హింస సోహం అంటున్న అస్సాం

అసోం హింస
అసోంలో బోడో మిలిటెంట్ల ఉన్మాద చర్య అత్యంత కీలకమైన ఈ సమస్య మీద సత్వరమే దృష్టిసారించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది. ఆదివాసీల ఊచకోత అనంతరం తలెత్తిన ఉద్రిక్తత కాస్తంత తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే అయినప్పటికీ మరణించిన వారి సంఖ్య వందకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటలిజెన్స్‌ విభాగాలకు మిలిటెంట్ల దాడుల గురించి ముందస్తు సమాచారం అందినప్పటికీ, ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ దానిని కొట్టిపారేయడమూ, పోలీసు యంత్రాంగం తర్జనభర్జనల్లో ఉండటమూ ఊచకోత రెండు జిల్లాల్లో జరగడానికి వీలుకల్పించినమాట వాస్తవం.

అసోం జీవవైవిధ్యానికే కాదు, జాతి వైరుధ్యానికి కూడా మారుపేరు. వివిధ తెగలకు, మతాలకు నిలయం. ఆధిపత్య పోరాటాలకు పుట్టినిల్లు. బోడో మిలిటెంట్‌ బృందాలు కత్తులు, తుపాకులతో పాటు గ్రెనేడ్లు కూడా విసురుతూ గ్రామాలమీద పడి ఊచకోత కోయడం అత్యంత భయానకమైన సన్నివేశం. పసికందుల నుంచి పండుముందుసలి వరకూ ఎవరినీ వారు విడిచిపెట్టలేదు. మారుమూల ప్రాంతాలకు పోలీసు బృందాలు చేరుకొనేలోగా అనేక గ్రామాలు తగలబడిపోయాయి. ‘బోడో కానివాడిని తగలబెట్టండి’ అంటూ తన సాయుధబలగాలకు నిషేధిత నేషనల్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌ (సాంగ్‌బిజిత్‌) అధినాయకుడు ఇచ్చిన ఆదేశాలు తూచ తప్పకుండా అమలు జరిగాయి. ఆ వర్గంతో చర్చలు జరిపేది లేదని ఇప్పటికే ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటన తరువాత రెండునెలల్లోగా దీని అధినాయకత్వాన్ని నిర్మూలించాలని సంకల్పం చెప్పుకున్నాయి. చర్చలకు దిగిరాని ఈ మొండిఘటాన్ని తుదముట్టించాలనుకోవడం ఇదే మొదటిసారి కాదు. మూడుదశాబ్దాలుగా హింసకు మారుపేరుగా ఉన్న అసోంలో నిజానికి ఈ ఏడాది అది కాస్తంత తగ్గుముఖం పట్టింది.
రెండు ప్రధాన మిలిటెంటు గ్రూపులు అరబింద రాజ్‌ఖోవా నాయకత్వంలోని ఉల్ఫా, రంజన్‌ దైమారీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌ (ఎన్డీఎఫ్‌బీ) వర్గం చర్చలకు దిగిరావడం ఇందుకు కారణం. కానీ, ఎన్డీఎఫ్‌బీ సాంగ్‌బిజిత్‌ గ్రూపుమాత్రం చర్చలను తిరస్కరించి దాడులకు పాల్పడుతూ వచ్చింది. భారత్‌ భూటాన్‌ సరిహద్దుల్లోని బోడో ప్రాదేశిక ప్రాంతంలో భద్రతా దళాల ఏరివేత కార్యక్రమంలో ఈ వర్గం బాగా దెబ్బతిన్నది. ఇందుకు జవాబుగా ఈ వర్గం భారీ దాడులకు పాల్పడే అవకాశాలున్నాయన్న హెచ్చరికలను విస్మరించడమే రెండు జిల్లాల్లో భారీ ఊచకోతకు కారణమైంది. సాంగ్‌బిజిత్‌ వర్గం సంఖ్యాబలం మూడువందలు కూడా ఉండదనీ, దానిని నిర్మూలించడం త్వరలోనే సాధ్యమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వసిస్తున్నప్పటికీ, ‘స్వతంత్ర బోడోలాండ్‌’ కోసం ఉద్యమిస్తున్న ఇటువంటి సంస్థలకు బోడోల్లో ఉన్న సానుభూతిని విస్మరించలేనిది.

అత్యధిక సంఖ్యాకులు తమకు చారిత్రకంగా అన్యాయం జరిగిందని భావిస్తున్నప్పుడు వారి కోర్కెల్లో న్యాయబద్ధమైనవి పరిష్కరించే ప్రయత్నం నిజాయితీగా జరగాలి. హక్కుల విషయంలోనూ, అభివృద్ధి విషయంలోనూ అన్యాయాన్ని సరిదిద్దక తప్పదు. బోడోలకూ, బోడోయేతర ఆదివాసీ తెగలకూ మధ్య అగాఽధాన్ని పెంచుతున్న అంశాల్లో ప్రభుత్వాలు పరిష్కరించగలిగేవి అనేకం ఉన్నాయి. దీనితోపాటు రెండు గ్రూపులు చర్చలకు దిగివచ్చిన నేపథ్యంలో, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రక్రియను ముందుకు తీసుకుపోకుండా జాప్యం చేసిన పక్షంలో పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది.
అసోంలో భూమిపుత్రులు ఎవరన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. అందరికంటే ముందు వలస వచ్చిన బోడోలు పదిన్నర లక్షలమంది వరకూ ఉన్నారు కనుక తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండు చేస్తున్నారు. అనేక సంస్థలు సాయుధ పోరాటం చేస్తున్నాయి. 2003లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం బోడో లిబరేషన్‌ టైగర్‌ ఫోర్స్‌ (బీఎల్‌టీఎఫ్‌)తో ఒక ఒప్పందానికి వచ్చి బ్రహ్మపుత్ర ఉత్తర తీరంలో ఐదారు జిల్లాలతో బోడో ప్రాదేశిక మండలి ఏర్పాటు చేసింది. 70 శాతం బోడోలున్న ఈ ప్రాంతంలో మిగతా తెగలూ ఉన్నాయి. మతాలూ ఉన్నాయి. స్వతంత్ర రాష్ట్రం ముసుగులో వారిపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రెండు జిల్లాల్లో ఊచకోతకు గురైన ఆదివాసీలు ప్రధానంగా బెంగాల్‌లోని సంతాల్‌ పరగణాల నుంచి, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వలస వచ్చినవారు. వలసపాలనలో హక్కులకు నోచుకోని ఈ తేయాకు తోటల కూలీలకు 1951లో హక్కులు దఖలు పడ్డాయి. హిందూమతాన్ని అనుసరిస్తున్న బోడోలు ముస్లింలను ఊచకోతకోయడమూ, క్రైస్తవ బోడోలు సంతాల్‌లపై దాడులు చేయడమూ కనిపిస్తున్నదే.
ప్రధానంగా పరిమిత వనరుల కోసం జరుగుతున్న ఈ పోరాటాలను అదుపు చేయడం మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించగలిగినప్పుడు చాలా వైషమ్యాలు సమసిపోతాయి. వ్యవసాయమే ప్రధానమై, బ్రహ్మపుత్ర మాత్రమే బతుకు తెరువైనప్పుడు ఉన్నవారి మధ్యనా, వలసలు వస్తున్నవారితోనూ ఘర్షణలు తప్పవు. మతం పేరిట, తెగల పేరిట పడగవిప్పుతున్న వైషమ్యాలకు రాజకీయం కూడా తోడుకావడం దేశ సరిహద్దు ప్రాంతంలో ప్రమాదకరం. ఉపాధికి పెద్దపీట వేస్తూ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం అవసరం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం

కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం
గల్ఫ్‌ ఆంధ్ర మ్యూజిక్‌ అవార్డ్‌ (గామా అవార్డ్స్‌) ప్రదానోత్సవం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న దుబాయ్‌లో ఘనంగా జరగనుంది. 2013కుగానూ మ్యూజికల్‌ అవార్డ్స్‌తోపాటు ప్రముఖ దర్శకుడు బాపుని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కళాతపస్వీ కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నారు. ‘గామా’ అవార్డ్‌ కమిటీ చైర్మన్‌ కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ ‘‘2013కు సంబంధించిన అవార్డ్‌ ఫంక్షన్‌ను జనవరి 31న ఎంతో ఘనంగా జరిపాం. 2014లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ‘గామా’ అవార్డుప్రదానోత్సవం 2015 ఫిబ్రవరి 6న ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈసారి కె.విశ్వనాథ్‌గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నాం. పలువురు సినీ ప్రముఖులు, గాయనీగాయకులు, సంగీత దర్శకులు, పాటల రచయితలు పాల్గొనబోతున్న ఈ వేడుక దుబాయ్‌లోని తెలుగువారికి కనుల పండుగ అవుతుంది’’ అని అన్నారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రముఖ సాహితీ విమర్శకుడు , ఆత్మీయుడు స్వర్గీయ టిఎల్.కాంతారావు గారి మేనకోడలు,కవయిత్రి శ్రీమతి శేషుకుమారి దంపతుల నెప్పల్లి స్వగృహం లో మా దంపతులకు ఆతిధ్యం -26-12-14-

ప్రముఖ సాహితీ విమర్శకుడు , ఆత్మీయుడు స్వర్గీయ టిఎల్.కాంతారావు గారి మేనకోడలు,కవయిత్రి  శ్రీమతి శేషుకుమారి దంపతుల నెప్పల్లి స్వగృహం లో మా దంపతులకు ఆతిధ్యం -26-12-14-

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బాల చంద్రన్ -అర్బన్ లిబరల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంట్లో ఇవాళ 25-12-14గురువారం కొడుకు లు కోడళ్ళు మనవలు మనవరాళ్ళ అనుకోని కలయిక 

మా ఇంట్లో ఇవాళ 25-12-14గురువారం  కొడుకు లు కోడళ్ళు మనవలు మనవరాళ్ళ అనుకోని కలయిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘భారతరత్న’కు సార్థకత

‘భారతరత్న’కు సార్థకత

  • 25/12/2014
TAGS:

ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ దేశంకంటె గొప్పవాడు కాజాలడు…ఒక రాజకీయ పక్షం ఎంత శక్తివంతమైనదైనా కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం కంటె శక్తివంతమైనది కాజాలదు. ఇలా సూత్రీకరించిన వాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. 1977లో మురార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో అటల్ బిహారీ విదేశ వ్యవహారాల మంత్రి…పదవీ స్వీకార ప్రమాణం చేసిన రోజున సాయంత్రం కొత్త ఢిల్లీలో జరిగిన సార్వజనికోత్సవ సభలో వాజ్‌పేయి ఈ సూత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సూత్రాన్ని ఆయన ప్రచారం చేయలేదు. పాటించి ప్రస్ఫుటింప చేశారు. అందుకే ఆయన కేవల రాజకీయవేత్త కాలేదు. రాజకీయ పరిధిని అతిక్రమించి రాజ్యాంగ విస్తృత భూమికను పండించిన ప్రజాస్వామ్య కృషీవలుడయ్యారు. జాతీయ సాంస్కృతిక సస్యక్షేత్ర ఆదర్శ హరితాంచల విధాయకుడయ్యారు. అంతర్జాతీయ ప్రసిద్ధిని పొందగలిగిన భరతమాత వరాల బిడ్డడయ్యారు. రాజకీయాలను, నైతిక నిష్ఠతో మెరుగులు దిద్దిన వాజ్‌పేయి భారత రత్న పురస్కార అలంకృతుడు కావడం భారతీయులందరికీ మోదం కలిగిస్తున్న పరిణామం. ‘మాతృదేవి’ ఆమోదం పొందిన చారిత్రక శుభఘట్టం. మహాత్మాగాంధీ వంటి మహనీయులకు సైతం ఆరాధ్యుడైన ‘మహామనా’ బిరుదాంకితుడైన మదన మోహన మాలవీయ పండితుడు క్రీస్తుశకం 1861 డిసెంబర్ 25న జన్మించారు. అదే డిసెంబర్ 25న 1924లో పుట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయి మాలవీయ వలెనే మాననీయుడు అయ్యారు. మదనమోహన మాలవీయ వారణాసి హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా జాతీయ సంస్కార శోభితులైన విద్యావంతులను తీర్చిదిద్దే కార్యక్రమానికి 1916లో శ్రీకారం చుట్టారు. ఇలాంటి విద్యావంతుల పరంపరలోనివాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. హైందవ జాతీయ సంస్కారానికి అద్దంలాగా భాసిస్తున్నారు అటల్ బిహారీ…ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంటునకు వనె్న తెచ్చారు. ప్రధానమంత్రిగా ఆ పదవీ గరిమెను పెంచారు. సుపరిపాలన పరిమళాలను పంచిపెట్టారు. మదన మోహన మాలవీయ పండితుని వంటి మరో పండితుడు అటల్ బిహారీ, స్వాతంత్య్ర సమరయోధుడు. మదనమోహన మాలవీయ పండితునికి లభించిన నాడే భారతరత్న వాజ్‌పేయికి కూడ లభించడంలోని ఔచిత్యం ఇది. మాలవీయ ప్రసంగం పావన గంగా ప్రవాహం వలె శ్రోతల హృదయసీమలను ముంచెత్తేదట. అటల్‌జీ ప్రసంగం మరో గంగా ప్రవాహం…గుండె గుండెలో మహానుభూతులు తరంగ భంగిమలను పొంగులెత్తించిన మధుర విన్యాసం. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని సింధే కీ ఛావనీ గ్రామంలో చిరు సరితగా జాలువారిన వాజ్‌పేయి జీవితం మహా సింధువు వలె భారతావని నలు చెరగులను ముంచెత్తింది. ఆయన జీవన ప్రస్థానం సమకాలీన భారత చరిత్రకు ప్రతిబింబం… శక్తివంతమైన ఆయన వ్యక్తిత్వం జనసంఘ్ రాజకీయ పక్షానికి కల్లోల కడలిలో చుక్కాని అయింది. భారతీయ జనతాపార్టీ ప్రగతి ప్రస్థాన కరదీపిక అయింది. ఉజ్వల కాంతుల విజయ కేతనమైంది. భారతి చరణారవిందాలను నిరంతరం స్పృశించిన కుసుమం ఆయన వ్యక్తిత్వం. మాతృగళ హారంలోని రత్నం. ఆయన సహజమైన సజీవమైన భారత రత్నం. భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కార ప్రదానం ఈ వాస్తవానికి సరికొత్త ధ్రువీకరణ మాత్రమే. ఇది ఆ పురస్కారాలకు లభించిన సార్థకత!
తక్షశిల, నలంద వంటి చోట్ల సహస్రాబ్దుల క్రితం విలసిల్లిన మహా విద్యాలయాల బోధనా సంప్రదాయాలను పునరుద్ధరించడానికై మదనమోహన మాలవీయ ప్రారంభించిన జాతీయ సంస్థ వారణాసి విశ్వవిద్యాలయం. అన్ని రంగాలకు ఆధారభూతమైనది విద్యారంగమన్న వాస్తవానికి అనుగుణంగా మాలవీయ ఈ మహత్తర సంస్థను నిర్మించారు. శీలవంతులైన విద్యావంతులు జాతికి, జగతికి హితం కలిగిస్తారు. శీలం లేని విద్యావంతులు రాక్షసులుగా మారి సమాజ విఘాతం కలిగిస్తారు. ఇదీ చరిత్ర! మాలవీయ స్వాతంత్య్ర సమర యోధుడు, సామాజిక ఉద్యమ వీరుడు, దళిత జనోద్ధారకుడు, ఆచార్యుడు, కవి, పండితుడు, పత్రికా సంపాదకుడు, న్యాయవాది. కానీ వ్యక్తులను శీలవంతులుగా దిద్దే విద్యావేత్తగానే ఆయన ప్రసిద్ధుడు. అందుకే మదన మోహన మాలవీయ వ్యక్తి నిర్మాణ ఉద్యమం- ఎమ్.ఎమ్.ఎమ్-గా వినుతికెక్కారు. అయితే ఆయనకిప్పుడు భారత రత్న పురస్కారం ఇవ్వడం కొత్త వివాదాలకు, విచిత్ర పరిణామాలకు దోహదం చేయవచ్చు. 150 ఏళ్ల క్రితం జన్మించి 68 ఏళ్లకు పూర్వం పార్థివ దేహ పరిత్యాగం చేసిన ఆ మహనీయునికి సమకాలీనులైన మహనీయులు మరెందరో ఉన్నారు. బంకించంద్రుడు, లోక మాన్యుడు, వివేకానందుడు, లాలాలజపతిరాయ్…ఇంకా ఎందరో ఉన్నారు. వారందరికీ భారతరత్న పురస్కారం అవసరమా? ఈ సనాతన భూమి అనాది చరిత్రలో భారతరత్నాలు అసంఖ్యాకులు. అందువల్ల ఈ పురస్కారాన్ని వర్తమాన జాతీయ స్ఫూర్తి ప్రదాతలకు పరిమితం చేయడం మేలు. అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఇలాంటి వర్తమాన వాస్తవం…
అటల్ బిహారీ వాజ్‌పేయి జాతీయ భావనిష్ఠకు 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం శ్రీకారం. 18 ఏళ్ల వాజ్‌పేయిని బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించి, కారాగృహం పాలు చేసింది. 1975 నాటి ఎమర్జెన్సీ నాటి ఆయన జైలు జీవితం ఈ శ్రీకారానికి శిఖరం. రాజకీయపక్ష సంకుచిత ప్రయోజనం కంటె స్వజాతి హితం మిన్న అని విశ్వసించి సమాచరించిన రాజనీతిజ్ఞుడు అటల్ జీ. బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన యుద్ధ సమయంలో ఆయన జనసంఘ్ నాయకుడు, ఇందిరాగాంధీకి వ్యతిరేక పక్షంవాడు. కానీ యుద్ధ విజయం సాధించిన ఇందిరను ఆయన ‘దుర్గాదేవి’గా అభివర్ణిచారు. 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అణు పరీక్ష నిర్వహించినప్పుడు అభినందించిన జాతి హిత చింతకుడు వాజ్‌పేయి. 1993లో ఆయన పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు. భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పక్షం అధినేత. పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో మన దేశానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టింది. మన ప్రభుత్వం మానవ అధికారాలను మంట గలుపుతోందన్నది ఆరోపణ. అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు అభ్యర్థనపై వాజ్‌పేయి మన ప్రతినిది బృందానికి నాయకత్వం వహించారు. సమితి సభకు వెళ్లి పాకిస్తాన్ తీర్మానాన్ని వమ్ము చేసి విజయుడై తిరిగి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడం జాతి హితానికి వాజ్‌పేయి యిచ్చిన ప్రాధాన్యానికి చెరగని సాక్ష్యం…ప్రధానిగా ఉండిన సమయంలో వాజ్‌పేయి సుపరిపాలనకు నమూనాను నిలబెట్టారు. ఆంతరంగిక భద్రత, ఆర్థిక భద్రత సరిహద్దుల భద్రత, సాంస్కృతిక చైతన్యం…ఇవన్నీ సుపరిపాలన స్వభావ స్వరూపాలు. వాజ్‌పేయి పాలన ఈ స్వభావగీతాన్ని వినిపించింది..
పదవికి ప్రాధాన్యం ఇవ్వడం వాజ్‌పేయికి తెలియని విద్య. పదవులు ఆయనను వరించాయి. వరించిన పదవులను త్యజించడం ఆయనకు తృణప్రాయం. ‘‘నిరీహణమీశః తృణమివ తిరస్కార విషయః’’-నిస్వార్ధపరునికి అధికార పదవి గడ్డిపోచవలె తిరస్కార విషయం- అన్న చాణిక్య సూక్తి వాజ్‌పేయి జీవితాన్ని నడిపించింది. లాల్‌కృష్ణ అద్వానీ అభివర్ణించినట్టు అటల్ బిహారీ వ్యక్తిత్వం నిష్కలంకతకు సజీవ విగ్రహం…

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉక్కుకాకాని అమర్ హై

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పీరతి మేధా పనికి రాదా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరో రెండు రత్నాలు -ఎడిటోరియల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అటల్‌జీ నాకు చుక్కాని (ఎల్‌.కె. అద్వానీ)

అటల్‌జీ నాకు చుక్కాని (ఎల్‌.కె. అద్వానీ)
నా రాజకీయ జీవనం ప్రారంభమైనప్పటి నుంచి అందులో అంత ర్లీనంగా భాగమైన ఒకే ఒక వ్యక్తి అటల్‌ బిహారీ వాజ్‌పేయి. గత 50 సంవత్సరాలుగా పార్టీలో నాకు అత్యంత సన్నిహిత సహచరుడు.. ఆయన నాయకత్వాన్ని నేను ఎప్పుడూ ఎలాంటి సందేహం లేకుండా అంగీకరించాను.
అటల్‌జీ 1948లో జాతీయవాద వారపత్రిక ‘పాంచజన్య’కు సంస్థాపక సంపాదకుడిగా పనిచేశారు. దాన్ని క్రమం తప్పకుండా నేను చదువుతున్నందువల్ల ఆయన పేరు అప్పటికే నాకు సుపరిచితం. శక్తివంతమైన ఆయన సంపాదకీయాల్నీ, అప్పుడప్పుడు ప్రచురించే ఆయన కవితల్నీ చదివి నేనెంతో ఉత్తేజితుడినయ్యేవాడిని. ధర్మప్రకాశన్‌ ఆధ్వర్యంలో లక్నోలో ఈ పత్రికను ప్రారంభించిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాద్యాయ ఆలోచనల్ని కూడా తెలుసుకునేందుకు అది అవకాశం కల్పించింది. రకరకాల పేర్లతో వ్యాసాలు రాయడమే కాక ప్రూఫ్‌రీడర్‌, కంపోజర్‌, బైండర్‌, మేనేజర్‌గా కూడా వారు పనిచేశారు. అప్పుడప్పుడే హిందీ నేర్చుకున్న నాలాంటి వారికి ఆ భాషలోని అంతర్లీనమైన సౌందర్యం, స్వచ్ఛత, దేశభక్తితో కూడిన ప్రేరణ కల్పించే అపార సామర్థ్యం పాంచజన్య ద్వారా అర్థమయ్యేవి.
1952లో నేను తొలిసారి అటల్‌జీని క లిశాను. భారతీయ జనసంఘ్‌కు చెందిన యువకార్యకర్తగా ఆయన రాజస్తాన్‌లోని కోటా నుంచి వెళుతున్నారు. అక్కడ నేను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేస్తున్నాను. కొత్తగా ఏర్పడిన పార్టీకి ప్రజల్లో ఆదరణ కల్పించడం కోసం ఆయన డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీతో పాటు రైలులో వెళుతున్నారు. ఆ రోజుల్లో అటల్‌జీ డాక్టర్‌ ముఖర్జీ రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు. అస్పష్టంగా ఉన్న ఆయన రూపురేఖలు నా మనస్సులో ఇంకా ముద్రితమై ఉన్నాయి. ఒక యువ రాజకీయ కార్యకర్తగా వాజ్‌పేయ్‌ సన్నగా ఉండేవారు. నేను కాస్త పొడవు కాబట్టి ఆయనకంటే సన్నగా కనిపించే వాడిని. యవ్వనపు ఆదర్శ భావాలు ఆయన పుణికి పుచ్చుకున్నారని నాకు సులభంగా అర్థమైంది. రాజకీయాల్లో ప్రవేశించినా, ఆయన చుట్టూ ఒక కవితాత్మక ఆకర్షణ నెలకొని ఉండేది. ఆయనలో ఏదో ఒక శక్తి జ్వలిస్తున్నట్లు కనిపించేది. ఆయనలోని అంతర్జ్వాల ఆయన ముఖంపై ప్రస్పుటంగా గోచరించేది. అప్పుడాయన వయసు 27 లేదా 28 సంవత్సరాలు ఉండవచ్చు. ఈ మొదటి పర్యటన ముగిసేనాటికి వాజ్‌పేయి ఒక అసాధారణమైన యువకుడని, ఆయన గురించి నేను తెలుసుకోవాలని నాలో నేను అనుకున్నాను. ఆ తర్వాత ఆయన రెండో సారి పర్యటనకు వచ్చారు. అద్భుతమైన ఆయన వ్యక్తిత్వం, లక్షలాది మంది ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేయగలగిన ప్రతిభావంతమైన ఆయన వక్తృత్వం, హిందీ భాషపై అసాధారణమైన ఆధిపత్యం, అత్యంత తీవ్రమైన రాజకీయ అంశాలపై కూడా చమత్కారికంగా, వ్యంగ్యంగా వ్యక్తీకరించగలిగిన ఆయన సామర్థ్యం.. ఇవన్నీ నా పై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపాయి. ఆయన రెండో పర్యటన ముగిసేనాటికి ఆయన ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడని ఒకరోజు భారతదే శానికి నాయకత్వం వహించగలిగిన లక్షణాలు ఆయనలో ఉన్నాయనే అభిప్రాయం నాకు ఏర్పడింది.
1957లో అటల్‌జీ పార్లమెంటుకు ఎన్నికైన తరువాత దీన్‌దయాళ్‌జీ నాకు సంబంధించిన మరో చర్య తీసుకున్నారు. రాజస్థాన్‌ నుంచి ఢి ల్లీకి మారి పార్లమెంటు పనిలో అటల్‌జీకి సహాయపడాల్సిందిగా దీన్‌దయాళ్‌జీ నన్ను కోరారు. అప్పటి నుంచి అటల్‌జీ, నేను జనసంఘ్‌, తరువాత బీజేపీ ప్రతి పరిణామ దశలోనూ కలిసికట్టుగా పనిచేశాము. లోక్‌సభలో ప్రవేశించిన తరువాత ఆయన పార్లమెంటులో పార్టీ వాణిని వినిపించారు. పార్టీకి సంఖ్యాబలం ఏమాత్రం లేకపోయినా, ఆయన అంతకు మించి ప్రతిష్టను గడించారు. 1968 ఫిబ్రవరిలో దీన్‌దయాళ్‌జీ విషాద మరణం తరువాత ఆయన పార్టీ అధ్యక్షపదవీ బాధ్యతల్ని కూడా చేపట్టవలసివచ్చింది. పార్టీ చరిత్రలో అది అత్యంత సంక్లిష్ట సమయం అయినప్పటికీ ఈ సంక్షోభం నుంచి జనసంఘ్‌ను ఆయన కాపాడి సమర్థవంతమైన నాయకుడిగా నిరూపించుకున్నారు. కార్యకర్తలు, మద్దతుదారుల్లో అటల్‌బిహారీ అధంకారంలో వెలుగురేఖలా భాసిల్లారు. అదే అప్పుడు వారి నినాదమైంది. (అంధేరీ మే ఏక్‌ చిన్గారీ… అట్‌ బిహారీ.. అటల్‌ బిహారీ)
ఆ తరువాత తారాజువ్వలా ఎదిగేందుకు కారణం అయోధ్య ఉద్యమం. అయితే ఈ సమయంలో అట్‌జీ దాదాపు నిష్ర్కియంగా ఉండిపోయారు. అయితే 1996లో అటల్‌జీ 13 రోజుల ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన పార్టీ వైఫల్యం నుంచి 1998లో విజయవంతంగా అధికారాన్ని చేపట్టడం వరకూ ఆయన వ్యక్తిగత ఆదరణే ప్రదానాంశమైందని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ ఆకర్షణ పార్టీకున్న మద్దతుకంటే అతీతమైనది. మరోసారి మేమిద్దరమూ రాజకీయ అస్పృశ్యతా సంకెళ్లను చేధించి ఎన్‌డిఏను ఏర్పరచేందుకు కలిసికట్టుగా కృషి చేశాము.
కొన్ని దశాబ్దాలుగా కొంత మంది వ్యక్తుల ఊహిస్తున్నదానికి భిన్నంగా అటల్‌జీకి నాకు ఉన్న బాంధవ్యంలో ఏనాడూ పోటీతత్వంకానీ, సంఘర్షణకానీ తలెత్తలేదు. అయితే మామధ్య ఎప్పుడూ అభిప్రాయభేదాలు లేవని చెప్పడం నా ఉద్దేశం కాదు. అవును.. కొన్నిసార్లు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మా వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉండటం వల్ల సహజంగానే వ్యక్తులపై, సంఘటనలపై, సమస్యలపై మా అంచనాలు కూడా చాలా సందర్భాల్లో బిన్నంగా ఉన్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యానికి విలువిచ్చే ఏ సంస్థలోనైనా ఇది సహజమే. అయితే మా సంబంధాలు ఇంత ప్రగాఢంగా ఉండడానికి మూడు కారణాలు ఉన్నాయి. మొదట దేశం, తరువాత పార్టీ, తరువాత వ్యక్తి ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తమ సభ్యులందరికీ పిలుపునిచ్చిన జనసంఘ్‌, బిజెపి సిద్ధాంతమూ, ఆదర్శాలు, విలువలను మేము బలంగా పంచుకున్నాము. పరస్పర విశ్వాసం, గౌరవాన్ని తగ్గించే విధంగా మేము మా అభిప్రాయాలకు ఏనాడూ తావివ్వలేదు. కానీ మూడవ అత్యంత ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది నేను ఎలాంటి ప్రశ్నలకూ తావివ్వకుండా నా అంతరాంతరాల్లో కూడా అటల్‌జీని నా సీనియర్‌గా, నా నాయకుడిగా అంగీకరించాను. అయితే, నా పట్ల అటల్‌జీ అనుసరించిన సర్దుబాటు ధోరణిని కూడా నేను ఇక్కడ ప్రస్తావించాలి. కొన్ని అంశాలపై నా ఆలోచన ఫలానా విధంగా ఉన్నదని ఆయనకు తెలిస్తే దానిపై తనకు పెద్ద వ్యతిరేక అభిప్రాయం లేకపోతే ఆయన దాన్ని అంగీకరించేవారు. ‘అద్వానీజీ ఏం చెప్పారో అదే సరైనది..’ అనేవారు. ఆ తరువాత మేము చర్చిస్తున్న విషయం అంతటితో సుఖాంతమయ్యేది.
లెక్కలేనన్ని సందర్భాల్లో అటల్‌జీతో నేను గడిపిన క్షణాల్ని తరచిచూస్తే, ఆయనకు ఈ నివాళిని ముగించే ఉత్తమ మార్గం గురించి ఆలోచిస్తుంటే నాకు 1959 ప్రాంతంలో మేమిద్దరమూ కలిసి చూసిన ఒక సినిమా గుర్తుకొస్తుంది. హిందీ సినిమాలను కలిసి చూడటం మా ఇద్దరికీ ఇష్టమైన అలవాటు. 1970 ద్వితీయార్థం వరకూ మేము ఢిల్లీలో రీగల్‌, ఇతర సినిమా హాళ్లకు కలిసి వెళ్లే వాళ్లం. అటల్‌జీ, నేను జనసంఘ్‌కు చెందిన వందలాది కార్యకర్తలతో కలిసి ఢిల్లీ మున్సిల్‌ కార్పొరేషన్‌ ఉప ఎన్నికల్లో కష్టపడి పనిచేశాము. మా ప్రయత్నాలు ఎన్ని చేసినా విజయం లభించకపోవడంతో నిరాశకు గురయ్యాం. ‘చలో కోయీ సినిమా దేఖ్‌నే చల్‌తే హై.’ అని అటల్‌జీ నాకు చెప్పారు. మేమిద్దరం పహాడ్‌గంజ్‌లో ఉన్న ఇంపీరియల్‌ సినిమాకు వెళ్లి ప్రముఖ నటుడు, నిర్మాత రాజ్‌కపూర్‌ నటించిన ఒక సినిమాను చూశాము. దాస్తో విస్కీ ప్రతిష్టాత్మక నవల ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ ఆధారంగా నిర్మించిన ఆ సినిమా భారత స్వాతంత్య్రం తరువాత జరిగిన ఘటనల్ని చిత్రీకరించింది. నెహ్రూకాలంలో హామీలు నెరవేరకపోవడంతో భ్రమలు కోల్పోయిన ప్రజల గురించి, పేదలకు జరిగిన అన్యాయాల గురించి అది చిత్రీకరించింది. అయితే నవోదయం రానున్నదని, ప్రజలు సహనంగా, విశ్వాసంగా ఉండాలని ఆ సినిమా పిలుపునిచ్చింది. దాని ఆశావహ సందేశం అటల్‌జీలో, నాలో ఉన్న నిరాశను పోగొట్టేవిధంగా ఉంది. ఆ సినిమా పేరు కూడా ‘ఫిర్‌ సుబాహోగీ’.
(అద్వానీ ఆత్మకథ ‘నా దేశం నా జీవితం’ నుంచి..)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇద్దరు భారత రత్నాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జమ్మూలో హీరో కాశ్మీర లో జీరో అయిన మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒరిగిన దర్శక శిఖరం

ఒరిగిన దర్శక శిఖరం

కథా రచయిత, స్ర్కీన్‌ప్లే రైటర్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌… అన్ని విభాగాల్లోను లెజండ్‌ అనిపించుకున్న సృజనాత్మక కళాకారుడు కె.బాలచందర్‌. విలక్షణమైన దర్శకత్వ శైలి, అసాధారణ కథాకథనాలతో, సమకాలీన సాంఘిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించిన తీరు బాలచందర్‌ను భారతీయ సినిమా శిఖరాగ్రాన నిలిపాయి.
తమిళ సినిమా దర్శక శిఖరంగా కొలిచింది. తెలుగులో కొద్ది సినిమాలే చేసినా వాటితో ‘మరో చరిత్ర’ సృష్టించారు. అంతర్గత మానవ సంబంధాలు, సామాజిక నేపథ్యాలు, సాహసోపేతమైన స్ర్తీ కథా పాత్రలు కేంద్రబిందువుగా మధ్యతరగతి జీవితాలను అనితరసాధ్యంగా ఆవిష్కరించడం ద్వారా వెండితెరపై ఓ విప్లవాన్నే సృష్టించారు బాలచందర్‌. స్ర్కీన్‌ రైటర్‌గా ఇండస్ర్టీలో అడుగుపెట్టి, దర్శక దిగ్గజంగా ఎదిగారు. దర్శకుడిగా 100కిపైగా సినిమాలు తెరకెక్కించి, నిర్మాతగా కవితాలయ ప్రొడక్షన్స్‌ పతాకంపై 58 చిత్రాలు నిర్మించి, ఎందరో తారలకు ప్రకాశాన్నిచ్చారు.
ఆయన తీసినవన్నీ కథాబలం ఉన్న సినిమాలే. మధ్యతరగతి కుటుంబాల్లోని సహజమైన పాత్రలతో ఆయన తీసినన్ని చిత్రాలు మరే దర్శకుడూ తియ్యలేదనేది నిర్వివాదం. కుటుంబ బంధాలు, సాంఘిక అసమానతలను చాలా లోతుగా చూపించి, వాటికి చక్కని పరిష్కారాలు కూడా చూపిన దర్శక రచయిత బాలచందర్‌. ఆయన సినిమాలు కళాత్మకతకు అద్దం పడుతూనే, కాసుల వర్షం కురిపించాయి. విమర్శకుల ప్రశంసలందుకుంటూనే కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించాయి. ఆయన కథలు, కథనశైలి, పాత్రలు విలక్షణమైన, వైవిధ్యమైన దర్శకుడిగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో కొత్త దర్శకులు వచ్చినా, కమర్షియల్‌ సక్సెస్‌లు అందుకున్నా బాలచందర్‌ స్థానం చెక్కుచెదరలేదు. తన సినిమాలతో, తను సృష్టించిన సినీ ధృవతారలతో ఐదు దశాబ్ధాలుగా భారతీయ సినిమాలో ‘శిఖరం’గా నిలబడ్డారు. నటీనటుల నుండి నటన రాబట్టుకోవడంలోను, తను ఎంచుకున్న కథలను వెండితెరపై ఆవిష్కరించడంలోను బాలచందర్‌ శైలే వేరు. ఆయన సినిమాలపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు కూడా జరిగాయి.
బాల్యం – నాటకాల్లో ప్రాచుర్యం….
పూర్తి పేరు కైలాసం బాలచందర్‌. 1930, జూలై 9న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తంజావూరు జిల్లాలోని నన్నిలయం ఆయన స్వస్థలం. ప్రాథమిక విద్య అక్కడే జరిగింది. అన్నామలై విశ్వవిద్యాలయంలో జుయాలజీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం తిరువారూర్‌ జిల్లా ముత్తుపేటలో పాఠశాల టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. ఏడాది తరువాత మద్రాసులో అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో అప్రెంటిస్‌ క్లర్క్‌గా చేరారు. ఆ సమయంలో మద్రాసులో నాటకాలు ఎక్కువగా ప్రదర్శితమవుతుండేవి. ఉదోగ్యం చేస్తూనే నాటకాల వైపు ఆకర్షితులయ్యారు బాలచందర్‌. యునైటెడ్‌ అమెచ్యూర్‌ ఆర్టిస్ట్స్‌ అనే డ్రామా కంపెనీలో చేరారు. కొన్నాళ్లకి ఆంగ్లంలో ‘మేజర్‌ చంద్రకాంత్‌’ అనే నాటకాన్ని రాశారు. అప్పట్లో మద్రాసులో ఆంగ్లంపై ప్రజలకి అంత పట్టులేకపోవడంతో తిరిగి తమిళంలోకి అనువదించారు. సొంతంగా ఒక డ్రామా ట్రూప్‌ను ఏర్పాటుచేసుకొని ‘మేజర్‌ చంద్రకాంత్‌’ నాటకాన్ని ప్రదర్శించారు. ప్రజల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. పెద్ద సెన్సేషన్‌ సృష్టించింది. ఆ తరువాత స్వీయ దర్శకత్వంలో ‘సర్వర్‌ సుందరం’, ‘నీర్‌కుమిళి’ (నీటి బుడగ), ‘మెళుగువర్తి’ (కొవ్వొత్తి), ‘నానల్‌’ (పొడవాటి గడ్డి), ‘నవగ్రహం’ వంటి బహుప్రాచుర్యం పొందిన నాటకాలను ప్రదర్శించి, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
నాటకాలకు అపూర్వ జనాదరణ…
కేబీ నాటక రచనా కౌశలం గురించి విన్న పురట్చి తలైవర్‌ ఎంజీఆర్‌ తన ‘దైవతాయ్‌’ (1965) సినిమాకి స్ర్కీన్‌ప్లే, డైలాగులు రాయమన్నారు. అయితే అప్పటి వరకు నాటక అనుభవమే కలిగిన కేబీకి అపరిమిత ప్రజాదరణ కలిగిన ఎంజీఆర్‌ సినిమాకి మాటలు రాయడం కష్టమనిపించింది. తరువాత రోజుల్లో ఓ సందర్భంలో ఈ విషయాన్ని గుర్తుచేసుకొంటూ ‘ఆ సమయంలో నా పరిస్థితి నీటిలో నుండి బయటపడ్డ చేపలా ఉంది’ అని చెప్పారు. మొత్తానికి ‘దైవతాయ్‌’ నిర్మాత ఆర్‌ఎం వీరప్పన్‌ సాయంతో జనాదరణ పొందే విధంగా డైలాగులు రాయగలిగారు. నెమ్మదిగా ఎంజీఆర్‌ క్రేజ్‌, ఇమేజ్‌కి తగ్గట్టుగా డైలాగులు రాయడంలో పట్టు సాధించారు. అప్పుడే వినోదాత్మకంగా విశేష ప్రజాదరణ పొందిన ‘సర్వర్‌ సుందరం’ నాటకాన్ని సినిమాగా మలచాలని ఆనాటి దిగ్గజ నిర్మాత ఆవిచ్చి మెయ్యప్ప (ఏవీఎం) చెట్టియార్‌ నిర్ణయించి, బాలచందర్‌ నుండి హక్కుల్ని కొనుగోలు చేశారు. ఈ నాటకంలో నటించిన నాగేష్‌నే కథానాయకుడిగా పెట్టి కృష్ణన్‌ పంజు దర్శకత్వంలో ‘సర్వర్‌ సుందరం’ (1964) సినిమా తీశారు. అపూర్వ జనాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అవార్డులు, రివార్డులు దక్కాయి. అది తమిళ సినిమా ఆణిముత్యాల్లో ఒకటిగా నిలిచింది. కథా రచయితగా బాలచందర్‌ ప్రతిభ హిందీ దర్శకుల వరకూ పాకింది. ఆయన రాసిన తొలి నాటకం ‘మేజర్‌ చంద్రకాంత్‌’ను ‘ఊంచే లగే’ (1965) పేరుతో హిందీ సినిమా తీశారు. ఇది జాతీయ స్థాయిలో పేరు సాధించింది. అదే ఏడాది ముక్తా శ్రీనివాసన్‌ నిర్మించిన ‘పూజైక్కు వంద మలర్‌’కి డైలాగులు రాశారు.
దర్శకుడిగా ఆరంగేట్రం…
బాలచందర్‌ దర్శకత్వ ఆరంగేట్రం ఓ సంచలనం. తొలి సినిమాతోనే దర్శకుడిగా తనదైన ముద్ర వేసి, తమిళ సినిమాని తనవైపు తిప్పుకున్న అపార ప్రతిభాశాలి. ఆ సమయంలో సినిమాలన్నీ కథానాయక ప్రధానమైనవే. వాటికి భిన్నంగా సినిమా తీయాలన్న ఉద్దేశ్యంతో – మధ్య తరగతి కుటుంబ జీవితాలను వెండితెరపై ఆవిష్కరించాలనుకున్నారు. తను రాసిన నాటిక ‘నీర్‌కుమిళి’నని సినిమాగా తీయాలని నిర్ణయించి, మెగాఫోన్‌ పట్టారు. తొలి చిత్రంతోనే కొత్త ట్రెండ్‌ సృష్టించారు. అప్పటి వరకు వెండితెరపై హీరోయిజాన్నే చూసిన ప్రేక్షకులకు ‘నీర్‌కుమిళి’ (1965) కొత్త అనుభూతిని పంచింది. మధ్య తరగతి జీవితాలు ఆ పాత్రల్లో ప్రతిబింబించడంతో ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమా మొత్తం దాదాపుగా ఒక సెట్‌లోనే తీసేశారు. సహజత్వానికి దగ్గరగా ఆయన తెరకెక్కించిన తీరు అందరికీ బాగా నచ్చింది. సినిమా హిట్టయ్యింది, దర్శకుడిగా కె.బాలచందర్‌కి గుర్తింపు వచ్చింది. తన నాటక బృందంలో ఉన్న నటీనటులతోనే ఈ సినిమా తీశారు. ఇక ఆ తరువాత దర్శకుడిగా బాలచందర్‌ ప్రస్థానం అప్రతహరితంగా కొనసాగింది. తను రాసిన నాటకాలనే సినిమాలుగా మలచి విజయాలందుకున్నారు. ‘నానల్‌’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’, ‘ఎదిర్‌ నీచ్చల్‌’ వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. తెలుగులో ‘అంతులేని కథ’, ‘మరో చరిత్ర’, ‘ఆకలి రాజ్యం’, ‘తొలికోడి కూసింది’, ‘కోకిలమ్మ’, ‘రుద్రవీణ’ వంటి ఆణిముత్యాలను రూపొందించారు. ‘మరో చరిత్ర’ను హిందీలో ‘ఏక్‌ దూజే కేలియా’గా రీమేక్‌ చేసి, అక్కడా నీరాజనం అందుకున్నారు.
నటుడిగా…
1996లో వచ్చిన ‘కల్కి’లో తొలిసారిగా వెండితెరపై కనిపించారు బాలచందర్‌. సినీ దర్శకుడిగానే ఆయన కనిపిస్తారు. ఆ తరువాత 2006లో తెలుగు నటుడు ఉదయ్‌ కిరణ్‌తో తీసిన ‘పొయ్‌’ చిత్రంలో అతిథి పాత్ర పోషించారు. అప్పటికి నాలుగేళ్ల తరువాత బాలచందర్‌ ప్రధాన పాత్రలో ‘రెట్టై సుళి’ వచ్చింది. కొత్త దర్శకుడు తామిరై తెరకెక్కించిన ఈ చిత్రంలో మరో దర్శక దిగ్గజం భారతీరాజా కూడా నటించారు. ఈ ఏడాదిలోనే వచ్చిన ‘నిన్నైత్తదు యారో’ చిత్రంలో గెస్ట్‌ రోల్‌ చేసిన బాలచందర్‌ తన ప్రియ శిష్యుల్లో ఒకరైన కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘ఉత్తమ విలన్‌’లో నటించారు. ఈ సినిమా ఫైనల్‌ కాపీ పూర్తి కాకముందే ఆస్పత్రి పాలయ్యారు.
ధృవ‘తార’ల సృష్టికర్త…
భారతీయ సినిమాకి ముఖ్యంగా దక్షిణాదికి గొప్ప గొప్ప నటీనటులను, సాంకేతిక నిపుణులను అందించారు బాలచందర్‌. ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఉలగ నాయకుడు కమల్‌హాసన్‌, మ్యూజిక్‌ మ్యాస్ర్టో ఏఆర్‌ రెహ్మాన్‌లను పరిచయం చేసింది ఆయనే. నాజర్‌, సరిత, వివేక్‌, విమలారామన్‌… చెప్పుకుంటూనే పోతే 1980ల నుండి ఇప్పటి వరకు తమిళ, తెలుగు సినీ పరిశ్రమలను ఏలుతున్న అగ్ర నటీనటుల్లో చాలా వరకు బాలచందర్‌ శిష్యులే. తను తీసిన సినిమాల్లాగే 100 మందికిపైగా తారలను వెండితెరకు పరిచయం చేశారు. కమల్‌హాసన్‌ అత్యధికంగా 35 చిత్రాల్లో నటించారు. కథానాయికల్లో సరిత 22 సినిమాల్లో నటించింది.
తెలుగులో…
తమిళంలో ఘన విజయం సాధించిన ‘భామా విజయం’ను ‘భలే కోడళ్లు’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. ‘సుఖదుఃఖాలు’, ‘చిరంజీవి’, ‘సంబరాల రాంబాబు’, ‘జీవితతరంగం’, ‘తూర్పు పడమర’ చిత్రాలకు స్ర్కీన్‌ప్లే రచయిత. దర్శకుడిగా ‘భలే కోడళ్లు’ (1968), ‘సత్తెకాలపు సత్తయ్య’ (1969), ‘బొమ్మా బొరుసా’ (1971), ‘అంతులేని కథ’ (1976), ‘మరో చరిత్ర’ (1978), ‘అందమైన అనుభవం’ ‘1979), ‘గుప్పెడు మనసు’ (1979), ‘ఇది కథ కాదు’ (1979), ‘ఆకలి రాజ్యం’ (1981), ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ (1981), ‘47 రోజులు’ (1981), ‘తొలికోడి కూసింది’ (1981), ‘కోకిలమ్మ’ (1983), ‘రుద్రవీణ’ (1988) వంటి మంచి చిత్రాలు అందించారు.‘భామా విజయం’, ‘సర్వర్‌ సుందరం’ వినోదాత్మక చిత్రాలుగా ఎంతో పేరుతెచ్చాయి.
అవార్డులకే వన్నెతెచ్చిన బాలచంద్రుడు…
9 జాతీయ అవార్డులు, 13 ఫిలిం ఫేర్‌ అవార్డులు, 10 రాష్ట్ర అవార్డులు, 4 నంది అవార్డులు, 3 గౌరవ డాక్టరేట్‌లు.. చెప్పుకుంటూ పోతే బాలచందర్‌ కీర్తిసిగలో అవార్డులు ఎన్నో ఎన్నెన్నో! వినోద రంగంలో ఆయన చేసిన సేవలకు 1987లో పద్మశ్రీ వరించింది. 2010లో ఇండియన్‌ సినిమాలోనే అతిపెద్ద పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే, 2011లో ప్రతిష్టాత్మక ఏఎన్‌ఆర్‌ జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 1970లో తమిళనాడు రాష్ట్ర అత్యుతన్న పురస్కారం కలైమామణి దాసోహమంది. ఇక వివిధ సంస్థలు ఇచ్చిన అవార్డులు, చేసిన సన్మానాలకు లెక్కేలేదు.
బాలచందర్ జర్నీ 1930-2014

కె.బాలచందర్‌ మంగళవారంనాడు సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూశారు. 84 ఏళ్ల బాలచందర్ కు భార్య, ముగ్గురు పిల్లలు. ఆయన భార్య పేరు రాజం. కైలాసం, ప్రసన్న అనే ఇద్దరు కుమారులు. పుష్ప కందస్వామి అనే కుమార్తె.
సినిమారంగంలో ఎంతోమందిని నటీనటులుగా, సాంకేతిక సిబ్బందిని పరిచయం చేశారు. వారిలో కమల్‌ హాసన్‌, రజినీకాంత్‌, మమ్ముట్టి ముఖ్యులు. తమిళంలో చిరంజీవిని పరిచయం చేశారు. అదేవిధంగా శ్రీవిద్య, శ్రీదేవి, సరిత, వివేక్‌ (తమిళ హాస్య నటుడు) ప్రకాష్‌ రాజ్‌, వై. జి. మహేంద్రన్‌ (తమిళ నటుడు), సుజాత, చరణ్‌ (తమిళ దర్శకుడు), రమేష్‌ అరవింద్‌, మాధవి, జయసుధ, జయప్రద, శ్రీ ప్రియ, గీత, చార్లి (తమిళ హాస్య నటుడు), యువరాణి, విమలా రామన్‌ కూడా వున్నారు. సాంకేతిక విభాగంలో ఏ.ఆర్‌.రెహమాన్‌ ‘రోజా’ సినిమాను నిర్మించిన బాలచందర్‌, సంగీత దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చారు. తొలికోడి కూసింది, ఆకలిరాజ్యం, ఇదికథ కాదు, మరోచరిత్ర చిత్రాలు అప్పట్లో తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి.
నాటకాలతో తొలి అంకం
తమిళనాడు, తంజావూరు జిల్లాలోని నన్నిలం గ్రామం ఆయన స్వస్థలం. వస్త్రాలపై వేసే రంగురంగుల పెయింటింగులకు ఈ గ్రామం ప్రసిద్ధి. వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. నాన్న దండపాణి కైలాసం. అమ్మ సరస్వతి. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీయస్సీ పూర్తి చేశాడు. తరువాత అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో ఉద్యోగిగా ఆయన జీవితం ప్రారంభమైంది. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో సరదాగా నాటకాలు రాస్తుండేవాడు. అలా రాసిన ఒక నాటకం ఎం.జి. రామచంద్రన్‌ దృష్టిలో పడటంతో ఆయన్నుంచి ఆహ్వానం వచ్చింది. ఎంజీఆర్‌ నటించిన దైవతాయి అనే చిత్రానికి సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించాడు.
సినిమా ప్రవేశం:
ఆయన సినిమా పరిశ్రమలో అడుగు పెట్టేసరికి సినిమాలన్నీ హీరోయిజంతో నిండిన కథలే ఉండేవి. అంటే కథలన్నీ పురుష ప్రధానంగా సాగుతూ ఉండేవి. ఈ పంథాను మార్చడానికి, తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి ఆయన మధ్యతరగతి కుటుంబాలను, వారి ఆశలు, ఆశయాలను, ప్రేమను, అభిమానాలను కథా వస్తువులుగా ఎన్నుకొన్నాడు. ఆయన సినిమాలోని పాత్రలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి.
మొదటి సినిమా తరువాత ఆయన రాసిన నాటకాల్లో ఒకటైన ‘నీర్కుమిళి’ ని సినిమాగా తీశాడు. ఆ సినిమాలో అన్ని సన్నివేశాలు దాదాపు ఒకే సెట్‌‌లో ఉంటాయి. అలాంటి కథ అప్పటి ప్రేక్షకులకు కొత్త. అనుకున్నట్టే అది విజయం సాధించింది. దాంతో ఆయన చిత్ర దర్శకుడిగా మారాడు. తరువాత మేజర్‌ చంద్రకాంత్‌, ఎదిర్నేచ్చల్‌ లాంటి చిత్రాలు తీశాడు. అప్పుడాయనకు పెద్ద స్టార్లతో సినిమాలు తీయమని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ ఆయన ఎప్పుడూ హీరోలు దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేసుకోలేదు. ‘సర్వర్‌ సుందరం’ (1964) కథ తయారు చేసినప్పుడు మాత్రం ఆ పాత్రకు నగేష్‌ అయితే చక్కగా సరిపోతాడనిపించింది. అప్పటికి ఆయన చాలా బిజీ హాస్యనటుడు. కానీ ఆయన్ని కలిసి కథ వినిపించడంతో అందుకు అంగీకరించాడు. ఆ సినిమా బాలచందర్‌కు మేలిమలుపు నిచ్చింది. క్రిష్ణన్‌ పంజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే బాలచందర్‌ దానికి మాటలు రాశాడు. ఆ చిత్ర సంభాషణలకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అవకాశాలు బాగా పెరిగాయి.
ఉద్యోగం-సందేహం:
అవకాశాలు పెరగడంతో ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలా వద్దా? అని కొన్నాళ్ళు సందేహించాడు. అయితే మెయ్యప్పన్‌ అనే నిర్మాత ఆయనకు ధైర్యం చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేయించడమే కాకుండా వరుసగా మూడు అవకాశాలిచ్చాడు. దాంతో ఆయన సినిమా పరిశ్రమలో స్థిరపడ్డాడు.
అప్పట్లో ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీలు ఎదుర్కొనే బాధలు ఆయన కథల్ని బాగా ప్రభావితం చేశాయి. అలా వెలుగులోకి వచ్చినవే సుజాత నటించిన అంతులేని కథ, సుహాసిని ప్రధాన పాత్రలో వచ్చిన సింధుభైరవి, ప్రమీలతో తీసిన అరంగేట్రం. ‘సింధుభైరవి’లో మగవాడి సహాయం లేకుండా బ్రతకాలనుకునే పాత్ర సుహాసినిది. అరంగేట్రంలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కుటుంబాన్ని పోషించడం కోసం వేశ్యావృత్తిని స్వీకరిస్తుంది. అప్పటి సమాజంలో ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసేవారు కావడంతో ఈ కథలు వివాదాస్పదం అయ్యేవి. అంతేకాదు అప్పట్లో వచ్చే సినిమాల్లో విషాదాంతాలు ఉండేవి కావు. చాలావరకు పెళ్ళితో అంతమయ్యేవే. కానీ ఆయన సినిమాలు అందుకు భిన్నంగా ఉండేవి.
చిరంజీవితో….
చిరంజీవి, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రవీణ గ్రామాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్న ఓ యువకుడి కథ. దీనికి ఆయన ఆ చిత్ర నిర్మాత నాగేంద్రబాబుతో కలిసి ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు. కమల్‌ హాసన్‌, సరిత నటించిన ‘మరో చరిత్ర’ అప్పట్లో యువతను బాగా ఆకట్టుకున్న విషాదాంత ప్రేమకథ.
అందుకున్న పురస్కారాలు:
1973 లో తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి పురస్కారం, 1982లో ఏక్‌ దూజే కేలియే సినిమాకు గాను ఫిల్మ్‌ ఫేర్‌ ఉత్తమ స్క్రీన్‌ ప్లే అవార్డు గెలుచుకున్నారు. 1987లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం. 1989లో రుద్రవీణ సినిమా కోసం జాతీయ స్థాయిలో నర్గీస్‌ దత్‌ అవార్డు, వెండి కమలం బహుమతుల్ని చిరంజీవి, నాగేంద్రబాబులతో పంచుకున్నారు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాన పాటల వాణి అనేవాళ్ళు – వాణీవిశ్వనాథ్‌

వాన పాటల వాణి అనేవాళ్ళు – వాణీవిశ్వనాథ్‌

ఇదేమీ వర్షాకాలం కాదు. వణికిస్తున్న చలికాలం. అయితే వాణీవిశ్వనాథ్‌ గుర్తుకొస్తే.. వర్షంలో తడిసి ముద్దవుతాం. అప్పట్లో – ఒంపు ఒంపున హంపి శిల్పంలా పల్చటి సిల్కుచీరల మీద.. ఆ వయ్యారి ఒలకబోసిన అందాలకు దాసోహం అవ్వని ప్రేక్షకులు లేరు. వానపాటలంటే వాణీవిశ్వనాథే చెయ్యాలి అనేంత పేరు తెచ్చుకుందీ సుందరి. హీరోలతో పోటీపడి నటిస్తూ.. అదిరిపోయే స్టెప్పులేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకముద్రను చాటుకున్న వాణి.. అవకాశాలున్నప్పుడే.. బయటికొచ్చి ఓ మలయాళీ విలన్‌ను ప్రేమించి.. సెటిల్‌ అయిపోయింది.. ఇద్దరు పిల్లలతో హాయిగా కాలం వెల్లదీస్తున్న ఆమెను కదిపింది ‘నవ్య’..
అదే నా గ్లామర్‌ రహస్యం
నాకు ఇద్దరు పిల్లలు. 2003లో పాప ఆర్చ, 2008లో బాబు అద్రి పుట్టారు. వారితోనే లైఫ్‌ సాగిపోతోంది. మంచి అవకాశాలు వస్తున్నప్పుడే పరిశ్రమ నుంచి తప్పుకున్నాను. ఒకవైపు సినిమా ఛాన్సులు, మరోవైపు భర్త ఈ రెండింటిలో – భర్తే ప్రధానమనిపించింది. మంచి భర్త దొరకడం అదృష్టం. పెళ్లయిన తరువాత మనం మనల్ని చాలా మార్చుకోవాలి. హీరోయిన్‌గా వున్నప్పుడు నలుగురు సర్వెంట్లు వుండేవారు. అన్ని చోట్లా అలాగే కావాలనుకుంటే మన జీవితం చెడిపోయినట్లే..శ్రీ ఒక ఇంటికి ఇల్లాలైన తరువాత అన్నీ మనమే చూసుకోవాలి. మా ఇంటివరకు అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఒకరకంగా ఇంట్లో పనే నా గ్లామర్‌ రహస్యం!
రజనీతో నటించలేకపోయా..
పెద్ద నటులతో నటించే అవకాశం రావడం గొప్పగానే వున్నా అది కూడా నాకు మైనస్‌ అయిందేమో అనిపిస్తుంది. ఎన్‌టీఆర్‌తో చేయడం వల్ల బాలకృష్ణ గారితో కలిసి నటించలేకపోయా. వెంకటేష్‌గారితోను మిస్‌ అయ్యా! ఆయనతో ఓ సినిమా ప్రారంభమైనా ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది. ఇక నా అభిమాన నటుడు రజనీకాంత్‌తో కలిసి పని చేసే అవకాశం రాలేదు. ఇది ఎప్పటికీ నాకు లోటే. 6వ తరగతి చదువుతున్న మా పాప ఇటీవల తన స్కూల్లో ‘రజనీకాంత్‌ జీవితం’పై వకృత్త్వ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. అదే నాకు కొంత ఊరట.
ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత
ఎంతోమంది గొప్ప నటులతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఎన్‌టీఆర్‌ వద్ద తోటివారిని గౌరవించడం నేర్చుకున్నాను. చిరంజీవి గారి వద్ద టైం పంక్చువాలిటీకి ఉన్న విలువను తెలుసుకున్నాను. ఆయనతో డ్యాన్స్‌ చేయడమంటే మాటలా? నేను టెన్షన్‌ పడకుండా చక్కగా మాట్లాడుతూ మంచి వాతావరణం కల్పించేవారు. నేచురల్‌గా నటించడం మోహన్‌లాల్‌కే సాధ్యం. కేవలం డైలాగ్‌ డెలివరీతో ఎలాంటి భావమైనా పలికించవచ్చన్నది మమ్ముట్టి గారిని చూసి నేర్చుకున్న విద్య.
విలన్‌తో లవ్‌
మాది ప్రేమ వివాహం. మలయాళ సినిమాల్లో బాబూరాజ్‌ విలన్‌. ఆయన ‘ది గ్యాంగ్‌’ తీశారు. అందులో నెపోలియన్‌ హీరో, నేను హీరోయిన్‌ని. బాబూరాజ్‌ విలన్‌. ఆ సమయంలోనే ఆయనతో ప్రేమలో పడ్డాను. విషయం బయటికి పొక్కడంతో ‘హీరోయిన్‌ని సొంతం చేసుకున్న విలన్‌’ అంటూ మీడియాలో పెద్దపెద్ద వార్తలు వచ్చాయి. 2002 ఫిబ్రవరి 28వ తేదీన తిరుపతిలో మా పెళ్లి జరిగింది.
‘‘నేను మలయాళీ అమ్మాయిని. అమ్మ పేరు గిరిజ. నాన్న విశ్వనాథ్‌ అప్పట్లో పేరు మోసిన జ్యోతిష్యులు. ఐదో తరగతి వరకు నా చదువంతా కేరళలోనే సాగింది. తర్వాత చెన్నై వచ్చేశాను. అక్కడే నాన్న జ్యోతిష్యం చెప్పేవారు. సరిగ్గా నేనప్పుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాననుకుంటా? ఒక రోజున – తన కొత్త సినిమాకు మంచి ముహూర్తం పెట్టమని నాన్నను అడిగేందుకు మా ఇంటికి వచ్చారు కోవై తంబి అనే నిర్మాత. అదే సమయంలో స్కూలు బ్యాగుతో ఇంట్లో అడుగుపెట్టాను నేను. నన్ను చూసిన ఆ నిర్మాత – ‘‘మీ అమ్మాయి చూడముచ్చటగా ఉంది. మీరు ఒప్పుకుంటే నా సినిమాలో అవకాశం ఇస్తాను..’’ అన్నారు. ‘‘అయ్యో వద్దు వద్దు. మా పాప ఇంకా చదువుకుంటోంది. అప్పుడే సినిమాలంటే దాని చదువు పాడైపోతుంది..’’ అన్నారు నాన్న. కానీ ఆయన వింటేగా! నాన్నను మొహమాట పెట్టేశారు. దాంతో నాకు తొలి అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు ‘మన్నుక్కువైరం’. మురళి, పాండ్యన్‌ హీరోలు. అందులో నాది శివాజీగణేశన్‌కు మనవరాలి పాత్ర. 1987 డిసెంబర్‌లో నా అభిమాన హీరో రజనీకాంత్‌ పుట్టినరోజు నాడే ఆ సినిమా విడుదలవ్వడం నా అదృష్టం. సినిమా యావరేజ్‌గా ఆడింది కానీ నా పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఏడాది తర్వాత విజయకాంత్‌ గారి ‘పూదోట్ట కావల్‌ కారన్‌’లో అవకాశం వచ్చింది. అందులో విజయకాంత్‌-రాధికల దత్తపుత్రిక పాత్ర నాది. అది కూడా మంచి పిక్చర్‌. దీన్నే తెలుగులో కృష్ణంరాజు, రాధిక జంటగా ‘ధర్మతేజ’ పేరుతో రీమేక్‌ చేశారు. అందులో కూడా నా పాత్ర నాకే వచ్చింది. అయితే తెలుగులో నా తొలిపిక్చర్‌ అది కాదు. జగపతిబాబు హీరోగా పరిచయమైన ‘సింహస్వప్నం’ నా తొలి తెలుగుచిత్రం.
కన్నడలో రాజ్‌కుమార్‌తో..
అప్పటికే తెలుగు భాష రాక.. నానా ఇబ్బందులు పడుతుంటే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. అది కూడా మహానటుడు రాజ్‌కుమార్‌కు హీరోయిన్‌గా. ఆ సినిమా పేరు ‘పరశురాం’. అప్పటికి నా వయసు 17 ఏళ్లు. ఆ తరువాత అక్కినేని-జయసుధ నటించిన ‘భలేదంపతులు’లో రాజేంద్రప్రసాద్‌ గారికి జంటగా నటించాను. అప్పటి నుంచి సీరియస్‌గా తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. ఏదోలే పార్ట్‌టైం అన్నట్లుగా తెలుగును పట్టించుకోలేదు. కాని ఆ సమయంలోనే చదవడం కూడా నేర్చుకోవడం చూసి జయసుధ గారు ‘తెలుగు భలే నేర్చుకున్నావే..!’ అంటూ ప్రశంసించారు. అది మరపురాని కాంప్లిమెంట్‌.
అలా తెలుగులో మకాం.. 
తెలుగులో నా కెరీర్‌ను పెద్ద మలుపు తిప్పిన చిత్రం ‘నా మొగుడు నాకే సొంతం’. అందులో మోహన్‌బాబుగారు హీరో. ఆ చిత్రం సక్సెస్‌తో తెలుగులోనే స్థిరపడ్డాను. భాషా సమస్యను అధిగమించేందుకు – సినిమా డైలాగుల్ని పదే పదే ప్రాక్టీసు చేసేదాన్ని. ఒక్కోసారి సెట్‌లో దాసరి నారాయణ రావు గారు అప్పటికప్పుడు డైలాగుల్ని మార్చేసేవారు. ‘‘సార్‌! నాకు వచ్చిందే అంతంతమాత్రం డైలాగులు. ఇప్పుడు మీరు హఠాత్తుగా మారిస్తే ఎలా’’ అంటూ మొరపెట్టుకునేదాన్ని. అందుకాయన ‘‘నువ్వు మలయాళ అమ్మాయివి కదా! తెలుగును ఈజీగా నేర్చుకోగలవు. సమస్యే లేదు’’ అని ప్రోత్సహించేవారు. ఆ సినిమా హిట్టవ్వడంతో నాకు మంచి పేరొచ్చింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘మా అల్లుడు’, ‘మా ఇంటి కథ,’ ‘చిన్న కోడలు’ వంటి చిత్రాలలో నావన్నీ హోమ్లీ పాత్రలు. కాని చిరంజీవి గారితో చేసిన ‘ఘరానా మొగుడు’ మాత్రం నన్ను గ్లామర్‌ గాళ్‌ని చేసింది. ఆయనతో నేను ‘కొదమసింహం’లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించా.
అక్కడికక్కడే ఎన్టీఆర్‌ పేమెంట్‌ ఇచ్చారు..
‘ఘరానా మొగుడు’ సెట్‌లో వుండగానే ఎన్‌టీఆర్‌ గారు ‘సామ్రాట్‌ అశోకా’కు హీరోయిన్‌ కోసం వెతుకుతున్నారని తెలిసింది. ‘మనమూ ఓ ట్రయల్‌ వేసి చూద్దాం’ అనుకుని అటు నుంచి అటే ఇంటర్వ్యూకు వెళ్లాను. నిజానికి అందులో హీరోయిన్‌ పాత్ర కోసం శ్రీదేవి, మాధురీదీక్షిత్‌, భానుప్రియ వంటివారిని తీసుకునే ఆలోచన వుందని ప్రచారం జరుగుతున్నా.. అదృష్టం పరీక్షించుకుందామనే ఇంటర్వ్యూకు వెళ్లాను. సెలెక్టవుతానన్న నమ్మకం అస్సలు లేదు. ఎన్‌టీఆర్‌ చాలా సంప్రదాయాలు పాటిస్తారని తెలుసు. అందులో అశోకుని భార్య పాత్ర కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నేనేమో ‘ఘరానా మొగుడు’ సెట్‌లో జీన్స్‌పై వుండడంతో ఆ డ్రెస్‌తోనే వెళ్లాను. అప్పుడు నా బ్యాగులో చీర లేదు. అయినా ధైర్యం చేసి వెళ్లాను. గదిలోకి వెళితే ఎన్‌టీఆర్‌ కూర్చొని వున్నారు. ‘‘ఊఁ.. మీరు మలయాళీయా’’ అని అడిగారు. టీ ఇస్తే తాగేశాను. కొన్ని ప్రశ్నలడిగారు. పేమెంట్‌ గురించి కూడా అడిగారు. నేను ఇచ్చిన జవాబులతో ఏమనుకున్నారో ఏమో.. టేబుల్‌లో నుంచి డబ్బు, డైలాగుల స్ర్కిప్ట్‌, ఓ క్యాసెట్‌ తీసి నా చేతిలో పెట్టారు. స్ర్కిప్ట్‌లో సంస్కృత డైలాగులున్నాయి. సంస్కృతం నాకు కొంత వచ్చు కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. ఆయనకు థ్యాంక్స్‌ చెప్పి హోటల్‌కు వెళ్లిపోయాను. గదిలో చూసుకుంటే ఆయన చెప్పిన పేమెంట్‌కన్నా రూ.50 వేలు ఎక్కువే ఉంది. వెంటనే ఎన్‌టీఆర్‌ గారికి ఫోన్‌ చేసి విషయం చెప్పాను. ఆయన ‘‘ఒక్క నిమిషం’’ అని.. కొంతసేపాగిన తరువాత ‘‘వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని వెనక్కి పంపొద్దు. అది నా గిఫ్ట్‌ అనుకొని మీరే వుంచుకోండి’’ అని నవ్వేశారు.
ఆయన పక్కనే నాకొక కుర్చీ..
ఎన్‌టీఆర్‌ తోటి నటీనటులకు ఇచ్చే గౌరవం అంతాఇంతా కాదు. ‘సామ్రాట్‌ అశోకా’ షూటింగ్‌ సెట్‌లో ఆయనకు ప్రత్యేకంగా కుర్చీ వుండేది. దాని పక్కనే నాకొక సీటు వేసేవారు. షూటింగ్‌ విరామంలో వాటిల్లోనే కూర్చొనేవాళ్లం. ఆ సమయంలో సెట్‌కి అప్పుడప్పుడూ చిరంజీవి, బాలకృష్ణ, హరికృష్ణ వంటి వారంతా వస్తుండేవారు. ఎన్‌టీఆర్‌ను పలుకరించేందుకు వారు దగ్గరికి వచ్చేవారు. సెట్‌లో నిలబడే వారంతా మాట్లాడేవారు. దాంతో నేను కూడా లేచి నిలబడేదాన్ని. కానీ ఎన్‌టీఆర్‌ ‘‘మీరు కూర్చోండి’’ అని చేతులూపేవారు. ఆ వ్యవహారం నాకు చాలా ఇబ్బందిగా వుండేది. ఆ సినిమా షూటింగ్‌లోనే లక్ష్మీపార్వతిని పరిచయం చేశారాయన. ఆ సమయంలోనే ‘‘మీ ఇద్దరి చుబుకం ఒకే విధంగా వుంది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రం తర్వాత హిందీలో మూడు అవకాశాలు వచ్చాయి.
ఎట్టకేలకు మాతృభాషలోకి ఎంట్రీ..
తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించిన తరువాత.. నా మాతృభాష మలయాళంలో అవకాశం వచ్చింది. అంతే! మూడు షిఫ్టుల్లో పని చేయాల్సి వచ్చింది. ఇతర భాషల్లో పని చేయడానికి సమయమే లేదప్పుడు. తెలుగులో చేసిన ‘సర్పయాగం’ మలయాళంలోను నేనే చేశాను. అక్కడ బాగా రిసీవ్‌ చేసుకున్నారు ప్రేక్షకులు. తెలుగులో 50, మలయాళంలో 50 చిత్రాలకు పైనే చేశాను. మొత్తం 120 సినిమాలకు పైనే చేశాను. 12 వాన పాటలకు డ్యాన్స్‌ చేశా. అప్పట్లో ‘‘వాన పాటలు చేస్తే వాణీవిశ్వనాథే చేయాలి’’ అనేవారు.
అక్కడైతే హీరోలను కూడా తిట్టొచ్చు..
తెలుగు, తమిళం చిత్రాల్లో పోటీ ఏమీ లేదు. కానీ మలయాళంలో మాత్రం హీరోలే మాకు పోటీ. మలయాళంలో అన్ని రకాల పాత్రలు చేశాను. ముఖ్యంగా నేను చేసిన పోలీస్‌ పాత్రల్ని ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఏదైనా కార్యక్రమానికి వెళ్లినా నన్ను చూసి భయంభయంగా దూరం జరిగేవారు జనం. మమ్ముట్టి, మోహన్‌లాల్‌, సురేష్‌గోపీ వంటి వారందరితో చేశా. తెలుగు, తమిళం సినిమాల్లో హీరోల ఇమేజ్‌ దెబ్బతినకుండా కథలుంటాయి.
 డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌
Related News
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ తో ”డీ ”సాధ్యమా -ఇండియా గెట్ లో కృష్ణా రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూడోతరం అంబేద్కర్ కాకా

Displaying

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముగిసిన ”మరో చరిత్ర”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదా పాశురాలు -రమణ భావ గీతాలు

గోదాదేవి పాశురాలు
కీళ్‌వానమ్‌ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు
మేయ్‌వాన్‌ పరన్దన కాణ్‌! మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్‌
పోవాన్‌ పోగిన్రారై ప్పోగామల్‌ కాత్తు ఉన్నై
క్కూవువాన్‌ వన్దు నిన్రోమ్‌ కోదుకుల ముడైయ
పావాయ్‌! ఎళున్దిరాయ్‌ పాడిప్పరై కొండు
మావాయ్‌ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై చ్చెన్రు నామ్‌ శేవిత్తాల్‌
ఆవావెన్రు ఆరాయ్‌న్దు అరుళ్‌ ఏల్‌ ఓర్‌ ఎంబావాయ్‌
మంచునురగలు నంచుకొంటూ
గరిక పరకల కరకరామని
కొరికి నమలీ – తీరుబడిగా నెమరువేయంగా
ఆలమందలు ఊరిబయటకు ఉరకలేయంగా
నల్లతూరుపు తెల్లబోయీ ఎర్రబారేవేళ లోపల
మూడుమారులు యమునలోనా మునిగిలేవంగా
కన్నెపిల్లలు చురుకు చురుకుగ పరుగు తీయంగా
వారినాపీ నీ వాకిట – నిలిపి ఉంచామే
ఎందుకో తెలుసా ?
మదపుటేనుగులంటి మల్లులిద్దరిబట్టి మట్టికరిపించీ
కేశి రాక్షసు గొంతు చించీ వధియించీ
ఆయాసపడకుండా హాయిగా నవ్వేటి
మేటివీరుని మనము మెప్పించవలెనంటే
మార్గశిరనోములే మనకు మార్గమ్ము
లేచిరావే పిల్ల లేచిరా చెల్లి – కన్నెపిల్లలు పడు కష్టాలు చూసి
తనకోసమని తెలిసి తానె దయతలిచి
మననాదరిస్తాడు మన బాలకిష్టయ్య
కాత్యాయనీ తల్లి దీవించగాను – పెళ్ళాడుతాడమ్మ కల్యాణమూర్తి
సిరినోము – హరిపూజ – గిరిపుత్రివరము
గోకులం కన్నెలకు కల్యాణకరము
లోకులం దిరికిదే సౌభాగ్యప్రదము
పల్లెపిల్లా మేలుకో
రే – పల్లె పిల్లా మేలుకో
(ఎమెస్కో పబ్లికేషన్స్‌ ప్రచురించిన‘మేలుకొలుపు’ నుంచి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇందిరకు అన్యాయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాకా వెంకట స్వామి ఇక లేరు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి

ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి

అన్నిటా ప్రధములు

ఆదునికాంధ్ర ప్రధమ నాటక కర్తలలో నాల్గవ వారు ,ఆంగ్ల నాటకాన్ని అనువదించిన మొట్టమొదటి వారు ,విషాదాంత నాటక రచనలో ప్రప్ర ప్రధములు ,తోలి సాంఘిక నాటకం రాసిన వారు ఒక్కరే ఆయనే వావిలాల వాసుదేవ శాస్త్రి గారు .

ఆధునిక కవిత్రయం

వడ్డాది సుబ్బారాయుడు ,వీరేశలింగం వావిలాల వాసుదేవ శాస్త్రి గారాలను ఆధునిక కవిత్రయం అంటారు ముగ్గురూ రాజమండ్రి వాస్తవ్యులే .దీనిని గురించి వాసురాయ కవి అంటే వడ్డాది సుబ్బారాయకవి గారు పందొమ్మిదవ శతర్ధం ఉత్తరార్ధం లో ఒక పద్యం లో చెప్పుకొన్నారు –

‘’భావను ,రాన్మహేంద్రమున బాదము వెట్టితి,నాడిటంగవుల్ –వావిలాల వాసు దేవ గురు వర్యు డోకండు వివేక వర్దినీ

ధీవర పత్రికాధిపతి దేశిక వీరప లింగ మొక్కడుం – గావుట చే గావిత్రయముగా గనియించిరి మమ్మిటీవలన్ ‘’

నన్నయ లాంటి వాడు వాసు దేవా శాస్త్రి గద్య  తిక్కన  వీరేశ లింగం ,ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన వడ్డాది .ఇలా ఆధునిక కవిత్రయం అయ్యారు

వావిలాల వారు –మా బంధుత్వం

.ఇందులో వావిలాల వారి గురించి తెలుసుకొందాం ఆయన మాకు దూ —-రపు చుట్టం కూడా .ఆయన మనవడు వావిలాల కృష్ణ   ఆంద్ర దేశం నుండి అమెరికా వెళ్ళిన తోలి తరం వాడు .కృష్ణ ఉయ్యూరులో మా చిన్న తాతగుండు అంతర్వేది గారి  కుమారుడు ‘’అప్పన కొండ’’ అనబడే గుండు వరాహ లక్ష్మీ నరసింహ మూర్తి-జి వి.ఎల్ .యెన్ .మూర్తి  అంటే నాకు మేన మామ .అయన జంషెడ్పూర్ తాతా ఐరన్ స్టీల్స్ లో చీఫ్ కెమిస్ట్ .  ఆయన కుమార్తె లక్ష్మి భర్త వావిలాల కృష్ణగారు  .దాదాపు అరవై ఏళ్ళనుండీ అమెరికాలో ఉంటూ  సుమారు నలభై ఏళ్ళ నుండి టెక్సాస్ రాష్ట్రం లోని హూస్టన్ లోనే ఉంటున్నారు .తోలి తెలుగు సంఘాన్ని అమెరికాలో స్థాపించిన వారిలో కృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు .భార్య లక్ష్మి మంచి సాంఘిక సేవా కార్య ,వాలంటీర్ .మేము మొదటి సారి అమెరికా లో టెక్సాస్ లోని హూస్టన్ కు 2002లో మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,అల్లుడు ఛి కోమలి అవధాని వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు గాఢ పరిచయం ఏర్పడింది అంతకు ముందొక సారి లక్ష్మిగారు ఉయ్యూరుకు అప్పన కొండ మామయ్యఎదూరికి బాచీ వాళ్ళింటికి  వస్తేపరిచయం అయింది .వావిలాల కృష్ణ-లక్ష్మి  అంటే హూస్టన్ లో తెలియని తెలుగు వారుండరు .అంట కలుపుగోలు తనం గా ఉంటారు .మా అమ్మాయి ఆయన్ను పెదనాన్న అని ఆవిడను అమ్మక్కయ్యా అని ఆప్యాయంగా పిలిచేది . ఆవిడే  మాకు అక్కడి ప్రముఖ  మీనాక్షి,దుర్గా. ఇస్కాన్  దేవాలయాలను చూపింది ప్రసిద్ధ డాన్సర్ రత్న పాపను అంటే సీతా అనసూయ అనే కృష్ణ శాస్త్రిగారి మేనకోడళ్లలో ఒకరైన అనసూయా దేవి కుమార్తే. ‘’హూస్టన్ లో ‘’అంజలి ‘’అనే నృత్య శిక్షనాలయం స్థాపించి వందలాది మందికి కూచిపూడి ,భరతనాట్యం నేర్పిస్తోంది .అనసూయ గారు మా మద్రాస్ పెదబావ గారు గాడేపల్లి క్రుపా నిధి గారికీ బంధువే .వావిలాల వారికి ఇద్దరమ్మాయిలు పెద్దమ్మాయి అమెరికాలోనే ఉంది రెండవ ఆమ్మాయి’’ఎమెండా’’ హూస్టన్ లో ఉంటుంది .ఇదీ ఆకుటుంబ పరిచయం .

వాసుదేవ శాస్త్రిగారి జననం –విద్య –ఉద్యోగం

వావిలాల వాసుదేవ శాస్త్రిగారు 1851జూన్ లో జన్మించి 1897జూన్ లోనే మరణించారు .నలభై ఆరు సంవత్సరాలు మాత్రమె జీవించినా చరిత్రలో నిలిచిపోయారు .బి.ఏ.పాసైనారు .రాజమండ్రి  కాలేజిలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .1895లో కృష్ణా  ,గుంటూరు జిల్లాలో ‘’అసిఅస్తంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ‘’గా కొంతకాలం ఉద్యోగించారు . వావిలాల వాసుదేవ శాస్త్రి ,వీరేశ లింగం వడ్డాది సుబ్బా రాయుడు లను” ఆధునిక కవి త్రయం ”అనే వారు

-వావిలాల వాసుదేవ శాస్త్రి గారు బి .ఏ .పరీక్ష లో (1877 )ఉత్తర సర్కారు లో ఇంగ్లిష్ లో మొదటి మార్కు పొందిmacdonaald  మెడల్ సాధించారు .”  -వావిలాల వాసుదేవ శాస్త్రి గారి పేరు ఆటవెలది పద్య పాదానికి సరిపోతుంది యతి తో సహా .వీరి బావ గారు వీరిని   ”బావ గారు ఆటవెలది పాదాలలో చిక్కు కున్నారు ”అని వుడికించే వారట. .

‘’సరిగ్గా ఆ కాలంలోనే వావిలాల వాసుదేవ శాస్త్రి అనే పట్టభద్రుడు, షేక్స్‌పియర్ రాసిన జూలియస్ సీజర్ ని “సీజర్ చరితము”అనే నాటకాన్ని 1874 లో అనువదించాడు. ఇదే ఇంగ్లీషు నాటికకి మొట్టమొదటి తెలుగు అనువాదం. ఈ నాటికలో తేటగీతి పద్యాలుపయోగించారు. వావిలాల వారు “నందక రాజ్యం” అనే సాంఘిక నాటకాన్ని కూడా రాసారు. ఇందులోనూ తేటగీతి పద్యాలు వాడారు. నందక అనే జమిందారు రాజ్యంలో ప్రజలకష్టాలు, ఆ కాలంలో ఉన్న సమస్యలూ, రాజకీయాలూ అన్నీ ఈ నాటికలో చిత్రీకరించబడ్డాయి. ఈ విధంగా వావిలాల వారే మొట్ట మొదటి సాంఘిక పద్య నాటక కర్త గా చరిత్రలో మిగిలిపోయారు.’’అని శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం తెలియ జేశారు .

 

వావిలాల వారి సాహితీ ప్రస్థానం

‘’నందక రాజ్యం ‘’అనే అయిదు అంకాల తోలి సాంఘిక నాటకం రాశారు వావిలాల వారు .ఇది 1888లో ముద్రణ పొందింది .తెలుగు స్వతంత్ర నాటకాలలో కోరాడ రామ చంద్ర శాస్త్రి గారి ‘’మంజరీ మధుకరం ‘’మొదటిది .నందక రాజ్యం రెండవది అయితే నందక రాజ్యం మొదటగా అచ్చు అయిన్దికనుక తోలి స్వతంత్ర నాటకం గా గుర్తింపు వచ్చింది .ఏ నాటకాన్నీ ,’’సీజరు ‘’నాటకాన్ని వావిలాల వారు ‘’తేట గీతుల’’లో రాశారు .అందుకని వావిలాల వారు ప్రధమాంధ్ర పద్య నాటక కర్త కూడా అయ్యారు .1853LO ‘ మర్చంట్ ఆఫ్ వెనిస్ ‘’ను ,హేమచంద్ర ఘోష్  ‘’చారుమతీ చిత్త విలాసం ‘’పేరుతొ ‘’బెంగాలీ భాష లోకి అనువదించాడు .ఇండియాలో షేక్స్పియర్ నాటకాల అనువాదానికి ఇదే  నాంది పలికింది .1872లో కే జి నేటర్ అనే ఆయన  నాటకాన్ని ‘’విజయ సింహుడు ‘’గా మరాఠీ భాషలోకి అనువాదం చేశాడు .ఇందులో కొంత స్వాతంత్రం కూడా తీసుకొని అనువదించాడు ..పూనా కాలేజిలో దాన్ని అప్పుడే ప్రదర్శించాడు .కనుక జూలియస్ సీజర్ నాటకానికి ఇండియాలో వచ్చిన అనువాదాలలో నేటర్ రాసిన మరాఠీ అనువాదమే మొదటిది .రెండవది తెలుగులో అనువాదం చేసిన వావిలాల వారిది .

వావిలాల వాసు దేవ శాస్త్రిగారు ‘’ముముక్షు తారకం ‘’(శంకరాచార్య  భజ గోవిందం ),’’ఆంద్ర రఘు వంశం ‘’కూడా రాశారు . మ్రుచ్చ కటికం ‘నాటకాంద్రీకరణాచేశారు .’’మాత్రు స్మ్రుతి ‘’,బ్రాహ్మణీయం ‘’,’’పిత్రారాధన ‘’,మాత్రారాధనా ‘’,రుక్మిణీ స్మరణం  (సతీ స్మ్రుతి) వ్రాశారు .

ఇన్ని రాసినా వావిలాల వారి రచనలు ఏవీ ప్రాచుర్యానికి రాలేదు .సంభాషణా చాతుర్యం ,పద్యం లో లోటు లేక పోవటం పెద్ద వెలితిగా కనిపిస్తుంది .1987లో శ్రీమతి మంగళగిరి ప్రమీలా దేవి  ‘’నందక రాజ్యం ‘’ను ముద్రించి లోకానికి తెలియ బర్చింది . 2002లో పౌత్రులు సర్వశ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి ,కృష్ణ శాస్త్రి ,వెంకటప్పయ్య శాస్త్రిలు కలిసి మళ్ళీ ముద్రించారు .

ఉయ్యూరుతో  బాంధవ్యం

వాసు దేవ శాస్త్రి గారి మొదటి భార్య శ్రీమతి రుక్మిణి గారుఒక పిల్ల  వాడిని ప్రసవించి  చనిపోతే శ్రీమతి పూర్ణ మహాలక్షమ్మ గారిని ద్వితీయం చేసుకొన్నారు .ఈమె రుక్మిణి గారి పిన తండ్రి కుమార్తెయే .పూర్ణమ్మ గారి కి శాస్త్రి గారి దాంపత్యం లో శ్రీమతిలక్ష్మమ్మ ,శ్రీమతి  భవాని , ,శ్రీ సత్యనారాయణ శాస్త్రి జన్మించారు .పెద్ద కూతురైన లక్ష్మమ్మ ను ఉయ్యూరులోని గుండు అంతర్వేదిలక్ష్మీ నృసింహం గారికిచ్చి వివాహం చేశారు .ఈయన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజ మండ్రి లో పని చేసి రిటైర్ అయ్యారు .ఈయనే మా అమ్మకు స్వయానా బాబాయి.లక్ష్మమ్మ గారు ఇరవై సంవత్సరాలు అంతర్వేదిగారితో కాపురం చేసి ఒక కొడుకును కని1921లో  చనిపోయారు .

వావిలాల వాసుదేవ శాస్త్రి గారి రెండవ కూతురు భవానిగారు 1891లోను ,కొడుకు సత్యనారాయణ శాస్త్రి 1906లోను అకాల మరణం చెందారు .అంటే శాస్త్రి గారికి పుత్రసంతానం మిగలలేదు .దౌహిత్రుడే అంటే లక్ష్మమ్మ గారి కుమారుడు వరాహ లక్ష్మీ నరసింహ మూర్తి అనే మా ‘’అప్పన్న కొండ మామయ్య ‘’మాత్రమె వారసుడు  అయ్యాడు .1911లో వావిలాల వారి మరణానంతరం భార్య పూర్ణ మహాలక్ష్మిగారు  భర్త వాసుదేవ శాస్త్రిగారి అన్న కుమారుడిని దత్తత చేసుకొన్నారు .ఈయనకు వాసుదేవ శాస్త్రి ,ఇద్దరు కూతుళ్ళు పుట్టారు .

నా చేతికి ‘’నందక రాజ్యం ‘’

నాకు అమెరికా లో వావిలాల కృష్ణ గారు బాగా పాతబడిన వాసుదేవ శాస్త్రిగారి ‘’నందక రాజ్యం ‘’గ్రంధాన్ని ఆప్యాయం గా అందజేశారు చదివేశాను .అమెరికాలో తెలుగు సాహిత్యం చదవటం అదే మొదలు .అందులో సాహిత్యం లో విఖ్యాతులైన ఆధునిక కవిత్రయం లో ఒకరైన వావిలాల వాసుదేవ శాస్త్రి గారి పుస్తకం  ఆయన మనవాడి ద్వారా పొంది చదివే అదృష్టం లభించి నందుకు గర్వపడ్డాను .అదొక థ్రిల్లింగ్ అనిపించింది .’’తేటగీతులు ‘’చాలా తెలిపోయినట్లనిపించింది .వ్యావహారికం గా అంటే’’ కలోక్వియాల్’’గా ఉంటుందని ఆయన అలా రాశారు .వ్రుత్తపద్యాలైతే ఇంకా సోగసుదనం వచ్చేదని అనుకొన్నాను .చెవులకు ఇంపుగా కూడా ఉండేవి .ఏమైనా తెలుగు సాహిత్యం లో ఒక అద్భుతాన్ని, సాహసాన్ని చేసిన సాహిత్య ఘనా పాటి శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి గారు.ఈ పుస్తక ముద్రణకు మహా పండితులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ఎక్కువగా తోడ్పడినట్లు వావిలాల వారి తమ్ముడు ముందుమాటలో రాశారు .

విశ్వనాధ ‘’సీతాయణం ‘’

వావిలాల కృష్ణ ,లక్ష్మి దంపతుల ఇంట్లో అమెరికా ‘’ఆటా ‘’వారి మాస పత్రిక చూసి చదివా .అందులో విశ్వనాధ సత్యనారాయణ గారి కుమారుడు శ్రీ అచ్యుత రాయలు ధారా వాహికం గా రాస్తున్న ‘’సీత ‘’చదివాను. తండ్రికి తగ్గ కొడుకు అనిపించారు .ఆయన అమెరికాలోనే ఉన్నారప్పుడు .రామాయణాన్ని ‘’సీతాయణం ‘’గా రాసినట్లు కనిపించింది .అందులోనే శ్రీమతి విశ్వనాధ కమలాదేవి ఒక పజిల్ నిర్వహించటం ఆకర్షించింది .విశ్వనాధ కుటుంబం అమెరికాలోనూ ‘’వైశ్వనాదీయాన్ని ‘’చాటుతున్నారు భేష్

2-11-2002 శనివారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నూతన సంవత్సర ,సంక్రాంతి ,మన్మధ ఉగాదులకు శుభాకాంక్షలు -పద్య రూపం లో అందజేస్తున్నారు-శ్రీ పంగులూరి హనుమంతరావు శ్రీ యల్లాప్రగడ ప్రభాకర రావు

2015 sankranti manmadha greetings 001

Posted in కవితలు | Tagged | Leave a comment

సమగ్ర విమర్శకుడు -రాచపాళెం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓ కారణజన్ముడి జీవితకథ- – వంశీ

ఓ కారణజన్ముడి జీవితకథ

Sakshi | Updated: December 22, 2014 03:34 (IST)
ఓ కారణజన్ముడి జీవితకథ

అందుకే… అంత బావుంది!
నటీనటులు: ఎఫ్. ముర్రే అబ్రహం, టామ్ హల్క్, ఎలిజబెత్ బెరిడ్జె, సైమన్ కలౌ తదితరులు.
కెమెరా: మిరోస్లవ్ ఆండ్రిక్, దర్శకుడు: మిలాస్ ఫోర్‌మేన్,నిర్మాత: సౌల్ జీంట్జ్, విడుదల: 1984 సెప్టెంబర్ 19 సినిమా
నిడివి: 161 నిమిషాలు, నిర్మాణ వ్యయం: 18 మిలియన్ డాలర్లు (దాదాపు  113 కోట్ల రూపాయలు),
వసూళ్లు: 51.97 మిలియన్ డాలర్లు (దాదాపు 327 కోట్ల రూపాయలు)

ఇళయరాజాగారు తన జీవితంలో చాలా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఈ ‘ఎమేడియెస్’. ‘‘నువ్వూ చూడు’’ అన్నారు నాతో. నా అభిమాన దర్శకుడు మిలాస్ ఫోర్‌మెన్ తీసిన అద్భుతమైన సృష్టి ఇది. ఆరు సార్లు చూశాను. చూసిన ప్రతిసారీ వందల ఏళ్లనాటి వాతావరణంలోకి నన్ను తీసుకెళ్లిపోయారు. ఆనాటి వేష భాషలూ, కట్టుబాట్లూ – అన్నీ నా కళ్ల ముందు బొమ్మకట్టాయి. ఆ తర్వాత మొజార్ట్‌కి అభిమానినైపోయి అతని సింఫనీలు చాలా విన్నాను.

ఇళయరాజాకి ఈ సినిమా అంతగా నచ్చడానికి కారణం… ఇదొక మ్యూజికల్, మనసును మా గొప్పగా పట్టేసుకున్న మొజార్ట్ కేరెక్టర్. పదిహేడు వందల ఏభై ఆరులో ఆస్ట్రియాలో సాల్జ్‌బర్గ్ అనే టౌన్లో పుట్టి పదిహేడువందల తొంబై ఒకటిలో ఆ దేశానికి కేపిటల్ అయిన వియన్నాలో కేవలం ముప్ఫై రెండేళ్లు మాత్రమే బతికి, చనిపోయిన గ్రేట్ కంపోజర్ మొజార్ట్ ఆత్మకథ ఈ ‘ఎమేడియెస్’ సినిమా. ఆ కాలంలో బెతోవెన్, బాక్, మొజార్ట్ ఉన్నట్టే మన సౌత్‌లో ముగ్గురు వాగ్గేయకారులుండేవారు. త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్.

ఇక మొజార్ట్ ఆత్మకథ సినిమాగా తీయబడిన ‘ఎమేడియెస్’ సినిమా విషయానికొస్తే… పీటర్ షాఫర్ రాసిన స్టేజ్‌ప్లేను స్క్రీన్‌కి అనువదిస్తే, అమెరికాలో సెటిలయిన జెకోస్లోవేకియా వాడయిన ప్రొఫెసర్ మిలాస్ ఫోర్‌మేన్ డెరైక్ట్ చేశారు. మొజార్ట్ వేషాన్ని టామ్‌హల్క్ అద్భుతంగా చేస్తే, అంతకంటే అద్భుతంగా శైలోరి కేరెక్టర్ని ముర్రే అబ్రహమ్ చేశాడు. చాలా ప్రతిభగలవాడయిన మొజార్ట్‌ను చాలా జెలసీతో చూస్తూ ఇంకో పక్క నుంచి ఆరాధించే సాటి మ్యూజీషియన్ కేరెక్టర్ అతన్ది. సినిమా టైటిల్స్‌లో మొదట ముర్రే అబ్రహమ్ పేరే వేశారు. అలా వేయడం చాలా సబబు. ఈ సినిమాకి మ్యూజిక్ కొత్తగా కంపోజ్ చెయ్యలేదు. ఆనాడు మొజార్ట్ రాసిన సింఫనీలు, సొనాటోలూ, శాంటాటాలు, ఒపేరాలు పేర్లల్ చేశారు. మ్యూజిక్ డెరైక్టర్ లేని ఈ సినిమాకి ద గ్రేట్ సర్ నేవిల్లే మారినర్ కండక్టర్‌గా వ్యవహరిస్తూ సూపర్‌వైజ్ చేశారు.

ఇక కథ విషయానికొస్తే… క్రిస్టొఫ్ ఓల్ఫ్‌గేంగ్ ఎమేడియస్ మొజార్ట్ అతని అసలు పేరయితే… ఉల్ఫీ అనేది ముద్దు పేరు. మూడో ఏట నుంచే సంగీత సాధన చేస్తుంటాడు మొజార్ట్. కళ్లకు గంతలు కట్టి వదిలేస్తే పియానో, వయోలా అత్యంత అద్భుతంగా వాయిస్తుంటాడు. అలా పెరిగి పెద్దవాడయిన మొజార్ట్ ఎనిమిదో ఏట కంపోజ్ చేసిన మొదటి సింఫనీ – ఇ ఫ్లాట్ మేజర్ కె. 16…. ఆఖరి సింఫనీ – సి. మేజర్ కె 551. చాలా పొడుగైన ఆ సింఫనీకి ‘జూపిటర్ సింఫనీ’ అని పేరు పెట్టాడు. శైలోరి అనే అతను రాత్రీ, పగలూ సాధన చేస్తుంటాడు. మామూలు సాధన కాదు రాక్షస సాధన కానీ, సింఫనీలో నాలుగు బార్ల లెంగ్త్ ఉన్న చిన్న ఫ్రేజ్ కూడా పక్కాగా వాయించలేడు. ప్లేయింగ్‌లో ఒక ఫ్లో రాదు.

రాత్రీ పగలనక పిచ్చి పిచ్చిగా ఆకతాయిగా తిరుగుతాడు మొజార్ట్. తాగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు. అలా కలతిరిగి, తిరిగి సడన్‌గా పియానో ముందు కూర్చుని పరమాద్భుతంగా వాయిస్తాడు. ఒకోసారి చేతులు వెనక పెట్టి, కళ్లు మూసుకుని కాళ్లతో వాయిస్తుంటే మహరాజే మతిపోయి చూశాడదంతా. అదంతా చూసిన శైలోరికి బుర్ర పనిచేయడం మానేస్తుంది. జీసస్ ముందుకెళ్లి ‘‘ఇంత సాధన చేసిన నాకు అబ్బని విద్య ఏ కృషీ చెయ్యనివాడికెలా అబ్బుతుంది? అసలు వాడికెలా ఇస్తున్నావ్ అంత టేలెంట్‌ని?’’ అని క్రాస్‌ని ఫైర్ ప్లేస్‌లో పారేస్తాడు.

మొజార్ట్ ఎంత ప్రతిభ గలవాడయినా అతను చేసే పిల్ల చేష్టలకీ, పిచ్చి చేష్టలకీ రాజుగారి ఆస్థానంలో ఎవరూ గొప్పోళ్లా చూసేవారు కాదు. కొందరైతే పట్టించుకునేవారు కాదు. చాలా విచ్చలవిడిగా తిరుగుతూ, తాగుతుండడం వల్ల విపరీతమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయిన మొజార్ట్ ఆ బాధల్ని మర్చిపోవడానికి మరింతగా తాగడం మొదలెట్టాడు. మొజార్ట్ ఆర్థిక బాధల్ని చూస్తున్న శైలోరి ఆ మొజార్ట్‌కి ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసి అతని ప్రతిభను దోచుకోవాలనుకుంటూ ఇంకో పక్క తనకు అన్యాయం చేసిన దేవుడి మీద కక్ష సాధించాలనుకుంటాడు. మారువేషం వేసుకుని మొజార్ట్ దగ్గరకొచ్చిన శైలోరి ‘‘నీ ఆర్థిక ఇబ్బందులు తీరుస్తాను. దానికి ప్రతిఫలంగా నా పేరు మీద ఒక సింఫనీ రాసిపెట్టాలి’’ అన్నాడు.

దానికి సరే అన్నాడు మొజార్ట్. రాత్రీ పగలూ తాగుతా… ఒక అద్భుతమైన సింఫనీ రాసి శైలోరీకిచ్చాడు మొజార్ట్.ఇంకిక్కడ నుంచి మొజార్ట్‌లోని ప్రతిభను వాడుకుంటా, రాజుగారి కొలువులో గొప్ప సంగీతకారుడిగా వెలిగిపోతున్నాడు శైలోరి. అలా వెలిగిపోవడం వెనకాల మొజార్ట్ ఉన్నాడని అక్కడి వాళ్లెవరికీ తెలీదు.మొజార్ట్‌లో ప్రతిభను వాడుకుని ఎదిగిపోతున్న శైలోరి ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా మొజార్ట్‌ను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెడుతా, మానసికంగా చాలా దిగజార్చే ప్రయత్నం చేస్తుంటాడు. మొజార్ట్‌కీ, అతని భార్యకీ మాటామాటా పెరగడంతో కొడుకును తీసుకుని పుట్టింటికెళ్లి పోయింది.

ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మొజార్ట్ శారీరకంగా, మానసికంగా చాలా క్షీణించిపోతున్నాడు. ఒకసారి ఒక స్టేజిషో క్లైమాక్స్‌లో పడిపోయిన మొజార్ట్‌ని ఇంటికి మోసుకెళ్లాడు శైలోరి.నీరసంగా మంచం మీద పడిపోయున్నాడు మొజార్ట్.
అది చూసిన శైలోరి మనసు ఆనందంతో గంతులేస్తుంది. నెమ్మదిగా మొజార్ట్ దగ్గర కొచ్చిన శైలోరి, ‘‘చూడు మొజార్ట్! ఇప్పుడు నువ్వు హెల్త్ బాగోక చాలా చాలా బాధపడుతున్నావు. నువ్వు ఈ మంచం మీద విశ్రాంతి తీసుకుంటా కూడా ఒక సింఫనీ రాయొచ్చు… అలా రాయొద్దు. నువ్వు డిక్టేట్ చేస్తుంటే నేను రాసుకుంటాను’’ అని మొజార్ట్‌ను ఒప్పించేడు. ఓ పక్క నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మొజార్ట్ అద్భుతంగా కంపోజ్ చేసి చెప్తుంటే రాసుకుంటున్నాడు శైలోరి.

తెల్లవారుజామున బిడ్డతో పాటు ఇంటికొచ్చిన మొజార్ట్ భార్య దూరంగా చిన్న మంచం మీద శైలోరి పడుకుని ఉండడం చూసి విస్త్తుపోతుంది. తన భర్త టాలెంట్ వీడు దోచుకుంటున్నాడని అర్థం చేసుకున్న ఆమె… చిందరవందరగా పడి ఉన్న కాయితాలు పోగేసి, బీరువా లోపల దాచేసి తాళం వేసి, భర్త వైపు తిరిగేసరికి చనిపోయి ఉన్నాడా మొజార్ట్.అలా వియన్నా నగరంలో వర్షం కురుస్తున్న ఆ ఉదయం పూట కాఫిన్ బాక్స్‌లో పెట్టిన మొజార్ట్ శవాన్ని ఒక అనాథ శవంలా శ్మశానానికి తీసుకెళ్లి, తీసిన గోతిలో ఆల్రెడీ పారేసి ఉన్న శవాల మధ్య ఈ శవాన్ని కూడా వేసి చేటడు ఉప్పేశాడు కాటికాపరి.

కొన్నేళ్ల క్రితం మొన్న కాలం చేసిన మ్యూజిక్ డెరైక్టర్ చక్రిగాడు, నేను ఆస్ట్రియా వెళ్లినప్పుడు మొజార్ట్ పుట్టిన సాల్జ్‌గర్గ్ వెళ్లాం. ఇరుకైన సందుల్లో ఉన్న ఒక బిల్డింగ్‌లో అతి చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఒక గదిలో చిన్న ఉయ్యాల, అందులో చంటిబిడ్డ బొమ్మ, గమ్మత్తుగా లైటింగ్ చేశారు. వందల ఏళ్ల క్రితం ఆనాడు అక్కడ పుట్టాడట మొజార్ట్. వేలాది సందర్శకుల మధ్యనున్న మేం చాలా థ్రిల్ ఫీలయ్యాం. ఒక చోట ఆనాటి మొజార్ట్ సింఫనీలని సి.డి.లు చేసి అమ్ముతున్నారు. కొని డిస్క్‌మేన్లో వింటా… ఆ కాలానికెళ్లిపోయాం. ఆ సంగీతం ఇప్పటికీ ఎప్పటికీ కొత్త కొత్త అనుభూతుల్నిస్తూ కొత్తగానే రాజిల్లుతుంది, విరాజిల్లుతుంది.

ఇంకక్కడినించి ఎక్కడికెళ్లినా మొజార్ట్ పేరే. కేవలం మొజార్ట్ పేరు మీద బతుకుతుందా నగరం… ఎక్కడ చూసినా మొజార్ట్ పేరే.
హోటళ్లు, వైన్ షాపులూ, గన్నులూ, పెన్నులూ, దువ్వెనలూ, గుండుసూదులూ – ఇలా ఒకటేమిటీ… అన్నీ ఆ గ్రేట్ మొజార్ట్ పేరు మీదే!ఆ వైభవం చూస్తా… అందరూ అనుకున్నట్టే మేమూ అనుకున్నాం. ‘‘మనం మామూలు మనుషులం. ఈ మొజార్ట్ ఆ దేవుడు ప్రత్యేకంగా సృష్టించిన మనిషి… మహామనిషి’’. అలాంటి కారణజన్ముడి జీవిత కథను ఆండ్రిక్ ఫొటోగ్రఫీతో, సెర్నీ ఆర్ట్ డెరైక్షన్‌లో, పిస్టెక్ కాస్ట్యూమ్స్‌లో, ఫోర్‌మెన్ డెరైక్షన్‌లో ఒక అద్భుత కావ్యంగా సృష్టించారు.

పేరొందిన నవ్య చిత్ర దర్శకుడు
చెకొస్లోవేకియాకు చెందిన 82 ఏళ్ళ మిలాస్ ఫోర్‌మేన్ దర్శకుడే కాక రచయిత, స్వయంగా నటుడు కూడా! నవ్యచిత్రాల రూపకర్తగా, ‘చెకోస్లోవేక్ న్యూ వేవ్’ దర్శకుల్లో అతి ముఖ్యుడిగా చరిత్ర కెక్కారు. ఆయన రూపొందించిన ‘ది ఫైర్‌మ్యాన్స్ బాల్’ (1967) చిత్రం ఆయన స్వదేశంలో అనేక సంవత్సరాలు నిషేధానికి గురైంది. మోజార్ట్ మీద తీసిన ఈ ‘ఎమేడియస్’తో పాటు, ‘వన్ ఫ్లూ ఓవర్ ది కుకూస్ నెస్ట్’ చిత్రానికి కూడా ఆయన ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డులందుకున్నారు. అనేక అంతర్జాతీయ అవార్డులందుకొన్న ఫోర్‌మేన్ కవి కూడా! కవితలు రాయడంతో పాటు ‘మై టు వరల్డ్స్’ పేరిట ఆత్మకథ కూడా రాశారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా వ్యవహరిస్తున్నారు.

– వంశీ
ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పారాహుషార్ !పెషావర్ -ఎండ్లూరి సుధాకర్ కవిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హాసం మాస పత్రిక లో కొన్ని కోణంగి విషయాలు

హైదరాబాద్ మోతీనగర్ నుండి హాసం అనే అన్నిరకాల అభిరుచులతో హాస్య మాస పత్రిక కొన్నేళ్ళు నడిచి పాఠకాదరణ లేక ఆగిపోయింది . నడిచినంత కాలం మాత్రం హాస్యం ఏరులై పారింది అందులోనే తనికెళ్ళ భరణి ”ప్రసి ద్ధ సంగీత విద్వాంసుల పై ధారావాహికం గా చాలా మంది మరుగున పడిన విద్వాంసుల గురించి కొత్త కోణం లో రాశాడు .దాన్ని ప్రేరణగా తీసుకొని నేను ”ఆంద్ర వేద శాస్త్ర విద్యా లంకారులు ”రాసి సరస భారతి ప్రచురణ గా తెచ్చాను  అంత ప్రభావం చూపించింది ఆ శీర్షికా, భరణి రచనా .యెన్నొ సినిమాలలోని మధుర గుళికల్లాంటి పాటలన్నిటిని ఆ పత్రిక వరుసగా ప్రచురించిందని జ్ఞాపకం  అలాంటిఅభిరుచి ఉన్న పత్రిక బతికి బట్ట కట్టక పోవటం మన దురదృష్టం ఽ  ఆంధ్రులు  చేసుకొన్న దురదృష్టం .

     ఇవికాక హాస్యానికి పెద్ద పీట వేసింది హాసం .పేరును నిల బెట్టుకోంది  హాసం పోషకులు ప్రసిద్ధులైన మందులకంపెనీ యజమాని రెడ్డిగారని జ్ఞాపకం .యెమ్బి ఎస్ ప్రసాద్ ,,విఎన్ రామారావు మొదలైన హేమా హేమీలు సంపాదక వర్గం లో ఉన్న జ్ఞాపకం ..కొన్ని సంచికలు చదివాను .కలకాలమ్ దాచుకోదగ్గ మాసపత్రిక హాసం .
          అందులో ”చౌ చౌ చౌరాస్తా ”అనే శీర్షిక లో సరదాఅయినవి ,తమాషా అయినవి ఉండేవి .దాని ఉపశీర్షికలు -1కొంటె క్వేస్చన్లు  -వింత జవాబులు .2-చిలిపి లిపి 3-ఈ రూటే వేరు 4-చిలిపి కవిత 5-షార్ట్ కట్స్ నాకు బాగా నచ్చినవి కొన్ని రాసి జాగ్రత్త  చేసుకొన్నాను .వాటినే  మీ ముందు ఉంచుతున్నాను .  

                         చిలిపి లిపి
-ACDT-ఎసిడిటి
CBRUM-శిబిరం
GOLAW–గోల
                          ఈ రూటే వేరు
కప్పు గంతుల చంద్ర  ప్రకాష్  -Frog jumps Moon light
గాజుల బంగార్రాజు –Bangles golden king
గాలి ఏక దంతం -Air single tooth
                  డబుల్ రోల్
గున్న ఎనుగులాగున్న వాడికి
ఇందిరా?-అది కాలేజీకి పోయిందిరా
                 షార్ట్ కట్స్
ఆలపాటి కుటుంబ రావు –ఆ .కు .
గోవిందరాజు కరుణాకర రావు -గొ.క రా
చింతల పాండు జీవన్ -చిం పాం జీ .
మేడార కుటుంబం –మే.కు.
గోపరాజు చిదంబరం –గో.ఛి.
మాంబళం సంబంధన్ -మాం సం
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-14-ఉయ్యూరు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సర్వాంగ సుందరమైన వికలాంగ కధలు -3 (చివరి భాగం )

సర్వాంగ సుందరమైన వికలాంగ కధలు -3 (చివరి భాగం )

‘’కల్పనా సాహిత్యం లో బలీనమైన ఆకర్షణ ,సామాన్య పాఠకులలో దానికున్న విశేషాదరణ వల్లనే  వల్లనే కధలు రాస్తారు ‘’’’short story is the national art form ‘’.అందుకే కధకు అద్వితీయ గౌరవం కలిగింది.’’అన్న ప్రఖ్యాత కధకులు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత శ్రీ ముని పల్లె రాజు అన్న మాటలు  నిత్య సత్యాలు .’’కద రాయాల్సింది కలం తోకాదు ,హృదయం తో ‘’అన్న శ్రీపాద వారి మాటలు శిరోధార్యం గా భావిస్తూ ఈ  సంకలనం లోని కధలు అచ్చంగా హృదయం తో రాసినవే అనిపిస్తాయి .’’జీవితాన్ని ప్రేమిస్తే ,దాని అర్ధం తర్వాత అదే తెలుస్తుంది ‘’అని చెప్పిన పెద్దల మాటలకు అద్దంపట్టిన కధలు ఇవి .’’కద ఆకలి లాంటిదే .ఆ ఆకలి తీర్చుకోవటానికే కద రాస్తాడు రచయిత.కొత్త ప్రయోగాలు రావాలి .అవి ప్రజల హృదయాల్లో చొచ్చుకు పోవాలి .

‘’వికలాంగులు తమ ఉనికిని నిల బెట్టుకోనేందుకు చెయ్యాల్సిన  ప్రయత్నాన్ని కాల్పనిక సాహిత్యం ద్వారా ఈ సమాజానికి తెలియ జెప్పాలనేదే నా ప్రయత్నం ‘’అని శ్రీ నాగ రాజు నాకు రాసిన లేఖ  లో తెలియ బర్చారు .తానూ వికలాంగుడే కనుక ,తన లాంటి వారి భావ ప్రకటనలతో ,కదా ప్రక్రియ ద్వారా వారినే వస్తువుగా చేసిన సాహసమే ఈ ప్రయత్నం .వికలాంగు లపై వచ్చిన సాహిత్యం చాలా అరుదుగా ఉన్న కాలం లో   ‘’వికలాంగుల కధలు –అస్తిత్వ చిత్రణ ‘’ఆ లోటును భారీగానే భర్తీ చేసిందని పిస్తుంది .ఇందులో పది మంది మహిళలు రాసిన కధలూ ఉన్నాయి .ఇదీ ఒక ముందడుగే .తమ లోని సృజనను వెలువరించే అవకాశమూ వికలాంగు లకు లభించింది .ఇలాగే వికలాంగుల రచనలతో చిన్న నవలలు ,నాటికలు ,కవితలు తీసుకొని వస్తే ఆ సాహిత్యం మరింత పరి పుస్టమౌతుంది .

ఈ కధల్లో ‘’నారేటివ్ ‘’శైలి ఎక్కువ గా ఉంది .బహుశా ఇలాంటి కధలకు ఇది తప్పని సరేమోనని పిస్తుంది . వాచ్యం ఎక్కువైంది .అంటే అన్ని విషయాలు కధకులే చెప్పేయటం జరిగిందని ,పాఠకుల ఊహకు ,ఆలోచనకు అవకాశమే  లేదని అర్ధం ..ఇదే మొదటి మెట్టు కనుక ఫరవా లేదు .తరువాత వచ్చే వాటిలో ఈ మార్పు వస్తే మరింత బాగుంటుంది .అందరు తమ ప్రతిభను పణంగా పెట్టి రాశారు .అందరూ అభినంద నీయులే .శ్రీ మునిపల్లె రాజు గారన్నట్లు ‘’ఏ విషాదమైనా ,మన విషాదమే .విషాదానికి జాతి ,కుల ,మత , జండర్ అనే రంగులు లేవు .ఒక్కటే రంగు –విషాదమే .’’ ఈ విషాదాన్ని అధిగమించే శక్తి ఉన్న కధలే ఇవన్నీ ‘.’’తన దుఖం ,విషాదం ,ఒంటరి తనం రచయితకు మొదటి గురువులు .గురువైనా కొంత దూరమే నడిపిస్తాడు .మిగతా ప్రస్థానమంతా వ్యక్తిదే ‘’అన్న సూక్తికి నిదర్శనలే ఈ కధలు .

వీరందరూ కదా స్వరూపాన్ని కళాత్మకం గా ,వాస్తవంగా చెప్పే ప్రయత్నమే  చేశారు ..’’మన జీవితపు ప్రతి బింబం లాగా వాస్తవిక వాద కద నడవాలి’’ .అలానే నడిచాయి ఈ కధలు .దిగులు ,దరిద్రత ఒంటరితనం ,అభద్రతా,భయం ,ఆందోళన ప్రతి ఫలించిన కధలివి .పరిష్కార మార్గం చూపిన కధలు కూడా .’’పాజిటివ్ అవుట్ లుక్ ‘’ఉండటం వలన జీవితానికి భరోసా నిచ్చాయి .లోకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాసిన కధలే .శాప గ్రస్తులకు ,బలహీనులకు ఆశావహ మైన భవిష్యత్తును చూపే కధలే ఇవి .

‘’profoundly  personal of all arts ‘’అయిన కధలు చదివి ,భావ స్పూర్తి పొందాలి కాని ,నా లాంటి మూడవ వ్యక్తీ పరిచయం ,ముందుమాట ,వత్తాసు కావాలా?’’అన్న సందేహం ఉన్నా ,ఆత్మీయుడు శ్రీ నాగ రాజు మాట కాదన లేక పోయి రాశాను అంతే.ఈ పాతిక కధలూ చదవండి .అనుభవించండి .వారితోబాటు ఆనందం పంచుకోండి .ధైర్య మివ్వండి .సహవేదన చెంది మానవులం అని పించుకొందాం రండి .

గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎక్స్ రే కవితా పోటీ విజేతల కు పురస్కార ప్రదాన సభ

xray1 001 xray2 001 xray3 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మహా నటి సావిత్రి కి హాలీవుడ్ నటి ,ఆస్కార్ గ్రహీత -సూసన్ హేవర్ట్ అభిమానం గా రాసినట్లు రాసిన గార్లపాటి పల్లవి ఊహాలేఖ

savitri1 001 savitri2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు -2

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు -2

వికలాంగోపనిషత్

ఈ కదా సంకలనం లో కధకులు గొప్ప సత్యాలను ఆవిష్కరించారు .అవి వికలాంగుల కోసమే చెప్పినా సర్వులకూ అనుసరణీయాలే .అందుకే ‘’ఉపనిషత్ ‘’అన్నాను .’’అవయవాలు పని చేసినా పనీ పాటూ లేకుండా సోమరిగా తిరుగుతూ ,ఆస్తులను ఖర్చు చేస్తూ ,దుర్వ్యసనాలకు బానిసలై అసాంఘిక శక్తులుగా మారేవారే సక లాంగు  లైన వికలాంగులు .వికలాంగ పిల్లలు సద్గుణాలతో సమాజానికి తోడ్పడిత తలిదండ్రులకు అంతకంటే కావల్సినదేముంది ?’’అని ‘ఆణిముత్యం ‘’కధలో విశ్వం ప్రభాకర్ అంటాడు .’’మనవ జీవితానికి కావాల్సిన పరమార్ధం ‘’తృప్తి ‘’.దీన్ని కోట్లు ఖర్చు చేసినా పొందలేం .ప్రతి జీవీ ఇతరులకు ఉపయోగ పడుతుంది .మనిషి మాత్రం తన ఇష్టాల పంట కోసం ఎన్నిటినో బలి తీసుకొంటాడు .’’అని ‘’గమ్యం ‘’లో ప్రసూన శరత్ అంటాడు .’’మా కళ్ళతో మా కలలు కన నివ్వండి ప్లీజ్ .విధికి ఎడురీదగలిగే కెరటాలం మేము .అధైర్యం ఉంటె ముందుకు సాగలేం.విజయాల తీరామ్రుతాన్ని సేవించలేం .’’అంటాడు నరసింహం ‘’చాంపియన్స్ ‘’లో చాంపియన్ లాగా .

‘’అతడే ఒక స్పూర్తి ‘’కదలో ముళ్ళపూడి  ‘’మనిషిని మనిషిగా పుట్టించలేని ఆ బ్రహ్మ ను సృష్టించింది ఎవరో నాకు తెలిస్తే వాడిని ,యా నాలుగు తలల రాక్షసుడిని ఎవరు సృస్తిన్చామన్నారు ?అని అడిగే వాడిని ‘’’’   ఆకాశం లా ఉంటె మేఘమై అలుముకోవాలి,మెరుపై మెరిసిపోవాలి ,ఉరుమై గర్జించి ,,చినుకై వర్షించి పులకింప జేస్తేనే ఆకాశానికి  ఆ గొప్పతనం .నెల వంక వంకరగా ఉందని వెన్నెలను వద్దను కొంటామా ? .ఎదోరకమైన వంకరను కాదు చూడాల్సింది .హృదయంలో వెలుగుల్ని ‘’అన్నాడు.ఘాలి లలిత’’మనో నేత్రం ఉండీ ప్రపంచాన్ని చూడలేని అందునికన్నా ,మనో నేత్రం తో ప్రపంచానికి వెలుగులు పంచెదే వ్యక్తిత్వ పు వెలుగు ‘’అంటుంది .’’సమాజం నిన్ను చూసి జాలిపడితే ఎదిరించే ధైర్యం  కావాలి. ప్రేమకు వైకల్యం లేదు అని చెప్పగలిగే సత్తా ఉండాలి ‘’అంటుంది శివలెంక నాగ లక్ష్మి ‘’కళ్ళున్న ప్రేమ ‘’లో . కమల పాటి వెంకట శాంత లక్ష్మి ‘’తెలివితో ప్రకాశించే ‘’కధలో ‘’నా శరీర లోపం నాతప్పుకాదు .భగవంతుడి తప్పు .సంపూర్ణ ఆరోగ్య ప్రదమైన హృదయంఉంటె చాలు’’ అన్నది. అడవి బాపిరాజు ‘’తిరుపతికొండ మెట్లు ‘’కధలో ‘’ఉడుకు మోతుతనం కాశ్మీర దేశాన్ని ఎడారిగా చేయగల శక్తితో విజ్రుమ్భించింది .జపాన్ వాడు మంచూరియాను ఆక్రమించి చైనా వాడిని తరిమి కొట్టినట్లు బిచ్చగాళ్ళ సంఘం ‘’పున్నెడిని’’ కొండ మీద నించి  నేట్టేయాలని ఉద్యమించింది ‘’అన్నారు  ‘’పిల్లలకు లోపాలున్నాయని నిరుత్సాహ పడ కూడదు . .వారిలోపం మరో రూపం లో పూడ్చ బడుతుంది .వారికి నచ్చిన దారిలో పిల్లలను పోనివ్వాలి .కాని ,జాగ్రత్తగా గమనిస్తూండాలి .వారిని ప్రోత్స హించ క పోవటం  పోవటం మన లోపమే అవుతుంది తప్ప ,వారిలోని లోపం ఒక లేక్కలోనిదికాదు’’అన్నది గుమ్మా శశికళ ‘’ఆదర్శం ‘’కధలో .

నయాబ్ రసూల్ ‘’వికల మనసులు ‘’కధలో ‘’అవిటి వారు  బాగా తెలివి గల వాళ్లై నేర్పరులై వ్యక్తిత్వంలో ,కళల్లో. సామాన్యుల కంటే మేధావులుగా ఉంటారు .వారిపై జాలి చూపించి వారి అంగ వైకల్యం గుర్తుకు తెచ్చి ,భవిష్యత్తును అగమ్య గోచరం చేయద్దు . మామూలు మనుషులుగా చూస్తె చాలు .అన్నిటిని అధిగమించి అద్భుతాలు సాధిస్తారు ‘’అంటారు .’’పడమటి కొండల్లో సూర్యుడుకూడా కులం లేని వాని బాధను చూడలేనట్లు కనుమరుగై  ,వెలుతురూ సన్న గిలింది .’’అని ‘’నిచ్చెన మెట్లు ‘’కధలో డాక్టర్ వసునూరి రవీందర్ అన్నారు . ‘’లైఫ్ అంటే మేధా మేట్రిక్స్ కాదు..అన్నిటికీ  అన్సర్లు ఉండవు .ఉద్వేగాలు మోతాదు మించితే కష్టం .అనుమానం నీకే కాదు  అందరికీ  అశాంతి అల్గిస్తుంది .’’ అని ‘’నిజం ‘’లో నాగరత్నం అంటే ,’’పోరాటంలో  ఆనందమూ తృప్తీ ఉన్నాయి ‘’.’’ఛీకటి ఎరుగని కళ్ళకు నిత్య సూర్యోదయమే ‘’అంటుంది జ్యోత్స్నా ఫణిజ  .’’సువర్ణోదయం ‘’లో .ఇవన్నీ నిత్య సత్య ఉపనిషత్ సూక్తులే .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విజయవాడ లో పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం ఆధ్వర్యం లో చిన్నయసూరిగారి 208 జయంతి సందర్భం గా 20-12-14 శనివారం జరిగిన తెలుగు భాషా వికాసం సదస్సు దృశ్యమాలిక 

విజయవాడ లో పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం ఆధ్వర్యం లో చిన్నయసూరిగారి 208 జయంతి సందర్భం గా 20-12-14 శనివారం జరిగిన తెలుగు భాషా వికాసం సదస్సు దృశ్యమాలిక

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కొవ్వలి నవలల్లో వస్తు వైవిధ్యం

కొవ్వలి నవలల్లో వస్తు వైవిధ్యం

  • – ముక్తేవి భారతి, 9989640324
  • 15/12/2014
TAGS:

వెయ్యి నవలలు పాఠక లోకానికందించిన రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు. వీరి నవలలు ప్రత్యేకమైన వస్తువు, శైలి గలవి. ముఖ్యంగా కొవ్వలి నవలల్లో వస్తువైవిధ్యం అప్పటి కాలాన్నిబట్టి చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆనాటి సమాజం అద్దంలో చూసినట్టుగా పాఠకుని ముందు నిలుస్తుంది. కందుకూరి వారి సంస్కరణోద్యమ ప్రభావం ఆనాటి యువ రచయితలపై వుంది. వృద్ధ వివాహాలు, కన్యాశుల్కం, వేశ్యాలోలత్వం, కుహనా సన్యాసినులు, మతం మార్పిడులు, విభిన్నమైన స్ర్తిల సమస్యలు కొవ్వలి నవలల్లో ముఖ్యమైన విషయాలు. సామాజికంగా, కుటుంబ పరంగా స్ర్తిలకు జరుగుతున్న అన్యాయాలను చూపిస్తూనే, వాటినుండి బయట పడేందుకు స్ర్తిల పక్షాన కవి గొంతు విప్పటం స్పష్టంగా తెలుసుకొంటాం. వారికి జరగాల్సిన న్యాయంకోసం పోరాటం చేయటానికి సాహసం చూపటానికి కొవ్వలి వారి పాత్రలు వెనుకాడలేదు.
‘ఆడ మళయాళం’, ‘మా ఆవిడ రూపవతి’, ‘బర్తు కంట్రోలు’ వంటి నవలల్లో వ్యంగ్యం, సందేశాలతో కూడిన వస్తువైవిధ్యం ఉంది. కొన్ని నవలల్లో (ఆడ మళయాళం) మత మార్పిడి అంశం కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తెచ్చిపెట్టే మతం చాలా శక్తిమంతమని బోధిస్తారు కొవ్వలి. ‘ఆడ మళయాళం’ నవలలో జ్యోషి పాత్రలో మానవత్వాన్ని రంగరించారు. మతాంతర వివాహం చేయించారు. ఈ నవలలో భగవతి అనే ఆమె బోధనలలో, మత విశ్వాసాలలో ఎంత మోసం వుందో చెప్పి స్ర్తిల కళ్ళు తెరిపించారు. అప్పుడే చెప్పిన దొంగ సన్యాసులు… సన్యాసినుల్ని నేడూ చూస్తూనే వున్నాం గదా! కొవ్వలివారి ‘మా ఆవిడ’ నవలపై గురజాడ ప్రభావం బాగా కనిపిస్తుంది. ఆనాటి సమాజంలో సామాన్యంగా కనిపించే వృద్ధ వివాహం అంశానికి నవలా రూపమిచ్చారు. ఇందులో యాభై ఏళ్ళ పాపయ్య పధ్నాలుగేళ్ళ అన్నపూర్ణని పెళ్ళాడటానికి రెండువేల రూపాయలు పిల్ల తండ్రికిస్తాడు. స్నేహితులందరూ పాపయ్యని ‘‘నీ కర్మంగాలా! ఇంత బతుకు బతికి చివరికి డబ్బిచ్చి పిల్లను కొనుక్కుంటావురా’’ అని ఈసడిస్తారు. ఆ వృద్ధుడు అయిదు రోజుల పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. మేజువాణీ, బాణాసంచా, ముత్యాల పల్లకి కోరినట్టు రాశారు. ‘‘నా ముద్దూ ముచ్చటా తీరాలి’’ అంటాడు పాపయ్య. ఇది చదువుతుంటే నాకు వీరేశలింగం, చిలకమర్తివారల ప్రహసనాలు గుర్తుకు వచ్చాయి. అమ్మయిలే గొంతు విప్పి మనసులో మాట చెప్పి ధైర్యంగా ముందడుగు వెయ్యాలని కొవ్వలి సందేశమివ్వటం ప్రగతి శీలత్వమే!
రూపవతి అయిన భార్య భర్తను అవమానపరుస్తూ, ఇంటి చాకిరీని భర్తచేత చేయిస్తూ, పర పురుషులతో అతి చనువుగా వుండే రూపవతి భార్యకన్నా గుణవంతురాలయి రూపురేఖలు బాగా లేకున్న భార్యే కుటుంబంలో శాంతి సౌఖ్యాలను చేకూరుస్తుందని కొవ్వలి ‘రూపవతి’ అనే నవలలో బోధిస్తారు. అందుకే మనవారు ‘‘రూపవతీ భార్యా శత్రుః’’ అన్నారు. రూప సంపద తాత్కాలికం- గుణ సంపద శాశ్వతమన్నదే కొవ్వలి ఉద్దేశం.
ఘోరమైన, మూఢమైన దురాచారాల్ని పోగొట్టేందుకు కథలు, నవలలు, ప్రహసనాలు, గేయాలు, నాటికలూ వెలువడ్డాయి. అటువంటి రచనల వల్లనే సమాజంలో మార్పు వచ్చింది. కొవ్వలి రచనలు కూడా ఆ కోవకి చెందినవే. ‘బర్త్ కంట్రోలు’ నవలలో కొవ్వలి భర్తల పక్షం వహించినట్టు అనుకుంటాం గానీ భర్తల్ని మోసంచేసే భార్యలూ ఉన్నారని కళ్ళు తెరిపించటానికే ఈ నవల రాసినట్టు భావించాలి. ‘బర్త్ కంట్రోల్’ అనే నెపంతో గున్నమ్మ భర్తను శారీరక సుఖానికి దూరంగా వుంచుతుంది. అయితే ఆమె మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకొంటుంది. గర్భం దాల్చి- తనకు పుట్టిన పిల్లని సంబంధం పెట్టుకొన్న వాడి భార్యకి అప్పగించి భర్తతో ‘‘నేను మీకు అన్యాయం చేశాను’’ అన్నప్పుడు పశ్చాత్తాపం వచ్చిందని పాఠకుడు గున్నమ్మపై సానుభూతి చూపించేలా రాశారు కొవ్వలి!
కొవ్వలివారి ‘దాసీ పిల్ల’ రెండవ నవల. చెళ్ళపిళ్ళవారు మెచ్చుకొన్న నవల. ఇందులో లక్ష్మి దాసీ పిల్ల. సంఘం చేత నీచంగా చూడబడుతూ, సేవక వృత్తిలో తనువు తెల్లార్చుకొనే తక్కువ కులాలలో కూడా నీతి, ప్రేమ, ఆత్మగౌరవం వంటి ఉత్తమ గుణాలుంటాయని ఈ నవల చెప్తుంది. ఎంతటి అభ్యుదయ దృక్పథం! ఈ ‘దాసీపిల్ల’ నవలలో చాలా మలుపులున్నాయి. చివరకు సుఖాంతం చేస్తారు. ఈ నవలలో సత్యవతి బాల వితంతువు. ఆ అమ్మాయికి కేశఖండన చేయించాలని తల్లిదండ్రులు అనుకోవటంతో సత్యవతి అత్త కొడుకుతో లేచిపోవాలనుకొంటుంది. ఇందులో క్రైస్తవ మత ప్రచారాన్ని, కొందరి దొరసానుల దయాహృదయాల్ని, చదువుకొన్నవారి అభ్యుదయ భావాల్ని వివరిస్తూ యువత సమాజాన్ని తీర్చిదిద్దగలదన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు కొవ్వలి.
‘‘కూడు లేక ఏ మానవుడూ చెడిపోడు. పూటకు లేని వాడయినా గుణవంతుడయితే కోటికి పడగలెత్తగలడు. గుణహీనుడయిన కోటేశ్వరుని జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు పతనం తప్పదు. ఈ నిజమును తెలుసుకొని బతికినవారు ధన్యులు’’ అంటారు, ‘నిశానీదార్’ నవలకి ముందు మాటలో! ఈ నవలలో నిరక్షర కుక్షి అయిన రంగనాయకులు ఇంగ్లీషు బాగా చదివానని గొప్పలకి పోతూ డాంబికాలు చెప్తూ భార్యని, అత్తని మోసం చేస్తూ వుంటాడు. ఈ నవల ఇంగ్లీషు వ్యామోహాన్ని ఒక కోణంలోనూ, మోసకారితనాన్ని మరో కోణంలోనూ చూపించి ఆడవారు ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సానుకూలపరచుకోవాలని హితవు చెప్తారు కొవ్వలి. ఈ రంగ నాయకులు పాత్ర గురజాడవారి గిరీశం పాత్రను గుర్తుకు తెస్తుంది. ఇద్దరూ సమాజానికి కీడు చేసేవారే!
‘విడాకులు’ నవలలో సాంఘిక సమస్యలు చాలా చూపించారు. దాంపత్యం, ప్రేమ, స్నేహం, స్ర్తి ఆశయాలు వంటివి వెల్లడించారు. స్ర్తిల సమస్యలకి ఎవరు కారకులు? తల్లిదండ్రులా? సమాజమా? ఎవరు? అన్నదే కొవ్వలి వారి తపన!
కొవ్వలి లక్ష్మీనరసింహారావుగారి నవలల్లో సంఘ సంస్కరణలు విభిన్న రూపాల్లో కనిపిస్తుంది. వీరి నవలలు చదువుతుంటే ఏ నవలకి ఆ నవల ప్రత్యేకమైనదే అనిపిస్తుంది. సమాజంలో ఎంతటి వైవిధ్యం వుందో వీరి నవలల్లోనూ అంతటి వస్తువైవిధ్యం వుంది. ‘రూపం కాదు, గుణం ముఖ్యం’, ‘కుహనా సంస్కారవంతులుంటారు జాగ్రత్త’, ‘కుల మతాల ఉచ్చుకు దూరంగా వుండండి’, ‘్భర్యాభర్తల అనుకూలత’….. ఇలా ఎన్నో అంశాల్ని తమ నవలల్లో వివరించి మనకి కనువిప్పు కలిగించారు. కొవ్వలివారు కేవలం వ్యవస్థలోని లోపాలనే చెప్పి ఊరుకోలేదు- వాటిని సరిదిద్దాలని తపన చెందారు. ఇటువంటి గొప్ప నవలా రచయిత మన తెలుగువాడవటం గర్వించదగినది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చౌరస్తా’లో తెలుగు భాష

చౌరస్తా’లో తెలుగు భాష

  • – ఎ. రజాహుస్సేన్, 9505517052
  • 15/12/2014
TAGS:

భాషా ప్రాతిపదికన ఏర్పడిన తెలుగు రాష్ట్రం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. రెండు రాష్ట్రాలమధ్య ఇప్పుడు భౌతికంగా హద్దులు- సరిహద్దులు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడినాయి. అయితే అన్నీ బాగున్నాయి కానీ భాష విషయంలోనే ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు కూడా అధికార భాష తెలుగే. రాష్ట్ర విభజన ముందువరకు అంటే అవిభక్త రాష్ట్రంలో తెలుగు మాట్లాడే 23 జిల్లాల్లో వేరే వేరే మాండలికాలు, రకరకాల యాసలున్నా స్థూలంగా ప్రామాణిక భాష ఒకటే వాడుకలో వుంది. తెలంగాణ ప్రాంతంలోని తెలుగు భాష చిన్నచూపునకు గురవుతోందన్న విమర్శ వుంది. తెలంగాణ భాషను మోటు భాషగా, అనాగరిక భాషగా ముద్రవేశారన్న ఆరోపణ కూడా వుంది. ప్రామాణికత ముసుగులో కోస్తాంధ్రకు చెందిన రెండున్నర జిల్లాల భాషే తెలంగాణ ప్రాంతంలో పెత్తనం చేస్తోందన్న భావన బలంగా వుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇపుడు వ్యావహారిక భాషలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని మాండలికాలు, యాసను వ్యవహారంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, ఇప్పటిదాకా అధికారికంగా కొనసాగుతున్న ప్రామాణిక తెలుగుకు బదులు తెలంగాణ ప్రాంతంలోని మాండలికాలతో కూడిన భాష దశలవారీగా వ్యవహారంలోకి రాబోతోంది. మాండలిక భాష ప్రధాన స్రవంతిలో కలువబోతోందంటే మాండలిక యాస కూడా భాషలో చోటుచేసుకుంటుంది. అంటే తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే భాష, యాస అధికారిక రూపును సంతరించుకోబోతున్నాయి. తెలంగాణ భాష తన అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నంగా దీన్ని భావించాలి. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే దీనివల్ల రాష్ట్రం రెండుగా చీలినట్లే తెలుగు భాష కూడా రెండుగా చీలిపోవాల్సి వస్తుందా? అంటే ఆంధ్ర ప్రాంతంలో ‘ఆంధ్ర తెలుగు’ (ప్రస్తుతం ప్రామాణికంగా అమల్లో వున్న భాష) తెలంగాణ ప్రాంతంలో ‘తెలంగాణ తెలుగు’ (కొత్త రూపును సంతరించుకోబోయే తెలంగాణ భాష)ను చూడబోతున్నామా? ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో ప్రామాణికంగా పరిగణింపబడే తెలుగు భాషే ఇప్పుడు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా వ్యవహారంలో వుంది. అయితే ఇకమీదట ఈ ప్రామాణిక భాష కేవలం ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాలకే పరిమితం కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో తెలంగాణ మాండలికాలతో కూడిన ‘తెలంగాణ భాష’ సాక్షాత్కరించనుంది. తెలంగాణ ప్రాంతంలోని పాఠశాలలు, ఇతర విద్యాలయాల్లో అలాగే అధికారిక కార్యకలాపాల్లో ఇక తెలంగాణ భాషే కనిపించవచ్చు. అలాగే పాఠ్యపుస్తకాల్లో కూడా ప్రస్తుత ప్రామాణిక భాషకు బదులు తెలంగాణ భాష చోటుచేసుకోబోతోంది. అంటే తెలుగు భాష ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా, తెలంగాణలో మరోవిధంగా వుండబోతోంది. రెండు రాష్ట్రాల్లో మాట్లాడేది, రాసేది తెలుగే అయినా అవి రెండు రకాలుగా వుండటంవల్ల ఏమైనా చిక్కులువస్తాయా? అన్నది భాషా పండితులు ఆలోచించాలి.
మాండలికాల్లో మట్టివాసన
ఏ భాషకైనా మాండలిక పదాలే మూలం. మాండలికాల్లో మట్టివాసన గుప్పుమంటుంది. శాస్త్ర ప్రకారం చూసినా కూడా ఏ భాషకైనా జీవధాతువు మాండలికమే.. వృత్తి పద పరిశీలన ఆధారంగా ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగుదేశాన్ని నాలుగు భాషా మాండలికాలుగా విభజించారు. అందులో ఉత్తర మండలాన్ని (తెలంగాణ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో కోస్తా – రాయలసీమలకు ఆనుకొని వున్న ప్రాంతం) తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన భాషా మండలంగా భాషా శాస్తవ్రేత్త భద్రిరాజు గుర్తించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రత్యేక భాషా మండలంలో మాట్లాడే మాండలికాలతో తెలంగాణ భాష కొత్త రూపు సంతరించుకునే ప్రయత్నం మొదలైంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో మాండలిక పదాలతోపాటు, తెలంగాణ ప్రాంత నుడికారాలు, జాతీయాలు, ఇతర వాడుక పదాల్ని చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే తన పని ప్రారంభించింది. అయితే హడావుడిగా ఏదో ఒకటి చేశాం అన్నట్లు కాకుండా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వుంది. అలాగే తెలంగాణ మాండలిక పదాల్ని పాఠశాలల్లో పుస్తకాల్లో విస్తృతంగా వాడుక లోనికి తేవాలంటే ముందుగా మాండలిక పదకోశాల్ని సిద్ధం చేసుకోవాలి. వృత్తి పదకోశాల్లో ప్రస్తుతం కొన్ని మాండలిక పదాలు అందుబాటులో వున్నాయి. నలిమెల భాస్కర్ ‘తెలంగాణ పదకోశం’ కొంతవరకు ఉపయోగపడుతుంది. 1999లో ‘సామాజిక భాషా పరిశీలన’ అనే పథకం ద్వారా తెలుగు అకాడమీ జిల్లాల వారీగా ప్రచురించిన తెలుగు మాండలికాన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చు. వీటితోపాటు తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వాడుకలో వున్న మాండలిక పదాల్ని విస్తృతంగా సేకరించాల్సిన అవసరముంది. దీనికి సంబంధించి ఓ బృహత్ప్రయత్నం జరగాలి.
అలాగే తెలంగాణ మాండలికంలో వచ్చిన కవిత్వం ఇతర రచనల్లోని పదాల్ని పలుకుబళ్లను, పదబంధాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణ మాండలికంలో కవిత్వం రాసిన వారున్నారు. తెలంగాణ పదాల సొగసు, మాధుర్యం, నాదం, ఆత్మ, ఆత్మీయత, సృజనాత్మకత, వౌలికత, సార్థకత, మట్టివాసనలు మరీ ముఖ్యంగా ఈ ప్రాంతపు ఉద్యమ జానపద సొగసులు తెలంగాణ భాషలో సమగ్రంగా ఆవిష్కరించబడాలి. నూతన భాషా విధానంలో వీటన్నిటిని క్రోడీకరించాలి. అలాగే ఇంట్లో పరిసరాల్లో నేర్చుకునే ‘ఇంటిభాష’ను విస్మరించకూడదు. ఇక తెలంగాణ నుడి, నానుడి పలుకుబడిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే తెలంగాణ జాతీయాల్ని, సామెతల్ని పొడుపు కథల్ని విస్మరించకూడదు. కరీంనగర్‌కు చెందిన వేముల పెరుమాళ్లు సుమారు 3000 జాతీయాల్ని సేకరించారు. వాటిని తెలంగాణ భాషా స్రవంతిలోకి తీసుకురావాలి. అలాగే తెలంగాణలో పాటకు, పద్యానికి కూడా ప్రత్యేక స్థానముంది. ఉద్యమకారులకు జానపదులకు ‘పాట’ ఊపిరైంది. అలాగే పల్లె పట్టుల్లో పద్యాలు హృద్యాలుగా అలరారాయి. మందార మకరంద మాధుర్యంలో పోతన భాగవత పద్యాల్ని ఇప్పటికీ పాడుకునే పల్లె ప్రజలున్నారు. పోతన పద్యాల్లోని తెలంగాణ మాండలికాల్ని బయటకు తీయాలి. సురవరం ప్రతాపరెడ్డి సీసపద్యాల్ని పాలమూరు మాండలికంలో రాసి మట్టి రుణం తీర్చుకున్నారు. ఈ విధంగా మాండలికాల్లో పద్యాలు రాసినవారు అనేకమంది వున్నారు. వీరి పద్యాల్ని సేకరించి అందులో మాండలికాలకు ఊపిరిపోయాలి. ఇక ‘కథ’ విషయానికొస్తే తొలితరం తెలంగాణ కథల్లో నాటి తెలంగాణ వ్యావహారికం కనిపిస్తుంది. తొలితరం తెలంగాణ కథలన్నీ ఇప్పుడు అందుబాటులో లేవు. వీటిని సేకరించాలి. ఈ కథల్లో అరవై యేళ్ళ కిందటి తెలంగాణ జీవితం కనిపిస్తుంది. అప్పటి మాండలికం వినిపిస్తుంది.
నూతన భాషా విధానం ప్రకటిస్తారా?
తెలంగాణ ప్రాంతంలోని తెలుగు భాషలో చేపడుతున్న మార్పులు- చేర్పులకు సంబంధించి ఓ నూతన విధానం (పాలసీ) ప్రకటిస్తే బాగుంటుంది. దీనివల్ల బహిరంగ చర్చకు అవకాశం కలుగుతుంది. దీనివల్ల భాషా నిపుణులు, పండితులు, భాషాభిమానులు తదితర వర్గాలనుంచి గుణాత్మకమైన సూచనలు, సలహాలు లభించే అవకాశముంటుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ‘బడిపలుకుల భాష’కు ‘పలుకుబళ్ల భాష’కు మధ్య చాలా వ్యత్యాసముంది. వ్యత్యాసాన్ని సవరించాలని ప్రభుత్వం భావించడం సహజమే. అయితే ఈ ప్రయత్నాన్ని ఏ కొందరికో పరిమితం చేయకుండా అందరినీ కలుపుకుపోవాలి. ఎటువంటి అపోహలకు, అనుమానాలకు తావు లేకుండా అవసరమైన వారందరినీ సంప్రదించాలి. అప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ‘చౌరస్తాలో’ వున్న మన తెలుగు సరైన మార్గంలో పయనించడానికి దిశా నిర్దేశం చేసినట్లవుతుంది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు

గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు

  • – దాసరి దుర్గాప్రసాద్
  • 15/12/2014
TAGS:

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు చెబుతారు. శని దూషణ సర్వదేవతలనూ తిట్టిన దాంతో సమానమంటారు. ఆ స్వామిని పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. అంతటి మహిమాన్వితుడైన ఆ స్వామి కొలువుదీరిన క్షేత్రమే పావగడ. దేశంలో ఉన్న ప్రముఖ శనైశ్చర స్వామివారి క్షేత్రాలలో పావగడ కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు శనీశ్వర స్వామివారు, శీతల అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలను ఆవిష్కరించే కొండల నడుమ ఉన్న ఈ దివ్య క్షేత్రం శ్రీ శనీశ్వరస్వామి లీలా విశేషాలతో, మహత్యాలతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అహంభావ హీనం, ప్రసనాత్మభావం కల భక్తుల్ని శనీశ్వరుడు రామరక్షయై కాపాడతాడని పురాణాలు చెబుతున్నాయి. సత్యం, న్యాయం శనీశ్వరుని రెండు కళ్ళు. శని అంటే శక్తి. మహాశక్తి. శనీశ్వరా అంటే శివశక్తి. ఆ శివశక్తి ఆశీస్సులు పొందడానికి భక్తి ప్రధానమైనది. పరిపూర్ణ అహింసామూర్తిగా, సర్వంతర్యామిగా ఆ స్వామి పూజలందుకుంటున్నాడు. ఆ మహిమాన్విత స్వామి కొలువుదీరిన పుణ్యప్రదేశమే పావగడ. ఇక్కడ ఆ స్వామి శని మహాత్మస్వామిగా భక్తులచే నీరాజనాలందుకుంటున్నాడు.
పూర్వకాలంలో ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో ఒక సాధువు శనీశ్వరస్వామి వారి పటాన్ని ఉంచి పూజలు నిర్వహించేవాడట. అయితే స్వామి వారి దృష్టి తమపై పడకూడదనుకున్న భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి దూరంనుంచే స్వామివారిని దర్శించుకునేవారట. అనంతర కాలంలో కట్టా కృష్ణయ్యశెట్టి, ఎ.నర్సింగరావు అనే భక్తులు విరాళాలు సేకరించి స్వామివారికి ఒక చిన్న మందిరాన్ని కట్టించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది.
అనంతర కాలంలో ప్రఖ్యాత శిల్పకారుల సహకారంతో నిర్మించిన నవగ్రహాలను తిప్పయ్య అనే భక్తుడి నేతృత్వంలో ప్రతిష్టించారట. ఆనాటి నుంచి నేటివరకూ ఈ ఆలయం దినదిన ప్రవర్థమానమవుతూ భక్త జన సందోహంతో అలరారుతుంది.
మనోహరమైన దేవతా శిల్పాలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న శనీశ్వరస్వామి వారి ప్రధానాలయ గోపురం భక్తులలో భక్తి భావాన్ని ప్రోదిచేస్తుంది. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు ఓం శనైశ్వరస్వామినే నమః అంటూ ప్రధానాలయంలోకి చేరుకుంటారు. ఆలయంలో ముందు గా ప్రధానాలయానికి వెలుపల శని దేవుని మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. కాకి వాహనారూడుడైన ఆ స్వామిని భక్తులు భ్రక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. ఇదే ఆలయంలో మరో పక్క పంచముఖ హనుమంతుడు కొలువుదీరాడు. ప్రధానాలయంలోని ప్రాకారాలన్నీ వివిధ దేవీదేవతల సుందర శిల్పాలతో అందంగా ఆహ్లాదంగా దర్శనమిస్తాయి.
గర్భాలయం వెలుపలి ప్రాంగణంలో శనీశ్వరస్వామి, జ్యేష్టాదేవి సుందర మూర్తులు దర్శనమిస్తాయి. పంచలోహ సమన్వితంగా ఉన్న ఈ మూర్తులను భక్తులు భక్తితో దర్శించుకుని
సత్యశక్తి స్వరూపం…….
సంకట హరణం దేవాం
శనీశ్వరాం ప్రణమామ్యహమ్
అంటూ భక్తిశ్రద్ధలతో ప్రణామాలు అర్పిస్తారు. స్వామివార్లకిచ్చిన కర్పూర హారతిని కళ్ళకద్దుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.
శనీశ్వరస్వామి గర్భాలయానికి మరోపక్క శీతలామాత ఆలయం ఉంది. ఈ ఆలయానికి ముందు చండి, ప్రచండి మూర్తు లు దర్శనమిస్తాయి. ప్రధానాలయంలో ఎడమవైపున సత్యనారాయణస్వామి, కుడివైపున వినాయకుడు, దత్తాత్రేయుని మూ ర్తులు కానవస్తాయి. గర్భాలయంలో శ్రీ శీతలామాత వారి దివ్య మంగళ రూపం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. ఈ ఆలయంలోనే శనీశ్వరస్వామి, శీతలామాత, జ్యేష్టాదేవి, సీతారామ లక్ష్మణుల పంచలోహ మూర్తులు కానవస్తాయి.
పావగడ శ్రీ శనైశ్చరస్వామి ఆలయం శనిదేవుని విశేష పూజలకు ప్రత్యేక వేదికగా అలరారుతోంది. ఇక్కడ నవగ్రహ మండపంలో శని దేవునికి, ఇతర గ్రహదేవతలకు రోజూ వందలాది మంది భక్తులు నిర్వహించే అర్చనాది అభిషేకాలు నయన మనోహరం. ఆద్యంతం ఆధ్యాత్మికానురక్తిని ప్రోదిచేసే ఆయా పూజల్లో పాలుపంచుకోవడం భక్తులు తమ అదృష్ట్భాగ్యంగా భావిస్తారు. అత్యంత భక్తివిశ్వాసాలతో ఇక్కడ స్వామి వారిని తిల తైలాభిషేకాలతోపాటు అఖండ హారతి నిర్వహిస్తే సమస్త గ్రహ బాధలనుంచి శని దేవుడు విముక్తి కల్గిస్తాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఆ కారణంగా ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి ఆయా పూజలన్నీ చేయించి స్వామి సేవలో మునిగి తేలుతారు. పూజానంతరం తమ బాధలను, బరువులను స్వామివారి సమక్షంలో విడిచిపెట్టే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. దీనికిగాను పూజలు చేయించుకునే భక్తులు వెండి దండాలను చేతబూని స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం ఆయా దండాలను స్వామివారికి సమర్పిస్తారు. తమ గ్రహబాధలను, ఇతర కష్టాలను దండాల రూపంలో చేతబూని స్వామి వారికి సమర్పిస్తారు. వైవిధ్యంగానూ, విశేషంగానూ కానవచ్చే ఈ సంప్రదాయం దేశంలోని ఏ శనీశ్వరస్వామి ఆలయంలోనూ కనిపించదు. ఆసక్తిని గొలిపే ఈ తంతు చూడడానికి రెండు కనులూ చాలవంటే అతిశయోక్తి కానేరదు. ఈ ఆలయంలో శని త్రయోదశికి, శని జయంతికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఆయా పర్వదినాలలో స్వామివారి ఆలయం భక్తసంద్రంలా అగుపిస్తుంది.

దండంపట్టుకో.. సుఖదుఃఖాలను దింపేసెయ్
ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి కోరుకున్న పూజలన్నీ చేయించి స్వామి సేవలో మునిగి తేలుతారు. పూజానంతరం తమ బాధలను, బరువులను స్వామివారి సమక్షంలో విడిచిపెట్టే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. దీనికిగాను పూజలు చేయించుకునే భక్తులు వెండి దండాలను చేతబూని స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత ఆయా దండాలను స్వామివారికి సమర్పిస్తారు. తమ గ్రహబాధలను, ఇతర కష్టాలను దండాల రూపంలో చేతబూని స్వామి వారికి సమర్పించడమే ఈ ప్రదక్షణ, దండంసమర్పణంలోని అంతరార్థం. వైవిధ్యంగానూ, విశేషంగానూ కానవచ్చే ఈ సంప్రదాయం దేశంలోని ఏ శనీశ్వరస్వామి ఆలయంలోనూ కనిపించదు.

దేవాలయానికి మార్గం
ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకోవడానికి అనంతపురం జిల్లా హిందూపురం వరకు వచ్చి అక్కడనుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. అలాగే కళ్యాణదుర్గం నుంచి అరవై కిలోమీటర్లు దూరంలో అలరారుతున్న ఈ దివ్య క్షేత్రం చేరుకోవడానికి ప్రయివేటు బస్సులు, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ భక్తులకు కావాల్సిన భోజన వసతి సదుపాయాలున్నాయి. పావగడ శ్రీ శనీశ్వరస్వామి ఆలయ దర్శనం సర్వగ్రహ పీడా నివారణం. స్వామి దర్శనం సర్వశుభకరం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’

సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’

 

సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’

  • -గోపగాని రవీందర్
  • 20/12/2014
TAGS:

వటపత్రశాయి,
రచయిత: సింహప్రసాద్,
పేజీలు: 240, వెల: రూ.175/-
చిరునామా: శ్రీశ్రీ ప్రచురణలు,
401, మయూరి ఎస్టేట్స్, ఎమ్.ఐ.జి-2 650,
హైదరాబాద్- 500 085.
సెల్: 9849061668

ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో సుపరిచిత కథకులు సింహప్రసాద్‌గారు. పతనమవుతున్న మానవత్వ విలువలపై ఆవేదనతో రాస్తున్న అతికొద్దిమంది రచయితల్లో ఆయన ఒకరు. వర్తమాన జీవనంలోని సున్నిత అంశాలపై హృద్యంగా రాస్తున్న కథలు, నవలలు ఆకట్టుకుంటున్నాయి. గత నాలుగు సంవత్సరాల్లో వివిధ దిన, వార, మాస పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో పురస్కారం పొందిన ఇరవై కథలతో ‘వటపత్రశాయి’గా ఏడవ కథాసంపుటిని వెలువరించారు. పోటీకి వచ్చిన కొన్ని వందల కథలనుండి ఎన్నుకున్న కథ అంటే సహజంగానే ఆసక్తి కల్గుతుంది. మన చుట్టువున్న రకరకాల వైవిధ్య జీవితాల్ని పరిచయం చేస్తాయి.
మానవ సృష్టి నిరంతరంగా సాగుతూనే సమాజముంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా పిండదశలోనే పిల్లలను తొలగించుకుంటున్న దుస్థితిని మనం చూస్తున్నాం. మాతృత్వం చాలా గొప్ప సంప్రదాయమని చాటిచెప్పిన కథ ‘వటపత్రశాయి’. పిల్లలను కనడానికి అనువైన యవ్వన కాలాన్ని కాదనుకొని డబ్బు సంపాదనకై పరుగుపెడ్తున్న దంపతులకు చెంపదెబ్బలాంటి కథ ఇది. కుటుంబ జీవనంలో స్ర్తిని ఒక సంపాదన వనరుగాకాక జగన్మాతగా చూడాలని, ప్రతి బిడ్డా వటపత్రశాయేనని చెప్పిన కథ ఆలోచింపజేస్తుంది. ఇతర పనులను వాయిదావేసుకున్న ఫర్వలేదుకాని తల్లికావడాన్ని వదులుకోవద్దని నేటి తరానికి హితవుచెప్పిన కథ ఇది. మనం సుఖంగా ఉంటేనే సరిపోదు మన చుట్టు ఉండేవాళ్ళుకూడా బాగుండాలి. అనాథ పిల్లలకోసం నడుపుతున్న ఆశ్రమానికి సహాయం చేయడంకోసం అన్నపూర్ణమ్మ రోజు వండుకునే బియ్యంలో పిడికెడు తీసి పక్కనపెట్టి, నెల రోజుల తర్వాత ఆ బియ్యాన్ని నిర్వాహకులకు ఇచ్చి, వాళ్ళకు కొంత సహాయపడ గలిగినందుకు తృప్తిచెందుతుంది. తమ పిల్లలు తమకు పెట్టకపోయినా పింఛన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న వృద్ధులు వాళ్ళు. తాము రోజు తినే తిండిని తగ్గించుకుని సహాయం చేస్తారు. మానవీయతకు అద్దంపట్టిన కథ ‘గుప్పెడు.’
‘వంశవృక్షం’ కథలో నీ ఎదుగుదల మూలాలను తెలుసుకోవాలని సూచిస్తారు. ఉద్యోగ జీవితంలో అవినీతి అక్రమ సంపాదనలో కూరుకుపోయి, తమకు నీడనిచ్చిన కుటుంబానే్న మరిచిన ఉదంతం బాధను కల్గిస్తుంది. పేద పురోహితుడి అశక్తికి కారణం తనదగ్గర డబ్బు లేకపోవడం. తన పూర్వికులు సహాయంకోరిన వాళ్ళను ఆదుకొని ఆస్తులను కోల్పోతారు. ఆ రెవెన్యూ అధికారి కుటుంబం కూడా వాళ్ళు అందించిన సహకారంతోనే నిలిచింది. ఆ కుటుంబం కష్టాల్లోఉంటే సహాయం చేయాల్సిందిపోయి డబ్బులకోసం సతాయించడం చూస్తాం. నేటి మానవ నైజానికి నిదర్శనమీ కథ. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న మహిళలపై జరుగుతున్న అత్యాచార యత్నాలను ధైర్యంగా తిప్పికొట్టి, తగిన బుద్ధిచెప్పిన కథ ‘ఓ సీతకథ.’ ఒక లంబాడీ మహిళ బతుకుకై ఆర్ట్స్ విద్యార్థులకోసం తన అందమైన యవ్వనాకృతుల్ని అర్పించిన దీనగాథ ‘మోడల్’కథ. ఆమె దేహాన్ని చిత్రించి ఎంతోమంది గొప్ప చిత్రకారులైనారు. ఆమె ఆకలి మాత్రం తీరలేదు. చివరికి ఆమె శవంగా మారినా మోడల్‌గా ఉండి దహన ఖర్చులను సంపాదించుకున్న తీరు ద్రవింపజేస్తుంది.
కార్పొరేట్ విద్య అందించే డబ్బుకు దాసోహమన్న గణిత మేధావి సూరిబాబు గుర్తింపుకై పడిన తండ్లాటలో చదువుచెప్పిన గురువునే తక్కువచేసి ఆలోచించుకుంటాడు. పూర్వ విద్యార్థులు అందరు కలిసి ఆ గురువుకు సన్మానం చేయాలను కుంటారు. గురువు మాత్రం నాకన్న విశేషమైన కృషిచేసిన నా శిష్యుణ్ణి సన్మానం చేస్తానని సూరిబాబుకు సన్మానం చేస్తాడు. దాంతో అతనిలోని అహంకారం పటాపంచలవుతుంది. గురువు ఔన్నత్యాన్ని చాటిచెప్తునే నేటి విద్యారంగంలోని అవలక్షణాలను కూడా చర్చించిన కథ ‘పరబ్రహ్మం.’
రైతులకు గిట్టుబాటు ధర లేక పంటలు వేయమని సమ్మెచేస్తున్న పట్టించుకోని ప్రభుత్వాల తీరును ఎండగట్టిన కథ ‘రోమ్-నీరో-్ఫడేలు’. ఆడపిల్లల జనాభా తగ్గడంతో పెళ్ళికోసం పరీక్షలురాసే రోజులు రానున్నాయని హాస్యంగా చెప్పిన కథ ‘రేపింతే’. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రతీది వినోదభరితంగా ఉండాలనే మీడియా ప్రభావంవల్ల మానవత్వం మసకబారుతున్న వైనాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు ‘విష పరిష్వంగం’ కథలో. ఒక నిరుద్యోగి ఉరిని ఈవెంట్‌గా మార్చుకున్న వ్యాపార కోణాన్ని చూపి నివ్వెరపోయేట్లు చేశారు. మార్పు సహజం. రెండు దశాబ్దాల క్రితందాక కూడా కంప్యూటర్ల ప్రభావం లేదు. టైపు మిషన్‌లతో ఉపాధి చూసుకున్నవారు ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా వచ్చిన ప్రగతితో ఆ కుటుంబాలవారు ఉపాధికి దూరమయ్యారు. ఐనా నమ్ముకున్న వృత్తే కాపాడుతుందని నమ్మిన వృద్ధుని కథే ‘పాతనీరు’. పాతది పనికిరాదనే దృక్పధాన్ని నిరసించే కథ ఇది. ఒకప్పటి పాత నీరు కొత్తదే అని తెలిపిన కథ. దేని ఉపయోగం దానికి ఉంటుందని తెలుస్తుంది. నేటి అవినీతి ఉద్యోగులకు బుద్ధిచెప్పటానికి ఒక తెలివైన పౌరుడు లంచంగా దొంగనోట్లును ఇస్తాడు. దాంతో ఆ ఉద్యోగి పడిన అవస్థల కథే ‘గాంధీతాత నవ్వేడు’. నగరంలో పెరిగిన సెల్‌టవర్ల మూలన అంతరిస్తున్న పక్షుల గూర్చిన కథ ‘వాయసం.’ పిండాలు తినే కాకులు కనబడవు. మారిన అలవాట్లు కాకులకు తిండి లేకుండా చేశాయని ఆవేదన చెందుతారు. చివరికి పిండాలు తినడానికి కాకులు రావు కాని కుక్కలు ఎగబడుతున్నాయని వాస్తవ స్థితిని చిత్రీకరించారు. సర్‌గోసి మదర్ గూర్చిన కథ ‘తల్లీ నిన్నుదలంచి..’ పేదరికంలో మగ్గుతున్న ఒక కుటుంబం గర్భాశయాన్ని అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయంతో బతకాలనుకుంటే, బిడ్డను కన్న తర్వాత వీసా సమస్యతో బిడ్డను వదిలించుకుంటే ‘విత్తనం నాదికాకపోయిన భూమినాదే’ కాబట్టి నేనే పెంచుకుంటానని ఆ తల్లి ధైర్యంగా బిడ్డను స్వీకరిస్తుంది.
మనిషికి నిజమైన ఆనందం సంపాదనలో లేదని పదుగురికి సహాయం చేయడంలోనే ఉందని చెప్పే కథ ‘మనిషి దేవోభవ’. అత్తాకోడళ్ల పోట్లాటలు కొత్తకాదు కాని టీవిల దగ్గరనుండి నేటి ఫేస్‌బుక్ వాడకం దాకా వాళ్ళ రుసరుసలు, తిట్టుకోవడాలు హాస్యంగా వివరిస్తూనే కొడుకుగా, భర్తగా పాత్రలను పోషిస్తూ ఆ పురుషుని బాధలను వర్ణించారు ‘ఒక యుద్ధం ఒక సంధి ఒక శాంతి’ కథలో. భార్యభర్తల మధ్య ఉండే చిన్నచిన్న సంఘటనలకు విపరీతంగా ఆలోచించి చిన్నాభిన్నం అవుతున్న ఇతివృత్తాలు అనేకంగా ఉన్నాయి. అందుకే తొందరపడి కఠిన నిర్ణయాలను తీసుకోవద్దని చెప్పేకథ ‘మనసా! తొందరపడకే.’ విలాసానికి బానిసైన ఒక బ్యాంకు ఉద్యోగి పతనావస్థకు దర్పణం ‘జారుడుమెట్లు’కథ. ‘రెయిన్‌రెయిన్ గో అవే’ రైమ్స్ నేర్పే కానె్వంటు చదువులను నిరసిస్తూనే వాన అవసరాన్ని చాటిచెప్పిన కథ ‘వాన వాన వల్లప్ప’. కుటుంబం ఆనందాల హరివిల్లు అంటారు. ఒక ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఉమ్మడి కుటుంబంగూర్చి పెద్ద ఉపన్యాసం ఇస్తే, ఒక చానల్ రిపోర్టర్ ఆయన అబద్ధాలను బట్టబయలుచేసి, తల్లిని మరిచిన నీది ఒక ఉమ్మడి కుటుంబమా? అని నిలదీస్తుంది ‘ఆత్మపదార్థం’ కథలో. ఇంకా కుల వివక్ష కొనసాగుతుందని, కష్టాల్లో ఉన్నవాళ్ళకు వాటి పట్టింపు ఉండదని, ఉత్తరాఖండ్ వరదల్లో యాత్రికులను సైనికులు కాపాడిన సాహస విధానాన్ని చక్కటి కథనంతో వివరించిన కథ ‘గబ్బిలం’. మొత్తంమీద విభిన్న సామాజిక అంశాలపై రాసిన సింహప్రసాద్ కథలు ఒక్కసారైన చదవాల్సిందే. కొలకలూరి ఇనాక్, పోరంకి దక్షిణామూర్తి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ముందుమాటలు ఈ సంపుటికి అదనపు ఆకర్షణ.

  • భాషా, సాహిత్యాలకు సరైన పథ నిర్దేశం

    • -వెలుదండ నిత్యానందరావు
    • 20/12/2014
    TAGS:

    సాహిత్య విమర్శకు
    ‘కోవెల’ సంపత్కుమార సాహిత్య దర్శనం
    వెల: రు.100.. పేజీలు: 104
    ప్రతులకు: డా.టి.రంగస్వామి
    శ్రీలేఖ సాహితి, ఇంటి.నెం.14-5/2,
    మండల కార్యాలయం ఎదురుగా
    శ్రీలేఖ కాలనీ, హసన్‌పర్తి,
    వరంగల్లు-506371
    తెలంగాణ రాష్ట్రం
    ఫోన్: 0870-25647222

    విమర్శకునిగా, వక్తగా, కవిగా ఆచార్యునిగా కోవెల సంపత్కుమారాచార్య వారు జగమెరిగినవారు. వారు కీర్తిశేషులై అపుడే నాలుగేళ్లు దాటుతుంది. కోవెల సంపత్కుమార పర్యవేక్షణలో డాక్టరేటు పట్టం గ్రహించిన ప్రియ శిష్యుడు శ్రీలేఖ సాహితీ సంస్థ నిర్వాహకుడు డా.టి.రంగస్వామి ఈ నివాళి గ్రంథాన్ని ప్రకటించారు. ఇది ఒక ఉత్తమ గురువునుంచి సంక్రమించిన ఉత్తమ సంస్కార లక్షణంగా భావిస్తూ శ్రీరంగస్వామిని అభినందించవచ్చు.
    సంపత్కుమార ఛందఃపరిశోధన పారమ్యతను ఉగ్గడిస్తూ పల్లె శీను, ఆముదాల మురళి, ఆముక్త కావ్యాన్ని విశే్లషిస్తూ ఎస్.రాజేంద్రప్రసాద్, శ్రీరంగస్వామి గార్లు రాసిన వ్యాసాలున్నాయి. చింతయంతి, శతకాలు, కాలస్పృహ, అపర్ణ లాంటి కావ్యాల గురించి పి.వీరస్వామి, ఆకునూరి విద్యావతి, భిక్షపతి మొదలైనవారు రాసిన వ్యాసాలు, పెన్నా శివరామకృష్ణ, టి.ఉదయవర్లు సంపత్కుమార గారితో గతంలో చేసిన ఇంటర్వ్యులను ఈ సంకలనంలో పొందుపరిచారు.
    విశ్వప్రేమ అనే వృత్తానికి ప్రేమ కేంద్రబిందువని వైవాహిక జీవితమంటే ఐహిక సౌఖ్యమొకటే కాదు, మేధాపరమైన సహవాసం. ఇరువురు కలిసి సేవామార్గంలో, నివృత్తి మార్గంలో పయనించవచ్చు (పుట 66) అంటూ సంపత్కుమార రాసిన అపర్ణ కావ్యాన్ని విశే్లషిస్తూ పెన్నా శివరామకృష్ణ వ్యక్తీకరించిన అభిప్రాయాలు విశిష్టమైనవి, ఔచితీమంతమైనవి.
    సాహిత్యం వెర్రితలలు వేస్తున్న కాలంలో దాన్ని సన్మార్గంలో పయనింపచేసిన మహామనీషి, భారతీయమైన ఆధ్యాత్మిక తత్వాన్ని భూమికగా స్వీకరించాలని వ్యక్తిగా జీవించడం మాత్రమే కాదు సమాజంలో ఒక సంఘ జీవిగా ఇతరుల సమస్యలకు ప్రతినిధిగా ఉండాలి. కాని వాటినుండి దూరంగా పరిగెత్తకూడదని సంపత్కుమార స్పష్టంగా ప్రబోధించారని (పుట 45) డా.ఆకునూరి విద్యాదేవి అభిప్రాయపడ్డారు.
    పల్లేరు వీరస్వామి సంపత్కుమార రచించిన చింతయంతి కావ్యంలోని ఆర్త్భక్తి, లోకరీతులు, సంస్తుతి, భాగవతాంశాలు మా తృత్వం, వ్యాజస్తుతి, కృష్టానురక్తి, గోదావచస్సుధలను సోదాహరణంగా వివరించిన తీరు పాఠకులకు సంతృప్తి కలిగిస్తుంది. తెలంగాణ ప్రజల వ్యావహారిక భాషలోనే పాఠ్య గ్రంథాలుండడంవల్ల కలిగే లాభనష్టాలేమిటని పెన్నా శివరామకృష్ణ అడిగిన ప్రశ్నకు కోవెల సంపత్కుమార ఇచ్చిన జవాబు చూడండి.
    రాజకీయంగా ఆర్థికంగా రాష్ట్ర విభజన ఉద్దేశాలు ఏమైనా కావచ్చు. కాని భాషాపరంగా మొత్తం తెలుగువారిలో ఒక ఏకీభావం ఉండడం అవసరం. నిజానికి మాండలికాలనేవి భాషాపరంగా యాసలు. భిన్నమైన వ్యావహారిక పద సముదాయం ఉండవచ్చు. అందువల్ల ఒక ప్రాంతపు భాష పాఠ్యగ్రంథ భాషగా ఉండడంవల్ల ఈ ఏకీభావం ఆ ప్రాంతంలోనే దెబ్బతినడానికి అవకాశం ఉంది. తెలంగాణలోనే వేరు వేరు జిల్లాల్లో వేరు వేరైన పలుకుబడి, యాసలు ఉన్నాయి. అందువల్ల వీటిలో భాషా సమత్వం కోసం ఒక సాధారణత్వాన్ని సాధించడం అవసరం. బోధన ఎట్లాగు ఎవరు చెప్పినా, చెప్పకపోయినా ఆయా యాసలోనే సాగుతుంది. మాండలిక పదాలు భాషలో చేరడం భాషా సమృద్ధికి దోహదం చేస్తుంది. కాని ఆ యాసలే పాఠ్యభాషలో కూడ రావాలనడం అంత ఆరోగ్యకరమైన విషయం కాదేమో! ఇదే పరిస్థితి మిగతా ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. పాఠ్యభాష, బోధన భాష రెండూ కలిసి విద్యార్థి భాషా శక్తిని పెంపొందిస్తాయి. భాషా, సాహిత్యాల విషయంలో ఎవరికైనా విశాల దృక్పథం అవసరం. భాషా, సాహిత్యాలు యాక్షన్- రియాక్షన్ల విషయాలు కావు (పుట 95)
    ఇప్పుడు ఉద్యమావేశంలో ఉన్నాం. క్రమేపీ ఒక నాలుగయిదేళ్ల తర్వాత ప్రశాంతత ఏర్పడుతుంది. అప్పుడు ఈ భావనకే అందరూ చేరక తప్పదు. కోవెల సంపత్కుమార గారి వనంలోని ఫోటో అందవైంది ముఖ చిత్రంగా అలంకరించినందుకు మంచి పుస్తకాన్ని అందించినందుకు శ్రీరంగస్వామి అభినందనీయులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కందాల విందులూ.. చమత్కారాల చిందులూ

కందాల విందులూ.. చమత్కారాల చిందులూ

  • -సన్నిధానం నరసింహశర్మ
  • 20/12/2014
TAGS:

నృహరీ!
పంచశతి; కవి: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ;
పుటలు: 224, వెల: తెలుపలేదు;
ప్రతులకు: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ,
1-8-702/1/1, ఆంధ్రా బ్యాంకు సందు, నల్లకుంట,
హైదరాబాదు- 500 044

కావత్తు ప్రాస కుదిరిందని చెప్పడం కాదు; ఇది అక్కిరాజువారి చక్కనైన పొత్తం, కంద పద్యాల ముచ్చటైన మనోవిహార యాత్రాఫలాలు. యావత్తు పుస్తకం చదివితే అక్కిరాజు సుందర రామకృష్ణ నాటక, కావ్య పద్య పఠనంలోనే కాదు, పద్య రచనంలో కూడా రాణించదగిన వారనిపిస్తుంది.
దశావతారాల్లో నరసింహావతారం ఒక విలక్షణ అవతారం. సగం నరుడూ, సగం సింగమూ. నృహరీ మకుటంతో ఇప్పుడు శతక సింహాసనంపై అక్కిరాజు భాసిస్తున్నారు. ఆమూక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు నరసింహస్వామిని ‘దంభకేసరి’ అన్నాడు. ‘లక్షాధికారైన లవణమన్నమెకాని, మెరుగు బంగారంబు మింగబోడు’వంటి శాశ్వత సూక్తిరత్నాకరమైన నరసింహ శతకం వేమన శతకం వంటి శతకాల వెంబడిని ప్రజావాఙ్మయ విలీనమైంది. ఆమధ్య రామడుగు వెంకటేశ్వరశర్మ చెంచులక్ష్మి అనే ఒక మనోహర కావ్యంలో నృసింహస్వామి కథాభివర్ణనలు చేశారు. ఇలా నరసింహస్వామి ఇప్పటికీ సాహిత్యంలో అవతరిస్తూనే వున్నాడు.
వర్తమాన కాలంలోని ఈ పంచశతి ఆకట్టుకునే సామాజిక అయస్కాంతాల్ని స్వంతం చేసుకుంది.
‘కొడుకులు సింహాసనముల/ కడునేర్పున కూర్చొనంగ కావించెడి ఆ/
చెడుగుల యత్నములక్కట/ అడుగడుగునా గాంచుచుంటి
మయ్యా నృహరీ’ అంటూ కుటుంబ పాలనల్ని నిరసిస్తారు. ‘పుడమిని మాత్రమె కాదుర/ కడు కంపునుగొట్టు మురికి కాల్వలగూడన్/ చెడుగులు కబ్జాచేసిరి/ సడిసప్పుడు చేయకుండ చతురతన్నహరీ’ అంటూ భూకబ్జాదారుల నిస్సిగ్గు పనుల్ని నిరసించారు.
భాషా సంపద పుష్కలంగా ఉంటే యతి, ప్రాస, గమక, గమనాల్లో వీర విహారం చేయగలం- ఎటొచ్చీ శోధనా నైపుణ్యం, సమయ సందర్భ పద క్రీడారహస్యాలు తెలిస్తే అని కవి నిరూపించారు. దేవుళ్ళపై భలే చమత్కారాలు చేస్తారు. డ్రెస్సులు గడిగడి మార్చుచు/ కస్సూబుస్సులను చూప ఘనునీకంటెన్/ డ్రెస్సే ఎరుగని శివుడే/ లెస్సగు దైవంబు తెలిసెలేరా- నృహరీ’ అటువంటిదే.
గణగుణాలూ, గుణగణాలూ రెండిటా నిండుదనాన్ని పొందిన త్రిశతి, యిది.
‘తలకాయలు తమతమ జే/బులలోపల వేసికొనుచు పోలింగు కు, పో/వలసిన రోజులు వస్తే/ సెలవింక డెమోక్రసీకి సిరిసిరి మువ్వా’ అంటూ ఆధునిక భావాలతో సిరిసిరిమువ్వ శతకంలో కందకందుక క్రీడాకారుడయ్యాడు. ప్రశంసని హృదయంలోంచి కంఠంలోకి తెచ్చుకుని మాటల్లోకి తెచ్చుకోలేనివారు తప్ప ఎవ్వరైనా ఈ త్రిశతిని మెచ్చుకు తీరతారు ఇందులోని తలపు మువ్వల సవ్వడులకి.
‘పక్కింటివారి లోగిట/ చక్కగా తెగ పూచినట్టి చామంతి పువుల్;/ కుక్కలు కాపలయున్నను/ పక్క ప్లానేసి జయము వడసితి- నృహరీ అంటారు సహజ చమత్కారంగా.
‘ఇప్పుడు పెద్దమగాడను/ చెప్పగ, బాల్యాన సిసలు చిల్లరగాడన్/ తప్పులు దండిగ చేసితి/ అప్పామన్నించు నీ ప్రియాత్మజు- నృహరీ’ అనడంలో నీ ప్రియాత్మజుడను అనడంలో ఆత్మీయత, కొంటెతనం గడుసుదనం మేళవించాయి. ఈ నృహరి త్రిశతిలో ‘వీరస్తుతులు!’ లేవుగాని వైరభక్తివుంది. నరసన్నను కన్నతండిరిగా భావించిన చనవు మాటలుంటాయి.
‘ఈ మధుమేహమదేమో/ భామలపై తరుగనట్టి వాంఛలవేమో! శ్రీ మహిళాధవ, భువి/ కడు/ ధీమహితుడు చెప్పలేడు- తెలియుర నృహరీ!’ అంటూ ‘మధు’మోహాన్ని’ కూడా దాపరికం లేకుండా చెబుతారు.
‘ఎంచగ గతమున నెంతో/ మంచిగ పలుకాడు నీవు, మార్చితె మోటౌ చెంచుల ‘కుర్రో’యనివి/న్పించెడి ‘బేవర్సు’ బాస బిత్తరినృహరీ!’ అన్నారు. బేవర్సు బాస అని యధాలాపంగా అనేశారు, చమత్‌‘కారం’గా.
ఉత్తిచమత్కారాలు శక్తిచమత్కారాలై విభిన్న భావ విహారాలై చమత్కారాల చిందుల్తో కందాల విందుల్ని చేసింది ఈ త్రిశతి.
చమత్కారమంటే ‘లోకాతీతమగు వస్తువును చూడగా చిత్తమునకు కలుగు ఆనందహేతువైన వికాసం’ అని అర్థం. ఈ త్రిశతి అటువంటి హృదయ వికాసాన్ని కలిగిస్తుంది. కవిగారు సుమారు అరవై పుటల్లో ‘నామాట’అని వ్రాసింది పఠన యోగ్యమవడం విశేషం. అందులో అనుభవాలు అనుభవసారాలూ వున్నాయి.
‘‘ఇది భక్తికావ్యం కాదు, ఇది అధిక్షేపకావ్యమే. భగవంతునికి తనను తాను అర్పించుకునే ఆర్తినివేదనం, కైవల్య ప్రాప్తికై ఆరాటంకాదు, చెడుపై చెడుగుళ్ళూ ఆడడం, మాటల తూటాలను పేల్చడం బాధ్యతగా కర్తవ్యంగా తలపోస్తూ భగవంతుని నిలదీయడం’’అని ఆచార్య నిత్యానందరావు ‘పద్య పరశువు’ అనే తమ అభిప్రాయంలో అన్నది యదార్ధ వాక్యాలు.
మంచి కవిత్వాలు వస్తున్నాయి. కని పూర్వంలా రసజ్ఞులు, కవితాభిమానులు కవిత్వ ప్రచారం పంపిణీలు చేయలేకపోతున్నారనిపిస్తుంది. చేస్తే ఈ పొత్తం ప్రయోజనదాయకం. ఈ పంచశతి కందాలవిందుల్ని చేస్తూ మనపై చమత్కారాల పన్నీటి చుక్కల్ని చిందిస్తుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి

ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి

  • 21/12/2014
  • -కె.వి.జి. శ్రీనివాస్

అక్కడ మంచుముత్యాలు కురుస్తూంటాయి.. కొమ్మకొమ్మకూ పూలన్నట్లు…ఎటుచూసినా మంచు బిందువులే రాలుతూంటాయి… అక్కడ పిల్లగాలులతో సయ్యాటలాడుతూ తెల్లటిమబ్బులు నేలను తాకుతూ జారిపోతూంటాయి…. తెల్లటి చామంతుల్లా మెరిసి.. విరిసిన కాఫీ పూల పరిమళాలు పలకరిస్తూంటాయి… ఎతె్తైన కనుమల మధ్య, చుట్టూ పరుచుకున్న లోయల మధ్య ఒంటరిగా ఉండే ఆ సీమలో అడుగుపెడితే.. లేలేత ఎరుపుతో నవనవలాడే యాపిల్ కాయలతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తోటలు కన్పిస్తాయి. స్వర్గానికి నిచ్చెనలు ఇక్కడినుంచే వేయొచ్చన్న భావన మనసును తాకుతుంది. ఇదంతా చూస్తే మీకు అందాల కాశ్మీరం కళ్లముందు కదలాడుతుంది. కానీ ఇది కాశ్మీర్ కాదు. అక్కడున్న అందాలను తనవి చేసుకున్న లమ్మసింగి సొబగులు ఇవి. విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో ఉన్న ఈ గిరిజన పల్లె అందరికీ లంబసింగిగా సుపరిచితమే. ఎముకలు కొరికే చలికి..అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదుతో వార్తల్లోకి ఎక్కింది. పర్యాటకులనూ, ప్రకృతి ప్రేమికులను, శాస్తవ్రేత్తలను రా..రమ్మని పిలుస్తున్న లమ్మసింగి కథాకమామిషు ఇది…. ఆ గిరిజన పల్లె చలికి పుట్టినిల్లు.. కొండకోనల మధ్య ప్రకృతి అందాలు ఆరబోసుకున్న ఓ చిన్నపల్లె… మిట్ట మధ్యాహ్నమైనా ఆ ఊరివేపు తొంగి చూసేందుకు సూరీడు కూడా కాస్తంత జంకుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే చలికే వెన్నులో వణుకు పుడుతుంది. శీతాకాలం వస్తే అక్కడ నీరు గడ్డకట్టుకుపోతుంది.. పట్టపగలే చలిమంటలు వేసుకోవాలి. కొండలను ముద్దాడుతూ దిగివచ్చే తేలికపాటి తెల్లమబ్బులు మనను తాకుతూ వెళుతూంటే గుప్పిట్లో బంధించేద్దామా అన్న కోరిక పుట్టుకొస్తుంది. పోగులు పోసినట్టు కనిపించే మంచు ముత్యాలు.. ప్రకృతి అందాలన్నీ ఒకేచోట ఆరబోసుకున్నాయా.. అనిపించే ప్రాంతమది. ఈ సోయగాలను కెమెరాల్లో బంధించాలనుకున్న వారికి.. ఈ సోయగాలను తనివితీరా తిలకించాలనుకునేవారికి అనువైన లోయ ఇది. కొంతకాలం వరకూ ఈ గ్రామం గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ గ్రామం ప్రధాన వార్తల్లోకెక్కింది. డిసెంబర్-జనవరి నెలల్లో ఇక్కడ జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడమే ఇందుకు కారణం. విశాఖకు సుమారు 105 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో లమ్మసింగి ఉంది. ఇక్కడికి ఒక్కసారి అడుగుపెడితే…అదో నవలోకంలా కన్పిస్తుంది. కాశ్మీర్ అందాలన్నీ ఇక్కడ కన్పిస్తాయి. సూరీడు నడినెత్తిమీదకొచ్చినా ఇక్కడ తెల్లవారు జామున ఉండే వాతావరణమే కనిపిస్తుంది. మధ్యాహ్నం దాటితే కానీ వెలుతురు కనిపించదు. ఇంతలోనే చీకట్లు ముసురుకుంటూంటే సూరీడు ఇక సమయం లేదనుకున్నట్లు పడమటి దిక్కుకు పరుగులు తీస్తాడు. కాశ్మీరు, కులుమనాలికి దీటైన అందాలు మన మధ్యనే ఉన్నాయి. తలచుకుంటే కొద్ది గంటల్లోనే ఆ అందాల వాకిట్లోకి వెళ్లిపోవచ్చు. కొడైకెనాల్, ఊటీకో వెళితే ఎలా తన్మయత్వంలో తడిసిపోతామో, సరిగ్గా అలాంటి అనుభూతే లమ్మసింగిలో కూడా కలుగుతుందంటే అతిశయోక్తికాదు. సూర్యుడు నడినెత్తిన ఉన్నా గడియారం చూస్తే తప్ప, ఎంత పొద్దెక్కిందో ఎవ్వరికీ తెలియదు. మనిషి ఎదురుగా నిలిచినా ఆనవాలు పట్టలేనంత దట్టమైన మంచు. పట్టపగలు లైట్లు వేసుకుని తిరుగాడే వాహనాలు.. ఇదీ.. లమ్మసింగి ప్రత్యేకత. నర్సీపట్నం-చింతపల్లి మధ్య లమ్మసింగి ఉంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఈ ప్రాంతం కాశ్మీరు లోయలా కొత్త అందాలతో మెరిసిపోతుంది. సాధారణ రోజుల్లో రాష్ట్రం అంతా ఎండలు మండిపోతున్నా, అక్కడమాత్రం ఐదు నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతుంటాయి. ఏప్రిల్, మే నెలల్లో కూడా ఇక్కడ రాత్రి పూట దుప్పటి కప్పుకోవలసిందే. ఇక ఈ సీజన్‌లో జీరో డిగ్రీ ఉష్ణోగ్రతలోకి వాతావరణం చల్లగా జారుకున్నప్పుడు చెట్టు.. చేమ.. కొండ.. కోన అన్నీ మంచు తో చేసినట్లు కన్పిస్తాయి. ప్రకృతి కాన్వాస్‌పై గీసిన అద్భుత దృశ్యమిది. ప్రకృతి అందాల మాటున కష్టాలెన్నో కేవలం 500 మంది జీవించే పల్లె ఇది. లమ్మసింగి పంచాయతీ పరిధిలో 18 చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి. ఇక్కడి ఇళ్ళు విసిరేసినట్టు కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారం. విపరీతమైన చలి, మంచు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నా, ఇక్కడి గిరిజనులకు మాత్రం ఈ చలే శాపంగా పరిణమించింది. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు ఇక్కడి గిరిజనులవి. బయటకు వెళ్లి కాయకష్టం చేయకపోతే కానీ కడుపునిండదు. అలాంటి వీరికి చలి అవరోధంగా నిలిచింది. చలికి భయపడి పనుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. బయటకు రాలేక, పనులు చేసుకోలేక సతమతమవుతున్నారు ఇక్కడి అడవి బిడ్డలు. వృద్ధులు, చిన్న పిల్లలు చలికి పండుటాకుల్లా వణికిపోతుంటారు. పర్యాటకశాఖ చిన్న చూపు అందచందాల్లో కాశ్మీర్‌ను తలదనే్న లమ్మసింగి పర్యాటకంగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడికి కొద్దిపాటి దూరంలోనే ఉన్న అరకు ప్రపంచ పర్యాటకలను ఆకర్షిస్తోంది. ఆంధ్రాలో ఓ కాశ్మీరు దాగి ఉందని బాహ్య ప్రపంచానికి తెలిసేట్టు మన పర్యాటక శాఖ చేయలేకపోయింది. ప్రకృతి అందాలు ఆహ్వానిస్తున్నా పర్యాటకులు ఒకటి, రెండు రోజులు ఇక్కడ గడిపేందుకు తగిన వసతులు లేవు. పర్యాటకులు ఇలా వచ్చి, అలా వెళ్లిపోవలసిందే తప్ప, మంచుతెరల చాటున దాగిన లోయ అందాలను తనివితీరా చూద్దామంటే తగిన వసతి లేక వెళ్లిన కొద్దిసేపటికే వెనుదిరగాల్సి వస్తోంది. ఇక్కడ కనీసం కాకా హోటళ్ళు కూడా కనిపించవు. ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునేవారు తమ వెంట తినుబండారాలు విధిగా తీసుకువెళ్లాల్సిందే. ఈ గ్రామంలో కూరగాయలు కూడా దొరకవు. వారానికోసారి జరిగే సంతకు వెళ్లి ఇక్కడి గ్రామస్తులు కూరగాయలు కొనుగోలు చేసుకుంటారు. స్వచ్ఛమైన పల్లె అంతా వ్యాపారమయమైన రోజుల్లో.. అలాంటి వాసనలు సోకని స్వచ్ఛమైన అడవి పల్లె ఈ లమ్మసింగి. చెట్లమీద పూలతో పోటీ పడుతూ రంగు రంగుల చీరలతో అందంగా.. అమాయకంగా కనిపించే యువతులు చెట్ల కొమ్మల చాటు నుంచి తొంగి చూస్తూ కనిపిస్తారు. మంచు తెరల మధ్య నుంచి నీళ్ళ కడవలతో వరుసగా నడిచివచ్చే గిరిపుత్రికలు చూడ ముచ్చటగా ఉంటారు. కట్టు..బొట్టు నుంచి ప్రత్యేకంగా కనిపించే వీరిని కెమెరాల్లో బంధించాలనుకునేవారికి ఇంతకు మించిన రమణీయ దృశ్యాలు ఎక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు. అసలు పేరు కొర్రుబయలు లమ్మసింగికి మరోపేరు కొర్రుబయలు. ఈ పేరు వెనుక చిన్న కథ ఉంది. కొర్రు అంటే బిగుసుకుపోవడం అని, బయలు అంటే బయట అని అర్థం. ఓసారి ఈ గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి ఆరు బయట చలిలో కూర్చుని బిగుసుకుపోయాడట. అప్పుడు ఆ వ్యక్తి పెట్టిన పేరే కొర్రుబయలు. కాలక్రమేణా ఈ పేరు తెరమరుగై, లమ్మసింగిగా రూపాంతరం చెందింది. ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో తాజంగి గ్రామం ఉంది. ఇది సముద్రమట్టానికి 1,600 అడుగుల ఎత్తున ఉంది. దీనికి మరో 2,000 అడుగుల ఎగువన లమ్మసింగి ఉందన్నమాట. అంటే లమ్మసింగినుంచి చూస్తే కాళ్లకింద ఉన్నట్లు తాజంగి పల్లె కన్పిస్తుంది. అక్కడ కూడా ఇదే వాతావరణం దర్శనమిస్తుంది. చల్లని గాలితెమ్మెరలు మనసును ఉత్సాహపరుస్తాయి. ఇక్కడి నుంచే పొగమంచు లమ్మసింగి వైపు పరుగులు తీస్తుంటుంది. లమ్మసింగి యాపిల్ వస్తోంది… యాపిల్ అంటే కాశ్మీర్, సిమ్లా గుర్తుకు వస్తాయి. సీజన్‌లో ఇబ్బడిముబ్బడిగా యాపిల్స్ అక్కడి నుంచి దిగుమతి అవుతుంటాయి. ఇకపై మనం సిమ్లా నుంచో కాశ్మీర్ నుంచో యాపిల్స్ దిగుమతి చేసుకోనక్కర్లేదు. లమ్మసింగిలో ఇంతకన్నా నాణ్యమైన యాపిల్స్ దొరకనున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో జీరో డిగ్రీల ఉష్ణోగ్రత, ఏటా 1000 నుంచి 1200 మిల్లీ మీటర్ల వరకూ కురిసే వర్షం ఈ ప్రాంతానికి కలిసి వచ్చింది. అదే యాపిల్ సాగుకు ఉపకరించింది. సాధారణంగా గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తుంటారు. ఇక్కడ పసులు, క్యారెట్, పైనాపిల్, క్యాబేజీ పండిస్తుంటారు. వీటితోపాటు యాపిల్ కూడా ఇక్కడ పండించగలమని నిరూపించారు. ఐదు డిగ్రీకల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నచోట యాపిల్ సాగుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వాతావరణం లమ్మసింగిలో ఉండడంతో సెంట్రల్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సంస్థ ఇక్కడ యాపిల్ పండించే విషయమై అధ్యయనం చేసి, పరిశోధనలు ప్రారంభించింది. యాపిల్ సాగుకు ఇది మంచి ప్రాంతమని నిర్ధారించింది. 60 మంది రైతులతో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఇప్పుడు యాపిల్స్ ఇక్కడ కాస్తున్నాయి. నాలుగేళ్ల కిందట రాంబాబు అనే రైతు యాపిల్ విత్తనం నాటారు. అది మొక్కగా ఎదిగింది. నాలుగు సంవత్సరాలకు కాయలు కాశాయి. కాశ్మీర్ యాపిల్‌ను తలదనే్న యాపిల్ చేతికందింది. ఇంకేం..కాశ్మీర్, సిమ్లా మాదిరి యాపిల్, స్ట్రాబెర్రీ కూడా పండించగలమన్న ధీమా ఇక్కడి రైతుల్లో వచ్చింది. అంటుకట్టిన మొక్కలు నాటితే ఎనిమిదేళ్లకు కాపు మొదలై 40 ఏళ్లపాటు దిగుబడినిస్తాయి. అదే రూట్ స్టాగ్ మొక్కలను నాటితే రెండేళ్లకే పంట మొదలై, 20 ఏళ్లవరకూ పంటనిస్తాయి. ప్రస్తుతం గిరిజనులు యాపిల్ సాగులో నిమగ్నమై ఉన్నారు. లమ్మసింగి యాపిల్ తినేందుకు సిద్ధంగా ఉండండి మరి! బాక్సైట్ బాంబ్ పేలుతుందా? లమ్మసింగికి కొద్దిపాటి దూరంలోనే బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. చాలాకాలంగా పెద్దల కళ్ళు వీటిపైనే ఉన్నాయి. ఈ ఖనిజాన్ని వెలికి తీయడానికి పర్యావరణవేత్తల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ ఖనిజాన్ని వెలికి తీసేందుకు కార్పొరేట్ సంస్థలు కాస్త వెనుకంజ వేస్తున్నాయి. కానీ సమీప భవిష్యత్‌లోనే ఈ ఖనిజాన్ని వెలికి తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదే జరిగితే ఇక్కడున్న ప్రకృతి రమణీయత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ చల్లని వాతావరణం కాలుష్యమయమవుతుంది. ప్రకృతి కన్నీరు కార్చకుండా ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరెన్సీ చెట్ల కథ తెలుసా…? లమ్మసింగికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏపుగా పెరిగే కొన్ని చెట్లను కరెన్సీ నోట్లను తయారు చేయడానికి మాత్రమే వాడతారు. లంబసింగికి సమీపంలోని జాలికొండ ప్రాంతంలో ఈ చెట్లు ఎక్కువగా కన్పిస్తాయి. ప్రస్తుతం దాదాపు 30 ఎకరాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ మొక్కలను మరిన్ని ప్రాంతాల్లో పెంచేందుకు ప్రయత్నించినా పరిస్థితులు సానుకూలంగా లేక ఫలితమివ్వలేదు. కారణాలు ఇతమిత్థంగా తెలీదు. ఇక్కడివారు మాత్రం వీటిని కరెన్సీ చెట్లనే పిలుస్తారు. వాటి శాస్ర్తియనామం వారికి తెలీదు. ఇటీవలి హుదూద్ తుపాను తీవ్రతకు కొన్ని చెట్లు విరిగిపడ్డాయి. వీటి పరిరక్షణకు అటవీశాఖ రంగంలోకి దిగింది. రెండోస్థానం ఆదిలాబాద్‌దే తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఏపీలోని లంబసింగి మొదటి స్థానంలో ఉంటే తెలంగాణలోని ఆదిలాబాద్ రెండోస్థానంలో ఉంది. ఆ జిల్లాలో 90శాతం అటవీప్రాంతమే. దట్టమైన అడవులు, చుట్టూ ఉన్న చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలోని అటవీప్రాంతాలవల్ల శీతల వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉట్నూరు, ఆసిఫాబాద్, బోధ్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువ. ఈఏడాది ఇప్పటికి కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటిగ్రేడ్‌గా నమోదైంది. ఈనెలాఖరుకు, జనవరి తొలివారంలో అది 2 డిగ్రీలకు పడిపోవచ్చు. దట్టమైన పొగమంచు కప్పుకుని, ఎండ పొడకూడా పడని తండాలు ఈ జిల్లాలో ఎన్నో. రోజుల తరబడి సూరీడు తలెత్తి చూడని పల్లెలకు లెక్కేలేదు. కాఫీ.. మిరియాలూ ప్రత్యేకం లంబసింగిలో మంచు, పొగమంచు, చల్లనిగాలులు ఎంత సాధారణమో కాఫీ, మిరియాల సాగూ అంతే. అందమైన కాఫీ మొక్కల పూలు ధవళవర్ణంతో మంచుతో పోటీపడుతూ ధగధగలాడుతూ కనువిందు చేస్తాయి. నిజానికి వీటిని చూస్తే పెద్దపెద్ద తెల్లని చామంతుల్లా కన్పిస్తాయి. కాఫీ తీగలకు దండ గుచ్చినట్లు అందంగా విరిసి ఉంటాయి. గబుక్కున చూస్తే వాటిని చామంతులనే అనుకుంటాం. కడిగిన ముత్యంలా తెల్లటి పూలను చూస్తే మనసు ఎటో వెళ్లిపోతుంది. లంబసింగితోపాటు చింతపల్లి ఏజెన్సీ అంతటా మిరియాల సేద్యం పుంజుకుంది. ఇక్కడి మిరియాలకు ఘాటుకూడా ఎక్కువే. కాఫీ సేద్యం సంగతి చెప్పనే అక్కర్లేదు. మన కాఫీ గింజలు ఎగుమతికి తగిన నాణ్యతతో ఉన్నాయంటే లంబసింగి ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. లంబసింగి కథ చదివాక మీకు అనిపిస్తోంది కదూ అక్కడికి వెళ్లాలని. బయలు దేరండి మరి. లమ్మసింగికి దారేదంటే.. అతి శీతల ప్రాంతమైన లమ్మసింగికి వెళ్లాలంటే నర్సీపట్నం నుంచి చింతపల్లి మీదుగా 32 కిలో మీటర్లు ప్రయాణించాలి. హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. భద్రాచలం నుంచి లమ్మసింగికి 240 కిలోమీటర్లు. భద్రాచలం నుండి నెల్లిపాక, జికెవీధి మీదుగా ఇక్కడికి చేరుకోవాలి. ఒంపుసొంపుల ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణించి లమ్మసింగి చేరుకోవలసి ఉంటుంది. అక్కడికి వెళ్లాలనుకునేవారు ఒకటికి రెండు స్వెట్టర్లు, లేదా జర్కిన్‌లు ఎక్కువ తీసుకోవలసిందే. అచ్చమైన అమాయకత్వం లమ్మసింగిలో ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అక్కడి ప్రజలూ అలాగే ఉంటారు. మాయామర్మం ఎరగని గిరిపుత్రులు కొత్తగా వచ్చే వారిని విచిత్రంగా చూస్తారు. పలకరించడానికి సిగ్గుపడతారు. మనం చొరవచూపితే మొహం చాటేస్తారు. వారిని ఫొటోలు తీద్దామని ప్రయత్నిస్తే, ముఖం దాచేసుకుంటారు. భయంతో పారిపోతారు. ఇదంతా పరిచయం అయ్యేవరకే. మనపై నమ్మకం కుదిరేవరకే… ఒక్కసారి వారితో మాట్లాడి మచ్చిక చేసుకుంటే, వారి ఆదరాభిమానాలకు మనం మురిసిపోవలసిందే. అంత చల్లదనం ఎలా… భూ ఉపరితలం నుంచి 18-20 కిలోమీటర్ల వరకు టోపోస్పియర్ ఉంటుంది. భూ ఉపరితలం నుండి 164 మీటర్ల ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూంటుంది. నిజానికి లంబసింగి నైసర్గికంగా కీలక ప్రాంతంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 3600 అడుగుల ఎత్తున ఉంది. దీంతో చల్లదనం మామూలే. చుట్టూ ఎత్తుగా తూర్పుకనుమలు విస్తరించడం, లోతైన లోయలు, చిక్కటి అడవి, శీతలగాలుల తీవ్రత, బొగ్గుపులుసు వాయువు తక్కువగా ఉండటం వల్ల లమ్మసింగిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మంచి శీతాకాలంలో జీరో అంతకన్నా తక్కువగానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. 2007నుండి మార్పు మరింతగా కన్పిస్తోంది. 2010లో తొలిసారిగా, అధికారికంగా జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో చలికి గజగజలాడాల్సిందే. -డి.శేఖర్, శాస్తవ్రేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, చింతపల్లి రూ. 5 కోట్లతో రిసార్టు ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన లమ్మసింగిని అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ ఆరు ఎకరాల్లో 25 గదులతో కూడిన రిసార్ట్‌ను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. ఈ రిసార్ట్ బయటకు పూర్తిగా గిరిజన సంప్రదాయంతో కనిపిస్తుంది. లోపల మాత్రం ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ఈ రిసార్ట్ మధ్య ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయనున్నాం. ఎకో ఫ్రెండ్లీ రిసార్ట్‌గా దీన్ని తీర్చదిద్దాలని భావిస్తున్నాం. సీజన్‌లో చాలామంది అరకు వెళ్లాలనుకుంటారు. అంతకన్నా రమణీయ దృశ్యాలు ఉన్న లమ్మసింగిని కూడా బాహ్య ప్రపంచానికి తెలిసేలా ఓ టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పాడేరు-చింతపల్లి-లమ్మసింగి-కెడి పేట మధ్య ఈ టూరిజం సర్క్యూట్ ఉంటుంది. విశాఖ నుంచి పర్యాటక శాఖ ప్యాకేజి బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది. -భీమ శంకరం , డివిజనల్ మేనేజర్, పర్యాటక శాఖ **

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏపీలో భాజపాకు మంచి రోజులు?

ఏపీలో భాజపాకు మంచి రోజులు?

  • – టంకశాల అశోక్ (సెల్ : 9848191767)
  • 21/12/2014
TAGS:

ఇప్పటికే ఉన్న సూచనలు గత ఆదివారంనాడు స్పష్టమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపికి ప్రత్యామ్నాయంగా మారేందుకు బిజెపి నాయకత్వం ఇక తుది నిర్ణయం తీసుకున్నట్లే. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌కు చెందినరాంమాధవ్ డిసెంబర్ 14న హైదరాబాద్‌లో మాట్లాడుతూ, ‘‘స్థానిక సంస్థలనుంచి లోక్‌సభ వరకు భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలలోనూ బిజెపి అభ్యర్థులు రంగంలో ఉంటారు’’, అని అరమరికలు లేని విధంగా ప్రకటించారు.
దీనిపై ప్రస్తుతం వారి మిత్రపక్షమైన టిడిపి నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం గమనార్హం. పైకి ఏమీ మాట్లాడకపోయినా అంతర్గతంగా వారు ఆ విషయమై చర్చించుకునే ఉంటారు. అందుకు తమ ప్రతివ్యూహం ఏ విధంగా ఉండాలన్న ఆలోచన సీరియస్‌గా చేయవలసిన దశ ఇంకా వచ్చిందనలేము గాని, అధినాయకుడు చంద్రబాబు మనసులో ఒకచోట రాంమాధవ్ ప్రకటన తప్పక నమోదై ఉంటుంది. అట్లా నమోదుకావడమంటే అర్థం వ్యూహరచన దిశగా నెమ్మదిగా ఆలోచనలు జరుగుతాయని. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానున్న కాలంలో ఈ కోణంనుంచి ఆసక్తికరమవుతాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలహీనమైన పార్టీ అని అందరికీ తెలిసిందే. తెలంగాణలోకన్నా బలహీనమైనది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రత్యామ్నాయం కాగలమని పార్టీ నాయకులు పైకి అంటున్నప్పటికీ, అందుకు అవకాశాలు తమ పరిస్థితి మెరుగ్గా ఉన్న తెలంగాణ కన్న, నామమాత్రంగాగల ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ. ఇదొక చిత్రమైన స్థితి అయినా వాస్తవం. అందుకు కారణాలు ఊహించేందుకు రాజకీయ పాండిత్యం అవసరం లేదు కూడా.
అధికారంలోగల పార్టీల మాట అట్లుంచితే, ప్రతిపక్ష క్షేత్రంలోగల శూన్యత ఎటువంటిదన్నది ఇటువంటి వ్యూహాలకు ప్రధానమవుతుంది. తెలంగాణలో టిఆర్‌ఎస్ తర్వాత కాంగ్రెస్ బలంగా ఉంది. బిజెపికి టిడిపితో పొత్తు ఉన్నా, అది బిజెపికి కలిసిరాని బంధంగా మాత్ర మే కొనసాగుతున్నది. మొత్తానికి టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ స్థానంలోకి రాగల అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇందుకు భిన్నం. అక్కడ కాంగ్రెస్ లేదు. రాగల అవకాశాలు స్వల్పం. వామపక్షాలకు అవకాశం శూన్యం. ప్రతిపక్ష క్షేత్రంలో మిగిలింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒక్కటే. అది యథాతథంగా బలంగానే ఉంది. అటువంటి స్థితిలో టిడిపికి బిజెపికి ప్రత్యామ్నాయంగా కాగలగటం ఎట్లా సాధ్యం?
ఇక్కడ గమనించవలసిన విషయాలు కొన్నున్నాయి. బిజెపి ఎదుగుదలకు రెండు లక్ష్యాలుంటాయి. అది వీలైతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ స్థానంలో రెండవ శక్తిగా మారటం కావచ్చు, లేదా రాజకీయ రంగాన్ని టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలతో కలిపి ముక్కోణంగా మార్చటం కావచ్చు. ప్రస్తుతం ద్వికోణంగా ఉన్న స్థితిని మిత్రపక్షమంటూ లేకుండా తనంతట తాను ముక్కోణంగా మార్చగలిగినా అది చెప్పుకోదగ్గదే అవుతుంది. లేదా అన్నీ కలిసివస్తే 2019నాటికో, తర్వాతనో తమదే రెండవ స్థానమైనా కావచ్చు.
ఇంతకూ బిజెపిని ఏ మార్గంలో శక్తివంతం చేయనున్నారు? తమ సిద్ధాంతాలు ప్రచారంచేసి, ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేసి సంస్థను ఒక్కొక్క ఇటుకగా పేర్చుకుంటూ అభివృద్ధిపరచటం ఒక పద్ధతి. తాము కేంద్రం లో అధికారంలో ఉన్నందున దానిని ఆకర్షణగా చూపి ఇతర పార్టీలకు చెందిన ముఖ్యులను, ఏ పార్టీకి చెందని వారిని చేర్చుకోవటం ద్వారా ఆ పనిచేయటం రెండవ పద్ధతి. మూడవ పద్ధతిగా ఈ రెండు మార్గాలనూ మేళవించవచ్చు.
ఇక ప్రజల సమస్యలపై ఉద్యమాలకు సంబంధించి గల ఇబ్బందులేమిటో తెలిసిందే. తాము భాగస్వామిగాగల కూటమి అధికారంలో ఉన్నపుడు ఉద్యమాలంటే తమపై తాము ఉద్యమించుకోవటమే. ప్రచారాల ద్వారా విస్తరించబూనటం తెలుగుదేశం పార్టీకి సరిపడదు. అది తమకు ప్రమాదకరమని భావిస్తారు వారు. అపుడు రెండుపార్టీల మధ్య ఘర్షణలు కాకపోయినా ఉద్రిక్తతలు తలెత్తుతాయి. మిత్ర సంబంధాలు దెబ్బతింటాయి. అంతమాత్రాన ఒక పార్టీ తననుతాను బలోపేతం చేసుకోకుండా మిన్నకుంటుందని కాదు. కాని పరిస్థితి కొంత సున్నితంగా ఉంటుంది. దానిని ఎదుర్కొంటూ పని చాకచక్యంగా సాగించటం తిరిగి సమయం తీసుకునేదే. మరొకవైపు ఏవో ఒక ఎన్నికలు, చివరకు 2019 ఎన్నికలు వచ్చిపడతాయి.
ఈ స్థితిలో, మనకు వినవస్తున్న మాటలు నిజమే అయిన పక్షంలో, బిజెపి నాయకత్వం ఇతర పార్టీల నాయకులను, తద్వారా ఆయా సామాజిక వర్గాల వారిని, ప్రాంతాలవారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుందనుకోవాలి. అట్లా కొద్దిమంది ముఖ్యులు ఇప్పటికే చేరారు. కావూరి సాంబశివరావు, పురంధీశ్వరి వంటి వారి ప్రాబల్యం గురించి తెలిసిందే. మరికొన్ని పెద్ద పేర్లు వినవస్తున్నాయి. వీరు ప్రధానంగా కాంగ్రెస్ కుటుంబీకులు. ఆ పార్టీ పరిస్థితి అక్కడ దయనీయంగా మారినందున అక్కడినుంచి, అదే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి అనిశ్చయంగా మారుతున్నందున రానున్న కాలంలో చాలా చేరికలు ఉండగలవన్నది అంచనా. ఇటువంటి వారికి వేరే మార్గం లేదు కూడా. టిడిపిలోకి వెళ్లటం కష్టం. ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులతో కలహాలున్నాయి. అందరూ కలిసి స్వంత పార్టీ కొత్తగా ఏర్పాటుచేయలేరు. కనుక బిజెపి ఒక్కటే మార్గం. పైగా అది కేంద్రంలో అధికారంలో ఉంది. ఇతరత్రా దేశంలో ఇంకా బలపడుతున్నట్లు తోస్తున్నది. మరొకవైపు చూస్తే, బిజెపి ఈ పద్ధతిలో బలపడటం టిడిపికి బెరుకుపుట్టించవచ్చు.
మొత్తానికి ఇందువల్ల జరిగేది ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి ఒక స్వతంత్ర శక్తిగా ముందుకు రావటం. అయితే అందుకు ఇతర పార్టీల వారిని ఆకర్షించగల ఏకైక అయస్కాంతం జాతీయ స్థాయిలో బిజెపికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉండగల బలం. ఒకవేళ ఏ కారణంవల్లనైనా అది బలహీనపడితే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి ఇసుక గూడు అవుతుంది. కనుక రాష్ట్ర బిజెపి నాయకత్వం కీడెంచి మేలెంచే పద్ధతిలో దీనినికూడా పరిగణనలోకి తీసుకుంటూ కనీసం ఒకమేరకైనా ‘ఒక్కొక్క ఇటుక’ నిర్మాణ సూత్రాన్ని అనుసరించటం వారికే మేలుచేస్తుంది.
పోతే, టిడిపి నాయకత్వానికి ఇది నచ్చగల పరిస్థితికాదని వేరే చెప్పనక్కరలేదు. ఏ పార్టీఅయినా తమకు ఎదురులేని అధికారం కావాలని కోరుకుంటుంది. తాము ఇకనుంచి అన్ని ఎన్నికలలో తమంతట తాము పోటీచేయగలమని ప్రకటించిన రాంమాధవ్‌కు ఇది తెలియనిది కాదు. దీని అర్థం రెండు పార్టీల పొత్తు తెగిపోగలదని ఎంతమాత్రం అనుకోవద్దు. కాకపోతే బిజెపి బలం పెరిగినకొద్దీ టిడిపి ఎక్కువ సీట్లు కేటాయించవలసి వస్తుంది. అంగీకారాలు కుదరనపుడు ‘మైత్రీపూర్వక పోటీలు’ జరుగుతాయి. ఇదంతా మనం ఇతర పార్టీల మధ్యనేగాక బిజెపి-శివసేన, బిజెపి- బిజూజనతాదళ్ సంబంధాల విషయంలో కూడా చూసిందే.
దీనికి కీలకం ఇక్కడ టిడిపి, ఢిల్లీలో బిజెపి ఎంత జనాకర్షకంగా పాలిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు రాష్ట్రాన్ని బాగా అభివృద్ధిపరచి, గతంలోవలెగాక మానవాభివృద్ధి మార్గంలో అన్నివర్గాల ప్రజలకు మేలుచేసిన పక్షంలో, బిజెపి పెరుగుదలవల్ల కలిగే సవాలును ఎదుర్కొనగలుగుతారు. అదే విధంగా పైన చెప్పుకున్నట్లు, ఎన్‌డిఎ ప్రభుత్వపాలన ఇక్కడ బిజెపికి ప్రాణాధారమవుతుంది. ఇందులో ఎవరు ఎక్కడ పట్టుతప్పినా ఏమి జరిగేదీ ఊహించటం పెద్ద కష్టం కాదు. అది వైఎస్‌ఆర్‌సిపికి, కాంగ్రెస్‌కు కొత్త ఊపిరులిచ్చినా ఆశ్చర్యం ఉండదు.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోషలిస్టు భావాలకు ఆద్యుడు సంత్ గాడ్గే మహరాజ్

సోషలిస్టు భావాలకు ఆద్యుడు సంత్ గాడ్గే మహరాజ్

  • 21/12/2014
TAGS:

ముషీరాబాద్, డిసెంబర్20: దేశంలో సోషలిస్టు భావాలకు ఒక భూమిక ఏర్పడటానికి సంత్‌గాడ్గే బాబా మహరాజ్ భోదనలు, కీర్తనలు ఎంతగానో ఉపకరించాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సంత్‌గాడ్గే బాబా మహారాజ్ అంబేద్కర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాడ్గేబాబా 58వ వర్థంతి కార్య క్రమం నిర్వహించారు. సంస్ధ చైర్మన్ అందోల్ నర్సింగ్‌రావు ఆధ్వర్యంల సికింద్రాబాద్ శ్రీనివాసనగర్‌లో జరిగిన కార్యక్రమానికి చిలకలగూడ సిఐ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరై గాడ్గేబాబా చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతర సంచారి అయన గాడ్గేబాబా జనం మదిలో చిరస్తాయగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో డా. సి. రాజా, రజనీకాంత్, నాగేశ్వరరావు, శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సంత్‌గాడ్గే వర్థంతి
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 20: వాగ్గేయకారుడు సంత్‌గాడ్గె బాబా 58వ వర్థంతి సభను పట్నంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంత్‌గాడ్గె చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా తెలంగాణ జన సమితి కన్వీనర్ కంబాలపల్లి సాయినాథ్, టిఆర్‌ఎస్ నాయకులు భర్తాకి రాజు, ఎల్లేష్, ఎండి అస్లం, బిఎస్పి నాయకులు మేడిపల్లి మహేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కప్పాటి రఘు మాట్లాడుతూ రజక కులంలో పుట్టి వాగ్గేయకారునిగా ఎదిగిన సంత్‌గాడ్గె మహనీయుడని కొనియాడారు.

గాడ్గేబాబాకు ఘన నివాళి
నల్లకుంట, డిసెంబర్ 20: స్వఛ్చతను పరిశుభ్రతను ప్రతి పౌరుడు ఆచరించాలన్న గాడ్గేబాబా అన్నారని సెయింట్ గాడ్గే బాబా మహారాజ్ మిషన్ అధ్యక్షుడు అమరజ్యోతి, ప్రధాన కార్యదర్శి కొండేటి నాగేశ్వరరావుఅన్నారు. శనివారం డిడీ కాలనీలోని సంహయోగ కేంద్రంలో గాడ్గేబాబా 58వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా గాడ్గేబాబా చిత్రపటానికి పూల మాల వేసిన అనంతఠం వారు మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందే పారిశుద్ధ్య ప్రాముఖ్యతను చాటి చేప్పి ప్రజలలోచైతన్యం కలిగించిన మహోన్నతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. గాడ్గేబాబా తన కీర్తనలతో సమాజంలోని మూఢ నమ్మకాలను పారదోలడానికి కృషి చేశారన్నారు. నేటి యువత ఆయన ఆలోచన విధానాలను స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.బాబాసాహెచ్ అంబేద్కర్ కూడా గాడ్గేబాబా ప్రవచనాలు ఆదర్శనీయమని ఎన్నో సందర్భాలలో పేర్కొన్నట్టు తెలిపారు. చీపురు పట్టుకుని స్వఛ్చ్భారత్‌లో భాగంగా గ్రామగ్రామాన తిరిగి గ్రామాలను తీర్చిదిద్దుతూ ప్రపంచ దేశాలకుస్ఫూర్తినింపారన్నారు.ఈ కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు డా.సి.రాజు, వి.సత్యనారాయణ, జి.మస్తానయ్య, ఆంజనేయులు, టి.సాంబశివరావు, ఆర్‌ఎన్. విశ్వాస్, ఎంఎన్ రావు, రజనీకాంత్, కనకయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేడు ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు ప్రదానోత్సవం

నేడు ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు ప్రదానోత్సవం

  • 21/12/2014
TAGS:

హైదరాబాద్, డిసెంబర్ 20: సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 21వ తేదీ ఆదివారం సాయంత్రం సికిందరాబాద్ టివోలి గార్డెన్స్‌లో ‘శివానంద ఎమినెంట్ అవార్డు- 2014’ పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకుల పక్షాన ట్రస్టు మేనేజింగ్ ట్రస్టి కె.బసవరాజు తెలిపారు. ఈ పురస్కారాలను ఈ సారి భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావు, పద్మభూషణ్ మహామహోపాధ్యాయ డా.సత్యవ్రత్ శాస్ర్తీలకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సద్గరు శివానందమూర్తి అనుగ్రహభాషణం చేయనున్నట్లు వివరించారు.
పురస్కార గ్రహీతలు వీరే!
వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన పలువురు ప్రముఖులకు ప్రతి ఏటా శివానంద ఎమినెంట్ అవార్డులను ప్రదానం చేసి సత్కరించుకునే ఆనవాయితీని చాలా కాలంగా ట్రస్టు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం పురస్కారాలు స్వీకరించిన ప్రముఖుల వివరాలిలా ఉన్నాయి. వీరిలో భారత రత్న ప్రొఫెసర్ సి.ఎన్.రావు బనారస్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్‌సి, యుఎస్‌ఏలో పిహెచ్‌డి చేసిన తరువాత అనేక పరిశోధనలు చేసి 63 విశ్వవిద్యాలయాలనుండి గౌరవ డాక్టరేట్‌లు పొందారు. అనేక విజ్ఞానశాస్త్ర అకాడమీలకు సభ్యులుగా వ్యవహరించారు. అనేక సేవలందించి పతకాలు, అవార్డులు స్వీకరించి, ప్రముఖులచే మన్ననలు పొందారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులనిచ్చి సగౌరవంగా సత్కరించిందని నిర్వాహకుల పక్షాన బసవరాజు తెలిపారు.
పురస్కారాన్ని స్వీకరించనున్న మరొక ప్రముఖులు డాక్టర్ సత్యవ్రత్ శాస్ర్తీ సంస్కృతంలో బి.ఎ ఆనర్స్, పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ సంస్కృతం మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. బనారస్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పొందారని, 45 సంవత్సరాలుగా బోధనా శాఖలో డీన్‌గా, సంస్కృతిశాఖ అధిపతిగా, ఒడిషా రాష్ట్రంలోని పూరిలోని శ్రీ జగన్నాధ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా అత్యుత్తమ సేవలందించారు. సంస్కృతంలో జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న మొట్టమొదటి విద్యావేత్త సత్యవ్రత్ శాస్ర్తీ అని బసవరాజు పేర్కొన్నారు. వీరికి పురస్కారాలను ప్రదానోత్సవం చేసేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో తొలుత సాయంత్రం 5 గం. ల 45నుండి 45 నిమిషాలపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
chitram..
సద్గురు శివానంద మూర్తి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందరికీ న్యాయం చేసే రాజధాని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మాభిమానమే అసలు సమస్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జార్ఖండ్ కాశ్మీర్ లలో ఎవరికెన్ని?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు –1 ముందు మాట –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-14

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు –1

ముందు మాట  –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-14

డా.శ్రీ అసిలేటి నాగ రాజు -ప్రముఖ కధకులు  స్వర్గీయ గంధం  వేంకా స్వామి శర్మ గారి ‘’అమృత హస్తాలు ‘’కదా సంపుటి పై పరిశోధన చేసి రాసిన పుస్తకం ఆవిష్కరణ సభలో శర్మ గారి అభ్యర్ధన మేరకు నేనూ పాల్గొన్నాను .అదే నాగరాజు గారితో మొదటి పరిచయం .సుమారు వారం క్రితం నాగ రాజు గారు ఫోన్ చేసి తానూ ‘’వికలాంగుల కధలు –అస్తిత్వ చిత్రణ ‘’కదా సంకలం తెస్తున్నానని ,ముందుమాట రాయమని కోరగా సరేనన్నాను .ఇరవై అయిదు కధలను వివిధ వయసులలో ఉన్నవారు రాసిన కధలు ఇవి .అందులో ఆరుగురు వికలాంగులు కూడా ఉండటం సంకలనానికి నిండు దనం తెచ్చింది .నాగరాజు కూడా వికలాంగుడే. లబ్ధ ప్రతిస్టూ లైన అడవి బాపిరాజుగారు ,  ,జూపాక సుభద్ర గారల కధలు కూడా ఉండటం తో మరింత శోభ చేకూరింది .కద కద కోసం కాకుండా జీవిత సత్యాన్వేషణ కోసం రాసిన కధలివి .వికలాంగుల మానసిక వేదన ,సమాజం వారిపట్ల చూపే నిరాదరణలను అధిగమించి నిత్య చైతన్యం తో విధి ఎర్పరచిన వక్రత ను అవక్ర పరాక్రమమైన ధైర్యం తో ఎదుర్కొని ,లక్ష్యాన్ని ఎన్నుకొని ,గమ్యం చేరే విధానం దాదాపు అన్ని కధల్లోనూ స్పుటం గా కన్పించింది .ఆశా దీపం ఆరిపోకుండా కాపాడుకొనే చిత్తస్థైర్యం ముగ్ధులను చేస్తుంది .తాత్కాలికం గా  కుంగి పోయినా బంతి లాగా మళ్ళీ ఎగిరేపాత్రలుదిశా నిర్దేశం చేస్తాయి .వికలాంగు లైనా వారి మనసు వికలాంగం కాదు .అందులో సంపూర్ణ వికసనం దర్శిస్తాం .హెలెన్ కెల్లర్, సుధా చంద్రన్ ,స్టీఫెన్ హాక్ లాంటి వారి జీవితాలను తెలుసుకొని స్పూర్తి పొందిన వారికధలే ఇవి .,నిరాశా ,నిస్పృహలతో ఆత్మ హత్య చేసుకో కుండా ,ఆత్మ స్థైర్యం తో జీవించిన వారి కధలు, గాధలే  ఇవి .అందుకే ‘’సర్వాంగ సుందరం ‘’అన్నాను .

ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క రక మైన ఆత్మ ఘోష .జీవితపు మాధుర్యాన్ని జుర్రుకోవాలనే ఆలోచన ,తానూ ఎదిగి తన లాంటి నిర్భాగ్యులకు సేవ చేయాలనే కృత నిశ్చయం ఈ కధల్లో ఉన్న అంతస్సూత్రం .కృత్రిమత మచ్చుకు కూడా కనపడ కుండా సహజ సుందరం గా రాసిన ఈ కధల్లో ఆయా పాత్రల అస్తిత్వం కొట్ట వచ్చినట్లు కనిపిస్తుంది .పాత్రల మనో నిబ్బరానికి ,ఆదర్శాలను ఎంచుకొన్న వైనానికి ముచ్చట పడతాం .ఇవికధలు కావు –జీవితపు సత్య చిత్రణలే అనిపించేంత గొప్ప గా దాదాపు అందరూ రాశారు .మాండలికం లో రాసినా ,లంబాడీ తండా భాషలో రాసినా కధలు అందం గా వచ్చాయి .మనసుకు పడతాయి ఆలోచింప జేస్తాయి .’’మన కర్తవ్యం ఏమిటి ?’’అనే దుగ్ధను రేకెత్తిస్తాయి .ఈ కదాసంకలనం చదవటం నాకు గొప్ప అను భూతిగా ఉంది .దీనిపై నాలుగు మాటలు రాయటం నా అదృష్టం గా భావిస్తున్నాను .ఇవి ముద్రణ పొంది మిగిలిన వారికి స్పూర్తి ,ప్రేరణ కలిగిస్తాయన్న పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-12-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాజకీయం కట్టిపెట్టి అభివృద్ధి చేయండి -సీనియర్ పాత్రికేయులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment