నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం

నా దారి తీరు -100

మేడూరు లో ఉద్యోగం

2-9-1989 న చిలుకూరి వారి గూడెం లో చేరిన నేను 22-8-90 సాయంత్రం విధులనుండి విడుదలై ,రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కనుక జాయినింగ్ టైం ఉండదు కనుక మర్నాడే  మేడూరు హైస్కూల్ లో 23-8-90 ఉదయం చేరాను .

సుమారు సంవత్సర కాలమే చిలుకూరి వారి గూడెం లో పని చేసినా ,ఆ స్కూల్ అన్నా ఆ ఊరు అన్నా విపరీతమైన అభిమానం ఏర్పడింది .మళ్ళీ ఎప్పుడైనా అక్కడే చేయాలని అనిపించేది .అంతమంచి వాతావరణం ఏర్పడి ,అనుబంధం శాశ్వతమయింది .అందుకే ఈబాద .రాను పోనూ ప్రయాణపు ఇబ్బంది తప్ప అక్కడనాకు యే ఇబ్బందీలేదు స్టాఫ్ సహకారం ,పిల్లల ప్రవర్తన కమిటీ వాళ్ళ చేయూత అన్నీ అందుకొని స్కూల్ రూపు రేఖలనే మార్చగాలిగాను .ఇంత గొప్ప అభి వృద్ధి చేయగాలుగుతానని నాకే తెలియదు అన్నీ కుదిరి అలా జరిగింది .ఇందులో నాకు సహకరించిన లెక్కల మేష్టారు శ్రీ పురుషోత్తమా చారి సెకండరీ మాస్టారు శ్రీ శేషగిరి రావు హాస్టల్ వార్డెన్ శ్రీ రాఘవుల చేయూత జీవితం లో మరువ లేనిది .నేను అక్కడి నుంచి బదిలీ అయి వచ్చినా, వీళ్ళు నాతో ,మా కుటుంబం తో అదే బాంధవ్యాన్ని కొనసాగించారు .లెక్కల మాస్టారి తల్లిగారు భార్య నా యెడల చూపిన ఆప్యాయత మరువలేను .పై మూర్తిత్రయం బెజవాడ వైపు వచ్చినప్పుడల్లా ఉయ్యూరు వచ్చి మా ఆతిధ్యం పొంది వెళ్ళేవారు వాళ్ళను చూస్తే మహదానందంగా ఉండేది .పూర్వం మానికొండలో రాజుగారు గరుడాచలం గారు ,రాఘవ రావు లు యెంత అభిమానంగా ఉండేవారో అదే ఇప్పుడు కనిపించింది .జననాంతర సౌహృదం అనిపిస్తుంది ఆలోచిస్తే .అలాగే మేము మైలవరం వైపు వెళ్ళినా వాళ్ళను కలిసి మాట్లాడకుండా ఉండే వాళ్ళం కాదు .మా మూడో వాడు మూర్తి చిలుకూరి వారి గూడెం దగ్గర రామ చంద్రాపురం లో ఆర్ ఏం పి డాక్టర్ గా ఉన్నప్పుడు ,మైలవరం దగ్గర గణపవరం లో ఉన్నప్పుడు కారు మీదమా అక్కయ్య బావలతో  మైలవరం లో రాఘవులుగారిని పుల్లూరులో ఆచార్యుల గారి ఫామిలీ ని అక్కడికొచ్చిన శేష గిరి రాగారినీ చూసి కిన్నెర సాని ,భద్రాచలం ,నెమలి ,జమలాపురం ఒక సారి వెళ్లాం మరో సారి మా అమ్మాయి మేము కలిసి వెళ్లి వీళ్ళందర్నీ చూశాం .అలా చాలాకాలం కొనసాగింది .

తర్వాత శేషగిరి రావు గారు నన్ను మళ్ళీ చిలుకూరి వారి గూడెం ట్రాన్స్ ఫర్ చేయించే ప్రయత్నం శాసనసభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారిద్వారా చేస్తానని రిక్వెస్ట్ రాసి ఇమ్మని ,రెండు మూడు సార్లు నేను అడ్డాడలో ఉండగా వచ్చి అడిగారు .అది ఇక జరగని పని అని ఆయన్ను సమాధాన పరచి పంపేవాడిని .ఆయనకు హెడ్మాస్టర్ బండి రామారావు కు కెమిస్ట్రీ కుదరలేదని ఆయన మాటల్లో తేలింది స్కూల్ డబ్బు స్వాహా చేస్తున్నాడని కూడా చెప్పిన జ్ఞాపకం గుడివాడలో ఆయన బ్రహ్మాండమైన ఇల్లు కట్టి గృహప్రవేశానికి స్వయంగా ఆహ్వానిస్తే వెళ్లాను అక్కడ లెక్కలమేస్టారు వార్దేన్ గారు మళ్ళీ కలిశారు .తర్వాత శేషగిరి రావు గారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని లేక్కలమేస్టార్ ఫోన్ చేస్తే బెజవాడ విజయ టాకీస్ ఎదురుగా ఉన్న హాస్పిటల్ లో ఇన్సెంటివ్ కేర్ లో ఉండగా చూసొచ్చాను .కాని ఆయన ఆతర్వాత రెండుమూడు రోజులకే చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడు గుడివాడలో కార్యక్రమాలు చేశారు కాని నేను వెళ్ళలేక పోయాను వీరు భొట్ల శేషగిరిరావు గారి అన్నగారికి ఉయ్యూరు లో ఉన్న వేమూరు దుర్గ,సుబ్రహ్మణ్యం గార్ల అమ్మాయినిచ్చి ద్వితీయం చేశారు .ఆ సందర్భం గా రెండు వైపులవారూ నన్ను సంప్రదించి మంచి చెడ్డలుతెలుసుకొన్నారు ఈ విధంగా ఉయ్యూరు బంధం ఆయనకు ఏర్పడింది

లెక్కల మాస్టారు ఏం .పురుషోత్తమా చారి గారి తో స్నేహం అసలెన్నటికీ మరుపు రాదు ఆయన కుటుంబం తో నూ అంతే .ఇదెక్కడి బంధమో ఆశ్చర్యమేస్తుంది .ఆచారి గారి తల్లిగారి ఆరోగ్యం బాగా ఉండేదికాదు భార్య చాలా సన్నగా అనారోగ్యంగా నే ఉండేవారు .కాని ఆదరణకు స్నేహానికి వాళ్ళనే చెప్పుకోవాలి ఆడపిల్ల మగ పిల్లాడు చిన్నక్లాసులు చదువుతున్నారు .దాదాపు 8 ఏళ్ళక్రితం ఆచారి గారు చనిపోయారని వాళ్ళబ్బాయి ఫోన్ చేశాడు .వెళ్ళలేక పోయాను .తర్వాత వాళ్ళ అమ్మాయి వివాహం మైలవరం లో చేస్తున్నామని శుభలేఖ పంపి వాళ్ళబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు  .అదే ముహూర్తానికి బెజవాడలో మల్లాది వెంకటేశ్వర్లు కూతురు వివాహం .వివాహం చూసి అక్షంతలు వేసి దీనికి హాజరైన దంటు వారబ్బాయి ,వెంపటి శర్మగారబ్బాయిలను చాలా రోజుల తర్వాత చూశాం .అక్కడికి మమ్మల్నిద్దర్నీ చూడటానికి వచ్చినఆత్మీయులు కవి కధకులు  శ్రీ గంధం వేంకాస్వామి శర్మ గారిని చూశాం అప్పటికే 85 ఏళ్ళ వృద్దు ఆయన .’’ఎందుకండీ శ్రమ పడి వచ్చారు ?మేమే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళం కదా ‘’అన్నాను .ఆయన నవ్వి ‘’మీ ఇద్దర్నీ చూస్తే పార్వతీ పరమేశ్వరులని పిస్తుంది అందుకే దర్శనం కోసం వచ్చాను ‘’అన్న ప్రేమాభిమాన మూర్తి వారు .ఇదే వారిని చూసిన చివరి సారి .ఆ తర్వాత మేము అమెరికా వెళ్ళటం అక్కడ మేము ఉండగానే వెంకాస్వామి శర్మగారు చనిపోవటం జరిగింది

సత్యనారాయణ పురం లో మల్లాది  వెంకటేశ్వర్లు కూతురు పెళ్లి నుంచి సరాసరి బస్ స్టాండ్ కు వెళ్లి మైలవరం బస్ ఎక్కి ఫంక్షన్ హాల్ కు చేరేసరికి సుమారు మధ్యాహ్నం 2 అయింది వేలాది మంది వచ్చి భోజనాలు చేసి వెడుతున్నారు మేము లేక్కలమాస్టారి భార్యను పలకరించి పెళ్లి కూతురు కు కానుక అందజేసి ఆశీర్వ దించి వాళ్ళబ్బాయి అబ్బాయాచారి మా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట వివాహ భోజనం చేసి మళ్ళీ బస్ ఎక్కి బెజవాడ మీదుగా ఉయ్యూరు చేరాం ఇన్ని జ్ఞాపకాలు మాకు లేక్కలమేస్తారి కుటుంబం తో ఉన్నాయి పిల్లలిద్దరూ మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లోనే బి టేక్ చదివి బెంగుళూర్ లో ఉద్యోగాలలో ఉన్నారు మంచి అభివృద్ధి సాధించారు లెక్కల మేస్టారి మంచి మనసే ఈ అభివృద్ధికి కారణం వారి అమ్మగారి ఆశీస్సులు విశుద్ధ హృదయం తోడ్పాటుగా నిలిచాయి .

అంతకు ముందు మైలవరం గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్త్రేస్ విజయ లక్ష్మి గారి పదవీ విరమణకు ఆహ్వానిస్తే నేనూ  వెళ్లాను అప్పుడు ఆచారిగారు కలిసి ఇంటికి తీసుకు వెళ్ళారు .

మేడూరు స్కూల్ విశేషాలు

ఉయ్యూరు లో 23-8-90 ఉదయం 7 గంటలకేఇంట్లో భోజనం చేసి సరాసరి బెజవాడ మేడూరు బస్ ఎక్కి ,తాడంకి కపిలేశ్వరపురం వీరంకిలాకు పమిడిముక్కల మీదుగా మేడూరు చేరాను .ఉదయం విధుల్లో చేరినట్లు సంతకం పెట్టాను .పెద్దస్కూల్ .సుమారు ౩౦౦ మంది పిల్లలు .అన్నీ రెండు సెక్షన్లు .స్టాఫ్ అందరూ కొత్త నా ముందు ఇక్కడ పనిచేసిన శ్రీ జి ఎస్ యెన్ చౌదరి కూడా బిఎడ్ లో నా ట్రెయినింగ్ మేట్ అవటం మరో తమాషా అతన్ని పునాది పాడు వేశారు .ఒక సారిస్కూల్ అంతా కలయ తిరిగా .మంచి బిల్డింగ్ లున్నాయి .పెద్ద ఆటస్థలం  మంచి లేబరేటరీ దానిలోనే పాఠాలు చెప్పటానికి వీలైన విశాలమైన హాలు ,పైన లైబ్రరీ కం కామన్ హాల్ ఉంది లైబ్రరీలో చాలా పుస్తకాలు మంచి పుస్తకాలు ఉన్నాయి లైబ్రేరియన్ శ్రీమతి  కోటమ్మ అనిజ్ఞాపకం ఇక్కడే ఉద్యోగం లో చేరి నాన్ స్టాప్  గా పని చేస్తోంది చాలా మంచి ఆవిడ అనిపించింది .పెద్దావిడే .స్కూల్ ముందు వెనకా ఆట స్థలం చుట్టూ కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి పెద్ద ఊటబావి దానికి ఎలక్ట్రిక్ మోటారు ఓవర్ హెడ్ వాటర్ టాంక్ అన్నీ ఉన్నాయి .కొబ్బరి  పోషణకు ప్రభుత్వం డబ్బు అందజేస్తుంది మూడు నేలలలకోసారి జమాఖర్చులు పంపాలి ఉయ్యూరయ్య అనే జూనియర్ గుమాస్తా స్కూల్ లెక్కా డొక్కా తోపాటు దీన్నీ చూస్తాడు .నమ్మకస్తుడు భయస్తుడు కమితీవారి తలలో నాలుక కూడా .కొంతా స్థలం లో వరిసాగు కూడా ఉంది గొప్ప  .సీనియర్ గుమాస్తా సుబ్రహ్మణ్యం గారని గుర్తు ఉయ్యూరులో మాధవరావు అనే ఆయన తోడల్లుడు .గంభీరంగా ఉంటాడు .సైన్స్ మేస్టర్ శ్రీసుబ్రహ్మణ్యం  నాతొ పెనమకూరులో చేశాడు .భార్య గ్రేడ్ టు తెలుగుపండిట్ .లెక్కల మాస్టారుశ్రీ ప్రసాద్ అని చాలా సమర్ధుడు ,మంచి టీచర్ .తలలో నాలుక .స్కూల్ ఇంచార్జ్ హెడ్ మాస్టర్ ఆయనే ఇంకో పోస్ట్ లో ఎవరో ఒకరు రావటం వెళ్ళటం జరిగేది .కనుక బాధ్యతఅంతా ప్రసాద్ గారిమీదే ఉండేది .సీనియర్ తెలుగు మేష్టారు శర్మగారు .దగ్గరలో ముళ్ళపూడి వారు స్కూల్ ఫంక్షన్ లన్నీ ఈయనే నిర్వహించేవారు .వాళ్ళబ్బాయి టెన్త్ లో ఉన్నాడు చురుకైనవాడు పబ్లిక్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు నాకు బాగా ఇష్టమైన శిష్యుడు చాకు అంటామే అలాంటి షార్ప్ నెస్ ఉన్నవాడు ఆయన కుటుంబం లో అందరూ తెలుగు పండితులే ఒక అన్న పెనమకూరు లో తెలుగు పండిట్ .ఇంకో ఆయన కపిలేశ్వరపురం లో అలా .సోషల్ మేష్టారు మస్తాన్ గారు .ఇక్కడి వాడే  హిందీటీచర్ లేడీ .ఉయ్యూరు లనుండి వస్తారు కోటలో అద్దెకుంటున్నారు భర్త తమిరిశ దగ్గర సోషల్ మేష్టారు ఇద్దరు ఆడపిల్లలు .పేరు తూటుపల్లి సావిత్రి అనిజ్ఞాపకం .సెకండరీ గ్రేడ్ లలో లంకపల్లి ఆయన నల్లగా పొట్టిగా ఉండేశ్రీరామ మూర్తిగారు .మా మామయ్యా వాళ్ళ పొలం కౌలుకు చేస్తానని ఒకటి రెండు సార్లు ఉయ్యూరులో నన్ను చూశానని గుర్తు చేసుకొన్నారు  .ఈయనే స్టాఫ్ సెక్రటరి .అందర్నీ ఒప్పించగలిగే ఓర్పూ నేర్పూ ఉన్నవారు .భీష్మ పితామహుడు ఒకాయన రెడ్డియ్యగారు ఉండేవారు .క్రాఫ్ట్ మాస్టర్ ప్రకాశ రావు గార్డెనింగ్ .’’దేవదాసు ‘’.అటెండర్ అర్జున రావు .రుద్రపాక వాడు ఇక్కడే సెటిల్ అయ్యాడు నైట్ వాచ్ మన్ ఆ ఊరివాడే కోటయ్య .సీనియర్ డ్రిల్ మాస్టారు శ్రీ సుబ్బారావు కపిళేశ్వరపురం వాడు రెండో డ్రిల్ మాస్టారు పమిడిముక్కలనుంది వచ్చేవారు మెతక మనిషి .నా దగ్గరే రిటైర్ అయ్యాడుసహృదయుడు  లాబ్ అసిస్టంట్ ప్రసాద్ –అతనికొడుకు 9 లో ఉన్నాడు స్కూల్ లో సంచాయిక ‘’అనే పిల్లల పొదుపు పధకం నేనెక్కడ పని చేసినా సమర్ధంగా నిర్వహించాను ఇక్కడ దాన్ని ప్రసాద్ చూస్తున్నాడు .వార్షికోత్సవం నాటికి ఎవరు ఎక్కువ పొడుపు చేస్తే వారికి బహుమతి ఇచ్చేవాళ్ళం .బాగా తెలివిగలవాడు సహృదయుడు .కొద్దికాలానికి గుమాస్తా సుబ్రహ్మణ్యం గారు బదిలీ అయి, లోయ శంకర రావు వచ్చాడు జగజ్జన్త్రీ మాటల గారడీ వాడు పని కూడా స్పీడ్ గా చేసేవాడు బాగా రాజకీయ పలుకుబడి ఉన్న వాడు .నాకు బాగా ఉపయోగ పడ్డాడు .అలాగే కొద్దిమంది బదిలీ అవటం కొత్తవాళ్ళు రావటం జరిగేది .

సాయంకాలం స్టాఫ్ సెక్రెటరి స్టాఫ్ సమావేశం ఏర్పాటు చేశారు తేనీటి విందు ఇచ్చారు .నన్ను నేను పరిచయం చేసుకొని అందరి పరిచయం చెప్పించి ,అందరం కలిసి స్కూల్ అభి వృద్ధికి పని చేద్దాం యిలా చేస్తా అలా చేస్తా అని నేను చెప్పను సంవత్సరం చివరికి మనం ఏం చేశామో తెలుసుకొందాం అని చెప్పాను ఒక పావుగంటలో స్టాఫ్ మీటింగ్ పూర్తీ చేశాను స్కూల్ జనరల్ డిసిప్లిన్ అంతా డ్రిల్ మాస్టర్ సుబ్బా రావు గారే చూసేవారు .రోజూ సమయానికి అసెంబ్లీ నిర్వహించటం ,లేట్ గా వచ్చిన వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వటం అన్నీ పకడ్బందీ గా చేసేవాడు .టీచర్ లలో బాడ్మింటన్  ఆడే వాళ్ళలో నేనూ తెలుగు మాస్టారు డ్రిల్ మాస్టారు , సైన్స్ ,లెక్కల మేస్టార్లు ఉన్నాం మేమందరం వాలీబాల్ కూడా ఆడేవాల్లమే కనుక స్కూల్ అయ్యాక ఒక గంట ఆడుకొని అప్పుడు బయల్దేరేవాళ్ళం

మళ్ళీ ప్రయాణం తిప్పలు

మేడూరు ఉయ్యూరుకు దగ్గరే .సుమారు 15 కిలోమీటర్లు కాని రోడ్డు బాగుండదు బస్ ఫ్రీక్వెంసి లేదు .ఏదో రకంగా వీరంకి లాకు చేరితే అక్కడినుండి వెళ్ళాలంటే ‘’టంగు’’ తెగేది .ఏదో తంటాలుపడి పమిడిముక్కల చేరితే అక్కడి నుండి స్కూల్ పిల్లల సైకిల్ మీద ఎక్కి వెళ్ళాలి లేక పోతే లెఫ్ట్ అండ్ రైట్ రెండుకిలోమీటర్లు   అలాగే సాయంకాలం 5 గంటలకే మేడూరు నుంచి విజయవాడ బస్ .అది మిస్ అయితే ఆరున్నరకో ఏడుకొ కాని మళ్ళీ బస్ లేదు .ఇంటికి చేరేసరికి ఎనిమిది దాటేది .ఒక రకంగా నాపని’’ పెనం మీంచి పొయ్యిలోకి ‘’అన్నట్లు అయిందేమో అనిపించింది .

సాయంకాలం బస్ కోసం స్కూల్ దగ్గరే ఉన్న యలమంచిలి వెంకటేశ్వరరావు గారు అనే రిటైర్డ్ సెకండరీ గ్రేడ్ మాస్టారి అరుగులపై ఆయనతో కబుర్లు చెప్పుకోవటం ఆయన శ్రీ పి శ్రీరామ మూర్తి గారి మనిషి .కబుర్లు బాగానే చెప్పేవారు ఎన్నో పాత విషయాలు తవ్వుకొని మాట్లాడుకొనేవాళ్ళం అలాగే ఆ ఊళ్లోనే రిటైర్ అయిన ఒక హిందీ మాస్టారు కూడా ఉన్నారు ఆయనా వెంకటేశ్వర రావే ఆయన ఇక్కడ ట్యూషన్ కింగ్ .

శ్రీ యలమంచిలి రామమోహన రావు గారు

మేడూరు అన్నా మేడూరు స్కూల్ అన్నా శ్రీ యలమంచిలి రామమోహన రావు గారే జ్ఞాపకం వస్తారు ఎవరికైనా మేడూరు లోనే కాదు చుట్టూ ప్రక్క వంద గ్రామాలలో అంతటి మంచి మనిషి .లేరు .మేడూరు గ్రామ సర్పంచ్ గా దాదాపు 25 ఏళ్ళు పనిచేశారు స్కూల్ బిల్డింగ్ కు స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టించారు .పంచాయితీ భవనం పసువులాస్పత్రి వంటివి అన్నీ వారి వితరణ వలన వచ్చినవే  ఆయన గొప్ప సంస్కారి .మాంచి కాంగ్రెస్ అభిమాని నిజాయితీకి నిర్భీకతకు ప్రసిద్ధి .ఎప్పుడూ తన చేయి పైనే ఉండాలని కోరుకొనేవారు దాన ధర్మాలకు లెక్కేలేదు .శ్రీ కాకాని వెంకటరత్నం గారికి నమ్మిన బంటు ,కాకాని వారు యే ఎలక్షన్ లో నిలబడినా ఖర్చు అంతా రామ మోహన రావు గారిదే దానితో ఎలక్షన్ అయ్యాక ఈ యన పొలం నాలుగో ఐదో ఎకరాలుఖాళీ .అంతమాత్రం చేత వెనకడుగు వేసేవారుకాడు మళ్ళీ ఎన్నికకు మళ్ళీ రెడీ సుక్షేత్రమైన మాగాణి పొలం కాకాని వారికోసం ఎన్నికలార్పణం అయ్యేది .సర్పంచ్ గా గ్రామాన్ని సర్వతోముఖా భి వృద్ధి చేశారు కాని రోడ్డు సౌకర్యం ఎర్పరచుకోలేక పోయారు తారు రోడ్డు గతుకుల రోడ్డే గతి .రావు గారికి రాజకీయ ప్రమోషన్ రావాలని ఆశించారు జనం దానికి ఆయన ససేమిరా అనేవారు నేను శాసన సభకు నిలబడతాను అంటే కాకానికి నిలబడే సాహసం ఉండేదికాదు అంత సాహసం ఈ వీర భక్త హనుమాన్ చేయలేదు ఏనాడూ .చివరికి ఉయ్యూరు మండలానికి ఉపాధ్యక్షులుగా అందరి బలవంతం మీద పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .ఆయన కనబడినా ఆయన పేరు చెప్పినా ‘’చేయెత్తి మహానుభావుడు ‘’అని నమస్కరిస్తారు జనం అదీ ఆయన కున్న కీర్త ప్రతిష్ట ‘అలాంటి రామ మోహన రాగారు నేను మేదూరులో చేరటానికి సుమారు రెండు నెలల ముందు చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రావు  మేడూరు సర్పంచ్ .ఆయన తమ్ముడు ఉయ్యూరు షుగర్ ఫాక్ట్రరీ లోను ,చుట్టూ ప్రక్కలా ప్రసిద్ధుడైన చెరుకు రైతు .పేరు గుర్తు లేదు .స్కూల్ కు సలహా దారు కూడా  ఇదీ నేను చేరిన మేడూరు అక్కడి స్కూలు నేపధ్యం మిగతా వివరాలు తరువాత తెలియ జేస్తా .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-16- ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మట్టి పరిమళం గుబాళించిన చిక్కని చక్కని కవితలే వెన్ను విరిగిన కంకులు

మట్టి పరిమళం  గుబాళించిన చిక్కని చక్కని కవితలే వెన్ను విరిగిన కంకులు

డా మక్కెన శ్రీను గారితో నాకు ముఖ పరిచయం లేదు .కాని వారు నిన్న తమ ‘’వెన్ను విరిగిన కంకులు ‘’నాకు ఆదరంగా పంపారు .రాత్రికే చదవటం పూర్తీ చేశాను .ఇది రైతు కవిత్వం.  కవి  శాస్త్రజ్ఞులు కూడా .కనుక కవిత్వం శాస్త్ర బద్ధంగా కవితాత్మకం గా విషయ వివేచనంగా పండింది .వెన్నులు విరిగినా తరగని కవితా కంకులను పండించింది .డాక్టర్ గారికి హృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాను .ఇందులో నాకు అందిన సోయగాలను మీకు పరిచయం చేస్తున్నాను

అభివాదం శ్రమవేదం ,ఆర్తనాదం సమ్మోదం అనే నాలుగుభాగాలుగా ఉన్న ఈ కావ్యం  రైతు ప్రశంస ,అతని శ్రమజీవన విధానం ,ఇంత చేసినా గిట్టుబాటుకాక పడే ఆవేదన పెడుతున్న ఆర్తనాదాను వినిపిస్తూనే చర్యలు సక్రమ౦ గా అందరూ తీసుకొంటే వచ్చే సమ్మోదం కూడా సోపాన పద్ధతిలో కవి వివరించారు .నేత జీవుల మీద శ్రీ రాధేయ  లాంటి కవులు అద్భుత కవిత్వం వెలువరించారు .రైతులమీదాశ్రీ కొండ్రెడ్డి వెంకట రెడ్డి వంటివారు రాశారు .వాటిల్లో ఆవేశం ,ఆక్రోశం పాలు ఎక్కువ .దీనిలో సమతూకం నాకు కనిపించింది .నాలుగు పాదాలలో చిక్కని చక్కని కవిత్వం చెప్పారుకవి ఈ నాలుగు భాగాల కు వివరణ ఇచ్చారు-అభివాదం లో రైతు గొప్పతనం మట్టికీ రైతుకూ ఉన్న బాంధవ్యం  వర్ణించానని శ్రమవేదం లో రైతు శ్రమ ఆరాటం  వృత్తిధర్మాలు చెప్పానని ,ఆర్తనాదం లో ప్రకృతి వైపరీత్యాలు నకిలీ విత్తనాలు ఎరువులు పురుగులమందుల వలన కుదేలైన రైతు దీన గాధ తెలియ జేశానని ,చివరగా సమ్మోదం  లో ప్రభుత్వాలు రైతుకు సాయం చేసి వ్యవసాయానికి తోడ్పడాలని సూచించానని తన ప్రణాళిక తెలియ జేశారు

ముందుగా రైతుకు అభివాదం చేస్తూ ‘’సేద్యమంటే బహు చక్కని స్నేహం –మనిషీ పశువు పాడే ఐక్యతా రాగం –ఆకలిని హరించే హలం పాడే గాత్రం ‘’అనటం బహుశా నేనెప్పుడూ వినలేదు చదవలేదని గుర్తు .చాలాసుకుమార భావనలు తగిన పదాలతో వర్ణించి వన్నె తెచ్చారు ‘’వ్యవసాయం ఒక సుమ సంగీతం ‘’అనటం గొప్ప అభి వ్యక్తీ .దున్నటం నుండి గంపలకు పైరు ఎత్తుకోవటందాకా వివరిస్తూకవి ‘’నాగలి భువికి చేసే లేత గాయం –చినుకులు పూసే పట్టికి లేపనం –మొలకలు రైతుకు హరిత దీపం –పంటలు పసిడి సిరుల ప్రతి రూపం ‘’చాలా సుకుమారంగా హృద్యంగా ఉంది పాదం గుర్తులతో పునీతమైన క్షేత్రానికి చేతి స్పర్శ మట్టి స్తోత్రమై మురిసిన ఆకాశం చినికే చినుకుల ఛత్రమై భూమి లిఖించిన సిరి సేద్యపు పత్రమైంది . ఏరువాకే ఆనంద హేల అయిన రైతు జాతి ఏలిక ,పాలిక ‘’అనటం రైతుకిచ్చిన గౌరవం .నెత్తిమీద తలపాగ కిరీటం .నడకలో మహా రాజసం ఒలక బోస్తాడు రైతు రాజు .అతనికి ‘’వడ్లు గొడ్లు ‘’చూస్తే సంబరం ‘’కవి వర్ణించిన రైతు ప్రకాశం జిల్లా వీరన్నపాలెం రైతు అయిన ఆయన తండ్రిగారే అని గ్రహిస్తాం ఆయనే ఆశీర్వదించి రాయమన్న కావ్యం ఇదంతా .

కవినీ రైతునీ ,కాగితాన్నీ నేలను పోలుస్తూ రెండవభాగం శ్రమవేదం ‘’లో ‘’హలాన్ని కలంలా చేత బట్టి –వేదాన్ని సిరాగా జాలువార్చి –చదునైన నేలను కాగితంగా మార్చి – అక్షర సేద్యం చేసే కవి రైతన్నేగా ‘’అంటూ చాలా భావ గర్భిత౦ గా రాశారు కవి .రైతుచేసేది ధర్మ ,కర్మ ,శ్రమ సేద్య యుద్ధాలు హలం తో ,స్వేదం తో ,పొలం తో క్షేత్రం తో వరుసగా ఈ యుద్ధాలు సాగిస్తాడు రైతు అంటే –‘’స్వేదం చిందించిన సేద్య ‘’రూపకం ‘’,వేదం పలికించిన శ్రమ వాచకం ,’’అంతే కాదు శాస్త్ర వేత్త పరిశోధించని జీవన శాస్త్రం . రైతు అనగా ‘’రచయిత లిఖించని పచ్చని కావ్యం అని ప్రక్రియా పరంగానో  ఉత్క్రుస్టుడురైతు అన్నారు ‘’కొడవలి మెడపై పైరు నాట్యాలు ‘’చేస్తాయట .రమ్యమైన మాట .ఏ కార్తికి వాన పడితే పంట ఎలా ఉంటుందో రైతు అనుభవం ,శాస్త్రానుభావాలతో చెప్పారు .’’రేవతిలో సస్య రమ పులకిస్తే ,మృగశిర ముక్కారు పంట ఇస్తుంది కత్తెర వాన కనకం పండిస్తే భరణి వాన ధరణి విరగ బూయిస్తుంది ఆరుద్రలో దరిద్రం ఉండదు పునర్వసులో వాన పుష్ప వర్షమే ,’’అందుకే ‘’కృషీ వలుని కృషికి కార్తెలే హర్షం ‘’

ఉత్తర లో ఊడవటం కంటే ఏడవటం మంచిది ,మూల కురిస్తే ముంగారు పంట ,కృత్తికలో విత్తితే కుత్తుక నిండదు . ఆశ్లేష వర్షానికి అరికాలు తడవదు ,విశాఖ వర్షం విషం ,పుబ్బలో చల్లితే దిబ్బలో పోసినట్లే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని వ్యవసాయం చేయాలని హితవు .ఇది రైతు పంచాంగం గా భావించాలి . రైతు అంటే ‘’మానెడు చల్లి పుట్టెడు సృష్టి కర్త ‘’’’హాలికుడు నిలువెత్తు స్వేద దీపం ‘’రైతు రోజూ చూసేది ‘’నవజాత మేఘాలనే –నమ్మేదేప్పుడూ వాతావరణాన్నే ‘’అహం చేరని సనాతన సస్యాలయ౦ ,’’రైతే ఒక వ్యవసాయ విశ్వ విద్యాలయం ‘’ఒకప్పుడు రైతు ‘’సాయం చేసే సేద్య రూపం .మరి ఇప్పుడు ‘’సాయం లేని వ్యవసాయం  ఒకప్పుడు సంబురాల వ్యవసాయం .ఇప్పుడుసాయం లేని  ఎగ తాళికి గురైన ‘’ఎగసాయం ‘’అయింది

మూడవ భాగం ‘’రైతు ఆర్తనాదం ‘’వినిపించారుకవి .ఇప్పటి వ్యవసాయం ‘’భరోసా  ,భద్రతా లేనిది గజి బిజీ యై విరగ కాచి వరదపాలై ,ఈన గాచినక్కల పాలై నా ‘’సేద్యపు యుద్ధానికి రైతెప్పుడూ సిద్ధమే ‘’పుట్ల కొద్దీ పండించిన అన్నదాత నేడు పట్టెడన్నం కోసం ,ఎదురు చూస్తున్నాడు .రైతు నడుం విరిగింది .ఋతుపవనాలు కను చూపులో కానరాక మేత లేక బక్క చిక్కిన పశువులు ,ఎరువు చిమ్మిన బీడు భూములై వాపోతున్నాడు ‘’చేదకు అందని ఎండిన  బావి  –చేను పండుట ఇక ఎండ మావి ‘’అని నిర్ణయించుకొని ,అన్నీ కుదువపెట్టి విత్తి నా ఫలితం లేక నకిలీ విత్తనాలు ఎరువులకు బలై చితికి చేరువయ్యే కట్టె అయ్యాడు అందుకే చివరికి

‘’పగ్గం కాడి మేడి వదలబడి –కొడవలి నాగలి మూలన పడి –రైతన్న అడుగు మెల్లగా తడబడి –చరిత్రలో కలిసిపోఎను సాగుబడి ‘’అని రైతు దీన హీన చరిత్రను కళ్ళముందు ఉంచారు .ప్రపంచీకరణం తెచ్చిన గొప్ప మార్పు రైతు కూలీఅవటం కమత ౦ సెజ్ లు గా మారటం .తాను పండించిన పంటకు ధర నిర్ణయించే అధికారం లేక ,వ్యవసాయం జూదంగా మారింది ‘’ దేశాన్ని కాచే సూరీడికి పొద్దు పొడవటం లేదు ‘’ఆర్దికమే అన్నీ నిర్ణయిస్తుంటే హార్దిక బంధాలు పటా పంచలవుతుంటే నిబద్ధతకే తిలోదకాలిచ్చే రోజు –‘’మానవీయత మరువని రైతే రాజు ‘’అంటారు కవి .

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో కవి శాస్త్ర వేత్తగా ఆలోచించి చెప్పారు ‘’సమ్మోదం ‘’అనే 4 వ భాగం లో

‘’సాగు దిగుబడి నిష్పత్తిలో సామ్యం –దిగుమతి ఎగుమతుల్లో భాగ స్వామ్యం –ధరల నిర్ణయాన రైతులే ముఖ్య పాత్రలు –నెరవేరాలి స్వామినాధన్ సస్య సిఫార్సులు అని సూక్తి ముక్తావళి చెప్పారు

చివరగా రెండు బంగారు కవితలతో రైతు కావ్యానికి పుస్తకానికి ముగింపు చాలా అర్ధవంతంగా పలికారు కవి

‘’నాలుగు వేదాలు విశ్వ జనితం –నాగేటి నాదాలు రైతు జీవితం –శ్రమ వేదమే జాతి నినాదం –స్వేద వాదమే జనతకు నాదం ‘’అని రైతు గీత ‘’సేద్యపు భగవద్గీత చెప్పారు .చివరగా

‘’రైతు తలగుడ్డవ్వాలి జాతి పతాకం –ఎర్ర కోట పై ఎగరాలి సేద్య కపోతం –రైతు రంగా ఆశయాలే రైతుకు భోజ్యం –గాంధీజీ కన్నకలలే గ్రామ స్వరాజ్యం ‘’అంటూ ఎంతో ఆశాభావంగా ‘’వెన్ను విరిగిన కంకుల్ని మళ్ళీ ‘’వెన్ను విరుచుకొనే లాగా చేయాలని ఆరాట పడ్డారు కవి శ్రీ మక్కేన శ్రీను .

ముందుమాటలలో కవి తండ్రి కావ్యాన్ని అంకితం పొందిన  శ్రీ మక్కేన రామ సుబ్బయ్య గారు ‘’హలమే మా శ్రీను కలం ‘’అని వెన్ను తట్టి ప్రోత్సహించారు ఇంట్లో కవ్వం చేలో కర్రు కదిలితే కరువే ఉండదని అందుకే రైతు రాజు  రారాజు అయ్యాడని ,ఇప్పుడు అంతా ఉల్టా అయిందని బాధ పడ్డారు .హైదరాబాద్ ‘’ఇగ్నో ‘’లో అసోసియేట్ ప్రొఫెసర్ డా పి వి కె .శశిధర్ ‘’జీవనకవనం ,మట్టి కుదుళ్ళు ‘’,భావ తరంగం రాసి ప్రశంసలు పొందిన శ్రీ మక్కేన సార్ కవి రాసిన ఈ కవితా సంపుటి అందరి మన్ననలు పొందాలని ఆశించారు ‘’తన పదవీకాలం లో చాలాభాగం వ్యవసాయ రంగం లో నే గడిచిందని శ్రీను గారు ‘’Fully exploited the versatility of the Telugu Language ‘’అని ఆశీర్వదించారుఆంద్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రెటరి భు భాషా కోవిదులు  డా మోహన్ కందా

‘’మక్కేన శ్రీను గారు –చెక్కిన బొమ్మ ఈకావ్యం ‘’అని’’ ఆయన నడిచే నవ్య సేద్యాలయం ‘’అని కీర్తిస్తూ ‘’విత్తనం మొలిస్తే గేయం –కరువు నవ్వితే గాయం –రైతు బతికితే అజేయం –రైతు దుఖం ప్రభుత్వాలకు పరాజయం ‘’అంటూ హెచ్చరిక జారీ చేశారు ఇంకొల్లు ,తెలుగు అధ్యాపకులు కవి ,రచయిత  .డా బీరం సుందర రావు ‘’.నామాట ‘’అంటూ కవి గారు తానుఆచార్య రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం స్నాతక స్నాతకోత్తర డాక్టోరల్ పట్టాలు పొంది ,తిరుపతి పశువైద్య విజ్ఞాన కళాశాలలో చదువుకోన్నానని ,ఉద్యోగ ధర్మం రచనా శక్తికి అడ్డుగా నిలిచిందని ,ఆంగ్లం లో వైజ్ఞానిక వ్యాసాలూ 20 0కు పైగా రాశానని ఈ మధ్యనే ప్రవ్రుత్తి పై  మ నసుపోయి తెలుగులో మూడు రచనలు చేశాననిదీనినీ ఆదరించమని కోరారు .కనుక అందరు చదివి ప్రోత్సహించాలని కోరుతున్నాను .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-16- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం –ఆహ్వానం

– శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం –ఆహ్వానం

3-9-16 శనివారం మధ్యాహ్నం 3 గంలకు  సరసభారతి  ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ వారితోకలిసి శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి(అమెరికా ) దంపతుల సౌజన్య సహకారాలతో  శ్రీకోట సూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యులగురు పూజోత్సవం ,పబ్లిక్ స్కూల్ లో నిర్వహిస్తున్నాం  .ముఖ్యతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్  ,ఆత్మీయ అతిధులుగా   ,శ్రీ కోటగురు పుత్రులు శ్రీ కోట చంద్ర శేఖరశాస్త్రి ,శ్రీ గాయత్రి ప్రసాద్ శ్రీ సీతారామాంజనేయులు గార్లు కుటుంబాలతో పాల్గొంటారు . ,శ్రీ కోట మాస్టారి చిత్రపటానికి పుష్పహార  సమర్పణ జరుగుతుంది  .

ఆనాటి కార్యక్రమం లో శ్రీమైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) ఏర్పాటు చేసిన  శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారి ధర్మపత్ని కీశే .కోట సీతమ్మగారి ,స్మారక నగదుబహుమతి 10 ,000 రూపాయలను , ప్రతిభ ,పేదరికం ఉన్న శాంతి నికేతన్ హైస్కూల్ బాలికకు  ,అలాగే ప్రతిభ ,పేదరికం ఉన్న ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ బాలునికి కీ శే .కోట సూర్యనారాయణ గురు వరేణ్యుల స్మారక నగదు బహుమతి10 ,000రూపాయలను సరసభారతి ద్వారా అందజేయబడుతుంది ,కోట సోదరులు తమ తలిదండ్రుల జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన స్మారక నగదు పురస్కారం 10 000రూపాయలను పేదరికం  ప్రతిభా ఉన్నఇంటర్  విద్యార్ధికి వారి చేతులు మీదుగా అందింప జేయటం జరుగుంది .

రెండు రోజుల తర్వాత వచ్చే  5 వ దేదీ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 3 వ తేదీ ననే శ్రీ కోట మాస్టారి గురు పూజోత్సవ సందర్భంగా  శ్రీ కోట సోదరులకు ,శాంతి నికేతన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ మధుసూదన్ పిళ్లే శ్రీమతి విజయ లక్ష్మి దంపతులకు ,సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మిగారికి ,,ఇద్దరు పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులకు  సత్కారం జరుగుతుంది ..

శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవ సందర్భంగా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవానికి సాహిత్యాభిమానులు ,విద్యాభిమానులు విశేషంగా పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన

మనవి-ఇటీవలి కృష్ణా పుష్కరాలు , సందర్భం గా ప్రత్యేక ఆహ్వానపత్రం ముద్రింఛి అందజేయటానికి   సమయం చాల నందున ఇదే ఆహ్వానంగా భావించి అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన

Inline image 1  Inline image 2

గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

ఏం కె బాబు –ప్రిన్సిపాల్ –ఉయ్యూరు పబ్లిక్ స్కూల్

శ్రీ వినాయక చవితి మరియు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలతో

 

ఉయ్యూరు .

26-8-16

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మధురం మధురం మాధవ నామం

మధురం మధురం మాధవ నామం

శ్రీ కృష్ణుడు ఉద్భవించిన చోటఉత్తర ప్రదేశ్ లోని  మధుర లో ఆయన జన్మించిన చెరసాల చుట్టూ శ్రీ కృష్ణాలయం నిర్మించారు .కేశవ దాసాదేవాలయం దాటగానే కృష్ణాలయం వస్తుంది .ప్రక్కనే మసీదుకూడా ఉంటుంది మొట్టమొదటి ఆలయాన్ని వజ్ర నాభుడు నిర్మించాడు అది దెబ్బతింటేతర్వాత విక్రమాదిత్య మహారాజు పునర్నిర్మించాడు మహమ్మదీయ దండ యాత్రలో ఈ దేవాలయం 17 సార్లు ధ్వంసమైంది ధ్వంసమైన ప్రతిసారీ కొత్త ఆలయాన్ని నిర్మించారు .

శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారం స్వయం భువు . సాక్షాత్తు  శ్రీ మహా విష్ణువే శ్రీ కృష్ణ రూపం లో ద్వాపర యుగం కంస శిశుపాలాది దుస్ట రాక్షసగణాలను సంహరింఛి ధర్మ సంస్తాపనకోసం  ఉద్భవించాడు శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీ కృష్ణ జయంతి .గోవింద ,ముకుంద వాసుదేవ అని ఆయన్ను మనసారా భక్తజనం పిలుచుకొంటారు .మనసులను ఆకర్షించేవాడుకనుక కృష్ణుడు ..శ్రీకృష్ణ ,వాసుదేవ బాలకృష్ణ ,గోపాల మూర్తిగా క్రీ .పూ.4 వ వశతాబ్దినుంచి పూజలు అందు కొంటున్నట్లు చరిత్రకారులు అంటారు .కృష్ణుని స్వయంభువుగా భావి౦చ టాన్ని ‘’కృష్ణ తత్త్వం ‘’అన్నారు ఇది మధ్యయుగం లో భక్తీ మార్గం పరిపక్వంగా ఉన్నప్పుడు బాగా వ్యాపించింది 10 వశతాబ్దం నుండి శిల్పాలలో చిత్రలేఖనం లో క్రిష్ణాక్రుతులకు ప్రాధాన్యం పెరిగింది .ఒరిస్సాలో ని పూరీ క్షేత్రం లో శ్రీ జగన్నాధ దేవాలయం ఈ ప్రభావం తో నిర్మించబడింఅలాగే మహారాస్ట్రలో విఠోబా అనే పాండురంగని ఆలయం రాజస్థాన్ లో శ్రీనాద్ దేవాలయం ఏర్పడ్డాయి 19 60 తర్వాత పాశ్చాత్య దేశాలలో కృష్ణా కాన్షేస్ బాగా పెరిగి అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి అంతర్జాతీయ కృష్ణా కాన్షేస్ సంస్థ చాలా ప్రాచుర్యం పొందింది దీనినే ‘’ఇస్కాన్ ‘’అంటారు

సాధారణం గాశ్రీ కృష్ణ విగ్రహాలు నల్ల రాతితో తయారు చేసేవారు .కాలక్రమేనణా నలుపు తగ్గించి నీలం రంగు వాడుతున్నారు అసలు ఆయన రంగుకు ‘’జమ్బూల్ ‘’అనిపేరు దీన్నే జామున్ అంటారు అది  ‘’ఊదా రంగు (పర్పుల్ కలర్ )ఫలం జంబూ ఫలానికి ఉన్న నాలుగు చిహ్నాలలోరెండు  శ్రీకృష్ణుని కుడి పాదం పైన ఉన్నట్లు వాటిని శ్రీ రూప చింతామణి ,ఆనంద చంద్రిక అంటారని శ్రీ మద్భాగవతానికి వ్యాఖ్యానం రాస్తూ శ్రీల విశ్వనాధ చక్ర వర్తి ఠాకూర్ తెలియ జేశారు

సింద్ లోని లర్కానా జిల్లాలోని మొహన్జ దారో ‘’లో దొరికిన ఒక ఒక షొప్ స్టోన్ శిలాఫలకం పై యమలార్జున గర్వ భంగం అంటే రెండు మద్ది చెట్లను నడుముకు కట్టిన రోటి తో ధ్వంసం చేసిన బాలక్రిషణ మూర్తి శిల్పం బయట పడింది  అంటేసిందు నాగరకత కాలం నాటికే శ్రీ కృష్ణ కధలు బహుళ ప్రచారం లో ఉన్నాయి అని పురా తత్వ వేత్తలు వి ఎస్ అగర్వాల్ లాంటి వారు నిర్ణయించారు కృష్ణుడిని బాల కృష్ణు నిగా లేక రాదా కృష్ణుని గా యవ్వన దశలో ఉన్న విగ్రహాలు ఎక్కువ .ఆయన నిలబడి మురళి వాయిస్తూ  వ్యత్యస్త పాదం తో కనిపించటం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది చుట్టూ గోవులు గోపాలురు గోపికలు పర్య వేష్టించి ఉంటారు ఈ త్రిభంగిమ ‘’లో కనిపించే కృష్ణుడిని ‘’ పశుపాలకుడైన దేవదేవునిగా భావించి గోవింద అని గోపీ కృష్ణా అని ఆత్మీయంగా పిలుచుకొంటారు అయన చిలిపి చేష్టలకు గుర్తుగా వెన్న నవనీత చోరా ,గోకుల కృష్ణ ,కాళీయ మర్దన  గిరిధర గోపాల అని పిలుచుకొని మురిసిపోతారు .

ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా మీర్జా పూర్ లో త్రవ్వకాలలో దొరికిన శిల్పాలు శ్రీ కృష్ణుని కురుక్షేత్ర సంగ్రామానికి చెందినవి .ఇవి క్రీ పూ.800కాలానివి .అస్త్ర శస్త్ర దారిగా అర్జున  రధ చోదకుడిగా చేతిలో చేన్నాకోలతో గుర్రాలను అదిలిస్తూ కనిపిస్తాడు ..ఈ కృష్ణుడిని  ,పార్ధ సారధిగా కొలుస్తారు .

క్రిష్ణకధలు భారత భాగవత ,హరివంశ పురాణాలలో నిక్షిప్తమై అక్షర బద్ధమైనాయి రుగ్వేదం లోని 1-22-164 లో 31 వ సూక్తం లో చెప్పబడిన పశుపాలుడు శ్రీ కృష్ణుడే అని శ్రీ భక్తీ వినోద ఠాకూర్ అభిప్రాయ పడ్డారు క్రీ పూ..8 నుంచి 6 వ శతాబ్దాలకు చెందిన ఛాందోగ్య ఉపనిషత్ లో 3-17 -6  సూక్తం లో వాసుదేవ కృష్ణుడు దేవకీ కుమారుడు అని ఘోర అంగీరసుని శిష్యుడని పేర్కొన బడింది క్రీ పూ 6 వ శాతాబ్దికి చెందిన యాస్కుని నిరుక్తం అక్రూరుని వద్ద శ్యమతక మణి ఉన్నట్లు శత పద బ్రాహ్మణం ఐతరేయ అరణ్యకాలలో కృష్ణుడిని వృష్ణి వంశ సంజాతునిగా చెప్పాయి క్రీ పూ 5 లేక 6 శతాబ్దాలలో ఉన్న పాణిని తన అష్టాధ్యాయి లో వసుదేవుని కుమారుడు వాసుదేవుడని  అర్జున కౌరవు లగురించి చెప్పాడు అంటే కృష్ణునికి అర్జునికి కౌరవులకు సంబంధం ఉందని తెలుస్తోంది

ఇంతటి విస్తృత ప్రచారం ద్వారకా నాధుడు మధురా వల్లభుడు వ్రేపల్లె నందవంశ బాల కృష్ణు డికి ఉంది భారత యుద్ధం లో అర్జునికి కర్తవ్య బోధ చేసి గీతాచార్యుడై ‘’కృష్ణం వందే జగద్గురుం ‘’అని అందరి మొక్కులు అందు కొంటున్నాడు

Inline image 3Inline image 4Inline image 1 Inline image 2

 

శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కన్నయ్య సన్నిధిలో చూడయ్య (గోకులాష్టమి సందర్భం గా మనసులో మెదిలిన భావనకు ఊహా రూప కద

కన్నయ్య సన్నిధిలో చూడయ్య (గోకులాష్టమి సందర్భం గా మనసులో మెదిలిన భావనకు ఊహా రూప కద)

వ్రేపల్లెలో కన్నయ్య పుట్టిన రోజు వేడుకలు బహుపసందుగా సాగుతున్నాయి .ఊరంతా ముగ్గులు తోరణాలు ,ఆటలు పాటలు ,బాలకృష్ణుని చిలిపిచేస్టల ప్రదర్శనాలు నాటకాలు ఒకటేహడావిడి .ప్రతి ఇంట్లోనూ వాళ్ళింట్లోనే కన్నయ్యపుట్టాడనే సంతోషం తో చేస్తున్నారు వేడుకలను .ఇవన్నీ అయిపోయి అందరూ నంద యశోదల ఇంటికి చేరారు .అందరి దృష్టీ పలురకాల ప్రదర్శనల పైనే ఉంది.కన్నయ్య ఒక పక్క వంశీగానం భువన మనోహరంగా చేస్తూ మనసులకు ఆనంద పరవశం కలిగిస్తున్నాడు .వెన్నెలలో బృందావన సందర్శనాన్ని కల్పిస్తున్నాడు అపురూపమైన తమకన్నయ్యకు తల్లి యశోదమ్మ వివిధ రకాలైన నూతన వస్త్రాలను ఆభరణాలను గంటకో రీతిగా మారుస్తూ సంతృప్తి పడుతోంది ఆడపిల్ల లేదన్న బెంగ తీరటానికి కన్నయ్యను కన్నెపిల్లగా కూడా అలంకరించి మరిన్ని నగలు దిగేసి ముచ్చట తీర్చుకొంది.ఇక నందయ్యకు ఒంటిమీద బట్ట నిలవటమే లేదు పొంగిపోతున్నాడు తనకు దక్కినఅదృస్టానికి .ఎన్నిజన్మల తపోఫలమో అని భగవంతునికి చేతులెత్తి మాటిమాటికీ నమస్కరిస్తున్నాడు .ఆడవారి సందడి చెప్పనే అక్కర్లేదు

ఇలా కోలాహలం గా పరవశంగా వాతావరం ఉంది అందరూ  మేనుమరచి పోతున్నారు .ఈ హడావిడి ఒక్కడి విషయం లో మాత్రం లెక్క తప్పింది .వాడే ‘’చూడయ్య .వాడి ద్రుష్టి అంతా కన్నయ్య మీదే ఉంది .చూపు పక్కలకు తిప్పితే ఒట్టు .ఎంత సేపు అట్టాకన్నయ్యని తాగుతాడు వీడు? అని అందరికీ లోపల ఉందికాని కన్నయ్య ఏమనుకొంటాడోనని నోటికి తాళాలు బిగించు కొంటారు .ఇవాళ అయితే కృష్ణాష్టమి అని సరిపుచ్చుకు౦దామంటే ,రోజూ ఇదే తంతు .కన్నయ్య ఎక్కడుంటే అక్కడే వాడు .ఆయనతో మాట్లాడడు .పలకరించడు .తమలాగా ఆయనతో వెన్న, పాలు దొంగతనాలు చేయడు.ఈ చిలిపి పనులు కన్నయ్య చేసేటప్పుడు కూడా  చూడయ్య చూపు కన్నయ్య చేసే పనులమీద ఉండదు .తాము నవ్వుతూ కేరింతలేస్తీ ఆ పనులు చేస్తుంటే వాడుమాత్రం కన్నయ్య మీంచి రెప్ప పక్కకు తిప్పుడు,ద్రుష్టి ,మరల్చడు.అందుకే వాడి అసలు పేరు అందరూ మర్చిపోయి కన్నయ్యను ఎప్పుడూ చూస్తూ ఉంటాడుకనక  చూడయ్యఅని పిలవటం మొదలు పెట్టారు . ఇదేమైనా గాలి రోగమేమో అనుకొనేవాళ్ళు .వాడి తలిదండ్రులకు చెప్పారు కూడా .’’ఒరేయ్ ! వాడేవురికిఅర్దమవ్వడు  పొద్దున్నే ఇంత సద్ది నోట్లో కుక్కుకొని ఇంటినుంచి బయటికి అడుగు పెట్టినోడు , యే అర్ధరాత్రికో కన్నయ్య నిద్రపోయాక కొంపకు చేరుతాడు .తినటానికి ఏమైనా పెడదామని అడిగితే’’కడుపు చాలా బరువుగా ఉందమ్మా నేనేమీ తినలేనే ‘’అని ముసుగు తన్ని పడుకుంటాడు .వాడు మా దారికి రాడని తెలిసి మేమే ఆడి దారిలో పడ్డాం ‘’అంటుంది తల్లి .’తండ్రి మాత్రం ‘’ఆడిదోఇంతపుటకరా .పుట్టటం తోనే ఆడిపక్క కన్నయ్య బొమ్మ ఉంది .మేమేవరుమూ,కొని తెచ్చి పెట్టి౦దికాదు ‘’పుట్టినోడు ఏడవాలా ?ఆహా అదేమీ లేదే  పిలగాడికి .కన్నయ్య బొమ్మను చూస్తూ నగూ కొన్నాడు .గాలీ ధూళీ లాంటివేమైనా పట్టాయా అని ఆల్లనీ పిల్పించాం .ఆళ్ళుతమవల్లకాదని కాడి పారేశారు .ఇదీ ఈడి సంగతి అబ్బయ్యా .ఎప్పుడూ మీ పక్కనే ఉండేటోడుగనక మీరే కుసింత కనిపెట్టి ఉండ౦ డబ్బా’’అన్నాడు తండ్రి .అప్పట్నించి ఇంక ఎవరూ వాడినేమీ అనరు పట్టించుకోరు .

రంగ రంగ వైభవంగా కన్నయ్య పుట్టిం రోజు జరిగిపోతోంది .చూడయ్య చూపు మాత్రం కన్నయ్యను వదలలేదు .యశోదమ్మ చివరగా వచ్చి దిష్టి తీసి ,ఇంతవెన్న నోట బెట్టి ౦ది .కను చూపుతో సైగ చేశాడు తల్లికి .వెంటనే అర్ధం చేసుకొని ఆ ఎంగిలి  వెన్నముద్ద నే చూడయ్య నోట్లోనూ పెట్టింది .వాడికి ఆ స౦గతి తెలుసా? .వాడి మనోరంగమంతా  కన్నయ్య ముఖ చంద్ర బింబ దర్శనాస్వాదనలోనే ఉండిపోయింది.  యశోద వెన్నపెట్టిన సంగతీ తెలీదు అది నోట్లోకి జారిపోతున్న వైనమూ వాడికి స్పృహలో లేదు .అందరూ వెళ్లి పోయారు కన్నయ్యా చూడయ్యా ఇద్దరే ఉన్నారు .కన్నయ్య ‘’చూడా !నాతో మాట్లాడవు .పలకరించవు ఆటాడవు ఎప్పుడూ నా మొహం లోకి చూస్తూనే ఉంటావు .విసుగు అనిపించదా ?’’అడిగాడు కన్నయ్య .ఎప్పుడూ కన్నయ్య ముందు నోరు విప్పని చూడయ్య ఒళ్ళంతా పులకరించింది .అదేదో జన్మ జన్మల అనుబంధం అనిపించింది .కన్నయ్య అడిగాడు కనుక జవాబు చెప్పక పొతే బాగుండదని ‘’కన్నా !నీముఖం చూస్తేనే చాలు నా పంచప్రాణాలకు చైతన్యం కలుగుతుంది .నీతో మాట్లాడితే ఆ భాగ్యం దక్కదేమోనని భయం .కనుక నిన్నే చూస్తా నాకు అంతకంటే ఆనందం లేదు అక్కర్లేదు .ఇలా శాశ్వతంగా నీ ముఖ సందర్శన భాగ్యమివ్వు ఈ చూడ య్య కు .’’అన్నాడు చూడుడి కళ్ళనుండి ధారా పాతంగా ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి కాదు కారిపోతున్నాయి .ఏమైందో తెలీదుకాని కన్నయ్య కళ్ళనుండీ సంతత ధారాపాతం గా బాష్పదారలు కురుస్తున్నాయి .పైన ఉన్న దేవతాగానం రుషిగణంకృష్ణాష్టమి వేడుకలు చూస్తూ ఈ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు పుష్ప వృష్టి కురిపించారు .

కొంచెం బాహ్య స్పృహలోకి వచ్చారు ఇద్దరూ ‘’కన్నయ్యా !నేను నిన్ను ఇలాఅంటిపెట్టుకొని ఉలకక పలకక నిన్నే చూడటం నీకిస్టమేనా ఇబ్బందిలేదా ?’’అడిగాడు చూడుడు .కరిగి పోయిన కన్నయ్య ‘’చూడా !మనది జన్మ జన్మల అనుబంధం .నువ్వు చూడామణి అనే రుషీశ్వరుడివి నేను కృష్ణావతారం దాల్చే టప్పుడు రుషిగణమంతా గోప గోపికలు గా జన్మించారు అప్పుడు నువ్వు నాదగ్గరకొచ్చి ‘’పరమాత్మా !నేను  అనవరతం నీ ముఖార వి౦దాన్ని దర్శించే  భాగ్యం మాత్రం ప్రసాదించు నాకింకేమీ వద్దు  ‘’అని కోరావు .ఆ వర ప్రభావం వలననే నువ్వు ఇంత సన్నిహితంగా నన్ను నా ముఖాన్నీ చూస్తూ పరమానందాన్ని పొందుతున్నావు .’’అన్నాడు .అంతే చూడడు కన్నయ్య పాదాలపై వాలి భక్తితో ప్రణమిల్లి’’ ఇంతకంటే ఇంకా యే ఆనందం నాకక్కర్లేదు కన్నా ‘’అని ముఖాన్ని పైకి త్రిప్పి కన్నయ్య ముఖ చంద్రోదయాన్ని తనివి తీరా దర్శించి అలా కన్నయ్య పాదాలపై వాలిపోయాడు .ఒక దివ్యజ్యోతి చూడయ్యనుంచి కన్నయ్యలోకి ప్రవేశించింది .దీనికి సాక్షులు పైనున్న రుషి ,దేవ గణం..విషయం  తెలిసి  అందరూ వచ్చి కన్నయ్య చూడయ్య  ల అనుబంధాన్ని అర్ధం చేసుకొని చూడయ్య భక్తికీ కన్నయ్య కృపకూ  ముగ్ధులయ్యారు

Inline image 1  Inline image 2

శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలతో

మీ గబ్బిట దుర్గాప్రసాద్-25-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1 of 18,073 Print all In new window ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపించింది -అభినందన సభ లో బాబు –

విజయం ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపిస్తోంది: అభినందన సభలో చంద్రబాబు By: Nageshwara Rao Published: Wednesday, August 24, 2016, 14:25 [IST] అమరావతి: కృష్ణా పుష్కరాల విజయం ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులు, అధికారులు, కార్మికులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాకంటే సిబ్బంది, ఉద్యోగులు ఎక్కువగా కష్టపడ్డారని అన్నారు. పోలీసులు కూడా పుష్కరాల్లో సేవ చేశారని మెచ్చుకున్నారు. Also Read: బాబు సర్వే: టిడిపి స్థితిపై దిమ్మతిరిగే ఫలితం పోలీసులంటే లాఠీలు ఉపయోగిస్తారన్న చెడుభావం గతంలో ఉండేదని, పుష్కరాల పోలీసుల ఇమేజ్ పెరిగిందని అన్నారు. టెక్నాలజీ సాయంతో పుష్కరాలను విజయవంతం చేశామని తెలిపారు. టెక్నాలజీ వల్ల కమ్యూనికేషన్‌ గ్యాప్‌ రాలేదన్నారు. ఈ విజయం అన్ని వర్గాల ప్రజలది, అధికారులదని సీఎం తెలిపారు. నది పారిన అన్ని ప్రాంతాల్లో పుష్కరస్నానాలు చేశారని చెప్పిన చంద్రబాబు, పారిశుద్ధ్యం విషయంలో పురపాలకశాఖ తీరు అభినందనీయమని కొనియాడారు. 17వేల మంది విద్యార్థులు పుష్కర సేవకులుగా పనిచేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఐవోటి కింద ముందుకు తీసుకువెళ్లడానికి ఈ పుష్కరాల అనుభవం ఉపయోగపడుతుందని అన్నారు. పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్‌ సమన్వయం బాగుందని, పక్కా ప్రణాళికతో పుష్కరాలను నిర్వహించారని అభినందించారు. కృష్ణా పుష్కరాలు మతాలకు అతీతంగా జరిగాయని.. ముస్లింలు, క్రైస్తవులు కూడా పుష్కర స్నానాలు చేయడం అభినందనీయమన్నారు. Also Read: 2 పుష్కరాలు, సింధు గోల్డ్ మెడల్, థ్యాంక్స్: వచ్చినవారితో సంకల్పం చేయించిన చంద్రబాబు ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సేవ చేయడం, స్వచ్ఛంద సంస్థలు యాత్రికులకు అన్నదానం చేయడం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. ఇక డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ పుష్కర విధుల్లో మృతి చెందిన పోలీసు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. పుష్కరాల్లో సాంకేతికను ఎక్కువగా వినియోగించుకున్నామని ఆయన తెలిపారు. ఈ విజయం వెనుక అందరి కృషి దాగి ఉందని చెప్పిన ఆయన రాబోయే రోజుల్లో అన్ని శాఖలతో సమన్వయంతో కలిసి ముందుకు సాగుతామని అన్నారు. సీఎం ప్రోత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు. Post Comment Ads by Revcontent From The Web Today Mumbai Girl Gets 4 Shades Fairer in 14 Days by Using This 1 Weird Old Trick! Just Copy & Paste To Make Rs. 2,25,000/Month Indian Millionaires Trying To Ban This Program No Diets Or Gym: Melt All

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం
శ్రీమన్నారాయణుని షోడశ కళల పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడు అవతరించిన శ్రావణ బహుళ అష్టమి పుణ్యతిథి శ్రీకృష్ణాష్ఠమిగా జరుపుకోవటం సంప్రదాయం. దశావతారాలు ఇంతటి వైవిధ్య భరితమైనది, ప్రముఖమైనది మరొకటి లేదు. శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే దేవకీ వసుదేవులకు తన నిజరూప దర్శన ప్రాప్తి కలిగించాడు. తన అవతార రహస్యం చెప్పాడు. ఆ తర్వాత కార్యమైన తనను గోకులానికి చేర్చటం, యశోద పుత్రికను తెచ్చి దేవకి దగ్గరలో పరుండబెట్టటం ఇత్యాది భావి కార్యాచరణకు ఆదేశమిచ్చాడు. పుట్టినది మొదలు గోకులం, యమునాతీరం, బృందావన ప్రాంతాలు అన్నీ ఆ చిన్నారి చిద్రూపుని విహార భూములయ్యాయి. ఈ అమాయక గోపబాలుడు వెన్నదొంగ అయి ఎన్నో అలౌకిక దివ్యలీలలు ప్రదర్శించాడు. భక్తాగ్రగణ్యులైన గోపికలు కృష్ణుని భౌతిక దృష్టితో దేవకీవసుదేవుల పుత్రుడిగా కాక ఆత్మదృష్టితో దర్శించి ఆరాధించారు. అఖిల దేహినా మంతరాత్మదృక్ అని భావగత పురాణం వివరించినట్లు సకల ప్రాణులలోను అంతర్యామియై ఉన్నవాడనే భావనతోనే చూశారు. వారికి జన్మాంతర బంధమున్నది. ధర్మసంరక్షణార్థం మహావిష్ణువు కృష్ణుడుగా అవతరించినప్పుడు, ఎందరో మహర్షులు, దేవతలు గోపగోపీ జనులుగాను, ఆదిశేషుడు బలరామునిగాను ఆ ఆదిదేవుని అనుసరించి జన్మించిన వారే!
ఆ బాలకృష్ణుని దివ్యలీలా చేష్టలకు పరవశించి, కలవరించి, కవులెందరో ఆ వేణుగానలోలుని గుణగణాలను గానంచేసి తరించారు. మన తెలుగు వారికి కృష్ణుని పేరు చెప్పగానే స్ఫురించేది పోతనగారి భాగవతమే! భక్తికి మరోపేరు భాగవతంగా ప్రసిద్ధి పొందటానికి కారణం మందారమకరంద సదృశమైన శైలిలో, సుందర పదబంధ భరితమైన పోతనగారి తెలుగు పద్యాలే. కవిత్వాన్ని కైవల్య సాధనంగా చేసుకొని మధురమైన భక్తిమార్గంలో పయనించి తరించిన భాగవతోత్తముడు పోతన.
తెలుగునాట పోతన పద్యం లాగా ఉత్తరాన సూరదాస్‌కీర్తనలు బహుళప్రాచుర్యం పొందినవి. ఇవి భాగవతంలోని కథలను వర్ణించినా,దశమస్కందంలోని కృష్ణ లీలలను తనివితీరా పాడుకొన్నాడు సూరదాస్. వంగ సాహిత్యాన్ని శ్రీకృష్ణ చైతన్యంతో పునీతమొనరించిన వాడు చైతన్య మహాప్రభు. మహారాష్ట్రులకు పండరిపురంలో వెలసిన పాండురంగడే పరమ ఆరాధ్యుడు. ఏకనాథ్, తుకారం, నాందేవ్ లాంటి కవులు శ్రీకృష్ణ కవితా లహరిలో తడిసిన వారే. గుజరాతీలో నరసిమెహతా రచనలు ప్రసిద్ధి పొందాయి. శ్రీకృష్ణుడే ధ్యాసగా, శ్వాసగా తన్మయం చెంది గానం చేసిన మీరాభజనలు యావద్భారతావనిని మధుర భక్తి లహరిలో ఓలలాడించాయ. కృష్ణతత్త్వ ప్రతిపాదిత గ్రంథాలలో జయదేవుని గీతగోవింద ప్రాశస్త్యం ఇంతింతనరాలేము కదా. అటులనే లీలాశుకుని కృష్ణ కర్ణామృతం, నారాయణ తీర్థుల కృష్ణలీలా తరంగిణి మకుటాయమానంగా భాసించే మహత్తర మధుర కావ్య కల్పతరువులు.
శ్రీకృష్ణుడు తన అవతారంలో చూపిన లీలా వినోదా లన్నింటిలోకి రాసలీల మధురాతిమధురం. భాగవతంలో రాసలీలలు 5అధ్యాయములలో వర్ణితాలైనవి. దీనినే రాస పంచాధ్యాయి అంటారు. బహుజన్మ కృత పుణ్యఫలంగా గోపికలను కృష్ణ పరమాత్మతో తదాత్మ్యం చెందే భాగ్యం లభించింది. అదే రాసలీలా పరమార్థంగా సంభాషించాలి. అనురక్తికే కాక భక్తికీ సుందర అభివ్యక్తిగా నిలిచింది రాధ. మధురాధిపతే రఖిలం మధురం అని మాధుర్య రసాధిపతి అయి భాసించినవాడు కృష్ణుడు. పరా ప్రకృతిగా భాసించినది రాధ. పైకి శృంగారంగా కనపడినా జీవాత్మ పరమాత్మల సంయోగం కోసం అంతరచైతన్యం కోరుకునే భగవద్రతి అది. భాగవతంలో కనిపించే గోపికల ప్రణయ తత్త్వమూ ఇదే! రాధా తత్త్వాన్ని ఉపాసించి కృష్ణానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని అంటారు. శ్రీకృష్ణ్భగవానుడు తన అనంతముఖ అవతార రహస్యాలను మూడు ముఖ్య దశలలో విశదపరిచాడు. మొదటిది బాల్యదశ. వెన్నదొంగగా మారి, గోపాలకుడై నందకులాన్ని వందనీయం చేశాడు. బృందావనానికి మారటం కాళీయమర్దనం, తదుపరిదైన యవ్వనాంకురదశ, బృందావనం తరువాత‘ప్రౌఢ నిర్భర పరిపాక దశ’. అష్ట మహిషులతో పరిణయం, కురుపాండవుల సంగ్రామం, గీతాబోధ. ఇది ప్రపంచానికి కర్తవ్య బోధ. ఇక రుక్మిణీ కల్యాణం, సత్యభామ పరిణయం ఇవన్నీ తెలిసినవే. కలడో లేడో అనే సంశయం లేకుండా అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు శ్రీకైవల్య పదాభి లాషులందరి హృదయాలలోనూ వెలసే ఉన్నాడు. అలా వెలసి ఉన్న వాడిని తెలుసుకోవడమే జన్మ సార్థకత.(ఆంద్ర భూమి )

బిల్వమంగళుడు లీలాశుకమహర్శియై శ్రీ కృష్ణ కర్ణామృతం మధుర భక్తికి పరాకాష్ట గా రాశాడు .మొదటి శ్లోకంలో

‘’చింతామణి ర్జయతి సోమగురుర్మే-శిక్షా గురుశ్చ భగవాన్ శిఖి పించమౌళిః

యత్పాద కల్పతరు పల్లవ షేఖ రేషు –లీలాస్వయం వరరసం లభతే జయశ్రీః’’

అంటే –శ్రీ కృష్ణ కర్ణామృత కావ్య రచనలో నాకు మార్గ దర్శి అయిన చింతామణికి ,నాకు దీక్షా గురువైన సోమ గిరికినమస్కరిస్తున్నాను .కల్ప వృక్షం తమ చిగురాకుల కొనలవద్ద లక్ష్మ్మీ దేవిని అలంకరించుకొని విలాసంగా కన్పిస్తోంది  ఆ కల్ప వృక్షం లాంటి పాదాలతో విరాజిల్లుతూ నెమలి పించం ధరించి ఉన్న నా శిక్షా గురువైన శ్రీ కృష్ణునికి కూడా నమస్కరిస్తున్నాను

శ్రీ కృష్ణ కర్ణామృత శ్లోకాలు ఉత్తర ,దక్షిణ భారతాలలో విరివిగా వ్యాప్తి చెందాయి సంగీత భజన సభలలో ఆలపిస్తారు తాళ లయాన్వితంగా ఉండటం తో వీటిని నృత్యాభినయానికీ చక్కగా వినియోగిస్తారు .మూడు ఆశ్వాసాల కర్ణామృతం నిజంగానే చెవులకు అమృతమే .4 వ శ్లోక౦ భావ  మాధుర్యాన్ని జొన్నలగడ్డ పతన్జలిగారు వివారించారు చూడండి

బర్హోత్తంస విలాస కుంతలభరం మాధుర్య మగ్నాననం –ప్రోన్నీ లన్నవ యౌవనం ,ప్రవిల సద్వేణుప్రణాదామృతం

ఆపీనన స్తన కుట్మళా భి రాభితో ,గోపీభి రారాదితం –జ్యోతిశ్చేతసి నశ్చ కాస్తుజగతా మేకాభిరామాద్భుతం

భావం –లోకాలన్నితిలోని మనోహర వస్తువులకంటే ,ఆశ్చర్య పదార్దాలన్నిటికంటే ,ఆశ్చర్యమైనది గోపాల కృష్ణుని దివ్య తేజస్సు శిర్సులో నెమిలి పించం ఉంటుంది బాలుడే అయినా సౌన్దర్యం లో పడుచువారి లక్షణాలు కనిపిస్తాయి మాధుర్య విలసిత మోము నుండి వీనుల విందైన మురలీనాడం వెలువడుతుంది .ప్రౌఢ గోపా కాంతలు నిరంతరం ఆయన చుట్టూ చేరి ఆరాధిస్తూ ఉంటారు .అలాంటి తేజో రూప గోపాలుని రూపం ఎప్పుడూ నా మనసులో ప్రకాశించాలి .

 

అందరు చెప్పుకొనే శ్లోకం ‘’కస్తూరీ తిలకం ‘’లీలాశుకునిది అని చాలామందికి తెలియదు .

‘’కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం –నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుఃకరేకంకణం

సర్వాంగే హరి చందనం చ కలయన్ కంఠేచ ముక్తావళీ—గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః

328 శ్లోకాలున్న ఈ స్తోత్ర మంజరి లో ప్రతిశ్లోకం కర్ణ రంజనమే .చివరగా లీలాశుకుడు

‘’లీలాశుకం రచితం తవ దేవ దేవ కృష్ణ కర్ణామృతం వహతు కల్పశతాంత రేపి ‘’అని చెప్పాడు వంద  కల్పాల

దాకాఅంటే నాలుగు యుగాల దాకా  కావ్యం జీవించి ఉండాలని ఆకాంక్షించాడు .ఉంటుంది కూడా

లోకం లో కృష్ణుడిని ‘’గోపాల సుందరి ‘’గా అర్చించే విధానం ఉంది .ఆ మూర్తి జపానికి  33 బీజాక్షరాలున్నాయి .ఇందులో 18రాజ గోపాల మంత్రం లోని వైతే 15 శ్రీ విద్య లోని పంచ దశాక్షరాలు .

దక్షిణ ద్వారక లోని రాజా మన్నార్ గుడి దైవం శ్రీ రాజగోపాలుడు. ఆయన ధ్యానం ‘’శ్రీవిద్యా రాజ గోపాలునిగా చేస్తారు స్వామి పాదాల చెంత శ్రీ చక్రం ప్రతిష్టితమై ఉండటం గొప్ప విశేషం ఆయన అలంకారం ఏమిటో తెలుసా ?మోహినీ అలంకారం అంటే మదన గోపాల సుందరి అలంకారం  బ్రహ్మోత్సవాలు ఈ అలంకారం తోనే నిర్వహిస్తారు .లీలాశుకుడు ఈ మదన గోపాల సుందరి ని శ్రీకృష్ణ కర్ణామృతం లో 3 నుంచి 104 శ్లోకాల వరకు తనివితీరా బహు సుందర పదబంధం తో వర్ణించాడట

శ్రీ రామ కర్ణామృతం

కంచి మఠానికిచెందిన పీఠాదిపతి శ్రీ శ్రీ బోదేంద్ర సరస్వతి గారికి శ్రీరామ సిద్ధాంతం   పై మహా అభిరుచి ఉండేది  వారు తమ పీఠాదిపత్యాన్నిఐచ్చికంగా త్యజించి  పదవీ విరమణ తర్వాత కుంభ కోణం దగ్గరున్న గోవిందాపురం గ్రామం వెళ్లి రామభక్తి సామ్రాజ్యం లో చిదానందాన్ని అనుభవిస్తూ ‘’శ్రీ రామ కర్ణామృతం ‘’అనే మహా గొప్ప స్తోత్ర రచన చేశారు. త్యాగ రాజస్వామికివీరు  ము౦దు వారు .వీరి అనుయాయులు రామనామ  సిద్దాంతా న్ని కావేరీ  పరీ  వాహక  ప్రాంతం లో విస్తృతంగా వ్యాపింప జేశారు. కావేరీనదీ ఉపనది అయిన వీరసోగ్హన్ నదిలో స్వామివారు ‘’జీవ సమాధి ‘’ చెందారు . రామ కర్ణామృత శ్లోకాలు కృష్ణ కర్ణామృత శ్లోకాలలానే ఉండటం విశేషం .ఆ సౌరు చూద్దాం –ముందుగా కృష్ణ కర్ణామృత శ్లోకం –

‘’హే దేవ హే దయిత ,హే జగదేక బంధో-హే కృష్ణ హే చపల హే కరుణైక సింధో

హే నాధ హే రమణ ,హే నయనాభి రామ –హాహా కదాను భవితాసిపధం ద్రుసోర్మే

ఇప్పుడు శ్రీ రామ కర్ణామృత మకరందం జుర్రుదాం

‘’హే రామ ,హే రమణ హే జగదేక వీర –హే నాద హే రఘుపతే కరుణాలవాల

హే జానకీ రమణ  హే జగదేక బంధో –మాం పాహి దీనం అనిశం కృపణం కృతజ్నం ‘’

 

 

కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో వున్న పాపమును కూడా త్రాగేశాడు. పుణ్యమే మిగిలిపోయింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరువత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణునికి తల్లి వుంటే ఏ లోకములకు వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్ళిపోయింది. మరి అ ‘పిల్లవాడు నా కొడుకు’ అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో! వాళ్ళు వెళ్ళే స్థితిని నేను చెప్పలేను అన్నారు పోతనగారు.
ఇది పూతన సంహార ఘట్టము. ఈ ఘట్టమును తాత్త్వికంగా పరిశీలించాలి. భాగవత దశమ స్కంధము ఉపనిషత్ జ్ఞానము. ఆవిడ పేరు పూతన. అమరకోశం ‘పునాతి దేహం పూతన’ అని అర్థం చెప్పింది. దేహమును పవిత్రముగా చేయుడానికి పూతన అని పేరు. మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిదీ అని ప్రశ్నిస్తే నాది అని చెపుతాము. అయితే ఇప్పుడు నేను అనబడే నువ్వు ఎవరు? దానికి జవాబు మనకే తెలియదు. అదే పెద్ద అజ్ఞానము. ‘నేను నేను’ అంటున్నది ఏది? అంటే తెలియక ఆ ‘నేను’ని చీకటితో, అజ్ఞానముతో కప్పివేశాము. అదే పూతన. అవిద్య. ‘నేను’కు ‘నాది’ తోడవుతుంది. నేను అనేది అబద్ధము. ఈ అబద్ధామునకు నాది అనే మరియొక అబద్దం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. ‘నా’ అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. ‘నేను, నాది’ అనే రెండు పూతన రెండు స్తనములు. ఇందులోంచి విషయములను ఇస్తుంది. విషయమే విషము. దేహము ఎప్పుడూ సుఖమునే కోరుతుంది. కానీ దేహసంబంధమయిన సుఖములు విషముతో సమానమయినవి. అవి ఎప్పటికీ దేహి సూక్ష్మరూపమును తెలియనివ్వవు. అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు. దీనిని ఏమయినా చేయగలమా? ఏ పని చేసినా దానిని భగవత్ ప్రసాదమని భావించాలి. భగవదర్పణ చేసి సుఖములను అనుభవిస్తే అవి మనపట్ల విషములు కావు అమృతములు అయిపోతాయి. భగవంతుని అర్పించడం వలన లోపల శుద్ధి జరుగుతోంది. శుద్ధి లేకుండా తింటే విషం అయిపోతుంది. పూతన కృష్ణునికి విషపూరిత స్తన్యమును ఇచ్చింది. విషము అమృతము అయిపోయింది. మీకు కూడా అన్నింటినీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటు అయితే అది అమృతం అవుతుంది. మనస్సును దేహమును కూడా శౌచపరచగలదు. ఈశ్వరుని వైపు తిప్పగలదు. ఈ రహస్యమును ఆవిష్కరించడమే పూతన సంహారమునందు ఉన్న పెద్ద ప్రయత్నము.
ప్రకృతి వికారమయిన శరీరం పైకి అందంగా ఉన్నట్లు ఉంటుంది. కానీ దీనియందే ఉండిపోతే అసత్యమయిన ‘నేను’నందు మీరు ఉండిపోతే అది అమృతత్వమును యివ్వదు. అసత్యమయిన ‘నేను’ సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు వెళ్ళినట్లయితే ఈ భక్తి ఒకనాడు జ్ఞానము అవుతుంది. జ్ఞానము ఎప్పుడు కలిగేదీ మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. జ్ఞానమును అగ్నిహోత్రంతో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒకరోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అపుడు అసలు ‘నేను’ను తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంహారఘట్టం. అందుకనే కృష్ణుని మొదటి లీల పూతన సంహారంతో మొదలవుతుంది. ఇది దేహమును పవిత్రం చేసింది. అపవిత్రమయినది పవిత్రం అయింది. పవిత్రము అవగానే లోపల వున్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోతుంది. మారిపోయి అసలు ‘నేను’ను పసిగట్టగలిగిన స్థితికి తీసుకు వెళుతుంది. ఈ ఘట్టమును పరమోత్కృష్టమయిన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు.

 

Inline image 1Inline image 2Inline image 3

శ్రీ కృష్ణ జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-16 -కాంప్-బాచుపల్లి -హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణా పుష్కర ఆయాస ,అనుభవ ఆకాంక్షలు –తొక్కా చానెల్

కృష్ణా పుష్కర ఆయాస ,అనుభవ ఆకాంక్షలు –తొక్కా చానెల్

హమ్మయ్య నిన్నటితో కృష్ణా పుష్కరాలు రంగరంగా వైభోగం గా పూర్తయ్యాయి .అందరూ హాయిగా ఊపిరి పీల్చుకొన్నారు .చంద్రబాబుకు అలసట బదులు ఉత్సాహం పరవళ్ళు తొక్కింది .వాలు కుర్చీలో కూచుని వీటిని నెమరేసుకొంటూ ఉంటె నాస్నేహితుడు టిక్కూ  రొప్పుతూ ,రోజుతూ ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చి ‘’గురవా !’’తొక్కా టి వి ‘’వాళ్ళు నన్ను నీదగ్గారికి పంపారు .వాళ్ళ విలేకరులంతా ఎక్కడెక్కడో బిగుసుకు పోయారట .నువ్వు జనం లోకి వెళ్లి ‘’పుష్కరాయాస౦ ,  ,అనుభవ, ఆకాంక్షలు’’ రికార్డ్ చేసి ఇవ్వాలట .మరీ మరీ రిక్వెస్ట్ చేస్తే పరిగెత్తుకొచ్చా ‘’అన్నాడు చెమటను చోక్కాతోతుడుచుకొంటూ .’’సరే నాకేంటి ?’’అన్నా.’’ఈ పని చేస్తే ఈ సారినుంచి నువ్వు రాసిన యే చెత్త అయినా ప్రసారం చేస్తామని నాకు హామీ ఇచ్చారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ నా పరువు కాపాడవా “’  అన్నాడు వగరుస్తూ .’’నీ పరువు సరే నా’’ బరువు ‘’సంగతి ?వెహికిల్ ఇస్తారా కెమెరామాన్ ఉంటాడా ,అరగంటకోసారి టిఫిన్ కాఫే మధ్యాహ్నం మీల్స్ అన్నీ ఉన్నాయా ?  నేను రికార్డ్ చేసింది అక్షరం వదలకండా బ్రాడ్ కాస్ట్ చేస్తారా .కటింగ్ ఉంటె కోర్టుకు వెడతానని చెప్పు ‘’అని మేక పోతుగా౦ భీర్యం ప్రదర్శించాను ’ .’’ఆ లోపం ఏమీలేదు .వాటన్నిటితో వెహికిల్ మీ వాకిట్లో రెడీ .నువ్వు ఎక్కి సురూ చేయటమే ఆలస్యం ‘’అంటూ మనసులో ‘’ఈ తొక్క ప్రోగ్రాం ప్రసారం అయినప్పడుకదా’’అని వాడుమనసులో అనుకోన్నమాట నా మెదడు రికార్డ్ చేసేసింది   .’’వీడు ఇంత పకడ్బందీ ప్లాన్ లో వచ్చాడంటే లబ్ది బానే ఉంటుందని కక్కుర్తి పడి వడినీ వాన్ లో కుక్కి నేనూ ఎక్కాను .

ముందుగా పోలీస్ వారిని అడగాలని వారిదగ్గరకు వెళ్లాను .వాలిపోతూ సోలిపోతూ కుర్చీలో కూర్చోలేక పోతూ ,కాళ్ళు వాఛి  ఉన్నాడు పోలీసాయన .’’మైక్ ఆన్ చేయింఛి ‘’సార్ ! మీ పుష్కరం అనుభవం రికార్డ్ చేయటానికి తొక్కా టి వి వాళ్ళు నన్నుపంపారు చెప్పండి ‘’అన్నాను .’’నీరసం ఒళ్ళంతా వ్యాపించి కాళ్ళూ చేతులు స్వాధీనం కాకుండా ఉన్న ఆయన ‘’బలే అనుభవం సార్ .ఒకచోట కూర్చోకుండా నిలబడకుండా 24 గంటల డ్యూటీ చేశాం నడుం విరిగింది .అయినా ఆ జనం హుషా రేంటి సార్.విరగబడి వచ్చారు .వాళ్ళను చూస్తె ,మా అలసట మాయమైంది .కస్టమనిపించలేదు .ఇష్టం తోనే చేశాం .మాదేముంది సార్ .సి ఏం సార్అసలు నిద్రాహారాలు తీసుకొన్నారో లేదో అనిపించింది సార్.ఈ డ్యూటీలో ఆల్ హేపీ హేపీ సార్’’అని కూలబడిపోయాడు .

దారిలో 70 ఏళ్ళ ముసలాయన కనిపిస్తే ఆగి మైకం ఆనించాను ‘’సార్!మీ పుష్కరానుభవం చెప్తారా ‘’అని అడిగా ‘’ఓ తప్పకుండా .నేను 5 పుష్కరాలు చూశాను .అందులో ఇది ది బెస్ట్ .ఏర్పాట్లు పర్య వేక్షణ ఉచిత బస్ సౌకర్యం విశాల ఘాట్లనిర్మాణం ,పారిశుధ్యం ,ఉచిత టిఫిన్ కాఫీ భోజనాలు పోటీలు పడి ఏర్పాటు చేయటం,ముసలీ ముతకలను జాగ్రత్తగా కనిపెట్టి ఉండటం ఓహ్ మహా ఆనందంగా ఉంది .చంద్రబాబు దూర దృష్టికి టెక్నికల్ సైంటిఫిక్ నాలెడ్జ్ వాడకానికి పరాకాష్ట ఈపుష్కరం. గోదావరికీ ఇలానే చేశాడు .తపన ఉన్నవాడేచేయగలడు .మీద్వారా ఆయనకు ,ప్రభుత్వానికి అధికారులకు పోలీసులకు స్వచ్చంద సంస్థలకు ,విద్యార్ధులకు దాతలకు మా తరఫున అభినందనలు అందజేయండి ‘’అని గుక్క తిప్పుకోకుండా గురువుగారు వాయించి పారేశాడు .

అంతా పాజిటివ్ గానే ఉండే వ్యతిరేకం గా ఎవరూ చెప్పటం లేదే అని లోపల పీకు తోంది .సరే ఈ సారి పార్టీలవాళ్ళను వాళ్ళ ఆకాంక్షలను అడుగుదామని పించి ముందుగా జగన్ పార్టీఆయన కనిపిస్తే మైక్ ఇచ్చాను ‘’తొక్కలో పుష్కరానికి ఇంత ఖర్చా .పార్టీ రాజకీయమేకాని ప్రజాదృస్టి ఎక్కడ?అన్నాడు జగన్ పరిభాషలో .’’వచ్చే పుష్కరానికి మీ  లక్ష్యం ఏమిటి ‘’?అడిగా .మానాయకుడు పక్కనే ఉన్నాడు ఆయనే చెబుతాడు అని ఆయన్ను పిలుచుకొచ్చి మైకిచ్చాడు ‘’ఇదేం తీరు .ఎక్కడాప్రజలు ఇబ్బంది పడకుండా చేస్తే ఎలా ?మనల్ని ఎలా గుర్తుంచుకొంటారు  .తొక్కిసలాటలు ఉండాలి జననస్టం  కలగాలి .నేను వెళ్లి కావులించు కొంటూ ఓదార్చాలి ,సాను భూతి చూపాలి .నాకు ఆవకాశమే లేకుండా చేసి నోట్లో మట్టి కొట్టాడు  ‘’అన్నాడు .””మరి మీ లక్ష్యం “?’’ఏముందీ .కృష్ణను ఇడుపులపాయకు ,మా తండ్రిచనిపోయిన పావురాల దిబ్బకు పారించి అక్కడ పుష్కరం పెట్టటం ‘’అన్నాడు .ఆహా ఏమి కోరిక అనిపించి నోరుమేదాపక జారుకొన్నాం .

హస్త వాసి ఒకాయన కనిపిస్తే మైకిచ్చి ‘’వచ్చే పుష్కరాలకు మీ ప్లాన్ ఏమిటి ?’’అడిగా కంగారు లో ‘’అప్పటిదాకా మా పార్టీ ఉంటేకదా’’అని గబుక్కున నోరుజారి పక్కనున్న నాయకుడికిస్తే ఆయన ‘’అప్పుడు  మా రాష్ట్ర నాయకుడితో వారున జపం చేయించి కృష్ణ నీటిని మడకశిర ధర్మవరం దాకా తీసుకు వెళ్లి  ప్రతి ఊరికి కాలవలద్వారా పారిస్తాం .ఇంటికొక జల్లు స్నానం  పెట్టి ఇక్కడికొచ్చే శ్రమ లేకుండా చేస్తాం  .’’అన్నాడు .ఓహో ఇదేదో బానే ఉందనుకోన్నాను .ఇంకొంచెం ముందుకు వెడితే నారాయణ రాఘవులు చెట్ట పట్టాలేసుకొని ఖుషీగా కన్పించారు .పార్టీ వేదికల మీద ,సభల్లో ఎడమొగం పెడమొగం గా ఉన్న ఈ ఇద్దరు ఇంత జబర్దస్తీ దోస్తీచేస్తున్నారేమిటి అని బోల్డు ఆశ్చర్య పోయి జమిలిగా మైకిచ్చా ‘’మాకు ఇవి ఒంటికి పడవు .అయినా జనాల సెంటి మెంట్ ను గౌరవి౦ చాలికనుక ఈ సారి పుష్కరానికి రష్యాలోని ఒల్గానదిని చైనాలోని యాంగ్ చికియాంగ్ నదినీ కృష్ణానదిలో సంగమించేట్లు చేసి ఘన౦ గా రెడ్   బాడ్జీలతో పుష్కర శోభ తెస్తాం .’’’’మీకు అధికారం లోకి వచ్చే ఆశ ఉందా స్వామీ ‘’అన్నాను మైక్ కట్ చేసి ‘’అధికారమా మశానమా !ఉన్న అస్తిత్వమే పోతుంటే .మోడీ దెబ్బకు మా పేట్రన్ దేశాలే కుదేలైపోతే ‘’అన్నారు ఇద్దరు .

ఇంకా ఎవరు మిగిలారబ్బా అనుకొంటుండగా మజ్లిస్ నాయకుడు ఎదురయ్యాడు .’’వచ్చే పుష్కరాలకు మీ లక్ష్యం ఏమిటి ?’’అడిగా ‘’అరె భాయ్ !మా మతపోళ్ళు కొందరు పుష్కర స్నానం చేస్తుండగా ఫోటోలు వీడియోలు తీసి పెద్ద పబ్లిసిటి ఇచ్చారు ..అయినా మా వాళ్లకు పూర్తీ స్వాతంత్రం ఉంది అన్నిట్లో  మేం కాదనం .వచ్చే పుష్కరాలకు ‘’కాబా ,మక్కాలనుండి పవిత్ర జలాలు తెప్పించి పుష్కర జలాల్లో కలిపి శుద్ది చేస్తాం .ఇదే మా యాక్షన్ ప్లాన్ ‘’అన్నాడు .ఇంతలో గులాబీ చొక్కా ఆయన ఎదురయ్యాడు .మామూలు ప్రశ్నే అడిగా ‘’ఏందివయ్యా మీ బాబు అన్ని కోట్లు ఖర్చు చేసి అన్ని సౌకర్యాలు కలిగించి మా దిమా కరాబు చేసి౦డాడు  .మా నాయకుడు సిందుకే స్వాగతం పలక్క ,ఎవరినోపంపి చేతులు దులుపుకొంటే ,మీ బాబు ఆమెనూ గురువునూ ప్రత్యెక విమానం లో బెజవాడ రప్పించి కేంద్రమంత్రులు, స్వామీజీ ,కృష్ణా పుష్కర సమక్షం జనం ముందు ఘనం గా సన్మానించి నజరానా లు  అందించాడు మీ డబ్బులన్నీ దొబ్బెసిన మేమే ఇంతఘనంగా చేయలేకపోతే ,రోజూ అప్పుచేసిపప్పుకూడు తినే మీరింది వయ్యా ఇంతగొప్పగా చేసిండ్రు . .భేష్ వయ్యా .ఈ సారి పుష్కరాలకు మేము కృష్ణానది అంతా గులాబీ రంగుతో పారించి ,కృష్ణకు గులాబీరంగు అద్ది మా భక్తీ ప్రకటిస్తాం ‘’అన్నాడు .’’ .’’ఓరి నాయనో 1 ఇదేం ప్రాదేశిక భక్తీ అని అవాక్కయ్యాను .

ఇంకెవరినైనా ఇంటర్వ్యు చేద్దామంటే గత 12 రోజులకంటే ఎండ మండి మాడ్చేస్తోంది .పుష్కరం కిక్ లో ఆ ఎండలని భరించి స్నాన దాన ప్రదానాలు చేసి దైవ దర్శనంతో పులకించి తరించిన కోట్లాది పుష్కర భక్తులకు శుభా కాంక్షలు పలుకుతూ ఓవర్ టు తొక్కా చానెల్ .ఇది మీ తిక్కకు సరైన లెక్క .అనుభవించండి ‘’

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-24-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుష్క(ల )ర హాస్యం –2

11-కృష్ణా పుష్కర శోభను ఆకాశం నుంచి చూస్తున్న లక్ష్మీ పార్వతీ సరస్వతీ  పరవశించి అబ్బురపడి తన్మయం తో ఆనందిస్తూ ఉన్నా సహజమైన ఆడలక్షణం పోక ఒకరినొకరు సూటి పోటీ మాటలు రువ్వుకొంటున్నారు .ముందుగా పార్వతి ‘’అమ్మా లక్ష్మీ !మీ ఆయన పాదాల నుంచే నీళ్ళు కారాయని మేము బాధపడుతుంటే ఇప్పుడు ఏకంగా ఒళ్లంతా నీళ్ళు కారుతూ కృష్ణగా నల్లగా కనిపిస్తూ,చీమలు పిట్టలు కాకులతో సహ్యాద్రి పై ఉన్న అశ్వత్ధ వృక్షం నుంచి కారుతున్నాడు .నాకైతే కంపర మేస్తోంది బాబూ ‘’అంది .

లక్ష్మి తక్కువదా’’గురివింద గింజ సామెత రుజువు చేశావుకాని ఇక చాలు ఆపవమ్మా !మా అయన పుట్టిన చోటే తగుదునమ్మా అని మీ ఆయనా పచ్చి ఉసిరికాయల చెట్టు లోంచి కిందకు దూకి ,వేణి గా  మా ఆయనలో కలవలేదా “”అని అంటించింది  .

తానూ ఏదో ఒకటి మాట్లాడాలికనుక సరస్వతి ‘’ఏమోనమ్మా !ఎక్కడా లేని విడ్డూరం మీ ఆయనల్లో ఉంది .అయినా మగా మగా ఈ సంపర్కమేమిటి అసహ్యంగా .స్వజాతి సంపర్కంలా .పోనీ నదులే కదా ఆని సరి పెట్టు కొంటె , అంతటితో ఆగారా ?ఇద్దరూ  పరస్పర  వ్యామోహం తో కిందామీదా పడి అయ్యప్పనే కన్న మహానుభావులు .చెప్పు కొంటె సిగ్గేస్తోంది ‘’అంది నిష్టూరంగా .

అప్పుడు లక్ష్మీ పార్వతులు ‘’అమ్మా !ఇలా సూటీ పోటీ మాటలు అంటావనే  మీ ఆయనకు మా ఆయనలు గుడులే నిషేధించారు .ఒక్క గుడిలో అయినా మాకున్నట్లు మీ ఇద్దరి విగ్రహాలు ఉన్నాయా?చాలు చాల్లేవమ్మా ‘’అన్నారు .అవాక్కైంది సరస్వతి

అదే సమయం లో త్రిమూర్తులూ పుష్కర వైభవాలను చూసి ముచ్చటపడుతుండగా పై మాటలు వాళ్ళ చెవుల బడ్డాయి’’చూశారా ! లోకపూజలు అందుకొంటున్నా ,మన ఆడవాళ్ళకు ఆడ బుద్ధి పోలేదు ‘’బ్రహ్మవి మూడు విష్ణువుదొకటి ,శివుడివి అయిదు  మొత్తం   9  మొహాలతో ఆకాశమ౦ తా వినబడేలా పగలబడి నవ్వారు .

12-‘’ఒరేయ్ ! మా అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది కృష్ణ వేణి పేరు పెట్టారు .’’అన్నాడు ఇంకోడితో .ఇంకోడు ‘’మా అబ్బాయికి మగపిల్లాడు పుట్టాడు ‘’పుష్కర్ ‘’అని నామకరణం చేశాం ‘’అన్నాడు .ప్రక్కనే ఉన్న ఒక యాభై ఏళ్ళ పెద్దాయన ‘’మరి మొన్ననే నాకు 12 వ సంతానం కలిగింది .ఏం పేరు పెట్టాలో తెలీక బుర్ర గోక్కు౦టు న్నాను  ‘’ .వీళ్ళిద్దరూ ‘’పిండం ‘’అనిపెట్టు అన్నారు .ఆయన గుడ్లురిమి చూశాడు ‘’అదేనండి పిండజ’’అని పెట్టండి. అరిరే పీరు.బాగా కిక్  అవుతుందని వెళ్ళిపోయారు . ఉంటే కోడతాడేమో ననే భయం తో .

13-‘’గురూ ! బాబు పుష్కరాలకు మోడీని పిలిచాడా ?’’

‘’ఇది ఎవరింట్లో పెళ్లి .ఆయనే రావాలికాని  ఆహ్వానాలు కావాలా ?’’

‘’ఒక వేళ వచ్చి ఉంటే ఏమిచ్చే వాడు ?

‘’పూర్తిగా కృష్ణ నీటిలో మునిగి అడుగున దొరికిన ఇసక మట్టి నువ్వులు దర్భలు తీసి బాబు చేతిలో పెట్టి    ‘’కృష్ణార్పణం ‘’అనేవాడేమో !

14-‘’శాస్త్రీ !ఇదివరకు పుష్కరాలకు ముందు హేతువాదులు నాస్తికులు ఇదంతా ‘’మనువాదుల ‘’అకృత్యం అని ,ఇందులో సైంటిఫిక్ రీజన్ ‘’లేదని వాదించి పుంఖాను పుంఖాలుగా కరపత్రాలు పంచి పెట్టేవారు .ఇప్పుడు వాళ్ళ జాడే కనిపించట్లేదే ?’’

శాస్త్రి ‘’నిజమే శర్మా !పాపం వాళ్ళ మాట వినే నాధుడే లేడిప్పుడు .విశ్వాసానికి మించిన సైన్స్ లేదని ఆనాటి నుంచి ఈనాటి దాకా మనవాళ్ళందరూ ఘోషిస్తూనే ఉన్నారు .

మూర్తి ‘’అయ్యా శాస్త్రిగారు శర్మగారు ! ఊరవతల ఒక చోట టెంట్ వేసి ఎవరికీ తెలీకుండా పుష్కరాలు లాగిస్తున్నారని కర్ణాకర్నీగా  వినికిడి .ఇది నేను చెప్పానని నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్ ‘’అనగా అందరూ నవ్వుకొన్నారు .

15-‘’పంతులుగారూ !మానాన్నకు ఇద్దరు భార్యలు .మా అమ్మకు ఇద్దరు భర్తలు .నేను ఎవరెవరికి తర్పణాలు వదలాలో తెలియటం లేదు ‘’అన్నాడు

‘మరి నీ సంగతి ?’’పంతులుగారి ప్రశ్న .

‘’ముగ్గురు పెళ్ళాలు .నా చివరిపెళ్ళానికి అయిదుగురు భర్తలు ‘’అన్నాడు

‘’అందరూ కట్టకట్టుకొని కృష్ణలో పడి మునగండి చాలు ‘’విసుక్కొంటూ పంతులుగారు లేచిపోయాడు .

16-అందరూ ఆకాశం వైపు కన్నార్ప కుండా చూస్తున్నారు .ఏమిటి విశేషం అని తెలుసుకోవటానికి వెళ్లి అడిగాను

‘’బాబూ ! ఇప్పుడే పోలీసులు వాన్ లలో 80 మంది అంధులను అతి మర్యాదగా కార్లలో ఎక్కించుకొని వచ్చి ,ప్రతి ఒక్కరికీ దగ్గరుండి పుష్కర స్నానం చేయించి ,టిఫిన్ కాఫీ భోజనాలు సంతృప్తిగా పెట్టి గొప్ప సేవా ధర్మం చూపారు .ఇప్పుడే మధ్యాహ్నం అయిందిగా అదుగో ఆకాశం లో సకల దేవ రుషి గణాలు ,పుష్కర, కృష్ణవేణి తల్లి వారందరినీ మనసారా ఆశీర్వ దిస్తున్నారు .ఇంతకంటే పుష్కర మహాత్మ్యం ఏముంటుంది ‘’అని అందరూ ఆకాశం వైపుకు నమస్కరిస్తూ ఆనందం ప్రకటించారు .

17-‘’ఇంతటి సేవా భావం తెలంగాణలో కనపడలేదేం?’’ఒకాయన సూటి ప్రశ్న

‘’దండుకోనేవాడు ,పిండు కొనేవాడు ఒకడైతే ,దయా దాక్షిణ్యాలు మానవతా ప్రదర్శించేవాడు ఇంకోడు నాయనా .అందుకే అంత తేడా ‘’అన్నాడు పక్కవాడు

18-‘’గురూ !పుష్కరాలకు ఇంత ఖర్చు చేయాలా ? రోజూ హారతులివ్వాలా ,రోజూ బాబు ప్రత్యక్షంగా చూడాలా .నాకు మాత్రం చాలా సిల్లీ గా ఉంది ‘’అన్నాడొక సిల్లీ ఫెలో.

‘’శిష్యా ! పన్నెండు ఏళ్ళకోసారి వచ్చే అరుదైన అవకాశం .మనం తిన్నా తినక పోయినా అతిధి మర్యాదలను కాపాడాలి .పుష్కర స్నానం చేస్తేనో పిండ ప్రదానాలు చేస్తేనో మోక్షం వచ్చేదానికన్నా  ఇన్ని లక్షలమంది కి మర్యాద పూర్వక ఆతిధ్యమిచ్చి వాళ్లకు యే అసౌకర్యం కలగకుండా కంటి పాపల్లాగా కాపాడి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే వచ్చే పరమ సంతృప్తి ఇంకేది చేసినా రాదు .ఆ సంతృప్తీ ,ఆనందమే బాబు కళ్ళల్లో ముఖం లో ప్రస్పుటంగా కనిపిస్తోంది .మన ఇంట్లో కార్యక్రమం జరుగుతుంటే యజమాని ఎక్కడో కూచుంటే దానికి శోభ రాదు .అందరితో మమైకం అవ్వాలి అప్పుడొచ్చే సంతృప్తి ఇంకెప్పుడూ రాదు .దానికోసమే బాబు పడే శ్రమ .స్వార్ధం లేనప్పుడే ఇంతటి పరమానందం కలుగుతుంది ‘’అన్నాడు గురూజీ .

19-‘’శాస్త్రిగారూ! పుష్కరాలలో ఏదైనా ఇష్టమైంది వదలాలా “”?భార్యా భర్త ప్రశ్న

‘’వదిల్తే మంచిది నాయనా ‘”

‘’అయితే ఇష్టం తో కాదుకాని కష్టం తో మా ఆవిడను వదిలేస్తా ‘’అన్నాడు  భార్యా బాధితుడు

‘’కానిస్టేబుల్ !అని అరిచి ‘’మా ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు చూడండి ‘’అంది

‘’నాయనోయ్ ! కాశీకి వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు ‘’నిన్ను నేనెక్కడ వదల గలను బాబోయ్ ‘’అన్నాడు

20-సిపి ఐ నారాయణ ,సిపిఎం రాఘవులు పుష్కర ఘాట్లు చూసుకొంటూ వస్తూ ‘’జనం వెర్రికి హద్దులేదు .నది దేనికో ప్రతినిధి అట  మూఢ విశ్వాసం పెరుగుతో౦ది కాని తగ్గట్లేదు ‘’అనుకొంటున్నారు .ప్రక్కనే ఉన్నాయన ‘’అయ్యా మీగుర్తులు సుత్తీ కొడవలి మీ జెండాలు మీ విశ్వాసాలకు ప్రతినిదులుకావా ?’’అన్నాడు .కనిపించకుండా ఆ ఇద్దరూ పరార్ .

కృష్ణా పుష్కరం చివరి రోజు శుభా కాంక్షలతో

Inline image 1Inline image 2Inline image 3

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-23-8-16- కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -99

నా దారి తీరు -99

బదిలీ ప్రయత్నం వగైరా

స్కూలు  రోడ్డు ప్రక్కనే ఉంది .మైలవరం నుంచి తిరువూరు ,భద్రాచలం మొదలైన చోట్లకు చిలుకూరి వారి గూడెం మీదనుంచే పోవాలి .ఎక్స్ ప్రెస్ బస్సులు ఇక్కడ ఆగవు .కనుక మైలవరం లో దిగి సాధారణ బస్  కాని లారీ కాని ఎక్కి ఈ ఊరు రావాలి .స్కూల్  టైం కు చేరుకోవాలంటే ఉయ్యూరు లో కనీసం 5 గంటలకేబయల్దేరాలి .బెజవాడ చేరి అందుబాటులో ఉన్న బస్సెక్కి రావాలి .అప్పటికే ఇంటి దగ్గర టిఫిన్  చేసి కాఫీ కలిపి అయ్యగారికి రెడీ చేసేది మా శ్రీమతి .అన్నం వండి ,ఒకటో రెండో కూరలు ,పప్పు సిద్ధం చేసి కారియర్ సిద్ధం చేసేది  .ఇవన్నీ తీసుకొని దొరగారు బయల్దేరాలి .మధ్యలో ఎక్కడైనా బస్ మిస్ అయినా టెన్షన్ టెన్షన్ .మైలవరం బస్ స్టాండ్ లో టిఫిన్ బాగానే ఉండేది .అవసరమైతే తినేవాడిని .సమయానికి ఎలాగో అలా తంటాలు పడి స్కూల్ కు చేరేవాడిని .బట్టలు మాసిపోయేవి .ఒక్కోసారి ప్రయాణం అంటే భయమేసేది .అట్లాగే సాయంత్రం స్కూల్ వదిలాక ఇంటికి బయల్దేరటమూ బ్రహ్మ ప్రళయ మైపోయేది .బస్సులు సమయానికి రాక వచ్చినా ఖాలీలేక ఆటోలోనో లారీలోనో వెళ్లాల్సివచ్చేది మైలవరం నుండి సూపర్ ఫాస్ట్ లేక ఎక్స్ ప్రెస్ బసు ఎక్కి ఇబ్రహీం పట్నం నుంచి బెజవాడ చేరి మళ్ళీ ఆర్డినరి బస్ ఎక్కిఊరు చేరేవాడిని .ప్రయాణం నరకమయ్యేది మైలవరంనుండి మిల్క్ ప్రాజెక్ట్ మీదుగా బెజవాడ బస్ దొరికితే ఎక్కేవాడిని .ఏమైనా సోమవారం శనివారం ప్రయాణాలకు అటు నుంచి ఇటు ,ఇటు నుంచి అటు చాలా కష్టమై పోయేది .స్కూల్ బాగుంది పిల్లలు మేస్టార్లు మంచివాళ్ళు కమిటీ సహకారం బాగా ఉంది  స్కూల్ చుట్టుపక్కల  వాతావరణమూ బాగుంది .నన్ను ఇక్కడే ఉండిపోమ్మనే వారూ బాగా ఉన్నారు నాకూ చాలా ఇష్టమైన స్కూల్ ఇప్పటిదాకా చేసినవాటిలో .కాని ప్రయాణ బాధ భరించ లేక పోయేవాడిని .అలాంటి సమయం లో మాతమ్ముడు మోహన్ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చి నా బదిలీ ప్రయత్నాలకు ఊపు వచ్చింది .ఆ విషయాలు చెప్పేముందు మరికొన్ని విషయాలు చెప్పాలి .

,మామిడి కాయలు

స్కూల్ రోడ్డుకు దగ్గర గా ఉండటం ,రోడ్డుకిరువైపులా మామిడి చెట్లు ఉండటం ఈ స్కూల్ కు నాకు వరం అయింది .ఉయ్యూరు వెళ్ళేటప్పుడల్లా అటెండర్ దాస్ కు చెబితే మామిడికాయలు కోసి రెడీ చేసేవాడు .తీసుకు వెళ్ళేవాడిని. పుల్లూరులో ,మెరుసుమిల్లి గ్రామాలలో వెన్న పూసా బాగా మంచిది దొరికేది. లెక్కల మేస్టారికి చెప్పి డబ్బులిచ్చి కొని పించి తీసుకు వెళ్ళేవాడిని .కృష్ణ దాసు దాసుగారి అమ్మాయిసీత తో పాటు ,మరొక పొట్టి అమ్మాయి ఇంకొక మెరుసుమిల్లి తొమ్మిది చదివే అమ్మాయిప్రభావతి అనిజ్ఞాపకం –తెల్ల చొక్కా ఆకుపచ్చ పరికిణీ మీద వేసేది .మగ పిల్ల అని పించేది  .వీళ్ళే కాక  మగపిల్లలూ ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారు .ఎక్కడో బయట వంద కిలో మీటర్ల దూరం లో ఉన్నాను అనే ఫీలింగ్ వీరందరి వల్లా ఉండేదికాదు.  స్కూల్ అన్నివిధాలా అభి వృద్ధి చేశాం .అదొక ‘’తుత్తి’’.

స్కూల్ బోర్డ్ లు

స్కూల్ కు డిస్ ప్లే బోర్డ్ లు ఉండాలి అవేవీ లేవు ఇన్స్పెక్షన్ కు ముందే వివరాలన్నీ సేకరించి ముందుగా ‘’గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ‘’బోర్డ్ తయారు చేయించాను. అంటే స్కూల్ పుట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు యేయే హెడ్ మాస్టర్లు ఎంత కాలం పని చేశారో వివరాలు అన్నమాట .తర్వాత  టెంత్ క్లాస్ రిజల్ట్  బోర్డ్  .యే సంవత్సరం యెంత రిజల్ట్ వచ్చింది ,స్కూల్ ఫస్ట్ ఎవరు వివరాలన్నమాట .తర్వాత 7 వ తరగతి జిల్లా కామన్ పరీక్షలలో ఉత్తీర్ణతా శాతం స్కూల్ ఫస్ట్ విద్యార్ధి వివరాలు .ఆ తర్వాత స్టాఫ్ పర్టిక్యులర్స్ .హెడ్ మాస్టర్ తో ప్రారంభించి సీనియారిటీ ప్రకారంబి ఎడ్ అసిస్టంట్ట్లు సెకండరి గేరేడ్ లు , ,తెలుగు హిందీ డ్రిల్ డ్రాయింగ్ అటెండర్ నైట్ వాచ్మన్ తో సహా వివరాల బోర్డ్ కూడా తయారు చేయించాను. ఇవి రాయటానికి పెయింటింగ్ చేయటానికి డ్రాయింగ్ మాస్టారు లేదు  కనుక ప్రైవేట్ ఆర్టిస్ట్ తో డబ్బు లిచ్చికామన్ గుడ్ ఫండ్ నుంచి ఖర్చు చేసి  రాయించాను .వీటితో స్కూల్ కు సమగ్రతః ఏర్పడింది అందమూ వచ్చింది .ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయికనుకనే ఇన్స్పెక్షన్ లో మంచి రిమార్క్ లు పొందగాలిగాం .గార్డెన్ వర్క్ చా లా ప్రోత్సాహకంగా ఉండేది. కూరగాయల వలన రాబడీ వచ్చేది .కనుక ఎందుకు ఈ ఊరు వదలాలి అని మనసు పీకేది .నేను వెళ్ళటం ఎవరూ హర్షించే విషయమూ కాదు కూడా .

స్కూల్ కు గుమాస్తా లేదు అన్నీ ఆచారిగారే చెయ్యాలి పే బిల్స్ జీతాలబట్వాడ నామినల్ రోల్స్ తయారీ పరీక్షల ఏర్పాట్లు అన్నీ ఆయనే చేసేవారు .బెజవాడ నుండి ఉమాశంకర్ అనే ఆయన వస్తాడని బాగా ప్రచారం జరిగింది .కాని రాలేదు ఆయన బాగా పలుకుబదిఉన్న తోట్ల వల్లూరు బ్రాహ్మిన్ .కనుక రాలేదు .మైలవరం పంచాయితీ రాజ్ లో లో జూనియర్ గుమాస్తా ప్రసాద్ అనే కుర్రాడిని వేశారు .తండ్రి టీచర్ చనిపోతే కొడుక్కి ఉద్యోగం ఇచ్చారు .బాగానే పని చేసేవాడు .కనుక గుమాస్తా బాధా తీరింది .

ఇక్కడ ఉండగానే  రెండవ మేనల్లుడు అంటే చిన్నక్కయ్య బావలకుమారుడు ఛి .మృత్యుంజయ శాస్త్రి ,ఛి సౌ విజయలక్ష్మి ల వివాహం హైదరాబాద్ లో జరిగితే వెళ్లాను .తిరిగి వచ్చేటప్పుడు అ౦చ లంచేలు మీద రావటం తో పాంట్ షర్ట్ రైలు ఇంజన్ లో బొగ్గు వేసేవాడి బట్టల్లా నల్లగా మారిపోయాయి .స్కూల్ దగ్గర గప్ చిప్ గా దిగి  స్నానం చేసి బట్టలు మార్చుకొన్నాను. ఇదొక తమాషా అనుభవం నాకు

శ్రీ వి .హనుమంత రావు గారి రికమండేషన్ లెటర్ – మేడూరు కు ట్రాన్స్ ఫర్

హైదరాబద్ బి. డి .ఎల్ .లో పని చేసే మా తమ్ముడు మోహన్ ఒక సారి ఉత్తరం రాస్తూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన శ్రీ వి .హనుమంత రావు గారి బామ్మర్ది తన దగ్గర పని చేస్తున్నాడని రోజూ ‘’సార్ !మీరు నాకు ఉద్యోగం ఇచ్చి చాలాహేల్ప్ చేశారు .మాబావగారి ద్వారా ఏదైనా పనికావాలంటే ఇట్టేచేయించి పెడతాను ‘’అనే వాడట ఈవిషయంనాకు రాసి ఉయ్యూరు చుట్టూ పక్కలకు చేరాలంటే ఇదే మంచి అవకాశం అన్నాడు. సరే ప్రయత్నం చేయమన్నాను .బామ్మర్ది బావకు ఏం చెప్పాడో తెలియదు కాని పది రోజుల్లో శ్రీ హనుమంతరాగారు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు గారికి నన్ను ఉయ్యూరు లేక దానికి అతి దగ్గరలో ఉన్న స్కూల్ కు ట్రాన్స్ ఫర్ చేయమని రికమండేషన్ లెటర్ రాసి ఇచ్చారు .దాన్ని బామ్మర్ది మా వాడికిస్తే వాడు నాకు పోస్ట్ లో వెంటనే పంపేశాడు .ఈవిషయం ఎవరికీ చెప్పలేదు చాలా  రహస్యంగా నే ఉంచాను . మా ఆవిడకూ చెప్పలేదు .ఒక శని వారం ఉయ్యూరు వెళ్లి ఆ సీల్డ్ రికమెండేషన్ లెటర్ ను చైర్మన్  శ్రీ కోటేశ్వర రావు గారిని జిల్లా పరిషత్ ఆఫీస్ లోకలిసి అందజేశాను .అయన ఆశ్చర్యంగా ఒక సారి తలపైకెత్తి నా వైపు చూసి నవ్వుతూ కాంప్ క్లెర్క్ కిచ్చి అర్జెంట్ గా ఈపని పూర్తిచేయమని చెప్పారు .నేను తర్వాత చిలుకూరివారి గూడెం వచ్చి నా పనులు నేను చేసుకు పోతూనే ఉన్నాను. లెక్కల మేస్టారికి శేషగిరి రావు గారికి కూడా రహస్యం చెప్పలేదు .ఒక రోజు టపాలో నా ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది నన్ను మేడూరుకు ట్రాన్స్ ఫర్ చేసి ఇక్కడ నా పోస్ట్ లో మైలవరం నేటివ్ నాలాగానే సైన్స్ మేస్టర్, నాకు రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజి లో సహాధ్యాయి నల్లగా ఎత్తుగా తెల్ల బట్టలతో ఉండే రామా రావు ను వేశారు .నేను ఇక్కడికోచ్చినప్పుడుకూడా నా ట్రెయినింగ్ మేట్ జి .హెచ్. హనుమంతరావు ను ఇక్కడినుండి కాజ కు ట్రాన్స్ ఫర్ చేసి, నన్ను చిలుకూరివారి గూడెం హెడ్ మాస్టారుగా వేశారు .నేను రిలీవ్ చేసినవాడు నన్ను రిలీవ్ చేసిన వాడూ నా సహాధ్యాయు లవటం తమాషా గా ఉంది .స్టాఫ్ అంతా షాక్ తిన్నారు .చెప్పకుండా ఎందుకు చేశారీపని అని కమిటీ ప్రెసిడెంట్ రెడ్డిగారు వచ్చి గోల చేశారు .శేషగిరిరావు గారిముఖాన నెత్తుటి బొట్టు లేదు. దిగాలు పడిపోయారు ..ఏదో అందరికి సర్ది చెప్పాను .మంచి టీపార్ర్టీ సెండాఫ్  పార్టీ ఇచ్చారు .ఒక ఆల్ఫా సూట్  కేస్ ను బహుమతిగా  అందజేశారు దాన్ని చాలా ఏళ్ళు వాడాను .పిల్లలందరూ బార హృదయం తో వీడ్కోలు చెప్పారు .ప్రయాణం భారం తప్పిందికదా అని నేను సంతోషించాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-22-8-16-ఉయ్యూరు

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

దిగ్విజయంగా ముగిసిన మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం

దిగ్విజయంగా ముగిసిన మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం

ఆగస్ట్ 19, 20, 21 (2016)  తేదీలలో  సాయంత్రం హైదరాబాద్ లో శ్రీ త్యాగరాజ గాన సభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం విజయవంతంగా జరిగింది. పలు రాష్ట్రాలు, నగరాల నుండి సుమారు 100 మంది మహిళా రచయితలూ, సాహితీవేత్తలూ ఈ మహా సభలలో పాల్గొని ప్రసంగించారు.

మొదటి రోజు (ఆగస్ట్ 19, 2016) సాయంత్రం 6 గంటలకి సుప్రసిద్ధ రచయిత్రి డి. కామేశ్వరి గారి జ్యోతి ప్రజ్వలన, లక్ష్మీ పద్మజ ప్రార్థనా గీతంతో కేవలం మహిళా రచయితలకి మాత్రమే అయిన ఈ ప్రత్యేక సాహిత్య వేదికకి డా. ముక్తేవి భారతి అధ్యక్షత వహించగా డా. ముదిగంటి సుజాతా రెడ్డి గారు ముఖ్య అతిధిగానూ, శారదా అశోక వర్ధన్, పోల్కంపల్లి శాంతా దేవి, డా. అమృత లత (నిజామాబాద్), కొండవీటి సత్యవతి, కళా శారద విశిష్ట  అతిధులుగా వేదికని అలంకరించారు. డా. తెన్నేటి సుధా దేవి గారు స్వాగత వచనాలు పలికి సభా నిర్వహణకి నాందీ ప్రస్తావన చేయగా పలకగా సుప్రసిద్ద గాయని సుచిత్ర బాలాంత్రపు ఆహ్వానిత అతిథుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. వక్తలు ఈ నాటి సాహిత్య వాతావరణం, పుస్తక ప్రచురణలో రచయిత్రులకి ఉన్న ఇబ్బందులు,  సంఘటితం గానూ, వ్యక్తిపరంగానూ సాహిత్యాభివృద్ధికి చేయ వలసిన అంశాల మీద సముచితంగా ప్రసంగించారు. పొత్తూరి విజయ లక్ష్మి, నెల్లుట్ల రమా దేవి తమ హాస్య కథానికలని వినిపించి ఆహుతులని నవ్వులతో ముంచెత్తగా, తమిరిశ జానకి, శైలజా మిత్ర, ఐనంపూడి శ్రీ లక్ష్మి, సి. భవానీ దేవి, మండపాక మహేశ్వరి, తదితరులు స్వీయ రచనా పఠనం, పద్య పఠనం, తదితర సాహిత్య ప్రసంగాలతో సుమారు వంద మంది సాహిత్యాభిమానులని ఆకట్టుకున్నారు.

రెండవ రోజు ఆగస్ట్ 20, 2016 ఉదయం 10 గంటలకి జ్యోతి ప్రజ్వలన అనంతరం ముందుగా స్త్ర్రీల పాటల మీద స్నేహలతా మురళి గారి సోదాహరణ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తరువాత విరామం లేకుండా సుమారు నాలుగు గంటల పాటు 18 మంది రచయిత్రులు  అనేక అంశాలపై సాధికారంగా తమ ప్రసంగాలు వినిపించారు. తెనాలి రామకృష్ణుడు తీర్చిదిద్దిన  స్త్రీ పాత్రల మీద నందివాడ అనంత లక్ష్మి తాళ్ళపాక తిమ్మక్క మీద మంగళగిరి ప్రమీలా దేవి, భాగవతంలో మానవతా విలువల మీద వారిజా రాణి గారు, మొల్ల రామాయణం మీద సర్వ మంగళ గౌరి, ప్రాచీన సాహిత్యంలో సామాజిక బాధ్యతల మీద కస్తూరీ అలివేణి, శతక సాహిత్యం మీద కూలంకషంగా జరిగిన కోటంరాజు రమా దేవి గారి ప్రసంగం, నవలా సాహిత్యం మీద సమగ్ర సమీక్ష చేసిన ఇంద్రగంటి జానకీ బాల ప్రసంగం, ఆధునిక సాహిత్యంలో కవిత్వం మీద అత్యంత ఆసక్తికరంగా, సాధికారంగా ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణి అభిభాషణ, ఆధునిక సాహిత్యంలో కథానిక మీద కె. బి. లక్ష్మి సమగ్ర విశ్లేషణ, రాయసం లక్ష్మి, వి. త్రివేణి, వై. కామేశ్వరి, ప్రభల జానకి, కె. లలిత, సంధ్యా రాణి, బి.జ్యోతి, శ్రీ మణి గారి ప్రసంగాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

తరువాత జరిగినన స్వీయ రచనా విభాగంలో మున్నంగి కుసుమ, లంక సీత, మల్లాది పద్మజ, ములుగు లక్ష్మీ మైథిలి, శ్రీ వల్లీ రాధిక, వరలక్ష్మి, మీనీషా జోస్యుల, వారణాసి నాగ లక్ష్మి గారి ఆకట్టుకున్న కవిత, రాజీవ, శ్రీ లక్ష్మి, ఘంటసాల నిర్మల, మిరియాల లలిత గారి ప్రచార కవిత్వం, పోతన జ్యోతి, లక్కరాజు నిర్మల వైవిధ్యమైన కవితా పఠనం, లావణ్య, సీనియర్ రచయిత్రి వెంపటి హేమ మొదలైన వారు తమ రచనలు వినిపించారు.

ఆఖరి విభాగంలో ఆధునిక సాహిత్యంలో కథానిక మీద సాధికారంగా ప్రసంగించిన సీనియర్ రచయిత్రి పోలాప్రగడ రాజ్యలక్ష్మి, టీవీ చానెల్స్ -సమాజ ప్రభావం మీద తమ అనుభవాలని క్రోడీకరించి ప్రసంగించిన విజయ దుర్గ, టీవీ చానెల్స్ లో స్త్రీ పాత్రల చిత్రీకరణ, సీరియల్స్ ప్రభావం మీద ఆవేదనా భరితంగా ప్రసంగించిన ఉషా రాణి, గురజాడ శోభా పేరిందేవి, చలన చిత్రాలలో జానపద గేయాలపై ఆయా పాటలు పాడుతూ విశేషించిన సుప్రసిద్ద గాయని, వ్యాఖ్యాత సుచిత్ర ప్రసంగం సభికులని బాగా ఆకట్టుకున్నాయి. ఆఖరి అంశంగా కేతవరపు రాజ్యశ్రీ ఆదునిక కవితా రీతుల పై సమగ్ర ప్రసంగం చేశారు.

ఉదయం 10 గంటల నుండి సాయత్రం 6 దాకా నిర్విరామంగా సాగిన ఈ రెండవ రోజు కార్యక్రమంలో సుమారు 50 మంది మహిళా రచయితలు ఉత్సాహంగా పాల్గొన్నారు.  సుప్రసిద్ధ సాహితీ వేత్త ఆచార్య ఆవుల మంజులత గారు సభకి విచ్చేసి తమ సందేశాన్ని వినిపించి ఈ నాటి సాహిత్య సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.

ఆగస్ట్ 21, 2016 ఉదయం 10 గంటలకి జ్యోతి ప్రజ్వలన అనంతరం ముందుగా కన్నెగంటి అనసూయ, కుప్పిలి పద్మ, తెన్నేటి సుధా దేవి ల స్వీయ కథా పఠనంతో సభ ప్రారంభం అయింది. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో వి. శైలజ (సిద్ధ్దిపేట), వాణిశ్రీ, శ్రీ లక్ష్మి (గుడివాడ), కందేటి రాణి ప్రసాద్ (సిరిసిల్లా),సుజనా దేవి (కరీం నగర్), మెర్సీ మార్గరెట్, గొడవర్తి సంధ్య తమ కవితలు వినిపించారు. తరువాత విభాగంలో పత్రికా నిర్వహణలో ఇబ్బందుల మీద కాశీనాధుని సువర్చలా దేవి, పత్రికా నిర్వహణ బాధ్యతలపై పొత్తూరి జయ లక్ష్మి సుదీర్ఘ ప్రసంగం, పత్రికా రంగంలో మహిళల పాత్ర మీద సూర్య కుమారి (ఖమ్మం), నిజ జీవితానికీ, టీవీ సీరియల్స్ లో స్త్రీ పాత్రలకీ తేడా పై చెంగల్వల కామేశ్వరి, బతుకమ్మ పాటల మీద తిరునగరి దేవకీ దేవి, తెలంగాణా పండుగల మీద ఆచార్య సూర్య ధనుంజయ్, మన పండుగలు, సంప్రదాయాల మీద తెన్నేటి హేమ నళిని, నాటక రంగం లో స్త్రీలు అనే అంశం మీద అత్తలూరి విజయ లక్ష్మి సాధికార ప్రసంగం, చలన చిత్రాలలో సెన్సార్ బోర్డ్ పాత్ర మీద సెన్సార్ బోర్డ్ సభ్యులు, నటీమణి, దివ్యాంగులకి ఆదర్శ మహిళ పద్మ ప్రియ ప్రసంగం, జానపద సాహిత్యంలో స్త్రీ అనే అంశం మీద రాజ మల్లమ్మ, వల్లూరి రేవతి స్వీయ కవితా గానం అందరినీ ఆకట్టుకున్నాయి.

ముగింపు సమావేశం లో డా. నందమూరి లక్ష్మీ పార్వతి ముఖ్య అతిథిగా మంచి సాహిత్య ప్రసంగం చేశారు. డా. కె.వి. కృష్ణ కుమారి, డా. మంథా భానుమతి విశిష్ట ప్రసంగాల అనంతరం మహిళా రచయితలకి పురస్కార ప్రదానం జరిగింది. ఈ ముగింపు సభలో వంగూరి చిట్టెన్ రాజు పాల్గొన్నారు.

దిగ్విజయంగా జరిగిన మూడవ జాతీయ మహిళా రచయిల సమ్మేళనం ఫోటోలు కొన్ని ఇందుతో జతపరుస్తున్నాను. మూడు రోజుల ఫోటోలు అన్నీ ఈ క్రింది లంకెలలో చూడవచ్చును.

 

August 19, 2016: Inagural Day photo.

https://onedrive.live.com/?authkey=%21AMwfHPgcKd0cX6I&v=photos&id=698227D5154D95E0%2110133&cid=698227D5154D95E0

August 20, 2016 : Photos

https://onedrive.live.com/?authkey=%21AEK_bYkztD59vmE&v=photos&id=698227D5154D95E0%2110228&cid=698227D5154D95E0

August 21, 2016: Photos

https://onedrive.live.com/?authkey=%21ACHVqqumLRZrDH8&v=photos&id=698227D5154D95E0%2110438&cid=698227D5154D95E0

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పుష్క(ల )ర హాస్యం

పుష్క(ల )ర హాస్యం

1-       అప్పుడే ఒకడిని కత్తితో కసక్కున చంపి ఒక రౌడీ ఒక ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ కాళ్ళపై పడి చేసిన తప్పు చెప్పి ‘’స్వామీ కృష్ణా పుష్కరం లో మునిగితే నా పాపం పోద్దా ?’’అని అడిగాడు .

వెంటనే స్వామి ‘’’’నువ్వు మునిగి పోతే’’ అంతా పోతుంది నాయనా ‘’అన్నాడు .

2-      కృష్ణకు హారతి ఇవ్వటానికి జనం లోంచి దూసుకెళ్లిన ఒకడు పక్కవాడితో ‘’ఇంత పెద్ద’’ గోదా- కృష్ణ ‘’కు ఈ హారతులు చాలవేమో గురూ ?’’అన్నాడు.

పక్కవాడు ‘’నువ్వైతే నీళ్ళపై పెట్రోల్ పోసి హారతిచ్చేవాడివా టింగిరి నాయాలా ‘’అని విసుక్కున్నాడు .

3-      ‘’మా నాన్నకు పాతిక వేలు పెట్టి పుష్కరం పెట్టాను తెలుసా ?’’అన్నాడొక బాజా రాయుడు పదేళ్ళ తర్వాత బెజవాడ పుష్కరం లో కలిసిన గుడివాడ ఫ్రెండ్ తో

‘’అలాగా ! నిన్న సాయంత్రమే గుడివాడలో మీ నాన్న తో మాట్లాడానే ! అప్పుడే పోవటం పుష్కరం పెట్టటం కూడా అయిందా ?ఆశ్చర్యంగా అడిగాడు గు. మి.

‘’ఒరే!పదేళ్ళ కిందట మానాన్నను మా ఆవిడ సరిగ్గా చూడటం  లేదని కోపం తో ఇల్లు వదిలి వెళ్లి పోయాడు .పోయాడనే అనుకొన్నాం .మా ఆవిడ’’ పుష్కరం పెట్టి మీ నాన్న పీడా విరగడ చేసుకో మంటే పాతిక వేలు క్షవరం చేసుకొని పెట్టాన్రా బాబూ .మా నాన్న బతికే ఉన్నాడన్నమాట .నేను బతికున్న సంగతి ఆయనకు మాత్రం చెప్పకురా ప్లీజ్ ‘’అన్నాడు బె .మి .

4-‘’ఒరే! చంద్రబాబు మరీ పిసినారి .వత్తులతో నక్షత్ర హారతిప్పిస్తున్నాడు ‘’అన్నాడు ఇంకో ఠికానా లేని వాడితో

రెండో వాడు ‘’అయితే ఏం చేయాల్రా ?’’అడిగాడు

మొ. వాడు ‘’రాకెట్ పంపించి నక్షత్రాలని తెంపుకొచ్చి హారతివ్వచ్చుగా ‘’అన్నాడు .

4-      బికినీతో ఆమె ,పోట్టినిక్కర్ తో వాడు పుష్కరానికొచ్చారు .ఆమె స్నేహితురాలు కనిపించి ‘’ఒసే సుశీ !మొన్నేకదే మీ పెళ్లి అయింది .అప్పుడే పుష్కరానికొచ్చారేం “”?అని అడిగింది

సుశి ‘’మీ అన్న టింగ రోడే.ఎక్కడికీ కదలడు .నేనే హనీ మూన్ కి  పుష్కరానికి లాక్కొచ్చా ‘’అంది.

5 –ఒక పల్లెటూరాయన సంచీనిండా సామానుతో పుష్కర స్నానానికి వచ్చి బ్రాహ్మడి దగ్గరకెళ్ళి ‘’పంతులు గారూ !ఇవాళ పండు ,కూర ,పుస్తకం దానం చేయమని పంచాంగం లో ఉంది ,పుచ్చుకోండి ‘’అన్నాడు

గిరాకీ  లేని ఆయన తలో కిలో కూరలు డజను పళ్ళు ఏదైనా భాగవత గ్రంధం లాంటిది దానం ఇస్తాడేమోనని ఆశతో ‘’సరే’’నన్నాడు .వాడు సంచీ అంతా కెలికి ‘’పంతులుగారు !రేట్లు మండిపోతున్నాయి .ఏదీ కొనేట్టు లేదు’’ అని పండు కు ప్రత్యామ్నాయంగా పావలా విబూది పండు ,కూరకు బదులుగా ఒక కొత్తిమిరకాడ ,పుస్తకానికి బదులు పావలా ఎక్కాల పుస్తకం చేతిలో పెట్టాడు .’’ఓరి నీ పిండం పిచికలకు పెట్టా ‘’అని మనసులో అనుకోని చెంబెడు నీళ్ళు వాటిమీద దిమ్మరించి  కృష్ణలో కలపమన్నాడు.

6         ఒకడు పుష్కరానికొచ్చి స్నానం చేయకుండా వాచీ చూసుకొంటూ కాలం గడుపుతున్నాడు .ఇది గమనించి ఒక పెద్దాయన ‘’ఏమిటి నాయనా దేనికోసం ఎదురు చూస్తున్నావ్ ‘’అని అడిగాడు

‘’ఏం లేదండీ !మధ్యాహ్నం పన్నెండున్నర ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాను ‘’అన్నాడు .’’ఏమిటి దాని ప్రత్యేకత ?అడిగాడు .’’తెలియదా మీకు  .ఆ సమయం లో ముక్కోటి దేవతలు పుష్కరుడు బృహస్పతి పుష్కర జలం లో ఉంటారు కదా అప్పుడు స్నానం చేస్తే కనిపిస్తారేమో నని’’ అన్నాడు ఆ అమాయక బ్రహ్మ ‘’స్నానం చేస్తే కనిపించరు .స్నానం చేస్తూ’’ పోతే ‘’వాళ్ళే కనిపిస్తారు ‘’అని చమత్కరించాడాయన .

7-‘’స్వామీ !పుష్కరాలలో వాగ్దానం చేసి నెరవేర్చక పోతే ఏటవుద్ది ?’’ఒక డౌటేశ్వర్.

‘’ఏమీకాదు .తెలంగాణా ప్రభుత్వం ఉచిత ఫలహారాలు భోజనాలు అని హోర్డింగ్ లతో హోరెత్తించి పిడికెడు మెతుకులు కూడా రాల్చలేదు .ఏమయింది ?నాయకుల వాగ్దాన వైఫల్యం ప్రమోషన్ కు దారి .పుష్కరుడు కూడా ఏమీ పీకలేడు ‘’అన్నాడు స్వామీజీ గడ్డం సాఫు చేసుకొంటూ .

8–‘’పాపం బాబు ఉచిత టిఫిన్ భోజనం ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తూ కంటికి నిద్రలేకుండా పర్య వేక్షిస్తున్నాడు కదా స్వామీ .కేంద్రం నుంచి ఏదైనా రాల్పిస్తాడా పుష్కరుడు ?’’

‘’ఏం రాల్పిస్తాడు నాయనా ! మట్టీ మశాన్నం తప్ప .ఏదో మెతుకులు విసిరినట్లు ఇవ్వాల్సినవాటినే వందో వంతు రాలుస్తుంటే .ఆయన మాత్రం ఏం చేస్తాడు ?కస్టపడేవాడికి ఫలితం లేటు .మాటలగారడీ వాడికి సద్యో ఫలితం ‘’అన్నాడు నిర్లిప్తంగా స్వామి.

9—‘’గురవా !ఇన్నికోట్లమంది పుష్కర స్నానం చేస్తే మనపాపాలన్నీ తొలగించి పుష్కరుడు ఈ పాపా౦మూట మోస్తాడా పాపం ‘’అన్నాడొక సామాన్యుడు .

‘’అందుకే గదరా సన్నాసీ –ఇవన్నీ వదిలించు కోవటానికి ఆయనకు 12 ఏళ్ళు పట్టేది . అప్పటిదాకా మన మొహం చూడడు.

10 –‘’పుష్కరాలకు పుష్కలం గా వస్తున్న అశేష జన సందోహాల భక్తీ శ్రద్ధలకు ,నమ్మక విశ్వాసాలకు  సంస్కృతీ పారంపర్యానికి ఘనంగా నమస్కరిస్తూ సరదాకోసం రాసిన దీన్ని’’ లైటర్ వీన్’’ గా తీసుకోమని ప్రార్ధిస్తున్నాను –

మీ– దుర్గా ప్రసాద్ –22-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నాదారి తీరు -98 చిలుకూరివారి గూడెం హైస్కూల్ లో చదువు ,ఇతర విషయాలు

నాదారి తీరు -98

–చిలుకూరివారి గూడెం హైస్కూల్ లో చదువు ,ఇతర విషయాలు

సాధారణం గా హెడ్ మాస్టర్ గా ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ పోయెట్రి వారానికి మూడో నాలుగు క్లాసులు ,ఒకటో రెండో మోరల్ క్లాసులు పదవతరగతికి తీసుకొనికాలక్షేపం చేస్తూ  అడ్మినిస్ట్రేషన్ భారం అంటూ తప్పించుకొంటారు .కాని నేనెప్పుడూ అలా చేయలేదు .ఇక్కడి కారణాలు చాలా ముఖ్యమైనవి .పదవ తరగతి లో సెకండరీ గ్రేడ్ మాస్టారరు శేషగిరి రావు గారబ్బాయి   మాంచి తెలివి తేటలున్నవాడు శ్రీనివాస్ ,అలాగే ఆడపిల్లల్లో బాగా చదివే బాలమ్మ అనే అమ్మాయి ఉన్నారు .వీళ్ళను దృష్టిలో పెట్టుకొని శేషగిరిరావుగారు నేను జాయిన్ అవగానే ‘’సార్ ! టెన్త్ క్లాస్ ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ మీరు తీసుకొంటేనే న్యాయం జరుగు తుంది ‘’అని దాదాపు వేడుకొన్నట్లుగా సూచించారు .నేను ప్రతివార౦ ఉయ్యూరు వెళ్ళాలి ఎలా అని ముందు కొంచెం సందేహించా .కాని సవాలుగా తీసుకొన్నా .ఈ రెండూ చాలా బరువైన సబ్జెక్ట్ లు ఎంత చెప్పినా ,ఎన్ని పీరియడ్ లు బోధించినా చాలనివి .కనుక వారానికి మాక్సిమం పీరియడ్లు రెండు సబ్జెక్ట్ లకునేనే తీసుకొని బోధించేవాడిని .మెరిట్ స్టూడెంట్ లు ఉంటేమరీ రెచ్చి పోవటం నాకున్న పెద్ద జబ్బులాంటి అలవాటు. వాళ్లకు ఒక్కమార్కు కూడా తగ్గరాదు అనే ఆరాటంనాది .ఇది బాగా ఫలించింది  ఏ మాస్టారు సెలవు పెట్టినా, టెన్త్ కు ఎక్స్ట్రా వర్క్ నాకే వేయమని చెప్పి వేయించుకొని స్లిప్ టెస్ట్ లకు వారం ముందు  క్వార్టర్లీ హాఫియర్లీ, పరీక్షలకు పది పది హీను రోజుల ముందే కోర్స్ పూర్తీ చేసి థరోగా రివిజన్ చేసి సబ్జెక్ట్ కరతలామలకం చేసేవాడిని .ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా అదే పధ్ధతి అలవాటైన పధ్ధతి .క్లాస్ లో పాఠం చెబితే దాదాపు ఇంటికి వెళ్లి చదవాల్సిన అవసరం లేకుండా చేసేవాడిని .మర్నాడు క్లాస్ కు వచ్చేటప్పటికి అంతా హృదయ గతం గా ఉండేది .నిన్నటి దానిపై ప్రశ్నలడిగి జవాబులు చెప్పించటం ముఖ్యమైన నిర్వచనాలు దాదాపు క్లాసు లో అందరితో అనిపించటం తో విద్యార్ధులలో మంచి హుషారు వచ్చి దూసుకు పోయేవారు .

ఇదికాక నేను తెల్లవారు జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సంధ్య ,పూజ ‘’చదువు’’కొని ఎనిమిదింటికల్లా సిద్ధంగా ఉండేవాడిని .ఒక వైపు స్టవ్ మీద వంట చేస్తూ టెన్త్ పిల్లలకు లెక్కలు కూడా చెప్పేవాడిని .మోడల్ లెక్కలు చేయించి బిట్ లతో సహా సిద్ధం చేసేవాడిని .అంటే మూడు ముఖ్యమైన సబ్జెక్ట్ లు చెప్పేవాడినన్నమాట. కమిటీ ప్రెసిడెంట్ వచ్చి అభినందించేవారు .ఒకసారి శాసన సభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారింటికి తీసుకొని వెళ్లి నా గురించి బాగా చెప్పేవారు .కాని నేను కాంగ్రెస్ అభిమాని కాదని తెలుగు దేశం వాడినని తెలుసుకొన్నారు .నేనేమీ ప్రచారం చేయలేదు మాటవస్తే అభిమానం చాటే వాడిని అంతే.రాత్రిళ్ళు హాస్టల్ విద్యార్ధులను చదివి౦చేవాడిని .హిందీతో సహా యే సబ్జెక్ట్ లో అనుమానం వచ్చినా తీర్చేవాడిని .అది వాళ్లకు ప్లస్ పాయింట్ అయింది .

టెన్త్ క్లాస్ పరీక్షలు మైలవరం లో రాయాలి ఈ స్కూలు పిల్లలు .గవర్నమెంట్ హై స్కూల్ కు నన్ను డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా వేశారు .చీఫ్ సూపరింతెండ్ నాకు పూర్వ పరిచయం ఉన్న బెజవాడ ఆయనే .ఇక్కడ కాపీలు బాగా జరుగుతాయని ప్రచారం బాగా ఉండేది .నేను చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడిని .ఎవ్వరి దగ్గరా స్లిప్ లు లేకుండా ముందే తనిఖీ చేయించి పరీక్ష హాల్ లోకి పంపేవాడిని .పాపం అందరికి ఇది కంటకంగా ఉండేది .ప్రక్కనే బస్ స్టాండ్ .లోపలి రావటానికి కాపీలు అందజేయటానికి అవకాశాలు ఎక్కువ .అన్నీ జరాగకుండా చేయగలిగాను .ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారమ్మాయి పరీక్ష రాస్తోందని కొంచెం చూసీ చూడనట్లు పొతే మంచిదని చీఫ్ నాకు చెప్పారు .నా నిఘా మరీ పెంచాను ఆయన నిరుత్తరుడైనాడు .ఆ అమ్మాయి ఏమీ రాయలేక పోయింది. పరీక్షలో తప్పినట్లు తర్వాత తెలిసింది .మా స్కూల్ పిల్లలు గర్ల్స్ స్కూల్ లో పరీక్షలు రాసిన గుర్తు .టెన్త్ రిజల్ట్స్ మాకు బాగా ప్రోత్స్సహకంగా ఉన్నాయి ఎంతో ఇప్పుడు జ్ఞాపకం లేదు శేషగిరి రావు గారబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చాడు .అయిదు వందల టోటల్ దాటినట్లు జ్ఞాపకం ఇంగ్లీష్ సైన్స్ లలో 80 లకు పైగా మార్కు లోచ్చాయి .బ్రైట్ స్టూడెంట్ కు తగ్గ మార్కులవి .నాకంటే అతడి కృషి గొప్పది .శేషగిరిరావు గారు వారింట్లో గొప్ప విందు స్టాఫ్ కు ఇచ్చారు .

విశాలాంధ్ర తాత మనవడు

ఉయ్యూరులో మాచిన్నప్పుడు ఒక చిన్న  కొట్లో చెప్పులూ బూట్లు అమ్మకం చేస్తూ వీర కమ్యూనిస్ట్ అయిన తాత ఒకాయన ఉండేవాడు. ఆయన విశాలాంధ్ర పత్రిక ఏజెంట్ .ఇంటింటికీసైకిల్ మీద  వెళ్లి పత్రిక  వేసేవాడు .ఆయన సైకిల్ ఎక్కటం బలే తమాషాగా ఉండేది .సైకిల్ ను కోతదూరం తోసుకొంటూ వెళ్లి ఎక్కేవాడు .ముతక పంచ మోకాళ్ళు దాటి కట్టు తో కోటేరు ముక్కుతో కొంచెం పొట్టిగా ఉండేవాడు .ఆయన్ను అందరూ ‘’విశాలాంధ్ర తాత ‘’అనేవారు .చాలా నిక్కచ్చైన మనిషి .ఆయన చెయ్యి కొంచెం వంకర పోయి కలిపించేది .కమ్యూనిస్ట్ ఉద్యమం లో ఆయన పాల్గొన్నందుకు పోలీసులు కొట్టిన దెబ్బలకు చెయ్యి వంకర పోయి౦ద ని ఆయనే నాకొక సారి చెప్పాడు .ఫోటోలకు ఫ్రేం లు కూడా కట్టేవాడు .చాలా పొందిక గా మర్యాదగా ఉండేవాడు .’’ఏమే మనవడా 1’’అంటూ అందర్నీ పలక రించేవాడు  .ఈ తాత తర్వాత ఏమయ్యాడో తెలియదుకాని చిలుకూరివారి గూడెం లో స్కూల్ కు ఎదురుగా హాస్టల్ కు దగ్గరలో ఒక ప్రభుత్వ హోమియో క్లినిక్ ఉండేది .ఒక సారి ఆ డాక్టర్ గారిని లేక్కలమేస్తారు పరిచయం చేశారు .మాటల సందర్భం లో ఆ యువ డాక్టర్ తాను  విశాలాంధ్ర తాత మనవడినని, తాత చనిపోయి చాలాకాలమై౦దని చెప్పాడు .ఎంత కాలానికి ఎక్కడ ఎలా ఎవరు పరిచయమౌతారో తెలియదు .

గబ్బిట మేష్టారు

చిలుకూరు వారి గూడెం లో చాలాకాలం ఎలిమెంటరీ సెక్షన్ లో పని చేసి అప్పుడు మద్దుల పర్వ స్కూల్ లో సోషల్ మాస్టారుగా పని చేస్తున్న గబ్బిట సుబ్రహ్మణ్య శాస్స్త్రి గారు ఒక సారి మా స్కూల్ కు వచ్చి పరిచయం చేసుకొన్నారు .అయన మానికొండ దగ్గర మానేడు మాక గ్రామం వాడు .నేను మానికొండలో సైన్స్ మేస్టర్ గా పని చేస్తున్నప్పుడు , ఆ ఊరివాడు గబ్బిట దుర్గా ప్రసాద్ అనే నా పేరున్నవాడు మానికొండ హై స్కూల్ లో తోమ్మిదో క్లాస్ చదివాడు. వాడు నా దగ్గర ట్యూషన్ కూడా చదివాడు .వాడితో మిగతా ట్యూషన్ పిల్లలతోరమణారావు రాసిన  ‘’భర్త మార్కండేయ ‘’నాటకం ప్రాక్టీస్ చేయింఛి వార్శికోత్సవం లో వేయించా. ఆ దుర్గా ప్రసాద్ ఈ శాస్త్రి గారి తమ్ముడే . ఈ శాస్త్రిగారికి ఒక సారి ఆక్సిడెంట్ జరిగి బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలో ఉంటె నేనూ  ఆచారిగారు వెళ్లి పలకరించాం .

బాబూ రావు గారి సలహా

యెన్ .బాబూ రావు అనే సెకండరీ గ్రేడ్ టీచర్ గుడివాడ కు దగ్గర వాడు .నల్లగా స్పోటకం మచ్చల తో ఉండేవాడు ..మాజీ ఏం .ఎల్. సి .శ్రీ పి శ్రీరామ మూర్తిగారి అభిమాని లోడ లోడ గా వాగటమే తప్ప సబ్జెక్ట్ బోధించటం తక్కుత. క్లాస్ ను సరిగ్గామేయి౦ టెన్ చేసే శక్తీ లేనివాడు .కాని లోకజ్ఞానం బాగా ఉన్నవాడు .ఒక సారి మాటల సందర్భంగా మా అమ్మాయి విజయ లక్ష్మి టెన్త్ పాసైందని ,పాలిటెక్నిక్ లో చేర్చాలను ఉందని అన్నాను .ఆయన వెంటనే కొత్తగా డి టి, సి .పి.కోర్సు ప్రారంభిస్తున్నారని కంప్యూటర్ నేర్పించే కోర్స్ అని గుంటూరు ప్రభుత్వ గర్ల్స్ పాలిటెక్నిక్ లో ఉందని వివరాలన్నీ చెప్పాడు .దానిప్రకారమే అప్ప్లికేషన్ పెట్టించి సీటు రాగానే చేర్పించి హాస్టల్ లో ఉంచి మూడేళ్ళు చదివించాము .ఈ సలహా ఇచ్చినందుకు బాబూరావుగారికి కృతజ్ఞుడిని .ఇలా తీగలాగితే ఎన్నో డొంకలు  కదుల్తున్నాయి . మరిన్ని విషయాలు మరో సారి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

స్వాతంద్రోద్యమ అస్సాం అమర నారీమణులు -గబ్బిట దుర్గా ప్రసాద్ 28/07/2016 గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ ఆగస్టు

స్వాతంద్రోద్యమ అస్సాం అమర నారీమణులు -గబ్బిట దుర్గా ప్రసాద్

Gabbita Durgaprasadభారత స్వాతంత్ర్య సమరం లో వీర మరణం పొంది అమరులైన అస్సాం వీర నారీమణులు శ్రీమతి కనకలతా బారువా ,మరియు శ్రీమతి సతి జయమతి మొదలైనస్త్రీ మూర్తుల నిస్వార్ధ త్యాగాలను ఈస్వాతంత్ర్య దినోత్సవ సమయం లో స్మరించుకొందాం .

కనకలతా బారువా:

అస్సాం లో దారంగ్ జిల్లా బోరంగ బారి గ్రామం లో 22-12-1924న కనకలతా బారువా జన్మించింది .ఆమెను బీర్బలా అని కూడా పిలిచేవారు .తండ్రి కృష్ణ కాంత్ ,తల్లి కామేశ్వరి .తాత గారు ఘనకాంత బారువా గొప్ప వేటకాడు .ఈమె పూర్వీకులు పూర్వపు దోలాఖారియా రాజ్యం వారు .తర్వాత దోలకారియా బిరుదును త్యజించి బారువాబిరుదును మాత్రమే ఉంచుకొన్నారు .అయిదేళ్ళప్పుడే తల్లిని కోల్పోయిన అభాగ్యురాలు కనకలత .తండ్రి రెండో పెళ్లి చేసుకోన్నాడు .కాని ఈమె 13 వ ఏట తండ్రికూడా గతించగా అనాధ అయ్యింది .మూడవ తరగతి వరకు స్కూల్ లో చదివి తన చెల్లెళ్ళు తమ్ముళ్ళ సంరక్షణ కోసం చదువు మానేసింది .

భారత స్వాతంత్రి సమరం లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం లో కనకలత పాల్గోని’’ అస్సాం సబ్ డివిజన్ లోని ‘’మృత్యు వాహిని ‘’అనే యువ దళంలో చేరింది .20-9-1942 న ఈ మృత్యువాహిని దళం పోలీస్ స్టేషన్ దగ్గర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయి౦చుకొన్నది .చేతులలో యే ఆయుధాలు లేకుండా ఆ గ్రామ యువజనం కనకలతా బారువా నాయకత్వం లో పోలీస్ స్టేషన్ కు పెద్ద ఊరేగింపుగా బయల్దేరింది .పోలీస్ ఇన్స్పెక్టర్ రేబతిమోహన్ శోం వారిని ఊరేగింపు అపు చేయకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని హెచ్చరించాడు .బెదరక చెదరక మొక్కవోని ధైర్యం తో కనకలత తన బృందాన్ని ముందుకే నడిపించింది ..పోలీసులు వారిపై తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు .చేతిలోని జాతీయ పతాకను వదిలిపెట్టకుండా కనకలత తుపాకి గుళ్ళకు ఎదురొడ్డింది .తూటాలు ఆమె గుండెను చీల్చుకొని రాగా కనకలతా బారువా అక్కడికక్కడే కుప్పకూలి వీరమరణం పొందింది .అప్పటికి ఆమె వయసు 17 సంవత్సరాలు మాత్రమే .ఆమె చేతిలోని జాతీయ పతాకను ముకుంద కాకోటి చేతిలోకి తీసుకొని ముందుకు నడిచాడు .అతనిపైనా కాల్పులు జరుపగా ఆయనా అక్కడికక్కడే మరణించి అమర వీరుడయ్యాడు .

ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన తీర రక్షణ నౌకకు కనకలతా బారువా పేరు పెట్టి భారత ప్రభుత్వం గౌరవించింది .20 11 లో కనకలత నిలువెత్తు విగ్రహాన్ని గౌరీ పూర్ లో నెలకొల్పి ఘనమైన నివాళులు అర్పించారు .

సతి జయంతి:
భారత స్వాతంత్ర్య పోరాటం లో ఏమాత్రం సందేహించకుండా తమ రక్త తర్పణం తో భారత మాత ఋణం తీర్చుకొన్న అస్సాం దేశ భక్తు లెందరో ఉన్నారు .అందులో సతి జయంతి త్యాగం స్మరించ దగినది .అస్సాం రాజ్యం లో లోరా రాజ్యం లో విచ్చల విడిగా పెరిగి పోయిన అన్యాయం ,అవినీతి లపై ఎదురు తిరిగి పోరాడి ప్రాణాలర్పించిన మహా గొప్ప మహిళా సత్యాగ్రహి ,త్యాగ మూర్తి సతి జయతి .ఆమెను పెట్టిన మానసిక, శారీరక క్షోభ ,కాని చావు అంటే భయం కాని ఆమె స్థిర నిర్ణయాన్ని మార్చలేక పోయాయి .అంతటి నిర్భీక నిర్ణయాత్మక స్త్రీ మూర్తి ఆమె .అస్సాం రాజు సులిక్ఫా అవినీతి అన్యాయ పాలనపై జయంతి స్పందించిన తీరు అస్సాం ప్రజల కు కనువిప్పు కలిగించి ఆమెకు మద్దతునిచ్చి గొప్ప ఉద్యమాన్నే నిర్వహించారు .ఫ్రాన్స్ దేశపు జోన్ ఆఫ్ ఆర్క్ లాగా సతి జయంతి భాసించింది .

ఉషామెహతా:

ఎనిమిదేళ్ళ వయసులోనే ఉషా మెహతా బాల విప్లవ కారిణిగా గుర్తింపు పొందింది .సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమం లో బ్రిటిష్ ప్రబుత్వం పై పోరాడిన చిట్టి తల్లి ఉషా మెహతా .తండ్రి బ్రిటిష్ ప్రభుత్వం లో జడ్జి అయినా ఆమె భయ పడలేదు వెనుకడుగు వేయలేదు .తండ్రి నయానా భయానా ఆమెను ఉద్యమంలో పాల్గొనవద్దని హెచ్చరించాడు .ఆమె అన్ని బంధనాలను త్యజించి భారతమాత దాస్య విముక్తికోసం ముందుకే ఉరికింది .చదువు మానేసి ఉద్యమమే ఊపిరిగా జీవితం సాగించింది .అండర్ గ్రౌండ్ లో రహస్య రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్విట్ ఇండియా ఉద్యమం లో వార్తా ప్రసారం చేసిన ధైర్య సాహస నారి మెహతా .తనతో బాటు అనేక బాలబాలికలను ఉద్యమ సభలలో ఊరేగింపులలో మొహరించి గొప్ప చొరవ చూపింది .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Share

– See more at: http://vihanga.com/?p=17443#sthash.BbQvctwT.dpuf

Posted in రచనలు | Tagged | Leave a comment

నాదారి తీరు 97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర ఎన్నికలు వగైరా

— నాదారి తీరు

97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర  ఎన్నికలు వగైరా

చిలుకూరి వారి గూడెం దగ్గర  చండ్రగూడెం లో  మల్లె తోటలు ఉండేవి .ఉయ్యూరు వెళ్ళేటప్పుడు కొని తీసుకు వెళ్ళేవాడిని .చాలా సువాసనతో ఉండేవి  .ఇక్కడే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ,దానికి అనుబంధంగా మంచినీటి కేంద్రం ఉన్నాయి .వాహన దారులకు బాట సారులకు అక్కడి బావిలోని చల్లని నీరు దాహంగా ఇచ్చేవారు. గొప్ప సేవాకార్యక్రమం .నీళ్ళు కొబ్బరి నీళ్ళు అంత తియ్యగా ,అంత చల్లగా ఉండటం ప్రత్యేకత .లారీలవాళ్ళు బస్సులవాళ్ళు దాతలు ఇచ్చిన విరాళాలతో దీన్ని నడుపుతున్నట్లు అర్ధమయింది .ఇక్కడి మల్లెపూలను ఉయ్యూరు లో మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో జరిగే శ్రీ హనుమజ్జయంతికి లెక్కలమాస్టారు శ్రీ పురుషోత్తమాచారి గారు చాలాశ్రమపడి తెచ్చి అందించేవారు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళేవారు .ఆచారిగారితోపాటు శేషగిరిరావు గారుకూడా ఒకటి రెండు సార్లు ఉయ్యూరుకు ,మా ఇంటికి వచ్చి మా ఆతిధ్యం పొందిన జ్ఞాపకం .

జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ దర్శనం

చిన్నప్పటి నుంచి జమలాపురం కేశవరావు గారి గురించి ,వారి సేవానిరతి గురించి వింటూనే ఉన్నాను .ఆచార్లగారు శేషగిరిరావుగారు నన్ను ఒక సారి జమలాపురం తీసుకు వెళ్ళారు .శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది .లెక్కలమేస్టారికి అక్కడి పూజారులు అందరూ బాగా పరిచయమే .కనుక సరాసరి దర్శనానికి వెళ్లాం .అక్కడ వివాహాలు చేసుకొంటారు పుట్టు వెంట్రుకలు అక్షరాభ్యాసం అన్నప్రాసనలు లెక్కే లేదు. అందరికీ ప్రసాద వితరణ ఉంది .స్వామి విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది .కళ్యాణోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి .ఇది దాటితే మధిర వస్తుంది మధిర నుండి బస్ సర్వీస్ ఫ్రీక్వెంసి బాగా ఉంది

నెమలి శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం

ఒకశనివార౦  పుల్లూరులోనే ఉండిపోయి ,మర్నాడు ఆదివారం ఉదయం నేను లెక్కలమేస్టారు కలిసి ,రామచంద్రాపురం తోటపల్లి గంపలగూడెం మీదుగా నెమలి వెళ్లాం .నెమలి లో శ్రీ వేణుగోపాలస్వామి ప్రత్త్యేక ఆకర్షణ ఉన్న దైవం .కోరికలు తీరటానికి ఇక్కడ రాత్రి నిద్ర చేసి ఉదయం స్వామి దర్శనం చేస్తారు. వంటలు చేసుకొనే వీలు, గదులు ఉన్నాయి .నీతటి సౌకర్యం లేని ఆతిమెట్ట ప్రాంతం. జిల్లా పరిషత్ స్కూళ్ళలో నెమలి పనిష్ మెంట్  ఏరియా గా భావించేవాళ్ళం .దగ్గరలోనే ఊటు కూరు లో కూడా హై స్కూల్ ఉంది. శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారి శాసనమండలి ఎన్నిక సమయం లో ఆయనతో పాటు ఈ ప్రాంతాలన్నీ కారులో తిరిగి ప్రచారం చేశాం .స్వామి నల్లరాతి వ్యత్యస్త పాదార వింద విగ్రహ రూపుడు .గొప్ప కళ కనిపిస్తుంది .ఇక్కడి స్వామి వారి కల్యాణానికి అనేక ప్రాంతాలనుండి భక్తజన సందోహం వస్తుంది .అర్చకులు ఉయ్యూరు వేదా౦తంవారికి బంధువులే .మా రచకులు వేదాంతం రామాచార్యులగారి కొడుకు దయాకర్ కు ఈ ఆలయ అర్చకస్వామి కుమార్తెనే ఇచ్చి వివాహం చేశారు .స్వామి దర్శనానందం తో మధ్యాహ్నానికి పుల్లూరు తిరిగి వచ్చి ఆచార్యుల గారింట భోజనం చేసిన గుర్తు .

ఇక్కడ పని చేస్తుండగానే ఎన్నికలు జరిగిన జ్ఞాపకం .ఒక చోట రిటర్నింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నప్పుడు మొదటి సారిగా శ్రీబోళ్ళ బుల్లిరామయ్య, శ్రీ గంటి మోహన చంద్ర బాల యోగి గార్లు బూత్ పరిశీలనకు రాగా చూసిన గుర్తు .

పంద్రాగస్ట్ వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాం .విపరీతమైన వర్షం  వచ్చింది .లోపలే వరండాలో కానిచ్చాం .పోటీలు నిర్వహించి ప్రైజులు అందజేశాం .జాతీయ గీతాలు నేర్పి పాడించాను .కమిటీ ప్రెసిడెంట్ గారు ముఖ్యఅతిధి .పిల్లలకు మైలవరం నుండి స్వీటు హాటు చాక్లెట్లు తెప్పించి ఇచ్చాం .టీచర్స్ కు టీ పార్టీ ఇచ్చాం. ఇక్కడ ఏదైనా చాలా ఘనంగా జరిగేది .అందరి సహకారం బాగా ఉండేది .

శ్రీ కృష్ణ దాసు గారి ఆతిధ్యం ,ప్రభావం

పుల్లూరు స్కూలు ఎలిమెంటరీ స్థాయి నుంచి హైస్కూల్ స్థాయికి ఎదిగి ఇప్పుడు ఇ౦త సర్వాంగ సుందరంగా ఉండటానికి ముఖ్య కారకులు శ్రీ వి .కృష్ణ దాసు గారు .వారిది గుడివాడ దగ్గర భూషణ గుళ్ల .ఇక్కడే చేరి పని చేసి అంచెలంచెలుగా స్కూల్ ను అభి వృద్ధి చేసి తానూ డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ బి ఎడ్ లు సాధించి ఇంగ్లీష్ లో అసమాన పాండిత్యం పొంది అన్నీ వున్నా చాలా అణకువగా ఉన్న విశిష్ట వ్యక్తీ .కమిటీ వారికి తలలో నాలుక. శాఖా పరమైనది ఏది సాధించాలన్నా ఆయనే ముందు ఉండి సాధించి అభి వృద్ధి చేసేవారు .పీనల్ హెడ్మాస్టర్ వచ్చేవరకు ఆయనే అన్నీ ,రూల్స్ ,రేగ్యులేషన్లు కరతలామలకం .నేను బాగా పని చేస్తున్నాని తెలుసుకొని ఒక సారి స్కూల్ కు వచ్చి పలకరించి వారింట ఆతిధ్యం తీసుకోమని వినయంగా కోరారు. వారమ్మాయి సీత తొమ్మిది చదువుతోంది .ఇక్కడ వారి కాపురం చిలుకూరు వారి గూడెం లోనే . నేను వారింటికి భోజనానికి వెళ్లి నప్పుడు తల్లిగారు భార్యగారు స్వంత బందువు లాగా ఆప్యాయత కనబరచి చాలా మర్యాద చేశారు .దాసు గారటే మైలవరం ప్రాంతం లో తెలియని వారు లేరు .నేనంటే చాలా ఆత్మీయంగా ఉండేవారు .వారి తల్లి గారు స్వంత కొడుకులాగా ఆదరించారు వారి ఆతిధ్య మర్యాద మరుపుకు రాదు  .వీలున్నప్పుడు స్కూల్ కు వచ్చి పలకరించేవారు .వేసవి సెలవులలో వారబ్బాయి ఉపనయనం స్కూల్ లో చేయాలనుకొన్నానని చెబితే, జిల్లా పరిషత్ కు రాసి పర్మిషన్ తెప్పించాను .మేమిద్దరం ఉపనయనానికి ఉదయమే హాజరై వారి ఆతిధ్య మర్యాదలు పొందాము  మా ఇద్దరికీ నూతన వస్త్రాలు అందజేశారు .నేను చిలుకూరి వారి గూడెం వదిలాక వారికి నెమ్మది నెమ్మదిగా ప్రోమోషన్లు వచ్చి అంగలూరు డయట్ లెక్చరర్ అయి డిప్యూటీ డి.యి. ఓ. అయి పరీక్షల ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించి  రిటైర్ అయ్యారు .సుమారు ఏడెనిమిది ఏళ్ళ క్రితం  సాహితీ బంధువు పెద వోగిరాల వాసి మాకు అత్యంత ఆప్తులు కవి అందునా భక్తకవి అయిన శ్రీ ఓగిరాల సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి వివాహం లో బెజవాడలో దాసు గారు మళ్ళీ కనిపించారు .సహృదయం ,సంస్కారం, సౌజన్యం ,వినయం, నిక్కచ్చితన౦  మూర్తీభవించిన వారు శ్రీ కృష్ణ దాసు గారు  నవ్వుతూ చక్కని చతురోక్తులాడుతూ ,సాహిత్య మర్మాలు తెలియ జేస్తూ ఎలివేట్ చేసే గొప్ప సుగుణం వారిలో ఉంది .వారు నాకు పరిచయమవ్వటం నా అదృష్టంగా భావించాను వారి స్పూర్తి ప్రేరణ నా విద్యుక్త ధర్మానికి మంచి మార్గం చూపాయి .

నాగార్జున సాగర్ యాత్ర

లేక్కలమేస్టారు  ఇక్కడ ప్రతి ఏడాది ఏదో చోటుకు పిల్లలను యాత్రా సందర్శనానికి తీసుకొని వెళ్ళే అలవాటు ఉందని ఒక సారి నాతో అంటే ఈ ఏడాదీ వేద్దాం అని చెప్పి విద్యార్ధుల అభిప్రాయం పరిగణలో తీసుకొని నాగార్జున సాగర్ యాత్ర ఏర్పాటు చేశాం .సుమారు పదిహేను రోజులముందే నేనూ ఆచారిగారు కలిసి బెజవాడ వెళ్లి ఒక ప్రైవేట్ బస్ బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాం .విద్యార్ధుల వద్ద డబ్బు వసూలు చేయటం ఏర్పాట్లు వసతి అన్నీ లేకల మాస్టారు సైన్స్ మాస్టారు చూశారు.  వార్డెన్ రాఘవులుగారు   హాస్టల్ తరఫున భోజనం టిఫిన్ ఏర్పాట్లు చూస్తానని ముందుకొచ్చారు .అంతా రెడీ అయి ఒక రోజు రాత్రి 7 గంటలకు బయల్దేరటానికి నిర్ణయించుకొని విద్యార్ధినీ విద్యార్ధులను సాయంత్రం 5 గంటలకే స్కూల్ లో హాజరు కావాలని చెప్పాం .వాళ్ళందరూ వచ్చారు .కాని బస్ మిస్ .అనుకొన్న సమయానికి బస్సు రాలేదు .ఆచార్లుగారు ఫోన్లమీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు .ఇదిదగో అదుగో అని తెల్లవారు ఝామున అయిదింటికి బస్ వచ్చింది .బెటర్ లేట్ దాన్ నెవర్ సామెత  సార్ధకం చేస్తూ అందరం బస్సు ఎక్కాం .సుమారు అరడజను మంది టీచర్లు కూడా విద్యార్ధుల అవసరాలను తీర్చటానికి తీసుకొని ఉపాధ్యాయులందరికి ఉచితంగా తీసుకొని వెళ్ళే ఏర్పాటు చేశాం అంతా హాపీ .

కోదాడకు దగ్గర ఏటి ఒడ్డున బస్ ఆపి కాల కృత్యాలు తీర్చుకొనే అవకాశమిచ్చి కోదాడ హోటల్ లో టిఫిన్ చేయించి మళ్ళీ బయాల్దేరాం .సాయంత్రానికి నాగార్జున సాగర్ చేరాం రాత్రి అక్కడ ఒక స్కూల్లో బస ముందే ఏర్పాటు చేసుకొని వార్డెన్ గారు వండించిన భోజనం చేసి రాత్రి విశ్రమించాం .ఉదయం కార్యక్రమాలు కానిచ్చి వార్డెన్ గారి టిఫిన్ తిని కాఫీ తాగి సాగర్ డాం అంతా కాలినడక న తిరిగి ప్రతి విషయాన్ని అర్ధమయేట్లు వివరించి చెప్పి ఈపర్యటన  సఫలం చేశాం .తర్వాత విజయపురి  గెస్ట్ హౌస్ మ్యూజియం వగైరాలు చూపించి రాత్రి భోజనాలు చేసి బయల్దేరి మర్నాడు ఉదయం 10 గంటలకు చిలుకూరి వారి గూడెం చేరాం .విద్యార్ధులను తమ అనుభవాలను తెలియ జేయవలసినదిగా అసెంబ్లీ లో కోరి చెప్పించాం చాలా సంతృప్తి చెందారు అందరూ .దీని విజయానికి ముఖ్య కారకులు లెక్కల మాస్టారు పురుషోత్తమా చారిగారే నని సగర్వంగా తెలియ జేస్తాను ఇచ్చిన బాధ్యతా అ౦త పకడ్బందీ గా నిర్వ హించే సామర్ధ్యం ఆయనది  .

వార్షిక తనిఖీ

విజయవాడ జోన్ లో ఈ స్కూల్ ఉంది కనుక అక్కడి ఉపవిద్యా శాఖాధి కారి గారుశ్రీ సుగుణ భూషణ రావు గారు ? స్కూల్ ను తనిఖీ చేయటానికి వచ్చారు .ఆయన తూర్పు గోదావరి జిల్లావారు ..చలాకీ మనిషి .స్కూల్ లోనే వారికి వసతి సౌకర్యాలు కలగజేసి ,కాఫీ టిఫిన్లు నాకూ వారికీ లెక్కల మాస్టారి ఇంటి నుంచే తెప్పించే ఏర్పాటు చేశాం. ఆచారి గారి భార్య గారు తల్లిగారు ఈ బాధ్యత తీసుకోవటం లో పరమాన౦ద పడ్డారు .స్కూల్ రికార్డ్ లన్నీ పకడ్బందీ గానే ఉన్నాయి కనుక ఇబ్బంది లేదు .అన్ని క్లాసుల ,అన్ని సబ్జెక్ట్ ల తనిఖీకి చుట్టు ప్రక్కల స్కూళ్ళ సీనియర్ ఉపాధ్యాయులను పానెల్ ఇన్స్పెక్టర్లు గా ఆహ్వానించాము .ఏర్పాట్లన్నీ ఘనంగా చేశాం .గంటకో సారి కాఫీ లేక టీ .తనిఖీకి ముందు టిఫిన్ ఏర్పాటు అన్నీ పెళ్లి తంతు లాగా నడిపాం .ఆఫీసర్ గారు ,గుమాస్తా ఖుషీ ఖుషీ .వారిద్దరికీ’’ తాంబూలాలు’’ఇచ్చి మర్యాదా చేశాం .తనిఖీ  రెండు రోజులు చేశారు .రెండు రోజులూ ఇదే విధానం .మొదటి రోజు మధ్యాహ్నం లంచ్ ,రెండవ రోజు సాయంత్రం డిన్నర్ షడ్రసోపేతంగా ఆచారిగారి ఇంటి నుండే కమ కమ్మగా వండి పంపారు. లొట్టలేసుకొంటూ అందరం తిన్నాం  .స్టాఫ్ మీటింగ్ లో ఉపవిద్యాశాఖాదికారిగారు నన్నూ స్కూల్ ను స్టాఫ్ ను బాగా మెచ్చుకొన్నారు. విద్యార్ధుల ప్రవర్తనకు ముగ్ధులయ్యారు .చాలామంచి రిమార్క్ లు రాశారు. లాగ్ బుక్ లో విజిట్ బుక్ లో ఘనంగా పొగిడారు. మా స్కూలు అందరికీ అన్ని విషయాలలో ఆదర్శంగా ఉందన్నారు .  తాను  చాల చాలా సంతృప్తి చెందానని చెప్పారు . .ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ కావటానికి స్టాఫ్ నాకిచ్చిన తోడ్పాటు ,విద్యార్ధుల ప్రవర్తన యెంత ముఖ్యమైనవిగా ఉన్నాయో ఆచార్యుల గారింటి ఆతిధ్యం అంతకంటే గొప్పగా ఉంది చెప్పక తప్పదు.లెక్కల మాస్టారు ఈ ఖర్చు అంతా తానే భరిస్తానని ముందే నాకు చెప్పారు .అలాకుదరాదని మొత్తం ఖర్చు ఎంతో లెక్కరాయమని చెప్పి ,జీతం ప్రకారం వాటా వేసి మొత్తం వసూలు చేయించి ఆచారిగారికి ఇప్పించా .ఆయన కూడా కాదన లేక పోయారు . నేను అక్కడి నుంచి వచ్చాక లేక్కలమేస్టారు ఆయనతో సాన్నిహిత్యాన్ని బాగా పెంచుకొన్నారు .తర్వాత ఈ అదికారిగారు బందరులో స్పాట్ వాల్యుయేషన్ లో అసిస్టంట్ కాంప్ ఆఫీసర్ గా ఉండాగా కలిశాను .ఆ రోజుల్ని బాగా గుర్తుకు తెచ్చుకొన్నారు .

రోజూ పసందైన విందు

ఈ తనిఖీ విందు అందరిలో ఆనందాన్ని నూతన ఉత్సాహాన్ని కలిగించింది .ఒక సారి నేను ఒక సోమవారం ఉదయమే ఉయ్యూరు లో గారెలు , ,చక్కర పొంగలి  పులిహోర , మా శ్రీమతితో చేయించి  ఉయ్యూరు అరటిపళ్ళు కూడా తీసుకొని కాన్ ల నిండా పెట్టించుకొని అంచెలంచెల మీద స్కూల్ కు సమయానికి చేరి ,ఎవరికీ తెలియ జేయకుండా మధ్యాహ్నం స్టాఫ్ మీటింగ్ ఉందని చెప్పి ,అందరికీ ఉయ్యూరు నుంచి తెచ్చిన పదార్ధాలు వడ్డింప జేసి టీ కూడా తెప్పించాను అందరూ మహా రుచికరంగా ఉన్నాయని ఎంతో సంతోషంగా తిని ధన్యవాదాలు చెప్పారు. బహుశా ఆరోజు మా పెళ్లి రోజేమో జ్ఞాపకం లేదు .ఇది ప్రేరణ కలిపించింది అందరికి. ఇలాంటి వాటిలో ముందుండే శేషగిరిరావు అనే సెకండరీ గ్రేడ్ మాస్టారు ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఇంతకంటే ఎక్కువ ఐటమ్స్ వండించి విందు చేశారు .తర్వాత లెక్కలమాస్టారు .ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వార్డెన్ రాఘవులుగారు కూడా  తమ బాధ్యతగా తీసుకొని రోజు పసందైన విందు చేస్తూ తాము వెనక బడలేదని నిరూపించుకొన్నారు .ఇట్లా చాలా హుషారుగా  జాలీగా హేపీగాఒక నెల రోజులు విందే విందు గా  కాలం దొర్లి పోయింది చిలుకూరి వారి గూడెం లో .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-20-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 30 నేటి వైణికులు 44-బోనాల శంకర ప్రసాద్

— ఇది విన్నారా కన్నారా !  30

నేటి వైణికులు

44-బోనాల శంకర ప్రసాద్

323-వీణావాదన విద్యను  ఒక శతాబ్ది కాలంముందుకు తీసుకు వెళ్ళిన ,వెళ్తున్న మహా వైణికులు శ్రీ బోనాల శంకర ప్రసాద్ రాగ జీవాన్ని ,ప్రాణాన్ని పట్టుకొని వాయిద్యానికి ప్రాణం పోసినవారు  .వాసా ,ఈమని ఇత్యాదుల సంగీత రహస్యాలను ఆపోశనపట్టి ‘’మన కర్నాటక సంగీతానికి మంచి రోజులొచ్చాయి ‘’అని ఆనందం పొందేట్లు చేశారు .1966 లోవిశాఖ  జిల్లా పెనుగోల్లు గ్రామం లో జగన్నాధం ,రమణి దంపతులకు జన్మించారు .మంచి ఆధ్యాత్మిక వంశం వారిది తండ్రిగారితోకలిసి రమణ మహర్షి శిష్యులైన ‘’బాబు గారు’’ అని పిలువబడే స్వామీజీ విశాఖలో లలితానగర్ లో స్థాపించిన ఆశ్రమం లో వీణ వాయించేవారు .తండ్రి జగన్నాధంగారు ఈ ఆశ్రమం లో తప్ప ఇంకెక్కడా కచేరీ చేసేవారు కాదు .

324 –తొమ్మిదవ ఏట కచేరీ ప్రారంభించిన ప్రసాద్ ,సంగీత డిప్లమా సాధించి ,కడప రేడియో నిలయ విద్వాంసులై ,తర్వాత విశాఖ కేంద్రం లో చేరి పదేళ్ళు పనిచేసి, చెన్నై వెళ్లి పనిచేశారు శ్రీ జయేంద్ర సరస్వతి వీరిని కంచి పీఠ ఆస్థాన విద్వాంసులను చేశారు .,వీణ కచ్చేరీలకు ప్రోత్సాహం తక్కువ అని భావించారు ప్రసాద్ .

Inline image 1

45 –అంబుజ వల్లి

325-వాసా వారి  శిష్యులలో మొదటివారు శ్రీమతి అ౦బుజవల్లి .కానుకుర్తి వెంకట్రావు లచ్చన్నమ్మ దంపతులకు జన్మించారు జమీందారి వంశం .తండ్రి చిన్నప్పుడే చనిపోగా శ్రీకాకుళం చేరి ఆర్ కాళిదాసుగారి వద్ద వీణ నేర్చారు .హరిడేహళ్ వెంకట రావు  గారితో వివాహమయ్యాక నెర్లిమర్ల చేరి ,సుదర్శనం అప్పలాచార్యులవద్ద నేర్చారు .వాసావారు రోజూ వీరింటికి వచ్చేవారు .రాజనీతి శాస్త్రం ప్రజాపాలన లలో ఏం యే తో పాటు బి ఎడ్ చేసిన  అ౦బు జవల్లి విజయనగరం రాజా వారికాలేజిలో 1965 నుంచి 1993 వరకు వీణ లెక్చరర్ గా, శాఖాధిపతి గా  పని చేసి ,పదవీ విరమణ తర్వాత తెలుగు విశ్వ విద్యాలయం లో వీణ లెక్చరర్ అయ్యారు .సంగీతం పైనా వాసా వారిపైనా ,గాన కళ మీద ఎన్నో వ్యాసాలూ రాశారు .

Inline image 2

46 –ఆనంద రాజ్య లక్ష్మి

326 –మాధుర్యం వైదుష్యం రెండూ ఉన్న వైణికులు ఆనంద రాజ్య లక్ష్మిగారు .వీణ తప్ప వేరే ప్రపంచం లేదీమెకు .16 వ ఏట చిట్టిబాబుగారు వాసా వారింటికి రాగా తన శిష్యురాలి ప్రతిభను ఆయనముందు ప్రదర్శింప జేశారు .కష్టమైన తోడి రాగం వాయించి మెప్పు పొందారు .వాసావారి నుంచి అనేక రహస్యాలు గ్రహించారు .’’లాహిరి లాహిరి ‘’సినిమాకు ,టి వి సీరియల్స్ కు వీణ వాయించారు సినీ నటి జయప్రద వీరివద్ద నాలుగేళ్ళు  వీణ నేర్చుకొన్నారు .వీరి వీణ కృషికి యునేస్కో సర్టిఫికేట్ ఇచ్చింది .

Inline image 3

47 –ఇ .గాయత్రి

327 –వీణకు మహా గౌరవం తెచ్చినవారిలో గాయత్రి గారొకరు .వీణ పై గజల్స్ వాయించి రికార్డ్ చేశారు ‘’పంచ సూక్తాలను’’ వీణ పై వాయించే నేర్పు ఈమెది .పంజాబీ భాంగ్రా ,గుజరాతీ డాండియా పాటల్ని వీణపై వాయిస్తారు .వీణకు పరిమితులు లేవని భోపాల్ లో జరిగిన సెమినార్ లో పత్రం రాసి సమర్పించారు .అవసరం ఉంటేనే గమకం వేస్తారు .వాసా వారి శిష్యరత్నం .దేశ విదేశాలలో అనేక అవార్డులు పొందారు .ఆమె కేసెట్లు అమెరికాలోని పిట్స్ బర్గ్ దేవాలయందాకా వ్యాపించాయి .

Inline image 4

48-ఈమని కల్యాణి

328 –ఈమని శంకర  శాస్త్రిగారమ్మాయి  కల్యాణి .తండ్రికి కచేరీలలో సహకరించారు .భర్త లక్ష్మీనారాయణ .ఈమె వీణ తండ్రిని గుర్తు చేస్తుంది .చిట్టిబాబు వీణ ఈమనిని మరి పిస్తుంది .గమక ప్రాధాన్యం ,మీటు వైశిష్ట్యం ,కీర్తన వాయించటం లో స్పష్టత కల్యాణిగారి ప్రత్యేకత .ఆవేశం తోపాటు నిగ్రహమూ ఉన్న కళాకారిణి .భౌతికంగా ఈమని వారు మనమధ్య లేక పోయినా కుమార్తె కల్యాణిగారు సృజిస్తున్న ‘’నాద దేహదారణ చేస్తున్నారు ‘’ అంటే అతిశయొక్తికాదు’’ అన్నారు ముదిగొండశ్రీ .’’మధుర స్మృతి-ఇతర కీర్తనలు ‘’అనే పేరుతొ కేసెట్ గా రికార్డ్ చేశారు .1975 లో ‘’మొదటి ప్రపంచ తెలుగు మహా సభలలో తండ్రి ఈమని శంకర శాస్త్రి గారితో వేదికపై సహకార వాద్యం వాయించిన ఘనత కల్యాణి గారిది

.49  –టి పద్మిని

329 –మంచి ప్రయోగ శీలి పద్మినిగారు రామవరపు విజయ లక్ష్మి తిరుపతి రామానుజ సూరి గార్ల వద్ద వీణ నేర్చారు .తుమ్మల వేణు గోపాలరావు కృష్ణా బాయ్ దంపతులకు జన్మించి ,రచయితా ,ఆంద్ర విశ్వ విద్యాలయ తెలుగు శాఖలో ఆచార్యులు అయిన అత్తలూరి నరసింహారావు గారిని పెళ్లి చేసుకొని ,1956 లో బెజవాడలో గాత్రం వీణలలో డిప్లొమా పొంది ,ఏం యే ఇంగ్లీష్ చేసి ,పి హెచ్ డి.సాధించారు .ఆకాశవాణి ,దూరదర్శన్ లోకచేరీలు చేశారు .1979 లో ‘’మ్యూజిక్ –పెయింటింగ్ ఫీస్ట్ ‘’వాయించారు వీరు వీణ వాయిస్తుంటే ఇద్దరు చిత్రకారులు చిత్రాలు వేయటం అనేది ఇక్కడ చేసిన ప్రయోగం .భరతుడు నాట్య శాస్త్రం లో యే రసానికి యే రంగు ఉంటుందో తెలియజేశాడు .సన్నాయి వాయిద్యం తో కలిసి పద్మిని గారు’’ ద్వివాద్య ‘’కచేరీ చేయటం మరో ప్రయోగం .1993 ,99 లలో రెండు సార్లు అమెరికా వెళ్లి పాడుతూ వాయించమంటే అలాగే కచేరీలు చేసి వచ్చారు .

50 –జయ లక్ష్మీ శ్యామ సుందర్

330-వాసా ,అయ్యగారి ,పప్పు వంశాలు వైణిక వంశాలు .పప్పు సోమేశ్వరరావు గారమ్మాయి ,అయ్యగారి సోమేశ్వర రాగారబ్బాయి శ్యామ సుందర్ గారి భార్య శ్రీమతి జయలక్ష్మి ..1955 లో జన్మించి తండ్రి ,మామగార్ల భర్త  సాన్నిధ్యం లో సాధన చేసి ,అగ్రశ్రేణి వైణికురాలై భర్తకు  సహకార వాద్యం వాయిస్తూ ,ఆకాశవాణిలో  టి .వి .లో సోలోగా జంటగా వాయిస్తూ 2001 అమెరికా తానా సభలకు వెళ్లి జంటగా వాయించి డెట్రాయిట్ ,న్యు జేర్సీలలో విడిగా కచేరీలు చేశారు జయలక్ష్మి .విజయవాడ రేడియో కేంద్రం నుంచి ‘’రండి చేయి చేయి కలుపుదాం ‘’’’పచ్చలహారం ‘’,తుంగ భద్ర ‘’వంటి రూపకాలను ప్రసారం చేశారు .

51 –రామవరపు మాధురీ దేవి

331 –ఒరాకిల్ డెవలపర్ 20 00 ,,మైక్రో సాఫ్ట్ అప్లికేషన్స్ నాలెడ్జ్ తో అప్లికేషన్ లో డిప్లొమా పొందిన రామవరపు మాదురీదేవి ,ఆంధ్రా యూని వర్సిటి నుంచి వీణ డిప్లొమా ,ఢిల్లీ  విశ్వ విద్యాలయం నుంచి కర్నాటక గాత్ర సంగీతం లో ‘’సంగీతశిరోమణి ‘’వీణలో ఏం.ఎ గోల్డ్ మెడల్ ,కర్నాటక సంగీతం లో అదే యూని వర్సిటీ నుంచి ఏం. ఫిల్ .పొందిన ఘనత మాదురీదేవిగారిది .15-1-1969 లో విశాఖ లో రామవరపు విజయలక్ష్మి ,శరత్ బాబు దంపతులకు జన్మించిన మాధురి చిన్నతనం లోనే పెద్ద పేరు పొందింది .రేడియోలో ఎ గ్రేడ్ వీణా ఆర్టిస్ట్ ,లలిత సంగీతం లలిత వాద్య సంగీతం లో బి గ్రేడ్ ఆర్టిస్ట్ .’’కర్నాటక సంగీతం లో వర్ణముల పాత్ర ‘’,జావళి అన్న సంగీత ప్రక్రియా పరిశీలనం ‘’అనే రెండు అంశాలపై గొప్ప పరిశోధన చేసి పత్రాలను సమర్పించారు .చిట్టిబాబుగారి ‘’టెంపుల్ బెల్స్ ‘’,’’సేరేనాడే ‘’అనే ఎల్ .పి రికార్డ్ లలో వాయించిన అదృష్ట వంతురాలు .కర్నాటక ,లలిత ,పాశ్చాత్య సంగీతాలు మూడింటి లోను నిష్ణాతురాలు .1989 -90 లలో అమెరికాలో అనేక రాష్ట్రాలలో పర్యటించి అనేక ప్రముఖ పట్టణాలలో కచేరీలు చేసి మెప్పు పొందారు .’’అంకిత భావం ఉంటేనే ఏదైనా సాధ్యం ‘’అంటారు ఆమె .ఆమె వీణ విద్యా రహస్యాన్ని ఒక పత్రిక ‘’స్వర వీణా మాధురి ‘’అని మెచ్చింది .Inline image 7

52- మేడూరి శ్రీనివాస్

332  -వృద్ధ సంగీత విద్వాంసులు శ్రీ మేడూరి శ్రీనివాస్ గారు .పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర దొమ్మేరులో 19 13 జనవరిలో జన్మించి ,1923 నుంచి రెండేళ్ళు శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రిగారి వద్ద వీణ నేర్చిన శ్రీనివాస్ గారి తలిదండ్రులు లక్ష్మీ సూరమ్మ ,కామ దాసు గార్లు .విజయనగరం లో వాసా వెంకట రావు గారి వద్ద వీణ అభ్యసించి ,హైదరాబాద్ కింగ్ కోఠీ ప్రభుత్వ సంగీత కళాశాలలో 16 ఏళ్ళు వీణ అధ్యాపకులుగా పని చేశారు .10 వ ఏట నుండే వీణ వాయించిన వీరి భార్య కుమార్తెలు అందరూ వీణా వాదన నిపుణులే .

53 –మేడూరి నరసింహా రావు ,సుబ్బలక్ష్మి

333 –మేడూరి నరసింహారావు నిలబెట్టి  వాయించేవారు వీణను .సంగమేశ్వర శాస్త్రిగారి శిష్యులు .నరసింహా రాగారమ్మాయి సుబ్బలక్ష్మి .తండ్రివద్దేవిద్య నేర్చ శ్రీపాద పినాక పాణిగారివద్ద మెళకువలు గ్రహించి వేగంగా వీణ వాయించే నేర్పు సాధించారు .బెంగుళూరులో ఉంటున్నారు .

54- మేడూరి శ్రీనివాస్

334 -1969 ఆగస్ట్ లో దొమ్మేరులో పుట్టి తండ్రివద్దే విద్య నేర్చి ,వీణ టెక్నిక్ లను అక్క సుబ్బలక్ష్మి దాగ్గర గ్రహించి అగ్ర స్థాయి వైణికులుగా ఉంటూ యెంత వేగంగా వాయించినా స్పష్టత తగ్గకుండా ,శ్రోతలను కదల కుండా కూర్చేపెట్టే సామర్ధ్యం పొంది బాగా రాణిస్తున్నారు .వాద్యం పై గొప్ప అధికారం నైపుణ్యం ఉన్నవారు .ఇన్సూరెన్స్ ఉద్యోగి అయినా శ్రోతల మానసిక ఇన్సూరెన్స్ కు వీణ ద్వారా హామీ ఇస్తున్నారు .చిట్టిబాబుగారు ఒకే వీణపై 10 వీణల పెట్టుగా ఎలా వాయి౦చ గలరో శ్రీనివాస్ కూడా అంతేసులభంగా శంకరాభరణం, తోడి రాగాలను ‘’తోడి పారేయ ‘’గలరు .

55- అయ్యగారి సత్య ప్రసాద్

335-అయ్యగారి శ్యామసుందర్ గారి తమ్ముడు ,సోమేశ్వరరావుగారబ్బాయి సత్య ప్రసాద్ .తండ్రేగురువు .వీణలో డిప్లోమాపొంది విశాఖ రేయోకేంద్రం నుండి వీణ వాయించేవారు 28-10-1955 లో గుంటూరు జిల్లా బాపట్ల లో జన్మించిన వీరు  ,గాత్రధర్మానికే ప్రాధాన్యమిస్తారు .ఎవరూ ఎదురుగా  తాళం వేయాల్సిన అవసరం లేకుండా మనసులోనే తాళం నడుపుకొనే ప్రత్యేకత వీరిది .సప్త తంత్రులను సద్వినియోగం చేస్తారు. రాజమండ్రి ప్రభుత్వ సంగీత కళాశాలలో వీణ అధ్యాపకులుగా ఉన్నారు .

Inline image 8

56 –యోగ వందన

336 –ఉస్మానియా నుంచి ఏం. ఎస్ సి ,,త్యాగరాజ ప్రభుత్వ కళాశాలనుంచి వీణ డిప్లొమా ,మీరజ్ లోని అఖిల భారత గాంధర్వ విద్యాలయ నుంచి ప్రధమ శ్రేణి లో ‘’అలంకార్ ‘’ను పొందిన విదుషీమణి యోగవందన .దేశ విదేశాలలో గొప్ప కీర్తి పొందిన వందన భాగ్య నగరం లో పుట్టి పెరిగింది  భర్త శ్రీ కామేశ్ ను పెళ్ళాడి బెంగుళూరు లో స్థిరపడ్డారు .వీరి తలిదండ్రులు శ్రీ వేటూరి ఆనందమూర్తి శ్రీమతి చంద్ర కళ .తల్లి గొప్ప గాయని. తండ్రి మహా పండితులు ,కవి రచయితా విఖ్యాత విమర్శకులు,పరిశోధకులు . .తాతగారు జగత్ ప్రసిద్ధకవిపండిత పరిశోధకులు మాస్టర్ సి వి గారి శిష్యులు  వేటూరి ప్రభాకర శాస్త్రిగారు .

337-శ్రీమతి కాజ శుభాషిణి ,శ్రీ ఎ.అనంత రావు గార్ల వద్ద విద్య నేర్చి వాసావారి వాదనా పద్ధతికి అలవటై, కుసుమ కోమల మార్దావాన్ని సాధించారు. మహారాజపురం విశ్వనాధయ్యర్ గోల్డ్ మెడల్ పొందారు .మన రాష్ట్రం లోని అన్నినగరాలలో కచేరీలు చేశారు .తిరువయ్యూర్ త్యాగ రాజ ఆరాధనోత్సవాలలో భక్తీ శ్రద్ధలతో పాల్గొంటారు .

338-2011 మే నెలలో మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో ‘’టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ‘’లో,ఇండియన్ కల్చరల్ సెంటర్ ,లలో వీణ కచేరి చేశారు  ఐ సి సి ఆర్ ద్వారా సైప్రస్ ,చైనాలకు ఆహ్వానాలన౦దు కొని సింగ పూర్ లో మన ఎ౦బసిలో వీణ వాయించారు. దుబాయ్ జర్మనీ డెన్మార్క్ లలో ఆహ్వానాల మేరకు వెళ్లి కచేరీలు చేసి ఘన సన్మానాలు అందుకొన్నారు .

339-‘’వాయి౦చ గానే శ్రోతలకు యిట్టె తెలిసి పోయే ప్రముఖ కృతులను ఎన్నుకొని వాయిస్తాను .రాగం వెంట రాగం వాయిస్తున్నప్పుడు రెండు రాగాలలో స్వర సామ్యం లేకుండా చూసుకొంటాను .భిన్న వాగ్గేయ కారుల రచనలనూ వేర్వేరు తాళాలను ఎన్ను కొంటాను .కచేరీ చివర హిందూస్తానీ రాగాలు వాయిస్తాను ‘’ అని యోగ వందన తన విజయ రహస్యం చెప్పారు .

340 –‘’జనం వీణకచేరీలకంటే గాత్రకచేరీలను ఎక్కువగా ఆదరిస్తున్నారని ‘’అనటాన్ని యోగవందన ఒప్పుకోవటం లేదు .కన్నైకుడి వైద్యనాదంగారి వయోలిన్ సోలో  కచేరీ ఎంతటి ప్రసిద్ధి చెందిందో అందరికి తెలుసు .ఇప్పుడు శాస్త్రీయ సంగీతానికి ఆదరణ బాగా ఉందని ,వాద్య కళాకారులు కూడా శ్రోతల్ని రంజింప చేయటం ముఖ్యంగా భావించాలన్నారు ..సంగీత విద్యాభి వృద్ధికి విశ్వ  విద్యాలయాలు బాగా తోడ్పడుతున్నాయని ,అయితే ప్రభుత్వ సాయం, ప్రోత్సాహం ఇంకా ఎక్కువగా ఉండాలని ,తలిదండ్రులు తమ పిల్లలను సంగీతం పై ప్రోత్సాహం కలిగించాలని ,గురువుల బాధ్యతా కూడా ఎక్కువగా ఉందని వీణ నేర్చుకోవ టానికి గాత్ర సాధన కూడా అవసరమని ,సాధనకన్నా సంగీతం  వినటం ఎక్కువ అవసరమని ,కచేరీముందు అదనపు సాధన విజయాన్నిస్తుందని తన కుమార్తె యోగ కీర్తన కూడా ఇదే కోవ లోకి చెందుతుందని వీణా ‘’యోగం’’ లో అందరి ప్రోత్సాహ’’ వందనాలు’’ అందుకొంటున్న ‘’యోగ వందన ‘’గారి మాటలు అందరూ ఆలోచింప దగినవే .

Inline image 9

‘’ఇది విన్నారా ,కన్నారా ‘’అనే ఈ సంగీత ధారావాహిక ఇంతటితో సమాప్తం .

మొదట్లోనే చెప్పినట్లు ఈ బృహత్ రచనకు ఆధారం –తెలుగు అకాడెమి వారు ప్రచురించిన ఆచార్య శ్రీ ముది గొండ వీరభద్రయ్య గారి రచన ‘’మన గాత్ర,తంత్రీ వాద్య సంగీత విద్యా నిధులు ‘’అని వినయ పూర్వకం గామళ్ళీ  తెలియ జేస్తూ,ఇంత మంది సంగీత సరస్వతులను ,వారి గురు మహోదయులను ,శిష్య ప్రముఖులను పరిచయం చేసే మహా అదృష్టం నాకు దక్కిందని పొంగిపోతూ ,ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారి కీ ,వారి విశేష కృషికి నమస్కరిస్తూ   సెలవు తీసుకొంటున్నాను .

Inline image 10

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్- 20-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్ .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 29 నేటి వైణికులు 39-పుదుక్కోటై కృష్ణ మూర్తి

ఇది విన్నారా కన్నారా !  29

నేటి వైణికులు

39-పుదుక్కోటై కృష్ణ మూర్తి

308 –నేటి అగ్రశ్రేణి వైణికులలో పుదుక్కోటై కృష్ణ మూర్తి ఒకరు .అయన లో అనేక వాదనల శైలి మిశ్రమితమై ఉంది .అందరి లోని మేలిమిని గుర్తిస్తూ తనదైన శైలి ఏర్పరచుకొన్నారు .7-10-19 39 లో మీనా౦ బాళ్ ,రామస్వామి దంపతులకు కొడైకెనాల్ లో జన్మించారు ..తండ్రి పుదుక్కొట రాజావారి కార్ డ్రైవర్ .9 వ ఏటనే పుదుక్కోటై శ్రీనివాసన్ దగ్గర సంగీత శిక్షణలో చేరి 13 వ ఏట గాత్ర కచేరీ చేశారు .అన్నామలై విశ్వ విద్యాలయం లో సంగీతం లో బాచిలర్ డిగ్రీ పొంది ,20 వ ఏటతిరుచ్చి,,మద్రాస్ ఆకాశవాణి లనుంచి కచేరీలు చేశారు.22 వ ఏట 1961 లో తిరుపతి దేవస్థానం సంగీత కళాశాలలో చేరి 1997 వరకు అధ్యాపకులుగా చేసి ,ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ పొందారు  .విరమణ తర్వాత శ్రీ సత్య సాయి మీర్ పూరి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ ప్రిన్సిపాల్ అయి సర్టిఫికేట్ ,డిప్లొమా కోర్స్ లకు రూప కల్పన చేసి ,బాబా నుండి ప్రశంసలు పొందారు .

309- .’’వైణిక పంచానన ‘’ ,వైణిక గాయక ‘’బిరుదులు  పొంది గాత్ర వాద్య మాదుర్యాలతో మెప్పించారు .పరమనాజూకైన తమగాత్రం తో పాత పాడుతూ వీణ వాయించి సవ్య సాచి అనిపించారు .రెండిటిని సమాన ప్రతిభతో వ్యక్తం చేయటం వారి ప్రత్యేకత .వారికి అపారమైన కీర్తన పాఠం ఉన్నదని,తానం లో అందే వేసిన చేయి అని ,సప్తవిధ తానాలు అలవోకగా వాయించ గలరని హామీరు ,కల్యాణి రాగాలను వాయించేటప్పుడు అచ్చంగా హిందూస్థానీ పద్ధతిలోనే వాయిస్తారని ముదిగొండవారంటారు .

310- సాధారణం గా వైణికులు తమ వీణకు మేళం కట్టుకోరని ,కాని కృష్ణమూర్తిగారు తామే కట్టుకొని ,కొత్త పద్ధతులను కూడా కనుక్కోన్నారని చెక్కతో మేళం కట్టుకోవటాన్ని సాధించారని వీణ కుండ సైజు ను తగ్గించి స్థాయిని 1 ½ స్థాయిగా మార్చి అంటే’’ మానవుడికంఠం పలికే స్థాయి’’కి చెక్కమేళం కట్టి ,యాళి ముఖాన్ని పై వైపుకు మార్చి ‘’కృష్ణ వీణ ‘’అని పేరు పెట్టారని ఆచార్య శ్రీ తెలిపారు .భార్య పద్మా కృష్ణ మూర్తి గారితోకలిసి సంగీత కేసెట్ తెచ్చారు .

311-5-2-2003 న విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో గురు పూజోత్సవ సమయం లో శ్రీ అన్నవరపు రామస్వామి గారు కృష్ణ మూర్తిగారిని  సన్మానించి ,వెండి వీణ బహూకరించి ‘’వీణా వాద్య విద్వద్మణి’’బిరుద ప్రదానం చేశారు .పదవి విరమించాక తిరుపతిలో స్థిరపడి వీణ మీటు ,సరలీస్వరాల నుంచి రాగం తానం ,పల్లవి దాకా నేర్పటం పై 32 డి,వి.డి.లను సిద్ధం చేసి కొత్త రీతిలో గురుత్వం వహిస్తున్నారు .ఇవి 38 గంటల నిడివి ఉన్నవి .ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన 4 సంవత్సరాల సర్టి ఫికేట్ కోర్స్ కు దృశ్య శ్రవ్య మాధ్యమాలలో వాయించి చూపారు .స్పెయిన్ కెనడా దేశాలు భార్యతో పర్యటించి వీణ కచేరీలు చేసి మెప్పు పొందారు .

Inline image 1

40 –అయ్యగారి శ్యామ సుందర్

312-అయ్యగారి సోమేశ్వర రావు గారికుమారులైన శ్యామ సుందర్ తండ్రికి మించిన తనయులు .తండ్రి ‘’వైణిక రత్న ‘’అయితే కుమారుడు ‘’వీణా వాద్య విశారద ‘’.19 48 లో విజయనగరం లో జన్మించి 8 ఏళ్ళకే మొదటికచేరీ చేసిన ఉద్దండ పిండం .4 వ ఏటనే కీర్తనలు వాయించిన ఈచిన్నారికి 5 న చేయాల్సిన అక్షరాభ్యాసం 4 వ ఏటనే చేసి స్పీడ్ పెంచారు తలిదండ్రులు .30 వ ఏట ఆకాశవాణి ఎ గ్రేడ్ ఆర్టిస్ట్ అయ్యారు. అదే వయసులో మద్రాస్ సంగీత అకాడెమి ‘’ఉత్తమోత్తమ వీణా వాదకుని ‘’గా గుర్తిస్తే ,1978 లో శ్రీ కృష్ణ గాన సభ వీరిప్రతిభను గుర్తించి సత్కరించింది

313-త్యాగ రాజ పంచరత్న ఊహా స్వర తరంగిణి ,భ్రమ ,విశ్వ సంగీత పరిణామం అనే వాద్య బృంద రచనలు చేసి ,అనేక యక్షగానాలకు సంగీతం కూర్చి సామర్ధ్యం రుజువు చేసుకొన్నారు .వీరి ‘’నాగ బంధం ‘’రచనకు జాతీయ పురస్కారం లభించింది .17 ఏళ్ళుగా ప్రభుత్వ సంగీత కళాశాలలో పని చేశారు  .విజయవాడ కాలేజి ప్రిన్సిపాల్ గా పని చేశారు వీరి వీణ తరగతి లో 200కు పైగా విద్యార్ధులు ఉ౦డేవారంటే వారి సామర్ధ్యం ఎంతటిదో తెలుస్తుంది .ఆహ్వానం పై అమెరికా వెళ్లి అనేక చోట్ల కచేరీలు చేశారు .’’నాకు అనుభవం అంతా నాన్నగారితో కచేరీలు చేయటం వల్లనే వచ్చింది ‘’అని చెప్పుకొన్నారు .3 గంటల కచేరీలో 20 ఐటమ్స్ వాయించే నేర్పు వారిది .’’వీణ మీద గిమ్మిక్స్ చేయ కూడదు . ,అది సంగీతం కాదు . వీణ పాడాలి ‘’అంటారు .

Inline image 2

41- –రామ వరపు విజయ  లక్ష్మి

Inline image 3

314-కొన్ని వేలమందికి వీణ నేర్పిన విజయలక్ష్మి విశాఖ వాసి .ఆమె పుట్టినిల్లు మెట్టి నిల్లు  రెండూ సంగీత నిలయాలే పట్రాయని నారాయణ మూర్తిగారి వద్ద పదేళ్ళు నేర్చారు .ఓలేటి వెంక టేశ్వర్లుగారి కర్నాటక హిందూ స్థానీ బాణీల సమ్మేళన పధ్ధతి బాగా నచ్చి దానిలో సాధన చేసి అగ్రభాగాన నిలిచింది .కుమార్తె మాధురి వైణికురాలు ,కుమారుడు తేజస్వి మార్దంగికుడు .సంగీతం లో డాక్టరేట్ పొందాడు .ఉక్కు విశాఖ ను సంగీత విశాఖ గా తీర్చి దిద్దిన ఘనత రామ వరపు విజయ లక్ష్మిగారిదే .ఆమె శిష్యురాళ్ళు డా పద్మిని ,మాధురి లు అంతర్జాతీయంగా ఎదిగిన విద్వాంసులు.

Inline image 4

42-దుడ్డు సీతా రామయ్య

315-20-2-1956 న జన్మించిన సీతారామయ్య 1994నుంచి హైదరాబాద్ త్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాలలో వీణా చార్యులుగా పని చేస్తున్నారు .9 వ ఏటనే వీణ మీటిన ఈ చిరుత 1973 లో చిట్టిబాబుగారి వీణ కచేరి చూసి ప్రేరణ పొంది సాధన చేశారు .కౌశల్యం వచ్చాక నేపాల్ ప్రధాని కొయిరాల ,మెక్సికో గవర్నర్ ఆల్బర్టో కార్దినాస్ సమక్షం లో కచేరీలు చేశారు .

316-వీణ లో దొడ్డ వారైన దుడ్డువారు శయన వీణా విధానాన్ని మార్చి ఊర్ధ్వ వీణగా వాయించటం మొదలు పెట్టారు .తాళానికి ‘’మెట్రో నిం ‘’(తాళయంత్రం ) ఉపయోగిస్తారు .’’చిట్టిబాబు గారి వాదనలో మెలోడి ఉంటుంది .అదే పండితుడిని ,పామరుడిని కట్టి పడేసింది .చిట్టిబాబు గారే నా ఇన్ స్పి రేషన్ ‘’అన్నారు దుడ్డు వారు .’’పుదుక్కోటై క్రిష్ణమూర్తిగారిలో ఒక టెంపో ఉంది .అది హుషారెత్తిస్తుంది .గమకం ,అలవోకతనం గాత్ర ధర్మం వాద్య ధర్మం ఉంటాయి .స్వర కల్పనలో నిర్దుష్ట మైన మాద మేటిక్స్ ఉంటాయి ‘’అని అభిప్రాయపడ్డారు .

317 –‘’వీణ మీద తానం ప్రత్యేక అంశం .తానానికి ఎక్సేర్ సైజు లుంటాయి .ఇవన్నీ చెప్పి ,కలిపేస్తే సామాన్యంగా సులభం గా ఉండే రాగాలలో తానం వాయి౦చేట్లు విద్యార్ధిని సిద్ధం చేయ వచ్చు. తానం లో లయ ఉంది .జాగాకి రావాలన్న టెన్షన్ ఉండదు ‘’అన్నది దుడ్డువారి దొడ్డ అభిప్రాయం .మంచి ప్రయోగశీలి ఉత్తమ అధ్యాపకులు మేధా సంపత్తి ఉన్నవారు సీతారామయ్యగారు అని వీరభద్రయ్యగారి విశ్లేషణ .

43-కాజా సుభాషిణీ శాస్త్రి

318-వాసా కృష్ణ మూర్తిగారి శిష్యులలో ఇప్పుడు వీణ బాగా వాయించేముగ్గురిలో శ్రీమతి కాజా సుభాషిణీ శాస్త్రి ,శ్రీమతి ఆనంద రాజ్య లక్ష్మి శ్రీమతి అంబుజ వల్లి గారు అని ముదిగొండ ఉవాచ .ముగ్గురూ ముగ్గురే .సంగీత అమ్బోనిది ని చిలికి అమృతం తెచ్చినవారే నంటారు .కచేరీలు చేస్తూ గాన సభలు నిర్వహిస్తూ విద్య నేర్పుతూ మూడింటిలోనూ అసామాన్య ప్రతిభ చూపినవారు సుభాషిణీ శాస్త్రి .1958మే నెలలో కందుకూరులో రాజేశ్వరి నరసింహం దంపతులకు జన్మించారు .విశాఖలో వాసావారి శిష్యురాలై వీణ అభ్యసించారు .వాసావారికి లలిత ,సినీ సంగీతం ఇష్టం లేదని ఆమె చెప్పారు .

319- అరుణాచల శాస్త్రిగారిని వివాహం చేసుకొని హైదరాబాద్ లో ఉంటూ మంచాల వారి వద్ద వీణాభ్యాసం కొన సాగించారు .1987లో ఎ గ్రేడ్ ఆర్టిస్ట్ అయి మనరాస్ట్ర , కొచ్చిన్ రేడియో కేంద్రాలనుంచి ,దూరదర్శన్ లలో కచేరీలు చేశారు .ప్రస్తుతం హైదారాబాద్ తెలుగు విశ్వ విద్యాలయం లో బోధిస్తున్నారు .మనో ధర్మ సంగీతాన్ని ఆదరించారు .’’తుమురాడ ,వాసా ,ఈమని త్రయం  తెలుగు వీణకు కొత్త జీవం పోశారు .శాస్త్రిగారి శిష్యుడు చిట్టిబాబుగారు వీణకు హత్తిన మాధుర్యం అంతా ఇంతా కాదు ‘’అన్నారు సుభాషిత౦ గా  సుభాషిణి గారు .1986 డిసెంబర్ లో ముదిగొండవారికి  నిజామాబాద్ లో మామిడి పూడి ఆనంద్ గారి అబ్బాయి సింహాచలం గారింట్లో ఈమని వారితో రెండు మూడు గంటలు మాట్లాడే సదవకాశం లభించిందట .అప్పుడు ముదిగొండ వారు ఈమనివారిని ‘’వీణా వాదనలో బాల చందర్ గారిది ఒక పంధా ,మీది ఒక పంధా గా ఉన్నాయి కదా ఈ రెండిటిలో ఏది శ్రేష్టమైనది ?’’అని అడిగితే తడుముకోకుండా ‘’నా మార్గమే ‘’అని నిర్ద్వంద్వంగా శాస్త్రి గారు చెప్పారట ‘’అది నిజమే .పద నిర్దేశకుడై ఒక రీతికి ప్రవక్త అయిన మహా వైణికుడు తనమార్గం తక్కువదనో ,ఇతరుల మార్గం తనదానికంటే గోప్పదనో అంటాడా ?’’అన్నారు ఆచార్య ముదిగొండ .

320-శ్రీ సంజీవ రెడ్డి తర్వాత హైదరాబాద్ లోని గ్రీన్ లాండ్ సౌధాన్ని యే ముఖ్యమంత్రీ ఉపయోగించలేదని శ్రీ టంగుటూరి అ౦జయ్యగారు ముఖ్యమంత్రి అయి ఆ సౌధానికి మరమ్మత్తులు చేయించి గృహ ప్రవేశం చేసే సందర్భం లో ముఖ ద్వారం ముందు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి వీణ సంగీత కచేరీ  ఏర్పాటు చేయించారని ,అ౦జ య్యగారు గృహప్రవేశం చేయాలంటే శాస్త్రిగారు తమ వాయిద్యాలతో సహా వేదిక వదిలి వెళ్ళాల్సిందే నని ,గంట సేపు జరిగిన ఆ కచేరీని అ౦జయ్యగారు ఆస్వాదించి వేదిక ముందుకు వచ్చి శాస్త్రిగారికి  వారి వీణకు వంగి నమస్కరించి ,వేదికదాటి సకుటుంబం గా గ్రీన్ లాండ్స్ సౌద ప్రవేశం చేశారని అ౦జయ్య గారి సంస్కారం అది అని ,శాస్త్రిగారి వీణ వైదిక మంత్రోచ్చారణ తో సమానమని ,అది సామవేద గానమని ,కచేరీలలో మంత్రం పుష్పాన్ని ,ఘన పాఠాన్ని వాయించటం శాస్త్రి గారి ప్రత్యేకత అని ముదిగొండ వారు ముదిత మనస్కులై వివరించారు .

321-సంగీతం లో పండిపోయిన శాస్త్రిగారు 16 ఏళ్ళ వర్దిష్ణువు అయిన సుభాషిణి శాస్త్రి కి తనతో పాటు కొన్ని కచేరీలలో సహకార వాద్య కారిణిగా అవకాశం కల్పించారని ,కొంత కాలం ఆ శాస్త్రి గారు ఈ శాస్త్రికి వీణ కూడా నేర్పారని ,ఆయనతో చేసిన కచేరీల విషయాలెన్నో తనకు తెలియ జేశారని ఆచార్యులవారన్నారు .శాస్త్రిగారి అరుదైన ‘’లైటర్ మూడ్స్ ‘’అంటే తేలిక లక్షణాలను సుభాషిణి రికార్డ్ చేసి భద్రపరచారు .ఆయన వద్ద సంగీతం నేర్చుకోవటానికి తన రెండున్నర ఏళ్ళ కొడుకు రామ కృష్ణ తో  సహా వెళ్ళేదాన్ని అని వాడుఏడవవకుండా  ఆటబొమ్మలు బిస్కెట్లు తీసుకు  వెళ్ళేదాన్నని కాని ,వాడు శాస్త్రి గారి శాస్త్రిగారి ‘’పాన్ పరాగ్ ‘’డబ్బా తీసుకొని పారి పోయేవాడని ,గురువుగారు వెంటపడి ‘’ఒరే దాన్ని తినకురా ‘’అని అరుస్తూ వెంబడించేఈ చిన్న విషయాలను కూడా తాను  రికార్డ్ చేశానని సుభాషిణి శాస్త్రి గారు చెప్పారు .పెద్దవారి జీవితం లో చిన్న తంతు ఇది .ఇదంతా ‘’జీవన సంగీతమే ‘’అంటారు సుభాషిణి .

322-ఒక సారి శ్రీకాకుళం లో శాస్త్రిగారి కచేరీకి సుభాషిణీ శాస్త్రి గారి కుటుంబాన్ని శాస్త్రిగారు కారులో తీసుకు వెళ్లారట .కచేరీ మొదలవ్వటానికి ముందు సుభాషిణి కొడుకు రామ కృష్ణ శాస్త్రిగారిని ‘’కచేరీ ఎప్పటికి పూర్తీ అవుతుంది తాతగారూ ?అని అడిగితె ‘’బిగ్ ముల్లు 12 ,స్మాల్ ముల్లు9 మీదకు వస్తే ప్రోగ్రాం అయి పోతుందిరా ‘’అన్నారట .పిల్లాడు వాచీ మాటిమాటికీ చూసుకొంటూ9 కాగానే స్టేజి దగ్గరకెళ్ళి గట్టిగా ‘’తాతగారూ ! 9 అయి పోయింది ‘’అన్నాడు .కోపం తెచ్చు కోకుండా’’ తాత శాస్త్రిగారు -‘’అయి పోయి౦ది నాన్నా కచేరీ ‘’అని కొన సాగించారని సుభాషిణిగారు తెలియ బర్చారు .’’జీవితానికి సంగీతం మాధుర్యం తెస్తే ,సంగీతానికి జీవితమూ మాధుర్యం తెస్తుంది .విద్య విషయం లో  శాస్త్రి గారు ఎంతటి రసిక మూర్తి యో ,జీవితం లోనూ వారి శిష్య వాత్సల్యం లోనూ ఆయన పరమ సహృదయ రసమూర్తి ‘’అని చెప్పారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

Inline image 5

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 28 38-కళాప్రపూర్ణ చిట్టిబాబు

ఇది విన్నారా కన్నారా !  28

38-కళాప్రపూర్ణ చిట్టిబాబు

296-1981నుండి 87దాకా తమిళనాడు రాష్ట్ర కళాకారుడుగా ఉన్న చిట్టిబాబు గురించి 656   పేజీలున్న ‘’హిందూ స్పీక్స్ ఆన్ మ్యూజిక్ ‘’గ్రంధం లో  గురించి కేవలం 10 పంక్తులు మాత్రమే రాశారని బాధ అపడ్డారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .కానీ ‘’కన్నడ సంగీత నృత్య పరిభాషా కోశ ‘’లో చిట్టిబాబు గురించి కొన్ని వివరాలైనా సంక్షిప్తంగా తెలియ బరచారని సంతోషించారు.

297 –చల్లపల్లి రంగారావు ,సుందరమ్మ దంపతులకు చిట్టిబాబు 1936 లో కాకినాడ లో జన్మించారు తండ్రివద్దా ,పా౦డ్రవరపు సింగ రాజు గారి దగ్గరా శిక్షణ పొందారు తర్వాత జయుణ్ణి అప్పలాచార్య వద్ద రెండేళ్ళు శిష్యరికం చేశారు .1948భరణీ వారి ‘’లైలా మజ్ను ‘’సినిమాలో మజ్ను వేషధారి అక్కినేనికి బాల మజ్ను వేషం వేయటానికి మద్రాస్ వచ్చి వేషం వేసి మెప్పించారు. ఆసినిమా గొప్ప విజయం సాధించింది .రెండవ సినిమా   బాలరాజు లో కూడా బాల నాగేశ్వర రావు గా నటింఛి  చిట్టిబాబు గట్టి బాబు అనిపించుకొన్నారు .ఈసినిమా కూడా మాంచి హిట్ కొట్టింది   .12 వ ఏట వీణ లో మహా విద్వా౦సుడినవ్వాలనే సంకల్పమ కలిగి ,  చిట్టి బాబు మహా మహోపాధ్యాయ ఈమనిశంకర శాస్త్రి గారి దృష్టిలో పడి వారి వద్ద వీణ నేర్చారు .అసలు పేరు’’ చల్లపల్లి హనుమాన్లు ‘’ను శాస్త్రిగారు ‘’సి .చిట్టి బాబు ‘’గా మళ్ళీ నామకరణం చేశారు .శాస్త్రిగారు ముద్దుగా చిట్టి బాబూ అని పిలిచే పిలుపే పూర్తిగా నామదేయమై పోయింది .

298 – 1948 నుండి62వరకు  ‘’సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రి ‘’లో వీణ కళాకారుడుగా ఉండి,ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావు పెండ్యాల నాగేశ్వర రావు విశ్వనాధన్ –రామ మూర్తి గార్ల వద్ద సంగీత శాఖలో పని చేస్తూ అనేక తెలుగు తమిళ చిత్రాల సూపర్ డూపర్ హిట్ ట్యూన్లకు కారకులయ్యారు  .

13-10-1964 న చిట్టిబాబు అభినందన సభలో డా .పి.వి రాజమన్నార్ ‘’ఒక వ్యక్తీ లలితకళలలో ప్రజ్ఞా వంతుడు కావటానికి ‘’పూర్వ జన్మ పరిపాకం ‘’అవసరం .చిట్టిబాబు వీణా గానం వింటే ఆయన అలాంటి పరిపాకం లో జన్మించినట్లు తెలుస్తుంది సాధారణం గా గాయకులూ వాద్య విద్వాంసులు సంప్రదాయాన్ని అనుసరిస్తూ ,అందులోంచి బయట పడలేక అంటిపెట్టుకొని ఉండి పోతూ ఉంటారు .చిట్టి బాబు అలా కాకుండా సంప్రదాయాన్ని ఆధునిక పోకడలతో మేళవించి ,అద్భుత రస కల్పనలతో స్వకపోల కల్పితమైన ఒక బాణీ కి రూప కల్పన చేశారు .కళకు శిఖరాగ్రం అంటూ ఉండదు .కళాకారుడు కళను నిరంతరంగా ఉపాసన చేయాల్సి ఉంటుంది ‘’అన్నారట .

299 –‘’గాన కళ ‘’1964 సెప్టెంబర్ –అక్టోబర్ సంచికలో ‘’చిట్టిబాబు గారి వీనావాదన విన్నప్పుడు వారి గురువుగారు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి బాణీ స్పురణకు వస్తుంది .’’మార్గ హిందోళ ‘’రాగాలాపన ,కల్యాణి రాగం లో విశిష్ట కల్పనలు అనన్య సామాన్యమైనవి ఉపజ్ఞా  పూరితమైన వీరి భావనా పటిమ పెద్దలైన వైణిక విద్వాంసుల కోవకు చెంది నట్లుగా ఉంది .’’బేహాగ్ ‘’చక్కని హిందూ స్థానీ లో వాయించారు ‘’అని మెచ్చుకోన్నది.

300-తిరువయ్యూరు ‘’శ్రీ త్యాగ రాజ బ్రహ్మోత్సవ సభ ‘’నిపుణుల సంఘం లో చిట్టిబాబు సభ్యులు .కంచికామ కోటి పీఠఆస్థాన విద్వాంసులై వన్నెకెక్కారు .శ్రీ తిరుమల తిరుపతి దేవాలయం ఆస్థాన విద్వాంసులను చేసింది .1990 లో కేంద్ర సంగీత నాటక అకాడెమి పురస్కారం అందజేసి గౌరవించింది .మైసూర్ రాజ దర్బార్ లో ‘’వైణిక శిఖా మణి ‘’బిరుదు ప్రదానం చేశారు .

301  -చిట్టిబాబు ఎందరెందరికో ప్రత్యక్షంగా ,పరోక్షంగా గురువై వీణ నేర్పారు కొలంబియా గ్రామ ఫోన్ రికార్డింగ్ కంపెని వీరి వీణా గానాన్ని ఎల్;పి.రికార్డ్ లుగా ,45 ఆర్. పి.ఏం .రికార్డ్ లుగా తెచ్చంది .వీటికంటే ము౦దేవీరి 75 ఆర్.పి.ఏం రికార్డులున్నాయి .తర్వాతకాలం లో అన్నీ కేసెట్లుగా సి.డి .లుగా వచ్చాయి .తమ శిష్యులైన సుందర్ ,నగేష్ బాబు ,శాంతి రావు ,డా సుమ ,చూడామణి ,శాంత లతో కలిసి ‘’బెల్స్ ఆఫ్ జాయ్ ‘’అనే కేసెట్ ను రికార్డ్ చేశారు .ఇది ‘’శుభోదయం ‘’తో ప్రారంభమై ‘’శుభ రాత్రి ‘’తో పూర్తి అవటం విశేషం .ఇవికాక ‘’సప్త స్వర ,నగు మోము ,రమ్మనవే ,చిన్నం చిరుకులే (రాగమాలిక )తో పాటు స్వయ౦గా ‘’సముద్ర ప్రియ ‘’రాగం లో వాయించిన ‘’కరుణించ వయ్య ‘’అనే కీర్తనలున్నాయి .

302 –ప్రయోగ శీలి అయిన చిట్టిబాబు వీణపై దేనినైనా వాయించవచ్చు ,వీణకు ఏదీ అసాధ్యం కాదు అని రుజువు చేశారు .’’వెడ్డింగ్ బెల్స్ ‘’అనేది పాశ్చాత్య సంగీతాన్ని రుచి చూపించిన కేసెట్ జగత్ ప్రసిద్ధమైంది .చిట్టిబాబుగారి ‘’కొమ్మలో కోయిల ‘’వీణను జన సామాన్యం లో తెచ్చింది .విని పులకించని వారు లేరు .ఆమని కొయిన కలకూజితానికే.మాధుర్యం అద్ది నట్లు ఉంటుంది  .వింటే పులకించి పోవాల్సిందే .

303 –వీణ మీద ‘’వేణు మీటు ‘’ను మీటి వంశీ గానం తో మోహన వంశీ స్వరూపులై భాసిస్తారు .ఇదీ చిట్టిబాబు మరో ప్రత్యేకత .మాంచి స్పురద్రూపి .దైవ భక్తీ అధికం .మాతా పితృ భక్తికి నిలువెత్తు ఆదర్శం చిట్టిబాబు .’’కలై కోవిల్ ‘’అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు .చిట్టిబాబుగారి సంగీత వాద్యం తో వచ్చిన ‘’ఉన్నై పోల్ ఒరువన్ ‘’రష్యన్ అవార్డ్ పొందింది

304 –యుగోస్లేవియా రోమ్ ,జర్మని మలేషియా ,కెనడా మొదలైన విదేశాలలో పర్యటించి అక్కడి రసజ్నులనూ మెప్పించిన వీణ ఘనాపాటీ ,కళా ప్రపూర్ణ చిట్టి బాబు గారు .మద్రాస్ లోని ‘’బాలసుబ్రాహ్మన్య సభ ‘’వైణిక కులాలంకార ‘’బిరుదు నిచ్చి సత్కారించింది .చిట్టిబాబువీణా  వాదన గుణాన్ని’’ కన్నడ సంగీత నృత్య పరిభాషా కోశ ‘’గ్రంధం ‘’మీటుసౌఖ్య ,నాద మాధుర్య ,లయ ప్రచోదనం ‘’అని మహో త్క్రుస్టం గా అభి వర్ణించింది .

305-‘’తెలుగువారి కీర్తి పతాక ,మహా ప్రయోగశీలి ,వీణ వాదనకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన నాద తపస్వి ,గురువు ఈమని నిమరపించిన ప్రియ శిష్యుడు చిట్టిబాబు ‘’అన్నారు ఆచార్య ముది గొండ .

306-9-2-1996 న 60 ఏళ్ళ వయసులోనే చిట్టిబాబు అమరులయ్యారు .బాపు దర్శకత్వం వహించిన’’ సంపూర్ణ రామాయణం ‘’సినిమా కు ‘’రఘువంశ సుధాంబుధి చంద్ర ‘’కీర్తన వీణపై వాయించారు .సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన రాజాజీ జీవితం పై తీసిన తమిళ చిత్రం’’దిక్కట్ర పార్వతి ‘’కి సంగీత దర్శకత్వం వహించారు. దీనికి సంభాషణలు ప్రముఖ మాటల రచయిత’’కన్నదాసన్ ‘’.ఇందులో వాణీ జయరాం పాడిన ‘’ఆగిం మఝై పోఝిందాల్’’పాట విపరీతమైన ప్రజాదరణ పొంది ఆల్ టైం రికార్డ్ అయింది .కన్నడ చిత్రం ‘’శ్రీ రాఘవేంద్ర మహిమే ‘’కు కూడా సంగీత సారధ్యం చేశారు చిట్టిబాబు .ఇది తెలుగులో కి డబ్  అయింది .

307 –చిట్టిబాబు గారి ప్రతిభకు తగ్గ పురస్కారాలు ఎన్నో లభించాయి .కేంద్ర సంగీత నాటక అకాడెమి 1990 లో నాటి భారత రాష్ట్రపతి శ్రీ ఆర్ వెంకట రామన్ గారి చేతులమీదుగా పురస్కారాన్ని అందజేసింది .తమిళనాడు ప్రభుత్వం 19 72 లోనే ‘’కలైమా మణి ‘’పురస్కారం తో గౌరవించింది .ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘’తెలుగు వెలుగు ‘’పురస్కారాన్ని ,తమిళ ప్రభుత్వముఖ్యమంత్రి ఏం జి రామచంద్రన్  ‘’స్టేట్ ఆర్టిస్ట్ అవార్డ్ ‘’ను ,మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ‘’తంత్రీ విలాస్ ‘’బిరుదాన్ని ,ఉప రాష్ట్ర పతి శ్రీ శంకర దయాళ్ శర్మ ‘’స్పిరిట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డ్ ‘’ను ,మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ క్లబ్ ‘’సంగీత కళా నిపుణ ‘’లను అందించి తమను తాము సత్కరించుకొన్నాయి .వీటి కంటే ప్రముఖమైనది మైసూర్ మహారాజు శ్రీ జయ చామరాజ వడియార్ 1967 లో మైసూర్ ఆస్థాన సభలో ప్రదానం చేసిన ‘’వైణిక శిఖా మణి ‘’బిరుదం .అంతేమాత్రమె కాదు అక్కడ చిట్టిబాబు గారు చేసి అత్యద్భుత  వీణా వాదన కచేరిలో ప్రదర్శించిన  అనితర సాధ్యమైన ప్రతిభకు ముగ్ధులైన మైసూర్ మహా రాజా తాము తమ మెడలోనిత్యం ధరించే అతి విలువైన అత్యంత అభిమానమైన  స్వర్ణ ఆభరణాన్ని  స్వయం గా తీసి చిట్టి బాబు గారి క౦ఠానికి. అలంకరించటం గొప్ప చారిత్రాత్మక సంటనం ,చిరస్మరణీయమై నిలిచింది .ఒక వ్యక్తి సామర్ధ్యం గుర్తించటానికి  అంతే సామర్ధ్యం ఉండాలి. మైసూర్ మహా రాజా శ్రీ జయ చామరాజ వడియార్ సాహిత్య ,సంగీతాది కళలన్నిటిలో అందే వేసిన చెయ్యి .అందుకనే వారిని ‘’రాజులలో సంగీత విద్వాంసుడు సంగీత విద్వాంసులలో రాజు ‘’అనే వారు .ఈ అరుదైన సత్కారాన్ని అందు కొన్న చిట్టిబాబు గారు ధన్యులు .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 27 37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం )

ఇది విన్నారా కన్నారా !  27

37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం )

288—వాగ్గేయ కారుడైన విశ్వేశ్వరన్ వందకు పైగా కృతులు ,తిల్లానాలు ,పదాలు ,వర్ణాలు ,కొన్ని లఘు సంగీత రచనలు చేశారు తెలుగు కన్నడ సంస్కృతాలలో ఈ రచనలున్నాయి .దర్బారు ,నాయకి ,ఆరభి ,దేవ గాంధారి ,రీతి గౌళ ,ఆనంద భైరవి ,వరాళి ,శుభ పంతు వరాళి, భైరవి ,శ్రీ ,మనిరంగు ,మధ్యమావతి వంటి గొప్పరాగాలలోనూ రచన చేశారు కొన్ని హిందుస్తానీ లో  చేశారు .కర్నాటక సంగీతం గొప్పతనాన్ని గురించి వీరభద్రయ్య గారితో ‘’Ours is enormously Evolved –ours best chiselled  one ‘’అన్నారట .దీక్షితులవారి హిందోళ రాగ కృతి ‘’నీరజాక్షి కామాక్షి ‘’హిందూ స్థానీ  బాణీ లో మాల్కోస్ రాగం అనిపించేట్లు పాడేవారట .

289 –వీణా వాదనకు గాత్రానికి భేదం లేకుండా వాయించిన ఆమహా వైణికులు విశ్వేశ్వరన్ .యాజ్న వల్క్య మహర్షి చెప్పిన –

‘’వీణా వాదన తత్వజ్ఞః శ్రుతి జాతి విశారదః –తాలజ్నశ్చ ప్రయాసేన మోక్ష మార్గం స గచ్చతి ‘’అన్న శ్లోకం సంగీతోపాసకులందరికి గీతోపదేశం లాంటిది అన్నారు ముదిగొండవారు .

290-మహోన్నతులని వైణికులు తంత్రులపై వాయిస్తుంటే అది వారి గొంతుకలోని స్వర తంత్రులను అనునాదం లో కదిలిస్తాయి .ఏ ధ్వని వోకల్ కార్డ్ లను కదలించ లేక పోతుందో అది గాత్ర హీనమైనదని ఆచార్య ఉవాచ .బహుశా యే వైణికునికీ లభి౦చనిఅరుదైన అదృష్టం విశ్వేశ్వరన్ గారికి దక్కింది .దీక్షితులవారు ఒక సారి కాశీలో గంగా స్నానం చేస్తుండగా వారికి మంత్రం దీక్ష నిచ్చిన చిదంబర యోగి ‘’నీకు మంత్రం సిద్ధి అయింది ‘’అని చెప్పబోయే తరుణం లో దీక్షితులవారి కర కమలాలలోకి వీణ వచ్చి నిలిచింది .నాద జ్యోతి ముత్తుస్వామి దీక్షితులు వాయించిన వీణపై వాయించే అరుదైన అవకాశం విశ్వేశ్వరన్ గారికి కలిగింది .దీక్షితులవారు నిత్యమూ అర్చించుకొనే శ్రీ చక్ర యంత్రం ,గణపతి విగ్రహం ,సుబ్రహ్మణ్య స్వామి పటాలకు రెండు రోజులు పూజించే అదృష్టమూ కలిగింది .దీక్షితులవారి వీణకు యాళి ఊర్ధ్వ ముఖంగా ఉన్నట్లే విశ్వేశ్వరన్ గారు తమ వీణలకూ అలాగే ఉండేట్లు తయారు చేయి౦చు కొన్నారు .దక్షిణాది శిల్పాలన్నిటిలో వీణ యాళి ఊర్ధ్వ ముఖం గా ఉంటుంది అని ఆచార్య శ్రీ పరిశీలించి చెప్పారు.

291-Never has Lakshana  is in the leading position ,and it is only Lakshya that has always hearled ,only  followed Lakshana’’

‘’Lakshya and lakshana should be inseparable .It is only when this tribe grows that there is a meaningful progress in the art and benefit to the recipients of the experience from music be it in the musicians or the listeners ‘’అన్నది విశ్వేశ్వర సంగీత తీర్ధ సారాంశం .

ఆయన లక్ష్య ,లక్షణ సమన్వయానికి ముఖారి రాగం లో విశ్వేశ్వరన్ గారు కట్టిన గీతం గొప్ప ఉదాహరణ

పల్లవి –‘’లక్ష్య లక్షణ సమన్వయ ముఖ్యత నెంతని తెలప నా తరమా ‘’

అనుపల్లవి –‘’లక్ష్యమే ముందుండి రాజిల్లు సంగీతములో

స్వర మేల,కళానిధిని రామామాత్యుడు వ్రాసినది ఈ

సమన్వయ స్తాపనకే నని వినలేదా ?

స్వర లయా౦ కార  గమక రాగ భావ రసములతో

పరమునకు ,ఇహమునకు ఏక సాధనమని చెప్పిన

వర  నిశ్శంకునికి యశము నిచ్చిన అంతక ప్రముఖారి

విశ్వేశ్వరుని వర ప్రసాదమైన సంగీతములో ‘’  .

292 –విశ్వేశ్వరన్ గారికి దేశ ,విదేశాలలో ఎన్నో గౌరవ పురస్కారాలు లభించాయి .చెన్నై శ్రీ కృష్ణ గాన సభ ‘’సంగీత చూడామణి ‘’బెంగుళూర్ వారు ‘’పలని సుబ్రహ్మణ్య పిళ్లే ‘’పురస్కారాన్ని ,కర్నాటక గాన కళా పరిషత్ ‘గాన కళా భూషణ ‘’బిరుదు తోపాటు ‘’ఆలిండియా మ్యుజీషియన్స్ సిల్వర్ జూబిలీ కాన్ఫ రెన్స్ ‘’కు అధ్యక్షునిగా ఎన్నుకొన్నది .వ్యాస రాజ ధర్మ సంస్థానం పరివ్రాజకాచార్యులు ‘’సంగీత సార్వ భౌమ ‘’ను ,ప్రపంచ సంగీత దినోత్సవం నాడు ఆకాశ వాణి ‘’జాతీయ పురస్కారాన్నిఅందించగా   ,అమెరికాలో కాలిఫోర్నియా ‘’ధియోడోర్ ధామస్ విశ్వేశ్వరన్ గారిపై ఒక  డాక్యు మెంటరిని తీశారు .20 02 లో కర్నాటక ప్రభుత్వం ‘’రాజ్య సంగీత విద్వాన్ ‘’ప్రదానం చేసింది

293 –ఇంగ్లాండ్ ,ఐర్లాండ్ లకు మూడు సార్లు వెళ్ళారు .బి బి సి  వీరి కచేరీ రికార్డ్ చేసింది కేంబ్రిడ్జ్ ,డబ్లిన్ ,బర్మింగ్ హాం బెల్ ఫాస్ట్ మొదలైన రేడియో కేంద్రాలు టి వి కేంద్రాలు వీరి సంగీతాన్ని ప్రసారం చేశాయి .వీరి వీణా వాదన ను సంగీత కంపెని –సంగీత వీణా వైభవ ,గ్రేట్ రాగాస్ ,సోల్ స్టర్రింగ్ రాగాస్ మొదలైన కేసెట్లుగా తెచ్చింది .’’ఏకత లో భిన్నత ‘’సర్వం ఖల్విదం బ్రహ్మ ,వాది రాజు మొత్తం రచనలకు ‘’భ్రమర గీతం ‘’రచన చేసి రికార్డ్ చేశారు

294 –విశ్వేశ్వరన్ గారి భార్య ఉషాదేవి .కూతుళ్ళు విద్యా నటరాజ్ ,వీణా జయంత్ లు .కుమారుడు కార్తీక్ అందరూ వైణికులే .ఆయన చదువు ఏం యే –ఇండాలజీ .1965 లో మైసూర్ విశ్వ విద్యాలయం సంగీత నృత్య కళాశాల స్థాపించి విశ్వేశ్వరన్ ను మ్యూజికాలజిస్ట్ గా నియమించింది .1973 లో వీణ అధ్యాపకులై 78లో వాద్య సంగీతాఆచార్యులుగా పదోన్నతి పొంది ఎందరెందరికో వీణ విద్యనూ నేర్పారు

295 –‘’ధన్యుడనైతి ని సంగీతమును నేర్చి నందువలన ‘’అని కీర్తనలో తన మనో ప్రవ్రుత్తి చాటారు .కన్నడదేశం లో తెలుగు మర్చి పోతున్న తెలుగు కుటుంబీకుడు అయిన విశ్వేశ్వరన్ దేవ గాంధారి రాగం కీర్తన ఆయన ఎంతటి వినీతులో తెలియ జేస్తుంది –

‘’అంతరంగము తెలిసి పాడిన –సంగీతమునకు మాత్రమే  పూర్ణార్ధము

చింతన ,మనన ,సాధన జత గూర్చి –మన కెంతో చక్కని మార్గము జూపిన పెద్దల ‘’.ఒక్కటి చాలు ఆయన అంత రంగ ఆవిష్కారానికి.  సితార్ విద్వాంసుడు పండిట్ శివ కుమార్ శర్మ వద్ద సితార్ అభ్యసించిన విశ్వేశ్వరన్ ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు జి .యెన్ .బాల సుబ్రహ్మణ్య౦ గారికి’’ నెవ్యు’’.   2007 లో 63 వ ఏట వీణా పాణి విశ్వేశ్వరన్ తన తల్లి సంగీత సరస్వతీమాత సంగీత  సామ్రాజ్యం లో ఆస్థాన విద్వాంసుడు గా  చేరటానికి ఇహలోకం వీడారు .

Inline image 1  Inline image 2Inline image 1Inline image 2

g.n bala subramanyam

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 26 37-వీణా పాణి విశ్వేశ్వరన్

ఇది విన్నారా కన్నారా !  26

37-వీణా పాణి విశ్వేశ్వరన్

281-తెలుగు మాతృ భాష అయినా  విశ్వేశ్వరయ్య ఎప్పుడో మైసూర్ రాష్ట్రానికి తరలి వెళ్లి పోయారు .అందుకే ఇంటి పేరు తండ్రి పేరే అయింది .తల్లి వరలక్ష్మి ,తండ్రి రామయ్య గార్లు .కనుక రామయ్య గారి విశ్వేశ్వరయ్య ఆర్ .విశ్వేశ్వరయ్య అయ్యారు .కుటుంబం లో అందరికి సంగీతాభిమానం ఉంది .విశ్వేశ్వరన్ ఎవ్వరి వద్దా వీణ నేర్చుకోలేదు వీనావాదనం ఆయన లోంచి విచిత్రంగా ఆవిష్కారమైంది .అన్న సీతారాం ఆ నాడు ఆస్థాన విద్వాంసుడు .ఒక రోజు అన్నగారు ‘’సామి నిన్నే ‘’అనే శంకరాభరణ రాగం గురు పద్ధతిలో వాయిస్తూ ఉంటే ,అది తమ్ముడు విశ్వేశ్వరన్ కు కర్ణ కఠోరం  అనిపించి ,అలా వాయించ రాదు అని వెక్కిరించారు .’’వాయిస్తుంటే పాడి నట్లు ఉండా’’ అని తమ్ముడు అన్నకు సలహా ఇచ్చాడు ‘.పౌరుషం పొడుచుకొచ్చిన అన్న ‘’మరెట్లా వాయించాలో వాయించి ఏడు ‘’అన్నాడు కోపంగా .ఇది చాలెంజ్ అనిపించి అ౦తకు ముందు ఎన్నడూ వీణను ముట్టుకొని సాధన చేయని  విశ్వేశ్వరన్  వీణ దగ్గరకు వెళ్లి తీసుకొని ‘’దేవుడు పూనిన వాడి ‘’లాగా నిండు గమకం తో పాట పాడినట్లు అని పించేలా శంకరా భరణ  వర్ణాన్ని వాయించాడు .ఇది అటు ‘’అన్నాయి’’ కే కాక ఇటు ‘’తమ్మాయి’’కీ అద్భుతం అని పించింది .దైవానుగ్రహం వలన ఆ రోజు వాయించిన వైనమే ఆయన్ను అగ్రశ్రేణి విద్వాంసుని చేసింది .

282 –బాల్య దశలో జరిగిన పై సంఘటన తర్వాత విశ్వేశ్వరన్ యే రాగాన్ని పట్టుకొంటే ఆ’’ రాగ దేవత’’ ఆయన్ను రెండు ,మూడు గంటలు ఆవహించి ఉండేది .ఇలా చిన్ననాటి నుంచి నాద సుఖాన్ని ,నాదానందాన్ని ఆయన అనుభవించారు .గురువు లేకుండా వీణా సాధన అసాధ్యం .గురుముఖతా నేరిస్తేనే ఎడమ చేతి వ్రేళ్ళతో వాయించే నేర్పు అలవడుతుంది కాని వీటికి అతీతుడైన విశ్వేశ్వరన్ అన్నీ గురువు లేకుండానే దైవ కృప వలన నేర్చుకొన్నారు ఇదొక అద్భుతం

283 –విశ్వేశ్వరన్ వ్రేళ్ళను వీణ మీద సాధించటం తో పాటు తన గొంతునే వీణ మీదకు దింపారు అన్నారు ఆచార్య ముదిగొండ .అందరూ ఇలా చేయగలరా అంటే లేదనే చెప్పాలి .కొందరికే ఇది సాధ్యమయింది .ఆయన వ్రేళ్ళను వినియోగించేవిధానం పరమ నూతనం అని ,దాన్ని చూసి అనుభవించాల్సిందే తప్ప రాతలో వర్ణించి చెప్పలేమని ఆచార్య వీరభద్రయ్య గారి అభిప్రాయం .అందుకే వీణపై ‘’విశ్వేశ్వరన్ రీతి ‘’ఏర్పడింది అన్నారు. విద్యలతల్లి సరస్వతీ మాత మాత్రమె ఆయన గురువు .వేరే గురువెవ్వరూ లేరాయనకు. ఒక నాడు నాదానందం లో లయించి ఉండగా నాద దేవత వాణీ దేవి దర్శన మిచ్చి ,రెండు రోజులు వీరికి విద్యా బోధన చేసింది .వాద్యం లో లీనమయిన వానికి అమ్మ అనుగ్రహం తప్పక ఉంటుంది .అందుకే వీనావాదనం మోక్ష విద్యకు మార్గం అయింది అన్నారు ఆచార్య శ్రీ .గాత్ర ధర్మం లో లేని ఒక్క అంశమూ వారి వీణా వాదనలో వినిపించక పోవటం ప్రత్యేకత .నిష్ణాత్రుత్వం తో విశ్వేశ్వరన్ ‘’స్వయంభు ‘’అయ్యారన్నారు ముదిగొండ వారు .మానుష గురువు లేకుండా ఇంతటి పూర్ణ ప్రజ్న సాధించినవారెవ్వరూ లేరు అని వీరభద్రయ్య గారు వాక్రుచ్చిన మాట యదార్ధం .వీణ చేత బట్టిన ఆరు నెలలకే మైసూరు చుట్టుప్రక్కల వైణికుడు గా విశ్వేశ్వరన్ పరిచయమయ్యారు. వైదుష్య సంపాదనలో ఆయన ఇంకా శిఖరారోహణం చేస్తూనే ఉన్నారు .

284 –నూనూగు మీసాల నూత్న యవ్వనం లో 16 వ ఏట మైసూర్ కు 18 మైళ్ళ దూరం లోని టి .నరసీపూర్ లో రామోత్సవాలలో ఆహ్వానం పై  1947 .ఏప్రిల్ లో 3 ½గంటలు వీణ కచేరీ చేసి అందరినీ తల ఊపేట్లు చేశారు .ఈ తొలి కచేరీకి మృదంగం వాయించిన వారు  మహా మార్దంగికులైన విద్వాన్ శ్రీ చౌడయ్య.వయోలిన్ చౌడయ్యగారికి ,ఈ చౌడయ్య గారు చాలా కచేరీలలో మృదంగం వాయించారు

285 –విశ్వేశ్వరన్ ఎంతటి వైణికులు అంటే వీణ మాస్ట్రో బాలచందర్ నిండు గుండెలతో మెచ్చుకొన్న వైణికులు .విశ్వేశ్వరన్ కంటే వీణ బాలచందర్ నాలుగు ఏళ్ళు మాత్రమే పెద్దవారు .మీటులో ఇద్దరికీ చాలా తేడా ఉంది అన్నారు ఆచార్య శ్రీ .సంగీత సామ్రాజ్యం లో బాలచందర్ మకుటం  లేని చక్ర వర్తి .ఆయన పంధా ఎవరూ అనుసరి౦చ లేరు .ఒక సారి బాల చందర్ ఇంటి పూజా గదిలో విశ్వేశ్వరన్ వీణ కచేరీ ఏర్పాటు చేశారు .ప్రసిద్ధ సంగీత విద్వా౦ సులందర్నీ ఆహ్వాని౦చారు .విశ్వేశ్వరన్ వీణ వాయిస్తున్నత సేపు బాల చందర్ ‘’సెహ బాష్ ,’’భేష్ ‘’అని చాలా సార్లు అని పొంగిపోయి కచేరీ అనంతరం కాశ్మీర్ జరీ శాలువా తో సన్మానించి ,ప్రశంసించారు బాలచందర్ .

286 –ఒక సారి ‘’ఇడయం ‘పత్రిక బాల చందర్ ను ఇంటర్వ్యు చేస్తూ ‘’మిమ్మల్ని మెప్పించిన వైణికులు ఎవరు ?’’’’అని ప్రశ్నిస్తే ‘’వాగ్గేయకారుడు ,అత్యంత ప్రతిభావంతుడు ,మైసూర్ విశ్వేశ్వరన్ నా హృదయాన్ని దోచుకొన్న వాడు ‘’అని చెప్పారు ,1988 లో మైసూర్ లో బాలచందర్ ‘’విశ్వేశ్వరన్ నాకన్నా గొప్ప సంగీత విద్వాంసుడు .నేను కేవలం వైణికుడినిమాత్రమే .ఆయన వైణికుడేకాక వాగ్గేయ కారుడు కూడా ‘’అన్నారు హిమాలయోత్తు౦గ  సదృశ పద్మభూషణ్ డా బాలచందర్ .1990 లో మద్రాస్ లో ‘’సరస్వతీ వాగ్గేయ ట్రస్ట్ ‘’విశ్వేశ్వరన్ స్వీయ రచనల కచేరీ ఏర్పాటు చేయగా బాలచందర్ వచ్చి ఆశీర్వదించి ‘’నా కన్నా కొన్ని సంవత్సరాలు చిన్నవాడే అయిన విశ్వేశ్వరన్ బుద్ధీ ,పాండిత్యం ,సంగీతసార అవగాహన లో ,మేధావిలసనం లో ఎంతో పెద్దవాడు గొప్పవాడు విశ్వేశ్వరన్ లాంటి వారి వలననే మనం సంగీతం లో అసలైన శాస్త్రీయత (క్లాసిజం )ను అవగాహన చేసుకో గలుగుతున్నాం .ఆయన సంగీతాన్ని ,వారు చెప్పే మాటల్ని ,వారి రచనల్లో నిక్షిప్త మైన విలువలను శ్రద్ధగా వినటం వలన మనకు భగవంతుని చేరే మార్గం చాలా సులభతరం అవుతుంది ‘’అని నిండుమనసుతో మెచ్చుకొన్నారు

287 –వీణ పై మొదటి కచేరీచేసిన కొద్ది రోజులకే మైసూర్ రేడియో వారు విశ్వేశ్వరన్ గారిని 1949 లో  వీణ కచేరీకి ఆహ్వానించారు .అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 60  సంవత్సరాలు ఆకాశ  వాణి కేంద్రాలలో వాయిస్తూనే ఉన్నారు .మద్రాస్ సంగీత అకాడెమి వీరి కచేరీ ఏర్పాటు చేసి గౌరవించింది .వీరికి ప్రక్క వాద్యాలు వాయించిన మహా మార్దంగికులలో పాల్ఘాట్ రఘు ,ఉమయాళ పురం శివరామన్ ,గురువాయూర్ దొరై ,ఉపేంద్రన్ ,ఎల్లా వెంకటేశ్వర రావు మొదలైన వారున్నారు.

 

Inline image 1Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-16- కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవాలు -4 మరిన్ని అలంపురం విశేషాలు (చివరిభాగం )

నా కృష్ణా పుష్కర అనుభవాలు -4

మరిన్ని అలంపురం విశేషాలు (చివరిభాగం )

పాప వినాశిని తీర్ధం –

అల౦పురానికి దక్షిణాన అరకిలో మీటర్ దూరం లో ‘’పాప నాశినీ తీర్ధం ‘’ఉంది .అష్టాదశ తీర్ధాలలో తీర్ధ రాజం గా ప్రసిద్ధి .అలంపురం లో బ్రహ్మేశ్వరాలయంసమూహం  ఉన్నట్లే ఇక్కడా ఒక దేవాలయ సముదాయం ఉంది .ప్రధాన ఆలయం చుట్టూ చిన్న చిన్న గుడులు కట్టారు .ఇవి  ద్రావిడ, వేసర పద్ధతులలోఉంటాయి .ప్రధానాలయం లో ‘’పాపనాశేశ్వరుడు  ‘’ఉంటాడు .సూర్య నారాయణ స్వామి ఆలయానికి ,ఇక్కడి ఆలయ మండపానికి స్తంభాలు ,పై కప్పులకు ,వాటిపై ఉన్న మూర్తులకు చాలా పోలికలుంటాయి .ద్వారబంధం స్తంభాలు ,పైకప్పు బండలు ఎర్ర ఇసుక రాతి తో చేయబడ్డాయి .ఒక రంగ మండపం మీద’’ త్రైలోక్య మల్లుని’’ కాలపు శాసనం ఉంది .మంటపం లో దక్షిణాన గణపతి ,సప్త మాతృకలు ,ఉత్తరాన అష్ట భుజ మహిషాసుర మర్దిని విగ్రహాలున్నాయి .ఆలయానికి ఉత్తర ,దక్షిణాలలోచక్కని గుళ్ళు ,మంటపాలు నిర్మించారు స్తంభాలపై రామాయణ గాధ,క్షీర సాగర మధనం శిల్పాలు పరమ రామణీయకంగా దర్శన మిస్తాయి.ఈ గుడులన్నీ నవ బ్రహ్మాలయాల తర్వాత కాలం లో నిర్మింప బడ్డాయి  .చాళుక్య రాజులకాలం నాటి వాస్తు ,శిల్ప పరిణామాల అధ్యయనానికి ఈ రెండు దేవాలయ సమూహాలను తప్పక చూసి తీరాల్సిందే .శ్రీ శైలం ప్రాజెక్ట్ ప్రభావం వలన ఆలంపూర్ కు దగ్గరలోనే ఈ తీర్ధం పునర్నిర్మాణం జరిగింది అన్నారు గడియారం రామ కృష్ణ శర్మ గారు .

Inline image 16

నరసింహాలయం

అలంపురం కోట లోపలే నరసింహాలయం ,సూర్య నారాయణ స్వామి ఆలయాలున్నాయి ఇవి 9 లేక 10 వ శతాబ్దం లో నిర్మించ బడి ఉండచ్చు .నరసింహాలయం శిధిలం కాగా త్రిభువన మల్లుని కాలం లో జీర్ణోద్ధరణ జరిగిందని శాసనం తెలియ జేస్తోంది .ఆ కాలం లో నరసింహ స్వామిని ‘’మాధవ దేవర ‘’అని పిలిచే వారు .గుడి ప్రవేశ ద్వారం ప్రక్కనే ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ,గుడిలో రంగ నాయకులు ,ఆళ్వారులు ,విజయనగర రాజులకాలం లో ప్రతిష్టించారు .లోపల ప్రదక్షిణం చేసుకొనే దారి లేదు .వరుసగా మూడు గర్భ గుడులు ఉండటం విశేషం .మొదటి దానిలో ‘’మాధవీ శక్తి ‘’,మధ్య దానిలో ‘’యోగానంద నరసింహ స్వామి ‘’,మూడవ దానిలో లక్ష్మీ విగ్రహానికి బదులు ‘’చాకమ్మ ‘’విగ్రహాన్ని ప్రతిష్టించారు ఇవన్నీ దివ్య మంగళ విగ్రహాలే .ఇలాంటి దేవాలయాన్ని  ‘’త్రిక దేవాలయం ‘’అంటారని శర్మ గారన్నారు .ఉత్సవ మూర్తులు పంచలోహ దాక్షిణాత్య సుకుమార శిల్ప కళా నైపుణ్యం తో ఉంటాయి గర్భ గుడి మీద విమానం ,ప్రవేశ ద్వారంపై గోపురం ఒకే కాలం లో నిర్మించబడి ఉంటాయని గడియారం వారి ఊహ .

Inline image 12Inline image 13

Inline image 14Inline image 15

సూర్య నారాయణ స్వామి దేవాలయం

నరసి౦హాలయానికి వెళ్ళే దారిలోనే సూర్య నారాయణ స్వామి గుడి ఉంది ఇదీ సుమారుగా తొమ్మిది ,పదీ శతాబ్దాలలో కట్టినదే. ఆలయానికి ముఖ మండపం లేక పోవటం ఒక ప్రత్యేకత .మూడు వైపులా మూసి ,ఒక వైపు మాత్రమే తెరచి ఉన్న విశాల మండపం ఉంది .ప్రదక్షిణ మార్గం లేదు .మధ్యలో ప్రధాన మూర్తి సూర్య నారాయణ స్వామి కొలువై ఉన్నాడు .ఇరువైపులా శివలింగాలు ఉండటం మరో విశేషం .స్తంభాలపై పురాణ గాధలు చెక్కబడ్డాయి పై కప్పు బండలకు దిక్పాలకులు ,గౌరీశంకర కల్యాణం ,గౌతమ బుద్ధునితో కూడిన నవావ తారాలు శిల్పించబడ్డాయి .ఎర్ర ఇసుక  రాతి కట్టడమే ఇది కూడా .కనుక చాలా ప్రాచీనాలయమన్నారు శర్మాజీ .మూడు గర్భాలయాలపై సోపాన పద్ధతిలో మూడు కదంబ శైలి విమానాలున్నాయి .ప్రధాన దైవం సూర్య నారాయణ మూర్తి విగ్రహం ‘’పాద రక్షల’’తో ఉత్తర దేశ ఆచారాన్ని బట్టి కన్పించటం మరొక ప్రత్యేకత .గణపతి సప్త మాతృకలు ,నంది ,పరశురాముడు నల్లరాతి తో సర్వాంగ సుందరంగా శిల్పీకరించ బడ్డారు .మంటప స్తంభం మీద ‘’కాల చర్య భుజ మల్లుని ‘’కాలం లో కర్నాటక ప్రసిద్ధులైన వణిక్ ప్రముఖులు వేయించిన’’ దాన వాహనం ‘’ఉంది అని అలంపురం పై సాధికారం ఉన్న గడియారం వారు చెప్పారు

Inline image 9Inline image 10Inline image 11

కూడలి సంగ మేశ్వరాలయం

శ్రీ శైలం ప్రాజెక్ట్ వలన ముంపుకు గురైన ఈ ప్రాంతం లో’’ కూడలి సంగమేశ్వరాలయాన్ని ‘’అలంపురం కు తరలించి ఊరి ముందు విశాల స్థలం లో యదా తధంగా పునర్నిర్మించారు .ఈ దేవాలయ గోడలపై ఉన్న మూర్తులు విలక్షణ శిల్ప విన్యాసాన్ని చాతుతున్నాయని శర్మ గారువాచ .నరసింహ సూర్యనారాయణ ,పాప వినాశన ,సంగమేశ్వరాలయాలను  సమయం లేక మేము చూడలేక పోయాం .

అలంపురం మూర్తులు

అలంపురం శిల్పాలలో మూర్తి లక్షణం ,ప్రతిమా లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి .శైవం మూలాధారంగా ఉన్న శిల్పాలివి .హైందవ పురాణ విజ్ఞానం ,తత్వ విచార పరిచయం తెలిసిన వాళ్ళకే వీటిలోని లోతుపాతులు తెలుస్తాయని శర్మగారంటారు దీనికి ఉదాహరణ ఇక్కడి ‘’అంధకాసుర సంహార మూర్తి ‘’,మరియు ‘’ధ్యాన ముద్రా శివ మూర్తి ‘’లను పేర్కొన వచ్చు అన్నారు గడియారం వారు .అలాగే ‘’త్రిముఖ మహేశ మూర్తి ‘’ప్రత్యేకమైనదని ,ఇలాంటిది ఎలిఫెంటా గుహాలయం లో మాత్రమే ఉందని ఈ మూర్తి భగవంతుని సృష్టి స్థితి లయాలను తెలియ జేస్తుందని విశ్లేషించి చెప్పారు నందులలో తల వాకిలి కి ఎదురుగా ఉన్నది అపూర్వమైనదని ,అది గౌరీ శంకరులను మోస్తున్నట్లు ఒకే రాతిలో చెక్కబడిందని ఇలాంటి మూర్తి ప్రపంచం లో ఇంకెక్కడా లేదని ,దీన్ని ‘’వృషభారూఢ మూర్తి ‘’అంటారని తమకున్న అపూర్వ శిల్పాను భవం తో శర్మగారు వాక్రుచ్చారు .

Inline image 6Inline image 7Inline image 8

పురావస్తు సంగ్రహాలయం

మ్యూజియం అనే పురావస్తు సంగ్రహాలయం అలంపురం లో కుమార బ్రహ్మాలయానికి వెనక ,ఒకప్పటి సిద్ధుల మఠం లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది .ఇందులో అలంపురం పరిసరాలలో పడి ఉన్న దేవతా మూర్తులు ,శిలాశాసనాలు తెచ్చి చక్కని పీఠాలపై అమర్చారు .ఇవన్నీ విలక్షణ మూర్తులే .హైందవ విగ్రహ మూర్తి లక్షణాలు తెలుసుకోవాలంటే ఈ సంగ్రహాలయం ‘’అపూర్వ విజ్ఞాన దాయిని ‘’అన్నారు శర్మగారు .

కనుక దైవ భక్తీ ,విజ్ఞాన పరిశీలనా ,చారిత్రిక పరిశోధనా ,వాస్తు, శిల్ప జిజ్ఞాస ఉన్నవారందరూ సందర్శించాల్సిన అపూర్వ క్షేత్రం అలంపురం .ఆలం అనే సంస్కృత పదానికి  ’’ఇక చాలు ‘అని అర్ధం .ఎంత చూసినా ‘’చాలు అని పించని ‘’జిజ్ఞాసా ప్రదేశం అలంపురం .జోగులాంబ దర్శనం ముక్తి దాయకం .ఈ విషయాలన్నీ తెలుసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించండి .అపూర్వ అనుభవం పొందండి .

Inline image 3Inline image 4Inline image 5

శ్రీగడియారం రామ కృష్ణ శర్మ గారు

అలంపురం దేవాలయాలు శ్రీ శైలం ప్రాజెక్ట్ లో జల సమాధి కాకుండా పరి రక్షించినవారు ,ఇక్కడి శిల్ప సంపద ,చరిత్ర ,పురా తత్వ విషయాలను పరిశోధించి ప్రపంచానికి తెలియ జెప్పినవారు ,ఆరు వందల ఏళ్ళ తర్వాత ,జోగులాంబా దేవి నూతన ఆలయాన్ని పూర్వం ఉన్న చోటనె నిర్మించ టానికి మూల కారకులు ,సంస్కృతాంధ్ర కవి ,పండితులు వక్త ,సంస్కర్త ,స్వాతంత్ర్య సమర యోధులు ,చరిత్ర శాసన పరిశోధకులు జీవితం లో  సగం కాలం ఆలంపూరు పరిశోధనలకే వెచ్చించిన వారు , కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత స్వర్గీయ శ్రీ గడియారం రామ కృష్ణ శర్మ గారు .శర్మగారు రచించి 15 వ ముద్రణ పొందిన ‘’దక్షిణ కాశి –ఆలంపూరు క్షేత్రం ‘’పుస్తకమే నేను తెలియ జేసిన విషయాలన్నిటికి ఆధారం అని మనవి చేస్తూ ఆ మహాను భావునికి కై మోడ్పు ఘటిస్తున్నాను .

శర్మగారు 1919 మార్చి 6 న అనంతపురం జన్మించి అలపురం కు వచ్చి స్థిరపడి లో 25-7- 2006 న ల 87 వ ఏట మరణించారు .’’శత పత్రం ‘’అనే వారి ఆత్మకధకు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్నిశర్మగారి మరణానంతరం  అందించింది .మాధవ విద్యా రణ్య చరిత్ర ,హిందూ ధర్మం ,పల్లెపాడులోని విజయాదిత్య తామ్రశాసనం ,కేయూర బాహు చరిత్ర ,విజ్ఞాన వల్లరి ,మన వాస్తు సంపద అనే గ్రంధాలు రాశారు

Inline image 1Inline image 2

పీచే మూడ్

‘’యోగాంబ’’అనే జోగులాంబ శక్తి పీఠాన్ని 15-8-16 సోమవారం సందర్శించిన మేము మధ్యాహ్నం 3 -30 గంటలకు అందరం స్ప్రైట్ తాగి ,మళ్ళీ కారులో హైదరాబాద్ కు బయల్దేరాం .పిల్లలు ‘’ఆకలో అని గోల’’ .దారిలో కేసి ఆర్ గారి ఉచిత టిఫిన్ కాఫీ సెంటర్లు కాని ఉచిత భోజనాలు కాని ఎక్కడా జాడ లేదు .దాబాలపై’’ దాడి’’ చేసి పుష్కర యాత్రికులు ,’’డబ్బు చిలుం’’ వదిలించుకొని అక్కడ ఉన్న అన్నం లాంటి దేదో కతికి, కడుపాకలి తీర్చుకొంటూ కనిపించారు .సరైన హోటల్ ఎక్కడా దొరకలేదు .మధ్యలో ‘’హేబ్బెర్ ‘’అనే ఊరు వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడు కనిపించింది .వెంటనే నాకు ‘’హెబ్బార్ నాగేశ్వర రావు ‘’అనే కవి కధకుడు జ్ఞాపకం వచ్చాడు. బహుశా ఇక్కడి వాడేమో అనుకొన్నాను .దారిలో అంతా’’ బిగ్ పిరమిడ్’’ హోటల్ ఫ్లేక్సీలు చూసి ఆశగా జడ్చెర్ల దాటాక’’ బిగ్ పిరమిడ్ ‘’అనే పెద్ద హోటల్ పై మేమూ దాడి చేద్దామని వెళ్లి కూర్చున్నాం .కాని అక్కడ నీళ్ళ సరఫరా లేదట .ఒక గంట అయ్యాక వండి వడ్డిస్తామన్నారు టిఫిన్లు .నెత్తిన ముసుగేసుకొని ఇంకొంచెం దూరం పోయి అక్కడ విఘ్నేశ్ విరాట్ హోటల్ లో దూరాం .నేను అట్టు ఆర్డర్ ఇచ్చా మిగినవాళ్ళు అట్టు ,చపాతీ ఆర్డర్ ఇచ్చారు .నాకేమీ సహించలేదు. సగం తిని వదిలేశా,ఐస్ క్రీం కొని కడుపు చల్లార్చుకోన్నాం పిల్లలు నేనూ .కడుపు లో ఏదో పడిందనే సంతృప్తి మాత్రమే మిగిలింది .బాచుపల్లి కి రాత్రి 9 గంటలకు చేరుకున్నాం .భోజనం మా అబ్బాయిఇంటి పక్కనే ఉన్న వాడి  బావ మరిది ప్రసాద్ ఇంట్లో .తిని ఇంటికొచ్చి హాయిగా నిద్ర పోయా .ఒళ్ళంతా పులిసింది కనుక నిద్ర బాగా పట్టింది .

అనుకోని కృష్ణా పుష్కర ప్రయాణమే అయినా ఆనందం సంతృప్తి ఆధ్యాత్మిక చారిత్రిక వైభోగాలను అందించింది ఈ పుష్కరం .అలంపురం లో సాంస్కృతిక కార్య క్రమాలూ నిర్వహిస్తున్నారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవం -3-అలంపురక్షేత్ర సందర్శన విశేషాలు

నా కృష్ణా పుష్కర అనుభవం -3-అలంపురక్షేత్ర సందర్శన విశేషాలు

సుమారు పాతికేళ్ళ క్రితం శ్రీ గడియారం రామ కృష్ణ శర్మ గారి జీవిత చరిత్ర చదివాను .వారు మెహబూబ్ నగర్ ప్రాంతం వారని జ్ఞాపకం ,అందులో వారు తాను సంస్కృత కావ్యాలను చదువుకోవాలనే ధ్యేయం తో కృష్ణా జిల్లా తేలప్రోలు దగ్గర ఉన్న చిరివాడ అగ్రహారం లో ఉన్న శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద శిష్యులై వారిఇంట్లో నే ఉంటూ వారి గురుత్వం లో అభ్యసించి ఇంతటి వాడినయ్యానని శాస్త్రి గారి వైదుష్యానికి ఎల్లలు లేవని గురుపత్ని అపర అన్నపూర్ణ అని రాశారు .ఆ తర్వాత శర్మ గారు అలంపురం విశేషాలను ,అక్కడి పురాతన వస్తువులు శ్రీశైలం డాం నిర్మాణం లో మునిగి పోతున్న విషయాలను గురించి రాసి అక్కడి మహా శక్తి పీఠం అయిన జోగులాంబ దేవాలయ వైభవాలను చారిత్రిక నిర్మాణాలను కాపాడే బాధ్యతా తానూ ఎలా తీసుకొని  ఆ పురాసంపదను ఎలా కాపాడినదీ వివరించారు తుంగ భద్రా కృష్ణా సంగమం వలన ఆలయం మునిగిపోకుండా ,పురా సంపద చిద్రం కాకుండా నదిలోగోడకట్టించి కాపాడిన వైనం అంతా ఒక డాక్యుమెంటరీ చిత్రం చూస్తున్న అనుభూతి కలిగేట్లు రాసిన తీరు చదివి వారి పాండిత్య ప్రకర్షకు వైదిక సంప్రదాయ నిబద్ధతకు ఆశ్చర్య పోయాను .అది గొ అప్పుడే నాకు అలంపురం గురించి ,అమ్మవారి గురించి తెలిసింది .అప్పటి నుంచి వెళ్లి సందర్శించాలన్న తహతహ పెరిగి పోయింది .అంత దూరం వెళ్ళాల్సిన పని ఉంటేకదా వెళ్లి చూసేది  .ఆ పని రాలేదు,సందర్భమూ కలగ లేదు  .ఇదిగో ఇప్పుడు’’ బీచుపల్లి రాయుడి దర్శనం’’ తో అనుగ్రహం తో  దానికి సుమారు 40 కిలో మీటర్ల దూరం లోనే అలంపురం ఉందని మా అబ్బాయి చెబితే, కారును అల౦పురానికి పోనిమ్మన్నాను మా మనవడు మనవ రాలు గొణుగుతున్నా,తిండి తిన్న వెంటనే బయల్దేరి మధ్యాహ్నం 12 -30 కి అలంపురం చేరాం .కర్నూలు హై వేకి సుమారు 15 కిలోమీటర్ల దూరం లో సింగిల్ రోడ్ పై అలంపురం చేరాం .హై వే నుంచి కర్నూలు కేవలం 14 కిలో మీటర్లే . ఇన్నేళ్ళకు అలంపురం చూసే అదృష్టం కృష్ణ వేణీ పుష్కరం కలిగించింది .

ఆలంపుర క్షేత్ర వైభవం

ఒక్క జోగులాంబ అమ్మవారిని దర్శించాలంటే ఒక దారి ,కృష్ణా తుంగ భద్రా సంగమ ఘాట్ లలో స్నానం చేయాలంటే మరో దారి ఉంది .అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు సర్క్యులర్ రోడ్ లాగా ఉంటుంది .మేము సరాసరి అమ్మవారి దర్శనానికే వెళ్లాలని అనుకొన్నాం .గుడికి దూరంగా కారు పార్క్ చేయాలని కాంట్రాక్టర్లు ‘’కిరి కిరి ‘’చేసినా మేము దాదాపు గుడి సమీపం దాకా వెళ్లి అక్కడే పార్క్ చేసి నడక శ్రమ తగ్గించు కొన్నాం .ఇక్కడ కూడా యే రకమైన సూచనలు ఇచ్చేవారుకాని దారి చూపే బోర్డ్ లు కాని లేవు .’’అడుక్కుంటూ ‘’వెళ్ళాల్సిందే అలానే వెళ్లాం .ముందుగా అక్కడున్న నవ బ్రహ్మాలయాలు చూశాం .తర్వాత శ్రీ బాల బ్రహ్మేశ్వర ఆలయమూ దర్షించాము .వీటిల్లో ఎక్కడా ‘’పూజార్ల దర్శనం’’ కాలేదు మాకు .తలుపులు తీసే ఉండటం తో స్వాముల దర్శనమే లభించింది .పేర్లు తేడా కాని అన్నీశివ లింగాలే .ఒకప్పుడు ఇది వీర శైవానికి కేంద్రం .బసవన మంత్రి ప్రభావం తో వీర శైవం  ఇక్కడ విజ్రు౦భిం చింది .కూడలి సంగమేశ్వరం లో సంగమేశ్వర స్వామి దర్శనం సకల పాపహరం .కృష్ణా తుంగ భద్రా నదుల్లో పవిత్ర స్నానాలు ,శివ మహాదేవుని దర్శనం ఒళ్ళు పులకరించే విశేషాలు .అలంపురం ఒకప్పుడు ప్రసిద్ధ విద్యాపీఠం గా ప్రసిద్ధి చెందింది ఇందులోని స్థానాది పతులు అందరూ మహావిద్వాంసులు .దాన శాసనాలలో చాలామంది కాలాముఖ శివా చార్యుల పేర్లు ఉన్నాయి .అందులో ‘’బ్రహ్మ రాసి పండిత ,వితరణే౦ద్రరాసి ,భువన శకిత పండిత ,సోమేశ్వర రాసి ,త్రిలోచనముని నాద,లోకాభరణ పండిత ,ఈశాన రాసి ,విద్యా రాసి ‘’మొదలైన పేర్లు శాసనాలలో తరచుగా కనిపిస్తాయి .కొందరు మంత్రులు విద్యాలయాలకు భూరి దానాలు చేసినట్లు ఉంది .ఆనాటి దేవాలయాలు విద్యా కేంద్రాలుగా విలసిల్లాయి .

జోగు లాంబ సందర్శనం

అమ్మవారి ఆలయం కిట కిట లాడుతోంది భక్త జన సందోహం తో .పెద్ద క్యూలున్నాయి .ఉచిత  దర్శనమే .మధ్యాహ్నం 1 గంటకు చేరిన వాళ్ళం జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచచ్చేసరికి మధ్యాహ్నం 3 గంట లయింది .అయితేనేం మహా వైభవ దర్శనం లభించింది .అమ్మవారిని కనులారా దర్శించే అదృష్టం కలిగింది .సర్వాలంకార శోభితయై అమ్మవారు నయనానందకరం చేసింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూశాను .జన్మ ధన్యం, చరితార్ధం అయింది .పాతికేళ్ళ తహ తహ తీరి ఉపశమనం కలిగింది .అమ్మవారి అసలు పేరు ‘’యోగాంబ’’అదే కాల క్రమం లో జోగులాంబ అయింది .సతీదేవి శరీరాన్ని విష్ణు మూర్తి చక్రాయుధం తో 18ముక్కలు చేస్తే అవి పడిన ప్రతి చోటూ శక్తి క్షేత్రం అయింది అని మనకు తెలుసు సతీదేవి పై’’ పెదవి దంతాలు’’ ఇక్కడ పడటం వలన ఇది శక్తి క్షేత్రమై అయిదవ శక్తి క్షేత్రంగా ప్రాధ్యాన్యం పొందింది .ముసల్మానుల  దండ యాత్రలో పురాతన ఆలయం 1390 లో విధ్వంసం కాగా ,615 సంవత్సరాల తర్వాత అమ్మవారి ఆజ్ఞాను సారం ఆమెకు పాత ఆలయం ఉన్న చోటు ననే వాస్తు ప్రకారం పునర్నిర్మించి పాక్షికంగా ధ్వంసమైన అమ్మవారి పాత విగ్రహాన్నే ప్రతిష్టించారు  .అప్పటి దాకా అమ్మవారి విగ్రహాన్ని బాల బ్రహ్మేశ్వర ఆలయం లో చిన్న గుడిలో ఉంచి పూజించారు 9 వ శతాబ్దం లో జగద్గురువులు ఆది శంకరాచార్య స్వామి ఇక్కడికొచ్చి అమ్మవారి దర్శనం చేసి ,అమ్మవారి భయంకర రూపాన్ని శాంతింప జేయటానికి శ్రీ చక్రం ను ప్రతిష్టించారు .విజయ నగర రాజు రెండవ హరి హర రాయల కుమారుడు మొదటి దేవరాయలు తండ్రి ఆజ్ఞపై ఇక్కడికి వచ్చి ముస్లిం సేనలతో యుద్ధం చేసి ఓడించి తరిమేసి ఆలయాన్ని కాపాడినట్లు చారిత్రకాధారం ఉంది .ఈసంఘటన 1390లో జరిగింది.ఆలయం చుట్టూ జలకుండం ,మధ్యలో దేవాలయం ,మండప స్తంభాలమీద  అష్టాదశ మహా శక్తుల మూర్తులు చెక్కబడి ఉన్నాయి .ముఖ మండప పైకప్పు బండలకు నాగం ,పద్మం తీర్చ బడ్డాయి .మిగతా దేవాలయాల్లోనూ ఈ చిత్రాలు ఉన్నాయి .నాగం మన శరీరం లోని మూలాధార చక్ర౦ లోని కుండలినీ శక్తి కి  ప్రతీక .పద్మం శిరసులోని సహస్రారంకు గుర్తు అని గ్రహించాలి .ఈ రహస్యం తెలుసు కొని అమ్మవారిని దర్శిస్తే పరమ వైభోగమే .

నవ బ్రహ్మాలయాలు

దక్షిణ కాశి అని ఆలంపూర క్షేత్రానికి పేరు .నవ బ్రహ్మేశ్వర తీర్ధం అనీ పిలుస్తారు శ్రీశైలాని అలంపురం పశ్చిమ ద్వారం అంటారు .శైవులకు మహా ఆరాధనీయ క్షేత్రం .నల్లమల కొండలలో వెలసిన బాలబ్రహ్మ ,జోగులాంబ దేవి ఆలయాలు నిరంతర౦ భక్తులతో కళకళ లాడుతాయి .తుంగ భద్ర నదికి పడమటి ఒడ్డున ఆలంపూర క్షేత్రం ఉంది .ఈ ప్రాంతం పూర్వం శాతవాహన ఇక్ష్వాకుల బాదామి చాళుక్యుల ,రాష్ట్ర కూటుల ,కల్యాణి చాళుక్యుల కాకతీయుల ,విజయనగరరాజుల ,గోల్కొండ కుతుబ్ షాహీ ల   ఏలుబడిలో ఉండేది .అల౦ పురం పూర్వపు పేరు హలం పురం ,హమలా పురం .ఆరవ త్రిభువన మల్ల విక్రమాదిత్యుని క్రీ శ1101 నాటి శాసనం లో ‘’హటంపుర ‘’అని పేర్కొన బడింది .ఇక్కడి నవబ్రహ్మాలయాలు శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలు .ఆలయాలన్నీ ఎర్ర రాతి నిర్మాణాలే .భారతీయ పురాతత్వ శాఖ ఆలంపూర ఆలయాలను జాతీయ సంపదగా గుర్తించి రక్షిస్తోంది .శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణం లో ఈఆలయ సముదాయాలు పురాతన వైభవ చిహ్నాలు మునిగి పోకుండా ఎత్తైన ప్రదేశం లో మ్యూజియం కట్టి భద్ర పరచారు .నవ బ్రహ్మ ఆలయాలన్నీ7 వ శతాబ్దికిబాదామి చాళుక్య రాజులు నిర్మించిన   శివాలయాలే .

స్కాంద పురాణం లో అలంపురం గురించి ఉంది బ్రాహ్మ దేవుడు అలంపురం లో శివుని కోసం ఘోర తపస్సు చేశాడని ,శివుడు ప్రత్యక్షమై బ్రహ్మకు సృష్టి చేసే వరం ప్రసాదించాడని ఉంది. అందుకే దీనికి బ్రహ్మేశ్వర ఆలయం అనే పేరొచ్చింది .కుమార ,అర్క ,వీర ,విశ్వ ,తారక ,గరుడ ,స్వర్గ ,పద్మ ,బ్రహ్మేశ్వరాలయాలే నవ బ్రాహ్మాలయాలు .ఈ పేర్లు పురాణ ప్రసిద్ధ నవ బ్రాహ్మలు అంటే ప్రజా పతుల పేర్లుకావు .ఈ పేర్లు సిద్ధుడు పరుసవేది కోసం వాడిన మూలికల పేర్లు అయి ఉంటాయని గడియారం వారు తెలియ జేశారు .పాల్కురికి సోమనాధుడు ‘’పండితా రాధ్య చరిత్ర ‘’లో ఇక్కడిక్షేత్ర తీర్ధ విశేషాలను వర్ణించాడు .ప్రతి ఆలయం మీద అష్టదిక్పాలకులు ,శివ ,విష్ణువులు ,నటరాజు ,పురాణ కదా శిల్పాలు భావ గాంభీర్యం తో దర్శన మిస్తాయి ఈశిల్పాల ప్రత్యేకతకు దేశీయ విదేశీయ శిల్ప మర్మజ్ఞులు అబ్బురపడ్డారు .పై భాగం లో గరుడ ,గ౦ధర్వ,కిన్నెర ,కింపురుషాదులు ,మానవ మిదునాలు ,పంచ తంత్ర కావ్య కదా శిల్పాలు అందరినీ ఆకర్షిస్తాయి . ‘’శ్రీమార ,నాయన ప్రియాన్ ,శ్రీ కంఠా చార్యన్ మొదలైన శిల్పా చార్యుల పేర్లు చెక్కబడి ఉన్నాయి .పులకేశి కట్టించిన ‘’పట్టుద కల్లు’’దేవాలయాలకంటే అలంపురం లోని ఈ దేవాలయాలలో అపూర్వ వికాసం కనిపిస్తోందని శ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారు ‘’అల౦పూర్  క్షేత్రం ‘’పుస్తకం లో వివరించారు. అదృష్ట వశాత్తు నాకు వెదక బోయిన తీగ కాలికి తగిలి నట్లుగా ఈ పుస్తకం బయట పుస్తక ఫోటో షాపు లో దొరికింది కొని అందులోని విశేషాలనే తెలియ జేస్తున్నాను .

ఎందుకు దక్షిణ కాశి అయింది ?

శ్రీ శైల క్షేత్రానికి నాలుగు దిక్కులలో నాలుగు ద్వారాలున్నాయి తూర్పు ద్వారం త్రిపురాంతకం .దక్షిణ ద్వారం సిద్ధవటం ,పడమర అలంపురం ,ఉత్తరాన ఉమా మహేశ్వరం ద్వారాలుగా ఉన్నాయి .స్థల పురాణం లో దీన్ని భాస్కర క్షేత్రమని ,పరశురామ క్షేత్రమని ,దక్షిణ కాశి అని వర్ణించారు .కాశీకి దీనికి చాలా దగ్గర పోలికలున్నాయి .కాశీలో ఉత్తర వాహినిగా గంగానది ,64 స్నాన ఘట్టాలు విశ్వేశ్వరుడు,విశాలాక్షీ  ఉన్నారు అలాగే అలంపురం లో కూడా ఉత్తరావాహినిగా తుంగ భద్రా నది ,పాపనాశిని ,మణి కర్ణిక మొదలైన 64 స్నాన ఘట్టాలు ,బాల బ్రహ్మేశ్వరుడు జోగులాంబా ఉన్నారు .కాశీకి దగ్గరలో ప్రయాగలో గంగా యమునా సరస్వతి కలిసి సంగమ క్షేత్రం ఉన్నట్లే ఇక్కడ కూడా కృష్ణానది తుంగ భద్రానదికలిసే కూడలి  సంగమ క్షేత్రం ఉంది .

మత దృష్టిలో కూడా అలంపురం చాలా ప్రాధాన్యత పొందింది .వైదిక మతాలైన శైవ వైష్ణవ ,శాక్తేయ ,గాణాపత్య ,సౌర స్కాంద అనే షణ్మతాలకు చెందినదేవతా మూర్తులు ఇక్కడ ఉండటం మహా విశేషం .ఇక్కడి బ్రహ్మేశ్వరాలయం రస సిద్దులైన శిల్పా చార్యుల చేత నిర్మింప బడింది .ఇక్కడి బాల బ్రహ్మేశ్వర లింగం మహా ఓషధీ సంస్కారం పొందిన మహా మహితాత్మక రసలింగం .ఇక్కడి అధిష్టాన దేవత అష్టాదశ శక్తి పీఠాలలో అయిదవది

ఈ క్షేత్రానికి 12 అధ్యాయాల స్థలపురాణం ఉంది .దీన్ని బట్టి బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశాడని అందుకే బ్రహ్మేశ్వరుడు అనే లింగానికి పేరొచ్చిందని ముందే చెప్పుకొన్నాం ఇతర క్షేత్రాలలో బ్రహ్మ విగ్రహాలు కనిపించవు కాని ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడి లింగం ‘’జ్యోతిర్ జ్వాలామయం ‘’.జమదగ్ని మహార్హి ఇక్కడే తపస్సు చేశాడని భార్య రేణుకా దేవిని అనుమానించి కుమారుడు పరశురాముని చేత వధింప చేశాడని తండ్రిమాట విని నందుకు మహర్షి సంతోషించి వరం కోరుకో మంటే తల్లిని బ్రతికించమని కోరి తిరిగి తల్లిని దక్కి౦చుకోన్నాడని  రేణుకాదేవి తల పరశురాముని గండ్ర గొడ్డలికి తెగి చండాల వాటిక లో పడినందున ,మొండెం తో తలను అతికించే వీలు లేక ఆ తల ‘’ఎల్లమ్మ ‘’అనే గ్రామ దేవతగా పూజలు  అందుకొంటు౦దని జమదగ్ని చెప్పాడు .ఇప్పటికీ ఆ ‘’మొండేమే’’ ‘’భూదేవి’’ పేరుతో పూజింప బడుతోంది .అష్టాదశ తీర్ధాలలో ‘’పాప నాశనం ‘’తీర్ధం విశిష్టమైనదని ,అక్కడి గదా ధర విగ్రహ సన్నిధిలో తీర్ధ ,శ్రార్ధాలు చేస్తే అంతులేని పుణ్యం లభిస్తుందని స్థల పురాణం చెప్పింది. అంతేకాక ఆలంపూర్ దేవాలయాలను రససిద్ధుడు నిర్మించాడని ,కాశీ విశ్వేశ్వర ప్రేరణ తో రససిద్ధుడు ఇక్కడికి వచ్చి క్షేత్ర పాలకుల గురించి తపస్సు చేశాడని బ్రహ్మేశ్వరుడు తలపై నుంచీ ,జోగులాంబ నోటి నుంచి ,గణపతి బొడ్డు నుంచి రసాన్ని ఇచ్చారని ,దానితో ‘’పరుస వేది’’నితయారు చేసుకొని ఇక్కడి ఈఆలయాలను కట్టిస్తూ ఉన్నాడు .’’విలసద్రాజు’’అనేవాడు సిద్ధుడి నుంచి పరుస వేదిని లాక్కొనే ప్రయత్నంలో దాడి చేయటానికి వస్తున్నాడని తెలిసి ,ఆలయాల నిర్మాణం ఇంకా పూర్తికాక ముందే గర్భాలయం లో ప్రవేశించి బ్రహ్మేశ్వర లింగం లో ఐక్యమయ్యాడని కధనం .సిద్ధుని శాపం చేత విలసద్రాజు రాజ్యాన్ని సర్వస్వాన్నీ పోగొట్టుకొని కస్టాలెన్నో అనుభవించి ఒక జింక చేత ఉపదేశం పొంది శివసాన్నిధ్యం చేరాడు .ఈ గాధ ప్రవేశ ద్వారం ముందున్న తోరణ స్థంభం పై చెక్క బడి ఉంది .

ప్రధానాలయం

నవ బ్రహ్మ ఆలయాలు ఉండటం వలననే ఇది బ్రహ్మేశ్వర క్షేత్రమైంది .ఆలయాలన్నీ ఒకే  కాలం లో కట్టినవి కావు బాదామి చాళుక్యులు పాలించిన రెండు వందల సంవత్సరాల కాల గమనం లో కట్ట బడినవి .భారతీయ వైదిక మత వికాసం ,వాస్తు ,శిల్ప రీతులు ,చారిత్రిక విశేషాలు తెలుసుకోవాలను కొనే వారికి ఇది తప్పక చూడ తగిన క్షేత్రం .ఆలయాలకు పడమర దిశ లో మహా ద్వారం ఉంది .దీన్ని 8 వ శతాబ్ది రాష్ట్ర కూట ధారా వర్ష ధ్రువ మహా రాజు సేనాపతి’’ బలవర్మ ‘’కట్టించాడు .శిల్ప రీత్యా దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి .పై కప్పు బండలకు మూడు అంక ణాలలోత్రిమూర్తులు ,మొదటి అంకణంలో పద్మంపై పాము పడగలు ఉండే విష్ణు మూర్తి ,మధ్య అంకణం లో అంధకాసుర సంహార మూర్తి రూపం లో శివుడు ,మూడవ అంకణం లో చతుర్ముఖ బ్రహ్మలను తీర్చి దిద్దారు .మహాద్వారం కింది భాగం లోరెండు వైపులా చిన్న గుళ్ళలో కంచి కామాక్షీ దేవి ,ఏకాంబరేశ్వర శివుడు ఉంటారు .కామాక్షి విగ్రహాన్ని 135 3లో ‘’ పెర్మాడి రాయని మంత్రి ‘’ప్రతిస్టించాడు .ఈవిగ్రహ పీఠానికి మధ్య భాగం లో మూడు మనిషి తలలు చెక్కబడి పరిశోధకులను తికమక పెడుతున్నాయని గడియారం వారు ఉవాచ .ఈ విగ్రహం చాలా ఎత్తుగా చేతిలో కత్తి పట్టుకొని పీఠం పై కూర్చుని ఉండటం మరో విశేషం .నల్లరాతి గంభీరాకృతి శిల్పం ఇది .తారక బ్రహ్మేశ్వర ఆలయాన్ని ఎవరో యే కాలం లోనో ధ్వంసం చేశారు .ఇప్పుడు ఆ దేవాలయం ఎక్కడ ఉందో గుర్తించటం కష్టం అంటారుగడియారం  శర్మగారు

బాల బ్రహ్మేశ్వరాలయం

నవ బ్రహ్మ ఆలయాలలో బాల బ్రహ్మేశ్వరాలయం ప్రధాన మైనది .దీనికి చుట్టూ ప్రదక్షిణ చేయటానికి మార్గం ,ప్రాకారం ముఖ మండపాలను విజయాదిత్య మహా రాజు క్రీ శ.702  లో కట్టించాడు .ఆనాటి ప్రాకార ద్వారం ఇప్పుడు ప్రవేశాద్వారమైంది ..ప్రాకార శిల్పి ‘ఈశానా చార్యుడు ‘’మహా రాజ సత్కారం పొందాడు .ముందరి శాలలో త్రిమూర్తులు దక్షిణాన వీరభద్రుడు ప్రక్కన నవ గ్రహాలూ ఉన్నాయి .

రెండవ ద్వారం దాటితే ప్రదక్షిణా పధం ,మధ్య మండపం ,రధం ఆకారం లోని గర్భాలయం కనిపిస్తాయి మధ్య మండపానికి రెండు ప్రక్కలా రెండు ద్వార పాలకులను చెక్కిన బండలను నిల బెట్టారు .పైభాగం లో ఉండాల్సిన గజలక్షి ఆలయ మరమ్మత్తులలో మాయమైంది .అంతరాలయం లో నాలుగు స్తంభాల మధ్య శివలింగం ఉంది .ఇదే ‘’జ్యోతిర్జ్వాలమయ శివలింగం ‘’.జ్యోతిర్లింగాలలో చెరక పోయినా జ్యోతిర్లి౦గ మే .లింగం తల భాగం దోసిలి ఆకారం లో గుంటలు పడి ఉంటుంది .ఆ గుంటలు లింగాన్నుంచి రస సిద్ధులు రసం తోడిన గుంటలు అన్నారు గడియారం వారు .మంత్రం ,ఔషధ సంస్కారం పొంది బాలబ్రహ్మేశ్వరుడు కోరుకొన్నవారికి కొంగు బంగారమయ్యాడు

గర్భాలయానికి మూడు ప్రక్కలా గూళ్ళలో రససిద్ధి గణపతి ,ఆలింగ న మూర్తి ,రెండు సింహాలపై సమ భంగిమలో చేతిలో ఖడ్గం ధరించి నిలబడి ఉన్న దుర్గా దేవి ఉంటారు .దక్షిణం వైపు ప్రదక్షిణ మార్గం లో ఉన్న స్త్రీ మూర్తిని ‘’కన్యా కుమారి ‘అంటారు .ఉత్తరాన కొన్ని విగ్రహాలు పీఠాలపై ఉన్నాయి . ఇవి ఎక్కడా దొరకని అరుదైన విగ్రహాలు .హిరణ్య కశిపుని స్థానాది పతులు,విశ్వ విద్యాలయం లోని అధ్యాపక మూర్తులు  విగ్రహాలకింద’’వ్యాళ సింహ ,అభినవ త్రిలోచన ,ఈశాన రాశి ‘’,విద్యారాసి ‘’మొదలైన  వారి పేర్లు ఉన్నాయి .వాళ్ళ తలపాగాలు ,జడలు కట్టిన వెంట్రుకలు ,చూడ దగ్గవి .ఈవిగ్రహాల ప్రక్కన పాప వినాశిని నుంచి తెచ్చిన రెండు అపూర్వ విగ్రహాలను ఉంచారు .జ్వాలా నరసింహ ఆకృతిలో హరిహర పంచాయతన మూర్తి ,ఫాలనేత్రమూ కుడి చేతిలో సుదర్శన చక్రం ఎడమ చేతిలో త్రిశూలం ,కుడి చెవికి మకర కుండలం ,ఎడమ చెవికి నాగా భరణం ,కుడి చేత జ్ఞాన ముద్ర ,ఎడమ చేత బిల్వదళం ఉన్న ఈ శిల్పం ఎన్నో ఎన్నెన్నో భావాలకు గుర్తు .ఇలాంటి మూర్తి మరెక్కడా లేదని గంట కొట్టి గడియారం వారు మరీ చెప్పారు ..హిరణ్య కశిపుని కడుపు చీల్చి పేగులు మెడలో వేసుకొన్న పదహారు చేతుల ఉగ్ర నరసింహ మూర్తి గాంభీర్యానికి ప్రతీక. ఈ రెండు శిల్పాలను ఒకే శిల్పి చెక్కి ఉంటారని రామ కృష్ణ శర్మగారు ఊహించారు .గర్భగుడిపై చతురస్రం గా  ఎత్తుగా కట్టిన విమానం ,దానిపై మహా ఆమలకం ,,పైభాగాన శిఖరం ,చాళుక్యుల నాటి కళా వైభవానికి నిదర్శనం .నవ బ్రహ్మాలయాలన్నీ ఒకే రీతిలో ఉండటం ఇంకో విశేషం. గోపురానికి ముందున్న ‘’శుక నాశం ‘’గూడులో దండం పట్టుకొన్న పురుషుడి విగ్రహం ‘’లవ లీశ మూర్తి ‘’అని గడియారం వారు తేల్చి చెప్పారు .

ముందే గడియారం వారి పుస్తకాన్ని చదివి ఉంటే వీటినన్నిటినీ సమగ్రంగా దర్శించి తరించ గిలిగే వాడిని అని ఇప్పుడు అనిపిస్తోంది .యోగం ఉంటె మరొక సారి అలంపురం క్షేత్రాన్ని దర్శించి ఆ శిల్ప కళా విభూతికి జోహార్లు అర్పించాలని ఉంది .దీన్ని చదివి మీరు ధన్యులయ్యారు కనుక ఇవన్నీ గుర్తు ఉంచుకొని ఈ క్షేత్రాన్ని దర్శించమని మనవి .

ఇంకా కొన్ని విశేషాలున్నాయి ఈ సారి తెలియ జేస్తాను .

Inline image 5Inline image 6Inline image 1  Inline image 2Inline image 4Inline image 7Inline image 8Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవం -2 ‘’బాచుపల్లి నుండి బీచు పల్లి ,అలంపురం’’

నా కృష్ణా పుష్కర అనుభవం -2

ఇప్పుడు 2016 లో వస్తున్నవి ఏడవ పుష్కరాలు .ఇంకా ఎక్కడ స్నానాలు చేయాలన్నది ఆలోచన లేదు అని 5-8-16 న రాశాను .నిన్న 15-8-16 సోమవారం భారత 70 వ స్వాతంత్ర దినోత్సవం రోజున తెలంగాణా లో కృష్ణా పుష్కర స్నానం చేశాము .ఆవివరాలే ‘’బాచుపల్లి నుండి బీచు పల్లి ,అలంపురం ‘’శీర్షిక గా తెలియ జేస్తున్నాను ‘

‘’బాచుపల్లి నుండి బీచు పల్లి ,అలంపురం’’

నిన్న 15 వ తేది ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి స్నానం ,సంధ్య ,పూజ లు పూర్తీ చేసుకొని ,రెండు సార్లు కాఫీ త్రాగి ,నేనూ మా రెండవ అబ్బాయి శర్మ ,కోడలు ఇందిర మనవడు శ్రీ హర్ష ,మనవరాలు హర్షితా౦జని కలిసి మా వాడి కారులో వాళ్ళు ఉంటున్న హైదరాబాద్ లోని బాచు పల్లి నుండి శ్రీ ఆంజనేయ క్షేత్రం అయిన బీచుపల్లి కృష్ణా ఘాట్ కు ఉదయం 5 గం లకే బయల్దేరాం .దారిలో తినటానికి పులిహోర ,పెరుగన్నం ‘’మూటలు ‘’కట్టుకొన్నాం .మా శ్రీమతికి కంటి శుక్లాల ఆపరేషన్ చేసి మూడు వారాలు అయినందున ఆవిడను ఇంట్లోనే వదిలి మేము మాత్రమే బయల్దేరాం నేషనల్ హై వే 44 మీద ప్రయాణం చేస్తూ షాద్ నగర్ జడ్చెర్ల మీదుగా మెహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లి ఘాట్ కు ఉదయం 8- 30 గంటలకు అంటే సుమారు మూడున్నర గంటలు కారులో ప్రయాణం చేసి సుమారు 210కిలోమీటర్లు ప్రయాణించి చేరాం  జూరాల ప్రాజెక్ట్ చెర నుండి విడుదలైన కృష్ణమ్మ ఇక్కడ పరవశంగా పరవళ్ళు తొక్కుతూ మహా ప్రవాహంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది .బీచుపల్లికి రెండవ వైపు రంగా పూర్ ఘాట్ ఉంది .అక్కడ నీరు ఘట్లకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించింది నడక దూరం కూడా తక్కువగా ఉన్నట్లు ఉంది .జన రద్దీ కూడా అక్కడ బాగా ఉంది .కాని బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి సుప్రసిద్ధుడు కనుక ఈ ఘాట్ లో కృష్ణా పుష్కర స్నానం చేయాలని వచ్చాం .

ఎ1  కార్ పార్కింగ్ లో కారు ను పెట్టి ,స్నాన సరంజామా ,పూజా సామగ్రి ,తిండీ అన్నీ మోసుకొంటూ సుమారు కిలోమీటరు పైగా ఉన్న బీచు పల్లి రేవు చేరాం .జనం అంత గా రద్దీగా లేరు .ఓ మోస్తరుగా ఉన్నారు .పార్కింగ్ దగ్గరే బస్ స్టేషన్ ఉంది.అక్కడి నుండి అలంపురం కర్నూలు మొదలైన చోట్లకు బస్సులున్నాయి .కర్నూలు చాలాదగ్గర .పుష్కర ఘాట్ లో దిగి మా అబ్బాయి కోడలు మనవ రాళ్ళ కు సంకల్పం చెప్పి కృష్ణా పుష్కర స్నానం చేయించి అర్ఘ్యాలు ఇప్పించాను .తర్వాత మా మనవడు ,నేను దిగి స్నానం చేశాము .కాలుష్యం లేదు మంచి ప్రవాహం .కానిమా  ఘాట్ కు పక్కనే ఉన్న రెండవ ఘాట్ లో కొంచెం లోతు ఎక్కువగా ఉంటె మధ్యలో ఉన్న చిన్న గోడ దాటి అందులో పూర్తిగా మునిగి స్నానాలు చేశాం. చాలా హాయి అనిపించింది ,కొత్త విద్యుత్హు శరీరం లోకి ప్రవేశించిందని పించింది .కరెంట్ అంటే ప్రవాహం కనుక జల విద్యుత్ శరీరం లోకి చేరిందన్నమాట .మాంచి ఉరవడి ఉండటం తో జీవ నదిలో స్నానం చేయటంతో గొప్ప అనుభూతి కలిగింది .అందరం చాలా ఆనందించాం.నేనూ మళ్ళీ సంధ్యావందనం చేసి కృష్ణవేణి కి ,బృహస్పతి శివ సూర్య మొదలైన దేవతలకు,ఋషులకు అర్ఘ్యం ఇచ్చాను. తర్వాత పితృదేవతలకు ,జలతర్పణం చేశాను .జ్ఞాపకం ఉన్న చనిపోయిన బంధువులకు మిత్రులకు కె ఎల్  రావు గారికి కాటన్ దొరకు ,కాంతారావు గారికి ఆర్ ఎస్కె మూర్తి మొదలైన మిత్రులకు జల తర్పణం చేశాను .తర్వాత మా కోడలి చేత  కృష్ణ వేణీ మాతకు అష్టోత్తర పూజ చేయించాను .అంతా అయ్యాక అందరం బట్టలు మార్చుకొని ఒడ్డునే ఉన్న శ్రీ రామాలయాన్ని సందర్శించే ప్రయత్నం చేసి జనం బాగా ఉన్నందున బయటి నుంచే నమస్కారం చేసిలడ్డూ ప్రసాదం కొని ,తిని  ,ప్రక్కనే ఉన్నఅతి ప్రాచీన  బీచు పల్లి ఆంజనేయ స్వామి ని కనులారా దర్శించి ,ప్రసాదం కొని,తిని  బయటికొచ్చి అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని వెంట తెచ్చుకొన్న పులిహోర ,దధ్యోజనం తిని బరువు తగ్గించాం .మందులేసుకొని11గంటలకు  మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయ్యాం .ఈ క్షేత్రం లోనే ‘’కణ్వ మహర్షి ‘’తపస్సు చేశాడని ఐతిహ్యం .ఇక్కడ కణ్వమహర్షి తపోవనం ,ఆయన కు గుడి కూడా కట్టి ఉంది .ఇక్కడ వి ఐ పి లకు ప్రత్యేకఘాట్ ,ప్రత్యేక పార్కింగ్ లు కూడా ఉన్నాయి ‘

బీచుపల్లి ప్రాధాన్యత

మెహ బూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్ట్ కు సుమారు 30 కిలోమీటర్ల దిగువన బీచుపల్లి లో కృష్ణానది ప్రవహిస్తోంది .నదిమీదుగా  బ్రిడ్జ్ కట్టి నేషనల్ హై వేకు కలిపారు .దీనివలన తెలంగాణా ,రాయల సీమలకు గొప్ప సౌకర్యమేర్పడింది .మధ్య ,ఉత్తర దక్షిణ భారత దేశాలను కలిపే భాగం గా నిర్మించబడిన బ్రిడ్జ్ లలో ఇది ఒకటి .మొదట్లో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కృష్ణా నది ఒడ్డుకు 20 0మీటర్ల దూరం లో ఉంది. దీనికి దగ్గర శివాలయముంది ..వర్షాకాలం లో కృష్ణకు ఉద్ధృతంగా వరదలొచ్చి శివాలయం  మునిగి పోయేది .19 92 లో ఒడ్డునే శ్రీ రామాలయం కట్టారు .బీచుపల్లి ఆంజనేయ స్వామి రెండు దీవుల మధ్యలో ఉన్నాడు .10 చదరపు కిలో మీటర్ల వైశాల్యం ఉన్న పెద్ద దీవిఉన్నగ్రామాన్ని గుర్రం గడ్డ అని అంటారు .దీనిలో పంటలు బాగా పండి రైతుల నివాస భూమిగా ఉంది. చిన్నదీవిని నిజాం కొండ అంటారు .బీచుపల్లి లో ఉన్న రెసి డేన్షియల్ స్కూల్ గత 30 ఏళ్ళుగా పదవ తరగతి పరీక్షలలో టాప్ రాంక్ సాధిస్తూ అగ్రభాగాన ఉంది .

శ్రీ బీచుపల్లి ఆంజనేయ వైభవం

15 వ శతాబ్ది లో విజయనగర రాజు శ్రీ కృష్ణ దేవ రాయల ఆస్థాన గురువు వ్యాస రాయలవారు ఈ ప్రాంతం లో పర్యటన చేస్తూ ,శిష్యులతో ఒక సారి ఇక్కడే విశ్రాంతి తీసుకొన్నారు . ..ఈ ప్రదేశం పరమ పవిత్రమైనదిగా భావించి ఇక్కడ శ్రీ ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు తన ఆలోచనలనన్నిటితో ఒక సుందర ఆంజనేయ విగ్రహాన్ని తయారు చేయించారు  .తాను  ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాక ఈ మూర్తిని ఎవరు అర్చిస్తారు అనే అనుమానం రాగా ,ఆ రాత్రి కలలో స్వామి కన్పించి దానికి పరిష్కారం చెప్పాడు అంతే .మంచి ముహూర్తంలో వ్యాస రాయలవారు శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్టించారు .మర్నాడు ఉదయం వ్యాస రాయలవారు నిద్ర లేవగానే ఒక  గిరిజన బాలుడు  తాను ప్రతిష్టించిన హనుమస్వామి విగ్రహానికి పూజ చేస్తూ కనిపించాడు .ఆ కుర్రాడి పేరే ‘’ బీచు పల్లి ‘’.బోయ జాతి కుర్రాడైన బీచుపల్లి ని ఆలయ అర్చకునిగా వ్యాస రాయలవారు నియమించారు .అప్పటి నుంచి ఆ జాతివారే ఆలయ అర్చకులు .అందుకనే స్వామిని ‘’బీచుపల్లి రాయుడు ‘’అని ఆప్యాయంగా పిలుచుకొంటారు .

నిత్యం బీచు పల్లి రాయుడికి తమలపాకుపూజ ,పంచామృత అభిషేకం నిర్వహిస్తారు .మార్గశిర పౌర్ణమి నాడు హనుమజ్జయంతిని  వైశాఖ శుద్ధ చతుర్దశినాడు నృసింహ జయంతిని ఘనం గా నిర్వహిస్తారు .ఈ క్షేత్రం లో వివాహ ఉపనయనాలు చేసుకొంటారు .ప్రశాంత వాతావరణం ఉన్న క్షేత్రం కనుక ధ్యానానికి అత్యంత అనుకూలం .ఈ ప్రాంతం వారికి బీచుపల్లి రాయుడు కులదైవం .ఉత్సవాల రోజున దేశం నలు మూలల నుంచి వేలాది భక్తజనం వచ్చి క్రిష్ణాస్నానం చేసి బీచుపల్లి రాయని దర్శించి మనసులోని కోర్కెను విన్నవించి సఫల మనోరదులౌతారు .

బీచుపల్లి పోతే వాఛి పోద్ది

ఆలయాల సందర్శనం తర్వాత ఎటు పోతే కారు పార్కింగ్ వస్తుందో తెలీక ,చెప్పేవారెవరూ లేక అక్కడి దిశా నిర్దేశం చేసే సూచికలు లేక ,తలో రకంగా చెప్పగా ‘’లాడూ లస్కూ ‘’బుజాన వేసుకొని పొలం గట్ల వెంట పడుతూ లేస్తూ నడుస్తూ ,దాదాపు రెండుకిలోమీటర్లు కాళ్ళు వాచేట్లు నడించి పార్కింగ్ చోటికి చేరితే ,అది వి ఐ పి పార్కింగ్ అని కానిస్టేబుల్ చెబితే మళ్ళీ అరకిలో మీటరు నడిచి కోళ్ళ ఫారాల ప్రక్కన నడుస్తూ ,ఆ కంపు నసాళానికి ఎక్కి చీదరింపు ఏవ గింపు కలిగినా ముక్కు మూసుకొని నడిచి ఎట్లాగో అట్లా మా ఎ 1 పార్కింగ్ చేరి హమ్మయ్య అనుకోని కారులో కూర్చుని  బయట పడే ప్రయత్నం చేశాము .జనమూ పెద్దగా లేరు ,కార్ల హడావిడీ తక్కువే అయినా ఘాట్ దాకా కార్లను పంపించకపోవటం దారుణం .ముసలీ ముతకా అంత దూరం నడిచి వెళ్ళాలంటే’’ కూసాలు ‘’కదిలి పోతాయి .పోనీ అంత స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేస్తున్నారా అంటే అదీ లేదు .ఆటోలు’’ పుష్పక విమానాల్లాగా’’ జనాలను ఎక్కించుకొని ,ఆఘమేఘాలమీద ఘాట్లకు పరిగెత్తుతూనె ఉన్నాయి .సుమోలు కార్లూ కూడా వెళ్ళటం చూశాం .చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేదు .’’డైరెక్షన్ లెస్ యాటి ట్యూడ్’’కు ప్రత్యక్ష నిదర్శనం ఇదే .

సరే అని కారులో బయల్దేరి బయట పడుదామంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు నిర్జన ,కొత్తగా వేసిన కచ్చా ఎర్రమట్టి సన్నని రోడ్డు మీద ప్రయాణిస్తేనే కాని  మెయిన్ రోడ్ కు చేరుకోలేక పోయాం .ఈ ఏర్పాటూ పరమ దారుణంగా ఉంది .అసలు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు .బ్రిడ్జి మీదనుంచే వెనక్కి వెళ్ళే ఏర్పాటు చేస్తే ఎంతో సౌకర్యంగా ఉంది .బ్రిడ్జి కి ఆనుకొనే నది ఉంటె ఈతిప్పలెందుకు అని అందరూ ‘’సన్నాయి నొక్కులు ‘’నొక్కుతూనే ఉన్నారు . .

ఇంకో విశేషం హైదరాబాద్ దాటి వచ్చాక ప్రతి అరకిలో మీటర్  దూరం లోనూ రోడ్డుకు రెండువైపులా ‘’పుష్కర యాత్రికులకు ఉచిత ఫలహారం భోజనం ‘’అని బోర్డ్ లున్నాయి .కాని ఎక్కడా ‘’బావార్చి ‘’అంటే వండి వార్చి వడ్డించిన దృశ్యం కనిపించలేదు .ఇదొక మెహర్బానీ .సరే’’ టోల్ ఫ్రీ ‘’అని నెలల తరబడి మాధ్యమాలలో చెప్పించిన సర్కారు తోలు వలిచి మరీ టోల్ ప్లాజా లలో  టోల్ బాజా మొగిస్తున్నారని కార్ల వాళ్ళు ‘’కార్ కూతలు ‘’కూశారు .అందుకే ‘’బీచ్ పల్లి పొతే వాచి పోద్ది ‘’అన్నాను .

అలంపురం జోగులాంబ దర్శన విశేషాలు తరువాత తెలియ జేస్తాను .అంత దాకా ఓపిక పట్టండి .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-16-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హోసూర్ తెలుగుల ఉసురు పోసుకో కండి

—

తెలుగు సభలు శ్రీనివాసుని పాదాల వద్ద జరుగుతున్న నేపధ్యం లో మన సోదరులై, తమ తెలుగుని రక్షించుకొంటు సంస్కృతిని కాపాడు కొంటూ ,తమని ఎవరూ పట్టించుకోలేదని బాధ పడుతూ, ప్రతి వేదిక పైనా వారి వేదనను వెలి బుచ్చుతూ, తమిళ్ నాడు లో బల వంతం గా చేర్చ బడ్డ తెలుగు వారి ఘోష విని వారికి న్యాయం చేసి ,వారి ఉసురు తగల కుండా చూసుకో వలసిన బాధ్యత నిర్వాహకు లైన ఆంద్ర ప్రభుత్వం మీద ఉంది .ఆ బాధ్యత ను ఈ సభలు సక్రమం గా నిర్వ హించే ఆలోచన చేయక పోతే వారి ని ఓదార్చటం కష్టం .వారికి న్యాయంకల్గించక పోతే తెలుగుకే కాదు తెలుగు ప్రజలకు తెలుగు సంస్కృతికి తీరని అన్యాయం చేసి నట్లే .కనుక సభలు వారికి బాసట గా నిలవాలి .వారికి కావలసిన వన్నీ నెర వేర్చాలి .క్రితం ఏడాది నేను హోసూర్ వెళ్లి అక్కడి తెలుగు భాషోద్యమ నాయకులైన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ,యెన్.ఏం.కృష్ణప్ప ,డాక్టర్ శ్రీ వసంత్ ,శ్రీ కే.మునిరాజ్ శ్రీ ఆర్ .రఘునాధ రెడ్డి గార్లను కలిసి వారి ఘోష విన్నాను .చలించి పోయాను .వారి పోరాట పటిమకు ధన్యవాదాలు అందించాను .మాత్రు భాష పట్ల వారికి ఉన్న మమకారం అర్ధం చేసుకొని అభి నందించాను .అందులో నారాయణ రెడ్డి గారి పాత్ర గణనీయం ..వారితో రెండు గంటలకు పైగా జరిపిన సంభాషణ లో మీ అందరికోసం కొన్ని విషయాలన్దిస్తున్నాను .

.  1970 వరకు సేలం వరకు తెలుగు బోధనా ఉండేది .డి.ఏం.కే.అది కారానికి వచ్చిన తర్వాత తమిళాన్ని నెత్తిన రుద్దాడు కరుణానిధి ముఖ్య మంత్రి .తమిళ భాష దెబ్బతింటుందని హిందీ వ్యతి రేకోద్యమాన్ని నిర్వహించిన ఆ పార్టి తెలుగును కాల రాచటానికి చెయ్యని ప్రయత్నం లేదు .’’తెలుగు ఒళిగ’’అంటే ‘’క్విట్ తెలుగు ‘’ఉద్యమం చేపట్టింది ఆపార్టీ.తెలుగు స్కూళ్ళు అప్పటి వరకు వందకు పైగా ఉండేవి .జనాభా ఒక లక్ష .జనాభాలో తెలుగు వారి శాతం 60%ఉండేది .ఇప్పటికి అంతే కాని విద్యాలయాలు తీసేశారు .హోసూర్ కర్నాటకకు సరి హద్దు కు ఎనిమిది కిలోమీటర్లలో  ఉంది .అయితే తమిళ నాడులో ఉన్నది .పూర్వం దీన్ని ‘’హసవూర్ ‘’అనే వారు .హోయసల రాజుల కాలం లో ఉన్న నగరం .1956 లో సర్వే  చేసిన పటాస్కర్  కమిటీ ఇచ్చ్చిన నివేదిక ప్రకారం హోసూర్ వాళ్ళ ఇష్టప్రకారం యే రాష్ట్రం లో నైనా చేర వచ్చు అన్నాడు . .తెలుగు రాష్ట్రం సాధించే టప్పుడు అందరు హోసూర్ ను మర్చి పోయారు ..వారి ఘోష విని పించుకో కుండా నిర్ణయాలు తీసుకొన్నారు .

తమిళం ముందు చాప కింద నీరు లా చేరిపోయింది .ఇక్కడ తెలుగు సంఘం యాభై ఏళ్ళ పై నుంచే పని చేస్తోంది .తన భావాలను విష్పస్తం గా చెబుతూనే ఉంది .తెలుగు వాడే అయిన కోదండ రామయ్య గారు ఏం .ఎల్.సి.గా ఉండి పోరాటం చేశారు తమిళ నాడు లో తెలుగు భాషోద్యమాన్ని నిర్వహించారు .’’జై తెలుగు తల్లి ‘’నినాదం తో దేశం అంతా దద్దరిల్ల జేశారు .ఇక్కడి ‘’మిత్ర బృందం ‘’బోస్ బజార లో మొదటి సారిగా ఉద్యమాన్ని చే బట్టింది .ఘంటసాల మిత్ర బృందం ఉగాది వేడుకలు ఘంటసాల పాటలు నిర్వహిస్తారు ..’’నడుస్తున్న చరిత్ర ‘’సంపాదకులు శ్రీ సామల రమేష్ బాబు వీరికి గొప్ప ప్రేరణ .వీరితో కలిసి పని చేస్తూ ప్రోత్సహిస్తున్న వారు ప్రముఖ కధకులు ,సామాజిక కార్య కర్త శ్రీ సా.వేం.రమేష్ అంటే వీరందరి దైవ సమానం .స్వర్గీయ కైవారం తాతయ్య ఆధ్యాత్మిక ఆశ్రమం ఎంతో ప్రోత్సహిస్తుంది తాతయ్య గారి ని ,వారి సేవలను నిత్యం వీరు స్మరిస్తారు . తాతయ్య గారు ‘’దూషించు వారి –నయ భాషించి ప్రేమతో భూషించవ మనసా ‘’అని ఉద్బోధించే వారు . .

కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం 2001లో ఏర్పడింది .ప్రతి నెల మొదటి ఆది వారంకోదండ రామయ్య ఆంద్ర సాంస్కృతిక సంఘం భవనం లో  సమావేశమైకవితలు రచనలు చదివి విని పిస్తారు నెలలో మిగిలిన వారాలలో సభ్యులు ప్రాంతాలన్నీ తిరిగి సమస్యలను తెలుసు కొంటారు .తెలుగు బడుల్లో విద్యార్ధులను చేరుస్తున్నారు .మూడేళ్ళు గా కొంత అభి వృద్ధి సాధించారు తమిళ బడులు తెలుగు బడులు గా మారుస్తున్నారు .ప్రతి ఫిబ్రవరి ఇరవై  ఒక్కటి రోజున‘’మాత్రు భాషా దినోత్సవం ‘’నిర్వహిస్తున్నారు .మే నెలలో గిడుగు జయంతిని ,ఉగాది కవి సమ్మేళనాలను నిర్వహించి కవితలను పుస్తక రూపం లో తెస్తున్నారు .బ్రౌన్ ,వేమన జయన్తులను జరుపుతారు . 2004 లో ‘’తెలుగు వాణి ‘’స్తాపించి తెలుగు బోధనా పై శ్రద్ధ చూపుతున్నారు . .’’తల్లి భాష ‘’మాస పత్రిక ఏర్పరచి మంచి సాహితీ సేవ చేస్తున్నారు . రాయ వెల్లూర్ నుండి తెలుగు నేర్చుకోవటానికి హోసూర్ వస్తున్నారు .అజంతా వాచకం తయారు చేసుకొన్నారు కుప్పం వర్సిటి లో రిసోర్సు పెర్సన్ లకు శిక్షణ నిప్పిస్తున్నారు .శిక్షణ నిచ్చిన వారిలో శ్రీ పరిమి రామ నరసింహం గారు గొప్ప కృషి చేస్తున్నారు నూట ఇరవై గ్రామాల నుండి గ్రామానికి సుమారు యాభై మంది దాకా వచ్చి నేర్చుకొన్నారు .స్రీలు కూడా చాలా ఉత్సాహం గా పాల్గొనటం విశేషం .

ఆ ప్రేరణ తో తమిళ విద్యార్ధులు కూడా తెలుగు లో కవిత్వాలు రాశారు .హోసూర్ లో ‘’పల్లె కళల పరస (పండుగ )2007 లో రెండు రోజులు నిర్వహించారు .శ్రీ ఆర్ వి .ఎస్ సుందరం ,శ్రీమతి నాయని కృష్ణ కుమారి ,దేవ పుత్రా మొదలగు హేమా హేమీలందరూ వచ్చారు .తెలుగు కధలపై ‘’వర్క్ షాప్ ‘’నిర్వ హించారు .సా.వేం .రమేష్ ఆధ్వర్యం లో ‘’తిరుచి ‘’లో2008 లో అయిదు రాష్ట్రాల ‘’పల్లె కళల పరస ‘’నిర్వహించి గొప్ప ప్రేరణ కల్పించారు .అక్కడ ఉన్న పద్నాలుగు తెలుగు జాతుల వారిని ఏకం చేశారు .తిరుచి లో అందరు దాదాపు రెడ్లె వాసవీ మహల్ లో తిరుచి కోట ఆకారం లో వేదిక ఏర్పరచి అక్కడ సభు నిర్వహించారు .కేంద్ర ,రాష్ట్ర మంత్రులంతా హాజరయ్యారు .’’దక్షిణ భారత పల్లె కళల పండుగ ‘’అనే బాన్నర్ కట్టుకొన్నారు ‘’మా తెలుగు తల్లికి ‘’పాటతో సభలు ప్రారంభించారు .వచ్చిన అతిధులు అంతా తెలుగు అభి వృద్ధికి హామీ లిచ్చారు .అక్కడ అందరు తెలుగు వారే తర్వాత తమిలులయారు .ఇప్పుడు హోసూర్ ఏం .ఎల్.యే.శ్రీ గోపీనాద్ తెలుగు వాడే మంచి తెలుగు మాట్లాడుతాడు .కూచి పూడి నాట్యం చూసి అంతా అప్రతిభులైనారు .’’తెలుగు ఇంత మధురమా ,తెలుగుకు ఇంత ప్రమాదం వచ్చిందా ‘’అని అందరు ఆశ్చర్య పోయారు .నాలుగు వందల మంది కలా కారులు రెండు రోజులు నిర్వహంచిన వివిధ కార్యక్రమాలను అందరి మనస్సుల్ని ఆకర్షించాయి .తల్లి భాష తెలుగు పట్ల అందరికి పూజ్య భావం ఏర్పడింది .ఇదంతా రమేష్ గారి చలువే అంటారు వీరు .ఈ స్పూర్తితో ప్రతి జిల్లా వారు తామూ ఇలా నిర్వహిస్తామని ముందుకొచ్చి నిర్వహిస్తున్నారు

కరుణా నిది అది కారానికి వచ్చిన తర్వాతా తెలుగు వారిని తమిళులు గా’’ జన గణన ‘’లో మార్చి రాసి ద్రోహం చేస్తున్నారు ..తెలుగు అనేది ఇక నుంచి విని పించ రాదనీ కరుణానిధి కూతురు కని మొలి చెప్పి,తండ్రికంటే నాలుగాకులేక్కువే చదివానని పించింది .దీనితో నిరసన పెరిగింది .ఆందోళనలు ఉద్యమాలు చేశారు .మద్రాస్ నగర వీధుల్లో తెలుగు వాణిని వినిపించారు .ఒత్తిడి పెరిగి కరుణ నిర్బంధ తమిళ చట్టాన్ని రద్దు చేసుకొన్నాడు .అసలు ‘’ఎంగుం తమిళం ఎడియం తమిళం ‘’అంటే ఎక్కడైనా, ఎందులో నైనా తమిళం అనేది కరుణ నినాదం కాని వెనక్కి తగ్గాడు .ఓటర్ల లిస్టు లో తెలుగు పేర్లుంటాయి ఊరి పేర్లు మాత్రం తమిళం లో ఉంటాయి .ఆ నాటి ముఖ్య మంత్రులు ఎడ్యూరప్ప ,అచ్యుతా నందన్,రోశయ్య  కరుణ ను బానే హెచ్చ రించారు .బెంగళూర్ లో వేలాది మంది నిరసన స్వరం అట్టిగా విని పించారు .తెలుగు కన్నడ సంఘాలుకలిసి కట్టు గా పని చేసి జన జాగృతి చేశాఇ . .ఈ బాధ భరించలేక ఎన్నికల ముందు నిది గారు విధి గా తమిళం నేర్చుకోవాలి అన్న పట్టుదల సవరించుకొని ‘’ఎవరి భాష వాళ్ళు నేర్చుకో వచ్చు’’అని ప్రకటింఛి ఉత్తర్వు ను ఇచ్చాడు .అప్పటికే ఆలస్యం జరిగి తెలుగు వారంతా కరుణా నిది పార్టీకి వ్యతి రేకం గా ఓటేసి మట్టి కరిపించి జయ లలితకు పట్టం కట్టారు .ఇప్పటికీ తెలుగు అంటే ఈ ప్రాంతం లోనీ వారికి ప్రాణం .దాన్ని నిల బెట్టుకోవా టానికి యే త్యాగానికైనా సిద్ధమే .దేనికీ భయ పడే తత్త్వం లేని నిజాయితీ పరులు .మన రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఆసరా గా నిలబాది తమిళ నాడు ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపి న్యాయం చే కూర్చాలి ఇప్పటికీ ఈప్రాంత గ్రామాల్లో తమిళం మాట్లాడితే ‘’దిగువ సీమ వాళ్ళు వచ్చారు ‘’ అని ఈసడించుకొంటారు .దిగువ  జాతుల వారే తమిళం మాట్లాడే వారట ..

ఇదీ హోసూర్ ముఖ చిత్రం .కనుక వారికి అన్ని కోణాల్లోనూ న్యాయం జరిపించాల్సిన బాధ్యత తెలుగు సభలు జరిపే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రముఖం గా ఉంది .తెలుగు ప్రజల మీదా ఉన్నాడని మర్చి పోరాదు అని గుర్తు చేయటానికే ఇదంతా రాశాను .వారి ఘోష మనకు ఉసురు కాకూడదు ..వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు .మన వెన్ను దన్ను కూడా అవసరం .ఇప్పటి దాకా తాత్సారం చేసిన ప్రభుత్వం ఇక అలానే ఉపేక్ష  గా ఉంటె తెలుగు వారు సహించరు అనేది గమనించాలి .హోసూర్ తెలుగు సోదర సోదరీ మణులకు మనం అందరం అండ గా నిలవాలి .జై తెలుగు జై జై తెలుగు తల్లి .

 

ఉత్త చవటల్ని గద్దె నెక్కిస్తే ఇలాగే ఉంటాయి ఫలితాలు ! తెలుగు నాట ఒక్క ఎన్టీఆర్ తప్ప తెలుగు కోసం కష్ట పడ్డ నాయకులు లేరు. యజమాని లేని పొలం లాంటిదే ప్రస్తుతం తెలుగు జాతి.

నాల్గవ తెలుగు ప్రపంచ సభల సందర్భం గా అందరికి శుభా కాంక్షలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-12-12- ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 25 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -8(చివరి భాగం )

ఇది విన్నారా కన్నారా !  25

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -8(చివరి భాగం )

272-శంకర శాస్త్రి గారి ప్రతిభ సాంప్రదాయ శాస్త్రీయ సంగీతం లో ఎంత ఉందో ,ఆధునిక శాస్త్రీయ సంగీతం లోనూ అంతే ఉంది .ఆర్కెస్ట్రా సంగీతం భారతీయం కాదు .మన సంగీతం లో ఒక్క కళాకారుడే సంగీత విద్యా ప్రదర్శన చేస్స్తాడు.తాళ ,మృదంగాలు కేవలం సహకారాలే .కాని ఆర్కెస్ట్రాలో అనేక వాద్యాలు ఒకే స్వరాన్ని పలికించటం విశేషం .అంటే గాత్రం లో బృంద గానం లాంటిది ఆర్కెస్ట్రా  అన్నమాట . అదుకే దీన్ని’’ వాద్య బృందం’’ అన్నారు .వాద్యబృందం లో శాస్త్రీయ సంగీతాన్ని వినిపింప జేయటం ,అందులో కూడా రాగం ,తానం ,పల్లవులను వినిపింప జేయటం ,అందులో మరీ ముఖ్యంగా తోడి రాగ౦ తానం ,పల్లవి కట్టటం అన్నీ  శాస్త్రి గారు చేసిన అద్భుతాలే .అద్భుతాలకే అద్భుతం .అద్భుతాలకే అద్భుతం అని పించారు .వీణపై తోడి రాగాన్ని వాయించటం లో శాస్త్రి గారు అద్వితీయులు ..తోడి రాగం లో ఇతర వాద్యాల తోడు గా వాద్య సమ్మేళన రచన గా తీర్చి దిద్ది కొత్త దారి వేసి మార్గ దర్శకులయ్యారు ..వాద్య సంగీతం అంటే సినిమాలో రీ రికార్డింగ్ సంగీతం లా ,లలిత సంగీతంలాఅని పిస్తుంది .శాస్త్రి గారు దీని ట్రాక్ లోంచి తప్పించి శాస్త్రీయ సంగీతాన్ని కూడా ,అందులోనూ రాగం ,తానం ,పల్లవి ని వాద్య సమ్మేళన రచనగా రూపొందించి దివ్యానుభూతిని కలిగించారు అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు .శాస్త్రి గారి వాద్య బృంద సంగీతం వింటుంటే ‘’ఆధునిక కర్నాటక వర్ణాలా !’’అని పిస్తాయన్నారు ఆచార్య శ్రీ .’’మనో ధర్మ సంగీతం శంకర శాస్త్రి గారి లో కొత్త రూపు ఎత్తింది .వీరి వాద్య బృంద సంగీత రచనలన్నీ వారి సృజనాత్మక ప్రతిభకు ఎత్తిన పతాకలు అని ముదిగొండ వారు అన్నమాట అక్షర లక్షలు చేసే సత్య వాక్యం .

273  -సంగీతం లో ఎన్ని ప్రయోగాలు చేసినా శాస్త్రిగారు శాస్త్రీయ సంగీతాన్ని వదిలి పెట్టలేదు .సంగీత శాఖలన్నిటిపైనా వారికి గౌరవమున్నా శాస్త్రీయ సంగీతాన్ని వీణ కచేరీలను వదలలేదు .తనకు అన్ని రాగాలు ఇష్టమే నని ముదిగొండవారి తో జరిగిన ఇష్టా గోష్టి లో చెప్పారు .కాని ‘’శంకర శాస్త్రి తనాన్ని’’ వాయించిన రాగాలలో శంకరాభరణం ,కల్యాణి ,తోడి ,గానమూర్తి ,కీర వాణి రాగాలున్నాయని’’ పసిగట్టారు ఆచార్య వర్యులు .’’శివ దీక్షా పరు రాలనురా ‘’అనే కురువంజి రాగ జావళి వారి వలన కొత్త ప్రాణం పోసుకొన్నదని ,ఆ రాగాలకు ’ పేటెంట్  ‘’శాస్త్రి గారిదే నని ముదిగొండ ఉవాచ .

275-దీర్ఘ ,లఘు కంపితాలతో,మంద్ర ,అనుమంద్ర తంత్రుల విని యోగం లో శాస్త్రి గారు మలయ మారుత వీచికలనే కాక ,ప్రళయ కాల ఝ౦ఝామారుతాలవరకు సృష్టించేవారు .రాగాలాపనలో అనవసర ప్రయోగాలు ,పునరుక్తులు ఉండేవికావు .స్వర ప్రస్తారం లో తాళం తీగెల మీద మీటు శాస్త్రి గారి మరో ప్రత్యేకత .కీర్తన పాఠం శంకర శాస్త్రి గారు వాయించి నంత స్పష్టంగా వాయించ గల వైణికులు ఒకరో ఇద్దరో ఉన్నారేమో నంటారు వీరభద్రయ్య గారు .తానం శాస్త్రి గారి చేతిలో కొత్త అందాలు సంతరించు కొన్నదని ,కచేరీలలో యే రాగం తర్వాత యే రాగం వాయించాలి ,యే రాగాలకీర్తనలకు రాగాలాపన ,స్వర ప్రస్తారం చేయాలి మొదలైన వాటికి శాస్త్రిగారు పెట్టిందే ఒరవడి గా నిలిచింది అన్నారు ముదిగొండ వారు .

276-ప్రతి కచేరీ చివర వీణ పై ‘’మంత్రం పుష్పం ‘’వాయించటం శాస్త్రి గారి ప్రత్యేకత .దీనికి ముందు ‘’కం సెప్టెంబర్ ‘’లోని పాశ్చాత్య సంగీతాన్ని వినిపించేవారు .దీన్ని ఎందుకు వాయించేవారు ?అనే ప్రశ్నకు ‘’ఇందులో ఒక రహస్యం ఉంది .దీని మీటు ‘’స్టక్కాటో’’ పద్ధతిది .తీగ మీద కలిగే’’ అనురణ నాన్ని ‘’ అంటే నిరంతర ప్రవాహాన్ని ఆపే పధ్ధతి అది అన్నమాట .వీణ మీద అన్నీ సాధ్యమేనన్న ‘’ధిషణాహంకారంప్రదర్శనం ‘’‘’శాస్త్రి గారిది అని మనకు తెలియ జెప్పారు ఆచార్య ముదిగొండ .విశ్వనాధ కున్న’’ ధిషణాహంకారమూ’’ ఇలాంటిదే .అది వారిద్దరి గర్వానికి చిహ్నాలు కావు. ప్రతిభ ఉత్పత్తి లకుదర్పణాలు.,పట్టాభి షేకాలు .వీణ లో మమైకం అయి శాస్త్రి గారు చేస్తే భారతీయ సాహిత్యం లో మమేకమై విశ్వనాధ చేశారు .కచేరీ చివరలో శాస్త్రి గారు ప్రవేశ పెట్టిన ఈ రెండు అంశాలు  వారిముఖ్య శిష్యుడైన చిట్టిబాబు గారి లో వృద్ధి పొంది ‘’వెడ్డింగ్ బెల్స్ ‘’అనే పాశ్చాత్య సంగీత క్యాసెట్ ఆవిష్కారమైంది .వేదమంత్రాలను చిట్టిబాబు గారు కూడా కచేరీ చివరలోనే వాయించి గురు సంప్రదాయాన్ని కొన సాగించారు

278 –శంకర శాస్స్త్రిగారు కచేరీలలో విద్వత్ ను ఎంతగా ప్రదర్శించేవారో ,అంతగానూ మాధుర్యాన్ని ఒలికి౦చేవారు . ఈ లక్షణం తోనే  వారి వాయిద్యం వీణ చిరస్మరణీయ మైంది .లాలిత్య ,మాధుర్యాలే లేక పోతే ఈమని శంకర శాస్త్రి లేరు .మాధుర్యానికి అడ్డం వచ్చేదాన్ని దేనినీ వారు అంగీకరించ లేదు .శాస్త్రిగారు అంటే  నిరహం కారులు , నిగర్వులు .తమ విద్య విషయం లో అహంకరించారు .’’సరస్వతీ మాత నా గుప్పిటి లో ఉంది ‘’అని చాటి చెప్పిన రోజూ ఉంది .అయితే ఇది విద్యాబలం వలన చేకూరిన శక్తి అని విస్పష్టంగా ప్రకటించారు ఆచార్య ముదిగొండ .

279-తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులుగా నియమింపబడి శాస్త్రి గారు గౌరవం పొందారు .యూని వర్సిటి  గ్రాంట్స్ కమిషన్  సభ్యులుగా నియమింప బడ్డారు .మద్రాస్ మ్యూజిక్ అకాడెమి లో ఎక్స్ పర్ట్ కమిటీ సభ్యులైనారు .కేంద్ర సంగీత నాటక అకాడెమీ గౌరవ సలహాదారుగా ఉండి,ప్రతిభకల విద్వాంసులనుజాతీయ స్థాయి లో  ఎంపిక చేసే బాధ్యతను స్వీకరించారు  .విద్యా మంత్రిత్వ శాఖకు చెందినా .కర్నాటక సంగీతానికి ఫౌండర్ చైర్మన్ గా  ,ఫిలిం అవార్డ్ కమిటీ  సభ్యులుగాఉన్నారు .

280 –‘’వైణిక శిరోమణి ,వీణా గాన గాంధర్వ ,గాన రూప కళా సరస్వతి ,వీణా వాదన తత్వజ్ఞ,,గాంధర్వ కళానిధి ,గాన కలాధర ,వీణా చక్ర వర్తి ,వల్లకీ వల్లభ’’ మొదలైన బిరుదాలు  శాస్త్రి గారి కీర్తి కిరీటం లో కలికితురాయిల వలె ధగ ధగ లాడాయి వారి ప్రతిభకు తార్కాణాలయ్యాయి .దక్షిణ భారత దేశ సంగీత విద్వాంసులలో  ప్రప్రధమంగా  వారికి ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు లభించింది .సంగీత నాటక అకాడెమి ,సాహిత్య కళా పరిషత్ లు అవార్డులనిస్తే ,,ఆంద్ర విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ప్రదానంచేసింది . సంగీత సరస్వతికి చేసిన సేవను గుర్తించి భారత ఉప రాష్ట్ర పతి శాస్త్రి గారికి ‘’చతుర్దండి పండితః ‘’అని బిరుదునిస్తే భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారాన్ని ప్రదానం చేసి ఈ సంగీత సరస్వతిని  సన్మానించి ధన్యమైంది .

శాస్త్రిగారి కుమార్తె శ్రీమతి కళ్యాణీ నారాయణ రావు దూర దర్శన్ ,ఆకాశ వాణి లలో వీణ పై గొప్ప ప్రదర్శనలు చేసి తండ్రిగారి కీర్తి పతాకను ధరించి ముందుకు దూసుకు పోయింది .

 

సశేషం

Inline image 1  Inline image 2

భారత స్వాతంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-16- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 24 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -7

ఇది విన్నారా కన్నారా !  24

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -7

267-కేవలం వాద్యాలమీదనే కొన్ని స్వరాలతో సంగీత రచన చేసి ,దానిలో సంఘటనల వలన కలిగే అను భూతులను శ్రోతలలో కలిగించాలి అనే మహా విద్యలో శంకర శాస్త్రి గారు అద్వితీయులు .ఈఅనుభవం తో 80 కి పైగా ‘’వాద్య బృంద రచనలు ‘’చేసి వినిపించారు .ఇందులో కొన్ని సంఘటనా నేపధ్యం లో ఉంటె ,మరికొన్ని మహా పురుష జీవిత ఘటనా నేపధ్యం తో ఉన్నాయి .’’సౌమ్య పురుష ‘’అనే పేరుతొ మహాత్మా గాంధీ శత జయంతి ఉత్సవాలకు రచించారు .అలాగే ‘’భారత జ్యోతి ‘’,’’జవహర్ జ్యోతి ‘’దేనికది ప్రత్యేకం గా చేశారు .వీటిలో వీరి కీర్తిని ఎవరెస్ట్ శిఖరం పై అత్యున్నతంగా నిలిపినవి రెండు –ఒకటి ‘’ఆదర్శ శిఖరా రోహణ’’,రెండవది ‘’భ్రమర విన్యాసం ‘’అని ముందే చెప్పుకున్నాం .టేన్జింగ్ నార్కే ఎవరెస్ట్ ను ఎక్కటాన్ని  ‘’ఆదర్శం ‘’గా భావించి ఆ పేరు పెట్టారు ధ్వన్యాత్మకంగా .వాక్కు లేని హృదయ భాషను వారి వాద్య బృందం పలికించి ఆ సంఘటనను ‘’చిరస్మరణీయం ‘’చేశారు శాస్త్రి గారు .అలాగే తుమ్మెద అంటే భ్రమరం జీవితం లోని ఒక్క రోజు జీవితాన్ని సంగీతంగా అనువదించి మాటలకందని భావ వ్యక్తీకరణ చేసి తమ వీణానాదం లోని ఝ౦కా రాలను సహస్రదళ పద్మంగా వికసింప జేసి మహా మధురాను భూతి కలిగించారు .’’రస తేనే పట్టు ‘’ను నిర్మించి జుమ్మనే నాదం తో ,అమృతమయమైన కమ్మని జుంటి తేనె తాగించారు .

268 –ఈమని వారి ప్రతిభను యే కొంతకో పరిమితం చేయలేము .వారి ప్రయోగ వైవిధ్యం ఎల్లలు లేని సముద్రమే .సంప్రదాయ శాస్త్రీయ ,లలిత ,సినీ ,పాశ్చాత్య ,ఆర్కెస్ట్రా  హిందూ స్థానీ సంగీతాలలో ఎన్నో ఎన్నెన్నో మూలాలు , కిటుకులు  తెలిసిన మహా విద్వా౦సులాయన .అందుకే ఆర్కెస్ట్రా సంగీతం లో తోడి రాగ ఆలాపన ,తానం ,పల్లవులను రచించి లక్షలాది శ్రోతలకు సంతోషాన్ని, సంతృప్తిని కలిగించారు .శుద్ధ కర్నాటక శాస్త్రీయతను రంగరించుకొన్న తోడి రాగాన్ని వాద్య బృందానికి శాస్త్రి గారు తీసుకోన్నారంటే వారి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి .సాహసం, గుండె ధైర్యం ఉన్న వారు కనుకనే ఈపని చేశారు సార్ధకత నూ చేకూర్చారు .

269 -50 దేశాలు పాల్గొన్న ‘’ఏషియా రోష్ట్రం ఫైల్’’లో శంకర శాస్త్రిగారు ‘’స్వర రాగ సుధా రస ‘’అనే శంకరాభరణ కీర్తనను రాగ ,తాన ,స్వర కల్పన లతో మద్రాస్ ఆకాశ వాణి కేంద్రం లో రికార్డ్ చేసి ఆ పోటీకి పంపగా, దానికి న్యాయ నిర్ణేతలు ప్రధమ బహుమతినిచ్చి వారి సృజనకు నీరాజనాలు అందించారు .ఆ కాలం లో రష్యా దేశం లో శాస్త్రి గారి వీణా వాదన చాతుర్యాన్ని మెచ్చుకొని వారు లేనేలేరు అంటే అతిశయోక్తి కాదు అంటారు ఆచార్య ముదిగొండ వారు .’’యహూదీమెనుహిన్ ‘’ఈ పోటీ కి న్యాయ నిర్ణేత. శుద్ధ శాస్త్రీమైనా , సుందర లలిత సంగీతమైనా శాస్త్రి గారు దేనికి దానికే కట్టుబడి శ్రోతలను ముగ్ధులను చేయగలరు అన్నది శుద్ధ సత్యం అంటారు వీరభద్రయ్య జీ .

270-శాస్త్రి గారి ప్రయోగాలలో శిఖరారోహణం అయినది వారు రచించిన ‘’ఇందు ‘’.దీన్నే శ్రీ బి వి కె శాస్త్రిగారు ‘’మాగ్నం ఓపస్ ‘’అన్నారట .’’ఇందు ‘’వాద్య బృందం రచన లో కొన్ని ముఖ్యమైన సంగీత పర అంశాలున్నాయి .72 మేళ కర్తలు ,అందులో 6 రాగాలు .వీటిని ఒక్కొక్క సమూహంగా ,చేసి 12 సమూహాలుగా ఏర్పరచి ,ఒక్కో సమూహాన్ని ‘’చక్రం ‘’అనే పేరు పెట్టి ,మొత్తం 12 చక్రాల ఆవర్తనాన్ని సృష్టించారు .వీటికి 1-ఇందు 2 నేత్ర 3-అగ్ని 4 వేద 5-బాణ ,6-ఋతు7-ఋషి 8-వసు ,9-బ్రహ్మ ,10-దిశి ,11-రుద్ర 12 –ఆదిత్య అని నామకరణ౦  చేశారు .ఈ 12 చక్రాలలో మొదటి చక్రం ఇందు .

271 –ఇందుచక్రం లో 6 రాగాలు –కనకాంగి ,రత్నా౦గి ,గాన మూర్తి ,వనస్పతి ,మానవతి ,తాన రూపి లను పొందుపరచారు .ఈ ఆరు రాగాలలోనూ రిషభం శుద్ధ రిషభమే .అలాగే గాంధార మధ్యమాలు కూడా అంటే రి ,గ లు ప్రక్క ప్రక్కనే ఉంటాయి .ఇంకా తేలికగా అర్ధమవ్వాలంటే చతుశ్రుతి రిషభమే శుద్ధ గాంధారం .మధ్యమమూ శుద్ధమే .మరి ఈ ఆరు రాగాలకు ప్రత్యేకత దేనివలన వచ్చింది ?అంటే దైవత ,నిషాదాల వల్లనే వచ్చింది. కనకా౦గి లో అన్నీ శుద్ధస్వరాలు ,రాత్నా౦గి లో కైశికి నిషాదం ,గాన మూర్తి లో కాకలి నిషాదం ఏర్పడింది .ఈ ఆరు రాగాలతో ‘’ఇందు ‘’పేరు తో స్వర రచన చేసిన స్వర బ్రహ్మ శాస్త్రిగారు .అసలు ఈ ఊహ రావటమే మహా గొప్ప విషయం ,దాన్నిసవాలుగా  సాధించి నిరూపించి తమ ఉపజ్నను వెలుగులోకి తెచ్చారు .’’గాన మూర్తి ‘’రాగం పై శాస్త్రి గారికి –మహా గొప్పఅంటే అపారమైన  సాధికారత ఉంది  .ఒక్క ఎం .ఎల్. వసంత కుమారి తప్ప వేరెవ్వరూ ఈ రాగాన్ని ఇంతగా స్వాధీనం చేసుకో లేదు .గమకం లో స్పష్టత సాధించుకోలేని  వైణికునికి ఇందు చక్ర రాగాలను పలికించటం అసాధ్యమైన పని .అంతటి తపనా తపస్సు శాస్త్రి గారిది .సంగీత వైడుష్యాన్నీ ,మాధుర్యాన్నీ రెండిటినీ ద్రుష్టి లో పెట్టుకొని వాద్య బృంద రచన చేసి చిర యశస్సు సాధించిన ‘’మకుటం లేని మహావీణా  సంగీత చక్ర వర్తి’’ శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు అని సామాన్యులకు అర్ధం కాని ఈ విషయాలను అలవోకగా కరతలామలకం చేసి చెప్పారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గురు మూర్తులు .

Inline image 2

సశేషం

70 వ స్వాతంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-16- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 23 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -6

ఇది విన్నారా కన్నారా !  23

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -6

262-తానం లయ బద్ధమైన రాగాలాపనమే .ఆ లయకూ వీణ వాద్యం లో నాద మాధుర్యం లో ని౦ప గలిగే అవకాశం ఉంది .దీన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న మహానుభావులు ఈమని శంకర శాస్త్రి గారు .రాగాలాపన చేయటం లోనూ శాస్త్రి గారు వీణ లో ప్రత్యేకత సాధించారు .రాగాలాపనలో మీట్లుతక్కువ గా ఉంటాయి .ఐతే శాస్త్రి గారు తక్కువ మీట్లతో రాగాలాపన చేస్తూనే స్వరకల్పనలో లాగానే స్వర సమూహాలను వెంట వెంటనే మీటి రాగాలాపనలో భాగం గా వాటిని మెరిపించేవారు .వీరి తరవాతి వైణికులు కూడా దీన్ని బాగా అంది పుచ్చుకున్నారు అంటే శాస్త్రిగారి ప్రయోగం యెంత ఔన్నత్యాన్ని సాధించిందో అర్ధమవుతుంది .తానం మీట్లతో ,తాళం తీగలను మీట కుండా ,రాగా లాపనలో ఇమిడించటం కూడా శాస్త్రి గారి మరో విశిష్ట పద్ధతియే అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .

263 –గాయకుని గొంతులో వంపు సొంపులు ఇచ్చా మాత్రం తో తేగలగడం ఎలాంటిదో ,వీణ లో మీటు అలాంటిది .అందరూ వీణ బాగానే వాయిస్తారు .కాని వాదన కళ ఈ వంపు సొంపులను సృష్టించటం లోనే ఉంది .వీటినేసంగీత శాస్త్రం ‘’గమకాలు’’ అన్నది .మీటులో నైపుణ్యమే  లేక పొతే గమకం సిద్ధి౦చనే సిద్ది౦చదు .మీటులో నైపుణ్యం కుదిరాక ఎడమ చేతితో దండం మీద తీగలను సాధించాలి .ఈ రెండూ ఒకదానితో ఒకటి కలిస్తే ‘’వాదనం ‘’అవుతుంది లేకపోతే మిగిలేది ‘’రోదనమే ‘’అని చమత్కరించారు ఆచార్య జీ..శంకర శాస్త్రి గారికి  అటు కుడి చేతి మీటు లోను ,ఇటు ఎడమ చేతి వాయింపు లోను ఉన్నంత అధికారం మరే వైణికుడికి లేదని ఆచార్య ముదిగొండ ఘంటా పదంగా చెప్పారు .రెండిటికి సమప్రాదాన్యమిచ్చినప్పుడే ప్రేక్షక శ్రోత్రుజనం సంతోషిస్తారు .ఈ రెంటినీ సాధించినప్పుడే వైణికుడు కూడా తన ‘’కళలో రమిస్తాడు ‘’.ఒక రకం గా ఇది ‘’వైణిక సవ్య సాచిత్వం ‘’అని తేల్చారు వీరభద్రయ్య గారు .ఈ విద్యకు శంకర శాస్త్రిగారు పెట్టింది పేరు అని తీర్పునిచ్చారుకూడా .గతించి పోయిన వీణా వైభవాన్ని శాస్త్రి గారి ఈ సవ్య సాచిత్వం తోనే పునరుద్ధరించారు అని నిర్ద్వంద్వంగా ముదిగొండ వీరభద్రయ్య గారు ఆచార్యానుభవం తో నిర్ణయించి చెప్పారు .

264-వీణ పై తోడి రాగం వాయించటం కష్టమని ,మరీ ,’’హనుమత్తోడి’’లో సాధారణ గా౦ధారాన్నీ ,కైశిక నిషాదాన్నీ మెట్టు మీద చూపటం కుదరనే కుదరదని ,దీనికి దగ్గర గా ఉండే ఆనంద భైరవిలో సాధారణ గా౦ధారాన్ని పైనే చూప వచ్చని ,చూపాలి కూడా నని అన్నారు ఆచార్య శ్రీ .కాని కర్నాటక తోడి లో ఇది కుదరదు .దాన్ని ఖచ్చితంగా ఎప్పుడైనా చతుశ్రుతి రిషభం లోనే ,కంపిత గమకం తో చూపాలి .ఆరోహణలోనూ అంతే .అలాగే శుద్ధ దైవతం లోనే కైశిక నిషాదాన్ని చూపాలి .  దీనివలన స్వర కల్పనలో వేగ సాధనకు కొంచెం ఇబ్బంది కలుగుతుందని, కాని శాస్త్రి గారు సంప్రదాయాన్ని పాటిస్తూనే మధ్య మధ్యలో కైశిక నిషాదాన్నిమెట్టు పైననే చూపేవారని ,చాలా కొద్ది సార్లు సాధారణ గా౦ ధారాన్ని మెట్టు మీదే చూపేవారని  కాని అది ఏమాత్రం ఎబ్బెట్టుగా ఉ౦డేదికాదని,పైగా గొప్ప అందంగా ఉండేదని స్వర రాగ కషాయాన్ని కాచి వడబోసిన  ఆచార్య వర్యుల ఉవాచ .నాట రాగం లో షట్ శ్రుతి రిషభం ,షట్ శ్రుతి దైవతం లను వెనక స్వరాలలో లాగి చూపాల్సిందే తప్ప మెట్టు మీద వాయించటానికి వీలు లేదని ,అవరోహణలో మాత్రమప్పుడప్పుడు అలా వాయించినా ఓర్చు కొంటు౦దని  శాస్త్రిగారి వాదనలో ఈ మెలకువలన్నీ ఇమిడిపోయి ఎంతో రామణీయకం సృష్టింప బడేది అని వీణా వాదనా సామర్ధ్యమున్న ఆచార్య ముదిగొండ వీర భద్రయ్యగారు . విశ్లేషించి వెలికి తీసి చెప్పిన ‘’మహా వాక్యా’’లివి .

265-శాస్త్రం లో గమకాలూ’’ పది’’ అని, వాటిలో ఆరోహరణ అవరోహణ, మూర్చనలు విశేషం లేనివని ,ఢాలు,స్పురితం ,కంపితం ,ఆహతం ,ప్రత్యాహతం ,త్రిపుచ్చం ,ఆందోళనం అనే ఎనిమిది గమకాలూ వీణ మీద వాయిస్తే విశేష మాదుర్యాన్నిస్తాయని ,శంకర శాస్త్రి గారు వీటి నన్నిటినీ’’ నిర్దుస్టం’’గాను ‘’నిర్దిష్టం ‘’గాను పలికి౦చేవారని ,కాంటాక్ట్ మైక్ వీటికి ఎంతగానో తోడ్పడిందని ,ఈ ‘’దశ విధ గమకాలు  ‘’కాకుండా శాస్త్రి గారు మరొక ‘’12 గమకాలు ‘’వీణా వాదన లో సృష్టించారని ,వాటికి పేర్లు లేవని ,ఇప్పుడు వాటిని వాయి౦చేవరూ లేరని ,శాస్త్రిగారి కుమార్తె మాత్రం కొన్నిటిని వాయిస్తుందని తేల్చి చెప్పారు ఆచార్య వర్యులు .

266-వీణా తంత్రులను కృత్రిమ గోళ్ళను తొడుక్కొని వాయిస్తారు చాలామంది .వీటిని తీగలతోనే చేస్తారు .వీటిని మధ్య వ్రేలికి దాని ప్రక్క వ్రేలికి తొడుక్కుంటారు .అయితే శాస్త్రిగారు వీటిని అసలు వాడేవారు కాదు .అంతాసహజమైన గోళ్ళ ద్వారానే సాధించారు .నాదం లో హెచ్చు తగ్గులు కలిగేట్లు మీటడం వలన గొప్ప శ్రుతి సుభగాత్వాన్ని శాస్త్రిగారు సాధించే వారు అంటారు ఆచార్య ముదిగొండ శ్రీ .

 

Inline image 1 Inline image 2Inline image 4

 

చంద్ర లేఖ సినిమా లో  మూడు  దృశ్యాలు

సశేషం

15-8-16 సోమవారం 70 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 22 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -5

ఇది విన్నారా కన్నారా !  22

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -5

258-గాత్రానికి గాత్రత్వం ఎలాంటిదో వీణ కు ‘’వీణత్వం’’ అలాంటిది .చాలామంది వైణికులలో ఈ  వీణత్వం లోపిస్తుంది .7 తంత్రులను వీణ మీద మీటి నప్పుడు కలిగే నాద సౌభాగ్యం ఇతర వాద్యాలలోకాని గాత్రం లో కాని రాదు అంటారు ఆచార్య వీరభద్రయ్య .ప్రతి వాద్యానికీ ఒక పరిమితి ఉంటుంది .ఆ పరిమితి లోనే వీణ వృద్ధి చేశారు శంకర శాస్త్రి గారు .త౦త్రి మీద కంపిత గమకాన్ని సాధించటం కుదరదు .కాని ప్రయోగ శీలి అయిన శాస్త్రిగారు అనుమంద్ర తంత్రిని పరాన్ముఖంగా కాకుండా ,అభి ముఖంగా లాగి గమకాన్ని సాధించిన నేర్పు ఈమని వారిది అంటారు శ్రీ వీరభద్రయ్య .మంద్ర ,అనుమంద్ర తంత్రుల మీటులో సాధించిన మరో విశేషం ఉంది .వీణ బ్రిడ్జికి మేళాంతానికిమధ్య మీటటం కాక ,తార స్వరాలు పలికే మెట్ల మీద ఆ తంత్రులను బొటన వ్రేలితో మీటటం .మామూలు చోట మీటితే వచ్చే ధ్వనికి ,దండం పై తారస్థలం లో మీటితే వచ్చే ధ్వనికీ ఎంతో భేదం ఉంది అని విశ్లేషించి చెప్పారు ఆచార్య వీరభద్రయ్య .ఇక్కడే రసికులు ,సంగీత ప్రియులు గమనించాల్సిన అంశం ఒకటి ఉందంటారు ఆచార్య వర్యులు .తీగపై మీటు ఎక్కడ మీటాలి ?ఇది ఒక్కొక్క త౦త్రి పై ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది .సందర్భాన్ని బట్టికాకుండా అన్నిటికీ మేళాంతంనుంచి బ్రిడ్జి వరకు తీగలోని మధ్య బిందువు మీద కాని ,మేళాంతం లో కాని మీటటం సాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు .కాని శాస్త్రి గారు మీటే స్థలాన్ని అక్కడక్కడ మారుస్తూ నాదం లో గొప్ప వైవిధ్యాన్ని సాధించారు .మీటును బ్రిడ్జి కి ఆనుకొన్న స్థలం లో మీటి రాగానికి ,స్వరానికీ ఎంతో భేదాన్ని చూపారు శాస్త్రి గారు మూడు చోట్ల మీటు ను మీటడం వలన వాద్యధ్వనిలో ఉండే యాంత్రికత ను తొలగించి’’ సజీవత్వం ‘’కల్గించటం శాస్త్రి గారి అద్భుత కృషి అన్నారు వీణ విమర్శకులైన ముదిగొ౦డవారు .

259-శాస్త్రి గారు సాధించిన మాధుర్యం మీటే స్థలాన్ని బట్టి తెప్పించారు . ఆ తంత్రులకు ‘’జీవం ‘’పెట్టారు .అంటే బ్రిడ్జి మీద ఈ రెండు తంత్రులకు ఒక ‘’గరుకైన ఉన్ని పోగు’’ను పెట్టి ,దానితో ఆ తంత్రులను మీటినప్పుడు ఒక విచిత్ర ,విశిష్ట మధుర ధ్వని కలుగుతుంది ఈ పధ్ధతి త౦బూరాలో ఉంది .దీన్ని వీణలోనూ తెచ్చారు శాస్స్త్రిగారు .వాయి౦పు లో మంద్ర తంత్రీ నాదానికి అనూహ్యమైన మాధుర్యాన్ని ఈ ‘’జీవం ‘’వలన సాధించేవారు శాస్త్రి గారు అని కనిపెట్టి చెప్పారు ముదిగొండ అయ్యవారు.అంతవరకూ మీటు విషయం లో ఇలాపరిశోధించిన వారు లేరని ముదిగొండ ఉవాచ .వీణా వాదనా మాధుర్యం లో సగం ఈ మీటు లోనే ఉంది  .

260-సారణి మీద పంచమాన్ని మీటి నప్పుడు పంచమ తంత్రిని కూడా జోడించటం సాధారణ వైణికులు చేసేపని .కాని శాస్త్రి గారు సారణి మీద వాయిస్తున్నప్పుడు, కేవలం స-ప-స- లను వాయిస్తున్నప్పుడు మాత్రమే కాక ,తక్కిన స్వరాలను మీటు తున్నప్పుడు కూడా ఇతర తంత్రులను అక్కడక్కడ మీటి ‘’అనితర సాధ్యమైన మాధుర్యాన్ని ‘’సృష్టించేవారు .వీటి గురించి తెలియాలంటే వారి ప్రయోగాలే శరణ్యం అన్నారుఆచార్య  వీరభద్రయ్య  .

261-తాళం తీగల విషయ౦ లో కూడా శాస్త్రి గారి వాదన లో ప్రత్యేకత ఉంది .పూర్వ సంప్రదాయం లో తాళాన్ని చూపేటప్పుడు మాత్రమే తాళం తీగలను మీటేవారు .తాళాన్ని చూపేటప్పుడు ‘’ఘాత ‘’ఎక్కడ చూపితే అక్కడ మాత్రమే తాళం తీగలను చిటికెన వ్రేలి గోరు తో పైకి మీటేవారు .తరువాత తర్వాత ఈ విధానం మారింది .అప్పుడు శాస్త్రిగారు తాళం తీగలను మాధుర్యం సృస్టించటానికి మాత్రమే వాడారు .ఇప్పుడు ఎవరూ వారి నైపుణ్యాన్ని అనుకరించ లేక పోతున్నారు శ్రుతికి ప్రత్యామ్నాయం గానిలపడమే కాక ,సారణి మీద వాయింపు కు మాధుర్యపు గుబాళింపు ,రోచిస్సు లను జోడించి ఘనత తెచ్చారు అని విశ్లేషించారు డాక్టర్ వీరభద్రయ్య .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 21 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -4

ఇది విన్నారా కన్నారా !  21

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -4

250-రేడియోలు గ్రామ ఫోన్లు ఇంకా జనం కొనుక్కోలేని రోజులవి .సంగీత విద్వాంసులు రికార్డులను తెస్తూనే ఉన్నా ప్రతి ఇంట్లో వినే అవకాశం లేని రోజులు .మోజున్నవారు డబ్బున్నవారు మాత్రమేకొని, విని ఆనది౦చ గలిగే రోజులవి .అలా౦టికాలం లో ఈమనివారు  1943 తిరుచినాపల్లి ఆలిండియా రేడియో స్టేషన్ నుంచి మొదటి వీణ సంగీత కచేరీ ఒక గంట సేపు  చేశారు .ఆ కచేరీతో కాకినాడ సరస్వతీమహళ్ సభాధ్యక్షులు శ్రీ దివాన్ బహదూర్ కొమ్మిరెడ్డి సూర్య నారాయణ మూర్తి నాయుడు గారితో పాటు ,అట్టడుగు వర్గం దాకా ఈమని వారి అభిమాను లయ్యారు .ఈ నాయుడు గారి వద్దనే శాస్త్రిగారు హిందూస్తానీ ,పాశ్చాత్య సంగీత మర్మాలను తెలిసికొన్నారు .వీటివలన శాస్త్రి గారి వీణా వాదన సామర్ధ్యం కొత్త అవతారమెత్తి అందరి అభిమానానికి పాత్రమైంది .

251-ఆ నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ సాంబ మూర్తి గారి సలహా మేరకు శాస్త్రి గారి తండ్రిగారు కుటుంబాన్ని మద్రాస్ కు 1940లో మార్చారు .ఇంటర్ పూర్తీ చేసి వాసన్ గారు నిర్మించిన జెమిని స్టూడియో లో పాప నాశన౦ శివన్ ,దండపాణి దేశికర్ ,సాలూరి రాజేశ్వర రావు వంటి దిగ్దంతుల సరసన 18 ఏళ్ళ శాస్త్రిగారు సంగీత బృందం లో చేరటానికి వీణను వాయించమంటే మూడు గంటలసేపు శాస్త్రిగారు కచేరీ చేయగా ముగ్ధులై వాసన్ గారు బృందం లో చేర్చుకున్నారు .తండ్రి పిల్లాడు పాడైపోతాడేమోనని బాధ పడ్డారు .శాస్త్రిగారికి చిన్నప్పటి నుంచి ఇతరులలో మేలిమి గ్రహించటం ,దాన్ని తనబాణీలోఒదిగేట్లుచేయటం రివాజు .చతురత సాధించాక వీణపై పాశ్చాత్య సంగీతాన్ని వాయించి మెప్పు పొందారు .దీని మీటు ,పధ్ధతి వేరు .కుడి ,ఎడమ చేతుల రెండింటి పని కర్నాటక సంగీతానికి బహు దూరం .సినిమాలకు వీణ వాయించినా ,సగీతదర్శకత్వం వహించినా వారి సృజన శక్తియే అగ్ర శ్రేణిలో నిలబెట్టింది .సినిమాలకు వాయించి ఉండక పొతే జాతీయ వాద్య బృందానికి నాయకత్వం వహించటానికి అవకాశం వచ్చి ఉండేదికాదు .శాస్త్రి గారి వాద్య బృంద రచనలు తర్వాత కాలం లో ప్రాంతీయ రేడియో స్టేషన్ లలోని వాద్య బృందాలకు ఒరవడి పెట్టాయి .

252 –జెమినీలో ఉండగా రెండవ ప్రపంచ యుద్ధకాలం లో సంగీత సంరంభం కొంత కాలం ఆగి పోయింది .దాక్షారామం వెళ్లి కచేరీలు చేయటం మళ్ళీ మొదలు పెట్టారు .జెమినీ నుంచి మళ్ళీ పిలుపు వచ్చి వెళ్లి చేరారు .జెమినీ సినిమా ‘’దాసీ అపరంజి ‘’సినిమాకు రెండుపాటలు శాస్త్రి గారే కట్టారు .’’శ్రీ జయ పరమేశ’’పాట బాగా జన రంజక మయింది .సంగీత దర్శకులు కాకుండానే ఇలా ఎన్నో పాటలకు స్వరాలు కూర్చారు .బి యే పూర్తిచేయటానికి కాకినాడ వెళ్లి పాసై తిరిగి వచ్చారు .వాసన్ గారి దగ్గర మళ్ళీ చేరి ,తాము తీస్తున్న ‘’మంగళ ‘’హిందీ సినిమాకుట్యూన్లు కట్టమని కోరగా మాంచి బాణీలు కట్టారు   తెలుగు సినిమా ‘’సంసారం ‘’కు శాస్స్త్రి గారు కట్టిన ట్యూన్లు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపాయి .ఇవికాక ‘’బహుత్ దిన్ హుయే ‘’,మిస్టర్ సంపత్ ‘’,నిషాన్ ,’’చంద్రలేఖ ‘’సినిమాలు శాస్త్రి గారి బాణీల ఓణీల తోనే జనాన్ని మెప్పించి దిగ్విజయమయ్యాయి  .చంద్ర లేఖ సినీ సంగీతం రికార్డ్ లను సృష్టించింది

253 –జెమినీలో ఉండగానే శాస్త్రిగారు వీణా వాద్యానికి ఎన లేనిసేవ చేశారు .వాద్య బృందం లో అప్పటి దాకా వీణ వెనక వరుసలో ఉండేది .ఎవరికీ దాని స్వారస్యం ఆనేదికాదు. ‘’అగస్త్య భ్రాత ‘’అయింది అప్పుడు వీణ .జెమినీలోని పాశ్చాత్య సౌండ్ ఇంజనీర్ ఏడాదికోసారి తన దేశానికి సెలవు మీద వెళ్లి వచ్చేవాడు .ఒకసారి అలాగే వెళ్లి వచ్చి అక్కడ గిటార్ కు కాంటాక్ట్ మైక్ అంటే పికప్ పెడుతున్నారని చెప్పి తెచ్చిచ్చాడు .ఈ పికప్ ను వీణకు అమర్చి తమ సంగీతాన్ని బాగా పికప్ చేశారు శాస్త్రీజీ .సున్నిత గమకాలను  నాజూకు మీట్లను పట్టుకొని శ్రోతలకు వాటిని వీణపై అందించి పరవశులను చేసేవారు .దీనితో వీణకు మళ్ళీ నాజూకుల నగలు ఆభరణాలుగా భాసి౦చాయి వీటికన్నిటికీ ఆద్యులు శంకర శాస్త్రి గారే .ఆ తర్వాత పికప్ అందరికీ ఆరాధ్యమై, మాంచి పికప్ సాధించింది

254 -1959 డిసెంబర్ 1 న శాస్త్రి గారు మద్రాస్ రేడియో స్టేషన్ లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా చేరారు .1961 లో ఢిల్లీ లో నేషనల్ ఆర్కెస్ట్రా కు కంపోజర్ గా ,కండక్టర్ గా ,డైరెక్టర్ గా పని చేశారు .అంతకు ముందే కొన్ని వాద్య బృంద రచనలు చేసి శ్రోతలను మంత్రం ముగ్ధులను చేశారు .

255-1940 నుండి -76 వరకు శంకర శాస్త్రి గారి సంగీత జీవితం విశిష్టంగా పాతికేళ్ళు సాగింది .అనుక్షణ సంప్రదాయ ,ప్రయోగాలు సాగాయి .వీణా వాదాన్నిశర వేగంగా ముందుకు తీసుకు వెళ్ళారు .శాస్త్రీయ సంగీతం తోపాటు లలిత ,వాద్య సంగీతాలకూ సత్పరిణామాలు సాధించి చూపారు .

256 –వీణ కర్నాటక సంగీతానికి ,సితార్ ,సరోద్ లు హిందూ స్తానీకి ప్రత్యేకత అని భావించే రోజులవి .ప్రపంచ సంగీత చరిత్రలో మొదటి సారిగా శాస్త్రిగారు శ్రీ రవి శంకర్ తో సితారా తో కలిసి వీణ వాయించారు ఆధార శ్రుతి నుంచి రెండు రీతుల బాణీలవరకుఅన్నీ సమస్యలే .వీటినన్నిటినీ పరిష్కరించు కొంటూ శాస్త్రిగారు సరి కొత్త ప్రయోగం చేసి రెండు వాద్యాలనుంచి రెండు బాణీల సంగీతం నుంచి మేలిమి ని ఈ కచేరీలో రాబట్టారు .దీన్ని ఆకాశ వాణి ప్రసారం చేసింది .భారతీయ సంగీత చరిత్రలో’’ తొలిజుగళ్ బందీ ‘’ఇదే .దీనికి ఆద్యుడుతెలుగు బిడ్డ  శాస్త్రి గారే కావటం మన అదృష్టం .వీణ వాయిస్తూ ఒక భజన పాడి వినిపించిన శాస్త్రి గారిని భారత ఉప రాష్ట్ర పతి, శాస్త్రి గారిని ‘’ఇంటే గ్రేటర్ ‘’అని ప్రశంసించారు .సితారా ,వీణా ,సరోద్ బాణీలను ఇంటేగ్రేట్ చేసిన ఘనత శాస్త్రి గారిదే .

257  -సినీ సంగీత ప్రపంచానికి పి బి శ్రీనివాస్ ను ,ఎ.ఏం రాజా ను గాయకులుగా పరిచయం చేసి కానుకగా ఇచ్చిన వారు శాస్త్రి గారే .ఇక వీణకు కానుకగా శ్రీ చిట్టి బాబు ‘’ను ,శ్రీమతి వి యెన్ సరస్వతిని వారసులుగా అందించారు శాస్త్రి గారు.

Inline image 2

సశేషం

కృష్ణా పుష్కర ప్రారంభ , వరలక్ష్మీ వ్రతం శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-16- కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 20 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3

ఇది విన్నారా కన్నారా !  20

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3

‘’మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు ‘’అనే కీర్తన ఎప్పుడూ పాడుకోనేవారట .శంకర శాస్స్త్రి గారు కూడా చివరి కచేరీలలో ఈ కీర్తనే వాయి౦చేవారట .వారు ముక్త పురుషులు .నాదం లో లయించేవారు .1987 డిసెంబర్ 23 న ఈమని వారు ‘’ఈమనికి ‘కి ’స్వస్తి చెప్పి శంకర గళ నిగళం లో చేరుకొన్నారు .వారు తూర్పు గోదావరిజిల్లా ద్రాక్షా రామపుణ్య క్షేత్రం లో  1922 సెప్టెంబర్ 23న జన్మించారు  .ఇక్కడే అశ్వత్ధ నారాయణుడూ వెలసి ఉన్నాడు. అంటే శివ కేశవ క్షేత్రం అన్నమాట .65ఏళ్ళు మాత్రమే  జీవించి ప్రతిక్షణాన్నీ సార్ధకం చేసుకొన్నారు  .తండ్రి అచ్యుతరామ శాస్త్రి  తాతగారుసుబ్బా రాయ శాస్స్త్రి గార్లు ఇద్దరూ మహా వైణికులే .శాస్త్రిగారికి నలుగురు అక్కయ్యలు .తల్లి మగపిల్లాడికోసం తపన చెంది అశ్వత్ధ నారాయణుడికి మొక్కుకొంటే ఆ స్వామి అనుగ్రహం తో శంకర శాస్త్రి గారు జన్మించారు .బాలసార నాడు వీరికి పెట్టిన పేరు ‘’శంకర సూర్య మాణిక్యాల రావు ‘’.

248 –అంత ధనిక కుటుంబం కాకపోయినా భుక్తికి లోటు లేనిదే .కొడుకు సంగీత వృత్తిలో స్థిరపడటం తండ్రిగారికి ఇష్టం ఉండేది కాదు .కాని శంకర శాస్త్రి గారికి నర నరానా ,ప్రతి రక్త బి౦దువులోనూ సంగీతమే ఉంది. ఏమీ తెలియని వారి శైశవ బాల్యాలలోనూ సంగీతమే ప్రవహి౦చింది వారిలో   .తండ్రిగారు ఇది విన్నారా కన్నారా !  20

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3

247-‘’సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా ‘’.త్యాగరాజస్వామి వారు జీవితపు చివరి రోజులలో నాద లోలురై వీణ వాయించు కొంటూ ఉంటె వీరు నోటితోనే మృదంగ జతులను పలికే వారట .అంటే తాళ వాద్యం లేకుండానే తాళ ధ్వనులను పలికే వారన్నమాట .లయ ,తాళాలు అలా వారికి ఆజన్మ సిద్ధంగా లభించిన వరాలయ్యాయి .  తాళం తో పాటు మధురంగా పాడటం కూడా యే శిక్షణా లేకుండానే వచ్చేసింది .ఈ చైల్డ్ ప్రాజేడీ ప్రతిభ గుర్తించి తండ్రిగారు కొన్ని వర్ణాలు నేర్పారు .కాని సంప్రదాయ శిక్షణ కొడుకుకు అవసరం లేదని కొద్ది రోజుల్లోనే గ్రహించారు .కుమార సంభావ కావ్యం లో మహా కవి కాళిదాసు పార్వతీ దేవికి ప్రాక్తన విద్య తో సకల శాస్త్రాలు లభించినట్లు చెప్పాడు .అలాగే శాస్త్రిగారివిద్యఅంతా  కూడా ప్రాక్తన విద్య యే.ఉపదేశాకాలం లో ఈ ప్రాక్తన విద్య సహజంగా దానంతటికి అదే బయటికి వచ్చేది .అంతటి చిన్న వయసులోనే వీణ పై ప్రయోగాలు చేసేవారు .కొత్త ధ్వనులు సృష్టించేవారు ప్రకృతిలో విన్న ప్రతి ధ్వనినీ వీణ పై పలికించి అబ్బుర పరచేవారు .ఒక్క ఏడాది కాలం లోనే కచేరీ కి కావాల్సినంత పాఠం నేర్చుకొని ,ప్రయోగ శీలత తో దాన్ని గుబాళింప జేసేవారని ఆచార్య ముదిగొండ అన్నారు .

249-దాక్షారామం లో మూడవ ఫారం చదివి ,కాకినాడ వెళ్లి పెద్దక్క సరస్వతమ్మ గారింట ఉండి,పి ఆర్ కాలేజీలో ప్రిసిపాల్ పెద్దాడ రామ స్వామిగారిని పాట తో మెప్పించి సీటు సంపాదించారు .ప్రిన్సిపాల్ గారే వీరి పేరును ‘’ఈమని శంకర శాస్త్రి ‘’గా మార్చారు .ఇది ఆయనకు రెండవ బారసాల అయి ఆ పేరే స్థిర పడి విశ్వ వ్యాప్తమై పోయింది ‘’.పేరులోన పెన్నిధి కలదు ‘’అని రుజువైంది .’’సూర్య మాణిక్యాల రావు’’నోటితో మృదంగమే వినిపిస్తే ,శంకర శాస్త్రి జీవితమంతా వీణ నే వినిపించాడు .వీణ పై పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తున్నప్పుడు వ్రేళ్ళతో ఆ పాట లయను వీణ బుర్ర మీద కొట్టి వినిపించేవారు .వీరి కాలేజి చదువుకు రెండు సార్లు విఘ్నం కలిగింది .1930 లోని చదువు ,1945 కు కాని బి యే .పట్టాను ఇవ్వలేక పోయింది ‘

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-16 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 19 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -2

ఇది విన్నారా కన్నారా !  19

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -2

242-‘’హాలులో నాలుగు గోడలమధ్యబందీ అయిన వీణా వాద్యాన్ని ,ఆధునికకాలపు అభి రుచులకు అనుగుణంగా ,మైదానం లోకి తెచ్చి ,ప్రపంచ వ్యాప్త సంగీత రసికులను’’ శాంత రసం ‘’లోము౦చినవారు ఈమనివారు .ఇదివారి సంకల్ప శక్తీ ,నిరంతర అభ్యసనం ,సాధనారక్తీ ,వాద్యం పైనిబద్ధత ,నిరంతర కృషి ,పరిశోధనాసక్తీ,పరిశీలా దృష్టి వల్లనే సాధ్యమైంది .త్రిలింగ క్షేత్రమైన ద్రాక్షారామం లో పుట్టి,ఆనాటి తెలుగు దేశపు అగ్రశ్రేణి వైణిక విద్వాంసులైన పితృపాదులు శ్రీ అచ్యుత రామ శాస్త్రి గారి వద్ద నే వీణా వాదనా సామార్ధ్యాన్ని పొంది ,వీణను ’’తెలుగు వీణ ‘’గా అవతార మెత్తించి  అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టారు.   వీణను తెలుగు వీణగా ప్రతిష్టించిన ఘనత శాస్త్రి గారిదే .వీణ అంటే తెలుగు వాళ్ళది ,అనే గౌరవం సత్కీర్తి ఈమని వారే కలిగించారు .సంగీత వ్యాప్తికి తమిళులు ఎంతగా కృషి చేశారో వీణ వ్యాప్తికి ఈమని శంకర శాస్త్రి గారు అంతటి కృషి చేశారు’’అని విశ్లేషించిన ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారి పలుకులు ‘’ప్రాబలుకులే ‘’.

243-ఈమని వీణావాదనం  ఎవరి వాద్యాన్నీ పోలి ఉండదు .అందులో వారి వ్యక్తిత్వమే ప్రతిధ్వనిస్తుంది .వాద్య రీతు లో వారి వాద్య రీతి కల్తీ చేయబడలేదు .అతి సున్నితమైన గులాబీ రెక్కల రెపరరెపలను చూపారు .మేఘ గంభీర నాదంతో ధను౦జయుని ధనుస్ట౦ కారాన్నీ చూపుతూ ,ఒక్కో రసానికి ఒక్కొక్క రీతిని ప్రయోగించిన విశేష నేర్పు వారిది .

244-ఈమని వారి వీణా నాద వైవిధ్యం అనితర సాధ్యం .ఒక్కొక్క సారి సితారా లాగా ,మరోసారి సరోద్ వలె ,మరికొన్ని సార్లు గిటార్ మెరుపులతో ,వేరొక సారి గోటు వాయిద్యంగా తంత్రీ వాయిద్యాల విభిన్న వ్యక్తిత్వాలనన్నిటినీ తమ వీణ లోనే పలికించి మెరిపించి మురిపించ గల నాద యోగ సిద్ధులు శంకర శాస్త్రి గారు .హృదయం లో మోగే ‘’అనాహతాన్ని ‘’తమ మీటుల నడుమ ‘’నిశ్శబ్దం’’ లో ‘’మ్రోగించే ‘’ఘనత శాస్త్రి గారిది .దీనినే వారు ‘’మ్యూజికల్ సైలెన్స్ ‘’అన్నారు .’’దీన్ని అనుభవించి ఆలాపనలో ఈ నిశ్శబ్ద స్థితి ని చూపలేని సంగీత కళాకారుడు ఎవ్వరికీ యే అనుభవాన్నీ ఇవ్వలేడు’’అన్న ఆచార్య ముదిగొండవారి మాటలు వారి అనుభవానికి చిరునామాలు .

245-భారత దేశం లో ‘’కాంటాక్ట్ మైక్’’(పికప్ )ను మొట్టమొదటగా వాడిన వారు ఈమని వారే .పికప్ వాడి వీణా నాదం లో ,మీటు లో ,నాజూకులు ,నయగారాలు తెచ్చిన ప్రప్రధమ వైణికులు శంకర శాస్త్రి గారు .లలిత సంగీతం లో శాస్త్రీయ వాసనలను ,శాస్త్రీయ సంగీతంలో  లలిత సంగీత ‘’లే పరిమళాలను ఘుమ ఘుమలను  ‘’అద్దిన ప్రయోగ శీలి శాస్త్రి గారు . ఈప్రయోగ శీలత యే వారిని ఢిల్లీ ఆకాశ వాణి కేంద్ర వాద్య బృంద సంగీత దర్శకుని ,మద్రాస్ జెమనీ సినీ స్టూడియో లో కొన్ని హిందీ ,తెలుగు సినిమాలకు సంగీత దర్శకుని చేసింది .

246 –లోకాన్ని ,లోకపు సంఘటనలను వీణా నాదం లోకి అనువదించటం అంతకు ముందు ఎన్నడూ లేనిది .శాస్తి గార ఈ పని చేసి చూపి ఆశ్చర్య పరచారు .టెన్సింగ్ నార్కే ఎవ రెస్ట్ శిఖా రాన్ని అది రోహించిన వార్త విని స్వయంగా స్పందించి ‘’ఆదర్శ శిఖరా రోహణ౦ ‘’అనే గొప్ప వాద్య బృంద సంగీతాన్ని సృష్టించి ప్రసారం చేయించారు .దీన్ని విన్న శ్రోతలందరూ తామే అధిరోహిస్తున్న అనుభూతికి లోనయ్యారు .అంటే వీణా వాదనతో ఇతర వాద్యాలను జోడించి సంగీతాన్ని ఎవరెస్ట్ శిఖరా రోహణ౦  చేయి౦చా రన్నమాట ఈమని వారు .టెన్సింగ్ ఎక్కి చరిత్ర సృష్టిస్తే సంగీతం తో ఎవరెస్ట్ నెక్కించి  శంకర శాస్త్రి గారు మరో చరిత్ర సృష్టించారు .అలాగే ‘’భ్రమర విలాసం ‘’అనే రసమయ సంగీత రచన చేసి వినేవారికి ‘’భ్రమర ఝంకారాన్ని ‘’అను భూతిలోకి తెచ్చారు .దీనిలోని సంగీత విశేషాలను తెలుసుకోనేట్లుకూడా  చేశారు .ఇలా తమ సంగీత యాత్రలో శాస్త్రి గారు వందలాది ప్రయోగాలు చేసి భేష్  సెహభాష్ అని పించుకొన్నారు .ఇలాశాస్త్రి గారి గురించి  యెంత రాసినా ,యెంత చెప్పినా తనివి తీరదు ..అద్భుత రసానందమే అనుభవైక వేద్యం అవుతుంది .ఒళ్ళు పులకించి పోతుంది .

Inline image 1  Inline image 2

సశేషం

రేపు 12-8-16 శుక్రవారం శ్రీ కృష్ణ వేణీ పుష్కర ప్రారంభ ,శ్రీ వరలక్ష్మీ వ్రత శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృష్ణాపుష్కర, వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు

సాహితీ బందువులకు సాహిత్యాభిమానులకు 12-8-16 శుక్రవారం నుండి ప్రారంభమయ్యే శ్రీ కృష్ణ వేణీ పుష్కర ప్రారంభ శుభాకాంక్షలు ,మరియు శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్

—

Inline image 1Inline image 2

పుష్కరోత్సవం!
12-08-2016 01:32:19

                  పుష్కర ఘడియల్లో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నది. తెలుగుసమాజం యావత్తూ భక్తిపారవశ్యంలో పులకరించి పోతున్నది. జలం జీవమై, మానవ నాగరికతలు నదీమతల్లుల ముద్దు బిడ్డలైనప్పుడు, పాడిపంటలు ప్రసాదించే ఆ జీవనదులను అర్చించి, తమ ప్రాణదాతలకు ప్రణమిల్లే సమున్నత సంప్రదాయం మనది. ఎండిన గొంతుకల సేదతీర్చి, తెలుగునేలపై నిండైన పచ్చదనాన్ని పరచే కృష్ణవేణమ్మ పుష్కర మహోత్సవాన, నిండుగా మునకేసి పునీ తులు కావడానికి కోట్లాదిమంది సంసిద్ధులైన తరుణంలో తెలుగు ప్రభుత్వాలు బృహత్తరమైన ఏర్పాట్లతో ప్రజాభీష్టాన్ని నెరవేరు స్తున్నాయి.

                  పుష్కరాలు భారతీయ ధార్మిక జీవనానికి ప్రతీకలు. ఉమ్మడి భావనకు చిరునామాలు. సమైక్యతకు నిదర్శనాలు. పుష్కరుడైన వరు ణుడు ఏడాదికొకటి చొప్పున, ఈ దేశంలోని పన్నెండు పుణ్యనదుల్లో నివాసం ఉంటాడన్న శాస్త్రోక్తితో పన్నెండేళ్ళకోమారు ప్రతీనదికీ పుష్క రాలు వస్తాయి. ఆయా కాలాల్లో ఈ నదీపరీవాహక ప్రాంతాలు పుణ్య భూములై పులకరించిపోతాయి. ఇప్పుడు దేవగురువు బృహస్పతి కన్యా రాశిలో కాలూనిన కాలంలో, దేశంలో మూడవ అతిపెద్ద, పుణ్యనదుల్లో ఆరవదిగా శాస్త్రాలు అభివర్ణించిన కృష్ణమ్మ పుష్కరుడి ఆగమనంతో పులకించిపోతున్నది. తన 1400 కిలోమీటర్ల ప్రయాణంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల చారిత్రక, సాంస్కృతిక జీవనంలో ప్రముఖ పాత్రపోషిస్తూ, వివిధ పురాణాల ప్రశస్తిని పొందిన కృష్ణవేణి ఈ దారిపొడవునా అనేక ఆలయాలను అభిషేకిస్తున్నది. తెలుగునేల మీద ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం, అష్టాదశపీఠాల్లో ఒకటిగా ఉన్న అలంపూర్‌లతో పాటు అనేకానేక పుణ్యస్థలాలను స్పృశి స్తున్నది. ఆయా దివ్యక్షేత్రాల మహిమ, నదీ పవిత్రత కలగలసి పుష్కరకాలంలో తీరంలోని ఆలయాలు మరింత మహత్తును సంతరించుకుంటాయన్న విశ్వాసమే నదీస్నానం అనంతరం అలయ దర్శనాన్ని ఒక విధిగా మార్చింది. సహ్యాద్రి పర్వతసానువుల నుంచి హంసలదీవిలో సాగరసంగమమయ్యేవరకూ మార్గమధ్యంలో అనేక ఉపనదులను కలుపుకుంటూ పరవళ్ళు తొక్కే కృష్ణవేణి మానవ నిర్మిత ఆధునిక దేవాలయాలకూ ఆధారభూతమవుతున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ప్రకాశం బ్యారేజీవంటివాటిని నిండుగా దీవిస్తూ, తెలుగునేలను సస్యశ్యామలం చేస్తూ, కోట్లమంది దప్పిక తీరుస్తున్నది.
                  పుష్కరుడి ఆగమనంతో పులకించే పుణ్యతీర్థాలు, భక్తజన పాదస్పర్శతో తడిసిముద్దవుతున్న వందలాది స్నానఘట్టాలు, అలం కరణలతో వెలిగిపోతూ, భక్తిపారవశ్యంలో పరవశించిపోతున్న ఆల యాలు తెలుగునేలన దర్శనమిస్తున్నాయి. చల్లనితల్లి కృష్ణమ్మకు తలవంచి నమస్కరించి, మునకలేసి తరించడానికి బారులు తీరు తున్న భక్తులకోసం ఘనమైన ఏర్పాట్లు చేయాలన్న దృఢ సంకల్పంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సుదీర్ఘకాలంగా శ్రమించాయి. తెలంగాణ ప్రభుత్వం 825 కోట్లతో, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1200 కోట్ల కేటాయింపులతో, ఉమ్మడిరాష్ట్రంలో జరిగిన చివరి పుష్కరాల బడ్జెట్‌కు పదిరెట్లు ఇప్పుడు ఖర్చుచేస్తున్నాయి. 1992లో కోటీపాతికలక్షలున్న భక్తజనుల సంఖ్య, మరుసటి పుష్కరాలకు మూడుకోట్లయినప్పుడు ఇప్పుడు ఆ సంఖ్య ఏడుకోట్లకు చేరుతుందన్న అంచనాలు కట్టి ఇంతటి వ్యయానికి నడుంబిగించినా, పనుల నాణ్యత విషయంలో ఎప్పటిమాదిరిగానే విమర్శలు తప్పడం లేదు. వాటిని అటుంచితే, ఈ సామాజిక మహోత్సవాన్ని సజావుగా ముగించడం ప్రభుత్వాల కర్తవ్యం. ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్ళతో భక్తజనకోటి రాకకోసం ఏర్పాట్లు చేసినప్పుడు డజనుకుపైగా ప్రభుత్వవిభాగాలు సయోధ్యతో, సమన్వయంతో మిగతా బాధ్యతలను కర్తవ్యనిష్ఠతో నెరవేర్చి ఈ పుణ్య స్నానాల ప్రక్రియను మధురానుభూతిగా మార్చవలసిన అవసరం ఉన్నది.
               ప్రయాణానికి వీలైన, పేరున్న ప్రాంతాలకే భక్తులు అధికంగా తరలివెళ్ళే చరిత్ర ఇటువంటి సందర్భాల్లో కనిపిస్తున్నదే. అందువల్ల తక్కిన ఘాట్ల వివరాలను ఆధునిక సమాచార వ్యవస్థద్వారా తెలియ చెప్పడంతోపాటు, ఎప్పటికప్పుడు రద్దీని కూడా విశదీకరించి మార ్గనిర్దేశనం చేయడం అవసరం. ప్రభుత్వ సమాచారాన్నీ, హెచ్చరికలను పెడచెవినపెట్టకుండా భక్తులు కూడా సంయమనంతో తోడ్పాటుతో వ్యవహరించినప్పుడే ఈ పుణ్యకార్యం ప్రమాదాలకు తావులేకుండా ప్రమోదాన్ని అందిస్తుంది.
                  తనకు ప్రాణాధారమైన నీటిముందు వినమ్రంగా మోకరిల్లే ఈ ఆధ్యాత్మిక క్రతువు ప్రకృతిపట్ల ప్రేమకూ ఆరాధనకు ప్రతీక. దీనికి ఆయాప్రాంతాల్లోని విభిన్నమైన ఆచారాలు, విధులు, విశ్వాసాలు తోడైనప్పటికీ, అది అందిస్తున్న సందేశాన్నీ, అంతిమసారాన్నీ తన జీవనపర్యంతం గుర్తెరిగి వ్యవహరించడం మనిషి బాధ్యత.


 
 
Inline image 3
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

10-8-16 బుధవారంహైదరాబాద్ లో మేము

, మా అమ్మాయి ,పిల్లలుమధ్యాహ్నం ఓల్డ్ బోయినపల్లి లో మా చిన్నక్కయ్యా బావా వాళ్ళింట్లో ,సాయంత్రం నల్లకుంటలోమా అన్నయ్య గారమ్మాయివేదవల్లీ ,రామ కృష్ణ గారింట్లో ను ,రాత్రి మల్లాపూర్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో ను గడిపిన చిత్ర మాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 18 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం

ఇది విన్నారా కన్నారా !  18

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం

239ఈమని శంకర శాస్త్రి గారు ముత్తు స్వామి దీక్షితులవారి వీణా ముఖం లో దర్శనమిస్తారని ఆచార్య ముదిగొండ వీర భద్రయ్య అంటారు .దీక్షితులవారు కాశీలో గంగా స్నానం చేస్తుంటే జగన్మాత వారి చేతులలో వీణ ను ప్రసాది౦చి౦దట .వారి వారసుల వద్ద ఆ వీణ ఇప్పటికీ ఉందట .ఆ వీణకు ‘’యాళి’’అదో ముఖంగా కాక ఊర్ధ్వ ముఖంగా ఉండటం విశేషం .అంటే వీణ శిరస్సు కిందికి కాక పైకి ఉంటుందన్నమాట .

240-మైకుల్లేనికాలం లో  దూరంగా ఉండేవారికీ వినబడాలని వైణికులు తంత్రులను బలంగా మీటేవారు .దీనివలన నాదం లోని అందం పోయేది .శివ మహా దేవుడు వీణ వాయించినట్లు త్యాగ బ్రహ్మ కీర్తనలో ఉంది .చాలామంది వీణ వాయించినా వారికే కీర్తి వచ్చిందికాని వీణకు రాలేదు .ఈమని వారు జన్మించి పరమేశ్వర వీణకు ఘనతను సాధించి పెట్టారు .వారు జన్మించి ఉండక పోతే ఇది సాధ్యమై ఉ౦డేదికాదంటారు ముదిగొండవారు .’’అన్ని వాద్యాల స్థాయిలో వీణను నిలబెట్టి ,కొత్త ఊపిరులూది ,నూతన జన్మ నిచ్చి ,సర్వ స్వతంత్ర ,సంపూర్ణ ,సమగ్ర ఘన వాద్యం గా నిలిపిన ఘనత మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి మహోదయులదే’’అన్నారు ఆచార్య ముదిగొండ .

241-‘’ఆర్కెస్ట్రాలో వెనక ఉండే దుర్దశ నుంచి తప్పించి దాన్ని ఉచ్చ స్థాయికి తెచ్చి ,గాత్ర ధర్మాల నన్నిటిలోను వీణను నిలిపి  ,గాత్రం కంటే ఎక్కువగా వీణ మాధుర్యాన్ని నింపి ,సంగీత ప్రపంచాన్ని అమృత పానం చేయించిన సంగీత జగన్మోహిని యొక్క పుంభావ మూర్తి శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు ‘’అని విశ్లేషించి చెప్పారు ముదిగొండజీ .వీణ ను బయటి వస్తువుగా భావించక ,తన ‘’దేహాత్మ’’ లలో ఒకదానిగా ,తన ఆత్మగా ,అంతరాత్మ గా  భావించి,దానితో లయించిన నాద యోగి ఈమని శాస్త్రీజీ .గాయకుని గొంతు కంఠంలో ఉంటే ,శాస్త్రి గారు తన గొంతును బయట ఉన్న వీణకు ఇచ్చి ప్రదర్శించారు .ఆయనలోని గొంతుకూ ఆయన ఒడి లోని వీణకూ భేదం లేనే లేదు .దీక్షితులవారు ‘’మీనాక్షి మేముదం దేహి ‘’అని పాడుతూ జగన్మాతలో లీనమైతే శంకర శాస్త్రిగారు నాలుగున్నర గంటల సేపు గుంటూరు లో వీణ కచేరి చేసి ,ఆజ్ఞాపక  లహరీ ప్రవాహం మనసు నిండా నింపుకొని అదే రోజు రైలులో ప్రయాణం చేస్తూ అనంత వాయువులలో తన ప్రాణ వాయువును లయింప జేసుకొన్నారు .వారి ప్రక్కనే వారి వీణ కూడా  ఉంది .ప్రాణోత్క్రమణ  కు ముందు చాలా కాలంగా వారు తమ వీణ తో మాట్లాడుతూ ఉండేవారట .ఆ మాటల్లో సారాంశం ‘’నేను ఎప్పుడు చెబితే అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళు ‘’అని .వీణ వారికి జడపదార్ధం కాదు .అది ఆయనలోని సరస్వతీ మాత .వీణలో ఆవాహనమైన ఆ దేవతా మూర్తినే దర్శించేవారాయన  .పేరుకే కాక నిజంగానే భోళా శంకరులే శంకర శాస్త్రి గారు .వీణ మీద  ఈషణ్మాత్ర తిరస్కృతి  కూడా వారు సహించేవారు కాదు .ఒక సంగీత విమర్శకుడు ఒక సారి ఆయనతో చమత్కారంగా ‘’అయ్యా !ఇప్పుడు సరస్వతీ దేవి వీణ ను వదిలేసి ,అంతకన్నా సౌఖ్యమూ ,ఎక్కువ సౌలభ్యమూ ,వేగ సిద్ధీ ఉన్న వయోలిన్ ను పట్టుకోన్నట్లుంది ‘’అంటే శాస్త్రిగారు ఆయన వైపు ‘’గుడ్లురిమి ‘’చూశారట .వీణ అంటే వారికి అంతటి నిబద్ధత .శాస్త్రిగారికి ముందుకాలం లో  వీణను విద్వాంసులు కష్టం అనుకోని వేగంగా వాయించేవారు కాదు .ఆ లోటును పూడ్చి శాస్త్రిగారు మహా వేగంగా వాయించి యెంత తేలికో రుజువు చేశారు .సరోద్ వాయించే అమ్జాద్ ఆలీఖాన్ కు వేగంగా వాయించటం మహా ఇష్టం .అలాంటి ఖాన్ సాబ్ తో శాస్త్రి గారు వీణతో యుగళం  వాయించి ప్రపంచ శ్రోతలనే మెప్పించారు .వారి సాధన ,ప్రయోగం అంతటివి.

Inline image 1Inline image 2 Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-10-8-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 17

ఇది విన్నారా కన్నారా !  17

34-వైణిక సార్వ భౌమ –శ్రీ పప్పు సోమేశ్వర రావు

231 –వీణా ,జ్యోతిష సంస్కృతాలలో ఉద్దండులు శ్రీ పప్పు సోమేశ్వర రావు .’’సోమేశ్వర కృతి కదంబం ‘’పేరిట వాగ్గేయ కారుల చరిత్ర రాసి 199 7 లో ప్రచురించటమేకాక వాగ్గేయ కారులు కూడా అయ్యారు .’’కృతి కదంబం ‘’పేరుతో సంస్కృత భాషా కృతులను రాశారు .నవగ్రహాలపై రాసిన కృతులు వీరి సంస్కృత భాషా  సంగీత పాండిత్యానికిప్రాతీకలు .

232-పప్పు వారు విజయనగర పద్ధతిలో తానం వాయించి ప్రత్యేకత సృష్టించారు .విజయవాడ రేడియోలో 14 వ ఏట మొదటి కచేరీ చేశారు బావగారు అయ్యగారి సోమేశ్వర రావు గారే గురువు .ఎన్నో రేడియో కేంద్రాలలో కచేరీ చేశారు .వీరి రాగం,తానం పల్లవి లకు ప్రత్యేకత ఉంది .100 పల్లవులను విభిన్న తాళాలలో వాయించే అరుదైన నేర్పున్నవారు అలా హైదరాబాద్ కేంద్రం లో వాయించి చూపారుకూడా .

233  -ఇంగ్లీష్ టీచర్ గా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాద్ సికందరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలలలో వీణా చార్యులయ్యారు .వైణికుని కి పరీక్ష పెట్టె తోడి ,ఆనంద భైరవి ,శహన ,కేదార గౌళ ,కాపీ ,నీలాంబర రాగాలను సాధికారంగా వాయించే నైపుణ్యం వారిది .

234 –మరీ చిన్నతనం లో వాయించిన కచేరీలకు పారితోషిక ధనాన్ని తండ్రిగారి పేర చెక్ ఇచ్చేవారట .వీరికుమారుడు పప్పు చంద్ర శేఖర్ కూడా తండ్రికి తగ్గ వారే –‘’వీణానాద సుధార్ణవ ‘’,వైణిక సార్వ భౌమ ‘’బిరుదాంకితులు .12-9-2002 వైణిక సార్వభౌమ ,వైణికశిరోమణి  పప్పు సోమేశ్వర రావు గారు పరలోక గతులయ్యారు .

Inline image 1

35-వైణిక శిరోమణి –శ్రీ వాసా కృష్ణ మూర్తి

235 –వాసా వారి కుటుంబమంతావీణా వాదన  సంగీతం లో ధన్యమైనవారే .వాసా పెద జగ్గన్న గారి నుంచి రామ దాసు ,దాసన్న ,చిన జగ్గన్న,పెద కామయ్య ,నర్సయ్య ,అప్పయ్య ,చిన కామయ్య ,సాంబయ్య ,కృష్ణ మూర్తి ,వెంకటరావు సాంబ మూర్తి ,కృష్ణ మూర్తి గారి దాకా   పది తరాల వరకూ అందరూ వైణిక విద్వాంసులే అవటం అబ్బుర పరచే విషయం.

236- వాసా కృష్ణ మూర్తిగారు తయారు చేసిన శిష్యులు అనేకులున్నారు వీరి బాణీకి విశిష్టత ఉంది .హిందూ స్థానీ రీతిని కూడా మేళవించి వాయించే సామర్ధ్యం వారిది .వీరికుమారుడు వెంకటరావు గారుకూడా గొప్ప విద్వాంసులే .రెండు చేతులతోనూ వీణ మీటే ప్రత్యేకత కృష్ణ మూర్తిగారిది .కుడి చేతి వ్రేళ్ళతో మీటు ,ఎడమ చేతి వ్రేళ్ళతో వాదనమూచేసేవారు .రోజుకు కనీసం 10 గంటల సాధన చేసేవారు .

237 –తానం విషయం లో గొప్ప ప్రయోగ శీలి .తాళం తీగలను మీట కుండానే కృష్ణ మూర్తిగారు అప్పుడప్పుడు కొంతకాలం తానం వాయించి ,ఆ వెంటనే తాళం తీగల్ని మీటి దానితో కలిపేవారు .ఇదీ ప్రత్యేకత .ఆయన తానం పరవళ్ళు తొక్కే ప్రవాహం లాగా స్రవించేది .ఈవిధంగా స్పురిత ,ప్రత్యాహత ,సుళువులతో కూడిన మేళ రాగ పంచక తానం దురితం లో విజ్రు౦భించి వాయిస్తుంటే ‘’నాసామిరంగా’’- వినే వాళ్లకు సితార్ ,సరోద్ లు విన్నంతమదురాను భూతి కలిగేది

238 –నిర్మొహమాటి కృష్ణ మూర్తిగారు .ఎంత గొప్ప సంగీత విద్వా౦సుడైనా తనకు నచ్చకపోతే నిర్మొహమాటంగా   విమర్శించేవారు .1944 లో శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు కృష్ణ మూర్తిగారి వీణా వాదన విని ‘’శిరోమణి ‘’బిరుదునిచ్చారు .తర్వాత ‘’వైణిక శిరోమణి ‘’అయ్యారు .వీరి శిష్యులలో ప్రముఖులు –శ్రీ మంగు వెంకట రావు ,శ్రీ బి జగన్నాధం ,శ్రీ మతులు వసు౦ధరాదేవి,జోగులాంబ ,అ౦బుజవల్లి ,సుభాషిణి శాస్త్రి .కృష్ణమూర్తిగారిని ‘’వీణా వాదన పధ నిర్దేశికులు’’గా భావిస్తారు .

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృష్ణా పుష్కరాలు –కొన్ని విశేషాలు

కృష్ణ వేణీ నది సాగర సంగమం అంత తేలిక గా జరి గిందా ?

అంటే జరగలేదనే చెప్పాలి .క్రిష్ణవేణీ నదికి సుమారు 20 ఉపనడదులున్నాయి .అవే తుంగ భద్ర ,భీమ ,పంచ గంగ ,ఘట ప్రభ ,పాలేరు ,మున్నేరు మొదలైనవి .వీటి జలకాలతో సంపూర్ణమై బిల బిలా కృష్ణమ్మ పరుగులిడుతూ బంగాళాఖాతం వైపుకు పరుగు పరుగున వస్తోంది .బెజవాడ దగ్గరకు రాగా ఇంద్ర కీలాద్రి ప్రవాహాన్ని ఆపేసింది .ఇక అంగుళం ముందుకు కదిలే వీలు లేక పోయింది.దీనికో కధ ఉంది .కీలుడు అనే కొండ అమ్మవారికోసం తపస్సు చేయగా ఆమె ప్రత్యక్షమైంది .వరం కోరుకో మంటే అమ్మవారిని హృదయ స్థానం లో నిలిచి పొమ్మని వేడుకొన్నాడు .అలానే అని కనక దుర్గమ్మ తల్లి కీలును హృదయ కుహరం స్వయంభువు గా నిలిచి పోయింది .సహ్యాద్రి నుండి ప్రవహిస్తూ అనేక ఓషధులను తనతో మోసుకొచ్చిన కృష్ణ వేణీ నది వలన భూములన్నీ సారవంతమై బంగారు పంటలు పండి కృష్ణా పరీవాహక ప్రాంతమంతా సశ్యశ్యామలమైంది .అదొక దివ్య క్షేత్రమైంది .అదే కీలాద్రి .ఇంద్రుడు మొదలైన దేవతలు కృష్ణ వేణీ నదిలో పవిత్ర స్నానాలు చేసి కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించి పూజించారు .కనుక అది అప్పటి నుండి ‘’ఇంద్ర కీలాద్రి ‘’అయింది .సముద్రుని చేరాలన్న కృష్ణానది తపన కీలుని వలన తీరకుండా ఆగి పోయింది .మళ్ళీ దేవతలందరూ కీలుడిని ప్రార్ధించి కృష్ణ వేణీ నదికి దారి ఇమ్మన్నారు .సరే అన్న కీలుడు తన కొండలో  ఒక సొరంగం ఎర్పడేట్లు చేసి నదీ ప్రావాహాన్ని దానిగుండా సాగి పొమ్మన్నాడు .అప్పటికే చాలాకాలంగా నిలిచి పోయిన కృష్ణ నీరు మహోద్రుతంగా సొరంగం ద్వారా ప్రవహించటం తో దానికి తట్టుకో లేక పెద్ద కొండ చరియ విరిగి తేలుకొంటూ సుమారు రెండు మైళ్ళు నదీ ప్రవాహం పై తేలుతూ కొట్టుకు పోయింది .దీనినే ‘’తేలు కొండ ‘’అన్నారు .అది విజయవాడ సమీపం లో ‘’యనమల కుదురు ‘’వద్ద ఆగి పోయి అక్కడ ఒక దివ్య క్షేత్రం వెలసింది .దీన్ని  ‘’ఫల్గుణ తీర్ధం’’అంటారు .ఇక ఉత్సాహంగా ప్రవహిస్తూ హంసల దీవి వద్ద  పాయలుగా చీలి సాగర సంగమం పొంది తరించింది .

‘’కృష్ణా పరీ వాహక ప్రాంతం లో మొత్తం 138 పవిత్ర క్షేత్రాలు ఏర్పడి ప్రసిద్ధి చెందాయి .

క్రష్ణానదీతీరాన్ని పాలించిన రాజులు –విశేషాలు

కృష్ణానది తూర్పు భాగ దేశాన్ని క్రీ శ.3 ,4 శతాబ్దాలలో ఇక్ష్వాక రాజులు పాలించారు .వీరి రాజధాని విజయపురి అంటే నేటి నాగార్జున సాగర్ .క్రీ శ.4 వ శతాబ్దిలో మచిలీ పట్నం దగ్గరున్న ‘’కూడూరు ‘’అంటే నేటి గూడూరు బృహత్పలలాయనుల రాజధాని .అప్పుడు అది గొప్ప రేవు పట్టణం కూడా .బందరు ఓడ రేవు నుండి యూరోపియన్ దేశాలకు ‘’మజ్లిన్ ‘’అనే చా సున్నిత సుందర వస్త్రాలు ఎగుమతి అయ్యేవి .అందుకే దానికి మచిలీ పట్నం అనే పేరు వచ్చిందని చరిత్రకారుల ఉవాచ .

తరువాత శాలంకాయన , ఆనంద గోత్రీక రాజులు కృష్ణకు రెండు వైపులా పాలించారు .వీరి తరువాత పాలించిన విష్ణు కుండిన రాజులు మొగల్రాజ పురం ఉండవల్లి గుహలను నిర్మించారు .7 వ శతాబ్దం లో విష్ణు కుండిన రాజుల రాజ దాని బెజవాడ .వారి పాలనలో కళా ,సాంస్కృతిక వికాసం సమృద్ధిగా జరిగింది .ఇంతటి చారిత్రకల కృష్ణా నదికి పుష్కర శోభ కొద్దిరోజులలో వస్తోంది .అందుకే కృష్ణ వేణీ మాతకు –

‘’కన్యా గతే గురౌ యద్య –సప్త కోట్యఘ నాశనం –స్నాన మాత్రేణ సర్వేషాం-తావత్పుణ్య వివర్ధనం ‘’అని నమస్కరిస్తూ పుష్కర పుణ్య స్నానం ఆచరించాలి .

Inline image 1Inline image 2Inline image 3

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-8-8-16 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 16

ఇది విన్నారా కన్నారా !  16

32-వీణకు అంతర్జాతీయ వైభవం కల్పించిన –శ్రీ మొక్కపాటి నాగేశ్వర రావు

226-1926 లో శ్రీ మొక్కపాటి సత్యనారాయణ ,శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్లకు జన్మించి ఏలూరులో వీణ నేర్చి ,మద్రాస్ లో సంగీత విద్వాన్ పాసై నిలువుగా నిలబెట్టి వీణ వాయించే వైదుష్యం శ్రీ నాగేశ్వర రావు గారిది .1956 నుండి పదేళ్ళు మద్రాస్ లో వీణ బోధించి అనేక శిష్యులకు గురువయ్యారు .వీరి శిష్యులలో విదేశీయులు ఎక్కువ మంది ఉండటం విశేషం

227 -1966 లో ఫ్రెంచ్ ప్రభుత్వమిచ్చిన స్కాలర్షిప్ పై ‘’గ్రిగోరియన్ బాండ్ ‘’వారి చర్చి మ్యూజిక్ పై పరిశోధనకు ఆహ్వానింప బడి ,పూర్తీ చేశారు అమెరికా వెళ్లి ‘’వేసిలీనియన్ ‘’విశ్వ విద్యాలయం లో ఆచార్యులుగా పని చేశారు .1969 లో ఇండియాకు తిరిగొచ్చి అనేక కచ్చేరీలు చేస్తూ శిష్యుల చేతా చేయించారు .1970లో మద్రాస్ లో స్థిరపడ్డారు .1974 లో శ్రీ దండమూడి రామమోహన రావు గారితో కలిసి యూరప్ దేశాలలో పర్యటించి పలు సంగీత కచేరీలు చేసి మెప్పించారు .1976లో పారిస్ విశ్వ విద్యాలయం లో కర్నాటక సంగీత ఆచార్యులుగా నియమింపబడి సేవలు అంద జేశారు .

Inline image 1

33-వైణిక బాల భాస్కర –శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు

228—చరిత్ర సృష్టించిన మహా వైణికులు శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు .వీణ గురువరాచార్యులు ,వారి పౌత్రులైన వీణ వెంకట రమణ దాసు గార్లను బాల్యం లోనే మెప్పించినవారు సోమేశ్వర రావు గారు .’’వాగ్గేయ కార రత్న ‘’శ్రీ హరి నాగ భూషణం గారు మచిలీపట్నం లో సోమేశ్వరావుగారు 19 వ ఏట చేసిన కచేరీకి ముగ్ధులై ‘’వయసులో చిన్నవాడే అయినా కళ లో వ్రుద్ధుడే .కళలో పూర్తీ సిద్ధ హస్తుడు .’’వీణా కోవిద’’అని విజయనగర సంస్థ ‘’భారతీ తీర్ధ ‘’అందజేసిన బిరుదు కు అన్నివిధాలా తగినవాడు .అంతకంటే ‘’వైణిక బాల భాస్కర ‘’బిరుదం అత్యుత్తమంగా ఉంటుంది ‘’అన్నారు .మార్చి 25 న ఈ బిరుదప్రదానం హరి వారి చేతులమీదుగా అందుకొన్న చైల్డ్ ప్రాజేడి సోమేశ్వర రావు గారు .

229-17-5-1951న కోయంబత్తూర్ లో ,ఆ తర్వాత తంజావూర్ లో వీణ కచేరీచేసి మెప్పించారు .15-2-1952  న మచిలీపట్నం ‘’ఆంద్ర సారస్వత సమితి ‘’వారు ‘’వైణికరత్న’’బిరుదునిచ్చి సత్కరించింది .శ్రీ సోమేశ్వర రావు విజయనగరం జిల్లా వేగేశ అగ్రహారం లో 1920లో జన్మించారు .విజయనగర సంగీత కళాశాలలో చదివి ‘’డిప్లొమా ‘’అందుకొన్నారు .చిన్న తనం లోనే స్నేహితులను చుట్టూ కూర్చో బెట్టుకొని ‘’సంగీత ఆట ‘’ఆడేవారు .ప్రతిమాటకూ సమాధానాన్ని సంగీతం లో చెప్పటం అప్పటి వీరి ప్రత్యేకత గ్రామ. ఫోన్ రికార్డ్ లను బహు శ్రద్ధగా వినేవారు .ఆది భట్ల నాయన దాసుగారు వీరి బాల్య సంగీత ప్రతిభ గుర్తించి ,విజయ నగర సంగీత పండితులకు పరిచయం చేసి శ్రీ పేరి శ్రీరామ మూర్తి గారి వద్ద గాత్ర విద్యకు కుదిర్చారు

230 –శ్రీ వాసా కృష్ణ మూర్తి తో కలిసి వారింట వీణ సాధన చేస్తూ ,నిలబెట్టి వీణ వాయించేవారు .దేశమంతా పర్యటించి అనేక కచేరీలు చేసి చాలా.సువర్ణ ఘంటా కంకణాలతో  సన్మానింప బడ్డారు .వీరి ధర్మపత్నికూడా వీరి శిష్యురాలే .వీరి సంగీతారాధనకు అచ్చెరువొందిన బాపట్ల ప్రజలు సగౌరవంగా ఆహ్వానించి అక్కడే ఉండే ఏర్పాటు చేసి గౌరవించారు .14-7-1973 న సోమేశ్వరరావు గారు 53వ ఏటనే సోమేశ్వర సాన్నిధ్యం చేరుకున్నారు .

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-8-16- కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు -2(చివరి భాగం

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం )

481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు -2(చివరి భాగం )

శివ కర్ణామృతం లో పుట్టపర్తి వారి కవితా గీర్వాణం

పుట్టపర్తి వారి సంస్కృత భాషా గరిమకు ,వారి ఊహా సౌందర్యానికి అద్దం పట్టేదే ‘’శివ కర్ణామృతం ‘’.కాని దీనిని కొందరు సాహితీ ప్రియులేకాక సాహిత్య వరిస్టులు కూడా తమ రచనలు గా , వారివిగా ప్రకటించుకొన్నారని ఆచార్య వర్యులు మధునాపంతుల సత్యనారాయణ గారికి జాబు రాస్తూ బాధ పడ్డారు ..ఇలా వ్రాత ప్రతిగాఉన్నప్పుడే చేతులు మారింది ఈ కావ్యం .కాని ఇందులోని శ్లోకాలను ఆచార్యుల వారు పలు సభల్లో చదివి వినిపించటం తో వారి సంస్కృత భాషా వైదుష్యం చాలా మందికి తెలుసు .50 ఏళ్ళ  తర్వాత వారి కుమార్తె శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని గారిని చేరటం,తండ్రిగారు 1990 సెప్టెంబర్ 1 న  శివ సాయుజ్యం పొందాక ,మరణానంతరం  16 ఏళ్ళ తర్వాత ఆమె దీన్ని 20 06 లో ఆమె  ముద్రించి సాహితీ లోకానికి అందించారు .ఇదీ దీని తెర వెనుక గాధ..పరమ వైష్ణవులైన నారాయణాచార్య పరమేశ్వర భక్తితో శివ తా౦డవమేకాక  ,ఈ కావ్యాన్నీ  రచించి తమ అద్వైత భావనకు ఉద్దీప్తి కలిగించారు .

శివ కర్ణామృతం అంతా పరమేశ్వరుని గుణగాన లహరీ విలాసమే .ఒకే అంశం తో ఒక గ్రంధాన్ని రాయటం సాహసమే కాక అరుదైన విషయం కూడా .121శ్లోకాలతో విరాజిల్లే ఈ కావ్యం శివ పారమ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పింది .ఉదాహరణకు కొన్ని శ్లోకాల సొగసు చూద్దాం –

‘’కళానిధి కళావతీ  కలిత జూట వాటీ లస –త్త్రివిస్టప తరంగిణీ లలిత తాండవాడంబరః

మదా౦చిత విలోచనో మధుర ముగ్ధ వేషస్సదా-పరిస్పురతు మానసే గిరి సుతాను రాగాంకురః’’

భావం –గిరిపుత్రి పార్వతికి శివుడు అనురాగ అ౦కురంగా ఉన్నాడు .ఆయన జటా జూటం చంద్ర వంక తో శోభిస్తోంది .ఆ జూటం లో గంగానది అతి మృదులంగా తాండవిస్తోంది .అందుకని ఆయనకళ్ళు మదాలనం గా ఉన్నాయి  .ఆకట్టుకొనే ఇలాంటి రూపం ఉన్న శివుడు నన్ను అనుగ్రహించాలి .

49 వ శ్లోకం లో తమ ధార్మిక నైజాన్ని మనోహరంగా వర్ణించిన శ్లోక వైభవం చూద్దాం –

‘’శేష శైల శిఖా రాది వాసినః –కిమ్కరాః పరమ వైష్ణవా వయం –తత్తధాపి శశి ఖండ శేఖరే –శా౦కరే మహసి లీయతే మనః ‘’

అర్ధం –శేష శైల శిఖరం పై వెలసిన శ్రీనివాసుని భక్తులం పరమ వైష్ణవులం అయిన మేము నెల వంక శిరో భూషణం గా విరాజమానమైన ఆ పరమ శివ కాంతి స్వరూపం లోనే మా మనసులు లీన మౌతున్నాయి ‘’ అని తమ శివ భక్తిని వైష్ణపరాయణత్వాన్ని చెప్పుకొన్న అద్వైత భావి పుట్టపర్తివారు .

‘’శివ కర్ణామృతకావ్యం స్తోత్ర కావ్యం .భగవానుని రూప గుణ మహాత్మ్య ,తత్వ  భక్తీ తన్మయత్వ స్తుతి ఇందులో ఉండటం వలన భక్తుని అభ్యర్ధనం పరమ రామణీయకంగా ఆవిష్కృత మైంది .శబ్దాలంకార శోభ నిజంగా  చెవులకు అమృతం గా అంటే కర్ణా మృతం గా  భాసిల్లింది .బ్దార్ధ ఉభయ అలంకార శోభ నెమలిలా పురి విప్పి నాట్యం చేసింది ‘.ఈ కావ్యం లో ఆచార్యులవారు శివునిదివ్య కాంతి స్వరూపునిగా స్తుతించారు .శివుని విభూతిని కాంతి ,తేజో రూపాలుగా వర్ణించి దైవం ఒక్కటే అని ఆ దైవం ఆమెకాని అతడు కాని కాదని అదొక దివ్య తేజం అని ,ఆతేజం మానవులకే కాక సకల విశ్వ సృష్టి కి ఆధారమైనది అని తన మనో భావాన్ని తెలియజేసి వేదోపనిషత్ రహస్యాన్ని విస్పష్టంగా విడమర్చి చెప్పారు ‘’అన్న శ్రీ శశిశ్రీ గారి మాటలు ముత్యాల మూటలే.ఆచార్య వర్యుల ముఖ్య అంతేవాసిగా వారు గ్రహించిన పూర్తి సత్యమే ఇది .

సాహితీ పుత్రుని జీవిత విశేషాలు

శ్రీ కృష్ణ దేవరాయల రాజ గురువు తిరుమల తాతాచార్యుల వారి వంశం వారు అనంత పురం జిల్లా చిత్రావతీ నదీ తీరం లోని పుట్ట పర్తి చేరి తిరుమలవారు పుట్టపర్తి ఇంటి పేరు వారయ్యారు .పెనుగొండ తాలూకా చియ్యేడు గ్రామం లో మాతామహుల ఇంట నారాయణా చార్యుల వారు 28-3-1914 న జన్మించారు .తండ్రి శ్రీ శ్రీనివాసాచార్యులు .తల్లి లక్ష్మీదేవమ్మ (కొండమ్మ ). నారాయణా చార్యులవారికి తొలి గురువు తల్లి . అణ్ణయ్య ఆచార్యులవద్ద సంస్కృతం అభ్యసించారు .   ధర్డ్ ఫారం చదివే రోజుల్లోనే ‘’అల కవితా లోకమునకు ‘’అనే కంద పద్యం అల్లిన కుశాగ్ర బుద్ధి వారిది .పెనుగొండ కలెక్టర్ భార్య పిట్ దొరసాని వీరి కుటుంబ శ్రేయోభిలాషి .ఆమె షేక్స్పియర్ ,మిల్టన్ ల సాహిత్యాన్ని ఆపోసన పట్టిన విదుషీ మణి .ఆచార్యులవారికి ఆంగ్ల భాషపరిచయం ఆసాహిత్యం పై అభిమానం కలుగ జేసింది .రంజకం మహా లక్ష్మి అనే నృత్యకళాకారిణి  వీరికోరికపై కూచిపూడి ,భరతనాట్యాలను నేర్పింది .పుట్టపర్తివారి బంధువు  మైసూరులో ఉన్న శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారి వద్ద ప్రాకృత భాష ,దాని భాషా భేదమైన ‘’అపభ్రంశం’’కూడా నేర్చి అందులోని కావ్యమైన ‘’జనహర చరిత్ర ‘’అధ్యయనం చేసి  కావ్య రచన పై ద్రుష్టి పడి. పెనుగొండ గతవైభవం మనసులో మెదిలి ‘’పెను గొండ లక్ష్మి ‘’కావ్యంగా రాశారు .అప్పటికి ఛందస్సులో పూర్తి ప్రవేశమూ లేదాయనకు .చిన్నప్పటి నుంచి తిక్కన భారతం వాచో విదేయం అవటం తో తేలికగా రాయగలిగారు .ఆర్ధిక స్తోమత లేక ముద్రా భాగ్యం కలిగించే లేక పోయారు .

తిరుపతి సంస్కృత కలాశాలలో చేరాలని వెడితే ప్రిన్సిపాల్ కపిత్ధలం కృష్ణమాచార్యులు పూర్వపు చదువు ధృవీకరణ పత్రాలు కావాలన్నారు .అవి ఉండటానికి అయన ఎక్కడైనా చేరి చదివితేగా!అసహనంగా బయటికి వస్తూ ఆశువుగా ఆవేశంగా పద్యాలు చెబుతూ బయటికొచ్చిన వీరిని వెనక్కి పిలిచి సీటు ఇచ్చారు ప్రిన్సిపాల్ .అదే వారి యోగ్యతా పత్రమైంది ,ప్రవేశ పాత్రమైంది.వ్యాకరణ అలంకార శాస్త్రాధ్యయనం చేస్తూ తోటి విద్యార్ధులకు వీటిని బోధిస్తూ’’ వాలి చరిత్ర ‘’,ఇందుమతి’’ అనే రెండు కావ్యాలు రాసి నచ్చక చి౦చి పారేశారు .అవధానాలు చేసి అలరించారు .ఊహా శక్తి కి  అవధానాలు అడ్డం అని మానేశారు .పాఠ్య భాగాలు ఆయనకు ‘’ఆనలేదు’’ .నటన పై ధ్యాస పెరిగి సహ విద్యార్ధులతో ‘’బొబ్బిలి ‘’నాటకాన్ని కడప జిల్లా రాజం పేట లో ప్రదర్శించారు .వీరు తాండ్ర పాపారాయుడు పాత్రను, చలమచర్ల రంగా చార్యులుగారు రంగ రాయుడు పాత్రధరి౦చారు .నిరంతర సాహిత్య గోష్టి జరిపేవారు . వారి ధారణా శక్తి అమోఘం   భట్ట బాణుని కాదంబరి కావ్యం  షేక్స్పియర్ మిల్టన్ షెల్లీ కీట్స్ వర్డ్స్ వర్త్ కవుల రచనలను ఆసాంతం  అప్పగించేవారు .వాల్మీకి రామాయణం నాలుకపై ఎప్పుడూ నర్తి౦చేది .అలివేలుమంగా పురానికి ఉత్తరాది మఠం స్వామి శ్రీ సత్య ధ్యాన కీర్తుల వారొచ్చినప్పుడు వారి సమక్షం లో సంస్కృతం లో ఆశుకవిత్వం చెప్పి షట్ శాస్స్త్ర పండితులైన స్వామినే మెప్పించారు .తిరుపతిలో తాను చదవటానికి ఏదీ మిగలి లేదని పెను గొండ కు వెళ్లి పోయి పరీక్ష సమయానికి వచ్చి రాసి ఉత్తీర్ణులయ్యారు .

1934 లో14 వ ఏట’’  పెనుగొండ లక్ష్మి’’ కావ్యం రాశారు .19 వ ఏట ముద్రణ పొందిన ఆ కావ్యాన్ని  మద్రాస్ ప్రభుత్వం ఇంటర్ కు పాఠ్య గ్రంధం చేసింది .తిరుపతిలో ఉండగానే ఇంటర్ పరీక్ష రాసి తాను  రాసిన కావ్యానికి తానే విద్యార్ధిగా పరీక్ష రాసి చరిత్ర సృష్టించారు .ఏనుగొండ లక్ష్మి పై ఇచ్చిన రెండుమార్కుల ప్రశ్నకు 40 పేజీల సమాధానం రాసి సమయం అయిపోగానే మిగిలిన వాటి జోలికీ పోకుండా జవాబు పత్రం ఇచ్చేశారు .పార్సీ భాషాధ్యయనం చేసి 17 0పద్యాల ‘’షాజీ ‘’ ‘’సాక్షాత్కారం ‘’ రాశారు .పెనుగొండలో వివాహం చేసుకొని భార్య కొన్ని రోజులకే చనిపోతే విద్వత్ కవ యిత్రి  శ్రీమతి కనకమ్మ గారిని వివాహమాడి 5 గురు కుమార్తెలు ఒక కుమారునిని పొందారు . .ఆమె ఉత్తమ కవయిత్రి గా బహుమతి పొందారు .కాపురం ప్రొద్దుటూరు కు మార్చారు .కన్యకా పరమేశ్వరి దేవాలయం లో సంస్కృతం నేర్పారు విద్వాన్ పూర్తికాలేదింకా .భారతి పత్రికలో వీరి రచనలు ప్రచురితమయ్యేవి .మునిసిపల్ హై స్కూల్ తెలుగు పండితులుగా చేశారు .హిందీ సాహిత్యాన్ని అవలోడనం చేశారు .తులసీ తుకారాం కబీర్ రాస్ఖాన్ ,రాహీం ల కవిత్వాన్ని మధించారు .’’మేఘదూతం’’ ,శివ తాండవం’’ ‘’పండరి భాగవతం’’ రాశారు .కుందూ నది ఒడ్డున చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని శిష్యులతో ఉంటూ దాదాపు 7,0 00 కృతులు రాశారు .’’విజయనగర సామ్రాజ్య ప్రబంధం’’ రాశారు .మరాఠీ భాషానుభవంతో ‘’పాద్యం ‘’,అనే కావ్యాన్ని గురువు పూజ స్థానీయం పై రాశారు .పాండి చేరి వెళ్లి ,శ్రీ అరవింద ఘోష్ తో పరిచయం పెంచుకొన్నారు .అరవిందుల రచనలు తెలుగులోకి కొన్ని ఆవదించారు

రాళ్ళపల్లి వారి వద్ద సంగీతాన్ని సంధ్యా వందనం శ్రీనివాసాచారిగారితో కలిసి నేర్చుకొన్నారు .ఫిడేల్ పెద్ద జమాలప్ప ,వద్ద 150 కృతులు పాఠం చెప్పించుకొన్నారు ‘.ఘోరా కు౦ భార్ ‘’,తులసీదాస్’’, ‘’కాంగ్రెస్ చరిత్ర ‘’హరికధలు రాసి స్వయంగా గానం చేశారు. 60 వర్ణాలను కొక్కొండ సుబ్రహ్మణ్యం వద్ద నేర్చి ‘’శివ రంజని ‘’,శ౦కరి ‘’అనే రెండు కొత్త రాగాలను కనిపెట్టారు .త్యాగ రాజ స్వామి పై సంస్కృతం లో సుప్రభాతం రాస్తే మంగళం పల్లి బాల మురళీ కృష్ణ మధుర గానం చేసి అజరామరం చేశారు .ఇది ఆడియో కేసెట్ గా వచ్చింది .అగస్త్యేశ్వర సుప్రభాతం, చెన్నకేశవ సుప్రభాతం ఆచార్యులవారి ఇతర సంస్కృతకీర్తనలు . అన్నమాచార్యులవారి 100 కృతులకు బాణీల ఓణీలు వేశారు .

‘’గాంధీజీ మహా ప్రస్థానం ‘’తోపాటు కమ్యూనిస్ట్ భావ ప్రేరితంగా ‘’మేఘ దూతం ‘’,ఇంగ్లీష్ లో ‘’లీవ్స్ ఇన్ ది విండ్ ‘’కవితా సంపుటిని రాశారు . శంకరం బాడి బాడి సుందరా చార్యుల ప్రసిద్ధ గీతం ‘’మా తెలుగు తల్లి ‘’ని ఆంగ్లం లోకి అనువదించారు.సంప్రదాయ శైలి లో ‘’ది హీరో ‘’’’వైన్ గ్లోరియస్ ,’’భాగవతం ‘’రాశారు .ప్రొద్దుటూరు  నుండి కడప కు మకాం మార్చి శ్రీ రామ కృష్ణ హైస్కూల్ లో తెలుగు పండితులుగా చేరి ,జిల్లెళ్ళమూడి అమ్మ గారు కొనిచ్చిన ఇంట్లో చేరి , .మళయాళ నిఘంటువు నిర్మాణం చేసి, ఆ భాషలోని రచనలను తెలుగులోకి తెలుగు నుండి కొన్ని మలయాళం లోకి మార్చారు .మరాఠీ భాష లో’’ భగవాన్ బుద్ధ’’ ,స్వర్ణ పత్ర’’ ,’’ఉషః కా’’ల్ నవలలు రాశారు .కృష్ణ శంకర్ దేవ్ మరాఠీరచన ను ‘’సమర్ధ రామ దాసు ‘’గా తెలుగులోకి అనువాదం చేశారు .

తులసీదాస్ మహాకవి రామ చరితమానస్ ఆచార్యులవారికి కంఠో పాఠం..హిందీలోఉన్న  ‘’గాడీవాలా ‘’నవల ‘’కబీర్ వచనా వలి’’అనువదించారు .ఇంగ్లీస్ష్ నుంచి ‘’మెరుపులు –తలపులు ,’’అరవిందులు ,గీతోపన్యాసాలు’’ అనువాదం చేశారు .14 భాషలలో అనితర సాధ్య పాండిత్య ప్రకర్ష కలిగి ,సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించిన వీరికి ,ప్రతిభకు తగ్గ పురస్కారం ‘’పద్మశ్రీ ‘’నిభారత ప్రభుత్వం 1972జనవరి 26 న పుట్టపర్తి వారికి అందజేసి గౌరవించింది .1975 లో తిరుపతి విశ్వ విద్యాలయం ,1978 లో శ్రీ కృష్ణ దేవ రాయ విశ్వ విద్యాలయం లనుంచి గౌరవ డాక్టరేట్ పొందారు .’’జనప్రియ రామాయణం’’రాసి ,5 వ ఏట ఉర్దూ భాష నేర్చి ,ఘనంగా షష్టి పూర్తీ మహోత్సవం జరుపుకొని ,దేశం లోని అనేక సాహిత్య సంస్థలచేత సమ్మానింప బడి ,భార్య కనకమ్మగారి ప్రోత్సాహ , ప్రోద్బలాలతో 140 గ్రంధాలు రాసి తనకురావాల్సిన ‘’జ్ఞాన పీఠపురస్కారం ‘’మాత్రం దక్కక , 78 వ ఏట అభిమానులకు శిష్యులకు ‘’అవతారం చాలిస్తున్నానప్పా ‘’అని చెప్పి సరస్వతీపుత్రులు తల్లి సరస్వతీ సాన్నిధ్యానికి చేరారు .

ప్రొద్దుటూరు లో 20-9-1991 న పుట్టపర్తి వారి విగ్రహం ఏర్పాటు చేశారు .కడపలో వారి శిష్యులు ‘’సరస్వతీ పుత్ర అవార్డ్ ‘’ఏర్పరచి అర్హులకు అంద జేస్తూ వారి మధురస్మృతులను జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఋణం తీర్చుకొంటున్నారు .కుమార్తెలు శ్రీ నాగపద్మినిగారు సోదరితో శ్రీమతి  అనూరాధ గారి తో కలిసి ‘సరస్వతీ పుత్ర’ నారాయణా చార్య ‘’’బ్లాగ్ ఏర్పరచి తండ్రిగారి రచనలను  అందరికి అందుబాటు లోకి తెచ్చారు .

Inline image 1  Inline image 2Inline image 3

సమాప్తం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం )

481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు

స్వామిశివానంద చే’’ సరస్వతీ పుత్ర’’బిరుదాన్ని పొంది ,14 భాషలలో అఖండ పాండిత్యాన్ని సాధించి, తాను రాసిన ‘’పెనుగొండ లక్ష్మి ‘’కావ్యానికి తానే విద్యార్ధిగా  ఇంటర్ లో పాఠ్య గ్రంధంగా చదివిన ప్రపంచం లోనే అరుదైన వ్యక్తీ ,రెండు విశ్వ విద్యాలయాలనుండి గౌరవ డాక్టరేట్లు పొంది ,శతాధిక గ్రంధ కర్తయై ,పరమ వైష్ణవులైనా ‘’శివ తాండవ’’ కావ్యం నభూతో గా రాసి అఖండ కీర్తినార్జించి,భారత ప్రభుత్వం చే పద్మశ్రీ బిరుదాన్ని తమ అద్వితీయ కవితా, పాండిత్యాలకు అందుకొన్నవారు  శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు .అయితే వారు సంస్కృతం లో కూడా గ్రంధ రచన చేసిన విషయం శివ తాండవం మరుగున పడేసింది .అంతేకాదు 50 ఏళ్ళ తర్వాత మాత్రమె వారి ‘’శివకర్ణామృతం ‘’వెలుగు లోకి రావటం కూడా వింత విషయమే అయింది  గీర్వాణ కవుల కవితా గీర్వాణం రెండవ భాగం లో 481వ గీర్వాణకవిగా వారిని ఆలస్యంగా పరి చయం  చేస్తున్నందుకు మన్నించమని కోరుతూ వారి సంస్కృత భాషా వైశద్యాన్ని వివరిస్తున్నాను .

ఆచార్యుల వారి  సంస్కృత రచనలు –శివ కర్ణామృతం ,త్యాగ రాజ సుప్రభాతం ,అగస్త్యేశ్వర సుప్రభాతఃమ్ ,మల్లి కార్జున సుప్రభాతం ,మార్కాపుర చెన్నకేశవ సుప్రభాతం ,శివసహస్ర౦ అనే ఆరు రచనలు .ఇవికాక వారి శివ తాండవం లోనూ గీర్వాణ భాషను సందర్భాన్ని బట్టి వాడి,శోభ చేకూర్చారు .ముందుగా శివ తాండవ గీర్వాణ సౌందర్యం దర్శిద్దాం –

శివ తాండవం

కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం లో ఉదయ  సాయంత్రాలలో ప్రతి నిత్యం 108 ప్రదక్షిణాలు 40 రోజులు  చేసి ,అలౌకికానందాన్ని అనుభవించి శివ భక్తీ మహా ప్రవాహంగా మహోద్రుతంగా జాలువారి శివ తాండవం గా రూపు దాల్చింది .భక్తికి శివ కేశవ భేదం లేదని రుజువైంది .కన్నడం లోని రగడ ఛందస్సును తీసుకొని ,ఆ గేయ౦  ఛందస్సులో నర్తించే వైనాన్ని గ్రహించి కవితా తాండవమే చేశారు . నందీశ్వరుని నోట నా౦దీవాచాకాన్ని పుట్టపర్తివారు సంస్కృతం లో చెప్పించి అఖండ గౌరవం ప్రత్యేకతలను చేకూర్చారు  .తాండవాన్ని గూర్చి నంది వివరిస్తూ –

‘’అర్దే౦దూత్ఫుల్ల కేశం స్మిత రుచి పటలీ దంశితంగౌర వర్ణం –తార్తీయీకం ,వహంతం ,నయన ,మహికుల ప్రత్న భూషా వితానం

వృత్తారంభాట్ట హాస విచలిత కకుప్చక్ర ,మానంద  కందం—తమ్ వందే నీలకంఠం త్రిదశపతి శిరస్చు౦బి పదాబ్జ పీఠం ‘’

భావం –తలపై ఉన్న చంద్ర ఆభరణ కాంతులతో ,విచ్చుకొన్ని పరమ శివుని జటలు నిగనిగ లాడుతూ ,ఆయన చిరు నవ్వులు మూసుకున్న మూడవ కంటి పై గౌసన తొడగి నట్లుగా ,గట్టిగా నవ్వుతూ శివుడు  తాండవం  చేస్తున్నాడు .ఆ నవ్వుకు దిక్చక్రాలు అల్లలాడిపోతున్నాయి .ఆయన పాద౦  పీఠంపై   ఒంగి నమస్కరిస్తున్న దేవేంద్రుని శిరసును తాకు తోంది .

శివుని తాండవ రూపాన్ని వర్ణిస్తూ నందీశ్వరుడు –

‘’పాటల జటా ఘటిత ,జూట రుచి కోటి భ్రుష పాటిత తమిస్ర వలయం –కూట శబరం పటునిశాటకుల,జహాత సుఖ మోటనర సిక నిలయం

కోటి శత కోటి సమ కోటి నయనోత్దిత కృపీట భవ దగ్ధ  మండనం –నాటితభువం ప్రళయ నాటక మహా రచన పాటవ చణం హృది భజే ‘’

తాత్పర్యం –యఎర్రని జటా జూట౦  కాంతులతో చీకట్లను పార ద్రోలు తున్నాయి .రాక్షసుల సుఖ హారి ,మాయా కిరాతకుడు నూరు వజ్రాయుదాల కాంతితో సమాన కా౦తి కల మూడవ కంటి మంటతో మన్మధదహనం చేసినవాడు ,ప్రళయ నాటకం ఆడేవాడు సమస్త విశ్వాన్ని తా౦డవం తో సమ్మోహన ౦ తో అలరించే పరమ శివునికి ప్రణతులు .

పార్వతీ దేవి కడగంటి చూపు తో శివుని వక్షస్థలం నెమలి పురుగుల రంగుగా మారిందట .పార్వతి తన అందాలు చూసుకోవటానికి భర్త నేత్రాలే దర్పణాలుగా ఉపయోగిస్తోందట .వేదాలనే స్త్రీకి ఆయన సొమ్ము .జ్ఞాస్వరూపుడు శివుడు .శివాట్టహాసాలతో దిక్కులు పగిలిపోతున్నాయట ..చేతులు పైకెత్తి నాట్యం చేస్తుంటే ఆకాశం వెనక్కి పోతోందట .కాలి కదలికలకు భూమి ,పర్వతాలు కంపించి పోతున్నాయి .మొలకు చుట్టిన సర్పాభరణం మధ్య మధ్యలో ఊడి పోతుంటే సరి చేసుకొంటున్నాడు .ఇలాంటి శివునికి నందీశ్వరుడు –

‘’జయ జయ శంకర ,శత్రు భయంకర –జయ జయ ప్రధమ పిశాచన శంకర –జయ జయ తాండవ సంభ్రమ సుందర –జయ జయ ధైర్య విచలిత మందర ‘’అనిజయం పలికాడు .తరువాత శివతాండవాన్ని చక్కని తెలుగులో రాసి శివునితోపాటు మనల్నీ నర్తి౦చేట్లు చేశారు సరస్వతీపుత్రులు .గీర్వాణ ఆంద్ర భాషలలో తమ కవితా పాండితీ విభూతిని పండించి జన హృదయాలను రంజింప జేసే కవిత్వం రాసిన పుట్ట పర్తి వారు ధన్యులు .చదివి మనమూ ధన్యుల మవుతాం .ఆ అనుభూతి నాన్యతో దర్శనీయమని పిస్తుంది

తరువాత శివ కర్ణామృత విశేషాలు తెలుసుకొందాం

ఆధారం –సాహిత్య అకాడెమి ప్రచురించిన శ్రీ శశిశ్రీ రాసిన ‘’పుట్ట పర్తి నారాయణా చార్య ‘’గ్రంధం

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-16- కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా కృష్ణా పుష్కర అనుభవం

నా కృష్ణా పుష్కర అనుభవం

సహ్రుదయులైన సాహితీ బందులకు,సాహిత్య సాంస్కృతిక అభిమానులకు శ్రీ క్రష్ణవేణీపుష్కర శుభాకాంక్షలు ‘ఈ నెల 12 వతేదీ శుక్రవారం నుండి 23 వ తేదీ మంగళవారం వారం వరకు బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించటం వలన క్రిష్ణవేణీ నదికి పుష్కరాలు మహోద్రుతంగా ఆంద్ర దేశమంతా జరుగుతున్నాయి .ఈ సందర్భం గా వయసు ,జ్ఞానం లో పెద్ద లైన వారు తమ కృష్ణ వేణీ పుష్కర అనుభవాలను రాస్తే అందరికి విశేష విషయాలు తెలుస్తాయని పించింది .అందుకే ఈ శీర్షికలో అందరూ భాగ స్వాములై తమ అనుభవాలను దీనిలో రాసి అందరికి వాటితో పరిచయం కలిగించాలని మనసారా కోరుతున్నాను  .బాధ్యత ఎవరి మీదో వేసి నేను పక్కకు తప్పకొకుండా ముందుగా వయసు రీత్యా 77లో  ఉన్న నేనే ముందుగా నా అనుభవాలను పొందు పరుస్తున్నాను. మీరూ రాయండి .పంచుకోండి .సద్వినియోగం చేయండి .

1940 లో పుట్టిన నాకు  4 ఏళ్ళవయసులో 1944 లో పుష్కరం  వచ్చింది .కనుక దాని గురించి నాకేమీ తెలియదు .నాకు గ్రాయకం వచ్చాక వచ్చిన పుష్కరం 1956 లో వచ్చింది .కనుక దీన్ని రెండవ పుష్కరం గా భావిస్తాను .అప్పడు మా నాన్న గారున్నారు .అమ్మా నాన్నలతో కలిసి పుష్కర స్నానం బెజవాడ లో చేసినట్లు లీలగా గుర్తుంది .అప్పడు నేను ఎస్ ఎస్ ఎల్ సి పాసై బెజవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఇంటర్ చదువుతున్నాను .మా చిన్న మామ్మఅంటే ‘’బుల్లిమామ్మ’’ గారింట్లో ఉండి చదువు కున్నా.అమ్మా నాన్న బుల్లిమామ్మ ఇంటికే వచ్చారు .అందరం కలిసి బారేజ్ ఇవతల ఘాట్ లో స్నానం చేసి ఉంటాము . అప్పుడే ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తే చూశాము .అప్పుడే మొదటి  సారి టీ.వి .ని చూశాము .భలే గొప్ప అనుభవం అది నాకు .ఇంకా చాలా ఉన్నాయి కాని నాకేమీ గుర్తులేవు .కాని ఆ తర్వాత నాన్న ,మా మేనమామ గుండు గంగయ్యగారు కలిసి తోట్ల వల్లూరు లో యధావిధిగా పుష్కరాలు పెట్టారు .వంట బ్రాహ్మణులను కుదిర్చి  మంచి బ్రాహ్మణులను పిలుచుకొని చాలా పెద్ద  ఎత్తున పుష్కర విధి నిర్వహించారు.బహుశా అదే మా రెండు ఇళ్ళల్లో జరిగిన పూర్తి పుష్కర సంబరం అని నాకు జ్ఞాపకం .

1968 లో మూడవ పుష్కరం చూశాను .నాన్న గారు 1961 లో మరణించటం ,అంతకు ముందే 1959లో మా అన్నయ్య మరణించటం,1964 లో నాకు ప్రభావతి తో పెళ్లి అవటం  వెంట వెంటనే పిల్లలు పుట్టటం తో మా ఇంట్లో పుష్కర హడావిడి ఏదీ జరిగిన గుర్తు లేదు .

1980లో నాలుగవ పుష్కరం చూశాను .బెజవాడ వెళ్లి మా తోడల్లుడు చతుర్వేదుల శ్రీరామ మూర్తి గారి కుటుంబం తోకలిసి బారేజ్ కు ఇవతలే పుష్కర స్నానాలు చేశాము .అప్పుడే నా చేతి వాచీ ,బంగారు ఉంగరం తీసి మా తోడల్లుడి గారి అబ్బాయి ముదుకు జాగ్రత్త చేయమని ఇస్తే వాడు బాధ్యతా రహితంగా సంచీలో వేసుకొన్న వాటిని గాలిలో ఊపుతూ రేవు చేరేసరికి అవి ఇసుకలో ఎక్కడో పడిపోయాయి .వాడిని అడిగితె తెల్ల మొకం వేశాడు .కృష్ణార్పణం –పుష్కరార్పణం అనుకొన్నాను –గాలికి ఎగిరే పేల పిండిని కృష్ణార్పణం అన్నట్లుగా .

1992లో అయిదవ పుష్కరం చూశాను .అప్పుడు మా రెండో అక్కయ్యాశ్రీమతి దుర్గ  బావ గారుశ్రీ వివేకానంద్ గారు కూడా ఉయ్యూరు వస్తే అందరం కలిసి తోట్ల వల్లూరు వెళ్లి కృష్ణా స్నానం చేసి హిరణ్యం పెట్టాం .తర్వాత శ్రీ కాకుళం కూడా వెళ్లి అక్కడా పుష్కర స్నానాలు చేశాం.  మేమిద్దరం బెజవాడ వెళ్లి కృష్ణానదీ స్నానం చేసి కనక దుర్గమ్మ దర్శనం చేసి ఎక్సి బిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం లో స్వామిని దర్శించాం.అప్పుడే చిట్టి బాబు గారి వీణ కచేరీ చూసి పరవశించాం .కోకిల స్వరాలు వేదం చాలా అద్భుతంగా వీణ పై వాయించి దివ్యాను భూతి కలిగించారు చిట్టి బాబు .చిట్టిబాబు వీణ లో చాలా గట్టి బాబు అని పించారు .ఆకార్యక్రమాన్ని శ్రీ నూకల చిన సత్యనారాయణ గారు సమన్వయ కర్త గా వ్యవహరించారు .ఎందుకోఆయన చిట్టి బాబు గారి వీణా వాదనను సరిగ్గా విశ్లేషించ లేక పోయారు అని పించింది నాకు .చేతిలో కాగితం లేదు. కాని చిట్టిబాబు గురించి చెప్పాలని తహ తహ గా ఉంది .ఎవరినో అడిగి పెన్ను తీసుకొని బస్ టికెట్ల వెనక నా స్పందన రాసి నూకల వారికిచ్చి చదవమని కోరాను .నా రాత అర్ధం కాక ఆయన ‘’ ఎవరో దుర్గా ప్రసాద్ గారట .చిట్టిబాబు గారి గురించి బాగా రాశారు .వారి నోట వింటే బాగుంటుంది .అని మాస్టారూ !మీరే పైకొచ్చి చదివి వినిపించండి ‘’అన్నారు  .నేను అక్కడ ప్రేక్షకజనాలకు బాబు గారికి నూకల వారికి నమస్కరించి నేను రాసిన ఆ చిన్న అక్షరాలలోని భావాన్ని ‘’చిట్టిబాబుగారు ఈ కృష్ణా పుష్కర సమయం లో మనల్ని అందరినీ తమ వీణా వాదనతో రస పుష్కరిణి లో ఓల లాడించారు .ఈ అనుభవం జీవితాంతం మరువ లేనిది .ఈ జీవితానికి ఈ అనుభవం చాలు అని పించింది .కోయిల స్వరాన్ని, వేద మంత్రాలను మహాద్భుతంగా వాయించి రస డోలికలలో ఊరేగించారు .ఆంద్ర జనం వారికి ఏమిచ్చినా ఋణం తీరదు .ఈమని వారిశిష్యులై గురువును మించిన శిష్యులనిపించారు .మరింత గా వీరు రాణించి సంగీత సర్వాతీ సమారాధన చేయాలని వినయ పూర్వకంగా కోరుతున్నాను ‘’అన్నాను .చిట్టిబాబు గారు తల వంచి నా పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు .నా జీవితం లో ఇది గొప్ప అనుభవం .అక్కడే శ్రీ మంగళం పల్లి బాలమురలీకృష్ణ గారి మేనల్లుడు శ్రీ పారుపల్లి రంగనాద్ గారి అన్నమయ్య కీర్తనలు విన్నాము .చాలా అలవోకగా భక్తీ భావ బంధురంగా పాడారు వారు .వేదిక దిగగానే అభినంది౦చాము .చాలా సంతోష పడ్డారు  ఆయన  చెబితే కాని  ఆయన బాలమురళిగారి మేనల్లుడు అని తెలియ లేదు .అప్పుడే బెజవాడ వాస్తవ్యులు  ప్రముఖ హరికధా విద్వాంసుల శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి   హరి కధనూ విన్నాం .ఆయన లబ్ధ ప్రతిస్టులైన భాగవతార్ .1963 లో నేను మోపి దేవి హై స్కూల్ లో పని చేస్తున్నప్పుడు పెద ప్రోలులో కాపురం ఉన్నాం. అప్పుడొక రాత్రి ఆయన పెదప్రోలులో కదా గానం చేశారు .వారికధాగానం వినటం అదే మొదటి సారి .ఇప్పుడు మళ్ళీ ..గాత్రం గానం విధానం చాలా బాగా ఉన్నాయి . .అయన మంచి నాటక నటులు కూడా .పొట్టిగా ఎర్రగా ఉంటారు ఈ పుష్కరాలలోనే మా అమ్మాయి విజయ లక్ష్మి  గుంటూరుగర్ల్స్ పాలిటెక్నిక్ లో చదువుతున్నప్పుడు అమరావతి కి కూడా వెళ్లి పుష్కర స్నానం చేసి అమరేశ్వర స్వామినీ దర్శించాం .

ఆరవ పుష్కరం2004 లో వచ్చింది .అప్పటికి నేను రిటైర్ అయి 6 ఏళ్ళు అయింది .అప్పటికే ఒక సారి 20 02 లో మొదటి సారి అమెరికా వెళ్ళాం .ఈపుష్కరానికి ఆరోగ్యాలు బాగానే ఉండటం తో వీలైనన్ని ఎక్కువ చోట్ల పుష్కర స్నానాలు చేశాం .స్నానం చేయాలి అను కొన్న రోజున తెల్లవారుజ్హామునే లేచి స్నానం సంధ్యా పూజా పూర్తి  చేసి టిఫిన్ తయారు చేసుకొని బాక్స్ లో పెట్టుకొని బస్ ఎక్కేవాళ్ళం .అక్కడ పుష్కర స్నానం చేసి దైవ దర్శనం చేసి అప్పుడు టిఫిన్ చేసేవాళ్ళం .ఆ తర్వాత మళ్ళీ ఏదో ఊరికి వెళ్లి  అక్కడస్నానాదులు చేసేవాళ్ళం .సాయంత్రానికి ఎప్పటికో  ఇంటికి చేరేవాళ్ళం .ఒకసారి ఉదయమే బయల్దేరి తోట్ల వల్లూరు రేవులో స్నానం చేసి ,పులిగడ్డ  నాగాయ లంక పెదకళ్ళే పల్లి  ,శ్రీకాకుళం ,పడవ పై కృష్ణ అవతలి ఒడ్డు చిలుమూరు చేరి అక్కడిగుంటూరు  రేవులో స్నానం చేసి రాత్రి కి  ఇంటికి చేరాం .ఈ ప్రయాణాలలో పండ్లు ఇంటి టిఫిన్ తప్ప ఎక్కడా భోజనం కాని టిఫిన్ కాని చేసేవాళ్ళం కాదు .

ఇప్పుడు 2016 లో వస్తున్నవి ఏడవ పుష్కరాలు .ఇంకా ఎక్కడ స్నానాలు చేయాలన్నది ఆలోచన లేదు .రేపు ఉదయమే మాఅమ్మాయి పిల్లలతో హైదరాబాద్ మా అబ్బాయి శర్మా వాళ్ళ ఇంటికి వెడతాం .అక్కడ అమ్మాయి ,పిల్లలు  13 తేది రాత్రి ఫ్లైట్ కు అమెరికా బయల్దేరి వెడతారు .మేము మా రెండో అబ్బాయి శర్మా  వాళ్ళింట్లో బాచుపల్లి లో ఉంటాం .అన్నీ కుదిరితే అక్కడే దగ్గరున్న ప్రదేశం లో కృష్ణా పుష్కర స్నానం చేస్తాం .అయినా సౌరమానం ప్రకారం గురుడు కన్యా రాశిలో ప్రవేశించాడని ముక్త్యాలలో ఒక గురువుగారు శిష్యులతో కృష్ణా పుష్కర స్నానం కిందటి మంగళవరామే చేశారని ఆంద్ర జ్యోతిలో చదివి కిందటి శుక్రవారం మేమిద్దరం మా అమ్మాయి పిల్లలిద్దరూ కలిసి కారులో ముక్త్యాల వెళ్లి పుష్కరస్నానం చేసి శ్రీ ముక్తేశ్వరస్వామిని కోటిలింగాలలోని శ్రీ పశుపతి నాదుడిని తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని ,పరిటాల శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి ఫెర్రీ వద్ద గోదావరి కృష్ణా సంగమాన్ని చూసి పులకించి ఆ పవిత్ర సంగమ ‘’గోదా –కృష్ణ ‘’జలాన్ని శిరసుపై చల్లుకొని ఇంటికి తిరిగి వచ్చిన సంగతి మీకు  తెలిసిందే .అంటే మా పుష్కర కోయిల మా సరసభారతి ఉగాది కోయిలలాగా ముందే కూసి౦దన్నమాట .

మీరూ మీ అనుభవం రాసి ఈ శీర్షికను సుసంపన్నం చేయండి .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-16—ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణానదీ వైభవ పద్యం ( శ్రీ ఉపాసన -జులై)

”శ్రీ  శైల మల్లేశు  చెంత పాతాళ గం  -గా ప్రవాహపు జలకముల లోన

నాగార్జున గురు విజ్ఞాన వీచీచ్చాయ-జీర్ణించుకొని యున్న జీవనముల
అమరావతీ  స్తూప  రమణీయ శిల్పశా -స్త్ర  జ్ఞాన ఘట్టంపు సాక్ష్య  తటిని
భవ్య దుర్గా శైల పాదోదక మిళిత -స్నాన ఘట్టముల చక్కటొకట
కృష్ణ శాంతించు మున్నంగి రేవు వద్ద -ఎక్కడో ఒక్క చోటైన ఒక్క క్రుంకు
చాలు నీ పుష్కర సమయ స్నపన మాంధ్రి-పావనాను భూతిశ్రీ ల పంట లిచ్చి ”

— సేకరణ -గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణా పుష్కరాలలో ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో కృష్ణ వేణీ మాతకు ప్రత్యేక పూజ

ఉయ్యూరు లో రావి చెట్టు బజారులో వేంచేసియున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో పవిత్ర కృష్ణ వేణీ పుష్కరాల సందర్భంగా 12-8-16శుక్రవార0  నుండి 23-8-16 మంగళ వారం వరకు  ప్రతి రోజు ఉదయం 7 గం లకు, సాయంత్రం 7 గం  లకు  శ్రీ కృష్ణ వేణీ మాత విగ్రహానికి అష్టోత్తర పూజ నైవేద్యం హారతి తో ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నాము .భక్తులు పాల్గొని కృష్ణవేణీ మాతను సందర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించి,   అనుగ్రహానికి పాత్రులై తరించ ప్రార్ధన .

Inline image 1Inline image 2Inline image 3

శ్రావణ శుక్రవారం ,కృష్ణా పుష్కరాలు వరలక్ష్మీ వ్రతం ,శ్రావణ పౌర్ణమి ,శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలతో

                                           గబ్బిట దుర్గా ప్రసాద్
                                ధర్మ కర్త –శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం ,ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -245 (చివరి ఎపిసోడ్ ) 91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్ కవి –డిలాన్ ధామస్ -2(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -245 (చివరి ఎపిసోడ్ )

91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్  కవి  –డిలాన్ ధామస్ -2(చివరిభాగం )

35 వ ఏట ‘’నేను ముసలి ,చిన్న ,నల్ల ,తెలివైన వాడుగామిలమిల మెరిసే కళ్ళతో జుట్టురాలిపోయి పళ్ళూడి పోయిన వాడిగా ఉన్నాను ‘’ అని చెప్పుకొన్నాడు .బలంగా,లావుగా ఉన్నా  చురుకుగా కదిలేవాడు  .మూడో సారి అమెరికా వెళ్ళినప్పుడు ఇగార్ స్ట్రా విన్స్కి తోకలిసి ఒక ఒపెరాకు పని చేయాలనుకొన్నాడు .కద ముందే సిద్ధం చేసుకొని సంగీతం కాలిఫోర్నియాలో కూర్చాలనుకొన్నారు .అతని ‘’కలేక్టేడ్ పోయెమ్స్ ‘’అప్పుడే సెన్సేషనల్ విజయం సాధించింది .న్యూయార్క్ లో 39 వ పుట్టిన రోజు ను ఘనంగా సంతోషంగా జరుపుకొన్నాడు .సంబరాలు అంబరాన్ని అంటుతున్న సమయం లో తీవ్రంగా జబ్బు పడ్డాడు .వెంటనే సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు .అక్కడ మెదడుకు సంబంధించిన ‘’యెన్ సెఫలో పతి ‘’అనే జబ్బు తో బాధ పడుతున్నట్లు నిర్ధారించారు .సుమారు రెండు వారాలలోపే డిలాన్ ధామస్ 9-11-1953  న మరణించాడు .

ధామస్ ఇరవై ఏళ్ళ లోపే ‘’యైటీన్ పోయెమ్స్ ‘’అచ్చు అయింది .స్విన్ బరన్ కవిత్వమా అనిపించింది .అణ గారిన నాగరకత ,సాక్సన్ వెలుగున్న సెల్టిక్ నీడ అతనికవిత్వం లో కనిపిస్తుంది .అతని ముందు మూడు  పుస్తకాలను కలిపి ‘’ది వరల్డ్ ఐ బ్రీత్’’పేర ఒకే పుస్తకంగా తెచ్చారు .డిలాన్ ను అత్యద్భుత నవ కవిత్వ సృష్టికర్త గా గుర్తించి అతని కవిత్వాన్ని సర్రియలిజం కవిత్వం అన్నారు .వీటిలో పగటికలలు ,సబ్ కాన్షస్ లో విహారం కనిపిస్తాయి .ఫ్రాయిడ్ ప్రభావమూ ఉంది .’’poetry is the rhythmic ,inevitably narrative ,movement from an over clothed blindness to  a naked vision .Poetry must drag further into  the clear nakedness of light more even of the hidden cause than Freud could realize ‘’అంటాడు ధామస్ .చనిపోవటానికి ఏదాదిముందు అచ్చు అయిన ‘’ఇన్ కంట్రీ స్లీప్ అతనే చెప్పినట్లు ‘’record of my individual struggle from darkness toward some measure of light .To be stripped of darkness is to be clean ,to be  stripped of darkness  is to be clean ,to strip of darkness is to make clean ‘’.

చివరి రచన ‘’అండర్ మిల్ వుడ్ ‘’బి బి సి లో ప్రసారం కావాల్సింది  అమెరికాలో  ప్రాభవం పొంది౦ది  .ఇందులో ఒక మచ్చుతునక –‘’it is spring moonless night in the small town starless and –bible black ,the cobble streets silent and hunched –courtiers and rabbit’s wood limping invisible down to –the slow back ,slow ,black  crow black ,fishing boat hobbing sea ‘’

లారెన్స్ బిన్యాన్  బ్లేక్ ద్విపదులలాగా కప్లేట్స్ రాశాడు ,-‘’the spirit born to bless –lives but in its own excess ‘’

పేదరికం లో గడిపిన ధామస్ డబ్బు సంపాదించటం ఎట్లాగో తెలియదు .తాను ‘’I want to write only poems of God ‘s world –by a man who does not believe in God ‘’అంటాడు డిలాన్ .వేర్నార్ వాట్కిన్సన్ ఇచ్చిన పారితోషికానికి కృతజ్ఞత తెలుపుతూ జాబు రాస్తూ ‘’మీరిచ్చిన గుండ్రని సిల్వర్ ట్రాష్ ‘’ను నేను అమ్ముకొంటే నెల రోజుల గ్రాసం లభిస్తుంది ‘.నా లాంటి వాడు చేతిలో పెన్నీ లేకుండా జీవించటం దారుణం ‘’అన్నాడు .ధామస్ చనిపోయాక ప్రాభవం మరింత పెరిగింది ,అతని చిన్న కధలు బాగా క్లిక్  అయ్యాయి .అతని రచనలో బాల్యం ,సెక్స్ సామర్ధ్యం ,కల్లోల మత౦  చావు లే విషయాలు .’’My world was christened in a stream of milk and earth and sky were alone airy hill –I dreamed my genesis in swear of sleep ‘’అంటాడు .అండర్ మిల్క్ వుడ్ బి బి సి లో ప్రసారం కావాల్సింది 1953 లో అమెరికాలో అయింది .ఇందులోని రెండు భాగాలను ధామస్ స్వంత గొంతుకతో చదివాడు .తనకవిత ప్రతిదాంట్లోనూ మనిషి ప్రేమ ,దేవుని ప్రస్తుతి ఉంటాయని అవే లేక పోతే తాను  నిరర్ధక జీవినే అవుతానని చెప్పుకొన్నాడు .అతడు చదువుతుంటే విశ్లేషణకు అందనంత వేగంగా దూసుకు పోతుంది కవిత్వం. అదే ఆయన ప్రత్యేకత.

ధామస్ ను చిరంజీవిని చేసిన కవితలు   ‘’డు నాట్ గొ జెంటిల్ ఇన్ దట్ గుడ్ నైట్ ‘’,’’ఎ డెత్ హావ్ నో డొమినియన్ ‘’నాటకాలు ‘’ప్లే ఫర్ వాయిసెస్ ‘’,’’అండర్ మిల్క్ వుడ్ ‘’లు ,.ఏ సాహిత్య ముఠా కు చెందనివాడు ధామస్ .నియో రొమాంటిక్ ,ఫ్రాయిడ్ ప్రభావం వెల్ష్ జాతీయ ప్రభావం ఉన్నవాడు .అమెరికా వెళ్ళినప్పుడు ధామస్ హార్డీ కవితల్ని ఆయనకే చదివి వినిపించినవాడు .వెల్ష్ జాతీయుడేకాని దాని జాతీయత పై అంతగా ఇష్టం లేనివాడు .ఆ జాతీయతను ‘’హిల్ ఫారం మొరాలిటి ‘’అంటాడు .శబ్ద ప్రయోగం లో అందేవేసిన కవి .పోతనకవి  లాగా చెవులకింపైన పద ప్రయోగం చేసి మనసులను ఆకర్షిస్తాడు ధామస్ సమాధిపై ఆయనే రాస్సుకొన్న కవితను చెక్కించి ఘన నివాళి సమర్పించారు –‘’Not for the proud man apart from the raging moon I write on these spindrift pages not for the towering dead with their right angles and psalms but for the lovers ,their arms round thee griefs of the ages who pay no heed my craft or art ‘’

సమాప్తం

Inline image 1

‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’సంపూర్ణం

ఆధారం –లూయీ అంటర్ మేయర్ రాసిన ‘’మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ‘’

మనవి –సుమారు సంవత్సరన్నర క్రితం రాయటం ప్రారంభించిన ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’ధారావాహిక 245 ఎపిసోడ్ లలో  91 మంది ప్రముఖుల జీవితాలను గురించి రాసే అదృష్టం  నాకు దక్కింది .ఈపుస్తకాన్ని నాకు నామీద అభిమానం తో ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా )నేను కోరిందే తడవుగా కొని నాకు 20-10-2014న అందేట్లుగా పంపారు .వెంటనే చదవటం ప్రారంభించి760 పేజీలున్న ఈ బృహత్ గ్రంధాన్ని 23-1-2015 నాటికి చదివి పూర్తీ చేశాను .వెంటనే దీన్ని తెలుగులో రాస్తే బాగుంటుంది అనిపించి శ్రీ గోపాల కృష్ణ గారికి మెయిల్ రాస్తే ‘’నేనే చెబుదామనుకోన్నాను .మీకూ అదే ఆలోచన వచ్చింది కనుక ప్రారంభించండి ‘’అన్నారు .వెంటనే  అంతర్జాలం లో రాయటం ప్రారంభించాను .మధ్య మధ్య లో మరెన్నో వాటిపై దృష్టి పెట్టటం వలన సుమారు సంవత్సరంన్నర కాలం పట్టింది పూర్తీ అవటానికి .అంటర్ మేయర్ రైట్ సోదరులను విడివిడిగా రాసి 92 మంది తో పుస్తకం రాస్తే, నేను రైట్ సోదరులను ఇద్దర్నీకలిపి ‘రాయటం వలన  సంఖ్య 91 అయింది .అంటర్ మేయర్ చాలా వివరణాత్మకంగా గ్రంధం రాశాడు .దాదాపు ఆయన చెప్పిన దానిని దేనినీ వదలకుండా నేను తెలుగులోకి తెచ్చాను .అయినా నాకు సంతృప్తి కలగక వీకీ పీడియా లో వెతికి మరింత సమాచారాన్ని చేర్చి సంతృప్తి చెందాను .అంత మాత్రం చేత ఇది సంగ్రమూ సంపూర్ణమూ అని నేను అనుకోవటం లేదు .ఇంకా చెప్పవలసింది విశ్లేషించ వలసినది చాలా ఉండే ఉంటుంది .ఆ మహానుభావులను పరిచయం చేయటానికే నేను ప్రయత్నం చేశాను .ఇందులో నాకు తెలియని వారు చాలా మందే ఉన్నారు .చాలామంది వీరి గురించి విని ఉండక పోవచ్చు .వీరంతా తమ కార్యకలాపాలతో ఆధునిక యుగ నిర్మాణానికి తోడ్పడినవారే  .అన్ని రంగాలకూ చెందిన వీరి కార్య క్షేత్రాలు కళ, సంస్కృతీ, రాజకీయం, శిల్పం, సంగీతం  నాట్యం  వేదాంతం ఆర్కి టేక్చర్ ,కవిత్వం ,సినిమా, నాటకం ,సైన్స్ ,టెక్నాలజీ మొదలైనవి .ఏదో ఒక రంగం గురించి ఏదో కొంచెం ఆవగింజలో అరవై భాగం మాత్రమే తెలిసిన నాకు ఇన్ని రంగాల లోని విషయాలు తెలుసుకొని అర్ధం చేసుకొని అందరికి తెలిసేట్లు రాయటం బ్రాహ్మ ప్రళయమే అయింది .నా శక్తి యుక్తులన్నీ పణంగా పెట్టి రాయాల్సి వచ్చింది .దీనిలో నేనుఎంతవరకు సఫలీకృతుడిని అయ్యానో మీకే తెలుసు .ఏదైనా, ఒక మంచి ప్రయత్నం చేశాను అన్న సంతృప్తి మాత్రం నాకు లభించింది .

ఈ మహామహులపై మరింత పరిశోధన చేసేవారికి ఇది కొంత వరకు కరదీపిక అవుతుందని నమ్ముతున్నాను .అంటర్ మేయర్ ఆంగ్లం లో రాసిన గ్రంధాన్ని నాకు పంపి చదివించి తెలుగులోకి అంతర్జాలం లో దాన్ని తెచ్చే ప్రయత్నానికి  నన్ను ప్రేరేపించిన ,ప్రేరణ నిచ్చిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి కృతజ్ఞుడను .ప్రతి ఎపిసోడ్ చదివి ,స్పందింఛి ప్రోత్సహించిన వారి ఋణం తీర్చు కోలేనిది . అసలు దీన్ని పూర్తీ చేయగలనా అని అనుమానం వచ్చింది .70 మంది మీద రాసే దాకా నమ్మకం కుదరలేదు .ఇక లాభం లేదని సుమారు నెల రోజులనుండి పగలూ ,రాత్రి విడవ కుండా మిగిలిన వారిపై రాసి ఇవాల్టితో పూర్తీ చేసి ఊపిరి పీల్చుకొని  అమ్మయ్య అనుకొన్నాను .ఒక రకంగా భగీరధ ప్రయత్నమే ఇది .

అంటర్ మేయర్  ఆంగ్లకవులపై రాసిన పుస్తకాన్ని పూర్వం నాకు పంపగా ,చదివి ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గా నేను నెట్ లో వారి ప్రోత్సాహంతోనే ధారావాహికంగా రాయటం ,దానికి తామే పూనుకొని గ్రంధ రూపం లోకి తెచ్చి వారి బావగారు శ్రీ డా .రాచకొండ నరసింహ శర్మ ఏం డి గారికి  ‘ అ౦కితమిప్పించటం మీకు తెలిసిందే . వారికి నాపై ఉన్న ఆత్మీయతకు ఇంత కంటే నిదర్శనమేముంది ?

అంకితం –‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’అన్న  92 మంది మహా మనీషుల పై రాసిన ఈ 245ఎపిసోడ్ ల ధారావాహిక ను అందులో ఉన్న ఆ 92మంది మహానుభావు లందరికివారి కృషికి  ,వీరి నందరిని తన పుస్తకం లో ఆవిష్కరించిన లూయీ అంటరర్ మేయర్ కు ఆయన రచనా విధానానికి   , ఇంక ఏమీ చేయలేక  సవినయంగా అంకితమిచ్చి ఋణం తీర్చుకొంటున్నాను ..దీన్ని చదివి ఆదరించిన సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను ‘

Inline image 2

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-16-ఉయ్యూరు

–

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

4 of 17,977 Print all In new window ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -244 91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్ కవి –డిలాన్ ధామస్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -244

91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్  కవి  –డిలాన్ ధామస్

ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో డిలాన్ ధామస్ జ్వలించే విప్లవ భావ ,సాటి లేని శైలీ శయ్యా సౌభాగ్యాలతో ప్రపంచం పై విరుచుకు పడ్డాడు ..రాయగానే స్వాగతించక పోయినా ,వారసత్వ కవితా లక్షణాలు లేక పోయినా తనకాలపు ఉత్సాహ ఉద్రేక కవి అయ్యాడు .దురదృష్ట వశాత్తు చిన్న వయసులోనే చనిపోయినా సాహిత్య లోకం పై బలమైన ముద్ర వేశాడు .కొన్ని కవితలు ,కదా సంపుటాలు కొన్ని ,స్వీయ చరిత్రలాంటి స్కెచ్ లు మాత్రమే రాసి లబ్ధ ప్రతిస్టుడయ్యాడు .అతని ‘’పోర్ట్రైట్ ఆఫ్ ఎ పోయెట్ అస్ ఎ యాంగ్ డాగ్ ‘’తోపాటు మరొక నాటకం ఆయన్ను సాహిత్యం లో చిరంజీవిని చేశాయి .వీటితో ఆంగ్ల సాహిత్యాన్ని సుసంపన్నం చేసి ,అనుపమ సంగీత సౌభాగ్యం కలిగించి ,కొత్త దృశ్యాలను చూపించి నూతన శబ్దాలు వినిపించి ,సమకాలీన సాహిత్యానికి జవ జీవాలు కల్పించి సంచలనం సృష్టించాడు .

27-10-1914 న వేల్స్ లోని వెల్ష్ సీ పోర్ట్ లోని స్వాన్సేయా లో ఇంగ్లీష్ టీచర్ కొడుకుగా డిలాన్ ధామస్ పుట్టాడు .టౌన్ లోని గ్రామర్ స్కూల్ లో చేరి క్లాస్ రూమ్ పాఠాల కంటే ,స్థానిక జానపద గీతాలపై ఆసక్తి పెంచుకొన్నాడు .’’చిన్నప్పుడు నేను చిన్న ,సన్న ,చురుకైన  వెంటనే మురికి అయ్యేట్లు ,ఉంగరాల జుట్టు తో ఉండేవాడిని ‘’అని చెప్పుకున్నాడు .సాధారణ చదువు పూర్తీ అయి ,గ్రామర్ స్కూల్ వదిలి నటుడిగా రిపోర్టర్ గా ,రివ్యూ రాసేవాడిగా ,స్క్రిప్ట్ రైటర్ గా ఇంకా అనేక చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ పొట్ట కూటికి డబ్బు సంపాదించాడు .రెండవ ప్రపంచ యుద్ధకాలం లో ‘’యాంటి ఎయిర్ క్రాఫ్ట్ గన్నర్ ‘’గా పని చేశాడు.ఈ అనుభవాలన్నీ కవితల్లోకి చేరాయి .21 కి కైర్లిన్ మాక్నమారా తో వివాహమై ,లివిలీన్ కాలం అనే ఇద్దరు అబ్బాయిలు ,ఐరాన్ అనే కుమార్తెను కనీ, లాఫర్నే  ,కర్మర్తాన్ షైర్ అనే చేపలు పట్టే గ్రామం లో స్థిరపడ్డాడు .అక్కడ తన ఇల్లు ‘’బోట్ హౌస్ ‘’మాత్రమే నని చెప్పుకొన్నాడు . ఈ గ్రామం ఒకప్పుడు ఫెర్రీల రేవుగా ఉండేది .

ఇరవైలలో ఉండగా తాను  రాసిన కవితలను బి బి సి రేడియో లో చదివి వినిపించేవాడు .1950 లో మొదటి సారి అమెరికా వెళ్లి రెండేళ్ళ తర్వాత తిరిగొచ్చి మళ్ళీ 1953 లో వెళ్ళాడు .అక్కడ  తనవి, తనవి కానివి పాటలు పాడి రంజింప జేసేవాడు .ఆతను పాడేది అతని స్వంతమో ఇతరులదో ఎవరికీ తెలిసేదికాదు .’’కాళిదాసుకవిత్వం కొంత నా పైత్యం కొంత ‘’అన్నట్లు ఉండేది .అతని గానమాదుర్యం ,తాదాత్మ్యత తో పాడటం   అందరినీ ముగ్ధులను చేసేవి . .అతనిలో షెల్లీ మళ్ళీ కనిపించినట్లు ఉండేది .మంత్రం ముగ్ధమై విని పరవశి౦చేవారు .కాగితం పై ఉన్న ఆయన కవిత్వం అర్ధం కాక పోయినా ఆనాటి హృదయాకర్షణ పాటకుడు అనిపించాడు .అమెరికా స్వంత ఇల్లు అయింది .’’నాకు న్యూయార్క్ అంటే నమ్మకం లేదుకాని సౌత్ ఎవెన్యు ను ప్రేమిస్తాను ‘’అనేవాడు .సీమెన్స్ బార్ అంటే ఇష్టం .అక్కడ అతన్ని వెల్ష్ జాతివాడిగా గుర్తించి మాట్లాడేవారు .అది సాహిత్య సాంఘిక కార్యకలాపాల క్లబ్ గా ఉండేది .

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-16- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243

90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి  –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం)

ఆడెన్ 30 వ ఏట రాసిన ‘’ఆన్ దిస్ ఐలాండ్ ‘’లో  మూడేళ్ళ తర్వాత వచ్చిన ‘’అనదర్ టైం ‘’లో సా౦ఘికవిషయాలు చోటు చేసుకొన్నాయి .భాషా చాలా సరళంగా విషయం సూటిగా ఉంది .అప్పటి వరకు ఉన్న మూస పదబంధాలను త్రోసి రాజని కొత్త ఉదాత్త భావ జాలాన్ని చొప్పించాడు .నిత్య జీవిత విషయాలు కవిత్వం లో చోటు చేసుకొన్నాయి .పాటకజన పాటలు ,జానపద గీతాలు ,లయతో ఊగిపోయేట్లు రాశాడు .సైన్స్ ఆవిష్కరణలను కొత్త నాటక శైలిలో రచించాడు .డిగ్నిటి తోపాటు రౌడి యిజం కూడా ఏకకాలం లో కన్పించటం ప్రత్యేకత .ఉన్నత విద్యావేత్తగా ఒక ప్రక్క కనిపిస్తూనే ప్రజాకవిగా వెలు గొందాడు .ఈ ద్విముఖ కవితా మార్గం ఆశ్చర్య పరచింది .’’The poet was essentially a wit after the caustic mockery of ‘’Law ‘’అనిపిస్తాడు అంటాడు గార్దేనేర్స్ .ఉదాహరణకు ఒక కవిత –

‘’Law says the judge as he looks down his nose –speaking clearly and most severely –law is as I have told you before –law is as you know I suppose –law is but let me explain it once more –law is the law ‘

సామాన్య లిరికల్ కవి మాత్రమే రాయగలిగిన ఒక లవ్ పోయెం రాసి మరీ ఆశ్చర్య పరుస్తాడు ఆడెన్ –

‘’Lay your sleeping head ,my love-human on my faithless arm –time and fevers burn away –individual beauty from –thoughtful children ,and the grave –proves the child ‘s ephemeral –but in my arms till break of day –let the living creature lie –mortal ,guilty but to me –the entirely beautiful ‘’

ఆధునికకవులయిన  ఆడెన్ ఒక్కడే పాత ఫాషన్  బాల్లడ్ లో లేక విలానేల్లె లో భావ వ్యక్తీకరణ చేసే సామర్ధ్యమున్నవాడు .ఫ్రెంచ్ సంప్రదాయాలైన సేస్టినా మొదలైన ఫారంస్ లో కూడా ఆడెన్ ఒక్కడే ఇలాచేయగాలిగాడు .ఆడెన్ ఇంగ్లాండ్ లో అందరితో కలిసి పోయాడు .ఒక్కొసారీ ‘’మరీ ఎక్కువ భారం వేశాడు ‘’అనిపిస్తాడు .ఆడెన్ కవిత్వం లో ‘’A vitality ,an explosive violence ,that leaves his contemporaries dazed ‘’అన్నాడు స్పెండర్ .ముప్ఫై లలో ‘’ది డబుల్ మాన్ ‘’,’’ఫర్ ది టైం బీయింగ్ ‘’లలో ఆయన ఎంత విరుద్ధ భావ ప్రేరణ కవియో ,తన తరాన్ని ఎంత గొప్పగా ప్రబావితం చేశాడో తెలుస్తుంది .’’ది డబుల్ గేమ్’’  700 లైన్లు ఉన్న సుదీర్ఘ కవిత . ఇందులో ఆడెన్ మల్టిపుల్ మాన్ గా కనిపిస్తాడు అంటే-బ్రావేరాపెర్ఫార్మార్ గా ,ఫినికల్ క్రాఫ్ట్స్ మన్ గా జాంటి ఐకనో క్లాస్ట్ గా ,రిజర్వేడ్ క్లాసిసిస్ట్ గా కనిపిస్తాడన్నమాట .దీన్ని చూసి ఆయన మళ్ళీ లైన్ లో పడ్డాడని సమకాలీన కవులలో ప్రయోగ శీలి అని ,పోప్ మార్గ గామి అనిపిస్తాడు .కాని ‘’ది టెంపుల్స్ ‘’లో క్లాసిక్ కలోక్వియల్ లను కలిపి చాలా అందంగా  పారడాక్స్ గా రాశాడు.ఇదీ ,దీనితరువాత రాసిన వాటిల్లో ఒక అపూర్వతను సాధించాడు –అదే లైట్ వర్స్ కు ఆరేటరికి ,ఉన్నత భావాలకు ,ఉన్నత తీవ్రతకు మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి పారేశాడు .

ఇలియట్ కవిలాగా ఆడెన్ నిరాశా నిస్పృహ సంక్షోభాలను లతో కవిత్వం తో ప్రారంభించి,పరిపక్వత పొందాక తన స్వీయ భావ జాలం తో క్రూరత్వానికి నిరసనగా రాశాడు .మంచితనం లేని సౌందర్యాన్ని మెచ్చలేదు .గాయ పడిన మానవ హృదయ ఘోష వినిపించాడు .ఆధునిక మానసిక శాస్త్రాన్ని ,సాంఘిక శాస్త్రం తో జోడించాడు .ఇలియట్ పాత సంప్రదాయం లో పాతుకు పోతే ఆడెన్ భవిష్యత్తుపై దృష్టి నిలిపాడు .కొన్ని సార్లు సలహాలిచ్చాడు .మరికొన్ని సార్లు కర్క్ గార్డ్ ,ఫ్రాయిడ్ ,హెన్రి జేమ్స్ ,మాధ్యూ ఆర్నాల్డ్ ,యేట్స్ ,రిల్కే ,ఐన్ స్టీన్ ఎడ్వర్డ్ లియర్ ల  అవసర మూల విషయాలు అభి వర్ణించాడు .కాని వాటిల్లో పూర్తిగా మునిగి పోలేదు .ఇలియట్ రాసిన మాస్టర్ పీస్ ‘’వేస్ట్ లాండ్ ‘’లాంటిది ఆడెన్ రాయక పోయినా ఇలియట్ తర్వాత అంత ప్రభావం చూపిన కవిగా చరిత్రలో నిలిచి పోయాడు .దీనికి భౌగోళిక ,కవితాత్మక న్యాయం. ఉంది ఆడెన్ ఇంగ్లాండ్ లో పుట్టినా అమెరికాలో స్థిరపడ్డాడు .ఇలియట్ అమెరికాలోని మిస్సోరిలో పుట్టి ,బ్రిటన్ చేరి బ్రిటిష్ పౌరుడయ్యాడు .ఇలియట్ లాగానే ఆడెన్ సినిసిజం నుంచి మిస్టిజం కు ,నాగరకతా వ్యామోహాన్ని త్యజించి మత విశ్వాసానికి చేరువయ్యాడు .తన తరానికి ‘’ఏజ్ ఆఫ్ యాన్ క్సైటీ’’అని పేరుపెట్టి రాసిన దానికి పులిట్జర్ బహుమతి 1948లో  పొందాడు  .1940 నాటి భాషను వాడుతూ అందులోని వింతైన యాసకు ప్రాణం పోశాడు .ఇది పూర్వపు ఆంగ్లో సాక్సన్ రోజుల్లోకి తీసుకు వెడుతూ కొత్త అందాన్ని కల్పించింది

40 లలో ఆడెన్ రచయిత సంపాదకుడు కొల్లాబరేటర్ ,అనేక కవితా సంపుటుల నాటకాల ,వ్యాసాల కర్త అయ్యాడు .తన తర కవుల కు తన సామర్ధ్యం వలన శత్రువూ అయ్యాడు .అతని అభిమాన బృందాన్ని ‘’A circle of merchandising ,cooperative than a literary school ‘’అన్నారు ఈర్ష్యతో .మార్క్సిజం పట్ల ఆరాధన ఆయనలో ఎప్పుడూ పూర్తిగా పాదుకొని లేదు .మర్చేపోయాడు తర్వాత .పబ్లిక్ స్కూల్ బాయ్ గా ,గార్డెన్ పార్టీలతో జేరాల్ద్ హెర్డ్ తో కాలక్షేపం తో బి బి సి కి సైన్స్ పాప్యులరైజర్ గా ‘’అమెరికన్ హాలి ఉడ్ వీరీ రేలిజియాసిటికి ‘’వ్యాఖ్యానకర్తగా బిజీ బిజీ గా గడిపాడు .బారుగా ,స్ట్రా ఎల్లో రంగు జుట్టు తో ,తేలిక మిరుమిట్లు గొలిపే కళ్ళతో ఒక’’ పక్ ‘’ అనిపించేవాడు ఈ పక్కిజమే అతని అభిమానుల్ని కలవర పరచింది .కవిత్వ టెక్నిక్ లో అనితర సాధ్యుడు ఆడెన్. చివరి రోజుల కవిత్వం ‘’నోన్స్ ‘’లో ‘’అనదర్ టైం ‘’లలో మానవత్వం పై మమకారం ,వినయం కనిపిస్తాయి .కోపం స్థానం లో జాలి చోటు చేసుకొన్నది .ప్రపంచ వికృత స్థితిపై రాసిన కవిత –

‘’Intellectual disgrace –stares from every human face –and the seas of pity lie –locked and frozen in each eye ‘’వేదనామయ కాలం నుండి ,చావు ఆలోచనలనుండి ఐక్యతా అనుభవం లోకి ప్రవేశించాడు .అతని ప్రస్తానం ‘’from doom is dark and deeper than any sea dingle ‘’నుంచి ‘’we must love one another and die ‘’లోకి ప్రవేశించింది .తన కాలపు కవుల్లో పూసల్లో మణి లాగా వెలిగాడు ఆడెన్ .యేట్స్ కవి మరణాన్ని భావ గర్భితంగా గొప్పగా వర్ణించాడు –

‘’in the deserts of the heart –let the healing fountain start –in the prison of the days –teach the free man how to praise ‘’

గడచిన రెండు శతాబ్దాలలో అమెరికా బ్రిటన్ దేశాల లో కవులు రెండు వందలకు పైగా ఉన్నారు .ఇందులో విస్మ్రుతులేవరో సంస్మ్రుతులేవరో కాలమే నిర్ణయించాలి .అందులో 16 గురుకవులు మాత్రం తమ కాలసమస్యల్ని ఒత్తిడులను తట్టుకొని నిలిచారు 20 వశతాబ్దం రెండు ప్రపంచ యుద్ధాల తాకిడికి తట్టుకొని నిలిచింది .వీటివలన శాంతి యేర్పడ లేదుకాని ఘర్షణ వాతావరణం ఏర్పడింది .మూడో ప్రపంచ యుద్ధం రావచ్చుననే భయం దేశాలమధ్య కొంత సయోధ్యతను చే కూర్చింది .సహిష్ణుత పెరిగింది .హెన్రి డేవిడ్ దోరో నమ్మినట్లు‘’the mass of men lead lives of quiet desperation was now obvious to every  one ‘’.ఈ కవులు బయటి సంఘర్షణలు ,లోపలి టెన్షన్ లకు గురైన వాళ్ళు .కొందరు ఈ కుదుపులను రికార్డ్ చేస్తే కొందరు అలవికాక విసిరి వేయబడ్డారు .మరికొంత మంది పలాయనం చిత్తగించారు .నిలిచి వెలిగిన  ఆందోళన కాలపు  కవే ఆడెన్ .ఆధునిక మానవుని భయాందోళనలు ,కలవరం అసూయ నిరాశాలకు ఆడెన్ ప్రతి రూపమే అయ్యాడు .తనకాలాన్ని అందరికంటే ఎక్కువ ప్రభావితం చేసిన మేధావి రచయితా ఆడెన్ .

వ్యక్తిగా కవిగా తనకొక స్థానం కల్పించింది అమెరికాయే నన్నాడు ఆడెన్ ..అమెరికా తనను రాయటానికి ఆకర్షించిన దేశం అని మురిసిపోయాడు .అమెరికన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ‘’పురస్కారం పొందాడు .అందులో సభ్యుడై గౌరవం పొందాడు కూడా .చాలా కాలేజీలు ,యూని వర్సిటీలలో బోధించాడు .1956 లో లండన్ వెళ్లి ఎమ్డెన్ గా లెక్చర్లిచ్చాడు .నార్మన్ హోమ్స్ తో కలిసి ‘’పోఎట్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ‘’,’’ఎ బుక్ ఆఫ్ మోడరన్ అమెరికన్ వెర్స్ ‘’గ్రంధాలు రాశాడు .’’ది ఎంచేఫ్ద్ ఫ్లడ్ ‘’కూడా రాశాడు .కాల్రిడ్జి ,లూయీస్ మాన్లి ,హాప్కిన్ మేల్విల్లీ ,బాడర్లేర్ ,జూల్స్ వేర్న్స్ మొదలైన ప్రముఖులపై సాధికారిక ఉపన్యాసాలిచ్చాడు .ఫ్రాయిడ్ ,కర్క్ గార్డ్ ,పాస్కల్ ఓల్టేర్,మాంటేగ్ ఐన్ స్టీన్ లపై కమ్మని కవితలల్లాడు .’’కాదేదీ కవితను అనర్హం ‘’అని చాలా సార్లు రుజువు చేసి మన శ్రీ శ్రీకి దారి చూపాడు .న్యూయార్క్ లోని ఏడు తరాల మానవుల్ని ఏడు దశల్లో చూపాడు .ఆయన కవిత్వం సాధనకు దారి చూపింది .ప్రేమ రాజకీయం ,మత౦  నీతి ,పౌరసత్వం ,సైకాలజీ లపై గొప్ప శైలీ టెక్నిక్ తో కవిత్వం రాశాడు .ఆయన భావాలపై ఎన్నో డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీశారు .’’ఫునెరల్ బ్లూస్ ‘,అన్ నోన్ సిటిజెన్ ‘’,సెప్టెంబర్ ఫస్ట్ ‘’,రెఫ్యూజీ  బ్లూస్’’కవితలను ఇప్పటికీ జనం చదివి ప్రేరణ పొందుతున్నారు .అమెరికా హృదయం లోకి దూసుకు వెళ్లి ,ఆధునిక కవులలో శ్రేష్టుడు గా ఉన్నాడు ఆడెన్ .నోబెల్ ప్రైజ్ కు నామినేట్ అయ్యాడు కాని అందలేదు .29-9-1973న 66 వ ఏట ఆస్ట్రియా లోని వియన్నా లో ఆడెన్ మరణించాడు .లండన్ వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు .20 వ శతాబ్దపు గొప్ప రచయిత అనిపించుకొన్న ఆడెన్ ‘’ఒపేరా లిబర్టోస్ ‘’రాసి బలంగా భావ ప్రదర్శన చేశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment