’గీర్వాణ భాషా వైభవం ‘’-4

’గీర్వాణ భాషా వైభవం ‘’-4

9- శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీపట్టణం -9849812443

గీర్వాణ భాషా వైభవం

1-సీ –గీర్వాణ భాషలో గీతా మహాత్మ్యమున్ –పరమాత్మ బోధించె పార్థునకును

గీతాలాపనన్ గీతామృతమ్మును –గ్రోలినంతనె కల్గు మేలు మనకు

ఉపనిషత్సారమ్ము నుపదేశమున  గీత –సామాన్యులు తరియించ సాధనమ్ము

దైవ సన్నిధి చేరు త్రోవ ను’’ పదునెంది’’-అధ్యాయముల చూపు నదియె గీత

తే.గీ.-భక్తీ పారవశ్యమునొంది ప్రణతులనెడు-రీతి గీర్వాణ భాష పై ప్రీతి గొలుప

స్తోత్ర పారాయణ ము విన సొంపు గూర్చు –దైవ దత్తమగు వరమె దేవ భాష .

2-సీ-గీర్వాణ భాషను నేర్చుకొనిన మేలు –సకల పురాణముల్ చదువ గలరు

వేదసారమ్మునూ విదితమై సంస్కృత –పండితులనుపేరు బడయ గలరు

దేవ భాషను నేర్చి దివ్య తేజము నంది –ఆదర్శమూర్తులై అలరగలరు

శాస్త్ర విజ్ఞానమున్ సార్వజనీనతన్ –సర్వ సమర్ధులై సాగగలరు

తే.గీ.-ఉత్తమోత్తమ గ్రంధముల్ ఉదధి నురుకు –కెరటముల వలె నెల్లరి దరి జేర

తెలుగున కనువదించి యందించ గలరు –జన్మ సార్ధకంబై వారు ధన్యులగును .

3-సీ-పద్య మూలంబగు ‘’పదగతౌ ‘’సంస్కృత- ధాతువుపద్య పథమును నడుపు

నియమ బద్ధమగుచు నిర్ణీత పరిధిలో –హ్రుద్యమంబుగా సాగు పద్య లహరి

భాష యశ్వంబన  భావమ్ము రధమైన –ఛందో పధము సాగు సారధి కవి

యతియు ప్రాసలను సంస్కృత భూయిష్ట మౌ –పద్యముల వ్రాయు విద్య ఘనము

తే.గీ-వారసత్వమ్ము నబ్బిన వరమె మనకు –పద్య మన్న నతిశయోక్తి పదము కాదు

శోభ గూర్చెడు గీర్వాణ  శ్లోకములకు –తెలుగు పద్య రూపము నిచ్చు తెగువ వరమె.

4-సీ-సాహిత్య సంపద సంస్కృతమ్మునెతొలి-ప్రాడుర్భవి౦చ౦గ ప్రణతు లందె

ప్రాక్రుతుడైనను ప్రాచేతసుడు  వ్రాసె-ఆదికావ్యంబు రామాయణమ్ము

సంస్కృత కావ్యముల్ సంస్తవమ్మును చేసె-ప్రాజ్ఞు లు తెలుగున భాగ్య వశము

వ్యాస భారత భాగవతముల్ కవిత్రయం -పోతన వ్రాసిరి రపూర్వముగను

తే.గీ.-తొలుత మునులు పురాణముల్  పలురకములు –దేవ భాషను వ్రాసిరి దివ్యముగను

పిదప భవభూతి కాళిదాసేతరులు ను -విశ్వనాధాది విబుధులు వివిధ కవులు- కలము పట్టిరి భాషపై కాంక్ష తీర .

5-సీ.-సంస్క్రుతమును నేర్చు సంస్కృతి పెరిగిన –దేవనాగరలిపి తెలియవచ్చు

భాష యౌన్నత్యమున్ బాగుగా నెరిగిన –భాషాభిమానమ్ము పట్టు పెరుగు

తరచిన పూర్వ వృత్తాంతము లనెల్ల-మూలపు రాణి ప్రాముఖ్య మెరుగు

ఆ పుణ్య గాధల నద్భుతమగు పాత్ర-లాదర్శ ప్రాయమై యవధరి౦చు

తే.గీ.-రామ చంద్రుని వంటి కుమారు ననగ-సీత వలెసుగుణాల రాశి తనయగను

భారత లక్ష్మణుల వంటి సోదరులుగలుగ-కోరు కుందురు జనులెల్ల కుశల మరసి .

10-శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర –విజయవాడ -8885803170

గీర్వాణ భాష గొప్పతనం

1-మహర్షి వాల్మీకి రామాయణం కడు రమ్యం –దేశ విదేశాలలోఘన

తకెక్కి ,భారతీయుల గౌరవం ఇనుమ –డింప జేసిన సాహిత్యము .

2భారతీయుల సంస్కృతి ఆచార వ్యవహా –రము వ్యాసుని ఉపనిష-

తత్తులు,వేదములు అనుసరణీయము –ప్రపంచం లోగణుతి కెక్కె.

3- రసజ్ఞుల హృదయాలపై చిరు జ-ల్లులు కురిపించు మన

స్సుమై మరపించె దేవ భాష –సుధ లొలుకు కన్న తల్లి.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-11-12-16- ఉయ్యూరు  .

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’గీర్వాణ భాషా వైభవం ‘’-3

’గీర్వాణ భాషా వైభవం ‘’-3

7-శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు –విజయవాడ -9703776650

సంస్కృత సంస్కృతి

1-వాల్మీకిన్నుతియింతుసీత చరితం బత్యద్భుతంబై మహా –వాల్మీకంబయి ధర్మ సూత్రవిలసద్వాణీ పతీయంబునై

వ్రేల్మిన్ తానొనరించె సత్క్రుతిని భావి౦పన్మహా మౌనికిన్ –కాల్మొక్కేను మదీయ భావనల నెక్కొలంబు దీవి౦పగన్ .

2- వ్యాసుడు విష్ణు సన్నిభుడు వైదిక మార్గ వివర్ధను౦ డహో-దీసము డెవ్వరాతనికి తీరిచి దిద్దెను వేద సంహతిన్

భాసుర భారతంబు మరి భాగవతంబు పురాణ గాధలన్ –భాసిలు భారతీయతకు పాటిలు తాత్విక బ్రహ్మ సూత్రముల్

3-.ఉపమకు కాళిదాసు సమయోచిత భావ ప్రభారవీ౦ద్రుడున్ –సుపద మనోహరాల సుమ శోభకు దండి త్రయంపు మాఘుడున్

సుపధము చూప సంస్కృత యశో విభవంబు ప్రపంచ కావ్యమై –సుపఠన పాఠనంబుల రసోచిత బంధ మెలర్ప జేయరే .4-ఆధ్యాత్మ జ్ఞానంబు నంద గోరితివేమొ-ఉపనిషత్తుల తనివొంద జూడు

భక్తి తత్పరుడవై ముక్తి గోరితివేమొ-బహు పురాణమ్ముల పఠన మేలు

సంస్కృత పాండిత్య సాధనే లక్ష్యమా –కావ్య పంచక మీవు కాంచి చదువు

గద్య కవిత్వంపు హృదయ సౌందర్యమ్ము –భట్టు బాణు  నడుగు భళిర జూపు

భారతీయాత్మకు పావన మూలమ్ము –వేదాల సారమ్ము వెల్లడించు

కావ్య నాటక గీతికా వైభవానంద –గంధ మిచ్చును నీకు కాళిదాసు

అంగాంగ రసబంధ శృంగార సూత్రాలు –వాత్సాయనంబునై వాసి గాంచె

శృంగార గీతాల భ్రుంగీ రావాలేన్నొ-నిష్టంబు జయదేవు నస్టపదుల

లలిత లలిత పద కలిత స్వరితము, నారాయణ తీర్థు తరంగ హేల

వైప్లవ్య భావాల విక్రాంతి శూద్రకు –మృచ్ఛ కటికము నందచ్చమగును

ఎన్నొన్నొ చందంబు లెన్నెన్నొప్రక్రియల్ –గీర్వాణ మండుండె నేర్వ గాను

పాణినీయంబును పాతంజలంబును- చరక సంహితకూ సంస్కృతంబె

నాదు సంస్కృత సంస్కృతి సాదు సాదు –అఖిల భారత భాషల కాత్మ యగును

దివ్య భారత వెలుగుల దిశల చివర –శాశ్వతంబుగా నిలిపెనా సంస్కృతంబు .

8-శ్రీ శ్రిస్టి శ్రీనివాస శర్మ –నిమ్మకూరు -9849036311

సంస్కృత భాషా ప్రాశస్త్యం

1-భారత భారతి వైభవ –భారతి సంస్క్రుతముకాదె భాషలకెల్లన్

‘’సారస భారతి’’ ఇచ్చిన –హారతి సంస్కరణము సంస్థలకెల్లన్.

2-బీజాక్షరముల మంత్రము –పూజా విధుల పఠన మగుచు భువిలో మహిమన్

భూజము వోలెనిలిపి ,తా-భాజనమగు సంస్కృతాన భాగ్యము కలుగన్.

3-సంస్కృతము చదువ భాషా –సంస్క్రుతులబ్బునిజము ,శాస్త్రోపజ్నా

సంస్కారోపస్కారపు –సంస్కృతిచేతనుమనుజులు సద్గతి కనరే?

4-భారత గౌరవ కారణ –మీరెంటి వలన నిలిచెను ఇమ్ముగ నేడున్

పారంపరమౌ సంస్కృతి-చారణ కృత సంస్కృతమును సంపద కాగన్ .

5-సంస్కృతము సనాతన భాష ,శాస్త్ర భాష లకును శక్తి నిచ్చిన భాష –లక్షణముగ

గడన కెక్కిన భాష ,కంప్యూటరు మడమ తొక్కు –భాష ,నిత్య నూతనమగు భద్ర భాష  .

6-దేవనాగరి ప్రాచీన దేవ భాష –  యనగ నెట్లు చెల్లు ?గణన యంత్రముల కు

చక్కగ యమరునని శాస్త్ర సాధకులును –తెలుపు చుండ నట్టి కీర్తి నిలుప వలదె?

సశేషం

గబ్బిట దుర్గా ప్రసాద్ -11-12-16-ఉయ్యూరు

 

.

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ భాషా వైభవం ‘’-2

’గీర్వాణ భాషా వైభవం ‘’-2

5-డా.గుడిసేవ విష్ణు ప్రసాద్ –అవనిగడ్డ -9441149608

మంజుల మంజూష –సుందర సుర భాష

1-అ.వె.శ్రీకరములొసగి చెలు వారు మా తల్లి –జనని భారతంబ జయము జయము

జ్ఞాన సుధలు నింపి జగమేలు మా తల్లి-జనని శారదాంబ జయతు జయతు .

2-సీ-రామయణాఖ్యంబు రఘువర చరితంబు- వాల్మీకి సృజన గీర్వాణ భాష

పంచమ వేదంబు భారతకావ్యంబు -వ్యాస ముఖోధిత శ్వాస భాష

విశ్వ వందిత గీత విజ్ఞాన సముపేత ,-శ్రీ కృష్ణ పరమాత్మ శ్రేయ భాష

కవికుల గురువర్యు కాళిదాస సుకవి –కావ్య నాటకముల శ్రావ్య భాష

ఆ.వె.-వేద విషయ జ్ఞాన ,వేదాంత శాస్త్రంబు –వైద్య వ్యోమ శాస్త్ర  వర్ణితంబు

శ్రుతి సుఖ నినదంబు స్మృతిహిత వరదంబు –సుందరసుర భాష శోభితంబు.

3-సీ-వేద ప్రవచనంబు విజ్ఞాన సారంబు –వివరించి తెల్పెడి వేదభాష

నాక లోకము నందు పాకారి ప్రముఖులౌ –దేవతల వచియించు దేవ భాష

అద్వైత తత్వమౌ ఆధ్యాత్మ బోధనల్-సంతరించు కొనిన జ్ఞాన భాష

అతి పురాతన భాష అతి సనాతన భాష –నిత్య నూతన మైన నిగమ భాష

ఆ . వె.-భాషలకు భాష గీర్వాణ వాణి భాష –అన్నిభాషల మూలమౌ నమర భాష

సకల సుజ్నేయ భాష సంస్కార భాష –సరళమౌ భాష నరయంగ సంస్కృతంబు .

4-ధ్యానంబు చేయ నద్యయనంబు చేయంగ –సహకరించెడి భాష  సంస్కృతంబు

నిత్య పూజల యందు నిలిచి యుండెడిభాష –సాఫల్యమగు భాష సంస్కృతంబు

శబ్దార్ధ జ్ఞానంబు చక్కగా వివరించు –శక్తి గల్గిన భాష సంస్కృతంబు

అన్ని భాషలకు ఆధారముగా నుండి – సంస్కరించిన భాష సంస్కృతంబు

ఆ.వె.-మధురమైన మంజుల భాష –సదమల హృదయంబు సంస్కృతంబు

నరనరముల నిలిచి నాదమై పలికెడి –సరిగమల సరిభాష సంస్కృతంబు .

6-మధురకవి శ్రీమతి ముదిగొండ  సీతారావమ్మ –విజయవాడ -9299303035

గీర్వాణ వాణి

1-కం .ఆమునులే ప్రార్ది౦చిరి –ఆ మహాదేవుని ,వినగనె,ఆర్తిని బాపన్

డమరుకమును మ్రోగించెను –అమలంబౌ భాష నొసగె అవనికి దయతో .

2-కం .ఆకాశమందు మ్రోగగ-సాకారము చెందినట్టి చక్కని భాషే

చీకాకులు తొలగించెను –నాకదునీ ధరుడొసంగె నవ గీర్వాణిన్.

3-కం .గీర్వాణ భాష ఇయ్యది –గీర్వాణికి సాటి యగును కీర్తిని పెంచున్

గీర్వాణ గతుల నరసిన –గీర్వాణ కవీశ్వరులకు కేలును మోడ్తున్ .

4-కం –గీర్వాణ వాణి తెలిసిన –గీర్వాణుల గూర్చి వ్రాతు గీర్వాణముగా

గీర్వాణ వైభవంబిల –గీర్వాణముతో వచింప కీర్తియె నాకున్ .

5-ఆ.వె.-సూరిగాదు అతడు సూర్యుడై వెలుగిచ్చె –మల్లినాద సూరి మహిత గుణుడు

అతడు చేసినట్టి వ్యాఖ్యానమె మనల –సంస్కృతంబు దరికి సాగ నిచ్చె.

6- సీ-వేద పురాణాలు వివిధ శాస్త్రంబులు –సంస్క్రుతమందున సాగు చుండు

పూజలు వ్రతములు పుణ్య యాగంబులు –సంస్కృత మంత్రాల సాగు చుండు

పుట్టిన గిట్టిన పుణ్య కార్యములును –సంస్క్రుతమందునె సాగు చుండు

అస్టోత్తరంబులు ,ఆ సహస్రంబుల-స్తోత్రములన్నియు సంస్క్రుతంబె

అ.వె.దివ్యమైనదిదియె దేవభాషనబడు-సాటి లేని మేటి సంస్క్రుతంబు

జనని యగును గాదె జగతి భాషలకును –భారతాన పుట్టె భాగ్య వశము .

7-సీ-వేద వేదాంగాలు విడదీసి ప్రకటించె-వ్యాసుడు భారత భాగ్య దాత

ఆ పురాణమ్ములు లఖిలేతి హాసాలు –మనకు చేకూర్చిన మాన్యు డితడు

వాల్మీకి రచియించె  వన్నెకెక్కు విధాన –రామాయణమ్మును రమ్యముగను

చాణిక్య చరకులు చక్కగ వ్రాసిరి –నీతులు ,వైద్యమ్ము నిత్యముగను

కాళిదాసు రచియించె కాళికా శక్తి చే కావ్య నాటకములు కమ్మగాను

భవ భూతి చూపించె భవ్యమౌ కరుణను –కాదంబరిని గూర్చె గద్య దండి

అర్ధ గౌరవమును సార్ధకముగా జూపె-భారవి కావ్యాన భవ్యముగను

మాఘుడు కావ్యాన మాధుర్యమును నింపి –శిశుపాల వధ వ్రాసె శేముషిగను

హర్షుడు నైషధం హర్షాన వెలయించె-విద్వదౌషధమన్న విభవ మందె

పాణిని కౌముదిన్ పరమ మయ్యెను భాష –వ్యాకరణ ప్రతిభా వైభవమున

తే.గీ –భరత భూమిని గీర్వాణ భాష యందు –పెక్కు శాస్త్రాలు కావ్యాలు పేర్మి వ్రాసె

దివ్యతమమును చేసిరి దివ్యులంత-నాటి కీర్తిని మరువక నడచు టొప్పు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-16- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’గీర్వాణ భాషా వైభవం ‘’-1

‘’గీర్వాణ భాషా వైభవం ‘’-1

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2-రెండవ భాగం 4-12-16 ఆదివారం ఆవిష్కరణ సందర్భం గా   ‘’గీర్వాణ భాషా వైభవం ‘’ పై జరిగిన పద్య కవి  సమ్మేళనం లో కవుల పద్య మకరంద ధారను ధారావాహికం గా అందజేస్తున్నాను .అనుభవించి ఆస్వాదించండి .

1-డా రామడుగు వెంకటేశ్వర శర్మ (గుంటూరు ) 9966944287

గీర్వాణ భాషా వైభవం

1-సీ –రామ నీరద  సుదర్శన మాత్ర కవన నృత్యతా కేకి వాల్మీకి !అంజలు లివె

శ్రుతి పురాణార్ధ భారత పద్మ వికసనోల్లాస  వేద వ్యాస !ప్రణతి వినుతి

ప్రతిభా సమేత రూపక దీపికా వాస ! భాసా నమోస్తు

కమ్రోపమాన సత్కవితా విలాస శ్రీ కాళిదాసా!నమస్కార శతము

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి– ,నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మ యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

2-సీ-‘’కవి భారవే రర్ధ గౌరవ ‘’ఖ్యాతి చేకొన్న భారవి !ఏటి కోళు లివియె

శబ్ద లాలిత్యైక సంపస్సముద్దండి!దండి మహా కవీ దండమయ్య

మల్లినాద ప్రశంసా ‘’మాఘ మేఘేతి’’ వాక్య కారక మాఘ !ప్రణతి శతము

శివ మహిమ్న స్తోత్ర కవి గాఢ భక్తాగ్ర గణ్య సత్కీర్తి సౌజన్య !నతులు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

3-సీ –నవ విద్వ దౌషధ  నైషద కవితా ప్రవర్ష ,హర్షా !ఇదే ప్రణుతి శతము

కాదంబరీ రసజ్ఞాన దాయక బాణ !బాణ భట్టారకా  వందనములు

‘’సరస పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి ‘’యౌ జయదేవ  వందనములు

‘’ కృష్ణ కర్ణామృత లీలాశుకా ‘’!జ్ఞాన చింతామణి కవీంద్ర !చేతు నతులు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

4-సీ –కరుణా రసైక సత్కవన గోదావరీ వర భూతి ,భవ భూతి !వందనములు

గుణ్య సామాన్య నైపుణ్య జీవన రూపకా !మృచ్చ కటికాఖ్య కర్త !నతులు

చాణక్య రాజ్యాంగ చతురతా పూర్ణ ‘’ముద్రారాక్షస ‘’విశాఖ దత్త నతులు

తృతీయ పంథా ప్రధానా !’’అనర్ఘ రాఘవ రూపకా !నమస్కార శతము

బంధుర రసానంద పరీమళ’’!కుందమాలా కార! వందనములు

నిర్మల ప్రియదర్శినీ రూప నవ్య నాగానంద హర్షాధిపా నమోస్తు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

 

2- డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి-పొన్నూరు -8106766197

పద్య మందార మాలతో అభినందన చందనం  –

1-జయశీలంబును ,కార్య శూరతయు ,సౌజన్యంబు రూపంబు దా

ల్చి ,యపూర్వంబుగ దీర్చి దిద్దిన గీర్వాణ కళాక్షేత్రంబు’’ గీర్వాణ వా

ణి’’,యమూల్యంబగు భావ సంపదల నున్మేషింప,సారస్వత

ప్రియు లిద్దాని గుణంబులన్ గని ,ప్రహర్షింపన్,సమర్ధంబగున్ .

2- ఘనులై సంస్కృత భాష నధ్యయనమున్ గావించి ,కావ్యాలు వ్రా

సిన ,ఆయా కవి జీవితంబుల ప్రశస్తిన్ ,జ్ఞాన విజ్ఞాన భా

వనలన్, బ్రోది యొనర్చి ,భావి తరముల్ భద్రంబు లై వర్దిల౦

గను ,గీర్వాణ కవి ప్రణీతములు  సద్గ్రంధంబులన్ దెల్పుచున్ .

3-తరువుల్ బూచిన పుష్ప సౌరభము ,లుత్సాహంబు తో, వాయు

వెల్లరకున్ బంచిన రీతి ,సంస్కృతుల సంలాపంబు ,లాంద్రోక్తి సుం

దరమై  భాసిల జేయు సత్కవులు ,సత్కారార్హులాత్మోన్నతిన్

బర మార్ధంబు గ్రహించి ,లోకులకు జెప్పన్ ,సద్విర్మంబగున్ .

4-అభినందించు బ్రపంచ మీ కృతికి ,నత్యంతంబు సత్య౦బు ,దు

ర్లభౌ ,సంస్కృత కావ్యముల్ విబుధు లౌరా !యంచు గీర్తింప ,ద

చ్చుభ సందర్భ,ముదాహరి౦చుచు ,కవీశుల్ మెచ్చ సాహిత్య ,సౌ

రభ ముల్,దిక్కుల నింపు మీ కృషి ,సువర్ణం బై విరాజిల్లెడున్  .

5-తినబోవన్ రుచి గూర్చి చెప్పవలెనా ?తియ్య౦దన౦ ,భిక్షుఖా

దన మన్నన్ బునరుక్తి కాదొకొ ?ప్రసాదంబిట్టి దౌనంచు ,వ

ర్ణన గావి౦పగ శక్యమే ?సవిత నారాధింప ,దీపంబు జూ,

పిన చందంబిది,గబ్బిటాన్వయ మణీ!విద్వద్విమర్శాగ్రణీ’’.

డా .తూములూరు శ్రీ దాక్షిణా మూర్తి శాస్త్రి

రిటైర్డ్ ప్రిన్సిపాల్ – శ్రీ భావనారాయణ స౦స్కృత కళాశాల –పొన్నూరు

3-శతావధాని శేఖర ,కాశీకావి ,విద్యా వారిది ,అసమాన అవధాన సార్వ భౌమ ,అవధాన కళా తపస్వి

డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ –విజయవాడ -9440346287

వందేహం గీర్వాణీం

1-సంస్కృతస్య ప్రతిస్ఠేద్వే సంస్కారః సంస్కృతిస్తధా-వ్యక్తీనాం చ సమాజస్య మార్గోప దేశం భజే ‘’

2-బాసల గన్న బాస ముది బాసల ముందటి బాస ,చాల మేల్-బాస ,పరాయి బాస తెలబారగ వెల్గెడు బాస ,తన్ను రా

జేసిన పెక్కు బాసలకు చిక్కులు దీసిన వేల్పు బాస ఈ –బాస యొసంగు గాక  సరి బాటను ,కైతను ,కట్టు బాటులన్ .3మాతృ స్తన్యేన కొ భ్రస్టః పుష్ప ఏవ సదా భవేత్ –గీర్వాణ భాషయాసర్వాః భాషా వర్ధంత ఇత్యలం ‘’

4-వందేహం గీర్వాణీ౦ –వాణీ మజ్నాన తిమిర దీపాం త్వాం

చతురోక్తి రూప హేలాం –లీలా రస మార్గ మోక్ష సంధాత్రీం ‘’

5-జయతు జయతు వాణీ సంస్కతాఖ్య పురాణే-సురస సరస దానీ భారతీ చేక్షు పాణీ

బహు యుగ పరిదీప్తా దుర్గ మార్ధ ప్రదాత్రీ –రసమయ కవితొక్తిః వేద వేదా౦గ మూర్తిః’’

 

4-డా .ధూళిపాళ రామ కృష్ణ –విజయవాడ -9963668214

సంస్కృత సంస్కృతి

1-దుర్గా ప్రసాద కవితా సరసాసుర భారతీ –ఆసక్తి కర సంలగ్నా భూయాత్ కవి యశః కరీ

2-రాజ్యాది భోగ నిష్కామాః రస సిద్ధాః కవీశ్వరాః-ఏయే కామ దుఘా జాతా అమరాన్ తానుపాస్మహే ‘

3-కాంతా సంమితకావ్య మంజుల పదైః రమ్యోప దేశా గిరః –రామాజ్యాచరణ ప్రబోధ రసికా ఉత్తేజ యంత్యఃప్రజాః

ధర్మా ధర్మ వివేక పావన ధియః కుర్వంత్య ఏవానిశం –ఆవేదాత్ సుకవీశ్వరావధి సఖే గీర్వాణ వాణ్యా౦ స్థితాః’’

4-వక్తహ గణికాస్యేవం మాకస్యా పేతి సంస్కృతా-తచ్చూద్రక వచో మూలం మానిషాదేతి మంగళం ‘

5-స్త్రీ వ్యాద ద్విజ సంవాదే పరిణీతేన కర్మణా-సర్వ తోషణ మాదిస్టం వ్యాసేనాద్బుతకర్మణా ‘’

6-భవ వత్స విమత్సరస్సదా-ధృవ మాతా యదవచో దాత్మ జాతం

మనశ్శమ మాదిమ గురుః-సురభాషైవ దిదేశ లక్ష్య సిద్ధౌ ‘’

7-లోక జ్ఞాన దర్శితౌ కావ్యే కణ్వవ్యాధౌ వనౌకసౌ –శాకున్తలే భారవేచ సంస్కృతే సంశ్రూతి స్తదా ‘’

8-గుణేషు క్రియతాం యత్నః గుణ లుబ్ధాహి సంపదః –విమృశ్య కారితా తత్ర ధర్మ రాజేన బోధితా ‘’

9-ఏతద్వ్రతం మమేత్యాహ రాజా రామో మహా యశాః-సర్వాభయ  ప్రదానం హి సర్వ దానాధికం మతం ‘’

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -9-12-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ శతకం

సాహితీ బంధువులకు నమస్కారం -ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి శతకం రాయిస్తున్నామని పూర్వం తెలియ జేసిన సంగతి గుర్తుండే ఉంటుంది .అనివార్య కారణాలవలన ఆ శతకాన్ని డా తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు రాయటం లేదు దాన్ని ప్రముఖకవి విమర్శకులు విశ్లేషకులు 30ఏళ్లుగా నాకు పరిచయం ఉన్న సాహితీ మూర్తి శ్రీ తుమ్మొజు రామలక్ష్మణాచార్యులు గారు  రాస్తున్నారు .ముందు చెప్పినట్లు ఈ నెల 12 వతేది శ్రీ హనుమద్ వ్రతము రోజున ఆవిష్కరణ జరగటం లేదు కవి మారారుకానుక కొంత సమయం పడుతుంది బహుశా జనవరి లో ఆవిష్కరణ జరుగవచ్చు .ఈ శతకానికి  చాలా ఉత్సాహం గా ముందుకొచ్చి విరాళాలు పంపిన వారందరికీ కృతజ్ఞతలు .ఇంకా ఆసక్తి ఉన్నవారు పంపటానికి అవకాశం ఉంది ఈ శతకం లో దాతల గోత్రనామాలు ప్రచురిస్తామని ముందే తెలియ జేశాను .

 గీర్వాణం -2  ఆవిష్కరణ రోజున స్వామి వార్లపై రెండవ శతకాన్ని కూడా రచింప జేస్తున్నట్లు తెలియజేయటం దానిని మధురకవి బహుగ్రంథకర్త ,శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు రచించటానికి అంగీకరించి రచన చేస్తున్నారని తెలియ జేస్తున్నాము .ఈ శతకాన్ని సరసభారతి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం మాత్రమే ఖర్చు భరించి ముద్రిస్తున్నాము దీనికై ఎవరూ విరాళాలు పంపనక్కరలేదు . ఈ శతకాన్ని ఫిబ్రవరి చివరలో లేక మార్చి మొదటి వారం లో ఆవిష్కరింప జేస్తాము రెండు శతకాల ఆవిష్కరణలు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లోనే నిర్వహిస్తామని తెలియ జేస్తున్నాను -వీటితో సరసభారతి ప్రచురణా స0ఖ్య  24 అవుతుంది -దుర్గాప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

4-12-2016 ఆదివారం సాయంత్రం ఉయ్యూరు రోటరీ ఆడిటోరియంలో సరసభారతి – రోటరీ క్లబ్ సంయుక్తంగా గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం పుస్తక ఆవిష్కరణ

ది 4-12-2016 ఆదివారం సాయంత్రం ఉయ్యూరు రోటరీ ఆడిటోరియంలో సరసభారతి – రోటరీ క్లబ్ సంయుక్తంగా గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం పుస్తక ఆవిష్కరణ నిర్వహించబడినది. శాసన సభ ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుధప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్, జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు – పూర్ణచంద్ పుస్తక రచయిత సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్, పద్మశ్రీ ఎస్ వి రామారావు గారు , ఆత్మీయ అతిధులు, తదితర సాహితీ బంధువులు పాల్గొన్నారు .

https://plus.google.com/photos/115752370674452071762/album/6360294741927450513/6360294745637225506

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

live now

http://www.blossomslive.com/

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పుస్తకావిష్కరణ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పుస్తకావిష్కరణ

అతిధుల పరిచయం

2-డా.శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి

కృష్ణాజిల్లా పామర్రు దగ్గర ఎలమర్రు గ్రామానికి చెందిన శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి కృష్ణా జిల్లా నందిగామలో డా . శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి శ్రీమతి పద్మావతి దంపతులకు 3-10-1983 న జన్మించారు . ,తిరుపతిలో నే చదువు ప్రారంభించి ,శాస్త్రాధ్యయనం  కొనసాగించారు . .తర్క శాస్త్రం లో మహా పండితులైన తండ్రి శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి వద్దనే తర్క భాష్యాన్ని అధ్యయనం చేసి ,శ్రీ ప్రద్యోత్ కుమార్ ముఖోపాధ్యాయ శ్రీ సుధాంశు శేఖర్ శాస్త్రి గార్ల వద్ద లోతులు తరచి నిష్ణాతు లయ్యారు .మూడు  గ్రంధాలు -1-తర్కామృతం-మాణిక్య ప్రభ కు హిందీ వ్యాఖ్యానం 2-కారికావళి గురుకృపకు హిందీ వ్యాఖ్యానం 3-సామాన్య నికృతి కి క్రోడపత్రం రాశారు . .ఇవికాక 3  గ్రంధాలు 1-శాస్త్ర దీపిక 2-చైతన్య  3- కాళికా స్తుతి సంస్కృత వ్యాఖ్య లకు సంపాదకత్వం వహించారు .

శ్రీ మాణిక్య శాస్త్రి గారి విద్వత్ కు తగిన పురస్కారాలు పొందారు  .1- బెనారస్ హిందూ యూని వర్సిటి నుండి 20 06 శాస్త్రి ఆనర్స్ పరీక్షలో ప్రధమ స్థానం  సాధించినందుకు స్వర్ణ పతాకాన్ని భారత రాష్ట్ర పతి శ్రీ ఎ.పి.జే.అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అందుకొన్నారు .2-మరొక బంగారు పతాకాన్ని 20 07 లో ఆచార్య పరీక్ష లో మొదటి స్థానం పొందినందుకు ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి నుండి స్వీకరించారు .3 మహా మహోపాధ్యాయ గోపీనాధ పురస్కారం 4-సంస్కృత భారతి నుండి మనోరమ పురస్కారం అందుకుని విద్యా’’ జయ’’కేతనం ఎగురవేసి తర్క న్యాయ శాస్త్రాలలో ‘’మాణిక్య౦’’ గా ప్రకాశిస్తున్నారు శాస్త్రిగారు .నిజంగా విద్వత్ లో’’ శాస్త్రి’’అనిపించారు ..

శ్రీ మాణిక్య శాస్త్రి గారు 40 జాతీయ సెమినార్లలోను,10 అంతర్జాతీయ సెమినార్లలోను పాల్గొని తమ అనుభవాలను ఇతర మేధావులతో  పంచుకొని సెమినార్ల కే విలువ పెంచారు ..ప్రముఖ సంస్థల ఆహ్వానంపై తర్కం, మీమాంస ,వేదాంత శాస్త్రాల పై 10 దాకా మహోపన్యాసాలనిచ్చి రాణించారు  ప్రస్తుతం పూరీలోని  శ్రీ జగన్నాధ సంస్కృత  విశ్వ విద్యాలయం లో న్యాయ శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా సేవల౦దిస్తున్నారు  .

సరస భారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ భాగం ‘’గ్రంధా విష్కరణ సభకు విశేష అతిధిగా  శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి గారి ని వేదికపై కి సాదరం గా ఆహ్వానిస్తున్నాము .

 

2-    శ్రీ గుండు హనుమంత రావు

విజయవాడలో జన్మించి ,పెరిగిన శ్రీ గుండు హనుమంతరావు గారికి విజయవాడలో చాక్లెట్ ,బిస్కట్ కంపెని తోపాటు వ్యాపారం లో రాణిస్తున్నారు  .1974 నుంచి స్టేజ్ షో లు నిర్వ హించటం ప్రారంభించి ,రావణ బ్రహ్మ పాత్రతో మొదటిసారి రంగ ప్రవేశం చేశారు . .అనేక టి వి .సీరియల్స్ లో నటించారు .వీటిలో  జెమినీ  టి వి వారు 2001 నవంబర్ నుండి 2007  నవంబర్ వరకు 313ఎపిసోడ్ లుసీరియల్ గా వచ్చిన ‘’అమృతం ‘’సీరియల్ మహా హాస్య భరితమై కమ్మని ఆహ్లాదభరిత ఆరోగ్యకర  హాస్యానికి నిర్వచనంగా ,ఒక లెజేండ్ గా మిగిలిపోయింది. అందులో ఆముదాల ఆంజనేయులు ఉరఫ్ ‘’అంజి ‘’పాత్ర ధారి గా అత్యద్భుత నటన ప్రదర్శింఛి అందరి అభిమానం పొందారు .అన్ని ఎపిసోడ్ లలో ఉన్న ఏకైక పాత్ర దారి  దాదాపు హీరోలాంటి పాత్రధారి   శ్రీ హనుమంత రావు ఒక్కరే అవటం గర్వ కారణం .అమృతం సీరియల్ కోసం కనీసం 32 సినిమాలను తిరస్కరించి ఆ సీరియల్ లో అంతటి అంకిత భావం తో నటించి అపూర్వ విజయం చేకూర్చిన ఘనత శ్రీ గుండు హనుమంత రావు గారిదే .అందుకే ఆయన ‘’అమృతం ఫేం ‘’అయ్యారు .

1985 లో ‘’ఇదేమిటి ‘’నాటకాన్నినటించి  ప్రదర్శించారు . దీన్ని చూసిన ప్రముఖ హాస్య దర్శకులు శ్రీ జంధ్యాల , శ్రీ హనుమంతరావు గారి నటనా ప్రతిభ గుర్తించి ‘’అహ నా పెళ్ళంట ‘’సినిమాలో అవకాశమిచ్చారు . ఈ సినిమాలో మొదటి సారిగా నటించి  సినీ అరంగేట్రం చేశారు.సపోర్టింగ్ యాక్టర్ గా  వందలాది సినిమాలలో ప్రముఖ హాస్యనటులుగా ప్రముఖ దర్శకులు జంధ్యాల ఎస్ వి కృష్ణా రెడ్డి వంటి హాస్య దర్శకులవద్ద చాలా సినిమాలలో నటించి హాస్యనటనకు తమదైన ఒరవడి  సృస్టిం చారు .

అమృతం సీరియల్ లో నటించినందుకు ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘’నంది అవార్డ్ ‘’ను తొలిసారి అందుకొని , రెండవ సారి ‘’శ్రీ మతి శ్రీ సుబ్రహ్మణ్యం ‘’సీరియల్ కూ మూడవది ‘’ఆది తాళం ‘’లో నటనకు  పురస్కారాలు అందుకొన్న ఘనత శ్రీ హనుమంత రావు గారిది .’’నవ్వుల నారప్ప ‘’,కెవ్వు –కేక ‘’హాస్య ప్రోగ్రాం లను బుల్లి తెరకు చేసి నవ్వులు పూయించి పండించారు . .సుమారు 30 ఏళ్ళ నటనానుభవం వారిది .దాదాపు 300 చిత్రాలలో నటించి మెప్పించారు .తన కృషినే అభిమానించి ,ప్రేమించి సంతృప్తి చెందే మనస్తత్వం శ్రీ హనుమంతరావు గారిది . .ఆరోగ్య ప్రదమైన సున్నిత హాస్యం తో ప్రజలను నవ్వి౦చ టమే  రావు గారి ధ్యేయం .

కమ్మని సునిసిత హాస్యానికి చిరునామాగా నిలిచిన  అమృతం ఫేం శ్రీ గుండు హనుమంత రావు గారిని సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ భాగం ‘’గ్రంధా విష్కరణ సభకు ఆత్మీయ అతిధిగా వేదిక నలంకరించ వలసినదిగా  సాదరం గా ఆహ్వానిస్తున్నాం .

3-  యాంకర్ ఝాన్సి

ఝాన్సీ లక్ష్మి టెలివిజన్ యాంకర్ గా ,సినీ నటిగా ,దర్శకురాలిగా ,నిర్మాతగా ,రచయిత్రిగా ,కాలమిస్ట్ గా సుప్రసిద్ధులు .20 ఏళ్ళ సుదీర్ఘ బుల్లి తెర అనుభవం ఆమెను బహు పాత్ర పోషణ చేయించింది .8 నందీ పురస్కారాలు అందుకొన్న ఘనత ఆమెది .సాధారణ యాంకర్ గా మాత్రమేకాక సాంఘిక ,మానవతా విషయాలలో చాలా క్రియాశీల వ్యక్తీ అని  నవీన ,చేతన ప్రదర్శనల ఆమె  ద్వారా నిరూపించుకొన్నారు .1997 నుండి 2007 వరకు పదేళ్ళు సుదీర్ఘంగా ఆమె జెమిని టి వి .లో సమర్పిచినసీరియల్  ‘’టాక్ ఆఫ్ ది టైం’’ఆమెను విజయ శిఖరాలకు చేర్చింది .లింగ విచక్షణ ,సమాన హక్కులు వంటి సమస్యలపై టివి 9 లో సమర్పించిన ‘’నవీన ‘’ సీరియల్  రామనాధ గోయెంకా అవార్డ్ ను సాధించి పెట్టింది .పట్టణ పేద ప్రజల జీవిత చిత్రణగా విప్లవాత్మక భావాలతో సమర్పించిన ‘’చేతన’’సీరియల్ ఝాన్సీ సాహస ధైర్యాలకు ప్రతీక .2014 ఎన్నికలలో టి. వి. 9 కోసం చేసిన  ‘’ఓపెన్ హార్ట్ ‘’కోసం తెలంగాణా ,ఆంధ్రా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి రాజకీయ చర్చలలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి మనముందు నిలిపారు …ఇవేకాక ‘’బ్రెయిన్ ఆఫ్ ఆంద్ర ‘’,’’పెళ్లి పుస్తకం ‘’,’’సండే సందడి ‘’,కనకవర్షం ‘’ కొ అంటే కోటి ,లక్కూ –కిక్కూ ‘’ధారావాహికలు బాగా ప్రాచుర్యం పొందాయి .జెమిని టి .వి. లో ‘’అమృతం ‘’హాస్య ధారావాహికలో సంజు ‘’గా గొప్పనటన ప్రదర్శించి ప్రేక్షకాభిమానం పొందారు .

తెలుగు మా౦డలీకాలన్నింటి లోను   ధారాళంగా మాట్లాడే ఝాన్సి ప్రతిభకు అమితాశ్చర్యమేస్తుంది.ఈ అనుభవం సినీ రంగ ప్రవేశానికి రాచ బాట వేసిఅందులోను స్థిరపడటానికి దోహదం చేసింది .తులసి సినిమాలో ‘’కొకాపేట కనకం ,’తో దూసుకు వచ్చిన ఝాన్సి ,అష్టాచెమ్మా ‘’,సింహ ,.పంజా ,జయం మనదేరా మొదలైన చిత్రాలలో తనదైన నటననతో సినీ ప్రేక్షకులను మై మరపించారు .పత్రికా రంగం లోనూ ఆమె ప్రవేశించి ‘’సాక్షి ‘’పత్రికలో ‘’ఝాన్సీకి వాణి’’కాలం ఆమెలోని రచయితను ప్రజల దగ్గరకు చేర్చింది .

‘’ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవిరి ధింగ్ ‘’అనే ఆంగ్ల చిత్రాన్నిశీతల్ మొర్జారియా దర్శకత్వం వహించగా  రేఖా పప్పు తోకలిసి నిర్మించారు ఝాన్సి .ఈ సినిమా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడి ప్రశంసలు పొందింది .వంటల పోటీ కై ఆమె డైరెక్ట్ చేసి సమర్పించిన ’’చెఫ్ నంబర్ వన్’’ చాలా ఉత్తేజంగా కొన సాగింది .

బాలల విద్య ,ఆరోగ్యం ,హక్కులు ,పరిసరాలపై ఝాన్సి చాలా ప్రోగ్రాములు చేశారు .తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాల పిల్లల విద్య కోసం ఆమె సహాయ సహకారాలు ‘’వుమెన్ ఇన్ నెట్ వర్క్ ‘’ద్వారా అందిస్తూ సేవ చేస్తున్నారు .బాల్య వివాహాలు , వినికిడి సమస్య తీర్చే సంస్థ,ఆర౦భ్,లెప్రా ఇండియా వంటి సంస్థలకు కు ఝాన్సి ‘’బ్రాండ్ ‘ఎంబా సడర్ ‘’గా ఉన్నారు .’’రైన్ బొ హోమ్స్ ‘’,విశ్వ ద్రక్ష ‘’చేయూత ‘’వంటి స్వచ్చంద సంస్థలకు ఝాన్సి వెన్ను దన్ను గా నిలిచారు .

1997 లో ‘’తోడు’’సినిమాలో సహాయ పాత్రధారణకు మొదటి సారిగా నందీ అవార్డ్ అందుకొన్న ఝాన్సి వరుసగా ‘’జయం మనదేరా ‘’లోనూ 2007 ,2010 లలో తులసి ,సింహా లలో  ఉత్తమ హాస్య నటిగా ,శారద టీ వి సీరియల్ లో ఉత్తమనటిగా ,పెళ్ళిపుస్తకం సీరియల్ లో  ఉత్తమ యాంకర్ గా’’ ఎ..టి ఎం .టి వి షో’’లో బెస్ట్ యాంకర్ గా నందీ పురస్కారాలు అందుకున్నారు .ఇవికాక ‘’యాంకర్ ఆఫ్ ది డికేడ్ ,వార్తా వాసవి అవార్డ్ ,యునిసెఫ్ వారి లాడ్లీ అవార్డ్ ఢిల్లీ తెలుగు అకాడెమి అవార్డ్ లవంటి వి ఎన్నో ఆమె కీర్తి కిరీటం లో కలికితురాయిలుగా వెలిగిపోతున్నాయి .

బహుముఖ ప్రజ్ఞావంతురాలై అమృతం ఫేం అయిన  ‘’యాంకర్ కీ రాణి ఝాన్సీ’’ గారిని సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘-రెండవభాగం ‘’గ్రంధా విష్కరణ సభలో ఆత్మీయ అతిధిగా వేదిక నలంకరించావలసినదిగా ఆత్మీయం స్వాగతం పలుకుతున్నాం .

 

3-  డా .శ్రీ ధూళిపాళ రామ కృష్ణ

డా ధూళిపాళ రామ కృష్ణ గారు కృష్ణా జిల్లా విజయవాడలో 23-11 -1964 న శ్రీ ధూళి పాళ అచ్యుత రామయ్య ,శ్రీమతి సీతారామమ్మ  దంపతులకు జన్మించారు .బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి వద్ద గురుకుల పద్ధతిలో తర్క ,వేదాంత శాస్త్రాలను ,కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా స్వాముల వారి వద్ద  బ్రహ్మ సూత్ర శంకర భాష్యాదులను అధ్యయనం చేసిన అదృష్ట వంతులు శ్రీ రామ కృష్ణ గారు . 1987 నుంచి సంస్కృతాధ్యాపనం చేస్తూ ,విజయవాడ  మేరిస్ స్టెల్లా కళాశాల సంస్కృత విభాగాధ్యక్షులుగా ఉన్నారు . ఆంద్ర దేశం లో స్వాతంత్ర్యానంతర౦ గత 60 ఏళ్ళలో  సంస్కృత సాహిత్య రచన’’పై  –యు జి .సి ఆధ్వర్యం లో విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజిలో  డా ధూళిపాళ రామకృష్ణ  గారి ఆధ్వర్యం లో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ హరే కృష్ణ శతపధి ,శ్రీ వెంకటేశ్వర వేదిక్యూని వర్సిటి  వైస్ చాన్సెలర్ శ్రీ సన్నిధానం సుదర్శన శర్మ ,మద్రాస్ యూని వర్సిటి వైష్ణవిజం ప్రొఫెసర్ శ్రీ నరసింహా చార్యులు ,రాజస్థాన్సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సెలర్ శ్రీ . వి.రామ కృష్ణమాచార్యులు వంటి ఉద్దండుల సమక్షం లో  ,2008 ఆగస్ట్ 11 ,12 తేదీలలో జరిగినసదస్సు లో పత్ర సమర్పకుల రచనల కదంబాన్ని ‘’సంహూతిః’’అంటే ‘’సామూహిక పిలుపు ‘’ గ్రంధంగా వెలువరించటం లో శ్రీ రామ కృష్ణ గారి పాత్ర అద్వితీయం . .ఇది గొప్ప ఆకర గ్రంధంగా ,సంస్కృత కవుల గురించి తెలుసుకోవాలనే ఆధునికులకు చాలా ఉప యుక్తంగా ఉంది.

మంచి కవులు, అధ్యయన శీలురు అయిన శ్రీ రామ కృష్ణ గారు సంస్కృతం లో ‘’శ్రీ మద్భాగవతే అద్వైత మత ప్రతిష్టా’’ రచించి భాగవతపురాణం లోని అద్వైత మత ప్రతిస్టాపనం గురించి గొప్ప పరిశోధన చేసి ఎరుక పరచారు .’’వందే కాశ్మీర భారతం ‘’అనే 14 శ్లోకాలు, కార్గిల్ లో 2016 సెప్టెంబర్ 26 ,27 తేదీలలో కేంద్ర సాహిత్య అకాడెమి నిర్వహించిన ఉత్తర భారత మరియు ఈశాన్య భారత రాష్ట్రాల  రచయితల గోష్టి లో కాశ్మీర్ పై స్పందించి రాసిన గీర్వాణ  కవిత .

ఆంగ్లం లో ‘’ఎ స్టడీ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్ స్క్రి ప్శన్స్ ఇన్ ఆంద్ర ప్రదేశ్ ‘’అనే గ్రంధాన్ని ఆంద్ర దేశం లోని శాసన అధ్యయనం పై తమకున్న గాఢ పరిశీలనకు దర్పణంగా రచించారు .కొన్ని సంస్కృత కావ్యాలను తెలుగు లోకి అనువాదం చేసి వాటి లోని భావ పరంపరను తెలుగు వారికి పరిచయం చేసి సంస్కృత సాహిత్యం లో ఉన్న తమలోతైన పాండిత్యాన్ని తెలియ జేశారు .అందులో ‘’శ్రీ రామ కీర్తి మహా కావ్యం ‘’,శివ కర్ణామృతం ‘’,’’శివ మహిమ కలికా స్తుతి ‘’,సుమనో వాగ్విలాసః ‘’,కృష్ణ లీలా తరంగిణి ‘’ముఖ్యమైనవి .ఇవన్నీ ముద్రితాలే.

డా రామ కృష్ణ గారి గీర్వాణ పాండిత్య ప్రతిభా  విశేషాలను గుర్తించిన ధాయ్ లాండ్ ప్రభుత్వం రాకుమారి చే 2013 లో రాజ సత్కారం చేసి గౌరవించింది .2014 సెప్టెంబర్ 5 వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘’ఉత్తమ సంస్కృతాధ్యాపన పురస్కారం’’ అందజేసి వారి విద్వత్ కు నీరాజనం పట్టింది .

సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ భాగం ‘’గ్రంధా విష్కరణ సభకు గౌరవ అతిధిగా శ్రీ ఉత్తమ సంస్కృతాధ్యాపన పురస్కారం అందుకొన్న డా ధూళి పాళ రామ క్రష్ణగారిని సగౌరవం గా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం .

1-    మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్

శ్రీ బుద్ధ ప్రసాద్ కృష్ణా జిల్లా దివితాలూకా నాగాయలంకలో 26-5-1956 ఆంద్ర ప్రదేశ్ మాజీ విద్యామంత్రి ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించిన శ్రీ మండలి కృష్ణా రావు శ్రీమతి ప్రభావతీ దేవి దంపతులకు జన్మించారు .తండ్రిగారి సుగుణ సంపత్తి పూర్తిగా పుణికి పుచ్చుకొన్న వ్యక్తి శ్రీ బుద్ధ ప్రసాద్ .అవనిగడ్డలో సెకండరీ విద్య పూర్తి చేసి ఉస్మానియా యూని వర్సిటినుండి డిగ్రీ పొందారు .

తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పొందిన శ్రీ ప్రసాద్ 1919 లో మొదటి సారిగా అవనిగడ్డ నుంచి  శాసన సభకు ఎన్నికయ్యారు .2014 లో మరల ఎన్నికై దాదాపు 700కోట్ల రూపాయలతో ప్రజాభి వృద్ధి కార్యక్రమాలు చేశారు .2007 లో మొదటి సారిగా మంత్రి పదవిని పొంది పశు సంవర్ధక శాఖ బాధ్యతలు చేబట్టి ‘’పశుక్రాంతి ‘’’’మత్స క్రాంతి ‘’పధకాలను అమలు చేసి రైతుల ,మత్సకారుల జీవితాలలో వెలుగులు నింపారు .పులి వెందలలో పశు సంవర్ధక శాఖలో ‘’అడ్వాన్సేడ్ రిసెర్చ్ సెంటర్ ‘’ను ఏర్పరచారు .హైదరాబాద్ విజయవాడ ,పులి వెందలలో సూపర్ స్పెషాలిటి పశువుల హాస్పిటల్స్ నెలకొల్పారు. పులిగడ్డ వద్ద మండలి వెంకట కృష్ణారావు  పెనుమూడి వంతెన నిర్మించి గుంటూరు జిల్లాను అతి సమీపానికి తెచ్చారు .కృష్ణా జిల్లా అన్ని అభివ్రుద్ధికార్యక్రమాలలో ఆయన సలహా సంప్రదింపులు ఉన్నాయి .2005 సునామీకి సర్వస్వం కోల్పోయిన వారి పునరావాస కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు .తండ్రిలాగా మాటలో, నడవడిలో, అచ్చమైన  గాంధేయ వాది.శ్రీ ప్రసాద్ . కృష్ణా మహోత్సవ, దివిమహోత్సవ నిర్వహణ,శ్రీకాకుళం లో శ్రీకృష్ణ దేవరాయ ,కాసుల పురుషోత్తమ కవి విగ్రహ ప్రతిష్ట సాగర సంగమం అభి వృద్ధి ,ఘంటసాల లో బౌద్ధ ఆరామ నిర్వహణ ,పరిరక్షణ , కూచిపూడి కళాక్షేత్ర  అభివృద్ధి ,లండన్ లో సి పి బ్రౌన్ సమాధి ఆధునీకరణ ,విజయవాడలో క్షేత్రయ్య కళాక్షేత్ర ఆవరణలో  లబ్ధ ప్రతిస్టులైన  మహనీయుల కాంశ్య విగ్రహాల ఏర్పాటు ,బందరు కోట పునర్వైభవం ,కృష్ణావిశ్వ విద్యాలయం,  అందులో తెలుగు శాఖ ఏర్పాటు  కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో జాతీయ , అంతర్జాతీయ తెలుగు మహా సభలనిర్వహణ ,రిఫరెన్స్ గ్రందాల ప్రచురణ  ఘనం గానిర్వహించారు .,కోర్టులలో తెలుగు లో తీర్పు కోసం విశేష కృషిచేశారు .తండ్రిగారరి పేరిట ప్రతి ఏడాది పురస్కారాలను అందిస్తున్నారు .  .లండన్ లోని తెలుగు హిస్టరీ సదస్సుకు అధ్యక్షులుగా ఉన్నారు .వ్రుత్తి రాజకీయమే అయినా ప్రవ్రుత్తి సాహిత్యం,సంస్కృతీ  అయిన మనీషి శ్రీ బుద్ధ ప్రసాద్ . ప్రపంచ౦ లో చాలా దేశాలు పర్యటించి విశేషాలను అక్షర బద్ధం చేసి యాత్రా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు .వారి పుస్తకాలలో ముఖ్యమైనవి మారిషస్ లో తెలుగు తేజం ,ప్రజలు –ప్రగతి ,ఇంగ్లాండ్ లో తెలుగు వైభవ స్మృతులు .అధికార భాషాసంఘ అధ్యక్షులుగా పనిచేసి తెలుగు అమలుకు గొప్ప కృషి చేశారు .తెలుగుకు  ప్రాచీన హోదా కై ఉద్యమించి అందరి సహకారం తో  సాధించారు .భువన విజయాలలో కృష్ణదేవరాయలుగా వన్నె తెచ్చారు .2014నుండి నవ్యాంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఉప సభాపతి గా  పదవికే గౌరవం తెచ్చారు .భాషా సంస్కృతుల పరిరక్షణ అభి వృద్ధి పకోసం శ్రీ బుద్ధ ప్రసాద్ గారిలాగా  అంకిత భావం తో పని చేసే రాజకీయ నాయకులు లేరు అని నిస్సందేహంగా చెప్పవచ్చు .

, సరసభారతి నిర్వహించిన తెలుగు భాషా సదస్సులో,ఉగాది వేడుకలలో ,గురజాడ ,రవీంద్రుల 150 వ జయంతి సభలలోశ్రీ బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా  పాల్గొని స్పూర్తి నిచ్చి ప్రోత్సహించారు .

వారి సమర్ధతకు తగిన మరిన్ని ఉన్నత పదవులలో రాణించి వర్ధిల్లాలని ఆశిస్తూ  సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవభాగం ‘’గ్రంధా విష్కరణ సభకు సంస్కృతీ సంపన్నులు ,మాన్య ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారిని ముఖ్యతిధిగా వేదిక నలంకరించి ,తమ అమృత హస్తాలతో పుస్తకావిష్కరణ చేయవలసినదిగా సగౌరవంగా వేద్దికపై కి ఆహ్వానిస్తున్నాం .

 

గీర్వాణ భాషా వైభవం –కవి సమ్మేళనం –డా రామడుగు వెంకటేశ్వర శర్మ (గుంటూరు )గారి కవిత

1-సీ –రామ నీరద  సుదర్శన మాత్ర కవన నృత్యతా కేకి వాల్మీకి !అంజలు లివె

శ్రుతి పురాణార్ధ భారత పద్మ వికసనోల్లాస  వేద వ్యాస !ప్రణతి వినుతి

ప్రతిభా సమేత రూపక దీపికా వాస ! భాసా నమోస్తు

కమ్రోపమాన సత్కవితా విలాస శ్రీ కాళిదాసా!నమస్కార శతము

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి– ,నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మ యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

2-సీ-‘’కవి భారవే రర్ధ గౌరవ ‘’ఖ్యాతి చేకొన్న భారవి !ఏటి కోళు లివియె

శబ్ద లాలిత్యైక సంపస్సముద్దండి!దండి మహా కవీ దండమయ్య

మల్లినాద ప్రశంసా ‘’మాఘ మేఘేతి’’ వాక్య కారక మాఘ !ప్రణతి శతము

శివ మహిమ్న స్తోత్ర కవి గాఢ భక్తాగ్ర గణ్య సత్కీర్తి సౌజన్య !నతులు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

3-సీ –నవ విద్వ దౌషధ  నైషద కవితా ప్రవర్ష ,హర్షా !ఇదే ప్రణుతి శతము

కాదంబరీ రసజ్ఞాన దాయక బాణ !బాణ భట్టారకా  వందనములు

‘’సరస పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి ‘’యౌ జయదేవ  వందనములు

‘’ కృష్ణ కర్ణామృత లీలాశుకా ‘’!జ్ఞాన చింతామణి కవీంద్ర !చేతు నతులు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

4-సీ –కరుణా రసైక సత్కవన గోదావరీ వర భూతి ,భవ భూతి !వందనములు

గుణ్య సామాన్య నైపుణ్య జీవన రూపకా !మృచ్చ కటికాఖ్య కర్త !నతులు

చాణక్య రాజ్యాంగ చతురతా పూర్ణ ‘’ముద్రారాక్షస ‘’విశాఖ దత్త నతులు

తృతీయ పంథా ప్రధానా !’’అనర్ఘ రాఘవ రూపకా !నమస్కార శతము

బంధుర రసానంద పరీమళ’’!కుందమాలా కార! వందనములు

నిర్మల ప్రియదర్శినీ రూప నవ్య నాగానంద హర్షాధిపా నమోస్తు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

 

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవభాగం

గ్రంధ పరిచయం –పద్య మందార మాలతో అభినందన చందనం  -డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి

1-జయశీలంబును ,కార్య శూరతయు ,సౌజన్యంబు రూపంబు దా

ల్చి ,యపూర్వంబుగ దీర్చి దిద్దిన గీర్వాణ కళాక్షేత్రంబు’’ గీర్వాణ వా

ణి’’,యమూల్యంబగు భావ సంపదల నున్మేషింప,సారస్వత

ప్రియు లిద్దాని గుణంబులన్ గని ,ప్రహర్షింపన్,సమర్ధంబగున్ .

2- ఘనులై సంస్కృత భాష నధ్యయనమున్ గావించి ,కావ్యాలు వ్రా

సిన ,ఆయా కవి జీవితంబుల ప్రశస్తిన్ ,జ్ఞాన విజ్ఞాన భా

వనలన్, బ్రోది యొనర్చి ,భావి తరముల్ భద్రంబు లై వర్దిల౦

గను ,గీర్వాణ కవి ప్రణీతములు  సద్గ్రంధంబులన్ దెల్పుచున్ .

3-తరువుల్ బూచిన పుష్ప సౌరభము ,లుత్సాహంబు తో, వాయు

వెల్లరకున్ బంచిన రీతి ,సంస్కృతుల సంలాపంబు ,లాంద్రోక్తి సుం

దరమై  భాసిల జేయు సత్కవులు ,సత్కారార్హులాత్మోన్నతిన్

బర మార్ధంబు గ్రహించి ,లోకులకు జెప్పన్ ,సద్విర్మంబగున్ .

4-అభినందించు బ్రపంచ మీ కృతికి ,నత్యంతంబు సత్య౦బు ,దు

ర్లభౌ ,సంస్కృత కావ్యముల్ విబుధు లౌరా !యంచు గీర్తింప ,ద

చ్చుభ సందర్భ,ముదాహరి౦చుచు ,కవీశుల్ మెచ్చ సాహిత్య ,సౌ

రభ ముల్,దిక్కుల నింపు మీ కృషి ,సువర్ణం బై విరాజిల్లెడున్  .

5-తినబోవన్ రుచి గూర్చి చెప్పవలెనా ?తియ్య౦దన౦ ,భిక్షుఖా

దన మన్నన్ బునరుక్తి కాదొకొ ?ప్రసాదంబిట్టి దౌనంచు ,వ

ర్ణన గావి౦పగ శక్యమే ?సవిత నారాధింప ,దీపంబు జూ,

పిన చందంబిది,గబ్బిటాన్వయ మణీ!విద్వద్విమర్శాగ్రణీ’’.

డా .తూములూరు శ్రీ దాక్షిణా మూర్తి శాస్త్రి

రిటైర్డ్ ప్రిన్సిపాల్

,శ్రీ భావనారాయణ స౦స్కృత కళాశాల –పొన్నూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా

పెద్ద నోట్ల రద్దుతో బుర్రతిరిగి మైండ్ బ్లాంకై

బ్యాంకుల వద్ద నల్ల కుబేరులు క్యూలు కట్టి

నల్లదనం వదిలించు కొంటారని ఆశపడితే

బంకుల్లోనే ఉండి పోయి వెక్కి రిస్తూ నల్లమాలచ్చి

బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అని పాడుతోంది .

‘’నల్ల’’వారి బదులు వేతనజీవులైన ‘’తెల్లకాలర్ ‘’వాళ్ళు

‘’కాలర్లెస్’’మాత్రమేకాక బడుగు జీవులే బ్యాంకుల వద్ద

పడిగాపులు పడుతూ కష్టార్జితమైన  తెల్ల సొమ్మునే

హడావిడిగా భద్ర పరచుకొంటున్నారే తప్ప

నల్లదనం బయటికే రాలేదింకా

పైగా ఫిఫ్టీ ,సెవెంటీ పెర్సెంట్ అంటూ ఊరింపు

మధ్యలో దళారీలు ,అప్పుడే దొంగానోట్లూ వచ్చి వాలిపోతుంటే

బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అంటూ నం. పా.సా .పాట పాడుతున్నాడు .

క్రమశిక్షణ గల మన సైన్యం పాక్ పై

సర్జికల్ ఆపరేషన్ చేసి విజయవంతమైంది

 ఆర్ధిక క్రమ శిక్షణ లేని దేశం లో అరాచక

అస్తవ్యస్త పరిస్థితి ఇన్నేళ్ళుగా రాజ్యమేలుతుంటే

స్వచ్చ భారత్ అంటూ ఫోటోలకోసం

పోజు లిచ్చే నాయక గణం భజనే తప్ప

క్రియా శూన్యమై నోరు వెళ్ళ బెడుతుంటే

చేస్ట లుడిగి  యెన్ ఫోర్స్ మెంట్  కాడి పారేస్తుంటే

ప్రభుత్వాన్ని శాసించేది ‘’మనీ డాన్ ‘’లేనని అర్ధమై

ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ died చందమై

సంస్కరణ చట్టు బండలై వెక్కి రిస్తుంటే 

 ప్రజావస్తను చూసి ఈ వ్యవస్థ జాలితో  పాడుతోంది

బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అంటూ వెక్కిరింపుగా 

.

నిన్న రాసిన ‘’మోతాదు మించిన మోదుడు’’కవిత చదివి స్పందించిన శ్రీ మైనేని గోపాలకృష్ణగారు (అమెరికా )’’బోల్తా కొట్టి౦దిలే మోడీ పిట్టా’’అంటూ పాతపాటను  జ్ఞాపకం చేస్తూ కామెంట్ రాశారు. అదే శీర్షికగా నేను  ఈ కవిత రాసినందుకు శ్రీమైనేని వారికి కృతజ్ఞతలతో –

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-12-16 –ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

మోతాదు మించిన మోదుడు

మోతాదు మించిన మోదుడు

మంచి వాడనుకొంటే మంచమంతా చెడగొట్టినట్లు

ఏదో పొడి చేస్తాడనుకొంటే  పొడిచి పారేశాడు

సామాన్యుడిని ,ముసలి ముతకా  బీదజనాన్ని

రోడ్డున పడేసి రద్దు తో మోదీ

జనాన్ని మోది మోది బాది

పారేసి లబోదిబో మనిపించాడు .

నల్ల కుబేరుల నేమీ పీక లేక

నలుపు తెలుపౌతుందని నమ్మి

అడ్డ దిడ్డంగా అర్ధ రాత్రి పెద్ద నోట్లు రద్దు చేసి

వీరంగం వేస్తుంటే వెంకయ్యా అండ్ పార్టీ

 డప్పూ డోలు వాయిస్తూ వీర భజన చేస్తుంటే

జనం బాంకుల వద్ద క్యూలలో పడిగాపులు పడుతూ

లేస్తూ ,వారికి రావాల్సినది అవసరమైనది

దేబిరించి తీసుకొనే పరిస్థితి కల్పించిన

ఈ ముఠాను జనం జీర్ణించుకోలేక

మొహం మీదనే కక్కేస్తుంటే

ఆర్ధికం చక్కబడేదెన్నడు?

జనం ఆర్తి తీరేదెన్నడు ?

నగదు రహితం చివరికి నగదే రహితమై

పోతుందేమో ?ఏమో ?ఏమో ఎవరికి తెలుసు ?

ఇక దారేది ఓ జాతిపితా !మహాత్మా  !

  గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-16 –ఉయ్యూరు 

—

Posted in కవితలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం రచనకు ఉపయుక్తమైన గ్రంధాలు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం రచనకు ఉపయుక్తమైన గ్రంధాలు

1-హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ –శ్రీ ఎం .కృష్ణమాచారియార్

2-కాంట్రి బ్యూషన్ ఆఫ్ ఆంధ్రా టు సాంస్క్రిట్ లిటరేచర్ –డా.శ్రీ బిరుద రాజు రామ రాజు

3-సంహూతిః(అందరూ కలిసి ఇచ్చిన పిలుపు )—ఆంద్ర దేశం లో స్వాతంత్ర్యానంతర౦గత 60 ఏళ్ళలో  సంస్కృత సాహిత్య రచన’’పై  –యు జి.సి ఆధ్వర్యం లో విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజి లో సంస్కృత శాఖాధిపతి డా ధూళిపాళ రామకృష్ణ  గారి ఆధ్వర్యం లో రాష్ట్రీయ సంస్కృతవిద్యాపీఠం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ హరే కృష్ణ శతపది ,శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూని వర్సిటి వాస్ చాన్సెలర్ శ్రీ సన్నిధానం సుదర్శన శర్మ,మద్రాస్ యూని వర్సిటి వైష్ణవిజం ప్రొఫెసర్ శ్రీ నరసింహా చార్యులు ,రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సెలర్ శ్రీ . వి.రామకృష్ణమాచార్యులు వంటి ఉద్దండుల సమక్షం లో  ,2008 ఆగస్ట్ 11 ,12 తేదీలలో జరిగిన సదస్సు లో పత్ర సమర్పకుల రచనల కదంబం .

4-సంస్కృత వాజ్మయ చరిత్ర –రెండు భాగాలు –శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి .

5 -వరూధినీ ప్రవరం ,తత్వమసి ,కల్యాణం (నాటిక )శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి

6-లింగోద్బవ  వృత్త మాలికా స్తుతి  ,గజేంద్ర మోక్షం ,ఉమాకల్యాణం ,  రాజవాహన విజయకావ్యం  –శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి

7-డా.చెరువు సత్యనారాయణ శాస్త్రి సమగ్ర సంస్కృత శతావధానం –శ్రీ నోరి భోగేశ్వర శర్మ విశ్లేషణ

8-శ్రీ శైల సారోద్ధారం           శ్రీతాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి

9-మత్స్వప్నః ,-శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి

10-పుత్ర సంజీవనం –శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి

11-హర్శనైషద, దర్శన పరామర్శ –డా.శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి

12-మానస పూజ ,వర్షోత్సవ కీర్తనలు –శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజి

13-జగద్వంద్యులైన జగద్గురువులు- ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడు

14- పుట్టపర్తి నారాయణా చార్య –శ్రీ శశిశ్రీ

15-శ్రీ సువర్చలా౦జనేయం –శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ

16-గుప్త పాశుపతం ,అమృత శర్మిష్ట –శ్రీ విశ్వనాధ సత్యనారాయణ

17- పావక ప్రభ ,శృంగార లహరి ,అంబికా కరావలంబ స్తోత్రం –  డా.శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ

18-బ్రహ్మశ్రీ కాశీ భట్ట బ్రహ్మయ్య     -శ్రీ జటావల్లభుల పురుషోత్తం

19—పైడి చూపు – శ్రీ మాడభూషి నరసింహా చార్యుల గారి పల్లవీ పల్లవోల్లాసం (జాంబవతి చరిత్ర)  రచనకు’’పైడి చూపు ‘’అనే  ముందు మాటరాసిన శ్రీ ఉన్నం జ్యోతి వాసు

20  -శ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రి గారికి రాష్ట్ర పతి పురస్కారం లభించిన సందర్భంగా పై వెలువడిన ‘’సంస్కృత విద్యా’’ప్రత్యేక సంచిక –అందులో శ్రీ డా .మద్దులపల్లి దక్షిణామూర్తి శాస్త్రి గారు తండ్రి గారిపై హిందీలో రాసిన వ్యాసం .

21-రామాయణ సారోద్ధారం -7 భాగాలు –శ్రీ ములుకుట్ల నరసింహా వధాని

 

.సరస భారతి ప్రచురణకు విరాళాలు అందజేసిన వదాన్యులకు కృతజ్ఞతలు

1-శ్రీ వేలూరి రామ కృష్ణ ,శ్రీమతి వేదవల్లి దంపతులు –గరివిడి –రూ 2 ,501

2-శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీమతి సమత దంపతులు –హైదరాబాద్ –రూ 1,116

3-శ్రీ పువ్వుల నరసింహా రావు,శ్రీమతి కరుణానిధి దంపతులు –ఉయ్యూరు-రూ 1,116

4-శ్రీ టి వి .ఎస్ బి శాస్త్రి (ఆనంద్ )శ్రీమతి రుక్మిణి దంపతులు –హైదరాబాద్ –రూ 500

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం

వందనం అభివందనం            గబ్బిట దుర్గాప్రసాద్

 

గీర్వాణ కవుల కవితా గీర్వాణం మొదటి భాగం గ్రంధాన్ని ఉస్మానియా విశ్వ విద్యాలయ సంస్కృత ప్రాచార్యులు డా.శ్రీ ఇప్పగుంట సాయి బాబాగారికి పంపగా, క్షుణ్ణంగా చదివి అభినందిస్తూనే ,నేను చేసిన తప్పులను సవివరంగా వ్రాత పూర్వకంగా తెలియ జేశారు .ఆ పత్రాలను అందరికిఅంతర్జాలం ద్వారా తెలియ బర్చాను .అందులో వారు నాకొక గొప్పసూచన చేశారు .శ్రీ ఎం .కృష్ణమాచారియార్ గారు ఆంగ్లం లో రాసిన ‘’హిస్టరీఆఫ్  క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’తెప్పించుకొని చదవమన్నారు .ఈ విషయాన్ని గుర్తించిన నా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారుసుమారు వెయ్యిపెజీలున్న ఆ గ్రంధాన్ని  నాకు తెలియ కుండానే ఆర్డర్ ఇచ్చి తెప్పించి నాకు పంపారు .అద్భుతం అనిపించింది చదువు తుంటే.దాని ఆధారం గా గీర్వాణ కవుల కవితా గీర్వాణం రెండవ భాగం నెట్ లో రాయటం ప్రారంభించాను .ఇందులో ఉన్న దాదాపు అందరుకవులను,అన్ని ప్రక్రియలను గురించి రాయగలిగాను .దీనికి శ్రీ సాయిబాబాగారికి శ్రీ మైనేని వారికీ ఎంతైనా రుణపడి ఉంటాను .

మొదటిభాగానికి ముందుమాట రాసిన డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు కూడా ఇంకా రాయవాసిన కవులు చాలా మంది ఉన్నారనివారిని గూర్చి కూడా రెండవ భాగం లో రాయమని మంచి సలహా ఇస్తూ ఆ కవుల వివరాలు గుంటూరు జిల్లా పొన్నూరు సంస్కృత కళాశాలరిటైర్డ్ ప్రిన్సిపాల్ డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ఇవ్వగలరని వారి ఫోన్ నంబర్ నాకు ఇవ్వగా కిందటిఏడాది  సెప్టెంబర్ లోవారితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నాను .వారి వలననే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ,వారి తండ్రిగారు శ్రీవెంకటప్పయ్య శాస్త్రిగారు ,శ్రీ తూములూరు వారి బావగారు ,శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారి దౌహిత్రులు అయిన శ్రీచెరువు సత్యనారాయణశాస్త్రిగారు,శ్రీ కొలచిన యజ్ఞనారాయణ దీక్షితులు  గార్ల గురించి శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు పై వారు రచించిన పుస్తకాలు పంపగారాయగలిగాను .శాస్త్రి గారి ద్వారానే శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారిని పరిచయం చేసుకొని సీతారామ శాస్త్రి గారు పంపిన తమవీ,తమ తండ్రి గారు శ్రీ నారాయణ శాస్త్రి గారి గ్రంధాలనాధారంగా వీరిద్దరి సంస్కృత సేవను వివరించాను .అలాగే శ్రీ ములుకుట్ల   నరసింహావధాని గారు రచించిన ‘’రామాయణ సారోద్ధారం ‘’7 భాగాలు శ్రీ తూములూరు వారు నాకు అందజేయగా అవధాని గారి గూర్చి సవివరంగా రాయగలిగాను .

.చీరాల విశ్రాంత లెక్చరర్ ,సంస్కృత భాషా సేవకులు ,ఆత్మ జ్యోతి మాసపత్రిక సంపాదకులు శ్రీ రావి మోహన రావు గారినీ శ్రీ తూములూరు వారు పరిచయం చేయగా ,వారు పంపిన వాటి ఆధారం గా శ్రీ చింత గుంట సుబ్బారావు గారి గురించి రాశాను .శ్రీ మోహన రావు గారి ద్వారాశ్రీగరిమెళ్ళ సోమయాజులుగారు పరిచయమవ్వగా వారు పంపిన రచనల నాదారంగా శ్రీ గరిమెళ్ళ వారి గూర్చి రాశాను .గుంటూరు జిల్లాజిల్లెళ్ళమూడి  అమ్మ సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి తో ఉన్న పూర్వ పరిచయాన్నిపురస్కరించుకొని వారిద్వారా జిల్లెళ్లమూడి సంస్కృత కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డా.శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారి ఫోన్ నంబర్ తెలుసుకొని ,  హైదరాబాద్ లో వారి స్వగృహం లో కలిసి ఇంటర్వ్యు చేసి ,వారు అందజేసిన తమ రచనల నాధారంగా శర్మ గారి గీర్వాణ కృషి నిపరిచయం చేయగలిగాను.

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రాహ్మణ్య  శాస్త్రి  గారు వారంతకు వారే నాగురించి తెలుసుకొని వారి గ్రంధాలను పంపగా వారి గూర్చి రాసేభాగ్యం దక్కింది  .ఈ రెండవ భాగం తీగ కదలటానికి ముఖ్య కారకులు ,నాపై అమితమైన ప్రేమ ఆదరణ కురిపిస్తూ,అభినందిస్తూ  ‘’ప్రసాద్గారూ !సంస్కృతం చదువుకొన్న మేమెవ్వరం చేయ లేని మహత్కార్యాన్ని మీరు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి నాకు గర్వం గా ఉంది’’అనిఎప్పటికప్పుడు ఫోన్ లో దీని ప్రగతిని తెలుసుకొంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహించిన శ్రీ తూములూరు వారి సౌజన్యానికి ఎంతో రుణపడిఉంటాను .

శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారి పరిచయం లో మరో గొప్ప ముందడుగు పడింది .వారు ఆచార్య శ్రీ  బిరుద రాజు  రామ రాజుగారు ఆంగ్లం లో రాసిన ‘’కంట్రి బ్యూషన్ ఆఫ్ ఆంద్ర టు సాంస్క్రిట్ లిటరేచర్ ‘’‘’గ్రంధం చదివారా అంటే, లేదని చెప్పాను .ఎక్కడైనాదొరుకుతుందేమో నెట్ లో వెతకమని శ్రీ మైనేని వారిని కోరటం  వారు వెంటనే దాన్ని ఆర్డర్ ఇచ్చిస్వర్గీయ  సద్గురు శ్రీ శివానంద  మూర్తి గారిగారి కుమారులు శ్రీ బసవ రాజు గారి తో ఫోన్ లో మాట్లాడగా తమ వద్ద ఉన్నదని చెప్పి కొరియర్ లో 700 పేజీలున్న   దానిని భద్రం గాఉచితంగా పంపి అందజేశారు. దీన్ని ఆధారం గా ఆంధ్రదేశం లోని  సంస్కృత కవులను ,వారిరచనలను చదివి రాయగలిగాను .పుస్తకం ఇంగ్లీష్లో ఉండటం ,కవుల రచనలను సంస్కృత లిపిలోనే శ్రీ రాజు గారు ఇవ్వటం వలన అర్ధం చేసుకొని రాయటం కష్టమని పించినా ఇష్టంగాచేస్తున్నందుకు మహా

…

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణం -2 లో ముందుమాటలు -నతి -నుతి డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు

నతి –నుతి –

డా .శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి

సజ్జన సాంగత్యం

బహు భాషా కోవిదులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ,నా కంటే వయసులోనూ ,జ్ఞానం లోను పెద్ద వారు .ఏ పూర్వ పుణ్యమో ,వారితో పరిచయ భాగ్యాన్ని నాకు కలుగ జేసింది .’’సతాంస౦గస్సద్భిః కథమివహి పుణ్యేన ,భవతి ‘’అన్న భవభూతి వాణి అక్షరాలా నిజమని తెలిసింది .మన భారత దేశం యొక్క గొప్ప తనాన్ని చాటి చెప్పేవి సంస్కృతీ ,సంస్కృత భాష అని పెద్దలు వివరించారు .అవి వీరికి ప్రాణ నాడులై నిలిచాయి .

మాతృ దేవో పితృ దేవో భవ

గొప్ప సంప్రదాయ కుటుంబం లో పుట్టి ,ఉత్తములైన తల్లి దండ్రుల సంస్కార సంపద పుణికి పుచ్చుకొన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు ,వారిని దైవములుగా భావించి ,సేవించి ,తమ కృషికి ఫలితమైన ఈ గ్రంథాన్నివారికి భక్తితో సమర్పించటం చాలా సంతోషాన్ని కలిగించింది .చక్కని సంప్రదాయాన్ని పాటించి ,ఇతరులకు మార్గ దర్శకం గా నిలిచారు .వృత్తి రీత్యా సైన్సు ,లెక్కలు ,ఇంగ్లీషు భాష అభ్యసించి కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో ఉపాధ్యాయులుగా కొంతకాలం ,ప్రదానోపాధ్యాయులుగామరి కొంత కాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ,ఉత్తమ ఉపాధ్యాయులుగా కీర్తి గడించి ,ఎందరో విద్యార్ధులకు జ్ఞాన దానం చేసిన మనీషి శ్రీ దుర్గా ప్రసాద్ గారు .                             సాహిత్యాభిలాష

స్నేహ సంపన్నమైన హృదయం కావటం చేత ,బంధువులతో ,మిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండి ,జీవితాన్ని అన్ని విధాలా ,బహు పుష్ప ఫల భరితంగా పండించుకొన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు ,అమర సాహితీ నందనోద్యాన వనం లో ప్రవేశించి ,ఆ సౌందర్యాన్ని చూసి ,పరవశించి ,తన ఆనందాన్ని సమకాలీన సమాజానికి అందిస్తూ ,భావి తరానికి భద్ర పరచాలనే సంకల్పం తో ,ఎంతో శ్రమ కోర్చి ,వ్యయ ప్రయాసలను లెక్క చేయక ,నిత్యకృషీ వలులై బంగారు పంట పండించారు .అది వారి జీవ సంస్కారము .పూర్వ జన్మ వాసనా వాసితముగా బోధ పడుతుంది .

భాషా సేవ

ఆ కార్య క్రమం లో ఎందరో పండితులను స్వయంగా కలుసుకొని ,వారితో సంభాషించి ,వారిలో గల ప్రతిభ ను గుర్తించి ,అభి నందిస్తూ ,వారి కావ్య విశేషాలను అక్షర బద్ధం చేశారు .వీరు మరి కొన్ని గ్రంథములను కూడా తెలుగులో రచించి ,ప్రచురించి ,ఆంద్ర భాషామతల్లికి ఎనలేని సేవ చేశారు .ఇతరులు వ్రాసిన కొన్ని గ్రంథములకు  వెలుగు చూపించారు .

‘’సరసభారతి ‘’అనే పేరుతో సాహిత్య సంస్థనొక దానిని స్థాపించి ,సభలు ,సమావేశాలు ,సన్మానాలు నిర్వ హిస్తూ ,సంగీత సాహిత్యములను సమాదరిస్తున్నారు .సంస్థ పక్షాన ఇతర కవుల గ్రంథములను ప్రచురించి ,ప్రోత్స హిస్తున్నారు .

సాహిత్య ,విజ్ఞాన విశేషముల నెన్నింటినో నిత్యము అంతర్జాలము నందు విద్యుల్లేఖల ద్వారా అందరికి అందజేస్తూ ,అభినంద నీయులయ్యారు.ప్రపంచ ఇంగ్లీష్ కవులను ,వారి రచనలను కూడా పరిశీలించి ,,తెలుగు వారికి పరిచయం చేస్తూ గ్రంథములు రచించారు .77 సంవత్సరములు పైబడిన వయస్సును లెక్క చేయకుండా ,నిత్య నూతనమైన ఉత్సాహ౦తో చక్కని పని చేస్తున్నారు .శ్రమ వారిది ,ఫలితం మనందరిది .కాలాన్ని వృధా గా గడుపుతూ ,చింతలతో వంతలతో కృంగి,కృశించే వారికి మంచి స్పూర్తి నిస్తూ ,జగము వర్ధిల్లు వార్త నిస్తున్నారు .-ప్రగతి మార్గ దర్శనం చేస్తున్నారు .

ఇటు వంటి వారిని సత్పురుషులని కీర్తిస్తూ  పెద్దలు ఉన్నతవృక్షము లతో పోల్చారు .వృక్షములు ఎండలో ఉండి ,చెంత చేరిన వారికి నీడ నిచ్చి ,సేద తీరుస్తాయి . ఫలాల నిచ్చి ,తృప్తిని గూర్చి ,ఆనందింప జేస్తాయి .ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తాయి .పరోపకారమే ప్రకృతి పరమార్ధము

 

శ్లో –‘’ఛాయా మన్యస్య కుర్వంతి,తిస్ఠంతి స్వయ మాతపే

ఫలాన్యపి పరార్ధాయ వృక్షాస్సత్పురుషా ఇవ’’

వీరికి లభించిన మరో వరం ,మనసెరిగి మెలగే భార్యా ,బిడ్డలు .అది వారిని విజయ పథం లో పయనించటానికి మరింత బలవంతులను చేసింది .

ఉద్యమ స్పూర్తి

కోరిక మాత్రం చేతనే కాక ,ప్రయత్నం తోనే కార్యములు ఫలిస్తాయి .అది సింహమే అయినా ఎప్పుడూ నిద్ర పోతూ ఉంటే ,ఆకలి ఎలా తీరుతుంది .’’మృగ రాజు ‘’అనే పేరు ఎలా వస్తుంది ?

‘’ఉద్యమే నహి  సిద్ధ్యంతి కార్యాణి ,నమనోరథైః

నహి సుప్తస్య సింహస్య ,ముఖే ప్రవిశంతి మృగాః’’

సంస్కృత కవుల జీవిత విశేషాలను వివరిస్తూ ,కావ్య పరిమళాలను ఆస్వాదించటానికి పూను కొన్న శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి ప్రొఫెసర్ గారి సలహా ,మైనేని వారి సహాయం లభించాయి .చేతిలో నిఘంటువులు అంతర్జాలం ఉండనే ఉన్నాయి .చక్కని సమన్వయం తో ఇంతటి బృహత్కార్యాన్ని తలపెట్టి ,సాధించారు .సంస్కృత పరిరక్షణ ,సంస్కృత భాషా ప్రచారమే కాని ,స్వార్ధ మెరుగని వారు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు .తమ శక్తి యుక్తులన్నీ లోక హితం కొరకు వెచ్చించారు .ఇతరులకు సాయం చేయటం లోముందుంటారు .

గుణ గ్రహణ పారీణత

కవిలో ,కావ్యం లో గుణాన్ని గుర్తించి ,ప్రకటించే మంచి లక్షణం శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి వెన్నతో పెట్టిన విద్య .సద్విమర్శకునికి ఉండవలసిన ఉత్తమ గుణమది.శివుడు గరళమును కంఠము నందు నిలుపు కొని ,చంద్ర కళను శిరసున ధరించుట ఇందులకు నిదర్శనము .

శ్లో –‘’గుణ దోషౌబుధో గృహ్ణన్ ,ఇందు క్ష్వేడా వివేశ్వరః

శిరసా శ్లాఘ్యతే పూర్వం ,పరం కంఠే నియచ్ఛతి’’.

హనుమదుపాసన

ఇంతటి మహత్కార్యాన్ని అవలీలగా సాధించిన శ్రీ దుర్గా ప్రసాద్ గారికి  ఉపాస్య దైవమగు శ్రీ హనుమదనుగ్రహం పరిపూర్ణం గా ఉంది .ఇప్పటికి వారు 50 పైగా సుందర కాండ పారాయణలు పూర్తి చేసి ,,స్వామి పాదముల చెంత సమర్పించారు .ఉయ్యూరు లో గల శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం కేంద్రంగా చేసుకొని వారు పారాయణాలు వ్రతములు ,హోమములు ,ఉత్సవములు నిర్వహిస్తూ,భక్త కోటికి స్పూర్తి నిస్తూ ,ప్రీతిపాత్రులైనారు .దేశ ,విదేశాలలో ఉన్న ఆంజనేయ దేవాలయాలను ,దర్శనీయ స్థలాలనుతెలియ జేసి ,ప్రజలకు మహోపకారం చేశారు .

పరోపకారము

వారి విద్యా, ధన . శక్తి యుక్తులు ,జ్ఞానానికి ,దానానికి ,సంస్కృతి పరి రక్షణకు వినియోగ పడి ,లోకం లో శాశ్వతములయ్యాయి .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

దేశం లో ,విభిన్న కాలాలలో ,భిన్న రాష్ట్రాలలో గల సంస్కృత కవులు ,వారి రచనలతో బాటు ,కవుల జీవిత విశేషాలను కూడా పరి శీలించి ప్రకటించారు .ఆయా కవుల చారిత్రిక నేపధ్యం వివరింప బడి ,చరిత్ర గ్రంధంగా కూడా ఇది పరిగణింప దగి ఉన్నది .విశ్వ విద్యాలయం వారు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికృషికి మెచ్చి,నిర్నిబంధంగా డి.లిట్.(డాక్టర్ ఆఫ్ లిటరేచర్ )పట్టము నిచ్చి ,గౌరవించ వలసి ఉంటుంది .ముందుముందు పి .హెచ్ .డి.చేసే విద్యార్ధులకు ఈ గ్రంధం పరిశీలింప దగిన ‘’ఆకర గ్రంధము ‘’గా  (రిఫరెన్స్ బుక్ )ఉంటుంది .ఈ గ్రంధము ద్వారా  నేను ఎన్నో నూతన విషయాలు తెలుసుకోగలిగాను . .ఇందులోని ప్రాచీన కవులు ,స్వాతంత్ర్యానంతర సంస్కృత కవులు ,ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు కూడా ప్రస్తావి౦ప బడ్డారు . ఎందరో మహాను భావులు అందరికి వందనాలు.

శ్రీ దుర్గా ప్రసాద్ గారు ఈ గ్రంధం లో ఉట్ట౦కించిన ‘’ఉప శీర్షికలు ‘’సహితం ,అన్వర్ధములై ,ఆలోచింప జేస్తూ వారి పరిశీలనా దృక్పధమునకు ,అభిరుచికి అద్దం పడుతున్నాయి .ఇందులోని విశేషాలను వివరిస్తూ వ్రాయటం మొదలు పెడితే మరొక గ్రంథం అవుతుంది .వారి కృషి కి ప్రత్యక్ష సాక్ష్యం మీ కరములను అలంకరించిన ఈ సాహిత్య లక్ష్మి అని చెప్పటం అతిశయోక్తి కాదు .సూర్యునకు దివిటీ పట్టటం ( దీపం చూపించటం ),భక్తి ప్రకటనము మాత్రమే అని  విన్నవిస్తూ ,వాత్సల్యంతో నాకీ అవకాశాన్ని  కల్పించిన బ్ర .వే .గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి ,సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను .వారి కృషికి జేజేలు పలుకుతున్నాను .

శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారిని ఒక వ్యక్తిగా కాక సాహితీ సంస్థ గా సంభావిస్తూ ,వారి బహుముఖ ప్రజ్ఞా విశేషములను ప్రస్తుతిస్తున్నాను .

డా. తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి

రిటైర్డ్ ప్రిన్సిపాల్ –శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ,పొన్నూరు .

 

 

 

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణం -2స్పాన్సర్ -సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ మరియు ఆ దంపతుల ”మా మాట ”

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం  గ్రంధ ప్రాయోజకులు

సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు  శ్రీ మైనేని గోపాల కృష్ణ

జననం –విద్యా భ్యాసం

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు సమీపం లోని కుమ్మమూరు గ్రామం లో శ్రీ మైనేని వెంకట నరసయ్య ,,శ్రీమతిసౌభాగ్యమ్మ దంపతులకు 10-1-1935న ఆరవ సంతానం గా జన్మించారు .వీరి అన్నగార్లు స్వర్గీయ సూర్య నారాయణ ,స్వర్గీయ తాతయ్య అనేరాజ శేఖర్ ,అక్కయ్యలు శ్రీమతి అన్నపూర్ణాదేవి ,స్వర్గీయ శ్రీమతి  కనక దుర్గా దేవి ,శ్రీమతి భారతీదేవి .చెల్లెళ్ళు శ్రీమతి హేమలతా దేవి,శ్రీమతి సత్యవాణి .బాల్యం లోనే పిల్లల చదువుకోసం తండ్రిగారు కుటుంబాన్ని ఉయ్యూరు కు మార్చారు .ప్రాధమిక విద్య ను గోపాల కృష్ణ గారుకీ శే కోట సూర్య నారాయణ శాస్త్రి గారి వద్ద నేర్చారు .కోటమాస్టారు అంటే మైనేని వారికి అమితమైన గౌరవం భక్తీ .వారి పేరు చెబితే పులకి౦చిపోతారు ..1950వరకు తాడంకి స్కూల్ లోచదివి ఎస్. ఎస్. ఎల్. సి .పాసై ,తరువాత విజయవాడ ఎస్ .ఆర్ .ఆర్ .కాలేజి లో ఇంటర్ చదివి1954లో ఉత్తీర్ణులయ్యారు .కొంతకాలం నాటకాలు ,సోషలిస్ట్ పార్టీ సభలతో  కాలేజీకి  డుమ్మా కొట్టారు ..బెజవాడ హోటల్ వర్కర్స్ యూనియన్తో చేరి ,వర్కర్ల జీవన పరిస్థితులను మెరుగు పరచటానికి వారిని యాజమాన్యం గౌరవం గా చూడటానికి కృషి చేశారు .

ఉన్నత విద్య –వివాహం –మొదటిసారి అమెరికా ప్రయాణం

1953-54లో ఉయ్యూరులో డ్రమాటిక్ అసోసియేషన్ స్థాపించి ఆత్రేయ గారి యెన్ .జి.వో నాటికను ప్రాక్టీస్ చేశారు .1955-58కాలం లోవిశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీ మెయిన్ సబ్జెక్ట్ గా ఎడ్యుకేషనల్,సోషల్ అండ్ చైల్డ్ సైకాలజీ మైనర్ సబ్జెక్ట్ లుగా తీసుకొని చదివి1959లో ఏం.ఏ .సెకండ్ క్లాస్ లో పాసైనారు .1960లో గుంటూరు జిల్లా రేపల్లెతాలూకా నల్లూరు గ్రామవాసి కీ శే .పరుచూరి భావ నారాయణచౌదరి ,శ్రీమతి రత్న మాణిక్యమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి సత్య వతి ని వివాహం చేసుకొన్నారు .1960-61లో అమెరికా వెళ్లి మిన్నియాపోలీస్ లోని మిన్నెసోటా యూని వర్సిటి లో ఎడ్యుకేషన్ సైకాలజీ ,స్టాటిస్టిక్స్ లో కొంత కోర్సు వర్క్ చేశారు  .గోపాల కృష్ణ గారు 1961-62లోమాడిసన్ లోని విస్కాన్సిన్ విశ్వ విద్యాలయం లో ఇండియన్ స్టడీస్ కు అనుబంధం గా ఉన్న తెలుగు గ్రంధాలను కేటలాగ్ చేయటానికిసహాయ పడుతూ ,కొన్ని లైబ్రరీ కోర్సులు పూర్తి చేశారు . .1962లో ఇండియా తిరిగి వచ్చికొంతకాలం  .చిరు ఉద్యోగాలు చేస్తూ ,కొంతకాలంనిరుద్యోగి గా ఉంటూ ,కొంతకాలం ఉయ్యూరు కే సి పిలో అతి చిన్న ఉద్యోగం  చేసి,స్థిరమైన రాబడి లేక కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందిపడుతూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ 1968వరకు ఆరేళ్ళు  గడిపారు .

తలపు తట్టిన అదృష్టం  లైబ్రరీ సైన్స్  కోర్స్ -ఉద్యోగం

అదృష్టం తలుపు తట్టగా 1969లో అమెరికా వెళ్లి టెన్నేసిలో   లైబ్రరీ  సైన్స్ లో ఎం..ఎస్..చేసి,,అందరి ఆదరాభిమానాలు పొంది డిగ్రీ తీసుకొనిసంతృప్తి చెందారు .సుమారు ఏడేళ్ళు పడిన మానసిక వేదనకు ,శారీరక శ్రమకు విముక్తికలిగింది . కోర్సులో ఉండగానే  కెంటకీలోని లూవిల్ యూని వర్సిటి లో కేటలాగర్  అండ్  ఇన్ స్త్రక్టర్  ఇన్ లైబ్రరీ సైన్స్ కు ఎంపికై ,పదవీ  బాధ్యతలు చేబట్టారు .అమెరికన్ లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్,న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరి ,ఇతర విశ్వ విద్యాలయాల లైబ్రరీలను సందర్శించారు . .మెషీన్ రీడబుల్ కేట లాగింగ్ కు ఇన్ హౌస్ ట్రెయినింగ్ఇచ్చారు .ఆంగ్లో అమెరికన్ కేటలాగింగ్ రూల్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు .ఆబ్ స్ట్రాక్ట్ ఆఫ్ అకడేమిక్ ప్లాన్ అండ్ బిల్డింగ్ ప్రోగ్రాం కుసహకరించారు .లాంగ్  రేంజ్ బడ్జెట్ ,పర్సనల్ అండ్ రిసోర్సెస్ ప్రొజెక్షన్ కు సహాయకుడిగా సేవలందించారు .యూనివర్సిటి ఆఫ్ లూయీ విల్లైబ్రరి సిస్టం కు టెక్నికల్ సిస్టం అందించటం లో ప్రముఖ పాత్ర పోషించారు . మైనేనిగారి బాస్   ప్రోత్సాహం తో  కేటలాగింగ్ కన్సల్టంట్ గా  1974నుంచి 76వరకు రెండేళ్ళు   యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్ట్ నాక్స్ లైబ్రరీ  ,నేషనల్ ఆర్కైవ్స్ ,సన్స్ ఆఫ్ అమెరికన్రివల్యూషన్ లో 1976-78 వరకుసలహా దారుగా ,కెంటకీ లోని లూయీ విల్ లో ఉన్న లైబ్రరీ ఆఫ్ వరల్డ్ ఫెయిత్  సెంటర్ లో 1980-82 వరకు ఏంతో సంతృప్తిగా సేవ లందించారు .  తనపై బాస్ కున్న నమ్మకానికి ఎంతో కృతజ్ఞత చూపిస్తారు శ్రీ గోపాల కృష్ణ ..,పై ఉద్యోగులచేత ప్రశంసలు,సహోద్యోగుల చేత ఆత్మీయ మిత్రులుగా అభినందనలు పొందారు .1997లో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ స్పెషల్ అసిస్టంట్ టు యూని వర్సిటిలైబ్రేరియన్ గా పదవీ విరమణ చేశారు .

కుటుంబం

మొదటి నుండి సత్యం ధర్మం న్యాయం లపై మక్కువ ఉన్న గోపాల కృష్ణగారు కెంటకీ సదరన్ బాప్టిస్ట్ దియలాజికల్  సెమినరి,ముర్రె స్టేట్యూని వర్సిటీలలో హిందూ ధర్మం పై ప్రసంగాలు చేశారు .లూయీవిల్ యూని వర్సిటి లో రెలిజియన్ స్టడీ డిపార్ట్ మెంట్ ఆహ్వానం పై బౌద్ధధర్మం పై దార్మికోపన్యాసమిచ్చి అందరి మన్ననలు అందుకొన్నారు .అతిధులను గౌరవం గా ఆదరించటం .బాధితులకు సాను భూతిసహవేదనలనుచూపటం మైనేని వారికి తలిదండ్రుల నుండి సంక్రమించిన గొప్ప సుగుణం .గోపాల కృష్ణ దంపతులకు   ఇద్దరు కుమారులు.పెద్దకుమారుడు శ్రీ కృష్ణ –కోడలు శ్రీమతి రమ.మనుమ రాళ్ళు ఛి శ్రేయ ,సెరీన.చిన్న కుమారుడు శ్రీ రవి .కోడలు శ్రీమతి కవిత .మనుమడు ఛికిరణ్ .మనుమరాళ్ళు ఛి రియా ,కరీనా .  మనసాంప్రదాయం ప్రకారం

…

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -26

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -26

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-5 (చివరిభాగం )

‘’తదుక్తం’’ అని మల్లినాధుడు చెప్పిన అలంకార సూత్రాలను డా.పి .ప్రభునాద ద్వివేది తన పి హెచ్ డి ధీసిస్ లో కాళిదాస కావ్యాలపై మాత్రమె ఉటంకించిన విషయాలను ఈ  విధంగా వివరించాడు .

అలంకారం పేరు             ప్రతాపరుద్రీయం లోని కొటేషన్లు                                      కావ్యం పేరు

1-తుల్య యోగిత                ప్రస్తుతానాం తదాన్వేషా కేవలం తుల్య ధర్మతః                   కుమార సంభవం -1-2

ఔపోస్యాం గమ్యతే యత్ర  సమతా తుల్య యోగితా

2-పరిణామ           అరస్యోమాణ రేప్య విషయాత్మనా స్థితం ప్రక్రుతత్యేష యోగిత్వే               ‘కుమార -1-10-

పరిణామ ఉదాహృతః

మల్లినాధుడు ఇందులోని ముఖ్యమైన మాటలే చెప్పాడు

ఆరోప్యామాణస్య ప్రకృతోపయోగిత్వే పరిణామ రతి

3-నిదర్శన             అసభ్యా వద్ధర్మ యోగ దుపమానోపమేయ మెయయోః                          కుమార -1-3-

స్యా నిదర్శనా

4-వ్యతిరేక       భేద ప్రాదాన్యే నోపమాన దుపమేయ స్తాదికయే విపర్యయే వా వ్యతిరేకః                కుమార -1-43

5-కావ్య లింగ     హోతార్వాక్య య పదార్ధత్వే కావ్య లింగ ముదాహృతం                               కుమార -1-48

6-స్వభావోక్తి       స్వభావోక్తిరసౌ చారు యధావద్వస్తు వర్ణనాం                                         కుమార-1- 56

7-ప్రతి వస్తూ పమ   యాత్ర సామాన్య నిర్దేశః ప్రుధవ్యాక్య ద్వయే యది –                                 కుమార -3 -21

చాసౌ విశామలంగమ్యోపమ్యాశ్రితే సా స్యాత్

ప్రతి వస్తూపమా మతా

8-విషమ               విరుద్దే కార్యస్యో త్పతిర్య న్ననార్యస్య వా భవేత్ –విరూపఘటనాచాసౌ        మేఘ -1-5

విశామాలంకే కృతి స్విదా

9-అర్దా౦తరన్యాస  కార్యకారణ సామాన్య విశేషణా౦ పరస్పరం –సమర్ధనం                         మేఘ -1-8

యత్ర సోర్దాన్తర న్యాస ఉదాహృతః

10-స్మరణ       సద్రుశాను భావవా దన్యస్మ్రుతిఃస్మరణాభ్యుచతే                                     మేఘ -11-14

ధ్వని పైమల్లినాధుని భావన

రసానికి ,అలంకారానికి దగ్గర సంబంధమున్న అనేక అలంకారాలను ఉదహరించవచ్చు .సంస్కృత అలంకార శాస్త్రం లో మరొక ముఖ్య విషయం అయిన ధ్వని లేక వ్యంజనం ఉంది .ధ్వని క్షేత్ర సూచన అభిదా అనే సూటి విషయానికి,లక్షణ అనే రెండవ అర్ధానికి  భేదం ఉంది .ఏ సాహిత్య విషయమైనా అది ఇచ్చే సూటి అయిన అర్ధానికి ,లేక ఉపార్ధాన్ని బట్టి మెచ్చుకో బడటం లేదు .సాహిత్య సౌందర్యం స్త్రీ అందాన్ని చెప్పలేక పోయినా అనుభవించ గలిగినట్లు (ప్రతీయమాన౦  ) గా ఉంటుంది .ఈ విధంగా వ్యక్తం చేయగలిగిన సూచననే ధ్వని అంటారు .ధ్వని భావన1-వస్తు ధ్వని-అంటే సత్య లక్ష్యం 2-అలంకార ధ్వని-అంటే ఏదో దానితోతులనాత్మక  పోలిక , 3-రసధ్వని-అంటే ఏదో  భావ లేకఅవ్యక్తానుభూతి  అని  మూడు రకాలుగా  ఉంటుందని చెప్ప వచ్చు ..

సాధారణం గా అలంకారం లో ప్రాధమిక భావన మరియు సూచ్యార్ధం ఉండ వచ్చు .కానిఇందులో ప్రాధమిక భావన ఆది పత్యం వహిస్తుంది .అలాకాకుండా సూచ్యార్ధ లేక ఉద్దేషిత భావం ఆధిపత్యం వహిస్తే పైన చెప్పిన 3 రకాలలో ఏదో ఒక ధ్వని  ‘’ధ్వని ‘’ఉందన్నమాట .కవిత్వం లో ధ్వని అతిముఖ్యమైన కీలక సూత్రం .సుచేతన (కాన్షస్)ఉన్న  వ్యాఖ్యాత ,సౌందర్య భావనలన్నీ తెలిసిన మల్లినాధుడు   .ధ్వనిని చాలా విస్తరించే ఎక్కడ అవకాశం వస్తే  అక్కడ బాహాటంగా బహుళంగా తెలియ జేశాడు అన్నాడు లాల్యే పండితుడు .

శిశుపాల వధ కావ్యం లో ఎవరు నల్లని లేక చెడు మనసుతో ఉంటారో వారు శిశుపాలుని అనుసరిస్తారు ,ఎవరు చీకటి లేక చెడు మనసు లేకుండా శుద్ధ మనస్కత తో ఉంటారో వారు  కోమల కాంతిని అనుసరిస్తారు –‘’యత్ర ధ్వాంతం రజనీముఖ  మనుయాతితహిదితి ,తద్విదితి వస్తునా అలంకార ధ్వని అని మల్లిననాధుడు వ్యాఖ్యానించాడు .ఇక్కడ తమస్ –స్వభావ –ప్రదోష మాటలు ద్వంద్వార్ధ౦   కలవే కాక ,పోలిక ను సూచించేవి .ఇక్కడ ఉన్నది ఉపమాలంకారం ధ్వని ఆధారం గా ఉన్నది .ఒక్కో సారి మల్లినాధుడు శ్లోకం లోని  అలంకార సూచనలను  పక్కన పెట్టేసి ,అక్కడ ఉన్న ధ్వనిని వెలుగులోకి తెచ్చాడు శిశుపాల వధ 4-19 శ్లోకం లో రైవత పర్వత వర్ణన ఉంది .దాన్ని కవి మాఘుడు  శివునితో పోల్చాడు .అది ఆకాశాన్ని కప్పేసి అంతరిక్షానికి ముసుగు గా మారింది .భూమికి చాలా ఎత్తుగా ఉండటం ,దాని శిఖరాలు అత్యున్నతాలుగా ఉండటం వాటిపై చంద్ర కాంతి ప్రసరించి శోభిస్తోంది .-‘’ఆచ్చాదితాయత దిగంబర ముచ్చ కైర్గామ క్రమ్య సంస్తతముదగ్ర విశాల శృంగం –మూర్ధ్ని స్పురత్తుహిన దీధితి కోటమేన ముద్రీక్ష్య కొ భువి న విస్మయతే నగేంద్రం ‘’.

శిశుపాల వధ లోనే మరో శ్లోకం లో పదాలు ఒక స్పష్టమైన అర్ధానికే పరిమితమై ఉంటాయి .కాని మనకు వేరే అర్ధాలు కూడా ఉన్నాయేమో ననే సందేహం కలుగుతుంది .అక్కడ శ్లేష ఉండదు .ఉదాహరణకు ‘’నగేంద్ర ‘’అనే ముఖ్య ‘పదానికి రెండు అర్ధాలు లేవు . విశేషణం ఒకే సందర్భానికి మాత్రమే చెందింది కాకపోవటం వలన అది సమాసోక్తి అలంకారం కాదు .అది తుల్య యోగిత  కాదు కారణం రెండూ ప్రక్రుతంకావు (రైవతం)అప్రక్రుతమైన శివుని ఉద్దేశించినవి .సూటి అర్ధాలు వేరే భావన అంటే శివుడు అనే  కలిగిస్తాయి .కనుక ఇక్కడ ధ్వని ఉందని కనుక ఈ శ్లోకం లో ఏ విధమైన అలంకారం లేదని మల్లినాధుడు వివరించాడు –‘’తస్మాత్ ప్రకణికార్య మాన  పర్యసితాభి ధన్య పరే ణాపి శబ్దేన అర్దాన్తరీకృద్ధ్వని రిత్యాహుః   ‘’అని ధ్వనినే ఇక్కడ మల్లినాధుడు ప్రతిస్టించాడు అని లాల్యే  పండితుడు తెలియ జేశాడు .

తరువాత విద్యాధరుని ‘’ఏకావలి ‘’లో రస, అలంకార విశేషాలను  మల్లినాధుడు  రాసిన తరల వ్యాఖ్యానం లో ఎలా వివరించాడో తెలుసుకొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

4-12-16 న ఆవిష్కరింపబడే632 పేజీల గీర్వాణం -2 ముందు వెనుక కవర్ పేజీలు

geervaanam-2-front-cover geervaanam-2-back-cover

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం –అంకితం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం –అంకితం

మా తలిదద్రులు కీ .శే.శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  ,కీ .శే..శ్రీమతి భవానమ్మ దంపతులకు

నాన్న అమ్మ

మా తండ్రిగారు శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారుక్రీ శ 1900, వికారి నామ సంవత్సరం లో కృష్ణా జిల్లా ఉయ్యూరు లో శ్రీ గబ్బిట దుర్గా పతిశాస్త్రి ,శ్రీమతి నాగమ్మ దంపతులకు జన్మించారు .మాది వైదిక తెలగాణ్య శాఖ . గౌతమస గోత్రం ఆంగీరస ,అయాస్య ,గౌతమ త్రయార్షేయం.మా తాతగారిది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర దెందులూరు మండలం లోని రామారావు గూడెం అగ్రహారం .బాగా స్థితి పరులైనఅగ్రహారీకులు .అక్కడ మాకు ఒక భక్తాంజనేయ స్వామి వారి చిన్న దేవాలయం ఉంది .మా నాన్నగారు జన్మించిన కొద్దికాలానికే తండ్రిగారుచనిపోయారు. ఆస్థికూడా తగ్గి పోయింది .మా నాయనమ్మ నాగమ్మ గారి తండ్రి శ్రీ గుండు లక్ష్మీ నరసి౦హావధానులు గారు ఉయ్యూరు నివాసి.అందుకని మా నాయనమ్మగారు భర్త మరణం తో తండ్రి  వద్దకు  కుమారునితో సహా ఉయ్యూరు చేరారు  .దౌహిత్రుడైన మా నాన్న గారికి,మాతామహులు ఉయ్యూరులోని ఆయన పొలం ,ఇల్లు ,స్థలం రాసి ఇచ్చి అల్లారు ముద్దుగా పెంచారు .మా మామ్మ అక్క చెల్లెళ్ళలో అప్పటికిఎవరికీ సంతానం లేనందున అందరూ మా నాన్నగారిని  అతి గారాబం గా చూసుకోనేవారు .చిన్నప్పటి నుంచే సంగీత ,నాటక,సాహిత్యాలపైపరిచయం బాగా ఉండేది .ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఉయ్యూరు ఆస్థినంతా దౌహిత్రుడుగా మా నాన్న గారికి ,మా నాయనమ్మగారితండ్రి శ్రీ లక్ష్మీ నరసింహా వదానులు గారి ద్వారా సంక్రమించినదే  .ఇది కాక రామారావు గూడెం లో పిత్రార్జితమూ మా నాన్న గారికి దక్కింది .మా అమ్మ గారు శ్రీమతి భవానమ్మగారు గుండు వారి ఆడబడుచు .ఉయ్యూరులో మా ఇంటి ప్రక్కనే ఉత్తరాన వారి ఇల్లు ఉంది .తలిదండ్రులు శ్రీగుండు సింగిరి శాస్త్రి ,శ్రీమతి దుర్గ .మాఅమ్మగారు తన 12 వ ఏటనే మా నాన్నగారిని వలచి వరించటంవలన  ,పెద్దలు  అనుమతి౦ఛి ఇద్దరికీవివాహం జరిపించారు .

చదువు ఉద్యోగం

మా తండ్రిగారు విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై ,బ్రహ్మశ్రీ చెరుకుపల్లి లక్ష్మీ నరసింహ శాస్త్రి మొదలైన గురువులవద్ద వేద,వేదా౦తాలను,కావ్యాలను అభ్యసించి  సంస్కృత ,ఆంధ్రాలలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు .కవిత్వమూ బాగానే అబ్బింది .ఉయ్యూరు లోని సి. బి.ఎం.స్కూల్ లో తెలుగు పండితులుగా కొంత కాలం పని చేశారు .ఆ తర్వాత అనంత పురం జిల్లా లోని హిందూ పూర్ లో ఉన్న ఇ.సి.ఎం.హైస్కూల్ లో  సీనియర్ తెలుగు పండితులుగా చేరి ,22 సంవత్సరాలు అక్కడే పని చేశారు .మా బాల్యం లో కొంత భాగం అక్కడే గడిచింది.మాంచి రేషన్ కాలం లోను పేద విద్యార్ధులకు మా ఇంట్లో వారాలు  ఇచ్చి చదువుకొనే విద్యార్ధులను  ప్రోత్సహించారు .ఇంటి వద్ద ఉచితంగాతెలుగు బోధించేవారు .రాయల సీమ ప్రాంత కవి పండితులైన శ్రీ కల్లూరి సుబ్బారావు మొదలైన వారితో  ప్రత్యక్ష పరిచయం ఉండేది .ఆంద్రప్రాంతం నుండి ఉపన్యాసాలకై హిందూ పురం వచ్చే కవిపండితులకు, గాయకులకు, హరి కధకులకు మా ఇంట్లోనే వసతి ,భోజన సౌకర్యంకల్పించేవారు . ఇలా ఆతిధ్యం పొందిన వారిలో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ ,శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి ,శ్రీ జటావల్లబులపురుషోత్తం ఉన్నారని మా అమ్మ చెప్పింది .నాన్నగారి నాటకం, సంగీతకచేరీలు మహా ఇష్టం .ఎంతదూరమైనా వెళ్లి చూసి వచ్చేవారట .బ్యాడ్మింటన్ బాగా అడేవారట .ప్రసిద్ధ హరికధకులు శ్రీ పిల్లలమఱ్ఱి రామ దాసు గారి హరికధలు నెలల తరబడి హిందూ పూర్ లో జరిగేవి .దీనికినాన్నగారి ప్రోత్సాహమే కారణం అని చెప్పేవారు .హిందూ పుర వైశ్య ప్రముఖులు  గొప్ప వదాన్యులు,వితరణ శీలురు కూడా. వీరందరికీనాన్నగారంటే మహా గౌరవం ..కవి పండితులను ఆహ్వానించి ఘన సన్మానం చేసేవారు .వీటన్నిటికి వెనుక నాన్నగారి చేయూత ఉండేది .

ఉయ్యూరుకు బదిలీ

కృష్ణా జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ గా శ్రీ కాకాని వెంకట రత్నం గారున్నప్పుడు ,మా నాన్న గారిని హిందూ పురం మునిసిపల్ హైస్కూల్ సర్వీస్ తోకృష్ణా జిల్లా జగ్గయ్య పేట హై స్కూల్ కు జిల్లామార్పు ప్రాతి పదిక మీద తీసుకొని వచ్చారు .ఆ తర్వాత ఉయ్యూరు ఉన్నత పాఠ శాలకు బదిలీఅయి ,1954 లో పదవీ విరమణ చేశారు .పిమ్మట తాత్కాలిక ప్రాతిపదికపై ఉంగుటూరు హైస్కూల్ లో రెండేళ్ళు పని చేశారు . రిటైర్డ్ హెడ్మాస్టర్  శ్రీ పుచ్చా శివయ్యగారు  ,శ్రీ అన్నే హనుమంత రావు గారు అనే లెక్కల మేష్టారు కలిసి స్థాపించిన శ్రీ సరస్వతి ట్యుటోరియల్ కాలేజిలో 5 సంవత్సరాలు తెలుగు పండితులుగా పని చేశారు .ఎక్కడ పని చేసినా నాన్న గారు అద్భుతంగా పాఠాలు బోధిస్తారనే పేరుండేది .కృష్ణాజిల్లాలో ఆంద్ర , సంస్కృతాలలో  అంతటి పండితుడు ఆనాడు

…

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -25 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-4

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -25

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-4

కిరాతార్జునీయం లో నిదర్శనాలంకారానికి గొప్ప ఉదాహరణ ఉన్నది .అర్జునుడు ధనుర్బాణాలను  వదిలేసి సన్యాసం తీసుకొంటాను అన్నప్పుడు ఇంద్రుడు చెప్పిన హితం –‘’యాః కరోతి విద్యోదర్క నిః శ్శ్రేయ స్కరీఃక్రియాః –గ్లాని దోషచ్చిదః స్వచ్చాః స మూఢః పంగకచ్చాపః ‘’–అని చెప్పినసందర్భం లో ‘’తన పోరాట పటిమను ప్రదర్శించాల్సిన వాడు విముక్తి కి ప్రయత్నిస్తే చివరికి సర్వనాశనానికి సహాయకారి అవుతాడు ‘’నీటిని శుభ్రం చేయక   అలసత్వం చూపినట్లు అష్కల్మష మనస్కుడు అలసట పొందరాదు ‘’.ఇందులో నిదర్శనాలంకారం ఉందని మల్లినాధుడు గుర్తించాడు .

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండితీ గరిమ చూస్తె మహాశ్చర్య మేస్తుంది .అనంతంగా ఉన్న సమాచారం నుంచి ఉదాహరణలను ఎన్నుకొని  అన్వయించటం బహు కష్టమైన పని .అంతేకాదు ఒకటికంటే ఎక్కువ అలంకారాలు ఉంటె ఈ పని మరీ కష్టమౌతుంది .వాటినన్నిటినీ యాసిడ్ టెస్ట్ చేసినట్లు పరీక్షించి నిగ్గు తేల్చి న్యాయం చేకూర్చి , మరీ ఉదాహరించాడు .దీనికి ఎంతో లోతైన అవగాహన ,పాండిత్యం జమిలిగా ఉండాలి అలా ఉన్నది కనుకనే మల్లినాధుడు వ్యాఖ్యాన చక్రవర్తి అయ్యాడు .కిరాతార్జునీయం 2-31 శ్లోకం లో మరో ఉదాహరణ గమనిద్దాం –‘’అభి వర్షతి యోనృపాలయం విధి వీజాని వివేక వారిణా-స సదా ఫలశాలినీం క్రియో శరద౦ లోక ఇవాధితిస్టతి’’దీనిపై మల్లినాధుడు –‘’సాహసి కరస్య కాకతాలీయ న్యాయేన ఫలసిద్ధిర్వివేక నస్తునియతేతి భావః –అన్న ఫల శబ్దేన సస్య హేతు క్రుతయోరర్ధయో రభే రాభేదాధ్య వసయాత్ శ్లేష మూలాతిశయోస్యోక్తి స్తదను గృహీతా చోపమేత్యను సంద ఏం’’.ఈ సర్గ ప్రారంభం లో యుధిష్టిరుడు ,భీముని రౌద్ర భీమ వచనాలు విన్నతర్వాతకూడా చలించకుండా  శాంతి వచనాలే పలికాడు .తీవ్ర స్వభావమున్నవాడు కూడా విజయం సాధిస్తే ప్రశాంతతకు నిలువ ఎక్కడ ఉంటుంది ?ఈ ప్రశ్నకు ధర్మ రాజు సమాధానం చెప్పాడు –‘’ఎవరు విధి అనే విత్తనాలువివేకమనే జలం తో కలిపి  చల్లుతాడో అతడు శరదృతువులో పంటకు వచ్చినట్లు  ఫలాలను గ్రహిస్తాడు .ఇక్కడ శ్లేషతో కూడిన అతిశయోక్తి అల౦కారముందని చెప్పాడు .ఫలం అంటే పంట అని ,ఫలితం అని రెండు అర్ధాలున్నాయి .ఇవి భేదార్ధం ఉన్నవికావు .వీటిలో భావం ‘’ఫలితం ‘’ఉపమేయంగా ,పంట ఉపమానం గా భావించాలి .అర్ధం చేసుకోవటానికి రెండర్ధాలు తెలియాలికనుక శ్లేష ఇక్కడ ఉన్నట్లు చెప్పుకోవాలి .విధి బీజాని వివేక వారినః పదాలు సందర్భానికి ఉపమేయ ,ఉపమానాలుగా ప్రవర్తిస్తాయి . నిశ్చల పవిత్ర జలాలలో పడవపై వెడుతూ దాన్ని మురికి చేయటం లాగా బలవంతపు సన్యాసం లేక తపస్సు చావుకుకారణ మౌతుంది .ఇందులో ఒక వాక్యం యొక్క అర్ధం వేరొక వాక్యార్ధం పై బలంగా పడింది .వస్తువు కున్న సంబంధం లో ఏకత ఉంది  .మల్లినాధుడు నిదర్శన అలంకారం విషయం లో కూడా ఇలానే చెప్పాడు .సంబంధం లేనివి ఒకదానిపై ఒకటి రెండు విభిన్న వాక్యాలలో ఉండటం చేత ఇది ‘’వాక్యార్ధ వ్రుత్తి నిదర్శనలంకారం ‘’అని వివరించాడు –‘’యత్ర వస్తుసంబందేన ప్రతిబి౦బనం గమ్యతే సా నిదర్శనా ‘’అని తెలియ జేశాడు .

భట్టికావ్యం లో ప్రత్యెక విషయాలు తెలుసుకోవాలి .జయమంగళ వ్యాఖ్యాత ఇందులోని 10 వకాండం లోని అలంకారాలను మాత్రమె గుర్తించి చెబితే మల్లినాధుడు అన్ని కా౦డలలోని అలంకారాల గురించి పూర్తిగా వివరించి చెప్పాడు.సుమారు 25 అర్దాలంకారాలను మల్లినాధుడు నిర్వచించాడు .దీనికి విద్యానాధుడు రాసిన ‘’ప్రతాప రుద్రీయం ‘’నుచక్కగా వినియోగించుకొన్నాడు .కొన్ని అలంకారాలు ముఖ్యంగా 6 అలంకారాలు భట్టికాలం నాటికీ వాడుకలో లేవని చెప్పాడు .అవే కారణ మాల ,కావ్య లింగ ,ప్రతీప ,భ్రాన్తిమాన్ ,సమ ,దృష్టాంత  .భట్టికాలం లో చలామణి లో ఉన్న ‘’విభావన ,సమాసోక్తి , రసవత్ ,ఊర్జవి ,ఆశిష్ ,పర్యాయోక్తి ,వ్యాజస్తుతి ,సమాహిత ,విశేషోక్తి ,హేతు ,కావ్య లింగ ,ఉపమారాపక ,నిదర్శన ,పరి వ్రుత్తి ,ఉత్ప్రేక్ష ,తుల్య యోగిత అలంకారాలను గురించి మల్లినాధుడు పేర్కొనలేదని లాల్యే పండితాభిప్రాయం. 10 వ కాండలో లోని అన్ని శ్లోకాల అలంకారాలు జయమంగళ తెలిపాడు .అలాగే మల్లినాదుడూ చేసాడు .కాని ఈ రెండిలో భేదాలున్నాయి .ఆ తేడాలేమిటో గమనిద్దాం.

భట్టికావ్యం 10-22 శ్లోకం లో ‘’ఆది దీపక ‘’10-24లొ అంతా దీపిక అల౦కారాలున్నాయని జయమంగళ వ్యాఖ్య .కాని అవి కారణమాల ,కావ్య లింగ అలంకారాలని మల్లి నాధుడు గుర్తించాడు .10-40లో ప్రియ అలంకారం ఉందని జయమంగళ అంటే ప్రతీప అలంకారం అని సూరి చెప్పి దానికి తగిన బలమైన సాక్ష్యాలను తెలియజేశాడు –‘’మధుకర విస్తానాం సరసీరుహాణా౦ చోపమానాము యమే యత్వ కల్పపాద నాద్వితీయ ప్రతీపాలంకారః ‘’అని స్పష్టం చేశాడు .అలాగే భట్టి కావ్యం లో నిదర్శనాలంకారాన్ని –‘’వాక్యార్దానాం పరాజయ వాక్యార్దేన సమానాధిక రణ్యా భావాత్ సాదృశ్య క్షేపాద్ బహూనాం మాలయా నిబంధనాచ్చా స౦భవస్తు సంబందో వాక్యార్ధ నిష్టామాలా నిదర్శనా ‘’అంటూ బలంగా చెప్పాడు .మూడు అసాధ్య విషయాలు ఒక చోట చేర్చబడ్డాయి –అవే నీటిపైరాయి తేలటం ,సూర్యుని నుంచి చీకట్లు రావటం ,చంద్రుని నుంచి అగ్ని బయల్దేరటం మరియు మహా పరాక్రమ శాలి అయిన రావణుడిపై విజయం సాధించటం –‘’శిలా తరిష్యదుదకే  న పర్ణా౦ –ద్వాన్తః రవేః .శామ్యతి వహ్ని రి౦దోః-జతా పరేహం యుధి జ్జ్యేష్యమాణాస్తుత్యాని –మన్యక పులస్య నప్తః ‘’.జయ మంగళ ‘’బ్రహ్మ ‘’ను అనుసరిస్తే మల్లినాధుడు అలంకార సర్వస్వ కర్త ‘’రుయ్యకుని’’ అనుసరించాడు .

అలంకార విషయం లో మరో ముఖ్య విషయం గమనించాలి .కొన్ని చోట్ల అలంకార నిర్వచన ప్రస్తావనలో మల్లినాధుడు దాన్ని తాను ఎక్కడనుంచి తెచ్చి చెప్పాడో తెలియ జేయలేదు .అవసరం మేరకు వాక్యాలు ఉదాహరించి ‘’తదుక్తం ‘’అని తేల్చేశాడు .కనుక ఎక్కడో ఒక గ్రంధం  నుంచి దాన్ని పొందాడని గ్రహించాలి .చాలా సందర్భాలలో కర్త పేరు తెలియ జేసినా సూరి ఇలా ఎందుకు చేశాడు అన్నది ఒక పెద్ద ప్రశ్న .దీనికి సంతృప్తి కర సమాధానం చెప్పటం కష్టం అన్నాడు లాల్యే .అయినప్పటికీ ,ఆ ఉల్లేఖనం (కొటేషన్ )చాలావరకు ఏక రీతిగా నే ఉంది .సంకోచం లేకుండా ఈ చర్చలోని అలంకార శీర్షికలకు  కొన్నిపదాలకు ముందే ఉన్న  నిర్వచనాలు విద్యానాధుని ప్రతాప రుద్రీయం నుండి గ్రహించినట్లు భావించాలి .కాకతీయ ప్రతాపరుద్ర చక్ర వర్తి ఆస్థానకవి విద్యానాధుడు అని మనకు తెలుసు …మల్లినాదునికుమారుడు కుమారస్వామి ప్రతాపరుద్రీయం పై ‘’రత్నాపన ‘’వ్యాఖ్యానం రాశాడని ముందే చెప్పుకొన్నాం .

‘’ తదుక్త౦ ‘’ అంటూ ముక్తాయింపు ఇచ్చిన మల్లినాడుడు విద్యానాధుని అలంకారాలను గురించి ఎలాచేప్పాడో తరువాత  తెలుసుకొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -24 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-3

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -24

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-3

పంచ మహాకావ్యాలలో ‘’ప్రతి వస్తూపమాలంకారం ‘’ఎక్కువగా వాడ బడింది .మల్లినాధుడు ఈ అల౦ కారం కని పించిన చోటల్లా విజ్రుమ్భించి  చాలా విస్తృతంగా రాశాడు .అందులో ఒకటి చూద్దాం .శిశుపాల వధ 11-22-‘’ఉపప్లుతం పాతుమదో మదోద్ధతేశ్వమేవ విశ్వంభరం –విశ్వమీశిషె-క్రుతేర్వేః క్షాలాయితుం క్షమతే కః క్షపాతమస్ఖండ మలీమాసం నభాః’’అనే  శ్లోకం లో రెండు వాక్యాలు ఉన్నాయి .అందులో ఒకదాని పై అలంకార ప్రశ్న ఏర్పడింది .’’ఆకాశాన్ని రాత్రి కటిక చీకటిగా మారిస్తే ,దాన్ని పూర్తిగా కడిగేసే సామర్ధ్యం సూర్యునికి తప్ప మరెవరికి ఉంది ?.తరువాత వాక్యం లో ‘’ఓ విశ్వ పాలకా !తీవ్ర మోహా వేశం లో ఉన్న జనాలను నువ్వు తప్ప రక్షించేవారెవరు ?ఈ రెండు వాక్యాలలో సాధారణ విషయం సమర్ధత .ఇది  ‘’ఈషిసే ‘’,’’క్షమేత’’అనే రెండుపదాల చేత ప్రతికూల పద్ధతిలో చెప్పబడింది .కనుక ఇక్కడ అలంకారం ‘’ప్రతి వస్తూపమ’’అంటే విలక్షణ పోలికతో సూచించబడింది .కృష్ణుడికి ,సూర్యుడికి మధ్య సంబంధం సాంకేతికంగా ‘’వస్తు ప్రతి వస్తూభావ ‘’ఎలాగంటే రెండిటిలోనూ ఒకే రకమైన గుణ౦ రెండువిభిన్న  వాక్యాలలో రెండు సార్లు ఆపాది౦పబడింది కనుక .అంటూ వివరణ ఇచ్చాడు సూరి మహాశయుడు .

మరో ఉదాహరణ –కిరాతార్జునీయం 2-8 శ్లోకం’’ విషమేపి విగాహయతే నయః కృత తీర్ధః ప్రయసాభి వాశయః

సతు తత్ర విశేష దుర్లభః సదుపన్యాస్యాతికృత్య వర్తమా యః ‘’లో యుద్ధ తంత్రాన్ని సరస్సు  తో పోల్చాడు భారవికవి .కనుక అందులో పదాల అర్ధాలు అనుమానాస్పదం గా ఉంటాయి .అవి రెండిటికీ వర్తిస్తాయి .కవి హృదయాన్ని విప్పి చెప్పటానికి శ్లోక౦ లోని భావాన్ని మల్లినాధుడు చాలా చక్కగా విశదీకరింఛి తన వ్యాఖ్యాన నైపుణ్యానికి అద్దంపట్టాడు .వాటి అర్ధాలను ఇలా తెలియ జేశాడు-‘’విషమేపి’’ పదం –యుద్ధ తంత్ర విషయం లో ‘’దుర్బోదోపి ‘’అంటే తెలుసుకోలేనంత అని, సరస్సువిషయం లో దుష్ప్రవేశేపి –అంటే చేరలేని ,లేక దుర్గమమైన అనే అర్ధాలు చెప్పాడు . ‘’కృత తీర్ధః ‘’పదానికి క్రుతాభ్యా సాదు పాయః ‘’అంటే-ఎంతో ప్రయత్నం చేస్తే కాని అని యుద్ధ విషయం లోను ,క్రుతజలావతారః అని అంటే దిగటానికి మెట్లు అని  సరస్సు విషయం లోను ,’’కృత్యవర్త్మ’’శబ్దానికి –సంధి విగ్రహాది కార్యం అని యుద్ధ పరంగా ,స్నానాదికం అని సరస్సు పరంగా అర్ధాలు చెప్పాడు .అలాగే’’ సత్సాదు ‘’కు ‘’దేశ కాలాది విరుద్ధం ‘’అని అంటే కాలమాన పరిస్తితులను బట్టి అని రణ తంత్ర పరంగా ,’’గర్త గ్రహ పాషాణాది’’అని అంటే గోతులు ,మొసళ్ళు ,రాళ్ళు అని సరస్సు పరంగా అద్భుతంగా అర్ధాలు చెప్పి కవి హృదయాన్ని గొప్పగా ఆవిష్కరించాడు .ఈ శ్లోకం లో ఉపమా అర్ధాంతర న్యాస అలంకారాలు జోడింప బడ్డాయి అని తెలియ జేశాడు .మొత్తం మీద ఇందులోని చర్చాసార పిండితార్ధాన్ని –‘’యదా కేనాచిత్ కృత తీర్దే వయసి గంభీరేపి ప్రవేస్టారః సంతి తీర్ధ కరస్తు విరలః –తద్వార్నీతావాపి గూఢ మపి  తత్త్వం వ తరి బోద్దారః సంతి .-వక్తా తు న సులభః –అతః ఇయం పఠితామపి సాదు వక్తీతి యుజ్యతే విస్మయ ఇత్యర్ధః ‘’అని ముగించాడు .’’రూడ్ బెర్జెన్ ‘’దీనిపై వ్యాఖ్యానిస్తూ సరస్సులోని లోతైన నీటిలోకి ప్రవేశించాలంటే మెట్లనిర్మాణం  అవసరం .మెట్లు కట్టేవాడు అరుదుగా ఉంటారు .యుద్ధ తంత్రం లో జనం చాలామంది  దాని సారాంశం గ్రహించేవాళ్ళు ఉన్నా కొందరే దాన్ని వివరించగలిగే వాళ్ళు ఉంటారు .కనుక ఇక్కడ ద్రౌపది యుద్ధ విషయం లో యేమాత్రపు శిక్షణ పొందకున్నా యుద్ధ తంత్రాన్ని గూర్చి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది ‘’అని రూడ్ బెర్జేర్ రాసినట్లు లాల్యే పండితుడు పేర్కొన్నాడు

‘’శిశు ‘’లోనే మరొక శ్లోకం లోఅనేక అలంకారాలను కవి గుది గుచ్చాడు .ఖండిత నాయిక ప్రేమికుడిని ఇబ్బంది పెట్టె సన్నివేశం లో ‘’తుమ్మెద సమూహాలు లతలను పరిత్యజించి పుష్పాలను కోసిన స్త్రీలపై పడ్డాయి .అవి ఆ లలితా కోమల పుష్పాలతో మాలలు అల్లే ఆ స్త్రీల చుట్టూ మూగి రొద చేస్తూ తిరుగుతున్నాయి ఇక్కడ పౌరధర్మఅవగాహన అంత ప్రాముఖ్యం పొందలేదు ‘’-ఆశ్లోకం –‘’అవిచిత కుసుమా విహాయ వల్లీర్యువతిషు కోమలమాత్మమాలినీషు –పదముపదదిరే కులాన్యాలీనాం న పరిచాయో మలినాత్మానాం ప్రధానం ‘’ఇక్కడ మలినాత్మనాం దుర్మార్గుడు తనలోని నల్లదనాన్ని కరగిచుకొని అతిక్రమించటం .కనుక ఇక్కడ’’అతిశయోక్తి ‘’ఉన్నది .తేనెటీగల సహజ స్వభావం ఇక్కడ చెప్పబడింది .మలినాత్మ పదానికి నలుపు అని కౌటిల్యం లేక దుష్టత్వం అనే రెండు అర్ధాలు ఉండటం వలన అతిశయోక్తి ఉన్నందున రెండు అలంకారాలు ప్రత్యేకంగా ముఖ్యమైనది ,దానిపై ఆధార పడిందీ  ఉండటం వలన ‘’సంకర అలంకారం ‘’అయిందని –‘’అత్ర మలినాత్మనా మితి కృష్ణాంగారస్య దుస్ట చిత్తత్వేన సహభేదాధ్యాసా యేనార్ధాంతర న్యాసస్తాపనం శ్లేష ప్రతి బౌద్ధాపి తాతిశయోక్తానుప్రాణితోయామితి ‘’సంకరః ‘’అని తేల్చాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-12-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -23 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-2

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -23

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-2

అలంకారాలను కలిపే విషయం లో మల్లినాధుడు స్పష్టమైన వివరణలిచ్చాడు .శిశుపాలవధ -1- 89 శ్లోకం లోకంసుని ఇతర రాజులను లేడి తో పోల్చిన సందర్భం లో  ఉన్న అలంకారం ,’’శ్లిష్ట పరంపరిత రూపకం ,ఉపమాలంకారం తో కలిసిన మిశ్రమాలంకారం అని చెప్పాడు మరొక వాక్యం లో సింహం హరి(కృష్ణ ) రూపం లో ఉన్నదని చెప్పాడు.మరో చోట రాక్షసులు ఏనుగులు అన్న శ్లోకం లో రూపకాలంకారం ఉందన్నాడు .అసురపై ద్విశ  అధ్యారోపణ ,హరి(సింహం ) పై హరి (కృష్ణ )ను అధ్యారోహణ౦ చేసినప్పుడు శ్లేష లో  చెల్లుతుందని చెప్పాడు .ఇలాంటి సంకర అలంకారాలను మొదటి సారి లోకం దృష్టికి తెచ్చినవాడు మల్లినాదుడే .

ప్రామాణిక అలంకార శాస్త్రం లోస్పష్టంగా నిర్వచించ బడిన  చెప్పబడిన అలంకారాలను మల్లినాధుడు గుర్తించి ముఖ్య మైన అలంకారాలను వివరించాడు .కొన్ని ఇతర అలంకారాలు ఉంటె అర్దాలంకార ,శబ్దాలంకారాల సంసృస్టిలేక రెండూ గా భావిస్తూ మరిన్ని అలంకారాలను ఆయన గుర్తించి చెప్పాడు .కిరాతార్జునీయం -4-41  శ్లోకం –‘’భవ కీతయే హత వ్రుహంతమసమవబోధ పారి రజసః శమనం –పరిపీయ మాణానివ వో సకలే స్వసాదమే తినాయనా౦జలిభిః’’’’ లోని అలంకారం విషయం లో అందులో 1-శ్లిష్ట రూపక 2-రూపక 3-ఉత్ప్రేక్ష 4-సంకర అనే నాలుగు అల౦కా రాలున్నట్లు గుర్తించాడు  .  ‘’అవబోధ వారి ‘’శబ్దం లో  రజస్అంటే దుమ్ము అయితే వారి అంటే నీరు అయి ప్రాముఖ్యం పొందింది అన్నాడు  .దుమ్ము కుదుటబడటాన్ని’’సామన ‘’శబ్దం రూపకం గా సూచించిందని చెప్పాడు .భారవికవి అవబోధ జలాన్నివనదేవతల దోసిలి అనే  కనులు తాగాయని ,వివరించాడు ఇది ఉత్ప్రేక్షాలంకారమే నని కారణం రెండూకూడా స్వతంత్రమైనవే అని ఇక్కడ అలంకారాలు సంస్రస్టి చెందాయని తెలిపాడు ..మరో చోట పరిణామ ,రూపక అలంకారాల మధ్య తేడాను స్పష్టం చేశాడు .’’రూడ్బెర్జెన్ ‘’మహాశయుడు మల్లినాద  అనతరంగాన్ని విశ్లేషించి చెప్పినదాన్ని ఇక్కడ తెలుసుకొందాం –‘’యత్ర ప్రకృత కార్యోపయోగితాయ విషయ విషయ్యాత్మనా పరిణమితిస పరిణామాలంకారః  ‘’–‘’ఏకావలి పై వ్యాఖ్య రాస్తూ మల్లినాధుడు తరువాతి దానిపై ఒక విషయం ఆరోపిస్తేఅక్కడ విచారణలో ఉన్న  విషయం ఉపయోగపడేది అయితే అది ‘’పరిణామ అలంకారం ‘’.ఇలాంటి సందర్భాలను వివరిస్తూమల్లినాధుడు రూపక ,పరిణామ అలంకారాల మధ్య భేదాన్ని విద్యా చక్రవర్తి భావాలను బట్టి వివరించాడు  .ఏకావలి పై త్రివేది  రాస్తూ శిశుపాల వధలోని అనేక ప్రకరణాలను ఉదాహరించాడు .మల్లినాధుడు విద్యాధరుడు చెప్పిన పరిణామాలంకారాన్నే ఎన్నుకొన్నాడు ‘’అని చెప్పాడు .

ఇప్పుడు మల్లినాధుడు  చర్చించిన  మరికొన్నిఅలంకారాలను చూద్దాం .మహా కావ్యాలలోని ‘’సమాసోక్తి ‘’అలంకారాన్ని చాలా నేర్పుగా వివరించాడు .శిశుపాల వదలోని రాత్రి వేళ కలువల  అందాన్ని వర్ణించే సందర్భం లోకవి  ‘’చంద్రుడు కలువలతో  తెల్లారేదాకా సయ్యాటలు ఆడాడని ‘’చెప్పాడు .అతని చేతులు అంటే కిరణాలు పడమటి వైపుకు సాగిపోతూ వాటిపై విశ్రమించాడు .చంద్రునికి అలసట వచ్చి వివర్ణుడయ్యాడు.చంద్రుని చర్యలు దక్షిణ నాయకత్వాన్ని తలపిస్తాయి .రెండర్ధాల విశేషణాలను వాడటం వల్లనే ఇది సాధ్యం కనుక ఇది ‘’సమాసోక్తి ‘’అల౦కారం అని స్పష్టం చేశాడు .దీనిపై మల్లినాధుడు అతి విస్పష్టం గా విశ్లేషించి చెప్పాడు –శిశుపాల వదలోని 11-22 శ్లోకం –‘’ఉపకుముదవన దీహాస కేళి ప్రసంగా-దధి కరూది రశేశా ప్యుషాం జాగరిత్వా –ఆయమపర దిశో౦కే ముజ్వతి స్రస్త హస్త –శిశియిషురివ పాండుం మ్లానమాత్మా ని మి౦దుమ్’’.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1 of 18,439 Print all In new window — వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -22 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -22

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ

అలంకార శాస్త్రం లో మహా పాండిత్య గరిమ ఉన్న మల్లినాధుడు ,తాను వ్యాఖ్యానించిన పంచ మహాకావ్యాలలోని ప్రతి శ్లోకం లో ఉన్న అలంకార వైభవాన్ని వివరించాడు .తాను చెప్పిన అలంకారాన్ని సమర్ధించే అలంకార శాస్త్ర సూత్రాలను చెప్పి ,ప్రత్యామ్నాయాలను కాదనటానికి స్పష్టమైన కారణాలు తెలియ జేశాడు .దీనికి చాలా ఉదాహరణలు ఇవ్వ వచ్చు .అందులో మహా కావ్యాలలోని కొన్నిటిని  మాత్రమే  తెలుసుకొందాం శిశుపాల వధ 2-42 శ్లోకం  –‘’విధాయ వరం సమర్షె నరోరై చ ఉదాసతే –ప్రక్షిప్యోదర్చిషం కక్షే రోరతేతేభి మారుతం ‘’పై చేసిన వ్యాఖ్యలో ‘’ఆగ్రహించిన శత్రువు తో శత్రుత్వం ప్రాముఖ్యం లేక మార్పు లేని విధంగా ఎదురుగాలిలో నిలవటంలా ఉంటుంది’’ .అన్నాడు శిశుపాల వధ లోనే మరో శ్లోకం లో నిదర్శన అలంకారం ఉందని ,మొదటి వాక్యం లో చెప్పబడిన మనుషులు ,రెండవ వాక్యం లోనూ ఉన్నారని –‘’విశిస్టో దాసీ న్యశయ నయోచాక్యర్ధ యోర్నిర్దిస్టే కత్వా సంభవాత్ –సాదృశ్య లక్షణా యమ సంభ ద్రర్తుసంబందో వాక్యార్ధనివ్రుత్తిరితి నిదర్శనా చేద్’’అని వ్యాఖ్యానించాడు .కనుక ఇక్కడ అలంకారం దృష్టాంతాలంకారం కాదని ,అది రెండువిభిన్న వాక్యాలున్నప్పుడే ,వస్తు ప్రతిబింబం రెండు వస్తువుల మధ్య ఉంటేనే అవుతుందని ,కాని ప్రస్తుత విషయం లో ఇక్కడ ఒకే ఒక వాక్యం మాత్రమె ఉందని  కనుక దృష్టాంతం కాదని స్పష్టం చేసి దానికి బలంగా అలంకార సూత్రాన్ని తెలియ జేశాడు.

శిశుపాల వధ 2-109  శ్లోక వ్యాఖ్యలో దీపకాలంకారం అందులో ఉందని ,దానికి కారణం  బుద్ధి ,కర్మ ,మానస లలో సమాన లక్షణాలున్నాయని ,కాని ఇవి అసంబద్ధంగా ఉన్నాయని సూచించాడు .ఈ సమాన లక్షణం రెండిటిమధ్య పోలికను ఉపమేయ ,ఉపమానాలుగా సూచిస్తుందని అన్నాడు –‘’వాక్య భేదేన ప్రతిబింబ కారణాక్షేపే తస్యో త్ధా నాత్ –అత్ర తు వాక్యార్దేవాక్యార్ధ సమారోపాద్ వాక్య యేవాక్యతయాం తద్భావ ఇత్యలంకార సర్వస్వకారాః’’అని చెప్పాడు అలంకారాలలో ఉన్న రకాలను గురించి చెప్పటం లోమల్లినాధుడు మహా దిట్ట అన్నాడు లాల్యే .శిశుపాల వధలో అర్దా౦తరన్యాస అలంకారాన్ని గుర్తించి ,కారణం వలన ఫలితం రూఢి అయిందని అన్నాడు ఇందులోకారణం కొందరికి స్వీయ గౌరవమే సంపద అని భావిస్తారు .అందులోనే మరో శ్లోకం లో అర్దా౦త రన్యాసం’’సతీవ యోసిత్ ‘’అనే  ఉపమానం పై ఆధారపడి౦దని –‘’మారని ప్రవ్రుత్తి వ్యక్తిని అతనిభార్య లాగా ఇతరలోకాలలో కూడా అనుసరించే ఉంటుంది ‘’అని చెప్పాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-16- ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -21

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -21

మల్లినాధుని ధనుర్వేద  పాండిత్యం

వ్యాఖ్యానాలలో అక్కడక్కడ మల్లినాధుడు ధనుర్విద్య పై తనకున్న పాండిత్యాన్ని తెలియ జేశాడు .కామ భంగిమను వివరిస్తూ దాన్ని గుర్తింఛి దానికి ఒక సాంకేతిక నామాన్ని పెట్టాడు .విలు కాడు బాణం సంధించేటప్పుడుసాధారణంగా అయిదు రకాల భంగిమలను ప్రదర్శిస్తాడని సూరి చెప్పాడు .కుమార సంభవం లో కాళిదాసు చెప్పిన భంగిమ ‘’ఆలీఢ కామ ‘’భంగిమ అని అప్పడు ధనిష్కుడు పిడికిలి బాగా బిగించి పట్టుకొంటాడని వివరించాడు –

మల్లినాధుని అపార వ్యాకరణ పాండిత్యం

మల్లినాదునికి వ్యాకరణ శాస్త్రం పై అపారమైన పాండిత్యం ఉంది .కవుల ప్రయోగాలను శాస్త్ర రీత్యా నిగ్గు తేల్చి చెప్పాడు .కిరాతార్జునీయం లో ‘’అర్ధ గౌరవం ‘’అనే పదాన్ని ఉపయోగించాడు .పాణిని సూత్రం ప్రకారం నాణ్యతను తెలియ బరచే పదం షష్టీ విభక్తి తో సమ్మేళనం చేయ కూడదు .కానీ మల్లినాధుడు   గుణం లేక వేరొక వస్తువు లేక విషయం సందర్భం లో  సమ్మేళన పద౦గా వాడకూడదని పాణిని సూత్రం నిషేధించిందని చెప్పాడు .కాని గుణాన్ని మాత్రమె చెప్పే సందర్భం లో దానికి నిషేధం లేదని స్పష్టం చేశాడు .మల్లినాధుడు సాధారణం గా ముందు పదాన్ని సమర్ధించి చెప్పి తర్వాత పాణిని సూత్రాన్ని లేక సూత్రాలను  ఉటంకి౦చి ఆ పదాన్ని సమర్ధిస్తాడు .అన్ని వ్యాఖ్యానలలోను ఇదే  విధానాన్ని  సూరి కొనసాగించాడు అని ప్రమోద్ గణేష్ లాల్యే పండితుడు అభిప్రాయ పడ్డాడు .

కిరాతార్జునీయం లో ‘’గత్వరైః’’పదాన్ని-గత్వరైః-గమనశీలైః-అస్తిరే ‘’అంటూ   మల్లినాధుడు వివరించి చెప్పాడు .అందులోనే ‘’దుర్వచనం ‘’అంటే ‘’వక్తు మవశక్యం ‘’అని అర్ధం చెప్పాడు అంటే చెప్పటానికి వీలు కానిది అని అర్ధం .’’నాగాధిపస్య ‘’పదం  షష్టీ విభక్త్యంతం గా శేషుని గూర్చి చెప్పబడిందని సమర్ధించాడు .క్రద్యోగవలన ష స్ట్య౦తం కాలేదని ప్రాధమిక ప్రత్యయం క్రుదంతం వల్ల అయి౦ద న్నాడు .పాణిని చెప్పిన నిషేధం ఇక్కడ పనికి రాదనీ చెప్పాడు .పాణిని సూత్రాలతో వ్యాకరణ విశేషాలను పెక్కింటిని మల్లినాధుడు వివరించాడు .కవిఉపయోగించిన గ పదాన్ని పాణిని సూత్ర సాధన చేత సమర్ధించి చెప్పాడు .ఎక్కడ పాణిని సూత్రం చెప్పాడో చెప్పలేని పరిస్థితి  ఉంది .కొన్ని నమూనాలను చూద్దాం .’’పారితో నికేతాన్ ‘’అనే శిశుపాల వధ లోని   పదం లోని విభక్తి విషయం లో పాణిని సూత్ర వార్తికం’’ అభితః పరితః ఇత్యాదినాద్వితీయా’’  ద్వారా సమర్ధించాడు .’’అవతస్తరే ‘’పదం విషయం లో పరిపూర్ణ కాలం (పెర్ఫెక్ట్ టేన్స్ )లో గుణం మారి పునరావృత్తి అయి ‘’స ‘’లోపిస్తుంది –‘’అవతస్తరే –స్త్రుణాతేః కర్తరి లిట్ –కృతశ్చ  సంయోగాదేర్గుణాః’(పాణిని )లింగ జన్జ్హోర్నలోపశ్చ శర్పువాఃరావయః (పాణిని  ) ఇత్యభ్యాసః సకారలాపశ్చ ‘’ అనే సూత్రాన్ని చెప్పాడు .రఘు వంశం లో లఘు అనేది రఘు గా మారుతుంది అని తెలియ జెప్పటానికి ‘’ఇత్య ప్రత్యయే వాలమూల లఘ్వలమంగుగులీనాం కాలే రత్వ మాపద్యతే ఇతి వైకల్పికె రేఫాదేశే రఘురితి రూపం సిద్ధం ‘’అని వివరించాడు .అలాగే మధు శబ్దానికి పుంలింగ రూపాన్ని –‘’అర్ధస్చ పుమ్సిచః ఇతి పుమ్లింగతా ఉక్తంచ మకరందస్య మద్యస్య మక్షికస్యపి వాచకః అర్ధర్చాది గణే పాఠాత్పుం నపు౦సకయోర్మధుః’’సూత్రం తో తెలియ జేశాడు .సమాసాంత పదం లాగా శిశుపాల వధ లోని ‘’ఆపధ’’పదం ఏర్పాటును దాని నపుంసక లింగాత్వాన్ని మరో సూత్రం తో సమర్ధించాడు –‘’ఆపద –పధోవిభాషాం –ఇతి నిషేధ వికల్పాత్ శ్రుక్పూ ఇత్యాదినా సమాసాంతః ఆపదం నపు౦సకం ఇతి నపు౦సకత్వాత్’’అనే సూత్రం తో సాధించి చెప్పాడు .

కొన్నిపదాల వ్యాకరణ నిర్మాణాన్నివివరించటానికి  మల్లినాధుడు  ఎన్నో సూత్రాలను తెలియ జేశాడు .అవసరమైతే ఒకటికంటే ఎక్కువ సూత్రాలను చెప్పి పదనిర్మాణ రహస్యాన్ని విప్పి చెప్పాడు .కొన్ని అసాధారణ పదాల ఏర్పాటును వివరించటానికి పాణిని సూత్రాలపై తనకున్న పట్టు తో నిరూపించాడు .వీటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకొందాం .

1-‘’విశ్వద్రిచి ‘’పదం విషయం లో చివరి అచ్చు తర్వాత వచ్చే హల్లు   ‘’విశ్వన్ ‘’మరియు’’ దేవ’’లసర్వ నామం అవుతుంది .  , దానిని ఏ ప్రత్యయం ఆశ్రయి౦చనప్పుడు దానికి బదులుగా  ‘’అద్రి ‘’వస్తుంది .పదం అదనంగా ఐ ను గ్రహించి’’ అ ‘’కు లోపం కలుగుతుంది అని చెప్పాడు –‘’విశ్వగ్దేవ యో శ్చ టేరధ్రన్చా తావ ప్రత్యయే ‘’పాణిని-6-3-92  –ఇతి దేరత్రాదేశా ‘’

‘’దారోజతే రూప సంఖ్యానాత్ ఉగితశ్చ’’-పాణిని 4-1-6 ఇతి దీమ్పు ‘’ఆచ’’-పాణిని 6-4-138

‘’ఇత్యకార లోపే ‘’చై ‘’-పాణిని-6-3-138

2-‘’తురసత్ ‘’పదా విర్భావాన్ని వివరిస్తూ పాణిని సూత్రాలను ‘’క్విప్ ‘’ను తొలగించి ర ను దీర్ఘం’’ రా’’చేసే సూత్రం చెప్పాడు –‘’తురాషట్ –‘’సహా తే శ్చోరాది కత్వాత్ క్విప్ –నహి వ్రుత్తీ-త్యాదినా ‘’-నైషధం -3-95

‘’పూర్వ పదస్య దీర్ఘః ప్రకృతి గ్రహేణ ణ౦తస్యాపి గ్రహ పాత్ ముగ్ధ శబ్దస్తు తురా శబ్దం టాబంత మాహ’’

3-మల్లినాధుడు ‘’అక్షి ‘’శబ్దం ‘’అక్ష ‘’గా మారటాన్ని వివరిస్తూ ,రఘు వంశం లోని  ‘’కాతరాక్షి’’లోని  చివరి ‘’ఐ ‘’అ గా మారటానికి రెండు సూత్రాలు పేర్కొన్నాడు –‘’కాతరాక్షీ బహువ్రీహో సవ యక్ష్మోః స్వండాత్షచ్ ఇతి షచ్ –షిద్వేరాదిభిశ్చఇతి దీమ్ష్ ‘’

4-కాళిదాసు ‘’ఘటోద్ని’’పదాన్ని గోవులకు విశేషణంగా  వాడాడు .’’ఉధాస్ ‘’అనేదాని బదులు ‘’అనం ‘’వచ్చి సమ్మేళన పదం బహువ్రీహి సమ్మేళనపదం అవుతుందని చూపించాడు –‘’ఘటా ఇవోదాంసి యాసం తా ఘటోద్రీః’’-ఊఘ సొ నండ్ఇత్య తండా దేశః –బహువ్రీహే రూఢసోడీమ్ష్’’

నైషద చరిత్ర లోని ఒక వాక్యం పై వ్యాఖ్యానిస్తూ సాధ్యమైన అన్ని అర్ధాలను తెలియ జేశాడు .’’హాన్దిక్వి పండితుడు దీన్ని అనువాదం చేసి అందించాడని లాల్యే పండిత ఉవాచ .ఇంద్రుడు శుభాంతంకోసం   నలునిలాగా ,చివరికి అసలైన నలుడిగా మారటం అంతా అతని కపట స్వభావమేనని మల్లినాధుని తీర్పు .-‘’కిం స్తానిషద భావ మదంత దృష్టం తాద్రుక్ కృత వ్యాకరణాః  పునః సః’’(నైషదీయం -10-136).ఇంద్రుని నలుని పాత్ర ధరించినా, నలుని శీల పవిత్రతను వ్యక్తం చేయలేక పోవటానికి కారణం అదే .’’గౌరీ ‘’అంటే తెలుపు అని హరిణి అంటే దుప్పి అని చెప్పి వన సంచారులైన వాటి పేర్ల విషయం లో తానేమీ కల్పించుకోనని చెప్పాడు .-‘’తస్య ఆలూ సంబందినః కార్యస్య హొతోః తదర్ధం దృష్టం నిషిద్ధం సయాని వద్భావం స్యాని వదాదేశోనల విధౌ –(పాణిని )-ఇత్యేనాల్ సంబందికయే శయని వదాదేశస్య నిషేషాది తి భావః కిం కద మదంత ఇతి అహో ఆశ్చర్యం అన్యాచ్చ ‘’

‘’తాద్రుకృత కరణాః తయాకృత   సంస్కారః  స ఇత్యయం శబ్దః స్వస్వకీయం ఆదేశం విదాయేతి ఖండీ విశ్లేషణాః త్యదాధత్వం ప్రాప్యేత్యర్ధః నానలః కార్యస్య హేతోః ఆలూ అక్షిత అలమ్ఘ్యాదిల క్షణస్యాని కార్యార్ధం కిం ఇతి దుస్టమలావిదావితి ప్రతి శేష దనుపంన్నం సయాని వభావ మదంత ?అహో విరుద్దామిత్యర్ధః ‘’లతో సమర్ధించాడు .

న్యాస,న్యాసోద్ధూత ,వామన అనే ప్రసిద్ధ వ్యాకరణ శాస్త్ర వేత్తల రచనలనుండి తన అభిప్రాయాలకు బలం చేకూర్చటానికి మల్లినాధుడు ఉదాహరించాడు .పాణిని సూత్రాలను పేర్కొనటం తో తనపని అయి పోయిందని సంతృప్తి పడకుండా ,ఆ సూత్రాల బలం చాలక పొతే ,తరువాత కాలపు వ్యాకరణ శాస్త్ర వేత్తల అభిప్రాయాలనూ ఉటంకించి తనవాదనకు బలం చేకూర్చుకొన్నాడు.రఘు వంశం లోని ‘’అరిహ ‘’శబ్ద విచారణ చేస్తూ మల్లినాధుడు ‘’అరి హణో రిపుద్రాః హంతేః క్విప్బ్రహ్మ భూణ వృత్రేషు క్విప్ ఇతి నియమస్య ప్రాయిక్త్వాత్ –యయాహ న్యాస్కారః  ప్రాయికశ్చాయం నియమః క్వచిదన్యాస్తి భూప పదేదృశ్యతే మధుహా ప్రాయిక్త్వం చ వశ్య మానశ్చబహుళ గ్రహణ స్య పురస్తాదప ‘’సూత్రాన్ని చెప్పాడు .

మల్లినాధుడు అనేక సంక్లిష్ట పదాలను వామన సూత్రాధారం గా రద్దు చేశాడు .ఉదాహరణకు –‘’అగ్ర పాదః ‘’-దీనిపై వివరిస్తూ సూరి –‘’కర్మ ధారయ సమాసః హస్తాగ్రహ స్తదాయో గుణ గుణినోర్భేదా భేదాభ్యా౦ ఇతి వామనః ‘’అని (కుమార సంభవం7-58)  పేర్కొన్నాడు .’’శరణాభవం’’అనే మేఘ సందేశ 1-45 శ్లోక పదాన్ని వివరిస్తూ ‘’శరవణాభవం’’-‘’అవర్జ్యో బహువ్రీహి ర్వ్యదికరణే జన్మాదుత్తర పద ఇతి వామనః ‘’అంటూ వామనోదహరణ నిచ్చాడు .

ఈ విధంగా మల్లినాధుని వ్యాకరణ పరిజ్ఞానం అవధులు లేనిదని రుజువవుతోంది .

తర్వాత మల్లినాధుని ‘’అలంకార శాస్త్ర విజ్ఞానాన్ని ‘’తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -20- సంగీత నాట్య శాస్త్రాలపై మల్లినాధుని ప్రజ్న

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -20-

సంగీత నాట్య శాస్త్రాలపై మల్లినాధుని ప్రజ్న

సంగీత శాస్త్రం పై మల్లినాదునికి లోతైన అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది .కుమార సంభవం లోని -1-4  శ్లోక వ్యాఖ్యానం లో ‘’తానం ‘’ను చక్కగా నిర్వచించాడు .తానం అనేది ముఖ్య స్వరం(మాస్టర్ టోన్) అని అందులోనుంచే విభిన్న స్వరాలు జనిస్తాయని నిర్వచించాడు .’’తాన ప్రదాయిత్వా నివోపమ౦తుం ‘’అనేదాన్ని వివరిస్తూ మల్లినాధుడు ‘’తానో నామ స్వగంతర ప్రవర్తకో రాజస్యితి ప్రవ్రుత్త యాది హేతురం శాపరణామ వంశ వవాద్య సాధ్యః –ప్రధాన భూతః స్వర విశేషః ‘’అని నిర్వచించి అభినవ గుప్త ,భరతుల వాక్యాల తో సమర్ధించాడు .మరొక సాంకేతిక పదం ‘’మూర్చన ‘’ను కూడా’’’’స్వరానా మారోహక్రమః మూర్చనా ‘’అంటూ గొప్పగా నిర్వచించాడు .- నాటకాలపై నిర్దుష్టంగా చెప్పిన దశ రూపకం లోని కొన్ని పంక్తులను ఉదహరించాడు .అదే శ్లోకం లో ‘’విభ్రమ ‘’కు ఉన్న అర్ధాన్ని దశ రూపకం నుంచి తెలియ జేశాడు .ఇది అదనపు అర్ధం  మాత్రమే-‘’-‘’అప్సరసాం విభ్రమ మండనాని విలాసాలంకరణా ని ‘’-అదవా విభ్రామో విపరీత న్యాసః –‘’విభ్రామత్వ రయా కాలే భూషాస్థానం విపర్యయః ‘’ఇతి దశ రూపకాత్ ‘’.మల్లినాధుడు రాగు వంశం లోని ‘’కరణ ‘’అనే ప్రత్యేక పదానికి అదొక ప్రత్యేక రకమైన ‘’తాడితం ‘’(బీట్ )లేక కాల స్థితి (టైమింగ్ )అని అర్ధం చెప్పాడు .దీన్ని సమర్ధించటానికి పెద్దగాప్రచారం లో లేని ‘’రాజ కందర్ప ‘’లోని –‘’కరణోస్థాలం  వ్యవస్తాపకే స్తానా  విశేషేః –తదుక్తం రాజ కదరా పేణ నృత్య వాదిత్వ గీతానాం ప్రయోగ వశ భేదినాం –సంస్యానం తాడనం రోధేః కారణాని ప్రచక్షతే ‘’శ్లోకాన్ని ఉదాహరించాడు .

శకున , సాముద్రిక  శాస్త్రాలపైనా  మల్లినాధుని అవగాహన

తన వ్యాఖ్యలలో శకున శాస్త్రాన్ని విస్తృతంగా ఉదహరించాడు .దీనినే సాముద్రిక శాస్త్రంగా కూడా పేర్కొన్నాడు .కాళిదాస కావ్యాలలో అనేక నమ్మకాలున్నాయి ఇవే తరువాత కాలం లో బాగా కొనసాగాయి .కొన్ని ఉదాహరణలు చూద్దాం -1- ఆమ్రకూట పర్వతం పై మేఘ౦  ఎందుకు విశ్రాంతి తీసుకొంటుంది ?అంతకు ముందు మేఘానికి మిత్రుడు ఎవరు?దీనికి ‘’నిమిత్తానందన ‘’సమాధానం ఏమిటి అంటే –యాత్రికుడు ప్రయాణకాలం లో సంతోషంగా ఉండాలి కనుక .మొదటి విశ్రాంతి సమయం లో ఆనందంగా ఉంటె ప్రయాణం అంతా సుఖ ప్రదం –దీనికి  సమర్ధన నిమిత్త నిదానం లోని ‘’-ప్రధమావసయే యస్య సౌఖ్యం తస్యాఖిలే హిని –శివం భవతి యాత్రాయాన మన్యదాత్వ శుభం ధృవం ‘’శ్లోకమే చాలు .

మేఘ దూతం లో శరీర భాగాలలో వచ్చే బాధలకు కారణాలను కూడా ‘’నిమిత్త నిదానం’’ ఆధారంగా చెప్పాడు-‘’స్పందానూన్మూర్ధ  . చత్రలాభం లలాటే పట్ట మంశుకం –ఇష్ట ప్రాప్తిం ద్రుశో రూర్ధ్వ మపా౦గే హాని మాది శేత్ ‘’.జ్యోతిషం లో ఉన్న సాముద్రికం నుంచి కొన్ని శ్లోకాలను చెప్పాడు .ఎర్రని కాలి  వేళ్ళున్న స్త్రీ చాలా అందంగా ఉంటుందని ,పాదం ము౦దు భాగాలు ఎత్తుగా ఉండి మడమలు కనపడకుండా ఉన్న స్త్రీలను రాజులు బాగా ఇష్టపడతారని సాముద్రిక శాస్త్రం ఆధారంగా మల్లినాధుడు –‘’అత్ర సాముద్రికా –యస్య రక్త తలో పాదావున్నతాగ్రే తల స్ప్రుశౌ –నిగూఢ గుల్ప్తౌ నిహతౌ సా స్యానృపతి  సమతా’’అనే శ్లోకం ద్వారా  కుమారసంభవ వ్యాఖ్యలో చెప్పాడు –అందమైన పలువరస ఉన్నఅమ్మాయి మరింత అందంగా ఉంటుందని సాముద్రికం ఆధారంగా తెలియ జేశాడు .అందమైన సౌస్టవమైన  ప్రక్కప్రక్కనే వరుసలో ఉండి మధ్యలో ఖాళీలు లేకుండా  చివరలు కోణాలుగా ఉన్నపలువరుస కలిగిన స్త్రీముందు  ప్రపంచం అంతా మోకరిల్లుతుందని సూరి చెప్పాడు—‘’యదుక్తం సాముద్రికే –‘’స్నిగ్ధాః సమాన రూపాః సుపంగత్వం శిఖరిణా శిలస్టాః-దంతా భవంతి యస్యాం తస్మాం పాదే జగత్  సర్వం ‘’.అంతే కాదు తాంబూల సేవనం తో దంతాలకు విపరీతమైన కాంతి లభిస్తుందని మేఘ దూత వ్యాఖ్యలో –‘’తాంబూల రస రక్తోపి స్పుట భాసః సమోదయః-దంతాః శిఖరిణౌ యస్యా దీర్ఘం జీవతి తత్ప్రయః ‘’అనేశ్లోకం ద్వారా  తెలియ జేశాడు మల్లినాద సూరి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

2016 డిసెంబర్ ”తెలుగు వెలుగు ”లో న రచన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”పై డా .టి .శ్రీరంగ స్వామి సమీక్ష

2016 డిసెంబర్ ”తెలుగు వెలుగు ”లో న రచన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”పై డా .టి .శ్రీరంగ స్వామి సమీక్షdarshaneeya

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

27-10-16ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టు కింద శ్రీ సత్యనారాయణ వ్రతం ,బంధు మిత్రులతో వన భోజనం –2

27-10-16ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టు కింద శ్రీ సత్యనారాయణ వ్రతం ,బంధు మిత్రులతో వన భోజనం –2వన భోజనం –2

 

వన భోజనం –1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -19 ఇతిహాస పురాణాలపై మల్లినాధుని పట్టు

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -19

ఇతిహాస పురాణాలపై మల్లినాధుని పట్టు

మల్లినాధ సూరి మహాకావ్యాలు ఇతిహాసాలు అయిన రామాయణ ,మహా భారతాల ,పురాణాల ప్రకరణాలను విస్తృతంగా తన వ్యాఖ్యానాలలో ఉదహరించాడు .గతకాలపు సంఘటనలను కవులు ప్రస్తావిస్తే ,వాటిని  సమర్ధించటానికి  ఇతిహాస పురాణాల విషయాలతో నిగ్గు తేల్చాడు .విశ్వామిత్ర మహర్షి బల అతిబల విద్యలను రామ లక్ష్మణులకు ఇచ్చాడన్న దాన్ని సమర్ది౦చటానికి రామాయణ శ్లోకం –‘’క్షుత్పిసానే న తే రామ భవిష్యేతే నరోత్తమ –బలాతిబలాం చైవ పఠతః పది రాధవ ‘’ఉదాహరించాడు .రఘు వీరచరిత 11 అధ్యాయం 75 వ శ్లోకం పై వ్యాఖ్యానిస్తూ రామాయణం లోని అయిదు శ్లోకాలలు వరుసగా పేర్కొన్నాడు –-‘’తే గావా పర్వతం రామ కైలాసం దాతు మండితం –అగ్ని౦ నియోజన మాసుః పుత్రార్ధం సవా దేవతాః .మహా భారతం నుండి కూడా చాలా శ్లోకాలను ఇంద్రుని ఆయుధ సంపత్తి పై పేర్కొన్నాడు .రఘువీర చరితం 11-42 పై వ్యాఖ్యానిస్తూ మహా భారతం లోని –‘’బాహుం సవజ్రం శక్రస్య క్రుద్దాస్య స్త౦భయతు ప్రభుః’’

మల్లినాధుని పురాణ పాండిత్యానికి ముగ్దులవుతాం .వాటినుంచి విస్తృతంగా ఉదాహరణ లిస్తాడు .కుమార సంభవం 4-41 శ్లోకం పై వ్యాఖ్యానిస్తూ’’ బ్రహ్మ పురాణ౦’’ నుంచి హిమాలయ పర్వత ఉత్పత్తిని ఉటంకి౦చాడు-‘’యజ్ఞార్ధం హి మయా సృస్టో హిమవానచలేశ్వరః .’’శివ పార్వతులు ఒకరికొకరు విడరాని బాంధవ్యం ఉన్నవారని చెప్పటానికి  సాక్ష్యం  గా ‘’వాయు పురాణం ‘’లోని –‘’శబ్ద జాత మశేషం తు ధత్తే శర్వస్య వల్లభా –అర్ధ రూపం యధాఖిలం ధత్తే ముగ్దేందు శేఖరః ‘’శ్లోకాన్ని ఉదాహరించాడు .అలాగే ‘’త్వస్ట’’ సూర్యుని ప్రకాశాన్ని తగ్గించటానికి అతన్ని పదును పెట్టె యంత్రం పై సాన పట్టాడన్న విషయాన్ని’’మార్కండేయ పురాణం ‘’నుంచి  -విశ్వ కర్మాత్వనుజ్ఞాతః శాకదీయే వివస్వతా –భ్రమ మారేష్య తత్తేజః శతనాయోపచకమే ‘’శ్లోకాన్ని చెప్పాడు .ఒక్కొక్క సారి మల్లినాధుడు పురాణ కధలను సూటిగా ఉదాహరించాకుండానే తెలియ జేశాడు .స్కందుని నివాసం’’ దేవ గిరి ‘’అని మాఘ కావ్య వ్యాఖలో చెప్పాడు .

క్రౌంచ పర్వతం బ్రద్దలైన విషయాన్ని సూరి తెలియ జేశాడు కాని అది ఏ పురాణం లో ఉందొ చెప్పలేదు –‘’పురా కిల –‘’భ్రుగు నందనేన స్కంధస్య స్పర్ధయా క్రౌ౦చాశిఖ రిణామతి నిశితా విశిఖ ముఖేన –హేలయా మృత్పిండ భేదం భిత్వా తత్ ఏవ క్రౌంచ కోపాదేవ సాధ్యః మముజ్జ్హ్రుం భితే కస్మిన్నపి యశః  క్షీరనిదౌ నిర్విలమపి జగజ్జాల మాప్లావితి తామితికదా శ్రూయతే ‘’.మరో సందర్భం లో రావణుడు తన తలలో 9 తలలను శివునికి అర్పించడాన్న దానిని శిశుపాల వధ ,ఉత్తరరామ చరిత వ్యాఖ్యలలో పురాణ గాధను తెలియ జెప్పాడు –‘’పురా కిల –రావణః కామ్యే కర్మణి  పశుపతి ప్రాణనాధ నవ శిరస్యగ్నౌ హుత్వా దశ మారంభే సంతుస్టాంతస్మాత్  కైలాసాది పత్యం వప్రే ‘’.మల్లినాధుడు కనీసం రెండు సార్లుశివుని స్థానం లో  బ్రహ్మనియమింప బడినట్లు తెలియ జేసే   పురాణ గాధలను తెలిపాడు కాని యేపురాణంలోనిదో చెప్పలేదు –1-‘’పురా కిల –‘’భగవాన్  దూర్జటిః బాణ ప్రేమ్ణా బాణాభిధానం హరి మభి యుజ్య నిర్జత్ ఇతి పౌరాణిక వదంతి .

2-పురాకిల –‘’భగవాన్ సత్యభామా ప్రీతయే బలాదింద్ర లోకదపహృత్య పారిజాత౦ నిజ గృహ ద్వారే పితావానితి కధానాను సందేయా ‘’

ఈవిధంగా మల్లినాధుని పురాణం గాధలన్నీ కరతలామలకం అని స్పష్ట మౌతోంది .వీటిని గురించి చెప్పేటప్పుడు ‘’పోరాణికం’’అని  ‘’కదా ‘’అనే మాటలు ,లేక వాటికి సమానార్ధమిచ్చే బహుళ ప్రచారం లో ఉన్న పదాలు వాడాడు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

26-11-16 శనివారం మా ఇంట్లో మా అన్నయ్య గారి మనవడు (కూతురుకొడుకు)రవి ,గాయత్రి దంపతులు ,ముని మనవడు ఛి రేయా౦శ్,మా అన్నయ్య గారబ్బాయి రాంబాబు జయలక్ష్మి దంపతులు

https://plus.google.com/photos/115752370674452071762/albums/6357152859406053825/6357154012607373874

 

26-11-16 శనివారం మా ఇంట్లో మా అన్నయ్య గారి మనవడు (కూతురుకొడుకు)రవి ,గాయత్రి దంపతులు ,ముని మనవడు ఛి రేయా౦శ్,మా అన్నయ్య గారబ్బాయి రాంబాబు జయలక్ష్మి దంపతులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -18 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్యం

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -18

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్యం

విద్యాధరుడు రాసిన ఏకావలి అనే అలంకార శాస్త్రానికి మల్లినాద సూరి’’ తరల ‘’వ్యాఖ్యానం రాశాడని ,అందులో ఎన్నో అలంకార శాస్త్ర విషయాలున్నాయని ముందే తెలుసుకొన్నాం .’’అలంకార సర్వస్వం ‘’లో మల్లినాధుడు ఉదాహరించిన విషయాలను ఇప్పుడు చూద్దాం .శిశుపాల వధ లోని అనేక శ్లోకాల అలంకార విశేషాలను వివరించటానికి అలంకార సర్వస్వం లోని శ్లోకాలను మల్లి నాధుడు పేర్కొన్నాడు –‘’విధాయ వైరం సమయేం నరోరో య ఉదాసతే –ప్రక్షిప్యో దర్ధషం కక్షే రోరతే తేభి భాస్తం’’. ఔదాశీన్యం ‘’,సాయన ‘’అనే మాటలు ఉన్న వాక్యాలు  అననుకూలం గా ఉన్నాయని మల్లినాద భావన .సందర్భాన్ని బట్టి ఆ రెండు వాక్యాలమధ్య సంబంధం  వరుసలో ఉండటం ‘’సాద్రుశ్యాలంకారం ‘’విశేషం అన్నాడు .కనుక ఇది నిదర్శనాలంకారం లో ఒక అంశమే .కనుక ఇక్కడ రెండు స్వతంత్ర వాక్యాలలో ఉన్నందున  అలంకారం దృష్టాంతం కాదని తేల్చాడు .ఇక్కడ బింబ ప్రతిబింబ సామ్యాన్ని గుర్తించాలన్నాడు . .అలాగే మేఘ దూతం 2 వ సర్గ లోని 18 శ్లోకం ,కిరాతార్జునీయం 9 వ సర్గ 15 వ శ్లోకం ,కుమారా సంభవం 1 వ సర్గ 2 వశ్లోకం పై వ్యాఖ్యానిస్తూ అదే విషయాన్ని తెలియ జేశాడు

ఏకావలి లో కొన్ని అలంకారాలు ‘’ఆరోపం ‘’పై ఆధార పడి ఉన్నాయని తెలుస్తుంది .అలంకార సర్వస్వాన్ని ఆధారం గా చేసుకొని మల్లినాధుడు ‘’అరోప ‘’విషయం పై చక్కని చర్చ చేశాడు –‘’అన్యత్రా న్యావాపః ‘’అంటే ఒక దానికి బదులు వేరొక దానిని చెప్పటం లేక ఉంచటం .’’విశేషోక్తి ‘’ని వివరిస్తూ కిరాతార్జునీయ శ్లోకాలను పేర్కొన్నాడు సూరి .ఇక్కడ కూడా అలంకార సర్వస్వ సహాయం తోనే విశేషోక్తిని వివరించాడు .-‘’యదికరణా సవ్యేకార్య సిద్ధిస్తదా విశేషోక్తిః’’అంటే కారణాలు అనేకం ఉన్నా ఫలితం కలగక పోతే ,అది విశేషోక్తి .ఏకావలి వ్యాఖ్య తరలలో  అలంకార సర్వస్వం నుంచి అనేక ఉదాహరణలిచ్చాడు .మరో అలంకారం’’ ఉత్ప్రేక్ష ‘’ను వివరిస్తూ సూరి అలంకార సర్వస్వంలో అధ్యావసాయ  భావనలను  ‘’పరిగణన లోకి తీసుకొని చెప్పాడు .-‘’సాదృశ్య ఏకత్వా ధ్యాసా దదోషః—ఇత్యలంకార సర్వస్వ కారః ‘’అని పేర్కొన్నాడు .ఉత్ప్రేక్ష ను వివరిస్తూ ‘’అధ్యవసాయ ‘’పై తనకున్న భావాలను స్పష్టం చేశాడు –‘’అలంకార సర్వస్వ కారస్తు తేష్వ సాపి  స్వతః సిద్ధత్వాత్ ప్రౌఢోక్తిసద్విష యో రభేదాధ్యసాయః –సంభావన వ్యాప్తి రిత్యాః –అత్ర సాక్షియత్వం తత్ ప్రయోజకత్వా న్నిమితం తత్ర అధ్యావసాయః ఇత్యాదినా సందర్భేణ’’అని ఏకావలి లో పేర్కొన్నాడు .అలంకార సర్వస్వ కర్త అభిప్రాయాన్ని దృష్టికి తెచ్చాడు సూరి .’’ఖండ గస్త వారి నారీషు ‘’అన్న దానిపై వ్యాఖ్యానిస్తూ –అస్య ప్రపంచ స్త్వలంకార సర్వస్వే ద్రస్టవ్యః ‘’ఏకావలి వ్యాఖ్య .

మమ్మటుడు’’భేదా భేద ‘’అలంకార విషయం లోచెప్పిన దాన్ని మల్లినాధుడు విభేదించాడు .అతిశయోక్తికి నాలుగే  నాలుగు భేదాలు చెప్పాడు . మమ్మటుడు ‘’సంబందా సంబంధ ‘’ను ప్రత్త్యేక వర్గం గా భావించాడు .అతిశయోక్తి అలంకారం లో 5 రకాలు ను సమర్ధించాడుసూరి  .అర్ధ శ్లేష శబ్ద శ్లేష ల పై మమ్మటుడి అభిప్రాయాలను అలంకార సర్వస్వం ఆధారంగా చర్చించి ‘’అర్ధ శ్లేష ‘’ను మాత్రమే గుర్తించాడు సూరి .భోజుని ప్రకరణాన్నిఉదాహరించినా దానిపై తాను భేదిస్తున్నానని చెప్పాడు . భోజుడు చెప్పిన ‘’చిత్ర హేతు ‘’ను మల్లినాధుడు  ‘’అసంగతి ‘’అన్నాడు .కారణం మన్మధుని ఆయుధపు దెబ్బఒక చోట పడితే గాయం వేరొక చోట  పడింది కనుక అన్నాడు —త్వదాపాంగసాహ్వయం యదంగతే –ముక్తం తదన్య తరేన చోష్యహం మనసి క్షతః –ఇత్రాన్యత్ర  శస్త్ర పాతో అన్యత్రం  క్షతి రిత్య సంగ గతి రేవేయామిత్యార్ధః ‘’

అనేక ప్రకరణాలను కర్త పేరు చెప్పకుండా మల్లినాధుడు ఉదాహరించాడు .వీటిని సింపుల్ గా ‘’తదుక్తం ‘’అన్నాడని లాల్యే పండితుని పిండితాభిప్రాయం . .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సేద దీర్చి హాయి గూర్చే ఉప్పలధడియం వారి ‘’దక్షిణా నిలం

సేద దీర్చి హాయి గూర్చే ఉప్పలధడియం వారి ‘’దక్షిణా నిలం ‘’

డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర నెట్ ద్వారాపరిచయమైన చెన్నై సాహితీ మిత్రులు .వారివీ వారి నాన్నగారివీ మనవీ పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవటం పోస్ట్ ద్వారా జరుగుతూనే ఉంది.కండ గల తెలుగు పద్యం చెప్పగల దిట్ట .మధ్యాక్కరలలో మక్కువ కూడా తీర్చుకొన్నారు .’తమ ’దక్షిణా నిలం ‘’అనే ఖండ కావ్య సంపుటిని జనని ప్రచురణలు ద్వారా ముద్రించి నాకు 27-7-16 న పంపారు . చూశాను కాని చదవ లేక పోయాను ఇవాళే అది బయట పడగా చదివి ఆనందిస్తూ మీతో ఆ ఆనందాన్ని పంచుకొంటున్నాను .

‘’గాలి వ్రేళులు కదిలి –అలల తీగల సాగి –రాగ ప్రస్తారమై ‘’ప్రపంచం సాగుతోంది అని ఖండ గతి లో ‘’దక్షిణానిలం ‘’కవితలో రాసి భావుకతకు అద్దం పట్టారు .అందులోనే మధ్యాక్కర లో –‘’జీవన మందొక కొన్ని వేళలు చిన్మయత్వంపు –తావలమై ఎన్ని జన్మలకును నైన దక్క కుండెడు మ –హా వైభవోపేతములయి దీపించు ,హ్రాదినీ తుల్య –కేవలానంద  తుందిల నిమేషముల్ క్రేళ్ళుగా చెలగు ‘’అంటూ జీవితం లోని మధుర స్మృతులను హృదయం లో భద్ర పరచుకొన్నారు .ఆయన చదివింది ఆంగ్లమాధ్యమం లో .14 వ ఏట నుంచి తెలుగు పద్యం రాయటం ప్రారంభించారు.హిందీ  భాష లోతులు తరచి రాష్ట్ర భాషా ప్రవీణ అయ్యారు .ఏలెక్ట్రికల్ ,ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మాధ్యమం లో  డిప్లొమా పొంది పి హెచ్ డి కూడా చేశారు .అయినా కవిత్వాన్ని వదిలిపెట్టక శ్రీ పులికంటి కృష్ణా రెడ్డి గారి ప్రోత్సాహమే వెన్ను దన్నుగా తండ్రి గారి మెలకువలతో వేంకటేశ శతకం ,మృత్యు ద్వీపం ,పునరపి ,జనని శతకం ,వెంకటేశ్వర మధ్యాక్కరలు రాసి ప్రచురించిన దీమతి శ్రీ వెంకటేశ్వర.ఇప్పుడీ ఖండకావ్యం .

కవికి వర్షం మాంచి హర్షాన్నిస్తుంది .పులకించి రాస్తారు. బహుశా మద్రాస్ లో ఒకప్పుడు వర్షాభావ పరిస్థితులను చూసి అనుభవించి ఉండటమూ కారణం కావచ్చు .హిందీ కవులు తులసీదాస్ కబీర్ లను ఆపోసన పట్టారు .’’తులసీదళం ‘’పేరిట ‘’తనదు కవిత గొప్పదని ఎంచు ప్రతికవి –కాని పరుల కావ్యగానము విని –సంతసి౦చువారి సంఖ్య ను లెక్కింప –నొక్క చేతి వ్రేళ్ళే ఎక్కువగును ‘’అన్న తులసీ దాసుని రామ చరిత మానస్ లోని పద్యానికి సార్ధకనామధేయం తో అనువదించి పవిత్రత చేకూర్చారు . ‘’తెలుగు వాడను నేనను తలపు విడక –భరత పుత్రుడ ననుమాట మరువకుండ –విశ్వ మానవ శ్రేయమ్ము వెల్లివిరియ –జయ పదమ్మున ఆంధ్రుడా !సాగి పొమ్ము ‘’అని ప్రబోధం కవితలో అంతర్జాతీయతను సాదిచంచ మని కోరారు .తండ్రి శ్రీ ఉప్పలధడియం రామ మూర్తిగారు చిత్తూరు జిల్లా ఏకో పాధ్యాయ పాఠశాల అనుభవాన్ని ‘’విద్యా దీక్ష ‘’లో బంధించి –‘’బడియయ్యు కాన రాద –క్కడ తగు సదుపాయమేమి ,క్రమ శిక్షణ తో-నడచుకొను చాత్రు లు౦డిరి –ఒడి దుడుకుల ధ్యాసలేని ఒజ్జయు నుండెన్ ‘’అని గురు దీక్ష, శిష్య విద్యా దీక్షకు నీరాజనం పట్టారు .

బాలుడు త్రివిక్రముడు అంటూ ‘’వామనుని పోల్కి కనిపించు బాలకుండు –కాని నిక్కమరయ త్రివిక్రముడు గాదె ‘’అన్నారు .మద్రాస్ విశ్వ విద్యాలయం లో నిర్వహించిన 24 గంటల కవి సమ్మేళనం లో ‘’భగ్న హృదయం ‘’కవిత వినిపిస్తూ కవి –‘’కనులు నిరతమ్ము కాల రేఖ పయి నిర్ని –మేషముగ నిల్చు నొక లక్షమిషలు చెప్పి –వ్యవధి లేదను మాట నేపంబొ నిజమొ-పరుగే బ్రతుకైన హృదయమ్ము వ్రయ్యలవదె?అని ఉరుకుల పరుగుల జీవిత పర్యవసానం అంతమే నని హెచ్చరించారు .ప్రముఖ వైయ్యాకరణులు శ్రీ దువ్వూరు వెంకట రమణ శాస్త్రి గారి ఆత్మ కద అందరూ చదవాల్సిన పుస్తకం .హృదయ గతం చేసుకోవాల్సిన గ్రంధమూ కూడా .ఆ పుస్తకాన్ని డా రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు గారు పంపగా చదివి పులకిత హృదయం తో –‘’చిన్ననాటి ముచ్చట్లను చేదుకొన్న –చాలునది యొక కావ్యమై జాలువారు –స్వీయ చరితలు కొన్నింటి చేర్చి చదువ –సంఘ జీవనమెల్ల  సుస్పష్ట మవదె’’అని ఆ పుస్తకాను భూతిని కమ్మని తేటగీతి లో పలికించారు. శాస్త్రి గారి ‘’జానకితో జనా౦తికమ్ ‘’ఎన్నో సార్లు రేడియోలో పునః ప్రసారమై సాహిత్యాభిమానులకు వీనుల విందు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది .

27-8-20 07 హైదరాబాద్ ప్రేలుళ్ళ పై  స్పందిస్తూ –‘’నగర జీవనంపు నరక యాతన నుండి –ఊరడిల్ల నెంచి పౌరుడొకడు –వనము కేగగ పిత్రువన మాయెనది ,కాలు –డెచటి కైన వెంబ డించుగాదె’’అని యముని మహిషపు లోహ ఘంటలు తప్పించుకోలేనివన్న వేదాంతాన్ని పలికారు .దక్షిణానిలానికి ‘’పంచ చామరం’’ వీస్తూ కవి –‘’ఇజాలు పోయి దోపిడీయె ఏక మాత్ర సూత్రమై –బజారు తత్వమే ప్రధాన భావ జాల మాయెరా –నిజాయితీకి చోటు లేని నేటి లోకమందునన్ –ప్రజాధనమ్ము కొల్లగొట్టు వాడె వన్నెకెక్కురా ‘’అని దోపిడీ,  బజారు తత్వమే ప్రాదానమై నిజాయితీ నీఱు గారి పోయిందని ఆవేదన చెందారు .’’చెంచా కవుల గురించి చెబుతూ ఒక్కొక్క వాక్యమే ఒక కావ్యం అని భ్రమిస్తూ భ్రమింప జేస్తూ ,వాడినే ‘’నవ కవి ‘’అని గుగ్గురువులు ప్రోత్సహిస్తూ శిష్య కోటి జాబితాలో చేర్చుకొని సాగే గురు  శిష్య సంబంధాన్ని ఏవ గి౦చుకొన్నారు.’’ఉగాది లక్ష్మి ‘’కవితలో –‘’షడ్రుచులు కల్సి నట్టి పచ్చడిని మెసవ –బ్రతుకు నందలి మంచి సెబ్బరల  నొక్క-రీతిగా గ్రహియించు పరిణతి కలుగు –మన ఉగాది పచ్చడి నెంత మహిమ గలదొ’’అని ఉగాది పచ్చడి ప్రవచించే జీవిత పరమార్ధాన్ని బాగా చెప్పి మెప్పించారు .

‘’వచన కవిత్వం గొప్పతనాన్ని మెచ్చుకు౦టానుకాని పద్యం పనికి రాదు అనేదాన్ని ప్రతిఘటిస్తాను’’అంటాడు  కవి –‘’వచన కవిత లోని వైవిధ్య మెంతయు –శ్లాఘ నీయ మనుచు చాటగలను –పనికి రాదు నేడు పద్య కావ్యంబను –భషణము ను మిగుల  ప్రతిఘటింతు ‘’అని నొక్కి చెప్పారు .కవికి పద్యం నల్లేరుపై బండి .సొగసుగా ,సరళ పదాలతో పద్యం లోనే ఎంతటి గహనమైన భావాన్నైనా చెప్పగల సమర్ధులు .దక్షిణా నిలం ను అందరూ ఆహ్వానించి సేదదీరి హాయి చేకూర్చుకోవాలని కోరుతున్నాను .

డా వెంకటేశ్వర గారు 1-విద్వాన్ సుందర కృష్ణ మాచారి ధర్మ నిధి పురస్కారం 2-నాగ భైరవ స్పూర్తి పురస్కారం 3-ఉగాది విశిష్ట పురస్కారం అందుకున్న సాహితీ మూర్తి .

ఇలా 42 శీర్షికల  తరంగాలుగా ‘’దక్షిణానిలం  ‘’వీచింది .మద్రాస్ మనకు దక్షిణంగా ఉన్నందున అక్కడినుంచి వచ్చిన  కమ్మ తెమ్మెరగా దీన్ని మనం భావించవచ్చు .ఈ కవితా ఖండికల సంపుటిని రమ్య భారతి సంపాదకులు సరసభారతికి ఆప్తులు ,సరసభారతి పుస్తక ప్రచురణ కర్త అయిన శ్రీ చలపాక ప్రకాష్ ఎంతో అందంగా అర్ధ వంతమైన ముఖ చిత్రం తో ప్రచురించారు .అంతే కాదు ‘ ప్రకాష్ గారి ’రమ్య భారతి’’  ఉప్పలధడియం వారి  ‘’జనని’’ సంయుక్తంగా మద్రాస్ లో ‘’తెలుగు భాష కు ప్రాచీన హోదా –తక్షణ కర్తవ్యమ్ ‘’పుస్తకా విష్కరణ సభ జరిపారు కూడా .ఇది చూసిన నాకు సరసభారతి విజయవాడ ,మచిలీపట్నాలలో అక్కడి స్థానిక సంస్థల తోకలిసి కార్య క్రమాలు నిర్వహించిందికదా జనని తో కలిసి ఒక కార్యక్రమం చెన్నై లో చేసి అక్కడి సాహితీ మిత్రుల మధ్య గడిపితే బాగుంటుంది అనిపిస్తోంది .చూద్దాం .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-16-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాక్షి- సంగీత అభిమనులకు తీరని లోటు

28a8d624-1cf1-40a8-86e3-2c78f7284d7f

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-2 గాన గ౦ధర్వ శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ

—

ఇది విన్నారా ,కన్నారా !-2

గాన గ౦ధర్వ  శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ

-శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అసలు పేరు మురళీ కృష్ణ .కాని బాల్యం లోనే 9వ ఏట  మొదటి సంగీత కచేరీలు చేయటం తో ‘’బాల’’మురళీ కృష్ణ అని పిలవటం తో అదే స్థిరపడి పోయింది .-బాల్యం లో బాలమురళి విజయ వాడలో చేస్తున్న  సంగీత కచేరీ లో ప్రేక్షక స్థానం లో కూర్చున్న తిరుపతి కవులలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ‘’ఆగు ‘’అని కిందనుంచే అని ,వేదిక నెక్కి ‘’నా వలెనే వృద్దుడవై-నా వలెనే కీర్తి కాంచి –నా వలెనే శ్రీ దేవి పద భక్తుడవై –భూ వలయము తిరుగు మోయి ‘’అని మూడు పద్యాలలో ఆశీర్వదించారు .అది పూర్తిగా ఫలించిందన్న సంగతి మనకు తెలిసిందే ..

-బాలమురళి 12వ ఏట తిరువయ్యూర్ లో సంగీత సద్గురు శ్రీ  త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం లో కచేరీ చేసి ‘’బాల గ౦ధర్వ ‘’బిరుదు పొందారు .

-‘’చాలా మంది కర్నాటక సంగీత విద్వాంసులు ఒప్పు కోలేని ఒక గొప్ప అంశం ఒకటి ఉంది .అది కర్నాటక సంగీతం కన్నా హిందూ స్థానీ  సంగీతం లో శ్రోతలు ఎక్కువగా రక్తిని అనుభ విస్తారు అన్నది .అయితే  కర్ణాటకలోని ప్రౌఢత్వాన్నిహిందూ స్తానీలోని రక్తిమను జోడించి పాడగల మేటి గాయకుడు శ్రీ బాల మురళీ ఒక్కరే ‘’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

-‘’ఆచార్య వీరభ్ద్రయ్యగారికి వీణ అన్నా వీణ విద్వా౦సులన్నా మహాప్రేమాభిమానాలున్నాయి .అందుకే శ్రీ పుదుక్కోటై వీరిని ‘’వీణ ‘’భద్రయ్య అన్నారు .శ్రీ ఎస్ .బాల చందర్ గారిలో ఉండే బరువైన ‘’మీటు ‘’వీరి వాయిద్యం లో కనిపిస్తుంది ‘’అన్నారు వరంగల్ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దుడ్డు సీతారామయ్య .-‘’సాహిత్యం స్పష్టంగా పాడితే లలిత సంగీతమని వెక్కిరిస్తారు .స్వర స్థానం మీద నిలిపి పాడితే హిందూ స్థానీ అని వేళాకోళం చేస్తారు .హిందూ స్తానీని మిక్స్ చేసి  పాడుతున్నాను అంటారు నన్ను .అసలు మిక్స్ చేయటం ఏమిటి ?హిందూ స్థానీ మన పిల్లల్లో ఒక పిల్ల సుమా ‘’అంటారు బాలమురళి .

-‘’దాక్షిణాత్య సంగీతాన్ని కర్నాటక సంగీతం అని యే శాస్త్రం లో ఉంది ?సంగీత రత్నాకరం లో ఉందా ?త్యాగ బ్రహ్మ చెప్పారా ?’’అని ప్రశ్నిస్తారు బాలమురళి .దీనికి వీరభద్రయ్యగారు వివరణ ఇస్తూ ‘’వాగ్గేయకారులైన ముత్తు స్వామి దీక్షితులవారి కీర్తనలలో హిందూ స్థానీ బాణీలు లేవా,ఆ బాణీలలోని రాగాలను వారు తీసుకోలేదా ?స్వాతి తిరుణాల్ రచనలలోను ఈ లక్షణం లేదా అంటూ ‘’వాతాపి గణపతిం భజే ‘’అన్న కీర్తన రచింప బడిన ‘’హంసధ్వని రాగం ‘’హిందూ స్థానీ నుంచే వచ్చిందని ఒక సంగీత మహా మహోపాధ్యాయులు అనలేదా ?అని చెప్పారు .అంతేకాదు దీక్షితులవారి ‘’నీరజాక్షి కామాక్షి ‘’ని పూర్తిగా హిందూ స్థానీ పద్ధతిలో ఒక విద్వాంసుడు పాడగా వీణ పై వాయించగా  తానూ విన్నానని మరి అలాంటప్పుడు బాల మురళిని ఎందుకు తప్పు పడుతున్నారో అర్ధం కావటం లేదని ఆచార్య వీణ(ర )భద్రయ్య అన్నారు .

-‘’మనకున్న మంత్రాల సంఖ్య 7 లక్షలట..అందులో తొంభై తొమ్మిది శాతం మృత మంత్రాలే నట .అంటే జీవన్మంత్రాలు కొన్ని వందలే నన్నమాట .అవతార పురుషులు అవతరించి అనేక మృత మంత్రాలకు ప్రాణం పోస్తారట .అలాగే రాగాలన్నీ ప్రాణప్రదాలు కావు .గాయకుని ప్రతిభా విశేషం వలన నే వాటిల్లో జీవం కలుగుతుంది .ఈ విధంగా బాలమురళి అనేకానేక రాగాలకు నూతన ప్రాణ దానం చేశారు .అంతేకాక72మేళ కర్త రాగాలలోను కీర్తనలను సంగీత యుక్తం గా కట్టి వాగ్గేయ కార చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకొన్నారు బాల మురళి ‘’అని బాలమురళిలోని వైశిస్ట్యాన్ని  ఆవిష్కరించారు ఆచార్య .

-‘’ఆయనను  మహా గాయకునిగానే చూస్తాం కాని ఆయన తనను ‘’వాగ్గేయ కారుని ‘’గా చూడమంటారు బాల మురళి .నిజమే వారు 400దాకా రచనలు చేశారు. వర్ణాలు ,కృతులు జావళీలు తిల్లానాలు రచించారు .బాలమురళి తిల్లానా వంటిది’’ నభూతో న భవిష్యతి’’ .గ్రహ భేదం తో వారొక తిల్లానాలో సాధించిన అందం అంతాఇంతా కాదంటారు ఆచార్యులవారు .ఏ పాఠశాల విద్యా లేకుండా ఎవరివద్దా సంస్కృతాంద్రాలు  నేర్వకుండా శతాధిక కృతులు రాశారు .సంగీతాన్ని మాత్రం త్యాగ రాజ స్వామి ప్రశిష్యులైన శ్రీ పారుపల్లి రామ కృష్ణయ్య పంతులుగారి వద్ద నేర్చారు దట్ ఈజ్ బాలమురళి .సంగీత సాహిత్యాలు రెండూ బాలమురళికి దైవ దత్తాలే .

-త్యాగ బ్రహ్మ నుంచి గురు పరంపరలో  నాలుగవ తరం వారు పారు పల్లివారు .త్యాగయ్య గారి పాఠమే,పారుపల్లి వారు పాడినది దానినే బాలమురళి అనుసరించారు .

-‘’మీరు ముందుగా సాహిత్య రచన చేసి దానికి సంగీతం కూరుస్తారా “”?అని అడిగితే ‘’సాహిత్య ,సంగీత రచనలు రెండూ ఏకకాలం లోనే చేస్తాను .పాట పాడాక అది యే రాగం లో వచ్చిందో చూసుకొంటాను ‘’అన్నారు స్వరబ్రహ్మ బాలమురళి .

-‘’ఏ పర్వీన్ సుల్తానా ‘’లాంటి మధుర గాయనీ మణులో తప్ప ఇతరులు పాడలేని ‘’అతి తార షడ్జమ స్థాయి ‘’ని అలవోకగా అధి రోహించి రాగల నేర్పు బాలమురళీ కృష్ణ గారికి వెన్నతో పెట్టిన విద్య .ఇతర గాయకులు  తార పంచమం చేరటానికే విపరీతంగా రొప్పుతారు ‘’అన్నారు ఆచార్య వీర భద్రయ్యగారు.

-‘’సంప్రదాయమొక బ్లూ ప్రింట్ మాత్రమే .బ్లూప్రింట్ రాగానే ఇల్లు దొరికినట్లు కాదు .అందులో ఎవరూ నివసించ లేరుకదా .బ్లూ ప్రింట్ ప్రకారం ఇల్లు కట్టుకొని అందులో ఉండాలి .కళాకారులు కావటం అంటే అదే .కేవలం సంగీత పుస్తకాలు చదవటం కాదు .సంగీతాన్ని తెలుసుకోవటం వేరు .సంగీతానికి నీవు తెలియటం వేరు .’’అన్నారు పద్మ విభూషణ్ బాలమురళి .

-సాధారణం గా అయిదు స్వరాలైనా లేనిది రాగం విశదం కాదు .కాని బాలమురళి ప్రయోగాత్మకంగా నాలుగు స్వరాలతోనే రాగం సృష్టించారు .లవంగి ,మహతి ,మనోరమ ,ఓంకారి ,ప్రతి మధ్యావతి ,రోహిణి, సర్వశ్రీ  ,సుముఖం సుషమ వంటి కొత్త రాగాలు సృష్టించి ప్రాణం పోశారు .

-గాత్రం తో పాటు బాలమురళి వీణ వయోలిన్ ,వయోలా మృదంగం వాయించటం లోనూ ప్రసిద్ధులు .

-‘’సంగీతసరస్వతిని సంకుచిత పరిధుల లో నుంచి విముక్తం చేసి ‘’భారతీయ సంగీతం ‘’అనే వినూత్న పంధానేర్పరచిన మార్గ దర్శి శ్రీ బాలమురళీ కృష్ణ ‘’అన్న ఆచార్యుల వారి విశ్లేషణ నూటికి వెయ్యి శాత0 య దార్ధం .

ఆధారం –ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య రచించిన ‘’మన గాత్ర ,తంత్రీ వాద్య సంగీతవిద్యానిధులు ‘’గ్రంధం.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged , | Leave a comment

చిన్నబోయిన శంకర గుప్తం బాలమురళితో రామదాసుకు జీవం

Inline image 1Inline image 1Inline image 1


మూగబోయిన ‘మురళి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), ఆరిలోవ, నవంబర్ 22: ప్రఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసుడు, నటుడు, గాయకుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ ఆకస్మిక మరణం సంగీతాభిమానులను హతాశులను చేసింది. తెలుగు సంగీత ప్రియుల గుండెల్లో చిరస్మరణీయులై ఎన్నో భక్తి గీతాలు, 25వేలకు పైగా కచేరీలు చేసిన బాలమురళి కర్నాటక సంగీతంతో పాటు పలు సినీ గీతాలను ఆలపించారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ బిరుదులతో ఆయన్ను గౌరవించింది. సంగీత కళానిధి బాలమురళికి విశాఖ నగరంతో విడదీయరాని అనుంబధం పెనవేసుకుంది. బాలమురళి సంగీత ప్రపంచాన్ని శాసించే స్థాయిలో విశాఖ నగరంలో పలు కచేరీలు చేశారు. దశాబ్ధాల బాలమురళి సంగీత ఝరికి విశాఖ వాసులు పులకించారు. 1995- 16లో నగరంలోని విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను స్వర్ణ కిరీటంతో సత్కరించారు. అదే సంస్థ కళా,సాంస్కృతిక రంగంలో విశేష సేవలందించిన వారికి స్వర్ణ కమలం ప్రధానం చేయాలని నిర్ణయించింది. సంస్థ తొలి ప్రయత్నంలో 2002లో బాలమురళిని నాదవిద్యాభారతి బిరుదుతో పాటు స్వర్ణ కమలంతో సత్కరించింది. అనంతరం 2010 జూలై 6న బాలమురళి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పోర్టు కళావాణి ఆడిటోరియంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన తన సంగీత గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. తిరిగి 2015 జూలై 24న లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డుల ద్వారా బాలమురళిని విశాఖ వాసులు ఘనంగా సత్కరించుకున్నారు. అంతకు ముందు 2013లో గీతం కళాశాల వేదికగా జరిగిన ఇండియన్ ఎకనామిక్స్ అసోసియేషన్ జాతీయ సదస్సు సందర్భంగా బాలమురళి గాత్ర కచేరీని ఏర్పాటు చేశారు. తన జీవిత చరమాంకంలో విశాఖ కేంద్రంగా ఉన్న విజయ్ నిర్మాణ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.
దేశం గొప్ప సంగీత విద్వాంసుని కోల్పోయిందని సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు అభిప్రాయపడ్డారు. బాలమురళితో కలిసి తాను ఆకాశవాణిలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సంగీతంలో ఆయనకు తెలియని గమకాలు లేవని అన్నారు.
ప్రఖ్యాత సంగీత కళాకారుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. దక్షిణాది సంగీతానికి బాలమురళి అందించిన సేవలు ఆయన్ను చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో నిలుపుతాయన్నారు. విశాఖలో ఆయన పలు సంగీత కచేరీల్లో పాల్గొన్నారని అన్నారు.

Inline image 1Inline image 1Inline image 1Inline image 1


Inline image 2

Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -16 మల్లినాధుని రాజకీయ శాస్త్ర పరిజ్ఞానం

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -16

మల్లినాధుని రాజకీయ శాస్త్ర పరిజ్ఞానం

అనేక రాజకీయ శాస్త్ర పండితుల ప్రకరణాల నెన్నిటినో మల్లినాద సూరి ఉదహరించాడు .రాజ్య వ్యవస్థపై కామందకుడు రాసిన వాటిని బాగా పరిశీలించి అవసరమైన చోట రాశాడు. కామందకుని ‘’నీతి సారం ‘’లో రాజు ,రాజ్యం ,రాజ్య పాలన మొదలైన విషయాలపై పై విస్తృత చర్చ ఉన్నది .మహా కావ్య రచయితలు  ముఖ్యంగా కాళిదాసు ,భవ భూతి లు భారతీయ రాజరిక వ్యవస్థలోని విషయాలను ఉదహరించారు .వారు చెప్పిన వాటి నిగ్గు తేల్చటానికే మల్లినాధుడు రాజకీయ శాస్త్రం పై ఉత్కృష్ట గ్రంధమైన’’ నీతి సారాన్ని’’ సహాయంగా తీసుకొన్నాడు .కాళిదాస భావభూతులకు తరువాతి కాలం వాడైన మల్లినాధుడు  ఈ మహా కవులు చెప్పిన రాజకీయ సిద్ధాంతాలు పూర్తిగా సంప్రదాయంగా వస్తున్న ,అందరూ అంగీకరించిన రాజకీయ శాస్త్ర సిద్దా౦తాలేనని రుజువు చేసి చూపించాడు .మహాకావ్య శ్లోకాల పై పూర్తీ రాజకీయ శాస్త్ర పరిజ్ఞానం తోనే వ్యాఖ్యానం రాశాడు .శిశుపాల వధలో 3 కిరాతార్జునీయం లో 4 ,భట్టి లో 1 ,రఘు వంశం లో 26 ,నైషధం లో 2 ,శ్లోకాలపై నీతిసారం ఆధారంగా రాజకీయ శాస్త్ర వ్యాఖ్య చేశాడు .అలాగే రఘు వంశం లో 11 శ్లోకాలకు  కౌటిల్యుని అర్ధ శాస్త్రం లోనుంచీ  ప్రకరణలు ఉదాహరించాడు .కౌటిల్యుడు ,చాణక్యుడు ఒక్కరే అన్నభావనతోనే మల్లినాధుడు ఉదాహరించాడు –‘’క్రియాహి వస్తుపా హితా  ప్రసీదతి’’అన్న రఘు వంశ వాక్యాన్ని వ్యాఖ్యానిస్తూ చాణక్యుడు చెప్పిన –‘’క్రియాహి ద్రవ్యం వినయతి న ద్రవ్యం ‘’తో సమర్ధించాడు  ..బలవంతుని ముందు మోకరిల్లటం ను’’వైటాసుర వ్రుత్తి ‘’అంటారని  ‘’అత్ర చాణక్యః శక్తానాం భూషణం క్షమా ‘’అన్నదానితో రఘు వంశ వ్యాఖ్య లో సమర్ధించాడు .రఘు వంశం లోనే మరో చోట మల్లినాధుడు –‘’అత్ర కౌటిల్యః బలీయసామభి యుక్తో దుర్బలః –సర్వత్రానుప్రణతో వేతసం ధర్మ మాతిస్టేత్ ‘’అన్న దానితో సమర్ధించి చాణక్య కౌతిల్యులు ఒక్కరే అన్నభావన కు బలం చేకూర్చాడు .అలాగే నియోగ ,వికల్ప ,సముచ్చయ శబ్దాల అర్ధాలను వివరించటానికి కౌటిల్యాన్ని వాడుకొన్నాడు-

‘’అత్ర కౌటిల్యః కార్యాణా౦ నియోగ వికల్ప సముచ్చయా భవంతి ‘’—అనేనైవోపాయేనవాన్యే నేతి నియోగః –అనేన  వాన్యేన వేతి వికల్పః-అనేనచేతి సముచ్చయః ‘’

కామందుని నీతి సారం ప్రాచీన రాజ్య వ్యవస్థపై  సాధికారం గా వ్రాయబడిన గ్రంధం కనుక మల్లినాధుడు ఎక్కువగా దీనినే ఉపయోగించుకోన్నాడని లాల్యే పండితుని అభిప్రాయం –‘’అత్ర కామందకః –శుశ్రూష శ్రవణం ధారణం తధా –ఊహాపోహోర్ద విజ్ఞానం చ ధీ గుణాః ఇతి –అన్వీక్షికీ జయీ దండ నీతిశ్చ శాశ్వతీ –ఏతా విదాశ్చ తత్రస్తు లోక సంస్థితి హేతవః ‘’అని మల్లినాద ఉవాచ .

ఇప్పుడు పేర్కొన్నవన్నీ మల్లినాధునికి  రాజకీయ శాస్త్ర౦ లో ఉన్న లోతైన అవగాహనకు గొప్ప ఉదాహరణలే అన్నాడు లాల్యే .

తంత్ర శాస్త్రోపజ్నుడు మల్లినాధుడు

నైషధం లో24 సర్గ 85 వ శ్లోకం  ఒక శ్లోకం అంతా తంత్ర పరిభాషలోనే ఉంది-

‘’ఆవామావా మార్ధే సకల ముభయ కార ఘటనా –ద్విధా భూతం రూపం భగవదిభి దేయం భవతి యత్

తదాంత మంత్రం మే స్మరహర మయం సేందు మమలం –నిరాకారం శస్వజ్జప  నర పతే సిద్ధ్యతు సతే’’

దీనిపై విపులమైన వ్యాఖ్యానం రాస్తూ మల్లినాధుడు నారాయణ వ్యాఖ్యాత రాసిన’’ అర్ధ నారీ నటేశ ‘’రూపం అనేది హ్రీంకార రూపం అని తెలిపాడు అందులోని మంత్రం సరస్వతీ మంత్రమే నని అందులో ‘’కామ రాజ బీజం ‘’నిక్షిప్తమై ఉందని  ఆ మంత్ర అర్ధాన్ని  శివ రూపం,మంద్ర రూపం ,యంత్ర రూపం అనే మూడు దృష్టి కోణాలలో వివరించాడు .ఈ శ్లోకం లో ‘’చింతామణి మంత్రం ‘’-ఓం హ్రీం ఓం ‘’అనే మంత్రం ఉందని ,అందరికి అన్వయించే విధంగా ఉందని వివరించాడు .దీనిపై పూనా లోని దక్కన్ కాలేజి ప్రొఫెసర్ ‘’హాన్దోక్వి ‘’అనే విశ్లేషకుడు ‘’నైషద ఆఫ్ శ్రీ హర్ష ‘’గ్రంధం లో వివరణ నిస్తూ ‘’ఈ విశేషణాలు మంత్రానికి ,భగదభిదేయ రూపానికీ రెండిటికి వర్తిస్తాయి.సరస్వతి మంత్రం ఒక్కో సారి అర్ధ నారీశ్వర రూపం తో గుర్తించటానికి వీలుగా ఉంది .కారణం అందులో మార్మిక రూపం దాగి ఉంది ‘’అన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గ ప్రసాద్ -22-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-3(చివరి భాగం )

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట  సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-3(చివరి భాగం )

బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గురు వరేణ్యుల ‘’శ్రీ గురు చరిత్ర ‘’కధలో యోగ సంఘటనా సామ్యాన్ని సూచన ప్రాయంగా మేళ్ళచెర్వు వారు ఇలా తెలియ జేశారు –ఇందులో కవి గత విషయక  భక్తి  పూర్వక గురు యోగ విజయ ధ్వని ఉందని చెప్పారు .1-కవి దృష్ట్యా గురువుగారు నివాసమైన చందోలు ‘’ద్వాదశాంతము ‘’.మిగిలినది అంతా అవతార విభూతి ,మళ్ళీ చందోలు రావటం ,అవతారం స్వస్థలాన్ని చేరటం 2-గురు దృష్ట్యా బహిరంగ కధ3 అంతరంగ కధగా గురువొక యోగి ,వారి మార్గం యోగ మార్గం . గుర్రం  పై వెళ్ళటం ఇంద్రియ వ్యాపారం ,ఆసనాది వ్యాయామం గా ,వనం సంసారంగా ,చీకటి అజ్ఞానం గా దొంగలు కామ క్రోదాదులుగా ,శివాలయం మూలాధార విశ్వ లింగం గా ,వస్త్ర ద్రవ్యాపహరణం ఆవరణ భేదం  బ్రహ్మ గ్రంధి చేదనంగా ,ఈల ఓంకారంగా,పరానాదంగా ఇద్దరు దొంగలు ఇడా,పింగళ నాడులు,పుణ్య జ్ఞానం గా ,చెరువు స్వాదిస్టానంగా ,అశ్వ రధము హృదయ౦  గా ,రదికుని విష్ణువు,ఈశ్వరునిగా ,జ్ఞాన బోధ ,వికాసాలు విష్ణు గ్రంధి భేదనంగా ,అనాహత జీవ సంయోగం గా ,ఖడ్గదారి రుద్రునిగా ,గురు విజయము రుద్రగ్రంది భేదనంగా ,చోర త్రయం త్రిమూర్తులుగా ,వర్షము సహస్రార సుధా వర్షంగా ,నక్షత్ర దర్శనం భ్రూమధ్యలో కనిపించే కాంతి చక్రంగా ,చోరగృహం  ఉద్యానవనం రెండూ మస్తక మస్తిష్కములుగా ,కదంబవన చింతామణి గృహాలుగా, నుయ్యి సుధా సముద్రంగా ,చంద్రుడు సహస్రార చంద్రుడుగా ,చోర పత్ని శ్రీ చక్రేశ్వరిగా ,చోరనాధుడు కామేశ్వరుడుగా ,అగ్ని పరీక్ష నిర్వికల్ప సమాధిగా ,విడుదల జీవన్ముక్తిగా ,సుప్రభాతం జ్ఞాన దృష్టిగా ,తిరుగు ప్రయాణం వ్రత్యా వృత్తిగా ,అశ్వ యానం లింగ శరీరం గా ,రైలును వెన్నుగా ,పంచ భౌతిక శరీరం గా భావించి ఈ మహా శ్లేష కావ్యాన్ని రాశానని కవి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తెలియ జేశారు .ఇవన్నీ ఆలోచి౦చు కొంటూ కావ్య ప్రవేశం చేసిన వారికి గురు కటాక్షం తో పాటు శ్రీ లలితా పరాభాట్టారిక అనుగ్రహ౦ తో  మోక్ష ప్రాప్తి లభిస్తుంది అని ఫల శ్రుతి గా భావించాలి .

తరువాత ‘’సువర్ణ మంత్రం పుష్పం ‘’ను గురు దేవులకు సమర్పించారు కవి .-‘’అఖండ నారాయణ భావ మంతర్బహి ర్దరీ దర్శిత మః పశ్యన్ –నారాయణోస్మీతి  కృతార్ధనామా గురుర్విముక్తౌ చరమాహి వృత్తిః’’’

గురువుగారు 10-12-19 90 రాత్రి 12-40 గం లకు మహా నిర్యాణం చెందారు .వారి చితి జ్వాలలో  ఇద్దరు స్త్రీ మూర్తులు  కనిపించినట్లు ఫోటోతో సహా ఆంద్ర ప్రభ దిన పత్రికఆదివారం సంచికలో  8-9-1991 న ముద్రితమైంది.ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్య పోయారు .గురువుగారిపై జగదంబకు గల అనుగ్రహానికి ఇది గొప్ప ఉదాహరణ .సాధకులకు జిజ్ఞాసులకు అదొక గొప్ప తార్కాణ అన్నారు కవి –దీన్ని శ్లోకం లో బంధించి చెప్పారు –

‘’చాయా గ్రాహక యంత్ర చిత్ర ఫలకే చిత్యగ్ని ధూమ చ్చటా-మధ్యే స్తోరుణ  పాండు రా౦బరదరే   దేవ్యౌ గురో రంతికే ‘’

‘’క్రుత్వాత్మ జీవిత నిదర్శన దర్శనేన –నిశ్చ ప్రచం భువి సనాతన సంప్రదాయం

బ్రాహ్మీ భవన్నపి  మహా గురు రంబికేద్వే-ప్రత్యక్షయన్ ద్రఢ యతిస్మ జగద్ధితాయ .’

చితిస్తత్పద లక్షార్దా ,తస్య ప్రాణా ఇహైవ లీయతే ,శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్యః,తస్మై గురవేనమః ,’’త్వమేవ మే వృణిష్వ’’య౦ త్వం మనుష్యాయ హితత మం మన్యతే ,నారాయణా యేతి సమర్పయామి ‘’అంటూ గురు విష్ణు రూపుని స్మరించి ‘’శ్రీ రాఘవాయ విద్మహే నారాయణాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ ‘’అంటూ వందనం చేశారు కవి .

11 వ సర్గ లో గురూప దేశం లో –‘’సర్వం ప్రపంచం భగవత్స్వరూపం సందర్శయన్ సంసది విశ్వ రూపః –కృష్ణో మహాత్మా ధృత రాష్ట్ర మందం సంస్కర్తు కామోపి భభూవ నాలం ‘’అని పరమాత్మ తత్వాన్ని బోధించారు .జడ భరత వృత్తాంతాన్ని బోధిస్తూ –‘’జడ భారత ఇవ మన్యసే జీవజాలం –యది నిజకర సేవా వర్ధితం పౌరుషేణ-జనన మరణ బంధే పీద్యతే జ్ఞావా౦ తశ్ఛేత్ –జడ భరత ఇవ త్వం మోక్షసే జీవ జాలాత్ ‘’.అవసరమైన చోట్ల ‘’కవి వ్యాఖ్యా ‘’అని కొన్ని శ్లోకాలు రాశారు .

గురువు గారు తమ పరదేవతా సేవను తెలియ జేస్తూ –‘’సత్యం బ్రవీమి మనయేవ సమీర లీనం –కిం మేమనోరధయితి ప్రకృతే వదామి –నిత్యం జపామి పర దైవత మేవ తత్త్వం –కృత్యం కురుష్వ యదితేవిధి రేష దిస్టః’’

‘’సుత రసిత రసాం తామగ్ని వర్ణాంజ్వలంతీం –పరమ శివ సభాగాం కర్మజానంద కందాం –సకల భువన మూలా మాస్ట సిధ్యం శు జాలాం-అఖిల గురు మనీషా మాది శక్తిం దదర్శ ‘’

నిశ్చల సమాధి గతులైన గురుబ్రహ్మ ఎలా ఉన్నారు అంటే –‘’సుధా బిందు స్యందీసకల నల చక్రా హిత రుచిః-ప్రభా సారం చక్రే విమల నభసః స్పంద రహితః –సమాధౌ నిర్మగ్నౌః పిహిత నయనా హంస మునయః –నిలీనాః పద్మా౦కే స్ఖలిత మిధునా భ్రాంతి రహితాః’’అన్నట్లున్నారు .

‘’హ్రీ౦కారోంకార సామ్యం స్వర శిఖర గతం ఝం కృతౌ దర్శయంతీ-పీయూషానంద లోభాదను సృత కుసుమా భ్రామరీ లోక బంధోః-కామ్యంతీ కాంతి పూరం కవి హృదయ హారం ఖే నిరాలంబ మార్గే –వాతా ధారా నుయా౦తీ  శ్రుతి శిఖర రతా తీర్ధ మిత్రం బభూవ ‘’

గురువు గారిని ఎంత వర్ణించినా కవి గారికి తనివి తీరదు .వారి అమ్మవారి పదార్చనాలీనత తనివి తీరా వర్ణించారు .

‘’జ్యోత్సా స్పురత్సలిలబుద్బుద బింబి తాత్మ-చిత్రం తరంగ తతి కంపిత సర్వ గాత్రం –దృష్ట్వా చ నిశ్చల నిజస్థితి మారయ పాదః –జజ్ఞే శరీర పరమేశ్వర జీవ తత్త్వం .

16 వసర్గలో గురు పునః పురాగమనం  స్వాగత సత్కారాలు వర్ణించారు .17 వసర్గలో  లలితా పరా భట్టారికా స్తవం రాశారు –‘’అయి జగదీశ్వరి శంకర సుందరి భక్త మనశ్చరి పాహి పరే –అవనత పావని భావక శోధిని పాప విపాటిని పాహి శివే –జనశివ కారిణి సంభ్రుత వారుణి దానవమారిణి ధర్మ రతే-జయజయహే కరుణా రసవాహిని విశ్వ విమోహిని విష్ణు కరే ‘’అనే శ్లోకాన్ని ‘’అయిగిరి నందిని నందిత మోదిని ‘’ధోరణి లో రాశారు .మొత్తం 33 శోకాలలో అమ్మవారి స్తుతి ఉంది .మరొకటి చూద్దాం –

‘’సంచారః పదయో ర్మహేశ్వరి భవత్సంకల్ప సంపాదితః –కాంతా రేత్ర భవే త్ప్రదక్షిణ విధిః వాగీశ్వరీ స్వస్తితే –కామంస్యా మమ సర్వ వాక్య రచనా సి౦హాసనాదీశ్వరి –స్తోత్రం తే పరమేశ్వరి ప్రభావతా త్సర్వం తవారాధనం ‘’అని శివానందలహరిలో భగవత్పాదులు చివరి శ్లోకాలలో చెప్పినట్లు చెప్పారు .

18 వ సర్గలో అగ్ని పరీక్ష ఉంది .పరస్త్రీ తనను స్పర్శించటం ధర్మ యుక్తం కాదని అందుకు జగజ్జనని ని క్షమాపణ కోరారు .19 లో సూత్రధార సాక్షాత్కారం ,రహస్య ప్రకాశం,జీవన్ముక్తి ,రామప్రసాద్ ఆస్థానానికి వెళ్ళటం సన్మానం  ఉన్నాయి .

చివరిదైన 20 వ సర్గ లో కవి వ్యాఖ్య ,సుప్రభాతం ,కోశానుగ్రహం ,పాఠకాహ్వానంతో కావ్యాన్ని ముగించారు –చివర్లో రాసిన మరో రెండు గురు ధ్యాన శ్లోకాల రుచి చూద్దాం-

‘’హరిహర సమాహారం దేవం మహా శబరీ నగే –పరమ శిఖరే సోపానాంతే విలోక్యచ భైరవం –తడనుమకర జ్యొతిః కాంతిం మహా పురుషో యదా –ఉషసి గురు రాస్యాదిత్య స్య ప్రభా మయోఖైః-‘’

‘’ముక్తా విద్రుమ హేమనీల ధవళ చ్చాయై స్సహస్రామ్శుభిః-జిత్వానంత గతం తమోంతర బహిర్వ్యాప్త౦ జ్వలంతం దివి –సూర్యం వీక్ష్య గురుః ప్రపంచ మఖిలం తద్భావితం భావయన్ –సత్యం తస్య రజో హిరణ్మయ రధం దధ్యౌ మనో నీరజే ‘’

‘’న్యూనం యదత్ర ప్రతిభావ లేపాత్ ప్రజ్ఞా పరాధాచ్చ శిశు ప్రకృత్యా –పూర్ణం భవేత్ శ్రీ గురు పాద నామ స్మృతేః క్షమైవ స్కలితం క్షమేత ‘’అని వినయంగా సర్వ శాస్త్ర సాహిత్య మేలి చెరువు శ్రీ మేళ్ళచెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు  క్షమాపణ స్తోత్రం చెప్పుకొన్నారు .

నేను కూడా నా మిడి మిడి జ్ఞానంతో మహా పండిత శాస్త్రకవి శ్రీ మేళ్ళచెర్వు వారి కవిత్వ శోభను చెప్పే ప్రయత్నం చేశాను .దీన్ని పండితులద్వారా తెలుసుకొని వింటే పరమాన౦దమే లభిస్తుంది .మొదట్లోనే చెప్పినట్లు సమర్ధులు ఎవరైనా దీన్ని పూర్తీ అర్ధ తాత్పర్య భావాలతో విశేషాలతో రాసి లోకోపకారం చేయవలసిందిగా మరో సారి కోరుతున్నాను .

కావ్యమంతా గురు భక్తి ప్రవాహమే .కవిత్వం  పీయూష లహరి . ఎంతో తేలిక పదాలతో ,ధారా శుద్ధి సందర్భ శుద్ధి తో రచన సాగింది .శ్రీ గురు చరిత౦ ను శిష్య శ్రీ శాస్త్రిగారు కవితాక్షర సువర్ణాలతో శోభ కూర్చారు .దీన్ని రాసిన శ్రీ శాస్త్రిగారికీ  నాకు అందించి చదివింప జేసి రాయించిన శ్రీ తూము లూరు వారికి శతాధిక కృతజ్ఞతలు .ధన్యోస్మి .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-16 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-2

raghava-narayana-sastri-dampatuluగీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట  సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-2

శ్రీ గురుచరితం  సంస్కృత శ్లేష మహాకావ్యం లో శ్రీ మేళ్ళచెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ‘’ఆత్మ నివేదనం ‘’శీర్షికలో ఈ కావ్య నేపధ్యాన్ని, తన రచనా ప్రణాళికను శ్లేష తత్వాన్ని వివరించారు .బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి శిష్యుడు శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి గురువుగారి జీవితంపై ‘’అగ్ని పరీక్ష ‘’అనే చిన్న నవల రాశారు .ఇది సెకండరీ స్థాయిలో ఉపవాచకం గా ఉన్నది .ఈ నవలికను ఆధారం గా చేసుకొని తాను మహా కావ్యంగా శ్లేషను జోడించి రాశానని తెలియ జేశారు .అయితే దీన్ని ఒక మామూలు కధగా కాకుండా అవకాశాన్ని బట్టి భక్తీ జ్ఞానం ,యోగాలను ఈ కావ్య పుష్పానికి కేసర త్రయం గా అమర్చి తన భక్తిని సౌరభం చేసి రచించానన్నారు .ఈ విధంగా తన కావ్యం లో మూడు రకాల ధ్వనులను సరళ వైఖరిగా పాటించానని .వీలుని బట్టి లలితా  సహస్ర నామావళి ని ,ఉపనిషన్మకరందం పైన విశ్రమించేట్లు చేశానని ,అందువల్ల అది శ్రీ గురు చరితమై పాఠక జనాలకు ధన్యత చేకూరుతుందని భావించి నట్లు చెప్పుకొన్నారు .

అంతా గురు చరిత్రమేకనుక వర్ణనలకు అవకాశం తక్కువని ,నాయిక అయినా ,నాయకుడు అయినా శ్రీ గురువు మాత్రమేనని ,చరిత్ర అంతా మౌనమే నని ,కధాకాలం కేవలం 12 గంటలు మాత్రమేనని ,అదికూడా అంధకారం నిశీధ సమయం అని ,అయినా గురు కటాక్షం తో ముందుకు సాగి పోయానని చెప్పారు .ఇది ఎలా ఉందీ అంటే –‘’పాషాణాది పీయూషం స్య౦దతే యస్య లీలయా ‘’గా ఉందట .

కేసరాలను బట్టి ఈ కావ్యం గురువుగారు రాసిన ‘’దత్తాత్రయాష్టక గర్భిత ఆత్మ సుప్రభాతం ‘’ తో పాటు ‘’మత్స్వప్నః ‘’అనే గ్రంధాలకు పూజా పుష్పం అని చెప్పారు .అందులోనూ ముఖ్యంగా –

‘’సావత్పరో రజసి తత్సవితుర్వరేణ్యం –దేవస్య ధీమహి మహోమతి చోదకస్య –గాయత్ర మర్ధ మితి భావయతో దురంతా –సా౦తానిశా ప్రవిరలా మమ సుప్రభాత౦ ‘’అనే శ్రీ గురువుగారి సుప్రభాత శ్లోకమే ఈ కృతికి జీవ గర్ర అని గర్వంగా చెప్పుకొన్నారు .తరువాత కావ్యం అందరికీ అర్ధం కావటం కోసం అందులోని కధను సూక్ష్మగా తెలియ జేశారు .

నిశిరాత్రి చీకటి కధ

తండ్రిగారు శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు ప్రారంభించిన రచన ‘’శ్రీరామ కధామృతం’’ఆయన మరణం తో ఆగిపోతే కుమారుడు శ్రీ రాఘవ నారాయణ  శాస్త్రి గారు పూర్తీ చేయ ప్రారంభించి పూర్తీ చేసి ,అధీతి బోదా చరణ ప్రచారణ చతుర్దశీ కృత వేద విద్యా స్వరూపులై ,’’బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ‘’అనే మాటకు సార్ధకత్వం చేకూర్చిన గురు వరేణ్యుల జీవితం లో ఇదొక ఘట్టం మాత్రమే.రామ ప్రసాద్ అనే ఒక సంస్థానాధీశుని సన్మానం అందుకోవటానికి నరసింగ పురం బయల్దేరారు గురువు గారు .భీమవరం చేరే సరికే ప్రొద్దు గూకింది .చివరి బస్సు వెళ్లి పోగా ముందు ప్రయాణానికి ఆటంకం కలిగింది . ఏమి చేయాలో పాలుపోని సందిగ్ధ స్థితి .ఇంతలో ఒక అపరిచిత వ్యక్తీ గుర్రం బండి సిద్ధంగా ఉందని చెప్పి ,నడిపించి పోలి మేర దాటించి ఒక అడవిలో వదిలేసి అదృశ్యమైపోయాడు .ఇంతలో కొందరు దొంగలు గురువుగారిని ముట్టడించి ,వారి చేతనే వారి వస్త్రాలను ,ఆభరణాలను ఒలిపించి మూట కట్టించారు .ఒక్క అంగ వస్త్రంతో మాత్రమే ఉన్న గురువుగారి దగ్గరకు ఇద్దరు దొంగలు వచ్చి ,వాగు దాటించి ,మార్గ మాధ్యమం లో వదిలేసి వెళ్ళిపోయారు .ఆ కారు చీకట్లోనే కాలి  నడకన దొరికిన దోవ పట్టుకొని సాగిపోతున్న గురువు గారిని ఒక వ్యక్తీ కలిసి తన బండిలో ఎక్కించుకొని ,క్రమంగా మాటల్లోకి దించి అనేక విషయాలు చర్చించాడు .గురువుగారి వేదాంత ధోరణి ,అసంగత్వ భావం ,,తెగింపు గమనించి వారిని ఒకమర్రి చెట్టు దగ్గర వదిలి మౌనంగా వెళ్లి పోయాడు .అక్కడే గురువు గారు కాసేపు ఆగి ఉండగా ,ఒక భీకరాకారుడు కాపాలికుని లాగా నటించి ,ఆయనను బలి అవటానికి సిద్ధంగా ఉండమని చేతి లోని పట్టా కత్తిని ఝళిపించాడు .బలి అవటానికి సిద్ధమైన గురువుగారు ధ్యాన నిమగ్నమయ్యారు .అప్పుడు వాడు ‘’మా దేవి  వద్దు అంటోంది ‘’అని చెప్పి ,వధ ప్రయత్నం మానుకొని వెళ్ళిపోయాడు గత్యంతరం  లేక గురువుగారు ఒక కంకర రోడ్డు పట్టుకొని, ఉన్న ఒకే ఒక అంగోస్త్రం తో ప్రయాణం సాగించారు .కొంత దూరం నడిచి పోగా వారికి ఒక దివ్య భవనం కనిపించింది .ఆ ఇంటి దగ్గరున్న బావి వద్ద స్నానం చేసి ,దైవ స్మరణ చేసి ,దప్పిక తీర్చుకొని ,మళ్ళీ ప్రయాణం సాగించే ప్రయత్నం లో ఉండగా ,ఒక ప్రక్కగా తులసికోట దగ్గర పూజ చేస్తున్న ‘’స్త్రీ ‘’కనిపించింది .ఆమె వారిని ఆహ్వానించి నూతన వస్త్రాలు సమర్పించి ,అతిధి సత్కారాలు చేసి ,గురువుగారి చేత ‘’భద్రాయురుపాఖ్యానం ‘’పురాణం చెప్పించుకొని ,శ్రద్ధగా విన్నది .తర్వాత వారిని తన అభ్యంతర మందిరానికి గౌరవం గా తీసుకొని వెళ్లి ,ఒక కుర్చీలో కూర్చో పెట్టింది .గురువు గారు కనులు మూసి ధ్యాన నిద్రలోకి జారిపోగా ,ఆమె హఠాత్తుగా వారి వామాంకం పై ఆశీనురాలైంది.ఈ హఠాత్ సంఘటనకు గురువు గారు భయపడక ,చిత్త స్వాధీనం లో ఉండి ,సహజ యోగికనుక ,ప్రాణ లయం చేసి ,నిర్వి కల్ప సమాధి లోకి వెళ్లి పోయారు .వెంటనే గురువుగారి శ్వాస ఆగి పోయింది .ఆయన పరిస్థితి చూసి నివ్వెర పోయిన ఆ స్త్రీ ,కిందికి దిగి ,నిలుచుని విసన కర్రతో విసరటం ప్రారంభించింది .కొంత సేపటికి గురువుగారు మామూలు స్థితి లోకి వచ్చారు .ఇంతలో వారి వెనక ఉన్న తెరల లో నుంచి నలుగురు మనుషులు వచ్చి క్షమాపణ వేడుకొన్నారు .రాత్రి అంతా గురువుగారిని పరీక్షించింది వీళ్ళే .పరీక్షించటానికి  కారణం యేమని అడిగితే  వాళ్ళేమి చెప్పారంటే  మొదటి దొంగ వారితో అడవిలో నడిచినప్పుడు వాడి శరీరం అంతా నిప్పులు పోసినట్లు మండి పోయిందని ,అందుకే గురువుగార్ని ముట్టుకోవటానికే భయపడి ఆయన వస్త్రాలు ఆభరణాలను ఆయనతోనే ఒలిపించి మూట కట్టించాడని ,దీనివలన గురువుగారి మహిమ ఎలాంటిదో వాడికి తెలిసిందని అందుకే అందరూ రాత్రి అంతా శ్రీ వారిని పరీక్ష చేశారని చెప్పుకున్నారు .విన్న గురువుగారు ‘’ఇది ఆ త్రిపుర సుందరీ దేవి పరీక్షయే ‘’అని నమ్మి ,వాళ్ళను శాంత పరచి ,తెల్లవారిన తర్వాత తిరుగు ప్రయాణం చేశారు .ఈ కొత్త భక్తులు ఇక పై నుండి దొంగతనాలు చేయం అని ప్రతిజ్ఞ చేశారు .రాత్రి తాము దొంగిలించిన వస్తువులతో పాటు తమ వంతు కానుకలనూ గురువుగారికి సమర్పించి  వీడ్కోలు చెప్పారు .

ఈ కధలో నిక్షిప్తమై ఉన్న యోగ సంఘటనా సామ్యాన్ని సూచన ప్రాయంగా తర్వాత మేళ్ళచెర్వు వారు తెలియ జేశారు .ఆ విషయాలు తరువాత గ్రహిద్దాం .

బ్రహ్మశ్రీ రాఘవ నారాయణ శాస్త్రి దంపతులఫోటో జత చేశాను చూడండి

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-1

 

గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట  సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-1

. ఒంగోలు మండలం ఉప్పు గుండూరు గ్రామవాసి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ జగన్నాధ శాస్స్త్రి శ్రీమతి మహా లక్ష్మమ్మ లకు జన్మించారు .భారద్వాజ గోత్రం .అనన్య సాధారణ పండితులు .చందవోలు శాస్త్రిగారిన బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్ద సంస్క్రుతకావ్యాలంకార ,వ్యాకరణ శాస్త్రాదులు నేర్చారు .తెనాలి సంస్క్రుతకాలేజిలో విద్యా ప్రవీణ అయ్యారు .సంస్క్రుతాధ్యాపకులయ్యారు .ఆంద్ర సంస్కృతాలలోఎం. ఏ .పొందారు .సంస్కృతం లో బహు గ్రంధాలు రాశారు ‘.శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు రాఘవ నారాయణ శాస్త్రి గారి పై ‘’అగ్ని పరీక్ష ‘’అనే చిన్న నవల రాస్తే అది ఉపవాచకం గా సెకండరీ స్థాయిలో బోధింప బడింది .దీన్ని ఆధారంగా శాస్త్రి గారి జీవితాన్ని ఒక యోగి చరిత్రగా భక్తీ జ్ఞాన యోగాలనుచేర్చి సంస్కృత మహా శ్లేష కావ్యంగా ‘’శ్రీ గురు చరితం ‘’లో శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ని గురించి సమగ్రంగా రాశారు .’’శ్రీ దేవీ మానసానంద హేతవే ధర్మ సేతవే –గుర్వే శిష్య లోకస్య నమోవాకం ప్రశాస్మహే ‘’అని గురు కీర్తన చేశారు .’’భావనా బృందావనం ‘’కావ్యం లో ముక్తక శ్లోకాలు రాశారు .’’సాలభంజికా సూత్ర దారం ‘’’’లాలితానంద లహరి, స్తన్య ధారా స్తవం ;;రచించారు .ఇందులో ఒక శ్లోకం –‘’హే నిత్య ప్రసావిత్రీ తే స్తన  యుగం ధారా ధారా హ్రీకరం-క్లీం మధ్యాక్రుతి మాత్రుగాదర గృహీత స్వాదితం భావయే –శ్రీ పీయూష ముపాస్య యస్య కవయ స్వెం బీజ వాజీ కృతా –అన్నాముత్ర జయంతి హన్తః –సుమనస్యో రాజ్య రారాజితాః’’

‘’వేదనాద స్తవం ‘’లో ‘’శరీరే యూపా గహనా కశేరుకా –విజ్ఞాన సంబందా మనసే మే జడస్య –ఆలస్య కచిద్ గోపికా  హంత సుప్తా –నూనం కించిత్ స్ప్రుశతీ వాద్వ యోక్త్రం ‘’అన్నారు .

వేదనా నివేదనం ‘’కావ్యం లో శిఖరిణీ శార్దూల విక్రేడి తాలలో కవనాన్ని కధనం తొక్కించారు .-‘’కిం దుఃఖం కిం సుఖం కిం శుభమితి మానసా వర్తమానాతీతం-నిస్చేతుం పంగ గుబుద్ధిః  -సతతామిద మా విశ్వాసజే ధ్నేయ్యమానః ‘’

ఇవికాక ‘’పరి ప్రశ్న మంజరి ‘’,లింగ దర్శనం ,కర్మ  వాద నిర్మధనం’’,దయా దారిద్ర్యం ,పరాకాయ ప్రవేశ స్తోత్రం ,తత్వ మంజరి ,నమశ్శివాయ ,బిన్డుమాలినీ స్తవం,రఘు కౌత్సం ,నిరపంనప ద్వాదశి ,శివ దోష స్తుతి ,అన్గాగార క్రుష్ణాగారః మొద లైనవి రాశారు.

ఒక్కసారి మేళ్ళచెర్వు  వారి త్రిభాష రచనా విభూతిని దర్శిద్దాం –

సంస్కృత రచనలు

1-శ్రీ గురు చరితం 2-సాలభంజికా సూత్రా దారం 3-లలితానందలహరీ ,స్పందలహరీ 4-స్తన్యదారా స్తవః 5-వేదనాస్తవః 6-వేదనా నివేదితం 7-లింగ నిర్మధనం 8-ఆకర్మానంద లహరి 9-దయాదరిద్రాయ నమశ్శివాయ 10-తస్యాభవత్కి౦చన 11-మన్యేహ మస్మి హృదయే పరమేశ్వరస్య 12-చరణార వింద షోడశి 13- అంతరార్ధ స్తోత్రం14-పరకాయ ప్రవేశ స్తోత్రం 15-బి౦దు మాలినీ స్తవః  16-రఘు కౌత్సుకం (నాటకం )17-అంగారక శృంగారః (జ్యోతిషం )

నిఘంటు నిర్మాణం

1-ధాతు కోశ పద కోశౌ 2-లింగాను శాసనము 3-తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు

తెలుగు గ్రంధాలు

1-సామి శరణం 2-మదాలస జోల పాట3-ఆత్మ సుప్రభాతం 4-ఆస్తి దేవము (సదసత్సంశయము )5-కనకధారాస్తవము –పద్యాను వాదము ,వ్యాఖ్య 6-శ్రీ కృష్ణ రాస లీల (యోగాత్రయీ హేల )7-కుజ సప్తతి (కుజ దోషం మీద పరిశోధన )8-బీజ తంత్రము 9-చందోలు మహర్షులు(చిన్ననవల ) 10-అటుకులలో కిటుకులు 11-గజేంద్ర మోక్షము –రుషి ఋణము 12-వామనుడు –వామనము .

ఆంగ్ల గ్రంధాలు

1-K.P.Special Study 2-P.G. Study on Traditional k.P.Astrology,Part- 13-P.G Study on Traditional K.P. Astrology –part -2

తెలుగు వ్యాఖ్యానాలు

1-త్రిపురామహిమ్నః స్తోత్రం -2-రామ కృష్ణ విలోమ కావ్యము 3-అష్టక గుచ్చము (బెల్లంకొండ వారి రచన )4-కనకధారా స్తవము (పద్యానువాదము )6-విజ్ఞాన భైరవము 7-విష్ణు సహస్ర నామ స్తోత్రము –మతత్రయ వ్యాఖ్యా సంగ్రహము 8-శివ గీత 9-సాంబ పంచాశిక (శ్రీ కృష్ణ పుత్ర సాంబ కృత సూర్య స్తోత్రము )10-వాగ్దేవీ స్తుతి (భోజ రాజ కృతం )11-ముక్తి ద్వారా స్తవ రాజము 12-వరాహోపనిషత్తు 13-కృష్ణ కుతూహలము (మధుసూదన సరస్వతి నాటకము ౦అనువాదము,లఘు వ్యాఖ్య 14-పరమాత్మ సహస్ర నామావళి –వ్యాఖ్య (బెల్లంకొండ రామ రాయ కృతం )

సహా సంపాదకత్వం లో వెలువ రించినది

సిద్ధాంత సింధుః(తెలుగు లిపి)(సంస్కృత మూలం శ్రీ రావి మోహనరావు గారితో కలిసి –దశ శ్లోకీ వ్యాఖ్య )

స్వీయ సంపాదకత్వం లో వవెలువరించినది

సిద్ధాంత సింధుః(నాగర లిపి )-ఆర్ .ఎస్. వి. పీఠం –తిరుపతి ద్వారా

సంస్కృత వ్యాఖ్య

రమావల్లభ రాయ శతకము (బెల్లం కొండ  రామ రాయ కవి )

ఆంధ్రానువాద గ్రంధాలు

1-బెల్లంకొండ రామ రాయ కృతాలు 1-అద్వైత విజయము 2-వేదాంత నిశ్చయము 3- అద్వైతామృతము 4 –భాగవత చతుశ్శ్లోకీ 5-సిద్ధాంత సింధువు –దశశ్లోకీ కి తెలుగు వివరణ 6 –శంకరా శంకర భాష్య  విమర్శనము 7- ఆంధ్ర వేదాంత ముక్తావళి 8-సిద్ధాంత లేశ –క్రష్ణాలంకార సంగ్రహం 9-పంచ పాదిక 10–స్వరూప ప్రకాశము 11-సంక్షేప శారీరకము (మధుసూదన కృత సార సంగ్రహ వ్యాఖ్య విశేషాలతో )12-బ్రహ్మ సూత్ర శంకర భాష్యము  13-పసామ త్రయి(వేదాంత పరిభాష వేదాంత పాఠం ,వాసుదేవ మననం )

సరళీకరణ సంగ్రహ తెలుగు గ్రంధాలు

1-సరళ విచార సాగరం (గ్రాంధిక తెలుగు నుంచి వ్యావహారిక తెలుగులోకి )2-సరళీకృత వ్రుత్తి ప్రభాకరం (గ్రాంధికం నుండి వ్యావహారికానికి )3-విద్యారణ్య కృత వివరణ ప్రమేయ సంగ్రహం కు ఆంధ్రానువాదం 4-శ్రుతి గీతలు –భాగవత దశమ స్కంధం లోని వాటికి టీకా తాత్పర్య ,పద్యానువాదం 5-నైష్కర్మ సిద్ధి –అనువాదం

ఇలామేళ్ళచెర్వు  వారి వేద, వేదా౦గ ,జ్యోతిష ,దర్శన సాహిత్య సరోవరం 70 గ్రందాలతో నిండి ఒడ్డుల నరసి నిండుగా ఉంది .ఇంకా ఎన్నో రాస్తూనే ఉన్నారు .వారి కలం నిత్యం పదునుతో  పరిగిడుతూనే ఉంది.ఇంతటి సాహిత్య శీలిని,పుంభావ సరస్వతీ మూర్తి ని  ప్రభుత్వ౦  గుర్తించక  పోవటం, పురస్కార ప్రదానం చేయకపోవటం  ఏలినవారి వక్ర దృష్టికి ఉదాహరణగా నిలుస్తుంది .శ్రీ వారు కూడా తానేదో సాహితీ సేవ చేస్తున్నానని మెహర్బానీ ప్రదర్శించకపోవటం ,గుర్తింపుకు ఆరాటపడక పోవటం  ,ఎక్స్పోజర్ కు దూరంగా ఉండట౦ వారి వినయానికి దర్పణం .

మేళ్ళచెర్వు వారి  గీర్వాణ భాషా వైశద్యాన్ని  ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం లో రాసే అదృష్టం నాకు కలిగింది .దీనికి డా .తూములూరు శ్రీ దక్షిణా మూర్తి గారే కారకులు .అంతకు ముందు ఎప్పుడో వారి గురించి కొద్దిగా రాశాను .మొన్న శాస్త్రిగారు తెనాలి వెళ్లి ,వారి ఫోటోను శ్రుతి గీతాలను ,వారి అపూర్వ సృష్టి బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారిపై సంస్కృతం లో శ్లేష మహాకావ్యంగా  రాసిన వారి దగ్గర మిగిలిఉన్న  ఒకే ఒక కాపీ  ‘’శ్రీ గురుచరితం ‘’ను నాకోసం తీసుకొని నిన్ననే నాకు అందేట్లు కొరియర్ లో శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు పంపారు .వాటిని బట్టి ఇదివరకు రాసినదాన్ని కొంచెం పెంచి ముద్రణకోసం లాస్ట్ మినిట్ లో డిటి పి చేయటానికి శ్రీ చలపాక ప్రకాష్ గారికి పంపాను .

వారి గురించి సమగ్రంగా గా రాయాలనే తలంపుతో ఈ వ్యాసం రాస్తున్నాను .వారి శ్రీ గురు చరితం ఇవాళే చదవటం ప్రారంభించి20 అధ్యాయాలలో 10 అధ్యాయాలు చదివాను .నాకు యేమని పించింది అంటే ఈ మహా కావ్యానికి మేళ్ళచెర్వు  వారే స్వయంగా అర్ధ తాత్పర్యాలతో తెలుగు లో వివరంగా విశేషాలతో రాస్తేఅద్భుతంగా ఉంటుందని .లేక వారంతటి శిష్యులు ఎవరితోనైనా రాయిస్తే ఈ తరంవారికి అందుబాటులో ఉంటుందని .వారు ఈ ప్రయత్నం చేసి గురు ఋణం ,పాఠక రుణమూ తీర్చుకోవాలని  వారికి నా విన్నపం .

నాకు తెలిసినంతవరకు ఈ కావ్యం లోని విషయాలు రెండవ వ్యాసం లో రాసే ప్రయత్నం చేస్తాను .

వారి ఫోటోను దీనితో పాటు జత చేస్తున్నాను చూడండి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-16 –ఉయ్యూరుmellachervu-subrahmanya-shaastri

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -15

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -15

మల్లినాధుని అద్వైత వేదాంత పాండిత్య గరిమ

మల్లినాధుడు అద్వైత వేదాంతాన్ని క్షుణ్ణంగా మదించిన వాడు .అందులో ఆయన పాండిత్య గరిమా ప్రదర్శనానికి సంబంధించిన కొన్నిటిని  తెలుసుకొందాం .కుమార సంభవం లోని విష్ణు స్తోత్రాలలో ఎన్నో వేదాంత విషయాలున్నాయి .వాటిని అద్వైత వేదాంతానికి అనుసంధానం చేస్తూ మల్లినాధుడు ఉపనిషత్ వాక్యాలను ఉదాహరించి తన అద్వైత అవగాహనా సామర్ధ్యాన్ని  నిరూపించాడు .-‘’కేవలాత్మనే ‘’కు ‘’ఏకః ఉపాయః ‘’అని చెప్పి ‘’ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ ‘’అనే ఐతరేయ ఉపనిషత్  వాక్యాన్ని పేర్కొన్నాడు . రఘువంశం లో ‘’హృదయస్థ మనాసన్నమకామం త్వాం తపస్వినం –దయాలు మనఘ స్పృష్టం పురాణ మజరం విదు’’ శ్లోకానికి మల్లినాధుడు  ఉపనిషత్ ధోరణి లోనే వ్యాఖ్య రాశాడు .-‘’అకామం నిత్య పూర్నత్వాత్ నిష్కామం తధాపి-తపస్వినం లోక యాత్రార్ధ౦ తాపసం విదుః –సోకామయత –బహుస్యాం ప్రజాయే యేతి –త తపస్యత్వా ఇదం సర్వ మసృజత ‘’అనే తైత్తిరీయ ఉపనిషత్ భాష్యంగా వివరించాడు .మరొక శ్లోకం లో మాయ అనేదానికి శక్తి అనే అర్ధం తో వివరించాడు .అద్వైత వేదాంత మార్గం లో జ్ఞాన కర్మ భక్తికలిసి ఒక ఆధ్యాత్మిక యాంత్రిక వ్యవస్థ నేర్పరచి మోక్షమార్గానికి దారి చూపిస్తుంది .

నైషధీయ చరితం లో అనేక శ్లోకాలు  అద్వైత భావ పరిమళాలను వెదజల్లుతాయి .అందులో   ఆసక్తికర మైన విషయం ఒకటి ఉంది –అది మనుషులు అయిదవ ప్రత్యామ్నాయమైన సత్యాన్ని నమ్మరు అన్నది .మిగిలిన నాలుగు ఇతర సిద్ధాంతాలు అద్వైతాన్ని వేళ్ళూన కుండా చేస్తాయి .దమయంతికి నలమహారాజు పై అనుమానం ఉన్నందున ,ఆమె అయిదవ ప్రత్యామ్నాయమైన సత్యాన్ని నమ్మదు .నలుడు అత్యంత నమ్మదగిన పురుషుడు .మిగిలిన నలుగురు ఆమెను పొందాలనుకొంటారు .అందుకు పూర్తీ నమ్మకస్తుడైన నలుని ఆమె చేరనీయ కుండా నిలువరించే ప్రయత్నం చేస్తారు –‘’సాప్తుం ప్రయచ్చతి న పశ్చతుస్టయే తాం మల్లాభ శంసిన న పంచమ కోటి మాత్రే –శ్రద్ధాం దధే నిషాద రాణ్విమతో మతానా మద్వేతతత్వ ఇవ సత్యత్తరేషి లోకః ‘’(నైషధం ).

‘’ రఘు మహా రాజు తన జ్ఞానాగ్ని చేత దహి౦ప బడ్డాడు ‘’అనే రఘు వంశ శ్లోకం –‘’అపారే దహనే స్వకర్మణా౦  వవృత్తే జ్ఞాన మయేన  వహ్నినా –‘’ అనేదానికి భగవద్గీత లోని ‘’య౦  యేయాంసి సనిద్రోగ్ని భస్మ సాత్ కురుతేర్జున –జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్ కురుతే తధా ‘’అనే దానితో సమర్ధించాడు సూరి .కుమార సంభావంలోని ఒక శ్లోకం పరమాత్మను తెలియాలి అంటే తనలోకి తాను చూసి తెలుసుకోవాలి  .బాహ్యే౦ద్రియాల చూసే చూపు ఆత్మను తెలుసుకోవటానికి పనికిరావు .అనే అర్ధం ఇచ్చేకుమార సంభావ  శ్లోకం –‘’మనో నవద్వార నిస్టిద్ర వ్రుత్తి హృది వ్యవస్థాప్య సమాధి పశ్యం –యమక్షరం క్షేత్ర విదో విదుస్త మాత్మా నమాత్మత్య న్యవ లోక యంతిం ‘’

న్యాయ శాస్త్ర కోవిదుడు మల్లినాధుడు

తార్కికులు ఒక క్రమ విధాన వాదనలను ,వివాదాస్పద వాదనలను  ఏర్పరచారు .అవి రెండు రకాలు .1-గతి తార్కిక వాదం(డయలేక్టికల్ ) 2-న్యాయ వాదం (సిల్లాజిస్టిక్ ).మొదటి దాని ప్రకారం రచయిత తన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు .తర్వాత దీనిపై అభ్యంతరాలను ముందే ఊహించి తన వాదాన్ని క్రమపద్ధతిలోమొదటి దాన్ని అనుసరించి వాటిని ఖండిస్తూ ,తన భావాన్ని సమర్ధిస్తూ  కొనసాగిస్తాడు . వ్యతిరేకులు కొన్ని విషయాలను ప్రతిపాదిస్తారు ,వాటిని సిద్ధాంత కర్త తృణీకరించి పక్కన పడేస్తాడు .ముగింపు మాత్రం మొదటి దానికి పూర్తిగా పునరుక్తిగా నే స్థిరపడుతుంది .ఇదే గతి తార్కిక వాదం .

రెండవది అయిన న్యాయవాదం లో అందరికి తెలిసిన అయిదు సోపానాలుంటాయి 1-ప్రతిపాదన 2-కారణం 3-ఉదాహరణ 4-అనువర్తన (అప్లికేషన్ )5- ముగింపు .మల్లినాదునికి ఇవన్నీ కరతలామలకాలే .సాధారణ న్యాయవాదాన్ని మల్లినాధుడు అనుసరించాడు .’’అను మేయ శోభి ‘’ని వివరిస్తూ పార్వతీ దేవి తుంటి భాగాన్ని వర్ణిస్తూ అవి చాలా అందంగా ఉన్నాయని ,అవి శివుని అర్ధభాగం గా ఉన్నప్పుడు మరింత శోభించాయని –‘’గిరిజా నితంబ బింబం విశ్వాతి శాయి సౌ౦దర్యం –గిరీశాంక రూఢత్వాత్వ్యతిరేకేణ నార్యంత రాశర్నితంబ బింబ వత్ ‘’అని కాళిదాసు  వర్ణించాడు  .దీన్నే మల్లినాధుడు ‘’అనుమేయ శోభి ‘’అన్నాడు .

వరద రాజు రాసిన ‘’తార్కిక రక్ష’’కు సూరి రచించిన ‘’నిష్కంటక ‘’వ్యాఖ్య లో మల్లినాధుని తార్కిక గరిమ మహోత్క్రుస్టంగా  ఉందని పి .జి లాల్యే పండితుడు విశ్లేషించాడు .మేఘం పై ‘’శైల భావన ‘’గుర్తుంచుకోవటానికి అనుకూలం .-‘’తస్యాత్తీరే —-ప్రేక్ష్యో పా౦తస్ఫురిత తాడితం త్వాంతమేవ స్మరామి ‘’అనేమేఘ దూత శ్లోకం పై వ్యాఖ్యానిస్తూ నిరుక్త కారుని మల్లినాధుడు విమర్శించాడు .భావన అనేది స్మృతికి సమానార్ధం కాదన్నాడు –దీనిపై స్పందిస్తూ సూరి –‘’నిరుక్త కారస్తు త్వాం తమేవ స్మరామి ఇతి యోజయిత్వా మీడే శైలత్వ రోప మాచస్టేసదా సంగాతం .శైలత్వ భావనా స్మ్రుతి రిత్యపి నొప పద్యతే .భావనాయః స్మ్రుతిత్వే ప్రమాణ భావాత్ –అనుభవ యోగాత్ సద్రుశ్యోపన్యాసస్య వైయర్దా చ్వ-విసద్రుశోపి సాలగ్రామే హరిభావ దర్శనోదితా ‘’అని చెప్పాడు .అలాగే ‘’మత్స దృశ్యం లిఖంతి’’అంటే ప్రేమలో మొదటిదశ అని  –లవ్ యట్ ఫస్ట్ సైట్’’గా అర్ధం చెప్పిన వ్యాఖ్యాతలను విపరీతంగా విమర్శించాడు  .దీనితర్వాత మల్లినాధుని రాజకీయ శాస్త్ర పాండిత్యాన్ని తెలుసుకొందాం.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

.

 

‘’

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రద్దు ”లోపనిలో పనిగా

పెద్ద నోట్ల రద్దు తో అందరి జీవితాల ఆనందాన్ని రద్దు చేసి ,మోడీ మరో తుగ్లక్ అని పిస్తున్నాడని అందరూ అన్నమాటే .చిక్కి శల్యా విశిష్టమై మంచం లోనే ఉండి పోయిన కాంగ్రెస్ ,కమ్మీ లకు రద్దు సంజీవిని లా పని చేసి ప్రాణం నిలిపి బజారులో గోల చేసే అవకాశమిచ్చింది .పరిస్థితి ఇలాగే ఉంటె ఉత్తర ప్రదేశ్ లోభి జె పి  నాయకులు ఎన్నికలలో గెలవలేమని నెత్తీ నోరు పెట్టు కొని తలబాదు కొంటున్నారట. అప్పనం గా మోడీ మళ్ళీ కేంద్రం లో కాం గ్రేస్ కు అధికారాన్ని బంగారు పళ్లెం లో పెట్టి అప్ప గిస్తాడేమో నాని అనుకొంటున్నారు .కనుక రద్దు లో పనిలో పనిగా బి జె పి అధిష్టానం మోడీ ప్రధాని పదవి రద్దు చేసి అద్వానీ వంటి సీనియర్ నాయకుని ప్రధానిని చేస్తే చరిత్ర పునరా వృత్తం కాకుండా ఉంటుందని అనిపిస్తోంది .-దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -39 దివిసీమ ఉప్పెన

Inline image 1

—  నా దారి తీరు -39

                                     దివిసీమ ఉప్పెన
            నా పెనమ కూరు ఉద్యోగం అంటే నాకు ముందు గుర్తుకొచ్చేది దివి సీమ ఉప్పెన మహోత్పాతమే . 1977 నవంబర్ 19 శని వారం రాత్రి జలప్రళ యమేర్పడి దివి తాలూకాను అస్తవ్యస్తం చేసింది పది వేలకు పైగా జనం ఉప్పెనకుబలి అయ్యారు .ఈ రోజే ఇందిరా గాంధి పుట్టిన రోజు కూడా  . నాటి  నుండి ఆమె ప్రతి పుట్టిన రోజుకీ జనం లో భయం ఉండేది ఏ ప్రమాదం వస్తుందో నని . అంతకు ముందు రోజు రాత్రి నుండి తుఫాను హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు   రేడియో ఏ ఆధారం ప్రమాద హెచ్చరికలు ఇరవై  నాలుగు గంటలూ మోగుతూనే ఉన్నాయి .శని వారం నుంచి మూడు రోజులు స్కూళ్ళను మూసి వేస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ అధికారికం గా ప్రకటించాడు .  స్కూల్ ఉంటుందేమో నని నేను సైకిల్ వేసుకొని పెనమకూరు కు వెళ్లాను హెడ్ మాస్టారు కానీ పించి సెలవు ప్రకటించామని చెప్పారు వెంటనే ఇంటికి తిరిగి వచ్చ్చే శా ను ఉదయం నుండి తీవ్రమైన నల్లటి మబ్బులు ఆకాశం అంతా  కమ్ముకొని దాదాపు  గంటకు వంద మైళ్ళ కంటే వేగం తో సముద్రం వైపు ప్రయాణించటం చూశాం .వర్షం , గాలి జో రైంది .
                     అప్పుడు మా ఇంటి పరిస్తితి ఒక సారి జ్ఞాపకం చేసుకొంటున్నాను . మా అన్నయ్య గారి అమ్మాయి వేదవల్లి మగ పిల్లాడిని రవి ని ప్రసవించి ఇంటిలో ఉంది . సావిట్లో ఆమెకు వర్షం పడకుండా ఉన్న  ఒక చోట మంచం వేసి పిల్లాడితోపడుకో బెట్టాం  నడుం కట్టుతో ఉంది .  భోజనాలు సాయంత్రం పెండ్రాలే చేసేశాం . మా తోడల్లుడు గారి అబ్బాయి ”సూర్యం ”మమ్మల్ని చూద్దామని ఆ ఉదయమే ఖమ్మం నుంచి వచ్చాడు .కదలి వెళ్ళటానికి వీలు లేక మా ఇంట్లోనేఉండీ  పోయాడు .  మేమందరం పదమ టిం ట్లో మంచాలేసుకొని పడుకోన్నాం.  అమ్మ ఆమెకున్న చిన్న నవ్వారు మంచం లో సావిట్లో మనవరాలికి తోడుగా పడు కొంది పెంకుటిల్లు కనుక వర్షం ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పడుతోంది వీలైన చోట్ల తప్పాలాలు బకెట్లు చెంబులు ,గిన్నెలు పెట్టాము   వాటిలో పడటానికి . నిండగానే తూము లో పారబోస్తున్నాం . బయటికి తలుపులు తీయటానికి సాహసించలేక పోయాం . విపరీతమైన గాలి వాన  తో ముంచెత్తుతోంది . గుండె దిటవు చేసుకొని రేడియో పెట్టుకొని వార్తలను హెచ్చరికలను వింటున్నాం .
                          రాత్రి పది దాటిన తర్వాత  తుఫాను భీభత్సం పెరిగింది మిన్నూ మన్నూ ఎకమ య్యేట్లు భీభచ్చం గా వర్షం కురుస్తోంది . ప్రళయం ముంచు కొచ్చిందని భయ పడ్డాం . ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నాం ప్రతి క్షణాన్ని . భీకర మైన శబ్దాలు విని పిస్తున్నాయి . ఆకాశం బద్దలై పోతున్నట్లని పించింది ఎక్కడో మంటలు చేల రేగుతున్నట్లు అని పించింది .పాపమ్ రేడియో వాళ్ళు కమ్యూని కేషన్లు తెగ నంతవరకు చెప్పాల్సింది చెబుతూ హెచ్చరికలు చేస్తున్నారు దివి సీమ లో తుఫాను కేంద్రీక రించిందని బందరు అవని గడ్డ ప్రాంతాలలో జల ప్రలయమేర్పడి నట్లు వార్తలు చెప్పుతున్నారు అర్ధ రాత్రి దాటిన తర్వాతా రేడియో పని చేయలేదు . తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియ లేదు .కుమ్భ వృష్టి కురుస్తూనే ఉంది ,గాలి వృక్షాలను ఇళ్ళ కప్పుల్ని కూల్చే వేగం తో వీస్తోంది మె రుపులు ఉరుములతో ఆకాశం  యము ఘంటి కలను మోగిస్తోంది . సరే ఎవరికి నిద్ర లేదు కళ్ళల్లో ఒత్తులేసుకొని బాలింత రాలీని చూసుకొంటూ ఇల్లు కూలి పోతుందేమో నని  నని భయ పడుతూ ,తలుపులు తీయకుండా గాలికి విరిగి పోకుండా అన్నీ రోళ్ళు రోకళ్ళు రాళ్ళు అడ్డాం  పెడుతూ  ఆ కా ళ  రాత్రి ని గడిపాం . తెల్లారే సరికి అంటా ప్రశాంతం గా ఉంది .వాకిల్లలొ రోడ్ల మీద మొల లోతు  నీళ్ళు బయటికి వెళ్ళే వీలే లేదు మర్నాటి వరకు .  కరెంటు ఎప్పుడో పోయింది రా వటా నికి వారం పైగా పట్టింది వైర్లు తెగాయి స్తంభాలు ట్రాన్స్ ఫార్మర్లు కూలి పోయాయి . అప్పటికి మాకు టెలిఫోన్ లేదు . పేపర్ వస్తేనే వార్తలు తెలిసేది .. రవాణా వ్యవస్థ దెబ్బ తిండి రోడ్లుమీడున్న చెట్లు కూలి పోయి ప్రయాణానికి ఆటంకం కలిగించాయి .
                          బయటికి వచ్చి రోడ్డు మీద  చూస్తె పరిస్తితి హృదయ విదారకం గా ఉంది . రేకుల షెడ్లు యెగిరి పోయాయి గడ్డి వాముల అడ్రస్ లు లేవు . పూరిల్లు ఎక్కడున్నాయో తెలియ లేదు సావిట్లో కట్టేసిన గొడ్లు చలికి వర్షానికి చచ్చి పడి ఉన్నాయి ఎన్ని కోళ్ళు చని పోయాయో లెక్క లేదు ఒక్క ఉయ్యూరు లోనే ఇట్లా ఉంటె మిగిలిన చోట్ల ఎలా ఉందొ నని అందరు భయ పడుతున్నారు . బస్సులు నడవటం పత్రికలూ రావటం రేడియో పని చేయటం  వల్ల  జరిగిన భీభత్సం క్రమం గా తెలుస్తోంది .దివి సీమ లో చెప్పలేనంత నష్టం జరిగిందని వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ,సముద్రం లో బడబాగ్ని పుట్టి ఊహించని నష్టాన్ని కలిగించిందని సముద్రం విరుచుకు పడి ఊళ్లకు ఊళ్ళను  తనలో కలుపుకోందని కెరటాలు కరెంటు స్తంభాల ఎత్తుకు వచ్చాయని ఇంత ఎత్తు  కెరటాలు రావటం ఇంత   వరకు ఎన్నడూ చూడలేదని ఎక్కడ పడితే అక్కడ శవాలు గుట్టలు గుట్టలు గా పడి  ఉన్నాయని జంతు కలేబరాలకు లెక్కే లేదని గడ్డి మోపులు కరెంటు స్తంభాల మీద కానీ పించాయని వార్తలోచ్చాయి .  జరుగ రాని  ఘోరం జరిగి పోయింది దివి సీమ లో బందరు కూడా బాగా దెబ్బ తిందని తెలిసింది .
Inline image 1
                          ఉప్పెన వచ్చిన మర్నాటి నుంచే మండలి కృష్ణా రావు గారు స్వయం గా బయల్దేరి దెబ్బ తిన్న ప్రాంతాలైన భావ దేవర పల్లి ,నాగాయలంకా ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఇబ్బంది పడే జనాలను ఓదార్చి మిగిలిన వారిని అవని గడ్డ లోని గాంధీ క్షేత్రానికి ,స్కూలు భవనాలకు తరలించి భోజన సౌకర్యాలు కలిగించారు ఆయన ఈ ఉప్పెన చూసి చలించి పోయారు ముఖ్య మంత్రి వెంగల రావు వస్తే కావలించుకొని ఏడ్చేశారు కా వలసిసహాయం అందినచమని అర్ధించారు .  స్వచ్చంద సంస్తలు అయిన ఆర్.యెస్.యెస్  వంటివి,సైన్యం  చాలా చొరవతో ముందుకు వచ్చి పునరావాస కార్యక్రమాలు చేబట్టాయి .     .శవాలను కాలువల్లోంచి బయటికి తీయటం పెద్ద సమస్య అయింది .శవాలకు అంత్య క్రియలు చేయటం పెద్ద సమస్య .వీలైనన్త వరకు బంధువులతో గుర్తింప జేశారు సామూహిక శవ దహనాలు చేయాల్సిన పరిస్తితి వచ్చింది . అక్కడ అంటూ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం పెద్ద సమస్య . కలెక్టర్ a.v.s.reddi అని జ్ఞాపకం . చాలా శ్రమించాడు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి పని చేయించాడు .
Inline image 2
                                ఈ ఉప్పెన మహోత్పాతాన్ని స్వయం గా చూడాలని పించింది .ఒక ఆదివారం మధ్యాహ్నం భోంచేసి బస్ లో అవని గడ్డ వెళ్లాను అక్కడి నుండి ఎక్కడికీ బస్సులు తిరగటం లేదు . జీపులు కార్లలోనే వెళ్ళాలి అలానే భావ దేవర పల్లి వెళ్లాను.  దారి పొడుగునా శవాలు కానీ పించాయి వాసన భీభత్సం గా ఉంది D.D.T.చల్లారు కాని ఆగటం లేదు ఆడా  మగా శిశువుల శవాలు చూసి గుండె జారిపోయింది పశువుల కలేబరాలకు లెక్కే లేదు . అవని గడ్డ లో స్వంచంద సంస్తల సేవలు చూసి కళ్ళు చెమర్చాయి .వాల్ల సేవకు ప్రతి ఫలం ఇవ్వలేము . ముక్కుకు కర్చీఫ్ పెట్టుకొనే తిరిగాను . గాంధీ క్షేత్రానికి వెళ్లి చూశాను భావ దేవర పల్లి లో ఉప్పెన నీరు హైస్కూల్ భవనం పై అంతస్తుకు చేరిందట  . ఉయ్యూరు  నుండి ఇక్కడికి వచ్చ్చిన  వచ్చిన సీతాపతి రావు హెడ్మాస్టారు పై అంతస్తు ఎక్కి ప్రాణాలు ఉగ్గాబట్ట్టుకోన్నారట అక్కడి లైబెరియన్ నాన్చారయ్య  కుటుంబం కూడా  అంతే తర్వాత ఉయ్యూరు కు బదిలీ అయ్యాడు .  అవని గడ్డకు మళ్ళీ చేరి బందరుకు బస్ లో వెళ్లాను .ఆన్ని  చోట్లా పంటలన్నీ నాశనం ఉప్పురిసి పోయాయి పొలాలన్నీ . రెండు మూడేళ్ళ దాకా పొలాలలో పంట పండదు .బందరు వైపూ  వైపునా ఇలాగే కానీ పించింది బందరు నుండి రాత్రికి ఉయ్యూరు చేరాను .
                     ఉయ్యూరు లో మేమందరం యార్ ఎస్ ఎస్ . వాళ్ళ కింద పని చేసి ఇంటింటికి తిరిగి బట్టలు డబ్బు పోగు చేశాం  మండావీరభద్ర రావు  మాకు నాయకుడు మాధవాచారి సహాయకుడు . వీటిని కార్లలో సేవా కేంద్రాలకు పంపి వారితో అందరికి అందజేయిన్చాం . ప్రతి స్కూల్ నుండి నిధులు వసూలు చేసి ఎవరికి వారు స్వచ్చందసం గా డ బ్బు వసూలు చేసిముఖ్య మంత్రి సహాయ నిధికి పంపారు దేశం ,ప్రపంచం అంతా  బాసటగా నిలిచింది మందులు పంపారు కొందరు దుప్పట్లు రగ్గులు చొక్కాలు చిన్న పిల్లల డ్రెస్ లు పంపారు ఇంకొందరు . మా తమ్ముడు మోహన్ మరదలు సునీత పూనా నుంచి చూడ టానికి వచ్చారు కూడా బట్టలు తెచ్చారు మళ్ళీ వాళ్ళతో వెళ్లి అక్కడ పంచి పెట్టాము . ఇదంతా  గుండె బరువేక్కువయ్యే సన్నీ వేషాలే .  ఆ సంఘటనపై  ”శని రాత్రి ”అనే దీర్ఘ కవితరాశాను .
                         ఈ విధం గా పెనమకూరు అంటే దివి ఉప్పెనే ముఖ్యం గా జ్ఞాపకం వస్తుంది . మా చల పతి  కి ఇచ్చిన మాటను నిలుపుకొన్నాడు వద్దే శోభనాద్రి .వాగ్దానం చేసిన  నాలుగు రోజులకే నన్ను పెనమకూరు నుండి ఉయ్యూరు కు ట్రాన్స్ ఫర్ చేయించాడు . 17-8-79 సాయంత్రం పెనమ కూరు హైస్కూల్ లో రిలీవ్ అయి మర్నాడు అంటే 18-8-79 ఉదయం ఉయ్యూరు హైస్కూల్ లో చేరాను ఇది  నా తొమ్మిదవ బదిలీ ఉయ్యూరు రావటం నాలుగో సారి . పెనమకూరు లో మంచి వీడ్కోలు విందు ఇచ్చారు హెడ్ మాస్టారు ఆప్యాయం గా మాట్లాడారు .స్టాఫ్ అంతా  మెచ్చుకొన్నారు .  Inline image 2
Inline image 3
                   సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –15-7-13- కాంప్ -హైదరాబాద్ .
Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శని రాత్రి –కవిత

శని రాత్రి –కవిత

        19-11-1977  శని వారం అర్ధ రాత్రి దివి సీమను ఉక్కిరి బిక్కిరి చేసిన ఉప్పెన తగ్గిన తర్వాత ,ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసి   స్పందించి ,30 -11 -1977 న రాసిన కవిత.
          అనిలం తో అనలం కలిస్తే ,సర్వం పరశు రామ ప్రీతి
అనిలం తో జలం కలిస్తే ,మహోధృత ప్రళయం
అనిలం ,జలం ,అర్ణవం ముప్పిరి గొంటే మహోప ద్రవం
ప్రుధివ్యాపస్తేజో వాయురాకాశ పంచ భూతాలు
ఒక్క ఉదుటున విరుచుకు పడితే
ఊహాతీత మానవ మారణ హోమం
శని రాత్రి -నిజం గానే మన పాలిటి ”శని రాత్రి ”
చిలికి .చిలికి గాలి వానయై ,కురిసి కురిసి కుంభ వ్రుస్టై
చాలదన్నట్లు ఉప్పెన పెన వేసుకు వస్తే
భూమి ,జలద( ధ)రించి ,భయకంపిత మైన వేళ
ఆకాశం ఆవులించి ,,బడబాగ్ని కీలలు నాలుక సాచితే
నమ్ముకున్న భూమి తొలగి పొమ్మంటే ,
కమ్ముకున్న గాలి తోసి పారేస్తుంటే
కడలి గర్భం   చీల్చుకొని ,సహస్ర కరాలు సాచితే
మానవునికి చోటేదీ ,దారేదీ ,దిక్కేదీ?
ఎన్ని వేల మానవ జీవితాలకు భరత వాక్యం పలికిందీ రాత్రి ?
ఎన్ని లక్షల మూగ జీవాల ఆర్తనాదం నినదించీ రాత్రి ?
ఎంత మందిఅభాగ్యుల కన్నీరు కాల్వలై
పొంగిన సాగర తరంగాలను ,వేనుకక్కు నేట్టిందీ కలి రాత్రి ?
కళ్ళ ఎదుటే ,కట్టుకున్న వాడు కూలి పోతుంటే
చూస్తూ చూస్తూనే తన వాళ్ళంతా ఊడ్చుకు పోతుంటే
నిస్సహాయం గా ,నీరవం గా ,జడమైనిల్చి పోతుంటే
సర్వస్వం కోల్పోయిన అభాగ్య సోదరుల
కన్నీటి గాధలు వింటుంటే
సాధించిన అభ్యుదయ మంతా
సాగరమ్  నీళ్ళ పాలై పోతుంటే
దిక్కు లేక మనసు వ్రక్క లై పోతుంటే
ఓదార్చే వారెవ్వరు ?,అక్కున చేర్చే వారెవ్వరు ?
ఎన్ని వేల కోట్లు ,ఈ దుఖార్తుల బాధలు తీర్చ గలవు ?
ఎన్ని వేల అశ్రు కణాలు ,ఈ అభాగ్యుల క్షుధాగ్ని ని ఆర్ప గలవు ?
ఎన్ని వేల చేతులు ,ఈ దారుణ మానవ ఖననం చేయ గలవు ?
ఏటా వచ్చే తుఫానే నేడు
ఉద్ద్రుతమై ,మహోద్ధ్రుతమై
ఒక్క రాత్రి లో సర్వం కబళించి
తెల్లారే సరికి ,జీర్ణించుకోలేక ,వెలి గ్రక్కింది
ఇది తెలుగు జాతి పాలిటి ఆశని పాతం

ఇది భారత జాతికే పెను సవాల్
సర్వ సభ్య సమాజానికే ఒక అగ్ని పరీక్ష
కొండంత ధైర్యం, గోరంత సాయం
ఉడతాభక్తి గా అందరం చేస్తే
ఈ శ్మశానం పై మళ్ళీ వసంతం ప్రభవిస్తుంది
ఈ శవాలపై నాగరకత వికశించి ,పరవశిస్తుంది
ఈ ఉప్పు నీరు గంగా జల మౌతుంది
ఈ కడలి పొంగు ,కంగు తింటుంది
ఈ చేలల్లో బంగారం పూసి ,స ఫలం అవుతుంది
ఈ నేల నాలుగు చెరగులా
మానవత మళ్ళీ చిగురిస్తుంది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్30-11-16

Posted in కవితలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -14 దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం -2

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -14

దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం -2

మల్లినాధుడు కొన్ని అనుబంధ శాస్త్రాలైన మీమాంస ,వేదాంత శాస్త్రాలను క్షుణ్ణంగా మధించాడని ,ఆయనకు మీమాంస శాస్త్రం లో ఉన్న పాండిత్యం అమోఘమైనదని దానికి తార్కాణం ఏకావలికి రాసిన ‘’తరళ’’వ్యాఖ్యానమే తెలియ జేస్తుందని ,అందులో కనీసం 25 సార్లు మీమాంస శాస్త్ర సిద్ధాంతాలను ప్రస్తావి౦చాడని ప్రొఫెసర్ ఎస్ .బి రఘునాదా చార్య పేర్కొన్నారు .ఆయన రాసిన వ్యాసం లో మరికొన్ని సిద్ధాంతాలను  –‘’మల్లినాధస్య మీమాంస శాస్త్ర పాండిత్యం ‘’అనే వ్యాసంలో  ఆయన రాసిన ‘’మల్లినాద మనీష ‘’లో వివరించారు .వేదమే అన్నిటికన్నా సాదికారమైనదని తెలియ జేయటానికి మల్లినాధుడు ఒక వాక్యాన్ని ప్రస్తావించాడు .

ఏకావలి పై వ్యాఖ్య రాస్తూ మల్లినాధుడు మీమాంస శాఖలో భట్టు యొక్క ‘’అభి తాన్వయ వాదం ‘’ను అనుసరించాడు .అంటే పదం యొక్క అర్ధం వాక్యార్దానికి దారి చూపిస్తుంది .. ’జ్యోతి స్టోమా ది వాక్యార్ధైఃపదేః-స్వాభి డేయ సామాన్య పర్వ సనాదాకాండ క్షాసం నిధిఃయోగ్యతా –బల్లబ్దేక వాక్యతా వ్యవస్తాపిత కారణాత్య  దిశక్తి యుక్తా నియతేవ్య క్తీరాక్షిపాద్రిమః –స్వస్తార్భి ఘనద్వారా తత్సంబంధి తదేర్పాదార్ధః లక్ష్యంతే—-యయాహుః –తస్మాత్ప దేశాభి హితైః పదాయైర్లక్షణాయా వాక్యార్ధః ప్రతిపాద్యతే ‘’( ఏకావలి )

ఏకావలి లోని ఆరవ ఉన్మేష లో అవిమృస్టావిదేయాంశశ ‘’యొక్క దోష రహితాలను చర్చ౦చాడు .ఇక్కడ మీమాంస శాఖ అభిప్రాయాలను పరిగణించాడు .ఇందులో  గుణం ముఖ్యమై విషయం తరువాతి స్థానాన్ని పొందింది –‘’తదేతత్ సమ్యగ్ వివేచిత స్మాభి స్తంత్ర వార్తికా యాం బాజపెయాదికరణే –తస్మాద్ విదేయస్య ప్రాధాన్య మప్రదాదాన్యం చను వాద్యస్యేతిమీమాంసా మా౦సలం వచ్చా ఇతి ప్రతీమః ‘’.మల్లినాధుడు మీమా౦స లోని అనేక అధికరణాలను వాటి పేర్లు చెప్పకుండా పరిగణన లోకి తీసుకొన్నాడు .

మొదట మల్లినాధుడు నమస్కార విధి ని చర్చించాడు .ఇందులో రెండు విధానాలను తెలిపాడు .అందులో మొదటిది కర్మకాండకు ముందు చేసే నమస్కారం .రెండవది వాజ పేయ జ్యోతిస్టోమ యాగాలలో కొన్ని ప్రత్యేకంగా చేయాల్సిన నమస్కారాలు .కర్మకాండకు ముందు చేసే నమస్కారం లో మళ్ళీ రెండు రకాలు .1-సూటిగా ఉపకరణాలతో చేసేది –దీన్ని ‘’సన్నిపాత్యోప కారకం ‘’అంటారు 2-దూరంగా ఉండి చేసేది దీన్ని ‘’ఆరాదుపకారక ‘’అంటారు .వీటిపై చర్చ చాలా సూటిగా అతి సరళం గా ,స్పస్స్టంగా ఉంటుంది .అలాగే ‘’సాంకేతికం ‘’ను ఉపయోగించే విషయం లో మల్లినాధుడు ‘’అక్ర్త్యాధి కరణం ‘’,’’తద్భూతాధి కరణం ‘’ లను ఉదాహరించాడు .విద్యాధరుని సమాధాన్ని పూర్తిగా వివరించాడు –‘’సర్వస్య జ్ఞానస్య విషయః అన్యాత్ ఫలమిత్వ వివాద మిత్యర్ధః –కుత్రేదం దృష్టం ?తత్రాహ విషయో హీతి –నీలాదిహి ఘటాది రిత్యర్ధః –ప్రాకవ్యం జ్ఞాతతా –సా చ జ్ఞాన జన్య జ్ఞానననుమాయికా విషయన్నిస్టాయత్ప్రసాదాత్ జ్ఞాతో ఘటః ఇతి విశిష్ట వ్యవహారో జాయతే ఇతి జ్ఞాతతోవాదినః ‘’(ఏకావలి ).తర్వాత మల్లినాదునిఅద్వైత వేదాంత పాండిత్య గరిమను తెలుసుకొందాం .

సశేషం

19-11-16 నాటికి   దివి సీమ ఉప్పెన వచ్చి  40 ఏళ్ళు అయిన సందర్భంగా జ్ఞాపకపు పొరల్లో నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

.

 

‘’

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘మా అన్నయ్య’ – కవితా సంకలనం మీద పద్య స్పందన

18.11.2016

సాహిత్యాభిమానులైన మిత్రులకు,

శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ, గారి అభినందన లేఖా మకరందము

నమస్కారములు !  నేను ఈమధ్య ‘మా అన్నయ్య’ అనే కవితా సంకలనం మీద నేను రాసి పంపిన  సమీక్షను మీరు చదివే ఉంటారు. అందులో ప్రస్తావించిన కొన్ని కవితా మకరందాలను ఆస్వాదించి, ప్రముఖ కవి, పండితులు, మిత్రులు శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ గారు తన సహృదయ స్పందనలను రెండు అందమైన కందాలలోనూ, ఒక ఆట వెలది లోనూ కవిత్వీకరించి నాకు పంపారు. ఆ అందాల కందాలనూ, బాలలా ఆటలాడిన ‘ఆట వెలది’ నీ  ఈ క్రింద మీకందిస్తున్నాను. మనసుతో అందుకొని ఆనందిస్తారని ఆశిస్తున్నాను:

 

శ్రీ రామడుగు శర్మ గారు, గుంటూరు:                                          10.11.2016  

 

కం !! “ గీతాంజలి మూర్తి”  సఖా !!

         మా తలపులయందు  నిలువ “మా అన్నయ్యే”

        చేత : ప్రీతిచే మీదగు  

        వ్రాతయె; “గబ్బిట” సఖుండె  భాగ్యుండాయెన్ !!

                                                        కం !! “..అన్నయ్య” కవన సంకల

                                                                నోన్నతిని గురించి మీరలున్నతరీతిన్

                                                               ‘అన్నన్న !’ – అనెడి  విధముగ                                                                                   పన్నిన విశ్లేషణంబు  బాగుండె  సఖా !

“మా అన్నయ్య” ను గురించి:

 

ఆ.వే !! నాకె కాదు  మా కుటుంబ జనాళి

కెల్ల వేళలందు చల్లనైన 

జాడ; తోడు – నీడ, మేడ మా అన్నయ్య

గుర్తు వచ్చె;  నివియె  కోటి నతులు !!

 అవ్యాజాభిమానంతో ఈ కవితలు రాసి పంపిన శర్మ గారికి  శతథా నా హృదయపూర్వక ధన్యవాదములు.

 

–          గీతాంజలి మూర్తి –                                                                                                

 

Posted in కవితలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -13 దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -13

దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం

ఇప్పుడు మల్లినాధుని దర్శన శాస్త్ర లేక తత్వ శాస్త్ర వ్యవస్థపై ఉన్న పాండిత్య వైభవాన్ని దర్శిద్దాం .మల్లినాదుని కాలానికి ఊహా లేక నిరాధార (స్పెక్యులేటివ్ )వ్యవస్థ క్రమంగా ఎదగటం చూశాడు .అన్ని వర్గాల ,మార్గాల వారికి వేదమే అంతిమ అధికారి(అల్టిమేట్ అధారిటి ).సహజం గా వేద గ్రందాలఅంటే శ్రుతుల  వ్యాఖ్యానం అత్యవసరమైంది .వేదాంత ,మీమాంస శాస్త్రాలు తమ వాదనలకు అనుకూలంగా వేద వ్యాఖ్య చేశాయి .ఈ రకమైన వ్యాఖ్యానం మొట్ట మొదట కుమారిల భట్టు ,ఆది శంకరాచార్యవంటి  అగ్ర శ్రేణి ఆచార్యులు ప్రారంభించారు .వీటిని వారి శిష్య బృందం పరిపూర్ణం చేసింది .మల్లినాధుడు అతి జాగ్రత్తగా వీటి అభి వృద్ధి సోపానాన్ని   మనస్సాక్షి గా ఒక విద్యార్ధిలా ఆకళింపు చేసుకొన్నాడు .పైగా అప్పటికే కవులు ,మహా కావ్య నిర్మాతలు అనేక శాస్త్రాలలో నిష్ణాతులు .కనుక వ్యాఖ్యాతలు ఆ కవీన్ద్రులతో సమానంగానో అంతకంటే ఎక్కువగానో వీటి లో సాధికారత కలిగి ఉండాల్సిన అవసరమేర్పడింది .తనకు ముందున్న వ్యాఖ్యాతల కంటే మల్లినాధుడు స్పష్టమైన గ్రంధ శాస్త్ర పాండిత్యం ఉన్నవాడు కనుక మహా వ్యాఖ్యాత అనిపించుకున్నాడు అని లాల్యే పండితుడు నిగ్గు తేల్చాడు .

ఇప్పుడు వేద విజ్ఞానం లోమల్లినాధుని ప్రతిభ ఎలాంటిదో దర్శిద్దాం .కాళిదాస మహా కవి కావ్యాలలో ఉన్న శ్లోకాల వ్యాఖ్యానానికి మల్లినాధుడు వేదం నుంచి అనేక ప్రకరణాలను ఉదాహరించి కాళిదాసుని వేదవిజ్ఞానం పై వెలుగులు కుమ్మరి౦చాడు . ద్వాదశాదిత్యులు గురించి కాళిదాసు చెప్పిన విషయాన్ని ఆరణ్యకాల లోని ‘’అరుణ కేతు చయనం ‘’లోని మంత్రాలను ఉదాహరించి ,ఈ ఆచార కర్మవలన ముఖ్య సూర్యుడు అధిపతి అయిన స్వర్గాన్ని చేర వచ్చు అనే విషయాన్ని నిర్ధారించి చెప్పాడు .ఈ ప్రకరణం అనేక సూర్యులున్నారని తెలియ జెప్పింది .మల్లినాధుడు ఆ సూర్యులందరి పేర్లు వివరించాడు .

వేదం లోని ఒక ముఖ్య నమ్మకాన్ని మల్లినాధుడు వేరొక చోట వివరించాడు .-‘’ఉదేతుమాత్మ జన్నీహం రాజాసు ద్వాదశాశ్వపి –జిగీషు రికో దినక్రుదాదిత్యే వివ కలాతే’’(శిశుపాల వధ వ్యాఖ్యలో )

నైషధం లో నలమహారాజు చంద్రుని మించాడు అనే విషయాన్ని ‘’ఆరోగ్యే భ్రాజః పటరః పతంగ-జ్యోతిస్టోమః స మహా మేరుర్ణ జహాతి ‘’అనేదానితో సమర్ధించాడు

‘’ఓ అమాయక చంద్రా !దమయంతి మనసు ఆమె మరణం తర్వాత నీలో కలుస్తు౦ద నుకొన్నావా .కాని ,మన్మధుడు ఆమె మనసు చంద్రుని లో నల ముఖం వలె కలిసిపోతుందని  ప్రకటించాడు .’’ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ మల్లినాధుడు బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి ఒక ప్రకరణాన్ని ఉదాహరించాడు –

‘’యత్రస్య పురుషస్య అగ్నం వాగత్యోపి వాతం ప్రాణాశ్చక్షు రాదిత్యం –మనశ్చంద్రః దిశాఃక్షేత్రం పృధివీం శరీర మాకారం మాత్మౌషదీ’’

దేవతల౦దరిలోవిష్ణు మూర్తి వరిస్టుడుఅన్నదాన్ని వివరిస్తూ కఠోపనిషత్ వాక్యాన్ని చెప్పాడు –‘’ఇంద్రియేభ్యః పరా హ్గ్రర్దాఅర్యేభ్యశ్చ పరం మనః ‘’

కాళిదాసు వేదం లో సూర్యుడు సాయం  వేళ తనకాంతిని అగ్నిలో నిక్షిప్తం చేస్తాడు అని రఘు వంశం లో చెప్పిన   ఒకనమ్మకాన్ని వేద ప్రమాణం తో సమర్ధించాడు –

‘’సౌరం తేజః సాయమగ్నిం సంక్రామతే –ఆదిత్యో వా అస్తం యన్నాగ్ని మను ప్రవిశతి –అగ్నిర్వా ఆదిత్యః సాయం ప్రవిశతి –ఇత్యాది శ్రుతి ప్రమాణాత్ ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-16 –ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 10-రుక్ సంహితలో విసర్గ సంధి పై పరిశోధించిన –వట కృష్ణ ఘోష్

– గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

10-రుక్ సంహితలో విసర్గ సంధి పై  పరిశోధించిన –వట కృష్ణ ఘోష్

1905లో జన్మించి 45 ఏళ్ళు మాత్రమే జీవించి 1950లో మరణించిన బెంగాల్ కు చెందిన (వ)ట కృష్ణ ఘోష్ భారతీయ భాషా శాస్త్రవేత్త మాత్రమె కాక ఇండో యూరోపియన్ భాషలను ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వాడు .సంస్కృతం ఇండో యూరోపియన్ భాషా శాస్త్రాలపై ఎన్నో గ్రంధాలు రాశాడు .పాళీ భాషపై విల్హెం గ్రీగర్ జర్మన్ భాషలో రాసిన పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించి కలకత్తా యూని వర్సిటీ నుండి ప్రచురించాడు .సంస్కృతం లో ఆయన మొదటి రచన –‘’లెస్ ఫార్మేశంస్ నామినేల్స్ఎట్ వేర్బెల్స్ ఎం పు డు సాంస్క్రిట్ ‘’

వట కృష్ణ ఘోష్ ఇతర రచనలు –ఆపస్తంభ అండ్ గౌతమ ,గోదే అండ్ హిస్ ఫాస్ట్ ,కలెక్షన్స్ ఆఫ్ ది ఫ్రాగ్ మెంట్స్ లాస్ట్ బ్రాహ్మణాస్ పాణిని ,ఇండో యూరోపియన్ ఆరిజిన్ ఆఫ్ సాంస్క్రిట్ ,వేదిక ,పాళీ లిటరేచర్ అండ్ లాంగ్వేజెస్ ,ఏ సర్వ్ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ,ఏ లా ఆఫ్ విసర్గ సంధి ఇన్ రుక్ సంహిత ,విజ్ఞాన బాడ,హిందూ ఐడియా ఆఫ్ లైఫ్ అకార్డింగ్ టు గృహ్య సూత్రాస్ అండ్ శ్రౌత సూత్రాస్ ధర్మ శాస్త్ర ,అర్ధ శాస్త్ర అండ్ కామ సూత్ర,లింగ్విస్టిక్ ఇంట్ర డక్షన్ టు సాంస్క్రిట్ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 9-వేద వృత్తి ప్రకాశిక కర్త –క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

9-వేద వృత్తి ప్రకాశిక కర్త –క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ

27-10-1896 న బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాలలో హుగ్లీ జిల్లా  నమ్ తా గ్రామం  లో కులీన చట్టోపాధ్యాయ కుటుంబం లో జన్మించిన క్షేత్రేశ చంద్ర చటోపాధ్యాయ వేద వ్యాకరణ ,పాళీ ,ప్రాకృత, ఫైలాలజీ లో మహా విద్వాంసుడు .బంకిం చంద్ర చటోపాధ్యాయ కుటుంబ వారసుడేకాక ఆయననుంచి పునరుజ్జీవన భావదారనూ అందిపుచ్చుకున్నాడు .కలకత్తా యూని వర్సిటి నుండి మెట్రిక్ పాసై ,ప్రెసిడెన్సి కాలేజి లో చేరి చదివి ఇంటర్ పాసయ్యాడు .తర్వాత ఆగ్రా ఔద్ యునైటెడ్ ప్రావిన్స్ కు ప్రవాసిగా వెళ్లి అలహాబాద్ యూని వర్సిటి నుండి బి ఏ .బెనారస్ యూని వర్సిటినుండి 1919 లోసంస్కృతం లో  ఎం ఏ . పాసైనాడు .కలకత్తా యూని వర్సిటినుండి 1921 లో వేదం ,1922 లో వేదాంతం లలో ఎం ఏ .పాసయ్యాడు .కాలేజీలో చదివే రోజుల్లో నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కు అతి సన్నిహిత మిత్రుడుగా ఉన్నాడు. క్షేత్రేశ డా.గంగా నాద ఝా శిష్యుడు .

1924 లో అలహాబాద్ యూని వర్సిటిలో సంస్కృత లెక్చరర్ గా పని చేసి ,1950 లో రీడర్ గా పదోన్నతిపోంది ,195 6 లో ప్రొఫెసర్ అయి రెండేళ్ళు పని చేశాడు .తర్వాత బెనారస్ లో సంపూర్ణానంద యూని వర్సిటిలో రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ అయి విస్తృత  పరిశోధనలకు  అవకాశాలు  కల్పించాడు .  .సరస్వతి భవన గ్రంధ మాల ధారావాహిక గ్రంధాలకు సంపాదకత్వం వహించాడు .సరస్వతి సుసమ అనే పత్రికకు ఎడిటర్ గా ఉన్నాడు .కేంద్రవిద్యా శాఖ ఆధ్వర్యం లోని తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం లో’’ వేదం అవెస్తా’’ల తులనాత్మక అధ్యయనానికి స్పెషల్ స్కాలర్ గా ఎంపిక చేయబడినాడు .1960 లో కలకత్తా యూని వర్సిటి ఈయనను కంపారటివ్ రెలిజియన్ పై స్టీఫెన్ నిర్మలేందు ఘోష్ లెక్చరర్ గా నియమింప బడ్డాడు .

1924 డిసెంబర్ లో మద్రాస్ లో జరిగిన ఆలిండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ లో క్రియా శీలక పాత్ర వహించాడు .19 37 లో త్రివేండ్రం లో వేదం,ఇండో ఆర్యన్  పై జరిగిన సభకు అధ్యక్షుడై నడిపాడు .1955 లో అన్నామలై యూని వర్సిటిలో 18 సెషన్ లో వేదం పై జరిగిన సభకుఆధ్యక్షం వహించాడు .1946 కరాచీ లో జరిగిన అఖిలభారతీయ హిందీ సాహిత్య సమ్మేళనం ఫైలాలజి సెక్షన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు .క్షేత్రేశుని సంస్కృత భాషా వైదుష్యానికి మెచ్చి 1966 లో రాష్ట్ర పతి పురస్కారం అందజేయబడింది ‘

ఈశ ,కేన ఉపనిషత్ ‘’వేదవృత్తి ప్రకాశిక ,స్టడీస్ ఇన్ వేదిక్ అండ్ ఇండో ఇండియన్ రెలిజియన్ అండ్ లిట రేచర్ గ్రంధాలను  రాశాడు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment