చస్తుంటే నే,  

ఈ హత్తుకోళ్ళు పొగడ్తలి౦కెందుకే

నీ బాహు బలి బంధాల పొత్తిళ్ళలో

విచ్చు కుందామనుకొంటే

గుచ్చు కుంటాది నీ గడ్డమ్మురా

కోడె కౌగిళ్ళ మోజేమో తీరి పోయేనురా  

పురి విప్పిచెలరేగె  నాలో  హోదా కోరికా

హస్తినలో మనిద్దరమొక మేనుకాగా  

ప్రతి ఊర  నిరసనల్లు పేట్రేగెరా

అప్పుడే ఎదురైన ఈ నిరసన

పదవి కొంప ము౦చేదాక  సాగునేమోమరి!   

పూర్తిగా రోట్లోతల నేను పెట్టాకనూ

మరణమూ  పరవశ మంటావని భయమేనురా  

చెమ్మ చేరింది నాకనుల చివరలలోన రా    

చి౦దులేసింది చిరు ఆశ నా కళ్ళలోనా  

ప్రేమ ఊరేటి నీ లొల్లి  చాలించరా   

కల కరిగిందిరా ఇల  తెలి మంచులా

నిలబడి పోయాను నేను నిస్సిగ్గుగా ..

నోట్ -నేనురాజ మౌళి తీసిన బాహుబలి కానీ ,మగధీర కానీ చూసే సాహసం ఇంతవరకు చేయలేదు .కానీ మర్యాద రామన్నచాలా ఇష్టంగా చూశా . మా పెద్దబ్బాయి శాస్త్రి ఈ మధ్య నేను హాస్యం రాయటం చూసి బాగానే ఉంది బాహు బలి లో ”పచ్చ బొట్టేసినా ”పాటకు ప్రస్తుత పరిస్థితులను జోడించి పేరడీ రాయమని చెప్పి నా దగ్గర ఆ పాట  లేదంటే నెట్ లో పంపాడు . అది చూసి చదివి చేసిన ప్రయత్నం ఇది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in కవితలు | Tagged | Leave a comment

భక్త రామదాసు జన్మ దినాన గ్రంధ భక్త రామప్ప సంస్మరణ

భక్త రామదాసు జన్మ దినాన గ్రంధ భక్త రామప్ప సంస్మరణ

Inline image 1

శ్రీ నారా రామప్ప వాజ్మయ తపస్వి అన్నారు శ్రీ శలాక రఘునాధ శర్మగారు .విశ్వనాధ వారి వేయి పడగలు నవల ఒక్క రాత్రిలో ఏక బిగిన చదివి పూర్తి  చేసిన పఠన దాహం కల వ్యక్తీ .మీసర గండ నారాయణ రాజు అనే గురువు  అనుగ్రహం తో భారత ,భాగవత రామాయణాలు ,మను ,వసు చరిత్ర కావ్యాల సారాన్ని అంతటినీ ఒంట పట్టించుకోన్నాడు .వయసు పైన పడినకొద్దీ యెంత గొప్ప పండితుడు ఎదురైనా తోడ గొట్టి సవాల్ చేసే ధీమా ఏర్పడేట్లుశిష్యుడు రామప్పను గురువు నారాయణ రాజు తీర్చి దిద్దాడు .దీనికి తోడూ అల్లు నారాయణప్పగురుత్వమూ అబ్బి రామప్ప సాహిత్య వ్యవసాయం మంచి ఫలసాయాన్నిచ్చింది .ఆంద్ర వాజ్మయం లో ఆయన చదవని గ్రంధం లేదు. అంతటి గ్రంధ భక్తుడు రామప్ప .

ఏ కావ్య ప్రస్తావన వచ్చినా అందులోని రసవత్తర పద్యాలు రామప్ప నాలుకపై నాట్యం చేస్తాయి .ఈ సాహిత్య పిపాస ఆయనకొక వ్యసనం గా మారి పోయింది .గొడ్లను కాయటానికి వెడుతున్నా, బస్ కోసం రోడ్డుమీద ఎదురు చూస్తున్నా చేతిలో గ్రంధం ఉండాల్సి౦దే.పొలం గట్ల మీద యే మార్కండేయ పురాణమో పరవశించి చదువుకొంటూ ఉంటే కాళ్ళమీద మహా సర్పాలు పాకుతూ పోయినా గుర్తించలేని రస తుందిల హృదయం రామప్పది అంటారు శలాక వారు . మహా విద్వాంసులు కూడా తొంగి చూడటానికి సాహసించని తిక్కన భారతం శాంతి ,ఆనుశాసనిక పర్వాల పద్యాలను ఆయనను కలలో లేపి అడిగినా చెప్పగల సత్తా ఉన్న మనిషి .వాటిలోని భావ పుస్టికీ ,శబ్ద సౌస్టవానికీ,కూర్పు ,నేర్పులకు అనుక్షణం ఆనంద తాండవం చేస్తుంది రామప్ప హృదయం .

1996 లో రామప్ప 85 వ ఏట కూడా ఉత్తమ కవిత్వం ఎక్కడ వాసన కొట్టినా పరుగెత్తుకొని పోయి ఆస్వాదించే పసితనం ఆయనది .తెలుగు వ్యాఖ్యానాల సహాయం తో ఆయన సంస్కృత మహా కావ్యాలను ,రామాయణ భారత భాగవతాలను నిరంతరం అధ్యయనం చేశాడు .వాటిలోని కొత్తదనాన్ని యిట్టె పట్టేసే నేర్పు ఆయనది .దాన్ని సహచరులతో పంచుకొని పరవశిస్తాడు .ఇవి కాక ఆంగ్ల సాహిత్యం అంద చందాలు చవి చూడాలన్న ఆరాటమూ పెరిగింది రామప్పకు .వేదాంత సౌరభాన్ని తనివి తీరా తనవి చేసుకోవాలన్న తపన ఉన్నవాడు .ఒక్క చదవటం తోనే రామప్ప ఆగి పోలేదు .పల్లె టూరు కనుక సంప్రదాయం గా పురాణ ప్రవచనం అక్కడ ఒక భాగం .ఒక పాఠకుడు పరిస్తూ ఉంటే ,మరో ప్రవక్త అందులోని రహస్యాలను విప్పి చెప్పి ఆనంద పరుస్తాడు .అలానే రామప్ప పురాణ ప్రవచనమూ చేశాడు .దానికి ప్రతిఫలం గా ఆయన ఏమీ ఆశించలేదు  తన కర్తవ్యంగా భావించి చేసిన ధర్మ యజ్ఞం ఆది.

నారా రామప్ప తలిదండ్రులు పెద్ద రామప్ప ,సుబ్బమ్మలు .అనంత పురం జిల్లాలో మన్నీలకు ఒక విశిష్టత ను చేకూర్చిన వాడు నారా రామప్ప .కులమతాలకు తావు లేకుండా మంచి విద్యార్ధులను స్వార్ధ రహితంగా తీర్చి దిద్దిన ఉత్సాహ శీలి రామప్ప .ఆయన శరీరానికే తప్ప  మనసుకు వార్ధక్యం లేదు .రామప్ప ప్రతిభ యెంత గొప్పది అంటే గంటకు 300 పద్యాలను అర్ధ స్పూర్తి చెడకుండా గొంతెత్తి చదవగల సామర్ధ్యం 85 ఏళ్ళ వయసులోనూ ఉన్నవాడు రామప్ప .మరో గొప్ప విషయం –ఆ వయసులోనూ పుస్తకాలు చదవటానికి ఆయనకు కళ్ళజోడు అక్కర లేదు .అపురూపమైన పద్యాలు ఎక్కడ దొరికినా అవి ఎన్ని వేలు అయినా ఎత్తి రాసుకొని భద్ర పరచుకొంటాడు రామప్ప .అయన గ్రంధాలయం లో స్వదస్తూరి తో రాసుకొన్న పుస్తకాలు అనేకం ఉన్నాయి .

రామప్ప ఎందరెందరికో అక్షర భిక్ష పెట్టాడు .ఎనిమిదేళ్ళ వయసున్న రామప్ప మనుమరాలు మహా ప్రబంధాలను అర్ధ స్పోరకం గా చక్కని పదబంధాలు చెడకుండా చదువుతుంది .సుమారు 70 ఏళ్ళ వయసున్న కొండప్ప భాగవత పద్యాలను కమ్మని కంఠంతో స్కాలిత్యం రాకుండా గానం చేసి శ్రోతలను అలరిస్తాడు .మూడక్షరాల పదాన్ని కూడా తప్పు లేకుండా చదవ లేని ఒక హరిజన బాలుడు ఆముక్త మాల్యద లోని ‘’ఖనటత్పయోబ్ద వీక్ష్య రసాతలా న్యోన్య సంపీడితాంగ భీతా౦డజములు’’ వంటి సుదీర్ఘ పరుషాక్షర  బహుళ సమాసాలను గ్రంధ సాహాయ్యం లేకుండా ఒప్ప జెప్ప గలడు.చల్లా కాటయ్యవంటి ఇలాంటి శిష్యుల నెందరి నో రామప్ప తీర్చి దిద్దాడు .కూలీ నాలీ చేసుకొనే ఎందరో హరిజనులు భారత ,భాగవత,రామాయణాది గ్రంధాలను యే మాత్రం పొరపాటు రాకుండా ,పండితులకు ఆహ్లాదం కలిగించే విధంగా పఠనం చేస్తారు .ఇదంతా రామప్ప ప్రభావమే .’’మేం రామప్ప గురువు శిష్యులం ‘’అని వీరాంతా గర్వం గా చెప్పుకొని ఆ గురువుకు గౌరవం కలిగిస్తారు .

ఇవన్నీ చూస్తుంటే రామప్ప ఒక ‘’సజీవ గ్రంధాలయం ‘’ తెలుగు సరస్వతి ముద్దు బిడ్డ’’అన్నారు శర్మగారు .ఆర్భాటం ప్రచారం పై ఆసక్తి లేని నిస్సంగా వాణీ సమార్చకుడు .పొద్దున్న ఇంత ‘’రాగి సంకటి’’ తింటే ఇక ఆరోజంతా రామప్పకు భోజనం తో పనేలేదు .ఆయనకు సాహిత్యాధ్యయనమే సర్వ సంపద .’’ఇలాంటి విద్యా తపస్విని చూసి తెలుగుతల్లి వెలుగు వెల్లువ నిరంతరం నింపు కొంటూ ఉంటుందని మా బోటి వారల నిండు నమ్మకం ‘’అన్నారు శ్రీ శలాక శర్మ గారు .శర్మగారికంటే  రామప్ప వయసులో 30 ఏళ్ళు పెద్ద వాడు .అయినా తానంటే ఆయనకు మహా గౌరవం అన్నారు శర్మగారు .ఒకరి నొకరు చూసుకోకుండా వారం రోజులు కూడా ఉండగలిగే వారు కాదట .శర్మ గారింటి ఇల్లాలు ,పిల్లలు రామప్ప వస్తే ‘’అదిగో మన్నీల తాత వచ్చాడు ‘’అని సంబర పడేవారట .వీరిద్దరూ ఎప్పుడు కలిసినా కనీసం వంద పద్యాలైనా స్మృతి పధం లో మేదిలేవి అంటారు శర్మగారు .

శర్మగారు బెజవాడ, బందరు, తిరుపతి, బెంగుళూరుమొదలైన చోట్ల  జరిగే సాహిత్య కార్యక్రమాలకు వెళ్ళే టప్పుడు రామప్ప ను వెంట తీసుకు వెళ్ళేవారు .ఎందరో మహానుభావులు శర్మగారి వలన రామప్ప వైభవాన్ని తెలుసుకొని హృదయం లో భద్రంగా నిలుపు కొన్నారు .ఒక సారి రామప్ప శర్మగారితో ‘’స్వామీ !నాది ఒక కోరిక .మీ ఇంటి ముందు వరండాలో మీ పటం ఒకటి పెట్టించండి .ఎందుకంటె నేను ఎన్నో సార్లు మీ ఇంటికి  వస్తూంటాను .మీరు ఇంట్లో లేకపోయినా అమ్మాయీ ,పిల్లలు నన్ను ఎంతో ఆదరం గా పలకరించి కాఫీ ఇస్తారు .అవి నాకు ఆనందాన్ని ఇచ్చినా ,నాకు కావలసింది అవి కాదు కదా .మీ పటాన్ని చూసి నమస్కారం పెట్టి ,మీతో ప్రసంగం చేసిన అనుభూతి పొందుతాను ‘’అని ఆనందంగా చెప్పుకొన్న వీరాభిమాని రామప్ప .’’రఘునాదు’’నికి’’ రామప్ప’’ రామ భక్త హనుమాన్ .

ఒక సారి తిరుపతిలో డా మేడసాని మోహన్ సహస్రావదానానికి శర్మగారు రామప్పను వెంట తీసుకు వెళ్ళారు .అక్కడ ఎందరెందరో మహా కవి పండితులకు రామప్పను పరిచయం చేసి ‘’ఈయన ఎప్పుడూ నా వేంటనే ఉంటాడు ‘’అన్నారు శర్మగారు .వెంటనే రామప్ప ‘’అవునవును ,ధర్మ రాజు వెంట కుక్క లాగా ‘’అన్నాడు.రామప్ప .శర్మగారు ఒక్కసారిగా అవాక్కయ్యారు .వెంటనే వారి మనసులో ఒక భావనా తరంగం కదిలి –మనసులోనే ‘’నా ధర్మరాజుతనం నిజమైనా కాక పోయినా ,ఆయన కుక్కతనం లో ధర్మ స్వరూపం పరమ సత్య మైనది ‘’అను కొన్నారట .అదీ శర్మ గారి సంస్కారం ‘        సాహిత్యమే అధ్యయన అధ్యాపన సర్వస్వం గా జీవించిన మనీషి శ్రీ నారా రామప్ప 90 సంవత్సరాల వయసులో 7-2-2,000 రధ సప్తమి పుణ్య దినాన జీవన రధ యాత్ర చాలించారు .ఆయన చేసిన అనంత సాహిత్య తపస్సు ఆయనకు అక్షయ పుణ్య లోకాలను ప్రసాదిస్తుంది ‘’అని ఆకాంక్షించారు శర్మగారు .

ఆధారం –ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారి ‘’కదంబ వనం ‘’లో ‘’వాజ్మయ తపస్వి రామయ్య ‘’వ్యాసం

భక్త రామదాసు జన్మ దిన శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

.

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాళిదాస శ్లోక శతపత్రం

కాళిదాస శ్లోక శతపత్రం

‘’మహా కవి కాళిదాసు రఘు వంశకావ్యం లో మొదటి 9 సర్గలు పీఠిక .తరువాత 6 ప్రధానమైన రామకధ.చివరి 4 సర్గలు ఉపసంహారం ఉన్నాయి ..6 కదల రామ కధకు 9 సర్గల పీఠిక ఏమిటి అనే సందేహం వస్తుంది .దైవ విగ్రహ ప్రమాణం దేవాలయ ప్రమాణం లో యెంత ఉంటుంది ?ఇదీ అంతే.కాళిదాసమహాకవి ముందు 9 సర్గలలో వెనక 4 సర్గలలో ఒక దివ్య ధామం నిర్మించి అందులో రామ కదా రూప దైవ మూర్తిని ప్రతిష్టించారు ‘’ .అని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు తమ ‘’కదంబ వనం ‘’పుస్తకం లో ‘’రఘు వంశ రసహేల ‘’లో వివరించారు .ఆ హేలా విలాసాన్నే నేను మీకు అందిస్తున్నాను .

షోడశ కళా పురుషోత్తముడైన పరమేశ్వరుడు శ్రీ రామునిగా అవతరించటానికి  ఆ 16 లక్షణాలనూ క్రోడీకరించాడు కవి .తన కావ్యం వేదసమ్మితమని ,వైవస్వత మనువు ప్రణవ సద్రుశుడైతే ,ఆ వంశ రాజులు వేద సదృశులై తే భగవంతుడు ఆ వంశం లో ఉద్భవి౦చటానికి గొప్ప యోగ్యతకలుగుతుంది .అందుకే కవి దిలీప మహా రాజును ప్రవేశ పెడుతూ –

‘’తదన్వాయే శుద్ధి మతి ప్రసూతః శుద్ధి మత్తరః  -దిలీప ఇతిరాజేందు రిన్దుః క్షీరనిధాఇవ ‘’అన్నాడు .చంద్రుడికి 16 కళలుంటాయి .అందుకే రాజును ‘’ఇందు’’ రూపమన్నాడు .ఈ షోడశ కళలు శ్రీరామునికి ముందున్న ఆ వంశ రాజు లందరికీ వర్తిస్తుంది .మరో మాట ‘’ప్రణవోపమ’’.ప్రణవం లాంటి వాడు .ఇదీ ఆ వంశం వారందరికీ వర్తించే ఉపమానమే .వివశ్వతుని కుమారుడు .వివస్వంతుడు అంటే అసమాన్యుడైన మకర కుండల కేయూర హారాలు ధరించి సరసిజాసన సన్నివిస్టుడై ,సర్వ జన ధ్యేయుడైన శ్రీమన్నారాయణ మూర్తికి తన మండలాన్ని గుడి గా చేసుకొన్నపుణ్య పురుషుడు .రఘు వంశం ఒక సూర్య మండలం అయితే దాని మధ్య శ్రీ రామ వృత్తాంతం నెలకొని ధ్యేయంగా ఉన్నది .క్షీర నిధి అనే మాటలో కల్ప వృక్షం కామ ధేనువు మొదలైన మహా పదార్ధాలు పాల సముద్ర మధనం లో ,అమృతంఉద్భ వి౦చటానికి ముందే పుట్టినట్లు , రఘు వంశం లో రాముడుద్భవి౦చ డానికి ముందే వీరు జన్మించారని సూచన . మహా గొప్ప ఉపమానాలు .దివ్యోపమలు ఇవి .’’కాళిదాసు భాషను కాని ,కధను కాని సృష్టించలేదు .ఉన్న భాషను ఉపయోగించి ,శబ్ద శక్తి తెలిసి సిద్ధమైన కధను స్నిగ్ధమైన రచనతో మనకు అందించాడు ‘’అన్నారు శలాక వారు .కాళిదాసు భారతీయత నిలువెల్లా జీర్ణించుకొన్న కవి .ప్రతి పలుకులో వేదనాదం ఉంటుంది .అర్ధ ,పురుషార్ధాలకే అధిక ప్రాధాన్య మిస్తాడు .’’దీనికి మించి అమృతాయమానమైన రస స్రోతస్సు భావుకుడిని అనుభూతిలో ముంచేస్తుంది .కాళిదాసు మూర్తీభవించిన ‘’భారతీయత ‘’అన్న శర్మ గారి పలుకులు ‘’ప్రాబలుకులే ‘’(వేద వాక్యాలే ) .

రఘు వంశ కావ్యం లో దిలీప ,రఘు ,అజ ,దశరధ కధలు మనోజ్ఞ శిల్పాభి రామాలైన ప్రాకారాలు .అందుకే అవి ధర్మార్ధ కామ మోక్ష పురుషార్ధ స్వరూప  వ్యాఖ్యాన రసవత్కావ్యాలు గా నిలిచాయి .దిలీప మహా రాజుకు శాపవశాన సంతాన౦ కలుగ లేదు .దీన్ని రూపుమాపుకొని సంతాన తంతువును అందుకొని వంశాన్ని నిలబెట్టు కోవాలని భార్య సుదక్షిణ తో సహా గురువు సందర్శించాలన్న కోరికతో ముందుగా సృష్టికర్తను అభ్యర్ధించాలనుకొని  గురువు ను దర్శించిఆయనలో బ్రహ్మను దర్శించాడు –

‘’తయా హీనం విదాతర్మాం కధం పశ్య న్నదూయసే –సిక్తం స్వయ మివ స్నేహా ద్వంధ్య మాశ్రమ వృక్షకం ‘’ అని ప్రార్ధించాడు .ఇందులో గురువును విధాత అని సంబోధించాడు .కనుక రాజు కోరికలో కొడుకు పుట్టాలన్న తపన జ్యోతకమైంది ఇలా చెప్పటం కావ్య పధ్ధతి అన్నారు శర్మగారు .దయాళువైన గురువు సంతానం కలగక పోవటానికి కారణం గ్రహించి దంపతులకు గోపూజ ను విధించాడు .ఆ విధి విధానాన్ని ఉపదేశించాడు-

‘’ప్రస్థితాయాంప్రతి స్టేథాః స్థితాయాం స్థితి మాచరేః-నిషణ్ణాయాం నిషీదాస్యాం పీతాంభసి పిబే రపః ‘’అని హెచ్చరికలు చెప్పాడు –గోవు నడిస్తే నడువు ,నిలబడితే నిలబడు ,కూర్చుంటే కూర్చో ,నీళ్ళు తాగితే తాగు .అన్నాడు .తు చ తప్పకుండా దిలీప సుదక్షిణ దంపతులు అలానే గో సేవ చేశారు .ఎలా చేశారో కవి చెప్పాడు –

‘’స్థితః స్థితా ముచ్చలితః ప్రయాతాం –నిషే దుషీ మాసన బంధ ధీరః –జలాభి లాషీ జలమాదదానాం-ఛాయేవతాం భూపతి రన్వ గచ్ఛత్ ‘’

గురువు ‘’నిశీధ ‘’అని చెబితే శిష్యుడు ‘’ఆసన బద్ధ ధీరుడు ‘’అయ్యాడు .ఆపః పిబే ‘’అని గురువు అంటే ‘’జలాభి లాషి ‘’అయ్యాడు .నీళ్ళు తాగాడో లేదో చెప్పలేదుకవి .అలా నిలువెల్లా నిస్టతో గోవును సేవించారు దంపతులు .చాయా అనే శబ్దానికి అర్ధం నీడ లాగా కాదని సర్వాత్మనా తనను పరిహరించుకొని గోవును అనుసరించాడని శర్మ గారు చెప్పిన అర్ధం చాలా సమంజసం గా ఉంది .

పరమ ఉదాత్త నిగ్రహం ప్రాణ వస్తువుగా ,ప్రత్యక్షర శిల్పాన్ని చేసిన వాడు కాళిదాస మహా కవి .ఆవేశం ఎక్కువై ,ఆకర్షణ అమితమై న వాడు భవ భూతి మహా కవి .గోసేవకు పరమానందం పొందిన గోవు దిలీపుని దీక్షకు మెచ్చి’’నాయనా !అని సంబోధించి  వరం కోరుకో మన్నది .అప్పుడు మహాకవి మహా రాజుతో అని పించిన శ్లోకం ప్రత్యక్షర శిల్ప శోభితం –ఇదే శ్లోక శతపత్రం .

‘’తతః సమానీయ స మానితార్దీ –హస్తౌ స్వహస్తార్జిత వీర శబ్దః –వంశస్య కర్తార మనంత కీర్తిం –సుదక్షిణాయాం తనయం యయాచే ‘’

ఎంత అదుపులో మనస్సు పెట్టుకొని దిలీపమహా రాజు గోవును అర్ధించాడో తెలియ జెప్పే మహా వాక్య ప్రమాణమైన శ్లోకం ఇది –మహా రాజు ‘’మానితార్ది ‘’అంటే ఎవరు యాచి౦చ టానికి వచ్చినా కోర్కెలు తీర్చే కల్ప వృక్షం వంటి వదాన్య వరేణ్యుడు.తాను  అడిగేది కామ దేనువుకు ప్రతిరూపమైన నందిని ధేనువును  .ఏ మాత్రం వివేకం కోల్పోయి అడిగిన వరం శాపం కావచ్చు .జీవితం లో ఎప్పుడూ ఇవ్వటమే కాని పుచ్చుకొన్నవాడు కాదు .అందుకే కవి ‘’హస్తౌ సమానీయ ‘’అన్నాడు .ఆ చేతులతో ఎన్నో యుద్ధాలు చేసి వీరుడు అని పించుకొన్నాడు ఇప్పుడు ఆచేతులు యాచకుని చేతులులా ఉన్నా వాటిలో  దాన ,యుద్ధ వీరాలున్నాయి .అంటే దానం తీసుకోవటానికి తగిన అన్ని యోగ్యతలు అర్హతలు ఉన్నాయని అర్ధం .మరి రాజు అడిగింది దేనిని ?తనయుడిని అంటే తన తనువునుండి పుట్టేవాడినే ఇవ్వమని అర్ధం .మరి ఆకొడుకు ఎలా ఉండాలి ?’’వంశస్య కర్తారం ‘’గా ఉండాలి వంశాన్ని వృద్ధి చేసేవాడుగా వర్ధిల్లాలి .మరి వాడి లక్షణాలు ఎలా ఉండాలి?’’అనంత కీర్తిం ‘’అనంతమైన కీర్తి ప్రతిష్టలు కలవాడై ఉండాలి .ఇక్కడ అనంత శబ్దం సాభిప్రాయంగా కవి ప్రయోగించాడని ,అనంత అంటే ఆదిశేషుని లాగా అలసట లేకుండా అనంతకాలం భూ భారం మోసే సమర్ధత కలవాడుగా ఉండాలన్న అర్ధమూ ఉందని శర్మగారి వ్యాఖ్యానానికి  జేజేలు .అంతాబాగానే ఉంది –తనకే సమర్ధుడైన కొడుకే ఇవ్వమని కోరాడు .ఆ కొడుకు ధర్మ పత్ని సుదక్షిణాదేవి సుక్తి ముక్తాఫలమై ఉండాలని ఒక ఝలక్ ఇచ్చాడు. అందుకే రాజు నోట ‘’సుదక్షిణాయాం ‘’అనే సాభిప్రాయమైన మాట వచ్చింది .రాజు పొందిన శాపం సుదక్షిణ కూ తగిలింది .కనుక శాప విముక్తి ఇద్దరికీ కలగాలి .ఇంత పకడ్బందీ గా కాళిదాస మహా కవి ఈ శ్లోకం రాసి దిలీప మహా రాజుతో అనిపించి సఫల మనో రధుడిని చేశాడు .

ఇందులో దిలీప సుదక్షిణా దంపతుల సంతానాభి లాష ,వ్రత దీక్ష ,గో రక్షణ కై ప్రాణ త్యాగానికైనా వెను దీయని ధర్మా భిరతి ,ఫలాభి సంధి కి తొణకనితనం ,గర్భ రక్షణ లో చూపిన శ్రద్ధ ,పుత్రుడికి సంస్కారాలు చేయటం లో చూపించిన నైపుణ్యం ,సరైన సమయం లో కుమారుడు రఘువుకు రాజ్య భారం అప్పగించటం ,వార్ధక్యం లో ముని వ్రుత్తి చేబట్టటం మొదలైన అంశాలను కాళిదాసు మహా ధార్మిక విధానం లో తీర్చి దిద్దాడని అందుకే ఇది ‘’ధర్మ పురుషార్ధ పరి పాక స్పోరక గాథ’’గా చిరస్మరణీయ మైనదని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ప్రవచించారు .ఇలాంటి వ్యాఖ్యాన శిరోమణుల వలననే మహా కవుల కవితా శిల్పం అర్ధం చేసుకో గలం.ఈ జాతికి వారు ధర్మ భిక్ష అందజేసిన పుణ్యమూర్తులు .

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-17  -కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 

.
—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దశరధ మహా రాజు నిస్సంగత్వం

దశరధ మహా రాజు నిస్సంగత్వం

ధర్మ నిర్వహణలో సంతాన తంతువు విచ్చేదం కాకుండా రక్షించు కోవటానికి దశరధ మహా రాజు  అశ్వ మేధ ,పుత్ర కామేష్టి యజ్ఞాలను పరమ శ్రద్ధాళువై ఆచరించాడు .చక్రవర్తి అశ్వ మేధం చేస్తే తన రాజ్యాన్ని అంతటినీ దక్షిణగా ఇవ్వటం శాస్త్ర విధి .దీనికి ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి కనుక ఇచ్చి నట్లుగా ఒక తంతు గా దీన్ని జరుపుతారు .కానీ దశరధుని మనః ప్రవ్రుత్తి చాలా భిన్నంగా ఉన్నట్లు శ్రీ మద్రామాయణం లో మహర్షి వాల్మీకి ,రామాయణ కల్ప వృక్షం లో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారూ గొప్పగా అభి వర్ణించారని ‘’కల్ప వృక్ష వాగ్వైభవం’’లో ‘’సార్వ భౌమ యజ్న దీక్ష ‘’వ్యాసం లో మహా వ్యాఖ్యాత,ప్రాచార్య  శ్రీ శలాక  రఘు నాద శర్మ గారు వ్యాఖ్యానించారు .ఇందులోని సారాన్ని ‘’దశరధ చక్రవర్తి నిస్సంగత్వం ‘’పేర మీకు అందిస్తున్నాను .

యజ్ఞం లో ప్రధాన ఋత్విక్కులైన  హోతకు తూర్పు దిక్కును , ,అధ్వర్యువుకు పడమటి దిక్కును , ,బ్రహ్మకు దక్షిణ దిక్కును , ,ఉద్గాతకు ఉత్తర దిక్కును దశరధ మహా రాజు యజ్ఞం పూర్తయ్యాక తనకున్న సర్వ భూమినీ దక్షిణగా ఇచ్చేశాడు .వాళ్ళందరూ గ్రహించి దీన్ని మేమేం చేసుకొంటాం అని బ్రతిమి లాడి ఆయనకే అప్పగించేసి ఆయన ప్రత్యామ్నాయంగా  ఇచ్చిన గో ,సువర్నాదుల్ని గ్రహించారు . ఇలా చేయటం లో మమకారాన్ని చంపుకోవటం అనే గొప్ప ప్రయత్నం ఉందని గ్రహించాలి .భౌతిక భాగ్య సంపదలతో మమకారం చంపుకున్నవాడు పరమార్ధ సంపదను తలకెత్తు కుంటాడని శర్మ గారు వ్యాఖ్యానించారు .ఈ ఘట్టాన్ని విశ్వనాధ తన ‘’సకలోహ వైభవ సనాధమైన’’ నాథ కథ’’లో అంటే కల్ప వృక్షం లో మహోన్నత రస బంధురంగా తీర్చి దిద్దారు .

‘’దక్షిణ గాగ సర్వ వసుధాతల మిచ్చెను  బర్వు దింపిన –ట్లక్షుల నప్పళించి భుజ మల్లన నూర్పున నెత్తి దించె స –ర్వక్షిత భార దూర్వహ భవ క్లమ బుద్ధి ధరా తలేశ్వరుం –డాక్షణ మందు సౌఖ్య నివహాత్త శరీర లఘుత్వ భావనన్ ‘’.

భావం వాల్మీకి దే అయినా విశ్వనాధ మహర్షిని తనలో ఆవాహన చేసుకొని రుషి వాక్కు ను వ్యాఖ్యానించాడు .దక్షిణగా సర్వ భూ మండలాన్నీ ఇచ్చేశాడు మహా రాజు –ఇదీ అసలు వార్త.ఈ వార్తను కవి కవిత్వం తో రసబంధురం చేశాడు .అలా దక్షిణగా ఇచ్చేసిన తర్వాత ఆయనకు పెద్ద బరువు చాలా కాలం మోయాగా మోయగా దింపేసి నప్పుడు కలిగిన గొప్ప అను భూతి అంటే రిలీఫ్ కలిగింది .కళ్ళు అప్పళించాడు.భుజం కొంచెం కదిలించి ,పెద్దగా ఊపిరి  తీసుకొని,పైకి ఎత్తి దించాడట .బరువులు మోసే వాళ్ళందరూ బరువు ది౦చినపుడు కలిగే ఊరట పొందాడన్న మాట  .ఇంతకాలం ఇంత బరువు మోసి నందుకు కలిగిన అలసమైన బుద్ధి ఇప్పుడు తేలిక పడింది .కొన్ని వందల సుఖాలు కట్ట కట్టుకొని వచ్చాయా అన్నట్లు శరీరం తేలిక పడింది .ఒక గొప్ప అందమైన భావ చిత్రాన్నిఅక్షరాలతో చిత్రించి విశ్వనాధ  కవి మన ముందుంచాడు రస రమ్యంగా .మనం దేశ కాలావధులు దాటి కథా కాలానికి వెళ్ళిన మహా విభూతి కల్పించారు కవి సామ్రాట్ .ఇంతటితో ఆగి పొతే ఆయన విశ్వనాధ ఎలా అవుతారు  ?మరో పద్యం వెలువరించారు –

‘’ఇన్నాళ్ళీధర మోసి మోసి ,బరువయ్యెన్ విశ్వ విజ్ఞాన సం-పన్నాళీక భవుల్ భవత్కరములన్ భద్రమ్ముగా నుంచి త-ర్కోన్నేయాచ్ఛ పథాధ్వనీనుడుగ నన్నో భూసుర గ్రామణుల్-మన్నింపం దగు నెప్పుడో తెణపి సంప్రాప్తించె నీ నాటికిన్ ‘’.

దీన్ని వ్యాఖ్యానిస్తూ శలాక శర్మగారు –‘’దశరధుని త్రికరణాలూ బరు వెక్కి పోయాయి .వయసూ పెరిగింది కనుక భారం ది౦చుకోవాల్సిందే .దాన్ని తేలిగ్గా కింద పారేసి చేతులు దులుపుకోవటం ధర్మ నిష్ట కల దశరధునికి సులభం కాదు .దాన్ని ‘’సుస్థాన పతితం ‘’చేయాలి అంటే మంచి సమర్ధుల చేతిలో పెట్టాలి .అందుకే ‘’విశ్వ విజ్ఞాన సంపన్నాళీక భవుల్ ‘’అంటే విశ్వ విజ్ఞాన సంపదలో మీరు పద్మ సంభవుడైన బ్రహ్మ దేవుని అంతటి వారు కనుక నిశ్చింతగా ఈ భారాన్నిమీకు అందిస్తున్నాను అనే పరి తృప్తి నా హృదయం లో పరవళ్ళు తొక్కు తోంది ‘’అని అతి వినమ్రంగా విన్న వించాడు  .ఇక్కడ ప్రయోగించిన ‘’నాళీకభవ ‘’ శబ్దం సాభి ప్రాయం గా ఉన్నది .నాళీకంఅంటే పద్మం –పంకజం అనీ అంటారు .అది బురదలో పుట్టి పెరిగినా దానికి ఆ బురద అంటుకోదు .అలాగే మహాత్ములైన మీరు ఈ రాజ్యాన్ని నిర్లిప్త భావం తో పరి పాలిస్తారు కనుక ఈ భూమికి సర్వతో భద్రత ఏర్పడుతుంది అనే గంభీరమైన అర్ధం ఇందులో కవి సామ్రాట్ నిక్షిప్తం చేశారు .’’భవత్కరములన్ భద్రమ్ము గా నుంచి ‘’అన్నాడు చక్రవర్తి –‘’మీ చేతుల్లో భద్రం గా పెట్టి నేను విశ్రాంతి తీసుకొంటాను ‘’అనే భావాన్ని ‘’విశ్వనాధ కవి చక్ర వర్తి ‘’ప్రాచీన భారతీయ మహా చక్ర వర్తి మహోన్నత భావ పరంపరను కుమ్మరించి చూపించారు ‘’అని శర్మ గారు పొంగిపోయారు .ఆ పులకింత మనకూ కల్పించారు .ఉత్తముడైన రాజు ప్రజల కోసమే బ్రతుకు తాడు .తాను  ఏలే రాజ్యానికి సర్వ సమర్ధుడైన ఉత్తరాధి కారి కావాలని ఆశిస్తాడు .అంతటి మహాత్ముడు దొరికితే ఆయన హృదయం ఆనంద అర్ణవమే అవుతుంది .బరువు ఎత్తుకొనేటప్పుడు,దించు కొనేటప్పుడు ఈ తత్త్వం’’ ఓతప్రోతం’’ గా ఉంటుంది అన్నారు శర్మ గారు .దశరధ మహా రాజు ఇంతటి మహోన్నతుడు కనుకనే  విష్ణు మూర్తి ‘’పితరం రోచయామాస తదా దశరధం నృపం ‘’అను కొన్నాడు అన్నాడు వాల్మీకి మహర్షి .అంటే తండ్రిగా దశరధ మహా రాజును శ్రీరామావతారానికి  ఎంచుకొన్నాడు విష్ణు మూర్తి అని అర్ధం .ఇక్కడ చక్రవర్తి సంసార బంధ వినిరక్తుడైన ఒక నిస్సంగునిలా దర్శనమిస్తాడు .అలాంటి వాని హృదయం ‘’ఆనంద సాంద్ర స్థితి ‘’లో విహరిస్తుంది ‘’అని శర్మ గారు మాత్రమే  చేయగల వ్యాఖ్యానం ఇది .

ఈ ఘట్టానికి ఫైనల్ టచ్ ఇస్తూ విశ్వనాధ –

‘’అని ఉత్తరీయమునుగ –ట్టిన దోవతి తోడ వడి వడిం జను ,నరపా

లుని త్రోవ కడ్డమై బ్రా-హ్మణు లిది ఏమయ్యభూమిపా !భూమ కృపా ‘’

ముందు పద్యం లో చెప్పిన మాటలు పలికి రాజు ఉత్తరీయం తో కట్టిన దోవతి తో వడివడి గా వెళ్లి పోతున్నాడు .అంతా దానం చేశాక కట్టు బట్టలు తప్ప మరేమీ తనతో తీసుకు పోరాదనే  దృఢ వైరాగ్య భావన గుండె లోతుల్లో నిక్షిప్తం చేసుకొని ,పరమ విరాగిగా ఉన్నాడు మహా రాజు .అప్పటి వరకు ‘’అసముద్ర క్షితీసుడు ‘’దక్షిణగా సర్వ భూమినీ ధార పోసిన మరు క్షణం లో ఐశ్వర్యం పై ఆవ గింజంత అధికారం కూడా తనకు లేదను కొన్న త్యాగ మూర్తి దశరధ మహా రాజు .కాళిదాస మహాకవి ‘’సంభ్రుతార్దానాం ‘’ అన్నాడు అంటే త్యాగం కోసమే అర్ధ సంపత్తిని కూర్చు కుంటారు అన్నాడు .త్యాగమే అమృతత్వానికి దారి .ఇంతటి త్యాగ శీలినే మహా విష్ణువు తండ్రిగా కోరుకున్నాడు .మనసు చాలా విచిత్రమైంది .ఒక్క క్షణం జాగు చేస్తే అది తనపై అధికారం చలా ఇంచే ప్రమాదం ఉంది కనుక ‘’వడి వడిం జని’’అని అతి వేగంగా అక్కడి నుంచి వెళ్లి పోతున్నాడు .అయితే ఎక్కడికి వెడుతున్నాడో కవి చెప్పలేదు . అది ‘’పరి వ్రజనం ‘’అన్నమాట .అంటే గమ్యం లేకుండా సాగటం .ఇదే పరమ వైరాగ్యానికి పరమ నిదర్శనం అంటారు శలాక శర్మ గారు .

తర్వాత యధా ప్రకారం దక్షిణ తీసుకొన్నవారు రాజుకు తిరిగీ భూభాగం అప్పగించి కానుకలతో సరిపెట్టుకోవటం మనకు తెలిసిందే .కాని వారు రాజుకు మహా సామ్రాజ్యం కంటే మహా ఫలాన్ని అనుగ్రహిం చారు .ఇక్కడ మహర్షి –

‘’తస్యా శిషోథ విధి వద్ బ్రాహ్మణైః సముదీరితాః-ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ ‘’

బ్రహ్మ జ్ఞాన సంపన్ను లైన ఆ మహర్షులు ఉదారుడు ,రాజ వీరుడూ ,నేల పై సాష్టాంగ  దండ ప్రణామం చేసి ఉన్నవాడూ అయిన దశరధ మహా రాజు కు విధి ననుసరించి ఆశీస్సులు అనుగ్రహించారు .ఇక్కడ ఆశీస్సులు అంటే ‘’శాసనాత్మకమైన ఆదేశాలు ‘’అన్నమాట .వారి మాటలను కాదన లేక మహా రాజు రాజ్యాన్ని మళ్ళీ స్వీకరించాడు .అయినా ‘’విరక్తత ‘’అలాగే ఉండి పోయింది అంటారు శలాక వారు .మహర్షి పలికిన ఆశీస్సులను విశ్వనాధ కవి మహర్షి బహుధా ప్రవచించి ఇలా చెప్పారు –

‘’సాదు జనైక క౦టక నిశాచర క౦ఠ కరాళ మూర్తి ,మా-యాధవు డంజనాద్రి శిఖరా౦చల చిక్కణ కాంతి మత్తనూ –సాధు మనోజ్ఞ మూర్తి త్రిదశ ప్రభు బంధ విమోచనుడు భూ –మీ ధవ !త్వత్పురావన సమిద్ధ మహో నిధియై తలిర్చుతన్ ‘’అన్నారు

భావం –‘’భూమీధవా !భూదేవి పతీ !అని సాభిప్రాయంగా అని ‘నీకు పరి పాలించే భూమి అంతాసుఖంగా ఉండాలన్న తపన ఉంటే,ఇప్పటికీ నువ్వు భూమి ధవుడివే అయి శ్రీ మహా విష్ణువుకు తండ్రివై ,నిన్ను నువ్వు ఉద్ధరించు కొని ,ప్రజలందర్నీ ఉద్ధరించే పుణ్యం కట్టుకోవాలి .ఎలాగా అంటావా –సాదుజనాలకందరికీ ఒకే ఒక క౦టకుడిగా చెలరేగుతున్న నిశాచర కంఠాలకు కరాళ మూర్తి అయిన వాడూ ,మాయ అనే ప్రకృతికి భర్త అయినవాడూ ,కాటుక కొండ కొమ్మల చివర్లలో నిగ నిగ లాడే కాంతితో విరాజిల్లే దేహ సౌందర్యం తో అందరి మనస్సులనూ ఆకట్టుకొనే నీల మేఘ శ్యాముడు ,దేవేంద్రుని బంధనం నుంచి విడిపించేవాడూ అయిన కుమారుడు జాజ్వల్యమాన మైన కాంతితో నీ ముందు తిరుగాడుతూ ఉంటాడయ్యా ‘’అని శుభాశీస్సులు కురిపించారు .దీనితో రాజు కోరికా ,జన వేదనా ,రాక్ష సంహారం, ఇంద్ర సంతృప్తీ తీరే వర ప్రదానం మహా రాజుకు యజ్న ఫలంగా దక్కింది .

మహర్షులు ద్రష్టలు ,క్రాంత  దర్శులు కనుక పుట్టబోయే’’ బుల్లి బుజ్జాయి’’ శ్రీ రామ చంద్రుని దర్శించి మాట్లాడారు .ఆయన చేసే సర్వ రామాయణాన్ని మూడు ముక్కల్లో కుదించి కుప్ప బోశారు .ఆది శేషుని అంశతో లక్ష్మణుడు ,పాంచజన్య శంఖం వెలుగులతో భరతుడు ,సుదర్శన చక్ర స్వరూపం తో శత్రుఘ్నుడు అవతరించ బోతున్నారని కూడా ఆశీస్సులతో సూచించారు .దశరధ మహా రాజు వైరాగ్య గరిమతో అందుకో బోతున్న ‘’అమృత స్థితి ‘’ఇది .ప్రత్యామ్నాయంగా కోట్ల కొలది సువర్ణాన్ని ,గోవులను సమర్పించి నామమాత్రమైన రాజ్య పాలన స్వీకరించాడు దశరధ చక్రవర్తి .ఇదంతా మహర్షి వాల్మీకి వాక్యాలకు విశ్వనాధ చేసిన మహా భాష్యం .’’అన్న శ్రీ శలాక వారి వ్యాఖ్యానం  శిఖరాయ మానం .బహుశా భారత ,భాగవతాలలో అశ్వ మేధయాగాలు చేసిన యే చక్రవర్తీ దశరదునిలా ప్రవర్తించినట్లు యే కవీ రాయలేదుఅని నేను అనుకొంటాను . .ఆ పని ఒక్క విశ్వ నాద మహా కవి మాత్రమే చేసి  తన సకలోహసనాధం గా  కల్ప వృక్ష రామాయణానికీ పట్టాభి షేకం చేశారు .

Inline image 1

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .   .

 

 

 

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే )

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే )

తీరికగా పేపర్ చదువుతున్నా .పక్కింటి పడుచు కుర్రాడు పరిగెత్తుకొచ్చి వగరుస్తూ కుర్చీలో కూల బడి ‘’అంకుల్ !నాకో హెల్ప్ చేయాలి ‘’అన్నాడు .వాడికి నేనంటే చనువు .తరుచూ వచ్చిపలకరిస్తాడు . నా మెయిల్స్ చదువుతాడు .ఫేస్ బుక్ లో కావలసినన్ని లైకులు పెట్టి కిక్కెక్కిస్తాడు .వాట్స్ అప్ లో ఓహ్ వాట్ యే బ్రిలియంట్ ఐడియా  వాట్ఎ పెర్సేప్షన్  !కంగ్రాట్స్ ‘’వంటివి బాగా దట్టిస్తాడు .కనుక నా అభిమాని అని వేరే చెప్పక్కర్లేదు .నా ప్రచార సారధి ఒక రకంగా అని గర్వం ఫీలౌతాను వాడిని చూసి .డప్పు కొట్టే వాడంటే ఎవరికి ఇష్టం ఉండదు?నేనేం ఎక్సెప్షన్ కాదు .సరే అసలు విషయం వదిలేసి శాఖా చంక్రమణం చాలా చేశాను ‘’ఇంతకీ నీకు నేనేం హెల్ప్ చేయాల్రా ?’’అడిగాను .’’ఏం లేదంకుల్ .వెరీ సింపుల్ . నాకు కొన్ని బూతుల్లాంటి తిట్లు  రాసి పెట్టాలి ‘’అన్నాడు జంకు లేకుండా .’’నేనేం ఆత్రేయనో ,వేటూరినో అను కొన్నావా ఇదే౦  తెంపరి తనం ?’’అన్నా .’’తప్పుగా అర్ధం చేసుకోకండి అంకుల్ .అవన్నీ పాత బడి పోయాయి .’’అన్నాడు ‘’అసెంబ్లీ లో మనవాళ్ళంతా పన్నెండో నంబర్ భాష రెచ్చి పోయి మాట్లాడుతున్నారు కదా ఇంకా ఏం నేర్చుకోవాలి ?’’అన్నా .’’వాటికి ఎక్స్పైరీ డేట్ అయి పోయింది అంకుల్ ‘’అన్నాడు సంకోచం లేకుండా .’’ఈ మధ్య ‘’ట్ర౦ప్ ట్రంపెట్ వాయించి నట్లు కంపు కొట్టేట్లు  అందర్నీ ఉప్పూ పత్రీ లేకుండా తిడుతున్నాడు కదా .రికార్డ్ చేసుకో లేక పోయావా ‘’అడిగా.’’లాభం లేదంకుల్ .అవి మరీ పచ్చిగా ఉన్నాయి ‘’అన్నాడు .’’అమెరికా స్కూల్ కుర్రాళ్ళు రెచ్చిపోయి తిట్టుకొంటారని విన్నా.ట్రై చేయలేక పోయావా ?’’అన్నా. ‘’అదీ అయింది అంకుల్ .నాకు లేటెస్ట్ గా ,సాంకేతికంగా, లైట్ గా కావాలి ‘’అన్నాడు .’’పోనీ యు ట్యూబ్ లో ఫన్  బకెట్ చూడక పోయావా ?అందులో కర్రోడు ,జుట్టు పోలిగాడు సరదాగా మంచి బూతులలాంటివే  తిట్టుకొంటారుగా .నేనూ సరదాకి చూస్తాను ‘’అన్నాను .’’అవన్నీ నిన్నటి తిట్లన్కుల్ .నాకు మీరైతే అతి లేటెస్ట్ తిట్లు రాయగలరని నమ్మకం .అంతే .నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం వద్దు ఇప్పటికే అరగంట వాయించారు ,ఇక మొదలు పెట్టి రాసి నాకు అర్జెంట్ గా మెయిల్ చేయండి ప్లీజ్ అంకుల్ ‘’అన్నాడు .’’అంత కొంపేం మునిగింది ?’’అన్నా .’’సాయంత్రం పోటీ ఉందన్కుల్ .మీ వన్నీ నావిగా చేసి పోటీ లో పార్టిసిపేట్ చేయాలి .గెలిస్తే ప్రైజ్ కూడా ఉంది .ఆ ప్రైజ్ మీకే ఇస్తా అంకుల్ నాకొస్తే ‘’అని ఊరించాడు .ములగ చెట్టు ఎక్కాక ,సుబాబుల్ చివరున్నాక ఇక తప్పించు కో లేనని తెలుసుకొని ,వాడిని కెలకటం బుద్ధి తక్కువని ఇక తప్పదని’’ పంచాంగ’’ రచనకు  ఉపక్రమించా .;

  1-ఒరే నీ కంప్యూటర్ లో కాకరకాయా

2-ఓరి నీ లాప్ టాప్ లో నా ఎర్ర టవలూ

 ౩-ఓసి నీ ఐ పాడ్ లో ఐస్ క్రీమూ

 4-ప్రోగ్రాం రాయమంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించినట్లు

 5-కంట్రోల్ సిస్టం రా అంటే కండోం సిస్టమా అని అడిగినట్లు

 6-సిస్టం ఉందా అని అడిగితే సిస్టర్ ఉందన్నాట్ట ఒకడు .

7-నీ రిమోట్ లో కమోడూ

8-డేటా పంపించారా బేటా అంటే బాటాషూ పంపినట్లు

 9-లూమ్స్ అంటే ఏమిట్రా అంటే హాండ్ లూమ్స్ బ్రదర్ అన్నట్లు

 10-అనలాగ్ అంటే అనంతనాగ్ తమ్ముడు అన్నట్లు

11-ఓరి నీ డిజిటల్ మెమరీలో డీజిలాయిలూ

12-ప్రాసెస్ చేయరా బాబూ అంటే ఫ్రాడ్ చేసిన౦త  ఫీలింగే౦ట్రా

13-ఓసి నీ కీబోర్డ్ లో నా జడ పిన్నూ

14-జాయ్ స్టిక్ అంటే అదేదో బూతనుకొని వంకర్లు తిరుగుతావేంటే

15- మానిటర్ తెమ్మంటే మానీటర్ ను తెచ్చినట్లు

16-ఓసి నీ స్క్రీన్ మీద నా  ఫేస్ పౌడరూ

 17-ప్రింటర్ ఉందా అంటే ప్రింట్ చేసేవాడ్ని పట్టుకొచ్చినట్లు

18-స్కాన్ చేసి పంపరా  అంటే స్కాంకాగితాలు పంపాట్ట ఒకడు

 19-ఇన్ పుట్ ఉందా అంటే మెలికలు తిరుగుతావేంటే

20-ఓరి ఎంకమ్మా ఔట్ పుట్ అంటే లాప్ టాప్ తీసి బయట పెట్టటం కాదహే .

21-లాగిన్ అవమంటే లాగు లోపల వేసు కోవటం కాదురా ఎర్రి పప్పా

 22-లాగవుట్ చేయమంటే బయటికెళ్ళి లాగూ విప్పాట్ట నీ బోటి చవట

 23-టచ్ స్క్రీన్ ఉందా అని అడిగితె స్కిన్ టచ్ చేసి చేబుతానన్నదిట ఒక ఎర్రి బాగుల్ది .

24-సోర్స్ ఉందా అని అడిగితె మచ్చలు పోవటానికి మందు రాసుకొన్నట్లు

25-నీనెట్ వర్క్ లో నా బాస్కెట్ బాలూ

26-ఓరి నీ మోడెమ్ లో కన్డోమూ

27-ఆర్టి ఫీషియల్ ఇంటలిజెన్స్ గురించి చెప్పరా అంటే  ఆర్టీసీ ఇంటలిజెన్స్ గురించి చెప్పినట్లు

28-నీ సిస్టం లో హార్డ్ వేర్ పోయిందిరా అంటే హార్డ్ వేర్ ఇనపకొట్టు కెళ్ళి  వేయించు కోస్తాను అన్నట్లు

29-వాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే మెత్తని బట్టలు కట్టే ఇంజనీర్ అనుకోని కులికిందట ఒక కలికి .

30-ఫర్మ్ వేర్  అంటే బట్టలు బిగుతుగా కట్టుకోవటం కదా మామా అన్నాట్ట

31-అబాకస్ అంటే అబార్షన్ చేయించు కోమన్నంత కంగారెందుకే

32- అనలాగ్ అంటే లాగూలు కూడా ఏమన్నాఅనగలుగుతాయా  అన్నా? అన్నట్టు

33-ఇప్పుడంతా డిజిటల్ రా అంటే నేను ఎప్పటినుంచో డిటర్జెంట్ వాడుతున్నానన్నాట్ట

34-వాక్యూం క్యూబ్ అంటే ఐస్ క్యూబ్ కి అన్నా? అని అడిగినట్లు

35-ఈ మెయిల్ పంపరా అంటే అదెందుకు ఆ మెయిల్ లో పంపుతాలే అన్నట్లు  

36-గిగా బైట్ అంటే –కుక్కలేకాక గిగాలు కూడా బైట్ చేస్తాయా అని అడిగినట్లు

37-పుస్తకాలు కొనటం దండగ ఈ బుక్ లో హాయిగా చదువుకో వచ్చు అంటే అవి బజార్లో ఎక్కడ దొరుకుతాయని అడిగినట్లు

38-పైతన్ లాంగ్వేజ్ అంటే పైతన్ పాము భాష అని భయపడినట్లు

 39-ఓసి నీ ఫేస్ బుక్ లో నా టెక్స్ట్ బుక్కూ

40-వాట్స్ అప్  చూడరా అంటే ‘’వాటీజ్ అప్పా ‘’అని పైకి చూసి’’ ఫాను మామా’’ అన్నట్టు.’

  ముళ్ళ మీద కూర్చున్నఫీలింగ్ తో  ఇవన్నీ రాసి పక్కింటి నా ఫాన్ కుర్రాడికి అర్జెంట్ గా మెయిల్ పంపి ఊపిరి పీల్చుకున్నా .మాఘమాసం లో ఈ తిట్ల పురాణం ఏమిటి అని, కీర్తి కక్కూర్తికి  చెంపలేసుకొని , ప్రాయశ్చిత్తంగా మళ్ళీ ఒకసారి  అరుణ పారాయణ చేసి స్థిమిత పడ్డా .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

—



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 54-భారతీయ శిల్ప చిత్రకళాధ్యయనం చేసిన సంస్కృత విద్యావేత్త –కలంబూర్ శివరామ మూర్తి (1909-1983)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -3

54-భారతీయ శిల్ప చిత్రకళాధ్యయనం చేసిన సంస్కృత విద్యావేత్త –కలంబూర్ శివరామ మూర్తి (1909-1983)

భారతీయ మ్యూజియాలజిస్ట్ ,కళా చరిత్రకారుడు,చెన్నై గవర్నమెంట్ మ్యూజియం క్యురేటర్,గొప్ప స౦స్కృత విద్వాంసుడు  సి .శివరామ మూర్తి .అనేక మోనోగ్రాఫుల ,గైడ్ పుస్తకాల రచయిత . సౌత్ ఇండియన్ ఎపిగ్రఫీపై సాధికారికత ఉన్నవాడు .ఎకడమిక్ విద్యానంతరం చెన్నై ప్రభుత్వ మ్యూజియం క్యురేటర్ గా ఉద్యోగం లో చేరి ,తర్వాత భారత పురాతత్వ శాఖ లో కలకత్తా ఆర్కియలాజికల్ సెక్షన్ సూపరిన్టెన్డెంట్ అయ్యాడు .తఱువాత జాతీయ మ్యూజియం కీపర్ అయి ,చివరకు డైరెక్టర్ అయ్యాడు .ఇంటర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ లో ఎక్సి క్యూటివ్ మెంబర్ అయి, చైర్మన్ గా సేవలు అందించాడు .అనేక విషయాలను శోధించి ,పరిశోధించి విలువైన పత్రాలు రచించి సమర్పించి ప్రచురించాడు .ప్రముఖ ఆర్కియాలజిస్ట్ జువాలజిస్ట్ ఫ్రెడరిక్ హెన్రి గ్రేవ్లి తోకలిసి 1938లో ఘనంగా ‘’యా౦టి క్విటీస్ అండ్ ఇండస్ట్రియల్’’ ప్రదర్శన నిర్వహించాడు .శివ రామ మూర్తి ఫ్రెంచ్ భాషలో రాసినఉత్తమ గ్రంధమైన  ‘’ఎల్  ఆర్ట్ ఇండే ‘’కు దాదాభాయ్ నౌరోజీ పురస్కారం లభించింది .ఇది జర్మని ,ఇటలి ,ఇంగ్లీష్ మొదలైన భాషలలో నూ ముద్రణ పొందింది .జవహర్లాల్ నెహ్రు మెమోరియల్ ఫండ్ ఏర్పరచినపుడు ట్రస్టీలు మొదటి సారిగా మూర్తి ప్రతిభా విశేషాలు గుర్తించి సత్కరించారు .

భారతీయ సాహిత్యం లో నటరాజ మూర్తి గురించి రెండేళ్ళు విస్తృతమైన పరిశోధనలు చేసి శివ రామ మూర్తి ‘’నటరాజ ఇన్ ఆర్ట్ ధాట్ అండ్ లిటరేచర్ ‘’అనే అపూర్వ గ్రంధం రచించాడు .తన తలిదండ్రులకు అంకితం చేసిన ఈ మహత్తర గ్రంధం ఆయన ప్రతిభా సర్వస్వం గా ఉంది .412పేజీలతో వెలువడిన ఈ ఉద్గ్రంధం నట రాజ విశ్వ నృత్య హేల ‘’శివ తాండవం ‘’ను ,దానికి కరణాలుగా సహకరించిన బ్రహ్మ ,విష్ణువులను  సమగ్ర సర్వ స్వరూప౦ గా  ఆవిష్కరించి చిరస్మరణీయం చేసింది . ఈ శివ తాండవ నృత్యానికి మూలాధారం వేదాలలో ఉన్నది .నటరాజ తత్త్వం భారతీయ సరిహద్దులు దాటి విశ్వ వ్యాప్త మైంది .దీనికి ముఖ్య కారకుడు శివరామ మూర్తి .ప్రముఖ చిత్రకారుడు,చరిత్రకారుడు  ఆనంద కుమారిల స్వామి కూడా నటరాజ విగ్రహం పై పరిశోధన చేసినట్లు మనకు తెలుసు .

శివ తాండవ నటరాజ మూర్తి చిదంబరం లో ఉన్నాడు .ఆ మూర్తి వైభవం వర్ణించటానికి ఆది శేషుడు కూడా చాలడు అంటారు .శివ తాండవం లో సత్యం శివం సుందరం సమ్మిళితమై ఉంటాయని స్పష్టం చేశారు .కాలానికి ,కాల రాహిత్యానికీ ఈ శిల్పం మనోహరమైన ఉదాహరణ .సంప్రదాయం ఆధునికతల మేళ వింపు ఉన్న మూర్తి .శివ రామ మూర్తి బక్కపలుచగా నుదుట విభూతి ,కుంకుమ బొట్టుతో ఉండి మహా మహోపాధ్యాయ అప్పయ దీక్షితుల వంశానికి చెందిన వాడని పిస్తాడు .ఆయన తండ్రి గొప్ప సంస్కృత విద్వాంసుడు ,సివిల్ ఆఫీసర్ ,;;సుందర రామాయణం ‘’రచించిన కలంబూర్ సుందర శాస్త్రి .

1983 లో శివరామ శాస్త్రీ నటరాజ స్వామి విభూతిపై ప్రసంగిస్తూ అకస్మాత్తుగా  గుండెపోటుతో 74 వ ఏట మరణించి నటరాజ సాన్నిధ్యాన్ని చేరుకొన్న ధన్య జీవి .మూర్తి గ్రేట్ బ్రిటన్ ,ఐర్లాండ్ దేశాల రాయల్ ఏషియాటిక్ సొసైటీల గౌరవ ఫెలోషిప్ పొందినవాడు .కంచి పరమాచార్యులు శ్రీశ్రీ చంద్ర శేఖరేంద్ర స్వామివారు   మూర్తిని సన్మానించి ‘’విచిత్ర చిత్త’’అనే సార్ధక బిరుదు ప్రదానం చేశారు .8 వ శతాబ్దపు పల్లవ రాజు మహేంద్ర వర్మకు ఈ ‘’విచిత్ర చిత్త’’బిరుదు ఉండేదని,కుడుమియామలై లోని మహేంద్ర వర్మ చెక్కించిన బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక శిల్ప విగ్రహం వద్ద శిలా శాసనం పై ఉన్నదట .ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొన్న మూర్తికి 1975 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ పురస్కారం అందజేసి సన్మానించింది .దేశ విదేశాలలో అనేక యూని వర్సిటీలకువెళ్లి గెస్ట్ లెక్చర్లు ఇచ్చాడు .దాదాపు 35గ్రంధాలు రచించాడు .మూర్తి మరణానంతరం బాంబే ఏషియాటిక్ సొసైటీ ‘’కాంప్ బెల్ మెమోరియల్ గోల్డ్ మెడల్ ‘’ను అందజేసింది .

శివరామ మూర్తి రచనా సర్వస్వం

  •  Mahabalipuram (1952)
  • Early Eastern Chalukya Sculpture (1962)
  • Indian Epigraphy and South Indian Scripts (1966)
  • Nataraja in Art, Thought, and Literature (1974)
  • L’Art en Inde (1977)
  • Chitrasutra of the Vishnudharmottara (1978)
  • Kalugumalai and Early Pandyan Rock-cut Shrines
  • Sanskrit Literature and Art: Mirrors of Indian Culture
  • La stupa du Barabudur (in French)
  • An Album of Indian Sculpture
  • Rishis in Indian art and literature
  • Royal conquests and cultural migrations in South India and the Deccan
  • Vijayanagara paintings
  • Numismatic parallels of Kalidasa
  • Sculpture inspired by Kalidasa
  • Sri Lakshmi in Indian art and thought
  • Ramo Vigrahavan dharmah-Rama embodiment of righteousness
  • Birds and animals in Indian sculpture
  • Sanskrit literature and art
  • Mirrors of Indian culture
  • Satarudriya – Vibhuti of Siva’s Iconography
  • Panorama of Jain art
  • Shiva
  • Ethical fragrance in Indian art and literature
  • Indian Painting
  • Approach to nature in Indian art and thought
  • The art of India
  • Expressive Quality of Literary flavour in Art
  • Early Andhra Arts and Iconography
  • Indian Bronze
  • The Chola temples: Thanjavur, Gangaikondacholapuram & Darasuram
  • Early eastern Chalukya sculpture
  • Harappan Art
  • Indian epigraphy and South Indian scripts
  • Bhagavatpada-Sri Sankaracharya
  • Epigraphical echoes of Kalidasa
  • 5000 years of the art of India: with Mario Bussagli
  • An Introduction to South Indian Temple Architecture and Sculptures, co-authored with F. H. Gravely
  • Illustrations of Indian Sculptures, co-authored with F. H. Gravely
  • Guide to the Archaeological Galleries, co-authored with F.H.Gravely
  • Notes on Hindu Images, co-authored with F. H. Gravel

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-1-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో ‘’హృదయ దఘ్ని

కోపం లో’’జమదగ్ని ‘’ఆప్యాయతలో  ‘’హృదయ దఘ్ని  ‘’

img_20170129_130832

శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మ గారి గురించి వారి వైదుష్యాన్ని గూర్చి చిన్నప్పటి నుంచీ  వింటూనే ఉన్నాను .మా ఉయ్యూరు వాడూ మాకు మేనమామ వరుసా అయిన సూరి శ్రీరామ మూర్తి అనే ఆయన సినిమా డిస్ట్రి బ్యూషన్ లో  పని చేసేవాడు  .వాళ్ళ అమ్మ మంగమ్మగారు మాకు చాలా ఆత్మీయురాలు .ఆయన అన్న సోమయాజి గారు నూజి వీడు లో ఉండేవాడు .ఆయన ఆకారం తమాషా గా అని పించేది .ఎప్పుడూ అన్నదమ్ములిద్దరూ ముక్కు పొడుం పీల్చేవారు .ఆ సోదరుల అను బంధం అద్వితీయం .మంగమ్మ మామ్మ,కొడుకు శ్రీరామ మూర్తి మామయ్య ఉయ్యూరులో పుల్లేరు కాలువ దగ్గర స్వంత పెంకు టింట్లో ఉండేవారు .వీళ్ళ అమ్మాయి కమల మా చిన్నక్కయ్య దుర్గ క్లాస్ మేట్.ఈ కమలను మా రేపల్లె బాబాయి అంటే మా మామ్మ అక్క గారు మహాలక్షమ్మగారి గారి కొడుకు  రాయప్రోలు శివ రామ దీక్షితులు పెద్దకొడుకు సుబ్బులు అని మేము ఆప్యాయంగా పిలిచే సుబ్రహ్మణ్యం అన్నాయ్ కిచ్చి ఉయ్యూరు లోనే పెళ్లి చేశారు .సూరి శ్రీరామ మూర్తి బావ గారింటి పేరు చెరుకుపల్లి వారు .ఆయన నూజి వీడు కాలేజి లో లెక్చరర్ అని జ్ఞాపకం .ఆయన పేరు జ్ఞాపకం లేదు .నూజి వీడు సూరి వారి కి అక్కడ రామ మందిరం ఉండేది దాని నిర్వహణ అందులో పెద్దాయన సీతారామాంజ నేయులు గారు చూసేవాడు .ఆయన చిన్న తమ్ముడు రఘు రామ చంద్ర మూర్తి కి ఉయ్యూరు లో మా మేనమామ గుండు గంగాధర శాస్త్రి గారి పెద్దమ్మాయి రాజ్య లక్ష్మినిచ్చి పెళ్లి చేశారు .పెద్ద తమ్ముడు రామ చంద్రమూర్తి బెజవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజి లో హెడ్ గుమాస్తా తర్వాత ఏం యి వో .ఇదే కాక మా అమ్మ కు తల్లి తరపు అంటే మా అమ్మమ్మ తరపు చుట్టరికం కూడా ఉండేది .దీనితో తరచూ నూజి వీడు వెళ్ళే వాళ్ళం .అప్పుడే శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మగారిని ఒక సారి చూసిన జ్ఞాపకం .తరువాత కాస్త సాహిత్య జ్ఞానం ఒంట బట్టాక జమదగ్ని గారి కధలు కవితలు వ్యాసాలూ చదవటం వలన ఆయన సాహిత్యోపజ్న కొంత తెలిసింది .విశ్వనాధ వారి వీర భక్తులని గొప్ప ఆతిధ్యాన్ని ఇస్తారని ,మహా నిస్టాగరిస్టులని ఆయన కధలు జాతీయ స్థాయిలో ఉండేవని   బ్రహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్య గారి రచనల వలనతెలిసింది .జనవరి 11 న విహంగ మహిళా వెబ్ పత్రిక వారు నాకు రాజమండ్రి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం లో వైస్ చాన్సలర్ శ్రీ ఎస్ వి సత్యనారాయణ గారితోసన్మానం చేసిన తర్వాత శ్రీ శలాక రఘు నాద శర్మ గారిని దర్శించటానికి వెళ్లాం . శర్మ గారు వారి శ్రీమతి మా పట్లచూపిన ఆదరం మరువలేనిది .నాకూ  మానవడు చరణ్ కు శర్మ గారు శాలువాలు కప్పి ,మా శ్రీమతి ప్రభావతికి భార్యగారి చేత చీరే సారే పెట్టించి ఆ దంపతులు చూపిన బంధు ప్రేమ విలువ లేనిది  అప్పుడు మా మధ్య జరిగిన సంభాషణలో వారి స్వగ్రామం గొల్లపల్లీ నూజి వీడు బంధుత్వం ,జమదగ్ని శర్మగారు శర్మగారు తన మేనత్త  కొడుకు అని చెప్పటం  సూరి శ్రీరామ చంద్ర మూర్తిభార్య శర్మగారి శ్రీమతికి దగ్గర బంధువని అన్నీ తెలిశాయి .శర్మగారిని 2015 ఉగాదికి సరసభారతి తరఫున ఆహ్వానించి మా తలిదండ్రుల స్మారక పురస్కారం అందజేశాం .శర్మగారు తమ రచనలను నాకు ఆప్యాయం గా బహూకరించారు .అందులో ఫిబ్రవరి 11 న కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో శాసన సభ ఉప సభా పతి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారికి అంకిత మివ్వ బోయేశ్రీ కృష్ణ దేవ రాయల ఆముక్త మాల్యద కావ్యం ఆధారంగా రాసిన   ‘’యామున ప్రభు రాజనీతి ,’’అనే  పుస్తకమూ కల్ప వృక్ష వాగ్వైభావమూ మొదలైన విలువైన పుస్తకాలున్నాయి . రాజనీతి ,భారత వైశిష్త్యమూ చదివేశాను .ఇప్పుడు కల్ప వృక్షం పైకి చేరుతుంటే అందులో జమదగ్ని దంపతులకు   ఈ పుస్తకం అంకిత మిచ్చినట్లు ,ఆయన సాహిత్య ఆధ్యాత్మిక కీర్తి వైభవాన్ని కళ్ళకు కట్టేట్లు వర్ణించిన రఘునాధ శర్మగారి వ్యాసం    బాగా ఆకర్షించింది .అందులోని విషయాలు చాలామందికి తెలిసి ఉండక పోవచ్చుననే భావనతో మీ ముందు ఉంచుతున్నాను .ఈ రచనకు ఇంతటి నేపధ్యం ఉంది .

శ్రీ జమదగ్ని శర్మ గారిని రఘు నాద శర్మగారు ‘’మానస గురువు ‘’గా భావించారు .జమదగ్ని గారు జీవిత చరమాంకం శ్రీకాళ హస్తి లో గడిపుతూ అను నిత్యం శ్రీ కాళ హస్తీశ్వర సందర్శనం తో పులకించి పోయేవారట .అక్కడే భౌతిక దేహాన్ని ఒక యోగిలాగా వదిలేశారట .ప్రతి  ఏడాది మాఘ పౌర్ణమినాడు సువర్ణ ముఖీ నదీ స్నానం చేసి , శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వేంచేసి విశిష్ట పూజలు అందుకొంటారు .’’అపర ధూర్జటి ‘’అయిన శ్రీ జమదగ్ని శర్మగారు ఆ పవిత్ర దినాన ఉదయం 10 గంటలకు స్వామి వారి సన్నిధిలో అతి సమీపాన కూర్చుని నిశ్చల మనసుతో శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ,సుమారు మూడు గంటలు సాగిన శ్రీవారి విశిష్ట ఆరాధన మానసికంగా దర్శిస్తూ ,తరువాత బాహ్య ప్రపంచం లోకి వచ్చారట ,.వారి ముఖం లో ఏదో గ్లాని కనిపించి డాక్టరు ను పిలవ మంటారా అని అడిగితె వద్దు రిక్షా పిలవమని చెప్పి ,గూడు రిక్షాలో కూర్చుని ఇంటికి వెడుతూ ,దారిలోనే వెనక్కి వాలిపోయి  తుది శ్వాస విడిచారట  .అంటే శివ ధ్యాన పరాయణులై శివైక్యం చెందారన్నమాట ఆయన నోటి నుండి ఎక్కువగా ‘’శివోహం శివోహం ‘’అనే మాటలే విని పించేవట.ఎవరితో ఎప్పుడు ఏది మాట్లాడినా ‘’మంచిది ,మంచిది ‘’అనే ఊత పదం వాడేవారట .మంచి మనిషికి మంచి మరణం అన్నమాట .

జమదగ్ని గారు తెలుగు పాఠం బోధిస్తుంటే తరగతి గదులూ ,పరిసరాలూ ని౦ డిపోయేవట.క్రమ శిక్షణకు ఆయన అత్యంత ప్రాదాన్యమిచ్చేవారు .అతిక్రమిస్తే సహించేవారు కాదు .విద్యార్ధులపై చేయి కూడా చేసుకొనే స్థితి కూడా ఉండేదట .కానీ దేనికీ జంకే వారు కాదట. విద్యార్ధి లోకానికి జమదగ్ని అంటే హడల్ –ఆయన పాఠంఅంటే మహా ఆదరం .కాళిదాసు అన్నట్లు ‘’అధ్యష్యుడూ ,అభి గమ్యుడూ’’ఆయన అన్నారు శలాక వారు .

జమదగ్ని గారికి పద్య కవితలో  విశ్వనాధ సత్యనారాయణ గారు ,కధలలో మునిమాణిక్యం నరసింహా రావు గారు ,కావ్య విమర్శలో ఆచార్య భూపతి లక్ష్మీ నారాయణ గారు ,వేదాంత విద్యలో బ్రహ్మశ్రీ లంక నరసింహ శాస్త్రి గారు గురువులు .రాజ మండ్రిలో వేదాంత విద్య నేర్చుకోవటానికి జమదగ్ని గారు మడి కట్టుకొని ,ఉద్ధరిణ ,పంచ పాత్ర తీసుకొని గురువు గారింటికి వెళ్ళేవారట .విధి నిర్వహణలో అలసతచూపించలేదు ,అధికారులచేత మాట పడని వ్యక్తిత్వం ఆయనది .

సాహిత్యం లో లబ్ధ ప్రతిష్టులైన శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి ,మధునా పంతుల సత్యనారాయణ ,మల్లంపల్లి శరభయ్య ,బాలగంగాధర తిలక్ గార్లతో సాన్నిహిత్యం బాగా ఉండేది .శరభయ్య గారు రాజమహేంద్ర పురవాసి అయినా జమదగ్ని గారింట నే అనేక పర్యాయాలు భోజనం చేసేవారట .అంతటి ఆత్మీయత వారిది .మానాప్రగడ శేషసాయి ,చామర్తి కనక ప్రవాసి వంటి మహా వ్యక్తులు ‘’జమదగ్ని గారు మా గురువుగారు ‘’అని జబ్బ చరఛి  చెప్పుకొని గర్వ పడే వారట .తన విద్యార్దీ ,తనకంటే చిన్నవాడూ అయిన భమిడి పాటి సదా నంద ను జమదగ్ని గారు ఆదరించిన తీరు అపూర్వంన్నారు శలాక వారు .

తలిదండ్రుల వార్ధక్యం లో   జమదగ్ని గారు చేసిన సేవ ‘’న భూతో న భవిష్యతి ‘’అన్నట్లు ఉండేది .తండ్రిగారికి నిత్యం స్నానం చేయించటం ,సంధ్యావందనం చేయించటం ,ఎక్కువ గంటలు వారి వద్ద గడపటం ,వైద్యం విషయం లో యెంత ఖర్చు అయినా లెక్క చేయకపోవటం ,యెంత శ్రమ అయినా పడటం జమదగ్ని గారి ప్రత్యేకత .కళాశాల డ్యూటీ ముగించి ఇంటికి రాగానే తలిదండ్రుల వద్ద చేరి ఆప్యాయంగా సంభాషించి వారి మనసులకు హాయి కలిగించటం అందరినీ అబ్బుర పరచేది .అబ్బాయి ఎప్పుడు వస్తాడా అని ఆ తలి దండ్రుల ఎదురు చూపు అంతకంటే విశేషమైనది .అప్పటికి జమదగ్ని గారి వయసు 50దాటింది అయినా అ పుత్ర ప్రేమ మాతా పితర ఆరాధనా అలానే కోన సాగింది .తన పిల్లలు ,అన్నగారి పిల్లలే కాక ఎందరో విద్యార్ధులకు అన్న వస్త్రాలు కలిపించి చదువులు చెప్పించి ఉద్దరించారు .ఎవరినీ ఏనాడూ మందలించటం జరగలేదట .తన జీవిత విధానం తో వారిని సంస్కరించేవారట .ఆయన నిబద్ధత అది .జీవితాంతం దాన్ని కాపాడుకొన్నారు .

పింగళి లక్ష్మీ కాంతం గారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నప్పుడు జమదగ్ని గారు స్నాత కోత్తర విద్యకు ప్రవేశం కోసం కలిసి అడిగారు .జమదగ్ని గారి గురించి కాంతం గారికి బాగా తెలుసు. ఆయనకు సీటు ఇవ్వటం ఇష్టం కూడా .కాని ఆనాటి రాజకీయ పరిస్థితులను బట్టి ‘’జమదగ్నీ!నువ్వు ఖద్దరు కట్టటం మానేస్తే సీటిస్తా నోయ్’’అన్నారు .అప్పటికి జమదగ్ని గారి వయసు 20 .’’మాస్టారూ !మేము ఖద్దరు కట్టటానికీ  ,స్వాతంత్రోద్యమానికీ ఏమీ సంబంధం లేదు .మాకు ఖద్దరు చాలా పవిత్రం .అయినా మీరు చెప్పారుకనుక ఈ రోజు నుంచి ఖద్దరు కట్టే విషయం లో మరింత శ్రద్ధాసక్తులు   చూపిస్తాను ‘’అని చెప్పి బయటికి వచ్చేశారట .పింగళి సీటు ఇవ్వలేదని చెప్పక్కర లేదు అనుకొంటా .నమ్మిన సిద్ధాంతం పట్ల ఆయన నిబద్ధత అలాంటిది .

జమదగ్ని గారు మాంచి భోజన ప్రియులు .తింటారు బాగా తినిపిస్తారు .ఆయన ఆతిధ్యాన్ని గురించి మెచ్చుకోని వారు ఉ౦డేవారుకాదు .అనంత పురం లో పని చేసినప్పుడు సి. రామ కృష్ణా రెడ్డి అనే  యువ తెలుగు లెక్చరర్ ఉండేవాడు .ఆయన పాఠం బాగా బోధించాలి అనే తపన ఉన్నవాడు .జమదగ్ని గారింటికి వచ్చి రోజూ చెప్పబోయే పాఠాన్ని క్షుణ్ణంగా చెప్పించుకోనేవాడు .జమదగ్ని గారి ఆప్త కోటి లోని వాడు. రెడ్డి గారు పాఠం చెప్పించు  కోవటానికి వస్తే ముందు కడుపునిండా కాఫీ ఫలహారాలు పెట్టి ,అప్పుడు   ఆయన పాఠం చెప్పేవారు .అదీ జమదగ్ని గారి ప్రత్యేకత .

జమదగ్ని గారి తండ్రి శ్రీ చెరుకు పల్లి బుచ్చిరామయ్యగారు శ్రీశ్రీ కళ్యాణానంద భారతీ మహా స్వాములవారి శిష్యులు .తమ విజ్ఞాన పరంపరను ‘’శ్రీ కల్యాణి ‘’అనే భగవద్గీతా వ్యాఖ్యానం లో నిక్షిప్తం చేశారు శ్రీ విద్య ఉపదేశం పొంది జేవితాంతం శ్రీ చక్రోపాసన చేసిన ధన్యులు .వారి శ్రీమతి లక్ష్మీ నరసమ్మగారు శలాక వారి ఆడబడుచు.మాతృత్వం మూర్తీభవించిన పుణ్య మూర్తి  .జమదగ్ని గారి ధర్మపత్ని శ్రీమతి శేషమణి ఉత్తమ గృహిణి .శ్రీ శలాక రఘునాధ శర్మగారిని జమదగ్నిదంపతులు  పుత్రునిలా ఆదరించి అభి వృద్ధి లోకి తెచ్చారని ఆ ద౦పతులను తమ దంపతులు ‘’హృదయ పీఠం లో భద్ర పీఠం ఏర్పరచిపూజించు కొంటామని  ,’’కల్ప వృక్ష వాగ్వైభవం’’ను అంకిత మిస్తూ ‘ అత్యంత వినయం ,భక్తీ ప్రపత్తులతో ‘’మానస గురు సమర్చన  ‘’ లో శ్రీ శలాకవారు నివేది౦చారు.

శ్రీ జమదగ్ని దంపతుల ఫోటో జత చేశాను -చూడండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-1 -17-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 53-హనుమాన్ చాలీసాకు ఇంగ్లీష్ అనువాదం వ్యాఖ్య రాసిన –నిత్యానంద మిశ్రా

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

53-హనుమాన్ చాలీసాకు ఇంగ్లీష్ అనువాదం వ్యాఖ్య రాసిన   –నిత్యానంద మిశ్రా

ఉత్తర ప్రదేశ్ లో లక్నో కు చెందిననిత్యానంద మిశ్ర సైంటిస్ట్ కుటుంబం లో 24-8- 1982 న జన్మించాడు .తండ్రి జే. డి.మిశ్ర కేమిస్త్రి లో పి హెచ్ డి.జునా గడ్ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ లో గ్రౌండ్నట్ రిసెర్చ్ డైరెక్టర్ .నిత్యానంద గుజరాత్ యూని వర్సిటి నుండిఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో  ఇంజినీరింగ్ డిగ్రీ పొందాడు .ప్రస్తుతం ముంబాయ్ సిటీ గ్రూప్ లో ఉన్నాడు .

  సంస్కృతం లో డిగ్రీ లేక పోయినా ఆ భాషను అనర్గళం గా మాట్లాడేవాడు .చాలాపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు ఎన్నో పుస్తకాలను అనువదించాడు .స్వామి రామభద్రా చార్య శిష్యుడు .నిత్యానంద మిశ్రా హనుమాన్ చాలీసా పై విపుల వ్యాఖ్యానం’’మహావీరీ   ‘’ ఇంగ్లీష్ లో రాసి ప్రసిద్ధి పొందాడు తెచ్చాడు .తులసీదాసు చాలీసాకు ఇంగ్లీష్ లో దీనికి మించినది లేదని ప్రపంచవ్యాప్తం గా భావిస్తారు .ప్రతిపదానికి అర్ధం భావం తాత్పర్యం విశేష వివరణ ,స్వర లిపి ,నోటేషన్లుతో మహాద్భుతం అని పిస్తుంది .

 నిత్యానంద మిశ్ర సంస్కృతం లో ‘’ప్రజ్ఞా చక్షు రామ భద్రా చర్య ‘’మరియు ‘’మహేశ్వర సూత్రేషు రామకధ’’,’’సంభాషణా సందేశ్ ‘’రాశాడు .

  ఇంగ్లీష్ లో ‘’ఆల్గారిదమ్స్ ఇన్ ఎమెర్జింగ్ ఏసియన్ మార్కెట్ ,’’ఆధ్యాత్మ రామాయణం లో పాణినీయం ,గోస్వామి నారాయణ దాస అండ్ రామ భద్రాచార్య ,రామభాద్రాచార్య రచించిన శ్రీ భార్గవ రాఘవీయం ‘’కు సంపాదకత్వం వహించి ముద్రించాడు .మిశ్రా ప్రస్తుతం ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రికి స్టాటిస్టికల్ అనలిస్టు గా పని చేస్తున్నాడు .ఈతని తల్లి బయో కెమిస్ట్రీలో ఎం ఎస్ సి .చేసి కేంద్రీయ విద్యాలయం లో లెక్చరర్ .పెద్దక్క గాంధీ నగర్ ప్లాస్మా రిసెర్చ్ఇన్ స్టి ట్యూట్ లో సైంటిస్ట్ .

Inline image 1

                 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-17 –ఉయ్యూరు

 

 

    .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 51-మహా భారత౦పై విపుల వ్యాఖ్య రాసిన –అర్జున మిశ్ర

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

51-మహా భారత౦పై విపుల  వ్యాఖ్య రాసిన –అర్జున మిశ్ర

మహా భారతం పై తిరుగు లేని వ్యాఖ్య రాసిన అర్జున మిశ్రా 15 వ శతాబ్ది సంస్కృత మహా విద్వాంసుడు .గోవర్ధన పాథక్ కు సమకాలికుడు .బెంగాల్ లోని  వరేంద్ర చంపాహేత్తియగ్రామం లో జన్మించాడు .బెంగాల్ ను గణేష్ రాజ్య వంశం పాలిస్తున్న కల్లోల పరిస్థితులలో అంటే 1450 -1500 కాలంనాటి వాడు   అన్నమాట .ఆయన మహా భారతం పై 1534 లో రాసిన వ్యాఖ్యాన వ్రాతప్రతి ఇప్పటికీ ఉన్నది .మిశ్రా  వ్యాఖ్యానం ను17 వ శతాబ్దం లో మహా భారతం పై మహా గొప్ప వ్యాఖ్యానం రచించిన వారణాసి మహా పండితుడైన నీలకంఠ విస్తృతంగా ఉదాహరించాడు .ఇంతకంటే అర్జున మిశ్రా వివరాలు మనకు తెలియటం లేదు .

52-మహాభారతానికి  అద్వైత వ్యాఖ్యాన౦ రాసిన  –నీల కంఠ చతుర్ధర

17 వ శతాబ్ది ఉత్తరార్ధం లో వారణాసి లో నివసించిన సంస్కృత మహా పండితుడు నీల కంఠ చతుర్ధర .ఈయన జీవిత విశేషాలూ మనకు దొరకకపోవటం మన దురదృష్టం .గోదావరీ తీరం పై నివసించిన మహారాష్ట్ర సంస్కృత విద్వాంసుడు ఈయన .ఇక్కడ నుంచి వారణాసి చేరి వేద వేదా౦గ ,మీమాంస ,శ్రౌత,యోగ  శైవ ,తర్క ,అద్వైత వేదాంత శాస్త్రాలను గొప్ప గొప్ప విద్వాంసుల వద్ద అధ్యయనం చేసి పారమెరిగాడు .అప్పుడు వారణాసి మహా విద్వాంసుల కు నిలయంగా సరస్వతీ దేవి కొలువు కూటంగా భాసించేది..తన గురువులు లోకమాన్య ,లక్ష్మీ నారాయణ,నారాయణ తీర్ధ అని తానే చెప్పుకున్నాడు .నీలకంఠుని అద్వైత రచనలు వ్యాఖ్యానాలు మధుసూదన సరస్వతి ,నృసి౦హాశ్రమ ,అప్పయ్య దీక్షితులవంటి మహా మహోపాధ్యాయులను ప్రభావితం చేశాయి .

   మహా భారతం పై ‘’భారత భావదీప ‘’అనే ఉద్గ్రంధం అనితర సాధ్యంగా ,పరమ ప్రామాణికంగా నీల కంఠ రచించాడు .అద్వైత వేదాంత భూమికగా రచించిన ఈ వ్యాఖ్యానాన్ని మించినది ఇంతవరకు లేదు అని పించు కొన్నది .ఇప్పటికీ దానినే అందరూ ఉదాహరిస్తూ సందేహాలు తీర్చుకొంటూ ,భారత ఆమ్నాయం లోని అనర్ఘ  రత్న మాణిక్యాలను  దర్శిస్తూ ఆ వెలుగులలో జీవితం ధన్యం చేసుకొంటున్నారు .

  ఈ వ్యాఖ్యానాన్ని మొదటిసారిగా కేసరీమోహన్ గంగూలీ  ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రపంచ దృష్టికి తెచ్చాడు. దాని అనుభవం వర్ణనాతీతం . మహా భారతానికి మహా వ్యాఖ్యానం నీల కంఠ దీక్షితుని ‘’భారత భావ దీప౦  ‘’నిజంగానే వెలుగులు చిమ్మింది .

   సశేషం

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-17 –ఉయ్యూరు

 

    .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎందుకో అనుకొంటి గోంగూరకీ –‘’అందుకే ‘’అనుకొంటి గోంగూరకీ

ఎందుకో అనుకొంటి గోంగూరకీ –‘’అందుకే ‘’అనుకొంటి  గోంగూరకీ

జల్లికట్టు సమర్ధనంటే గొంగూరకీ –జనం మీద ప్రేమనుకొంటి గోంగూరకి

హోదా తో ముడిపెట్టుతుంటే  గొంగూరకీ –‘’అందుకే’’ అనుకొంటి గొంగూరకీ .

రాజభవనాలున్నవి ఎందుకంటె గొంగూరకీ –రంజకం గా పాలించటాని కనుకోంటి  గొంగూరకీ

రాసలీల కేంద్రమని తెలిసి గొంగూరకీ- ప్రజలలెట్లా సహి౦చేరు గొంగూరకీ 

గ్గ్లోబర్ నొటోరియల్ పోస్టు కోరేది  గొంగూరకీ  -‘’అందుకే ‘’నను కొంటి గొంగూరకీ .

పరా మర్శించటాని కొస్తే గోంగూరకీ-ప్రజలపై ప్రేమనుకొంటి గొంగూరకీ 

కావులింపు ముద్దు లేంటి గొంగూరకీ –‘’అందుకే ‘’అను కొంటి గోంగూరకీ .

వర్గ౦  మీద ప్రేమనుకొంటి గోంగూరకీ –తరిమి నిప్పుపెట్టట మేంటి  గోంగూరకీ

అసలు సమస్య నొదిలి పెట్టి గోంగూరకీ –చీటికీ మాటికాగ్రహ మేంటి గొంగూరకీ-

 పదవి లేకుంటేను మరి గోంగూరకీ -కుదురు గా కూర్చో నివ్వదు గో౦గూరకీ –

అంతా సవ్యంగ ఉంటె గో౦గూరకీ—కుంటిసాకు వెదికి గోంగూరకి

హల్ చల్ చేస్తారు  గోంగూరకీ- ‘’అందుకే ‘’ననుకొంటి గోంగూరకీ .

ఐదు రాష్ట్రాల ఎన్నికలూ గోంగూరకీ –అసలు సమస్య తేల్చలేదు గొంగూరకీ

రద్దు నోట్ల మాయ యేమో గొంగూరకీ –ఓటరోడి నాడి తెల్వదు గోంగూరకీ

జతలు కట్టి  దూకుతుంటే గోంగూరకీ—‘’అందుకే ‘’అనుకొంటి గోంగూరకీ .

‘’ముఖ్య మంత్రినే చేస్తార అరెస్ట్  గోంగూరకీ-అని గగ్గోలు పెట్టె నిన్న గోంగూరకీ

పగటి కలలబేహారి గోంగూరకీ-సంయమనం నేర్పెదెవ్వరు గోంగూరకీ

-కామెర్ల మాయ ఏమో గోంగూరకీ – అప్పుడే సీట్లో కూకున్నభ్రమ గో౦గూరకీ  

ఉచ్చ నీచాలొదిలి  వదురుతుంటేను గొంగూరకీ –‘’అందుకే ‘’అను కొంటి గోంగూరకీ .

అబ్బా అని పించాల్సిన సినీమాలు గోంగూరకీ-‘’గబ్బు ‘’కొట్టి కుదేలైతే గోంగూరకీ

 సమస్య నేదో కెలికి  గోంగూరకీ-భారీ డైలాగులతోను గోంగూరకీ

ప్రజా  ఉద్యమమంటూ గోంగూరకీ-పరి గెత్తుకోస్తుంటే గో౦గూరకీ

ఇదేమి నాయకులంటూ గోంగూరకీ-కుదేలై పోతుంటే జనం గోంగూరకీ

అసలు రంగు బయట పడితే గోంగూరకీ-‘’అందుకే ‘’అను కొంటి గోంగూరకీ

పనేమీ లేదా నీకు గోంగూరకీ- ఈ దురద పాముడేంది గోంగూరకీ

అని నన్ను నిలదీస్తే గోంగూరకీ-‘’అందుకే ‘’అనుకో౦డి మీరు గోంగూరకీ.

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-17 –ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

చిలిపి’’ వరద ‘’

చిలిపి’’ వరద ‘’

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వర రావు చిన్నతనం విశాఖ పట్నం లో గడిచింది .అప్పుడు ఆయన తండ్రి శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు గారు ఆంధ్రా యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా ఉండేవారు. ఆయనవల్లనే శ్రీ శ్రీ ,ఆరుద్రలు పాశ్చాత్య సాహిత్యపు పోకడలను గ్రహించారు .పుస్తకాలిచ్చి వారితో చదివి౦చేవారాయన .వరద బాల్యం విశాఖ లో రావి శాస్త్రి తో ‘’యేరా అంటే యేరా ‘’అను కొనే చిలిపి  స్నేహంగా గడిచింది .ఆచిలిపి చేష్టలను   రావి శాస్త్రి ‘’వరద స్మృతి’’లో ‘’అబ్బూరి నా ఆది గురువు ‘’వ్యాసం లో వివరంగా రాశాడు అందులోని కొన్ని ముఖ్య విషయాలు .

‘’అబ్బూరి వరద  ఆది గురువు ,నాచివరి గురువు కూడా ‘’అన్నాడు రావిశాస్త్రి .కొద్ది రోజులకు చనిపోతాడనగా వరద రావి కి ఫోన్ చేసి ‘’ఒరే శాస్త్రీ !బతికున్న వాళ్ళకంటే చచ్చిపోయిన వాళ్ళే అదృష్ట వంతులురా .కనుక నువ్వు ఏం దుఖించకు –విచారించకు ‘’అని చెప్పాడు .

19 32 లో విశాఖ ఏ వి యెన్ కాలేజీ లో శాస్త్రి సెకండ్ ఫాం ఒక సారి ఫెయిల్ అయి మళ్ళీ చదువుతుండగా అప్పుడొక ఎర్రటి కుర్రాడు స్పోటకపుమచ్చలతో వచ్చి చేరాడు .ఎక్కడినుంచి వచ్చావని శాస్త్రి అడిగితె ‘’బెజవాడ నుంచీ ‘’అని బెజవాడ విశాఖ కంటే గోప్పదనట్లు పోజిచ్చి చెప్పాడు .’’ఆడే వరద’’. .’’దేవుడు లేడు.నీకు తెలుసా ?’’అడిగాడు కుర్ర వరద కుర్ర శాస్త్రిని .ఆమాటకుతల్లీ తండ్రీ లేనివాడిలాగా  బెదిరిపోయాడు శాస్త్రి.అప్పుడు ప్రహ్లాదుని గురించి రహస్యంగా ఒక కద రాస్తున్నాడు శాస్త్రి .వరద మాటలకు భయపడి ఆ కద చి౦చేశాడు  ‘’దేవుడు ఉంటె మా చెల్లి ఎందుకు చచ్చిపోవాలి ?’’అన్నాడు బుడ్డి వరద .దీనిపై తానొక  ఒక గేయం రాశానని మర్నాడు తెచ్చి చూపించాడు బాలవరద .వరద రెండవ భాషగా  తెలుగు  తీసుకోవటం వలన ఏ డివిజన్ లో ,రావి సంస్కృతం తీసుకోవటం వలన బి డివిజన్ లో ఉన్నారు .ధర్డ్ ఫారానికి ఇద్దరూ బి డివిజన్ లో ఉన్నారు .

ఒకసారి తెలుగు మాస్టారు వరదను కొట్టాడు .అతని అన్న వాణీకుమార్ కు పిచ్చకోపం వచ్చి మేస్టార్ని ‘’మా తమ్ముడిని ఎందుకు కొట్టావు బయటికి రా చంపేస్తాను ‘’అన్నాడు .ఫోర్త్ ఫారం లో వక్తృత్వ పోటీల్లో వరద ఎక్కువగా పాల్గొనేవాడు .కన్యకాపరమేశ్వరి దేవాలయం పూజారి స్థానాపతి సత్యనారాయణ మూర్తి వద్ద వరద సంస్కృతం నేర్చాడు .సత్యనారాయణగారి భార్య రుక్మిణమ్మ దేవీ భాగవతం ను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించి విదుషీమణి .

ఆరుద్ర పినతండ్రి భాగవతుల నారాయణ రావు సైకిల్ కు మున్సిపాలిటీ పన్ను ఏడాదికి రెండుమ్ముప్పావలా కట్టక పొతే సైకిల్ లాక్కెళ్ళారు. ఆయన వరదకు మంచి దోస్త్ .అందుకని వరద స్నేహితులందరి దగ్గరా అణా బేడా ఎంత ఇస్తే అంత వసూలు చేసి పన్నుకట్టి సైకిల్ విడిపించి ఇప్పించాడు .ఆ రోజుల్లో రూపాయకు 8 సేర్ల బియ్యం వచ్చేవిట .సైకిల్ పన్నుకు 22 సేర్ల బియ్యం వచ్చేవని రావి రాశాడు .దీనితో నారాయణ రావు అందరికీ  బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాదట .అంత డబ్బు ఆ రోజుల్లో పోగు చేయటం చాలెంజ్ .దాన్ని చేసి చూపించినవాడు వరద .మేస్టర్లకు వరద ప్రియ శిష్యుడు

శాస్త్రికీ వరదకూ లెక్కలు రావు  ఫిఫ్త్ ఫాం ఫైనల్ పరీక్షల్లో లక్ష్మణరావు అనే లేక్కలమేస్టారు నాలుగైదు లెక్కలు చెప్పేశాడు .శాస్త్రి కనిపెట్టి దణ్ణం పెట్టి’’ షేక్స్ పియర్ మొహం ‘’పెడితే అతనికీ చెప్పి ఇద్దరూపాస్ అయేట్లు చేశాడు .ఎస్ ఎస్ ఎల్ సి కి వచ్చేసరికి వరద వరదలా విజ్రు౦భించాడు .అప్పుడు జస్టిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు జరిగితే వరద బాచ్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది .జస్టిస్ పార్టీమీద రోజుకొక బులెటిన్ రాసి వదిలేవాడు వరద .ఎవరికీ తెలిసేదికాదు .జయపురం రాజా విక్రమ దేవ వర్మ ఏ పార్టీనీ సపోర్ట్ చేయలేదు .వరద కు కోపం వరదలా వచ్చి ఆయన పై ‘’తొండం అప్పారావు ‘’అనే పేరు పెట్టి పెద్ద గేయం రాశాడు .అది అప్పట్లో పెద్ద పాప్యులర్ అయింది .బొబ్బిలి రాజా రామబ్రహ్మం అనే ఆయన్ను కాదని జస్టిస్ పార్టీ టికెట్టు అంకితం భానోజీ రావు ను సపోర్ట్ చేయమని ఆర్డర్ వేశాడు .దీనికీ మండింది వరదకి .

ఆ రోజుల్లో ‘’గోంగూర పాట’’అందరి నోట్లోనూ నానేది –అది –‘’నాను ఎల్లకెల్లకేల్లినాను గొంగూరకీ –తోటలన్నీ తిప్పినాడు గొంగూరకీ –దొడ్లన్ని తిప్పినాడు గొంగూరకీ –మాయ దారి నా కొడుకే గొంగూరకీ –చివరికి మంచమెక్కమన్నాడే గొంగూరకీ ‘’అనేది బాహా హిట్ సాంగ్ .అబ్బూరి వరద ఈ బాణీలో రామ బ్రహ్మం మీద పాటతో విరుచుకు పడ్డాడు –

‘’మేడలని కట్టావు రామ బ్రహ్మం –మిద్దేల్ని కట్టావు రామ బ్రహ్మం –స్టాండ్ స్టాండ్ అన్నావు రామబ్రహ్మం –స్టాండేను అన్నావు రామబ్రహ్మం –కానీ రాజా గారొచ్చారు రామబ్రహ్మం –సిట్టు సిట్టాన్నారు రామ బ్రహ్మం –సిట్టేను అన్నావు రామబ్రహ్మం –‘’ఈ పాట పిల్ల గాంగ్ అందరికీ నేర్పి రామబ్రహ్మం ఇంటి ఎదురుగా కూచుని పాడించేవాడు వరద .అప్పుడు తెన్నేటి విశ్వనాధం కాంగ్రెస్ కాండి డేట్ అంటే జస్టిస్ పార్టీకి వ్యతిరేకం కనుక భానోజీకీ వ్యతిరేకమే.పాట చివర్లో ‘’విశ్వనాధంకి  జై –రామ బ్రహ్మంకి తుస్ ‘’అని పించేవాడు .పాటపాడి గాంగ్ వెళ్ళిపోయేది రోజూ .వైశ్యులు కాంగ్రెస్ సపోర్ట్

వాళ్ళు ఒక పాట తయారు చేస్తే వరద బృందం వరద లీడర్షిప్  లో డాన్స్ చేస్తూ దాన్ని పాడేవాళ్ళు .-ఆపాట

‘’తెన్నేటి విశ్వ నాధమూ మన కాంగ్రేసు వారండీ –వారికి మన వోటు నిచ్చి ఖ్యాతి నిలపండి ‘’  .ఈ పాటను కోమట్లు వాళ్ళ ఆడవాళ్ళు చూడాలని వాళ్ళ ఇళ్ళముందు పాడించేవారు .ఇది గ్రహించి వరద శాస్త్రి తో ‘’ఒరేయ్ 1 వాళ్ళ కులం వాళ్ళు చూడాలని మన చేత గంతులేయి స్తున్నారు ‘’అని చెప్పి ఆతర్వాత ముఖ్య కేంద్రాలలోనే పాడి డాన్స్ చేశారు

తోటి  స్నేహితులందరూ ఒకరినొకరు ఒరేయ్ అనే పిల్చుకోనేవారు .అలా పిలవని వాళ్ళను వెలేసేవారు .ఇంటర్ ముందువరకు ఇలా నే సాగింది  పాత ముఠా అంతా మారి కొత్తజనం చేరారు ఏవండీ అని పిలవటం అప్పుడు గౌరవం .అది వరదకు నచ్చలేదు .అలా పిలిస్తే ‘’జెల్ల ‘’కొట్టే వారు .కనుక ఈ బాధ భరించలేక అందరూ ఒరేయ్ లోకి దిగారు .దీనితో వరద ‘’ఒరేయ్ ఒరేయ్ క్లబ్ ‘’ను ఏర్పాటు చేశాడు .ఇంటర్ లో ఒఏయ్ క్లబ్ ను ‘’యువజన సంఘం ‘’గా మార్చాడు .కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసిన వారిని ఇంకా విడుదల చేయకపోతే విడుదల చేయాలని పెద్ద యాజిటే షన్ తెచ్చాడు  వరద .ఇంటర్ లో స్టూడెంట్ యూనియన్ కార్య వర్గ సభ్యుడయ్యాడు. శాస్త్రినీ ఎలెక్ట్ చేయించాడు ..భమిడిపాటి కామేశ్వర రావు మాస్టారు రాసిన నాటకాల్లో తానూ వేషం వేసి రావి శాస్త్రి చేతా స్టేజి ఎక్కించాడు .1938 లో జపాన్ –చైనాపై అప్రకటిత యుద్ధం మొదలు పెట్టింది .అప్పట్లో మార్కెట్ అంతా జపాను సరుకులతో నిండిపోయేది .ఏ వస్తువైనా బేడా అర్ధణా .కాంగ్రెస్ వాళ్ళే వీటిని అమ్మేవారు .వరద షాపుల ముందు పికెటింగ్ నిర్వహించి ‘’డౌన్ విత్ ది సర్వీసెస్ ఆఫ్ జపాన్ గూడ్స్ ‘’అని నినాదాలు చేయించి ఆపించే ప్రయత్నం చేశాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో ఎం యెన్ రాయ్ అనుచరులయ్యారు అబ్బూరి తండ్రీ కొడుకులూ .కమ్యూనిస్ట్ లు తటస్థం .కాని వరద హిట్లర్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దేశాలకు సపోర్ట్ చేయాలన్న రాయ్ వాదం తో ఏకీభవించి సపోర్ట్ చేసి స్టూడెంట్ బలగాన్నీ సపోర్ట్ కు సన్నద్ధం చేశాడు .చిలిపి పనులలోనూ వరద కు ఒక ధ్యేయం ఆదర్శం దేశ భక్తీ ఉండేవి .అతన్నే అందరూ అనుసరించేవారు’’. దటీజ్ వరద’’.

గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-17 –ఉయ్యూరు



గబ్బిట దుర్గా ప్రసాద్                                

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హాస్యపు’’ వరద ‘’

హాస్యపు’’ వరద ‘’

మా శ్రీ మైనేని గోపాలకృష్ణగారు (అమెరికా )నాకు ఆప్యాయంగా అబ్బూరి వరద రాజేశ్వర రావు గారి స్మృతిగ్రంధం ‘’వరద స్మృతి ని ‘’27-10-16 న పంపారు .ఆనాడే చదవటం మొదలు పెట్టాను కానీ వరుసగా చదవటం కుదరక అప్పుడప్పుడు చదువుతూ ఈ మధ్య పది రోజులు నుంచి రాత్రిళ్ళు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఈ రోజు అంటే 25-1-17 కు అంటే సుమారు మూడు నెలలకు పూర్తి చేయగలిగాను .అందులో చాలా చాలా గొప్ప విషయాలు సాహిత్యం ,జర్నలిజం ,రాజకీయం పై ఉన్నాయి .ఆ విషయాలు ఈ కాలపు చాలా మందికి తెలియదని పించింది . ఇది నా అజ్ఞానం కావచ్చు .అందుకని అందులో కొన్ని విషయాలు కొన్ని ఆర్టికల్స్ గా రాయాలని అనుకొన్నాను .అందులో మొదటి సారిగా వరదలోని హాస్య ప్రియత్వాన్ని ఆయనభార్య శ్రీమతి అబ్బూరి చాయాదేవి తెలియ జెప్పిన  ,అందులోనూ ఆయన రిపబ్లిక్ డే పై  చెణికిన హాస్యపు తునకతో పాటు ‘’హాస్యపు ‘’వరద ‘’గా పారిస్తున్నాను . .

1-ఢిల్లీ లో రిపబ్లిక్ డే పెరేడ్ చూడటానికి అంత చలిలోనూ జనం వేలం వెర్రిగా వెళ్లి పేవ్ మెంట్ల మీద పడిగాపులు పడుతూ చూడటాన్ని ‘’ఇది వెర్రిపబ్లిక్ డే’’అన్నాడు వరద .

2-పుస్తకాల ఆవిష్కరణ  ను’’ఆవిష్కర్మ ‘’అని జోకాడు .

3-ఢిల్లీ లో వరద ఇల్లు మెయిన్ రోడ్డు పై ఉండటం తో వాహనాల రొద ఎక్కువగా ఉండేది. దాన్ని ‘’శబ్ద రత్నాకరం ‘’అన్నాడు ముద్దుగా .

4-‘’ఉదయం –సపరివార పత్రిక ‘’లో బాపు భాగవత చిత్రాలు కొన్ని వారాలపాటు వచ్చేవి .వాటిని చాయా దేవిగారు ఒక గుడ్డ మీద పొడుగ్గా వరుసగా అంటించి జాగ్రత్త చేసేవారు .చిత్రాలు ఒక దానిపై ఒకటి వచ్చేట్లు జాగ్రత్తగా మడతలు పెట్టి రిబ్బను తో  కట్టేవారు  .ఎవరికైనా చూపించాల్సి వచ్చినప్పుడు దాన్ని విప్పి పరిస్తే కృష్ణలీలలన్నీవరుసగా పరుచుకొని కనిపించేవి .దాన్ని వరద ‘’దేవుడి గోచి ‘’అని చమత్కరించేవాడు .

5-చాయా దేవిగారి అన్న కూతురు వారింటికి వచ్చింది .బయటనుంచి ఇంట్లో ప్రవేశిస్తున్న వరదకు ఆమె మాటలు వినిపింఛి  ‘’ఇంట్లో ఏదో’’ నీసు’’ వాసన వస్తోందే ‘’అన్నాడు .ఆ ఇద్దరూ వాసన చూసి మాకేమీ వాసన అనిపించటం లేదే అన్నారు అమాయకం గా .ఆయన నవ్వుతూ ఆ పిల్లతో ‘’నువ్వు’’ నీసు ‘’(niece ) వి కదే నువ్వు వస్తే నీసు వాసన వెయ్యదూ ?అందుకే నీసు వాసన అన్నానన్నాడు  .పగలబడి నవ్వుకున్నారు .

6-మేనకోడలు నృత్య ప్రదర్శన సావనీర్ ప్రచురణ ఆలస్యమైంది. ఆమె రోజూ గూటిస్తోంది ఎప్పుడేప్పుడని .విసిగిన వరద ‘’వీళ్ళు నన్ను సావనీరు బతకనీరు ‘’అన్నాడు .

7-ఏ గృహిణి అయినా చారు రుచిగా చేస్తే ‘’చారు శీల’’అవుతు౦దనేవాడు .

8-దూర దర్శన్ నేషనల్ నెట్ వర్క్ లో ‘’అప్నా ఉత్సవ్ ‘’చూస్తున్నరోజుల్లో ఎవరైనా బాత్ రూమ్ కు వెడితే ‘’అప్ నా’’ఉచ్చ’’వ్ కి వెళ్ళాడని చమత్కరించేవాడు .

9-పెళ్లి అయిన కొత్తలో జబ్బు చేసి బాగా చిక్కిపోయిన భార్య  చాయాదేవిని ‘సతీ డొక్కూ బాయ్ ‘’అని హేళన చేసేవాడు

10-. తిరుపతి వెంకన్న ‘’లార్డ్ వెంకటేశ్వర ‘’కాదు ‘’లడ్డూ వెంకటేశ్వర ‘’అనేవాడు .

11-ఇంటికి నేం ప్లేట్ తయారు చేయమని ఒకాయనకు ఆర్డర్ ఇస్తే అక్షరాలను సన్నగా పొడుగ్గా ఏదో రకంగా పూర్తీ చేసి తెచ్చాడు .ఆ అక్షరాలను చూసి ‘’ఇవి మామిడి పూడి వెంకట రంగయ్య గారి ‘’లా ఉన్నాయని గురువుగారైనా సంకోచం లేకుండా అనేశాడు .

12-కలర్ ప్రింటింగ్ వచ్చిన కొత్తలో రంగులు ముట్టుకొంటే అంటుకొనేట్లు’’ గాడీ ‘’గా చవుక బారుగా ఉండేవి .దీన్ని వరద ‘’పేపర్లు ముట్టుకొంటే ‘’కలరా ‘’ అంటుకొనేట్లుంది ‘’అన్నాడు .

13-దోమలకు ‘’ఓడో-మాస్ ‘’రాసుకోమని సలహా ఇస్తే ‘’ఓ దోమాస్ ‘’అని పిలుస్తుంటే కుట్టకుండా ఉంటాయా ?’’అన్నాడు

14-మార్క్సిస్ట్ లు ‘’దాస్ కాపిటల్ ‘’నుచీటికీ మాటికీ ఉదహరిస్తుంటే ‘’వీళ్ళు ‘’కేపిటల్’’ దాసులు ‘’ అని వ్యంగ్యబాణాలు సంది౦ చేవాడు వరద .

15-ఎప్పుడూ ఎవరో ఒకర్ని తిట్టేవాడిని ‘’పద్మ దూషణ్ ‘’అనేవాడు .

16-చాయా దేవి ఒక బొమ్మగీసి ‘’ఏమండీ’’ అగ్లీ ‘’గా ఉందా ?’’అని అడిగితే ‘’  అగ్లీగా ఉన్నవాళ్ళు మాత్రం లోకం లో లేరుటే! “’అని పరోక్షంగా ఆమెనే అన్నాడు .

17 –ఎప్పటికప్పుడు కొత్త చేతి కర్రలు కొనటం వరద సరదా .’’అప్పుడే కర్ర పట్టుకోన్నారేమిటి ?’’అని ఎవరో అడిగితే’’కట్టెలే మనకు చుట్టాలు కదా ‘’అని నగ్న సత్యాన్ని నర్మ గర్భంగా అన్నారు .

18-వరద చనిపోవటానికి సుమారు నెల ముందు ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయ భాస్కర రెడ్డి వరద ను అధికార భాషా సంఘ అధ్యక్షుని చేశారు .ఒక మిత్రుడు అభినది౦చటానికి వస్తే అప్పటికే 70 వ పడిలో ఉన్న వరద ‘’ఈ వయసులో రంభనిస్తే ఏం చేసుకోను? అని చమత్కరించాడు .మరో మిత్రుడితో ఈ విషయాన్నే ‘’పాత చింతకాయ పచ్చడి జబ్బు పడ్డ వాళ్ళకే ఇస్తారు ‘’అన్నాడు .

19-తల్లి అంటే వల్లమాలిన ఆరాధన వరదకు .ఆమె ముసలితనం లో చీటికీ మాటికీ ‘’వంట్లో బాగుండలేదు డాక్టర్ని పిలవరా ‘’అని అని చెబితే ‘’పైన దేవుడు పిలుస్తుంటే మళ్ళీ ఈ డాక్ట రెందుకే బాబూ’’అంటూనే కారేసుకొని డాక్టర్ కోసం పరిగెత్తే వాడు .

20-‘’వైద్యో నారాయణో హరిః’’   అంటే –వైద్యుడు వచ్చి ‘’నారాయణా’’ అంటే ,రోగి ‘’హరీ ‘’అంటాడు అని తమాషా అర్ధం చెప్పాడు వరద .

రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో

Inline image 1

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-17 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మీ సాహితీ సేవ నిరుపమానం

శ్రీ” పూర్ణ ”సుబ్బారావు”గార్లకునమస్తే –28 వ విజయవాడ పుస్తక మహోత్సవం లో రచయితల పుస్తకాల ప్రదర్శన ,అమ్మకాలకు ఒక స్టాల్ ను ఏర్పరచి రచయితల తరఫున అమ్మకాలకు బాధ్యత వహించి ,ఆ 11 రోజులూ కస్టపడి అమ్మకాలు చేబట్టి ,పాఠకులకు ,రచయితలకు సమ న్యాయం చేసి బహుశా దేశం లోనే మొదటి సారిగా ఆదర్శ వంతమైన ప్రణాలికను విజయవంతంగా అమలు చేసిన మీ ఇద్దరి సౌజన్యం మరువ లేనిది .

  మా సరస భారతి తరఫున 10 రకాల పుస్తకాలను మీరు ప్రదర్శనలో ఉంచి ,అమ్మగా వచ్చిన మా కు రావాల్సిన డబ్బు 17 20 రూపాయలను ఆంధ్రా బాంక్ చెక్ గాను ,మిగిలిన పుస్తకాలను మా కార్యదర్శి శ్రీమతి మాది రాజు శివలక్ష్మి ద్వారా అంద  జేసినందుకు ధన్యవాదాలు .  నాకు శ్రమ ఇవ్వకుండా శివ లక్ష్మి పుస్తకాలను ఉయ్యూరు నుండి ,మీకు చేర్చటం మిగిలినవి తానే  మళ్ళీ  అప్పగించటం లో ఆమె ,ఆమె భర్తగారి పాత్రా గణనీయం ..
   .ఇంతవరకు మేము అందరికి అన్ని  పుస్తకాలు ఉచితంగానే అందజేశాము . సరసభారతి మొట్ట మొదటి సారిగా పుస్తకాల ”అమ్మకం రుచి” ఇప్పుడే చూసింది .
  అలాగే” బుకుత్సవం ”లోరచయితలను ఆహ్వానించి ,ఖర్చులు  భరించి    ముఖా -ముఖి నిర్వహించి ,పారితోషికమూ అందించి ప్రోత్సహించించి ,దీనిలోనూ  దేశం లోనే మొట్ట మొదటి సారిగా అందరికి ఆదర్శ ప్రాయమయినందుకు , నిర్వహణ కమిటీ తోపాటు మిమ్మల్నీ అభినందిస్తున్నాను -దుర్గా ప్రసాద్ -సరసభారతి -ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 49-తత్వ చింతామణి ప్రతిభ కర్త –సచ్చిదానంద మిశ్ర (1971 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

49-తత్వ చింతామణి ప్రతిభ కర్త –సచ్చిదానంద మిశ్ర (1971 )

1-3-1971 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోబస్తీ గ్రామం లో  జన్మించిన వారణాసి సంస్కృత మహా విద్వాంసుడు సచ్చిదానంద మిశ్ర .ఆయన మాతృవిద్యాలయం సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం .బెనారస్ హిందూ యూనివర్సిటిలో ఫిలాసఫీ, రెలిజియన్ ప్రొఫెసర్గా పని చేశాడు . .ఆయన సంస్కృత భాషా సేవను గుర్తించి ఆయనకు 2009 లో రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ‘’మహర్షి బాదరాయణ వ్యాస పురస్కారం ‘’ప్రదానం చేశారు .సంస్కృత వ్యాకరణం భారతీయ ఫిలాసఫీలపై గొప్ప అధ్యయనం చేసి గ్రంధాలు రచించాడు .అందులో ముఖ్యమైనవి ‘’తత్వ చింతామణి ప్రతిభ ‘’,మానసోల్లాసం – మానసోల్లాస వార్ధినిఅనే ఆనంద కుమార వ్యాఖ్యతో,ఆపదేవ వ్యాఖ్యతో సదానందుని వేదాంత సార ,న్యాయ దర్శన్ మే అనుమాన ,వ్యుత్పత్తి వాద హిందీలో విపుల వ్యాఖ్యతో రచించాడు

Inline image 2

50-సంస్కృతం –మానవ భాషా పరిణామం పై పరిశోధించిన –సంపదానందమిశ్ర (1971 ). 

ఒరిస్సాకు చెంది ,పాండిచ్చేరి సంస్కృత విద్వాంసుడైన సంపదానంద మిశ్రా 17-11-1971 న జన్మించాడు .కుటుంబం సంస్కృత విద్యలో పునీతమైంది .ఉత్కల్ యూని వర్సిటి నుండి సంస్కృతం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొంది ,పాండి చేరి యూని వర్సిటిలో డా వెంపటి కుటుంబ శాస్త్రి వద్ద సంస్కృతం లో ఎంఫిల్ చేసి ,స్వర్ణ పతకం అందుకున్నాడు .’’సంస్కృతం –మానవ భాషా పరిణామం ‘’పై ధీసిస్ రాసి ఉత్కల్ యూని వర్సిటి నుండి పి .హెచ్. డి.పొందాడు. పాండిచేరిలో అరవిందో సొసైటీ ఆధ్వర్యం లో నిర్వహింప బడుతున్న ‘’అరబిందో ఫౌండేషన్ ఫర్ ఇండియన్ కల్చర్ ‘’కు ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్నాడు .

  విద్యార్ధి ,అధ్యాపక బృందాలకు సంస్కృతం మంత్రం ,యోగ ,భగవద్గీత లపై నిత్యమూ మిశ్రా  వర్క్ షాపులు ,ట్రెయినింగ్ ప్రోగ్రాములు ,పునశ్చరణ తరగతులు నిర్వహిస్తూ ఉంటాడు .సంస్కృత, ఇంగ్లీష్, ఒడియా భాషలో పత్రికలకు వ్యాసాలూ  కవితలు పాటలూ రాస్తూ ఉంటాడు .సంగీతం కూరుస్తాడు .అరవింద సొసైటీ నిర్వహించే 24 గంటల సంస్కృత రేడియో ప్రోగ్రాం తోపాటు ,అనేక సంస్కృత ప్రాజెక్ట్ లను సమర్ధంగా మమేకమై నిర్వహిస్తాడు .

  మిశ్రా రాసినవి , సంపాదకత్వం లో వచ్చినవీ పుస్తకాలు –సాంస్క్రిట్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్ ,ఏ బుక్ ఆఫ్ హిమ్స్ అండ్ ప్రేయర్స్,ది సెంచరి ఆఫ్ లైఫ్ ఆఫ్ శ్రీ అరబిందో విత్ ది ఒరిజినల్ వెర్సెస్ ఆఫ్ భర్త్రు హరి ,అరబిందో అండ్ సాంస్క్రిట్ ,ది వండర్ దట్ ఈజ్ సాంస్క్రిట్ ,హాస్య రంజని ,ఎ హాండ్ బుక్ ఆఫ్ సాంస్క్రిట్ ప్రోసడి.

  వందేమాతరం ట్రస్ట్ కు మిశ్రా ముగ్గురు సభ్యులలో ఒకడు .500  మత,మతాతీత సంస్కృత గ్రంధాలను అనువాదాలతో సహా ప్రచురించటం ఈ సంస్థ లక్ష్యం .మూర్తి క్లాసికల్ లైబ్రరి ఆఫ్ ఇండియా కు దీటుగా ,అంతకంటే నాణ్యంగా ,సాధికారికంగా ,సాంస్కృతిక నేపధ్యం తో భారతీయ ఆత్మ ప్రతిబి౦బి౦చేట్లుసంస్కృత గ్రంధ ముద్రణ  తేట సరళ అనువాదాలతో ప్రచురించటమే ‘’వందేమాతరం ట్రస్ట్ ‘’ముఖ్య ఉద్దేశ్యం  అని మిశ్రా వినమ్రంగా ప్రకటించాడు .ఈ బృహత్ ప్రచురణ లో రామాయణ భాగవత భారతాలు వేదాలు ఉపనిషత్తులూ ఉండటం మనమందరం గర్వించదగిన విషయం .

 2012 లో సంపదానంద  మిశ్ర సంస్కృత సేవా ధర్మానికి భారత రాష్ట్ర పతి శ్రీమతి ప్రతిభా పాటిల్ నుండి ‘’మహర్షి బాదరాయణ వ్యాస పురస్కారం’’ అందుకున్నాడు .సంస్కృత వ్యాకరణ అధ్యయన, అధ్యాపనం లో మిశ్రా జీవితం చరితార్ధక మౌతోంది .

Inline image 1

  మూడవ గీర్వాణం అర్ధ శతం (50 )అయిన సందర్భంగా శుభాకాంక్షలతో

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-1-17- ఉయ్యూరు

    .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాటసారి రచించిన మనసుపుస్తకం సిరీస్ లో మొదటి నిజ జీవిత నవలిక “ఊగిసలాడకే మనసా” మరియు రవీణ

బాటసారి రచించిన మనసుపుస్తకం సిరీస్ లో మొదటి నిజ జీవిత నవలిక “ఊగిసలాడకే మనసా” మరియు రవీణ 

చవాన్ రచించిన స్ఫూర్తి కవితా సంపుటి “స్వజయ సారధి” పుస్తకావిష్కరణ మహోత్సవం

తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 20 సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో బాటసారి రచించిన నిజ జీవిత నవలిక “ఊగిసలాడకె మనసా” మరియు పూణే వాస్తవ్యులు రవీణ చవాన్ రచించిన స్ఫూర్తి కవితా సంపుటి “స్వజయ సారథి” పుస్తకాల ఆవిష్కరణ తెలంగాణా భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సభాధ్యక్షులుగా ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు నాళేశ్వరం శంకరం గారు వ్యవహరించగా, తెలుగురథం సాహితీ సంస్థ వ్యవస్థాపకులు  కొంపెల్ల శర్మ గారు స్వాగత పలుకులు, వందన సమర్పణలతో సభను  నిర్వహించారు.

ప్రగతి స్కూల్ చిన్నారులు అక్షర, సింధూర, వైష్ణవి మరియు మాయ గణపతి వందన సమర్పణ మరియు కూచిపూడి నృత్యంతో సభ కన్నులపండువుగా మొదలయ్యింది.

అనంతరం బాటసారి మరియు రవీణలు రచించిన వారి పుస్తకావిష్కరణ ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడి హరికృష్ణ చేతుల మీదుగా జరిగింది. బాటసారి రచించిన ‘ఊగిసలాడకె మనసా’ తొలి ప్రతిని శ్రీమతి రవీణ చవాన్ స్వీకరించగా, రవీనా చవాన్ రచించిన ‘స్వజయ సారథి’ వారి NRI తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మి తులసి మరియు శ్రీ సత్యనారాయణ స్వీకరించారు.

అనంతరం  మామిడి హరికృష్ణ మాట్లాడుతూ- సమాజానికి సందేశాన్నిచ్చే రచనలు రావాలని అన్నారు. దైనందిన జీవితంలో అందరికి ఎదురయ్యే అనుభవాలను సులువుగా అర్ధమయ్యేలా బాటసారి రచన ఉందన్నారు. చైతన్య పరిచే సూక్తులతో స్ఫూర్తిని రగిలించే కవితా సంపుటి ‘స్వజయ సారథి’ విశేషం అన్నారు.

అనంతరం విశిష్ట అతిథులైన అనంతపూర్ నుండి విచ్చేసిన ప్రముఖ కవి రాధేయ ఉమ్మిడిశెట్టి మాట్లాడుతూ- ఇవాళ వర్తమాన కవిత్వంలో వస్తున్న అస్తిత్వ వేదనలుగాని, ప్రాంతీయ రోదనలు గానీ ఎక్కడా ప్రతిధ్వనించవు. మానవతావాదం, సామాజిక చైతన్యం ప్రధాన భూమికగా మనతో స్వజాయ సారథి సంభాషిస్తుంది  అని అన్నారు. నెల్లూరు నుండి వచ్చిన అంతర్జాతీయ కవి శ్రీ పెరుగు రామకృష్ణ ఇరువురు రచయితలను, వారి రచనలను పొగిడారు.

ప్రముఖ రచయిత్రి శ్రీమతి స్వాతీ శ్రీపాద మాట్లాడుతూ ఇలాంటి సభల్లో యాభై శాతం మహిళలు కూడా ఉంటే బావుంటుందన్నారు.  స్వజయ సారథి పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఆ సంపుటిలో ఒక కవితను తీసుకొని కవిత ఎలా చదవాలి అని ప్రేక్షకులకి తెలియజేసి ఆకట్టుకున్నారు.

వంద సినిమాలకు పైగా మాటలు అందించిన ప్రముఖ తెలుగు సినీ రచయితా దివాకరబాబు మాడభూషి మాట్లాడుతూ భమిడిపాటి వారు సినీరంగప్రవేశానికి గేట్లు తెరిచారని, ఇప్పుడు ఈ భమిడిపాటి వాడైనా బాటసారిని తానూ ప్రోత్సహిస్తున్నానని చెప్పారు.

ప్రముఖ కవయిత్రి శ్రీమతి మిరేజ్ ఫాతిమా మాట్లాడుతూ బాటసారి రచన ఆడవారి మనసుని అర్ధం చేసుకొని రాసే రచనలని, ఈరోజుల్లో అలా ఎవరూ రాయడం లేదని, ప్రముఖ రచయిత, బాటసారి తన గురువుగా భావంచే చలం గారి ఫోటో ఎక్కడ చూసినా బాటసారి గుర్తొస్తాడని, మరో మైదానంలా తన రచన ఉంటుందని బాటసారి రచనలని కొనియాడారు.

ప్రముఖ రచయిత, కవి  RVSS గారు ఊగిసలాడకె మనసా నవలికను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఒక ప్రత్యేకమైన ఇతివృత్తాన్ని తీసుకుని నవలీకరించడంలో బాటసారి కృతకృత్యులైనారని, చేయి తిరిగిన రచయితలా కథనాన్ని నడిపించారని నవలలో ప్రతి పంక్తి చెపుతుందని అన్నారు. సన్నివేశాలన్నింటిని సహజంగా ఉండేలా రాయాలంటే ఎంతో కష్టమైన పని. స్త్రీ పాత్రలో పరకాయప్రవేశం చేసి మనోభావాలను చెప్పిన తీరు నిజంగా అద్భుతమనిపించింది అని కొనియాడారు. మౌనశ్రీ విశిష్ట అతిథిగా విచ్చేసిన సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ తన స్పందనను పాట ద్వారా పాడి వినిపించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులను స్వీకరించారు.

కొంపెల్ల శర్మ మాట్లాడుతూ మనసు కి విలువలుండాలని, విలువల వలువలు లేని జీవితం వ్యర్థమని అన్నారు. వారు ప్రత్యేకంగా ఇద్దరు రచయితలని సన్మానించారు.

పిసిపాటి ప్రసాద్ గారు మాట్లాడుతూ నాళేశ్వరం శంకరం గారు సూరత్ సాహిత్యోత్సవంలో చెప్పినట్టుగా గ్రంథాలయానికి పుస్తకాలను రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకు ఇవ్వవలసినదిగా కోరగా, ఆ గ్రంథాలయానికి ఉట్టికోట ఆళ్వారుస్వామి పేరుతో రాష్ట్రాల్లో గ్రంథాలయాన్ని మొదలు పెట్టవలసినదిగా కోరారు. వివిధ రాష్ట్రాల్లో కవులు రచయితలూ, కళాకారులు మరియు ఏ భాషలోకైనా తర్జుమా చెయ్యగల రచయితలను కూడా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కో ఆర్డినేటర్ అయినా రవీనా చవాన్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని పిసిపట్టి ప్రసాద్ గారు కోరారు.

అనంతరం ఈ పుస్తకావిష్కరణకు గుజరాత్ నుండి వచ్చిన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య చైర్మన్ పిసిపాటి ప్రసాద్ గారిని, ముంబై నుండి వచ్చిన ‘మాజ మహారాష్ట్ర తెలుగు మంచ్  ప్రధాన కార్యదర్శి అశోక్ కంటే గారిని మామిడి హరికృష్ణ సన్మానించారు. రచయితలు మామిడి హరికృష్ణ గారిని నాళేశ్వరం శంకరం గారిని సన్మానించగా విశిష్ట అతిథులని, ఆత్మీయ అతిథులైన డా. అశోక్ బాబు, మురళీధర్ అడ్ల మరియు  విజయ్ కుమార్లను, సీనియర్ జర్నలిస్ట్ GVLN మూర్తి, వాట్సాప్ గ్రూప్ కవిసమ్మేళనం వ్యవస్థాపకులు  మేకా రవీంద్ర గారిని కూడా మామిడి హరికృష్ణ సన్మానించారు. డా. అశోక్ బాబు, మేక రవీంద్ర, శ్రీమతి ఇందిరా, శ్రీ RVSS శ్రీనివాస్, మధుసూదన్ మరియు తాళపత్ర గ్రంథ పరిశోధకుడు కావూరి శ్రీనివాస్ ఆశీస్సులతో రచయితలిద్దరిని సన్మానించారు. రచయితలకు అభిమానులైన ముఖపుస్తక స్నేహితులు, ఆత్మీయులు తమ ఇష్టమైన రచయితలను సన్మానించుకొని అభినందనలు తెలియజేసారు. పసందైన విందు భోజనం రచయితలు ఏర్పాటు చేయగా పుస్తకావిష్కరణ సభ ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుని ఆత్మీయుల నడుమ సంతోషంగా ఘనంగా ముగిసింది… @ మీ తెలుగువేదిక

*********************************

పుస్తకాలు కావాల్సిన వారు, డిస్ట్రిబ్యూటర్స్, పుస్తక విక్రేతలు సంప్రదించాల్సిన వివరాలు:

Email: teluguvedika.net

Phone number: 9922 927 527

“ఊగిసలాడకే మనసా” : వెల: 50 రూపాయలు

“స్వజయ సారథి” : వెల: 75 రూపాయలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3- 48-లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాపీఠ సంస్థాపకుడు –మండన మిశ్ర (1929 -2001)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3-

48-లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాపీఠ సంస్థాపకుడు –మండన మిశ్ర (1929 -2001)  

మండన మిశ్ర అంటే ఆది శంకరాచార్యుల శిష్యుడు కాదు ఆధునిక భారతం లో  సంస్కృతానికి విశేష వ్యాప్తి తచ్చిన రాజస్థాన్ సంస్కృత మహా విద్వాంసుడు .7-6-1929 న రాజస్థాన్ లో జయపూర్ కు 50కి .మీ దూరం లో ఉన్న అనూతియా అనే చిన్న గ్రామం లో జన్మింఛి ,తన సంస్కృత భాషా సేవా వ్యాప్తితో దాన్ని ప్రపంచ ప్రసిద్ధం చేసిన మహనీయుడు.తండ్రి హిందూ పండితుడు .తల్లి సామాన్య గృహిణి . ఏడుగురు సంతానం లో మిశ్రాపెద్దవాడు .శ్రీమతి భారతి మిశ్ర ను వివాహమాడి,ఒక కుమార్తె ముగ్గురు కుమారులకు తండ్రి అయ్యాడు కుమార్తె ఈ  మధ్యనే చనిపోయింది .పెద్దకుమారుడు భాస్కర మిశ్ర  లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ .

  ప్రాధమిక విద్య స్వగ్రామం లో చదివి ,ఉన్నత విద్య పట్టాభి రామశాస్త్రి  అనే గొప్ప విద్వాంసుని వద్ద అమర్సార్ లోనేర్చాడు .ఈ గురు శిష్య సంబంధం ఆదర్శమై ప్రాపంచ వ్యాప్తి ప్రసిద్ధి చెందింది .సంస్కృత భాషా వ్యాప్తికి అంకిత భావం తో   విశేష సేవ,కృషి  చేసిన ఏకైక వైస్ చాన్సలర్ గా దాదాపు అందరు భారత ప్రధానమంత్రులు ,రాష్ట్రపతులు మిశ్రాను గుర్తించి  అభినందించి ,అమిత గౌరవం చూపారు .మండన మిశ్ర నేతృత్వం లో ఒక బృందం అమెరికాకు వెళ్లి అక్కడ సంస్కృత విద్యావ్యాప్తికి బీజారోపణచేసి ,ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది .

  జైపూర్ లోని మహా రాజా సంస్కృత  కాలేజి లో లెక్చరర్ గా జీవితం ప్రారంభించిన మిశ్రా ,సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .పండిత మదనమోహనా మాలవ్యా స్థాపించిన సంస్కృత అసోసియేషన్ కు అనుబంధంగా ఏర్పడిన ‘’అఖిలభారత సంస్కృత సాహిత్య సంస్థ ‘’కు డా మండన మిశ్ర 1956 లో మంత్రిగా ,1959 లో మినిస్టర్ –ఇన్ చీఫ్ గా ఎన్నుకోబడ్డాడు .అప్పుడే అఖిలభారతీయ సంస్కృత సాహిత్య సంస్థకు సరైన దీటైన నాయకుడు అవసరమయ్యాడు .తన శక్తి యుక్తులు ధారపోసి ,సంస్థ శాఖలను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేసి వ్యాప్తి చేశాడు .శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి మండన మిశ్ర లోని అకు౦ఠిత దీక్షను గుర్తించి  ,రాజస్థాన్ ప్రభుత్వం నుంచి ఆయన సేవలను తీసుకొని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యా పీఠం కు శాశ్వత డైరెక్టర్ ను చేశాడు .

  మిశ్రా ఆలోచనలతో ‘’ప్రపంచ సంస్కృతశతాబ్ది ఉత్సవాలు ‘’రూపు దిద్దుకొని ,భారతదేశం లో సంస్కృతానికి ఒక కొత్త యుగాన్ని సాధించాడు .ఇది ఫలవంతమై ,మిశ్రా చొరవ కృషి వలన 1961 లో కలకత్తా లోచారిత్రాత్మకంగా ‘’అఖిల భారతీయ సంస్కృత సాహిత్య సంస్థ ‘’ఏర్పడి భారత ప్రధమ రాష్ట్రపతి డా .రాజేంద్ర ప్రసాద్ అమృత హస్తాలమీదుగాప్రారంభోత్సవం జరుప బడింది .ఈ సభ దిగ్విజయంగా జరిగి ఢిల్లీ లో ‘’సంస్కృత విద్యా పీఠం ‘’ఏర్పాటు కు మరొక చారిత్రాత్మ తీర్మానం చేయబడింది.డా రాజేంద్ర ప్రసాద్ గారి పూనిక, సలహా ,అత్యున్నత విద్యావేత్తలైన పంజాబ్ గవర్నర్ శ్రీ నరహరి విష్ణు ,భారత ప్రభుత్వ హోం శాఖ స్టేట్ మినిస్టర్ శ్రీ బలవంత నాగేష్ దత్తా ,ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ శాంతి ప్రసాద్ మొదలైనవారు రాజస్థాన్ ప్రభుత్వం తో సంప్రదించి డా మండన మిశ్రా సేవలను ఢిల్లీ లో స్థాపించే సంస్కృత విద్యా పీఠానికి అవసరమని నొక్కి చెప్పి ఒప్పించి ,1962 లో ఢిల్లీ సంస్కృత విద్యా పీఠాన్ని మిశ్రా ఆధ్వర్యం ఏర్పాటు చేశారు .

   ఆ కాలం లో సంస్కృత విద్యా బోధనకు నిధులు పెద్దగా ఉండేవికావు .కేంద్ర ప్రభుత్వం సంస్కృత విద్యా సంస్థల కు ఏడాదికి కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే అందజేసేది .అది ఏమూలకూ చాలేది కాదని గ్రహించిడా మిశ్రా,ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి 95శాత౦ ఆర్ధిక సహాయాన్ని అన్ని సంస్కృత విద్యా సంస్థలకు అందజేసేట్లు కృషి చేసి సంస్థలకు ఆర్ధిక పరి పుష్టి కలిగించాడు .దీని ఫలితం గా ఇప్పుడు ఆ సంస్థలకు లక్షలాది కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూరుతున్నాయి .దేశం లోని అన్ని సంస్కృత సంస్థలను ఆర్ధికంగా బలోపేతం చేసి సంస్కృత విద్యా వ్యాప్తికి డా మిశ్రా చేసిన అనితర సాధ్య కృషి ఇది .

   అదృష్ట వశాత్తు ఆనాటి ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి  అఖిల భారతీయ  సంస్కృత సాహిత్య సంస్థకు చైర్మన్ గా ఉండటానికి అంగీకరింఛి డా మిశ్రా నుమినిస్టర్ –ఇన్ –చీఫ్ గా ఎన్నిక చేశారు .రాజస్థాన్ ప్రభుత్వం అనుమతి సుదీర్ఘ సంస్కృత సేవ దేశం లోని విద్యావేత్తలందరి సహకారం వలన ముఖ్యంగా ప్రధాని శాస్త్రి గారి ప్రేరణ వలన ఈ బాధ్యతను స్వీకరించి మిశ్రా సమర్ధంగా  అంకిత భావం తో జీవితకాలమంతా పని చేసి  గొప్ప విజయాలు సాధించి దేశమంతటా సంస్కృత విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేసి అందరి మెప్పూ పొందాడు . లాల్ బహదూర్  ఆకస్మిక మరణం తో ప్రధాని అయిన ఇందిరాగాంధీ ,డా సంపూర్ణానంద్ సలహాతో డా .మిశ్రా ఈ  సంస్థపేరును శాస్త్రి గారి గౌరవార్ధం ’’ లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యా పీఠం ‘’గా మార్చి భారత ప్రభుత్వానికి అప్పగించాడు .ఈ సంస్థకు సంస్థాపక డైరెక్టర్ గా మిశ్రా ఉండిపోయాడు .మిశ్రా అవిశ్రాంత కృషి, దీక్షా, దక్షత వలన ఈసంస్థ 1989  లో డీమ్డ్ యూని వర్సిటి అయింది .23-6-1989న భారత ప్రభుత్వం డా మిశ్రా ను డీమ్డ్ యూని వర్సిటి మొట్టమొదటి వైస్ చాన్సలర్ పదవిలో నియమించి గౌరవించింది . అయిదేళ్ళుమొదటి వైస్ చాన్సలర్  పని చేసి మిశ్రా  1994 లో రిటైర్ అయ్యాడు ..ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మిశ్రా అమోఘ వ్యక్తిత్వానికి తగినట్లు 1-1-1996 న  వారణాసిలోని  డా.సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సలర్ పదవి నిచ్చి గౌరవించింది.ఇక్కడ పని చేసిన మూడేళ్ళ కాలం ఆ విశ్వ విద్యాలయానికి స్వర్ణ యుగమే అయింది .అన్ని పరీక్షలను  నిర్దుష్ట కాలం లో నిర్వహించటం,తరగతులను క్రమం తప్పకుండా జరపటం, 115 గ్రంధాలను ప్రచురించటం,సరస్వతి దేవి ఆలయాన్ని నిర్మించటం ,మహా వైభవోపేతంగా దానిని ప్రారంభించటం ,ఇద్దరు రాష్ట్ర పతులు డా.శ్రీ శంకర దయాళ్ శర్మ ,శ్రీ కె ఆర్ .నారాయణన్ లను ముఖ్య అతిధులుగా ఆహ్వానించి , రెండు  ప్రముఖ సభలను పెద్ద ఎత్తున నిర్వహించటం,  డా మురళీ మనోహర్ జోషీ పాల్గొనటం ఆవిశ్వ విద్యాలయ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాలుగా నిలిచి పోయేట్లు చేసి, డా మిశ్రా  చైతన్య స్పూర్తికి దర్పణంగానిలిచాయి .   

  డా.మిశ్రా వారణాసి లో’’ శ్రీ పట్టాభిరామ శాస్త్రి వేద మీమాంస రిసెర్చ్ సెంటర్ ‘’నుతన గురువు ,ప్రముఖ సంస్కృత మీమా౦సాచార్య శ్రీ పట్టాభిరామాచార్య గౌరవార్ధం  అధునాతన వసతి సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన భవనం లో స్థాపించి అందరి ప్రశంసలను అందుకొన్నాడు . ఈ సెంటర్ కు డా .మిశ్రానుఫౌండర్ చైర్మన్ గా  శ్రీ కంచి శంకరాచార్య నియమించి గౌరవించారు.20 00 సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం డా.మిశ్రా కు  పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసి సత్కరించింది  .  డా.మిశ్రా రాజస్థాన్ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ గా పని చేస్తూ 15-11-2001 న 72 వ ఏట మరణించాడు  .కేంద్ర ప్రభుత్వం కనీసం పద్మ విభూషణ్ అయినా అందజేసి ఉంటె ఆయన సేవలకు తగిన గౌరవం ఇచ్చినట్లుగా ఉండేది .

Inline image 1

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-1-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 46-మను స్మృతికి మహా భాష్యం రాసిన –మేదాతిధి(క్రీ .శ.1000)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

46-మను స్మృతికి మహా భాష్యం రాసిన –మేదాతిధి(క్రీ .శ.1000)

 మనువు రాసిన మను స్మృతి అనే న్యాయ శిక్షా శాస్త్రానికి మహా భాష్యం రాసిన తొలి రచయిత మేదాతిది .మనుధర్మ శాస్త్రం గా ప్రాచుర్యం పొందిన ఆ బృహద్గ్రంధ సారాన్ని లోకానికి మేదాతిది భాష్యం రాసి మహోపకారం చేశాడు .మేదాతిది ఎక్కడి వాడు ఏ ప్రాంతం లో భాష్యం రాశాడు అనేది చర్చ నీయా౦శ౦ గా ఉన్నది . కాశ్మీరు కు చెందినవాడు అని అందరూ భావిస్తుంటే కాదు దక్షిణ భారత దేశానికి చెందినవాడు అన్నాడు జూలియస్ జాలీ .గార్గ్ బూలర్ చెప్పగా మహా పండితుడు కాణే అంగీకరించింది మేదాతిది కాశ్మీర్ వాడని ,కాదంటే కనీసం ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాడు అని .రాబర్ట్ లి౦గాత్ ఈ వాదాలు అనవసరమని మేధా తిది కాశ్మీర్ దేశ కవి అని నిశ్చితాభిప్రాయంగా చెప్పాడు .మేదాతిది తన వ్యాఖ్యానం లో తన ముందు రాసిన వ్యాఖ్యాన కర్తల పేర్లను పేర్కొన్నాడు అని కాణే పండితుడు చెప్పాడు .యాజ్ఞవల్క్య స్మ్రుతి వ్యాఖ్యానమైన ‘’మితాక్షర ‘’. లో ఉన్నదానిప్రకారం మేదాతిది మను స్మ్రుతి వ్యాఖ్యానాన్ని క్రీ.శ.820 -1050మధ్యకాలం లో రాసి ఉంటాడని నిర్ధారించవచ్చు  .లింగాత్ మాత్రం మేధాతిధి ది  9- 10 శతాబ్దం కాలం అన్నాడు .డేవిడ్ బ్రిక్ తన 2010వ సంవత్సర’’ సతీ సహగమనం ‘’ సమీక్షలో మేధాతిధి జీవితకాలం క్రీ శ.1000అని తేల్చాడు .ఇంతకంటే ఆయన గురించి మనకు తెలిసినది ఏమీ లేదు .

Inline image 1

47-శిలా ,తామ్రశాసన, నాణాల పరిశోధకుడు –వాసు దేవ విష్ణు మిరాసీ (1893 -1985 )

డా .వాసుదేవ విష్ణు మిరాసీ మహారాష్ట్ర లో మధ్యతరగతి కార్తేడ్ బ్రాహ్మణ కుటుంబం లోరత్న గిరి జిల్లా దియోగడ్ తాలూకా కావెల్ గ్రామం లో  1893మార్చి 13 న జన్మించాడు . 82 జీవించి 3-4-1985లో మరణించాడు  . శాసన పరిశోధకుడు సంస్కృత విద్వాంసుడు ,ఇండాలజిస్ట్ .20 వ శతాబ్దపు మహా విద్వాంసులలో పేరెన్నిక గన్నవాడు .ప్రాచీన భారత దేశపు నాణాలు ,శిలా తామ్ర శాసన పరిశోధకుడు .వీరి మహా విద్వత్తుకు బ్రిటిష్ ప్రభుత్వం 1941 లో మహా మహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరిస్తే  భారత స్వాతంత్ర్యానంతరం భారత రాష్ట్ర పతి 1975 లో పద్మ భూషణ్ పురస్కారం తో సత్కరించారు .  కొల్హాపూర్ లో ప్రాధమిక విద్య పూర్తీ చేసి పూణే చేరి .డిగ్రీ పాసై ,పూనాలోని దక్కన్ కాలేజి   నుండి సంస్కృతం లో ఎం .ఏ .పొందాడు .బొంబాయి వెళ్లి ,ఎల్ఫిన్ స్టోన్ కాలేజి లో సంస్కృత ప్రొఫెసర్ గా పని చేశాడు .తర్వాత నాగ పూర్ లో సంస్కృత పీఠాది పతి పోస్ట్ కు ఆహ్వాని౦ప బడి చేరాడు .1942లో ప్రిన్సిపాల్ అయ్యాడు .1947నుంచి 1950 వరకు అమ్రోతిలోని విదర్భ మహా విద్యాలయం ప్రిన్సిపాల్ గా పని చేశాడు .1957 నుంచి 9 ఏళ్ళు 1966 వరకు నాగపూర్ యూని వర్సిటిలో ‘’ఆనరరి ప్రొఫెసర్ ఆఫ్ ఏన్షేంట్ ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ మరియు హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ఇన్ హుమానిటీస్ గా సేవలు అందజేశాడు .

 మిరాశీ 30 కి పైగా ఇంగ్లీష్ హిందీ మరాటీ భాషలలో పరిశోధనా పత్రాలు రాశాడు .275 కు పైగా ఇండలాజికల్ జర్నల్స్ లో వ్యాసాలూ రాశాడు .ఆయన రాసిన ‘’ఇన్ స్క్రిప్షన్స్ఆఫ్ ది కాలచూరి –చేది ఎరా’’బాగా ప్రసిద్ధి పొందింది .;;ఇన్ స్క్రిప్షన్స్ఆఫ్ వాకాటాస్ ‘’,ఇన్ స్క్రి ప్షన్స్ ఆఫ్ సిలహరాస్ ‘’,శాతవాహన –క్షాత్రప శిలాశాసనాస్ ‘’అన్నీ అన్నే .విలువైన సమాచారం తో శోభిల్లేవే .ఇండాలజీ ,కాళిదాస ,భవభూతి మహాకవులపైనా గ్రంధాలూ వ్యాసాలూ రాశాడు .

  లార్డ్ లిన్ లిత్ గొ 1941 లో మిరాశీకి ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదునిచ్చి సత్కరించాడు .1966 లోసంస్కృత భాషా సేవకు  . రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు ’1977భారత రాష్ట్ర పతి శ్రీ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ‘’పద్మ భూషణ్ ‘’పురస్కారం ప్రదానం చేసి గౌరవించారు  .1970 లో భారత పురాతత్వ శాఖ  గౌరవ కరేస్పా౦ డెంట్ పదివినిచ్చి గౌరవించింది .నాగపూర్ సాగర్ మొదలైన యూని వర్సిటీలు డి.లిట్ ప్రదానం చేశాయి .ఆలిండియా హిస్తారికాన్గ్రేస్ అధ్యక్షునిగా ఉన్నాడు .నూమేస్మాటిక్సొసైటీ ఆఫ్ ఇండియా ఎపిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా  ఫెలోషిప్ అందజేసి సత్కరించాయి .

Inline image 2

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-23-1-17 –ఉయ్యూరు  

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment