విశ్వనాధ మెత్తని యెద

విశ్వనాధ మెత్తని యెద

‘’తన యెద ఎల్ల మెత్తన ,కృత ప్రతి పద్యము నంతకంటె మె-త్తన,తన శిష్యులన్న నెడదం గల ప్రేముడి మెత్తన ‘’ అని తన గురువు చెళ్ళపిళ్ళ వారి మెత్తని హృదయాన్నిమెత్త మెత్తగా  ఆవిష్కరించాడు విశ్వనాధ  .విశ్వనాధ దీనికేమీ తీసిపోయిన వాడు కాదు .గురువును మించిన శిష్యుడు .ఈయన యెద అంతకంటే మరింత మెత్తన .అదెలాగో తెలుసు కొందాం .

శ్రీ సురగాలి తిమోతీ జ్ఞానందకవి బొబ్బిలి వాడు .విశ్వనాధ కవిత్వమంటే తీరని దాహం లో ఉన్నవాడు చూడటానికి బెజవాడ వచ్చాడు .బజారులో గురువుగారిపక్కన శ్రీ పాటి బండ్ల మాధవ శర్మ ,శ్రీ పొట్ల పల్లి సీతారామా రావు ఉన్నారు .విశ్వనాధ గురించి వారినడిగి తెలుసుకొని అమాంతంగా ఆశువుగా’’తెలుగుం గబ్బము లల్లునట్టి కవులీ దివ్యాంధ్ర భూమీస్తలిన్ –కలవారెందరో ?వారు నీకు సములా ?కావ్య ప్రపంచాన ,నీ-కల మెన్నో విధముల్ చెరించెడిని విఖ్యాతిం బ్రఫర్శి౦చెడిన్ –పలుకన్ నీకును నీవె సాటి గురుదేవా ౧ సత్యనారాయణా ‘’అని మొదలుపెట్టి చివరగా ‘’కమనీయార్ధ రసావతార దిషణాగంభీర మూర్తీ!దయా –సముద్రా వివిదార్ధ కావ్య రచనా సామ్రాజ్య పట్టాభిషి –క్త  మహాన్ద్రాభ్యుదయాభిమానీ ,విలసద్బ్రాహ్మ స్వరూపా ,గుణో-త్తమ ,యౌదార్య రసస్వభావ ,గురునాధా విశ్వనాధా నమః ‘’అని నాలుగు పద్యాలు చెప్పి విశ్వనాధ మహోన్నత వ్యక్తిత్వాన్ని మనసారా ఆవిష్కరించాడు . గురూజీ ఉబ్బి తబ్బిబ్బై ‘’నువ్వెవరవునాయనా ?’’అని అడిగాగానే ‘’వాడి జోకును జడిపించి సగర గుండె –జీల్చి చెండాడి పులి యని సెప్పుకొన్న –పాపరాయండు పుట్టిన ప్రదిత సీమ –బొబ్బిలి పురమ్ము నా పుణ్య భూమి ‘’అన్నాడు పద్యం వదిలి వచనం లో పరిచయం చేసుకో అన్నారు .వదలలేదు శిష్యపరమాణువు .మళ్ళీ ఆశువులోనే ‘’తేనెలు సోనలు గురియగ –ధీ నిదులెల్లరు నుతించు దివ్యదఖండ –శ్రీ నాయ కవిత చెప్పెడి –జ్ఞానానందకవి రత్నము నామము వాడన్ ‘’అన్నాడు .ఇదంతా మొగల్రాజ పురం తూము దగ్గర జరిగిన సంఘటన .గురువు మది మెత్తనై’’నీ కవిత్వం భేషుగ్గా ఉంది .కొంచెం కృషి చేస్తే గోప్పకవివి అనిపించుకొంటావు ‘’అని దీవించారు గురు బ్రహ్మ .ఈ గురుశిష్య సంబంధం విశ్వనాధ జీవిత పర్యంతం కొన సాగింది .స్వంత కొడుకులాగా ఆయన్ను విశ్వనాధ ఆదరించాడు. ఈ కవి కావ్యాలన్నిటికి ముందుమాట రాసి మెచ్చి ప్రోత్సహించిన వాత్సల్యం విశ్వనాధ ది.’’కవికోకిల’’ బిరుదునిచ్చి సత్కరించారు విశ్వనాధ ఆయనకు ప్రయాణాలకు ఛార్జీలిచ్చి పంపేవారు .విశ్వనాధకు కుల సాహిత్యం తో సంబంధం లేదని కవితా గంధం ఉన్న వారెవరైనా ఆయనకు ఆత్మీయులేనని తెలియ జేసే ఉదాహరణ ఇది .

రాయుడు శాస్త్రి అని పేరున్న బ్రహ్మశ్రీ తాతాసుబ్బరాయ శాస్త్రిగారు ఒక సారి బెజవాడవచ్చి విశ్వనాధ ఇంటికి  వెడితే ఆయన ఇంట్లో లేకపోతె తానొచ్చానని భార్యకు చెప్పమని రైల్ స్టేషన్ కు  వెళ్ళారు ఇంటికొచ్చిన విశ్వనాధ విషయం తెలిసి ఆగమేఘాలమీద స్టేషన్ కెళ్ళి శాస్త్రి గారిని కలిసి నమస్కరించాడు .ఇద్దరి చూపులు కలుసుకున్నాయి ‘’నాయనా !నీ పుస్తకాలు చదివాను ‘’అనగానే విశ్వనాధ ఆర్ద్ర హృదయుడై ఆనంద బాష్పాలు కారుతుండగా ,మాట రాక  రుద్ధ కంఠంతో వినయంగా మాట పెగుల్చుకుని ‘’నేను మీ దగ్గర చదువు కోలేకపోయినందుకు బాధ పడుతున్నాను ‘’అన్నాడు .శాస్త్రిగారు కూడా ఆనంద  బాష్పాలు రాలుస్తూ విశ్వనాధ బుజం తడుతూ ‘’ఎక్కడ చదువుకొంటే నేం నాయనా !నీకు మంచి భవిష్యత్తు ఉంది ‘’అని దీవించారు .ఇది ఇద్దరు మహానుభావుల సమాగమం .ఆనంద పులకా౦కితం .కృతజ్ఞతా భావ సమ్మిళితం .

విశ్వనాధ వారి ‘’దయాంబుధి ‘’పద్యాలు జిజ్ఞాస పెంచే అనుభూతి శకలాలు .’’నీరదము ‘’అనే పద్యాలలో ‘’అచటి బహుజన రక్త చిహ్నముల యందు నాది ఇదని గుర్తేమి కన్పడును ?’’అనే చరణాలు కన్నీళ్లు తెప్పిస్తాయి .’’గొంగళి పురుగు ‘’కద మానవ స్వభావం మీద వ్యాఖ్య .ఒకరి దొడ్లో ములగ చెట్టు ఉంది .కొమ్మలు పక్క వాళ్ళ దొడ్లోకి వెళ్లి కాయలుకాసి ఇద్దరిమధ్యా ఆవేశకావేశాలు పెరిగి కోర్టుదాకాపోయి చెట్టు కొట్టేశారు .కాని దానికి అంటిపెట్టుకున్న గొంగళి పురుగులు మాత్రం  రెండు కుటుంబాల ఇళ్ళల్లో చేరి బాధించాయి .స౦కుచిత స్వభావాలమీద చెణుకుఇది . ఒక వీధికుక్క దిక్కు లేని చావును గురించి ‘’నిర్దయ ‘’పద్యాలు రాశాడు కరుణ రసానికి పరాకాష్ట .బజారు బజారంతా కావలికాసే కుక్కకు స్థలాభిమానం లేదు .చివరికి ఆ అభిమానం తో ఊరి వైపు చూస్తూ చచ్చిపోయిందట వీదికుక్కను వస్తువు చేసి రాయటం ఆయనకే చెల్లింది .కారణం ఆయన యెదమెత్తన .

చూరు కింద నుంచోటానికి చోటు ఇవ్వక పొతే ఒక చిన్న మేక పిల్ల వానలో తడిసి చనిపోయింది .దీనిపై ‘’ ‘’రాశారు .విశ్వనాధ కాలాన్ని వెనక్కి తీసుకు వెడతాడు అని నిందించే వారికి ఇది కను విప్పు కలిగిస్తుంది .పిల్లల మనస్తత్వాన్ని చక్కగా వివరిస్తాడు విశ్వనాధ .పసివాడు ఏడుస్తుంటే తండ్రి రాజుగారి ‘’పట్టపు ఏనుగు’’ చూపించి దానిమీద కూర్చోబెడతానని సముదాయి౦చినా ఏడుపు మానలేదు .కాని బజారులో ‘’రంగుల పచ్చి పేడ బొమ్మ’’ కొనిస్తే యిట్టె యేడ్పు ఆపేశాడు .

కిన్నెర సాని పాటలలో ‘’తెలుగు వంపు ,తెలుగు మెత్తన ,తెలుగు ప్రతిభ ‘’ప్రతి ఫలించేట్లు రాశానని చెప్పుకొన్నాడు  .దిక్కు లేని వాళ్ళ చావును ‘’అసృత బాష్పము ‘’శీర్షికతో పద్యాలు రాశాడు .ఒక పేదరాలు పాము కరిచి మర్రి చెట్టు నీడన చనిపోవట౦ ,ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళిపోవటంపై ‘’గొడుగు లడ్డమ్ముగా బెట్ట్టు కొనెడి వారు  -గాని ,యాదారి బోవు నొక్కరును వచ్చి –‘’యామె’ మృతికేమి హేతువో’’ యని తలంచు –వారు ముక్కుపై వ్రేలుంచు వారు లేరు ‘’అన్నారు .శ్రీ శ్రీ’’ భిక్షు వర్షీయసి’’ని చదివి ఓహో అంటాం కాని దీన్ని పట్టించుకొన్న వారు లేరు .

చిన్న పిల్లాడొకడు అన్నం తినే  ముందు కాళ్ళు కడుక్కోవటానికి దొడ్లోకి వెళ్లి తులసి మొక్కను పీకాలను కొంటాడు .దానిప్రక్కనున్న మల్లెమొక్క వద్దని వారిస్తుంది .తులసి కూడా పీకద్దని ప్రాధేయ పడింది .ఇంతలో తల్లివచ్చి అన్నానికి వాడిని తీసుకెళ్ళింది .తులసి మొక్కను పీకావా అని అడిగితె వాడు ‘’తులసి చెల్లిని ముద్దాడుతున్నాను ‘’అంటాడు ‘’మా నాయనే ‘’అని తల్లి కొడుకును అక్కున చేర్చుకుంటుంది. సుకుమారమైన అందమైన కల్పన చేశాడు చిన్నపద్య  కధలో విశ్వనాధ .లలితంగా పిల్లలకు ప్రకృతిని పరిచయం చేయటమే ఆయన ఉద్దేశ్యం .

ఒక కమ్మ వారమ్మాయి  చిన్నతనం లోనే విధవ రాలైతే విశ్వనాధ తన ఇంట్లో ఆమెను కూతుర్లా పోషించి మరొక మంచి వాడికి రెండవ వివాహం చేసిన ఔదార్యంచూపాడు  ఆయన యెద మెత్తన కాదా .

అబ్బూరివారద రాజేశ్వర రావు తో ‘’మీనాన్న రామ కృష్ణారావు రాయాల్సిన బృహత్ కావ్యాన్ని నేను రాయాల్సి వచ్చిందయ్యా ‘’అన్న సంస్కారి .అబ్బూరి పాండితీ గరిమకు గొప్ప నివాళి కూడా .ఇలా విశ్వనాధ యెద సుతి మెత్త్తన అని చెప్పటానికి ఎన్నో ఉన్నాయి .

ఆధారం –తెలుగు యూని వర్సిటి ప్రచురణ ‘’విశ్వ నాద ఒక కల్ప వృక్షం ‘’

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 425-విశ్వవిద్యాలయం లో ‘’గీర్వాణ పాదు ‘’ను పెంచిపోషించి కాయించిన కులపతి కున్హన్ రాజా(1895-1963)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

425-విశ్వవిద్యాలయం లో ‘’గీర్వాణ పాదు ‘’ను పెంచిపోషించి కాయించిన కులపతి కున్హన్ రాజా(1895-1963)

చిత్తే౦జూర్ కున్హన్ రాజా మద్రాస్ లోని అడయార్ లైబ్రరీ క్యూరేటర్ గా చాలా ఏళ్ళు పని చేశాడు .అడయార్ ఫిలసాఫికల్ సొసైటీ లో 1920లో చేరి అక్కడే ఉంటూ సంస్కృత భాషా సేవ చేశాడు .లైబ్రరీ అభివృద్ధి,గ్రంధ ప్రచురణయే  ధ్యేయంగా పని చేశాడు . ప్రొఫెసర్  రాజా గొప్ప గ్రంధ కర్త .సంస్కృతభాషా వ్యాప్తికి భారతీయ సంస్కృతీ వ్యాప్తికి విశేష కృషి చేశాడు .ఎప్పటికైనా సంస్కృతభాష మాత్రమె భారతీయ ఐక్యతను సాధించగలదని ,ప్రపంచానికి పరమోత్తమమైన విలువలను బోధించేదని గాఢం గా నమ్మాడు  .ఆయన కల ఇంకా సాకారం కాలేదు .ఇండియా రానురాను విభజనకు గురి అయిన్దేతప్ప ఐక్యత సాధించలేకపోయింది. సాంస్కృతిక విలువలు పతనమై పోయాయి .ఇండాలజీ పై కున్హన్ రాజా వెలువరించిన పత్రాలసంపుటికి గౌరవ ప్రదంగా అడయార్ లైబ్రరి ‘భారతీయ బ్రహ్మ విద్య ‘’అనే ఉద్గ్రంధాన్ని ఆయన శతజయంతి నాడు అంకితమిచ్చి1996లో  ప్రచురించి గౌరవించింది .

శంకరాచార్య రాసిన బ్రహ్మ సూత్ర భాష్య’’చతుస్సూత్రి ‘’కి  వాచస్పతి  భామతి రాసిన దానిని  ఫిలాసఫీ రీడర్ శ్రీ ఎస్ ఎస్ సూర్యనారాయణ శాస్త్రి  మద్రాస్ యూనివర్సిటి సంస్క్రుతాచార్యులు శ్రీ కున్హన్ రాజ కలిసి ఆంగ్లం లోకి అనువదించారు .దీనికి ముందుమాట శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ రాశారు . ‘’some fundamental problems in Indian philosophy ‘’,’’some aspects of education in ancient India ,’’sankhya karikas of Isvara Krishna ,’’’’asya vamsya mantram ‘’’’survey of Sanskrit literature  ‘’,మొదలైన ఆంగ్ల గ్రంధాలు రాశాడు .భారత ప్రశస్తి ,చంద్ర వాక్యాస్ ఆఫ్ వరరుచి ,కూడా ఆయనవే .

ఆంద్ర విశ్వవిద్యాలయం లో గీర్వాణ సేవ

1954 లో విశాఖపట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృత శాఖ డాక్టర్ సి కున్హన్ రాజా ఆచార్యులుగా ప్రారంభమైంది .కాని నాలుగేళ్ల తరువాతనే సంస్కృతం లో ఏం ఏ ,.పి.హెచ్ డిల కు విద్యార్ధులను చేర్చుకోవటం ప్రారంభమైంది .లబ్ధ ప్రతిష్టులైన సంస్కృత పండితులెందరో డిపార్ట్ మెంట్ లో చేరి సేవలందించారు . ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ గా పని చేసినప్పుడు ‘’కాళిదాస ‘’గ్రంధాన్ని ‘’ది వేదాస్’’ను రచించి ప్రచురించాడు .సంస్కృత శాఖలో ‘’దర్శనాలపై పరిశోధన , సంస్కృతం లో స్త్రీల సాంఘిక అధ్యయనం ,తులనాత్మక సాహిత్య విమర్శ ‘’లకు ప్రాధాన్యమిచ్చారు .ఐ ఏ ఎస్ ఆఫీసర్లు కూడా సంస్కృతం లో అత్యుత్సాహం చూపి చేరి మాస్టర్స్ డిగ్రీ పొంది డిపార్ట్ మెంట్ కు గర్వకారణంగా నిలిచారు  .అందులో చదివి ఉత్తీర్ణులైన వారు వివిధరంగాలలో ఉన్నత పదవులలో రాణించారు .ఇందులోని ఫాకల్టి సభ్యులు జర్మని ,ఆస్ట్రేలియా ,కెనడా ,తాయ్ లాండ్ వంటి ఇతర దేశాలు సందర్శించి అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు .సంస్కృత డిపార్ట్ మెంట్ వారిని  యు జి సి ,ఎపి పిఎస్ సి ,యుపి ఎస్ సి వారు తరచుగా సంప్రదిస్తూ సలహాలను తీసుకొనేవారు .ఫాకల్టివారు జాతీయ ,అంతర్జాతీయ జర్నల్స్ ను ప్రచురించేవారు.సంస్కృత శాఖాభి వృద్ధికి  కున్హన్ రాజా సేవలు నిరుపమానమైనవి .

Inline image 1  Inline image 2    Inline image 3   Inline image 4

‘’అస్య వామస్య సూక్త ‘’అనేది ఋగ్వేదం లో మొదటి మండలం లోని 164 వ సూక్తం .దీనికి సాయనుడు, స్వామి ఆత్మానంద వ్యాఖ్యానం రాశారు .దీన్ని ఇంగ్లీష్ లోకి విశాఖలోని ఆంద్ర విశ్వ విద్యాలయ సంస్కృత  ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ కున్హన్ రాజా అనువదించాడు .ఇందులో ఎన్నో ప్రతీకలున్నాయి .వాటి వివరణ అంతా ఉంది .కాలచక్రగమనం గ్రహాలూ నక్షత్రాలు వాటి సంబంధం సప్తాశ్వాలు వాటి అర్ధం సూర్యుడు రశ్మి అన్నిటి వివరాలున్న సూక్తం ఇది .సూర్యుడే  పరబ్రహ్మ అనేది ముఖ్య సిద్ధాంతం .

‘’God has no place in my philosophy ‘’అని కున్హన్ రాజా  ‘’కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ ‘’లోఅంటాడు .

1868లో మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజిలో సంస్కృత శాఖ ప్రారంభమైంది .1872లో గుస్టేవ్ ఆపర్ట్ మొదటి సంస్కృత ప్రొఫెసర్ .1927 లో డాక్టర్ కున్హన్ రాజా సంస్కృత ఆచార్యుడయ్యాడు .ఆయనవద్ద ఇద్దరు స్కాలర్స్ పని చేసేవారు .డిపార్ట్ మెంట్  లో’’న్యు కేటలాగ్  కేటలాగం’’(N.C.C )విభాగం ప్రారంభమై రాఘవన్ ఆధ్వర్యం లో పనిచేసింది ఆయన నుండి రాజా బాధ్యతలు స్వీకరించాడు .డిపార్ట్ మెంట్ ను బోధనలోను, రిసెర్చ్ లోను అగ్రగామిగా నిలబెట్టాడు .ఆరు మహా గ్రంధాలను ప్రచురించే ఏర్పాటు చేశాడు .1980లో రాజా పదవీ విరమణ చేశాడు .యెన్ సి సి సేవలు నిరుపమానం .వ్రాత ప్రతులను సేకరించి భద్రపరచారు .మైసూర్ యూనివర్సిటి మొదలైన వాటికి విజిటింగ్ ప్రొఫెసర్ గా రాజా వెళ్లి ఉపన్యాసాలిచ్చేవాడు .

‘’మేకింగ్ ఆఫ్  వెస్ట్రన్ ఇండాలజీ ‘’హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ పొయేటిక్స్’’, ఇంపార్టన్స్ ఆఫ్  సాంస్క్రిట్,’’సర్వే ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’కూడా రాశాడు . సంస్కృత ప్రాముఖ్యం పైన సంస్క్రతం లో’’సంస్క్రుతస్య మహాత్మ్యం ‘’ రాస్తూ ‘’భాషాసు ముఖ్య మధురా ప్రాచీనా విశ్వతో ముఖీ –భాతి సంస్కృత భాషేయం సర్వదా సర్వదాసతీ’’అన్నాడు మొదటి శ్లోకం లో.’’ఉన్నతేన స్తితిమతాహిమవద్భ్రూతా యధా-త్వన్గత్తరంగతా పుణ్య సరితా గంగయా యదా ‘’అన్నాడు .చివరి శ్లోకం –‘’అన్యోన్య భాషా న్వబోధ భీతేః-సంస్క్రుతిర్మాసు వ్యవహార వత్సు-దిగ్భ్యః సమేతేషు నరేషు తోషు –సౌవర్గ వర్గా స్వజనై రఛి న్హి’’

ఇంత గీర్వాణ సేవ చేసిన చిత్తేన్జూర్ కున్హన్ రాజా 1895లో జన్మించి 1963లో మరణించాడన్న ఒక్క విషయం తప్ప ఆయన జీవిత చరిత్రను ఎవరూ పొందు పరచకపోవటం దురదృష్టం .బౌద్ధ ”ధర్మపదం ”ఆంగ్లం లో రాశాడు .

మా శ్రీ మైనేని గోపాల కృష్ణగారు ఉదయం మెయిల్ రాస్తూ కున్హన్ రాజా తను 1955-58లో విశాఖ పట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఉండగా సంస్కృత విభాగానికి హెడ్ గా ,హాస్టల్ వార్డెన్ గా ఉన్నారని ,సంస్కృతం లో పేరుమోసిన పండితుడని ,హిందూ –బుద్ధిష్ట్ స్క్రిప్చర్స్ లో ఆరితేరిన వాజ్మయ సంపన్నుడు అని తాను ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’చదువుతున్నప్పుడల్లా గుర్తుకు వస్తున్నాడని ,ఆయనపై ఒక ప్రొఫైల్ రాస్తే సంతోషిస్తానని ‘’అన్నారు ‘’.వివరాలు రాయండి  వ్యాస రూపం లో పెడతాను .రాయవలసిన ముఖ్యుడే ఆయన ‘’అన్నాను .’’అలాగే ప్రయత్నిస్తా’’ అన్నారు .అప్పటిదాకా ఆగటం ఎందుకని రాసే సీరియల్ కు కామా పెట్టి కున్హన్ రాజా  పై నాకు దొరికిన సమాచారం అంతా సేకరించి రాసేదాకా మనసు నిలవ లేదు . ఇది సంగ్రమూ కాదు సంపూర్ణ మూ కాదు .ఇప్పటిదాకా రాయకపోయినా దానికి ప్రాయశ్చిత్తం గా రాసి౦ది మాత్రమే .ఇంకా ఏవైనా ఆయన గురించి తెలిస్తే తర్వాత కలుపుతాను .

కున్హన్ రాజా ఫోటో జతచేశాను చూడండి  .

సశేషం

మరో ప్రముఖునితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

40 చిత్రాల బాలనటుడు మాస్టర్ నాగేశ్వరరావు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చలో అమరావతి

Inline image 1
 
 
 
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వనాధ వర్షం కురిపించగలడా !

విశ్వనాధ వర్షం కురిపించగలడా !

ఎస్ .కురిపించగలడు .అనే ప్రత్యక్ష సాక్షులు చెప్పారు .ఆవివరాలు తెలుసుకొందాం .విశ్వనాధ నిగ్రహానుగ్రహ సమర్ధులు .ఒక సారి తోటి తెలుగు లెక్చరర్  డా.ధూళిపాళ శ్రీరామ మూర్తి గారు తోడురాగా గుంటూరుజిల్లా వేటపాలేమో ,మున్నంగో  ఆ గ్రామస్తుల అభ్యర్ధనపై వెళ్లారట .అప్పటికే కల్పవృక్ష రచనలో మునిగి ఉన్నారు .ఆ ఊరివారు ‘’రామాయణం రాస్తున్నారు కదా ! వాన కురిపిస్తారా ?’’అని సడన్ గా  అడిగారట .’’సరే చూద్దాం ‘’అనితాను  రాసిన  ‘’ఋష్యశృంగ ‘’చరిత్ర చదివారట .అందులో ‘’ఆ రధ మేగు త్రోవ జలదావళి మింట’’అనే పద్యం  చదవటం మొదలెట్ట గానే మేఘాలు క్రమ్ముకుని ఆ రాత్రి ‘’కుంభ ద్రోణం ‘’గా వర్షం కురిసిందని ఆ వూరి వారు శ్రీరామ మూర్తిగారికి చెప్పారట .

ధూళిపాళ వారే ప్రత్యక్ష సాక్షం గా ఉన్న రెండు మూడు సంఘటనలున్నాయి .ఒక వేసవిలో బెజవాడ లో సత్యనారాయణ గారుంటున్న మాచవరం లో సాయంత్రం మూడింటికి శ్రీరామ మూర్తిగారు వెళ్ళారు .వేడి బాగా ఉండటం తో విశ్వనాధ లోపల పడుకున్నారు. తాను వచ్చానని చెప్పగానే లోపలి రమ్మన్నారు .’’ఎండ బాగా ఉందయ్యా .ఏ కోశానా చల్లదనం లేదు .ప్రాణం ఆగేట్టు లేదు .కనుక ఇక్కడే కూర్చో అని భారతం లో ఋష్యశృంగ చరిత్ర చదివావా ‘?అని అడిగారు .’’చదవ లేదని ‘’చెప్పారు .’’సరే విను వాన కురుస్తుందేమో చూడు ‘.వ్యాసుడు యెంత బాగానో రాశాడు .’’అని చదవటం మొదలు పెట్టారు .’’ఇప్పుడు మనం పడవలు అంటామే అట్లాంటి పడవలు కలిసి కట్టి వాటి మీద మట్టి పోసి ,మామూలు నేల మీద పెరిగినట్లుగా ఒక కృత్రిమ వృక్షాన్ని తయారు చేశారట .దాన్ని ఆ పక్కనే ఉన్న నదిలో కలిపి వేశ్యలు ఋష్య శ్రుంగుడున్న వనానికి తెచ్చి అతనికి తెలియ కుండా రోమ పాదుని వనానికి తీసుకు వెళ్లారట .ఎంతత చమత్కారంగా వ్యాసుడు రాశాడో చూడు ‘’అన్నారట .ఇలా వ్యాఖ్యానం చేస్తుండగానే గాలి కొంత చల్ల బడింది .’’బయట కూర్చుందాం పద ‘’అని ఇద్దరూ బయట కుర్చీల్లో కూచున్నారు .మళ్ళీ కద మొదలెట్టారు .కద నడిచిన కొద్దీ వాతావరం బాగా చల్లబడింది .ఒక పావుగంట ఒక మాదిరి జల్లు పడింది .అంటే ‘’బట్ట తడుపు జల్లు’’ అన్నమాట .’’ఇవాల్టికి ప్రాణం నిలిచి౦దయ్యా ‘’అన్నారు విశ్వనాధ .

మర్నాడు ముందురోజు చల్లదనాన్ని కాదని ఎండ మండిపోయింది .శ్రీరామ మూర్తిగారు మేష్టారు ఎలా ఉన్నారో చూడటానికి వచ్చారు అంత ఎండలో .’’ఇవాళ కూడా మీరు వాన కురిపిస్తారేమో ననే ఆశతో వచ్చాను ‘’అన్నారు ధూళిపాళ..’’సరే అయితే కూర్చో .చూద్దాం ‘’అంటూ నన్నయ్యగారి ‘’ఋష్యశృంగ చరిత్ర ‘’చదివారు .ఆ రోజునా కిందటి రోజు మాదిరిగానే అంతే వర్షం పడింది .శ్రీరామ మూర్తిగారికి ఆశ్చర్యమేసింది .

అ మర్నాడు సుమారు మూడింటికి మేస్టారి భార్య వరలక్ష్మిగారు ధూళిపాళ గారింటికి ఆదరా బాదరా వచ్చి ‘’అదేమిటి అన్నయ్యగారూ  అక్కడ కొ౦పలంటుకొని పోతుంటే నిమ్మకు నీరెత్తి నట్లున్నారేమిటి పాకలో ఉన్నారాయే సామాను సర్దుకొని బయటికి రండి ‘’అన్నారు కంగారుగా .’’అక్కడెక్కడో చుట్టూ గుంట దగ్గర తగలడుతుంటే ఇప్పుడే కంగారు ఎందుకు అక్కయ్య గారూ .మాస్టారెలా ఉన్నారు?అని అడిగారు ‘’ఆయన ఆపసోపాలు పడుతున్నారండీ ‘’అన్నారు .శ్రీరామ మూర్తిగారు ఆగలేక మాస్టారింటికి  ఉరికారు .ఫైర్ ఇంజన్లోచ్చి హడావిడి చేస్తున్నాయి .కాని నీళ్ళు అక్కడ లేనేలేవు .’’మాస్టరుగారూ ! ఇవాళ కూడా వర్షం కురిపించండి  ఇళ్ళు తగలడుతున్నాయ్ .నాది తాటాకు కొంప కూడా ‘’అన్నారు .’’ఏమయ్యా ! నేనేమైనా దేవుడినా .మనం కురవ మంటే కురుస్తుందా ?అన్నారు .’’కురవమని మీరు అనండి కురిస్తే మీ మహిమ లేకపోతె దేవుడి మహిమ అనుకుందాం ‘’అన్నారు వీరు .’’అయితే ఇవాళ వాల్మీకం చదువుదాం ‘’అని చదువుతూ వ్యాఖ్యానిస్తున్నారు ‘’దాని దుంప తెగ ఇవాళ కూడా వాన పడింది ‘’అన్నారు దూ .శ్రీ .తర్వాత విశ్వనాధ రాసి౦ది కూడా చదివారు .’’ఇక్కడ మాకూ ఉపశాంతి .అక్కడ అగ్ని హోత్రుడికి తాప శాంతి కలిగింది ‘’అన్నారు శ్రీరామమూర్తిగారు .ఇదీ ‘’విశ్వనాధ –వాన ‘’కద

ఆధారం –‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం ‘’పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 421-గురుదైవ అద్వై స్థితి కర్త –శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

421-గురుదైవ అద్వై స్థితి  కర్త –శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ

తెలుగు సంస్కృతాలలో పండితులై నెల్లూరు నగరానికే శోభామానులైన శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ ‘’గురుదైవ అద్వైత స్థితి ‘’అనే ఉత్తమ సంస్కృత గ్రంధ రచన చేశారు .యాభై ‘’భుజంగ ప్రయాత ‘’వృత్తాలలో వ్రాయ బడింది .కుర్తాళ పీఠాదిపతులుశ్రీ శివ చిదానంద భారతీ స్వామి (ప్రసాద రాయ కులపతి)గురించిన స్తుతి, విన్నపాలు  వారి వక్తృత్వ విన్యాసం మొదలైనవి ఇందులో పొందుపరచారు .శిష్యునికి గురువుపై ఉన్న భక్తీ తత్పరతకు  నిదర్శనం ఈ గ్రంధం .నారికేళ పాకం లో ఉంది. తేలిగ్గా మింగుడుపడదు నవిలి నవిలి తింటే అంతా అమృతమే .ఉదాహరణకు ఒక శ్లోకం –

‘’అహంభావనా భావితాత్మాను భూతి ప్రడానే నిదానం నిడానే ప్రధానం –చిదానంద విస్పూర్తి సంమూర్తి మీడేశివం  సంతత౦ త్వేక మేవా ద్వితీయం ‘

స్థితం స్వేమ హిమ్నీక్షితే యోగి వర్యైః పరేవ్యోమ్ని చామ్నాత ముద్గీ ధనామ్ని –శ్రమేయ స్వహృత్సీమ్ని యత్తదామని ప్రభా భాసి యధ్యేక మేవా ద్వితీయం ‘’అని ఎకమేవా ద్వితీయం అనే బ్రహ్మ సూత్రాన్ని పొందుపరచారు .రాసిలో చిన్నదైనా వాసిలో విశిష్టమైనది .శర్మగారు ‘’శ్రీ గురు వసంత పంచకం ‘’పేర అయిదు శ్లోకాలు రమణీయంగా రాశారు

‘’భావే భాజయామి పరమాదరిణం శ్రీ తేషు హకారక్రుతిన్వి విహితేషు యదా హితేషు –లోకాతి శాయి మహిమానమ నూన కీర్తిం శ్రీ మౌన విశ్రుత యతీంద్ర మతీంద్ర యజ్ఞం ‘’రత్న పంచకం ‘’అనే ఖండిక కూడా రాశారు ఇందులో చిదానంద స్వామివారినే అమ్మవారిగా భావించి,ఆరాధించి  రాయటం విశేషం –

‘’నమతాం శివతాం శ్యామాం శివ వామాంక వాసినీం ఆశ్రయే విశ్వ జననీం చిదానందైక రూపిణీం-‘’కుర్తా ళాన్నిత్రికూటాచలం అనిపిలుస్తారు .ఆ పర్వత ప్రాంతాన్ని వర్ణిస్తూ’’త్రికూట ప్రపాతోత్పన్ని ర్జ్హ రామ్భః ప్రపూతో శ్రమ స్థాన మాశ్రిత్య తిష్టం –లసద్యోగ నిస్టాత్మ ద్రుష్టి ప్రహ్రుస్టస్య  పాదాయపాయా చ్చివానంద యోగీ ‘’

422-పంచకావ్యస్య దాతు రత్నాకరం  రచయిత –శ్రీ పుష్పగిరి వెంకట శాస్త్రి (1912)

నెల్లూరుజిల్లా కోవూరు తాలూకా మోడిగుంట గ్రామంలో శ్రీ పుష్పగిరి వెంకట శాస్త్రి 1912లో అన్నపూర్ణమ్మ దక్షిణా మూర్తిగార్లకు జన్మించారు .నెల్లూరు వేదసంస్కృత కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులు .సంస్కృత పంచ కావ్యాలలోని ప్రతి ధాతువుకు ఉన్న దశాలంకార రూపాలు ,కోజంత సన్నం తాదులు విశ్లేషించి క్రోడీకరించి ‘’పంచ కావ్యస్య ధాతురత్నాకరం ‘రెండుభాగాలుగా ’రాశారు .గొప్ప విలువైన కృషి .పంచకావ్య ధాతువుకు ఇది ‘’సిద్ధ పట్టిక ‘’.అపార వ్యాకరణ పాండిత్యం ఉన్నకవి. ఆ పాండిత్యాన్ని ఆ గ్రంధ మంగళ శ్లోకం లో ‘’చరీకర్తి ,బరీ భర్తి,సంజరీ హర్తిలీలయా –‘’చెప్పారు .ఇందులో పదేపదే వచ్చే క్రియల్ని ముచ్చటగా చూపారు .

423-సంస్కృత ఊర్వశి కావ్యం రాసిన –శ్రీ ఉడాలి సుబ్బరామ శాస్త్రి

నెల్లూరు వేద సంస్క్రుతకాలేజి న్యాయ తర్క పండితులు ,ప్రిన్సిపాల్ గా పని చేసిన శ్రీ ఉడాలిసుబ్బరామ శాస్త్రి తిరుపతి ఓరియెంటల్కాలేజిలో న్యాయ శిఖామణి కోర్సు చదివేటప్పుడే ‘’న్యాయ కుసుమాంజలి ప్రకాశిక ‘’బాధ్యతలు చేబట్టారు .వీరి మొదటి సంస్కృత కావ్యం ‘’ఊర్వశి ‘’రవీంద్రుని రచనకు గోపాలరెడ్డి తెలుగు సుతకు ఇది సంస్కృతీకరణ .ధారా శుద్ధి భావ గాంభీర్యం కావ్యం లో ఉన్నాయి –ఒక శ్లోకం

‘’దీపైర్మాణిక్య రూపై రనపగత విభా రూషిత ద్వారా దెశైః-కల్లోల హ్లాదిగీతై రపగత మాలిన స్మౌర వక్త్రాబ్జ శోభ –పర్యంకే విద్రమాణా మదిగత శయనా యాసి నిద్రాం నిశాయాం –క్వాపిత్వం కస్య వామ్కం సముపగత వతీతుల్య జన్మా జగత్యా ‘’అని కవి ఊర్వశిని ప్రశ్నిస్తున్నాడు ‘’నువ్వుపుట్టావా బాల్యం ఉందానీకు ,ఎవరి ఒడిలో పెరిగావు ,మణిమయ దీప కాంతులతో ద్వారా భూములే తరంగ నాదాలుగా మధుర గీతాలతో ఆనందిస్తూ ,ప్రసన్నమైన మ్నదస్మిత వదనం తో ,పగడపు పానుపు పై పవ్వళించేనువ్వు ఎవరి ఒడిని పొంది ఉంటావు?.మన భూలోక సౌందర్యాన్ని తిలకించి పులకి౦చమన్నాడు కవి –

నిత్యం విలోకయ పవిత్ర భువం విశాలాం తీర్దే త్రభారత మహాజన వార్ధి తీరే –యత్రాక్ష సూత్ర వలయత్వ ముపాగతాభిః ఆఖాతి కానన తతి ర్మధురం నదీభిః’’ఇందులోని శీర్షికలూ రమ్యంగా ఉన్నాయి –

‘’ అమృత కలశం ‘’కావ్యం  మోచర్ల రామక్రిష్ణయ్యగారి తెలుగు కావ్యానికి సంస్క్రుతీకరణం .85 శ్లోకాలు .ఇది శ్రీ హరి చరితామృతం .స్వామి దైవత్వాన్ని బహుసు౦దరంగా చిత్రించారు .మచ్చుకొక శ్లోకం –

‘’మాయాధ్వాంత నిశూదనాః  సముదితాః కారుణ్య వారాశితః –ప్రేమాలోక సుధా రసాః సుజనతా హ్రుత్కైర వామోదినః –క్షీరామ్బోది కన్యకానయన మొరానంద సందాయినః –మాం పాతుస్మిత చంద్రికా సముదయాః విష్ణో స్సదా శీతలాః’’ అంటే –మాయ అనే చీకటి పోగొట్టి ,కనికరం అనే సముద్రం నుండి పుట్టిన ,ప్రేమ తో వికసించిన చూపులు అనే అమృతరసాన్ని చిలికించే సజ్జనుల హృదయ కమలాలను వికసింప జేసే పాల సముద్ర తనయ లక్ష్మీదేవి కి నేత్రానందాన్ని కలిగించే శ్రీమన్నారాయణుని చల్లని చిరు నవ్వులనే వెన్నెలలు నన్ను రక్షించాలి .

ఇవి కాక శాస్త్రిగారు ‘’మూల స్థానేశ్వర సుప్రభాతం ,సరస్వతీ సుప్రభాతం అవధూత గీత ,పూర్వ యక్షః ,జవహర్ జ్యోతి సంస్క్రుతకావ్యాలు రాశారు కాళిదాసు మేఘ సందేశాన్ని రెండు సర్గల కావ్యం గా సంస్కృతం లో రాసిన ప్రతిభా మూర్తి .

424-శుక  సందేశం  రాసిన –శ్రీ కిడాంబి శ్రీనివాస రామానుజాచార్యులు (1930

తిరుపతిలో 1930లోవెంకట నరసింహా చార్యులు ,జానకమ్మల సంతానమే  శ్రీ కిడంబి శ్రీనివాస రామానుజాచార్యులు .నెల్లూరు మూలపేట  శ్రీ వేణుగోపాల దేవాలయం లో బాల్యం గడిచింది వేదసంస్కృత కళాశాలలో చదివి సాహిత్య ప్రవీణ ,భాషా ప్రవీణ లు పాసైనారు. వివిధ సాహిత్య ప్రక్రియలలో 33 గ్రంధాలు రాశారు .

గీర్వాణ కవితా గీర్వాణం

సంస్కృతం లో మొదటికావ్యం ‘’శుక సందేశః ‘’కల్పిత ఇతి వృత్తం నూట ఒక్క శ్లోకాల ఈ గ్రంధాన్ని గురువుగారు శ్రీ గాజులపల్లి హనుమచ్చాస్త్రి గారికి అంకితమిచ్చారు –గురుస్తుతి

‘’విద్యా భూషణ సంజ్నితస్య హనుమచ్చాస్త్రీ త్యు పాఖ్యావతః –శ్రీమత్సింహ పురీ స్థసంస్కృత కళాశాలా ధీనేతుర్గురోః –పాదాంభోజ యుగే సమర్ప్యతదిదం కావ్యం గురోర్దక్షిణాం—తేనై తేన వచో విలాస విభావేనా కల్పయం వాగ్ధనః ‘’

లంకలో ఉన్న సీతాదేవి చిలుక ద్వారా శ్రీరామునికి సందేశం పంపటమే కద.

‘’దూరీ కర్తుమ్ సుర మృగ దృశాం దుఃఖ మూర్వీం ప్రసన్నా –దేవీ సీతా మృగమను విభేసాను జాతే ప్రయాతే –నీత్వాలంకా మహర రిపుణా ప్రాపితాశోక వాటీం-కల్పద్యామాం కధమపి నిశామాది మాంతం వ్యనైషీత్’’సీతమనోవ్యదను వ్యక్తం చేసింది .మృదు మధురభావాలు శబ్దాలతో కావ్యం రస రంజితమైంది .

‘’బుద్ధ చరిత ‘’లో ఒక ఘట్టాన్ని ‘’సౌగతం ‘’గా రాశారు .గోపాల రెడ్డి గారి ‘’నిద్ర ‘’ఖండికను ‘’నిద్రా విభూతిం ‘’గా మలచారు .’’నారద ముని సుప్రభాతం  శ్రీ లక్ష్మీ నారాయణ సుప్రభాతం ,శ్రీ గోదా సుప్రభాతం ,శ్రీ గోదా సహస్ర మాలిక ,శ్రీ లక్ష్మీనారాయణ సహస్ర నామ స్తోత్రం ‘’ఆచార్యుల వారి సంస్కృత రచనలు .దువ్వూరి రామి రెడ్డిగారి ‘’గులాబీతోట ‘’ను ‘సుభాషిత పుష్ప వాటికా ‘’గా రాశారు .ఆకిలి రామశర్మగారి ‘’శార్వరి ‘’ని సంస్కృతం లో ‘’శర్వరి ‘’గా అనువదించారు .పదిముఖ్యమైన లఘు స్తోత్రాలు రాశారు .అన్నీ ప్రసిద్ధి చెందినవే .విశ్వనాధ ‘’హాహా హుహూ ‘’నుసంస్క్రుతీకరి౦చారు .బెజవాడ రెడ్డిగారి’’ నేడు ;;ఖండికను ‘’ఉల్లేఖ మంజరి ‘’గా గీర్వాణీకరించారు .యజ్ఞాలలో పశువదను నిషేధించటాన్ని సమర్ధిస్తూ ‘’దానికి బదులు ‘’పిండ పశు ప్రదానం ‘’చేయాలని ‘’పశ్వాలంబన నిషేధ ‘’వ్యాసాన్ని సంస్కృతం లో శ్రీ విశ్వనాధ ముతులు ఆరవత్తూర్ వ్యాసానికి  అనువాదం గా  రాశారు ..

తెలుగులో సుమారు పదిగ్రందాలు రాశారు .శ్రీ ఆకెళ్ళ అచ్చన్న శాస్త్రి తోకలిసి ‘’శ్రీ సంస్కృత భాషా ప్రవేశిక ‘’అనే సులభ వ్యాకరణాన్ని రాశారు .

బిరుద సత్కారాలు

ప గో జి పెంటపాడు ‘’ఉభయ వేదాంత సభ వారిచే ‘’ఉభయ వేదాంత వాచస్పతి ‘తిరుపతి ’రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం చే ‘’వాచస్పతి ‘’శ్రీ చిన జియ్యర్ చే ‘’గోపాలోపాయన ‘’సన్మానాన్ని అందుకున్నారు .గుంటూరు ఉభయ వేదాంత సభ చే ‘’శ్రీ మద్గోపాలాచార్య స్మారక ‘’పురస్కారం పొందారు .

తల్పగిరి రంగ నాద స్తోత్రం లో స్వామిని –‘’పినాకినీతే రమ్య శేష పర్యంక శాయినం –నిద్రా ముద్రాభి రామం తమ్ వందే శ్రీ రంగ నాయకం ‘’-ఉపదాయ కరం వామం దక్షిణం జానుగామినం –కృత్వా సుఖేన శయితం  వందే శ్రీ రంగ నాయకం ‘’అని అందంగా ఆ నిద్రా భంగిమను వర్ణించారు కళ్ళకు కట్టినట్లు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం –నెల్లూరు జిల్లా-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం –నెల్లూరు జిల్లా-

రచన -శ్రీ అమృతవాక్కుల శేషకుమార్-వేద సంస్కృత కళాశాల –నెల్లూరు

415-ఆశుకవి కేసరి –శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి (1892-1951)

బహుగ్రంధ కర్త ,అవధాని ,బహు ప్రక్రియా పారంగతులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి 1892లో నెల్లూరు జిల్లా కరవది లో సీతారామయ్య ,కనక రత్నమ్మగార్లకు జన్మించారు .తెలుగులో 25,సంస్కృతం లో 15 గ్రంధాలు రాశారు .’’ఆశుకవి శేఖర ,విద్యా భూషణ ‘’,కావ్య కళానిధి బిరుదులు పొందారు .వేదాంత ,మంత్రం శాస్త్రాలలో ప్రవీణులు .స్వయం కృషితో ధర్మ శాస్త్రం నేర్చారు .సంస్కృతాంధ్రాలలో విరివిగాఅష్టావధాన ,శతావధానాలు   చేశారు .మైసూరు మహా రాజాస్థానం లో1920నుండి ‘’ఆస్థాన మహా విద్వత్కవి ‘’గా ఉన్నారు తిరువాన్కూర్ మహారాజాస్థానం లో ‘’నరసింహ కంకణ ‘’సత్కారం అందుకున్నారు .గజారాన్య క్షేత్రం అనే తలకాడులో ‘’ఆశుకవి శేఖర ‘’,దర్భంగా మహారాజాస్థానం లో ‘’కావ్యకలానిది ‘’,బిరుదులూ సత్కారాలు పొందారు .చాలా సంస్థానాలు వీరికి వార్శికాలు పంపేవి .1942లో వెంకట గిరి రాజాస్థానం లో ‘’ఆస్థాన కవి ‘’గౌరవం పొంది 54 వేల శ్లోకాలుగల ‘’పద్మ పురాణాన్ని ‘’ఆంధ్రీకరించారు .11-2-1951న పరమ పదించారు

శాస్త్రిగారి గీర్వాణ కవిత్వం

పంచాయతన పంచ శతి ,శ్రీ కృష్ణ రాజాభ్యుదయం ,అవధాన దర్శనం ,రాజ ధర్మం ,అష్టక కదంబం ,శివ సూత్ర సంగ్రహం ,పరాభావ బోధిని ,దేశ యాత్రా చరిత్ర మహాశూర పురాభ్యుదయం ,,కాముకీ విరాగ సంభాషణ శతకం వగైరా పదిహేను గ్రంధాలను సంస్కృతం లో చిదంబర శాస్త్రి రచించారు .

శాస్త్రి గారి కాముకీ విరాగుల సంభాషణలో మచ్చుకి ఒకటి-

కాముకి-తన్వాస్తు  శారద కళానిధి పూర్ణ బింబం –న్యాక్కారి హాస వదనం సరాగం –యోవానపశ్యతి తదేక మతిః పురస్తాత్ –దిక్ తస్య జీవితమజాగళస్తనాభం ‘’

విరాగి-ఫాలేన  భస్మితమనోభావ మక్షియస్య –సుప్తే కళానిధి కలాకమనా విభాతి –తం యోన పశ్యతి తదేక మనాస్సమాదే –నిక్ తస్య జీవిత మజాగళాస్త్తనాభం ‘’

నిజాం సంస్థానం లో ‘’మాన పూజాపహారం ‘’అనే సమస్యను శాస్త్రిగారు ‘’సోయం రాజా భువి విజయతా సుస్తిరం రాఘ వెంద్రః –క్రీదాకాలే పటుతర బలే దాన ధర్మ ప్రసంగే –సంపల్లక్ష్యాం హరిహర పదాంభోరుహ ద్వంద్వ భాగే –కీర్తి శ్యామా కుచయుగ తదేమాన పూజాప హారం ‘’గా పూరించి మెప్పు పొందారు .

416-శారదా ప్రసాద కవి-శ్రీ మోచర్ల రామ కృష్ణయ్య(1904-1983)

సరసకవి కవిశేఖర ,,ప్రసన్న మధురకవి ,సాహిత్య రత్న బిరుదాంకితులైన శ్రీ మోచర్ల రామ కృష్ణకవి నెల్లూరు మండలం ,కందుకూరు తాలూకా మోచర్లగ్రామం లో 27-5-1904 న రామలింగయ్య ,లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు .నెల్లూరులో ప్రసిద్ధ న్యాయవాది .దుర్భా సుబ్రహ్మణ్యం గారి శిష్యులు .ఇరవై గ్రంధాలు రాశారు .ద్వారకా పీరాదిపతులచే’’సాహిత్య రత్న ‘’బిరుదుపొందారు .గొప్పనటులు ‘’ప్రచండ భార్గవం ‘’నాటకం రాసి ప్రదర్శించారు .గ్రాన్దిక భాషలో ‘’గిరిజా కల్యాణం ‘’రాశారు. రమణానంద లహరి  ‘’ పార్వతీ పరమేశ్వర వివాహం ఆత్మా బోధ ,గంగాలహరి ,హంస సందేశం ,పొట్టి శ్రీరాములు గారి మరణం పై ‘’అమర గౌరవం ‘’పద్యకావ్యం శివాజీనాటకం  మహారాష్ట్ర రాజుల చరిత్రకావ్యం రాశారు ..రామభక్తులైన రామ కృష్ణయ్య గారు రామాయణ సుందర కాండను ఎన్నో సార్లు పారాయణం చేసి తరించారు  .ఎనభై వ ఏట 21-5-1983 న మరణించారు .

సంస్కృత విద్వత్తు

సంస్కృత రచనలు ‘’శారదా ప్రసాదః ‘’,రాశారు ఇందులో సరస్వతీ దేవి ప్రశంస నివేదనలుమొదలైన వానిపై రాశారు .ఉదాహరణకు ఒక శ్లోకం –

‘’నోదద్యాశ్చే త్పరమ పదవీ సాధకం వాగ్వరం నః నూనం సర్వే వయమిహ మృగ ప్రాయతా మాపను యామః –నిత్యం కృత్యం తవ పద యుగాబ్జా ర్చనం తన్నరాణాందిస్త్యాతుభ్యం నతిశతమహం భవ్యసిద్ధైత నోమి’’

దేవి నామ ఔచిత్య సార్ధకతను తెలిపే శ్లోకం గాంభీర్య భావ సదృశం –‘’హిరణ్య గర్భాత్స రసః స్రవంతీ౦ ,త్రయీ మయై స్స్వర్ణ జలైస్స్ఫురం తీం-స్వరోర్మినాదేన సముల్లసంతీం సరస్వతీ మాయతయే నమామి ‘’

417-‘’ఆంద్ర కళ్యాణ ‘’-స్వయం పాకుల వెంకట రమణ శర్మ(1906

నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా జరుగుమల్లి లో 4-6-1906నవెంకటప్పయ్య ,వెంకట లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .తెలుగులో చాలా రచనలు చేశారు సంస్కృతం లో ‘’రత్నాంజలి’’కావ్యం రాశారు .అమర వాణిని గురించి అందులో ‘’యామాశ్రిత్య చిరంతనో మునివరో వాల్మీక జన్మా పురా –దిజ్ఞారీ పంధాన దాన చతురం  ప్రాగల్భ్య మాసీదివాన్ –యామశ్రిత్య చ బాదరయణపరివ్రాడ్ విశ్వవాన్వ గ్రహీత్ ‘-తాద్వాణ్యా స్తుతి వర్ణ నాదిక విదే శేషో పినాలంభావేత్ ‘’

418-ఆర్యా త్రిశతి కర్త –పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి

సంస్కృతాంధ్రాలలో మహాపండితుడైన పిశుపాటి విశ్వేశ్వర  శాస్త్రి పరాభవ నామ సంవత్సరం .చైత్ర బహుళ విదియ బుధవారం నెల్లూరుమండలం కరవది లో సీతారామమయ్య ,కనకమ్మలకు జన్మించారు .నెల్లూరు వెంకట గిరి రాజా కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు .’’ఆశుకవి కేసరి శతావధాని  ,’’బిరుదులు పొందారు .మహా భాష్యంత వ్యాకరణ వేత్తలు .శంకర ప్రస్తాన త్రయాన్ని ఆకళింపు చేసుకున్న వేదాంతి .మంత్రం శాస్త్ర ప్రవీణులు .సంస్కృతం లో ‘’ఆర్యా త్రిశతి ‘’అనే కావ్యాన్ని ఆర్యా వృత్తం లో భర్తృహరి సుభాషిత త్రిశాతిలాగా గొప్పగా రాశారు .’’రాజ ధర్మ ‘’కావ్యానికి సంస్కృతం లో ‘’జయ వ్యాఖ్య ‘’రాసి మహా వ్యాఖ్యాతగా పేరొందారు .

419-విక్టోరియా రాణి చరిత్ర రాసిన –చింతపల్లి నృసింహ కవి

నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా గురురాజ పేటలో చింతపల్లి నృసింహ శర్మ జన్మించారు .తెలుగులో ‘’ఆంద్ర కాదంబరి ‘’రాశారు సంస్కృతం లో ‘’విక్టోరియా మహారాణీ చరిత్ర’’రాసి చరిత్ర ప్రసిద్ధులైనారు ఆ రోజుల్లో అదొక వింతగా విడ్డూరంగా చెప్పుకొనేవారు .

420-సంస్కృత ’గాంధీ  సూత్రాలు’’ రాసిన దిట్టకవి సుబ్రహ్మణ్య శర్మ

గీర్వాణ ఆంధ్రాలలో దిట్టమైన కవిత్వం చెప్పగల దిట్టకవి సుబ్రహ్మణ్య శర్మ ప్రముఖ గాంధేయవాది .మద్రాస్ ప్రెసి డెన్సికాలేజి ప్రిన్సిపాల్.గాంధీ గారి గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పటానికి ‘’గాంధీ సూత్రాలు ‘’ను సంస్కృతం లో రాశారు .బహు గ్రంధకర్త .గొప్ప కర్మిస్టి.సర్వేపల్లి రాధాకృష్ణ పండితునికి వియ్యంకుడు .శర్మగారి కుమారుడు శాండిల్యతో రాధాకృష్ణన్ గారి  కుమార్తె వివాహం జరిగింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 412-శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

412-శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు

కృష్ణా జిల్లా అవనిగడ్డ వాస్తవ్యులు  శ్రీ  జోశ్యుల సూర్యనారాయణ మూర్తి గారు  సంస్కృతా౦ధ్రాలలొ  మహా విద్వాంసులు .గొప్పకవి .కృష్ణా జిల్లా పరిషత్ లో తెలుగు పండితులుగా పని చేసి రిటైర్ అయ్యారు . తేనెల వాకల లాంటి పదాలతో అద్భుత ప్రసంగాలు చేసేవారు .విశ్వనాధ అంటే వీరభక్తి .తాను ఉయ్యూరు దగ్గరున్న తాడంకి హైస్కూల్ లో పని చేస్స్తుండగా విశ్వనాధను ఆహ్వానించి కల్ప వృక్షం పై ప్రసంగి౦పజేసి మహా సత్కారాన్ని చేశారు .నాకూ చాలా సన్నిహితులే. మానాన్నగారు మృత్యుంజయ శాస్త్రి గారి విద్వత్తును గూర్చి తరచూ చెప్పేవారు . తరువాత అవనిగడ్డలో శ్రీ మండలి కృష్ణా రావు గారు ఏర్పాటు చేసిన ‘’గాంధి క్షేత్రం ‘’లో ఉంటూ అక్కడ సాంస్కృతిక సాహిత్య సేవలందించారు. క్రిష్ణారావుగారికి ,వారికుమారుడు బుద్ధ ప్రసాద్ గారికి అత్యంత సన్నిహితులే .బుద్ధప్రసాద్ మూర్తి గారి శిష్యుడై ఉండవచ్చు .రామాయణం లోని అనేక విషయాలపై వారు పుస్తకాలు రాశారు నాకూ అందజేశారు .సంస్కృతం లోనూ అపార పాండిత్యం ఉన్నవారు కనుక గీర్వాణ రచనా చేశారు .

మూర్తిగారి గీర్వాణ రచన

మాతృలహరి అనే  సంస్కృతకావ్యం మూర్తిగారు రాశారు .అందులో ‘’తవ శ్రీ చక్రం మందిరమితి తదన్తర్గత,మహా –సహస్రారం కోశం స్థితి రితి చ యోగీశ్వర వచః

అహం దేవి త్వాంకధ మకృత పుణ్యః పరిచరా –మ్యయోగాధ్యాభ్యాసస్తవ చరణ సేవైక గతికః ‘’అని లలితాపరమేశ్వరిని ప్రస్తుతించారు .

‘’వెంకటేశ్వర స్తుతి శతకం’’కూడా రాశారు –‘’జయత్యనంతః ఖలు వెంకటేశ్వరో –భవాన్ భావాసుప్త జన ప్రబోధకః

సదా పరీక్షా ప్రవిదాన లాససో –జనైశ్చ నిత్యం  స్తవనీయ విగ్రహః ‘’నిత్యం భక్తులనుఏదోపరీక్ష పెట్టి నిగ్గు తేలుస్తూ ఉంటావుకదా వెంకటేశ్వరా! అని భావం . ‘’గురుక్రుపాలహరి ‘’,భారత ధీరతా దిలీపః ‘’కావ్యాలు రాశారు . ‘’నవీన సద్భాత రక్షణాయ –నార్యస్చ వీరాఃపురుషాస్తధైవ-నిశ్చిత్య చిత్తే దృఢ బుద్ధి మంతః –సమాప్నుయు సత్యాగ గుణం విశిష్టం ‘’మూర్తిగారు ‘’దుర్గా నాగేశ్వరాస్టకం ‘’’’వాతాత్మజాస్టకం’’,ఆంజనేయ కరావ లంబ స్తోత్రం ‘’కూడా రాశారు .

413-ఇతర కృష్ణా జిల్లా కవులు

డా.కంభం పాటి రామ గోపాల కృష్ణ మూర్తి ‘’సౌందర నందం ‘’,అన్నమాచార్య చరిత్ర ‘’నాటికలను సంస్కృతం లో రాశారు .శ్రీ ఉపద్రష్ట వెంకట క్రిష్నయ్య ‘’చాణక్య ‘’,’’శివాజీ ‘’ప్రహ్లాద ‘’అనే ఏకపాత్రాభినయాలను ,’’సనత్కుమార ఆశ్రమం ‘’’’మహిళానాం మిత్ర బాంధవ్య కల్పకం ‘’’’భోజనం దేహిరాజేంద్ర’’’’తరతి శ్లోక మాత్మ విత్ ‘’సంభాషణలు,శ్రీ దుర్గా స్తోత్రం ,వందేమాతరం  రాశారు . ‘’భాక్తానుగ్రహ పారీణాంసర్వ దుఃఖ నివారిణీం-మోక్షదాం కామదాం దివ్యాందుర్గం దేవీం నమామ్యహం ‘’అని దుర్గా స్తోత్రం చేశారు

శ్రీ రాణి సదాశివ మూర్తి ‘’అగ్ని పుత్రావయాం భారతాః’’’’జీవ బ్రహ్మైవ నా పరః ‘’’’శివ పాణినీయం ‘’నాటకాలను ,’’సరద్విరాగం ,’’ఋతు సందేశం ‘’నృత్య రూపకాలను రచించి పైన చెప్పిన అగ్ని పుత్ర కు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందారు .శారదా స్తవ మంజరి ,గాయత్రీ స్రగ్ధరా సుప్రభాతం ,జగన్నాధ సుప్రభాత స్తవ మంజరి ,వాస్తు పురుష అష్టోత్తర నామ స్తోత్రం కూడా చేశారు .గాయత్రి సుప్రభాతం లో ‘’ప్రత్యూష జాత పవనాః ప్రసర౦తిమందం-పద్మాకరే కమల షండ సుగంధ వాహాః –మాకంద లోల మధుపాస్తవ కీర్తిగానాః-గాయత్రి దేవి ,మహితే కురు సుప్రభాతం ‘’అని కమనీయంగా చెప్పారు .

శ్రీ ఎస్.టి జి వరదాచార్యులు ‘’సుషుప్తి వృత్తం ‘’,కావ్యం ,’’భాషా శాస్త్ర సంగ్రహం ‘’రాస్తే శ్రీపోలా రామ సుబ్రహ్మణ్యం ‘’శ్రీ భద్రాచల సీతారామ వివాహ మహోత్సవః ‘’లో’’ మంద్రం మంద్రంమదన గమకై ర్మంజుమంజీరనా –మాతా సీతా  ధవళ ధవలైర్మంద హాసైర్మనొజ్నైః-మందం,మందంచరణ చలనైః రామ ,నాద వరంత్వాం-ఆగచ్చంతీ శుభ మభి ముఖం శోభతే సుప్రసన్నా ‘’అని మంద్ర మంద అందాలతో సీతారామ వర్ణన చేశారు .

‘’శ్రీ పమిడిపాటి పట్టాభిరామారావు ‘’శ్రీ బాలకృష్ణ చరిత్రం లో ‘’ఏకా కాచన చుమ్బితేవపిబతి స్వీయాధరం లీలయా -‘ఏకా కాచన పీడితేవ కుచయొః స్తౌతి చ –ఏకాకాచన సంగతేవ సురతే సౌఖ్యేన సంజల్పతే –ఏవం రస విలాస సౌఖ్య మతులం  గోపీ జనైర్భావ్యతే ‘’అని రాసక్రీడను తనివార వర్ణించారు . ’,’’శకుంతలా ‘’కూడా రాశారు. శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి ‘’గాయత్రి జయరామం ‘’లో’’రామే రామే సకల జనతా తన్నిరీదిపస్తం –  ‘’రాజం కర్తుం సమఖిల షతః కింతు దైవేన రుస్టం-కైకేయ్యై ప్రాగ్వర యుగ మదాత్ భూపతి స్తత్ప్రభావాత్ –రామోరణ్యం ప్రతి చలితవాన్ సీతాయా లక్ష్మణేన-చాన్డ్రీ –‘’ రాయగా ,శ్రీ దంటు సుబ్బావధాని ‘’ధర్మ పధం ‘’శ్రీ కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు ‘’గురుక్రుపాలహరి ‘’రాశారు .అందులో ఒక మచ్చు ‘’-వాణీ యన్ముఖత స్స్వయం క్వణయతే వీణాం పునర్యత్పదే –లక్ష్మీర్యత్ర శివోదయ స్సుకలితా  సృస్టిశ్చ యత్రాత్యుతం –రక్షా కార్యమతో జగద్విలయనం యత్రాద్భుతం శామ్భవం –  వందే తత్కిమపి త్రిశక్తిక మహా త్రై పూరుషంగౌరవం ‘’

ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి ‘’పుష్ప విలాపః ‘’,’’కున్తీకుమారీ ‘’అనే  కరుణశ్రీ ఖండకావ్యాలను గురుప్రపత్తి ,ధ్యానాస్తకం ,ఈశ వింశతి  సంస్కృతం లో రాశారు .ఇవికాక ‘’నిద్రేమే ప్రియ వల్లభే ‘’,’’విధరహో బలవాన్ ‘’రచించారు .శ్రీ పేరి వెంటేశ్వర  శాస్త్రి ‘’నాగేశ గూడార్ధదీపికా ‘’వ్యాకరణ శాస్త్ర గ్రంధాన్ని ఆగిరిపల్లిలో రాశారు .శ్రీ పసుమర్తి రంగనాధం ‘’ఆత్మ తత్వ ప్రకాశికా ‘’వేదాంత గ్రంధం రాశారు .

శ్రీ కూచిభట్ల చంద్ర శేఖర శర్మ ‘’గాయత్రీ శంకరాచార్య ‘’,నవగ్రహ సుప్రభాతం ‘’రాయగా శ్రీ పోలా  సుబ్రహ్మణ్యం’’వీరేశ్వర సుప్రభాత స్తవః ‘’ శ్రీ మల్ల్లాది సుబ్రహ్మణ్య శర్మ ‘’మహేశ మాలా స్తోత్ర కదంబం ‘లో –‘’జిహ్వే కీర్తయ శంకరం పురహరం  చేతో భజ శ్రీధరం –పాణిద్వంద్వ సమర్చయేశ్వర కదాఃశ్రోత్త్ర ద్వయ త్వం శృణు –శంభుం లోకయ లోచనద్వయ  విభోర్గచ్చా౦ ఘ్రి యుగ్మాలయం –జిఘ్ర ఘ్రాణ మహేశ బిల్వ సురభిం మూర్ధన్నమోమాపతిం ‘’అని అత్యంత భక్తిని ప్రదర్శించారు  ’శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి శ్రీ మాత్రుస్తవః ‘’,రాశారు .

శతావధాని శ్రీ వేలూరి శివ రామ శాస్త్రి కొవ్వూరులో శతావధానం చేశారు .అందులో ‘’కర్నాత్మజా ముదవహ ద్విబుదో ఫై పార్ధుః ‘’అనే సమస్యకు సంస్కృత శ్లోకం –‘’ధర్మాత్మజం ద్రుపదజాం పరిదృశ్య వేగా –చ్చాన్ద్రాయణా చరణ బద్ధ విదిర్విదేశాన్ –పశ్యన్ తదీయ పృధు సుందర మీక్ష్య చక్షుః –కర్నాత్మజా ముదవహ ద్విబుదోపి పార్ధుః అని చెప్పారు .

శ్రీ రొంపి చర్ల శ్రీనివాసాచార్యులు గుడివాడ తాలూకా నందివాడలో సంస్కృత అవధానాలు చేశారు .ప్రముఖ వాగ్గేయ కారులు శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ సంస్కృత కీర్తనలు రాశారు .అందులో గురుదేవులు పారుపల్లి రామక్రిష్ణయ్యగారిని ఒక కీర్తనలో ‘’మహనీయ మధుర మూర్తే –కమనీయ గానమూర్తే –సహన సౌశీల్యాది  సద్గుణొ పేతసత్కర్తే –మహతీ మంత్ర సుగాత్ర మాం పాహి గురుమూర్తే ‘’—అహరహ మానందమయ గాన బోధనాను రక్తే –ఆశ్రిత మురళీ కృత మృదు సంగీత సుదాసక్తే –మామ్పాహి చారు మూర్తే –‘’కీర్తించారు .

బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిగారు ,బ్రాహ్మశ్రీ  ముదిగొండ వెంకట రామ శాస్త్రి గారు విజయవాడలో గొప్ప సంస్కృత పండితకవులు తర్క వ్యాకరణాలలో అద్వితీయులు .వీరు సంస్కృత గ్రంధ రచన చేసినట్లు విన్నాను కాని నాకు లభించలేదు .

ఇంతవరకు స్వాతంత్ర్యానంతరం అరవై ఏళ్ళలో కృష్ణా జిల్లా పండించిన  గీర్వాణపంట ను వీక్షించం దీనికి ముఖ్యాధారం ముందే మనవి చేసినట్లు ‘’సంహూతి ‘’.అందులో శ్రీ పాలపర్తి వారి వ్యాసం .

414-శ్రీ సువర్చలా౦జనేయం కర్త శ్రీగుర జాడ పూర్ణ చంద్ర శర్మ గారు (1910)

మేము ఉయ్యూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠ శాలలో తొమ్మిది పది  తరగతిచదువుతుండగా మాకు తెలుగు బోధించిన శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మగారు ఉయ్యూరు దగ్గర గురజాడ వాస్తవ్యులు .శ్రీ గురజాడ సాల్వపతి శర్మ ,శ్రీమతి సూర్యకాంతమ్మ దంపతుల కు 23-10-1910న జన్మించారు .కౌండిన్య గోత్రీకులు .శ్రీ శర్మగారు ప్రముఖ కవి శ్రీ గురజాడ రాఘవ శర్మగారి పెదనాన్న కుమారులు .శ్రీ సువర్చలాన్జనేయం ‘’అనే సంస్కృత కావ్యాన్ని మనోహరంగా రాశారు దీనిని శ్రీ ఆంజనేయ స్వామి కలలో కన్పించి రాయమని ఆదేశిస్తే వారి అనుగ్రహ ఫలితంగా నే రాశానని చెప్పుకున్నారు ..దీనిని గురజాడలో శ్రీ కోదండ రామాలయం లోశ్రీరాముని ఎదురుగా  ప్రతిష్టితులైన  శ్రీ  ఆంజనేయస్వామికి మేష్టారు 11-2-1976అంకితమిచ్చారు .ఇదికాక ‘గురు గౌరవం ‘’అనే సంస్కృత నాటకం  ‘’ప్రహ్లాద చరిత్ర ,హరిణీ నారదం ,జడ భరతచరితం ,గజేంద్ర మోక్షం గ్రంధాలు రచించారు  తెలుగులో ‘’అచ్చ తెలుగు పార్వతీ పరిణయం ‘’,గేయ రామాయణం ,పుష్పకం,సీతాకల్యాణం ,పార్వతీ కళ్యాణం ,శివ భాగవతం ‘’రాశారు దాదాపు అన్నీ అముద్రితాలే . నాకు ఒక్క శ్రీ సువర్చలాన్జనేయం మాత్రమె లభించింది .దీన్ని ఆధారంగానే వివరాలు రాశాను . నేను రాసిన ‘’దర్శనీయ ఆంజ నేయ దేవాలయాలు ‘’గ్రంధం లో ‘’శ్రీ సువర్చలాంజ నేయం ‘’ను యధాతధం గాసంస్కృత శ్లోకాలతో బాటు నేను  సంక్షిప్తంగా వాటికి రాసిన తాత్పర్యాన్ని చేర్చి సరసభారతి తరఫున ప్రచురింఛి 13-5-2015 నశ్రీ హనుమజ్జయంతి నాడు ఉయ్యూరులో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయం లో స్వామి సమక్షం లో శాసనమండలి సభ్యులు శ్రీ వై వి .బి రాజేంద్రప్రసాద్ చేత ఆవిష్కరింప జేశాం  .ఈ గ్రంధాన్నిఅమెరికాలో ఉంటున్న మా చిన్న మేనల్లుడు ఛి వేలూరి  మృత్యంజయ శాస్త్రి (జయ వేలూరి) శ్రీమతి విజయ లక్ష్మి దంపతుల సౌజన్యం తో ప్రచురించి మా చిన్నక్కయ్యా బావా శ్రీమతి వేలూరి దుర్గ శ్రీ వేలూరి వివేకానంద దంపతులకు వారి ‘’వివాహ వజ్రోత్సవ కానుక ‘’గా అంకితం చేశాం .

శ్రీ సువర్చలాంజ నేయ కావ్య సౌరభం

ఈ కావ్యం లో నారద తు౦బురులు తామలో ఎవరు గొప్ప సంగీతవిద్వా౦సు లో తెలియ జేయమని శ్రీ హనుమ దగ్గరకు వస్తే ఆయన శ్రీరామ నామ కీర్తనలతో మైమరపిస్తే అక్కడి రాతి అరుగు కరిగి నీరై  దానికి ఆనించిన వీణలు అందులో కూరుకు పోయాయి .హనుమ భక్తీ సంగీతానికి ఆశ్చర్య పడి తమ తప్పు తెలుసుకొని భక్తీ సంగీతం లో హనుమ ను మించిన వారు లేరని గ్రహించి హనుమను ప్రశంసించి ఆయన హృదయం లో చూపిన సీతా రామ దర్శనం తో పులకించి వెళ్ళటం కద.

మొదటి శ్లోకం –‘’శ్రీ మద్విద్యా దానోద్దండం –అపశబ్ద దోష రిపు ప్రచండం –హస్తే స్వాత్మీయ దంత దండం –వందే ప్రణవ స్వరూప తుండం ‘’అని వినాయక స్తుతి చేశారు నారద తుం బురులు ‘’భగవతి హనుమతి ధృత్వా మోదం  -కుర్వతి మధురం రామ నినాదం –సద రతిబాష్ప వారి యశోదం-సుముత్తితౌ వక్తుం వాదం ‘’బాష్పవారి పరిపూర్ణ లోచనుడైన హనుమ వారిని ఆశ్చర్యంగా చూసి కూర్చోబెట్టాడు .’’దృష్ట్వా దృష్ట్వా శ్రీహనుమంతం –సంతుస్టువతుర్బహు గాయంతం –పాదోక్షేపణగతి నృత్యంతం –తౌ మే నాతేమహిమా వంతం ‘’పార వశ్యం తో చిందులు తొక్కుతూ రామగానం చేస్తున్న హనుమను చూసి అతనిమహిమ తెలుసుకున్నారు .ఇలా మధుర శబ్దవిన్యాసం తో శర్మగారు రాస్తారు .వాళ్ళ వీణలను శ్రీ రాముని స్మరించి కరిగిన శిలాద్రవం నుండి తీసిచ్చాడు .భక్తియే శరీరంగా అవతరించిన మూర్తి హనుమ .

తాము వచ్చిన పని చెప్పి అంతకు ముందు వారిద్దరి విద్యా స్పర్ధను వివరించారు .సరస్వతి లక్ష్మి కూడా తేల్చలేక పోయారన్నారు .హనుమయే సరైన న్యాయ నిర్ణేత అని పంపారు .వారిద్దరిని గానం చేయమన్నాడుహనుమ .చేశారు కాని వారికే నచ్చలేదు చివరికి హనుమ భక్తికి దాసోహం అన్నారు .భక్తీ మహిమకు అపజయం లేదని అర్ధం చేసుకున్నారు గర్వం ఖర్వమైంది .

‘’యహ్ పాషాణౌద్రావ యతీతి –యస్సర్వాన్ విస్మయ యతీతి –యో భక్తాన్ సంతార యతీతి –సమహాన్ నిశ్చిత ఏవ జయీతి ‘’-భక్తీ మహిమతో రాళ్ళు కూడా కరిగిపోతాయి .ప్రాణికోటి ఆశ్చర్యం లో మునిగి పోతుంది .తరించటానికి భక్తియే సాధనం .అలాంటి వాడే జీవిత విజేత .అని అర్ధం .హనుమను తమకు రామదర్శనం చేయించమని వారిద్దరూ కోరగా గుండె చీల్చి చూపించాడు .

‘’తాభ్యాం గర్వ సుస్టూ త్యక్త –తత్రాధిక ప్రసంగో ముక్తః శ్రీ రామ ఇత్యరనత ముక్తః –హనుమాన్ తృస్టోవక్తు మశక్యతః ‘’-ఇద్దరూ గర్వాన్ని వదులుకొని  శ్రీరామ సంకీర్తన చేసి హనుమకు ఆనందం కల్గించారు

‘’హృదయే దైవం కః స్థాపయతి –హృదయం చిత్వా కో దర్శ యతి –గానేన శిలాః కో ద్రావయతి –సమహాన్ హనుమానేకో జయతి ‘’-అంటే-హృదయం లో ప్రతిష్టి తుడైన దైవాన్ని ,తెర తీసినట్లు తీసి హృదయం చీల్చి దర్శన మిప్పించి ,తన అఖండ గాన మహిమతో కఠిన శిలను గానమహిమతో కరిగించిన హనుమ ఒక్కడే జయ శాలి ‘’.అప్పుడు దేవతలు పుష్ప వర్షం కురిపించారు .

‘’సర్వస్మిన్ స్తు వతిసతి –యదా స్వరూపం ధృత్వా శ్రీ భగవాన్ –హనుమాన్ సువర్చ లాధ్యః – సత్కల్యాణం తదాప్త వాన్ ‘’విధి విధానం లో హనుమ సువర్చలా కల్యాణం జరిపించి మంగళాభరణాలను సమర్పించి సంతోషించారు .

‘’రామాలయ నటంతం –సంభాషంతం క్వాపి చ నా వశ్యం –తాద్రుశ్యమాత్రా వశ్యం –శ్రీకపి మితి నారదో మేనే ‘’-కదలాడే ,మధురంగా భాషించే ‘’శ్రీ రామాలయాన్ని ‘’ఎక్కడైనా ఎవరైనా చూశారా?అలాంటి సాక్షాత్తు’’ శ్రీ రామాలయం’’గా భాసించిన శ్రీ హనుమత్ ప్రభువును సందర్శించే  భాగ్యం కలిగిందని నారద తుంబు రులు సంతోషం ఆనందం పొందారు .ఈ విధంగా శ్రీ  సువర్చలాన్జనేయ స్వాముల కల్యాణాన్ని జరిపించి,సుఖ సంసారం చేయించి  వారికి పుస్టుడు,తుస్టుడుఅనే ఇద్దరు కొడుకులు జన్మించారని ముగించారు .

దీనితో కృష్ణా జిల్లా కవుల సంస్కృత రచనలు సమాప్తం .తరువాత నెల్లూరు  జిల్లా రచయితల గురించి తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేతాజీ ఫైల్స్ గుట్టు విప్పాలి వరంగల్ డిక్లరేషన్

Inline image 1


Inline image 2

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తేజో మయం శ్రీ వారి విగ్రహం ,జాతీయ పతాకాన్ని రక్షిద్దాం

Inline image 1

Inline image 1
 
 
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వణకవుల కవితా గీర్వాణం -3 411-శతావధాని శేఖర శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

గీర్వణకవుల కవితా గీర్వాణం -3

411-శతావధాని  శేఖర శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

3-10-1957న గుంటూరు జిల్లా పొన్నూరులో పూర్నాంబ ,వెంకట సుబ్బా రావు దంపతులకు జన్మించిన  ‘’అవధాని శేఖర ‘’శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,కృష్ణాజిల్లా అవనిగడ్డలో ప్రాధమిక మాధ్యమిక విద్య నేర్చారు .వీరి సహాధ్యాయి ప్రస్తుత ఆంద్ర రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ .పొన్నూరు శ్రీ భావనారాయణ  స్వామి సంస్కృత కళాశాలలో  చదివారు.శ్రీమతి భానుమతి ని అర్ధాంగిని చేసుకున్నారు . తెలుగులోనూ ,సంస్కృతం లోను ఏం .ఏ .పాసై ఈ రెంటిలోనూ పి.హెచ్ .డి. సాధించారు సంస్కృతం లో విశ్వనాధ రాసిన రూపకాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు .విజయవాడ సయ్యద్ అప్పలస్వామి సంస్కృత కళాశాలలో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేస్తున్నారు .విజయవాడలో వీరు పాల్గొనని సాహిత్య సభ లేదు .రేడియోలో ప్రసంగించని విషయం లేదు .

Inline image 1

తెలుగు రచనలు

మనస్సాక్షి మహా భారతం ,పద్మ వంశి ,తల్లా పిచ్చయ్య ప్రకాశం ,ధర్మ భిక్ష పద్య కావ్యం జైన ధర్మ శతకం ,వెంకయ్యస్వామి జీవిత చరిత్ర ,శంకరాచార్య స్వామి కృతికి అనువాదంగా ‘’కాశీ సారం ‘’ రాశారు .

సంస్కృత రచనలు

సంస్కృతం లో’’ శ్రీ షిర్డీ సాయి సహస్ర నామ స్తోత్రం ,శాంతి సూక్తం ,కాశీ లోని శ్రీ విశ్వేశ్వర స్వామిపై సుప్రభాతం’’ రాశారు .దీనిని స్వామికి సమర్పిస్తే అక్కడి పూజారులు ,ఆలయ నిర్వాహకులు ఆశ్చర్యపడి లక్ష కాపీలు ప్రచురించి అందరికి ఉచితంగా అందజేశారు .’’పంచారామ పంచ భూత లింగ సుప్రభాతం’’ రాసి భక్తీ రచనలో మేటి అనిపించారు .ప్రసిద్ధ సంస్క్రుతకవులపై వీరు ‘’ఉత్తరా శ్లోకాలు’’రాశారు .

‘’కకపాలీ ,ధునీ పాత్రీ ,ధూమ నాళీ,విభూతి మాన్ –శ్రీ మాన్ షిర్డీ వాసశ్చ సాయి దేవో భి రక్షతు ‘’అని’’ శ్రీ షిర్డీ సాయి సహస్ర నామ స్తోత్రం  ‘’లో అన్నారు .

అవధాన ప్రక్రియ

2013 డల్లాస్ లో జరిగిన 19వతానా సభల్లో’’అవధాన ప్రక్రియ ‘’పై వివరించారు . శ్రీ గరికపాటి నరసింహా రావు గారితో కలిసి అవధానం చేశారు .న్యూయార్క్ లో తెలుగు లిటరేచర్ అండ్ కల్చర్ అసోసియేషన్ వారి ఆహ్వానంపై ‘అష్టావధానం ‘’చేశారు  లండన్ నగరం లో ‘’అచ్చతెలుగు అవధానం ‘’నిర్వహించారు . 25-12-1995లో విజయవాడలో ‘’ఏకదిన సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానం ‘’చేశారు .తాడికొండ గోగినేని కనకయ్య సంస్కృత కళాశాలలో సంస్క్రుతావధానం చేశారు .చిత్రాక్షరి ని ‘’సంస్కృతాంధ్ర కళానందైఃపండి తైః పరి శోభితం –కానకీం తాం కళాశాలాం వందే విజ్ఞాన రూపిణిం’’అని పూరించారు .

మొత్తం మీద 500 అష్టావధానాలు, మూడు శతావధానాలు చేసిన అవధాన సరస్వతి శ్రీ శ్యామలానంద .

.భక్తీ టి వి లో ధర్మసందేహాలు తీర్చారు .అనేక భువన విజయాలలో నటించి మెప్పుపొందారు .రేడియో స్టేషన్ డైరెక్టర్  శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి ఆధ్వర్యం లో జరిగిన ‘’ఆధునిక గిరీశం –వెంకటేశం ‘’రూపకం లో ఆదిత్య ప్రసాద్ ఆనంద గజపతి వేషం వేస్తే సర్వశ్రీ ధారా రామనాధ శాస్త్రి ,పింగళి  కృష్ణా రావు ,పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,జంధ్యాల మహాతీశంకర్,పువ్వాడ తిక్కన సోమయాజి మొదలైన వారు గురజాడ అప్పారావు ఆదిభట్ల నారాయణ దాసు మొదలైన వారి వేషాలు ధరించి రక్తి కట్టించారు .భారత దేశ స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భం గా విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజిలో  2008ఆగస్ట్ 11,12తేదీలలో యు జి సి వారు నిర్వహించిన జాతీయ సంస్కృత సెమినార్ లో కృష్ణా జిల్లా సంస్కృత రచయితల గురించి పత్ర సమర్పణ చేశారు .కృష్ణాజిల్లా రచయితల సంఘ కార్యక్రమాలలన్నిటికి  పండితునిగా వ్యవహర్తగా ,విశ్లేషకునిగా కార్య కర్తగా పని చేసి విజయాలకు తోడ్పడుతారు .

బిరుదులూ సత్కారాలు

‘’  అవధాన కళా సరస్వతి ,’’అవధాన శారద ,’’శతావధాని శేఖర ‘’,బిరుదులను పాలపర్తి వారు వారి అవధాన ప్రక్రియా ప్రదర్శనకు అందుకున్నారు .చతుర్గుణిత అవధానం చేసి మెప్పుపొంది ‘’అవధాన చతురానన ‘’,అనే బిరుదుతో సార్ధక నామదేయులయ్యారు .

శ్యామలానంద ప్రసాద్ ప్రతిభకు తగిన పురస్కారాలెన్నో అందుకున్నారు .మొదటగా తెలుగు విశ్వ విద్యాలయ పురస్కారం పొందారు .అధికార భాషా సంఘం పురస్కారాన్ని అందుకున్నారు. నూతన ఆంద్ర  రాష్ట్ర ప్రభుత్వ౦  ఉగాది పురస్కారాన్నిఇచ్చి సత్కరించింది .

ఎన్ని బిరుదులూ ఉన్నా పురస్కారాలు పొందినా ,గీర్వాణ,ఆంధ్రాలలో ఏంతో  విద్వత్తు ,ప్రతిభా ,కవితా సామర్ధ్యం ఉన్నా అతి నిరాడంబరంగా అత్యంత వినయం తో ,భేషజం లేకుండా అందరికి తలలో నాలుకగా ప్రవర్తించే వ్యక్తిత్వం శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాదావ దాని గారిది .

సశేషం

మరో ప్రముఖుంతో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గురజాడ 153 వ వర్ధంతి -సామల వ్యాసం



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బీహార్ లో లోహియా అమ్బెడ్కర్ అడ్రస్లు ఎక్కడ?టంకశాల ప్రశ్న

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాజల్ తో ఆర్కే ,నంది నాటకాలు ,రెండుకవితలు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీవారి గరుడ సేవ , జేసుదాసు పై ప్రభవించిన జీవిన రాగం


 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

Sahithi Mandali 307 150920 Audio

DSCN8154 DSCN8155 DSCN8156 DSCN8157 DSCN8158 DSCN8141 DSCN8142 DSCN8143 DSCN8144 DSCN8145 DSCN8148 DSCN8150 DSCN8151 DSCN8153Inline image 1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రుద్రమ పుట్టిన తేది శాసనం ,సన్నాసి జపం కార్టూన్స్ ,అక్కినేనిపై చక్రధర్ సొర చిత్రాలు

akkineni by chakradhar 001 yedo yedo annadi 001 sora chitra 001 sannasi cartoons 001 rudrama d.b.shasanam 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 411-గాన కళా పూర్ణ -శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచార్యులు

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3

411-గాన కళా పూర్ణ -శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచార్యులు

15-9-1923 కృష్ణాజిల్లా జగ్గయ్య పేటలో వైష్ణవ కుటుంబం లో శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణ మాచార్యులు జన్మించారు .బాల్యం లోనే సంస్కృతాంధ్రాలలో ప్రావీణ్యం సంపాదించి సంగీతం లో ప్రవేశించారు .పారు పల్లి రామ క్రిష్నయ్య పంతులుగారి వద్ద గురుకులాభ్యాసం లో సంగీతం అభ్యసించి ప్రసిద్ధి చెందారు .పంతులుగారి వద్ద విద్య నేర్చి ప్రసిద్ధులైన వారిలో శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ ,శ్రీ అన్నవరపు రామస్వామి వంటి ఉద్ద్దండులున్నారు 1948లో విజయవాడ ఆకాశ వాణి ప్రారంభమయినప్పుడే వయోలిన్ విద్వాంసునిగా చేరారు .35ఏళ్ళు ఉద్యోగించి 1983లో పదవీ విరమణ చేశారు .వయోలిన్ లో టాప్ ఆర్టిస్ట్ గా గొప్ప పేరు .స్వీయ రచనలలో ,హరికదాగానం లో ప్రసిద్ధులు .ఆంధ్రప్రదేశ్ అకాడెమి వీరి విద్వత్తుకు ‘’గానకళా ప్రపూర్ణ ‘’బిరుదు నిచ్చి సత్కరించింది .’’సంగీత సాహిత్య కళానిధి ,కళాసాగర,‘’హరికధా చూడామణి ‘’ఇతర బిరుదులు. ..వీరి సప్తతిమహోత్సవాన్ని శిష్యులు 1995అక్టోబర్ లో బెజవాడలో ఘనం గా నిర్వహించారు .విజయ వాడ రేడియో స్వర్ణోత్సవాలలో 1998లో వీరికి ప్రత్యెక గుర్తింపు నిచ్చి సన్మానించారు .

 

త్యాగ రాజ స్వామి శిష్యపరంపరలో అయిదవ తరం వారు

వీరు త్యాగరాజస్వామి వారి శిష్యులలో అయిదవ  తరం వారు కావటం విశేషం .ఆ వరుస ఇది –త్యాగయ్య ,మనుబూచవాదివెంకటసుబ్బయ్యర్ ,సుసర్ల దక్షిణా మూర్తి ,పారుపల్లి రామ కృష్ణయ్య య్య, నల్లాన్ చక్ర వర్తుల కృష్ణ మా చార్యులు .

రచనలు

.’’బిడాల మోక్షం ‘’అనే ప్రహసనం రాసి నవ్వులు పూయించారు .’’త్యాగ రాయ చరితం, పరకాల విలాసం  శ్రీ నృసింహ తాడనం తెలుగులో రాశారు .సంస్కృతం లో’’నౌకా చరితం శఠగోప చరితం ,భూ ప్రశంస,చంద్ర కళా షోడశి ,’’ రచించారు . ‘ నౌకా చరితం త్యాగయ్య తెలుగు కృతికి సంస్స్క్రుతానువాదం    .

ఆచార్యుల వారి సంస్కృత కృతులు

కర్నాటక సంగీతం లో కొత్త కీర్తనలు రాయాల్సిన అవసరం లేదని సంగీత త్రిమూర్తులు రాసిన అమూల్య రత్నాల వంటి కీర్తనలలో కొన్ని నేర్చుకొని పాడటానికే జీవితం సరిపోదని ద్రుఢంగా నమ్మారు .కాని అభిమానుల కోరికపై ఇరవై స్వంత కృతులు వర్ణాలు తిల్లా నాలు  రాశారు .ఇందులో కొన్ని అపూర్వరాగాలలో చేశారు .సంస్కృతాంధ్రాలలో అపార ప్రజ్ఞావంతులు కనుక దేనికీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండేదికాదు .సంస్కృతం లో శుద్ధ అభంగ రాగం లో ‘’వర్ణం ‘’అనే వర్ణాన్ని ,వసంత రాగం లో ‘’గౌరీ సుకుమారి శంకర నారి కృతిని ,’’మారాజననిం ఆశ్రాయే ‘’కృతిని నాట రాగం లో ,కల్యాణి రాగం లో ‘’శ్రీ కనక దుర్గే కృతిని ,’’ గజవదన మాశ్రయే ‘’కృతిని కేదార రాగం లోను మొదలైనవి రచించారు .

వీరి కుమారుడు స్వర్గీయ జగన్నాధా చార్యులు పేరుమోసిన సంగీత విద్వాంసుడు .క్రిష్ణమాచార్యులుగారు 2006లో ఎనభై మూడవ ఏట పరమ పదించారు .

కృష్ణమాచార్యుల సంస్కృత రచనా సౌభాగ్యం

కృష్ణమాచార్యుల వారి సంస్కృత రచనలలో ‘’మృత సంజీవనం ‘’అనే ఏడు అంకాల నాటకం విశిష్టమైనది అన్నారు పాల పర్తివారు .భారతం లోని కచ దేవయాని కధను ,మృత సంజీవినీ విద్యనూ గ్రహించి సలక్షణ నాటకం గా తీర్చి దిద్దారు .సంగీత విద్వా౦సు లుకనుక కచ దేవయానుల మధ్య సంగీత చర్చను ప్రవేశ పెట్టారు .చివరి అంకం లో శుక్రాచార్యులవారు ‘’మృత సంజీవిని ‘’కి ఇచ్చిన వివరణ మహాద్భుతంగా ఉండి,నాటకాన్ని చిరస్థాయి చేసింది .

‘’ధర్మః సత్యం దయా శౌచం నీతిః ప్రీతిః మృతా ఇవ-తేషాం సంజీవనే సర్వే స్పృహ యంతాం మనీషిణః ‘’

మద్య పాన నిషేధానికి శుక్రాచార్యులు చెప్పిన కారణం మరీ బాగుంది –

‘’బుద్దేర్మోహ కరం ,విపత్పరికరం సత్కీర్తి నాశంకరం –మాన ప్రాణ హరం ,దశేంద్రియ గుణ గ్రామ ప్రభా తస్కరం

విధ్వంస కరం ,భ్రమణ యుగవత్ త్రైలోక్య సాక్షాత్కారం –శ్రితా రోద్య నిషిధ్యతే ఖలు సురాపానం మయా సర్వతః ‘’

ఈ నాటకం లో ఆచార్యశ్రీ కల్పించిన సన్నివేశాలు సంభాషణలు రసవంతం గా ఉన్నాయి .వీరి’’ చంద్రకళాశోడశి ‘’లో నుంచి ఒక శ్లోకం మచ్చుకి –‘’చంద్రేస్వతే నభసి సాదు విరాజ మానే –శ్రేయః కిమన్యకర దీప వలంబనేన –దోషా కరోస్తూ –ద్రస్టేతస్య గుణ దోష గణాన్వ్యసక్తు’’

ఆహార్యులవారు సంస్కృతం లో హరికధలు చెబుతూ భారత దేశమంతటా పర్యటించి రికార్డు సృష్టించారు .విజయ వాడ రేడియో కేంద్రం నుండి సంస్కృత హరి కదా చెబుతూ అధికారులను ‘’రామ చంద్ర సమారబ్దా ,వీర భాద్రాభి వర్దితా –రజనీ కాంత విక్రాన్తా ‘’నభో వాణీ ‘’విరాజతే ‘’అని శ్లాఘించారు .

సంస్క్రుతం ,తెలుగులలో లెక్కకు మించి అవధానాలు చేసిన ఘనులు ఆచార్యులవారు .

.

సశేషం

మరో కవితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వారసత్వ నీడలు

వారసత్వ నీడలు

  • 11/09/2015
  •  -మురహరి ఆనందరావు
అలనాడు మహానటులు నిర్మించిన స్వర్ణయుగం -నేడు వారసత్వ నటులతో వెలవెలపోతోంది. వారసత్వం తరంపోతే తరం దూసుకొస్తుంది. వెండితెర, కోట్ల పారితోషికం, వారసత్వ ప్రోత్సాహం వెరసి చిత్రసీమను నాశనం చేస్తున్నాయనిపిస్తుంది. వారు చూపించిందే నటన. పిచ్చిపిచ్చి గంతులే నృత్యాలు. పిడికిలి బిగించడమే పోరాటాలు. అలా వారసులేం చేసినా ప్రేక్షకులు (అభిమానులు) చూసి తీరాల్సిందే. అప్పటితరం కీర్తిని గడిస్తే, నేటితరం కాసులు గడిస్తున్నారు. అప్పటితరం పాత్రల్లో జీవిస్తే, నేటి వారసులు పాత్రలకు పాతరేస్తున్నారు. అప్పట్లో విజయశాతం 90గా వుంటే, ఇప్పుడు పరాజయాల శాతం 90శాతానికి చేరుకుంటుంది. నేటి ప్రపంచ సినీ రంగ నటీనటులకు వారసత్వం అర్హత, జన్మహక్కు. అందువల్లే సినిమా రంగం వారసులతో నిండిపోయింది. తండ్రి- తాతల పేర్లు చెప్పుకుంటూ, వంశాల గురించి సొంత డబ్బాకొట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. నట వారసులుగా రంగప్రవేశం చేస్తున్నారే తప్ప జవసత్వాలు కలిగిన నటన చూపలేకపోతున్నారు. అందం, చందం, ఆకర్షణ, నటన లేకపోయినా వారసత్వపు ముసుగులో ముసిముసి నవ్వులతో వెండితెరపై అరంగేట్రం చేసి, ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తూ, చిత్రస్థాయిని నానాటికీ దిగజారుస్తున్నారు. పెట్టుడు బిరుదులనే ఇంటి పేరుగా మార్చుకుని చెట్టులేని చోట ఆముదం చెట్టే గొప్పదనే సామెతను నిజం చేస్తున్నారు. ఎవరికివారు -నేనే నెంబర్‌వన్ అనుకునే పరిస్థితికి వచ్చారు. మీడియా-బుల్లితెర సైతం రేటింగుల కోసం అలాంటి వాళ్లకు వత్తాసు పలుకుతుంది. చదువు, భవిష్యత్, కుటుంబ బాధ్యతలను మర్చిపోయిన వీరాభిమానులు మాత్రం పరస్పరం బురద చల్లుకునే స్థితిలోనే ఉండిపోతున్నారు. సంభాషణలు చక్కగా పలకకున్నా ఫరవాలేదు. పదిమందికీ పేడి ముఖం నచ్చకున్నా నష్టం లేదు. కళ్లెక్కడో అగాధంలో వున్నా.. పిచ్చిగెడ్డాల ఫ్యాషన్‌ను పూసుకున్నా బాధ లేదు. గాంభీర్యం లేని గొంతు పీల శబ్దాన్ని తలపోస్తున్నా… నవరసాలకు అర్థం తెలియక హావభావాలను ప్రస్ఫుటించలేకున్నా.. అసలు పాత్రలో జీవించలేకపోయినా -వారసత్వం ముసుగులో వ్యవహారాన్ని చక్కబెట్టుకోవచ్చు. అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తారు. పిచ్చిగెంతులతో పాటలు, సహజత్వంలేని పోరాటాలు, పోజులతో నెట్టుకొస్తున్నారే తప్ప -నటనతో కాదన్నది వాస్తవం. కోట్లు, క్లబ్బులు, వసూళ్లు, రికార్డుల గోలతో ముందుకు సాగుతున్నారే తప్ప, పదికాలాలపాటు గుర్తుండే పాత్రలతో ఒక్కటంటే ఒక్క చిత్రాన్నీ నిర్మించలేకపోతున్నారు. పైరవీ అవార్డులతో తామే గొప్ప అనుకుని భ్రమపడటం తప్ప, ఆత్మసాక్షి వేసే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పరిస్థితి. హిందీ చిత్రసీమను పరిశీలిస్తే అలనాటి దిలీప్‌కుమార్, దేవానంద్, మీనాకుమారి, వైజయంతి మాల అభినయంలో నేటి వారసులు పదోశాతం నటన చూపేవారే లేరు. రాజ్‌కుమార్, శత్రుఘ్నసిన్హాలను మించి సంభాషణలు పలికేవారు వారసుల్లో ఒక్కరూ కనిపించరు. అలా 24 సినీరంగ విభాగాల్లో నేటి వారసులు -లిల్లీపుట్లు అనుకోవాల్సిందే. అతిగా ఖర్చు పెట్టించడం, విదేశీ షూటింగులకు పనికట్టుకు వెళ్ళడం, సాంకేతికంగా (గ్రాఫిక్స్) అడ్వాన్సు కావడం, స్ర్తిపాత్రలకు దుస్తులు తగ్గించడం, భారీగా పారితోషికం అందుకోవడం, థియేటర్లను కళ్యాణ మంటపాలుగా మార్చడం, సినిమా టికెట్ల ధరను అమాంతంగా పెంచేయడం, పైరసి అభివృద్ధికి కారణం కావడం ఈ నటవారసుల ప్రవేశమే అనక తప్పదు. కోట్ల వసూళ్లని వ్యాపారపరంగా గొప్పగా ప్రకటించుకుంటున్నారే తప్ప, చిత్రం పది కాలాలపాటు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంటుందా? అని మాత్రం ఆలోచించరు. వంద రోజుల విజయం సాధించిందని కూడా చెప్పలేరు. కోట్లు రాబట్టింది, చరిత్ర తిరగరాసిందంటూ గర్వపడటం తప్ప, ఆరు మాసాల పిదప ఆ చిత్రాన్ని ఎవరైనా తలచుకుంటారా? అన్న దిశగా ఆలోచించరు. ఏదో ఏడాదికి రెండో మూడో కాస్త మంచి (పూర్తిమంచివి కాదు) చిత్రాలు రాగానే వారు వారు పొగుడుకోవడం, మీడియా ఇంకాస్త ముందుకెళ్లి -ఇంటర్వ్యూలు, బిట్లు, అభిప్రాయాలు, లైవ్‌షోలతో మేకప్ చేయడంతో వారసులంతా ‘అబ్బో’ అనుకునే నిదురమత్తులోకి జారుకుంటున్నారే తప్ప, పాత్రను ప్రేక్షకులు గుర్తుంచుకుంటారా? చిత్రం పది కాలాలపాటు జీవంతో వుంటుందా? అని మాత్రం ఆలోచించడం లేదు. హిందీ సినీ రంగం సైతం వారసులతో కిటకిటలాడుతోంది. వారసులే తప్ప బయటి నటీనటులు లేరని గట్టిగానే చెప్పుకోవచ్చు. బయటివాళ్లు వచ్చే ప్రయత్నం చేసినా -వారసులు రానివ్వరు, అడుగుపెట్టనివ్వరు, ప్రోత్సహించరు, బహిష్కరిస్తారన్నది అక్షర సత్యం. అందువల్లే హిందీ రంగంలోనూ నాసి పెరుగుతోందే తప్ప వాసి తగ్గుతోంది. ఖర్చు కోట్లకు చేరుతోంది. నటన నాస్తికి చేరుతోంది. డ్యాన్సులు, ఫైట్లను నమ్ముకుని చిత్రాలను నిర్మిస్తున్నారే తప్ప, మంచి పాత్రలను మలిచే సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టేటనే్న. గుర్తుంచుకునే స్థాయి చిత్రాలు నిర్మించలేకపోతున్నారన్నది అక్షర సత్యం. ఇదే వారసత్వ రోగం (క్యాన్సర్) హాలీవుడ్ రంగంలోనూ లేకపోలేదు. తండ్రీ కుమార్తెలు హెన్రిఫోండా, జోన్ ఫోండా; ఆలుమగలైన నికోల్‌కిడ్‌మెన్, ట్రాంక్రూస్; ఏంజలీనాజోలి, బ్రాడ్‌పిట్; ఎలిజబేత్ టేలర్, రిచ్చర్డ్ బర్టన్; అన్నదమ్ములైన సెల్విస్టర్ స్టాలోన్, థిమోతి స్టాలోన్; తండ్రీ తనయులైన సీన్ కానరి, జూసూస్ కానరి; విల్‌స్మిత్, జెరోమిస్మిత్; కిర్క్ డగ్లాస్, మైకల్ డగ్లాస్; బ్రూస్ లీ, బ్రాండన్ లీ.. అలా వారసత్వం తొంగి చూస్తూనే ఉంది. కాకపోతే, వాళ్ల మందటి తరం స్థాయిని అందుకోవడంలోనూ, లేదా తరువాతి తరం తమకంటూ ప్రత్యేకతను చూపించడంలోనో సక్సెస్ అవుతూ వస్తున్నారు. చెట్టుపేరుతో కాయలు అమ్ముకునే ప్రయత్నాలు, పనికిరాని భుజకీర్తి బిరుదులు తగిలించుకోకుండా -ఐడెంటిటీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ -మన టాలీవుడ్ మాత్రం వారసత్వపు నటులతో చిక్కిపోతుంది. ముందరి తరం నటులు స్వర్ణయుగం ఆవిష్కరించారు. వారసులతరం ప్లాఫ్‌ల యుగాన్ని నడిపిస్తున్నారు. అప్పట్లో వారు కీర్తిని గడిస్తే, నేటితరం కాసులు గడిస్తున్నారు. అప్పటితరం పాత్రల్లో జీవిస్తే, నేటి వారసులు పాత్రలకు పాతర వేస్తున్నారు. అప్పట్లో విజయశాతం 90గా వుంటే, ఇప్పుడు పరాజయాల శాతం ఆ సంఖ్యకు చేరుకుంది. అప్పట్లో తక్కువ పారితోషికంతోనే నవరసాలు చిలికించారు. నేడు నవరసాలను బూడిదలో పోసేస్తున్నారు. అప్పట్లో నటనకు అవార్డులు అందుకునేవారు. నేడు పైరవీల అవార్డులతో భుజాలెగరవేస్తున్నారు. అప్పటి సాహిత్యం పరిమళించేది. నేటి సాహిత్యం కంపు కొడుతోంది. అప్పటి గాత్రాలు మధురంగా మనసును తాకేవి. నేటి గాత్రాలు చెవుల తుప్పు వదిలిస్తున్నాయి. అప్పటి నృత్యాలు ఆహ్లాదపరచేవి. నేడు జుగుప్సకు నిలయమయ్యాయి. అప్పట్లో నిండైన దుస్తులతో భారతీయత కనిపించేది. నేటి విలువలు వదిలేసిన వలువలు భారతీయతను పరిహసిస్తోంది. అలా వివరిస్తూ పోతుంటే అలనాడు మహానటులు నిర్మించిన స్వర్ణయుగం -నేడు వారసత్వ నటులతో వెలవెలపోతోంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. వారసత్వం తరంపోతే తరం దూసుకొస్తుంది. వెండితెర, కోట్ల పారితోషికం, వారసత్వ ప్రోత్సాహం వెరసి చిత్రసీమను నాశనం చేస్తున్న దృశ్యాలే గోచరిస్తున్నాయి. వారు చూపించిందే నటన. పిచ్చిపిచ్చి గంతులే నృత్యాలు. పిడికిలి బిగించడమే పోరాటాలు. అలా వారసులేం చేసినా ప్రేక్షకులు (అభిమానులు) చూసి తీరాల్సిందే. మెచ్చుక తీరాల్సిందే. బిరుదులిస్తూ పోవాల్సిందే. మీడియా ఆకాశానికి ఎత్తాల్సిందే. ఎంత చెప్పినా, ఎలా చెప్పినా నాట వారసత్వంతో -టాలీవుడ్ రంగం నాణ్యత, వాసి పోగొట్టుకుందన్నది నిజం. సినీ రంగం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లాలంటే నేటి వారసులంతా -అక్కినేని, నందమూరి, ఎస్వీర్, సావిత్రి, జగ్యయ్యలు నటించిన చిత్రాలు పదేపదే చూడాలి. నటన, హావభావాలు, సంభాషణలు పలికే తీరు- పాత్రలో జీవించడం లాంటివి నేర్చుకోవాలి. నవరసాల అభినయమెలా అన్నది
కోవాలి. అంతవరకు చెత్త సినిమాలే.. పైరవీ అవార్డులే. అవి చరిత్రలో పేజీ నింపవు. మరిచిపోక తప్పదు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మమత ”నేతాజీయం ‘



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రామాయణ మహా భారతాలకు ఖచ్చితమైన కాలం


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రుద్రమ దేవి ,నేతాజీ 1945 లో చావలేదు


 
 

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాజకీయ బంధనం ,అక్కినేని పుట్టిన రోజు




గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణా పెన్నా అను సంధానం


 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 – ఆంద్ర ప్రదేశ్ కు చెందిన కవులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

410 నుండి రాస్తున్న కవులందరూ ఆంద్ర ప్రదేశ్ కు చెందినవారు ,స్వాతంత్ర్యానంతరం గత అరవై ఏళ్ళకు పైగా సంస్కృతం లో రచనలు చేసిన వారు, చేస్తున్నవారు .వీరందరి గురించి రాసే మహద్భాగ్యం నాకు కలిగినందుకు అది నా అదృష్టంగా భావిస్తున్నాను . వీరందరి విషయాలను సేకరించటానికి యు. జి .సి. ఒక జాతీయ సదస్సును ‘’సంహూతి ‘’పేరిట విజయవాడ మేరీస్ స్టెల్లా  కాలేజి లో 2008ఆగస్ట్ 11,12 తేదీలలో నిర్వహించి, వివిధ జిల్లాలకు చెందిన కవులు, వారి సంస్కృత రచనపై పత్ర సమర్పణ చేయించింది .వీటిని ఒక పుస్తకం గా’సంహూతిః’’(అందరు కలిసి ఇచ్చిన పిలుపు )అనిపేరు పెట్టి  ప్రచురించింది .ఇది గొప్ప ముందడుగే .అయితే సమగ్రం  మాత్రం కాదు .కవుల రచనలగురించి మాత్రమె ఇందులో ఉందికాని వారి జీవిత చిత్రణ లేదు .దీనిని నేను కోరగానే నాకు పంపిన డా శ్రీ పాల పర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .మిగిలిన సోర్సులనుండి మరింత వివరాలు సేకరించి ఈ సీరియల్ ను సమగ్రం  చేసే ప్రయత్నం చేస్తాను .ఒక వేళ లభించక పొతే చేసేది లేక ఈ గ్రంధం లోని విషయాలే ఉటంకిస్తాను అని మనవి చేస్తున్నాను .ఈ సదస్సు నిర్వహణకు ,పుస్తక ప్రచురణకు మెరిస్ స్టెల్లా కాలేజి సంస్కృత శాఖ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ – డాక్టర్ ధూళిపాళ రామ కృష్ణగారు తోడ్పడ్డారు .రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ హరేకృష్ణ శతపతి ,శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సన్నిధానం సుదర్శన శర్మ ,మద్రాస్ యూని వర్సిటిలో వైష్ణవిజం ప్రొఫెసర్ డా.ఏం నరసింహా చారి ,రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కే వి.రామ కృష్ణమాచార్యులు మొదలైన ఉద్దండులు అండగా నిలిచి విజయం చేకూర్చారు .

మొదటగా కృష్ణా జిల్లాకవులు ,వారి సంస్కృత రచనలతో ప్రారంభిస్తాను .సంహూతి లో దీనిపై పత్ర సమర్పణ చేసినవారు .అవధాన సరస్వతి డా శ్రీ పాల పర్తి శ్యామలానంద ప్రసాద్ .శ్యామలానంద విశ్వనాధ సంస్కృత రూపకాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన గీర్వాణ భిషక్కులు .సంస్క్రుతావధానం  చేసిన అవధాని .కాశీ విశ్వేశ్వరునిపై సంస్కృత  సుప్రభాతంరాసిన భక్త శిఖామణి . వీరిలో మొదటికవిగా శ్రీ విశ్వనాధ ను గురించి రాస్తున్నాను .

410-విశ్వం పట్టనికవి,సాహితీ కల్ప వృక్షం  శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు

జీవితం

విశ్వనాధ శోభనాద్రి ,పార్వతి దంపతులకు విశ్వనాధ సత్యనారాయణ 10-9-1895 కృష్ణా జిల్లా నందమూరు గ్రామం లో జన్మించారు .చిన్ననాతనుండే కవిత్వం చెప్పటం అలవాటై చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి శిష్యరికం లో రాటు దేలారు .బెజవాడ ఎస్.ఆర్ ఆర్ . కాలేజిలో తెలుగు లెక్చరర్ గా ఉద్యోగం ప్రారంభించి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా రిటైర్ అయి ,కరీంనగర్ కాలేజిలో ప్రిన్సిపాల్ గా చేరి రెండేళ్ళు పని చేశారు .

కొడాలి ఆ౦జ నేయులుగారితో కలిసి అష్టావధానం చేశారు .తెలుగు సాహిత్యం లో దాదాపు అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేసినవాడు విశ్వనాధ .’’నవ్య సంప్రదాయాఉద్యమం ‘’కు  ఆద్యుడైనిలిచాడు .కవితా చతుర్ముఖుడు .జాతీయాభిమానం ,ధర్మ వీరం ,శాంత కరుణం ,భక్తీ భావం ఇవే చతుర్ముఖాలు .ఆంద్ర ప్రశస్తి తెలుగు ఋతువులు ఆంద్ర పౌరుషం కోకిలమ్మ పెళ్లి  లలోఆంద్ర  జాతీయాభిమానం ,ఝాన్సి రాణి శివార్పణం మున్నగు వానిలో జాతీయాభిమానం ,కుమారాభ్యుదయం ,ప్రద్యుమ్నోదయం ,రురు చరిత్రలలో ధర్మ వీరం ,శాంతం  అంతర్వాహినులై ప్రవహించాయి .కిన్నెర సానిపాటలు ,వరలక్ష్మీ త్రిశతి లలో కరుణ పొంగిప్రవహించింది .మాస్వామి ,విశ్వనాధ మధ్యాక్కరలు ,భ్రమర గీతంగోపికా గీతాలు ,శ్రీ కృష్ణ సంగీతం లలో భక్తీ పారవశ్యం ఉన్నాయి

మొదట్లోభావకవి గా గిరికుమారుని ప్రేమగీతాలు ,శాశిదూతం శృంగార వీధి రాసి ఉన్నత స్థానం పొందారు .వందలాది ఖండకావ్యాలు ,విమర్శనా వ్యాసాలూ రాశారు .అల్లసాని వారి అల్లిక జిగిబిగి , నన్నయ గారి ప్రసన్న కవితా కదా కలితార్ధ యుక్తి  ఒకడు నాచన సోమన ,చాల ప్రసిద్ధి చెందాయి .పురాణ వైర గ్రంధమాలగా అనేక నవలలు రాశారు .  విశ్వనాధ’’ మాగ్నం ఓపస్ కావ్యం’’ శ్రీమద్రామాయణ కల్ప వృక్షం .తన సకలోహ సారంగా రాశారు ఇది విశ్వనాధ జీవుని వేదన తండ్రిగారి కోరిక .రాయటానికి 35ఏళ్ళు పట్టింది .మిగిలినవన్నీ రోజుల్లో డిక్టేట్ చేసి రాయిన్చినవే అందుకే ఆయనను ‘’గ్రేట్ డిక్టేటర్ ‘’అన్నారు సరదాగా ..కల్ప వృక్షానికి  1971లో జ్ఞాన పీఠ పురస్కారం అందుకొన్న తోలి తెలుగు కవి అయ్యారు .వీరి నవలేతిహాసం అంటేక్లాసిక్ నవల ‘’వేయి పడగలు ‘’దీనికి ఆంద్ర విశ్వ విద్యాలయం నగదు బహుమతి పొందారు .’ప్రక్రుతి సమతుల్యతను ప్రతిపాదించిన నవల ఇది .మూడు తరాల ఆంద్ర జాతి  పరిణామాన్ని చూపించింది .భారతీయతపై పాశ్చాత్య ప్రభావం తిరస్కరించబడింది. ’ఏక వీర ‘’నవల మనస్తత్వ పరిశీలనకు నిలు వెత్తు అద్దం..

కవిసామ్రాట్ ,కళాప్రపూర్ణ ,మొదలైన బిరుదులూ అనేక సాహిత్య సంస్తలచేత పురస్కారాలు పొందారు .భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ్ ‘’పురస్కారమందించి గౌరవించింది .ఉజ్జయిని వారి కాళిదాస సమ్మాన్ అందుకొన్నారు .1966-76కాలం లో ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన కవులుగా ఉన్నారు .కేంద్ర ,రాష్ట్ర సాహిత్య అకాడెమి సభ్యులైనారు .గుడివాడలో గజారోహణం అందుకున్న కవిసామ్రాట్ విశ్వనాధ .81ఏళ్ళు సార్ధక జీవితం గడిపి 18-10-1976 న కవిసామ్రాట్ విశ్వనాధ సత్య నారాయణ కవితా విశ్వనాధుడై  విశ్వేశ్వరునిలో ఐక్యమయ్యారు .  .

విశ్వనాధ గీర్వాణ కవితా గీర్వాణం

విశ్వనాధ దాదాపు 146 గ్రంధాలను తెలుగు సంస్కృత భాషలలో రాశారు .అందులో సంస్కృతం లో మూడు నాటకాలు ‘అమృత శర్మిస్టం’’ ‘’గుప్త పాశుపతం ‘’’అశని నిరాసనం ‘’రాశారు .సంస్కృత కావ్యాలు శివ పంచశతి ,దేవ త్రిశతి ,గురుప్రసాదం ,శారదా చంద్ర మౌళి సుప్రభాతం ‘’రచించారు .

అమృత శర్మిస్టం

‘’యయా తేరివ శర్మిస్టా భర్తుర్బహు హమతాభవ ‘’అనేకాళిదాసు సూక్తిని ఆధారం చేసుకొని దానికి వ్యాఖ్యానంగా శర్మిష్ట ను నాయిక ను చేసి తొమ్మిది అంకాల మహానాటకాన్ని సంస్కృతం లో రచించారు . దీన్ని ‘’అమృత శర్మిస్టం’’అన్నారు .శర్మిష్ట శాపకారణం గా భూమిమీదకు వచ్చిన అప్సరస .భరత ముని శిష్యురాలై ఆయన నాట్య శాస్త్ర ఆవిర్భవానికి కారకురాలైంది .ఇందులో విశ్వనాధ ‘’రసయానం ‘’అనే దాన్ని ప్రతిపాదించారు .

‘’క్రతు ద్వంసీ సంధ్యా ప్రణయ భర సంస్పంది చరణ –స్పురన్నాట్యక్రీడా ప్రధమ రస నిష్యందన గురుః

తపస్చాంత ర్వ్రుతత్తిః సరస మ్రుదుభావైః పరిణతాం-సమాన స్కందా రోపణకృతి కృపః పాతు  గిరిశః ‘’అనే నాందీ శ్లోకం తో ప్రారంభమైంది. కర్మ జ్ఞాన ధ్యాన మార్గాలతో బ్రహ్మానంద సబ్రహ్మ చారి అయిన రసాను భూతికూడా సమాన ప్రతి పత్తి కలిగి మోక్షాన్ని అమృతత్వాన్ని ఇస్తుంది అని భావం .కాళిదాసుని శాకుంతల నాటకం లో లాగానే సన్నివేశాలు ,ప్రతిపాదనలు ,శ్లోక రచనా ఉన్నాయని శ్లాఘించారు శ్యామలానంద .’’సప్రభాతరలంజ్యోతి రుదేతివసుదా తలాత్ ‘’అన్న కాళిదాసు శ్లోకం తో సమానంగా విశ్వనాధ ‘’భో అమృత లో భాత్ పశ్యన్తి దివి మానవాస్సర్వే ‘’శ్లోకం రాశారు .కావ్యాన్ని ఏదో కాలక్షేపం కోసం చదవ రాదు .అది ‘’రసయానం ‘’మోక్ష దాయకం అవుతుంది అని చెప్పారు విశ్వనాధ .ఈ నాటకానికి భరతవాక్యం గా విశ్వనాధ ‘’

‘’వాచో మహా కవీనాం జయంతు నితరాం భవంతు ఫలితార్ధాః-వాగర్ధ మనో హృదత్ ,వివర్ధతాం రస మయంచ మహః ‘’చెప్పారు .

గుప్త పాశుపతం

పరమ శివుడిని మెప్పించి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించినా ,లోక క్షేమం కోరి దాన్ని కురు క్షేత్ర యుద్ధం లో ఎప్పుడూ ప్రయోగించలేదు .అది గుప్తం గానే ఉంది .యుద్ధం జరిగేటప్పుడు పశుపతి నాధుడైన శివుడు అదృశ్య రూపం లో యుద్ధాన్ని గమనిస్తూనే  ఉన్నాడు .అంటే శివ కేశవులు అద్వైతం గా సృష్టి స్తితి లయలను పర్య వేక్షిస్తూనే ఉంటారు .లోక నాశన కరమైన ఆటం ,హైడ్రోజెన్ బాంబు లాంటి ఆ అస్త్రాన్ని ప్రయోగించని నరోత్తముడు నరుడైన అర్జునుడు .కనుక అర్జునుని మనవడైన పరీక్షిత్తుకు ప్రాణాన్ని రాజ్యాన్ని ,ఇద్దరూ కలిసి ఇచ్చారు .ఆధునికకాలం లో వార్ వెపన్స్ మానవాళికి యెంత ప్రమాదకరమో ఆలోచించుకోవాలని విశ్వ నాద చెప్పిన హితవు ఇది .పది అంకాల మహా నాటకం గుప్త పాశుపతం .వీర రస నాటకం గా కనిపిస్తూనే శాంత రసాన్ని ధ్వనిగా చెప్పింది .వేణీ సంహార నాటక శైలిలో ఇందులో బాలాకీ ,కౌబేరి ,ఘటకుడు అనే విచిత్ర పాత్రల్ని విశ్వనాధ సృష్టించారు .

నాటక పీఠిక లోనే విశ్వనాధ ‘’ఆత్ర చ బహుదా వీరః శాంతే పర్య వశ్యతి .శబ్ద ప్రయోగ లాలిత్యాది విషయేషు గుప్త పాశుపతం ప్రౌఢ మార్గమనుసరతి .ఏతత్ సర్వం కిమపి మహాధ్వని సర్వస్వం .అన్యదప్య స్తితి కించిత్ సర్వం దైవ నిర్మితం .దైవ చలితం .దైవ ప్రవర్తితం ,మహా ప్రళయ  సంబంది కర్మకాత్ మహేశ్వరః ‘’అని తెలియ జేశారు .నరుడైన అర్జుండు నరజాతికి ప్రతినిది . .బాలాకి చేత ‘’అర్జున ! బ్రహ్మ నిస్టస్త్వం .జగాన్నిర్మాణవేత్తాత్వం ‘’అని పిస్తారు .ఇదే ఈనాటక ఉద్దేశ్యం .మానవాళి సుభిక్షంగా ఉండాలన్నది విశ్వనాధ యోచన .భరత వాక్యం లో శివ కేశవులనిద్ద్దరిని కవి విశ్వనాధ –

‘’శాస్త్రై త్వత్ కృపయా యదోః కులపతే జ్ఞాత్వాపి నజ్ఞాయతే –గంగా జూట జుటీక  మృత్యు ముపరి స్తిత్వా భవిష్యామి కిం

దృష్ట్యా ద్యాపి బిభేమి లోకమిహ త్వత్పాదాబ్జ యోర్భంభరీ-భూతం నిత్య పరి భ్రమం తమను మాం ప్రేమ్ణా కురూమాపతే’’ అని ప్రార్ధించి లోకం లో పీడనం లేకుండా జనం సుఖ శాంతులతో వర్ధిల్ల జేయమని భావం .అంతటి మానవీయ కోణం లో రాసిన నాటకం ఇది .

ఆశని నిరాసనం

ఆశని అంటే పిడుగు .నిరాసనం అంటే మరల్చటం .పిడుగును మరల్చటం అనే ఈ ‘’వ్యాయోగం ‘’అని పిలువ బడే సంస్కృత రూపకం ఏకాంకిక .తెలుగు వారి వైదిక సంస్కృతీ పరి రక్షణ దీక్షకు నిలువుటద్దం గా విశ్వ నాద చేసిన అపూర్వ సృష్టి .ఉరుములు ఉరిమినప్పుడు  ‘’అర్జున ఫాల్గుణ పార్ద’’అనే మంత్రాన్ని,అందులో అర్జునుడికిఉన్న పదిపేర్లు  మనం చదువుతాం .అలా చదివితే పిడుగు మనమీద పడదనే విశ్వాసం. ఇది ఒట్టి విశ్వాసం కాదు .తైత్తిరీయ ఆరణ్యకం లో ఉన్న ‘’విద్యుద్వధ ‘’ఘట్టాన్ని మేళవించి వైదిక వాజ్మయం ద్వారా వేద వ్యాస మహర్షి అందించిన విజ్ఞాన శాస్త్రం అని దాన్ని మానవ జాతి వదులు కోవద్దనీ విశ్వనాధ హిత సందేశం .కొంచెం ఫ్లాష్ బాక్ కు వెడదాం

ఏక చక్ర పురం లో బ్రాహ్మణ వేషం లోఅర్జునుడు  భిక్షాటన చేస్తున్నప్పుడు పిడుగు పాటుపై ఉన్న భయాన్ని వ్యాసుల వారికి చెప్పుకున్నాడు .అక్కడ వ్యాసాశ్రమం లో పిడుగు ఎలా ఏర్పడుతుంది అనేదాన్ని రసాయనిక శాలలో అంటే లాబ రేటరి .లో ప్రత్యక్షం గా చూసి మహర్షిద్వారా తీలుసుకొంటాడు .ఒక సారి తనపై పడ బోతున్న పిడుగును ఉత్తరీయం చెంగున బంధిస్తాడు .అది విడుదల చేయమని ప్రార్ధిస్తుంది .ఇక మీదట తన పేర్లు చదివే వారిపై పడరాదు అని పిడుగు వద్ద హామీ తీసుకొని అర్జునుడు దాన్ని వదిలేస్తాడు .భయంకరమైన పిడుగు పాటు మరణం నుంచి మానవ జాతిని రక్షించటానికి అర్జునుడు చేసిన ప్రయత్నం ,ఆధునిక విజ్ఞాన ప్రయోజనాలకు మార్గ దర్శక మౌతుంది .పాశ్చాత్య విద్యలు ఎన్ని నేర్చినా భారతీయతను మరచి పోవద్దని హెచ్చరిస్తూ సందేశం  ఇచ్చే రూపకం ఇది  .

‘’యూయం పశ్చిమ బుద్ధయస్తదను  మా భూయస్త భో భో నరాః-మావిద్విష్యాచ సేతు సీత నగ యోర్మధ్యే త్రవైయాసకీం

జానీయాత పరాశారాత్మజ మిమాం దాత్రీం సమద్దర్తుమే –వోద్భూతం పరమేశ్వరం రుషి గణైః సంప్రార్ధ మానం హరిం ‘’

’వ్యాసర్షి మానవాళికి చేసిన మహోపకారాన్ని ‘’

‘’బహుయుగ పరిదీప్తా సాదు సంగృహ్య విద్యా –క్రుతవతి పది ఏనాకారీ విస్పష్ట రేఖా

నిఖిల జగదనంత ప్రాప్త పుణ్యైక మూర్తిః-జయతి స శుక తాతః స్ఫీత వేదార్ధ భూతః ‘’శ్లోకం తో కీర్తిస్తారు .

ఇలా మూడు రూపకాలలో విశ్వనాధ సంస్కృత సాహిత్యం లోనూ తనకొక ప్రత్యెక స్థానాన్ని పొందారు .విశ్వనాధ రచించిన  సంస్కృతకావ్యాలు –శివ పంచశతి ,దేవవగైరా  త్రిశతి ,గురు ప్రసాదం ,శారదా చంద్ర మౌళి సుప్రభాతం  స్తుతి కావ్యాలు .భక్తికి జ్ఞానానికి నిలయాలు .జీవ దేవ సంబంధాలు .

మొత్తంమీద 30కావ్యాలు ,20నాటకాలు ,60నవలలు ,10విమర్శన గ్రంధాలు ,35చిన్నకధలు ,౩ నాటికలు ,70సాహిత్య వ్యాసాలూ ,10ఇంగ్లీష్ వ్యాసాలూ ,10సంస్కృత రచనలు ,3 అనువాదాలు .100 ఉపోద్ఘాతాలు లేక పీఠికలు ,మరెన్నో రేడియో భాషణలు చేసిన ‘’సాహితీ కల్ప వృక్షం ‘’విశ్వనాధ .’’తను కావించిన సృష్టి తక్కోరుల కాదు ‘’అన్న తిక్కన్నకు దీటైన వాడు. ఆయన రచనలో ‘’ఏదీ ఎంగిలి కూడు కాదు ‘’అని చెప్పుకొన్న సత్తా ఉన్నవాడు .’అంటే ఒకదానిలో ఉన్న విషయం మరో దానిలో ఉండదు అన్నమాట .

’’అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాద్రు శుం-డలఘు స్వాదు రసావ తార ధిషనణాహంకార  సంభార దో-హల  బ్రాహ్మీ మయ మూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే-శలచా౦ద్రీ మృదు కీర్తి చెల్లపిళ వంశ స్వామికున్నట్లుగన్ ‘’  ‘’అని  తనలాంటి శిష్యుడు ఉన్నాడన్న కీర్తి  గురువు చెళ్ళపిళ్ళ వారికే  దక్కిందని గర్వంగా చెప్పుకోన్నవాడు .దీనినే’’దిషణాహంకారం’’. అన్నారు .’’నా మార్గాముకాదునా తాత ముత్తాతల మార్గమూ ‘’కాదు ఇతనిదిఒక కొత్త మార్గం అని గురు ప్రశంస పొందినవాడు .’’అవిచ్చిన్న సంప్రదాయ వాది’’’’continuation with the past ‘’తో యుగ కర్త అయిన వాడు విశ్వనాధ .’’ఏ బాటలో నడిచినా సమ్రాట్టు .ఆత్మీయం ,ఆత్మాశ్రయం ,ఆత్మ నాయకం ‘’గా వర్దిల్లాడు .ఈ శతాబ్ది చైతన్యమంతా అగస్త్యునిలా ఆపోసన పట్టి భారతీయ దార్శనిక మూలాలతో విలువకట్టిన ప్రజ్ఞా మూర్తి .అయన పలుకే ఒక ప్రమాణం .ఆయన జీవుని వేదనే కల్ప వృక్ష రామాయణం .షేక్స్పియర్ లాగా నాలుగు విషాదాంత నాటకాలు రాసి మెప్పించిన వాడు విషాదాంత నాటక శిల్ప చతురాననుడు విశ్వనాధ .ఆయన విమర్శలు ప్రతీకాత్మక విమర్శకు ప్రామాణిక సూక్తాలు .ఆయన ఒక సమగ్ర వ్యక్తీ .కళా ప్రపూర్ణుడు .

‘’రసం వేయి రెట్లు గొప్పది అని ఢంకా బజాయించి చెప్పినవాడు .ఆయన వ్యక్తికాదు .సంప్రదాయ యుగా ప్రవక్త .’’నన్నయ తిక్కన నన్నావేశించిరి ‘’అని ,ఆగ కుండా వారి మార్గాన్ని మెరుగులు దిద్దుతాను అని  చెప్పుకున్న ధీశాలి ,ప్రయోగ శీలి .శృంగార రస ద్రష్ట ,స్రష్ట కవిసార్వ భౌముడు  శ్రీనాధుడు అయితే కరుణరస ద్రష్ట ,స్రష్ట కవిసామ్రాట్ విశ్వనాధ .’శిల్పం కాని సాహిత్యం కాని విజాతీయామి ఉండ రాదు .జాతీయమై ఉండాలి .వ్రాసిన వానికి ముక్తి చదివిన వానికి రక్తి ముక్తి .యెంత సముద్రం మీద ఎగిరినా పక్షి రాత్రి గూడుకు చేరు కుంటుంది .ఇది జాతీయత .ఇది సంప్రదాయం ‘’అన్న వాడు .’’నేను పొతే నాతొ పోయేవాళ్ళు నన్నయ ,తిక్కన,ఎర్రన ,నాచన సోమన ,శ్రీనాధుడు ,పోతన ,పెద్దన తెనాలి రామ లింగడు మొదలైన వారు ‘’అని ఎలుగెత్తి చాటి చెప్పి సంప్రదాయ పరిరక్షణకు దీక్ష  పూనాడు  .ఆయన చేబట్టని,  చేబట్టిన దాన్ని స్వర్ణ మయం చేయని సాహిత్య ప్రక్రియ లేనేలేదు .’’అని ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం గారు మహోదాత్తంగా విశ్వనాధ ఆత్మను ఆవిష్కరించారు .ఇంగ్లీష్ నవలలెన్నో చదివాడు ఇంగ్లీష్ సినిమాలేన్నిటినో చూసి జీర్ణించుకొన్నాడు .ఎక్కడ ఏ కొత్తదనం వున్నా దాన్ని భారతీయత తో  దాని శైలిలో రంdగరించి తీర్చి దిద్దటం విశ్వనాధ ప్రత్యేకత ..’’నిన్నటి నన్నయ భట్టు నేటి కవి సమ్రాట్టు ‘’విశ్వనాధ అని ఆయన తెలుగు వారి ‘’గోల్డు నిబ్బు –మాట్లాడే వెన్నెముక పాటపాడే సుషుమ్న ‘’అంటూ ప్రశంసించాడు శ్రీ శ్రీ ,

‘’శ్రీ విశ్వనాధ కవిపండిత సార్వ భౌమ –సుజ్ఞాన పీఠం,సదామృత కావ్య శిల్పాత్ద్

ఐదిష్యదాంధ్ర సుర భారత భానుఃదీప్తి  -విశ్వాద్వాధ్యవాజ్మయ నభస్య ప్రభాం గణేషు’’

‘’రసమయ శుభ  విశ్వ శ్శ్రేయ  కావ్యాననేకాన్ –సరళ తరల సత్ప్రౌఢిప్రసాను సాధాత్

సకల సుగుణ సంపూర్ణాను మోదప్రభావాత్ –దశ దిశు సుధా దావల్య కాంతే రతన్వన్ ‘’ (సుధీంద్ర ప్రహ్లాద )

‘’ప్రతిభయే రూపం ధరిస్తే విశ్వ నాధుడే –హిమ గిరి శిఖరం చలించి వస్తే విశ్వనాదుడే

వర్షామేఘం కవనం రాస్తే విశ్వ నాధుడే –వాణి ఆంధ్రుడై వసుధ జనిస్తే విశ్వనాధుడే ‘’

మరో మహా కవితో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అయిదుగురు ఇంటికి?

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిగెత్తే జీవితం వద్దు అన్న బుల్లితెర అస్మిత ,28కోట్ల పెయింటింగ్ ,361 కోట్ల వజ్రం


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదావరి పరవళ్ళు

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 4౦9’’ఘటికా శతగ్రంధ ఘటనుడు -చెంగల్వ కాళకవి !(1590-1673)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

4౦9’’ఘటికా శతగ్రంధ ఘటనుడు -చెంగల్వ కాళకవి !(1590-1673)

దక్షిణాంధ్ర యుగం లో తంజావూర్ రాజు రఘునాధ రాయలకాలం లోను విజయ రాఘవ రాయలకాలం లోను చెంగల్వ కాల కవి ఉన్నాడు రఘునాధుని ఆస్థానకవి కాలేదు ఆ గౌరవం విజయ రాఘవుడిచ్చాడు .పాకనాటి ఆరువేల నియోగి .తండ్రి వెంకటయ్య తల్లి కృష్ణాంబ.’’ఘటికా శత ఘంట గ్రంధ ఘటనుడు ‘’గా కీర్తిపొండాడు .ఓష్ట్య ,నిర్యోస్త్య మొదలైన నియమాలతో కవిత్వం చెప్పేవాడు .’’పరి హ్రుతేతర యుక్తిభాగనూతన కదా కధకుడు ‘’.భారత శాస్త్ర పారంగతుడు .విజయ రాఘవుని ఆస్తానకవియై అతనిపై ‘’రాజగోపాల విలాసం ‘’రాశాడు .రాజుకు పరమ మిత్రుడుకూడా .రాజుతో రానులతో వి౦దు లారగించేంత చనువున్నవాడు .చాలారాశాడంటారు కాని విలాసం ఒక్కటే మిగిలింది .సంస్క్రుతకవులలో భారవికి ఉన్న స్థానం కాళ కవికి ఉంది .

బొమ్మకంటి ఆప్పయా చార్యుడు పద్నాలుగవ శతాబ్దం చివరలో ఉన్నాడు .రేచర్ల సింగ భూపాలుని ఆస్థానకవి .అమరసింహుడు రాసిన ‘’అమరకోశం ‘’కు ‘’అమర కోశ వ్యాఖ్య ‘’రాశాడు .ఈ వ్యాఖ్య వలన ఇతనికి ‘’మారపోత ‘’అనే పేరొచ్చింది .

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా ఇంట్లో నా మేనడుళ్ళు, మేనకోడలు నా రెండవ అక్క దుర్గ పెద్ద కుమారుడు అశోక్, అమెరికాలో ఉంటున్న చిన్న మేనల్లుడు శాస్త్రి, మేనకోడలు పద్మ

This gallery contains 13 photos.

More Galleries | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 407-మాడ భూషి నరసింహా చార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

407-మాడ భూషి నరసింహా చార్యులు

శ్రీవైష్ణవులైన మాడ భూషి నరసింహా చార్యులు పండిత వంశం లో జన్మించారు వీరి మూలపురుషుడు వెంకటా చార్యులు ఎనిమిది భాషలలో పండితుడు .పురాణ శాస్త్రాలలో అపార ప్రజన కలవాడు ‘’ప్రతి వాడ భయంకర ‘’బిరుడున్నవాడు .మహారాజులు ఈయన పాద పూజ చేసేవారు .చాలా గ్రంధాలు సంస్కృతం లో రాశాడని చెబుతున్నా ఏవీ లభ్యం కాలేదు .ఆయన జీవించిన 17,18 శాతాబ్దాలకాలం ఒక అద్భుత అధ్యాయమే .వీరికి తొమ్మిది మంది కుమారులు .అందులో శ్రీనివాసా చార్యులు మహా పండిట్. అతని కొడుకుకు వేంకటాచార్య పేరు పెట్టారు .ఈయనకు అయిదుగురు కొడుకులు .అందులో వేదాంత దేశికులు కుశాగ్రబుద్ది.ఈయనా అష్ట భాషా పా౦ డిత్యమున్నవాడే .న్యాయ ధర్మ వేదం వేదాంత పురాణాలలో సిద్ధ హస్తుడు .’’విద్వద్గజం ‘’బిరుదురాజాస్థానం లోను ,’’పండితకవి ‘అని యువరాజ సభలో ,’’సదరమీను ‘’అని ఆంగ్లేయ కోర్టు లలో పేరు ’ పొందాడు .సర్వ స్వతంత్రుడు .ఇంగ్లీష్ కూడా నేర్చాడు .బ్రాహ్మనసభ ‘’బృహస్పతి ‘’అని కీర్తించింది ఈ వేదాంత దేశికాచార్యుల కొడుకే నరసింహా చార్యులు .’’నరసింహ దేశికులు ‘’అని గౌరవంగా పిలువ బడేవాడు .తండ్రికి తగ్గ కొడుకే కాదు మించిన వాడుకూడా .

నరసింహా చార్యులు 1799లో పుట్టాడు .తండ్రి ,గురువుల వద్ద సర్వ విద్యలు నేర్చాడు .వైనతెయుని అనుగ్రహం తో సంగీతా సాహిత్యాలలో ఎదురు లేని వాడని పించాడు .(వేదాత్మా విహగేశ్వరో )వాసు చరిత్ర పద్యాలను వీణపై అతి శ్రావ్యంగా ఆలపించే నేర్పు ఆయనది .ఆ పద్యాలపైనే పండిత గోస్టులు ,పరీక్షలు జరిగేవి .వాసు చరిత్రకు అంట క్రేజ్ ను తేక్చినవాడానే..ఆయన సమకాలికుడు శిష్టు కృష్ణ మూర్తి శాస్త్రి(1790-1870) వసు చరిత్ర పద్యాలకు రాగాలు కట్టి విపులమైన వ్యాఖ్య రాశాడు .

వివాద రహితుడైన ఈయన నూజి వీడు ప్రభువు శోభనాద్రి అప్పారావు ఆస్థానం లో ఉన్నాడు .శోభనాద్రి కంటే ఆచార్యులు చిన్నవాడే అయినా రాజు మహా భక్తీ శ్రద్ధలను కనబరచేవాడు .కవులను కళాకారులను ఆదరించాడు .సంగీత సాహిత్యాలను ప్రోత్సహించాడు .నరసింహా చార్యుల చేత ‘’పల్లవీ వల్లవోల్లాసం ‘’కావ్యం తెలుగులో రాయించాడు .దీన్ని ఆగిరిపల్లి శోభనాద్రి నరసింహ స్వామికి అంకిత మిప్పించాడ. నరసింహా చార్యుల గురించి ఇంతకంటే వివరాలు తెలియవు .

408-మాడ భూషి వెంకటాచార్యులు (1835-18970)

మాడ భూషి నరసింహా చార్యులు కొడుకు వెంకటాచార్యులు(1835-18970 గండర గండకవి మహా పండితుడు .మేధావి .ఏక సందాగ్రాహి .అసాధారణ ప్రతిభా సమన్వితుడు .తర్క వ్యాకరణ జ్యోతిష్యాలలో ఆయనది అపారమైన ప్రజ్న.సంస్కృత ,ప్రాకృత ,,వికృత ,శౌరసేని ,మాగధీ ,పైశాచీ మొదలైన భాషా వ్యాకరణాలను ఆపోసన పట్టిన వాడు .సంస్కృతాంధ్రాలలో మహా ప్రబంధ రచన చేశాడు .సంగీత సాహిత్య పారంగతుడు .’’అష్ట ముఖాస్ట భాషా వ్యస్తాక్షరీ విద్యా వదాన్యుడు ‘’ఇవన్నీ ఏకకాలం లో ప్రదర్శించి ఆశ్చర్య పరచేవాడు .ఆంద్ర,గీర్వాణ ప్రబంధాలను, అనులోమంగా, విలోమంగా అప్పగించే మహా ధారణా రాక్షసుడు .ఆరడుగుల అందగాడు .కమ్మని స్వరం .గంధర్వ గానం .తన అవధాన విద్యతో ఆంద్ర దేశాన్ని ఒక ఊపు ఊపాడు 1875ప్రాంతం లో .1872 ఫిబ్రవరి 21 న నూజివీడు ప్రభువు నారయ్యప్పారావు   ఆగిరి పల్లిలో ఒక విద్వాన్మహా  సభ జరిపి దానిలో వెంకటాచార్యుల చేత ‘’శతావధానం ‘’.ఆశు కవితావధానం చేయించాడు దీనితో ఆచార్యులగారి  పేరు దేశమంతా మారు మోగింది .సంస్కృతం లో ఇరవై ఏడు వృత్తాలు తెలుగులో ఇరవై ,రెండు భాషలో నాలుగు కీర్తనలు ,మొత్తం యాభై ఒకటి పూర్తీ చేశారు .సభలో ఉన్న పిఠాపురం  రాజా  రావు వెంకట మహీ పతి గంగాధర రామారావు ముచ్చటపడి ‘మీ ద్విసందాగ్రాహిత్వం పరీక్షిస్తాను ‘’అన్నాడు ఒక పండితుడు చెప్పిన సీస పద్యాన్ని ఆచార్యులుగారు పౌరాణిక ధోరణిలో చదివి అనులోమ ,ప్రతిలోమంగా కూడా చెప్పారు .సభంతా నివ్వెర పోయి చూసింది .అయినా రామారావు బహద్దర్ గారికి ‘’ఆనలేదు ‘’ఆ సీస పద్య భావాన్ని ఒక వృత్తం లో సంస్కృతం లో చెప్పమని అడిగారు .ఆచార్యుల వారు అతి సునాయాసంగా ఆశువుగా చెప్పారు .మళ్ళీ ‘’అభూతోపమాలంకారం తో ఒక తెలుగు వృత్తం ‘’చెప్పమన్నారు .తడుముకోకుండా చెప్పారు ఆచార్య శ్రీ .కాలం గురించి ఎవరికీ స్పృహ లేదు .అన్నం ,నీళ్ళు మర్చిపోయారు అందరూ అవధాన విందే ఆరగిస్తున్నారు .ఆచార్యులుగారు చెప్పిన శ్లోకాలోకాని పద్యాలలోకాని ఒక్క దోషమూ లేక పోవటం చూసి అంతా ‘’అవాక్కయ్యారు ‘’.అదీ వెంకటాచార్యులవారి మనీష .అప్పటికే అర్ధ రాత్రి దాటింది .

మర్నాటి సభలో ఆచార్యుల వారు ‘’అష్టభాషా వ్యస్తాక్షరి ‘’అనే అవధాన ప్రక్రియను ప్రదర్శించారు .అందులో ఇంగ్లీష్  హిందీ ,తమిళం భాషల్లోనే ప్రశ్నలు ఇచ్చారు . .దీనినీ అద్భుతంగా రక్తి కట్టించారు .నివ్వేరపడ్డ గంగాధర రామారావు ‘’ఆచార్యుల వారు ‘’పండిత రాయలకు’’ అపర అవతారం గా కనిపిస్తున్నారు .ఇకనుండి వీరిని ‘’పండిత రాయ వెంకటాచార్యులు ‘’అని గౌరవంగా పిలవండి అని హితవు చెప్పారు .పండితరాయలు ‘’వాక్పతి అనే పేర. ఈ భూప్రపంచం లో నాకు తప్ప ఎవరికీ లేదు ‘’అని గర్జించిన వాడు .నూజివీడు  జమీన్ దావాలో ఇరుక్కున్నది .అప్పుడు ఆచార్యులవారు వంద పేజీల వాజ్మూలాన్ని తారీఖులు తో షా  చెప్పారు న్యాయ స్థానం లో .ఆశ్చర్య పోయిన జడ్జికి అనులోమ విలోమాలలోనూ దాన్ని వినిపించి మైండ్ బ్లాక్ అయెట్లు చేసిన ధారణా రాక్షసుడు. క్రాస్ ఎక్సామినేషన్ లోను మళ్ళీ అవే ప్రశ్నలు వేస్తుంటే వాటినీ తేదీలతో సహా చెప్పేశారు .వీరి సాక్ష్యం వల్లనే రాజా వారు కేసు గెలిచారు .

వనప్పాకం అనంతా చార్యులు అనే  పండిత మిత్రునితో ఉన్నప్పుడు ఒక అరవ పండితుడు వచ్చాడు .తన గొప్పలు చెప్పుకొంటూ తెగ కోతలు కోస్తున్నాడు .అక్కడి పండితులెవరూ  ఆయనకు  ఆనలేదు .ఆచార్యుల గారక్కడే ఉన్నారు .అరవాయన పడి శ్లోకాలు చెప్పగానే ఈయన ఇవి నేను చిన్నప్పుడే చదివాను అన్నారు .ఇవి పూర్వకవి ఎవరో రాసినవి అని ఆక్షేపించారు .ఇది ధర్మమా అని ప్రశ్నించారు .మండిపోయిన అరవాయన ‘’ఏదీ చెప్పు ‘’అన్నాడు. పొల్లు పోకుండా ఆచార్యులవారు చెప్పి దిమ్మ తిరిగేట్టు చేశారు .

ఆంద్ర దేశం లో శతావదాన్ని ప్రచార లోకి తెచ్చింది మాడభూషి వెంకటాచార్యుల వారే. ఆ తర్వాతే తిరుపతికవులు .గంటకు వందలకొద్దీ పద్యాలు ఆశువుగా చెప్పి రికార్డు సృష్టించారు .వేల కొద్దీ పద్యాలు ధారణ చేయగల సత్తా వారిది .వీరి ఆశీస్సులతో బుక్కపట్టణం రాఘవాచార్యులు ,దేవుల పల్లి సోదరకవులు అవధానాలు ప్రారంభించారు .తిరుపతికవులు వ్యాప్తి తెచ్చారు .ఆచార్యులవారు అవధానాలేకాక, గ్రంధ రచనా చేశారు .’’భారతాభ్యుదయం ,వామన నాటకం ,మదన మోహన చరిత్ర వచన కావ్యం ,రామావదూటి తారావళి ,హంస సందేశం ,పుష్ప బాణ విలాసం అనే ఆశువుగా చెప్పిన ఆంధ్రీకరణం ,ఆనంద గజపతీంద్ర శతకం ,బృహద్వైద్య రత్నాకరం ,ప్రభా నాటకం అనే అశ్వ ఘోషుని చరిత్ర రచించారు .ఇంతటి హ్యూమన్ కంప్యూటర్ కు సంతానం లేక పోవటం విచారకరం .వారసత్వం కోసం వేదాంతం నరసింహా చార్యులను దత్తత తీసుకొన్నారు .వెంకటాచార్యుల వారు తన కొడుకు నరసింహా చార్యులు1972లో  చేసిన అద్భుత శతావదాన్నికళ్లారా చూడలేక పోయారు .కారణం 1858కే కాలధర్మ౦  చెందారు .

ఈ రచనకు ఆధారం –శ్రీ మాడభూషి నరసింహా చార్యులు రాసిన ‘’పల్లవీ పల్లవోల్లాసం ‘’అనే జాంబవతి చరిత్రకు వేములపాడు వాస్తవ్యులు  ‘ శ్రీ ఉన్నం జ్యోతివాసు గారు రాసిన ముందుమాట ‘’పైడి ముడుపు ‘’.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 406-వర్షోత్సవ కీర్తనలు రాసిన శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజి (1835-1899)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

406-వర్షోత్సవ కీర్తనలు రాసిన శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజి (1835-1899)

1835 లో గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజు గారి జీవిత చరిత్ర పెద్దగా తెలియలేదు .భార్య శ్రీమతి జగదీశ్వరమ్మ గారు .వారు నిత్య దేవీ ప్రసన్నుఅని ,పాదు కాంత శ్రీ విద్యా దీక్షాపరులని,సన్యాసాశ్రమం స్వీకరించి కల్యానంద స్వామి గా ఆశ్రమ నామ దేయం పొందారని వారి దౌహిత్రుడు కొలచిన అద్వైత పరబ్రహ్మ శాస్త్రి గారు తెలియ జేశారు .దీక్షితులుగారు ‘’శ్రీ విశ్వనాధ మానస పూజా స్తవం ,వర్షోత్సవ ఏకాన్తోత్సవ ,చూర్నోత్సవ కీర్తనలు రాశారని ,వాటిని తాను  పునర్ముద్రించానని చెప్పారు .ఇవి సుమారు వందఏళ్ళనాటి రచనలు .అందులో దీక్షితులుగారు చేసిన విజ్ఞప్తి ని సంక్షిప్తంగా తెలియ జేస్తున్నాను ‘’అప్పయ్య హవిర్యాజి ,మహా లక్ష్మమ్మ దంపతులకు గుంటూరులో రామచంద్ర పురాగ్రహారం లో జన్మించాను  .కామకాయనస గోత్రీకుల౦ . .నేను రాసిన శ్రీ కాశీ విశ్వనాధ మానస పూజా స్తవం ,శ్రీ కాశీ విశ్వనాధ వర్షోత్సవ కీర్తనలు ,ఏకాన్తోత్సవ కీర్తనలను వ్యాకరణ కేసరి బ్రహ్మశ్రీ ఉపద్రష్ట లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు పరిష్కరించారు .రాజ మండ్రిలోని శ్రీ  వీరేశ లింగం గారి వివేక వర్దినీ ముద్ర ణశాలలో ,ఆ పట్టణ శివ భక్తాగ్రగన్యుడు  బ్రాహ్మణ పూజా దురంధరుడు ,వాసవా౦బా  వర ప్రసాదుడు పైదికుల గోత్రానికి చెందిన నడుపల్లి సత్య లింగం శ్రేష్టి గారి రెండవ కుమారుడు సూర్య నారాయణ శ్రేష్టి ,ఆర్య వంశ కుల గోత్రం వాడు అయిన మల్లయ్య శ్రేష్టి కుమారుడు బాపిరాజు ధన సాయం చేసి ముద్రించారు ‘.అది 11-8-1889-విరోధి నామ శ్రావణ శుక్ల పౌర్ణమి ఆదివారం .’’

ఈ కీర్తనలను కొన్నింటిని గుంటూరు రామచంద్ర పురాగ్రహారం లో గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లెశ్వర  స్వామి పైనా ,మరి కొన్ని ఎడ్లపాడు దగ్గరున్నవిశ్వనాధ ఖండ్రిక లోని  గంగా అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వ నాధుని పేరా ,ఇంకొన్ని వినుకొండ తాలూకా చేజెర్ల గ్రామంలో పార్వతీ  సహిత శ్రీ కపోతేశ్వర స్వామి పైనా  వ్రాయ బడినాయి.ద దీక్షితులుగారు  ఇవి కాక అనేక స్తోత్రాలు అష్టకాలు ,కీర్తనలు వందకు పైగానే రాశారు .వీటిని అన్నిటిని ముద్రించే శక్తి లేక దౌహిత్రుడు దీన్ని మాత్రమె అచ్చు వేసి ఆస్తిక జనులకు అందించారు .రామ చంద్రపురాగ్రహార శివాలయం లో ప్రతి ఏడాది జరిగే కల్యాణోత్సవం లో ఈ కీర్తనలను ఇప్పటికి గానం చేస్తూ దీక్షితులగారిని స్మరిస్తూనే ఉంటారు .ఈ మలి ముద్రణకు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి మహోదయులు తొలిపలుకులు రాశారు .kydikshitulu 001

శ్రీ శాస్త్రిగారు ‘’మా తండ్రిగారు వెంకటప్పయ్య శాస్త్రి గారు తమ రచనలలో కొలచిన యజ్న నారాయణ దీక్షితుల వారిని గురువు గా చెప్పుకొన్నారు .ఆశ్రమ స్వీకారం తర్వాత ‘’కల్యానానంద స్వామి ‘’అయ్యారు .మా తండ్రిగారి శ్రీ రామ కదామృతం మొదలైన వాటిలో ఆశ్వాసాంత పద్యాలలో ‘’యజ్న నారాయణాఖ్య అని ‘’కల్యాణానంద నాదా హృదయ గురు కరుణా ‘’అని కీర్తించారు .మా తండ్రిగారితో చిన్న బుట్టెడు తుమ్మి పూలు పూజకు కోయించి ,పేకాడే తనను దేవీ కృపకు పాత్రుడిని చేశారని మా నాన్న గారెప్పుడూ కృతజ్ఞత తో చెప్పు కొనే వారు . తన గురువులలో దీక్షితులుగారు అగ్రగణ్యులు అని భావించేవారు .గురువుగారికి మా తండ్రిగారు ఎప్పుడూ తర్పణం వదిలేవారు. వారి తదనంతరం నన్ను కూడా వదలమని ఆదేశిస్తే అలానే వదులుతున్నాను .దీక్షితుల గారి కృతులలో భక్తీ పరాకాష్ట గా ఉంది .అద్వైతం గారు మళ్ళీ దీన్ని ముద్రించటం ఋణం తీర్చుకోవటమే .’’అని ౩-6-1974 లో రాశారు .

దీక్షితులగారి గీర్వాణ కవితా దీక్షితీయం

మానస పూజ

‘’శ్రీ విశ్వనాధ గిరి మూర్ధ్ని నివేశ సంస్థం-విశ్వేశ్వరం విధి ముఖార్చిత పాద పద్మం

శ్రీమద్విశాల నయనా ,వినయాంత రంగం –ధ్యాయామి సంతత మహం శశి ఖండ మౌళిం’’ శ్రీకాశీ విశ్వనాధ స్వామినేనమః –ధ్యాయామి ..నాలుగవ శ్లోకం లో

‘’కనక రంజిత శుమ్భ స్తంభ గుమ్భత్సు ముక్తా-ఫలమణి, నికురుమ్బై ర్నిర్మితే భాసమానే

దివిజ ముని కదంబై స్సేవితే మంట పేస్మిన్ –శశిధర హర దాస్యే రత్న సింహాసనం తే ‘’నవ రత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి .తొమ్మిదవ శ్లోకం లో

‘’నమకస్చామకస్చైవ సూక్టైశ్చ వివిధై స్తదా –అరుణై రౌపనిష దై,రానద లహరీస్తవై

శ్రీ రుద్రజాపైరామ్నాయై ర్మహిమ్నాది మహా స్తవై ‘’ఆభిషేకం కరిష్యామి –స్వీకరిష్వ మమ ప్రభో  -పూర్నాభిషేకం సమర్పయామి .ఇలా ఇరవై నాలుగు స్తోత్రాలతోనైవేద్యం ధూపం దీపం తాంబూలం ,నీరాజనం ,మంత్రపుష్పం ప్రదక్షిణ మొదలైనవన్నిటితో  పూజా విధానం అంతా చెప్పారు .చివరికి ఫల శృతి కూడా చెప్పారు .అప్పుడు తననుగురించి

‘’ఇతి శ్రీ చిదానంద నాద చరణార  బిందు సందోహ మరందాస్వాదనిష్టా గరిష్టశ్రీమత్కాళ్యాణానంద నాద భూసుర విరచితం శ్రీ మత్కాశీ విశ్వనాధ మానస పూజా స్తవం సంపూర్ణం ‘’అన్నారు .

శివుడిని పెళ్లి కొడుకును చేసేప్పుడు తెలుగులో ‘’నగ రెల్ల పందిళ్ళు వైచిరి –వాటికి సొగసైన చాన్ద్నీలు గట్టిరి –భగవంతు డైన శివుని శుభ లగ్నమునకు’’ 18 చరణాల పాట రాశారు .నలుగు పాటను పదమూడు చరణాలలో రాశారు .

‘’మంగళా పరదా సర్వా మంగళా హిత శర్వా –అన్గాజా మదగర్వా –హరనుతా సుపర్వా ‘’అని మొదలెట్టి ‘’చేజేర్లా పుర వాసా –రాజ రాజేశ్వరా –రాజశేఖర శైలా రాజరాజాహితా ‘’అని ముగించారు .

మంగళహారతి –‘’విశ్వనాదాయ సకల –విశ్వ సంరక్షణాయ –శాశ్వ తైశ్వర్య దాయ కాయ మంగళం ‘’అని ప్రారంభించి ‘’సోమ శేఖరాయ త్రిపుర సుందరీ మనోహరాయ –కామితార్ధ దాయకాయ ధీమ మంగళం .అని అంటూ  ‘’యజ్న నారాయనాస్వ విజ్ఞానదాయ కాయ –యసుజ్ఞాన కోశ శుభద మంగళం ‘’అని ముగించారు .

వసంతోత్సవం రాశారు –‘’సువ్వి శ్రీ విశ్వనాధ సువ్వి శ్రీ మల్లినాద –సువ్వి శ్రీ రామనాధ సువ్విలాలీ ‘’అని ప్రారంభించి 24 చరణాలు రాశారు

శ్రీ యజ్ఞనారాయణ  దీక్షితుల వారి గురువులైన శ్రీ తుంగ తుర్తి బుచ్చి లింగ శివ యోగి రాసిన ‘’కొట్నాలపాట ‘’చూర్నోత్సవ కీర్తన వగైరాలనుకూడా  ఈ పుస్తకం లో  ప్రచురించారు

దీక్షితులవారి ఫోటో జత చేశాను చూడండి

.    మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 405’’-శ్రీ హర్ష నైషద దర్శన పరామర్శ’’కర్త శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

405’’-శ్రీ హర్ష నైషద దర్శన పరామర్శ’’కర్త శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు

శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి శ్రీమతి బాలా త్రిపుర సుందరి దంపతులకు 24-2-1945 న గుంటూరు జిల్లా రేపల్లె లో శ్రీ జయ సీతారామ శాస్త్రి గారు జన్మించారు .అక్కడే ప్రాధమిక ,ఉన్నత విద్య నేర్చి1966లో తెలుగు సంస్కృతాలలో భాషా ప్రవీణ పాసైనారు .గుంటూరు లో కొలచల కృష్ణ మూర్తి గారి కాలేజి లో సంస్కృత పండితులుగా పని చేశారు .విజయ వాడకు చెందినా శ్రీశొంఠిసూర్య నారాయణ శ్రీమతి లక్ష్మీ ప్రసూనాంబ దంపతుల కుమార్తె శ్రీమతి గాయత్రి ని 7-5-1966లో వివాహం చేసుకొన్నారు వీరికి ఒక ఆడపిల్ల ముగ్గురు కుమారులు జన్మించారు . .1970 నుండి రేపల్లె లో తండ్రిగారు స్థాపించిన సంస్కృత కళాశాలలో లెక్చరర్ గా పని చేశారు .తర్వాత జిల్లెళ్ళమూడి అమ్మ గారి సంస్కృత కళాశాలలో 1994వరకు సేవలందించి కృష్ణా జిల్లా గన్నవరం దగ్గరున్న బుద్దవరం కాలేజి లో ఉద్యోగించి 2003 లో రిటైర్ అయ్యారు .

నోరి నరసింహ శాస్త్రి గారి ప్రేరణతో ‘’క్షేత్రయ్య పద సాహిత్యం ‘’ను పరిష్కరించి ప్రచురించారు .వీరి సంస్కృత భాషా పాండిత్యం మేరలేనిది. తండ్రికి తగ్గ తనయులు .అందుకే వీరి ప్రతిభకు తగిన గుర్తింపు తీసుకు రావటానికి శ్రీ సన్నిధానం సుదర్శనం గారు తిరుపతి సంస్కృత కాలేజి కి తీసుకొని వెళ్ళారు .అక్కడ ప్రచురణ శాఖలో సూపరింటే౦ డెంట్ గా  ఉన్నారు .సంస్కృత గ్రంధాలను పరిశోదించటం  ముద్రణ లో తప్పులు సరి చూడటం చేస్తున్నారు  . ఇప్పటికి ఆ ప్రాజెక్ట్ కింద సుమారు 50 సంస్కృత గ్రంధాలను  ప్రచురించారు వీటి ప్రచురణలో శాస్త్రిగారి కృషి అద్వితీయం .ఇప్పుడు శైవానికి చెందిన ‘’నీల కంఠ భాష్యం ‘’ప్రచురణలో సహాయ పడుతున్నారు .

సీతారామ శాస్స్త్రి గారికి అమరకోశం ,రామాయణ పారాయణం ఉపదేశించిన తల్లి శ్రీమతి బాలమ్మగారు .కావ్య  శాస్త్రాలను లను సంప్రదాయ పద్ధతిలో పాఠం చెప్పి మంత్రోప దేశం చేసినవారు తండ్రిగారైన నారాయణ శాస్త్రి గారు .వీరిద్దరూ తమకు ఆది గురువులైనారని శాస్త్రిగారు వినమ్రంగా తలిదండ్రులకు కృతజ్ఞత తెలుపుకున్నారు .భాషా ప్రవీణ చదివే రోజుల్లో’’ ఉత్తర నైషద కావ్య కర్త’’  శ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారి శిష్యరికం చేసి’’ జ్ఞానాన్జన శలాక తో చక్షురున్మీలనం ‘’పొందానని గురు భక్తీ చాటుకొన్నారు .తనను మంచి మనిషిగా ,మంచి ఉపాధ్యాయునిగా ,సద్విమర్శకునిగా తీర్చి దిద్దిన వారు రేపల్లె వాస్తవ్యులు మిత్రులు అయిన కవిసామ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు అని గర్వంగా చెప్పుకొన్నారు .

శ్రీ  బాలా త్రిపురసుందరీ ఉపాసకులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ‘’నైషద కావ్య ‘’రహస్యాలను వేలకొలది ఎరుక పరచారని ,జ్ఞాన జ్యోతిని వెలిగించారని ,చింతామణి మంత్రాన్ని ఉపదేశించి ఆశీర్వ దించారని ,దాని ఫలితమే ‘’శ్రీ  హర్ష నైషధం –దర్శన పరామర్శః ‘’అనే తన సంస్కృత పరిశోధన గ్రధం అని సీతా రామ శాస్త్రి గారు సెలవిచ్చారు .శ్రీ కంచి కామకోటి శారదా పీఠాది పతులు ,పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహ ఆశీర్వచనాలు వెన్నుదన్నుగా నిలిచాయి .శ్రీ వారు ‘’శ్రీహర్షుని తల్లిపేరు మామల్లదేవి ‘.మామల్ల తమిళపదం.మహా బలిపురానికి మామల్ల పురం అనే పేరుంది .ఈ దృష్టితో శ్రీ హర్షుని జీవిత విశేషాలను ఎవరైనా పరిశోధిస్తే బాగుంటుంది ‘’అని సెలవిచ్చిన మాట తనకు ఈ జన్మ అంతా పులకింతలు కలిగిస్తూనే ఉంటుంది అని పరవశం తో శాస్త్రి గారన్నారు .

ఇదికాక శాస్త్రిగారు సంస్కృతం లో ‘’శ్రీ మాత్రుస్తవః ‘’ రాశారు అమ్మవారి అనుగ్రహం తో .ఒక గంటలో ‘’శాలినీ వృత్తం’’ లో పది శ్లోకాలు రాశారు .ఇది దేవీకృప ,గురుదేవుల అనుగ్రహం అన్నారు .దీనికి  ఆర్ష విద్యా ప్రచారకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు తెలుగులో వివరణ రాశారు .మొదటి శ్లోకం లో

‘’శ్రీ విద్యాం చిన్ముద్ర యుక్తాం భవానీం –చిత్తోన్మాద ద్వంసినీం ,చిన్మయీం ,మాం

మొహాతీతాం ,ముగ్ధ హృద్యాం మ్రుడానీం-శ్రీం మంత్రార్ణోద్భవ  భాగ్యాం,ప్రణౌమి ‘’

ఎనిమిదవ శ్లోకంగా

‘’వాక్కూటస్తాం ,శారదాం మౌని పూజ్యా౦ –శ్రీదాం ,లక్ష్మీం ,మధ్య కూటే వసంతీం

జ్ఞాని జ్ఞేయాం ,శక్తి కూటేవిహర్త్రీం –శ్రీం మంత్రార్నో ద్భవ భాగ్యాం ప్రణౌమి ‘’

చివరిది అయిన పదవ శాలినీ శ్లోకం ‘’

‘ షట్చక్రో పర్యున్మ నీస్థా,మగమ్యాం-యోగీన్ద్రాణా,మాత్మ శుద్ధిం దిశంతీం –

సోహంభావో ద్భాస బుద్ధీడ్య మానాం-శ్రీ మంత్రార్నోద్బ ద్ద భాగ్యాం ప్రణౌమి ‘’అంటూ ఆశువుగా అమ్మవారి లీలావిలాసాన్ని అత్యంత భక్తితో వర్ణించారు. ఇందులో చివరిపాదం మకుటంగా ఉండటం విశేషం .దీనికి ‘’మాత్రు స్తవం ‘’ను అనుబంధంగా అయిదు శ్లోకాలు రాశారు .

దీనితోబాటు శాస్త్రిగారు ఇరవై అయిదు శ్లోకాల ‘’గాయత్రీ జయ రామం ‘’అనే చిన్న కావ్యాన్ని సంస్కృతం లో రచించారు .

సీతారామ శాస్స్త్రిగారు తమ అన్నగారు  రామ సుబ్రహ్మణ్య శాస్త్రి ,తమ్ముడు శ్రీ కృష్ణ ప్రసాద్ గారలతో కలిసి ‘’ముళ్ళపూడి సోదరులు ‘’పేరుతొ ‘’సీతాయాః చరితం మహాత్ ‘’ను శ్రీ గాయత్రీ జయ రామ కావ్య సహితంగా  రాశారు .

శ్రీ హర్ష నైషధీయ దర్శన పరామర్శ

శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు తాను  సంస్కృతం లో రాసిన నైషద పరామర్శ లోని ప్రధానాంశాలను తెలుగు లో అందరికి అర్ధమయేట్లు రాశారు .ఆ విషయాలనే మీ ముందు ఉంచుతున్నాను .శ్రీ హీరుడికి మామల్లదేవికి జన్మించిన కుమారుడే శ్రీహర్ష కవి .చింతామణి వర ప్రసాదుడు .నైషద కావ్యాన్ని సంస్కృతం లో రాసిన ప్రతిభా శాలి .ఈ కవి కాశ్మీర దేశపు వాడని శాస్త్రిగారు సోపత్తికంగా నిర్ణయించారు .ఆంద్ర నైషధం లో శ్రీనాధుడు తెలియ జేసిన అనేక  శాస్త్రీయ విషయాలపై ఒక వ్యాసం రాస్తే శ్రీ నోరి నరసింహ శాస్త్రి ఏంతో  మెచ్చారు .1980 లో తిరుపతి ఓరియెంటల్ కాన్ఫరెన్స్  లో ఈ వ్యాసం శాస్త్రి గారు చదివి అందరి ప్రశంసలను పొందారు .శ్రీ గాలి పార్ధ సారదిగారి వద్ద పి హెచ్ డి చేయటానికి’’ నైషధీయ దర్శన పరామర్శ ‘’ను ఎన్నుకొన్నారు .నైషధం లో ప్రబంధ ధ్వని ఉన్నట్లు గోచరించింది .కాని సారధి గారు లేనిపోని అర్దాలకోసం పాకులాడవద్దని నిరుత్సాహ పరచారు . .అప్పుడు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్దకు చేరి సంశయ నివృత్తి చేసుకొని కొత్త వెలుగులను దర్శించారు .శ్రీహర్షుడు మహా భారతం నుండి పూర్తీ నలచారిత్రను తీసుకోకుండా నలదమయంతుల వివాహం వరకే తీసుకొని 22సర్గల మహాకావ్యం రాశాడు .ఇందులో హంస పాత్ర ,భీమ నల పాత్రలలో ఉన్న సంకేతార్ధం ,ఇంద్రాదులుప్రవేశించటం లో అంతరార్ధం ,నలుడిని తమ దూతగా పంపి వెంటనే దమయంతి వద్దకు దూతికలను పంపటం లో ఉద్దేశ్యం ,భీమ నలులను సరస్వతి దేవి అనుగ్రహించటం ,కలిని ప్రవేశ పెట్టటం ,చంద్ర వర్ణన తో కావ్యాన్ని పూర్తీ చేయటం ,ప్రతి సర్గలో ‘’ఆనంద ‘’పదం ఉండటం ,చంద్ర ,అమృత ,శ్రీ శబ్దాలను ప్రయోగించిన తీరు అన్నీ వింతగా ఉన్నాయి .

బంగారు హంస ‘’బ్రహ్మ వాచకం ‘’.హంసను చెలులు పట్టుకోబోతుంటే దమయంతి ‘’నైవాశ కునీ భావేన్మే’’అంటే ఈ హంస నా విషయం లో పక్షికాదని అనటం ప్రత్యెక విషయాలు .’’పాఠం లాగా వేదాంత విషయాలను అభ్య సించి నప్పటికీ సమాధి స్తితికి వచ్చిన యోగికి మాత్రమె ఆనంద స్వరూపమైన బ్రహ్మ దొరుకుతాడు ‘’అని హంస అన్నమాటలు మామూలువి కావు .మానవ శరీరం లో హంస సంచారం అంటే ప్రాణ సంచారమే .ఆత్మ దర్శనం కోసం యోగి హంసను బంధిస్తాడు .అందుకే నలుడు ‘’దేన్నీ చూడటానికి నిన్ను పట్టానో ఆ రూపాన్ని చూశాను ‘’అనటం లో పరమార్ధం అదే .

రెండవ అధ్యాయం లో హంస నలునితో ‘’సరసీః పరి శీలితుం మయా ,గమి కర్మీకర్త నైకనీ వృతా ‘’అనే శ్లోకం లో గమి కర్మీకృత పదం వ్యాకరణ పాండిత్యం తో చెప్పిందికాదని వ విశిష్టా  ర్ధం తో చెప్పినదని శాస్త్రిగారు భావించారు .మన శరీరం లో మొత్తం 21,600 హంసలు ప్రయాణిస్తూ ఉంటాయి ..అందుకే శ్రీనాధుడు కూడా ఈ పదాన్ని అలాగే తెలుగు అనువాదం లో వాడాడు .శ్రీగుంటూరు శేషేంద్ర శర్మ కూడా ఇదే ఆలోచన చేశారు .దమయంతి దగ్గరకు వందమంది అప్సరసలు చెలికత్తెలుగా వచ్చారు. చాన్దోగ్యం ప్రకారం వందనాడులు మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రయాణం చేస్తాయి అని ఉంది దానికిది సంకేతం .ఇదే సుషుమ్నా నాడి .

దమయంతి ఒక రాజకుమారిమాత్రమే కాదు .విద్యా శక్తి జ్ఞాన విద్య .ఆమెను పొందిన జీవుడు పరమాత్మ అవుతాడు .ఈమె తండ్రి భీముడు .అంటే కామ క్రోదాదులకు భయంకరుడు .ఇంద్రియ నిగ్రహుడు అయిన దముడు అనే రుషి ప్రభావం తో భీమ రాజుకు దమింప జేసేడైన దమయంతి జన్మించింది .ఆమె సాక్షాత్తు శ్రీయే నంటారు శాస్త్రీజీ . ఏడవ సర్గలో శ్రీహర్షుడు దమయంతిని మూడు భాగాలుగా వర్ణించాడు .కేశాలనుండి చుబుకం వరకు ,మెడనుండి రోమాళి వరకు ,మూడవసారి కిందిభాగం వర్ణిస్తాడు .ఈ మూడు మూడు కూటాలు .అవి వాగ్భవ ,మధ్య ,శక్తి కూటాలు .కూట త్రయ కళేబరం లలితా దేవిది అలాంటిదే దమయంతి సౌందర్యం .ఆమెయే  తను మధ్యమం లో అణిమ ,శ్రోణి ,వక్షోజాలలో గరిమ ,చేతం లో వశిత్వం, నవ్వులో లఘిమ ,నలుని విషయం లో  ఈశిత్వం ,సూక్తి రమ్యత్వం లో ప్రాకామ్యం ,యశస్సులో ప్రాప్తి అనే అష్ట సిద్దులతో పరమాత్మ నిన్ను సృష్టించాడని నలుడు దమయంతిని 10 వ సర్గలో పొగడటం లో అంత రార్ధమిదే నంటారు శాస్త్రిగారు.

నలుడు అంటే సాధకుడైన జీవవుడు .పరమాత్మ సాక్షాత్కారం పొందిన వాడు .’’రలయో రభేదః ‘’అంటే రా కి ల కి భేదం లేదు .నరుడే నలుడు అని భావం .

‘’నిషీయ యస్య క్షితి రక్షిణః .కదాః తదాద్రి యంతేన బుధా స్సుదామసి –నలస్షిత చ్చత్రిత కీర్తి మండలః నరాశిరా సీన్మ హసాం మహోజ్వలః ‘’అని కావ్య ప్రారంభం లో నలుడినికవి నిశీయ అనే అవ్యయం తో కావ్యాన్ని ప్రారంభించాడు .అంటే అవ్యయ పురుషుని వర్ణించాడని అంటారు శాస్త్రిగారు .ఈ కద వినే వారు అమృతాన్ని వద్దు అంటారట .క్షితి శబ్దం కూడా ప్రత్యేకమినదే .అంటే శరీరం అని ,దాన్ని రక్షించేవాడుపరమాత్మ అని లోని అర్ధం .అమృతత్వం లభిస్తుందని అర్ధం హర్షుడు ఇలాంటివి ఎన్నో నిక్షిప్తం చేశాడు .అన్నీ ఉపనిషద్వాక్యాలేనంటారు .జీవుడు విద్య కోసం ప్రయత్నిస్తాడు. దానికి కొన్ని అర్హతలుకావాలి .జ్ఞాన విద్య తనకు అనుకూలమా కాదా అని తెలుసుకోవాలి .అదే దేవతల ద్యూతం .’’భీమజ ‘’తో యోగం పొంది అద్వైతం పొందటమే నలపాత్ర .

పదిహేడవ సర్గలో ‘’కలి’’ప్రస్తావనలోను వేదాంతం ఉంది .చివరిదైన 22 వ సర్గలో చంద్రోదయ వర్ణన .అగ్ని ,సూర్య సోమ ఖండ  త్రయాత్మకమైన పంచ దశి మంత్రానికి శ్రీం చేరిస్తే నాల్గవ ఖండం అయి ‘’చంద్ర కళా ఖండం ‘’అవుతుంది .ఇది చంద్ర వర్ణన పరస్పరాను బద్ధాలు .శ్రీం శబ్దాన్ని సహస్రారం లో ధ్యానిస్తారు .ఇన్ని అర్ధాలు నైషద కావ్యం లో కవి నిక్షిప్తం చేశాడని ఇది కేవలం నల దమయంతుల కద కాదని జాగ్రత్తగా గురువుల దగ్గర చదివి అంతరార్ధాన్ని గ్రహించాలని శ్రీహర్ష కవి ఒక శ్లోకం లో ముందే చెప్పి హెచ్చరించాడు –

‘’గ్రంధ గ్రంధి రిహక్వచిత్ క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయా –ప్రాజ్ఞాన్మన్యమనా హఠేన పఠితీ,మాస్మిన్ ఖల ఖేలతు

శ్రద్ధా రాద్ద్ధ గురుఃశ్లదీకృత దృఢ గ్రన్ధిః సమాసాదయ –త్వేతత్ కావ్య రసోర్మి మజ్జన సుఖ వ్యాసజ్జనం సజ్జనః ‘’అంటే ఈ గ్రంధం లో క్లిష్టమైన ముడి ని నేను అక్కడక్కడ కావాలనే ప్రయత్న పూర్వకం గా వేసి ఉంచాను .పండితుడినని ,ప్రాజ్నుడనని మూర్ఖుడు కావ్యములోకి మూర్ఖుడు ప్రవేశించ రాదు .గురువులను శ్రద్ధతో ఆరాధించి ,వారి అనుగ్రహం తో నేను వేసిన ‘’దృఢ గ్రంధి ‘’ని కొంత కొంత వదులు చేసుకొని ,విప్పుకో గలిగిన సజ్జనుడికి మాత్రమె ఈ కావ్యామృతములో సుఖం గా స్నానమాడు గాక ‘’అన్నాడు మహాకవి శ్రీ హర్షుడు .ఇవన్నీ వ్యంగ్య నిర్ధారణకు సాక్ష్యాలు అంటారు జయ సీతా రామ శాస్త్రి గారు .ఈ విధంగా ప్రబంధ ధ్వని నైషద కావ్యమంతా విస్తరించి ఉందని ఎన్నో వివరాలతో విపులమైన వ్యాఖ్యానం సంస్కృతం లో రాసి పి హెచ్ డి సాధించారు .సాధారణ పాఠకులకోసం తెలుగు ఇంగ్లీష్ లలో  లో వివరణ నిచ్చారు .శ్రీహర్షుని శ్లోకం తోనే తన పరిశోధనా వ్యాసాన్ని ముగించారు శాస్త్రిగారు –

‘’మదుక్తి  శ్చేదంతర్మదయితు సుదీ భూయ –కి మస్యా నామస్యాత్ అలస పురుషా నాద రభరైః ‘’

ఆధునిక సంకేతికతో శాస్త్రి గారు చాలా చక్కగా వేదాంత పరంగా విశ్లేషించారని ధిల్లీ యూని వర్సిటి సంస్కృత  శాఖాధిపతి మెచ్చారు .మొత్తం మీద అపూర్వ సిద్ధాంత గ్రంధం శాస్త్రిగారి ‘’నైషధీయ దర్శన పరామర్శ ‘’.వారి సర్వ శాస్త్ర పాండిత్యానికి ,గీర్వాణ భాషా ధిషణకు దర్పణం .

శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి ఫోటో కింద జత చేశాను చూడండి .

మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం

సశేషం

శ్రీ వినాయక చవితి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వినాయక చవితి నాడు’’ విశ్వనాధ హాస్యాయణం ‘’

వినాయక చవితి నాడు’’ విశ్వనాధ హాస్యాయణం ‘’

విశ్వనాధ సత్యనారాయణ తాను  చేసిన ఉద్యోగాల గురించి ‘’అనేక ఉద్యోగాలు చేశాను .అవి గోచీకి పెద్దవి ,గావంచాకు చిన్నవి .నేను కృత్తికా నక్షత్రం లోపుట్టాను ఆకలి ఎక్కువ ఆరగించుకోవటం తక్కువ ‘’అని చమత్కరించారు .’’మాగాణి పల్లెటూరిలో పుట్టని వాడు ,లేక మెట్ట పల్లెటూరిలో పుట్టిపెరగని వాడు మహాకవి కాలేడు’’అన్నాడు .’’ఈదేశం లో బ్రిటిష్ వాడు నాటిన విష వృక్షాలలో విద్యా విధానం ఒకటి .ఆ’’ముశి పళ్ళు’’తినటానికి మనజాతి అలవాటు పడింది ‘’.’’నా నోరు మంచిది కాదు తగాదాలు కొని తెచ్చుకోనేవాడిని చిన్నతనం లో ‘’.కూచి పూడివారు గ్రామాలకు వచ్చి యక్షగానాలతో మైమరపించేవారు చివరి రోజున’’ శారదా వేషం ‘’కట్టేవారు .ఈ వేషం స్త్రీ కాదు ,పురుషుడుకాడు. విచిత్ర వేషం .రమ్యంగా ఉండేది .వారి విద్య తమాషాగా ఉండేది .స్త్రీలు వడ్లు దంచగా వచ్చే రోకటి ధ్వని ,ఒకే రోకలితో దంపటం ,రెండు ,మూడు నాలుగు అయిదు  రోకల్లతో దంచటం  ఈ ధనులన్నీ  ఒక మగాడు కాళ్ళతో తొక్కి చూపించేవాడు .అదొక ధ్వని అనుకరణ విద్య .ఇప్పుడు దాన్ని మిమిక్రీ అంటున్నాం .శారద వేషధారి  దారి వడ్లు  దంపటం  చూపిస్తూ ఉంటె గ్రామం లో ఆడా ,మగా ఆశ్చర్యం గా చూసేవారు ‘’అని తన ఊరు నందమూరువిశేషాలను విశ్వనాధ చెప్పాడు .

విశ్వనాధ బందరులో ఎస్ ఎస్ ఎల్సి వరకు చదివాడు  అప్పడాయన వేషం ఆయన మాటల్లోనే ‘’ఒక లాగు చొక్కా .చేతులకు మురుగులు ,కాళ్ళకు కడియాలు ,నెత్తిమీద జుట్టు ,ముందు సాదా గొరిగింపు ,జుట్టు ముడి వెనక గిరజాలు ‘  ఇదీ ఆయన వేషం .ఇప్పుడా వేషం లో ఉంటె ‘’ఏదో ‘’తేడా గాడు ‘’ అను కొంటాం కదూ .’’మాకు హిందూ హైస్కూల్ లో బేత పూడి ప్రకాశం గారు వ్యాకరణం చెప్పేవారు .వృద్దు .’’తెల్లటి పొడుగాటి ఎలుగు బంటి’’లాగా ఉండేవాడు వ్యాకరణ సూత్రాలు రాకపోతే చెవి పట్టుకొని పిండేవాడు పాము కాటు లాగా ఉండేది నల్లమందు వేసుకొని స్కూలుకు వచ్చేవాడు ‘’.అన్నాడు

విశ్వనాధ పెద తల్లి విధవ రాలు .బందర్లో వీరికి వండి పెట్టేది. కటిక పిసిని గొట్టు .రాత్రి పూట వండిన అన్నమే పొద్దున్న పెట్టేది తినక పొతే  మధ్యాహం మళ్ళీ రాత్రికి  అదే పెట్ట్టేది.తినలేక చావు వచ్చేది ‘’అని రాసుకొన్నారు .విశ్వనాధకు కారం వస్తువులు ఇష్టం .కారపు వస్తువుల్లో కారం నంజుకొని తినే అలవాటు ఆయనది .అప్పుడుకాని కారం నషాళానికి  అంటేదికాదు . .బందర్లో పెసర పునుకులు స్పెషల్. అవి ఉంటె ఈయనకు ఇంకేమీ అక్కర్లేదు .అవి తింటే స్వర్గానికి బెత్తెడు దూరం కాదు బెత్తెడు పైనే ఉన్నట్లు ఉండేదట .పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అని గిరీశం అంటే ‘’పునుగులు తినని వాడు పురుగులు పడిపోతాడు ‘’అన్నట్లు చెప్పారు .అణాకు పన్నెండు పునుకులు పెట్టేవారు .అవి తిని వారందాకా అన్నం తినే వాడు కాదు  .

విశ్వనాధ హెడ్ మాస్టారు ‘’వెంపటి నరసింహం గారు ‘’మొహం మినహాయిస్తే అంతా జాంబ వంతుడే ‘’అన్నాడు విశ్వనాధ .ఆయన అంటే అందరికి భయం .ఇంగ్లీష్ లో గొప్ప పండితుడు .’’బియ్యపు గొట్టం కంది పప్పు ఒక్కడే తినేవాడాయన ‘’అన్నాడు విశ్వనాధ .విశ్వనాధ కు సంగీతం బాగానే వచ్చు పాతిక ముప్ఫై రాగాలు బాగా పాడేవాడు .ప్రముఖ సంగీత విద్వాంసుడు .’’హరినాగాభూషణం గారు అపర త్యాగ రాజు ‘’అన్నాడు విశ్వనాధ .ఆయనవి వందకచేరీలు విన్నాడీయన. ఆ నాటి నాటకాలలో సంగీతం ‘’అచ్చంగా ఉండేది ‘’‘’తరువాత్తర్వాత ‘’సంగీతం పేర అరుస్తున్నారు రుబ్బుతున్నారు ‘’అన్నారు .

విశ్వనాధ గురువు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గాఋ చదువు చెప్పే పద్ధతిని వివరిస్తూ ‘’శాస్త్రిగారు చామన చాయకు మించి నల్లని మేను . కాళ్ళకు పాంకోళ్లు.ధోవతి .లోన తెల్లని చొక్కా ..పైన ఒక కోటు .అవిమాయనివికావు మాసినవి కావు ..ఒక తలగుడ్డ .మొగాన విభూతి గంధం .నుదుట పెద్ద కుంకుమ బొట్టు .ఎప్పుడూపక్కన ఒక గొడుగు .ఊరిలో తిరిగినా ఇదే వేషం .క్లాసు కు గంటలో అరగంట దాటిన తర్వాత రావటం ఆయన అలవాటు ఆయన్ను ఎవరూ ఏమీ అనే వారు  కాదు. ఆయన ఇక్కడ పని చేయటం ఒక మహా భాగ్యం .ఆలస్యంగా ఎందుకోస్తున్నారు అని అడిగితే ‘’ఏం చేయమంటారు .బడి ఉన్న రోజుల్లో నేను అన్నం కూడా సరిగ్గా తినను ‘’అని ఏదో ‘’హరికధ’’ చెప్పేవారు .చంకలో కాగితాలకట్ట దాన్ని బల్లపై పెట్టి రాసుకొంటూ కూర్చునే వారు .చెప్పులు కింద వదిలి గొడుగు కుర్చీకి ఆనించి ,కాళ్ళు బల్ల మీద పెట్టి రాసుకొంటూ ఉండటమే ఆయన పని .తర్వాతపీరియడు మేస్టారు వచ్చి బయట నుంచొని ఈయన బయటికోచ్చేదాకా ఉండేవాడు. అదీ తీరు .కాని ఆయనతో తిరగటం సభలకు వెళ్ళడం తో అబ్బిన విద్య తప్ప ఆయన క్లాసులో చెప్పింది ఏదీ లేదు ‘’అన్నాడు విశ్వనాధ .

గురు శిష్యులిద్దరూ చమత్కార ప్రియులే .ఒక సారిగురువు  సన్మాన సభలో  శిష్యుడు మాట్లాడుతూ ఏదో వేసవికాలం చెలమ నీరు గురించి చెబుతుంటే ,గురువు గారు ‘ఏరా మా ఊళ్లు చెలమలలో నీరు పడటం లేదే ‘’అన్నాడు చమత్కారం గా .వెంటనే విశ్వనాధ ‘’ఎలా ఉంటాయండీ ఆ నీళ్లన్నీ మన కవిత్వం లోకి ఎక్కిపోతే ‘’అని రిపార్టీ ఇచ్చాడు .కిక్కురు మనలేదు గురువు ..పింగళి లక్ష్మీ  కాంతం గారికి ,విశ్వనాధకు’’ షస్టాస్టకం ‘’గా ఉండేది .పడేదికాదు .ఒక సారి పింగళి పురాణం సుబ్రహ్మణ్య శర్మతో ‘’మీ మేస్టారేమిటోయ్ ,ఆడ వాళ్ళు ముట్టు అయినట్లు నెలకో నవల రాస్తాడు ?’’అనగా పురాణం ‘’మీ కదీ చేతకాదు గా ‘’అని తిప్పికొట్టాడు .

ఆరేళ్ళు విశ్వనాధ ఉద్యోగం లేకండా తన కుటుంబాన్ని ,తమ్ముడి కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది .తల్లి కూడా జీవించే ఉంది .సంచీలో పుస్తకాలు వేసుకొని ఊళ్లకు వెళ్లి అమ్ముకొని వచ్చి జీవించేవాడు .అంత దరిద్రం అనుభవించాడు .అయినా ఆయనలో ఎదుటివాడు బాధలో ఉంటె సహాయం చేసే మానవీయత మాత్రం పోలేదు .ఒక సారి జ్ఞానానందకవి వస్తే రెండు వందల రూపాయలు ఇచ్చి పంపి ,మర్నాడు ఒక స్నేహితుడిని ఒక రూపాయి అప్పు అడిగాడట .మరో సారి బెజ వాడ రేడియో స్టేషన్ లో పింగళి ,తెన్నేటి లత ఏదో ప్రోగ్రాం గురించి చర్చి౦చు కొంటూ ఉంటె, ఒకాయన సరాసరి లోపలి వెళ్లి శిష్యుడైన పింగళి తో ‘’ఒరే లక్ష్మీ కాంతం! అన్నం తిని నాలుగు రోజులయింది. రెండు రూపాయలు ఇప్పించు ‘’అని అడిగాడట జేబులు తడిమి లేవన్నాడట’’లక్ష్మీ కాంతుడు ‘’. లత ఇద్దామనుకోన్నదికాని పింగళి ఏమనుకొంటాడోనని భయమేసి మాట్లాడలేదు .ఇంతలో విశ్వనాధ లోపలి వస్తున్నట్లు గమనించిన లత వచ్చిన పెద్దాయనను బయటికి తీసుకొని వెళ్లి విశ్వనాధకు విషయం అంతా  చెప్పింది .ఆయన క్షణం ఆలస్యం చేయకుండా ఆయన్ను  వెంట  పెట్టుకొని మోడరన్ కేఫ్ కు తీసుకొని వెళ్లి నెల రోజులకు సరిపడా భోజనం టికెట్లు కొనిచ్చి హోటల్ మేనేజర్ తో ఆ పెద్దమనిషి ఎపుడు వచ్చినా భోజనం పెట్టమని తాను  డబ్బు కడతానని అన్నాడట అదీ విశ్వనాదీయం .

చెళ్ళపిళ్ళ వారి సన్మాన సభలో దేశం లోని కవులందరూ వచ్చారు. దీన్ని చమత్కరిస్తూ కట్టమంచి రామ లింగా రెడ్డి ‘’ఇక్కడి నుంచి నేనొక రాయి విసరితే అది ఏదోఒక కవికి తగుల్తుంది ‘’అన్నాడట .తన గురించి చెప్పుకుంటూ ‘’నేను తగలేస్తే తగల బడే వాడిని కాదు పాతేస్తే పాతి పెట్ట బడే వాడిని కాదు ‘’అన్నాడు విశ్వనాధ .విశ్వనాధ అంటే భారత దేశం ఆత్మ .అయన విద్యకే ఒక వ్యాఖ్యానం

.సురవరం ప్రతాప రెడ్డిగారు విశ్వనాధకు ఏదో ఆర్ధిక సాయం చేయించాలి అనే ఉద్దేశ్యం తో నిజాం లోని ఒక జమీన్ కు తీసుకొని వెళ్ళాడు .జమీందార్ చనిపోయాడు భార్య జమీ చూస్తోంది. పరదా చాటున ఉంది .పరిచయాలైన తర్వాత ఆవిడ ‘’మీరు విజ్ఞులు కదా సాని మీద పాట రాశారేమిటండి ?అంది నిస్టూరంగా  అదొక వాగు పేరుకనుక కిన్నెర సాని పేరుతొ రాశాను అన్నాడు ఈయన .ఆవిడ అహం దెబ్బ తిని ‘’ఏమైనా సాని సానే కదా! ’అని రెట్ట్టించింది .కోపం నషాళానికి అంటి ,’’అమ్మా మిమ్మల్ని మీ పరిచారికలు ‘’దొరసాని గారు దొర సానిగారు ‘’అని పిలుస్తున్నారు .అంటే ఏమిటో అనుకొన్నాను ‘’అని, అని విసా విసా లేచి బయటికి వచ్చేశారు. రెడ్డిగారు లబో దిబో .నూటపదహార్లు చేజారిపోయాయే.నిన్ను అరెస్ట్ చేయి౦చె దికదయ్యా ‘’ అన్నాడు.విశ్వనాధ ‘’ఏం చేస్తుంది చంపుతుందా ?అదే నయం .యదార్ధం చెప్పటానికి భయ పడటం కన్నా అది నయం శబ్దానికి అర్ధం తెలియని ప్రతి వాడూ విమర్శకుడైతే చచ్చే చావు కదండీ. ఆమె మహా పతివ్రత .కాని తెలుగు పలుకుబడిలో ఆమె దొరసాని .సందర్భం నుండి పదాలను విడగొట్టి కవుల తప్పులను ఎన్నే వాళ్ళు అంటే నాకు మహా మంట ‘’అన్నాడు. ఆత్మాభిమానం కల విశ్వనాధ .దటీజ్ విశ్వనాధ .

ఆధారం –‘’విశ్వ నాద ఒక కల్ప వృక్షం ‘’పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ

శ్రీ గణేష్ చతుర్ధి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-15-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సాహితీబ0దు వులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భం గా ఒక తీపికబురు

సాహితీబ0దు వులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భం గా ఒక తీపికబురు

మన ఉయ్యూరు వాసి 1917లో రష్యా  వెళ్లి  ఆయిల్ సైన్స్ లో పరిశోధన చేసి ”father of chemmoaology ””కేమటాలజి పిత” గా ప్రసిద్ధి చెందిన స్వర్గీయ కొలచల సీతారామయ్య గారి గురించి వారి పెద్దల్లుడు బ్రేజేన్స్కి రష్యన్ భాషలో రాయగా .ఆంగ్లం లో గుప్తా ,అచలా జైన్లు ‘A wreath  for Doctor Ramayya ”గా రాస్తే దాన్ని నాకు శ్రీ మైనేని గోపాలకృష్ణగారు పంపారు చదివి అనుభూతి పొంది ”కేమటాలజి పిత కొలచల సీతారామయ్య (పుల్లేరు నుండి ఓల్గా దాకా )పేరుతొ వివిధ శీర్షికలతో 32 ఎపిసోడ్ లుగా మే నెలలో రాసిన సంగతి మీకు తెలిసిందే .. దీన్నిసరస భారతి తరఫున  పుస్తక రూపం లో తీసుకు రావటానికి ఏం ఎల్ సి శ్రీ వై వి బి  రాజేంద్ర ప్రసాద్ స్పాన్సర్ గా ఉంటానని ముందుకు వచ్చారు .శుభస్య శీఘ్రం అని దానిని డి టి పి చేయించ టానికి శ్రీ చలపాక ప్రకాష్ గారితో మాట్లాడి  అందజేశామని తెలియ జేయటానికి ఈ పండుగ  సందర్భం గా సంతోషం గా ఉంది  అందరి సౌజన్యానికి మనః పూర్వక ధన్యవాదాలు -దుర్గాప్రసాద్

 
సాహితీబ0దు వులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భం గా ఒక తీపికబురు

మన ఉయ్యూరు వాసి 1917లో రష్యా  వెళ్లి  ఆయిల్ సైన్స్ లో పరిశోధన చేసి ”father of chemmoaology ””కేమటాలజి పిత” గా ప్రసిద్ధి చెందిన స్వర్గీయ కొలచల సీతారామయ్య గారి గురించి వారి పెద్దల్లుడు బ్రేజేన్స్కి రష్యన్ భాషలో రాయగా .ఆంగ్లం లో గుప్తా ,అచలా జైన్లు ‘A wreath  for Doctor Ramayya ”గా రాస్తే దాన్ని నాకు శ్రీ మైనేని గోపాలకృష్ణగారు పంపారు చదివి అనుభూతి పొంది ”కేమటాలజి పిత కొలచల సీతారామయ్య (పుల్లేరు నుండి ఓల్గా దాకా )పేరుతొ వివిధ శీర్షికలతో 32 ఎపిసోడ్ లుగా మే నెలలో రాసిన సంగతి మీకు తెలిసిందే .. దీన్నిసరస భారతి తరఫున  పుస్తక రూపం లో తీసుకు రావటానికి ఏం ఎల్ సి శ్రీ వై వి బి  రాజేంద్ర ప్రసాద్ స్పాన్సర్ గా ఉంటానని ముందుకు వచ్చారు .శుభస్య శీఘ్రం అని దానిని డి టి పి చేయించ టానికి శ్రీ చలపాక ప్రకాష్ గారితో మాట్లాడి  అందజేశామని తెలియ జేయటానికి ఈ పండుగ  సందర్భం గా సంతోషం గా ఉంది  అందరి సౌజన్యానికి మనః పూర్వక ధన్యవాదాలు ఇది సరసభారతి 18 వ ప్రచురణ ,నేను రాసిన 12 వ పుస్తకం అవుతున్నందుకు మరింత సంతోషం గా ఉంది . i  -దుర్గాప్రసాద్

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Click here to Reply, Reply to all, or Forward
13.11 GB (87%) of 15 GB used
Last account activity: 19 hours ago

Details

gabbita prasad's profile photo
gabbita prasad

4 circle

https://accounts.google.com/o/oauth2/postmessageRelay?parent=https%3A%2F%2Fmail.google.com#rpctoken=367570853&forcesecure=1https://clients6.google.com/static/proxy.html?jsh=m%3B%2F_%2Fscs%2Fabc-static%2F_%2Fjs%2Fk%3Dgapi.gapi.en.u14lLJaui1I.O%2Fm%3D__features__%2Fam%3DAAI%2Frt%3Dj%2Fd%3D1%2Frs%3DAItRSTOQXh5W7RmvhkCxBgvo-53xlAGpzA#parent=https%3A%2F%2Fmail.google.com&rpctoken=336459517

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 404-పుత్రసంజీవనం –కావ్య కర్త –బ్రహ్మశ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రిగారు –(1918-1990)

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3

404-పుత్రసంజీవనం –కావ్య కర్త –బ్రహ్మశ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రిగారు  –(1918-1990)

శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారు 10-12-1918సాధారణ నామ సంవత్సర మార్గ శిర శుద్ధ దశమి నాడు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద లంక గ్రామం లో జన్మించారు తలిదండ్రులు పార్ధ శారదమ్మ ,సుబ్బయ్య గార్లు .చిన్నతనం లోనే తండ్రి చనిపోతే తల్లి తానె అన్నీ అయి పెంచి పెద్దవానిని చేసి విద్యా బుద్ధులు నేర్పించి వివాహం చేసింది ఆమె రుణాన్ని తీర్చుకోలేను అన్నారు శాస్త్రి గారు .అన్నగారు రాజ శాస్త్రి గీర్వాణ భాషలో పండితుడిని చేశారు. శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రిగారి వద్ద శాస్త్రాలు అవలోడనం చేశారు .సాహిత్య మార్గ దర్శి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అనే చందవోలు శాస్త్రిగారు .తన సాహిత్య వృక్షానికి  జనస్వామి వెంకటేశ్వర శాస్త్రి గారు బీజారోపణం చేస్తే ,చిలుకూరి వరదయ్య శాస్త్రి గారు నీరుపోశారు .మూల్పూరు సుబ్రాహ్మణ్య  శాస్త్రిగారు మొలకింప జేస్తే ,మంగిపూడి వెంకట శాస్త్రిగారు పెంచారు .కంభం పాటి రామ మూర్తి గారు పూలు పూయిస్తే ,వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కాయలు కాయించారు .యతి రాజు సంపత్కుమారాచార్యులుగారు సొంపు చేస్తే  తాతా సుబ్బరాయ శాస్త్రి అనే రాయడు శాస్త్రీ గారు  పండజేశారు అని శాస్త్రి గారు ఈ ఎనిమిది మందికి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు సీస పద్యం లో .వీరు అస్టమూర్త్యాత్మక దేవతలుగా భావించారు .తర్క శాస్త్రాన్ని వేమూరి రామ బ్రహ్మ శాస్త్రి గారి వద్ద నేర్చారు ..అగమా౦తాన్ని  దెందుకూరి నరసింహ శాస్త్రి గారి వద్ద చదివి పారీణుడయ్యారు  .

ఈ విధం గా నారాయణ శాస్త్రిగారు మహా మహోపాధ్యాయులైన గురువులవద్ధ కావ్య పాఠం,తర్క వేదాంత ,అలంకార ,వ్యాకరణ శాస్త్రాలను ఆసాంతం అభ్యసించి ఎదురు లేని వారి గురువులకు తగిన శిష్యుడు అనిపించుకొన్నారు .1929లో పోపూరి సీతారామయ్య ,పున్నమ్మగార్ల పుత్రిక శ్రీమతి బాలా త్రిపుర సుందరిని వివాహం చేసుకొని చిన్నక్క పున్నమ్మగారి అల్లుడైనారు .మేనల్లుడే అల్లుడైన శాస్త్రిగారి విద్యాదానానికి ఆమె అన్నదానం తో సహకరించారు .శాస్త్రి దంపతులకు నలుగురు కుమార్తెలు ముగ్గురు కుమారులు కలిగారు .

రేపల్లె చిట్టి వారి వీధిలో శాస్త్రిగారు శాస్త్ర పాఠ శాలను ఏర్పరచి ,శిష్యులకు విద్య నేర్పించారు .గ్రామంలోని ఉదారుల ఇంట వారాలు ఏర్పాటు చేసి ,తన ఇంటిలోనూ భోజన వసతి కలిపించి విద్యార్ధుల విద్యకు ఆటంకం లేకుండా విద్యాలయాన్ని నిర్వహించారు .ఇది క్రమంగా వృద్ధి చెంది రైలు పేటకు మారి 1940లో శ్రీ శంకర విద్యాలయం గా రూపు దిద్దుకొన్నది .జగద్గురువులు శ్రీ శంకర భాగవత్పాదులపై శాస్త్రిగారికి అపార భక్తీ తాత్పర్యాలు౦ డేవి ..భవన నిర్మాణం కోసం ఉన్నది అంతా ఖర్చు చేశారు .ఇది గమనించిన మహాదాత తిమ్మ సముద్రం వాసి శ్రీ గోరంట్ల వెంకన్న చౌదరి ధన సహాయం చేసి శాస్త్రి గారి సంకల్ప సిద్ధికి తోడ్పడ్డారు .వారికి  జీవితాంతం శాస్త్రి గారు కృతజ్ఞత చూపించేవారు .

శ్రీ శంకర విద్యాలయం తర్వాత ‘’వేదం శాస్త్ర పాఠ శాల ‘’గా మారింది .ఇప్పుడు శ్రీ శంకర సంస్కృత డిగ్రీ కళాశాలగా అభి వృద్ధి చెందింది .నిర్వహణకు,ఆర్దికానికి ఇబ్బందులేర్పడి  శ్రీ తూములూరి సుబ్బావదానిగారు మొదలైన వారిని ఏర్పాటు చేశారు .శాస్త్రిగారు పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి వారి సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు .1962-67 వరకు శ్రీ డాక్టర్ కే .వి కే. సంస్కృత కళాశాలలో అయిదేళ్ళు లెక్చరర్ గా ఉద్యోగించి ,తర్వాత రెండేళ్ళు తిమ్మ సముద్రం లో గోరంట్ల వారి పాఠ శాల నిర్వాహకులుగా ఉన్నారు .అక్కడి నుండి రేపల్లె చేరి తన విద్యాలయాన్ని సంస్కృత కళాశాలగా రూపాంతరం చెందించి 1969-75 వరకు ప్రిన్సిపాల్ పదవిని అలంకరించి కళాశాల అభివృద్ధికి తోడ్పడ్డారు .గర్వాహంకార, అసూయాదులు లేని శాస్త్రిగారు పదవీ విరమణ తర్వాత కూడా అక్కడే బోధనలు చేసి తన అపార జ్ఞాన సంపదను విద్యార్ధులకు అందజేసేవారు .

భారత,భాగవత ,రామాయణాలను పురాణాలుగా ఎన్నో సార్లు శాస్త్రిగారు ప్రవచనం చేశారు .1960లో శంకర విద్యాలయం లో శాస్త్రి గారు భాగవత ప్రవచనం చేయగా పులకించిన శిష్యులు ,రేపల్లె పురాజనులు ‘’సువర్ణ ఘంటా కంకణ ‘’పురస్కారాల౦దజేసి ధన్యులయ్యారు .గుంటూరులో ‘’వేద ప్రవర్ధక విద్వత్ సభ ‘’కార్యాలయం లో నాలుగేళ్ళు శాస్త్రి గారి చేత ఉపనిషత్ భాష్య ప్రవచనం చెప్పించారు .

కావ్య రచన

విద్యార్ధి దశలోనే  నారాయణ శాస్త్రిగారు సంస్కృతం లో ‘’సుబ్రహ్మణ్య విజయం ‘’అనే ఏకాంకిక నాటకం రాశారు .ఇందులో శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారి విద్యా విజయాన్ని కదా వస్తువును చేసి గురు ఋణం తీర్చుకొన్నారు .కాని ఇది అముద్రితం అవటం మన దుర దృష్టం .పొన్నూరులో ఉండగా కాళిదాసు’’అభిజ్ఞాన శాకుంతలం ‘’ను తెలుగులో రచించి ‘’కవి కులగురువు’’పై తమకున్న ఆరాధనా భావాన్ని తెలియ జెప్పుకున్నారు .ఇది ఇతర ఆంధ్రానువాదాల కంటే మేలు బంతి .అందుకే మూడు సార్లు ముద్రణ పొందింది .చాలా విశ్వ విద్యాలయాలలో పాఠ్యాంశమైంది .’’అంగద రాయ బారం ‘’అనే ఖండ కృతి తెలుగులో రాశారు. శ్రీ పరాశరం కృష్ణ మాచార్యుల గారితో కలిసి ‘’ఆపస్తంభ ‘’,లౌగాక్షి గృహ్య సూత్రాలు ‘’ను ఆంధ్రీకరించగా విఖనస గ్రంధ మండలి ప్రచురించారు .

పుత్ర సంజీవన కావ్యావిర్భావం

శాస్త్రి గారి మూడవ కుమారుడు శివరామ కృష్ణ మహా బాల మేధావి .తండ్రిగారుచెబుతూండగానే’’ అమరకోశం మొదటికాండ’’ నోటికి వచ్చేసింది .రెండవ కాండ మొదలు పెట్టాడు శ్రీ లంకా శ్రీమన్నారాయణ గారి వద్ద మొదటి తరగతి చదివి రెండవ తరగతిలో చేరి ఇరవై ఎక్కాలు బట్టీ పట్టాడు ఈ 5 ఏళ్ళ బాల కిశోరం .ఈ కుర్రాడు తనంత పండితుడవుతాడని శాస్త్రి గారు ఉప్పొంగిపోయేవారు .ఆతని తెలివి తేటలకు మిగిలిన శిష్యులు ఆశ్చర్య పోయేవారు .విధి వక్రించి ఈ  బాలుడు అయిదేళ్ళ రెండు నెలలకే తలిదండ్రులకు గర్భ శోకం మిగిల్చి మరణించాడు .

ఈ శోకాన్ని దాచుకోలేక శాస్త్రిగారు సంస్కృతం లో ‘’పుత్ర సంజీవనం ‘’అనే కావ్యాన్ని రాశారు .’’శోకం శ్లోకం ‘’గా మారి వారి శోకం ఉపశమించింది .శ్రీకృష్ణ బలరామ కుచేలురు సా౦దీపని మహర్షి శిష్యులు .సాందీపుని కుమారుడు చనిపోతే కృష్ణుడు గురు దక్షిణగా ఆకుమారుని బ్రతికించి తెచ్చి అప్పగించి గురు ఋణం తీర్చుకొన్న కద.ఈ కావ్యం రాసిన తర్వాత శాస్త్రి గారికి మళ్ళీ మగ పిల్లాడు పుట్టి ఆనందాన్ని కలిగించాడు .ఈ  కుర్రాడికి ‘’శ్రీ కృష్ణ ప్రసాద్ ‘’అనే పేరు పెట్టుకొని సంతృప్తి చెందారు .శాస్త్రిగారి మేనల్లుడు మూడేళ్ళ వయసులోను , ఆ  పిల్లాడు అయిదేళ్ళవయసులో చనిపోగా ,పెద్ద దౌహిత్రుడు తొమ్మిదేళ్ళకే మరణించి ఆకుటుంబం లో శోకం నింపారు .కావ్యాన్ని అంకితం ఇచ్చే  ‘’స్వస్రీయ పుత్ర దౌహిత్ర —‘’అనే శ్లోకం లో పాపక్షయార్ధంగా కావ్యాన్ని పరమాత్మకు అంకితమిస్తున్నట్లు తెలిపారు .

చతుర్దాశా పాదక గురు పూజోత్సవం ‘’

స్వంత కాలేజిలో పదవీ విరమణ తర్వాత శాస్త్రిగారు ఇంటి వద్దే విద్యా బోధనా చేయటం ప్రారంభించారు .1982లో ఆరోగ్యం దెబ్బ తిన్నది .అప్పటికి రిటైర్ అయి పదేళ్ళు అయినా పెన్షన్ శాంక్షన్ కాలేదు .కావ్యం ముద్రణ జరగలేదు .ఈ రెండూ మనోవ్యధకు గురి చేశాయి .ఈ పరిస్తితి గమనించిన  యాభై ఏళ్ళుగా శాస్త్రి గారి వద్ద విద్య నేర్చిన శిష్యబృందం అందరూ కలిసి ఒక సారి కలుసుకో వాలి అని భావించి ,శాస్త్రిగారికి ఆ సందర్భంగా సన్మానం చేయాలని నిర్ణయించారు ‘’దీనికి’’ విద్యా చతుర్దశా పాదక గురు పూజోత్సవ ‘’సన్మానం’’అని పేరుపెట్టి 10-8-86ఆదివారం రేపల్లె సంస్కృత కాలేజి లో జగన్మొహనం గా నిర్వహించారు .’’రుద్రాభిషేకం ‘’తో ప్రారంభించారు .మధ్యాహ్నం రెండుగంటలకు శిష్యులతో శ్రీ శాస్త్రి గారి ‘’వాత్సల్య గోష్టి ‘’నిర్వహించారు .సాయంత్రం అయిదుగంటలకు వేదపండితులచే శాస్త్రిగారికి మహదాశీర్వచనం చేయించారు .మంగళ వాద్యాలతో శాస్త్రిగారి దంపతులను స్వగృహం నుండి ఊరేగింపుగా కాలేజికి సగౌరవంగా తోడ్కొని వెళ్ళారు .రిటైర్డ్ హై కోర్ట్ న్యాయమూర్తి శ్రీ గొల్లపూడి వెంకటరామ శాస్త్రి గారు అధ్యక్షత వహించిన సభలో శాస్త్రిగారి వైదుష్యాన్ని వక్తలు బహువిధాల ప్రస్తుతించారు .బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు శాస్త్రి  గారి దంపతులకు శుభాశీస్సులు పలికి ‘’విద్యా చతుర్దశా పాదుక ‘’అనే ఇదివరకెన్నడూ ఎవరికీ ఇవ్వని కొత్త బిరుదును అందజేసి సత్కరించారు .శాసన సభ్యులు శ్రీ యడ్ల వెంకట్రావు శాస్త్రిగారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు .మచిలీపట్నం ఆంద్ర జాతీయ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు బ్రహ్మశ్రీ  భాగవతుల కుటుంబ రావు గారు ‘’పుత్రసంజీవనం ‘’కావ్యాన్ని ఆవిష్కరించారు .శిష్య బృందం శాస్త్రి గారిపై  ప్రశంసా  పద్య కుసుమాలు సమర్పించారు .

తర్క వేదాంత సామ్రాట్ ,దర్శనా చార్య బ్రహ్మశ్రీ  మద్ద్దుల పల్లి మాణిక్య శాస్త్రి ,అభినవ సరస్వతీ కంఠాభరణ,ఉపన్యాస కంఠీరవ శ్రీ ప్రభాకర శ్రీ కృష్ణ భగవాన్ గార్లు శాస్త్రిగారి సంస్కృత సాహిత్య వ్యాప్తిని బహుదా ప్రసంశించారు .’’శిష్య ప్రశస్తి ‘’అనే కార్యక్రమం లో శిష్యులు అభిమానులు పెద్దలు శాస్త్రి గారి దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించారు .

నారాయణ   శాస్త్రిగారు శ్రీ ప్రమోద నామ సంవత్సర  వైశాఖ బహుళ త్రయోదశినాడు  22-5-1990న 72 ఏళ్ళు సార్ధక జీవనం చేసి శ్రీకృష్ణ గోలోకం చేరుకున్నారు .  .

ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారి ‘’పుత్ర  సంజీవనం ‘’కావ్య విశేషాలు

శ్రీ కృష్ణునికి కావ్యాన్ని అంకితమిస్తూ శాస్త్రిగారు

‘’స్వస్రీయ –పుత్ర –దౌహిత్రైః-వియోక్తోహం యదేనసా –సమూల మేనస్తద్ధగ్ధుం –క్రుతిః కృష్ణాయ దీయతే ‘’అని శోక శ్లోకం చెప్పారు .శ్రీ కృష్ణుని పాదాబ్జాలను నమ్ముకొని భవ భ్రాంతి రహితంగా ఉంటానని రెండవ శ్లోకం చెప్పారు –‘’

శ్రీ భాగవతుల కుటుంబరావు గారు కావ్యాన్ని చక్కగా విశ్లేషించారు అందులోని విషయాలను మీకు తెలియ జేస్తున్నాను .

‘’నతి ర్భూయాస్తే స్తు శ్రుతి శిఖర సంభావ్య మహిమన్ –రతిస్వచ్చారిత్రే భవతు మధునో ప్యాహితరవే

క్రుతిర్మే హ్రుత్పద్మే తవ వసతు లక్ష్మీ సహచరీ –మతిస్త్వ త్పాదాబ్జే విహరతు భవ భ్రాంతి  రహితా ‘’

కాళిదాసుని కుమార సంభవం లోక సహజం అయితే శాస్త్రిగారి పుత్ర సంజీవనం అతిలోక అభి నందనీయం .వ్యాస భాగవతం లోని 32 శ్లోకాలు దీనికి ఆధారం .దీన్ని 426వృత్త శ్లోకాలుగా పెంచి రాశారు .మూలం లో కద మహా వేగం గా సాగితే శాస్త్రి గారు కళ్ళాలు బిగపట్టి దారిలోని దృశ్యాలను చూపించారు .సముద్ర వర్ణన సముద్ర యాత్ర స్నానం సముద్రుడు బల రామ  కృష్ణు లకు చేసిన పూజ,యమ మందిర వర్ణన చూపించారు బలరామ  కృష్ణు లకు గురువు సాందీపని మహర్షి ఇచ్చిన ఉపదేశాన్ని వివరంగా రాశారు .ఇది చదివితే మన ప్రాచీన విద్యా వైభవం ఏమిటో తెలుస్తుంది .ఆయన నేర్పిన విద్య పరాపరాలకు సంబంధించింది సమన్వయ విద్య .భాగవతం లోని క్రిష్ణలీలలను సంగ్రహం గా చెప్పారు .శ్రీ కృష్ణ లీలలను అరవై మూడు శ్లోకాలలో వర్ణించారు .పుత్ర సంజీవనం మానవ సాధ్యమైన విషయం .కాదు అతి మానుషం కనుక కృష్ణ మహిమలను అంతగా చెప్పాల్సి వచ్చింది .గురుపత్ని శ్రీ కృష్ణ బాల్య క్రీడలని గుర్తు  చేసుకొని తన మాత్రు వాత్సల్యాన్ని ప్రకటించింది .దీనివలన వారి పుత్ర శోకం కొంత మేరకు తగ్గింది .‘కావ్యం లో సముద్రుని ప్రసక్తి రెండు సార్లు వస్తుంది .అ౦దుకే బల రామ కృష్ణు లను చూసిన సముద్రుడు  తనకు ఆ అవతారాలకు గల సంబంధం గుర్తుకు వచ్చింది .సోదరులిద్దరు కనపడగానే అయాచితం గా భక్తితో సముద్రుడు నమస్కరిస్తాడు .ఇది లోక సహజ౦.వారొచ్చిన పని అడిగి తెలుసుకొన్నాడు

భాగవత కధలో యమ లోక వర్ణనం లేదు .శాస్త్రిగారు అతి లోక సహజంగా వర్ణించి యముడు బ్రహ్మ విద్యా చార్యుడని గుర్తు చేశారు .యముడి చేత షోడషోప  చార పూజలు చేయించారు .సా౦దీపుడు కాశిలో జన్మించటం చేత శాస్త్రిగారు కాశీ ,అవంతీ పుర(ఉజ్జయిని) వర్ణనలను తృప్తిగా చేశారు .సాందీపుని ఆశ్రమం ,శిష్యుల ప్రవ్రుత్తి ,ఆశ్రమ గురువులపై పురజనులకుండే గౌరవం శిష్యుల  భక్తి మొదలైనవి రమ్యంగా వర్ణించారు .మూలం లో కొద్ది శ్లోకాలో ఉన్న కుచేలోపాఖ్యానాన్ని పెంచి రాశారు .కనుక శాస్త్రి గారి కల్పనలన్నీ ఔచితీ యుతాలే అయ్యాయి .

‘’అస్త్యుత్త రస్యాం దిశి దేవతాత్మా ‘’అనే కాళిదాసు శ్లోక మొదటిపాదాన్ని తీసుకొని ‘’కాశీతి విశ్వేశ్వర రాజదానీ ‘’అని కాశి శ్రీ విశ్వేశ్వర రాజధాని అన్నారు .ప్రబంధ లక్షణం అయిన పురవర్ణన చేశారు .సాందీపుని వర్ణన పరమ రమణీయం .కృష్ణుడు యముడికి ఉపనిషద్విజ్ఞానం బోధించటం గొప్ప విషయం .ఉల్లేఖ ,పరికర ,కావ్య లింగాలంకారాలతో కావ్యానికి శోభ తెచ్చారు .అర్దా౦త రన్యాస వినియోగంలో భర్తృహరి గుర్తుకొస్తాడు .సాందీపని ఉదాత్తత గంభీరం .

శాస్త్రిగారి కవితా గీర్వాణం

పుత్ర శోకం

కుమారుడు సముద్రం లో మునిగి చనిపోయాడని తెలుసుకొన్న సాందీపని దంపతుల శోకం వర్ణ నాతీతం –‘’అధ మోహ వశం వాదా ఉభౌ –వివిధోపాయ విబోధతే  సుతం –అవధార్య నిమగ్న మర్ణ వే–పతితౌ తావపి శోక సాగరే ‘సముద్రం లో మునిగి చనిపోయాడని తెలుసుకొన్న ’మూర్చ పోయిన దంపతులు మళ్ళీ శోక సముద్రం లో మునిగిపోయారు .కొడుకు ఇల్లంతా తిరుగాడే దృశ్యం జ్ఞాపకానికి వచ్చి వారికి ఇల్లంతా అగ్ని ఆవహించినట్లని పిస్తోంది .శాస్త్రి గారు కుమారుని పోగొట్టుకొన్న దుఖం కూడా ఇలాగే ఉంది .అందుకే ఈకావ్యం రాసి ఊరడింపు చెందారు .

‘’తనయా నునయామి మాననీయే –ననుతే  యుక్తమభాషణం మయీత్దం –వితరామృత వాహినీం గిరం –పితరావద్య విచేత నానభూవ ‘’

‘’కొడుకా! మాతో మాట్లాడు .చైతన్య౦  లేని మాకు నీ మాటలు అమృతపు సోనలౌతాయి .’’అని దుఃఖ పడ్డారు .ఈ దుఖం గురువు  కు శాస్త్రిగారికీ సమానమే .అందుకే అంత గొప్పగా చెప్పగలిగారు .వ్యాసభగవానుడు ప్రత్యక్షమై ‘’శివుడు అనే పేరుగల నీ కొడుకును శివునిగా మనసులో భావించు .ఆ పరమాత్మ మీ ధ్యానానికి కనికరిస్తాడు ‘’అని ఓదార్చాడు .

ఆశ్రమ వాసం

బలరామ కృష్ణులు సాందీపని మహర్షి ఆశ్రమానికి చదువుకోవటానికి వచ్చారు. తమను తాము పరిచయం చేసుకొన్నారు ‘’నమోస్తు వాగంబుధి సాగరాయ-నమోస్తు విజ్ఞాన సమృద్ధి దయా –నమోస్తు విద్యార్ధి ద్యాఫ్లుతాయ –నమోస్తు సాందీపని సద్బుదాయ ‘’అని కీర్తించారు ..అక్కడి మునిబాలకుల నిత్య కృత్యాన్ని తెలుసుకొన్నారు .

ఇతర శిష్యులు లాగే అడవికి వెళ్లి దర్భలు, సమిధలు ఏరుకోస్తున్నారు కుచేలుడు, సోదరులు .ఒక రోజు అకస్మాత్తుగా ఆకాశం మేఘా వ్రుతమైంది ‘’ధారా దరైరావ్రుత మ౦త రిక్షం –గర్జద్భిరుచ్చై స్చపలా విలాసైః-తమస్సహాయై రపపాత్ర భావం –వర్షద్భి రాశా పరిపూర్ణ రూపై’’ –తాత్కాలిక సౌభాగ్యానికి గర్వించి గర్జిస్తూ తామసం తో యోగ్య భూమి అని తెలియ కుండా వ్యర్ధ దానానికి పూనుకొని మేఘాలు ఆకాశం కమ్మాయి .చక్కని భావం తో రాసిన శ్లోకం .తలల మీద దర్భల మోపులు ,పాదాల నిండా ముళ్ళు ,దారి కనపడక నడుస్తుంటే మెరుపులే దారి చూపిస్తున్నాయట.శిష్యులు రాకపోవటం తో కలత చెంది ,ముని వారిని వెదకటానికి వెళ్ళాడు .వారు కనిపించగా పరమానందం కలిగి ఒక కద జ్ఞాపకం చేసుకొన్నాడు .’’పూర్వం ఉపమన్యుడు అనే శిష్యుడు గురువు భిక్షాటనం చేయవద్దని నిషేధిస్తే జిల్లేడాకులు తిని గుడ్డి వాడై ,దారి తెలియక ఒక పాడు బడిన బావిలో పడి గురు దయకు పాత్రుడయ్యాడు .వీళ్ళను చూస్తె ఆ కద జ్ఞాపకం వచ్చిందట ఆయనకు .అంత దయాళువు సా౦దీపనిముని .

సమస్త శాస్త్ర బోధనం

గురు బోధ ఎలా ఉందొ చూద్దాం –‘’విశ్వ రూప మభవద్యదాత్మనో –వాజ్మయం ప్రణవతస్తదా ఖిలం –స ప్రతీక మమలస్య చాత్మనః –స ప్రసూతి రాఖిలాగమాధ్వనః ‘అని ఓంకార రహస్యం చెప్పాడు ముని ‘’పరమాత్మ నుంచి ప్రపంచం ఏర్పడినట్లు ,ఓంకారం నుండి సకల వాజ్మయం ఆవిర్భవించింది .ఇదే సగుణ ,నిర్గుణ బ్రహ్మాన్ని చేరటానికి ఆలంబనం .వేదమార్గానికి మూలం .చిన్న చిన్న మాటలతో గొప్ప అర్ధాన్ని పొదిగారు శాస్త్రి గారు .అలాగే నాలుగు వేదాల ఆవిర్భావం ,శిక్షా వ్యాకరణ ఛందస్సులు నిరుక్త జ్యోతిష కల్పాల గురించి బోధించాడు .పురాణ దర్శన యోగ ,సాంఖ్యాల వివరాలు ఎరుక పరచాడు .మీమాంసా దర్శన కామ గాంధర్వ ,ధనుర్వేద అర్ధ శాస్త్రాలను బోధించాడు .ఉదకవాద్యం గురించి ,ఉదకాఘాతం గూర్చి పూలమాలలను గుచ్చటం,వంటకళ మొదలైన సమస్తకళలు వారికి నేర్పాడు .’’సూత్ర క్రీడా’’ అనే తమాషా ఆటను నేర్పాడు ‘’నాళికా రచిత సూత్రా మంతరాః-చేద దాహ విధి మాచర న్నపి –నిర్వికార ముప దర్శయే ద్యది –క్రీడనాయ విహితా కళా హ్యసౌ ‘’గొట్టం మధ్య లోంచి దారాన్ని పోనిచ్చి ,ఆగోట్టాన్ని మధ్యలో తెంచినా కాల్చినా దారం చివరదాకా వచ్చే ఆట ను సూత్ర క్రీడా అంటారట. అది నేర్పాడు మహర్షి .పొడుపుకధలు ,అంటే ‘’ప్రహేళిక ‘’లను నేర్పారు .నోటికొచ్చిన పద్యాలను పరీక్షించుకొనే  ‘’ప్రతిమాలా ‘’కళ ను చెప్పాడు .అంటే మన అంత్యాక్షరి అన్నమాట .శబ్దం అర్ధం కష్టతరం గా ఉండి  ధారణ చేయటానికి అలవికాని పద్యాలను రాసే ‘’దుర్వాచక యోగ కళ’’బోధించాడు .సమస్యా పూరణం, నాటకం నేర్పాడు .దాతు వాదం ,వాస్తు విద్య ,వృక్షాయుర్వేదం ,శుక శారికా ప్రలాపం ,’’మేష కుక్కుట లావక యుద్ధ విధి ‘’అంటే గొర్రెలు ,కోళ్ళు ,పక్షులకు సంతోషం కలిగించే ద్యూత విద్య .అంటే మహర్షి నేర్పని విద్య లేనేలేదు .అది సా౦దీపమహర్షి విద్యా విధానం .ఆయన దగ్గర చదివితే విద్యార్ధి పరిపూర్ణుడు అవుతాడు .లోకజ్ఞానం అధ్యాత్మజ్ఞానం ,అన్నీ అబ్బి సర్వ సమర్దుడవుతాడు .శాస్త్రిగారి కున్న జ్ఞానం అపారం అని మనకు దీని వలన అర్ధమవుతుంది .

శ్రీ  కృష్ణ లీలలు

ముని పత్ని శ్రీ కృష్ణ లీలలు జ్ఞప్తికి తెచ్చుకొని చనిపోయిన తనకుమారుని బాల్య చేష్టలను నెమరు వేసుకొన్నది ‘’కృష్ణేన ద్రుష్ట విష పన్నాగభోగ పాశా-కృస్టేన.సాశ్రు నయనేః నిజ బంధు వర్గైః-ద్రుస్టేన ఫాద విధి ఘట్టన భగ్న భుగ్న –భ్రస్టాసృగాతత ఫణాసుకిమప్య వర్తి ‘’అంటూ క్లిస్టపదాలతో సమర్ధంగా శ్లోక రచన అతి సునాయాసంగా చేశారు .కృష్ణుడు కాళీయుని పడగలపై అద్భుతంగా నృత్యం చేశాడని భావం.గోపికా వస్త్రాపహరణాన్ని ,గోవార్ధనోద్ధరణాన్నిగుర్తు చేసుకొని రాసలీలా విలాసాన్ని ‘’కాంతా యుగాంతర గత ప్రిi క్రిష్ణి కాసు – కృష్ణ ద్వయాంతర  గత ప్రమదావృతాసు –ద్రుక్పాత శాసిత పరస్పర యష్టి పాత –పాద క్రమాసు విహ్రుతం కిల మదలీషు ‘’అనేక రూపాలతో కృష్ణుడు గోపికలతోరాస క్రీడలు చేశాడు .చాణూర,కంస వదలను స్మరించి కృష్ణుని అవక్రపరాక్రమాలను వెల్లడించింది .

గురు పుత్రుని వెదకటం

గురు పుత్రుని తీసుకు రావటానికి సోదరులు బయల్దేరి సముద్రం దగ్గరకొస్తే సముద్రుడు విష్ణు అవతారాలను గుర్తు తెచ్చుకొన్నాడు –‘’బలే రుపా హృత్య బలారయే శ్రియం –నినీషు రేష స్పుట ఖర్వా వేషయుక్  -నఖాగ్ర నిర్నేజన మాత్ర పాధసో –గాభీరతా గర్వ మపాహర నమ్మ ‘’బలి నుంచి సంపదలు హరించి దేవేంద్రునికి ఇవ్వాలనుకొని వామనావతారం దాల్చి విష్ణువు త్రివిక్రముడై ,నా లోని నీళ్ళను తన చేతి గోళ్ళను కడగ టానికి మాత్రమే సరి పోయేట్లు చేసి ,నా గాంభీర్యాన్ని పోగొట్టాడు’’ .అని సముద్రుడన్నాడు .తాను  వచ్చిన పని కృష్ణుడు చెప్పి సముద్ర  తరంగాల చేత భక్షింప బడిన గురు పుత్రుని తెచ్చిమ్మని ఆదేశించాడు .భయ పడ్డ సముద్రుడు తనలో దాగి ఉన్న’’ పంచ జనుడు ‘’అనే రాక్షసుడు భక్షించాడని చెప్పాడు .సముద్ర జలాన్ని కల్లోలపరిస్తే ఆ రాక్షసుడు బయటపడితే వాడితో యుద్ధం చేసి చంపేశాడు .వాడి శరీరం లోపల గురుపుత్రుడు కనిపించ లేదు .కాని’’ పాంచ జన్యం ‘’అనే శంఖం మాత్రం లభించింది .యమ నిరుతులవైపు సాగిపోయారుఆకాశమార్గాన రధం లో  బలరామ కృష్ణులు .

భూమికి 86 వేల ఆమడల దూరం లో సంయమనీ నగరానికి వెళ్లి యముని చూశారు .మహర్షులతో యముడు వైదిక ఉపాసనా ఫలితం మోక్షమా ,వేరేదైనా అని గోష్టి నిర్వహిస్తున్నాడు .ఆత్మ నిత్యానిత్యాలపై చర్చిస్తున్నాడు .ఇంతలో శ్రీకృష్ణ శంఖ ధ్వని విని భయ కంపితుడై ,స్వాగతం చెప్పి స్తోత్రాలు చేశాడు –

‘’జయ ప్రభో జామ్జహి జంతు సంతతే –ప్రతార యంతీ మసతీం యదా గుణైః-న శక్తి రేతాం వినిహంతుమంతరా-భావస్ప్రసాదాదితి వేదనిర్ణయం ‘’-ప్రభూ జయం .ప్రాణులను మోసగించే మాయను చంపు .నీ అనుగ్రహం లేకపోతె మేము దాన్ని చంపలేము అన్నాడు .’’తవ స్వరూపం నిగమాంత చు౦బి తం –హరుడా పరిశ్వక్తుముదార దర్మనా –ఉపాసతే త్వా ముదరే ప్యనాహతే –సహస్ర పత్రే నిగృహీత మానసాః’’-వేదాంత వేద్యమైన నీ రూపం మనసులో నింపుకొని సత్పురుషులు మణిపూరక అనాహతాలలో  సహస్రారం లో ఉపాసన చేస్తున్నారు .’’

ఈ ‘’సుత్తి ‘’ని విని సూటిగా ‘’మా గురుపుత్రుని అపహరించావు వెంటనే ప్రాణాలతో అతన్ని ఇచ్చెసెయ్యి ‘’అన్నాడు . వెంటనే  గురు పుత్రుడైన’’ శివ బాలుడి’’ని తెప్పించి కృష్ణునికి అప్పగించేశాడు యముడు .

‘’యమార్పితం ప్రాణ భ్రుతే ద పశ్యతాం –తపస్వినాం దేహ మకల్పయ ద్విభుః-చరాచరా కార సుక్ల్పనావిదః –కిమస్య మాయా మనుజస్య దుశ్శకం  ‘’ యముడిచ్చిన  ఆ జీవుడికి పూర్వం ఉన్న భౌతిక దేహాన్ని వచ్చేట్లు చేశాడు వాసుదేవుడు .సమస్తసృ ష్టి రూపకర్తకు అసాధ్యం ఉంటుందా ? సముద్రం లో మునిగితే యమలోకానికి ఎలావచ్చానని కుర్రాడు అడిగితె జరిగింది చెప్పాడు .శివ బాలుడు అడిగిన యోగి, మాయ మొదలైన వాటిని అర్ధమయ్యేట్లు చెప్పాడు .

గురు దక్షిణ గా పుత్ర సంజీవనం

భూమిమీదకు వచ్చి గురు ఆశ్రమం చేరారు .గురువుకు పుత్రుని ‘’సమర్ప మాయాస సుతం స దక్షిణా-మివ క్రతో స్సద్గురవే స దక్షిణః ‘’క్రతువు చివర మంచి దక్షిణతో ఇచ్చినట్లు గురువుకు సమర్పించాడు .శిష్యుడైన కృష్ణుని గురువు సాందీప ముని ‘’భో రామ కృష్ణ జగతీతల భాగ్య రాశీ –విద్యా విడంబన మయం మామ పుణ్య పాకః –యుష్మద్దయా రస విలాస భావశ్శివ శ్రీ –కృష్ణ ప్రసాద ఇతి సంవ్యవహార మేతు ‘’-నీకు నేనేదో విద్య నేర్పటం నా పూర్వ జన్మపుణ్య  ఫలం .నీ దయ వలన మళ్ళీ జన్మించిన శివుడనే ఈ పిల్లాడిని  ఈ రోజు నుండి ‘’కృష్ణ ప్రసాదు ‘’అనే పేరుతొ పిలుచుకొంటూ నా కృతజ్ఞతను తెలుపుకొంటాను ‘’అన్నాడు శాస్త్రి గారికి కూడా ఈ కావ్యం రాసిన తర్వాత పుట్టిన కుమారుడికి ‘’కృష్ణ ప్రసాద్ ‘’పేరే పెట్టారని ముందే చెప్పుకొన్నాం ఈ కావ్యానికి వారి జీవితానికి ఉన్న అవినా భావ సంబంధం మహోత్క్రుస్టం .

.

కావ్యం లో కరుణ రసానికి అధిక ప్రాధాన్యమిచ్చారు .వీర ,అద్భుత రసాలు అ౦గాలుగా అమరాయి .కావ్యనాయకుడు శ్రీ కృష్ణు నిలో శాంత రసం కనిపిస్తుంది .భక్తీ రసం పొంగింది కూడా .శిష్యులకు  గురు భక్తీ శుశ్రూష ఉండాలి .ఆసుర శక్తిని దైవీ శక్తి జయిస్తుంది అనే సందేశం .

కావ్యం చివర గురు దంపతులకు శ్రీకృష్ణుడు తన గోలోకాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు –‘

‘’కృష్ణో గురూక్త మనుమాన్య తదేతి సర్వం –సర్వోపరిస్తి త  మశాంత దియా మగమ్యం

రమ్యం ప్రశాంత ముపదర్మ యతి స్మదివ్యం –గోలోక మేక మనయోర్నయనోత్సవాయ ‘’గురువు కోరికపై కృష్ణభగవానుడు దివ్యమైన గోలోకాన్ని దర్శింప జేశాడు .మనసు ప్రశాంత మైనది  .కన్నుల పండువుగా దర్శించి పులకించారు .

‘’గోలోకాలోక నేన ప్రముదిత వదనశ్రీ –గురుభ్యాం గురుభ్యాం

ఆశీరర్భిః ప్రేష్య మాణౌ కృత జయ నినదై రుజ్జయిన్యా౦ జనౌఘైః-

తుస్టౌ శ్రీరామ కృష్ణావ ను కలముదయత్పుత్ర విశ్లేష  బాష్ప –స్థానా దేశం స్వ పిత్రో స్సపది విదధతుః లోచ నానాం ప్రహర్షం ‘’

గోలోక సందర్శనం చేత సంతసించిన గురు దేవుల ఆశీస్సులు పొంది ,ఉజ్జయిని జనులంతా జయ ధ్వానాలతో వీడ్కోలు పలుకగా ,తమ తలి దండ్రుల  పుత్ర వియోగ దుఖాన్ని  పోగొట్టి సంతోషం కలిగిస్తూ బలరామ కృష్ణులు ఇంటికి బయల్దేరి వెళ్ళారు .అని కద ను సమాప్తం చేశారు .ఈ చివరి అధ్యాయాన్ని ‘’విజయ విలాససర్గ  ‘’అన్నారు .అయిదవ దాన్ని ‘’లీలా విలాస సర్గ’’అని నాలుగవ దాన్ని ‘’కళా విలాస సర్గ ‘’అని మూడవ దానిని ‘’శుశ్రూష విలాస సర్గ ‘’అని రెండవదాన్ని ‘’విధి విలాస సర్గ ‘’అని మొదటి దానిని ‘’ఉదయ విలాస సర్గ ‘’అని సార్ధకం గా పేర్లు పెట్టారు .కావ్యం లో శాస్త్రిగారి భాషా ,శాస్త్ర పాండిత్యం ,అలంకార వైదుష్యం ,శాస్త్ర యోగ వేద వేద వేదాంగ రహస్య జ్ఞానం ,లోక వ్రుత్తి ,ప్రస్పుటంగా కనిపిస్తాయి శ్లోకాలు పరమ మనోహరంగా తీర్చిదిద్దారు .వారి అపూర్వ ప్రజ్ఞకు అంజలి.  .శాస్త్రిగారి కుమారులు శ్రీ జయ సీతా రామ శాస్త్రిగారు కూడా గొప్ప సంస్కృత విద్వాంసులు .నైషధం పై ‘’నైషధీయ పరామర్శ ‘’అనే సంస్కృత వ్యాఖ్యానం రాసి తండ్రి కి తగ్గ తనయుడు అనిపించుకొన్నారు .

పుష్పగిరి పీఠాదిపతులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారు ఆశీస్సుల౦దజేస్తే   ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన కవి అవధాన శిరోమణి ,విద్యా వారధి ,మహా మహోపాధ్యాయ శ్రీ కాశీ కృష్ణా చార్యులవారు –

‘’అక్షీణై ర్గురుశిక్షణై శ్శుభకరై ర్వాణీకటాక్షోత్కరై –ర్వైదుష్యం,యదనుత్తమం ,సుకవితా పుష్టం,త్వయా సాదితం

తస్యాన్త్యంత పవిత్రతా చతురతా గంభీరతా భూ,రహో –శ్రీ నారాయణ శాస్త్రి వర్య సుకవే తే’’పుత్ర సంజీవనం ‘’అని కవినీ, కవిత్వాన్ని, శేముషినీ  మెచ్చి ఆశీర్వదించారు .కావ్యానికి ‘’పుత్ర సంజీవనం ‘’అనే పేరు అన్నిరకాలా సమర్ధ నీయంగా ఔచిత్య వంతం గా ఉంది .

శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారి దంపతుల ఫోటో జత చేశాను చూడండి

మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం

సశేషం

శ్రీ వినాయక చవితి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వినాయక చవితి శుభాకాంక్షలు – వ్రత పూజ విధానం

VinayakaVratakalpam2015

 

VINAYAKA CHAVITHI1395432840vinayakachavithi

Wishing that Lord Ganesha fills your home with prosperity & fortune... Best wishes on Ganesh Chaturthi Images
 
 
 
 
11
 
ganesha_symbolism
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రత్యేక గణపతి -ధ్యాన శ్లోకం – కత్తినివదలి తంబురా పట్టిన కనక దాసు -రామకృష్ణ ప్రభ -సెప్టెంబర్

ganesh 2 001 ganesh 1 001 kanakadasa2 001 kanakadasa1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నట రాజ తత్త్వం -మూసి- సెప్టెంబర్

nataraja3 001 nataraja 1 001 nataraja2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వినాయక చిత్రం -స్వామిపై పద్యాలు -మూసి సెప్టెంబర్

musi2 001 musi1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంట్లో శారదక్కయ్య కొడుకు ఛి లక్ష్మణ్, ,కూతురు ఛి సౌ ఇందు

DSCN2369 DSCN2368 DSCN2367 DSCN2376 DSCN2375 DSCN2374

Posted in సమయం - సందర్భం | Leave a comment

బిహార్ మహా కూటమి ,అలుపెరుగని నాట్య మయూరి



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వరంగల్ వద్దంటున్న గద్దర్ -లావణ్య పధం ,ఉద్రేకాలు రెచ్చగొట్ట తగునా


 
 

 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఖేలానందం పేస్ జోడి విజయం


 
 

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిశ్రమలకు AP నంబర్ -2


 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment