గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 8-సంజ్ఞా నామవాచకాలపై విశేష పరిశోధన చేసిన సమీరన్ చంద్ర చక్ర వర్తి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

8-సంజ్ఞా నామవాచకాలపై విశేష పరిశోధన చేసిన సమీరన్ చంద్ర చక్ర వర్తి

భారతీయ భాషా పరిశోధకుడు ,సంజ్ఞా నామవాచాకాలపై(ఓమాస్టిక్స్ )  విశేష కృషి చేసిన సమీరన్ చంద్ర చక్రవర్తి బెంగాల్ లో జన్మించాడు .వేదాధ్యయనంపై నాపరిశోధన చేసిన సంపాదకుడు .ప్రస్తుతంకలకత్తా యూని వర్సిటిలో ఎమిరిటస్ ఫెలో గా ,జర్మన్ గెస్ట్ లెక్చరర్ గా ఉన్నాడు .రామ కృష్ణా మిషన్ఇన్ స్టి ట్యూట్ సెంటర్ ఫర్ ఇండలాజికల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ కు గౌరవ విజిటింగ్ ప్రొఫెసర్ . రవీంద్ర భారతి యూని వర్సిటి లో స్కూల్ ఆఫ్ వేదిక్ స్టడీస్ లో మాజీ రిటైర్డ్  డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ ..    ఆపస్తంభ సామాన్య సూత్రలేక యజ్న పరిభాష సూత్రను ,బ్రాహ్మణ సంగ్రహం నురాశాడు .ఆంగ్లం లో ‘’సం ఆస్పెక్త్స్ ఆఫ్ వేదిక్ కల్చర్ ,బుద్ధిజం అండ్ వరల్డ్ కల్చర్ ,ఏ స్టడీఆఫ్ పరిప్లవ ,ది పరిభాషాస్ ఇన్ అశ్రౌత సూత్రాస్ ,ఆన్ ది ట్రాన్స్ లేషన్ ఆఫ్ వేదిక్ సాక్రిఫిసియల్ లోర్,ది పొజిషన్ ఆఫ్ ది పరిభాషాస్ ఇన్ ది టేస్ట్యువల్ ఆర్డర్ ఆఫ్ ది ఆపస్థంభ సూత్రాస్ మొదలైన గ్రంధాలు రచించాడు .

సంస్కృత విద్యా చక్రవర్తి అయిన సమీరన్ చంద్ర చక్ర వర్తి  గ్రిఫ్ఫిత్ మెమోరియల్ అవార్డ్ ,రాస్ట్రీయవేద విద్యా ప్రతిస్టాన్ పురస్కారం ,ఇంటర్నేషనల్ పెంగ్విన్ పబ్లిషింగ్ హౌస్ నుంచి ‘’రైజింగ్ పర్సనాలిటి ‘’అవార్డ్ ,కలకత్తా భారతీయ విద్యా భవన్ నుండి సాంస్క్రిట్ డే అవార్డ్ , 2009 లో రాష్ట్ర పతి పురస్కారం ,బొంబాయి భారతీయ విద్యా భవన్ నుంచి గురు గంగేశ్వరానంద వేద రత్న పురస్కారం అందుకొన్నాడు .

Inline image 1

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -12 నిఘంటువులపై సాధికారత

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -12

నిఘంటువులపై సాధికారత

మల్లినాధుడు అనేక నిఘంటువులు కోశాలనుంచి వాక్యాలను ఉదాహరించి తన వ్యాఖ్యానాలను సమర్ధించుకొన్నాడు .ఒక పదానికి తాను ఒక అర్ధాన్ని చెప్పాడు అంటే అది ఏ కోశాన్ని ఆధారం గా చేసుకొనిసమర్ధించి  చెప్పాడో వివరంగా తెలియ జేశాడు .వ్యాఖ్యాతగా తాను సాధికారంగా ఆ పదానికి సరైన అర్ధం చెప్పగలిగాడు .సంస్కృత భాషలో దాదాపుగా ప్రతి  పదానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి .కవి ఆ పదాన్ని ఏ అర్ధం తో,ఏమి ఆశించి  వాడాడో వివరించి చెప్పాల్సిన పని వ్యాఖ్యాతది.వ్యాఖ్యాత ఆ అర్ధాన్ని నొక్కి చెప్పి ,అందులోని సూక్ష్మాన్ని ,నిగూఢ విషయాన్ని బహిర్గతం చేయాలి .అ అర్థాన్నే ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఎందుకు దానికే ప్రాధాన్యమిచ్చాడో  సోదాహరణంగావివరించాల్సి ఉంది.మరి దీనికి ముఖ్య సాధికార ఆధారం నిఘంటువు లేక కోశమే . కనుక వ్యాఖ్యాత దీన్ని అభ్యంతర పెట్టి కాదనే వారి ని దృష్టిలో పెట్టుకొని ,అనర్హత గల అర్ధాలను చెప్పకుండా ,విమర్శ పాలుకాకుండా ,తనను తాను సమర్ధించుకోవాలి .దీనికి కోశమే శరణ్యం .అందుకని మల్లినాధుడు చాలా కోశాలు లేక నిఘంటువులను ఉపయోగించుకొన్నాడు .పాఠకుడి కి ఆ నిఘంటువులలోని వాక్యాలను ఆయన ఉదాహరిస్తూ వ్యాఖ్యానం చేస్తుంటే ఆశ్చర్యం ఆనందం కలుగుతాయి  ఈ విధంగా తన కాలానికి ఉన్న ప్రముఖమైన ఆ కోశాలను చదువరికి అతి సన్నిహితం చేయటానికి సూరి ఎంతో కృషి చేశాడు . .ఏయే కోశాలలనుంచి ఎన్ని ఉదాహరణలు ఇచ్చాడో చెప్పాలంటే అదొక చేంతాడంత లిస్టు అవుతుంది .అయినా మల్లినాద మనీష తెలుసుకోవాలి అంటే అదే దారి .

అమర కోశాన్ని –శిశుపాల వధకావ్య వ్యాఖ్య లో మొదటి సర్గలో 45 సార్లు ,రెండులో 35 సార్లు ,మూడులో 23 సార్లు ,నాలుగులో 30 సార్లు ,అయిదులో 36 సార్లు ,ఆరవ సర్గలో 28సార్లు ఏడులో 2 సార్లు ,ఎనిమిదిలో 19 సార్లు ,తొమ్మిదిలో 18 సార్లు ,పదిలో అప్ద్దేనిమిది సార్లు ,పదకొండులో పదిహేడు సార్లు ,పదిహేడులో పదహారు సార్లు ,పద్దేనిమిడిలో ముప్ఫై ఆరు సార్లు ,పందోమ్మిడిలో ముప్ఫై మూడు సార్లు ,ఇరవైలో ఇరవై ఒక్క సారి  ఉదాహరించాడు.

కిరాతార్జునీయం లో మొత్తం 297 సార్లు ,రఘు వంశం లో 462 సార్లు ,కుమార సంభవం లో 146 సార్లు ,నైషధం లొ6 24 సార్లు ,మేఘ దూతం లో 80  సార్లు ,భట్టికావ్యం లో 111సార్లు ఉపయోగించాడు.

‘’ వైజయంతి కోశం ‘’ను శిశుపాల వధలో 99 సార్లు ,రఘువంశం లో ఒకే ఒక్కసారి ,కిరాతార్జునీయం లో 4 7సార్లు ,కుమారసంభవం లో 60 సార్లు ,మేఘ దూతం లో 3 సార్లు ఉదాహరించాడు .

‘’శబ్దార్నవం ‘’నుశిశుపాల వధలో 8 సార్లు ,కిరాతార్జునీయం లో 4 సార్లు ,భట్టికావ్యం లో 1 సారి ,రఘువంశం లో 83 సార్లు ,కుమారసంభవం లో 5 సార్లు ,నైషధం లో 2 సార్లు పేర్కొన్నాడు .

‘’క్షీరస్వామి వ్యాఖ్యానాన్ని’’ శిశుపాల లో 2 ,మేఘ లో 2 ,కిరాత లో 3 సార్లు భట్టిలో 1 ,రఘు లో 20 ,కుమార లో 5 సార్లు ,ఉదాహరించాడు

‘’హారావళి ‘’విశ్వ ప్రకాశిక ,హాలాయుధ కోశ ,విశ్వకోశ ,శాశ్వత కోశ,యాదవ కోశ ,భట్తమల్ల వ్యాఖ్య ,లనుంచి కూడా విస్తృతంగా కోట్ చేశాడు .ఇన్ని కోశాలను ఆకలింపు చేసుకొని సందర్భాన్ని బట్టి ఉదాహరించాడు అంటే మల్లినాధుని మనీష ఎంత గొప్పదో తెలుస్తోంది అని పి జి లాల్యే విమర్శక శిఖామణి గుది గుచ్చి ఒక చోట చేర్చి విపులంగా చెప్పాడు . ధర్మ శాస్త్రాలవిషయాలను  వ్యాఖ్యానించ వలసి వస్తే మల్లినాధుడు ‘’మను ధర్మ శాస్త్రాన్ని’’,’’ కామందకాన్ని’’ ఆదారం చేసుకొని వ్యాఖ్యానించాడు .కనుక నిఘంటు ,కోశాలపై మల్లి నాదునికి అద్వితీయ వైదుష్యం సాధికారత ఉన్నాయని వీటన్నిటి వలన తెలుస్తోంది .”కోశమయ జీవి ”అనచ్చు సూరిని . సంస్కృత సాహిత్య శాస్త్రాలలోని అన్ని విభాగాలపై ఆయన పాండిత్యం మహోత్తమమం .కవులు మహా విద్వాంశులు కనుక వ్యాఖ్యాతలు కూడా అంతటి లేక అంతకు మించిన  విద్వాంసులై ఉండాలి .మల్లినాద మనీష ఆయన చేసిన వ్యాఖ్యానలలోని ప్రతి పంక్తిలోను దర్శనమిస్తుంది .సంస్కృత సాహిత్యం లో విభిన్న విభాగాలపై మల్లినాధుని వైదుష్యాన్ని తరువాత తెలుసుకొందాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-16 –ఉయ్యూరు .

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అర్హతకు తగిన గౌరవం

Inline image 1

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన సంపాదక కార్యాలయ ఆస్దాన పండిత పరిషత్తు మండలి లో కృష్ణా జిల్లా రచయితలసంఘం ప్రధాన కార్యదర్శి ,శతాధిక గ్రంథ రచయిత,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ,సరసభారతికి ఆత్మీయులు డా .జి వి. పూర్ణ చంద్ గారిని నియమించి సముచిత గౌరవం కల్పించి నందుకు దేవస్థానపాలకమండలిని ,అర్హత పొందినియమితులైన  ,శ్రీ పూర్ణ చంద్ గారిని మనసారా అభినందిస్తున్నాను -గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-16 -ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి 99 వ సమావేశం మరియు లక్ష దీపోత్సవం

సరసభారతి 99 వ సమావేశం మరియు లక్ష దీపోత్సవం

 

Inline image 1

ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో

సరసభారతి 99 వసమావేశం గా 19-11-16 శనివారం సాయంత్రం 6-30 గం లకు కార్తీక మాస సందర్భంగా ”శివ మహిమ ”ధార్మిక ప్రసంగం ఏర్పాటు చేయబడింది .

— 26-11-16 శనివారం సాయంత్రం 6-30 గం .లకు భక్తుల సహాయ సహకారాలతో ”లక్ష దీపోత్సవం ”నిర్వ హింప బడుతుంది .భక్తులు ఈ రెండు కార్యక్రమాలకు విశేషంగా హాజరై జయప్రదం చేయ ప్రార్ధన .                                                         గబ్బిట దుర్గా ప్రసాద్

                                             సరసభారతి అధ్యక్షులు ,మరియు దేవాలయ ధర్మ కర్త

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -11 మల్లినాధుని శ్రుతి వైదుష్యం

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -11

మల్లినాధుని శ్రుతి వైదుష్యం

శ్రుతి అనగానే వేద సాహిత్యం అంతటికీ వర్తిస్తుంది .ఇందులో మల్లినాద సూరి పాండిత్య వైదుష్యాలను తెలియ జెప్పే కొన్ని విషయాలను తెలుసుకొందాం .రఘువంశ ప్రధమసర్గలోని 31 వ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ ‘’దక్షిణా ‘’పదానికి వివరణ నిస్తూ బ్రాహ్మణం లోని ఒక విషయాన్ని ఉదాహరించాడు .-

‘’యజో గాంధర్వ స్తస్య దక్షిణా అప్సరసః –దక్షిణాయా దాక్షిణ్యం నామార్త్విజో దక్షిణత్వం  పాపకత్వం

తే దక్శంతే దక్షిణాంప్రతిగ్రుహ్ణ’’

సూర్యుడు సాయం వేళ అగ్ని లో ప్రవేశిస్తాడు అని వివరించటానికి ఒక వేద వచనాన్ని ఉదాహరించాడు –

‘’సౌరం తేజః సాయమగ్నిం ప్రకమతే –ఆదిత్యో వా అస్తం యన్నగ్ని మను ప్రవిశతి –అగ్ని ర్వా ఆదిత్యః సాయం ప్రవిశీతి ‘’ కుమారుని ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక దాన్ని(కొటేషన్) ఉల్లేఖించాడు –

‘’ఏష అనృణీ యః పుత్రీ యత్వా బ్రాహ్మ చారీవా ‘’

‘’యదా సాంఖ్య ‘’అనే భావాన్ని వివరిస్తూ మతానికి సంబంధించిన సహాయకాలను ఉపయోగించుకొన్నాడు .ఎక్కువభాగం మీమాంస లోని చర్చలను ఉల్లేఖించి ,బ్రాహ్మణ పాఠ భాగాలను సంయోజనం చేస్తూ వాటి క్రమసంబందాన్ని విస్పష్ట పరచాడు.ఉపనిషత్ వాక్యాలను ఉదాహరించి భావం బలీయం చేశాడు .దేవతలు విష్ణుమూర్తి పై చెప్పిన స్తోత్రాలను చెబుతూ గతి ధర్మానికి ఉపనిషత్ వాక్యాలను చూపించాడు –‘’తమేవం విదిత్వా తి మృత్యుమేతి నాన్యః పంధా విద్యతే యనాయ ‘’అని రఘువంశం లో –‘’’’ఆత్మా వా రదమేక ఏవాయం పంధా విద్యతే యనాయ ‘’అని కుమార సంభవం రెండవ సర్గ లో –‘’సమవేదే నాస్తమయే గీయతే ‘’కుమారా సమ్భవ౦ 8 వ సర్గలో చెప్పాడు .

వ్యాకరణ పాండిత్యం

మల్లినాధుని వ్యాకరణ పాండిత్యం అవధులు లేని సముద్రమే .కొన్ని వ్యాకరణ గ్రందాలలోతులు తరిచి చూశాడు .అవి ఆయనకు వాచోవిధేయాలయ్యాయి .మనం ఇప్పుడు చెప్పేమాట ‘’ఫింగర్ టిప్స్ ‘’పై వ్యాకరణ సూత్రాలుంటాయి ఆయనకు .అత్యధికంగా పాణిని సూత్రాలను ఉదాహరించాడు .పదం యొక్క అర్ధాన్ని పూర్తిగా వివరిస్తే తప్ప ఆయనకు సంతృప్తి ఉండదు .అదీ మల్లినాదీయం .పతంజలి ,కైయాట,వృత్తికార లనుండి మూడు ఉదాహరణలు ముందు తెలుసుకొందాం .

ఉదాహరణ –మునిద్ర తాది త్యత్ర యద్యపి మునిద్ర తస్య మేనకాయా అనీప్సిత త్వాత్ ‘’కారణానార్ధ నాప్మీప్సితః ‘’ఇతి నాపాదానత్వం తయ్యాపి క్రుతోద్యమామితి  మానసప్రవేశో త్కర్తవ్యతాత్  ధ్రువ మపాయే పాదనం ఇత్యపాదానత్వమేవ స్యాత్ ‘’

1-యత్రామిధ్యా సంప్రన్య నివర్తతే తచ్చ ధృవం పాయేపాదానం ఇతి ప్రసిద్ధం (కుమారసంభవ వ్యాఖ్యానం-5-3  )

2-విశ్వ యోనే రితి షష్టీ తస్యానంతర మితి భాష్యేదర్శనాత్ ‘’                  (.’’’’’’’’                          6-9 )

3-అలమితిపర్యష్య ర్ధగ్రహణం ఇతి భాష్యకారః ‘’(మేఘ దూత వ్యాఖ్య -44)

రఘు వంశం లో ‘’విశ్రామయ ‘’కు అర్ధాన్ని వృత్తికార ఆధారం గా తెలియ జేశాడు  .శ్ర ను దీర్ఘం  చేయటం గత్యంతరం లేక చేయటమేనని ఇది ‘’వ్యవస్థిత విభాస ‘’కు చెందుతుందని ,కొన్ని ‘’స్లిస్ ‘’లాంటి మూలాలు  ఉపసర్గ లున్నప్పుడు సకర్మకాలౌతాయని చూపించాడు .

‘’విశ్రామయ విశ్రమయ ఇతి హస్తపాఠే ‘’జానీ మ్రుస్ట ఇతి మిత్వే మితాం హ్రస్వ ఇతి హ్రస్వః –దీర్ఘపాఠే మితాం ఇతి సూత్రే వా చిత్త విరాగే ఇత్యతో వా ఇత్యను వర్త వ్యవస్థిత విభాషా శ్వ ణాత్వాద్ హ్రస్వ భావః ఇతి వ్రుత్తి కారః ‘’(రఘు వంశ వ్యాఖ్య )

అలాగే ‘’ఉభ ‘’కు బదులుగా ‘’ఉభయ ‘’ను వాడటం విషయం లో రఘు వంశ వ్యాఖ్యలో వివరించాడు .ద్విరేఫనుసమర్ధిస్తూ కయ్యాటుని సూత్రంతో సమర్ధించాడు .వామనుడిని కనీసం 12 సార్లు మల్లినాధుడు ఉదాహరించాడు ..ముఖ్యంగా ‘’అగ్రపాద’’భావ నేత్ర జన్మా ,బింబాధర మొదలైన సంయోగ పదాలలో వామనుడిని బాగా వాడుకొన్నాడు .’’అతర్జాయత్ ‘’క్రియను సమర్ధించే ‘’ఆఖ్యాత చంద్రిక ‘’లోని సూత్రాన్ని వివరించాడు .కొన్ని సార్లు మల్లినాధుడు గ్రంధ కర్తపేరు చెప్పకుండానే వారి సూత్రాలను ఉదాహరిస్తాడు .’’విత౦త్రిః’’మొదలైన వాటిలో   విసర్గ లోపాన్ని  సమర్ధించాడు .-‘’అవి తస్తుతాన్త్రిభ్య ఈః’’ఇతి పత్నీ దాతో రైణాదిక ఈ ప్రత్యయః విభావాన్న —‘’ఇలా చెప్పుకొంటూ పోతుంటే ఎన్నెన్నో ఉన్నాయి .అని లాల్యే పండితుని వ్యాఖ్య .

సశేషం

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -15-11-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి ఆహ్వానం

aahvaanam-page-1 aahvaanam-page-2

Posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 7- మహేశ చంద్ర న్యాయ రత్న భట్టాచార్య

–  గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

7- మహేశ చంద్ర న్యాయ రత్న భట్టాచార్య

22-2-1836 న కులీన బ్రాహ్మణ కుటుంబం లో మహేశ చంద్ర భట్టాచార్య బెంగాల్ లో జన్మించాడు .నారిత్ కు చెందిన ఈ కుటుంబం తరతరాలుగా సంస్కృత భాషా పాండిత్యం లో పండిపోయింది .ఆ కుటుంబం వారందరూ దాదాపు సంస్కృత మహా విద్వా౦సులే.తండ్రి హరినారాయణ తర్క సిద్ధాంతం లో అద్వితీయుడు .ఒక బాబాయి గురుప్రసాద్ తర్క పంచానన బిరుదు పొందితే మరో బాబాయి ఠాకూర్ దాస్ చౌరామణి విశిష్ట పండితునిగా గుర్తింపు పొందాడు .పెద్దన్న పండిట్ మాధవ చంద్ర ‘’సార్వ భౌమ ‘’బిరుదు నందుకుని మహిషాదల్ రాజ్య సభా పండితుడైనాడు .

హుగ్లీ లోని జహానాబాద్ కు చెందిన  పండిత రామ చదర తర్క భాగిస్ కుమార్తె మందాకినీ ని వివాహమాడి మనోరమ ,మన్మధ నాద విద్యార్ధ భట్టాచార్య  ,మునీ౦ద్ర నాద్ భట్టాచార్య,మహిమ నాద భట్టాచార్య లకు తండ్రి అయ్యాడు  .పెద్దకొడుకు మద్రాస్ రాస్ట్ర మొదటి ఇండియన్ అకౌంటంట్ జనరల్  .

మహేశ భట్టాచార్య 70  వ ఏట 12-4-1906 న మరణించాడు .

18 7 6 లో ప్రసన్న కుమార్ సర్వాధికారి స్థానం లో సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు .ప్రిసిపాల్ గ 19 ఏళ్ళ పాలనలో సంస్కృతం లో ప్రతిభ గల విద్యార్ధులకు అర్హతలను బట్టి గౌరవ స్థానాలను కల్పించాడు .స్వగ్రామం నారిత్ లో ఆంగ్లో –సాంస్క్రిట్  సెకండరీ స్కూల్ ఏర్పాటు చేశాడు .కావ్య ప్రకాశ ,మీమాంస దర్శన ,కృష్ణ  యజుర్వేదాల ను విలువైన పీఠికలు రాసి సంపాదకత్వం వహించి ప్రచురించాడు .దయానంద సరస్వతి వేద భాష్యం పైనా,తులసీ ధర మీమాంస పైనా ,మృచ్చకటిక కర్త పైనా ,లుప్త సంవత్సరం పైనా అనేక పత్రాలు రాశాడు .దయానంద భాష్యంపై భట్టాచార్య చూపించిన అభ్యంతరాలకు దయానంద స్కూల్ సంస్కృత విద్వాంసుడు తెలియ బరచిన వివరాలను ఒక పుస్తకంగా ప్రచురించాడు .సంస్కృత విద్యా వ్యాప్తికి భట్టా చార్య కృషి ప్రశంసనీయం .సంస్కృత విద్యాలయాలకు కావలసిన నిధి సేకరణ కూడాచేసి వాటి నిర్వహణకు తోడ్పడ్డాడు .

నారిత్ గ్రామంలోను ,పరిసరాలలోనూ  మంచి రోడ్ల నిర్మాణం చేబట్టాడు .స్వంత జిల్లా హౌరా లోని ట్రా౦ రోడ్ల విషయం లోనూ శ్రద్ధ చూపాడు .16-2-1887 న విక్టోరియా రాణి పట్టాభిషేక రజతోత్సవ  నాడు ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదాన్నిచ్చి గౌరవించారు .’’మోస్ట్ ఎమినేంట్ ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ ‘’ భట్టో పాధ్యాయ  గుర్తింపు పొండాడు .భారతీయ సంస్కృత విద్వాంసులు ‘’న్యాయ రత్న ‘’బిరుదం తో సత్కరించారు .హ౦గేరిలోని బుడాపెస్ట్ లో ఉన్న ‘’హంగేరియన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ‘’ఫారిన్ మెంబర్ గా ఎన్నుకో బడ్డాడు .కలకత్తా విశ్వ విద్యాలయం ,బెంగాల్ లోని టెక్స్ట్ బుక్ కమిటీ ,బీహార్ సాంస్క్రిట్ సమాజ్ బొంబాయిలోని  ఆంధ్రో పలాజికల్ సొసైటీ లలో గౌరవ సభ్య స్థానం పొందాడు..హిందూ హాస్టల్ కమిటీ జాయింట్ సెక్రెటరిగా ,బెతూన్ కాలేజి మెంబర్ గా ,హౌరా ఇంజినీరింగ్ కాలేజి కి విజిటర్ గా ఉన్నాడు .బెంగాల్ ప్రెసిడెన్సిలో అంటే బెంగాల్ బీహార్ ఒరిస్సాప్రాంతాల సంస్కృతానికి న్యాయ రత్న స్థాయి లో ఇంచార్జి గా సేవలు అందించాడు .ఉత్తర కలకత్తాలోని శ్యాం బజార్ కు ‘’భట్టా చార్య బజార్ ‘’అని గౌరవ నామం పెట్టి గౌరవించారు .వందలాది ఆయన వద్ద విద్య నేర్చి సంస్కృత మహా విద్వాంసు లయ్యారు .

Inline image 1

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

12-11-16 శనివారం మధ్యాహ్నంయాకమూరు ప్రాధమికోన్నత పాఠశాలలో పఠనోత్సవం బాలల దినోత్సవం లోముఖ్య అతిదిగానేను పాల్గొన్న చిత్ర మాలిక

12-11-16 శనివారం మధ్యాహ్నంయాకమూరు ప్రాధమికోన్నత పాఠశాలలో పఠనోత్సవం బాలల దినోత్సవం లోముఖ్య అతిదిగానేను పాల్గొన్న చిత్ర మాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) –

ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) – గబ్బిట దుర్గా ప్రసాద్

ఫిన్నిష్ సాహిత్య నేపధ్యం

ఫిన్లాండ్ దేశం లో మొదటి రచన 13 వ శతాబ్దపు బర్చ్ బార్క్ లెటర్ గా గుర్తింపబడింది .అప్పటి రచనలు స్వీడిష్ ,లాటిన్ భాషలోనే ఉండేవి .16 వ శతాబ్దం నుండే ఫిన్నిష్ భాషాభి వృద్ధి మొదలైంది .ఫిన్నిష్ భాషలో మొదట రాసిన వారిలో ఫిన్నిష్ ,లూదరన్ ,మైకేల్ అగ్రికోలాలు 1510-1557 మధ్య రాశారు .అగ్రికోలా న్యు టెస్ట్ మెంట్ ను 1548 లో ఫిన్నిష్ భాషలోకి అనువదించాడు .

19 వ శతాబ్ది పూర్వ భాగం లో ఫిన్లాండ్ రష్యా పాలనలో ఉండేది .స్వాతంత్ర సముపార్జనకై ఉద్యమాలు సాగటం తో జానపద సాహిత్యం అభి వృద్ధి చెందింది .మొదట్లో ఇవీ స్వీడిష్ భాషలో ప్రారంభమై క్రమంగా ఫిన్నిష్ భాషలో వ్యాప్తి చెంది ఫిన్నిష్ అస్తిత్వాన్ని సాధించింది .వేలాది జానపద కవితలు సేకరి౦చి ప్రచురించారు .మొదటి ప్రముఖ కవితా సంకలనం 1835 లో వచ్చిన ‘’కలే వాల ‘’ .అలెక్సిస్ కివి రాసిన ‘’సెవెన్ బ్రదర్స్ ‘’ఫిన్నిష్ మొదటినవల 1870లో వచ్చింది ‘’.ఫ్రాన్స్ ఈ మిల్ సిలనపా ‘’రాసిన ‘’మీక్ హెరిటేజ్ ‘’కు మొదటి నోబెల్ బహుమానం వచ్చింది .మరో ప్రముఖ రచయిత వైనో లిన్నా.ఇలా ఫిన్నిష్ సాహిత్యం ప్రపంచ గుర్తింపు పొందింది .ఇప్పుడు ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయితల గురించి తెలుసుకొందాం .

1- ఫిన్నిష్ దేశపు మొదటి కవయిత్రి -క్రిస్టినా రేజీనా వాన్ బర్చేన్ బాం : 

17 వ శతాబ్దపు ఫిన్నిష్ రచయిత్రి క్రిస్టినా వాన్ బర్చేన్ బాం స్వీయ చరిత్ర వంటి ఒకే ఒక ఆక్రోస్టిక్ కవిత 24-7-1651 లో రాసిన ‘’ఎనాన్నన్ నీ వీసా (మరో కొత్త పాట ) మాత్రమే లభించింది .ఎనిమిది లైన్లు ఉన్న స్టాంజాలలో 29 లైన్లు మాత్రమె దక్కాయి .ఇది ఫిన్నిష్ జానపద పాటలాగా ఉంటుంది .దీన్ని లింకో పిన్ లైబ్రరీలో భద్ర పరచారు . బర్చేన్ బాం కేరేలియా లో జన్మించింది .మూడేళ్ళప్పుడే తండ్రి చనిపోయాడు .వరించి వచ్చిన వరుని వివాహమాడి’’ ముప్ఫై ఏళ్ళ యుద్ధం ‘’ లో పాల్గొనటానికి భర్త వెడుతూ ఒక సందేశం రాసి పంపితే విషయం తెలుసుకొన్నది .17 ఏళ్ళు అతని కోసం నిరీక్షించి ఇక తిరిగి రాడు అని నిశ్చయం చేసుకొని ,తన వలపు వయసు వ్యర్ధమైనాయని బాధపడి ఒక య౦గ్ నోబుల్ మాన్ ను మళ్ళీ పెళ్ళాడింది .స్వార్ధ పరుల పుకారుల మధ్య అక్కడ ఉండ లేక కొత్త జంట విడిపోయింది .తన కవితలో తాను ఒంటరి దానినని వేదన భరించలేక తాను ఈలోకాన్ని వీడి వెళ్లి పోతున్నానని రాసుకొన్నది .ఫిన్లాండ్ దేశపు మొట్ట మొదటి కవయిత్రి గా బర్చేన్ బాం గుర్తింప బడింది

2—నాటక రచయిత్రి -క్రేస్టి సాల్వేజ్ బెర్గ్రోత్ : 

24-1-1886 న జన్మించిన కరే స్టి సాల్వేజ్ బెర్గ్రోత్ ప్రముఖ రచయిత ,నాటక రచయిత కూడా .చిన్నతనం లోనే సాహిత్యాభిలాష అలవడిన అదృష్ట వంతురాలు .1920 వరకు స్వీడిష్ భాషలోనే రాసి ,ఇంగ్లీష్ ఫ్రెంచ్ సాహిత్యాన్ని ఫిన్నిష్ భాషలోకి అనువాదం చేసింది .ఆమెకు జర్మన్ భాషపైనా మంచి పట్టు ఉంది.కేరిలియన్ మాండలికం లో ఆమె రాసిన ’’అను జా మిక్కో ‘’,కుపార్ సారే అంటి ‘’నాటకాలు బహుళ ప్రచారం పొందాయి .నవలలు నాటకాలు జ్ఞాపకాలు ,పిల్లల కధలు అన్నీ కలిపి 70 దాకా రాసింది .
వాలంటైన్ వాలా అనే సినిమా దర్శకునితోకలిసి ‘’టేట్’’అనే మారుపేరుతో ‘’మొర్సిలయన్ య్లాట్ట ,తోషితార్కోటు క్షేల ,డైనమిట్టీతో,ఊక్రా సుల్హానేన్ ,వికాన్ టిట్టో అనే ,అయిదు సినిమాలకు పని చేసింది .ఇవన్నీ హాస్యపు గుళికలే ఆమె రచనా ప్రతిభకు ఉదాహరణలే .యుద్ధానంతర కాల ప్రజలు ఈమె రచనలను పెద్దగా మెచ్చలేదు. మనసు గాయపడి రోమ్ ,ఇటలీలు తిరుగుతూ అప్పుడప్పుడు ఫిన్లాండ్ వస్తూ 1970 లో ఫిన్లాండ్ లో స్థిర బడింది .1975 జనవరి 24 న 7 9 వ ఏట హెల్సింకి లో మరణించింది .

3 – మత్స్య కార నవలా రచయిత్రి -అన్ని బ్లోం క్విస్ట్ : 

7-10-1909 లో అన్ని బ్లోం క్విస్ట్ రష్యన్ సామ్రాజ్యం లో ఉన్న గ్రాండ్ డచి ఫిన్ లాండ్ లోని అలాన్ ఐ లాండ్స్ లోని వార్డో లో జన్మించింది .తండ్రిది చేపలు పట్టే వ్రుత్తి .పది మంది సంతానం లో పెద్దది ..అమ్మమ్మ అన్నా దగ్గర పెరిగి మూడు నవలల శ్రు౦ ఖల రాసింది .1936 లో వాల్టర్ బ్లూమ్ క్విస్ట్ ను పెళ్లి చేసుకొని నలుగురు సంతానం కని, చేపల వేట, షిప్పింగ్, కొద్ది పాటి వ్యవసాయం పై జీవించారు .చురుకు దనం ఉండటం వలన స్థానిక మార్తా సంస్థకు చైర్మన్ అయి ,వాక్సినేషన్ ను ప్రోత్సహించింది .ఆలాండ్ ఐలాండ్ కు విద్యుచ్చక్తి రావటానికి కృషి చేసింది .ఆమె రాసిన మొదటి చిన్నకధ పోటీలలో మొదటి బహుమతిని 1949 లో సాధించింది .
రెండేళ్ళ తర్వాత మూడు నవలల ‘’ స్టారంస్కార్స్ –మజ’’ సీరియల్ లో మొదటినవల ‘’వేగెన్ స్టిల్ స్టారం స్కారేట్ ‘’నుప్రచురించింది .అయిదు నవలల ఈ సీరియల్ చేపలు పట్టే వాని భార్య మజ జీవిత చరిత్ర .ఈ నవలలు 19 7 5 లో టెలి సీరియల్స్ గా వచ్చాయి .అశేష ఆదరణ పొందాయి .1973 లో ఈ సీరియల్ లోచివరినవల పూర్తీ చేయగానే ,హెల్సింకి యూని వర్సిటి లోని స్టిగ్ జటినేన్ తో కలిసి ఆలాండ్ ఐలాండ్ ప్రజల జీవితం పై అధ్యయనం చేసి,’’సిమ్ స్కాలా ‘’పేరుతో దీన్ని 1977 లో ప్రచురించింది

తర్వాత ‘’అన్నా బీటా ‘’ట్రయాలజి మొదలు పెట్టి మొదటి నవల ‘’అన్నా బీటా ‘’రాసి 1979 లో వెలువరించింది .ఇందులోని కధలన్నీ తన అమ్మమ్మ భర్త అయిన తాతయ్య జీవిత చరిత్రే .1987 లో ఆమె కొడుకు సముద్రం లో మునిగి చనిపోయాడు .ఈ విషాదాన్ని జీవిత చరిత్రగా ‘’హావేట్ ఫిన్స్ ఇంటర్ మెర్ ‘’పేరిట రాసి 1989 లో ప్రచురించింది .జీవితాంతం వార్డో లో గడిపి బ్లోం క్విస్ట్ 26-6-1990 న 80 ఏళ్ళ వయసులో మరణించింది .ఆమె గౌరవార్ధం ఆలాండ్ ఐలాండ్ ప్రభుత్వం 21-3-2009 న ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది .క్విస్ట్ రెండు ఫిక్షన్ లు ,మజ సీరియల్ లో 5 నవలలు ,అన్నా బీటా ట్రయాలజిలో 3 నవలలు ,స్వీయ చరిత్ర వంటి 3 రచనలు చేసి ఫిన్నిష్ సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది .చేపలు పట్టే స్త్రీ ఒక్కొక్క మెట్టూ ఎక్కి అనితర సాధ్యమైన సాహిత్య కృషి చేసి తనకు తన వ్రుత్తి వారికి తన గ్రామానికి ఆలాండ్ ఐలాండ్ కు చిర యశస్సు నార్జించి పెట్టిన స్త్రీ రత్నం బ్లోం క్విస్ట్ .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -10 మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ? -3

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -10

మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ?-3

శిశుపాల వధ పై మల్లినాధుని ‘’కూలంకష ‘’వ్యాఖ్యానాన్ని కూలంకషంగా తెల్సుకొందాం  .మల్లినాధుడు నిష్పాక్ష పాత౦ గా గుణ దోషాలను విమర్శిస్తాడు .సాధుత్వ అసాదుత్వాలను ప్రమాణ పూర్వకం గా సిద్దాన్తీకరిస్తాడు .తప్పు ఉంటె చెప్పటానికి వెనుకాడడు .సాధ్యమైనంతవరకు కవి పోకడను సమర్ధిస్తాడు .కవి ప్రయోగం ఏవిధంగా సమర్ధనీయం కాదో ,చెప్పి దుస్సాధనం అనిపిస్తే ఖండిస్తాడు .ఇతర వ్యాఖ్యాతల అపోహల్ని దురభిప్రాయాలను అప వ్యాఖ్యానాలను అక్కడక్కడ ప్రస్తావించి నిరాకరిస్తాడు .దోషాలను చెప్పేవాడేకాని ,మల్లినాధుడు దోషాలనే వెతకాలనే రంధ్రా న్వేషకుడు కాదని గ్రహించాలి .విచక్షణతో పాటు సౌజన్యం మూర్తీభవించిన  వ్యాఖ్యాత .’’వ్యాఖ్యానతో విశేష ప్రతి పత్తిః’’అన్నట్లు గ్రంధం లోని విశేషాలను తెలియ జేస్తూ ,దానికి అనుబంధంగా వ్యాఖ్యానం నడిపిస్తాడు .ఇవన్నీ పూర్వం మనం తెలుసుకోన్నవే .అవికాక సర్వం కష లో  మిగిలిన విషయాలను తెలుసుకొందాం .

ఆకాశం నుంచి కిందకు దిగి వచ్చే తేజో రాశిగా నారద మహర్షి ని  వర్ణిస్తూ మాఘకవి ‘’క్రమాదముం నారద ఇత్యభి బోధిస ‘’అని వర్ణించాడు కర్మవాచాకమైన నారద శబ్దం రెండవదిగా రావాల్సి ఉంటె ‘’ఇతి ‘’అనే దానితో చెప్పబడటం తో కర్మత్వం రాలేదని ‘’నిపాతే నాభిహితే కర్మాణి న కర్మ విభక్తిః’’అనే వామనుని సూత్రాన్ని సూచించి మల్లినాధుడు సమర్ధించాడు .

’’రణద్భి రాఘట్టనయానభస్వతః ప్రుధగ్వి భిన్న శ్రుతి మన్దలైః స్వరైః’—స్ఫుటీ భవద్గ్రామ విశేష మూర్చనా మవేక్ష మాణం మహతీం ముహుర్ముహుః’’అన్న శ్లోకం లో సంగీత విషయాలను కూలంకషంగా చర్చించి వెలుగు లోకి తెచ్చాడు .అవసరమైనంతవరకే గ్రహించి ‘’తత్రేహ నామాని  తు-నాపేక్షిత ముచ్యతే –ఇతి ప్రతిజ్ఞా భంగ భయాన్నలిఖ౦త ఇతి ‘సర్వ మదాతం’’అని అందంగా ముగించాడని చెరువు వారు ఉవాచ .  ద్వారకకు వచ్చే నారదుని వర్ణనలో మాఘుడు రాసిన శ్లోకాలను వ్యాఖ్యానిస్తూ మల్లినాధుడు ఆ శ్లోకం లోశ్రుతి స్వర గ్రామ మూర్చనాది సంగీత శాస్త్ర పారిభాషికాలను అను సందానించాడు .నారదుని వీణ మహతి .స్వర ప్రారంభం లో ప్రధమ శ్రావణ రూప హ్రస్వ మాత్ర శబ్ద విశేషాన్ని శ్రుతి అని ,శ్రుతి తర్వాత అనురణన ధ్వనికి స్వరమని ,స్వరాలు ఏడు అని ,స్వర సందోహాన్ని గ్రామం అంటారని ,నంద్యా వర్త ,జీమూత ,సుభద్ర అనే మూడు గ్రామాలకు షడ్జ ,మధ్యమ ,గాంధారాలు జన్మ హేతువులుగా ప్రసిద్ధాలని ,మూడు గ్రామాలలో ముఖ్యం గా ఏడేడు మూర్చనలు ఏర్పడగా మొత్తం 21 మూర్చనలు అవుతాయని ,ఇన్ని పారి భాషిక పదాలను నారద వర్ణనలో మాఘకవి తన సంగీత అభిజ్ఞాతను చాటుకున్నాడు. ఆ లోతుల్ని మల్లినాధుడు వెలికి తీసి వ్యాఖ్యానించాడు .

ఏకాదశ సర్గ లో వైతాళికులు శ్రీ కృష్ణుని మేలు కొలుపు పాడే సందర్భం లో శ్లోకాలోనూ సంగీత ప్రస్తావన ఉంది –

‘’శ్రుతి సమధిక ముచ్చైః పంచమం పీడ యంతః –సతత మ్రుషభహీనం భిన్నకీ కృత్య షడ్జమం

ప్రణి జగదు రకాకు శ్రావక స్నిగ్ధ కంఠాః–పరిణతి మితి రాత్రేః మాగాదా మాధవాయ ‘’

పంచమ ,ఋషభ,షడ్జ స్వరాలు వదిలేసి మిగిలిన స్వరాలతో కూడిన రాగ ప్రస్తారాలతో వంది మాగధులు సుప్రభాత గీతాలను పాడి మేలుకొలిపారు .షడ్జ ఋషభ షడ్జ స్వరాలు ప్రభాత సమయం లో ఉపయోగించ రాదు అని భరతమహర్షి చెప్పిన దాన్ని కవి బాగా అర్ధం చేసుకున్నాడని సూరి వ్యాఖ్య .

అలాగే మాఘ కవి కి ఉన్న నాట్య శాస్త్ర పాండిత్యాన్ని ,భరతుని ధనుంజయుని కవి ఎంత చక్కగా సమన్వయము చేసి రాశాడో వివరంగా తెలిపాడు .భోజనాలు నాటకాలులాగా ఉన్నాయని కవి రాశాడు .ఆ సంబంధం ఎలా ఉందొ సూరి వ్యాఖ్యానించాడు .అలాగే అలంకార కామ ,వైద్య ,ధనుర్వేద మంత్రం సాముద్రిక శకున ,రత్న ,గజ ,అశ్వ , శాస్త్రరహస్యాలన్నీ కవికి కరతలామలకాలు .వాటి లోతులను తరచి నిగ్గు తేల్చి చూపాడు సూరి  ,మాఘ కావ్యం లో ప్రతి శ్లోకం లో ఏదో ఒక విశేషం ఉంటుంది .15 వ సర్గలో 34 శ్లోకాలు ప్రక్షిప్తాలు అనిపండితాభి ప్రాయం .శబ్దార్ధ శైలీ భావాలలో కూడా మిగిలిన కావ్యం కంటే తేడాలు కనిపిస్తాయి .వీటిలో స్తుతి ,నింద రెండు కూడా ఉన్నాయి .16 వ సర్గ లో అననుకూలమైన ప్రతికూల అర్ధ బోధకాలైన దూత వాక్యాలను వర్ణించే శ్లోకాలు పేలవం గా కావాలనే రాసినట్లున్నాయి.వల్లభ దేవుడు వీటికీ వ్యాఖ్యానం రాశాడు .కాని మల్లినాధుడు అవి మాఘ కవి రచన కానందున ‘’నా మూలం లిఖ్యతే కించిత్ ‘’అని తాను చేసిన ప్రతిజ్ఞననుసరించి వ్యాఖ్యానం చేయలేదు

‘’ప్రతి శరణమ శీర్ణ జ్యోతి రగ్న్యాహితానాం ‘’అనే శ్లోకానికి మీమా౦సా దర్శన పరిచయాన్ని విపులంగా రాశాడు .మల్లినాధుడు శ్రుతిమీమాంసా ప్రమాణాలతో శ్రౌత క్రియాదులను వివరిస్తూ సుదీర్ఘంగా వ్యాఖ్యానించి చివరికి ఇక ఈ చాందస గోస్టీ వ్యసనాన్ని చాల్లే పొమ్మని కొంటేతనంగా పూర్తీ చేశాడని చెరువువారి విశ్లేషణ .మల్లినాధుడు వ్యాకరణ ప్రక్రియను అంతటినీ సూత్రప్రదర్శన పూర్వకం గా వ్యాఖ్యానించి ‘’స సంతత౦ దర్శయతే గతస్మయః ‘’అనే కిరాతార్జునీయానికి రాసిన ఘంటా పద వ్యాఖ్యలో చక్కగా విచారించానని ,తాను వ్యాఖ్యానాలు రాసిన గ్రంధాలలో ఎక్కడెక్కడ అలాంటి ప్రయోగాలున్నాయో వాటిని సందర్భాను సారం గా చదువుకొనే వారికి తేలికగా ఉండేట్లు చేసి వ్యాఖ్యాతలకు ,విమర్శకులకు ఆదర్శ ప్రాయంగా మల్లినాద సూరి నిలిచాడు .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

6-11-16 ఆదివారం విజయవాడ ఐలాపురం హోటల్ లో ఆంద్ర పత్రిక సాహితీ సేవ, శత వసంతోత్సవ సభ చిత్రాలు

Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo: with sri ke srinivasarao -secretary ,sahitya akademy
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -7

-పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -7

31-‘’కృశ పరిణతి చేతః క్లేశ వశ్యం కవ చేదం –కవ చ తవ గుణ సీమోల్లంఘినీ శశ్వ దృద్ధిః

ఇతి చకితమ మందీకృత్య మాం భక్తి రాధాత్-వరద చరణ యోస్తే వాక్య పుష్పోపహారం ‘’.

భావం –భక్త వరదా శివా !నామనస్సు కృశించే లక్షణం కలది .ఎన్నో కష్టాలకు  వశమైనది .కనుక నా మనస్సెక్కడ ?ఎల్లప్పుడూ పరిమితులు మించి ఉండే నీ మహిమ ఎక్కడ ?ఏవిధంగా నీ గుణాలను నామనసు భావి౦చ గలదు ?దానికి అది సాధ్యం కాని పనికదా అని ఎంతో భయపడుతున్నాను .కానీ నీ పై భక్తి నన్ను మండుడిని చేయటం లేదు .అది నన్ను యెంతో ఉత్సాహ వంతుణ్ణీ,సమర్దుడిని చేస్తుంది .దాని ఫలితం గా నీ పాద ద్వయానికి ఈ శ్లోకాలనే పుష్పాలను కానుకగా ఆ భక్తియే సమర్పింప జేస్తోంది .

‘’భక్తిః కిం న కరోత్యహో వనచరో భాక్తావత౦సాయతే ‘’అన్నారు శంకర భగవత్పాదులు శివానంద లహరి లో .భక్తిచేయలేని పని లేదని తాత్పర్యం .

32-అసిత గిరి సమం స్కాత్కజ్జలం సింధు పాత్రే –సుర తరు వర శాఖా లేఖినీ పత్ర ముర్వీ

లిఖతి యది గృహీత్వా శారదా సర్వ కాలం –తదపి తవ గుణానా మీశ పారం న యాతి ‘’

భావం –పరమేశా !సముద్రం పాత్రగా ,కాటుక కొండ అంత కాటుక మసి తో ,కల్ప వృక్షపు కొమ్మ ఘంటం గా భూమి అంతా రాసే పత్రం గా ఏర్పడి వీటినన్నిటి సాయం తో సాక్షాత్తు సరస్వతీ దేవి యే లేఖకురాలై వ్రాయటానికి పూనుకొన్నా నీ గుణాలనన్నిటినీ వ్రాయటం సాధ్యం కాదు కదా .

‘’యాత్ర వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ‘’అని శ్రుతి .ఒకప్పుడు వాక్కులు పరమాత్మను వర్ణించటానికి పూనుకొని కొంతదాకా వెళ్లి శక్యం కాక మనసుతో అవి తిరోగమనాన్ని పొందాయని .సర్వం తానె అయిన పరబ్రహ్మను వర్ణించటం అసాధ్యం అని భావం .

33-అసుర సుర మునీన్ద్రై రర్చిత స్యేందు మౌళేః-గ్రథిత గుణ మహిమ్నో నిర్గుణ సేశ్వరస్య

సకల గుణ వరిస్టః పుష్పదంతాభి దానో –రుచిర మలఘు  వృత్తైః స్తోత్ర మేతచ్చకార ‘’

భావం –శ్రేష్ట రాక్షస ,దేవ ,ముని గణాలచే అర్చింపబడే పరమేశ్వరుడు చంద్రుని శిరోభూషణంగా ఉన్నవాడు ,గుది గుచ్చిన సద్గుణాల మహిమకలవాడు ,త్రిగుణాలకు అతీతుడు .అలాంటి సర్వేశ్వరుని మహిమలను వర్ణించే ఈ స్తోత్రాన్ని పుష్పదంతుడు కూర్చాడు .అతడు భక్తులకు ఉండాల్సిన లక్షణాలున్న  శ్రేష్టుడు.భావ గర్భితమైన ఈ స్తోత్రం ఎంతోమధురమైనది ఛందస్సుసంబంధించిన విశిష్టమైన వృత్తాలతో రచి౦ప బడింది.

34-‘’అహరహరనవద్యం దూర్జటేః స్తోత్రమేతత్ –పరతి పరమ భక్త్యా శుద్ధ చిత్తః పుమాన్యః

స భవతి శివ లోకే రుద్రా తుల్య స్తథాత్ర-ప్రచురతర  ధనాయుః పుత్రవా న్కీర్తి మాంశ్చ’’

భావం –పరమేశ్వరుని సంబంధించిన ఈ స్తోత్రం ఉత్తమమైనది .ప్రతి రోజూ రాగ ద్వేషాదులతో కలుషితం కాని శుద్ధమనసు కలిగి ,పరమభక్తి తో దీన్ని పఠించే వాడు ,ఈ లోకం లో అత్యధిక ధనాన్ని ,పూర్ణాయుస్సును ,పుత్రులను కీర్తినీ పొందుతాడు .మరణించాక శివ లోకం లో రుద్రునితో సమానుడవుతాడు.

ధూర్జటి అంటే-‘’ధూః భార భూతా జఃటిః జటా యస్యేతి ధూర్జటిః’’-భారమైన జడలు కలవాడని అర్ధం

35-మహేశాన్నాపరో దేవో మహిమ్నోః నా పరాస్తుతిః-అఘోరాన్నాపరో మంత్రో నాస్తి తత్త్వం గురోః పరం ‘’

భావం –సృష్టిలో పరమేశ్వరునికి మించిన దైవం లేడు.పరమేశ్వరునికి చెందిన అఘోర (సౌమ్యమైన )మంత్రమైన పంచాక్షరికి మించిన మరో మంత్రం లేదు ,శివునికంటే ,పంచాక్షరికంటే మించినవీ గురువు కంటే పరతత్వ మైనదీ ఏదీ లేదని తాత్పర్యం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

95 ఏళ్ళ యువకుడితో 77 ఏళ్ళ నేను

కృష్ణా జిల్లాపరిషత్ లో నాతొ పాటు సైన్స్ మేష్టారు గా హెడ్ మాస్టర్ గా పని చేసి ,బాడ్ మింటన్ లో గొప్ప ఆటగాడిగా గుర్తింపబడి నేషనల్ స్థాయిలో ఆడి ప్రయిజులుపొందిన 95 ఏళ్ళ వయసులోనూ అతి చలాకీగా ఆరోగ్యం గా ఉన్న మంచి మనసున్న నా అభిమాని  అయిన శ్రీ సి వి సన్యాసి రాజు గారితో ఇవాళ హోటల్ ఐలాపురం లో ఆంద్ర  శత జయంతి రోజు న తీసుకున్న ఫోటోలు .నేనంటే ఆయనకూ విపరీతమైన అభిమానం .నేను 19 67 లో మానికొండ హైకూలు లో పని చేస్తుండగా హెడ్మాస్టర్ శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వరరావు గారి తో కలిసిమాస్టాఫ్ బాడ్ మింటన్, వాలీ బాల్ ఆటలను ఫ్రెండ్లీ మ్యాచెస్  చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వర రావు గారిరుద్రా పాక  హైస్కూల్    లో ఆడటానికి వెళ్లినప్పటి నుంచి రాజుగారితో పరిచ య0 ..చైర్మన్ గారింట్లో మకాం .విందుభోజనాలు ఆతిధ్యం మర్చి పోనీ సంఘటన సెంట్రల్ ప్లేయరా గా మహాసునాయాసం రెండు చేతులతో రెండు బాట్లూ పట్టుకొని షాట్లతో  ఆడే నైపుణ్యం ఉన్నవారాయణ   .ఆస్కూల్హెడ్మాస్టర్ శ్రీ ఈడుపుగంటి వెంకటేశ్వరరావు ,డ్రిల్ మాస్టర్ ఆయనతమ్ముడు శ్రీ రత్తయ్య మొదలైన వారితో ఆడిన ఆట నా స్మృతిలో ఇంకా నిలిచే ఉంది ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు కలిసాం .. ఏళ్ళక్రితం రిటైరైనా గొప్ప చలాకీగా కనిపించటం చూసి అమాంతం ఆలింగనం చేసుకొని ఆనందించాను అదీ ఈ ఫోటోల మధురానుభూతి -దుర్గా ప్రసాద్    102_7794 102_7795

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -9

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -9

మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ?-2

మాఘకవి శిశుపాల వధ కావ్య వ్యాఖ్య ప్రారంభిస్తూ మల్లినాధుడు ఇందీవర శ్యాముడు ,ఇందిరానంద కారుడు వందారు జన మందారుడైన యదునందనునికి నమస్కరించి ,వప్ర క్రీడా విలాసాలలో దంతాగ్రాలతో ధరణిని గ్రుచ్చి ఎత్తి ఆదివరాహం లాగా కనిపిస్తూ ఉల్లాఘ ఉత్ఫణ ఫణాధర గరీయ మాన క్రీడా వదానుడైన ఇభరాజవదనుని ప్రార్చించాడు తర్వాత శారదాంభోజ వదన ,సన్నిధి ,సర్వద అయిన శారద తన వదనా౦బుజ౦ న సర్వ కామదయై సర్వదా సన్నిధి చేసేట్లు సరస్వతీదేవిని స్తుతించాడు. తరువాత ‘’వాణీం కాణ భుజీం ‘’శ్లోకం లో తన శాస్త్ర పరిచయాన్ని వ్యాఖ్యాన అర్హతను సాధికారంగా వెల్లడించి ,మహోపాధ్యాయ బిరుదున్న ఈ మల్లినాధసూరి  మాఘ కావ్యానికి సర్వం కష వ్యాఖ్యానాన్ని రచిస్తున్నానని  ,నామ నిర్దేశ పూర్వకంగా వివరించాడు .కావ్య అవతారిక నుండి మరో రెండు మల్లినాధుని శ్లోకాలు –దంతా౦చలేన ధరణీతల మున్నమయ్య –పాతాళ కేళిషు ద్రుతాది వరాహ లీలం

ఉల్లాఘనోత్ఫణ ఫణాదరగీయమాన –క్రీడావదాన మిభ రాజ ముఖం నమామి ‘’

‘’మల్లినాద సుదీస్సో య౦ మహోపాధ్యాయ శబ్దభాక్  -విధత్తే మాఘ కావ్యస్య వ్యాఖ్యాం సర్వం కషా భిధాం’’

తన వ్యాఖ్యాన సమగ్రత్వాన్ని ,రసభావ ధ్వని ,అలంకారాది సర్వ విషయ ప్రతిపాదికత్వాన్ని ప్రకటిస్తూ మల్లినాధుడు  ఈ కింది విధంగా  చెప్పుకొన్నాడు –

‘’ఏ శబ్దార్ధ పరీక్షణ ప్రణయినో ఏవా గుణాలంక్రియా –శిక్షా కౌతికినో విహుర్తు మనసో యేచ ధ్వనేరధ్వని

క్షుభ్యద్భావ తరంగితే రస సుధా పూరే మిమంక్షంతి యే- తేషామేవ కృతే కరోమి వికృతిం మాఘస్య సర్వంకషాం’’

దీనిభావం –ఎవరు శబ్దార్దాల సందర్భ శుద్ధి ఔచిత్యాన్ని పరిశీలించటానికి ఇష్ట పడతారో,ఎవరు గుణాల అలంకార లోతులను సమన్వయ విశేషాలను తెలుసుకోవటానికి ఉత్సాహ పడతారో ,ఎవరు ధ్వని ప్రస్తానం లో విహరించటానికి మనసు పడుతారో ,ఎవరు ఉవ్వెత్తున లేచే భావ తరంగాలుగల రసామృత సముద్రములో మునకలు వేయటానికి ఉరుకు లెత్తుతారో ,వారంద కోసమే  ఈ ‘’సర్వం కష ‘’ను రచిస్తున్నాను ‘’అని వ్యాఖ్యానం యొక్క ప్రాశస్త్యాన్ని వివరించాడు .దీన్ని బట్టి ఇతర కావ్య వ్యాఖ్యానాలు చేయటం కంటే మల్లినాధుడు దీని వ్యాఖ్యానం రాయటానికి చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోన్నాడని తెలుస్తోంది .

సూరి లేఖినీ నర్తన విన్నాణాన్ని నిపుణ౦ గా  పరిశీలిస్తే –మేఘ సందేశ ,శిశుపాల వధ వ్యాఖ్యానాలు రెండు గ్రంథస్త విషయాన్ని బట్టి ,అనేక అంశాలు ,అనేక రహస్యాలు తెలియ జేయటం లో ఉదాత్తం అని పిస్తాయి .ఎన్నో శాస్త్ర పరిశీలనం చేసి ,సప్రమాణంగా ఆయా సందర్భాలను పరిష్కరించటం లో మల్లి నాధుడు ఈ కావ్య ద్వయ వ్యాఖ్య  రచన కోసం ఎన్నో ఏళ్ళు చాలా కస్ట పడ్డాడని తెలుస్తోంది .అందుకే ‘’మాఘే మేఘే గతం వయః ‘’అని ఆయనే చెప్పిన మాట వలన అర్ధమౌతోంది అని చెరువువారు శ్రీ గరిమెళ్ళ వారి వ్యాఖ్యానం లో పేర్కొన్నట్లు తెలియ జేశారు .

అప్పటికే పంచకావ్యాలకు వ్యాఖ్యానాలు రాసి మల్లినాధుడు ముదుసలి అయ్యాడు .నైషదానికి కూడా వ్యాఖ్య రాయాలని కోరిక కలిగింది .జరా భారం తోజారిపోతున్న కనుబొమలను దారం తో ఎత్తి కట్టుకొని ,తాళ పత్ర గ్రంధాలను తడివి తడివి చదువుతూ ,శిష్యులచే చదివించు కొంటు వ్యాఖ్యానం చేశాడని ,మిత్రులెవరో ఇంతకాలం ఏం చేశావు ,ఇంత శ్రమ చేసి ఇప్పుడు  రాయటం ఎందుకు అని ప్రశ్నించి ఉంటారని అందుకే ‘’మాఘానికి ,మేఘానికి వ్యాఖ్యానాలు రాయటం లో నా ఆయుర్దాయం చాలా భాగం గడిచి పోయింది ‘’అని చెప్పి ఉంటాడని విజ్ఞులు భావిస్తున్నారు .నిజంగానే ఆ వ్యాఖ్యల గొప్పతనం  అంతటిది .ప్రబంధ ధ్వని కి ఉదాహరణమైన నైషదానికి చేసిన వ్యాఖ్యానం కూడా అసామాన్యమైనదే .తన పంచ కావ్య వ్యాఖ్యానాలను చదివిన వారికి ,అందులో సర్వంకషాధ్యయనం చేసిన వారికి నైషధం లోని సర్వార్ధ రహస్యాలు తేలికగా గ్రహించ గలరనే నమ్మకం తో నైషద వ్యాఖ్య ‘’జీవాతువు ‘’ను క్లుప్తంగా రాశాడని పండితాభిప్రాయం .

మాఘ కావ్యం లోని విశిస్టత,,పరిపాకం ,అర్ధ నిర్భరత ,విషయ బాహుళ్యం ,అనేక శాస్త్ర పరిచయం ,కదా సంవిధాన వైచిత్రి, అపూర్వ వర్ణనా విస్ఫూర్తి  ఆ కావ్యం మీద గౌరవాన్ని పెంచుతాయి. కనుక అతి శ్రద్ధగా ఈ కావ్యాన్ని ,కావ్య కర్తను సూరి మనసారా శ్లాఘించాడు –

‘’నేతాస్మిన్ యదు నందన స్స భగవాన్ వీరః ప్రదానో రసః –శృంగారాది భిరంగవాన్ విజయతే పూర్ణా పునర్వర్ణనా’’

‘’ఇంద్ర ప్రస్థగమాద్యుపా య విషయః చైద్యా వ సాదః ఫలం –ధన్యో మాఘ కవిః వయం చ కృతినః తత్సూక్తి సంసేవనాత్ ‘’ ఇంత మెచ్చుకొన్న మాఘ కావ్యం శిశుపాల వధ కు చేసిన’’ సర్వం కష’’ వ్యాఖ్య లో ఏ ఏ విషయాలను ,ఏయే విధంగా సమన్వయము చేసి దీనికి అంతటి గౌరావాన్ని సంపాదించాడో తెలుసుకోవాల్సిందే .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -6

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -6

26- త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవహ –స్త్వమాపస్త్వం వ్యోమత్వము ధరణి రాత్మా త్వమితిచ

పరిచ్చిన్నా మేవం త్వయి పరిణతా బిభ్రతి గిరం –న విద్వస్తత్తత్వం వయ మిహతు యత్వం న భవసి ‘’

భావం –మహేశా !పండితులు నువ్వు సూర్యుడివి ,చంద్రుడివి ,వాయువు ,అగ్ని ,నీరు ,ఆకాశం ,భూమి ,ప్రత్యగాత్మవు అని కూడా చెబుతున్నారు .అవన్నీ నీ స్వరూపాలుగా ,నీ స్వరూపాన్ని పరిమితం చేస్తూ వాక్కులతో కొలుస్తున్నారు .మేము మాత్రమీ చరా చర సృష్టి లో నువ్వు అసలు ఏ వస్తువు కావో తెలుసుకోలేక పోతున్నాం .

27-త్రయీం తిస్రో వృత్తీ త్రిభువన మథో త్రీనపి సురా –నకారా ద్వైవర్ణై స్త్రిభిరభి దధత్తీర్ణ విక్రుతిః

తురీయా తే ధామ ధ్వనిభి రవరుంధాన మణుభిః- సమస్తం వ్యస్తం త్వాం శరణద గృణోత్యోమితి పదం ‘’

భావం –భక్త హృదయావాసా పరమేశా !అకార ఉకార మకారాలు కలుపగా ఓం పదం ఏర్పడి మూడు వేదాలను ,మూడైనా సత్వ రజస్ తమోగుణాల వృత్తులను  ,మూడులోకాలను ,బ్రహ్మ విష్ణు రుద్ర అనే ముగ్గురు దేవతలనూ బోధిస్తోంది .గుణాలకు అతీతం ,షడ్భావ వికార రహితం అయిన నీ నిర్గుణ రూపమే నీ నాల్గవ స్థితి .సూక్ష్మ నాదాలతో ఓంకారం  ఆ స్థితినే స్తుతిస్తుంది విశ్వ మంతా సూక్ష్మ ఓంకారనాదాలు వ్యాపించి నీ నాల్గవది అయిన నిర్గుణ తత్వాన్ని అభి వర్ణిస్తున్నాయి ‘

‘’ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ‘’అని వేదం .ఓంకారమే పరబ్రహ్మ వాచకం .ఓంకార మహాత్మ్యాన్ని ఛాందోగ్య ఉపనిషత్ విశేషంగా వ్యాఖ్యానించింది .

28-భవః శర్వో రుద్రః పశుపతి రథోగ్రః సహ మహాన్ –తథా భీమేశా నా వితి యదభిధానాస్టక మిదం

అముష్మిన్ ప్రత్యేకం ప్రవిరచతి దేవా శ్రుతి రపి-ప్రియా యాస్మై ధామ్నే ప్రణిహిత నమస్యో స్మి భవతే ‘’

భావం –శంభో !భవ ,శర్వ ,రుద్రా ,పశుపతి ,ఉగ్ర ,మహా దేవా ,భీమ ,ఈశాన అని నీ నామ అష్టకం ప్రసిద్ధి చెందింది .ఒక్కొక్క నామాన్ని గురించి శ్రుతి చక్కగా ప్రత్యేకంగా నిన్ను స్తుతిస్తోంది .అందరికీ ఇష్టుడూ ,ఈ రకమైన తేజస్స్వరూపుడు అయిన నిన్ను (నీకు)నమస్కరిస్తున్నాను

ఈ నామాల అర్ధం తెలుసుకొందాం

భవః –‘’భవతి భవతే వా సర్వ మితి భవః –‘’సర్వం తానె అయిన వాడు

శర్వః –‘’ప్రళయే భూతాని శ్రునాతి హినస్తీతి శర్వః ;;-ప్రళయ కాలం లో సమస్త ప్రాణులను హింసించే వాడు

రుద్రః –‘’రోదయతి శత్రూనితి రుద్రః –‘’-శత్రువులను దుఖపెట్టేవాడు –‘’స్వయం రురోద ఇతి వా రుద్రా ‘’-ఒకప్పుడు బ్రాహ్మ వలన జన్మ ప్రాప్తి౦చగా దుఖి౦చినవాడు –‘’రుదం రోదనం ద్రావయతి ఇతి వా రుద్రః ‘’-దుఖాన్ని పోగొట్టేవాడు

పశుపతిః-‘’పశూనాం జీవానాం పతిః’’పశువులు అనే జీవులు ప్రమధులైన  వారికి ప్రభువు –‘’బ్రహ్మ విద్యాః స్తావరాంతా శ్చ పశవః పరికీర్తితాః-పశవః క్షేత్రజ్ఞాః తేషాం పతిః తేషాం త్రాతా ఇతి పశుపతిః’’-పశువులు అనే జీవులను సంసార బంధం నుంచి రక్షించేవాడు .

ఉగ్రః –‘’ఉగ్రత్వాత్ ఉగ్రః ;;-మిక్కిలి భయంకరుడు

మహా దేవః –‘’మహా౦ శ్చఅసౌ  దేవః ‘’-శ్రేష్టు డైన దేవుడు

భీమః –‘’బిభేతి అస్మాత్ త్రైలోక్యం ఇతి భీమః ‘’-ముల్లోకాలను భయపెట్టేవాడు

ఈశానః –‘’ఈస్టే ఇతి ఈశానః ‘’-ఐశ్వర్యం కలవాడు .

29-నమో నేదిస్టాయ ప్రియదవ ! దవిస్టాయ చ నమో –నమః క్రోధిస్టాయ స్మరహర ! మహిస్టాయచ నమః

నమో వర్షిస్ఠాయ త్రినయన !యవిస్టాయ చ నమో –నమః సర్వస్మై తే తదిదమితి సర్వాయ నమః ‘’

భావం –అడవిలో ఉండటానికి ఇష్టపడే శివా !నువ్వు అందరికీ దగ్గరగా ఉంటావు .అలాగే దూరంగానూ ఉంటావు .మన్మధ సంహారా !మిక్కిలి సూక్ష్మ౦ గా  ,మిక్కిలి పెద్ద ఆకారం గా కూడా ఉంటావు .ముక్క౦టీ!బాగా వ్రుద్దుడువు బాగా యువకుడివీ కూడా .అంతేకాక సమస్తమూ అయిన వాడవు .అంతేనా –ఇది అది అని నిర్దేశించి చెప్పే వ్యవహారమంతటినీ మించిన  సర్వ స్వరూపుడవు నువ్వు .అట్టి నీకు నమస్కారం .

ఈశ్లోకం కృష్ణ యజుర్వేదం లోని నమక భాగం లోని ‘’నమస్సోమాయచ రుద్రాయచ ‘’అని నమః నమః అని చాలా సార్లు వచ్చే మంత్రానికి అనుసరణ .

30-బహుల రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమోనమః –జనసుఖ కృతే సత్వోద్రేకే మ్రుడాయ  నమో నమః

ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః –ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః ‘’

భావం –జగదీశా !నువ్వు సమస్తసృస్టి కార్యం నిర్వహించేటప్పుడు రాజోగుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటావు .ప్రజాసుఖ పాలనలో సత్వ గుణాన్ని ,పొంది మృడుడవు అవుతావు .సృష్టి ని లయం చేసేటప్పుడు తమోగుణ సంపన్నుడవై  హరుడు అనిపించుకొంటావు .కాని నువ్వు మీ మూడు గుణాలకు అతీతుడవే. గొప్ప తెజస్స్వరూపుడవై శివుడు అనిపించుకొంటావు.అంతటి విశిస్టుడ వైన నీకు నమోవాకాలు .

ఈపదాల అర్ధాలు గ్రహిద్దాం –

భవః –‘’భవతి భవతే వా సర్వ మితి భవః –అంతా తానె అయిన వాడు

మృడః-‘’మృడ యతి సుఖ యతి భక్తానితి మృడః;’’-భక్తులను సుఖింప జేసేవాడు –‘’స్వయం సుఖీ వా ‘’తాను సుఖం కలవాడు అని కూడా

హరః –ప్రళయం లో సమస్తమూ లయింప జేసేవాడు –‘’భక్తానాం ఆర్తి హరతీతి హరః ‘’భక్తుల పీడను హరించేవాడు

శివః –‘శామ్యతి పరమానంద రూపత్వాత్ నిర్వికారో భవతీతి శివః –‘’బ్రహ్మానంద స్వరూపుడు ,నిరాకారుడుకనుక శమించి ఉండేవాడు –‘’శేరతీ సజ్జన మనాంసి ఇతివా ‘’-ఇతనిలో సజ్జనుల మనస్సు ఉంటుంది –‘’శేతే సజ్జన మనస్సు ఇతివా ‘’-సాధుజన హృదయ వాసి –‘’శివం కల్యాణం తద్యోగాద్వా శివః ‘’-శుభం తో కూడిన వాడు .’’శివో ప్రదాత్ వా శివః ‘’-శుభాలనిచ్చేవాడు

.Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -8

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -8

వ్యాఖ్యానాలు మల్లినాధుడు రాయలేదా ?

మల్లినాధుని కుమారుడు కపర్ది పండితుని ఆపస్తంభ గృహ్య సూత్రాలకు ‘’తాత్పర్య దర్శనం ‘’రాసిన సుదర్శనా చార్యుడు –‘’యత్కృతం వేద వద్భాష్య మాద్రి యంతే విపశ్చితః –స కపర్దీ చిరంజీయా ద్వేద వేదంగతత్వవిత్ ‘’అని ప్రశంసించాడు .మల్లినాధుని తమ్ముడు పెద్ది భట్టు అని వీరిద్దరూ కపర్ది కి కుమారులని పెద్ది భట్టు మహా మహోపాధ్యాయుడై నైషదాదులకు వ్యాఖ్యానం రాశాడని మాతులేయుని క్రతువులో సర్వజ్న సింగ భూపలునిచే సత్కరింప బడినాడని ,ఈ పెద్ది భట్టు కొడుకు కుమార స్వామి అని ,ఇతడే ప్రతాప రుద్రీయానికి రత్నాపన వ్యాఖ్య రాశాడని ,ఈతని కొడుకే  శంభువు  అని ,యితడు విశ్వజిద్యాగం చేశాడని ,ఇతని కొడుకు భాస్కరుడు ,అతనికొడుకు నాగేశ్వర యజ్వ సర్వ ముఖ యాగం చేశాడని ,నాగేశ్వరునికొడుకు కొండుభట్టు వేద వేత్త అని ,కొండు భట్టు కొడుకు నాగేశ్వరుడు ,అతని కొడుకు నారాయణుడు ,.నారాయణ పండితుడు చంపూ రామాయణానికి ‘’పద యోజనం ‘’వ్యాఖ్య రాశాడని ,అందులోని అవతారిక లో –

‘’కోలాచలాన్వయాబ్దీ ౦దు ర్మల్లినాధో మహా యశాః-శతావధాన విఖ్యాతో వీర రుద్రాభి వర్నితః

మల్లినాదాత్మజః శ్రీమాన్ కపర్దీ మంత్ర కోవిదః –అఖిల శ్రౌత కల్పస్య కారికావృత్తి మాతనోత్

కపర్ది తనయో ధీమా న్మల్లినాదోగ్రజః స్మృతః –ద్వితీయ స్తనయో దీమాన్పెద్ది భట్టో మహోదయః

మహోపాధ్యాయ ఆఖ్యాత స్సర్వ దేశేషు సర్వతః –మాతులేయ క్రతౌ దివ్యే సర్వజ్ఞే నాభి వర్షితః

గణాధిప ప్రసాదేన ప్రోచే మంత్ర వరాన్ బహూన్ –నైషద జ్యోతిషదీనాం వ్యాఖ్యాతా భూజ్జ గద్గురుః

పెద్ది భట్ట సుతః శ్రీమాన్ కుమార స్వామి సంజ్ఞకః –ప్రతాపరుద్రీ యాఖ్యాన వ్యాఖ్యాతావిద్వదిగ్రమః ‘’

దీన్ని బట్టి మల్లినాధుని తమ్ముడు పెద్దిభట్టు నైషదాది కావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడని ,కుమార స్వామి యజ్వ పెద్ది భట్టు కొడుకు అని ,మల్లినాధుని ఔరసుడుకాదని అనిపిస్తోంది .కాని ప్రతాప రుద్రీయానికి కుమార స్వామి రాసిన ‘’రాత్నాపణ ‘’వ్యాఖ్యలో ‘’శ్రీ మహా మహోపాధ్యాయ కోలాచల మల్లినాద సూరి సూనునా ,విశ్వజనీన విద్యస్య విద్వన్మణేః –పెద్ద యార్యాస్యాను జేన కుమార స్వామి సోమ పీథినా ‘’అని అతి స్పష్టంగా చెప్పేశాడు .కనుక కుమారస్వామి మల్లినాధుని చిన్న కొడుకే అని నిర్మొహమాటం గా చెప్ప వచ్చు .

శ్రీ మల్లాది సూర్య నారాయణ శాస్త్రి గారు ఈ రెండు వాదాలకు మధ్యేమార్గం గా పరిష్కారం చెప్పి పెద్ది భొట్టు కొడుకు కుమార స్వామి మల్లినాధుని దత్త పుత్రుడు అయి ఉండచ్చు అని, అందుకే కుమారస్వామి తాను మల్లినాధుని కొడుకునని చెప్పుకొని ఉండవచ్చునని ,జన్మ చేత సోదరుడైన పెద్దయార్యునికి తాను తమ్ముడిని అని రాశాడు అని ఉదాహరించారు .కాని ఇది సంగతమైన విషయం కాదని ,పొసగదని ,పెద్ది భట్టు అన్ని వ్యాఖ్యానాలురాస్తే తండ్రిపేరు చెప్పుకోక పోవటం ఆక్షేపణీయమని ఈవాదం తప్పు అని ,కుమార స్వామి పెద్దిభట్టు పేరు ఎక్కడా ప్రస్తావించలేదని ,అవతారికలో ‘’పద వాక్య ప్రమాణ పారావార పారీణుడైన మల్లినాదునికి తండ్రికి తగ్గ తనయుడుగా కోలాచలం పెద్దయార్యుడు జన్మించాడని ,ఆతని తమ్ముడినైన తాను రత్నాపణవ్యాఖ్య రచిస్తున్నానని  తెలిపాడు –ఆ శ్లోకాలు

‘’త్రిస్కంద శాస్త్ర జలదిం చులుకీకురుతేస్మయః –తస్య శ్రీ మల్లినాధస్య తన’’యోజని ‘’తాదృశః

కోలాచల పెద్ద యార్యః ప్రమాణ పద వాక్య పార దృశ్వా యః –వ్యాఖ్యాత నిఖిల శాస్త్రః ప్రబంధ కర్తా చ సర్వ విద్యాసుః

తస్యానుజన్మా తదనుగ్రహా త్త -విద్యోననవద్యో వినయావమ్రః-

స్వామీ విపశ్చి ద్వితనోతి టీకాం –ప్రతాప రుద్రీయ రహస్య భేత్రీం ‘’

అని చెప్పి అన్ని సందేహాలకు మంగళం పాడి మల్లినాధుని కొడుకులు పెద్దయార్య ,కుమార స్వామి అని ,స్వామి అన్నగారి వద్దే విద్యేనేర్చాడని అర్ధమౌతోంది .మిగిలిన వాదాలేవీ దీని ముందు నిలవవు .అంతేకాక ‘’తనయోజని తాదృశః కోలాచల పెద్దయార్యః ‘’అనటం వలన ‘’అజని ‘’అనే క్రియా పద సామర్ధ్యం చేత కుమారస్వామి మల్లినాధుని ఔరస పుత్రుడే అని నిర్దా రింప బడుతోంది అని డా.చెరువు సత్యనారాయణ శాస్త్రి తమ ‘’శిశుపాల వధ –ఆంధ్రీ కృతులు ‘’అనుశీలనం లో అన్నారు .అంతేకాక మల్లినాధుని తమ్ముడు పెద్దిభట్టు అనేక కావ్య గ్రంధాలకు వ్యాఖ్యానాలు రాసి అన్నగారిపై భక్తీ చేత మల్లినాధుని పేరుతొ వెలయించాడు అనే నానుడి లోకం లో ప్రచారం లో ఉన్నదని ,కాని అది క్షమార్హం కాదని ,కొన్ని అయినా పెద్దిభట్టు తనపేర రాసుకో కుండా ఉంటాడా అని ,కొన్ని మాఘ ,నైషద వ్యాఖ్యాన ప్రతులలో ‘’పెద్ది భట్ట కృతే ‘’అని ఉందని ,ఈ వ్యాఖ్యానాలను పూర్వం ‘’పెద్ది భట్టీయం ‘’పేరుతొ పిలిచేవారని అంటారు. ఇదీ అసంగతమైన విషయమేనని ,అలా అయితే పెద్ది భట్టునే  వ్యాఖ్యాత్రు శేఖరునిగా లోకంలో  ఎందుకు ప్రసిద్ధి చెందలేదని ప్రశ్నించి ,మల్లినాధుడు అంతటి మహా వ్యాఖ్యాన పండితుడు తమ్ముడు రాసిన  వ్యాఖ్యానాలకు తన పేరు పెట్టుకోవటానికి అంగీకరిస్తాడా అని కొట్టి పారేసి అవన్నీ కోలాచలం  మల్లినాద సూరి వ్యాఖ్యానాలే అని తేల్చి స్పష్టంగా చెప్పారు చెరువు వారు  .

మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ?

మల్లినాద సూరి ప్రతికావ్య వ్యాఖ్యాన ప్రారంభం లో గణేశ ,సరస్వతి ,శివ ,కేశ వాదులను స్తుతిస్తూ ప్రార్ధనా శ్లోకాలు రాశాడు .అవి రమణీయాలై పండిత లోకం లో బహుళ ప్రచారం పొందాయి –అందులో మచ్చుకు కొన్ని –

‘’అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావన మచింత్య వైభవం –

తం నరం వపుషి కుంజరం ముఖేన్మహే కిమపి తు౦దిలం మహః ‘’

‘’ఆశాసు రాశీ భవదంగవల్లీ భాసైవ దాసీకృత దుగ్ధ సింధుం –

మందస్మితై ర్నిందిత శారదే౦దు౦ ,వందేర విందాసన సుందరిత్వాం ‘’

‘’శారదా శారదాంభోజవదనా వదనాంబుజే –సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధి౦ క్రియాత్ ‘’

‘’ఇందీవర దళశ్యామ మిందిరా నంద వర్ధనం –వందారు జన మందారం వందేహం యదు నందనం ‘’

‘’జాహ్నవీ మూర్ధ్ని పాదే వా కాలః కంఠే వపుష్యధ్య –కామారిం కామతాతం వా కంచిద్దేవం భజామ్యహం ‘’

మాతా పితృభ్యాం జగతో నమో వామార్ధ జానయే –సద్యో దక్షిణ దృక్పాత సంకుచ ద్వామ దృస్టయే ‘’

ఈ శ్లోకాలు  మల్లినాధుని కవన పాండిత్య మాధుర్యాలణు వ్యక్త పరుస్తున్నాయి .ఇందులో సరస్వతీ దేవిపై రాసిన ‘’శారదా శారదాంభోజ ‘’శ్లోకం కృష్ణునిపై రాసిన ‘’నదీ వర దళ శ్యామ ‘’శ్లోకం అవి మల్లినాదునివే అని తెలియక పోయినా జనం నాలుకలమీద ఆనాటి నుంచీ నర్తిస్తూ నే ఉన్నాయి .

ప్రతి కావ్య వ్యాఖ్యాన ప్రారంభం లో ‘’అన్వయ ముఖం గా నే నేను వ్యాఖ్యానిస్తాను .మూలం లో లేని విషయాలు రాయను .అసంబద్ధ విషయాలను ప్రస్తావించను .’’అని నియమం ఏర్పరచుకొని అన్యూన్యాతిరిక్తం గా రచించాడు .మల్లినాద ప్రతిజ్ఞా శ్లోకం –

‘’’’ఇహాన్వయ ముఖే నైవ సర్వం వ్యాఖ్యాయతే మయా –నా మూలం లిఖ్యతే కించి న్నాన్న పేక్షిత ముచ్యతే’’ అదీమల్లినాధుని నిబద్ధత .ఈ విషయాన్నే అక్కడక్కడ ‘’అలమతి పల్లవితేన’’—‘’అలమతి విస్తరేణ’’-గ్రంధ విస్తరభయాన్న లిఖ్యతే’’  అనే మాటలతో ఎప్పటికప్పుడు జాగృతం అయ్యాడు .

నైషద వ్యాఖ్యానానికి జీవాతువు అనే పేరు పెట్టాడని తెలుసుకొన్నాం .జీవాతువుఅంటే జీవ నౌశాధం అని అర్ధం చెప్పాడు సూరి (జీవాతుర్జీవ నౌషధం );నారికేళ పాకమైన కిరాతార్జునీయానికి ‘’ఘంటా పాఠ’’వ్యాఖ్య రాస్తూ సూరి –చెప్పిన ప్రారంభ శ్లోకాలు –

‘’నారికేళ ఫలసమ్మితం వచో భారవే స్సపది తద్విభజ్యతే –స్వాదయ౦తు రస గర్భ నిర్భరం సారమస్య రసికా యధేప్సితం ‘’

‘’నానా నిబంధ విషయైక పదైర్నితాంతం సాశంక చంక్రమణ భిన్నధియామశంకం –కర్తుం ప్రవేశ మిహ భారవి కావ్య బంధే ఘంటా పధం కమపి నూతన మాతనిష్యే’’అని రాశాడు అంటే –‘’భారవి పలుకులు నారి కేళ ఫల సమానాలు వాటిని నేను పగుల కొడతాను .రసనిర్భరాలైన ఆ వాక్యాల సారం రసికులు ఆస్వాది౦చుదురు గాక ‘’అని భారవికవి గొప్ప తనాన్ని తెలిపాడు .’’’అనేక వ్యాఖ్యానాల ఎగుడు దిగుడు వలన భారవి గొప్పతనం జనాలకు దూరమై పోయింది .భారవి కవితలో నిస్సందేహంగా బుద్ధి ప్రసరించేట్లు రాచబాట లాంటి కొత్త వ్యాఖ్యానం రాసి దగ్గరకు తెస్తాను’’అని మరీ చెప్పి సుగమమైన వ్యాఖ్యానం రాశాడు .

’అలాగే నైషదానికి కూడా తన వ్యాఖ్యాన అవసరం కలిగిందనిచెబుతూ ‘’ మిగిలిన కావ్యాలకు ఎలాంటి దుర్గతి పట్టిందో ,నైషదానికి కూడా అలాంటి దుర్గతే పట్టి ,క్షుద్ర వ్యాఖ్యాన విష పీడితాలైన శ్రీ హర్ష కవి రాజ వాక్యాలకు బ్రతికి౦చ టానికి జీవాతువు (జీవాతుర్జీవ నౌషధం )అనే వ్యాఖ్య రాస్తున్నాను. రస భావ గుణార్ధ దోష ధ్వన్యలంకార రహస్యజ్నుల సంతోషం కోసం నైషద కద రూపమైన అమృత కావ్యాన్ని వ్యాఖ్యానిస్తున్నాను’’అని తెలియ జేసి మొదలు పెట్టాడు .దీనికి ఆయన శ్లోకాలు ఇవి-

‘’క్షుద్ర వ్యాఖ్యా విషార్తానాం శ్రీ హర్ష రాజ కవిరాడ్గిరాం –ఉజ్జీవనాయ జీవాతు ర్జీయా దేష మయాక్రుతం ‘’

‘’శ్రీ మల్లినాద విదుషా విదుషాం మతేన తేనైవ నైషద కదామృత కావ్య బంధః

-వ్యాఖ్యాస్యతే డ్య రసభావ గుణార్ధ దోష సాధ్వన్యలంక్రుతి రహస్య విదా౦ ముదేస్తు’’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -5

21-క్రియాదక్షో దక్షః క్రతుపతి రదీశస్త నుభ్రుతా –మృషీణామార్తిజ్వం శరణద సదస్యా స్సురగణాః

క్రతు భ్రంశ స్త్వత్తః క్రతుషు ఫలాదాన వ్యసనినో –ద్రువం కర్తు శ్శ్రద్దావిదుర మభి చారాయ హి మఖాః’’

భావం –భక్తరక్షక పరమేశా !శరీరధారులకు దక్షుడు అధిపతి .యాగ నిర్వహణలో గొప్ప  సమర్ధుడు .ఆయన చేసే యజ్ఞాన్ని నిర్వహించేవారు సామాన్యులుకాదు , మహర్షులు . యజ్న వేదికపై ఆసీనులైనవారు దేవతా సమూహం . ఇన్ని సమకూరినా యాగ ఫలాన్నిచ్చే నీ వలన దక్ష యజ్ఞం విధ్వంసమైంది. శ్రద్ధ లేనివాడు ఎంత వైభవంగా యజ్ఞం చేసినా కూడా ,ఆ యజ్ఞాలు చేసేవారికి అనర్ధాలే కలిగిస్తాయి .

యజ్నఫల దాత శివుడు ఫలాననివ్వటానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాడు .యజ్ఞం లోశ్రద్ధలేకుండా ఆయన అనుగ్రహం పొందలేరు .ఎంతటి గొప్పవాడైనా, శాస్త్రీయంగానే యజ్ఞం చేసినా అనర్ధాలే ఫలిస్తాయి ‘’యదేవ శ్రద్ధయా కరోతి తదేవ వీర్య వత్తరం భవతి ‘’అని  ఛాందోగ్యం చెప్పింది

22-ప్రజానాధం ప్రసభ మభికం స్వాం దుహితరం –గతం రోహిద్భూతాం రిరమయి షుమృశ్య వపుషా

ధనుష్పాణేర్యాతమ్ దివమపి సపత్రా కృతమముం –త్రసంతం తే ద్యాపిత్యజతి  న మృగ వ్యాధ రభసః ‘’

భావం –గౌరీశా !సంధ్యాదేవి బ్రహ్మ కూతురు .ఒక రోజు ఆమె లేడి రూపం పొంది విహరిస్తుంటే బ్రహ్మకాముకుడై ఆ లేడి వెంట పడి కూతురే అయినా క్రీడించటానికి ఉబలాట పడ్డాడు .అప్పుడు విషయం తెలుసుకొన్న నువ్వు పినాకం అనే ధనుస్సు ధరించి వేటాడే బోయవానిగా ఎడురయ్యావు .బ్రహ్మ భయపడి ఆకాశం లోకి పారిపోయాడు .నీ వేటగాని సంరంభం బ్రహ్మకు ఎప్పుడూ ఒణుకు తెప్పిస్తూనే ఉంటుంది .అనుచితంగా ప్రవర్తించే వారికి నువ్వు సింహ స్వప్నమే .

23-స్వలావణ్యాంశంసా ధృత ధనుష మహ్నాయ తృణవత్-పురః ప్లుస్టం ధృస్ట్వాపురమధన పుష్పాయుధమపి

యది స్త్రైణ౦ దేవీ యమనియత దేహార్ధ ఘటనా –దవైతి త్వామద్దా బత వరద !ముగ్దా యువతయః ‘’

భావం –పరాక్రమ ప్రబల త్రిపురాసురిడిని సంహరించిన పరమేశా !అహంకారం తో మన్మధుడు నీకు చిత్త చాంచల్యం కలిగించాలని సంకల్పించి విల్లు ఎక్కుపెట్టగా నువ్వు గడ్డిపోచనుకాల్చినట్లు  దహనం చేసేశావు .కనుక నువ్వు మన్మధ వికార రహితుడవని భావించాలి .యోగ సమాధిలో నిగ్రహించుకొన్న శరీరం తో నువ్వు జగజ్జనని అయిన పార్వతీ దేవిని అర్ధభాగంగా గ్రహించావు .తన ముఖ లావణ్యాన్ని తలచుకొని ఆమె నిన్ను స్త్రీలోలుడిగా భావించి ఉంటె, లోకం లో యువతులు తెలివి తక్కువ వాళ్ళు అని  నిశ్చయి౦చాల్సి వస్తుంది .ఇది యదార్ధమేకడా ఈశా .అంటే నిన్ను స్త్రీలోలుడిగా భావించటం తెలివి తక్కువ తనమే .

మాలవికాగ్ని మిత్రం లో మహా కవి కాళిదాసు ‘’కాంతా సమ్మిశ్ర దేహోప్య విషయ మనసాం యః పరస్తా ద్యతీనాం ‘’అన్నాడు శరీరం లో అర్ధభాగం గా పార్వతిని గ్రహించినప్పటికీ పరమేశ్వరుడు విషయ వా౦చల నుండి ఇంద్రియాలను నిగ్రహించుకొన్న యోగి పుంగవుల కంటే అగ్ర గణ్యుడుఅని తెలియ జెప్పాడు .

24-స్మశానేష్వా క్రీడా స్మరహర !పిశాస్స హ చరాః-చితాభస్మా లేపః స్రగపి నృక కోటీ పరికరః

అమంగల్యం శీలం తవ భవతు నామైవమఖిలం –తదాపి స్మర్త్రూణాం వరద !పరమం మంగళమపి ‘

భావం –స్మర దహనా !శివా !నువ్వు విహరించేది స్మశానాలలో .నువ్వుపూసుకోనేది శవాలు కాలిస్తే వచ్చే బూడిద .నీ మెడలో మానవ కపాలాల దండ .ఇలా నీ స్వభావం సర్వం అమంగళమే .వరదాతవైన నువ్వు భక్తులకు పరమ శుభ దాయకుడవు అవటం ఆశ్చర్యం .

‘’శివం కల్యాణం తద్యో గాద్వా శివ ప్రదత్వా ద్వా శివః ‘’అని శివ శబ్దానికి నిరుక్తి .శుభాలతో కూడి, శుభాలనిచ్సువాడు .అమంగళం గా కనిపించినా మంగళ కారుడు శివుడు అని తాత్పర్యం .

25-మనః ప్రత్యక్చి త్తే సవిధ మవధా యాత్త మారుతః –ప్రహ్రుష్య ద్రోమాణః ప్రమద సలిలో త్సంగిత దృశః

యదా లోక్యా హ్లాదం హ్రద ఇవ నిమజ్యా మృత మయే –తధత్యంత స్తత్వం కిమపి యమిన స్తత్కిల భవాన్ ‘’

భావం –దుర్గేశా !యోగులు యోగ విధానం లో మనసును వాయు స్తంభన చేసి ప్రత్యగాత్మ లో నిలుపుతారు .అప్పుడు వారు అలౌకికానందాన్ని పొందుతారు .ఆ ఆనందానుభవంగా వాళ్ళ ఒళ్ళు పులకరిస్తుంది .కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి .ఆ స్థితిలో  ఏ వస్తువును  చూసి అమృత సరస్సులో మునిగి నంత ఆనందం పొందుతారో దాన్ని వాక్కులచేత వివరింప శక్యం కాదు పరమాత్మా ! ఆ వస్తువు నువ్వే .పరమేశ్వరుడు సచ్చిదానంద పరబ్రహ్మ అని తాత్పర్యం .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీ’ర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం గ్రంథావిష్కరణ సభ (100 వ సమావేశం )

అక్షరం లోక రక్షకం

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు

–  అక్షరం లోక రక్షకం

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు

’గీ’ర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం గ్రంథావిష్కరణ సభ (100 వ సమావేశం )

ఆహ్వానం

సరసభారతి , రోటరీక్లబ్ ,ఉయ్యూరు సంయుక్తంగా నిర్వహిస్తున్నసరసభారతి అధ్యక్షులు  శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచన ;’’గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం(482 మంది సంస్కృత కవుల జీవిత ,సాహిత్య పరామర్శ )కీ శే లు శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  శ్రీమతి ,భవానమ్మదంపతులకు అంకిత మిస్తూ , శ్రీ మైనేని గోపాల కృష్ణ,శ్రీమతి సత్యవతి దంపతుల (అమెరికా )సౌజన్య సహకారాలతో వెలువడిన గ్రంథాన్ని4-12-20 16 ఆదివారం సాయంత్రం ,రోటరీ క్లబ్ ఆడిటోరియంలో  ఆంద్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు  విష్కరణ చేసే  సభలో పాల్గొని జయ ప్రదం చేయవలసినదిగా అతిధులకు  ,సాహిత్యాభిమానులకు  ,కవి పండితులకు  సాదర గా ఆహ్వానం పలుకుతున్నాం .

 

కార్య క్రమం

4-12- 16 ఆదివారం  మధ్యాహ్నం 4 గం ల నుండి -5 -30 గం వరకు

గీర్వాణ వైభవం (సంస్కృత సంస్కృతి)పై ప్రముఖ కవుల కవి సమ్మేళనం –

నిర్వహణ డా .గుమ్మా సాంబ శివరావు (తెలుగు శాఖాధిపతి ,లయోలా కళాశాల ,విజయవాడ )

సాయంత్రం 5 -30-నుండి 5-45 గం వరకు

‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం –ఆవిష్కరణ

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు ,గ్రంధ కర్త

సభ ప్రారంభకులు  –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,సరసభారతి గౌరవాధ్యక్షులు మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు

ముఖ్య అతిధి ,గ్రంథావిష్కర్త –మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ,శాసన సభ ఉప సభాపతి

విశిష్ట అతిధులు –పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామ కృష్ణా రావు ,గీతం యూని వర్సిటి చాన్సెలర్ ,విశాఖ పట్నం

ప్రొఫెసర్ గబ్బిట ఆంజనేయ శాస్త్రి , న్యాయశాఖ ప్రొఫెసర్ , బెనారస్ హిందూ యూని వర్సిటి  వారణాసి.

శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి ,న్యాయశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ – శ్రీ జగన్నాధ విశ్వ విద్యాలయం ,పూరి

గౌరవ అతిధి   –డా .ధూళి పాళ రామ కృష్ణ ,సంస్కృత శాఖాధ్యక్షులు ,మేరీ స్టెల్లా కాలేజి ,విజయవాడ

మాన్య అతిధదులు  –  శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసన మండలి సభ్యులు

శ్రీ జి .వెంకటేశ్వర రావు  సి .ఓ ఓ.,-కె సి పి.

ఆత్మీయ అతిధులు – ప్రముఖ టి వి ,సినీ నటి ,యాంకర్ ఝాన్సి (అమృతం ఫేం )

శ్రీ గుండు హనుమంత రావు ,ప్రముఖ సినీ హాస్య నటులు ,(అమృతం ఫేం)

శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం

డా .జి వి .పూర్ణ చంద్ ,ప్రధాన కార్య దర్శి,కృష్ణాజిల్లా రచయితల సంఘం

శ్రీ చలపాక ప్రకాష్ ,రమ్య భారతి సంపాదకులు ,మరియు కార్య దర్శి,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం

సాయంత్రం 5- 45గం నుండి – 6 గం వరకు – గ్రంథ పరిచయం

డా .తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి ,రిటైర్డ్ ప్రిన్సిపాల్ ,శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ,పొన్నూరు

సాయంత్రం 6 గం నుండి –రాత్రి 7- 30 గం వరకు –అతిధుల అభిభాషణం ,అతిధులకు సన్మానం

కార్య క్రమ నిర్వహణ -శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్య దర్శి

జోశ్యుల శ్యామలాదేవి  మాదిరాజు శివ లక్ష్మి  గబ్బిట వెంకట రమణ    గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు, మరియు    కార్య దర్శి              కోశాధికారి           అధ్యక్షులు -సరసభారతి

రోటరీ క్లబ్ ప్రెసిడెంట్

పూర్తి వివరాలతో ఆహ్వాన పత్రికను నవంబర్ 15 లోపు అంద జేస్తాము

—

‘’’చందః పాద యుతాం నిరుక్త నఖరాం ,శిక్షాది జ౦ఘాన్వితాం

ఋక్సామోరుయుగా,మధర్వ జఘనా  ,మధ్వర్యు వేదో ధరాం

తర్క న్యాయ కుచాం,పదస్మృతిభుజాం కావ్యార వి౦దాననాం

వేదా౦తామృత  లోచనాం,భగవతీం వాగ్దేవతా మాశ్రయే ‘’.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -7

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -7

మల్లినాద మహా వైదుష్యం

అనితర సాధ్యమైన మేధస్సు ,పాండిత్య గరిమ శాస్త్ర పరిజ్ఞానం ,కావ్య ప్రతిభ విమర్శనా చాతుర్యం ,విశ్లేషణ సామర్ధ్యం,లోకజ్ఞానం  మల్లినాద సూరి ప్రత్యేకతలై ,ఇతార వ్యాఖ్యాతలు ఆయనకు ఆమడ దూరం లో ఉండిపోయారు .ఆయన పాండిత్య పారావారానికి అవధి లేదు .అన్ని నిఘంటువులు ,పదకోశాలు , ,,సర్వ శాస్త్రాలు ,పాణిని సూత్రాలు ,ధర్మ శాస్త్రాలు ఆయనకు కరతలామలకాలు వాచో విదేయాలు .రెండు చోట్ల మాత్రం తనను గురించి చెప్పుకొన్నాడు .రఘు వంశ వ్యాఖ్యానం లో తనను ‘’పద వాక్య ప్రమాణ పారావార పారీణ’’అని ,తనకున్న అపార శాస్త్ర పాండిత్యాన్ని సంజీవిని వ్యాఖ్య ప్రారంభం లో ఒక శ్లోకం లో తెలియ జేశాడు –

‘’వాణీం కాణభుజీ మజీగణదవాసా సీచ్చ వైయాసికీ –మంత్రస్తంత్ర మరంస్త పన్నాగ గవీ  గు౦భేషు చాజా గరీత్

వాచామాచకల ద్రహస్య మఖిలం యశ్చాక్ష పాద స్ఫురాం –లోకే భూద్యదుపజ్న మేవ విదుషాం సౌజన్య జన్యం యశః ‘’

దీనిభావం –కణాద,గౌతమ తర్క శాస్త్రాలను ,వ్యాసకృత బ్రహ్మ సూత్రాలను ,మీమాంసా వ్యాకరణాలను క్షుణ్ణంగా అభ్యసి౦చాను ,కనుక మహా మహోపాధ్యాయ బిరుదు సార్ధకం .అన్ని శాస్త్రాలలో సిద్ధాంత స్థాపనం చేసేవారినే మహా మహోపాధ్యాయులు అంటారు .శంకర భగవత్పాదులు ‘’ఈక్షితేర్నా శబ్దం ‘’అనే సూత్రానికి వ్యాఖ్యానం రాస్తూ ‘’తత్ర పద వాక్య ప్రమాణజ్నేనాచార్యేణ వేదాంత వాక్యానాం బ్రహ్మావగతి ప్రదర్శనాయ వాఖ్యాభాస ప్రతి పత్తయః పూర్వ పక్షీయ నిరా క్రియ౦తే’’అని రాసే సందర్భం లో ‘’పద వాక్య ప్రమాణజ్న ‘’బిరుదు ను బాదరాయణ మహర్షికి(వ్యాసర్షి ) విశేషంగా ప్రయోగించారని శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారు ‘’ఆంద్ర మాఘ కావ్య పీఠిక ‘’లో తెలియ జేశారని డా చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు తమ శిశుపాల వధ ఆంధ్రీ కృతులు అనుశీలనం లో రాశారు .

వరద రాజ కృత ‘’తార్కిక రక్షా సార సంగ్రహం ‘’కు నిష్కంటక వ్యాఖ్య ,కుమారిల భట్టు రాసిన ‘’తంత్ర వార్తికం ‘’కు వ్యాఖ్యానం ,జితేంద్ర సిద్ధి రచన ‘’న్యాస గ్రంధం ‘’కు ‘’న్యాసోద్యోతం వ్యాఖ్యతోపాటు ఒక జ్యోతిష గ్రంధాన్ని మల్లినాధుడు రాశాడని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి రాశారని  చెరువు వారు  చెప్పారు . కాళిదాస కావ్య వ్యాఖ్యానం చేస్తూ ‘’కాళిదాస గిరాం సారం ,కాళిదాస స్సరస్వతీ –చతుర్ముఖో ధవా సాక్షా ద్వేత్తి నాన్యేతుమాద్రుశాః ‘’అని వినయం తోపలికాడు సూరి .’’’భారతీ కాళిదాసస్య దుర్వ్యాఖ్యా విష మూర్చితా –ఏషా సంజీవినీ వ్యాఖ్యా తామద్యో జ్జీవ ఇష్యతి ‘’అంటే కాళిదాస మహా కవి వాక్కులకు అనేక దుర్వ్యాఖ్యానాలు వలన అర్ధ ప్రసన్నత  కోల్పోయి  మూర్చిల్లాయనీ, సార్ధకమైన నా సంజీవినీ వ్యాఖ్య వాటికి ప్రాణం పోసి వికసింప జేస్తాయి .అని భావం.’’మల్లినాద కవిస్సోయం మందాత్మా నుజి ఘ్రుక్షయా –వ్యాచస్టే కాళిదాసస్య కావ్య త్రయ మనాకులం ‘’అని ప్రతిజ్ఞ కూడా చేశాడు మల్లినాధుడు .అల్ప బుద్ధికలవారికి అతి సునాసంగా కాళిదాస హృదయం అర్ధమయ్యేట్లు చేయటం నా విధి ‘అని భావం .

మల్లినాధుడు తొక్కిన కొత్త దారి

సామాన్యుడికి కావ్య శాస్త్రాలు చేరువవ్వాలంటే అసలు అప్పటిదాకా ఉన్న వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయి ,మల్లి నాధుని కొత్త మార్గం ఏది ?తెలియాలి .కేవలం కద తెలుసుకోవటానికి కావ్యం చదవక్కరలేదు .ఇతిహాస పురాణాలలో ఈ కధలన్నీ ఉండనే ఉన్నాయి .కావ్యం లోని విశేషాలను మనసుకు అందజేసి,ధ్వని భావ చమత్కారాలకు మురిసి ,రసాందాన్ని పొందటమే కావ్య పరమార్ధం .పండితులకు తత్వజ్నులకు ఈ రహస్యాలు తెలుస్తాయి .సామాన్యులకు అవి కరతలామలకాలు కావటం లేదు .కనుకనే వ్యాఖ్యానాల అవసరం కలిగింది  .పైకి రావాలనే విద్యార్ధులకు అందుబాటులో లేని ప్రబంధాది కావ్యాలకు కరదీపికలై మార్గదర్శనం చేస్తాయి వ్యాఖ్యానాలు ..

సాధారణ వ్యాఖ్యానాలలో అన్వయ క్రమం లో పదాలను కూరుస్తారు వీటిని అన్వయ వ్యాఖ్యలు అంటారు .మరికొన్నిటిలో కర్త ,కర్మ ,క్రియ లను ముందుగా చెప్పి తర్వాత ఆకాంక్షను బట్టి ఆ యా పదాల విశేషాలను వివరించబడుతాయి వీటిని ‘’సాకా౦క్ష వ్యాఖ్యానాలు ‘’అంటారు .అంటే పదాలకు ,పదా౦తరాలకు ఉన్న సంబంధాన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పి సంబంధాన్ని నిరూపించటం అన్నమాట .

రెండు రకాల వ్యాఖ్యానాలలో సమన్వయ ముఖ వ్యాఖ్యానం కావ్యాల విషయం లో సమన్వయ సారళ్యాలకు  సులభంగా అర్ధం చేసుకోవటానికి ఉపకరిస్తుంది .ఇలాంటి వ్యాఖ్యానాలనే టీక అంటారు .వీటిలో పదాలకు సంబంధించి అర్ధాలకు సంబంధించి విశేషాలు సమాసాలకు విగ్రహ వాక్యాలు ,ప్రకృతి ప్రత్యయ విభాగాలు ,కఠిన పదాలకు అర్ధాలు ,వాటికి నిఘంటు ప్రమాణాలు ,అలంకార విశేషాలు ,వాటి లక్షణాలు ,అందులో చెప్పబడిన శాస్త్ర విషయాలణు వివరించే ప్రమాణ వాక్యాలు మొదలైన వాటితో సమగ్రంగా ఉంటుంది .ఇవన్నీ లేకుండా కేవలం పద సమన్వయము మాత్రమే ఉంటె ‘’లఘు వ్యాఖ్య ‘’అంటారు .సమన్వయము లేకుండా కఠిన పదాలకు అర్ధం మాత్రమే చెప్పే వాటిని ‘’గచ్చద్వాఖ్యలు ‘’అంటారు .కావ్యం లోని విశేషాలను మాత్రమే చెప్పి ,అందుకు సంబంధించిన శాస్త్ర ,లక్షణ గ్రంధాది ప్రమాణాలతో ,ఉదాహరణలతో వివరించే వాటిని ‘’టిప్పణి’’అంటారు .ఇందులో ఉన్న లాఘవాన్ని బట్టి లఘు టిప్పణి అన్నారు ఇలా వ్యాఖ్యానాలలో ఉన్న రకాలను చెరువు వారు వివరిచారు .

సంస్కృత కావ్య నాటకాదులలో అన్వయం ద్వారా సమగ్ర వ్యాఖ్యానంతో వాటిలోని విశేషాలను పాఠకుడు తేలికగా గ్రహిస్తాడు .ఇలాంటి పరిజ్ఞానాన్ని ‘’సాహిత్యం ‘’అంటారు .సాహిత్యం అంటే సహి తత్త్వం .శబ్దార్ధ ,గుణాలంకార ,రసభావ వివిధ శాస్త్ర విషయ సహితం కనుక ఇది సాహిత్యమయింది .సాహిత్యం అంటే ఇవన్నీ ఉన్నది . సాహిత్య పండితుడు అంటే ఇవన్నీ పూర్తిగా తెలిసినవాడు అని  అర్ధం .మల్లినాధుడు అన్వయ ముఖ సవ్యాఖ్యాన మార్గమే తొక్కి మార్గ దర్శియై ,ఆదర్శ ప్రాయమైనాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆంధ్ర పత్రిక శత జయంతి ఉత్సవ ఆహ్వానం

ఆంధ్ర పత్రిక శత జయంతి ఉత్సవ ఆహ్వానంsahitya-akademy-andhra-patrika

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఇమాన్యుయేల్ కాంట్ -వికాసం అంటే ఏమిటి ?

ఇమాన్యుయేల్ కాంట్  -వికాసం అంటే ఏమిటి ?

ఇమాన్యుయాల్ కాంట్ (1724-1804 )గొప్ప జర్మన్ మేధావి గణిత శాస్త్ర వేత్త  ప్రపంచ తత్వ వేత్తలలో అగ్ర శ్రేణికి  చెందినవాడు  .భారతీయ తత్వ వేత్తలు ఆయన సిద్ధాంతాలను తరచూ ఉదాహరిస్తూ ఉంటారు .ఆయనకూ మన దేశం పై అపార మైన గౌరవం ఉన్నది .వికాసోద్యమానికి ఆధ్యాత్మిక మూలాలు సంతరించాడు. స్వచ్చమైన హేతువాద పరామర్శ (క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ),సిద్ధాంతీకరణ విమర్శ(క్రిటిక్ ఆఫ్ జడ్జిమెంట్ ) కాంట్ గొప్ప రచనలు .లెస్సింగ్ లాగా వికాసం అనేది నిరంతర కార్యక్రమం అని మనోవికాసం తో కూడిన హేతు వాదం వైపుకు పురోగామించటమే మానవ జీవిత పరమార్ధమని కాంట్ అంటాడు .ఆయన రాసిన’’ హేతు వాదం అంటే ఎమిటి ‘’?అనేదాన్ని ఆయనమాటలలోనే తెలుసుకొందాం

‘’వికాసం అంటే స్వయంగా తెచ్చుకొన్న పారతంత్రం నుండి విమోచన .పార తంత్రం అంటే మనిషి ఇతరుల ఆదేశం లేకుండానే తన తెలివిని ఉపయోగించుకోలేని అసమర్ధత . అందుకే ఈ  పారతంత్ర్యం .దానికి హేతువు అయిన వివేచనా శక్తి లోపం వలన కాకుండా ఇతరుల ఆదేశం లేకుండా దాన్ని ఉపయోగించుకోవటానికి అవసరమైన పట్టుదల సాహసం లేక పోవటం వలన కలిగేది. ఇది స్వయం కృతం .’’సాహసించు –నీ హేతువాద వివేకాన్ని ఉపయోగించు ‘’అనేది వికాస వాద సూత్రం .

‘’అలసత్వం ,పిరికితనం పారతంత్రానికి ముఖ్య కారణాలు.బాహ్య దేశం నుంచి విముక్తిపొందినా వీళ్ళు జీవితమంతా సంరక్షకత్వం (ట్యూటేలేజ్ )లో మసులుతూ ఉంటారు .నాకోసం అన్నీ అర్ధం చేసుకొని నా పని తేలిక చేసే పుస్తకం ,నాకోసం ఒక అంతరాత్మగల గురువు ,నా ఆహారాన్ని నిర్ణయించే వైద్యుడు ఉంటె నేనుగా ప్రయత్నం చేయటం ఎందుకు ?నేను ఆలోచి౦చక్కరరలేదు .నేను డబ్బు వెదజల్లితే ఇవన్నీ చేసేవారు నాకు దొరుకుతారు ..ఇతరులే నా బదులు పని చేయటానికి సిద్ధంగా ముందుకు వస్తారు ..ఈ సంరక్షకులు మొదట తమ ‘’పశువుల మందకు’’ మూగతనాన్ని అలవాటు చేసి తర్వాత తాళ్ళతో బంధించి బండీకి కట్టేస్తారు .తప్పించుకొనే ప్రయత్నం చేస్తే ఎంత ప్రమాదమో తెలియ జేసి గ్రిప్ లో ఉంచుకొంటారు .ఎవరిడైనా గీత దాటటానికి చేసి విఫలమైతే  మిగిలిన వారికి కనువిప్పుకలిగించి ఆ ప్రయత్నం జోలికి వెళ్ళకుండా చేస్తారు .కనుక ఒంటరిగా ఉంటూ ఈ పారతంత్రం నుంచి తప్పించుకోవటం చాలా కష్టం .పారతంత్రం అతనికి మహా భాగ్యం గా ఉంటుంది .బుద్ధిని ఉపయోగించటానికి అశక్తుడు అవుతాడు .అవకాశమూ ఇవ్వరు, తీసుకోడు కూడా .స్వేచ్చాచలనం అలవాటు లేక దేనికోదానికి బందీ అయిపోతాడు .

ప్రజలు తమంత తాము వికాసం పొందటం సాధ్యమే .స్వేచ్చ ఇస్తే వికాసం వస్తుంది .పారతంత్ర కాడిని బుజం మీదనుంచి తోసిపారేశాక తమ యోగ్యతను గురించి ఆలోచిస్తారు .కర్తవ్యమ్  అనే సూత్రాన్ని గుర్తెరిగి బాగా ప్రచారం చేస్తారు .అసూయా ద్వేషాలు నాటటం ప్రమాదకరం .మనోవికాసానికి కావాల్సింది స్వేచ్చ మాత్రమే . ‘’వాదించకు ,చెప్పింది చెయ్యి విశ్వసించు ,వాదించినా విదేయుడవై ఉండు ‘’అని స్వాతంత్ర్యాని అడ్డ కట్టలు  సర్వత్రా ఉంటాయి .హేతువాద వివేచనకు మనిషికి ఎప్పుడూ స్వతంత్రం కావాలి .సమాజం లోని వ్యక్తులు కృత్రిమ ఐక మత్యం తో అస్వతంత్రులుగా పని చేయాలి .అప్పుడే వారి ప్రయోజనాలను ప్రభుత్వం గుర్తించి అనుకూలంగా ప్రవర్తిస్తుంది .పన్నుల అనౌచిత్యాన్ని ,అన్యాయాల గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు పౌరులుగా తమ ధర్మాలకు వ్యతిరేకంగా పని చేయకూడదు .మతం కాని సంఘం కాని మనవ మనో వికాసాన్ని అణచిపెట్టే ఏ పనీ చేయ రాదు .ఒక వర్గానికున్న హక్కును వేరొక వర్గానికి లేకుండా చేయరాదు

‘’మనం వికాస ౦ పొందిన యుగం లో జీవించటం లేదా అని ఎవరైనా ప్రశ్నిస్తే’’లేదు’’ అని నా సమాధానం .కారణ౦ మనం ఉన్నది వికాస వాద యుగం లోనే కాని , వికాస యుగం లోకాదు. వికాసవాద యుగం అంటే ఫ్రెడరిక్ శతాబ్ది. ఫ్రెడరిక్ ప్రభువు మానవులకు నిషేదాలులేకుండా స్వేచ్చా జీవుల్లా ఉంచటానికి ప్రయత్నంచేసి మనోవికాసాన్ని సాధించినవాడు .పౌరస్వాతంత్ర్యం ప్రతి వ్యక్తీ మనస్సుకూ తన శక్తికొలది విస్తృతంగా వికాసం పొందటానికి  అవకాశం కలిగిస్తుంది .అతి కఠిన మైన మెదడు చిప్పలోప్రకృతి అద్భుతమైన విత్తనాన్ని ఆరోపించింది .దాన్ని అతి సుకుమారంగా చూసుకొంటుంది. ‘స్వేచ్చగా ఆలోచించాలి అన్న ఆసక్తే ఆ బీజం .ఇది ప్రజల పరిణామ౦ మీద ప్రభావం కలిగిస్తుంది దానితో స్వాతంత్రానికి అర్హత సంపాదిస్తాడు .చివరికి అది ప్రభుత్వ విదానాలమీదకూడా ప్రభావం చూపిస్తుంది .ప్రభుత్వం వారిని యంత్రాలలాగా కాకుండా అప్పుడు వారి వారి హోదాలకు తగినట్లు సంభావిస్తుంది .

Inline image 2

ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-16 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -4

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -4

16-మహీ పాదా ఘాతా ద్వ్రజతిసహసా  సంశయ పదం –పదం విష్ణోః భ్రామ్యద్భుజ పరిఘ రుగ్ణ గ్రహణం

ముహుర్ద్యౌ  రౌస్ధ్యంయాత్య నిభ్రుత జాడా తాడిత తటా-జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభుతా ‘’

భావం –ఉమాపతీ !సంధ్యాసమయం లో ఒక రాక్షసుడు లోకాలను బాధిస్తుంటే ,వాడిని భయపెట్టి ,లోకాలను సంరక్షించటం కోసం నువ్వు సంధ్యా నాట్యం చేస్తున్నావు .అప్పుడునీ అడుగుల ఒత్తిడికి భూమి హటాత్తుగా తానున్నానో లేనో ననే అనుమానం పొందుతోంది  .ఆ నాట్యం లో అడ్డ గడియ లాంటి నీ భుజాల ను నువ్వు త్రిప్పు టూ ఉంటె విష్ణు స్థానమైన ఆకాశం విరిగిన గ్రహ సమూహాలై పోతోంది .చెదిరే నీ జటా జూటం చేత మాటి మాటికీ దెబ్బలు తింటున్న స్వర్గం ప్రతి దెబ్బకీ స్థితిని తప్పుతోంది .సహింప శక్యం కాని నీ తాండవనృత్యం నీకు గొప్ప ఆధిపత్యాన్ని కల్పించటం పరమ మనోహరంగా ఉంది .

17-వియద్వ్యాపీ తారా గణ గుణిత ఫేనోద్గమ రుచిః-ప్రవాహో వారాం యః పృషతలఘు దృస్టశ్శిరసితే

జగద్వ్యీపాకారం జలధి వలయం తేన కృత మి –త్యనే నైవోన్నేయం ధృత మహిమ దివ్యం తవ వపుః’’

భావం –రుద్రా ! గంగ ఆకాశమంతా వ్యాపించి ,నక్షత్ర సముదాయం చేత ఎన్నో రెట్లుగా ఆవిర్భవిస్తున్న గంగ నురుగు తెల్లగా ఉంది .ఆ గంగా ప్రవాహం నీ శిరసుపై చిన్న నీటి బిందువులుగా దర్శన మిస్తున్నాయి .జగత్తు అంతా ఆ గంగా ప్రవాహం చేత ఆవరి౦పబడి ఒక ద్వీపాకారంగా కనిపిస్తోంది .అంతటి శక్తిగల గంగా ప్రవాహం నీ శిరసుపై చిన్న చిన్న నీటి బిందువులుగా కనిపించటం చేత నీ దివ్య సుందర దేహం మహా మహిమాన్వితమైనదని స్పష్టంగా చెప్పకనే చెబుతోంది .

18-రధః క్షోణీ యంతా శతధృతి రగేంద్రో ధనురధో –రదా౦గే చంద్రార్కౌ రధ చరణ పాణిశ్శర ఇతి

దిధుక్షోభే కోయం త్రిపుర తృణ మాడంబర విధి –ర్విధేయైః క్రీడంత్యో న ఖలు పరతంత్రాః ప్రభుధియః’’

భావం –గంగాధరా !త్రిపురాసురులు నీకు గడ్డిపోచాలాంటి వారు .వాళ్ళను కాల్చాలని సంకల్పించావు .అప్పుడు భూమి అంతా నీకు రధమైంది .బ్రహ్మ సారధిగా ,మేరుపర్వతం ధనుస్సుగా ,సూర్య చంద్రులు రధ చక్రాలుగా అమరిపోయారు .ఆ అల్ప దుస్ట  రాక్షస సంహారానికి నీకు ఇంతటి ఆడంబరం అవసరమే లేదు .సమస్త లోకాలను శాసించేవారి బుద్దులు ఇతరులపై ఆధార పడవు .ప్రభువుల బుద్ధులు విధేయులతో వినోదించాలని ఉబలాట పడుతూ ఉంటాయి .అందుకే త్రిపురాసుర దహనానికి కావాలనే నువ్వు ఇంతటి పటాటోపాన్ని  ప్రదర్శించావు .

19-హరిస్తే  సాహస్రం కమల బలిమాధాయ పదయోః –యదే కోనే తస్మిన్నిజ ముదహరన్నేత్ర కమలం

గతో భక్త్యుద్రేకః పరిణతమసౌ చక్ర వపుషా –త్రయాణా౦ రక్షాయై త్రిపుర హర జాగర్తి జగతాం ‘’

భావం – త్రిపురహరా హరా!విష్ణువు నీ పదద్వయాన్ని  వెయ్యి కమలాలతో అర్చించాలని సంకల్పించి సేకరించి ఉంచితే అందులో లెక్కకు ఒకటి తగ్గింది .వెంటనే పద్మవంటి తనకన్నునే పెకలించి పద్మ౦గా సమర్పింఛి అర్చించాడు . .విష్ణుమూర్తి  అచంచ  భకక్తి యొక్క ఆవేశమే చక్రం గా మారి ఆయన హస్తాన్ని అలంకరించి విష్ణు చక్రమని పిలువ బడుతోంది .ఆ విష్ణు చక్రమే సమస్త లోక రక్షణకు జాగ్రుతమై నిత్యం మేలు కొనే ఉంటుంది .భక్త్యావేశం తో సమర్పి౦ప బడిని విష్ణు నేత్రమే చక్ర రూపం పొంది హస్తాన్ని అలంకరించి సర్వ లోక రక్షణలో నిత్య జాగృతంగా ఉన్నది .

20-క్రతౌ సుప్తే జాగ్రత్ త్వమసి ఫలయోగే క్రతుమతాం –క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధన మృతే

అతతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదాన ప్రతిభువం –శ్రుతౌ శ్రద్ధాం బధ్వా దృఢ పరికరః కర్మసు జనః ‘’

భావం –యజ్నేశా !ఏ యజ్ఞం అయినా ఎప్పుడో ఒకప్పుడు పూర్తి కావాల్సిందే. యజ్ఞం చేసినవాడికి ఫలాన్ని అందించటం లో నువ్వు ఎప్పుడూ సంసిద్ధంగా ముందే ఉంటావు. యజ్ఞం అనిత్యమైంది ,జడం కూడా .అది ఫలాన్ని ఇవ్వ లేదుకదా  ఏకర్మకైనా ఫలదాతవు పురుషోత్తముడవైన నువ్వే .నిన్ను ఆరాది౦చకపోతే ఫలం ఎలా లభిస్తుంది ?జనాలకు ఈ విషయం బాగా తెలుసుకనుక ,యజ్ఞం ద్వారా నీ అనుగ్రహం పొందాలని  వేదం పై పూర్తీ విశ్వాసం తో వేదోక్తాలైన యజ్ఞాలను నిర్వహిస్తున్నారు .

‘’పురి శరీరే శేతే పురి దేహే సీదతీతివా పురుషః ‘’అని పురుష శబ్దానికివాచకమైన పరమాత్మకు  నిర్వచనం .అంటే శరీరం లో ఉండేవాడు .’’వేదో నిత్య మదీయతాం తదుదితం కర్మ స్వనుస్టీయతాం’’అని శంకర భగవత్పాదులు ఆదేశించారు .అంటే వేదోక్త  కర్మలను  ఆచరించమని భావం. వేద ప్రతిపాదిత యజ్న కర్మలకు ఫలప్రదాత పరమేశ్వరుడే .

 

Inline image 1

Inline image 2

సశేషం

నాగుల చవితి శుభాకాంక్షలతో

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -6

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -6

మల్లినాధుని సృజన రచనలు

మహాకావ్య వ్యాఖ్యానం తో పాటు మల్లినాద సూరి స్వీయ రచనలూ చేసి తన కవితా సామర్ధ్యాన్ని తెలియ జేశాడు ,ఆయన సృజలలో 1-రఘువీర చరితం అనే 17 కాండల కావ్యం .శ్రీ రాముని అరణ్య వాసంనుండి పట్టాభిషేకం వరకు .1531 శ్లోకాలున్నాయి .ఇవి కాళిదాస రఘువంశ కావ్యం కంటే కొంచెం తక్కువ శ్లోకాలతో ఉంది .

2-వైశ్య వంశ సుధాకరం –వైశ్య కులం లో వచ్చిన కొన్ని సమస్యలపై  మల్లినాధుని తీర్పు .మొదటి ప్రౌఢదేవరాయలకాలం లో ముఖ్య న్యాయ నిర్ణేతగా మల్లినాధుని నియమించి వైశ్య సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి తీర్పు చెప్పమని కోరాడు . తనకిచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసి వైశ్య కుటుంబ మూల విషయాలను త్రవ్వి తీసి ,నేపధ్యాన్ని అధ్యనం చేసి వెలువరించిన తీర్పు ఇది .వైశ్య శబ్దాలకు చారిత్రాత్మక అర్ధాలను సేకరించి వివరించాడు .అందులోని భిన్నతరగతుల వారి విధులను విధానాలను తెలియ జేశాడు. దీనివలన వారికి వర్తక వాణిజ్యాలలో గొప్ప ఉపయోగమే కలిగింది .ఆకాలం లోమల్లినాధుని తీర్పు ఒక శాసనం (టెస్ట్ మెంట్ )అయింది

అమర కోశాన్ని పూర్తిగా చదివి అర్ధం చేసుకొని దానిపై ఉన్నకాశీ రామస్వామి ,వంధ్యాగతీయ,సర్వానంద ,లింగ భట్ట హరిదీక్షిత  గురుబాల ప్రబోధిని వంటి తెలుగు సంస్కృత వ్యాఖ్యానాలను పరిశీలించి .రాసిన కావ్యం ఇది .

3-ఉదార కావ్య 4-భక్తి రహస్య 5-నక్షత్ర పాఠా ధ్యాయం కూడా మల్లినాద కృతులే అంటారు .అయితే అది పూర్తిగా నిరూపింప బడలేదు .

మల్లినాద కావ్య వ్యాఖ్యాన రచనలు

1-కాళిదాస మహాకవి రచించిన 1-రఘు వంశం

2-కుమార సంభవం

3-మేఘ దూతం లకు సంజీవని వ్యాఖ్య రాశాడు .

4–భారవి రాసిన –కిరాతార్జునీయం కు ఘంటాపాఠ వ్యాఖ్యానం

5–మాఘకవి రచన –శిశుపాల వధ కు –సర్వంకష వ్యాఖ్యానం

6 -శ్రీ హర్షుని నైషధీయ చరిత కు –జీవాతువు వ్యాఖ్యానం

7 -భట్టి రాసిన భట్టి కావ్యానికి-సర్వ పాఠీన వ్యాఖ్య రాశాడు

శాస్త్ర  గ్రంధాలకు  వ్యాఖ్య

1-      విద్యా ధరుడు రచించిన ఏకావలి అలంకార గ్రంధానికి –తరల అనే పేరుతో వ్యాఖ్యానం రాశాడు

2-      వరద రాజ కృతి –తార్కిక రక్షాస్టిక కు ఒకటవ పరిచ్చేదం పై మాత్రమే-నిష్కంటక వ్యాఖ్యానం రచించాడు

 

న్యాయ శాస్త్ర గ్రంధ వ్యాఖ్యానం

మూడు శాస్త్ర గ్రంధాలకు వ్యాఖ్యానం రాశాడు

1-తంత్ర వార్తిక –కు సిద్దా౦జన

2-స్వర మనోజ్ఞ మంజరి కి పరిమళ వ్యాఖ్య

3-ప్రశస్త పాదాభ్యాస కు నిష్కంటక వ్యాఖ్యానం రాశాడు

అంటే మొత్తం మీద 12 గ్రంధాలకు మల్లినాధుడు వ్యాఖ్యానాలు రాశాడు .ఇవికాక 1-లఘు  శబ్దేందు శేఖర 2-అమర కోశ 3-నలోదయ వ్యాఖ్యానాలకూ కర్త మల్లినాదుడే అంటారు .అయితే అది  అనుమానాస్పదం అన్నారు ‘

ఏ వ్యాఖ్య తరువాత దేన్నీ రాశాడనే దాన్ని స్పష్టంగా నిర్దుష్టంగా వివరించి చెప్పటం కష్టమే .కొన్ని సూచనలు మాత్రం కనిపిస్తాయి అవే ఆధారాలు .ఆయన రాసిన ఇతర వ్యాఖ్యానాలలో వీటి గురించి ప్రస్తావన కనిపిస్తుంది .కనుక వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం దొరుకుతుంది .

శిశుపాల వధ కు రాసిన సర్వం కష వ్యాఖ్యానం లో కాళిదాస రచనలకు రాసిన సంజీవని ప్రస్తావన చేశాడు .కనుక సర్వంకష కు ముందే రఘువంశ కుమార సంభావ మేఘ దూత లపై సంజీవని వ్యాఖ్య రాశాడని తెలుస్తుంది .మేఘ దూత భట్టి కావ్యాలలో రఘువంశ సంజీవని వ్యాఖ్య ప్రస్తావన ఉంది .కనుక ఈ రెండిటికంటే ముందే రఘువంశ వ్యాఖ్యానం రాశాడని భావించ వచ్చు .శిశుపాల వధకు రాసిన సర్వం కాషలో సర్వం కష విషయం ఉన్నది కనుక అదే పేరుతొ ఇంకోదానికి రాయలేదని అనుకోవటానికి దారితీయదు .ఘంటా పద వ్యాఖ్య విషయం సర్వం కషలో .సర్వ పాతఠీనం రఘు వంశ సంజీవనిలో కనిపిస్తుంది .కనుక మేఘ దూత, భట్టి కావ్య  వ్యాఖ్యానాలకంటే ముందే భారవి కావ్యం పై వ్యాఖ్య రాశాడని తెలుస్తోంది .జీవాతువు వ్యాఖ్య గురించి దేనిలోనూ ప్రస్తావన కనిపించలేదు .కనుక అన్ని వ్యాఖ్యానాల తరువాతే జీవాతువు రాశాడని చెప్ప వచ్చు .జీవాతువులో మల్లినాధుని ఇతర వ్యాఖ్యానాల ప్రస్తావన లేదు .ఒక వేళ దీన్ని అన్ని వ్యాఖ్యానాల కంటే ముందే రాశాడేమో ?ఏమో ,అయి ఉండచ్చు .

తరల వ్యాఖ్య ను తన ఇతర వ్యాఖ్యానాలో సూరి ప్రస్తావించలేదు .తార్కిక రక్ష కూడా అంతే.అయినప్పటికీ మల్లినాధుని ‘’పంచ కావ్యాది టీక’’కు వర్తిస్తుంది తార్కిక రక్షకు ముందే వాటికీ వ్యాఖ్యానాలు రాశాడని అనుకోవాలి .మల్లినాధుడు పంచకావ్యాలు అని అన్నాడే కాని పంచ మహా కావ్యాలు అనలేదు . అంటే అయిదు  ప్రసిద్ధ కావ్యాల గురించే ఆ మాట అని ఉంటాడు .అవే పంచ మహా కావ్యాలు .తరల వ్యాఖ్యలో తంత్ర వార్తిక వ్యాఖ్యాన ప్రస్తావన ఉన్నది  .ఏతా వాతా మల్లినాధుని వ్యాఖ్యానాల వరుసక్రమం ఈ విధంగా ఉందని చెప్పవచ్చు-ఘంటా పదం,సంజీవని ,సర్వ పాఠీన ,జీవాతువు ,స్వర మంజరి పరిమళ ,ప్రశస్త పాదాభ్యాస టీకా ,తార్కిక  రక్షా టీకా ,తంత్ర వార్తిక టీకా ,తరల, మల్లినాధుని కుమారుడు  కుమార స్వామి ప్రతాప రుద్రీయానికి రాసిన’’రత్నాపన’’వ్యాఖ్యానానికి  కు మల్లినాధుడు విద్యాధరుని ఏకావలి కి రాసిన  ‘’తరల’’ వ్యాఖ్యానం ఒక కర దీపిక ,మార్గ దర్శి అని ప్రసిద్ధ సంస్కృత విద్వా౦సుడు,విమర్శకుడు శ్రీ ప్రమోద్ గణేష్ లాల్యే అభిప్రాయ పడ్డాడు .. .    సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-2-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వ విజేత అలేక్సాండర్ అవాక్కైన సందర్భం

విశ్వ విజేత అలేక్సాండర్ అవాక్కైన సందర్భం

మాసిడోనియా చక్ర వర్తి అలేక్సాందర్ ఒక సారి ఆఫ్రికాలో ఒక మారుమూల దేశానికి వెళ్ళాడు .ఆ దేశం బంగారుగనులతో అతి భాగ్య వంతం గా ఉంది .ఆ దేశ ప్రజలు బుట్టలనిండా బంగారు పళ్ళు తెచ్చిఇచ్చిఅలేక్సాండర్ ను దర్శించి కానుకగా ఇచ్చారు. ‘’ఈ పళ్లన్నీ మీరే తీసుకొని అనుభ వించండి  .నేను మీ సంపద చూడటానికి రాలేదు ‘.మీ ఆచార వ్యవహారాలను తెలుసుకోవటానికి వచ్చాను ‘’అన్నాడు .ప్రజలు ఆయన్ను రాజుగారు నేరాలు విచారించి తీర్పు చెప్పే చోటికి తీసుకు వెళ్ళారు .

అదే సమయం లో ఒక పౌరుడు వచ్చితనతో వచ్చిన వాడిపై  రాజుకు కు ఒక విషయం ఫిర్యాదు చేశాడు ‘’రాజా !నేను ఈ అబ్బాయి దగ్గర ఒక బస్తా ఊక కొన్నాను .ఇంటికెళ్ళి చూస్తే ఆ బస్తాలో చాలా  బంగారం  ఉంది.నేను ఊకనే కొన్నాను కాని బంగారాన్ని కాదు .అది నాదికాదు. అమ్మినతనిదే .ఇతడు ఆ బంగారం  తీసుకో నంటున్నాడు .మీరే నచ్చ చెప్పి అతని బంగారం అతనికి ఇప్పించేయ్యండి ‘’అన్నాడు .

ఆ రెండో వాడు ‘’నాకు అన్యాయం సొమ్ము వద్దు మహాప్రభూ !నేను అతనికి ఊకతో సహా అందులో ఉన్న అమా౦ బాపతు తోపాటు  అంతా అమ్మేశా. అదంతా అతనిదే నాదికానే కాదు .ఆ సొమ్ము అతనికే చెందుతుంది. మీరే నచ్చచెప్పి అతనికి అది ఇప్పించండి ‘’అన్నాడు .పెద్ద ధర్మ సంకటమే వచ్చిందని రాజు తెలివిగా మొదటివాడిని ‘’నీకు కొడుకు ఉన్నాడా “’?అని రెండోవాడిని ‘’నీకు కూతురు ఉందా ?’’అని ప్రశ్నించాడు ఉన్నారన్నారిద్దరూ .’’అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీరు వియ్యంకులు అవండి. పెళ్ళికి బస్తాలోని బంగారం వాళ్లకు కానుకగా ఇవ్వండి ‘’అని రాజు తీర్పు చెప్పాడు ;

ఆ తీర్పు విన్న అలేక్జాండర్ అవాక్కై బోల్డు ఆశ్చర్య పోయాడు  .రాజు ప్రపంచ విజేతత తో ‘’నేనేమైనా తీర్పు తప్పు చెప్పానా ఆశ్చర్య పోతున్నారు ?’’అని అడిగాడు .’’అబ్బే .లేదు మా దేశం లో అయితే ఈ తీర్పు వేరే విధంగా ఉండేది ‘అన్నాడు .’’ఎలా ఉంటుందో చెబుతారా ?’’రాజు ప్రశ్నించాడు .

‘’వాది,ప్రతివాది లిద్దరికీ తలలు తెగి పోయేవి .ఆ బంగారం రాజుగారి కోశాగారం చేరేది ‘’అన్నాడు అలేక్సాండర్.ఇది విన్న రాజు విపరీతంగా చప్పట్లు కొట్టి ‘’మీ దేశం లో సూర్యుడు వెలుగుతాడా ,ఆకాశం మీ మీద వర్షం కురిపిస్తుందా ?’’అని అడిగాడు .’’ఆహా ‘’అన్నాడు అలేక్సా౦డర్ .’’అయితే అవి మీ దేశం లోని అమాయక జంతువులకోసమే అయి ఉంటుంది .అలాంటి మనుషులమీద సూర్యుడు ప్రకాశించకూడదు .ఆకాశం వర్షించ కూడదు ‘’అన్నాడు ఆఫ్రికా దేశ రాజు .మరోసారి అవాక్కయ్యాడు అలేక్సాండర్ .

ఇది జర్మన్ కవి జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డేల్(1744 -1803) సేకరించి ,రాసిన  న  ‘’ఆఫ్రికా వాసి తీర్పు ‘’కద

Inline image 1

ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-11-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిజమైన కవి స్వభాష లోనే రాయాలని చెప్పిన జర్మన్ కవి –జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డెర్

నిజమైన కవి స్వభాష లోనే రాయాలని చెప్పిన జర్మన్ కవి –జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డెర్

1744 -1803 కాలానికి చెందిన జర్మన్ కవి జోహాన్ గాట్  ఫ్రీడ్  హెర్డర్. ఆయన వికాసవాద సాహిత్యం లో ప్రఖ్యాతుడు .ప్రకృతితో మానవ అనుబందాలనుండే కవిత్వం పుడుతుందని అది మౌలికమని ,దానికి కృత్రిమమైన ఛందస్సు వగైరా అనవసరమని అన్నాడు హీర్దర్.కవిత్వ౦ , భాష పైన తన అభిప్రాయాలను ‘’నిజమైన కవి స్వభాష లోనే రాయాలి ‘’అనే వ్యాసం లో వివరించాడు .అందులో కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకొందాం .ఇవి ఆనాడే కాదు నేడూ అనుసరణీయం అనిపిస్తాయి .

1-నేను ఏ భాషలో పదాలను అతి సమర్ధంగా ఎన్నుకోగలనో ,ఏ భాషపై నాకు పూర్తి అధికారం ఉందో ,వాటి గురించి సమగ్రమైన జ్ఞానం నాకు ఉందో నేను విధిగా ఆ భాషలోనే రాయాలి .నిస్సంకోచంగా అది నామాతృ భాషే అవుతుంది

2-మన  వాగింద్రియాలు మనసు చెవి మాతృభాషకు అనుకూలం గా సహజం గా మలచినవి .కనుక నేను నా మాతృభాషలోనే నామనోభావాలను చక్కగా వ్యక్తం చేయగలను. మనస్వదేశం మన మాతృ భాషా మనకు ప్రియమైనవి మాతృభాష మిగిలిన భాషలకన్నా అతి మనోహరం గా కనిపిస్తుంది .

3-మన మనసు ఎప్పుడూ ఇతర భాషలను మనకు తెలియ కుండానే మాతృభాష భాషలోకి అనువది౦చు కొంటు౦ది .ఆ భాషలను నోటిలోనే ఉంచుకొని ,ఇంకా లోతులకు పోయి భాషల తార తమ్యాలు తెలుసుకొని పరిశీలిస్తుంది .వాటినీ గుర్తు పెట్టుకొంటుంది .కొన్ని విషయాలలో సంపన్నత, వైభవం విదేశ భాషలలో కనిపించినప్పుడు,అది తన భాషలోని సౌందర్యాలను గురించి ఆనందిస్తూనే ,సాధ్యమైనంతవరకు తన భాష లోని లోపాలను పూరించుకోవటానికి విదేశీ సంపదను తెచ్చుకుంటుంది .మనసును విదేశీ భాషలనే సముద్రం లో మునిగిపోకుండా కాపాడే సురక్షిత నౌక అది .ఆందోళన కలిగించే భాషా వైవిధ్యం లో అది ఐక్య భావం సాధిస్తుంది .నేను విదేశీ భాషలు నేర్చుకొంటాను, కాని అది నా భాషను మరచిపోవటానికి మాత్రం కాదు .నేను విదేశీ సంచారం చేస్తాను అక్కడి ఆచార సంప్రదాయాలు అలవర్చుకొని నేను పుట్టిన సంఘం లోని ఆచార వ్యవహార సంప్రదాయ మర్యాదలను మర్చి పోవటానికి కాదు .నేను ఇంకో దేశం లో పౌరసత్వం పొంది  నా దేశం లోని పౌరసత్వాన్ని వదులు కోను .ఇలా చేస్తే నేను ఆర్జించిన దానికంటే కోల్పోఏదేఎక్కువ .నేను విదేశ ఉద్యాన వనాలలో పచార్లు చేస్తాను. అక్కడి వింత పూలతో నా ఆరామాన్ని అల౦కరించు కొంటాను అప్పుడు నా భాష నా భావనా విధానానికి ప్రియతమమవుతుంది .నా దేశ విధానాలను వివరించటానికి విదేశీ విధానాలు నేను పరి శీలిస్తా . విదేశ సూర్య రశ్మితో పండిన పండ్ల లాగా నా స్వదేశ ప్రతిభకు కానుక లిస్తాను . .

4-భావ వ్యక్తీకరణ కోరే కవి తన జన్మ భూమికి విశ్వాసపాత్రుడై ఉండాలి .నిజమైన భావోద్వేగాలను వ్యక్తం చేయటానికి దేశీయ భాషలోనే సాధ్యం .నా అసమర్ధతను అంగీకరిస్తున్నాను నేను ఒక్క భాష తప్ప పూర్తిగా అర్ధం చేసుకోలేనని సిగ్గు విడిచి చెబుతున్నాను .హోమర్ లాగా అంత సర్వాంగ సుందర౦గా ఎవరైనా అనేక భాషల్లో రాయగలరా ?పిండాల్ లాగా హోరేస్ లాగా ఏ మాతృభాషలోనైనా రాయ గలరా ?.షేక్స్ పియర్  ఆయన భాషలో తప్ప ఇంకే భాషలో నైనా అలా రాయగలడా ?లేరు .కనుక నేను నేల మీద  సాష్టాంగ పడి,నా తల్లి నేలను ఆలింగనం చేసుకుంటాను .ఆమె భాషే నాకవితా దేవత ‘’

అని తల్లిభాషకు వందనం చేశాడు జోహాన్ గ్రాట్ ఫ్రీడ్ హెర్డేర్.

Inline image 1

ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-11-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -3

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -3

11-యత్నా దాపాద్య త్రిభువనమవైర వ్యతికరం –దశాస్యో యద్బాహూ నభ్రుత రణ కండూ పరవశాన్

శిరః పద్మ శ్రేణీ రచిత చరణా౦భోరుహ బలేః –స్థిరా యా స్తద్భక్తే స్త్రిపుర హర !విస్ఫూర్జిత  మిదం ‘’

భావం –త్రిపురారీ శివా !పదితలల రావణుడు ఏ శ్రమా లేకుండా మూడు లోకాలలో తన్ను ఎదిరించే వాడు లేడనుకొన్నాడు  .అతని 20 చేతులూ ఎప్పుడూ ఎవరితోనే యుద్ధం చేయడం తో తీట కు లొంగిపోయాయి .దీనికి నీ అనుగ్రహమే కారణం .నీ పాద పద్మాలను తన శిరస్సు లనే పద్మాల మాలలతో అర్చించటం చేత అది అతనికి సాధ్యమైంది. నీ పూజపై స్థిర భక్తి  ఉండటం దీనికి కారణం.నీపాదారవి౦దాలపై దృఢ భక్తి వల్లనే అతనికి అది సాధ్యమైంది .12-అముష్య త్వత్సేవా సమదిగత సారం భుజ వనం –బలాత్ కైలాసే పి త్వదదివసతౌ విక్రమ యతః

అలభ్యా పాతాలే ప్యలస చలితాంగుస్ట  శిరశి-ప్రతిష్టా త్వయ్యాసీ ద్ధ్రువ ముపచితో ముహ్యతి ఖలః ‘’

భావం –ఈశ్వరా ! రావణుడు నీ అనుగ్రహానికి పాత్రుడై 20 భుజాలు పొందాడు .నీకృపతో లభించిన ఆభుజాలశక్తితో నువ్వు నివశించే కైలాసపర్వతం పైనే తన ప్రతాపం చూపించాడు. వెంటనే నువ్వు అనాయాసంగా నీ బొటన వ్రేలిమొన తో అణచి వేయగా పాతాల లోకం లో కూడా ఉండటానికి వీలు లేకపోయింది .దుష్టుడు ఉపకారం పొంది దాన్నిమరచి ఉపకారిపైనే బలప్రదర్శనకు దిగటానికి పూనుకోవటం లోక సహజం .

13-యదృద్ధిం  సుత్రామ్ణో వరద పరమోచ్చైరపై సతీ –మధశ్చక్రే బాణః పరిజన విదేయ త్రిభువనః

న తచ్చిత్రం తస్మిన్వరి వసితరి త్వచ్చరణయో –ర్న కస్యా ఉన్నత్యై భవతి శిరస స్త్వయ్య వనతిః’’

భావం-భక్తుల కు వరాలిచ్చి కోర్కె తీర్చే పరమేశా !బాణాసురుడు మూడు లోకాలను తన సైన్యం తో స్వాధీనం చేసుకొన్నాడు .సంపద విపరీతం గా సాధించి ఇంద్ర పదవిని తన  పదవి కంటే తక్కువ చేసేశాడు .నీ పద భక్తుడు కనుక అతనికిది ఒక విశేషమే కాదు .నీకు ఎవరైనా శిరసువంచి నమస్కరిస్తే  వాడు ఏ ఉన్నతినైనా సాధించగలడు .అలాంటి వరదుడవు నువ్వు .

14-అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా –విదేయస్యాసీ ద్యస్త్రి నయన విషం సంహృత వతః

స కల్మాషః కంఠే న తవ కురుతే న శ్రియ మహో –వికారో పి శ్లాఘ్యో భువన భయ భంగ వ్యసనినః ‘’

భావం –ముక్కంటీ !అమృతం కోసం సముద్ర మధనం చేసేటప్పుడువెలువడిన కాల కూట విషాన్ని చూసి దేవ రాక్షసు లు  ప్రళయం వస్తోందని భయపడ్డారు .వాళ్ళపై నీకు పార కరుణ  ఉండటం చేత ఆ విషాన్ని మింగి నీ కంఠం లో దాచుకున్నావు .దీనితో నీ కంఠం లో ఒక నల్లని మచ్చ ఏర్పడింది .తెల్లని నీ శరీరం లో ఆ నల్ల మచ్చ కూడా నీకు శోభనే తెచ్చింది .వికారంగా లేదు కూడా .లోకుల భయాలను తొలగించే వారి శరీర వికృతి కూడా కొనియాడ దగిందే అవుతుందికదా .

15-అసిద్దార్దా నైవ క్వచిదపి స దేవాసుర నరే –నివర్త౦తే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః

స పశ్యన్నీశ త్వామితర సుర సాధారణ మభూత్ – స్మరః స్మర్తవ్యాత్మా న హి పధ్యః పరి భవః ‘’

భావం -సర్వ సృష్టికి అధిపతి ఐన సర్వేశా !సృష్టి దేవ రాక్షస మానవులతో కూడి ఉంది .మన్మధ బాణాలు ఎప్పుడూ వ్యర్ధం కావు .ఎవరిపై ప్రయోగిస్తే వారు దాని కి తగుల్కొని  బాధపడక తప్పదు .అవి జయ స్వభావం కల బాణాలు అలాంటి శక్తిగల మన్మధుడు నువ్వు సామాన్య దేవతగా భావించి నీపై పుష్పబాణాలు ప్రయోగించి  నీ మూడవ కంటి అగ్నికి  ఆహుతై శరీరం కోల్పోయి ,అనంగుడు అయ్యాడు .ఇంద్రియ నిగ్రహమున్న వారిపై అవమానం లేక బల ప్రయోగం ఆరోగ్య ప్రదం కాదు .వినాశ హేతువే అవుతుంది .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-11-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు భాష సంస్కృతుల అభివృధ్ది కమిటీకి ది.19 అక్టోబరు 2016 నాడు సమర్పించిన నివేదిక

img051 img052

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -5

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -5

మల్లినాదునిపై ప్రచారం లో తెలుగు కన్నడ కధలు

సంస్కృత శతావధాని ,భు గ్రంధకర్త శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి ‘’సంస్కృత మాఘ కావ్యము –ఆంధ్రీ కృతులు ‘’అనే అంశం పై పరిశోధించి పి హెచ్ డి పొందారు .అందులో మల్లినాధుని పై ప్రచారం లో ఉన్న ఒక కధను ఉదాహరించారు .మల్లినాధుడు చిన్నతనం లోచదువు ,సంధ్యా లేక అల్లరి చిల్లరగా తిరిగేవాడు .ధనవంతుదికొడుకు కనుక పెళ్లి అయింది అత్తారింటికి వెడితే భార్య బావ మరదులు అతని విద్యా గంధ హీనతను యెగతాళి చేశారు .చివరికి సూటీపోతటీగా భార్య ‘’ఎన్ని మాటలు అన్తేనేం రోకలి చిగురిస్తుందా ?’’ముసలః కిసలాయతే’’?అని దెప్పి పొడిచింది .తనస్వగ్రామం వెళ్లి భార్య అన్నమాటలలో అర్ధాన్ని పండితులనదిగి తెలుసుకొని ,పట్టుదలపెరిగి తాను మహా సంస్కృత విద్వాంసుడు కావాలని నిర్ణ యించుకొని కావ్య నాటక అలమ్కారాది శాస్త్రాలను ,పదవాక్య ప్రమాణాలను దీక్షగా గురువులవద్ద చదివి గొప్ప విద్వాంసు డై అత్తారింటికి దారేది అని వెళ్లి నిజంగానే రోకలి చిగురించింది అనే అర్ధం వచ్చేట్లు  ‘’ముసలః కిసలాయతే ‘’అని ‘’ భార్యతో అన్నాడు .భార్తవిద్వాట్టుకు భార్య పరవశం చెంది ,ఆతనితో అత్తారింత్కి కాపురానికి వెళ్లి సుఖ జీవనం గడిపింది .సూరి అనిపించుకొన్న మల్లినాధుని పాండిత్యాన్ని కొడుకు కుమారస్వామి ‘’త్రిస్కంద శాస్త్ర జలదిం చులుకీకురుతేస్మ యః ‘’అని కీర్తించాడు

కన్నడ దేశం లో మరో కద ప్రచారం లో ఉంది .ఇలాంటి కధలను కన్నడ కవి రచయితా అవధాని డా ఆర్ గణేష్ ‘’కవితే గోండు కధే ‘’అనే పుస్తకం లో నిక్షిప్తం చేశాడు .వీటిని ‘’దంత కద ‘’అన్నారు.కన్నడ దేశం లో చిన్న పిల్లల పుస్తకాలలో మల్లినాదునిపై ఒక కద చేరింది .మల్లినాధుడు బాల్యం లో చదువు పై శ్రద్ధ లేకుండా జులాయిగా ,రంగేళీ గా తిరిగిన సంపన్న యువకుడు .ధనికుడు కనుక పిల్లల తండ్రులు వెతుక్కుంటూ వచ్చి తమ పిల్లను అతనికిచ్చి పెళ్లి చేయాలని ఉవ్విల్లూరేవారు .ఒకాయన విద్యా వతి అయిన తన కూతుర్ని విద్యా విహీనుడైన మల్లి నాదునికిచ్చి వివాహం చేశాడు  .పెల్లియ్యాక కాని భార్యకు తన భర్త విద్యా గంధం లేని వాడని తెలియ లేదు.ఒక రోజు ఇద్దరూ రోడ్డుపై వాహ్యాళికి వెడుతుంటే రోడ్డుమీద పడ్డ ఒక పువ్వును చూసి మల్లినాధుడు ఆమెతో ‘’ఆ పువ్వు ఎంత అందంగా ఉందొ చూశావా ?అని దాని అందాన్ని గురించి పొగిడాడు అప్పుడామే ‘ఎంత అందమున్నా అది వాసన లేని పువ్వు దైవ పూజకు పనికి రాదుకదా “’క్ని నర్మ గర్భం గా అన్నది  .ఆమె మాటల భావం అర్ధమై విద్యా లో మహా పండితుదవ్వాలనే బలమైన కోరిక కలిగింది .

గురుకుల వాసం చేస్తూ విద్య నభ్యసించాలని నిశ్చయించుకొని ఒక మహా పండితుని గురుకులం లో చేరాడు గురువు మల్లినాధుని దీక్షకు సంతోషించి పరీక్షించే నెపం తో గురుపత్నికి మల్లినాదునికి పెట్టె ఆహారం   నెయ్యి తో కాఉండా వేపనూనేతో చేసి వడ్డించమని ఆదేశించాడు .ఆమె రోజూ అలాగే చేసేది పూర్తిగా చాడువు పై మనసు కేంద్రీకరింప బడిన మల్లినాదుడికి రుచి విషయం పట్టేదికాడు .చదువు పై ఏకాగ్రత తప్ప వేరే దృష్టి లేదు

ఒక రోజు గురువు గారి ప్రక్కనే కూర్చుని గురు పత్ని వడ్డిస్తుంటే భోజనం చేయ సాగాడు .రుచిలో తేడా ఉందని గ్రహించి గురుపత్నితో ‘’మాతా!ఆహారం చాలా చేదుగా ఉందేమిటి ?’’అని అన్నాడు .ప్రక్కనే ఉన్న గురువు చిరు నవ్వు నవ్వి  శిష్యుడి బుజం తట్టి ‘’నాయనా ! రోజూ మీ గురుపత్నినినెయ్యి బదులు  వేపనూనె తో తయారు చేసిన ఆహారమేనీకు  పెట్టమని  ఆదేశించాను ఆమె అలాగే చేసింది చదువు ధ్యాసలో నువ్వు రుచి గ్రహించకుండా ఇంతకాలం తిన్నావు .ఇప్పుడు నువ్వు  పరిపూర్ణ విద్య సాధించావు ఇక ఇక్కడ ఉండాల్సిన పని లేదు ఇంటికి వెళ్ళ వచ్చు ‘’అన్నాడు .గురువు గారి ఔదార్యానికి తనను అంతటి విద్వాంసునిగా మలచినందుకు కృతజ్ఞత తెలిపి,అనుజ్న పొంది ఇంటికి చేరాడు .భార్యా కుటుంబం అందరూ ఎంతో సంతోషించారు .మహా విద్వాంసుడైన మల్లినాద సూరి కాళిదాస మహాకావ్యాలకువ్యాఖ్యానం రాయటం ప్రారంభించాడు

భర్త పాండిత్యానికి ఆశ్చర్య పడిన భార్య ఒక రోజు తనపై ఒక శ్లోకం రాయమని మల్లినాధుని కోరింది .ఆయన తటపటాయిస్తూ  శూర్పణఖ తో పోలుస్తూ ఒక శ్లోకం ‘’రామ వైరి భగినీవ రాజసే ‘’అనే శ్లోకం చెప్పాడు .భార్యకు ఎక్కడో కాలింది.ప్రతీకారం తీర్చుకోవటాని ఎదురు చూస్తోంది .మల్లినధుడు తన వ్యాఖ్యానాలలో ‘’ఇత్యర్ధః ‘’-ఇదీ అర్ధం అని ,ఇతి భావః ‘’-ఇదీ దీని తాత్పర్యం అని ఎక్కువగా వాడటం అలవాటు. మామూలు సంభాషణనూ వ్యాఖ్యానాలపై పూర్తీ దృష్టితో ఉండటం వలన ఇవి వచ్చేవి .ఒక రోజు మల్లినాధుడు అన్నం లోకి ఎం చేశావు అని భార్యను అడిగితె ,ఎన్నాళ్ళనుంచో రిపార్టీ ఇవ్వాలని ఎదురు చూస్తున్న ఆమె వెంటనేసమాధానంగా  శ్లోకం లో –

‘’ఇత్యర్ధ  క్వధితం చైవేతి భావ తే మనం తధా- సంజీకృతేదయ భుక్త్యార్ధం  తుష్యతాం భావదాశయః ‘’అని చెప్పింది- దీని భావమేమి మల్లినాద –అనుకొంటే –‘’ఉడికిన ఇత్యర్ధ మజ్జ గేహులి అని భావం .ఇదే మధ్యాహ్న భోజనం హాయిగా ఆరగించి ఆనందించండి ‘’అన్నది .మల్లి నాధుడు తన భార్య పాండిత్యానికి  బహుశా గర్వ పడే ఉంటాడు

మల్లినాద సూరి తాతగారు కోలాచల౦ సుబ్బా శాస్త్రిగారు కర్నాటక రాష్ట్రం ధార్వాడ్ జిల్లాలోని  మహేంద్ర గడ నివాసి అని ,కన్నడ ,మరాటీ భాషలలో ఎన్నో హరికధలు రాశాడని అవి నీతి బోధకాలుగా ఉన్నందున ఇప్పటికీ జనం నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయని ,ఆయన తండ్రి నిజాం రాజ్యం లోని అనే గొందే సంస్థానం లో దివాన్ అని అది విజయనగర సామ్రాజ్యం లో భాగం అని ఆ వంశానికి చెందిన వాడే బళ్ళారి వాసి సంఘ సంస్కర్త విద్యా వివేక సంపన్నుడు వితరణ శీలి ,న్యాయవాది  అయిన కోలాచలం వెంకట రావు గారని ,ఆ వంశానికి చెందిన బళ్ళారి లాయర్ శ్రీ కోలాచలం అనంత ప్రకాష్ గారు నాకు జులైలో  పంపిన ‘’కోలాచలం ఫామిలీ ఆఫ్టర్ మల్లినాద ‘’అనే జిరాక్స్ కాగితాలలో ఉంది.దీనితో మల్లినాదుని కాలం, ఆయనపై ప్రచారం లో ఉన్న కట్టుకధలకు స్వస్తి చెప్పి ఆయన వ్యాఖ్యాన వైఖరిని ,బహుశాస్త్ర పాండిత్యాన్ని గురించి తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-16 –ఉయ్యూరు .

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -1

నేపధ్యం –పుష్పదంతుడు గాంధర్వ రాజు, శివ భక్తుడు .సంగీత ప్రవీణుడు .కామ రూపం లో ఎవరికీ కన పడకుండా ఆకాశమార్గం లో సంచరించ గలవాడు .ఇతని సంగీతవైదుష్యాన్ని మెచ్చి ఇంద్రుడు తనకొలువు అయిన దేవేంద్ర సభలో పుష్పదంతుని సంగీత విద్వాంసునిగా నియమిస్తాడు .

ఒక సారి పుష్పదంత ప్రభువు ఆకాశమార్గం లో అదృశ్యం గా సంచరిస్తూ చిత్ర రధుడు అనే రాజు పాలిస్తున్న నగరాన్ని సందర్శిస్తాడు .చిత్ర రధ రాజూ గొప్ప శివ భక్తుడే .పరమేశ్వర పూజకోసం ఒక గొప్ప పూల తోటను పెంచుతాడు .అది వివిధ పుష్పాలతో ఎప్పుడూ శోభాయమానంగా ఉంటుంది .పుష్పదంతుడు  ఈ ఉద్యానవనాన్ని చూసి పరవశించి పోతాడు .అందులో ప్రవేశించి పూలు కోస్తాడు .అదృశ్య రూపం లో ఉండటం వలన ఆతనిని రక్షక భటులు చూడలేక పోతారు .రెండు మూడు రోజులు ఇలాగే గడిచాక చిత్ర రధ రాజు పరమేశ్వర పూజకుతన తోటలో పూలు లేక పోవటం గమనిస్తాడు .భటులను ప్రశ్నిస్తే వాళ్ళు రాత్రీ పగలు తాము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాపలా కాస్తున్నామని పూలు ఎవరు కోసి మాయం చేస్తున్నారో  అర్ధం కావటం లేదని రాజుకు విన్న వించారు .వారు అత్యంత విశ్వాస పాత్రులు కనుక వారి మాట నమ్మి రాజు పూల దొంగను ఎలా పట్టుకోవాలనే విషయమై చాలా మధన పడ్డాడు.

మర్నాడు రక్షక భటులను పిలిపించి రాజు అన్ని పూల చెట్ల కిందా మారేడు దళాలను వెదజల్లమని ఆజ్ఞాపిస్తాడు భటులు అలాగే చేశారు .మారేడు పత్రి శివునికి అత్యంత ప్రీతికరమైనది .దాన్ని కాలితో త్రోక్కితే పరమేశ్వరునికి విపరీతమైన  ఆగ్రహం కలుగుతుందని రాజు భావించాడు .ఆ రోజు పుష్పదంతుడు యదా ప్రకారం అదృశ్య రూపం లో పూదోట లో  ప్రవేశించి   నిర్భయంగా పూలు కోస్తాడు .అలాకోయటం లో అనుకోకుండానే మారేడు దళాలను కాళ్ళతో తొక్కుతాడు .అప్పుడు శివుని ధ్యానానికి భంగం ఏర్పడుతుంది .వెంటనే పుష్పదంతునిపై ఆగ్రహోదగ్రుడై దేవ జాతికి చెందిన గాంధర్వ రాజు పుష్పదంతుడు తనకు అత్య౦త ప్రీతికరమైన పవిత్రమైన  మారేడు దళాలను తొక్కటం ,పూల దొంగతనానికి పాల్పడటం గొప్ప నేరంగా భావిస్తాడు .గంధర్వ రాజు పుష్ప దంతుని దివ్య సర్వ శక్తులను నశింప జేస్తాడు శివుడు .ఆకారణంగా అతడు రక్షక భటులకు కనిపించి దొరికి పోతాడు .వాళ్ళు బంధించి చిత్ర రధ మహారాజు సమక్షం లోకి తీసుకు వెడతారు .రాజు విపరీతమైన కోపం తో పుష్పదంతుడిని కారాగార శిక్ష విధిస్తాడు .

చెరసాలలో బంధింప బడిన పుష్పదంతుడు విచారంతో కుమిలి పోతూ,తానేదో అపచారం చేసి పరమేశ్వరునికి ఆగ్రహం కలిగించటం వలన తన దివ్య శక్తులన్నిటినీ కోల్పోయానని గ్రహిస్తాడు .పరమ శివుని సంపూర్ణానుగ్రహం సాధించటానికి చెరసాలలో ఉంటూనే పరమ భక్తి తో శివ మహిమలను వర్ణిస్తూ  ‘’శివ మహిమమ్నః స్తోత్రం’’ రాశాడు .స్తోత్రం రచన పూర్తికాగానే పరమేశ్వరుడు,  తన మహిమలను పరమాద్భుతంగావర్ణించినందుకు పరమ ప్రీతి చెంది ,అనుగ్రహించి పుష్పదంతుని దివ్య శక్తులన్నీ తిరిగి అనుగ్రహిస్తాడు .చెరసాల నుండి బయట పడిన పుష్పదంత గ౦ధర్వ రాజు  చిత్ర రధ మహా రాజును దర్శించి తాను చేసిన అపరాధాన్ని మన్నింఛి ,క్షమించమని  ప్రార్ధిస్తాడు  .దయాళువు అయిన మహారాజు శాంతించి,క్షమించి పుష్పదంతుని విడిచి పెడతాడు .పుష్పదంతుడు మళ్ళీ తన గ౦ధర్వ లోకానికి చేరుకొంటాడు .

ఈ కద తర తరాలుగా ప్రచారం లో ఉంది .కాని ఈ కధకు ఆధారం కాని పుష్పదంతుని కాలం కాని ఇదమిత్ధం గా నిర్ణయించటానికి వీలు లేక పోతోంది .పుష్పదంతుని శాపం మాత్రం ,ఆస్తిక జనాలకు గొప్ప వరమై పుష్పదంత గ౦ధర్వ రాజు శివ మహిమలను వర్ణిస్తూ రాసిన మహా గొప్ప శివ స్తోత్రం ‘’శివ మహిమ్నః స్తోత్రం’’ దక్కింది .

దీనికి, సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగులో అర్ధ తాత్పర్యాలు రాసి శివమహిమతోబాటు పుష్పదంత కవి కవితా సామర్ధ్యాన్ని తెలియ జేశారు .ఇదే ఈ నా రచనకు ఆధారం అని సవినయంగా మనవి చేస్తున్నాను .

1-మహిమ్నః పారంతే పరమ విదుషో యద్య సదృశీ –స్తుతి ర్బ్రహ్మా దీనామపి  తదవసన్నా స్త్వయి గిరః

అధా వాచ్యస్సర్వః స్వమతి పరిమాణావధి గృణన్-మమాప్యేష సోత్రే హర నిరప వాదః పరికరః ‘’

తాత్పర్యం –పరమేశ్వరా !నువ్వు నన్ను పిలిచి ‘’పుష్పదంతా ! నాసంపూర్ణ మైన మహిమను స్తుతి౦చ టానికి పూనుకున్నావు .నువ్వు పండితుడవు కాదు .ఇది నీలాంటి వాళ్లకు తగిన పని కాదు ‘’అని అంటావేమో –అలాగైతే నీ మహిమ వర్ణించటానికి బ్రహ్మాది దేవతల మాటలూ శక్తిహీనాలే అవుతాయి కదా .వాళ్ళ స్తుతులూ అసమగ్రాలే .తమ బుద్ధి శక్తిని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రతివాడూ సామర్ధ్యం లేని వాడు అవటం వలన నిందింప దగ్గ వాడే అవుతాడు .కాబట్టి నేను నిన్ను స్తుతించటానికి చేస్తున్న ప్రారంభం  ఎలాంటి ఆక్షేపణా లేనిదే .మహా మహుల స్తోత్రాలే సరితూగనప్పుడు ,నేను చేసే ఈస్తుతి ఏవిధంగానైనా దోషం లేనిదే అవుతుంది .

2-అతీతః పంధానం తవ చ మహిమా వాజ్మనసయోః   -అదద్వ్యావ్రుత్యా య౦ చకిత మభిదత్తే శ్రుతి రపి

స కస్య స్తోతవ్యం ?కతి విధ గుణః ? కస్య విషయః ?-పదేత్వర్వాచీనే  పతతి న మనః కస్య న వచః ‘’?

భావం –పరమేశా !నీ మహిమ వాక్కులద్వారా ,మనసుద్వారా ,ఊహించటానికి అతీతమైనదే .వేదం కూడా నీమహిమ వర్ణించి చెప్పటానికి శక్యం కాక ఇది కాదు ,ఇదికాదు అంటూ భయం తో చెబుతోంది .అలాంటి నీ మహిమను ఎవరు స్తుతించగలరు ?గుణాల లెక్కకు అది అందదు  .నీ మహిమ వర్ణించటానికి ఏదీ విషయమే కాలేదు .నీ మహిమ వర్ణించటం లో ఎవరి మనసైనా  ,వాక్కైనా అధోగతి పాలుగాక తప్పదు .

3-మధుస్ఫీతా వాచః పరమమృతం నిర్మితవత –స్తవబ్రహ్మన్ కిం వాగపి సుర గురో ర్విస్మిత పదం ?

మమ త్వేతాం వాణీం గుణకధన పుణ్యేన భవతః –పునామీత్యర్దే స్మిన్ పుర మధన !బుద్ధి ర్వ్యవసితా .తాత్పర్యం –సర్వ వ్యాపీ ,పరబ్రహ్మ స్వరూపీ పరమేశ్వరా !అత్యంత శ్రేష్టమైన వేదవాక్కుల్ని నువ్వే కూర్చావు .అవి అమృత సమానాలు .తేనేలాగా మహా తియ్యనైనవి .అలాంటి వేదవాక్కుల్ని రచించిన నీపై  దేవ గురువు బృహస్పతి స్తుతిస్తూ చెప్పిన మాట కూడా చాలా పేలవంగా ఉండి ఆశ్చర్యం కలిగిస్తుంది .అలాంటి నీ గుణాలను ఈ స్తోత్ర రూపం గా స్తుతించటం వలన కలిగే పుణ్యం వలన నా వాక్కును శుభ్రం చేసుకొంటాను .త్రిపుర సంహారీ ఈశ్వరా !ఈ విషయం లో నా బుద్ధి నన్ను ప్రోత్సహిస్తోంది .మన్నించు .

Inline image 1

సశేషం

కార్తీక మాస శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-31-10-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -2

పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -2

4-తవైశ్వర్యం యత్తత్  జగదుదయ రక్షా ప్రలయ కృత్—త్రయీ వస్తుం వ్యస్తం తిసృషు గుణ భిన్నాసు తనుషు

అభవ్యానా మస్మిన్ వరద !రమణీయామ రమణీ౦ –విహన్తుం వ్యాక్రోశం విదధత ఇహైకే జడదియః ‘’

భావం –కొలిచే భక్తులకు వాత్సల్యం తో వరాలిచ్చే దేవరా 1 రుక్ యజు సామ అనే మూడు వేదాలకీ నీ  విశ్వాధి పత్యమే వస్తువు .వాటి లక్ష్యం నీ సార్వ భౌమత్వాన్ని  వర్ణించటమే .అది ఒక్కటిగానే ఉంటుంది .కానీ రజోగుణ ,సత్వ గుణ ,తమో గుణ అనే మూడు రూపాలుగా విభజింప బడుతుంది .అదే బ్రహ్మ ,విష్ణు ,రుద్ర రూపాలు ధరిస్తూ సమస్తలోకాలను సృష్టిస్తూ ,రక్షిస్తూ చివరికి ప్రళయం చేస్తుంది .అలాంటి సర్వోత్క్రు స్ట మైన నీ ఆధిపత్యాన్ని ,ఎంతోరమణీయమైన దాన్ని దుర్మార్గులకు అరమణీయం గా కన్పించి నిన్ను నిందిస్తున్నారు .

5-కిమీహం కిం కాయ స్సఖలు  కిముపాయాస్త్రి భువనం –కిమాధారో ధాతా సృజతి కిముపాదన ఇతి చ

అత ర్క్యైశ్వర్యే  త్వయ్యవనసర దుస్త్దో హతదియః –కుతర్కోయం కా౦శ్చిన్ముఖర యతి మోహాయ జగతః ‘’

తా-పరమేశా !తార్కికులు కొందరు లోకాలకు సృష్టి కర్త అయిన నువ్వు ఏ కోరికతో సృష్టి చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు .నీ ఆకారం ఏమిటి ?సృష్టికి నీ ఉపాయ౦  ఏమిటి ?నీకు ఆధారం ఏమిటి ? ఏ ఉపాదానం తో సృస్తిస్తున్నావు ?అంటూ ఊహకు అందని నీ ఆధిపత్యాన్ని గూర్చి ,నీ పై ఉన్న చెడు తలంపును బట్టి ,లోకం లో భ్రాంతిని కలిగించటానికి వాచాలత ప్రదర్శిస్తున్నారు ఇదంతా .భేషజమే ,కుతర్కమే .

6-అజన్మానో లోకాః కిమవయవ వంతో పి జగతాం –అధిస్టాతారం కిం భవ విధి రానాదృత్య  భవతి

అనీశో వా కుర్యాత్  భువన జననే కః పరికరః –యతో మందస్త్వా౦ ప్రత్యమరవర !సంషేరత ఇమే ‘’

భావం –దేవతా శ్రేస్టా ఈశా !ఈ లోకాలన్నీ విభిన్న అవయవాలు కలవి .అవయవాలున్న వస్తువుకు జన్మ ఉంటుందని శాస్త్రం చెప్పింది. కనుక లోకాలు సృష్టింప బడినవే .మరి సృష్టికర్త లేకుండా సృష్టి జరుగుతుందా ?జరుగదు .లోకాల సృష్టికి పరమేశ్వరునికంటే సమర్ధుడెవ్వరు?సృష్టి నిర్వహణకు ఆయనకు పరిజనం దేనికి ?అయన సర్వ సమర్ధుడు కదా .మంద బుద్ధులు కొందరు ఇలాంటి నీ సామర్ధ్యాన్ని అనుమానిస్తున్నారు .కనుకనే లోకం లో దీనిపై చర్చ జరిగింది.

7-త్రయీ సౌఖ్యం యోగః పశుపతి మతం వైష్ణవమితి-ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పధ్యమితి చ

రుచీనాం వైచిత్ర్యా దృజు  కుటిల నానాపధ జుషాం-నృణా మేకో  గంయస్త్వ మసి పయసా మవర్ణవ ఇవ . ‘’

భావం –సంసార విముక్తికోసం కొందరు వేదోక్త కర్మ ,కొందరు సాంఖ్యం ,కొందరు యోగం ,మరికొందరు పాశుపతం ,ఇంకొందరు వైష్ణవం అంటూ వేరు వేరు మార్గాలు ఉపదేశిస్తూ ఉంటారు .ఎవరికివారు తమదే విశిష్టమైనదని ప్రచారం చేస్తారు .మరికొంతమంది అది పధ్యం అంటారు .ఇలా వారి వారి అభిరుచి ,వైచిత్రిని బట్టి  విభిన్న  మార్గాలు నిర్ణయిస్తారు .కాని  అన్నిరకాల జలాలకు సముద్రం లాగా సమస్తమానవులకు నువ్వే చేరదగిన వాడవు .

8-మహోక్షః ఖట్ట్వాంగ౦  పరశురజినం భస్మ ఫణినః-కపాలం చేతీయత్ తవ వరద !తంత్రోపకరణం

సురాస్తాం తామృద్ధిం దధతి చ భావద్భ్రూ ప్రణిహితాం –నహి స్వాత్మా రామం విషయ మృగ తృష్ణా భ్రమయతి ‘’

భావం –ఈశా !సృష్టి కార్య నిర్వహణలో నీకు సాధన సామగ్రి వృషభ రాజమైన నంది ,మంచం కోడు ,గండ్ర గొడ్డలి ,గజ చర్మం ,విభూతి ,పాములు ,మనిషి పుర్రె అనేవి .అయినా దేవతలు నిన్నే భక్తితో కొలుస్తారు .నువ్వు నీ కంటి సంజ్న చేత వాళ్లకు కావలసిన సంపదలతోపాటు  కోరికలన్నీ తీరుస్తావు .అనంత సంపద ప్రదానం చేస్తున్నా నువ్వుమాత్రం సంపదలు అనుభవించాలన్న కోరిక ఈషన్మాత్రం కూడా లేని వాడవు .ఆత్మలోనే నిరంతరం క్రీడిస్తూ ఆనందాను భూతి పొందుతున్న నిన్ను ఏ వస్తువూ మొహాన్ని కలిగించనే లేదు. అందుకని ఏ సమప్దపైనా నీకు అనుభవి౦చాలన్న కోరికే కలగదు .

9-ధృవం కశ్చిత్ సర్వం సకల మపరస్త్వ ధ్రువ మిదం –పరో ధ్రౌవ్యే జగతి గదతి వ్యస్త విషయే

సమస్తే ప్యేతస్మిన్ పుర మధన !తైర్విస్మిత ఇవ –స్తువన్ జిహ్రేమి త్వాం న ఖలు నను ద్రుస్టాముఖరతా ‘’

భావం –త్రిపురాసుర భంజకా శివా !జగత్తు నిత్యం అని ఒకడు అనిత్యం అని మరొకడు అంటున్నారు .మరొకడు నిత్యా నిత్య నిర్ణయం లో కొంత నిత్యం కొంత అనిత్యం అన్నాడు .వారి వాదాలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి .నిన్ను స్తుతిస్తూ వాళ్ళ ప్రతిపాదనలకు సిగ్గుపడటం లేదుకాని వాళ్ళ వాచాలత్వం నింద్యం అనిపిస్తోంది .

సర్వ వ్యాపక చైతన్య స్వరూపుడు పరమాత్మ ఒక్కడే ‘’ఎకమేవా ద్వ్తీయం బ్రహ్మా ‘’అని వేదం ఘోషించింది

10-తదైశ్వర్యం యత్నాద్య ద్యుపరి విరించో హరి రధః –పరిచ్చేత్తుం యాతావనల మనల స్కంద వపుషః

తతో భక్తి శ్రద్ధా భర గురు గ్రుణద్భ్యాం గిరిశ! యత్ –స్వయం  తస్థే తాభ్యాం తవ కిమను వ్రుత్తిర్న ఫలతి ‘’

భావం –పరమ శివా !ప్రజ్వలిస్తూ ఉండే అగ్ని స్తంభంగా నువ్వు ఉండగా ,నీ మహిమ ఎలాంటిదో తెలుసుకోవాలనే చాపల్యం తో బ్రహ్మ తన వాహనం హంస నెక్కి ఊర్ధ్వ లోకాలకు ,విష్ణువు యజ్న వరాహ రూపం తో పాతాలలోకాల క్రిందకూ వెళ్ళారు .కాని నీ శిఖరం,నీ మొదలు వాళ్లకు కనిపించనే లేదు .ప్రయత్న విఫలురైన వాళ్ళిద్దరూ నిన్ను స్తుతించారు .వారికి దర్శన భాగ్యం కలిగించి ఆదరించావు .నీకు చేసిన సేవ ఎప్పుడూ వృధా కాదని రుజువైంది .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-1-11-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

29-10 16 శనివారం ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో ”కాలుష్య రహిత దీపావళి” అవగాహన సమావేశం లో ముఖ్య అతిధిగా నేను

29-10 16 శనివారం ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో ”కాలుష్య రహిత దీపావళి” అవగాహన సమావేశం లో ముఖ్య అతిధిగా నేను

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

“మా అన్నయ్య” – కవితా సనకలనం

maaannayya

 

 

 

మాన్యులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,

          నమస్కారములు !  ముందుగా ‘దీపావళి  శుభాకాంక్షలు‘ తెలుపుకుంటున్నాను.
        మీరు నాపట్ల అభిమానంతో లోగడ పంపిన ‘మా అన్నయ్య‘ కవితా సనకలనం చదివి ఏంతో  ఆనందించాను. వెంటనే నా స్పందనలను తెలుపాలని అనుకున్నా, తెనాలి వెళ్ళటం, ఏవో ఇతర రచనలు చేయటంతో కాల  యాపన అయినందుకు విచారిస్తున్నాను.
         అయినా, ఇది ఇప్పుడు చదివి అందులోని కొన్ని మధుర భావాలను ఆస్వాదించాను. వాటిపై, నా సమీక్షను రాసి ఇప్పుడే, నా మిత్రులందరికీ అంతర్జాలం లో పంపాను.  దీనితో మరల పంపుతున్నాను.  ఎన్నో మంచి కవితలను, సోదర  సోదరీమణులు  రాసి ఈ గ్రంధానికి వన్నె తెచ్చారు.  మీరు సాహితీ  సేవలో తరిస్తూ, మావంటి సాహిత్య ప్రియులను కూడా తరింపజేస్తున్నందుకు మీకు శతథా ధన్యవాదాలు తెలుపుకుంతున్నాను.

         నా సమీక్ష మీ మనసును ఆకట్టుకుంటుందని భావిస్తాను. ప్రస్తుతానికి సెలవు.

మీ గీతాంజలి మూర్తి 

000100020003

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జర్మనీ రైతుల తిరుగు బాటు బావుటా

జర్మనీ రైతుల తిరుగు బాటు బావుటా

స్విట్జర్లాండ్ ,యూరప్ లో అనేక దేశాలలో రైతులకు లాగానే జర్మనీ రైతులు తమకూ స్వతంత్ర ,మర్యాదా పూర్వక ,పీడన రహిత జీవితం కావాలని తిరుగుబాటు చేసి తమకోర్కేలను ‘’12 సూత్రాలలో ‘’నిబంధించారు వీటిని మేమ్మేన్జేన్ లో ప్రవీణుడైన సెబాస్టియన్ లోట్టార్ అనే యాత్రికుడు రాశాడు. ఈయనకు క్రిసోఫర్ షాపెలేర్ సహకరించాడు  .  బడుగు బలహీన వర్గాల ఆవేదన ఇందులో ప్రతిధ్వనించింది.క్రైస్తవ స్వాతంత్ర భావన ఇందులో సరళ రమణీయంగా ధ్వనించింది.ఆ ద్వాదశ సూత్రాల వివరాలు తెలుసుకొందాం .

1-మేము మా మత బోధకుడిని ఎన్నుకొని నియమించు కొంటాం .ఆయన ప్రవర్తన సరిగా లేకపోతే భర్తరఫ్ చేసి కొత్త వారిని నియమించుకొనే హక్కు అధికారం మాకు ఉండాలి .సువార్తలను యధాతధంగా బోధించేవాళ్ళు మాకు కావాలి విపరీత వ్యాఖ్యాతలు వద్దు.

2-ఇప్పటిదాకా మమ్మల్ని భూస్వాముల బానిసలుగా చూశారు .ఏసు గొర్రెలకాపరి నుంచి అత్యున్నతుని వరకు సమానం గా చూడమని స్వేచ్చ నిమ్మని చెప్పాడు .మేము స్వేచ్చగా బతకాలను కొంటున్నాం. భగవంతుని ఆదేశాలప్రకారం జీవి౦చాలికాని దైహిక భీతి సూత్రాలను అనుసరి౦చి కాదు.

3-చేపలు పట్టటం ,పిట్టలు కొట్టటం పేదవాడికి హక్కు .దాన్ని మాకు ఇవ్వలేదు .మాకు నష్టం చేసి ‘’మానవ పశువులు ‘’‘’అనుభవిస్తున్నాయి .

4-అడవులను ప్రభువులు హక్కు భుక్తం చేసుకొన్నారు .మాకు వాటిపై అధికారం కావాలి .అడవులు ప్రజలందరి హక్కు భుక్తం కావాలి .

5-మేం చేసేపనులు చాలా కష్టంగా ఉన్నాయి .ఇలా పీడించి మమ్మల్ని పిప్పి చేస్తున్నారు .న్యాయం గా మాతో పని చేయించుకోవాలి .

6-భూస్మాముల పీడన ఇక మేము సాహి౦చ లేము .భూస్వాములు మాతో చేసుకొన్న ఒప్పందాలను మేము గౌరవిస్తాం .

7-మేము చెల్లించలేని శిస్తులను బలవంతంగా భూస్వాములు లాక్కో కూడదు .

8-కష్టం చేసేవారికి తగిన ప్రతిఫలం పొందే హక్కు కావాలి .

9-ప్రజలందరికీ చెందిన బీడు భూములను ,పొలాలను కొందరు స్వంతం చేసుకొని హాయిగా అనుభవిస్తున్నారు .అవి ప్రజలందరికి  చెందాలి .

10-సమస్యలను పరస్పర అంగీకారం తో దౌర్జన్య రహితంగా పరిష్కరించుకొనే వీలు హక్కు కల్పించాలి .

11-మరణ సుంక దురాచారాన్ని పూర్తిగా రద్దు చేయాలి .అనాధుల ఆస్తులను మర్యాదకు భంగం కలిగించేట్లు కాజేయటం మేము సహించం .

12-ఈ సూత్రాలలో ఏవైనా భగవద్వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయని రుజువు చేస్తే మేమే వాటిని ఉపసంహరించు కొంటాం

ఈ హక్కుల కోసం రైతులు చేసిన తిరుగు బాటును సామంతులు దుర్మార్గం గా రక్తపాతం తో అణచి పారేశారు .దీనితో రైతులు తమ జీవన పరిస్తితులు మరింత అధ్వాన్నమైనాయని గ్రహించారు . ఇలా మత సంఘర్షణలకు సాంఘిక రాజకీయాలతో ముడిపెట్టారు . 1955 లో జర్మనీలో మత ద్వంద్వతానుశాసనం చేసి ఆమోదించారు .దీనితో రాజకీయ విభేదాలు మరింత పెరిగి చివరికి యూరప్ అంతా ముప్ఫై ఏళ్ళ యుద్ధం 1618-నుండి 1648  వరకు వ్యాపించింది .దీనివలన జర్మనీలో చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి జర్మని జనాభా లో మూడవ వంతు జనం ఈ త్రిదశ సంగ్రామం లో హతమై పోయారు .

కాని  అదే సమయం లో సాహిత్య స్థాయి ఉన్న రచనలు అనేక వచ్చాయి .ఇదొక శుభ పరిణామం .అంతకు ముందు మత సంబంధ కరపత్రాలు ,లాటిన్ లో జీవకారుణ్య  సారస్వతం కొన్ని ప్రజాహిత రచనలు మాత్రమే వచ్చాయి 15 వ శతాబ్దం జర్మన్ సాహిత్యం ఇహ లోకానికి ,పర లోకానికి మధ్య ఉయ్యాల లూగింది .ప్రజలలో జీవితేచ్చ నశించలేదు .విధి వైపరీత్యాలను సహించగల శక్తి మీదనే తమ జీవితాన్ని తీర్చి దిద్దు కొనగలగటం మీదనే జీవన సౌఖ్యం ఆధార పడి ఉందని అందరూ గ్రహించారు .ఈ వైమనస్యాల అంతిమ పరిష్కారం 18 వ శతాబ్దం లో హేతు వాదం పూర్తిగా వ్యాప్తి చెందిన తర్వాతే సాధ్యమైంది .ఇవన్నీ నవలలో బాగా వ్యక్తమయ్యాయి .

ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ .

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-16 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 5-విస్తృత పరిశోధకుడు ప్రొఫెసర్ –ప్రమోద్ గణేష్ లాల్యే

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

5-విస్తృత పరిశోధకుడు ప్రొఫెసర్ –ప్రమోద్ గణేష్ లాల్యే

1928లో జన్మించిన ప్రమోద్ గణేష్ లాల్యే సంస్కృతం లో మహోన్నత విద్వాంసుడు .హిందీ సంస్కృతాలలో ఎం ఏ చేశాడు .ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పి ఎచ్ డిపొంది ,అందులో సంస్కృత  ప్రొఫెసర్ గా పని చేసి ,శాఖాధ్యక్షుడుగా రిటైర్ అయ్యాడు .ఎన్నో విలువైన గ్రంధాలు రాసి పేరు తెచ్చుకొన్నాడు .పూనా లో భండార్కర్ ఓరియెంటల్రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్లో ‘’మైక్రో ఫైల్మింగ్ ప్రాజెక్ట్ ‘’ను పర్య వేక్షించాడు .హైదరాబాద్ సంస్కృత అకాడెమి డైరెక్టర్ .ఆయన 75 వ జన్మ దినోత్సవాన్ని యూని వర్సిటి 2003లో ఘనంగా నిర్వ హించి’’ప్రమోద సింధు ‘’అనే ప్రత్యేక సంచికనుఆయన గౌరవార్ధం ప్రచురించింది .   . మల్లి నాదసూరని వివిధ కోణాలలో పరిశోధించి ఇంగ్లీష్ లో ‘’మల్లినాద ‘’ మోనోగ్రాఫ్ ను రాస్తే సాహిత్య అకాడెమి ప్రచురించింది .

ప్రొఫెసర్ లాల్యేవి ఇంగ్లీష్ ,ఫ్రెంచ్ ,సంస్కృతం ,మరాఠీ నాలుగు భాషలలో  63 రచనలు ,93 ప్రచురణలు 431 లైబ్రరి హోల్డింగ్స్ ఉన్నాయి .అందులో ముఖ్యమైనవి కొన్ని తెలుసుకొందాం – లౌకిక న్యాయ కోశ ,నవ రస మంజరి ,మల్లినాద మనీష ,శ్రీ కృష్ణ లీలా తరంగిణి ,శివాజీ పై కవిత ,వరదాభ్యుదయ చంపు ,లలితాసహస్రనామ స్తోత్రం ,స్టడీస్ ఇన్ దేవి భాగవతం ,ఫ్రీ ఇండియా ఫోర్జేస్,ది కార్డ్స్ అండ్ బౌన్స్ ఇన్ ది  వాల్మీకి రామాయణ , ఫ్రీ ఇండియా ఫోర్సెస్ యెహెడ్ ,నిఘంటు నిర్మాణం ,మాపులు తయారు చేయటం వ్యాఖ్యానాలు, జీవిత చరిత్ర  రాయటం ఆయన చాలా ఇష్టపడి చేశాడు .

Inline image 1  Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 4-చార్వాక /లోకాయత పై శోధించిన –రామకృష్ణ భట్టాచార్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

4-చార్వాక /లోకాయత పై శోధించిన –రామకృష్ణ భట్టాచార్య

10-12-1947 న కలకత్తా లో జన్మించిన రామ కృష్ణ భట్టాచార్య కలకత్తా యూనివర్సిటి లో చదివిఇంగ్లీష్ లో  బి ఏ ,ఎం ఏ ,పి హెచ్ డిలను 1966 ,68 ,1986 లలో పాసైనాడు .ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ లో రీడర్ గా ఆనంద  మోహన్ కాలేజి లో చేరి 31-12-2007 న రిటైర్ అయ్యాడు .ఇంగ్లీష్ లో ఎమిరిటస్ ఫెలో ,యూని వర్సిటి గ్రాంట్స్ కమిషన్ సభ్యుడు .ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రిసెర్చ్ కు విజిటింగ్ ప్రొఫెసర్ .ప్రస్తుతం కలకత్తా పావ్ లోవ్ ఇన్ స్టిట్యూట్ ఫెలో గా ఉన్నాడు .

8 వశతాబ్ది నుండి 12  వ శతాబ్ది వరకు ఉన్న చార్వాక లేక లోకాయత భౌతిక వాదం పై శాస్త్రీయ పరిశోధన చేసి ,దాని కనుమరుగుకు కారణాలు అన్వేషించి తెలియ జేశాడు .చార్వాకం లో మత భేదాలు చాలా ఉన్నప్పటికీ అవగాహన విషయం లో అందరిదీ ఏకాభిప్రాయమే అని రుజువు చేశాడు .చార్వాకు లందరూ ఇంద్రియ వాదులు అనే అభిప్రాయం తప్పు అని సాదికారికం గా రుజువు చేశాడు  .చార్వాకమతానికి ముందుకూడా ఈ భావనలు ఇండియాలో ఉన్నాయని ,కాని దానిపైనే చార్వాకం వృద్ధి చెందింది అని చెప్పటానికి ఆధారాలు లేవని వివరించాడు .మణిమేఖలలో దొరికిన  ఆదారాలను బట్టి  మహా భారతం లో అప్రత్యక్షంగా చెప్పబడిన విషయాలను బట్టి ఈ రెండు వ్యవస్థలు ఒకే సారి ఏర్పడి ఉంటాయని భావించాడు .

భట్టాచార్య ఇంగ్లీష్ లో ‘’గ్రౌండ్స్ ఫర్ హాప్,స్టడీస్ ఆన్ ది చార్వాక ,ఎమేర్జెంస్ ఆఫ్ మెటీరియలిజం ఇన్ ఇండియా ‘’గ్రంధాలు రాశాడు బెంగాలీలో 20 దాక పుస్తకాలూ రాశాడు .చార్వాకం పై 25 దాకా వ్యాసాలూ రాసి ప్రచురించాడు .8 పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు .

 

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-29-10-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 3-కృష్ణానంద ఆగమ వాగీశ

—               గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

3-కృష్ణానంద ఆగమ వాగీశ

వారెందర బెంగాలీ బ్రాహ్మణుడైన కృష్ణానంద వాగీశ 1650  లోచైతన్య ప్రభు జన్మించిన నవ ద్వీపం లో మహేశ మిత్రునికి  జన్మించాడు ..గొప్ప పండితుడు ,సాధకుడు .వేదాన్ని తంత్ర శాస్త్రాన్ని మధించినవాడు.అనేక శాస్త్రాలు చదివినందువలన మహామహోపాధ్యాయ బిరుదు పొందాడు .తమ్ముడు సహస్రాక్ష మిత్ర గొప్ప వైష్ణవ భక్తుడు .శ్రీ కృష్ణ ఉపాసకుడు .ప్రణతోషిణి రాసిన రామతోష ణుడికి  7 వ తరం వాడు .బెంగాల్ ప్రాంతం లో తాంత్రిక విద్య వ్యాప్తి చేసిన వారిలో ప్రధముడు .’’ఆగమేశ్వరికాలి మా’’ అనే నవద్వీప పూజా విధానాన్ని ప్రారంభించాడు . బీర్భం లోని మోల్లెపూర్ లో యోగ సాధన చేస్తూ తనువు చాలించాడు .

కలకత్తాదక్షిణ కాళీ ఆరాధన ప్రారంభించింది కూడా ఈయనే .ఒక రోజు కాళికా దేవి కలలో కన్పించి ,మర్నాడు ఉదయం ఆయనకు ఎవరు ఏ రీతిలో కనిపిస్తే ఆ రీతిలో తనను పూజించే పద్ధతిని ప్రచారం చేయమని కోరింది .మర్నాడు ఉదయం లేవగానే ఒక యువతీ ఆవుపేడతో పిడకలు చేసి గోడకు కొడుతూ ఉండటం చూశాడు  .గోడకు పిడక కొట్టే టప్పుడు ఆమె ‘’ఆలీఢ భంగిమ ‘’ లో కుడి పాదం ముందుకు చాచి,.కృష్ణానంద ను చూడగానే ఆమె కంగారు తో  నాలుకను దంతాల మధ్య .పెట్టి కనిపించింది .కృష్ణానంద ఈ భంగిమను మరింత వాస్తవాని దగ్గరగా మలచి కాళీ మాత పూజా విధానాన్ని ఏర్పాటు చేశాడు .క్రిష్ణానందుడు కాళీ భక్తులకు ,కవి రాం ప్రసాద్ సేన్ కు గురువు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్—29-10-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

26-10-16 బుధవారం కేసి పి 75 వసంతాల ఉత్సవం లో సహస్రావధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మ

This gallery contains 47 photos.

More Galleries | Tagged | Leave a comment

మా ఇంట్లో నరక చతుర్దశి -మాడున చమురు ,పిల్లల టపాకాయల కాల్పు

This gallery contains 35 photos.

More Galleries | Tagged | Leave a comment

ర్వాణ కవుల కవితా గీర్వాణం -3 2-వేదా౦గ శిక్షపై పరిశోధించిన –ప్రొఫెసర్ కె .హయగ్రీవ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

2-వేదా౦గ శిక్షపై పరిశోధించిన –ప్రొఫెసర్ కె .హయగ్రీవ శర్మ

తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ శ్రీ హయగ్రీవ శర్మ కృష్ణ యజుర్వేదాన్ని క్రమాంతం శ్రీ వెంకటేశ్వర వేదాగమ పాఠ శాల లో చదివారు .వ్యాకరణం ముఖ్య విషయం గా సంస్కృత ఎం ఏమొదటి తరగతి లో  పాసై స్వర్ణ పథకం సాధింఛి , పి హెచ్ డి,పొందారు .29 ఏళ్ళుగా సంస్కృత ప్రొఫెసర్ గాపని చేస్తున్నారు .సాహిత్యం ,వ్యాకరణం ,వేద సాహిత్యం వెంకటేశ్వర అధ్యనాలపై ఆసక్తి .వేదాంత శిక్షపై పరిశోధన చేశారు .5 గురు విద్యార్ధులకు పిహెచ్ డికి గైడ్ గా ఉన్నారు .4 గురు వీరివద్ద ఎం ఫిల్ చేశారు .వీరి విద్వత్ కు భారత ప్రభుత్వం శిక్షా విద్యా పురస్కారం అందించింది  వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ఉత్తమ అధ్యాపక పురస్కారం ఇచ్చింది .

యు జి కర్రిక్యులం సబ్జెక్ట్ కమిటీలో మెంబర్ గా ,బి ఓ ఎస్ చైర్మన్ గా ఎక్స్టర్నల్  మెంబర్ గా ఉన్నారు . నెదర్లాండ్ లోని మహర్షి మహేష్ యోగి వేదిక్ యూని వర్సిటి వేదంగా ,శిక్ష ప్రాజెక్ట్ కు చీఫ్ ఎడిటర్ గా పని చేశారు .తిరుమల దేవ స్థానం ప్రచురించిన స్కాంద పురాణాన్ని తెలుగులో అనువాదం చేశారు యక్ష నిరుక్తాన్ని  .సాయన వ్యాఖ్యానమున్న కొన్ని ఋగ్వేద మంత్రాలను తెలుగు లో అనువదించారు.పాణినీయ శిక్ష కు సంపాదకత్వం వహించారు ,,తైత్తిరీయ ఉపనిషత్ , తెలుగు అనువాదం చేశారు వామన –పంచ మహా కావ్యాలపై పరిశోధన చేశారు .వామన –మల్లినాద లను తులనాత్మకం గా పరిశోధించి,యజుర్వేదాన్ని వేదంగా శిక్ష ఆకారం గా ,పరిశీలించారు .వేదంగ సమీక్షా ,సంస్క్రుతస్య వైశిష్యం ,గౌతమ ధర్మ సూత్రా మనుసరేణ శాసనం పాలనం, గౌతమ ధర్మ సూత్రేషు ప్రతిబింబిత సమాజ స్థితి ,వేదోక్త వర్ణ ధర్మః ,అధర్వ వేద ఔషధ విజ్ఞానం ,ది రోల్ ఆఫ్ ఆన్దాలజి ఇన్ పర్సనల్ డెవలప్ మెంట్ మున్నగువిషయాలపై   13 రిసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించారు .

తిరుమల దేవాస్థాన పత్రిక సప్తగిరిలో వేదాంత మహత్వం ,తైత్తిరీయారణ్య కం ,అన్న ప్రాశస్త్యం ,ఆది శంకరులు మొదలైన విషయాలపై చాలా వ్యాసాలూ రాశారు.

సశేషం

దీపావళి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-16 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు

హైదరాబాద్ బాగ్ లింగం పల్లికి చెందిన శ్రీ బి నరసింహా చార్యులు 16-7-1944 న జన్మించారు .ఉస్మానియా యూని వర్సిటిలో విద్య నభ్యసించి న్యాయం లో బి ఓ ఎల్.1963 లోను ,సంస్కృతం లోఎం.ఏ 19 66 లోను ,సంస్కృతం లో పి హెచ్ డి .లు పొందారు .రష్యన్ భాషలో  అడ్వాన్సేడ్ డిప్లొమా 1985 లో ,గ్రాండ్ స్టెఫీన్స్ 1966 లోను అదే యూని వర్సిటి నుంచి సాధించారు .సంస్కృత సాహిత్యం ,కవిత్వాలలో తెలుగు సంస్కృత తులనాత్మక పరిశోధనలో ,ప్రాచీన న్యాయ శాస్త్రం లోను మిక్కిలి అభి రుచి ఉన్నవారు .

హైదరాబాద్ తాండూర్ ప్రభుత్వ  హై స్కూల్ లో,ఒయాసిస్ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో   తెలుగు సంస్కృత ఉపాధ్యాయులుగా ఉద్యోగం ప్రారంభించి,న్యు సైన్స్ కాలేజి ,సర్దార్ పటేల్ కాలేజి లోలెక్చరర్ గా ,30 ఏళ్ళు లెక్చరర్ ,రీడర్ ,ప్రొఫెసర్ గా సైఫాబాద్ పి జి కాలేజ్ ఆఫ్ సైన్స్ ,ఈవెనింగ్ కాలేజి ,ఉస్మానియా యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ ఆర్త్సండ్ సైన్స్ లోను పని చేశారు .10-11-1993 నుండి 2-3-1996 వరకు జులై 9 9 నుండి జులై 20 01 వరకు ,జూన్ 2003  నుంచి జులై 2004 వరకు ,ఉస్మానియా సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేసి రిటైర్ అయ్యారు .

పూర్వపు ఆంధ్రప్రదేశ్ సంస్కృత అకాడెమి డైరెక్టర్ గా పని చేశారు .సంస్కృతం లో యు జి మరియు పి జి బోర్డ్ ఆఫ్ స్టడీస్ కు చైర్మన్ గా ,,1996 నుండి సురభారతి సమితి సేక్రేటరిగా ,నేషనల్ అసెస్మెంట్ ,అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు .

ఆచార్యులవారు 19 మంది విద్యార్ధులకు ఎం ఫైల్ డిగ్రీకి  ,5 గురికి పి హెచ్ డి.కి గైడ్ గా వ్యవహరించారు .30 దాకా జాతీయ సెమినార్లకు హాజరయ్యారు .9 గ్రంధాలను 30 పరిశోధన పత్రాలను  రాసి ప్రచురించారు .సిలబస్ రివిజన్ కమిటీ మెంబర్ గా ,సెలెక్షన్ బోర్డ్ మెంబర్ గా ,ఉన్నారు రేడియోలో చాలా విషయాలపై ప్రసంగించారు .ఎన్నో సంస్థలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు

రొడ్డం నరసింహఆంగ్లం లో  రాసిన ‘’యోగ వాసిస్టం ‘’ను తెలుగులోకి అనువదించారు.16 వ శతాబ్ది కి చెందిన యతీంద్ర మతదీపిక అనే శ్రీనివాసాచార్య సంస్కృత గ్రంధాన్ని తెలుగు చేశారు .వినోబా భావే హిందీలో రాసిన వేద చింతన ను తెలుగు లోకి అనువదించారు.మార్కండేయ పురాణం లోని హరిశ్చ౦ద్రో పాఖ్యానాన్ని తెలుగు చేశారు .సంస్కృత అకాడెమి ప్రచురించిన యోగ సూత్ర సార ,దాతు కారిక లకు సంపాదకత్వం వహించారు .

  1.   వీరిరిసేర్చ్ పేపర్లలో ముఖ్యమైనవి –ధర్మ సూరే మల్లినాధస్య ,అధమార్ణత్వం ,రాసకలిక ,సీతారామ విహార కావ్యధూర్త సమాగమం మొదలైనవి . ఈ క్రింది  12 గ్రంధాలకు పీఠికలు రాశారు .
  2. -Purvamimamsa Bhashyavartikayormatabhedanamadhyayanam, M.Phil. Thesis in Sanskrit, A. Yajnaramulu, 1993.
  3. Nirnaya Sindhu, Dr.K.Narasimhacharya, 1994.
  4. Sri Gayatri mantrakshara mala, Sri K.Suryanarayana, 1995.
  5. Sri Alavandar Strotram, Burgula Ranganatha Rao, 1995
  6. Telugu loni vinnapasahitya Samiksha, Ph.D. Thesis, K.Perumallacharya, 1996.
  7. Andhralankara Vangmaya Charita, Ph.D.Thesis, S.G. Ramanuja Charya, 1998.
  8. Vaidika Chandah Sastram, P.Koteswara Sharma, 2000.
  9. Ramanuja Sampradaya Saurabham, Sriman Samudrala Srinivasacharyulu, 2004.
  10. Kutova manusham, Dr.A.Prabhavati Devi, 2002.
  11. Nuti Manjari, Bhallamudi Radha Krishnamurthy, 2003.
  12. Surya Satakam, Ummadi Narasimha Reddy, 1999.

Inline image 1

దీపావళి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-16 -ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కార్తీక మాస ప్రత్యేక వ్యాస ధారావాహిక

నమస్తే గోపాల కృష్ణ గారు -దీపావళి శుభా కాంక్షలు -ఈ సారి కార్తీక మాసం లోప్రత్యేకంగా ఏం రాయాలి అని మధన పడుతుంటే నిన్న విశాఖ పట్నం నుంచి సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంపిన పుష్పదంతకవి సంస్కృతం లో రాసిన ”శివ మహిమ్నఃస్తోత్రం ”పై వారు వ్యాఖ్యానం రాసిన పుస్తకం అందింది.  వారికి  వేంటనే ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియ జేశాను .అప్పుడు వారు .”అయ్యా 1 మీ గీర్వాణం వీలున్నప్పుడల్లా చదువుతూ ఉంటాను . అందర్నీ చదివించే గొప్ప లక్షణం అందులో ఉంది నన్ను బాగా ఆకర్షించింది .”అన్నారు పొంగిపోయాను ఆయన అంతటి మనీషి ఇలా అనటం నా అదృష్టం అని పించింది వెంటనే .”శాస్త్రి గారూ ! రెండవ గీర్వాణం 482 మందికవులతో రాశాను. డిసెంబర్ 4 న శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు ఆవిష్కరిస్తారు ”అని చెప్పగానే” చాలా సంతోషం . డిసెంబర్ 4 కోసం ఎదురు చూస్తూ ఉంటాను ”అన్న విశాల హృదయం వారిది .

 కనుక శిమ మహిమ్నః స్తోత్రాన్నే వారి వ్యాఖ్యానం తో కొంచెం సులభతరం చేసి31-10-16 సోమవారం  కార్తీక మాసప్రారంభం నుండి అంతర్జాలం లో ధారావాహిక గా మీకు అంద జేస్తున్నానని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను -దుర్గా ప్రసాద్ –

సాహితీ బంధువులకు దీపావళి శుభాకాంక్షలు

ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి ఆలయం లో 31-10-16 సోమవారం నుండి 29-11-16 మంగళవారం వరకు పవిత్ర కార్తీక మాసం సందర్భం గా ప్రతి మంగళ వారం రాత్రి 7 గం .లకు కార్తీక మాస ప్రత్యేక దీపాలవంకరణ నిర్వహింప బడుతుంది . దర్శించి తరించ ప్రార్ధన.
                                         గబ్బిట దుర్గా ప్రసాద్
                                          ఆలయ ధర్మ కర్త
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం

257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత  సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 )

శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి తెలంగాణా కరీ౦ నగర్ జిల్లా ధర్మ పురిలో 1933 లో భారద్వాజ గోత్రీకులు కొరిడే కృష్ణయ్య ,గంగాయమ్మ దంపతులకు జన్మించారు .సంప్రదాయ బద్ధంగా విద్య నేర్చి బాల్యం లోనే రామాయణ భాగవత భారతాదులను చదివి ఆకళించుకొని ,తాడూరి బాల కృష్ణ శాస్త్రి ,గొల్లపల్లి సాంబశివ శాస్త్రి ,పాలెపు వెంకట రాయ శాస్త్రి వంటి ఉద్దండుల వద్ద సంస్కృత వ్యాకరణ అలంకార ,తర్క వేదాన్తాలను అధ్యయనం చేశారు .కవిత్వం శాస్త్ర విచారాలలో  లో స్వయం కృషితో పట్టు సాధించి ,కవిత్వ, రచనల ద్వారా వాసికెక్కారు .1956 లో 23 వ ఏట పూరీ గోవర్ధన పీతాదిపతులచే ‘’సాహిత్య రత్న ‘’బిరుదం పొంది ,ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృత సాహిత్య విద్యా ప్రవీణ పరీక్షలో 1961 లో ఉత్తీర్ణులై కరీం నగర్ జిల్లా లో సుల్తానా బాద్ ,,రాయకల్లు ,చొప్పదండి ధర్మపురి లలో సంస్కృత ,తెలుగు పండితులుగా పని చేశారు .శ్రీ తాడూరి శివ రామయ్య శ్రీమతి లక్ష్మీ నర్సిం ల కుమార్తె శ్రీమతి సులోచనా దేవిని ఆమె కు 5 లేక 6 ఏళ్ళ వయసున్నప్పుడే వివాహమాడారు .

సంస్కృత సాహిత్య పరిశోధనకై  కేంద్ర ప్రభుత్వమిచ్చిన ఉపకార వేతనం తో ఉస్మానియా యూని వర్సిటి సంస్కృత అకాడెమి లో  వారణాసి ధర్మ సూరి   రచించిన ‘’సాహిత్య రత్నాకరం ‘’పై గొప్ప పరిశోధన చేశారు  .ప్రైవేటుగా చదివి ఎం ఓ ఎల్ ,తెలుగు ఎం. ఏ లను ఉస్మానియా నుంచి అందుకొన్నారు .సికందరాబాద్ సర్దార్ పటేల్ కాలేజి లో 1972 నుంచి ఆంధ్రోపన్యాసకులుగా పని చేస్తూ ,యు జి సి ఫెలోషిప్ తో ‘’ధ్వని-మనుచరిత్రము ‘’విషయం పై పరిశోధన చేసి పి హెచ్ డి పొంది ,1981 నుండి ఉస్మానియా యూని వర్సిటి స్నాతకోత్తర కేంద్రం లో ఆంధ్రోపన్యాసకులుగా చేరి ,1993 లో రిటైరయ్యారు .

శాస్త్రి గారి సంస్కృత రచనలుసంస్కృత భారతి ,ఆరాధన ,భారతి వివేచన పత్రికలలో ,వారణాసి విశ్వ విద్యాలయ సాహితీ సుషమా ,సాగర్ విశ్వ విద్యాలయ సాగరిక ,భారతీయ విద్యా భవన్ వారి సంవిత్ ,స్వాధ్యాయ మండలి వారి ‘’అమృతలత ‘’,వారణాసి ధర్మ మండలి ‘’సూర్యోదయ ‘’,మద్రాస్ రామకృష్ణ ప్రభ లలో ప్రచురితాలై భారత దేశ ప్రముఖ సంస్కృత పండితులుగా గుర్తింపు పొందారు .వీరి సంస్కృత రచనలో ముఖ్యమైనదవి 1- వారణాసి ధర్మ సూరి రాసిన సాహిత్యరత్నాకరానికి ‘’ఉన్న నౌక ,మందారం అనే రెండు వ్యాఖ్యానాలను మదించి లఘువ్యాఖ్యను మూడు భాగాలుగా సంతరింఛగా ఉస్మానియా సంస్కృత అకాడెమి 1972 ,74 ,81 లలో ప్రచురించగా యావద్భారత పండిత ప్రకాండ శ్రేణిలో ఒకరైనారు .2- సుమనో౦జలిఅనే సంస్కృత కవితా సంకలనం టిప్పణి సహితంగా1973 లో  ప్రచురించారు 3-భూ సంస్కరణలపై ‘’వసుమతీ సుధాకరం ‘’నాటకం రాస్తే ఆకాశవాణి ద్వారా ప్రసారితమైంది 4- ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి  సుప్రభాతం 5-సంస్కృత పథ ప్రదర్శిని ,6-స్వీయ సంస్కృత కవితా ఖండికల సంకలనం ‘’కవితా విపంచీ ‘’ .7-షోడశీ. ‘’8-శ్రీ ఏ సి పి శాస్త్రి గారు రచించిన ‘’నల చరిత్ర ‘’తెలుగు నాటకాన్ని రాజన్న శాస్త్రి గారు  సంస్కృతం లోకి అనువదించగా ‘’సురభారతి ‘’ప్రచురించింది .20 01 లో ఢిల్లీ సంస్కృత అకాడెమి ప్రచురించిన ‘’విశ౦తి శతాబ్దీయ సంస్కృత కావ్యామృతం ‘’లో శాస్త్రి గారి కవితా ఖండికలను చేర్చి గౌరవించింది .

తెలుగులో వైశాలి నాటకం ,వీరభద్ర సుప్రభాతం ,ఏక వీర కుమారీయం ,శ్రీ రుద్ర స్తోత్రం ,శంభు శతకం ,సరస్వతీ వైభవం ,సుమగీతాలు ,మొదలైనవి రచించారు .శాస్త్రిగారి ఆధ్యాత్మిక సాహిత్య వ్యాస సమాహారాన్ని ‘’మ౦జూష ‘’గా ప్రచురించారు .

శాస్త్రి గారి  విద్వత్తు కు తగిన పురస్కారాలు అందుకొన్నారు .శ్రీ శృంగేరి పీతదిపతులు శాస్త్రి గారిని ఆస్థాన పండిత గౌరవం కల్పించారు సారస్వత జ్యోతి ఉత్తమ ఉపాధ్యాయ బిరుదాన్ని ,సర్వార్ధ సంక్షేమ సమితి శాస్త్ర  పండిత పురస్కారం,చ్చి సత్కరించింది . దివాకర్ల పురస్కారం ,హిందూపుర స్వర్ణ భారతీ పురస్కారం ,తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ సంస్కృత పండిత పురస్కారం ,కందుకూరి శివానంద మూర్తిగారి అమృతోత్సవ పండిత పురస్కారం అందుకొన్నారు .

శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి గారు 11-3-20 13 మాఘ బహుళ అమావాస్య నాడు 80 వ ఏట ‘’రాజశేఖర సాయుజ్యాన్ని’’ పొందారు.

ఆధారం –శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి గారి కుమారులు శ్రీ కొరిడే విశ్వనాధ శర్మ గారు పంపిన ‘’మంజూష ‘’లో ఆచార్య బిరుద రాజు రామ రాజు గారి వ్యాసం ‘’పస్పశము ‘’శ్రీ విశ్వనాధ శర్మగారి ‘’మా నాన్న గారు ‘’వ్యాసం .

గీర్వాణ వైదుష్యం

గణేశుని స్తుతిస్తూ రాజకీయ గణ నాయకులనూ అన్యాపదేశంగా ఎత్తి పొడిచిన కవిత

‘’అది తిష్ట న్నుచ్చ పదం –రూపకళా ఖర్వా గర్వ యుక్తశ్చ

పరి భూయ త్వం ద్విజపతి –రాప్తశ్చాదర్శనీయతాం సద్యః ‘’

ఉన్నత పద౦ లో ఉంటూ రూప కళా గర్వం తో చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వి అవమానం చేసి ప్రజాదరణ కోల్పోయాడు అని భావం .

గోదావరీ నది వర్ణ న –‘’గోదావరీ విమల వీఛి మృదంగ వాద్యే –సంవాద్యమాన ఇహ గంధ వహేన హృద్యం

బాలాపికా లపతి రమ్య రవేణ గీతం –లక్ష్మీ నృసింహ  భగవంస్తవ సుప్రభాతం ‘’

నిర్మల గోదావరీ తరంగాల మృదంగ ధ్వని ని వాయువు హృద్యంగా అందిస్తుంటే పిల్లకోయిలలు రమ్యం గా గానం చేస్తున్నాయి మేలుకో లక్ష్మీ నృసింహా .

ఏది రాసినా సంప్రదాయం చరిత్ర అంతర్లీనంగా ,కవితాత్మకంగా రాశారు శాస్త్రి గారు .అందుకే వారి వైదుష్యాన్ని అంతటి గొప్ప పండితకవి శ్రీ కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి గారు బహు గొప్పగా రమ్యంగా వర్ణించారు రాజన్న శాస్త్రి గారిని –

‘’వైదుష్యం ,లేఖకత్వం ,సుగమ ఫఃణితిభిః సంస్కృతాధ్యాపకత్వం –విద్వద్గోస్టీషు చర్చానికషణ చణతా  శాస్త్ర వాదే పటుత్వం

శక్తి ర్గైర్వాణవాణ్యాం విబుధ జన సదోభాషణే నర్గళాచ-విద్వద్రాజన్న శాస్త్రిన్ !భవతి విజయతే భారతీ సుప్రసాదాత్ ‘’

ఆధారం –శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి గారి కుమారులు ,ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల సంస్కృతోపన్యాసకులు- శ్రీ కొరిడే విశ్వనాధ శర్మ గారు24-10-16 న  పంపిన ‘’మంజూష ‘’పుస్తకం లో ఆచార్య బిరుద రాజు రామ రాజు గారి వ్యాసం ‘’పస్పశము ‘,’శ్రీ విశ్వనాధ శర్మగారి ‘’మా నాన్న గారు ‘’వ్యాసం.

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’

దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’

రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగి ,సంగీత సాహిత్యాల సమలంక్రుతుడు శ్రీ పొనకంటి దక్షిణా మూర్తి గారితో పూర్వ పరిచయమేదీ లేదు కాని వారు ఆప్యాయంగా పంపిన ‘’విశ్వ విలాపం ‘’పద్య కావ్యం ఈ రోజే 24-10-16 అందింది .విశ్వం దాని ప్రక్కన చెట్టు  చేప ,పిచుక,ఎలుక ,పాము ,కోడి ,కుక్క ,మేక జంతువులతో భావ శుద్ధిగా ముఖ చిత్రం పుస్తకం లోని భావాలను వ్యనజనం చేసింది .తమ తలిదండ్రులు కీ శే లు శ్రీ పొనకంటి నర్సయాచార్యులు శ్రీమతి బాలమ్మ దంపతులకు అంకిత మిచ్చారు .

కవి కరుణశ్రీ పుష్ప విలాపం స్పూర్తి తో రాసిన కావ్యమిది .పది ప్రాణుల ఆర్తిని వాటి తరఫున మనకు అందించి ఒక సారి నిలబడి ఆలోచించమని హెచ్చరించాడు .ఇందులో మొదటిది ‘’వృక్ష విలాపం ‘’జంధ్యాలవారి పుష్పవిలాపానికి అను సృజన – గొడ్డలితో అభయారణ్యం లోని ఒక వృక్షాన్ని నరక బోతుంటే దాని ఆవేదన  ‘’వృక్ష విలాప కావ్యం ‘’అయింది .భూమిలోకి వేర్లు లోతుగా పాదుకొని ,భూసారాన్ని వృద్ధి చేస్తూ ,వానలు గుమ్మరిస్తూ ,ఆశ్రితులకు సేద తీరుస్తూ ప్రశాంత చిత్తులను చేస్తూ ఉండే తమల్ని ఉక్కు రంపాలతో మేను తుక్కు చేయవద్దని చెట్టు ప్రాధేయ పడుతుంది ‘’

‘’మా తులలేని పుష్ప ఫల మానిత వృక్ష సుగంధ మౌషదీ –రీతులు ఎన్నొ మీవయి వరించి భరించి హరి౦చి పోయే,మా

చేతనమంత చెండుకొని చీలిచి, మీచితి మంట పేర్చి మ –మ్మీతరి బుగ్గి చేతురు సుమీ నరజాతికి న్యాయ మున్నదా?’’అని ప్రశ్నించింది .జాలరిగా వల తో చేపలను పట్టుకో బోతే అవి ‘’మత్స విలాపం ‘’చేసి మనసు కరగించాయి  .

‘’నీటిని శుద్ధి చేసెదము ,నీచును నాచును నోట మ్రింగి యే-నాటికి చేటు దేము ,జలనాశన మొనర్చము మీకు వోలె మీ

నోటికి జారదేమి మము నూర్పుచు ముద్దగ మ్రింగకున్న యే-పాటిది నీట మా బ్రతుకు ప్రాణము  దీయుట పాపమే కదా ‘’అన్నాయి .’’పూర్వం మీరూ మేమూ నీళ్ళలోనే కలిసి బతికాం ,తర్వాత భూమి పైకి చేరి పరిణామ క్రమలో మీరు మానవు లయ్యారు .తోటి ప్రాణులమైన మాపై సానుభూతి లేకుండా నిత్యం వేటాడి చంపి తింటారా ?మత్స్యాలను చంపి తినటం నేరం అని చట్టం చేయలేక పోయారని బాధ పడి కవిత్వం లోమాత్రం  నెరాజాణ కనులతో మమ్మల్ని పోలుస్తారుకాని వేటాడటం మానరు ,ఇంట్లో ఆక్వేరియం పెట్టి చిత్ర చిత్రాల చేపల్ని పెంచి తమ స్వేచ్చకు బంధం వేశారని ఈసడించాయి .

‘’నెత్తురు లేని ప్రాణులని  నేరుగా గొంతులు గోయ బోక మ –మ్మెత్తిలి రక్కుచు ,పోలుసులూడగ జేతురుప్రాణము౦ డ గన్

తుత్తినియల్  తెగించి మము దుర్భర హింసల పాలు జేయ ,మీ-చిత్తము లెట్టు లోప్పే జలజాతులు సైతము ప్రాణులే కదా ‘’ అంటూ తమను  చేసే చిత్రవధ వర్ణిస్తూ బావురు మన్నాయి .

ధాన్యపు కంకుల్ని నోటకరచుకొని ఇళ్ళ వసారాలలోఅంద మైన  గూళ్ళు కట్టి కిచ కిచలతో స్వేచ్చాజీవుల్లా విహరించే పిచ్చుకని ఇప్పుడు తుపాకీ గుండుకు కూడా కనిపించక మాయమై పోయాయి .దీనికి కారణం మానవ నైజమే ప్రకృతి సమతుల్యతను కాపాడక పోవటమే .వాటి ఆరాటం విన్నాడు కవి గుండె చెరువైంది వాటి శోకం తో –

‘’పుల్లలు నోట దెచ్చి ,పూరి బోయుచు గుండ్రని గూళ్ళు గట్టుకన్ –ముళ్ళ పొదళ్ళ నైన మరి ముద్దుగ నుందుము గుంపు గూడి ,మీ

కళ్లము లందు గింజలను కమ్మగా నోటితొ నార గించుచున్-అల్లన చెట్ల పైన తిరుగాడుచు నుంటిమి ఇంతకాలమున్ ‘’అని తమ పూర్వ వైభవాన్ని చెప్పుకొని ఇప్పుడు ‘’కాలం మారి పోచ్చి –కలికాలం వచ్చి గాలి నీరు ఆకాశం కలుషితాలై   భూమిపైనే కాక చంద్ర మండలం పైనా ఉండటానికి ఆరాట పడుతున్నారు మీ మానవులు .కరెంటు దీపాలవలన పగలేదో రాత్రేదో తెలియటం లేదు ప్రేలుడు శబ్దాలతో చెవులు పగిలి పోతున్నాయి .దుర్గంధం శ్వాశ నాళాలు చిల్లులు పడుతున్నాయి వాతావరణం భీతావరణం అయి  ఫాక్టరీ పొగలు వాహనాల రోడ్లు , ,కర్బనాల కాలుష్యం ఉద్గ మించే ఉద్గారాలు మధ్య పక్షిజాతి బతక లేక చస్తోంది  గుడిసెలు భవనాలై వృక్షాలను కూల్చి వేస్తుంటే కాకులు గ్రద్దలకు ఆవాస౦కరువై అతి వృష్టి అనా వృష్టి ఆశనిపాతమైతే ,అభ్రగాలన్నీ అంతరించి కరువు కాటకాలవల్ల   గండ భేరు౦డాలు గగనమే అయ్యాయి ‘’అని విలపించి

‘’పచ్చదనము లేదు –పాప పుణ్యము లేదు –నీతి లేదు ,నిలువ నీడ లేదు –చల్లదనము లేదు -,శాంతి సౌఖ్యము లేదు –బ్రతుకు లేదు బ్రతుక భవిత లేదు ‘’అని దీన ప్రాణి బాధను కళ్ళకు కట్టించారుకవి .దడులు ,దప్పర్లపై దర్శనమిచ్చే కాలకంఠాలు,పందిరి పాకలపై వాలే బండారు పిట్టలు ,తుర్రుమనే బుర్రు పిట్టలు ,ముక్కుతో  చెట్టు కాండాన్ని  తొలిచే వడ్రంగి పిట్టలు ,కన్జరీటాలు,పొట్టి గిజిగాళ్ళు ,పాలపిట్టలు ,పూరేళ్లు ,కంటికి కనిపించటమే లేదని ఇదంతా మానవ స్వయం క్రుతాపరాధమేనని ప్రకృతి హనానమే దీనికి కారణమని కవి నిష్కర్షగా చెప్పాడు చివరికి

‘’శాస్త్ర వేత్త లార ,సంఘ సేవకులార –ధర్మ నిరతులార ,ధన్యులార –సుకృత కార్యము లచె ప్రకృతిని కాపాడి –పక్షి జాతికొరకు పాటు బడరె’’అని పక్షిజాతి తరఫున వకాల్తా తీసుకొని న్యాయం చేయమని ప్రజా కోర్టును వేడుకోన్నారుకవి .ఇక మూషికశోక కావ్యాన్ని  వినిపిస్తాడు కవి .  ‘’గజ ముఖ వాహనం అని పొగుడుతూ ఇంట్లో దూరితేమాత్రం బోనులు పెట్టి మందులుపెట్టి  పిల్లుల్ని పెంచి  పచంపుతారు .పొట్టిగా ఉన్న కారణం తో ‘’చిట్టెలుక ‘’అని చీదరిస్తారు ‘’కాని

‘’ముందుగ సూది మందులను మూషిక మూకల కిచ్చు చుండి ,మీ –రందరు వాడు చుండెదరు  హాయిగ జీవిత కాల మంతయున్ ‘’అని తమలను ఎలా వాడుకొంటున్నారో మనుషులు తెలియ జేసి ,’వ్రేలెడు లేని ఎల్కలనువేదనలకుం గురి జేతురేల,మీ-జోలికి రాని మమ్ము పరిశోధన పేర ప్రయోగ శాలలన్ –మూలుగ జేసి మా బ్రతుకు ముంచుట న్యాయమా ?’’అని ప్రశ్నించింది . ‘’మీ క్షేమం కోసం మా బ్రతుకు ఏమార్చటం ఏం న్యాయం ?అంది

‘’అవని యందు నరులు అవసానము వరకు –ఆధిపత్యము గను బ్రతుకు చుండ

అల్పప్రాణికిటుల అవకాశము లేక –స్వల్ప కాలమందె సమయు  చుండె’’’’అని గోడు గోడున బాధ  వెళ్ళగక్కుకొని అల్పప్రాణులను మానవులు ఎంత నీచంగా చూస్తూ స్వార్ధానికి వాడుకొంటు న్నారో తెలియ జెప్పింది .

సర్పాల కూ స్వగతాలుంటాయి .దాన్నీ ఆవిష్కరించాడుకవి సర్ప విలాపం లో .’’చీమల పుట్టల్లో దూరి ఎప్పటికైనా బయటికి వస్తే చావ చితక కొడతారు .భూలోక వాసులు భూత దయ లేక వెంటాడి వేటాడి చంపుతారు. మాలోకమే మేలు అనుకొంటే ఆ నాగ లోకం ఎక్కడో మాకు తెలీదు ఆదిశేషుని దగ్గర మొర పెట్టుకొందామంటే వైకుంఠ ద్వారం ఎక్కడుందో అంతు బట్టటం లేదు .శంకరాభరణాల వంక చేరుదామంటే కైలాసమార్గం తెలీదు .నాగ దేవత అని కొలుస్తారుకాని కనిపిస్తే మాత్రం కాల రాస్తారు .అడవుల్ని ఆరగించటం తో అజగరాలు ,కొండా కోనా పిండి చేస్తుంటే కొండ చిలువలు ,పుట్టలు పొదలు నాశనం చేస్తుంటే నాగులు ,చెట్టూ చేమా పోయి వాన కోయిలలు అరుదై పోయాయి .పొట్టకూటికోసం పెట్టెల్లో బంధించి ఆడిస్తున్నారు  మా జీవితాలతో నే ఆడుకొంటున్నారు –అని ‘’

‘’నాగిని నృత్యమంచు నవ నాడులు పొంగగ నర్తకీమణుల్ –భోగము వోలె హస్తములు మోమున కెత్తుచు ,మొగ్గ వేయుచున్

తీగెలు సాగగన్ తనువూ తీపులు బెట్టగ దొరలు చుందురే –నాగులు నేలపై నిటుల నాట్యము సేయగ జూచినారటే’’అని మానవ వికృత చేష్టలను ఎండ గట్టింది .పాముల్ని కోసుకు తింటూ కోరలు పీకి హింసిస్తూ ,విషం తో ఔషధాలు చేసి అమ్ముకొంటూ ,చర్మాలను ఒలిచి వేష భూషణాలు తయారు చేసి ధరిస్తూ ,చాదస్తంగా చలన చిత్రాలలో చపల చిత్తంగా నటింప జేయిస్తూ ,మొక్కులు చెల్లిస్తూ చలిబిడి పె, పాలు పోస్తూ పూజిస్తూ కూడా కనబడితే హత్య చేస్తున్నారు .పాలు తాగాలంటే పెదవులేలేవు పాయసం తిందామంటే నాలుక చీలి ఉంది ,సాధ్యం కాదు కనుక మీ నైవేద్య భాగ్యాలు మేము తినలేం .కలుగులో ఎలుకలే మా ఆహారం .ప్రయాణం చేసేటప్పుడు మేము ఎదురైతే దోషమా ,

‘’గరుడ పక్షులువెంటాడి తరుము చుండు –కరకు ముంగిసల్ తనువులు తురుము చుండు

నరులు దొరికించుకొని నెల జారుచు చుండ –బ్రతుకు సాగించు టెట్టులో భద్రముగను ‘’అని పాము విలపించింది .

‘’పక్షుల మయ్యి ,పై కేగురు పాటవ మెంత యు లేక నేలపై –రక్షణ లేని మమ్ము సుకరంబుగ పోషణ జేసి మానవుల్

భక్షణ జేయ  నెంచియు కృపాణము చేసేడిచెంత జేర మా –చక్షుల నీరు జారినది జాలిగ’’కుక్కుట శోక కావ్యమై ‘’అని కోడి విలాపం మొదలు పెట్టాడుకవి .’’కంచె చేను మేసినట్లు 21 రోజులు పెంచి పోషించి పండగకో పబ్బానికో చుట్టాలోచ్చారానో కోసుకు తింటారు .కోడికూర తింటే కొవ్వు పెరిగి గుండెపోటు వస్తుందని తెలిసినా తినటం మానరు .పు౦జుక్రీడలతో  జూదం ఆడుతారు .కోడిపుంజులాట కొంపలు ముంచినా మానలేరు

‘’బుద్ధుదహింస ధర్మమే బోధ జేసే –రామ కృష్ణు దాహిమ్సచే  ప్రేమ వడసె

గాంధి సత్యగ్రమహింస గాదె చూడ –హింస మానవ ,మానవ హితము కోరి ‘’అని కొక్కొరో కొ సూక్తి చెప్పింది .

‘’శ్వాన విలాపం ‘’లో కుక్క కూడా మనిషికి గడ్డిపెట్టింది .కనిపిస్తే రోకటితో కొడతారు .తాడుతో గొలుసుతో బంధించి పెంచుకొంటారు .విశ్వాసానికి మారుపేరని పొగడుతూనే ,కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటూ ,కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయి౦చు కొంటారు .సంకరజాతి కుక్కలపై  ఉన్నమోజు స్తానికులమైన ఊరకుక్కలపై లేదు

‘’చిత్త కార్తె లో మాత్రమేచిత్తగించి –పిల్లలను గను చుండు మా పిచ్చి తల్లి

బిడ్డ లెట్లు బ్రతుకు నంచు బెంగ టిలుచు –ఒడిని పాలిచ్చి పెంచును కడుపు నిండ’’

అని తమ వీధి బాగోతం చెప్పుకొన్నది .జంతు ప్రేమికులకు తమపై జాలి లేదని ,జీవకారుణ్యం వారికీ పట్ట లేదని వాపోయింది –‘’

‘’పక్షి మృగ జాతు లన్నింటి ప్రాణమొకటే –అన్ని ప్రాణుల నుండేడి నాత్మ యొకటే

మహిని మనిషికి కుక్కకు మరణ మొకటే –జన్మ ఏదైన ప్రాణికి జనన మొకటే’’అంటూ శంకరాచార్యునిలా అన్నమయ్య లా తత్వ బోధ చేసింది .

‘’మేష విలాపం ‘’లో మేక మేమే అంటూ మౌన రోదనతో గుండెలోని బాధ కోడిలాగానే వెళ్ళ గక్కింది .’’క్షుద్ర పూజల్లో మమ్మల్ని నరకడం న్యాయమా ,జంతుబలి నిషేధం గా ఉన్నా పాటించక పోవటం పాడికాదు అని బుద్ధి చెప్పింది

‘’భక్తి మార్గము నందునె ముక్తి గనగా –శక్తి యుక్తుల యందు నాశక్తి ఏల

సాత్వికాహార మందునే సత్తువవుండ –మాంస భక్షణ పై మీకు మక్కువేల ?అనిచీవాట్లు  పెట్టింది .

‘’లేత చిగురు మేయు లేడి పిల్లల నైన –ఆకులలములు దిను మెకమునైన –

సాదు జంతువైన చంప బూనుదు రేల-కూటి కోసమేన వేట యకట ?’’అని మృగయా వినోదం పాపం అన్నది ‘’మృగ విలాపం ‘’లో లేడి .పంచ భూతాలూ కూడా తమ గోడును  ‘’భూత విలాపం ‘’గా వినిపించాయి

‘’ఆకస మందు వాయువు అందును అగ్నియు ,అగ్ని వాయువుల్ –ఏకము కాగ నందు జలమేర్పడయా జలమందు పృథ్వి ,ని

ర్వాకము నొంద, పృథ్వి పయి వ్యస్తముగా జనియించె నోషధుల్ –ఆకర మాయే దారుణి చరాచర సృష్టికి విశ్వ మందుననన్ ‘’అని ఉపనిషత్ లలోని  ,ప్రాణి అవిష్కారాన్ని ఒక్క పద్యం లో చక్కగా చెప్పాడు కవి .చివరగా

‘’విశ్వ శోధన జేయు మీ విజ్నులకును –విశ్వ కారణ మేమియొ విదితమైన

ఆత్మ సాధన యందు తాదాత్మ్య మొంద-అంతరంగము నందునే యరయ లేర’’అని విజ్ఞాన వేత్తలకు చక్కని సుద్ది చెప్పి బాహ్య శోధనం కంటే అంతరంగ శోధన మంచిదని హితవు చెప్పాడు కవి దక్షిణా మూర్తి .

ఈ కవికి పద్యం ఒక రసప్రవాహమై నడిచింది .సందర్భ భావ శుద్ధి తో ప్రతిపద్యం హృద్యమైనది .పదాల వెదుకు లాట లేదు .అవి వాటి కవసరమైన స్థానాల్లో కూర్చుని పద్యానికి అందం లయ ,సౌభాగ్యం కల్పించాయి. కవి సహజ కవి అనిపించాడు . సుమారు అయిదేళ్ళక్రితం ఇలాగే ఒక కవి కోడి మేక ఆవు లఅంతరంగం పై పద్య కవిత్వం రాస్తే ఆ నాటి విజయవాడ ఆకాశవాణి డైరెక్టర్ మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు నాకు పంపి సమీక్ష చేయించి నాతో రికార్డ్ చేయించి రేడియో లో ప్రసారం చేయించిన సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చింది .సమస్త ప్రాణికోటి మీదా కవి కున్న దయా దాక్షిణ్యాలు చూస్తే ఆయన్ను ‘’దయా దాక్షిణ్య  దక్షిణా మూర్తి ‘’అనటం భావ్యమని పించింది .కవి స్వగ్రామ౦ తెలంగాణా లోని ఆదిలాబాద్ మండలం లో లక్సెట్టి పేట మండలం లోని ఇటిక్యాల . మరిన్ని అర్ధవంతమైన కావ్య రచన కవి నుండి ఆశిద్దాం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -23 41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్

—  ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –23

41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్

ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో 18-8-1883 న జన్మించి 17 9-1965 లో మరణించిన ఎర్నెస్ట్ వుడ్ , మాంచెస్టర్ మునిసిపల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ లోఫిజిక్స్ కేమిస్ట్రి ,జియాలజీ  చదివి ,బౌద్ధం ,యోగాలపై మక్కువతో సంస్కృతం అధ్యయనం చేశాడు .1907 లో స్థానిక ఫిలసాఫికల్ చాప్టర్ కు 24 వ ఏట ప్రెసిడెంట్ అయి ,1908 లో విస్తృత పరిజ్ఞానం కోసం ఇండియాలో మద్రాస్ లో ఉన్న అడయార్ కు వెళ్ళాడు .

 అనీబిసెంట్ ఉపన్యాసాల ప్రభావవంతో దియసఫీ పై ఆసక్తి పెరిగి ,ఆ సోసైటీలో చేరి మాంచెస్టర్ లాడ్జి లో ఉన్నాడు .తర్వాత అడయార్ సొసైటీకి 1908 లో ప్రెసిడెంట్ అయిన బీసెంట్ కు ముఖ్య అనుచరుడయ్యాడు .1909 లో అడయార్ కు లీడ్ బీటర్ ,చార్లెస్ వెబ్ స్టర్ లు వచ్చి చేరారు .లీడ్ బీటర్ బాల  జిడ్డు కృష్ణ మూర్తి ని కనుగొని ఆతడే భవిష్యత్తులో ప్రపంచ గురువు అని ప్రకటించిన విషయాన్ని ఎర్నస్ట్ వుడ్ ‘’ఈజ్ దిస్ దియాసఫీ ?’’అనే  పుస్తకం లోను ఆ తర్వాత రాసిన వ్యాసాలలోను పేర్కొన్నాడు .

 బీసెంట్ సలహాతో వుడ్ విద్యా బోధనలో చేరి సొసైటీ ఏర్పాటు చేసిన స్కూళ్ళలో కాలేజీలలో బోధన చేశాడు .తరవాత సింద్ నేషనల్ కాలేజి మదన పల్లి కాలేజి లలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ప్రిన్సిపాల్ గా చేశాడు .దియాసఫిని క్లాసులలో బహిరంగ ఉపన్యాసాలలో ,రచనల ద్వారా బాగా వ్యాప్తికి తెచ్చాడు .హెలెనా బ్రావిస్కి రాసిన ‘’సీక్రేడ్ డాక్ట్రిన్’’కు మంచి ప్రచారం తెచ్చాడు .ఇండియాలో ఆసియా ఐరోపా దేశాలలో అమెరికాలోను పర్యటించి దియాసఫీ పై ప్రసంగించి అవగాహన పెంచాడు .1932 లో ఒక నౌకా ప్రయాణం లో అవతార్ మెహర్బాబా నుచూశాడు .రెండవ ప్రపంచ యుద్ధ పరిసమాప్తి వరకు ఇండియాలోనే ఉండి తర్వాత అమెరికాకు  వెళ్ళాడు .

   దియాసఫీ భవిష్యత్తు ప్రశ్నార్ధకమై యోగా మీద దృష్టి పెట్టి లోతులు తరచాడు .జిడ్డు కృష్ణ మూర్తి విషయమై సొసైటీ చీలిపోయి ,1933 లో అనిబిసెంట్ మరణానంతరం వుడ్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశాడు .లీడ్ బీటర్ కు పూర్తీ అనుచరుడైన జార్జి అరండేల్ పావులు కదిపి ఎర్నెస్ట్ వుడ్ ను ఓడించాడు .ఇది మోసం దగా ,కుట్ర అని వుడ్ ఆరోపించాడు .దిశా నిర్దేశనం లేని సొసైటీ పై అసంత్రుప్తికలిగినా జిడ్డు వారి స్వయం వ్యక్తిత్వం పై ఆరాధనాభావమేర్పడి యోగం పై మనసు కేంద్రీకరించాడు .

           వుడ్ యోగ

భారత దేశం లోనిఎందరో యోగులను ,పండితులను కలిసి చర్చించాడు .అందరూ స్నేహితులయ్యారు చిన్ననాటి స్నేహితుడైన ఎడ్విన్ ఆర్నోల్డ్ రాసిన ‘’లైట్ ఆఫ్ ఏసియ’’గ్రంధం చదివి శాకాహారిగా ,,మద్యపానానికి దూరంగా ఉన్నాడు .మైసూర్ లోని శృంగేరి శివ గంగ సంస్థానం శంకరాచార్య స్వామి ఎర్నెస్ట్ వుడ్ యోగ సాధన సంస్కృత బోధనా  గుర్తించి ‘’శ్రీ సాత్వికాగ్రగణ్య ‘’బిరుదు ప్రదానం చేశారు ..భారతీయ యోగులలో ఏ ఒక్కరికీ వుడ్ శిష్యుడు కాడు.1928 లో అమెరికా వెళ్ళినప్పుడు జిడ్డు కృష్ణ మూర్తి ని మళ్ళీ కలుసుకొని ,అయన స్వయం వ్యక్తిత్వానికి ఆకర్షితుడై యోగ సాధనపై గ్రంధాలను చదివాడు .ఇక జీవితమంతా యోగ పై పుస్తకాలు రాస్తూ గడిపాడు .అమెరికా మళ్ళీ వెళ్లి కాలిఫోర్నియా లో అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఏసియన్ స్టడీస్ ‘’కు ప్రెసిడెంట్ గా ,డీన్ గా  పనిచేసి ,టెక్సాస్ లోని హూస్టన్ యూని వర్సిటి లో పని చేశాడు .

  ఇండియాకు తిరిగివచ్చి ‘’గరుడ పురాణం ‘’ఆంగ్లం లోకి అనువదించాడు .పతంజలి యోగ సూత్రాలు భగవద్గీత ,శంకరాచార్యుల వివేక చూడామణి కూడా ఆంగ్లం లోకితర్జుమా చేశాడు .ఈ ఉద్గ్రంధాలు ,వాటి వ్యాఖ్యానాలు ఆధునిక మానవునికి కరదీపాలని స్పష్టంగా చెప్పాడు .ఇండియా లో భార్య హీల్డా తో కలిసి మేరియా మాంటిసోరి విద్యా వ్యవస్థలో కొనసాగాడు.ఇటలీ లోని ముస్సోలినీ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో 1939 లో మేరియా మాంటిస్సొరి అడయార్ దియసఫికల్ సొసైటీ వారి ఆహ్వానం పై ఇండియా వచ్చి అడయార్ లో 19 37 నుండి 10 ఏళ్ళు 1948 వరకు ఉన్నది .ఆ కాలం లోనే ఇండియాలో చాలా మాంటిసోరి వద్యా సంస్థలు వెలిశాయి .

    1950  లో వుడ్ దంపతులు అమెరికాలో హూస్టన్ లో స్థిర నివాసం యేర్పచుకొన్నారు.యూని టేరియన్ ఫెలోషిప్ ఆఫ్ హూస్టన్ లో క్రియాశీలకం గా పని చేశాడు  .అక్కడ మాంటిస్సొరి స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది వుడ్ ను అనేక ప్రాంతాలవారు ఆహ్వానించి ప్రసంగాలు ఏర్పాటు చేశారు .1962 లో స్కూల్ ఏర్పరచి మాంటిస్సొరి భావ వ్యాప్తి కలిగించారు .విరిల్ రోడ్ లో ఫెలోషిప్ ప్రాపర్టి కి దగ్గర చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని వుడ్, హీల్డా దంపతులు అతి నిరాడంబరం గా ప్రశాంతంగా జీవిస్తూ స్కూల్ ను సర్వతోముఖంగా అభి వృద్ధి చేసి సంతృప్తి చెందారు  .1965 లో సెప్టెంబర్ 17 న 82 వ ఏట ఎర్నెస్ట్ వుడ్ ,ఆ తర్వాత 1968 లో హీల్డా మరణించారు .తరువాత బోర్డ్ వారు ఈ స్కూల్ ను’’ ది స్కూల్ ఆఫ్ వుడ్స్ ‘’అని గౌరవ ప్రదంగా మార్చారు .వుడ్ మరణాన౦తరమే ఆయన రాసిన వివేక చూడామణి అనువాదం ‘’ది పిన్నాకిల్ ఆఫ్ ఇండియన్ థాట్ ‘’ముద్రింప బడింది .

Inline image 1  Inline image 2

 సశేషం

       మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

4 of 18,265 Print all In new window ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -22’ 40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్

ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –22’

 40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్

18-7-1943 న ఆనాటి జర్మని ఈనాటి పోలాండ్ లో ని స్క్యూబాస్ లో మైకేల్ విట్జేల్ జన్మించాడు 1965 నుండి 71 వరకు జర్మనీలో ,పాల్ ధీమే ,హెచ్ పి స్కిమిట్ ,కె హాఫ్మన్ జే నార్తన్ ల వంటి ఉద్దాదుల వద్ద ఇండాలజీ చదివాడు .19 72 – 73 కాలం లో నేపాల్ లో  మీమాంస శాస్త్రాన్ని  జనునాద పండిట్ వద్ద అభ్యసించాడు .1972 -78 మధ్య కాట్మండు లో ‘’నేపాల్ –జర్మన్ మాన్యు స్క్రిప్ట్ ప్రిజర్వేషన్ ప్రాజెక్ట్ ను ,’’నేపాల్ రిసెర్చ్ సెంటర్ ‘’ను ఏర్పరచాడు . టూబింజేన్ ,లీడెన్ ,లలో పని చేసి 1986 నుండి హార్వర్డ్ లో చేస్తున్నాడు .క్యోటో పారిస్ టోక్యో లకు రెండేసి సార్లు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళాడు .1972 నుంచి సంస్కృతాన్ని బోధిస్తున్నాడు .

 వేద సంస్కృతం లో ప్రాచీన భారత దేశ చరిత్రలో ని మా౦డలీకాలు ,వేదమతాభి వృద్ధి భారత ఉప ఖండం లోని భాషా శాస్త్ర పూర్వ చరిత్ర మొదలైన వాటిపై , విస్తృత పరి శోధన చేసిన వాడుగా మైకేల్ విత్జేల్ గుర్తింపు పొందాడు .’’ఎలక్ట్రానిక్ జర్నల్ ఆఫ్ వేదిక్ స్టడీస్ ‘’కు హార్వర్డ్ ఓరిఎంటల్ సిరీస్ కు  ముఖ్య సంపాదకుడుగా ఉన్నాడు .1999 నుంచి ‘’స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ ఆఫ్ ప్రి హిస్టరీ ‘’అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్నాడు .2006 నుండి ‘’ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఫర్ కంపారటివ్ మైదాలజి ‘’కి ప్రెసిడెంట్ .2003  లో అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు మెంబర్ గా ఎన్నుకో బడ్డాడు .2009 లో జర్మన్ ఓరియెంటల్  సొసైటీ  గౌరవ సభ్యుడయ్యాడు .  ,2012 లో రాసిన ‘’కంపారటివ్ మైదాలజి ‘’గ్రంధం గుర్తింపు వలన హార్వర్డ్ యూని వర్సిటి లో   ఫాకల్టిఅఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కు కాబట్ ఫెలో గౌరవం20 13 లో  పొందాడు   .

     విత్జేల్ ముఖ్య పరిశోధన అతి ప్రాచీనమైన వేదాలపైన వాటి వ్రాత ప్రతులు ,పారాయణ పద్ధతులపైన.అంతకు పూర్వం లభించని కొత్త ప్రతుల అన్వేషణ చేశాడు .ఆతను సాధించింది ‘’కధా ఆర్యాంక ‘’.ఋగ్వేదాన్ని జర్మన్ భాషలోకి టి గోటే తోకలిసి కొత్తగా తర్జుమా చేశాడు .వేద శాఖల గూర్చి,ఉత్తర భారతం ఆ పై ప్రాంతాలలో వేద సంస్కృతీ వీటి వలన ఎలా వ్యాపించిందీఅనే విషయాలపై  విస్తృత పరిశోధన చేశాడు .దీనికోసం వేద మా౦డలీకాలపై 1989 లోను ,వేద ప్రామాణ్య అభి వృద్ధి  పై 1997 లో , ప్రాచీన భారతం పై 2003 లో పుస్తకాలు రాశాడు ఇవికాక విస్తృత పరిశోధనతో రాసిన వ్యాసాలూ చాలానే ఉన్నాయి అందులో ‘’ది అనాలిసిస్ ఆఫ్  ఇంపార్టెంట్ రెలిజియస్ అండ్ లిటరరీ కాన్సెప్ట్స్ ,ది సెంట్రల్ ఏసియ యాంటి సిడేన్ట్స్ ,ది మహా భారత ,ది కాన్సెప్ట్ ఆఫ్ రి బర్త్ ,ది లైన్ ఆఫ్ ప్రాజేని (సంతాన రేఖ ),సెవెన్ రిషిస్ ముఖ్యమైనవి .

 విత్జేల్ మరో గొప్ప పరిశోధన –మధ్యయుగ  ,ఆధునిక భారత దేశం నేపాల్ లలో సంప్రదాయాలు భాషా శాస్త్రం ,బ్రాహ్మణులు ,కర్మ కండలు ,రాజ్యాధికారం ,ఈ నాటి సంస్కృతీ ..మరో పరిశోధన వేద గ్రందాల స్థానీకరణ .ఋగ్వేద ,కృష్ణ యజుర్వేద సంహిత ,బ్రాహ్మణాల కాలం లో ప్రాచీన భారత దేశ చరిత్ర .కౌరవులది ఢిల్లీ ప్రాంతమే అన్న మరో పరిశోధన .ఇటీవలి కాలం లో విత్జేల్ –ఇండియన్ ,యూరేషియన్ పురాణాలకు ఉన్న సంబంధం –దీనివలన చారిత్రాత్మక తులనాత్మక పురాణ బంధాలు తెలిశాయి .ఇండస్ లిపి లోని భాషాశాస్త్ర సహజత్వాన్ని ప్రశ్నించాడు .హార్వర్డ్ లో అనేక అంతర్జాతీయ సెమినార్లు నిర్వహించి ఫలప్రదం చేశాడు .కాలి  ఫోర్నియా  స్టేట్ స్కూల్ చరిత్ర పుస్తకాలలో మార్పులు చేయాలని అమెరికాలోని వేదిక్ ఫౌండేషన్ ,హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఒత్తిడి చేస్తే విత్జేల్ నాయకత్వం లో ఒక  ఎక్స్ పర్ట్ పానెల్ ను వేసి మార్పులపై అధ్యయనం చేయమన్నారు .మధ్యవర్తిత్వం జరిపి కోరిన 58 మార్పులలో 12 మాత్రమె ఒప్పుకొని ఒక అవగాహన కుదిర్చి పుస్తకాలలోని విషయాలు మార్చనక్కర లేదని రిపోర్ట్ ఇచ్చాడు .దీనితో ఆయన హిందువులకు వ్యతిరేకి అని అభాండం వేశారు .2009 లో ఇండియా చైనాలు పర్యటించాడు .తాను హిందువులకు వ్యతిరేకిని కానని చెప్పుకోవాల్సి వచ్చింది .

Inline image 1Inline image 2

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-16 –ఉయ్యూరు  

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment