వందేళ్ల ‘రజనీ’కాంతులు!

వందేళ్ల ‘రజనీ’కాంతులు!

  • 31/01/2015
TAGS:

అయిదేళ్ల చిరు ప్రాయంలోనే కల్యాణి రాగాన్ని అలవోకగా ఆలపించి అనతికాలంలోనే ఆయన స్వరలోకపు ‘సంగతుల’న్నీ ఔపోసన పట్టేశారు.. తన 18వ ఏట తొలి గీతాన్ని రాసి సొంతంగా బాణీ కట్టి ‘్భష్’ అనిపించుకున్నారు.. తొలినాళ్లలో చలనచిత్ర సీమవైపు మమకారం పెంచుకుని స్వర వైవిధ్యంతో అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు.. ఎన్నో చిత్రాలకు పాటలు రాసి, స్వరాలు సమకూర్చి సినీ సంగీతానికి దిశానిర్దేశనం చేశారు.. ఘంటసాల వంటి గాయకులను, సాలూరు రాజేశ్వర రావు, పెండ్యాల వంటి సంగీత దర్శకులను వెన్నుతట్టి ప్రోత్సహించారు.. ఎలాంటి ప్రచారాన్ని ఆశించకుండా ఇతరుల కోసం సినీ గీతాలు రాశారు, లాలిత్యపు సుగంధాలను అద్ది పాటను కొత్త పుంతలు తొక్కించారు.. ‘నాగరాజు’, ‘తారానాథ్’, ‘నళినీకాంత్’ వంటి అనేక పేర్లతో పాటలు రాసినా, తన స్వరాలు ఎందరికో పేరు తెచ్చినా ఆయన ఏనాడూ కీర్తిప్రతిష్ఠలను కోరుకోలేదు. ఓ రేడియో నాటకంలో పాటలకు తొలిసారి స్వరాలందించిన ఈ సృజనకారుడు ముందుగా సినీ రంగంలో, ఆ తర్వాత ‘ఆకాశవాణి’లో అద్భుతాలను సాధించారు.. అనేక కారణాలతో చలనచిత్ర సీమకు దూరమయ్యాక రేడియోలో వినూత్న ప్రయోగాలు చేసి కొత్త ఒరవడికి నాంది పలికారు. రాగాలకు మాధుర్యాన్ని రంగరించి లలిత సంగీతానికి ‘ఆకాశవాణి’లో ప్రాణప్రతిష్ఠ చేశారు..
లలిత సంగీతానికి పర్యాయపదంగా నిలిచిన ‘శత వసంతాల’ బాలాంత్రపు రజనీకాంతరావు అక్షరాలా స్వర మాంత్రికుడే..! లలిత సంగీతంలో విభిన్న శైలితో వినూత్న ఆవిష్కరణలు చేసిన ఆయన ఓ వాగ్గేయకారుడిగానే కాదు, ‘ఆకాశవాణి’లో భక్తిరంజని, ధర్మసందేహాలు, వనితావాణి వంటి కార్యక్రమాల రూపశిల్పి కూడా.. సినిమా, రేడియో, ప్రైవేటు రికార్డులు.. ఇలా విభిన్న రంగాల్లో ఆయన స్వరాలు ఏ తరం వారినైనా ఉర్రూతలూగిస్తాయి. బిఎన్ రెడ్డి నిర్మించిన ‘స్వర్గసీమ’లో భానుమతి ఆలపించిన ‘ఓహో పావురమా..’ పాటను రాసి అద్భుత సంగీతాన్ని అందించారు. అదే సినిమాలో ‘గృహమే కదా స్వర్గసీమ’, ‘హాయి సఖీ’, ‘ఎవరి రాకకై’ వంటి పాటలు ఆయన సృజనే. గోపీచంద్ నిర్మించిన ‘గృహప్రవేశం’లో ‘మేలుకోవే భారతనారీ..’ పాటతో అప్పట్లోనే స్ర్తివాదాన్ని రజనీ వినిపించారు. తాను రచించి స్వరపరచిన పాటలు ఎవరి పేరుమీదో ప్రచారం పొందినా ఆయన ‘శైలి’ మాత్రం ప్రస్ఫుటంగా కనిపించేది. 1920 జనవరి 29న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించి, అధిక మాసాలతో కలిపి నేడు నూరవ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనాలు…

మా పింగళి మాస్టారు…
‘సాహిత్య చరితలో జంటకవుల పంట
ఆంధ్రికి ప్రత్యేకమయిన దంట
ఆధునికాంధ్రాన ఆదికవుల జంట
తిరుపతి వేంకటేశ్వరుల దంట
మలికైతరీతుల తొలి పంట వేంకట
పార్వతీశ్వర కవిద్వయముదంట,
తొలకరి కైతల మలిపంట పింగళి,
కాటూరి కవి యుగ్మకమ్ము దంట
ఒక్క కవుల జంట నొకరికి పుత్రుడు
నొక్కజంటలోనే యొకరి శిష్యు
డగుట రెండు జంటలందున మిగిలిన
తండ్రి, గురుని భక్తిదలతునెపుడు’
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షతలో రిటైరై, విజయవాడ ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమ ప్రయోక్తగా ఉంటూండిన మా గురువుగారు పింగళి లక్ష్మీకాంతం గారికి 1967 జనవరిలో, నూజివీడులో ఆయన శిష్య బృందం చేసిన సన్మానంలో నేను రచించి చదివిన పద్యాలలో ఒకటి ఇది.

నెం.7 అరుళమ్మాళ్ వీధిలో..
నెంబర్ 7 అరుళమ్మాళ్ వీధిలో కొమ్మూరి వారి ఇంట్లో ఉండగా ఒక సంఘటన జ్ఞాపకం ఉంచుకోవలసినది జరిగింది. నా హోల్డాల్‌కి బెల్ట్ ఉంది కానీ ఆ బెల్ట్‌కి తాళం కప్ప ఏదీ ఉండేది కాదు. నా హోల్డాల్‌లో నా డైరీ.. నేను వ్రాసుకునే దినచర్య పుస్తకం ఉండేది. సాముద్రిక పుస్తకం ఒకటి చదివి, నా చేతిలో రేఖలకి నేనే ఒక రీడింగు ఆ డైరీలో వ్రాసుకున్నాను.
‘నా 20వ ఏడు పూర్తయేసరికి నా చదువు పూర్తయిపోతుంది. మా నాన్నకి ఇష్టం లేని- ఒక అమ్మాయితో నాకు ప్రణయం ఏర్పడి, ఆమెను పెండ్లి చేసుకోడానికి నిశ్చయించడం, మా నాన్నగారితో అభిప్రాయ భేదానికి దారి తీస్తుంది’ అని వ్రాసుకున్నాను నా డైరీలో.
హోల్డాల్ తాళం లేకుండా ఓపెన్‌గా తెరిచే ఉండడం చేత కృష్ణశాస్ర్తీ గారు నా డైరీ తీసి చదివారు. ‘ఇలా డైరీలో నీ ఇష్టం వచ్చినట్లు వ్రాసేసుకుని, ఇలా నలుగురాడపిల్లలూ వచ్చిపోతూ ఉండే హాలులో- నీ హోల్డాల్‌లో ఆ డైరీ పెట్టుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడికి వచ్చే పిల్లలలో ఎవరినో ఆ పంక్తులు ఆకర్షించాలనేనా? ’అని అడుగుతూ నన్ను దబాయించాడు.
నాకు కళ్లవెంబడి నీళ్లతో గొంతులో డగ్గుత్తికావచ్చి ఆయనతో ఇలా అన్నాను. ‘నేను నా డైరీ నా సొంతానికి వ్రాసుకున్నాను గాని, ఏ అమ్మాయిల మనస్సునీ ఆకర్షించడానికి కాదు. మా నాన్న గారికి గాని, ఇంట్లో ఎవరికి గాని చెప్పని నా హృదయ రహస్యం నీకు చెబుతున్నాను ఇప్పుడు. మా నాగరాజు బావ చెల్లాయమ్మా అని, మీరు పాపా అనీ పిల్చుకొనే సుభద్రని నేనూ, నన్ను సుభద్రా ఒకరికొకరం కోరుకున్నాం. ఈ సంగతి మీకే మొదటిసారి చెబుతున్నా. మా నాన్నగారికి ఆ విషయం ఇష్టం లేని సంగతి.. అని చేప్పే సరికి ఆయన కూడా కళ్లనీళ్లు తుడుచుకుంటూ ‘మా పాపని గురించా వ్రాసుకున్నావు డైరీలో..’ అన్నారు.
జపాన్ బాంబు..
1942లో మద్రాస్ మీద జపాన్ వాడి బాంబు పడటంతో ఆంధ్రతీర ప్రాం తాల వరకూ వచ్చిన అనేకమంది మద్రాస్‌లో ఉంటున్న తెలుగువాళ్లు తమ తమ ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లిపోయారు. (తాత్కాలికంగా) నే నూ పిఠాపురం చేరాను. రేడియోలో వ్యవసాయదారుల కు లేఖలు వ్రాసి చదువుతూంటే గోపీచంద్‌గారు నన్ను చూడ్డానికని పిఠాపురం వచ్చారు. కాంట్రాక్టు పద్ధతిపై వచ్చే డబ్బు పెంచితే బాగుండుననిపించి ఆ కాంట్రాక్టు అయ్యేట్టు, కాలవ్యవధి పెంచుతూ ఆదేశం వచ్చింది. 1943 నాటికి నా నెల జీతం వందరూపాయలయింది. ఐతే ఆ జీతం తీసికోకుండానే రేడియోలో ప్రభుత్వ అధికారి పదవి వచ్చింది. నల్లటి ‘ఆచ్‌ఖాన్’ కోటు (షేర్వానీ) సంపాదించి ఇంటర్వ్యూకి వెళ్లి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ఆగస్టు 15న సెలెక్ట్ అయ్యాను. నాలాగే వైఎస్ రావు (శ్రీవాత్సవ), ఎస్‌వి సుబ్బారావు (బుచ్చిబాబు)లకూ ఇటువంటి అపాయింట్‌మెంటు లభించింది. మొత్తం 10 మందిమి ఉద్యోగులమయ్యాము. 1944 మే 8న ఉద్యోగంలో చేరాను. ఎటొచ్చీ ఆ ‘వంద’ తీసికోలేదనే బెంగ ఉండిపోయింది. అయితే 175 రూపాయల జీతం! రేడియోలో అధికారిగా సోమవారం, బుధవారం పదిహేను నిమిషాలు, నెలకో గంట నాటకం, ప్రత్యేక హాస్యవల్లరి, చిత్రమయ జగత్, రోజూ గ్రామీణ కార్యక్రమం సరేసరి. వీటిని తయారు చేయడం నా పని. ఒకసారి ‘పాఠశాల సమయం’ కూడా నిర్వహించవలసి వచ్చింది.
‘ఇంట నుండ నేల…ఇటువంటి సందె వేళ
విహరింపగ రావేల రావేల..’- అంటూ పాటలు, ఇంటర్య్యూలు సాగేవి.
కృష్ణశాస్ర్తీ రాస్తే నేను ఆయన పాట పాడటం లేక నేనే రాసి ట్యూన్ చేసుకోవడం జరిగేది. ‘మీ పాపకు ఓ పాట’ అని నేరాసిన పాట ట్యూన్‌లతో కార్యక్రమం కన్నమ్మ గారి ఆధ్వర్యంలో సాగేది. ఇది వారానికి రెండు సార్లు ప్రసారం అయ్యేది. ఆటవిడుపు అనే కార్యక్రమం కోసం ‘రారే చిన్న పిల్లలార’ అంటూ టెడ్డీబేర్స్ పిక్నిక్ ట్యూన్‌లో సాగించి పాడించాను. ఈ పిల్లల కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు బాపు, ముళ్లపూడి రమణలు! అలా వారానికో పిల్లల బృందం పాల్గొనేది. నెలకోసారి జానపద గీతాల కార్యక్రమం ఏర్పాటు చేసి అరుదైన పాటలు సేకరించి ప్రసారం చేశాను. నన్ను పెంచిన మా అమ్మమ్మ దగ్గర పాత మంగళ గీతాలు సేకరించాను. అవి ప్రసారం అయితే విని సంతోషించారు మా అమ్మమ్మ. చుట్టూ చేరే పిల్లల్ని మా మనవడు నా పాటలు వినిపిస్తున్నాడంటూ వాళ్లకి పిఠాపురం పార్కులో రేడియో వినేలా చేసేదావిడ. నేను కాకినాడ నుంచి కలకత్తా- మద్రాస్‌కి కలిపే రైలు ఎక్కాను. సామర్లకోటకు మా నాన్నగారు వచ్చి సాగనంపారు. అలా మద్రాస్ తిరిగి చేరాను. అక్కడ రాయపేటలో నా కోసం ఓ రెండుగదుల మేడ ఇల్లు కుదిర్చారు దుర్గాబాయి గారూ మా అన్నయ్యానూ.
*

చిత్రం.. రజనీ 2012లో ‘ఆత్మకథా విభావరి’ పేరిట తన జీవిత విశేషాలను భావితరాల కోసం అందించారు. ఆ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలు యథాతథంగా…

శతవర్ష సౌందర్యగీతం వాణీ పుత్రుడు

  • -కె.బి.గోపాలం
  • 31/01/2015
TAGS:

‘కవి రాజహంస’ బాలాంత్రపు వేంకటరావు, వేంకట రమణమ్మ దంపతులకు 1920 జనవరి 29న నిడదవోలులో జన్మించిన రజనీ కాంతరావు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పాఠశాల విద్య పూర్తి చేశారు. కాకినాడ పిఆర్ కళాశాలలో హైస్కూల్ విద్య ముగించి, 1940లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బిఎ (ఆనర్స్) పూర్తి చేశారు. 1941లో ‘ఆకాశవాణి’ మద్రాసు కేంద్రంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1947 ఆగస్టు 15న తొలి స్వాతంత్య్ర దినం సందర్భంగా ‘మాదీ స్వతంత్ర దేశం’ గీతాన్ని ప్రముఖ గాయని టంగుటూరి సూర్యకుమారిచేత రేడియోలో పాడించిన ఘనత రజనీదే. విజయవాడ ఆకాశవాణిలో బాధ్యతలు చేపట్టాక ‘్భక్తిరంజని’ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అహ్మదాబాద్, విజయవాడల్లో స్టేషన్ డైరెక్టర్‌గా పనిచేసి అదే హోదాలో బెంగళూరులో పదవీ విరమణ చేశారు. ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలాన్ని రేడియోలో ఇంటర్వ్యూ చేసిన ఖ్యాతి రజనీకే దక్కింది. రేడియోలో అన్నమయ్య కీర్తనలను పరిచయం చేసిన గొప్పదనం ఆయనదే. సినీ రంగంలో కొన్నాళ్లు పనిచేశాక ఆకాశవాణి ద్వారా లలిత సంగీతానికి ఎనలేని కృషి చేశారు. భావకవి దేవులపల్లి చేత రేడియో కోసం మూడు యక్షగానాలను రాయించి ప్రసారం చేశారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం శాఖలో, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర కళాపీఠంలో సేవలందించారు. స్వరకర్తగానే కాదు, ఎనె్నన్నో లలిత గీతాలు, నృత్య రూపకాలు రచించి సాహితీ రంగానికీ వనె్న తెచ్చారు. 1961లో కేంద్ర సాహిత్య అవార్డును, 1981లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌ను, 2000లో ‘అప్పాజోస్యుల విష్ణ్భుట్ల ఫౌండేషన్’ (అమెరికా) పురస్కారాన్ని అందుకున్నారు.

రజనీకి నూరేళ్లు వచ్చాయని పండగ చేస్తున్నారు. వందేళ్లకు సంబంధించి లెక్క మనకు అవసరం లేదు. పండగ చేస్తున్నారంటే మాత్రం చాలా బాగుంది. ఒక వ్యక్తి అంతకాలం జీవించారంటేనే పండగ చేయాలి. ఆ వ్యక్తి గొప్పగా బతికి ప్రపంచానికి సంతోషం పంచిన వారయితే పండగ మరింత ఘనంగా చేయాలి. అదే జరుగుతున్నది. నాకు తెలిసి రజని ఈ సంగతులేవీ పట్టించుకోరు. అమాయకంగా తన ప్రపంచంలో తాను ఉంటారు.
ఇంతకు, ఎవరీ రజని అనే అడిగేవాళ్లుంటారేమో? ఆయన పేరు బాలాంత్రపు రజనీకాంతరావు! ఆయన వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరయిన బాలాంత్రపు వెంకటరావుగారి కుమారుడు. తండ్రి గొప్పవాడని ఇవాళ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొడుకు ఆయనంత గొప్పవాడూనూ. రజని గాయకుడు, గీత రచయిత, సంగీతకారుడు, సాహిత్యవేత్త, పరిశోధకుడు, ప్రయోక్త, ప్రయోగాలకు పెట్టింది పేరు. లలిత సంగీతం, లలిత శాస్ర్తియ సంగీతం విన్న, వినేవాళ్లకు ఆయన దేవుడే!
‘ఓహోహో.. పావురమా’ అని ఒక పాత పాట ఉంటుంది. అది ఈనాటికీ అందరూ ఇష్టంగా వింటూ ఉంటారు. అంటే అంత హిట్‌సాంగ్ అన్నమాట. చిత్రమేమంటే ఆ పాట రాసింది తానేనని రజని అని ఎక్కడా చెప్పరు. రికార్డుమీద నాటికీ, నేటికీ ఆయన పేరు లేదు. అదేమిటని అడిగితే అందంగా నవ్వుతాడు ముసలాయన! ఆయనను ముసలాయన అంటే పొరపాటు, పొరపాటున్నర! ఆమధ్యన ఒక కుటుంబ కార్యక్రమంలో చూస్తే రజని ముందువరుసలో ఉన్నాడు. అరవయి ఏళ్లు వస్తే ‘అస్తావిస్తు’ అని ఒక మాట ఉందని తెలుసు! వెళ్లి అనుమానంగా నమస్కారం చేసి, పేరు చెప్పుకుని, ‘గుర్తున్నానా?’ అని అడిగాను. ‘అదేమిటి గోపాల్! మనం ఎన్ని సంగతులు చర్చించుకున్నాం? ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం! ఆ ధృవుడు, 26 వేల సంవత్సరాల సంగతి నాకు ఇంకా గుర్తుంది!’ అంటూ సులభంగా కబుర్లలోకి దిగాడాయన. అక్కడ కనిపించకుండా జాగ్రత్తపడ్డాను కానీ, బిత్తరపోవడం నా వంతయింది! అదీ- రజని అంటే!
ప్రఖ్యాత నర్తకి శోభానాయుడు బృందం కొరకు ‘కళ్యాణ శ్రీనివాసం’ అని కొత్త ‘బాలే’ రాయించాలి. ననే్న రాయమన్నారు. నేను జంకాను. ‘రజని చేత రాయిద్దాం’ అన్నాను. నేను రాస్తానన్న నమ్మకంతోనో, మరో కారణంగానో, సంగీత దర్శకుడుగా కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావుగారిని నిర్ణయించి, ఆయనకు చెప్పేశారు కూడా. రజని రెండు వేపులా వాడిగల కత్తి మరి! పాట రాస్తుంటే, రాగం, వరుస కూడా అక్కడే సెటిల్ చేసేస్తాడు. రచన చేయడానికి ఒప్పుకున్నాడు. అందుకని టెంపొరరీగా కూచిపూడి అకాడమీలోనే ఉన్నాడు కూడా. నేనెంత అదృష్టవంతుడినో మరి. నిత్యం ఆయన దగ్గరకు పోవాలి. ఆనాడు రాసిన భాగం వినాలి. దాని గురించి చర్చించాలి. అవసరాలు వినిపించాలి. అది నా పని! రచన ఎంత గొప్పగా వచ్చిందో నేను చెప్పనవసరం లేదు. కానీ, పెద్దాయన ‘దక్షిణానిలాలు’ అంటూ ఫలానా రాగంలో పాట అంటూ ఏకంగా పాడడం ప్రారంభించాడు. ‘అయ్యా! అక్షరాలు మాత్రమే మన వంతు! రాగం సంగతి మరెవరికో అప్పగించారు’ అని మెత్తగా ప్రతినిత్యం గుర్తుచేయవలసి వచ్చేది. మహానుభావుడు గనుక, ఆయన ఏనాడూ నొచ్చుకోలేదు. ‘కదూ!’ అని ముందుకు సాగాడు. ఆ నృత్య నాటిక ఎంత బాగా వచ్చిందో, చూచినవాళ్ళు చెప్పుదురుగాక!
కొందరు కారణజన్ములుంటారు. రజని అలాంటివాడేనని గట్టి నమ్మకం. రజని పుట్టి రెండేళ్లు నిండకముందే అమ్మ చనిపోయింది. మహాకవి, పండితుడయిన తండ్రి ఈ బిడ్డను చంకనెత్తుకుని అన్నీ తానే అయ్యి పెంచాడు. గోరుముద్దలతోపాటు పద్యాలు తినిపించాడు. జోలపాటలతో బాటు సాహిత్యం తలకెక్కించాడు. అమ్మ ఏదీ? అని బిడ్డ అడిగితే, చుక్కల్లో ఉంది అని చెప్పేవారట ఆయన. అమ్మ పాడేది అని ‘నల్లనల్లని వాడే, నగుమోము వాడే’ అనే పాట వినిపించేవారట. రజనికి మేనత్తగారయిన నరసమ్మగారు అప్పట్లో ఒక మహిళా పత్రికకు సంపాదకురాలు. ఆమె బోధన కూడా జతకలిసి ‘నా మనసులో భక్తిరంజని ఆనాడే మొదలయింది’ అంటాడు రజని. ఆయన రాసిన పాట ‘శతపత్ర సుందరి’ ఇప్పటివాళ్ళు విన్నారో లేదో తెలియదు. నిండా సంస్కృతం. వింత నడక. పాట బాగుంది అనిపించింది గానీ, నిజం చెప్పాలంటే, కుర్రవాడయిన నాకు అర్థం కాలేదు. అది సరస్వతి అమ్మవారి గురించిన పాట అని తరువాత తెలిసింది. అంత జిగిపాకంగా పాటలు రాసి, వరుసలు కట్టిన రజని ‘బురదలోన పంది’ అంటూ సరదాగా నడిచే పిల్లల పాటలు కూడా రాశాడంటే ఆశ్చర్యం. ఆయనలోని వస్తు విస్తృతి గొప్పది!
రజనితో నాకు ఇంచుమించు స్నేహం కలిసిందంటే భుజాలు పొంగిపోతాయి. దేశాలం లేక దేవసాలగం అనే రాగం గురించి పరిశోధన చేస్తున్నాడాయన. ఫోన్‌లో నాకు ఆ రాగం, పాట వినిపించడం ఇంకా గుర్తుంది. ‘పొడిచెనదే శుక్రతార’ అంటూ గాంధీ గురించి రాసిన పాటను ఆ రాగంలోనే మలిచాడని గుర్తు! ధృవనక్షత్రం గురించి పరిశోధన చేసి ‘తూబన్’ అనే మధ్యప్రాచ్య పాత్ర ధృవుడేనని రజని చెప్పాడు. నాకు అర్థమయిన ఆస్ట్రానమీ సంగతులు, అతనికి అర్థమయే పద్ధతిలో చెప్పినట్టున్నాను. 26 వేల సంవత్సరాలు అని భాగవతంలో రెఫరెన్సు దొరికింది అంటూ ఆ విషయంగా తాను నాకు ఉత్తరం రాయడం గుర్తుంది. రజని చాలా గొప్ప పనులు, రచనలు చేశాడు. కానీ, అవి గొప్పవని ఆయన ఎన్నడూ అనుకోలేదు.
రజనీకాంతరావుగారు రేడియోలో స్టేషన్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేశాడు. పదవి నిర్వహించడమంటే ఆర్కెస్ట్రా, వాద్యగోష్ఠి నిర్వహించడం లాంటిదే. రకరకాల వారుంటారు. అందరినీ కలుపుతూ చక్కని రచన సృష్టించాలి, అన్నారాయన ఒకచోట. అక్కడా సంగీతమే తోచింది, ఆయనకు!
విజయవాడ రేడియోలో వీళ్లంతా ఉన్నకాలం.. అన్ని రకాలూ స్వర్ణయుగం. రజని ‘కొండనుంచి కడలిదాకా’ అని సంగీత రూపకం ప్రొడ్యూస్ చేశాడు. దానికి ఎనె్నన్నో బహుమతులు వచ్చాయి. అంతర్జాతీయంగా కూడా! గోదావరి పుష్కరాలొస్తున్నాయి. ఈ రూపకాన్ని తిరిగి పైకి తీస్తే బాగుంటుంది.
‘మనసవునే ఓ రాధా!’ అని ఒక పాట. ఆ కాలంలో శాస్ర్తియ గాయకులంతా లలిత సంగీతం కూడా పాడేవారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వోలేటి వేంకటేశ్వర్లు, యం.వి.రమణమూర్తి అందరూ ఈ పాట పాడారనుకుంటాను. ఘంటసాల కూడా పాడారేమో? రజని పాటలను గురించి వరుసగా చెపుతూ పోతే, ఎంతయినా, ఎంతకాలమయినా చెప్పవచ్చు. 1938లో తాను చదువుకుంటున్నప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏదో ప్రత్యేక సందర్భం వచ్చింది. జాతీయ గీతాలతో బాటు ఒక తెలుగు పాట ఉండాలని పెద్దలు నిర్ణయించారు. రజని చేత ‘పసిడి మెరుంగుల’ అనే పాట రాయించారు. తరువాత ఆ పాట రేడియోలో వచ్చేది. ఆడ, మగ జంట గొంతుకల్లో సాగుతుందది. అది తెలుగుదనం గురించిన పాట. బాగుంటుంది.
రజని కబుర్ల సందర్భంలో ఎన్నో సంగతులు చెప్పారు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ తాను కలిసి ‘కృష్ణరజని’ అనే పేరుతో కొంతకాలం రచనలు చేశారు. అది చాలా మందికి తెలుసు. రేడియోలో (హైదరాబాద్) విప్రనారాయణ నాటకం షెడ్యూల్ చేశారు. అప్పట్లో అంతా నిజంగానే హాట్‌కేక్స్. కొన్ని అప్పటికప్పుడు వినిపించే కార్యక్రమాలయితే, కొన్ని, కేవలం కొన్ని గంటలు ముందు మాత్రమే రికార్డ్ అవుతాయి. కృష్ణశాస్ర్తీగారికి బద్ధకమని అందరికీ తెలుసు. ముంచుకుపోతున్నా రాయరు. చివరి క్షణాన రాసినదయినా రచన బ్రహ్మాండంగా వస్తుంది. విప్రనారాయణ అలాగే రాశారట. అయినా నిడివి తగ్గింది. రజని కూడా ఒక చేయి వేశారు. ‘కొలువయితివా రంగశాయి’ అన్న పాట ఇంచుమించు రజని రచన. నాటకంలోనూ, నేటికీ కృష్ణశాస్ర్తీ రచనగానే అందరికీ తెలుసది. సినిమాలో కూడా వాడుకున్నారు. (ఈ సంగతి చెప్పి నేను తప్పు చేస్తున్నానా? రజని చెప్పాలి!)
రవీంద్రుని రచనలను తెలుగువారికి పరియం చేసిన ఘనత రజనిదే. రవీంద్రుడు స్వయంగా చేసుకున్న వరుసల్లోనే తెలుగులో అనువాదగీతాలు రాసి తెలుగువారికి వినిపించాడాయన. ‘వని వికసించెనదే, పక్షీ ఏలా రాదు’ అని ఒక పాట. ఒకప్పుడు రేడియోవాళ్లు రవీంద్రభారతిలో కార్యక్రమం పెట్టారు. ఒక బెంగాలీ గాయకుడు అసలు పాట పాడిన తరువాత చిత్తరంజన్ తెలుగు వర్షన్ పాడారు. నాకు తెలుగే నచ్చింది. రవీంద్ర సంగీత్ గురించి రజని స్వయంగా పాడుతూ, వివరించిన రేడియో రూపకాన్ని ‘లోకాభిరామం’ అనే నా బ్లాగులో పదుగురితో పంచుకున్నాను. ‘ఎవరూ కేక విని రాకపోయినా, ఒకడినె పదవోయ్’ అని మరో పాట. ‘యాక్లచలో’ అనే బెంగాలీ మూలగీతాన్ని దేశంలోని పిల్లలందరికీ నేర్పించారు.
రజనికి మధ్యప్రాచ్య సంగీతమూ, సూఫీ తత్వము బాగా వంటబట్టాయి. మీరాబాయి, సూర్‌దాసులను మించిన సూఫీలు ఎవరూ లేరు అని తాను అనడం గుర్తుంది. ‘అతిథి శాల’ అనే రేడియో సంగీతరూపకం, ఆయనే సిద్ధం చేశారు. ‘మేలి జలతార్ బుటాలల్లిని నీలివలయం ఈ గుడారం!’ ఎంత బాగుంటుందో పాట!
రజనీ ‘్భవ తరంగాలు’ అనే వీక్లీ కాలం ద్వారా తమ అనుభవాలను, ఆలోచనలను పాఠకులతో పంచుకున్నారు. అది మన అదృష్టం. ఆ పుస్తకం చదివితే ఎవరికయినా ఆశ్చర్యం కలుగుతుంది. ఉద్యోగంలో చేరకుండా రజని, సినిమా రంగంలోనూ, కవి, గాయకుడు, సంగీతస్రష్ఠగా మిగిలి ఉంటే ఎట్లా ఉండేదో? ఆయన అనుభవాలు, ఆలోచనలు కొంతవరకయినా, అక్షర రూపంలో మనకు ఇచ్చాడు. ఇప్పుడా శత వర్ష సుందరుడు, యింకా ఏమయినా చెప్పగలడా? పాడగలడా? మొన్నమొన్నటిదాకా పాడినట్లే గుర్తు. రజని పాటలను, మాటలను సేకరించాలి మరి! వాళ్ల అబ్బాయి రామచంద్ర చక్కగా పాడతాడు. అచ్చంగా తండ్రిలాగే పాడతాడు. పాడి ఒక సీడీ చేశాడు కూడా. అతను చేతనయినన్ని పాటలు రికార్డ్ చేస్తాడని ఆశిస్తే ఆశ కాదు!
రజని వంటి గొప్ప మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయ్యా.. రజనీ గారూ! మీరిలాగే మరింతకాలం హాయిగా పాడుతూ బతకండి! మాలాంటి వాళ్లను ఆశీర్వదించండి! మరిన్ని పండగలు, పాటలు అందించండి! శతశతం జీవేమ శరదస్సువీరాః!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సభల వైభోగం


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికన్ వేదం వల్లించిన శ్రీ అరవింద రావు —– కోరిక — జిడ్డు కృష్ణ మూర్తి –

అమెరికన్ వేదం
ఈ శీర్షిక మనకు ఆశ్చర్యాన్ని కలిగించేదే. అయినా ఇటీవలే ఒక అమెరికన్‌ రచయిత రాసిన పుస్తకమిది. పేరు అమెరికన్‌ వేదం. ఈ పుస్తక రచయిత ఫిలిప్‌ గోల్డ్‌ బర్గ్‌ సుమారు సంవత్సరం క్రితం ఉస్మానియా యూనివర్శిటీలో తన పుస్తకం గురించి ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా వచ్చారు. వేదికపై ఉన్న నేను కూడా ఈ పుస్తకం గూర్చి మాట్లాడాను.
ఈ పుస్తకం 18వ శతాబ్దం మొదలుగా యూరోపియన్లు మన దేశ సంస్కృతిని ఎలా అధ్యయనం చేశారు, వారి భాషల్లోకి ఎలా అనువాదాలు చేశారు. వాటి ప్రభావం ఆ దేశాల మేధావులపై ఎలా పడింది అన్న విషయం చాలా వివరంగా చెబుతుంది. యూరప్‌ నుంచి అమెరికాకు వెళ్ళిన ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధగ్రంథాలు, పతంజలి యోగ సూత్రాలు ముఖ్యంగా అమెరికన్‌ మేధావుల్ని ఆకట్టుకున్నాయి. వివేకానందుడు అమెరికాకు వెళ్లకముందే అమెరికాలోని మహామహులు- ఎమర్సన్‌ లాంటి వేదాంతులు, థోరో, విట్‌మాన్‌ లాంటి రచయితలు, థామస్‌ జెఫర్సన్‌ లాంటి రాజనీతివేత్తలు వేదాంతాన్ని, భగవద్గీతను గూర్చి తెలుసుకున్నారని ఇందులో చూడగలం. ఎమర్సన్‌ను జ్ఞానయోగిగానూ, ఽథోరోను కర్మయోగిగానూ, విట్‌మాన్‌ను భక్తియోగిగానూ రచయిత ఈ పుస్తకంలో (పేజీ 42) వర్ణించాడు. విట్‌మాన్‌ రాసిన ‘‘””Leaves of Grass”’’ అనే పద్యసంకలనం భగవద్గీతను, భజనగీతాల్ని పోలి ఉందని చెప్పాడు రచయిత (పేజీలు 41-42). పై మహాకవి మరణించినపుడు భగవద్గీత ఆయన తలదిండు కింద కనిపించిందట. సత్యాన్ని గూర్చి తెలుసుకోవడానికి ఉపనిషత్తుల్ని మించిన పుస్తకాలు లేవనీ, అవి తనకు శాంతిని ఇచ్చిన గ్రంథాలనీ షోపెనార్‌ అనే జర్మన్‌ తత్త్వవేత్త చెప్పాడు. ఆయన రాసిన ‘‘ “”The World as Will And Idea”’’ అనే పుస్తకాన్ని మాండూక్య ఉపనిషత్తుతో పోల్చాడు అమెరికన్‌ వేదాంతి క్యాంప్‌బెల్‌(పేజీ 98).
వివేకానందుడు అమెరికాకు వెళ్ళడం మన సాంస్కృతిక చరిత్రలో ఒక గొప్ప సంఘటన. సర్వమత సమావేశంలో ఆయన మాట్లాడింది కేవలం ఉపనిషత్తులు. గీతలోని సారాంశం మాత్రమే. వైదిక సంస్కృతిలోని మూల సూత్రాలు మొట్టమొదటగా ఒక భారతీయుని ద్వారా ప్రపంచానికి బోధపడ్డాయి. ఆయన తర్వాత విదేశాలకు వెళ్ళిన గురువులందరూ కేవలం వేదాంతాన్నే చెప్పారు. సత్యం ఒక్కటే అనేక విధాలుగా దర్శింపబడింది అనే వేదాంత సూత్రం వారిని ప్రభావితం చేసింది. వేదాంతాన్ని, బౌద్ధ సిద్ధాంతాల్ని ఒక మతంగా కాకుండా తత్త్వశాస్త్రం, మానసిక శాస్త్రం దృష్టికోణంలో పాశ్చాత్యులు
చదివారు.
వివేకానందుడు అమెరికాకు వెళ్ళడం మన సాంస్కృతిక చరిత్రలో ఒక గొప్ప సంఘటన. సర్వమత సమావేశంలో ఆయన మాట్లాడింది కేవలం ఉపనిషత్తులు. గీతలోని సారాంశం మాత్రమే. వైదిక సంస్కృతిలోని మూల సూత్రాలు మొట్టమొదటగా ఒక భారతీయుని ద్వారా ప్రపంచానికి బోధపడ్డాయి. ఆయన తర్వాత విదేశాలకు వెళ్ళిన గురువులందరూ కేవలం వేదాంతాన్నే చెప్పారు. సత్యం ఒక్కటే అనేక విధాలుగా దర్శింపబడింది అనే వేదాంత సూత్రం వారిని ప్రభావితం చేసింది. వేదాంతాన్ని, బౌద్ధ సిద్ధాంతాల్ని ఒక మతంగా కాకుండా తత్త్వశాస్త్రం, మానసిక శాస్త్రం దృష్టికోణంలో పాశ్చాత్యులు చదివారు. ఆల్డస్‌ హక్స్‌ లీ అనే రచయిత జిడ్డు కృష్ణమూర్తి యొక్క గొప్ప స్నేహితుడు. ఆ ప్రభావంతో ‘‘The perennial Philosophy’’ అనే పుస్తకం రాశాడు. సనాతనధర్మం అనే మాటకు ఇంగ్లీషు అనువాదమే పై పేరు. ఈ పుస్తకంలో మొదటి అధ్యాయమే ‘‘That Art Thou’’, అంటే తత్త్వమసి అనే వేదాంతవాక్యం. ఛాందోగ్య ఉపనిషత్తులోని సంభాషణల్ని యథాతథంగా రచయిత అందులో ఉటంకించారు. ఈ పుస్తకంలో వివేకచూడామణి, భగవద్గీతల్లోని అనేక శ్లోకాలు, బౌద్ధుల లంకావతార అనే పుస్తకం నుండి వాక్యాలు అనేకాలు కనిపిస్తాయి.
భారతీయులు సృష్టికాలాన్ని లెక్కించిన విధానంపై కార్ల్‌ సేగన్‌ అనే ఖగోళశాస్త్రవేత్త ఆశ్చర్యం ప్రకటించారు. శాస్త్రవేత్తలు చెప్పే కాలపరిమితికి సరిగ్గా సరితూగుతుందని అన్నాడు. ‘‘it is the only religion in which the time scales correspond to those of modern scientific cosmology… its cycles run 8.64 billion years long’’ అన్నాడు.
అమెరికాలో ప్రారంభమైన దివ్యజ్ఞాన సమాజం (Theosophical society) అక్కడి మేధావులపై చాలా ప్రభావం చూపింది. ఆజ్చూఠ్చ్టిటజుడ రాసిన ‘‘The Secret Doctrine’’ అనే పుస్తకం ఉపనిషత్తుల్లోనూ, బౌద్ధ సిద్ధాంతంలోనూ ఉన్న సాధనా పద్ధతుల్ని తెలిపింది. అదే సమయంలో పరమహంస యోగానంద అనే గురువు చాలామంది మేధావుల్ని ప్రభావితం చేశాడు. ఆయన రాసిన ‘‘Autobiogrphy of a Yog’’ అనే పుస్తకం బెస్ట్‌ సెల్లర్‌గా మారింది.
మహర్షి మహే్‌షయోగి అమెరికన్‌ సంస్కృతిలో ఒక చరిత్ర సృష్టించాడని చెప్పవచ్చు. ఆయన శిష్యులు ప్రముఖ కళాకారులైన బీటిల్స్‌. యోగాన్ని, ధ్యానాన్నీ ఎక్కువ ప్రచారంలోకి తెచ్చిన వ్యక్తి మహే్‌షయోగి.
మానసికశాస్త్రం కూడా భారతీయ సంప్రదాయం నుండి చాలా నేర్చుకుంది. అమెరికన్‌ మానసికశాసా్త్రనికి తండ్రి అనబడే విలియమ్‌ జేమ్స్‌ వివేకానందుడికి గొప్ప అభిమాని. ఆయన ‘‘The Varieties of Religious Experience’’ అనే పుస్తకాన్ని రాశాడు. ‘‘Vedanta is the paragon of all monastic systems’’ అంటాడు విలియమ్‌ జేమ్స్‌(పేజీ79). ప్రముఖ మేధావులు Vedanta Society of America అనే సంస్థను స్థాపించారు. ప్రముఖ చరిత్రకారులు టాయిన్‌ బీ, విల్‌డ్యురాంట్‌ మొదలైనవారు ఇందులో ముఖ్యులు.
అమెరికాకూ, పాశ్చాత్య దేశాలకూ మొదట్లో వెళ్లిన గురువుల లాగా ఇటీవలి కాలంలో వెళ్తున్న భారతీయ స్వామీజీలు, పండితులు అంత ప్రభావవంతంగా లేరనే సత్యాన్ని రచయిత రాశాడు. ఇటీవల నియోవేదాంత అనే పేరిట చాలామంది అమెరికన్‌ రచయితలు వేదాంతాన్ని ఆధునిక భాషలో వివరించడం గమనించదగింది. పాశ్చాత్యులే వేదాంత ప్రవచనాలు కూడా చేస్తున్నారు. ఉదాహరణకు రిచర్డ్‌ అనే అమెరికన్‌ రాందాస్‌ అనే గురువుగా మారాడు. డేవిడ్‌ ఫ్రాలీ అనే అతను వామదేవశాసి్త్రగా మారాడు. రమణమహర్షి బోధనలతో ప్రభావితులైన ఎక్‌హార్ట్‌ టోలే మొదలైనవారు స్వతంత్రంగా ఎన్నో గ్రంథాలు రాశారు. ఎక్‌హార్ట్‌ టోలే పుస్తకాలలో వేదాంతాన్నే ఆధునిక భాషలో చెప్పాడంటాడు రచయిత. పాశ్చాత్యులు తమ మతగ్రంథాలనే కొత్తకోణంలో ఎలా వ్యాఖ్యానించాలి అనే మెళకువలు కూడా నేర్చుకున్నట్టుగా గోల్డ్‌ బర్గ్‌ చెప్పారు.
కొందరు స్వామీజీల బలహీనతలను కూడా రచయిత ఒక అధ్యాయంలో యదార్థ ధోరణిలో వివరించారు. స్వామీజీలు ముఖ్యంగా అమెరికన్‌ శిషురాండ్రతో శృతిమించి ప్రవర్తించడం ఆ సీ్త్రల భర్తలు ఈ గురువులపై కోర్టుల్లో కేసులు వేయడం మొదలైనవి దురదృష్టకరమైన పరిణామాలు. ఇవి పరమహంస యోగానందతోనే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కూడా ఒకరిద్దరు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు
చివరగా గోల్డ్‌ బర్గ్‌ ఇలా రాశారు- ‘‘Vedanta’s spirituality has never been more necessary. In an evershrinking world, pluralism and genuine respect for religious differences within a framework of underlying unity is a needed counterweight to the deadly forces of ethnocentrism’’ (పేజీ 345). అన్ని మతాల్నీ, సంస్కృతుల్నీ గౌరవించే సంస్కృతి భారతీయసంస్కృతి అంటూ ముగిస్తాడు రచయిత.
ఈ పుస్తకంపై రచయిత ప్రసంగాన్ని పాఠకులు యూట్యూబ్‌లో కూడా వినగలరు.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ

కోరికలు అణిచిపెడితే ప్రమాదమే!

మన దేశం ఈ ప్రపంచానికి అందించిన గొప్ప తత్వవేత్తల్లో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (1939-1945) అమెరికాలో నివసించిన కృష్ణమూర్తి- బహిరంగంగా ఎటువంటి ప్రకటనలు చేయకపోయినా-తన దగ్గరకు వచ్చిన వారికి మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. ఆ సంభాషణలన్నింటినీ ఇటీవల కృష్ణమూర్తి ఫౌండేషన్‌- ‘ద వరల్డ్‌ వితిన్‌’ అనే పేరిట ప్రచురించింది. దానిలోని ఒక ఆసక్తికరమైన భాగం..
బి నా దగ్గరకు వచ్చాడు. తాను సెక్స్‌ కోరికలకు బానిసనయిపోయానన్నాడు. ఈ కోరికలను తగ్గించుకోవటానికి రకరకాలుగా ప్రయత్నించానని అయినా లాభం లేకపోయిందని వాపోయాడు. అతను ఏం చేయాలి?
ఇంతకు ముందు మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. ప్రేమ ఒక లైంగిక ఉత్ర్పేరకం కాదు. ఒక ఆలోచన కూడా కాదు. మన బుద్ధి (ఇంటలెక్ట్‌) నుంచి పుట్టింది కూడా కాదు. నేను అనే భావన పూర్తిగా తొలగిపోయినప్పుడు కలిగే ఒక అనుభూతి. ఇది మనం ఒక పని చేసినందుకు వచ్చే ప్రతిఫలం కాదు. అది ఒక స్వయానుభూతి. జాలి, దయ, కరుణ, క్షమాగుణం మొదలైన భావాలు ఉన్నప్పుడే ఈ ప్రేమ కలుగుతుంది. ప్రేమ ఒక గొప్ప సృజనాత్మక శక్తి. ఈ శక్తి విడుదల కాకుండా సెక్స్‌ అనుభూతులు విడుదల అయితే అది మోయలేని బరువుగా, పెద్ద సమస్యగా మారుతుంది. అంతే కాదు ఈ సృజనాత్మక శక్తిని అర్థం చేసుకోకుండా సెక్స్‌ కోరికలను అణిచిపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. చాలాసార్లు ఈ కోరికలు మరింత శక్తిమంతంగా మారతాయి. అవి తమ రూపాన్ని మార్చుకొంటాయి. రకరకాల హింసాపద్ధతులకు, క్రూరత్వానికి కారణమవుతాయి. ఎవరైనా అమితమైన సెక్స్‌ కోరికల నుంచి బయటపడాలంటే- ముందు వారు ఆ కోరికల మూలాన్ని అర్థం చేసుకోవాలి. సెక్స్‌ కోరిక తలెత్తినప్పుడు- దానిని విశ్లేషించి వదిలేస్తే చాలదు. దాని ఆనుపానులను, ప్రయాణిస్తున్న మార్గాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నం పదే పదే చేస్తూ ఉండాలి. అప్పుడు అతనికి కోరికల మూలం తెలుస్తుంది. ఈ జ్ఞానం వచ్చినప్పుడు- సరైన మార్గం కూడా దానంతట అదే ఆవిష్కృతమవుతుంది. ‘నేను మాత్రమే’ అనే ఆలోచన నుంచి విముక్తి పొందుతాడు.
ప్రచురణ: కృష్ణమూర్తి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా
ధర: రూ. 295 పేజీలు: 234
ప్రతులు: అన్ని ప్రముఖ పుస్తక షాపుల్లో లభ్యమవుతాయి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్టూన్ అంటే కవ్వింత నవ్వింత

కార్టూన్ అంటే కవ్వింత నవ్వింత

వ్యంగ్య చిత్రాలను నాలుగు దశాబ్దాలుగా వేస్తూ నవ్వులు పువ్వులు పూయిస్తున్న ఏకైక తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు రాగతి పండరి. మొక్కవోని ధైర్యంతో, జీవితాన్ని ఓ సవాలుగా తీసుకుని వేలాది కార్టూన్లు సృష్టించిన అలుపెరుగని ఆ నవ్వుల రారాణి గురువారం మరణించారు. గతంలో
ఆమె నవ్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలు.. 
1965 జూలై 22 న నేను పుట్టాను. పుట్టిన యేడాదికే పోలియో బారన పడటం, ఆ తర్వాత రెండేళ్ళకు నాన్నగారి మరణం నా చిన్ననాట జరిగిన రెండు విషాదాలు. నాన్న నాకు పెట్టిన పేరు పండరీబాయి. ఇంట్లో అందరూ నన్ను ‘చిట్టి’ అని పిలుస్తారు.ఆరేళ్ళ వయసులో నా కాళ్ళకు శస్త్ర చికిత్స జరిగింది. ఆరునెలల్లో కాలీపర్స్‌ సాయంతో ఇంట్లోనే నడవడం, ట్యూషన్స్‌ ద్వారా చదవడం ప్రారంభించాను. తోబుట్టువులు బడికి వెళ్ళిపోతే ఇంట్లో అమ్మా నేనూ మిగిలేవాళ్ళం. వంటయ్యాక అమ్మ కథలు చదివి వినిపించేది. తీరిక వేళల్లో రెండో అక్క చదువు చెప్పేది. ఆ రోజుల్లోనే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ తదితర పత్రికలు చూసే దాన్ని. వాటిల్లో ఎక్కువగా జయదేవ్‌ గారి కార్టూన్లు నన్ను ఆకర్షించేవి. అప్పుడే, నేనూ కార్టూన్లు వేసి పదిమందినీ నవ్వించాలన్న కోరిక పుట్టింది.
ఎనిమిదేళ్ళ వయసుకే తొలి కార్టూను
వచ్చీరాని ఊహలతో వంకర టింకర బొమ్మలతో చిత్తుకాగితాల మీద జయదేవ్‌ గారిని అనుకరిస్తూ బొమ్మలు వేసేదాన్ని. వాటిల్లో నాకు నచ్చిన వాటిని డ్రాయింగ్‌ పేపర్‌ ముక్కల మీద ఇండియన్‌ ఇంక్‌ తో వేసి పత్రికలకు పంపేదాన్ని. చాలా కార్టూన్లు తిరిగి వచ్చేవి. అలా పంపగా, పంపగా ఆంధ్రజ్యోతి వీక్లీ లో నా తొలి కార్టూను అచ్చయింది. అప్పటికి నా వయసు ఎనిమిదేళ్ళు.
నా కార్టూనుకు ఆంధ్రజ్యోతి వీక్లీ వారు పంపిన పారితోషికం నాలుగు రూపాయలు. అదే నా తొలి పారితోషికం. పోస్టుమేన్‌ రిసీవ్డ్‌ ఫోర్‌ రూపీస్‌ అని రాసి సంతకం పెట్టమన్నాడు. కార్టూను పడితే పత్రికల వాళ్ళు డబ్బులు పంపుతారని నాకు అప్పటికి తెలియదు. ఆ సంతోషంతో రిసీవ్డ్‌ ఫోర్‌ హండ్రెడ్‌ రూపీస్‌ అని రాశాను. పోస్ట్‌మేన్‌ కోపంతో అది కొట్టించేసి మళ్ళీ సరిగ్గా రాయించాడు. అదే నా మొదటి ధర్మార్జితం. ఆ సంఘటన ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాకు నవ్వు ఆగదు. ఒళ్ళు పులకరిస్తుంది.
ప్రతిభా సత్కారం
కళాకారులకు అవార్డులు అందుకునేటప్పుడు మధురానుభూతులు కలగడం సహజం. అలాంటి సందర్భం నాకు 1991 గణతంత్ర దినోత్సవం నాడు వచ్చింది. మైదానంలో పోలీసు విన్యాసాలు, పతాక ఆవిష్కరణ తర్వాత ప్రతిభా పురస్కారం అందుకునేందుకు క్రచర్స్‌ తో నడిచి వెళ్తుంటే అందరి చూపులూ నా మీదే. ‘ఈ అమ్మాయా రాగతి పండరి, పత్రికల్లో నవ్వించే ఈమె ఈ స్థితిలో ఉందా?’ అనే మాటలు ప్రేక్షకుల నుండి వినిపించాయి. ఆ సానుభూతి చాలా ఇబ్బందిగా అనిపించింది. మొదటిసారిగా తెలుగు కార్టూనిస్టులను మన ప్రభుత్వం గుర్తించింది. 2009 వ సంవత్సరంలో రాష్ట్ర సాంస్కృతిక మండలి కళారత్న (హంస) పురస్కారానికి తొట్టతొలిగా నన్నే ఎంపిక చేసింది. ఇది కార్టూనిస్టుల అందరి విజయం.
(అ)మృత దేహ దానం
నా మరణానంతరం నా పార్థివ దేహాన్ని ఆంధ్రప్రదేశ్‌ బాడీ డోనర్స్‌ అసోసియేషన్‌కు చెందేలా దానం చేశాను. శ్రీమతి గూడూరు సీతామహాలక్షి ్మగారి ఆధ్యర్యంలో సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఈ అసోసియేషన్‌ను నిర్వహిస్తోంది. మాస్టారు అవసరాల రామకృష్ణారావుగారు ఇందుకు స్ఫూర్తి. కనిపించే దేవుళ్ళు వైద్యులు. వారి ద్వారా ఏ కొందరికైనా నా పార్థివ దేహం ఉపయోగపడితే నా జన్మ సార్థకం అవుతుంది. ఈ నిర్ణయానికి తమ అంగీకారాన్ని తెలియజేసి సంతకం చేసిన నా కుటుంబ సభ్యులకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలను? ఆనంద బాష్పాలు తప్ప…
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు అమలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ ఇంటూ కేజ్రీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లిజెండ్ కు సెండాఫ్ –


 
 


 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాంగ్రెస్ శూన్య హస్తం -కేసి అర్ కొత్త భాష్యం

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ సారి శ్రీరామ నవమి ఎక్కడ?

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీశైల, అమరావతి బెజవాదలలో స్వాముల రధ యాత్ర

 


 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అకలంక దేశ భక్తుడు గోపాల కృష్ణ గోఖలే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –

146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad)

జననం –విద్య-

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కోడి తాడిపర్రు జమ్మల మడక వారి ఆగ్రహం . అందులో జమ్మల మడక వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి హనుమాయమ్మ  దంపతులకు మాధవ రామ శర్మ గారు 13-4- 1907 న జన్మించారు .తాతగారు రామయ్య గారి దగ్గరే వెలి బూడిద లో అక్షరాలు  దిద్దారు .తల్లిదగ్గర పన్నెండో ఏడు వచ్చేదాకా పాలు తాగారు .అదే తన కంఠ స్వర వరం అన్నారు .ఉపనయనం తర్వాత తాతగారి వద్దే సహస్ర గాయత్రి జపించి రామ హృదయం నేర్చారు .తండ్రి ‘’తాడి పర్రు శాస్త్రులుగా ,సాహితీ చక్రవర్తులు’’ గా పేరుపొందారు .వీరివద్ద సంస్కృతం అధ్యయనం చేసి పొలం పనులు చేయటం  అలవాటు చేసుకొన్నారు .ఇసుకలో చెడుగుడు ఆడుతుంటే ‘’స్పటిక వినాయకుడు ‘’దొరికితే బుద్ధి మార్చుకొని  చదువు పై  శ్రద్ధ వహించారు .దీన్ని తర్వాత పూజా మందిరం లో ప్రతిష్టించి నిత్యార్చన చేసేవారు .పాలేళ్ళకు పూరిపాకలో ఆముద దీపాల వెలుగులో చదువు నేర్పేవారు .

ఇంగ్లీష్ నేర్వడం –చదువు కు స్వస్తి –అధ్యయన అధ్యాపనం

మొదటి ప్రపంచ యుద్ధం అయిపోగానే తురుమెళ్ళ జార్జి కరోనేషన్ స్కూల్ లో మూడవ తరగతి చదివి ఇంగ్లీష్అక్షరాలూ నేర్చుకొన్నారు .స్కూలులో  నాటకంలో ‘’ఉపానందుడు’’ పాత్ర ధరించి మద్రాస్ మంత్రి పాత్రో చేతులమీదుగా సిరా బుడ్డి ,పుస్తకం బహుమానం గా పొందారు .లెక్కలలో పూజ్యం .తిలక్ మరణం తో విద్యార్ధుల సమ్మే జరిగి చదువుకు స్వస్తి చెప్పారు .తాతగారి దగ్గర ఒంటరిగా కావ్యాలు గ్రంధాలు నేర్చారు .అలంకార శాస్త్రాలన్నీ కరతలామలకలై నాయి .వాటిలోని పద్యాలూ శ్లోకాలు అన్నీ  కంఠతా వచ్చేశాయి .పుస్తకం అక్కరలేక పోయేది .తెనాలి సంస్కృత కళాశాల న్యాయ శాస్త్రాధ్యాపకులు శ్రీ కురుగంటి శ్రీ రామ మూర్తి గారు మాధవ రామ శర్మగారి వద్ద తర్క ప్రకరణ గ్రంధాలు చదివారు అంటే వీరి విద్వత్ యెంత గొప్పదో తెలుస్తోంది .కాశీ విద్యాకేంద్రం అని తెలిసి అక్కడ చదవాలని ఎవరికీ చెప్పకుండా వెళ్లి దశాశ్వ మేధ ఘాట్ లో సావిత్రీ జపం చేశారు .కాని తలిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళారు .ఇలా కాశీ చదువు సాగలేదు .

భావ వేగి

భావ వేగి అయిన శర్మగారు ఇంటి పట్టున ఉండక విద్యాకేంద్రం విజయ నగరం  తాతా సుబ్బారాయ శాస్త్రి గారనే రాయడు శాస్త్రి గారి వద్ద శాస్త్రాలు నేర్వాలని వెళ్లి రాజా గారి సంస్కృత కళాశాలలో చేరి ‘’సాహిత్య విద్యా ప్రవీణ ‘’చదివి ఉత్తీర్ణులై ,తర్కం నేర్వాలనుకోన్నరుకాని సాహిత్యం అభ్యసించారు. రాయడు శాస్త్రి గారి అంతేవాసులై సకల శాస్త్రాలు నేర్చేశారు .రామ శాస్త్రి గారి వద్ద తర్కం ,గంటి సూర్య నారాయణ శాస్త్రి గారి దగ్గర మీ మాంస ,రామానుజ చార్యుల వద్ద శాస్త్ర దీపిక  నౌడూరి వెంకట శాస్త్రి ,కంభం పాటి రామ శాస్త్రి గారి నుండి వ్యాకరణం నేర్చారు .అలంకార కౌస్తుభం ,వక్రోక్తి జీవితం ,అభినవ భారతి పై పట్టుసాధిం చారు .రాయడు శాస్త్రి గారి వద్ద ఉన్నప్పుడే మాధవ రామ శర్మ మాధవ ‘’రాయ’’ శర్మ అయ్యారు .

ఉద్యోగం

జీతం తీసుకోకుండా పన్నెండేళ్ళు తెనాలి సంస్కృత కళాశాలలో సాహిత్యాలంకార భాష శాస్త్ర అధ్యాపడుగా ,ఉపాధ్యక్షుడు ,ప్రిన్సిపాల్ గా సేవలందించిన మహోన్నత మూర్తి .ఈ బోధన వల్లనే తనకు గ్రంధాలు రాసే భావ వ్యూహం కలిగిందన్నారు .తర్వాత నెల్లూరు వేదం సంస్కృత కళాశాలలో ‘’సర్వాధ్యక్షులు ‘’గా పని చేశారు .పిమ్మట గుంటూరు  క్రైస్తవ కళాశాలలో సంస్కృతాంధ్ర  భాషాధ్యాపకుడుగా ఉన్నారు .అక్కడ రిటైరై కే .వి .కే .సంస్కృత కాలేజి లో అయిదేళ్ళు పని చేశారు ,నాగార్జున యూని వర్సిటిలో తెలుగు విభాగం లో ఉద్యోగించారు .

వివాహం –సంతానం

శర్మగారు వేదాంతం వారి ఆడబడుచుశ్రీమతి  కామాక్షీ హైమవతి ని  వివాహమాడారు. వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలిగారు .రెండవ కుమారునికి భావ భూతి శర్మ అని నామకరణం చేసి ఆ మహా కవిపై తనకున్న భక్తీ తాత్పర్యాలను చాటుకొన్నారు .అయిదవ కాన్పు సమయం లో శర్మ గారి భార్య చనిపోయారు .అప్పటినుండి పిల్లలకు తానే తల్లి అయ్యారు శర్మగారు .

గ్రంధ రచన

శర్మ గారు సంస్కృతాంధ్రాలలో 29గ్రంధాలు రచించారు .వారికి వాల్మీకి ,కాళిదాసు  భవభూతి ,అభినవ గుప్తుడు ,క్షేమేంద్రుడు అభిమాన రచయితలు .జగద్గురు శ్రీ కళ్యానంద భారతీ మహా స్వామి వారి చేత మంత్ర విద్యా దీక్ష స్వీకరించారు . ఆ సంస్కారమే  తన రచనా వ్యాసంగానికి దోహదం చేసిందని తెలియ జేశారు .  సంస్కృతం  లో శర్మగారు ఆనంద వర్ధనుని ధ్వన్యాలోక అలంకార శాస్త్రానికి సంగ్రహ సంస్కృత రచన ‘’ధ్వని సారం ‘’ రాశారు . దీక్షా గురువులైన శ్రీ కళ్యానంద భారతీ స్తుతిగా ‘’కళ్యాణ భారతి ‘’రాశారు .శర్మగారికి పుట్టపర్తి సత్య సాయి బాబా అంటే అమితాభిమానం సంస్కృతం లో ‘’సత్య సాయి పురాణం ‘’గా నలభై వేల శ్లోకాల తో సర్వ పురాణ సారం గా రచించారు . తెలుగులో మంత్రం శాస్త్ర గ్రంధం గా శ్రీ ,జగన్నాధ పండిత రాయని రసగంగాధరానికి వ్యాకహారికాంధ్ర భాషా వివరం గా ‘’నవ రస గంగాధరం ‘’,విద్యానాధుని ప్రతాప రుద్రీయానికి’’ఆంద్ర ప్రతాప రుద్రీయం ,ముమ్మటుని కావ్య ప్రకాశానికి ప్రామాణికాలైన పది వ్యాఖ్యానాల సారం గా ‘’కావ్య ప్రకాశం ‘’,రుయ్యకుని అలంకార సర్వస్వానికి ‘’అలంకార సూత్రం ‘’,భరతుని నాట్య శాస్త్రానికి వ్యాఖ్యానం గా ‘’నాట్య వేదం ‘’,క్షేమేంద్రుని రచనకు ‘’ఔచిత్య విచార చర్చ ‘’కుంతకుని గ్రంధానికి అనువాదం గా ‘’వక్రోక్తి జీవితం ‘’,భగవద్గీత ఆరు వేల శ్లోకాలకు వ్యాఖ్యానం ,మహా భారతాన్ని ధర్మ శాస్త్రం గా నిరూపిస్తూ ‘’శ్రీమన్మహా భారతం –ధర్మ శాస్త్రం ‘’మొదలైనవి రచించారు .ఇంకా కొన్ని గ్రంధాలు ముద్రించాల్సినవి ఉన్నాయి .’’సాహిత్యం అంటే సర్వ పురుషార్ధ సాధనం గా రసభావ స్పురణ ,తత్పర్యవసానమూ ఉండాలి ‘’అని శర్మ గారి అభిప్రాయం .

పుట్టపర్తి నారాయణాచార్యులు ,విశ్వనాధ సత్య నారాయణ గారల రచనలంటే శర్మ గారికి యెనలేని అభిమానం వారంటే ఆరాధనా భావమూ .

ఆధ్యాత్మిక జీవనం

నిత్య సంధ్యావందనం ,ధ్యానం ,మంత్రజపం చేసేవారు .ఇలవేల్పు అయిన శ్రీ లలితా పర భట్టారిక సహస్ర నామ రహస్యాలను బోధించేవారు .ఫాల భాగం లో భస్మం ,గంధం ,కుంకుమ ధరించేవారు .శర్మ గారి ప్రత్యేకత క్రాపుతో పాటు ‘’పిలక ‘’ఉండటం .ధోవతి ,దానికి అందమైన కుచ్చెళ్ల తో ప్రత్యేకంగా దర్శన మిచ్చేవారు .ఉత్తరీయ కప్పుకొంటే మహా రాజ ఠీవి జ్యోతక మయ్యేది .కంచి పరమాచార్య వారరి కటాక్షం పొందారు .శృంగేరీ స్వాముల వారి ఆశీస్సు లందుకొన్నారు సత్య సాయి కి ప్రీతి పాత్రులయ్యారు .తను సేకరించిన అయిదు వేల అపూర్వ గ్రంధాలను సత్య సాయి కాలేజి లైబ్రరీకి బహూక రించారు .భద్రాద్రి లో శ్రీరామనవమి కల్యాణం రోజున ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు .’’నారాయణి నమోస్తుతే ‘’అనే మాట తరచుగా వాడేవారు .

భువన విజయ సృష్టికర్త

మాధవ రామ శర్మ గారే  శ్రీ కృష్ణ దేవరాయల భువన విజయం కు ద్రష్ట ,స్రష్ట .తిమ్మరుసు పాత్ర ధరించేవారు .దాని రూపకర్త శర్మ గారే .ఏ సి కాలేజిలో మొదటి సారి దాన్ని ప్రదర్శించారు .విశ్వనాధ ,గడియారం పుట్టపర్తి మధునా పంతుల వంటి సాహితీ దిగ్గజాలు పాల్గొన్న సభ అది .

సభలూ సమావేశాలు

‘’ శర్మ గారు మహా వక్త. అనర్గళం గా ఏ విషయం పైన నైనా మాట్లాడేవారు .ముందు సంస్కృతం లో  ధారాళం గా ప్రసంగించి తర్వాతే తెలుగులో మాట్లేడేవారు .అ౦తటి గీర్వాణ భాషాభిమానం వారిది .శర్మగారిది ‘’కంచు కంఠం’’.ఆ నాడు ‘’జకార త్రయం ‘’అని పిలువ బడే ఉద్దండ మహోపన్యాసకులు శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మ శ్రీ జటావల్లభుల పురుషోత్తం ,శ్రీ జొన్నల గడ్డ సత్యనారాయణ మూర్తి గార్లు .ఆస్థానకవి శ్రీ కాశీ క్రిష్ణాచార్య వారి 90వ జన్మ దినోత్సవం నాడు శర్మగారి ఆధ్వర్యం లో గుంటూరులో ‘’సంస్కృత సామ్రాజ్యం’’అనే అపురూప సభ నిర్వహించారు. ప్రత్యెక సంచిక తెచ్చారు .

బిరుదులు –సత్కారాలు

మాధవ రామ శర్మ గారి మహా విద్వత్తు కు అంతే స్థాయిలో 18బిరుదులూ లభించాయి .అదేరీతిలో  సత్కార సన్మాన పురస్కారాలు పొందారు .వీరి బిరుదులలో మహోపాధ్యాయ ,దర్శనాచార్య ,లాక్షణిక సామ్రాట్ ,శాస్త్ర విశారద ,సాహిత్య సామ్రాట్ ,అభినవానంద వర్ధన ,రస జగన్నాధ ,నవ విద్యానాద ,సాహిత్య వాచస్పతి ,ధర్మ విద్యా ప్రవీణ ,సంస్కృత విద్యా భూషణ మచ్చుకు కొన్ని మాత్త్రమే .

నాగార్జున విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ,డి లిట్ ఇచ్చి గౌరవించింది .అన్నవరం శ్రీ సత్య నారాయణ స్వామి దేవస్థానం వార్షికం ఇచ్చి  సమ్మానించేది .ఆలిండియా ఓరియంటల్ కాన్ఫ రెన్స్ లో ప్రతినిధి గ పాల్గొన్నారు .నవ ద్వీపం లో  గౌడీయ మఠం తరఫున పాల్గొని సంస్కృతం లో గంట సేపు ప్రసంగించి ఆనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి జ్యోతి బాసు నే ఆశ్చర్య చకితుల్ని చేసి ‘’భారత దేశం లో ఇంత అనర్గళం గా సంస్కృతం లో ఇంత సేపు ప్రసంగించే వ్యక్తీ ఉన్నారా?’’అని  అప్రతిభులను చేశారు .వీరికి వచ్చిన శాలువాలు సన్మాన పత్రాలకు లెక్కే లేదు .అనేక చోట్ల పల్లకీలో ఊరేగించారు .ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు . సత్య సాయి పెన్ను ,రిస్ట్ వాచీ  బహూకరించారు .కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ‘’సాహితీ మాధవం ‘’అనే  ప్రశంసా  పద్యం రాసి చివరలో ‘’అభినవానంద భరత ‘’భావార్ద్ర ‘’మధుర రస పధ విహారి  మాధవ రామ సూరి ‘’అని కీర్తించారు .సాహిత్య వాచస్పతి పండిత పరమేశ్వర ,సాహిత్య విద్యాధర శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మగారు ఎనభై ఒక్క ఏడాది సార్ధక జీవితం గడిపి గీర్వాణ భాషా సేవలో పునీతులై  13-7-1988 న ‘’మాధవ సదనం ‘’చేరుకొన్నారు .

అధారం – శర్మ గారి శత జయంతికి(2007)కుమారుడు శ్రీ జమ్మల మడక భవ భూతి శర్మ రచించిప్రచురించిన  పుస్తకం . ‘’మా నాన్న –జమ్మల మడక మాధవ రామ శర్మ ‘’ .Inline image 1

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ – 19-2-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మూవీ మొఘల్‌ మరిలేరు

మూవీ మొఘల్‌ మరిలేరు

కేన్సర్‌తో రామానాయుడు కన్నుమూత
దాదాపు 5 దశాబ్దాల కెరీర్‌.. 13 భాషల్లో 140 చిత్రాల నిర్మాణం
ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్‌ రికార్డ్‌
ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో స్థానం
సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం.. నేడు అంత్యక్రియలు
తెలుగు సినిమా పెద్దదిక్కుల్లో ఆయన ఒకరు… ఘన విజయాలకు ఆయన ఓ చిరునామా.. సినీ నిర్మాతలకు ఆయన ఓ పెద్ద బాల శిక్ష… అమ్మానాన్నలు పెట్టిన పేరు… రామానాయుడు! సినీ పరిశ్రమ ఆయనకు పెట్టిన పేరు ‘మూవీ మొఘల్‌’! ఎన్నో ఘనతలు, మరెన్నో రికార్డులు, ఇంకెన్నో విజయాలు సొంతం చేసుకున్న ఆ స్టార్‌ ప్రొడ్యూసర్‌.. డి.రామానాయుడు (79) ఇక లేరు! నలుగురు సంగీత దర్శకులను… ఆరుగురు హీరోలను…. 14 మంది హీరోయిన్లను… 24 మంది దర్శకులను పరిచయం చేసిన… 13 భాషల్లో 140 చిత్రాల స్టార్‌ ప్రొడ్యూసర్‌!!
రైతు కుటుంబంలో పుట్టి, వ్యాపారాల్లో అడుగుపెట్టి చివరికి సినిమాల్లో స్థిరపడి.. ఆయన సాగించిన విజయ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న రామానాయుడు బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. దీంతో… తెలుగు చిత్ర పరిశ్రమ మూగబోయినట్లయింది. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఖిన్నులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులు ‘మూవీ మొఘల్‌’కు నివాళులర్పించారు.
హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సహా 13 భారతీయ భాషల్లో 140 చిత్రాలు నిర్మించి.. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్‌ రికార్డు సాధించిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. మూవీ మొఘల్‌.. దగ్గుబాటి రామానాయుడు(79) ఇక లేరు! కొంతకాలంగా ప్రొస్టేట్‌ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు సురేశ్‌, వెంకటేశ్‌, కుమార్తె లక్ష్మి ఉన్నారు. ప్రజల సందర్శనార్థం గురువారం ఉదయం ఆయన పార్థివ దేహాన్ని రామానాయుడు స్టూడియోస్‌లో ఉంచి, మధాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని రామానాయుడు కుమారుడు వెంకటేశ్‌ తెలిపారు.
కారంచేడులో పుట్టి.. పెరిగి..
రామానాయుడు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కారంచేడు. 1936 జూన్‌ 6న దగ్గుబాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. మూడేళ్ల పసి వయసులోనే మాతృమూర్తిని కోల్పోయారు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన తొమ్మిదేళ్ల చిరు ప్రాయంలో పెద్ద మనసు ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు రామానాయుడు. భూదానోద్యమంలో భాగంగా 1945లో ఆచార్య వినోబా భావే కారంచేడుకు వెళ్లినప్పుడు.. ‘నా వంతుగా రెండున్నర ఎకరాలు ఇస్తాను’ అని ప్రకటించారు. కొడుకు మాటను మన్నిస్తూ ఆయన తండ్రి రెండున్నర ఎకరాల భూమిని ముగ్గురు వ్యవసాయ కూలీలకు పంచారు. ఆ తర్వాత.. ఒంగోలులోని బంధువుల ఇంట్లో ఉండి ఎ.బి.ఎం.హైస్కూల్‌లో చదువుకుని, ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. పాసయ్యారు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు విజయవాడలో లయోలా కాలేజ్‌ స్థాపన నిమిత్తం విరాళాల వసూలు కోసం కారంచేడు వచ్చిన నిర్వాహకులకు వ్యక్తిగతంగా విరాళం ఇవ్వడమే కాకుండా, ఊళ్లో రెండు లక్షల రూపాయల విరాళాలు సేకరించి ఇచ్చారు. పర్యవసానంగా ప్రతిష్ఠాత్మక మద్రాస్‌ లయోలా కాలేజీలో ఆయనకు ఇంటర్మీడియట్‌ సీటు వచ్చింది. కానీ అక్కడ ఏడాది కంటే ఎక్కువ ఉండలేకపోయారు. రెండో సంవత్సరం చీరాల వి.ఆర్‌.ఎస్‌. అండ్‌ వై.ఆర్‌.ఎన్‌. కాలేజీలో చేరారు. బాల్య స్నేహితుల సావాసంతో చదువు మీద సరిగా దృష్టిపెట్టక పరీక్షల్లో తప్పారు. దాంతో చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి వ్యవసాయంలో అడుగుపెట్టారు. 21వ ఏట.. తన మేనమామ యార్లగడ్డ నాయుడమ్మ కుమార్తె రాజేశ్వరిని 1957 నవంబర్‌ 2న వివాహమాడారు. మూడేళ్లు తిరిగేసరికి వారికి సురేశ్‌, వెంకటేశ్‌ జన్మించారు. కారంచేడులో ‘నమ్మినబంటు’ సినిమా షూటింగ్‌ జరగగా, ఓ ఎడ్లపందెం సీన్‌లో అక్కినేని నాగేశ్వరరావు డూప్‌గా నటించడమే కాక, అందులో కలెక్టర్‌ వేషం కూడా వేశారు. నటుడిగా ఆయన తెరమీద కనిపించిన మొదటి సినిమా అదే.
ఇటుకల వ్యాపారం చేద్దామని వెళ్లి..
ఇటుకల వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో మద్రాస్‌ వెళ్లారు రామానాయుడు. కానీ ఆ వ్యాపారంపై ఆసక్తి కలగలేదు. అప్పుడు సినీ రంగంపై దృష్టిపడింది. దర్శకుడు గుత్తా రామినీడు సలహాతో ఆయన దర్శకత్వం వహించిన ‘అనురాగం’ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం ద్వారా సినీ రంగంలో ప్రవేశించారు. అయితే టైటిల్స్‌లో ఆయన పేరు ఉండదు. ‘అనురాగం’ ఆర్థికంగా నిరాశపరిచింది. దీనికితోడు.. సినీ రంగంలోకి వెళ్లడాన్ని ఆయన తండ్రి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఆయనను ఒప్పించి భార్యా పిల్లలను తీసుకుని 1962 జూన్‌ 24న మద్రాస్‌లో కాపురం పెట్టారు. ‘అనురాగం’ తర్వాత భాగస్వాములు లేకుండా సొంతంగా సినిమాలు తియ్యాలని సంకల్పించి.. పెద్ద కుమారుడు సురేశ్‌ పేరు మీద 1963లో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌ను నెలకొల్పారు. డి.వి.నరసరాజు చెప్పిన కథ నచ్చడంతో తాపీ చాణక్య దర్శకత్వంలో సినిమా తియ్యాలని సంకల్పించారు. ఆ కథకు ఎన్టీఆర్‌ అయితే సరిగ్గా సరిపోతారని భావించి, ఆయననుసంప్రదించారు. తన వద్ద సరిపడేంత పెట్టుబడి లేకపోయినా, ఎన్టీఆర్‌కు రెగ్యులర్‌ డిసి్ట్రబ్యూటర్‌ అయిన విజయా పిక్చర్స్‌ ఇచ్చిన అడ్వాన్స్‌తో సినిమా ప్రారంభించారు. అదే.. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’ సినిమా. 1964 మే 21న విడుదలైన ఆ చిత్రం సూపర్‌ హిట్టవడంతో రామానాయుడు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు.
‘ప్రేమనగర్‌’ ఓ అధ్యాయం
1968లో తెలుగులో తను నిర్మించిన ‘పాప కోసం’ సినిమాను అదే ఏడాది తమిళంలో ‘కొళందై కాగ’ పేరుతో రీమేక్‌ చేసి, తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టారు రామానాయుడు. ఆ మరుసటి ఏడాది అక్కినేని నాగేశ్వరరావుతో తన తొలి సినిమా ‘సిపాయి చిన్నయ్య’ తీశారు. దాని తర్వాత కె.బాపయ్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ‘ద్రోహి’ సినిమా అట్టర్‌ఫ్లాపై ఆయన పెట్టుబడి రూ. 5 లక్షలను మింగేసింది. ఆర్థికంగా జీవన్మరణ సమస్య ఎదురైన సమయంలో.. ‘ప్రేమనగర్‌’ తీశారు. నవయుగ ఫిలిమ్స్‌ వద్ద రూ. 10 లక్షలు తీసుకుని, తను రూ. 5 లక్షలు పెట్టి, మొత్తం రూ. 15 లక్షలతో ఆ సినిమాని నిర్మించారు. 1971లో అది చాలా పెద్ద బడ్జెట్‌. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఆ సినిమా సెప్టెంబర్‌ 24న విడుదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో భయంకర తుఫాను. మూడు రోజుల పాటు కుండపోత వర్షం. రామానాయుడులోని ఆశలు ఆవిరవుతున్నాయి. ఆ సినిమా ఆడకపోతే, ఆర్థికంగా ఆయన కోలుకునే స్థితి లేదు. నాలుగో రోజు సినిమాకు సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చింది. వర్షాలకు మించి వసూళ్ల వర్షం కురిసింది. అలా ఆయన కెరీర్‌లో మేలిమలుపుగా, ఓ గొప్ప అధ్యాయంలా నిలిచింది ‘ప్రేమనగర్‌’. సినిమానా, వ్యవసాయమా? తేల్చుకోవాల్సిన స్థితిలో ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో వేరే ఆలోచన చేయాల్సిన అవసరం ఆ తర్వాత ఆ యనకెప్పు డూ రాలేదు. ఆ చిత్రాన్ని శివాజీ గణేశన్‌తో ‘వసంత మాళిగై’ పేరుతో రీమేక్‌ చేసి, అక్కడా ఘన విజయం సాధించారు. అదే సినిమాని రాజేశ్‌ ఖన్నా, హేమ మాలిని జంటగా ‘ప్రేమ్‌నగర్‌’గా రీమేక్‌ చేసి, హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన, అక్కడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలా ఒకే కథను మూడు భాషల్లో తీసి, హ్యాట్రిక్‌ సాధించారు. ఆ సినిమా నుంచి సురేశ్‌ ప్రొడక్షన్స్‌, అగ్ర సంస్థల జాబితాలో చోటు పొందింది. ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తూ ‘మూవీ మొఘల్‌’గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకే కాదు.. భారతీయ సినిమాకు రామానాయుడు చేసిన సేవకు గుర్తుగా ఆయన్ను ఎన్నో పురస్కారాలు వరించాయి. అందులో ముఖ్యమైనవి.. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్‌ పురస్కారం. సినీ రంగానికి సంబంధించిన ఈ అత్యున్నత పురస్కారాన్ని ఆయన 2009లో అందుకున్నారు. 2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. అలాగే.. రాజకీయనాయకుడిగా.. వ్యక్తిగా.. రామానాయుడు ఎన్నో సేవాకార్యక్రమాలను చేపట్టి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.
ప్రముఖుల సంతాపం
స్టార్‌ ప్రొడ్యూసర్‌ రామానాయుడు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతికి సంతాపసూచకంగా గురువారం షూటింగ్‌లు జరపకూడదని చిత్ర పరిశ్రమ.. థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించినట్లు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రకటించారు.
ప్రతిభకు పట్టం
ప్రతిభ ఎక్కడున్నా గ్రహించి, వెలుగులోకి తీసుకువచ్చిన మంచి మనిషి రామానాయుడు. ఇరవై నాలుగు మంది దర్శకులను, ఆరుగురు హీరోలను, పద్నాలుగు మంది హీరోయిన్లను, నలుగురు సంగీత దర్శకులను చిత్రసీమకు పరిచయం చేశారు. ఆయన సంస్థలో వందమందికి పైగా హీరోలు, 130 మంది వరకు హీరోయిన్లు నటించారు. నిర్మాతగా ఆయన అన్ని వ్యవహారాలూ చూసుకున్న చివరి చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా’. వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ కలిసి నటించగా, సురేశ్‌ నిర్మించిన ‘గోపాల గోపాల’ చిత్రానికి ఆయన సమర్పకుడు.
ఈ భాషల్లో సినిమాలు..
తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళ, మరాఠీ, గుజరాతీ, ఒడియా, భోజ్‌పురి, అస్సామీ, పంజాబీ, ఇం గ్లిష్‌ భాషల్లో ఆయన చిత్రాలు నిర్మించారు.
ఆయనలో నటుడు
తాను నిర్మించిన దాదాపు ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సీన్‌లో కనిపించడం రామానాయుడుకు అలవాటు. అత్యధిక సినిమాల్లో ఒకటి లేదా రెండు సన్నివేశాల్లో కనిపించే చిన్న పాత్రలు వేసిన ఆయన.. ‘హోప్‌’ అనే సినిమాలో ప్రధాన పాత్రనూ చేసి మెప్పించారు. బయటి నిర్మాతలు చాలా మంది ఆయనను తమ సినిమాల్లో నటించమని అడిగినా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. బయటి బేనర్‌లో ఆయన నటించిన ఒకే ఒక్క చిత్రం ‘దాగుడు మూతలు’. అప్పట్లో సీనియర్‌ నటి శాంతకుమారి ‘‘ఒరేయ్‌.. నాయుడు, నా మాట వినరా. హీరోగా చెయ్యరా. నీది హీరో ముఖంరా’’ అని ఎన్నిసార్లో పోరుపెట్టినా, ఆయన నవ్వి ఊరుకున్నారు.
స్టూడియోల అధినేత..
చిత్రసీమలో నిర్మాతగా తను సంపాదించిన డబ్బును, అదే చిత్రసీమలో ఖర్చుపెడుతూ, పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషిచేశారు రామానాయుడు. 1984లో సురేశ్‌ మూవీస్‌ అనే డిసి్ట్రబ్యూషన్‌ సంస్థను ప్రారంభించి, పంపిణీదారునిగా మారారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లో ఐదెకరాల కొండ ప్రాంతాన్ని తొలిచి రామానాయుడు స్టూడియోస్‌ను కట్టారు. స్ర్కిప్ట్‌ పట్టుకుని ఈ స్టూడియోకు వచ్చే నిర్మాత చేతికి తొలి కాపీ వచ్చేవరకూ అన్ని సదుపాయాలనూ ఇందులో కల్పించారు. ఈ స్టూడియోకు ఐదు కిలోమీటర్ల దూరంలో నానక్‌రామ్‌గూడలో రామానాయుడు సినీ విలేజ్‌ పేరుతో మరో స్టూడియో ఏర్పాటుచేశారు. విశాఖపట్నంలోనూ ఓ పెద్ద స్టూడియోను నెలకొల్పారు.
రాజకీయాల్లోనూ..
చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమానికి ఆకర్షితులైన ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టి, టీడీపీలో చేరి 1999లో ఎంపీగా ఎన్నికయ్యారు. రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి చేతిలో ఓటమి పాలవడంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.
రేపు వస్తానో రానో..
రామానాయుడు స్టూడియోస్‌.. కొండలు పిండి కొట్టి కట్టిన ఆయన కర్మభూమి! సినీ రంగాన్ని నమ్ముకుని వచ్చే ఎంతో మంది కార్మికులకు ఉపాధినిచ్చిన బతుకు సీమ!! అందుకే ఆ స్టూడియో అంటే రామానాయుడు ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే మంగళవారం ఆయన స్టూడియోకు వెళ్లారు. ‘ఇక్కడికి రావడం ఇదే చివరిసారి’ అన్నంత ఇదిగా అణువణువూ కలియదిరిగారు. సిబ్బంది అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ‘రేపు వస్తానో రానో.. ఇక్కడికి రావడం ఇదే చివరిసారేమో’నని ఆయన తమతో అన్నారంటూ స్టూడియో సిబ్బంది కంటతడి పెడుతున్నారు. అంతేకాదు.. నమ్మిన బంటులా ఇంతకాలం తన వెంట ఉన్న డ్రైవర్‌, ఇతర సిబ్బందిని జాగ్రత్తగా చూసుకోవాలని పెద్ద కుమారుడు సురేశ్‌బాబుకు రామానాయుడు చెప్పినట్లు తెలుస్తోంది!!
అదే మహమ్మారి..
కేన్సర్‌.. సినీ పరిశ్రమలో ప్రముఖులను వరుసగా కబళిస్తూ వస్తున్న ఈ మహమ్మారే మూవీ మొఘల్‌ మరణానికీ కారణమవడం గమనార్హం. పాతతరం నటుడు కాంతారావు మొదలు.. అక్కినేని నాగేశ్వరరావు, వడ్డే రమేశ్‌, ఈవీవీ, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్‌, వీబీ రాజేంద్ర ప్రసాద్‌, గణేశ్‌ పాత్రో ఇలా ఎందరో సినీ ప్రముఖులు కేన్సర్‌కు బలైన సంగతి తెలిసిందే!!
సినీ దిగ్గజాన్ని కోల్పోయాం : ప్రముఖుల నివాళి
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడుకు పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. ఆయన మృతిపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌, ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీరంగాల దిగ్గజాలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి చలన చిత్ర రంగానికి తీరని లోటని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. భారత చిత్రసీమకు వెలలేని సేవలందించారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ సినిమాలు తీయడమేగాక ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. అనేక భాషలలో శతాధిక చిత్రాల నిర్మాణంతో ప్రపంచ గుర్తింపు పొందిన రామానాయుడు మృతి యావత్‌ సినీ ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు, ప్రజాభిమానం ఆయనను అమరుడిగా నిలుపుతాయని పేర్కొన్నారు. తెలుగులోనే కాకుండా కన్నడ భాషలోనూ చిత్రాలు నిర్మించి, తమ రాష్ట్ర ప్రజల అభిమానం చూరగొన్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య కొనియాడారు. సినీ పరిశ్రమతోపాటు ప్రజాసేవలోనూ ఆయన కృషి ప్రశంసనీయమని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. సినీరంగంతోపాటు టీడీపీకి కూడా తీరని లోటని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. రామానాయుడు సినీరంగానికి పెద్దబాల శిక్షలాంటివారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. అలాగే ఆయన లేరంటే నమ్మలేకపోతున్నామని మరో ఇద్దరు మంత్రులు బండారు దత్తాత్రేయ సుజనా చౌదరి అన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, అయ్యన్న పాత్రుడు, పల్లె రఘునాథరెడ్డి, శిద్దా రాఘవరావు, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు, మృణాళిని, పి.నారాయణ, తోపాటు ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రామానాయుడు మృతిపై సంతాపం ప్రకటించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, సీపీఎం తెలంగాణ రాష్ట్రశాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఎందరికో మార్గదర్శకుడిగా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తిగా ప్రతిపక్ష వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌ కొనియాడారు. సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును పోగొట్టుకున్నదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. ఐదు దశాబ్దాలు పరిశ్రమకు ఎనలేని సేవచేశారని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. రామానాయుడు మృతి పరిశ్రమలకు తీరని లోటని ఏపీ శాసనమండలి టీడీపీ విప్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు.
తెలుగు ప్రజల గౌరవం పెంచిన వ్యక్తిగా మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. చిత్రసీమ మూగబోయిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. కళామతల్లికి ఎనలేని సేవలు చేశారని చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. సినీ ప్రపంచం ఒక లెజెండ్‌ను కోల్పోయిందని పశ్చిమగోదావరి జిల్లాలో సినిమా షూటింగ్‌లో ఉన్న హీరో శ్రీకాంత్‌, హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు, నిర్మాత అంబికా కృష్ణ అన్నారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -90 వత్సావాయి స్కూల్ స్టాఫ్

నా దారి తీరు -90

ఇప్పటికి 15 ట్రాన్స్ ఫర్లు రుచి చూశాను. ఇది పదహారవ బదిలీ కం ప్రమోషన్ .వత్సవాయి చిల్లకల్లు –బోనకాల్ రోడ్డుమీద ఉంది. చిల్లకల్లు నుంచి తిరుమలగిరికొండ  దూరం గా కనిపిస్తుంది .అడిదాటితే కన్నెవీడు వస్తుంది తర్వాత మక్క పేట .ఇక్కడినుంచి తూర్పుకు వెడితే పెనుగంచిప్రోలు . మక్కపేటనుండి మునేరు దాటి తే వత్సవాయి వస్తుంది .వత్సవాయి నుండి బోనకల్ రైల్వే స్టేషన్ అయిదు కిలో మీటర్లు .అది హైదరాబాద్ –విజయ వాడ రైల్వే లైన్ లో ఉంది .శాతవాహన  గోల్కొండ లాంటి ఎక్స్ప్రెస్ ట్రెయిన్లు ఈ స్టేషన్ లో ఆగుతాయి .అందుకని ఉద్యోగస్తులు ఈ ట్రెయిన్ లో అప్ అండ్ డౌన్ చేస్తారు . వత్సవాయి హైస్కూల్ గ్రౌండ్ లో పెద్ద వాటర్ టాంక్ దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుండే కనిపిస్తుంది .ఊరందరికీ నీటి సప్ల్లై ఇక్కడి నుంచే .

వత్సవాయి హైస్కూల్ హెడ్ మాస్టార్ లింగం వెంకటేశ్వర రావు గారు లాంగ్ లీవ్ పెడితే నన్ను ప్రమోషన్ మీద ఇక్కడికి వేశారు .పెద్ద స్కూలే అన్నీ డబల్ సేక్షన్లే .అందరూ వెనకబడిన , ఎస్ టి  విద్యార్ధులే .కోమట్లూ ఎక్కువే .వత్సవాయి నుంచి ఎనిమిదికిలోమీటర్ల దూరం లో పొలం పల్లి ఉంది .ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది .ఇక్కడి హైస్కూల్ హెడ్మాస్టర్ విల్సన్ గారు ఉయ్యూరు హైస్కూల్ లో నా ఎస్ ఎస్ ఎల్ సి క్లామేట్ చంద్రా  నిర్మల భర్త గారే .ఆమె అక్కడే తెలుగు పండిట్ .కొండూరు అనే ఇంకొక ఊరు   కూడా ఎనిమిది కిలోమీటర్ల దూరం లో ఉంది .ఇక్కడా కొత్తగా హైస్కూల్ పెట్టారు .బ్రాహ్మణ్యం ఎక్కువ. స్కూల్ కమిటీ వారి అధీనం లోనే ఉంది .ఆప్రేసిడెంట్ట్ మునసబుగారుకూడా అనిజ్ఞాపకం .

వత్సావాయి స్కూల్ స్టాఫ్

స్కూలు రమణయ్య అనే  లెక్కల మాష్టారు  ఇంచార్జిలో ఉంది .ఆయనకు ఇక్కడ ట్యూషన్లు కూడా ఉన్నాయి జగ్గయ్యపేట నుండి వచ్చేవాడు .రెండో లెక్కల మేస్టారేవరోగుర్తులేదు .సైన్స్ మేష్టారు అప్పారావు దగ్గరలో ఉన్న జొన్నలగడ్డ వాసి. మంచి కుర్రాడు .బాగా చెప్పేవాడు .సోషల్ కు విజయవాడ ప్రాంతం ఆవిడా .ఆమె భర్తసీనియర్  తెలుగుపండిట్ . ఇద్దరి ఆరోగ్యాలు అంతంత మాత్రమె .ఎప్పుడూ సెలవలె .తెలుగాయన మూడీ పర్సన్ .ఆస్తమా పేషెంట్ ఆవిడ కూడా .పిల్లలు లేరు .డ్యూటీ మైండెడ్ కాదు ఇద్దరూ..హిందీ పండిట్ శంకర రావు గారనే పెద్దాయన .యు టి ఎఫ్ కార్య కర్త .పంచె కట్టి చొక్కా తో వచ్చేవారు ఆయన అందరికి పెద్ద ఆయన మాట అందరికి ఇష్టమే .డ్రిల్ మాస్టారు ఆలీ గారు దాదాపు రిటైర్ మెంట్ స్టేజ్ లో ఉన్నాడు .దీనికి తోడూ పక్షవాతం వచ్చి కర్ర సాయం తో వచ్చేవాడు . హాజరు పట్టీ  లో సంతకం పెట్ట టానికే స్కూల్ కు వచ్చేవాడు .ఆ తర్వాత స్కూల్ వదిలి సెంటర్లో చేరి టీలు తాగుతూ గఫ్ఫాలు కొట్టేవాడు .‘’ఏదైనా అంటే ‘’సార్ !ఇప్పుడు ఇట్లా ఉన్నాకాని మంచి డ్రిల్ మాస్టర్ గా నాకు పేరుంది .అన్నీ ఆడేవాడిని బాగా నేర్పెవాడిని నందిగామ వాడిని డబ్బా కొట్టే వాడు .డ్రాయింగ్ మాస్టారు పెంటపాటి అప్పారావు గారని గుర్తు .ఆయన చాలా క్రమ పద్ధతిలో ఉండేవాడు .బ్రాహ్మణులు .ఒకటి రెండు సార్లు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు వెళ్లి తిన్నాను. చాలా మర్యాద గా చూశారు .సెకండరీ గ్రేడ్ టీచర్ గా  కోసూరు వాడు పరుచూరి బ్రహ్మానందం ఉండేవాడు .ట్యూషన్ లో చాలామంది పిల్లలు ఉండేవారు .శంకర రావు గారికి ముఖ్య శిష్యుడు .వారానికో సారి మమ్మల్ని ఇంటికి పిలిచి సాయంత్రం వేల కాఫీ టిఫిన్ ఇచ్చేవాడు భార్య బాగా అచేసేది . ఇంకొక సెకండరీ గ్రేడ్ టీచర్ ఆచార్యులుగారు కుర్రాడే .క్రికెట్ పిచ్చి ఎక్కువ .బందరు దగ్గర నుండి దుర్గాంబ అనే గ్రేడ్ టు తెలుగుపండిట్  వచ్చారు .క్రాఫ్ట్ మేష్టారు వెంకటేశ్వరరావు మానికొండలో నేను సైన్స్ మేస్టర్ గా పని చేసినపుడు లాబ్ అసిస్టంట్ గా ఉన్నవాడు .చికినాల నేటివ్ .పంచె చొక్కా తో ఉండేవాడు మాంచి మాటకారి .ఇక్కడ గార్డెనింగ్ మాత్రమె క్రాఫ్ట్ పని .స్కూల్ కు ఒకే ఒక రైటర్ లగడపాటి కృష్ణ మూర్తి ఉండేవాడు ఆన్నీ బాగా తెలిసిన వాడు .దాదాపు ఇరవై ఏళ్ళనుండి ఇక్కడే పని చేస్తున్నాడు .ఇక్కడే రిటైర్ అయ్యాడు .అన్ని పనులు చాలాశ్రద్దగా స్పీడ్గా చేసి నాకు ఏంతో సహకరించేవాడు  .టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నామినల్ రోల్స్ రాయటం దగ్గరనుండి పరీక్షలకు సీటింగ్ విషయం పేపర్లు పెట్టటం ఫైల్స్ మెయింటేన్ చేయటం ,కరేస్పాడేన్స్న్స్ అంతా పకడ్బందీ గా చేసేవాడు .ఏ అనుభవం లేకుండా హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్న నాకు ఇ౦ త అనుభవం ఉన్న క్క్లార్క్  ఉండటం నక్కను తొక్కినట్లు అయింది కమ్మవారే అయినా తలలో నాలుకలా ఉండేవాడు ఇలాంటి గుమస్తా నాకు దొరికి నందుకు అందరూ ణా అదృష్టాన్ని మెచ్చుకొనేవారు .ఒక సారి ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టించాడు సంస్కారి .విద్యార్ధులకు ఆయన అంటే గురి ఎక్కువ ఏ పనైనా చక చకా చేసేవాడు .టి సి లు వగైరాలకు ఎంతోకొంత పిల్లల దగ్గర తీసుకొనే వాడు అని విన్నాను .ఇది తప్పని సరే .దీనిపై నేనేమీ స్పందించలేదు .మధిర దగ్గర ఎర్రుబాలెం ఆయన స్వగ్రామం .కొన్ని పోస్ట్లు లేవు .లైబ్రేరియన్ లేడు ఇంతపెద్ద స్కూల్ కి .అటెండర్ మంగళా పురం దగ్గర లక్ష్మీ పురానికి చెందిన వెంకటేశ్వరరావు అనే కుర్రాడు .ఈ మధ్యనే వచ్చాడు నైట్ వాచర్ ముసలాయన రిటైర్ అయ్యాడు .అతనికొడుకు తో పని చేయించి అతనిని కొన్ని నెలల తర్వాత చైర్మన్ గారితో చెప్పి రెగ్యులరైజ్ చేయించాను .బలరాం అనే లైబ్రేరియన్ నాతో పామర్రులో చేశాడు .అతన్ని సస్పెండ్ చేస్తే చైర్మన్ గారి దృష్టికి తెచ్చి పోస్ట్ ఫిలప్ చేయమంటే అతన్నేవేశారు .పెద్ద దేశ ముదురు కబుర్ల పోగు . ఇలాంటి నేపధ్యం లో నేను హెడ్ మాస్టార్ బాధ్యతలను మొదటిసారిగా వత్సవాయి హైస్కూల్ లో చేపట్టాను .

మళ్ళీ ఒకే గదిలోపుల్లయ్య నాయుడు ఇంట్లో  కాపురం

కొత్తలో హైస్కూల్ లోనే ఒక వారం పడుకొన్నాను .క్రాఫ్ట్ మేస్టారు, ఆచార్యులు , అటెండర్కూడా అక్కడే పడుకొనేవారు బల్లల మీదే నిద్ర. నేను హెడ్ మాస్టారు రూమ్ లో ఉండేవాడిని స్టవ్ తెచ్చాను కనుక ఖాళీ రూమ్ లో వంట చేసుకొనే వాళ్ళం .అటెండర్ ,క్రాఫ్ట్ కూరలు అవీ తరిగిస్తే నేనే వండే వాడిని పప్పూ కూర సాంబారు చేసేవాడిని బాగా నే కుదిరి తెగ మెచ్చుకొంటూ అందరం తినే వాళ్ళం ..క్రాఫ్ట్ మేష్టారు ఖర్చు లెక్కలు రాసి పదిహేను రోజులకోసారి సమాన వాటాలు వేసి సర్డుకొనే వాళ్ళం తర్వాత హెడ్ గా స్కూల్ లో నేను పడుకోవటం చెడు సంప్రదాయం అనిపించి స్కూలు ప్రక్కనే ఒక సాలీల పుల్లయ్య నాయుడు ఇంట్లో వాకిలి వైపు గదిలోకి మారాను .మడత మంచం పట్టే ఖాళీ .వంటకు సరిపడా స్థలం ఉండేది. అన్నీ కిటికీలలోనే  నేనే వండేవాడిని ఆచార్యులు క్రాఫ్ట్  అటెండర్  నేనూ తినేవాళ్ళం ఎవరి కంచాలు వాళ్ళు కడుక్కొనే వాళ్ళం అంట్ల గిన్నెలు అటెండర్ తోమేసే  సేవాడు. సరదాగా ఈ’’ మగ కాపురం ‘’ రెండు నెలలు చేశాం తర్వాత క్రాఫ్ట్ ఫామిలీ తెచ్చుకొన్నాడు .అటెండర్ స్కూల్ లోనే వండుకోనేవాడు. ఆచార్యులూ వేరే గది తీసుకొని ఉన్నాడు .పుల్లయ్య నాయుడు భార్య పిల్లలు సారూ గారు అంటూ ఏంతో అభిమానం గా ఉండేవారు .హెడ్మాస్టారు వాళ్ళ ఇంట్లో అద్దేకున్నందుకు గర్వ పడే వారు  నా రూమ్ స్కూల్ కు అతి సమీపం ‘.ఫెన్సింగ్ దాటి స్కూల్ లోకి వెళ్ళటమే .నాయుడు ఇంట్లో ఇడ్లీ చేస్తే నాకు పిల్లలతో పంపేవాడు  అతనిది  సైకిల్ మీద వెళ్లి చేసే వస్త్ర వ్యాపారం .కొత్తగా డాబా ఇల్లు కట్టుకొన్నాడు .కాఫీ కూడా ఇచ్చేది ఆ మహా ఇల్లాలు .మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తే టీ చేసి పంపేది .ఒకే కుటుంబ సభ్యులం గా ఆత్మీయత తో ఉన్నాం .నాయుడు ఆ తరాత నేను అక్కడినుంచీ వచ్చేసినాక కూడా ఉయ్యూరు కు అడ్రస్ కనుక్కొని వచ్చి పలక రించి పోయేవాడు .ఈ మధ్య ఖమ్మం వెళ్లి నేను మా శ్రీమతి, మా పెద్ద కోడలు, మా అమ్మాయి విజ్జి వత్సవాయి మీదుగా తిరిగి వచ్చి పుల్లయ్య నాయుడి ఇంటికి వెళ్లి పలకరించాం .నేనున్న గది చూపించా .ఎలా అందులో ఉన్నానో నని వీళ్ళు ఆశ్చర్య పోయారు .వాళ్ళ మర్యాద మాటలతో చెప్పలేనిది .నాయుడు కొడుకు బి టెక్ పాసై ఉద్యోగ ప్రయత్నం చేస్తూమా  శర్మ ద్వారా ఏవైనా ఉద్యోగాలున్నాఎమో నని కనుక్కోమని ఫోన్ చేసేవాడు మా వాడు   లేవని చెప్పేవాడు .అతనికి ఏమీ సాయం చేయలేకపోయానే అనే బాధ మనసులో ఉంది రుణాను బంధం ఇది .

వంకాయ కూర బాగా చేసేవాడిని .బంగాళా దుంప వేపుడు రసం సాంబారు పప్పూ బాగా కుదిరేవి .కొంత మిగిల్చి నాయుడు కుటుంబానికి ఇచ్చేవాడిని తెగ మురిసిపోతూ తినేవారు .ఆ గదిలోనే హాస్టల్ ఆడపిల్లలకు ట్యూషన్ చెప్పాను  మద్దెల రా మొండి తోక  జ్యోతి అనే టెన్త్ కాస్ నైంత్ క్లాస్ పిల్లలు వచ్చేవాళ్ళు .రాణి అంట్లు తోమి పెట్టేది .చదువు పెద్దగా వచ్చేదికాదు .బాగా పాడేది జ్యోతి కొంతనయం .క్రాఫ్ట్ కూతురు టెన్త్ తప్పితే ట్యూషన్ చెప్పమంటే చెప్పాను లెక్కలు ఇంగ్లీష్ .పాసైంది పెద్దమ్మాయికి కూడా ట్యూషన్ చెప్పిన జ్ఞాపకం .ఉదయం తోమ్మిదికే భోజనం చేసి స్కూల్ లో టెన్త్ క్లాస్ హాస్టల్ పిల్లలకు సైన్స్ లెక్కలు ఇంగ్లీష్ చెప్పేవాడిని .కస్టపడి చదవటం ఎలాగో నేర్పాను. సాయంత్రం స్కూల్ అవగానే డాబా మీద టెన్త్ వాళ్ళను ‘’మల్లేసే వాడిని ‘’ స్టోరీలు పద్యాలు అప్పగించుకోవటం రాయించటం చేసేవాడిని వాళ్ళల్లో చురుకు దనం పెరిగింది .ప్రతి బుధవారం ఎనిమిది తొమ్మిది పది తరగతుల పిల్లలకు చివరి పీరియడ్ లో కధలు చెప్పటం రాజకీయ నాయకుల గురించి వివరించటం సైన్స్ లో వచ్చిన కొత్త విషయాలు చెప్పించటం క్విజ్ నిర్వహించటం చేయటం తో వాళ్ళలో జనరల్ నాలెడ్జి కొంత పెరిగింది ఇన్ని యాక్టివిటీస్ ఇ౦త దూరం గా ఉన్న స్కూల్ లో ఏ హెడ్ మాస్టారు నిర్వహించి ఉండరు .ఇక్కడకి వచ్చిన మేస్టార్లు హెడ్ లు అందరూ కృష్ణా జిల్లా నడిగడ్డ నుండి ఏదో రకం గా ట్రాన్స్ ఫర్ అయి  చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని ఎప్పుడు ఇక్కడి నుండీ బయట పడదామా అని ఎదురు చూసేవాల్లె .నేనూ అదే టైప్ అయినా డ్యూటీని ఏనాడూ అలక్ష్యం చేయలేదు .అందుకే ఒకరకం గా సక్సెస్ అయ్యాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-15- ఉయ్యూరు

 

 

..

 

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -13

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -13

6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ -3

34 వ ఏట మేల్విల్లీ తన ప్రతిభా సర్వస్వం అయిన ‘’మోబీ డిక్ ‘’నవల రాయటం ప్రారంభించాడు .ప్రసిద్ధ రచయిత నథానియల్ హతారన్ తో గొప్ప స్నేహమేర్పడింది .ఆయన ను ఆదర్శం గా తీసుకొన్నాడు .ఇద్దరు బాగా సన్నిహితులయ్యారు .మేల్విల్లీకి పెద్దన్నగా సలహాలిస్తూ మార్గ దర్శిగా ఉండేవాడు హతారన్ .కస్టపడి రాసిన మోబీ డిక్ నవల 185 లో విడుదలైంది .ఇలాంటి పుస్తకం అమెరికన్ సాహిత్యం లో అంతకు ముందెన్నడూ రాలేదు .ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.బైబిల్ లోని  ‘’call me Ismaaelఅనే వాక్యాన్నిమొదటి వాక్యం గా  అర్ధ వంతం గాఉపయోగించాడు .ఇస్మాయిల్ అనే వాడు ప్రపంచం లోని అసంత్రుప్తి అశాంతి లనుండి పారిపోతూ అన్నమాట అది .ఆ ప్రయాణం లో ఆత్మ హననం కూడా ఉంది .ఆహాబ్ అనే పాత్ర తనకాలికి గాయం చేసిందనే పగా ప్రతీకారం తో తెల్ల వేల్ ను చంపటానికి సిద్ధ పడతాడు .కాని ఆ తిమింగిలమే ఆహాబ్ ను చంపేస్తుంది .వాడి నౌక కూడా నాశన మవుతుంది .నౌకలో మిగిలిన ఒకే ఒకడైన ఇస్మాయిల్ ఈ కదా అంతా చెప్పటానికి మిగిలి ఉంటాడు .

చరిత్ర చర్విత చర్వణం అవుతుందనే గొప్ప ఫిలాసఫీ ఈ నవలలో పోదిగాడు .నవలలో లొపాలి అనేకం ఉన్నా ఈ తరహా కదా,కధనం కొత్తది అవటం తో గొప్ప విజయాన్ని సాధించింది .Melvilllle  has great genius ,but little telent ‘’అన్నారు కొందరు .కాని మోబీ డిక్ లోని ఎపిక్ లక్షణాన్ని ఎవరూ కాదనలేదు .దానికి అదే సాటి అనిపించింది .మోబీ డిక్ పరమోత్క్రుస్ట ,మరమోన్నత నవల గా చరిత్రలో మిగిలిపోయింది .కొద్ది మంది విమర్శకులు కొందరు అభిమానులకు ఈ నవల నచ్చలేదు .వాళ్ళంతా ‘’టైపీ’’వంటినవలె మళ్ళీ రాస్తే బాగుండు ననిపించింది .న్యు మంత్లీ మేగజైన్ ‘’mad as a March hare  .gibbering ,screaming ‘’అని ఈసడించింది .

తన శక్తి సర్వస్వం ఖర్చు చేసి మేల్విల్లీ మోబీ డిక్ రాశాడు .ఇక ఆయనలో ఏమీ మిగలలేదు .శక్తి తో పాటూ ఆరోగ్యమూ తగ్గిపోయింది అప్పులూ వెంబ డి౦చాయి .ఇక తాను బతకటానికి ఆదాయం తెచ్చే ఏ రచనా చేయలేనేమోననే నిరుత్సాహం ఆవరించింది .విధి వెక్కిరిస్తోందని అనిపించి ‘’Dollars damn me and the malicious Devil is forever grinning in upon me ,holding the door ajar ‘’అని బాధ వెల్ల గక్కాడు .బుద్ధి పెట్టి రాస్తే ప్రభుత్వం బాన్ చేస్తోంది అన్నాడు .చేతిలో డబ్బు ఆడటం లేదు డబ్బు అవసరాలు ఎక్కువైనాయి. ఏడోనవల ‘’పియర్రీ ఆర్ ది యామ్బిగ్యుటీస్ ‘’మొదలు పెట్టాడు రెండోకొడుకు పుట్టాడు . ఈ నవలలో ఒక తల్లీ కొడుకు ఉంటారు వారిద్దరూ అక్కా తమ్ముడు లాగా ఉండటం ఇందులో ప్రత్యేకత .ఎవరికీ ఆనలేదు .అప్పు చేసి మామ గారు చెప్పిన చోట ఒక వ్యవసాయ క్షేత్రాన్నిపిట్స్ ఫీల్డ్ దగ్గరే  కొని అందులోనే  పదహారేళ్ళున్నాడు  .ఉన్నత హిమాయ శృంగం లాంటి మోబీ డిక్ నవల ముందు పియర్రీ ఒక పిగ్మాలియన్ అయిన్దిపాపం ఆర్ధికం గా ఏమీ లాభించనూలేదు .దీనితో మెల్వి ఉత్కృష్ట దశ పతనారంభమైంది  . తరువాతి నలభై ఏళ్ళూఅసౌకర్యం గా అసంతృప్తిగా అశాంతిగా బతికాడు .ఒంటరి తనం లో ఉండిపోయాడు .

దీనికి తోడూ సయాటిక్ రుమాటిజం వ్యాధి పీల్చేస్తోంది.నరాల బలహీనతా పట్టుకోంది..పెద్ద కొడుకు పద్దేనిమిదేల్లకే ఆత్మా హత్య చేసుకోవటం తో దిగాలు పడిపోయాడు .మేల్విల్లీ సృజన అంతా అతని 26-31 ఏళ్ళ వయసులోనే జరిగి వట్టిపోయింది .’’ది కాన్ఫిడెన్స్ –మాన్ ‘’అనే నవలా కొన్ని చిన్న కధలు రాశాడు .రాయాలనే కోరిక పూర్తిగా నశించింది .మానసికానందం కోసం మామగారిచ్చిన డబ్బుతో గ్రీస్ టర్కీ ఈజిప్ట్ ఇటలీ ఇంగ్లాండ్  లు సందర్శించాడు  .లెక్చర్లు ఇచ్చి ఏదైనా’’ఒడుక్కు౦దా’’మను కొని ప్రయతించి విఫలుడైనాడు .వచనం వదిలి అదృష్టాన్ని కవిత్వం లో వెతుక్కోన్నాడు .ఆ ప్రయత్నమూ బెడిసికొట్టింది .అసలైన అవగాహన లేకుండా రాసి అభాసు పాలయ్యాడు .రెండు వందల కవితలు రాశాడు .అందులో వేళ్ళమీద లెక్కించ దగినవి మాత్రం మీరు మిట్లు గొలిపాయి .తన సంత్రుప్తికోసమే కవిత్వం రాసుకొన్నాడు .

47 వయసులో కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం వచ్చింది .న్యూయార్క్ కు కుటుంబం మార్చాడు.బాగా కష్టమైన పనే .కానీ ఏమీ అనకుకోకుండా చేశాడు .దీనిలో 25 ఏళ్ళు అలాగే బండీ లాగాడు .వయసు అరవై ఏడు వచ్చింది .భార్య అతని పరిస్తితి అర్ధం చేసుకొని ఉద్యోగం మానేసి మళ్ళీ గ్రంధ పఠనం పై ద్రుష్టి పెట్టమని సలహా ఇచ్చింది .మనుమలు పుట్టారు .చరమాంకం లో బెర్మూడా కు యాత్రగా వెళ్ళాడు .’’జాన్ మేరీ అండ్ ఆదర్ పోయెమ్స్’’రాసి ప్రచురించాడు .ఇదే ఆఖరి రచన .గుండె వ్యాకోచం తో మేల్విల్లీ 28-9-1891 న72 వ ఏట మరణించాడు .పేపరు వాళ్ళు ఆయన చావు గురించి ‘’death of a once popular author’’అని మాత్రం రాసి ఇంకు దులుపుకొన్నారు .

మేల్విల్లీ చనిపోయిన పాతిక సంవత్సరాల వరకు ఆయన అభిమానులు తప్ప ఎవరూ ఆయన్ను గుర్తుపెట్టుకోలేదు .1921లో వీవర్ అనే రచయిత ఒక పబ్లిషర్ ను బ్రతిమిలాడి ‘’హీర్మాన్ మేల్విల్లీ –మారినర్ అండ్ మిస్టిక్ ‘’అనే గ్రంధాన్ని వెలువరించాడు .అప్పుడు జనాలకు చురుకు పుట్టింది .ఈ వేడి ఆయన పుట్టిన అమెరికాలో అనుకొంటే తప్పులో సారీ పప్పులో కాలేసినట్లే .అది ఇంగ్లాండ్ లోని లండన్ లో  సాగింది .మూడేళ్ళలో పదహారు గ్రంధాలు వెలువడ్డాయి .ఇదే మేల్విల్లీ పునరాగమనానికి అంటే రినైసేన్స్ కు దారి తీసింది .ఆ తర్వాత వరుసగా మూడు దశాబ్దాలు అందరూ మేల్విల్లీ పై అనేక కోణాలలో రచనలు చేసి ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని రచనా సామర్ధ్యాన్ని లోకానికి తెలియ జేశారు . ఎన్నో జీవిత చర్తిత్రలు వచ్చాయి .ఈచరిత్రలలో అనేక అసందర్భాలు  చోటు చేసుకోన్నాయి .అవగాహనలో తేడాలు వచ్చాయి .

మహా రచయితది హెచ్ లారెన్స్ ‘’the whale Moby Dick is the deepest blood being of the white race ,our deepest blood nature  and he is hunted hunted and hunted  by the maniacal fanatism of our white mental consciousness ‘’అని కుండ పగల కొట్టినట్లు చెప్పి ‘’we get dark races and pale to help us red yellow ,and black ‘’అన్న నిజాన్ని చెప్పాడు .మోబీ డిక్ లో ఆహాబ్ అంటే మనిషే అని ‘’man sentient ,speculative ,religious ,standing his full stature against the immense mystery of creation .’’అని ఎల్లరీసేడ్ విక్ అన్నారు .మోబీ డిక్ చెడుకు సంకేతం అని ఆహాబ్ మోబీ తో పోరాటం మంచికి చెడుకు పోరటమేనని చివరికి మంచి  తుడిచి పెట్టుకు పోతుందని ఇంకోఆయన వ్యాఖ్యానించాడు .భగవద్గీత పై ఎన్ని వ్యాఖ్యానాలోచ్చాయో అన్నీ మోబీ డిక్ మీద వచ్చాయి .ఎవరి దృక్పధం వారిది .అయినా ఇంకా మోబీ డిక్ ను చదువుతూనే ఉన్నారు మేల్విల్లీని ఆరాదిస్తూనే ఉన్నారు .

మేల్విల్లీ కి ఉన్న విలువలు ఆయన తరం నాటివికాదు .పేరుకు ,ఖ్యాతికి ఆయన ఇష్ట పడనే లేదు విషాదానికి పో లాంటి వాళ్ళు ఎలాగో మేల్విల్లీ కూడా అంతే .చాలెంజెర్ నంబర్ వన్ గా మిగిలాడు .ఎమర్సన్ ప్రశాంత ఇంద్ర ధనుస్సు కు వ్యతిరేకం గా మేల్విల్లీ పిడుగులు కురిపించాడు .వాల్ట్ విట్మన్ సూర్య దీప్తికి బదులు సాహసవీరోచిత  నల్లతనాన్ని ఆహ్వానించాడు .మేల్విల్లీ ప్రతిష్ట,వ్యక్తిత్వం  నానాటికీ పెరుగుతూనే ఉంది .Melville  not only measures up to the American giants but towers darkly above them ‘’ అన్న లూయీ అంటర్ మేయర్ మాట ముమ్మాటికీ నిజం .

మరో ప్రముఖునితో కలుద్దాం

Inline image 1  Image result for moby dick

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-4(శివరాత్రి స్పెషల్ )

       మినీ  ద్విపద్స్-4(శివరాత్రి  స్పెషల్ )

31-పర్వ దినం శివరాత్రి

 జన్మకో మహా రాత్రి .

32-అర్ధ రాత్రి లింగోద్భవం

    మహా ‘’ఎరికోద్భవం ‘’

33-జీవన్ముక్తి శివ రాత్రి

  తామస హరం  ఈ రాత్రి .

34-శివ శంకర నామం

   భవ హర గానం

35-అభిషేక ప్రియుడైన శివుడు

   తిమిర సంహారక రుద్రుడు

36-మహా శివ క్షేత్రం కోటప్పకొండ

  కోటీశ్వరస్వామి అందరి అండా దండా.

37-మల్లికార్జున క్షేత్రం శ్రీశైలం  

     నేడు కైలాస మహాశైలం

38-భీమేశుని దాక్షారామం

  ముక్తి రక్తుల విహారారామం

39-విశ్వేశ్వరుని వారణాసి  

   ముక్తి కెప్పుడూ వాసి

40-మనసు మాలిన్యం తొలగించే రాత్రి

  లింగోద్భవ మైన ఈ శివరాత్రి .

   సశేషం

          మహా శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలతో

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-15

 

Posted in కవితలు | Tagged | Leave a comment

కృష్ణుడు ఇచ్చిన రామ విగ్రహాలు -రామ తీర్ధం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లాలాజలం తో షుగర్ టెస్ట్ -రెండురూపాయలకే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పర్యావరణ మార్పు -రోగాల ముప్పు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివరాత్రికి జాగరణం ఎందుకు?శ్రీ స్వరూపానంద-అక్షర’ లక్షల ఆది దేవుడు

శివరాత్రికి జాగరణం ఎందుకు?
అక్షర’ లక్షల ఆది దేవుడు

శివుడు శివంకరుడు, వశంకరుడు కూడా. తన తకధిమి తాండవ కేళీ లయ విన్యాసాలతో సమస్త చరాచర జగత్తును ఆడించే హృదయాలయ వశుడు శివుడు. విలయ కారకుడుగా విఖ్యాతుడైన పరమేశ్వరుడు, నిజానికి భావ పరంపరా వారధి అయిన భాషకు ఉద్భవ కారకుడు. నటరాజుగా మారిన తాండవ శివుని అభంగ ఢమరుక నాదం నుంచే సకల భాషలకు మూలమైన ధ్వనులు ఉద్భవించాయి. ఆ ధ్వనులే ఉత్పత్తి స్థానం ఆధారంగా వర్ణాలుగా పరివర్తన చెందాయి. ఆ వర్ణాలే లక్షల అక్షర మాలలై, వ్యాకరణాన్ని వరించి భాషలుగా అవతరించాయి. అందుకే ఆదిదేవుడి వలె అక్షరం కూడా అనశ్వరమైనది. అర్థనారీశ్వరమైన ఆది దంపతుల వలె వాగర్థాలు కూడా విడదీయలేనివి. శివరాత్రి సందర్భంగా శివుని ఢమరుకం నుంచి జాలువారిన
వర్ణోత్పత్తి క్రమం…
శ్లో// నృత్తావసానె నటరాజ రాజః
ననాదఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్‌
ఏతద్విమర్శేత్‌ శివసూత్రజాలం
నటరాజైన శంకరుడు ఆనందతాండవం తర్వాత తన చేతిలోని ఢమరుకాన్ని 14సార్లు మోగించాడు. అప్పుడు ఈ క్రింద సూచించబడిన ధ్వనులు వెలువడ్డాయి.
1) అ, ఇ, ఉ, ణ్‌ 2) ఋ, ……(అచ్చు)క్‌ 3) ఏ, ఓ, ఙ్‌, 4) ఐ, ఔ, చ్‌ 5) హ, య, వ, ర, ట్‌ 6) ల, ణ్‌ 7) ఞ, మ, ఙ, ణ, న, మ్‌ 8) ఝ, భ, ఞ్‌ 9) ఘ, ఢ, ధ, శ్‌ 10) జ, బ, గ, డ, ద, శ్‌ 11) ఖ, ఫ, ఛ, ఠ, థ, చ, ట, త, వ్‌ 12) క, ప, య్‌ 13) శ, ష, స, ర్‌ 14) హ, ల్‌.
పై ధ్వనుల ఆధారంగా మహర్షులు ప్రస్తుతం మనం వాడుకుంటున్న వర్ణమాలను… అంటే ‘‘అ’’ నుండి ‘‘హ’’ వరకుగల రూపొందించి వాటికి ‘‘అక్షరములు’’ అని నామకరణం చేశారు. ‘క్షరము’ అంటే నశించేది అని అర్థం. క్షరము కానిది కాబట్టి ‘అక్షరము’ (శాశ్వతంగా నిలిచేది) అన్నారు. అలాంటి ధ్వనులను చెవులతో మాత్రమే వినగలం. కళ్లతో చూడటానికి, చేత్తో రాయటానికి తగినవిధంగా ఆ ధ్వనులకు ఒక రూపం కల్పించి ‘అక్షరాలు’ అన్నారు. ఈ అక్షరాలతో పదాలు, పదాలతో వాక్యాలు ఏర్పడి ప్రత్యక్షంగా ఉన్నవారికి, పరోక్షంగా ఉన్న వారికే కాకుండా ఆ తర్వాతి తరాలవారికి కూడా తమ భావాన్ని అందించగల ఒక గొప్ప అవకాశం లభించింది. ఆ లిపి రూపంలో ఉన్న అక్షరాలు కాలక్రమంలో అనేక మార్పులకు లోనయ్యాయి. చివరకు దేవనాగరి లిపిలో, వివిధ ప్రాంతీయ భాషలలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అక్షరాలకు ఈశ్వరానుగ్రహంవల్ల లభించిన ధ్వనులే మూలం. ‘‘తల్లి సమస్త భాషలకు దైవతభాషయ’’ అన్నట్లు అన్ని భాషలలోని అక్షరాల ఉచ్చారణకూ ప్రస్తుతం అక్షర రూపంలో మనం ఉచ్చరిస్తున్న ధ్వనులతోనే అధికశాతం ఉచ్చరించడం సాధ్యమవుతుంది. అందుకే భారతీయ భాషలలో చాలా వరకు, కొన్ని సందర్భాలలో ఇతర భాషలలోకి సంస్కృతం చొచ్చుకుపోగలిగింది. ఆ విధంగా పరమేశ్వరుని అనుగ్రహంతో లభించినవి కాబట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతా సూచకంగా వర్ణమాలను నేర్పేముందు ‘‘ఓం నమశ్శివాయ సిద్ధం నమః’’ అని రాయిస్తారు. ఆ తర్వాతే ‘అ, ఆ’ మొదలైన వర్ణాలను బోధించటం ప్రారంభించారు. తదనంతర కాలంలో అవే ‘ఓనమాలు’గా ప్రసిద్ధమయ్యాయి. అవే ‘అక్షరములు’ (నాశము లేనివి)గా నాటినుంచి నేటిదాకా ఉన్నవి. ‘క్‌+ష=క్ష త్‌+ర=త్ర జ్‌+ఞ=జ్ఞ’ ఇతర సంయుక్తాక్షరాల వంటివేగానీ, స్వతంత్రాక్షరాలు కావు. ఇలాంటి అక్షరాలను ఉచ్చరించడానికి అనువుగా ఉన్న ఈ శరీర భాగానికి ‘‘ఆస్యమ్‌’’ అని నామకరణము చేశారు. ‘‘ఆస్యంతి ఉచ్చారయంతి వర్ణాన్‌ అనేన ఇతి ఆస్యమ్‌’’- అంటే… ‘నోరు’ అని మన మాటల్లో చెప్పుకోవచ్చు. నోటిలో కూడా ఏయే భాగంతో ఏయే అక్షరాలు ఉచ్చరించటం సాధ్యమో కూడా వివరించారు.
మూడు భాగాలు
ఇందులో ‘అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు’ అని మూడు భాగాలున్నాయి. అచ్చుల సహాయం లేకుండా హల్లులను స్వతంత్రంగా పలకటం సాధ్యం కాదు. కాబట్టి హల్లులకు అచ్చులు ప్రాణంవంటివి. అందుకే అచ్చులను ‘ప్రాణులు’ అంటారు. ‘‘అచ్‌’’ ప్రత్యాహారాంతర్గతమైనవి… అంటే- మొదట చెప్పిన సూత్రాలలో ఒకటో సూత్రము మొదటి అక్షరం ‘‘అ’’. నాలుగోసూత్రము చివరి అక్షరం ‘‘చ్‌’’. ఈ మధ్యగల అక్షరాలు ‘‘అ, ఇ, ఉ, ఋ, ……, ఏ, ఓ, ఐ, ఔ’’లకు ‘అచ్చులు’ అని పేరుపెట్టారు. అదేవిధంగా ‘‘హల్‌’’ ప్రత్యాహారాంతర్గతమైనవి… అంటే- ఐదో సూత్రం మొదటి అక్షరం ‘‘హ’’. పద్నాలుగో సూత్రం చివరి అక్షరం ‘‘ల్‌’’. ఈ మధ్యగల అక్షరాలకు ‘హల్లులు’గా నామకరణం చేశారు. ఇటువంటి అక్షరాలు ఆస్యము (నోటి)లో ఏయే ప్రదేశంలో ఏయే అక్షరాల పుట్టుక జరిగిందో దాన్ని కూడా సవివరంగా తెలిపారు.
1) అ, కు, హ విసర్జనీయానాం కంఠః
2) ఇ, చు, య, శానాంతాలు అని ఇలాంటి సూత్రరూపంలో తెలియజేశారు.
1) అ, క, ఖ, గ, ఘ, ఙ, హ (8) వసర్గలు – – – – – – – – వీటికి కంఠం ఉత్పత్తి స్థానం.
2) ఇ, చ, ఛ, జ, ఝ, ఞ, య, శ – – – – – వీటికి దవడలు (తాలు).
3) ఋ, ట, ఠ, డ, ఢ, ణ, ర, ష – – – – – – – వీటికి మూర్ఘ (నాలుక పైభాగము).
4)…., త, థ, ద, ధ, న, ల, స- – – – – వీటికి దంతాలు.
5) ఉ, ప, ఫ, బ, భ, మ – – – – – – – – వీటికి పెదవులు (ఓష్ఠములు).
6) ఞ, మ, ఙ, ణ, న (ముందు చెప్పిన స్థానాలతోపాటు పాటు (నాసిక).
7) ఏ, ఐ – – – – – – – – కంఠం, దవడలు.
8) ఓ, ఔ – – – – – – – కంఠం, పెదవులు.
9) వ, – – – – – – – – దంతాలు, పెదవులు.
10) ః ఖ – – – – – – – – జిహ్వమూలం (నాలుక మొదటి భాగము)
11) (0) సున్న
ఆ తర్వాత ‘హ్రస్వాలు, దీర్ఘాలు’ అనే మార్పుతో మరిన్ని అక్షర రూపాలు ఏర్పడ్డాయి. ముందు చెప్పినట్లుగా ఈ అక్షరాలతో పద, వాక్య నిర్మాణం జరిగి మనసులోని భావాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నవారికి తెలిపే అవకాశం ఏర్పడింది.
 టి.సుధాకరశర్మ
70363 70381

 

 సాహితీ బంధువులకు17-2-15 మంగళవారం  శ్రీ మహా శివ రాత్రి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

మనం ఏటా మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటున్నాము. దీనికి కారణం? పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
ఒకసారి బ్రహ్మ విష్ణువుతో ‘‘నేను ఈ విశ్వానికి సృష్టికర్తను కనక నేనే గొప్ప’’ అని అన్నారు. దానికి విష్ణువు ‘‘నీవు నా బొడ్డులో పుట్టావు కనక నేనే గొప్ప’’ అని తిరిగి సమాధానం చెప్పారట. ఇద్దరికి ఘోర యుద్ధం మొదలయ్యింది. వారిద్దరికి బుద్ధి చెప్పడానికి పరమేశ్వరుడు ఆకాశము, పాతాళము వ్యాపించి ఒక అగ్నిస్తంభ ఆకారంలో జ్యోతిర్లింగమై ఆవిర్భవించారు. దాన్ని చూసి బ్రహ్మకు, విష్ణువుకు భయం కలిగింది. అప్పుడు ‘‘మీలో నా మొదలూ తుదీ ఎవరు తెలుసుకొని వస్తారో వారే గొప్ప’’ అని శివుడి యొక్క అదృశ్యవాణి వినిపించింది.
బ్రహ్మ హంస రూపం ధరించి జ్యోతిర్లింగం పైభాగాన్ని తెలుసుకోవడానికి వెళ్లాడు. విష్ణువు వరాహరూపంతో ఆ జ్యోతిర్లింగం మొదలు ఎక్కడ ఉందో వెదుకుతూ బయలుదేరాడు. ఇలా వారిద్దరు ఎన్నో సంవత్సరాలు వెళ్లినా వారికి ఆ జ్యోతిర్లింగము ఆది అంతాలు కనబడలేదు. అయితే వారు పూర్తిగా అలసిపోయి శివుడిని ప్రార్థించగా శివుడు జ్యోతిర్లింగం మధ్య ప్రత్యక్షమై ‘‘నేను గొప్ప నేనేగొప్ప అని మీరు అనవసరంగా తగువుపడుతున్నారు. మీకందరికీ నేనే మూలం. మీలోని శక్తికి నేనే కారణం. ఈ పవిత్రమైన రోజును ప్రజలు మహాశివరాత్రిగా జాగరణము, ఉపవాసము మొదలగు వాటి చేత నా నిజస్వరూపాన్ని తెలుసుకుని ముక్తులు అవుతారు’’ అని అనుగ్రహించి అదృశ్యమైపోయాడని శివపురాణంలోని విశ్వేశ్వర సంహితలో ఉంది.
ఈ జ్యోతిర్లింగ విషయమై ఆపాతాలనభస్థలాన్త భువన బ్రహ్మాండ మా విస్పుర జ్యోతి స్ఫాటిక లింగ.. అని మొదలుగు విధాల వర్ణన మహాన్యసంలో కూడా ఉంది. కనక భారతీయులు అనాదిగా ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉంటూ, రాత్రి జాగరణం చేసి శివునికి నాలుగు జామల్లో పూజాభిషేకాలు చేస్తూ, మరుసటి రోజు ఉదయం ప్రసాదం తీసుకుంటారు.
శివజాగరణ రహస్యం
‘‘ఇతిహాస పురాణాఖ్యానం వేదం సముప బృహయేత్‌ (భారతం)’’ అంటే ఇతిహాస పురాణాలు వేదార్థాన్ని తెలుపుతాయి అని ఉంది. అందుకే పురాణాల్లో ఈ శివరాత్రి కథకి వేదార్థాన్ని గ్రహించాలి.
తైత్తిరీయ నారాయణంలో మనోబ్రహ్మ అని ఉంది. కనక ఈ విశ్వాన్ని సృష్ట్టించే మనస్సే బ్రహ్మదేవుడు. ‘విష్ణుంకృత్వాథ సారథికు’ అను శృతి ప్రకారము, ‘బుద్ధింతు సారధిం విద్ధి’ ప్రకారం స్థూల శరీరాన్ని రషించే బుద్ధియే విష్ణువు. మనస్సు అనే బ్రహ్మ ఇంద్రియాల రూపంలో అంటే హంసరూపంతో ఎంత ప్రయత్నించినా, బుద్ధి అనే విష్ణువు తర్కరూపం అంటే వరాహరూపంలో ఎంత ప్రయత్నించినా వారిద్దరు ఆత్మ అయిన జ్యోతిర్లింగము యొక్క ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు.
‘యతోనాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ’ అంటే ఆత్మ మనస్సు, ఇంద్రియాలకు తెలియబడేది కాదు. అది అనుభవంతోనే తెలియబడుతుంది.. అని ఈ తైత్తిరీయ ఉపనిషత్‌ వివరణే ఈ కథ.
శివరాత్రి నాడు నిద్ర చేయకూడదు అని జాగరణ చేయాలి అని, ఉపవాసం చేయాలని పురాణాలలో ఉంది. ఇక్కడ నిద్ర అంటే ఏమిటి? అంటే శ్రీ గౌడపాదులు నిద్రా తత్త్వ మజానతః (గౌ.కా) అన్నారు. అందరి స్వరూపమైన ఆత్మ యొక్క పరమార్థాన్ని తెలియకపోవడమే అంటే అవిద్యయే నిద్ర.
‘అన్యథా గృహ్లాతః స్వప్నః’ అన్నారు గౌడపాదులు. అంటే ఉన్న ఆత్మను ఉన్నట్లు తెలుసుకోక దానిని దేహమని, మనస్సని, ఇంద్రియాలని తప్పుగా తెలుసుకోవడమే స్వప్నము. ఈ రెండు నిర్వచనాల వల్ల యధార్థ గ్రహణమే జాగ్రత్త (మెలకువ) అని గౌడపాదులు అన్నారు. అంటే తన స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే జాగరణము. ఆ రోజే మన జీవితంలో శివరాత్రి. గౌడపాదులు అనాది మాయయా సుప్తః యదా జీవః ప్రభుద్యతే.. అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా.. అన్నారు. అంటే పరమ కరుణామూర్తి అయిన గురువులు ఆత్మోపదేశం చేయగా అనాది మాయానిద్ర తొలగి, అజము, అనిద్రము, అస్వప్నము, అద్వైతము అయిన తన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన జాగరణ. ఇలా తెలుసుకోకుండా ప్రజలు ఈ రోజు శివరాత్రి కనక జాగరణ చేయాలని రాత్రంతా సినిమాలు చూడటం, వేరే వేరే పనులు చేయడం సరికాదు. శివరాత్రి నాడు అన్నం తినకూడదు అని రకరకాల తిండి తీర్థాలను జాముజాముకి తీసుకుని, ఉపవాసం చేసామని భావించకూడదు. ఉప అంటే దగ్గర. జీవాత్మ పరమాత్మకు సమీపంలో ఉండడం. గురువుల వద్ద శ్రవణం చేసి తన ఆత్మ పరమాత్మయే అని గుర్తించడమే నిజమైన ఉపవాసం. అంతేగాని శరీరం ఎండబెట్టడం ఉపవాసం కాదు. అయితే శివరాత్రి రోజు ఆహారం స్వీకరించకుండా ఉపవాసం చేస్తే మంచిదే అది ఆరోగ్యానికి, అంతఃకరణశుద్ధికి ఉపయోగం కాని ఇదే పరమార్థం అనుకోకూడదు.
ఇక యామ పూజ, యామం అంటే జాము. ఆ రోజు రాత్రి ప్రతి యామం శివునికి అభిషేకం చేయాలి. ప్రథమయామం రెండవ యామంలోను, మూడవ యామంలో మొదటి రెండు యామాలను అంతర్గతాలు. ఇలాగే నాలుగో యామం చివర తెల్లవారుతుంది. ఈ నాలుగు యామాలు వాస్తవంగా మాండుంక్యంలోని (స్నోయమాత్మా చతుస్పాత్‌’) ఆత్మకి నాలుగు పాదాలు ఉన్నాయి అని తెలుపుతుంది. విశ్వపాదం తైజసపాదంలోను విశ్వతైజసపాదాలు ప్రాజ్ఞపాదంలోను ఈ మూడు పాదాలు తురీయపాదంలోను అంతర్గతాలు. ‘త్రయాణాం’ విశ్వాదీనాం పూర్వపూర్వ ప్రవిలాపనేన తూరీయస్య ప్రతిపత్తిరితి’ అని శ్రీ శంకర భాగవతాదులు మాండూక్య భాష్యంలో చూపారు. ఈ విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయములు అద్వితీయ ఆత్మలో వికల్పాలని గుర్తిస్తే ఆ నాల్గవ యామం చివరిలో తెల్లవారినట్లు అప్పుడు పరమార్థ జ్ఞానోదయం కలుగుతుంది. ఇదే శివ జాగరణ రహస్యం.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి,
విశాఖ శారదాపీఠాధిపతి,
ఫోన్‌ : 9966669658
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విభ్రాంతి విరిగి పోయింది -సినారే కవిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంధ్రా హెమింగ్ వె కేశవరెడ్డి అసామాన్య రచన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీయర్ గారి లక్ష దీపారాధన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శివరాత్రి.. జ్ఞానదీప్తి

శివరాత్రి.. జ్ఞానదీప్తి

  • 15/02/2015
  • – పసుమర్తి కామేశ్వరశర్మ

‘శివ ఏవ కేవలః’ సృష్టికి ముందు నిరాకారము, నిర్గుణము, నామరూప రహితము అగు ‘సత్’ పదార్థమొక్కటి ఉన్నదని, అది శివుడని తెలుపుతున్నాయి- వేద మంత్రములు. సృష్టి, స్థితి, లయములనే ధర్మముల వలన ఆయనకు బ్రహ్మ, విష్ణు, శివ అనే నామములు ఏర్పడ్డాయి. శివునికి ఉన్న నామ రూపాలలో ఒకానొక ప్రత్యేకత, విశిష్టత ఉంది. పరమ శివుని రూపములు రెండు. ఒకటి పురుష రూపం, రెండవది ‘లింగ’ రూపం. ‘శమయతీతి శివః’ అందరినీ బ్రహ్మానందంలో శమింపచేసేవాడు, శివుడు. ‘శీతే సజ్జన మనస్సు ఇతి శివః’ – సజ్జనుల మనస్సులలో శయనించి ఉండేవాడు, శివుడు. ‘శివం వేదః తద్యోగాత్’ శివమంటే వేదము. ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః అని ప్రపంచానికి శాంతి మార్గాన్ని దర్శింపజేసి, శాంతింపజేసే వేదము – శివమవుతుంది. దాని యోగము గలవాడు శివుడు. శివప్రదత్వాత్ శివః మంగళములను, శుభములను ఇచ్చేవాడు – శివుడు. ఇలా అనేక వ్యుత్పత్యర్థాలు ఉన్నాయి. ముఖ్యమయినది మరోటుంది. ‘శం నిత్య సుఖమానంద మికారః, పురుషః స్మృతః వకారః శక్తిరమృతా మేళనం శివ ఉచ్యతేః’ అన్నది శివపురాణమే. ‘శం’ అంటే నిత్య సుఖము, ఆనందము. ‘ఇ’ కారం – పరమ పురుషుడు. ‘వ’కారం అమృత స్వరూపిణి అయిన శక్తి. ఈ ముగ్గురి కలయికయే ‘శివం’ అవుతుంది. ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్థం. పరమశివుని కంఠం నుండి బయల్వెడిలింది ఓంకారము. దాన్ని విడదీస్తే ‘అ ఉమ్’ అయింది. ‘అ’ను ‘మ్’ ప్రక్కన చేరుస్తే ‘ఉమ’ అయింది. ఉమ అంటే బ్రహ్మ విద్య. ఓంకారం బ్రహ్మవిద్య. అందుకే ‘ఉమ’ను పరమశివుడు ఎప్పుడూ తన దేహార్ధ భాగంలో ఉంచుకొంటాడు. వేదమాత శివునికి అర్ధాంగిగా ఉంటుంది. వారి భార్యాభర్తృ సంబంధము నిత్యము, శాశ్వతము. దీనిననుసరించే భారతీయ వివాహ వ్యవస్థ స్థాపించబడింది. పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు, ఆదిదంపతులు. ‘సనాతన’ అంటే ఎల్లప్పుడూ, నిత్యనూతనం అని అర్థం. కాళిదాస మహాకవి తన రఘువంశ, కుమార సంభవములనెడి కావ్యముల ద్వారా భారతీయ దాంపత్య వ్యవస్థను పార్వతీపరమేశ్వరుల ద్వారా చెప్పాడు. వాగర్థా వివసంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ – పార్వతీ పరమేశ్వరులు వాగర్ధములలాగా శాశ్వత సంబంధం కలవాళ్లు. సప్త మహర్షులు హిమవంతుని దగ్గరకు, పరమశివుని తరఫున రాయబారంగా వెళ్లి, ‘తమర్థ మివ భారత్యాసుత యోక్తు మర్హసి’ వేద వాక్కుతో పరమార్థము జత చేసినట్లు, యోగము చేసినట్లు, నీ కూతురైన పార్వతితో, శివుని యోగము చేయమన్నారు. అందుకే, శివరాత్రి రోజున లింగానికి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటే, ఇటు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇదే మహా శివరాత్రి మహోత్సవమంటే. వ్యక్తమంటే కనిపించేది. ఆ వ్యక్తమంతా ఉమాస్వరూపం. కనిపించనిదంతా – అవ్యక్తం. ఆ అవ్యక్తం – శివస్వరూపం. ‘వ్యక్తావ్యక్త స్వరూపిణి’ అర్ధనారీశ్వర తత్త్వం. ఉమాశంకరుల యోగమునకు విష్ణువని పేరున్నదని రుద్ర హృదయోపనిషత్ చెబుతోంది. బాగా వికసించిన పుష్పములుగల వృక్షము నుండి చాలా దూరము వరకు సుగంధ పరిమళము వ్యాపిస్తుంది. పుణ్యకర్మలు చేసేవాడి నుంచి మంచి సుగంధము వస్తుంది. పరమశివుడు అనే తీగకు వేద రూప పుష్పములు పూయటం వలన, ఆ తీగె నుండి మంచి విద్యాగంధము వీస్తుందిట. ఆ గంధము ప్రజలకు పుష్టిని, వృద్ధిని సమకూరుస్తుంది. ఇహపరముల నిస్తుంది. అందుకే శివుణ్ణి ‘సుగంధి’ అని వేదము వర్ణించింది. ‘త్య్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ ఉర్వారుకమివ బంధనా న్మృత్యోర్ముక్షేయ మామృతాత్’ – ‘యజుర్వేదం త్రినేత్రుడు, పరిమళమును వెదజల్లువాడు, మంచి పుష్టిని చేకూర్చువాడు అయిన రుద్రుణ్ణి మేము ఆరాధించుచున్నాము. దోసపండును తొడిమ నుండి వేరు చేసినట్లు ఆ రుద్రుడు, మమ్మల్ని మృత్యువు నుండి వేరుచేసి, కాపాడి అమృతత్త్వాన్ని చేకూర్చుగాక’ అని అంటూ, మహాశివునికి లింగోద్భవకాలంలో పరమశివుడికి అభిషేకం చేస్తున్నాం. ప్రతిమాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. ‘శివరాత్రి’ అనే పదానికి, శుభప్రదమైన, మంగళకరమైన రాత్రి అని అర్థం. రాత్రి ‘చీకటి’ కదా.. అజ్ఞానానికి సంకేతం. ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, లింగోద్భవ కాల జ్ఞాన జ్యోతి దర్శనం, బిళ్వార్చన, నామసంకీర్తన, శివపార్వతుల కళ్యాణం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగింపబడుతుంది. శివారాధన వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. ‘చంద్రమా మననో జాతః’ మనస్సుకి అధిదేవత చంద్రుడు. చంద్రుని కళలు కృష్ణ పక్షంలో దినదినం క్షీణించి, చతుర్దశి నాడు కేవలం ఒక కళే ఉంటుంది. అలాగే. మనసుకు చేరిన 16 మాలిన్యములు (అష్టమదములు, అరిషడ్వర్గములు, మనస్సు అహంకారం) ఒక్కటే శేషించి ఉంటుంది. ఆ మాలిన్యాన్ని దూరం చేసేది – శివపూజ, శివాభిషేకం, శివనామ సంకీర్తనం. ఇక్కడే మనం మార్కండేయుడి కథను, ఆధ్యాత్మికతను జ్ఞప్తి చేసుకోవాలి. ‘మనుష్యాణాం సహస్రేషు’ అన్నట్టు, కోటికొకడుంటాడు. పట్టుదలగల సాహసికుడు, సాధకుడు. పట్టుదలుంటే చాలదు, పట్టుకోవటానికొక ఆలంబనముండాలి. అదే శివాకార వృత్తి. ‘లీనంగమయ తేతి లింగం’ అఖండమైన జ్ఞానం. మార్కండేయుడు శివలింగాన్ని వాటేసుకొన్నాడంటే ఏమిటి అర్థం? 16 ఏళ్ల వయసుకే మృకండ మహర్షి కుమారుడైన మార్కండేయుడు కాలధర్మం చెందవలసి ఉంది. దీనికి ప్రతీకారం చేయాలని శివలింగాన్ని పట్టుకున్నాడు. యముడు వచ్చి కాలపాశం వేశాడు. కానీ, శివలింగం వాటేసుకున్నాడు కాబట్టి శివుడు ప్రత్యక్షమైనాడు, కాలుణ్ణి పంపించి, అజరామరుణ్ణి చేశాడు మార్కండేయుణ్ణి. పదహారేళ్లవోకావు – షోడశ కళాత్మకమీ ప్రపంచం. కాలం వల్లనే దానితో సంబంధం. అది కాలంతోటే తిరుగుతుంది. అదే మృత్యువు. అదే కాలపాశం. కాలమనే పాశం. దాన్ని జయించే మార్గం – శివాకార వృత్తి. మృత్యుభయం లేదు. మానవుడికి, అమృతత్త్వానే్న ప్రసాదిస్తుంది. అసలు అమృతమనేది ఎక్కడుంది? అది సంసారంలోనే ఉంది. విషం లాంటి మృత్యువూ ఉంది. మన జీవిత సాగరాన్ని మధించాలి, అపుడు రెండూ దర్శనమిస్తాయి. హాలాహలం లాంటి కాలాన్ని కబళించి, కాలాతీతమైన శివతత్త్వమే నా స్వరూపమని గుర్తు చేసికొంటే అమృతత్వం లభిస్తుంది. త్యాగగుణం అలవడుతుంది. త్యాగం – నిశ్చల నిర్మల మనస్సునిస్తుంది. ‘త్యాగేనైకే అమృతత్త్వ మనసుః’ అన్నది శ్రుతి. దీనే్న బోధిస్తుంది మహాశివరాత్రి. శివుణ్ణి సాకారంగా అనగా మూర్తమైన విగ్రహంగా తీసికొంటే- ఆయన భస్మానులేపనం, పృథివికి, గంగాజటాజూటం – జలానికి, ఫాలనేత్రం – అగ్నికి, నాగభూషణత్వం వాయువుకి, దిగంబరత్వం ఆకాశానికి సంకేతమైతే, చంద్ర శేఖరత్వం మనస్సుకి, వృషభ వాహనం బుద్ధికి, గజచర్మ ధారణం అహంకారానికి, త్రిశూల ధారణం – త్రిగుణాలు తన కధీనమై ఉన్నాయని, త్రిగుణాతీతుడని వివరిస్తాయి. అమ్మవారు శరీరానే్న పంచుకొని ఉందంటే ఏమిటి అర్థం? చిద్రూపం శివ తత్త్వమైతే, సద్రూదం శక్తితత్త్వం. సచ్చిత్తులు అవినాభూతమయినవని చెప్పేది అర్ధనారీశ్వర తత్త్వం. ‘సత్యజ్ఞానానంద రూపా సామరస్య పరాయణా’ అన్నారు. మాఘ మాసంలో చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలం. ఈ రోజు శివుడు తేజోమయంతో లింగాకారం నుండి ఆవిర్భవించాడు. ‘అధ్యవోచ దధివక్తా ప్రథమోదైవ్యోభిషక్, అహేగ్‌ంశ్చ సర్వాజ్ఞమ్భయస్థ్య ర్వాశ్చయాతు ధాన్యః’ దేవతలకు ప్రప్రథమ వైద్యుడు రుద్రుడు. అందు శివునికి అభిషేకం చేస్తే సర్వరోగములు నశిస్తాయి. ఆయన గొప్ప శస్త్ర చికిత్సా నిపుణుడు. మనిషికి ఏనుగు తలను పెట్టినవాడు. అందుకే వైద్యులు లోపల శస్త్ర చికిత్స చేస్తుంటే జయప్రదంగా జరిగి, స్వస్థత చేకూరాలని, మానసికంగా రుద్రనమకాన్ని ముఖ్యంగా ఈ మంత్రాన్ని ‘అఘారేభ్యో…’ అనే మంత్రాన్ని పఠించి, దైవ బలాన్ని కూడా అర్థిస్తారు. శివరాత్రినాడు శివరాత్రి మహాత్మ్యాన్ని చెప్పుకోవాలి. ఒక వేటగాడు మహాశివరాత్రి పర్వదినాన మృగములను వేటాడే నిమిత్తం ఒక చెట్టుపై కెక్కాడు. చెట్టుకు సమీపంలో వలను వేసి ఎదురుచూస్తున్నాడు. ఎంత రాత్రి అయినా ఒక్క మృగము కూడా ఆ దిక్కుకు రాలేదు. మృగములు రాకను చాటుగా ఉండి చూడాలని చెట్టుపై నుండి కిందికి రాలేదు. కాలక్షేపానికి, ఏదో చేయాలి కాబట్టి, ఆ చెట్టు ఆకులను తెంపి కింద వేయసాగాడు. ఆ ఆకులు అప్రయత్నంగా కిందనున్న శివలింగంపై పడ్డాయ. అతను ఎక్కి కూర్చున్నది బిళ్వ వృక్షము. తనకు తెలీకుండానే శివునికి, శివరాత్రి రోజున శివునికి బిళ్వార్చన చేశాడు. పట్టుదలతో వేట దొరికిన తరువాతే ఇంటికి వెళ్లాలనుకుని రాత్రంతా జాగరణ చేశాడు. తెల్లవారింది. ఏమీ లేకుండానే ఇంటికి వెళ్లాడు. అతని భార్య కూడా భర్త రాక కోసం ఎదురుచూస్తూ జాగరణ చేసింది. ఉపవాసం చేసింది. దాని ఫలితంగా ఇద్దరూ శివసాన్నిధ్యం అందుకున్నారు. తెలియకుండా, అప్రయత్నంగా చేసిన దానికే ఇంత ఫలితాన్ని పొందితే, తెలిసి సంపూర్ణ భక్త్భివంతో చేస్తే ఆ పరమశివుడు ఇంకెంత ఇస్తాడో..! ఈశ్వరునికి వాహనము నంది. ఈశ్వర తత్త్వానికి లింగము ఎలా గుర్తో, జీవతత్త్వానికి ‘నంది’ అలా గుర్తు. జీవతత్త్వములోని పశుతత్త్వం. పశుతత్త్వముతో కూడిన ఈ జీవతత్త్వము ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పకుండా ఈశ్వరుని వైపు తిప్పటం చేత భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందుతుంది. నందిని, ఈశ్వరుడిని రెండుగా విభజించి చూస్తారు. నందికి ఈశ్వరునికి ఎవరూ అడ్డు తగలకూడదు. అంటే జీవునికి, పరమాత్మకు అడ్డం ఉండకూడదు. నంది ధర్మానికి ప్రతీక. జీవుడు నంది శృంగముల మధ్య నుంచి లోపలున్న పరమాత్మను దర్శిస్తాడు. తనలో ఉన్న పశుతత్త్వాన్ని అణచివేసుకొని, ధర్మంతో అర్థ, కామాల్ని అనుభవిస్తే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని పొందుతాడు. అప్పుడు నంది, ఈశ్వరుడు అని రెండుగా ఉండవు. ‘నందీశ్వర’ అని రెండూ ఏకమై పోయినాయి. అప్పుడు అన్నీ ఒకే తత్త్వంగా భాసిస్తాయి. ఇదే శివరాత్రి మనకు అందించే ఆధ్యాత్మికత. బిళ్వార్చన విశిష్టతను, ఆంతర్యాన్ని తెలుసుకుంటే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయ. బిల్వపత్రం మూడు దళములతో కూడి ఉంటుంది. మానవులను ప్రభావితం చేసే త్రిగుణములకు, త్రికాలములకు, త్రితాపములకు ప్రతీక ఈ పత్రం. ఈ శరీరమే బిల్వదళం. త్రిగుణముల ఏకత్వమును సాధించినప్పుడే భగవంతుని అర్పణకు అర్హతను పొందుతుంది. ఆ ఏకత్వమును సూచిస్తుంది బిల్వదళార్చన. తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం దగ్గరలో ఉన్న చిన్న శివాలయంలో గ్రహణ సమయంలో ఒక దేవతా సర్పం ఆలయంలోని బిల్వ వృక్షం మీదకు ప్రాకి బిల్వదళాల్ని తుంచి, సోమ సూత్రం గుండా శివాలయంలోకి ప్రవేశించి శివలింగం మీద దళాన్ని ఉంచి, లింగాన్ని చుట్టుకొని, గ్రహణ సమయమంతా లింగం దగ్గరే ఉండి, గ్రహణం విడిచిన తరువాత, అదే సోమసూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వార్త, ఫొటోలు కూడా పత్రికలలో వచ్చినాయి. ఇది బిల్వపత్రార్చన విశేషం. మనలోని కామ పిశాచాన్ని, పశు రాక్షస తత్త్వాన్ని, దహింప చేసికోవాలి. పాశుపతమైన ఈ దీక్ష మనకుంటే, పశుపతి అనుగ్రహం మనకు లభిస్తుంది. తిరోధన అనుగ్రహాలు రెండూ పరమ శివుని చేతిలో ఉంటాయి. తిరోధానంతో శివుడే జీవుడయ్యాడు. అనుగ్రహంతో మరలా జీవుడైన తానే శివుడే భాసించాడు. ఇదే మహా శివరాత్రినాడు మనం తెలిసికోవలసిన శివలీలా వైభవం. నాదతనుమ నిశం- శంకరం, నమామియే మనసా శిరసా అని చిత్తరంజని రాగంలో త్యాగరాజ స్వామి కీర్తించిన కృతి, మహాశివరాత్రికి సంపూర్ణ స్ఫూర్తిని, దీప్తిని ఇస్తుంది. పంచభూత లింగ క్షేత్రములు ఈ శివ్వం పంచభూతమయం. పంచభూతములనగా – ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. శివునికి భూతపడి అనే నామము ఉంది. అందుకే ‘ఈవావాస్య మిదం సర్వం’ అన్నది శ్రుతి. పంచభూత రూపుడను నేనే అని తెలియజేయటానికి పరమ శివుడు దక్షిణ భారతదేశంలో ఐదు క్షేత్రములందు ఆవిర్భవించి భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. అవి, చిదంబరంలోని ఆకాశలింగం, శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగము, అరుణాచలములో తేజో (అగ్ని), లింగము, జంబుకేశ్వరములో జలలింగము, కాంచీ క్షేత్రములో పృధివ లింగ రూపములు. ఇవే పంచభూత లింగ క్షేత్రములు. చిదంబరం.. చిదంబరం క్షేత్రంలోని నటరాజస్వామి ఆలయంలో ఉన్నదే ‘ఆకాశలింగం’. మానవ రూపంలో శివునకు విగ్రహం ఉన్న దేవాలయం చిదంబరంలో మాత్రమేనని చెప్తారు. చెక్కబద్దలతో చేసిన ఒక గడిలోపల, గుడ్డ తెరలు వేలాడదీసి ఉంటాయి. ఆ తెరను కొంచెం తొలగించి చూడమంటారు. దూరంగా గోడ మీద బంగారపు ఆకులలాటి వాటితోనున్న తోరణం లాంటిది ఒకటి వేలాడుతూ ఉన్నట్లనిపిస్తుంది. శివుడు ఆకాశ రూపంలో ఇక్కడ వెలిసియున్నాడని చెప్తారు. సృష్టిలో మొదటిది ఆకాశం. దాని నుంచి వాయువు. వాయువులో నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటిలో నుంచి భూమి పుట్టుకొచ్చాయని వేదం చెప్పింది. ఈ సృష్టిలో వున్నవన్నీ ఏదో ఒకనాటికి నశించిపోయి చివరకు శూన్యంలోకి చేరవలసినవే. మనస్సును ఆకాశంలాగా నిర్మలంగా ఉంచుకొనడమే మనిషికి నిజమైన సుఖమని చెప్తుంది- ఆకాశలింగం. ‘చిత్’ అంటే మనస్సు, ‘అంబరం’ అంటే ఆకాశం. ఇదే చిదంబరం, ఇదే చిదంబర రహస్యం కూడా. కేదార రాగంలో ‘ఆనంద నటన ప్రకాశం చిత్సభేశం, ఆశ్రయామి శివకామ వల్లీశం’ అంటూ చిదంబర నటరాజ స్వామిని కీర్తించాడు – ముత్తుస్వామి దీక్షితులు. శివునికి ఉన్న రెండు అవస్థల్లో ఒకటి సమాధి అవస్థ. రెండవది తాండవ నృత్య అవస్థ. సమాధి నిర్గుణం, తాండవ నృత్యం సగుణం. శివునికి నాట్యం అంటే ఇష్టం. ప్రదోష కాలంలో పరమశివుడు నటరాజస్వామి అయిః నాట్యం చేస్తే, బ్రహ్మాది దేవతలందరూ ఆనందంతో చూస్తారు. శివతాండవం తొమ్మిది విధములని చెప్తారు. అవి : ఆనంద తాండవం, సంధ్యా తాండవం, ఉమాతాండవం, గౌరీ తాండవం, కాళికా తాండవం, త్రిపుర తాండవం, సంహార తాండవం, లలితా తాండవం, ఊర్థ్వ తాండవం. శ్రీకాళహస్తి.. సప్త మహర్షులలో శ్రేష్టుడైన వశిష్టునికి నూరు మంది కుమారులు. ఒకానొక సందర్భంగా వారంతా హతులయ్యారు. అమిత దుఃఖంతో కొండ మీద నుండి కిందికి దూకటానికి ఉద్యుక్తుడైనాడు వశిష్ఠుడు. భూదేవి రక్షించి, దుఃఖ శమనానికి పరమ శివుణ్ణి ప్రార్థించమన్నది. పట్టుదలతో దీక్షగా తపస్సు చేశాడు. ప్రత్యక్షమయిన పరమశివుణ్ణి- ‘బ్రహ్మ విద్యని ప్రసాదించమ’ని ప్రార్థించాడు. శివలింగం మధ్యలో నుంచి పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంతో వశిష్టునికి దర్శనమిచ్చి ఆయన కోరుకున్న వరాల్ని ప్రసాదించి వాయు రూపంగా అంతర్ధానమయినాడు. శివలింగం వశిష్టునికి ఎదురుగా ఉండిపోయింది. కైలాసంలో పార్వతీ దేవి భర్తను అనే్వషిస్తూ వచ్చి, జ్ఞాన భిక్ష నొసగే జ్ఞాన ప్రసూనాంబగా స్వయంభువుగా వెలిసింది. శివలింగం ప్రక్కనే. ప్రమధ గణమంతా వచ్చి తూర్పు దిక్కున, దుర్గాదేవి ఉత్తర దిక్కున ఆవిర్భవించారు. ఇప్పటికీ శ్రీకాళహస్తి ఆలయంలో దక్షిణామూర్తి విగ్రహం ఒకటి ప్రత్యేకంగా ఉండి, ప్రతిరోజూ పూజలందుకుంటోంది. ఆలయానికి ఉత్తరంగా ఊరి బయట దుర్గాదేవి ఆలయం కొండమీద ఉన్నది. ‘శ్రీ’ అంటే సాలెపురుగు. కాళ అంటే పాము. ‘హస్తి’ అంటే ఏనుగు. శివలింగాన్ని పూ జించి ముక్తిని పొందటం చేత ‘శ్రీకాళహస్తీశ్వరుడు’ అని ఆ స్వామికి పేరు వచ్చింది; ఆ ఊరిని ‘శ్రీకాళహస్తి’ అని పిలుస్తున్నారు. శ్రీకాళహస్తికి దగ్గరలో ‘ఉడుమూరు’ అనే బోయవారి గ్రామం ఉండేదట. ఆ ఊరికి ‘నాదనాథుడు’ అనే నాయకుడుండేవాడు, ఆయన కుమారుడే -తిన్నడు. తిన్నడు అడవిలో తిరుగుతూ ఉండే సమయంలో శ్రీకాళహస్తీశ్వర లింగం కనపడింది. భక్తిశ్రద్ధలతో పూజించటం ప్రారంభించాడు. అచంచల భక్తితో పరమేశ్వరుడు పెట్టిన పరీక్షలో తన రెండు కళ్లనూ స్వామికి అర్పించి కృతార్థుడై తిన్నడు భక్తకన్నప్ప అయినాడు. శ్రీకాళహస్తీశ్వర లింగం మీద సాలెపురుగు, పాము, ఏనుగు కలిసి ఉన్నట్లుగా పరీక్షగా వీక్షిస్తే దర్శనమిస్తాయి. ఆలయ గర్భగుడిలోనే స్వామి లింగం ప్రక్కనే తిన్నడి విగ్రహం కూడా ఉంటుంది. అందుకే శివుడు భక్తపరాధీనుడు, భోళాశంకరుడు. తమ తమ పూర్వ జన్మలలో సాలెపురుగు విశ్వకర్మ కొడుకైన ఊర్ణనాభుడని, పాము శంభుడనే నాగలోక వాసి అని, ఏనుగు హస్తి అనే ప్రమధుడు అని, తిన్నడు సాక్షాత్తు అర్జునుడేనని కొన్ని గాథలున్నాయి. ఈ క్షేత్రం గురించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మధురానగరంలో మాణిక్యవల్లి అనే వేశ్య ఉండేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వాళ్లిద్దరూ చిన్నతనం నుండి గొప్ప శివభక్తులు. తల్లి ఎంత చెప్పినా వారు వేశ్యావృత్తిలోకి రాలేదు. ఒకరోజున ఇద్దరు దొంగలు ఆ అక్కచెల్లెళ్ల వద్ద ఉన్న నగల్ని కాజేద్దామన్న దురుద్దేశంతో, వాళ్లిద్దరికీ శ్రీకాళ హస్తీశ్వర స్వామిని చూపిస్తామని చెప్పి తీసికొని వెళ్లారు. రాత్రిపూట ఆ దొంగలు వారిద్దరిని చంపాలని నిర్ణయించుకున్నారు. పరమేశ్వరుడు దుష్టుల్ని శిక్షించి, తన భక్తుల్ని రక్షించడమే కాదు మోక్షాన్ని ప్రసాదించాడు. ఆలయం దగ్గరలోనే వారిద్దరి పేరునా ఒక అందమైన మంటపం ఉంది. ఇదీ శ్రీకాళ హస్తీశ్వరుని కరుణ, భక్తిపరాధీనత. ‘శ్రీకాళ హస్తీశ శ్రీతజనావన జ్ఞాన ప్రసూనాంబికాపతే’ అని కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. అరుణాచలం ‘అరుణాచల నాథం స్మరామి అనిశం అసేత కుచాంబాసమేతం. అప్రాకృత తేజోమయ లింగం’ అంటూ సారంగ రాగంలో, అరుణాచలంలో అసేత కుచాంబా సమేతుడైన అరుణాచలేశ్వరుని స్మరించినంత మాత్రమున కైవల్యాన్ని ఇచ్చే స్వామి అని కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. కొండకి ప్రదక్షిణం చేస్తారు. కొండ శివాకారంగా ఉంటుంది. ఆలయ గాలి గోపురం నిర్మాం సుమారు 1560 ప్రాంతంలో శ్రీకృష్ణ దేవరాయల చేత ప్రారంభించబడి, తరువాత వారిచే పూర్తి చేయబడింది. కృతయుగంలో అగ్ని లింగంగాను, త్రేతాయుగంలో వజ్ర రూపంగాను, ద్వాపర యుగంలో బంగారపు కొండ రూపంలో ఉండేదని, కలియుగంలో శివాకారంగా రూపుదాల్చిందని స్కాంద పురాణంలో చెప్పబడింది. తిరువణ్ణామలై పేరు వినగానే జ్ఞప్తికి వచ్చేవారు – కార్తికేయ అంశభూతులైన భగవాన్ రమణ మహర్షి. జంబుకేశ్వరం… జలలింగం శ్రీరంగపట్టణంలో కలిసే ఉంటుంది. పరమశివుని లింగరూపం కింద వున్న పీఠం లోంచి నిరంతరమూ నీరు కొంచెం కొంచెంగా, బొట్లు బొట్లుగా ఊరుతూ ఉంటుంది. పీఠం చుట్టూ ఒక వస్త్రం కప్పి ఉంచుతారు. ఆ వస్త్రం తడిసిన తరువాత తీసి, పిండేసి మళ్లీ పరుస్తారు. స్వామివారి గర్భగుడి ప్రక్కగా అమ్మవారి ఆలయం, ఆ జగన్మాత ‘అఖిలాండేశ్వరి’. మొదట్లో అమ్మవారి విగ్రహ మూర్తి చాలా ఉగ్రంగా, భీకరంగా ఉండేదట. ఆదిశంకరులు తపస్సు చేసి, తల్లిని ప్రసన్నురాలిని చేసికొని శాంతమూర్తిగా చేశారు. జగద్గురు శంకరులే జాతి రత్నాలతో కూర్చిన శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారు. ‘తాటంక యుగళీభూత తపనోడుప మండలా’ అని లలితా సహస్ర నామంలో చెప్పినట్లు అఖిలాండేశ్వరీ అమ్మవారి కర్ణ్భారణములు మహిమాన్వితమైనవి. ఆ తల్లి సర్వదా చిరునవ్వుతూ ప్రసన్న వదనంతో ఉండేందుకు, ఆమె ప్రియ తనయుడైన వినాయకుని విగ్రహం ఒకదానిని ఆమె ముందు ప్రతిష్ఠించారు. పెద్ద పుష్కరిణి ఒడ్డున మంటపం. దీన్ని శ్రీరామచంద్రుడు నిర్మించాడన్నది స్థల పురాణం. ‘జంబూపతే పాహిమాం, పర్వత జాప్రార్థితాప్సు లింగ విభో’ అని ముదావహంగా కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. *

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు

సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు

andhraprabha –   Sun, 15 Feb 2015, IST

కృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప రసజ్ఞుడు, విద్వాంసుడు. ఆంధ్రభోజుడను బిరుదు కలవాడు. రాయలు తను విరామం దొరికినపðడు కవి పండితులతో గడిపేవాడు. దండయాత్రలకు వెళ్లేటపðడు కూడా పండితులను, కవులను తనతో తీసుకువెళ్లేవాడు. కవులకు, పండితులకు అగ్రహారాలు ఇచ్చి వారిని గౌరవించేవాడు. ఇతడు కవి, పండితుల పక్షపాతి. కృష్ణదేవయాలు సంస్కృత కవులను, ఇతర దేశభాషలలో కవిత్వం రాసే

వారిని కూడా సమాదరించాడు.

జయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వారిలో ఉత్తమోత్తమ పరిపాలకుడిగా శ్రీకృష్ణదేవరాయలు

పేరు పొందాడు. మహావీరుడిగానే కాక సంగీత, సాహిత్యాలకు పెద్దపీటవేసిన వాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన పాలన కాలం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1530 వరకు విజయనరగ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. భారతదేశంలో గొప్ప రాజులలో శ్రీకృష్ణదేవరాయలొకరు. ఇతడు అపజయమెరగనివాడు. ఇతడు స్వయంగా గొప్ప విద్వాంసుడు. రాజనీతిజ్ఞుడు. ఇతడు రాసిన ‘ఆముక్తమాల్యద’ పాండిత్యానికి లోకజ్ఞతకు గొప్ప నిదర్శనంగా నిలిచింది. అనేకమంది విద్వాంసులను పోషించి గౌరవించాడు. ఏ విధంగా చూసినా భారతదేశ చరిత్రలో ఉన్నత స్థానం పొందాడు. మహామంత్రిగా ఖ్యాతి గడించిన తిమ్మరుసు అనేక పర్యాలు కుట్రల నుండి కృష్ణరాయలను కాపాడుతూ వచ్చాడు. కృష్ణదేవరాయల పట్ల తిమ్మరుసుకు అత్యంత అభిమానం ఉండెను. విజయ నగర కన్నడ తమిళం కూడా రాజుల చేత పోషించించబడి వర్ధిల్లింది. సాళువ, తుళువ ఆర్వీటి వంశాల పాలనలో తెలుగు భాషకు ఎనలేని గౌరవం పొందింది. విజయనగర రాజుల పాలన కాలంలో మొదటగా పేర్కొనదగినవాడు నాచన సోమన. ఇతనిని రెండవ బుక్కరాయల కాలం వాడిగా కొందరు నిర్ణయించారు. కాని శాసనాలలో విరుద్ధంగా ఉన్నవి. ఇతడు గొప్ప పండిత కవి. నాచన సోమునికి సర్వజ్ఞ బిరుదు కలదు. ఇది ఇతని పాండిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

సోమన ఉత్తర హరివంశంలో గొప్ప గ్రంథాన్ని రచించాడు. మొదటి దేవరాయల కాలంలో జక్కన అనేకవి విక్రమార్క చరిత్రను రాసాడు. దేవరాయలు సంస్కృత భాషను, కర్ణాటక భాషను కూడా సమాదరించి పోషించాడు. సాళువ నరసింహరాయలకు పిల్లలమఱ్ఱి పిన వీరభద్రుడు తాను రాసిన జెమిని భారతాన్ని అంకిత మిచ్చాడు. ఇతని కవిత్వం కొంత కఠినంగా ఉన్నా మిక్కిలి రమ్యమైనదని పండితుల చేత ప్రశంసలు పొందింది. సాలువ నరసింహరాయలకాలంలో అన్నమాచార్యుడు తిరుపతిలో నివసించి తన కృతులను రచించాడు.

విజయనగర రాజుల కాలంలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల యుగం అఖండ ఐశ్వర్యాతో అనుభవించెను. దానివవల్ల ప్రజలలో భోగలాలసత్వం పెరిగింది. రాజులు, సామంతులు మొదలుగా గలవారు శృంగారరస ప్రధానమైన ప్రబంధ రచనలను ప్రోత్సాహించారు.

కృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప రసజ్ఞుడు, విద్వాంసుడు. ఆంధ్రభోజుడను బిరుదు కలవాడు. రాయలు తను విరామం దొరికినప్పుడు కవి పండితులతో గడిపేవాడు. దండయాత్రలకు వెళ్లేటప్పుడు కూడా పండితులను, కవులను తనతో తీసుకువెళ్లేవాడు. కవులకు, పండితులకు అగ్రహారాలు ఇచ్చి వారిని గౌరవించేవాడు. ఇతడు కవి, పండితుల పక్షపాతి. కృష్ణదేవరాయలు సంస్కృత కవులను, ఇతర దేశభాషలలో కవిత్వం రాసే వారిని కూడా సమాదరించాడు. శ్రీకృష్ణదేవరాయలకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా పేరుపొందిన కవులుండేవారు. ప్రబంధ పరమేశ్వరుడనదగిన అల్లసాని పెద్దన వీరిలో అగ్రగణ్యుడు. రాయలితనిని యాధ్రకవితా పితామహుడనే బిరుదునిచ్చి గౌర వించాడు. అల్లసాని పెద్దన రాసిన ‘మనుచరిత్రను’ శ్రీకృష్ణదేవ రాయలకు అంకిత మిచ్చాడు. మను చరిత్ర ఒక గొప్ప శృంగార ప్రబంధం. దీనిలోని కవిత్వం మృదుమధురంగా ఉండి చదువరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ మను చరిత్ర తరువాత వచ్చిన ప్రబంధాలకు దారి చూపించింది. నంది తిమ్మన తను రాసిన ‘పారిజాతాపహరణ’ను రాయలకు అంకితం ఇచ్చాడు. కృష్ణదేవరాయలు గొప్ప కవి. అతడు ఆముక్తమాల్యద అనే గొప్ప గ్రంథాన్ని రాసి కవిగా తనేమిటో నిరూపించుకున్నాడు. దీనికి విష్ణు చిత్తీయమనే మరో పేరు కూడా కలదు. ఆముక్తమాల్యద భక్తిరస ప్రధానమైన గ్రంథం. సమకాలీన జీవితమును కృష్ణదేవరాయలు పరిశీలించినంతగా మరెవరు పరిశీలించి ఉండక పోవచ్చు.

రాయల ఆస్థానలో లొల్ల లక్ష్మీధర పండితుడు ఉండేవాడు. ఇతను మొదట గజపతుల దగ్గర ఉండి తదుపరి విజయనగరానికి వచ్చినట్లుగా చెబుతారు. ఇతడు శివానంద లహరి అనే గ్రంథానికి వాఖ్యానం అలాగే దైవజ్ఞాన విలాసమను గొప్ప గ్రంథాన్ని రాసాడు. దైవజ్ఞాన విలాసమొక విజ్ఞానగని. రాయల విఖ్యాతమంత్రి తిమ్మరుసు గొప్ప సంస్కృత విద్వాంసుడు. అతడు అగస్త్య భారతానికి వ్యాఖ్యానం రాసాడు. తిమ్మ రుసు మేనల్లుడు నాదెండ్ల గోపన ప్రబోధ చంద్రోదయమను గ్రంథంపై టీక రాసాడు. విజయనగర రాజాస్థానానికి ఎందరో మత బోధకులు వచ్చి శాస్త్ర చర్చలు గావించేవారు. శ్రీకృష్ణదేవరాయలను ఆశ్రయించి ఎందరో కవులు, పండితులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ఆయన నుండి ఎన్నో బహుమతులు పోందేవారు. కవులను మిక్కి లిగా గౌరవించేవాడు. కృష్ణదేవరాయలు సాహిత్య చర్చల కోసం ‘భువనవిజయం’ అనే దానిని స్థాపించాడు. ఇందులో ఎందరెందరో కవులు పండితులు తమ పాండిత్య ప్రతిభను ప్రదర్శించేవారు. మత సంస్క ర్తలు విజయనగరాన్ని సందర్శించేవారు. అటువంటి వారిలో చైతన్యుడు, వల్లభా చార్యుడు వంటివారు ఉన్నారు. మాధ్వగురులగు వ్యాసతీర్థులు, విజయేంద్రులు, రామానుజ మతస్థులు డొడ్డయాచార్య, తాతాచార్య మొదలైనవారు విజయనగర రాజుల చేత అదరింపబడినారు. వ్యాసతీర్థుడు వేదాంతము, తర్కం వంటి విష యాలపై అనేక గ్రంథాలను రాసాడు. స్త్రీ రచయితలు కూడా విజయనగర రాజులచే గౌరవించబడినారు. వారిలో తిరుమలాంబ, గంగాదేవి మొదలైన వారు ఉన్నారు. తిరుమలాంబ వరదాంబికా పరిణయం అనే గ్రంథాన్ని రాసింది. గంగా దేవి మధురావిజయమనే గ్రంథాన్ని రాసింది. సాహిత్యంతోపాటు సంగీతం, నాట్యం వంటి కళలను కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆదరించి కళాకారులను గౌరవించాడు. శ్రీకృష్ణదేరాయలు వీణావాదాన్ని నేర్చుకొని దానిలో ప్రావీణ్యాన్ని సాధించాడు. కృష్ణుడను సంగీత విద్వాంసుడు కృష్ణదేవరాయలకు సంగీత గురువు. విజయనగర రాజుల కాలంలో శిల్ప కళ, చిత్ర లేఖనం ఎంతో ఆదరాన్ని పొంది అభివృద్ధిని సాధించాయి. ఎన్నోదేవా లయాలను నిర్మించారు. కృష్ణదేవరాయల భువన విజ యం పేరిట గొప్ప సభా భవ నాన్ని నిర్మించాడు. ఈ మంటపం గజాకారం గల స్థంభా లపై నిలిచి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలం సాహిత్యానికి, కళలకు స్వర్ణ యుగం. అంతటి మహోన్నత పరిపాలకులు భారతావనిలో చాలా తక్కువ మందే ఉన్నారంటే అతిశ యోక్తికాదు. విశాల భూభా గాన్ని పరిపాలించి గొప్ప పరిపాలకుడిగా పేరుపొందాడు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలంతో కదులుతూ వర్తమాన చరిత్రతో కరచాలనం

కాలంతో కదులుతూ వర్తమాన చరిత్రతో కరచాలనం

ANDHRAPRABHA –   Mon, 9 Feb 2015, IST

కాలానికి లేని చూపును మానవులు చారిత్రిక సులోచనాల ద్వారా తమ కళ్ళల్లో పొదుగుకోవాలి. రచయితల, పాత్రికేయుల దృష్టిలో ‘కాలజ్ఞత’కు అర్థం -అనుకూల పరిస్థితులలోనే కాదు, మంచి మార్పుకోసం జరిగే నిరంతర సమరంలో ప్రతికూల పరిస్థితులలో కూడా తెగబడి మరీ తనతనాన్ని సార్దకం చేసుకోవడమని కూడా అర్థం. ‘ధర్మం’ అంటే ‘ఆయుధ’ మేనన్నది వ్యాసభారత సూక్తి. పాత్రికేయులకూ, రచయితలకూ అదే ఆయుధం. ఇది అక్షర సత్యమైన వ్యాఖ్యానం. అక్షరాన్నే ఆయుధంగా చేసుకొని దశాబ్దాల తరబడి పోరాడుతున్నవారు ఎబీకె. ఎబీకేను ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన జగమెరిగిన పాత్రికేయులు. ఇక ప్రస్తుత విషయానికొస్తే గత ఆరేడు సంవత్సరాల కాలం ఒక పత్రికలో ఆయన రాసిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, భాషా, సాహిత్య, సాంస్కృతిక వ్యాసాలను అన్నింటిని ఒక దగ్గరకు చేర్చి ‘కాలంతో కరచాలనం’ పేరుతో వ్యాససంకలనాన్ని వెలువరించారు.

ఈ వ్యాసాలు వారి బహుముఖీనమైన ప్రతిభకు మచ్చుతునకలు.

ఈ వ్యాస సంకలనంలో ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు విభజన రాజకీయాలు, జాతీయాంశాలు రాజ్యాంగమూ .. చట్టాలు… సిబిఐ, అంతర్జాతీయం, విదేశాంగ నీతి, అవి.. ఇవి, తెలుగు భాష, ఆర్థికాంశాలు, వాతావరణ సమస్యలు. పర్యావరణం మొదలగు విభాగాలున్నాయి. ఈ అంశాలను పరిశీలిస్తే ఏదో ఒక విభాగంలో ప్రజ్ఞకలిగిన వారిగా కాక ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ధుష్టమైన విధానంతో, విషయ పరిజ్ఞానంతో అందించే వారిగా మనకు ఏబికె కనిపిస్తారు. ‘ఫార్ములా -1’ రేసును ఇండియాలోకి దిగుమతి చేయడానికి ‘తాళి’ కట్టినవాడు చంద్రబాబు. ఈ మధ్య ఆయన గ్రేటర్‌ నోయిడాలో ‘ఫార్ములా’-1 రేసు ప్రారంభం కానున్నదన్న వార్త రాగానే మహాసంతోషంతో అందుకుతానే అసలు ప్రతిపాదకుడననీ, కానీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ విదేశీ కార్ల రేసు రాకుండా అడ్డుకున్నారని ‘గొప్పలు’ చెప్పుకోబోయారు. అన్న చంద్రబాబు మాటలను కోట్‌ చేస్తూ మింగమెతుకులేదు గాని, మీసాలకు సంపెంగనూనె పట్టించుకోవడంకోసం ఆరాటపడ్డాడట వెనకటికొకడు అంటూ వ్యాఖ్యానిస్తారు ఏబికె ‘వికృత క్రీడోన్మాదానికి ఓ ‘ఫార్ములా’! అనే శీర్షికతో రాసిన వ్యాసంలో.

అలాగే కేజీ బేసిన్‌ సంపదపై వైఎస్‌ వైఖరే ఆదర్శం, ఆంధ్రా గ్యాస్‌ అంబానీల సొత్తా? అనే శీర్షికతో ఒక వ్యాసం కనిపిస్తుంది. అలాగే వైఎస్‌ పట్టించిన గ్యాస్‌ దొంగ, వైఎస్‌ స్వతంత్రుడు… అందుకే దాడి, ‘పావురాల గుట్ట’పై ప్రశ్నల తుట్టె, తెలుగువారి సమైక్యతా వారధి బూర్గుల: వేర్పాటు’తోనే అసమానతలు తొలగవు వంటి వ్యాసాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఈ వ్యాసాలు ఆరేడు సంవత్సరాల కాలంలో రాసినవని గుర్తుపెట్టుకోవాలి.తనది ‘వీర తెలంగాణాయే గాని వేరు తెలంగాణ కాదు’ అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి తెలంగాణ భవితవ్యానికి, మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆవేదనతో చేసిన ప్రతిపాదనకు మించి శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో అదనంగా ప్రత్యేకించి చెప్పిందేమీ లేదంటారు ఏబికె ‘వేర్పాటుపై శ్రీకృష్ణ ఒంటరికాదు! అనే వ్యాసంలో. ఇందులో ‘కక్ష రాజకీయమే కూలింది’ పేరుతో రాసిన ఒక వ్యాసంలో జగన్మోహన్‌ రెడ్డిని అసలెందుకు నిర్భందించవలసి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వకుండా, క్షమాపణ చెప్పుకొనకుండా కాంగ్రెస్‌ నల్లిలాగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి కోసం కాంగ్రెస్‌ అధిష్టానం జగన్‌పై కక్ష సాధింపునకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చివరకు దొరికిపోయింది కాంగ్రెస్‌ ప్రభుత్వమూ, సిబిఐలేనంటారు ఈ వ్యాసంలో. ఏబికె కు కొన్ని నిర్దుష్టమైన నిశ్చితాభిప్రాయాలున్నాయి. వాటిని వ్యక్తం చేయడంలో ఎప్పుడూ వెనకంజ వేసిందిలేదు. నిర్మొహమాటంగా చెప్పటంలోనూ ఆయనెప్పుడు ముందే ఉంటారు.

‘వాగుడు కాయల కొలువులు’ పేరుతో ఒక వ్యాసమిందులో కనిపిస్తుంది. దాదాపు పన్నెండు చానళ్ళు ఒకే పార్టీపైనా, ఆ పార్టీ నేతపైనా వీక్షకుల తలమొత్తేలా వ్యతిరేక ప్రచారాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికల రుతువు ఆఖరి వారం రోజులలో అవి ఎంతహద్దు మీరాయో కూడా ప్రేక్షకులు గమనించారు. అక్కసుతో కూడిన ఆ దుష్ప్రచారం అంతా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పైనా, ఆ పార్టీ నాయకుడు జగన్‌పైన. అంటూ చానళ్ళ నైజమేమిటో తనదైన కోణంలో వివరిస్తారు.

ఒక వర్గం వారి ‘ఆడపిల్లలు ప్రత్యర్థి వర్గం జనాభాను పెంచే సంతానోత్పత్తి’ యంత్రాలు కాకూడదట! దీన్నిబట్టి చూస్తే పురుషాధిక్యతా రోగం, బడుగు, బలహీన వర్గాలు మైనారిటీల పట్ల ఏహ్యమైన చిన్నచూపు, దుర్మార్గపు మనస్తత్వం ఎంతగా గూడుకట్టుకుని ఇప్పటికీ ఊళ్లేలుతున్నాయో అర్థమవుతోంది. ఏ రాజకీయ పక్షానికీ మత వ్యవహారాలతో మతాలలో సంబంధం ఉండరాదని, మత సంస్థలకు రాజకీయాలతో ప్రమేయం ఉండరాదని రాజ్యాంగ నిర్ణయ సభ తీర్మానం. కానీ పాలక పక్షాలు మత రాజకీయం ద్వారా ఎన్నికలలో ప్రజల్ని సమీకరించడానికి అలవాటుపడ్డాయని దుయ్యపడతారొక వ్యాసంలో. మారని మనిషి మోడీ! అనే వ్యాసంలో గుజరాత్‌లో ప్రభుత్వ కిరాతక చర్యలను ముఖ్యమంత్రి మోడీకి గుర్తుచేసి రాజధర్మం కాస్తా తప్పావు. ధర్మం పాటించడం నేర్చుకోమని నాటి ప్రధాని వాజ్‌పేయి స్వయానా పాఠం చెప్పారు! అయినా మోడీ బుద్దిమారలేదు. తాను గుజరాత్‌లో చేసిన పని తప్పుకాదని, ఒప్పేనని సమర్థించుకుంటున్నాడని మోడీ గురించి వివరిస్తారు. నక్సల్స్‌ మిలిటెంట్‌ కార్యకలాపాల గురించి కాంగ్రెస్‌ తీర్మానం గురించి వివరించిన ఒక వ్యాసంలో రాజకీయ కార్యక్రమం ఏదైనప్పటికీ కనీసం నాగాలాండ్‌ తరహా కాల్పుల విరమణకు ఉభయులూ సిద్ధమై, వాస్తవ జీవితంలో ప్రజాసమస్యల ఆధారంగా రాజకీయ పరిష్కారం వైపుగా సంప్రదింపులు జరపడం మంచిది. ఈ ఆశ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానంలో స్పష్టంగా ఉన్నందున నక్సల్స్‌ కూడా తెగేవరకూ లాగకుండా ఆచరణలో సమస్యల పరిష్కార దిశగా ప్రజలలో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి కార్యాచరణకు పూనుకుంటే ప్రజాబాహుళ్యం ఆహ్వానిస్తుందనడంలో సందేహం లేదంటారు ఏబికె. అలానే ఈ రోజున 230 జిల్లాలకు నక్సల్స్‌ మిలిటెంట్‌ కార్యకలాపాలు పరివ్యాప్తమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడుజాగ్రత్తగా సమస్యను ఒక కొలిక్కి తేవడానికి సంప్రదింపులద్వారానే శతథా ప్రయత్నించాలని హితవు పలుకుతారు ఏబికె. పార్లమెంటే ‘సర్వాధికారి’ కాదు!, కావాలి ప్రతి మహిళ ఒక కాళిక! సుప్రీం మాటే అంతిమం! అమెరికా అవుట్‌ సోర్సింగ్‌ ఔట్‌ కాక తప్పదా! అరబ్బుల ఆగర్భ శత్రువు అమెరికా, లాడెన్‌ హతం ‘అంతం’ కాదు, లాడెన్‌ మరణం ఒక మిస్టరీ! స్వేచ్ఛ పేర శత్రు సంహారం, వర్థమాన మహావీరుడు గడాఫీ, డ్రాగన్‌పై అమెరికా డేగ కన్ను, ఏ టాబ్లాయిడ్‌ పుట్టలో ఏ పామున్నదో?! అమ్మ భాష -అరణ్య ఘోష, మాతృభాషే సార్వత్రిక మాతృక! వంటి అనేకానేక వ్యాసాలు ఇందులో కనిపిస్తాయి. ఏబికే సాహిత్య సంపాదకీయాలు అసిధారా వ్రతంతో చేసిన రచనలు. అపరంజి రేకులు, రమ్యాలోక విలసితాలు. ఆయన మనస్సు మహితం. బుద్దిమహాతీక్షణం. విమర్శ నిష్పక్షపాతం. ఆయన ఊహలు సత్యధర్మ సంయుతాలు. ఆయన సంపాదక శిరోమణి అని తిరుమల రామచంద్ర గారన్నమాటలు ఇక్కడ ప్రస్తావించడం సమయోచితం.

పేజీలు: 494, వెల: 220 రూపాయలు, ప్రతులకు: ఏబికే ప్రసాద్‌, కేరాఫ్‌ సి.ఆర్‌.ఫౌండేషన్‌, వృద్ధాశ్రమం, రూమ్‌ నెం.10, కొండాపూర్‌, హైదరాబాద్‌ -84. మరియు -విశాలాంధ్ర, నవోదయ బుక్‌ హౌసుల్లో–


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ది లాస్ట్ ఎమ్పరార్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అరదా రచన -అర్ధం చేసుకోరూ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎన్నికలు నేర్పిన పాఠం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాఘ బహుళ ఏకాదశి 15-2-15 ఆదివారం శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చిత్రమాలిక 

మాఘ బహుళ ఏకాదశి 15-2-15 ఆదివారం శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి  వ్రతం  చిత్రమాలిక

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -12

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -12

6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ -2

మేల్విల్లీ ‘’కానిబాల్స్ ‘’ఆటవిక జాతుల తో కలిసిపోయాడు .వాళ్ళ బట్టలే వేసుకొన్నాడు .వాళ్ళలాగే నగ్నం గా సముద్ర స్నానాలు చేసేవాడు .ఇవన్నీ ‘’టైపీ’’నవలలో అచ్చం గా జరిగింది జరిగినట్లు రాశాడు .ఈయన సమక్షం లో ఆ జాతివారు తమ నర మాంస భక్షణ చేయలేదు .వాళ్ళ పండుగా పబ్బాలలో వారిలాగే పాల్గొని ప్రవర్తించాడు .ఆ జాతి మనుషులు  సౌందర్యారాధకులు .’’ సెక్సానందం ‘’లో నిష్ణాతులు .నిజం గా అదొక స్వప్న లోకమే అందులో ఉండిపోవాల్సి వచ్చింది మెల్ విల్లీ . ‘’బంగారు యుగం లో కంచుబంగారు మనుషుల’’ తో గడిపాడు .రెక్కాడితెకాని డొక్కాడని జీవులు వారు .వ్యాపారం వర్తకం తెలీని అమాయకులు .ఈ సంస్కృతిని మేల్విల్లీ ‘’స్నివిలై జేషన్ ‘’అన్నాడు సరదాగా .అదునాతన అమెరికా వాసి అనామక ఆటవిక జాతి మధ్య అదే ఆటవిక జీవితం గడపటం వింతల్లో వింత .ఇస్టపడే  అక్కడ ఉన్నా ఇంటి బెంగ పట్టుకోంది కొంతకామైన తర్వాత . ..కాలికి గాయం అయి వాళ్ళు ఎన్నిరకాల మందులు వేసినా నయం కాక బాధ ఎక్కువైంది .వాళ్ళ విపరీతమైన ఆపేక్ష ,నిఘా లను ఎలాగో అలాగా వాళ్ళ మనిషి సాయం తోనే తప్పించుకొని బయటపడ్డాడు .అక్కడ నుండి ఆస్త్రేలియన్ వేలింగ్ షిప్ ‘’లూసీ ఆన్ ‘’ఎక్కి పారిపోయాడు .

ఈ నౌక ప్రయాణమూ మహా ఘోరంగానే ఉంది .కెప్టెన్ తాగు బోతు,జగడాల మారి .షిప్ –పాపిటే చేరగానే సిబ్బందిని  అందర్నీ బందీలుగా పట్టుకొన్నారు .మేల్విల్లీని వదిలేశారు కాలిగాయం ఉండటం వలన .రెండు సార్ల సముద్రయానం ఏమీ లాభించాలేదని తిమింగిల వేటకు సిద్ధపడ్డాడు .చార్లెస్ అండ్ హెన్రి నౌకా ప్రయాణానికి రిజిస్టర్ చేయిన్చుకొన్నాడు .ఇది అతని మూడవ వేల్ హంట్ షిప్ .హవాయ్ చేరాక ఒక ఇంగ్లీష్ స్టోర్ కీపర్ దగ్గర గుమాస్తాగా చేశాడు .ఏదైనా చిలక కొట్టుడే కాని కాసుల వర్షం రాలలేదు .హోనోలూలు చేరాడు .అక్కడా అదృష్టం వెక్కిరించింది .వేల్ హంట్ బోర్ కొట్టింది .నాలుగు నెలలు హవాయి లో గడిపి అమెరికా ప్రయాణానికి బయల్దేరాడు .

పద్నాలుగు నెలలు  నేవీ ‘’లో సైలర్ గా ఉండి మళ్ళీ మార్క్వేస్ దీవి మీదుగా దక్షిణ అమెరికా వెళ్ళాడు .అక్కడ శిధిల ,అవినీతిమయ మైన లిమా సిటీ చూశాడు .ఆ అనుభవం జీవితం లో ఎన్నడూ మరచిపోలేదు .కొద్ది మంది స్నేహితుల సాయం తో ఓడ ఎక్కాడు .నావికా సిబ్బంది పాశవికం గా ప్రవర్తించేవారు .1844అక్టోబర్ 3 న అమెరికా లోని బోస్టన్ చేరుకొన్నాడు .నేవీ సర్వీస్ నుండి విడుదలయ్యాడు .దాదాపు పాతికేళ్ళు ఏ రకమైనఉత్సాహ ప్రోత్సాహాలు ,స్తిరాదాయం లేకుండా గడిపాడు దుర్భర జీవితాన్ని ..

అపార అనుభవం మాత్రం వచ్చింది రాయటం మొదలు పెట్టాడు పదాలు దూసుకొచ్చి కాగితాలు నిండిపోతున్నాయి అదొక మానసిక చేతనా వస్థ.నూకు –హియా దీవి అనుభవాలతో’’ టైపీ’’నవల రాశాడు .ఇందులో మేల్విల్లీ జీవిత చిత్రణ ఏదో కల్పనా ఏదో తెలియ నంత అద్భుతం గా సాగి అందరికి నచ్చింది .’’Herman Melvillie is the morning of the  imagination’’అన్నాడు లెవీస్ మంఫోర్డ్ .ఆయనే హెన్రి డేవిడ్ తోరో తో పోల్చాడు .ఇద్దరూ వాస్తవానికి రూపు కట్టించారని మెచ్చాడు .నేటివిటి కి ప్రాణం పోశారిద్దరూఅనాగరక జాతుల మధ్య తిరిగినా  అమెరికా  మామూలు సంస్కృతీ సంప్రదాయం లోకి చేరారు .అమెరికా నిత్య జీవితాన్ని కొంత  ఏవ గింపు తో అక్షరబద్ధం చేసిన రచయితలూ ఈ ఇద్దరు .టైపీ నవల సెన్సేషనల్ హిట్ కొట్టింది .విపరీతమైన క్రేజ్ తో జనం కొని చదివి ఆనందించారు ,రచయితను బాగా ప్రోత్సహించారు .టిప్సీ జాతి మనుసుల మధ్య మేల్విల్లీ గడిపిన ఈవితం ఏంతో ఆసక్తిగా ఉండటం అలా అంతకు ముందు ఏ రచయితా ఆ జాతి జీవుల గురించి ఆచార వ్యవహారాల గురించి రాయకపోవటం చదువరులను ఏంతో బాగా ఆకర్షించి అభిమానులయ్యారు మేల్విల్లీకి .సూపర్ డూపర్ హిట్ అయింది టైపీ .ఇరవై ఎనిమిదేళ్ళనాటికే ఈ అపూర్వ విజయం హెర్మాన్ కు దక్కింది  . రెండో పుస్తకం బిల్లీ బాడ్ రాసి ప్రచురించాడు

క్రమం గా మేల్విల్లీ కి సాహిత్యాభిమానులు స్నేహితులు ఏర్పడ్డారు .వారు అతన్ని ఒక ‘’ఐకాన్ ‘’గ భావించారు .గతాన్ని హాయిగా మర్చి పోయి కొత్త ఉత్సాహం తో ముందుకు దూసుకొని వెళ్ళే అవకాశం నమ్మకం  వచ్చింది .ఎలిజ బెత్ షా అనే చిన్న నాటి నుండి తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .అందంగా లేకపోయినా అభిమాన వతి అయిన భార్య .భర్తపై ఆరాధనా భావం ఉన్నభార్య .రచనే తన జీవితా సర్వస్వం అని మేల్విల్లీ భావించి రాస్తున్నాడు అతని దృక్పధాన్ని అర్ధం చేసుకొని ఆమె సహకరిస్తోంది .డబ్బు అప్పుతెచ్చో నగలు అమ్మో అతని రచనా వ్యాసంగానికి ఇబ్బంది లేకుండా సంసారం గడుపుతోంది .భార్య పై మేల్విల్లీకి అమిత ఆపేక్ష ,ప్రేమ స్నేహభావం .ఆమెతో రోజూ వాకింగ్ చేసేవాడు .తను  రాసింది చదివి  వినిపించేవాడు .హడావిడి హనీమూన్ పూర్తీ చేసుకొని మళ్ళీ పూర్తిగా రచనలో మునిగిపోయాడు మేల్విల్లీ .భర్తకు అవసరమైన కొత్త రాతబల్లా కుర్చీలు సౌకర్యాలు ఆమె చూసేది .

మేల్విల్లీ మూడో నవల ‘ మెర్డి’’ప్రచురించాడు .తాను  ఇరవై తొమ్మిదో ఏడు దాకా మహాకవి షేక్స్పియర్ గురించి తెలుసుకోనందుకు బాధ పడ్డారు .ఆయన జీసస్ తో సమానం అని భావించాడు .మహాకవి రాచనలన్నీ చదివి జీర్ణించుకొన్నాడు .ఇప్పుడు రాసే దానిలో ఆయన ప్రభావం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది .మార్డి నవల ఒక సెటైర్  వేదాంతం గా ,కవితగా ,దృష్టాంతం గా కలగలుపుగా సాగింది .దీని నేపధ్యం దక్షిణ సముద్రమే .అందులోని మితికల్  దోమినారో  ఇంగ్లాండ్ కు ,ప్రాఫెర్రో .ఈజిప్ట్ కు ,ఫ్రాంకో ఫ్రాన్స్ కు వివెంజా అమెరికాకు చెందిన పాత్రలు .మార్డి విమర్శకులను అప్రతిభులను చేసింది కాని రీడర్స్ ను చేర లేక పోయింది .నిరాశ మిగిల్చింది .మళ్ళీ సముద్రయాన సాహసాల కధలు రాయటం మొదలు పెట్టాడు .’’రెడ్ బరన్ ‘’పేరిట మొదటి యూరాప్ పర్యటన లో షిప్ బాయ్ గా అనుభవాలు రాశాడు .అంతగా’’ పేలలేదు’’కాని సముద్ర ప్రయాణ జీవితం బాగా వచ్చింది .డబ్బుకోసమే దీన్ని రాశానని చెప్పుకొన్నాడు .కొడుకు పుట్టాడు ఖర్చులు పెరిగాయి పొగాకు కొనుక్కోవటానికైనా డబ్బు లోస్తాయని రాశానన్నాడు .అందులో మేల్విల్లీ నిజాయితీ అడుగడుగునా ప్రత్యక్షమై విపరీతమైన సానుభూతి వచ్చి మార్డీ నవల కంటే రెట్టింపు అమ్మకాలు జరిగాయి .తర్వాత ‘’వైట్ జాకెట్ ‘’ మూడుభాగాలుగా రాశాడు .ఇందులో  యునైటెడ్ స్టేట్స్ ‘’అనే నౌక పై తన నేవీ అనుభవాలను రాశాడు .కొంత సింబాలిజం కూడా జోడించి  వైట్ జాకెట్ వండాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ .14-2-15 –ఉయ్యూరు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ కృష్ణుని జాతక చక్రం – శివుని దశావతారాలు-వాసవి స్రవంతి -ఫిబ్రవరి

krishna jatakam 001 dasha shiva 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వట్టి కోట ఆళ్వారుస్వామి జైలుకధాలు – వేటూరి వారి మానవీయత -మూసీ -ఫిబ్రవరి

veturi1 001 veturi2 001 veturi3 001vattikota1 001 vattikota2 002

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరుదేశ్వార్ మరయు జోశ్యం వారి శివ స్తుతిపద్యాలు -మూసి-ఫిబ్రవరి

marudesvar 001 sivaratri 001

మరుదేశ్వార్ మరయు జోశ్యం వారి శివ స్తుతిపద్యాలు -మూసి-ఫిబ్రవరి

kuvempu-1 001 kuvempu2 001 kuvempu3 001

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విలువల ముఖ్యమంత్రి సాహితీ వేత్త సంజీవయ్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సాహితీ హెమింగ్వే -కేశవా రెడ్డి మృతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-3

మినీ  ద్విపద్స్-3

21-ఓడిన ఒక ఎన్నిక కే’’ మోడీ ‘’

  బావురుమని  అయ్యాడు ‘’మూడీ ‘’

22-నాగార్జున నీటికి’’ తాళం ‘’

   తెలుగోళ్ళ మద్య ఇదేం ‘’మేళం?’’

23-ఇవాళ ‘’వేలంటైన్ డే’’

    రేపు’’ విడాకుల డే?’’

24-పచ్చనిపోలాల్లో రాజదానేమిటి ?

   ఉండవల్లి అసహనం ఇప్పుడా ఏమిటి?

25- నాలుగేళ్ళు గడ్డుకాలమే’’డిగ్గీ ‘’

    హస్తానికి ఆయనే పెట్టాడు’’ బుగ్గి ‘’

26-సామాన్యుని పట్టాభిషేకం’’ నేడే ‘’

     ఏడాది చెర నేటితో ‘’వీడే’’ .

27-నేడే వరల్డ్ కప్ ‘’టెంపర్ ‘’

  ప్లేయర్స్ కు ఆఫర్ ‘’బంపర్  ‘’.

28-  సాహితీ’’ వేత్త’’ సంజీవవయ్య ‘’

    విలువల  సి .ఏం. గా ‘’.అయ్యే ‘’.

29-ఐ ఎస్ ఐ పై  ఒబామా ‘’దూకుడు’’

    ప్రతిస్ట కోసం  పాపం’’ పాకుడు ‘’

30-తెలుగు సాహితీ ‘హెమింగ్వే ‘’

    కేశవ రెడ్డి ని అయ్యో కేన్సర్ ‘’మింగే ‘’.

     సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-2-15- ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -11

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -11

6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ

ఆమెరికా సాహిత్య చరిత్రలో అత్యద్భుత అత్యు న్నత నవలా నిర్మాతగా  , ద్రస్టగా ,కవిగా విజయ వంతమైన రచయితగా పేరొందిన వాడు హెర్మన్ మేల్విల్లీ .ఇంత గొప్పవాడు చనిపోయే ముందు ఒక అజ్ఞాత వ్యక్తిగా ఉండిపోవటం దురదృష్టకరం .అయన ఇంటి నుంచి పారిపోయి నరమాంస భక్షకులతోకలిసి జీవించాడని మాత్రమే అమెరికన్ జనాలు గుర్తుపెట్టుకొన్నారు .మిగిలినవన్నీ మర్చే పోయారప్పటికి  .అమెరికా గర్వించదగిన ఉన్నత కుటుంబం లో 1-8-1819 లో న్యూయార్క్ సిటి లో జన్మించాడు .తలిదండద్రులిద్దరివైపు వారూ అమెరికన్ రివల్యూషనరీ యుద్ధం లో  వీరోచిత పోరాటం చేసిన వారే  .పాల్గొన్నవారే .తాత బోస్టన్ టీ పార్టీ నిర్వహణ సమయం లో మేజర్ గా ఉంటె ,మాతామహుడు పీటర్  గేంస్ వర్త్ ఫోర్ట్  స్టాన్విక్స్ ను  బ్రిటిష్ మూకల దాడి నుండి కాపాడి రక్షించిన యోధుడు .తల్లివైపు వారిది  డచ్ –అమెరికన్ సంప్రదాయం .గాల్వనిస్ట్ విధానాన్ని తూ చా గా పాటించే వారు .ఎనిమిది మంది సంతానం లో మేల్విల్లీ మూడవ వాడు .ఇల్లు మంచి వాతావరణం లో తలిదండ్రులు నడుపుతున్నారు .హంగూ ఆర్భాటాలు లేవు .తండ్రి దిగుమతి వ్యాపారస్తుడు .కమీషన్ వ్యాపారి .ఎప్పుడూ ఇతర దేశాలు తిరిగే వాడు .మంచి స్కూల్ లో చేర్పించి మేల్విల్లీ ని చదివించాడు .తండ్రితో అప్పుడప్పుడు ఇతర ప్రదేశాలు వెళ్లి చూసేవాడు .

కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు .ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవటం సహజం .1830 లో దేశం లో డిప్రేషన్ వచ్చి వ్యావారాలన్నీ దెబ్బతిన్నాయి .మేల్విల్లీ తండ్రి దివాలా తీశాడు .కుటుంబాన్ని ఆల్బనికి ,తల్లి బంధువుల సమీపానికి మార్చాడు .అక్కడ ఫర్ బిజినెస్ చేసి అప్పుల్లో నిండా మునిగిపోయాడు .శారీరక మానసిక ఆరోగ్యం కోల్పోయాడు .మానసిక వ్యాధి కూడా వచ్చింది .ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి నలభై ఏళ్ళకే చనిపోయాడు .అన్న గాన్సూవేర్ట్ తండ్రివ్యాపారాన్ని బుజాన వేసుకొని నిర్వహించాడు .అన్న వ్యాపారమూ లాభించలేదు .హెర్మన్ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పొట్ట పోషించుకొంటూ కుటుంబాన్ని ఆదుకొనేవాడు .పద్దెనిమిదో ఏట టీచర్ గా చేరాడు పిట్స్ ఫీల్డ్ లో .కుటుంబం లాన్సింగ్ బర్గ్ కు చేరింది .ఇంజినీర్ అవ్వాలనే ఉద్దేశ్యం లో మేల్విల్లీ సర్వేయింగ్ లో చేరాడు .స్తానిక పత్రికలలో వ్యాసాలూ రాసేవాడప్పుడప్పుడు.1839లో లివర్ పూల్ వెళ్ళే సెయింట్ లారెన్స్ నౌక లో కేబిన్ బాయ్ గా నమోదయ్యాడు .అతని తోపాటు అందులో పని చేసేవాళ్ళు ‘’రఫ్ అండ్ టఫ్  ‘’టైపు మనుషులు .అల్లకల్లోల సముద్రం భయానక ప్రయాణం అతని మనసుపై ముద్ర వేసింది .హృదయం అల్లకల్లోలమైంది సముద్రం తో పాటు .ఎన్నో కొత్త కొత్త భావాలు ఊపిరి సలపనివ్వకుండా ముసురుతున్నాయి .నౌకలో అతనిపని కోడి పిల్లల్ని మాంసం కోసం శుభ్రం చేయటం పందులకు పడుకొనే సదుపాయం కలిగించటం .’’గాడిద చాకిరి చేయించేవారు నన్ను’’ అని చెప్పుకోన్నాడు..చాలా నీచం గా క్రూరం గా డబ్బున్న మనుషులు హీనం గా’’అలబామాలో ఉన్న ఆఫ్రికన్ ‘’లాగా  చూసేవారు .ఇంత హీన నీచ పరిస్తితులలో పని చేస్తున్నా ఏమాత్రం అసహ్యించుకోకుండా గాడిద చాకిరీ చేస్తూనే ఉన్నాడు .దీఇకి ముఖ్య కారణం సముద్ర ప్రయాణం మీద ఉన్న మోజే .ఈ వింత విపరీత విషయాలన్నీ మేల్విల్లీ రాయబోయే  బృహత్తర నవలలకు ముడి సరు కైంది.ఈ మొదటి విదేశీ ప్రయాణంలో  నాలుగు నెలలు  గడిపాడు  మేల్విల్లీ .లివర్ పూల్ లో దుర్భర జీవితాన్నే గడిపాడు .మళ్ళీ న్యూయార్క్ చేరాడు కాని జీవితం  అనిశ్చితం  అనిపించింది . పల్లెటూరి స్కూళ్ళలో టీచర్ గా పని చేశాడు.దీనితో గ్రామీణ వాతావరణానికి బాగా అలవాటు పడ్డాడు .ఈ నేపధ్యం లో కొన్ని రచనలు చేశాడు .దీని అప్రెంటిస్ వర్క్ అన్నారు .

ఎన్నిప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం రాలేదు అందుకని ‘’ఆషు నెట్ ‘’అనే ‘’వేలింగ్ షిప్’’ లో ప్రయాణించటానికి సభ్యుడైనాడు మేల్విల్లీ .ఇది సుదీర్ఘ ప్రయాణం .తెరచాపలు అల్లాడు .‘’వేల్ వేట’’లో ఆనందం పొందాడు. ప్రతి చిన్న విషయాన్ని గుర్తుంచుకొని పదేపదే మననం చేసుకొనేవాడు .రాయబోయే చారిత్రాత్మక విశేష నవల ‘’మోబీ డిక్ ‘’కు కావలసిన విషయమంతా మనసులో సుళ్ళు తిరిగింది .నౌకలోంచి సముద్రం లోకి దూకే వాడు .నౌక మీద విపరీతం గా శ్రమపడి  అసలైన ట్రేయినిం గ్ పొందాడు .దాన్ని గురించి తెలియ జేస్తూ ‘’వేల్ షిప్ అంటే హార్వర్డ్ ,నాఏల్ కాలేజి ‘’అన్నాడు .అంత పరస్పర సంబంధం ఉందని అన్నాడన్నమాట .’’ఆషునేట్ షిప్ ‘’1841జనవరి మూడున మాసచూసేట్స్ లోని న్యు బెడ్ ఫోర్డ్ నుండి బయల్దేరింది .బాగా  కిక్కిరిసిన జనం తో బయల్దేరింది .కెప్టెన్ ఒక కిరాతకుడు .మూడీ ఫెలో . ప్రయానణీకులూ మూడీ ఫెలోస్ గానే ఉన్నారు .ఏడాదిన్నర ప్రయాణం చేసి మార్క్వేయాస్ చేరింది. అప్పుడు మేల్విల్లీ  ఇంకో తోటి మనిషితోకలిసి నౌకను వదిలేశారు .నూకూ హివా అనే మారుమూల ప్రదేశానికి పారిపోయారు .అక్కడి టైపీస్ జాతి నరమాంస భక్ష కుల  మధ్య గడిపారిద్దరూ .వీరిద్దరిని బందీలుగా చేసి గౌరవంగానే చూశారు .Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-2-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

క్షేత్రాలు పై స్పందన

spandana1 001 spandana2 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఫ్రెడరిక్ ది ,గ్రేట్ పీటర్ ది గ్రేట్,చంద్రబాబు ది గ్రేట్ -రామ్ కుమార్

capital1 001 capital2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వరల్డ్‌ కప్‌ కోసం కీరవాణి పాట

వరల్డ్‌ కప్‌ కోసం కీరవాణి పాట

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ జీవితంపై నీరజ్‌ పాండే రూపొందిస్తున్న ‘ఎం.ఎస్‌. ధోని – ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రం కోసం తయారుచేస్తున్న ‘ఫిర్‌ సే’ అనే పాటను వరల్డ్‌ కప్‌లో పాల్గొంటున్న భారత క్రికెట్‌ జట్టుకు అంకితం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడైన ఎం.ఎం. కీరవాణి ఇప్పటికే ఈ పాటకు బాణీలు సమకూర్చగా, మనోజ్‌ ముంతషిర్‌ సాహిత్యం అందించాడు. స్వతహాగా క్రికెట్‌ ప్రేమికుడైన నీరజ్‌ ఈ పాటకు వీడియోను కూడా రూపకల్పన చేస్తున్నాడు. ప్రపంచ కప్‌లో భాగంగా ఈ నెల 15న భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఒకదానితో ఒకటి తలపడనుండగా, అదే రోజు ఆ పాటను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని నీరజ్‌ తెలియజేస్తూ ‘‘మొత్తం దేశపు భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా ‘ఫిర్‌ సే’ పాట ఉంటుంది. భారత జట్టు నుంచి దేశంలోని ప్రతి ఒక్కరూ ఏం ఆశిస్తున్నారో అది ఈ పాటలో ఉంటుంది. ఇది ఒక ప్రార్థనాగీతం, ఒక ఆశయ గీతం. ఎం.ఎం. క్రీమ్‌ సాబ్‌ చాలా అందమైన బాణీలు సమకూర్చారు. మన జట్టుపై మనకుండే ప్రేమకు, దేశం కోసం మన ఆటగాళ్లు పడే తపనకు ఇది మేం అందిస్తున్న నీరాజనం’’ అని చెప్పాడు. ‘ఎం.ఎస్‌. ధోని’ చిత్రాన్ని ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, ఇన్‌స్పైర్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తుండగా, టైటిల్‌ రోల్‌ను సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుట్‌ పోషిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌ 22న ఈ చిత్రం విడుదల కానున్నది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కర్మ మేనేజ్ మెంట్ -శ్రీ అరవింద రావు

కర్మ మేనేజ్మెంట్

మనిషి శాసీ్త్రయ పద్ధతిలో నిరూపించలేని విషయాల గూర్చి, ఎవరూ చూడలేని విషయాల గూర్చి మత ప్రచారకులు వాదులాడుతుంటారని మనకు తెలిసిన విషయమే. అలాంటి వాటిలో కర్మ ఒకటి. హిందూమతంలో ఉన్న కర్మ సిద్ధాంతం ప్రజల్ని బానిసత్వంలో ఉంచే ఉద్దేశంతో చెప్పబడింది అనే వాదన ఇటీవలి కాలంలో వచ్చింది. ఒక సామాజిక వర్గం వారు ఇలాంటి పనిచేశారు అంటూ ఆ వర్గం పట్ల ద్వేషం రగిలించడం కూడా జరుగుతోంది. అందువల్ల దీన్ని తెలుసుకోవడం అవసరం.
కర్మ అంటే పని అని అర్థం. ఆఫీసుకు వెళ్లడం లేదా టీ తాగడం లాంటి పనులనే అర్థం కాదు. సమాజంలోని ఇతర వ్యక్తులతో వ్యవహరించడంలో మన ప్రవర్తనకు కర్మ అని పేరు. మన ప్రవర్తన నైతికంగా ఉండవచ్చు. అనైతికంగా ఉండవచ్చు. అసాంఘిక ప్రవర్తన అదుపు చేయడానికి ప్రతి సమాజంలో చట్టాలు ఉంటాయి. కాని కొన్ని రకాల ప్రవర్తనకు చట్టం ప్రకారం శిక్ష లభించవచ్చు. కొన్ని చట్టపరిధిలోకి రాకపోవచ్చు. చట్టపరిధిలోకి రాని అనేక పనులు ఎదుటివాళ్ళను హింసించేటట్టు ఉండవచ్చు. ఇలాంటి పనులు జరగకుండా మేనేజ్‌ చేయడం, ప్రజలందరూ మంచి మార్గంలో నడిచేటట్టు చేయడం అందరు మత పెద్దల ముందున్న పెద్ద సమస్య. దీనికై మతాలు తమ తమ ధోరణిలో కొన్ని విశ్వాసాల్ని చెప్పాయి. ఫలానా పని చేయడం వల్ల స్వర్గం అనే బహుమతి పొందుతారనీ, మరో విధమైన పనివల్ల నరకం అనే శిక్షను పొందుతారనీ అన్ని మతాలూ చెబుతాయి. ఈ బహుమతి, శిక్ష అనేవి మనం చేసిన కర్మకు ఫలం. ఈ ఫలాన్ని కూడా కర్మ అనే పేరిట పిలుస్తూంటాం. కర్మను అనుభవించాల్సిందే అనే మాటను వాడుతూంటాం.
కర్మఫలం మేనేజ్‌మెంట్‌పై అనేకులు అనేకరకాలుగా చెప్పారు. మంచి చేసేవాడికి మంచి ఫలితం రావాలి. చెడు చేసేవాడికి చెడ్డ ఫలితం రావాలి అనేది న్యాయసమ్మతం. ఈ విషయంలో మతాలు ముఖ్యంగా రెండు విధాలుగా చెప్పాయి. 1. ప్రతివ్యక్తీ కర్మఫలం తప్పక అనుభవించవలసిందే అని, మనం చేసే పనులు అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి అనేక జన్మలు ఉంటాయి అని చెప్పడం. 2. ఫలానా మతాన్ని నమ్మితే మీ పాపాలన్నీ దేవుడు తీసుకుంటాడని చెప్పడం మరో పద్ధతి. ఏది ఏమైనా కర్మఫలం ఉంటుందని దేవుణ్ణి నమ్మే వారందరూ ఒప్పుకున్న విషయమే.
మనం చేసే మంచి, చెడు పనులన్నింటినీ లెక్కపెట్టడానికి దేవుడి వద్ద ఏదో ఒక విధానం ఉందని అన్ని మతాలూ చెబుతాయి. ఒక ఉర్దూ కవి ఇలా వాపోయాడు- పకడే జాతే హై ఫరిష్తోంకే లిఖే పర్‌ నా హక్‌ – అంటే కుడిభుజం పై కూర్చున్న దేవదూత పుణ్యకార్యాలన్నింటినీ నోట్‌ చేసుకుని, ఎడమ భుజంపై ఉన్న దేవదూత పాపకార్యాల్ని లెక్క వేసుకొని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు కానీ నా సంజాయిషీ వినడం లేదు అని ఆయన బాధ. కర్మ ఎకౌంటింగ్‌కుగాను యమలోకంలో చిత్రగుప్తుడు కంప్యూటర్‌లాగ లెక్క వేస్తాడని పురాణాల్లో చూస్తాం.
ఒక వ్యక్తి తను చేసిన పనుల ఫలితాన్ని మరో జన్మలో అనుభవిస్తాడనీ, లేదా ఈ జన్మలో ఉన్న స్థితికి ఇంత క్రితం జన్మల్లో చేసిన పనులు కారణమనీ నమ్మడాన్ని కర్మసిద్ధాంతం అంటారు. కర్మ సిద్ధాంతాన్ని హిందూమతమే కాకుండా బౌద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ఆసియా మతాలన్నీ నమ్ముతాయి. బౌద్ధం, జైనం దేవుణ్ణి అంగీకరించకున్నా కర్మసిద్దాంతాన్ని నమ్ముతాయి. చైనా, జపాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక మొదలైన దేశాలన్నీ బౌద్ధదేశాలు. అంటే ప్రపంచంలో దాదాపు యాభైశాతం ప్రజలు జన్మ ఉందని నమ్ముతారు. బుద్ధుని జాతక కథలు, జైనుల తీర్థంకరుల కథలు ఇవన్నీ కర్మ, మరో జన్మను తెలుపుతాయి.
భారతీయ సంస్కృతిలో కర్మ సిద్ధాంతాన్ని చెప్పడానికి కారణాల్ని ఇలా చెప్పారు.
1. మనిషి ఎన్నెన్నో పనులు చేస్తూంటాడు. వాటన్నింటికీ ఫలితం అతను బ్రతికుండగానే అనుభవించే అవకాశం ఉండదు. దీనికి మనం చాలా ఉదాహరణలు చూస్తూంటాం. ఇంత మంచి వ్యక్తి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడని లేదా ఇన్ని దుర్మార్గాలు చేసిన వ్యక్తి ఇంత సుఖంగా ఉన్నాడనో అనుకుంటూంటాం. దీన్ని పరిష్కరించడానికి మళ్ళీ జన్మ ఉంటుందని ఊహించాలి. అలా కాకుంటే ఒక వ్యక్తి తన చేయని తప్పుకు ఈ జన్మలో శిక్ష పొందుతున్నట్లు లేదా, చేయని పుణ్యానికి లాభం పొందుతున్నట్లు చెప్పవలసి వస్తుంది.
2.సృష్టి వైచిత్రి- అంటే ఛీజీఠ్ఛిటటజ్టీడ. ఒకరు రాజభోగాలతో పుడితే, మరొకడు కటిక పేదగా ఉంటాడు. ఒకడు ఆరోగ్యవంతుడిగా ఉంటే మరొకడు అవిటివాడుగా పుడతాడు. దీనికి కారణం చెప్పలేం. సృష్టి అనేది ఒక యాక్సిడెంట్‌ అనీ, యఽథాలాపంగా జరిగినది అని చెప్పాలి. లేదా దేవుడు కొంతమందిపై పక్షపాతబుద్ధి చూపాడని చెప్పాలి. కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే పై విధంగా చెప్పాల్సిన పనిలేదు.
3. సమాజంలో మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం.
4. వ్యక్తి హుందాగా తాను చేసిన పనికి తానే బాధ్యత వహించాలని చెప్పడం. భగవంతుడు ఎవరి పాపాల్ని గాని, పుణ్యాన్ని గానీ తీసుకోడు అని ధైర్యంగా చెబుతుంది. భగవద్గీత (5-15) ఆ తర్వాత 18 వ అధ్యాయంలో తాను అర్జునుణ్ణి అన్ని పాపపుణ్యాలనుండీ గట్టెక్కిస్తాననీ చెబుతాడు కృష్ణుడు. ఇలా చెప్పడం పైకి విరుద్ధంగా కనిపిస్తుంది. గత వ్యాసాలలో భగవంతుడి స్వరూపాన్ని గురించి చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుందాం. పరమాత్మ అంటే శుద్ధ చైతన్యమే. దీనికి ప్రపంచాన్ని సృష్టించటం, పోషించడం, పోలీసింగ్‌ చేయడం మొదలైన పనులేమీ ఉండవనీ తెలుసుకున్నాం. పై చైతన్యంలో ప్రకటమయ్యే ఒకనొక సృజనాత్మకశక్తి (ఛిట్ఛ్చ్టజీఠ్ఛి ఞౌఠ్ఛీట) నే మనం సృష్టికర్త. దేవుడు అని భావించుకుంటున్నామని తెలుసుకున్నాం. శుద్ధ చైతన్యానికి పుణ్యపాపాలతో సంబంధం లేదు. సృష్టికర్త అనే స్థాయిలో కూడా దేవుడు మనకు సరైన బుద్ధిని ప్రసాదిస్తాడు. అంతే కానీ పాపాల్ని మాఫీ చేయడు. దదామి బుద్ధి యోగం – అంటాడు కృష్ణుడు. మనిషే సరైన బుద్ధి ద్వారా పాపం, పుణ్యం అనే బంధాలనుండి తప్పుకుని బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడని దీని అర్థం.
ఇటీవల మానసిక శాస్త్రవేత్తలు పునర్జన్మపై అనేక ప్రయోగాలు చేశారు. ఞ్చట్ట జూజీజ్ఛ ట్ఛజట్ఛటటజీౌుఽ అనే విషయంపై పరిశోధించి మనిషికి మరో జన్మ ఉన్నట్లు చెప్పిన అనేక పరిశోధనా వ్యాసాలను చూడగలం. కర్మసిద్ధాంతం అంటే మనిషి కర్మకు బానిస అని అర్థం కాదు. తను ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తన ఖర్మ. దీన్నుండి తప్పించుకోలేం అనుకోవడం జ్చ్ట్చజూజీటఝ అవుతుంది. మన సిద్దాంతం దీన్ని అంగీకరించదు. ఒక మనిషి పుట్టుక మాత్రమే (ధనవంతుడిగానో, ఆరోగ్యవంతుడిగానో) కర్మను బట్టి ఉంటుంది. ఆ తర్వాత మనకిష్టమైన పనిని ఎంచుకునే స్వాతంత్య్రం మన బుద్ధికి ఉంది. దీన్నే ఇంగ్లీషులో జట్ఛ్ఛ ఠీజీజూజూ అంటారు. ప్రతివ్యక్తి మంచి కర్మల్ని ఎంచుకుని జ్ఞానానికి అర్హుడు కాగలడనీ, మనుష్య మాత్రుడెవడైనా మోక్షానికర్హుడనీ మన సిద్దాంతం చెబుతుంది. మనుషుల్ని బానిసత్వంలో ఉంచడానికి ఇది చెప్పబడింది అనే హాస్యాస్పదమైన భావం మన పుస్తకాల్లో ఎక్కడ వెతికినా చూడలేం. కర్మ సిద్దాంతాన్ని నమ్మిన బౌద్ధమతాన్ని స్వీకరించిన అంబేద్కర్‌ తనంత తాను బానిసత్వంలోకి వెళ్లాడని చెప్పలేం కదా!
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను  navya@andhrajyothy.com
పంపండి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సౌర సాగు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యూరప్ కు గ్రీక్ విషాదం తప్పదా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కలిసి రండి అన్న బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment