7-3-15 శనివారం ఉదయం తిరుపతిలో రాకేశ్ రిసెప్షన్ ,మధ్యాహ్నం మదనపల్లి లో శ్రీ రామినేని భాస్కరేంద్ర గారింట్లో మా కు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,గౌరవ సత్కారాలు -భాస్కర్ గారి ”సరస్వతీ మహల్ ”మరియు భార్య శ్రీదేవిగారి ”పూజా మందిరం ” సుందరకాండ పారాయణం ,ప్రతి అంగుళం లో ”శ్రీ షిర్డీ సాయి ”దివ్య దర్శనం ,సేకరించినభద్రపరచిన ”కళా నికేతనం ”దృశ్యమాలిక 

7-3-15 శనివారం ఉదయం తిరుపతిలో రాకేశ్ రిసెప్షన్ ,మధ్యాహ్నం  మదనపల్లి లో శ్రీ రామినేని భాస్కరేంద్ర గారింట్లో మా కు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,గౌరవ సత్కారాలు -భాస్కర్ గారి ”సరస్వతీ మహల్ ”మరియు భార్య శ్రీదేవిగారి ”పూజా మందిరం ” సుందరకాండ పారాయణం ,ప్రతి అంగుళం లో ”శ్రీ షిర్డీ సాయి ”దివ్య దర్శనం ,సేకరించినభద్రపరచిన  ”కళా నికేతనం ”దృశ్యమాలిక

Posted in నా డైరీ | Tagged | Leave a comment

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం -రాకేశ్ నిఖిల వివాహం ,బాచుపల్లి లో సత్యనారాయణ వ్రతం 10-3-15 మంగళ వారం ఉదయం రాత్రి చట్నీస్ రెస్టారెంట్ లో రిసెప్షన్ దృశ్యాలు 

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం -రాకేశ్ నిఖిల వివాహం ,బాచుపల్లి లో సత్యనారాయణ వ్రతం 10-3-15 మంగళ వారం ఉదయం రాత్రి చట్నీస్ రెస్టారెంట్ లో రిసెప్షన్ దృశ్యాలు

Posted in నా డైరీ | Tagged | Leave a comment

5-3-15 గురువారం రాత్రి శ్రీ చలపాక ప్రకాష్ గారింట్లో మేము మరియు 6-3-15 శుక్రవారం రాత్రి తిరుపతిలో రాకేశ్ వివాహ రిసెప్షన్ లో సంగీత ఝరి 

5-3-15 గురువారం రాత్రి శ్రీ చలపాక ప్రకాష్ గారింట్లో మేము మరియు 6-3-15 శుక్రవారం రాత్రి తిరుపతిలో రాకేశ్ వివాహ రిసెప్షన్ లో సంగీత ఝరి

Posted in నా డైరీ | Tagged | Leave a comment

9–3-15 , మా అక్కా బావల ఇంట్లో మేము ,వేదవల్లి గాయత్రిలతో మేము –

This gallery contains 36 photos.

More Galleries | Tagged | Leave a comment

9-3-15 సాయంత్రం హైదరాబాద్ , తమ్ముడు కృష్ణ మోహన్ ఇంట్లో

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మదనపల్లి లో 7-3-15 శనివారం శ్రీ రామినేని భాస్కరేంద్ర గారి కళ్యాణ మండపం ఇంటి ఎదురుగా ఒరిజినల్ తిరుమల నామాల కొండ ,హార్స్లీ హిల్స్ ,రిషీవాలీ తరిగొండలో వెంగమాంబ విగ్రహం నరసింహ స్వామి ,తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి 

మదనపల్లి లో 7-3-15 శనివారం శ్రీ రామినేని భాస్కరేంద్ర గారి కళ్యాణ మండపం ఇంటి ఎదురుగా ఒరిజినల్ తిరుమల నామాల కొండ ,హార్స్లీ హిల్స్ ,రిషీవాలీ  తరిగొండలో వెంగమాంబ విగ్రహం నరసింహ స్వామి ,తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఆహ్వానం

మార్చ్ 16 సోమవారం సా – Copy0001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్యన జీవితం – శీలా వీర్రాజు

silavi1 001 silavi2 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20-

10-ఫియోడర్ డాస్టో విస్కీ –2

సెమి పాలంట్ నిస్కి  లో మిలిటరీకవాతు చేస్తూ ఖాళీ సమయం లో రచనావ్యాసంగం కొన సాగించాడు .అప్పుడే ఒక పిల్లాడి తల్లి అయిన మేరియా డిమిత్రివాన ఇసఎవను ప్రేమించాడు .ఆమె భర్తను వదిలి రావటం కష్టమైంది .భర్త చనిపోయిన తర్వాత ఆమె వేరొకరిని  మనసిచ్చి మనవాడికి నిరాశ కలిగి౦చి౦ది .కాని ఆమె అంటే ఆరాధనమాత్రం తగ్గలేదు .ఆమెనే పెళ్లి చేసుకొని ఆమె కొత్త భర్తను, కొడుకును ,ఆమెను పోషించాడు . ప్రభుత్వం పూర్తిగా క్షమ ప్రసాదించి పీటర్స్ బర్గ్ లో మామూలు జేవితాన్ని గడపటానికి అంగీకరించిం ది.రష్యాలో సంస్కరణ ఉద్యమం ఊపులో ఉంది .సోదరుడు మైకేల్ తో కలిసి దాస్తోవిస్కి ‘’వ్రేమ్యా ‘’(టైం )మేగజైన్ ను నడిపాడు రెండు విలువైన పుస్తకాలు ‘’ది ఇన్ సల్టేడ్ అండ్ ఇంజూరేడ్ ‘’’’ది హౌస్ ఆఫ్ ది డెడ్ ‘’రాశాడు .రెండవ నవలను టాల్ స్టాయ్ బాగా మెచ్చాడు. ఇది ఆయన జైలు జీవితమే జీవిత పోరాటం లోనే జీవిస్తున్నాడు .ఆగిన సృజన ప్రవాహాన్ని కదిలించి వేగవంతం గా రాసేస్తున్నాడు .జర్మని ఫ్రాన్స్ ఇంగ్లాండ్ టూర్ చేశాడు .అక్కడి భౌతిక వ్యామోహం పై ఏవగింపు కలిగి ‘’వింటర్ నోట్స్ ఆన్ సమ్మర్ ఇంప్రె షన్స్ ‘’రాశాడు వాటిపై .మొదట్లో  ఆంక్షలు విధించినా తర్వాత వదిలేశారు అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది .

40 లో మూర్చ తీవ్రమైనది. జ్ఞాపక శక్తి క్షీణించింది .స్థలమార్పు అవసరమన్న డాక్టర్ సూచన పై విదేశీ యానం చేశాడు .పోలినా సుస్లోవా అనే పిల్లపై పారిస్ లో  వ్యామోహం లో పడ్డాడు .చేతిలో చిల్లిగవ్వ లేని స్తితిలో ఉన్నాడు .జాక్ పాట్ కొట్టి ఏదో లబ్దిపొందాలని జర్మన్  గాంబ్లింగ్ లో దిగాడు .గెలుపు ఓటమిల దోబూచులాటలో పడి అదే వ్యామోహమై తానూ ఎందుకిక్కడికి వచ్చాడో మర్చేపోయాడు .పారిస్ చేరాడు .ప్రేమించిన పోలినా లవర్ ఆమెను మోసం చేసి జంప్ జిలానీ .ఆమె పోషణ కూడా మీదేసుకొన్నాడు మన విశాల హృదయుడు .ఆమెతో వీస్ బెడేన్ వెళ్లి మళ్ళీ వీల్ ఆఫ్ ఫార్చూన్ లో కూరుకుపోయాడు . ఇంటిదగ్గర భార్యకు తీవ్ర అనారోగ్యం గా ఉందని తెలిసి రష్యా చేరాడు .భార్య కు పిచ్చెక్కి చనిపోయింది .కొంతకాలానికి తాను  అధికం గ ప్రేమించిన సోదరుడూ చనిపోయాడు మళ్ళీ డిప్రెషన్ లో పడ్డాడు. మైకేల్ చేసిన విపరీతామైన అప్పులు తీర్చాలనే సంకల్పం తో విపరీతంగా వేగం గా రాశాడు, గాంబ్లింగ్ ఆడాడు .ఉన్నదంతా ఊడ్చుకు పోయింది పోలినాడబ్బును కూడా క్షవరం చేశాడు .కాండిల్స్ కొనే స్తోమతకూడా లేక  రాత్రుళ్ళు  చదవటం రాయటం మానేశాడు .ఒక్క రూబుల్ అప్పుకోసం వీధుల వెంబడి మూడేసి రోజులు తిరిగిన సందర్భాలెన్నో ఉన్నాయి .

అదృష్టం ఒక్క సారిగా తలుపు తట్టింది ‘’ది గాంబ్లర్  ‘’’’క్రైం అండ్ పనిష్మెంట్ (నేరము శిక్ష)నవలలు రాయటానికి పబ్లిషర్ తో ఒప్పందం కుదుర్చుకొని గడువు లోపల పూర్తీ చేయటానికి అన్నా గ్రిగేరేవ్నా ‘’అనే స్టె గ్రాఫర్ ను పెట్టుకొని పూర్తీ చేసి చివరికి ఆమె ప్రేమబంధం లో చిక్కి పెళ్లి చేసుకొన్నాడు .నేరము శిక్ష గొప్ప విజయాన్ని సాధించింది కాసుల వర్షమే కురిపించింది.అప్పులవాళ్ళు మీద పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్ళారు.చిప్ప చేతిలో పట్టుకొని కొత్తభార్య తో రాష్యా వదిలి జెర్మని స్విట్జెర్లాండ్ ఇటలీలు తిరిగాడు .సుఖం ఆనందం పొందలేక పోయాడు .స్వంత ఇల్లు ఎర్పరచుకోవాలనే కోరిక కలిగింది .అందులో కూర్చుని హాయిగా స్వేచ్చగా రాసు కోవాలనుకొన్నాడు .రష్యా గాలి అ నీరే తనకు బలవర్ధకం అనుకొన్నాడు ఫిట్లు ,గాంబ్లింగు జోరైనాయి .శక్తి  క్షీణించి పోతోందని సృజన మందగించిందని బాధ పడ్డాడు .సరదా గా మొదలైన జూదం వ్యసనమై పీల్చి పిప్పి చేసింది .ఇడియట్ ,దిపోసేసింగ్ నవలలు రాస్తున్నాడు .జెనీవాలో భార్య గర్భవతి గా ఉన్నప్పుడు చేతిలో 5 ఫ్రాంకులు మాత్రమే ఉన్నాయి .మొదటి బిడ్డ మరణం రెండో బిడ్డ ద్రేస్దేన్ లో జననం .తన దీన స్తితిని తెలియ జేస్తూ స్నేహితునికి ‘’నా భార్య ఒక పిల్లాడిని పోషించాలి .నేను ఎందుకూ పనికి రాని వాడినైపోయాను . ఎప్పుడూ ఆకలి తో ఉంటున్న నేను ఏమి ఎలా రాయగలను .ఆకలి రాక్షసినన్ను కొరికి తినేస్తోంది .చదరంగం ఆడి డబ్బు సాధించటం తప్ప గత్యంతరం లేదు ‘’అని రాశాడు .

వేదనా బాధ దరిద్రం నిర్లక్ష్యం పెనవేసుకు పోయి అతనితో చదరంగం ఆడాయి .ఓడిపోయాడు అన్ని ఆటలలో .విముక్తి భావాలను గాలికి వదిలేశాడు . చాందసం పెరిగింది మతం నరనరానా పాకింది .గురూగారికి 50 ఏళ్ళకు మొకాలిలోని మెదడు అసలు స్థానానికి చేరి చేసిన తప్పులకు చెంపలేసుకొని పశ్చాత్తాపపడి జూదానికి గుడ్ బై చెప్పి మళ్ళీ రష్యాలో అడుగు పెట్టాడు .అప్పులాళ్ళు అతని రచనలకు అడ్డుపడలేదు .స్వేచ్చగా రాయనిచ్చారు .ఊపిరి తీసుకొని మహా రచనలని పించుకొన్న ‘’ది పోసేసేడ్ ‘’’’ది ఎటర్నల్ హస్బండ్ ‘’ది బ్రదర్స్ కర్మ జావ్ ‘’లను క్షణం తీరిక లేకుండా గాంబ్లింగ్ లో వృధా చేసుకొన్న కాలాన్ని సద్వినియోగం చేసుకొని తీక్షణం గా రాశాడు అధిక శ్రమ చేశాడు .చావు మీద పడిన వాడైపోయాడు అలసట తో .

60 మీద కొచ్చాయి .మూడు నెలల తర్వాత మృత్యువు కబళించింది .మనసులో అనుకొన్న పుస్తకాలు రాయటానికి ఇంక ఎక్కువకాలం బతికితే బాగుండును అనుకొన్నాడు .బ్రదర్స్ నవల చివరి భాగం రాస్తూ పెన్ను చేతిలోనుంచి జారిపడి దాస్తోవిస్కి 28-1-1881న మరణించాడు .రష్యా రచయితలూ చాదస్తం గా రాస్తారనే అపప్రధ లోకం లో ఉంది .కాని దాస్తోవిస్కి మనసుపెట్టి రాశాడని ,ప్రతివారితోను మాట్లాడినట్లు రచన చేశాడని మెచ్చుకొంటారు .అతని గొప్ప ఫాన్ అయిన వర్జీనియా ఉల్ఫ్ ‘’his novels are seething whirlpools ,gyrating sand storms ,water spouts which hiss and boil and suck us in .the y are composed purely and wholly of the stuff of the soul .The elements of the soul are seen not separately but streaked ,invoved ,inextricably confused ,a new panorama of the human mind is revealed ‘’అంటూ పరవశం తో చెప్పింది .ఆయన రచనలు పాపులు నేరస్తులు ,ఆత్మ పరాదీనులగురించే రాశాడు .ఒక కొత్త ప్రపంచాన్ని సృస్టించాడు .సెయింట్ అల్యోశా లాంటి పాత్రలు సృష్టించాడని సోమర్సెట్ మాం పొగిడాడు .ప్రపంచం లో జరిగే ప్రతినేరానికి మన బాధ్యతా ఉంది మన ప్రమేయం లేకపోయినా అనుభవించాల్సి వస్తోంది అంటాడు దాస్తోవిస్కి

కదా నవలా రచయితగా ,జర్నలిస్ట్ గా ఫిలాసఫర్ గా  గుర్తింపు పొందాడు .మత ఆధ్యాత్మిక వేదాంత విషయాలను గురించి రాశాడు .ఎపిగ్రామ్స్ కవితలూ రాశాడు .నవలలో జీవిత చరిత్రను జోడించాడు .తాను  ఫిలాసఫీలో బలహీనుడిని  అని చెప్పుకొన్నా డాస్తో విస్కీ రచనలలో ఫిలాసఫీయే ఎక్కువ గా కనిపిస్తుంది .రష్యన్ స్వర్ణ సాహిత్య యుగం లో టాల్ స్టాయ్ ,డాస్తో విస్కీ లే అధిక ప్రాచుర్యం పొందారు .ప్రఖాత గణిత విజ్ఞాన శాస్త్రజ్ఞుడు అయిన్ స్టీన్ అతన్ని ‘’గొప్ప మత రచయితఅని ‘’who explores the mystery of spiritual existence ‘’ అన్నాడు .ఆధునిక వచనానికి ఆద్యుడు దాస్తోవిస్కి అన్నాడు జేమ్స్ జాయిస్ ‘’.ఆతని రచనల్లో నమ్మేవి నమ్మలేనివీ ఉన్నా  చదువుతూ పోతే తను చెప్పినవన్నీ యదార్ధమే అనిపిస్తాయి’’అన్నాడు మరో అమెరికన్ లిజెండ్ హెమింగ్ వే .కాఫ్కా ‘’నాకు రక్త బంధువు దాస్తోవిస్కి ‘’అన్నాడు .ఫ్రాయిడ్ ‘’కర్మజారో నవల ఇంతకు  ముందెన్నడూ రాని మహత్తర నవల ‘’ అని పొంగిపోయాడు .సర్రియలిస్టూలు సింబాలిస్ట్ లు ఎక్సేన్శియలిస్ట్ లు  బీట్ సంగీతం వాళ్ళు తమకు ప్రేరణ దాస్తోవిస్కి అన్నారు

1956లో రష్యా ఆయన పేర పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది .ఆయన పేర మ్యూజియం ఏర్పరచారు .బుధ గ్రహం మీద ఒక క్రేటర్ కు ఆయన పేరు పెట్టారు .1991లో కనుగొన్న చిన్న గ్రహాన్ని ఆయన పేరుతొ పిలిచారు .ఆయన పేరుమీద ఎన్నో సంస్థలు ఎన్నో రకాల అవార్డులు అందజేస్తున్నాయి  .170ప్రపంచ భాషలలోకి ఆయన రచనలు అనువాదాలయ్యాయి .ఎన్నో సినిమాలు తీశారు .మొత్తం మీద పదిహేను  నవలలు నవలికలు రాశాడు .,రష్యా విప్లవం లో రెండు మూడు పేరాలు కుదించారు   .17చిన్నకధలు 5 అనువాదాలు చేశాడు .

సశేషం

 

మరో ప్రముఖ వ్యక్తీ తో మళ్ళీ కలుద్దాం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేటి నిజం పత్రిక లో – నా గురించి — ఆధ్యాత్మక సాహిత్యపు “గబ్బిట’ దుర్గ ప్రసాద్

03-04-2015_4

 

http://www.netinizam.com/default.aspxUntitled

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19

10-ఫియోడర్ డాస్టో విస్కీ –

జీవితం అంతా యుద్ధ రీతి పోరాటమే బాధలే ,అణచివేతలే,లోపలి పీడన బాహిర వేదన ,ఏదో సుదూర స్వప్నాల తీరాలు అందుకొనే ఆరాటం ఆవేదన పోరాటమే  డాస్తో విస్కీ అని పిలువబడే ఫియోడర్ మిఖైలోవిచ్  డాస్తో విస్కీ జీవితం .పగటికలలు .ఆకలల సాకారానికి ఆరాటం .భరించ లేని వేదన ,దాని సాఫల్యతకు నిరాశా పూరక పోరాటం .పుట్టిన నాటి నుండీ ఇదే తీరు .27 ఏళ్ళ వయసులో ఉరి శిక్ష ఆఖరి క్షణం లో రద్దు అయి మనకోసం బతికాడు .ప్రపంచ ప్రసిద్ధ నవలా రచయితగా మిగిలాడు .

30-10-1821మాస్కోలో మురికి చిన్న పబ్లిక్ హాస్పిటల్ లో తండ్రి స్టాఫ్ ఫిజీషియన్ గ ఉన్న చోట ఏడుగురుసంతానం లో ఒకడుగా పుట్టాడు .బాల్యం లో పేదరికం ,జబ్బులు ,అకస్మాత్తు చావుల వార్తలే ప్రతి రోజూ వినేవాడు .తండ్రి తాగుడుకు విపరీతం గా బానిసై ఉద్యోగాన్ని పోగొట్టుకొంటే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి కొద్దో గొప్పో సంపాదించి కుటుంబాన్ని పోషించాడు ఎనిమిదో ఏటనే దాస్తోవిస్కి కి దుఖం, దౌర్భాగ్యం అంటే ఏమిటో తెలిసింది .ఈ సమస్య బైబిల్ లోని నీతికద అతని జీవితాంతం గుర్తుండిపోయాయి .54 వ ఏట భార్యకు జాబు రాస్తూ ‘’బుక్ ఆఫ్ జాబ్ చదువుతున్నా .అది మళ్ళీ నాలో పాత దుఖం వేదన దుస్తితి జ్ఞప్తికి తెచ్చింది చదవటం ఆపేసి పుస్తకం పక్కన  పారేసి పచార్లు చేశా .నా కన్నీళ్లు ధారాపాతం గా కురుస్తూనే ఉన్నాయి బలవంతం గా ఆపుకోగాలిగాను ఈ పుస్తకమే మొట్ట మొదటి సారిగా నన్ను ఆకర్షించి పట్టేసుకోన్నది ‘’అని రాశాడు .

16 ఏట సోదరుడు మైఖేల్ తో బాటు సెయింట్ పీటర్స్ బర్గ్ లోని మిలిటరీ ఇంజినీరింగ్ స్కూల్ లో చేరాడు నాలుగేళ్ళు చదివాడు. రోజూ కవాతు భరించలేకపోయాడు .ఖాళీ దొరికినప్పుడల్లా దొరికినన పుస్తక౦ చదివాడు పుష్కిన్ కవిత్వం పైనా ,బాల్జాక్ వచన రచన రచన మీదా విపరీత మైన అభిమానమేర్పడింది .బాల్జాక్ రచన ‘’యుజినీ గ్రాన్ డేట్ ‘’ను అనువదించాడు .20 కి ఆర్మీలో   సెలెక్ట్ అయ్యాడు .కాని ఇంకో ఏడాది స్కూల్ లోనే చదివాడు  .తర్వాత రెండేళ్ళు మిలిటరీ ఇంజినీరింగ్ లో తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సి వచ్చి చేశాడు .ఇంతలో తండ్రి హత్యకు గురైనాడు .జాగ్రత్త లేకపోవటం వలన సంపాదించిన డబ్బంతా వృధాగా ఖర్చు చేసేశాడు .బాల్జాక్ ను చదవటం వలన ‘’రష్యన్ హ్యూమన్ కామెడి ‘’రాయాలని కలలు కనేవాడు .ఆరు నెలలు కస్టపడి రాసి ‘’పూర్ ఫోక్ ‘’మొదటి నవల పూర్తిచేసి ప్రచురించాడు ..

మొదటినవలె అయినా అది బాగా అందర్నీ ఆకర్షించి నేక్రసోవ్ అనే విమర్శకుడు గోగోల్ తో సమానంగా రాశాడని కీర్తి౦చి ‘’ఇంతకీ  నువ్వేమి రాశావో నీకైనా తెలుసా?’’అని ప్రశ్నించాడు  .ఈ విషయాన్ని 30 ఏళ్ళ తర్వాత గుర్తుకు తెచ్చుకొని దాస్తోవిస్కి ‘’నా జీవితం లో దీనిని మించిన  గొప్ప ఆనందం ఎప్పుడూ అనుభవించలేదు ‘’అని చెప్పుకొన్నాడు  .పూర్ ఫోక్ లో లో పాత్రలన్నీ ఉత్తరాలద్వారా విషయాలను ఆకలితో అలమటిస్తూ ,కొంచెం పాలు  చిన్న రొట్టెముక్క తింటూ బతుకుతూ  తెలియ జేస్తాయి .ఈ నవల  ఇన్ స్టంట్ట్ సక్సెస్ సాధించటం తో రచయితగా పేరొచ్చింది .అధోజగత్ సహోదరుల జీవితాలే అతని కదా వస్తువులైనాయి .27 వయసులో మెలో డ్రామా జోడించి విషాదపాత్రలతో రెండోనవల మొదలుపెట్టాడు .కొన్నేళ్ళతర్వాత యువ రాడికల్స్ తో పరిచయమేర్పడి ఫోరియర్ రచనలు చదివి సోషలిజం గూర్చి వాళ్ళతో చర్చించాడు .1848 రష్యా విప్లవ కాలం లో ఇలాంటి చర్చలు దేశ ద్రోహ నేరం .దాస్తోవిస్కి తో పాటు అతని స్నేహితులను కూడా అరెస్ట్ చేసి పీటర్ అండ్ పాల్ ఫోర్ట్రెస్ లో బంధించి విచారించారు .ఉరి శిక్ష ఖాయం చేశారు .వద్య స్థలానికి ఒకరోక్కరినే తీసుకోనివేడుతున్నారు .శిక్ష ను చదివి వినిపించి ఒక్కొక్కరినే ఉరి తీస్తున్నారు .అందరిలో నిరాశా నిస్పృహా నిర్వేదం నిండి ఉన్నాయి .ఉరి తీయబదేవారి వరుసలో ఆరో వాడు దాస్తోవిస్కి .కళ్ళు మూసుకొన్నాడు .ఆ సంఘటన గురించి తరవాత రాస్తూ ‘’ఒక్క నిమిషమే నాకు బతికే కాలం మిగిలి ఉంది .ఒక తెల్ల గుడ్డముఖం పై కప్పారు .సైనికులు వెనక్కి వెళ్లి నిలబడ్డారు .ఇంతలో జార్ చక్రవర్తి మా అందరికి ప్రాణ భిక్ష పెట్టినట్లు వార్త చదివారు ‘’.ఉరి శిక్ష నాలుగేళ్ల సైబీరియా  కఠిన జైలు శిక్షగా మార్చారు .ఇది ఒక వ్యక్తీ జీవితం లో అత్యంత ఉత్కంఠ భరిత సన్నివేశం .ఊహించలేనిది రానిది. అలా  మృత్యు ముఖం  నుండి డాస్తో విస్కీ బయటపడి ప్రపంచ ప్రఖ్యాత రచయిత అయ్యాడు  .మనసులో పడిన ఈ మచ్చ జీవితాంతం మరచిపోలేదు ..

ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో సైబీరియా లో శిక్ష అనుభవించాడు .38 వయసులో మళ్ళీ సెయింట్ పీటర్స్ బర్గ్ చేరాడు సృజన జీవితం లో మూడవ వంతు ప్రవాసిగా గడిపిన దురదృష్ట వంతుడు దాస్తోవిస్కి .కోటార్గా,ఓంస్ నేర బందికానాలలో ఉండగా రాళ్ళు పగల కొట్టించారు ,రాళ్ళు  మోయించారు .ఏ పుస్తకమూ చదవ నివ్వలేదు ఒక్క అక్షరం కూడా రాయనివ్వలేదు .ఒక్క బైబిల్ చదవటానికి మాత్రమే పర్మిషన్ ఉండేది .ఆ దుర్భర నరక వేదన గురించి ఆయన మాటల్లోనే తెలుసుకొందాం ‘’eternally in chains ,eternally under guard,eternally behind bolts and bars and never alone !Total suppression of the mind –that was life in the fortress ‘’ఎన్నో భావాలు వచ్చేవి ఆవన్నీ వాహిక లేక ఇంకిపోయేవి .ఏదేదో రాయాలనిపించేది కాని రాయటానికి పేపర్ కూడా నిషేధమే .ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని మూర్చ రోగం వచ్చింది .

జైలు నుంచి విడుదల చేశారుకాని సైబీరియన్ టౌన్ సెమి పాలటిన్ స్క్ కు చేరాడు .కొంత ఆరోగ్యం కుదిరింది .నాలుగేళ్ళు జన జీవితానికి దూరమై ఉన్నాడు బైబిల్ ఒక్కటే అతనికి ఊరట గా ఉండి దైవానికి దగ్గర చేసింది .రాడికల్ భావాలు మార్చుకొన్నాడు .ఆస్నేహితులకు దూరమైపోయాడు. ఆలోచనా విధానం లో పెద్ద మార్పు వచ్చింది .ప్రపంచాన్ని సోషలిజం ద్వారా ఉద్ధరిద్దామన్న భావన తొలగి పోయి౦దిమనసునుండి .మతానికి చేరువైపోయాడు .ప్రజలు నమ్మారుకనుక తానూ నమ్మాను  అని చెప్పాడు .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -92 చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక

నా దారి తీరు -92

చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక

సాధారణం గా అప్ లాండ్ అనబడే పశ్చిమ కృష్ణాలో పని చేసే మేస్టార్లు ఉద్యోగులు శనివారం నాడు ఒక గంటా అరగంటా ముందే స్వంత ఊళ్లకు వెళ్ళటానికి హెడ్ మాస్తారినో పై అధికారినో పర్మిషన్ అడిగి లేక రాత పూర్వకం గా కాగితం రాసిచ్చి సిద్ధమై లాస్ట్ పీరియడ్ లో ‘’చెక్కేస్తారు ‘’నేనూ అందుకు మినహాయింపు కాదు .గండ్రాయిలో ఉండగా మరీ .మా హెడ్ గారు మా కంటే ఆయనే తొందర పెట్టి ‘’మేస్టారూ !మీరు చాలా దూరం వెళ్ళాలి కదా .చివరిపీరియడ్ లోక్లాసులుంటే ఎవరికో ఒకరికి అడ్జస్ట్ చేస్తా .మీరు వెళ్ళిరండి ‘’అనే వారు అది బాగా అడ్వాంటేజ్ గా తీసుకొని వాడుకోన్నాము నేనూ అక్కడి డ్రాయింగ్ ప్రసాద్ .ఇప్పుడు నేను హెడ్ మాస్టార్ని కదా వత్సవాయిలో .వెళ్ళే టీచర్లకు పర్మిషన్ ఇచ్చి పంపేవాడిని.వాళ్లకు చివరిపిరియాద్ క్లాసులుంటే నేనో లేక ఇంకెవరో తీసుకొనే వాళ్ళం. ఈ వెళ్ళే బాచ్ లో క్రాఫ్ట్ వెంకటేశ్వర రావు ,నేనే ఉండేవాళ్ళం  .అక్కడ నాలుగున్నర దాకా ఉండి బయల్దేరితే ఉయ్యూరు అంచలంచెల మీద చేరే సరికి రాత్రి ఎనిమిది దాటేది అందుకని మూడుమ్ముప్పావు కే బయల్దేరేవాళ్ళం .ఇంచార్జ్ కి స్కూల్ అప్పగించి వెళ్ళేవాడిని .అదీ మొత్తం మీద చాలా కొద్ది సార్లే వాడుకొన్నాను .లారీలమీడా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ,చిన్నకార్లలో ఏది దొరికితే వాటిలో ప్రయాణం చేయాల్సి వచ్చేది .కన్నెవీడు హైస్కూల్ కు వెళ్లి వాలీబాల్ బాద్ మింటన్ ఫ్రెండ్లీ మాచేస్ ఆడి వచ్చేవాళ్ళం అక్కడిహేడ్ మాస్టారు కపిలేశ్వర పురం లో పని చేసిన చలపతిరావుగారే మంచివాడు నిదానస్తుడు

ఒక శనివారం క్రాఫ్ట్ మేష్టారు నేనూ చివరి పిరియడ్ లో చేక్కేసే ఏర్పాటులో ఉన్నాం .ఇంతలో  డి ఇ వొ గారు అకస్మాత్తుగా స్కూల్ విజిట్ కు వచ్చారు .గుండేలాగిపోయాయి .గబగబా ఆయనకు స్వాగతం చెప్పి ,అడిగిన రికార్డ్ లన్నీ చూపించాము .అంతాపర్ఫెక్ట్ గా ఉందని సంతోషించి సంతృప్తి చెందారు .ప్రతిక్లాసుకూ తీసుకొని వెళ్లి చూపించాను .అన్నీ బాగా అబ్సర్వ్ చేశారు .స్కూల్ పెర్ఫెక్ట్ లైన్ లోనే నడుస్తోంది అనే ఇంప్రెషన్ వచ్చింది ఆయనకు .మంచి రిమార్క్ విజిట్ బుక్ లో రాసి వెళ్ళారు .ఆయన వెళ్ళేదాకా లాంగ్ బెల్ కొట్టలేదు అయిదింటి దాకా ఉండి వెళ్ళారు అప్పుడు బెల్ కొట్టి పిల్లల్ని పంపాము .చివరి పీరియడ్ కు పది నిమిషాలముందు ప్రతి రోజూలాగే అసెంబ్లీ ఏర్పాటు చేసి ఆయనతో మాట్లాడించి జనగణమన పాడించి పంపాము .మేము ముందే వెళ్లి ఉంటె మా పరిస్తితి ఏమిటో భగవంతుడికే ఎరిక ఇలా మొదటి  హేడ్మాస్టారి అనుభవం రుచి చూశాను .దేవుడు నా యెడల ఉన్నాడనిపించింది లేకపోతె అభాసుపాలయ్యేవాడిని .

పిఆర్.సి-కొత్త స్కేళ్ళలో ఫిక్సేషన్లు

నేను వత్సవాయి హెడ్ మాస్టారుగా ఉండగానే కొత్త వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలులోకి వచ్చాయి .అందరికి ఆప్షన్లు కోరుకోవటం దానిప్రకారం స్కెల్ లో ఫిక్సేషన్ చేయటం బకాయీలను తయారు చేయటం చాలా పెద్దపనే .మా గుమాస్తా లగడపాటి కృష్ణ మూర్తి బాగా సర్వీస్ ఉన్నవాడేకాని ఎందుకో ఫిక్సేషన్ చేయటానికి కొంత జంకాడు .దాన్ని పోగొట్టటానికి నేనూ ఆయన గండ్రాయి వెళ్లాం. అక్కడ హేడ్మాస్టార్ శ్రీ పి వి సుబ్రహ్మణ్యం గారికి ఇవన్నీ నల్లేరుపై బండినడక.ఆయన దగ్గర కూర్చుని విధానం అంతా ఇద్దరం తెలుసుకొన్నాం .అప్పుడు కృష్ణమూర్తి ‘’సార్ –ఇంతేనా అయితే ఇంక ఎవరి సహాయం సలహా మనకు వద్దు మనమే చేసేద్దాం ‘’అన్నాడు తిరిగి వత్సవాయి వచ్చి అందరి ఫిక్సేషన్లు పూర్తీ చేసి జిల్లాపరిషత్  కు పంపం వెంటనే సాంక్షన్ అయి వచ్చాయి ఎరియర్ లు కూడా బాగా ముట్టాయి .ఇందులో కొంత వసూలు చేసి జిల్లాపరిషత్ గుమాస్తాలకు ‘,ఆడిట్ వాళ్లకు’’ ఆమ్యామ్యా’’ సమర్పించాలి మేమూ అలానే చేశాం .’’భూత తృప్తి’’ అన్నమాట .నాఫిక్సేషన్ గండ్రాయిలోనే హెడ్ మాస్టారు చేసి పంపారు .మేము ఇక్కడ నాన్ ద్రాయల్ సర్టిఫికేట్ రాసి జిల్లా పరిషద్ కు పంపి సాంక్షన్ చేయిన్చుకోన్నాం .నాకు అనుకోకుండా ఒక స్టేజ్ బెనిఫిట్ వచ్చి జీతం బాగా పెరిగింది .

హాఫ్ పే లీవ్ –బదిలీ

ఉయ్యూరులో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పనులకు గాను రెండు సార్లు హాఫ్ పే లీవ్ పెట్టాను. హెడ్ మాస్టారి లీవ్ జిల్లా పరిషత్ పి ఇ వొ గారు సాంక్షన్ చేయాలి .15-6-88నుండి 26-6-88 వరకు సెలవుపెట్టాను మొదటిసారి .ఆలయ పునః ప్రతిష్ట చేశాము .ఇక గండ్రాయి లో ఉండాలని పించలేదు ఇదివరకే రాసినట్లు లాంగ్ లీవ్ పెట్టి ప్రయత్నం చేయాలి అందుకని 5-8-88 నుండి 34 రోజులు 7-9-88 వరకు లీవ్ పెట్టాను .జిల్లా పరిషద్ చైర్మన్ ను వీలైనప్పుడల్లా కలుస్తూనే ఉన్నాను .వత్సవాయి లో అన్ని పోస్ట్ లను నేను చైర్మన్ కోటేశ్వర రావు గారి దృష్టికి తీసుకొని వెళ్లి భర్తీ చేయించాను ఇది ఒక రికార్డ్ .ఎవరూ పట్టించుకోని స్కూల్ ను నేను పట్టించుకోని నేను వచ్చేనాటికి ఒక్క ఖాళీ కూడా లేకుండా ఫిలప్ చేయి౦చ గాలిగాను. నా గొప్పతనం కంటే చైర్మన్ కోటేశ్వర రావు గారి చొరవ బాగా కలిసొచ్చింది .’’మేస్టారూ !మీరక్కడ ఉండాలని లేదంటూనే పోస్ట్ భర్తీ గురించి మీకెందుకు అంట ఆరాటం ?’’అన్నారొకసారి అప్పుడు నేను ‘’సార్ ! అసలే దూరపు ప్రాంతం మన ప్రాంతం నుండి వెళ్ళిన వాళ్ళు అక్కడెవరూ ఉండటం లేదు .పోస్టులు ఉంటె ఉండాలన్న తపన ఉంటుంది ‘’అంటే నవ్వి అన్నీ భర్తీ చేశారు అదినాకు గొప్ప సంతృప్తి నిచ్చింది .

స్పాట్ వాల్యు ఏషన్ కు బందర్ వేస్తె హాయిగా ఉయ్యూరు నుండి వెళ్లి వచ్చేవాడిని .అప్పుడు ఆఫీసులోచైర్మన్  గారుంటే కలిసి అర్జీ ఇచ్చి బదిలీ కోరేవాడిని. ఒక సారి నేనూ అడ్డాడ హెడ్మాస్టారు శ్రీ వై .దేవేంద్ర రావు పెదముత్తేవి హెడ్ శ్రీ కోసూరి ఆదినారాయణ జమ్మవరం హెచ్ ఏం శ్రీ పి ఆంజనేయ శాస్త్రి ,మొదలైన వాళ్ళం చైర్మన్ గారిని కలిశాం నేను నా ట్రాన్స్ ఫర్ సంగతి చెప్పా . ఎక్కడా ఖాళీలు లేవు .మంగళాపురం ఖాళీ అవుతోంది అక్కడికి వెయ్యమంటే వేస్తానన్నారు .సరే దూరం తగ్గుతుంది కదా అని ఓకే చెప్పి గుమాస్తా శేషగిరి రాకు తెలియ జేసి ‘’చేపాల్సింది ‘’చేపి లాంగ్ లీవ్ 13-7-89-1-9-89 వరకు 51 రోజులు పెట్టా .అప్పుడు పి ఇ వొ పరమ హం(హిం)స గారు .పైకి స్ట్రిక్ట్ ,లోన లొటారం .నన్ను చల్లపల్లి దగ్గర మంగళాపురం .హైస్కూల్ కు అక్కడి హెడ్మాస్టారు శ్రీ జోశ్యులు గారు రిటైర్ అయితే అందులో వేశారు .పెనం మీదనుంచి పొయ్యిలోకి కాకపోయినా పొయ్యి రాళ్ళమీద పడినట్లయింది నా పరిస్తితి .ఆర్డర్ వచ్చేదాకా ఎవరికీ చెప్పలేదు .బందరు వెళ్లి తీసుకొని మంగళాపురం హైస్కూల్ లో చేరాను ఈ రికార్డ్ అంతా సర్వీస్ రిజిస్టర్ లో జిల్లాపరిషత్ మెయింటేన్ చేస్తుంది .అందులో నేను వత్సవాయిలో రిలీవ్ అయిన తేది మంగళాపురం లో చేరిన తేదీ వాళ్ళే నమోదు చేస్తారు. నాదగ్గర ఆ వివరాలు లేవు .గుర్తుకూడాలేదు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-2-15- ఉయ్యూరు

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -1

అమెరికాలో న్యు హాంప్ షైర్ లో బౌ అనే చోట 16-7-1821 న జన్మించిన మేరీ బేకర్ ఎడ్డీ జీవితం పై ఎన్నో అభూతకల్పనలు అసంబద్ధ రాతలు వచ్చాయి .అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొని తాను నమ్మినదానినే చెప్పి ,రాసి ,ముందుకు సాగిన జీవితం ఆమెది .సత్యాన్వేషణలో మూలాలను  తరచిన సూక్ష్మ బుద్ధి ఆమెది .మార్క్ ట్వేన్ ఆమె పై ఒక పెద్ద పుస్తకమే రాశాడు .ఆమె రాసిన క్రిస్టియన్ సైన్స్ ను హంబగ్ అని ఈసడించి రెచ్చిపోయి రాసిన వారూ ఉన్నారు .నిరు పేద జీవితం గడిపి కానీకి ఠికాణా లేని స్తితిలోంచి ,కోట్లకు పడగలెత్తిన   ఐశ్వర్య  సంపన్నురాలైంది .అదీ క్రిస్టియన్ సైన్స్ అనే వినూత్నవిధానం తో .ఆధునిక ప్రపంచ నిర్మాతలలో తానూ ఒకరి చరిత్ర సృష్టించింది .

ఈమె పూర్వీకులు స్కాట్ లాండ్ ,ఇంగ్లాండ్ దేశీయులు .తల్లి విద్యావంతురాలు .రుజు ప్రవర్తన ఉన్న మహిళ.మగవారి తో సమానం గా కస్టపడి పని చేసే ఓర్పూ నేర్పూ ఉండేది తల్లికి .తండ్రి చాలా పవిత్రుడైన  కాన్గ్రిగేషనలిస్ట్ .అంటే వ్యక్తిగత శుద్ధత  ద్వారానే ఉన్నత స్తితిని ,దైవ సాన్నిధ్యాన్ని పొందవచ్చు అనే మెథడిస్ట్ పద్ధతికి దగ్గర భావాలున్న వాడు .మత ధర్మాలను చాలా నిద్ధతతో పాటించేవాడు .

మేరీ చిన్నతనం నుంచి ఏదో ఒక జబ్బుతో బాధపడేది .మూర్చలు వచ్చేవి అకస్మాత్తుగా .తీవ్ర స్వభావం ఉండటం వలన ఈ ఫిట్స్ ఆమెకు ఒక శాపమే అయింది .బాల్యం నుండి మత విషయాలలో చురుకుగా ఉండేది .’’ఎవరో నన్ను పేరు పెట్టి మూడు సార్లు పిలిచినట్లుఅంతరాత్మలో  అనిపించింది ‘’అని తన అనుభవాన్ని రికార్డ్ చేసింది .తనను ‘’జోన్ ఆఫ్ ఆర్క్’’ గా భావించుకొనేది .ఆమెతో బంధుత్వం ఉన్నట్లు ఊహించుకోనేది .పన్నెండవ ఏట నే బాల యేసు లాగా తానూ చర్చి పెద్దలతో వాదించానని  చెప్పుకొనేది .కాని యవ్వనం వచ్చేసరికి వీటికి విరుద్ధం గా ఆమె సంచరించింది .

పిల్ల ఆరోగ్యం కోసం తండ్రి కుటుంబాన్ని ఈ నాడు సాన్ బారంటన్ బ్రిడ్జ్  అని పిలువబడే టిల్టాన్ కు మార్చాడు .మేరీ ఆరోగ్యం కొంత మెరుగైంది .తానూ ఒకకవిని అని ఊహించుకొని ఏకాంతం లో కవిత్వం రాసేది .అందులో మంత్రాలనూ కలిపి రాసేది .19 వ ఏట సోదరుడు ఆల్బర్ట్ చనిపోవటం తో డిప్రెషన్ కు లోనైంది .రెండేళ్ళ తర్వాత ఆల్బర్ట్ స్నేహితుడు అయిన ఒక తాపీ పని వాడిని పెళ్లి చేసుకొన్నది .భర్త స్టోన్ మేసన్ గా వ్యాపారమూ చేసేవాడు .సౌత్ కరోలినలోని చార్లేస్టన్ కు నవ వధువును తీసుకొని వెళ్లి కాపురం పెట్టాడు  .అతనితో ఎన్నో సార్లు బిజినెస్ ట్రిప్ లలో పాల్గొనేది .భర్తకు ఎల్లో ఫీవర్ వచ్చి అకస్మాత్తుగా చనిపోయాడు .చేతిలో పెన్నీ కూడా లేని గర్భ దరిద్రం లో అప్పుడు మేరీ ఉంది .పుట్టింటికి చేరి ఒక కొడుకును కని తండ్రిపేరు పెట్టుకొన్నది .

చిన్నతనం లోనే గర్భం దాల్చటం వలన పిల్లాడు పుట్టే లోపే ఆమె ఆరోగ్యం మరీ క్షీణించి ఇక బతకదేమో ననిపించింది .అందువల్ల పసిపిల్లాడిని సాకే పని కూడా చేయలేక పోయేది .నరాల బలహీనత ఆమె ఆరోగ్యాన్ని తరచుగా దెబ్బ తీసేది .కుటుంబ సభ్యుల తోడ్పాటు తో ,ఆసరా తో ఆమె బతికింది .ఇలాంటి స్తితిలోకూడా కవిత్వం రాసి౦దివీలైనప్పుడల్లా .పిల్లాడిని పెంచలేననే అధైర్యం  ఆమెను కమ్ముకొంటే  విలేజ్ బ్లాక్ స్మిత్ భార్య చేతిలో కుర్రాడి సంరక్షణ బాధ్యత పెట్టింది .ఇరవై ఏళ్ళకు తల్లి చనిపోయింది .తండ్రి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .తండ్రి ఇంట ఇప్పుడుకూడా ఒంటరి జీవి అయిపోయి౦ ది .మగ వారి విషయం లో ఆమె చాలా దురదృష్ట వంతురాలు .బార్లేట్ అనే అతన్ని ప్రేమిస్తే ,అతను కాలిఫోర్నియా కు వెళ్లి చనిపోయాడు .ఆ దుఖమూ కుంగ దీసింది .కొడుకును మారుటి తండ్రి దూర ప్రాచ్యానికి తీసుకెళ్ళిపోయి దూరం చేశాడు పుత్రప్రేమకు .కొడుకు తనకే దక్కాలన్న అరాటమూ ఆమెలో లేదు .కారణం తన పొట్టనే తాను  పోషించుకోలేని దైన్యమే .కొడుక్కి 35 ఏళ్ళు వచ్చి  భార్యా ఇద్దరు పిల్లలతో ఉన్నాడని తెలిసి ‘’మదర్స్ డార్లింగ్ ‘’అనే కవిత రాసింది .’’Thy smile through tears ,as sunshine over the sea –Awoke new beauty in the surge;s roll –Oh !life is dead ,bereft of all,with theee –Star of my earthly hope,babe of my soul ‘’అని తన ఆవేదనను వెళ్ళ గక్కింది .

ముప్ఫైలలో  మళ్ళీ వివాహ సన్నాహాలలో పడింది .డేనియల్ పాటర్సన్ అనే డెంటిస్ట్ ను పెళ్లి చేసుకొన్నది .ఆమె అనారోగ్యం గురించి అతనికి పూర్తిగా తెలుసు ,కానీ అతని అభిరుచులు వేరు .జీవన వైవిధ్యాన్ని ఆమె కోరుకోలేక పోయింది .అతని పాశవిక చేష్టలకు తట్టుకోలేక పోయింది .వైట్ మౌ౦టే న్స్ దగ్గరున్న నార్త్ గ్రాటన్ లో ఉన్నారిద్దరూ .అక్కడా ఒంటరిదైపోయి౦దిమళ్ళీ .నిరంతరం సంచార వైద్యం లో ఉండే ఆతను ఇంటిదగ్గర భార్యను వదిలేసి వెళ్ళిపోయేవాడు .ఆమె ఇతరులేవరితోనూ స్నేహం చేసేదికాదు

నలభై వ ఏట .పోర్ట్ లాండ్ లోని మైమ్ లో ఫినియాస్ పి.క్విమ్బి అనే ఆయన మెస్మరిజం తో వ్యాధులు నయం చేస్తున్నాడని విన్నది .ఆయనే తన వ్యాధికి దిక్కు అని నమ్మి అక్కడికి చేరింది. మొదటి సెషన్ లోనే క్విమ్బి- మేరీ శారీరక ఆరోగ్యాన్నేకాదు  మానసిక ఆరోగ్యాన్నీ బాగు చేశాడు .ఆమెలో ఉన్న అసాధారణ ప్రజ్న ఆసక్తికి ముచ్చటపడి ఆయన తనకు వచ్చిన సర్వ విద్యనూ ఆమెకు నేర్పించాడు .కొద్ది కాలం లోనే ఆయనతో బాటు సమాన మైన విద్య నేర్చి చాంపియన్ అని పించింది .ఆయన రాసిన గ్రంధాలన్నీ చదివింది .ఆయన ప్రతిభావిశేషాలను పత్రికలో వ్యాసాలుగా రాసి ప్రచారం చేసి౦ది మేరీ బేకర్.ఆయన హిప్నటిజం తోకాని లేక ‘’యానిమల్ మాగ్నేటిజం ‘’తో కాని రోగుల వ్యాధులను నయం చేయటం లేదని ఒక శాస్త్రీయ మైన ఎవరికీ తెలియని విధానం లో నయం చేస్తున్నాడని తెలియ జేసింది .శిష్యురాలి అకు౦ఠిట దీక్షకు  మద్దతునిచ్చి ఆమెను తీర్చిదిద్దటం లో క్విన్బీ ఎక్కువ సమయం గడిపాడు .ఆమె రాసిన వాటిని ‘’సైన్స్ అండ్ హెల్త్ ‘’పేరిట ముద్రించింది .

మేరీ ఆరోగ్యం బాగుపడటమేకాదు ,ధైర్యం సాహసం ,ఆలోచన ,మనో నిబ్బరం యేర్పడి మానసిక వ్యాధులను కూడా నయం చేయగలిగే స్తితిలోకి వచ్చింది .వీటిని స్మ్రుతిగీతాలుగా రాసి ‘’lines on the Death of Dr .P .P. Quimby ,who healed with the Truth that Christ Taught in contra distinctions to all Isms ‘’పేర వెలువరించింది .కొంతకాలానికి ఆమె నడుస్తూ పడిపోయి విపరీతంగా గాయాలైనాయి .అప్పుడు జీసస్ చెప్పిన ‘’physician heal thy self !’’వాక్యాలను మననం చేసుకొని రెండు రోజుల్లోనే లేచినిలబడి నడవటం ప్రారంభించింది .దీనినే క్రిస్టియన్ సైన్స్ అన్నది .1866 ఫిబ్రవరిలో తనకు ‘’డివైన్ మెటా ఫిజికల్  హీలింగ్ ‘’అబ్బిందని దీనినే ‘’క్రిస్టియన్ సైన్స్ ‘’అన్నాని రాసి౦దిమేరి .అన్ని శారీరక బాధలకు మనసేకారణం అని అన్నిటికి ప్రధానం మైండ్ అనీ నిర్ణయించింది .ఇక్కడి నుండి ఆమె జీవితం మలుపు తిరిగి ఉచ్చ స్తితికి చేరింది .

 

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18

9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -2

తన కొత్త మతాన్ని సంస్థాపించటానికి ముందు మేరి బేకర్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నది .డాక్టర్ పాటర్సన్ నుండి ఏడాదికి రెండు వందల డాలర్ల పెన్షన్ తప్ప ఇంకే ఆదాయమూ లేదు .ఉండటానికి స్వంత ఇల్లే లేదు .ఎవరో ఒక ఇల్లాలి మానసిక స్థితిని సరిచేసి వారింట్లో ఆ రోజు ఆతిధ్యం పొందుతూ సంచారి జీవితం గడిపింది .ఇలా ఉంటున్నా క్విమ్బీ జీవిత విశేషాలను రాస్తూనే ఉంది .నాలుగేళ్ళు బాధ దుఖం ,బీదరికం ఒంటరితనం లో జీవించి చివరికి మొదటి డ్రాఫ్ట్ ‘’extracts from doctor P.P.Quimby ;s writings ‘’ పూర్తీ చేసింది .ఇది బాధా నివృత్తి చేసేదేకాక భరించలేని మానసిక సంక్షోభానికి పరిష్కారం గా కూడా ఉన్నది .దీనితో ఆమె అసలైన క్రిస్టియన్ సైన్స్ ఆవిర్భావానికి మార్గం సుగమమైంది .దీనితో బాటు ప్రేమించటం గురించి బోధించేది .

మొదటి సారిగా ఆమె శిష్యులు బాధా నివారణ చేయటం లో ప్రసిద్దులవటం తో ఆమె కీర్తి నెమ్మదిగా ప్రపంచమంతా పాకింది అదే ఆమె విజయానికి తొలి మెట్టు అయింది .వారికి బోధించటానికి ఫీజు వసూలు చేసేది .దీనితో అనేక సంస్థ లేర్పడ్డాయి వారిలో భేదాలు తారా స్థాయికి చేరాయి .57 ఏళ్ళ వయసులో పాటర్సన్ కు విడాకులిచ్చి గిల్బర్ట్ ఎడ్డీ ని పెళ్ళాడింది .456పేజీల ఉద్గ్రంధాన్ని పూర్తీ చేసి 1875 లో విడుదల చేసింది .క్విమ్బీ పద్ధతిని ‘’ది సైన్స్ ఆఫ్ హెల్త్ “’అన్నది దానికి  ‘’విత్ కీ టు స్క్రిప్చర్స్ ‘’ అని జోడించింది .పది హేనేళ్లు దానిని ఎప్పటికప్పుడు కొత్తవి చేస్తూ ఆధునీకరిస్తూనే ఉంది .ఆ పుస్తకం లక్షా యాభై వేల కాపీలు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించింది .తన స్వంత చర్చిలోని ప్రతి వ్యక్తీ ఒక కొత్త కాపీ కోనేట్లు చేసింది.అమ్మకాలపై ప్రతి పుస్తకానికి ఒక డాలర్ రాయల్టీ పొందింది .

పదార్ధం పై మనసు ఆధిక్యతను ఆధారం గా రాసిన పుస్తకం అది .చెడు అనేది లేదని అంటు౦దిమేరి .చెడు అనేది భయం వలన ఏర్పడే ఒక మానసిక స్థితి అన్నది .ఆమె రాసిన పుస్తకం లో విరుద్ధ విషయావులెన్నో ఉన్నాయి .కాని శిష్యులపై ఆమెకు గొప్ప పట్టు ఉండేది .55  వయసులో ‘’క్రిస్టియన్ సైన్స్ అసోసియేషన్ ‘’ఏర్పాటు చేసింది .మూడేళ్ళ తర్వాత ‘’ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ,సైంటిస్ట్ ‘’ను స్థాపించింది .రెండేళ్ళ తర్వాత ఇందులోని ఎనిమిది మంది చార్టర్ సభ్యులు రాజీనామా చేశారు .61 వయసులో తన చర్చ్  ని బోస్టన్ నగరానికి మార్చింది .ఆమె ప్రతికదలికా ఒక వార్తా సంచలనమే అయింది .దాన్ని బాగా కాష్ చేసుకొందికూడా .తన మాటకు, చేష్టకు ఆమె పురాణ గ్రంధాలనుండి ఆధారాలు చూపి అప్రతిభులను చేసేది .అపోక లిప్స్ చెప్పిన ‘’ and there appeared a great wonder in heaven ,a woman clothed with the sun and the moon under her feet ,and upon head a crown of twelve stars ‘’అనే మాటలను తనకే అన్వయి౦చు కొనేది

క్రిస్టియన్ సైన్స్ కొద్దికాలం లోనే గొప్ప వ్యాప్తి పొందింది .ఈ అతి వ్యాప్తిని చూసి మహా రచయితా మార్క్ ట్వేన్ ‘’ఇలా అయితే క్రిస్టియన్ సైంటిస్టులు 1920కి పది మిలియన్లు ,1930కి వారంతా బలమైన శక్తి గా రూపొంది ప్రతి రాజకీయ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తారు .1940 నాటికి రిపబ్లిక్ అధికారాలు చేబట్టి అధికారం లో పాతుకు పోయే అవకాశం ఉంది ‘’అని రాశాడు .ట్వేన్ మాటలు పూర్తిగా ఉత్ప్రేక్షలే  అభూతకల్పనలే  అయ్యాయి .1950 నాటికి మేరీ స్థాపించిన మదర్ చర్చ్ బ్రాంచీల సంఖ్య మూడు వేలు అని ఎన్ సైక్లో  పీడియా బ్రిటానికా తెలియ బర్చింది .అందులో రెండు వేలరెండొందల బ్రాంచీలు అమెరికా ,కెనడాలలో ఉన్నాయి  .

ముసలితనం మీదా పడుతున్నకొద్దీ ఎడ్డీ బలం, అధికారం మరీ పెరిగింది .ఒక యునిటేరియన్ మినిస్టర్ సాయం తో తన పుస్తకానికి తుది మెరుగులు దిద్ది తన అనుచరులకు  బైబిల్ కు ప్రత్యామ్నాయం అయేట్లు చేసింది .దేశం లో  లో సంచారం చేస్తూ ఉపన్యాసాలిస్తూ తన మతం లోకి జనాలను చేర్పిస్తూ మదర్ చర్చ్ ను బలీయం చేసింది .ఒక భారీ సంస్థకు ఆర్గనైజర్ గా ఎదిగిపోయింది అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయింది .మగ పురుషులతో అంత సఖ్యతగా లేక పోయినా సంస్థా గత విషయాలకు వారిపైనే ఆధార పడాల్సి వచ్చేది ..డెబ్భై వ పడిలో 41ఏళ్ళ ఒక హోమియో పతి డాక్టర్ ను చేర దీసింది అయిదేళ్ళ తర్వాత అతన్ని విసర్జించింది .అల్లాగే ఎవరినో దగ్గరకు తీయటం ,కొద్దికాలానికే వారికి గుడ్ బై చెప్పటం అలవాటైపోయింది ఆమెకు . ఆమె శీలాన్ని శంకించారు .చనిపోయిన వారి మరణానికి ఆమె చికిత్స వికటించే అనే ప్రచారమూ బాగా  బలపడింది .పూర్తిగా ఆమె పై వ్యతి రేకత కాదు  .ఆమె చుట్టూ ఉన్న కోటరీ పై వ్యతిరేకతే అది .సంస్థాగత వ్యవహారాలపై ఆమె పట్టు కోల్పోయిందనే ప్రచారం సాగింది.ఆమె స్వచ్చ ప్రవర్తనపై అపనమ్మకం కలిగింది .ఆమెను ఒంటరి దాన్ని చేసి పిచ్చిదానికిందా కట్టేశారు .86 ఏళ్ళ వయసులో కూడా ఆమె తనసంస్త్ర్హ ను పూర్తీ నియంత్రణలో ఉంచుకో గలిగింది .తొంభై ఏళ్ళు వచ్చాయి వృద్ధాప్యం వలన నే మేరీ బెకర్ ఎడ్డీ 3-12-1910 న తను నమ్మిన క్రీస్త్ ను చేరుకొంది .పేదరికం లో అతి సాధారణ రైతు కుటుంబం లో పుట్టిన ఆమె చనిపోయేసరికి ఒక పెద్ద సువిశాల సంస్థకు అధికారిణిఅయి మూడు మిలియన్ డాలర్ల ఆస్తికి వారసురాలై చరిత్ర సృష్టించింది .ఈ ఆస్తి అంతా ఆమె తను పెంచిపోషించిన చర్చి  కే  దక్కేట్లు చేసి ,భౌతికవాదాన్ని రూపుమాపి ,పదార్ధ వాదాన్ని లేకుండా చేసేందుకే  వినియోగించేట్లు చేసింది మేరీ బేకర్ ఎడ్డీ .

భారతీయ వేదాంతానికి క్రిస్టియన్ సైన్స్ కు అవినాభావ సంబంధం ఉందని మేరీ 33 వ ఎడిషన్ లో చెప్పింది .భగవద్గీతలోని అనేక శ్లోకాలను అందులో చేర్చింది .తర్వాత తీసేశారు .తర్వాత కాలం లో భారతీయ మైన అన్నివిషయాలను ఆ పుస్తకం నుండి తొలగించారు .ఎడ్డీ జీవితాంతం మార్ఫిన్ వాడుతూనే ఉందని ఒక రిసేర్చర్ తెలిపాడు .ఆమె చర్చి  బ్రాంచీలు 76దేశాలలో  వ్యాపించి ఉన్నాయి ఆమె శత జయంతికి ఆమె జన్మించిన బౌ గ్రామం లో 100టన్నుల గ్రానైట్ పిరమిడ్ ను నెలకొల్పి ఘనం గా నివాళులర్పి౦చారు .దాదాపు 16 పుస్తకాలు రాసింది మేరీ .

సశేషం

Inline image 1

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-15- ఉయ్యూరు

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-15 ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18

9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -2

తన కొత్త మతాన్ని సంస్థాపించటానికి ముందు మేరి బెకర్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నది .డాక్టర్ పాటర్సన్ నుండి ఏడాదికి రెండు వందల డాలర్ల పెన్షన్ తప్ప ఇంకే ఆదాయమూ లేదు .ఉండటానికి స్వంత ఇల్లే లేదు .ఎవరో ఒక ఇల్లాలి మానసిక స్థితిని సరిచేసి వారింట్లో ఆ రోజు ఆతిధ్యం పొందుతూ సంచారి జీవితం గడిపింది .ఇలా ఉంటున్నా క్విమ్బీ జీవిత విశేషాలను రాస్తూనే ఉంది .నాలుగేళ్ళు బాధ దుఖం ,బీదరికం ఒంటరితనం లో జీవించి చివరికి మొదటి డ్రాఫ్ట్ ‘’extracts from doctor P.P.Quimby ;s writings ‘’ పూర్తీ చేసింది .ఇది బాధా నివృత్తి చేసేదేకాక భరించలేని మానసిక సంక్షోభానికి పరిష్కారం గా కూడా ఉన్నది .దీనితో ఆమె అసలైన క్రిస్టియన్ సైన్స్ ఆవిర్భావానికి మార్గం సుగమమైంది .దీనితో బాటు ప్రేమించటం గురించి బోధించేది .

మొదటి సారిగా ఆమె శిష్యులు బాధా నివారాన చేయటం లో ప్రసిద్దులవటం తో ఆమె కీర్తి నెమ్మదిగా ప్రపంచమంతా పాకింది అదే ఆమె విజయానికి తోలి మెట్టు అయింది .వారికి బోధించటానికి ఫీజు వసూలు చేసేది .దీనితో అనేక సంస్తలేర్పడ్డాయి వారిలో భేదాలు తారా స్థాయికి చేరాయి .57 ఏళ్ళ వయసులో పాటర్సన్ కు విడాకులిచ్చి గిల్బర్ట్ ఎడ్డీ ని పెళ్ళాడింది .456పేజీల ఉద్గ్రంధాన్ని పూర్తీ చేసి 1875 లో విడుదల చేసింది .క్విమ్బీ పద్ధతిని ‘’ది సైన్స్ ఆఫ్ హెల్త్ “’అన్నది దానికి  ‘’విత్ కీ టు స్క్రిప్చర్స్ ‘’ అని జోడించింది .పది హేనేల్లు దానినేప్కటి క ప్పుడు కొత్తవి చేస్తూ ఆధునీకరిస్తూనే ఉంది .ఆ పుస్తకం లక్షా యాభై వేల కాపీలు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించింది .తన స్వంత చర్చిలోని ప్రతి వ్యక్తీ ఒక కొత్త కాపీ కోనేట్లు చేసిండి అమ్మకాలపై ప్రతి పుస్తకానికి ఒక డాలర్ రాయల్టీ పొందింది .

పదార్ధం పై మనసు ఆధిక్యతను ఆధారం గా రాసిన పుస్తకం అది .చెడు అనేది లేదని అంటు0ది  .చెడు అనేది భయం వలన ఏర్పడే ఒక మానసిక స్థితి అన్నది .ఆమె రాసిన పుస్తకం లో విరుద్ధ విషయాలెన్నో ఉన్నాయి .కాని శిష్యులపై ఆమెకు గొప్ప పట్టు ఉండేది .55  వయసులో ‘’క్రిస్టియన్ సైన్స్ అసోసియేషన్ ‘’ఏర్పాటు చేసింది .మూడేళ్ళ తర్వాత ‘’ది చర్చ ఆఫ్ క్రైస్ట్ ,సైంటిస్ట్ ‘’ను స్థాపించింది .రెండేళ్ళ తర్వాత ఇందులోని ఎనిమిది మంది చార్టర్ సభ్యులు రాజీనామా చేశారు .61 వయసులో తన చర్చ ని బోస్టన్ నగరానికి మార్చింది .ఆమె ప్రతికదలికా ఒక వార్తా సంచలనమే అయింది .దాన్ని బాగా కాష్ చేసుకొందికూడా .తన మాటకు చేష్టకు ఆమె పురాణ గ్రంధాలనుండి ఆధారాలు చూపి అప్రతిభులను చేసేది .అపోకా లిప్స్ చెప్పిన ‘’ and there appeared a great wonder in heaven ,a woman clothed with the sun and the moon under her feet ,and upon head a crown of twelve stars ‘’అనే మాటలను తనకే అన్వయిన్చుకోనేది

క్రిస్టియన్ సైన్స్ కొద్దికావులం లోనే గొప్ప వ్యాప్తి పొందింది .ఈ అతి వ్యాప్తిని చూసి మహా రచయిత మార్క్ ట్వేన్ ‘’ఇలా అయితే క్రిస్టియన్ సైంటిస్టులు 1920కి పది మిలియన్లు ,1930కి వారంతా బలమైన శక్తి గా రూపొంది ప్రతి రాజకీయ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తారు .1940 నాటికి రిపబ్లిక్ అధికారాలు చేబట్టి  అధికారం లో పాతుకు పోయే అవకాశం ఉంది ‘’అని రాశాడు .ట్వేన్ మాటలు పూర్తిగా ఉత్ప్రేక్షలె  అభూతకల్పనలే  అయ్యాయి .1950 నాటికి మేరీ స్థాపించిన మదర్ చర్చ్ బ్రాంచీల సంఖ్య మూడు వేలు అని ఎన్ సైక్లో  పీడియా బ్రిటానికా తెలియ బర్చింది .అందులో రెండు వేలరెండొందల బ్రాంచీలు అమెరికా కెనడాలలో ఉన్నాయి  .

ముసలితనం మీదా పడుతున్నకొద్దీ ఎద్దే బలం అధికారం మరీ పెరిగింది .ఒక యునితెరియాన్ మినిస్టర్ సాయం తో తన పుస్తకానికి తుది మెరుగులు దిద్ది తన అనుచరులకు  బైబిల్ కు ప్రత్యామ్నాయం యెట్లు చేసింది .ఎశం లో సంచారం చేస్తూ ఉపన్యాసాలిస్తూ తన మతం లోకి జనాలను చేర్పిస్తూ మదర్ చర్చ్ ను బలీయం చేసింది .ఒక భారీ సంస్థకు ఆర్గనైజర్ గా ఎదిగిపోయింది అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయింది .మగ పురుషులతో అంత సఖ్యతగా లేక పోయినా సంస్తా గత విషయాలకు వారిపైనే ఆధార పడాల్సి వచ్చేది ..డెబ్భై వ పడిలో 41ఏళ్ళ ఒక హోమియో పతి డాక్టర్ ను చేర దీసింది అయిదేలోల తర్వాత అతన్ని విసర్జించింది .అల్లాగే ఎవరినో దగ్గరకు తీయటం కొద్దికాలానికే వారికి గుడ్ బై చెప్పటం అలవాటైపోయింది ఆమెకు . ఆమె శీలాన్ని శంకించారు .చనిపోయిన వారి మరణానికి ఆమె చికిత్స వికటించే అనే ప్రచారమూ బాగా  బలపడింది .పూర్తిగా ఆమె పై వ్యతి రేకత కాదు  .ఆమె చుట్టూ ఉన్న కోటరీ పై వ్యతిరేకతే అది .సంస్థాగత వ్యవహారాలపై ఆమె పట్టు కోల్పోయిండానే ప్రచారం సాగింది.ఆమె స్వచ్చ ప్రవర్తనపై అపనమ్మకం కలిగింది .ఆమెను ఒంటరి దాన్ని చేసి పిచ్చిదానికిండా కట్టేశారు .86 ఏళ్ళ వయసులో కూడా ఆమె తనసంస్త్ర్హ ను పూర్తీ నియంత్రణలో ఉంచుకో గలిగింది .తొంభై ఎల్లువచ్చాయి వృద్ధాప్యం వలన నే మేరీ బెకర్ ఎడ్డీ 3-12-1910 న తను నమ్మిన క్రీస్త్ ను చేరుకొంది .పేదరికం లో అతి సాధారణ రైతు కుటుంబం లో పుట్టిన ఆమె చనిపోఎసరికి ఒక పెద్ద సువిశాల సంస్థకు అధికారిణిఅయి మూడు మిలియన్ డాలర్ల ఆస్తికి వారసురాలై చరిత్ర సృష్టించింది .ఈ ఆస్తి అంతా ఆమె తను పెంచిపోషించిన చర్చ కే  దక్కేట్లు చేసి ,భౌతికవాదాన్ని రూపుమాపి ,పదార్ధ వాదాన్ని లేకుండా చేసేందుకే  వినియోగించేట్లు చేసింది మేరీ బేకర్ ఎడ్డీ .

భారతీయ వేదాంతానికి క్రిస్టియన్ సైన్స్ కు అవినాభావ సంబంధం ఉందని మేరీ 33 వ ఎడిషన్ లో చెప్పింది .భగవద్గీతలోని అనేక శ్లోకాలను అందులో చేర్చింది .తర్వాత తీసేశారు .తర్వాత కాలం లో భారతీయ మైన అన్నివిష యాలను ఆ పుస్తకం నుండి తొలగించారు .ఎడ్డీ జీవితాంతం మార్ఫిన్ వాడుతూనే ఉందని ఒక రిసేర్చర్ తెలిపాడు .ఆమె  చర్చ్   బ్రాంచీలు 76 దేశాలలో వ్యాపి0చి ఉన్నాయి ఆమె శత జయంతికి ఆమె జన్మించిన బౌ గ్రామం లో 100టన్నుల గ్రానైట్ పిరమిడ్ ను నెలకొల్పి ఘనం గా నివాళు లర్పి0చారు  .దాదాపు 16 పుస్తకాలు రాసింది మేరీ .engraving

మేరీ పుట్టిన ప్రదేశం 

న్యు హాంప్ షైర్-కాంకార్డ్ లో  మేరీ స్తాపించిన  క్రైస్ట్  ఆఫ్ సైన్స్

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-15 ఉయ్యూరు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -1

అమెరికాలో న్యు హాంప్ షైర్ లో బౌ అనే చోట 16-7-1821 న జన్మించిన మేరీ బేకర్ ఎడ్డీ జీవితం పై ఎన్నో అభూతకల్పనలు అసంబద్ధ రాతలు వచ్చాయి .అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొని తాను నమ్మినదానినే చెప్పి ,రాసి ,ముందుకు సాగిన జీవితం ఆమెది .సత్యాన్వేషణలో మూలాలను  తరచిన సూక్ష్మ బుద్ధి ఆమెది .మార్క్ ట్వేన్ ఆమె పై ఒక పెద్ద పుస్తకమే రాశాడు .ఆమె రాసిన క్రిస్టియన్ సైన్స్ ను హంబగ్ అని ఈసడించి రెచ్చిపోయి రాసిన వారూ ఉన్నారు .నిరు పేద జీవితం గడిపి కానీకి ఠికాణా లేని స్తితిలోంచి ,కోట్లకు పడగలెత్తిన   ఐశ్వర్య  సంపన్నురాలైంది .అదీ క్రిస్టియన్ సైన్స్ అనే వినూత్నవిధానం తో .ఆధునిక ప్రపంచ నిర్మాతలలో తానూ ఒకరి చరిత్ర సృష్టించింది .

ఈమె పూర్వీకులు స్కాట్ లాండ్ ,ఇంగ్లాండ్ దేశీయులు .తల్లి విద్యావంతురాలు .రుజు ప్రవర్తన ఉన్న మహిళ.మగవారి తో సమానం గా కస్టపడి పని చేసే ఓర్పూ నేర్పూ ఉండేది తల్లికి .తండ్రి చాలా పవిత్రుడైన  కాన్గ్రిగేషనలిస్ట్ .అంటే వ్యక్తిగత పైశుధత ద్వారానే ఉన్నత స్తితిని ,దైవ సాన్నిధ్యాన్ని పొందవచ్చు అనే మెథడిస్ట్ పద్ధతికి దగ్గర భావాలున్న వాడు .మత ధర్మాలను చాలా నిద్ధతతో పాటించేవాడు .

మేరీ చిన్నతనం నుంచి ఏదో ఒక జబ్బుతో బాధపడేది .మూర్చలు వచ్చేవి అకస్మాత్తుగా .తీవ్ర స్వభావం ఉండటం వలన ఈ ఫిట్స్ ఆమెకు ఒక శాపమే అయింది .బాల్యం నుండి మత విషయాలలో చురుకుగా ఉండేది .’’ఎవరో నన్ను పేరు పెట్టి మూడు సార్లు పిలిచినట్లుఅంతరాత్మలో  అనిపించింది ‘’అని తన అనుభవాన్ని రికార్డ్ చేసింది .తనను ‘’జోన్ ఆఫ్ ఆర్క్’’ గా భావించుకొనేది ఆమెతో బంధుత్వం ఉన్నట్లు ఊహించుకోనేది .పన్నెండవ ఏట నే బాల యేసు లాగా తానూ చర్చి పెద్దలతో వాదించానని  చెప్పుకొనేది .కాని యవ్వనం వచ్చేసరికి వీటికి విరుద్ధం గా ఆమె సంచరించింది .

పిల్ల ఆరోగ్యం కోసం తండ్రి కుటుంబాన్ని ఈ నాడు సాన్ బారంటన్ బ్రిడ్జ్  అని పిలువబడే టిల్టాన్ కు మార్చాడు .మేరీ ఆరోగ్యం కొంత మెరుగైంది .తానూ ఒకకవిని అని ఊహించుకొని ఏకాంతం లో కవిత్వం రాసేది .అందులో మంత్రాలనూ కలిపి రాసేది .19 వ ఏట సోదరుడు ఆల్బర్ట్ చనిపోవటం తో డిప్రెషన్ కు లోనైంది .రెండేళ్ళ తర్వాత ఆల్బర్ట్ స్నేహితుడు అయిన ఒక తాపీ పని వాడిని పెళ్లి చేసుకొన్నది .భర్త స్టోన్ మేసన్ గా వ్యాపారమూ చేసేవాడు సౌత్ కరోలినలోని చార్లేస్టన్ కు నవ వధువును తీసుకొని వెళ్లి కాపురం పెట్టాడు  .అతనితో ఎన్నో సార్లు బిజినెస్ ట్రిప్ లలో పాల్గొనేది .భర్తకు ఎల్లో ఫీవర్ వచ్చి అకస్మాత్తుగా చనిపోయాడు .చేతిలో పెన్నీ కూడా లేని గర్భ దరిద్రం లో అప్పుడు మేరీ ఉంది .పుట్టింటికి చేరి ఒక కొడుకును కని తండ్రిపేరు పెట్టుకొన్నది .

చిన్నతనం లోనే గర్భం దాల్చటం వలన పిల్లాడు పుట్టే లోపే ఆమె ఆరోగ్యం మరీ క్షీణించి ఇక బతకదేమో ననిపించింది .అందువల్ల పసిపిల్లాడిని సాకే పని కూడా చేయలేక పోయేది .నరాల బలహీనత ఆమె ఆరోగ్యాన్ని తరచుగా దెబ్బ తీసేది .కుటుంబ సభ్యుల తోడ్పాటు తో ,ఆసరా తో ఆమె బతికింది .ఇలాంటి స్తితిలోకూడా కవిత్వం రాసి౦దివీలైనప్పుడల్లా .పిల్లాడిని పెంచలేననే అధైర్యం  ఆమెను కమ్ముకొంటే  విలేజ్ బ్లాక్ స్మిత్ భార్య చేతిలో కుర్రాడి సంరాక్షణ బాధ్యత పెట్టింది .ఇరవై ఏళ్ళకు తల్లి చనిపోయింది .తండ్రి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .తండ్రి ఇంట ఇప్పుడుకూడా ఒంటరి జీవి అయిపోయి౦ ది .మగ వారి విషయం లో ఆమె చాలా దురదృష్ట వంతురాలు .బార్లేట్ అనే అతన్ని ప్రేమిస్తే ,అతను కాలిఫోర్నియా కు వెళ్లి చనిపోయాడు .ఆ దుఖమూ కుంగ దీసింది .కొడుకును మారుటి తండ్రి దూర ప్రాచ్యానికి తీసుకెళ్ళిపోయి దూరం చేశాడు పుత్రప్రేమకు .కొడుకు తనకే దక్కాలన్న అరాటమూ ఆమెలో లేదు .కారణం తన పొట్టనే తాను  పోషించుకోలేని దైన్యమే .కొడుక్కి 35 ఏళ్ళు వచ్చి  భార్యా ఇద్దరు పిల్లలతో ఉన్నాడని తెలిసి ‘’మదర్స్ డార్లింగ్ ‘’అనే కవిత రాసింది .’’Thy smile through tears ,as sunshine over the sea –Awoke new beauty in the surge;s roll –Oh !life is dead ,bereft of all,with theee –Star of my earthly hope,babe of my soul ‘’అని తన ఆవేదనను వెళ్ళ గక్కింది .

ముప్ఫైలలో  మళ్ళీ వివాహ సన్నాహాలలో పడింది .డేనియ  ల్ పాటర్సన్ అనే డెంటిస్ట్ ను పెళ్లి చేసుకొన్నది .ఆమె అనారోగ్యం గురించి అతనికి పూర్తిగా తెలుసు ,కానీ అతని అభిరుచులు వేరు .జీవన వైవిధ్యాన్ని ఆమె కోరుకోలేక పోయింది .అతని పాశవిక చేష్టలకు తట్టుకోలేక పోయింది .వైట్ మౌన్తెన్స్ దగ్గరున్న నార్త్ గ్రాటన్ లో ఉన్నారిద్దరూ .అక్కడా ఒంటరిడైపోయిన్దిమళ్ళీ .నిరంతరం సంచార వైద్యం లో ఉండే ఆతను ఇంటిదగ్గర భార్యను వదిలేసి వెళ్ళిపోయేవాడు .ఆమె ఇతరులేవరితోనూ స్నేహం చేసేదికాదు

నలభై వ ఏట .పోర్ట్ లాండ్ లోని మైమ్ లో ఫినియాస్ పి.క్విమ్బి అనే ఆయన మెస్మరిజం తో వ్యాధులు నయం చేస్తున్నాడని విన్నది .ఆయనే తన వ్యాధికి దిక్కు అని నమ్మి అక్కడికి చేరింది. మొదటి సెషన్ లోనే క్విమ్బి- మేరీ శారీరక ఆరోగ్యాన్నేకాదు  మానసిక ఆరోగ్యాన్నీ బాగు చేశాడు .ఆమెలో ఉన్న అసాధారణ ప్రజ్న ఆసక్తికి ముచ్చటపడి ఆయన తనకు వచ్చిన సర్వ విద్యనూ ఆమెకు నేర్పించాడు .కొద్ది కాలం లోనే ఆయనతో బాటు సమాన మైన విద్య నేర్చి చాంపియన్ అని పించింది .ఆయన రాసిన గ్రంధాలన్నీ చదివింది .ఆయన ప్రతిభావిశేషాలను పత్రికలో వ్యాసాలుగా రాసి ప్రచారం చేసి౦ది మేరీ బేకర్.ఆయన హిప్నటిజం తోకాని లేక ‘’యానిమల్ మాగ్నేటిజం ‘’తో కాని రోగుల వ్యాధులను నయం చేయటం లేదని ఒక శాస్త్రీయ మైన ఎవరికీ తెలియని విధానం లో నయం చేస్తున్నాడని తెలియ జేసింది .శిష్యురాలి అకు౦ఠిట దీక్షకు  మద్దతునిచ్చి ఆమెను తీర్చిదిద్దటం లో క్విన్బీ ఎక్కువ సమయం గడిపాడు .ఆమె రాసిన వాటిని ‘’సైన్స్ అండ్ హెల్త్ ‘’పేరిట ముద్రించింది .

మేరీ ఆరోగ్యం బాగుపడటమేకాదు ,ధైర్యం సాహసం ,ఆలోచన ,మనో నిబ్బరం యేర్పడి మానసిక వ్యాధులను కూడా నయం చేయగలిగే స్తితిలోకి వచ్చింది .వీటిని స్మ్రుతిగీతాలుగా రాసి ‘’lines on the Death of Dr .P .P. Quimby ,who healed with the Truth that Christ Taught in contra distinctions to all Isms ‘’పేర వెలువరించింది .కొంతకాలానికి ఆమె నడుస్తూ పడిపోయి విపరీతంగా గాయాలైనాయి .అప్పుడు జీసస్ చెప్పిన ‘’physician heal thy self !’’వాక్యాలను మననం చేసుకొని రెండు రోజుల్లోనే లేచినిలబడి నడవటం ప్రారంభించింది .దీనినే క్రిస్టియన్ సైన్స్ అన్నది .1866 ఫిబ్రవరిలో తనకు ‘’డివైన్ మెటా ఫిజికల్  హీలింగ్ ‘’అబ్బిందని దీనినే ‘’క్రిస్టియన్ సైన్స్ ‘’అన్నాని రాసి౦దిమేరి .అన్ని శారీరక బాధలకు మనసేకారణం అని అన్నిటికి ప్రధానం మైండ్ అనీ నిర్ణయించింది .ఇక్కడి నుండి ఆమె జీవితం మలుపు తిరిగి ఉచ్చ స్తితికి చేరింది .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగుకు’’ స్టార్డం ‘’మాత్రమే తెచ్చిన సభలు

తెలుగుకు’’ స్టార్డం ‘’మాత్రమే తెచ్చిన సభలురెండవ రోజు 22-2-15 ఆదివారం దృశ్యమాలిక

కృష్ణాజిల్లా రచయితల  సంఘం ఫిబ్రవరి 21,22 తేదీలలో విజయవాడలో నిర్వహించిన మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు దిశా నిర్దేశం చేయలేదనే అభిప్రాయం కలిగించింది .సినీ ప్రముఖులు తనికెళ్ళ ,అశోక్ తేజ ,గొల్లపూడి ,బ్రహ్మానందం లు స్టార్ అట్రాక్షన్ మాత్రమే కలిగించారు .దానివలన తెలుగుకు ఒరిగిందేమీలేదు .రెండవ ప్రపంచ సభల చివరి రోజు స్వర్గీయ జాలాది గొప్ప ప్రేరణ స్పూర్తి కలిగిస్తే ,ఈ మూడవ ప్రపంచ సభల మొదటి రోజు రాత్రి సుద్దాల అశోక్ తేజ అదే స్పూర్తిని కలిగించి మనసులో నిలిచిపోయాడు .మిగతా వారి వన్నీ ఊక దంపుడు ఉపన్యాసాలే . శ్రీ కూచి భొట్ల ఆనంద్ బృందం  రెండవ సభలలో  సాంకేతికాంశాన్ని సర్వ సమర్ధం గా చాటి చెప్పిన  దిశా దిర్దేశం చేసిన దృశ్యం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది .ఆరోజు సభ అవగానే అందరూలేచినిలబడి ‘’స్టాండింగ్ ఒవేషన్’’తో   హర్షాన్ని ఆన౦ దాన్ని కృతజ్ఞతలను ప్రకటి౦చటం మరువరాని మరువలేని అనుభూతి .అదే తర్వాత యునికోడ్ ప్రాముఖ్యతకు పెద్ద పీట వేసింది.ఈ సభల్లో కూడా శ్రీ ఆన౦ద్ ఉపన్యాసం మనం అందరం ఏం చేయాలో కర్తవ్య నిర్దేశకం గా సాగింది .బహుశా నా దృష్టిలో ఈ సభల్లో ఇది హైలైట్. ఆయన స్పీచ్ ‘’మైడేన్ స్పీచ్ ‘’.సభలు అంటే అలా ఉండాలి ఉపన్యాసం అంటే అ౦త నిబద్ధత తో ఉండాలి .అందులో ప్రపంచ సభలంటే గొప్ప స్పూర్తి తో ప్రతినిధులు ఇంటికి చేరుకోవాలి ఫాలో అప్ యాక్షన్ లో పడాలి .అంతసీను ఈ సభల్లో దృశ్యమానం కాక పోవటం నిరాశ మిగిల్చింది .ఇంకో విషయం శ్రీ బుద్ధ ప్రసాద్ ను శ్రీ గుత్తికొండను ,శ్రీ పూర్ణచంద్ ను పాసివ్ గా కూర్చోబెట్టి,బైపాస్ చేసి  శ్రీ లక్ష్మీ ప్రసాద్ ఏకపాత్రాభినయం చేశారని పిస్తుంది .మొదటి రోజు 21-2-15 శనివారం దృశ్యమాలిక

కుర్రాడైనా సాహిత్య ఆకేడేమీ కార్య దర్శి ఛి .కృత్తి వెంటి శ్రీనివాసరావు ఎన్నో ఆచరించాల్సిన విషయాలను ,కార్య రూపం దాల్చాల్సిన వాటిని అతి సహజం గా సరళం గా చెప్పాడు .అతని చిన్నతనం పేద ప్రోలు లో నా కళ్ళ ముందు గడిచింది .అతని అన్న మాధవ్ నాకు అభిమాన శిష్యుడు అక్కడ .రావు చెప్పిన దానిలో ‘’కుంచేన్ టూర్ ప్రోగ్రాం ‘’తప్పక సాహిత్య సంస్థలు నిర్వహిచి కేరళ తీసుకొని వెళ్లి ఆసభలలో పాల్గొనే అవకాశాన్ని సాహితీప్రియులకు కలగ జేయటం తక్షణ కర్తవ్యమ్ .అది అమలు చేస్తారో లేదో చూద్దాం .సభా వైరాగ్యం లా మర్చేపోతారో?సభలో ఉన్న శ్రీనివాస్ నేను ఫలానా అని పరిచయం చేసుకోగానే లేచి  నిలబడి షేక్ హాండ్ ఇచ్చిన సహృదయుడు .ఈ రెండు రోజుల సభలలో చివరి రోజు మంత్రుల కవాతు బాగుంది.శ్రీ  చంద్రబాబు రాలేక పోయిన దాన్ని వీళ్ళు చక్కగా కవర్ చేశారు .ప్రసిద్ధ రచయితల పేర్లు సభా వేదికలకు పెట్టి  కనీసం వారి చిత్రపటాల బానర్ కూడా కూడా లేక పోవటం మరీ అవమానకరం గా అందరూ భావించటం లో తప్పేమీ లేదు .ఇదివరకెన్నడూ ఇలా జరగలేదు .బహుశా అసలు సభా వేదిక మన రచయితల సంఘం చేతిలో లేకుండా చేశారేమో ననిపిస్తోంది .మేనేజి మెంట్ అధీనం లో ఉందా అని అనుమానం కలిగించింది .

సభలు అంటే షడ్రసోపేత భోజం ఉండాల్సిందే .ఉన్నాయికూడా వెరైటీ బానే చూపారు రెండవ రోజు మధ్యాహ్న భోజనం లోవె రాత్రికి రంగూ హంగూ మార్చి వడ్డించటం కొంచెం తమాషా అనిపించింది .రెండు రోజులూ సాయంత్రాల్లో ‘’మినపసున్ని ఉండలు ‘’వేసి పొద్దున్నుంచీ సభల్లో పాతుకుపోయినందువల్ల వచ్చిన నీరసాన్ని దూరం చేసి ఇన్స్టంట్ బలం ఇచ్చినట్లనిపించింది .అందరికీ ఇబ్బందికలిగించిన మరో ముఖ్యమైన విషయం టాయ్ లేట్ల నిర్వహణ .కంపు భరించలేకపోయారుజనం .ఒక్క కుళాయి నున్చికూడా నీరు రాలేదు .చేతులు కడుక్కోటానికి పాపం బకెట్లతో నీరు తెచ్చి శుభ్రం చేసేవాల్లున్నారుకనుక సరిపోయింది లేకుంటే రోగాలబారిన పడాల్సి వచ్చేది .

సాధారణం గా కృష్ణా జిల్లారచయితలసంఘం చివరిరోజు సభలో తీర్మానాలు రాసి చదివి ఆమోదాన్ని తెలిపేట్లు చేసే ఆనవాయతీ ఉంది .ఈ సారి ఆ దారిలో నడవ లేదు కారణం ఏమిటో ఎవరికీ అంటూ బట్టలేదు .అయితే మంత్రి శ్రీ ఉమా తెలుగు దేశ ప్రభుత్వ ఎన్నిక వాగ్దానాలు ,నిర్ణయాలు చదివి వినిపించారు .బహుశా మనం కోరినా అవే కోరేవారమేమో ఆలోటు తీర్చిన శ్రీ ఉమాకు అభినందనలు .జ్ఞాపికలు ,బ్యాగులు ఘనంగానే ఉన్నాయి .సంఘం తెచ్చిన రెండు పుస్తకాలు ‘’తెలుగు భారతి ‘’,యువ భారతి ‘’గర్వించదగిన గ్రంధాలే సందేహం లేదు  గొప్ప రిఫరెన్స్ పుస్తకాలే .ఈ రెండూ తీసుకురావటం లో శ్రీ పూర్ణ చంద్ కృషి ,ఆలోచన ,అమలు ,అంకిత భావం అనన్య సదృశం,అసాధారణం .ఆరోగ్యం కొంచెం బాగుండక శ్రీ గుత్తికొండ కొంత డల్ గా కనిపించినా నిబద్ధతకు ఏమీ లోపం రాలేదు .శ్రీ తుర్లపాటి  శ్రీ బుద్ధ ,లక్ష్మీ ప్రసాద్ లను ఒకే శాలువాతో బంధించారు కాని దీనికంతటికి ముఖ్య కారకులు శ్రీ సుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ ద్వయాన్ని కూడా అలాగే బంధించి ఉంటె చారిత్రాత్మకం గా ఉండేది .రావు గారు ఏది చేసినా ఒక ప్రయోజనం ఉంటుందేమో?

పాపం ధిల్లీ నుంచి పిలిపించి మాట్లాడిస్తే శ్రీ వెంకయ్య అచ్చం గా పుస్తక మహోత్సవం లో జనవరి నాలుగవ తేదీన పుస్తకప్రియుల పాద యాత్ర అయి ఎక్సిబిషన్ గ్రౌండ్ లో ఏమి మాట్లాడాడో ఒక్క అక్షరం బీరు పోకుండా అదే హేళన అదే చీత్కారం అదే ధోరణిలో పాడిందే పాటరా —-పళ్ళ దాసరీ ‘’అన్నట్లు ఎబ్బెట్టు కలిగించింది .మాటల మా౦త్రి కత ఎప్పుడూ చెల్లుబాటుకాదు’’ బోరున్నర ‘’ అనిపించింది .ఇక శ్రీ బుద్ధ ,లక్ష్మీ ప్రసాద్ ల మాటలు కూడా అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డే .కొత్తవిషయం మచ్చుకైనా లేక పోవటం .ఒకే మూస దారిలో మాట్లాడటం రక్తి కట్టించాల్సినదిపోయి వెగటుపుట్టించాయి ఎప్పుడు మొదలు పెట్టినా అక్కడినుండే ,ఎప్పుడు ఆపేసినా అక్కడే .రొటీన్ ఉపన్యాసాలే ఇద్దరివీ .ధిల్లీ నుంచి అయన వచ్చి ,రెండు రోజులసభల్లో వీళ్ళిద్దరూ మాట్లాడినదేదీ స్పూర్తి దాయకం గా లేకపోవటం మరీ కొట్టవచ్చినట్లనిపించింది .శ్రీ పూర్ణ చంద్ కు అవకాశమిస్తే ఆ లోటు పూడేది .ఎక్కడో ఎవరో సభలను కబ్జా చేసిన భావం కనిపించింది .ఇది మంచిదికాదు .

1300 మంది ప్రతినిధులు ఏంతో దూర తీరాలనుండి వ్యయ ప్రయాసలకోర్చి వచ్చారు .వారి మధ్య ఇంటరాక్షన్ కలిపింఛి ఉంటె ఏంతో బాగుండేది .పొద్దున్నుంచీ సాయంత్రందాకా కూర్చుని కూర్చుని విని విని జనాలకు బోర్ కొట్టదా/
?ఏదైనాతెలుగు పైనో రచయితలపైనో మంచి డాక్యుమెంటరీ లు ప్రదర్శిస్తే ప్రయోజనం బాగుండేది వెరైటీగా ఉండేది మనకున్న ఆధునిక సాంకేతికను ప్రతిబింబించే సభలుగా ఉండేవి ఆ దృష్టిలో ఉండకపోవటం బాధకలిగించింది .అయితే తెలుగు దేశం భౌగోళికం గా విడిపోయినా భాషా పరం గా ,మానసిక పరం గా కలిసే తెలుగుప్రజలున్నారు అనే గొప్ప సంకేతాన్ని ఈసభలు మిగిల్చాయి అనే సంతృప్తి మాత్రం కలిగింది . విదేశాంధ్రులు చాలా ఉత్సాహం గా పాల్గొన్నారు .అందులో ఆచార్య డేనియల్ నిగార్స్ అందరితో రెండు రోజులూ చాలాకలుపుగోలుగా ఉండటం ఇంటరాక్ట్ అవటం ఎందరినో  ఆకర్షించింది .అలాగే యువకుడు డా.శ్రీ జొన్నలగడ్డ మూర్తి కలుపుగోలుతన౦ గా చిలిపి కవితలతో అందర్నీ ఆకట్టుకొన్నారు .మిగిలిన వారు వేదికకే పరిమితమైనారు .

తెలుగు వికాసం ,ప్రాచీనహోదా ,ప్రపచ భాష ,రాస్త్రేతర ,ప్రసార మాధ్యమాలు సాహిత్య సంస్థలపై సదస్సులు రొటీన్ గా ఎప్పుడూ పాల్గొనే వాళ్ళతోనే చర్విత చర్వణం గా సాగాయి .కొత్తదనం లేదు .సభల తర్వాత వీటికి ఫాలోఅప్ యాక్షన్ ఎలాగూ ఉండదని నమ్మకం .కవిసమ్మేళనాలు  ఉత్సాహం గా సా—గాయి .మొదటి రోజు కరెంట్ లేక ‘’కపి మ్మేళనం‘’గా ఉందని కొందరు కామెంట్ చేశారు మర్నాడు ఉదయమ్ .ఈ సమ్మేళనాలకు  నేను లేనుకనుక విన్నదే రాశా .ప్రచార మాధ్యమాలు సభల ప్రారంభానికి చాలా రోజుల ముందునుండే చక్కని ప్రచారం చేశాయి .సభలనూ బాగానే కవర్ చేశాయి .మొత్తం మీద హడావిడి ఆర్భాటమేకాని ప్రయోజనాత్మక సభలు అని అనిపించలదనే అందరి అభిప్రాయం .ఒడ్డున ఉండి రాళ్ళు వేయటం తేలికే .దిగితెకాని లోటు, లోతు  తెలియదు .ఏమైనా .కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్య  దర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ ల సంయుక్త కృషి ఫలితమే ఈ విజయానికి శ్రీరామ రక్ష .’’వన్ మోర్ ఫెదర్ ఐ న్ దెయిర్ కాప్ ‘’.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-15- ఉయ్యూరు

 

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో

ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో

 జననం –ప్రాచుర్యం –వలస

  unnamed గ్రీకు దేశానికి చెందిన పాటల కవితల రచయిత్రి సఫో .లెస్బొస్స్ దీవిలో క్రీ పూ  630–612లో జన్మించి, క్రీ పూ.570లో మరణించింది .అలేక్సా౦ డ్రియన్లు.తమ’’ నవ రత్న కవుల’’లో సఫో ను చేర్చి గౌరవించారు .ఆమె రాసిన అనంత సాహిత్యం ఆనాటి ప్రజల మెప్పు పొంది ,ఆరాధనీయురాలై నా ,కాలగర్భం లో చాలా భాగం కలిసి పోయింది .మిగిలిన కవిత్వమే చాలు  ఆమె ప్రతిభకు గీటు రాయి గా నిలిచిపోవటానికి .లిడియా కు చెందిన ప్రముఖ కవి ‘’ఆల్యేటీస్ ‘’.కు సమకాలికురాలని భావిస్తారు .నలభై అయిదు నలభై ఆరు ఒలింపి యాడ్ ల నాటికే ఆమె ప్రాచుర్యం పొందిన కవి అయింది .

తలిదండ్రులు –  సంతానం

  పారియాన్ మార్బుల్ శాసనాన్ననుసరించి సఫో లేస్బాస్ నుండి వలస పోయి  సిసిలీకు క్రీ .పూ604-594 కాలం లో   వెళ్ళింది .ఆమెరాసిన కవితల్లో మిగిలిన వాటిలో 98 వ కవిత ఆమె జీవిత చరిత్ర గా భావిస్తారు .. వలసపోవటానికి   ముందే ఆమెకు ఒక కూతురు ఉన్నట్లు  తెలుస్తోంది . .ముసలితనం దాకాఅంటే క్రీ పూ. ఆరవ శతాబ్దపు మధ్య కాలం వరకు  జీవించింది .’’ఆక్షి రింకస్ పేపరస్’’లో చెప్పబడిన దాని ననుసరించి ఆమె తల్లిపేరు ‘’క్లీస్’’.కూతురి పేరుకూడా  అదే .తండ్రిపేరు ‘’స్కామెండ్రోనిమస్’’.తల్లి జీవించిన కాలం లోనే సఫో కవిత్వం రాయటం ప్రారంభించింది .తండ్రిపేరు ఆమె కవిత్వం లో ఎక్కడా కనిపించదు .సఫో రాసిన ఒక కవితలో ‘’నాకు ఆరుపుట్టిన రోజులు గడిచిపోయాయి మా నాన్న అస్తికలు సేకరించే నాటికి ‘’అని చెప్పుకొంది..

సోదరులు –భర్త

   సేఫోకి ముగ్గురు సోదరులున్నట్లు తెలుస్తోంది .వారిపేర్లు ఈజిరియస్ ,లారికస్,కేరకస్.ఇందులోకేరకస్ అందరిలో పెద్దవాడు .సఫోకు చిన్నతమ్ముడు లారికాస్ అంటే అభిమానం ఎక్కువ .నగరం లో భాగ్య వంతుల కుమారులు తరచూ కలిసే చోట లారికాస్ వారికి  వైన్ పోయి౦చేవాడని   రాసింది .దీన్ని బట్టి సఫోకూడా సంపన్న కులీనురాలే అని నమ్మ్తుతున్నారు .ఆమె జీవితం పై అనేక చరిత్రకారులు విపరీత కధనాలు అల్లారు .కాని అవన్నీ సత్య దూరాలేనని తేలింది .చివరికి సూడా వివరణలో ఉన్నదానిప్రకారం సఫో బాగా ధనవంతుడైన ‘’సేరిక్లియాస్ ‘’అనే అతన్ని వివాహమాడింది .ఆతను ‘’ ఆండ్రోస్’’లో బడా వ్యాపారి అని ఆయనే సఫే కూతురు క్లీస్ కు తండ్రి అని తేలింది .

సిసిలీ జీవితం –మళ్ళీ లేస్బాస్ చేరిక

    సఫో జీవితం ఆనాటి రాజకీయ కల్లోల పరిస్తితులకు గురైంది .లేస్బాస్ రాజకీయ కల్లోలం లో పాటికస్ అధికారం లోకి వచ్చాడు .దీనితో సఫో  సిసిలీకి వలస పోయింది .అక్కడ సిరాక్యూజ్ నగరం లో ఆమె విగ్రహాన్ని స్తాపించారు ..సమకాలీనుడు ఆలికాస్ లాగా  కాకుండా రాజకీయాలకు  కవిత్వం తో చోటుకల్పించ లేదు .కాని  98 వ కవితాఖండిక  లో  తనకు విలాస వంతమైన జీవికకు తగిన సౌకర్యాలు .లేవని మాత్రం తెలిపింది .ఆల్సియాస్ రాజకీయ పక్షానికి మద్దతు తెలియజేసింది .మళ్ళీ లేస్బాస్ చేరి అక్కడే జీవితం గడిపిందని రికార్డులు సూచిస్తున్నాయి .

సఫో జీవితం పై మరో నీలి నీడ

ఫాయాన్ లిజెండ్ ప్రకారం సేఫో కవయిత్రి ‘’ఫాయాన్ అనే ఫెర్రీ నడిపే వాడిని ప్రేమించి అతనికోసం ‘’లూకాదియన్ క్లిఫ్ ల నుండి దూకి ఆత్మ త్యాగం చేసుకొన్నది .ఇది చారిత్రిక అసత్యం అని రుజువైంది .

సఫో రచనల సేకరణ –భద్రత

  అలేక్సాండ్రియా గ్రంధాలయం సేఫో  కవితా ఖండికలను తొమ్మిది పుస్తకాలుగా  సేకరించి భద్ర పరచింది .అందులో ఒకటవ పుస్తకం  లో 330 స్తాఫిక్  స్టాంజాలున్నాయి .రెండవ పుస్తకం  లో గ్లకానిక్ పంక్తులున్నాయి ‘మూడులో యాక్లిపియాద్ స్టిక్స్  పద్యాలు ,నాలుగులో మూడులో ఉన్నట్లుగానే  ఉండేకవితలు ,అయిదులో త్రిపాద కవితలు ,ఆరులో ఏమి ఉందొ తెలియదు .ఏడవ పుస్తకం లో రెండే రెండు కవితలు ,ఎనిమిదిలో 103వ విభాగం లోనివి తొమ్మిదిలో ‘’ఎపి తాల్మియా ‘’మొదలైన ఛందస్సులలో ఉన్నవి కనిపిస్తాయి ఈ పుస్తకాలను సేఫో రాసిన ఛందస్సును బట్టి విభజించి తయారు చేశారు .

సఫో కవితా విన్యాసం

  మొదటి తునక లేక ఫ్రాగ్మేంట్ లో పూర్తీ కవిత ఉంది ‘అది ఆఫ్రో డైట్ కు స్తోత్రం .గోప్పశైలీ ,చక్కని పద బంధం తో అలరారే కవిత ఇది .అందర్నీ ఆకర్షించింది .2014ఫిబ్రవరిలో  ఇదివరకు వెలుగు చూడని సఫో కవితలను ‘’టైమ్స్ లిటరరీ సప్లిమెంట్ ‘’లో ‘’న్యు పోయెమ్స్ బై సఫో ‘’పేరిట ముద్రించారు .ఆమె కవిత్వం చిక్కగా చక్కగా మంచి పదబంధం తో ప్రాసలతో ఆధునిక ప్రణయ కవిత్వ ధోరణిలో ఉంటుంది .అంత చక్కని కవిత్వం అంతకు ముందెన్నడూ గ్రీకు భాషలో రాలేదని అంటారు .పిచ్చికలు ఆఫ్రొడైట్ రధాన్ని లాగుతున్నట్లు రాసింది .సరైన పదాలను ఎన్నుకొని సూటిగా గుండెలను తాకేట్లు కవిత్వం రాసింది .చదివి యిట్టె ఆకర్షింప బడతారు .మాధుర్యం గల శబ్దాలతో సంగీత ధ్వని కల్గిస్తుంది .చెవులకు ఏంతో ఇంపుగా కవితలుంటాయి .కవిత్వం అంతా ప్రసాద మాధుర్య భరితం .ప్రముఖ  విశ్లేషకుడు డయారిసియాస్ ,సఫో కవిత్వానికి ముగ్ధుడయ్యాడు .

హోమర్ తో పోలిక

    సఫోకవిత్వం లో కొన్ని భాగాలు హోమర్ కవితలను పోలిఉంటాయి . ఇలియడ్’’లోని  కధలను విస్తరించి ,మాధుర్యం అద్ది అందం గా తీర్చింది .హెక్టార్ , ఆన్డ్రో మాక్ వివాహాన్ని మనోహర కవిత్వం తో ముంచేసింది .హెలెన్ పాత్రనూ బాగా పోషించింది .హోమర్ కవి  ట్రాయ్ పట్టణం లాగా, సఫోకవయిత్రి  లేస్బాస్ కూడా లిడియా వలన రాజకీయ అస్తిరత్వం తో ఉండేది .హోమర్ ‘’మిలిటరిజం’’ నుకవిత్వం లో ప్రదర్శిస్తే  సఫో ప్రేమ ,సౌందర్యాలతో కవిత్వాన్ని హృదయాన్ని మనసుని ఆకర్షించింది .అది వీరకావ్యం అయితే ఇది ప్రేమకావ్యం . ..ఇద్దరూ చారిత్రక సంఘటనకు అక్షరాకృతి తమదైన శైలిలో కల్పించారు .వీటివలననే ఆనాటి సాంఘిక రాజకీయ స్తితిగతులు తెలిశాయి .

అలెక్సాండ్రియాలో పాపిరస్ పై  సఫో కవిత్వం –ప్లేటో మెచ్చుకోలు –ఇంగ్లీష్ అనువాదం

  సఫో తనకవితలను ‘’సితార ‘’వాయిద్యం పై వాయిస్తూ పాడేది .క్రీ పూ మూడవ శతాబ్దానికి అప్పటికి వాడకం లోకి వచ్చిన పాపిరాస్ చుట్టలపై సఫో కవితలు గ్రంధస్తమై అలేక్సాండ్రియా ‘’హౌస్ ఆఫ్ మ్యూసేస్ ‘’లో భద్రపరచ బడినాయి  .కాని దానిపై అనేక సార్లు దండ యాత్రలు జరిగి ఎక్కువ భాగం సేఫో రచనలు ద్వంసమైనాయి . సేఫో కవితలను ‘’డివైన్ సాంగ్స్ ‘’అన్నారు ఆనాడు .తత్వ వేత్త ప్లేటో –సేఫోను’’ తెలివైన కవి ‘’అన్నాడని క్లాడియస్ ఆలినాస్ రాశాడు .సఫో సమకాలీన కవి ఆల్కేయాస్ ‘’ఊదా రంగు కురుల స్వచ్చ తేనే మాధుర్య హసిత సఫో ‘’అన్నాడు మూడవ శతాబ్దపు తత్వవేత్త ‘’మాక్షిమస్ ఆఫ్ టైర్ ‘’సఫోను గురించి రాస్తూ ‘’పొట్టి నల్లని అమ్మాయి’’ అని ,’’ఆమె  మహిళా స్నేహితురాళ్ళ తో  మెలిగే విధానం అచ్చం గా సోక్రటీస్ విధానం గానే ఉండేదని’’అన్నాడు  .సఫోకవితలను ఇంగ్లీష్ లోకి జాన్ హాల్ అనువదించి1652లో  ప్రచురించి గొప్ప వ్యాప్తి తెచ్చి ఆమె కవితామాదుర్యాన్ని తెలుసుకొవటానికి సహకరించాడు.2002లో ‘’అన్నే కార్సన్ ‘’సఫో కవితా ఖండికలను ‘’ఇఫ్ నాట్ వింటర్ ‘’పేరిట ముద్రించాడు .ఆ తర్వాత అనేక అనువాదాలోచ్చి సఫో కవిత్వ మాధుర్యం ఆధునిక యుగం లో బాగా ప్రచారమైంది .

సఫో పేరు ప్రభావం

  19 .వ శతాబ్దం నుండి సఫో జన్మించిన లేస్బోస్ దీవి పేరు నుండే మహిళా హోమో సెక్సువల్స్ కు  ‘’లే స్బియన్ ‘’అనే పేరు వచ్చింది .విక్టోరియన్ యుగం లో సఫో పేరు బాలికల ఉన్నత విద్యాలయం హెడ్ మిస్ట్రెస్   పేరు గా మారింది .

            – గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

0

– See more at: http://vihanga.com/?p=14176#sthash.yTek2EJG.dpuf

Posted in రచనలు | Tagged | Leave a comment

భిన్న ధ్రువాల సంకీర్ణం – కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల – మాట మరిచావా మోదీ?

కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల
అంగవైకల్యాన్ని అధిగమించి కవయిత్రిగా రాణిస్తున్న రాజేశ్వరికి రూ.10లక్షల ఆర్థికసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. నిరుపేద వికలాంగ చేనేత కార్మికురాలైన కవయిత్రి రాజేశ్వరికి ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం వన్‌టైమ్‌ గ్రాంట్‌ కింద పదిలక్షలను విడుదల చేస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. పదిలక్షల ఆర్థికసాయాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసి వచ్చే వడ్డీతో ప్రతినెలా 10వేల రూపాయలను రాజేశ్వరికి సాయంగా అందించనున్నారు
మాట మరిచావా మోదీ?
అన్నను అన్నావు.. అనాథను కానివ్వను అన్నావు
ఢిల్లీ చిన్నబోయేలా రాజధాని నిర్మిస్తానన్నావు
సీమాంధ్రను నెంబర్‌ వన్‌ చేస్తానన్నావు కానీ
అధికారంలోకి వచ్చాక తొండిచేయి
2 బడ్జెట్లలో పైసా కూడా నిధుల్లేవు
మరో ‘కర్నూలు’ తప్పదా అన్న ఆందోళన!
నాటి మోదీ మాట..
తిరుపతిలో…
నా కళ్లముందు వెంకటేశ్వర స్వామిని చేరుకునే కాలిబాట భవ్యంగా కనిపిస్తోంది. సీమాంధ్ర స్వర్ణాంధ్రగా కావాలంటే చెప్పండి. నేను మీతోనే ఉంటాను. మీకోసం ఏమైనా చేస్తాను. ఢిల్లీ చిన్నబోయేలా సీమాంధ్ర రాజధాని నిర్మించుకుందాం!’’
గుంటూరులో…
‘కాంగ్రెస్‌ మిమ్మల్ని అనాథలుగా మార్చిందనే ఆవేదన వద్దు. మీకు అన్నగా, అండగా నేనుంటాను. మీ కలలను నా కలలుగా భావిస్తా. మీ కష్టాలను నా కష్టాలుగా భావిస్తా. అధికారంలోకి రాగానే అండగా ఉంటా!’
‘ఒక్కడంటే ఒక్కడు కూడా మా మొర ఆలకించలేదు’ అనే ఆక్రోశం! నిరసనలు, ఆందోళనలు ఎన్ని చేసినా కన్నెత్తి కూడా చూడలేదని ఆగ్రహం! రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ఆవేదన! కాంగ్రెస్‌పై అంతులేని కసి! ఈ అనిశ్చితి నుంచి బయటపడేసేదెవరు? మమ్మల్ని ఆదుకునేదెవరు? అనే ప్రశ్నలు! ఈ సమయంలో… మోదీ అనే నాయకుడు వారి కళ్లకు ‘మెసయ్య’ (రక్షకుడు)లాగా కనిపించారు. ఆయన మాటలు సూటిగా వారి హృదయాలను తాకాయి. ‘మీరు అనాథలు కాదు. అన్నలా నేనున్నాను’ అని మోదీ చెప్పగానే భావోద్వేగంతో కళ్లు తడుపుకొన్నారు. ‘ఢిల్లీ చిన్నబోయేలా రాజధాని నిర్మిస్తాం’ అని ప్రకటించగానే… ‘నిజమే కాబోలు’ అని అనుకున్నారు. మోదీ ప్రధాని అయ్యారు. ఒక బడ్జెట్‌ ముగిసింది. ‘ఇది పూర్తిస్థాయి బడ్జెట్‌ కాదులే!’ అని సరిపెట్టుకున్నారు. నిన్నటికి నిన్న మరో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కానీ… నవ్యాంధ్రకు ఇచ్చింది ఏమీ లేదు. ‘విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తాం’ అంటూ మరో హామీ తప్ప! విభజన చట్టంలో ఏముంది? మోదీ ఏం చెప్పారు? నవ్యాంధ్రకు చేయాల్సింది ఏమిటి? ఇప్పటిదాకా ఏం చేశారు? ఇవీ ప్రశ్నలు! ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న వరుస కథనాలు నేటి నుంచి…
(హైదరాబాద్‌ – ఆంధ్రజ్యోతి)  అది.. 2014 మే ఒకటో తేదీ! మండే ఎండాకాలం.. ఆపై రోళ్లు పగిలే గుంటూరు.. రాష్ట్ర విభజన నిర్ణయంతో మండిపడుతున్న సీమాంధ్ర ప్రజలను ఉద్దేశించి ఒక గంభీర స్వరం అంతకంటే ఉద్రేకంగా ప్రసంగిస్తోంది. ‘‘ఆంధ్రులని అవమానించడం కాంగ్రెస్‌ పార్టీకి మొదటి నుంచీ ఉన్నదే. అప్పట్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి (రాజీవ్‌ గాంధీ) మీ ముఖ్యమంత్రిని ఎయిర్‌పోర్ట్‌లో అవమానించారు. ఇందిరా గాంధీ తెలుగువారైన నీలం సంజీవ రెడ్డిని పోటీకి నిలిపి వెన్నుపోటుతో ఓడించారు. ఇప్పుడేమో అమ్మా కొడుకుల పాలన మిమ్మల్ని అనాథలుగా వదిలేసింది. రాష్ట్ర విభజన జరిగిన తీరు, తల్లీ కొడుకుల (సోనియా – రాహుల్‌) వ్యవహారం మీకు ఆవేదన కలిగించింది. మీరు అనాథలు కాదు. మీ అన్నను నేను, మీకు అండగా ఉంటాను. మిమ్మల్ని ఏనాటికీ అనాథలను చేయను. మీ భవిష్యత్‌కి భరోసా ఇస్తున్నా. మీకు అండగా ఉంటాను. సీమాంధ్ర కోసం పార్లమెంటులో పోరాడి సాధించిన హామీలన్నీ అమలు చేస్తా’’ అంటూ ఆ గంభీర స్వరం మరింత గంభీరంగా ప్రజలకు కొండంత భరోసా ఇచ్చింది. ఆ స్వరం పేరు నరేంద్ర మోదీ. ఒక్కసారి ఎన్డీయే కూటమికి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కు అద్భుత భవిష్యత్‌ ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ సైతం చిన్నబోయేలా సీమాంధ్ర రాజధానిని నిర్మించుకుందామని మోదీ పిలుపునిచ్చారు. ‘‘మీ కలలను నా కలలుగా భావిస్తా. మీ కష్టాలను నా కష్టాలుగా భావిస్తా. మీ కలలని నెరవేరుస్తా. అధికారంలోకి వస్తే అండగా ఉంటా. ఢిల్లీ మీ వెంట ఉంటుంది. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేనా.. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల కలిగిన బాధను అర్థం చేసుకోగలనని, హైదరాబాద్‌ నుంచి రావడమంటే తల్లిని వదిలి బిడ్డ రావడమేనని కూడా అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి తన మస్తిష్కంలో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, సీమాంధ్రలో టీడీపీ-బీజేపీ, ఢిల్లీలో ఎన్డీయే సర్కారు ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘ఇవి ముఖ్యమంత్రిని, సర్కారును ఏర్పాటు చేసే ఎన్నికలు కావు. సీమాంధ్రను నిర్మించుకునే ఎన్నికలు. మీరు మంచి నిర్ణయం తీసుకోకుండా… సీమాంధ్రను స్కామాంధ్రగా మార్చే వారి చేతికి ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. సీమాంధ్ర అసెంబ్లీలో టీడీపీ-బీజేపీ పూర్తి మెజారిటీ ఇవ్వండి. ఎంపీ సీట్లన్నీ గెలిపించండి. సీమాంధ్ర నెంబర్‌ వన్‌ అవుతుందో, లేదో చూడండి!’’ అంటూ నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి ఆంఽధ్రావని స్పందించింది. అప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి సరైన పునాది కూడా లేకపోయినా.. ఏకంగా రెండు ఎంపీ, నాలుగు అసెంబ్లీ సీట్లను కట్టబెట్టింది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ, టీడీపీ కూటమికి పట్టం కట్టింది. అయితే, ఎన్నికలకు ముందు ఆశల పల్లకిలో ఊరేగించిన ఆ స్వరం ఇప్పుడు మూగవోయింది. ఏ జిల్లాలో అయితే ఆయన ‘మీరు అనాథలు కారు.. అన్నగా అండగా ఉంటా’ అన్నారో అదే జిల్లాలో ఏర్పాటవుతున్న నవ్యాంధ్ర రాజధానికి మాత్రం తొండి చేయి చూపించారు. ఢిల్లీ చిన్నబోయేలా రాజధానిని నిర్మిస్తామని భరోసా ఇచ్చిన ఆయన ఇప్పుడు.. అందుకు కనీసం ఒక్కపైసా నిధులను కూటా బడ్జెట్లో కేటాయించలేదు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నిటినీ అమలు చేస్తామని పదే పదే స్పష్టం చేసిన మోదీ ఇప్పుడు చంద్రబాబు పదే పదే కోరుతున్నా పట్టించుకోవడం లేదు. సీమాంధ్రులను కాంగ్రెస్‌ అనాథలను చేసినట్లే.. బీజేపీ కూడా అదే బాటలో పయనించింది. ఆంధ్రప్రదేశ్‌ ఆశల్ని కృష్ణా నదిలో కలిపేసింది. దిక్కూ మొక్కూ లేకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అనాథగా మిగిలింది. ఒకవైపు తెలంగాణ, మరోవైపు కర్ణాటక, ఇంకోవైపు తమిళనాడు రాష్ట్రాల రాజధానులు దేశంలోనే అత్యుత్తమ రాజధానుల్లో ముందు వరుసలో ఉన్నాయి. అదే సమయంలో, ఏపీ రాజధాని మాత్రం ఏమవుతుందో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి నెలకొంది.
చట్టంలో స్పష్టంగా ఉన్నా…
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి, శాఖాధికారుల కార్యాలయాలు, సిబ్బందికి క్వార్టర్లు, ప్రభుత్వ అతిథి గృహాలు తదితరాలను నిర్మించడానికి ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అందజేస్తుందని విభజన చట్టంలో స్పష్టం చేశారు. ఆ మేరకు నవ్యాంధ్ర రాజధాని కోసం కేంద్రం నిధులు ఇచ్చి తీరాలి. రాజధాని నిర్మాణం అంటే నాలుగు భవన సముదాయాలు కట్టడం కాదు. భవిష్యత్‌ అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాలను కల్పించుకోవాల్సి ఉంటుంది. కానీ, తాజా పరిస్థితిని చూస్తుంటే కర్నూలు చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం కనిపిస్తోందని సీమాంధ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రులకు రాజధాని లేదని, గుడారాల్లో ఉన్నారంటూ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ తదితరులు పదే పదే ఎద్దేవా చేశారని, భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి పునరావృతమయ్యేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి, సీమాంధ్రుల్లో ఇటువంటి మనోభావాలను గుర్తించే.. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. దాదాపు 40 వేల ఎకరాలను సేకరించడమే కాకుండా సింగపూర్‌ సహకారంతో ఆ దేశాన్నే తలదన్నేలా రాజధానిని నిర్మిస్తామని శపథం చేశారు. రైతులను బతిమలాడి, బామాలి, ఒప్పించి భూ సమీకరణను అయితే పూర్తి చేశారు. కానీ, కోట్ల రూపాయల నిధులు ఎక్కడినుంచి తెస్తారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇప్పటికి రెండు బడ్జెట్లను కేంద్రం ప్రవేశపెట్టింది. కానీ, రెండింటిలోనూ పైసా కూడా కేటాయించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సీమాంధ్ర నేతల్లోనూ కేంద్ర సాయంపై ఆశలు అడుగంటుతున్నాయి. అదే సమయంలో, ఏపీ ఇప్పటికే రెవెన్యూ లోటుతో సతమతమవుతోంది. రుణ మాఫీని అమలు చేయడానికే తలకిందులవుతోంది. ఈ పరిస్థితుల్లో అత్యుత్తమ సదుపాయాలతో ప్రపంచ శ్రేణి రాజధానిని నిర్మించాలంటే అథమ పక్షం లక్షా పదివేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ కూడా దానికంటే తక్కువే. నాలుగైదేళ్లలో రాజధానిని నిర్మించాలంటే ఏటా కనీసం పాతిక వేల కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. వాటిని బడ్జెట్లో కేటాయిస్తే ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాలు కూడా ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణానికి కేంద్రమే దిక్కు. కానీ, తాజా బడ్జెట్‌తో రాజధాని నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా విదల్చబోదని స్పష్టం కావడంతో రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

 

భిన్న ధ్రువాల సంకీర్ణం

 

జమ్మూ-కశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏడువారాల పాటు చర్చోపచర్చలు జరిపిన తరువాత, ఇరుపక్షాలూ తాము అత్యంత ప్రధానమైనవిగా భావించిన వాటిని ‘వివాదస్పద’ అంశాలుగా నిర్ణయించి అటకెక్కించడంతో అధికారం పంచుకోవడం సాధ్యపడింది. ఏకాభిప్రాయం సాధ్యం కాని అంశాల జోలికిపోకూడదన్న ఏకాభిప్రాయంతో ఉత్తర, దక్షిణ ధృవాలు రెండూ ఏకమయ్యాయి. అధికారంలోకి వచ్చిన కొద్దిగంటల్లోనే వివాదస్పద వ్యాఖ్యలు నిప్పురాజేస్తున్నప్పుడు, ఇరుపక్షాలూ ఎదుటివారి వ్యాఖ్యలతోనూ, చర్యలతోనూ తమకు సంబంధం లేదంటూ ఎంతకాలం నెట్టుకురాగలవో చూడాలి.
ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం ఒక చక్కని దృశ్యాన్ని ఆవిష్కరించింది. వేర్పాటువాదుల పట్ల ఒకింత సానుభూతిగా ఉండే ఒక ప్రాంతీయ పార్టీ, హిందూ జాతీయవాదాన్ని బలంగా వినిపించే ఒక జాతీయపార్టీ ఒక సరిహద్దు రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నాయి. ఇంతకాలమూ తాము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగానికి విధేయులమై ఉంటామంటూ బీజేపీ మంత్రులు ప్రమాణం చేశారు. మాజీ వేర్పాటువాద నాయకుడు, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు సజ్జాద్‌ లోన్‌ తన రాష్ట్రంలో బీజేపీ కోటాలో మంత్రిగా ప్రమాణం చేశారు. ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన బీజేపీ, పీడీపీలు ఈ పొత్తుకు సిద్ధపడటానికి రాజకీయంగా ఏ లెక్కలు కట్టుకున్నాయో, భవిష్యత్తుమీద ఏ అంచనాలకు వచ్చాయో తెలియదు కానీ, ఆ పరిమితులూ, పరిధులతో పనిలేని దృశ్యం అక్కడ కనిపించింది. దీనితోపాటు, రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రాంతాల్లోనూ ఆధిక్యం ఉన్న పార్టీలు అధికారాన్ని పంచుకోవడం జమ్మూ, కశ్మీర్‌ ప్రాంతాల అభివృద్ధికి మేలు చేస్తుంది. ఇంతకాలమూ అధికారంలో ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమిని తిరస్కరిస్తున్నప్పుడు ఈ రెండు ప్రాంతాలవారూ ఊహించినట్టుగానే భిన్నదారులు ఎంచుకున్నారు. హిందువుల ఆధిపత్యం ఉన్న జమ్మూలో బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తే, ముస్లిం ఆధిపత్యం ఉన్న కశ్మీర్‌లో పీడీపీకి ఆధిక్యత లభించింది. కశ్మీర్‌లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోతే, ఒకే ఒక్క స్థానంలో ఆ పార్టీ బలపరచిన స్వతంత్ర అభ్యర్థి సజ్జాద్‌ లోన్‌ గెలిచారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించారంటూ కొత్త ముఖ్యమంత్రి నేరుగా హురియత్‌కూ, ఉగ్రవాదులకు, సరిహద్దు ఆవల దేశానికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం వివాదం రేకెత్తించినా క్షేత్రస్థాయి వాస్తవం అదేనని ముఫ్తీకి తెలుసు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా మోదీ ప్రభంజనంతో బీజేపీ బలమైన శక్తిగా, 44 ప్లస్‌ అంటూ లక్ష్యం పెట్టుకుని రాష్ట్రంలో కాలుమోపినప్పుడు, అక్కడి అంచనాలు, లెక్కలు ఒక్కసారిగా తారుమారైపోయాయి. ఈ తరుణంలో, తొలిసారిగా హురియత్‌ ఎన్నికల్లో పాల్గొనవలసిందిగా కశ్మీరీలకు విజ్ఞప్తి చేసింది. బీజేపీ విస్తరణభయం మిలిటెంట్లూ, హురియత్‌ ఈ ఎన్నికల్లో సానుకూలంగా ఉండేట్టు చేసింది. కశ్మీర్‌లో అన్ని దశల్లోనూ ఓటింగ్‌ అధికంగా జరగడమే ముఫ్తీ ముఖ్యమంత్రి కావడానికి వీలు కల్పించింది. తన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ లోక్‌సభనుంచి వాకౌట్‌ చేసినా, బీజేపీ ఆగ్రహించినా ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడానికి అప్పట్లోనే కాదు, భవిష్యత్తులోనూ ఆ విధమైన సహకారం తనకు అవసరమని ఆయన భావిస్తుండటమే కారణం.
నిత్యం ఉద్రిక్తంగా ఉండే ఈ సరిహద్దు రాష్ట్రంలో సుస్థిర ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రశాంతత కొనసాగాలని రాష్ట్ర ప్రజలే కాదు, దేశమంతా కోరుకున్నది. కేంద్రంలో బలంగా ఉన్న ఒక జాతీయపార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకభాగస్వామి కావడం ఆ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైన బంధాలు ఏర్పడతాయి. అధికారంలో ఉన్న బీజేపీ పనితీరు చూడటానికి కశ్మీర్‌ ప్రజలకు, అక్కడి ప్రజల పట్లా, సమస్యల పట్లా ఒక అవగాహన కలగడానికి బీజేపీకీ ప్రత్యక్షంగా అవకాశం కలుగుతుంది. ఇది ఇంతకాలమూ ఇరువైపులా పేరుకుపోయి ఉన్న అనుమానాలు, అపోహలూ తొలగిపోయేందుకు వీలు కల్పిస్తుంది. కరడుగట్టిపోయి ఉన్న అభిప్రాయాలను కరిగించుకోవడానికీ, వీలైనచోట్ల మార్చుకోవడానికీ దోహదం చేస్తుంది. అలాగే, జమ్ము, కశ్మీర్‌ ప్రాంతాల మధ్య సయోధ్యకు మరింత దోహదం చేస్తుంది. ఎన్నికల బరిలో కత్తులు దూసుకున్న ఈ రెండు పార్టీలూ, కలసి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కొన్ని అంశాలపై కఠినమైన వైఖరులను సడలించుకున్నాయి. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు చెల్లవంటూ నినదించిన పార్టీ ఇప్పుడు 370వ అధికారణ విషయంలో మారుమాట్లాడవద్దని నిర్ణయించుకుంది. సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టం ఎత్తేయాలంటూ ప్రచారం చేసి, మేనిఫెస్టోలో పెట్టిన పీడీపీ ఇప్పుడు మెట్టుదిగింది. ఒకే ఒరలో ఇమిడిపోవడానికి సిద్ధపడిన ఈ రెండు కత్తులూ ఇకముందు అనవసరపు వ్యాఖ్యలకు, వివాదాలకు స్వస్తిచెప్పి, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా అభివృద్ధే లక్ష్యంగా కలసి పనిచేయడం ఆరంభించాలి. తమకు అధికస్థానాలు కట్టబెట్టిన జమ్ము, కశ్మీర్‌ ప్రాంతాలతో పాటు లద్దాఖ్‌ను కలుపుకోవాలి. రాష్ట్రాన్ని గుజరాత్‌ తరహాలో అభివృద్ధి చేస్తానంటున్న ముఫ్తీకి తన రాష్ట్రం ఇప్పుడు దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఎక్కడ ఉన్నదో తెలియంది కాదు. ఉగ్రవాదం మాత్రమే ఆ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్య కాదు. అపారమైన వనరులు ఉన్న ఆ రాష్ట్రాన్ని ప్రధాన స్రవంతితో మమేకం చేసి, అభివృద్ధికి బాటలు వేసినప్పుడు ఉగ్రవాదం సహా అనేక వివాదాలు చల్లారిపోతాయి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గజ గజన్‌!ఏపీకి అన్యాయంపై సర్వత్రా ఆగ్రహం

గజ గజన్‌!ఏపీకి అన్యాయంపై సర్వత్రా ఆగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ నిరసన
ఆందోళనలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌
అయినా, చప్పుడు చేయని జ‘గన్‌’
కేసులకు భయపడేనంటున్న నేతలు
అధినేత తీరుపై ఆ పార్టీ నేతల్లోనే ఆగ్రహం
హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగానే తన ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. మేము అధికార పక్షమో.. ప్రతిపక్షమో తేల్చుకోలేని గందరగోళంలో ఉన్నామంటూ టీడీపీ నేతలు కూడా బరువైన వ్యాఖ్యలే చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్‌ ఏకంగా కోటి సంతకాల ఉద్యమమే ప్రారంభించింది. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మర్నాడే ఆ పార్టీ నేతలు జిల్లాల్లో ఆందోళనలు చేశారు.
ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ వామపక్ష నేతలు కూడా విమర్శలు గుప్పించారు. ఇక, విద్యావంతులు సోషల్‌ మీడియా వేదికగా తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తుంటే.. గ్రామాల్లో నిరక్షరాస్యులు కూడా తమ స్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తుతున్నారు! కానీ, ఏపీకి జరిగిన, జరుగుతున్న అన్యాయంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి రాష్ట్రంలో ఒకే ఒక్కరు ఉన్నారు.. ఆయనే వైసీపీ అధినేత జగన్‌! యథా రాజా తథా ప్రజా అన్నట్లు.. ఆయనతోపాటు ఆ పార్టీ నేతల స్పందన కూడా అంతంతమాత్రమే! కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ ప్రాథమిక పాఠశాల విద్యార్థి నుంచి ఉన్నతాధికారి వరకూ.. గల్లీ నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకూ ప్రతి ఒక్కరూ గగ్గోలు పెడుతున్నా జగన్‌ ఎందుకు నోరు మెదపడం లేదు!? ఏపీని అథః పాతాళానికి తోసేసే ఇలాంటి చర్యలకు ఒడిగడితే జగన్‌ కేంద్రాన్ని ఒక్క మాట కూడా ఎందుకు అనడం లేదు!? ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరి మదిలోనూ మెదులుతున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఇది! వాస్తవానికి, బడ్జెట్‌కు ముందు జగన్‌ ఢిల్లీ వెళ్లారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు తదితరులను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై తనకు సంబంధం లేకపోయినా, తన ధర్మాన్ని నిర్వర్తించానని, ఏపీకి న్యాయం చేయాలని జైట్లీ, ప్రభులకు వినతి పత్రం ఇచ్చానని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక జోన్‌ కావాలంటూ ప్రభుకు వినతి పత్రం ఇచ్చారు కూడా. ఆయన దానిని ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో కిమ్మనలేదు. సాధారణ బడ్జెట్‌ తర్వాత ఏపీలోని దాదాపు అన్ని వర్గాలూ స్పందించాయి. కానీ, జగన్‌ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. రైల్వే బడ్జెట్‌ తర్వాత ఆయన మాట్లాడకపోవడంతో, సాధారణ బడ్జెట్‌ వచ్చే వరకూ ఆగుదామని ఆయన కాస్త సంయమనం పాటించారేమోననే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, సాధారణ బడ్జెట్‌పై జగన్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహాదారు సోమయాజులు సన్నాయి నొక్కులు, పార్లమెంటు బయట ఆ పార్టీ ఎంపీల వ్యాఖ్యలు మినహా ఆ పార్టీ నుంచి స్పందన కరువైంది. మరీ ముఖ్యంగా, ఈ అంశంపై జగన్‌ మాట్లాడకపోవడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమైంది. ఇప్పుడు రాజకీయ వర్గాల అంతర్గత సంభాషణల్లో ఇదే ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించుకోవచ్చని అప్పట్లో బ్రహ్మాండమైన సలహా ఇచ్చి రాష్ట్ర విభజనకు కారణమయ్యారని, ఇప్పుడు ఏపీకి అన్యాయం జరుగుతున్నా కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడకపోవడానికి ఆయనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులే కారణమని వారు చెబుతున్నారు. ప్రధానికి, కేంద్రానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా సీబీఐ, ఈడీ ఉచ్చు మరింత బిగుసుకుంటుందని జగన్‌ ఆందోళన చెందుతున్నారని, అందుకే రాష్ట్రమంతా భగ్గుమంటున్నా ఆయన మాత్రం మౌనముద్ర దాలుస్తున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేనా.. జగన్‌ వ్యవహార శైలిపై ఆ పార్టీ నేతలే అంతర్గతంగా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఇలా వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఇక పార్టీ బతుకుతుందా!? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏపీకి అన్యాయంపై స్పందించకపోయినా, ఏపీలో తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు జగన్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తుళ్లూరు ప్రాంతంలో మంగళవారం నాటి ఆయన పర్యటననను ఉదాహరిస్తున్నారు. సమీకరణ మొత్తం పూర్తయిపోయిన తర్వాత రైతులకు అన్యాయం జరుగుతోందంటూ ఇప్పుడు జగన్‌ అక్కడికి వెళుతున్నారని తప్పుబడుతున్నారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కశ్మీరంలో కొత్త చరిత్ర

కశ్మీరంలో కొత్త చరిత్ర

కొలువుతీరిన బీజేపీ-పీడీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా నిర్మల్‌ సింగ్‌
మంత్రులుగా 23 మంది.. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాది లోన్‌కు పదవి.. హాజరైన ప్రధాని, ఆడ్వాణీ, షా
పాక్‌ వల్లే ప్రశాంతంగా కశ్మీర్‌ ఎన్నికలు.. ఉగ్రవాదులు కూడా సహకరించారు: ముఫ్తీ
పైన్‌ చెట్లకు కుంకుమ పువ్వు పూసినట్లు… దాల్‌ సరస్సులో కమలం వికసించినట్లు… భిన్న ధ్రువాలు ఒక్కటైనట్టు… మంచుకొండల్లో కొత్త సూర్యోదయమైనట్టు… కశ్మీర్‌ రాష్ట్రంలో పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది. భిన్న ధ్రువాలైన రెండు పార్టీలు కలిసి నడిచిన సమయం ప్రజాస్వామ్య సౌరభాలను వెదజల్లింది! జమ్మూ కశ్మీర్‌లో పీడీపీతో కలిసి బీజేపీ తొలిసారి అధికారం చేపట్టింది.! 49 రోజుల గవర్నర్‌ పాలనకు ముగింపు పలుకుతూ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.
జమ్మూ, మార్చి 1: వివాదాస్పద అంశాలను పక్కనపెడుతూ.. ముఫ్తి మహ్మద్‌ సయీద్‌ నేతృత్వంలోని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ, భారతీయజనతాపార్టీలు కలిసి కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌ కే ఆడ్వాణీ, సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌, పీడీపీ నేత ముఫ్తీ మహబూబా సయీద్‌ తదితర అతిరథ మహారథుల సమక్షంలో కశ్మీర్‌ 12వ ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. ముఫ్తీతోపాటు ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నిర్మల్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో సహా పీడీపీ-బీజేపీలకు చెందిన 25మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రుల్లో 13మంది పీడీపీకి చెందినవారు కాగా మిగిలినవారు బీజేపీ సభ్యులు. రాజకీయ నాయకుడిగా మారిన వేర్పాటువాది సజ్జద్‌ లోన్‌ బీజేపీ కోటాలో మంత్రిపదవి దక్కించుకోవడం గమనార్హం. కశ్మీర్‌ ప్రభుత్వం జమ్ము వర్సిటీలోని జొరావర్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌పార్టీలు బహిష్కరించడం విశేషం. ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోదీ.. ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ని, సజ్జాద్‌ లోన్‌ని ఆలింగనం చేసుకున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత సీఎం ముఫ్తీ, డిప్యూటీ సీఎం నిర్మల్‌ సింగ్‌ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్‌ 370పై యథాతథ స్థితి కొనసాగించడం వంటి అంశాలతో కూడిన 16 పేజీల ఉమ్మడి ఎజెండాను విడుదల చేశారు. రాజ్యాంగం కల్పించిన మిగిలిన సదుపాయాల విషయంలో కూడా ప్రస్తుతం కొనసాగిస్తున్న విధానాన్నే కొనసాగించేలా అంగీకారానికి వచ్చామన్నారు. కల్లోలిత ప్రాంతాలకు సంబంధించి ఆర్మీకి ప్రత్యేక అధికారాలు( ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఇచ్చే చట్టాన్ని తొలగించే అంశంపై పరిశీలన చేస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తేఈ చట్టాన్ని రద్దుచేస్తామంటూ ఎన్నికల సందర్భంగా పీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టాన్ని రద్దు చేయడం కుదరదని బీజేపీ చెబుతూ వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ చరిత్ర సృష్టించింది. తొలిసారి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారం చేపట్టింది. ఉపముఖ్యమంత్రి బాధ్యతను చేపట్టి రికార్డు సృష్టించింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన కశ్మీర్‌ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 70 స్థానాలున్న జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో పీడీపీ 28 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 25 సీట్లను చేజిక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 13 కాంగ్రెస్‌కు 12 స్థానాలు దక్కాయి. హంగ్‌ ఏర్పడడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు 49రోజుల గవర్నర్‌ పాలన అనంతరం.. బీజేపీ, పీడీపీలు ఒక అంగీకారానికి వచ్చి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయడంతో రాజకీయ సంక్షోభం ముగిసింది.
ఇదో చరిత్రాత్మక అవకాశం: ప్రధాని మోదీ
జమ్మూకశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటు ఓ చరిత్రాత్మక అవ కాశమని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ నేతృత్వంలో ఏర్పాటైన పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారుకు ఆయన అభినందనలు తెలిపారు.
పాక్‌ వల్లే ప్రశాంతంగా కశ్మీర్‌ ఎన్నికలు: సీఎం ముఫ్తీ
జమ్మూ, మార్చి1: పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారును కొలువుతీరిన కొంతసేపటికే వివాదాస్పద వ్యాఖ్యలపర్వం మొదలైంది. పాకిస్థాన్‌, ఉగ్రవాదుల వల్లే జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ కశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయంటే ఆ ఘనతను హురియత్‌, ఉగ్రవాదసంస్థలకు ఇవ్వాల్సిందే. ఇదే విషయాన్ని నేను ప్రధాని మోదీకి కూడా చెప్పాను’’ అని ముఫ్తి చెప్పారు. ‘‘దేవుడి దయవల్ల ఉగ్రవాద సంస్థలు ఎటువంటి అడ్డంకులు సృష్టించలేదు. ఒకవేళ వారు అలా చేసి ఉంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవి కావు’’ అని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు అవతలి ప్రజలు కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహరించారంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ప్రశంసించారు.
కశ్మీర్‌ ప్రభుత్వంలో మాజీ వేర్పాటువాది!
జమ్మూ: సజ్జద్‌ లోనె తండ్రి ప్రముఖ వేర్పాటువాది అబ్దుల్‌ ఘనీ లోన్‌. 2002లో ఆయన్ను హత్యచేశారు. అప్పటికి సజ్జద్‌ లోన్‌ (48) హురియత్‌ కాన్ఫరెన్స్‌ ముఖ్య నేతల్లో ఒకరు. కశ్మీర్‌ పోరాటంలో తాము ఎవరినైతే సమర్థించారో ఆ జిహాదీలే తండ్రిని కాల్చి చంపారు. ఈ ఘటన సజ్జద్‌ లోన్‌ను వేర్పాటువాద పంథా నుంచి ప్రజాస్వామిక పథంలోకి నడిపించింది. జమ్మూకశ్మీర్‌ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంలో ఆయనను భాగస్వామిని చేసింది. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా.. సజ్జద్‌ లోన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ‘‘ఇతర వేర్పాటువాదులు కూడా అనుసరించేందుకు వీలుగా నేను ఒక దారిని వేస్తు’’న్నానని సజ్జద్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై సీఎం సయీద్‌ వ్యాఖ్యానించారు. సజ్జద్‌ 1989లో వేర్పాటువాద రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పుడే ఆయన ఇంగ్లంగ్‌లోని కార్డిఫ్‌ కళాశాలలో పీజీ పూర్తి చేసుకొని బయటకొచ్చారు. అబ్దుల్‌ ఘనీ లోన్‌ కుమారుల్లో అతడు చిన్నవాడు. తండ్రి స్థాపించిన పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌కు, ఆయన మరణం తరువాత తిరుగులేని నేత అయ్యారు. లోయలో ఉగ్రవాద హింసను ఖండించి.. హురియత్‌ కాన్ఫెరెన్స్‌కే కాదు, సొంత అన్న, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు బిలాల్‌ ఘనీ లోన్‌కీ శత్రువుగా మారారు. పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం చొరవతోనే కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందనేది సజ్జద్‌ వాదన. ఇదే నినాదంగా.. ఎదురీతలా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం.. 2014 ఎన్నికల్లో మలుపు తిరిగింది. హంద్వారా నుంచి గెలిచి.. బీజేపీ కోటాలో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వంలో చేరారు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూగ రోదన యాతన – ‘మూలింటామె’ మాటలు – చిట్టి

మూగ రోదన యాతన – ‘మూలింటామె’ మాటలు – చిట్టి
బర్‌ వన్‌ పుడింగి’ నామిని రాసిన ‘మూలింటామె’లో బూతు పురాణపు సంగతులేవీ లేవు! లేవు!. తిరుపతి పరిసర ప్రాంతపు పల్లెటూళ్ళో ఆడోళ్ళు మాట్లాడే పలుకులను పలికించాడే తప్ప, ఇంకిత జ్ఞానం లేకుండా కావాలని రాసి బిల్డప్‌ కొట్టలేదు మా మిట్టూరబ్బోడు. ఆడవాళ్ళను అనైతికంగా, అభాసుపాలు చెయ్యడానికి ‘పందొసంత’ను సృష్టించలేదు. ‘ప్రపంచీకరణ’, వంటి పెద్ద పెద్ద పదాలకు అర్థం చెప్పేందుకు ‘నామిని’ వల్ల కాదు. అసలు ఈ ‘మూలింటామె’ దేనికి ప్రతీకగా నిల్చిందనేది నా ప్రశ్న. ఓ పాఠకుడిగా ఇదీ నా పరిశీలన.
మూలింటామె ‘మనుమరాలు’ కిందిస్థాయి వర్గపు వ్యక్తితో లేచిపోతుంది. బంగారం లాంటి బిడ్లను, దేముడు లాంటి భర్తను, ఒద్దిగా సాగుతున్న ‘కాపురాన్ని’ ఉన్నపలంగా వదిలేసి పోతుంది. అది ‘ఊరి సమస్య’గా అమ్మలక్కలు, ఊర్లోవాళ్ళు ‘భజనగుడి’ కాడ మద్దిస్తం పెట్టి ‘చర్చల రచ్చలు’ జరిపి ఆ ‘మూలింటామె’ కుటుంబాన్ని వీధిలోకి పెట్టతారు. సహజంగానే తమ తప్పులను దాచిపెట్టి పక్కవాళ్ళ విషయాలను, వాళ్ళు చేసిన తప్పులను భూతద్దంలో చూసి, అంతకు ముందు చేసిన మంచి పనులను పక్కన నెట్టి లేని ‘చెడ్డ’ను బయటపెడతారు. ఇందులోనూ అంతే ! గుట్టుగా సాగె ‘మూలింటి’ సంగతులను బట్టబయలు చేస్తారు- ‘మూలింటామె’ మనుమరాలు తప్పు మూలంగా!
చుట్టూ ఉన్న ఆడవాళ్ళు సంగతులు అదే పనిగా చెప్పాలా, వాళ్ళ వివరాలు పూసగుచ్చినట్లు చెప్పాల. అంతేకదా! మా ‘నామిని’కి పుట్టి పెరిగిన, పెంచిన నేల ఇచ్చిన వరమే ‘స్వచ్ఛమైన యాస’. అంతేకానీ ‘యాస’ల కోసం ఎటువంటి ‘ప్రయాసలు’ పడలేదు. ఆడజనం- తిట్లతో, బూతులతో, మాట్లాడుకున్న ‘అసభ్య పదజాలాన్ని’ చూస్తే ఎట్లా? మూలింటామె మూగ రోదన – యాతన గమనించకపోతే ఎట్లా? ఇంతకీ ఈ పెద్ద కథో, నవలో, ఏమోగానీ, నాకు మాత్రం – వయస్సు ఉడిగిన ముసలితనంలో, చితికిన మట్టి మనిషి మనస్సు-నరక యాతనను చూసినాను. ఇక్కడ ఆడజనులకు, వాళ్ళ ‘ఆడతనం’కు అగౌరవం జరగలేదని తెలుస్తుంది. ఈ ‘మూలింటామె’లో కేవలం ఆ వూర్లో ‘మూలింటి’ కుటుంబంలో జరిగిన సంఘటనల ఘటనలను మాత్రమే చిత్రీకరించడం జరిగింది. ‘మూలింటామె’ ఇంటి పరిస్థితులను ఎదిరించే శక్తి లేక అనాథ అబలగా, అమాయక అమ్మతనమునకు ప్రతీకగా, కొడుకు మరో పెళ్ళి చేసుకొని రెండో పెళ్లాం ‘మాయ’ ఉచ్చులో చిక్కుకొని ‘తల్లి’ని గుర్తించలేక పోయాడనే తల్లడిల్లే ‘తల్లి’గా, మూగజీవులు (పిల్లులు) సాకే ‘మాతృమూర్తి’గా చివరకు ఆడదాని ‘ఆత్మగౌరవం’ను బలిపెట్టకుండా తనకుతానే ‘ఆత్మహత్య’ చేసుకొని ‘సబల’ కాని ‘అబల’గా మిగిలిపోతుంది.
‘మూలింటామె’తో మాట్లాడే ఆడోళ్ళలో ‘అసభ్య పదాల’ను వెతికి చూసారే! బంగారు దేముళ్ళురా! మచ్చుకు మూలింటామె మాటలో దాగిన మూగరోదన, నరకయాతన చూడండి! గుండె తడిని గుర్తించండి! లేచిపోయి, ఇక తనను కలుసుకోదని కుములుతూ – మూలింటామె ‘మనుమరాలు ఫోటో’ను తడుముతూ!-
‘నీ యంత నాణ్ణిగత్తె యీ నాలుగూళ్లలో వుంటాదా.. నా కూతరా! పచ్చి పసుపు గొమ్మును తుంచి చూస్తే ఎట్టూంటాదో ఆ వర్నంతో వుంటావే!’…
‘ఎంత ఆస్తయిన ఆడదానివి నువ్వు! నీ యీపు మింద గంపవొడ్లు ఆరబెట్టుకోవచ్చునే!’
 ‘ఏ శుక్రోరం నీ కోసరమన్జెప్పి కూకుడుకాయాలు కొట్టాలా నేను! నా చేతులు నొప్పులు బుట్టేటట్లు నీ బారడు పొడుగు యెంటికల్ని ఎట్టా పులిమేదాన్ని! అగ్గి పెంకులో సాంబ్రాణీసి యెంటికలకు పొగ బెట్టుకొని ఆర్చుకునే దాకా నేను వొక్క పూటన్నా వొప్పుకున్నానా?’
‘మొగోడు దినానికి రాగ్గింజంత పెరిగితే, ఆడది వడ్ల గింజంత పెరిగితింది గదా, బిడ్డి బిరబిరా పెద్ద మనిసైపోతే కొడుకు ఇచ్చి చేసుకుందామని నీకు నేను ఎన్ని రకాలుగా చేసి పెట్టుంటా!’
‘నాయమ్మా, నా కూతరా! నా కొడుకు ముందు నీకు తండ్రి, మళ్ల మేనమామ, మళ్లనే మొగుడు! కానీ నువ్వు తండ్రని తలిచినావా, మేనమామ అని తలిచినావా,మొగుడని లెక్కలోకి యేసుకున్నావా!’
‘ఒక మొగబిడ్డి, వొక ఆడబిడ్డి – చాల్లే బెమ్మాళం అనుకున్నాము. తల్లి పోలికిన మొగబిడ్డా. తండ్రి పోలికన ఆడబిడ్డ పుట్టినారు బలే అదురుష్టమంతుళ్లు అనుకున్నాము. ఏమి అదురుష్టమంతులు! దిక్కులేని బిడ్డిలైపోతురి, నువ్వు బూమ్మింద వుండీ!’
 ‘యీ మిట్టూరు మొత్తానికి మడికాడికి పోయ్‌ పచ్చి కసువు పెరకని ఆడదీ, శెనిగి చెట్టు తొవ్వని ఆడదీ, వరికోతలు కొయ్యని ఆడదీ-వొక్కదాన్ని చూపించు! బాపనోళ్ల బిడ్డి మాదిరిగా చూసుకుంటిమిగదా!’..
 ‘నీయంత రాణి వాసం జేసిన ఆడది రాయల్‌ చెరువు పాయకట్టు మొత్తానికీ లేదు.న అయినా ఈ ఇల్లు నీకు జెమినీ అయింది!’..
 ‘నీ మొగుడు వొకావొకడే… తొడి కోడలి పోటుకు నీకు వుండిందా, ఆడబిడ్డ పోటుకు నీకు వుండిందా? ఏమి సంకటమొచ్చిందని యీ పొద్దు నా యిల్లొదలి ఎలబారి పోయ్‌నావు?…’
 ‘ఎంత వదనంగా కాపరం చేసుకుంటా వుంటిమి… నీ వొంటికి సెగ దగలని పన్లే గదా నువ్వు చేస్తావుంటివి.. అట్టాంటి కాపరం నీకు ఎద్దును మోసినట్టూ గువ్వను పట్టినట్టూ అనిపిచ్చిందా!…’
 ‘సరిమొగోళ్లల్లోకి యింక నీ మొగుడు ఎట్టా బోవాలనుకుంటివి? కర్ములారా, అసలికి యీ యిల్లొదలి పోయ్యేదానికి నీకు మనసెట్ట నొప్పిందే యీనురాలా!’
 ‘కడంతగాలంలో నాగొంతులో అన్నినీళ్ళు పోస్తావనిగదా నాకొడుక్కి నిన్ను చేసుకొనింది! నేను చచ్చి నన్ను యెల్లాలకల బెంచీ మింద పండబెట్టుండినా నాపైనా పక్కలా పడి ఏడవ గలగతావా యింక నువ్వు’….
రెయ్యీ తెల్లవారులూ యిదే వాటం మూలింటామెది. ఇంకా.. ఎన్నో ఎన్నో ‘అమాయక ప్రేమ’కు ఉదాహరణలు చూడొచ్చు.
 మనుమరాలు మరల తిరిగొస్తుందని దేముళ్లకు మొక్కడం-యెంగటేస్పరసామి పటానికి, చెంగల్రాయ పటానికి, ఉత్తరకొండకి, దచ్చినకొండకీ దండాలు పెట్టుకోవడం, అగలాండంలో కేజీ కర్పూ రం యేస్తానని, వుండీలో నూట పదార్ల దుడ్లేస్తానని-ఉత్తర సామికీ మొక్కోవడం… ‘అమాయక భక్తి’ని పరిశీలించవచ్చు.
 ‘వూరికేందో శీనాగతి పట్టిందనీ, వూళ్లో గంగమ్మ జాతర జరక్క పదేండ్లు కావస్తుండడంతో గంగమ్మ చానా కోపంతో కండ్లు తెరవబట్టే యీట్టా కత జరిగిందనీ, శాంతం జెయ్యాలంటే ఈసారి జాతర జరపాలని బజిన గుడికాడ తీరు మానమైన సంఘటన’ చిత్రీకరించిన తీరులో, ‘పల్లె యొక్క మూఢ భక్తి’ని చూపడంలో రచయిత తన శైలిని ప్రదర్శించారు.
 తలకాయ నెప్పికి మాత్ర తెప్పించుకొని, మాత్ర వేసికొని, కాగితం ను నమిలి మింగేసిన విధానాన్ని చూపడంలో ‘మూలింటామె’ యొక్క ‘తెలివి’ని గమనించవచ్చు.
కొడుకు ‘నారాయుడు’కి రెండో పెళ్ళి చెయ్యడంలో ఎదురు చెప్పే శక్తి లేక తన వాళ్ళకే పగరాలైన వైనాన్ని గమనించినపుడు- ఆమెను ‘నిస్సహాయురాలు’కి నిదర్శనంగా నిలుపుతారు రచయిత.
 కొత్త కోడల్ని చూసి ‘యింకెట్ట యీ కొంపలో నీళ్ళు తాగబొయ్యేది తల్లా’ అని మూలింటామె పలికిన మాటలో రానున్న తన బతుకు శూన్యంలోనికి నెట్టబడుతుంది- అని అమె నోటనే రచయిత పలికించాడు.
ఇక చెప్పాలంటే.. ‘మూలింటామె’ తన కుటుంబాన్ని చక్కబెట్టే, స్థితి లేక ‘నిస్సహాయురాలు’గా నిల్చి పోతుంది. కొడుకు నారాయుడు రెండో పెళ్ళాంకు, ఆమె సావాసగాడు గుడుగుడు చెందురుడుకి, కీలు బొమ్మగా మారడం, తల్లిని పట్టించుకోకపోవడం వంటి పరిస్థితులు- మారుతున్న కాలానికి, ఆర్థిక గతులుకు, మనుషుల యొక్క మాయలు, లీలలకు ఈ పల్లె కథ ఉదాహరణ.
తను వ్రాసిన పుస్తకాలను తానే వాడవాడల తిరిగి అమ్మే ‘పుస్తకాల కొట్టు’గా తిరుపతి మిత్రులు (సాహితీ సన్నిహితులు), అభిమానులు – ‘నామిని’ని చూసారు. ఆ రోజు, ఈ రోజు… ఎప్పటికీ రచనలో- తనదైన శైలిలో నామిని ‘నెంబర్‌వన్‌ పుడింగి’గా నిలబడతారు.
నేటి మోడ్రన్‌ టెక్నాలజీ కాలంలో ‘స్మార్ట్‌ ఫోన్‌’లు వుపయోగించడంలో జనులు తెలివిమీరి ‘బ్లూటూత్‌’లో ‘బూతు’లను స్వీకరిస్తూ.. వీక్షిస్తూ.. అనుసరించడంతో పోలిస్తే ఇది ఏ పాటిది? మూలింటామె – వూళ్లో ఆడోళ్ల ‘బూతులు’ పెద్దవి చేసి చూడబల్లాల్సిన అవసరం లేదులే! ప్రపంచీకరణ- ఆధునికీకరణ- సరళీకరణల- ‘పరుగు పందెం’ లో ‘పల్లె జనులు’ ఎక్కడకనీ? ఎంత దూరానికి పయనిస్తారు?
ముద్ద సంగటి, శెనక్కాయలు, వూరిపిండి, మునగాకు పొరుటు, నోటికి కమ్మగా అందించి పల్లె జీవితానికి ప్రతిబింబంగా నిలుస్తుంది ‘మూలింటామె’- ‘కథ’.
చివరిగా ఒక మాట-
మూలింటామె చీమంతమ్మకు చెప్పిన చెవిలో రహస్యం లాగానే…
నామిని- నడుస్తున్న పల్లె జీవితాలతో స్వీయానుభవాలతో పచ్చనాకు సాక్షిగా కలంతో కలకాలం నిల్చే రచనలు చేస్తారు! అంతేగానీ, కుయ్యో, అయ్యో, మొర్రో అంటూ మోడ్రన్‌ ముతుక అతుకుల- ఇం(టిం)గ్లీషు కాపీ, కల్తీ కథలు రాయరు! వాస్తవికతకు విరుద్ధంగా, సహజత్వానికి దూరంగా ఎప్పటికీ రాయరు గాక!’
– చిట్టి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నూరేళ్ళుగా ‘ఇంటా బయటా’

నూరేళ్ళుగా ‘ఇంటా బయటా’
రవీంద్రనాథ్‌ టాగోర్‌ నవల ‘ఘర్‌ బాహిరె’ నూరు శరత్తులు పూర్తి చేసుకొని కాల పరీక్షలో నెగ్గింది. టాగోర్‌ 1915లో తూర్పు బెంగాల్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌ ప్రాంతం)లోని సెలియాధా లో ఉంటూ ఈ నవలను పూర్తిచేశారు. టాగోర్‌ రేడికల్‌ మిత్రులు నిర్వహిస్తున్న ‘సబుజపత్ర’ పత్రికలో 1915-16లో ఈ నవల ధారావాహికగా అచ్చయింది. నిఖిలేశ్‌, అతని భార్య బిమల- వారి జీవితాల్లో ప్రవేశించి సంక్షోభం సృష్టించిన సందీప్‌ ప్రేమవ్యవహారం నేపథ్యంలో- టాగోర్‌ స్వదేశీ ఉద్యమాన్ని చిత్రించారు. టాగోర్‌ భావించిన నిర్మాణాత్మక స్వదేశీ ఉద్యమానికి నిఖిలేశ్‌ ప్రతినిధైతే, హింసాయుతంగా మారిన తీవ్ర ఉద్యమానికి సందీప్‌ ప్రతినిధి. ఉద్యమ నేపథ్యంలో టాగోర్‌ ఈ నవలలో సీ్త్రల సమస్యలు, విద్య, కుల సమీకరణలు, జాతీయవాదం మొదలైన అంశాలను చర్చించారు.
పాఠకుల వివేచనకు పదునుపెట్టే సంక్లిష్టమైన నవల ఇది. నవల ధారావాహికగా వెలువడుతున్న రోజుల్లోనే బెంగాలీ భద్రలోకం ఆ నవలను తీవ్రంగా విమర్శించింది. భారత నారీధర్మాన్ని, ఆదర్శాలను టాగోర్‌ పరిహసించాడని ఆరోపణ. ఈ నవల కాలాన్ని గుర్తుచేసుకుంటే ఆయన సీ్త్రలు పడ్డ సంఘర్షణను, బాధలను, దుఃఖాన్ని, వాటి కారణాలను చక్కగా విశ్లేషించారనిపిస్తుంది.
స్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌ పరిపాలనా సౌలభ్యం నెపంపెట్టి బెంగాల్‌ను రెండుగా విభజించాడు. దేశీయుల్లో అప్పుడప్పుడే ననలువేస్తున్న స్వేచ్ఛాకాంక్షను, ఉద్యమస్ఫూర్తిని మొగ్గలోనే తుంచడానికి వలసపాలకులు ‘విభజించి పాలించు’ సూత్రాన్ని అమలు చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే మత, కుల, జాతి వైరుధ్యాలను పెంచి పోషించి పబ్బం గడుపుకున్నారు. బంగ విభజనతో దేశ ప్రజలు, ముఖ్యంగా బెంగాలీయులు పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యమాన్ని కొనసాగించారు. ఇదే వందేమాతరం ఉద్యమ నేపథ్యం. టాగోర్‌ మొదట ఉద్యమంలో పాల్గొన్నా, తర్వాత ఉద్యమాన్ని వ్యతిరేకించారు. తన కళ్ళముందే వెర్రితలలు వేసిన ఉద్యమ సంఘటనలను, చరిత్రను ఆయన ‘ఘర్‌ బాహిరె’ నవలగా రూపొందించారు.
దురదృష్టవశాత్తు ఆనాటి రాజకీయ నాయకులు, సాహిత్యవేత్తలు భారతీయ సంస్కృతిని, భారతీయ భాషలను, గత వైభవాన్ని అతిగా భావించుకొని ఆకాశానికెత్తారు. ఈ మిథ్యా గర్వం, మితిమీరిన జాతీయభావన భారతీయ సమాజం అంతర్ముఖీనమై తన లోపాలను సవిమర్శగా పరిశీలించుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ప్రాచీనభావజాలాన్ని నిరంకుశంగా రుద్దడానికి ప్రయత్నించిన కొత్తరకం నిరంకుశత్వాన్ని టాగోర్‌ నిర్భయంగా వ్యతిరేకించడమే కాక, ఆధునిక దృక్పఽథాన్ని, ఒక మానవీయ దృక్పథాన్ని ఈ నవలలో ప్రతిపాదించారు. గోరా నవలలో ప్రధానపాత్ర నవల ముగింపునకు వచ్చేసరికి జీవితవాస్తవంతో సమాధానపడుతుంది. ‘నేను సాధారణ భారతీయుణ్ణి. ఇప్పుడు నాలో ఏ ఘర్షణా లేదు. హిందువులకు, మహమ్మదీయులకు, క్రైస్తవులకు మధ్య సంఘర్షణ లేదు. అందరూ నా వాళ్ళే. నేను వాళ్ళందరికీ చెందుతాను’. ఈ సత్యాన్ని గోరా తనలో ఆవిష్కరించుకుంటాడు. ఈ ఆలోచనాధారనే, భావజాలాన్నే టాగోర్‌ ‘ఘర్‌ బాహిరె’ నవలలో కొనసాగించారు.
నిఖిలేశ్‌ చిన్నపాటి జమీందారు. అతని బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోతారు. నాయనమ్మ గారాబంగా పెంచుతుంది. నిఖిలేశ్‌ అన్నలిద్దరికీ నాయనమ్మ జాతకాలు, నక్షత్రాలు చూపించి గొప్ప సౌందర్యవతులతో పెళ్ళి జరిపిస్తుంది. అన్నలిద్దరూ వ్యసనాలకు బానిసలై యవ్వనంలోనే పోతారు. పెద్దవదిన ఆధ్యాత్మిక జీవనాన్ని ఎంచుకొంటుంది. చిన్నవదిన జీవితంమీద ఆసక్తి కోల్పోదు. నాయనమ్మ నిఖిలేశ్‌కు ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన బిమలతో పెళ్ళి జరిపిస్తుంది. అందరూ జమిందారి బంగళాలో ఉంటారు. టాగోర్‌ ఈ నవలను పాత్రల స్వగతాల రూపంలో, పాత్రల దృష్టికోణం నుంచి రచించారు. ఈ పద్ధతిని ఇంగ్లిషు నవలాకారులు విడిచిపెడుతున్న సమయంలో టాగోర్‌ ఈ విధానాన్ని నవలామాధ్యమంగా గ్రహించారు. ఇందులోని పాత్రలు అంతర్‌దృష్టితో తమ జీవితాన్ని, బతుకు బాధలను పాఠకుల ముందు పరుస్తాయి. బిమల, నిఖిలేశ్‌, సందీ్‌పల ప్రతిస్పందన ఉత్తమపురుషలో సాగుతుంది.
బిమల స్వగతంతో నవల మొదలవుతుంది. ఆమె సంప్రదాయ భద్రలోకానికి ప్రతినిధి. పతిసేవే జీవితాదర్శంగా భావించిన తల్లి ఆమెకు ‘రోల్‌మోడల్‌’. నిఖిలేశ్‌ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివిన విద్యావంతుడు. పాశ్చాత్య రాజకీయ, ఉదార మానవతా భావాలు అతనిలో బలంగా నాటుకుంటాయి. తన భార్యను పరదా నుంచి వెలుపలికి తెచ్చి, ఆమెను విద్యావతి, సంస్కారవతి చెయ్యాలనే కాంక్షతో ఇంగ్లీషు దొరసానిని ట్యూటరుగా నియమిస్తాడు.
తన జమిందారి కేంద్రం ‘సుఖ సాయర్‌’లో కళాశాల విద్యార్థులు లేవదీసిన ‘స్వదేశీ’ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సందీ్‌ప అనే తన పాతమిత్రుణ్ణి నిఖిలేశ్‌ భార్య బిమలకు పరిచయం చేస్తాడు. అతను నిఖిలేశ్‌ బంగళాలోనే ఉంటూ సెలవులకు ఊళ్ళకు వచ్చిన విద్యార్థి కుర్ర గుంపును వెంటవేసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తాడు. సందీప్‌ ఉద్వేగపూరితమైన ఉపన్యాసాన్ని విన్న బిమల స్వదేశీ ఉద్యమం పట్ల అభిమానం పెంచుకుంటుంది. తన వాక్చాతుర్యం, ఆకర్షణీయమైన రూపంతో ఒక రంగుల కల సృష్టించి, సందీప్‌ బిమలను తన మాయాజాలంతో సమ్మోహితురాలిని చేస్తాడు.
స్వదేశీ ఉద్యమానికి ముందే నిఖిలేశ్‌ స్వదేశీ వస్తూత్పత్తి, సహకార ఉద్యమాలతో చేతులు కాల్చుకొని, వాటిపట్ల భ్రాంతిని తొలగించుకున్నాడు. స్వదేశ ఉద్య మం బెంగాలీయులను మతం, కులం ప్రాతిపదికన చీల్చివేసిందని, బెంగాలీ నిరుపేదలను నిట్టనిలువుగా చీల్చివేసిందని, ఉద్యమం ముస్లింలకు ‘నామ’ శూద్రులకు (శూద్రుల్లో ‘తక్కువ’ కులాలవారు) చెడుపు చేస్తుందని అతను గ్రహిస్తాడు. పేదల జీవనోపాధిని లాగివేసుకోవడంలో, జీవించే హక్కును నిర్మూలించడంలో ఉద్యమం ఒక సాధనంగా మారిందని కూడా అతడు భావించాడు. జమిందార్లు, భూస్వాములు పేదప్రజలకు వ్యతిరేకంగా లేవదీసిన కుట్రగా ఉద్యమాన్ని వ్యాఖ్యానించుకొంటాడు. తన జమిందారి ప్రాంతంలో విదేశీవస్తువులను నిషేధించమని ఉద్యమకారులు కోరినపుడు ‘మీ నిర్ణయాన్ని బలవంతంగా ప్రజలమీద రుద్దకండి’ అని సమాధానమిస్తాడు.
ఉవ్వెత్తున లేచిన ఉద్యమకెరటాలమీద స్వారీ చేస్తూ, అవకాశాన్ని అందిపుచ్చుకొని సందీప్‌ సెల్ఫ్‌స్టైల్డ్‌ లీడర్‌గా చెలామణి అవుతూంటాడు. నిఖిలేష్‌ అతిథిగా ఉంటూ బిమలను ఆకర్షించి, ఆమెను ఉద్యమానికి స్ఫూర్తిగా, ఊపిరిగా వర్ణించి భారతమాత ఆమె రూపంలో సాక్షాత్కరించిందని నిస్సిగ్గుగా భర్త సమక్షంలోనే కీర్తిస్తాడు. బిమల అతని మాయాజాలంలో చిక్కుకునిపోతుంది. ‘ఉద్యమానికి అవసరం’ అంటూ అతను అడగగానే బిమల అన్ని బాధ్యతలను, వివాహ బంధాన్ని పణంగా పెట్టి తన వంటిమీది నగలనే కాక, భర్త ఇనప్పెట్టెలోంచి కూడా బంగారు నాణాలు దొంగిలించి అతని దోసిట్లో పోస్తుంది. ఆ డబ్బు ఉద్యమం కోసం కాదు, అతని అవసరం కోసం అని సందీప్‌ అనుచరుడిద్వారా విన్న ఆమె భ్రమలన్నీ తొలగిపోతాయి. అప్పటికే తన పొరపాటును సరిదిద్దుకొనే అవకాశం చేజారిపోతుంది.
‘ఘర్‌ బాహిరె’లో రెండు ఉప కథలున్నాయి. ‘పంచు’ నామశూద్రుడు. భార్య వైద్యం, కర్మకాండలు వగైరా ఖర్చులకు ఉన్న భూమిని పోగొట్టుకొని నిరుపేదలు నివసించే ప్రాంతాల్లో సలీసయిన విదేశీ ఉన్నిబట్టలు, ఇమిటేషన్‌ నగలు అమ్మి జీవిస్తుంటాడు. పంచూకు మిగిలిన చిన్న భూమినీ, అందులో ఉన్న ఇంటినీ కాజేయడానికి భూస్వామి హరీశ్‌కు ఉద్యమం ఒక సాఽధనం అవుతుంది. భూస్వామ్య వ్యవస్థ, స్వదేశీ ఉద్యమం, సాంస్కృతిక జాతీయవాదం పంచూమీద దాడిచేస్తాయి. ఉద్యమం మొదలవగానే బెంగాల్లో ముస్లింల పరిస్థితి దిగజారుతుంది. భూస్వాములు ‘ఈశ్వరబత్తి’ పేరుతో ముస్లిం కౌలుదారులనుంచి ప్రత్యేక పన్ను వసూలు చేస్తారు. ఆ కరువురోజుల్లో ధనరూపంలో కాక, ధాన్యరూపంలో శిస్తు చెల్లించాలని కొత్తగా డిమాండ్‌ చేస్తారు.
గ్రామీణప్రాంతాల్లో జమిందార్లు, భూస్వాములు ఉద్యమంలో పాల్గొనడం ఒక ఉటోపియన్‌ ఆదర్శం మాత్రమే. భూస్వాములు, కౌలుదార్ల మధ్య సంబంధాలలో మార్పురాలేదు. మీర్‌జాన్‌ వంటి పేదముస్లింలు విదేశీనూలు, విదేశీ చవకబట్టలు, ఉన్ని వస్త్రాలు అమ్మి బ్రతికే పేదలు. ‘సుఖసాయర్‌’ సంతలో వాళ్ళు ఉన్ని వస్త్రాలు అమ్మకూడదని ఉద్యమకారులు ఆదేశించినపుడు పేద వ్యాపారులు తమ కష్టాలు చెప్పుకుంటారు. దేశం కోసం అన్నీ త్యాగం చెయ్యాలని సందీప్‌, అతని వెంట ఉన్న విద్యార్థులు వాదిస్తారు గాని, వీళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను గురించి ఆలోచించరు. మీర్‌జాన్‌ వంటి వాళ్ళు ఉద్యమకారులను ధిక్కరిస్తారు. ఉద్యమకారులు మీర్‌జాన్‌ పడవను ధ్వంసం చేస్తారు. పంచూ బట్టల మూటను దగ్ధం చేస్తారు. పంచూ ఇంటినీ, తోటనూ హరీశ్‌ పరంకాకుండా నిఖిలేశ్‌ గురువు చంద్రనాధబాబు అడ్డుకోగలుగుతాడు.
హిందూ, ముస్లింల మధ్య హింసాపూరిత ఘర్షణలు మొదలు కాగానే సందీప్‌ ప్రాణభయంతో కలకత్తా పారిపోతాడు. గిరీశం మానసపుత్రుడులాగా ఇతడు మనకు అనిపిస్తాడు. ఘర్షణల్లో యువ ఉద్యమకారుడు అమూల్య చనిపోతాడు. ఘర్షణలను నివారించడానికి వెళ్ళిన నిఖిలేశ్‌ గాయపడి, చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్నట్లుగా చెప్పి టాగోర్‌ ఈ నవల ముగింపును పాఠకుల ఊహకే విడిచిపెడతారు. బిమల వితంతువయిందా? నిఖిలేశ్‌ కోలుకున్నాడా? వాళ్ళ సంసారం కుదుటపడిందా? సత్యజిత్‌ రే ‘ఘర్‌ బాహిరె’ సినిమాలో వితంతు రూపంలో ఉన్న బిమలను చూపి సినిమాను ముగించారు. పాఠకుల వివేచనకు పదునుపెట్టే సంక్లిష్టమైన నవల ఇది. నవల ధారావాహికగా వెలువడుతున్న రోజుల్లోనే బెంగాలీ భద్రలోకం ఆ నవలను తీవ్రంగా విమర్శించింది. భారత నారీధర్మాన్ని, ఆదర్శాలను టాగోర్‌ పరిహసించాడని ఆరోపణ. అప్పట్లో బెంగాలీ నవలను ఇంగ్లీషులోకి అనువదిస్తున్నప్పుడు కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. కానీ, 1980 దశకంలో బెంగాలీ మాతృకకు యధాతథమైన, ప్రామాణికమైన ఇంగ్లీష్‌ అనువాదం వచ్చింది. అలాగే, ‘ఇంటా బయటా’ పేరుతో 60-70 ఏళ్ళకిందే ఈ నవల తెలుగు అనువాదం అందుబాటులోకి వచ్చింది.
టాగోర్‌ ఈ నవలను ఏభైయేళ్ళ వయసులో రాశారు. ఆ వయసులో మనుషులు సాధారణంగా సంప్రదాయం వైపు మొగ్గుచూపుతారు. టాగోర్‌ ప్రయోగాత్మక సృజనాత్మక ఈ నవలలో గొప్పగా అభివ్యక్తమయింది. ఆయన మార్పువైపు చూపుసారించడం గమనిస్తాం. ఈ నవలలో సీ్త్రల సమస్యలు, కులసమీకరణలు, జాతీయవాదం చర్చకు వచ్చాయి. అందువల్లే ఈ నవలకు ప్రాముఖ్యం తగ్గలేదు. సంప్రదాయవాదులు ఈ నవలలో టాగోర్‌ నైతిక పతనాన్ని చిత్రించారని నిందించారు. ఇప్పుడు సీ్త్రవాదులు ‘ఘర్‌ బాహిరె’ నవలలో సీ్త్ర పాత్రలను ’ఖీడఞజీఛ్చిజూజూడ ఝ్చఛ్ఛీ జ్ఛఝజీుఽజీట్ట’ అని తేలిక చేయడం కూడా లేకపోలేదు. టాగోర్‌ ఈ నవలను, కధలను రాసిన కాలాన్ని గుర్తుచేసుకుంటే ఆయన తన రచనల్లో సీ్త్రలు పడ్డ సంఘర్షణను, బాధలను, అనుభవించిన దుఃఖాన్ని, వాటి మూల కారణాలను విశ్లేషించారనిపిస్తుంది. సమస్త మానవాళిలోని మంచి తనాన్ని తన తాత్వికతలో సంలీనం చేసుకొని రచనల ద్వారా అభివ్యక్తం చేశారని తోస్తుంది.
– కాళిదాసు పురుషోత్తం
9247564044
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అద్భుత మానవతా వాడి గణేష్ పాత్రో -గొల్లపూడి

చిత్రసీమ హైదరాబాద్‌ రావడానికి నేనూ కారణమే- దాసరి

‘‘సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిరావడానికి తానే కారణమని ఒకాయన చెప్పుకున్నాడు. చెప్పింది పెద్దాయన కాబట్టి అందరూ నమ్మారు. స్టూడియోలు కట్టామన్నారు. వాటిని ప్రజల కోసం కట్టారా? వాళ్ల కోసం కట్టుకున్నారు. అంతా తామే చేశామని చెప్పుకునేవారి వల్ల చరిత్ర మరుగునపడిపోతుంది. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు రావడానికి దాసరి కూడా ఒక కారణమన్న వాస్తవం వెలుగులోకి రాకుండా పోయింది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు రచించిన ‘ఒకే ఒక్కడు.. యశస్వి ఎస్వీ రంగారావు’ పుస్తకావిష్కరణ ఆదివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. యువకళావాహిని ఆధ్వర్యంలో సారిపల్లి కొండలరావు సారథ్యం వహించిన ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించగా, కైకాల సత్యనారాయణ స్వీకరించారు. తొలి ప్రతిని బీఏరాజు దంపతులు, మలి ప్రతిని సురేష్‌ కొండేటి కొనుగోలు చేశారు. దాసరి మాట్లాడుతూ ‘‘ఎస్వీ రంగారావుగారి గురించి రామారావు రాసిన ఈ పుస్తకం మంచి ప్రయత్నం. థియేటర్లను కబ్జా చేసినట్టుగా చరిత్రను కూడా కబ్జా చేశారు. చరిత్ర కనుమరుగు కావడానికి వీల్లేదు. ఎస్వీఆర్‌ నాకు దేవుడు. ఆయన లేకపోతే నా తొలి సినిమా ‘తాతామనవడు’ లేదు’’ అని అన్నారు. కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘సంభాషణలు పలికే విధానంలో ఎన్నో మెళకువలు నేర్పారు ఎస్వీఆర్‌. ‘సంసార సాగరం’ సినిమా చూసి ‘నా అసలైన వారసుడివి’ నువ్వేనన్నారు. పద్మా అవార్డ్‌లు ఆయనకు రాలేదని అంటున్నారు. లాబీయింగ్‌తో వచ్చే పద్మ అవార్డ్‌లు ఎన్ని ఇచ్చినా ఆయనకు తక్కువే’’ అని తెలిపారు. ‘‘మహాభారతానికి ఓ కృష్ణుడు ఉన్నట్టు తెలుగు సినిమా పరిశ్రమకు ఒకడే ఎస్వీఆర్‌. తెలుగు జాతి సంపద ఎస్వీఆర్‌’’ అని బ్రహ్మానందం కొనియాడారు. ఈ పుస్తకానికి దాసరిగారే టైటిల్‌ను సూచించారని పుసుపులేటి రామారావు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సి.కృష్ణవేణి, ఆర్‌.నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ, గీతాంజలి, మాదాల రవి తదితరులు పాల్గొన్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రామ నారాయణం-అన్జాట శిల్పి రా పాలెట్-పాంచాలి పుట్టినిల్లు-ఈ మేకప్ వేరయా

makeup1 001 makeup2 001 makeup3 001 panchali 001 rama narayanam 001 raw palet 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కెసిఆర్ రాజకీయం ఒక పజిల్

కెసిఆర్ రాజకీయం ఒక పజిల్

తెలంగాణ వచ్చేదా? చచ్చేదా? ప్రారంభంలో నిర్లక్ష్యంగా వినిపించిన మాట. కొంత కాలం గడిచిన తరువాత ఆందోళన నిండిన స్వరంతో వస్తుందంటా? అనే మాట వినిపించింది. తీరా వచ్చిన తరువాత సరే సాధించుకున్నారు కదా చూద్దాం ఏం చేస్తారో? భయటకు వినిపించకుండా మనసులోనే అనుకున్న స్వరం. ఒకటిన్నర దశాబ్దాల కాలంలో తెలంగాణ గురించి వివిధ సందర్భాల్లో వినిపించిన స్వర సమ్మేళనమిది. అసాధ్యం అనుకున్న లక్ష్యం కాస్తా సాకారం అయింది. తెలంగాణ పురుడు పోసుకొని తొమ్మిది నెలలవుతోంది. తెలంగాణ ఉద్యమం అర్థం కానట్టే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజకీయ ఎత్తుగడలు సైతం అర్థం కాని పజిల్. ఒకవైపు తొమ్మిదేళ్ల పాలనానుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు , ఇటువైపు మంత్రిగా కొద్దికాలం, ఉద్యమ నాయకుడిగా దశాబ్దన్నర కాలం అనుభవం ఉన్న కెసిఆర్. ఏం పాలిస్తాడు చూద్దాం అని మనసులోనే అనుకున్నవారు ఊహించని విధంగా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలకుడిగా తనను తాను నిరూపించుకుంటున్నారు.
రాజకీయ నాయకుల్లో సరుకు ఉంటే తప్ప ఐఎఎస్ అధికారులు పట్టించుకోరు. పైకి సార్ సార్ అంటూ మంత్రులను గౌరవించినా, వారిలో విషయ పరిజ్ఞానం లేకపోతే అస్సలు పట్టించుకోరు. కెసిఆర్‌లో ఇలాంటి సరుకు ఐఎఎస్‌లు సైతం రాముడు మంచి బాలుడు టైపులో వినయంగా పని చేయక తప్పని స్థాయిలో ఉంది. ఏ అంశంపైనైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసి సాధికారికంగా మాట్లాడడం కెసిఆర్ నైజం. ఉద్యమ కాలంలోనైనా ముఖ్యమంత్రిగా నైనా ఈ విధానంలో మార్పు లేదు.
14ఏళ్ల ఉద్యమం. ప్రజలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, లెఫ్టిస్ట్‌లు, రైటిస్ట్‌లు అనే తేడా లేకుండా తెలంగాణకు చెందిన వారంతా ఉద్యమ బాట పట్టారు. అయితే ఉద్యమానికి అనుకూలంగా కావచ్చు లేదంటే ఉద్యమానికి వ్యతిరేకంగా కావచ్చు, కానీ తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమంతో మమేకమయ్యారు. ఈ సమయంలో ఎంతో మంది కెసిఆర్‌తో సన్నిహితంగా మెదిలారు.
ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే పక్కన ఓ పీట వేసుకుని పాలనలో చేదోడు వాదోడుగా ఉందామని కలలు కన్న వారి సంఖ్య తక్కువేమీ కాదు.
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ఒక్కసారిగా మారిన కెసిఆర్‌ను చూసిన వారు అతి సన్నిహితులు సైతం విస్తుపోయారు. ఆయన చేతిలో సంతకం చేసే పెన్నుగా మారిపోదామనుకుని కలలు కన్న వారికి ధర్మదర్శనం కూడా దక్కని పరిస్థితి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి ఎవరు అధికారంలోకి వచ్చినా మమ్ములను ప్రసన్నం చేసుకోందే రోజు గడవలేదు. ఎక్కడికి వెళతాడు చూద్దాం అనుకున్న వారు సైతం రోజులు గడిచిన కొద్ది డీలా పడిపోయారు. పిలుపు రాకపోవడంతో తామే చొరవ తీసుకుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించినా ఫలించలేదు.
ఇలాంటి ప్రయత్నాలను చూసినప్పుడు ముఖ్యమంత్రి అహంకారంతో అందరినీ దూరంగా పెట్టాడనుకుంటే పొరపాటు. ఎంతో సన్నిహితంగా మెదిలిన మహామహులను సైతం దూరంగా పెట్టిన అదే కెసిఆర్ ఎక్కడో మారుమూల పల్లెలో నివసించే సాధారణ రైతును పేరు పెట్టిపిలుస్తాడు. అప్పుడే మరిచిపోయావా? మనం గతంలో కలిశాం మీది పలానా ఊరు కదూ అంటూ సామాన్యుడిని పలకరిస్తాడు. మరో రైతును ఇంటికి పిలిచి కలిసి భోజనం చేసి తన కారులోనే సచివాలయానికి తీసుకు వచ్చి అధికారులను, మంత్రులను పరిచయం చేస్తారు.
కెసిఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో రైతులు సమస్యలు చెబుతుంటే ఒక రైతు లేచి ట్రాన్స్‌ఫార్మర్ల సమస్య చెబుతుంటే ముఖ్యమంత్రి అతన్ని గుర్తు పట్టి మీద దొంగల రామారం గ్రామం కదూ అంటూ అతని గురించి చెప్పుకొచ్చారు. సాగునీటి కోసం తన పొలంలో 64 బోర్లు వేసి చివరకు ఆయన పేరే బోర్ల రామిరెడ్డిగా స్థిరపడింది. నల్లగొండ జిల్లాకు చెందిన బోర్ల రామిరెడ్డి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే కెసిఆర్ ఏకంగా రామిరెడ్డితో పాటు ఆ గ్రామస్తులను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి, కలిసి భోజనం చేసి తన కారులోనే సచివాలయానికి వెళ్లారు. అధికారులు, మంత్రులను పిలిచి రామిరెడ్డి చెప్పిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఒకవైపు ఉద్యమ కాలంలో పెద్దపీట వేసిన వారిని పెద్దగా పట్టించుకోని వైఖరి మరోవైపు సామాన్యులకు చేరువ కావడం.
తానో పజిల్‌లా ఎదుటి వారికి అర్థం కాకుండా ఉండడం కెసిఆర్‌కు అలవాటు. దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ప్రాణాలు పోయినా సరే ఎర్రగడ్డ ఆస్పత్రిని వదిలేది లేదని నినాదాలు చేశారు. ఇదో మహోద్యమంగా మారుతుందని విపక్షాలు ఎంతో ఆశలు పెట్టుకున్నాయి. ఆస్పత్రి ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. టిబి ఆస్పత్రి ఉండాల్సింది ఊరవతలనే.. కెసిఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని మీడియా ముందుకు వచ్చి కితాబు ఇచ్చారు.
సచివాలయంలో జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు అంటూ మీడియాకు సమాచారం లీకు ఇచ్చారు. మీడియా ఈ వార్తకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇంకేం కెసిఆర్ చేతికి చిక్కాడు అంటూ అవకాశం కోసం కాచుకుని కూర్చున్న టిడిపితో పాటు వ్యతిరేక శక్తులన్నీ మహోద్యమానికి సన్నద్ధం అయ్యాయి. కనీసం 24 గంటలు కూడా గడవకముందే అదే జర్నలిస్టులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకునేట్టు చేశారు. మీకేం కావాలో, నిబంధనలు ఎలా ఉండాలో మీరే చెప్పండి చేయడానికి నేను సిద్ధం అంటూ తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చినంతగా చెప్పేశారు. ఇళ్లు, హెల్త్ కార్డులు, కుటుంబ సంక్షేమం సాధారణ జర్నలిస్టులు ఇంత కన్నా కోరేదేముంటుంది. ప్రాజెక్టులు, ప్రభుత్వ ఆదాయంలో వాటాలు కోరుకునే బడా జర్నలిస్టుల సంగతి పక్కన పెడితే వృత్తినే నమ్ముకున్న సాధారణ జర్నలిస్టులు ఇంత కన్నా ఏం కోరుకుంటారు. జర్నలిస్టులతో కలిసి ఉద్యమం నడపాలని సన్నాహాలు చేసుకున్న వర్గాలకు ముఖ్యమంత్రి కానుక తీవ్ర నిరాశను కలిగించింది.
ఏ వర్గానికి ప్రయోజనం కలిగించదలిచారో ముందు ఆ వర్గం నుంచి వ్యతిరేకత కొని తెచ్చుకోవడం కెసిఆర్‌కు ఓ సరదా! అంతకు ముందు మెట్రో రైల్ యజమాన్యంతో కలిసి ఆందోళన చేద్దాం అనుకున్న వర్గాన్ని సైతం ఇదే విధంగా నిరాశ పరిచారు. హరిత హారం, చెరువుల పూడిక తీసివేత వంటి వినూత్న పథకాలే కాదు చివరకు పిఆర్‌సిని సైతం అనుభవజ్ఞులైన పాలకుడు కాపీ కొట్టేట్టు చేయడంలో కెసిఆర్ విజయం సాధించారు.
ప్రత్యర్థి ఒక వ్యూహంతో దాడికి సిద్ధంగా ఉంటే సరిగ్గా దానికి భిన్నంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రత్యర్థులకు ఆయుధమే లేకుండా చేయడంలో కెసిఆర్‌ది అందెవేసిన రాజకీయం. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లపై ఆధారపడి విపక్షాలు వ్యూహాలు రూపొందించుకుంటే… హైదరాబాద్‌లో ఉన్న వారంతా హైదరాబాదీలే, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అంటూ వారికి భరోసా ఇస్తారు. ఉద్యమ నేత వాళ్ళూ మా వాళ్లే అంటే, వాళ్ల ఓట్లను నమ్ముకున్న విపక్షాలు కాదు కానే కాదు వాళ్లు సెటిలర్సే అనాల్సిన పరిస్థితి కల్పించారు. ఈ ఎత్తుగడ ఎంత వరకు ఫలిస్తుందో కానీ విపక్షాలకు ఈ రాజకీయం మింగుడు పడడం లేదు.
కెసిఆర్ మీడియాతో సన్నిహితంగా ఉన్నారా? ఉద్యమ నాయకులను గౌరవిస్తున్నారా? సామాజిక వర్గాల వారీగా ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? మంత్రిని తొలగించడం సబమా? ఎన్‌డిఏలో చేరుతారా? ఎంఐఎంతో సన్నిహితంగా మెదులుతారా? బిజెపితో జత కడతారా? ఏం చేస్తే ఏమవుతుంది అనే లెక్కలు విమర్శకులకు అవసరమే. విపక్షాలకూ అవసరమే. కానీ సామాన్య ప్రజలకు ఈ లెక్కలను పెద్దగా ఖాతరు చేయరు. తెలంగాణ ఏర్పడితే ఏ ప్రయోజనం కలుతుందని సామాన్యులు ఆశలు పెట్టుకున్నారో అవి నెరవేరితేనే కెసిఆర్ విజయానికి అర్థం. సామాన్యులు ఆశించింది, వారికి కావలసింది తమ పరిస్థితి మెరుగు పడడం. ఇప్పటి వరకు ప్రణాళికలు రూపొందించారు. ఇక వాటి అమలు జరగాలి.
కాంగ్రెస్‌కు బలమైన నాయకుడే లేడు. టిడిపికి సీమాంధ్ర పార్టీ అనే ముద్ర చాలు. ప్రత్యర్థుల బలహీనతల వల్ల కెసిఆర్ రాజకీయంగా ఎదురు లేదు. భవిష్యత్తులో సైతం ఆయన విజయానికి ఢోకా ఉండక పోవచ్చు. కానీ అది తెలంగాణ ప్రజలకు సంతృప్తినిచ్చే విజయం కాబోదు. ఇంటింటికి తాగునీరు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఆసరా వంటి పథకాలు విజయవంతంగా అమలు చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్శించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం, చెప్పినట్టుగా ప్రతి చేనుకు నీరు అందించడం, విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా మార్చడమే కెసిఆర్ పాలనకు నిజమైన విజయం. ఈ మాటలు నిజమైనప్పుడే సాధించిన తెలంగాణకు అర్థం. అంతే తప్ప ఎవరెవరికో పదవులు కట్టబెట్టడం, ఏదో కొంత మందిని సంతృప్తి పరచడం కాదు. ఈ విజయాల సాధనకు నడుం బిగించడం ముఖ్యం. ఉద్యమ సమయంలో లెక్కలేనన్ని చిల్లర ఆరోపణలు చేసినా తెలంగాణ కోరుకునే వారు మాత్రం కెసిఆర్ నాయకత్వానే్న విశ్వసించారు. హుస్సేన్ సాగర్ మురికి ప్రక్షాళనను సైతం సహించ లేదని విమర్శిస్తున్నారు. ఉద్యమ సమయంలోనే పాలనా కాలంలోనైనా విమర్శలు సహజమే అంతిమంగా సామాన్య తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగాలి. ప్రత్యర్థులను మట్టికరిపించే ఎత్తుగడలు అవసరమే, కానీ ప్రజల హృదయాలను ఆకట్టుకోవడానికి ఎత్తుగడలు, షార్ట్‌కట్‌లను నమ్ముకోవద్దు ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించాలి. అప్పుడే తెలంగాణ కోరుకున్న వారికి సంతృప్తి.


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్యాయంగా నిందలు పడ్డ అగ్రనేత

అన్యాయంగా నిందలు పడ్డ అగ్రనేత

  • – కె.శ్యాం ప్రసాద్ syamprasadk56 gmail.com
  • 01/03/2015
TAGS:

సైద్ధాంతిక రాజకీయాలకు మారుపేరుగా, రాజకీయ నిబద్ధతకు ఉదాహరణగా నిలిచిన బంగారు లక్ష్మణ్ స్వర్గస్తులై ఒక సంవత్సరం పూర్తయింది. 2014, మార్చి 1న తీవ్ర అస్వస్థతతో భాగ్యనగర్‌లో స్వర్గస్తులయ్యారు.
బంగారు లక్ష్మణ్ పేరు చెప్పగానే వారికి సన్నిహితంగా మిగిలిన వ్యక్తుల్లో వున్న వ్యక్తిత్వ చిత్రానికి టి.వి ఇతర ప్రసార మాధ్యమాలలో జరిగిన ప్రచారం కారణంగా సాధారణ ప్రజానీకంలో గల వ్యక్తిత్వ చిత్రానికి భిన్నమైన రూపాలు కల్పిస్తాయి. కేవలం పత్రికలుచూసి సాధారణ ప్రజలకు బంగారు లక్ష్మణ్ పేరు చెప్పగానే తెహెల్కా ఆపరేషన్‌లో కేవలం ఒక లక్ష రూపాయలు తీసుకుంటున్న నేతగా గుర్తిస్తారు. ఈ ఆరోపణల కారణంగా పార్టీ నిర్ణయం మేరకు పార్టీ జాతీయాధ్యక్షునిగా రాజీనామా చేసారు. తిరిగి వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. సుమారు 12 సంవత్సరాలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. జిల్లా కోర్టులో శిక్ష పడిన కారణంగా సుమారు ఆరు నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
తనకు రక్షణ శాఖలో ఎవరితోను సన్నిహిత సంబంధాలు లేవని వారు స్పష్టంగా పలకడం తెహెల్కా టేపులో వినపడుతుంది. తీసుకున్న లక్ష రూపాయలకు పార్టీ జారీ చేసిన రసీదునుకూడా కోర్టు ముందుంచారు. ఏ సందర్భంలోను రక్షణ శాఖకు ఎటువంటి సిఫార్సు చేయలేదు. ఆ సమయంలో వారు మంత్రిగా లేరు. కేవలం పార్టీ జాతీయాధ్యక్షునిగా మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ వారికి జిల్లా కోర్టులో శిక్ష పడింది. పడక మంచంలో కోట్ల రూపాయలతో పట్టుబడిన మాజీ కేంద్రమంత్రికి చాలా త్వరలోనే బెయిలు వచ్చింది. అవినీతి ఆరోపణలకు గురైన లాలు ప్రసాద్ యాదవ్‌కు చాలా తక్కువ రోజుల్లోనే బెయిల్ వచ్చింది. అయితే బంగారు లక్ష్మణ్ జైలులో ప్రవేశించిన ఆరు నెలల వరకు బెయిలుపై జడ్జి వాదనలే వినలేదు. బెయిల్ దరఖాస్తుపై వాదనలు లేకుండానే వాయిదాలు పడుతూ వచ్చాయి. ఆరు నెలల తరువాత వాదనలకు అవకాశం కల్పించిన తరువాత వారికి బెయిలు వచ్చింది. జైలులో ఏకాంతంగా గడపడం, అవాస్తవ ఆరోపణలపై తనపై జరిగిన దుష్ప్రచారం, ఆరోపణలకు గురైన సమయంలో ఆప్తులు పార్టీవారు తగురీతిలో అండగా నిలవకపోవడంపై లక్ష్మణ్ ఎంతో వేదనకు గురయ్యారు. శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగిపోయారు. గతంలో ఆయనకు గుండె ఆపరేషన్ జరిగినా మంచి ఆరోగ్యవంతమైన శరీరం. ఈ జైలు జీవితం కారణంగానే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విడుదలైన కొద్ది కాలానికి తీవ్ర అస్వస్థతకు గురై తనువు చాలించారు.
లక్ష్మణ్‌జీతో సన్నిహితులైన వ్యక్తులకి వారిపట్ల గల చిత్రం భిన్నమైంది. మృదు స్వభావం, జ్ఞాన తృష్ణ, నిరంతర అధ్యయనం, ఆచి తూచి మాట్లాడడం, ఆంగ్లం, హిందీ, తెలుగు భాషల్లో వక్తృత్వము, ఎవ్వరినీ నొప్పించని స్వభావము, లోతైన సిద్ధాంతపరమైన విషయాలను సైతం సరళంగా అందరికీ అర్ధమయ్యే భాషలోచెప్పగల నేర్పు ఇలా ఎన్నో సుగుణాలు ఆయనలో కనపడతాయి.
17 మార్చి 1939న లక్ష్మణ్ భాగ్యనగర్‌లో ఆర్థికంగా ఒక చిన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి నర్సింహ వాటర్ వర్క్స్ విభాగంలో చిన్న కార్మికుడు. 1950లో హైస్కూల్ విద్యార్థిగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఆయన చేరారు. ఒకపక్క విద్యాభ్యాసం, మరోపక్క ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా దేశభక్తికి సంబంధించిన పాఠాలు నేర్చుకున్నారు. వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ బిఏ, ఎల్‌ఎల్‌బి పూర్తి చేసారు. హైదరాబాద్ నగర శాఖకు ఆర్‌ఎస్‌ఎస్ నగర బౌద్ధిక్ ప్రముఖ్‌గా పనిచేసారు. చిన్నప్పటినుండి తెలివైన విద్యార్థి. విద్యుత్ శాఖలో ఏజిస్ కార్యాలయంలో, రైల్వే శాఖలో ఉద్యోగాలు చేసారు. భారతీయ జనసంఘం పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జనసంఘ పూర్తిసమయ కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో జనసంఘానికి బలమైన పునాది వేసిన వారిలో లక్ష్మణ్‌జీ ఒకరు. 1971లో నెల్లూరు లోక్‌సభ రిజర్వు స్థానంనుంచి పార్టీ ఆదేశాల మేరకు వారు పోటీ చేసేవరకు వారు దళిత వర్గానికి చెందిన వారని ఆర్‌ఎస్‌ఎస్‌లోను, భారతీయ జనసంఘంలోను ఆప్తులు సైతం తెలియదు.
ఎన్నికల్లో ఓటమి ఖాయం అని తెలిసినప్పటికీ పార్టీని బలోపేతం చేయడం దృష్ట్యా పోటీ చేయమన్నప్పుడల్లా బంగారు లక్ష్మణ్ పోటీ చేసారు. 1971లో నెల్లూరునుండి 1978లో పెద్దపల్లి పార్లమెంటునుండి 1992లో నంద్యాల పార్లమెంటు నుండి 2004లో రాజస్తాన్‌నుండి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 1984లో స్థానిక సంస్థలనుండి ఎమ్‌ఎల్‌సిగా ఆంధ్రప్రదేశ్‌నుండి ఎన్నికైన కొన్ని నెలలకే కౌన్సిల్ రద్దయింది.
1996లో గుజరాత్‌నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న సమయంలో పార్టీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించారు. నాగపూర్ జాతీయ కౌన్సిల్ సమావేశంలో జాతీయ అధ్యక్షులుగా బంగారు లక్ష్మణ్ చేసిన ప్రసంగం దేశంలోని దళిత మైనార్టీ వర్గాలను ఎంతో ఆకట్టుకుంది. ఎంతోకాలంగా పార్టీకి దూరంగా వున్న ఈ వర్గాలు పార్టీకి సన్నిహితం కావడం ప్రారంభమైంది. లక్ష్మణ్‌జీ వ్యక్తిత్వం, వక్తృత్వం కారంగా దేశవ్యాప్తంగా దళిత వర్గాలు బిజెపి పట్ల విశేష ఆసక్తిని కనిపించడం ప్రారంభించారు. ఈ సందర్భంలో అధికారంలో వున్న బిజెపిని బలహీనం చేయడంలో ఒక కుట్రగా తెహెల్కా స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించబడింది. రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌పై ఆరోపణలు వచ్చినా ఆయన పదవిలో కొనసాగారు. ఫెర్నాండెజ్‌ను కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వంలోని నాయకులందరు అండగా నిలిచారు. కానీ ఇటువంటి సమర్ధన పార్టీ నాయకత్వంనుండి, కేంద్ర ప్రభుత్వంనుండి బంగారు లక్ష్మణ్‌కు లభించలేదు.
తెహెల్కా అనంతరం రాజకీయంగా తనను దూరంగా వుంచుతున్నారని ఆయన సన్నిహితుల వద్ద అప్పుడప్పుడు ఆవేదనను వ్యక్తం చేసినా ఆయన ఏనాడూ పార్టీకి, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా బయట ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇతర పార్టీలలోని ప్రముఖ దళిత నాయకులు ఆయనను దగ్గరకు తీయాలని, బిజెపినుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేసినా, పదవులు ఆశ చూపినా ఆయన ఏనాడూ దారితప్పే ప్రయత్నం చేయలేదు. పైగా పార్టీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో వ్యక్తిగత రాగద్వేషాలకు తావులేకుండా ఆయా నాయకులపట్ల సానుభూతితో మాట్లాడేవారు. వారు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల పట్ల సానుభూతి వ్యక్తం చేసేవారు.
ఆంధ్రప్రదేశ్ జనసంఘ శాఖ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షునిగా, జాతీయ కార్యదర్శిగా, దళిత మోర్చా జాతీయ అధ్యక్షునిగా, జాతీయ ఉపాధ్యక్షునిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా వివిధ బాధ్యతలలో పార్టీ బలోపేతం కోసం పనిచేసారు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసి జైలుజీవితం గడిపారు.మంత్రాలయంలో ఒక శాసనసభ్యుని ప్రవేశం సందర్భంగా అవమానానికి గురైన సంఘటనలో, చుండూరు, కారంచేడు, పొదిరికుప్పం ఘటనలలో దళితులపై జరిగిన దాడి సందర్భాలలో పార్టీలోపలా బయటా దళితుల సమానత్వం కోసం హక్కుల కోసం ఆయన ఎంతో చొరవ చూపించారు. దళిత గిరిజన వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళికను కేంద్రంలో వివిధ రాష్ట్రాలలో సక్రమంగా అమలు కావాలని ప్రైవేటు రంగంలోరిజర్వేషన్లు కావాలని పార్టీలోపల అభిప్రాయం కూడగట్టారు. ఎన్‌డిఏ అధికారంలోవున్న సమయంలో ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం విజయవంతం కృషి చేసారు.లక్ష్మణ్ అవాస్తవ ఆరోపణలకు గురై ఆవేదనతో అకాలంగా మరణించారని, లక్ష్మణ్‌జీ అసువులు బాసిన తర్వాత కూడా కేసును కొనసాగించి లక్ష్మణ్‌జీపైనున్న అవినీతి ఆరోపణలన్నీ అవాస్తవమని కోర్టులో నిరూపించడమే లక్ష్మణ్‌జీకి నిజమైన నివాళి.


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ కామెంట్స్‌ విని ఏడ్చాను.. యాంకర్ shilpa chakro borti

ఆ కామెంట్స్‌ విని ఏడ్చాను..

‘‘ఎందుకయ్యా ఈ బెంగాలీ అమ్మాయిని తీసుకొచ్చి మాకు అంటగట్టారు. ఆమె వచ్చీరాని తెలుగులో నటిస్తుంటే చూడలేక చచ్చిపోతున్నాము’’ అని అవమానాలు ఎదుర్కొన్న ఈ బెంగాలీ శిల్పా చక్రవర్తి.. అచ్చుపోసిన ఆరణాల ఆడపడుచులా యాంకరింగ్‌లో ఎలా మెరిసిపోయారు? పదిహేనేళ్లపాటు అన్ని ఛానళ్లు, ఫంక్షన్లు, సినిమాల్లో ఎలా దూసుకుపోతున్నారు? శిల్ప ఇంటర్వ్యూ మొదలుపెట్టగానే తనదైన శైలిలో గలగలా మాట్లాడారు..
‘‘నాన్నకి ట్రాన్స్‌ఫర్‌ వచ్చినప్పుడల్లా నివసించే ప్రాంతం మారేది. నా స్కూలూ మారేది. నేను ఆరోతరగతిలో ఉండగా మొత్తానికి హైదరాబాద్‌లో కుదురుగా సెటిల్‌ అయ్యాం. తార్నాకలోని రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. హైదరాబాద్‌లో కేవలం ఉద్యోగ నిమిత్తమనీ, ఎప్పటికైనా కోల్‌కతాకు వెళ్ళాల్సిందేనని మాట్లాడుకునేవారు. అందుకే అమ్మానాన్నలు ఇక్కడ ప్రాపర్టీలు ఏవీ కొనలేదు. దీంతో పాటు స్కూల్‌లో నాకు తెలుగు ఆప్షన్‌ ఎంచుకోకుండా చేశారు. ఇక మా ఏరియాలో అన్ని వసతులు ఉండేవి. అదో మినీ ప్రపంచం. అదృష్టమేంటంటే కోల్‌కతాలో నేను స్టార్ట్‌ చేసిన కథక్‌ నృత్యం హైదరాబాద్‌లో కంటిన్యూ చేసే అవకాశం దక్కడం. ఇక ఆరు నుంచి పదో తరగతి వరకూ రైల్వే మిక్స్‌డ్‌ స్కూల్లో చదివాను. చదువుపై ఆసక్తి లేదు. అయితే ఇంట్లో వాళ్ళు తిడతారనీ, క్లాసులో క్లవర్‌ అనిపించుకుంటే విలువ ఉంటుందనే ఉద్దేశంతో బాగా బట్టీపట్టి చదివేదాన్ని. అన్నట్లు స్కూల్‌లో వక్తృత్వపోటీ, డిబేట్స్‌లో మనమే క్వీన్‌. ఇక నేను అథ్లెట్‌ని కూడా. లాంగ్‌జంప్‌, మారథాన్‌లో పాల్గొనేదాన్ని. ఇలా హైదరాబాద్‌లో నా బాల్యం హాయిగా సాగింది. ఓసారి జరిగిన కామెడీ నాకిప్పటికీ గుర్తు. స్టేజ్‌పై కథక్‌ నృత్య ప్రదర్శన చేస్తున్నానప్పుడు. హఠాత్తుగా నా విగ్‌ జారిపోయి ఎగిరి జనాల మీద పడింది. విచిత్రమేంటంటే ఆ ప్రోగ్రామ్‌కు ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన దగ్గర విగ్గు పడటం. ఆ సంఘటన తల్చుకున్నప్పుడల్లా నవ్వు ఆగదంటే ఆగదు.
ఆసుపత్రి కెక్కిన ‘వన్‌ సైడ్‌ లవ్‌’ …
ఇంటర్‌లో ఎం.పి.సి. బాధ తాళలేక బీకామ్‌ జంప్‌ అయ్యా. తర్వాత హాయిగా అనిపించింది. ఇక ఇంటర్‌మీడియట్‌లో నాకెవరూ ప్రపోజ్‌ చేసే సాహసం చేయలేదు. ఎందుకంటే మా అన్నయ్య నాకంటే ఐదేళ్ళు సీనియర్‌. పైగా నన్ను కాలేజీలోని క్లాస్‌ దగ్గరివరకూ తీసుకొని వచ్చేవాడు. క్లాస్‌ అయిపోయాక తీసుకెళ్ళేవాడు. అదీ సంగతి. ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఓ రోజు క్లాసులో పాఠం వింటున్నాను. మా ప్రిన్సిపాల్‌ రమ్మని పిలిస్తే వెళ్లాను. ‘ఏంటమ్మా ఇది?’ అన్నారు ఆయన సీరియ్‌సగా. నాకర్థం కాలేదు. ‘దేని గురించి సర్‌’ అని అడిగా. ‘నీ ప్రేమ కోసం ఇద్దరు బాస్కెట్‌బాల్‌ ప్లేయర్స్‌ బాగా దెబ్బలాడుకున్నారు. పెద్ద గాయాలతో వారిద్దరూ ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నారు’ అన్నారు. వారి గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదని బయటికొచ్చా. విషయమేంటంటే… బాస్కెట్‌ బాల్‌ ఆడే సమయంలో ఓ అబ్బాయి మరో అబ్బాయితో ‘శిల్పని లవ్‌ చేస్తున్నా… తను నా లవర్‌’ అన్నాడట. రెండో అబ్బాయి ‘నా లవర్‌ని లవ్‌ చేస్తావా?’ అని గొడవేసుకున్నాడట. అలా పీక్‌ స్టేజ్‌లో వారి వన్‌ సైడ్‌లవ్‌ హాస్పిటలైజ్‌ అయ్యింది. ఆ ఏజ్‌లో మొదట గిల్టీగా ఫీలయ్యా, బాధపడ్డా… ఆ తర్వాత ఫ్రెండ్స్‌ అందరూ శిల్ప కోసం ఇద్దరు అబ్బాయిలు ప్రాణాల్ని లెక్కచేయలేదనీ, మాకోసం అంతసీన్‌ లేదనేవారు.
అలా వచ్చింది అవకాశం..
డిగ్రీలో ఉన్నప్పుడు కల్చరల్‌ యాక్టివిటీస్‌ కోటాలో నన్ను రైల్వే ఆఫీసర్‌ చేద్దామనుకున్నారు మా పేరెంట్స్‌. నాకిష్టం లేదు. ససేమిరా అన్నాను. అయినా సరే దరఖాస్తు చేయించారు. పరీక్షలో భాగంగా కథక్‌ నాట్య ప్రదర్శన ఇచ్చా. సరిగ్గా ఆ ఏడు ఎక్కువ మంది కల్చరల్‌ యాక్టివిటీస్‌ కోటాకి హాజరుకావటంతో సంబంధిత రైల్వే అధికారులు ‘రెండేళ్ళ తర్వాత ఈ కోటాలో రిక్రూట్‌ చేసుకుంటాం’ అన్నారు. హమ్మయ్య అనుకున్నా. ఎప్పటిలాగే డిగ్రీలో ఉండగా హైదరాబాద్‌లోని బెంగాళీల కోసం ప్రత్యేకంగా ఉండే ‘బంగయా సాంస్కృతిక సంఘం’ ఆధ్వర్యంలో కథక్‌ ప్రదర్శన ఇస్తుండగా, ఆ ప్రోగ్రామ్‌ని కవర్‌ చేయటానికి వచ్చిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ రిపోర్టర్‌ హిందీలో పరిచయం చేసుకున్నారు. అలా యాంకరింగ్‌ అవకాశమొచ్చినప్పుడు నేను తటపటాయిస్తుంటే ‘వచ్చిన అవకాశం వదులుకోకు’ అన్నారు పేరెంట్స్‌. ఛానెల్‌ ఆఫీసుకి వెళ్లాను. కెమెరా ముందు చాలా ఫ్రీగా మాట్లాడా. ప్రోగ్రామ్‌ స్టార్ట్‌ చేసినపుడు తప్పక పిలుస్తామన్నారు. అన్నట్లే పిలుపొచ్చింది. తెలుగు పలుకులు పలుకుతూ సంతూర్‌ టాప్‌ 10, డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌, మేటి చిత్రాలు ప్రోగ్రామ్స్‌ని లాగించాను.
తిట్టే నా గెలుపుకు తొలిమెట్టు!
భాష రాకున్నా నేను ఎలాగైనా టేక్‌ ఓకే చేయాలని యాంకరింగ్‌ చేసేదాన్ని. స్ర్కీన్‌పై బాగా కనిపించినా, ఫేస్‌లో అసలు ఫీలింగ్‌ పలికేది కాదు. ప్రతి యాంకర్‌ పార్ట్‌కీ ముప్పయి టేకులకి పైగా తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ స్టూడియోలోనే ఉండేదాన్ని. పాపం… నా యాంకరింగ్‌ అంటూనే కెమెరా వాళ్ళు భయపడేవాళ్ళు. ఆ సమయంలో కెమెరామెన్‌ల ముఖాల్లో సంతోషం కనిపించినప్పుడే నేను సక్సెస్‌ అయినట్లు భావించా. టీవీలో కనిపించటం వల్ల త్వరగా ప్రేక్షకులకి దగ్గరయ్యా, దీంతో సీరియల్స్‌లోనూ అవకాశాలు వచ్చాయి. మద్రాసులో బాలాజీ టెలిిఫిలింస్‌ వారి ‘కంటే కూతుర్ని కనాలి’ సీరియల్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఆ సీరియల్‌లో కోమాలిక అనే పాత్ర పోషించా. డైలాగ్స్‌ చెప్పలేక చాలా టేక్స్‌ తీసుకున్నా ఓ ఎపిసోడ్‌కి. ఆ సీరియల్‌ కో-డైరక్టర్‌ ‘ఎందుకండీ తెలుగురాని వాళ్ళని మాకు అంటగట్టి చంపుతారు? అసలు తెలుగు వాళ్లే లేనట్లు ఈ బెంగాళీ అమ్మాయిని మా మొహాన పడేశారు’ అంటూ యాభైమంది ముందు సెట్లో తిట్టేశారు. కళ్ళెంబడీ నీళ్లు దిగాయి. ఏడుస్తూ నా గదిలోకి వెళ్లా. బయటికి రావాలనిపించలేదు. సిగ్గుగా అనిపించింది. మళ్లీ టేక్‌ కోసం పిలిచారు. ఆ ఏడుపు మొహాన్ని కవర్‌ చేసుకుని నటించా. టేక్‌ ఓకే అయ్యింది. ఆ రోజు రాత్రి బాధపడ్డా. తర్వాతి రోజు నుంచి సెట్‌లో అందరితో తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసేదాన్ని. కొంచెం కొంచెం మాట్లాడుతూ చదవటం త్వరగా అలవాటు చేసుకున్నా.
యాంకరింగ్‌లో బిజీగా ఉండే రోజుల్లో ఇ.వి.వి. సత్యనారాయణ గారు హీరోయిన్‌గా అవకాశమిచ్చారు. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఓ రోజు దర్శకుడు త్రివిక్రమ్‌ కాల్‌ చేశారు. అదే ‘నువ్వే నువ్వే’ చిత్రం. చిన్న సీన్‌ అయినా నోటెడ్‌ అయ్యాను. తర్వాత ‘అందరివాడు’ చిత్రంలో నటించా. ఇప్పటివరకూ ఏడు చిత్రాల్లో నటించా. ప్రస్తుతం నాగచైతన్య మూవీలో ఓ పాత్రలో నటిస్తున్నా.
ద్వేషించిన ఆయన్నే లవ్‌ చేసి..
కళ్యాణ్‌ అనే ఇంగ్లీషు పేపరు జర్నలిస్ట్‌ నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు. ఇంటర్వ్యూ కంప్లీట్‌ అయ్యాక ‘కాఫీ కెళ్దాం’ అన్నారు. ఇలాంటివి నచ్చవన్నాన్నేను. ఆ తర్వాత రెండు, మూడు సార్లు ప్రోగ్రామ్స్‌ కోసం కాల్‌ చేశారు. నా అసిస్టెంట్‌లతో ఫోన్‌ లిఫ్ట్‌ చేయించి బిజీ అని చెప్పించే దాన్ని. బాలాజీ టెలిఫిలింస్‌ వారి సీరియల్‌ చేస్తుండగానే ఓసారి కలిశారు. ఆయన మాటల వల్ల కోప్పడి తన ఫోన్‌ నెంబర్‌ డిలీట్‌ చేశా. షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఒకాయన ‘కళ్యాణ్‌ అనే మీడియా పర్సన్‌, ముంబై మార్కెట్‌పై అవగాహన ఉన్న వ్యక్తి. అతనే మీ పేరుని నిర్మాతలకి సూచించాడు’ అన్నారు. షేమ్‌గా ఫీలయ్యా. ఆయన్ని ఎలాగైనా కలవాలనుఉని, ఆరువేల రూపాయలు పెట్టి గాగూల్స్‌ కొన్నా. వెళ్లి ఆ గిఫ్ట్‌ ఇచ్చా. అప్పుడూ ఇలాంటి చీప్‌ గాగూల్స్‌ అని తూలనాడటంతో కోపం నషాళానికి అంటింది. విషయం తెలుసుకున్న కళ్యాణ్‌ సారీ చెప్పాడు. కోపంతో స్కూటీ వేసుకొని ఇంటికొచ్చా. ఆ తర్వాత రెండు, మూడు సార్లు ఫోన్‌ చేసి కలిశా. కొన్నెళ్ళకి ప్రపోజ్‌ చేశాను. పెళ్లి చేసుకుంటా అంటే.. కెరీర్‌ గురించి ఆలోచించు.. రెండు, మూడేళ్ళు ఆగు అన్నారు పెద్దలు. గొడవలొచ్చాయి. ఇది మంచిది కాదని తలచి కళ్యాణ్‌కి ఫోన్‌ చేసి మ్యారేజ్‌ చేసుకుందాం అన్నాను. ఓ రోజు బయటికెళ్ళిపోయి ఫిల్మీస్టైల్‌లో ఆర్యసమాజ్‌కి వెళ్లి పెళ్లిచేసుకున్నా. అలా తెలుగింటి కోడలినయ్యా. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు. జీవితం హాయిగా సాగిపోతోంది..’’
– నవ్య డెస్క్‌
ఫోటోలు: ఎస్‌.మహమ్మద్‌ రఫీ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ భారత్ లక్ష్యం ,,మతం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మతమౌఢ్యం ప్రమాదకరం

మతమౌఢ్యం ప్రమాదకరం

మత సహనం లోపిస్తే భారతదేశ సమగ్రతకు ప్రమాదం ఉందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట అక్షరాలా నిజం. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, తాను మాట్లాడే మాటపై పూర్తిగా నియంత్రణ ఉన్న వ్యక్తి. ఏ మతాన్నీ ప్రత్యేకించి చెప్పకుండా అన్ని మతాలూ అలా వ్యవహరిస్తున్నాయని చెప్పాడు. మతసహనం ఎవరికి లోపించింది, అది ఎలా ప్రమాదకరం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది మన వంతు.
ఖీ.ఖి.ఉజూజీ్టౌ అనే అమెరికన్‌ కవి తాను రాసిన ఖీజ్ఛి గ్చిట్ట్ఛ ఔ్చుఽఛీ అనే పద్యంలో బృహదారణ్యక ఉపనిషత్తులోని కథను ప్రస్తావించాడు. సృష్టికర్త అయిన ప్రజాపతి వద్దకు దేవతలు, మనుష్యులు, రాక్షసులు ముగ్గురూ వెళ్లారట. ప్రజాపతి వారికి కేవలం ‘ద’ అని బోధించి పంపించాడు. ఈ ‘ద’ అర్థమేమిటో తెలుసుకోవడం వాళ్ళ వంతు అయింది. అయినా ఆ కాలంలో అంతరాత్మ ప్రబోధం, న్యాయబుద్ధి ఉన్న వాళ్లు కాబట్టి తమలో ఉన్న తప్పు ఏమిటో దాన్ని ప్రజాపతి సూచించాడని అనుకున్నారు. ‘ద’ అంటే దమము అని దేవతలు అనుకున్నారు. మేమెప్పుడూ ఇంద్రియ సుఖాల్లో మునిగి ఉంటాం. దాన్ని తగ్గించుకోమని ప్రజాపతి చెప్పాడని వారు అనుకున్నారు. ‘ద’ అంటే దానం చేయడమని మనుష్యులు అనుకున్నారు. తాము కేవలం స్వార్థపరులై ఉన్నామని ప్రజాపతి భావన అని వారు అనుకున్నారు. రాక్షసులు కూడా అలాగే న్యాయంగా ఆలోచించారు. ‘ద’ అంటే దయ. మేము ఇతరుల్ని పీడిస్తూంటాం. దాన్ని తగ్గించుకోమని ప్రజాపతి చెప్పాడని వారు అనుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు కూడా ప్రజాపతిలాగనే మాట్లాడారు. పోతే మనవాళ్ళు తమలో ఉన్న లోపాల్ని గూర్చి ఆలోచించలేదు. ఆయన చెప్పిన మాట మాకు వర్తించదు. ఇతరులకే వర్తిస్తుంది అన్నట్టుగా అర్థం తీసుకున్నారు. మత అసహనం అంటే కేవలం ప్రభుత్వ పార్టీకి మాత్రమే ఉంది. మరెవరికీ లేదు అన్నట్లు వ్యవహరించారు. భారతీయ మేధావులు వెంటనే కొరడా తీసుకుని ప్రభుత్వ పార్టీ వీపుపై బాదడం, ప్రభుత్వం ఇబ్బందికరంగా వ్యవహరించడం చూశాం.
తన మాటల్ని ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారో అమెరికా అధ్యక్షుడు గమనించాడు. ఆయన ఎంతో విజ్ఞుడు కాబట్టి తన దేశం తిరిగి వెళ్లిన వెంటనే ఒక బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగులో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ‘‘భారతదేశం ఎంతో అందమైన దేశం. ఎంతో వైవిధ్యం ఉన్న దేశం. కానీ ఇటీవల అన్ని మతాలవారూ ఇతర మతాలపై అసహనాన్ని చూపిస్తున్నారు. వీటిని చూస్తే గాంధీ మహాత్ముడు ఎంతో క్షోభ చెందేవాడు.’’ ఇంకా మాట్లాడుతూ తమ మతాన్ని గూర్చి కూడా ఇలా అన్నాడు. ‘‘ఖ్ఛఝ్ఛఝఛ్ఛట ్టజ్చ్టి ఛీఠటజీుఽజ ్టజ్ఛి ఛిటఠట్చఛ్ఛీట ్చుఽఛీ ్టజ్ఛి ఐుఽ్ఞఠజీటజ్టీజీౌుఽ ఞ్ఛౌఞజ్ఛూ ఛిౌఝఝజ్ట్ట్ఛీఛీ ్ట్ఛటటజీఛజ్ఛూ ఛ్ఛ్ఛీఛీట జీుఽ ్టజ్ఛి ుఽ్చఝ్ఛ ౌజ ఇజిటజీట్ట… ఐుఽ ౌఠట జిౌఝ్ఛ, ఛిౌఠుఽ్టటడ, టజ్చూఠ్ఛిటడ ్చుఽఛీ ్జజీఝ ఇటౌఠీ(ట్చఛిజ్చీజూ ట్ఛజట్ఛజ్చ్టజీౌుఽ జ్చూఠీట) ్చజూజూ ్టౌౌ ౌజ్ట్ఛుఽ ఠ్ఛీట్ఛ ్జఠట్టజీజజ్ఛీఛీ జీుఽ ్టజ్ఛి ుఽ్చఝ్ఛ ౌజ ఇజిటజీట్ట’’ అన్నాడు. నల్లవాళ్లందరూ బానిసలుగా ఉండాలని శాపం పొందినవాళ్లని చెబుతూ వారిని చాలాకాలం బానిసత్వంలో ఉంచడాన్ని ఆయన గుర్తు చేశాడు. అమెరికన్‌ మీడియా ఆయనపై మండిపడింది. ఐట ౖఛ్చఝ్చ ్చ కఠటజూజీఝ? అనే శీర్షికతో పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి. విద్యావంతులూ దేశాన్ని గూర్చి ఆలోచించేవారూ చరిత్ర చదవడం చాలా అవసరమని మనం మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోవాలి.
గత వ్యాసాల్లో ఒక చోట రాజీవ్‌ మల్హోత్రా అనే రచయిత రాసిన ‘‘బ్రేకింగ్‌ ఇండియా’’ అనే పుస్తకం గూర్చి ప్రస్తావించాను. భారతదేశ సమగ్రత గూర్చి అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాటల్ని పై పుస్తకంలో చెప్పిన విషయాల నేపథ్యంలో చూడడం అవసరం. అమెరికా అధ్యక్షుడు ఛాందసవాది కాదు. మతమార్పిడి సంస్థలు మన సమాజంలో సృష్టిస్తున్న వేర్పాటువాదాల గురించి అతనికి బాగా తెలుసు. భారతదేశాన్ని విడదీయటానికి మతం ఒక ఆయుధంగా ఎలా మారింది, ఆ ఆయుధాన్ని ఎవరు ఎలా వాడుతున్నారు అన్న విషయాన్ని రాజీవ్‌ మల్హోత్రా కూడా తన పుస్తకంలో వివరించాడు. ప్రపంచమంతటా తమ సంస్కృతే ఉండాలి అని భావించే వారు మన దేశంలో ఎలా విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, అలా రెచ్చగొట్టడానికి మతాన్ని ఎలా వాడుకుంటున్నారు అని ఆయన బాగా విశ్లేషించాడు. అలా రెచ్చగొట్టేవారిని కూడా అమెరికా అధ్యక్షుడు తప్పకుండా తన మాటల్లో ప్రస్తావించాడని అనుకోవచ్చు. అతని మాటల్ని నిజాయితీతో చేసిన వ్యాఖ్యలుగానూ, ఒక ముందు జాగ్రత్తతో చేసిన హెచ్చరికగానూ భావించవచ్చు.
మత అసహనం అంటే ఏమిటి అని నిష్పాక్షికంగా మనం ఆలోచించాలి. మన సొంత మతం పట్ల, సిద్ధాంతం పట్ల విశ్వాసం. గౌరవం కలిగి ఉండటం సామాన్యస్థాయి. మన మతమే సరైనది, మిగతా మార్గాలన్నీ తప్పు మార్గాలు అనుకోవడం ఛాందసవాదం(జఠుఽఛ్చీఝ్ఛుఽ్ట్చజూజీటఝ) అనుకోవచ్చు. ఇది రెండవ స్థాయి. ఈ వాదం మరీ బలంగా మారి ప్రపంచమంతా మా మతమే ఉండాలి మరొక మతం ఉండటానికి వీల్లేదు. ఇతర మతాల్లోని దేవుళ్లు రాక్షసులతో సమానం అనడం ప్రమాదకరమైన మూడవస్థాయి. పై మూడింటిలో రెండవస్థాయి ఆలోచన భారతీయ మతాల్లో అప్పుడప్పుడు ఉన్నా మూడోవస్థాయి మాత్రం ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు. పై కథలో ప్రజాపతి వద్దకు వెళ్లిన వివిధ వర్గాల లాగ మనం మన మతగ్రంథాలు ఏమంటున్నాయో, మనం ఎలా వ్యవహరిస్తున్నామో కూడా ఆలోచించుకోవాలి.
ఎన్నో శతాబ్దాలుగా భారతదేశంలో అనేక సంస్కృతుల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసి ఉండడం చరిత్రలో చూడగలం. ఉదాహరణకు ప్రపంచంలోని అన్ని దేశాల్లో యూదులు మతహింసను అనుభవించారు. ఎంతో నాగరికత ఉందని భావించుకునే యూరోపియన్‌ దేశాల్లో ఆరు మిలియన్ల యూదులు ఎంతో ఆఽధునికమైన 20 వ శతాబ్దంలో చంపబడ్డారు. కేవలం భారతదేశంలో వారు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. అందుకే ఇజ్రాయిల్‌ రాజ్యం ఏర్పడినప్పుడు వారి పార్లమెంటులో మొట్టమొదటగా భారతదేశానికి కృతజ్ఞత చెప్పారు. ఇతర మత పెద్దలు మన దేశానికి వచ్చి మన దేశాన్నంతటినీ వారి మతంలోకి మారుస్తామని చెప్పారు. ఇంటర్నెట్‌లోని యూట్యూబ్‌లో ఖీట్చఛిజుజీుఽజ ఉఠ్చిుఽజ్ఛజూజీటఝ, ఉఠ్చిుఽజ్ఛజూజీటఝ గ్చ్టిఛిజి అనే వాటిని వెతికితే వందలాది వ్యాసాలూ, వీడియోలూ చూడగలం. అమాయక ప్రజల్ని ఎలా భయపెడుతున్నారో చూడగలం. మన స్వామీజీలు ఎప్పుడూ ఇతర దేశాలకు వెళ్లి వాళ్ళని మారుస్తామని చెప్పలేదు. ఇతర మతాల దేవుళ్ళకు సైతాను రూపాలంటూ నిందించలేదు.
శాంతిభద్రతల్ని కాపాడే విషయంలో ఒక నానుడి ఉంది. ‘‘అ ట్టజ్టీఛిజి జీుఽ ్టజీఝ్ఛ ట్చఠ్ఛిట ుఽజీుఽ్ఛ’’. అంటే ఒక గుడ్డ చిరగడం మొదలైనపుడు ఒక కుట్టు వేసి సరిచేయవచ్చు. ఊరక వదిలేస్తే తరువాత చాలా కుట్లు వేయాల్సివస్తుంది అని అర్థం. దేశభద్రత విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ‘‘సారపు ధర్మమున్‌ విమల సత్యము పాపముచేత బొంకుచే’’ అంటూ భారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయమిదే. కౌరవసభలో ద్రౌపది అవమానం జరిగినపుడు పెద్దలందరూ మౌనం వహించారు దాన్ని గుర్తుచేస్తూ కృష్ణుడు అన్న మాటలవి. అసత్యాలతో సత్యాన్ని కప్పి పుచ్చుతున్నప్పుడు జరుగుతున్న విషయాన్ని గుర్తించని పెద్దలందరూ తమ మౌనం వల్ల రాబోయే నష్టానికి బాధ్యులవుతారని భారతం బోధించే సత్యం.
Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

అమ్ముడుద్యమం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణ శాస్త్రిగారి సభ -సాక్షి -పేపర్ కధనం

hyma 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలూ-జ్ఞాపకాలు…

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలూ-జ్ఞాపకాలు…

ANDHRAPRABHA –   Mon, 23 Feb 2015, IST

కథక చక్రవర్తి అని పేరు పొందిన ప్రసిద్ధ తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘అనుభవాలూ-జ్ఞాపకాలున్నూ’అన్న రచన దరిదాపు 570 పేజీలతో 3 సంపుటాలుగా ఉంది. ఇది ఆత్మకథా కాదు.. ఆయన జీవిత చరిత్రా కాదు. అలాగని, ఆయన జీవిత గమనం గురించి ఆయనే రాసుకున్న చరిత్ర కాకుండానూ పోదు. ‘ఇది తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రయోగం’ అని భావించబడింది ఆ రోజుల్లో.. నీలంరాజు గారి నవోదయ పత్రికలో ప్రచురింపబడింది. లబ్ద ప్రతిష్టులయిన ఆ కాలపు రచయితలనేకులు మొదటి సంపుటం చదివి ఆశ్చర్యంతో ఆనందంతో ఎన్నో ప్రశంసలు కురిపించారు. మలి సంపుటాల కోసం ఎంతో ఆసక్తి, ఆతృత ప్రదర్శించారు. వేలూరి శివరామశాస్త్రి , జలసూత్రం, పురిపండా అప్పలస్వామి, విశ్వనాధ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి లాంటి వారెందరో ఈ రచనా విశేషాలు సాకల్యంగా ఎత్తిచూపారు. అయితే ఈ జీవిత చరిత్ర అసంపూర్తిగానే ఉండిపోయింది. శ్రీపాద వారి అకాలమరణం కారణంగా 4వ సంపుటం రాలేదు. ఆయన చివరి ఉత్తరం (తేదీ లేదు) వీలునామా గానూ.. ‘కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి’ పేర (బహుశా పురిపండ వారు..) రాసిన 2 పేజీల వ్యాసం ఈ పుస్తకం చివరి పేజీలలో ప్రచురించారు. ఈ నాటి ప్రకాశకులయినా శ్రీపాద వారు చితించని తదనంతర జీవన ఘట్టాలను రేఖామాత్రంగా నయినా రాయించి ప్రచురిస్తే బావుండేది.23 ఏప్రిల్‌ 1891న జన్మించి..25 ఫిబ్రవరి 1961న పరమపదించారు శ్రీపాద. ఈ70 సంవత్సరాల జీవన పరిధిలో అవధులులేని ప్రతిభా వ్యుత్పత్తులు సాధించుకుని ,తెలుగు సాహిత్యంలో సార్థక జీవిగాఎదిగారు. ఆయనకు రాజమండ్రిలో షష్టి పూర్తి మహోత్సవం, 65వ జన్మదినం సందర్భంగా 25-4-1955న ఆయనకు విశాఖలో కనకాభిషేకం జరిపి సాహిత్య కారులుమురిసి పోయారు. ఆసందర్భంలోనే ఈ ‘అనుభవాలూ-జ్ఞాపకాలూ’ ప్రచురితమైంది. ఈ ‘జ్ఞాపకాలు- అనుభవాలు’ తారీఖుల వారీగానో, జీవన క్రమంలోనో రాసినవి కావు. ఒక సజీవ చైతన్య స్రవంతిగా శ్రీ పాద వారికి గుర్తుకొచ్చిన క్రమంలో, ఆయా ఘట్టాలకు , సంఘటనలకు చెందిన, గత,భవిష్యత్‌ వివరాలను కూడా ఒకచోట రాయడంలో ఒకఅద్భుతమైన రచనగా ఇది ఆసక్తికరంగా సాగుతుంది.ఇది ప్రధానంగా వ్యక్తిగతం,స్వంత జీవిత చిత్రణ కనుక సహజంగానే ఆనాటి సామాజిక చరిత్రను సాంఘిక జీవితాన్ని మనంఇప్పుడు పూర్తిగా తెలుసుకోవాలంటే అనేకపరిమితులు కూడా ఏర్పడ్డాయి. ఈపుస్తకాన్ని ..ఆజీవితాన్ని, సరిగ్గా అవగాహన చేసుకోవాలంటే మనకు కొంత చారిత్రక జ్ఞానం ఉండాలి. ఈనాటి పాఠకునకు తెలియని ఎన్నోసంగతులు, సందర్భాలు, ఈనాటి ఆలోచనలతో చూస్తే హాస్యాస్పదంగా ఉండేవి ఎన్నో ఉన్నాయి. ఒక ప్రత్యేక ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా మునికొడవలి, పొలమూరు గ్రామాలు. అందుబాటులో ఉన్నపిఠాపురం, కాకినాడ, రాజమండ్రి పట్టణాలు, ఆతరువాత చెన్నపట్నం ఈ రచనకు భౌగోళిక భూమిక. మధ్య తరగతి వైదిక (బ్రాహ్మణ) కుటుంబాల స్థితిగతులు, ఆలోచనా విధా నాలు, అంతరంగాలు,ఛాందసాలు, చాపకింద నీరులా ప్రవేశిస్తున్న మార్పులు,వాటిని అంగీకరించలేని శ్రోత్రియ పెద్దల నిస్పృహలు, నిరసనలు- వాటిని సరకు చేయక ముందుకెళుతున్న మరోతరం తపనలు, తాపత్రయాలు, సంకోచాలు, సంఘర్షణలు వారి లొంగుబాట్లు, ఎదురు దాడులు చాలా స్పష్టంగా మనకు తెలుస్తాయి. ప్రధానంగా బ్రాహ్మణ అగ్రహారీకుల గురించే చిత్రించినా.. సంఘటనల రూపేణా ,వైదిక-నియోగుల విభేదాలు,ఆచార వ్యవహారాలు,భావ వైరుధ్యాలు, రెడ్డివారు, కమ్మ దొరలు, క్షత్రియ (రాజుల) కుటుంబాలు, భ్రటాజులు, తదితరుల శ్రమలు, దర్పాలు, లౌక్యాలు, సంస్కారాలు, భాషా భెెదాలు సామాజిక అంతస్తుల స్థాయి భేదాలు తారసపడతాయి. అతి చిన్న కాన్వాసు మీద అత్యంత ప్రతిభా విశేషంగా రూపొందిన సజీవ జీవచిత్రం కనుక ..ఈ పుస్తకం మనకు అనేక చోట్ల కళ్లు తెరిపిస్తుంది. కన్నీళ్లు కురిపిస్తుంది. స్ఫూర్తినిస్తుంది. శ్రీపాదవారు శిల వంటి జీవితాన్ని శిల్పంగా ఎలా మలచుకున్నారో శ్రద్ధతో, పూనికతో జీవితాన్ని ఎలా సాధించుకున్నారో తెలుస్తుంది. ఆయన కృషి విలువ తెలియాలంటే మనం ఆనాటికి ముందున్న చారిత్రిక నేపధ్యాన్ని తెలుసుకోవాలి.

గోదావరి ప్రాంతం కరువు, తుపానులతో దయనీయంగా వుండేది. ‘భూమి శిస్తు కట్టడమే దండగ’ అని అనేక గ్రామాల్లో వ్యవసాయం కూడా చేసేవారు కాదు. కాస్త మెరుగయిన జీవితం కోసం ప్రజలు తమ నివాసాలు మార్చుకుంటూ ఉండేవారు. కుటుంబాలు ఇతర గ్రామాలకు తరలివెళుతుండేవి. బ్రాహ్మణ కుటుంబాలు ఇందుకు మినహాయింపేమీ కాదు. (శ్రీపాద వారి పూర్వీకులు , తల్లిదండ్రులు కూడా ఇలా ఇక్కట్లు పడ్డవారే) ఆయా కులాల వారు తమతమ కులవృత్తులు, విద్యలు నేర్చుకుంటూ, వారస త్వంగా వస్తున్న ఆచార వ్యవహారాల పరిధిలో బతుకు లీడుస్తుండేవారు. కష్టమో, నిష్టూరమో ఉన్నదాంతో సర్దుకుని పెద్దల, గ్రామ పెద్దల, మాటల చట్రంలో ఒదిగి బతుకుతుండేవారు. దీనికి తోడు పరాయి పాలన బరువు. ఆ పాలకుల ప్రయోజనాలు, అవస రాలు, అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలు.. మత మార్పుడులు, విద్యలు,కళలు అన్నింటా వారి ప్రభావం ఉండేది. గోదావరి మీద ధవళేశ్వరంలో 1852 కల్లా ఆనకట్ట వచ్చింది. 1855కి కృష్ణా నదికి ఆనకట్ట నిర్మించారు. దాంతో కాలవల ద్వారా సాగు..ఇక వ్యవసాయ రంగంలో అనేక మార్పులు ..ఉత్పత్తులు పెరగడం..మిగులు సంపాదన వైపు అడుగులు పడటం జరిగింది. రైతు కుటుంబాలలో..ముఖ్యంగా బ్రాహ్మణతర కుటుంబాలలో చదువుకోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం, ఆరాటం మొదల య్యింది.అనేకచోట్ల మిషనరీలు, కిరస్తానీ మతప్రచారం, ఆసు పత్రులు, విద్యాలయాలు మొదలుపెట్టారు.విస్తరించారు. విద్యార్థులకు ధనికులు ఉదార దృష్టితో ఆర్థిక సహాయం (విద్యా దానం)అందించడం ఒక స్థాయిలో పెరిగింది. అప్పటి వరకు ఉన్న శిథిలమవుతున్న గురుకుల విద్యా వ్యవస్థ అదీ బ్రాహ్మణ కుటుంబాలలోనే అమలవుతున్న స్థితి విచ్ఛిన్నమవుతోంది.

దివిజగంగను భువికి పారించిన భగీరథ ప్రయత్నానికి తక్కువ కాని చిరదీక్షా తపస్సమీక్షణ ఫలితమే శ్రీపాద తెలుగుకథ ఆవిష్కరణ. కథ పాశ్చాత్య సాహిత్యరూపమని, పాశ్చాత్య విద్య ద్వారానే దాన్ని అవగతం చేసుకోగలమని వాదించిన వారికి భిన్నంగా తెలుగు జీవితాన్ని ,మధురమైన తెలుగుతో కథల బస్తాలకెత్తిన వాడు, జాతి ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టినవాడు, ప్రతిభా సమున్నతుడు శ్రీపాద. రాజకీయ స్వాతంత్య్రం కోసం పోరాటం , సాంఘిక సంస్కరణోద్యమాలు ఆనాటి జీవన స్రవంతిలో రెండు ప్రధాన పాయలు. వాటి ఫలితంగా వ్యక్తుల జీవితాల్లోనూ ,ఆచరణలోనూ వస్తున్న మార్పులు ఎన్నో..శ్రీపాదలో తలెత్తిన వ్యక్తిగత మార్పులను వాటికి ప్రోది చేసిన వ్యక్తుల ఊహల ఊసులు,వాళ్ల వ్యక్తిత్వాలు ,వాళ్లు ఇచ్చిన ఊతం, సాయం ఎంతో సంస్కారయుతంగా చిత్రించారీ రచనలో ..శిఖలు తీసి క్రాఫింగులు పెట్టుకోవడం, ఒంటిమీద చొక్కాలు ధరించడం, పొరుగూరు వెళ్లినపుడు హోటళ్లలోభోజనం చేయడం, నాటకాలు ఆడటం, నాట్యాలు చూడటం, సంగీతం పాడటం లాంటి (ఈనాటి) అతి సాధారణ వ్యవహారాలు కూడా సదాచార వైదికులు చేయరానివిగా,నీతి దూరమైనవిగా నట, విట, కవి, గాయకులను పంక్తి బాహ్యులుగా చూసే స్థితులన్నింటినీ ఈ శ్రీపాద చిన్నవాడు ఎంతో దృఢచిత్తంతో ఎదిరించాడు. కుటుంబ కట్టుబాట్లను వ్యతిరేకిస్తూ తన అభీష్టాలను సాధించుకున్నాడు. అప్పుడు జరిగిన భావ సంఘర్షణ ఎంత చికాకు కలిగించినా తన పథం వీడలేదు.మాండలికాలలో ఉన్న సొగసు, సొబగు, వ్యక్తీకరణ, ఆయా ప్రాంతాలలో జనసామాన్యం వాడుకలో ఉన్న పదాల అర్థ సంపన్నతకు ఎంతో పరవశించేవారు. ఈ భిన్నత్వమంతా ప్రతిఫలించేదే పటిష్టమయిన తెలుగు అని భావించేవారు. ” జాతీయమైన తెలుగుభాష నేర్చుకోవాలంటే స్త్రీల దగ్గరే నేర్చుకోవాలి. అది పరభాషలతో సంకరం కాని పలుకు బడుల భాష. పురుషుల భాషలో కంటే స్త్రీల భాషలో మాధుర్యము, హృదయాలను పట్టివేసే జాతీయత కనపడింది నాకు” అని తన మధురమైన తెలుగు నుడికారం నేర్చుకున్న విధానం తెలిపారు. ఆ రోజుల్లో వచ్చిన మదనకామరాజు కథలు, అరేబియన్‌ నైట్సు, యవన యామినీ కథలు, భోజకాళిదాస కథలు, భట్టి విక్రమార్క కథలు, చార్‌దర్వీష్‌ కథలు, రేచుక్క పగటిచుక్క కథలువంటి కథల పుస్తకాలు కంటపడినవన్నీ ఈయన చదివేశారు. వాటిల్లో తెలుగు భాష చాలా అసహ్యంగా ఉండేది. అయినా కథ చెప్పడం..ఆసక్తి కరంగా చెప్పడం ఎలానో తెలుసుకోవడానికి అవి చదివేవారు. ‘

” సంస్కృత సాహిత్యం అంటనివాడే తెనుగున ప్రవేశిస్తాడు”,” చచ్చు తెనుగు పోనిస్తూ”అన్నారు కొందరు .అయినా తెనుగు చదువుతూ , కథలు రాయడమూ మొదలుపెట్టారు. ‘తెలుగు భాష చచ్చుదయితే మరి తెనుగు జాతి? పైగా తెలుగువాడే ఇలా అనడమా’ అని మహా కసి పుట్టింది. ఆ కసి నుండే ప్రసన్న కథా యుక్తి వెలువడింది. కులము, వేశ్యకాంతలు అనే వీరేశలింగం గారి ఉపన్యాసాలు చదివి దాంతో శుద్ధ ప్రచ్ఛన్న బ్రహ్మ సామాజికుడిగా అయిపోసాగారు కానీ ‘స్వాంతంత్య్రము లేదు. ఎదిరించే సత్తా లేదు. ..లోపల్లోపల ప్రతీకార భావము చాటుచాటుగా ఆచార బహిష్కారము’ జరిగిపోసాగాయి. ఈ ఎదిరించే లక్షణం తోటే అనేక గ్రంథాల మీద ఇది వరకు ఎవరూ చేయని రీతిలో విమర్శలు రాశారు. మహాభారతం మీద, కొన్ని చారిత్రక నవలల మీద సృజనాత్మకమైన విమర్శలు చేశారు. చారిత్రక గాధలు భారత సంస్కార దర్పణాలుగా, భారత వీరుల విశిష్ట ప్రవృత్తి జాతికి ఉద్దీపనగా సాహిత్య సృష్టి జరగాలని భావించారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వ వ్యతిరేకంగా అనిపించే అభిప్రాయాలు ప్రకటించారు. వీరపూజ గ్రంథం ప్రకటించడానికి ‘ప్రభుత్వం రాజద్రోహ నేరమారోపిస్తుందేమో’నని కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు తటపటాయిస్తుంటే, వారికి చిక్కులు రావడం తన కిష్టం లేదంటూనే శ్రీపాద వారు ” వల్ల కాదంటే ఈ గ్రంథమే ప్రకటించడం మానుకుంటాను కానీ నా సిద్ధాంతాలు, నా ఆక్షేపణలు మారుకోనూ, ఉపసంహరించుకోను”అని విస్ఫష్టంగా చెప్పారు. దేశంలో అన్ని భాషాజాతుల మధ్య సామరస్యం, సమాన గౌరవం పెంపొందించడానికి ,జాతీయులు ఆత్మగౌరవంతో తమ తమ మాతృభాషలను, సంస్కృతులను పరిరక్షించుకోవడానికి కావలసిన ఆత్మస్థైర్యం, స్ఫూర్తి కలిగిస్తుంది శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి అనుభవాలు రచన. ప్రతికూల పరిస్థితులలో వ్యక్తి తన అభిలాషలను సాధించడానికి చూపించ వలసిన తెగువ, పూనిక , ప్రయత్నాలను సోదాహరణంగా ఎతి ్తచూపుతుంది ఈ జీవిత కథ . ఒక శతాబ్ద కాలంలో తెలుగుదేశంలో వచ్చిన సాంస్కృతిక మార్పులను అవగతం చేసుకోవడానికి చరిత్రను అర్థం చేసుకోవడానికి తప్పక చదవవలసిందీ ఆత్మకథా కథనం.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పెరుమాళ్‌ మరుగన్‌ ఇక రాయడా!

పెరుమాళ్‌ మరుగన్‌ ఇక రాయడా!

రాత్రికి రాత్రి ఒక రచయిత అంతర్జాతీయ రచయితగా అవతరించటం వెనుక కుట్ర లేదంటే నమ్మగలమా! పెరుమాళ్‌ మురుగన్‌ చారిత్రక స్పృహవున్న రచయిత. ఆయనకి రాస్తేగాని పొట్టగడవని పరిస్థితి లేదు. కాని ఒక పబ్లిషర్‌కి, ఆ అగత్యం వుంటుంది. అందుకోసం సదరు పబ్లిషర్‌ కొన్ని అఘాయిత్యాలు చేయిస్తాడు. కొన్ని శక్తులని ప్రకోపింప చేస్తాడు. గిట్టని రాజకీయ పార్టీలు ఒహళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకుంటాయి. తమిళనాడులో కులతత్వ శక్తులు బలంగా వున్నాయి. వాళ్ళ ఆసరాతో దీన్ని మరింత రాద్ధాంతంగా మార్చిన మీడియా మూలంగా తమిళనాడుకే పరిచితమైన రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ రాత్రికి రాత్రే సన్మాన్‌ రష్దీ, తస్లీమ్‌ నస్రీన్‌ సరసన చేరటం అది రచయితకే ఎంతో మేలు చేసింది. కీడు చేయటం వెనక ఖ్యాతి వచ్చింది. ఆయన తమిళ నవల మధురుభగన్‌ గొడవ వెనుక పబ్లిషర్‌తో పాటు కార్పొరేట్‌ విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. పెరుమాళ్‌ మురుగన్‌ అదే చెప్పాడు. ఆయన ప్రస్తుత విద్యావిధానం మీద పోరాటం చేస్తా ఎన్నో వ్యాసాలు రాశాడు. కులతత్వం మీద ప్రస్తుత విద్యా విధానం మీద తిరగబడ్డాడు. విద్యార్థుల చేత కులాల పట్ల నిరసనతో 32 వ్యాసాలు రాయించాడు. నమక్కల్‌, తిరుచెంగోడు ప్రాంతాలలో స్కూళ్ళు నడుపుతున్న యాజమాన్యాలకి అది కంటగింపుగా మారింది. వాళ్ళే తనమీద దాడికి పూనుకున్నారని రచయిత అభిప్రాయం.

ఒన్‌ పార్ట్‌ ఉమన్‌గా పెంగ్విన్‌ ఇంగ్లీషులోకి ఆయన నవల మధురు భగన్‌ తర్జుమా చేశాకే ఈ కొడవంతా వచ్చింది. కొంగునాడుకి కోపం తెప్పించింది. ఈ కొత్త సంవత్సరం జనవరి ఎనిమిది రాత్రిన ఆయన కుటుంబంతో సహా అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు. తన నవలలోని ఊరిపేరుని మారుస్తానని, వాస్తవిక ఘఠనలని కాల్పనిక సాహిత్యంలోకి తేవడం పొరపాటని అంగీకరించాడు.

అయినా ఆ శక్తులు శాంతించలేదు. హిందు మున్నడి మరో మూడు కుల తత్వ సంస్థలు కలసి ఆ నవలని నిషేధించాలని గోల చేశాయి. కులతత్వ, హిందుత్వ శక్తులు ఒక వేదికగా ముందుకు రావటం తమిళనాడులో ఇదే మొదటిసారని రచయిత వాపోయాడు. ఒక నవలకి వ్యతిరేకంగా ఆరు చెంగోడులో బంద్‌ జరగటం ఆశ్యర్యమే! 2010లో వచ్చిన మధురుభగన్‌ మీద రాని గొడవ అదే నవల 2014లో ఇంగ్లీష్‌లోకి వచ్చాక ఎందుకొచ్చిందని ఆరాతీస్తే కానరాని సత్యాలు చాలా వున్నాయి.

ఈ విషయం మీద, తమిళనాడులో వున్న నా యిద్దరు రచయిత మిత్రులతో ఈ వ్యాసం రాసేముందు మాట్లాడాను. పేరు రాయద్దని అభిప్రాయపడ్డ రచయిత నెపం పబ్లిషర్‌ మీద, దేని మీదేనైనా గొడవ చేసే రాజకీయశక్తుల పైనా అనుమానపడ్డాడు. మరో రచయిత నీలకంఠన్‌ ఈ గొడవ జరగటం మంచిదే, పెరుమాళ్‌ మురుగన్‌కి అది మేలు చేసిందని అభిప్రాయపడ్డాడు. పొట్ట గడవటం కోసం కొన్ని శక్తులు చేయించిన అరాచకంగా నీలకంఠన్‌ నొక్కి చెప్పాడు.

పెరుమాళ్‌ మురుగన్‌ సామాజిక స్పృహ వున్న మంచి రచయిత. రాయనని చెప్పించినంత మాత్రాన అదో పెద్ద బాధ కాదని, ఆయనకి రాత్రికి రాత్రి పేరు రావటం సంతోషంగా నీలకంఠన్‌ భావించాడు. తమిళ భాషలోని ఒక నవలకి అంతర్జాతీయ ఖ్యాతి రావటం ఆ భాషా ప్రియులని ఆనందపరుస్తోంది అంటే అనుమానం ఎందుకు. వాళ్ళు అంత భాషాప్రియులు. అసలు అస్తిత్వ ఉద్యమాలు వెనక ఆర్థిక కారణాలు బలంగా వుంటాయని చరిత్ర ప్రస్తుతం భావిస్తోందని వేరే రాయనక్కర్లేదు. ప్రపంచీకరణలో భాగంగా తిరుచెంగోడు అనేవూరు కొంగునాడుగా పిలవబడే కోయంబత్తూరు, ఈరోడ్‌ తిరువూరు, సేలం కరూర్‌ జిల్లాల్లో భాగమై వ్యవసాయానికే కాదు సాహిత్య మాగాదిగాను తమిళనాట ప్రసిద్ధమే. నల్లరేగడి మట్టితో పుట్టిన పెరుమాళ్‌ మురుగన్‌ త్వరలోనే మరింత గొప్ప సాహిత్యమే సృష్టిస్తాడు. ఆ నమ్మకం ఆ భాషాప్రియులు వెల్లడిస్తున్నారు. ముక్కుమీద వేలు వేసుకోవాల్సింది మనమే!

పిల్లలు లేని పొన్నా కాళీల ఆనందమయ జీవితంలోకి ఒక్క నలుసు పుట్టకపోతే సంసార జీవితం ఏముంటుంది. ఇరుగు పొరుగుల సూటి పోటీ మాటలు అవమానాలునూ! తిరు చెంగోడు లోని అర్ధనారీశ్వర ఆలయంలో జాతర రోజున కేవలం గర్భధారణ కోసం ఒక స్త్రీ తప్పు, అది ఆచారంగా వందలయేళ్ళుగా వస్తోంది. అదే మధురుఘవన్‌ నవల చిత్రీకరించింది. గొప్ప హేతువాది పెరియార్‌ రామస్వామి కూడా 125 ఏళ్ళ క్రితం తిరు చెంగోడు వాసి గానే జన్మించాడు. ఆయన తాత్విక వారసుడు పెరుమాళ్‌ మురుగన్‌, ఆయనతో ప్రస్తుతం మనం మాట్లాడలేము. దేవాలయాల మీద బూతు బొమ్మలు వుండంగా పూజిస్తాము. అదే గుడుల వెనుక ఆచారాల వెనుక, ఉత్సవాల వెనుక జరిగే శృంగార కాంక్షని రాసినందుకి రచయితకి శిక్ష వేస్తాము. నీలకంఠన్‌ చెప్పినట్టు పెరుమాళ్‌ మురుగన్‌ తప్పక రాస్తాడు. ఇదో తాత్కాలిక తెరచాటు మాత్రమే, ఆయన కులతత్వం ఎదిరించాడు. ఆయన తన కొత్త నవల పూకళిని కులపీడితుడైన ధర్మపురి ఐలవాసన్‌కి అంకితం యిచ్చాడు. ఫలితంగా ఆయన కొత్త నవలని కొనటానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారట. సమాజంలో కులం వేళ్ళూనుకున్నప్పుడు ఒక రచయిత కులం నించి తప్పించుకోలేడు. మధురు భగన్‌లో గౌండర్‌ పేరుని రచయిత వాడాడు. తమిళనాడులో గౌండర్‌ పేరుని అనేక కులాలు వాడుకుంటాయి. అప్పటికి రచయిత తన కొత్త నవల పూకళిలో ఏ కులాన్ని ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డానని అయిన దాన్ని కొని చదవటం లేదని బాధపడ్తున్నాడు. కొంతమంది తమ లబ్ధి కోసం రచయితని బలి చేస్తున్నారు. రచయిత అదే వ్యాఖ్యానించాడు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మానవతావాద కవి మునిసుందరం

మానవతావాద కవి మునిసుందరం

ANDHRAPRABHA –   Mon, 23 Feb 2015, IST
  • ”నా పేరు సుందరం
  • నా కవిత మానవతా మందిరం

అని స్పష్టంగా తనను తాను నిర్వచించుకున్న కవి ఎస్‌.మునిసుందరం. నాలుగు దశాబ్దాలకు మించిన కవిత్వ జీవితం గల తెలగు కవులలో మునిసుందరం ఒకరు. దాదాపు 14 కవిత్వ సంపుటాలు, కొన్ని కథలు, మరికొన్ని నాటకాలు రచించడమే గాక, మునిసుందరం నటుడు కూడా. అంతేగాక తిరుపతిలో నూతలపాటి గంగాధరం పేరుమీద పెట్టిన సాహితీ సంస్థలో చాలాకాలం బాధ్యతలు నిర్వహించారు. ఇంకా ఒకటి రెండు సంస్థలకు నాయకత్వం వహించారు. యాత్రిక జన సందోహంతో ఉక్కిరిబిక్కిరిగా ఉండే తిరుపతిలోని కోట కొమ్ముల వీధిలో నింపాదిగా కవిత్వ రచనా జీవితాన్ని గడుపుకున్న సాహిత్వైక జీవి మునిసుందరం. అనారోగ్యకరంగా, అపసవ్యకరంగా, అమానవీయంగా, అవమానకరంగా ఉన్న సమాజం స్థానంలో ఆరోగ్యకరమూ, సవ్యమూ, మానవీయమ్ము, గౌరవ ప్రదము అయిన సమాజాన్ని నిర్మించాలని కవిత్వ తాపత్రయం పడిన కవి మునిసుందరం. వర్తమాన సామాజిక వ్యవస్థ ఎన్ని రకాలుగా చెడిపోయి ఉందో ఎత్తిచూపి, విమర్శకు పెట్టి మారండిరా అని నెత్తిన నోరుబెట్టి నాలుగు దశాబ్దాలు బుద్ధి చెప్పాడు ఆయన.

విమర్శకులెవరో గుర్తించి నిర్వచించవలసిన అవసరం లేకుండానే తాను మానవతా వాదినని ఆయనే తన చిరునామాను తెలియజేశారు. మట్టి, మనిషి, మానవత ఈ మూడు మాటలు ఆయన కవిత్వంలో అంతటా పరచుకొని ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత నగ్జల్బరీ ఉద్యమం మొదలయిన సందర్భం ఈ మద్యకాలంలో మార్క్సిజం చెప్పిన క్రిటికల్‌ రియలిజంను స్వీకరించి, మార్క్సిజం చెప్పిన వర్గపోరాటాన్ని కొంచెం దూరం పెట్టి రచన చేసిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వీళ్ళలో నా కవిత్వం కాదొక తత్వం అని చెప్పుకున్న ఖల గంగాధర తిలక్‌ అగ్రగామి. ఎస్‌.మునిసుందరం అలాంటి కవి ఆయన మార్క్సిస్టులు లేవనెత్తే సకలాంశాలు లేవనెత్తారు. అయితే అన్నిటికీ మానవతే పరిష్కారమని నమ్మారు. ఆయన కవిత్వంలో లోకపుట న్యాయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. పెట్టుబడిదారీ, ధనిక స్వామ్య వ్యతిరేకత బలంగా వినిపిస్తుంది. అవినీతి పైన ఒంటికాలితో లేస్తారు. కానీ వీటికి పరిష్కారంగా వర్గపోరాటముండదు. దుర్మార్గాలను ధైర్యంగా అధిక్షేపిస్తారు. కాని వర్గపోరాటం వద్దంటారు.

”అవినీతి, అన్యాయం, అధర్మం/దేశమాత దేహసిరిపై రాచపుండ్లు”/అవినీతి పులి అభివృద్ధిని మింగుతున్నది/”నా దేశం నేడొక ఎముకలగూడు/వినిపించుకొనే దెవరు దానిగోడు”

ఇలాంటి విమర్శలు మునిసుందరం కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి. విమర్శనాత్మక వాస్తవికత మునిసుందరం కవిత్వంలో పాఠకునికి దిగ్భ్రమ కలిగిస్తుంది. కవితోపాటు పాఠకుడు కూడా ధర్మాగ్రహానికి గురౌతాడు. అంతా అయినాక అయితే ఏం జేద్దాం? అంటే

”వర్గాల జోలికి పోకండి/ వర్గీకరణలు చేయకండి” అంటాడు./ ”గుండెగిన్నె బోర్లాపడితే / ”మానవత రక్తం నేలపాలౌతుంది…/ తుపానులు వరి కంకుల్ని పండిస్తాయా?”/ అని ప్రశ్నిస్తారు. అదే సమయంలో

”నా అక్షరమే నా సాహసం/ మానవత నాసాధ్యం”

అని ప్రకటిస్తాడు. ”దేశమంటే మట్టికాదోయ్‌” అని నూరేళ్ళ క్రితం గురజాడ నాటి సందర్భంలో అంటే, మునిసుందరం ”దేశం అంటే నేను పుట్టిన మట్టి” దేశం అంటే మనుషులు” అని పునర్నిర్వచనం చేశారు. ప్రతి భారతీయుడు మానవతా మూర్తి అయితే దేశం బాగుపడుతుందని ఆయన విశ్వసించాడు.

ఇరవయ్యొకటవ శతాబ్దం వచ్చిన సందర్భాన్ని ప్రపంచ ప్రజలు విశిష్ట సందర్భంగా గుర్తిస్తే కవి మునిసుందరం

”నూరుపుటలు నిండిన చరిత్ర పుస్తకాన్ని/ పుట పుటలో పుటుక్కుమన్న మానవత/ రక్తపు మరకలు అద్దిన దానవత”

అని ఇరవయ్యవ శతాబ్ది చరిత్రను నిర్వచించారు.

ఈ పునాదులు మారకుండా పైపైన వచ్చే మార్పులు రావడం వల్ల ప్రయోజనం ఉండదని మునిసుందరం అభిప్రాయం.

”అధునాతన రథ చక్రాల క్రింద నలిగి/ శాశ్వతంగా కన్ను మూసింది మానవత”

అన్నది ఆయన ఆవేదన. శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం సాధించే అభివృద్ధి మనుషుల్ని మరింత మానవీయంగా తీర్చి దిద్దడం పోయి, మరింత స్వార్థ పరుడుగా, మరింత గుంపు స్వభావాన్ని కల్పించవలసింది పోయి, మరింత ఏకాకిగా మార్చడాన్ని మునిసుందరం అనేక పర్యాయాలు అధిక్షేపించారు.

”స్వతంత్ర భారతీయుడు/ అనూహ్యంగా స్వార్థ సింధువైపోయారు”

భారత దేశ చరిత్ర సంస్కృతులమీద మునిసుందరంకు అపారమైన గౌరవం ఉంది. అదే సమయంలో విమర్శనాత్మక దృష్టి ఉంది.

”శ్రీరాముని పదరజంతో/ గోపాల కృష్ణుని గీతామృతంతో/ బుద్ధభగవానుని ప్రబోధాలతో/ బోసినవ్వుల బాపూ ఆంగికంతో/ తడిసిముద్దయిన/ పరమపునీత యీ మట్టి/ అందుకే నేను మట్టితినే పెరిగాను”

అని ప్రకటించడానికి ఏమీ సంకోచించడు మునిసుందరం. అంతేకాదు

”సీతనాటిన విత్తే నేటి మనిషి/ సీత నాగరికత కంకురార్పణ”

అని కూడా అనగలిగారు. ఇలా అన్న కవి మరో సందర్భంలో

”కత్తులు కటార్లు బరిసెలు బాణాలు/ మనువు బిడ్డలే… సుడిగాలులై దాడిచేస్తారు”

అని అధిక్షేపించడానికి ఆయన వెనుకాడరు. చరిత్ర పట్ల ఆయనకు గౌరవంతో కూడిన విమర్శనాత్మక దృష్టి ఉంది. ఆయన కోపం, ఆయన ఆగ్రహం స్వాతంత్య్రానంతర రాజకీయ వ్యవస్థపైన్నే స్వాతంత్య్రం వచ్చినా భారత దేశం బాగుపడలేదే అన్నది ఆయన ఆవేదన. ఎన్నికలు, ప్రణాళికలు మన దేశాన్ని బాగుచేయలేకపోయాయన్నది ఆయన అవగాహన. దోపిడీ, అవినీతి రాజ్యమేలుతున్నాయి అన్నది ఆయన కోపం. వీటికన్నిటికీ కారణం మానవత లోపించడమే నన్నది ఆయన నిష్కర్ష.

మునిసుందరం ‘మానవత’ అయ్యో పాపం అనేది కాదు. దానికి ఆర్థిక సాంఘిక రాజకీయ సాంస్కృతిక పార్శ్వాలున్నాయి. జన హృదయాలను మధించి తాను హాలాహలాన్ని తాగి ప్రజలకోసం అమృతం తెచ్చినట్లు ప్రకటించిన కవి ”నా అమృతం మానవత్వం” అని ప్రకటించారు. భారతదేశానికి స్వాతంత్య్రం రావలసిన రూపంలో రాలేదన్న అవగాహన మునిసుందరం చాలా కవితల్లో కనిపిస్తుంది.

”స్వాతంత్య్రానికి నా దేశంలో అర్థం/ బాధ్యతారహితంగా అనుచితంగా ప్రవర్తించడం”

మునిసుందరంకు మానవత సర్వ రోగనివారిణి.

ఆయన గమ్యం, గమనం రెండూ మానవతే.

నిజాయితీ ఊపిరిగా/ మంచి ఆయుధంగా/ మానవత గమ్యంగా కదంతొక్కు/ అని ప్రబోధించారు, అయితే ఈ మానవత ఎలా సాధించడమంటే! అయోమయంలో ఎకె 47, తుపాకీ మానవతా పుష్పాలు పూయిస్తుందా? అని ఆయన ఎదురు ప్రశ్న వేస్తారు.

”నా దేశంలో/ అంతస్తుల వారీగా బిచ్చగాళ్ళు/ లచ్చలకు లచ్చలు బయలుదేరారు”

అనగలిగినంత రాజకీయ దృష్టి ఉంది మునిసుందరంకు.

”పేదరికం తివాచీవలె రోడ్డుమీద పడివున్నది”

అనగలిగిన ఆర్థిక దృష్టి ఉంది.

”చెత్తపని చేసి అయినా / విత్తము సంపాదించుబిడ్డా”

అనే వ్యంగ్య కంఠస్వరముంది.

”దోపిడి పిల్ల వున్నంత అందంగా / ‘స్వేద’భారతి వుండదు.”

అనగలిగే వర్గ దృష్టి ఉంది. వీటన్నింటికీ విరుగుడు మానవత్వమేనని మునిసుందరం తీర్పు.

”మానవతా మేఘం/ చినుకై నేలతల్లిని చుంబిస్తే/ చిక్కటి ఉషస్సులా/ దిక్కుల్ని కమ్మేసి/ తెలుగు పలుకులతో/ నాచరమాంకాన్ని నేనే రాసుకోవాలని”

ఆయన మానవత్వ భారతీయ సమాజ ఆవిర్భావం కోసం ఎదురు చూశారు.

చాలామంది లాగే మునిసుందరం కూడా ఇజాలను చాలా పర్యాయాలు ఎద్దేవా చేస్తూ వచ్చారు. ఇజాలు.. మనిషి… వ్యవస్థ… రాజ్యం, అంతా డొల్ల… అంతా నల్ల ”అని నైరాశ్యంగా మాట్లాడారు. అయితే ఆయన మానవత్వంకు ఒక పెద్ద ఇజమని గుర్తించలేకపోయారు.

జాతీయ అంతర్జాతీయ సమాజం మీద కవితలు రాస్తూనే మునిసుందరం రాయలసీమ మనిషిగా సీమ నిర్దిష్ట సమస్యల మీద కూడా రాశారు.

”రాయలసీమ మట్టి నేను/ నా కిన్నినీళ్ళు కావాలి…./ గంగమ్మ తల్లి నీకో నమస్కారం/ నా సీమను / ఎడారిగా మార్చవద్దు”

అని విన్నవించాడు.

జీవించినన్నాళ్ళు మానవత్వాన్ని అమృత సిద్ధాంతంగా ప్రచారం చేసిన కవి ఎస్‌.మునిసుందరం ఆర్భాటం లేని కవి. మునిలాగే ఉండిపోయారు. ఆయనలో చివరిదాకా ఏవో కొన్ని ఆధ్యాత్మిక వాసనలున్నా, భౌతిక జీవితం గురించే రాశారు. ప్రపంచీకరణను తిరస్కరించాడూ, భావాన్ని అందమైన అధిక్షేప భాషలో ఒదిగించే ప్రయత్నం చేశారు. ఆధునిక తెలుగు కవిత్వ వికాసానికి తిరుపతి నుండి తనదైన దోహదం చేశారు. ఇప్పుడు ఆయన ఒక చరిత్ర అయ్యారు. ఇకమీదట ఆధునిక తెలుగు కవిత్వ చరిత్ర ఆయనను గురించి మాట్లాడుకోకుండా సమగ్రం కాదు.

”నేను చచ్చిన తర్వాత/ నన్ను ముక్కలుగా కోసి/ మీరంతా వండుక తినండి/ ఒకపూట మీకాహారమై/ నన్ను తృప్తి చెందనివ్వండి/ నా ఎముకల్ని పిండిచేసి/ కాఫీ కాసుకోండి/ మీ అలసట పోతుంది”

మునిలాంటి పి.కేశవరెడ్డితో పాటు మాట్లాడుకున్నట్లు ఒకేరోజు మరణించిన మునిసుందరం గారికి నివాళితో…

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విఖ్యాత ఛాయాగ్రాహకుడు విన్సెంట్‌ ఇక లేరు

విఖ్యాత ఛాయాగ్రాహకుడు విన్సెంట్‌ ఇక లేరు
అద్భుతమైన కెమెరా పనితనంతో వెండితెరకు కొత్త సొగసును తెచ్చిన భారతదేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన సీనియర్‌ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అలోసియస్‌ విన్సెంట్‌ (86) ఇక లేరు. దక్షిణాది భాషలన్నింటిలోను ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గ అనేక చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన ఘనత ఆయనది. వృద్ధాప్యంతో చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు జయనన్‌, అజయన్‌ ఉన్నారు. కుమారులు కూడా తండ్రిలాగానే సినిమాటోగ్రాఫర్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1953 నాటి ‘చండీరాణి’ తెలుగు చిత్రంతో విన్సెంట్‌ సహాయ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. భానుమతి భర్త, దర్శకుడు పి.రామకృష్ణ ప్రోత్సాహంతో ‘బ్రతుకు తెరువు’ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభమైంది. ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో అగ్రహీరోలు, దర్శకుల చిత్రాలకు సినిమాటోగ్రఫి అందించారు. పలు హిందీ చిత్రాలకూ పనిచేశారు. ‘సొంతవూరు’, ‘ఇల్లరికం’, ‘పెళ్లికానుక’, ‘కులగోత్రాలు’, ‘లేతమనసులు’, ‘భక్త ప్రహ్లాద’, ‘సోగ్గాడు’, ‘జ్యోతి’, ‘సెక్రటరీ’, ‘అడవిరాముడు’, ‘గడుసుపిల్లోడు’, ‘ప్రేమలేఖలు’, ‘రాధాకృష్ణ’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’, ‘ఆపద్భాందవుడు’, ‘యమజాతకుడు’, ‘అల్లరి ప్రియుడు’, ‘సాహసవీరుడు సాగరకన్య’, ‘బొబ్బిలిసింహం’, ‘అన్నమయ్య’ చిత్రాలు విన్సెంట్‌ కెరీర్‌లో కొన్ని ఆణిముత్యాలు. తెలుగు ‘ప్రేమనగర్‌’కు తమిళ రీమేక్‌ ‘వసంత మాళిగై’, హిందీ రీమేక్‌ ‘ప్రేమ్‌నగర్‌’కు అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందించింది ఆయనే. హిందీలో ‘మెహర్బాన్‌’, ‘బందిష్‌’, ‘మహాన్‌’ వంటి సినిమాలు ఆయన కెమెరా పనితనంతో ఉత్తమ స్థాయి చిత్రాలుగా రూపొందాయి. కెమెరాతో విన్సెంట్‌ ఎన్నో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. తమిళంలో శివాజీ గణేశన్‌ నటించిన ‘ఉత్తమపుత్తిరన్‌’ చిత్రం ద్వారా భారతీయ సినిమాకి జూమ్‌ షాట్‌ని పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అంతకంటే ముందు, బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలకు పనిచేస్తున్నప్పుడే సెట్స్‌పై నేచురల్‌ కలర్స్‌ను ఉపయోగించిన మొదటి సినిమాటోగ్రాఫర్‌ ఆయనే. దర్శకుడిగా కూడా విన్సెంట్‌ సత్తా చాటారు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మారాలి… మనుషులు మారాలి

మారాలి… మనుషులు మారాలి

ఆయన కలం నుంచి జాలు వారిన మాటలు ఆణిముత్యాలు. ఆయన గళం నుంచి వెలువడే గానం అణువణువునా శివతన్మయత్వాన్ని కలిగిస్తుంది.. ఆయన కవిత్వమే శివుడి నాగాభరణం. తెలుగు భాషకు ఆభరణం. తెలుగువారికి పరిచయం చేయనక్కరలేని వ్యక్తి. ఆయనే తనికెళ్ల భరణి. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విచ్చేసిన భరణితో ‘ఆంధ్రజ్యోతి’ కాసేపు ముచ్చటించింది. ఆ విశేషాలు ఇవి..
కన్నీళ్లు, త్యాగాలు, కష్టాలు, ఆకలి కేకలు, చాలీచాలని జీతం ఇవన్నీ కలిస్తేనే మధ్యతరగతి జీవన పోరాటం. సమాజంలో గౌరవంగా బతకాలనే ఆరాటం. పై స్థాయికి ఎదగాలనే తపన, కిందిస్థాయికి దిగకూడదనే పట్టుదల. ఇవన్నీ కలసి మధ్యతరగతి వ్యక్తిని ప్రశాంతంగా ఉండనీయవు. ఎవరినీ తృప్తి పరచలేకపోయినా అందరినీ తాను తృప్తి పరిచినట్లు భావిస్తాడు. అదే నిజమనే భ్రమలో కడవరకు ఉంటాడు.
ఆలోచన మారాలి
రోజులు మారుతున్నాయి, ప్రజల ఆలోచన విధానం మారుతోంది, గురజాడ అప్పారావు కలం నుంచి జాలువారిన మహోన్నతమైన రచన ‘కన్యాశుల్కం’. ఆనాటి సామాజిక రుగ్మతలను కళ్లకు కట్టినట్లు చూపించి, ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించింది. పురుషాధిక్యం వల్ల తరువాత కాలంలో వరకట్న దురాచారం ప్రబలింది. అది ఈనాటికీ సజీవంగానే ఉంది. భ్రూణ హత్యల వల్ల నేడు పెళ్లికాని ప్రసాద్‌లు ఎక్కువయ్యారు. ఆడపిల్ల పుడితే అందరూ లక్ష్మీ, సరస్వతీ అని పిలుస్తారు కాని, కొంత మంది మాత్రం భారంగా భావిస్తారు. ఈ రకమైన ప్రజల ఆలోచన మారాలి.
పెళ్లి కీలకం
ఆడపిల్లల జీవితంలో పెళ్లి కీలకమైంది. పెళ్లి అయ్యేంతవరకు తాను గుడిసెలో నివసించినా భవంతిలో నివసించినా ఆమె ఆ ఇంటికి మహారాణి. ఆమె ఏది చేసినా చెల్లుతుంది. అయితే ఆమె జీవితంలో ద్వితీయభాగం, సువర్ణాధ్యాయం పెళ్లితో మొదలవుతుంది. అనూహ్యమైన ప్రదేశానికి ఆడపిల్ల వెళుతున్నప్పుడు తనతోపాటుగా కట్నం వెంట తీసుకువెళ్లాలి. ఇంతకన్నా ఘోరం మరోటి లేదు. ఎదిగిన ఆడపిల్లను తల్లిదండ్రులు గుండెల మీద కుంపటిలా భావిస్తున్నారు. ఈ ఆలోచనా విధానం మారాలి. ఈ విషయంపై ‘కన్యాకుమారి’ అనే కవిత రాశాను. ‘‘ఏ ఊరిలో ఆడపిల్ల నడయాడదో అక్కడ పుష్పాలు పుష్పించవు’’ అని తమిళకవి అన్నమాటలు అక్షరసత్యాలు. నేటి తరం తల్లిదండ్రులు ఆడపిల్ల ఔన్నత్యాన్ని గుర్తించాలి. పి.వి.నరసింహారావు పుణ్యమా అని ఐటి రంగంతో మధ్యతరగతి బతుకులు బాగుపడ్డాయి, కష్టాలు గట్టెక్కాయి. తల రాతలు మారాయి. ఆడపిల్ల చదువు పూర్తికాగానే క్యాంపస్‌ సెలక్షన్స్‌ ద్వారా ఉద్యోగస్థురాలై వేలాది రూపాయలను జీతంగా తీసుకుంటోంది. తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించటమే కాక సమాజంలో తలెత్తుకొని జీవించేలా చేస్తోంది.
జీవన మాధుర్యాలు ఆస్వాదించండి
మదర్‌కు సాయం చేస్తే మదర్‌థెరీసా అంత గొప్పవాళ్లవుతారు. పిల్లల కోసం తమ చిన్న చిన్న సంతోషాలను, సుఖాలను త్యాగం చేసే తల్లిదండ్రుల శ్రమను, వారికి మీపై ఉన్న వాత్సల్యాన్ని గుర్తించండి. చదువుతో పాటుగా తల్లిదండ్రులకు చిన్నచిన్న పనుల్లో సాయం చేయండి. పిల్లలు చేసే చిన్నచిన్నపనులే తల్లిదండ్రులకు అమితానందాన్ని ఇస్తాయి. అవే జీవితాంతం తియ్యటి జ్ఞాపకాలను పంచే జీవన మాధుర్యాలను మిగుల్చుతాయి.
బతకటం నేర్చుకోండి
బతకటం నేర్చుకోండి. తనకోసం బతకటంలో ఏ మజా ఉండదు. సమాజం కోసం బతికితే దానిలోని మజా తెలుస్తుంది. సమస్త జీవకోటిలో మానవుడికే ఇతరుల కోసం బతికే పరమోత్తమమైన అవకాశం లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒకరికోసం ఒకరు బతకాలి. మానవ సంబంధాలు అంటే ఇదే.
బ్రాహ్మీముహూర్తంలో చదివితే…
’తెల్లవారుజామున లేవకుండా గొప్పవాడైన వాడిని చూడలేదు’ అనే కొటేషన్‌ నన్ను విపరీతంగా ఆకర్షించటమే కాక నా జీవనగతిని మార్చివేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా (30 సంవత్సరాలు) నేను సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాను. భారతీయ శాస్త్రంలో కాలాన్ని మూడు భాగాలుగా విభజించారు. తెల్లవారుఝామున 2 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్య కాలాన్ని సరస్వతీ కాలంగానూ, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య. కాలాన్ని శక్తి కాలంగానూ, సాయంత్రం 6. నుంచి అర్ధరాత్రి 12 మధ్య కాలాన్ని లక్ష్మీ కాలంగా పేర్కొన్నారు. బ్రాహ్మీముహూర్తం తెల్లవారుజామున 2 నుంచి 4 గంటలదాకా ఉంటుంది. ఈ సమయంలో చదివితే ధారణశక్తి పెరుగుతుంది.
వాళ్లు మార్గదర్శకులు
ఏ కళ్లలో కరుణ ఉంటుందో ఆ కళ్లే ప్రపంచానికి దివ్వెల వెలుగులిస్తాయి. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం మహోన్నతమైనది. అది ఎప్పటికీ నశించదు. వారు అంతః సౌందర్యంతో కోట్లాది హృదయాలలో పదిలంగా ఉన్నారు. మదర్‌థెరీసా, గాంధీ, వివేకానంద… ఇలాంటి వారు అంతః సౌందర్యంతోనే ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా మారారు. లక్షలాది మంది వారి మార్గాన్ని అనుసరిస్తున్నారు.
అలా చేయండి
కృష్ణుడు బుద్దికి, అర్జునుడు మనసుకు సంకేతం. బుద్ధి, మనసులకు పంచేంద్రియాలను జతచేసినపుడే అద్భుతాలు సృష్టించవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా నిజాయితీగా జీవించాలి. ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ – రాముడు నిలువెత్తు ధర్మంతో మూర్తీభవించినవాడు. రాముడు దేవుడు అని ఎక్కడా చెప్పలేదు. సామాన్యుడుగానే బతికాడు. రాముడు ఓ మంచి భర్త, అన్న, స్నేహితుడు, రాజు, కుమారుడు. ఓ వ్యక్త్తి ఆదర్శంగా ఎలా జీవించాలో ఆచరించి చూపిన మహోన్నతమైన వ్యక్తి. కృష్ణుడు ఏ కార్యాన్ని ఎలా చేయాలో చెప్పాడు. అందుకే పెద్దలు రాముడు చేసినట్లు చేయమని, కృష్ణుడు చెప్పినట్లు చేయమని చెపుతారు.
శివుడే దేవుడు
మనిషి కూడా తను చేసే పనుల ద్వారా శివుడిగా మారొచ్చు. శివతత్వం అంటే మంగళకరం అనే అర్థం ఉంది. మంగళకరమైన పనులు నిరంతరం చేస్తూ ఉంటే శివస్థాయికి చేరుకుంటాం. శివుడిని మనిషిగా భావించవద్దు. ప్రతి మనిషిని శివుడిగా భావించటం అలవరుచుకోవాలి. శివుడి మీద నాకున్న ప్రేమే నాతో ’ఆటగదరా శివా!’ రాయించింది.
కారణం తల్లిదండ్రులే
నైతిక విలువలు తగ్గటానికి ప్రధాన కారణం తల్లిదండ్రులదే. తమ పిల్లలను డబ్బు సంపాదించే యంతాల్రుగానే చూస్తున్నారు. ఆ విధంగానే చదివిస్తున్నారు. ఆ విధంగానే పెంచుతున్నారు. కొడుకు చెడిపోతే తల్లిదే బాధ్యత, కూతురు చెడిపోతే తండ్రిదే బాధ్యత. భారతీయ సంస్కృతిలో గురువుకు విశిష్ట స్థానం ఉంది. నేటి యువత చాలామంది గురువు ముందు సిగరెట్‌ తాగుతున్నారు. సిగరెట్‌ తాగినందువల్ల గురువు దండించకపోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల భారతీయ సంస్కృతి, సంస్కారం చచ్చిపోతాయి.
అనాడు ఆచార్యదేవోభవ, నేడు…
’ఆచార్య దేవో భవ’ నేడు జీరోగా మారిపోయింది. పూర్వం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిధి దేవోభవ అని పెద్దలు చెపుతుండేవారు. తల్లిదండ్రులే ఈ విలువలు పాటించనప్పుడు వారి వారసులు ఎలా అనుసరిస్తారు? ఈ రోజు ఉపాధ్యాయులు తమ విద్యార్థులను దండించే పరిస్థితులు లేవు. ఎవరైనా దండిస్తే తల్లిదండ్రులు ఆ పాఠశాల యాజమాన్యంపై గొడవకు దిగుతున్నారు. దీంతో ఉపాధ్యాయులకు పిల్లలను తీర్చిదిద్దాలనే కాంక్ష రోజురోజుకు తగ్గిపోతోంది. మా జీతం మాకు వస్తే చాలనుకుంటున్నారు.
సమాజంలో మార్పు రావాలి
మంచి సినిమాలు తీయటానికి, ప్రయోగాలు చేయటానికి సినిమా పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ప్రేక్షకుల అభిరుచి మారితేనే సినిమాల్లో మార్పు వస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ప్రేక్షకుల ఆదరణ ఉంటే మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రోత్సాహం అవసరం
పొరుగు రాష్ట్రాల్లో మాతృభాషకు ఆదరణ ఎక్కువ. ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు. తమిళనాడులో సంగీత అకాడమీలో సాహిత్య, నృత్య కార్యక్రమాలు 365 రోజులు జరుగుతూ ఉంటాయి. రెండు నెలలకు ముందే షో టిక్కెట్లన్నీ అమ్ముడవుతాయి. ఇక్కడ మాత్రం ఫ్రీగా చూపించినా స్పందన మాత్రం నామమాత్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు సొంత లాభం కొంత మానుకొని సంగీత, సాహిత్య కళలను ప్రోత్సహించాలి.
పదో తరగతి వరకు చెప్పులు లేవు
నేను పదోతరగతి వరకు చెప్పులు లేకుండానే పాఠశాలకు వెళ్లేవాణ్ణి. ఓ రోజు మార్కెట్‌ నుంచి సరుకులను నాన్నతో కలసి ఇంటికి మోసుకు వస్తున్నాను. దారిలో బాటా షాపు కనిపించింది. ఎలాగైనా నాన్న చేత చెప్పులు కొనిపించాలని స్థిర నిర్ణయానికి రావటంతో షాపు దగ్గరకు రాగానే కాలుతున్న సిగరెట్‌ ముక్కను తొక్కాను. అలా చేస్తే కాళ్లకు చెప్పులు లేకపోవటంతోనే కాలిందని నాన్న గ్రహించి ఎదురుగా ఉన్న బాటాషాపులో చెప్పులు కొంటాడనుకున్నాను. కాలు కాలి పెద్దగా అరవటంతో నాన్న చూసుకొని నడవమని నా తల మీద గట్టిగా చరిచాడు. కొత్త చెప్పులు రాకపోగా కాలు కాలింది. దీంతో కుంటుకుంటూనే ఇంటికి వెళ్లాను. నాన్న జేబులో చెప్పులు కొనేంత డబ్బు లేకపోవటంతో చూసుకొని నడవమని నాపై నాన్న అరిచారే కాని, నాపై ప్రేమ లేక కాదు. ఈ విషయం అర్ధం చేసుకోవటానికి నాకు చాలా రోజులే పట్టాయి.
ఆకలి కేకల మధ్య నుంచి….
కష్టాలు, కన్నీళ్లు, ఆకలి కేకల వాతావరణం నుంచే నా జీవన సమరం మొదలైంది. మేము ఏడుగురు అన్నదమ్ములం. నాన్న జీతం అప్పట్లో నెలకు రు.700 మాత్రమే. అది కుటుంబ అవసరాలకు చాలీచాలని జీతం. నాన్న తెచ్చే జీతంతో అమ్మ ఎంతో నేర్పుగా, ఓర్పుగా నెట్టుకువచ్చేది. మధ్యతరగతి వెతలు ఇంతింత కాదు. చిన్న చిన్న కోరికలు, సంతోషాలు తీరాలంటే గగనమైపోయేది. ప్రతి రోజు ఓ యుద్ధం, ఓ అలక, ఓ నిట్టూర్పు, ఓ కన్నీరు. ఒకరికి సంతోషం కలిగించాలంటే కుటుంబంలో మరొకరు త్యాగం చేయవలసిందే. ఇది అక్షర సత్యం. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తేనే పిల్లలు ఎదుగుతారనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మధ్యతరగతి జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా మధ్యతరగతి నుంచి వచ్చినవాడే. ‘‘నా చిన్నప్పుడు ఆక లేసినపుడు ఇంకో రొట్టె పెట్టమని అమ్మను అడిగితే, తలా ఒకటి మాత్రమే వస్తుంది, అంతగా ఆకలి వేస్తే నాకోసం ఉంచుకున్న రొట్టె తీసుకుని తినమంది, కుటుంబం కోసం ఎంతో శ్రమించే అమ్మ తన ఆకలిని చంపుకొని మరీ నాకు రొట్టె పెట్టింది. అలాంటి మాతృమూర్తి రుణం ఎలా తీర్చుకోగలం’’ అని రజనీకాంత్‌ ఓ సందర్భంలో చెప్పారు. ప్రతీ ఇంట్లో ఇలాంటిదే మధ్యతరగతి పరిస్థితి.
మా గురువు రాళ్లపల్లి
మా గురువైన రాళ్లపల్లి ఓ రోజు డైరెక్టర్‌ వంశీని నాకు పరిచయం చేసారు. వంశీతో పరిచయం నా సినీ జీవితంలో ఓ మైలు రాయి. వంశీ చెప్పినట్లుగా పంచ్‌ ఉండే విధంగా మాటలు రాయటంతో ‘లేడీ్‌స్‌టైలర్‌’ సూపర్‌ హిట్టయింది. ఆ తరువాత ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.
నక్షత్రం పేరే నాపేరు
నేను దశమి తిధినాడు, భరణి నక్షత్రం రోజున జన్మించాను. మనకున్న 27 నక్షత్రాలలో భరణి రెండోది. తిధి, నక్షత్రం కలిసి వచ్చేవిధంగా నాన్న నా పేరును దశ భరణిగా నామకరణం చేశారు. ఇందులో పెద్ద విశేషం లేదు. నా పూర్తి పేరు తనికెళ్ల దశ భరణి.
ఇంటర్వ్యూ: పెద్దింటి కృష్ణచైతన్య, విజయవాడ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కూచిపూడి నాట్యారామం చైర్మన్‌గా కూచిభొట్ల ఆనంద్‌ బాధ్యతలు స్వీకారం

కూచిపూడి నాట్యారామం చైర్మన్‌గా
కూచిభొట్ల ఆనంద్‌ బాధ్యతలు స్వీకారం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన కూచిపూడి నాట్యారామం అధ్యక్షుడిగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమక్షంలో ఆయన చైర్మన్‌ పదవి స్వీకరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అసెంబ్లీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌, ప్రముఖ కళాకారుడు గుమ్మడి గోపాల కృష్ణ ప్రభృతులు హాజరయ్యారు.

కూచిపూడి నాట్యానికి మరింత ఆదరణ తీసుకురావడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 100 కోట్లతో ఇటీవల కూచిపూడి నాట్యారామాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ చలపాక ప్రకాష్ దంపతులు మా ఇంటికి  వచ్చిన

కుమార్తె వివాహ శుభలేఖలను అందజేయటానికి స్వయం గా మా ఇంటికి 25-2-15 మధ్యాహ్నం వచ్చిన శ్రీ చలపాక ప్రకాష్ దంపతులు DSCN0415 DSCN0416 DSCN0417

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి 35 వ వర్ధంతి సందర్భం గాఅమరావాని హైస్కూల్ విద్యార్ధులకు అవగాహనా సభ

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి 35 వ వర్ధంతి సందర్భం గాఅమరావాని హైస్కూల్ విద్యార్ధులకు అవగాహనా సభ -25-2-15 బుధవారం -నేను ,శ్రీమతి మందరపు హైమవతి ,శివలక్ష్మి గంగాధరరావు శ్రీనివాస మూర్తి ప్రిన్సిపాల్ నాగ రాజు  ఫోటో మాలిక

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి మన్మధ ఉగాది వేడుకలకు ఆహ్వానం -15-3-15-ఆదివారం -ఎ సి లైబ్రరీలో -3-30 నుండి

ugadi1 001 ugadi2 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆరుద్ర ,పెండ్యాల కలిసి ఊపిన సంగీత ”ఉయ్యాల జంపాల

ఆరుద్ర ,పెండ్యాల కలిసి ఊపిన సంగీత ”ఉయ్యాల జంపాల uyyala1 001 uyyala2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వచ్చ బాబా

స్వచ్చ బాబాsvaccha baba-1 001 svaccha baba-2 001 svaccha baba-4 001 svacchabaaba-3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గుండు హనుమన్త్క రావు బాత్ రూం స్తిక్కర్లే

gundu 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -16

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -16

                     8- ఆధునిక ప్రతీక వాద రచయిత -చార్లెస్ బాడేలేర్-2

ఇరవై ఏడవ ఏట డిప్రెషన్ నుంచి బయట పడ్డాడు బాడలేర్ .తనలాగే జీవితం లో దుఃఖ శోకాలనుభావించిన అమెరికా కవి బహుముఖ ప్రజ్ఞాశాలి ,రచయితా ‘’ఎడ్గార్ అలాన్ పో’’ ను రెండేళ్లక్రితమే చదివి ఆయన రచనలను ఫ్రెంచ్ భాషలోకి తర్జుమా చేయాలనే మంచి కోరిక కలిగింది .’’నేనెందుకు పో ను అనువదిస్తున్నానో తెలుసా?అతని పోలికలు నాలో ఉన్నాయి ,  నామానసిక ఆధ్యాత్మిక బంధువు అనిపిస్తాడు .మొదటి సారి నేను ఆయన పుస్తకం తెరచి చదివి నప్పుడు  దిగ్భ్రాంతికి లోనైనాను .నేను ఏ విషయాల పై రాయాలని కలలు కన్నానో ,ఏ వాక్యాలు ఎలా రాయాలనుకోన్నానో ,అవన్నీ పో మహానుభావుడే రాసేశాడు .’’అని తన ఆరాధనా భావాన్ని తెలియ జేసుకొన్నాడు .కేధలిక్ మత వారసుడిగా బాడేలేర్ కు అసలైన పాపం అంటే ఏమిటో తెలుసు .చెడు మానవ ప్రకృతిలో అంతర్గతమై ఉందని పో గుర్తించినట్లే ఈయనా గుర్తించాడు .ఆరేళ్ళు తీవ్రం గా కస్టపడి  తన సృజనకు పదును పెట్టి పో కధలను  అయిదు  భాగాలుగా  ఫ్రెంచ్ భాషలో కి అనువదించాడు .కాని ఒక్క కవిత జోలికి కూడా పోలేదు .ఒకే ఒక అమెరికన్ కవిత లాంగ్ ఫెలో రాసిన’’హయవాత ‘’మాత్రం ఫ్రెంచ్ లోకి అనువాదం చేశాడు .ఇలా పో కవితో తాదాత్మ్యం చెంది రచనా సృష్టి చేసిన తర్వాత తాను రాయాలను కొన్న విషయాలపై ద్రుష్టి పెట్టాడు .

శైలి మార్చుకొన్నాడు .కామ భావనలు తగ్గి శోక భావాలు పెరిగాయి .ప్రేమ కవిత్వం లో అంతకు ముందు ఎవరూ రాయనంత గొప్ప కవిత ‘’అన్ వాయెజ్ ఏ సైటర్ ‘’ రాశాడు . అందులో పిచ్చి మోహం పెల్లుబికింది .భయంకర భీభత్స భయానక౦ గా దాన్ని సమాప్తి చేశాడు .’’in thine isle O Venus ,I found only upthrust-A calvary symbol whereupon my image hung –Give me Lord God ,to look upon that dung –my body and my heart ,without disgust ‘’దీనిపై మాన్సేల్ జోన్స్ స్పందిస్తూ ‘’సాహిత్య ప్రభావం కోసం కాకుండా పాపం అనేది మానవ అంతరాత్మ  స్వభావం ‘’అన్న విషయాన్ని బాడేలేర్ తెలియ జేశాడన్నాడు .కవితలో విశ్రుం ఖలత క్రమంగా తగ్గి  బాలెన్స్ స్తితిలో ఉంటున్నాడు మనకవి .ఆత్మవిమర్శ చేసుకొని జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు .1857లో ‘’లెస్ ఫ్లుఎర్స్ డు మాల్ ‘’రాసి ప్రచురించాడు .దీన్ని అమ్మకానికి పెడితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీన్ని ఖండించగా ,,కాపీలన్నీ పోలీ సులు స్వాధీనం చేసుకొన్నారు .ఈ విషయం తల్లికి ఉత్తరం ద్వారా తెలిపాడు .ఆ పుస్తకం పై తన స్పందన తెలియ జేస్తూ ‘’I have put all my tenderness ,my hate ,and my religion into the book .Iam proud of having written a book that inspired nothing but fear and horror of evil ‘’అన్నాడు .పుస్తకం లో ఏదో కొద్దిగా చదివి నిర్ణయానికి రాకూడదని మొత్తం చదివి అర్ధం చేసుకోవాలని కోరాడు .కోర్ట్ కు వెళ్ళాడు కోర్టు అతనిపక్షమే తీర్పు చెప్పినా  ఆ పుస్తకం లో దైవ దూషణ లేదని ,కాని బూతు అశ్లీలం ఉన్నాయని బహిరంగ అమ్మకానికి అనుమతించమని అందులోని  లెస్బియన్ పై ఉన్న ఆరు కవితలను తీసేసి ప్రచురిస్తే అనుమతిస్తామని తీర్పు చెప్పారు .దీనికి ఒప్పుకొని అలానే చేసి  మరో 35 కవితలు చేర్చి రెండవ ముద్రణ లో వాటిని తీసేసి ముద్రించాడు .కాని తానూ ఆశించిన పుస్తక శిల్ప నిర్మాణం(ఆర్కి టేక్చర్) దెబ్బ తిన్నాడని తెలుసుకొన్నాడు

బాడేలేర్ భావనలో కవిత్వ పరమార్ధం రెండు రకాలుగా ఉంటాయని ‘’the distinction between good and the beautiful ,the discerning of beauty in evil ‘’చెప్పాడు .’’no where in literature has there been found a more astonishing mixture of radiance and what Baudelaire called ‘’spleen ‘’of the macabre and the magnificent ‘’.కవిత్వం ,విమర్శ  విరుద్ధమైనవికావు అని చాలామంది అన్నదానిని ఒప్పుకోలేదు .కవి గొప్ప విమర్శకుడు అన్నాడు .విమర్శకుడు కాకపొతే సగం కవి మాత్రమె అవుతాడు అన్నాడు . కవి భావాలను ప్రసారం చేసే వాడుమాత్రమేకాదు,అన్ని కళలను సమన్వయము చేసి అతీత శబ్దాలను సృష్టించేవాడు . సాహిత్య ,కళ ,సంగీతం ,సౌందర్యం లపై బాడేలేర్ రాసినవిషయాలన్నీ అతని సృజన శక్తి ,అన్వేషణ ఫలితాలే .అవి   ఆనందాన్ని ఇస్తూనే  జ్ఞానాన్ని పెంచేవే .’’the material objects exist in this world only because they have their origin in the world of spirit .the artist should decipher the hidden writings of nature and to interpret the mysteries of the universe .’’అని హితవు చెప్పాడు .కళ అనేది పరమ ఉత్క్రుస్టమైనది మాత్రమె కాకుండా ప్రపంచం  లో అందాన్ని ప్రభావితం చేసేది .అందం అంటే మానసిక  వాస్తవికత –దీనినే ఆర్టిస్ట్ సృష్టించి దర్శింప జేస్తాడు .ఆర్టిస్ట్ దృష్టిలో అందం వస్తువులోఉండదు ,దానికి ఆర్టిస్ట్ తెచ్చే అందం లోనే ఉంటుంది .

ప్రచురించిన పుస్తకం ఆర్ధికం గా లాభించక పోవటమేకాక ఆరోగ్యం పైనా ప్రభావం చూపి ,రెండో ముద్రణలోనూ ప్రోత్సాహం రాక కున్గిపోయాడు .ప్రచురణ కార్ట్ దివాలా తీసి అప్పుల వాళ్ళ బాధ పడలేక బెల్జియం పారిపోవటం  మరీ బాధించింది .   లెక్చర్లు దంచి డబ్బులు వెనకేసుకొందామని ప్రయత్నిస్తే అదీ దారుణం గా విఫలమైంది .బెల్జియం లో ఉండగా ఆరోగ్యం మరింత క్షీణించి మొదటిసారి ఎటాక్ వచ్చింది .యవ్వనం లో విలాసంగా అన్నిరకాల సుఖాన్ని అనుభవించటం తో సంక్రమించిన సుఖ వ్యాధి పీల్చి పిప్పి చేస్తోంది .శారీరక బాధలను  మానసిక కుంగు బాటును మరిచిపోవటానికి నెమ్మదిగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు . భరించలేని పరిస్తితులలో ఆత్మహత్యకూ ప్రయత్నించాడు .దీనితో మానసిక స్థితి అదుపు తప్పి ‘’the wind of the wings of madness’’అనుభూతికి లోనయ్యాడు .43 ఏళ్ళ నది వయసులోనే ఈ సుఖాలు దుఖాలు బాధలూ అవమానాలు అన్నిటిని మరిచి పోయే శాశ్వత నిద్ర లోకి జారు కోవటానికి ముందు రెండేళ్ళు బెల్జియం లో దయనీయ స్తితిలో ఉండిపోయి ,నెమ్మదిగా పారిస్ చేరాడు  బాడేలేర్ .ఇక్కడ కొత్తగా కండరాల బలహీనత ,విస్మృతి ఏర్పడ్డాయి .మాట్లాడలేక పోయేవాడు .శరీరభాగాలేవీ పని చేయక పక్షవాత స్తితిలో ఉండిపోయాడు  .కాని మెదడు సురక్షితంగానే ఉంది .చివరికి మృత్యువే జయించి అతని బాధలన్నీ తీర్చి అక్కున చేర్చుకొని31-8-1867 నశాశ్వత విముక్తినిచ్చింది .

అతని అంత్య క్రియలు అత్యంత హీనంగా పదిమండి మాత్రమె హాజరవగా జరిగాయి .సాహిత్య సాంస్కృతిక సంఘాల వారెవరూ హాజరుకాలేదు .బాడేలేర్ పుస్తకాన్ని అంకితం పొందిన మహానుభావుడూ గైర్ హాజరయ్యాడు .సాహిత్య పత్రికలేవోకంటి తుడుపుగా నాలుగు ముక్కలు రాసి దులిపేసుకోన్నాయి .ఆతను జీవంచి ఉండగా వచ్చినమంచి  రివ్యూ మూడుభాగాలు పాల్ వేర్లేన్ అనే 22ఏళ్ళ యువ కవి రాసింది పెద్దగా ప్రాచుర్యం లేని “”L Art’’మేగజైన్ లో వచ్చింది .బతికి ఉండగా పట్టించుకోకుండా వదిలేశారు అతన్ని .కాని చనిపోయాక నాలుగేళ్ళకు బాడేలేర్ కవితలందరి చేతులలో  అలంకారా లైనాయి .ఇష్టపడి చదివి ఆరాధించటం మొదలు పెట్టారు .స్విన్ బరన్ కవి అతనిని ‘’ఫైర్ స్కార్ద్ స్పిరిట్ ‘’అన్నాడు .అతని కవితలు మన హృదయాలను మంటలతో తృప్తి పరుస్తాయన్నాడు .బాడేలేర్ కు స్మృతిగీతం రాస్తూ స్విన్ బరన్ ‘’thou sawest ,in thine own singing season ,brother –secrets and sorrows unbeheld of us –fierce loves ,and lovely leaf-buds poisonous –bare to thy subtler eye but for none other ‘’అంటూ నివాళులర్పించాడు .

సింబాలిక్  అనబడే ప్రతీక వాద కవులు బాడేలేర్ ను తమ మార్గ దర్శిగా భావించారు .కవిత్వాన్ని  సాంకేతి కతతోను ,సంగీతం తోనూ సంపన్నం చేశాడని పరవశిస్తారు . రూపకాలంకారాలు ,భావ చిత్రాలు తో సింబాలిక్ గా విషయాన్ని చెప్పాడని మెచ్చారు .ఆధునికులు అతనిలో సృజన ,విధ్వంసం అనే రెండుకళలున్నాయన్నారు .మతాధికారులు ‘’he transformed a seemingly insatiabe appetite for sin into a hunger for spiritual sustenance ‘’అని విశ్లేషించారు .దాదాపు ఇరవైకి పైగా పుస్తకాలు రాశాడు .

అయితే ఇవాళ బాడేలేర్ ను ఏ భావ జాలం వాళ్ళు తమవాడు ,ప్రేరకుడు  మార్గ దర్శి అని చెప్పటం లేదు .అతని ప్రభావం ,ప్రేరణ ఉత్తేజం అన్ని రకాల భావజాలాలోకి చొచ్చుకుపోయి  కలిసి కరిగి పోయాయి .శృంగార విరాగాలలో కలిసి పోయాయి .బాడేలేర్ చెప్పిన అసలు సూక్తి ఏమిటి అంటే ‘heaven or Hell what does it matter .Let us plunge into the depths .In the very pit of the unknown ,we will find the New ‘’.మార్సెల్ ప్రాస్ట్ ,ఆల్ఫ్రెడ్ డీ విన్జీ మొదలైన ఫ్రెంచ్ కవులు అతని ప్రభావానికి లోనయ్యారు .ఇంగ్లీష్ కవులలో ఎడ్మండ్ విల్సన్ ,ఇలియట్ మొదలైన వాళ్ళు  సింబాలిజాన్ని పోషించారు .సెక్స్ ను చావును గురించే ఎక్కువ చెప్పాడు .అవే ‘’ స్కాండలస్ సాహిత్యం’’ గా ముద్రపడ్డాయి .లెస్బియన్ శృంగారం చాలా పవిత్రమైనది ఆరోగ్యమైనది అని చెప్పాడు .ప్రేమ ఆరాధన గురించి ,రూప పరివర్తన ,శోకం ,నగరాలలో అవినీతి పైకవిత్వం రాశాడు .జీవించలేని దుర్భర పరిస్తితులను చూసి చాలించాడు . .If rape or arson, poison or the knife

Has wove no pleasing patterns in the stuff

Of this drab canvas we accept as life—

It is because we are not bold enough!

(Roy Campbell‘s translation)

మరో ప్రముఖునితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -15

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -15

                     8- ఆధునిక ప్రతీక వాద రచయిత -చార్లెస్ బాడేలేర్

ఆధునికత అనే పదానికి సృష్టికర్త ,సింబాలిజం కు ఆద్యుడు ,ది ఫ్లవర్స్ ఆఫ్ ఈవిల్ నవల ద్వారా ప్రపంచ  ద్రుష్టి నాకర్షి౦చిన ఫ్రెంచ్ రచయిత చార్లెస్ పియరీ బాడేలేర్.19 వ శతాబ్దపు ఫ్రెంచ్ రచయితలు కొరడా దెబ్బలు కొట్టుకొని పాఠకులనూ అలానే కొట్టారు .వాళ్ళమనసులోని కోపం ,డిప్రెషన్ ,లను వ్యక్తిగత సెన్సేషనలిజం , ,బాహ్య ప్రదర్శనం గా మార్చుకొన్న విపరీత మనస్కులు .అందులో బార్లీ డీ ఆర్విల్ సముద్రపు ఎండ్రకాయ లాగా జీవిస్తూ అది సముద్రపు రహస్యాలు తెలుసుకోగలదని దాని హ్రుదయ౦  అతి పవిత్రమైనదని  అన్నాడు .బాడేలేర్ వీధుల్లోనే యెర్ర ఈకలతో చేసిన దాన్ని మెడ చుట్టూ కట్టుకొని తిరిగితే ,ఇంకో ఆయన రి౦బాడ్ దైవ దూషణ రాతలను పార్కు బెంచీల మీద పిచ్చ పిచ్చగా వంకర  టింకర గా ‘’షిట్ – గుడ్ బై ‘’( Merde a Dieu) అని రాసేవాడు .బాడేలేర్ చాలాబాధలు అనుభవించాడు .సమకాలీన రచయితల కంటే ఎక్కువగా స్వయంకృత డయాబాలిజంఅంటే  దెయ్యాల భయం తో   ,అపరాధ భావం తో క్షోభ చెందాడు .ఇవే మనసంతా నిండిపోయి ‘’ఫ్లవర్స్ ఆఫ్ ఈవిల్ ‘’అనే ప్రఖ్యాత నవల రాశాడు .దీనిని సమీక్షిస్తూ ప్రముఖ విమర్శకుడు డీ ఆర్విల్ ‘’డాంటే స్వయం గా నరకం సందర్శిస్తే,  బాడేలేర్ ఆ నరకం నుండే వచ్చాడు ‘’అన్నాడు.

 పారిస్ లో 1821ఆగస్ట్ 9 న  బాడేలేర్ పుట్టేనాటికి తండ్రి వయసు 62,తల్లి వయసు 26.అంత వ్యత్యాసం ఉంది .ఒక్కడే పిల్లడుకనుక సంపన్నుడైన తండ్రి తన వెంట మ్యూజియం లకు తిప్పుతూ ఎన్నోకధలను చెబుతూ వాత్సల్యాన్ని కురిపిస్తూ  ,ఉత్సాహం కలిగించాడు .ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు .ఏడవ ఏటనే తండ్రి చనిపోగా తల్లి యువ కమాండర్ ను ప్రేమించి పెళ్ళాడింది .బాడేలేర్ కు ఈ కొత్త తండ్రిపై ద్వేషమే కలిగి హామ్లెట్ లాగా తల్లిమీదా అది ప్రతిఫలించి ఆమె తనకు నమ్మక ద్రోహం చేసిందని నిశ్చయించుకొన్నాడు . మాతృప్రేమను కోల్పోయానని బాధపడ్డాడు .ముప్ఫై  ఏళ్ల తరువాత అమ్మ ఒడిలోని మాధుర్యాన్ని ,ఆమె చూపించిన  శ్రద్ధ ,వాత్సల్యాలను అనుభూతిని  గుర్తుకు తెచ్చుకొని  రాసుకొన్నాడు .

  స్కూల్ లో చదువులో సాధారణం గా ఉండేవాడు .సాహిత్యం తప్ప మిగిలిన విషయాలేవీ అతన్ని ఆకర్షించలేదు .లాటిన్ పద్యాలకు బహుమతి వస్తే ,అవిదేయతకు శిక్ష పొందాడు .మళ్ళీ చేరి పరీక్ష పాసై తోచిందేదో రాస్తూ కాక్షేపం చేశాడు .కుర్రాడు చెడు సావాసాలుప ట్టిపాడి పోతాడేమో అని భావించి మారుటి తండ్రి సుదీర్ఘ ప్రయాణం తో కలకత్తా కు పంపించాడు .నౌక ఒకసారి ఘోర తుఫాను ప్రమాదానికి గురైతే ప్రయాణం విరమించి మారిషస్ లో .అక్కడి ట్రాపికల్ సీనరీ ,రెచ్చగొట్టే అమ్మాయిలూ బాగా నచ్చి , .లోపల దాగి ఉన్న కవిత్వానికి ప్రేరణ లభించ గా కొద్దికాలం ఉండిపోయాడు .మళ్ళీ పారిస్ చేరి కుర్రగాంగ్ తోకలిసి ‘’బోహీమియన్  అరిస్తో క్రసి ‘’అని పేరుపెట్టుకొని జీవించాడు . .నీటైన సోగ్గాడు బాడేలేర్ విలాసంగా వారిమధ్య కాలం గడిపాడు .బార్బీ డీ ఆర్విల్ అనే వాడుతన వింత చేష్టలతో   జతకలిసి ఉన్నాడు .క్రమంగా ఈ బాచీ సంఖ్య పెరిగింది .డబ్బు మదించిన వాళ్ళే వీళ్ళు .దియేటర్ లో చిన్న వేషాలు  వేసే ఒక పిల్లను చూసి  వ్యభిచారిణి కాదని చేరదీసి పెళ్ళాడాడు బాడేలేర్ .ఏ క్షణానికి తోచిన భావాన్ని అప్పటి అప్పుడే కవిత్వీకరించటం ప్రారంభించాడు .కలిగిన ప్రతిమానసిక భావాన్ని అక్షర బద్ధం చేశాడు .అప్పుడప్పుడు వచన రచనా చేశాడు .తటస్థపడిన ప్రతి స్త్రీపైనా కవితలు రాసినా ,జీన్ డవాల్ అనే ఆమె బాగా ప్రేరణ కలిగించింది .ఆమెనే ‘’డార్క్ వీనస్ ‘’అన్నాడు .ఆమె అంగాంగ  సౌందర్యాన్నీ కవిత్వ బద్ధం చేశాడు .యెంత త్వరగా ప్రేమించి దగ్గరికి చేర్చుకొనే వాడో అంతే స్పీడ్ గా వారితో పోట్లాడి దూరం చేసుకొనేవాడు .కాని జీన్ అతని జీన్స్ నే పట్టుకొన్నది . మనవాడి క్షణికోద్రేకాలకు విసిగి వేసారి ఒక సారి ఆమె అతన్నివదిలి  వెళ్లిపోతానన్నది .ఆమె వియోగాన్ని భరించ లేకపోయాడు .14 ఏళ్ళు కలిసి మెలసి ఉన్న ఆమె తనను వదిలి వెడితే జీవించలేనని తల్లికి ఉత్తరం రాశాడు .కానిఎడబాటు జరగ లేదు . ఇరవై ఏళ్ళు జెన్నీ బాడేలేర్ ‘జీవిత ’నాట్య  నాగిని ‘’గా ఉండిపోయింది .’’అందాల రాక్షసిగా’’’’ ,కాంతి దేవతగా ‘’అతనిమనసులో ఉండిపోయింది .ఆమె అందానికి ఆకర్షణ కి ఆరాధనకి కరిగిపోయాడు .అందం స్వర్గం నుండి భూమికి దిగివస్తుందో నరకంకూపం  నుండి వెడలి వస్తుందో  నిర్ణ యించలేకపోయాడు .దీనినే కవితాపరంగా ‘’viens du ciel profound ou sors-tu de l’abime’’అని రాసుకొన్నాడు .

 విపరీతంగా పిచ్చపిచ్చగా ఆడంబరం గా విచ్చల విడిగా డబ్బు ఖర్చుచేస్తున్నాడు బాడేలేర్ .సంక్రమించిన సంపదలో సగం ఖర్చై పోయింది .ఇలా అయితే చేతికి చిప్పెగతి అని మిగిలిన ఐశ్వర్యం ఇలా దుబారాకాకుండా అతనికి ఫైనాన్సియల్ గార్దియన్ గా ఒక నోటరీ ని ఏర్పాటు చేసింది తల్లి .అప్పటి నుంచి ప్రతి రూపాయి ఖర్చుకోసం నోటరీ దయా దాక్షిణ్యం పై ఆధార పడాల్సి వచ్చింది .ఖర్చు అలవాటైన ప్రాణం కదా విలవిల లాడుతోంది .అప్పులు చేస్తున్నాడు విపరీతంగా .అప్పిచ్చే వాళ్లకు ఎర గా మారిపోయాడు .డాబు దర్పం మాయమయ్యాయి .గుండ్రని అందమైన సున్నితమైన ముఖం  గట్టిపడిపోయింది .నవ్వుతూ హాళ్ళూ పెళ్ళూ గా ఉండేవాడు ముభావం గా ఉంటున్నాడు .చెక్కులు చిక్కిపోయాయి .అందమైన ఖరీదైన ధగధగలాడే బట్టలు వదిలేసి నల్ల బట్టలు కడుతున్నాడు .నల్ల బ్రాడ్ క్లాత్ మాత్రమె వేసుకొంటున్నాడు .దావీదు మహిమ కాదు ఇది ధనమహిమ .దనం చేతిలో ఆడక వచ్చిన పరిస్తితి కాదు కాదు సృష్టించుకొన్న స్థితి .దుస్తితి .బోహీమియన్ సంస్కృతీ వదిలి పెట్టేశాడు .బూర్జువా ముఠాకు దూరంగా ఉంటున్నాడు .1848జూన్ రివల్యూషన్ కు సాయం చేశాడు .బారికేడ్ లనిర్మాణం లో ,సాయపడ్డాడు .స్వయం గా ‘’we must shoot General Aupick ‘’అనే బానర్ ‘’నేశాడు ‘’.సాధారణ సైనికుడి స్థాయి నుండి జెనరల్ పదవికి ఆ తర్వాత రాయబారిపదవికి ఎదిగిన వాడిపై ద్వేషం మాత్రం పోలేదు .

     విప్లవ పత్రిక’’సాల్ట్ పబ్లిక్ ‘’ స్థాపించి నడపటం లో రాజీలేని వాస్తవ చిత్రకారుడైన గుస్తేవ్ కూర్బేట్  కు ,హెరాన్ దీమార్ అనే విమర్శకుడికి సహాయపడ్డాడు .విప్లవానికి ఇన్ని రాకాల ఊపిరులు ఊదినా అది విఫలమై చప్పగా చల్లారి పోవటం తో మానసిక క్షోభ చెందాడు బాడేలేర్ .’’సెకండ్ ఎంపైర్ ‘’అధికారానికి వచ్చింది .రాజకీయం అంటే రోతపుట్టింది .వీధుల్లోకొచ్చి విప్లవ నినాదాలిచ్చి ఉద్రేకం తో ఊగి ,ఊగించిన ‘’మాబ్ ‘వింత, విపరీత ప్రవర్తనకు  అసహ్యమేసింది .ఉదాసీనత మనసులో, శరీరం లో ప్రవేశించి నిష్క్రియా పరుడయ్యాడు బ్రాడేలేర్ .

    Étienne Carjat, Portrait of Charles Baudelaire, circa 1862.jpg సశేషం

      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment