రాముడి ఈవితాన్నే మార్చేసిన మాయా జింక రూప మారీచుని అరుపు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాజకీయభోగరాజు పట్టాభి సీతారామయ్య

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

28 -11- 15 శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బాచుపల్లి లోని మా రెండవ అబ్బాయి శర్మఇంటిదగ్గరలో బావమరది ప్రసాద్ ,కళా దంపతులు కొత్తగా కొన్న స్వగృహం లో మాకు ఆతిధ్యం 

28 -11- 15 శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బాచుపల్లి లోని మా రెండవ అబ్బాయి శర్మఇంటిదగ్గరలో  బావమరది ప్రసాద్ ,కళా దంపతులు కొత్తగా కొన్న స్వగృహం లో మాకు ఆతిధ్యం

Posted in సమయం - సందర్భం | Leave a comment

రామారావు గూడెం బంధువు ఛి సౌ కల్పన దంపతులబాచుపల్లి స్వగృహం లో27-11-15 సాయంత్రం మేము

This gallery contains 34 photos.

More Galleries | Tagged | Leave a comment

అంబేద్కర్ జపం లో అసహజ ధోరణులు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మజ్యోతి – డిసెంబర్ – సంచిక – శ్ర్రీ రామాలయం – భద్రాచలం

http://www.samskruti.org/people/ramora/ramoraindex.htmlAatmajyothi Dec 2015 for Web
0066
0067

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 21-తిరుచానూర్ కృష్ణ కవి

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

21-తిరుచానూర్ కృష్ణ కవి

తిరుపతి దగ్గరున్న అలివేలు మంగాపుర(తిరుచానూర్ )) నివాసి చిరుచానూర్ కృష్ణకవి .కవికాలం తెలియదు .’’సత్యభామా పరిణయం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .శేష నరసింహ కుమారుడు కృష్ణ కూడా ఇదే పేరుతొ నాటకం రాశాడు .కృష్ణకవి కవిత్వం మచ్చుకి –

‘’లక్ష్మీ మండ కురయాత్యసో శశికళా చూడావ చూడాయితా –శంభోర్య ప్రధమాన విభ్రమ భ్రుతః

వవ్రే సర్వ సురాసురస్య మిష తః స్పర్ధవతః కోమలా –రుడేశ్వర్యమనాన్య తుల్యా మమ్రుతో త్మాధో త్సవే శడంకరం ‘’

కవి పేరు తెలిపే శ్లోకం

‘’ద్ద్రాక్షా వీక్ష ప్రతీ సుక్రుదయ సరసతాభి శ్రురిశ్రుశ్వ సాక్షాత్ –నీచా మోచపి వాచాం మధురి మధురి సా పాద దూలిర్మదూ లిః

పీయూషం యోష వేషం వహతి నవ పాయో జోష మస్తో స ఏష –ధ్వన్యా ధ్వన్య ధ్వనీనో భువి జయతి తరాం కృష్ణ నామా కవీన్ద్రః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26 -11 -15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం )

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం )

శేషం(శేష ) వారు గొప్ప విద్వత్ కుటుంబానికి చెందినవారు. గోదావరిజిల్లాకు చెందిన శేషం నరసింహ వారణాసికి 16 వ శతాబ్ది మొదట్లో  వెళ్లి బెనారస్ దగ్గరున్న తాండవ రాజ్యమేలే గోవింద చంద్రుని ప్రాపు సంపాదించాడు .ఆ కాలం లో మహా వ్యాకరణ వేత్తగా ప్రఖ్యాతుడు .అక్కడ వ్యాకరణ విద్యాలయం స్థాపించి నేర్పాడు .ఇందులోచదివిన వారిలో భట్తోజీ నాగోజీ లున్నారు .నరసింహుని ఇద్దరుకోడుకులు చితామణి,కృష్ణ లు గొప్ప విద్యావేత్తలు రచయితలూ .కృష్ణ కుమారులు  వీరేశ్వరుడు నారాయణుడు .ఇందులో వీరేశ్వరుడు పండిత రాజు భట్టోజి ,అన్నం భట్టు లకు గురువు .శేషా లేక శేషం కుటుంబం వారణాసి వాస్తవ్యులైనా ఆంధ్ర దేశీయులే .

శేష కృష్ణ గిరిధారి అనబడే గోవర్ధన దారి అక్బర్ ఆస్థానం లో ఆర్ధిక మంత్రి అయిన రాజా తోడర్ మల్ కుమారుడు . కనుక కృష్ణ కవి 16 వశతాబ్దం చివరిదాకా 17 వశతాబ్దం ప్రారంభకాలం దాకా జీవించి ఉండ వచ్చు .ఈ కవి కంస వధ  మురవిజయం ,ముక్త చరిత్ర సత్యభామా పరిణయం అనే నాటకాలను ,పారిజాత హరణం ,ఉషాపరిణయం ,సత్యభామా విలాసం ,క్రియా గోపన రామాయణం చంపూ కావ్యాలు రాశాడు .ఇవికాక ప్రక్రియా ప్రకాశంఅనే వ్యాఖ్యను రామచంద్ర విరచిత ప్రక్రియా కౌముది పై రాశాడు  ,స్ఫోటత్వం ,యంగ్లు ఘంటా శిరోమణి అనే వ్యాకరణ గ్రంధాలను ,శేష కృష్ణ కారిక రచించాడు కాని లభ్యమైనవి కంసవధ నాటకం ,పారిజాతహరణం చంపు మాత్రమే .

కంస వధ 7 అంకాల నాటకం .1588 లో రాశాడు .భాగవత కద.గురువు గిరిధారి ప్రోద్బలం తో రాసినట్లు చెప్పాడు

‘’తస్యాస్తి తండన కులామల మండస్య శ్రీ తోడర క్షితి పతే స్తనయో న్యాజ్ఞః –ఆనాకలా కుల గృహం స విదగ్ధ గోస్టీమేఖో దితి గురుర్గిరి దారీ నామ్నా ‘’

ఈ నాటకాన్ని కాశీ విశ్వేశ్వర ఉత్సవాలలో ప్రదర్శించేవారు .సూత్రధారుడు కవిని పరిచయం చేస్తాడు .మహా వ్యాకరణ వేత్త అయిన కృష్ణకవి వ్యాకరణ జ్ఞానం లేక పొతే యెంత గోప్పకవినైనా లోకం చులకనగా చూస్తుంది అన్నాడు

‘’రసాలంకార రసాసపి వాణీ వ్యాకర ణోజ్నితా-రివత్రేవనం రంజయతి సజ్జనాన్ ‘’

సాధారణం గా అన్ని శ్రవ్యకానాట కాలు లాకుండా ప్రదర్శన యోగ్యం గా ఉంది .మొదటి అంకం లో కంసుడు ఆకాశవాణి చెప్పింది విని కృష్ణుడిని సంహరించే అన్ని విధానాలు అమలు చేయమని ఆజ్ఞాపిస్తాడు .రెండవ అంకం లో కృష్ణలీలలు శకటాసుర ,కేశిని పూతన సంహారాలు ఉంటాయి .మూడవ దానిలో కంసుడు బలరామ కృష్ణు లను మధురకు ఆహ్వానించి చంపే కుటిల ప్రయత్నం చేయటం ఉంది .నాలుగవ అంకం లో శ్రీకృష్ణ బలరామూల మధురానగర ప్రయాణం ,యమునా ,గోకుల బృందావన వర్ణన ,చెలికత్తె విలాసవతి ద్వారా రాధ కృష్ణుడి కి  పంపిన సందేశం ,రాసక్రీడ ఉంటాయి .అయిదులో బలరామ కృష్ణులు చాకలి నుండి బట్టలు తీసుకోవటం సుదాముని ఆతిధ్యం ,కుబ్జకు సుందర రూపమివ్వటం ,మధురానగర ప్రవేశం ఉన్నాయి ఆరు లో కువలయాపీడ ఏనుగును చాణూర మర్దన మల్లులను చంపటం ,చివరికి కంస వధ ఉన్నాయి .ఏడవ చివరి అంకం లో దేవకీ వసుదేవులను కంసుని చెరనుండి విడిపించటం ,ఉగ్రసేనుడిని  రాజుగా అభిషిక్తుడిని చేయటం తో నాటకం పూర్తవుతుంది .

శేష కృష్ణ కవితా ప్రతిభ ఆద్యంతం కనిపిస్తుంది .కవికి జ్యోతిశ్శాస్త్రం లో ప్రవేశామున్నట్లు అర్ధమౌతుంది .బలరామ కృష్ణులు మధురకు బయల్దేరే ముహూర్తం దివ్యంగా ఉండేట్లు దైవజ్నుని చేత చెప్పించాడు .కాలిందీ నది సోయగాన్ని కమనీ యంగా వర్ణించాడు –

‘’పశ్యన్నేతాం చపల శఫరీ లోచనాంపంకజస్య –కోక ద్వంద్వస్తన భారనతాం బాల శైవాల కేశీం.

భ్రున్గశ్రేణీ మధుర వచనాం రాజ హంస ప్రచారం –వ్యాసక్తో పిక్షణమిహ పునః ప్రేయసీం స్మరితోస్మి ‘’

రాధ విరహ వేదనను పరమాద్భుతంగా విలాసవతి చేత చెప్పించాడు –

‘’మాలా వ్యాలానుకారా పరిమళ బహుళ స్నిగ్ధ చంపాను శంపా –పంపా కంపానిలోస్యా మలయా జని లయాశీ విషోద్గర ఘోరః

నస్యా దస్యా విభవ్య జ్వరమిహ కత మస్యో త్సకంపాను కంపా -ఝంపా సంపాత జగ్ర త్రుహిన కర హరి ప్రోద్గమో న్నాస భాజః ‘’

‘’పారిజాత హరణ చంపు ‘ను  తాండవ రాజు సోదరుడు నరోత్తముని ప్రేరణ పై రాశాడు –‘’

‘’సానందం మకరంద బిందు నికర ప్రస్యంద బందీ భవన్ –మందీ భూతి మిలింద  తు౦దిల దలన్మందార మందాదరం

భూయః సౌరభ లోభ సంభ్రమ భరాత్  భ్రుంగీ భిరంగీ కృతే –భామాయః కిల పారిజాత కుసుమే జీయాత్రుష్ణ౦ మనః ‘’అలాటి దివ్యపారిజాతాన్ని కోరకుండా ఎవరు ఉండగలరు .నందితిమ్మనతెలుగులో రాసిన ‘’పారిజాతాపహరణం ‘’ను  శేష కవి బాగా అధ్యయనం చేసి రాసినట్లు కనిపిస్తుంది .దీని పై  నంది కవి ప్రభావం అడుగడుగునా ఉంది .గంభీర రచనలో సిద్ధ హస్తుడైన కవి అతి సరళంగా సుందరంగా పారిజాత సుమాల౦త కోమలంగా కవిత్వం చెప్పాడు . తిమ్మన పద్యాలను ఒకరకంగా సంస్క్రుతీకరించాడని చెప్పచ్చు .సత్యభామ కోపాన్ని అనునయించే కృష్ణుడి పాట్లు –

‘’త్వం చంద్రికా చేత్తదహం చకోరే స్త్వందీపికా చేత్తదహం ప్రకాశః –కాదిమ్బినీ త్వం యది చాతకోహం ,మా మన్యదా మానిని మా స్మబుద్ధః ‘’.

మిగతా పారిజాత కావ్యాలలో పుణ్యక కవ్రతాన్ని వివరంగా వివరిస్తే మన శేష కవి ఒకే ఒక శ్లోకం లో చెప్పేశాడు –‘’

‘’అమర ముని సమాజే తత్ర సాత్రాజితీ సా గురుభి రధ నియుక్తా నారదాయా ర్చ యిత్వా –అదిత విదిత పుణ్యో పుణ్యకే పారిజాతం విదివదఖిల భర్త్రా వాసు దేవేన సార్ధం ‘’

ప్రతి సర్గ చివర్లో తన పోషకరాజు పేరును ప్రస్తావించాడు శేష కృష్ణ పండితకవి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27 11 15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

‘’

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

26 -11 15 గురువారం -మధ్యాహ్నం -హైదరాబాద్ -సెక్రెటరి కాలనీలో మా బావ మరది ఆనంద్ స్వగృహం లో

26 -11 15 గురువారం -మధ్యాహ్నం -హైదరాబాద్ -సెక్రెటరి కాలనీలో మా బావ మరది ఆనంద్ స్వగృహం లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి

బొబ్బిలిలో సుసర్ల చాయాంబ ,సుబ్రహ్మణ్య లకు కామ శాస్త్రి జన్మించాడు .బొబ్బిలి రాజు రంగారావు బహద్దూర్,వెంకట గిరి రాజా  ఆస్థానకవి .వెంకట గిరిలో వెలుగోటి వెంకట కృష్ణ యాచేంద్ర కు ప్రీతిపాత్రుడై ,ఆయన సలహాతో ‘’గిరికా కళ్యాణం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .దీని మాతృక తెలుగు లో రామ రాజ భూషణుడు రాసిన ‘’వసు చరిత్ర ‘’ప్రబంధం .వసుచరిత్రను ముందుగా సంస్కృతం లో అనువాదం చేసినవాడు కాళహస్తి కవి అని మనకు తెలుసు .శ్రీధర పేరి సూరి దీనినే ‘’వసుమంగళనాటకం ‘’గా రాశాడు .బాబానృపాలుడూ ఇదే పని చేశాడు .కామ శాస్త్రి ఆ కోవలో మూడవ వాడయ్యాడు .

కామ శాస్త్రి ఈ నాటకం లో కొన్ని కొత్త పాత్రలను ప్రవేశ పెట్టాడు కొన్ని మార్పులూ చేశాడు .నాటక శాస్త్ర మర్యాదలనన్నిటి కి సమాధానం గా కోత్త  సా౦కేతికతో దీన్ని చేశాడు .కాని టెక్నాలజీ యే మిగిలింది కానీ నాటక కళ  దెబ్బతిని పోయింది .నాందీవాక్యం –‘’శ్రేయసే భూయసే భూయా ద్రాజ చూడామణి గిరావః –గిరిజా వదనా౦ భోజ చంచరీక ద్రుగస్చలః .’’

అయిదు అన్కాలకు 1-గిరికా దర్శనం 2 అమరావతి ప్రస్తానం 3 మహేంద్ర కృత ప్రతిజ్ఞ 4-కోలాహల కన్యాదాన ప్రతిజ్ఞా 5 –గిరిక కల్యాణం అని పేర్లు పెట్టాడు .రామరాజకవి వాడిన శ్లేషలను  సంస్కృతం లోకి దింపే ప్రయత్నం చేశాడు .వసురాజును చూసి గిరిక లేవ బోతుటే వద్దని మర్యాదగా చెప్పిన శ్లోకం

‘’గుణాల నాలాధిక సౌకుమార్యకా –న్యనయద్రుగంబా పానల చుమ్బితానిచ –క్షామాణితన్వంగి మద్విదేషు తే మ్రుదూని గాన్నాన్యుప చార కర్మణి ‘’అని మర్యాద ఇస్తాడు .

అయిదవ ఆకం లో వసు గిరిక కల్యాణం వర్ణించాడు .అచ్చమైన తెలుగు ఇంటి పెళ్ళిలా మన పద్ధతిలోనే చేయి౦ చేశాడు పెళ్లి .ఫలశ్రుతి చెప్పాడు

‘’శ్రీ వెంకట గిరి నిలయః కరుణా రాసా వృష్టి శమిత జన తాపః –పాయాన్నః కృష్ణ ధనః సమవర్ధిత సుకృతి జన కడంబో యం ‘’

20 – మిశ్రమ భాణం రాసిన –కాశీపతి(17 20

కౌండిన్య గోత్రీకుడు ఉమాపతి పుత్రుడు కాశీపతి .1734లో మైసూరు రాజు సైన్యాధ్యక్షుడైన ఆంధ్రుడైన కలులే నాగ రాజు పోషణలో ఉండేవాడు .విలువైన 1- తన పోషకుడు నంజరాజు రాసిన ‘’సంగీత గంగాధరం ‘’ శ్రావణ నందిని అనే వ్యాఖ్యానాన్నిరాశాడు .2 –ముకున్దనందన భాణం రాశాడు .రెండింటిలోను గణపతిని ఒకే విధంగా స్తుతించాడు

‘’వందే వందారు మందార మిందు చూడస్య నందనం –అమందానంద సందోహ బంధురం సి౦ధు రాననం ‘’

వ్యాఖ్యానం లో కొన్ని చారిత్రిక విశేషాలు తెలియజేశాడు .రెండవది అయిన భాణం భద్రగిరి చూదేశ్వర ఉత్సవాలలో ప్రదర్శించేవారు .ఈ ముకుంద నందం విషయం  లో, వివరణలో వినూత్నమైనదిగా కనిపిస్తుంది .ఇది మిశ్రభాణం. .ఆ రోజుల్లో వినూత్నమైనది అరుదైనదికూడా .సంస్కృత ప్రాక్రుతాలను కలిపి రాశాడు .రాజు భుజంగ  శేఖరుడి క్రీడలు శ్రీ కృష్ణ గోపికా క్రీడల్లాగా ఉంటాయి ..తర్కం లో దిట్ట ఐన కవి కవిత్వం లో అదే పదును చూపాడు .సూత్రధారుడు కవి ప్రతిభను చక్కగా వివరించాడు –

‘’తర్క కర్కశ వక్ర వాక్య గహనే యా నిష్టురా భారతీ –సా కావ్యే మ్రుదులోక్తి సార సురభౌ స్యాదేవ మే కోమలా ‘’

కవి ఊహకూ సరల కవిత్వానికి మరో ఉదాహరణ

‘’భూయో నిపీయ లావణ్యా౦బుధి మప్రభాత౦ –పుంజీభవన్నుదయతే త పంచ్చలేన

ఔర్వీ గ్నిరంభార పయోనిది మత్చ్య పాతుం –నీలో దుబుద్ధద కడంబమితి ప్రతీమః ‘’’

కాశీపతి కవిత్వం లో కాళిదాస, జయ దేవ, లీలాశుకుల కవిత్వం మిశ్రితమై కనిపిస్తుంది

‘’తప్తాంబురుహం తదూరు యుగళం తాద్రుక్ నితంబ స్థలం –తన్మధ్యం స గభీర నాభి వలయస్తా వాను రోజ క్రమః

తదంకం తదపాంగ ముగ్ధ వలనం తే నీల నీలాలాలకాః-సా తన్వీతి తదంక కేషు హృదయం దావన్న విశ్రామ్యతి ‘’

ఇది ముకుందుడైన శ్రీకృష్ణుని గురించి రాసినదే అయినాకాదంబినీ అంటే మబ్బు కుమార్తె  సౌదామిని అంటే మెరుపు ,కళానిధి కళత్ర చంద్రికా మొదలైన పేర్లు కూడా వస్తాయి కనుక ఇది పూర్తిగా భాణ  లక్షణాలను కలిగి లేదు కొన్ని సామెతలనూ పనిలో పనిగా కవి చెప్పాడు. ఆ నాటి కాలం లో శృంగార వీరవిహారం గురించి వర్ణించాడు. తనకు ఇష్టమైనవి ,అయిస్ట మైనవీ చెప్పాడు. గూర్జరులను గూర్జర స్త్రీ లను  విమర్శించాడు .ఇలా యే భాణం లోనూ లేదు ,

ఆంద్ర దేశం లో ఈ బాణం విస్తృత ప్రచారం లో ఉండేది .దీని చాలామంది కవులు అనుఅరించారు అనుసరించారు .కొందరు అందులోని వాక్యాలను ప్రేరణగా తీసుకొన్నారు .అందులో ముఖ్యమైనది –‘’మద్యం విష్ణు పదం కుచౌ శివపదం వక్త్రం విధాతుః పదం ‘’వంటివి .చిలకపాటి రామానుజ శర్మ దీన్ని పూర్తిగా అనువదించాడు .మరో సూక్తి ‘’చౌర్యేనైవ కృతం హికుక్షి భరణం జన్మ ప్రభూ  ‘’ ను అవధానకవులు తిరుపతికవులు తమ ‘’పాణిగ్రహీత ‘’లో అనువాదం చేసి రాశారు .కనుక ఎందరికో ప్రేరణ నిచ్చి కొత్తమార్గం తోక్కించింది కాశీపతి రాసిన ‘’ముకున్దానంద భాణం  ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25 11- 15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 17-కవి కు౦జరుడు (1235)

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

17-కవి కు౦జరుడు (1235)

అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుని శిష్యుడే కవి కుంజరుడు.అంటే కవులలో మద గజం అని అర్ధం .రాజ శేఖర చరిత్ర నీతిబోధక  కావ్య నిర్మాత .దీనికే ‘’సభా రంజన ప్రబంధం ‘’అనే పేరుంది .కమ్మని కధలు చెబుతూ నీతి బోధ చేశాడు .ఇవి రాజశేఖర రాజాస్థాన కధలే .వీటిని రాజు సుబుద్ధికి వివరించాడు .కుంజర కవే అభినవ కాళిదాసు రాజశేఖరుని ఆస్థానకవి అని చెప్పాడు .రాజశేఖరుడు పినాకినీ తీర విద్యానగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు .కుంజర కవికావ్యానికినారాయణుడు వ్యాఖ్య రాశాడు .

కావ్యారంభం చేసినాక రాజుకు భా౦డవ్యుడికి జరిగిన సంభాషణ ఉంటుంది .

రాజు –స్కందే కృషీవల హలం కలయన్ క యాసి ?

భా౦డవ్య –గచ్చామి తే నికటమేవ విభో

రాజ –కిమర్దం ?

భాండవ్య—హ హంత కర్షణ పరాస్తవ వైరి భూషః

రాజ –(గద్యం నితంత సంతుష్ట స్తస్మే నిజ కర్ణా గతేస్వ కుండలే ప్రయచ్చత్

ఆశ్వాసాంత గద్యలో ‘’ఇతి శ్రీ కవి కుంజర కృతౌ రాజ శేఖర చరిత్రే సభా రంజన ప్రబందే ప్రధమోల్లాసః ‘’

కవి కుంజర ఇందులో 28కధలు 1-దుర్జయ 2-సూక్ష్మమతి 3-సారంగా 4 దైవజ్న వల్లభ 5 సోమ 6 కామలీల కవ యిత్రి 7 కాశీపతి 8 సానంద 9-రత్నాకర 10 కుటుంబ కవి మొదలైన శీర్షికలు పెట్టి కధలు వివరించాడు .ఈ పేర్లు అన్నీ అసలైన వో కాదో తెలియదు .కై ఇందులో శ్రింగార శేఖర ,మందర ,లలితపాల ,శ్రీకామ కమలాకర మొదలైన వారు అభినవ కాళిదాసు నేతృత్వం తో తమకు జరుగుతన్న అన్యాయానికి గాను దుర్జయుని దెబ్బ తీశారు .రాజుకు దుర్జయుని దురాలోచన తెలిసి బహిష్కరించాడు .

కుంజర కవి వెల్లాల కవి శిష్యుడు కనుక ,రామచంద్రకవి తరువాతి వాడుకనుక కాలం 1235 గా చెప్పవచ్చు .కవికి వచ్చిన బిరుదేకాని అసలు పేరు వేరుగా ఉండిఉంటుంది .రాజ శేఖరుని సమకాలీన రాజులు రాజేంద్ర చోళుడు ,పాండ్య రాజు విజయ వర్మ ,మాల్వలోని దారానగర రాజు ,సింహళ పాలకుడు ,కొంకణేంద్రుడు హూణ క్షోణిధరుడు మొదలైన వారున్నారని తెలుస్తోంది .దీనిని బట్టి చూస్తె అభినవ కాళిదాసు భోజరాజాస్తానకవి అనిపిస్తాడు .అక్కడినుండి రాజశేఖరుని ఆస్థానం చేరి ఉంటాడు .ఇవన్నీ ఊహాగానాలే .చారిత్రిక సత్యాలుకావు .వెల్లాల కవి భోజ రాజ ఆస్థానకవి అనటం  అసంబద్ధమని పిస్తుంది .రాజ శేఖరుని దగ్గరకు రాకముందు మరొక దక్షిణ దేశ రాజు ‘’పుణ్య కోటి’’ ఆస్థానం లో ఉండేవాడినని ‘’అభి కవి ‘’స్వయంగా రాసుకొన్నాడు .కనుక కవి కుంజరునిరాజ శేఖర చరిత్ర ,రామ చంద్ర కవి ‘’ప్రక్రియ కౌముది ‘’కి తరువాత నే రాయబడింది అని అర్ధమౌతోంది .

18-కవి రాక్షసుడు (11 -13 శతాబ్దం )

గొప్ప లక్షణ గ్రంధ కర్త అని 14వ శతాబ్ది తర్వాతి తెలుగు లాక్షణికులు వ్యాకరణ కర్తలు ,అలంకార శాస్త్ర రచయితలూ  . కవులచేత ప్రశంసి౦ప బడిన కవి రాక్షసుడు మహా కవి బహు గ్రంధ రచయిత.ఇతని రచనలు –కవి రాక్షసీయం ,ఆది నారాయణ చరిత్రం ,అనే తెలుగు రచనలు ,కవిరాక్షసీయం అనే ద్వ్యర్ధి  కావ్యం ,సదార్ధ నిర్ణయం అనే నిఘంటువు సంస్క్రుతం లో రాసినట్లు చెప్పబడ్డాడు ..ఆంద్ర కవులు ఇతనికాల౦ 11-13శతాబ్దాల మధ్య అన్నారు  .దాక్షారం నివాసి అన్నారు .రాక్షస నిఘంటువులో  67శ్లోకాలు మాత్రమె ఉన్నాయి .అసలు పేరు కాక బిరుదనామమే కవి రాక్షసుడు ‘ఈ బిరుదు రావటానికి కారణం కవే చెప్పాడు –

‘సాక్షరేషు భవతీహ జగత్యం సర్వ ఏవ హృది మత్సర యుక్తః –సాక్షరం కవి జనేషు తమేనం లోక ఏష ‘’కవి రాక్షస మహా ‘’

కవిరాక్షసీయం పై నాలుగు వ్యాఖ్యలున్నాయి .1-నాగ నారాయనుడి  ‘’సిద్ధార్ధ దీపిక  ,తెలుగుకవి లోకనాదుడురాసిన వ్యాఖ్యానం కాక అజ్ఞాత రచయితలవి మరో రెండున్నాయి .

కవి రాక్షసీయం 105 శోకాల గ్రధం .ప్రతి శ్లోకానికి రెండు అర్దాలుంటాయి .అందులో మొదటిశ్లోకం

‘’గుణ దోషో బుదో గృహ్నాన్ ఇందు క్ష్వేలా వివేశ్వరః –శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చాతి’’

చివరి శ్లోకం

‘’మహాన్ స ఏవ పురుషో యస్య సత్యానురోదినః –ఆక్షిప్త పారిజాతేన బాహునా రక్ష్యతే జగత్ ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-11 15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 16-వెల్లాల ఉమామహేశ్వరుడు (1235)

నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
16-వెల్లాల ఉమామహేశ్వరుడు (1235)
అభినవ కాళిదాసు అని పించుకొన్న వెల్లాల ఉమా మహేశ్వరుడు అక్కయ సూరి శిష్యుడు .మహా పండిత  కవి .కవికాలం ఇదమిద్ధం గా చెప్పలేం .భాగవత చంపు ,అభినవ భారత చంపు ,భాగవత పాద షట్పది ,కలి  విడంబనం ఇతని కృతులు .సంస్కృతం చదివే వారందరికీ భాగవత చంపు అనుభవం లోకి వచ్చేదే .భారత చంపు అంతగా రాణి౦చక పోవటానికి కారణం ప్రత్యర్దికవి అనంత భట్టు రాసిన భారత చంపువు .ఈ చ౦ పువు అ చంపువుకు గ్రహణం పట్టించింది .మూడవ కావ్యం శ్రీ శంకరాచార్య స్తుతి .నాలుగవది ఓరియెంటల్ లైబ్రరీకే పరిమితం
  అభినవ కాళిదాసు దక్షిణ దేశ ప్రభువు రాజశేఖరుని ఆస్థాన కవి అన్నాడు కవి కున్జరుడు .కాని ఇది సరిపోవటం లేదు .కవి కున్జరుని అభిప్రాయం ప్రకారం తన గురువు అభినవ కాళిదాసు రాజ శేఖర రాజు ఆస్థానం లో పలుకుబడిగల కవి కొత్తవారినేవ్వరినీ ప్రోత్సహించానివాడు అయిన దుర్జయుని కవితా ప్రతిభతో జయించాడు .దీన్ని బట్టి వె ల్లాలకవి 1235కాలం వాడని నిర్ణయించారు .తల్లి తిరుమలాంబ తత్వ చంద్రిక ,విరోధ వరూధిని ,ప్రసంగా రత్నాకరం ,అద్వైత కామ దేను ,వేదాంత సిద్ధాంత సారం ,శృంగార శేఖర భాణంకూడా రాశాడు .వీటిని బట్టి వెల్లాల కవి అన్ని శాస్త్రాలలో గొప్ప పా౦డి త్యం ఉన్నవాడని తెలుస్తోంది .అభినవ కాళి దాస బిరుదు సమర్ధనీయం అని పిస్తుంది .మహోపాధ్యాయ పక్షధార ఎల్లయ్య శిష్యుడు  అక్కయ సూరి రాసిన వ్యాఖ్యానం బట్టి వెల్లాల కవి గొప్పతనం ప్రదర్శితమైంది .మంధన ,బెల్లం కొండ రామ రాయ కవుల వ్యాఖ్యానాల వలన మనకవి ప్రతిభ అర్ధమవుతుంది .
  భాగవత చంపు రాయటానికి కారణాలు కవి చెప్పుకొన్నాడు -”అభినవ పద పూర్వ కాళిదాసః ప్రగల్భః -త్రినయన దయితాయాః ప్రేమ దిమ్భర స్తృతీయః-విరచ యతి తయైవ ప్రేరితః ప్రేమ పూర్వ -హరి గుణ పరిణద్దం  చారు చంపూ ప్రబంధం ”.
అభినవ కాళిదాసు తనపై మహా కవి కాళిదాసు ప్రభావం ఎలా ఉన్నదీ తెలియ జేశాడు .తన కావ్యమంతా ధ్వని ప్రధానమైనదని కనుక జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోవాలని చెప్పాడు .ఆరు విలాసాలతో ఉన్న ఈ చంపు శ్రీ కృష్ణుని జీవితం లో ముఖ్య ఘట్టాలను వివరిస్తుంది .చవర్లో రాధ ను కూడా ప్రవేశ పెట్టాడు .వారిద్దరి శృంగార చేస్టల వర్ణన కూడా ఉంది .అలక చెందిన పెద్దభార్య రుక్మిణీ దేవిని అనునయించటం తో ముగించాడు .
  ఇతని శృంగార శేఖర భాణం శృంగార శేఖర ,ఉత్పలమాల ప్రేమ వ్యవహారం .కామ కోటి వల్లభ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .కవిగోత్రం కాశ్యాప అని దీనిలో చెప్పాడు .చివరలో చెప్పిన శ్లోకం చూద్దాం –
”అనితర రసాదీనం భూయాదానంగా పదం -హృదయ మసు క్రుంచ్చ్రున్గార ద్వేతశ్రుమ్ఖలితం
రస ధారా కలాపీడం శ్యామామయం కరుణామయం -శమయుత పునర్జన్మ వలేశం మమాపి పర౦ మహః ”
  సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-15 -కాంప్ -బాచుపల్లి -హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సామాన్యుని దగ్గరకు ఉపనిషత్తులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదిరాజు వీరభద్ర రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వివిధ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 15-ఉపమాక వెంకటేశ్వర (1850)

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

15-ఉపమాక వెంకటేశ్వర (1850)

1850కి చెందిన ఉపమాక వెంకటేశ్వర కవి విశ్వనాధ ,కామాంబ లకుమారుడు .నిట్టల ఇంటి పేరు .విజయ నగరం జిల్లా వాడు .కవిత్వం లో అఖండుడు .ఆశ్చర్య పరచే కవితా ప్రాభవం ఉన్నవాడని గుర్తింప బడ్డాడు .’’రామాయణ సంగ్రహం ‘’కావ్యం 29సర్గలలో  1866లో రాశాడు .ఒకేపంక్తి లో అక్షరాల మార్పు వలన నాలుగు రకాల అర్ధాలు వచ్చే గర్భ కవిత్వం రాశాడు .అందుకని ఈ రామాయణానికి ‘’చతుశ్చిత్ర గర్భ రామాయణం ‘’అనేపేరోచ్చింది .

బాలకాండలోనే తన వంశ చరిత్రను రెండవ పాదం మొదటి అక్షరాలలో చెప్పాడు .-

‘’అదస్య కాండస్యాద్యపాద ద్వితీయ పాదాదిమ వర్ణ మారభ్యా న్త్యపాద ద్వితీయ పాదాది వర్ణ పర్యంతం తైర్వర్నోరూదితాచిత్రణి’’అని క్లూ ఇచ్చాడు .’’శ్రీ నిట్టలోపమాశర్మణా విశ్వనాధ తయేన కమామ్బాలతా ప్రసవేన జయద్వాయ జాత సూరవిశ్వనాధ రామ భద్ర రామది పుత్రా వతాచ రామ పాద కమల యుగ సచ్చా రాలోమానసేన విబుధా చరణకన్జసేవినా భవ తమో రుణోయంశ్రీ రామాయణ సంగ్రహే నామభూతకాల (చరి)తే బభూవ ‘’

దీని లో కవిచేప్పినదాన్ని బట్టి ఆయనకిద్దరు భార్యలని కుమారులపేర్లుసూర ,విశ్వనాధ ,రామ భద్ర ,రామ అని తెలుస్తోంది .

ఉపమాకవిఈ కావ్యం లో  కవిత్వం తోఎన్నో ఫీట్లు చేశాడు .ఇందులో  నాలుగు లఘు కావ్యాలు ఉన్నాయి . అవి1- గౌరీ వివాహం . ఇది శివ పార్వతి కల్యాణం .అయోధ్య కాండ నుంచి యుద్ధ కా౦డవరకు శ్లోకాలలోని మొదటి అక్షరాలలో ఈ కద వస్తుంది  .2-శ్రీ రంగాది క్షేత్రం మాహాత్మ్యం –అయోధ్య నుండి ,యుద్ధకాండం వరకు  ప్రతి శ్లోకం లోని రెండవ పాదం  లో 63 శ్లోకాలలో శ్రీరంగం పురుషోత్తమం ,రామేశ్వరం ,అవి ముక్తం ,సింహా చలం ,కంచి ,సాకేతం ,ద్వారక ,మధుర ,శేషాచలం ,ప్రయాగ ,గౌతమి భద్రాచల క్షేత్రాల చరిత్ర ను నిక్షిప్తం చేశాడు .3-భగవదవతార చరిత్రం –ఇది విష్ణు  అవతార చరిత్ర .ఇది శ్లోకం లోని మూడవ మూడవ పాదాలను కలిపితే వస్తుంది .ఇదివచనం .4-ద్రౌపదీ కల్యాణం –అయోధ్య నుండి యుద్ధ కా౦డవరకు ఉన్న శ్లోకాలలో నాలుగవ పాదాలన్నీ కలిస్తే ఈ కావ్య రూపం దర్శన మౌతుంది

ఈ మహా కావ్యం లో చివరి గొప్ప ప్రదర్శన మరీ ఆశ్చర్య పరుస్తుంది – బాల కాండ లోని ప్రతి శ్లోకం మొదటి  అక్షరాల సముదాయం శ్రీ రామ కవచం ‘’గా రూపు దాలుస్తుంది .దీన్నిదర్శిద్దాం –

‘’రామ సదా పాహి శిరో మామక మగజే –శమానస నందకర ఫాల తలం త్వం మమ చ

క్షేత్ర యుగళ మాగమాంతర శ్రిత పద నయన యుగం –సీతాప్రియ మదీయం చ నాసికాం వాలిహర ‘

చివర్లో కవి –

సీతా కర సారస యుగ పాతాతి విశద మణివిరాజిత మౌళిం-సీతా యుత మరుణామణి ప్రోతసనగం భజే శుభే రామం ‘’శ్లోకం చెప్పి ముగించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-11 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 14-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

14-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

శాండిల్య గోత్రానికి చెందినలక్కమా౦బా  రామేశ్వరుల పుత్రుడు ఈశ్వరప్ప .సదాశివుని శిష్యుడు .’’పార్వతీపరిణయచంపు’’రాశాడు. 16 వశతాబ్దం వాడు .ఈయన వారసుడు సుబ్బన్న ఈవ్రాత ప్రతిని సిద్దార్దినామ సంవత్సర భాద్రపద బహుళ తదియగురువారం -16-9-1619కాపీచేశాడు .కనుక కవి కాలం  16శతాబ్దికి పూర్వం అని భావించవచ్చు.

ఇందులోఅవతారిక లో  44శ్లోకాలున్నాయి . 223 శ్లోకాలు గద్యాలు అయిదు ‘’సన్నాహాలు ‘’ఉన్నాయి .మొదటి అయిదు శ్లోకాలు వివిధదేవతలపై,తనగురువు పై  చెప్పినవి .గురువు కవి రెండవ అన్నగారు కావచ్చు.ఎనిమిది నుండినలభై మూడవ శ్లోకంవరకు కవివంశ  వర్ణన ఉంది  .మూడవదానిలో  అన్నసుబ్రహ్మణ్యం గీర్వాణ ఆంధ్రాలలో గొప్పకవి అనిచెప్పాదు .ఈకావ్య రచనకు హేతువు గురించిచేప్పు కొన్నాడు .’’ప్రాచ్యం రోహిత పట్ట కందుక రుచిం జిత్వా నిశానాయకే –జాతే వంచిత హేమ మంజుల రుచో జంబీర రససేచ్చయా ‘’

మొదటికాండ లోహిమ వంతుడికి ,మేనక కు మైనాక ,పార్వతి ల జననం వర్ణించాడు రెండవ దానిలో నారదుని రాక ,సంధ్యా ,చీకటి ,రాత్రి  వర్ణనం నక్షత్ర చంద్ర ,సూర్యోదయ వర్ణన ,పార్వతి చెలులతో ఆటలు ,హిమ వంతుడి రాక ఉన్నాయి మూడులో భద్ర తీర్ధం లో శివునితపస్సు ,పార్వతిశివునికి చేసే సేవలు ,ఇంద్రాది దేవతలు వచ్చితారకాసురుని ఆగడాలు చెప్పి రక్షణ కోరటం ,బ్రహ్మ హితవుపై మన్మధుని సాయం కోరటం ,మన్మధుడు శివుడు తపస్సు చేసే చోటుకు రావటం ఉన్నాయి నాలుగులో మన్మదుడుశివునిపై బాణం వేయటం మసి కావటం ,రతీ విలాపం ,శివుడి అభయం ,నిరాశ తో పార్వతి తండ్రి ఇంటికి వెళ్ళటం ,పార్వతి తపస్సు ,బ్రాహ్మణ బ్రహ్మచారి వేషం లోశివుడు వచ్చి మనసు మార్చుకోమనటం ,ఆమెనిరాకరణ,నిజ రూపం లో శివుని ప్రత్యక్షం ,శివుడు పార్వతీ కల్యాణానికి ఒప్పుకోవటం సప్తర్షులరాయబారం ,చివరికి సకల దేవత సమక్షం లోశివపార్వతీ కళ్యాణం వర్ణించ బడ్డాయి .

ఈశ్వరప్ప  కాళిదాస కుమార సంభవాన్ని అనుసరించాడు .కావ్యం హిమాలయ వర్ణన తో ప్రారంభ మైంది .

‘’శ్రీ మనస్త్రి సమస్త పర్వత పతిర్నమ్నాహిమాద్రిర్మహాన్ –కస్చిద్రద్ర వ్యపతే ర్దిశ ప్రకట యన్నాత్మీయ విస్తారతాం ‘’

పార్వతీదేవి పాద ముఖ వర్ణన –‘’రాత్రీ శుదాంశురిపురేత్య విజ్రుమ్భణం మే –హన్తీతి పర్వత సుతాంప్రతి సాదు జప్వా

పధం తదీయ చరనావతారం ప్రపద్య –తత్సంజ్నయా విజయతే కిము నిత్య ఝ్రుమ్భం ‘’

శివుడు బ్రహ్మ చారి   వేషం లో వచ్చి పార్వతి తో సంభాషించటం –‘’జానామి జానామి తవానుభావం తస్యాన్న విస్టన్విజ్రుతానూ ప్రవేశ్యే

మాలికా రూప కపాళీ కాళీ ధర ,రాశాభ మురూ యదు శ్పాలి కా భీస్టేదః –అంగార గీభవ ద్రూతి కర స్శూలికీ  కిం వ్రుతస్సత్వయా భీకరచేస్టయా ‘’అని పార్వతిని శివుదివిక్రుతవేశం వివరించి బెదర గొట్టేప్రయట్నం చేశాడు .

వివాహ సమయంలో పెండ్లికోడుకైన శివుడేలాఉన్నాడు?

‘’జటా జూటా రాశంభో స్సపాది హరి తోష్నీశ వసనం –సుధాంశు స్తత్రత్యః ప్రభావతి మహా భాషిక మపి ‘’చివరలోశివ పార్వతులశృంగార క్రీడా వర్ణనం చేశాడు

‘’కళ్యాణ ప్రదాయే స్తాయో స్త్రిజగతా మాస్వాదితా మూల్యత్ –త్తంభూలాది ర్యయొః కృత బహిర్జాత వ్య వా యా స్థయొః’’

ఆస్వాతంతగాద్యం –‘’ఇతి శ్రీ మదీశ్వర ప్పాభిదాన బుధ విరచిత పార్వతీ పరిణయ నామ దేయ చంపూ ప్రబందే పంచామాస్సంనాహః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ – 21-11-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 16-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

నాలుగవ  గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

16-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

శాండిల్య గోత్రానికి చెందినలక్కమా౦బా  రామేశ్వరుల పుత్రుడు ఈశ్వరప్ప .సదాశివుని శిష్యుడు .’’పార్వతీపరిణయచంపు’’రాశాడు. 16 వశతాబ్దం వాడు .ఈయన వారసుడు సుబ్బన్న ఈవ్రాత ప్రతిని సిద్దార్దినామ సంవత్సర భాద్రపద బహుళ తదియగురువారం -16-9-1619కాపీచేశాడు .కనుక కవి కాలం  16శతాబ్దికి పూర్వం అని భావించవచ్చు.

ఇందులోఅవతారిక లో  44శ్లోకాలున్నాయి . 223 శ్లోకాలు గద్యాలు అయిదు ‘’సన్నాహాలు ‘’ఉన్నాయి .మొదటి అయిదు శ్లోకాలు వివిధదేవతలపై,తనగురువు పై  చెప్పినవి .గురువు కవి రెండవ అన్నగారు కావచ్చు.ఎనిమిది నుండినలభై మూడవ శ్లోకంవరకు కవివంశ  వర్ణన ఉంది  .మూడవదానిలో  అన్నసుబ్రహ్మణ్యం గీర్వాణ ఆంధ్రాలలో గొప్పకవి అనిచెప్పాదు .ఈకావ్య రచనకు హేతువు గురించిచేప్పు కొన్నాడు .’’ప్రాచ్యం రోహిత పట్ట కందుక రుచిం జిత్వా నిశానాయకే –జాతే వంచిత హేమ మంజుల రుచో జంబీర రససేచ్చయా ‘’

మొదటికాండ లోహిమ వంతుడికి ,మేనక కు మైనాక ,పార్వతి ల జననం వర్ణించాడు రెండవ దానిలో నారదుని రాక ,సంధ్యా ,చీకటి ,రాత్రి  వర్ణనం నక్షత్ర చంద్ర ,సూర్యోదయ వర్ణన ,పార్వతి చెలులతో ఆటలు ,హిమ వంతుడి రాక ఉన్నాయి మూడులో భద్ర తీర్ధం లో శివునితపస్సు ,పార్వతిశివునికి చేసే సేవలు ,ఇంద్రాది దేవతలు వచ్చితారకాసురుని ఆగడాలు చెప్పి రక్షణ కోరటం ,బ్రహ్మ హితవుపై మన్మధుని సాయం కోరటం ,మన్మధుడు శివుడు తపస్సు చేసే చోటుకు రావటం ఉన్నాయి నాలుగులో మన్మదుడుశివునిపై బాణం వేయటం మసి కావటం ,రతీ విలాపం ,శివుడి అభయం ,నిరాశ తో పార్వతి తండ్రి ఇంటికి వెళ్ళటం ,పార్వతి తపస్సు ,బ్రాహ్మణ బ్రహ్మచారి వేషం లోశివుడు వచ్చి మనసు మార్చుకోమనటం ,ఆమెనిరాకరణ,నిజ రూపం లో శివుని ప్రత్యక్షం ,శివుడు పార్వతీ కల్యాణానికి ఒప్పుకోవటం సప్తర్షులరాయబారం ,చివరికి సకల దేవత సమక్షం లోశివపార్వతీ కళ్యాణం వర్ణించ బడ్డాయి .

ఈశ్వరప్ప  కాళిదాస కుమార సంభవాన్ని అనుసరించాడు .కావ్యం హిమాలయ వర్ణన తో ప్రారంభ మైంది .

‘’శ్రీ మనస్త్రి సమస్త పర్వత పతిర్నమ్నాహిమాద్రిర్మహాన్ –కస్చిద్రద్ర వ్యపతే ర్దిశ ప్రకట యన్నాత్మీయ విస్తారతాం ‘’

పార్వతీదేవి పాద ముఖ వర్ణన –‘’రాత్రీ శుదాంశురిపురేత్య విజ్రుమ్భణం మే –హన్తీతి పర్వత సుతాంప్రతి సాదు జప్వా

పధం తదీయ చరనావతారం ప్రపద్య –తత్సంజ్నయా విజయతే కిము నిత్య ఝ్రుమ్భం ‘’

శివుడు బ్రహ్మ చారి   వేషం లో వచ్చి పార్వతి తో సంభాషించటం –‘’జానామి జానామి తవానుభావం తస్యాన్న విస్టన్విజ్రుతానూ ప్రవేశ్యే

మాలికా రూప కపాళీ కాళీ ధర ,రాశాభ మురూ యదు శ్పాలి కా భీస్టేదః –అంగార గీభవ ద్రూతి కర స్శూలికీ  కిం వ్రుతస్సత్వయా భీకరచేస్టయా ‘’అని పార్వతిని శివుదివిక్రుతవేశం వివరించి బెదర గొట్టేప్రయట్నం చేశాడు .

వివాహ సమయంలో పెండ్లికోడుకైన శివుడేలాఉన్నాడు?

‘’జటా జూటా రాశంభో స్సపాది హరి తోష్నీశ వసనం –సుధాంశు స్తత్రత్యః ప్రభావతి మహా భాషిక మపి ‘’చివరలోశివ పార్వతులశృంగార క్రీడా వర్ణనం చేశాడు

‘’కళ్యాణ ప్రదాయే స్తాయో స్త్రిజగతా మాస్వాదితా మూల్యత్ –త్తంభూలాది ర్యయొః కృత బహిర్జాత వ్య వా యా స్థయొః’’

ఆస్వాతంతగాద్యం –‘’ఇతి శ్రీ మదీశ్వర ప్పాభిదాన బుధ విరచిత పార్వతీ పరిణయ నామ దేయ చంపూ ప్రబందే పంచామాస్సంనాహః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ – 21-11-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సర్వపాపా హారం పాద గయాక్షేత్రం

Inline image 1

 

 

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శరత్ జ్యోత్స్నా రాణి అంతరంగం

Inline image 1Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అబ్బావుద్ ఖతం

Inline image 1Inline image 1


Inline image 2

 
Inline image 2
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4

13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి

17వ శతాబ్ది మధ్యలో కర్నూలు పాలకుడు ఆనంద రావు దేశాయ్ ఆస్థానం లో అయ్యవారు శాస్త్రి ఉన్నాడు .’’సభార౦జనం ‘’అని పిలువ బడే ‘’హితకారి ‘’అనే ఏకాంకిక నాటకం రాశాడు .దీన్ని 29తాటాకులపై లిఖించాడు .అందులో మొదటి అయిదు పత్రాలు కనిపించలేదు .కనుక కవి గురించి ఆయన పోషకుల గురించి వివరాలు తెలియటం లేదు .లభించిన ఆధారాలను బట్టి సంస్కృతాంధ్రాలలో దిట్టమైన కవి .కందనోలులేక కర్నూలు  నుపాలించిన మహారాష్ట్ర పాలకుడు నిత్యానందరావు లేక ఆనంద రావు దేశాయ్ ఆస్థానకవి .బహుశా ఆనందరావు మహారాష్ట్ర రాజ ప్రతినిధి కావచ్చు .శివాజీ పాలనలో కర్నూలును పాలించిన మరో ఆన౦దరావు కూడా ఉన్నాడు .ఆనందరావు శివాజీ మహారాజును కీర్తించినందు వలన ఈయనే అయ్యవారు శాస్త్రిగారి పోషకుడు అని భావించారు .మహబూబ్ నగర్ జిల్లాలో జటప్రోలు సంస్థానం లో ‘’అయ్యవారు పల్లె ‘’అగ్రహారం ఉంది .ఇది ఈయనకు ఈనాముగా బహూకరించ బడి ఉండచ్చు .

కవి చెప్పిన దాన్నిబట్టి ఇది ఏరకమైన ఎకా౦కికయో తెలియదు .బీజ,ముఖ సంధులు మొదటి అయిదు పత్రాల అలభ్యతవలన తెలియ రావటం లేదు .అంతా వర్ణన మయం .నాటిక చివరి భాగం కూడా స్పష్టంగా లేదు .రసికా వతంస అనే ఇందిరా మందిరరాజు ,హితకారి  అనే రెండే రెండు ముఖ్య పాత్రలున్నాయి .హితకారి అనేవాడు మంత్రి కొడుకు .దౌవారికుడు హితకారి ని రాజు సమక్షం లో ప్రవేశ పెట్టి నిష్క్రమిస్తాడు .హితకారి ,రసికావతంసుడు కలిసి వన విహారం చేస్తారు .వనపాలుడనే తోటమాలి ,రాజానుచరుడు కొంత హాస్య సంభాషణ నడుపుతారు . దీనితో కద సమాప్తం .రాసికావతంసుడు ,హితకారి ఒక రోజు కార్యక్రమగా రాజంతః పురం నుండి వన సందర్శనం చేయటం,కాసేపు తోటలో తిరిగి ,పిచ్చాపాటీ మాట్లాడుకొని మళ్ళీ తిరిగి రావటం  ఇందులో కధ.దారిలో వారికి కనిపించిన సకల సజీవ నిర్జీవ విషయాలను వర్ణించాడు కవి .శాస్త్రి గొప్ప పండితకవి అనిపిస్తాడు .వైశేషిక న్యాయం నుంచి వైద్య శాస్త్రం వరకు ఆయనకు ప్రతి విషయం లోను లోతైన పరిజ్ఞానం ఉందని తెలుస్తుంది .ఇద్దరూ బయల్దేరేముందు వారి వేషధారణ రసికుడు అద్దం లో తన అందాన్ని చూసుకోవటమూ వర్ణించాడు –మనమూ ఒక సారి ఆ అడ్డం లోకి తొంగి చూద్దాం –

‘’ఆదర్శ న భవతే దర్శనతోన్తః ప్రవేశ యసి సర్వాన్ –యస్య ముఖ శ్రీ ర్లోకే తస్య బేర్ సర్వలోకాఃస్యుః’’

రాజు తన ముత్యాల  కర్నా భరణాన్ని చూస్తూ—‘’’ముక్త ఫల ముఖో ల్లాస కరే రాజం అవోగ్రగః

సువృత్త చతురాకారో న కః ప్రభుహితో భవేత్ ‘’అంటాడు .తోటకు వెళ్లేముందు హితకారి తమ ఇందిరామందిర పట్టణ వైభవాన్ని వర్ణిస్తాడు

‘శ్రీ మత్సర్వ పురీ రమా విజయ లక్ష్మీ లక్షణ ప్రభవా-సీమాన్తాయితసూర్య సోమ సరణీ శృంగార రంగన్ముఖా

సత్ప్రాకార నితంబ బింబ రాశనా కల్పాయిత స్వర్దునీ –మేధ్యాసౌ న కదం హిసర్వ విబుధ శ్రీ మందిరేయం పురీ ‘’అని దాని శోభను వర్ణిస్తాడు .

వనం లోకి ప్రవేశించాక కనబడిన ప్రతి వృక్షాన్ని వర్ణిం చాడు కవి .ఈ వర్ణన లలో శాస్త్రీయ కోణమూ ఉంది .అశ్వత్థ నింబ ,వట ,తి౦త్రిణి ,కపిత్త ,బిల్వ ,ప్లక్ష ,ఉదుంర ,చూతమొదలైన వృక్ష వర్ణన ఉంది .తరువాత కనిపించిన సింహ శార్దూల కురంగ వనావర్త ,మున్నగు జంతువర్ణన చేశాడు .అప్పటికే మధ్యాహ్నమైంది. అక్కడ భవానీ దేవాలయం లో అమ్మవారికి పూజ చేశారు .అప్పుడు అక్కడి సరోవరం లో విహరించే హంస ,కుముద మత్స్య ,చాతక చకోర చక్రవాక పక్షుల వర్ణనా పనిలోపనిగా కానిచ్చేశాడు .చకోరపక్షి వర్ణ చూడండి –

‘’చకోరే తారకోదార యోగో యస్తోనిరంతరం –నహి చే చ్చంద్రికా పానంకదం ఖేచరముద్రయా ‘’

ఇంతలో కొన్ని మాటలు వినిపిస్తే అవి వనపాలురు రాజును చూడాలనే ఉత్సాహపు మాటలంటాడు హితకారి .వాళ్ళు రాజుకు ఫలాలు పుష్పాలు కానుకగా సమర్పిస్తారు .వాళ్ళు తెచ్చిన ఖర్జూర ద్రాక్ష ,మాతలు౦గ దాడిమి మొదలైన ఫల వర్ణన తర్వాత మల్లికా ,గంధఫలి (సంపెంగ )కేతకీ పుష్ప వర్ణన  చేస్తాడు .మిట్ట్మమధ్యాహ్నమైనఉక్కపోస్తోంది రాజుగారికి విసరటానికి విజామర వర్ణ న చేశాడుకవి .చమట పట్టిందికనుక స్నానం చేయాలి .ఆ తతంగాన్నీ బాగానే పూర్తీ చేశాడు .చండీ ఆలయం లో పూజారి వీరికోసం ఎదురు చూస్తున్నాడు .వెళ్లి పాల్గొన్నారు .భవానీ దేవిని కవి వర్ణించాడు –

‘’అంబ జగతో వలంబ నమంబాత్వే నైవ విహితామిహ భూయః –అవలంబయ  మాం కృపయే త్యుక్తిః పునరుక్తమితిమయానోక్తా ‘’అని వరుసగా అయిదు శ్లోకాల ప్రార్ధన చేశాడు .అమ్మవారి ప్రసాద స్వీకారం తర్వాత భోజనాలకు ఉపక్రమించారు .భోజన సామాగ్రినంతా వర్ణించాడు తినుబండారాల వర్ణనా నోరూరిస్తుంది .పాటోలఅంటే పొట్లకాయ వర్ణనా ఉంది –‘’పాటోలాదీర్ఘ క్రున్త్యాపి లాఘవం కేన సాధితం –పాషాణ వహనాదిభ్యః కిమార్జితాం ‘’

గుమ్మడికాయ అంటే కూష్మా౦ డాన్నిఅంతే రుచిగా వర్ణించాడు –‘’కూష్మాండ సర్వమదురోప్య బలాదుర్భఘసాఘ్రు వ్రుత్తోసి –బాల్యే సర్వ పిధ్యం భవదాచారణం  కిమేత దుపపన్నం ‘’

వన్నీ 24ఆకులలో ఉన్నాయి చివరి 25వ పత్రం లభ్యం కాలేదు .26లో తిరుగు ప్రయాణ వర్ణన ఉంది .దారిలో స్త్రీ,అంతఃపుర ,సింహాసనం  కళ్ళజోడు ,కలం ,రాసే వస్తువులు ,దీపం ,కత్తిమొదలైన వర్ణన ఉంటుంది .తర్వాత రాజు కళావతితో కాలక్షేపం చేసే సమయమైనదని హితకారి గుర్తు  చేస్తాడు .కళావతి రాణి అని మనకు అప్పుడు తెలుస్తుంది .చివరకు హితకారిరాజును ఆశీర్వదిస్తాడు .

‘’రాజన్ సామ్రాజ్య లక్ష్మీ విభవావిలాసితః సర్వ దిక్కుమ్భి కుంభ –ప్రోదాన్ముక్తా ఫలశ్రీ సహచర యశసా ఖ్యాత విద్రుద్రజ శ్రీ ‘’దీనికి జవాబుగా రాజు

‘’జయంతి బహుదా సుధా మధుర బందుతా బంధుర –ప్రబంధ రచనా చమత్కృతి కృతార్ధ స్ద్వే భవాః

ప్రసూన చయ సౌరభేః ప్రసవి దేను దుగ్ధ దాన్చితే –ర్వచో భి రభిత స్స్తభాం ప్రభావ ఏవ సంభావితం ‘’

రాజును తనకు సెలవిప్పించమని హితకారి కోరటం ,ఇతనికోసం ఇంటిదగ్గర భార్య కృపావతి ఎదురు చూస్తూ ఉండటం తో ఏకాంకిక పూర్తీ అవుతుంది .బిరుదు రాజు వారు దీన్ని ‘’వీధి ‘’అనే నాటక భాగం గా పేర్కొన్నారు .నాకేమో ఇది ఒక ‘’ట్రావేలోగ్ ‘’అంటే పిక్నిక్ లాగా ఉందని  పించింది .ఏమైనా అయ్యవారు శాస్త్రి తానొక ‘’గైడ్ ‘’గావ్యవహరించి కద నడిపించాడు .ఒక కొత్త ప్రయోగం అనిపించాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 9-మరిగంటి అప్పల దేశికులు (1790)

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4

9-మరిగంటి అప్పల దేశికులు (1790)

శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన మరి గంటి వారు నల్గొండజిల్లా నివాసులు .తర్వాత రాష్ట్రమంతా వ్యాపించారు .తెలుగు సంస్కృతాలలో బహు గ్రంధాలు రచించారు .కుతుబ్ షాహి ,విజయనగర పాలకుల పోషణలో ఉన్నా ఈ కవులు ఒక్క రచనను కూడా ఆ రెండు రాజ వంశీయులకు అ౦కితంచేయక పోవటం మహా విశేషం .తమ ఇస్ట దేవతలకు మాత్రమె అంకితమిచ్చారు .అనుముల నివాసి అయిన మరి గంటి నరసింహా చార్య(1700)తెలుగులో చాలానూ సంస్కృతం లో ‘’శతవైరి వైభవాదివకరం ‘’ఛందో గ్రంధాన్ని రాశాడు . ఈయన మనవడు ,వేంకటాచార్య కుమారుడు అప్పలదేశికుడు నరసింహ పురం లో నివసించాడు .లక్ష్మీ నృసింహ స్వామికి పరమ భక్తుడు .

అప్పల దేశికులు సంస్కృత లఘుకావ్యాలు చాలా రాశాడు .అందులో ముఖ్యమైనవి 1-శ్రీరామ పాద స్తుతి 2శ్రీ గోదా స్తవం 3శ్రీ అర్వపల్లి లక్ష్మీనరసింహ స్తోత్రం 4నరసి౦హాస్టోత్తరం 6స్థంభ గిరి లక్ష్మీ నరసింహ స్తోత్రం .

శ్రీరామ పాద స్తుతి 28శ్లోకాల లఘుకావ్యం .ఒకటి రెండు శ్లోకాలు మచ్చుకి

‘’చిత్రం యాత్ర శిలాతలే సుఘటితం రామేణ పాద ద్వయం –సాక్షాల్లక్ష్మణవారుణాస్త్రవిభావజ్జాతం చ శీతం పయః

సీతాయాః కరుణా కటాక్ష విభవత్సంపాదితాస్సంపదో-మిత్రే రత్న వృతౌ నృసింహ నగరే జీవేయ మాయుశ్శతం’’

అర్వేపల్లి లక్ష్మీ నృసింహస్తోత్రం లో  స్వామి ఉగ్ర ,శాంత స్వరూపాలను వర్ణిస్తూ చెప్పిన శ్లోకాలు కమనీయం

తుండ త్వండ త్తరంగ రావసిత భర పరిష్వంగ నిస్తండలింగ –ద్రుండం గందానుగా త్రున్గ్రం గగనగ గాంధర్వ గర్వ మహోర్మిం

దీప్యత్ స్వేతాత పత్రం  మణిమకుటలసన్మస్తకం యుక్త పార్శ్వం –లక్ష్మీ క్షమాజ ముఖాబ్జాస కరుణా చరణం పూర్నిమాచంద్ర వక్త్రం –సర్వోత్తంసంసమస్తాభరణవిలసితం కోటి సూర్య ప్రకాశం

నేత్రానంద ప్రదం తం మహా హ్రిది కలయే అర్వపల్లీ నృసింహం .

నరసింహ స్తోత్రం 27శ్లోకాల నక్షత్ర మాలిక .బీజాక్షర నిక్షిప్తం .

‘’శ్రీ వత్సాంకం త్రినేత్రం శశి సమ ధవళం చక్ర హస్తం సురేశం –వేదాంగో వేదనాదః వినుత సురపతి ర్దేవ రూపః పరేశః ‘’శ్రీ గోదాస్తవం’’నుండి ఒక ఉదాహరణ

‘’కనక లతికా స్నిగ్ధం ముగ్దాంబుజాయతలోచనా –మమృత లహరీ భోగ్యం యోగ్యం మురారి మహో రసః ‘’

అప్పలదేశికులు ఎన్నో తిరునామాలు, మంగళ హారతులు సంస్కృతాంధ్రాలలో రాశాడు .శ్రీ వైష్ణవులలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి .

10-దశకుమార కదాసార కర్త -అప్పయా మాత్య (15శతాబ్దికి పూర్వం )

దండి దశకుమార చరిత్ర కు శ్లోక రూపకావ్యమే అప్పయామాత్యుని ‘’దశ కుమార కదా సారం ‘’.ఇది మూడు పరిచ్చేదాలలో ఉంది .199అనుష్టుప్ శ్లోకాలో రాశాడు .ఇందులోని అయిదు భాగాలు మూడు పరిచ్చేదాలుగా మలిచాడు .రాజవాహనుని చరిత్రతో పూర్తీ అవుతుంది .మొదటి పరిచ్చేదం లో మొదటి భాగం లోని పూర్వ పీఠిక ఉంది .రెండవ పరిచ్చేదం లో రెండు నాలుగు భాగాల కద ఉంటుంది .మూడవ దానిలో అయిదవ భాగ కద ఉంది .కవిత్వం సరళంగా సుందరంగా అందంగా ఉంటుంది .కవి పేరుతప్ప మిగిలిన వివరాలు తెలియ రాలేదు .విజయనగర రాజ మంత్రి అయి ఉండవచ్చునని ఊహిస్తున్నారు .ఆంద్ర నియోగి బ్రాహ్మణుడు అని పేరును బట్టి ఊహ

కావ్యాన్ని ‘’శ్రీ వాగుమాం పరం శాంత మేక వీరం మహేశ్వరీం-సంపత్సంహిత్య సౌభాగ్య సమ్యక్ సిధ్యర్ధ మర్యయే ‘’అని మొదలు పెట్టాడు .ఆయనే చెప్పినదాన్ని బట్టి కవి సనాతన ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు .ఏకవీరా దేవి భక్తీ కాకతీయుల కాలం లో ఎక్కువగా ఉండేది .ఆకాల సాహిత్యం ,శాసనాలు దీనికి రుజువు .ఖచ్చితం గా మనకవి ఫలానా కాలానికి చెందినవాడు అని చెప్పలేముకాని 15శతాబ్దికి పూర్వం ఆని చెప్పచ్చు .సాంద్రమైన దశకుమార చరిత్రను అతి సరలాఆ భాషలో రాశాడు అప్పయామాత్య .మధురపదజాలం ముగ్ధ మనోహరంగా ఉంటుంది .కావ్యం చివరలో

‘’రమ్య కాంతేగృహే సార్ధం ప్రియయా రాజవాహనః –విహారన్ వల్లభ్యసుగోస్టచామాభ్య రదనా పూర్వక మేష పృస్టః

చతుర్దశానాం జగతాం ప్రపంచం సంక్షేపతః స్పష్ట ముదాజహార

ఇతి శ్రీ మదప్పయా మాత్య విరచితే దశ కుమార కదా సారే సోమదత్త కధాకధనం నామ తృతీయః పరిచ్చేదః ‘’

11-యదుగిరి భూషణ చంపు కవి-అప్పలాచార్య

శ్రీశైల కుటుంబానికి చెందిన లక్ష్మీ ,రాఘవాచార్యుల కుమారుడే అప్పలాచార్య.తిరుపతి నివాసి .’’యదుగిరి భూషణ చంపు ‘’రాశాడు .యదుగిరి అనే మెల్కోటే అనే వైష్ణవముఖ్య క్షేత్ర  పవిత్రతను ఇందులో వర్ణించాడు .గీర్వాణా౦ ద్రాలలో గొప్పకవి .వీర రాఘవ శిష్యుడు .కవికాలం తెలియదు .కావ్య ప్రారంభ శ్లోకం –

‘’శ్రీమానబ్జాభవాదిమస్తక తటన్యస్తప్రశ స్త ప్రభా –వాస్తుస్నిగ్దా చిరత్న రత్న మకుటా సంగో లసత్ప్రన్నగః ‘’

గురువు వీరరాఘవుని పై చెప్పిన శ్లోకం చూద్దాం –

‘’శ్రీ భాష్యామృత పూరితం గురుతరం శ్రీ వైష్ణవైశ్చాతకైః-నిత్యం సేవితమాత్మ సస్యాని కరనాత్యంతతాపోద్రుతాం –దిన్వంతమ్రసవత్తయా హృది భజే శ్రీ రాఘవా స్వామినం ‘’

చివరి శ్లోకం  -‘’సాదురన్న హృదయ౦గమోజ్జ్వలం భాను కూటనిభనాయకో జ్జ్వలం

మాననీయ గుణ బంధ పోషణం రాజతే యదుగిరీశ భూషణాం’’.

ఆశ్వాశా౦త గద్య లో –‘’ఇతి శ్రీ త్సేందవ కన్దరదేవా లబ్ధ సంస్కృతాంధ్ర భాషా చతుర్విధ కవితా ధురంధరస్య ,శ్రీ వేంకటాద్రి నివాస చరన కమల కిమ్కరస్య ,శ్రీ మద్వీర రాఘవ గురు చరణనీరజ భ్రున్గస్య శ్రీ శైలాన్వాయ దుగ్ధ సింధు జస్య ,శ్రీ రాఘవార్య తనూజస్య ,శ్రీ లక్ష్మీ గర్భ శుక్తి కా మణోరప్పలాచార్యస్య ,క్రుతిషు యదుగిరి భూషణాఖ్యం చంపూ కావ్యం సమాప్తం .

12-ప్రహసన కర్త -బొమ్మకంటి అయ్యలనాధుడు (17వ శతాబ్దం )

బొమ్మకంటి అయ్యలనాధుడు లేక తిరుమలనాధుడు ‘’కుహనా భైక్షవ ప్రహసనం ‘’రాశాడు.దీనిని  రాజ శేఖర పట్టణం లో స్వామి గోపికా రమణుని ఉత్సవాలలో ప్రదర్శించే వారు .ముస్లిం నాయకుడు అహ్మద్ ఖాన్ వేశ్య చంద్ర లేఖ పై వ్యామోహాన్ని ఎండగట్టే  వ్యంగ్యాత్మక రచన .ఇందులో ఒలికే హాస్యాన్ని చవి చూద్దాం.

‘’వేదనామ మ్రుతప్రదాన సమయే సంప్రాప్తకాంతక్రుతిః-లీలావిక్రమ వల్గితస్తన భరే భాస్వద్విభూషావలిః

సాన్తర్హస్వవచః ప్రపంచ తురస్నిగ్దా ల్లసా లొకనైః-పశ్యన్నాస వవంచితా సుర గణోనారాయణః పాతునః ‘’

సూత్ర దారికి నటి కి మధ్య సంభాషణలలో రచయిత గురించి కొంత తెలుస్తుంది .చివరలో షండ భిక్ష సంభాషణ ఉంటుంది .

షండ-‘’భో భో గృహాంతరాలస్తితా చంద్ర లేఖా కుపితోతిగ్రుహాన్నిర్గతో  హ్మదుఖానః –తదదా భవద్విర వహితైః స్థాతవ్యం

భిక్షు –వత్స కోయమాను రణానమివాహ్మదుఖాన ఘంటాయః ‘’ఈభాషణం లో ఖాను మోహించింది చంద్ర లేఖ అని తెలుస్తుంది

తెలుగులో కూచిమంచి జగ్గకవి రాసిన ‘’చంద్ర లేఖా విలాపం ‘’మన అయ్యలనాదునికి ప్రేరణగా కనిపిస్తుంది .ముస్లిం పాలకులు ఆంధ్రాన్ని పూర్తిగా ఆక్రమించిన తర్వాత రాయ బడిన ప్రహసనం గా దీన్ని భావిస్తారు .కనుక అయ్యలనాధుడు 17వ శతాబ్దికి  చెందిన వాడని చెప్ప వచ్చు .బొమ్మకంటివారు గొదావరీ  తీరంలోని  తెలగాణ్యబ్రాహ్మణులు . ఇదే ఇంటిపేరుతో ఖమ్మం జిల్లాలో నియోగులు కూడా ఉన్నారు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ – 19-11-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నవ్యాంధ్ర నవనిర్మాణం ”కవిసమ్మేళనం -3 చివరిభాగం

నవ్యాంధ్ర నవనిర్మాణం ”కవిసమ్మేళనం -3 చివరిభాగం

7b 001 8 001 7a 001

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నవ్యాంధ్ర నవ నిర్మాణం -కవి సమ్మేళనం -2భాగం

నవ్యాంధ్ర నవ నిర్మాణం -కవి సమ్మేళనం -2భాగం4a 001 4b 001 3a 001 3b 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

48వ గ్రంధాలయ వారోత్సవం -విజయవాడ టాగూర్ లైబ్రరీలో 18-11-15 బుధవారం సాయంత్రం రమ్య భారతి సరసభారతి మల్లె తీగ సంయుక్త ఆధ్వర్యం లో ”నవ్యాంధ్ర నవ నిర్మాణం ”పై కవి సమ్మేళన దృశ్యాలు

48వ గ్రంధాలయ వారోత్సవం -విజయవాడ టాగూర్ లైబ్రరీలో 18-11-15 బుధవారం సాయంత్రం రమ్య భారతి సరసభారతి మల్లె తీగ సంయుక్త ఆధ్వర్యం లో ”నవ్యాంధ్ర నవ నిర్మాణం ”పై కవి సమ్మేళన దృశ్యాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1

’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1

48వ గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా
‘’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1
వేదిక –టాగూర్ గ్రంధాలయం –విజయవాడ
తేది ,సమయం -18-11-15-బుధవారం –సాయంత్రం -6గం లకు
నిర్వహణ –రమ్యభారతి ,సరసభారతి, మల్లెతీగ సాహితీ సంస్థలు
కవితలు
1-ఐతే ఒకే –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్
సింగపూర్ సి౦గారమైనా
చైనా చైతన్యమైనా
జపాన్ నాణ్యమైనా
మలేసియా మహా భాగ్యమైనా
దేన్ని అనుసరించి ,అనుకరించి నిర్మించినా
మనభాష ,మన సంస్కృతీ సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా
బడుగు జీవుల బతుకులతో చెలగాటమాడకుండా
రైతన్న ,నేతన్న ల నడుం విరవ కుండా
నవ్యాంధ్ర నవ నిర్మాణం సాగిస్తామని నమ్మకం కలిగిస్తారా
ఐతే ఒకే .
2-నవ్యాంధ్ర నిర్మాణం –శ్రీమతి కోపూరి పుష్పాదేవి
అద్భుత రాజ దాని అమరావతి
ఆంధ్రుల ఆశ శ్వాస అమరావతి
అయిన వారికి ఆకులు వదిలి
కాని వారికి క౦చాల౦ది స్తోంది అమరావతి
పచ్చని చేలను ఫలహారం చేసి
బంగారు గుడ్లు పెడతానంటోంది
అరచేతిలో వైకు౦ఠాలు మా కొద్దు
ఆకాశానికి నిచ్చెనలసలే వద్దు
అంకితభావం ఏంతో ముద్దు
కృషి తైలం పోసి
శ్రమ జ్యోతులు వెలిగిద్దాం
అపూర్వ అమరావతిని సాధిద్దాం
ఆంధ్రుల పోరాట పటిమే కాక
నిర్మాణ సౌభాగ్యాన్నీ
ప్రపంచానికి చాటి చెబుదాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-15

Posted in కవితలు | Tagged | Leave a comment

గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా 18-11-15 బుధవారం సాయంత్రం 6 గం లకు విజయ వాద టాగూర్ లైబ్రరీలో కవి సమ్మేళనం

సాహితీ ప్రియులకు ఆహ్వానం -గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా ఉయ్యూరులోని సరస భారతి విజయవాడలోని రమ్య భారతి ,మల్లె తీగ  సంస్తలచేత ఈ రోజు 18-11-15 బుధవారం సాయంత్రం 6 గం .లకు టాగూర్ లైబ్రరీలో నిర్వహింప బడుతోంది . కవులకు,సాహిత్య ప్రియులకు  , సాదర ఆహ్వానం .విచ్చెసి జయ ప్రదం చేయండి .-దుర్గాప్రసాద్ ,చలపాక   ప్రకాష్ ,కలిమిశ్రీ  ,  navyandhra2 001 navyandhra1 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఝాన్సీ స్పూర్తికే మహా రాణి ,అనాధలకు అమ్మ

Inline image 1
 
 
 
 
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చంద్ర ప్రతిష్టిత సోమేశ్వర స్వామి,ప్రదక్షిణలో పరమార్ధం అభిషేక ఫలితం

Inline image 1
 
 
 
 
Inline image 2
 
 
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా నియంతలు మహా భోజన ప్రియులు

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందూత్వ సింగం

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 8- దృశ్య శ్రవ్య మిశ్రమ కావ్య౦ రాసిన – వడ్లమాని అన్నయ శాస్త్రి

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4

8- దృశ్య శ్రవ్య మిశ్రమ కావ్య౦ రాసిన – వడ్లమాని అన్నయ శాస్త్రి (

వాదూలస గోత్రీకుడు వడ్లమాని అన్నయ శాస్త్రి విశాఖ పట్నం సంస్కృత పాఠ శాలలో సంస్కృత పండితునిగా పని చేశాడు ‘’సీతారామ రాజాభ్యుదయం ‘’అనే చంపూ నాటకం రాశాడు .సాధారణం గా కావ్యాలు దృశ్యకావ్యాలు గానో శ్రవ్య కావ్యాలుగానో ఉంటాయి కాని ఈకవి దృశ్య శ్రవ్య మిశ్రమం  చేసి రాశాడు .ఉపోద్ఘాతం లో నే కవి ఈ విషయం వివరించాడు ,’’సంతు ఖాలు భువి బహూని నాటకాని,అనేకాని చ కావ్యాని ప్రబందాస్చ బహువిధాః .తాద్రుష్పద్దతి వ్యతిరిక్తతాయాంపూర్వకల్పితదృశ్య శ్రవ్యత్వో భయ సంబంధ మిశ్రతయా వివిధ కావ్య రాసాని మగ్నానామపి బుధ నామాహృదకారిణీ భవే దియామితినిస్చినుమః ‘’.దీన్ని రాయటాన్ని సమర్ధించుకొన్నాడు కూడా .

ఇది మిశ్రమ కావ్యం అనటానికి రచయితలకు ,పాత్రలకు మధ్య జరిగే సంభాషణలు దృశ్య కావ్యం అని పిస్తే ,సుదీర్ఘ వర్ణనలు శ్రవ్య కావ్యం అని పిస్తుంది .ఈ చంపూ నాటకం లో నాలుగు స్తబకాలున్నాయి .మొదటిస్తభకం’’నాయక వ౦శాభి వర్ణనం ‘’  లో  ‘’నాయకుడైన సీతా  రామరాజు వంశాభి వర్ణనం ‘చేశాడు కవి .రామ రాజు కాకర్ల వంశస్తుడు .ఆలమండలో ఉండేవాడు .ఇది విజయనగర ప్రభువు ఆనంద గజపతి రాజు పరిపాలనలో ఉండేది .కాకార్ల వంశం వారు విజయ నగర రాజు కు సైనికాధికారులు .రామ రాజు పూర్వీకుల వర్ణన కూదాచేశాడు కవి .రెండవ స్తబకం’’కృతి సమర్పణం ‘’ లో హరిహర రాజ పట్టాభిషేక వర్ణన ఉంది .మూడవది ‘’యువ రాజ విలాసం ‘’లో సీతారామ రాజు చేసిన త్యాగం ,అయన వివాహం ,పట్టాభి షేకం రాజు మంత్రి కొడుకుతో వింధ్యగిరి పర్యటన ఉంటాయి .నాలుగవ స్తబకం ‘’సమ్మేళనం ‘’లో సీతారామ రాజు పుణ్య క్షేత్ర సందర్శనం ,ఇతర రాజులపై యుద్ధాలు విజయాలు ,అంతం లో తండ్రీ కొడుకుల సమాగమం ఉన్నాయి .ఈ కావ్యం లో శాంతరసం ఉందని కవే చెప్పాడు.

పండిత ప్రకాండుల ప్రశంసలు అందుకొన్నాడు కవి అన్నయ శాస్త్రి .ఇది అతి అరుదైన సంస్కృత చంపూ కావ్యం .కవి కవిత్వ ప్రతిభకు కొన్ని ఉదాహరణలు చూద్దాం .

‘’ఆస్తి ఖల్వాఖిల వసుంధరా వలయ ప్రతి నిధిః సహస్ర రధసవిలాస గమన సముచితా విశంక తరధ్యాపయ పదిక జన సతత సంచరణ మసృణిత విపులోపల ఫలక ధటితఘంటా సంతత క్రేత్రు జన సముదయ బహు ముఖారవ పూరణ జనిత ప్రతిధ్వానతయా అనపేక్షిత ‘’ఇలా సాగే కమ్మని కవిత్వం .చివరలో ‘’శ్రీ మదానంద గజపతి మహా రాజేన పరిపాలయ మానస్య మహా మండలస్య శ్రీమత్చలమండనగరీ’’అని పూర్తీ చేశాడు .

రెండవ స్తబకం లో ‘’ అహో అస్య శశి మృతోః-సౌభాగ్యం తదాహి –అల్పావశేష తదన్కా పటలీతరూణాం నత్యన్త్య మండన వతీ వినితేవ భాతి ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-11-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా సరస భారతి ఆధ్వర్యం లో ’17-11-15-మంగళ వరం ఉదయం 11గం.లకు ఉయ్యూరు ఏ సి గ్రంధాలయం లో ‘నూతన రాజ దాని అమరావతి ”పై విద్యార్ధులకు వక్తృత్వ పోటీల నిర్వహణ 

గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా సరస భారతి ఆధ్వర్యం లో ’17-11-15-మంగళ వరం ఉదయం 11గం.లకు ఉయ్యూరు ఏ సి గ్రంధాలయం లో ‘నూతన రాజ దాని అమరావతి ”పై విద్యార్ధులకు వక్తృత్వ పోటీల నిర్వహణ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

16-11-15-కార్తీక మాసం మొదటి సోమవారంనాడుసాయంత్రం 5గం లకు ఉయ్యూరులో కే సి పి.ఆవరణలో శ్రీ పరిపూర్నానంద స్వామి వారి ఆధ్వర్యం లో ,గ్రామస్తుల ,పరిసర గ్రామ ప్రజల సహాయ సహకారాలతోజోరున కురుస్తున్న వర్షాన్ని అధిగమించి 25వేలమంది భక్త జనం నిర్వహించిన ”కోటి దీపోత్సవం ”

16-11-15-కార్తీక మాసం మొదటి సోమవారంనాడుసాయంత్రం 5గం లకు  ఉయ్యూరులో కే సి పి.ఆవరణలో శ్రీ పరిపూర్నానంద స్వామి వారి ఆధ్వర్యం లో ,గ్రామస్తుల ,పరిసర గ్రామ ప్రజల సహాయ సహకారాలతోజోరున కురుస్తున్న వర్షాన్ని అధిగమించి 25వేలమంది భక్త జనం నిర్వహించిన ”కోటి దీపోత్సవం ”

 

Inline image 1
 
Inline image 2
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గోవధ రాజ్యన్గావిరుద్ధం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మట్టి సింహాసనం పై తంగేడు వనం,నిజంగా ఇంద్రజాలికుడే

Inline image 1
Inline image 2
గబ్బిట దుర్గా ప్రసాద్
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”మ్యూజిక్ వల్ల హిట్లు ఫట్లు ఉండవు ”ఆర్ కె తో కీరవాణి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక పురుషార్ధాలు ,సాహిత్యం లో తులనాత్మక అధ్యయనం ఆధ్యాత్మ నిధి వారణాశి ,

Inline image 1

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శకుడు రేలంగి అనుభవాలు

‘క్లాప్‌ బోర్డ్‌’ అంటే ఏమనుకుంటున్నావురా? అన్నారు
Updated :15-Nov-2015 : 14:46
గత వారం 
అట్లూరి పుండరీకాక్షయ్యగారి బంధువు జగన్మోహనరావుగారు ఆ సమయంలోనే ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రం నిర్మిస్తున్నారు. కృష్ణంరాజుగారు, నాగభూషణంగారు ముఖ్య పాత్రధారులు. బి.వి.ప్రసాద్‌గారు దర్శకుడు. దాసరి నారాయణరావుగారు ఆ చిత్రానికి మాటల రచయిత. కేతాగారు మమ్మల్ని పుండరీకాక్షయ్యగారి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ఆయన కూడా నేను సినిమా ఫీల్డ్‌లోకి రావడానికి మొదట ఒప్పుకోలేదు. ‘ఎందుకు డాక్టర్‌గారు.. ఈ బురదలోకి. మేమంతా ఏవో తంటాలు పడి నెట్టుకొస్తున్నాం. సినిమాలు వద్దండీ. శుభ్రంగా చదివించి డాక్టర్‌ని చేయండి. లేదంటారా మీలాగా ఆర్‌.ఎం.పి. డాక్టర్‌ని చేయండి’ అని సలహా ఇచ్చారు. అయినా నేను వినలేదు. నా మొండిపట్టు చూసి మా నాన్నగారు కూడా ఆయన మాటలు వినిపించుకోలేదు.
‘సరే మీరు డిసైడ్‌ అయిన తర్వాత నేను చెప్పేదేముంది. మా సంస్థలో ఇతన్ని చేర్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. కాకపోతే అప్రెంటిస్‌ కనుక జీతభత్యాలు ఉండవు. షూటింగ్‌ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని అక్కడికి అతనే రావాల్సి ఉంటుంది. పికప్‌ చేయడం, డ్రాప్‌ చేయడం ఉండవు. ఇందుకు ఇష్టమైతే రావచ్చు’ అని నిర్మొహమాటంగా చెప్పారు. నేను సరేనన్నాను. ఆ సినిమాకి బండ్రెడ్డి నరసింహారావుగారు అసోసియేట్‌ డైరెక్టర్‌. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాగర్‌గారు. అలా ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రంతో అప్రెంటిస్‌గా నా సినీజీవితం 1971 అక్టోబర్‌ 14న ప్రారంభమైంది. ఆ రోజే ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రం మొదలైంది.

ఇక చదవండి

మా నాన్నగారిని వదిలిపెట్టి ఎప్పుడూ లేను. మా ఊరు దాటి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ వెళ్లినా సాయంత్రానికల్లా తిరిగి వచ్చేసేవాణ్ణి. ఇప్పుడు ఊరే కాదు రాష్ట్రం దాటి వచ్చేశాను. కొత్త ప్రాంతం, కొత్త వ్యక్తులు, మనకి తెలియని భాష. అయినా తెలిసిన వాళ్లు ఉన్నా రనే ధైర్యం. మెల్లిగా ఆ వాతావరణానికి అల వాటు పడ్డాను.
టీ నగర్‌లో తన స్నేహితుడు కోళ్ల సత్యంగారి ఇంట్లో నన్ను పెట్టారు నాన్నగారు. రాజాబాదర్‌ స్ర్టీట్‌లో అది ఉండేది. పై పోర్షన్‌లో కోళ్ల సత్యంగారు, అప్పారావుగారనే మరో ఆర్టిస్ట్‌ ఉండే వారు. కింద పోర్షన్‌లో మేకప్‌మన్‌ జయకృష్ణగారు ఉండేవారు. మా పక్క బిల్డింగ్‌ ఆర్టిస్ట్‌ ప్రభాకరరెడ్డిగారిది. అది ఆయన సొంత ఇల్లు. ఆయన ఇంటికి మహారథిగారు, ఇటీవల చనిపోయిన దర్శకుడు భాస్కరరావుగారు తదితరులు వస్తుండేవారు. యోగక్షేమాలు తెలియజేస్తూ ఉత్తరాలు రాయడానికి నేను బద్ధకిస్తానేమోనని నాన్నగారు ఓ వంద ఇన్‌లాండ్‌ లెటర్లు కొని ఫ్రమ్‌ అడ్రెస్‌, టు అడ్రెస్‌ తనే రాసి నా చేతికి ఇచ్చారు. వారానికి ఒకసారికి తప్పనిసరిగా ఉత్తరాలు రాయమని మరీమరీ చెప్పి వెళ్లారు.

అది షూటింగ్‌ పోస్ట్‌బాక్స్‌ అని తర్వాత తెలిసింది

‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రం షూటింగ్‌ ఎక్కువగా ఏవీఎం స్టూడియోలో జరిగేది. వడపళని వెళ్లే బస్‌ ఎక్కి అక్కడికి చేరుకునేవాడిని. నేను కొత్తవాడిని కనుక సెక్యూరిటీ గార్డ్‌ గేటు దగ్గరే ఆపేసేవాడు. దాంతో తెలిసిన వాళ్లు ఎవరన్నా వస్తారేమోనని ఎదురుచూసేవాడిని. ప్రొడక్షన్‌ బాయ్స్‌తోనే లోపలికి వెళ్లిన సందర్భాలు చాలా ఎక్కువ. ఇక సాయంత్రం ఐదు, ఐదున్నరకల్లా నన్ను పంపించేసేవాళ్లు. ఆ సమయానికి ఏదన్నా కారు టీ నగర్‌ వెళుతుంటే అందులో నన్ను ఎక్కించే వారు. సెట్లో నేను చేసే పనేమీ లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకూ అలా చేతులు కట్టుకుని ఓ పక్క నిలబడి షూటింగ్‌ ఎలా జరుగుతోందో అబ్జర్వ్‌ చేయడమే. సాయంత్రం అయ్యేసరికి కాళ్లు లాగేసేవి. చేతులు నొప్పులు పుట్టేవి. అలవాటు లేని వ్యవహారం కనుక నీరసం వచ్చేసేది. ఒక్కోసారి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ బాగా లేటయ్యేది. భోజనం కూడా ఉండేది కాదు. ఇక ఉత్తరం రాయడానికి తీరికేది? కానీ మా నాన్నగారు మాత్రం వదలకుండా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేవారు. కొడుకు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడోనని ఆయన ఆందోళన. ‘అడ్రెస్‌ రాసి మరీ ఉత్తరాలు ఇచ్చాను కదా. నేను క్షేమం అని ఒక ముక్క రాయడానికి వాడికంత బద్ధకం ఏమిటి?’ అనుకునేవారాయన.

అందుకే ఒక రోజు రాత్రి తీరిక చేసుకుని నింపాదిగా కూర్చుని అన్ని వివరాలతో ఉత్తరం రాశాను. అయితే దాన్ని పోస్ట్‌ చేయాలి కదా. పొద్దున్నే లేచి షూటింగ్‌కు పరిగెట్టడానికే సమయం సరిపోతుంది ఇక పోస్టాఫీసుకు వెళ్లి ఉత్తరాన్ని పోస్ట్‌ చేసే తీరిక ఎక్కడిది?

ఆ రోజు వీనస్‌ స్టూడియోలో షూటింగ్‌ జరుగుతోంది. ముందు రోజు కూడా అక్కడే జరిగింది. ఆ స్డూడియోలోనే ఒక చోట పోస్ట్‌ బాక్స్‌ ఉండటం ముందురోజు గమనించాను. అందుకే ఆ మర్నాడు లొకేషన్‌కు వెళ్లగానే మొదట ఆ పోస్ట్‌ బాక్స్‌ దగ్గరికి వెళ్లి, ఉత్తరం అందులో వేశాను. హమ్మయ్య.. నా క్షేమసమాచారాలు నాన్నగారికి తెలుస్తాయి అని తేలికగా ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత షూటింగ్‌కు వెళ్లిపోయాను. కాసేపటికి ఫ్లోర్‌ ఇన్‌చార్జ్‌ మా సెట్‌కివచ్చాడు. వస్తూనే ‘ఇక్కడ ‘రేలంగి నరసింహారావ్‌ ఎవరండీ?’ అని బేస్‌ వాయిస్‌తో ప్రశ్నించాడు. ఆ సమయంలో నేను, అసోసియేట్‌ సాగర్‌ గారు సెట్‌ బయటే ఉన్నాం. నేనేదన్నా తప్పుపని చేశానేమోనని కంగారు పడి ‘ఎందుకు.. ఏమైంది?’ అని అడిగాడు సాగర్‌గారు. అతను సమాధానం చెప్పకుండా ‘ఎవరో చెప్పండి ముందు’ అన్నాడు. సాగర్‌తో పాటు నాకూ కంగారు ఎక్కువైంది. నన్ను చూపించి ఇతనేనండీ.. ‘ఏం జరిగింది’ అని అడిగాడు. ‘ఏమయ్యా ఇతను ఫీల్డ్‌కి కొత్తా? షూటింగ్‌ కోసం మనం ఏర్పాటు చేసిన పోస్ట్‌ బాక్స్‌లో అతను లెటర్‌ వేశాడు. ఇదుగో’ అని సాగర్‌ చేతికి నేను పోస్ట్‌ చేసిన ఉత్తరాన్ని అందించాడు. అప్పటికి కానీ నేను చేసిన తప్పు ఏమిటో నాకు అర్థం కాలేదు. షూటింగ్‌ కోసం ఇలా స్ట్రీట్‌ సెట్‌లో పోస్ట్‌బాక్సులు కూడా ఏర్పాటు చేస్తుంటారని అప్పుడే నాకు తెలిసింది. ఆ మర్నాడు సాయంత్రం టీ నగర్‌లోని పోస్ట్‌ బాక్స్‌లో ఆ ఉత్తరం పోస్ట్‌ చేశాను. కొన్ని రోజులకు ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది.

పాండీబజార్‌లో.. తురాయి చెట్ల నీడలో…

దాంతో మళ్లీ పని కోసం వెదుక్కోవాల్సిస పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే దాసరి నారాయణరావుగారికి దర్శకత్వ ఛాన్స్‌ రావడంతో ఆయన బయటి సినిమాలకు రాయడం మానేసి ‘తాత-మనవడు’ స్ర్కిప్ట్‌ పనిలో నిమగ్నమయ్యారు. అయనతో పరిచయం ఉండటం వల్ల ప్రతిరోజూ సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లేవాణ్ణి. అప్పట్లో ఆయన టీనగర్‌లో హెన్స్‌మన్‌ పార్క్‌ పక్కనే ఉన్న ఇంట్లో ఉండే వారు. నేను, ధవళ సత్యంగారు, రాజు అనే ఆర్టిస్ట్‌, కాపరపు సూర్యనారాయణ అని…. దాసరిగారితో కలిసి నాటకాలు వేసి తర్వాత పరిశ్రమకి వచ్చి జూనియర్‌ ఆర్టిస్ట్‌ సప్లయర్‌గా స్టిరపడ్డారు.. ఆయన , ఇప్పుడు గురువుగారి దగ్గర బంగారుబాబుగారు అని ఉన్నారే ఆయన తండ్రి సుబ్బారెడ్డిగారు…. మేమంతా దాసరిగారింట్లో కలిసే వాళ్లం. పద్మగారు మా అందరికీ టీలు తయారు చేసి ఇచ్చేవారు. గురువుగారు ఆ రోజు తను రాసిన సన్నివేశాలన్నీ మాకు చదివి వినిపించేవారు. ‘చాలా బాగుంది సార్‌’ అని మేమంతా అభినందించే వాళ్లం.

నాది జీతం భత్యం లేని ఉద్యోగం కావడంతో ప్రతి నెలా మా నాన్నగారు నూట పాతిక రూపాయలు పంపించేవారు. పాండీ బజార్‌లోనే అశోకా హోటల్‌ అని ఉండేది. మనియార్డర్‌ రాగానే ముందు 90 రూపాయలు పెట్టి నెలకు సరిపడా భోజనం టిక్కెట్లు కొనేసేవాడిని. ఇంకా మిగిలిన 35 రూపాయలను రోజువారీ ఖర్చుల కోసం చాలా పొదుపుగా వాడుకునేవాణ్ణి. సాయంత్రం అయితే చాలు సినిమావాళ్లు, తెలుగువాళ్లతో పాండీబజార్‌ కిటకిట లాడుతుండేది. పాండీ బజార్‌ నుంచి పానగల్‌ పార్క్‌ వరకూ సినీజనం గుంపులు గుంపులుగా విడిపోయి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో అక్కడ తురాయి చెట్లు ఉండేవి. వాటి కింద చేరి కబుర్లు చెప్పుకుంటుండేవాళ్లం. భవిష్యత్తు గురించి అందమైన కలలు కనేవాళ్లం. ప్రతి రోజూ పాండీబజార్‌కి వెళ్లేవాడిని కాదు. మా గురువుగారు ఇంట్లో లేనప్పుడు మాత్రమే అక్కడికి వెళ్లేవాళ్లం. గురువుగారు ఉంటే ఆయన ఇంట్లోనే మాకు కాలక్షేపం అయ్యేది.
అలా ఒకరోజు పాండీబజార్‌కు వెళ్లినప్పుడు ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రానికి కాస్ట్యూమర్‌గా పనిచేసిన గోపాలకృష్ణగారు కనిపించారు. నేనంటే ఆయనకి అభిమానం. ఏం చేస్తున్నావంటూ నన్ను ఆప్యాయంగా పలకరించారు. ఖాళీగానే ఉన్నానని చెప్పాను. అయితే నాతో రండి అని డాక్టర్‌ నాయర్‌ రోడ్‌లో ఉన్న ఓ ఆఫీసుకు తీసుకెళ్లారు. అది నిర్మాత ఎమ్మెస్‌ రెడ్డిగారి ఆఫీసు అని అక్కడికి వెళ్లాక తెలిసింది.

రెడ్డిగారు ఆరు బయట కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నారు. నేను, గోపాలకృష్ణ ఆయన దగ్గరకు వెళ్లి వినయంగా నమస్కరించాం. ‘రావయ్యా గోపాలకృష్ణా.. ఏమిటీ విశేషాలు… ఈ కుర్రాడెవరు?’ అని అడిగారు రెడ్డిగారు. ‘సార్‌.. ఇతనిది పాలకొల్లు అండీ. డాక్టర్‌గారి అబ్బాయి. ‘మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌’ చిత్రానికి అప్రెంటిస్‌గా పనిచేశాడు. మన సంస్థలో అవకాశం ఇస్తారేమోనని…’ అని ఆపేశారు గోపాలకృష్ణ. ఆ సమయంలో చలంగారు హీరోగా ‘ఊరికి ఉపకారి’ చిత్రం ప్లాన్‌ చేస్తున్నారు ఎమ్మెస్‌ రెడ్డిగారు. నిజానికి ఆ చిత్రానికి ఆయన కాదు నిర్మాత… వాళ్ల బావమరిది మోహన్‌రెడ్డి. సుందరం మూవీస్‌ బేనరుపై తయారైన ఆ చిత్రం ఎమ్మెస్‌ రెడ్డిగారి పర్యవేక్షణలోనే తయారైంది.
ఆ సినిమాకి దర్శకుడు కె.ఎస్‌.ఆర్‌.దాస్‌గారు. అప్పటికి ఐదు రోజుల షూటింగ్‌ మాత్రమే జరిగింది.

అంతకుముందు ఎమ్మెస్‌ రెడ్డిగారు నిర్మించిన ‘కోడెనాగు’ తదితర చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రాజాచంద్ర ఈ చిత్రం కథాచర్చల సమయంలో ఏవో కారణాల వల్ల మానేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత పేరాల సుబ్రహ్యణ్యంగారు వచ్చారు. కానీ ఆయన కూడా కొన్ని రోజులు పనిచేసి వెళ్లిపోయారు. ఆ సినిమాకి పని చేయడానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావాలి. ఆ విషయం తెలిసే గోపాలకృష్ణ నన్ను అక్కడికి తీసుకెళ్లారు.

నా వంక ఎగాదిగా చూసి ‘ఏమిటయ్యా.. ఏం చేస్తావు నువ్వు?’ అని ప్రశ్నించారు రెడ్డిగారు. ‘డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏ పని చెప్పినా చేస్తానండీ’ అన్నాను నేను చేతులు కట్టుకుని వినయంగా.

‘మొదటి సినిమాకి ఏం నేర్చుకున్నావు?’

‘నేను అప్రెంటిస్‌ని కదండీ.. పనులేమీ చెప్పేవారు కాదండీ. సెట్లో ఉండి అన్నీ పరిశీలించేవాణ్ణి’.
‘సరే.. అలాగే పనిలో చేరు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో. జీతభత్యాలేమీ ఉండవు’ అన్నారాయన.
‘అలాగేనండీ’ అన్నాను.
‘గోపాలకృష్ణా.. అసోసియేట్‌ డైరెక్టర్‌ అంజి బాబు దగ్గరకి ఇతన్ని తీసుకెళ్లవయ్యా’ అని చెప్పారు రెడ్డిగారు.

అంజిబాబుగారు దర్శకత్వశాఖలో ఎంతో అనుభవమున్న వ్యక్తి. విఠలాచార్యగారి దగ్గర కో డైరెక్టర్‌గా చాలా కాలం పనిచేశారు. ఇంకా ఎంతో మంది దగ్గర కూడా వర్క్‌ చేశారు. దర్శకునిగా తనకు ప్రమోషన్‌ లభిస్తుందేమోనని ఆశగా ఎదురు చూశారు కానీ ఎవరూ అవకాశం ఇవ్వ లేదు. దాంతో ఇక నేను జీవితంలో దర్శకుణ్ణి అవ నని తీర్మానించుకుని రాజీపడి పోయి వేదాంత ధోరణి అలవరుచుకుని పనిచేస్తున్న సీనియర్‌ మోస్ట్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌. షూటింగ్‌ తొలి రోజున సెట్‌లో ఉన్నప్పుడు హీరో చలంగారి దగ్గరకు తీసుకెళ్లి నన్ను పరిచయం చేశారు అంజిబాబుగారు. ‘ఏ ఊరు మీది?’ అని ఆయన అడిగారు. ‘పాలకొల్లు అండీ’ అని చెప్పాను. ఆయనది కూడా పాలకొల్లు కావడంతో కొంచెం ఆసక్తి చూపిస్తూ ‘అలాగా.. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?’ అని ప్రశ్నించారు. ‘మా నాన్నగారు ఆర్‌.ఎం.పి. డాక్టర్‌గారండీ’ అని చెప్పగానే ‘మా రంగనాయకులుగారి అబ్బాయివా.. భలే వాడివయ్యా.. ఆ విషయం చెప్పవేం’ అని నాన్నగారి గురించి, నా గురించి అడిగారు. పరిచయమైన కాసేపటికే బాగా క్లోజ్‌ అయ్యాం ఇద్దరం. చలంగారిది చాలా మంచి మనసు.
తొలి సంపాదన రూ. 50

అప్పటికి నేను ఆ సంస్థలో చేరి నెల రోజులైంది. ఎమ్మెస్‌రెడ్డిగారిది చాలా గొప్ప మనసు. తన కంపెనీలో పనిచేసే వారిని కన్నబిడ్డల్లా చూసుకొనేవారు. ప్రతి నెలా 31 కల్లా జీతాలు ఇచ్చేవారు. రెండు రోజుల ముందు తనే స్వయంగా బ్యాంక్‌కి వెళ్లి కొత్త నోట్లు తీసుకువచ్చి కవర్లలో పెట్టి, వాటిమీద స్టాఫ్‌ పేర్లు రాసి, అందించేవారు. ఆ రోజు అందరికీ ఇచ్చారు. నాకు జీతభత్యాలు ఉండవని ముందే చెప్పారు కనుక నేను జీతం గురించి ఆశించలేదు. సాయంత్రం వరకూ ఆఫీసులోనే ఉన్నాను. ఉన్నట్టుండి రెడ్డిగారు నన్ను తన గదిలోకి పిలిచారు. ‘అందరికీ జీతాలిచ్చానయ్యా. నిన్ను ఒట్టి చేతులతో ఇంటికి పంపడానికి మనసొప్పడం లేదు. ఈ నెల నుంచి నీకు యాభై రూపాయలుఇస్తానయ్యా. ఇది జీతం కాదు.. దారి ఖర్చులు అనుకో’ అని యాభై రూపాయలు కవర్లో పెట్టి నాకు అందివ్వబోయారు. తీసుకోవడానికి నేను మొహమాట పడ్టాను. ‘పరవాలేదు సార్‌.. నా రూమ్‌ దగ్గరే కదా’ అన్నాను. ‘‘భలే వాడివయ్యా.. నేను ఇస్తున్నాను కదా.. తీసుకో’ అని బలవంతంగా ఆ కవరు నా చేతిలో పెట్టారు. అలా ఆ రోజు పరిశ్రమలో నా తొలి సంపాదనని అందుకున్నా.

చెంప ఛెళ్ళుమనిపించిన కె.ఎస్‌.ఆర్‌.దాస్‌

దర్శకత్వ శాఖలోని ప్రతి పని నాకు దగ్గరుండి నేర్పించేవారు అంజిబాబుగారు. నేనూ ఆసక్తిగా నేర్చుకొనేవాడిని. ఒక రోజు పోరూర్‌లో షూటింగ్‌ జరుగుతోంది. మెయిన్‌రోడ్‌ మీదే షూటింగ్‌. ఆ రోజు ఎండ చాలా తీవ్రంగా ఉంది. పొద్దున్నే షూటింగ్‌ మొదలెట్టాం. కె.ఎస్‌.ఆర్‌.దాస్‌గారికి స్పీడ్‌ డైరెక్టర్‌గా పేరుండేది. ఏ మాత్రం గ్యాప్‌ లేకుండా షాట్‌ బై షాట్‌ తీసేవారు. ఆయన స్పీడ్‌ని తట్టుకోవడానికి కొన్ని రోజులు పట్టింది నాకు. మొదట ఎడిటర్‌గా పనిచేసి, తర్వాత దర్శకుడయ్యారు కనుక మైండ్‌లోనే ఎడిటింగ్‌ చేసేసేవారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని నేను ఒక్కడినే కావడంతో క్లాప్‌ కొట్టడం, ఎడిటింగ్‌ రిపోర్ట్‌ రాసుకోవడం నేనే చెయ్యాల్సి వచ్చేది. షాట్‌ తీయడం పూర్తి కాగానే దాస్‌గారు మరో షాట్‌ తీయడానికి ఏర్పాట్లు చేస్తుంటే ఈ గ్యాప్‌లో నేను చేతిలో ఉన్న క్లాప్‌ బోర్డ్‌ని రోడ్డు మీద పెట్టి, మోకాళ్ల మీద కూర్చుని ఎడిటింగ్‌ రిపోర్ట్‌ రాసుకోసాగాను. ఇదంతా దూరం నుంచి గమనించిన దాస్‌ గారు వేగంగా నా దగ్గరకు వచ్చి ‘పైకి లేరా’ అన్నారు సీరియస్‌గా.
నేను కంగారు పడుతూ లేవగానే ఫట్‌ మని నా చెంప మీద కొట్టారు. ఆయన అలా కొడతారని నేను ఊహించలేదు. చేత్తో చెంపని అలాగే పట్టుకుని ఆయన వంక చూశాను.
‘క్లాప్‌ బోర్డ్‌ అంటే ఏమనుకుంటున్నావురా… అది మనకు సరస్వతిరా.. నిర్మాతకు లక్ష్మి. అటు వంటి క్లాప్‌ బోర్డ్‌ని రోడ్డు మీద పడేస్తావురా రాస్కెల్‌..’ అంటూ కోపంతో ఊగిపోయారాయన.

‘అది కాదు సార్‌.. ఎడిటింగ్‌ రిపోర్ట్‌ రాసుకోవడానికని…’ అని నేను చెప్పబోతుంటే ఆయన వినిపించుకోకుండా ‘రాసుకోవడానికి నీకు ఇబ్బం దిగా అనిపిస్తేనీ పక్కనే సెట్‌ అసిస్టెంట్‌ ఉన్నాడు. వాడికి ఇవ్వు.. లేదంటే చంకలో పెట్టుకుని రాయి.. ఇలాంటిది మరోసారి రిపీట్‌ అయిందంటే నేను ఊరుకోను’ అని వార్నింగ్‌ ఇచ్చారు.
(మిగతా వచ్చేవారం) 
పవన్‌పై తెలకపల్లిరవి వివాదాస్పద వ్యాఖ్యలు
Updated :15-11-2015 16:44:44
ఒంగోలు: తెలంగాణ సాహితీ స్రవంతి అధ్యక్షుడు తెలకపల్లి రవి.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒంగోలుకు వచ్చిన తెలకపల్లి రవి విలేకరులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్.. నీకు రాజకీయాలు కావాలా? లేక సినిమాలు కావాలా? తేల్చుకో అని అన్నారు. ‘‘చూడప్ప సిద్దప్పా.. నీకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉంటే సినిమాలు వదిలేసి, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారు. లేకపోతే రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకో’’ అని రవి హితవు పలికారు.
‘ప్రశ్నించడానికే పార్టీ పెట్టా’ అని చెప్పే పవన్.. ఎవరి తరపున ప్రశ్నిస్తున్నాడో అర్థం కావడం లేదని తెలకపల్లి వ్యంగ్యంగా అన్నారు. ప్రజల కోసం చంద్రబాబును ప్రశ్నిస్తాడనుకొంటే.. చంద్రబాబు చెప్పిన విషయాలే మీడియాతో చెబుతున్నాడని తెలకపల్లి విమర్శించారు. రాజధాని ప్రాంతవాసుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోరాడకుండా ఆయన వద్దే పెయిడ్ ఆర్టిస్టుగా ఉంటే లాభం లేదని చెప్పారు. కనీసం ప్రత్యేక హోదాపై కూడా పవన్ ప్రశ్నించకపోవడం ఏపీ ప్రజల దౌర్భాగ్యమని తెలకపల్లి రవి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులేనిదే ఎన్నికల్లో పోటీ చేయలేమని పవన కల్యాణ్ కూడా అనడం సబబు కాదని ఆయన చెప్పారు.
అమరావతి చుట్టూ 21 అద్భుత నగరాలు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఇంత వరకు అమరావతిని పట్టించుకోలేదని రవి ఎద్దేవా చేశారు.
వినాయకరావు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భరణి భావాలు

 

నాటక రచయితగా, నటుడిగా తనదైన ముద్ర… క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా 750 సినిమాలు… మూడు నంది అవార్డులు… రచయితగా ఎనిమిది పుస్తకాలు… దర్శకుడిగా మూడు షార్ట్‌ ఫిల్మ్‌లు, ఒక జనం మెచ్చిన సినిమా… ఇదీ తనికెళ్ళ భరణి ట్రాక్‌ రికార్డ్‌. ‘డిసైడ్‌ చేస్తా’, ‘అద్యెచ్ఛా’(అధ్యక్షా), ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అంటూ ఆయన తనదైన శైలిలో పలికిన డైలాగులు తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయేవే. ఆ ‘బహుముఖ ప్రజ్ఞా’భరణి చెప్పిన షూటింగ్‌ ముచ్చట్లే ఇవి …

లేడీస్‌ టైలర్‌ సినిమాకు నేను మాటల రచయితను. అయితే అంతకుముందు నాకు నాటకాల్లో నటించిన అనుభవం ఉన్నట్లు వంశీ గారికి తెలియదు. నటీనటులకు సీన్లు వివరిస్తుంటే ‘బాగా చేస్తున్నావయ్యా నువ్వే ఎందుకు నటించకూడదు’ అని అప్పటికప్పుడు నాతో వేషం వేయించారు. అలా సినీనటుడ్నయ్యాను.

బాపుగారి చమత్కారం

బాపుగారి సినిమా ‘పెళ్ళి పుస్తకం’ షూటింగ్‌ జరుగుతోంది. దానిలో నాక్కూడా ఒక పాత్ర ఇస్తే బావుణ్ననిపించింది. కానీ వాళ్ళు పిలవలేదు. అనుకోకుండా ఒక రోజు కబురు వచ్చింది. అది హీరో, హీరోయిన్ల ఫస్ట్‌ నైట్‌ సీన్‌. వారిరువురి మధ్యకూ పురోహితుడి తమ్ముడిగా ప్రవేశించి దక్షిణ గురించి అడిగే పాత్ర నాది. ఆ సన్నివేశంలో నేను శ్లోకాలు కూడా చెబితే బావుంటుందన్నారు బాపుగారు. గుర్తొచ్చిన ఏవో రెండు శ్లోకాలు చెప్పేసి సీను కానిచ్చేశాను. ఇక బయల్దేరబోతుంటే బాపుగారు నా చేతిలో పదివేల రూపాయల చెక్కు పెట్టారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర వేస్తేనే చాలనుకున్న నేను డబ్బులు వద్దన్నాను. ఆయన వినకుండా బలవంతంగా ముట్టచెప్పారు. ఇవ్వవలసిన డబ్బులే ఎగ్గొట్టే ఈ ఇండస్ట్రీలో ఇంత చిన్న వేషానికి పదివేలా! అని ఆశ్చర్యపోతుంటే, రమణగారు వచ్చి పదివేల రూపాయల కట్ట చేతిలో పెట్టారు. ఆల్రెడీ చెక్కు ఇచ్చారండీ అన్నాను. ‘అది నీ నటనకు, ఇది నీ రచనకు’ అన్నారాయన. స్ర్కిప్ట్‌లో లేని శ్లోకాలను చెప్పినందుకు కూడా రెమ్యూనరేషన్‌ ఇచ్చి వారి దొడ్డ మనసు చాటుకున్నారు. అలా నాకు డబుల్‌ రెమ్యూనరేషన్‌ ఇప్పించిన సీను, తీరా చూస్తే సినిమాలో లేదు. అదేంటండీ అని బాపుగారిని అడిగితే, ‘నీ నటన మాకు బాగా నచ్చి దాన్ని ఎడిట్‌చే సి మేమే ఉంచేసుకున్నామయ్యా’ అని చమత్కరించారు. ఇంతకీ విషయమేమిటంటే నిడివి ఎక్కువయిందని కత్తిరించిన సీన్లలో ఇదీ ఉందట.

… అదీ ‘అద్భుతః’ అసలు కథ

నేను దర్శకత్వం వహించిన ‘మిథునం’ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం మేనరిజం ‘అద్భుతః’ అనే మాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. నిజానికి ఆ పదం ‘అష్టా చెమ్మా’ సినిమాలో అనుకోకుండా నా నోటినుంచి వచ్చిందే. ఆ సినిమాలో నేను వంకాయ పచ్చడి చేస్తూ అవసరాల శ్రీనివాస్‌తో మాట్లాడే సన్నివేశం ఒకటి ఉంది. అప్పుడు నిజంగానే వంకాయను పుటంపెట్టి కాల్చి శాసో్త్రక్తంగా పచ్చడి చేశాను. సీన్‌ ప్రకారం అతడితో మాట్లాడటం అయిపోయాక పచ్చడి బండ నాకి రుచి చూడాలి. అలా రుచిచూస్తూ పచ్చడి చాలా బాగా కుదరటంతో అప్రయత్నంగా ‘అద్భుతః’ అనేశాను. దాన్ని అలా సీన్‌లో ఉంచేశారు. ఆ ఎక్స్‌ప్రెషన్నే తరువాత ‘మిథునం’లో వాడాను.

పిండి పులిహోర తెమ్మంటే…

‘పిండి పులిహోర’ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్‌ వంటకం. దాన్ని ‘మిథునం’ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం తినే దృశ్యం ఒకటుంది. అందుకోసం పిండి పులిహోర తెప్పించమని ఆర్ట్‌ డైరెక్టర్‌తో చెప్పా. తీరా షాట్‌ తీద్దామనుకుంటుండగా చూస్తే ఒక గిన్నెలో పులిహోర, మరో గిన్నెలో పిండి ఉన్నాయి. అతడికి పిండితో చేసే పులిహోర గురించి తెలియదట. సినిమా కాబట్టి ఏదోలా మ్యానేజ్‌ చేసేశామనుకోండి.

వార్నీ! గుమ్మడికాయ అభిమానం …

పరదేశి సినిమా షూటింగ్‌కు అమెరికా వెళ్ళినప్పుడు నాకు, ఎమ్మెస్‌ నారాయణకు, బ్రహ్మానందానికి, బాబూమోహన్‌కు ఒకే మోటెల్‌(అక్కడి హోటల్స్‌ని అలా అంటారు)లో బస ఏర్పాటు చేశారు. ఒక రోజు మమ్మల్ని తీసుకెళ్ళడానికి కారు రాలేదు. అందరం ఆకలితో నకనకలాడి పోతున్నాం. మోటెల్స్‌లో వంట చేసుకోవడానికి కింద ప్రత్యేకంగా రూముల ప్రకారం విడి విడిగా స్టవ్‌లూ, పాత్రలూ ఉంటాయి. కానీ కూరగాయలు, సరుకులూ మనమే తెచ్చుకోవాలి. కింద కెళ్ళి చూస్తే మాకు కేటాయించిన ప్రదేశాల్లో ఒక చోట సేమ్యా వంటిది దొరికింది. నాకు కాస్త గరిటె తిప్పడం అలవాటుండడంతో చుట్టుపక్కల ఉన్న ఇతరుల స్టౌల దగ్గరకెళ్ళి దొంగచాటుగా వెతికితే ఒక ఉల్లిపాయ, కొంచెం ఉప్పు, మిరియాల పొడి వంటివి కనిపించాయి. వాటితో ఉప్మా చేస్తే అందరూ లొట్టలేసుకుంటూ తిన్నారు. మర్నాడు షూటింగ్‌కు వెళ్ళాక ఈ విషయం దర్శకుడు రాఘవేంద్రరావు గారికి తెలిసి, ‘నీకు ఈ రోజు షూటింగ్‌ కాన్సిల్‌, నేను ఉంటున్న వారింట్లో మంచి గుమ్మడికాయ ఉంది. దానితో చక్కగా కూర వండటమే ఈ రోజు నీ షెడ్యూల్‌’ అని నన్ను ఆయన ఉంటున్న ఇంటికి పంపించారు. నేను వంట చేసి గుమ్మడికాయ కూరతో అందరికీ విందు చేశాను. నా వంట ఆ ఇంటిగల వాళ్ళకు కూడా బాగా నచ్చింది. నన్ను మర్నాడు వారు తమ ఇంటికి ఆహ్వానించారు. వారి అభిమానానికి పొంగిపోతుంటే అప్పుడు తెలిసింది, వారు నన్ను రమ్మన్నది నా చేత గుమ్మడికాయ కూర వండించి, వారి స్నేహితులకు కూడా రుచి చూపించడానికట!

పెట్టుడు గెడ్డం మహా చిరాకు …

నాకు పెట్టుడు గడ్డం అంటే తగని చిరాకు. అందుకోసం రెండు మూడు సినిమాలు కూడా వదిలేసుకున్నా. ‘బాహుబలి’లో నాది స్వామీజీ పాత్ర. గడ్డం ఉంటుందని తెలిసినప్పటికీ, ఆ సినిమా చరిత్ర సృష్టిస్తుందని నా మనసుకు అనిపించడంతో ఒప్పేసుకున్నాను. అయితే పెట్టుడు గడ్డం అవసరం రాకుండా ఆ పాత్ర అనుకున్నప్పటి నుంచీ గడ్డం పెంచాను. అయినా ఉపయోగం లేకపోయింది. షూటింగ్‌కి వెళ్ళగానే ఇంత బారు పెట్టుడు గడ్డం నా చేతికిచ్చారు. రాజమౌళి గారినడిగితే ‘మీ గడ్డం చాలదండీ, బారు గడ్డం ఉండాల్సిందే’నన్నారు. ఇక తప్పలేదు. ఆ సినిమాలోని నా డైలాగ్‌ ‘శివయ్యేటి చేత్తాడో మనకేటి తెల్సూ…’ అనుకుంటూ ఆ కేరళ అడవుల్లో పదిహేను రోజులపాటు షూటింగ్‌ కానిచ్చేశాను.

నాటకానుభవమే కాపాడింది

అది ‘దయామయుడు’ షూటింగ్‌ ఆఖరి రోజు. రాత్రి పన్నెండయ్యింది. 400 అడుగుల చివరి షాట్‌ అది. ఇంచుమించు ఆ షాట్‌ మొత్తం నా డైలాగులతోనే ఉంది. మధ్య మధ్యలో రెండు మూడు చిన్న చిన్న డైలాగులు ఇతరులవి ఉన్నాయి. ఆ రోజుతో ఆర్టిస్టుల డేట్సన్నీ అయిపోయాయి. ఏమైనా సరే ఆ రోజే షూటింగ్‌ పూర్తయిపోవాలి. చూస్తే ఫిల్మ్‌ కూడా 400 అడుగులే ఉంది. ల్యాబ్‌ పదకొండింటికే మూసేస్తారు. ఫిల్మ్‌ దొరికే టైం కూడా కాదది. విజయచందర్‌గారు నా దగ్గరకొచ్చి ఏం చేస్తావో తెలీదు, షాట్‌ మొత్తం ఒకే టేక్‌లో అయిపోవాలి. అన్ని డైలాగ్‌లు ఎలా గుర్తుపెట్టుకుంటావో ఏమో! నీదే భారం అన్నారు. నాకు లోలోపల టెన్షన్‌ మొదలైంది. అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా సింగిల్‌ టేక్‌లో షాట్‌ కానిచ్చేశాను. అందరం ఊపిరి పీల్చుకున్నాం. నాటకానుభవం ఉండటమే అప్పుడు నన్ను కాపాడింది.

మూడు దశాబ్దాల సినీ జీవితం నాకెన్నో అనుభవాలనిచ్చింది. వాటిలో కొన్నింటిని ఆంధ్రజ్యోతి ద్వారా ప్రేక్షకులతో పంచుకోవడం నిజంగా అద్భుతః.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ ముగ్గురూ మారినప్పుడే మంచి సినిమాలోస్తాయి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పారిస్ లో నరమేధం –

Inline image 1


Inline image 2Inline image 1

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అభి వృద్ధే ప్రజా వాంచితం

Inline image 1

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

15-11-15-ఆదివారం మా ద్వారకా తిరుమల ,రామారావు గూడెం అగ్రహారం దేవాలయ సందర్శన పూజ ,మరియు ఏలూరులో మా కొత్త మేనకోడలు ఛి సౌ భారతి దంపతుల స్వగృహం లో లో విందు 

15-11-15-ఆదివారం మా  ద్వారకా తిరుమల ,రామారావు గూడెం అగ్రహారం దేవాలయ సందర్శన పూజ ,మరియు ఏలూరులో మా కొత్త మేనకోడలు ఛి సౌ భారతి దంపతుల స్వగృహం లో లో విందు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment