40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్ హెన్రి డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec)-2(చివరిభాగం )

40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్  హెన్రి  డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec)-2(చివరిభాగం )

చాలా ఏళ్ళ బట్టి తాగుడు బాగా అలవాటైంది .ఇరవయ్యవ ఏడుదాటే దాకా మద్యం ఒక మందు అని అనుకోలేదు .33ఏళ్ళకు బాగా అలవాటు పడ్డాడు .విపరీతమైన తాగుడు ,విరామం లేని శ్రమ తో 1899లో ఆరోగ్యం దెబ్బతింది .తల్లికోరికపై న్యూలిలోని శాని టోరియం  నర్సింగ్ హోమ్ లో చేర్చారు .ఆల్కహాలకు దూరమవటం తో ఆరోగ్యం బాగైంది ..తిరిగి వెళ్లి మళ్ళీ బాటిల్ ఎత్తితే కొంప కోల్లేరని  హాస్పిటల్ సిబ్బంది హెచ్చరించారు .అందుకే వాకింగ్ కు వెళ్ళినా మనిషిని తోడు గా పంపేవారు .అది చాలా అసంబద్ధం అనిపించింది .అటెండర్ ను మంచి చేసుకొని అతనితో బార్ కెళ్ళి వాడికి పూటుగా పోయించి తానూ సేవించి శానిటోరియం చేరేవాడు రహస్యంగా .విశ్రాంతి దొరకటం తో ‘’సర్కస్ ‘’అనే కొత్త సీరియల్ చిత్రాలు గీయటం ప్రారంభించాడు. మానసికంగా బాగానే ఉన్నాడని భావించి డాక్టర్లు రిలీజ్ చేశారు .మొదట్లో కొంచెం తగ్గిఉన్నా మళ్ళీ డ్రీంకింగ్ లో విజ్రు౦భి ౦ చాడు .1901లో పక్షవాతం వచ్చింది .తల్లి వచ్చి తమ మల్రోం కోటకు తీసుకు వెళ్ళింది .జబ్బు తీవ్రమై 37 ఏళ్ళకే 9-11-1901న చిత్రకారుడు డీ టోలోసే లాట్రేస్  చనిపోయాడు ..

ఒకప్పుడు లాట్రేస్ కదిలే  వస్తువులంటే ఆసక్తి చూపాడు .ఆడ మగ జంతువుల  నడకలు బాగా గీశాడు .ఆసక్తి కలిగించని ప్రకృతిని ఇష్టపడేవాడు కాదు .పూలు ,పళ్ళ అమరిక కన్యలకే కాని మగాళ్ళకు కాదనే వాడు ప్రతిదానిలో వేగం  తోకూడిన దృశ్యం గోచరి౦చాలన్నాడు , లాండ్ స్కేప్ లంటే అయిష్టం .’’land sccape is nothing and should remain nothing but an accessary –the painter of pure land scape is an idiot ‘’అని అభిప్రాయ పడ్డాడు .చిత్రం యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా స్పష్ట పరచాలంటేనే లాండ్ స్కేప్ కావాలన్నాడు .చిత్రకారుడు ఫోర్ర్టైన్ దగ్గర కొద్ది స్ట్రోకులతో కేరెక్టర్ ఎలా చూపచ్చో నేర్చాడు .ఫోర్తైన్ మనుషుల తప్పుల్ని చర్మం వొలిచినట్లు వొలిచి చూపేవాడు .కాని లాట్రేస్ వారిలోని వైపరీత్యాలను ,విషాద ,అసంగతాలను గీశాడు .అతని టెక్నిక్ జపనీస్ ప్రింట్ ను తలపుకు తెస్తుంది .ముఖ్యంగా వాటి లో ఉండే అసమతుల్యమైన రంగులకలయిక కన్పిస్తుంది .అతనికి ‘’their spatial diagnols ,broad flat areas of color strong silhouttes cutting off a figure withseeming arbitrarines,but actually with sharp discrimination and great effect ‘’బాగా ఇష్టం .

హెన్రి గీసినవన్నీసుమారు  15 ఏళ్ళ కాలం లో గీసినవే .బతికి ఉండగా ఒక్క పేయింటింగ్అమ్మితే ఒట్టు .తనవి, ఇతరులవి చిత్రాలు చాలా వేశాడు .అతని శరీరం బలహీనమైనదేకాని మైండ్ చాలా బలమైనది అన్నారు విశ్లేషకులు .అడ్వర్టైజింగ్ ఆర్ట్ కు ,పోస్టర్ కు రూపం ,డిగ్నిటి తెచ్చిన వాడు లాట్రేస్ ఒక్కడే  . మోడరన్ ఇలస్త్రేషన్లు అన్నీ ఆయన కళనుండి ఏర్పడినవే .అతని ప్రతిభను గురించి మెక్ అనే విశ్లేషకుడు వివరిస్తూ ‘’Henri succeeded in raising design to the level of a fine art .He allowed no distinction ,no snobbish arbitrary barriers between commercial and pure art ‘’అన్నాడు .వాణిజ్య కళకు అసలు కళకు ఉన్న విభజన రేఖను చెరిపేసిన గోప్పకళాకారుడు హెన్రి.అతను మోరలిస్టూ కాదు ,మనుష్య ద్వేషికాడు.అతనొక సాక్షిమాత్రమే .ద్వేషం, భయం లేకుండా మాట్లాడతానని ప్రతిజ్ఞ చేసి నిలబెట్టుకొన్నవాడు.సమాజాన్ని లెక్క చేయలేదు .కాని ప్రతివ్యక్తిని విపరీత౦గా  తాపీగా ,నెమ్మదిగా అధ్యయనం చేశాడు .ఆసక్తి తగ్గకుండా మనుష్యులను పరీక్ష చేశాడు .వారి విషయమై ముందే అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ఆలోచించాడు .స్వర్గం కాక నరకం కాక మధ్యస్తం గాఉన్న ప్రదేశాలలో ఉన్న మనుషులే ఆయనకు కావాలి .వారి గురించే ఆలోచించి వారినే చిత్రించాడు ..అందుకే అతని గీత సూటిగా సాగింది .తీక్షణ౦గా  ,నిరలంకృతంగా నగ్నం గా ఉంది .ఒక పర్య వేక్షకుడిగా బాధ ,విసుగు లనుండి మానవత తప్పించుకోవటం అతనికేమీ ఆశ్చర్యం కలిగించ లేదు .అతని మోడల్స్ అందరూ డాన్సర్లు ,డ్రింకర్లు,క్లౌన్లు ,ఆనందాన్ని వెతుక్కొనే అమ్మాయిలూ .అతని చిత్రణలో ఆనందం లేదు రంగు లేదు .ఆతను చిత్రించిన డాన్సర్లు గంభీరంగా ,క్లౌన్లు అలసిపోయినట్లుగా ,డ్రింకర్లు డల్ గా వ్యభిచారులు దారుణంగా ఉంటారు .కాని వాటిలో మానసిక అంతర్ ద్రుష్టి చాలా అగాధమైనది గా కనిపిస్తుంది .వాటిని సృష్టించిన సృజనకారుడు ,ఆచిత్రాలూ  కూడా సంతోషానికి ,నీచ దౌర్భాగ్య స్థితికి అతీతంగా కనిపిస్తారు .అతని గురించి క్లుప్తంగా చెప్పాలంటే ‘’the art of Touslouse Lautrec is the art of an intense observer who does not render verdicts but whose reports are clear un critically candid ,and not  without compassion ‘’అని చెప్పవచ్చు .

లాట్రేస్ జీవితం పై సినిమాలు నాటకాలు వచ్చాయి .మొత్తం మీద 737కాన్వాసులు ,  275వాటర్ కలర్లు ,363ప్రింట్లు ,పోస్టర్లు ,5084డ్రాయింగులు ,గ్లాసు పింగాణీవస్తువు లపై కళాత్మకాలు ఇంకా లెక్కకు రానివెన్నో గీసి  ఈ వామన చిత్రకారుడు కళావిశ్వ రూపం చూపించాడు .మేనట్,డేగాస్అనే ఇద్దరు ఇంప్రెషనిస్ట్ చిత్రకారులకు రుణపడి ఉన్నాడు .అతని శైలిపై ప్రభావం చూపింది జాపనీస్ వుడ్ ప్రింట్లు .అవే అప్పుడు పారిస్ లో బాగా చలామణిలో ఉండేవి .వ్యక్తులు పని చేసే పరిసరాలను రంగులతో కదలికలను రాత్రి జీవితాన్ని గీశాడు .గ్లామర్ కు  ప్రాధాన్యం లేదు .గుంపులో గోవింద లాగా ఉండక ప్రత్యేకంగా చూపటం అతని ప్రతిభ .సిల్హౌటీలను చిత్రించటం లో మార్గ దర్శి .పొడవైన పలుచని బ్రష్ స్ట్రోకులతో  కావాల్సిన ఫలితాన్ని రాబడతాడు .అతని ఆర్ట్ వర్క్ అంతా కలర్ పెయింట్ లో డ్రాయింగ్ లే  అనిపిస్తాయి .

 

Inline image 1 Inline image 2Inline image 3  Inline image 4

 

 

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

10-11-15 మంగళవారం నరక చతుర్దశితెల్లవారు ఝామున -మా ఇంట్లో” మాడున చమురు”కార్య క్రమం -మనవడు చరణ్ ,మనవరాలు రమ్య ,అబ్బాయి రమణ లతో 

This gallery contains 15 photos.

More Galleries | Tagged | Leave a comment

బేగం షా నవాజ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

బేగం షా నవాజ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

ఆసియా శాసన సభకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ – బేగం షా నవాజ్

జహానారా అని పిలువ బడిన బేగం షా నవాజ్ ప్రముఖ ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ షఫీ కుమార్తె .1896 లో పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించింది .అక్కడే క్వీన్ మేరీ కాలేజి లో చదివింది .మియాన్ షా నవాజ్ ను పెళ్లి చేసుకొని బేగం షా నవాజ్ అయింది .

అఖిల భారత ముస్లిం మహిళా సంఘం ఏర్పడినప్పుడు ,దాని నిర్మాణానికి ,అభి వృద్ధికి శక్తి యుక్తులన్నీ ధార పోసింది .1918లో లాహోర్ లో ఆ సంఘం సమావేశమైనప్పుడు ‘’బహు భార్యా వివాహం ‘’రద్దు చేయాలని ఒక తీర్మానం తీసుకు రావటం లో సఫలీ క్రుతమైంది .లాహోర్ లోని ’’అంజుమన్- ఇ-హిమాయత్-ఇ-ఇస్లాం ‘’సంస్థలో విద్యా ,అనాధ లకోసం ఏర్పాటైన కమిటీలలో భాగస్వామిని అయి కృషి చేసింది .అఖిల భారత ముస్లిం మహిళా సమాఖ్య లో చాలా చురుకైన పాత్ర పోషించింది .దాని ప్రాంతీయ శాఖకు అధ్యక్షురాలై చాలా సంవత్సరాలు పని చేసి తన దక్షత చూపించింది .అఖిల భారత ముస్లిం మహిళా సమాఖ్య కేంద్ర కమిటీకి వైస్ ప్రెసిడెంట్ గా సేవలు చేసింది

లాహోర్ మునిసిపల్ కమిటీ సభ్యురాలుగా ఉంటూ .ఎన్నో హాస్పిటల్స్ ,మెటర్నిటి ,శిశు సంక్షేమ కమిటీలలో ఉత్తమ కృషి చేసింది .ప్రాంతీయ ముస్లిం మహిళా సంఘానికి ఉపాధ్యక్షురాలి గా ఎన్నికైన మొదటి మహిళా గా రికార్డ్ లకెక్కింది ‘.ఆమె సమర్ధత ,సేవ ,అంకిత భావాలను గుర్తించి అఖిల భారత రెడ్ క్రాస్ సొసైటీ కి సభ్యురాలిని చేసి అరుదైన గౌరవం కలిగించారు . రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు బేగం షా నవాజ్ మహిళా ప్రతినిధిగా హాజరైంది .1935లో బేగం ‘’పంజాబ్ ప్రాంతీయ మహిళా ముస్లిం లీగ్ ‘సంఘం ‘’ఏర్పరచింది .1937లో పంజాబ్ శాసన సభ కు సభ్యురాలిగా ప్రజా బలం తో ఎన్నికైంది .విద్యా ,వైద్యనిధి ,పబ్లిక్ హెల్త్ లకు పార్లమెంటరీ సెక్రటరిగా నియమింప బడింది .1938లో అఖిల భారత ముస్లిం లీగ్ బేగం కు ‘’కేంద్ర మమహిళా సబ్ కమిటీ ‘’లోగౌరవ స్థానం ఇచ్చింది .1942లో కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘’నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ సంభ్యు రాలు ‘’గా నియమించి గౌరవించింది .తర్వాత ముస్లిం లీగ్ ఆమెను డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ షిప్ కు రాజీనామా చేయమని కోరితే తిరస్కరించింది .ఫలితంగా బేగం ను లీగ్ డిస్మిస్ చేసింది .

1946లో మళ్ళీ లీగ్ తీర్ధం పుచ్చుకొని పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికైంది .ఆ ఏడాదే ,బీగం ను ఏం ఏ .హెచ్ ఇస్ఫానీతో అమెరికా కు సౌహార్ద యాత్ర కు పంపారు .యాత్ర ముఖ్యోద్దేశం అమెరికా ప్రజలకు ముస్లిం లీగ్ మనో భావాలను వివరించి తెలియ బరచటమే .1947లోపంజాబ్ లో పెద్ద ఎత్తున జరిగిన శాసనోల్లంఘన కార్య క్రమాన్ని సమర్ధ వంతం గా నిర్వహించింది .ఇతర ముస్లిం లీగ్ నాయకులతో బాటు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళింది .’’ది హార్ట్ డివైడెడ్’’అన్న పేరుతొ భారత్ పాకిస్తాన్ విభజనపై గ్రంధం రాసింది .1948లో కూతురు ముంతాజ్ షానవాజ్ మరణించింది .దాన్ని తట్టుకోలేక పోయింది బేగం .కొడుకు డా అహ్మద్ షా నవాజ్ అమెరికాలోని మాసా చూసేట్స్ లో కెమికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ .ఈయన 2007లో చనిపోయాడు .బేగం కుమార్తె బేగం నసీం జహాన్ –పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు .జుల్ ఫికరాలీ భుట్టో ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైంది .మరో కుమార్తె ముంతాజ్ షా నవాజ్ 1948లో యునైటెడ్ నేషన్స్ లో పాకిస్తాన్ ప్రతినిదిగా హాజరవటానికి వెడుతూ విమాన ప్రమాదం లో చనిపోయింది . 82 ఏళ్ళ వయసులో బీగం షా నవాజ్ 27-11-1979 న మరణించింది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in రచనలు | Tagged | Leave a comment

బీహార్ లో మళ్ళీ నితీష్ -ముదిగొండ -భాజపా స్వయంకృతాపరాధం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బీహార్ పాఠాలు ,మట్టి ఇచ్చిన మట్టి వచ్చును

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాకెట్ మాన్ టిప్పు తుల్తాన్ ,భారతీయ సంస్కృతీ తేజస్సు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్


Inline image 1
 
 
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -92

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -92

40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్  హెన్రి  డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec)

అంగవికల ఆరిస్టోక్రాట్ ,ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ ,వెలివేయబడిన వారితో ఆటలతో ,మార్పు చెందిన మాల్ ఫార్మేడ్ సొసైటీ తో గడిపే హెన్రి డీ టోలోసే లాట్రే24-11-1864న ఫ్రాన్స్ లోని అల్బి లో పుట్టాడు .తండ్రి కౌంట్ ఆల్ఫాన్సే స్వంత కజిన్ ఎడిలే ను  పెళ్లి చేసుకొన్నాడు .తండ్రి ది విపరీత ధోరణి .ఒకతెల్ల  ఆడ గుర్రాన్నిఎక్కి పారిషియన్ పార్కులన్నీ  చుడుతూ ,దిగి దాని పాలు పిండుకొని తాగాడు .గర్విష్టి,తారుమారుగా మాట్లాడేవాడు .పల్లెటూర్లన్నీ తిరుగుతూ తనతో బాటు ఒక డేగ (హాక్ )ను కూడా తీసుకు వెళ్లి దారిలో జంతువుల్ని చంపి దానికి ఆహారంగా పెడుతూ తిరిగాడు .గతం లోనే ఎప్పుడూ జీవిస్తూ రేసింగ్ ఇష్టపడుతూ ,ఆధునిక ప్రపంచాన్ని ముఖ్యంగా మోడరన్ ఆర్ట్ ను ఏవగించు కొంటూ గడిపాడు .దీనికి విరుద్ధమైనది అతని భార్య .ప్రశాంతంగా పవిత్ర హృదయం తో ఉండేది .మతసంబంధ జీవితాన్ని గడిపేది .బాగా చదువుకున్న సంస్కారం ఉన్న యువతి .సంస్కారాభివ్రుద్ధి కోరుకొనే ఇల్లాలు .పెళ్లి అయిన తర్వాత చాలా ఏళ్ళు ఈ దంపతులు విడిగానే జీవించారు .తనకీ తన భార్యకీ మధ్య దగ్గర సంబంధం ఉండటం వలన రక్తాలు కలవక పోవటం వలన తన కొడుక్కి అంగ వైకల్యం వచ్చిందని నమ్మేవాడు కౌంట్ .అందుకే భార్యను దూరం గా ఉంచాడు .

తల్లిలాగానే కొడుకు హెన్రి కూడా చాలా సున్నితంగా మంచి ప్రవర్తనతో ఉండి తల్లి అంటే అమిత ప్రేమ చూపేవాడు .ఒకే ఒక్క సోదరుడు పసితనం లోనే చనిపోయాడు .హెన్రి మూడవ ఏట క్రైస్తవం లో చేర్చే ఉత్సవం లో అక్కడ చర్చి లో ఉన్న  పుస్తకం లో పెద్దవాళ్ళు సంతకాలు చేస్తుంటే తానూ చేస్తానని మారాం చేశాడు .’’నీకు చదువురాదు కదా రాయలేవు ‘’అని అంటే ‘’అదినాకు తెలుసు కాని ఒక ఎద్దు బొమ్మ గీయగలను ‘’అని సమాధానం చెప్పాడు .అతని బాల్యం అలీబి కోట లోను పారిస్ లోను గడిచింది .పారిస్ లో లిసీ కండోర్సెట్ లో చదువుకు చేరాడు .బాగా చదివేవాడు .త్వరగా అన్నీ నేర్చేవాడు .స్నేహితులతో కలిసేవాడు బొమ్మలు బాగా వేసేవాడు .గుర్రాలు జంతువులను పరిశీలించి వాటి బొమ్మలను లెక్కలేనన్ని చిత్రించాడు .తనలాగే కొడుకు హార్స్ మాన్ గా స్పోర్ట్స్ మాన్ గా తయారవ్వాలని తండ్రి కోరిక .

11వ ఏట హెన్రి కోట లైబ్రరీలో పాలిష్డ్  నేలమీద పడిపోయాడు  .దురదృస్ట వశాత్తు తుంటి ఎముక విరిగింది .అది అతుక్కోవటానికి చాలా కాలం పట్టింది .క్రచేస్ సహాయం తో తల్లితో వాకింగ్ చేసేవాడు .మళ్ళీ అదృష్టం కలిసిరాక ఒక క్రచెస్ జారిపోయి వీధిలో పడిపోయి రెండో కాలి తుంటి ఎముకా విరిగింది .అప్పటికి 15ఏళ్ళు మాత్రమె .తర్వాత రెండేళ్ళు దేనికీ పనికి రాకుండా పోయాడు .ఇక తన కాళ్ళు సరికావని ,తానిక నడవ లేనని కు౦గి పోయాడు .కుంచించుకు ఉండిపోవాల్సి వచ్చింది .కాళ్ళు పెరగటం ఆగిపోయాయి .మిగతా శరీరభాగ మంతా పరిపక్వమైంది .మొండెం బాగానే పెరిగింది .తలమాత్రం మిగిలిన శరీరం కంటే ఎక్కువగా పెరిగింది .కాళ్ళు మాత్రం మరు గుజ్జు వైనాయి .యవ్వన ప్రాదుర్భావం లో సర్వాంగ సుందరంగా వికసించాల్సిన వాడు చాలా వికారంగా వికృతంగా అయ్యాడు .ముక్కు పెద్ద బల్బు లాతయారైంది .పెదిమలు బండగా ముతకగా బాగా ఎర్రగా అయ్యాయి .మూతి చిన్న నల్ల గడ్డం తో ఉండేది  . ఎత్తు నాలుగు అడుగులకు కొద్దిగా ఎక్కువ .పెరిగిన వయసులో మొండెం ,ఆ చిన్ని కాళ్ళమీద చూస్తుంటే చూడటానికి భయంకరంగా ,అసహ్యకరంగా ఉండేది పాపం .కాని  కళ్ళు మాత్రం చాలా సున్నితంగా సుతి మెత్తగా ఉండేవి .ఆ కళ్ళలో ప్రేమ ,స్నేహం ఉన్నా పెద్ద కల్లద్దాల వెనక అవి కనబడేవికావు .ఎందరో అతని చిత్రాలు గీశారు కాని ఆయనే స్వయం గావేసుకొన్న చిత్రం లో ఇవన్నీ స్పష్టం గా కనిపిస్తాయి .అతని వికారమైన తల ,కోతిలాంటి సిమ్మేట్రి లేని ఆకారం అందులో ప్రస్పుటంగా చిత్రి౦చుకొన్నాడు .

తండ్రి కౌంట్ కొడుకు హెన్రి వికృత రూపాన్ని భరించలేక పోయాడు ఇదివరకంటే కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ మరింత సన్నిహితుడయ్యాడు తల్లి ప్రేమకంటే తండ్రిప్రేమ ఎక్కువైంది .తల్లి కొడుకుని త్వరగా స్కూలు విద్య పూర్తీ చేసి ఆర్ట్ అధ్యయనం చేయమని సలహా ఇచ్చింది .అప్పటికే రినే ప్రిన్సిటా అనే ఫామిలీ ఫ్రెండ్ నుంచి హెన్రి కొన్ని సూచనలు పొందాడు .రినే రేసింగ్ , వేట సీన్లు వేయటం లో సుప్రసిద్ధుడు .హేన్రిని బోనాట్ అనే చిత్రకారుని దగ్గర చేరి నేర్చుకోమని సలహా ఇచ్చాడు .సృజన లేని హెన్రి జీవితం లో ఏదీ గీయలేడని ఢంకా బజాయించి చెప్పాడుఆయన  .తర్వాత ఫెర్నాండ్ కార్మాన్ అనే పెయింటర్ దగ్గర చేరాడు .ఈయన గొప్ప క్రమశిక్షణ,ఓర్పు వున్నవాడు .ఈయనదగ్గరున్నప్పుడే ప్రముఖ చిత్రాకారుడు ‘’వాన్ గో’’ ,మరికొంతమంది యువ ప్రయోగ శీలుర తో పరిచయ మయింది .ఇక ఎవరి శిక్షణా లేకుండానే స్వయం గా ఎదిగాడు హెన్రి .

20ఏళ్ళ వయసులో మాంట్ మాట్రే లో నివసించాడు .ఇది పారిస్ లో ఒక భాగం .ఇక్కడే ప్రముఖమైన పూటకూడు ఇళ్ళు ,ఈతగాళ్ళు ఉండేవారు .ఇది సిటీ కి దూరంగానేకాక ,చట్టానికీ దూరంగా ఉన్న ప్రాంతం .దీని వైవిధ్యం 1818వరకు బాగా ప్రసిద్ధమైంది .లాటిన్ క్వార్టర్ లలో ఉండే ఆర్టిస్ట్ లు రచయితలూ ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు .రాత్రి జీవితం ఒక వెలుగు వెలిగింది ఇక్కడ .’’కాబెరేట్స్, ఆర్టిస్టిక్స్ ’’గా పిలువబడే ఇక్కడ నైట్ క్లబ్బులు ,డాన్స్ హాళ్ళు సాహిత్య జీవులకు ఆర్టిస్ట్ లకు  మోడల్స్ కు సమావేశ స్థలా లైనాయి .మన ఆర్టిస్ట్ కు ఇక్కడి నివాసులతో పరిచయమేర్పడింది .తల్లిని తానిక్కడ   ఉండటానికి అనుమతికోరి దాదాపు ఇక్కడే ఉండిపోయాడు .స్నేహితుల అపార్ట్ మెంట్ లలో కలిసి ఉండేవాడు .ఒంటరిగా ఎప్పుడూ ఉండేవాడుకాదు .డీ మార్లిటన్  ప్రోప్రైటర్ అరిస్తైడ్ బ్రాంట్ అంటే మహా ఇష్టపడేవాడు.అతనికి చాలా చిత్రాలు వేశాడు .బ్రాంట్ గాయకుడు .బాలడ్స్ రాసేవాడు .అవి కూడా ఈ ప్రాంతం లో దగాపడిన మోస పోయిన వారిగురించి కవితలు రాసేవాడు .ఆతను హాస్య గాడు .పోకిరీజనంఅంటే ఇష్టం ఇక్కడున్న డాన్స్ హాల్స్ తో   బ్రోతల్ హౌసెస్ తో హేన్రికి దోస్తీ బాగా కుదిరింది .డాన్స్ హాళ్ళలో తిండి, మందు ,డాన్సులతో పాటు లభించేవి .అద్భుతమైన డాన్సులకు కేంద్రంగా ఉండేవి. ఎలిస్ మాంట్ మాట్రేలో ప్రొఫెషనల్స్ మాత్రమె చేసే డాన్సులు ఉండేవి .వీటిని చూడటానికి క్లబ్ పోషకులు ,వచ్చేవారు .అందులో ప్రఖ్యాతులందరి చిత్రాలు లాట్రేస్ఆరాధనా భావం తో  చిత్రించాడు .  మరొక కేబరేట్ ప్రొప్రైటర్,దివాన్ జపనీస్ మేనేజర్ కవిత్వం అల్లేవాడు .ఇతనే హేన్రికి  .పాత జానపద గేయాలతో ప్రేక్షకుల్ని ఉర్రూత లూగించే గాయని యువేటి గిల్బర్ట్ ను పరిచయం చేశాడు .ఆమె ఫీచర్స్ కు మనవాడు ఫ్లాటయ్యాడు .ఒకసారి ఆమె మనవాడు వేసిన చిత్రాలను చూడటానికి వచ్చినప్పుడు ఆమె చిత్రం గీసేశాడు ఆమెకు ఏదో  ఉపద్రవం జరిగి పోయినట్లు ఫీలయి’’నిజం గా మీరు వికలా౦గులై నా  పెయింటింగ్ లో  జీనియస్ ‘’అన్నది .’’సహజమే ‘’అన్నాడు .

శారీరక వక్రత హెన్రి లో విషాద వేదాంతాన్ని నింపింది .అతని పక్వ కళ కేబరేలలో ఇరుక్కు పోయి౦దన్నారు .మనిషిలోని ఉన్నతిని ఆతను వదిలేశాడు  .అందుకే అది విషాదాన్ని వదిలేసింది .అతనికళ కుళ్ళిపోయిన శిధిలమైన వాటినే చిత్రించింది .ఈ ప్రదేశ వాసుల జీవితాలను చిత్రించటం లో అతని భుక్తి గడిచింది .ఇందులో కొద్దిభాగమే గీశాడు .అందులోని అంతర్గత ప్రవాహాల జోలికి వెళ్ళలేదు .ఆతను స్నేహం, ఆప్యాయత కోరుకున్నాడు .అందుకే అసహజమైన వాటినే చిత్రించాడు .విదూషకులతో ,సైకిల్ తోక్కేవాళ్ళతో ,బల ప్రదర్శకులతో తిరిగి, వారినే గీశాడు .గుర్రపు పందేగాళ్ళను ,డాన్సర్లను ,ధైర్య సాహసవంతుల్ని చిత్రించలేదు .ఆశ్చర్యం కలిగించనివి,కోపం తెప్పించనివి  అతనికి ఇష్టం .ఒక అందమైన జ్యూయేస్అతనిపై సానుభూతితో దగ్గరై మిస్త్రేస్ అయింది .కాని ఆడవాళ్ళు ‘’ఈ లిటిల్ మాన్ స్టర్(పిల్ల రాక్షసుడును చూసి  ఉలిక్కిపడి పారిపోయేవారు  .అందుకే మనవాడి శ్రు౦గార చేస్టలన్నీ వ్యభిచారులతోనే .వారితోనే తృప్తి తీర్చుకోనేవాడు.కనుక వాస్తవమైన ప్రేమ ,పెళ్లి అతని జీవితం లో ‘’ఔటాఫ్ క్వస్చిన్ ‘’అయింది .వారితోడిదే జీవితం ప్రేమా ,ఆనందం తృప్తి సౌఖ్యం వారికి ఆతను స్నేహితుడైన ఆర్టిస్ట్ .వారి నిరాశామయ జీవితాలకు అతడే వెలుగు .వారి చిత్రాలనే గీసి సంతోష పెట్టేవాడు .నెలకు రెండువారాలు వారాంగన ల ఇళ్ళల్లోనే మకాం .అక్కడున్నప్పుడే అమితానందాన్ని పొందేవాడు .తనను కలుసుకోవాలనుకొన్న కన్జర్వేటివ్ ఫ్రెండ్స్ ను అక్కడికే వచ్చి మాట్లాడమనే వాడు .వాళ్ళకు  ఈ అడ్రస్ లు కనుక్కోలేక తలప్రాణం తోక కొచ్చేది .తన సెట్టింగ్ ల గురించి చెబుతూ ‘’every where there is ugliness and every where ugliness has its beautiful aspects .It is thrilling to discover them where nobody has noticed their existence ‘’అన్నాడు .

అతని స్టూడియో లన్నీ ‘’ఎవరిగోల వారిది ‘’గా రణ గోణ ధ్వనులతో ,చిందర వందర పెయింటంగ్ లతో ఉండేవి .ఆ ప్రాజెక్ట్ లలో ఏమున్నాయో కూడా తెలీని స్థితి .ఒక సారి రూమ్ మారుస్తూ ఉన్నగదిలోనే 80 కేన్వావాసులను గోడకు వదిలేసి వెళ్ళిపోయాడు .స్నేహితులకు అదిరిపోయే పార్టీలు ఇస్తూ’’ కంగారూ రో’’స్ట్’’తినిపించేవాడు .ఎన్నోరకాల మద్యాలు పోసేవాడు తాగేవాడు తాగించేవాడు తినేవాడు తినిపించేవాడు .ఇరవై ముప్ఫై మధ్య వయసులో ఆతను తిరిగిన మ్యూజిక్ హాళ్ళు ,రేసులు ,సర్కసులు హాస్పిటల్స్ అందులో ముఖ్యం గా ఆపరేషన్ దియేటర్లు ,కోర్ట్ రూములు బ్రోతల్ హౌసులు  లెక్కలేనన్ని . వింత ప్రవర్తన ఉన్న వారందర్నీ చూసేవాడు .వెయ్యికి పైగా డ్రాయింగులు , ,లితోగ్రాఫులు పెయింటింగులు వేశాడు .క్షణ జీవితానికి ఇష్టపడేవాడు .భవిష్యత్తు గూర్చి ఆలోచన ఉండేదికాదు .సాంగ్ షీట్స్ గణాంకాలు ,ప్రకటనలు,దియేటర్ ప్రోగ్రాములు ప్రదర్శన అట్టలు (ప్లేకార్డ్ )బొమ్మలు వాణిజ్య స్కెచ్ లు అన్నీ తయారు చేసిచ్చేవాడు .తన తల్లి లోని ‘’అమ్మతనం ‘’పై అద్భుతమైన లోతైన అవగాహనతో చిత్రాన్ని గీశాడు .వాన్ గో,ఆస్కార్ వైల్డ్ చిత్రాలు గీశాడు .నిరంతర యాత్రాశీలి .ఇంగ్లాండ్ హాలండ్ స్పెయిన్ బెల్జియం దేశాలు తిరిగాడు .అక్కడ తన అభిమాన చిత్రకారుడు వాన్ గో ను గేలి చేసినవాడితో దాదాపు ద్వంద యుద్ధం చేశాడు .ఫ్రాన్స్ సముద్ర తీరాన్ని చుట్టాడు . దాని అందాలను చిత్రాలలో బంధించలేదు .కాని స్థానిక బార్ మెయిడ్స్ పెయింటింగ్ లను కొని తెచ్చుకొన్నాడు .హెన్రి ప్రపంచం మాంట్ మాట్రే ఒక్కటే .ఇక్కడ స్వంత ఇంటి  ఆనందాన్ని అనుభవించాడు

.Inline image 1.

సశేషం

దీపావళి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-11-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆత్మ జ్యోతి – నవంబర్ లో జొన్నాడ క్షేత్రం -గబ్బిట దుర్గా ప్రసాద్

Aatmajyothi_Oct_2015_web

Aatmajyothi_Nov_2015_for_web00570058

 

0058

0059 0060 0061










 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆత్మ జ్యోతి – అక్టోబర్ లో శ్రీశై లం -గబ్బిట దుర్గా ప్రసాద్

0002 0074 0075 0076 0077 0078 0079 0080 0081 0082

Posted in రచనలు | Tagged | Leave a comment

బీహార్ ఠపాసులు

బీహార్ నితీష్ లాలూ లకు ముందే వచ్చిన దీపావళి 

మోడీ అమిత్ షా జోడీ ని ముందే  ముంచేసిన తిమిరావళి 
మాటల మంత్రాలతో ఓట్ల చింతకాయలు రాలవు బాసూ
అందర్నీ కలుపుకు పోయే  ప్రయత్నం చెయ్యాలి షురూ  
వీర గెలుపు ఒక ఏడాదిన్నర కితం
నేడు పరువు అయి పోయింది హతం 
వాగ్దానాలు అర్జంట్ గా అమలు చేస్తేనే నమ్ముతారు 
లేకుంటే ఇక బీహార్లో లావెంటబడి  జనం కుమ్ముతారు 
ప్రపంచ భ్రమణం లో గడిచాయి నెలలు పద్దెనిమిది 
ఒక్క అభివృద్ధి పని జరిగిందా ఇక్కడ ఏంది భాయీ ఇది ?
ముసలాళ్ళని  మూల కూర్చో బెడితే ఆద్వానీ లాంటి పెద్దల్ని
సహకారం ఎలా వస్తుంది పార్టీలో పెడితే ప్రచారానికి గద్దల్ని? 
అయినా ఒక రాష్ట్రం పై అంతఎన్నిక పగ దేనికి ?
పదహారుగురు మంత్రుల్ని మొహరించినా కోల్పోయావు  ఉనికి 
ప్రధాని పదవికే  ఏర్పడింది ఇప్పుడు  పెద్ద మచ్చ 
హుందాగా ఉండాలి కాని ఎందుకీ రచ్చ రచ్చ ?
నాడు ఘనం గా వెలిగి పేలిన  ” మోడీటపాసులు” 
 నేడు బీహార్ లో అయ్యో పాపం అయ్యాయి తుస్సు తుస్సులు 
అమరావతి శంకుస్థాపన కొచ్చిడబ్బివ్వకుండా  తెస్తావా మట్టీ నీరూ
అందుకే డబ్బుపాకేజీలు ప్రకటించినా  బీహారీలు  నమ్మ లేదు గురూ 
మట్టీ మశానం కమలానికేసి ఓట్లు మాత్రం అటుకుమ్మరించారు
భూస్థాపితం అవుతు౦దను కొన్న కాంగ్రెస్ కు 
నువ్వే బీహార్ తులసి తీర్ధం పోసి బతికి౦చావ్ కైకూ ? 
మొన్న కళ్యాణ్ మున్సిపాలిటీ  కొట్టిన చెంపదెబ్బ
ముందే పసిగట్టి  చెప్పారు తగలబోయే బీహార్ దెబ్బ 
దేశమంటే గుజరాత్ కాదని గ్రహించు గాంధీ పటేల్ వారసుడా 
సర్దుకోవాలి సర్దుకు పోవాలని తెలుసుకో అటల్జీ ప్రేమికుడా 
ఇప్పటికే రెండు రాష్ట్రాలలో చేతులు కాలి ఎక్కాయి బొబ్బలు 
సరి చేసుకోకుంటే నీకూ కమలానికి తగిలేదిఖాయం ఎదురు దెబ్బలు  
ఇల్లలుకగానే పండగ కాదని తెలుసు కోవాలి
ఇంటిలోని పెను పోరు తీర్చి రచ్చ గెలవాలి 
పెద్దల పెద్దరికాన్ని వినియోగించుకో కుంటే  
 ఇప్పటిలా మెడలో పడుతుంది ఇబ్బందుల  ఇనప కంటే
చరిత్రహీనుడై పోతాడనుకొన్నకుర్ర కాంగీ నాయకుడికి
నీ అస్తవ్యస్త ఆలోచనలతో తెచ్చి పెట్టావు అనవసర గిరాకీ  
ప్రజా నాడిని పసిగట్టలేని నీ” అమితాశల ”షా బృందం 
ఇక పని చేయలేదని గ్రహించి ఏర్పరచు మేల్కలయికల కొత్తబృందం 
నిన్ను మోసిన నాకే ఇంత కంపరంగా ఉంటె 
మిగిలిన వాళ్ళ సంగతేంది? అవ్వా సిగ్గు1 చెప్పు కొంటె . 
వెలుగుల దీపావళి నాడు ఇలా రాయాల్సి వస్తుందనుకోలేదు  
కడుపులో బాధ కక్కుకుంటే పోతుందో లేదో తెలీదు 
  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -9-11-15-ఉయ్యూరు . 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఈ తరం తోనూ ప్రయాణం చేస్తున్నా -తుమ్మేటి ,ఉయ్యాల బాలుడు ఉడిపి కృష్ణుడు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగు

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -91

39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్ –3(చివరి భాగం )

ఫోర్డ్ సామ్రాజ్యం బాగా విస్తరించాక విశేష అధికారాలను పొందాడు .కనుక తప్పులు చేయటానికి సాహసి౦చ లేదు .జరిగిన తప్పులన్నీ ఆయనపై ప్రభావం ఉన్నవారి వల్ల జరిగినవే ననే ఆరోపణ వచ్చింది .ఒకరిపై ఒకరిని ఉసి గొల్పి వినోదించే మనిషి ఫోర్డ్ ,యెంత ప్రాముఖ్యమైన వ్యక్తీ అయ్యాడో అంత డేంజర్ కూడా అయ్యాడు .కంపెనీలో పని చేసే అత్యున్నత స్థాయి ఆఫీసర్లను కింది తరగతి స్వీపర్లను పీకి పారేసినట్లు తీసిపారేశాడు .అలాంటి వారిలోఫోర్డ్ తో మొదటినుంచి పని చేసి కంపెనీ వ్యాప్తికి అన్ని విధాలా తోడ్పడి,వర్కింగ్ బ్రదర్ లా ఉన్న  జీనియస్ జేమ్స్ కజిన్స కూడా  ఉండటం బాధాకరం . అలాగే ప్రొడక్షన్ సూపరిన్టే౦ డెంట్,విల్లో ర న్ లో వార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన  హార్లేస్ సోరెంసన్ కూడా ఉన్నాడు .ముఖ్య బిజినెస్ సెక్రెటరి ,ఆంతరింగుకుడుఎర్నెస్ట్ లీ బోల్డ్ ను కూడా ‘’ఫైర్’’చేశాడు. కాల్చాడు అని కాదు  తీసేశాడని అర్ధం .ఫోర్డ్ దగ్గరున్న అతి ముఖ్యమైన నలుగురిలో బాడీ గార్డ్ ,స్క్రీనింగ్ ఏజెంట్ అయిన హారీ బెన్నెట్ ను ఒక్కడినే తన దగ్గర ఉంచుకొని మిగిలిన ముగ్గురికి ఉద్వాసన పలికాడు ఫోర్డ్ మహాశయుడు .ఫోర్డ్ చనిపోయేదాకా ఇతనున్నాడు .ఫోర్డ్ చనిపోయాక అప్పటికే ఫోర్డ్ ఎస్టాబ్లిష్ చేసిన సర్వీస్ ను తాను స్వీకరించానని  చెప్పాడు .ప్రతివాడూ మరోకరిని చెక్ చేసేవారని,ఉద్యోగుల్లో అయిదుగురిలో ఒకరు గూఢ చారి లేక సర్వీస్ మనిషి  ఒకరు ఉండేవారని,టాయ్ లెట్లకు వెళ్ళినా వెంబడిం చేవారని ,ఫోర్డ్ కంపెనీలో ఫోర్డ్ కు తెలియ కుండా ఏ చిన్న విషయమూ జరగదని బెన్నెట్ చెప్పాడు .

చాలాకాలం చాలా సమస్యలకు తన దగ్గర సమాదానాలున్నాయని ఫోర్డ్ నమ్మాడు .విద్యా గంధం లేని వ్యవహార దక్షుడు ,శక్తి వంతమైన పారిశ్రామిక వేత్త,అధిక సంపన్నుడైన ఉత్పత్తిదారుడు అన్నిటా తానె అయిన వాడైపోయాడు .రాజకీయాలు కూడా ఒక పరిశ్రమ . కనుకమిచిగాన్ నుంచి సెనేటర్ గా పోటీచేశాడు ఆయన రిపబ్లికన్ అయినా ఆ పార్టీ నామినేషన్ సాధించలేక పోయాడు .డేమోక్రాటిక్  టికెట్ పొంది ముగ్గ్గు లో దిగాడు .ఓడిపోయాడు .కాని తల వంచుకో లేదు .ప్రత్యర్ధి కదలికలు గమనించటానికి రాహస్య ఏజెంట్ లను ఏర్పాటు చేసి ,అతని అవినీతి బాగోతం బయట పెట్టి ,అతని రాజీనామాకు పట్టు బట్టాడు .కాని సాగ లేదు .కొడితే ఏనుగు కుంభ స్థలమే కొట్టాలనుకొని ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలనుకొన్నాడు .ఫోర్డ్ పత్రిక లో ‘’the next president of the United States will be a man who can read a blue print and who understands the problems of production and how to keep men employed ‘’అని ప్రకటించు కొని బిల్డప్ ఇప్పించు కొన్నాడు  .రాండాల్ఫ్ హార్స్ట్ పేపర్లు వెన్ను దన్నుగా నిలిచాయి ‘.’’ది లిటిల్ మాన్స్ లిటిల్ మాన్ ‘’అని ఆకాశానికి ఎత్తేశాయి .ఫోర్డ్ ను ఏదో ఒక పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టక పొతే అయన స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడి గెలుస్తాడు అనే అభిప్రాయం వ్యాపింప జేశాయి .ప్రతివారూ ఫోర్డ్ వైపే ఉన్నారు .వ్యవసాయ దారుల ట్రాక్టర్లు ఆయనవే .ప్రొహిబిష నిస్ట్ లు ,పెసిఫిస్ట్ లూ ,పని చేసేవారుఅయన వైపే . ,ఫోర్డ్ కార్లు వాడేవారు దేశ జనాభాలో చాలా ఎక్కువ మందే ఉన్నారు .ఇలా మాంచి ఊపులో రాజకీయం నడుస్తుండగా ఫోర్డ్ అకస్మాత్తుగా తానూ ప్రెసిడెంట్ పదవికి పోటీ దారును కాదని ,తన ఆలోచనను విరమించుకొంటున్నానని సంచలన ప్రకటన చేశాడు  .ఫాక్టరీ లో జరిగిన సంఘటనలు ,ఆయనకు చరిత్రా సంస్కృతులపై నమ్మకం లేక పోవటం లేక అవి తెలియక పోవటం ఫోర్డ్ లోపాలని ఆయన ‘’అవివేకి ‘’అని ‘’చికాగో ట్రిబ్యూన్ ‘’పత్రిక ఆరోపిస్తే ఫోర్డ్ దానిపై మిలియన్ డాలర్లకు డామేజ్ సూట్ వేశాడు .ఆ పత్రిక సాక్ష్యాలుగా బెనెడిక్ట్ ఆర్నాల్డ్ ఎవరో ఫోర్డ్ కు తెలియదని ,1812 యుద్ధం రివల్యూషన్ అన్నాడని ,ఆయన ‘’   history is bunk ‘’అన్నాడని చూపాయి . ఫోర్డ్ కేసు గెలిచాడు.కాని ప్రిస్టేజ్  డామేజ్ కింద ఆయనకు దక్కినది కేవలం ‘’ఆరు పెన్నీలు ‘’మాత్రమె అంటే కోర్టు’’ ఆయన పరువు విలువ 6 పెన్నీలు ‘’అని అభిప్రాయ పడిందా ?దీనితో  అహం మరీ దేబ్బదిన్నది .ఉడికిపోయాడు.అవమానం పాలైనాడు .దీని నుంచి బయట పడటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు .వర్తమాన క్రూర వాస్తవాన్ని గమనించాడు . గతాన్ని అర్ధం చేసుకున్నాడు .

గతం తవ్వుకొన్నాడు బాల్యపు స్మృతులు గుర్తు తెచ్చుకొన్నాడు .పాత నాగలి, కత్తి,కొడవలి చేతి శ్రమ ,నెమ్మదిగా నడిచే పల్లె జీవితం జ్ఞాపక మొచ్చాయి .  గ్రామ సీమలు కరెంట్ లేకుండా సరైన దారి సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయని గమనించాడు .మర్చి పోయిన కాలానికి చెందినస్మ్రుతి చిహ్నాలను సేకరించి భద్ర పరచాడు  .ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ కళ్ళముందు ప్రదర్శించాడు .భవిష్యత్ తరాలకు స్పూర్తి కలిగించాడు .పాత కాలపు నాట్యాలను సంగీతాన్ని వెలుగు లోకి తెచ్చాడు .ఫాక్టరీలో డాన్సింగ్ పార్టీలు ఏర్పరచి వాటి వివరాలను ముందుగానే బుక్ లెట్ లలో ముద్రించి తెలియ జేసేవాడు .పాతతరం వయోలిన్ వాద్య కారులను కలిసి వారి సాయం తోఅమెరికాలో ఉన్న  పూర్వకాలపు వయోలిన్ లన్నిటినీ సేకరించి భద్రపరచాడు . .అందులో అమరాటి,,స్త్రాడివారి,గుర్నేరి మొదలైన ప్రసిద్ధులు తయారు చేసిన వయోలిన్ లను కొన్నాడు. వాటికీ అయిదు వేల డాలర్లు ఖర్చు చేశాడు .ఒక పెద్ద మ్యూజియం కట్టించి అందులో అన్నిరకాల వాహనాలను ,ఈజిప్ట్ వారి చారియట్లు జపాన్ వారి జిన్ రిక్షాలు ,వేలోసి పీడియోలు,సైకిళ్ళు ,బగ్గీలు ,బస్సులు ,బాండ్ వాగన్లు ,రైళ్ళు ,ఇంజన్లు ,ఆటోలు అన్నీ సేకరించి అందులో ఉంచాడు .ఫిలడెల్ఫియా లోని లాండ్ మార్క్ అయిన ఇండి పెండేన్స్ హాలు  నమూనాను కట్టించాడు. ఇలాగే అమెరికాలో ఉన్న అన్నిరకాల విశేష కట్టడాల నమూనాలను కట్టించాడు .తన ముఖ్య స్నేహితుడు ఎలెక్ట్రిక్ బల్బ్ లిజెండ్  థామస్ ఆల్వా ఎడిసన్ మెన్లో పార్క్ ,న్యు జెర్సీ లలో  ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక సంస్థలను తరలించి తన మ్యూజియం లో సురక్షితం గా ఉంచాడు .లాంగ్ ఫెలో కవితో అమరమై నిలిచిన వేసైడ్ఇన్ ను తలుపుల దగ్గరనుంచి అన్నిటినీ మార్చి సర్వాంగ సుందరం చేశాడు .మాసాచూసేట్స్ స్కూల్  హౌస్ ను పునర్నిర్మించాడు .స్టీఫెన్ సి ఫాస్టర్ పుట్టిన చోటు ను ఒక రకమైన దేవాలయం గా మార్చాడు .పెన్సిల్వేనియా   లో జన్మించిన మెక్ గఫీ కాబిన్ ను తెచ్చి ఇక్కడ జాగ్రత్త చేశాడు .లింకన్ వాడిన ముతక కప్ బోర్డ్ ను తెప్పించి మ్యూజియం లో ఉంచాడు .దియేటర్లో కాల్పుల్లో చనిపోయేముందు లింకన్ కూర్చున్న కుర్చీని భద్రపరచాడు .ఫోర్డ్ సేకరణ దాహం తీరలేదు .తను చదివిన గ్రీన్ ఫీల్డ్ విలేజ్ ని అందులోని 90నిర్మాణాలను అందమైన కట్టడాలుగా మార్చి తన తీపి గుర్తులకు జ్ఞాపకాలుగా మలచాడు .ఆధునికత విస్తరించిన స్పీడ్ జీవితం కంటే ప్రశాంతమైన పాత రోజులే నయం అన్న విషయం రుజువు చేశాడు

వర్తమాన భూతకాలాల వారధిగా ఉండాలనుకొని చేసిన ప్రయత్నాలు పూర్తికాలేదు ఫోర్డ్ జీవితం పై అనేక గ్రంధాలు వెలువడ్డాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క దృక్పధం .’’ది వైల్డ్ వీల్ ‘’అనే పేరుతొ గారేట్ గార్రేట్ రాశాడు .ఎనభై వ ఏట ఫోర్డ్ జ్ఞాపక శక్తి క్రమంగా క్షీణించింది .కాని  బుర్ర పాదరసం గానే పని చేసింది .తను బలవంతంగా బయటికి నెట్టేసిన జీనియస్ ,ఆంతరంగికుడు ఉక్కు గుండె సూప రిండెంట్ పై ఆధారపడిన వాడు సోరేస్మన్ ను గురించి ఆలోచించి విచారించాడు .’’let us go over  and ask Charlie about this ‘’అన్నాడు .82 లో ఫోర్డ్ రిటైర్ అయ్యాడు .రిటైర్ మెంట్ ను ఏర్పాటు చేశాడు .అతని రాక పోకలని జాగ్రత్తగా గమనించేవారు .కుటుంబ సభ్యులు కాకుండా బయటి వారెవరూ ఆయన్ను కలవకుండా జాగ్రత్త పడ్డారు .ఎనభై నాలుగవ ఏడు సమీపిస్తున్న సమయం లో 7-4-1947న మెదడులో రక్తనాళాలు తెగిపోవటం వలన ఫోర్డ్ మరణించాడు .రోగ్ నది రోగ్ లాగా ఉచ్చ నీచాలు తెలియ కుండా వరదలతో  పోటెత్తి ఫోర్డ్ ఇంట్లో కరెంట్ పోయింది .ఇదే చివరి పారడాక్స్ .యంత్ర శక్తి కి ప్రతి రూపమై యంత్ర కాంతిని దశ దిశలా వెదజల్లిన  ఫోర్డ్ తాను ఆ నాడు చీకటి గదిలో  లో  పుట్టి నట్లుగానే ఇప్పుడు అదే చీకటిలో మరణించాడు .ఇదే పారడాక్స్.అతని మరణం లో అక్కడ వెలిగింది మినుకు మినుకు మంటూ వెలిగే  నూనె దీపం ,కొన్ని వెలుగు తున్న కొవ్వొత్తులు మాత్రమే .

Inline image 1  Inline image 2

Inline image 3   Ford   in germani

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -90

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -90

39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్ –2

 

అంత అందం ,ఆకర్షణా లేకపోయినా టిలిజ్ కారు టఫ్అండ్ రఫ్ గా ఉండేది .దీని నుండి ఇంకా కొంచెం   సున్నితమైననాలుగు సిలిండర్ల,మరింత ఆధునికతతో స్లైడింగ్ గేర్ తో ఆకర్షణీయమైన  ’’  మోడల్ ఏ ‘’వచ్చింది .ఉత్పత్తి వేగం పెంచారు .ఫోర్డ్ జీవితకాలం లోనే 30మిలియన్ పైనే కార్లు ఉత్పత్తి అయ్యాయి .నిమిషానికోకకారు ఉత్పత్తి అయింది .ఇవికాక జీపులు ట్యాంక్ విధ్వంసకాలు బాంబర్లు ,షిప్పులు ,బ్రెన్ గం కారియర్లు ,మొదలైన యుద్ధ వాహనాలు తయారు చేశాడు .ఏది నిర్మించినా సామర్ధ్యం ను దైవంగా భావించి చేశాడు . ,తక్కువకాలం లో  తక్కువ లేబర్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు .మనిషి మెషీన్ దేవుడికి   సేవ చేసే విధం చూపాడు .స్వయం కృషికి విశేష ప్రాదాన్యమిచ్చాడు .సృజనకు విశేష విజయం చేకూర్చాడు .సాదారణ ప్రజలే ఫోర్డ్ దృష్టిలో ఎప్పుడూ ఉండేవారు .వారి సంక్షేమమే ధ్యేయంగా పని చేసేవాడు. వారికి పిత్రు ప్రేమను అందించాడు .వారు సౌకర్యాలు కలిపిస్తే మరింత సామర్ధ్యం తో పని చేస్తారని నమ్మాడు ఆ సౌకర్యాలు కల్పించి రుజువు చేసుకొన్నాడు .

పని చేసేవారి ఇంటి పరిస్తితులను తెలుసుకోనేవాడు వారికి దురభ్యాసాలేమైనా ఉన్నాయేమో నని వేగుల ద్వారా విచారించేవాడు .సిగరెట్ తాగటాన్ని నిషేధించాడు తాగుతూ కనిపిస్తే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేవాడు .ఇదంతా ఒక కుటుంబం లో తండ్రికున్న బాధ్యతగా భావించేవాడు .ఫోర్డ్ సామ్రాజ్యం ఒక నియంత ప్రభుత్వం లాగా ,ఒక పోలీస్ రాజ్యంగా ,స్పై స్టేట్ గా అనిపించేది .స్వయం రక్షక భటులు ,ఇన్ఫార్మర్లు ,బలీయమైన ఆర్మేడ్ గార్డ్ లతో జెర్మనీ వాళ్ళ’’ గెస్టపో ‘’ను పోలి ఉండేది .ఫోర్డ్ ఫాక్ట రీలనుంది ఫోర్డ్ సామ్రాజ్యమేర్పడింది .రోగ్ రివర్ వద్ద వెయ్యి ఎకరాలలో విస్తరించి ,లక్షమంది ఉద్యోగులతో విలసిల్లింది .బొగ్గు ,ఇనుపగనులను ,టింబర్ లాండ్ ,బ్రెజిల్ లోని ఆరుమిలియన్ల ఎకరాల రబ్బర్ ప్లాంటేషన్ను గ్లాస్ ఫాక్టరీలను ,చిన్న పరిశ్రమలను స్వాధీనం చేసుకొన్నది .యూరప్ దక్షిణ అమెరికాలలో ప్రతి చోటా అనుబంధ కంపెనీలను ఏర్పరచింది .1923నాటికి ఒక్క అమెరికాలోనే ఫోర్డ్ ఉద్యోగుల సంఖ్య 2లక్షలకు పైనే ఉండేది .దీనితో నిరంతర ఉత్పత్తి సాధ్యమైంది .రోగ్ రివర్ ఫాక్టరీకి ఓడలలో దగ్గరున్న నౌకాశ్రయాలకు ఇనుము చేరేది .దాన్ని ఫాక్టరీలో కరగింఛి ఉక్కుగా మార్చేవారు .తర్వాత విడిభాగాలు తయారు చేసేవారు .వీటిని అసెంబుల్ చేసి ఆటో మొబైల్స్ ను నాలుగు రోజుల్లో తయారు చేసి  షిప్పింగ్ చేసి అమ్మేవారు.ఫోర్డ్ పట్టినది అంతా బంగారమే అయ్యేది.పాడై పోయిన ఒక రైల్ రోడ్ ను కొని ,కొన్నేళ్ళ తర్వాత దాన్ని 9మిలియన్ల డాలర్ల లాభానికి  అమ్మేశాడు  .1940లో ఫోర్డ్ ను సంపాదించిన సంపదను లెక్కపెట్టట సాధ్యం కాలేనంత పెరిగి పోయింది .కానిఆ ఏడాది   అది 60౦ మిలియన్ డాలర్లు పైగా  ఉంటుంది అని అంచనా వేశారని ఫోర్డ్ జీవితంపై ‘’దిలాస్ట్ బిలియనీర్ ‘’పేరసి రిచార్డ్స్ రాసిన పుస్తకం లో ఉంది .

ఫోర్డ్ లో చిన్న చిన్న విపరీత ధోరణులు ,పెద్దపెద్ద అసూయలు ఉండేవి .విశ్వ సమస్యలపై ఆలోచించేవాడు .వైరుధ్యాలపై ఆధారపడి ,అవేసాకులుగా చూపి అకస్మాత్తుగా దూరం పెట్టె అలవాటుండేది .లేబర్ యూనియన్ లతో చాలా కఠినంగా వ్యవహరించేవాడు .పరిస్తితి అర్ధం చేసుకోన్నాక అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చేవాడు .పొగాకు తాగటం మంచిది కాదనే ప్రచారం చేస్తూ ‘’నేరం చేసిన ప్రతి వాడికీ సిగరెట్ దురభ్యాసంతప్పకుండా  ఉంటుంది  ‘’అని చెప్పేవాడు .అమెరికన్ టొబాకో కంపెనీ కొన్నతర్వాత సిగరెట్ పై చెప్పిన మాటే మర్చిపోయాడు .

కళా సాంస్కృతిక రంగాల గురించి ఆయనేమీ పట్టించుకోలేదు  పుస్తకం చదివే అలవాటు కూడా లేదాయనకు . . ఫిలాసఫీ కూడా తెలియదు .ఎమర్సన్ చెప్పిన ‘’an institution is the lengthened shadow of one man ‘’పై నమ్మకమున్న వాడు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో ఫోర్డ్ అకస్మాత్తుగా ‘’ప్రపంచ రక్షకుడు ‘’గా శాంతి పరిరక్షకుడు గా అవతారం ఎత్తాడు .ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొన్న(చార్టర్డ్ ) షిప్ లో  వందమంది సానుభూతి పరులతో యూరప్ వెళ్లి  యుద్ధ ఉన్మాదం లో ఉన్న రెండు వైపులా వారి మధ్య సయోధ్య కుదర్చాలని అనుకొన్నాడు ‘’’’సైనికులను క్రిస్మస్ నాటికి ట్రెంచ్ లలోంచి  బయటికి తీసుకోచ్చేయండి ‘’అనేది ఫోర్డ్ స్లోగన్ .,స్లో –గన్ కూడా  .కాని అక్కడి పరిస్తితులను అర్ధం చేసు కొని గమ్మున ఉండి పోయాడు .నౌక నార్వే తీరం చేరగానే ఫోర్డ్ తిరుగు ప్రయాణపు షిప్ ఎక్కి తిరిగొచ్చాడు .

యుద్ధం అయిపోయాక ఒక ఏడాది తర్వాత మరొక తక్కువ స్థాయి ప్రయత్నం  తల పెట్టాడు .యూదులమీద యుద్ధం ప్రకటించాడు .బుడాపెస్ట్ జ్యూస్ రోజికా  స్క్విమ్మర్ తో జరిగిన దురదృష్ట సంఘటనలతో అతనిలో యాంటి సేమిస్ట్ భావాలు తీవ్రమైనాయి .’’డియర్ బార్న్ ఇండిపెండెంట్‘’’’అనే మేగజైన్   ను ఫోర్డ్ ఫోర్డ్ ప్రచురించాడు .ఏడేళ్ళు జాతి విద్వేషాన్నిఅందులో  వెళ్ళ గక్కాడు..నీచమైన డాక్యుమెంట్లను సేకరించి అందులో ప్రచురించాడు .ప్రపంచ ప్రభుత్వాల,కళా సంస్క్రుతుల ఆర్ధిక రంగాలలో  లో  తప్పిదాలన్నీ జ్యూస్ వల్లనే జరిగాయని వాళ్ళే బాధ్యులని  ఆరోపించాడు . కల్తీ మద్యం ,సంగీతం ,బేస్ బాల్.ఆడవాళ్ళ లిప్ స్టిక్ లన్నీ యూదుల సృష్టి అన్నాడు .చికాగో అటార్నీయారన్ ,కో ఆపరేటివ్ నిర్వాహకుడు సాపిరో  ఫోర్డ్ పై మిలియన్ డాలర్ల కు పరువు నష్టం దావా వేశాడు .గురూగారు ఒక్క సారిగా వెనక్కి తగ్గాడు .పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పి లెంప లేసుకొన్నాడు .ఈ తప్పు అంతా తన కింద పని చేసే వాళ్ళదే అని వాళ్ళే బాధ్యులని నేరం వారిపై తెలివిగా నెట్టేశాడు ఫోర్డ్ సామ్రాజ్యాధిపతి విలియం ఫోర్డ్ .’’జియాన్ ప్రోటోకాల్స్ ‘’అన్నీ తప్పుడు వని  సంజాయిషీ ఇచ్చ్చాడు .తన పత్రిక’’ఇండిపెండెంట్ ‘’లో రాయబడినదంతా తాను  బిజీగా ఉండటం వలన చదవ లేకపోయానని  తాను  చదవ కుండానే అచ్చై పోయిందని తప్పించుకొన్నాడు .వెంటనే ప్రచురణ ఆపేయి౦చేశాడు కూడా .

Inline image 1   Inline image 2సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -89

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -89

39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్

అమెరికాను చక్రాలపై నడిపించిన ఘనుడు ,మెకానిక్ ,’’దిలిటిల్ మాన్స్ లిటిల్ మాన్ ‘’హెన్రీ ఫోర్డ్ 30-7-1863లో అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం లో ఒక చిన్న పల్లెటూరు డియర్ బార్న్లో జన్మించాడు . .కొడుకు రైతు  కావాలని తండ్రికోరిక .స్కూల్ కు వెళ్లేముందు వచ్చిన తర్వాత ఫోర్డ్ ను పల్లె జీవితానికి అలవాటు చేశాడు .అయినా జీవితం చరమ భాగం లో ఏ భూమిని ప్రేమించలేదో అక్కడే మళ్ళీ మట్టి మనిషి అయ్యాడు .ఫోర్డ్ కార్ల ఉత్పత్తిలో మెస్సయ్య అయి కీర్తిగడించాక ఈ విషయమైరాస్తూ  ‘’మా డైరీ ఫాంను అచ్చంగా  ఒక ఫాక్టరీ నడిపినట్లుగానే  నడిపాం ‘’అన్నాడు .యవ్వనం లో అంత నెమ్మదిగా నడిచే గుర్రాలు ,ఆవుల మధ్య గడుపుతానని అనుకోలేదు .అప్పుడే  కనీసం అప్పటికి కంటితో చూడనైనా చూడని ట్రాక్టర్ల నమూనాలు గీసేవాడు .తల్లి ఉపయోగించే కుట్టు పని సూదులను స్క్రూ డ్రైవర్లు గా మలచేవాడు .పుస్తకం అడ్డం పెట్టుకొని మెకానికల్ ఆటవస్తువుల  కు  టింకరింగ్ ను చేసేవాడు రహస్యంగా .14ఏళ్ళకే వాచ్ ని విప్పి అందులోని భాగాలను బయటికి తీసి మళ్ళీ చక్కగా  అమర్చ గలిగేవాడు .డెట్రాయిట్ లో 16 వ ఏట పగటిపూట ఒక మెకానిక్ షాప్ లో వారానికి రెండున్నర డాలర్ల జీతం తో అప్రెంటిస్ గా పని చేశాడు .సాయంత్రాలలో ఒక జ్యూయలరీ లో ,అంతే జీతానికి పని చేశాడు .రెండేళ్ళ తర్వాత ఒక ఇంజెన్ షాప్ లో ఉద్యోగం వచ్చింది .వయసు 19లో మళ్ళీ ఫాం హౌస్ బాయ్ అయి ‘’సింగిల్ సిలెండర్ స్టీం ఫా౦ ట్రాక్టర్ ‘’ను స్వయం గా రూపొందించాడు .అదిపని చేసి౦దికాని పొలం లో ప్రక్కకి తిరగటానికి చాలినంత సామర్ధ్యం ఉన్న  బాయిలర్ ను తగిన ప్రసర్ తో తయారు చేయలేక పోయాడు .కొడుకు క్షేత్రపాలకుడుగా ఉన్నాడన్న సంతోషం తో తండ్రి  ఫోర్డ్ కు 40 ఎకరాల వుడ్ లాండ్ పొలం ఇచ్చాడు .దీనిలో ఒక సా మిల్ ను ఏర్పరచి పొలం లోని చెట్లను నరికించి రద్దు ముక్కలని అమ్మేశాడు .అప్పటికి అయ్యగారి వయసు 21మాత్రమే .

24ఏళ్ళకే పెళ్లి చేసుకొని హెన్రి డెట్రాయిట్ లో కాపురం పెట్టాడు .అకడ’’ ఎడిసన్ ఇల్ల్యూ మినేటింగ్ కంపెని ‘’ ఉద్యోగి అయ్యాడు .రెండేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఇంజినీర్ అయ్యాడు .డెట్రాయిట్ ఆటో మొబైల్ క్లబ్ లో చేరి మొదటి ఆటో మొబైల్ ను తయారు చేశాడు .సన్నగా పొడుగ్గా పలచగా ఉండేవాడు .నిశిత ద్రుష్టి ఉన్నకళ్ళు  .నొక్కుకు పోయినట్లుండే ముఖం .వాషింగ్టన్ ఇర్వింగ్ గీసిన’’ ఇచాబాడ్ క్రేన్ ‘’లా ఉండేవాడు .కొంగలాంటి చూపు .అన్నిటినీ పసికట్టే నేర్పు ఉండేవి .ఫోర్డ్ ప్రేమనంతా యంత్రాలమీదే కురిపించాడు .యంత్రం లోని ప్రతిభాగం ఆయన్ను ఆశ్చర్యపరచి ఉత్తేజం కల్గించేది .యంత్రారాధకుడై పోయాడు .’’అంతర్దహన యంత్రం ‘’(కంబస్చన్ ఇంజిన్ )తో ప్రయోగాలు చేశాడు .ఇంటికి కూడా తీసుకొని వెళ్లి వాటి సామర్ధ్యాన్ని పెంచే ప్రయత్నం చేసేవాడు .33వ ఏట అందవికారంగా ఉండే గుర్రం లేని బండీని ఇంజన్ తో’’ గా’సోలీన్ బగ్గీ ‘’ని నడిపి అందరకీ ఆశ్చర్యం కలిగించాడు .దీని తర్వాత అనేక రకాల కార్లు తయారు చేశాడు .కొన్ని వ్యతిరేక ఫలితాలనిచ్చాయి .చివరగా ఒక ‘’రేసింగ్ కార్ ‘’ను తయారు చేసి రేసింగ్  పోటీలో స్వయం గా నడిపి పాల్గొన్నాడు .ఈ అనుభవాన్ని వర్ణిస్తూ ‘’నేనే స్వయం గా ఒక మైలు దూరం ఐసు మీద నా రేసింగ్ కార్ నడిపాను .ఈ రేస్ ను జీవితం లో మరచిపోలేను .ఐసు మీద పగుళ్ళుఉండేవి . ఆ పగుళ్ళలో నా కారు యెగిరి గంతేసేది గాలిలో .అది మళ్ళీ యెట్లా మంచుమీదకు వచ్చేదో నాకు అర్ధమయ్యేదికాదు .గాలిలో లేనప్పుడు జారిపోతున్నానేమో అనిపించేది .ఏమైతేనేం విజయవంతంగా నడిపి రేస్ గెలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించాను ‘’అని ‘’మై లైఫ్ అండ్ వర్క్ ‘’అనే జీవిత చరిత్రలో రాసుకొన్నాడు ఫోర్డ్ .తానొక ‘’గ్రేటెస్ట్ డేర్ డెవిల్ డ్రైవర్ ‘’అనిపించుకొన్నా కార్ డ్రైవింగ్ పై వ్యామోహ పడలేదు .తేలిగ్గా ఉదాసీనంగా అదొక అడ్వర్ టైజ్ మెంట్ గా’’ లైట్ తీసుకున్నాడు ‘’.40వ ఏట 1903లో స్వంతంగా కార్ల కంపెనీ స్థాపించాడు .స్టాక్ హోల్డర్లు గా ఇద్దరు లాయర్లు ,ఒక బుక్ కీపర్ ,ఇద్దరు మెషీన్ షాప్ యజమానులు ,ఒక గుమాస్తా ,షాప్ నిర్వహించే ఒక మనిషి గాలిమరలు తయారు చేసే ఆయన  తో మొదలు పెట్టాడు .గ్రాస్ కాపిటల్ 25వేల డాలర్లు .అయిదేళ్ళ తర్వాత ‘’మోడల్ టి’’కారు(TLizz) ను రోడ్దేక్కింఛి అమెరికా ప్రజల్ని కాలినడక నించి తప్పించి కారులో దూసుకు పోయే స్థితిని కల్పించాడు ఫోర్డ్ .

నమ్మ శక్యం కాని విపరీతమైన లాభాలోచ్చి పడ్డాయి .దీనికో చిన్ని ఉదాహరణ .ఆర్గనైజర్లలో ఒకడైన జేమ్స్ కజిన్స్ కు  రోసేట్ట అనే సిస్టర్ ఉంది .జాగ్రత్తగా గడుపుతూస్కూల్ టీచర్ జీవితాన్నిగడుపుతూ ఎట్లాగో రెండు వందల డాలర్లు నిలవ చేసింది .రిస్క్ తీసుకొని అందులో సగ౦  అంటే వంద డాలర్లు ఫోర్డ్ కంపెనీలో పెట్టు బడి పెట్టింది .1919కి ఆమె పెట్టుబడిపై ఆమెకు మిలియన్ లో మూడవ వంతు అంటే మూడు వందల యాభై వేల డాలర్లు లభించాయి కళ్ళు తిరిగే రాబడి విని మూర్చ పోయే విషయం .ప్రతివాడు ఫోర్డ్ తయారు చేసిన’’ టి లిజ్  ‘’కారును చూసి మొదట్లో నవ్వారు .ఒక జోకు కూడా వదిలారు ‘’ఆ ఏం లేదురా !ఎవడో పల్లెటూరి రైతుబైతు పగిలిన బాయిలరూ ,తుప్పుపట్టిన వాష్ టబ్ ఫాక్టరీకి ఇచ్చి ఉంటాడు ఈయనేమో రెండు రోజుల తర్వాత వాటితో కొత్త ఆటో మొబైల్ చేసి రైతుకు రవాణా చేశాడు .మిగిల మెటల్ ఖరీదు 20డాలర్లు కట్టి రైతుకు పంపి ఉంటాడు ‘’ఇలా బోల్డు కధలు ప్రచారంయ్యాయి .ఇలా అంటూనే అందులో ఎక్కి అందరూ తిరిగారు .ఫోర్డ కొత్త  ఇంజన్ల సృష్టికర్తకాడు,ఆర్గనైజరూకాడు .కాని నిరంతర ప్రయోగాలు చేసేవాడు అవి హిట్ అవచ్చు ఫట్ అవచ్చు .ఆయనొక కూర్పరి (అసెంబ్లర్ ) .కానిఅతని ఈ ఇన్వెన్షనరీ  కూర్పు ఆలోచనే  ,కార్ల ఉత్పత్తిలో విప్లవం తెచ్చింది .శతాబ్దాల జనాల జీవన విధానాన్నే మార్చేసింది .అతి వేగం గా కార్లను ఉత్పత్తి చేసి అతి తక్కువ ధరకు అమ్మటం ఫోర్డ్ ప్రత్యేకత .ఈ కార్లు ‘’డబ్బు చేసిన ‘’మనుషులకోసం కాదు .సామాన్య పనీ పాటా చేసుకొనే జనం కోసమే .అంతకు ముందెప్పుడూ కారు ముఖం చూడని కారు ప్రయాణ సుఖం అనుభవించని ,స్వంత కారు లేని వారి కోసమే .వర్కర్ల జీతాలు పెంచి కారు ధర తగ్గించాడు ఫోర్డ్ .దీనికి తగిన గొప్ప ప్రతిఫలం పొందాడు .15మిలియన్ల టిలిజ్ కార్లను ఉత్పత్తి చేసి అమ్మాడు .అందులో చాలాభాగం కేవలం 290 డాలర్లకే అమ్మాడు .ధర తగ్గటం తో మార్కెటింగ్ పెరిగింది .అలా వ్యాపారం అనంతంగా సాగింది .రోడ్డుమీద కనిపించే ప్రతి రెండు కార్లలో ఒకటి ఫోర్డ్ కారే అవటం ఆశ్చర్య కరం .కారులో కొన్ని లోపాలున్నాయి వాటిని సరి చేయాల్సిఉంది .అయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు .లోపలి డిజైన్ బట్టి కారు ధర ఉండేట్లు చూశాడు .దీనితర్వాత ‘’మోడల్ A’’కార్లను తయారు చేయటం మొదలెట్టి రోజుకు ఆరు వేలు తయారు చేశాడు .అమరిక ,కన్వేయర్ బెల్ట్ ,స్పీడ్ అన్నీస్వంతంగా అమర్చారు .

సశేషం

Inline image 1

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధను తెలంగాణాకు పరిమితం చేయద్దు ,నవ చైతన్య నక్షత్ర రేవతి కా రా

Inline image 1
 
 
Inline image 2

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయవాడ టాగూర్ గ్రంధాలయం లో గ్రంధాలయ వారోత్సవాలలో సరసభారతి

library1 001 library2 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రాణమే పరమాత్మ,,హనుమ వధించిన రాక్షసుల సంఖ్య

Inline image 1
Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగును మాతృభాష కానివ్వకండి -కాలువ మల్లయ్య తెలుగు కధల్లో వృద్ధులు

Inline image 1

Inline image 1
Inline image 2
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డా అరవిందరావు ఉవాచ ,బీహార్ లో బి జె పీ దేహవా

వేదాల్లోనే అన్నీ ఉన్నాయష !
Updated :05-11-2015 23:00:53
గురుజాడ అప్పారావు ఏ ముహూర్తాన పై వాక్యాన్ని కన్యాశుల్కం నాటకంలో పలికించాడో గానీ.. ఆ వాక్యం ఒకానొక మనస్తత్వాన్ని తెలిపే ఫార్ములాగా మారింది. పై వాక్యాన్ని గమనిస్తే చెప్పేవాడికి వేదంలో ఏముందో తెలియదని స్పష్టమవుతుంది. అయితే అన్నీ ఉన్నాయట అనే అభిప్రాయం కూడా అతనికుంది. ఈ మనస్తత్వం ఇప్పటికీ చాలా మందిలో చూడగలం.
మన అదృష్టవశాత్తూ మనకంటే ఎక్కువగా వేదాలను ప్రపంచం ముందుకు తెచ్చినవారు పాశ్చాత్యులు. అలా లేనట్టయితే మన వేదాలు, అందులోనూ జ్ఞానానికీ, ఆలోచనకూ సంబంధించిన ఉపనిషత్తులు ఇంకా మడి కట్టుకుని ప్రజలకూ, ప్రపంచానికీ దూరంగా ఉండేవి. మొట్టమొదట మ్యాక్స్‌ ముల్లర్‌ వీటిని ప్రచురించడం వల్ల, Scared books of the East అనే శీర్షికలో మన వైదిక వాఙ్మయం అంతా ఆంగ్లంలోకి అనువాదం కావడం వల్ల అనేక మంది మేధావులు వాటిని తెలుసుకునే అవకాశం వచ్చింది. మంచి, చెడులను రెంటినీ గూర్చి వారు రాశారు.
‘వేదాల్లో అన్నీ ఉన్నాయష’ అన్నది గురజాడ గారి నాటకంలోని ఒక అమాయక పాత్ర చెప్పేమాట. అలా అనుకునేవాళ్లు ఈనాటికీ కొన్ని వాదాలు చేస్తూంటారు. ఉదాహరణకు కాంతివేగాన్ని గూర్చి వేదాలు చెప్పాయనీ, సూర్యుడికీ, భూమికీ మధ్య ఉన్న దూరం గూర్చి వేదాల్లో ఉందనీ, కుజగ్రహంలో నీళ్ల గూర్చి మనకు తెలుసనీ, ఓపెన్‌ హైమర్‌ అనే శాస్త్రవేత్త అణుబాంబును పేల్చిన తర్వాత.. భగవద్గీతలోనూ అణుశక్తిని గురించిన విషయాలున్నాయనీ.. ఇలా ఎన్నెన్నో చెబుతుంటారు. వీరు చాలా వరకు సంస్కృతంలో ప్రాథమిక జ్ఞానం మాత్రమే ఉన్నవారు. పుస్తకాలను, ఆ పుస్తకాలపై ప్రాచీనులు ఎలాంటి ప్రామాణికమైన వ్యాఖ్యానాలు చేశారో చదవనివారు. వీరిని టీవీల వారు తరచుగా ఆహ్వానిస్తుంటారు. ఏదో ఒక శాస్త్రవేత్త లేదా ఆధునిక హేతువాది ఎదురుగా కూర్చోబెట్టి చోద్యం చూస్తుంటారు. ఆధునిక ప్రేక్షకులకు ఇలాంటి పండితుల వాదాలు హేతుబద్ధంగా అనిపించవు.
వేదాల్లో ఏమీ లేదని చెప్పడం కూడా అజ్ఞానంతో కూడిన మాటే. ఈనాడు శాస్త్రవేత్తలు ఒక విషయ స్వరూపాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో.. ఆ కాలంలోనూ సత్యాన్ని శాస్త్రీయంగా తెలుసుకోగోరిన వారు అనేకులు. రుషులు అలా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆలోచించి రాసిన గ్రంథాలే వేదాలు. అందులోనూ వాటి చివరిభాగాలైన ఉపనిషత్తులు.
వేదాలను మనం నేరుగా అనువాదాల ద్వారా చదవలేమా అని ఒక ప్రశ్న. అలా చదవలేము అన్నది జవాబు. వేదాలను ఎన్నికోణాల నుంచి చదివితే సమగ్రమైన అర్థం వస్తుంది అని చెప్పడానికి ఆరుశాస్త్రాలు రాశారు. అవి భాషాశాస్త్రం ((linguistics), వ్యాకరణం ((gramar), ఛందస్సు (prosody), నిరుక్తము (వేదాల్లోని పదాలకు ఉన్న వివిధ అర్థాలు), జ్యోతిషము, కల్పశాస్త్రం అనేవి. వేదకాలం నాటి భాషాశాస్త్రాన్ని చూసేవరకు పాశ్చాత్య సంప్రదాయంలో linguistics అనేది లేదు. పాణిని అనే రచయిత చెప్పిన వ్యాకరణం నేటి భాషాశాస్త్రానికి పునాది అయింది.
జ్యోతిషం అంటే మనం అనుకునేట్టుగా నాకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుందా లేదా..? మొదలైన ప్రశ్నలకు సమాధానం చెప్పే శాస్త్రం కాదు. ఆకాశంలోని వివిధ నక్షత్రాలను, గ్రహాలను కొన్ని వేల సంవత్సరాలుగా పరిశీలించి వాటి గమనాన్ని, అవి వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు భూమిపై ఏర్పడే మార్పులను గమనించి చెప్పిన శాస్త్రం. అందుకే జ్యోతిషంలో రెండు విభాగాలు 1. గణితం, 2. ఫలభాగం. గణితభాగం ఈనాడు ఉన్న Astronomy కి మూలమైంది. ఇది చాలా ముఖ్యమైంది. దీనివల్లే సౌరసిద్ధాంతం (సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందనే వాదం) అతి ప్రాచీనకాలం నుంచి మనదేశంలో ఉంది. చివరిగా కల్పశాస్త్రం అనేది రేఖాగణితానికి సంబంధించినది. యజ్ఞవేదికలు తయారు చేసే సందర్భంలో ఏర్పడిన శాస్త్రమిది. పైథాగరస్‌ సిద్ధాంతం అంతకుముందే ఎంతో కాలం నుంచి ప్రాచీనులకు తెలుసన్న విషయం ఇటీవలే నిరూపితమైంది. రోమన్‌ సంస్కృతిలో కేవలం పదివేల వరకే సంఖ్యామానం ఉండగా, వేదగణితంలో లక్షకోట్ల వరకూ సంఖ్యామానం ఉండేది.
అలానే సృష్టి గురించి చెబుతూ చైతన్యం నుంచి ఆకాశం ఏర్పడిందనీ, దాని నుంచి వాయువు, అగ్ని, నీరు, భూమి, వృక్షజాలం, దాన్నుంచి జీవజాలం అనే క్రమంలో ఏర్పడ్డాయని చెప్పడం చాలా ఆశ్చర్యకరమైనది. ఈ విధంగా పైన చెప్పిన ఆరు శాస్త్రాలను వేదాంగాలు అన్నారు. అంటే వీటి సాయం లేకుండా వేదం అర్థాన్ని తెలుసుకోలేం. ఈ విభాగాలన్నింటినీ చదివిన పండితులు నేటికీ ఉండటం మన అదృష్టం.
ఆధునిక విజ్ఞానశాస్త్రమంతా వేదాల్లో ఉన్నదే అనడమే మన సమస్య. దీనికి కారణం ప్రాచీన పండితులకు ఈనాటి పరిశోధనా పద్ధతులు తెలియకపోవడం. కొంతవరకు ఆధునిక విజ్ఞానంపై అవగాహన ఉన్నవారు అన్నీ మనకే తెలుసనే వాదన చేయరు. సంస్కృత రంగంలో దిగ్గజంలాంటి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ‘‘వేదాల్లో ఏమున్నదో చెప్పడం చాలు. అంతేకానీ లేనివాటిని అందులోకి చొప్పించడం అసందర్భమైన పని’’ అని అనేవారు. ప్రముఖ వేదాంత ఆచార్యులు శ్రీ తత్వవిదానంద సరస్వతి లాంటి వారు కూడా ఈ వాదాన్నే సమర్థిస్తారు.
వేదంలో సైన్సును చొప్పించడం మానివేసి అందులో చెప్పిన సర్వాత్మభావం గురించి తెలుసుకుంటే చాలని వీరు అంటారు. సర్వాత్మభావం అంటే చైతన్యం ఒక్కటే ఉన్నదనీ, అదే వివిధ రూపాల్లో కనబడుతుందని ఉపనిషత్తులు చెప్పేవాదం. మన సంస్కృతిలో ఉదారభావాలను, సమానత్వభావాలను తెలుసుకోవడం సమాజానికి ఉపయోగపడగలదు. మన వారసత్వం గర్వకారణంగా ఉండగలదు. అంతేకాని గోవును చంపినవాడి తల నరకాలనే సంకుచిత లేదా మూర్ఖభావాలు వేదాల్లో కనబడవు.
ఆధునిక శాస్త్రజ్ఞులకు పైన చెప్పిన వేదభాగాలపై చాలావరకు అవగాహన లేకపోవడం, ప్రాచీన పండితులకు సైన్స్‌పై అవగాహన లేమి కారణంగా భారతీయ మేధోసంపదకూ, వికాసానికీ ఒకపెద్ద మచ్చ. ఈ రెండు వర్గాల వారినీ అనుసంధానం చేసే వ్యవస్థలు లేకపోవడం, అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసే వనరులు ఉన్న పీఠాలు మొదలైనవారు ఈ విషయంపై ఆలోచించకపోవడం శోచనీయం. మన మూలసూత్రాలను గూర్చి ఈనాటికీ పాశ్చాత్యులే వారికి తోచిన విధంగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
ఉదాహరణకు భారతీయ తత్వశాస్త్రంపై ప్రామాణికమైన journal of indian philosophyఅనే పత్రిక నెదర్లాండ్స్‌ దేశంలో ప్రచురితమవుతోంది. రచయితలు తొంభై శాతం మంది పాశ్చాత్యులే.
వేదాల్లో ఉన్న ఇబ్బందికరమైన విషయాలను ఏదో విధంగా సమర్థించడం లేదా మభ్యపెట్టడం అనవసరం. దీనివల్ల పండితుల విశ్వసనీయత దెబ్బతింటుంది. లేని వైజ్ఞానిక విషయాలను ఉన్నట్టుగా చెప్పడం హ్యాస్యాస్పదంగా కూడా ఉండవచ్చు. కాలక్రమంలో వచ్చిన మార్పును ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం అవసరం.
డాక్టర్ కె.అరవిందరావు
రిటైర్డ్ డిజిపి
(రచయిత ప్రసంగాలను యూట్యూబ్‌లో“advaita academy talks by aravinda rao” అనే శీర్షికలో చూడవచ్చు.)

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -88

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -88

38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్-3(చివరిభాగం )

పవర్ టెంటకిల్స్

పత్రికాధి పత్యం తో సంతృప్తి పడలేదు .ఇంకా విస్తృతమైన స్థిరమైన సాహిత్య పిపాసకులను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టాడు .మేగజైన్ రంగాన్నివశపరచుకొని  ఒక స్థితిలో 13 అతి ఖరీదైన నాణ్యమైన పీరియాడికల్స్ ను ప్రచురిస్తూ అందులో ‘’గుడ్ హౌస్ కీపింగ్ ‘’,కాస్మో పాలిటన్’’లను చాలా విజయవంతంగా నడిపాడు .పుట్ట గొడుగుల్లా మేగజైన్లను పుట్టించాడు .అప్పటికి ప్రపంచం లోనే అతి పెద్ద పేపర్ సామ్రాజ్యాన్ని ఏర్పరచి మేగజైన్ మొఘల్ అని పించాడు .తివాచీ నేత ,యుద్ధ సామగ్రి ,వెండి ,ఇంగ్లీష్ ఫర్నిచర్ ,మూరిష్ పాటరీ తన వ్యాపారరంగాలలో  టెంటకిల్స్ ను చొప్పించేశాడు .పనికి రాని  ‘’నిక్ నాక్స్’’ను ,సేల్లిని ఆస్ట్రిచ్ ఎగ్ లను కొనటానికి   ను 35,౦౦౦ డాలర్లు  తగలేశాడు .అతని ఏజెంట్లు ప్రముఖ శాస్త్రజ్ఞుడు బెంజమిన్ ఫ్రాన్ క్లిన్ కళ్ళ జోడును ,ఈజిప్ట్ కళా ఖండాలను ,గ్రీకు మార్బుల్స్ ను ,రెండవ రకపు పెయింటింగ్స్ ను ప్రపంచమంతా తిరిగి కొని  సేకరించారు .ఆయన వేర్ హౌస్  పాకేజీ విప్పి వెలుగు చూడని ,ఆయనే చూడని వస్తువులతో నిండిపోయింది .ఎక్కడ కొత్తది కనపడినా దాన్ని కొని సేకరించారు .

ఒక సారి ‘’స్పానిష్ మొనాస్టరీ ‘’ని కొని ,ఆ బిల్డింగ్ లోని ప్రతి రాయినీ జాగ్రత్తగా   తెప్పించటానికి రైల్ రోడ్డు నిర్మించుకొన్నాడు .ఈ మొత్తం వ్యవహారానికి అరమిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు మాహాను భావుడు .అన్నిటినీ పొందాలి అన్నీ తన అధీనం లోకి తెచ్చుకోవాలన్న తపనే ఈ పనులన్నిటినీ ఆయనతో చేయించింది .వేల్స్ లో ఒక రాజ సౌధాన్ని కొన్నాడు .లాంగ్ ఐలాండ్ లో తల తిరిగిపోయే అద్భుత సౌధం నిర్మించాడు .కాలి ఫోర్నియాలో సాన్ సిమియాన్ లో ఉన్న రాంచ్ ను 75,౦౦0ఎకరాలకు విస్తరింప జేశాడు .అందులో అరుదైన అందమైన పుష్పాల గార్డెన్ పెంచాడు .ఒక జంతు ప్రదర్శన శాల (జూ ),ఆటలాడే ప్రదేశాలు , సగం మాన్యు మెంట్ గా, సగం మాసోలియం(గోరీ ) గా ఉండే ఒక ‘’ మ్యూరీష్ పాలస్’’ నిర్మించాడు .,ఇవికాక నివాసానికి అతి విలాసమైన  భవంతిని అందులో పార్టీలు ఇవ్వటానికి అతిపెద్ద బా౦కేట్ హాల్, అతిధులకు కుటుంబ సభ్యులకు అతి పెద్ద హోటల్ లో ఉండే వాటి కంటే విశాలమైన ఎక్కువ గదులు ,ఏర్పరచాడు .రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు .లింకన్ ఫారం ను కొన్నాడు దియేటర్లు కట్టాడు .అపార్ట్ మెంట్లు స్కై స్క్రేపర్లు నిర్మించాడు .ఇది చాలదన్నట్లు సినిమా నిర్మాణ వ్యాపారం లోనూ తనదైన శైలిలో విస్తరించాడు .మొదట వార్తా చిత్రాలు ,ఫీచర్ ఫిలిమ్స్ ను ప్రొడ్యూస్ చేశాడు .తర్వాత సీరియల్స్ ,ఆ తర్వాత  మెరియన్ డేవిస్ ను పెట్టి సూపర్ చిత్రాలు తీశాడు .చేతి చమురు బాగా వదిలి 7 మిలియన్ డాలర్లుపైగా  బొక్క పడ్డ్డాయి . స్థిరమైన ఆలోచనలు లేక చేసిన పిచ్చి పనులయ్యాయి ఇవన్నీ .ఆయన పేపర్లన్నీ తళుకు బెళుకు తారాగణం తో సెక్స్ కధలతో నిండిపోతున్నాయి .’’మే వెస్ట్ ‘’రౌడీ సినిమాలు అసభ్యకరంగా ఉన్నాయని ,ఆమె పేరు ను తన మేగజైన్ లలో ఎక్కడా రాకూడదని శాసించాడు .

దియేటర్ యాజమాన్యం

దియేటర్ వ్యాపారం ప్రారంభించి అందులో  స్వంత జీవితాను భవం తో పూర్తిగా కూరుకు పోయాడు .18వ ఏట కాలిఫోర్నియా జడ్జి కూతురు అందచందాల భామ సిబిల్ సా౦డర్సన్ తో  ప్రేమలో పడ్డాడు .ఎంగేజి మెంట్ కూడా అయిపొయింది. కాని హార్స్ట్ హార్వర్డ్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పారిస్ వెళ్ళింది .అక్కడ కన్జర్వేటరి చదివి ‘’ఆపరేటిక్ స్టార్’’గా తిరిగి వచ్చింది .కాని మన వాడిని మనువాడటం మరిచే పోయింది   .రెండేళ్ళ తర్వాత మళ్ళీ మనోడు మరో కాలిఫోర్నియా యువతిఎలినార్ కల్హాన్    ప్రేమలో పడి ఇద్దరూ కలుసుకొంటూ ప్రేమలో ఉన్నారు ఆమె తనకు గొప్ప నటి కావాలనే కోరిక ఉందని చెప్పింది .మళ్ళీ ఎంగేజ్ మెంట్ తంతు జరిగింది .ఆ అమ్మాయి నటిగా మారి లండన్ వెళ్లి అక్కడి అభిమాన నటి గా ఎదిగింది .మళ్ళీ కద మామూలయింది.ఇక అమ్మ మాత్రమె తనను ఓదార్చగలదు అనుకోని  ఆమె రక్షణ కోరాడు

అకస్మాత్తు పెళ్లి

.ఆమె మీద ఉన్న నమ్మకం తో మరో 20 ఏళ్ళదాకా పెళ్లి ఊసు ఎత్తలేదు .వయసు నలభై వ పుట్టిన రోజున  ‘డాన్సింగ్ ’విల్సన్ సిస్టర్స్’’ లో ఒకరైన ‘’ మిలిసేంట్ విల్సన్ అనే చర్చ్అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .అయిదుగురు మగపిల్లలు  కలిగారు .వీరంతా తండ్రిని బహు ప్రేమాభిమానాలతో చూసేవారు ఆరాధించేవారు .

ఇంట్లో ఆశ్రయం ఇస్తే గుండెలో దూరిన నటి

అతని భార్య మిలిసేంట్ హార్ట్స్ దియేటర్ రంగం లో ప్రవేశించే వారికి చారిటీ ట్రస్ట్ పెట్టి సహాయ పడేది .అలాంటి అమ్మాయిలలో మేరియాన్ డేవిస్ అనే అమ్మాయిని చేర దీసి తన ఇంట్లోనే ఆశ్రయ మిచ్చింది .అప్పుడు హార్స్ట్ వయసు యాభై డేవిస్ వయసు ఇరవై .దీనితో బ్రూక్లిన్ కి చెందిన ఈమె ఒక్కరాత్రి లో  సేలిబ్రేటి అయిపొయింది .ఈమెను గురించి కవయిత్రి డోరోతి పార్కర్ ‘’మీరు హాలీ వుడ్ ఆకాశం వైపు చూస్తె అక్కడి నక్షత్రాలన్నీ ‘’మేరియాన్ డేవిస్ ‘’అని జపిస్తాయి అన్నది .రాండాల్ఫ్ డబ్బుతో, పేపర్ల బూస్టింగ్ లతో చాలా ఖరీదైన సినిమాలలో హీరోయిన్ గా నటించినా ‘’వెండి తెర రాణి’’కాలేక పోయింది .కాని హార్స్ట్ కు చాలా విశ్వాసంగా ,కంపానియన్ గా,ఆరాధకురాలిగా  ఉండేది.ఒక  సారి అతని ఆర్ధిక పరిస్తితి దెబ్బతింటే ఒక మిలియన్ డాలర్లు తిరిగి ఇచ్చేసి  ఆదుకొన్నదికూడా .భార్య విడాకులకు అంగీకరించకపోయినా ,ఆమెనుండి దూరమై డేవిస్ తో గడిపాడు. జల్సా ఖర్చు లో మార్పేమీ రాలేదు .విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేశాడు .ఆమె తో సంతృప్తిగా జీవించాడు .తన ప్రేమను పంచాడు తానూ ఇంతవరకు పొందని ప్రేమాను భూతిని ఆమెద్వారా పొందాలిగాడు . .

రాచకీయ అడుసు లో కాలు –బహు భంగుల భంగ పాట్లు

నలభై ఏళ్ళ వయసులో రాండాల్ఫ్ బుద్ధి తక్కువై రాజకీయ రంగ అరంగేట్రం చేశాడు .’’వార్ మేకర్ –ఇప్పుడు కింగ్ మేకర్ –సారీ సాక్షాత్తు.కింగ్ ‘’అయ్యాడు .1902లో కాంగ్రెస్ కు ఎన్నికై రాజకీయారణ్యం లో ప్రవేశించాడు .సరైన ప్రజా ప్రతినిధి అని అనిపించుకోలేక పోయాడు .అతని సహచర సభ్యులు అతని ఆలోచనలపై పై అపనమ్మకం తో ఉండేవారు .చివరికి పార్టీ నాయకుడుకూడా అతనితో కలిసి మాట్లాడని  పరిస్థితి ఏర్పడింది .దీనికి బెదరకుండా మరింత అత్యాసతో కొడితే గోల్కొండ కొట్టాలని ప్రెసిడెంట్ పదవిపై కన్నేశాడు .1904లో డెమొక్రాటిక్  పార్టీ అభ్యర్ధిగా నామినేట్ అవటానికి అన్ని రకాల పావులూ కదిపాడు .చివరికి దాన్ని  జడ్జి ఆల్టన్ బి పార్కర్ తన్నుకు పోయాడు .   ఏడాది తర్వాత న్యూ యార్క్ మేయర్  పదవికి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా  ప్రయత్నించాడు .టామనీ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు .అయినా ఆశ చావక న్యు యార్క్ గవర్నర్ కోసం అదే టామనీ తో చేతులు కలిపి ,ఎన్నో బహిరంగ సభలలో ఉపన్యాసాలిచ్చాడు .నలభై మూడు లో బలిష్టమైన ఎముకలతో ,భారీ పర్సనాలిటి తో పొడవైన ముఖం తో ,జుట్టు నుదుటి మీద పడి ఎడమ  కనురెప్పలపై వాలిపోతున్నట్లు ఉండేవాడు .పడమటి దేశ గర్వం ముఖం లో బాగా కనిపించేది .చిన్న చిన్న వాక్యాలు మాట్లాడేవాడు .ఇవన్నీ ఎవర్నీ ఆకర్షించ లేక పోయాయి .ప్రచార సంరంభానికి అయిదు లక్షల డాలర్లు ఖర్చు చేసినా ,డెమొక్రాట్ పార్టీఅభ్యర్ధులలో  హార్స్త్స్ తప్ప అందరూ ఎన్నికయ్యారు . విధి వక్రించింది .619డాలర్లు మాత్రమే ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసిన చార్లెస్ ఇవాన్స్ హగ్స్  బ్రహ్మాండమైన మెజారిటీ తో ఎన్నికై రాండాల్ఫ్ ను పీటీ, కాటా దెబ్బ కొట్టాడు .

అయినా ధన  బలం తో ఆశ పోక మళ్ళీ రాజకీయం లో అదృష్టం పరీక్షించుకోవాలనుకొన్నాడు .వైట్ హౌస్ లోనూ ,ప్రాంచమంతా తన ప్రభావాన్ని ,పలుకు బడి ని చూపించాలని భావించాడు .1908లోప్రెసిడెంట్ పదవికి  రిపబ్లికన్ అభ్యర్ధి విలియం హోవార్డ్ టాఫ్ట్.డెమోక్రాటిక్ అభ్యర్ధి మళ్ళీ బ్రియాన్ .సహజం గా డెమొక్రాట్ అయిన హార్ట్స్ రియాన్ తో తగాదా పడి ,ఒక స్వతంత్ర అనామక అభ్యర్ధికి మద్దతు ఇచ్చాడు .ఎన్నికల ప్రచారం లో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ నుండి కొన్ని లేఖలు దొంగ తనంగా సంపాదించి కొంతమంది సేనేటర్ల పై అభియోగం అనే బాంబు పడేశాడు .ఈ జిమ్మిక్కులేమీ పని చేయలేదు .రిపబ్లికన్ అభ్యర్ధి టాఫ్ట్ ప్రెసిడెంట్ గా భారీ మెజారిటీతో గెలిచాడు .మనవాడు బలపరచిన అనామకుడు హేజెంస్ కు మనవాడి రాష్ట్రం లో ఒక్క వోటుకూడా రాకపోవటం గమనార్హం .డబ్బే అన్నీ చేయిస్తుంది అనుకొంటే పెద్ద పొరబాటు .దానికి  మించి చాలా ఉంటాయని గ్రహించాలి .

ఎదురు దెబ్బలు తింటున్నా పదవిపై ఆశ చావ లేదు చిగురిస్తూనే ఉంది .1909లో న్యూయార్క్ మేయర్ పదవి మనకే అనుకొన్నాడు .తీవ్ర ప్రచారార్భాటం తో శక్తి యుక్తులన్నీ పణంగా పెట్టి ప్రయత్నించాడు .మళ్ళీ ఘోర పరాజయం పాలైనాడు .1912లో ప్రెసిడెంట్ పదవికి తన అభ్యర్ధిగా చాంప్ క్లార్క్ కోసం ప్రయత్నిస్తే ,తనను తీవ్రం గా వ్యతిరేకించే వుడ్రో విల్సన్ నామినేట్ అయి ప్రెసిడెంట్ గా గెలిచాడు .కనుక మనవాడికి రాజకీయం అచ్చి రాలేదు. తిరుక్షవరమే అయింది పాపం .

విదేశీ వ్యవహారలలో  వేలు

స్వంత రాష్ట్రం లో రెండు పార్టీలు అతన్ని నమ్మలేదు .అంటే తను నమ్మకం కలిగించ లేక పోయాడు .ఇది లాభం లేదని విదేశీ  వ్యవహారం లో వేలు పెట్టాడు .20ఏళ్ళకు పూర్వం మనవాడు యుద్ధం సృష్టించాడు .ఇప్పుడు 1914లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించాడు .అమెరికా యుద్ధం లో దిగక ఉండలేని పరిస్థితి. అందుకే సంఘటిత కూటమి (అల్లీస్ ) రాజ్యాలకు కొమ్ము కాసింది .పాపం హార్స్ట్ తిట్లు తినే  అందరూ ద్వేషించే ఒంటరి వాడైపోయాడు  పైగా ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ లకు అమెరికా  ఏ మాత్రం సాయం చేసినా విజేత అయ్యే జర్మనీ మాడ్చి మసి చేస్తుందని హెచ్చరించాడు .యుద్ధం వాల్ స్ట్రీట్ కు ఆయుధ సామగ్రి తయారు చేసేవారికి  లాభాలు కలిగించింది .చివరికి అమెరికా శత్రు దేశం తో ప్రత్యేక శాంతి ఒడంబడిక కుదుర్చుకోవాల్సి వచ్చింది . అవమానాలు భరించలేక రాండాల్ఫ్ డెమోక్రాటిక్ పార్టీకి గుడ్ బై చెప్పి రిపబ్లికన్ ల పంచలో చేరాడు   .రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ మైన సమయం లో మన ‘’జర్నలిజం మోనార్క్’’’’నేషనల్ సోషలిజం ‘’అనే నినాదాన్ని బయటపెట్టాడు .ఫాసిస్ట్ లు యాంటి సెమి సేమేటిస్ లు కలిసి హిట్లర్ ను ఇంటర్వ్యు చేసి ‘’హిట్లర్ శాంతికి ,ఆర్ధిక స్థిరత్వానికి కృషి చేసే అద్వితీయ శక్తి ‘’అని ప్రకటించారు .జపాన్ కూడా వారితో కలవటం తో హార్స్ట్ ‘’తూర్పు దేశాల బెదిరింపు ‘’(ఓరియెంటల్ మెనేస్ )అని సమాధాన పరచాడు .

అధికారాంతమున చూడవలె

రెండవ ప్రపంచ యుద్ధానంతరం’’ పేపర్ మొఘల్ ‘’పవర్ క్షీణింటం మొదలైంది .ప్రత్యర్ధి సంపాదకులు రాజకీయ నాయకులు ప్రెసిడెంట్లు  తీవ్రం గా దాడి  చేసేవారు  .ఇప్పుడు మరింత సంక్షోభం లో పడ్డాడు .ప్రిస్టేజి డామేజి అయింది .భౌతికంగా కు౦గి పోయాడు మానసికంగా క్రుశించిపోయాడు .1947లో మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చింది హార్స్ట్ గారికి .మౌంటేన్ రిట్రీట్ నుంచి మకాం మారియన్ డేవిస్ బివేర్లీ హిల్స్ కు మార్చాడు .ముప్ఫై ఏళ్ళ నుండి అంటిపెట్టుకున్నావిడే ఆరోగ్యంగా ఉండగానూ ఇప్పటి అనారోగ్య బలహీన స్థితిలోనూ సపర్యలు చేసి కృతజ్ఞత చూపింది .ఆయన గుండె నిబ్బర౦  మరో నాలుగేళ్ళు జీవి౦చేట్లు చేసింది  .88ఏళ్ళ సఫల విఫల దిగ్విజయ పరాజయాలను రుచి చూసిన విలియం రాండాల్ఫ్ హార్స్ట్ గారి హార్ట్ 14-8-1951న శాశ్వతం గా ఆగి పోయింది .

చనిపోవటానికి ముందు తన మనోభిప్రాయాలను వెల్లడించారు .ఆయన జీవిత చరిత్రలు రాశారు .’’ostracism by decency in life ,and oblivion in death ‘’’అని ఊహించి ముందే చెప్పాడు  చార్లెస్ బియర్డ్ అనే హిస్టోరియన్  ..అతని రాజకీయం పై వ్యాఖ్యానిస్తూ విలియం అలెన్ వైట్ ‘’I believe that Hearst as an ally of any politician is a form of political suicide ‘’అని ఘాటుగా వ్యాఖ్యానించాడు .ఎవరేమన్నా ఆతను’’ లెజెండరీ  ఫిగర్ ‘’అన్నది నిర్వివాదం.1900 లో మొదలుపెట్టి 1936లో ఓడిపోయిన లాండాన్ నుంచి మేకార్దీ వరకు అయన మెచ్చిన  పాత స్నేహితులంతా’’proverbial kiss of death ‘’ రుచి చూసిన వాళ్ళే  అన్నాడొకాయన .ఒక విధయం గా ఆయన ‘’గొప్ప మూవర్ అండ్ షేకర్ .‘’పత్రికా సామ్రాజ్య వ్యాప్తిలో ఎదురు లేనివాడు తిరుగు లేనివాడు .గొలుసు పత్రికలకు మార్గ దర్శి .సంచలన కధనాలకు ఆలవాలం .’’ఎల్లో కిడ్ ‘’పాత్రా ద్వారా ఎల్లో జర్నలిజానికి నాంది పలికినవాడు .అతని అస్థిర  విధాల విషయమై ప్రశ్నిస్తే దానికి ఆయన సమాధానం ‘’it is not important to be consistant ,as it is to be correct .A man who is consistent never learn any things .conditions change ,and he does not ‘’అని జవాబు చెప్పాడు అతని చరిత్రకారులు కూడా అతనిలోని  విరుద్ధ భావాలను అలాగే ఉండనివ్వండి అన్నారు .

Inline image 1   Inline image 2Inline image 3

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87

38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్-2

పులిట్జర్ తో పోటీ –ఎల్లో జర్నలిజానికి నాంది

అనుకొన్నది సాధించగానే కొత్త పధకానికి తేరా తీశాడు రాండాల్ఫ్ .సాన్ ఫ్రాన్సిస్కో ఎక్సామినర్ పత్రికాధి పత్యం చేబట్టాక ఎనిమిదేళ్ళకు ‘’న్యూ యార్క్ మార్నింగ్ జర్నల్ ‘’ను కొన్నాడు .అతని ధ్యేయం రెండు సెంట్లకు అమ్మే  పులిట్జర్ పత్రిక ‘’ది న్యు యార్క్ వరల్డ్ ‘’అమ్మకాలను  అధిగమించటమే .మనవాడు తెలివిగా తన పత్రిక వెలను ఒక్క సారిగా ఒకే ఒక పెన్నీ కి తగ్గించేశాడు .మొదట్లో విపరీతమైన నస్తాలోచ్చినా క్రమంగా నిలబడి లాభాలు సాధించాడు .పత్రికను  తీర్చి దిద్దటం లో డబ్బు కేమీ ప్రాధాన్యం లేదని ప్రకటనలు గుప్పించేవాడు .ప్రత్యర్ధి పులిట్జర్ పత్రికలో పని చేస్తున్న ‘’మాంచి బుర్ర ‘’ఉన్న మనుషుల్ని,ఆర్టిస్ట్ లను రెట్టింపు జీతం తో ఆకర్షించి తన పత్రికలో చేర్చుకున్నాడు .స్టీఫెన్ క్రేన్ ,ఎడ్గార్ సాల్ట స్,జేమ్స్ యి ఫోర్డ్ ,రిచార్డ్ హార్డింగ్ డేవిస్ వంటి దిగ్దంతులను చేర్చుకున్నాడు .వీరిని సెయింట్ పీటర్స్ బర్గ్ కు  జార్ చక్రవర్తి పట్టాభిషేకం చూడటానికి పంపాడు .ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేన్ ను విక్టోరియా మహా రాణి జూబిలీ ని వర్ణించి రాయటానికి  లండన్ పంపాడు .  తన పత్రిక సాహిత్యానికే ప్రాధాన్యం ఇస్తోందన్న అపోహ తొలగించటానికి మొదటి 16పేజీలను రంగుల్లో కార్టూన్లు జోకులు ఫాషన్లు కధలతో ముంచెత్తే శాడు .మరో 8పేజీలను కామిక్స్ కు కేటాయించాడు .తనది ‘’ఇంద్ర ధనుస్సు పేపర్ ‘’అని ప్రకటించేవాడు .వరల్డ్ పత్రికలో వచ్చే కామిక్ కేరక్టర్ కు ప్రత్యర్ధిగా ‘’ఎల్లో కిడ్ ‘’పాత్రను సృష్టించి వదిలాడు .అప్పటినుంచే ‘’ఎల్లో జర్నలిజం ‘’అనే పేరు బయల్దేరింది .పులిట్జర్ ఎడిటర్ ను లొంగ దీసుకొని ‘’ఈవెనింగ్ జర్నల్ ‘’మొదలు పెట్టాడు.సంపాదకీయాలతో అంతర్జాతీయం గా పేరు పొందిన ఆర్ధర్ బ్రిస్బేన్ ను చేర దీయటం తో ‘’బ్రెయిన్ డ్రెయిన్’’పూర్తయింది .మొదటి మూడు పేజీలను ఆశ్చర్యం లో ,హెచ్చరికలు చేస్తున్నట్లు తయారు చేయించాడు .ఈ విషయం లో తన పత్రిక ఎలా ఉంటుందో ఆయన మాటల్లోనే చూద్దాం ‘’when you looked at the first page you said  ‘’Gee whiz’’  .When you swathe second page ,you gasped ‘’Holy Moses ‘’,.And when you glimpsed the third page you exclaimed ‘’Good God Almighty ‘’ఇలా పాఠ కులలో విపరీతమైన మొహం మోజు కలిగించి తనపత్రిక వైపుకు మళ్ళించాడు చాకచక్యంగా .

యుద్ధం చేయిస్తానన్న రాండాల్ఫ్

హార్స్త్స్ వంచన ఆలోచనలతో స్పానిష్ అమెరికన్ యుద్ధం  నిజానికి ఆయన దాని సృష్టి కర్త కాకపోయినా కలిసి వచ్చింది .అమెరికా క్యూబా తరఫున యుద్ధాన్ని ప్రారంభించటానికి రెండేళ్ళ ముందే యుద్ధ భీభత్సాన్ని గగుర్పొడిచే వ్యాసాలతో భయానక దృశ్యాలతో పేపర్ నిండా రాయిన్చేవాడు .గవర్నర్లకు తెలిగ్రాములిచ్చేవాడు .ఏయే రాష్ట్రాల వారు ఎంతమంది వాలంటీర్లను నావికా యుద్ధానికి ,పద సైన్యానికి సమకూర్చగలరనిగవర్నర్లనందర్నీ  ఆరా తీశాడు .ఆర్టిస్ట్ ఫ్రెడరిక్ రేమింగ్ టన్ ను హవానా పంపి ఆర్టికల్స్ రాయించాడు .రేమింగ్ టన్ హవానా లో తనకేమీ పని లేదని అంతా పరమ  ప్రశాంతంగా ఉందని ,యుద్ధ వాతావరణం అసలు కనిపించనే కనిపించటం లేదని తానూ అమెరికాకు తిరిగి వచ్చేస్తానని తెలియబర్చాడు యజమానికి .’’అక్కడే ఉండు .చిత్రాలు పంపు .నేను యుద్ధం చేయిస్తాను ‘’అని చెప్పి అక్కడే ఉండమన్నాడు .క్యూబా విముక్తి ఉద్యమం లో ముఖ్యమైన అంశం అమెరికా క్యూబాతో చేసే వంద మిలియన్ డాలర్ల వ్యాపార  ఇబ్బందులే .క్యూబా షుగర్ ఎకానమీ ఒక్కసారి కుప్ప కూలి పోయింది .దీనికంతటికీ ముఖ్య కారణం స్పెయిన్ ,క్రూర స్పెయిన్ దేశమే నని హార్స్త్స్ ,పులిట్జర్ లు తమపత్రికలలో ఢంకా బజా ఇంచేవారు .ప్రజల్ని మభ్య పెట్టేవారు .యుద్ధాన్ని గురించి ఊదర కొట్టేవారు చివరికి అది తుస్సుమనగా ‘’అవర్ పెట్ వార్ ‘’అన్నాడు రాండాల్ఫ్ .దీనికీ ఒక కధనం ఉంది -.

ఐల్ ఆఫ్ పైన్స్ కు చెందిన ఇవాంజేలీనా సిస్నేరాస్ అనే విప్లవ వీరుని కూతుర్ని పీనల్ కాలనీ నుంచి కాపాడటానికి ప్రయత్నం చేశాడు .దీన్ని తన పత్రికలలో బోల్డ్ లెటర్స్ లో  సంచాల వార్తాకధనాలుగా ప్రచురించి ఏదో ఆమెకు మహోపకారం చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు .జెనరల్ కు ముడుపులు చెల్లించి కదా బిగువుగా నడపటానికి కృషి చేశాడు .ఇదంతా తన గొప్పతనమే అని రంగు పూశాడు మసిపూసి మారేడు కాయ చేశాడు ఇలా కొత్త తరహా జర్నలిజానికి నాందిపలికాడు .ఆపాప కస్టాలు  పడినట్లు ఆమెకుఆడవాళ్ళ నుంచి  సాను భూతి ని వరదలా   పారించాడు .

యుద్ధ పన్నాగాలపై ద్రుష్టి సారించాడు .అతని ఏజెంట్లు  డిప్లమాటిక్ లెటర్స్ ను తారుమారు చేసేవారు .హవానా హార్బర్ లో యుద్ధ నౌక ‘’మైన్’’ ఊహించని విస్ఫోటనం లో ధ్వంసానికి గురి అయినప్పుడు హార్స్త్స్ 50వేల డాలర్ల నజరానాను ఆ విధ్వంసకుడిని పట్టిచ్చిన వాదికిస్తానని ప్రకటించాడు . యుద్ధ రంగం ఎక్కడ ఉందొ కనుక్కోవటానికి తన స్వంత యుద్ధ నౌకను పంపాడు . అనుమానాస్పదు  లైన  స్పానిష్ నావికులను పట్టుకోవటానికి ఒక సారి తానె అక్కడికి వెళ్ళాడు .స్పెయిన్ నౌకలు అడ్డ దారిలో ఫసిఫిక్ కు చేరటానికి అతిపెద్ద స్టీం షిప్ ను సూయజ్ కెనాల్ లో ముంచే ప్రయత్నం చేస్తుంటే  అడ్డంకి  కలిగించే ప్రయత్నం చేశాడు .  ఒక రకంగా ఇది అంతర్జాతీయ కట్టు బాటును అతిక్రమించటమే .

పేపర్ పవర్

హార్స్త్స్ పత్రికలూ నిలబడ్డాయి ,సర్క్యు లేషన్ పెరిగింది .ఇప్పుడు హార్స్ట్ ఒక శక్తి కేంద్రమై పోయాడు .పత్రికా సామ్రాజ్యం ఏర్పరచాలని నిర్ణ యించాడు .దీనితో కొత్త గోల్స్ కు ,విస్తృతమైన పరిదులకోసం ప్రయత్నింఛి సాధించిన తన విజయాలకు ద్రుఢత్వం చేకూర్చాలను కొన్నాడు .దీనికి నందిగా ఒక్క నెల రోజుల్లోపుననే చికాగో లో ‘’అమెరికన్ ‘’పత్రికను 4-7-1900లో డెమొక్రాట్ కన్వెన్షన్ లో  అతను తన అభ్యర్ధిగా  విలియం జెన్నింగ్స్ బ్రియాన్ ను ప్రకటించే ముందు  స్థాపించాడు ..మరింత బలపడి ‘’చికాగో రికార్డ్ హెరాల్డ్ ‘’పత్రికను కొనేశాడు .ఇక వరుసగా బోస్టన్ అట్లాంటా ,వాషింగ్టన్ ,డెట్రాయిట్ ,సియాటిల్ ,రోచెస్టర్ ,ఓక్ లాండ్ , .లాస్ ఏంజెల్స్ ,సిరాక్యూజ్ బాల్టిమోర్ ,పిట్స్ బర్గ్ ,ఒమాహా లలో కొత్త పత్రికలూ పెట్టటం కాని ఉన్నవాటిని స్వాధీనం చేసుకోవటం కాని చేసి తన పత్రికా సామ్రాజ్య పరిధిని అతి విస్తృతం చేసుకొన్నాడు .1929లో సుమారు అరవై వయసులో25 పెద్ద పత్రికలను 18 అతి కీలకమైన పెద్ద సిటీలలో నెలకొల్పాడు. అనుకొన్నది సాధించాడు .

లేబర్ సానుభూతి-వారికే  వ్యతిరేకి

అతని విధానాలు చాలా కఠినంగా,అభి వృద్ధి నిరోధకం గా ఉండేవి .ఒకప్పుడు లేబర్ కు గొప్ప సాను భూతి పరుడుగా,ఆసరాగా  ఉన్నవాడు ఇప్పుడు ధన గర్వం తో దురహంకారి అయాడు .’’డబ్బు లావు’’ చేసినకొద్దీ మరింత బిగిసి రైట్ రియాక్షనరీ గా మారాడు .బిగ్ బిజినెస్ కు బిగ్ బాస్ అని పించుకొన్నాడు .పబ్లిక్ వెల్ఫేర్ ను    కార్పోరేట్ సంక్షేమానితో సమం చేశాడు .1919లో చట్టానికి సహకరించిన వారి ,చట్టాన్ని అమలు పరచే పౌరుల  హక్కులకు బాసటగా నిలిచాడు .పోలీసులను కూడా సమ్మె చేయమని సలహా ఇచ్చేవాడు అప్పుడు .అప్పుడాయన  ‘’every thinking human being admits the right of ordinary employees to organaize and to quit work when conditions are un satisfactory and to betaken back when conditions are amended ‘’ . అని నీతులు బోధించాడు .కానీ అదే వ్యక్తీ 15 ఏళ్ళ తర్వాత లేబర్ యూనియన్ లతో పోట్లాడాడు న్యూస్ పేపర్ గిల్డ్ ను వ్యతిరేకించాడు .పూర్వం తానూ సమర్దిన్చినవాటి నన్నిటినీ ఇప్పుడు వ్యతిరేకించాడు .ఇప్పుడు’’ కొత్తా పేపర్ దేవుడి’’అవతారం ఎత్తి ‘’strikes should be out lawed and complete machinery to enforce their suppression should be fully established and fearlessly operated ‘’అని కొత్త నీటి వాక్యాలు పలికాడు .రెండు నాలుకల ధోరణి అంటే ఇదే .స్ప్లిట్ పెర్సనాలిటి  .అని పించాడు .

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-15 -ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87

38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి,సంచలన కధనాలకు ,ఎల్లో జర్నలిజానికి ఆద్యుడు  –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్

అమెరికా జర్నలిజం లో వీరవిజయం సాధించినా ,రాజకీయం లో ఘోర పరాజయం పాలైనవాడు విలియం రాండోల్ఫ్ హార్స్ట్.;ఆనాడు’ లార్డ్ ఆఫ్ ది ప్రెస్’’గా ప్రసిద్ధి చెందినజోసెఫ్ పులిట్జర్ కు తీవ్ర ప్రత్యర్ధి విలియం .పులిట్జర్ సెన్సేషనల్ రిపోర్ట్ లతో సంచలనం సృష్టించి ,తన వార్తాపత్రికను ,దానితోబాటు జర్నలిస్ట్ ప్రపంచాన్ని ఒక కొత్త స్వేచ్చా  స్తాయికి తెచ్చినవాడు . హార్స్ట్ అధోజగత్ సహోదరుల బుజం కాయటం లో చాంపియన్ గా జీవితాన్ని ప్రారంభించి ,సాంఘిక సంస్కరణలకు వ్యతిరేకియై  అ౦తకు ముందెన్నడూ లేని బాధ్యతా రాహిత్య సెన్సేషనల్ వార్తలప్రచురణలతో  దెబ్బతిన్నాడు .సెన్సేషనల్ వార్తలు దొరక్కపోతే తానె స్వయంగా వార్తలను వండి వడ్డించేవాడు .అంటే వార్తలను సృస్టించే వాడన్నమాట .తాజా సంఘటనలకు నిత్య గండాలుగా సంకట స్తితులుగా చూపిస్తూ ,ఔత్సుక్యానికి పరాకాష్ట గా మలుస్తూ అంతులేని సంపదను ,పత్రికా సామ్రాజ్యాదిపత్యాన్నీ ,అధికారాన్ని సాధించి ఎన్నో గోలుసుపత్రికల డైరెక్టర్ అయి ,చివరికి ప్రింట్ మీడియాకు డిక్టేటర్ అయ్యాడు .

సిల్వర్ స్పూన్ బాయ్ –ఆమ్మ కూచి

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ ఫ్రాన్సిస్కో లో 29-4-1863లో కోటీశ్వరుడు ,పబ్లిషర్ ,సెనేటర్ అయిన జార్జి హార్స్ట్ కు జన్మించాడు .తల్లి ఫాబే అపర్సన్ .దక్షిణాదికి చెందిన సంస్క్రుతీసంపన్ను రాలు. భర్తలకంటే 22ఏళ్ళు చిన్నది .కవల పిల్లలలో ఒకడుగా జన్మించి ,వేరొకరు చిన్నతనం లోనే చనిపోతే విలియం తలిదండ్రులకు ఏకైక పుత్రుడై గారాబంగా పెరిగాడు .తల్లి ప్రేమనంతా ఇతని మీదే కురిపించింది .ఆప్యాయాన్ని ఆత్మీయతను ఇతని మీదనే చూపించింది .’’సన్నీ’’ అని అల్లారు ముద్దుగా పిలుస్తూ ,విలాసవంతమైన జీవితాన్ని అందిస్తూ పదేళ్ళ వయసులోనే ,తనతో బాటు యూరప్ యాత్రలు చేయించింది .అందుకే ఆ కొడుకు ‘’పిల్లవాడి గొప్ప మిత్రుడు తల్లి మత్రమే ‘’అని గొప్పగా చెప్పేవాడు .తిరిగి వచ్చాల కుటుంబానికి చెందిన గుర్రబ్బండీలో స్కూల్ కు పంపించింది .తానునడిచే స్కూలుకు వెడతానని ,తన బట్టలకు చిరుగులు చూపి కుట్టించమని లేకపోతె తనతోటి నిరుపేద విద్యార్ధులు గేలి చేస్తారని తల్లితో వాదించేవాడు .అ సమయం లో ఆతను 45 వేల ఎకరాల విస్తీర్ణం ఉన్న సాన్ సిమియాన్ లో ఉండేవాడు .17వ ఏట తూర్పున ఉన్నన్యు అంప్ షైర్ లోని  సెయింట్ పాల్ కు ప౦పారు .

హార్వర్డ్ లో ఉన్నా జీవితాన్ని’’ లైట్ తీసు’’కున్నాడు

అక్కడ హార్వర్డ్ లో ప్రవేశం కోసం చదివాడు . ఎక్కడో ప్రవాసం లో ఉన్నట్లు ఫీలయ్యేవాడు .చదువుపై శ్రద్ద చూపలేదు .అమ్మ మీద బెంగతో ఉండిపోయాడు .హార్వర్డ్ లో చేరినా అక్కడా సర్దుకు పోవటం కుదరలేదు .చేతినిండా డబ్బు ఉండటం తో జలసాగా విలాసంగా పార్టీలుఇస్తూ  ,ప్రతి చిన్న సందర్భానికి టపాసులు కాలుస్తూ  దుబారా చేస్తూ ఉన్నాడు .అనేక ప్రాక్టికల్ జోక్స్ ను సృష్టించి స్నేహితులకు చెప్పి నవ్వించేవాడు .తండ్రి పలుకుబడి కొడుకు కలివిడి తో యూని వర్సిటి వారి హాస్య పత్రిక ‘’లాంపూన్ ‘’కు బిజినెస్ మేనేజర్ అయ్యాడు .అడ్డగి౦చలేనంత చిలిపితనం తో చదువు కు గుంట కొట్టి గంట వాయించాడు .అధికారులు గమనిస్తూనే ఉన్నారు .క్రమ శిక్షణ విషయం లో ఇంకొక తప్పు చేస్తే డిస్మిస్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు .ఇవేమీ లెక్క లోకి తీసుకోకుండా’’లైట్ తీసుకొని’’  ‘’కేరే ఝాట్ ‘’గా మారి చదువు వదిలేసి జోకుల కేకులు తింటూ తినిపిస్తూ సంఘం లో కలుపు గోలు తనం పెంచుకొన్నాడు .చివరికి కొద్దికాలం సస్పెండ్ అయి మళ్ళీ చేరి ,తల్లి సేవ చేయటానికి వెళ్ళే ముందు మరో మిస్టేక్ చేసి బహిష్కరింప బడ్డాడు.అతని చేతినిండా చెప్పిన పని చేసే నమ్మకమైన స్నేహితులను డబ్బిచ్చి కుదుర్చుకొని  వారితో ఫాకల్టీ సభ్యులకు క్రిస్మస్ బహుమతులను కవర్ లలో పెట్టి అందజేసేవాడు  .వాటిని అందుకున్నవారు వాటిని ఓపెన్ చేసి చూస్తె అద్భుతమైన ప్రాచీన కుండలు ,వాటిపై వారి వారి చిత్రాలు ఉండటం గమనించి ఆశ్చర్య పోయే వాళ్ళు .ఇలా’’ బే ఫర్వాగా ‘’రెండేళ్ళు హార్వర్డ్ జీవితాన్ని గడిపాడు .చదువుపై హార్ట్ పెట్టకుండా హార్స్ట్ .

పత్రికాదిపత్యానికి బాటలు

21ఏళ్ళకు పాలిపోయిననీలి  కళ్ళతో పాలిపోయిన శరీరం తో  ఉండేవాడు .కళ్ళల్లో దృఢమైన నిశ్చయం మాత్రం కనిపించేది .ఆధిపత్యం సాధించాలని 22లో నిశ్చయించుకొన్నాడు .హార్వర్డ్ నుంచి తొలగించటానికి కొద్ది రోజుల ముందు తండ్రికి  ఒక గొప్ప ఉత్తరం రాస్తూ తమ ‘’సాన్ ఫ్రాన్సిస్కో ఎక్సామినర్ ‘’పత్రిక ను ,అప్పుడున్న యజమాని-అంటే తన తండ్రి కంటే గొప్పగా నడపగలనని నిర్భయం గా తెలియ జేశాడు.తన ఆశయం నెరవేరటానికి కావలసిన డబ్బు కేటాయించమని కోరాడు .న్యు యార్క్ వరల్డ్ అనే   పులిట్జర్ నడిపే పత్రిక కంటే కాలిఫోర్నియా వాతావరణం తో మరింత సృజనాత్మకంగా నడుపుతానని హామీ ఇచ్చాడు .మరో లేఖ రాస్తూ తమ పత్రికలో ఉన్న లోపాలను వివరంగా తెలియ బర్చాడు .ఎలా అభివృద్ధిలోకి తేవాలో సూచించాడు .తక్కువ జీతాలతో సరైన అవగాహన లేని సిబ్బందితో ఇక కుదరదని కొత్త వారితో సర్వోత్క్రుస్టమైన కొత్త నైపుణ్యం తో నడిపితేనే మనుగడ అనీ అన్నాడు .కొడుకు సత్తా ఏమిటో చూద్దామని పత్రికను మరింత సుందరంగా విలాసం గా తీర్చి దిద్దటానికి అడిగిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు అందజేశాడు తండ్రి .కాని కొడుకు ఒప్పుకోలేదు .తండ్రి అనకొండ కాపర్ మైన్స్ తో బాటు ,మోంటానాలో ఉన్న విశాలమైన ఎస్టేట్ కూడా స్వంతం చేస్తానని  ఊరించాడు .కాని తానూ న్యూ యార్క్ వెళ్లి అక్కడ ‘’వరల్డ్ ‘’పత్రిక లో స్థానం సంపాదిస్తాను అన్నాడు .తన్ను కొడుకు దెబ్బ తీశాడని గ్రహించాడు సెనేటర్అయిన  తండ్రి. అన్నట్లుగానే న్యూ యార్క్ చేరి రాండాల్ఫ్ పడమటి తీరం లో అత్యున్నతస్థానం లో ఉన్న డెమోక్రాటిక్ వార్తాపత్రికకు సంపూర్ణ అధికారాలతో మేనేజింగ్ ప్రో ప్రైటర్ అయ్యాడు .సాన్ ఫ్రాన్సిస్కో  కి వచ్చి మళ్ళీ తండ్రికి మూడో లేఖ రాశాడు .కొట్తోచ్చే’’కొత్తదనం ,మిరుమిట్లు గొలిపే సృజన, వార్తా విధానం లో విప్లవం తెస్తానని అందరూ ‘’ఎక్సామినర్ ‘’లోని తను నిర్వహించే దాన్నే చూసేట్లు చేస్తానని ,ఒక ఏడాదిలో పదివేల అదనపు సర్క్యు లేషన్ సాధిస్తానని ,రెండేళ్లలో పెట్టినఖర్చు వచ్చేస్తుందని ,అయిదేళ్ళలో పసిఫిక్ తీరం లో   తమదేపెద్ద గొప్ప పత్రిక అని పించుకొంటు0దని తెలిపాడు .

సంచలన వార్తా కధనాలు

హార్స్ట్ ఆలోచన ఊహావిహారంకాదు,స్పస్టమైనదికూడా .అతని నినాదం ‘’సర్క్యులేషన్ లో మనకు బదులు వేరొకరు ఉండ కూడదు  ‘.’అన్నట్లుగానే రుజువు చేసి చూపించాడు .హెడ్ లైన్ లను మరింత ఆకర్షణీయం గా చేశాడు .కార్టూన్ లకు జోకులకు రెట్టింపు స్థలాన్ని కేటా ఇంచాడు .పాత లాగుడు ,పీకుడు వార్తల స్థానం లో కొత్త గగుర్పొడిచే ‘’గాసిప్ కాలమ్స్ ‘’రాయించాడు .ప్రజల స్పందన నాడి లను బట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేశాడు .తన స్టాఫ్ లో ఒకమ్మాయిని నడి బజారు లో మూర్చవచ్చినట్లు పడిపొమ్మని  చెప్పి ఆమెనుసిటీ రిసీవింగ్ హాస్పిటల్  లోకి చేర్పించాగానే అక్కడ జరిగే దారుణాలన్నీ గమనించిరెండు రోజుల తర్వాత ‘’ఎక్సామినర్ ‘’లో  కాలిఫోర్నియా హాస్పిటల్స్ లోని దాస్టీకాలను హాట్ హాట్ గా వార్తల్ని వడ్డించేవాడు .పరిస్థితు లలో రావాల్సిన మార్పుల్నీ తేవాల్సిన సంస్కరణలను సూచించేవాడు .ఇవి తాజా గా పసందుగా ఉండటం తో ఎగబడి విరగ బడి కొని చదివి పేపర్ సర్క్యులేషన్ పెరగటానికి కారకులయ్యారు జనం .సిటీ ని కంట్రోల్ చేసే అధికారుల బోలు తనాన్ని ,పక్ష పాత దృస్టిని,పట్టించుకోక పోవటాన్ని పెద్ద పెద్ద హెడ్డింగ్ లతో ప్రజల దృష్టికి తెచ్చేవాడు ఈ పేపర్ మనకోసమే ఉంది అని ప్రజల్లో నమ్మకం కలిగించాడు విశ్వాసం పెంచాడు .సదరన్ ఫసిఫిక్ రైల్ రోడ్ కోసం ప్రజా పక్షాన నిలిచి పత్రిక ద్వారా పోరాటం చేశాడు .ప్రజా ఉద్యమాలకు బుజం కాశాడు .ప్రజాసమస్యలకు అద్దంపట్టి పరిష్కారాలు చెప్పాడు .అది ప్రజా పత్రిక అని ప్రజావేదిక అని గొప్ప నమ్మకం కలిగించి పత్రికా వ్యాప్తికి విశేషంగా తోడ్పడ్డాడు రాండాల్ఫ్ .

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-11-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వసుధ కు పురస్కారం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అబ్బాయ్ పెళ్ళెప్పుడు

Inline image 1
Inline image 2

 
 
Inline image 3
 
 
Inline image 4
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆవు ఆరోగ్య వాయువు -హెబ్బార్ – నిప్పుల కుంపటి పై నేపాల్

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పురస్కారాల తిరస్కారాలు సబబేనా ? ఆధ్యాత్మ గురువు అవసరమా

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెగిన సంకెళ్ళు -కేసి ఆర్ కౌరవం తో ధర్మ యుద్ధం గెలిచిన జ్యోతి కృష్ణుడు

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలమంతా కుక్కలాడే బ్రదర్ -కవిత నేనైతే వెనక్కివ్వను -కమల్

Inline image 1   Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 2-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4

2-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య  శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి

శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి 15-8-1955న కృష్ణా జిల్లా పెదపారు పూడి మండలం ఎలమర్రు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ గబ్బిట మేధా దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,తల్లి శ్రీమతి భ్రమరా౦బ గారు .కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠంలో చదివి ఆంద్ర విశ్వ విద్యాలయం లో చేరి 1980లో ఏం ఏ చదివి పాసైనారు . 1979లో శ్రీమతి పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు .వీరికి నలుగురు కుమారులు –శ్రీ గోవర్ధన సుందర దాస్ ,సీతా రామ శర్మ ,జయ మాణిక్య శాస్త్రి ,శ్రీ యజ్ఞేశ్వర దక్షిణా మూర్తి శాస్త్రి .82లో గుంటూరు విద్వత్ పరిషత్ ,గౌరవ డాక్టరేట్ నిచ్చి గౌరవించింది తిరుపతి .కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం 1985లో గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పురస్కారమిచ్చి సన్మానించింది .   .

గుంటూరు లో డాక్టర్ శ్రీ కొలచల వెంకట కృష్ణ శాస్త్రి గారి సంస్కృత కళాశాలలో 1977నుండి 83వరకు లెక్చరర్ గా పని చేసి  1983-88 కలం లో  తిరుపతిలోని న్యాయ సంస్కృత విద్యా పీఠంలో సేవలందించి ,తర్వాత బెనారస్ లోని  న్యాయ వైదిక దర్శన సంస్కృత కళాశాలలో రీడర్ గా ఉన్నారు .1988నుండి బెనారస్ హిందూ సంస్కృత విశ్వ విద్యాలయం లో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేశారు .

శాస్త్రి గారి గీర్వాణ రచనలు -1982లో మాణిక్య ప్రభ రాశారు .1995మాదూర్ గడాధరో మత భేద విమర్శ ,రచించారు .1987 లో’’ పంచలక్షణ శత కోటి’’కి సంపాదకత్వం వహించారు .రామ రుద్రీయ వ్యుత్పత్తి వాద౦ మొదలైన వాటిపై  ధారా వాహికం గా 1978నుండి 1981వరకు నాలుగేళ్ళు రేడియో ప్రసంగాలు చేశారు .

ఆంజనేయ శాస్త్రిగారు 1984-88వరకు తిరుమల తిరుపతి దేవస్థాన ఉపన్యాసకులుగా ఉన్నారు .వారణాసి కే కే డిలో ,హైదరాబాద్ లోని డివైన్ లైఫ్ సొసైటీలో సభ్యులు వక్తలు గా ఉన్నారు .సంప్రదాయ న్యాయ మీమాంస శాస్త్రాలను బోధించటమే శాస్త్రిగారి ముఖ్య అభిరుచి .

1670కాలపు వాడైన నాగేశ భట్టు భట్తోజీ దీక్షితుల భారతీయ పంచాంగం  ప్రకారం  కాల ,తిది నిర్ణయం పై సంస్కృత రచన చేశారు .మాణిక్య ప్రభు తర్కామృతం పై సంస్కృతం లో శాస్త్రిగారు ‘’సంస్కృత వ్యాఖ్యా విభూషితం తధా మణిప్రభ హిందీ వ్యాఖ్య సంవలితం ‘’రాశారు దీనిని వారణాసి శారదా సంస్కృత సంస్థానం 2012లో ప్రచురించింది .ఇది న్యాయ తత్వ శాస్త్రం పై మహా వ్యాఖ్యానం .జ్యోతిశ్శాస్త్రం పై కాళిదాసు ని ‘’కాలామృతం ‘’కు చింతలపాటి వెంకట యజ్వ తో కలిసి వ్యాఖ్యానం రాశారు .దీన్ని తిరుపతి వేద విశ్వ విద్యాలయం ముద్రించింది .16౦౦ కాలం వాడైన మధురానాద తర్క వాగీశుని ‘’మాధురి ‘’17,18శతాబ్దాలకు చెందిన గదాధర భట్టాచార్య రాసిన ‘’గదాదరి ‘’,13వ శతాబ్దికి చెందిన గణేశుని ‘’తత్వ చింతామణి ‘’వ్యాఖ్యానాలను తులనాత్మకంగా పరిశోధించి శాస్త్రిగారు ‘’మాధురి గదాధర్యో మత భేద విమర్శ ‘’అనే ఉద్గ్రంధాన్ని రాశారు .దీన్ని తిరుపతి పద్మావతీ ప్రకాశన సంస్థ  ప్రచురించింది .రామరుద్రి రాసిన నవ న్యాయ సిద్ధాంతం పై రామ రుద్ర భట్టు రాసిన వ్యాఖ్యానం పై ‘’వ్యుత్పత్తి వాదః –రామ రుద్రీయ వ్యాఖ్యన సహితః ‘’రాశారు. దీనిని న్యు ధిల్లీ సంస్కృత సంస్థానం ముద్రించింది .ఆదిత్యాచార్య వైదిక కర్మకా౦డలపై రాసిన ‘’షడా సితి ‘’పై నంద పండిత వ్యాఖ్యాన పరామర్శ రాశారు .దీన్ని వారణాసి లోని ఇండలాజికల్ రిసెర్చ్ సంస్థ ముద్రించింది .

‘’న్యాయ విద్యా ప్రవీణ ‘’ మరియు వేదా౦తాచార్య ‘’బిరుదులు  శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి న్యాయ, మీమాంసా శాస్త్ర పాండిత్యానికి  ,వేదాంత ప్రతిభకు సార్ధకతను చేకూర్చాయి .

మరో ప్రముఖునితో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –4 1-శ్రీ పన్నాల రాధా కృష్ణ శర్మ

నాలుగవ గీర్వాణం

 

సాహితీ బంధువులకు నమస్సులు –‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’శీర్షికతో మొదటిభాగం లో 146,రెండవ భాగం లో 254,మూడవ భాగం లో 118మంది అంటే మొత్తం 518 మంది సంస్కృత కవుల గురించి అంతర్జాలం లో రాసిన సంగతి మీకు తెలుసు .ఇంకారాయవలసిన కవులు  చాలామందే ఉన్నారు .శ్రీ తూములూరి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి సౌజన్యం తో నాలుగైదు రోజులక్రితం శ్రీ మేళ్ళ చెరువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు(తెనాలి ),శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారు పరిచయమై వారికి మన పుస్తకాలు పంపగా తమ గురించి తమ రచనల గురించే కాక ఇంకా లబ్ధ ప్రతిష్టి తు లైన కవుల గురించి వారి రచనల గురించి వివరాలు తెలియ బరుస్తామని చెప్పారు .శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారూ శ్రీ దక్షిణామూర్తి శాస్త్రిగారు,శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారి ద్వారా పరిచయమై అక్టోబర్ 19న హైదరాబాద్ లో నేను వారిని సందర్శించి ఇంటర్వ్యు చేసి రికార్డ్ చేశాను .వీరిని గురించి రాయాలి .నిన్న మా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అమెరికా నుండి ఆచార్య శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి(ఎలమర్రు )గురించి విలువైన సమాచారం నెట్ ద్వారా పంపారు .కనుక’’ నాలుగవ గీర్వాణం’’   ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను .ఎవరి గురించి వివరం లభిస్తే వారి గురించి ఇందులో రాస్తాను .దీనికి మళ్ళీ ఒకటో నంబరు తో మొదలు పెడతాను .చదివి స్పంది౦చ వలసినదిగా మనవి .-మీ దుర్గాప్రసాద్

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –4

1— శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మ

శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారు 1932మర్చి 22న కృష్ణాజిల్లా నూజివీడు దగ్గర నరసాపురం లో జన్మించారు .నూజి వీడు జమీందారు గారు వీరి తండ్రిగారిని ఆహ్వానించి  తీసుకెళ్ళారు .ఎలిమెంటరీ స్కూల్ చదువు లేదు .లెక్కలు వచ్చేవికావు .మేస్టార్లు కొడతారని బడికి వెళ్లేవారుకాదు. తలిదండ్రులు శ్రీ కానాది భట్ల సూర్యనారాయణ, కోటమ్మగార్లు ,చిలకలూరి పేట పన్నాల వెంకట సుబ్బయ్య గారికి దత్తత వెళ్ళారు .అక్కడా చదువు సాగలేదు పెంపుడు తండ్రి స్వేచ్చ నిచ్చేవాడుకాడు ..బంధువుల ఇళ్ళల్లోఏదో పని చేస్తూ ఉండేవారు   చదువు లేదు చట్టుబండలు లేదని ఆక్షేపించారు .పట్టుదల వచ్చింది .కృష్ణా జిల్లా గొడవర్రులో 1945సంస్కృత పాఠ శాలలో చేరారు .దీన్ని త్రిలింగ విద్యా పీఠం ఆధ్వర్యం లో .చుండూరి వెంకట రెడ్డి నిర్వహించేవారు .సుమారు రెండేళ్ళు కావ్యాలు చదివారు .గురువు శ్రీవెల్లంకి సత్యనారాయణగారు   .ఇక్కడి నుండి గురువుగారి బావగారు పైడిమర్రి చంద్రమౌళి శాస్త్రిగారి దగ్గర నేలకొండపల్లి లో చేరి వ్యాకరణం మొదలైనవి చదివారు .గొప్ప పునాది ఏర్పడింది ఇక్కడే అని గర్వంగా చెప్పారు ..సంస్కృతం మీద అభిమానం బాగా కలిగింది .శ్రీమతి కాత్యాయని ని వివాహమాదారు కుమారుడు, కుమార్తె కలిగారు .

గుంటూరు జిల్లా పరిషద్ హైస్కూల్స్ లో తలుగు పండితులుగా పని చేస్తూ 1969లో తెలుగు ఏం ఏ ,72లో సంస్కృతం ఏం ఏ సాధించారు . రామాయణం ,రామాయణం ఆధారంగా వచ్చిన వివిధ ప్రక్రియలలో  ‘’శ్రీరామ శీలాను శీలనం’’ విషయమ౦  గా గ్రహించి పరిశోధన చేసి 1977లో పిహెచ్ డి పొందారు .బరోడాకు చెందినఒక పరీక్షకుడు ‘’రాముడు దేవుడైతేఏం  కాకపొతే ఏం’’అని వ్యాఖ్యానించి నందుకు  మనసు నొచ్చుకొని శ్రీ రాముడినే శంకి౦చి నందుకు బాధ పడి డాక్టరేట్ పొందినా ఎక్కడా ‘’డాక్టర్ ‘’అని రాసుకోలేదని చెప్పిన  మహోన్నత వ్యక్తిత్వం పన్నాల వారిది  .  .ఆంధ్రా యూని వర్సిటీ లో లెక్చరర్ పోస్ట్ కు ప్రయత్నించారు .అది తీవ్ర పోటీగా మారి వీరికి అందలేదు .అప్పటికే ఎన్నో గ్రంధాలు సంస్కృత ఆంధ్రభాషలలో రాసి ఉన్నందున వీరి పేరు విశేష వ్యాప్తి చెంది .ధర్మపురి సంస్కృత కళాశాలలో ఇంటర్వ్యు లేకుండానే వీరి ప్రతిభ గుర్తించి ప్రిన్సిపాల్ పదవినిచ్చారు .అంతకు ముందు నాలుగు నెలలు గూడూరు దగ్గర విద్యానగరం కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .

జిల్లెళ్ళమూడి సంస్కృత  కాలేజి లో’’ అమ్మ’’ ఆహ్వానం తో చేరి  1971 నుండి 1987 వరకు  ప్రిన్సిపాల్ గా పని చేసి,అమ్మ చరణార విందమధు మత్త  భ్రుంగమై,ఆమెపై స్తుతి ,స్తోత్రాలుఎన్నో  రాస్తూ ,ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ,కళాశాలకు సేవలందించారు . 1978లో స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు .మధ్యలో డెప్యుటేషన్ పై1981నుండి 86వరకు   తిరుపతి దేవస్థానం తరఫున వ్యాసభాగవతం శుద్ధ ప్రతి(క్రిటికల్ ఎడిషన్ )  ప్రచురించే ప్రాజెక్ట్ లో వీరిని పరిష్కర్తగా తీసుకొన్నారు. ఎన్నాళ్ళైనా అది నత్త నడక నడుస్తుంటే విసుగెత్తి మానేసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు .వీరికి ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు కుమారుడు బి టెక్ పాసై అమెరికాలో ఉద్యోగిగా ఉంటున్నాడు .కుమార్తె బెంగుళూరులో ఉంటున్నది

పోతుకూచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రిగారమ్మాయి శ్రీమతి ఝాన్సీ   పన్నాల వారి ‘’పావక ప్రభ’’ కు ప్రతిపదార్ద తాత్పర్యాలను రాశారు . పావక ప్రభ ను శ్రీ ఏం దినకర్ ఇంగ్లీష్ లోకి ‘’The Sojourn “’గా అనువదించారు  ..డాక్టర్ శ్రీమతి సుగుణ పన్నాలవారు ‘’జిల్లెల్ల మూడి అమ్మ ‘’గారిపై వ్రాసిన  గ్రంధాలపై రిసెర్చ్ చేసి పి హెచ్ డి పొందారు                                         .పన్నాల వారు ‘’యోగ వాసిష్ట సారం, . రామదాసు చరిత్ర ,శృంగార లహరి ,అంబికా సహస్ర నామ స్తోత్రం ,అంబికా సుప్రభాతం ,అంబికా స్తవ కదంబం ,అంబికా కరావలంబ స్తోత్రం ‘’మొదలైన రచనలు చేశారు .అమ్మ ఆశ్రమానికి దాదాపు ఇరవై దాకా పుస్తకాలు రాసి అందజేశానని ,తన వద్ద ఒక్క కాపీ కూడా లేదని తాను ప్రచారం కోరుకోలేదని ఆ’’ జ్ఞాన పండు’’అతి వినయంగా నాతొ అన్నారు . దీనికి నిదర్శనం వారి రచనల్లో వారి పేరు తప్ప ఏ విధమైన వివరాలు, విశేషాలు ఉండక పోవటమే .తనది ఒక భాషా సేవగా, అమ్మ పద సేవగా వారు భావించి జీవించారు .సంతృప్తి వారి జీవితం లో స్పష్టంగా కనిపిస్తుంది .భేషజాలు లేని వ్యక్తిత్వం, డబ్బ పండు లాంటి ఛాయా మనల్ని ఆకర్షిస్తాయి .,రమణ మహర్షి రాసిన ‘’ఉమా సహస్రం ‘’ కావ్యాన్ని  అనువాదం చేశానని చెప్పారు  .యోగ వాసిష్ట సారం ఇటీవలే రాశారు  83 ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మగారిని వారింట్లో అక్టోబర్ 19 సాయంత్రం  సందర్శించి మాట్లాడి ధన్యుడనయ్యాను .

ఇప్పుడు వారి గీర్వాణ వాణీ విలాసాన్ని చూద్దాం –ముందుగా ‘’శృంగార లహరి’’లో స్నానిద్దాం .పన్నాలవారికి సర్వం జిల్లెల్ల మూడి అమ్మ గా దర్శనమిస్తుంది .ఆమెయే ఆయన శృంగార లహరి  .

మొదటి శ్లోకం ‘’యయా శక్త్యా బ్రహ్మా కమల నయనః ఫాలనయనః –జగత్ స్రస్టు౦ పాతుం ప్రళయ ముపనేతు  చ కుశలాః

యాయా వ్యాప్తం విశ్వం వసతి ఖలు యస్యాం జగదిదం –నమామాద్యాం దేవీం ముకుళిత కర స్తా మభ య దా౦ ‘’ మరొకటి –

‘’నమే సంధ్యో పాస్తి .ర్నచ విహిత కర్మ స్వభిరతి –స్త్వదీయా౦ఘ్రి ద్వంద్వం విధి వదసి నాభ్యర్చిత మహో

కిమాలోక్య వ్యర్దే మయి సదయ భావా సి జనని – తవైత ద్వాత్సల్యం వదతి భవతీం విశ్వ జననీం ‘’

సంస్కృత కవితాప్రవాహం శంకరాచార్యుల సౌందర్య లహరిని తలపింప జేస్తుంది .జిల్లెళ్ళమూడిని ‘’అర్క పురి

‘’అన్నారు.అమ్మ దివ్య చరిత్రయే ఈ లహరి .ఆమె హంసత్వాని వర్ణిస్తూ చెప్పిన శ్లోకం పరమ గభీరంగా ఉంది .

‘’భజంతే హంసా స్తంవిధి మపి నిషేవ్యోదక పయో –విభాగ ప్రాశస్త్యం తవ తు చరణౌ సేవిత వతాం

క్రుతార్దానాం నీరం భవతి విమల క్షీర మహ-ప్రభవం క స్తోతుం ప్రభవతి  శుభే తావక మిహ ‘’

చివరగా ఒక శ్లోకం

‘’క్వణన్మంజీరం  భో జనని విచారంత్యాం త్వయి భ్రుశం –నటంత స్సానందం సరభస ము౦ దృశ్యా  దివి షదో

ముదాభ్య్గ్డ ద్గచ్చంతో విదరతి నుతిం తే శివ కరీం –క్రుతార్దా కృత్వా యాం దదతి పరమానంద లహరీం ‘’

‘’అమ్మ ‘’శ్రీ లలితా పరా భట్టారికను దర్శించి పులకించి అనుభూతి తనుపొంది మనకు ఆ ఐశ్వర్యాన్ని కలిగించారు పన్నాల మహాశయులు .

వీరి రెండవ కావ్యం ‘’పావక ప్రభ ‘’ఇదీ అమ్మ మీద రాసినదే .దీనికి డా ధూళిపాల అర్క సోమయాజులుగారు ముందుమాట ఆంగ్లం లో రాశారు .జగన్మాతను స్తుతించే అద్భుత స్తోత్రం అన్నారు .ఇందులో ‘’భ్రూ మధ్యే నవ కు౦కు మం ‘శ్లోకం పరమ రామణీయకం అన్నారు .ఇందులో సాక్షాత్తు శ్రీ రాజ రాజేసశ్వరి అమ్మవారిని జిల్లెళ్ల మూడి అమ్మవారిలో తాదాత్మ్యంగా చూసిన ‘’లో చూపు’’ ఉందన్నారు .అలాగే ‘’యతో విద్యా అవిద్యా ..శ్లోకం ,66వ శ్లోకం 71 వ శ్లోకం కవిగారి భావుకతకు ,భక్తీ తాత్పర్యాలకు పరాకాష్ట అన్నారు .

రెండవ శ్లోకం చూద్దాం

‘’ఏకాకితా ముపగతే జన మండలీనాం –మధ్యే చరన్నివ వినిర్మల శాంతి సౌదే

కల్లోలితః పరమ పుణ్య పదే చ పాపం –చిన్వన్ సచిత్ర మనుజో విలపత్సజశ్రం ‘’

చివరగా

‘’అనవరత ముపాసే తాం సముద్రాంబు పూరా-కరుణ కిరణ లక్మఖేలయా పీయ భూయే

నవ జలధరం లాలీలయా భూత దాత్రీ –రచయితి నవ సస్య స్యమాలాంయా సావిత్రీ ‘’అని ముగించారు అణువణువునా ప్రత్యక్షరం లో అమ్మ ప్రేమామృతమే కనిపిస్తుంది. ఆమెది పావక ప్రభ అంటే అగ్ని కాంతి అనగా పవిత్రం ,పుణ్య లోక ప్రాప్తికరం .తాదాత్మ్య భావన తో శర్మగారు రాసి చిరకీర్తి నార్జించారు .వారు రాసిన స్తోత్రాలు సుప్రభాతాలు అన్నీ నిత్యం జిల్లేళ్ళ మూడి అమ్మ గుడిలో గానం చేస్తారు .అంతకంటే వారికి ఇంకేం కావాలి .ఆ మాటే వారు స్వయం గా చెప్పారు నాతొ .

అలాగే అమ్మ సుప్రభాతం ,అంబికా ప్రపత్తి ,శ్రీ చక్రేశ్వరీ స్తవం  ,అంబికా నవ మాలికా స్తవం రాశారు .దీనితోబాటు రాసిన ‘’అంబికా కరావ లంబ స్తోత్రం ‘’కూడా ప్రసిద్ధి చెందింది .అందులో నుంచి మచ్చుకు కొన్ని. ఇది అర్ధ తాత్పర్యాలతో ఉండటం విశేషం .మొదటి శ్లోకం

‘’ఏకైక మిత్రమితిమాం కలుషా స్సమస్తాః-కర్షంత్య ధీరమతి దుర్బల చిత్త మేనం

నైరాశ్య భార నిహతస్య శివేనసూయే –మాతర్భవామి మామ దేహి కరావలంబం ‘’

భావం –అనసూయా మాతా శ్రేయస్కరీ !దైన్యం తో దుర్బల మనసుతో ధైర్యం చెడి ఉన్న నన్ను మిత్రునిగా భావించి పాపాలన్నీ వశ పరచుకొంటున్నాయి .నిరాశ తో కుంగిపోయా .నాకు చేయూతనిచ్చి ఆదుకో .మరో శ్లోకం

‘’త్వత్సన్నిదౌ ప్రశమితైరపి తే పరోక్షే-క్రోదోద్యతై ర్భయద సంశయ సర్ప రాజైః

దస్టోప్యనన్య శరణ్యస్యశివే నసూయే –మాతర్భవాని ౧మమ దేహి కారావ లంబం ‘’

భా –నీపాదాల దగ్గరున్నప్పుడు నా అనుమానాలన్నీ తీరి నట్లే ఉంటాయి .వదిలి పెట్ట గానే పాముల్లాగా బుసలు కొడుతూ నన్ను కాటు వేస్తాయి .అలాంటి స్థితిలో నువ్వు తప్ప నాకు వేరే శరణు లేరు. కాపాడు తల్లీ

‘’బంధూక పుష్ప రుచి కుంకుమ శోభి తాస్యే –సిందూర రాగ రమణీయ కపోల దేశే

నాసావరీణ కనక ప్రసవే నసూయే –మాతర్భవాని ౧మమ దేహి కారావ లంబం .’’

తా-మంకెన పువ్వురంగు కుంకుమ బొట్టుతో నీముఖం శోభిస్తోంది చెక్కిళ్ళు సిందూరం రంగుతో అందంగా ,నాసిక సంపెంగ పువ్వును పరిహసిస్తున్నట్లున్నాయి .దివ్య తేజో విరాజమానమైన ఓ పరమేశ్వరీ నాకు చేయూత నివ్వు .

ఈ విధంగా శకరాచార్యులవారి కరావ లంబ స్తోత్రానికి దీటుగా దీన్ని పన్నాల వారు ,ఆపన్న శరణ్య ‘’అమ్మ ‘’ చేసాయం కోరారు .చివరి శ్లోకం లో

‘’అంబా పదాబ్జ మధుపాన రతేన రాదా –క్రిష్ణాఖ్య మత్త మధుపేన కృతం మనోజ్ఞం

స్తోత్రం భవేదిద మనుత్తమ సౌఖ్య దాయి –తేషాం సదా సుకృతి నామిహ ఏ పఠంతి’’

భా-అంబిక చరణ కమలాల సేవ అనే మధువును తృప్తిగా గ్రోలి మత్తెక్కిన తుమ్మెద వంటి వాడు ,రాదా కృష్ణుడు(పన్నాల రాదా కృష్ణ శర్మ )అతనిచేత మనోహరమైన ఈ స్తోత్రం రచింప బడింది దీన్ని చదివిన పుణ్యాత్ములు సర్వోత్తమ సుఖాలను పొందుదురు గాక .

మనోజ్ఞం ,అనుత్తమం  .అనే పదాలను స్తోత్రానికి విశేషణాలుగా పన్నాల వారు వాడారు .ఇంతకంటే సుఖం లేనిది ,సర్వోత్తమమైన సుఖాన్ని ఇచ్చేది అని భావం .ఆ సుఖం మామూలు సుఖం కాదు. మనోజ్నమైనది .అంటే మనసుతో మాత్రమే తెలియ బడేది .అనగా సచ్చిదానంద మైన సుఖం .నిర్మలమైన మనస్సు అంటే ఆత్మ.ఆత్మ యొక్క సుఖం ఆత్మకే తెలుస్తుంది .ఇతరులకు తెలియదు .కనుక ఈ స్తోత్రాన్ని సవిమర్శనంగా పఠించే వారికి రాగ ద్వేష రహితమైన శుద్ధమైన ఆత్మగా మనస్సు ఉంటుందని ఫలశ్రుతి చెప్పారు ,వివరణ కూడా వారే ఇచ్చారు ..అందరం చదివి శుద్దాత్ములవ్వాలని పన్నాలవారి అభీష్టం .

చివరగా’’ శ్రీ అంబికా నవ రత్న మాలిక ‘’లోని చివరి శ్లోకం తో సెలవు తీసుకొందాం –

‘’అంబా దివ్య పదార వింద భజనా –నందామృతా స్వాదినా-రాదా కృష్ణ మధు వ్రతేన కలితం బృందం స్తుతీనామిదం

ఆమోదం జనయత్సమస్త సుమన-స్సంఘస్య పృధ్వీ తలే –జీయాదా రవి చంద్ర తార మమలం –మాత్రా శిషాపోషితం ‘’

పన్నాల వారి ఫోటో జత చేశాను చూడండి

మరో కవితో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-15-ఉయ్యూరు

 

 

‘’

Posted in రచనలు | Tagged | Leave a comment

కళ్యాన్ బీహారు కు సంకేతాలు – ప్రభ – ఈ వ్యతిరేకత పరమార్ధం ఏమిటి ?వెంకయ్య

Inline image 1
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”భావ సంబంధం సున్నితమైనది ”

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గురువు వెలుగు శుద్ధ స్పటికం ,చిత్రమైన ముంగిస -పరమాచార్య – శిఖ ఎందుకు

Inline image 1
Inline image 2  Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘అయితే ఒకే ”తో” కొండంత” హాస్యాన్ని పండించిన ” లక్ష్మణరావు” అవతలి తీరాలకు ”వలస ”పోయాడు

Inline image 1
Inline image 2
 
Inline image 3
 
 
Inline image 4
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -86

37-ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ సంగీతానికీ కొత్త ఇంప్రెషనిస్ట్ వెలుగులు అద్దిన –క్లాడ్ ఏషిలీ డెబూసీ-3(చివరి భాగం )

నలభై లలో సంగీత విమర్శకుడిగా ఎన్నో పత్రికలకు డేబూసీ రాసేవాడు  .ఇవన్నీ ఆయన చనిపోయిన తర్వాత ‘’మాన్శార్ క్రోచ్ –యాంటి డిలేటేంటీ’’పేరుతొ ప్రచురితమైనాయి .’’ఐబీరియా ‘’ను చూసి విన్న తర్వాత ఆయన ప్రతిభ తెలుసుకొని విమర్శనాస్త్రాలు సంధించటం మానేశారు .స్పానిష్ సంగీతాన్ని స్పెయిన్ వారికంటే డెబూసీయే చాలా గొప్పగా రాశాడని మెచ్చారు .నలభై రెండేళ్లకే బాగా అలసిపోయాడు .శారీరక మానసిక౦గా  క్లేశం పొందాడు. ఈ వయసులోనే ‘’ప్రిల్యూడ్స్’’తో బాటు 12అసాధారణ ‘’ఎట్యూడ్స్ ‘’ రాశాడు. ఇవి శాశ్వత కీర్తిని తెచ్చాయి .మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయిన తర్వాత ఇక సంగీతం చేయటం మహా కష్టం అనిపించింది .కాని మిలిటరీ జర్మనీ దాస్టీకాన్ని,సంస్కృతీ వ్యతిరేకతను  నిరసిస్తూ కొద్దిగా రచనలు చేశాడు .ఆయన సంతకాన్ని ‘’క్లాడీ డేబూసీ ,మ్యుజీషి యన్ ఫ్రాన్కైస్ ‘’అని చేసేవాడు .1916తర్వాత రాయటం మానేశాడు .చాలాకాలం బాధను ఒంటరిగా సహించాడు .కాని’’నడుస్తున్న శవం ‘’గా అయిపోయినప్పుడు మాత్రం ఆయనకు కేన్సర్ సోకిందని తెలిసింది .జర్మన్ సైన్యం పారిస్ మీద బాంబుల వర్షం కురిపించినప్పుడు దాక్కో టానికిసురక్షిత ప్రాంతానికి  వెళ్ళే ఓపిక కూడా ఆయనకు లేదు .చివరికి తప్పని పరిస్తితులలో అత్యవసరంగా ’’మలాశయం(రెక్టం)కు  ఆపరేషన్ చేయి౦చు కొన్నాడు .కాని కోలుకోలేకా పోయాడు .25-3-1918న విపరీతమైన విమాన దాడులు బాంబుల వర్షం సమయం లో సంగీత జ్ఞాని  క్లాడే అషిలీ డెబూసీ 52 ఏళ్ళకే మరణించాడు .

డెబూసీ సంగీతం నిరసన ,మిరుమిట్లు గొలిపే ఆశ్చర్యంతో కలిసి ఉంటుంది .సంగీత మార్గ దర్శి అనిపిస్తాడు .శబ్దం  లో స్వచ్చతను ఆయన సాధించాడు .మాధుర్యం చాలా సున్నితంగా,పారదర్శకంగా  ఉంటుంది .వెండి జలతారు మిరుమిట్లు గోచరిస్తాయి .ఎక్కడా ఆగటం ఉండదు. నిరంతర సంగీత స్రవంతి గా ఉంటుంది .’’దిఆర్గాన్ ట్యూనర్ స్కేల్ ‘’ను ఉపయోగించటం అతని ప్రత్యేకత .అందులో ఆరు నాదాలు దర్శనమిస్తాయి .ఎక్కడా క్రమం తప్పదు .సాంకేతికత లో ఎన్నో అద్భుతాలు కనిపెట్టాడు .అవి సంగీత చరిత్రలో మైలు రాళ్ళు గా నిలిచి పోయాయి .ఆయన చూపిన ‘’సమాంతర శ్రేణులు ‘’అంతంత మాత్రం గా వినేవారిని తట్టి లేపి స్పూర్తి కలిగిస్తాయి .జెట్ స్ప్రింగ్ లాగా నాట్యమాడి ఉర్రూత లూగిస్తాయి .ఆస్కార్ థామ్సన్  ‘’the determining factor in the  musicof atleast the first third of the twentieth century because of the doors he opened and the restraints he cast aside ‘’ అన్నమాటలు అక్షర సత్యాలే .

డెబూసీ తో సంగీత హోరు ఆగిపోయింది .జిగి బిగి మిశ్రమ వాద్యాల రణగొణ ధ్వనులకు మంగళం పాడాడు .శృంగార అ౦గారాన్ని ఆర్పేశాడు .అనుభూతి వాదానికి (ఇమ్ప్రేషలిజం) తేర తీశాడు .మానసికానందాన్ని సమకూర్చాడు .అది తర్వాత వారికి మార్గ దర్శనం చేసింది .సంగీతం లో ఇమ్ప్రేషనిస్ట్ అవతారం ఎత్తినవాడు డెబూసీ .ఇతని ప్రభావం రావెల్ డ్యూకాస్ , రస్సెల్ పై అధికం .ఫ్రాన్స్ లో ఒక కొత్త ఉద్యమ యుగం ఆరంభమై విశ్వ వ్యాప్తమైంది .దీనికి పారిస్ ప్రధాన కేంద్రమై నిలిచింది .కాని ఇమ్ప్రేషనిజం అనే పదాన్ని గుణాన్ని తన సంగీతానికి పెట్టటం ఆయనకు నచ్చేదికాదు .

మద్య యుగపు సంగీతం నుంచి డెబూసీ ఎన్నో విలువైన విషయాలను ఏరికోరి తెచ్చుకొన్నాడు .ఫ్రెంచ్ క్లేరియన్ సంగీతకారులైన కూపెరిన్, రామూ ల సంగీతం అంటే మహా ప్రేమ .బాష్ ,చోపిన్ ,లిసాజీల ప్రభావమూ ఈయనపై ఎక్కువే .ఆయనకు ‘’పాశ్చాత్యేతర ‘’సంగీతం అభిమానమైంది .ప్రాచీనమైనది ప్రాత్య సంబంధమైనది అయిన సంగీతాన్ని ఆరాధించాడు .జావా వారి సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చాడు .వాళ్ళ గాంగ్స్,మెటల్లో ఫాన్స్ వాద్యాలపై మోజు .ఆయనకు సాహిత్యం విజువల్ ఆర్ట్(ద్రుశ్య కళ) లపై ఆసక్తి ఎక్కువ .మొదట్లో ఫ్రెంచ్ సింబాలిజం ఉద్యమ  ప్రభావం లో ఉన్నాడు .వాళ్లకు వాస్తవికత ప్రక్రుతిలపై మోజు లేక పోవటాన్ని జీర్ణించుకోలేక పోయాడు .వచన కవిత్వ ప్రభావం ఉండేది .స్టీఫెన్ మలార్మే గొప్ప ప్రభావం కలిగించాడు .సంగీతానికి తన కవిత్వానికి దగ్గర సంబంధం ఉందని మలార్మే చెప్పేవాడు .దీనితో మలార్మే కవిత ‘’ఆఫ్టర్ నూన్ ఆఫ్ ఏ ఫాన్ ‘’కు సంగీత కూర్చాడు డెబూసీ.

తర్వాత నేచర్ కు దగ్గరయ్యాడు .తనమతం నేచర్ అన్నాడు .గూఢ మైన ప్రక్రుతి (మిస్టీరియస్ నేచర్ )నా మతం , దైవం అని చెప్పాడు .ఆచారాలుపాటిస్తూ పూజలు చేస్తూ కూర్చునే దానికన్నా ప్రకృతిని ఆస్వాదించటం వల్లనే మానసిక తృప్తి ఆనందం అనుభూతి లభిస్తాయని అన్నాడు. సముద్రం దగ్గర ఉండి సూర్యోదయ సూర్యామయాలను అవి పొందే అందమైన మార్పులు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది అన్నాడు .సమకాలీన పైంటర్-జేమ్స్ ఆబాట్ మెక్ నెల్ డెబూసీ పై పెద్ద ప్రభావాన్ని కల్గించాడు .

20వశతాబ్దాన్ని అత్యధిక ప్రభావితం చేసిన కంపోజర్ లలో డేబూసీ మొదటి స్థానం లో ఉంటాడు .’’his innovative harmonies were influential to almost every major composer of the 20th century particularly Mauris Ravel  ,Igor travensky ,bela Bartok etc’’.జపానీస్ క౦పోసర్ ‘’టోరు టేకమిస్కి’’బాగా ప్రభావితుడైనాడు .జాజ్ సంగీతం లో మైల్స్ డేవిస్ ,డ్యూక్ ఎలి౦గ్ టన్  లను ప్రభావితం చేశాడు .సమకాలీన సౌండ్ ట్రాక్ కంపోజర్ జాన్ విలియమ్స్ వగైరాలపై ప్రభావం అధికం .

Inline image 1  Inline image 2  Inline image 3

మరో ప్రముఖునితో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-11-15-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కారా మాస్టారు గారికి శ్రీ మైనేని వారి జన్మ దిన కానుక

సాహితీ బంధువులకు ఆంద్ర ప్రదేశ్ అవతరణ శుభాకాంక్షలు

 మహా కధకులు ,శ్రీ కాకుళం పట్టణం లో ”కదా నిలయ0 ”రూపకర్త శ్రీ కాళీ పట్నం రామా రావు (కా రా మాస్టారు )గారి 9-11-15నాడు  91వ జన్మ దినోత్సవ సందర్భంగా ‘ ,సరసభారతి ఆప్తులు అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ”కదా నిలయం ”కు 15,000 (పది హేను వేల రూపాయలు )

విరాళంగా ”సరస భారతి ”ద్వారా అందజేశారని తెలియ జేయటానికి ఆనందం గా ఉంది . మాస్టారు మరింత  ఆరోగ్యంగా  శత వసంతాలు పైగా ఆరోగ్యం తో వర్ధిల్లి సాహితీ సేవలో తరించాలని కోరు కుంటున్నాను .. సరస భారతి ద్వారా విరాళం అందజేసిన ఆప్తులు శ్రీమైనేని వారి దంపతులకు కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగ జేయాలని బగ వంతుని ప్రార్ధిస్తున్నాము .-దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -84

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -84

37-ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ సంగీతానికీ కొత్త ఇంప్రెషనిస్ట్ వెలుగులు అద్దిన –క్లాడ్ ఏషిలీ డెబూసీ

సంగీతం పతనమై పోయిందని అనుకోవటానికేమీలేదు .  ఆధునిక సంగీతం లో నాలుగు విభిన్న జాతీయ స్రవంతులున్నాయని తెలుసుకోవాలి .అందులోరిచార్డ్ వాగ్నర్  తీవ్రమైన వాద్య ఘోషతో దద్దరిల్లే జర్మనీ సంగీతం ఒకటి .ఆ తర్వాత దీన్ని మరీ బలోపేతం చేసిన రిచర్డ్  స్ట్రాట్ ధోరణి తోబాటు ‘’ట్వెల్వ్ నోట్’’పద్ధతిలో ప్రసిద్ధమైన ఆర్నాల్డ్ స్కూన్ బెర్గ్ సంగీతం .  రెండవది   రష్యాకు చెందిన ‘’ఇగార్ స్ట్రావెన్ స్కి బూర్జువా సెంటి మెంట్ ను కాదని ’ ప్రాధమిక ,క్లాసికల్ లతో  సమ్మేళనమైన సంప్రదాయం .దీనితోబాటు డిమిట్రి  స్టాస్ట కోవిస్కి మరియు సెర్జీ ప్రోకోఫీవ్ ల సి౦ ఫనీలు .అమెరికా సంగీతం జానపదం  ,జానపద నాట్యం  నీగ్రో స్పిరిట్యు వల్స్ ,ప్రాంతీయ జాజ్ మొదలైన స్థానిక విషయాలనుండి ఆవిర్భవించింది .సంగీతం సౌందర్య సౌరభాన్ని తెచ్చిన ఘనత ఎరిక్ స్టేటీ,మారిస్ రావెల్ దక్కితే దాన్నినిర్దుష్టంగా సుసంపన్నం చేసిన ఖ్యాతి ఫ్రెంచ్ సంగీత కారుడు క్లాడ్ ఏషిలీ డెబాసి కి లభించింది .డేబాసీ సంగీతానికి కొత్త రంగులు ,హంగులు పొంగులు సోయగాలు ,సున్నితత్వం అద్ది ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ  సంగీతానికీ కొత్త వరవడి సృష్టించాడు  .

డేబాసీ ప్రభావం ఒక్క సారి  ఏర్పడినది కాదు ..క్రమానుగతంగా వచ్చింది .22-8-1862 నఫ్రాన్స్ దేశం లోని పారిస్ కు దగ్గరలో ఉన్న  సెయింట్ జేర్మాన్ లేయీ లో పుట్టాడు .క్లాడ్  ఏషిలీగా చర్చ్ లో పేరు నమోదైంది .కాని యవ్వన దశలో తానే ‘’డేబాసీ ‘’తగిలించుకొన్నాడు .దీనికి కారణం తన వంశం చాలా ఉన్నతమైనదని తెలియ జేయటానికే .ఏషిలీ అనేదాన్ని 30వ ఏడాది వరకు ఉంచుకున్నాడు .పేరుకే గొప్ప కాని ఊరు దిబ్బ .సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు .తరతరాలుగా చిన్న వ్యాపారస్తులు .అయిదుగురు సంతానం లో మనవాడు పెద్దోడు .కుటుంబం నడిపే చైనా షాప్ లో ఒక చిన్న గదిలో పుట్టాడు ఈ భవిష్య సంగీత సామ్రాట్ .తండ్రి మాన్యువల్ డేబాసీ కి ఒపేరా సంగీతం అంటే బాగా ఇష్టం,ఎందరో సంగీత కర్తలతో మంచి పరిచయాలున్నాయి . .ఇది కొడుకుకు కూడా అబ్బాలని ఆరాట పడేవాడు

కుర్ర డేబాసీ పియానో వాయించటం లో ఘటికుడని తెలిసి ,ఇక అతని చదువు సంగతి పట్టించుకోకుండా వదిలేశాడు .స్కూల్ కు పంపకుండా అతడు ‘’బాల మేధావి ‘’అని భావించి  తనతోబాటు ధియేటర్లకు సంగీత కచేరీలకు వెంట బెట్టుకొని తిప్పేవాడు .దీనితో చాలా ఏళ్ళు ఆతను సంగీతం కూరుస్తున్నా అందులో పరిపూర్ణత సాధించలేక పోవటం తరచూ తప్పులు చేయటం జరిగాయి .గురువు వద్ద నేర్చిన విద్యలేకపోవటమే కారణం .తప్పు తెలుసుకొని మొదటిసారిగా పియానో పాఠాలు నేర్పించాడు .దీనికి ఫీజు అతని కుటుంబ స్నేహితుడు అంటోనీ ఆరోసా చెల్లించేవాడు .ఈయనే మనవాడి ‘’గాడ్ ఫాదర్ ‘,ఆంట్ గారి  ప్రేమికుడు కూడా . కాని ఆరోసా ఆమెను తిరస్కరించటం తో స్పాన్సర్ షిప్ కోసం వేరొక అండను వెతుక్కోవాల్సి వచ్చింది.అదృష్ట వశాత్తు మన కుర్రాడు మేడం మాట్ డీ ఫ్లార్విల్ ద్రుష్టి లో పడ్డాడు .ఈమె చోపిన్ శిష్యురాలేకాక డేబాసీ కి ఆరాధనీయుడైన కవి పాల్ వేరలీన్ కు అత్తగారు కూడా .ఆమె మూడేళ్ళు మనవాడికి సంగీత పాఠాలు చెప్పింది .ఆమె నేర్పిన సంగీత విద్యలో పరిపూర్ణుడై ,11వ ఏట నే ‘’పారిస్ కన్సర్వేటరి’’  లో చేరటానికి అర్హత పొందాడు  .

ఈ కన్సర్వేటరి  లో 11 సంవత్సరాలున్నాడు .కొంత అసంతృప్తి ,కొంత సంతృప్తి తో ఇక్కడ గడిపాడు .హార్మానిక్ ప్రోగ్రేషన్స్ లో స్వేచ్చగా ప్రవర్తిస్తూ పాతవాటి బదులు తేలికైనవి కని పెడుతూ ,,సంగీత సంప్రదాయ విరుద్ధమైన వాటికి   స్వర రీతులను రాస్తూ ఉన్నాడు .  ఆతను చేసే ప్రయోగాలన్నీ తప్పుల తడకలన్నారు సంప్రదాయజ్నులు .అతనిలో ప్రతిభ ఉంది కాని పెడ దారి పడుతోంది అన్నారు .శబ్దాలను సృష్టించటం లో అప్పటిదాకా ఉన్న పాత పద్ధతులపై విభేదించాడు .మూల సిద్ధాంతమే తప్పు అన్నాడు .పియానో కళాకారుడిగా గొప్ప ప్రవీణుడు ,సాంప్రదాయానికి వ్యతిరేకి ,నవీన ద్రుష్టి ఉన్నవాడు .అతని సహచర విద్యార్ధి గేబ్రియల్ పీర్నీ ‘’డెబాసీ అద్భుత కళాకారుడు .అందర్నీ ఆశ్చర్యం లో ముంచేస్తాడు ,కాని వికారం అనిపిస్తుంది .దీనికి కారణం భయమో ఏదో ఉందని పిస్తుంది ‘’అన్నాడు .పియానోను చాలా ఫ్రీగా ముతకగా వాడేస్తాడు .కష్టమైన స్వర సమ్మేళనం వచ్చినప్పుడు చాలా గట్టిగా శ్వాస పీల్చేవాడు .బీతోవెన్ ఇతన్ని తప్పించుకోనేవాడు .ఎవరేమన్నా 14 ఏళ్ళకే అద్భుత ‘’చాపిన్ ప్లేయర్ ‘’అని పించుకున్నాడు డెబాసీ.పదిహేనవ ఏట పాటలకు  సంగీతం సమకూర్చాడు .ఇవి సాంప్రదాయ సెలూన్ ధోరణిలో ఉండేవి .

17 వ ఏట సంగీత విద్య కు తాత్కాలికం గా అంతరాయం కలిగి౦ది .సంగీత గురువు శిష్యుడికి   రష్యాలో ని సంపన్న గృహిణి నదేజా వాన్ మెక్ నుండి ఆహ్వానం వచ్చేట్లు సిఫార్సు చేశాడు .ఆమె టేకై కోస్కికి ఎన్నో ఏళ్ళుగా అతన్ని చూడకుండానే  ఆర్ధికం గా సాయ పడుతోంది .ఆమెతో బాటు సంగీత త్రయం ఉంటారు .ఆమె ఎక్కడికి వెడితే వీరినీ తనతో బాటు తీసుకొని వెళ్ళేది .రష్యా రావటం తో డెబాసీ సంగీత ప్రపంచం అకస్మాత్తుగా విస్త్రుతమైనది .మాస్కో లో మనవాడు బోరోడిన్ కూర్చిన ఆటవిక డాన్స్ ట్యూన్లు ,రిమ్ స్కి కోర్సకోవ్ కూర్చిన ఆకర్షణీయ స్వరాలు ,టకై కో విస్కీ ఆత్మ వేదనా రాగాలు,తూర్పు దేశాలకు చెందిన అపరిపక్వ ధోరణులు విన్నాడు .గ్రీకుల ఆరు మూల స్వరాలు ,ఇంపు చెడని చైనా నిరంతర సంగీతం ఆస్వాదించాడు .వెనిస్ లో తన నాహ్వానించిన మెక్ గారి సౌజన్యం తో ప్రఖ్యాత సంగీతనిది’’ రిచార్డ్ వాగ్నేర్’’ ను కలుసుకొనే అదృష్టం పొందాడు .వియన్నాలో ‘’ట్రిస్టాన్ అన్డైసోల్డీ’’సంగీతానికి పరవశించి పోయాడు .

తిరిగి ఫ్రాన్స్ చేరి కన్సర్వేటరిలో ఒక చెవితో ప్రయోగాత్మక హార్మనీలు ,రెండవ చెవితో ‘’ప్రిక్స్ డీ రోమ్’’కు సంగీతం సమకూర్చాడు .సంగీత ప్రదర్శనాకారుడిగానే  పొగడ్తలు పొందుతున్నాడు .సహకార వాద్యానికి మొదటి బహుమతి అందుకొన్నాడు .కాని సృజనకు దూరమై పోతున్నానేమో ననే అనుమానం ఉండేది .’’హార్మని పరీక్ష లో డజను తప్పులు చేశాడని ఇన్ స్ట్ర క్టర్లు వేలెత్తి చూపారు .అవి కావాలనే చేశానని సమాధానం చెప్పాడు .’’శృతి విరుద్ధ స్వరాలను ఎందుకు వదిలెయ్యాలి ?వాటికీ స్థానం కల్పించవచ్చు కదా ? తప్పేమిటి ’’అని ప్రశ్నించాడు డెబాసీ.అకాడెమీ వాళ్ళ గుండెల్లో బాంబు పేల్చాడు .తర్వాత ఒక న్యాయ నిర్వహణాధికారి ఇతని వ్రాత ప్రతులను రెండిటిని పరిశీలించి అంతటి ప్రతిభావంతుడు ఇలాంటి  తప్పులు చేయరాదన్నాడు .డెబాసీ ఏంతో సంతోషించాడు .చివరికి బిగ్గరగా ‘’నేను నా స్వంత సృజన చేశాను ‘’అని అరిచాడు .డేబాసీ  మొదటి సారిగా ప్రచురితమైన తన సంగీత రచన ‘’నూటిస్ డీ ఎటాలిస్’’ను  మేడం మేరీ సైంటీ  కు అంకితమిచ్చాడు .ఇప్పటినుంచి డెబాసీ ఆర్టిస్ట్ ల, బోహీమియన్ ల సర్కిల్ లో చేరాడు . ఇందులో మేడం వాస్నిర్ ప్రముఖ పర్షియన్ ఆర్కి టెక్ట్ భార్యకూడా ఉంది .అందం చందం కోయిల స్వరం ఉన్న ఆమెతో మన 19ఏళ్ళ డ్రీం బాయ్ ప్రేమలో పడ్డాడు .తలిదండ్రులకు గుడ్ బై చెప్పి , వాస్నిర్ సన్నిధానం లో కి ప్రవేశించాడు ఈప్రేమ పిపాసి .

సశేషం

 

Inline image 1

ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -56 గూడూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

ఊసుల్లో ఉయ్యూరు -56

గూడూరు మైకా వ్యాపారం చేసిన వేగ రాజు వారు

గూడురు  మైకా గనులు ,వ్యాపారం అంటే చప్పున గుర్తోచ్చేవారు కృష్ణా జిల్లా మానికొందలోని గోగినేని వారి కుటుంబం .అక్కడి మైకా గనులపై తిరుగు లేని ఆధిపత్యం సంపాదించి పుష్కల౦ గా  డబ్బు సంపాదించి అపర కుబేరులయ్యారని అందరూ చెప్పుకొనే విషయమే .సరుకు ఒకటే కాని దాని లోని లోతులుపాతులు తెలిసి వ్యాపారం చేస్తే కలిసొస్తుంది .లేక పొతే నష్టాల్లో ఆ గని లోతుల్లోకి కూరుకు పోతారు .దీనికెంతో లౌక్యం చాకచక్యం ,ధీమా, వ్యవహార దక్షత,అవతలి వాడిని ఎదుర్కొనే సత్తా ,సామర్ధ్యం ఉండాలి ,.దీనికి తోడూ అదృష్టమూ కలిసి రావాలి  .మైకా పైకి కనిపించే తళతళలతో ఊరించి బుట్టలో వేసు కొంటుంది. దిగితెనేకాని లోతు తెలియదుకదా .తెలీకుండా దిగితే ,అంచులు పట్టుకొనే తెలివి తేటలు లేకపోతె పెట్టిన సొమ్మంతా గనిపాలే .మిగిలేది అప్పులూ, తిప్పలే    .ఈ రెండవ రకానికి చెందినా వాళ్ళే మా ఉయ్యూరు లోని వేగారాజు వారు .పూర్తిగా మునిగిపోయారు .ఇప్పటిదాకా  ఉయ్యూరు వారు మైకా వ్యాపారం చేశారని నాకు తెలీదు  మా ఉయ్యూరు వాడు ,హైస్కూల్ లో నాశిష్యుడు ,కే సి పిలో పని చేసి రిటైరై  బెంగుళూర్ లో స్థిర డ్డవాడు  ,ఏ దేశం లో ఉన్నా సరసభారతి ని చదివి స్పంది౦ చేవాడూ ,వేగరాజు రాజేంద్ర ప్రసాద్ ,ఏదో పని మీద ఉయ్యూరు వచ్చి నాలుగు రోజుల క్రితం మా ఇంటికొచ్చి మాటల సందర్భంగా తమ తాతగారు స్వర్గీయ వేగ రాజు వెంకట సుబ్బయ్య గారు గూడూరు మైకా గనుల వ్యాపారం చేశారని ,అందులో నష్టపోయారని సవివరంగా తెలిపాడు .నేను రాసేదంతా ఆతను నాకు చెప్పిన విషయాలే .

          శ్రీ వేగరాజు వెంకట సుబ్బయ్య గారిల్లు ఉయ్యూరు లో విష్ణాలయం వెనక బజారులో ఉంది .ఆయన్ను నా చిన్నప్పుడు చూశాను .అప్పటికే బాగా ముసలివారు .వాకిట్లోదిగాలుగా  కూర్చుని ఉండేవారు.ఆయన భార్య సుందరమ్మగారినీ చూశానని గుర్తు . మేము విష్ణాలయానికి మా ఇంటి నుంచి ఈ వెనక దారిలోనే వెళ్ళేవాళ్ళం .ఇప్పటికీ అలానే వెడతాం.అప్పటికి ఆయన గురించి నాకేమీ పెద్దగా తెలియదు .కాని అయన తమ్ముడు వేగ రాజు సీతారామయ్య గారు ఇంకా వయసులోనే ఉన్నారు .బాగా స్థితిపరులని పేరు పొందారు .ఈయన ఇల్లు గుండు పద్మావతమ్మ గారింటికి వెళ్ళే దారిలో ఎడమ ప్రక్క ఎత్తైన స్థలం లో ఉండేది .సంతానం లేదు .అన్నగారి పిల్లలే వారింట్లో పిల్లలు .సీతారామయ్యగారు వేగ రాజు వారికే దత్తత వెళ్లారట .అందుకే ఆస్తి బాగా కలిసివచ్చిందట .వీరి ద్దరి మధ్య వెంకటేశ్వర రావు గారు౦౦ డేవారట .ఈయన్ను నేను చూసిన గుర్తు లేదు .ముగ్గురికి పిత్రార్జితమైన ఇల్లు ,పొలాలు ,స్థలాలు బాగానే ఉండేవట .వీరి పొలాలు తోటల వల్లూరు రోడ్డుకు ,పుల్లేరుకాలువకు ఎదుటి వైపు రోడ్డును ఆనుకొని ఉండేవట .ఉయ్యూరులో వేగరాజు వారి కటు౦ బానికి మంచి పలుకు బడి ఉండేదట .ఇక్కడి ఆస్తి అజమాయిషీ వెంకటేశ్వరరావు గారు చేసేవారట .

            ఈ అన్నదమ్ములలో పెద్ద వారైన వెంకట సుబ్బయ్యగారు గూడూరు వెళ్లి  మైకా గనులకొనుబడి , అమ్మకం  సుమారుగా 1940నుండే చేసేవారట .కొంతకాలం బాగా కలిసోచ్చిందట .విధి వైపరీత్యం వలన వీరి  గనులు కొన్ని కూలిపోయాయి .వ్యాపారం మొత్తం దివాలా తీసిందట .పది వేల రూపాయల అప్పులలో కూరుకు పోయారట .దిగాలుపడి గూడూరు నుంచి ఉయ్యూరు వచ్చేశారు .ఆ అప్పులు తీరిస్తేకాని ఆయన తల ఎత్తుకొలేని స్తితి .అప్పుడు తమ్ముడు వెంకటేశ్వర రావు గారు అన్నగారి పేర ఉన్న స్థలాలు ,పొలాలు   అయినకాడికి అమ్మేసి ,ఆ పది వేలు తీర్చేసి ,తానూ బొక్కాల్సింది బొక్కేసి రాజమండ్రి వెళ్లిపోయారట .ఊళ్ళో కరణం సీతం రాజు సాంబశివ రావు గారు ఈ వెంకటేశ్వర రావు గారికి బాగా వత్తాసు పలికి వెయ్యి రూపాయలు కిమ్మతు ఉన్నదాన్ని వందరూపాయలే వాల్యూ గాచూపించి సుబ్బయ్య గారిని ఈ ఇద్దరూ నిలువునా ముంచారని రాజేంద్ర ప్రసాద్ మొన్న ;లబో దిబో మన్నాడు. ఆతను చెప్పేదాకా నాకు అసలే విషయమూ తెలియనే తెలియదు .ఇలా ఉయ్యూరు వేగ రాజు వారి గూడూరు మైకా గనుల వ్యాపారం ముగిసిన అధ్యాయమే అయింది .కాని అదృష్టం బాగుండి ఆయన అల్లుడు మైకాలో పిచ్చ పిచ్చగా  సంపాదించాడట .ఆ కద తెలుసుకొందాం .ఎవరి అదృష్టం ఎలాంటిదో ?

        సుబ్బయ్యగారు సుందరమ్మగార్లకు శ్రీ వెంకట నాగేశ్వర రావు ,శ్రీ సాంబ శివరావు ,శ్రీ గోపాలకృష్ణ మూర్తి ,శ్రీ విశ్వేశ్వర రావు ,శ్రీ సూర్య నారాయణ ,శ్రీ విజయ రామారావు  అనే 6గురు కుమారులు .ఒక్కతే శ్రీమతి దుర్గాంబ ఆడపిల్ల .ఇందులో విస్సు ,సూరి మాకు సీనియర్లు .విజయ రామారావు నాకు హైస్కూల్   లో క్లాస్ మేట్.

   దుర్గాంబ గారిని కడప జిల్లా రాజం పేట కు చెందిన శ్రీ గోటేటి వెంకటేశ్వర రావు గారికిచ్చి వివాహం చేశారు .అప్పటికే ఆయన మైకా గనుల యజమాని. దుర్గాంబ గారి పాణి గ్రహణం తో ఆయనకు అంతా బాగా కలిసొచ్చింది. మైకా సామ్రాజ్యాధిపతి అయి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి వ్యాపారం ఎలా చేయాలో నిరూపించి మామగారికి ఊరట కలిపించాడు మామగారిది ‘’బాపన వ్యవసాయం ‘’లా వ్యాపారం ఉంటె అల్లుడుగారు ‘’వైశ్య దృక్పధం ‘’తో గొప్ప సంపాదనా పరులయ్యారు .ఎదురులేని వ్యాపారి అనిపించారు రాజేంద్ర చెప్పిన దాన్ని బట్టి ఇప్పటకీ గోటేటి వారికి 14లారీలు ,జీపులు కార్లూ ఎన్నో ఉన్నాయి .

            సుబ్బయ్య గారి సంతానం లో శ్రీ సాంబశివరావు గారు ఉయ్యూరు కెసీపి లో ఉద్యోగం చేశారు .మంచి పలుకుబడి సంపాదించారు .అందరికి తలలో నాలుకగా ఉండేవారు .ఏడాది క్రితమే సుమారు 90ఏళ్ళు జీవించి చనిపోయారు .ఆయన భార్య చనిపోయి సుమారు 40ఏళ్ళు అవుతుంది .వీరికుమారులు –శ్రీ సురేష్ బాబు  ,శ్రీ రాజేంద్ర ప్రసాద్ ,,బాబ్జీ అనే శ్రీ శంకర్ .ఇతను అకస్మాత్తుగా తండ్రి మరణానంతరం పదినెలల క్రితం చనిపోయాడు .బాబ్జీ ఐ టి ఐ ఇంస్ట్రక్తర్ గా పని చేసి రిటైర్ అయి ఉయ్యూరు చేరి ‘’వేగ రాజు మాన్షన్ ‘’అనే అపార్ట్ మెంట్ సముదాయం నిర్మించి తాతగారి పేరు నిలబెట్టాడు .సురేష్ ,రాజేంద్ర ,బాబ్జీ లు హైస్కూల్ లో నా శిష్యులే .ఉయ్యూరు బ్రాహ్మణ సంఘం లో క్రియా శీలక పాత్ర వహించిన వారే .క్రిందటి కార్తీకమాసం లో కొత్తగా  ఏర్పడిన బ్రాహ్మణ సంఘం లో బాబ్జీ కీలల పాత్ర పోషించాడు .పేదబ్రాహ్మణ విద్యార్ధులకు తండ్రి సాంబశివరావు గారి పేర పది వేల రూపాయల స్కాలర్ షిప్ లను అందజేసిన వదాన్యుడు .సా౦బశివరావుగారి కి ఇద్దరమ్మాయిలు శ్రీమతి బేబి జ్యోతి ,శ్రీమతి రాణీ సుజాత .ఇందులో జ్యోతి హైస్కూల్ లో నా శిష్యురాలే .

   ఉయ్యూరు వీరమ్మ తల్లికి ,వేగ రాజు వారి కుటుంబానికి సాన్నిహితం ఉంది. మాఘ మాసం లో శుద్ధ ఏకాదశి నాడు అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరేటప్పుడు ముందుగా వేగ రాజు వారింటికి వచ్చిచీ, సారే, హారతి తీసుకొన్న తరువాతనే బయాల్దేరుతుంది అని ,వీరమ్మ తిరునాళ్ళు  11వ రోజు జరిగే  సిడి బండీ ఉత్సవం  రోజున  తాటి మాను సిడిబండీకి మొదట వేగరాజువారే గుమ్మడికాయ కట్టి  కొబ్బరికాయ కొట్టి ,హారతిస్తారని ఆ తర్వాతే మిగిలిన వారు చేస్తారని అప్పుడే సిదిబండీ బయాల్దేరుతుందని ,ఇది అనాదిగా ఆనవాయితీగా వస్తోందని  రాజేంద్ర చెప్పాడు .

             మరో విషయం తో కలుద్దాం

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-15-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

అమరావతి అందాలను చిత్రించిన ప్రబంధం -ఉదయనోదయము

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మధ్య యుగాలనాటి ఆదోని కోట

Inline image 1

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాలకులు ధర్మజ్నులై ఉండాలి -టాగూర్ ,త్రి సంధ్యలు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇకపై ఇద్దరు పిల్లల చైనా , వట్టి కోట కాదు గట్టి కోట

Inline image 1
Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధిల్లీ బాలాజీ సన్నిధిలో ఆద్వాని -బీహార్ హోరా హోరీ

 

Inline image 1
 
 

బిహార్.. హోరాహోరి

  • 01/11/2015
  •  -ఎస్.కె.రామానుజం

దేశ రాజకీయాలపై ఆసక్తి ఉన్న అందరి దృష్టీ ఇప్పుడు బిహార్‌పైనే ఉంది. అక్కడి శాసనసభకు ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆ పోరులో గెలుపెవరిది..? ఇప్పుడు అందరి ప్రశ్న ఇదే. రాజకీయంగా దసరాకు ముందు ఉన్న పరిస్థితికి, ఆ తరువాత పరిస్థితికి చాలా తేడా వచ్చేసింది. రోజురోజుకూ మారుతున్న పరిణామాలతో అంచనాలు మారుతున్నాయి. ఇప్పటికైతే సమఉజ్జీల మధ్య సమరం ఇది. రాజకీయాల్లో ‘ఒకరి బలహీనతే మరొకరి బలం’ అన్న సంగతి అందరికీ తెలిసిన రహస్యం. కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు మాటను బట్టి ఓటరు మనసు మారిపోయే సన్నివేశాలు రాజకీయాల్లో మామూలే. బిజెపి పరివారం కీలక సమయంలో నోరుజారి కష్టాలు కొని తెచ్చుకుంటూంటే, ‘మహాకూటమి’ నేతలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని బలం పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు కాస్తంత పైచేయిగా కన్పించిన ఎన్డీఎ కూటమికి ఇప్పుడు తత్వం బోధపడుతోంది. బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలకు నిర్వహిస్తున్న ఐదు దశల పోలింగ్ ప్రక్రియ మరో నాలుగురోజుల్లో పూర్తవుతుంది. అక్కడికి మూడురోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అంతవరకూ ఓపికగా ఉండేది ఎవరు? ఈలోగానే ఎవరు గెలుస్తారు? ఎవరి ప్రభుత్వం వస్తుంది? అన్న ఆసక్తి ప్రతిఒక్కరిలో సహజంగానే కనిపిస్తుంది. ఇక మీడియా హడావుడి చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు వచ్చిన ‘ముందస్తు పోలింగ్ సర్వేలు’ చెబుతున్నమాట కూడా ఇరు కూటముల మధ్య హోరాహోరీ పోరు ఉందని, ఒకటీ అరా తప్ప ఎవరికీ పెద్ద ఆధిక్యం ఉండదని తేల్చిచెబుతున్నాయి. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బిజెపి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఆ తరువాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒక్క దిల్లీ మినహా చెప్పుకోతగ్గ ఫలితాలనే రాబట్టింది. చివరకు జమ్మూ- కాశ్మీర్‌లోనూ అద్భుత ఫలితాలు సాధించి దేశ రాజకీయ యవనికపై సరికొత్త అవతారం ఎత్తింది. ఈ పరిణామాలు విపక్షాలను బెంబేలెత్తించాయి. బిహార్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి దూకుడుకు ముకుతాడు వేయకపోతే భవిష్యత్ రాజకీయాల్లో కష్టాలు తప్పవన్న భయం వాటిని వెన్నాడింది. ఆ భయం మొదలవగానే విపక్షాలు ఏకమయ్యే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇక్కడ ఎవరి అవసరాలు వారివి. ఎవరి అంచనాలు వారివి. అవసరం కొద్దీ అంతా ఏకమయ్యారు. విడివిడిగా పోటీచేస్తే బిజెపి బృందం సులువుగా అధికారంలోకి వస్తుందన్న అంచనా వారిని ఒక పంచన చేర్చింది. జనతా పరివార్ పేరిట ఆరుపార్టీలు ఏకమైనా ములాయం సింగ్ అలకతో అది అభాసుపాలయ్యింది. ఆ తరువాత మరో రెండు పార్టీలు ఆ తాను నుంచి విడిపోయాయి. చివరకు జనతాదళ్ (యు), ఆర్‌జెడి, కాంగ్రెస్ పక్షాలతో కలిసి మహాకూటమి సీట్లు పంచుకుని పోటీ చేస్తున్నాయి. వీటికి దీటుగా బిజెపి మరికొన్ని పార్టీలతో కలసి బరిలోకి దిగింది. ప్రధానంగా వీరి మధ్యే పోటీ నెలకొంది. ఇక బిఎస్‌పి, ఎస్‌పి, లెఫ్ట్‌కూటమి, తొలిసారిగా ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగాయి. బిజెపికి అనుకూలంగా ఒవైసీ పార్టీ వ్యవహరిస్తోందన్న సరికొత్త విమర్శల జడివాన మొదలైన నేపథ్యంలో బిజెపి నేతల అనూహ్య వ్యాఖ్యలు తేనెతుట్టెను కదిపాయి. బిహార్‌లో పదేళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మధ్యలో చేసిన ‘మాంజీ’ ప్రయోగం వికటించి మళ్లీ సింహాసనం ఎక్కారు. మోదీతో విభేదించి, లోక్‌సభ ఎన్నికల్లో భారీగా నష్టపోయిన నితీష్ ఒంటరిపోరుతో ఒనగూడేదేమీ ఉండదన్న సత్యంతో లాలూతో సఖ్యత కుదుర్చుకున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సామెతకు బిహార్ రాజకీయాలు సరైన ఉదాహరణ. సరే, రాజకీయ ఉద్దండుల అంచనాలన్నీ నిజమవుతాయా? ఓటర్ల నాడి ఏమిటన్నది అంతుబడుతోందా? అంటే ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే. అయితే తాజా పరిణామాలు, బిహార్‌లో కొత్తగా వచ్చిన ఓటర్లు, తొలిమూడు దశల్లో మహిళా ఓటర్లు పెద్దసంఖ్యలో ఓటువేయడంవంటి అంశాలనుబట్టి కొంతవరకు పరిస్థితిని ఊహించవచ్చు. కులమే మూలం.. దేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. అక్షరాస్యతలో వెనుకబడి ఉన్న ఈ రాష్ట్రంలో అన్నింటికన్నా కులాల ప్రభావమే అధికం. అన్ని పరిణామాలూ ఈ అంశం ఆధారంగానే సంభవిస్తూంటాయి. ‘మండల్ వివాదం’ రాజుకోకముందు వరకు అది అంతర్లీనంగానే ఉన్న వ్యవహారం. ఆ తరువాత అది విచ్చలవిడిగా, విశృంఖలంగా మారిపోయింది. కులం ప్రస్తావన లేని విధానం లేదు. ఎన్డీఏతో జతగట్టి నితీష్ అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్రం తొలిసారిగా అభివృద్ధి మార్గాన పయనించడం మొదలైంది. ఇది తిరుగులేని నిజం. యాదవులను ఏకతాటిపై నడిపి చాలాకాలం పాటు అధికారంలో ఉన్న రాజకీయ చతురుడు లాలూప్రసాద్ యాదవ్ అవినీతి కారణంగా ఎన్నికలకు దూరమయ్యాక ఆ వర్గం వెనుకబడింది. యాదవుల కారణంగా ఎన్నో కష్టాలు పడిన కొన్ని వర్గాలు నితీష్ పంచన చేరి ఎన్డీఏకు అద్భుతమైన విజయాలు అందించాయి. మారిన పరిణామాల్లో నితీష్ యాదవుల మద్దతుకోసం లాలూతో చేయిచేయి కలపడం రాజకీయంగా కలసివస్తుందని భావిస్తున్నా కొన్ని సందేహాలు జెడియును భయపెడుతున్నాయి. యాదవుల పొడగిట్టని కొన్ని వెనుకబడిన వర్గాలు, అగ్రకులాలు వారికి దూరమవుతారన్న అంచనాలున్నాయి. సరే..ఎన్నికల వేళ బిహార్‌లో కులాల పాత్ర ఏమిటో చూద్దాం. ఓటర్లు 6.6 కోట్లు బిహార్‌లో ఎన్నికల్లో ఓటుహక్కు కలిగినవారి సంఖ్య 6.68 కోట్లు. వీరిలో పురుషులు 3.56 కోట్లు, మహిళలు 3.11 కోట్లమంది. మొత్తం ఓటర్లలో మహిళల సంఖ్య 30శాతం. కొత్తగా ఓటుహక్కు వచ్చినవారి సంఖ్య 20 లక్షలమంది. వీరంతా తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈసారి ఎన్నికల్లో మహిళలు, తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోబోయే కొత్తఓటర్లు ఫలితాలను నిర్దేశిస్తారని అందరూ భావిస్తున్నారు. ఇదీ కులాల లెక్క.. బిహార్ ప్రత్యేకతే కులాలు. ప్రజాస్వామ్యం, నీతివంతమైన రాజకీయాలు వంటి పడికట్టు పదాలు ఆ రాష్ట్రంలో పనిచేయవు. రాజనీతి వేరు, రాజకీయం వేరని బిహార్ రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. లౌకికవాదం, మతవాదం అన్నమాటలు అక్కడి కులాలు, మతాల అంశాల వారీగానే మాట్లాడతారు. రాజకీయ పరమపద సోపానపటంలో సింహాసనం అధిష్ఠించాలంటే కులం,మతం ఆనుపానులన్నీ తెలుసుకోవాలి. ఆ లెక్కల్లో ఇప్పుడు ఎవరు ‘బెస్ట్’ అన్నది త్వరలో తేలిపోతుంది. ఇప్పటికిప్పుడు వారు వేసుకున్న రాజకీయ లెక్కలకు మూలం ఇలా ఉంది. విభజన తరువాత పూర్వ ప్రాభవం కోల్పోయిన బిహార్ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యతను ఈసారి దక్కించుకున్నాయి. అందుకే అక్కడ ఉన్న వందలాది వర్గాల్లో ఎక్కువమంది మద్దతుకోసం రాజకీయ పక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒబిసి వర్గాలు 50శాతం మేరకు ఉన్నాయి. వీరిలో యాదవుల వాటా 15శాతం. కుర్మీ, కొయిరి, కుశవహ వంటి కులాల వాటా దాదాపు 11శాతం. బాగా వెనుకబడిన వర్గాలు (ఇబిసి)లు 20 శాతం. రాష్ట్రంలోని కనీసం 30 నియోజికవర్గాల్లో ప్రభావం చూపే ముస్లింలు 17 శాతం. అగ్రకులాలు 15 శాతంమంది ఉన్నారు. వీరిలో రాజపుత్రులు 5, భూమిహార్ 4, బ్రాహ్మణులు 5, కాయస్థులు 1శాతం ఉన్నారు. వీరుకాక మహాదళితులు 16శాతం మంది ఉన్నారు. మహాదళితుల్లోకి రాని దళితులు 4శాతంమంది ఉన్నారు. కులం వారీగా లెక్కలోకి రాని ఓటర్లు 2శాతంమంది ఉన్నారు. కులాలు, మతాల వారీగా ఇదీ అసలు స్వరూపం. ఎవరి పక్షాన ఎవరు? చాలాకాలం పాటు అధికారంలో ఉన్న లాలుప్రసాద్ యాదవ్ అంటే యాదవులకు చాలా ఇష్టం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఆయన కొన్నాళ్లుగా క్రియాశీలంగానే వ్యవహరిస్తున్నారు. పెద్దసంఖ్యలో ఉన్న యాదవులు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం, తన ఇద్దరు కొడుకులు, కుమార్తె రాజకీయంగా ఇంకా ఎదగకపోవడం, తనవర్గాన్ని ఇప్పటికైనా కాపాడుకోకపోతే భవిష్యత్ లేదన్న సత్యం తెలిసిన లాలూ నితీష్‌కు స్నేహహస్తం చాటారు. మోదీతో విభేదించి లోక్‌సభ ఎన్నికల్లో నష్టపోయిన ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని యాదవుల మద్దతు పొందేందుకు ఓ అడుగువేశారు. నితీష్‌కూడా ఓబిసియే. ఆయన కుర్మీ కులస్థుడు. అవినీతి మకిలి లేని నాయకుడు. అభివృద్ధిని అలవాటు చేసిన నేత. ముస్లింలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలకు ఆదర్శంగా ఉన్న నాయకుడు. అయితే, ప్రధాని మోదీతో ఢీకొట్టి చతికిలపడ్డారు. మోదీకి గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడంత ప్రభ లేదని నితీష్ అంచనా. పైగా లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలకు చాలా తేడా ఉందని, దిల్లీ ఎన్నికలే అందుకు నిదర్శనమని భావిస్తున్నారు. మోదీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎలాగూ చేసేదేమీ లేదు. అందుకే లాలూ, నితీష్‌లతో చేతులు కలిపింది. మోదీ భయం ఆ రెండు పార్టీలకన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ. నితీష్ ఓడితే అతడికన్నా తమపార్టీకే ఎక్కువ కష్టాలని భావిస్తోంది. అందుకే సోనియా, రాహుల్ బిహార్ బరిలోకి దిగి మోదీపై విరుచుకుపడుతున్నారు. ములాయం దూరం జరిగాక, లెఫ్ట్‌పార్టీలు ఓ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. లోపాయికారీగా అవి నితీష్ వర్గానికి సహకరించే సూచనలు కన్పిస్తున్నాయి. ఇక తొలిసారిగా ఎంఐఎం రంగంలోకి దిగింది. జాతీయ పార్టీగా విస్తరించడానికి బిహార్ ఎన్నికలను ఒవైసీ ఉపయోగించుకుంటున్నారు. బిజెపికి పరోక్షంగా సహకరించడానికి ఒవైసీ ప్రయత్నిస్తున్నారని, ఓట్ల చీలికవల్ల నితీష్ కూటమి నష్టపోయి, బిజెపి కూటమి బలపడుతుందని వారంతా భయపడుతున్నారు. ఈలోగా అనుకోని పరిణామాలు సంభవించి పరిస్థితుల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఇక దిల్లీలో గుణపాఠం చెప్పిన ఆప్, గుజరాత్ తాజా హీరో హార్థిక్ పటేల్ వంటివారి సన్నాయినొక్కులు బిజెపిని ఎంతోకొంత నష్టపరిచే అవకాశం ఉంది. ఎన్డీయే కూటమి పరిస్థితి… ఇక ఎన్డీయే కూటమిలో బిజెపి ప్రధాన పార్టీ. రామ్‌విలాస్ పాశ్వాత్ లోక్‌జన్‌శక్తి, మాజీ ముఖ్యమంత్రి మాంజీ సారథ్యంలోని హిందుస్తాన్ అవామ్ మోర్చా, మరికొన్ని పార్టీలు ఇందులో ఉన్నాయి. మోదీ ప్రభావం, అభివృద్ధి నినాదం వల్ల తమకు మేలు జరుగుతుందని ఆ కూటమి భావిస్తోంది. మహాదళిత వర్గానికి చెందిన మాంజీ, దళిత వర్గానికి చెందిన రామ్‌విలాస్ పాశ్వాన్, ఒబిసిల్లోని యాదవ వ్యతిరేక వర్గాలు, అగ్రవర్ణాలు తమకు అండగా నిలుస్తాయని ఆ పార్టీలు అంచనావేస్తున్నాయి. మహాకూటమి పరిస్థితి ప్రీ పోల్ సర్వేలు, అక్కడి వాస్తవ పరిస్థితులను అంచనావేస్తే రెండు కూటములు సమఉజ్జీలుగా ఉన్నాయి. అప్పటికప్పుడు ఫలితాలు అంచనావేస్తే కొద్దిగా ఎన్డీయే పైచేయి సాధించింది. మూడోదశ పోలింగ్ జరిగాక మహాకూటమికి పరిస్థితి అనుకూలంగా మారిందని అర్థమవుతోంది. బిజెపి, పరివార్ నేతల అసందర్భ, అనుచిత వ్యాఖ్యల వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. ఐదారు స్థానాలు ఆధిక్యత సాధించనుందన్న ఎన్డీయే కూటమికి గట్టి దెబ్బ తగిలిందన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఆ కూటమి దిద్దుబాటు చర్యలకు దిగింది. నితీష్ ఎత్తుగడ ఎన్నికల ప్రచారంలో మహాకూటమి తరపున నితీష్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లు ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తున్నారు. బిజెపి బృందం తప్పిదాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నెమ్మదిగా పైచేయి సాధించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు. ప్రచారం ప్రారంభమైన వెంటనే ‘బిహారీ..బాహరీ’ నినాదంతో బిజెపికి నితీష్ చెక్ చెప్పారు. బిజెపి తరపున రాష్ట్రం నుంచి పనిచేస్తున్న ఏకైక వ్యక్తి సుశీల్ మోదీ. ఆయన కూడా కొన్ని సంవత్సరాల క్రితం బిహార్‌కు వచ్చి స్థిరపడిన వ్యక్తి. ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర నాయకులు బిహార్‌కు చెందినవారు కాదు. ఎన్డీయే కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. దీంతో నితీష్ ఓ విమర్శ చేశారు. బిహార్‌కు చెందిన తనను గెలిపిస్తారా..? బయటినుంచి వచ్చి వెళుతున్నవారిని గెలిపిస్తారా? అంటూ గళమెత్తారు. పైగా ఎన్డీయే ప్రచార సామాగ్రిలో ఉండే నేతల్లో ఎక్కువమంది గుజరాతీయులే. రాష్ట్రానికి చెందిన నేతలకు సరైన స్థానం లేదు. ఈ విషయాన్ని కూడా నితీష్ వదిలిపెట్టలేదు. దీంతో బిజెపి తన ప్రచార వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చింది. దేశంలో రిజర్వేషన్లను పునః పరిశీలించాలన్న ఆర్‌ఎస్‌ఎస్ అధినేత భగవత్ చేసిన వ్యాఖ్యలో నిజానిజాలు, సహేతుకత పక్కనపెడితే నితీష్‌కూటమికి అది పెద్ద ఆయుధమైపోయింది. మండల్ తరువాత బిహార్‌లో తీవ్రమార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో, వెనుకబడిన, అతివెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో సహజంగా ఆయన వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయి. ఈ విషయాన్ని లాలూ-నితీష్ జంట తమకు అనుకూలంగా మార్చుకుంది. బిజెపి ఇప్పుడు కక్కలేని, మింగలేని స్థితిలో ఉంది. అయితే ఈ వ్యాఖ్యల వల్ల అగ్రవర్ణాలు సంపూర్ణంగా బిజెపికి సమర్థించవచ్చు. ఈ వర్గంలో ఓట్ల చీలిక ఉండకపోవచ్చు. దళితుల హత్యపై కేంద్రమంత్రి వికె సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు, దాద్రీ సంఘటన, బిజెపి పరివారంలో కొందరు చేసిన వ్యాఖ్యలు ముస్లింలు, దళితుల్లో ప్రతికూలతకు కారణమయ్యాయి. గొడ్డుమాంసంపై నిషేధం వంటి నిర్ణయాలు ముస్లింలను ఎన్డీయే కూటమికి దూరం చేసాయి. అయితే బిజెపి అంచనా వేరుగా ఉంది. బీఫ్, దాద్రీ సంఘటనల వల్ల హిందువుల మద్దతు తమకు గరిష్టంగా ఉంటుందని, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ భావన తమకు ఉపకరిస్తుందని అంచనావేస్తోంది. కాకపోతే రిజర్వేషన్లపై వ్యాఖ్య మాత్రం ఆ పార్టీని కలవర పెడుతోంది. కమలం కల మోదీపైనే ఆశలన్నీ పెట్టుకున్న బిజెపి బిహార్‌లో గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. దిల్లీతరహా అనుభవం ఎదురవకూడదని భావిస్తోంది. అగ్రకులాలకు, వెనుకబడిన వర్గాలకు మధ్య పోటీ అన్న లాలూ ప్రచారాన్ని ఆసరా చేసుకుని బిజెపి మొదట నితీష్ కూటమికి చెక్ చెప్పింది. బిహార్‌లో వెనుకబడినవర్గాల్లో యాదవులదే అగ్రస్థానం. వారి ఆధిపత్యంతో నలిగిపోయిన ఇతర ఒబిసిలు బిజెపిని ఆశ్రయిస్తారని ఆ పార్టీ అంచనావేసింది. నితీష్‌పై ఆయా వర్గాలకు ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ యాదవులను నమ్మే సాహసం వారు చేయకపోవచ్చు. లాలూ అధికారంలో ఉండగా వారు పడిన ఇబ్బందులను ఇప్పటికీ వారు మరిచిపోలేకపోతున్నారు. ‘జంగిల్‌రాజ్’ మళ్లీ వద్దన్న మోదీ మాటలు పనిచేస్తాయని ఆశతో ఉంది. అభివృద్ధి, భారీ ప్యాకేజీ, ఆ ప్యాకేజీని వద్దన్న నితీష్ వైఖరిని ఆ కూటమి తూర్పార పట్టి ఓటర్లకు చేరవయ్యింది. కాస్త పరిస్థితులు అనుకూలిస్తున్న తరుణంలో బీఫ్ నిషేధం, దానిపై మంత్రుల వ్యాఖ్యలు, రిజర్వేషన్ల వివాదం, దాద్రి సంఘటనలు కష్టాలను తెచ్చిపెట్టాయి. నితీష్ అభివృద్ధి చేసినా, అది అంతంతమాత్రమేనని ఆ పార్టీ చెబుతోంది. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ పేరు ప్రకటించడం, లాలూ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా నితీష్‌కే మద్దతిస్తామని స్పష్టం చేయడం వారికి లాభం చేకూర్చే అంశాలు. ఎన్డీయే కూటమికి ఆధిక్యం వస్తే ముఖ్యమంత్రి ఎవరన్నది చెప్పలేదు. మాజీ ముఖ్యమంత్రి మాంజీ వల్ల మహాదళితులు, పాశ్వాన్ వల్ల దళితులు, అగ్రవర్ణాల్లోని రాజపుత్రులు, భూమిహార్, కాయస్థ, బ్రాహ్మణులు తమకు పట్టం కడతారన్న ఆశతో ఉంది. మహిళలు, యువకుల్లో మోదీని అభిమానించేవారే ఎక్కువని బిజెపి ఆశపడుతోంది. ఉత్తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్‌కే ఎక్కువమంది మద్దతిచ్చినా స్థానిక రాజకీయాలను ప్రభావితం చేసే ఇతర అంశాలు, కులాల లెక్కలు ఓటువేయడానికి కారణమవుతాయి. ఇప్పటికే జరిగిన పొరపాట్ల వల్ల వచ్చే ప్రమాదాన్ని పసిగట్టిన బిజెపి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పట్టణ ఓటర్లను ఆకర్షించడం, మహిళలు, యువ ఓటర్లను తమవైపు మళ్లించడం, స్ధానిక నేతలను ప్రచారంలోకి దించడం, ప్రధాని మోదీ ప్రచార సభలు భారీగా నిర్వహించడంవంటి చర్యలు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో యువకులు, మహిళలు, ఒబిసిల్లో కొన్ని వర్గాలు బిజెపి పంచన చేరాయి. ఈసారి అలాంటి పరిస్థితి లేదని నితీష్ కూటమి భావిస్తోంది. నితీష్ కుర్మి వర్గానికి (ఒబిసి) చెందిన వ్యక్తి. ఒబిసిల్లోని కొయిరి వర్గానికి చెందినవారు, కుశవహ వర్గానికి చెందినవారు బిజెపిని ఆదరిస్తారని, మోదీకూడా ఒబిసి వర్గానికి చెందినవారేనని ఆ పార్టీ భావిస్తోంది. నితీష్ తన కుటుంబానికి, బంధువర్గానికి ఎన్నికల్లో ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఇది ఆయనకు లాభించే అంశం. కాగా, లాలూ తన ఇద్దరు కుమారులు తేజ్, తేజస్విలను ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇది ఆయనకు నష్టం కలిగించే అంశం. వ్యక్తిగతంగా ఆ ఇద్దరూ గెలిచినా యాదవులను వ్యతిరేకించే ఇతర వర్గాలు తమకు రక్షణ కల్పించే బిజెపి కూటమివైపు మళ్లవచ్చు. నితీష్‌పై వారికి అభిమానం ఉన్నా, ఆయన లాలూ పక్షాన ఉండటంవల్ల తమకు మేలు జరగదని వారు భావించడమే అందుకు కారణం. అందువల్ల ఎవరు ఎన్ని అంచనాలు వేసుకున్నప్పటికీ స్థానికంగా భద్రత, అభివృద్ధి అంశాల ప్రాతిపదికన ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఏతావతా బిహార్ ఎన్నికల్లో బిజెపి కూటమి గెలిస్తే- అది మహాకూటమి రాజకీయ అవకాశవాదం ఓటమిగా భావించాల్సి వస్తుంది. ఎన్డీయే కూటమి ఓటమిపాలైతే అది స్వయంకృతమనే అనుకోవాలి. నిజానికి అంతిమ విజేత ఓటరే కదా! ఎందుకంటే అందరి అంచనాలను తలకిందులు చేసే శక్తి అతడికే ఉంది. * నవ, యువ ఓటర్లు కీలకం బిహార్‌లో మొత్తం 6 కోట్ల 68 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంది. వీరిలో 30శాతం మంది 18నుంచి 29 ఏళ్లలోపువారు. తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోవలసినవారి సంఖ్య దాదాపు 20 లక్షలమంది. నిజానికి గత ఎన్నికల్లో బిహార్‌లోని నియోజికవర్గాల్లో ఒక్కో అభ్యర్థికి సగటున వచ్చిన ఆధిక్యం 15వేలు. ఈసారి కొత్తగా నమోదైన, తొలిసారి ఓటుహక్కును వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య నియోజికవర్గాల వారీగా విభజిస్తే అంతకంటే ఎక్కువే. అందువల్ల ఫలితాన్ని శాసించే స్థితిలో వీరున్నారు. అయితే రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పేరు నమోదు చేసుకున్నా వారు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని, వీరు ఎన్నికలకు రారని అంటున్నారు. బిజెపి ఇలాంటివారిపై ఓ కనే్నసి, వారిని ఎన్నికలవేళకు రప్పించాలని పనిచేస్తోంది. బలం…బలగం ఎవరెన్ని చెప్పినా, ఎంత ప్రచారం చేసినా, ఎన్ని విమర్శలు చేసినా అంతిమంగా నిర్ణయాన్ని చెప్పవలసినది ఓటరు. అతడు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటువేస్తేగాని అది తేలదు. తమకు అనుకూలమైనవారిని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటువేసేలా చేయడంలోనే సగం గెలుపు ఉంటుంది. అలా చేయాలంటే సరైన బలం, బలగం ఉండాలి. బిజెపికి బిహార్‌లో 6 లక్షలమంది సుశిక్షుతలైన కార్యకర్తలు ఉన్నారు. వీరిలో సగం మంది బిజెపి కూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తారు. మిగతా సగం మంది మహాకూటమికి సానుకూల అంశాలపై సమాచారం సేకరించి వాటికి తగ్గట్లు వ్యూహాలు అమలు చేస్తారు. టీస్టాళ్లు, రచ్చబండల వద్ద వీరంతా తమ పనిచేసుకొస్తూంటారు. ఇక, 70వేల మంది ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్లు రంగంలోకి దిగారు. తమ సంస్థ అధినేత భగవత్ వ్యాఖ్యల అనంతరం వీరు తమ వ్యూహాన్ని మార్చారు. ఇక 80 లక్షలమంది సభ్యులు ఆ పార్టీకి ఉన్నారు. జెడియుకు లక్షమంది కార్యకర్తలు ఉన్నారు. మరో పదివేలమంది ఆర్‌జెడి పక్షాన కార్యకర్తలు ఆ పార్టీకి పనిచేస్తున్నారు. ఇక మాంజీ, ఒవైసీ, లెఫ్ట్ పార్టీల తరపున పెద్దగా బలగం లేదు. కాంగ్రెస్ పక్షాన పదివేలమంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. సంస్థాగత నిర్మాణం గట్టిగా ఉన్న బిజెపికి ఈ విషయంలో లాభం చేకూరే అవకాశం ఉంది. మహిళలే నిర్ణేతలా? తొలి మూడు దశల్లో 57శాతం పైగా మహిళా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లలో వారిసంఖ్య 3కోట్లపైమాటే. అంటే దాదాపు 45శాతం. గత లోక్‌సభ ఎన్నికల్లో వీరిలో ఎక్కువమంది మోదీకి పట్టంగట్టారు. ఈసారి వారిమొగ్గు ఎవరివైపో కచ్చితంగా తెలియడం లేదు. నితీష్ పాలనపై వారికి సంతృప్తి ఉన్నా ఆయన కూటమిలోని మిగతా పక్షాలపై వ్యతిరేకత ఉంది. వెనుకబడినవర్గాలకు మంచి విద్యావకాశాలు, విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇవ్వడంవంటి పథకాలు నితీష్‌కు అనుకూలమైనా మోదీ ఆకర్షణనూ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఫాశాన్లలో ఫ్రాన్స్ ను తలదన్నిన తెలంగాణా -ఈమని శివ నాగి రెడ్డి -నీలీల పడేద దేవా పాట పుట్టు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బహులత్వమే మన బలం -ప్రణబ్ – శాంతి ఐక్యత ,పార దర్శకత మా మంత్రం

Inline image 1


 
 
Inline image 2
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment