తధ్యం కంటే సందేహాస్పదం మేలు

తధ్యం కంటే సందేహాస్పదం మేలు

అని చెప్పే మహా భారతం లోని జరితారి కద తెలుసుకొందాం .మందపాలుడనే ముని వెయ్యేళ్ళు తీవ్ర తపస్సు చేసి యోగ బలం తో దేవలోకం చేరాడు . కాని స్వర్గ ప్రవేశం కలగలేదు .కారణం ఏమిటని అక్కడి దేవతలను ప్రశ్నించాడు.  అతనికి సంతానం లేదు కనుక సంతతి లేని వారికి స్వర్గ ద్వారాలు తెరుచుకోవని చెప్పారు .మునికి వెంటనే సంతానం సాధించాలనే కోరిక కలిగి భూలోకానికి తిరిగి వచ్చాడు .అర్జెంట్ గా సంతానం కలగాలంటే ఏమిటి ఉపాయమ అని ఆలోచిస్తే ,పక్షి రూపం లోనే అది సాధ్యం అని గ్రహించాడు .మహర్షి తాను  ఒక ‘’లావుక పక్షి ‘’అయి ,’’జరిత’’ అనే అనే మరొక ఆడ లావుక పక్షిని భార్యను చేసుకొని సుఖించాడు . జరితారి మొదలైన నలుగురు బ్రహ్మ జ్ఞానుల్ని సంతానం గా పొంది ,ఖా0డవ వనం లో భార్య జరిత సంరక్షణ లో ఉంచి ,మొదటి భార్య ‘’లపిత ‘’దగ్గరకు చేరుకొన్నాడు .      లపితతో విహరిస్తుండగా అగ్ని దేవుడు ఖాండవ వనాన్ని కాల్చ టానికి వెడుతూ ఎదురయ్యాడు  .ఆయన రాకలోని అ0తరార్ధాన్ని గ్రహించి ముని, అగ్ని సూత్రాలతో ప్రసన్నం చేసుకొన్నాడు . అగ్ని దేవుడితో తాను  ఉత్తమ లోక ప్రాప్తి కోసం జరిత అనే  లావుక పక్షిని పెళ్ళాడి బ్రహ్మ వేత్తలైన నలుగురు కుమారుల్ని లావుక పక్షి రూపాలలో కని,తల్లి  జరిత సంరక్షణలోఖాండవ వనం లో  ఉంచి వచ్చానని ,ఖాండవ దహనం చేసేటప్పుడు తన నిసుగులైన కుమారుల జోలికి వెళ్ళకుండా వారిని కాపాడమని వేడుకొన్నాడు .’’వేద వేత్తలను కాపాడటం నా విధి ‘’అని అగ్ని అభయమిచ్చాడు మహర్షికి .

స్వాహా దేవుడు ఖాండవ దహనం చేస్తూ సర్వం స్వాహా చేస్తూ పోతున్నాడు .అగ్నిజ్వాలలు, నల్లని పొగ అడవి అంతా అల్లుకు పోతున్నాయి .ఒక చెట్టుమీద బిడ్డలపిట్టలతో ఉన్న తల్లి జరిత ఏ క్షణం లోనైనా చెట్టును అగ్ని కబళిస్తుందని భయ పడుతోంది .రెక్కలు రాని తన నిసువులను ఎలా కాపాడుకోవాలో ఆమెకు పాలు పోవటం లేదు. ఈ అపాయాన్నుంచి ఉపాయం గా ఎలా బయట పడాలో తోచటం  లేదు .ప్రళయాగ్ని లా అగ్ని వ్యాపిస్తుంటే బిడ్డలతో తల్లి జరిత చెట్టు మొదట్లో ఉన్న కలుగులలోకి వెళ్లి వారిని తలదాచుకోమని ఉపాయం చెప్పింది .తాను  బ్రహ్మ వేత్తలైన నలుగురు బిడ్డల్ని కని వారికే ఆపదా రాకుండా చూసుకొంటానని వారి తండ్రి కి వాగ్దానం చేశానని తన మాట విని కలుగుల్లోకి కి వెళ్లి దాక్కోమని బ్రతిమాలిడింది .అప్పుడు అందులో పెద్దకొడుకు’’ జరితారి’’ ‘’అమ్మా !కలుగులోకి వెడితే మాంసపు ముద్దల్లా ఉన్న మమ్మల్ని ఎలుకలు తినేస్తాయి .చెట్టు గూటిలో నే ఉంటె మంట మమ్మల్ని కాల్చేస్తుంది ఎలుక చేత చావుకంటే అగ్ని వల్ల మరణిస్తే ఉత్తమ గతి కలుగుతుంది .ఎలుక వలన చావు తధ్యం .గూటిలోనే ఉంటె చావు సందేహాస్పదం .ఎందుకంటె గాలి దిశమారితే చెట్టు కాలిపోదు .మేము సురక్షితంగా ఉండగలుగుతాం .అందుకని తధ్యం కంటే సందేహాస్పదమైన దాన్ని ఎన్నుకోవటం వివేక వంతుల లక్షణం .నువ్వు మా విషయం ఆలోచించకుండా నీకు క్షేమంగా ఉన్న చోటుకు పారిపో .మా గురించి బెంగ వదిలి పెట్టు .పుత్ర వ్యామోహం వదిలెయ్యి .నువ్వు బ్రతికుంటే మళ్ళీ మా తండ్రికి సంతానాన్ని సాధించి పెట్ట గలవు .కనుక నీ ఆత్మ రక్షణ నీకు తక్షణ కర్తవ్యం ‘’‘’అని ఆ బ్రహ్మ జ్ఞాని జ్ఞాన బోధ చేశాడు తల్లి జరిత కు .

పెద్ద కొడుకు ఎంతో ఆరిందాగా ,లోక జ్ఞానంతో చెప్పిన మాటలలోని పరమార్ధాన్ని గ్రహించి , ఆమె ఆమోదం తెలిపి వారు క్షేమంగా ఉండాలని ప్రార్ధిస్తూ వదలలేక వదలలేక ,మాటిమాటికీ వెనక్కి తిరిగి చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెళ్లి పోయింది .చతుర్ముఖ బ్రహ్మ నాలుగు శిరస్సులనుంచి నాలుగు వేదాలు  ధ్వనిస్తున్నట్లు జరితారి మొదలైన నలుగురు సుస్వరంగా వేద మంత్రాలు చదువుతూ ‘’అభయం  మాకు అభయం ‘’అంటూ అగ్ని దేవుని ప్రార్ధించారు .అగ్నికి మందపాల మహర్షికిచ్చిన వాగ్దానం జ్ఞాపక మొచ్చి వాళ్ళున్న వృక్షం జోలికి పోకుండా వృక్షాన్ని భక్షించక రక్షించి మాట నిల బెట్టుకొన్నాడు .ఎక్కడో దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన తల్లి జరిత మళ్ళీ వృక్షాన్ని చేరి బిడ్డల్ని ఆప్యాయంగా కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాలుస్తూ అగ్నికి కృతజ్ఞతలు చెప్పింది .అక్కడ మందపాలుడు  కొడుకు లేమై పోయారోనని కంగారు పడుతూ తానూ అగ్నిని ప్రార్ధించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ,అగ్ని తప్పక వాగ్దానం నిల బెట్టుకొంటాడని నమ్మకం తోఉన్నాడు .ప్రక్కనే ఉన్న భార్య లపిత ‘’అయ్యగారికి కొత్త పెళ్ళాం మీద మోజు ఇంకా తగ్గలేదన్న మాట .జరిత కూడా పక్షి కదా ఎగిరిపోయి ప్రాణాలు కాపాడుకొనే ఉంటుంది లెండి ‘’అని మేలమాడింది .’’వశిస్టమహర్షి యే పపతివ్రత అయిన  భార్య అరుంధతిని సందేహించాడు కదా ‘’అని నవ్వాడు .ఖాండవ దహనం అయిన తర్వాత మందపాలుడు తిరిగివచ్చి భార్యా పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలుసుకొని సంతోషించాడు .

ఈ కదలో సంతానం స్వర్గ లోక ప్రాప్తికి మార్గం అనీ ,చేసిన వాగ్దానాన్ని  ఎంతటి వారైనానిల బెట్టుకోవాలని ,తధ్యం అని నమ్ముకున్న దానికంటే సందేహాస్పదం అని పించిన దానిని ఎంచుకోవటం మేలు అనే విషయాలు ఉన్నాయని గ్రహించాలి .మహా భారతం ఏది చెప్పినా పరమార్ధ దృష్టితో చెబుతుంది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

.

 

Posted in రచనలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -6 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం

g దైవ చిత్తం -6

శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం

నాలుగవ అధ్యాయం –అనిశ్చిత సూత్రం

పేజి -56,పేరా -2

కాంతి తరంగ సముదాయమే అయినప్పటికీ మాక్స్ ప్లాంక్ ప్రతిపాదించిన క్వాంటం ప్రతి పాదన ననుసరించి కొన్ని సందర్భాలలో కాంతి కణ సముదాయం గా ప్రవర్తిస్తుంది .అది కొన్ని పాకెట్ లు గా(క్వా0ట్స్ ) వెలువడుతుంది ,హరించుకు పోతుంది .

వ్యాఖ్యానం –ఈ అధ్యాయం పూర్తిగా సా0కేతికపరమైనది,కణాల ద్వంద్వ ప్రవృత్తులను గూర్చి చెప్పటం  (ఈ ప్రపంచాన్ని ఏర్పరచే ప్రాధమిక కణాలు  ప్రోటాన్ ,న్యూట్రాన్ లతో ఉంటాయి )అవి కణాలుగా ,తరంగాలుగా ప్రవర్తిస్తాయనటం అంతా సాంకేతికమైన భావనలే .ఇందులో భారతీయ సాహిత్యం కణ సిద్ధాంతాన్నిబిందు సిద్ధాంతంగా చెప్పి  కొంతవరకు ఆమోదించింది .కాంతి బిందు సమూహం ఆ సముదాయమే కాంతి పుంజం అని చెప్పింది .ఈ కాంతి పుంజమే తరంగామా ?.

వేద భావనలో  తరంగ సిద్ధాంతం కూడా ఉంది .ఇది కాంతి ధ్వనులకు  మాత్రమె  కాక,ప్రపంచం లోని కదిలే ,మారే ప్రతి వస్తువుకు వర్తిస్తుంది అన్నది .

ఇదే ఛందస్(రిథం ) సూత్రం –  ప్రపంచ గమనాన్ని నియంత్రించేవి సప్త ఛందస్సులు .అవే గాయత్రి ,త్రిష్టుప్ ,జగతి ,ఉష్ణిక్, సక్వరి ,అనుష్టుప్బృహతీ  మొదలైన ఛందస్సులు .సృష్టిలో ప్రతిదీ లయ బద్ధం గా (రిథమిక్ )కదులుతుంది .ప్రతిదీ ముందుకు తరంగాలుగా ,వర్తులంగా జరుగుతూ పోతుంది .ఉదాహరణకు కాలం సంవత్సరాల ఆవర్తనం తో ముందుకు కదులుతుంది .ప్రతి ఏడాదిని ఒక తరంగం గా భావిస్తే 60సంవత్సరాల ఆవృత్తి ఒక సరళ రేఖగా ఒక తరంగ సముదాయం అవుతుంది ప్రతి ఏడాదికి ఋతువులు అదే సమయం లో ఏర్పడటం జరుగుతుంది .కాని అవి ఒకే మాదిరిగా ఉండవు .కారణం అవి స్పేస్ లో మరొక మెట్టు ముందుకు జరిగిపోవటమే .కనుక దీనిని బట్టి వేదం కణ సిద్ధాంతాన్నీ ,తరంగ సిద్ధాంతాన్నీ రెండిటినీ సమర్ధించింది అని తెలుసుకోవాలి .ఇదిఅనంతమైన  టైం ,స్పేస్ ల సృస్టులకు (కల్పాలు )కు తుది గా భావి౦చి౦ద న్నమాట .

పేజి 66-

ఇది వరకటి అధ్యాయం లో మనం చర్చించినట్లు  తరంగ ,కణ సిద్ధాంతాల నుపయోగించి విశ్వం లోని ప్రతి వస్తువు కాంతి,సాపేక్షత  తో సహా అన్నిటినీ కణాల నాధారంగా నే వివరించాలి .

ఈ అధ్యాయం క్వాంటం మెకానిక్స్ ,గ్రావిటీ ల ను కలిపిసమగ్ర పరచి  ప్రవచించే సిద్ధాంతాల కోసం ఆశిస్తూ ముగింపు పలకటమైంది .

అయిదవ అధ్యాయం –మూల కణాలు ,ప్రక్రుతి శక్తులు

పేజి -64,పేరా- 2

ఈ ఎలక్ట్రాన్లు పరమాణువు లోపలి నుండే వెలువడుతున్నాయని వెంటనే గమని౦చ డమైంది .1911లో బ్రిటీష్ భౌతిక శాస్త్ర వేత్త ఎర్నెస్ట్ రూధర్ ఫోర్డ్ –పదార్ధం లోని పరమాణువు లో అంతర్నిర్మాణం ఉందని రుజువు చేశాడు .

శాస్త్రిగారి వ్యాఖ్య –దీనినే కాణాదుని వైశేషిక దర్శనం లో ‘’అణు ‘’అని పిలిచాడు .అణువు విభజింప బడదు కానిపరమాణువు అనే పదాన్ని వాడి ,విభజన జరుగుతుందని సూచించాడు భారతీయ నాగర కత లో భాగమైన బౌద్ధ మతం లో శక్తి స్పేస్(ఆకాశం ) లో కనిపించని రూపం లో ఉంటుంది అని చెప్పింది .దీనికి ముందే భారతీయ బ్రహ్మ సూత్రాలలో సృష్టి కర్తలేక బ్రహ్మం  అంటే స్పేస్ అని చెప్ప బడింది .దీనికి సంబంధిన మంత్రం –‘’ఆకాశవత్ సర్వ గతా హ ,నిత్యహ’’.బ్రహ్మం లేక సృష్టికర్త ఆకాశం లాగా అనంతం ,తుది లేనిది అని భావం .దీన్ని బట్టి చూస్తె మన పూర్వీకులు పదార్ధం యొక్క చివరి స్థితి ఆకాశమే అని ,అన్ని పదార్ధాలు శక్తి నుండే ఆవిర్భ విస్తాయని అది మానవ నేత్రానికి ద్రుగ్గోచారం కాదని చెప్పారు .అతి వినయం గా ఒక విషయం చెబుతున్నాను –వేద సాహిత్యం ఈ పరమాణువు మొదలైనవన్నీ భౌతిక పరమైనవి(మెటీరియలిజం ) కనుక దానిపై ద్రుష్టి పెట్టలేదు .

పేజి -68,పేరా-2

క్వాంటం మెకానిక్స్ ను ,స్పెషల్ దీరీ ఆఫ్ రిలేటివిటిలకు స్థిరమైన (కన్సిస్తంట్ )రూపాన్ని ఇచ్చి సిద్దాన్తీకరించిన మొదటివాడు డిరాక్ .ఎలక్ట్రాన్ కు స్పిన్ 1/2  ఎందుకు ఉన్నదో,అది ఒక వలయం పూర్తీ చేసే సరికి ఒకే మాదిరిగా ఎందుకు ఉండదో  గణిత0 ఆధారంగా వివరించాడు . ఎలక్ట్రాన్ కు ఒక భాగ స్వామి అంటే యాంటి ఎలక్ట్రాన్ లేక పాజిట్రాన్ ఉండి ఉండాలని ఊహించాడు .1932లో కనుగొన బడిన ఈ విషయాన్ని ‘’డిరాక్ సిద్ధాంతం ‘’అన్నారు దీనికే ఆయనకు 1933లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .దీనిని బట్టి ప్రతికణానికి వ్యతిరేక కణం అనేది ఒకటి ఉంటుంది అని అర్ధమయింది ఈ యాంటి పార్టికల్ ఉండటం వలన అది అంతరించి పోగలదు .ఈ కణాలను మోసే శక్తులు ,యాంటి పార్టికల్స్ కూ సమానమే .ఏతా వాత తెలియ వచ్చేదేమిటంటే –వ్యతిరేక ప్రపంచాలు ,వ్యతిరేక మనుషులు ,కూడా యాంటి పార్టికల్స్ వలన ఏర్పడుతాయని .నీ యాంటి వ్యక్తిని కలిస్తే పొరబాటున కూడా వాడికి షేక్ హాండ్ ఇవ్వద్దు .ఇస్తే ఇద్దరూ పెద్ద మిరుమిట్లు గొలిపే కాంతి లో  అంతరించి పోతారు .

శాస్త్రీజీ వ్యాఖ్యానం –ఇదంతా వేదం లో చెప్పినట్లు దేవతలకు అసురులకు సంబంధించిన విషయం గా అనిపిస్తోంది కదూ. కణాలు దేవతలైతే వ్యతిరేక కణాలు యాంటి పార్టికల్స్ రాక్షసులు .దేవతలు యజ్ఞాలు చేస్తారు .’’యజ్ ‘’ అనే సంస్కృత ధాతువు నుండి యజ్ఞం అనే మాట వచ్చింది .దీని అర్ధం ‘’సంఘటీకరణం ‘’.అంటే అన్నిటినీ కలపటం .ఈ ప్రపంచం పంచ భూతాల చేత  సంఘటితమై ఏర్పడింది కనుక ‘’ప్రపంచం’’అంటారు .ప్రపంచం అనే మాటలో ‘’పంచ ‘’అనేది ముఖ్య మైనది ‘’.ప్ర’’అనేది ఉప సర్గ .కావాల్సిన భావాన్ని స్పష్ట పరచటానికిఉప సర్గ ను  ఉపయోగించారు .దేవ దానవుల  అనాదికాల యుద్ధాల గురించి ఎన్నో కధలూ గాధలూ మన వేదసాహిత్యం లో ఉన్నాయి .

పేజి 69,పేరా- 2

కణాల వాహికలైన శక్తులు పదార్ధ కణాలతో పరస్పర మార్పు పొంది ప్రభావం ఉన్నా రూపం లేని (వర్చువల్ ),యదార్ధ కణాలు అనిపించని వాటిగా ఉంటాయి .వీటిని సూటిగాపార్టికల్ డిటేక్టర్ తోకూడా గుర్తించలేము .అవి ఉన్నాయని వాటి ప్రభావం వలన మనకు తెలుసు  కాని చూడలేం. ఇవి పదార్ధ కణాలమధ్య శక్తి జనకాలౌతాయి . కణాలలో స్పిన్ 0,1లేక 2కూడా ఉన్నాయి .ఇవి కొన్ని సందర్భాలలో నిజమైన కణాలలాగా ఉంటాయి .అప్పుడు వీటిని మనం .కనిపెట్టి చూడగలం .అప్పుడు అవి ఒక భౌతిక శాస్త్ర వేత్త (క్లాసికల్ ఫిజిస్ట్ )చెప్పే కాంతి లేక గ్రావి టేషనల్ తరంగాలుగా మనకు దర్శన మిస్తాయి .పదార్ధ కణాలు ఒక దానితో ఒకటి సంఘర్షణ చెందినపుడు ఆభాస కణ శక్తి వాహికలు ఒక దానితోనొకటి మార్పు చెందినపుడు ఇవి ఉద్గారం చెందుతాయికూడా .రెండు ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ బలం ఏర్పడటానికి కారణం ఎప్పటికీ మనకు గోచరించని కనిపెట్ట బడని ఆభాస ఫోటాన్ ల మధ్య మార్పు మాత్రమె .ఒక వేళ ఒక ఎలక్ట్రాన్ రెండవ దానికంటే వేగం గా ప్రయాణిస్తే వాస్తవ ఫోటాన్లుమార్పు చెంది  కాంతితరంగాలుగా కని పిస్తాయి .

శాస్త్రి గారి వ్యాఖ్యానం –స్టీఫెన్ హాకింగ్ వంటి మేధావి సైంటిస్ట్ లు ఇప్పడున్న స్థితి లో ప్రపంచం లోని ఇంకా కొన్ని కణాలను సైన్సు డిటెక్టర్ ద్వారా గుర్తించి చూడలేక పోతోందని ,కాని సిద్ధాంత రీత్యా అవి ఉన్నాయని తెలుస్తోందని తెలియ జెప్పారు .ఈ వర్చువల్ కణాలు పదార్ధ నిర్మాణం లో కీలక పాత్ర పోషిస్తున్నాయి .కనుక మనం వీటిని దేవతలతో  పోల్చుకోవచ్చు .ఒక మంత్రం ‘’పరోక్ష ప్రియా ఇవహి దేవాహ’’ అనేది ఉంది . దీని అర్ధం దేవతలు మానవ దృష్టికి గోచరం కాకుండా రహస్యం గా (పరోక్షం గా )ఉంటారు .అందుకే వేదాలు పితృ కర్మల విషయం లో శ్రాద్ధ కర్మలు చేయమని చెప్పింది .పితృదేవతలు మానవ కంటికి కనిపించరని ,తర్క ప్రకారం వారు ఉన్నట్లు (లాజికల్ గా )చెప్పగలమనీ దీన్ని తిరస్కరించ లేమని తెలియ జేశాయి .కనుక నాస్తికులు ,హేతువాదులు ఇప్పటికైనా ప్రపంచం లో ఉన్న ప్రతిదానినీ  ఈ కళ్ళ తో చూడలేము అని గ్రహించాలి .వీళ్ళు దేవుడిని తమకళ్ళ ఎదురుగా తీసుకొచ్చి చూపింఛి నమ్మించ  మంటారు .అని ఒక చెణుకు చెణికారు  శాస్త్రీజీ .

Inline image 1  Max Planck 1933.jpg

సశేషం

క్రిస్మస్ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోరి కొలువైన కైలాసవాసుడు

కోరి కొలువైన కైలాసవాసుడు

04/06/2015

విజయనగరాన్ని విజయరామ గజపతి పరిపాలిస్తున్న రోజులల్లో నండూరి వెంక మ్మ తనకున్న పొలాన్ని పండిస్తూ కాలం గడుపుతోంది. ఒకరోజు పండిన ధాన్యాన్ని పురిలో భద్రపరచింది. ఆ రోజు రాత్రి ఆమె కలలో శివుడు కనిపించి తాను వీరరాజేశ్వరునిగా ఆ స్థలంలో వెలుస్తున్నానని, ధాన్యపు పరిలో తన ప్రతిరూపమైన శివలింగం నీకు కనిపిస్తుందని వెంటనే దానిని బయటకు తీసి అదే స్థలంలోప్రతిష్టించమని చెప్పి అదృశ్యమయ్యాడు.
ఆ మరునాడు వెంకమ్మ ధాన్యపు పురిలో వెదికింది. ఆ ధాన్యపు పురిలో కాంతులీనుతూ శివలింగం కనిపించింది. వెంటనే వెంకమ్మ విజయరామ గజపతి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా తెలియచెప్పింది. మహారాజు ఒక మంచిరోజున వీరరాజేశ్వరస్వామిని ప్రతిష్టించారు. అనంతర కాలంలో మూడు కోవెళ్ళుగా ప్రసిద్ధి చెందింది. ఈ సముదాయంలో వీరరాజేశ్వరస్వామి, నీలకంఠేశ్వరస్వామి, గౌరీ శంకరులు ఉండటంతో మూడు కోవెళ్ళుగా ప్రసిద్ధి చెందింది. 1978 సంవత్సరంలో మూడు కోవెళ్ళు దేవాదాయశాఖ అధీనంలోనికి వెళ్ళింది.
ఈ కోవెలలలో సీతారామస్వామి, జగన్నాథస్వామి పూజలు అందుకుంటున్నారు. వీర రాజేశ్వరస్వామికి ఇరువైపులా వినాయక సుబ్రహ్మణ్య స్వాములతోపాటు రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. మూడు కోవెళ్ళలో కొలువైన వీరరాజేశ్వరుని దర్శనం ముక్తిదాయకం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవుడికి వేయి పేర్లు 24-12-2015 అరవిందరావు

దేవుడికి వేయి పేర్లు
24-12-2015 23:25:24

ఒక గంభీరమైన విషయాన్ని లేక చదవడానికి సాధారణంగా ఎవరూ ఇష్టపడని విషయాన్ని అందరూ ఇష్టపడేలా చెప్పడం కష్టం. జీవుడు, బ్రహ్మ మొదలైన విషయాలు ఉపనిషత్తుల్ని చదివితే తప్ప తెలియవు.
కానీ వాటిని చదవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. వాటిలో ఉన్న విషయాల్నే ఏదో ఒక దేవుడి లీలగా భావించుకుని స్తోత్రం రూపంలో రాసి, పారాయణం చేయడం వల్ల కోటిజన్మల పాపం పోతుంది అని అంటే మనం చదవడానికి సిద్ధమవుతాం. అలా చదవగా చదవగా ఒకానొక దశలో మనకు ఆ స్తోత్రంలోని శబ్దాలపై మనస్సు వెళ్లి ఏమిటి దీని అర్థం అని ఒక ఆలోచన మొదలవుతుందని మన రుషుల ఆశ. ఇలా వచ్చిన పుస్తకాలే దేవుళ్ల సహస్రనామాలు(వేయిపేర్లు).
మహాభారతంలో భీష్ముడు అంపశయ్య(బాణాల పరుపు)పై పడి ఉండటం మనకు తెలుసు. ఆ సమయంలో ధర్మరాజు అతని నుంచి రాజనీతి గురించి, పారమార్థిక విషయాల గురించి తెలుసుకుంటాడు. భీష్ముడు రెండు సందర్భాల్లో విష్ణు సహస్రనామావళి, శివ సహస్రనామావళిని ధర్మరాజుకు బోధిస్తాడు. వ్యాసుడికి శివుడు, విష్ణువు అని తేడా లేకపోయినా మనకున్నది కాబట్టి ఆయన అలా చెప్పాడు. అనేక దేవతా సంప్రదాయాల్ని సమన్వయం చేస్తూ ఒకే తత్వానికి చెందినట్టు చెప్పడం మన రుషుల ప్రత్యేకత అని ఇదివరలో తెలుసుకున్నాం. లలితాదేవికి సంబంధించిన స్తోత్రం బ్రహ్మాండపురాణం అనే పుస్తకంలోనిది. అలాగే మిగతాదేవుళ్ల సహస్రనామాలు అనేక పురాణాల్లోనివి.
పరమాత్మ ఒకటే. అదే శాశ్వతంగా ఉండేది. అన్నింటికీ కారణమైనది అయిన తత్వం. అదే సృష్టి, స్థితి, లయ అనే వాటికి కారణం. సృష్టిలో ఉన్న వైచిత్రికి, మంచి, చెడు అన్నింటికి అదే కారణం. దేవుడి పేర్లు రాయాలని మనమే పూనుకున్నామనకుందాం. సృష్టికర్త అని ఒకపేరు, పోషకుడు అని ఒకపేరు, లయకారకుడు అని మరొకపేరు, దుష్టుల్ని శిక్షించేవాడు అని మరొకపేరు ఈ విధంగా మనమే చాలాపేర్లు పెట్టగలం. రుషులు మన సౌలభ్యం కోసం ఉపనిషత్తుల్లో చెప్పిన పరమాత్మతత్వాన్ని అంతటినీ ఇలాంటి పేర్ల ద్వారానే మనకు అందించారు. మనం అనేక రూపాల్లో పరమాత్మను ఆరాధిస్తూ ఉంటాం. అందువల్ల ఈ సహస్రనామాలు అనేక దేవుళ్ల పేరిట ఉన్నా వాటిలో ఉన్న అసలు విషయం ఒకటే.
చిన్న పిల్లలు మొదలుగా ముసలివాళ్ల వరకు ఆడ, మగ బేధం లేకుండా విష్ణుసహస్రనామాలు, లలితా సహస్రనామాలు అలాగే శివుడు, వెంకటేశ్వరుడు, దుర్గ, గణేశుడు మొదలైన దేవతల సహస్రనామాల్ని పారాయణం చేయడం చూస్తుంటాం. సామూహికంగా వందసార్లు, వేయిసార్లు చదవడం చూస్తుంటాం. పారాయణం అనే పదంలో పరం అంటే శ్రేష్ఠమైనది అని అర్థం. ఆయనం అంటే మార్గం లేక గమ్యం. ఇదే అన్నింటికన్నా శ్రేష్ఠమైన గమ్యము, తెలుసుకోదగినది అనే భావన. దానిపై తత్పరత(తపన)తో ఉండటం పారాయణం. విష్ణువును పూజించే సంప్రదాయంలోనే వారికి వేదాంతం తెలియకపోవచ్చు. కానీ విష్ణువుకు చెప్పిన వేయి పేర్లలో పరమాత్మ తత్వాన్ని చిన్న చిన్న ఫార్ములాల రూపంలో పారాయణం చేస్తారు. సరిగ్గా అదే తత్వాన్ని అదే భాషలో శివుని సహస్రనామాల్లోనూ లేదా లలితసహస్రనామాల్లోనూ మనం గమనించగలం. వందలాది పేర్లు స్ర్తీలింగ, పులింగ భేదాలతో అన్నింటిలో సమానంగా ఉంటాయి.
ఈ పేర్లను స్థూలంగా రెండు తరగతులుగా చూడవచ్చు. మొదటిది పరమాత్మ తత్వానికి సంబంధించినది. రెండవది ఆయా దేవుడు లేదా దేవికి సంబంధించిన పురాణగాథ. ఆ దేవుడి లేక దేవి మహిమలు, లీలలు, రాక్షసుల్ని సంహరించడాలు లాంటి వాటికి సంబంధించినవి. ఏ దేవుణ్ణి పూజించినా అదే పరమాత్మ అనే విధంగా చెప్పారు. కావున మొదటి తరగతిలోని పేర్లన్ని సహస్రనామాల్లోనూ ఒకటిగానే ఉంటాయి. పరమాత్మను మన ఇంద్రియాలతో తెలుసుకోలేము అనే విషయాన్ని అప్రమేయుడు అంటూ పురుష దేవతల విషయంలోనూ, అప్రమేయా అంటూ సీ్త్రవాచకాన్ని ఉపయోగించి సీ్త్ర దేవతల విషయంలోనూ చెబుతారు. అట్లాగే పాపాల్ని హరించడం అనే విషయాన్ని హరించేవాడు హరుడు (శివుడు), హరించేవాడు హరి(విష్ణువు) అన్నారు. నశించనది అనే అర్థం చెప్పడానికి అక్షరః అనే పదం అందరి దేవుళ్లకూ వాడబడింది. అట్లానే అనంత, అవ్యక్త, ఈశ్వర, ప్రజాపతి, మూడు గుణాలకూ అతీతంగా ఉండటం మొదలైనవన్నీ పరమాత్మను వర్ణించే పదాలే.
విష్ణుసహస్రనామాల్లో మామూలుగా శివుడికి చెప్పే రుద్ర, శివ, స్థాణు, ఈశాన, ఈశ్వర మొదలైన పేర్లు వందలాది కనిపిస్తాయి. సృష్టి, స్థితి, లయ అనేవి అన్నింటిలోనూ సాధారణమే. రెండవ తరగతి చెందిన పేర్లు పురాణాల్లోని కథలకు సంబంధించినవి. విష్ణువు మధువు అనే రాక్షసుణ్ణి చంపాడు. అందువల్ల మధుసూదన అనే పేరుంది. సూదనమంటే చంపడం. ఇది విష్ణువుకు మాత్రమే ఉన్న పేరు. అలానే భండాసురుడు, శుంభుడు, నిశుంభుడు మొదలైన రాక్షసుల్ని చంపినది లలిత. అందువల్ల ఆమె పేర్లలోనే ఆ రాక్షసుల ప్రస్తావన వస్తుంది. శివుడు త్రిపురములను(వేదాంతంలో చెప్పే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనేవి) నశింపజేసే వాడు అనే అర్థంలో త్రిపురాసురుణ్ణి చంపినవాడు అన్నారు. అలాగే శ్మశానంలో ఉండడం అతని ప్రత్యేకత. ఈ పదానికి శరీరంపై ఉన్న మమకారాన్ని ఛేందించేవాడు(శ్మ అంటే శరీరం, శానం అంటే బలహీనపర్చడం) అని అర్థం.
నిజానికి ఈ రెండో తరగతి పేర్లు కూడా ఒకే విషయాన్ని చెబుతాయి. దేవతలందరూ ఎలాగ ఒకే తత్వమో అట్లానే అసురులు కూడా ఒకే తమోగుణంలోని అనేక రూపాలు. లలితాదేవి చంపిన శుంభుడు, నిశుంభుడు అనే వాళ్లు కామక్రోధాలకు ప్రతీక. మరొక పురాణంలో వీటికే పేర్లు వేరుగా ఉండవచ్చు. వారిని విష్ణువు సంహరించాడని ఉండవచ్చు. తామస గుణాలకు వేర్వేరు పురాణాల్లో వేర్వేరు పేర్లు. ఆ గుణాల్ని నిర్మూలించే దేవతలకు కూడా వేర్వేరు పురాణాల్లో వేర్వేరు పేర్లు. దేవుడికి వేయి పేర్లే అని ఎలా చెప్పగలం? ఎన్నైనా చెప్పవచ్చు. కానీ మనకు సులభంగా ఉండటం కోసం వేయి చెప్పారని అనుకోవచ్చు. అట్లానే నూట ఎనిమిది పేర్లు (అష్టోత్తర శతనామాలు)కూడా. మామూలు కవులు చేసే స్తోత్రాల్లో వర్ణనలుంటాయి. గోపీకుచద్వంద్వంపైని కుంకుమతో ఎర్రబడ్డ వక్షస్థలం గలవాడు మొదలైన వర్ణనలు సహస్రనామాల్లో కనిపించవు. భగవంతుని గురించి మనకు సరైన అవగాహన కలిగించడానికి సాధనాలు ఈ సహస్రనామాలు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కారు’మేఘాలు

 

కారు’మేఘాలు

-రామానుజం19/12/2015

ముద్దొచ్చే చిన్నకారు చూడటానికి, ప్రయాణించడానికి అందంగా, సౌకర్యంగానే ఉంటుంది. కానీ మనిషి ఆరోగ్యంపై ఇప్పుడు వాటివల్లే ‘కారు’మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆ పరిణామం ప్రాణాంతకంగా మారుతోంది. అందుకే ఆ మబ్బుల్ని తొలగించే పనిలో పడింది ఈ లోకం. ‘కారు లేని లోకం’లో భయంలేని బతుకుకోసం తపిస్తోంది. అందుకే ‘కార్ ఫ్రీ’ ప్రాంతాల పేరుతో కాలుష్యం కాటేయని రూట్‌కోసం అంతా వెతుకుతున్నారు.
కాలుష్యాన్ని వెదజల్లుతున్న కార్లు, ఇతర వాహనాలవల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డుప్రమాదాల మరణాలు ఇందులో కలపలేదు. అందుకే మనిషి భద్రమైన లోకంకోసం అనే్వషించడం ప్రారంభించాడు. ప్రపంచంలో పలు దేశాలు ఇప్పటికే ఆ బాటలో దూసుకుపోతూంటే మనం ఇప్పుడు అటువైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాం. 1974లో కొలంబియా రాజధాని బొగొటలో తొలిసారిగా ‘కార్ ఫ్రీ జోన్’ ప్రయోగం జరిగి విజయవంతమైంది. ఇక అప్పట్నించి కార్లకు బ్రేక్‌లు పడటం ప్రారంభమైంది. ఇప్పుడు దిల్లీలో ఆ ప్రయోగం అమలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. జనవరి 1నుంచి సరి,బేసి సంఖ్యల వారీగా కార్లు రోజు విడిచి రోజు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. కొన్ని మినహాయింపులు, కొన్ని నిబంధనల నడుమ ఇది అమలుకాబోతోంది. ఈ ఆలోచనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అయితే ‘దిల్లీ’ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆలోచనల కంటే ముందుగానే ఈ ఉద్యమంలో గుర్‌గావ్ దారిచూపింది. హైదరాబాద్ అడుగులేసింది. ప్రజల్లో చైతన్యం వస్తే ‘కార్ ఫ్రీ జోన్’ సమాజం ఏర్పడం పెద్దకష్టమేమీకాదు.
అసలు సమస్య
ఒకప్పుడు వాతావరణం…ఒక పద్ధతి ప్రకారం మార్పులకు లోనయ్యేది. ఏ రోజుల్లో అది ఎలా ఉండేదో దాదాపు కచ్చితంగా చెప్పగలిగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పంచభూతాలు కలుషితమైపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. భూతాపం పెరగడంవంటి పెద్దసమస్యకు కొన్నిదేశాల పాత్రే ప్రధాన కారణం. అందులో వాయుకాలుష్యం భాగం తక్కువేం కాదు. ఈమధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) 1600 నగరాల్లో వాయుకాలుష్యంపై సర్వేచేసింది. ఆ జాబితాలో మన రాజధాని దిల్లీ తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనా రాజధాని బీజింగ్ ఉంది. ఇంతకూ అంత పెద్దనగరాలు చెత్తగా తయారవడానికి కారణమేంటి. అసలు వాయుకాలుష్యం ఏ స్థాయిలో ఉంది. ఈ విషయాలు తెలుసుకుంటే భయం వేస్తుంది.
కాలుష్యం కోరల్లో దిల్లీ
ఇక్కడి గాలి ఎంతగా కలుషితమయిందో తెలుసుకుంటే గుండెలు గుభిల్లుమంటాయి. మనిషికి అవసరమైన స్వచ్ఛమైన గాలి ఇక్కడ లేనేలేదు. గాలిలో ధూళి ఉంటుందని అందరికీ తెలుసు. మన కంటికి కన్పించని ధూళి కణాలు అందులో కలిసి ఉంటాయి. పరిమిత సంఖ్యలో ఆ కణాలుంటే నష్టమేం లేదు. కానీ దిల్లీలో ఉన్న కాలుష్యం స్థాయి, సాధారణ స్థాయికన్నా 13 రెట్లు అధికంగా ఉంది. ‘పిఎం 2.5’ స్థాయిలో అక్కడ కాలుష్యం ఉంది. ఆ ధూళికణాలున్న గాలిని పీల్చడంవల్ల ఊపిరితిత్తులు, శ్వాసకు సంబంధించిన రోగాలు ముప్పిరిగొంటాయి. క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదమూ ఉంది. దిల్లీలో గాలి ఇలా మారిపోవడానికి ఇంధనంతో నడిచే వాహనాలు కారణం. దేశ రాజధానిలో రోజూ 85 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వీటిలో డీజిల్‌తో నడిచే వాహనాలు ఎక్కువ. వాటిలో కార్లు మరీ ఎక్కువ. ఈ వాహనాల్లో 65శాతం కార్లే. ఇవి వెదజల్లే కార్బన్‌డయాక్సైడ్ ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. పొగకమ్ముకుపోవడం, గాలి స్వచ్ఛత కోల్పోవడం, ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలకు ఈ కార్లవల్ల కలిగే కాలుష్యం కారణమవుతోంది. దిల్లీ నగరంలో ఉన్న వాహనాలకు తోడుగా రోజూ 4500 కార్లు కొత్తగా రిజిస్టర్ అవుతున్నాయి. ఇలా ఈ సంఖ్య పెరుగుతూ వెడితే ఇక దిల్లీని ఎవరూ రక్షించలేరు. అందుకే ఇప్పుడు స్థానిక ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసి కార్లకు రెడ్‌సిగ్నల్ వేసే పనిలో పడింది.
కార్ ఫ్రి ప్రోగ్రామ్
వచ్చే ఏడాది మొదటిరోజునుంచి 15 రోజులపాటు దిల్లీలో ఆడ్‌ఈవెన్ నెంబర్ విధానంలో ‘కార్ ఫ్రీ జోన్’ విధానాన్ని అమలు చేయాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 7నుంచి రాత్రి ఏడు గంటలవరకు రోజు విడిచి రోజు కార్లు నడుపుతారు. మూడునెలల క్రితం ఇండియాగేట్ ప్రాంతంలో నిర్వహించిన ఈ తరహా ప్రయోగం వల్ల వచ్చిన ఫలితం ఇప్పుడు కొత్తవిధానానికి ఊతమిచ్చింది. బీజింగ్‌లో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. కార్ల నెంబర్‌లో చివరి అంకె సరి సంఖ్య ఉన్నవన్నీ ఒకరోజు నడిస్తే బేసిసంఖ్య ఉన్న కార్లు మర్నాడు నడుపుతారు. దీనివల్ల కాలుష్యం బాగా తగ్గుడంతోపాటు, ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. అయితే వేలసంఖ్యలో కార్లలో ప్రయాణించేవారి గతేమిటి అన్నది ఇప్పటి ప్రశ్న. వారికోసం మెట్రో, బస్సు సర్వీసుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటికే ఈ విధానం అమలవుతున్న దేశాల్లో తీసుకున్న చర్యలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
కొలంబియాలో తొలి అడుగు
‘కార్ ఫ్రీ జోన్’ ప్రయోగాన్ని ప్రారంభించిన తొలిదేశం కొలంబియా. ఈ దేశ రాజధాని బొగొటలో వారాంతంలో కార్లు నడపటం నిషేధం. దీనికి ప్రజలనుంచి బ్రహ్మాండమైన మద్దతు లభించింది. ఈ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఇది అమలవుతోంది. వారాంతంలో కార్లకు బదులు సైకిళ్లు వాడతారు. వారికోసం 75 మైళ్ల నిడివిన సైకిల్‌పాత్‌లు నిర్మించారు. వారికోసం ప్రత్యేక సిగ్నలింగ్ వ్యవస్థను నెలకొల్పారు. చాలా ప్రాంతాలను సైకిళ్లపై చుట్టివచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఉద్యమాన్ని స్పానిష్ భాషలో ‘సైక్లోవియా’ అని ముద్దుగా పిలిచారు. అంటే ‘బైక్‌పాథ్’ అని అర్థం. ఇది 1974నాటి మాట.
పారిస్ ప్రయోగం
ప్రపంచంలో ఎక్కువసంఖ్యలో కార్లను వినియోగిస్తున్న నగరం పారిస్. ముఖ్యంగా డీజిల్‌తో నడిచే వాహనాల సంఖ్య అక్కడ ఎక్కువ. అందువల్ల వాయుకాలుష్యం చాలా ఎక్కువ. టూరిస్టుల రద్దీ అధికంగా ఉన్న నగరాల్లో ఇది మొదటి స్థానంలో ఉంది. అందుకే ఈ నగర వాతావరణం మెరుగ్గా ఉండాలని స్థానిక నగరపాలక సంస్థ నిర్ణయించింది. తొలిసారి పారిస్ మేయర్ అనె్న షిడల్లో వినూత్న ప్రతిపాదనలతో ‘కార్ ఫ్రీ జోన్’ పథకాన్ని అమలు చేసి భేష్ అన్పించుకున్నారు. పారిస్ నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే కొన్ని ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. కారు యజమానులు వారాంతంలో నిర్దేశిత సమయాల్లో వాటిని ఉపయోగించకూడదు. అలాగే విశాలమైన సొంత పార్కింగ్ వ్యవస్థ ఉండాలి. అది లేని కారు యజమానులు పారిస్‌లో ఉండటానికి వీలులేదు. ఒకవేళ బొగ్గుపులుసువాయువును ఎక్కువగా విడుదల చేసే కార్లుంటే జరిమానాలు అధికంగా ఉంటాయి. ఇక కార్ ఫ్రీ జోన్‌లో ఉండేవారికోసం యోగా సెషన్స్ నిర్వహిస్తారు. ఆటలపోటీలు జరుగుతాయి. గెట్‌టుగెదర్ పార్టీలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్యక్రమంలో జనభాగస్వామ్యాన్ని తెలివిగా కల్పించారు షిడల్లో. నిజానికి యూరప్‌తోసహా అన్ని ఖండాల్లోనూ ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. కాకపోతే చాలాకొద్ది ప్రాంతానికి, కొద్దిసేపు మాత్రమే అది అమలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తంమీద దాదాపు 5వేల నగరాల్లో ఈ ‘కార్ ఫ్రీ’ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికారికంగా సెప్టెంబర్ 22న కార్ ఫ్రీ డే నిర్వహిస్తున్నప్పటికీ, ఒక్కో ప్రాంతంలో, ఒక్కో తేదీన దీనిని జరుపుకుంటున్నారు.
కార్ ఫ్రీ జోన్‌లో ఏర్పాట్లు…
కొన్ని దేశాలు ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకున్నాయి. కార్ల వాడకాన్ని నిషేధించిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి కొన్ని మైళ్ల విస్తీర్ణంలో మాత్రమే ఈ జోన్లు ఉంటున్నాయి కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పెద్ద అసౌకర్యం ఏమీ ఉండటం లేదు. కార్లకు బదులు సైకిళ్లు (బైక్) వినియోగించడానికే అందరూ ఇష్టపడుతున్నారు. ఇక సౌరశక్తితో పనిచేసే చిన్నపాటి వాహనాలు, ఎలక్ట్రికల్ రిక్షాలు ఉపయోగిస్తున్నారు. సైక్లింగ్‌కోసం ప్రత్యేక మార్గాలు (బైక్‌పాథ్)లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాహనాలు తిరిగే మార్గాల్లో ప్రత్యేక సిగ్నలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇక బైక్‌పాథ్‌ల జంక్షన్లూ, ఇన్నర్ లింక్ పాథ్‌లు ఏర్పాటు చేసి సైక్లిస్ట్ ఎక్కడా వేరే వాహనం ఎక్కాల్సిన అవసరంకానీ, సైకిల్ దిగి రోడ్డు మారాల్సిన అవసరంకాని లేకుండా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇక వారాంతంలోనే కాకుండా మామూలు రోజుల్లో కారున్నా వాడనివారికి ప్రత్యేక మనీకూపన్లు ఇచ్చి వారికి సొమ్ము చెల్లించే పథకాలను మరికొన్ని ఐరోపా దేశాలు అమలు చేస్తున్నాయి. కారును వారు వాడిందీ లేనిదీ తెలుసుకోవడానికి వారి వాహనంలోని డాష్‌బోర్డులో ఉండే ఒక సెన్సార్ ఈ వివరాలను నమోదు చేసి అధికారులకు పంపుతుంది. దానిని బట్టి చెల్లింపులు జరుగుతాయి. ఇక కార్ ఫ్రీజోన్ ప్రాంతాల్లో కార్లకు బదులు వాడుకునేందుకు సైకిళ్లు, బైక్‌లు, ఎలక్ట్రికల్ రిక్షాలను అద్దె ప్రాతిపదికన ప్రభుత్వమే అందజేసే వెసులుబాటును ఆయా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మాడ్రిడ్, మెక్సికోలో ఇలాంటి ఎలక్ట్రికల్ రిక్షాలు, సైకిళ్లు అందుబాటులో ఉంటాయి. నార్వేలోని ఓస్లోకూడా కార్ ఫ్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పలు దేశాలు.. సైకిల్స్, బైక్స్‌కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.
దిల్లీలో ఏం చేస్తారు…
జనవరి 1నుంచి పదిహేనురోజులపాటు ‘కార్ ఫ్రీ’ నగరంగా ఆడ్-ఈవెన్ నెంబర్ విధానాన్ని అమలు చేస్తారు. రోజూ 85 లక్షల వాహనాలు నగరంలో తిరుగుతున్నాయి. వీటిలో దాదాపు మూడొంతులు కార్లే ఉన్నాయి. వీటిలో డీజిల్‌తో తిరిగే కార్లే ఎక్కువ. దీంతో కాలుష్యం ఎక్కువుతోంది. ఇక లారీలు, ఆటోలు అదనం. పగటిపూట వీటిని నగరంలోకి అనుమతించరు. ఇక సగానికి సగం కార్ల వినియోగం తగ్గుతుంది. అయితే కార్లపై ఆధారపడి తిరుగుతున్నవారు ఇకముందు ఎలా ప్రయాణిస్తారన్నది ప్రశ్న. వారికి అందుబాటులో ఇతర రవాణా సౌకర్యాలు ఏమున్నాయన్నది ఇప్పుడు వేధిస్తోంది. దిల్లీ ప్రభుత్వం మాత్రం అదనంగా 5 వేల బస్సులను తిప్పాలని భావిస్తోంది. ఇక మెట్రో సర్వీసులు, సామర్థ్యం పెంచాలని యోచిస్తోంది. ఇప్పుడు బస్సులద్వారా 50 లక్షలమంది రోజూ తిరుగుతున్నారు. మెట్రోపై 30 లక్షలమంది ఆధారపడుతున్నారు. కనీసం కోటిమందికోసం వీటి సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టుకూడా కార్ ఫ్రీ విధానాన్ని సమర్థిస్తోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది. పదేళ్లు సర్వీసు పూర్తయిన డీజిల్ వాహనాల రెన్యువల్ వద్దని, ప్రభుత్వాలుకూడా డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను అనుమతించవద్దని, ప్రభుత్వం మున్ముందు ఇలాంటి వాహనాలను కొనుగోలు చేయవద్దని సూచించింది. ఇక లక్షల సంఖ్యలో స్కూలు పిల్లలను తరలించే కార్లు… ఇప్పుడు అందుబాటులో ఉండవుకనుక వారిని గమ్యస్థానాలకు చేర్చడం ఎలా అన్నదానిపై ఇప్పుడు చర్చిస్తున్నారు. కొన్నాళ్లపాటు స్కూళ్లకు సెలవు ఇచ్చి, కార్ ఫ్రీ కార్యక్రమం అమలు తరువాత ఫలితాన్ని అంచనావేసి నిర్ణయించుకోవాలని భావిస్తున్నారు.
గుర్‌గావ్‌తో మొదలు
మనదేశంలో హర్యానాలోని గుర్‌గావ్‌లో తొలిసారి ‘కార్ ఫ్రీ’ ప్రయోగం అమలు చేశారు. దిల్లీ శివారు ప్రాంతమైన గుర్‌గావ్ ఐటీ సెక్టర్‌కు కేంద్రం. ఇక్కడికి వచ్చిపోయేవారంతా కార్లపైనే ఆధారపడతారు. దీంతో అక్కడ అది పెద్దసమస్యగా మారిపోయింది. ఈ సమస్యనుంచి బయటపడటానికి ‘రాహ్‌గిరి డే’ కార్యక్రమాన్ని అమలు చేశారు. వారంలో ఒకరోజు ఈ ప్రాంతంలో కార్లు తిరగవు. రోడ్లు మూసేస్తారు. పిల్లాపాపలతో రోడ్డుపైనే కాలక్షేపం చేస్తారు. తిండీతిప్పలు, ఆటపాటలు, యోగా కార్యక్రమాలు అన్నీ రోడ్డుపైనే. దీంతో మేలైన వాతావరణ మార్పులు నమోదయ్యాయి. కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఒక్కరోజులో ఎంతమార్పు వచ్చిందో గమనించారు. ప్రజలనుంచి పెద్దఎత్తున మద్దతు లభించడంతో ఆ తరువాత రాహ్‌గిరి డేకు తోడుగా కార్ ఫ్రీ కార్యక్రమాన్ని అమలు చేశామంటున్నారు రాహ్‌గిరి స్వచ్చంద సంస్థ సహవ్యవస్థాపకురాలు సారిక పండాభట్.
దేశంలోని పలు ప్రాంతాల్లో..
నిజానికి గుర్‌గావ్ ప్రయోగంతో ఊపొచ్చినా అంతకుముందే పంజాబ్‌లోని ఫజిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. సిటీసెంటర్‌నుంచి క్లాక్ టవర్ మార్గంలో కార్లను నిషేధించారు. ఆ తరువాత సిమ్లాలోని హిల్‌మార్కెట్ నుంచి మాల్ రోడ్డు వరకు కార్లు వాడకాన్ని అనుమతించలేదు. ఇప్పటికీ అది అక్కడ అమలవుతోంది. ఇక కోయంబత్తూరులో ఆగస్టు 9న కార్ ఫ్రీ డేను అమలు చేస్తారు. అహ్మదాబాద్‌లలో ఏడాదికోసారి, కొన్ని ప్రాంతాల్లో ఇది అమలు చేస్తున్నారు. మహారాష్టల్రోని మథేరాన్ హిల్‌స్టేషన్‌లో కార్లకు బదులు గుర్రాలు, టాంగాలు, సైకిళ్లు వాడటం సంప్రదాయంగా వస్తోంది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతావంటి నగరాల్లో ఇంకా సంప్రదాయం ఊపందుకోలేదు.
జనచైతన్యంతోనే…
యూరప్, ఆఫ్రికా దేశాల్లో ‘కార్ ఫ్రీ’ ప్రయోగానికి జనంనుంచి మంచి మద్దతు లభించింది. ఆరోగ్యంకోసం వారంతా ఒక్కటయ్యారు. ప్రభుత్వాలుకూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఘనంగా, ప్రణాళికా బద్ధంగా చేస్తోంది. నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిగా కార్లను నిషేధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెడుతున్నాయి. ఇక మనదేశంలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న ఈ ఉద్యమం విజయవంతం అవ్వాలంటే ప్రజల్లో మార్పు రావాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. కారుమబ్బులు తొలగిపోయి…హాయిగా ఊపిరిపీల్చుకోగలుగుతాం.
*
*****************

కారొద్దంటున్న టాప్ టెన్ దేశాలివే
మాడ్రిడ్ (స్పెయిన్)
ఈ నగరంలోని 500 ఎకరాలను కారు లేని ప్రాంతంగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో నివసించేవారికి సొంత కారు ఉన్నా కర్బన ఉద్గారాలు విడుదల చేయకుండా ఉండాలి. ఒకవేళ ఆ వాయువులు విడుదలైతే జరిమానా విధిస్తారు. ప్రత్యేక పార్కింగ్ ప్లేస్ ఉండాలి. కారువాడని వారికోసం 150 ప్రాంతాల్లో 1500 ఎలక్ట్రికల్ బైక్‌లు అద్దెకు అందుబాటులో ఉంచుతారు.
పారిస్ (ఫ్రాన్స్)
ఈ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో డీజిల్‌తో నడిచే వాహనాలు నిషేధించారు. ఇక్కడ నివసించేవారు వారాంతంలో కార్లను ఉపయోగించకూడదు. కారులేనివారికి ప్రాధాన్యం ఇస్తారు. 2001లో ఇక్కడ కారులేనివారు 40శాతం ఉంటే ఇప్పుడు 60శాతంమంది ఉన్నారు.
చెంగ్డు (చైనా)
అత్యాధునిక రవాణా వ్యవస్థ ఇక్కడి ప్రత్యేకత. కార్లకు నిషేధం. సౌర, వాయు, విద్యుత్ సహాయంతో నడిచే ఆధునిక రవాణా సాధనాలు అందుబాటులో ఉంచారు.
హంబర్గ్ (జర్మనీ)
2034కల్లా పూర్తిగా కార్లు లేని నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యం. కాలిబాటలు, సైకిల్‌లైన్లు ఇక్కడి ప్రత్యేకత. భూతాపంవల్ల ఇక్కడ సముద్ర నీటిమట్టం గత 60 ఏళ్లలో 20 సెంటీమీటర్లు పెరిగింది. వేడీ అదేస్థాయిలో పెరిగింది. దీంతో ఇక్కడి ప్రజలకు వాతావరణం బాగుండాలన్న స్పృహ పెరిగింది.
కోపెన్‌హెగన్ (డెన్మార్క్)
ఇక్కడ జనంకంటే సైకిళ్లు ఎక్కువ. రోజూ 36వేల సైకిళ్లు నడుస్తాయి. కార్గొబైక్‌లో కుటుంబ సమేతంగా వెళ్లి పిల్లల్ని స్కూలుకు దింపడం ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ తిరిగే వాహనాల్లో సగానికి సగం సైకిళ్లు లేదా ఇలాంటి ఎలక్ట్రిక్ రిక్షాలు, కార్గొబైక్‌లే. 2020నాటికి కర్బన ఉద్గారాలు లేని నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యం. ఇక్కడ 390 కి.మీ. పొడువున సైకిల్ లైన్స్ వేశారు.
హెల్సింకి (్ఫన్లాండ్)
2050కల్లా సేఫ్‌సిటీగా మార్చాలని లక్ష్యం. ఇక్కడ బైక్, కార్గొబైక్‌లు, ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. వారంలో కొన్నిరోజులు, కొన్నివేళల్లో కార్లపై నిషేధం ఉంది. ఆ సమయంలో ప్రత్యామ్నాయ సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వమే ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మిలన్ (ఇటలి)
ఉదయం 7.30నుంచి రాత్రి 7.30వరకు కారు వాడనివారికి ప్రభుత్వం 1.5 యూరోల మొత్తానికి కూపన్ బహుమతిగా ఇస్తుంది. వారు కారును వాడిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఒక ప్రత్యేకవ్యవస్థతో వారి వాహనం అనుసంధానమై ఉంటుంది.
డబ్లిన్ (ఐర్లాండ్)
ప్రపంచంలో అతి ఇరుకైన నగరంగా పేరుపొందిన ఈ నగరంలో కార్ ఫ్రీ పథకం అమలు చేస్తున్నారు. జనంనుంచి మంచి మద్దతు లభిస్తోంది.
మస్దర్ సిటి (యుఎఇ)
ఈ ఎడారి నగరం ఆధునిక సాంకేతిక ప్రగతికి అద్దంపడుతుంది. కర్బన ఉద్గారాల ఊసేలేని ఇది జీరోవేస్ట్ నగరంగానూ ఉంది. ఇక్కడ కార్లు వాడరు. ఎలక్ట్రోపవర్డ్ ఆటోమేటిక్ సింగిల్‌కేబిన్ రాపిడ్ ట్రాన్సి సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దీనిని ఫ్యూచర్ టౌన్‌గా పిలుస్తున్నారు. సోలార్, విండ్, థర్మల్ ఎనర్జీతో ఈ వాహనాలను నడుపుతారు.

***********************

సైకిల్‌వాలా జిందాబాద్..
ఆ మధ్య శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్‌బాబు సైకిల్‌పై చక్కర్లు కొడితే జనం చప్పట్లు కొట్టారు గుర్తుందా…ఈ మధ్య దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బృందంకూడా సైకిల్‌పై సవారీ చేస్తూ జనసామాన్యాన్ని ఉత్తేజపరిస్తే దేశం మొత్తం ఆయనవెన్నంటి నడిస్తే ఆశ్యర్యపోయుంటారు. కానీ ప్రపంచంలో చాలామంద్రి సుఖమైన, భద్రమైన, వ్యయంలేని రవాణాసాధనంగా సైకిల్‌నే ఎంచుకుంటున్నారు. కారు వద్దన్నప్పుడు వారు ఎంచుకునే దీటైన వాహనం సైకిలే. వ్యాయామం, ఖర్చు లేకపోవడంతో వారికి ఇది పుష్పకవిమానమైపోయింది. సైకిల్ లభించనప్పుడు మాత్రమే వారు ఎలక్ట్రికల్ కార్లను వాడుతున్నారు. అయితే సైకిళ్లపై ఒకరు లేదా ఇద్దరే ప్రయాణించే అవకాశం ఉంది. నలుగురైదుగురు ఉండే కుటుంబం ప్రయాణించాలంటే ఎలక్ట్రికల్ కార్లను ఎంచుకుంటున్నారు.
ఇక్కడ సైకిళ్లు ఎక్కువ
ప్రపంచంలో సైకిళ్లు ఎక్కువగా వాడే నగరాలు కొన్ని ఉన్నాయి. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ అందులో ఒకటి. ఇక్కడ తిరిగే వాహనాల్లో 6శాతం సైకిళ్లే. వీటిని తొక్కేవారికోసం ప్రత్యేకంగా సైకిల్‌పాథ్‌లు ఏర్పాటు చేశారు. లోస్పీడ్ బైక్‌లైన్స్‌కూడా నిర్మించారు. అలాగే మరో అమెరికా నగరం మినెపోలిస్‌కూడా సైకిల్ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని బైసైకిల్ మ్యాగజైన్ పేర్కొంది. డెన్నార్క్‌లోని కోపెన్‌హెగన్‌లో 30శాతం వాహనాలు సైకిళ్లే. నెదర్లాండ్స్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం అమెస్టర్‌డాంలో సైకిళ్లే ప్రధాన ఆకర్షణ. బ్రెజిల్‌లోని కుంటిబా, ఆస్ట్రేలియాలోని పెర్త్, జపాన్‌లోని క్యోటో, తైవాన్‌లోని కవోసియంగ్, జర్మనీలోని బెర్లిన్ వాసులకు సైకిళ్లంటే మహామోజు. బెర్లిన్‌లో అయితే సైక్లిస్టులకోసం ఏకంగా కార్ పార్కింగ్ ప్లేస్‌లకన్నా రెండింతలు సైకిల్ పార్కింగ్ ప్లేస్‌లు ఉన్నాయి. ఏకంగా 400 మైళ్ల పొడవున బైక్‌పాథ్‌లు ఏర్పాటు చేయడం అక్కడి విశేషం.

*************************
గుర్‌గావ్-సైబరాబాద్
‘కార్ ఫ్రీ’ నగరంగా భాసిల్లాలని తపించే నగరాలు రెండున్నాయి. ఒకటి గుర్‌గావ్. రెండు హైదరాబాద్. ఇప్పుడు వాటి సరసన దిల్లీ చేరాలనుకుంటోంది. గుర్‌గావ్ ఐటీ సెక్టార్ పోగుపడిన హర్యానా పట్టణం. దిల్లీకి సమీపంలో ఉంది. ఇక్కడ ప్రతి మంగళవారం కార్ల వినియోగం ఉండదు. రోజూ 60వేల కార్లలో 3 లక్షలమంది ప్రయాణిస్తారు. ఆ రోజు మాత్రం పట్టణంలోని ఐదు జోన్లలో కార్లవాడకం నిషేధం. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇది అమలవుతుంది. పోలీసు, గుర్‌గావ్ మున్సిపల్ కార్పొరేషన్, హర్యానా డెవలప్‌మెంట్ అథారిటి కలసి దీన్ని అమలు చేస్తాయి. డిఎల్‌ఎఫ్ సైబర్ సిటీ, ఉద్యోగవిహార్-ఎలక్ట్రిక్ సిటి, గోల్ఫ్‌కోర్స్ రోడ్, డిఎల్‌ఎఫ్ సైబర్ హబ్, హుడా సిటీ సెంటర్-మెట్రోస్టేషన్-సుభాష్‌చౌక్ ప్రాంతాల్లో ఇది అమలు చేస్తున్నారు.
ఇక హైదరాబాద్‌లో ఐటి రంగం కేంద్రీకృతమైన హైటెక్‌సిటీ (సైబర్‌సిటి) ప్రాంతంలో ప్రతి గురువారం కార్ల వినియోగం తగ్గించాలని నిర్ణయించారు. గత ఆగస్టులో తొలిసారిగా ఇది ప్రయోగాత్మకంగా అమలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ ఆర్టీసి, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రెన్యుయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది అమలు చేస్తున్నారు. రోజూ ఇక్కడ 40వేల కార్లలో కొన్ని లక్షలమంది ప్రయాణిస్తున్నారు. ముఖ్యం ఐటీ ఉద్యోగుల రాకపోకలన్నీ కార్లపైనే సాగుతాయి. గురువారం కనీసం పదివేల కార్లను తగ్గించి నడపాలని మొదట నిర్ణయించారు. ఆ రోజు ఆర్టీసి అదనంగా కొన్ని బస్సులను నడుపుతోంది. కార్ల వినియోగం తగ్గడంవల్ల లక్ష లీటర్ల ఇంధనం ఆదా అవుతుండగా రోజుకు 273 టన్నుల కార్బన్‌డయాక్సైడ్ విడుదల నివారించబడుతోంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

50ఏళ్ళ పాండురంగడు -మార్కు మార్చని పూరీ

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాక్ లో మహిళా భద్రతా ,,బి జె పి లో అసమ్మతి సెగ

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రచయితల సంఘ సభ్యత్వ నమోదు ప్రారంభం మాస్టర్ ప్లాన్ రెడీ ,రచయిత్రులే పుస్తక విక్రేతలు

Inline image 1Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ చిత్తం -5 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం

దైవ చిత్తం -5

శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం

పేజి -33,పేరా -3

‘’విశ్వం మార్పు చెందదని,అది ఒకప్పుడు ఉండేది ,అదిఎప్పటికీ  ఉంటూనే ఉంది ‘’అని నిశ్చయంగా భావించిన విషయం లో మార్పు వచ్చింది .చలన శీల౦గా  ,విస్తరిస్తున్నవిశ్వం ఎప్పుడో పూర్వం ఒక స్థిరమైన కాలం లో ఆవిర్భవించి ,భవిష్యత్తులో ఒక చోట ఆగిపోతుందనే భావన దీని స్థానం లో ఏర్పడింది .పరిభ్రమణ విషయం ముందు అధ్యాయాలలో  వస్తుంది .కాలం గడిచాక అదే నా భౌతిక శాస్త్ర సిద్ధాంత పరిశోధనకు ప్రారంభ విషయం అయింది అన్నాడు హాకింగ్ .తానూ ,రోజేర్ పెన్ రోజ్ కలిసి  అయిన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతప్రకారం విశ్వానికి మొదలు తుది ఉన్నాయని చూపాము .

శాస్త్రీజీ భాష్యం –ఇదే విషయాన్ని వేద కాల మహర్షులు ‘’కాస్మిక్ పంచాంగం ‘’లో తెలియ జెప్పారు .ప్రస్తుత యుగం మహా యుగాలలో శ్వేత వరాహ కల్పం లోని 28వది అయిన కలియుగం లో మొదటిపాదం .వేద ఖగోళం  విశ్వానికి ఆరంభం ,అంతం కూడా ఉన్నాయని చెప్పింది. ఏదో వాళ్ళు కవితాత్మకంగా చెప్పిన దాన్ని ఇప్పటి పరిశోధనలకు ముడి పెడుతున్నావు ,అదేదో యాదృచ్చికం అని నన్ను మీరు అనవచ్చు . కాని ఇది మన మహర్షుల క్రాంత దర్శనానికి ఉదాహరణ అని వారి మేధో వికసనానికి పరాకాష్ట అని మర్చి పోరాదు .వారెప్పుడో మనో బలం టో అంతర్ దృష్టితో దర్శించి ప్రవ చించిన దానినే ఎన్నో ఏళ్ళ తర్వాత సైన్స్ పరిశీలించి చెప్పింది .ఇది ముమ్మాటికీ నిజం .

ఇక్కడ ఒక విషయం లో జాగ్రత్త పడాలి మనం .వేదాంత విషయమైన అద్వైతానికి మర్త్యలోకానికి చెందిన సైన్స్ కు ముడి పెట్ట రాదు .మన పూర్వీకులు ఈ రెండిటినీ వేర్వేరుగానే చూశారు .సూర్యోదయాన్ని విస్తృతంగా వర్ణించిన వేదం ,ఉపనిషత్ లో సూర్యుడు ఉదయించడు ,అస్తమించడు అనీ చెప్పింది . భూమి మాత్రమె తిరుగుతుంది అని చెప్పింది .ఖగోళ పంచాంగం వగైరాలు మానవులకు మాత్రమేనని గ్రహించాలి .గ్రహ గతులను తెలుసుకోవటానికి మాత్రమే అవి సహకరిస్తాయి .అంతేకాని ఈ ప్రపంచం మిధ్య అన్న అద్వైతానికి ఇది వర్తించదు .వేదాంత ఆలోచనలను  నిత్య జీవిత విషయాలతో కలపరాదు .బ్రహ్మ సూత్ర భాష్యం  శాస్త్రాలన్నీ భ్రాంతి నాధారంగా రాయబడినవి అని చెప్పింది .అందు చేత అవి ప్రకృతితో  అనుభవాదారమైనవి (ఎమ్పెరికల్ )అని స్పస్టపరుస్తాయి .ఈ శాస్త్రాలు అంటే మన భాషలో సైన్స్ లు మానవ కంటికి దేవుడిని చూపించ లేవు .దీనికి కారణం చెప్పాలంటే ఇవన్నీమానవ సిద్ధాంత రచనలే కావటం వలన .

మూడవ అధ్యాయం -విశ్వ వ్యాపనం

పేజి -37,పేరా -1

‘’మనం ఒక గెలాక్సీ లో ఉన్నాం .అది ఒక లక్ష కాంతి సంవత్సరాల దూరం లో ఉండి,నెమ్మదిగా పరిభ్రమిస్తోంది .చుట్టగా (స్పైరల్ )బాహువులలోని నక్షత్రాలు కేంద్రం చుట్టూ అనేక వందల మిలియన్ల సంవత్స రాలకొక చుట్టూ తిరుగుతూ ఉంటాయి .

శాస్త్రి గారి మహా భాష్యం –ఈ స్థిర నక్షత్రాన్నే మన పూర్వులు ధ్రువ నక్షత్రం అన్నారు .దీని చుట్ట్టూ పాల పుంత లోని  మిగిలిన  నక్షత్రాలు తిరుగుతాయని చెప్పారు .బాగా అర్ధం కావటానికి సామాన్యులకోసం ద్రువుని కద గా చెప్పారు .ధ్రువుడు తపస్సు చేసి దీన్ని సాధించాడని అన్నారు .వివాహ మంత్రాలలో కూడా ఈ విషయం ఉంది .ధ్రువ నక్షత్రాన్ని నూతన దంపతుల మధ్య శాశ్వత శృంగార బాంధవ్యం  ద్రుఢంగా,స్థిరంగా  ఉండేట్లు చేయమని  అర్దిస్తారు .కాలాన్ని స్పైరల్ గా భావించటం లో ఒక పరమార్ధముంది .సూర్యుని సమీపం లోని సింశుమార చక్రంతిరుగుతూ  ప్రతి 60ఏళ్ళకు ఒక సారి ఉన్న చోటికి వస్తుంది.దీన్ని గమనించాలి .సంస్కృతం లో సింశుమార అంటే ఒక సముద్ర జీవి .చక్రానికి(స్పైరల్ కు ) 27 నక్షత్రాలు ఉంటాయి. వీటిని చంద్రుని భార్యలుగా భావిస్తారు .ఒక్కో నక్షత్రం లో చంద్రుడున్న నెలను ఆ నక్షత్రం పేరుతొ పిలుస్తారని మన ఖగోళ శాస్త్రం చెప్పింది .మృగశిరా నక్షత్రం లో చంద్రుడు పౌర్ణమి నాడు ఉంటె ఆ నెలకు మార్గశిరమాసం అని పేరు అలానే మిగిలినవికూడా .

పేజి 44,పేరా 2

‘’గురుత్వాకర్షణ యెంత బలీయమైనది అంటే స్పేస్ దానికదే ఒంగి పోయి భూమి ఉపరిత0 లాగా కనిపిస్తుంది ‘’.బహుశా సాగర మధనం మహా కూర్మం పైన ఉన్న గుల్ల మీద మంధర పర్వతం ఆని ఉండటాన్ని సూచిస్తుంది .

పేజి 47 ,పేరా -2

గేలాక్సీలు ఒక దానికొకటి దూరం జరిగిపోతే , నిరంతరం ఏర్పడే కొత్త పదార్ధం నుండికొత్త గేలాక్సీలు   ఏర్పడి  ఆ స్థానాలను  భర్తీ చేస్తాయి .అందువలన అన్ని సమయాలలో ,స్పేస్ లోని అన్ని బిందువుల వద్దా విశ్వం మామూలుగానే మార్పు లేనట్లు కనిపిస్తుంది .

శాస్త్రీజీ  వివరణ –ఈ స్థిర రూప సిద్ధాంతాన్నే   బార్డి గోల్డ్ –బాయిల్ సిద్ధాంతం అన్నారు. కాని కొంతకాలం తర్వాత ఈ సిద్ధాంతానికి ‘’తూ నా బొడ్డు’’అని తీసిపారేశారు .ఈ విషయాన్ని భారతీయ మహర్షులు,ద్రష్టలు గణాలకు నాయకుడైన గణపతి కి ఉన్న సంబంధం తో చూపారు, రాశారు .ఇక్కడ గణాలు అంటే నక్షత్ర గణాలు అని అంటే గేలాక్సీలు అని అర్ధం .ఆయనకు నైవేద్యంగా పెట్టేవి బియ్యపు నూకతో చేసిన ఉండ్రాళ్ళు .అవే ఆయన కిష్టం .ఇవే నక్షత్రాలు .ఆయన బొజ్జ ఈ విశ్వమే .పాత తారల స్థానం లోనిరంతరం  కొత్త నక్షత్రాలు సృష్టింప బడటం అంటే నక్షత్రాలు వాటిలో ఉండే పదార్ధం (మాస్ )హరి౦చు కొని పోవటమే .కొత్త తారల పుట్టుక గెలాక్సీలలోని అయస్కాంత క్షేత్రాన్ని సమ తుల్యతలో ఉంచటానికే .ఈ గెలాక్సీ లో ఉన్న ఒక్క నక్షత్రం ద్వంసమైనా చాలు గెలాక్సీ కుప్ప కూలి పోతుంది .అందుకే మన పూర్వీకులు గణేశ్వరుని  ఈ నక్షత్ర సమూహ మూర్తిగా(ఎంబాడి  మెంట్ ) చెప్పారు.మూర్తీభవించిన విశ్వం లోని నక్షత్ర కూట సముదాయమే వినాయకుడు అన్న మాట .    అంటే ఆయన శరీరం లో నక్షత్రాలున్నాయని భావం .కనుకనే వినాయక చవితికి ఆయన శిరసుపై ‘’మహా రాజ లాంచనం’’అయిన  ఛత్రం గా ‘’పాల వెల్లి’ ని’వెదురుపుల్లల’తో తయారు

’ చేసి రంగుకాగితాలతో అలంకరించి ఉంచుతారు .ఈ పాలవేల్లినే ‘’మిల్కీ వే’’అంటాం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-12-15-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -4 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం

దైవ చిత్తం -4

శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం

పేజి 21,పేరా  -2

ప్రతి పరిశీలకుడిదడు   స్వయం గా  తనతో పాటు తీసుకు వెళ్ళిన గడియారం తో కాలాన్ని కొలిచి రికార్డ్ చేసుకోవటం గమనించబడింది .ఈ గడియారాలు ఒకే తీరుగా ఉన్నప్పటికీ  అవి రికార్డ్ చేసే కాలాలు ఒకే మాదిరిగా లేవు .

శాస్త్రిగారి విశ్లేషణ –భారతీయ లాజిక్ అనబడే తర్క శాస్త్రం పూర్వమేమనం అనుసరించే  గంటలు ,రోజులు మన కను రెప్పల తెరవటం మూయటం లతో ,సన్ డయల్ మొదలైన వాటిద్వారా కనుగొనే వారని తెలియ జేసింది .కాలం ను ‘’విభువు ‘’అంటారు .అంటే అఖండం  అని అర్ధం .అన్నం భట్టు రాసిన తర్క సంగ్రహ గ్రంధం లో ‘’అతీతాది వ్యవహార హేతు హు కాలః ,సా చైకో విభు రనిత్యహః ‘’.కాలం జరిగిన ,జరగా బోయే దాని  వ్యక్తీకరణకు కారణమవుతుంది .కాని అది అఖండం .సర్వ వ్యాపకం .విభు అంటే అదే .

పేజి 23,పేరా 1

కాలం పూర్తిగా  వేరైనది,ఆకాశం కంటే స్వతంత్ర మైంది కాదని ,దానితో కలిసే ఉంటుందని దీనివలననే స్పేస్ టైం అనేది ఏర్పడుతుంది

వ్యాఖ్య –భారతీయ వేదాంతులు కవులు భగవంతుని ఈ కింది విధంగా స్తోత్రం చేశారు –

‘’భగవానుని రూపం అనంతమైన విశ్వం .అది దేశ కాలాల చేత విభజింప బదేదికాదు .దేశ కాలా భేద్యం .ఆత్మతో మాత్రమె పరమాత్మను చూడగలం .అనుభవించగలం .ఆయనను సృష్టిలో కనిపించే ప్రతి ఉత్కృష్ట వస్తువుతో పర్యాయ పదంగా అర్ధం గా భావిస్తారు .భారతీయ సాహిత్యం లో ఈ రెండిటిని కలిపే చెప్పారు .సత్యం పై వారికున్న తపన ఈ రెంటి విషయమై తీవ్ర ఆలోచనకు గురిచేసి దేవుడు వీటికి అతీతుడు అని స్పష్టంగా నిర్ణయించి చెప్పాయి .దీనికి సంబంధించిన భర్త్రుహరి  కవి సంస్కృత శ్లోకం –

‘’దిక్కాలా ద్యా నవ  చిన్నానత చిన్మాత్రా మూర్తయే –స్వాను భూత్యేక మనయ నమస్సంతాయ తేజసే ‘’

దీని అర్ధం –భగవంతుడు దేశ ,కాలాలకు  సంబంధించిన వాడు  కాదు.వాటి చేత విభ జింప బడే వాడూ కాదు .ఆయన సర్వ విజ్ఞానానికి మూర్తి మత్వం .ఆయనను ఎవరికి వారు స్వయంగా అనుభవం తో(స్వానుభవం తో )మాత్రమె తెలుసుకొని దర్శించగలరు .  జ్ఞానం ,దానికి ఆవలి దానితో మాత్రమె ఈ అనుభూతి పొందగలం .ఆయన భక్తులకు ఆ అనుభవం ,ప్రశాంతి అనుగ్రహించే ఆయనకు ప్రణామాలు .

దిక్-ఆకాశం (స్పేస్ ),కాలం -టైం .ఈ రెండూ వ్యావహారికం లో ఉపయోగ పడేవి .అన్నంభట్టు తంత్ర సారం లో వీటికి చక్కని నిర్వచనాలు చెప్పాడు

కాలం –‘’అతీతాది వ్యావహార హేతు హు కాలహ-సా చికో విభుర్నిత్యః

ఆకాశం (స్పేస్ )దిక్-‘’ప్రాచ్యాది వ్యావహార హేతు హు  దిక్.-సా చైకా విభ్వీ నిత్యాచ ‘’

ఆకాశం కూడా అనంతమైనదే –అఖండమే అంటే విభు .మనకున్న 8,లేక 10దిక్కులు మన నిత్య జీవిత వ్యవహారం లో ఉపయోగించేవే .దిక్ కూడా  అనంతమే కాదు నిత్యమై శాశ్వతమైనదే .కనుక దేశ కాలాలు అభేద్యమై శాశ్వతమైనవి .కనుక రెండూ వేరు వేరుకాదు .రెండూ ఒక్కటే .ఈ విషయాన్ని మన తర్క పండితులు వేలాది సంవత్సరాల క్రితమే స్పష్టంగా తెలియ జేశారు .

పేజి -28,పేరా -1

‘’ఉదాహరణకు –సూర్యుడు ఇప్పుడు ఈ క్షణం లో ప్రకాశించటం మానేశాడు  అంటే ,అది అప్పటికప్పుడు భూమిపైనున్న వస్తువులపై ప్రభావం చూపదు .ఎనిమిది నిమిషాల తర్వాతే దాని ప్రభావం భూమిపై కనిపిస్తుంది .కారణం సూర్య కిరణాలు భూమికి చేరటానికి 8నిమిషాలు పడుతుందని మనకు తెలుసు .అలాగే మన విశ్వానికి  అత్యంత దూరం లో ఉన్న  గెలాక్సీ ల కాంతి అవి కొన్ని మిలియన్ సంవత్సరాలకు ముందు విడుదల చేసిన కాంతి మాత్రమె అని మనం గ్రహించాలి .సుమారుగా 8వేల మిలియన్ సంవత్సరాల క్రితం కాంతిగా శాస్త్రజ్ఞులు భావించారు .ఇప్పుడు మనం చూస్తున్న విశ్వం ఎప్పుడో పూర్వం ఉన్న విశ్వం అన్న మాట యదార్ధం .

పేజి 32,పేరా -3

సాధారణ సాపేక్ష సిద్ధాంతం లోని ఒక ఊహ ఏమిటంటే –భూమిలాంటి అతి భార పదార్ధాల వద్ద కాలం నెమ్మదిస్తుంది .కాంతి శక్తికి దాని ఫ్రీక్వెంసి కి (పౌనః పున్యం)కు ఉన్న సంబంధమే దీనికి కారణం .శక్తి పెరిగితే ఫ్రీక్వెంసి పెరుగుతుంది .కాంతి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి క్షేత్రానికి కి పైన ప్రయాణిస్తే ,అది కొంత శక్తిని కోల్పోయి ,దాని ఫ్రీక్వేన్సికూడా తగ్గిపోతుంది .కనుక దీనికి పైన ఉన్నవారికి కింద ఉన్న చోట ప్రతిదీ ఆలస్యంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది .

శాస్త్రీజీ భాష్యం –అందుకే మన వేద వేత్తలు భూమి మీది నెల ,సంవత్సరం మొదలైన వాటికీ పిత్రులోక ,దేవలోక వాసుల వారి కాలానికి చాలా తేడా ఉన్నట్లు గమనించి చెప్పారు .భూమిపై ఒక నెలకాలం పిత్రులోక వాసులకు ఒక పగలు ,ఒక రాత్రి మాత్రమె .ఇక్కడి ప్రతి పక్షం అక్కడ రోజులో సగం మాత్రమె .దేవలోక వాసులకు భూలోకపు సంవత్సరం ఒక్క రోజు మాత్రమె .అందుకే పితృ తర్పణం ప్రతి నెలకో సారి ,దేవతల ఉత్సవాలు సంవత్సరానికి ఒక సారి చేస్తారు .

పేజి 33,పేరా -2

న్యూటన్ సూత్రాలు ఆబ్సల్యూట్ పొజిషన్ ఆఫ్ స్పేస్ కు స్వస్తి చెప్పాయి .రిలేటివిటి  సిద్ధాంతం ఆబ్సల్యూట్ టైంకు మంగళం పాడింది .ఒకే ఈడున్న ఒక జంట కవలపిల్లలను ఉదాహరణగా తీసుకొందాం .అందులో ఒకడు దూరంగా ఒక పర్వతాగ్రాన పెరుగుతున్నాడని, రెండవ వాడు సముద్ర తీరం లో పెరుగుతున్నాడని భావిద్దాం .కొన్నేళ్ళ తర్వాత చూస్తె మొదటి వాడు రెండవ వాడికంటే ఎక్కువ వయసు పెరిగినట్లు గ్రహిస్తాం .వాళ్లిద్దరూకలిస్తే మొదటి వాడు రెండవ వాడికంటే పెద్దవాడు అనిపిస్తాడు .వయో భేదం ఇక్కడ చాలా తక్కువగా ఉండచ్చు .కాని ఇందులో ఒకడు చాలాకాలం చాలా దూరం లో స్పేస్ షిప్  లో కాంతి వేగం తో సమానంగా ప్రయాణించి వచ్చాడని అనుకొంటే ,వీడి వయసు భూమి మీద ఉన్న వాడి వయసుకంటే చాలా తక్కువగఉన్నట్లు ,చిన్నవాడుగా ఉన్నట్లు అనిపిస్తుంది .దీనినే ‘’ట్విన్స్ పారడాక్స్ ‘’అంటారు .ఇది ఒక ఆభాస (పారడాక్స్ )మాత్రమె నని ఆబ్సల్యూట్ టైంపై అవగాహన ఉన్నవారికి తెలుస్తుంది ..  .దీరీ ఆఫ్ రిలేటివిటి లో ఒకే రకమైన ఆబ్సల్యూట్ టైం అనేది ఉండదు .కానిదీనికి బదులు  ప్రతి వ్యక్తీ తన కాలాన్ని   తానున్న ప్రదేశం ,ప్రయాణించే విధానం తో గణన చేసుకొంటాడు .

శాస్త్రి గారి భాష్యం –ఈ విషయాలన్నీ మన వేదవేత్తలు ముందే తెలుసుకొని దేవతలుసాపేక్షంగా  అమరులు అని చెప్పారు .దేవతలకు అంతం ఉంది కాని వారు జీవితకాలం కల్పాలతో కలిసి ఉంటుంది .దీనికి కారణం వారు మర్త్య లోకానికి ఎంతో సుదూరం లో ఉండటమే .బహుశా ఈ దూరం మీడియం అంటే వాహిక ,లేక ఫేజ్ మార్పు అయి ఉండచ్చు .ఇది ఒక కణం పదార్ధం గా మారటానికి పట్టే కాలం అని చెప్ప వచ్చు .భూలోకం లోనే స్వర్గ లోకం ఉంది అని  వేదం చెప్పింది –‘’అంతర్హితోహి స్వర్గ లోకో మనుష్య లోకాత్ –(యజుర్వేదం -6 వ కాండ  -1వ అనువాకం )

కనుక స్వర్గ లోకం మీడియం లో ఉన్నది మాత్రమె అని స్పష్టమైంది .ఇది దూరానికి (స్పేషియల్ )సంబంధించిందికాదు .కారణం స్వర్గం-మర్త్య లోకమైన  భూమికి చెప్పలేనంత దూరం లో ఉండటమే .ఇది మీడియం డిఫరెన్స్ మాత్రమె .అందుకే దేవతల ఆయుర్దాయం మానవ ఆయుర్దాయం కంటే ఎక్కువ .

భూమిపై ఉన్న ఒక రాయి ,ఒక కణం ఒక మూలకం గా (దేవతలు ) మారటం తోపోల్చి ఈ వాహిక దూరాన్ని అర్ధం చేసుకో వచ్చు .అంటే పదార్ధ స్థితులలో వచ్చే మార్పు అన్నమాట .అంటే ఘన పదార్ధానికి ,వాయు పదార్ధానికి ఉన్న భేదం  లాంటిదన్నమాట .భారతీయ వేద విజ్ఞానం(మెటా ఫిజిక్స్ ) ప్రకారం పదార్ధం లోని అతి సూక్ష్మ కణం పరమాణువు కాదు –తన్మాత్ర మాత్రమె .ఒక ప్రోటాన్ శిధిలం కావటానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది .దీనిని బట్టి దేవతలు మానవులకంటే అత్యంత ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారో అర్ధమవుతుంది .ఇదీ మర్త్యులకు దేవతలకు జీవితకాలం లో ఉన్న భేదం (బహుశా పరమాణువు )

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెల్చెరు నారాయణరావు గారితో ముఖాముఖి సభ ఆహ్వానం

వెల్చెరు నారాయణరావు గారితో ముఖాముఖి సభ ఆహ్వానంPurnachand Invitation ______ ________ __________

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

దేవుని మనసు ( దైవ చిత్తం) -3

IMG_20151223_081707 IMG_20151223_081730

(శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం

పేజి -11,పేరా-

కనుక అందుకని ప్రారంభ దశ కు చెందినసూత్రాలు ఉన్నాయి .

వ్యాఖ్య –పదార్ధ విషయం లో భారతీయ వేద భావాలకు ఇది తక్కువ స్థాయి లో కనిపిస్తుంది .పురాణాల  ప్రకారం సృష్టి కర్త అయిన  చతుర్ముఖ బ్రహ్మ వేద  విధి ననుసరించి సకల సృష్టినీ చేశాడు .ఆయన భూమిని సృస్టించ బోయే ముందు ‘’భూ ‘’అనే శబ్దాన్ని ప్రవచించాడు .అంతే -భువి సృష్టింప బడింది . బ్రహ్మ చేసే సృష్టికి  ముందే భూ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ?అనే సందేహం రావటానికి అవకాశం ఉంది . వేదాలు సార్వకాలికమైనవి అని  వేదం చెప్పింది .అంటే వేద సూత్రాలు బ్రహ్మకు  ముందే ఉన్నాయన్నమాట .బ్రహ్మ వాటిని పునశ్చరణ చేసుకొని ,సృష్టికార్యం యదా ప్రకారం చేశాడు .దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి ?అంటే జ్ఞానానికి స్పేస్ ,టైం లు విధేయత కలిగిగి ఉంటాయని (సబార్డినేట్ ).వేద పరిభాషలో జ్ఞానం అంటే భగవంతుడే .జ్ఞానం లేకుండా కాలం అనేది ఎప్పుడూ ఉండదు ,లేదు కూడా .అది కాలాతీతం భూత వర్తమాన భవిష్యత్ లన్నిటిలోనూ జ్ఞానం ఉంటుంది .దీనినే వేదం ‘’సత్యం ‘’అన్నది .’’సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ‘’అని ఉపనిషత్ చెప్పింది .అనంతమైన జ్ఞానమే పరమ పురుషుడు .ఆయన త్రికాలాలలోను ఉంటాడు అని వేదం యే అనుమానాలకు తావు లేకుండా పేర్కొన్నది .

పేజి 12,పేరా -2

ఇప్పుడు విశ్వం ఏక పక్షమైనది సర్వసత్తకమైనది   (ఆర్బిట్రరి  ),అది కొన్ని నిర్దుష్ట సూత్రాలకు లోబడి పని చేస్తుందని ,చివరికి పాక్షిక సిద్ధాంతాలను ,పూర్తీ గా ఏకరీతి సిద్ధాంతంగా మార్చి అధ్యయనం చేస్తేనే ఈ విశ్వం లో ఉన్నది అంతావర్ణించి చెప్పటానికి వీలవుతుంది .

శాస్త్రి గారి భాష్యం – ఈ ఏకీకృత సిద్ధాంతం రాబట్ట టానికి ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధన తార్కికమైనదీ ,సా౦కేతిక పరమైనదీమాత్రమె అవుతోంది. ఈ యూని ఫైడ్ దీరీ (ఏకీకృత సిద్ధాంతం )సృష్టి ప్రారంభాన్ని,సృష్టి అంతాన్నివివరించటానికి  బిగ్ బాంగ్ ,బిగ్ క్రంచ్ సిద్ధాంత౦ శరణు జొచ్చారు .భారతీయ వేదాంతం  సృష్టికి కారణ భూతమైనదేమిటో(జగత్కారణం ) వివరంగా చెప్పింది .అన్ని సిద్ధాంతాలను కలిపి ఏక సిద్ధాంతాన్ని చేసి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలను చెప్పింది .సృష్టి ప్రారంభానికి ముందు ఎలా ఉన్నదో ,సృష్టి చేస్తే యే విధంగా కనిపిస్తుందో ,సృష్టి అంతం అయితే ఎలా దర్శన మిస్తుందో అన్నీ క్రిస్టల్ క్లియర్ గా వివరించారు .ఇదే అద్వైత సిద్ధాంతం .సృష్టికి ఆరంభం అనేదికాని అంతం అనేది కాని లేదు అని అతి సాధారణ మైన మాటలలో సుస్పష్టంగా వివరించి ఎరుక పరచింది అద్వైత సిద్ధాంతం .సృష్టి ప్రారంభం ,తుది అనేవి మన లౌకిక ద్రుష్టి లో మాత్రమె కనిపించే విషయం అన్నది .భగ వంతుడు  లేక పరమాత్మ ఈ విశ్వంరూపం లో దర్శనమిస్తాడు అన్నది పరమోత్క్రుస్ట భావన .

ఈ విశ్వాన్ని చూస్తూ దేవుడిని చూస్తున్నాము అని భ్రమ పడుతున్నాం .ఇదే సృష్టి అనుకొంటున్నాం.దీన్నే రజ్జు –సర్ప భ్రాంతి అంటున్నారు .తాడును చూసి పాము అని భ్రమ పడటం అన్న మాట .తాడు మార్పులేని నిర్వికారమైనది .కాని పాముకు ఆది అంతాలున్నాయి . ఇలా భ్రమ పడటమే వేదాంత పరిభాషలో’’ అవిద్య’’ అంటారు .ఇంద్రియ నిగ్రహం కలిగి చూస్తె ఏకాత్మ భావన కలిగి విశ్వం పరమాత్మ దర్శన మవు తుంది దీనికి సాధన కావాలి .ఈ సర్వ సృష్టిగా భాసించే భగవంతుడు కాలాతీతుడు ,అనంతుడు ,అవినాశి ,ఆనంత శక్తి సంపన్నుడు .కనుక సృష్టి ప్రారంభ ,అంతాలపై కలిగే  ప్రశ్నలన్నిటికీ ఇదే అత్యుత్తమమైన సమాధానం .

రెండవ అధ్యాయం –స్పేస్ అండ్ టైం

పేజీ -18,పేరా -2

నిజానికి న్యూటన్ శాస్త్రజ్ఞుడు ఆబ్సల్యూట్ స్పేస్ లేదు అన్నదాన్ని తిరస్కరించాడు .కాని అయన సూత్రాలలో ఇది ఇమిడే ఉంది .కానికాదంటాడు .ఈ రకమైన అతార్కిక నమ్మకానికి   అందరూ ఆయన్ను ఖండించారు .అ౦దులో ముఖ్యంగా వేదాంతి ,భౌతికంగా కనిపించే వన్నీ ,స్పేస్ ,కాలం అన్నీ భ్రాంతి పూర్వకమైనవే అని నమ్మిన బిషప్ బర్క్లీ తీవ్రంగా విరుచుకు పడ్డాడు .

శాస్త్రిగారి వ్యాఖ్యానం –బిషప్ బెర్క్లీ ఒక్కడే పాశ్చాత్య వేదా౦తులలో భారతీయ వేదాంత భావన అయిన ‘’మాయ ‘’ను గుర్తించిన వాడు .ఈ భావన 2,500సంవత్సరాల కిందటిదే .పంచేంద్రియాలతో మనం చూసే ఈ దృశ్య ప్రప౦చం అంతా అసలైనదికాదు అనేది మాయా సిద్ధాంతం లో ముఖ్యమైన విషయం .అదొక భ్రాంతి అంటుంది .అసలు సత్యాన్ని దర్శించాల౦టే మామూలు భౌతిక జీవనం జీవించే వారికి సాధ్యం కాదు .ఇంద్రియాలను వశ పరచుకొని ,మనసును స్థిరంగా ఉంచి చూస్తేనే ఏకాత్మ భావన కలిగి సర్వం ఖిల్విదం  బ్రహ్మ అనే ఎరుక కలుగుతుంది .పాపం న్యూటన్ మహాశయుడు గణిత ద్రుష్టి కోణం లో చిక్కుకొని సమస్యను పరిశీలించటం వలన సత్య దర్శనం చేయ లేక పోయి ఉండవచ్చు .సృష్టికి భిన్నమైన సృష్టి కర్తను చూడలేక పోయాడు .అందుకే ఆబ్సల్యూట్ గాడ్ ను నమ్మాడు .బర్క్లీ వేదాంతి కనుక ఈ పరిధి దాటి ఆలోచించి యదార్ధాన్ని చెప్పగలిగాడు .ఈ విశ్వం సరిహద్దులు లేని అనంతమైనది .అందులో ప్రతి బిందువు విశ్వానికి కే౦ద్రమే .విశ్వం లో స్పేస్ లో టైం లు ఒకదానికొకటి పెనవేసుకొని పాయింట్ ఆఫ్ సింగ్యులారిటీ ని తెలియ జేస్తాయి .

పేజి -19,పేరా -3

గాలిలో శబ్ద తరంగాలు వ్యాప్తి చెందినట్లు  కాంతి తరంగాలు ఈధర్ లో ప్రయాణం చేస్తాయి .వీటి వేగం ఈధర్ కు సాపేక్షం గా ఉంటుంది .

శాస్త్రి గారి భాష్యం –ఈథర్ సిద్ధాంతాన్ని అయిన్ స్టీన్ లాంటి ప్రముఖ శాస్త్ర వేత్తలు ప్రక్కన పడేసి చాలా కాలమైంది .శబ్ద తరంగాలు గాలిలో ప్రయాణం చేస్తాయి అన్న విషయం  వేద సాహిత్యం లో ఉండనే ఉంది .మనకు కొత్తదేమీ కాదు .భారతీయ అతిప్రాచీన తర్క శాస్త్రం (లాజిక్ )లో శబ్దం ఆకాశం యొక్క  (స్పేస్ ) గుణం అని ఉంది  .అంటే ఆకాశం శబ్ద తరంగాలను సృష్టిస్తుంది , .పంచ భూతాలలో ఒకటి అయిన ఆకాశం   (స్పేస్ )తర్వాత సృష్టింప బడిన ది గాలి అనే మరో భూతం .ఇదే శబ్దాని కి వాహకం గా ఉండిశబ్ద తరంగాలను ఆకాశం ద్వారా ప్రసారం చేస్తుంది .ఈవిషయాన్నే  ఉపనిషత్ ‘’ఆకాశాద్వాయుః వాయోరగ్నిః ‘’అని చెప్పింది అంటే ఆకాశం నుండి వాయువు అంటే గాలి ,గాలి నుండి అగ్ని సృష్టింప బడినాయి అని అర్ధం .

పేజి -20,పేరా -2

ఏమైనా 1905లో ఒక ప్రముఖ పత్రిక ఇప్పటిదాకా ఎవరికీ తెలియని స్విస్ పేటెంట్ ఆఫీస్ లో పని చేసే గుమాస్తా ఆల్బర్ట్ అయిన్ స్టీన్ ఈధర్ అనే మొత్తం భావన ఆనవసరం అనీ దీనీతో ఆబ్సల్యూట్ టైంఅనే అభిప్రాయాన్ని   పరిత్యజించాలి (అబా౦డన్ )అని  సూచించాడు .

శాస్త్రిగారి వ్యాఖ్య –వేద భావన లో కాలం ఆబ్సల్యూట్(పరిపూర్ణం  ) కాదు .భారతీయులు కాని పాఠకులు విష్ణు మూర్తి అనంతుడని పిలువబడే ఆది శేషుడు అనే పాము   తల్పం పైపాల సముద్రం పై  శయనించి ఉన్నట్లు ఉండే చిత్రాన్ని చూసే ఉంటారు .ఇక్కడ పాల సముద్రం అంటే ఈ విశ్వమే .అదే అంతరిక్షం లోని పాలపుంత  గెలాక్సీ అనే నక్షత్రసముదాయానికి  చిహ్నం  .శేషుడు కాలానికి ప్రతీక .సంస్కృతం లో శేషం అంటే మిగిలి ఉన్నది అని అర్ధం .సృష్టి అంతా లయం అయినప్పుడు కాలం ఒక్కటే మిగిలి (శేష )ఉంటుందని భావం .భారతీయ దార్శనిక పరిభాషలో కాలం చుట్టగా (స్పైరల్ )గా ఉంటుంది అని సరళ రేఖాత్మకం కాదని చెప్పారు .కనుక ఇక్కడ శేషుడు చుట్టలు చుట్టుకొని ఉండటం దీనినే సూచిస్తుంది .వేద జ్యోతిష సిద్ధాంతం ప్రకారం మన కు ప్రభవ, విభవమొదలైన 60 సంవత్సరాలున్నాయి. అవి ఒక ఆవర్తనం పూర్తికాగానే మళ్ళీ మొదలౌతాయి .అదీ మన ప్రత్యేకత .ఇదే యుగాలు ,  ,మహా యుగాలు ,కల్పాలు ,విషయం  లోనూ జరుగుతుంది .భారతీయ వేద ఖగోళశాస్త్రం  సృష్టి ప్రారంభం అంతాలతో కాలం అనంతంగా పునరా వృత్త మౌతుంది .దీనికి తుది అనేది లేనే లేదు .ఎందుకంటె మొదలు అనేది ఉంటేగా అంతం ఉండేది .కనుక సృష్టికి కాలానికి తుది మొదలు అనేవి లేనేలేవు అని నిర్ద్వందంగా భారతీయ ఖగోళ వేద విజ్ఞానం తెలియ జేసింది .కనుక పాశ్చాత్య భావన అయిన కాలం పరిపూర్ణం (ఆబ్సల్యూట్ )అనే దాన్ని భారతీయ వేద శాస్త్రాలు పరిగణన లోకి తీసుకొనే తీసుకోవు .

రచయిత శ్రీ ఎ.సి.పి.శాస్త్రి గారి ఆంగ్ల పుస్తక ముఖ చిత్రం జత చేశాను చూడండి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-15-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -2 (శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం )

దైవ చిత్తం -2

(శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం )

మొదటి అధ్యాయం –మన విశ్వ దృశ్యం

మొదటిపేజీ –మొదటిపేరా

‘’బహుశా ప్రముఖ సైంటిస్ట్ బెర్ట్రాండ్ రసెల్ అనుకొంటా ఒక సారి ఖగోళ శాస్త్రం పై ఉపన్యాసం చేశాడు .భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో ,ఎలా సూర్యుడు  అనేక నక్షత్ర సముదాయాల తో ఉన్న  మన గెలాక్సీ కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తాడో వివరించాడు .ఉపన్యాసం అంతా  విని చివరలో ఒక ముసలావిడ ఆయనతో  ‘’మీరు చెప్పింది అంతా  చెత్తగా ఉంది .ప్రపంచం నిజంగా సమతలం గ ఉండి,ఒక బలిష్ట మైన  తాబేలు వీపు  మీద ఆధార పడి ఉంది .’’అన్నది .అప్పుడు ఆ సైంటిస్ట్ ఆశ్చర్య కరమైన ఒక చిరునవ్వు చిందించి ‘’అలా అయితే ఆ తాబేలు దేని మీద నిలబడిం దమ్మా?’’అని ప్రశ్నించాడు .దాని కామె ‘’నువ్వు తెలివైన యువకుడివని అర్ధమైంది  నాయనా.అదెప్పుడూ కిందనే ఉంటుంది బాబూ ‘’అన్నది చిర్నగవుతో,రసెల్ ను హేళన చేస్తూ  విజయ విలాసంగా ‘’.

దీనికి శాస్త్రి గారి వ్యాఖ్యానం   –భారత దేశం లో వ్యాపించి ఉన్న ఈ కూర్మావతార విశేష విషయం యూరప్ దేశాలలోకి ఎలా ఎప్పుడు పాకిందో ,ఆమెకెలా తెలిసిందో వింటే ఆశ్చర్యమేస్తుంది .భూమి ఆది కూర్మం వీపు మీద నిలిచి ఉన్నది అనేది మన కు అతి సామాన్యమైన విషయమే .తరతరాలుగా వింటున్నదే .సాహిత్యం లో ప్రాచీనమైనదైన భాగవత పురాణం లో సృష్టి కర్త దశావతారాలను ధరించాడని వర్ణించ  బడింది .విష్ణు మూర్తి మొదటి అవతారం లో ‘’బృహత్ మీన రూపం’’ ధరించాడు .మీనం అంటే చేప .చేప కు  పురాణాలు ‘’ధి ‘’ అనే సంజ్ననిచ్చాయి .ఆటే వివేకానికి చేప ప్రతీక అన్నమాట .విష్ణువు లేక సృష్టి కర్తకు శత్రువైన సోమకాసురుడు వేదాలను అపహరించి ధ్వంసం చేయ బోతే వాడిని చంపి వేదోద్ధరణ చేశాడు .అంటే  బుద్ధి లేక వివేకం నశించకుండా రక్షించాడు .

రెండవ అవతారమే ‘’మహా కూర్మావతారం ‘’ దీని అవసరానికి సంబంధించిన ఒక కధ పురాణాలలో ఉంది .దైవానికి ఇస్టు లైన దేవతలు ,ఆయనకు శత్రువులైన అసురులు అనాదిగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు .ఇరువైపులా ఈ అనంతకాల యుద్ధం లో లెక్కకు మించి చనిపోయారు .చనిపోయిన దేవ, రాక్షసులను పునర్జీవితులను చేసే ఔషధం వైద్య విధానం అప్పటికి ఇంకా రాలేదు .దీనికోసం ఇరువైపులవారు సంప్రదించుకొని ,రాజీ పడి పాల సముద్రాన్ని మధిం ఛి చావు లేని  అమృతాన్నిపొందటానికి     అంగీకరించారు  .మధించే కవ్వం గా మంధర పర్వతాన్ని ,మహా సర్పమైన వాసుకిని రజ్జువు అంటే త్రాడుగా ఎంచుకొని క్షీరసాగర మధనం ప్రారంభించారు .పర్వతం బరువు వల్ల సముద్రం లోకి కుంగి పోతోంది .ఏం చేయాలో తెలీక విష్ణువును ప్రార్ధిస్తే ,ఆయన కూర్మ రూపం ధరించి తన వీపు మీద మందరాన్ని ఆని ఉండేట్లు చేయించి  మళ్ళీ చిలకటం   ప్రారంభించమన్నాడు .ఇలా అమృతం సంపాదించటానికి ‘’వారింగ్ గ్రూప్స్ ‘’ఏకమై నాయి .ఆ తర్వాత హాలాహలం ,చింతామణి కల్ప వృక్షం చివరికి అమృతం రావటం మనకు తెలిసిన కధ యే .

ఇంతవరకు బాగానే ఉంది .ఈ పురాణ కధ ఐరోపా దేశానికి చేరిందని తెలిసి మనకు ఉత్సాహం గానే కాక ఆశ్చర్యం గా కూడా ఉంది .ఎప్పుడు ఎలా అక్కడికి చేరిందో తెలీదు మనకు .డేవిడ్ ఫ్రాలీ ,శుభాష్ కాక్ లు  తమ ‘’ఇన్ సెర్చ్ ఆఫ్  క్రేడిల్ ఆఫ్ సివిలైజేషన్ –(నాగరకత ఉయ్యాల అన్వేషణ కోసం ) అనే పుస్తకం లో ఈ కధతో బాటు మిగిలిన మన పురాణ గాధలు ఇండియానుండే  యూరప్ చేరి ఉండ వచ్చు .

ఈ కూర్మావతార గాధ ప్రతీకాత్మకమైన కాస్మిక్ (అంతరిక్ష ) కధ .ఇందులో స్థిరరమైన సృష్టి పరిణామ సంఘటన నిక్షిప్తమై ఉంది .పాల సముద్రం అంటే ఆకాశం లోని నక్షత్ర సముదాయమైన మిల్కీ వే.(పాల పుంత )అని అర్ధం ..మధనానికి తాడుగా ఉన్న వాసుకి సర్పం గమనానికి సహకరించే దీర్ఘ వృత్తాకార (ఎలిప్టికల్)లేక వృత్తాకార మార్గానికి సంకేతం .ఈ పుస్తకం లోనే రా బోయే అధ్యాయాలలో గురుత్వాకర్షణ కంటికి కనిపించని బిందు సముదాయాలచేత పొందే మార్పు అని  తెలుసుకొంటాం .మంధర పర్వతం అంటే అయస్కాంత ధృవం లేక మధనానికి సహకరించే పాల పుంత కేంద్రం .మధనం లో వెలువడిన హాలాహలం లేక గరళం ఆటే ఓజోన్ వాయువు .గరళం తర్వాత వచ్చిందే అమృతం అంటే ప్రాణ వాయువైన ఆక్సిజన్ ,నీరు .ఇదీ పాల సముద్రం చిలకటం లో ఉన్న ఆంతర్యం .ఈ కధను ఇంత వివరంగా  చర్చించ టానికి కారణం   –రాబోయే అధ్యాయాలలో స్టీఫెన్ హాకింగ్ శాస్త్రజ్ఞుడు’’ సృష్టి ఆశ్చర్యకరంగా వింతగా (సింగ్యులారిటి ) ‘’అని చెప్పే సిద్దాంతాన్ని వివరిచటం కోసమే .దీనినే ‘’సింగులారిటిఅన్నాడు .అంటే అంతరిక్షం లో ఒక బిందువు (పాయింట్ ఇన్ స్పేస్ ).అంటే  టైం –స్పేస్ కర్వేచర్ (వక్ర రేఖ ) అనంతంగా మారిపోతుంది .స్పేస్ టైం ను వక్ర రేఖగానే భావిస్తారు కాని సరళ రేఖగా కాదు .ఇప్పటి ఈ పురాణ ప్రతీక కధనం సృష్టి,కాల ప్రారంభాలను  వివరిస్తుంది .ఇందులో కూర్మాన్ని ఎందుకు ఎంచుకొన్నారు అనే ప్రశ్న రావటం సహజం .అది పైన ఉన్న గుల్ల (షెల్ )వలన గుల్ల నీటిపైభాగాన ఉంచుతూ నీటిలో ఈద గలుగుతుంది.అంతే కాక అది పాల పుంతకు ప్రతీకగా గ్రహించ బడింది .దాని వీపు వక్రంగా ఉంటుంది కనుక స్పేస్ మరియు కాలానికి ఉమ్మడి  స౦కేతంగా తీసుకో బడింది . ఈ వక్రత అనంతం అనికూడా భావించే గ్రహించారు .మనం ఇప్పుడు మాట్లాడుకొనే స్పేస్ టైం వక్ర రేఖ రెండు పరిమాణాల(టు డై మన్షనల్ ) యూక్లిడ్ భావనా రేఖా చిత్రం (గ్రాఫ్ ). మహా కూర్మం లేక ఆది కూర్మం వీపు ను ఎంచుకోవటానికి కారణం టైం ,స్పేస్ లు సరళ రేఖా మార్గాలుకావని ,చక్రీయాలు (సైక్లిక్ )అనీ సూచించటానికే అని గ్రహించాలి .ఈ పుస్తకం లోనే తర్వాతి అధ్యాయాలలో ఈ స్పేస్ టైం కర్వ్ చాలా పెద్దదని ,అనంతమైనదని అప్పుడది ఒక సరళ రేఖగా గోచరిస్తుందని చెప్ప బడింది .అంటే స్పేస్, టైం ఒక సరిహద్దుగా ,సరళంగా (లీనియర్)ఉంటుందన్నమాట .వీటికి తగిన సరైన పదాలను ఈ క్రింద వివరించబడినాయి .

పేజీ 46పేరా 2

సైన్స్ లోని అన్ని సిద్ధాంతాలు స్పేస్ ,టైం లు సరళమైనదీ  దాదాపు  సమతల మైనదీ అన్న   ఊహలపై  ఏర్పడినవే.ఇవి బిగ్ బాంగ్ ఏకత్వం తో తెగిపోయి  అక్కడ స్పేస్ ,టైం వక్రత అనంతం అనే అభిప్రాయం స్థిరరపడింది .

పేజీ -133-పేరా -2

ఈ విశ్వం ఎలా ఆవిర్భ వించింది అని ఊహించి చెప్పటానికి కాలం ప్రారంభం నాటి సూత్రాలు అవసరం .సాధారణ సాపేక్ష సిద్ధాంతం నిజమైతే ,రోజర్ పెన్రోజ్ చెప్పిన సింగ్యులారిటి సిద్దాతాలు,నేను రుజువు చేసిన కాలం ప్రారంభం లో ఒక అనంత సా౦ద్రత ,అనంత వక్ర రేఖలో ఒక బిందువు .ఈ పాయింట్ దగ్గర సైన్స్ కు సంబంధించిన సకల సూత్రాలు ఆగిపోతాయి (బ్రేక్ డౌన్ )  .

శాస్త్రి గారి వ్యాఖ్య

భారతీయ పురాణ కధనం ప్రకారంమహా  కూర్మంలేక ఆది కూర్మం  అంటే తాబేలు జీవులన్నిటిలో ఎక్కువ ముసలిది అదే స్పేస్ –టైం లకు  ప్రతీక .అదే సృష్టి ప్రారంభానికి నాంది .స్పేస్ ,టైం లుఒక సరళ రేఖ కాక పొతే ,భూమి సరళ రేఖగా ఉన్న త్రిభుజా కార మంధర పర్వతం కూర్మం వీపుపై స్థిరంగా  నిలబడేదికాదు .మధనానికి వీలు కలిగేదీకాదు .ఈ కధలో ఇన్ని ప్రతీకలున్నాయి .ఈ ప్రతీకల నాధారంగా మన పురాణాలు వేద  విజ్ఞానాన్ని కదా రూపాలలో కరతలామలకం చేశాయి .వివరించే చెప్పే సామర్ధ్యం ఉన్న వారుంటే అంతా జుర్రుకొనే జుంటి తేనే .

Inline image 3Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-15కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హైదరాబాద్ లో 19-12-15,20-12-15 శని ,ఆదివారాలలో మా మేనకోడలు గణప వరపు పద్మ ,రామ కృష్ణ దంపతుల కుమార్తె ఛి సౌ రవళి వివాహ వేడుకల దృశ్యమాలిక 

https://plus.google.com/u/0/photos/115752370674452071762/albums/6230644397576532529/6230644441189902706

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం దైవ చిత్తం -1

దైవ చిత్తం -1

శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం

‘’పురాణాలను శాస్త్రీయంగా విశ్లేషించి వివరింఛి ,జన సామాన్యం లోకి వ్యాప్తి చేయాలన్న    కోరిక చాలా కాలంగా నాలో ఉండి పోయింది .అందుకనే చాలా వినయంగా నాకు సాధ్యమైన రీతిలో  దీన్ని ముద్రిస్తున్నాను .దయచేసి చదవండి .నచ్చక పొతే పక్కన పారేయండి .మనసుకు నచ్చితే కొన సాగించండి ‘’అని  శాస్త్రిగారు చదువరులకు మనవి చేశారు .ఈ పుస్తకం నిన్న సాయత్రం నాకు వారి మిగిలిన పుస్తకాలతో బాటు అందజేశారు .దీని  లోని ముఖ్య విషయాలు తల స్పర్శగా మాకు తెలియ జేశారు .పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని ‘’దీన్ని నేను తెలుగు లోకి అనువదించి  సాహితీ బంధువులకు అంద జేస్తాను’’అని  అనగానే శాస్త్రి గారు రెండు చేతులు జోడించి’’ మహద్భాగ్యం’’ అన్నారు . అందుకే ఉదయం వారి గురించి ‘’చిన పున్నయ్యే కాని పెద్ద పూర్ణ ప్రజ్ఞ శాస్త్రి ‘’’వ్యాసం రాసి వారి బహుముఖీన ప్రతిభా పా౦డిత్యాల గురించి వివరించాను .ఇప్పుడీ అనువాదాన్ని అందజేస్తున్నాను .ఇదీ ‘’దైవ చిత్తం ‘’కు నేపధ్యం .వారికి మన సరస భారతి గ్రంధాలను బహూకరించాను .

దైవ చిత్తం

కొన్నేళ్ళ క్రితం ప్రపచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త స్టీఫెన్ హాక్ రాసిన  ‘’ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’పుస్తకం చూసి చదివాను .అయ్యో ఒక దశాబ్దం ఆలస్యంగా దీన్ని చదివానే అని బాధ పడ్డాను .దీన్ని  బాంటాం ప్రచురణ సంస్థ 1988లో ప్రచురించింది .సహజంగా నేను సైన్సు వాడిని కాను .సైన్స్ లో యే శాఖలోనూ ప్రవేశం ఉన్నవాడినీ కాదు .మీ చేతులో ఉన్న ఈ చిన్న పొత్తంలో ముఖ్యంగా  కాస్మాలజి పై చర్చ ఉంటుంది .దీనికి  గణితం ,భౌతిక,  ,రసాయన శాస్త్రాలు సహకరిస్తున్నాయి .క్లాసికల్ సైన్స్ లలో శిక్షణ పొంది పండిపోయిన వారు చేయాల్సిన పని ఇది .నా బోటి శిక్షణ లేని వారు చేబట్టాల్సిన దికాదు .దీనిని  రాస్తూ పోతుంటే సుమారు 45 ఏళ్ళ క్రితం డిగ్రీలో చదివిన సామాన్య శాస్త్ర విషయాలన్నీ గుర్తుకొచ్చాయి .

భారతీయ పరంపరాగత   వేదసాహిత్యం లోని  విజ్ఞానం, పురాణాలలోని  లోని కీలక భావనలను,  ‘’బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం ‘’లోని నిర్ణయాలను సమన్వయ౦ చేసి  ఈ పుస్తకాన్ని రాస్తున్నాను .వీటిలోని పోలికలు ,సమన్వయము ,విరుద్ధ భావనలను దృష్టికి తెస్తున్నాను . వేద విజ్ఞానం లోను ,బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం లోను బాగా కొట్తోచ్చేట్లుకనిపించే  ప్రతీకలలో  ఉన్న పోలికలను సూచిస్తున్నాను .సైన్స్ లో ఆవిష్కరింప బడిన మహా సిద్ధాంతాలు కూడా తప్పకుండా పునశ్చరణకు  లోను కావాల్సిందేనని మన అనుభవాలు తెలియ జేస్తున్నాయి .మానవుడు నిరంతరం తార్కిక ,శాస్త్రీయ ఆలోచనా శీలి అని ఇదే అభివృద్ధికి చిహ్నం –అని మనం భావించాలి .ఈ పుస్తకం లోని  కొన్ని సిద్ధాంతాలనుఆ తర్వాత  అవసరాన్ని బట్టి మార్చాల్సి వచ్చింది . చర్చ సగుణాత్మకమై  వేద భావన లను పోలి ఉంటేనే ఈ మార్పు చేశాను .అనుమానాలకు తావు లేకుండా సైన్సు సిద్ధాంతాలు స్థాపింప బడే  వరకు భారతీయులు వేద దృక్పధమే సరైనదని భావింఛి నమ్మే వారు .సైన్సు కూడా ఇవాళ కాకపోతే రేపైనా ఇవే నిర్ణ యాలు చేస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం .సైన్స్ రంగం లో ని సిద్ధాంత విలువల  పై ఈ పుస్తకం అపార గౌరవ భావాన్ని కలిగి ఉంది .

ఈ సందర్భం గా ఒక విన్నపం .నాకు కనిపించిన పోలికలు బహుళ ప్రచారం లో ఉన్నవే .ప్రతి బారతీయుడికీ తెలిసినవే .సైన్సు పరిశోధనా ఫలితాలను హిందూ వేద విజ్ఞానానికి అంట గట్టి సైన్స్ ను చులకన గా చూస్తున్నానని కొందరికి అనిపించ  వచ్చు .ఏదైనా సత్యానికి దూరం కాదు కదా .వేద భావనలు  అతి సహజంగా సరళం గా ఈ  నాడు కనిపిస్తున్నాయి .ఇవి ఎంతోకాలం క్రితమే  ఈ నమ్మకాలు మన సమాజం లోవిలువ కలిగి  మెదడులలో ఉండిపోయిన విషయం మనకు జ్ఞాపక మొస్తుంది .అందుకనే అవి సహజాతాలు అని పిస్తున్నాయి ,ఇది కాంతిలో ఏడు రంగులున్నట్లుగా  కనుగొన్నట్లే అనిపించే టట్లు,అదొక కొత్త విషయమే కాదన్నట్లుగా ఉంటుంది .ఈ విషయాన్నికానీ పెట్టి కొన్ని శతాబ్దాలు అయిపోయి ,మానవ మనసులలో నిలిచిపోయి అదేదో అద్భుత విషయం కాదని అతి సామాన్యమైనదేనని అనిపిస్తుంది .అంత మాత్రం చేత ఆ ఆవిష్కరణ ను తక్కువ చేయటంగా భావించినట్లా ?పూర్వ కాలం లో చదువులు వ్రుత్తి పరమైనవి గా (ప్రొఫెషనల్ )గా ఉండేవి .ఈ వృత్తికి చెందని వారికి సంస్కృతం తో పరిచయం ఉండేదికాదు .వీరికి వీటి విషయమై అవగాహన కల్పించటం కోసం ,రాయటానికి భద్రపరచటానికి  తగిన సౌకర్యాలు లేని కాలం లో ఈ కీలక భావనలను మత  సంబంధమైన కార్యాలలో,ఉత్సవాలలో పూజాదికాలలో  నిక్షిప్తం చేసి పరం పరాగతం గా  తర తరాలకు అంద జేయటం జరిగింది  .చదువుకొన్న వారికే గ్రంధాల లోని విషయాలు తెలిసేవి .ఈ రోజుల్లో మనం గ్రంధాలయాలకు వెళ్లి తెలియని విషయాలను అవగాహన చేసు కొంటున్నట్లే ఆనాడు చదువు రానివారు పండితుల వద్దకు వెళ్లి సార్వకాలిక సత్యాలను తెలుసుకొనే వారు .అచ్చు యంత్రం కని పెట్టేంత  వరకు అన్ని దేశాలలో అన్ని నాగరకతలలో ఇదే విధానం అమలులో ఉండేది .కనుక దయచేసి నేను  పోలికలపై చేసిన వ్యాఖ్యలను మొదటి సారి పుస్తకం చదివినట్లు శ్రద్ధగా చదవ వలసినదిగా మనవి చేస్తున్నాను .అవి బాగా పరిచయమైనవే అయినా తిరస్కరింప బడాల్సినవి కావని గ్రహించండి .మొదట అధ్యాయాల వారీగా విషయాన్ని వివరిస్తున్నాను .ముందు అందులోని అంశాలను తెలియ జేసి తర్వాత నా వ్యాఖ్యానం రాస్తున్నాను .ఇది అందరికి సుబోధకం గా ఉంటుందని నా నమ్మిక .’’

ఎ.సి .పి . శాస్త్రి –కేశవ నగర్ కాలని –హైదరాబాద్

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దర్గా ప్రసాద్ -21-12-15-కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం

This gallery contains 15 photos.

More Galleries | Tagged | Leave a comment

హైదరాబాద్ బాచుపల్లి లో మా మేనకోడలు ఛి సౌ కళ ,చంద్ర శేఖర్ దంపతులు కొడుకు బాలాజీ

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

చిన పున్నయ్యే అయినా పెద్ద పూర్ణ ప్రజ్న శాస్త్రి

చిన పున్నయ్యే అయినా పెద్ద పూర్ణ ప్రజ్న శాస్త్రి

72ఏళ్ళ వయసులో కంచు  ఘంట లాంటి స్వరం తో వేదం నుంచి వేమన దాకా మాట్లాడగల నేర్పూ ,శాస్త్రం నుంచి శాస్త్రీయ దృక్పధాన్ని పిండగల ఓర్పూ ,సంగీతాంబోధిని తరచి అనర్ఘ రత్నాలను వెలికి తీసే పరిశీలనా ,ఏది చెప్పినా ,మాట్లాడినా రుషిప్రోక్తంగా భాసి౦పజేసే వాక్కు ,నాటక రచనలో సిద్ధ హస్తం ,భువన విజయ’’ భట్టు మూర్తిమత్వం ‘’వ్రుత్తి రిజర్వ్ బాంక్ ఉద్యోగమేకాని ప్రవ్రుత్తి సాహిత్య సంగీత ర(రా )సమయం గా సార్ధకం గా జీవిస్తున్న పెద్దలు శ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి గారు .ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఫోన్ లో వారితో పరిచయమవ్వటం వారి సౌజన్యానికి ముగ్ధుడ నవటం ,వారూ నేను కలుసుకోవాలనుకోవటం ,20-12-15 ఆదివారం సాయంత్రం బాచుపల్లి నుంచి బయల్దేరి  4గంటలకు పంజా గుట్టలోని వారి స్వగృహం లో నేనూ మా అబ్బాయిలు శాస్త్రి ,శర్మ లతో కలిసి వెళ్లిదర్శించిటం వారు అన్నట్లు పరిచయమైన36గంటలలోనే ఆయనను కలిసిన మొదటి వ్యక్తిగా నేను రికార్డ్ సృష్టించటం తమాషాగా ఉంది .వారి ఫోన్ నంబర్ నాకు ఇచ్చి మాట్లాడమని  శుక్రవారం సాయంత్రం నాకు ఫోన్ చేసి   చెప్పి ప్రోత్సహించిన పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్  శ్రీ తూము లూరు శ్రీ దక్షిణా మూర్తిశాస్త్రి గారి అమృత హృదయానికి ఎన్ని  కృతజ్ఞతలు చెప్పినా చాలదు . శ్రీ పున్నయ్య శాస్త్రి   బహుముఖ ప్రజ్ఞను సాహితీ బంధువులకు తెలియ జేయాలనే సంకల్పమే  ఈ వ్యాసం .

శ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి గారు అంటే ఎవరికీ తెలియదు .కాని ఏ.సి.పి.పిశాస్త్రి గారు అంటే అందరికీ తెలుస్తుంది. అదీ వారి పేరులోని మహత్తు .19-1-1944నశ్రీ అందుకూరి వెంకట సుబ్బయ్య ,శ్రీమతి అచ్చమాంబ దంపతులకు జన్మించారు . బి. యే.డిగ్రీ పొంది  రిజర్వ్ బాక్ లో ఉద్యోగించి అంచ లంచలులంచలుగా  ఎదిగి అసిస్టంట్ మేనేజర్ గా 2020 03సెప్టెంబర్ లో పదవీ విరమణ చేశారు .

సంగీతం లో విశేష అభిమానం ఉన్న శాస్త్రిగారు హైదరాబాద్ రాం కోఠి ఠిప్రభుత్వ కళాశాలలో 19668లో చేరి కర్నాటక సంగీతం నేర్చి ‘’సంగీత విభూషణ్ ‘’అయ్యారు  .తను నేర్చిన సంగీతాన్నిసార్ధకం చేస్తూ హైదరాబాద్ ఆకాశ వాణి కేద్రం వారు ప్రారంభించిన యువవాణి సగీత కార్యక్రమాలకు తన ప్రతిభా సామర్ధ్యం తో సార్ధకత చేకూర్చారు అనేక సభలలో ,దూర దర్శన్ లో సంగీత గేయాలకు స్వర రచన చేశారు ‘’నాం ఏక్ హై’’అనే హిందీ గేయ నాటికకు స౦గీత రచన చేశారు తెలుగు కూచిపూడి గేయ నాటిక ‘’మహా శ్వేత ‘’కు అనేక సంవత్సరాలు సంగీత రచన చేసి నాటిక విజయానికి ఎంతగానో  తోడ్పడ్డారు .దీనిరచయిత కీ శే.పి.వి.విరోహిణీకుమార్ ,.నృత్య దర్శకులు సరళాకుమారి .ఈ త్రయం మహా శ్వేతను సాహిత్య సంగీత నృత్య త్రివేణీ సంగమం చేసింది .1998 8లో ‘’అష్ట లక్ష్మీ వైభవం ‘’కు రచనా ,సంగీతం సమకూర్చి వైభవం తెచ్చారు .ఇది హైదరాబాద్ దూర దర్శని కేంద్రం నుండి దీపావళి ప్రత్యేక కార్యక్రమంగా ప్రసార మైంది దీనికి నిర్దేశకులు ప్రముఖ నృత్య దర్శకురాలు  డా .శ్రీమతి జొన్నల గడ్డ అనూరాధ .శాస్త్రి గారి ‘’సర్వమత గేయ నాటిక ‘’కొత్త గూడెం రేడియో స్టేషన్ నుండి ప్రసారమైంది .హైదరాబాద్ కేంద్రం శాస్త్రిగారి రచన ‘’సగీత కళానిధి భట్టు మూర్తి ‘’ని 2004 04లో ప్రసారం చేసి భట్టుమూర్తికవి లోని సంగీతజ్ఞతను శ్రోతలకు అందజేసింది .

శాస్త్రి గారి  రచనలు  చాలా భాగం ‘’రుషి పీఠం ‘’,మూసీ పత్రికలలో ప్రచురితాలు .వైదిక సాహిత్య విషయాలపై శాస్త్రిగారు ఎన్నో విజ్ఞాన దాయక వ్యాసాలూ రచించి అందులోని నిగూఢ భావాలను తేట తెల్లం గా జనసామాన్యానికి తెలియ జేశారు ,చేస్తున్నారు .’’కచ -దేవ’ యాని’’కధ ను ‘’విద్యా మహిమ ‘పేరుతో రచించారు .సీతా కల్యాణం గేయ నాటిక రాశారు .భువన విజయం లో శాస్త్రి గారు  దాదాపు పాతిక ఏళ్ళుగా ‘’భట్టు మూర్తి కవి ‘’పాత్రను రస రమ్యంగా పోషిస్తూ ప్రేక్షకాభి మానాన్ని సంగీత రసజ్ఞుల మెప్పును పొందుతున్నారు .శాస్త్రిగారి ‘’మిత్ర లాభం ‘’పద్య కావ్యం అముద్రితం .

శాస్త్రిగారు ఆకాశవాణి కి అనేక రేడియో నాటకాలు సంతరించి ఘన యశస్సు నార్జిచారు .అదులో ముఖ్యమైఅవి కాళి దాసు ను గురించి ‘’ప్రాణి ప్రధానం ‘’,బిల్హణ కవి జీవితం పై ‘’బిల్హణీయం ‘’,పులకేశి అనే చారిత్రిక నాటకం ,గరుత్మంతుని కధను ‘’సత్య నిష్ట’’గా ,మను చరిత్ర ,నల చరిత్ర  ,రఘు వంశ కధ ను ‘’కుముద్వతీ పరిణయం ‘’గా ,విప్రనారాయణ చరితం ను  ‘’వైజయింతీ విలాసం ‘’గా ,విడాకుల పై ‘’ఇయం సీతా మమ సుతా ‘అనే  సాంఘిక నాటకాన్ని ,దండి దశకుమార చరిత్ర ను  ‘’అవంతీ సుందరీ పరిణయం ‘’నాటికలుగా మలచారు .ఇవన్నీ రేడియో లో ప్రసారమై బహుళ జామోదం పొందాయి .శాస్త్రి గారి నల చరిత్ర నాటకాన్నిధర్మ పూరి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్  కీ శే.కోరిడే రాజన్న శాస్త్రి గారు  సంస్కృతం లోకి అనువదించగా ‘’సురభారతి ‘’సంస్థ ప్రచురిచింది .మహా మహోపాధ్యాయ స్వర్గీయ  శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడుగారు తమ అమృత హస్తాలతో ఆవిష్కరిచి సార్ధకత కల్పించారు .ఇది పాఠ్య గ్ర౦ధంగా చేయబడి నాటక గౌరవాన్ని ఇనుమడింప జేసింది .శాస్త్రిగారు ఆంగ్లం లో ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’అనే ఆలోచనాత్మక రచన చేశారు .ఆంగ్ల పత్రికలలో శాస్త్రి గారి వ్యాసాలూ దర్శన మిస్తాయి .

శాస్త్రి గారు గొప్ప స్టేజి నటులు కూడా .1970వరకు చాలా నాటకాలలో వివిధ పాత్రలు ధరించి మెప్పించారు .1977లో లిటిల్ దియేటర్ వారి ‘’విరజాజి ‘’నాటకం తో హీరో  పాత్ర ధరించి రంగస్థల నటనకు స్వస్తి పలికారు .ఇన్ని రకాలుగా విభిన్న రంగాలలో తమ శేముషీ వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు .ఒక రకం గా పూర్ణ ప్రజ్ఞులు ,ప్రాజ్ఞులు శాస్త్రిగారు .శాస్త్రి గారితో మాట్లాడటమే ‘’ఒక ఎడ్యు కేషన్ ‘’.

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12 -15-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

“సరదాగా మరికొంతసేపు” వుడ్‌హౌస్‌తో గడపమని …– గబ్బిట కృష్ణమోహన్ సారంగ – సాహిత్య వార పత్రిక -దాసరి అమరేంద్ర

Saradaga Kasepu File

మనింటికి వుడ్హౌస్ వచ్చిన వేళా… _ సారంగ

 

0001

సారంగ – సాహిత్య వార పత్రిక

కొత్త పుస్తకంDecember 17, 2015

మనింటికి వుడ్‌హౌస్ వచ్చిన వేళా…

 

-దాసరి అమరేంద్ర

 

Dasari Amarendraవుడ్‌హౌస్  ఎవరూ?రావుబహదూర్  సోమేశ్వరరావు  ఎవరూ?మధ్యలో గబ్బిట కృష్ణమోహన్ ఎవరూ?ఏవిటీ వీరి సంబంధం?

***తొంభైమూడేళ్ళు జీవించి, అందులో డైబ్భైరెండేళ్ళపాటు రచనా వ్యాసంగం సాగించి 1975లో వెళ్ళిపోయిన  మహానుభావుడు  పి.జి. వుడ్‌హౌస్.ఇంగ్లాండు మనిషి. అమెరికా అంటే అభిమానం.  “పన్ను” బాధల  పుణ్యమా  అని ఫ్రాన్సులో ఓ పదేళ్ళు  వున్నాడు.  రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్లకు చిక్కడిపోయి ఓ ఏడాదిపాటు వారి ఆతిధ్యం స్వీకరించాడు. పొరపాటునో, గ్రహపాటునో ఆ జర్మనీవారి రేడియోలో తన బాణీ ప్రసంగాలు  ఓ అరడజను చేసి తన స్వదేశీయల  అసహనానికీ, ఆగ్రహానికీ గురి అయ్యూడు. దాని పుణ్యమా  అని మళ్ళీ ఇంగ్లాడులో అడుగు పెట్టకుండా ఓ ముప్ఫై ఏళ్ళపాటు అమెరికాలో నివసించి, పౌరసత్వం పొంది  అక్కడే  తనువు చాలించాడు.  ఆగ్రహాలు సద్దుమణిగాక  మరణానికి కొద్దినెలలు వందు ఆంగ్లప్రభుత్వంవారి నైట్‌హుడ్ పొంది సర్ వుడ్‌హౌస్ అయ్యాడు.

 

***వుడ్‌హౌస్ ఏమి రాశాడూ?చాలా  రాశాడు. పుంఖానుపుంఖాలుగా రాశాడు. జబ్బసత్తువ వున్న రోజుల్లో మూడు నెలలకో  నవల రాశాడు. ఆ సత్తువ తగ్గినపుడు ఆరునెలలకో  నవల.నవలలు, కథాసంకలనాలు కలిసి తొంభై రెండు పుస్తకాలు. నలభై మ్యూజికల్ కామెడీల లిరిక్సుకి సహరచయిత. ఇవికాక ఉత్తరాలు, జ్ఞాపకాలు, వ్యాసాలు .. ఎన్నో రాశాడు. కానీ ఏది రాసినా – ఎంత వేగంగా రాసినా – కృషి చేసి రాశాడు. నాణ్యతను వదలలేదు. విజయవంతంగా రాశాడు. “మనకాలపు ఉత్తమ రచయిత’ అన్నాడో సమకాలీన రచయిత – 1930లో.నిజానికి ఆయన ఏమి రాశాడూ?సీరియస్ సాహిత్యం రాయలేదు. సామాజిక అంశాలతో రాయలేదు. వ్యంగ్య విమర్శకూ పూను కోలేదు. పోనీ హాస్యరచనలు అందామా – అదీకాదు. “ఫార్సు’ రాశాడు అని తేల్చారు విశ్లేషకులు. నా వరకూ నాకు ఆయన రాసినది రేలంగి, పద్మనాభంల బాణీల మేలు కలయిక అనిపిస్తుంది.

 

***వుడ్‌హౌస్ రచనలు పాఠకులను ఆకట్టుకొన్నాయన్నది నిజం, వాస్తవం. రాసి వందేళ్ళు దాటినా, రాసినాయన వెళ్ళిపోయి  నలభై ఏళ్ళు దాటినా అతనిని చదివేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఉన్నారు. ఇంగ్లీషులోనే  గాకుండా తమతమ సొంత భాషలలో అనువదించుకుని చదివేవాళ్ళూ వేలకొద్దీ ఉన్నారు. మన తెలుగులో బాపూరమణల  దగ్గిర్నించి గబ్బిట కృష్ణమోహన్ వరకూ ఆయన అభిమానులు అసంఖ్యాకం.ఊరికే అభిమానించి ఊరుకోకుండా వుడ్‌హౌస్‌ను అనుసృజించి పెడుతున్నారు గబ్బిట.

 

***

 

gabbita1సరదాగా మరికొంతసేపు అన్న వుడ్‌హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో “సినిమారంగం’కు చెందినవి నాలుగు.వుడ్‌హౌస్  అభిమానులంతా తమ అభిప్రాయాలను కలగలిపి ఆయన కథల్లో తలమానికంగా ఎన్నుకొన్న “అంకుల్ ఫ్రెడ్ ఫ్లిట్స్ బై’ అన్న 1936 నాటి కథ ఈ సంపుటిలో “సోంబాబాయి వలస కాపురం” గా మొట్టమొదట కనిపిస్తుంది. మాతృకలోని అంకుల్ ఫ్రెడ్ అనుసృజనలో రావుబహదూర్ సోమేశ్వరరావుగా “అవతారం” ఎత్తుతాడు. తన అబ్బాయి అవతారంతో కలిసి తన చిన్ననాటి ఊరు కుందేరుకు విలాసంగా వెళ్ళి ఇరవై పేజీలూ, ఒక గంటా వ్యవధిలో “తన లౌక్యాన్నీ, బుద్ధికుశలతని, సమయస్ఫూర్తిని, చాకచక్యాన్ని” అలవోకగా ప్రదర్శించి పాఠకులను అలరిస్తాడు.మొదటి భాగంలోని ఏడు కథల్లో నాలుగింట శశిరేఖ ముఖ్యపాత్ర ధారి. ఆమె తల్లి మహారచయిత్రి ప్రసూనాంబ  విస్మరించలేని కథావ్యక్తి. పెరిగి పెద్దయ్యాక సోంబాబాయి అంత గొప్పమనిషిగా రూపొందగల ప్రామిస్ వున్న శశిరేఖ  తాను  ఇష్టపడే  నరహరిని  కాకుండా తల్లి  సూచించి బాధించే వర్ధమాన రాజకీయు నాయుకుడు ప్రసాద్, రచయితగా అపుడపుడే నిలదొక్కుకొంటున్న గంపా శేఖర్, ఏకపక్ష  ఆరాధకుడు దూడల దివాకర్, అవ్యాజ వ్యామోహి శేషగిరులను ఎంతో చాకచక్యంతో “తెల్లవారుఝాము పాలబండి”లు ఎక్కించిన వైనం కనిపిస్తుంది ఈ నాలుగు కధల్లో.“విధి, “అదృష్టం” అన్న కథల్లో పాత్రలు వేరైనా వాటిల్లోని అనూరాధ, సరిత – శశిరేఖకు కజిన్లే. తండ్రి గోవర్ధనరావూ, జమీందారు నీలకంఠం – ఒకే తాను ముక్కలే. వెరసి ఈ రెండు కథలూ “తాత్విక దృష్టితో’ చూస్తే మిగిలిన నాలుగు కథలకు దగ్గరి బంధువులే.సినిమారంగపు నాలుగు కథల్లో రెండింట నరసరాజు, రాగిణిల  ఉదంతాలు  కనిపిస్తాయి. మరో కథ “కోతిచేష్టలు’లో వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని కనకరాజు, సుభాషిణి అయ్యారా అనిపిస్తుంది. నాలుగోకథ “మీనా దేశ్‌పాండే తారాపథం’ మొట్టమొదటి సోంబాబాయి కథలాగా మిగిలినవాటికి వేటికీ చెందని విలక్షణత గలది.***పరిమితుల దృష్ట్యా చూస్తే  అనువాదం సొంత రచన కన్న కష్టమైనది.అనుసృజన అనువాదం కన్న మరింత మరింత కష్టమైన పని.వుడ్‌హౌస్  కథల నేపధ్యం ఇంగ్లీషు గ్రామసీమలకూ, పట్టణాలకూ చెందినది. ఆయా రచనలను ఆంగ్లంలోనే చదువుకునేవాళ్ళకి అది అవరోధం కాకపోవచ్చు. ఇంగ్లీషు రానివాళ్ళ కోసమే ఈ తెలుగు ప్రయత్నం అనుకుంటే – అలాంటి పాఠకులు ఆయా పేర్లూ, ప్రాంతాలూ, ఆచార వ్యవహారాలతో మమైకం అయ్యే అవకాశం దాదాపు పూజ్యం. అందులోనూ ఆయా రచనలు హాస్యమూ, ఫార్సూ, శబ్ద అర్థాలంకారమయం అయినపుడు వాటిల్ని చదివే వాళ్ళకు అవి ఆకాశ పంచాంగాలు అయితీరుతాయి.మరి వాటిల్ని అభిమానించి, వాటిల్ని తెలుగు మాత్రమే వచ్చినవాళ్ళకు తెలియజెయ్యాలని తపించే వారికి ఏమన్నా మార్గాంతరం ఉందా?! ఉంది!!

అనుసృజన.

గబ్బిట కృష్ణమోహన్ గత ఐదారేళ్ళుగా ఈ మార్గాన వెడుతున్నారు. విజయయాత్ర చేస్తున్నారు. ఈ పరంపరలో సరికొత్త మైలురాయి “సరదాగా మరికొంతసేపు’.సోమేశ్వరరావు, గోవర్ధనరావు, గంపా శేఖర్, దూడల దివాకర్, శశిరేఖ, బండారు ప్రసూనాంబ, శేషగిరి, బాబ్జీ, అనూరాధ, శ్రీహరి, సరిత, జమీందార్ నీలకంఠం, నరసరాజు, కనకరాజు,రాగిణి, సుభాషిణి, రాజమాణిక్యం-ఉరఫ్-మీనా దేశ్‌పాండే – వీళ్ళ మాతృపాత్రలు ఆంగ్లదేశపు నేలకు చెందినవి అయినా, వీళ్ళంతా పదహారణాలు  తెలుగు  మనుషులు. గబ్బిటగారు ప్రాణప్రతిష్ట చేసిన మన మనషులు.కథల్లోని  “పానకుటీరాలు” మన సంస్కృతికి చెందినవి కాకపోయినా అనుసృజన నైపుణ్యమా అని పానకంలో యాలక పలుకుల్లానే ఉంటాయి.“పెరట్లో హాయిగా కూర్చున్న  కోడిపెట్టల్ని అదిలిస్తే రెక్కలు టపటపలాడిస్తూ పరిగెత్తినట్టు ఆడ వాళ్ళంతా బయటకి నడిచారు” (బుసబుసలు); “గుండెకు గాట్లుపడి ఆ గాట్లలోంచి గాలి బయట కొస్తున్నట్టుగా ప్రసూనాంబగారు నిట్టూర్చారు” (విశ్రాంతి చికిత్స); “అప్పుడే గుడ్డులోంచి బయటపడి వృత్తిలో ఓనమాలు దిద్దుకొంటోన్న వడ్రంగిపిట్ట చేసే చప్పుడులా ఉందది” (తల్లిగారి ఘనసత్కారం); “అది విని దివాకర్ చెట్లలోంచి దూసుకుపోయే గాలిలా మూలిగాడు” (తల్లిగారి ఘనసత్కారం) – ఇలాంటి అనే కానేక పదబంధాలూ, వాక్యాలూ అపురూపమైన దేశవాళీతనంతో గుబాళిస్తాయి. అనుసృజనకు అర్థాలు చెపుతాయి.

మూలభాషలో వుడ్‌హౌస్‌గారు ఏమని ఉంటారా అన్న కుతూహలం కలిగిస్తాయి.ఇవన్నీ ఒక ఎత్తు – కృష్ణమోహన్ “తలాడించేవాడి కథ”లోనూ, “మిస్ మీనా దేశ్‌పాండే తారా పథం”లోనూ చూపించిన ప్రతిభ అమోఘం; అద్వితీయం.తలాడించే భాగోతుల నరసరాజుకు ప్రేమాయణం గుంటదారుల్లో పడ్డప్పుడు మంచి కిక్కిచ్చే దానికోసం మనసు వెంపర్లాడినపుడు – అవి మద్యపాన నిషేధపు మంచిరోజులు – తనకు తెలిసిన ప్రదేశానికి వెళ్ళి తలుపు తట్టి “ఎవరికి ఎవరూ  కాపలా  బంధాలన్నీ  నీకేలా” అంటూ కోడ్ పాట పాడతాడు. తలుపు తీసిన మనిషి “ఏం సినిమా?” అని అడిగితే “ఇంటికి దీపం ఇల్లాలే” అని, “దాహమేస్తోంది” అంటాడు. ఇది చదివాక మన మనసుకు కిక్కూ  ఎక్కుతుంది. ఇంకా కావాలని దాహమూ వేస్తుంది.ఏకచిత్ర అగ్రతార మీనా దేశ్‌పాండేగారి మాతృపాత్ర ఆంగ్లభాషలో ఏవేం పాటలు గానించిందో తెలియదుగానీ  మన  రాజమాణిక్యం (ఉరఫ్ మీనా దేశ్‌పాండే) – “పులకించని మది పులకించు” దగ్గర మొదలుపెట్టి  “కల నిజమాయెగా కోరిక తీరెగా” దాకా ఓప్పదీ ఇరవై పాటలు పాడేసి “భళిరా గబ్బిటా!” అని పాఠకులు వీరతాడు వేసేలా చేస్తుంది.

 

***gabbita1వుడ్‌హౌస్ రాసినది సీరియుస్ సాహిత్యం గాకపోయినా దశాబ్దాల తరబడి, తరతరాల తరబడి పాఠకులను ఆకట్టుకొందన్న మాట నిజం.ఏవిటా కారణం? ఏవిటా రహస్యం?ఖచ్చితంగా చెప్పడం కష్టం.ఎడ్వర్డియన్ యాసా, కవుల కొటేషన్లూ, అనేకానేక సాహితీ చమక్కులూ కలగలిపి తనదైన ఓ ప్రత్యేక భాషాశైలిని సృష్టించాడు వుడ్‌హౌస్. దాన్ని  కామిక్ పొయెట్రీ అన్న వాళ్ళున్నారు. మ్యూజికల్ ప్రోజ్ అన్న వాళ్ళున్నారు. ఏదేమైనా భాష విషయుంలో వుడ్‌హౌస్ రచనలు భాష పరిధుల్ని దాటుకుని వెళ్ళి కొత్త మైలురాళ్ళను పాతాయి అన్న విషయం దాదాపు అందరూ అంగీకరిస్తారు.అయినా మూలప్రశ్న మరోరూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.హాస్య, వ్యంగ్య, ఫార్సు రచనలకు  కాలక్షేపమూ, ఉల్లాసమూ  గలిగించడాన్ని మించిన పరమావధి ఉంటుందా?

 

దానికి రేలంగి సమాధానం చెప్పగలడు – పద్మనాభం చెప్పలేకపోయినా.ఛార్లీ చాప్లినయితే ఢంకా బజాయించి, గుండెలు బద్దలుకొట్టి చెపుతాడు.

 

కానీ ఒక్కమాట.వుడ్‌హౌస్ గురించి మాట్లాడుతూ “సాహితీ ప్రయోజనం” అంటూ వెళ్ళడం చాదస్తపు చర్చ అయి తీరుతుంది.అయిర పుస్తకపు శీర్షికే ఆహ్వానిస్తోంది గదా:“సరదాగా మరికొంతసేపు” వుడ్‌హౌస్‌తో గడపమని …

 

ఇక ఆలస్యం ఎందుకూ – గబ్బిట వుడ్‌హౌస్ దగ్గరికి వెళదాం ..

gabbita1-330x506

Posted in సభలు సమావేశాలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 36-మహామహోపాధ్యాయ తర్క వేదాంత రత్న బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు

maddulapalli 1 001 maddulapalli2 001నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

36-మహామహోపాధ్యాయ తర్క వేదాంత రత్న బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి  గారు

ఆంద్ర దేశం లో తర్క శాస్త్రం లో అద్వితీయులని పించుకొని ,వందలాది శిష్యులను  ఆ శాస్త్రం లో తీర్చి దిద్ది వేలాది పురాణ  ప్రవచనాలు చేసి విజయవాడకే ఒక గొప్ప శాస్త్రీయ గౌరవాన్ని కల్పించిన వారు శ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రిగారు .చెవులకు కుండలాలు నుదుట విభూతి రేఖలు ఫాలభాగం లో కుంకుమ వంటి నిండా అతి విలువైన కాశ్మీర శాలువా చక్కనివెడల్పు అంచుల ఖద్దరు  ఆంద్రబిళ్ళ గోచీ కట్టు  తో స్పురద్రూపం తో బ్రహ్మ వర్చస్సుతో  శాస్త్రిగారిని చూస్తె అపర శంకరులని పించేవారు .వారు లేని వేదాంత సభ ,తర్క సభ ఉండేదికాదు .అందర్లోనూ కొట్టొచ్చినట్లు కనిపించే మహా గాంభీర్య మూర్తి మత్వం వారిది .చాలా సభలలో నూ ,విజయవాడలో మా బంధువుల వివాహ సందర్భాలలోనూ వారిని చూశాను .సభా తాంబూలం వారికిచ్చి ఆశీర్వచనం పొంది యజమానులు ధన్యులయేవారు  .ఆ వర్చస్సు అ ఠీవీ ఆ రాజసం ఆ విద్వత్తు ,ఆవ్యాసంగం ,ఆ ఉపన్యాస ధోరణి ,ఆ ప్రతిభా నాన్య దర్శనం అనిపించేవి .రాష్ట్ర పతి సన్మాన గ్రాహీతలైన వారి గురించి ఈతరం వారికెవరికీ తెలియక పోవటం ఆశ్చర్యమే .ఎంతోమంది గీర్వాణ కవుల గురించి రాశానుకదా మరి మద్దుల పల్లి వారి గురించి వెలితి ఉండిపోయిందనే విషయం  నన్ను బాధించింది .నాకు తెలిసిన వారి నందర్నీ సంప్రదించాను .ఎవరికీ తెలియదన్నారు .నా తపన గమనించిన పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు మద్దుల పల్లి వారి అబ్బాయి బావ మరది ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆయనకు ఫోన్ చేస్తే  మాణిక్య శాస్త్రిగారి అబ్బాయి శ్రీ దక్షిణా మూర్తి గారి నంబర్ ఇచ్చారు. వారితో మాట్లాడి నా తపన చెప్పి సరసభారతి పుస్తకాలు పంపాను. వారు తమ తండ్రిగారు రాష్ట్రపతి పురస్కారాన్ని అందు కోన్నప్పుడు అయన గౌరవార్ధం బెనారస్ విశ్వ విద్యాలయ తెచ్చిన ప్రత్యేక సావనీర్ ను ,శ్రీ శంకరాచార్య ప్రకరణాలపై మాణిక్య  శాస్త్రి గారు  రాసిన తత్వ ప్రభ గ్రంధాన్ని పంపారు .మొదటిది అంతా సంస్కృతం లో వివిధ లబ్ధ ప్రతిష్ట రచయితలు  రాసిన ఉత్తమ  వ్యాసాలున్నాయి అందులో మా గబ్బిట వారైన శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి గారి వ్యాసమూ ఉంది . శాస్త్రిగారికుమారులు దక్షిణామూర్తిగారు హిందీలో తమ తండ్రిగారి గురించి వ్రాసిన వ్యాసం అందులో ఉంది .అదే ఈ వ్యాసానికి ఆధారం  .

జనన విద్యాభ్యాసాలు

శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్స్త్రిగారు 1916 ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడు ప్రకాశం జిల్లా కలిగిరి మండలం ఆనంద పురాగ్రహారం లో జన్మించారు .తలిదండ్రులు శ్రీమతి చెంచు లక్ష్మి శ్రీ దత్తాత్రేయ శాస్త్రి గార్లు .తండ్రి ప్రకాండ వైయాకరుణులు .జ్యోతిష్ శాస్త్రం లో నిష్ణాతులు .ఆయన రోజులో ఎక్కువ భాగం భగవధ్యానం పూజ లోను విద్యార్ధులకు బోధనలోను ,ప్రజాహిత కార్యక్రమాలలోనూ గడిపే వారు .భార్యతో వారి దాంపత్య జీవితం సుఖ సంపన్నంగా ఉండేది . ఈ దంపతుల ప్రధమ సంతానం శ్రీమతి వెంకట సుబ్బమ్మ  ,రెండు శ్రీ సత్యనారాయణ శాస్త్రి మూడు శ్రీ లక్ష్మీ నరసింహ శాస్స్త్రి నాలుగు శ్రీ మాణిక్య శాస్త్రి అయిదు శ్రీమతి లక్ష్మీ వేదమ్మగార్లు .జ్యేష్టపుత్రుడైన సత్యనారాయణ శాస్త్రి గారు సంస్కృతాంధ్రాలలో ప్రసిద్ధ కవి .రెండవ కుమారుడు శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి సంగీత శాస్త్రం లో సుప్రసిద్ధ విద్వాంసులు .ఆఖరివారైన శ్రీ కృష్ణ మూర్తి శాస్త్రి అధ్యాపకులుగా పని చేసి విశ్రాంతి తీసుకొంటున్నారు

చిన్నతనం నుండి మాణిక్య శాస్త్రిగారు తండ్రి గారి వద్ద సంస్క్రుతాధ్యయనం చేశారు .శాస్త్రాలు నేర్వాలన్న ఆ కాంక్షతో 12వ ఎతానే కాశీ వెళ్ళారు . అక్కడ తర్కం వేదాంత శాస్త్రాలు అభ్యసించారు .పది సంవత్సరాల కఠోర పరిశ్రమ చేసి ప్రకాండ పండితులై ,కాశీ మహారాజు చేత ఘన సన్మానం అందుకొన్నారు. తర్వాత స్వగృహం చేరారు .శ్రీ వేమూరి రామ బ్రహ్మ శాస్త్రి మహోదయుల వద్ద శిష్యరికం చేసి తర్క ,వేదా౦తాల అంతు చూశారు .గురువుగారి ప్రశంసలు అందుకొన్నారు .శ్రీ గోరుగంత సుబ్రహ్మణ్య శాస్త్రి గురువరేణ్యు ల వద్దా చాలాకాలం విద్య నభ్యసించి గురువు గారిచే ‘’నువ్వు ఇప్పుడు విద్వాన్మణి వయ్యావు .గురువుకు కూడా చిర  యశస్సుకలిగించి ప్రకాండ పండితుడివై విశ్వ విఖ్యాత కీర్తినార్జిస్తావు ‘’అని ఆశీరభినదనలు అందుకొన్న విద్యా మాణిక్యం మాణిక్య శాస్స్త్రి గారు .

వివాహం సంతానం .

విప్పర్ల పల్లి నివాసి శ్రీ వంగల శ్రీ కృష్ణ మూర్తి ,ఆది లక్ష్మి దంపతుల సుపుత్రి శ్రీమతిసుబ్బలక్ష్మిని వివాహమాడారు .మాణిక్య శాస్త్రిగారు మొదట్లో ఆగిరిపల్లి సర్వ తంత్ర స్వతంత్ర విద్యాలయం లో అధ్యాపకులుగా సేవ చేశారు. తర్వాత విజయవాడ కు చేరి భారత మహిళా మండలి లో పురాణ ప్రవచనం చేస్తూ ,శిష్యులకు తర్క ,వేదాంత శాస్త్రాలు బోధిస్తూ నేర్చిన విద్యకు  సార్ధకత కల్పించారు .1954లో విజయవాడలో స్వగృహం నిర్మించుకొన్నారు .

మాణిక్య శాస్త్రి గారికి పంచాగ్నుల వంటి అయిదుగురు కుమారులు జన్మించారు .ప్రధమ పుత్రులు శ్రీ సూర్య నారాయణ ఘనాపాఠీ విద్యార్ధులకు వేదాధ్యనం గరుపుతూ 25మంది ఘనా పాఠీ లను తయారు చేసిన ఘనులు .రెండవ కుమారుడు శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రిగారు చార్టర్డ్ అకౌంటంట్ గా  పని చేసి 20మంది చార్టర్డ్ అకౌంట్స్ ను తయారు చేసినవిశేష  సునిసిత మేధావి .మూడవ కుమారులు శ్రీ కృష్ణ మూర్తి శాస్త్రిగారు తండ్రిగారి సేవలో తరిస్తూ జీవితాన్ని సార్ధకం చేసుకొన్నారు .నాలుగవ పుత్ర రత్నం శ్రీ దక్షిణామూర్తిగారు పూజ్యపాడులైన జనకుల వద్దనే సంస్కృతాన్ని అభ్యసించి కేంద్రీయ విద్యాలయం లో సంస్కృత అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు .తండ్రిగారి వారసత్వాన్ని నిలుపుతూ పురాణ ప్రవచనాలు చేస్తూ ఆర్ష విజ్ఞానాన్ని వ్యాపింప జేస్తున్నారు .అయిదవ కుమారులు శ్రీ దత్తాత్రేయ శాస్త్రిగారు తండ్రిగారు మాణిక్య శాస్త్రిగారి శాస్త్ర జ్ఞానాన్ని ఆపోసన పట్టి ఉత్తరాదికారిగా తర్క ,వేదాన్తాది శాస్త్రాలను  అధ్యయనం చేసి బహు ప్రఖ్యాతులయ్యారు .విశాఖ పట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వెలుగొందుతున్నారు .మాణిక్య శాస్త్రి గారి పుత్రులు అయిదుగురూ మాణిక్యాల లాంటి వారే .తండ్రిగారి  యశస్సును ద్విగుణీకృతం చేస్తున్నారు  ధన్య జీవి శాస్త్రిగారు .

మాణిక్య శాస్త్రిగారి బహు విధ వ్యాసంగం

విజయ వాడలో ఉంటూ మాణిక్య శాస్త్రిగారు త్రిలింగ విద్యా పీఠం లో చాలాకాలం తర్క వేదాంత శాస్త్రధ్యాపనంచేశారు .తరువాత స్వంత ఇంటిలో గురుకులమేర్పరచి ఎందరో శిష్యుఅలను అద్వితీయ పండితులుగా తీర్చి దిద్దారు .అందులో ప్రసిద్ధులు శ్రీ శ్రీ చతుర్వేదుల రామ లింగ శాస్త్రి ,శ్రీ కరిపెద్దు పురుషోత్తమ శాస్స్త్రి   ,శ్రీ పొదిలి లక్ష్మీ నారాయణ శాస్త్రి ,శ్రీ మేడి చర్ల గోపాల కృష్ణ మూర్తి శాస్త్రి మొదలైన దిగ్దంతులైన పండిత ప్రకా౦డులున్నారు. .శివరామ కృష్ణ క్షేత్రం లో 29 సంవత్సరాలు ఏకధాటిగా ప్రతిదినం పురాణ ప్రవచనం చేసిన రికార్డు శాస్త్రిగారిది .సాధారణ జనాలకు కూడాఅర్ధమయ్యేట్లు  వారు  తర్క  వేదాంత విషయాలను ప్రవచించే తీరు  మహాదా శ్చర్యంగా ఉండేది .ఉప పురాణాలను కూడా సామాన్యులకు సులభ బోధకం గా చెప్పే నేర్పు వారిది. అందుకే వారి ప్రవచనాలకు విశేషం గా భక్తజనం హాజరై విజయం కలిగించేవారు .చందోలు శాస్త్రిగా పిలువ బడే బాలా త్రిపుర సుందరీ ఉపాసకులు  బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారింట నెల రోజులు ఉండిఆ బ్రాహ్మీమయ మూర్తికి సర్వ శాస్త్ర పాండిత్యం లో మెలకువలు కరతలామలకం చేశారు .ఈ విషయాన్ని తాడేపల్లి వారే స్వయంగా చెప్పుకొన్నారు .విజయవాడలో శ్రీ మాణిక్య శాస్త్రి గారికి ఘన సన్మానం జరిగినపుడు శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు గురుభక్తిగా అభినందన శ్లోకాలు రచించి చదివారు .ఆ మాణిక్యం ఘన పదార్ధమైతే ఈ మాణిక్యం వాత్సల్య ఝరీ సదృశం అన్నారు .

దిన చర్య

శ్రీ మాణిక్య శాస్త్రి గారి దిన చర్య చాలా నిర్దుష్టంగా ఉండేది .క్షణం తీరుబడి లేనికార్య వ్యగ్రత వారిది    .ప్రతి దినం తెల్లవారుఝామున మున బ్రాహ్మీ ముహూర్తం లో నిద్ర లేచి గ్రంధావ లోకనాం చేసేవారు .7 గంటల వరకు పూజ,దేవతార్చన లో నిమగ్నంయ్యేవారు .తర్వాత పురాణ ప్రవచనం చేసేవారు .ఉదయం 9గంటలకు శిష్యులకు శాస్త్రాధ్యాపనం చేసేవారు .తర్వాత మళ్ళీ పూజ .భోజనాంతరం సాయంకాలం వరకు శాస్త్రాధ్యాపనం .సాయంకాలం నుండి రాత్రి 9గంటల వరకు పూజాదికాలు .రాత్రి 10గంటలనుండి ఒక గంట సేపు పునశ్చరణ .ఇదీ శాస్త్రిగారి బిజీ షెడ్యూల్ .  శాస్త్రిగారి ధర్మ పత్ని శ్రీమతి సుబ్బలక్ష్మి గారు ఛాత్రులకు ,పండితులకు అతిధులకు అందజేసే ఆతిధ్యం లో భర్త గారికి చేదోడు వాదోడుగా ఉంటూ గురుపత్నిగా సమాన గౌరవాదరాలను పొందేవారు .ప్రతి సంవత్సరం శాస్త్రి గారి గృహం లో నవ రాత్రి ఉత్సవాలను మహా వైభావంగానిర్వహించేవారు .ఆంద్ర దేశం లోని సుప్రసిద్ధ సమస్తవేద ,శాస్త్ర పండితులు  విచ్చేసి శాస్త్రి గారి ఘనమైన ఆదరణ ఆతిధ్యాలను గ్రహించి,సగౌరవ సత్కారాలను అందుకొని సంతృప్తి చెందేవారు

రచనా వ్యాసంగం

అనేక విషయాలపై భాషణలు ,ప్రసంగాలు ,చర్చలు ,అధ్యాపనం పురాణ ప్రవచనం విశేషాలను ప్రముఖ పత్రికలన్నీ వ్యాసపరంపర గా అందజేసేవి .వారి వ్యాసాలను ప్రచురించేవి .దిన పత్రికలైన ఇండియన్ ఎక్స్ ప్రెస్ ,హిందూ పత్రికలూ ఆంగ్లం లో వారి ప్రసంగాలను అందజేసేవి .శాస్త్రిగారు ఎక్కడ ఏ విషయమై రాసినా, మాట్లాడినా పత్రికలన్నీ వెంటనే ప్రముఖం గా ప్రచురించి వారి భావధారను అందజేసేవి .ఆంద్ర పత్రిక ఈనాడు వంటి తెలుగుపత్రికలు శాస్త్రిగారి బహుముఖీన పాండిత్యం విద్వత్తుల గురించి ప్రత్యేక వ్యాసాలూ రాసేవి .ప్రధాని నెహ్రూ నుండి పొందిన సన్మాన వార్తలను ఇల్లస్త్రేటేడ్ వీక్లీ ఘనం గా ప్రచురించి శాస్తిగారి కీర్తిని దశ దిశలా చాటింది .దర్భంగా మహారాజు చేసిన సన్మానాన్ని ప్రముఖంగా ప్రచురించి వారి కీర్తికిరీటానికి మరో కలికితురాయి నంద జేసింది

మాణిక్య శాస్త్రిగారు అనుక్షణ వ్యాసంగం లో ఉంటూ కూడా ‘’శ్రీ శంకరాచార్య ప్రకరణల పై ‘’తత్వ రహస్య ప్రభ ‘రాశారు .దీనికి రాష్ట్ర పతి పురస్కారం  ఘన సన్మానం లభించింది .ఇందులో దక్షిణా మూర్తి స్తోత్రం ,అపరోక్షాను భూతి దశ శ్లోకి ,సోపాన పంచకం ,ఏక శ్లోకీ మనీషా పంచకం మొదలైన వాటిపై వివరణ తో చర్చించారు .

శాస్త్రిగారి రెండవ గ్రంధం ‘’తత్వ సంవిజ్ఞాన పీఠికా’’ఇందులో భక్తీ ముక్తి మార్గాలు అనేక వేదాంత విశేషాలు ,ఉదాహరణలు ఉంటాయి వీరి తత్వ రహస్య ప్రభ ఇప్పటికీ లభ్యమే . .

శాస్త్రిగారి గురుకులం

మాణిక్య శాస్త్రి గారింట ఎందరో విద్యార్ధులు ఉండినిరంతర విద్య అధ్యాపనం చేసేవారు .వారే తర్వాత అగ్రగణ్య పండితులై గురువుగారి కీర్తికి కూడా కారకులయ్యారు .శాస్త్రిగారి సుపుత్రులు డా .దత్తాత్రేయ శాస్త్రి గారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఆచార్యులై,పురాణ ప్రవచకులై గురుపరంపరను కొనసాగించటం విశేషం .శ్రీ రాణీమురళీ కృష్ణ కేంద్రీయ విద్యాలయం లో సంస్క్రుతాధ్యాపకులై గీర్వాణ సేవలో తరిస్తున్నారు .శ్రీ ధూళిపాళ రామ కృష్ణ విజయవాడ మేరీస్టేల్లా కళాశాలలో సంస్కృత ఆచార్యులై భాషా సేవలందిస్తున్నారు శ్రీపాలగుడు సుబ్రహ్మణ్య శాస్త్రి సంస్క్రుతాధ్యాపనం తోబాటు పురాణ ప్రవచనం లోను అద్వితీయులని పించుకొన్నారు .ఈ శిష్య పరంపర ప్రతి ఏడాది మాణిక్య శాస్త్రి గారి జన్మ దినమైన ఫాల్గుణ బహుళ పాడ్యమినాడు గురు పూజోత్సవాన్ని అతి వైభవం గా నిర్వహిస్తారు .అంతర్గత వేద ,శాస్త్ర సభలను ఏర్పాటు చేస్తూ భక్తీ శ్రద్ధలతో  పండిత సన్మానాలనూ  వైభవం గా చేసి గురుభక్తిని ప్రకటించుకోవటం ఒక విశిష్టమైన ఆదర్శ  వంతమైన ఆనవాయితీ .దేశం లోని వివిధ ప్రాంతాలనుండి ఇక్కడికి వచ్చి శాస్త్రిగారి అంతే వాసులై శాస్త్ర విద్య నభ్య సించిన వారిలోశ్రీ వేదవ్యాస,శ్రీ శ్రీనివాసాచార్య ,శ్రీ కృష్ణ రాజ తంత్రీ మొదలైన మహా పండితులున్నారు  . శిష్యులలో మాణిక్య శాస్త్రిగారికి ప్రియశిష్యులు శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రిగారు  .బెనారస్ విశ్వ విద్యాలయం లో వైదిక దర్శన విభాగం లో ప్రొఫెసర్ గా పనిచేశారు  .అనేక మంది విద్యార్ధులకు మార్గ దర్శనం చేశారు . .గురు కీర్తి దశ దిహలా వ్యాపింప జేసి గురూణం తీర్చుకొన్న శాస్త్రి గారి ప్రియ తమ అంతేవాసి .

బిరుద సత్కార పురస్కారాలు

శ్రీశృంగేరి శారదా పీఠం,శ్రీ కంచి కామ కోటి పీఠం,ఉడిపి పెజావర్ మఠం,తిరుపతి దేవస్థానాలకు శ్రీ మాణిక్య శాస్త్రి గారు ఆస్థాన పండితులై గౌరవం పొందారు .ఇందులో కొందరు పీఠాదిపతులకు శాస్త్రిగారు తర్క వేదాంత గురువులవటం మహా గొప్ప విషయం .1992లో రాష్ట్ర పతి శ్రీ ఆర్ .వెంకట్రామన్ గారు మాణిక్య శాస్త్రిగారు చేసిన సంస్కృత సేవలను గుర్తించి రాష్ట్ర పతి పురస్కారాన్ని అందజేసి ఘనం గాసత్కరించారు .ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి బహు పర్యాయాలు పురస్కారం పొందారు .

శాస్త్రి గారి అపార పాండిత్యానికి తగినట్లు ‘’తర్క వేదా౦తాచార్య ,దర్శనాచార్య ,తర్క వేదాంతా రత్న మహామహోపాధ్యాయ మున్నగు బిరుడులందుకొన్న సమర్ధులైన దేశికులు . .శాస్త్రిగారు అగణిత పండితులకు అధ్యాపనం గరపటం వేలాది భక్తులకు ముక్తిమార్గదర్శనం చేయించటం బహు ప్రశంస నీయం .అనేకమంది శిష్యులు గురువుగారి పై ఉన్న గౌరవ ప్రపత్తులకు నిదర్శనంగా తమ పిల్లలకు మాణిక్య శాస్త్రి పేరు పెట్టటం చిరస్మరణీయం .ఇలా జరగటం బహు అరుదు ఈ అరుదైన ఆ గౌరవాన్ని దక్కించుకొన్న వారు శ్రీ మాణిక్య శాస్త్రిగారు

మాణిక్య శాస్త్రి గారి మరణం .

ఒక  సుప్రసిద్ధ సంస్కృత శ్లోకం

–‘’పరి వర్తినీ సంసారే మ్రుతః కో వా న జాయతే –సజాతో యేన  జంతేనయాతి వశః సమున్నతిం ‘

’లో చెప్పినట్లు జీవించిన వారందరూ మరణించి ఏదోఒక జన్మ పొందుతారు .కానీ ఎవని పేరు అతని వంశానికి ఉన్నతి కలిగిస్తుందో అలాంటి వాని జీవితం ధన్యం ఇలాంటి పేరు ప్రతిష్టలను మాణిక్య శాస్త్రిగారు తన వంశానికి కలిగించి ధన్య జీవులయ్యారు .92ఏళ్ళ సార్ధక జీవనం గడిపిన తర్క వేదాంత రత్న మహా మహోపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్స్త్రిగారు -8-4-2008 బ్రాహ్మీ ముహూర్తం లో బ్రహ్మ పదం చేరుకున్నారు .

‘’జయ౦తితే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరః—నాస్తి యేషాం యశః కాయే జరామరణ వర్జితం ‘’

శ్రీ మాణిక్య శాస్త్రి గారి రెండు ఫోటోలు జతచేశాను చూడండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మాధుర్య వీచి ,దైవాసుర సంపద్వియోగం ”మంచి మనసుకు మంచిరోజులు”కు 50

Inline image 1

Inline image 1

 



Inline image 2

 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 46-దేవాయార్య దీక్షితులు

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

46-దేవాయార్య దీక్షితులు

శ్రీపతి దీక్షితులకుమారుడే దేవాయార్య దీక్షితులు .హరితస గోత్రం .కాలాదులు తెలియవు .’’ప్రసన్న రామాయణం ‘’రాశాడు ఇందులో 22 సర్గలున్నాయి..మొదటిశ్లోకం –నిత్యాను ష౦గ దివి చిన్తయ దామ్నో యస్యామ్బుజా వాసుముఖాఃసురేంద్రాః—విభాంతివహ్నే రివవిస్ఫులింగా స్తస్మై నమస్యాం ‘’’వాల్మీకి ని స్తుతిస్తూ రాసిన శ్లోకం –‘’సారస్వతాంబు సర ప్రవృద్ధ శాఖాశతాదిస్టితదివ్య మూర్తిం –ఆలింగితంరామకధా లతాభి వాల్మీకి కల్ప ద్రుమ మాశ్రయం ‘’.తనను గురించి తన పుస్తకాన్ని గూర్చి –

‘’శ్రీ కాళిదాసాది కవీన్ ప్రణమ్య శ్రీ మత్పదాంకం సరాసాను బంధం –కావ్యం కరిష్యే కవి దేవయార్యః ప్రసన్న రామాయణ మదేయం ‘’

చివరగా –ఇతి శ్రీ దేవ యార్యేణ కృతే శ్రీపతి సూనునా –ప్రసన్న రామే కావ్యే స్మిన్ ద్వివిమ్శాయీరీతి ‘’

ఈ దేవయార్యుడు ప్రౌఢ దేవరాయల ఆస్థానం లో  ఉంది ‘’స్మ్రుతి చంద్రిక ‘’రాసిన  దేవన భట్టో కాదో తెలియదు .అలాగే 15,16శతాబ్దం వాడిన సంగీత ముక్తావళి  రాసిన దేవనా చార్య యో కూడా తెలియటం లేదు .

47-వారణాసి ధర్మ సూరి

యల్లమామ్బా ,పార్వతేశ్వర సూరి కుమారుడైన ధర్మ సూరి వెలనాటి బ్రాహ్మణుడు .హరితస గోత్రీకుడు .వారణాసి కులం కవి చంద్రుడు . కవి.కృష్ణా జిల్లా  పెదపులివర్రు లో జన్మించాడు .పరమ శ్రీరామ భక్తుడు .చివర్లో సన్యాసం తీసుకొని ‘’గోవిందా నంద సరస్వతి ‘’అయ్యాడు .మల్లినాద సూరికి జూనియర్ ..సాహిత్య రత్నాకరం రాశాడు .అందులో తన గురించి తనవాళ్ళ గురించి చెప్పాడు –‘’గోత్రే చ తస్య సమభూ దభి జాత వంశో వారనాసీత్యుపపదేనభువి ప్రసిద్ధః –తత్ర భవన్ బుధవారాస్త్రిపురా రి సోమ యజ్వాదయ శ్శుభ తప శ్రుతా శీలవృత్తాః’’

గొప్ప పండితకవి  వంశం  లో పుట్టానని  చెప్పాడు .ధర్మ భూపాలుడు నారాయణ పండితుని సత్కరించాడని రాశాడు .ధర్మ సూరి చాలా రాసినా మూడు గ్రంధాలే లభ్యం .అందులో ముఖ్యమైనది ‘’సాహిత్య రత్నాకరం ‘’.పది తరంగాలున్న గ్రంధం ..అలంకార శాస్త్ర గ్రంధం ఉదాహరణలన్నీ రాముని తో సంబందాం ఉన్న స్వకవితలే .దీనిపై చర్ల వెంకటశాస్త్రి ‘’నౌక ‘’,మల్లాది లక్ష్మణ సూరి ‘’మంద్ర ‘’,మధుసూదన మిశ్ర శర్మ ‘’నౌక ‘’అనే వ్యాఖ్యానాలు రాశారు .

 రెండవ గ్రంధం ‘’రత్న ప్రభ ‘’.మూడవది నరకాసుర విజయ వ్యాయోగం ..ధర్మ సూరి కవిత్వం లో లాజిక్ తో బాటు కవితా మాజిక్ కూడా ఉంటుంది –

‘’తర్క కార్కశతాం గతాపి నితరం వాగ్వైఖరీ సత్కవేః మాధుర్య ప్రకటీకరోతి కవితా కాలేషు కిమవదాద్భుతం ‘’

పశ్యత్యంత కఠోర తాముపగతా గ్రీష్మే మయూఖా వలిః –కిం నావిష్కురుతేనవామృత భరం భాసం నిదోః ప్రావ్రుషి ‘’

కవికి అనేక విషయాలలో మంచి ప్రవేశం ఉన్నట్లు చెప్పాడు –

‘’భామత్యుల్లలిసితా రాతా వివరణే తంత్రే నిరూఢిం గతాః-సచ్చిన్తామణయః సముజ్వల యశో లీలావతీ వల్లభాః

ధర్మ సూరి రాసిన ఇతరగ్రందాలు అలభ్యం ..కవిరాసిన ‘’కృష్ణ స్తుతి ‘’కృష్ణా నది గురించే ..వ్రుత్యనుప్రాసలో ఉన్న ఒక శ్లోకం –

‘’కృష్ణా మ్రుష్నాతిసిష్నాస్వభి జనవ్రుజినాన్యశు –వర శౌరాది దారా రుచిర రుచిర హీ భేనాచ్చపేన  

శుభ్రా శుభ్రా భ్యదూర్మిభ్ర మకర మకర గ్రామణీగ్రామనీడా –గద్యా గద్యారారేదో వివర భువి వల్లద్వీ వరాదా వరోదా ‘’  

 10౦ శ్లోకాల సూర్య శతకం రాశాడు .నాగ బంధం లో సూర్య బింబాన్ని వర్ణించాడు –

‘’బింబం ధ్వాంత వ్యాదాడం కనక ఘరా శిర రశ్చారి శోణాద్భుదాప్తం –పంచాది ప్రేమ సోమ క్షత దమురుముదః కర్త్రు కావ్యూహ హారి ‘’

బాలభాగవతం ,హంస సందేశం ,కంస వధ నాటకం భాష్య రత్న ప్రభ రచించాడు .’’బ్రహ్మ సూత్రా విషయ వాక్య వ్రుత్తి ‘’కూడా రాశాడు ‘

   సశేషం

  మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -18-12-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Leave a comment

ఉయ్యూరు పెన్షనర్స్ అసోసిఏషణ్ 17-12-15 గురువారం ఉదయం నిర్వహించిన 33వ జాతీయ పెన్షనర్ల దినోత్సవం లో సభాధ్యక్షుడిగా నేను పాల్గొన్న చిత్ర మాలిక

ఉయ్యూరు పెన్షనర్స్ అసోసిఏషణ్ 17-12-15 గురువారం ఉదయం నిర్వహించిన 33వ జాతీయ పెన్షనర్ల దినోత్సవం లో సభాధ్యక్షుడిగా నేను పాల్గొన్న చిత్ర మాలిక

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

భూలోక వైకుంఠం శ్రీరంగం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వానకవుల కవితా గీర్వాణం-4 44-త్రిపురాంతకకవి (18వ శతాబ్దం )

నాలుగవ గీర్వాణం

గీర్వానకవుల కవితా గీర్వాణం-4

44-త్రిపురాంతకకవి (18వ శతాబ్దం  )

యాచ ప్రబంధం అనే చారిత్రాత్మక కావ్యం రాసిన త్రిపురాంతక కవి కౌండిన్య గోత్రీకుడు భట్టపాదుని కుమారుడు .వెలుగోడు ,వెంకట గిరి రాజ్య స్థాపకుడు యాచమనాయకుని ఆశ్రితుడు .ఈ కావ్యం లో యాచమనాయక వంశ వర్ణన చేశాడు –

‘’సక్రుదానతిరర్చనాయ భూయ ,దుభయోరిత్యనుక౦ప యాల సనం –అవిలంబిత విగ్రహేక భావం శివయోః శ్రీ సమవాయ మాశ్రయం ‘’బంగారు యాచుని గురించి ఉన్దికనుక కవి 18వ శతాబ్దం వాడని విద్వత్ కుమారా యాచఆస్థానం లో ఉంది ఉండాలని భావిస్తారు.

‘’బ్రహ్మాండే రోత్వరావతి పరం కేశవే భక్తీ భాజః –క్రుత్యాక్రుత్యా గ్రహణ హరేణోశిక్షితా యేన సోయం ‘’

చివరి శ్లోకం-

‘’యాచ ప్రభోతావక దాన పత్ర  స్వరూప మాయాతిన చెన్న రూపం –దినేషు గత్సత్సు చ పంచషేషు భూయో హమాయాని భవత్సకాశం .

45-విఠల దక్షిణా మూర్తి పండితుడు (19వ శతాబ్దం )

విఠల రాజేశ్వర దీక్షితులు ,పరంబ ల కుమారుడు దక్షిణామూర్తి పండితుడు .ఈవిద్వత్ కవి 19శతాబ్ది మధ్యకాలం వాడు .మెదక్ జిల్లా సిద్ధిపేట తాలూకా చెప్పేల గ్రామ వాసి .మీమాంసా ధర్మ శాస్త్రాలలో అఖండ పండితుడు .కల్ప సూత్రాలపై ‘’యాజ్నికా భరణం ‘’రాశాడు మంచికవికూడా .ఎన్నో లఘుకావ్యాలు రాశాడు .వీటిలో మనో నైర్మల్య పంచకం ,జ్ఞాన తారావళి ,పంచ రత్నావళి ,బ్రహ్మానంద పంచకం ,కార్య సిద్ద్యాస్టకం ,జీవంముక్తాస్టకంమొదలైన 11రచనలున్నాయి

యిదే శ్లోకాలలో మనో నైర్మల్య పంచకం ఉంది –‘’ప్రతిక్షణ విశోధనా ద్రిపురిదంబహిర్నిల్మలం –న చేదితమహర్నిశం స్రవతి దుస్టగంధాన్ మలాన్ ‘’

జనన తారావళి 27శ్లోకాలున్నాయి –‘’సాక్షాత్క్రుతి బ్రహ్మాణి సావ దానే సురూప దేశాను భవాగామేశ్చ-ఏకాగ్ర చిత్తః తదను క్రమేణనిరుద్ధ భూమౌ విహారే రావిదాన్ ‘’

వ్యక్తీ పరబ్రహ్మ స్వరూపం అని తెలియ జెప్పే శ్లోకాలున్నది ‘’పంచ రత్నావళి ‘-హ్రుత్పున్దరీకే పరమధ్య సంస్తే దాహ్రాభిదే చిద్గాగనేయ ఆస్తే –సోయం చిదానందమయ స్సుఖస్య దుః ర్వస్య సాక్షీ పరమేశ్వరోస్మి ‘’

బ్రహ్మానంద పంచకమూ ఇదే ధోరణిలో ఉంది .కార్య సిద్ధి అష్టకం లో 8శ్లోకాలున్నాయి పది శ్లోకాలది ప్రదోష స్తవం .చిత్కలా భుజంగం 20శ్లోకాలు లక్ష్మీ కటాక్ష పంచకం లక్ష్మీదేవి స్తోత్రం శ్యామలా పంచ రత్న మాలిక శ్యామలాదేవి గురించి చెప్పినది –‘’ఇష్ట కామ్య ఫలసిద్ధిడా సకలలోక వశ్య కర మూలికా –ద్వాదశాబ్ద వయసి స్థితా మృదుల నీల వస్త్ర పరిదానికా

కాళికా గలిత చూలికా వికచ మల్లికా కుసుమ మాలికా –శ్యామలా మమ వరప్రదా భవతు చిత్కలా నవర్జస్వలా ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-12-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -98

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -98

42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్ -3(చివరిభాగం )

సాంఘిక పునర్ నిర్మాణం పై వెల్స్అభిప్రాయాలకు క్రమగా ఆదరణ తగ్గింది భవిష్యత్తులో ఏయే కొత్త విషయాలోస్తాయో ఆయన ‘’ది షేప్ ఆఫ్ థింగ్స్ టుకం ‘’లో రాశాడు .క్రమంగా అయన సాధారణ సృజన ధార బలహీనపదడిం దన్నారు  .తీవ్రంగా విమర్శిస్తూ ‘he sold his birth right for a pot of messages ‘’అని ఈస డి౦చారు.వయసు అరవై మధ్యలో ఉండగా అంతగా ఉత్సుకత లేని ‘’ది బల్ పింగ్టన్ఆఫ్ బ్లప్’’రాశాడు .ముదురు వయసులో రిపిటీషన్ లే రాస్తున్నాడు అనే అభియోగామూ ఉంది .దేనినీ లక్ష్యం చేయకుండా ‘’ది న్యు వరల్డ్ ఆర్డర్ ‘’రాశాడు .ఇది రేషనలిజాన్నితట్టి లేపింది .ఆయన ఊహించి ముందే చెప్పినవన్నీ ఒకటి తర్వాత ఒకటి అనుభవం లోకి వచ్చి నిజం చేస్తుంటే తిట్టిన నోళ్ళుమూత పడ్డాయి .ఆయనలో ఫెర్టి లిటి  పెరిగిందే కాని తగ్గలేదు .వయసు 90వచ్చేసరికి పబ్లిష్ అయిన ఉద్గ్రందాలే 90కి పైన ఉన్నాయి .30పాంఫ్లేట్స్ రాసి ప్రచురించాడు .”impure but inexhaustible Wells ‘’అనిపించుకొన్నాడు .

మానవాళికి మార్గ దర్శనం చేయటం లో వెల్స్ఎప్పుడూ ముందు ఉండేవాడు జనజాగృతమే ఆయన ధ్యేయం .76వయసులో డాక్టరేట్ పొందాడు .తన దిసీస్ కు ఆయన ‘’qulality of illusion in the continuity of the individual life in the higher Meta zoa with particular reference to Homo Sepines ‘’.అని పేరుపెట్టాడు

‘’సూపర్ హుమన్ వైటాలిటి’’ ఉన్నవాడు వెల్స్.రెండు ప్రపంచ యుద్ధాలు ఆయన పాత భావాలపై అనుమానం కలిగించాయి .హీరో షిమా ఉదంతం తర్వాత మనసు వికలమైంది .తన స్పందనను ‘’this can wipe out every thing bad or good in the world .It is up to the pe0ple  to decide which ‘’అన్నాడు ఆవేదనగా .79వ ఏట ‘’mind at the end of its tether ‘’అనే సోషలాజికల్ టేస్టమెంట్ రాశాడు .ఇందులో మానవ మూర్ఖత్వాన్ని ప్రశ్నించాడు .మానవుడు తాను  జీవించటానికి సరైన శ్రద్ధ తీసుకోలేక పోతున్నాడని బాధ పడ్డాడు .’’man will have to give place to some other animal better adapted to the fate that closes in ‘’అని భవిష్యవాణి చెప్పాడు

.కొన్నేళ్ళనుంచి డయాబెటిస్ తో బాధ పడుతున్నాడు వెల్స్.80వ ఏట పరిస్తితి క్షీణించింది .మరణం అంచున ఉన్నానని గ్రహించాడు తాను  కొన్ని రోజులకు చనిపోతాననగా ‘’నా ఒక కాలు సమాధిలో మరొకటి బయటా ఊగుతున్నాయి ‘’అన్నాడు తనగురించి జోక్ చేస్తూ .చావును విషాదాంతంగా కాని సీరియస్ గా కాని తీసుకోలేదాయన .ఒక సందర్భం లో ఆయన సంభాషణ సమయం లో కొంచెం పరాకుగా ఉన్నాడని  అంటే నవ్వుతూ ‘’నేను చావు లో బిజీగా ఉన్నాను ‘’అన్నాడు .ఇంకొక నెలలో ఎనభై వ ఏడు వస్తుందనగా వెల్స్ 14-8-1946న మరణించాడు .

ఎన్సైక్లో పీడియా బ్రిటానికా వెల్స ను  ‘’నావలిస్ట్ ,సోషియాలజిస్ట్ ,హిస్టోరియన్ ,అండ్ ఉటోపియన్’’గా అభి వర్ణించింది .న్యూ యార్క్ టైమ్స్ ‘’పార్లమెంట్ ,రాజకీయం ,ప్రైవేట్ ఆస్తి ,వాణిజ్య పోటీ ,పోలీసులు జైళ్ళు పిచ్చివాళ్ళు ,వికలాంగులు ,లేని ఆదర్శ రాజ్యం కోసం వెల్స్ తపించాడు ‘’అని శ్లాఘించింది .ప్రపంచ ప్రభుత్వం కోసం కలలు గన్న మేధావి వెల్స్.ప్రపంచ శాంతి స్థాపనే ధ్యేయంగా ఉన్నవాడు .ఆంగ్ల రాజకీయాలను ప్రభావితం చేసి మార్గ దర్శనం చేశాడు .సోషలిస్ట్ ఇంగ్లాండ్ రావాలని తపించాడు కాని బ్రిటిష్ పౌరుడేవ్వడూ దానికి ఇష్టపడడుఅనీ చెప్పాడు .ఆయన రాసిన సెక్స్ నవలలు విముక్తికి మార్గం చూపాయి .చార్లెస్ డికెన్స్ తర్వాత ఇంతటి పాప్యులర్ నవలా రచయితా రాలేదు .Wells was possibly the greatest British journalist since Defoe ‘’అని న్యూయార్క్ టైం ఘన నివాళి అర్పించింది .

వెల్స్ కొంతకాలం సోషలిస్ట్ ఫేబియన్ సొసైటీలో ఉన్నాడు .వారికి విద్యా ,సంస్కరణలపై అవగాహన ఏమీ లేదని తెలుసుకొని బయట పడ్డాడు  లండన్ యూని వర్సిటీలో లేబర్ పార్టీ ప్రతినిధిగా పోటీ చేశాడుకాని పార్టీపై అంతగా అభిమానం లేక వదిలేశాడు ‘’సోషల్ క్లాస్ ‘’రావాలని ఆశించాడు .ప్రపంచ ప్రభుత్వం ఏర్పడాలని ఆరాట పడ్డాడు .’’ది ఓపెన్ కాన్స్పి రసి ‘’ లో వరల్డ్ కామన్ వెల్త్ గురించి  చర్చించాడు .’’దిఫ్యూచర్ ఇన్ అమెరికా ‘’పుస్తకం లో అక్కడి జాతి విచక్షత కొంప ముంచుతుందని చెప్పాడు .మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ‘’టేర్రిటోరియలిజం ‘’పై మాట్లాడాడు .జియనిస్ట్ మూమెంట్ ను వ్యతిరేకించాడు .రష్యాలో స్టాలిన్ రాకతో భావాలలో మార్పు వచ్చింది .స్టాలిన్ తో మార్క్సిజం –లెనినిజం వస్తుందని ఆశించాడు .తర్వాతఫాసిజాన్ని కమ్మ్యూనిజాన్ని విమర్శించాడు .వెల్స్ పూనిక తో  ఇంగ్లాండ్ లో ‘’డిజైన్ అండ్ ఇండస్త్రియల్ అసోసియేషన్ ‘’ఏర్పడింది .’’గాడ్ ది ఇన్విజిబుల్ ‘’పుస్తకం లో దేవుడు మతాలను సృష్టించలేదని చెప్పాడు  “the most important writer the genre has yet seen”, and notes his work has been central to both British and American science fiction.[85] He was nominated for the Nobel Prize in Literature in 1921, 1932, 1935, and 1946.[7].

Inline image 1Inline image 2Inline image 4Inline image 5

నోబెల్ ప్రైజ్ కు నామినేట్ అయినా పొందలేని గొప్ప రచయిత.ఎందరెందరికో స్పూర్తి ప్రదాత .ప్రపంచ బంగారు భవిష్యత్తు కోసం కలలు కన్న ఆశావాది .క్రాంత దర్శి వెల్స్ .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –  16-12-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 41-మానవల్లి జగన్నాధ శాస్త్రి (1920)

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

41-మానవల్లి జగన్నాధ శాస్త్రి (1920)

కాశీకి చెందిన మానవల్లి జగన్నాధ శాస్త్రి మహామహోపాధ్యాయ మానవల్లి లక్ష్మణ శాస్త్రి కుమారుడు ,గంగాధర శాస్త్రికి సోదరుడు .కవిత్వం విమర్శ ,కధలు సంస్కృతం లో రాశాడు .అతని ‘’శాంత రస విమర్శ ‘’అందరిని ఆకర్షించింది .శాంత రస స్వరూప స్వభావాలు దానిపై విమర్శ ,అన్ని రసాలకన్నా శాంత రసమేఎందుకు ఉత్క్రుస్టమో వివరంగా చర్చించాడు .రెండవ రచన ‘’కాంతి ద్రుష్టి ‘’వచనం .కవి రాసిన చాలాకవితలు కధలు ప్రముఖ సంస్కృత పత్రికలూ సూర్యోదయ ,మొదలైన వాటిలో వచ్చాయి ఇండియా చైనా యుద్ధం పై ‘’మత్తేభ కుంభ దలన మృగాది రాజః ‘’శ్లోకాలు రాస్తే గా౦డీవం పత్రిక ప్రచురించింది ఇందులోంచి ఒక శ్లోకం –

క్రవ్యాదచీన బహుళ తాండవ ఖండ నయ ఛండోదమః ప్రభావితా నను హిందూ వీరః –గాడాంధకార హరణాయసహస్ర రశ్మిఃమత్తేభ కుంభదళనాయ మ్రుగాదిరాజః ‘’

ప్రవ్రుత్త సమరం బలం కుటిల చీనసంచాలితం –స్వకీయ బాతి బాన్ధవేః సహా విలోక్య రోషాత్ష్టితః

ప్రవ్రుద్వివిధాయుదో ధ్వనిత దుందుభిః సధ్వజే –న యాతి మహిమాలయో భువి హిమాలయో నిమ్నతాం ‘’

42-ఉపద్రష్ట జీవ బుధ (17వశతాబ్దం )

ఉపద్రస్ట కోనేరి కొడుకే జీవ బుధుడు .17వ శతాబ్దం వాడు .పండితరాయల ఇంటిపేరు కూడా ఇదే .’’నలానందం ‘’అనే 7 అంకాల సంస్కృత నాటకం రాశాడు .నల దమయంతి కద.-మొదటి శ్లోకం –

‘’శ్రీమన్మాధవ పాద పంకజ యుగం పాయాదపాయా త్సదా—పారావార సుతా కరాంబుజ మృదు స్పర్శేన సంలాలితం

గంగా యన్నఖ నిర్గత సామ భవత్కళ్యాణ దాసర్వదా –సర్వేషాం భావినం భవాబ్ది తరణిః త్రైలోక్య చింతామణిః’’

సూత్ర దారుని చేత తండ్రి కోనేరి జీవిత విశేషా లను చెప్పించాడు .తండ్రికోనేరి వేదాంత భాను కుమారుడు .ఒక బ్రాహ్మ గురు ఆశీస్సులతో ఖడ్గం పట్టి స్వీయ జన రక్షణ చేశాడు .నాటకం లో అద్భుత రస పోషణ జరిగిందని సూత్ర దారుడు వివరిస్తాడు .కవితాత వేదం భానుడు ,అని కవి తలిదండ్రులు జయంతి కోనేరి అని తెలుస్తుంది .కవి పిన తండ్రి సుబ్రహ్మణ్య యే గురువు .ఆశ్వాసాంత గద్యలో

‘’ఇతి శ్రీ కవికుల తిలక జీనామక విబుధ కృతౌ  నలానంద నాటకే నల రాజ్యాభి షేకో నామ సప్తమోన్కః’’

43-త్యాగ రాజు కవి

ఈ త్యాగరాజు సంగీత మూర్తిత్రయ త్యాగయ్య కాదు .కాలం పుట్టుక తెలియవు. కాశ్యప గోత్రీకుడు. ఆనంద నాధుని శిష్యుడు .1-ఉపదేశ శిఖామణి 2-పంచ కోశ విమర్శిని 3-స్వాత్మ స్పూర్తి విలాసం రాశాడు .అన్నీ వేదాంత గ్రంధాలే .ఐహికానికన్నా ఆముష్మికానికి ప్రాదాన్యమిచ్చాడు .తానూ ఆంధ్రుడనని చెప్పుకొన్నాడు –‘’ఇత్యానంద నాద పద పద్మోప జీవినా కాష్యపసగోత్రోత్పన్నే ఆంధ్రేన  త్యాగరాజ నామ్నా విరచితః ‘’ఉపదేశ శిఖా మణిః’సంపూర్ణం ‘’

రెండవ రచన అయిదు పాదాల ‘’పంచ కోశ విమర్శిని ‘’.పంచ భౌతిక శరీరం పై కాంక్ష తొలగి పరమ పద సోపానం వైపు ద్రుష్టి మరల్చాలన్న ఉద్బోధ .

మూడవది 37శ్లోకాల స్వాత్మ స్పూర్తి విలాసం .ఇవికాక శివమీడే స్తోత్రం శాంతి స్తవం ,నవ మల్లికా స్తవం ,ఆర్య పంచాదశి ,ధర్మా౦ బికాస్తావం ,నవాక్షర స్తోత్రం సంవిత్సతకం కూడా రాశాడు

ఉపదేశ శిఖామణి శంకరాచార్యుల భజ గోవి౦దా నికి అనుకరణ –

‘’భజ గౌరీశం భజ గౌరీశం భజ గౌరీశం ముగ్ధ మతే –భజ గౌరీశం భజ గౌరీశం భజ గౌరీశం భజ ముగ్ధ మతే

సత్యం వదరే ధర్మం చరరే క్రుత్యాక్రుత్య విచారం కురురే –కాలో యాతి గృహీత్వా దేహ వ్యర్ధం మా కురు మానుష జన్మ ‘’

పంచ కోశ విమర్శనం –

‘’న చాహం శరీరం జడత్వాత్ ప్రుధక్త్వాత్ న చ ప్రాణ వర్గః పిపాసాది మత్వాత్ –మనో నాపి సంకల్ప మూలా క్షయత్వాత్ తతసత్యాగ రాజ స్వరూపో హమేవ ‘’చివర్లో

‘’న చేశః ప్రభుత్వాత్వ మాయా వ్రుతత్వాత్ న జీవో ప్యావిదావ్రుతత్వాత్ బహుత్వాత్

న మాయస్య స్వరూపో ప్యాస త్వప్ప్రసంగాత్ తతస్త్యాగ రాజ స్వరోపోహ మేవ ‘’

త్యాగరాజ కవి రాసిన స్వాత్మ స్పూర్తివిలాసం నుండి ఒక ఉదాహరణ –

‘’వందే గురు పద ద్వంద్వం వాంచితా ర్ద ప్రదాయకం –వాగీశ విష్ణు రుద్రేంద్ర వాచార ౦భణాహేతుకం

స్పూర్తి రూపేణ తిస్టామి సద్రూపః ఫలయస్యహి –ఆదా వంతేతదా మధ్యే కటకే హాటకం యదా ‘’

చివరలో –

‘’సచ్చిదానంద రూపే తు మాయా సత్చిత్సుఖాత్మికా –శర్కరాల ౦ డ్రుకై ర్యద్వత్ శర్కరా రూపమేవ హి

ఏషాహ్వానంద నాధస్య పద పంకో ప జీవినా –స్వాత్మ స్పూర్తి విలాస సఖ్యో గ్రందో విరచితోవ్యయః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-15-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సమాజ హితం కోసమే చిత్రాలు ,,ఉద్యమ వనితా ధిల్లీ సింహాసనమెక్కిన తొలి మహిళా ,పర్యావరణ పరి రక్షకురాలు

 

Inline image 1

Inline image 1
Inline image 2


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వవేదం వీణాగానం -శ్రీమతి ఈమని —కాల్ నాగుల అరెస్ట్–ధిల్లీ రాజకీయ తుఫాన్ అడవి బిడ్డకు అరుదైన గౌరవం

Inline image 1Inline image 1
Inline image 2

Inline image 1
Inline image 2


 
 
Inline image 2
గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -97

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -97

42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్ -2

గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే హాల్ట్ అకాడెమీలో కొంతకాలం బోధించాడు .బయాలజీ టెక్స్ట్ బుక్ రాశాడు .ఈ తీవ్రమైన పని ఒత్తిడిలో ఆరోగ్యం దెబ్బ తింది..గోరు చుట్టుపై రోకటి పోటు అన్నట్లు గ్రౌండ్ లో ఆడుతుంటే ఒక కిడ్నీ నలిగిపోయింది .తనకు టి బి వచ్చిందేమోనని భావించాడు .రక్తం కక్కుకోనేవాడు అదృష్ట వశాత్తు తేరుకొన్నాడు .ఇలా అనారోగ్యానికి గురౌతున్నా ‘’సరిపడా ఆరోగ్యం నాకు ఉండేది ‘’అన్నాడు .జబ్బు నుంచి తేరుకొంటూ ఉన్న సమయం లో ఫిక్షన్ రాయటం ప్రారంభించాడు అప్పటికే సైంటిఫిక్, అకాడెమిక్ పేపర్లు రాయటం లో సిద్ధ హస్తుడైనాడు .తను రాసినవి ప్రింట్ లో చూసుకోవాలనే కోరిక కలిగింది .1888లో రాసిన రెండు నవలలు నచ్చక తగల బెట్టేశాడు . రీములకొద్దీ రాసిన కవిత్వాన్ని చి౦చి పారేశాడు .ఇందులో ఎక్కువ భాగం కామిక్ కు చెందినవే .వచన రచనలు పత్రికలకు పంపితే తిరిగి వచ్చిన జాడే లేదు .ఒక చిన్న కధకు ఒక పౌండ్ డబ్బులోచ్చాయి అదే ప్రాఫిట్ అనుకొన్నాడు జర్నలిజానికి సంబంధించిన ఆర్టికల్స్ రాసి డబ్బు సంపాదించి జీవితం లాగించేవాడు .

వెల్ల్స్ మొదటి పుస్తకం ‘’సెలెక్ట్ కాన్వేర్సే షన్స్విత్ యాన్ అంకుల్   ‘’ప్రచురితమైంది .తర్వాత ‘’ది టైం ట్రావెలర్ ‘’ను సీరియల్ గా  రాశాడు .ఇది క్లిక్ అయి మొదటిసారిగా వంద పౌండ్లు వచ్చాయి .ఇదే తర్వాత ‘’ది టైం మెషీన్ ‘’పేరిట పుస్తకం గా వచ్చింది .ఇదే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రచనగా చరిత్ర సృష్టించింది .రచనపై డబ్బు బాగా వస్తూ ఉండటం తో టీచింగ్ కు స్వస్తిపలికాడు .

అప్పటికే భావోద్రేకాల సుడిగుండం లో పడి కొట్టుకొంటున్నాడు.25వయసులో కజిన్ ఇసాబెల్ మేరీ   ను పెళ్లి చేసుకొన్నాడు.  .లండన్ లో స్టూడెంట్ గా  ఉన్నదగ్గర్నించీ ఆమెను ప్రేమించాడు .ఆమె చాలా సౌమ్యంగా నెమ్మదిగా అందంగా ,సానుభూతి పరురాలుగా,మౌనంగా  ఉండేది .ఆమె మౌనాన్ని తనతో ఏదీచెప్పటానికి లేక పోవటం అని ,ఆమె సానుభూతి ఏ విషయ౦  పై ఆమెకు అవగాహన లేక పోవటం వలన అని వెల్ల్స్ అర్ధం చేసుకొన్నాడు .శృంగారం అంటే ఆమెక౦తగా ఇష్టం ఉండేదికాదు .కనుక తన మగతనాన్ని వేరే చోట ప్రదర్శించాలనుకొన్నాడు .ఆరుసార్లు ఎంగేజ్ మెంట్లు అయినా ప్రేమ ఎందుకో సఫలం కాలేదు .

వివాహేతర సంబంధాలో వెల్ల్స్ కు మించిన వారు చాలా అరుదుగా ఉంటారు .వీటిని స్నేహితులు తెలిసినవారు తెగ చెప్పుకొనేవారు . తానూ బజాయించి చెప్పేవాడు వెల్ల్స్ .పెళ్లి అయిన రెండేళ్లకే భార్యాతో విడిపోయాడు .యామీ కేధరిన్ రాబిన్స్ అనే ఆమెకు దగ్గరయ్యాడు .ఆమెలో శారీరక మానసిక పరి పక్వత ఉందని అనుకొన్నాడు .కాని ఈయన్ను ఆమె భరించ లేక పోయేది .జేన్ అని ముద్దుగా పిలి చేవాడు అదే ఆమె కు సార్ధక నామం అయింది .వెల్ల్స్ గోడచాటు వ్యవహారాలను భరిస్తూ సర్దుకు పోయేది .వేల్స్ ను ‘’ప్రాఫెట్ ఆఫ్ అవర్ డే’’అని’’ ఫేబియన్ కాస బియాంకా’’ అనీ పిలిచేవారు .భర్త దొంగ చాటు శృంగారాలన్నీ ఆమెకు తెలుసు కాని వీటికోసం వివాహ బంధాన్ని తెంపు కోరాదని  సర్దుకు పోయేది .

నడి వయసులో లావుగా తయారయ్యాడు వేల్స్ .నిరంతర రచన సాగిస్తున్నాడు .’’ది ఇన్విజిబుల్ మాన్ ,’’ది వార్ ఆఫ్ ది వరల్డ్స్  ,వెన్ దిస్లీపర్ వేక్స్ ,దిటేల్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం.వగైరాలు బాగా క్లిక్ అయ్యాయి .నలభైలలో ‘’కీప్స్ అండ్ టోనో బాంగే’’అనే అతని రచనల్లో ఉత్క్రుస్టమైనదాన్ని రాశాడు .ఆత్మకధలాంటి నవలలూ రాశాడు .అందులో యవ్వనం లో తాను పడ్డ కస్టాలు బాధలూ  రాశాడు .జోన్ అండ్ పీటర్ అనే మానవ సంబంధాల గురించి చర్చించాడు .మొదటి ప్రపంచ యుద్దానికిముందే యుద్ధాలలో టాంక్ ల వాడకాన్ని ఊహింఛి  చెప్పిన మేధావి వెల్స్ .యుద్ధం లో విమానాలు చేసే విధ్వంసాన్నీ ఊహించి రాశాడు .పదమూడేళ్ళ ముందే జర్మనీతో యుద్ధం వస్తుందని చెప్పాడు .హీరో షీమా పై బాంబుదాడి జరగటానికి 31ఏళ్ళకు ముందే అలాంటి ఉపద్రవం జరగా బోతోందని ‘’ది వరల్డ్ సెట్ ఫ్రీ ‘’లో రాసిన క్రాంత దర్శి .’’ది అవుట్ లైన్ ఆఫ్ హిస్టరీ ‘’సూక్షం లో మోక్షం .స్ప్రుశినచని అంశమే లేదు .ఇంగ్లీష్ లో ఇది రెండు మిలియన్ కాపీలు అమ్ముడు అయి రికార్డ్ సృష్టించింది .దీనితర్వాత అంతే సక్సెస్ సాధించింది’’ది సైన్స్ ఆఫ్ లైఫ్ ‘’.దీన్ని కొడుకు జూలియస్ హక్స్లీ తో కలిసి రాశాడు .మూడు పుస్తకాలను ఏక కాలం లో రాసిన ఘనత వెల్స్ ది.ఒకటి ప్రచురణకు సిద్ధంగా ,ఒకటి గాలేరీ ప్రూఫ్ లో ,ఒకటి రాస్తూ ఉండేదిగా కనిపించేది .ఏ సబ్జెక్ట్ అయినా  విస్తుతమైనదో ,అతి చిన్నదో అనిపించేదికాదు  ఆయనకు .చిన్నదైనా పెద్దదైన అదే ఉత్సాహం తో రాసేవాడు .నీరస నిస్పృహలను దూరం చేయటం మానవాళిని జాగ్రుత పరచటమే ఆయన ధ్యేయం .

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-15-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 39—పరవస్తు చిన్నయ సూరి (1806-1862)

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

39—పరవస్తు చిన్నయ సూరి (1806-1862)

పరవస్తు వెంకట రంగయ్య,శ్రీనివాసాంబ  లకు  చిన్నయ సూరి తమిళనాడు చెంగల్ పట్టు జిల్లా శ్రీ పెరంబదూర్ లో 1806లో జన్మించాడు .సంస్కృతానికి పాణిని ఎంతటి ఘనుడో తెలుగు వ్యాకరణానికి చిన్నయ సూరి అంతటి ఘనుడు .ఆయన రాసిన బాల వ్యాకరణం ఒక కరదీపిక .తెలుగు వ్యాకరణ వేత్తమాత్రమే కాదు సూరి అమోఘ  వచన రచనా దురంధరుడు  కూడా .ఆలంకారిక గ్రాంధిక శైలికి మార్గ దర్శి చిన్నయ సూరి .ఈ రెండు రంగాలలో ఆయన అద్వితీయుడనిపించాడు .తెలుగులోమొట్ట మొదటి నిఘంటు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వాడు

సూరి తండ్రి మద్రాస్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి  .సూరి  మద్రాస్ లోతెలుగు తమిళం ,సంస్కృతం ప్రాకృత భాషలను  .తండ్రివద్దనేర్చి  తర్క ,అలంకార శాస్త్రాల ను కంచి రామానుజాచార్య వద్ద అభ్యసించాడు .1845-1848కాలం లో పచ్చయప్ప కాలేజిలో తెలుగు శాఖాదికారిగా పని చేశాడు .తర్వాత ప్రెసిడెన్సి కాలేజిలో సేవలందించాడు. సర్ సి పి బ్రౌన్ మొదలైన వారు సూరికి ముఖ్య స్నేహితులు. 56సంవత్సరాలు మాత్రమె జీవించి చిన్నయ సూరి 1862లో మరణించాడు

చిన్నయ సూరితెలుగు వ్యాకరణం  బాల వ్యాకరం పాణిని సంస్కృత వ్యాకరణం అస్టాధ్యాయికి సమానం .సూరి గారి తెలుగు నీతి చంద్రిక సంస్కృతం లో బాణుని కాదంబరికి సరి సాటి .తెలుగువారికోసం సంస్కృతం లో సూరి 1-సూత్రాంధ్ర వ్యాకరణం2-ఆంద్ర శబ్డాను శాసనం   రెండు వ్యాకరణాలు రాశాడు .రాసిన తెలుగు సంస్కృత రచనలలో సంస్కృత శ్లోకాలనూ చిన్నయ రాశాడు .ప్రముఖ దాత వితరణ శీలి పచ్చయప్ప పై ‘’పచ్చయప్ప యశో మండనం ‘’ను సంస్కృతం లో 1845లో రాశాడు .అందులోని కొన్ని రస గుళికలు –

‘’ఏకం కలాం భువనజాతి హితం ధన్యా స్సర్వజ్ఞతా౦  వద కదం లభతే గిరీశః

బహ్వీ కళా భువన జాత హితా దదానస్సర్వజ్న ఏష ఖలు పచ్చప మాన వేంద్రః

గుణస్య బాదికాం వృద్ధం కృతవాన్ పాణినిః పురా —అబాదిత గుణం వృద్ధి మకరోత్పచ్చప  ప్రభుః

పశ్యాయా మహానయందు సరితః పురాదిశాశ్చాదయం స్తత్ర స్మద్విజవాజి దేనుత రవో  మగ్నాః పునర్నేక్షితాః

ఏవం చార జనం బ్రువాణామమరస్వామీ హసన్వక్తి భో –మా భేషీ ర్ననుభ ద్రుంగవానయ మతిఃపచ్చపాకీర్తి ర్మహః ‘’

40-చొక్క నాధుడు (1660

నరసంబ తిప్పాధ్వరి కుమారుడు చొక్కనాధుడు ఆంధ్రుదడేకాని దక్షిణ భారతానికి వలస వెళ్ళాడు తంజావూర్ రాజు షాహాజీ మహా రాజు ఆశ్రయం  లో ను ,కేరళకు చెందిన ఇక్కేరి రాజు బసప్ప నాయకుని ఆస్థానం లోను ప్రాభవం పొందాడు .కవి నీల కంఠునికి సన్నిహితుడు .మహా పండితుడు రామ భద్ర దీక్షితునికి గురువు .అతని అన్నలు  నలుగురు కుప్పాధ్వరి ,తిరుమల ,స్వామి యాజీ ,సీతారామ,తమ్ముడు యజ్నేశ్వరుడు అందరూ అందరే .తిరువసనల్లూర్ అని పిలువబడిన షాహాజి రాజాపురం పరగానాలో ఉండేవాడు .చొక్కనాధుడు రస విలాసభాణం,సేవంతికా పరిణయం కాంతిమతి పరిణయం రాశాడు  .ఈ చివరి దానికి ‘’కాంతిమతీ సహరాజీయం ‘’అనే పేరు కూడా ఉంది .మధ్యార్జున స్వామి తిరునాళ్ళలో దీన్ని ప్రదర్శించేవారు .-మొదటి శ్లోకం

‘’సా నంద౦ మణి మచ్చీ స్సీమాని వాసన్ వక్షోజ చేలామ్చలం –వ్యాక్రు ష్వాద సలజ్జ మశు వినతగ్రీవం క్రుతస్వస్తి కం ‘’

పరిదుడు కవిని గూర్చి నాయకుని గూర్చి తెలియ జేస్తాడు –

‘’నేతా శాహ మహేంద్రో నాటకమతి చిత్ర సంవిధాన పదం –ఏష సభ రసజ్న కవిరపి చాస్యేష చొక్కా నాద సుధీః

కవి రస విలాస భాణందీనికి మున్దేరాశాడని సూత్రదారుడికి పారిషదుడికి మధ్య జరిగే సంభాషణలలో కవి వివరాలన్నీ తెలియ జేస్తాడు .భరత వాక్యం లో –‘’సంవర్ధతామజస్ర౦ సరస ముదు గిరాం సత్కవీనాం వచాంసి –క్షోణీపాలః సమస్తాః సుకృత పద ముపాశ్రిత్య తిస్టంతు నిత్యం ‘’

సేవాన్తికా పరిణయం నాటకం సుబ్రహ్మణ్య అనే గ్రామం లో సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలలో ఆడేవారు .బసవరాజుకు మలబారు రాజు మిత్రవర్మ కూతురు సేవంతికకు జరిగే వివాహ కద..కొచ్చిన్ రాజు గోదావర్మనుయుద్ధం లో ఓడించి మిత్రవర్మ అతడిని ఉడిపి దగ్గరున్న  మూకంబిక మందిరంలో బందీ గా ఉంచుతాడు .  తర్వాత విడిపించటం ,పెళ్లి చేయటం .

చొక్కనాధుడు తన స్నేహితుడు నీల కంఠను గూర్చి చెప్పిన శ్లోకం –

‘’తిప్పాధ్వరీంద్ర తనయో నను చొక్క నాద నామా విపస్చిదదయ మద్భుత నాటకేన-సంతోష సద్గుణనిధిం బసవ క్షితీంద్ర లబ్దాదికాం స్వపురం ప్రయాత .ఇందులో చొక్కనాధుని తమ్ముదిగురించి చెప్పలేదు

కవికి శ్రీరామునిపై ఉన్న భక్తికి  ని తెలియ జేసే శ్లోకం –

‘’క్రుపాకటాక్షేణ కృతః క్రుతార్దో రామేణదీనేక దయా పరేణ-కశ్చిన్ముముక్షుః సుజనా డింద్రరేణుః నామ్నా జగన్నాధ ఇతి ప్రతీతః ‘’.ప్రతి కాండం చివర కవి వంశాన్ని చెప్పాడు .చివరి శ్లోకం –

‘’అక్కా జగన్నాధ మసూత్ మాతాపితా చ నారాయణా దేవవిధం –తన్నిర్మితే జ్ఞాన విలాస కావ్యే సర్గే యయావస్టంఉత్తమత్వం .’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-12-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో13-12-15 ఆదివారం సుందరకాండ పారాయణ పూర్తీ సీతారామ కల్యాణం

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో13-12-15 ఆదివారం సుందరకాండ పారాయణ పూర్తీ సీతారామ కల్యాణం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

-శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి గారి పుస్తకాలు మీకోసం

-శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి గారి పుస్తకాలు మీకోసం

Valmikivani

Hanumadhwani

 

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 37-చిన బొమ్మ భూపాలుడు (1549

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

37-చిన బొమ్మ భూపాలుడు (1549

నలబొమ్మ భూపాలునికొడుకు చిన బొమ్మ భూపాలుడు వెల్లూరు ప్రాంతాన్ని 1549నుండి 1579వరకు పాలించాడు .అప్పయ్య దీక్షితులవంటి మహా కవిపండితులను పోషించటమేకాక స్వయాన సంస్కృతాంధ్రాలలో కవికూడా .ఆరుసర్గలలో ‘’సంగీత రాఘవం ‘’రాశాడు .ఆరుకా౦డల రామాయణాన్ని ఇందులో చెప్పాడు .జయదేవుని గీత గోవిందం లాగా ఇదంతా వివిధ రాగ ,తాళ గీత  మయమే .రాజుసంగీతం లో నిధి .మొదటి శ్లోకం –

‘’భాగ్యే నైవ భాగీరదాదివ ప్రాచేత సదాగాతా –యా కాండే రది గత్య సప్తభిరీవ సోతోభి రూర్వితలం ‘’

సౌరాష్ట్ర రాగం లో ఆట తాళం లో ఒక గేయం రాశాడు .ఇందులో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి రావణ బాధలను విన్న వి౦చు కొని రామావతారం దాల్చి రావణ సంహారం చేయమని ప్రార్ధిస్తారు .

‘’శ్రీ రమణ పురాణ పురుష  పరుషేణ దారుణారభస తరేణ శరేణ-కారుణీక విభో న చిరేణ’’//ద్రువపదం//

జహి జహి దశవదనం హి స్వామిన్ పశ్య గుణోమహితానస్య రణే విజితాన్ –వష్యమవస్యా మనం తసమస్తం తష్య న చేద్వితనో షి నిరస్తం —-‘’

మొదటికాండలో సీతారాముల వివాహం దాకా కద నడుస్తుంది .రెండవదానిలో భరతుడు పాదుకల స్వీకారం వరకు మూడులో రామలక్ష్మణులు పంపాసరోవరం చేరటం వరకు నాలుగులో ,సుగ్రీవాజ్నతో కపి సమూహాలు సీతాన్వేషణకు బయల్దేరటం దక్షిణ దిక్కుకు హనుమదాదులు వెళ్ళటం ,అయిదులో హనుమ లంకలో సీతా దేవిని చూసి రామునికి వచ్చి నివేదించటం ఆరవకాండ లో  లంకనుండి రాక శ్రీరామ పట్టాభిషేకం కదచెప్పాడు .

శూర్పణఖ అన్న రావణుడిని సీతను బలాత్కారించమని చెప్పే ఘట్టం –

‘’నారీ కచిన్నస్య వీరస్య విదు –ద్వోరీ ఘాతుః సృష్టి రాద్యానవద్యా –సా చేన్నీతా సుందరీ నేష త్తస్మాదన్యస్త ద్వదేన ప్రకారః ‘’

సుగ్రీవుడు సీత పైనుండి జారవిడిచిన నగలను రాముడికి చూపిస్తూ చూసి దుఖాన్ని ఆపుకోలేక పోయిన సందర్భంగా గీతం –

‘’ఇయమపి జనక భువో మణి రశన  ఆహామివ పరిహృత కటి తటకలనా //ద్రువపదం//

సాదు విదే సాదు కృతం వ్యయ యసి హరహర కియా దియమాం –హంసక శంసకదం త్వామితోసి హా విదితం నను మమ హి సఖాసి ‘’లంకనుంచి అయోధ్యకు వస్తూ సీతా దేవికి యుద్ధ రంగం లో తన వీరవిక్రమాన్ని ప్రదర్శించిన చోట్లను చూపుతూ వర్ణించిన గీతాలు బాగుంటాయి .ప్రతి కాండం చివరా ఒకే రకమైన –‘’ఇతి శ్రీ మత్పాద జకుల కళా శోదధీ పూర్ణ సుధా కరస్య నల బొమ్మా భూపాల తనూజస్య చినబొమ్మ భూపాల కస్య కృతౌ సంగీత రాఘవాఖ్యే మహా కావ్యే షస్టః సర్గః ‘’అనే రాశాడు .చివరి రెండు శ్లోకాలలో తాను  చొక్కా నాద భూపాలుని సామంత రాజునని చెప్పుకొన్నాడు –

‘’ఇతి చొక్కనాద నరనాధ పరిపాలితో బొమ్మ నరపతి రాకురుదేదం—రఘురమణ విరహ వచనో  పరచనకావన ముప శ్రుణుత పఠత మహా మోదం ‘’అని చెప్పాడు చొక్కనాధుడు విజయనగర సామ్రాజ్యం పై  తిరుగుబాటు చేసిన మధుర రాజు కావచ్చునని చరిత్రకారుల భావన .

38-దామెర చిన వెంకట రాయలు(19-20శతాబ్దం౦)

తూర్పుగోదావరిజిల్లా జగ్గం పేటజమీన్దార్ దామెర చిన వెంకట రాయలు  19-20శతాబ్దాలకు చెందినవాడు .తెలుగు సంస్కృతాలలో గొప్పకవి .తండ్రి పెద వేంకటరాయలు వేంకటాచల మహాత్మ్యం రాశాడు .తాత లాగా కవుల ,పండితుల విద్వాంసుల మధ్య చినవెంకన కాలక్షేపం చేశాడు .గుల్మ శూల నొప్పితో చివరి రోజుల్లో బాధ పడేవాడు .ఈ బాదోప శమనం కోసం సూర్యనుగ్రహం పొందటానికి ‘’సూర్య సప్తతి ‘’రాశాడు .దీన్ని 11-6-1905న పూర్తీ చేశాడు

‘’అభ్యక్షి దిగ్జగ్లో సంఖ్యా ఠ చే శాలివాహనస్య శకే-విశ్వావసు శుక్రసిత శ్రీ విష్ణు దినే ర్కసప్తతి రచితా ‘’అన్నాడు

ఈకావ్యం అంతా శ్లేష యమకాలతో  నడిపాడు .దీనికిజనసామాన్యానికి తెలిసేట్లు  వ్యాఖ్య రాయమని కాకరపర్రువాసి ద్వివేది రామ శాస్త్రిని కోరాడు . ఈ రాజు సత్య దేవ శతకం కూడా రాశాడు .తన బాధను నివారించమని సూర్యుని ప్రార్ధించిన శ్లోకం –

‘’గుల్మాఖ్యో రోగోష్వతి జల్మోమాం బాధనేమ్బర మణోత్వం– నిర్మూలయ తద్వ్యాది నిర్మల మనసా తనోమి నతికర్మ ‘’

దాదాపు ప్రతిశ్లోకం లో శబ్దాలంకారాలను  శ్లేషను ప్రయోగించాడు ‘

ఆలోకాలోక నగంస్వలోకస్య కలలోకస్తే –హి లోక మిత్ర తత్తన్ననీకానీక కర్మకుర్వంటి .

కవిప్రయోగించిన ప్రక్రుతాప్రకృత శ్లేషాల౦కారానికి ఉదాహరణ –

‘’వర వర్ణ దటిత సుపదాద్భుత బహులస్యే చ్చాగీత సుశ్లోకః –ఘన సుకుమార ప్రణయీ,తపన మయూరో వితోధిక క్లేశాత్ ‘’

తన పేరున్న శ్లోకం –‘’

‘’శ్రీ దామెర చిన వేంకటరాయ కృతా సూర్య సప్తతి ర్జయతు  – సంతు బహావోపి దోషా క్షన్తవ్యా కరుణయా సాధ్విః’’

శ్రీ సత్యనారాయణ స్వామిపై చెప్పిన సత్య నారాయణాస్టకం  నుండి ఒక ఉదాహరణ

‘’అత్యాత్పాప త్తీర్నాసత్యాహ్వాయ దేవతవ కృపయా –నిత్యం జనా జయంతి ప్రత్యక్షం సత్యమేవ తత్కరుణాత్

ఇందులోనూ చివరిశ్లోకం లో తన పేరు చెప్పుకొన్నాడు చిన వెంకట భూపతి .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-12-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆఫ్రికా కొన్ని అపోహలు వాస్తవాలు,కాలాన్ని ఒడిసి పట్టిన కాలమ్స్ కవిత్వానికి దూరమవుతున్న పాఠకుడు పాశురాలు

Inline image 1

Inline image 1Inline image 1

 
 
 
Inline image 3


Inline image 2


Inline image 2

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పర్యావరణం పై భారత్ దే పై చేయి,కాల్ మనీ మాయ లోళ్ళు మరోసారి శ0బుక వధ మరుగున పడ్డ తృణ విలాప కావ్యం ,సినీ నిర్మాత కళ్యాణ్ తో ఆర్ కె

Inline image 1

Inline image 1
Inline image 2
గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Inline image 1

గబ్బిట దుర్గా ప్రసాద్

Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంకర్ ఝాన్సి ,,దరణి కి గిరిభారమా పాట ,రామప్ప దేవాలయం ఉప్పు శిల్పాలు

jhansi1 001 jhansi2 001 ramappa 001 dharaniki giri bharama 001 uppubomma 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నీవు నేర్పిన దూమ్కుడే అయినా మనిషి మారలేదు

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సల్మాన్ కేసు చెబుతున్న పాఠాలు ,ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు బిడ్డ

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కనువిప్పు కలిగించే కాకి – వాడిని ఆమె సహించదు శరద్ పవర్

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అడ్రస్ లేని అసహనం అద్భుత కధనం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ జోడుగుర్రాల స్వారి ,అరుదైన ప్రజా బాంధవుడు

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 35-చిదంబర కవి-(16వ శతాబ్దం )

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

35-చిదంబర కవి-(16వ శతాబ్దం )

సూర్యనారాయణ యజ్వ మనవడు ,వేంకటాంబ ,అనంత రామయ్యలకుమారుడు చిదంబర కవి .16వ శతాబ్ది గొప్పకవి ,సాహిత్య శాస్త్ర వేత్త .తండ్రిగోదావరిజిల్లాలో పుట్టినా తమిళనాడుకు వలసవెళ్లి విజయనగర రాజుల ప్రాపకం సంపాదించాడు .శుద్ధ అద్వైతి అయిన చిదంబరం జీవితం చివర్లో తిరుపతి సందర్శించి ఒక్కసారిగా వీర వైష్ణ వుడయ్యాడు .వెంకటేశ్వర స్వామి పై 200 పైగా స్తోత్రాలు స్తుతులు రచించాడు .ఉత్తర ఆర్కాట్ లో ఉండే మాతామహుడు వేదపురీశ్వరుడు ‘’మార్గ సహాయ చరిత్ర ‘’రాశాడు .చిదంబర తల్లి తమిళ దేశీయురాలు తండ్రి ఆంధ్రావాలా .తమ్ముడు శ్రీనివాసుడు మేనమామ శివసూర్య .చిడంబరకవి తంజావూర్ జిల్లా పలయూర్ నివాసి .

రాఘవ యాదవ పాండవీయం అనే త్ర్యర్దికావ్యం ,చిదంబర విలాసం ,శ్లేష చింతామణి ,శబ్దార్ధ చింతామణి ,భాగవత చంపు ,పంచకల్యాణ చంపు రాశాడు .మొదటిదానికి ‘’కదా త్రయి ‘’అనే పేరూ ఉంది .మూడాశ్వాసాలకావ్యం .రామాయణ భారత భాగవత కదా.దీనికి అర్ధ ప్రదీపిక వ్యాఖ్య ఉంది.కావ్య ప్రారంభ శ్లోకం

‘’వాచం వో రచయతు స్సర్వదాంత రంగేగాంగేయ సరస నయోదయం దధానః –సత్యాప్తో బుధ కుల మౌళి బంధు రోజా శ్రీ రామ స్తుత గురుమానసాబ్జ హంసః ‘’.మూడవ ఆశ్వాసం లో తన వంశ చరిత్ర చెప్పుకొన్నాడు .

చిదంబర విలాస కావ్యం లోరెండు  కా౦ డలున్నాయి అర్ధ దీపిక పేర తానె వ్యాఖ్య రాశాడు .చాలా సంక్లిష్ట రచన –మచ్చుకి –

‘’నాద హ్రదా రామకే జానపద్యాః పారే వాసీ ఫాలయూ రగ్ర హారే –లీలా సేవ్యః శైల కన్యా సహాయః కైలాసేపి వ్యాప కాంక్షా౦ న దేవః ‘’

50వ శ్లోకం లో తానూ తంజావూర్ జిల్లా పాలయూర్ వాసినని చెప్పాడు

.శేష చింతామణి110శ్లోకాల కావ్యం .వ్యాఖ్యానం రాసుకొన్నాడు .కవి శ్లేష యమక చక్రవర్తి .-మొదటిశ్లోకం

‘’సవః శ్రేయో విభుస్తన్యా  త్సువయః పున్గావద్భావః –కరీంద్ర వదనో ల్లాసీ కటకీకృత పన్నగః ‘’

శబ్ద రత్న చింతామణి రెండు సర్గలు రామాయణ భాగవతజోడుకధలు .కవి నికశోపల వ్యాఖ్య రాశాడు..పంచకల్యాణ చంపు గద్య ,పద్య కావ్యం .రామ ,కృష్ణ సుబ్రహ్మణ్య స్వాముల కళ్యాణ గాధ,కవి శిష్యుడు నంజుండ వ్యాఖ్యానం రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-15 ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మారిన మోడీ

Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంట్లో 10-12-15 గురువారం ఉసిరి చెట్టు నీడలోమోడరన్ మినీ వరండా కార్తీక వనభోజనం

మా ఇంట్లో 10-12-15 గురువారం ఉసిరి చెట్టు నీడలోమోడరన్ మినీ వరండా కార్తీక వనభోజనం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment