ప్రుఫాక్ గీతానికి నూరేళ్ళు -రామ తీర్ధ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెల్లవారి పై కోర్టు కేసు గెలిచిన తొలి నల్లజాతిమహిళ-సౌజేర్నార్ ట్రూత్

తెల్లవారి పై కోర్టు కేసు గెలిచిన తొలి నల్లజాతిమహిళ-సౌజేర్నార్ ట్రూత్

నల్ల వజ్రం

ఆఫ్రికన్ అమెరికన్ మహిళ,బానిసత్వ నిర్మూలన ఉద్యమకారిణి ,స్త్రీహక్కుల పోరాట యోధురాలు సౌజేర్నార్ ట్రూత్ అమెరికా న్యూయార్క్ లోని  స్వార్టర్కిల్ లో  అల్స్తర్ కౌంటి లో1797లో బానిసగా  జన్మించింది .1826లో బానిస సంకెళ్ళు తెంచుకొని  కూతురు తో  సహా పారి పోయింది .తన  కొడుకును  తనకు  ఇప్పించమని తెల్లాయన పై  కోర్టులో కేసు వేసింది  .ఆ కేసు గెలిచి  కొడుకును దక్కి౦చు కొని  దేశం లో మొదటి సారిగా తెల్లవారిపై కేసు వేసి గెలిచిన నల్లజాతి వజ్రం అయింది ట్రూత్ .నిజం గా ట్రూత్ ఆమె వైపే ఉంది .అందుకే గెలిచింది .ఆమె అసలు పేరు ఇసబెల్లా బామ్ ఫ్రీ. 1843లో తన పేరును సౌజేర్నార్ ట్రూత్ గా మార్చుకొన్నది .ఒహాయో లోని ఆక్రాన్ లో 1851లో ఒహాయో స్త్రీహక్కుల సమావేశం లో అనర్గళం గా మాట్లాడి అందరిని ట్రూత్ ఆకర్షించింది .ఆమె ఎంచుకొన్న శీర్షిక ‘’నేను స్త్రీని కానా ?(Ain;t I a woman ?)ఒక విమోచనోద్యమ స్లోగన్ అయింది .ఆమె సివిల్ వార్ లో డచ్ భాష ను మొదటిభాషగా ఉపయోగించింది .అమెరికన్ యూనియన్ ఆర్మీకి నల్లవారిని సైనికులుగా చేర్చటానికి సాయ పడింది .యుద్ధం తర్వాత బానిసలుగా పూర్వం జీవించిన వారందరికీ నివాస స్థలాని ప్పించటానికి తీవ్ర కృషి చేసింది కాని ,సఫలీకృతం కాలేదు .

బానిసగా నాలుగు సార్లు అమ్మకం

ట్రూత్ తలిదండ్రులను హార్డెన్ బర్గ్ అనే తెల్ల దొర బానిస వర్తకుల నుంచి కొని తన ఎస్టేట్ లో ఉంచుకొన్నాడు .ట్రూత్ తొమ్మిదేళ్ళ పిల్లగా ఉన్నప్పుడు హార్డెన్ బర్గ్ చానిపోతే ఆమెను సంతలో గోర్రేపిల్లలతో బాటు వంద డాలర్లకు న్యూయార్క్ లోని కిన్గ్ స్టన్లో ఉండే జాన్ నీలీ కి అమ్మారు .అప్పటిదాకా ట్రూత్ డచ్ భాషలోనే మాట్లాడేది .నీలీ కర్కోటకుడు. ఎప్పుడూ ఇనపరాడ్లు పెట్టి కొట్టి బాధించేవాడు .దయా దాక్షిణ్యం లేని పశువు .నీలే ట్రూత్ ను నూట అయిదు డాలర్లకు పోర్ట్ ఈవెన్ లో ఉండే మార్తినాస్ కు అమ్మేశాడు .పదినెలల తర్వాత మార్టినస్ ఈమెను న్యూయార్క్ దగ్గర వెస్ట్ పార్క్ లోని జాన్  డుమాంట్ కు  అమ్మాడు . ఈ నాలుగో యజమాని కొంత ఉదారా స్వభావం ఉన్నవాడే కాని అతని రెండో భార్య ట్రూత్ ను  నరక యాతన పెట్టేది .

బానిస మరో ఫాం లో బానిసను ప్రేమించరాదా?

1815 ప్రాంతం లో ప్రక్క ఫాం లో ఉండే ఒక బానిస రాబర్ట్ ను ట్రూత్ ప్రేమించింది  .రాబర్ట్ యజమాని లాండ్ స్కేప్ పెయింటర్ .తనకు చెందని బానిస తో తన బానిస రాబర్ట్ పిల్లల్ని కనటానికి ఇష్టపడక అడ్డునిలిచాడు .ఒక రోజు రాబర్ట్ ట్రూత్ ను తొంగి చూస్తుంటే అతని యజమాని కొడుకు చూసి రాబర్ట్ ను చితక బాదాడు. ఇది చూసి ట్రూత్ యజమాని జోక్యం కలిగించుకొని విడిపించాడు .అప్పటి నుండి ట్రూత్ రాబర్ట్ ను చూడనే లేదు .ఈ సంఘటన ట్రూత్ ను మానసికం గా కల్లోలపరచింది .తర్వాత ట్రూత్ ఒక ముసలి బానిస థామస్ ను పెళ్ళాడి అయిదుగురు పిల్లల్ని కన్నది .

స్వేచ్చ కోసం పారిపోయిన ట్రూత్

న్యు యార్క్ రాష్ట్రం 1799లోనే బానిసత్వ నిర్మూలనం మొదలు పెట్టినా పూర్తిగా అమలు జరిగింది 4–4-1827నమాత్రమె .విమోచనకు ఒక ఏడాది ముందే ట్రూత్ కు విమోచన కలిగిస్తానని ఆమె యజమాని ప్రకటించినా ఆ పని చేయ లేదు .ఆమెకు చేతి దెబ్బ తగిలిందని ఆమె వల్ల ఆదాయం లేదని కుంటి  సాకులు చెప్పాడు .యజమాని మీద విశ్వాసం తో ట్రూత్ వంద పౌన్ల నూలు వడికింది .1826లోపెద్ద పిల్లలను యజమాని దగ్గరే వదిలిపెట్టి  చంటి పిల్ల సోఫియా తో యజమాని ఇంటినుంచి పారిపోయింది .అక్కడ నుండి ఐసాక్ మేరియా దంపతుల దగ్గరకు చేరగా వారు ఈమెను ,పిల్లను జాగ్రత్తగా చూసుకొన్నారు .విమోచన చట్టం ఆమోదం పొందేదాకా అక్కడే ఉంది .

కోర్టులో కేసు గెల్చిన మొదటి బానిస స్త్రీ ట్రూత్

ఆమె పెద్దఅయిదేళ్ళ కొదుకునూ యజమాని అన్యాయం గా అలబామాలోని ఒక యజమానికి అమ్మాడని తెలుసుకొన్నది .మేరియా దంపతుల సహాయం తో కోర్టులో కేసు వేసి గెలిచి తన కొడుకును తాను దక్కించు కొన్నది ట్రూత్ .ఈ విధం గా ఒక నల్ల జాతి బానిస తెల్ల జాతి యజమాని మీద కోర్టులో కేసు వేసి గెలిచి కొడుకును దక్కించుకోవటం చరిత్రలో ఇదే మొట్టమొదటిది .దీనితో ట్రూత్ గురించి అందరికీ తెలిసింది

మత విశ్వాసం .

మేరియా వాన్ వాజేన్స్ దగ్గర ఉండగా ట్రూత్ ఆధ్యాత్మిక ఆలోచనలలో పది నిజమైన క్రిస్టియన్ గా మారింది 1829 లో పిల్లాడు పీటర్ తో  సహా న్యూయార్క్ సిటీ చేరింది .క్రిస్టియన్ ఇవాన్జలిస్ట్ ఎలిజా పియర్సన్ ఇంట్లో హౌస్ కీపర్ గా ఉన్నది .తర్వాతా రాబర్ట్ మాధ్యూస్ తో పరిచయమై మాతియా కింగ్డం ఆఫ్ కమ్మ్యునల్ కాలనీ లో అతని హౌస్ కీపర్ అయింది .ఎలిజా పియర్సన్ మరణించాడు .అతన్ని విషం పెట్టి చంపారని అతని ఇల్లు అంతా దోచేశార్ని రాబర్ట్ మీద ట్రూత్ మీద అభియోగం వచ్చింది .కేసు కొట్టేశారు .రాబర్ట్ పడమటి దేశానకి వెళ్ళిపోయాడు .

1839లో ట్రూత్ కొడుకు వేల్ హంటింగ్ షిప్ లో ఉద్యోగం లో చేరి మళ్ళీ కనిపించలేదు తిమింగిలం బారిన పడి చని పోయి ఉంటాడు .1843 జూన్ ఒకటవ తేదీ న తన పేరు ‘’సౌజేర్నార్ ట్రూత్ ‘’గా మార్చుకొని దేవుడు తనను పిలుస్తున్నాడని చెప్పింది .మెథడిస్ట్ గా మారి బానిస విమోచానకోసం పర్యటన చేస్తూ ఉపన్యాసాలిస్తూ గడిపింది .1844లో మాసా చూసేట్స్ రాష్ట్రం లోని నార్త్ ఆమ్ప్ టన్లో ‘’నార్త్  అంప్ టన్అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రి’’లో చేరి స్త్రీ హక్కులకోసం ,మత సహిష్ణుత ,పాసిఫిజం లకోసం కృషి చేసింది .ఈ సంస్థ 470ఎకరాల ఒక ఫాం హౌస్ లో ఉండేది .అక్కడ సభ్యులు పశువుల పెంపకం ,కోతమర నిర్వహణ ,గ్రిస్ట్ మిల్లు (పిండిమర)సిల్క్ ఫాక్టరీ నిర్వహించారు .ఇక్కడే ప్రసిద్ధ విమోచన నాయకులు ఫ్రెడరిక్ డగ్లాస్ ,విలియం లాయడ్ ,డేవిడ్ రాగ్లర్స్ మొదలైన వారితో పరిచయం కలిగింది .1846లో స్వయం పోషకం గా లేదని ఈ సంస్థను రద్దు చేశారు .

ట్రూత్ లైఫ్ హిస్టరీ

జాన్ బెన్సన్ ఇంటి వ్యవహారాలూ చూడటానికి ట్రూత్ కుదిరింది .పశ్చిమం వైపు వెళ్లేముందు జాన్ ద్యుమాంట్ ను కలుసుకొన్నది .తన జ్ఞాపకాలను స్నేహితురాలు ఆలివ్ గిల్బర్ట్ కు ట్రూత్ చెబితే ఆమె రాసి పుస్తకం గా కూరిస్తే విలియం గారిసాన్ దాన్ని రహస్యం గా ‘’ది నారేటివ్ ఆఫ్ సౌజార్నేర్ ట్రూత్ –ఏ నార్దర్న్ స్లేవ్’’పేరిట పబ్లిష్ చేశాడు . ఫ్లారెన్స్ లో మూడు వందల డాలర్లతో ఒక స్వంత ఇల్లు ఎర్పరచుకోన్నది .మాసాచూసేత్స్ లోని వార్ చెస్టర్ లో ‘’మొదటి జాతీయ మహిళా సమాఖ్య ‘’సమావేశం లో ట్రూత్ మాట్లాడింది .కమ్మ్యూనిటికి చెందిన సామ్యుఎల్ అప్పులు తీర్చింది .తన ఇంటి ప్రక్క స్థలాన్నికొని ,తర్వాతా అమ్మేసి మిచిగాన్ రాష్ట్రం లోని బాటిల్ క్రీక్ కు చేరింది .

నేను స్త్రీనికానా?

ట్రూత్ మాట్లాడిన’’ Ain;t I a woman ?స్పీచ్ చిరస్తాయిగా నిల్చి పోయింది ఆ తర్వాతా పదేళ్ళు వందలాది ఉపన్యాసాలిచ్చి జనాన్ని ప్రభావితుల్ని చేసింది .న్యూయార్క్ లోని బ్రాడ్వే లో గొప్ప ప్రసంగం చేసింది .’’ఫ్రెండ్స్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెస్ ‘’లో మిచిగాన్ లోని బాటిల్ క్రీక్ చేరి మహోపన్యాసమిచ్చింది .అందులో ఒకడు ‘’నువ్వు మరీ మగాడిలా మాట్లాడుతున్నావ్ ‘’అనగానే రెచ్చి పోయి ట్రూత్ జాకెట్ విప్పి తన వక్షోజాలను సభా ముఖం గా చూపించి వాడి నోరు మూయించింది . ‘’అమెరికన్ ఈక్వల్ రైట్స్ అసోసియేషన్ లో ,నీగ్రోల ఎనిమిదవ  స్వేచ్చా సమావేశం లో భావోద్రేకాలతో మాట్లాడి  కార్యో న్ముఖులను చేసింది .

సేవాకార్యాలు

నార్త్ అంప్ టన్లో  ఇల్లు అమ్మేసి మిచిగాన్ లో హార్మోనియాలో కొత్త ఇల్లు కొనుక్కొన్నది .అమెరికన్ సివిల్ వార్ లో నల్లజాతి వారిని సైన్యం లో చేర్చే ప్రయత్నం చేసింది .ఆమె మనవడు జేమ్స్ కల్దేవేల్ చేరాడు .వాషింగ్టన్ లోని ‘’నేషనల్ ఫ్రీడ్ మాన్స్ రిలీఫ్ అసోసియేషన్ ‘’లో ఉద్యోగం చేసింది .అక్కడి ఆఫ్రికన్ అమెరికన్ ల జీవిత విధానాన్ని మెరుగు పరిచింది .ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ను కలుసుకొన్నది .ఫ్రీడం హాస్పిటల్స్ లో పణి  చేస్తూ గుర్రబ్బండీ తొలి సైన్యానికి సాయ పడింది .’

సైన్యం కోసం దేశ భక్తీ గీత రచన ,గానం

మొదటి మిచిగాన్ కలర్డ్ రెజిమెంట్ కోసం ‘’ది వాలిఎంట్ సోల్జేర్స్ ‘’అనే దేశ భక్తీ ప్రబోధ గీతం రాసి దాన్ని స్వరపరచి డెట్రాయిట్ ,వాషింగ్ట న్ లలో స్వయం గా పాడిన దేశ భక్తురాలు ఫ్లారెన్స్ లో విపరీతమైన ప్రయాణ బడలిక తో ఉన్నా కోరగానే  చిన్నపిల్లలా నుద్దేశించి అప్పటికప్పుడు మాట్లాడి వారిని ఉత్సాహ పరచింది .1870లో ఫెడరల్ ప్రభుత్వం  పూర్వపు బానిసలకు ఇళ్లస్థలాలను ఇప్పించమని తీవ్రంగా కోరి ప్రయత్నించినా ఇప్పించ లేక పోవటం ఆమెను తీవ్రంగా కలచి  వేసింది . ప్రెసిడెంట్ యులిసిస్ ను కలిసి బాటిల్ క్రీక్ కు తిరిగొచ్చి అధ్యక్ష ఎన్నికలో వోటు వేయటానికి వెడితే తిరస్కరించి పంపారు .

26-11-1883 నాడు సాంఘిక సంస్క రణాభిలాషి ,విమోచనోద్యమ నాయకురాలు ,మహిళాహక్కుల పోరాట యోధురాలు మహా వక్త ‘’సౌజేర్నార్  ట్రూత్ ‘’ఎనభై ఆరేళ్ళ వయసులో మరణించింది .

Sojourner truth c1870.jpg

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-15-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

హరితం

haritam1 001 haritam2 001 haritam3 001 haritam4 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోపాల కృష్ణాష్టకం -2

గోపాల కృష్ణాష్టకం -2

5-కుమారులిద్దరూ కృష్ణ ,రవి

 తలిదండ్రుల  సంస్కారం తో  పెరిగి

తమదైన విధానం తో విలసిల్లుతున్నా

ఇద్దరికీ వారు నిత్య ఆరాధ్య దైవాలే

ఇద్ద్దరు కోడళ్ళు ,మనుమలు మనవ రాళ్ళు

ఆ ఇంటి సౌభాగ్య చిహ్నానికి ఆన వాళ్ళు

దేశీయత నిండిన విదేశ జీవన యానం

విదేశం లో వెదజల్లుతున్న జంట విజ్ఞాన ప్రసూనం  .

6-అక్క డాక్టర్ శ్రీమతి అన్నపూర్ణకు నుద్దియౌ బావ

డాక్టర్  శ్రీ  నరసింహ శర్మ ఏం. డి.  రాచకొండ

సాహితీ సౌరభాలు వెదజల్లే ఏరాడ కొండ

వైద్యం లోనేకాక  ఆంధ్రాంగ్ల గీర్వాణాల మేలిమి కలయిక

మా గోపాల కృష్ణ దంపతులకు అక్కా బావా  

ఆది ఆదర్శదంపతులు భళిరా వారే వా .

వారిద్దరి సంస్కారానికీ వీరిద్దరి నీరాజనాలు

వసుధైక కుటుంబ భావనలకు వెదజల్లిన బీజాలు .

7-సిద్ధ యోగిపు౦గ వులను తల్లికి అంకిత మిప్పించి

మహిళా మాణిక్యాలను  జీవన సహచరి అర్ధాంగి కిప్పించి

క్షేత్రాలనేమో తన్నుతీర్చి  దిద్దిన కోగంటి వారి కందజేయించి

ఋణము  తీర్చుకొన్నట్టి ఘనులు గోపాల కృష్ణ  

పట్టు బట్టి తెలియ కుండ   ‘’గీర్వాణకవుల ‘’న౦కితమిచ్చి

 గోపాల  బంధుకోటి లోఒకడనై సరస జేరి  

 ధన్యుడనైన  నా భాగ్య గరిమ ఎన్న దరమే

సరసభారతికి  శ్రేయో మూర్తి గోపాల కృష్ణ మూర్తి .

8-పుట్టిన దేశం పై ,పెరిగిన గ్రామ౦ పై ఎంతటి ఆరాధన !

 ఎన్నెన్నో  దాన ధర్మాలు చేసి చేతికి ఎముక లేదని పించారు

ఉయ్యూరు ఊసులకు ,ఊసుల్లో ఉయ్యూరుకు పరవశులౌతారు

ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ వారిది అభయ హస్తమే

పెడ దారిన పడిన వారికి అందించే ఆపన్న హస్తమే  

బంధువులందరి నోళ్ళలో నానే ‘’కృష్ణ ‘’–‘’కృష్ణ  మామ ‘’

స్నేహపు విలువ తెలిసిన అక్షర తేజో మూర్తి గోపాల మైనేని

వర్ధిల్లాలి వారి దాంపత్యం సుఖశాంతులతో  ఏండ్లు ఎన్నేని .

మీ ఆప్తుడు ,ఆత్మీయుడు –    దుర్గా ప్రసాద్ -28- 6-15-ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

ఉప్పలధడియం వెంకటేశ్వర గారి స్పనదన

ఉభయ కుశలోపరి

చెన్నై

27.06.2015

పూజ్యులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి,

నమస్సులు. తమరు దయతో పంపిన పుస్తకాలు అందాయి. ఎంత గొప్ప సాహితీ వరివస్య !ఒకవైపు ఆంగ్ల కవుల పరిచయాలు, మరో వైపు సంస్కృత కవుల పరిచయాలు. అటుపై మహిళా మాణిక్యాలు. ఇక దర్శనీయ దైవక్షేత్రాలు, దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు, శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం – ఎంత వైవిధ్యం, ఎంత వైదుష్యం!

 

‘పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు’ ద్వారా అనేక ఆంగ్ల కవుల గురించి తొలిసారి తెలుసుకొన్నాను. ముఖ్యంగా రాజకవి మొదటి జేమ్స్, జాన్ స్కెల్టన్, క్రిస్టఫర్ మార్లో, రిచర్డ్ క్రాషా ప్రభృతుల గురించి. ఇక చాసర్, షేక్స్పియర్, మిల్టన్, డ్రైడన్, అలెక్జాండర్ పోప్, బ్లేక్, వర్డ్స్ ప్రభృతుల గురించి తగినంత విపులంగా రాశారు. డిలాన్ థామస్ గురించి చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. మరికొంత కాలం బతికి ఉండి, ఇబ్బందులు లేని జీవితం గడిపి ఉంటే మరిన్ని మంచి రచనలు చేసే వాడేమో అనుకోకుండా ఉండలేక పోయాను.

 

ప్రాచీన, ఆధునిక సంస్కృత కవులందరినీ పరిచయం చేస్తూ సంతరించిన గీర్వాణ కవుల కవితా గీర్వాణం అద్భుతమైన గ్రంథం. సరళంగా చెబుతూనే అవసరమైన అన్ని అంశాలనూ అందించారు. ముఖ్యంగా నైషధ కావ్య పరిచయం, మృచ్ఛకటిక పరిచయం, భారవి, భాసుడు, బాణుడు, మాఘుడు, భవభూతి, ఆనందవర్ధనుడు (ఆలంకారికుడు), మల్లినాథసూరి (వ్యాఖ్యాత), జగన్నాథ పండితరాయలు(ఆలంకారికుడు), మానవల్లి రామకృష్ణ కవి  ప్రభృతుల  పరిచయాలు చక్కగా వచ్చాయి. తెనాలి రాముని కథలను సంస్కృతీకరించిన సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి కృషి కొనియాడ దగినది. ఇతర భాషలలోకి మన సాహిత్యాన్ని తీసుకుపోయిన వారి పట్ల నాకు విశేష గౌరవం.కాగా, వాల్మీకి, వ్యాసుల పరిచయం కూడా ఇచ్చి ఉంటే సమగ్రత సిద్ధించి ఉండేదని భావిస్తున్నాను. విశ్వనాథ వారి సంస్కృత రచనల గురించి రేఖామాత్రంగా నైనా పరిచయం చేసి ఉండవచ్చుననుకొంటాను. అదలా ఉంచితే, సంస్కృత సాహిత్యాన్ని తెలుగులో ఇంత సరళ సుందరంగా పరిచయం చేసిన వారు ఇంకెవరూ లేరు. మీ కృషి దొడ్డది.

 

‘దర్శనీయ దైవక్షేత్రాలు’ తీర్థయాత్రలకు వెళ్ళే వారికి బాగా ఉపకరిస్తుంది. గుడిమల్లం గురించి మీరు పరిచయం చెయడం ముదావహం. నేనూ, మా అన్న (పెదనాన్నగారి అబ్బాయి) సత్యనారాయణా 1989లో ఆ గుడిని సందర్శించాము, చారిత్రక స్పృహతో. ఇన్నేళ్ళకు మళ్ళీ ఆ గుడి గురించి చదవడం ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపింది. ర్యాలి (జగన్మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు), సురుటుపల్లి (అనంతశయనంలో శివుడు), శ్రీ కూర్మం, అరసవిల్లి, శ్రీ ముఖలింగం, కాణిపాకం (చిత్తూరు జిల్లా – విఘ్నేశ్వర మందిరం), మంత్రాలయం (రాఘవేంద్ర స్వామి), విజయవాడ కనకదుర్గ మందిరం, మంగళగిరి, అహోబిలం, మహానంది ఇత్యాది దేవాలయాలను కూడా (మలి ముద్రణలో) కలుపుకొంటే మన రాష్టంలోని అన్ని ఆలయాలనూ పరిచయం చేసినట్టు అవుతుంది.

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు చదివి ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. ఇన్ని దేశాలలో ఆంజనేయ ఆలయాలు ఉన్నాయా అని ఆశ్చర్యం, తెలుసుకోగలిగినందుకు ఆనందం.         శ్రద్ధాసక్తులతో ఎక్కడెక్కడి సమాచారాన్నో క్రోడీకరించినందుకు మీకు జోహారు.

శ్రీ ఆంజనేయస్వామి మాహాత్మ్యం మా నాన్న చదివిన తరువాత నేను చదువుతాను. కాగా, త్యాగి పేరడీలు మరింత పదును దేరవలసి ఉంది.

మహిళా మాణిక్యాలు ఎంతో ఉపయుక్తమైన గ్రంథం. ప్రజా

కవయిత్రి ఫీలిస్ మెక్ గిన్లీ గురించి మీ పుస్తకం ద్వారానే తెలుసుకొన్నాను. పెరెల్ ఎస్. బక్, డొక్కా సీతమ్మ, శకుంతలా దేవి, భానుమతి, కేథరిన్ మాన్స్  ఫీల్డ్, యశోధరా రెడ్డి, భండారు అచ్చమాంబ. జిల్లేళ్ళమూడి అమ్మ, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, సిల్వియా పాత్, అన్నే ఫ్రాంక్, అగతా క్రిస్టీ, జూడిత్ రైట్ మినహా తక్కిన వాళ్ళ గురించి ఇప్పుడే తెలుసుకొన్నాను. ధన్యవాదాలు. ఇంకా జెన్నీ మార్క్స్, సరోజినీ నాయుడు, డా. ముత్తులక్ష్మీ రెడ్డి, ఆంగ్ కాయ్ సూ (మయన్మార్ నేత), మేరీ క్యూరీ తదితరులను కూడా చేర్చుకోవచ్చు. మొత్తం మీద ఉత్తమ రచన అనడంలో ఎలాంటి సంశయమూ లేదు.

తమ కృషికి మరో మారు అభినందనలు.

ఉప్పలధడియం వెంకటేశ్వర

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆధ్యాత్మిక సాహిత్యం



గబ్బిట దుర్గా ప్రసాద్
imggallery

India 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తరం -మారిన స్వరం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాహు బాలి పై బహు కధనాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాళ్లి ద్దరూ (బాపు-రమణ )మళ్ళీ వస్తే బాగుంటుంది -అన్న వరా ముళ్ళపూడి

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

రన్ మై డియర్ జాన్సన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ సరస్వతి -పుల్లెల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోపాలాస్టకం

   గోపాలాస్టకం

1-శ్రీయుత మైనేని గోపాల కృష్ణ

 తరగని మెరుగైన సాహితీ తృష్ణ

 ఆత్మీయ ఆప్యాయతల నిండు కృష్ణ

మాటల్లో మాత్రం గలగలా పారే కృష్ణ

హృదయం అతి పవిత్ర పుష్కర కృష్ణ

సహృదయత, మానవతల  పోటెత్తిన కృష్ణ

సహన సంస్కారాల మెండు నిండు కృష్ణ

ఆధ్యాత్మిక వలయాలకు ఆవలి కృష్ణ ‘

2-శ్రీ గోపాల కృష్ణ మైనేని

స్నేహానికి మత్తెక్కించే ఐరేని

అందరి శాంతి సౌఖ్యాలు కోరుకొనే శాంత మౌని

చిరు విషయాకే స్పందించే చైతన్య వని

హృదయం విజ్ఞానం నిండి ఉన్న గని

మస్తిష్కం నిండా పుస్తకాలున్న మణి

బాధిత పీడిత జనుల చింతామణి

మంచి కోసం  మనిషికోసం నినదించే సువాణి .

౩-శ్రీ కృష్ణ మైనేని గోపాల

ఆర్తుల పాలిటి కృష్ణ గోపాల

బంధువుల కు గోపికా లోల

హిత సన్నిహితులకు కృష్ణ కుచేల

గురువులకు  సాందీపాశ్రమశిష్య హేల

పెద్దల యెడ అత్యంత వినయ విలోల

శ్రీ రామ శ్రీ కృష్ణ భక్తిలో పరవశ లీల

మాతా పిత నిత్య సంస్మరణలో ధన్య లోల .

4-సరసభారతి కి శ్రీ  గోపాల కృష్ణ  తరగని గని

 గురు పూజోత్సవ నిర్వహణ సౌజన్య శీలి

అర్ధాంగి శ్రీమతి సత్యవతికి  ఆదర్శ పెనిమిటి

ఆఇద్దరి దాంపత్యం లోకానికి పెన్నిధి

అమెరికాలో ఉన్నా ఆకుటుంబం

అక్కడా ,ఇక్కడా అందరికీ ఆదర్శం .

ఇంతటి సంస్కార సౌజన్యాల కలయిక

పరిచయం ఉన్న మనందరికీ అష్ట సిద్ధుల వరం .  

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-15-ఉయ్యూరు

నమస్తే గోపాల్జీ -టాప్ లేపే లాప్ టాప్ తో  జ్ఞాపికలతోపుష్పహారం ,నగదు బహుమతి లమీ దంపతుల  అభిమాన వర్షం తో బాటు ,పూజ్యులు శ్రీ మీబావ గారి చేత ఈ డెబ్బై ఆరేళ్ళ కుర్రాడికి అభినందన ఆశీస్సుల కవితా  వర్షం కురిపించి నన్ను పూర్తిగా కృతజ్ఞతా భావపు హర్షం తో తడిసి ముద్ద చేసేశారు . దీనికి ఏమిచ్చి నేను ఋణం తీర్చుకోగలను?శ్రీ శర్మగారి సౌజన్యానికి అభిమానానికి నా కృతజ్ఞతా నమస్సుమాలు.  ఇది ఎన్నటికీ తీర లేని ఋణం ,అనుబంధం . అని పిస్తుంది .కాళి దాసు చెప్పిన ”జననాంతర  సౌహృదయం ”గుర్తుకు వచ్చింది . ఏ పూర్వ రుణాను బంధమోఇది ? ఇంతకంటే మాటలు రావటం లేదు మాటల కంటే నిండు గుండె తో మౌనం గా ఉండటం మేలే కాని అది సభ్యత కాదు సంస్కార లోపం అవుతుందని ఈ నాలుగు మాటలు రాశాను .సదా  మన అభిమాన ,అత్మీయతలు వర్ధిల్లాలని భావిస్తూ -మీ -దుర్గా ప్రసాద్

 

 

Posted in కవితలు | Tagged | Leave a comment

పుట్టిన రోజు వేడుక చిత్రాలు

పుట్టిన రోజు వేడుక చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా పుట్టిన రోజు -డా :శర్మ గారి “ప్రశంసనీయ పద్య సుమములు “

Birthday poem అయ్యా, శ్రీ దుర్గాప్రసాద్ గారూ : ఆమాట కొస్తే మీరు “చేతలవారు” సార్, మీరన్నట్లు “మాటల వారు ” కాదు.  పట్టువిడవని- రమణగారిని అడగండి చెబుతారు- డా :శర్మ గారి “ప్రశంసనీయ పద్య సుమములు ” చూశారుగదా!  దానితో పోలిస్తే  ఇది ఫీలింగ్ లో, శ్రమలో నామమాత్రమే నంటే ముమ్మాటికి నమ్మాలి మీరు.  ఆరోగ్యకారణంగా అవస్తపడుతూ గుండెనొప్పితో  బాధపడుతూకుడా ఆపద్యాన్ని ఎన్నిసార్లు revise చేశారో , చేయిoచారో , రమణ గారికీ , journalist శ్రీ ప్రకాష్ గారికీ , వారి సతీమణి సునీత గారికే తెలుసు . ఆరునూరైనా సరే , మీవ్యక్తిత్వం, వారి సీస, కంద పద్యాల్లో ప్రతిఫలించాలనే  తపన ఇoతింతని చెప్పనలవికాదు . రోజుకి పదిసార్లు “ఫోనుల చెర్నాకోలు” తో తోలుకువచ్చారు మమ్మల్ని .

ఇంకా ఏదో లోపమున్నట్లే –100% న్యాయం చెయ్యలేకపోయానే–అనేభావంతో  ఆఖరుకి ఇంకెన్నాళ్ళు బ్రతికుoటామో అని సమాధానపడ్డారు.
నాకుకూడా  శ్రీ రమణగారు నిస్వార్ధంగా  ఈ అవకాశమిచ్చి మీపుట్టినరోజున కలిగే  ఆనoదానుభూతిలో పాలు పంచుకునే  ఆవకాశo  కలుగగలందుకు  ఓర్పుతో  నేర్పుతో తోడ్పడినందుకు , అoతా  ఆ శ్రీరాములవారి అనుగ్రహంగా భావిస్తూ ఇంతటితో నాఈ మాటల “చాంతాడు ” ముగిస్తున్నాను (P. S .: ఎంతచెప్పినా , ఎంతచేసినా మిమ్మల్ని
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 156-రామ చరిత్ర రాసిన అభినంద

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

156-రామ చరిత్ర రాసిన అభినంద

సదానదుని కుమారుడైన అభినందుడు .ఉదయ సుందరి అనే కావ్యం లో సోద్దాలుడుఅనే కవి   అభినంద కవిని ,రా జ శేఖరుడిని అభినందించాడు .దీనివలన అభినందన తర్వాతి వాడే రాజ శేఖరుడు అని తెలుస్తోంది .పదకొండవ శతాబ్ది పూర్వార్ధం లో సోద్దాలుడు జీవి౦చిఉన్నాడని యువ రాజు హర వర్ష  అతనికి ఆశ్రయ మిచ్చాడని ,మహా గౌరవం గా చూసుకోన్నాడని తెలిసింది .కవి గొప్పతనాన్ని గుర్తించి హరవర్ష  అర్ధ సింహాసనాన్ని అందించాడనీ కధనం .సోద్దాలక ,అభిన్దలు రాజా హర వర్ష ను విక్రమాదిత్య ,హాల ,శ్రీ హర్ష ల తో పోల్చారు .అభినందన రాసిన’’ రామ చరిత’’ లో హర వర్ష ను యువ రాజ దేవునిగా ,విక్రమాదిత్యుని కుమారుడిగా ,పాల వంశ బీజమైన ధర్మ పాలుని సంతతి వానిగా చెప్పాడు .

బెంగాల్ చరిత్రలో పాల వాంశ రాజు ధర్మ పాలుడు ప్రసిద్ధుడు .అతిని ఇద్దరు కొడుకులు త్రిభువన పాల ,దేవ పాల లు .మాన్ఘీర్ చరిత్రలో త్రిభువన పాలుడు యువ రాజు గా పేర్కొన బడింది .కాని తండ్రి తర్వాత దేవపాలుడే రాజ్యానికి వచ్చాడు .తొమ్మిదవ శతాబ్దపు రెండవ భాగం లో దేవపాలుడు ఖ్యాతి పొందిన రాజు అయ్యాడు ..రాజా దేవపాలుడే యువరాజు హర వర్ష అని రామ సామి శిరోమణి పరిశోధన లో తేలింది .ఇతడే యువ రాజ దేవుడు ..పాల వంశపు వాడికి  హర వర్ష అనేకొత్త  పేరు ఎలా వచ్చింది అనే సందేహం ఉంది .దీనికి సమాధానమూ చెప్పారు .ధర్మ పాలుడు రాష్ట్ర కూట రాచ కన్య కామ దేవి ను పెళ్లి చేసుకొన్నాడు . రాష్ట్ర కూట  రాజులకు పేరు చివర హర్ష అని టాగ్ తగిలించుకోవటం ఒక ఫాషన్ .అందుకే అత్తవారింట్లో ఉన్నప్పుడు దేవపాలుడి పేరు హర వర్ష గా వాళ్ళు పిలుచుకోవటం ప్రారంభించి ఉంటారు అదేచివరికి స్తిరపడి పోయింది .కాని ఇతని పెద్దన్న త్రిభువన పాలుడు తండ్రి ధర్మపాలుని రాజ దర్బారులో  యువరాజుగా చలామణి అయ్యాడు . దీన్ని బట్టి అభినందన కవి తొమ్మిదవ శతాబ్ది పూర్వార్ధం వాడు అని తేల్చారు .

అభినందన రాసిన ‘’రామ చరిత’’ ను భోజుడు ,మమ్మటుడు మహిమ భట్టు పొగిడారు దీనితో అతని ప్రశస్తి ద్విగుణీక్రుతమైంది .ఇది రామాయణ కద యే.బరోడా ప్రతిలో కావ్యం చివరినాలుగు కాండలలో అభినందన ,భీమ కవుల  హస్తం ఉందని అనిపిస్తుందట .ఈ భీమకవి ఎవరో అజ్ఞాత కవి .అభినంద కవి అసంపూర్తిగా వదిలినకావ్యాన్ని   నాలుగు కాండాలను అదనం గా చేర్చాడు అనుకోవాలి .మొత్తం 36 కాండలలో  చాలాభాగం అభినంద  కవి రాసినవే .కదా భాగం తోబాటు తనకు ఆశ్రయ మిచ్చిన రాజుల ప్రశంస  చేశాడు .దీనితో బాటు తన రచనా చమత్క్రు తినీ చెప్పుకొన్నాడు తీర్ధం ,స్వార్ధం గా .విషయ వివరణలో స్పష్టత చిక్కని కవిత్వం ,కవితా వినోదం తో అభినంద కవి రాసిన రామ చరిత కావ్యం అలరారు తుంది .

157కాదంబరి కదా సారం రాసిన –మరో అభినంద కవి

ఇప్పటిదాకా తెలుసుకొన్న రామ చరిత రాసిన అభినంద కవి కాక ,మరో అభినందుడున్నాడు .ఇతనిని ‘’గౌడాభినందనుడు ‘’అంటారు.వీరి వంశం గౌడ దేశం లో ఉండేది .వీరిలో శక్తి అనే వాడు కాశ్మీర దేశం కు చేరేదాకా ఆ పేరుతోనే పిలువ బడ్డారు . శక్తి ఇక్కడికొచ్చి ,దర్వాభి సార లో ఒకమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .శక్తి మనవడు శక్తి స్వామికాశ్మీర్ రాజు లలితాదిత్యముక్త పాద  అనే కర్కోటక వంశ రాజు ఆస్థాన మంత్రి .ఇతని పరిపాలన కాలం 726.శక్తి స్వామికి అభినంద అయిదవ తరం వాడు .జల్హనుడు తన సూక్తి ముక్తావళి లో అభినంద ను రాజ శేఖరుని సమకాలికునిగా చెప్పాడు .అభినవ గుప్తుడు కూడా తన లోచన లో ఇతని గురించి చెప్పాడు .కనుక ఈ అభినంద కవి తొమ్మిదవ శతాబ్ది వాడు అని నిర్ణయించారు .కాని అభినంద  కవి తండ్రి జయంతుడు న్యాయ మంజరిలో దామోర గుప్తుని కుంతిని మాతను శృంగారం తో వర్ణించటం తప్పు  పట్టాడు .శంకర వర్మ ఆ నాటి కాశ్మీర్ రాజు అన్నాడు  .శంకర వర్మ  884నుండి రాజ్యం చేసినట్లు ఉంది .ఇది అభినందన కాలాన్ని కొంచెంతర్వాతి కాలానికి  తెచ్చింది .అంటే పదవ శతాబ్దపు మొదటి వాడు అయ్యాడు .ఇతను ఎనిమిది కాండలలో రాసిన కాదంబరి కదా సారం  బాణకవి వచనం లో రాసిన కాదంబరి  కధే .ఈ కావ్యాన్ని తర్వాతి కవులు చాలా చాటువులలో పొగిడారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 27-6-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరలా అమ్మ ఒడిలోనికి – గతం – వర్తమానం – భవిష్యత్తు – బందా , చదవండి సర్దాగా.

img143 img144

Posted in కవితలు | Tagged | Leave a comment

నా పుట్టిన రోజు

సాహితీ బంధువులకు -ఇవాళ నా పుట్టిన రోజు -75 నిండి 76 లో ప్రవేశిస్తున్న సందర్భం గా అందరికి శుభ కామనలు-మీ -దుర్గా ప్రసాద్ -27-6-15- ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

కలియుగ ధర్మ స్థాపకుడు -పరాశరుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంకా ఊరుకొంటే పరువు పోతుంది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెహ్రూ అబద్ధమాడారు

నెహ్రూ అబద్ధమాడారు

Added At : Thu, 06/25/2015 – 07:45

ఆంధ్రప్రభ నేషనల్ స్టోరీ
న్యూఢిల్లీ: దేశ ప్రథమ ప్రధాని జవ హర్‌లాల్‌ నెహ్రూపై తాజాగా ఒక వివాదాస్పద పుస్తకం వెలువ డింది. ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ ఆ పదవిని ఆధిష్ట్టించకుండా అడ్డుకునేందుకు ఒక సందర్భంలో నెహ్రూ అబద్దమాడారని తాజాగా విడుదలైన పుస్తకం పేర్కొంటోంది. ఇంటెెలిజెన్స్‌ శాఖ మాజీ అధికారి ఆర్‌ ఎన్‌పీ సింగ్‌ ‘నెహ్రూ : ఏ ట్రబుల్డ్‌ లెగసీ’ అనే పుస్తకంలో ఈ విషయం వెల్లడించారు. దానిలో మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్‌ లేఖలు, వాటిలోని అంశాలను సింగ్‌ ప్రచురించారు.
ఆ పుస్తకం ప్రకారం 1949 సెప్టెంబర్‌ 10న రాజేం ద్ర ప్రసాద్‌కు నెహ్ర్రూ ఒక లేఖ రాశారు. దానిలో రాజ గోపాలాచారిని ప్రథమ రాష్ట్రపతి చేయడమే క్షేమకర మైన, ఉత్తమమైన మార్గమని తాను (నెహ్రూ), పటేల్‌ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. (ఇందుకు అధికారిక రికార్డులను సింగ్‌ తమ పుస్త కంలో ఉటంకించారు). ఆ త ర్వాత సర్దార్‌ పటేల్‌, రాజ్యాం గ అసెంబ్లీ సభ్యుల అభి ప్రాయాలకు ఇది భిన్నంగా ఉండడంతో నె హ్రూ తనకు అబద్ధం చెప్పారని రాజేంద్ర ప్రసాద్‌ తీవ్ర వ్యధకు గుర య్యారు. ఆయన తనకు నెహ్రూ రాసిన లేఖ ప్రతిని ఆ సమయంలో బొంబాయిలో ఉన్న పటేల్‌కు పంపారు. తాము చర్చించని విషయం గురించి నెహ్రూ పేర్కొ నడం చూసి పటేల్‌ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్‌ తన విషయంలో నెహ్రూ వ్యవహరిం చిన తీరుకు నిరస నగా సెప్టెంబర్‌ 11న నెహ్రూకు లేఖ రాశారు. పార్టీలో తనకున్న హోదా మేరకు తనకు మెరుగైన స్థానం ఇవ్వడంలో తప్పు లేదని రాజేంద్ర ప్రసాద్‌ ఆ లేఖలో నెహ్రూకు స్పష్టపరిచారు. ఆ లేఖ అం దుకున్న నెహ్రూ తన అబద్ధం బయటపడిందని తాను చేసిన తప్పును ఒప్పుకున్నారని సింగ్‌ పేర్కొన్నారు. అయితే ఆయన నేరుగా ఆ విషయాన్ని వ్యక్తం చేయ కుండా, ప్రసాద్‌ తనను, పటేల్‌ను తప్పుగా అర్థం చేసు కున్నారని ఒక లేఖ రాశారు. అలాగే పటేల్ కు తాను మొదటి లేఖలో రాసిన అంశాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. పటేల్‌తో సంప్రతించకుండానే తాను రాజగోపాలపాచారిని ఎంపిక చేయాలన్న అభిప్రా యాన్ని వ్యక్తం చేసానని అంగీకరించారు. అయితే ప్రసాద్‌ తనకు రాసిన లేఖలోని అంశాల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తెలివిగా ఈ అంశాన్ని పటేల్‌ వైపు నెట్టా రు. ఈ అంశాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మీదేనని ఆయన పటేల్‌కు రాశారని సింగ్‌ పుస్తకంలో రాశారు.

–


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వికలాంగుల స్పూర్తి -హెలెన్ కెల్లెర్ ,మరియు సెక్షన్ 8 సవాళ్లు

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”లలిత్ ”లీకేజ్ మరయు ”లోపలి మనిషి ‘



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గవర్నర్ మీదే బాధ్యత పెట్టిన కేంద్రం


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 154—శివ స్వామి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

154—శివ స్వామి

‘’కప్ఫానాభ్యుదయం ‘’ అనే  ఒకే ఒక కావ్యం రాసిన శివ స్వామి కవి కాశ్మీర్ రాజు  అవంతి వర్మ  వర్మ ఆస్థానం లో ఉండేవాడు .కాలం క్రీ శ 855-884. బౌద్ధ ధర్మావలంబి.బౌద్ధం అంటే వీరాభిమానం .పైన పేర్కొనబడిన కావ్యం బుద్ధుని స్తుతి తో ఆరంభ మవుతుంది .ఇరవై కాండలున్న ఈ కావ్యం లో దక్షిణా పద రాజు కప్ఫాన చేసిన దండయాత్రల  వర్ణనలున్నాయి  .శ్రావస్తి రాజు ప్రసేన జిత్తు రాజ్యం పై సాగిన దండ యాత్ర ఇది ..ఈ యాత్ర మలయ పర్వతాల ద్వారా జరుగుతుంది .యాత్రమధ్యలో అనేక ఋతువులు గడిచి పోతాయి .సిల్వన్ అందాలు ప్రేమికుల సరసాలు అన్నీ ఇందు లో కవి వర్ణించాడు .యుద్ధం లో విజయం సాధించినా ,కప్ఫాన  వేదాంత ధోరణిలో పడిపోయాడు .ప్రపంచ బంధాల నుండి విముక్తుడై ప్రశాంత పవిత్ర జీవితం గడిపాడు .బుద్ధ భగవానుని శిష్యునిగా మారి నిర్వాణ సుఖం పొందాడు .

శివ స్వామి కావ్యం మాఘుని శిశుపాల వధ కావ్యాన్ని , కిరాతార్జునీయాన్ని పోలి ఉంది .యమకాల గమకాల  సొగసు చూపించాడు .బంధ కవిత్వం లోనూ ప్రజ్ఞ చూపాడు . కాని కావ్యం పూర్తిగా లభ్యం గా లేదు ‘

155-జిన సేన కవి

జినసేనకవి వీరాచార్య శిష్యుడు . వీరాచార్య సుభాద్రుడు ,లోహార్యుల కాలం లో ఉన్న పవిత్ర  గ్రందాల కు అధిపతి .శ్వేతాంబర జైన మతానికి ఆచరణాంగాల్లో నిష్ణాతుడు .వీరాచార్యుడు,శిష్యుడు  జిన సేన కవి ఇద్దరు కలిసి రాష్ట్ర కూట రాజు అమోఘ వర్మను జైన మతం లోకి మార్చారు . రాజు సర్వ సంగ పరిత్యాగం చేసి రాజ్యాన్ని కుమారుడికి 875 లో పట్టాభి షేకం చేశాడు .వీరాచార్యుడు రాజుకు సన్నిహితుడై ‘’గణిత సార సంగ్రహం ‘’లో ప్రశస్తి చేశాడు

గుణ సేనుడి శిష్యుడు గుణ భద్రుడు అకాల వర్ష కు చెందిన రెండవ కృష్ణ రాజు కు ఆచార్యుడు. జిన సేనుడు అమోఘ వర్మ మనవడు మొదటి కృష్ణ రాజు కాలం లో ‘’పార్శ్వాభ్యుదయం ‘’ను 814లో రాశాడు .ఆది పురాణం లో జినసేనుడు 42 అధ్యాయాలు రాశాడు .చివరి అయిదు అధ్యాయాలను శిష్యుడు గుణ భద్రుడు పూర్తీ చేశాడు .ఈ విషయాన్ని ఉత్తర పురాణం లో చెప్పాడు .దీన్ని లోక సేన కవి రాష్ట్ర కూట రాజు రెండవ కృష్ణుడి కాలం అకాల వర్ష  లో  897 జూన్ లో రాశాడు .పార్శ్వాభ్యుదయం కాళిదాసమేఘ సందేశానికి అనుకరణ.కాళిదాసు శ్లోకం లోని చివరి పాదాన్ని గ్రహించి మిగిలిన మూడు పాదాలు తాను కూర్చాడు .23 వ జైన తీర్ధ౦కరుడైన పార్శ్వనాధుని చరిత్రే ఇది .జిన సేనుని కవిత్వం ఉన్నత సంప్రదాయం లో ఉందడి విశిష్ట గుణ గరిష్టంగా ఉంటుంది .కాళిదాసు కవిత్వానికి సరి సమానంగా ఉంటుంది .కాని కాళిదాసును మించి మాత్రం కవిత్వం ఉండదు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గురు పూజోత్సవ ఆహ్వానం

     గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః –గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

         శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా)దంపతుల సౌజన్యం తో        

                        గురు పూజోత్సవ ఆహ్వానం

సుమారు 70 సంవత్సరాల క్రితం  ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేన్యులు కీ .శే.కోట సూర్య నారాయణ శాస్త్రి గారి చిత్ర పట ఆవిష్కరణ కార్య క్రమం  వారి కుటుంబ సభ్యుల సమక్షం లో గురుపూజోత్సవం నాడు 5-9-2015శనివారం ఉదయం 10 గం లకు సరసభారతి ,మరియు పి. ఆర్. ఎస్. ఏం. జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యం లో ఆ కళాశాల ఆవరణలో జరుగుతుంది ..ముఖ్య అతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ విచ్చేస్తారు .చిత్రకారుడు శ్రీ టి. వి .ఎస్. బి .శాస్త్రి (ఆనంద్),దంపతులు ,మా గురుపుత్రులు తమ కుటుంబాల తో పాల్గొని కార్యక్రమానికి వన్నె తెస్తారు .ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి సింగరాజు కల్యాణి గారు సంగీత కచేరి తో వీనుల విందు చేస్తారు . . శ్రీ రాజేంద్ర ప్రసాద్ కు ,గురు పుత్రుల కుటుంబాలవారికి , ,ఆర్టిస్ట్ శ్రీ  ఆనంద్ దంపతులకు  , కళాశాల అధ్యాపకులకు ,సంగీత విద్వాంసురాలు శ్రీమతి కల్యాణి గారలకు  సన్మాన కార్యక్రమం జరుగుతుంది . ప్రతిభ గల ఒక  పేద విద్యార్దినికి, ఒక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాల కృష్ణ దంపతులు ఏర్పాటు చేసిన  శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి స్మారక నగదు బహుమతిని సరసభారతి ద్వారా  అందజేయ బడుతుంది ..పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రిక ఆగస్ట్ లో అంద జేస్తాము .

 

గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు –మరియు పి.ఆర్ ఎస్ ఏం .కాలేజ్ –ఉయ్యూరు

26-6-15 –ఉయ్యూరు

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -53

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -53

21-ప్రముఖ ఫ్రెంచ్ ఆధునిక ఇంప్రెష నిజం చిత్రకారుడు- అగస్టే రేనార్ -2(చివరిభాగం )

ప్రకృతికి పరవశం

ముప్ఫైలలో రేనార్ పట్టుదలతో మరింత శక్తి యుక్తులతో రంగుల వైభవం చూపించాడు .ఇప్పుడు విమర్శకులు ఆ రంగుల ప్రపంచాన్ని ఆహ్వానించి ఆరాధించారు .మిగిలిన సహచరుల కన్నా కాంతి సమ్మేళనం లో చిత్రాలకు వృత్తాకార నిర్మాణం చేసి ముందుకు దూకాడు .వారు ఇతన్ని చేరుకోలేక పోయారు .నలభై లలో ఆ గ్రూప్ తో సంబంధాలు వదిలేసుకొన్నాడు . ఇంప్రెష నిజం  బాగా పెరిగిపోయి ,బాగా అనిశ్చితమై ,రంగుల విషయం లో స్పష్టత లేకుండా ,చిత్ర నిర్మాణం లో శ్రద్ద  లేకుండా తయారై పోయిందని గ్రహించాడు .కనుక ముందు తనను తానూ కరెక్ట్ చేసుకొన్నాడు. తన వర్ణాలు చాలా  మృదువుగా  డిజైన్లు మరీ ప్రకాశ వంతంగా ,పరమ శాంతంగా ఉన్నట్లు అనిపించింది .ఇంతకంటే బలీయంగా రంగులు ఉండాలని  శక్తి వంతంగా కనిపించాలని నిర్ణయించాడు .అవి ‘’solid and enduring ‘’గా ఉండాలనుకొన్నాడు .దీనికోసం దక్షిణ దేశమంతా తిరిగాడు .అల్జీరియా లో సమ శీతోష్ణ స్థితి కి అబ్బురపడ్డాడు .క్రీస్తుకు ముందున్న రోమన్ ఫ్రేస్కోలను పామ్పే లో చూశాడు . .మైకేలాన్జేలో , రాఫెల్ వర్ణ సరస్సులో రోమ్ ఫ్లారెన్స్ లలో మునక లేశాడు .ఎక్కడ ప్రకృతి పరవశం గా కనిపిస్తే దాన్ని అంతటినీ మనసులో భద్ర పరచుకొన్నాడు .చూడటమే కాదు వాటిని అధ్యయనం చేశాడు .వాటికి అబ్బురపడ్డాడు .’’nothing  can be taken for granted ,nothing is stereotyped ‘’అన్న ఎరుక కలిగింది .’’the sections of an orange ,the leaves of a tree ,,the petals of a flower ,are never identical .It would seem that beauty derives its charm from this very diversity ‘’అన్నాడు రేనార్ .

మోడల్ తోనే పెళ్లి

యువకుడిగా రేనార్ బక్కగా బలహీనం గా  విశాలమైన కను బోమలతో చిన్న మీసం తో కనిపించేవాడు. జట్టు వెనక్కి దువ్వేవాడు .మిగిలిన చిత్రకారులకంటే నెమ్మది స్వభావి .ఏదిచ్చినా సంతృప్తి పొందే మనస్తత్వం .వయసు మీద కొచ్చాక మనిషిలో గాంభీర్యం ,హుందాతనం వచ్చాయి .తన దగ్గర మొడల్స్ గా ఉన్నవారిలో మరీ అందగత్తె ఎలీన్ చారిగాట్ ను  ఎంచుకొని పెళ్లి చేసుకొన్నాడు .హాయిగా ఆనందంగా ఇద్దరూసామరస్యం తో  గడిపారు .ముగ్గురు కుమారులు పుట్టారు .అందులో జీన్ సినీ దర్శకుడిగా గొప్ప విజయాలు  సాధించాడు .

ఆర్దిటిస్ తో ఆర్టిస్ట్

యాభై లలో రేనార్ ను కీళ్ళ నెప్పులు బాగా బాధించాయి .అరవైలలో ఇవి పెరిగి మరీ బాధ పడ్డాడు .ఆర్దిటిక్ బాధ అనంత వేదనే అయింది .నడవ లేక పోయేవాడు .చివరికి చక్రాల బండీ యేశరణ్యం అయింది .చేతులు మరీ దెబ్బ తిన్నాయి .బొటన వ్రేలు తో ,చూపుడు వేలును కలప లేక పోయేవాడు .కాని పేయింగ్ ను మాత్రం మాన లేదు .చిత్రాలు ఇదివరకు లాగానే తేజో వంతం గా వేస్తున్నాడు .ఒక క్లాంప్ ఆధారం గా వ్రేళ్ళను కదిలించి చిత్ర రచన చేశాడు తన తండ్రి అని కొడుకు చెప్పాడు .కాని చరిత్రకారుడు రేనార్ వ్రేళ్ళు బ్రష్ పట్టుకోలేనంత బలహీనం గా ఏమీ లేవు  చాలా స్పష్టంగా గీసేవాడు అన్నారు .ఆ రంగులు చర్మానికి తగిలి ఇరిటేషన్ కలిగించేవి .తర్వాత అవే కండరాల నెప్పులు గా మారాయి  .తన ‘’పక్క’’ను చూసి .’’this ridiculous invention ‘’ అన్నాడు .ఎందుకు ఆధునిక సైన్స్ ఈ వృద్ధ జ౦బు కాలను ‘’ జాడీలో ఊరగాయ ‘’లాగా భద్ర పరుస్తోందో అర్ధం కావటం లేదన్నాడు .

రేనార్ విధానం

ఆ తర్వాత కాలం లో వేసిన కాన్వాస్ లు మరింత బలీయంగా ,సంపన్నంగా ఉండేవి .ముదురు ఊదా రంగు బాగా ఇష్ట పడేవాడు. బర్గండి ఎరుపు  రోజ్- పర్పుల్ కలర్లు ఎక్కువ గా వాడేవాడు .65 వ ఏట రేనార్ ను అమెరికన్ పెయింటర్ క్రిటిక్ వాల్టర్ పాష్ అతని విధానం ఏమిటి అని ప్రశ్నించాడు .దానికి రేనార్ ‘’I want red to be sonorous to sound like a bell .If it does not turn out that way ,I put on more reds or other colors till I get it .I have no rules and no methods .I look at a nude ,there are myriads of tiny tints .I must find the ones that will make the flesh on my canvass live and quiver .Shall I tell you what I think are the two qualities of art?i must be indescribable and it must be inimitable ‘’అని స్పష్టంగా చెప్పాడు

కీళ్ళ నొప్పులు పెరిగిన కొద్దీ రేనార్ చిత్రకళా పెరిగింది .ఒక సహాయకుడిని పెట్టుకొని శిల్పాలనూ తయారు చేశాడు .వాటిని అత్యున్నతంగా ప్రతిభా వంతంగా శిల్పీకరించాడు .ఎవరూ అతని శిల్పకళ ను  విమర్శించలేదు .అజాగ్రత్త ,నిస్తేజలను దూరం చేసుకొన్నాడు .1919లో కూడా ఇంకా కొత్త విషయాలు నేర్చుకొన్నాడు .’’నేనింకా అభి వ్రుద్ధిలోనే ఉన్నాను ‘’అన్నాడు 78 వ ఏట .ఆ మర్నాడే 1919 డిసెంబర్ 3 న చిత్రాకారుడు శిల్పి అగస్టీ రేనార్ చనిపోయాడు .

జీవితం చివర్లో రూపొందించిన పెద్ద నగ్న శిల్పాలు వెచ్చని స్ట్రా బెర్రీ జూస్ లో స్నానించి నట్లున్నాయి అన్నారు .అతని స్త్రీలు ‘’warm and lush ‘’కాని పసి  మనస్తత్వం తో అమాయకం గా ఉంటారు అన్నారు .అతను దేన్నీ బ్రష్ తో ముట్టుకొంటే అది ఒక కళా ఖండమే అయింది అతని శైలి బాగా ప్రాముఖ్యత ప్రాచుర్యం  పొందింది . ఇమ్ప్రేషనిజం ఆ తర్వాత ఉధృతమైన ఉద్యమగా మారింది .అవసాన దశలో మాటిస్సా వచ్చి  రేనార్ ను చూసి ‘’అతని ప్రతి స్ట్రోకు ఎక్కువ  నొప్పుల్ని కలిగిస్తోంది ‘’అన్నాడు .’’ఎందుకు ఇంకా పని చేస్తున్నావు ?’’అని ఆయన  అడిగితే  రేనార్ ‘’నెప్పులు  మాయమవటానికే .’’అని చెప్పి ‘’the pleasure –the creation of beauty remains ‘’అన్నాడు రేనార్ .

‘’ ఫెమినైన్ సేన్సుయాలిటీ ‘’రేనార్ ప్రత్యేకత . “Renoir is the final representative of a tradition which runs directly from Rubens to Wattea రేనార్  చిత్రాల  అమ్మకం70 మిలియన్ డాలర్లు దాటింది . Renoir mastered the ability to convey his immediate visual impressions, and his paintings showed great vitality, emphasizing the pleasures of life despite the financial worries that troubled him. Several of his masterpieces date from this period: La Loge (1874; “The Theatre Box”), Le Moulin de la galette (1876), The Luncheon of the Boating Party (1881), and Mme Charpentier and Her Children (1878). Charpentier organized a personal exposition for the works of Renoir in 1879 in the gallery La Vie Moderne.

అతని పెయింటింగ్స్ లో ‘’డాన్స్ ఎట్ లీ మోలిన్ డీ లా గెలేట్ ‘’ప్రసిద్ధమైనది ఇందులో ఒక డాన్స్ గార్డెన్ లో ఆరుబయట క్రిక్కిరిసిన జనం కనిపిస్తారు .ఇక్కడే రేనార్ నివసించేవాడు .వేలాది చిత్రాలు గీశాడు

 

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎండ్లూరి సుధాకర్ గారి ఆధునిక అష్టవిధ నాయికలు -చినుకు -ఏప్రిల్-మే సంచిక

ఎండ్లూరి సుధాకర్ గారి ఆధునిక అష్టవిధ నాయికలు -చినుకు -ఏప్రిల్-మే సంచికastanayikas 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -52

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -52

21-ప్రముఖ ఫ్రెంచ్ ఆధునిక ఇంప్రెష నిజం చిత్రకారుడు- అగస్టే రేనార్

చిత్రం వినోదం

20 ఏళ్ళ వయసులో ఆగస్టీరేనార్ తాను గీసిన కొన్ని చిత్రాలను ‘’గ్లేయిర్ ‘’అనే పెయింటర్ కు చూపించాడు .ఒక సారి చూసి ‘’చేతకాని పని చేసి పెయింట్ తో నిన్ను నువ్వే  వినోద పరచుకోన్నట్లున్నాయి  ‘’అన్నాడు .కుర్రాడు వెంటనే ‘’నాచిత్రం నాకు వినోదం  కలిగించక పోయిన రోజు పెయింటింగ్ వేయటం  ఆపేస్తాను ‘’అన్నాడు .చిత్రాలలో వినోదానికి అంత ప్రాధాన్యత నిచ్చాడు రేనార్ .అన్ని రకాల చిత్రాలు గీశాడు .అవి వినోదాన్నే కాదు ఆశ్చర్యాన్నీ కలిగించాయి .అనేక శైలులలో  చిత్రించాడు వైవిధ్యం అతని ఊపిరి .పాలెట్ నైఫ్ టెక్నిక్ దగ్గర్నుంచి,ఎకడమిక్ డ్రాయింగ్ లదాకా అన్నీ చేశాడు .సాధారణం నుంచి సంక్లిష్టం దాకా ప్రయాణించాడు .నగ్న చిత్రాలు కుటుంబ చిత్రాలు కూడా గీశాడు .సూర్య కాంతిలో మెరిసే ప్రక్రుతి దృశ్యాలు ,స్నాన ఘట్టాలలో విషయాలు ,చిన్నారుల నవ్వుల అందాలు అన్నీ అతని చిత్రాలలో జీవం పోసుకోన్నాయి .

సంగీతం నుంచి చిత్రలేఖనానికి

మొదటిసారిగా రేనార్ కాన్వాస్ మీద చిత్రం గీయ లేదు .పోర్సేలీన్ తో చేశాడు ఫ్రాన్స్ దేశం లో లిమోజేస్ అనే చోట రేనార్ 24-2-1841 జన్మించాడు. అసలు పేరు పియరీ అగస్టే రేనార్ .కూలి పని చేసుకొనే అతని తలిదండ్రులు పారిస్ కు మారారు .కొడుకు సంగీత విద్వా౦సుడవుటాడని ఆశించారు .గురువు సంగీతంమేస్తారు .కాని రేనా ర్ చేతులకు  పియానో వాయించటం కంటే పెన్ను తీసుకొని రాయటానికే ఇష్టం గా ఉండేది .14 వ ఏట పారిస్ లోని చైనా ఫాక్టరీలో అప్ర౦ టిస్ గా చేరాడు .కుండలు జాడీలపై చేతి తో పెయింటింగ్ వేసేవాడు .కాని ఇది ఎక్కువ కాలం సాగలేదు .వాణిజ్యపరమైన డిజైన్లు రూపొందించాడు .ఫాన్ లకు ,ట్రేలకు డిజైన్లు వేసి బాగానే డబ్బు కూడ  బెట్టి గ్లేయర్ ఆర్ట్ క్లాసుల్లో చేరాడు .ఇక్కడే సిసిలీ మొనేట్ అనే అతనితో పరిచయమై స్నేహితుడయ్యాడు .అతను ఇతన్ని కళా ప్రపంచపు ద్వారాలు తెరిచి చూపించాడు .కేధలిక్ అయినా కనిపించిన ప్రతిదానిలో అందాన్ని చూసేవాడు .స్టూడియోలకు  సెలూన్ లకు వెళ్లి విషయాలు అర్ధం చేసుకొనేవాడు .తాను  లోవర్ మధ్య ఉన్నట్లు ఫీల్ అయ్యేవాడు. నిజానికి అతను ఉన్నది మౌంటెన్ బ్లీన్ ఫారెస్ట్ దగ్గర .ఆ అరణ్యం అతన్ని బాగా ఆకర్షించింది .

యువ ఆర్టిస్ట్స్  అసోసియేషన్

24  వయసులో రేనార్ గీసిన రెండు చిత్రాలను సెలూన్ మెచ్చి ఆహ్వానించింది ..కాని తన విధానం లో తానూ వేసి చిత్రాలను పంపిస్తే తిరస్కరించింది సెలూన్ .కానీ అది వైఫల్యం కాదు .పోర్త్రైట్లకు కమీషన్ వచ్చేది .మురికి కూపం లోంచి మకాం రూ సెయింట్ జార్జ్ కి మార్చాడు .ఒంటి మీదకు 33 వచ్చాయి .స్వంత కాళ్ళ మీద నిలబడే సత్తా వచ్చింది. ఇరవై మంది ప్రయోగకులతో కలిసి ఒక సొసైటీ ఏర్పాటు చేశాడు .ఇందులో డేగస్ ,పిస్సరొ ,మొనేట్ ,సిజన్నే ,కూడా సభ్యులే .వీరందరూకలిసి మొదటి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు .చూసినవాళ్ళు పిల్లికూతలు అరుపులు కేకలతో నిరుత్సాహ పరచారు .మళ్ళీ రెండో ప్రదర్శన పెడితే మొదటిదానికంటే భీభత్సం జరిగింది .రేనార్ చిత్రాలను చూసి మొనేట్ అతనికి ప్రతిభ లేదని ఆ విషయం అతనితో చెప్పమని రేనార్ స్నేహితుడికి చెప్పి ఇంక పెయింటింగ్ జోలికి రేనార్ ను వెళ్ళ నీయ వద్దు అనిఒక ఉచిత సలహా పారేశాడు .   ,

ఇంప్రెష నిస్టులు

ఈ కొత్త ఆర్టిస్ట్ గ్రూప్ ను చీదరించుకొన్నారు, అవహేళన చేశారు అందరూ .మొనేట్ ఒక కాన్వాస్ పై ‘’ఇంప్రెషన్- సన్ రైజ్ ‘’చిత్రించాడు .దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఈ గ్రూపు కు ‘’ఇంప్రెష నిస్టులు ‘’అని ముద్ర వేశారు .ఈ పేరును ఈ గ్రూపు తిరస్కరించలేదు .ఆహ్వానించారు .’’treating a subject in terms of the tone and not of the subject itself is what distinguishes the Impressionists from other painters ‘’అని తమ భాష్యం చెప్పుకొన్నారు .వాస్తవానికి ప్రతిబింబం కాదుకాని దాన్ని మరో రకం గా ఆవిష్కరించటమే వారు చేసిన పని .జ్ఞానేంద్రియ జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చి ,ప్రకాశవంతమైన చిత్రాలు గీటమే ధ్యేయంగా పని చేశారు .పెయింట్ స్ట్రోక్ లతో ఫలితాలు రాబట్టారు ‘’they succeeded in in blurring the out lines of objects and merging them with the surroundings .This method permitted the introduction of one color into the area of another without degrading or losing it –thus enriching the color effects .The technic of vivid strokes seemed best to their efforts at retaining rapidly changing aspects ‘’అని ‘’the history of impressionism ‘’లో రేవాల్ద్ రాశాడు కాంతికి  చాయకు ఉన్న అనంతమైన మార్పుల్ని గుర్తించటం వాటిని కొత్తగా పిగ్ మెంట్ భాషలో చూపటం ఇందులో ప్రత్యేకత .దీనితో స్టూడియోలకే పరిమిత మైనచిత్రకళ  బాహ్య ప్రపంచం లోకి వచ్చి పొలాలు  అడవులు సరసులు ,సుడులు తిరుగుతున్న నీటి ప్రవాహాలు చిత్రాలలో దర్శన మిచ్చాయి .మొనేట్ ఏకంగా ఒక పడవ మీదే స్టూడియో నిర్మించుకొన్నాడు .చీకటి వెలుగుల  చిందు లాట దర్శించి చిత్రించాడు  .సిజన్నే లాగా రేనార్ కూడా ‘’దిఆర్ట్ ఆఫ్ ఇమ్మీడిఎట్ ‘’ను అభినందించాడు .ఇదే సెన్సిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నారు .ఒక ఆకు అంతర్నిర్మాణం  ఎలా ఉందొ చెప్పటానికి దాన్ని చిత్రవధ చేయక్కరలేదు స్పాంటేనియస్ విజన్ ఉంటె చాలు అంటాడు .

Inline image 1     Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 ఉయ్యూరు


గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దశమ వార్షికోత్సవ చినుకు సంచిక

దశమ వార్షికోత్సవ చినుకు సంచిక

‘’ఇక చినుకు రాదు .అయిపొయింది ,ఆగిపోయింది ‘’అని కొందరు సంబర పడుతున్న కాలం లో చినుకు సాహిత్యపు వానై ,వరదై, పదవ వార్షిక ప్రత్యేక సంచికగా రెండు రోజుల క్రితమే వచ్చి అందర్నీ ఆశ్చర్య పరచింది . రావు అనుకొన్న వర్షాలు ఈ మధ్య విపరీతంగా కురిసి హర్షాన్ని తెచ్చాయి ఆంద్ర దేశానికి .ఇప్పుడు ‘’ఈ చినుకూ’’ అంతే .

ముచటైన ముఖ చిత్రం ముందుగా మనల్ని ఆకట్టు కొంటుంది .’’అక్షరాలూ సేకరిస్తూ చల్లుకుంటూ సాహితీ సేద్యం చేస్తున్న నండూరి మాటలు ఎంకిపాటల్లా కమ్మగా ఉన్నాయి.ఎండ్లూరి వారి అష్ట విధనాయికలు  సంచికకు ఒక హైలైట్ అయితే, పన్నాల వారు అబ్బూరివారితో చేసిన ఇంటర్వ్యు మరో హెవీ లైట్ .’’సహన ద్రుష్టి తో సమీక్షించ గలిగే వ్యక్తిత్వాలే –సముదాత్త జీవన గమనానికి ‘’పధ సూచికలు అన్న సి నా రే కవిత అందరికి గణపాఠమే .’’అత్యాధునిక జీవన  శైలిలో –అంతర్గతంగా దాగిన తృష్ణ ‘’వావి వరసలు విస్మరించే పశుకామ తృష్ణ అని నిఖిలేశ్వర్ సమాజ పోకడను చిత్రించారు .భండారు వారి మనం మరచిన’’ హరికధ’’ను బాగానే ‘’గానం’’ చేశారు .ఎందుకో నరేంద్ర కద మధురాంతకం గా లేదు .సినీకవుల గేయాలు చర్విత చర్వణాలే అయినా ‘’ఆపాత మధురాలే ‘’.జాన్సన్ గారీమధ్య ఏదిరాసినా ‘’చోమన దడి ‘’గా కొత్తగా ఉంటోంది .కవన శర్మ కధకు హాట్సాఫ్ .రాంబాబు గారికద నిజం గా ఆయన ‘’కధా వేదగిరి ‘’అనిపించింది .చలపాక కద కరెంట్ టాపిక్ .పండుముసలి వింజమూరి గారు గోప దంపతులకు గౌరవం తెచ్చారు .’’రాయ్ ‘’గారు రాయాల్సింది పొందికగా రాశారు .

30 కధలు ,20 కవితలు ,8 సమీక్షలు ,10 విశ్లేషణలు ,ఒక ముఖా ముఖం వగైరాలతో బృహత్తర అక్షర వాహినిగా ఏప్రిల్ –మే కలగలపు ప్రత్యెక సంచికగా చినుకు దర్శనమిచ్చింది .కొని చదివి పదిల పరచుకోవలసిన సంచిక ఇది .

గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 –ఉయ్యూరు .

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిపూర్ణ ,రవిశంకర్ వ్యాసాలూ



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నన్ను నావని రమ్మంది గోదారి -అందెశ్రీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీకి మోడీ పరీక్ష

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా అధ్యకక్ష ఎన్నికలో బాబీ జిందాల్ సాహసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5

20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -3(చివరిభాగం)

అసాధారణ శిల్ప నైపుణ్యం

మిగిలిన కళాకారులు రోడిన్ శక్తి సామర్ధ్యాల లతోపాటు అతని విధానాలను ఇప్పుడు బాగా అర్ధం చేసుకొన్నారు .విమర్శకులు రోడిన్ ను పొగడ్తాలతో మున్చేస్తున్నారు .కాని అందులోనూ కొంత జాగ్రత్తా పాటించారు .అతని సాహిత్య ప్రజన తక్కువ అన్నారు అతని సూటి నిజాయితీ తనాన్ని మెచ్చ కుండా ఉండలేక పోయారు .’’కళాకద ‘’అనే పుస్తకం లో ఎస్ రీనాక్ ‘’రోడిన్ చేసిన వ్యక్తిగత సామూహిక శిల్పాలు’’ డోనటేల్లో ‘’శిల్పాల స్పూర్తి నిస్తున్నాయి .మార్బుల్ లో రోడిన్ తన మనోభావాలన్నీ గొప్పగా ప్రదర్శించాడు .భారీతనం ఆకారాలలోనే కాదు అందం లో భావ వ్యక్తీకరణలో అసాధారణం గా ఉంది ‘’అని రాశాడు .

న్యూడ్ హ్యూగో

ఈ అసాధారణం అనే పదం  రోడిన్ కు యాభై ఆరేళ్ళు వచ్చిన తర్వాతవిక్టర్ హ్యూగో శిల్ప  ప్రదర్శన నాడు  మళ్ళీ బయటికొచ్చింది .పాన్దియన్ లు ఆర్డర్ చేస్తే దీన్ని శిల్పీకరించాడు రోడిన్ . ఇందులో నేటివ్ సెన్స్ ను చూపించాడు .కవి  నవలా రచయిత అయిన హ్యూగో ను భారీ శిల్పంగా నగ్నంగా వదులైన బట్టతో చూపించాడు .కానని వాళ్ళు కోరింది ఫ్రాక్ వేసుకొని దర్జాగా కనిపించే హ్యూగో .ఇది చూసి వాళ్ళు అ రోడిన్ అభి రుచిని తిట్టిపోశారు .శిల్ప సౌందర్యం తెలియని ఎద్దు మొద్దు అన్నారు .జుగుప్స కలిగించే భంగిమలకు ఆకర్షితుడు అని దుయ్య బట్టారు

సాంస్కృతిక ఇంప్రెష నిజం –తిరస్కరింప బడిన బాల్జాక్ శిల్పం .

మరో రెండేళ్ళ తర్వాతనాటక కర్త బాల్జాక్ భారీ శిల్పాన్ని1898లో న్యు సెలూన్ లో  ప్రదర్శించాడు .దీన్ని ‘’సొసైటీ ఆఫ్ మెన్ ఆఫ్ లెటర్స్ ‘’సంస్థ ఆర్డర్ చేసింది .రోడిన్ గీసిన బాల్జాక్ శిరసు స్కెచ్ ను చూడగానే వాళ్ళు అగ్గిమీద గుగ్గిలమై తిరాస్కరించారు .ఆ విగ్రహం మెట్రో పాలిటన్ మ్యూజియం లో ఇప్పుడు ఉంది .కాని రోడిన్ ఇందులో సాంస్కృతిక ఇంప్రెష నిజం ‘’ను ప్రవేశ పెట్టాడు .అందువల్ల పురాతన గ్రీకు శిల్పం ళా కనిపించింది.కొందరికి ప్రాధమిక  గోథిక్ శిల్పం ళా తోచింది .మరికొందరికి చరిత్రకు పూర్వం ఉండే నిలబడ్డ పొడవైన శిలలాగా (మెన్హిర్స్) అనిపించింది .నిరాశ చెంది రోడిన్ బాల్జాక్ శిల్పాన్ని ఏమీ మార్చ లేదు తన ధోరణిలోనే చెక్కాడు .పొట్టిగా లావుగా ఉండేఅసలైన  బాల్జాక్ ను శిల్పీకరించలేదు .కాని సింహ శిరసు చైతన్యం తో చెక్కాడు దీన్ని అర్ధం చేసుకొన్నా విశ్లేషకుడు ‘’లామేన్ టైన్ ‘’’’thi figure of an element ‘’అన్నాడు .పేపరు వాళ్ళు కాకిగోల చేశారు .మునిసిపాలితీవాళ్ళు క్షమించరాని అవమానం అన్నారు .దీనీపై ఎన్నో కధనాలు అల్లి ,దూషించారు .ఒకప్పుడు చాలా రియలిస్టిక్ గా చేస్తున్నాడు రోడిన్ అన్న వాళ్ళే ఇప్పుడు అతనికి నేచురల్ గా  ఉండటం అంటే ఏమీ తెలియదు అని అన్నారు .ఈరకమైన వ్యతిరేక ప్రదర్శన రోడిన్ ను మనస్తాపానికి గురి చేయతమేకాడు ఆరోగ్యం పైనా ప్రభావం చూపింది .

చైతన్య పరాకాస్ట

రోడిన్ చేతిలో ఇంకా ఎన్నో అద్భుతాలు ఆవిష్కరింప బడాలి ..ఎన్నో చిరకాలం గుర్తుంచుకోదగిన చిత్రాలు ,శిరస్సులు ఆయన చేయాలి అందులో ముఖ్యం గా జార్జి బెర్నార్డ్ షా ,గుస్టేవ్ మాలర్ ,చార్లెస్ బాడర్లె ,జోసెఫ్ పులిట్జర్ మొదలైనవి .ఇవన్నీ సజీవ చైతన్యం తోణికిస లాదేట్లు నిర్మించాడు .చివరగా’’పోప్ బెనడిక్ట్ -15  ‘’పరమాద్భుత శిల్పం ,ఇవికాక 1909-11 మధ్య కాలం లో ఎన్నో చిన్న చిన్న కంచు విగ్రహాలు ,నాట్యం చేసేవారిని తయారు చేసి ప్రాణ ప్రతిష్ట చేశాడు .ఇంతగోప్పగా ధైర్యం గా చురుగ్గా అంతకు ముందెప్పుడూ దూసుకు వెళ్ళలేదు .న్యు యార్క్ ట్రిబ్యూన్ పత్రికలో ఎమిలి జేనార్  రివ్యు రాస్తూ ‘’they reach far out into space ,so they delineate not so much a specific dance in motion or a pair of acrobats as they do a flowering –out of dynamic energy expressed through the metal forms and the space they measure ‘’అని కీర్తించారు .

గౌరవ ఆదరాలు

అరవైలలో రోడిన్ ను పారిస్ లోని గ్రేట్ ఎక్సి బిషన్ లో సత్కరించటం ప్రారంభించారు .  అప్పటికి ఇంకా ఆయన శిల్పిస్తున్న ‘’నరక ద్వారం ‘’పూర్తికానేలేదు .తిరస్కరింప బడ్డ బాల్జాక్ శిల్పం తో బాటు వందలాది శిల్పాలు చిత్రాలను ఒక ప్రత్యెక భవనం లో పెట్టి దానికి’’రోడిన్ పెవిలియన్ ‘’అని పేరు పెట్టారు .తాను చేస్తున్న మాధ్యమానికి రోడిన్ కొన్ని సూత్రాలు రాశాడు .అసలైన శిల్పి బాహ్య సౌందర్య ప్రదర్శనలో తృప్తి చెందడు .అందులో దూసుకు వచ్చే  పదార్ధాన్ని ఆస్వాదిన్చేట్లు చేయాలి అన్నాడు .’’నేనేదీ కొత్తగా సృష్టించలేదు సృష్టిలో ఉన్నదానినే మళ్ళీ కనుక్కొన్నాను .ప్రతిదీ ప్రకృతిలోనే ఉంది .కళాకారుడు ప్రకృతిని అనుసరిస్తే అన్నీ అందుకోగలదు .మనవ శరీరం దేవాలయ యాత్రలాంటిది .దేవాలయం లో ఉన్నట్లే ఒక మధ్య బిందువు ఉంటుంది .దాని చుట్టూ అంతా అల్లుకు పోయి విస్తరిస్తుంది .ఆధునికులు చాయను అనుసరించారు పూర్వీకులు కాంతిని దర్శించారు .మనకు మైకేలాన్జేలో లోని ఆధ్యాత్మిక ప్రాధాన్యం తెలిస్తే గ్రీకులలాగా ప్రవర్తిస్తే అతని శిల్పాలలో అవిశ్రాంత చైతన్యాన్ని దర్శించగలం .

ఫలితం ఆశించకుండా చేసే కృషిని మనసును అర్ధం చేసుకో గలం ‘’అన్నాడు రోడిన్ .చివరగా ‘’the martyrdom of the creature tormented by un reliable aspirations ‘’అన్నాడు .

హద్దులు మీరిన అభిమానం

 

తాను భావించిన విషయాలన్నిటినీ జీవితకాలం లో ముసలితనం లోనే సాధించాడు రోడిన్ .తన శిల్పాలు తనకాలపు ఆధ్యాత్మిక భావనలకు ప్రకటనలే అంటాడు .మొదటి ప్రపంచ యుద్ధప్రారంభం రోడిన్ ను నిరాశ్ పరచింది .అది అతని జీవా శక్తికి విఘాతం కలిగించి చావుకు కారణం అయింది .ఫ్రాన్స్ దేశం లో ఇంధనం కొరత బాగా ఏర్పడింది .రోజ్ రోడిన్ దంపతులు చలికి వనికిపోఎవారు .1916జులై 10 నరోడిన్ కు తల తిరిగినట్లు అనిపించింది .మేడ మెట్ల నుంచి జారి పడ్డాడు .మంచం మీదనే ఉండిపోయాడు .ఎందరెందరో మహిళలు ఆయన అభిమానులు ,వచ్చి విపరీతంగా అయన చుట్టూ మూగారు .ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కబుర్లతో కాల క్షేపం చేశారు .భార్య రోజ్ వీళ్ళను చూసి కొంత అసూయ కొంత జుగుప్స కోపం తో భర్తకు దూరంగా ఉంది .వాళ్ళ కోలాహలం భరించలేక పోయింది వాళ్ళ అభిమాన శిల్పి మరణ శయ్యమీద ఉన్నాడని వాళ్లకు స్పృహ లేకుండా పోయినందుకు విచారించింది కాని ఆ విషయం ‘’మాస్టర్ ‘’కు చెప్పే సాహసం చేయ లేక పోయింది ,నిస్సహాయం గా నిస్చేస్తం గా ఉండిపోయింది .రోడిన్ చుట్టూ చేరిన ఆడవాళ్ళు తమలో తాము కలహించుకొని జుత్తూ జుట్టూ పట్టుకొని పోట్లాడుకొన్నారు .తిట్టుకొన్నారు కొట్టుకొన్నారు .చాలా అసభ్యంగా ప్రవర్తించారు .చివరికి జూడిత్ క్లాడ్ వచ్చి పరిస్తితిని చక్క బరచాల్సోచ్చింది .

యాభై ఏళ్ళ కాపురం తర్వాత రోజ్ ను  పెళ్ళాడిన రోడిన్

సెప్టెంబర్ లో రోడిన్ కు ప్రభుత్వ పెన్షన్ ఇచ్చారు ,ఈ పెన్షన్ తో రోజ్ జీవితం గడవటం కష్టం అనిపించింది రోడిన్ కు .ఆమె ను వివాహమాడి భార్య అని తెలియ జేస్తేనే ఆమెకు న్యాయం చేసిన వాడిని అవుతాననుకొన్నాడు.అప్పుడే చట్టప్రకారం తనకున్నదంతా ఆమెకు దక్కుతుందని భావించాడు .1917 జనవరి లో రోజ్ ను రోడిన్ పెళ్ళాడాడు యాభై ఏళ్ళు ఆమెతో కలిసి జీవించి తన 68వ ఏట రోజ ను పెళ్లి చేసుకొని ఆమెకు చట్టా భద్రత కల్పించాడు .ఈ వివాహ వేడుక ముగియగానే రోజ్ కు విపరీతమైన దగ్గు వచ్చి ,గదులను వెచ్చ చేసుకోవటానికి బొగ్గు కూడా లేకుండా గడిపి కొన్ని వారాల తర్వాతా రోజ్ మరణించింది .

మహా శిల్పి మహాభి నిష్క్రమణం

భార్య రోజ్ మరణం తర్వాత రోడిన్ ఎనిమిది నెలలు మాత్రమె జీవించాడు .వాతావరణం తట్టుకోలేనిదిగా ఉండేది .విపరీతంగా దగ్గు తెరలు తెరలుగా వచ్చేది .చలి మరీ విజ్రుమ్భించింది .గడ్డకట్టే చలి బాధించింది .వేడి చేసుకొనే బొగ్గు లేదు .ఈ నరక యాతన భరిస్తూ చివరికి 17-11-1917న  77 ఏళ్ళ వయసులోఅమరశిల్పి రోడిన్  మరణించాడు .మాదన్ లో రోజ్ సమాధి దగ్గరే రోడిన్ సమాధిని కూడా ఏర్పాటు చేశారు .వారి సమాదులమీద కంచు శిల్పం ‘’ది దింకర్’’ను ఉంచారు

.                 రోడిన్ ‘’సర్ఫేస్ మోడలింగ్ కళ’’

1870లో ఇటలీ యాత్ర తర్వాతా అనుకోకుండా రియలిజం కు మారాడు .  1900 నాటికి రోడిన్  ఫ్రాన్స్ దేశపు మహా శిల్పి అని పించుకొన్నాడు .తర్వాత ప్రపంచ మహా శిల్పులలో ఒకడై ప్రపంచ వ్యాప్త కీర్తిని పొందాడు .ధన సంపన్నులేందరో ఆయనకు మహా శిల్పాలు తయారు చేసే బాధ్యతలు అప్పగించారు దాన్ని సార్ధకం చేసుకొన్నాడు .

నేచరిస్ట్ అయిన రోడిన్ భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత నివ్వకుండా ,వ్యక్తిత్వానికి ఎమోషన్ లకు మాత్రమె విలువ నిచ్చాడు .తరతరాల సంప్రదాయాన్ని ,గ్రీకుల ఆదర్శ వాదాన్ని వదిలేసి ,బోరోక్ నియో బోరోక్ ల డేకరేటివ్ కళను కూడా దూరం చేసుకొని తనదైన రీతిలో వృద్ధి  చేశాడు ,ప్రతి శిల్పం రక్త మాంసాలతో వ్యవహరిస్తున్నట్లు గా తీర్చి దిద్దాడు .భావోద్రేకాలను  అతి స్పష్టంగా వ్యక్త పరచాడు .మనిషి మానసిక స్వభావాలు అతని భౌతిక స్వరూపాలకు ప్రతి బింబాలు అని భావించాడు .రోడిన్ ది ’’సర్ఫేస్ మోడలింగ్ కళ’’అంటారు .అతను సృష్టించిన ‘’దింకర్ ‘’శిల్పాన్ని గురించి రోడిన్ ‘’అందులోని మనిషి మెదడు తో నేకాక  నుదురు ,ముక్కు పుటాలు ,బిగ బట్టిన పెదిమలు ,చేతులు కాళ్ళ లోని ప్రతి కండరం ,ముడిచిన పిడికిలి బిగ పట్టిన మడమలు అన్నీ ఆలోచిస్తాయి అంటాడు .

శిల్పం లో సర్వ  సత్తాక స్వేచ్చ

రోడిన్ శిల్పాలే కాదు శిల్ప ఖండాలు కూడా సర్వ సత్తాక స్వేచ్చను వ్యక్తం చేస్తాయి .శిల్ప ఖండాలైన బాహువులు లేకుండా కాళ్ళు  లేకుండా ,తలలేకుండా ,చేసినవి అనూచానంగా వస్తున్న సంప్రదాయానికి తిరస్కరణలే .ఒకే మాదిరి మూస పోకడ నుండి తమకు తాము వ్యక్తిత్వం తో ప్రకాశించేట్లు చేశాడు .వీటికి ఉదాహరణలే వాకింగ్ మాన్ ,మెడిటేషన్ వితౌట్ ఆర్మ్స్ ,ఐరిస్ ,మెసెం జర్ఆఫ్ ది గాడ్స్ శిల్పాలు.

బాధ ,సంఘర్షణ ఆధునిక కళకు ‘’హాల్ మార్క్ ‘’అన్నాడు రోడిన్ . ‘’Nothing, really, is more moving than the maddened beast, dying from unfulfilled desire and asking in vain for grace to quell its passion.”’’అన్నాడు రోడిన్ .

సంగీత కళాభిమానం

 రోడిన్ కు వీర ఆరాధకుడు కవి బాడరెల్ . రోడిన్ కు సంగీతం ఇష్టం .గ్లాక్ చేసిన ఒపేరా మ్యూజిక్ అంటే అభిమానం .ఫ్రెంచ్ కేతడ్రిల్స్  .పై గ్రంధం రాశాడు రోడిన్ .అందరూ మర్చిపోయిన’’ ఎల్ గ్ర్రీకో ‘’ ,అప్పటికి ఇంకా ప్రాధాన్యం పొందని ‘’వాన్ వొఘ్ ‘’ల సంగీతాన్ని స్వంతం చేసుకొన్నాడు రోడిన్ .

రోడిన్ శిల్పకళలో పరిణామం

తన శిల్పాన్ని తయారు చేయించుకొంటూ జార్జి బెర్నార్డ్ షా రోడిన్ ముందు కూర్చున్నాడు .అప్పుడు రోడిన్ ను బాగా గమనించిన ఆయన ‘’రోడిన్ అనేక అద్భుతాలను ఆవిష్కరించాడు’’అన్నాడు . .తన బస్ట్ శిల్పం తయారీలోని వివిధ దశలను గమనించిన షా ‘’ కళావిర్భావ పరిణామ దశలన్నీ చూపించాడు రోడిన్ ‘’అని శ్లాఘించాడు ‘’మొదటగా బైజాంటిన్ మాస్టర్ పీస్ లాగా ,బెర్నిని ని లాగ  ,తర్వాత గొప్ప హూడన్ ల కళా సంవిధానం దర్శింప జేశాడు .అతని చేతులు ఒక శిల్పి శిల్పించే చేతుల్లా ఉండవు .’’ఎలాన్ వైటల్ ‘’చేత లాగా అంటే అంతరాత్మ చేత లాగా ఉంటుంది అన్నాడు .’’ది గాడ్ ఆఫ్ హాండ్ ‘’అనేది రోడిన్ చేతి పనే .

రోడిన్ వర్కింగ్ మోడల్

ఏ శిల్పం చేసినా మొదట మట్టి తోనే చేసేవాడు దీనికి అతి నిపుణులైన సహాయకులను పెట్టుకొనేవాడు .తర్వాత ప్లాస్టర్ తో చివరికి కంచు తో చేసేవాడు .అదీ అతని పని తీరు .ఈ విధం గా 19 వ శతాబ్దపు శిల్ప కళ దానికి ప్లాస్టర్ ను వాడే తీరుకు నాంది పలికాడు రోడిన్ .

రోడిన్ ప్రత్యేకత

శిల్ప కళను సంప్రదాయ విధానానికి భిన్నంగా తీర్చి దిద్దాడు రోడిన్ .రిపిటీషన్ నుంచి దాన్ని తప్పించాడు  .20 వ శతాబ్దపు శిల్పకళకు దారి చూపాడు . His popularity is ascribed to his emotion-laden representations of ordinary men and women – to his ability to find the beauty and pathos in the human animal.

రోడిన్ జీవితకాలం లో అతన్ని మైకేల్ ఆంజేలో తో పోల్చేవారు .ఆ యుగపు గొప్ప శిల్పి అని భావించారు .రోడిన్ చనిపోయిన మూడు దశాబ్దాలకాలం లో ఆయన్ను అందరూ మర్చిపోయారు .1950 నుంచి రోడిన్ ఆరాధన మళ్ళీ ఊపు అందుకొన్నది .ఆధునికకాలపు మహా శిల్పి అని గుర్తించారు .రోడిన్ చేసిన’’ వాకింగ్ మాన్ ‘’శిల్పం 20 వ శతాబ్దపు ‘’ఆముక్త కళ’’ అంటే ఆబ్ స్ట్రాక్ట్  స్కల్ ప్చర్  ఆర్ట్ కు మార్గ దర్శకమైంది .

బాల్జాక్ శిల్పం

See adjacent text.

Nude man holding is hand out, as if explaining a point.

జాన్ బాప్టిస్ట్

the thinker

మరో వ్యక్తితో మళ్ళీ కలుద్దాం

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుస్తక దినోత్సవ సంధర్భంలో నా అంతరంగములోని తరంగాలకు అక్షర రూపం – పుస్తక పురాణం మరియు పుస్తకానికి పుష్కరాలు – బందా

పుస్తక దినోత్సవ సంధర్భంలో నా అంతరంగములోని తరంగాలకు అక్షర రూపం – పుస్తక పురాణం మరియు పుస్తకానికి పుష్కరాలు – బందాimg140 img141

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అమెరికాలో మాయా బజార్ కళల సౌధం లో కదా సాగు

 
 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -50 20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -50

20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -2

మానవ శరీరం సర్వం సుందరమే

వాల్ట్ విట్మన్ మహాకవి కి లాగానే రోడిన్  కు కూడా మానవ శరీర భాగాలలో అందంగా ఉండనిది ఏదీ లేదనే భావం ఉంది .జీవితం లోని అతి సూక్ష్మ విషయాల పరిశీలన కూడా అవసరం అనేవాడు .రోడిన్  కు సెక్రెటరి గా పని చేసిన రైనర్ మారియా రిల్కే ‘’Rodin  grasped life in its smallest details –he observed it and it followed him –he awaited it at the cross roads where it lingered ,he over took it as it ran before him –he found it in all places equally great ,equally powerful ,and over whelming ‘’అని అతని తత్వాన్ని బాగా అధ్యయనం చేసి చెప్పాడు .రోడిన్ శరీరం అనేక పరీక్షలకు లోనైంది .ఎడారులు అందులో ప్రాకాశించాయి .ఆకలి దాన్ని బాధగా చూపింది  .దప్పిక కూడా వదలలేదు .ఇవన్నీ తట్టుకొని నిలబడి గట్టి వాడయ్యాడు .అతను వంగితే పటకార లాగా కనిపిస్తాడు. నడుస్తుంటే ప్రపంచ దూరాలన్నీ అతని తోనే ఉన్నాయని పిస్తుంది .అతని అడుగు బలంగా ద్రుఢం గా పడేది .అటూ ఇటూ ఊగుతుంటే అతనిబాహువులు అతని అడుగులను గురించి మాట్లాడుతున్నట్లుండేది .గాలిలో తేలిపోయినట్లు నడిచేవాడు .

మార్బుల్ మాస్టర్

కళలో ఎదుగుతున్న కొద్దీ రోడిన్ సున్నితత్వాన్ని శిల్పాలలో తెచ్చాడు .ఇ౦ ప్రెషనిస్ట్ చిత్రకారుడు గా అనిపించేవాడు .అతని తీరును నిశితంగా పరిశీలించిన అమెరికా విమర్శకుడు జేమ్స్ హన్కర్ ‘’the edges of certain parts were amplified ,deformed ,and falsified to ensure the undulating appearance of life ‘’అని చెప్పాడు .అతని ఆలోచన అస్పష్టం అనిపిస్తుంది .శిల్పం లో ఒక ధ్యాన యోగం ఉంటుంది. అదే అతని గొప్ప చిత్ర నిర్మాణ విధానం .అతనికి పాలరాయి అంటే మార్బుల్ అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే అతడిని శిల్ప నిర్మాణం లో పరాకాష్టకు చేర్చింది .అతను రూపొందించిన శిల్పాల శిరస్సులు , శరీర  భాగాలు పుష్ప సౌందర్యాన్ని సున్నితత్వాన్ని గుర్తుకు తెచ్చి మార్బుల్ అతని చేతిలో మట్టి,  మైనం అయి అనేక రూపాలు దాల్చి౦దే మోనని పిస్తుంది  .అంత లావణ్యం గా రోడిన్ శిల్పాలుంటాయి .

శిలా మహా కావ్యం

నలభై ఏళ్ళ వయసులో రోడిన్ పొట్టిగా ఉన్నా ఆకర్షణీయంగా ఉండేవాడు .అతని గడ్డం మాత్రం భలే తమాషాగా ఉండేది .అది నెరసిన తర్వాత ఓల్డ్ టెస్ట్ మెంట్ ప్రాఫెట్ లాగా కనిపించేవాడు .ఇంకా బాగా చెప్పాలంటే ‘’గాలిక్ హాన్స్ సాచ్’’ లా ఉండేవాడు .అద్భుత కళాఖండాలు సృష్టించాలని భావించాడు రోడిన్ .అందుకోసం మొదట ‘’గేట్ ఆఫ్ హెల్ ‘’అనే భారీ ప్రాజెక్ట్ తీసుకొని ఇరవై ఏళ్ళు దానిపైనే పని చేశాడు .ఆ శిల్పం లోని సౌందర్యాన్ని ఆస్వాది౦చనవారు దాన్ని ‘’ఎపిక్ ఇన్ స్టోన్  ‘’అన్నారు .అంటే ‘’శిలా మహాకావ్యం’’ అని వేనోళ్ళ కీర్తించారు  .డాంటే కలగన్న అన్ని భావాలకు ఈ శిల్పం ప్రతీకగా ఉందని మెచ్చుకొన్నారు .విషయ స్పృహ లో నుంచి అలౌకిక స్పృహకు దారి తీసింది ఆ శిల్ప చాతుర్యం .దీని తర్వాత అనేక అద్భుత శిల్ప రచన చేశాడు రోడిన్ .అందులో ‘’ఆడం అండ్ ఈవ్ ‘’,పోలో అండ్ ఫ్రాన్సిస్కా ‘’,ఉగాలినో ‘’,వరుస శిల్పాలను మిగిలినవాటిలో ముద్దు వంటివి –(కిస్ అమాంగ్ అదర్స్) అంటారు .దీనినే రోడిన్ ‘నోవాస్ ఆర్క్ ‘’అన్నాడు .కొందరు మాత్రం లాస్ట్ జడ్జి మెంట్ కు భయంకర రూపం అన్నారు .మరికొందరు మైకెలాంజిలో –మెడిసి కోసం డిజైన్ చేసి రూపొందించిన అసంపూర్తి సమాధులు అన్నారు .

త్యాగధనుల శిల్ప సృష్టి

యాభైలలో రోడిన్ కాలం బహు ఫలవంత మైన కాలం .పోర్ట్రైట్ ,కంచు విగ్రహాలు  ,స్మృతి చిహ్నాలు తయారు చేయటానికి చాలా ఆర్డర్లు వచ్చాయి .నగరాలు అక్కడి హీరోల ,చారిత్రిక పురుషుల విగ్రహాలు తయారు చేసి వారికీర్తిని ఇనుమడింప చేయమని కోరాయి .అలాంటి వాటిలో నాన్సీ టౌన్ క్లాడ్ లోర్ర్రైన్  స్మృతి చిహ్నం ఒకటి .డాం విల్లర్స్ కోసం బాస్తిన్ లేపెజ్ విగ్రహం ,కలైస్ కోసం ‘’దిబర్గర్స్ ఆఫ్ కలైస్’’శిల్పించి అమోఘం అని పించుకొన్నాడు .వీళ్ళందరూ కూడా చారిత్రాత్మక మహా పురుషులే .వీరు పద్నాలుగో శతాబ్దం లో నగరం ఆకలి బారిన పడకుండా మూడవ ఎడ్వర్డ్ రాజుకు తమల్ని తాము బలి చేగా ఆత్మ త్యాగం చే సుకొన్న వీరులు ధీరులు దీరోదాత్తులు త్యాగ దనులు మహా పురుషులు .ఈ ఆరుగురిని ఒక బృందంగా ముందు శిల్పించి ఆ తర్వాత విడివిడిగా ప్రతి ఒక్కరినీ తీర్చి దిద్దాడు .వారి త్యాగాలను అజరామరం చేశాడు రోడిన్ .అందర్నీ ఒకే వరుసలో కాకుండా రెండు నాటకీయ  వరుసలలో ఉంచి అందులో ప్రతి ఒక్కరూ ఒక గొప్ప ప్రదర్శనలో పాల్గొని తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ సామూహిక౦ గా కదులుతున్నట్లు చేశాడు ఈ ప్రతిభకే అందరూ జేజేలు పలికారు .చిరస్మరణీయం చేశాడు వారి జీవితాలను రోడిన్ .     శిల్ప విషయమై చెబుతూ రోడిన్ ‘’sculpture is the heart of hole and the lump .’’అన్నాడు ఈ హోల్  మరియు ల౦ప్  అనే పదాలను  మొదటిసారిగా సృష్టించి,ప్రయోగాలు చేసి శాశ్వత కీర్తి పొందారు . శిల్పించి వాటి ప్రభావం ఎలాంటిదో చూపించాడు  రోడిన్ .రోడిన్ సిజాన్నే లు  అలౌకిక కాంతి నిర్మాణం లో అజరామరంయ్యారు .ఈ ఇద్దరు శిల్ప మేధావులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం అన్నారు విశ్లేషకులు .రాబిన్ ‘’క్యూబిక్ ట్రూత్ ‘’కు ప్రాధాన్యత నిచ్చాడు .ఇదే  స్థల దేశాలకు గణిత పరమైన గౌరవం  అత్యంత ఉత్కృష్టమైన సమతుల్యతః తెచ్చాయి .రోడిన్ గొప్పతనాన్ని ‘’he carved the air as well as the surface of the stone to bring out ‘’the latent heroic in every natural movement ‘’ అని గొప్పగా అభి వర్ణించారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-15 -ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహాపండితులు పుల్లెల శ్రీ రామ చంద్రుడు మృతి


పుల్లెల’కు నగరంతో విడదీయని బంధం

  • 25/06/2015
TAGS:

హైదరాబాద్, జూన్ 24: ప్రముఖ సాహితీవేత్త, సంస్కృత భాషలో నిష్ణాతుడు పుల్లెల శ్రీరామచంద్రుడికి నగరంతో విడదీయలేని బంధం ఉంది. తూర్పు గోదావరి జిల్లా హిందూపల్లి వాస్తవ్యులైన ఆయన కొంతకాలం స్వస్థలంలో పనిచేసినా, ఆ తర్వాత నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో లెక్చరర్‌గా చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అత్యుత్తమ సేవలందిస్తూ క్రమంగా ప్రొఫెసర్‌గా, ఆ తర్వాత సంస్కృత విభాగానికి అధిపతిగా ఎదిగి మరువలేని సేవలందిస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. జి.పుల్లారెడ్డి ట్రస్టు తరపున భాషా వికాసం, సాహితీ, సంస్కృతి పరిరక్షణల కోసం నగరం వేదికగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. దీంతో పాటు సంస్కృత భాష ప్రచారం, దాన్ని వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేసిన ప్రముఖుల్లో పుల్లెల ఒకరు. బుధవారం సాయంత్రం ఆయన కనుమూశారన్న సమాచారం తెలవటంతో ఐఏఎస్ అధికారి జెఎస్వీ ప్రసాద్‌తో పాటు పలువురు సాహితీప్రముఖులు జూబ్లీహిల్స్ ఐటికాలనీ సమీపంలో ఉన్న ‘నందనవనం’ భవన సముదాయంలోని ఆయన నివాసానికి చేరుకోవటంతో అక్కడ విషాదం అలముకుంది. పలువురు ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు. సంస్కృతాంధ్ర భాషలో ఆయన చేసిన రచనలు, భాష వికాసం కోసం చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. మొత్తం 25 రచనలు చేసి, అందులో ఓ రచనకు రాష్టప్రతి పురస్కారాన్ని పొందారు. రచనల్లో ఎక్కువ అనువాదాలు చేశారు. సంస్కృతం, తెలుగు భాషల్లో తనకున్న పట్టును నిరూపించుకున్నారు. అంతేగాక, వాల్మీకి రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదించిన గొప్ప సాహితీవేత్త పుల్లెల శ్రీరామచంద్రుడు.

పాలగుమ్మి పద్మరాజు ఆదర్శనీయుడు
కాచిగూడ, జూన్ 24: ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు శతజయంత్యుత్సవ సమాపన సభ తెలుగు రథం, శ్రీవేదగిరి కమ్యూనికేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా సిక్కిం మాజీ గవర్నర్ వి.రామరావు విచ్చేశారు. పాలగుమ్మి పద్మరాజు మానవీయ విలువలు కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన రచనలు నేటి తరానికి తెలియజేయ వలసిన అవసరం ఉందని అన్నారు. కవిగా, చిత్ర రచయితగా, నవల నాటకకర్తగా ఎన్నో పురస్కారాలను అందుకున్నారని తెలిపారు. ‘బంగారుపాప’, ‘అంతర్జాతీయ కథకుడు’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వసాహితి అధ్యక్షుడు డా.పోతుకూచి సాంబశివరావు, లేఖిని మహళ చైతన్య సాహితీ సంస్థ అధ్యక్షురాలు డా.వాసా ప్రభావతి, రచయిత విహారి, పాలగుమ్మి సీత, పాలగుమ్మి రత్న, సంస్థ అధ్యక్షుడు కొంపెల్లి శర్మ, డా.వేదగిరి రాంబాబు పాల్గొన్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చినుకు10 వ వార్షిక పత్రికలో చలపాక కద”తరగని ముద్ద”

chalapaka2 001 chalapakakadha 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -49

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -49

20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్

అగస్టీ రోడిన్ శిల్పాలను మొదట తిరస్కరించిన వారే ఆ తర్వాత మహా గొప్ప శిల్పి అని ఆరాధించారు .గౌరవించారు సత్కరించారు .మళ్ళీ అతి తక్కువ చేసి మాట్లాడారు .దూషణ భూషణలు ఆయన జీవిత సముద్రం లో కెరటాలయ్యాయి .పావు శాతాబ్దికాలం ఆయన  సృజన అంతా పెద్దగా ఆమోదం పొందలేదు .పై పెచ్చు  అలక్ష్యం చేశారు కూడా .కొన్నేళ్ళ తర్వాత ప్రతిభను గుర్తించి  అగ్రాసనం మీద కూర్చో బెట్టారు .అంతే కాదు 19 వ శతాబ్దపు అత్యుత్తమ శిల్పి అని ,అన్నికాలాలలోని మహా శిల్పుల లో ఒకడు అని వీర తాళ్ళు వేశారు .ఇదీ లోక రీతి .

మట్టి బొమ్మల శిల్పి

12-11-1840 లో పుట్టిన ఫ్రాన్కోస్ అగస్టీ రెనో రోడిన్ ఫ్రాన్స్ లోని పారిస్ లో పురాతన గోధిక్  లక్షణాలున్న   జన సమూహం ఉన్న ప్రాంతం లో పుట్టాడు . తల్లి లోరైనీ నుండి తండ్రి నార్మన్ జాతికి చెందిన పని వారి కుటుంబం లోంచి వచ్చారు .ఆ జిల్లాలో రోడీన్లు అతి పేదవారుగా గుర్తింపు పొందారు .రోడిన్ కు అందువల్లనే 13 వ ఏట నుండి సరైన స్కూల్ విద్య నేర్చుకొనే అవకాశం లేక పోయింది .చిన్నతనం నుండి డ్రాయింగ్ బొమ్మలు గీయటం అతనికి అంది వచ్చిన వరం అయింది .తల్లి గ్రోసరీ షాప్ నుండి తెచ్చే సరుకుల పొట్లాల పేపర్ల పై ఉన్న కామిక్ బొమ్మలను చూసి రోడిన్ కాపీ చేసేవాడు .తర్వాత వాటిని తన స్వయం కృషి తో బాగా గీసేవాడు .ఇది గమనించిన తలి దండ్రులు రోడిన్ మాంచి కమర్షియల్ ఆర్టిస్ట్ అవుతాడని సంబర పడ్డారు .ఇంటి దగ్గర స్పెషల్ టీచర్స్ ను పెట్టి అతని చిత్ర నైపుణ్యాన్ని పెంచే స్తోమత వారికి లేదు .అందుకని అతని ఆసక్తికి ఊతం గా డేకరేటివ్ ఆర్ట్  లో శిక్షణ నిచ్చే’’ పెటైట్ ఈకోల్ ‘’లో చేర్పించారు .పెన్సిల్ డ్రాయింగ్ అంటే అసలు ఇష్ట పడని రోడిన్ మట్టి బొమ్మలు చేయటం లో ఆసక్తి చూపించి అదే తన జీవిత గమ్యం అనుకొన్నాడు .

పోర్సిలీన్ శిల్పి

18 వ ఏట ఈకోల్ బీక్స్ ఆర్ట్స్ లో చేరటానికి ప్రయత్నింఛి పరీక్ష రాశాడుకాని ఫలితాలు దారుణం గా ఉన్నాయి .మూడు సార్లుప్రవేశ  పరీక్షరాసి తప్పాడు .ఇది చూసిన తలిదండ్రులు నీరు కారిపోయారు .అరకొర సంపాదనతో బతుకు బండీ ఈడుస్తున్న తండ్రి  కొడుకును ఆ సంస్థకు పంపటం మానేశాడు .రోడిన్ తన కాళ్ళ మీద తాను నిలబడాల్సిన పరిస్తితి వచ్చింది .ఏదో ఉద్యోగం చేసి పొట్టపోసుకోవాలి .మట్టి బొమ్మల తయారీలో అప్ర౦టిస్ గా ,జర్నీమాన్ గా, ఆర్నమెంట్ వర్కర్ గా  పని చేశాడు .కాపీయిస్ట్ గా ,స్పైరల్ స్క్రోల్స్ తయారీలో అనేక చోట్ల పని చేశాడు .ప్రముఖ జంతు శిల్పి ఆటోయిన్ లూయీ బారీ దగ్గర పని చేసి తాను బారీ శిష్యుడిని అని చెప్పుకోనేవాడు .తర్వాత’’మోల్డర్ ‘’అవతారం ఎత్తాడు .తర్వాత సెవ్రెస్ లో ఉండే పోర్సేలీన్ ఫాక్టరీకి డిజైన్లు తయారు చేసే కారియర్ బెల్లీస్ దగ్గర చేరాడు .ఇక్కడే చిన్న చిన్న విగ్రహాలు తయారు చేయటం ,జంతు భాగాలు కూర్చటం ,బొమ్మలకు అలంకరణ చేయటం నేర్చుకొన్నాడు .తర్వాత మూస పని(మోల్దింగ్) అలవాటు అయింది .ఈయన దగ్గరే అయిదేళ్ళు ఉన్నాడు .రెండు డాలర్ల నెల అద్దె ఇచ్చి ఒక గుర్రపు శాలలో గడిపాడు .అది చీకటి గుయ్యారం .దానికి ఒక చివర పెద్ద బావి ఉంది .తాను  ఇక్కడే ఉండి పని చేయాల్సిన వాడు కనుక తానే ఆ నూతిని పూడ్చేశాడు రోడిన్ .

ముక్కు తెగిన మనిషి బొమ్మ

వయసు ఇరవై అయిదు వచ్చింది .నాగలి పట్టి దున్నే వాడుగా మొరటుగా కనిపించేవాడు .ముక్కు ఫ్లాట్ గా ఉండేది .ఒక బస్ట్ విగ్రహాన్ని చేసి ‘’ముక్కు తెగిన మనిషి ‘’అని పేరు పెట్టి1864 లో సెలూన్ కు తీసుకెళ్ళాడు .దాన్ని వాళ్ళు తిరస్కరించటమే కాదు తిట్టి పంపించారు .యదార్ధాన్ని ప్రతి బించి చేసిన శిల్పాన్ని వాళ్ళు మెచ్చుకోలేక పోయారు .అతను ‘’far too naturalistic and that he had mistaken the medium ‘’ అన్నారు విమర్శకులు .నిరాశ తోమళ్ళీ గురువు గారి దగ్గర చేరి కొన్నేళ్ళు పని చేశాడు .తన ప్రజ్ఞను కనబరుస్తూ లలితమైన ,అనుకరణాత్మకమైన  చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి అమ్మి జీవనోపాధి పొండాడు .1870లోపర్షియన్ వాళ్ళు  పారిస్  ఆక్రమణ కోసం చేసిన దాడిలో  నేషనల్ గార్డ్ గా పని చేశాడు .ఫ్రాంకో పర్షియన్ యుద్ధం ముగియ గానే బెల్జియం వెళ్ళాడు .అక్కడ బెల్జియన్ శిల్పి వాన్ రాస్ బోర్గ్ దగ్గర శిల్ప నిర్మాణం లో మెళకువలు నేర్చాడు .

మోడల్ భార్య

ఒక సారి పారిస్ అవతల ఒక బిల్డింగ్ వర్క్  చేస్తుంటే అందమైన కళ్ళున్న అమ్మాయి కనిపించింది .ఆమెకు 19 .పేరు రోజ్ బ్యూరేట్ .’’రోజ్ అంత బ్యూటీ’’అనుకొన్నాడు .  ఆమె కుటుంబం వారు చా౦పేన్ లో రైతులు .పారిస్ లో సీస్మిస్త్రేస్ గా  పని చేయటానికి వచ్చింది . ఆమెను మోడల్ గ పెట్టుకొని బొమ్మలు తయారు చేస్తూ ఇద్దరూ ప్రేమలో పడగా ఆమె అతనికో పిల్లాడిని’’ కని ‘’ పెట్టింది .ఈమెను అతని తలిదండ్రులు ఆదరించారు. అందరూ కలిసి బతికారు .ఆమె సైనికులకు చొక్కాలు కుట్టి సంపాదించేది .ఆ డబ్బుతో కొడుకు ను సాకేది .అప్పుడప్పుడు మొగుడు పెళ్ళాలు పోట్లాడుకోనేవారు. ఆమెలో సహనం ఎక్కువ .రోడిన్ మాత్రం బాధ్యతా రాహిత్యం గా ప్రవర్తించేవాడు. అతని తలిదండ్రులు ఆమె పక్షంగా మాట్లాడేవారు .కాలం గడిచిన కొద్దీ తాను ‘’ప్రకాశించే సూర్యుని కి ఛాయ మాత్రమె ‘’అని గ్రహించింది .అతను ఆమెను మంచీ చెడు తెలిసిన ఇల్లాలు అని కోపం అసూయ ,అనుమానం  ఉన్నా ప్రేమ గుణం ఉందని ,సత్యాసత్య వివేకం తెలిసిన దొడ్డ ఇల్లాలని చెప్పాడు .వారిద్దరిది అలౌకిక ఆత్మీయ ప్రేమ అంటారు  .మోడల్ గా వచ్చిన అమ్మాయి మోడల్ భార్య అయింది రోడిన్ కు .

సహజం నుండి అసహజానికి

1877లో సలూన్ రోడిన్ శిల్పాన్ని ప్రదర్శించటానికి అనుమతి నిచ్చింది .దానిపై 18 నెలలు తీవ్రం గా ద్రుష్టి పెట్టి పని చేశాడు .దీనికి ‘’కంచు యుగం ‘’(ఏజ్ ఆఫ్ బ్రాంజ్ )అని మొదట పేరు పెట్టి తర్వాత’’ప్రక్రుతికి మానవుడి జాగృతి ‘’(మాన్ ఎవేకేనింగ్  టు నేచర్ )అని మార్చాడు .దీన్ని చూసిన నిర్వాహకులు పెదవి విరిచారు .వారికి కావాల్సిన లలిత సుందర నగ్న శిల్పం కాదు అది .వెంటనే తిరస్కరించి ‘’too precise ,too realistic ‘’ అని వ్యాఖ్యానించారు .అది సృజనాత్మక శిల్పం కాదని అన్నారు .ఆ రోజుల్లో ఇవి సాధారణమే . .నకిలీ శిల్పాలు చేస్తున్నకాలమే అది . ఈ ఆరోపణను  చాలెంజ్ గా తీసుకొన్నాడు రోడిన్ .ఒక నాయకుడి శిల్పాన్ని తయారు చేసి మామూలు గా జీవితం లో కనిపించే నగ్నత్వం కన్నా ఇంకా ఎక్కువ నగ్నం గా తీర్చిదిద్ది ‘’నడుస్తున్న మనిషి ‘’అని పేరు పెట్టాడు .కాని శిల్ప విశ్లేషకుడు అక్టేవియాన్ మిరాబూ కు ఇది ‘’సెయింట్ జాన్ ‘’పోలికలున్న శిల్పం అని పించింది .ఈ జాన్ గారే తర్వాత ‘’సెయింట్ జాన్ బాప్టిస్ట్ ‘’గా ప్రసిద్ధుడయ్యాడు .సుప్త స్థితిలో ఉన్న శీలా  సజీవ చైతన్య రూపం దాల్చింది రోడిన్ చేతిలో .రోడిన్ లో  ఆత్మ స్థైర్యం ఒక్కసారిగా పెల్లుబికింది .

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ తరానికి సాయిబాబా ఎందుకు ఆరాధ్యుడు – బందా ( సర్దాగా చదవండి)

ఈ తరానికి సాయిబాబా ఎందుకు ఆరాధ్యుడు – బందా ( సర్దాగా చదవండి)img137 img138 img139

Posted in సేకరణలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 152- 100 అధ్యాయాల రామాయణం రాసిన మెంధ కవి .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

152- 100 అధ్యాయాల రామాయణం రాసిన మెంధ కవి .

భర్త్రు మెంద గా ప్రసిద్ధుడైన ఈ కవిని కొందరు కాళిదాసు కంటే ఘనుడు అని తమకావ్యాలలో పేర్కొన్నారు .మెంద అనే పదానికి అర్ధం ఏనుగును నడిపే మావటి వాడు అని .జల్హనుడు  తన సూక్తి ముక్తావళి లో రాజ శేఖరుడు ఈ విషయం పై రాసిన శ్లోకాన్ని ఉదాహరించాడు .మిగిలిన చరిత్రకారులు కూడా ఈకవిని మెంద అనే పేరుతోనే పిలిచారు .’అతని ’హస్తి పాల ‘’మొదలైన వాటిలో అడవి  ఏనుగులను ఏ విధం గా మాటు పెట్టి గోతులలో పడేట్లు చేస్తారో వివరింప బడి ఉంది .దీన్ని  బట్టి మెంద కు  కు ఈ విద్య తో సంబంధం ఉన్నట్లు తోస్తుంది .

కల్హణుడు మెంద ను కాశ్మీర్ రాజు మాతృ గుప్తుని ఆస్థానం లో ఉన్నట్లు రాశాడు .మాతృ గుప్తునికాలం క్రీ శ.430 గా భావిస్తే ఈకవి ఆ కాలం లో  జీవించాడని  చెప్పచ్చు . మృచ్చ కటికం ‘’లి౦ఫ తీయ తమొంగూని ‘’అనే ప్రసిద్ధ శ్లోకం లో ను ,అవిమారకుని బాల చరితం లోను ,కావ్యాదర్శం లోను ,సారంగ ధర పద్ధతిలోను విక్రమాదిత్యుడు ,మెంధతో  కలిసి కావ్యం అల్లినట్లు ఉంది .దీనితో మళ్ళీ కాలానికి గొళ్ళెం పెట్టాల్సోస్తోంది .ఏతా వాతా తేలిందేమిటంటే మెందకవి విక్రమాదిత్యుని కాలం వాడే నని .మంఖ కవి ‘’శ్రీ కంఠ చరిత్ర ‘’లో మెందను సుబందు ,భారవి, బాణులతో తో ముడిపెట్టాడు.రాజ శేఖరుడు మాత్రం ఆయన్ను వాల్మీకి అవతారం  ఆ తర్వాత భవ భూతి అవతారమని చివరికి తాను కూడా మెంద అవతారాన్నే అని మెచ్చుకొని చెప్పుకొన్నాడు   .దీన్ని బట్టి మెంద కవి 100 అధ్యాయాల ‘’రామ చరిత్ర ‘’రాశాడని తేల్చారు .దీని వ్రాత ప్రతి నకలు ఇప్పటికీ బెనారస్ విశ్వ విద్యాలయం లో భద్రం గా ఉందని క్రిష్ణమాచారియార్  రాశారు . .

153-సరస్వతీ పుత్ర-భట్టార హరిశ్చంద్ర

హర్ష చరిత లో బాణ కవి భట్టార హరిశ్చంద్ర కవి ని మెచ్చుకొన్నాడు .హరిశ్చంద్రకవి ‘’మాలతి ‘’అనే ప్రేమ కావ్యం రాశాడు .కనుక ఇతను ఐదవ శతాబ్ది కవి అని అనుకోవచ్చు .’’సదుక్తి కర్ణామృతం’’ లో ఈకవి మహాద్భుత కవిగా పేర్కొన బడ్డాడు .మహా కవుల సరసన చేర్చారు .చాటు పద్యాలలో ఈ కవి శ్లోకాలు విశేషం గా కనిపిస్తాయి .ఈ భట్టార హరిశ్చంద్ర కవి దిగంబర జైన మతానికి చెందినవాడు .తండ్రి ఆర్ద్ర దేవుడు .తల్లి రాధ .సోదరుడు లక్ష్మణ .వీరిది కాయస్తకులం లోని సనోముఖ కుటుంబం .ఈ కవి పాండిత్య ప్రకర్షకు ‘’సరస్వతీ పుత్ర’’ బిరుదం అందుకొన్నాడు .ఈకవిని రాజశేఖరుడు ‘’కర్పూర మంజరి ‘’లో పేర్కొన్నాడు .ఇతను ‘’ధర్మ సార మహాభ్యుదయం ‘’అనే 21 ఖండాల కావ్యాన్ని పదిహేనవ తీర్ధ౦కరుడైన ధర్మ నాధుని జీవిత చరిత్రగా రాశాడు .ఇందులో ధర్మపాలుని జననం నుండి నిర్వాణం దాకా వర్ణించాడు .నాయకుడైన ధర్మనాధుడు ఇక్ష్వాకు  వంశానికి చెందిన  రత్న పుర రాజు మహాసేనుడు   భార్య సువ్రతి ల కుమారుడు .హరిశ్చంద్ర కవి కవిత్వం మాధుర్యానికి నిలయం .స్వచ్చమైన తేట యైనకవిత్వం రాశాడు .

భట్టార హరిశ్చంద్ర కవి ‘’జీవనాధార చంపు ‘’ను కూడా 13 లంభాలలో జైన రాజు జీవనాదారుని జీవిత చరిత్ర గా రాశాడు.ఈ జీవనాధరుడు  సత్య౦ధర రాజు కుమారుడు .ఇందులో కవి ఉపయోగించిన భాష ఆకర్షణీయం గా ,అత్యుత్తమంగా ఉందని విమర్శకులు కీర్తించారు .టి ఎస్ .కుప్పుసామి గారు  ఈకవి ‘’జీవనాధార చరిత్రం ‘’అనే నాటకం కూడా రాశాడని తెలియ జేశారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-6-15 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గోదావరి మహా పుష్కరాలు – 2015 – సంక్షిప్త సమాచారం – బందా

గోదావరి మహా పుష్కరాలు – 2015 – సంక్షిప్త సమాచారం – బందాimg133 img134

Posted in సమయం - సందర్భం | Tagged , | Leave a comment

గోదావరి కృష్ణమ్మలు – అంతరంగము లోని తరంగాలకు అక్షర రూపం – బందా.

img136

Posted in కవితలు | Tagged | Leave a comment