చేతులు కాలక ముందే(కవిత) – శీలా సుభద్రాదేవి

చేతులు కాలక ముందే(కవిత) – శీలా సుభద్రాదేవి

అమ్మ బొజ్జలో నుండి బయట పడుతున్నప్పుడే
ఒక పిడికిట్లో జీవితాన్ని
మరో పిడికిట్లో ఆశల్నీ
భద్రంగా బిగించి పట్టుకొంటుంది పసికందు
ఎప్పుడో తనకి తెలీకుండానే
చేతినుండి జారవిడుచుకొన్న జీవితం
క్రమక్రమంగా మరొకరి అధీనంలోకి పోతుంది
ఆశలూ అంతే !
స్వంత జీవితం , స్వంత ఆలోచనలూ లేనిదైపోతూ
తనది కాకుండా మిగిలిపోతుందని తెలిస్తే
పిడికిలి విప్పెదికాదేమో
ఇప్పుడు ఎంత భద్రంగా దోసిట్లో బంధించి
తనదైన జీవితాన్ని గుండెల్లో దాచేసుకుందా మనుకొన్నా
వేళ్ళ సందుల్లోంచి జారిపోతూనే ఉంటుంది
మనిషి సంఘజీవికదా
సాంప్రదాయాలూ సాంఘిక వలయాలతో
మన చుట్టూ కంచెల్ని బిగిస్తూనే ఉంటుంది సంఘం
జీవించాలనుకోవటం వేరు
జీవించటం వేరు
జీవన విధానంలోనే మనసు వికసితం అవుతుంది
సమస్యల ముళ్ళ తీగల మధ్య నుండి
గాయపడకుండా నడవటంలోనే –
ఆర్ధిక సుడిగుండాల మధ్య కూరుకుపోకుండా
ప్రణాళిక బద్ధంగా బతకటంలోనే –
మనసును మండించే మూఢ నమ్మకాల జ్వాలల్లో నడుస్తూ
వ్యక్తిత్వం బయటపడుతుంది
అమూల్యమైన జీవితాన్ని
ఆరుబయట సుడి గాలుల పాల్చేసి
కన్నుమలిగే క్షణం లో ఎంత దుఃఖిస్తే మాత్రం
మిగిలేది శూన్యమే

– శీలా సుభద్రా దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కృష్ణ గీత – నిషేధం- క్రిష్ణ వేణి

కృష్ణ గీత – నిషేధం- క్రిష్ణ వేణి

సినిమాలు, పుస్తకాలు, పాటలూ..అన్నిటిమీదా బ్యానే.
మహారాష్ట్రాలో బీఫ్ నుంచీ, గుజరాత్లో బ్యాన్ చేయబడిన ‘ఫనా’, ‘ఫిరాక్’ మరియు ‘పర్జానియా’ వంటి సినిమాలేకాక ‘ద విన్సీ కోడ్’, ‘ద బ్లాక్ ఫ్రైడే, ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ వంటి సినిమాలనుంచీ సాతానిక్ వెర్సస్ లాంటి పుస్తకాలవరకూ మన దేశంలో ఏవి బ్యానుకి అనర్హం కాలేదు కిందటి రెండు సంవత్సరాలలో? .

‘ముహమ్మద్-దేవుని దూత’ అన్న ఇరానియన్ సినిమా పట్ల అభ్యంతరం తెలుపుతూ, ఆ ప్రోజెక్టులో జోక్యం ఉన్నవాళ్ళందరి మీదా- ముంబైకి చెందిన ర‌జా అకాడ‌మీ (సున్నీ ముస్లిం సంస్థ) ఫత్వా జారీ చేసింది. ఫత్వా జారీ చేయబడినవారిలో, మ్యూజిక్ కంపోసర్ ఏ ఆర్ రహ్మాన్ మరియు ఆ సినిమా తీసిన మజిదీ కూడా ఉన్నారు. “నేను పాశ్చాత్యదేశాల్లోనూ తూర్పు దేశాల్లోనూ కూడా ఉంటాను. ఎవరినీ తీర్పు తీర్చకుండా అందరినీ ప్రేమించడానికి ప్రయత్నిస్తాను.” అని చెప్తూ, తను “ఏ హానీ కలిగించే ఉద్దేశ్యంతో మ్యూజిక్ కంపోస్ చేయలేదని” ఆస్కార్ విజేత రహ్మాన్ తన ఫేస్‌బుక్ పేజీ మీద రాశారు.
ఫత్వా జారీ చేయడానికి ఒక ప్రక్రియ అంటూ ఉంటుంది. ఎవరికి పడితే వారికి ఫత్వా జారీ చేసే హక్కుండదు. అది వేరే సంగతనుకోండి.

11111111111111111111

మన సినిమాలు కానీ, టివి సీరియళ్ళు కానీ, పాటలు కానీ- స్టీరియో టైపులో ఉన్నంతకాలమూ ఏ బెంగా లేదు. కానీ ఏదైనా సున్నితమైన లేక గంభీరమైన అంశం గురించి ఎవరైనా మాట్లాడే ధైర్యం చేసిన క్షణం, అది మనకి మింగుడు పడదు. ఆ సినిమా లేక సీరియల్ని తీసిన వ్యక్తి ప్రమాదంలో పడకనూ మానడు.

‘సైనిక్ తులే నౌ హతియార్’ అన్న బెంగాలీ పాటని సలీల్ చౌదరీ All India Tripartite Land Reform Movement పర్యంతం కంపోస్ చేసి పాడారు. రైతులు తమ ఆయుధాలని చేబట్టి తమ భూమిని తిరిగి చేజిక్కించుకొమ్మంటూ ప్రేరేపిస్తుందా పాట. అప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో, ఆ ఆల్బమ్నే బ్యాన్ చేసేరు.

ఢిల్లీ గాంగ్ రేప్‌లో నిందితుడైన ముకేష్ సింగ్ ఆలోచనాధోరణిని చూపించిన లెస్లీ ఉడ్విన్ తయారు చేసిన డాక్యుమెంటరీ “ఇండియాస్ డాటర్‌” ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. పోలీసుల పర్యవేక్షణ ఉంటే తప్ప పార్టీలకి ఫారెన్ ఇన్వైటీస్ రావడాన్ని కర్నాటకా ప్రభుత్వం బ్యాన్ చేసింది.

ప్రపంచంలో అధిక పట్టణాలు సైకిల్ తొక్కమని ప్రోత్సహిస్తుంటే, కొలకత్తాలో 62 వీధుల్లో సైకిళ్ళు నడపకూడదు.
ప్యూగో కార్ అడ్వర్టైసుమెంటుని ప్రభుత్వం బ్యాన్ చేసింది. వీడియో చూడండి.

బ్యాన్ చేశిన ‘చాంద్ బుఝ్ గయా’( చంద్రుడు మరుగయేడు) అన్న ఫాయెజ్ అన్వర్ ఫిల్మ్‌- ఒక హిందూ యువకుడూ మరియు ఒక ముస్లిమ్ యువతికీ మధ్య ఉన్న ప్రేమ కథ గురించినది. గుజరాత్ అల్లర్లలో వారి జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి. ఆ సినిమాలో వయొలెన్సూ, కొన్ని అమానవీయమైన సీన్లూ ఉన్నాయి. అంతేకాక కొన్ని కారెక్టర్లు నిజజీవితపు కొంతమంది మనుష్యులని పోలి ఉండాలి.

“ఆంధీ” మరియు ‘కిస్సా కుర్సీకా” అన్న సినిమాలు ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తీసినవన్న అనుమానంతో అప్పుడు వాటిని బ్యాన్ చేశారు. ఈ సినిమాల లిస్ట్ సమగ్రమైనది కాదు కానీ ఇది tip of an iceberg మాత్రమే. ఇప్పుడు “లెస్బియన్” అన్న మాట మీదా బ్యానే.

2014 మార్చ్‌లో ‘గుర్బాణీ’ అనే ఒక సీరియల్ ప్రారంభం అయింది. ‘గుర్బాణీ’ అన్న మాటకి ఒక సిక్కు జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంటుందనీ, ఆ మాటని కేవలం సిక్కు గురూల భక్తిగీతాల కోసం మాత్రమే ఉపయోగించాలని శిరోమణీ గురుద్వారా ప్రబంధక్ కమిటీ అభ్యంతరం తెలిపింది. అప్పుడు ఆ సీరియల్ పేరు మార్చి ‘బాణీ’ అని పెట్టేరు.

మనం ప్రజాస్వామిక సమాజంలో జీవిస్తున్నాం. దేన్ని పడితే దాన్ని బ్యాన్ చేయడం కుదరదు. ఎప్పుడైతే ఏదైనా బ్యాన్ చేయబడుతుందో, జనులు దాన్ని చట్టవిరుద్ధంగా –అడ్డదారుల్లో, పొందాలనుకుంటారు.
ఏ బ్యానైనా పౌరుల స్వేచ్ఛని ఎంతో కొంత ఆరి కడుతుంది.
సమాజాలకి కొన్ని విలువలు ఉంటాయి. స్వేచ్ఛ వాటిల్లో ఒకటి.

బ్యాన్ చేయడంలో భారతదేశం అగ్రగామి అవుతున్నట్టుంది. పాశ్చాత్య దేశాల ప్రభావం నుంచి భారతదేశాన్ని రక్షించడానికి మన ప్రభుత్వం చాలా పాటు పడుతున్నట్టుంది.

బ్యాన్ల మీద కేంద్రీకరించే బదులు దేశం ఎదురుకుటున్న ఇతర సామాజిక/ఆర్థిక అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెడితే, మరిన్ని ఫలితాలు కనిపిస్తాయేమో! ప్రజాస్వామ్యం మరియు స్వేచ్చానుసార చిత్తం అన్న అభిప్రాయాలు మన మనస్సుల్లో ఇంకి ఉన్నాయి. కానీ ఈ బ్యాన్లు మన చర్యలనీ, మన ఆలోచనలనీ నిర్బంధిస్తున్నాయి.

పబ్లిక్లో యూరినేట్ చేయడం నిషేదం కాదు. పార్న్ మీద బ్యాన్ లేదు.
బ్యాన్ చేయాలంటే, బాల్య వివాహాలూ, రేప్ చేయడాలూ, గృహహింసా, చైల్డ్ లేబర్ –ఇలాంటివన్నీ కనబడవెందుకో మన ప్రభుత్వానికి!

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మరియు ఎక్ప్రెషన్ అన్నది తన్ని తాను స్వేచ్ఛగా- నోటి మాట ద్వారాకానీ, లిటరేచర్ ద్వారా కానీ కళ ద్వారా కానీ లేక సమాచార ప్రసారం యొక్క ఇంకే ఇతర మాధ్యమం ద్వారానైనా వ్యక్తపరచగలగడం అన్న భావం.
I disapprove of what you say but I will defend to the death your right to say it- Voltaire

– క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి

అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి – గబ్బిట దుర్గాప్రసాద్

అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి

మగవారికాలేజిలో చేరిన మొదటి అమ్మాయి ,మొదటి మహిళా హౌస్ సర్జన్ ,బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి మహిళా లేజిస్లేట,ర్ ,రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డ్ కు మొదటి చైర్ పర్సన్ ,శాసనమండలి మొదటి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్, మద్రాస్ కార్పోరేషన్ మొదటి ‘’ఆల్డర్ వుమన్ ‘’ఇలా అన్నిటా ప్రధమంగా నిలిచిన డాక్టర్ ముత్తు లక్ష్మి రెడ్డి ని గురించి తెలుసుకొందాం .

బాల్యం –విద్య:
మద్రాస్ రాష్ట్రం లోని పుదుక్కోట సంస్థానం లో 30-6-1886లో ముత్తులక్ష్మి జన్మించింది. తండ్రి నారాయణ సామి .తల్లి చంద్రమ్మాళ్ .ఆ కాలం లో మహిళలపై ఆంక్షలు ఎక్కువగా ఉండేవి . . తండ్రి నారాయణ సామి మహారాజా కాలేజి ప్రిన్సిపాల్ .చాందస భావాలకు వ్యతిరేకి .అందుకే కూతురు చదువుకు ప్రోత్సహించాడు .యవ్వన దశలో స్కూల్ మాన్పించినా ఇంటి దగ్గర ట్యూటర్ లనుపెట్టి విద్య నేర్పించాడు .కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేస్స్తోంది తల్లి .తాను అందరిలాగా ఉండదలచుకోలేదని తన ప్రత్యేకతను చాటుకోవాలను కొంటున్నానని తల్లికి నిర్మోహ మాటం గా చెప్పింది .మగవాళ్ళ చెప్పు కింద తేలు ల్లాగా పడి ఉంటున్న స్త్రీ జనాన్ని చూసి సానుభూతి ప్రకటించేది .వారికి విముక్తి కలగాలని కోరుకొనేది .మగ పిల్లలకే చదువు ఆడవారు చదువుకోకూడదు అనే దాన్ని బాహాటంగా వ్యతిరేకించింది .మెట్రిక్ పాసై మహారాజా కాలేజిలో చేరటానికి దరఖాస్తు చేస్తే కాలేజిప్రిన్సిపాల్, మగ విద్యార్ధుల తలిదండ్రులు తిరస్కరించారు . .మగ పిల్లల కాలేజిలో ఆడపిల్ల చేరితే వారినిఅనైతికంగా ప్రలోభ పెట్టి విద్యా వ్యవస్థను కలుషితం చేస్తుందని వాళ్ళ భయం .ఆమె స్త్రీకావటం ఒకటి ఆమె తండ్రి ఆధునిక భావాలు కలవాడుకావటం మరోటీ కారణాలుగా వారికి కనిపించాయి .కాని ఇలాంటి సంకుచితభావాలకు అతీతుడైన పుదుక్కొట మహారాజు ప్రిన్సిపాల్ అభ్యంతరాన్ని తోసిరాజని ముత్తులక్ష్మి ని కాలేజిలో చేర్చుకోవటమే కాకుండా ఆమెకు స్కాలర్షిప్ మంజూరు చేశాడు ..తండ్రికి ఆమె స్కూల్ టీచర్ కావాలని ఉండేది. కాని ఆమె కు ఇంకా ఉన్నత ఆశయాలు౦డేవి .
డాక్టర్ ముత్తు లక్ష్మి

ఉన్నత విద్య పూర్తీ చేసి 1907లో మద్రాస్ మెడికల్ కాలేజి లో చేరింది .అక్కడ అన్నిటా ప్రధమంగా నిలిచి తన ప్రతిభను ప్రదర్శించింది .ఎన్నో బంగారు పతకాలను ,ప్రైజ్ లను సాధించింది .1912లో మెడిసిన్ పాసై భారత దేశం లో మొదటి మహిళా వైద్యులలో ఒకరుగా నిలిచింది . మద్రాస్ లోని ప్రభుత్వ మహిళా శిశు వైద్య శాలలో హౌస్ సర్జన్ అయింది .డాక్టర్ సుందర రెడ్డి ని తనకు సమాన గౌరవం కలిగిస్తానని ,తన మనోభీస్తానికి ఎన్నడూ వ్యతిరేకంగా నడుచుకోనని ఆయన నుండి హామీ పొంది ,తన వ్యక్తిత్వాన్ని చాటుకొని1914లో 28 వ ఏట వివాహం చేసుకొన్నది .ప్రసిద్ధ తమిళ హీరో శివాజీ గణేశన్ కు మేనత్త ముత్తులక్ష్మి .అతనికి ఆదర్శ౦ ఆమె అని ఆతను చెప్పుకొన్నాడు .

రాజకీయ అరంగేట్రం:
కాలేజీలో చదివే రోజుల్లో సరోజినీ నాయుడు ఏర్పాటు చేసిన మహిళా సభలకు హాజరై ఉత్త్తేజితురాలైంది ముత్ట్టు లక్ష్మి ..స్త్రీ హక్కులకోసం సరోజినీ చేస్తున్న ఉద్యమాలకు సహకరించింది .తరువాత .అనిబి సెంట్ ,మహాత్మా గాంధీల ప్రభావానికి లోనైంది .ముత్తులక్ష్మిని స్త్రీ శిశు సంక్షేమం కోసం కృషి చేయమని వారు ఆదేశించారు .మహిళలు ఇంటి నాలుగు గోడలకే పరిమితం కా కూడదని ఆమె విస్తృతంగా ప్రచారం చేసి వారిలో మార్పు తెచ్చింది .

ఇంగ్లాండ్ వెళ్లి ఉన్నత విద్యనేర్చింది . డాక్టర్ ప్రాక్టీస్ వదిలి ‘’వుమెన్స్ ఇండియన్ అసోసియేషన్ ‘’ వారి అభ్యర్ధన మేరకు మద్రాస్ రాష్ట్ర శాసనమండలి కి శక్తి హరిహరన్ చేత 1926లో నామినేట్ చేయబడింది . ఇండియా మొత్తం మీద శాసన సభలో ప్రవేశించిన మొట్టమొదటి మహిళగా రికార్డ్ కెక్కింది .తర్వాత డిప్యూటీ చైర్ పర్సన్ గా .ఏకగ్రీవంగా ఎన్నుకో బడింది .ప్రపంచలో నే మొట్ట మొదటి లెజిస్లేచర్ మహిళా డిప్యూటీ చైర్మన్ గా గుర్తింపు పొందింది .’’.మహిళలకు మునిసిపాలిటీ శాసన సభలలో ఓటు హక్కు ఇవ్వాలని గొప్ప ఉద్యమం చేసింది ..’’దేవ దాసి’’వ్యవస్థను నిర్మూలించటానికి .కనీస వివాహ వయస్సును పెంచటానికి ఆమె కృషి అనితర సాధ్యం .మహాత్మా గాంధిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసింది .

సంఘ సంస్కర్త:
.అనాధలు అంటే ఆమె హృదయం ద్రవించేది .మరీ బాలికా అనాధలంటే విపరీతమైన ఆదరణ చూపించింది .అనాధలకు ఉచిత వసతి భోజనాలకోసం ‘’అవ్వై హోమ్’’ను మొట్టమొదటిసారిగా మద్రాస్ లో స్థాపించిన వితరణ శీలి ముత్తులక్ష్మి .ఎన్నో సాంఘిక సమస్యలపై,సంస్కరణ లపై గ్రంధాలు రాసింది .’’శాసనమండలిలో నా అనుభవాలు ‘’అనే పుస్తకం లో తన సేవాకార్యక్రమాలను వివరించింది .స్త్రీ శిశు హాస్పిటల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే తీర్మానం తెచ్చి పాస్ చేయించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రసూతి ఆస్పత్రిలో ప్రత్యేక హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది .స్థానిక సంస్థలు ,మునిసిపాలిటీల చేత నడుపబడే విద్యాలయాలలోని విద్యార్ధులకు తరచుగా క్రమపద్ధతిలో వైద్య పరీక్షలు నిర్వహించేట్లు చేసింది .ట్రిప్లికేన్ లోని ‘’కస్తూరిబాయి హాస్పిటల్ ‘’ముత్తు లక్ష్మి అకుంఠిత దీక్షా ఫలితమే .

అఖిల భారత మహిళా సభకు ముత్తు లక్ష్మి అధ్యక్షురాలిగా ఎన్నుకో బడింది .వేశ్యా వ్రుత్తి నిర్మూలనకు ,అనైతికంగా స్త్రీ బాలికలను అవమాన పరచటానికి బిల్లు పాస్ చేయించింది .వేశ్యాగృహాల చెర నుండి విముక్తులైన స్త్రీల కోసం ఒక బోర్డింగ్ హోం ను ఏర్పాటు చేసిన దయామయి .ముస్లిం బాలికలకోసం ఒక ప్రత్యేక హాస్పిటల్ ను స్థాపింప జేసింది .హరిజన విద్యార్ధినులకు స్కాలర్ షిప్ లు మంజూరు చేయించిన ఘనత ముత్తు లక్ష్మిది .మగవారికి 21 ఏడాది వరకు ఆడపిల్లలకు 16వ ఏడాది వరకు వివాహం చేయరాదని శాసనం చేయాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది .

ఇవికాక ఆమె ఎన్నో విధాలుగా ప్రజా సేవ చేసి ధన్యురాలైంది .’’కేన్సర్ రిలీఫ్ ఫండ్ ‘’ను ప్రారంభించింది . 1935 లో ‘’కేన్సర్ రోగులకు హాస్పిటల్ ‘’కట్టాలని ఉంది అని ప్రకటించింది .ఎందరో దాతలు వదాన్యులు విరాళాలలతో ముందుకు వచ్చారు .1952లో ‘’అడయార్ కేన్సర్ ఇన్ ష్టి ట్యూట్’’ కు ‘’శక్తి హరిహరన్ ‘’శంకు స్థాపన చేశాడు .18-6-1954నుండి అది పని చేయటం ప్రారంభించింది .ఇండియాలో రెండవ పెద్ద కేంద్రంగా దీనికి గుర్తింపు వచ్చింది .ఈ నాడు ప్రపంచ ప్రసిద్ధమై ఏటా 80,000 మంది కేన్సర్ వ్యాధి గ్రస్తులకు ఆశా దీపంగా భాసిస్తోంది . అడయార్ లోని వట వృక్షంగా ఈ సంస్థ అభివృద్ధి చెంది కేన్సర్ రోగులపాలిటి సంజీవని అయింది ధన్య చరిత్ర ఆమెది .

సాంఘిక సంక్షేమ  శాఖ కు మొదటి చైర్ పర్సన్ అయింది ముత్తులక్ష్మి .భారత దేశం లో విద్యాభి వృద్ధిని అధ్యయనం చేసి సలహాలిచ్చే ‘’హార్టాగ్ ఎడ్యుకేషన్ కమిటీ ‘’లో సభ్యురాలై విలువైన సూచనలు అందజేసింది .ఈ కమిటీ తరఫున భారత దేశం అంతా పర్య టించి స్త్రీ విద్యా వ్యాప్తి అభి వృద్ధిని గమనించింది ..ఈ కమిటీలో ముత్తులక్ష్మి ఒక్కరే మహిళా సభ్యురాలు .అలాంటి అరుదైన గౌరవం ఆమెకు దక్కింది .ఈ కమిటీ సలహాలు పాటించి ప్రభుత్వం ఎన్నో అభి వృద్ధి పధకాలను ప్రవేశ పెట్టి మహిళా విద్యకు దోహదం చేసింది .అఖిలభారత మహిళా సమాఖ్య తరఫున ప్రచురించే ‘’రోషిణి’’పత్రికకు సంపాదకురాలుగా సమర్ధంగా పని చేసింది .మహిళాభి వృద్ధికోసం జీవితాంతం పోరాడిన దీరోచిత మహిళా మాణిక్యం ముత్తు లక్ష్మీ రెడ్డి .ఎన్నో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగిన ఆమె వ్యక్తిత్వం అమోఘం .80ఏళ్ళ వయసులో కూడా ఆమెలో చైతన్యం పొంగి పోర్లేది .రాజకీయాలలో ఉన్నా స్త్రీ జాతి సేవను మరచిపోలేదు. ఆమెది మహాత్ముని శాంతి అహింసా మార్గం . పారిశుధ్యం తో కూడిన మరుగు దొడ్లను ,అందులో ప్రత్యేకం గా స్త్రీలకూ వేరుగా ఏర్పాటు చేయటానికి తీవ్ర కృషి చేసి సాధించింది .మురికి వాడలలో నివసించే పేదప్రజలకు వైద్య సదుపాయాలను కలిగించిన మహోదయురాలు.

ముత్తు లక్ష్మి చేసిన విశిష్ట సేవలకు కేంద్ర ప్రభుత్వం1956లో ‘’పద్మ భూషణ్ ‘’గౌరవాన్నిచ్చి సత్కరించింది .ముత్తు లక్ష్మిని చిరస్మరణీయం చేసిన జీవన సాఫల్యాలు ‘’అవ్వై హోం’’ మరియు ‘’కేన్సర్ ఇన్ ష్టిట్యూట్’’లు అనే రెండు గొప్ప సంస్థలు .82 ఏళ్ళు సార్ధక జీవితం గడిపి ,ప్రజా సేవలో పునీతురైన డాక్టర్ ముత్తులక్ష్మీ రెడ్డి 22-7-1968 న స్వర్గస్తురాలైంది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

 

Posted in రచనలు | Tagged | Leave a comment

యాభై ఏళ్ళ ప్రతిజ్ఞా పాలన

Inline image 1Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అడ్డుకొంటే ఇంటినే కాల్చారు మరియు అమానుష దాడి

Inline image 1
Inline image 2
గబ్బిట దుర్గా ప్రసాద్

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’-3(చివరి భాగం )

తెనాలివారి ‘’బాపు రస రేఖ  ‘’-3(చివరి భాగం )

బాపు ముఖ్య శిష్యుడు ,ప్రముఖ చిత్రకారుడు శ్రీ మోహన్ ‘’బాపు గారుతెన్నేటి సూరి నవల చెంగిజ్ ఖాన్ కు వేసిన అట్టమీది బొమ్మ గుర్రం మీద వీరావేశం తో ఖాన్ మంగోలియన్ కళ్ళూ ,,మీసాలు వెనక మంగోలియన్ డిజైన్ కళ్ళు తిరిగే రంగులు ,,మబ్బుల్లోకి ఎగిరిపోయే గుర్రం వెన్ను మీంచి తోక దాకా సర్ర్రున దూసిన గీత ‘’పరమాద్భుతం అన్నాడు .ఇది నచ్చని విశాలాంధ్ర బాస్ జోషి మంగోలియన్ వాతావరణం రాలేదని బాపు తో చెబితే మళ్ళీ వేస్తానన్న నిగర్వి .చెట్టంత ఆర్టిస్ట్ అయి ఉండీ మళ్ళీ వేస్తాను అంటం ఏమిటి అని మోహన్ ఆశ్చర్య పోయాడు .బాపు ను బొమ్మలు వేస్తుండగా చూస్తె ‘’బొమ్మలు గీసే మనిషిలా కనిపించడు.వాటి ఘోస్ట్ పెన్ మెన్ ‘’లా అనిపిస్తాడు .బాపు బొమ్మల ప్రభావం గురించి చెబుతూ మోహన్ ‘’ఆంద్ర పత్రికా ,ప్రభలు మోసుకొచ్చిన బొమ్మలు మా చెంపలు వాయించాయి .చాచి మరీనూ –మీరు చాతకాని వేర్రినాగమ్మలు అంటూ చాలెంజ్ చేశాయ్.నాతొ బాటు బోల్డు మంది ఆర్టిస్ట్ లకు మూడు దశాబ్దాలపాటు ఈ బాపూ భూతం మాకు౦చె ల్ని వెంటాడి ,వేధించి నానా రొస్టూపెట్టాయి .ఆయనలాగా వేయాలని మా ఆరాటం ,ఆయనలాగా వేయకుండా ఉండటానికి పోరాటం .మేము మా లాగా గీయాలని తపన .ఆయన్ను దాటిపోవాలని అత్యాశ .బాపు పార్టీలో చేరి సభ్యత్వ రుసుం చెల్లించి ‘’హోలీ టైమర్లు’’గా పని చేశాం .ఇలా ఆర్ట్ పార్టీ పెట్టిన సంగతి బాపుకు తెలీదు .ముప్ఫై ఏళ్ళు గడిచాక బాపు ఒపీనియన్ చేంజ్ చేసి పార్టీ ఫిరాయించి గ్లామరస్ సినీ పార్టీలో చేరిపోయారు .మేమంతా పత్రికల న్యూస్ ప్రింటుకి బల్లుల్లా అతుక్కు పోయి బతుకు తున్నాం .మాలో అరడజను మంది ఆయన్ను ఓవర్ టేక్ చేసి ఉండాల్సింది .50లలో ఆయన తెచ్చిన విప్లవాన్ని 80లలో మేము తెచ్చి ఉండాల్సింది .మాముందు పెద్ద’’గీతాదర్శాన్ని’’పెట్టి మాలో ఎవర్నీ ఆయనకంటే ముందుకు విసరలేక పోయాడు .’’అంటూ మోహన్ ఈ విషయం లో బాపు ‘’మిజరబుల్ ఫ్లాప్ ‘’అంటాడు కొంటెగా .

పశ్చిమ దేశ చిత్రకారుల చిత్రాలపై బాపుకున్న అధ్యయనం గొప్పది .నలభై ఏళ్ళ ఆయన అనుభవం తో చిత్రకారుల్ని తూర్పు దేశాలపై తిరిగి చూడమన్నాడు .అందుకే మోహన్ ‘’తూర్పు తిరిగి దణ్ణం పెడదాం ‘’అంటాడు సరదాగా .

మరో ఆర్టిస్ట్ శ్రీ చంద్ర  ‘’చిత్రకారుల వంశం రాను రాను గీత తప్పి పోయిందని ,బాపు గీతావాక్యాలు మళ్ళీ వినిపించి బుద్ధి చెప్పాలని , .ఆయన తెలియ బరిస్తే తప్ప తెలుసుకోలేం ‘’అన్నాడు .మరో చిత్రకారుడు శ్రీ సురేంద్ర ‘’సాక్షాత్తు బాపుగారే మహానుభావుడు అనే ఆర్టిస్ట్ లు చాలామంది ఉన్నారు .మనకున్నది ఒకే ఒక బాపు ఆయన మనకే కావాలి ‘’అని నిర్ద్వందంగా అన్నాడు .

శ్రీ ఎన్నార్ ‘’కుంచెను కొంచెమే ఉపయోగించే ‘’కలాయుధుడు’’ బాపు .కలం అతనిహలం .తన అక్షరాలనే కోతులనే అతను ‘’ఫాషన్’’చేశాడు .కధలకు గేయాలకు బొమ్మవేస్తే రచయిత భావాన్ని యధాతధం గా రేఖల్లోకి అనువాదం చేయడు .రచయిత పాయింట్ కు  కౌంటర్ పాయింట్ కోసం వేట సాగించి బ్రెయిన్ వేవ్ రాగానే అయిదు నిమిషాల్లో బొమ్మ పూర్తీ చేసే సత్తా బాపు ది.బాపు మార్క్సిస్ట్ అని చాలా మందికి తెలీదు .సర్రియలిజానికి దగ్గరగా వచ్చే ఫ్యాంటసీ తో అపూర్వ హాస్యాన్ని సృష్టించిన మార్క్స్ బ్రదర్స్ కామెడీలు ఆయనకు కంఠోపాఠం.ఇంటలెక్చువల్ చలన చిత్రాలు ఇస్టపడతాడు.పాప్యులారీటి  ఒక నేరం కాకపొతే బాపు నిజమైన సృజనాత్మక చిత్రకారుడు ‘’అన్నాడు ఎన్నార్ .

శ్రీ అన్వర్ ‘’పప్పీ వారి మైనం అగ్గి పెట్టె సైజు నుండి ఏ3న్నర  కొలతలవరకు చిత్రాలు గీయగల సత్తా, సామర్ధ్యం బాపు కు ఒక్కడికే ఉంది .బాపు పుట్టిన గడ్డపై పుట్టటం మన జన్మ చేసుకొన్నా అదృష్టం .సుమారు నలభై ఏళ్ళక్రితం బాపు గారి ఒరిజినల్స్ తో చిత్ర ప్రదర్శన జరిగిందట .ఆ బొమ్మల్ని ఒళ్ళంతా కళ్ళైచూసిన ఓ చంద్రశేఖర్’’ ఆర్టిస్ట్ చంద్ర ‘’అయ్యాడు .అలాగే మిగిలిన వాళ్ళు కూడా .తెలుగు ఇలస్త్రేషన్ పుట్టి 80ఏళ్ళు కూడా కాలేదు కాని, చావటానికి సిద్ధంగా ఉంది .సినిమా వాళ్లకు రాజకీయనాయకులకేనా వారసులు కళల కు వద్దా ?అని చక్కని ప్రశ్న వేశాడు.ఆలోచించాల్సిన ప్రశ్నకదాఇది ?క్రోక్విల్, బ్రష్ ,చార్కోల్ ,పేస్టల్ఏదీ అంటరానిది కాదన్నాడు బాపు .దొరికిన దానితో గీస్తూ పోతూ ఉంటె ఏదో ఒక రోజు మనం తలుపు దగ్గరికి వెళ్లి ఎవరూ ?అని అడిగితె ‘’నేనోయ్ బాపు బొమ్మను వచ్చాను .తలుపు తీయ్’’అంటుందట .బాపుగా పుట్టటం సులువు .’’బాపిస్ట్ ‘’గా బతకటం కష్టం ‘’అని బాప్టిస్ట్ (బాప్ –ఇస్ట్)భాషలో చెప్పాడు అన్వర్ .అన్వర్ధమైన మాట .ఒకసారి ఒక కవరు చేతిలో పెట్టి బాపు ‘’పెద్దవాడిని ఇస్తున్నాను కాదనవద్దు ‘’అనిఆ తర్వాత ఫోన్ చేసి ‘’నాకో సహాయంక్ చేయాలండీ !విజయవాడ గంధం ప్రసాద్ గారు నా బొమ్మలన్నీ కలిపి బుక్ తెస్తున్నారు దానికి మీరు ముందుమాట రాయాలి ‘’అని అన్వర్ ను కోరారట’’ బాపు దిగ్రేట్ ‘’

శ్రీ శివాజీ ‘’తెల్లకాగితపు స్పేస్ ను ఎలావాడాలో చైనా ఆర్టిస్ట్ కి బాపుకి మాత్రమె తెలుసు .ఆధునిక కళా ద్రుష్టి ఇచ్చిన అతి కొద్దిమందిలో బాపు ఒకడు .కుంచె పుచ్చుకొంటే మత్తు వచ్చేట్లు చేయగల మహత్తు ఆయనది .బుడుగును భాగవతాన్ని యానిమేషన్ చిత్రంగా తీయాలి .బాపు ఒరిజినల్ చిత్రాలు తమ దగ్గరున్న పెద్ద మనుషులు’’ పెద్దమనసు’’తో కలిసి పెద్ద చిత్ర కళా ప్రదర్శన పెట్టి దేశం యావత్తూ తిప్పాలి .35ఏం ఏం లో ఆయన వేసిన బొమ్మలన్నీ ఫిలిం తీసి భద్ర పరచాలి ‘’అనిగొప్ప సూచనలు చేసి ‘’ఇన్నివిదాల మనం గొప్ప పనులు చేయచ్చు ‘’అని మెత్తగా వాయించాడు .లాటిన్ అమెరికా రచన ,ఇరానీ సినిమా లాగా బాపు బొమ్మలు వసుధైక మైనవి .

చివరగా శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారి మంగళాశాసనం తో ముగిస్తున్నాను –

‘’అల వోకగ గీచిన గీ-తలు మురువులు –చిత్ర లక్ష్మి తలమానికముల్

పలుకులు ,కులుకులు కవితా-లలితములై చెలగు’’ బాపు రమణీయమ్ముల్ ‘’

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’సంపూర్ణం .

బాపు నవ్వు  బొమ్మ జత చేశాను చూడండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-15-ఉయ్యూరు

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

తానా సభల విశ్లేషణ -డా గుమ్మా సాంబశివ రావు -చినుకు – నాదరేఖలు

nada rekhalu 001tana2 001 tana3 001 tana4 001 tana5 001 tana1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ పులుగుర్ట వెంకట రామారావు గారి పద్యమాలిక -రచన

deergha padyam 2 001 deerghapadyam 1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’-2

తెనాలివారి ‘’బాపు రస రేఖ  ‘’-2

శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ బాపు –రమణల ఇంటికి వెళ్ళాడు .అప్పుడు రమణ ఇంటిని ‘’ముళ్ళ పూడి వెంకట రమణ అనే సదా బాలుడిది ఆ ఇల్లు ‘’అన్నాడు .కవిత్వం లో వచ్చిన శైలీ భేదాలే బాపు చిత్ర శైలిలోనూ వచ్చాయని ,ఒకప్పుడు ఆంద్ర జ్యోతి వారపత్రికలో 1/8 డెమ్మీ ఆకారం లో ‘’చిత్ర కల్పన’’శీర్షికతో ప్రశస్తమైన తెలుగుపద్యాలకు ఏం వి .ఎల్ నరసింహారావు వివరణలతో బాపు  విశిష్ట చిత్ర రచన చేశాడని ,అలాగే చైతన్య భారతి సంస్థ కోసం తనూ ,నండూరి రామమోహనరావు సంపాదకత్వం వహించి వెలువరించిన ‘’మహా సంకల్పం ‘’అనే ఆధునిక కవిత్వ సంకలనానికి బాపు ‘’కష్టజీవి ‘’తలపాగాలో తురాయి తురిమి చిత్రించిన బొమ్మ ఆధునిక కవిత్వ మహా సంకల్పానికి గీటు రాయి గా నిలిచిందని చెప్పాడు .ఇతిహాస యుగం నుండి ఈ నాటి ఆధునిక యుగం వరకు తెలుగు కవిత్వానికి ఎన్ని శైలున్నాయో అన్నిటి ఊహా  సమాహారమే బాపు చిత్ర రచనా శైలి అన్నాడు .ఆయనది రేఖలలో ,రంగులలలో ఒక చిత్రమైన శైలి .

స్వర్గీయ దాశరధి కృష్ణమాచార్య తన ‘’గాలిబ్ గీతాలకు ‘’బాపు తో చిత్రాలు గీయి౦చానని, ఆ పుస్తకాన్ని బొంబాయి కవి సమ్మేళనానికి  తీసుకొని వెళ్లానని ఆసభలో తానొక్కడే తెలుగు వాడినని తనకున్న ఉర్దూ పరిచయం తో ఆహ్వానం అందుకోన్నానని ,అక్కడి కవులకు ఆపుస్తకం చూపించానని ఒక్కో చిత్రాన్ని చూసి క్వాజా అహమ్మద్ అబ్బాస్ ,కైఫీ ఆజ్మీ సలాం మచ్లీ షహరీ మొదలైన ఉర్దూకవులు గాలిబ్ ఒరిజినల్ గీతాలను చదివి పరవశం కలిగించారని గాలిబ్ మహా కవి కవితామదురిమను రేఖా చిత్రాలలో బాపు అందించిన తీరు పరమాద్భుతం అని మెచ్చుకున్నారు .గాలిబ్ కవితా స్వరూపాన్ని చిత్రాల ద్వారా అందించిన ప్రముఖులు ఇద్దరే ఇద్దరని  అందులో ఒకరు ‘’చుగ్తాయి ‘’కాగా, రెండవ వారు ‘’బాపు ‘’అని చెప్పారు .’’బాపు చిత్రకళా భాషల పరిధులు దాటి ,దేశాల అవధులు దాటి అఖిల ప్రపంచ  ఖ్యాతి ఆర్జి౦చగలదు ‘’అని ఆనాడే దాశరధి శుభాశీస్సులు  అందజేశాడు . .

శ్రీరమణ –‘’బాపు ‘’జనార్దనాస్టకం’’కు వేసిన చిత్రాలలో ‘’ముక్కు ప్రాణం బుక్కు మీదికి వచ్చింది ‘’అంటాడు .రేఖల్లో ,బొమ్మల్లో ,రంగుల్లో హ౦గుల్లోనే కాదు ,అక్షరాలలో కూడా స్వంత శైలిని ప్రవేశపెట్టాడు అనీ ,ఎప్పుడూ వాయిదాలతో కాలయాపన చేసే లాయర్ వృత్తిని  ఆయన ప్రవృత్తికి విరుద్ధమవటం తో ప్రాక్టీస్ వదిలేసి ఇష్టమైన బొమ్మల ప్రాక్టీస్ మొదలెట్టాడని చెప్పారు .బాపు ను ఒకప్పుడు ఇంటర్ వ్యూ చేశాడు .అందులో బాపు చెప్పిన మాటలు ‘’కొన్ని రోజులు నేను ఎస్ ఎస్ చామకూర్ అనే పోర్ట్రైట్ ఆర్టిస్ట్ ,దామెర్ల రామా రాగారి శిష్యులు వద్ద కళాభ్యాసం చేశా . గోపులు గారి శిష్యరికం నన్ను ‘’అడ్వర్ టైజింగ్’’శాఖకు మళ్ళించింది .జే వాల్టర్ ధాంసన్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్ అవటానికి గోపులు గారే కారణం .తర్వాత ఫ్రీ లాంసర్ గా ఉండి ,ఆంధ్రపత్రిక అధినేత శివలెంక రాదా కృష్ణగారి ‘’అమృతాంజన్ ‘’పబ్లి సిటీ లో పనిచేశా .ఉయ్యూరు కే సి పి అధినేత వెలగ పూడి రామ కృష్ణ తమ కంపెనీ తయారు చేసే స్వీట్లకు ఎఫిషియెంట్ పబ్లిసిటీ వారిపై ఒత్తిడి చేసి నన్ను ఆర్ట్ డైరెక్టర్ ను చేశారు ‘’.అన్నాడు బాపు .

స్కూల్ లో చేరి కళాభ్యాసం చేయక పోయినా .ఎందరో గురువులకి తానూ ఏకలవ్య శిష్యుడనని చెప్పాడు .తన గురుపరంపర ‘’ఆర్ధర్ రాజాం ,రేజనాల్ద్ క్లీవర్ ,పీటర్ ఆర్నో ,జార్జ్ ప్రైస్,ద్యూలాక్ ,హోమ్ సోయ్ ,గోపులు , ,అహ్మద్ మొదలైనవారు అన్నాడు .’’ఒక్క సంకీర్తనే చాలు నన్ను రక్షింప ,తక్కినవి నీ భాండారాన ఉంచుకో ‘’అని అన్నమయ్య గడుసుగా ,చనువుగా స్వామికి చెప్పినట్లే ఒక్క బాపు బొమ్మ చాలు ‘’కళాప్రపూర్ణ ‘’ఇవ్వటానికి .రస రేఖ ఒక్కటి చాలదా కళా ప్రపూర్ణుడు అవటానికి ?’’అన్నాడు శ్రీరమణ .

జీవితం లోంచి నిత్య కృత్యాలలో౦ ఛి ,నాజూకైన హాస్యాన్ని వడగట్టటం బాపునైజమని ,కొండ౦త అతిశయోక్తి నుంచి  రవ్వంత కార్టూన్ ఉద్భవిస్తుందని ,బాపు కొంటె బొమ్మలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయని శ్రీ రమణ అంటాడు .ఆయన కృషి అనంతమైనదని అందుకే ‘’నానృషి కురుతే కార్టూన్ ‘’అన్నానని ‘’తామునిగింది గంగ –తా వలచింది బాపు బొమ్మ ‘’అన్నాడు ‘

తనికెళ్ళ భరణి ‘’తెలుగు వారికి భాషాభిమానం లేక పోయినా ‘’బాపాభి మానం ‘’చాల ఎక్కువ .సీతాకల్యాణం లో గంగావతరణం  ప్రపంచ చలన చిత్ర తెర మీదే అద్భుతం .లండన్ లో ప్రదర్శిస్తే ముక్కు మీద వేలేసుకొని బోల్డు ఆశ్చర్యపోయారు క్రిటిక్కులు .దాన్ని ఫిలిం టెక్స్ట్ బుక్కు గా పెట్టుకొన్నారు .ముత్యాలముగ్గులో ‘’అల్లు ‘’చేత కోతియేమోఅన్నంత అద్భుతంగా చేయించిన బాపు ప్రతిభకు హేట్స్ఆఫ్ .పెళ్లి పుస్తకం సినిమా చూసి గుమ్మడి ‘’మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించి౦దయ్యా  ‘’ఆన్నాడట .బాపు రమణల స్నేహం అద్వైతం .వాళ్ళిద్దరూ రెండు వెలుగులు, రెండు చీకట్లు, రెండు కస్టాలు, రెండు సుఖాలు .అంచేత వాళ్ళు ‘’సత్తిరాజు వెంకట రమణ ‘’,మరియు ‘’ముళ్ళ పూడి లక్ష్మీనారాయణ ‘’అవుతారు .ఎవరైనా పాదాభి వందన చేయటం ,పొగట్టం ,అతివాగుడూ అతి తాగుడూ ,కేమేరాకేసి చూట్టం ఓవర్ యాక్టింగ్ ,మైకు ము౦దు మాట్లాడమనటం ఆయనకు నచ్చదు.’’ ఆయనలోని  సిగ్గే ఆయన బొమ్మలకొచ్చింది ‘’.మోడేస్టేకి పరాకాష్ట బాపు .’’బ్రహ్మ బాపు బొమ్మ లాంటి అమ్మాయిని సృష్టిస్తే చూడాలని ఆశ .’’తెలుగువాళ్ళం మనం అదృష్ట వ౦తులం .మనకొక్కరికే బాపు ఉన్నాడు ‘’అన్నాడు భరణి .

చిత్రకారుడు జయదేవ్ బాపును చేసిన ఇంటర్వ్యు సారాంశం ‘’కార్టూన్ క్రూడ్ గా ఉండనంతవరకు పరవాలేదు .అంగ వైకల్యం వంటి వాటిమీద కార్టూన్లు వేయ రాదు .విదేశీ కార్టూనిస్ట్ లలో వెయ్యిమందికి పైనే నేను అభిమానించే వారున్నారు .అందులో ‘’గాలఘర్ ‘’అంటే చాలా ఇష్టం ‘’.పీనట్స్ సృస్తికర్త ‘’Shulz’’ అంటే కూడా బాగా ఇష్టం .నా చిత్రం నాకే బాగా లేదనిపిస్తే ఎంతమంది బాగుందని అన్నా పెద్ద అనుభూతి రాదు నాకు .నేనేమీ గొప్ప పనులు చేయలేదు కనుక నాకు వారసుడు అంటూ ఎవరూ లేరు .ఇతరులకు సలహా ఇచ్చేంత స్తోమత నాకు లేదు ‘’అని చెప్పాడు బాపు .

నం.పా.సా.అనే నండూరి పార్ధ సారధి ‘’రచయితకి రస పిచ్చి ,చిత్రకారుడికి బొమ్మలపిచ్చి ,సినీ దర్శకుడికి సినేమియా ప్రకోపం విధాయకమే కాని చిత్రకారుడికి ,చలన చిత్రకారుడికి శాస్త్రీయ సంగీతం ఉండటం అపురూపమే బాపు విషయం లో’’ అంటాడు .’’బాపు ఫస్ట్ లవ్ సంగీతమే .సంసారం చిత్రకళతో.హిందూస్తానీ సంగీతం బాపు ప్రాణం .బడేగులాం ఆలీఖాన్ ను పరిచయం చేసినవాడు పీ బి శ్రీనివాస్ .ఖాన్ సాబ్ సంగీత టేపులు ఆయనకొడుకు మున్వార్ ఆలీ దగ్గరకూడా ఉందడి ఉండవు . ఖాన్ మ్యూజిక్ వినటమే బాపు గాలి నీరు ఆహారం .తర్వాత ఎనిమిదేళ్ళకి ‘’నజామ్త్ ఆలీఖాన్ ,సలామత్ ఆలీఖాన్ అనే పాకిస్తానీ సోదరుల సంగీత మోజులో పడ్డాడు .వాద్య సంగీతం లో విలాయత్ ఖాన్,అలీం జఫార్ ఖాన్ ల సితార్ సంగీతం మహా ఇష్టం .పన్నాలాల్ ఘోష్ వేణువు బాగా ఇష్టం .అందులో యమన్ ,శ్రీ ,భూపాలీ ,తోడి రాగాలంటే బహు ఇష్టం .సజ్జాద్ హుస్సేన్ మా౦డలీన్ ప్రత్యేకాభిమానం .ఈయనకు రావలసినంత పేరు రాకపోతే బాపు ప్రత్యేకంగా కచ్చేరీలు పెట్టించాడు ముత్యాలముగ్గు సినిమాలో ఒక అందమైన సన్నివేశానికి ఆయనతో సంగీత౦  చేయించాడు .

తర్వాత గజల్ కళాకారుడు మెహదీ హసన్ బాపు మనసులో దూరాడు .హసన్ బాపు హృదయ సామ్రాజ్యాన్ని అయిదేళ్ళుఏలాడు .తర్వాత గులాం ఆలీ దాడి చేశాడు .మెహదీ హసన్ గజల్ వినకుండా ఒక్క పూటకూడా గడిపే వాడుకాదు .అలాగే సినీ సంగీత దర్శకుడు సి రామ చంద్ర ఆకర్షణీయమైనాడు .బడే గులాం ,అజాకత్ ,సలామాద్ ,మెహ్దీ,గులాం ఆలీ ,సజ్జాద్ ,సి రామచంద్ర ల కళా వైభవాల ప్రభావం బాపు చలన చిత్ర కళా శైలిని తీర్చిదిద్దాయి .ఈ రకంగా బాపు పై మహమ్మదీయ సంగీత  దండయాత్ర జరిగింది .

కర్నాటక సంగీతం పై ఆసక్తి తక్కువగా ఉన్నా రామభక్తి కారణం గా బాపుకు త్యాగయ్య గారు దగ్గరయ్యారు .రామదాసు తో ఆత్మీయత పెరిగింది .మహదేవన్ పరిచయం తో కర్నాటక శాస్త్రీయ సంగీత సంబంధం బలపడింది .బాపు కు ఇష్టం అయిష్టం మాత్రమె తెలుసు. ఒక మోస్తరు అనేది ఆయనకు గిట్టదు .ఇష్టమైతే నిండా మునిగిపోవటమే .సంపూర్ణ రామాయణం తీసేటప్పుడు రామాయణాలన్నీ పారాయణ చేయటం తో రామభక్తిలో నిండా మునిగిపోయాడు బాపు .’’త్యాగ రాజుగారు నూరిపోసిన ‘’రామ రసం ‘’తో బాపు వ్యక్తిత్వం ఓవర్ హాలయి పోయిందని,త్యాగరాజు ఆత్మ ఈయను ఆవహించిందో ఈయన త్యాగరాజుతో తాదాత్మ్యం చెందాడో తెలీనంత అను బంధమేర్పడి ,ఆ సినిమాకి సౌండ్ ట్రాక్ అంతా త్యాగరాజు కృతులే వినిపించాయి ‘’అని  పోఎటిక్ గా చెప్పారు నం .పా. సా .

త్యాగయ్య సినిమా నాగయ్యగారు తప్ప ఎవరూ తీయలేదు .ఆయన త్యాగయ్య రామదాసులలో ప్రధాన పాత్రలు రామభక్తులేకాని రాముడుకాదు .రామభక్తికనిపిస్తు౦ది కాని రాముడు కనిపించడు.రామపాత్ర ను బాపు తీర్చి దిద్దినంత ఉదాత్తంగా  ఏ దర్శకుడూ చిత్రించ లేదు  .సీతాకల్యాణం సినిమాలో సీత అంటే బాపూయే అనిపిస్తుంది .ఈ సినిమా చూస్తె ప్రేమ నిషా నాస్తికులకు కూడా పట్టుకునే ప్రమాదం ఉందనిపిస్తుంది .’’సంగీత జ్ఞాన యోగం లో త్యాగయ్య గారు చూపిన మార్గం లో పయనిస్తున్న కళా పదికుడు బాపు .సంగీత జ్ఞానము భక్తీ వినా సన్మార్గము గలదే ‘’అని బాపుగారి సంగీత కలాభిజ్ఞానం పై ముక్తాయింపు ఇచ్చాడు నం.పా.సా.

ఈ సారి తోటి చిత్రకారులు బాపుపై చ(అ)ల్లిన రంగుల చిత్రాల గురించి తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-15-ఉయ్యూరు

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నాయకుడా రైతుకు నువ్వే బాకీ పడ్డావు

Inline image 1

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతర్జాతీయ మౌతున్న నేపాల్

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా పెరటి లో కాసిన అమ్రుతపాళీ మాక్సి, మినీ అరటి గెలలు

మా పెరటి లో కాసిన అమ్రుతపాళీ మాక్సి, మినీ అరటి గెలలుDSCN2563 DSCN2564 DSCN2561 DSCN2562

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కొండలనడుమ కూర్గ్ అందాలు ,నెహ్రు

Inline image 1
Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -74

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -74

31-స్పష్టమైన వినిమయం కోసం నినదించిన అమెరికా ఆర్ధిక వేత్త –ధార్ స్టెయిన్ వెబ్లెన్-2(చివరిభాగం )

మిస్సోరి లో ఏమంత అభిమానం పొందలేకపోయిన వెబ్లెన్ న్యూయార్క్ చేరాడు .’’ది డయల్’’అనే లిబరల్ మాసపత్రిక ఎడిటర్ అయ్యాడు .బరువైన వ్యాసాలూ రాసినా పత్రిక నిలబడలేక పోయింది .యుద్ధ సమయం లో వాషింగ్ టన్ లో తాత్కాలిక చిన్న ఉద్యోగి అయ్యాడు .అతని భావాలు చాలా ముందు చూపుతో ఉండటం తో వదిలేయాల్సి వచ్చింది .సోషల్ రిసెర్చ్ కోసం న్యు స్కూల్లో లెక్చర్లు ఇచ్చాడు .భావోద్వేగం తో మాట్లాడటం తో ఎవర్నీ ఆకర్షించలేక పోయాడు .క్లాస్ రూమ్ లో కూడా ఆతను పారం చెబుతూంటే వినేవాడు ఒక్కడూ ఉండేవాడు కాదు .అతని ‘’ఎంక్వైరీ ఇంటు ది నేచర్ ఆఫ్ పీస్ ‘’ను చాలామంది తిరస్కరించారు .విధ్వంసకర విధానాలను ప్రచారం చేస్తున్నాడని అన్నారు .దీనితో ఏ పదవీ అతనిని వరించలేక పోయింది .డెబ్భై వ పడిలో ఉన్నాడు .శారీరక మానసిక ఆరోగ్యాలు కోల్పోయాడు .క్షయ కూడా సోకింది .కాలి ఫోర్నియాకు వెళ్ళాడు .అక్కడ అడవిలో కేబిన్ లో ఉన్నాడు .ఒంటరి జీవితము ,నిరాశా నిస్పృహ లతో శుష్కించిపోయి అక్కడే వెబ్లెన్ 3-8-1929న చనిపోయాడు .ఒక నోట్ లో నిస్పృహ తో ఉన్న మనిషి టెస్ట్ మెంట్ గా ఇలా రాశాడు చనిపోయే ముందు ‘’నాకు స్మ్రుతి చిహ్నం కాని శిల్పం కాని చిత్తరువుకాని  ఏర్పాటు చేయద్దు .శిలాఫలకం కాని దానిమీద రాత కాని ఇప్పుడుకాని మరేప్పుడూ కాని ఏర్పాటు చేయద్దు .నాపై జీవిత చరిత్ర రాయద్దు .నేనురాసినవి నాకు ఎవరైనా రాసినవి ఉత్తరాలు ప్రింట్ చేయ వద్దు .ఇంకేరకంగానూ కాపీ చేయటం ప్రచారం చేయటం నాకు ఇష్టం లేదు ‘’అని అందులో స్పష్టంగా రాశాడు .

తాను  తన విదానాల విషయం లో  విఫలమయ్యానని భావించాడు .చెడునుఎదిరించటానికి మంచిని సమాయత్త పరచలేక పోయానని వ్యధ చెందాడు .తనకు తానూ సమీకృతం కాలేకపోయినందుకు బాధ పడ్డాడు .’’దిపోర్టబుల్ వెబ్లెన్ ‘’పేరుతొ మాక్స్ లేర్నేర్ రాసిన పుస్తకం లో వెబ్లెన్ వ్యతిరేకించింది వ్యవస్థలనే కాని వ్యక్తులను కాదు అన్నాడు .రూసో తత్వ వేత్త భావాలనే వెబ్లెన్ నమ్మాడు .ఈ విషయం లో కారల్ మార్క్స్ ను వ్యతిరేకించాడు .కేపిటలిజం యుద్ధం కలిసి నడుస్తాయి అనేదాన్ని కాదన్నాడు .సర్ప్లస్ వాల్యు ను ఒప్పుకోలేదు .కాపిటల్ కి లేబర్ కి మధ్య పోరాటాన్ని ఒప్పుకోలేదు .క్లాస్ వార్ ఉండదని ,లేబరే యజమానులౌతారని అన్నాడు .’’వెబ్లెన్ విప్లవం’’వస్తుందని ఊహించాడు .దీనితో కొత్త్తతెలివితేటలున్న మెకానిక్స్  ఉన్నత శ్రేణి టెక్నో క్రాట్స్ ,అరిస్టోక్రసీ ఇంజనీర్లు వస్తారన్నాడు .అసాధ్యాలు అనిపించినా అవి ఆహ్వానింప దగిన విషయాలే .

వెబ్లెన్ చనిపోయినప్పుడు అతన్ని తప్పుడు భావాల ప్రాఫెట్ అని ,క్షమించరాని ఆర్ధిక వేత్త అని అన్నారు చనిపోయినవాడికి చూపించాల్సిన కనీస మర్యాద కూడా చూప లేదు .రాడికల్ మార్పులను వెబ్లెన్ ఆహ్వానించక పోవటం లోపమైంది .కానీ అతనిని ‘’ఇన్ స్టిట్యూషనల్ ఎకనామిక్స్ ‘’ఉద్యమానికి నాయకుడుగా గుర్తించారు .వ్యవస్థలకు ,టెక్నాలజీ కి మధ్య ఉన్న అంతరానికి ‘వెబ్లెన్ డైకోటేమి’’అని పేరు పెట్టారు .అభి వృద్ధి యుగం లో ప్రోగ్రెసివ్ అని పించాడు .లాభాలకోసమే ఉత్పత్తి అనేదాన్ని వ్యతిరేకించాడు .అతని ‘’కాన్స్పిక్యుయస్ కన్సమ్షన్’’సిద్ధాంతం సోషలిస్ట్ నాయకులను బాగా ఆకర్షించింది .మార్కిస్ట్ వ్యతిరేక కేపిటలిజం ను కోరేవారందరికి వెబ్లెన్ ఆరాధ్య దైవమే అయ్యాడు .

వెబ్లెన్ ను ప్రభావితం చేసిన వారిలో ‘’జర్మన్ హిస్టారికల్ స్కూల్ ‘’  ఒకటి .చరిత్రలో మానవులందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తారు అన్నది ఇద్దరి అభిప్రాయం .రెండవది డార్విన్ సిద్ధాంతం లోని కాజువాలిటిఅంటే యాదృచ్చిక సంఘటన .డార్విన్ సిద్ధాంతం ఆధారం చేసుకొని తన స్వంత ఆలోచనలను పెంచి వెబ్లెన్ ఆర్ధిక సిద్ధాంతాలను వ్యాప్తి చేశాడు .మూడవది ప్రాగ్మాటిజం  అంటే స్వేచ్చా పూరితమనసు సంఘం అభివృద్ధిని కోరుతుందని చెప్పేదాన్ని నమ్మి తన ఆర్ధిక పరిణామ సిద్ధాంతాన్ని బలపరచుకొన్నాడు .నాల్గవది మార్క్సిజం .అందులో కూలీకి యజమానికి మధ్య ఉన్న పోరాటం ను కాదని కూలీలు యజమాని మనసుమార్చేయాలన్నాడు .టెక్నాలజీకి పెద్ద పాత్ర ఉందన్నాడు వెబ్లెన్ .

వెబ్లెన్ చెప్పిన ’కాన్స్పిక్యుయస్ కన్సమ్షన్’’సిద్ధాంతం అంటే డబ్బును అనవసరంగా వస్తువులవిలువకంటే ఎక్కువగా ఖర్చుపెట్టటం .ఇది రెండవ  రెండవ పారిశ్రామిక విప్లవకాలం లో ఏర్పడింది .’’కాన్స్పిక్యువస్ లీజర్ ‘’సిద్ధాంతమూ చేశాడు వెబ్లెన్.ఐశ్వర్యాన్ని ,అధికారాన్ని ఉత్పత్తి పనిగా చూపించటంఅన్నమాట దీన్ని వ్యతిరేకించాడు .లీజర్ క్లాస్ ను చెప్పాడు .సూటిగా ఆర్ధిక భాగస్వామ్యం లేకుండా ఉన్నత స్థాయి గౌరవం పొందటం ఆక్షేప ణీయంఅని దీని సారాంశం .అది ఆర్ధిక గ్రంధాలు దాదాపు పాతిక వ్యాసాలూ రాసి ఆర్ధిక సిద్ధాంతాలకు పరి పుష్టి చేకూర్చాడు .

Quotes

Conspicuous consumption of valuable goods is a means of reputability to the gentleman of leisure.

Invention is the mother of necessity.

Born in iniquity and conceived in sin, the spirit of nationalism has never ceased to bend human institutions to the service of dissension and distress.

        Inline image 1      Inline image 2  Inline image 3

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’

తెనాలివారి ‘’బాపు రస రేఖ   ‘’

గుంటూరు జిల్లా తెనాలిలోని బాపు అభిమానులుశ్రీ రవి కృష్ణ గారి ఆధ్వర్యం లో బాపు రమణలను  తెనాలిలో సన్మానించాలనుకొని ఆహ్వానించటం మొహమాటంగా ఇద్దరూ ఒప్పుకోవటం , బాపుగారి పై ప్రత్యేక  పుస్తకం తేవాలనే సంకల్పం ,శ్రీ గిరిధర్ గారిచే బాపు చిత్రం వేయి౦చాలనుకోవటం ,అయన ఒప్పుకొని వేసివ్వటం ,ఆయన తన అభిమాన చిత్రకారులని ,మంచి స్టడీ చేస్తారని బాపు చెప్పటం 2013లో చకచకా జరిగిపోయాయి ..కానికార్యక్రమం కార్య రూపం పొందకుండా ముందు రమణ ఆ వెంటనే రెండేళ్లకు బాపు మనల్ని వీడి వెళ్ళిపోయారు .కాని పట్టువదలని విక్రమార్కులైన తెనాలివారు ఆ ఇద్దరూ లేకుండానే పుస్తకాన్ని తేవాల్సి వచ్చి  తెచ్చి 2015 జూన్ లో మనసులోని కోరిక ‘’ బాపు ‘’అనేపేరుతో ఆయన ముఖ చిత్రం తో  తీర్చుకొన్నారు ..శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అష్టవిధ నాయికలపై రాసిన పద్యాలకు బాపు వేసిన బొమ్మలూ చేర్చి ప్రచురించారు .దీనికి పూర్తీ సహకారం శ్రీ రమణ అంద జేశారు .బాపు శిష్యులైన చిత్రకారులు మోహన్, చంద్ర మొదలైనవారు ,భరణి వంటి రాయసగాళ్ళు బాపుపై తమ అభిప్రాయాలను పొందుపరచారు .శ్రీరమణ తానదైన శైలిలో ఎన్నో విషయాలు గుది గుచ్చి తెలియ జేశారు .పుస్తకం అందంగా సర్వాంగ సుందరం గా వెలువడింది .బాపు కి ఉన్న అభిరుచులు ,ఇష్టాలు ,అయిస్టాలు ,అభిప్రాయాలు అన్నీ ఇందులో పొందు పరచారు .ఒక రకంగా ఇది ‘’బాపు గీతోపనిషత్ ‘’.అయింది .అందులోని మేలిమి సారాంశాన్ని అంటే ఎసెన్స్ ను అనగా సారాన్ని  నేను మీకు ‘’తెనాలివారి  బాపు రస రేఖ ” ‘’గా అందజేస్తున్నాను .పుస్తకం చదవనివారికి ఇది ఉపశమనం కలిగిస్తు౦దని ఆశ .ఇందులో తెలిసినవిషయాలు, తెలియనివి, తెలుసుకో దగ్గవి, తెలియాల్సినవి ఎన్నో ఉన్నాయి .ఈ ‘’బాపు ‘’ను నాకు పంపించమని  మా ఆత్మీయులు అమెరికాలో ఉంటున్న శ్రీ మైనేని గోపాల కృష్ణగారు తెనాలి లో ఉన్న తమ గురువు, స్నేహితులు, మార్గ దర్శి, మెంటార్ అయిన శ్రీ కోగంటి సుబ్బారావు గారి అబ్బాయి శ్రీ శివ ప్రసాద్ గారికి ఫోన్ చేసి చెప్పగా ఆయన పంపితే నాకు సుమారు నెలక్రితం చేరింది..దీనికి పైవారందరికి కృతజ్ఞతలు .దీనిని ఇవాళే చదివాను.

బాపుగారి భార్యతెనాలికి చెందిన  ప్రఖ్యాత నాటక సినిమా నటులు ,డాక్టర్ స్వర్గీయ గోవిందరాజుల సుబ్బారాగారి కుమార్తె .అంటే బాపు తెనాలి వారి అల్లుడన్నమాట శ్రీ .సి నా రే ‘’సుదర్శనం ‘’పేరుతొ రాసిన కవిత లో ‘’పాపలాంటి పసినవ్వు చిలికే బాపు వెనక –ఓ కొంటె మేధావి ఉన్నాడని కొందరికే తెలుసు ‘’అంటూ మొదలుపెట్టి ‘’బాపు బొమ్మలునిరాడంబరంగా ఉన్నా  గుండెల వెనక ఉన్న స్వాభిమానా లకు చురకలు పెడతాయి.’’అన్నారు .’’బాపులో ఒక దార్శనికుడు, దర్శకుడు  ఉన్నాడు .ఒక్కొక్కబోమ్మా ఓ రంగుల మినీ కవిత ‘’అని శ్లాఘించారు .’’అన్ని అంచులున్న సుదర్శనం బాపు .బాపును  వరించిన’’ డాక్టరేట్ ‘’తరించింది ‘’అని కొత్తకోణం లో చెప్పారు .

బాపు రమణనలను నాలుగు దశాబ్దాలుగా సునిశితంగా తరచి చూసిన అంతేవాసి శ్రీరమణ ‘బాపు నిగర్వి కాని బాపు గర్వం రమణ ‘’అని రాశాడు .ఆంద్ర జ్యోతిలో శ్రీ రమణ పని చేస్తున్నప్పుడు విజయవాడవచ్చిన బాపు ఆఫీసుకు వెళ్లి శ్రీరమణ తో ‘’నన్ను బాపు అంటారండి .నా కార్టూన్లు ఒక సంపుటిగా రా బోతోంది .మీరు ముందుమాట రాస్తే సంతోషిస్తాను .అది అడగటానికే వచ్చాను ‘’అని మాడెస్ట్ గా అంటే కుంచించుకు పోయాడు శ్రీ రమణ .నాలుగు రోజుల్లో ‘’నానృషి’.కృతే కార్టూన్ ‘’అని రాశాడు .ఒక ఏడాదికే మద్రాస్ చేరి బాపు రమణ కుటుంబ సభ్యుడైపోయాడు .’

’సీతాకల్యాణం ‘’చికాగో ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికై అక్కడ వారి ఆహ్వానం పై మొదటి సారి విదేశీ ప్రయాణానికి మద్రాస్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాడు బాపు .అందరు వీడ్కోలు చెప్పటం పూర్తీ అయింది .ఇక బాపు లోపలి వెళ్లిపోవాలి .ముందుకు వెళ్ళబోయి బాపు వెనక్కి నాలుగు అడుగులు వేసి నోటి దగ్గర కర్చీఫ్ పెట్టుకొని నిలబడ్డ రమణ దగ్గరకు వెళ్లి అమాంతం పాదాభి వందనం చేసి తల వంచుకొని వెళ్ళిపోయాడు .దీనిపై శ్రీరమణ’’వారిద్దరి మధ్యా ఉన్నది చనువుకాదు .గౌరవం ఉన్నప్పుడే స్నేహమైనా ,బంధమైనా పదిలంగా ఉంటుంది అని రమణ అనేవాడు అని చెప్పాడు .’’బాపు –పైపు వీరుడు ‘’అని అందరికి తెలుసు .ఆయన దగ్గర వెయ్యిదాకా రకరకాల పైపులు ఉండేవి .’’ఈజన్ బర్గ్ అనే ఆయన కు బాపు  బొమ్మలన్నా బాపు-రమణలు  అన్నా చాలా ఇష్టం . ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున దక్షిణ భారతం లో పుస్తక ప్రచురణ ని, చదివే అలవాటునీ పెంపొందించటానికి ఆయన వచ్చాడు .ఆ రోజుల్లో ఎమెస్కో వారి ‘’ఇంటింటా గ్రంధాలయపధకం ‘’ఇలా వచ్చిందే .అప్పటికే బాపు గొప్ప డైరెక్టర్ .. .బాపు’’ తీసే సినిమాలలో ఎక్కడైనా ఒక చోట ఫ్రేములో కనిపించేట్లు నాలుగు పుస్తకాలు పెట్టు ‘’అని సలహా ఇచ్చాడు దాన్ని పాటించి సలహాకు విలువనిచ్చాడు బాపు .బాపు మౌత్ ఆర్గాన్ ఘనాపాఠీ.ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆర్కెస్ట్రాలో వాయించేవాడు .అయితే ఒక రోజు ఒక పాట రికార్డ్ చేస్తుంటే ‘’అచ్చు ఇదే ట్యూన్ రాత్రి రేడియో లో విన్నానండీ ‘’అన్నాడు మ్యూ జిక్ డైరెక్టర్ తో .అంతే మళ్ళీ అవకాశం రాలేదట .

‘’బాపు త్రాచుపాము . నేను వానపాము ‘’అని రమణ చెప్పేవాడట .తనకేమీరాదు నేర్చుకోవాలి అని రోజుకి ఇరవై గంటలు పనిచేసేవాడు బాపు .తానెక్కడా ఎవరిదగ్గరా చిత్రకళను నేర్చు కోలేక పోయాననే దుగ్ధ ఉండేది .అందుకే తగిన స్థాయికి రాలేక పోయానని అనుకొనేవాడు .అందుకే’’ బాపు స్కూల్ ‘’అవతరించిన్దిసార్ అని శ్రీ రమణ అంటే చిరాకు పడేవాడు బాపు .’’నాలోలోపం నాకు తెలుసు .మీకు తెలుసా ?’’అని గద్దించేవాడు .ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాల్ని విశ్లేషణాత్మకంగా వివరి౦చే వాడు .బాపుకు పిలకా నరసింహ మూర్తి చిత్రించే రంగులు ,రూపాలు అంటే ఇష్టం .అందుకే సీతాకల్యాణం సినిమా లో  పిలకా వారి చేత బాల సీత చూసే దశావతారాలు వేయించాడు .బులెట్ సినిమాలో ‘మా తెలుగు తల్లికి ‘’పాటచిత్రీకరణ కోసం తెలుగు దనాలను ఆయనతోనే వేయించిన కళాభిమాని .మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రాలు దర్పంగా ఉంటాయని మెచ్చేవాడు .బాపు హిందుస్తానీ, రమణ కర్నాటక సంగీతానికి చెవులు కోసుకొనేవారు .  .చాలా ఏళ్ళ క్రితం డాక్టర్ సమరం మానవ మనస్తత్వాలపై ఒక పత్రికలో వ్యాసం రాస్తూ ‘’ప్రాణానికి ప్రాణం గా ఉన్న బాపు –రమణ లలో ఒకరు చనిపోతే మరొకరు ఎలా జీవిస్తారు ?’’అనే అంశాన్ని ప్రస్తావించాడు .చాలామంది అభిమానులు సమరం పై సమార భేరి మోగించారు .

బాపు –చాలా సంగతులు రమణ కళ్ళతో చూస్తాడు ఆయన చెవులతో వింటాడు .బాపుని అర్ధం చేసుకోవటం అందరివల్లా కాదు .రమణ ఒక్కడే బాపుకు వెయ్యిమందిపెట్టు .ఫెయిల్యూర్ తో పేచీ పెట్టుకొని దాన్ని ఓడించే శక్తి రమణ కు ఉంది .ఆ గెలుపు లో మూడు వంతులవాటా బాపు కిస్తాడు .పొరుగు రాష్ట్రాలలో ఉంటె ‘’వెంకట్రావ్ ఎలా ఉన్నావ్ ?’’అని రమణకు ఫోన్ చేసే అలవాటు బాపుది..రమణ అసలుపేరు వెంకట్రావ్.’’రమణ బావుంటే అందరూ బావున్నట్టే ‘’అనేవాడు బాపు .ఒక అక్షరం కాని గీతకాని రమణ కు చూపించకుండా బయటికి పంపేవాడు కాదు .రమణ పోయిన తర్వాత’’ గీతాధ్యానం’’ లో ఉంటూ కూడా తెరచి ఉన్న తలుపు వైపుకు మధ్య మధ్యరమణ వస్తున్నాడే మో నని చూసేవాడు  . ‘’రమణ ఇక రాడు కదా అనే నిష్టుర సత్యం బాపు మనస్సులో కలుక్కు మంటుంది’’.ముందే చెప్పినట్లు’’ బాపు నిగర్వి .కాని బాపు గర్వం రమణ .రమణ నిగర్వి కాని ఆయన గర్వం బాపు ‘’.బాపుకు డబ్బు ఖర్చు చేయటం తెలియదు .రమణ మనసుతో రమణ చేతులతో ఉదారంగా ఖర్చు చేస్తాడు బాపు .రమణ దివ్య స్మృతికి ఒక పుస్తకం అంకితమిస్తూ ‘’నను గోడలేని చిత్తరువును చేసి వెళ్లి పోయిన నా వెంకట్రావు కోటి కోట్ల జ్ఞాపకాలకు ‘’అని మనసు పొరల్లోంచి వచ్చిన మాట రాశాడు బాపు అని శ్రీ రమణ చెప్పాడు .

పుస్తక ముఖ చిత్రాలు జత చేశాను చూడండి

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-15-ఉయ్యూరు bapu1 001 bapu2 001

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -73

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -73

31-స్పష్టమైన వినిమయం కోసం నినదించిన అమెరికా ఆర్ధిక వేత్త –ధార్ స్టెయిన్ వెబ్లెన్-1

థార్ స్టెయిన్ బుండే వెబ్లెన్ 30-7-1857న అమెరికాలోని విస్కాన్సిన్ ఫారం లో పన్నెండుడుగురు సంతానం లో ఆరవ వాడుగా పుట్టాడు .తలిదంద్రులిద్దరూ నార్వేజియన్ ప్రవాసీయులే .తండ్రి కార్పెంటర్ .వ్యవసాయ దారుడుకూడా .కాని దీనికి ఇస్టపడడు..మిగిలిన రైతుల్లాకాకుండా మగ పిల్లలతో బాటు ఆడపిల్లల్నీ కాలేజి లో చేర్పించాడు .కుటుంబం మిన్నేసోటాకు మారింది .అప్పటికే ఎనిమిదేళ్ళ వెబ్లెన్ ఇంగ్లీష్ లోకాకుండా  నార్వేజియన్ భాషలో నే  మాట్లాడేవాడు .ఇంగ్లీష్ అతనికి ‘’విదేశీ భాష ‘’అని పించింది .వెబ్లెన్ కుటుంబీకులు వ్యవసాయ క్షేత్రం లోనే పెరిగినా ,పల్లెటూరి రైతులను పీడించే నగర వ్యాపార వేత్తల మధ్య తగాదాలలో భాగ స్వాములయ్యేవారు .పదిహేడవ ఏట వెబ్లెన్ ను తండ్రి నార్త్ ఫీల్డ్ లోని చార్లేటాన్ లో ఉన్న ఒక చిన్న మత శాస్త్రం బోధించే సంస్థ  కు పంపాడు .ఇక్కడ మూడేళ్ళు ,కాలేజిలో మూడేళ్ళు చదివాడు.ఫిలాసఫీ లో బాగా రాణించినా అతనికి ఫైలాలజి అంటే భాషా తత్వశాస్త్రం  ,బయాలజీ  ,ఆర్ధికశాస్త్రం లపై అభిరుచి ఏర్పడింది .ఇరవైమూడేళ్ళ గ్రాడ్యుయేట్ అయ్యాడు .జాన్ హాప్కిన్ కు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాడు .అక్కడనుండి ఏల్ యూనివర్సిటికి బదిలీ చేయబడి పిహెచ్ డి ని 27ఏళ్ళకే పొందాడు .

ఏల్ లో ఉండగానే భవిష్యత్తుగురించి  ఆలోచించాడు .టీచింగ్ లో చేరాలనుకొన్నాడు .కాని ఇతని నార్వేజియన్ ఇంగ్లీష్ ,దు౦దుడుకు స్వభావం ,లెక్కలేని తనం ,మూర్ఖత్వం అతని ఉద్యోగానికి అడ్డుగోడలైనిలిచాయి .చేసేది లేక మళ్ళీ మిన్నెసోటా చేరి వ్యవసాయం చేస్తూ చార్లేటాన్ కాలేజి ప్రెసిడెంట్ కూతురు ఎల్లెన్ రోల్ఫ్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఏడేళ్ళు ఇక్కడే ఆశగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ తండ్రితో దీర్ఘ సంభాషణలు చేస్తూ ,పుస్తకాలు చదువుతూ గడిపాడు .వెబ్లెన్ కంటే అతని కుటుంబమే ఎక్కువ కలత చెందింది .ఎన్నో కౌన్సెలింగ్ లు ఇచ్చారు బాగుపడతాడేమోననే ఆశతో .చివరికి ఆతను ఆర్ధిక రంగం లో విజయ౦ సాధిస్తాడని నమ్మకం కలిగింది .ఫిలాసఫర్ గా కంటే ఎకనామిస్ట్ గా  రాణించ గలననే  నమ్మకంతో ‘’కార్నెల్ ‘’కు వెళ్ళాడు .

ముప్ఫై అయిదేళ్ళ వయసులో వెబ్లెన్ సాధారణ కూలీ కోటు ,ముతకనూలు ట్రౌజర్లు,కూన స్కిన్ కాప్ తో ఎకనామిక్స్ ప్రొఫెసర్ ప్రోఫెసర్ లారెన్స్ లాఫ్లిన్ ఆఫీస్సులో అడుగుపెట్టి ‘’నేను థార్ స్టెయిన్  వెబ్లెన్ ‘’అని పరిచయం చేసుకొన్నాడు .అతని సూటితనం  గాంభీర్యం లకు ముచ్చటపడి లాఫ్లిన్ కార్నెల్ లో ఫెలోషిప్ ఇచ్చాడు .చికాగో లో కొత్తగా ప్రారంభించే యూని వర్సిటి లో చేరబోతూ తనతోబాటు  వెబ్లెన్ ను  కూడా తీసుకొని వెళ్ళాడు .అక్కడ టీచింగ్ ఫెలో గా ఏడాదికి 520డాలర్ల జీతం తో చేరాడు .నలభై ఆరవ ఏట జీతం వెయ్యి డాలర్లు అయింది .చికాగో లో అనేకమంది ప్రముఖులతో పరిచయమేర్పడింది .కాని వారికి దూరం గా ఒంటరిగా ఉండేవాడు .బోధనపై విసుగూకలిగింది .రొటీన్ జీవితం పరమ బోర్ అనిపించింది .మెటీరియల్ లేబర్ లోని నాణ్యతపై పేపర్లు రాశాడు .డ్రెస్ విషయం లో పొదుపు ,క్లాస్ లలో ఎకనామిక్స్ ను బోధించటం లో రావాల్సిన సమూలమైన మార్పులు అన్నిటిపై ఆచరణాత్మకమైన విధానాలు రాసేవాడు .ఇంతగా రాసినా  నలభై రెండవ సంవత్సరం వరకు వెబ్లెన్ గురించి పబ్లిక్ కు ఏమీ తెలియదు .1899లో వెబ్లెన్ మొదటి పుస్తకం ‘’ది తీరీ ఆఫ్ ది లీజర్ క్లాస్ ‘’రాసి ప్రచురించాడు .

ఆ తర్వాత ఒక డజన్ దాకా పుస్తకాలు రాసినా ఈ పుస్తకానికొచ్చిన పేరు దేనికీ రాలేదు .ఇందులో ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ,ధనవంతుల వెంట మధ్యతరగతి వాళ్ళు ఎందుకు వ్యామోహం చూపిస్తున్నారో పూర్తిగా వివరించాడు .చాలా స్పష్టమైన  సాదారణ భాషలో రాయటం దీనికి  ప్లస్ పాయింట్ అయింది .అతని ‘’conspicuous consumption’’అంటే స్పష్టమైన వినిమయ విధానం అందరిని ఆకర్షించింది .డబ్బును కాలాన్ని ,ప్రయత్నాలను దుబారాగా ఖర్చు చేయటం పై తీవ్రంగా విరుచుకు పడ్డాడు .అమెరికా చరిత్రలో ఏ రచయితా అంతకు ముందు ఎప్పుడూ అమెరికా ధనవంతులు తెలివితక్కువగా ప్రిస్టేజ్ ని కొనుక్కోవటానికి డబ్బును ప్రవాహం లా ఖర్చు చేయటం పై రాయలేదు .అలా రాసి మేల్కొలిపిన  మొదటి వ్యక్తీ వెబ్లెన్ అయ్యాడు .ఒక ఫ్రాన్స్ రాజు సమావేశాలకు తానూ కూర్చునే సీట్ కోసం ఎంతో డబ్బు వృధా చేయటం ,క్రిస్టియన్ మతగురువుల ఆశీస్సు అభిమానం పొందటం పైనా చెలరేగి రాశాడు .

ఈ పుస్తకానికి సీక్వెల్ గా అయిదేళ్ళ తర్వాత ‘ది తీరీ ఆఫ్ బిజినెస్ ఎంటర్ ప్రైజెస్ ‘’రాశాడు వెబ్లెన్ .ఇందులో బడా పారిశ్రామిక వేత్తలు డబ్బును కూడబెట్టుకోవాటానికి ,అధికారం పొందటానికి  తాపత్రయ పడుతున్నారని ఇదివారి వ్యాపరలక్షణానికి శత్రువు అని నిర్మొహమాటంగా చెప్పాడు .విలువల తో కాక సరుకుల నాణ్యత తోకాక వస్తువుల రేట్ల తో ,ధనసంపాదన చేయటం హేయం అన్నాడు .లాభాపేక్షతో ఉత్పత్తిని ద్వంసం చేస్స్తున్నారని ,సామాన్యునికి అండగా నిలబడకుండా వాళ్ళ అమాయకత్వంతో వ్యాపారం చేసి లాభ పడుతున్నారని ఆక్షేపించాడు .దీనికోసం సమాజం లోని ఇంజినీర్లతో ఒక కొత్త కంట్రోల్ విధానం అమలు చేయాలని కోరాడు .యంత్రానికున్న సాంఘిక ఉపయోగాన్ని అందరి దృష్టికి తెచ్చాడు .

వెబ్లెన్ అభిప్రాయాలకు అవాక్కయ్యారు బడా బిజినెస్ మెన్ లతోబాటు యూని వర్సిటి ట్రస్టీలు కూడా వెబ్లెన్ ఆలోచనలు చాలా ప్రమాదకరం అని ఎలుగెత్తి చాటారు .దీనికి తోడు అతని ప్రైవేట్ జీవితమూ ఒడిదుడుకుల పాలైంది .భార్య అనేకసార్లు వదిలి పెట్టి వెళ్ళింది  .కొన్ని అభూతకల్పనలూ వచ్చాయి ఒక పేపరు ఆతను ఒకమ్మాయితో అట్లాంటిక్ లో ఉండటం చూశానని కధనం అల్లింది .తిరిగి వచ్చాక రాజీనామా చేయమనే ఒత్తిడి పెరిగింది .అప్పటికే వయసు నలభై తొమ్మిది .లేలాండ్ స్టాన్ఫోర్డ్ వెళ్లి మూడేళ్ళున్నాడు .అందం ,ఆకర్షణ ఉండటం తో ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలు వెబ్లెన్ అంటే వ్యామోహం తో వెంటపడేవారు .తప్పించు కోలేక పోయేవాడు .అదీ అతని పరిస్తితి .అతనిపై స్కాన్దల్స్ ప్రచారం జోరై పోయింది .

వీటిని తప్పించుకోవటానికి ఒక మౌంటేన్ కాబిన్ లో ఉన్నాడు .కావాల్సిన ఫర్నిచర్ తనకు తోచినట్లుగా ముతకగా తయారు చేసుకొన్నాడు డ్రెస్ విషయం లో  లో శ్రద్ధ చూపించలేదు. ఏది దొరికితే దాన్నే ధరించాడు .సూట్ లకు ఇస్త్రీ లేదు  ‘’చెంబు ఇస్త్రీ’’ తప్ప’.కోట్ బటన్ ఊడితే సేఫ్టి పిన్  పెట్టు కొనేవాడు .సగం జుట్టుతెల్లబడి రంగులేనిదైనది .గడ్డం గీయటం మీసం దువ్వటం లేనేలేవు .ముఖం పై ముడుతలు మరీ వయసు మీద పడేట్లు చేసింది .56 ఏళ్ళకే ముసలివాడైపోయాడు .స్నేహితుడు హెర్బర్ట్ డావెన్ పోర్ట్ ప్రోద్బలం తో మిస్సోరీ యూని వర్సిటి కి వెళ్ళాడు ఆర్ధిక వేత్త వెబ్లెన్ .

1911లో భార్య పూర్తిగా విడాకు లిచ్చి  వదిలేసి వెళ్ళిపోయింది .ఏడేళ్ళు మిస్సోరీ లో ఉన్నాడు .క్లాసులకు క్రమం తప్పకుండా వెళ్ళేవాడుకాని ఇష్టం తో బోధించ లేక పోయేవాడు .స్నేహితుడు డేవేన్ పోర్ట్ సెల్లార్ లో కాలమంతా ఏదో రాస్తూ గడిపేవాడు .ఉద్యోగ జీవితం ఉపయోగపడకపోయినా ఒక కొత్త పుస్తకం ‘’ది హయ్యర్ లెర్నింగ్ ఇన్ అమెరికా ‘’రాశాడు .దీనికి టాగ్ గా’’ఏ స్టడీ ఇన్ టోటల్ డేప్రేవిటి’’(పూర్తీ భ్రస్టత్వ౦లో అధ్యయనం )అని పెడదామనుకొన్నాడుకాని చివరికి తానే వెనకి తగ్గి ఆ టాగ్ తగిలించలేదు .ఇందులో పిరికి కాలేజి ప్రెసి డెంట్ లు ,టీచర్లు  ,డబ్బుకోసమే ఉండే ట్రస్టీలు గురించి ఏకేశాడు ., అమెరికా లో ఉన్నధైర్యవంతులైన అన్వేషకులు ,ఇంజినీర్లు గురించి పూర్తిగా చర్చించాడు .అమెరికా యూని వర్సిటి బోర్డ్ ప్రెసిడెంట్ లుపక్కా బిజినెస్ మెన్ అని ,కనసర్వేటివ్ దృక్పధం ఉన్నవాళ్ళని ఎత్తి చూపించాడు .ఇలాంటి వారితో కూరుకుపోయిన యూని వర్సిటీలు సామాన్యులకు ఏమీ చేయలేకపోయాయని ఆవేదన చెందాడు .

మిస్సోరీ లో ఉండగానే వెబ్లెన్ ‘’the instinct of Workmanship ,imperial Germany and the industrial revolution, an enquiry into the nature of peace and the terms of its perpetuation ,the vested interests and the state of the industrial art ‘’మొదలైన గ్రంధాలు రాసిప్రచురించాడు .వీటిలో తీవ్రమైన అధ్యయనం ,వ్యంగ్యం కనిపిస్తాయి .యాభై ఏడేళ్లకు మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు .రెండోభార్య మొదట్లో బాగానే ఉన్నా తర్వాత మతి స్తిమితం కోల్పోయి శరణాలయం లో ఉంచాల్సి వచ్చింది .మళ్ళీ ఎదురు దెబ్బలు ,వెనకడుగులు తప్పలేదు .మొదటి ప్రపంచ యుద్ధకాలం లో ‘’యాన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ ఆఫ్ పీస్ ‘’పుస్తకం వెలువడింది .సమయానికి తగిన రచనగా గుర్తింపు పొంది మంచి పేరు తెచ్చింది .ప్రొఫెషనల్ రాజకీయ వేత్తలు ఏ విధంగా నిజమైన దేశ భక్తిని స్వలాభానికి వాడుకొంటారో వివరించాడు .అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఏ పబ్లిషర్ కూడా ప్రింట్ చేయటానికి ముందుకు రాకపోతె వేబ్లెన్ 700డాలర్లు చేతి చమురు వదిలించుకొని ముద్రించాడు .తర్వాత అయిస్ లాండ్ దేశీయుల ‘’లాక్స్ డేలా సాగా ‘’అనే మధ్యుయుగ ఇతిహాసకావ్యాన్ని  (ఎపిక్ )ఆంగ్లం లోకి అనువాదం చేసి ప్రచురించి మళ్ళీ ప్రవాసానికి వెళ్ళిపోయాడు .

Inline image 1

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మావో నుంచి నోబెల్దాకా

Inline image 1
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒంటరితనం ,అమ్మతనం ,కమ్మదనం కలబోసిన శీలాసుభద్రాదేవి గారి ‘’ఏకాంత సమూహాలు ‘

ఒంటరితనం ,అమ్మతనం ,కమ్మదనం కలబోసిన శీలాసుభద్రాదేవి గారి ‘’ఏకాంత సమూహాలు ‘

శ్రీమతి ’సుభద్రా దేవి గారు ఎప్పుడూ ఏకాంత గోళం లోఒంటరిగా గడియారపు ముల్లును మోసుకు పోతూ  విహరిస్తున్నట్లు ,చుట్టూ జనసమూహాలు ఉరుకులు పరుగులూ తో వెనక వచ్చే నీడనైనా పట్ట్టి౦చు కోకుండా పరిగెత్తే తీరు చూసి ఆశ్చర్యపడ్డారు . తమనీడనే చూడలేనివారు ఆమెలోని స్పందనలను ఎలా గ్రహించగలరు ?ఇష్టం లేకపోయినా ఆమె చుట్టూ శూన్యమే ఆవరించి ఉంది. దాన్ని తొలిచే చిన్న కీటకమైనా వస్తుందేమోనని ఆశపడతారు .మిత్రత్వానికి స్నేహ హస్తం చాచుతున్నా  వారు దూరమై పోతూనే ఉన్నారు. . తనకు తానే శత్రువుని పోతున్నానేమో ననే శంకా, భయం ఆవరించాయి .అక్కడే ఒంటరి శిల్పాన్నైపోతానేమో నన్న ఆందోళన పెరిగింది .లోకం పోకడ గమనిస్తే తానే కాదు తనలాగా మరెందరో ఒంటరి తనం తో బందీలై పోతున్నందుకు బాధ పడ్డారు అందుకే శీర్షిక ‘’ఏకాంత సమూహాలు ‘’అయి అందర్నీ ఒక్క క్షణం నిలకడ గా నిలిచి  ఆలోచి౦ చుకోమని పిలుపు నిచ్చారు. ఈ  సంపుటిలో మొత్తం 40 కవితలు విలక్షణతతో ఉన్నాయి .అందమైన బౌండ్ పుస్తకం .ముఖ చిత్రం భర్త శ్రీ వీర్రాజు గారు చిత్రి౦చినదే . వెనుక ముఖ చిత్రం లో సుభద్రగారు  ‘’తెలుగింటి ఆడపడుచు ‘’గా సంప్రదాయ బద్ధం గా కూర్చుని ఉండటం పుస్తకానికి హై లైట్ .ఆమెతో పాటున్న మిగిలిన మూడు చిత్రాలు స్త్రీ ల విభిన్న దశలను చూపాయి .

సుభద్ర గారు అంటే మాటల మంత్రజాలం . ఆలోచనల దివ్య సారం .ఏది చెప్పినా అనుభవైక వేద్యంగా వైద్యంగా నే ఉండటం ఆమె ప్రతేకత .’’పచ్చని జీవితం పై పూస్తున్న ఆశల్ని –పిడికెడు బూడిదగా కాల్చేస్తూ ‘ఎక్కడినుంచో అశనిపాతం జరిగి వ్యధ రగిల్చి మిగిలిల్చింది. అయినా ఆమె ‘’అమ్మ గుండె కన్నీటి తోరణాలతో ‘’మళ్ళీ మరో జీవితానికి గూడు సిద్ధం చేసిన స్థైర్యం ఆమెది  .ఒక్కోసారి జారి పోయిందనుకున్న నిద్ర ‘’చటుక్కున కలల దారం తో రెప్పల్ని కుట్టేస్తుంది .’’దీనితో మనసు చుట్టూ గూడు అల్లే ప్రయత్నమూ జరిగిపోతుంది .ఆమె జీవితాన్ని కలలు శాసి౦చలేవు .ఆమె ‘’జీవితాన్నే కలలు కనటం అలవాటు చేసుకొన్న గడుసు పిండం .’’కలైనా జీవితమైనా ‘’ఆమెకు తేడాలేదు రెండూ ఒక్కటే .ఆమె ‘’తెగిన పాటల పతంగి ఏదో ఆలోచనల రెమ్మకు చిక్కుకుందేమో ‘’నని స౦దేహం .తన రాగాలకోయిల అలకమాని కొత్త రంగులు అద్దుకొని మళ్ళీ కంర పేటికపై వాలేవరకు పిలుస్తూనే ఉండే ఓపిక ఆమెది .

‘’సమాజానికి సూక్ష్మ రూపమైన కుటుంబాన్ని మోస్తూ ‘’నిత్య చైతన్య జ్వాలతో ,ప్రతిక్షణం మహోన్నతం గా నిలిఛి ,ఒంటినిండా ఆత్మ గౌరవ పర్వతాలు మొలిపించుకొంటూ ,వెలుగు కిరణాలమై ,’’చివరివరకు జీవితం సాగించాలన్న పిలుపు ఆమెది .’’మనలోని చిన్న ఆకాశాన్ని విస్తృతంగా మార్చుకోవటం మన చేతిలోని పనే ‘’అని,’’ ఊకోట్ట్టే తోడు’’ఉంటె అసాధ్యాన్ని సుసాధ్యం చేయచ్చు అనే భరోసా ఇస్తారు .కాలం కాటేసిన క్షణాలలో చూపు కూడా గమనాన్ని మర్చిపోయినా ,మళ్ళీ దారి లోకి మళ్ళాలి .ఆహ్లాదకర సమయాలు ఐస్క్రీము ల్లాగా కరిగిపోతాయి .అప్పుడు ‘’మనల్ని పదును పెట్టేవి గుండె అడుగు పొరల్లోకూరుకుపోయిన ఎదురు దెబ్బలే ‘’అని సాంత్వన వచనం పలికారు .ఒక్కోసారి ‘’కొలతల మధ్య ఇమిడి పోయే మరుగుజ్జు వృక్షాలు ‘’గా మారి పోతాం .ఇది తాత్కాలికం. స్వస్వరూప జ్ఞానం త్వరలో పొంది ముందుకు సాగాలి .’’మనజీవితం మనదే కాకూడదు .మనం సాధించిన విజ్ఞాన సర్వస్వాలు రేపటి తరాల్ని ఉత్తేజితుల్ని చేయాలి ‘’అని ప్రబోధించి ‘’ఈ జీవన కావ్యానికి –చివరి సిరి చుక్క సంతక౦ మాత్రం కావద్దు ‘’అని హెచ్చరిస్తారు .ఆమె స్త్రీలకోసమే చెప్పినట్లు ఉన్నా ఈ వాక్యాలు అందరికీ శిరో దార్యాలే .

తనకో స్వంత చిరునామాకావాలి కాని గుంపులో గోవింద లాగా ఉండకూడదు .అది ‘’నన్ను నేనుగా గుర్తు పట్టేందుకు .నాదైన –అచ్చంగా నాదే అయిన ముఖం కావాలి నాకు ‘’అంటారు .తనకోసం తానూ ఒలక బోసుకొనే కన్నీటి తోనైనా –‘తన  సంతకాన్ని ముద్రిస్తూ ‘ఉండే’’ స్వంత చిరునామాను  సంపాదించు కోవటమే ఆమె ఏకైక లక్ష్యం .ఇది అందరి స్త్రీల లక్ష్యం గా ఉండాలనేదే ఆమె కోరిక ,తాపత్రయం .ముసలితనం లో,ఒకరకమైన వ్యాధికి నడక అవసరమని డాక్టర్ల సలహా .కాని గమ్యం లేని నడక ఆమె కిష్టం లేదు కారణం ఆమె ‘’నిమిషాల్ని ఏరుకొంటూ-గంటల్ని ముడుచుకొంటూ- నాగేటి  చాలుకు కట్టిన ఎద్దులా ‘’తిరుగుతూనే ఉంది .

విదేశీయతలో మనం మమ్మీలంగా మారకుండా ‘’రేపటి తరాన్ని వేలు పట్టి నడిపించి –మన అక్షరాల్ని మనమే దిద్దిద్దాం –మన సంస్కృతీని ఉగ్గుబాలతో తాపించుదాం ‘’అని ఒక తెలివిగల బాధ్యత తెలిసిన ఒక అమ్మ లాగా  స్పందించారు –ఆకాశవాణి లో ప్రసారమైన ‘’మనసుల్ని తెరచి ‘’కవిత లో .  దుఖానికి వార్నింగ్ ఇస్తూ  ‘’నన్నూ ఈ  భూమినీ విడిచి నీ దారిన నువ్వు అనంత విశ్వం లోకి ఫో ఫో ‘’అని దుఃఖ రహిత సమాజం కోసం పరితపించారు .ధిల్లీ ఆకాశవాణి లో ప్రసారమైన ‘’ఉద్యమం ఒంటరిది కాదు ‘’కవితలో మానవ సమాజ పోకడలను తెలియజేస్తూ తెరల మాటునే మనసులు ,మాటలు దాచుకొంటున్నామని  ,మనిషికి  మనిషికీ మధ్య గోడలు కట్టుకొంటున్నామని బాధ పడుతూ ‘’తెరల్ని తొలగించుకోక పొతే –ఏకాకిగా మిగిలే ఒంటరి పక్షులమై పోతాం ‘’అని హెచ్చరించి ‘’ఉప్పెనైనా ,ఉద్యమమైనా ఒంటరిగా రాదు .పెదాలు కలిస్తేనే మాటౌతుంది ‘’అంటూ మనసులుకలిపి మానవతా హారమై ఉద్యమించాలని ఉద్బోధించారు .ఉద్యమం లేనిది లక్ష్యం సాధించటం కుదరదనే సూచన ఉంది .

విదేశం లో కొన్ని నెలలుఉండి ఇంటికి తిరిగి వస్తే ‘’దిగులు కళ్ళతో –పాలిపోతున్న పచ్చదనం తో –ఒళ్ళంతా తడుముతూ హత్తుకున్నాయి’’ –బాల్కనీలోని ఆమె పెంపుడు బిడ్డలు అంటే ‘’మొక్కలు’’ . ఎంత హృదయ స్పందనగా నో చెప్పిన కవిత ఇది! .

‘’ఊపిరి పోసుకున్నప్పుడే కాదు ,ఆ తర్వాతా –మనిషిగా బతికినవాడు –ఊపిరి కడబట్టినప్పుడు కూడా –జనం ఊపిరై జీవిస్తూ ఉంటాడు ‘’అన్న వాక్యాలు ‘’సుభద్రా మానుషోపనిషత్’’ వాక్యం లా పరమప్రబోధకంగా  పవిత్రంగా ఉంది .’’అంతరా౦తరాల్లోకి ‘’కవితలో సైంటిఫిక్ వింతలూ శస్త్రచికిత్స విజయాలు నెమరేస్తూ ‘’మెదడు పొరల్ని తిరగేసి ,మరగేసి –పంక్తులలో గాధల్ని తరచి తరచి తవ్వి –అవి చేసిన గాయాల మరకల్ని స్కాన్ చేయండి ‘’అని హితవుపలుకుతూ ,చేసేవారి జీవిత అనుభవాలను కూడా జోడించి మూల్యాంకనం చేయమని అంటూ ‘’కానీ –అది మీ కత్తులు చేయలేవు –మా కలాలకే అది సాధ్యం ‘’అని కత్తికంటే కలం గొప్పదని ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిభాషలో చెప్పారు .

‘’నదైనా ,మనిషైనా స్త్రీ కావటమే ‘’అన్న సామ్యాన్న బాగా చెప్పారు ‘’ఒకే ఒక్కటి ‘’లో .ఆమెది ఎల్లలు లేని ప్రేమ వార్ధి .’’ముళ్ళతో పొగరుగా చూసే ఎడారి మొక్కైనా –ఠీవిగా తలెత్తి నిలిచే మహా వృక్షమైనా –మొగ్గ తొడిగి బతుకు పండినప్పుడు మాత్ర౦ –ప్రేమ తెలిసిన మనసౌతుంది .’’ఇక్కడ సుభద్రా దేవిగారి అమ్మతనం ,ప్రేమ మాధుర్యం చక్కగా వ్యక్తమయ్యాయి .ఆమె  తనచుట్టూ తాను తిరిగే బొంగరమై ‘’చిన్నారి వెలుగు చుట్టూ పరిభ్రమించే వసుంధర నయ్యాను-అవును –నేను తల్లికి తల్లినే కదా ‘’ అని గుర్తు చేసుకొన్నారు . తాను  భూమాత అయి, ఆమెలోని సహజ సహనానికి ప్రతీకగా నిలిచి వెలుగు ప్రసరించే కారుణ్య దీపమైనారు .ఇంతకంటే కవి సాధించాల్సినదేమి ఉంది ?సార్ధకం ఆమె జీవితం ,కవితా జీవితం కూడా .మంఛి కవితా సంపుటి ‘’ఏకాంత సమూహాలు ‘’.చదివి అభినందించాల్సిన పుస్తకం .2007ఏప్రిల్ లో ప్రచురితమైంది .కిందటివారం సుభద్రగారు నాకు దీన్ని ఆత్మీయం గా పోస్ట్ లోపంపారు .చదివి ఆనందించి మీరూ సంతోషిస్తారనే  ఈ పరిచయం రాశాను .అంతేకాని ముంజేతి కంకణానికి  అద్దమేల ?

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దిగంబరులారుగురూ కర్తా కర్మా .క్రియలె

Inline image 1

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుష్క కు రుద్రమదేవి కాన్ఫిడెన్స్ పెంచిందట – అనుష్క కు రుద్రమదేవి కాన్ఫిడెన్స్ పెంచిందట

Inline image 1

 

 

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగులో సైన్సు జనీకరణ సమస్య -వివినమూర్తి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళాత్మక నిర్మాత ఏడిద నాగేశ్వర రావు మృతి

Inline image 1
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కూర్మనాధ స్వామి ,శ్రీవారి ఆలయం లో అచ్యుత రాయల పట్టాభిషేకం

కూర్మనాధ స్వామి ,శ్రీవారి ఆలయం లో అచ్యుత రాయల పట్టాభిషేకం

 

Inline image 1
 
Inline image 2
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చంద్ర గిరి వైభవం ,మహాల్లికా

 

Inline image 1
Inline image 2
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అణువు గురించి గణపతి స్వామి జ్ఞానం పై రవిశంకర్


Inline image 1
 
Inline image 2
 
 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అణువు గురించి గణపతి స్వామి జ్ఞానం పై రవిశంకర్


Inline image 1
 
Inline image 2
 
 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రవాస మోడీ

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఘంటసాల పోలీసే0కట సామి

Inline image 1


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన్యానికి జలహారం

Inline image 1
Inline image 2
 
Inline image 3
 
 
 
Inline image 4

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శిలాక్రుతి బాలాజీ

Inline image 1
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సత్యం బహుముఖీనం

సత్యం బహుముఖీనం

‘’మానవుడు కనిపించేదానికి ఆవల ద్రుష్టి సారించాడు .తనను తాను  విస్తృత పరచుకొన్నాడు .దీనినంతా అభివృద్ధి అని ,పరిణామం అని అంటున్నాం .అతని గమ్యం వైపు ప్రయాణానికి,భగవంతుని చేరడానికి  వీటితో కోలుస్తున్నాం .ఇదంతా మతం గొప్పతనానికి అంటగడుతున్నాం .దీనితో అతనిజీవితాన్ని  భయానకం చేస్తున్నాం .మతం అతనికి ప్రశాంతిని ,ప్రేమను అందించింది .అదేమతం అతనిలో భయాన్ని ,ద్వేషాన్నీ కూడా రగిలించింది .మతం అతనిలో సోదర భావాన్ని పెంపొందించింది .అదే సమయం లో మనిషి మనిషి మధ్య విద్వేష మూ పుట్టించింది .మతమే దాన గుణం తో విద్యా వైద్య  సంస్థలను  మనుషులతోబాటు జంతువులకుకూడా నెలకొల్పెట్లు చేసింది .ఇదే మతం వాటిమధ్య వైరాన్ని రక్తపాతాన్ని సృష్టించింది .ప్రతి ఆలోచనలో అంతర్గత ప్రవాహం ఒకటి ఉంటుంది అని గ్రహించాలి .ఇదేమనుషులలో  విభిన్న పక్షాలకు దారి చూపిస్తుంది .వేదా0తులమధ్య ,భిన్నమతాల మధ్య తులనాత్మక పరిశీలన చేసి అందరిలో సామరస్యాన్ని సాధించే  విద్యార్ధుల మధ్య చిచ్చు పెడుతుంది .ఇలా మతం వలన భిన్నమైన తెగల మనుష్యులంగా  మారిపోతున్నాం .ఈ సామరస్య సాధన కొన్ని దేశాలలో సాధించగలిగితే ఎన్నో దేశాలలో అది విఫలమైంది .

ప్రపంచం లో ఉన్న గొప్పమతాలన్నీ అతి ప్రాచీనమైనవే .అవి ఇటీవలికాలం లో వచ్చినవికావు అని గమనించాలి .దాదాపు  ఈ  పురాతన మతాలన్నీ గంగా –యూఫ్రటీస్ నదుల మధ్య మాత్రమె పుట్టాయి .ఇందులో ఏ ఒక్క గోప్పమతమూ యూరప్ లోకాని అమెరికాలో కాని పుట్టలేదని తెలుసుకోవటం ముఖ్యం .ఒక్కటికూడా అక్కడ పుట్టలేదు .అదీ విచిత్రం .ప్రతిమత ఆవిర్భావానికి  ఆసియా ఖండమె జన్మస్తలమై,,ప్రపంచ వ్యాప్తమైంది .ఆసియావాసులు మంచి మత బోధక వ్యాపారులని లని పించుకున్నారు .పాశ్చాత్య దేశీయులుసాంఘిక సంస్థలు ,సైన్యం ,ప్రభుత్వాలు మొదలైన వాటి నిర్వహణలో ఆరితేరినవారయ్యారు . మత బోధనా విషయానికి వస్తేమాత్రం ఆసియన్ల కు సాటి రారు .కారణం వీరికి మొదటినుంచి మతం వ్యాపార గుణమైంది  .అదివారి రక్త గతం  వ్యక్తిగతం. దీనికోసం వాళ్ళు ప్రచార సాధనాలను పెద్దగా ఉపయోగించలేదు .’’

‘’ ప్రస్తుత మానవ సమాజం లో అనేక మతాలు ,పెరుగుతూ విస్తరిస్తూపోతున్నాయి అనేది  యదార్ధ విషయం . ఇప్పుడు దీనికి ఒక అర్ధం ,పరమార్ధం ఏర్పడ్డాయి .సృష్టికర్త అయిన భగవంతుడు ఏదో ఒకమతమే ఉండాలని మిగిలినవి కాలగర్భం లో కలిసి పోవాలని అనుకొంటే ఇన్ని మతాలూ ఇన్ని రకాలుగా విస్తరించేవి కావు అన్న సత్యం గ్రహించాలి అందరూ .ఇందులో ఒక మతమే యదార్ధమైనదని మిగిలినవి కావని అనుకోని ఉంటె అదే ప్రపంచమంతా ఈపాటికి ఆక్రమించి ఉండేది .కాని అలా జరగలేదు కదా .ఒక్కమతానికే వ్రేళ్ళు బలమై ప్రపంచమంతా పాకలేదు .కొన్నిమతాలు కొంతకాలం ముందున్నాయి తర్వాత వెనక బడి ఉండచ్చు .ప్రపంచ వ్యాప్తంగా గణాంకాలు సేకరిస్తే కొన్నిమతాలు బాగా పుంజుకొని ముందుకు వెళ్లి కాలప్రభావం వలన ప్రాభవం కోల్పోయి వెనుకడుగు వేసినట్లు గమనించగలం .దీనితో అనేక తెగలు ఏర్పడ్డాయి ‘’.

‘’ఒకమతం తనకే సత్య దర్శనం అయిందని ,దేవుడు తనమతం వారికే సత్యాన్నితమ పవిత్ర గ్రంధం లో  అందించాడని .నిజంగా అనుకోని ఉంటె ఇన్ని తెగలు వచ్చేవికావు కదా .అలా ఒకే గ్రంధం లో తన భావనలు నిక్షిప్తం చేసి దేవుడు ,ఆ గ్రందాల విషయం లో పోట్లాటలు పెడతాడా?ఒక వేళ సత్యం ఉన్న  ఒక మత గ్రంధం దేవుడే ఇచ్చి ఉంటే,దాన్ని అర్ధం చేసుకోవటం అందరికీ సాధ్యమవుతుందా ?బైబిల్ నే ఉదాహరణ గా తీసుకొందాం .క్రైస్తవులలో ఎన్ని తెగలు ఏర్పడ్డాలేర్పడి నాయో ఎవరైనా చెప్పగలరా ? అది భగవంతుడిచ్చిన సత్య దర్శనమేగా ?మరెందుదుకు ఇన్నిచీలికలు ?అదే పవిత్ర గ్రంధం మీద ఒక్కో తెగ తనకు తోచిన వ్యాఖ్యానం చేసింది .తానే బైబిల్ ను పూర్తిగా అర్ధం చేసుకోన్నానని నొక్కి చెబుతుంది .మిగిలినవారివన్నీ అసత్యాలని బుకాయిస్తుంది .ఇలాగే అన్నిమతాల విషయం లో కూడా జరిగింది అని అర్ధం చేసుకోవాలి ‘’.

‘’  మహామ్మదీయుల్లో, బౌద్దులలో ఇలానే తెగలేర్పడ్డాయి .హిందువులలో లెక్కలేనన్ని ఉన్నాయని తెలిసిన విషయమే .దీన్ని బట్టి తేలింది ఏమిటి  ? ప్రపంచ మానవాళి నంతా ఒకే ఆధ్యాత్మిక విధానం లోకి ఒకే ఆలోచన కిందకు తెచ్చిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయని .అందరికీ ఒకే రకమైన నమ్మకాన్ని ,విశ్వాసాన్ని కల్గి౦చ లేమని. .ఇది పూర్తి యదార్ధం .దీనికి మనం భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి .నేను  ఏ తెగకు  వ్యతిరేకం కాదు .ఇన్ని రకాల తెగలేర్పడినందుకు నాకు మహాదానందంగానే ఉంది .అవి ఇంకా తామర తంపరగా పెరగాలని, విస్తరించాలని నేను కోరుకొంటున్నాను .ఇలా నేను అనుకోవటానికి కారణం ఏమిటి అంటే –ఇక్కడున్న మీరు, నేను, మనమందరం ఒకే రకంగా ఆలోచిస్తే ,ఇంక మనకు కొత్తగా ఆలోచి౦చా ల్సినదేదీ ఉండదు .వస్తువుల మధ్య చలనం జరగాలంటే రెండు లేక ఎక్కువ శక్తులు పరస్పరం ఘర్షణ చెందాల్సిందే .ఆలోచనలలో అభిప్రాయభేదం ,మానవ ఆలోచనల ను మేల్కొల్పుతుంది .ఇక్కడ చేరిన మనమందరం ఒకే విధంగా ఆలోచిస్తే మనం మ్యూజియం లో ఉండే  ‘’ఈజిప్షియన్ మమ్మీలు ‘’అయిపోయి ఒకరినొకరు శూన్య దృక్కులతో చూసుకొంటూ అచేతనంగా ఉండిపోతాం .అంతకంటే ఏమీ ఉండదు .ప్రవాహం ఉన్ననీటిలోనే  సుడిగుండాలు , అగాధాలు ఉంటాయి .ప్రవహించని  మరణ సదృశ నిలవ నీటిలో ఇవేవీ ఉండవు .మతాలు మరణిస్తే తెగలకు ఆస్కారం ఉండదు .అప్పుడు లభించేది స్మశాన నిశ్చల ప్రశాంతి మాత్రమే .మానవాళి ఆలోచనలు  సాగినంత కాలం ఈ తెగలు ఉంటూనే ఉంటాయి, ఉండాలి కూడా .భిన్నత్వం ప్రాణి చిహ్నం .అది ఉండాల్సిందే .ప్రపంచం లో ఎంతమంది మనుషులున్నారో అన్ని తెగలు ఏర్పడాలనే నేను ప్రార్ధిస్తాను .అందువలన ప్రతి వ్యక్తీ తన స్వంత ఆలోచన ,స్వయం విధానం   రూపొందించుకొని,మత భావాలను సుసంపన్నం చేయాలని నా కోరిక ‘’.అన్నాడు స్వామి వివేకానంద ‘’Many facets of the Truth ‘’లో .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లోతైన శాంతి వేదాంతం వైపుకు -2

లోతైన శాంతి వేదాంతం వైపుకు -2

41 పి హెచ్ కాలం లో ఉంటున్న వారికి విశ్వా౦త రాళ ,వ్యక్తిగత  స్థాయిలలో ఒకే విధమైన సమస్యలు ఎదురౌతున్నాయి .మనం ఉన్న సంస్క్రుతికాలం ప్రపంచం లేకుండా సమాప్తమవుతుందా ?అనేది అందరిని వేధించే ప్రశ్న .సత్యాన్ని విస్మరించి బతుకుతున్నామా అనేదీ ఒక ప్రశ్నగా మిగిలింది .దీనికి రెండు రకాల సమాధానాలు కనిపిస్తున్నాయి .అందులో ఒకటి ‘’అటామిస్ట్ సెపరేటిస్ట్’’అయితే రెండవది ‘ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ ‘’.స్తూలంగా ఆలోచిస్తే మనం మెటా ఫిజికల్ అపార్ధీ,కి లోబడి మిగిలిన ప్రపంచం టో సంబంధం లేకుండా గడపటం లేక మనం మనమున్న పరిసరాల లో ఒకరుగా బతకటం అంటే ఒక చెట్టుగానో డాల్ఫిన్ గానో  ఒక పర్వతంగానో ఉండిపోవటం .

మనం ఆధునిక వ్యక్తిగత సమాజం లో ఉంటున్నాం కనుక కాలం గురించిన అవగాహన అందరిదీ ఒకటిగానే ఉంటుంది .సభ్య సమాజ సభ్యులమే మంనమంతా. ఆనుభావాలు అందరివీ దాదాపు ఒకటిగానే ఉంటాయి .గాఢమైన ప్రాపంచిక విషయాలు కాలం తోఅంటే ‘’అంతా  అయిపొయింది –చివరిదశకు చేరుకోబోతున్నాం అనేదానితో  ముడిపడి ఉంటాయి .’’ఇప్పుడు ‘’అనే మాటకు అర్ధమే మారిపోయింది .ఈకాలం లో ఇప్పుడు అంటే ‘’అటామిక్ రిడక్షనిస్ట్ ‘’భావం కనిపిస్తుంది .విస్తృతమైన ‘’ఇప్పుడు ‘’జేనేసిస్ ‘అపోకలిప్టిక్ టైం  లైన్ ‘’ ’తోబంధం ఏర్పడి కనిపించదు .మనకు కనిపించేది మనం అనుభవించేదానికి మొదలు ,తుది లేనిది .డాక్టర్లు మొదలైనవారి పరిశోధనలలో ఈ ప్రపంచ విలువ లెక్కకు మించి పెరిగింది .శత్రువు అనే భావం నశించి ,మనమే అంతా అనేది ఏర్పడింది .

ప్రపంచ అగ్రగామి వేదాంతి జిడ్డుకృష్ణ మూర్తి ఎప్పుదూకూడా ప్రజలు ‘’కాల సమాప్తి ‘’ని  అనుభవించాలి అని బోధించేవాడు .అంటే పరంపరాగతమైన కాలం ఆలోచన నుండి విముక్తి చెందాలని ఆయన భావం .ఆయన బోధించిన రెండు సిద్ధాంతాలు ఈ నాటి కాలానికి సరిగ్గా వర్తిస్తాయి .మొదటిది ’’ప్రేమ ,శాంతి అనేవి కారణాలేవీ లేకుండానే కలిగేవి ‘’రెండవది ‘’వ్యక్తీ అంటేనే ప్రపంచం .’’

ద్వంద్వంగా,వేరువేరుగా  కనిపించే రెండురకాల టైం వరల్డ్స్ అనేవి మనసంస్కృతీ పరంపరలో ,మత భావనలలోనే గర్భస్తమై ఉన్నాయి .అత్యున్నతమైన సంస్కృతీ అనేక శతాబ్దాలుగావిలువలను  వెదజల్లి  ,ప్రస్తుత కాల ప్రపంచానికి  దూరంగా మరో అందని ప్రపంచానికి దారి చూపిస్తున్నాయి .వీటన్నిటి ఫలితంగా ఉన్నత కాలాతీత విలువలు మానవ మస్తిష్కం లోనే ప్రభవించి ఈ ప్రపంచానికి సంబంది౦చి నవిగానే అనిపించి ‘’దేవుడు లేడు’’అన్నభావనకు తప్పుగా సంకేతాలిస్తున్నాయి .ఇవి మతానికి వ్యతిరేకం అని కూడా అనిపిస్తుంది .ఇదే ప్రముఖ వేదాంతులు  స్పినోజా ,ఫ్యూయర్ బాచ్ విషయం లో జరిగింది .నిజానికి వారిద్దరూ ఈ ప్రపంచం లో ఆధ్యాత్మిక భావనలు నెలకొల్పినవారే .

స్థూల  జగత్తుకు సూక్ష్మ జగత్తుకు మధ్య అతి సన్నిహిత సంబంధం ఉన్నదని అందరికి తెలిసిన విషయమే .ఇది అనాదిగా విస్తరిల్లిన భావమే .’’టావోయిస్ట్’’వేదాంతం లోను ,పశ్చిమ దేశ వేదాంతం లోను చెప్పబడినదే .పదహారవ శతాబ్ది వైద్య శాస్త్రవేత్త,దార్శనికుడు ‘’పెరాక్లియాస్ ‘’కూడా ఈ భావాన్ని వ్యాప్తి చేశాడు .ఎవరేమి చెప్పనా ప్రతి వ్యక్తీ ఒక సూక్ష్మ  ప్రపంచమే .అన్నికాలాల్లో  అందరు మానవుల కు ప్రతినిదియే అనేది సార్వకాలిక సత్యం .

ఈ స్థూల సూక్ష్మ భావన భౌతిక ప్రపంచం లో ఏ కాలం లో జరిగే సంఘటన అయినా మనిషి వ్యక్తిగత మనసుపై  ప్రతిఫలిస్తుంది .ఫిలాసఫర్ ‘’జంగ్ ‘’పైదానినే ప్రతి దిన సంఘటనలో కూడా జరుగుతుందని చెప్పాడు .ఆయన ‘’సింక్ర నాసిటి’’అనేకొత్త  శబ్దాన్ని దీనికోసంవాడాడు .దీనిపై సమగ్రంగా చర్చించి ‘’An Acausal   connecting principle ‘’గా రాశాడు .కోట్లాది ప్రజల విషయం లో ఈ సింక్రనిష్టిక్ అనుభవం వారి జీవితాలలో ఒక భాగమై ఉంటుంది .దీనివలన ఆంతరంగిక శాంతి ,సానుభూతి సహవేదన ఏర్పడి అనంతమైన సంతోషం ఆనందాలను పొండుతాడువ్యక్తి .ఇది గుర్తించటానికి వీలులేనంతగా ఉంటుంది. అవి అసాధారణమై ఉంటాయి .ఏ గణాంకాలు సర్వేలు వీటిని గుర్తించలేవు .ఈ రకమైన భావాత్మక అనుభవాలు పశ్చిమ దేశాలలోకంటే ప్రాక్ దేశాలలో ఎక్కువగా కనిపించటం విశేషం .

ఈ శతాబ్దపు చివరలో విలియం జేమ్స్ ఒక క్రమ పద్ధతిలో ఈ అనుభవాలపై  మతాతీత౦గా విశాల దృక్పధం తో పరిశోధింఛి రికార్డ్ చేశాడు .దీనితో  కాలానికి సంబంధించిన కొత్త పదజాలం ఏర్పడింది .రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ,ధనాత్మక ఆలోచనాభివ్రుద్ధితో ఇంకా పరిశోధన1969 లో  సాగింది  .దీనికోసం  మెరైన్ బయాలజిస్ట్ ఆలిస్టార్ హార్డీ   ఆక్స్ ఫర్డ్ లో ఒక రిసెర్చ్ సెంటర్ ను ఏర్పరచాడు .దీనిని ఇప్పుడు ;;’’ఆలిస్టార్ హార్డీ రిసెర్చ్ సెంటర్ ‘’గా పిలుస్తున్నారు .

ఈ రకమైన భావనలు పరిశోధనలు మనసమాజాన్ని  మళ్ళీఅనంత మనవ సంబంధాలకోసం  అర్రులు చాచేట్లు చేస్తున్నాయి . .ఇది విశ్వవ్యాప్తమై కాలానికి తగినదిగా విస్తరించింది .ముఖ్యంగా హీరోషీ మా ఉదంతం తరవాత వచ్చిన గొప్ప గుణాత్మక మార్పు ఇది .ప్రముఖ రచయిత ఆల్డస్ హక్స్లీ ‘’రాజకీయ సిద్ధాంతాలు సార్వకాలికమైన వేదాంత మూలాలనుండే వస్తాయి .అవి సహిష్ణుతను ,అహింసను బోధిస్తాయి ‘’అన్నాడు .ఈ వేదాంత భావనలు సూటిగా మెటాఫిజికల్ విముక్తి అనుభవాల ఆధారంగా ఏర్పడ్డవే  ఈ ఉత్తమ అనుభవ  దృష్టాం తాల  నుండి వచ్చిన రాజకీయ నిర్ణయాలు ఇంకొంచెం లోతుగా అధ్యయన వేదికలవ్వాలి . సూటి అనుభవాలనుండి  వచ్చిన ఈ కాలాతీత విలువలు సహజ ,సాధారణ జీవిత0  లో  మమేకమై ,రాకకీయాలలో చేరి చివరకు మెటా ఫిజికల్ విముక్తి కారణాలౌతాయి .

పశ్చిమ దేశ వేదా౦తు లలో అగ్రగణ్యు డైన ‘’స్పినోజా ‘’ఈ ప్రపంచాన్ని అనంతమైనదిగా  భావించాడు  .శాంతిని నిర్వచించాడు .అందులో ‘’శాంతి అంటే యుద్ధం లేక పోవటం కాదు. శాంతిమనిషి హృదయపు శక్తి లో నుంచి జన్మించిన ఒక నైతిక ధార్మిక ప్రవరరతనా గుణం  ‘’అన్నాడు (peace is not the absence of war –it is a virtue born out of the strength of the heart ‘’’-ex animi i fortitudine)అన్నాడు .ఈ ప్రపంచం అనంతమైనది కనుక పవిత్రమైనదిఅనుకొన్నవాడు ఈ భూమికి తగిన వారసుడే .అలాంటి వాడి మనసులో మైక్రో సెకండ్ కాలం లోకూడా ప్రపంచ వినాశనాన్ని  తలపెట్టడు .అది వాడి సంస్కారం అవుతుంది .

కనుక ఏతా  వాతా తెలి౦దేమిటి అంటే శాంతి అంటే ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొని గుణాత్మక శాంతి వేదాంతం అనంత కాలాతీత విలువల ఆధారంగా ఉండాలిఅని . .పశ్చిమ దేశావాసులుకూడా భారతీయమైన ‘’అహింస ‘’ను అవలంబించాలి .నాన్ వయోలెన్స్ అంటే వ్యతిరేకార్ధం వచ్చే భావన దూరమవ్వాలి .మొదలు చివర అనేవాటికి వాటి ఉపయోగాలు వాటికి ఉన్నాయి .ఫ్యూర్ బాచ్ చెప్పినది అందరికీ ఆలోచనానుసరణం కావాలి ఆయనమాటల్లో చెబితేనే దాని ఎఫెక్ట్, అందం –‘’it was granted only to a few to ‘’see the end of the present ,to be raised beyond its boundaries and to feel through the hard skin and crust of the currently secure maxims and principles to the eternally bubbling spring of eve lasting life –to press into the depths and perceive the pulsebeat of the creative new time ‘’

ఇప్పుడు కొద్దిమందే ఉండవచ్చు .క్రమంగా బాగా పెరగాలి సంఖ్య.ఫ్యూర్ బాచ్ ‘’History teaches us that when something stands at the very verge of its total destruction ,it once again raises itself with all its force ,as if it wished to begin anew its already finished course of life ‘’’

ఈ వ్యాసానికి  ఆధారం –‘’దర్శన ఇంటర్నేషనల్’’ -1986 జనవరి లో ‘’జాన్ ఫ్రాన్సిస్ ఫిప్ప్ ‘’రాసిన ‘’Towards a deeper philosophy of peace ‘’వ్యాసం .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-15- కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పి .వి.కి ప్రేరణ స్వామి రామానంద

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పట్టిసీమలో మునిగినదేంత,తెలినదేంత


Inline image 1
 
 
 
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరబ్రహ్మశాస్త్రికి ఐసిహెచ్‌ఆర్ ఫెలోషిప్

పరబ్రహ్మశాస్త్రికి ఐసిహెచ్‌ఆర్ ఫెలోషిప్

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు కాకతీయుల చరిత్రపై అధ్యాయనం చేసి అనేక గ్రంథాలు రాసిన డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రికి భారత చారిత్రక పరిశోధనా మండలి (ఐసిహెచ్‌ఆర్) జాతీయ ఫెలోషిప్‌ను ప్రకటించింది. డాక్టర్ పరబ్రహ్మశాస్త్రితో పాటు బెనారస్ హిందూ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఠాకూర్ ప్రసాద్ వర్మకు కూడా ఫెలోషిప్ దక్కింది. 1921లో గుంటూరు జిల్లా పెదకొండూరులో పరబ్రహ్మశాస్ర్తీ జన్మించారు. గురుకుల పద్ధతిలో సంస్కృతం చదువుకున్నారు. జాతీయ ఫెలోషిప్ కింద ఆయనకు నెలకు 55వేల రూపాయిలు చొప్పున రెండేళ్లపాటు గ్రాంట్‌ను అందిస్తారు. దీనికి అదనంగా ఏటా మరో 60 వేల రూపాయిలను ప్రస్తుత పరిశోధనలకు వెచ్చించేందుకు ఇస్తారు. యావజ్జీవితం శాసన పరిశోధనలకు అంకితమైన వాసుదేవ పరబ్రహ్మశాస్ర్తీ ఆంధ్రచరిత్రకు ఆకరాలు అందించారు. శాసనాధారాలతో కాకతీయ వంశానుక్రమణిక, శాతవాహనుల గురించి లోతైన నికార్సయిన అధ్యయనం చేసిన ఏకైక పరిశోధకుడు పరబ్రహ్మశాస్ర్తీ. నాణాల పరిశీలనతో శాతవాహన శకాల నిర్ణయం చేసి పరిశోధకుల మెప్పు పొందారు. కాకతీయ వైభవానికి సంబంధించి కొన్ని అంశాలను గుర్తించి అజ్ఞాతంగా ఉన్న శాసనాలను వెలికి తీసి ప్రామాణిక గ్రంథాలను రచించారు. తెలంగాణకు గర్వకారణంగా ఉన్న చరిత్రను విశ్వవిఖ్యాతం చేసిన పండితుల్లో అగ్రగణ్యుడు. గ్రామాలకు వెళ్లి అసలు చరిత్ర ప్రజల జీవన విధానంలోనే ఉందని గుర్తించి, అదే తపనతో ఆ సమాచారాన్ని ఒడిసిపట్టుకుని ఏ హంగులూ లేని కాలంలో అద్భుతమైన యజ్ఞం చేశారు. సంస్కృతం మీద ఉన్న పట్టుతో ఎన్నో బ్రహ్మీ లిపి శాసనాలను అవలీలగా పరిష్కరించడమేగాక, లిపి పరిణామాన్ని కూడా వివరించి పండితులను మెప్పించారు. 12 గ్రంథాలు రాసిన పరబ్రహ్మశాస్ర్తీ శాసనాల్లో ఉన్న అన్నమాచార్య కీర్తనల పుస్తకానికి సహ సంపాదకత్వం వహించారు. 94 ఏళ్ల ప్రాయంలో సైతం పరిశోధనల్లోనే మునిగి తేలే వారి జీవితం భావి పరిశోధకులకు ఆదర్శప్రాయం.
1938లో పరబ్రహ్మశాస్ర్తీ మద్రాస్ రెసిడెన్సి నుండి ఎస్సెస్సెల్సీ ఉత్తీర్ణులయ్యారు. కాశీలో సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించిన పరబ్రహ్మశాస్ర్తీ కర్నాటక ధార్వాడ్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో డాక్టరేట్ పొందారు. 1959 నుండి పురావస్తుశాఖలో దీర్ఘకాలం పనిచేసి పదవీవిరమణ చేశారు. తెలుగువిశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్శిటీల్లోనూ కొంత కాలం పనిచేశారు. 500 బిసిలో ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక ఆర్ధిక పరిస్థితులపై పరిశోధనలు చేశారు. అనేక ప్రసిద్ధ జర్నల్స్‌లో పరబ్రహ్మశాస్ర్తీ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లోతైన శాంతి వేదాంతం వైపుకు

లోతైన శాంతి వేదాంతం వైపుకు

‘’ఇక నుండి  పురాతన ,మధ్యయుగ, ఆధునిక యుగ చరిత్ర అనే పేరుండదు .ఇప్పటినుండి పూర్వ అణుకాలం ,అణుకాలం అనే పిలవాల్సి ఉంటుంది .కొత్త చారిత్రిక కాలాన్ని ఆవిష్కరించుకోవాలి ‘’అన్నాడు 19 49 లో హీరోషీమా ఉదంతం జరిగిన నాలుగేళ్ళతర్వాత మొట్ట మొదట సారిగా ప్రచురించిన ‘’ఫిలాసఫీ ఆఫ్ పీస్’’ పుస్తకం లో జాన్ సోమేర్ విల్లీ .మన ప్రస్తుత కాలెండర్ మన ద్రుష్టిని 6-8-19 45మరల్చి మానవ చరిత్రలో ఒక విభజనను ఏర్పరచి ,యేసు క్రీస్తు పుట్టినకాలం కంటే అత్యధిక సంచలనమే సృష్టించింది ..కనుక ఈ సంవత్సరాన్ని,1986A.D అనటం  కంటే   41 పోస్ట్ హెచ్ (41post  H)అని పిలవాలి  .ఇది ఒక మానసిక వ్యాయాయమే .ఇది  మన దృక్పధం  అంతా మార్చేస్తుంది .ఇదేమీ కొత్తకాదు .ఆర్ధర్ కెప్లర్ సుమారు వందయేళ్ళ కిందటే ఇలాంటి కేలండర్ ను వాడమని సూచించాడు .కాని అయన ఆలోచనలను ఎవరూ పట్టించుకోలేదు .

1945ఆగస్ట్ 6 కు ముందున్న శతాబ్దం కు సంబంధించిన కాలం ఇంకా కాలగర్భం లో సుప్తంగానే చీకటిలో ఉండిపోయింది .ఇది అటామిక్ కార్డ్ ను పూర్వకాలానికి కలిపేదే .హీరోషీమా అటామిక్ బాంబ్ ఉదంతం తర్వాత బతికి ఉన్న వారిని అధ్యయనం చేస్తూ రాబర్ట్ లిఫ్టన్ ‘’హిబా కుష ‘’ తమకు ఇంతకంటే శక్తి వంతమైనదేదీ  తామున్న పరిస్తితులలో సాయం చేయగలిగినది కనిపించలేదని  పదే పదే చెప్పినట్లు గుర్తు చేసు కున్నాడు .

ఇంతకీ హిబా కుష అంటే ‘’చావులో మునిగిపోయిన ‘’లేక’’ విస్ఫోటన బారిన’’ పడిన అని అర్ధం .ఆది భౌతిక (మెటాఫిజికల్ ), మానసిక (సైకలాజికల్),భావాత్మక (ఎమోషనల్)ముగా మనమందరం విస్ఫోటన బాధితులమే .లోతుగా ఆలోచిస్తే మనమందరం( ‘’హిబా కుష )లమే .

క్లాడ్ లాంజ్ మాన్ అనే ఆయన ఆమధ్యనే తొమ్మిది గంటల సినిమాను ఈ హోలోకాస్ట్ గురించి తీశాడు . ఆ ఉదంత ప్రభావం క్రానాలజిపై మొదట పడి దాన్ని విచ్చిన్నం చేస్స్తుందని తెలిపాడు .ఈ మారణ హోమం జ్యూయిష్ హోలోకాస్ట్ కు వర్తిస్తుంది .అంతే  కాక ఒక మిలియన్ హీరోషీమా వాసులు అంతరించిపోవటానికి కారణమైంది కూడా .ఇంత భారీ అనంత మానవ హనననం  పశ్చిమ దేశాల ఆలోచనననే మార్చేసింది .

దీనితో మనం ఉన్న సాధారణ కాలమానాలు ,వాటిపై ఇప్పటికి ఉన్న అభిప్రాయాలు మార్చుకోక తప్పదనిపిస్తోంది .ఆకాలం మనల్ని అణగ తోక్కిపడేసింది ,పెత్తనం చేసింది . లేవకుండా చేసింది .తప్పించుకొని పారిపోకుండా ,చావు నుండి తప్పించుకోకు0డాకూడా చేసింది . ఇంకే విధమైన సంస్కృతీ ఇంతటి ‘’చావు కాలాన్ని ‘’(కిల్లింగ్ టైం )ఆలోచించి ఉండలేదు .దీనితో క్షీణత,వినాశనం, చావు లపై ద్రుష్టి ఎక్కువై సృజన ,నివారణ కాలం గురించి ఆలోచించలేదు .ఒడిలో పసిపాపను౦చు కొన్న బాలింత యువతీ కాలాన్నిగూర్చి ఆలోచించలేదు .కాని ఈ తర్వాతి కాలం-‘’ చావు-కాలాల ‘’   మధ్య దానితో సంబంధం కలిగి ఉన్నదికదా .

ఈ నాటి ఆధునిక సమాజం సమస్య ఏమిటి అంటే మనం కొత్త పురాణ కధలు ,భావ చిత్రాల గురించి మంచిగా ఆలోచించ లేక పోతున్నాం .మనది ‘’మైతో పొయేటికల్ పెర్సే ప్షన్ ఫైల్యూర్ ‘’అన్నాడు రసెల్ హోబాన్ .కనుక ఇది ఎక్కడో ఒక చోట  మొదలవ్వాలి .అందుకని ఆటం బాంబ్ తో మొదలు పెడదాం .అది యదార్ధమేకాక మనందరి శత్రువుకూడా .

ఇప్పుడు మనం ఒక ప్రత్యేక  సంస్కృతీ అంచున ఉన్నాం .నిజంగా చెప్పాలంటే హీరో షీమా ఉదంతం తర్వాత ఆ అంచును కూడా దాటేశాం .దీన్ని అంటిపెట్టుకు వచ్చిన కాలం ,చరిత్రలను అంటిపెట్టుకొని ఉంది .అందుకే కాలం లో మిలియన్ సెకండ్ లలో భిన్నంగా అంటే ‘’నానో సెకండ్ ‘’గా మార్చే ప్రయత్నం జరిగింది

ఈ ఉదంతం తో ఒక సంస్కృతీ మిగిలిన వాటిపై విజయం సాధించినట్లు అనిపిస్తుంది .ఇదే సంపూర్తిగా ‘’టోటలిటేరియనిజం’’ (నియంతృత్వం)గా  మారింది .ఇప్పటిదాకా ‘’హీబా కుష’’అంటే క్రిస్టియన్ బాంబ్ అనే పేరు సార్ధకమైపోయింది .

హీరోషీమ బాంబ్ బ్లాస్ట్ తర్వాత దానికి దగ్గరలో ఉన్న ఒక కేధలిక్ ప్రీస్ట్ బాంబు విస్ఫోటన సమయం లో తన ‘’గోడ గడియారం ఆగిపోయినట్లు’’ గుర్తించాడు. ఆ మూగ కదలలేని గడియారం జరిగిన మానవ మారణ కాండకు సాక్షిగా నిలిచింది .హిబా కుష లకు మాత్రం పాత ప్రపంచకాలం ఆగిపోయిందని  మనకుకూడా టైం వరల్డ్ కూడా6-8-1945కు  సమాప్తమై పోయిందని  అనిపిస్తుంది .హీరో షీమ ఒక ‘’పార హిస్టారిక్ ఈవెంట్ ‘’ను సూచిస్తు0దని అన్నారు .దీనితో మనమంతా మామూలు పడమటి చారిత్రిక విధానం నుంచి దాటి జీవిస్తున్నాం .ఇప్పుడు మనం వాస్తవంగా ప్రపంచ వినాశనానికి ముందుకాలం దాటివచ్చి  ‘’ ప్రపంచ వినాశన’ఆన0 తర కాలం ‘’లో జీవిస్తున్నాం .

ఆధారం ‘’దర్శన ఇంటర్ నేషనల్ -1986 జనవరి

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విశ్వనాధ సాహిత్య యుగ దశలు

విశ్వనాధ సాహిత్య యుగ దశలు

Inline image 1

విశ్వనాధ సాహిత్య యాత్రాను గమనిస్తే అందులో విభిన్న దశలున్నట్లు కనిపిస్తాయి పరిశీలకులు అందులో ముఖ్యమైన నాలుగు దశలను గుర్తించారు విశ్వనాధ కూడా వాటిని అంగీకరించాడు .వాటి వివరాలూ ఆయనే చెప్పాడు .వాటిని గురించి ఇప్పుడు తెలుసుకొందాం .

విశ్వనాధ సాహిత్య యుగం లో మొదటి దశ ‘’బాల్యావస్థ ‘’ప్రయత్నాలు చేయటం అధ్యయనాలు సాగించటం ,ప్రయోగాలు చేయటం ఇందులో ముఖ్యమైనవి .

ఆయన సాహిత్య యుగపు రెండవ దశ ‘’యోగ వంతమైన కాలం ‘’అని ఆయనే చెప్పుకొన్నాడు .ఆ దశలో సంస్కృతం ఇంగ్లీషు బాగా చదివాడు .ఈకాలం లో మచిలీపట్నం హిందూకాలేజీ లోను గుంటూరు ఏ సి కాలేజీ లోను లెక్చరర్ గా పని చేశాడు .అప్పుడే సంస్క్రుత కావ్యాధ్యయనం చేస్తూ సంస్కృత ,నాటకాలను ,ఆంగ్ల రచనలను కూలంకషంగా అభ్యసించారు .

మూడవ దశ 1938లో ప్రారంభమైనట్లు ఆయనే చెప్పాడు .ఆకాలం లోనే విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఉపన్యాసకునిగా చేరాడు .19 34లోనే రామాయణ కల్ప వృక్ష రచన ప్రారంభించి రెండు వేల పద్యాలలో పదహారు వందల పద్యాలు పూర్తీ చేశాడు కాని పుస్తకం పూర్తీ అయితే ఎలా అచ్చువేయాలో ఆయనకు తెలియలేదు .’’నేను నిత్య చైతన్యం గల రచయితను .నా పుస్తకాలను సరిగా పరిచయం చేయగల పండితుడు నాకు లభించటం చాలా అరుదు .నా పుస్తకాలలోని పదాలను తెరచి చూపగల వాడు నాకు దొరకడం లేదు .నాకు తెలియని అందాలను కూడా చూపించే సమర్ధుడు అలభ్యం ‘’అన్నాడు విశ్వనాధ .

ఆయన కవితాలు చాలాభాగం ప్రచురితమై ఆయన్ను కవిగా చేసి కూచోబెట్టాయి .అప్పటికి ఆయన్ను పాక్షికంగా కొందరే అంగీకరిస్తున్నారు .తనకు ఫాలోయింగ్ బాగా తక్కువగానే ఉన్నట్లు భావించాడు .రామాయణాన్ని పూర్తిగా ప్రచురిస్తే అందులోని గూఢమైన విషయాలు గుర్తించకుండా పోతాయేమోనని వ్యధ కూడా చెందాడు .రామాయణ ప్రచురణకు ఎవరైనా స్పాన్సర్ గా వస్తారేమో నని ఎదురు చూపులో ఉన్నాడు.తనకు సహాయం కావాలని తనను విస్తృతంగా చదవాలని కోరుకున్నాడు ‘’ప్రజలు నా కవిత్వాన్ని ,నా కళా వైదగ్ధ్యాన్ని అర్ధం చేసుకోలేరు .నేను వచనం లో రాస్తే వారు బాగా అర్ధం చేసుకో గలుగుతారు ‘’ఇలా ఆయన  ఆలోచనలు సాగుతున్నాయి .

అదేసమయం లో వేయిపడగలు ఒకవార పత్రికలో ధారా వాహికంగా ప్రచురిస్తామని విశ్వనాధ విద్యార్ధి అయిన  దాని సంపాదకుడు  తన పత్రికలో ప్రచురిస్తానని కోరాడు .దీనినైనా అర్ధం చేసుకోగలుగుతారా అనే అనుమానం ఆయన్ను వదలలేదు వెంటాడుతూనే ఉంది .దాన్ని అర్ధం చేసుకోవటానికి క్షున్నమైన సంస్క్రుతజ్ఞానం ఉండాలి అంటాడు విశ్వనాధ  ముందుగా రెండు నవలలు రాసి పాఠకుల స్థాయిని పెంచి వేయిపడగలు చదివి అర్ధం చేసుకొనే స్థాయి కల్పిస్తానని ఆ సంపాదకుడిని అడిగాడు .ఆయన ఒప్పుకున్నాడు .అప్పుడే ‘’మా బాబు ‘’నవల చాలా ఇళ్ళల్లో సామాన్యం గా అర్ధం చేసుకొనే వ్యవహారిక భాషలో రాశాడు .కాని దీనివలన శత్రు వర్గం పెరిగింది ‘’నేను సనాతన కాలపు రచయితనని ,కొత్త పరిణామాలను ప్రతిఘటించే వ్యక్తినని ముద్ర పడి పోయింది ‘’అని చెప్పాడు విశ్వనాధ .

వేయిపడగలు సీరియల్ ప్రారంభమైంది .ఇంకా అందులోని రహస్యాలను అర్ధం చేసుకోగల స్తితిలో చదువరులు లేరు అనే అభిప్రాయమే ఆయనది .’’ఒక పెద్ద కాన్వాసు పై చిత్రించిన విషయాన్ని అర్ధం చేసుకొనే స్థాయి పాఠకలలో రాలేదు.’’కొన్ని చివరలను కలిపి ఒక కధలో రహస్యం గా నేర్పుగా అల్లాను .దీన్ని చదివి నేను కరడుగట్టిన సనాతన వాదిని ‘అని గగ్గోలు పెట్టారు’’అని పాపం విశ్వనాధ నిర్వేదం చెందాడు .ఇవన్నీ 1938  కి ముందు .అప్పటిదాకా ఆయన నవలా రచయితకాడు .ముఖ్యంగా కవి మాత్రమె .’’ఏకవీర ‘’రాసి చాలాకాలమైంది ‘’భారతి ‘’లో ప్రచురితమైంది తనను విస్తృతంగా జనం చదవాలి అని కోరుకున్నాడు .

ఇక మొదలు పెట్టి వరుసగా నవలలు రాసిపారేశాడు .ముప్ఫై ఏళ్ళలో యాభై నవలలు రాశాడు .రాయటం ఒక వ్యసనం గా మారిపోయింది విశ్వనాధ కు .సమర్ధుడైన రాయసకాడు ఉంటె నవల చెబుతూ పది పదిహేను రోజుల్లో పూర్తీ చేసేవాడు .ముక్త్యాల రాజా  ఆహ్వానిస్తే వెళ్లగా రచన పూర్తీ అయితే  కల్ప వృక్షాన్ని అచ్చు వేయిస్తానని వాగ్దానం చేశాడు . . ఇంకా బాలకాండలో కొంత మిగిలిఉంది అప్పటికి .బాలకాన్డను ఆంద్ర దేశం లో చాలా చోట్ల చదివి వినిపించాడు విశ్వనాధ .సాహిత్య వర్గాలలో మంచి ప్రాచుర్యం పొందింది .బాలకాండ పూర్తీ చేసిన తర్వాత దాన్నిముక్త్యాలరాజా  ముద్రించాడు .అయోధ్య మొదలెట్టి చాలాకాలమైనా సహాయం చేసేవారు కరువైనారు .అప్పటిదాకా ఆయన రచన ఏదీ పూర్తియిన తర్వాత ఇంట్లో నిద్రించి ఎరుగదు. హాట్ కేక్ లాగా ముద్రణ జరిగి పోయేది .

నాలుగవ దశ19 40 తోప్రారంభామై 61  వరకు సాగింది . 19 40 -50 కాలం లో నవలలే ఎక్కువ రాశాడు .61 వరకు ఇంతే 19 5 6 లో గుడివాడ కరీం నగర్ లలో  షష్టిపూర్తిఉత్సవం  జరిగింది 1957 బెజవాదకాలేజీ ఉద్యోగ విరమణ చేశారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి మొదటి ఉపాధ్యక్షులైనారు .1958లో శాసన మండలి సభ్యులైనారు .1959 -6 1  కరీం నగర్ కాలేజి ప్రిన్సిపాల్ .62 లోకల్ప వృక్షం పూర్తీ .6 3 లో మధ్యాక్కరాలకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వచ్చింది 64లో ఆంధ్రా యూని వర్సిటి నుండి ‘’కళా ప్రపూర్ణ ‘’అందుకున్నారు .1969 లో ఉత్తర ప్రదేశ్ పర్యటన .   ..రామాయణ రచన కొనసాగుతూనే ఉంది మరికొన్ని కూడా రాస్తూనే ఉన్నాడు .విశ్వనాధకు దాబ్బు అవసరం ఎప్పుడూ ఉండేది .ఎవారైనా పుస్తకం రాయమని అడిగితె దాబ్బు తీసుకొని రాసి ఇచ్చేవాడు ‘’నాశత్రువులు ఆవేశం ప్రోద్బలం లేకుండా రాసే రచయితను ‘’అన్నారని విశ్వనాధ చెప్పాడు. కాని వారెవరూ వాటిని చెత్త పుస్తకాలని అనలేదట .సద్విమర్శకులు మాత్రం మంచి నవలలు అని మెచ్చుకొన్నారు .

19 34 నుండి   విశ్వనాధ సాహిత్య యుగం లో అయిదవది అయిన ఉచ్చదశ .వందల సంఖ్యలో గౌరవాలు సన్మానాలు అందుకొన్నాడు విశ్వనాధ .బొంబాయి కలకత్తా ,లక్నో ,మద్రాస్ నగరాలు ఆహ్వానించి గౌరవించాయి .ఉత్తర రాష్ట్రాలలో ప్రముఖ మైన అన్ని పట్నాలలో సన్మానాలు జరిగాయి .’’మా గురువుగారు వెంకట శాస్త్రి గారికి ఎన్ని సన్మానాలు జరిగాయో శిష్యుడైన నాకూ అన్నీ జరిగాయి ‘’అని చెప్పుకొన్నాడు .తన యెడల అప్పటికీ రెండు ప్రవాహాలని ఒకటి తన మిత్రులు నడిపే స్వచ్చమైన గంగా ప్రవాహం అయితే రెండవది తన శత్రువుల కలుషిత నీటి ప్రవాహం అంటాడు .భువన విజయం లో ఆయన శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర పోషించేవాడు .1946 లో బెజవాడ పురపాలక సంఘ వజ్రోత్సవ ఉపన్యాసం చేశాడు .రామాయణ కల్ప వృక్ష కనకాభిషేకం బెజవాడ శ్రీ విజయేశ్వరాలయం లో శ్రీ మల్లాది కుటుంబ రాగారు జరిపించారు .196 7 లో అకాడెమీ ఫెలోషిప్ వచ్చింది. ఏకవీర నవల సినిమా తీస్తున్నందుకు డి ఎల్ నారాయణ విశ్వనాధకు రెండు వేల రూపాయలిచ్చాడు .1970 జనవరి 26న రిపబ్లిక్ డే నాడు పద్మ భూషణ్ ప్రకటించి 21-4-19 70 న రాష్ట్రపతి పద్మభూషణ్ ను ప్రదానం చేశారు . 1971 అక్టోబర్ లో ఆంద్ర ప్రభుత్వ ఆస్థానకవి ‘’పదవీ స్వీకారం  చేశారు

16-11 -19 71  లో సాహిత్యం లో అత్యున్నత ‘’జ్ఞాన పీఠం’’పురస్కారం అందుకొని తొలితెలుగు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత గా రికార్డ్ స్థాపించాడు విశ్వనాధ .1971లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘’డాక్టరేట్ ‘’ప్రదానం చేసింది .

2 -1 -73 ‘’కోటి శివపంచాక్షరి ‘’ప్రారంభించి పూర్తీ చేశాడు .9 10- 74 మిమిక్రీ ఆర్టిస్ట్  వేణు మాధవ్ కు ‘’శివపురాణం ‘’అంకితమిచ్చాడు .7 -10-74 న విశ్వనాధ పుట్టిన రోజు పండుగను పిల్లలు ఆత్మీయంగా జరిపారు .19 10-7 5 ఉషశ్రీ శ్రీ  సన్మాన సభకు అధ్యక్షత వహించారు .13 1 7 6 సహస్ర చంద్ర దర్శనమహోత్సవాన్ని శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరావు మొదలైన వారి సమక్షం లో 16- 9- 76 వరకు జరుపుకున్నారు . గుండె జబ్బురాగా గుంటూరు జనరల్ హాస్పిటల్ లో చేరి 18 -10-1977 కవిసామ్రాట్ ,పద్మభూషణ్ ,తొలి తెలుగు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత డా.విశ్వనాధ సత్యనారాయణగారు  తనునమ్మిన  శ్రీ రాముడు పంచాక్షరి తారక మంత్రం చెవిలో చెబుతుండగా తను ఆరాధించిన శ్రీ విశ్వేశ్వర సన్నిధానం చేరారు .

విశ్వనాధ పై సీరియల్ వ్యాసాలు సమాప్తం

శ్రీ లాల్ బహదూర్ శాస్ట్రి జయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాక్షి దినపత్రికలో mahatma gandhi vuyyuru

unnamed

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు ,50 ఏళ్ళ దొంగ రాముడు

 

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్నపూర్ణ త్రిమూర్తులు -అక్కినేని ఆదుర్తి దుక్కిపాటి

Inline image 1
Inline image 2Inline image 3
గబ్బిట దుర్గా ప్రసాద్
 
 
Inline image 1
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు స్నేహ బంధం ”మిత్రుని మాట నమ్మి భార్యను కష్ట పెట్టాను ”అన్న గాంధి

Inline image 1—

Inline image 1


Inline image 2
 
 
Inline image 3

గబ్బిట దుర్గా ప్రసాద్
Inline image 1
 
 
Inline image 2
Inline image 2  Inline image 4Inline image 3

 
Inline image 2
 
Inline image 3

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వ నాధీయం

విశ్వ నాధీయం

‘’తెలుగుకవులది ఒకదారి ,విశ్వనాధది వేరొక దారి ‘’అని ఎర్రద్దాలు పెట్టుకున్నవారన్నమాట .ఆయన ఏది రాసినా మానవ జీవితోద్ధరణకే ,ఉత్తమ మానవతకే రాశాడని ఎందరో ఎలుగెత్తి చెప్పారు ఆయనా అప్పుడప్పుడు చెప్పుకొన్నాడు .ఆయన ద్రుష్టి నిజంగానే వేరు ఆయనది  అందరూ నడిచే బాటకాదు. అందరి చూపులాంటి చూపుకాదు  .అందుకే విలక్షణంగా కనిపిస్తాడు .లోచూపున్నవాడు .పైమెరుగులకు భ్రమసేవాడుకాడు .ఆయన ప్రతి  మాట కదలిక ఆలోచనల్లో నిజాయితీ భారతీయత ఆంధ్రత్వం తొణికిస లాడుతుంది.ఒక్కడు నాచనసోమన అని ఆయనే అన్నట్లు ‘’ఒక్కడు విశ్వనాధ ‘’ఇది తిరుగు లేనిమాట .ఆ మహోన్నత వ్యక్తిత్వాన్ని అన్ని కోణాల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం .

నవ్య సంప్రదాయ ఉద్యమానికి నాయకుడై విశ్వనాధ నాలుగు దశాబ్దాలు యుగ కర్తగా నిలిచాడు .కవి సార్వ భౌముడైన శ్రీనాదునితో సరిసమానం గా ఈ’’ కవిసామ్రాట్’’నిలిచాడు .విషాదాంత నాటక రచన చేసి ప్రాక్ పశ్చిమ నాటక శిల్ప సమన్వయము చేసిన ప్రయోగశీలి .ఆయన ముట్టని ప్రయోగం శిల్పం లేదు. సమకాలీన జీవిత చైతన్యానికి ఎత్తిన పతాకగా నిలిచాడు . ఆయన మధ్యాక్కరలు  ప్రవ్రుత్తి నివృత్తుల మధ్య ప్రతిస్పందించే జీవుని వేదనలే.భవ్య సంగీతాలే .కల్ప వృక్ష రామాయణం ఆధునిక మానవ చైతన్యం లో ప్రపంచమంతా ప్రతిఫలిస్తున్న ఆధ్యాత్మిక అన్వేషణకు అద్దం పట్టే ఇతిహాస కావ్యం ‘’.నాభక్తిరచనలు నావి కాన’’ అని మళ్ళీ రామాయణమా? అన్నదానికి సమాధానంగా చెప్పాడు .పరానికి పనికొచ్చే రచన చేయమన్న తండ్రిగారి ఆదేశామూ నెరవేర్చాడు .ఈ శతాబ్ది చైతన్యాన్ని ఆపోసనపట్టి  భారతీయ దార్శనిక మూలాలతో విలువకట్టిన ప్రజ్ఞా మూర్తి .ఆయన పలికిన పలుకే ఒక ప్రమాణం .ఒక ఆలోచనా సరళికి ఆదర్శంగా నిలచిన పూర్ణ ప్రతిభా మూర్తి .

ఇంగ్లీషు నవలా ప్రక్రియలో వచ్చిన ప్రయోగాలకు సాటి వచ్చే తెలుగు నవలలు రాసిన ఏకైక నవలా కర్త .రచయితగా సమగ్ర వ్యక్తీ .కళా ప్రపూర్నుడు .శిల్పానికి తెలుగు తోట అయిన నన్నయ తిక్కనలే ఆయన్ను ఆవేశించారు .పాశ్చాత్య శిల్పం తో బలపడి వినూత్న భారతీయ వ్యక్తిత్వం తో వెలిగే సాహిత్య శిల్పాన్నికోరి అలాగే ప్రత్యక్షరం రాసి చూపించాడు .’’నాలాంటి కృతి శత నిర్మాత ను బిడ్డగా పొంది నా తండ్రి గొప్పవాడయ్యాడు’’అన్నదానిలో ఆత్మ విశ్వాసమే ఉంది ,గర్వంకాదు .’’అలనన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యంబు ‘’అన్నప్పుడూ అంతే .వీటిలో ధ్వని గ్రహించాలి .ఆయనది వ్యవహార భాష .మంధర శైలి .రస ధ్వనులకు ప్రాధాన్యం  .ఆయన చేతన నిత్య వేగి .శబ్దాన్ని ఏరుకోవటానికి చిన్నము కూడా నిలవలేదు .అంతటి భావ తీవ్రత ఆయనది .

విశ్వనాధ రాసిన ‘’నా కన్నుల ఎట్ట యెదుటన నాపుత్రుని కంఠ ముత్తరించి –నేను దయా౦బు ధిని కాదా యటంచు నన్నడిగే ఓ ప్రభూ ‘’అనే పద్యాన్నిశ్రీ అబ్బూరి వరద రా రాజేశ్వర రావు మేనత్త బియ్యం యేరు కుంటూ తనలో తానూ చదివేదట .ఆమె చదువుతూ ఉంటె హృదయం ద్రవి౦చి పోయినట్లు ఉండేదని వరద చెప్పాడు .శ్రీ దాసు శ్రీరాములుగారు ‘’తెలుగునాడు  ‘’మొదటి  భాగమే రాశారు .రెండవది రాయలేకపోయారు .విశ్వనాధ వరదతో ‘’శ్రీరాములుగారు రెండోభాగం కూడా రాసి ఉంటె ఆంద్ర దేశం లో కన్యాశుల్కం తోబాటు ఇదీ చిరస్థాయిగా ఉండేది ‘’అని నిండుమనసుతో మెచ్చిన సహృదయుడు విశ్వనాధ .

‘’భావనా శబ్దాలత వల్లా ,ఆవేశ శుద్ధి చేత ,అనుభవ వస్తు గుణం  వలన ఎంతోమందికి ఎన్నో ప్రాంతాలలో విశ్వనాధ పద్యాలు వాచో విదేయాలుగా ఉన్నాయి .కవిత్వానికి ఇదే మూల లక్షణం ‘’అన్నారు గురువు  శ్రీ చెళ్ళపిళ్ళ శాస్త్రిగారు .ఇదేభావాన్ని ఆంగ్లకవి డబ్ల్యు హెచ్ ఆడెన్ కూడా చెప్పాడు .కవిత్వం లో విశ్వనాధ ఎన్నో రూపకల్పనలు చేసి ,పద్యాన్ని వశ పరచుకొన్నారు .తెలుగు జీవితాన్ని అమూలం విశ్లేషించి చూసి తన పద్యాలలో నిక్షేపించారు .అందుకే ఆయన ఖండక్రుతులు కల్ప వృక్షం కలకాలం నిలుస్తాయి .తన ఆనందం ముఖ్యంగా ‘’కావ్యానందమే ‘’అని చెప్పుకొన్నాడు .

విశ్వనాధ శబ్దాలు ,,తత్వ బోధలు ,కావ్యలక్షణాలు అన్నిటినీ ‘’శ్రీరామ చంద్రాత్మ’’గా భావన చేసి కల్ప వృక్షం రాశారు .ఇదంతా ఆయన సాధనయే .లోకానికి అదికావ్యం .దీనికి ఆయన కోరింది కూడా కావ్యానందమే తప్ప వేరుకాదు .పూర్వజన్మ సంస్కారం వలన అద్వైతి అయ్యారు .ఆయనకు శివకేశవులకు రామ విష్ణువులకు  భేద మేలేదు .రామాయణం రాసి ఇలవేల్పు విశ్వేశ్వరునికి అంకితమిచ్చారు .ఖండా౦తపద్యాలన్నీ శివభక్తిపారమ్యాలే.ఆయనే రాముడు ఆయనే పరబ్రహ్మ .నిజానికి అయన గుండెపై స్వారి చేయాల్సినవాడు శ్రీ కృష్ణుడు .వాళ్ళ ఊరిలో సంతాన వేణుగోపాల స్వామి అంటే ప్రాణం .స్వామి విగ్రహం లో చాలామార్పులు చేశారు .తండ్రి శోభనాద్రి గారు ప్రతిష్టించిన శివలింగం జ్ఞానమూర్తిగా విశ్వనాధ భ్రూ మధ్యమంలో ఆడుతూ ఉంటాడు .

కల్ప వృక్షం లో భరతుడు అగ్ని ప్రవేశం చేసే సందర్భాన్ని ఆంజనేయుడు రాముడికి సంగీతం పాడుతూ వినిపించాడు యుద్ధకాండ చివరలో ఉన్నఘట్టమిది .చివర్లో రాసిన 325వ పద్యం లో మూడు చరణాలు పూర్తియ్యాయి. నాలుగవది యెంత ప్రయత్నించినా రావటం లేదు .స్నానం చేశాడుకాని భోజనం చేయబుద్ధికాలేదు ఇంట్లో అందరూ గొడవ . చివరికి స్పురించి ‘’జైత్ర యాత్రా0 చ చ్చ్రీ మధుసూదనాస్య పవమానా పూర్ణ మైనట్టులన్ ‘’అని పూర్తీ చేశారు .పై చరణాలలో ‘’కంఠ శంఖం ‘’అని రాశారు .రాముడు విజయ యాత్రకు బయల్దేరినప్పుడు పరమేశ్వరుని కంఠం నుండి వచ్చిన వాయువు చేత నినదించి నట్లున్నది అనిభావం .భరతుడు శంఖావతారం .దీన్ని తన ఆత్మారాముడు పూరించిన చరణంగా విశ్వనాధ భావించాడు .’నా స్వామి రాముడు నాభాష వాడే ,ఆయనకు తెలుగు వచ్చు ‘’అని చమత్కరించాడు విశ్వనాధ .విశ్వనాధను ఆవేశించి రాముడు తన కద రాయి౦చు కున్నాడుకదా

తనను తాను’’బ్రాహ్మీమయ మూర్తి ‘’అని చెప్పుకోవటానికి ఎన్ని గుండే లు ఉండాలో  అన్నీ ఉన్నవాడు విశ్వనాధ .ఆయన ఎన్నో కష్టాల్ని , ఆపదల్ని పోతనగారి భాగవత షస్ట స్కంధం లోని’’ నారాయణ కవచ ‘’పారాయణం చేసి  పోగొట్టుకున్నాడు .శుక్రవారం బజారు వెళ్ళినప్పుడు తెలిసిన కొట్టువాడు కొబ్బరిముక్క ప్రసాదంగా ఇస్తే ,ఇంకోకోట్లో ‘’ఉప్పు గల్లు’’అడిగి తీసుకొని ,పచ్చిమిరపకాయలు కనిపించగానే దానితో కొబ్బరీ ఉప్పూ కలిపి నోట్లో వేసుకొని రుచి ఆనందాన్ని పొందేవాడు .అప్పుడే ఆయనమనసు ఏకాగ్రమై గోప్పభావనతో ఇరవై ముప్ఫై పద్యాలు మనసులోనే రాసుకోనేవారు .ఇంటికి రాగానే గ్రంధస్తంమయ్యేవి  .ఆయన శరీరం లోని జీవుడు అంటీ ముట్టకుండా ఉంటాడా అన్నదానికి ఇదే సమాధానం అన్నారు శ్రీ పేరాల భారత శర్మ

ఆయనది ఆడంబరం లేని జప విధానం .రోజుకి కనీసం ఒక్కొక్క మంత్రాన్ని మూడు వేల సార్లు మూడు మంత్రాలు జపించేవారు .పగలు తక్కువ కాలం రాత్రి ఎక్కువకాలం జపం లోగడిపేవారు .రాత్రి సుమారు రెండుగంటలకు నిద్ర కు ఉపక్రమించి ఉదయం కొంచెం ఆలస్యంగా లేచేవారు .లేవగానే వ్యాయామం శీర్షాసనం ఆసనాలు ,పొట్ట అక్కళించటం  తప్పనిసరిగా చేసేవారు .మయూర ,హలాసన ,సర్వా౦గాసనాలు 75 ఏళ్ళ వయసులోనూ వేసేవారు .రాత్ర్తిపూట తలకింద దీపం పెట్టుకొని తెల్లవారేదాకా ఇంగ్లీష్ నవలలు చదివేవారని పేరాలవారి ఉవాచ .రాముడికి36ఏళ్ళ వయసులో సీతా వియోగం జరిగితే విశ్వనాధకూ అదేవయసులో భార్య వరలక్షమ్మగారు చనిపోయారు .విశ్వనాధ శరీరం నేలమీద ఒక మోటారు .ఆయన మనసు ఆకాశం  లో ఒక విమానం .గ్రంధ రచనలో ఆయన ధారణ అపారం,ఆశ్చర్యకరం .మాస్కో లోని తెలుగు అకాడెమీ అధ్యక్షురాలు వేయిపడగలను స్తుతించటం గురజాడ వారి పూర్ణమ్మను విశ్వనాధవారి కిన్నెర సానిని పొగడటంచేస్తే  కమ్యూ నిస్ట్ నాయకుడు ముక్కామల   నాగభూషణంగారు ముక్కు మీద వేలేసుకొన్నారు .

కైక రాముని సాధారణ మనిషిగా ఊహించినదుకు రాముడి మనసు చివుక్కుమన్నదట .దీన్ని విశ్వనాధ అద్భుత శిల్ప నైపుణ్యం తో చెప్పాడు .పాత్రను పాఠకుల హృదయంలో  చిర ప్రతిష్ట చేసి రసాస్వాదన కలిగించే నేర్పు తిక్కనగారిది మళ్ళీ విశ్వనాధది. ఊర్మిలా లక్ష్మణుల సంసార రహస్యం గురించి వాల్మీకి మౌనం వహిస్తే విశ్వనాధ ఆ మౌనానికి అద్భుత వ్యాఖ్యానం చేశాడు. వైదిక సంస్కృతీ ,సంప్రదాయం ,తాత్విక సిద్ధాంతాలను ఆధారంగా విశ్వనాధ కల్పనలు చేస్తాడు ‘’అనాసక్తి యోగం ‘’తో ఊర్మిళా  ,లక్ష్మణుల  సంసార యాత్ర సాగింది. ఊహ సంపత్తి ,కధాకధన శిల్పం ,వాల్మీకానికి బయటికారణం వీటికి  తోడుజీవుని వేదన మొదలైన వాటిని పరమేశ్వరార్పణంగా విశ్వనాధ పండించాడు అది ఆయన కవితా రూప తపస్సు .’’నన్ను కూల్చటానికే కాని సీతను అపహరించటానికి కాదు ‘’అన్నమారీచుని భావం లో యెంత అర్ధముందో గ్రహించాలి .మాయలేడి కధలో ఋషుల భావన ఆయా వ్యక్తుల ప్రభావాన్ని ప్రబోధింప జేసే అకార్య నిర్వహణం చేయగలిగింది అని విశ్వనాధ వ్యాఖ్యానం .మారీచునిలోను జీవుని వేదన చొప్పించాడు .విశ్వనాధ ఊహ మన పరిధిని దాటి ఉండటం ప్రత్యేకత . కిష్కింద కాండలో చేసిన రుతు వర్ణనలు  సీతా రాముల కదా తో ముడి పడి  ఉంటాయి .అరణ్యవాసం లో వారివి ‘’సాదు శృంగార లీలా ప్రసన్న గాధలే ‘’అన్నాడు .

విశ్వనాధ ‘’కధక చక్రవర్తి ‘’.ఆయనకున్నది మంచితనంపై పూర్తినమ్మకం .ప్రతిమనిషికి ‘’డ్రై వింగ్ ఫోర్స్ ‘’ఉంటుందిఅది ఉన్నత ఆశయాలకోసం పరుగు పెడుతుంది అన్వేషణ చేయిస్తుంది మనిషికిఉన్న ఆవేదన లో మానవత్వం ఉంటుంది అదే మనిషిని మంచివాడిని చేస్తుంది .సుగ్రీవుడిలాగా కొందరికి లక్ష్యం మరుగున పడుతుంది అప్పుడు మేల్కొలపటానికి హనుమ ,లక్ష్మణులు కావాలి .విశ్వనాధ ‘’అవిచ్చిన్న సంప్రదాయార్ది ‘’.ఆయన పాత్రలు మూసలో ఇమడవు .అల్పాక్షరాల్లో అనల్పార్ధ రచనకు ఉదాహరణ ‘’దుందుభి కద’’.సంధ్యాకాలం నుండి మళ్ళీ సంధ్యాకాలం వరకు జరిగిన సుందరకా0 డకద ఆయన ఒక’’ ఉపాసన’’గా భావించాడు .బాలకాండలో కనిపించిన మనస్సౌన్దర్యం మళ్ళీ సుందరకాండలో కనిపిస్తుంది .శృతి కాఠిన్యం లేని వార్తాకధనానికి ,ఆవేశం లేని సరళ భక్తి నివేదనకు విశ్వనాధ మధ్యాక్కరలు వాడాడు .హనుమ లంకలో సీతను వెతికేటప్పుడు మత్తకోకిల వృత్తాలలో రఘువంశ పురుషుల గొప్పతనాన్ని వర్ణించారు మహేంద్ర గిరి నుండి హనుమ దిగేటప్పుడు సముద్రాన్ని భుజంగ వృత్తం లో వర్ణించాడు .అలాగే సముద్ర వర్ణన కు ‘’అష్ట మూర్తి ‘’,వరాహ ;;వృత్తాలను ఎన్నుకొన్నాడు .రాముడు సముద్రునిపై కోపం తో బాణం ఎక్కు పెట్టినప్పుడు ‘’శాలూరం ‘’సముద్రుడి వేదనను ‘’దుర్మిల’’,సముద్రునిస్తిమితమనస్సును ;;కిరీటం ;;, సంతోషాన్ని ‘’హంసి ‘’వృత్తాలలో చెప్పాడు .నరేంద్ర వృత్తం కూడా ప్రయోగించాడు .బహువిధ ఛందస్సులతో సుందరాన్ని మరింత సుందరం చేశాడు .కల్ప వృక్షం మొదటినుంచి చివరిదాకా ‘’శ్రీరామ చంద్ర తేజస్సంక్రాంతి’’విజ్రుమ్భించింది .

విశ్వనాధ వర్ణనలు మహా విచిత్రాలు .ఆయనది ఆలోచనామృతం ‘’పురుగు తొలచిన దూలం నుండి పొడి రాలినట్లు సన్నని మంచు కురుస్తోంది ‘’అన్నాడు వేయిపడగలలో  ‘’,’’రస ఉపనిషత్ రహస్య వేత్త ‘’విశ్వనాధ .జ్ఞాత శిల్పి .’’విశ్వనాధ సాహిత్య విలసనం ఆంద్ర సాహితీ నందనోద్యానమున వేయి శరజ్జ్యోత్స్నాలు వెదజల్లిన సమయం .ఆయన సాహిత్య సృష్టి విచ్చిన నెమలి పించం లాగా తళ తళలాడుతూ కన్నులు మిరుమిట్లు గొల్పును ‘’అన్నమాట యదార్ధం .’’నాకు ఏదో ఒక రోజు చావు ఉంది ‘అని తెలుసుకొన్నవాడు విజ్ఞానియే ‘’అన్న వివేకానందుని మాట విశ్వనాధకు స్పూర్తి .మధ్యాక్కరలలో వ్యాజ స్తుతి ఎక్కువగానే చేశారు .నెత్తినెక్కి పిండికోడుతున్నావ్ వంటి  పలుకుబడులు విపరీతం .’’కాలికి వేస్తె వేలికేస్తావు ,పిచ్చి కుదిరింది పెళ్లి కుదరలేదు , .కాళ్ళను  బదడ్డపాము కరవక మానదు ,మొదలైనవెన్నో రాశాడు .’’నీకంటే పల్నాటి నూతులు నయం ,నీకు మూతి మొహం లేవు జనం యెట్లా చూడగలరు ?నిన్ను అయినకాడికి అమ్మేస్తాను అని విశ్వేశ్వరునే బెదిరించిన భక్త శిఖామణి విశ్వనాధ .ఆయన మధ్యాక్కరలు మధు బిందు సమానాలు .

‘’శృంగార వీధి ‘’ మైమరపిస్తుంది .ఈకావ్యం తోనే అయన లోఉన్న మహాకవిబీజాలు మొలకెత్త సాగాయి .దీనిలో శృంగారం భక్తీ పర్యవసానం  అయింది .లౌకిక భావాన్ని అలౌకిక సత్యం తోకలిపి ‘’గోపికా గీతలు ‘’రాశాడు .ప్రతి వృత్తం మీదా విశ్వనాధ ముద్ర ఉంటుంది .పద్యంలాగే మనోహర వచనమూ సాగుతుంది .కవితా సుందరి శరీరం శబ్దం .నడకలో ఒయ్యారం ఛందస్సు .శబ్దార్ధ చమత్కారాలే గతి విన్యాస శోభ .అదే శ్రోతల్ని ఆకర్షిస్తుంది ప్రాచీనతలేకపోతే నవీనతకు అర్ధం లేదు అన్నది విశ్వనాధ నమ్మకం .

‘’‘’ ఏకవీర ‘’నవల మధురలోని వైగై నదీతీరాన ప్రారంభమై అక్కడే అంతమవుతుంది. నదికూడా నవలలో ఒక పాత్ర .’’ధర్మం చెయ్యి ‘’ అనేది దీని ముఖ్య సంకేతం. భావ కవిత్వోద్యమకాలం లో వచ్చిన ఏకవీర లోని అమృతం పాత్ర వేయిపడగలు నవలలో పసరికగా రూపు దాల్చింది ‘’అన్నారు ప్రోలాప్రగాదవారు .’’ధర్మ రేఖను అతిక్రమిస్తే దారుణ మరణమే తప్ప నిష్కృతి లేదు ‘’అని చెప్పిన నవల ఇది . ‘’తెరచి రాజు ‘’లో పతాక సన్నివేశం ఏకవీర పతాక సన్నివేశం నుండి రూపు దిద్దుకోన్నది .నైతిక సూత్రాలపట్లా ,సాంప్రదాయ జీవన మార్గం పట్లా విశ్వనాధకున్న విశ్వాసం గౌరవం ప్రతిఫలించే నవలలలివి .’’కాళిదాస భావభూతుల శైలిని తిక్కన మార్గాన్ని ,టాగూర్ శరీర వాంచలేని ‘’నౌకభంగం ;;లోని ప్రేమను నా భావనా రచనా చమత్క్రుతినికలిపి ఏక వీర రాశాను ‘’అని విశ్వనాధ చెప్పుకొన్నాడు .

విశ్వనాధ తులసీదాసు ,సూరదాసు ,మైధిలీ శరణ గుప్త ,దినకర్ మహాదేవివర్మ కవితలు చదివాడు .ఆయన మాటలకున్న అర్ధాలను మూలాలలోకి వెళ్లి చెప్పగలరు. లావణ్యం అంటే లవణం అంటే ఉప్పుకుండే నిగనిగ అని అర్ధం చెప్పారు .శ్రీ ఆచంట సాంఖ్యాయన శర్మగారిని కలిశాడు ఒకసారి విశ్వనాధ ఈయన సత్తా ఏమిటో ఆయన ప్రశ్న పరంపరాలతో ఆయన తెలుసుకొని సన్మానం చేసి పంపారు .ఆయన టేబుల్ సొరుగులో ‘’భగవద్గీతా, ఈయన ఆంద్ర ప్రశస్తి ‘’పుస్తకాలు ఉండటం చూసి అవాక్కయ్యాడు విశ్వనాధ .’’ప్రేమను అణచుకోవటం మహా పురుషుల లక్షణం ‘’అని అప్పుడు గ్రహించాడు విశ్వనాధ.

రామ ధూర్జటుల తత్త్వం విశ్వనాధను ఆవహించి  కల్ప వృక్షం లో హనుమ కార్య శూరత్వానికి దారి చూపింది .రామకధను ‘’నాధ కద ‘’అన్నాడు   .కట్టు కధకాదు మోక్షకద .’’ఇష్టిఖండం ‘’తోప్రారంభమై ‘’ఉపసంహరణ ఖండం ‘’టో పూర్తయింది .ప్రతికా0డ ను అయిదు భాగాలుగా విభజించటం ఆయన ప్రత్యేకత .అది ప్రతీకాత్మకాంశం .షట్ చక్రాలకు ప్రతీక .అదొక మహామాలా మంత్రం .కైకేయీ తత్త్వం రామాయణ కల్ప వృక్ష శాఖలపై సుపుష్పితమైంది. ఆయన వాల్మీకానికి చేసిన వ్యాఖ్యానాలు కావ్యమార్గం ఆశ్రయించి వ్యంగ్య మర్యాదను పాటించాయి .ముని వేషం లోఉన్న రాముడు పూర్వం దశరధుని  బాణం చేత కొట్టబడ్డ ముని కుమారుడులాగా ఉన్నాడట .కార్యకారణ సంబంధాన్ని ఇక్కడ ధ్వనింప జేశాడు. సీత అశోక వనం లో అగ్నిలా ఉందనటం వైశ్వనాదీయం .రాముడు నడుస్తున్న రత్న దీపం అట .కల్ప వృక్షం అర్ధం చేసుకోవటానికి భావుకత్వం అత్యవసరం .’’కనకదుర్గమ్మ నవ్వులకు మల్లికార్జునుడికి పులకలు వచ్చాయట. ‘’శివుని మౌళి  పై నుంచి వెన్నెలలు కృష్ణపై నుంచి వచ్చే చల్లని గాలులు పూచిక ముల్లుల్లాగా స్వామిని పోడుస్తున్నాయట.మనోహరభావం .

‘’నాపాట ‘’లో ఆయన అల్లిన లలితగీతం దిగంతాలకు పోయి నిలవలేక ఉపసంహరించిన అస్త్రం లాగా మళ్ళీ తననే వరించింది అంటాడు .’’సంధ్యవార్చడు ,అధ్యయనం లేదు ,కర్మపై నమ్మకం లేదు ‘’ఇదీ నేటి బ్రాహ్మణ్యం స్తితి అని వాపోయాడాయన .ఒకడు ‘’నార్మా షెవర్ ‘’అనే హాలీవుడ్ నటికీ ఉత్తరం రాసి జవాబుకోసం రోజూ పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్నాడట .తనకు నోబుల్ ప్రైజ్ వస్తుందని దాన్ని ఏయర్ పోర్ట్ లేని తన వూళ్ళో విమానం లో తీసుకోస్తారని ఇంకోడు రోజూ ఆకాశం వైపు చూస్తున్నాడు అని చమత్కరిస్తాడు ‘’’విశ్వనాధ వాడిన భాష నవ్యం అది ఆయన సృష్టి .దాన్ని విశ్వనాధ శైలి అనాలి ‘’అని శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మగారు తరచుగా సభలలో చెప్పేవారట .

విశ్వనాధ ఉపన్యాస ధోరణి విలక్షణమైనది .అక్షర తూణీరం నుండి వ్రేలికి వచ్చే అస్త్ర పరంపరలాగా పాఠకుల హృదయాలలోకి చొచ్చుకుపోతాయి ఆయన మాటలు .’’నాచన సోమన ,కృష్ణ దేవ రాయలు ,తెనాలి రామ కృష్ణుడు-ఈ ముగ్గుర్ని కాచి వడగడితే అయిన వాడు విశ్వనాధ ‘’అన్నాడుశ్రీ కాటూరికవి  .’’సత్యనారాయణ భావయిత్రీ శక్తి ముందు రాయలదికూడా తీసికట్టే .ఆయన సోమన అంతటివాడు .ఒకడు నాచన సోమన అన్నట్లే ఒకడు విశ్వనాధ .

ఆధారం –శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ –‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం ‘’

గాంధీజయంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ కాలానికి తగిన నాటిక -తూర్పు -పడమర

ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే
నిన్న బుధవారం 30-9-15 రాత్రి 9-30 కుమీ కేంద్రం  నుండి ప్రసారమైన  డా .శ్రీ మాదిరాజు రామలింగేశ్వర రావు గారు రాసిన ”తూర్పు -పడమర ”నాటిక ఈ కాలపు ఆలోచనల కు అద్దం  పట్టింది .సర్వమ్ తెలిసిన జ్ఞాన వృద్దు శ్రీ రామలింగేశ్వర రాగారి సమగ్ర సదవగాహనకు రూపంగా నిల్చింది . బి టెక్ పాసై ఒక్క గానొ క్క కూతురు అమెరికా కు పై చదువులకు  తలిదండ్రులకు తెలియ కుండానే అప్ప్లై చేయటం సీటు రావటం ఆమెతో బాటే అప్ప్లై చేసి సీటు సాధించిన కూతురి తండ్రిద్వారా ఈ తండ్రికి విషయం తెలియటం ఇంటికొచ్చి ముగ్గురు మధన పడటం ఈ నాటి మధ్య తరగతి కుటుంబ స్తితిని సూచించింది పెళ్ళిచేసి పంపిస్తే బాధ్యత తీరిపోతుందని ,తెలిసినవాదికిస్తే ఇబ్బంది ఉండదని తలిదండ్రుల భావన అయితే స్వశక్తితో ఎదగాలని కూతురి ఆలోచన .ఇన్దులొ ఎవరిదీ తప్పుకాదు . చివరకు వారిలో వారే సమస్యను అన్నికోణాలలో ఆలోచించి  పరిష్కరించుకోవటం ,కొంత రాజీ పడటం బాగుంది .
  అలాగే అమెరికా లో ఉండే రెండు తెలుగు కుటుంబాల అంతర్మధనం ,అక్కడ ఆడపిల్ల పెరిగిపెద్దడైతే మనమాట వినదేమోనని ,ఇష్టం వచ్చినవాడిని ముక్కూ మొహం తెలియనివాడిని చేసుకొంటుం దేమో ననే  భయం తో ఇండియాకు వెళ్ళిపోదామన్న ఒక తండ్రి ,అది తప్పుడు అభిప్రాయమని వారించిన పక్వ బుద్ధిగల భార్య ,అదే సమయం లో కుటుంబాన్ని అదేకారణా లతో ఇండియా పంపించేసి ,అక్కడ పిల్లల అనారోగ్యం ఆ వాతావరణానికి ఇమడ లేకపోవటం గుర్తించి అది తప్పు అని తెలుసుకొన్న మరో తండ్రీ . ఇండియా అయినా అమెరికా అయినా మనిషి బుద్ధిలో పురుగు తోలిస్తే చేసేదేమీ లేదని ,అమెరికాలో డేటింగ్ సమస్య ఉంటె ఇండియాలో” మృగాళ్ళు ,,నిర్భయ ఉదంతాలు ”సర్వసామాన్యమని తెలుసుకోవటం మంచి ముగింపు . దేశం కాని దేశం లోనూ సహాయ సహకారాలు అందించే సహృదయులు ఉంటారని తెలుసుకోవటమూ   స్నేహ తలిదండ్రులకు అది ఊరట కలిగించి భార హృదయం తోనైనా చివరికి నిండుమనసుతో అమెరికా పంపటం ”ఆల్ ఈజ్ వెల్ దట్  ఎంద్స్ వెల్ ”గా నాటిక ముగించటం ”సీసండ్ రైటర్”  రావు గారికే చెల్లింది . సంభాషణలు  పదునుగా సందార్భానికి తగినట్లు ,పాత్రల మనోభావాల సూచికలుగా నిండుగా ఉన్నాయి అందరూ  సమర్ధంగా నటించి మెప్పించారు . దర్శకత్వ ప్రతిభ అడుగడుగునా కనిపించింది  మంచి  నాటిక ప్రసారం చేసినందుకు అభినందనలు .
          గాంధీ జయంతి శుభాకాంక్షలతో
-దుర్గా ప్రసాద్-1-10-15 -కాంప్-మల్లాపూర్ -హైదరాబాద్

—

 

Posted in రేడియో లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మెదక్ జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏ .రాములు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

మెదక్ జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏ .రాములు

510 –శ్రీ యామవరం రామ శాస్త్రి (19 ౦౦

మెదక్ జిల్లా కాకుమాను గ్రామం లో జన్మించిన శ్రీ రామ శాస్స్త్రి రామకృష్ణ పండితుని మనవడు ,.కుటుంబం లో అందరూ కవి పండితులే .కాకుమాను రామ శాస్త్రి గా ప్రసిద్ధులు .శ్రీ విఠల చంద్ర మౌళి వద్ద వేదాంతాన్ని ,పినతండ్రి కృష్ణ శాస్త్రి వద్ద సంస్కృత కవిత్వాన్ని అభ్యసించారు .దొంతి సంస్థాన విద్వాంసుడు వెంకట పౌన్దరీక యజ్వ దగ్గర కావ్య శాస్త్రాలు నేర్చారు .

పాతికేళ్ళ వయసులోనే(19 19 ) రామశాస్త్రి’’ చిత్ర కవిత్వానికి ‘’ఆకర్షితులయ్యారు .25 0 శ్లోకాలతో నాలుగు భాగాలుగా ,18 ఖండాలుగా ‘’గురు స్తుతి ‘’కావ్యం రాశారు .కాని మొదటిభాగం లో 88 శ్లోకాలు మాత్రమె తెలుగు అచ్చులో అచ్చు అయ్యాయి .మొదటిభాగం లో 5 ఖండాలున్నాయి అవి-ప్రణవాదిశ్లేష ఖండం ,బ్రహ్మాది శ్లేష ఖండం ,బృహస్పత్యాది శ్లేష ఖండం ,సంకీర్ణ శ్లేష ఖండం ,చిత్ర శ్లేష ఖండం .గురువు యొక్క గొప్పతనాన్ని శ్లేష ,యమక ,అనుప్రాస ,ఏకాక్షర ,ద్వ్యక్షర కవిత్వాలలో చెప్పారు .చిత్ర కవితకు గొప్ప ఉదాహరణగా ఈ కావ్యం ఈ ఇరవయ్యవ శతాబ్దం లో శాశ్వతంగా నిలిచింది .ఇన్ని రకాల శ్లేష లను ప్రయోగించటం వలన ‘’శ్లేష యమక చక్ర వర్తి ‘’బిరుదు పొందారు .కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం –

విష్ణువును గురువును శ్లేషలో వర్ణించే శ్లోకం –‘’పరతవ బుద్ధ్యా చ  ప్రవిస్టాన్-దసస్వ సుదర్శనాభ్యాం-స్వరస్తాన్ గురుః పుణ్య జనాన్ సుసత్వాన్ –కుర్వన్ స దామోదర తాముపైతి ‘’

మరోశ్లోకం లో గురువును స్త్రీని శ్లేష లో పోలుస్తూ చెప్పారు –‘’అభ్రా మధ్యా నయజ్నా త్య సమస్త నమితా సుహృత్ –ప్రాతివ్రత్య పరా పాతత్ –భామేవ హ్యక్రుతి ర్గురేః’’

ప్రశ్నోత్తర మాలి కి ఒక ఉదాహరణ –‘’కోపమాన్ విహీనః స్యాత్ ?(కోప మాన విహీనః స్యాత్ )

‘’సద్గురొఃకా మహాత్మా ?(సద్గురేః కా మహాత్మతా )

చిత్ర శ్లేష ఖండం నుంచి ఒక ఉదాహరణ –పామావాంశ్చ పరాజితః –సుసమితౌ కాపాలికా సన్మతా

విస్టఃకోపమాలా శ్యాస్చ పశుభౌ –లబ్ధ్వా విపద్వి జ్జనితం –కృత్వా తాపాప రాయ ణాన్శ్రిత జనాన్ సర్వోపకారీ మహా

పాపాత్మా పది తోశిరే పరహితత్వం త్వం భావాప్యామలః ‘’

ఇందులో’’ ప ‘’అక్షరం ఉన్నప్పుడు ఒక శబ్దం తీసేస్తే వేరొక శబ్దం వస్తాయి ప ఉంటె చెడు అర్ధం తీసేస్తే మంచి అర్ధం రావటం ఈ చిత్ర కవిత్వ లక్షణం .

ఈ విధంగాఇరవై వ శతాబ్ది లో  ద్వ్యర్ధి ,యమక కావ్యాలురాసిన కవులు  చాలా అరుదుగా మెదక్ జిల్లాలో ఉన్నారు

51 1-శ్రీ గౌరీ భట్ల రామ కృష్ణ శర్మ

మెదక్ జిల్లా తోగూటమండలం .వెంకట్రావు పేటకు చెందిన కృష్ణశర్మ గారు మహా పండితులు .అవదానాలలో  చేయి తిరిగినవారు .సికందరాబాద్ లోనిలాల్గుడి లో ఉన్న  తూములూరి శివ రామ కృష్ణ శర్మ మునిసిపల్ సంస్కృత విద్యాలయం విద్యార్ధి .అక్కడే మహా గురువులవద్ద  సిద్ధాంత కౌముది ,పంచ మహాకావ్యాలు అవధాన విద్యా నేర్చారు .ప్రసిద్ధ అవధానిగా పేరొందారు .సంస్కృతాంధ్రాలలో చాలా అవధానాలు చేసి సమర్ధతను చాటారు .’’కవి శార్దూల కిశోరం ‘’బిరుదును శ్రీ యాదగిరి గుట్ట దేవాలయం లో శ్రీ ఖండవల్లి నరసింహ శాస్త్రి ,శ్రీ మల్లాది దక్షిణా మూర్తి శాస్త్రి గారల సమక్షం లో అందుకొన్నారు .సంస్కృతం లో విస్తృత రచన చేశారు . ‘’సహ బాల మానస పూజ ‘’అనే 10 8 శ్లోకాల భారతం ను యమకం లో రాశారు .మచ్చుకి ఒకటి –

‘’విలాపనం  లపనం మామ మామిమాం –కలయ పాలయ పార్ధ కుటుంబినీం

స్వస్తితే స్తితోగ్రపరా భవత్ –నిస్త భారత భార వహ ప్రభో ‘’

51 2 –మహాత్మా అప్పల విశ్వనాధ శర్మ (19 ౩౦ -20 ౦౦ )

యశోదా ,నారాయణ బాబుల సుపుత్రులే విశ్వనాధ శర్మగారు .మెదక్ జిల్లా మార్కూర్ లోని  పాండు రంగాశ్రమం లో జన్మించారు .’’పాండురంగ సుప్రభాతం ‘’ను ద్రాక్షాపాకం లో రాశారు .’’రాదా కృష్ణ సంవాదం ‘’కూడా రచించారు –ఒక ఉదాహరణ శ్లోకం –

‘’నీతం నవ నవ నీతం నీతం నీతంచ కిం తేన –ఆతపాతా పితా భూమై మాధవ మాధావ మధావ

శ్రీ రసారామ ప్రహ్రుత్య శండ్యా స్వీకృతం యది పలాయనంతట్-మానసే మమ  నితాంత తమసే నంద నందన కిమహో నిలీయసే ‘’

51 3 –శ్రీ ఉమాపతి పద్మనాభ శర్మ (19 40

సిద్ధిపేట ప్రభుత్వ  జూనియర్ కాలేజి తెలుగు లెక్చరర్ అయిన పద్మనాభ శర్మగారు ‘’అద్వైత గీత ‘’సంస్కృత రచన చేశారు .తెలుగు వ్యాఖ్యానమూ రాసి ‘’దర్శన ‘’మాసపత్రికలో ప్రచురించారు .గురుకుల విద్యాభ్యాసం తర్వాత అద్వైత వేదాంతాన్ని నేర్చారు .

కరీం నగర్ ,మందని లలో సంస్కృత విద్వాంసులున్నారు కాని సంస్కృత రచనలు చేసినట్లు కనిపించదు .

51 4 –శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (19 35

ధర్మ పురి లో శ్రీ లక్ష్మీ నరసింహ సంస్క్రుతకళా శాల ఉంది .ఎందరో దీనిలో చదివి గొప్ప పండితులయ్యారు .రచనలూ చేశారు .వారిలో రాజన్న శాస్త్రిగారు ప్రధములు .’’శ్రీ ధర్మ పురి లక్ష్మీ నరసింహ సుప్రభాతం ‘’రాశారు .’’సుమనోంజలి ;;ణి ‘’వసుమతీ సుధాకరం ‘’అనే సంస్కృత నాటకాన్ని రచించారు .ఈ నాటకం ‘’కుటుంబ నియంత్రణ ‘’విషయం  పై రాసినది .

ఇక్కడే సంగన భట్ల వారున్నారు వారు కూడా సంస్కృత కావ్యాలు రాసినట్లు తెలుస్తోంది .శ్రీ సంగణ భట్ల నరసయ్యగారు ధర్మ పురి సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేసి చాలా గ్రంధాలు రచించారు

51 5 –శ్రీ మామిడి పల్లి సాంబయ్య (19 ౦౦-19 70)

వేములవాడకు చెందిన  సాంబయ్య గారు నూట ఎనిమిది శ్లోకాలతో ‘’వేములవాడ రాజ రాజేశ్వరి  శతకం ‘’రాశారు . ‘’సుప్రభాతం’’కూడా చేశారు దీని మకుటం ‘’లెంబాల వాటిక విభో తవ సుప్రభాతం ‘’

51 6 –శ్రీ త్రిగుళ్ళ శ్రీహరి శర్మ (19 50

శర్మగారు వేములవాడకు చెందినవారు .అక్కడిసంస్క్రుతకాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్నారు .సంస్క్రుతకావ్యాలు చాలా రాశారు .సంస్కృతం లో అవధానాలూ చేశారు .

51 7 –శ్రీ కోరుట్ల కృష్ణమాచార్య

కరీం నగర్ జిల్లా కోరుట్ల సంస్క్రుతకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయిన కృష్ణమాచార్య గారు మూడు సంస్కృత కావ్యాలు రచించారు . శ్రీ వైష్ణవ తత్వాన్ని వర్ణించే ‘’గురువంశ మహా కావ్యం [‘’,రాశారు .మెల్కోటే లో ఉన్న రామ ప్రియ దైవానికి బీబీ నాంచారి కి ఉన్న ప్రేమను వివాహాన్ని వర్ణిస్తూ ‘’సంపత్ కుమార సంభవం ‘’కావ్యం రాశారు .కాళిదాసు మేఘ సందేశానికి అనురూపంగా ‘’మనః సందేశం ‘’రాశారు .

51 8 –శ్రీ కొల్లేగల్ ఆర్ .సుబ్రహ్మణ్యం (19 29

కర్ణాటకలో కొల్లేగల్ అనే వ్హిన్న గ్రామానికి చెందినవారు .హైదరాబాద్ లో స్థిర పడ్డారు .ఆంధ్రప్రదేశ్ లో గొప్ప సంగీత విద్వాంసులుగా పేరుపొందారు . సంగీత విద్యను శ్రీ బాలక్కవాదివరద రాజ అయ్యంగార్ ,శ్రీ ఆర్ బాల కృష్ణ ల వద్ద నేర్చుకు న్నారు .శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలలో దీక్షగా ‘’ఉంచ వ్రుత్తి ‘’చేస్తూ భక్తిగా పాల్గొంటారు .అన్నిభాషలలో గొప్ప పాండిత్యమున్నవారు .సంస్కృత తెలుగు కన్నడ ,తమిళ  భాషల్లో ఎన్నో కృతులు రాశారు .హిందీ మలయాళం లలోనూ కొన్ని కృతులు చేశారు .మొత్తం మీద 45 0 కృతులు చేసిన ఘనత వీరిది .

ఇక్కడి తోఆంద్ర ,తెలంగాణా లలో స్వాతంత్ర్యానంతర గీర్వాణ కవుల గురించి రాయటం పూర్తీ అయింది .

మనవి –ఏదో సరదాగా మొదలు పెట్టిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’మొదటి భాగం లో 1 4 6 కవుల గురించి రాసి పుస్తకం గా తెచ్చిన విషయం మీకు తెలుసు .రెండవ భాగం ప్రారంభించి 1 4 7 నుంచి 4 0 0 వరకు అంటే 2 5 4 మంది సంస్కృతకవులను గూర్చి రాశాను .మూడవ భాగం లో 4 0 1 నుండి 5 1 8 వరకు అంటే 1 1 8 మంది స్వాతంత్ర్యానంతర గీర్వాణ కవులను పరిచయం చేశాను .అంటే సంస్కృత కవుల ను శ్రీ శంకరాచార్యులవారితో ప్రారంభించి,అన్ని రాష్ట్రాల ,అన్ని సమీప దేశాలలో,అన్నికాలాల్లో  ఉన్న కవులను ,  దాదాపు నిన్నటి మొన్నటి వరకు సంస్కృత రచనలు చేసిన వారందరి గురింఛి అంటే మొత్తం 5 1 8 కవుల గురించి  రాసిన అదృష్ట వంతుడిని .అది నా పూర్వజన్మ సుకృతం మా తలిదండ్రుల ,మా శ్రీ సువర్చలాన్జనేయ స్వాముల  సంపూర్ణ అనుగ్రహం ,సాహితీ బంధువుల తోడ్పాటు అని సవినయంగా మనవి చేస్తున్నాను .ఇంత విస్తృత రచన చేయగలనని నేను భావించలేదు .అన్ని ప్రక్రియలను ,అన్నికాలాల వారిని పరిచయం చేసినందుకు మహదానందంగా ఉంది .చదివి ప్రోత్సహించిన వారికి, నాకు కావలసిన విషయాలను గ్రంధ రూపం గా అందజేసిన సహ్రుదయులందరికి మరొక్క సారి వినయాంజలి ఘటిస్తున్నాను .,ఇప్పుడు రాసినది అంతా  సమగ్రం, సంపూర్ణం కాదని ,కేవలం ప్రాధమిక విషయాలేనని ,ఇంకావారిని గురించి రాయవలసింది ఎంతో ఉండవచ్చని , రాయవలసిన వారు ఇంకా ఉండిపోయి ఉండవచ్చు నని , సకృత్తుగా ఇంకెవరైనా మిగిలిపోతే  వారి విషయాలు తెలిస్తే వారిని గూర్చి కూడా రాయగలనని తెలియ జేస్తున్నాను . .ప్రస్తుతానికి ఇంతే .సెలవు –

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -౩1 -9-15 –కాంప్- మల్లాపూర్ -హైదరాబాద్

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొత్తలక్ష్యాలు ,క్రూర ఎండమావి

Inline image 1
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment