పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -3

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -3

కదా లేఖన పోటీ లో పాల్గొని ‘’పోటీ ఉంటేనే ప్రతిభకి రాణింపు ‘’అని తెలుసుకొని ‘’ఒక నోటు పుస్తకం నిండా సాగి- అన్న ప్రాసన నాడే ఆవకాయ అయ్యింది ‘’అని అత్యుత్సాహాన్ని తెలియబరుస్తూ కలం పట్టించిన తన చేత కద రాయిన్చించి’’అని సంబర పడ్డారు .ఆ ‘’నవలా కద’’ పత్రికకు పంపిస్తే అడ్రస్ గల్లంతయ్యింది .ఆని నిరాశపడలేదు .’’ముడుచుకొన్న ఆలోచనల్లో చురుకుదనం పుష్పించి –అభిరుచుల్లో –కొత్తదనం అల్లు కుంటోంది ‘’అని ముచ్చటపడ్డారు .తెలుగు స్వతంత్రలో రెందోపెజీ లోపడే కవిత్వాలు చూసి కవిత్వపఠనం పై దృష్టి మళ్ళింది .బహుమతులు ప్రతిభకు కొలబద్దలూ అద్దాలు కాక కపొవచ్చు కాని  ‘’ప్రోత్సాహానికి ప్రేరకాలు ‘’అని నమ్మారు .జిళ్ళా యువజనోత్సవ  చిత్ర లేఖన పోటీలలో ‘’పొందిన ప్రధమ బహుమతి కేటలిస్ట్  అయి,కళా రంగం లో ముందుకు కదిలించింది ‘’.ఆ బహుమతి డాక్టర్ గరిక పాటి రాజా రావు గారి చేతులమీదుగాగ్రహించటం గౌరవం, చిరస్మరణీయం అయింది .

తాము ఉండే పేటలో కాంగ్రెస్ జండా ఎగరగా ఎన్నడూ చూడలేదట వీర్రాజుగారు .ఎక్కడ చూసినా ‘’యెర్ర జండేర్ర జండా  ఎర్రెర్రని జెండా ఎర్రజండా ‘’అని నారాయణ మూర్తి పాటలాగా రెప రెప లాడేవి .’’పార్టీ మీద నిషేధం ఉక్కు పాదమై వాలినప్పుడు –ఇంటిమీది జెండా పీకేసుకోన్నారుకాని –పార్టీ మీద నమ్మకాన్ని వదులుకోలేదు ‘’అని పార్టీపై  తన అభిమానాన్నితెలిపారు .కమ్యూనిస్ట్ మిత్రుడు కుందుం ప్రకాశ రావు  ఆప్తమిత్రుడు .’’నా అక్షర గమనానికి ప్రత్యక్ష కారణం అతనే ‘’అని కృతజ్ఞత చెప్పుకొన్నారు .ఆవంత్స సోమ సుందర్ ఆధునిక సాహిత్య పరిచయం చేశాడు .’’రచన బాగోగులని తూకం వేసే తూనిక రాళ్ళూ యేవో అతని దగ్గరున్నాయి ‘’అని ఆయన ప్రతిభను కీర్తించారు .’’నన్ను రచయితగా శిల్పించిన వాడు అక్షరాలా అతనే ‘’అని అన్నారు.’’వయసు పెరుగుతున్న కొద్దీ –ఇంటి పరిస్తితులు అర్ధమై –మనసులో చిక్క పడి –బాల్యం మెల మెల్లగా పట్టు సడలించుకొని –‘’దూరం గా జరిగిపోయింది .

నూనుగు మీసాలు తేనే రంగులో మెరుస్తున్నప్పుడు –‘’అందం అప్పుడు కాంటాక్ట్ లెన్స్ అయి –నాకళ్ళల్లో అమరిందేమో ?’’అన్నారు యవ్వన ప్రాదుర్భవాన్ని కవిత్వం లో ఒలక బోస్తూ .వందేళ్ళ చరిత్రగల కాలేజి లో చేరి ‘’ఆనంద గర్వాలు –మనసును ఉయ్యాల లూపాయి ‘’.అంటారు .దీనికి కారణం ‘’ఓ చారిత్రిక వార సత్వపు స్రవంతిలో –నేనో బిందు వౌతున్నందుకు ‘’పొందిన గర్వం అది .సంస్కృతీ వారసత్వానికి ముచ్చట అది .పెదనాన్న ఇల్లు గుల్ల చేసుకొని ,నిండు దరిద్రం తో మంచాన పదడి చనిపోతే ,పెద్దమ్మ  భారమూ తండ్రిమీద పడి నా తండ్రిబెదరలేదట .తల్లి ఒంటిమీద నగ నట్రా కాళ్ళోచ్చి కదిలిపోయాయి .పెదమామయ్య సాయమే దిక్కైంది.స్కాలర్ షిప్ అంది తల్లి చేతుల్లో డబ్బు పెడితే ‘’తన కలల సాకారానికి –వర్తమాన చిత్రం –ఆమె మనసులో –అస్పష్టంగా కదిలి ఉండాలి ‘’అని ఊహించారు .

కాలేజిలో పై ఖర్చులకు గాను ఊళ్ళో చిన్న పత్రికలకు కోరిన బొమ్మలేసి చిలక్కొట్టుడు డబ్బు సంపాదిస్తూ కుటుంబం పై భారం పడ కుండా చూసుకొన్నారు.దామెర్ల రామా రావు గారంటే ‘’అజంతా చిత్రాల రేఖల లాలిత్యానికి –దాని సమవర్ణ లేపన సౌందర్యానికి –పాశ్చాత్య దేశాల అంగ సౌష్టవాన్ని జోడించి –వంగ దేశపు వాష్ టెక్నిక్ ను మేళవించి –సరి కొత్త ఆంద్ర చిత్రకళా శైలిని  సృష్టించిన ‘’మహానుభావుడు అని కీర్తి కిరీటం చిత్రకళా భాష లో చెప్పి, పెట్టారు .’’ఆంద్ర చిత్ర కళా పునరుజ్జీవన వైతాళికుడు ‘’అన్నారు .మూడు పదుల వయసులోనే నూరేళ్ళు నిండిన  దురదృష్ట వంతుడు రామారావు . ఆయన స్మ్రుతి చిహ్నమే రాజమండ్రి లో వెలసిన ‘’కళా గౌతమి ‘.’రామారావు ఆప్తమిత్రుడు ,చిత్రకళలో మరో మేరువు అయిన వరదా వెంకట రత్నం గారి శిక్షణలో వీర్రాజు గారు చిత్రకళా రహస్యాలు తెలుసుకొన్నారు .స్కెచ్ పుస్తకాలను చిత్రాలతో నింపి వేళ్ళకు రేఖా సోయగాన్ని సమకూర్చుకొన్నారు .

చిత్రాల్లో జీవాన్ని ,చైతన్యాన్ని వేగాన్ని ని౦పు కొంటూ వెలుగు నీడల సహజ సౌందర్యాన్ని అడ్డుకొంటూ తనను తానూ చిత్రకారుడిగా ఆవిష్కరించుకొన్నారు వీర్రాజు గారు .తన ప్రయతనం కీర్తికోసం కాదని ఆర్దికావసారలకోసమే నని నిజాయితీ గా చెప్పారు .ఆస్థానకవి శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి చేతులమీదుగా చిత్రకార సన్మానం అందుకొని పులకించారు .అప్పటికి వయసు పద్దెనిమిదే అన్నది కొసమెరుపు .

‘’బిడియానికి పై తొడుగు మౌనం .చొరవకు పై తొడుగు మాటకారి తనం ‘’అని చక్కని అర్ధం చెప్పారు .ఆ రెండూ తనకు లేవు .’’గుండేల్లోతుల్లోకి తొంగి చూస్తె కాని అర్ధం కాని వాడిని ‘’అని ఆవిష్కరించుకొన్నారు తన్ను తాను .కాలేజీ తెలుగు శాఖ ఆహ్వానంపై వచ్చిన బాల బంధు బి. వి .నరసింహా రావు గారు ‘’ఆడుతూ పాడుతూ –హావ భావాతో చేసిన ఉపన్యాసం ‘’ఆకట్టుకొని ప్రేరణ కల్గించి ,ఎప్పటికైనా ఆ కాలేజీ వేదికపై ఓసాహిత్యో పన్యాసాన్నివ్వాలని ‘కోరిక ‘’మనసు పొరల్ని తోలుచుకొని –బీజ దళం లోంచి –చిగురాకై విచ్చుకొంది’’అని బయాలజీ భాష లో బాగా చెప్పారు .’’చప్పట్ల అభినందన హారం –మెళ్ళో వేసుకోవాలని ‘’ఆశ పడ్డారు .కాని ఆ అవకాశమే రాలేదట .

శరత్ సాహిత్యం చదివి అదే మూసలో అవే పాత్రల్ని మూస పోసి అచ్చులు పోసుకొని నవల రాశారు .’’చిదికే వరకు సెగ్గడ్డ సలపరం పెట్టి నట్లు ఆలోచనలు అక్షరాలై కాగితం మీద రాలే వరకు –మనసుకు పట్టిన జ్వరం –నిమ్మళించి తేలిక పడనే లేదు ‘’ఆయనకు .ప్రజా మత వార పత్రిక దీన్ని సీరియల్ ప్రచురించి గుర్తింపు పొంది’’ రచయిత గా చెప్పుకొనే వీలిచ్చింది ‘’అది మరోకొత్త నవలకు ఊపు నిచ్చింది .అప్పటికి అయన ఇంటర్ రాసిన విద్యార్ధి మాత్రమే .

 

 

వరదా వెంకట రత్నం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ

     గీర్వాణ కవుల కవితా గీర్వాణం

            నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ

—                        

   ఇలా మొదలైంది–“సిద్ధయోగిపుంగవులు” మొదలుకొని , “మహిళామాణిక్యాలు” ,

“పుర్వాంగ్లకవుల ముచ్చట్లు”, “దర్శనీయ దైవక్షేత్రాలు” ఒకొక్కటీ ఎప్పటి కప్పుడు 
శ్రీ దుర్గాప్రసాద్ గారు నాకు అంకితమివ్వాలనుకో వటo , నేను వాటి
స్వీకర్తులుగా సరియైనవారిని సూచించటం , వారు దానికి అంగీకరించటం
జరిగిపోయాయి . ఇప్పుడు “గీర్వాణకవుల కవితా గీర్వాణం” అంతర్జాలంలో
ధారావాహికంగా ప్రచురించిన దానిని నా ప్రమేయం లేకుండానే నాకు అంకిత
మివ్వటo నన్ను అమితాశ్చర్యాలకు గురిచేసింది . ఇంతటి పవిత్రమైన అమృతంలాoటి
రచనకు స్వీకర్త గా నాకున్న అర్హత శ్రీ దుర్గాప్రసాద్ గారికి నాయందున్న
అభిమానం మాత్రమే నని నా నిశ్చితాభిప్రాయం  .
తదుపరి , ఈవిషయాన్ని గురించి మేనకోడలు జ్యోతి తో సంభాషిస్తున్న సందర్భంలో
, జ్యోతి ఉత్సాహానికి నా ప్రోత్సాహం తోడై ఈ మహోన్నత విలువైన రచనను
పుస్తకరూపంగా ప్రచురిoచాలని, అందుకు జ్యోతి తoడ్రి గా రైన , మా పెద్దబావగారు
డా :  రాచకొండ నరసింహశర్మ గారి ఆశీస్సులతో ,అన్న సుధాకర్ , తమ్ముడు రమేష్,
చెల్లెలు సంధ్య(అంతా అమెరికా వాసులు ) లను కలుపుకొని సమిష్టిగా
ప్రాయోజకత్వం (స్పాన్సర్షిప్) వహించాలనుకొవటo , ఈసూచనకు శ్రీ
దుర్గాప్రసాద్ గారు  పచ్చజెండా ఊపటం ఒకదానివెంట ఒకటి దైవనిర్ణ యాలు గా
జరిగిపోయాయి.  వీరందరికీ నా ధన్యవాదాలు .

                                 –మైనేని గోపాలకృష్ణ-  హన్ట్స్ హిల్  -అలబామా -యు ఎస్ ఏ –

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -7

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -7

4- సామ్య వాద మహర్షి –కారల్ మార్క్స్

జీవితం లో ఎక్కువ భాగం లైబ్రరీలలో గడిపి ,యదార్ధ వాదాన్ని రొమాంటిక్ వాదానికి వ్యతిరేకం గా వ్యాప్తి  చేసి ,తన జీవితాన్ని మాత్రం ‘’నిత్య పెళ్లి కొడుకు ‘’గా అనుభవించిన వాడు కారల్ మార్క్స్ .హృదయం లేని వాడు ,అవతల వాడి గోడు పట్టించుకోని రకం .తన భావాలను వ్యతిరేకించే వారిని సహించని మనస్తత్వం .మధ్య తరగతి మహా రచయిత,ఆలోచనా పరుడు .ఏనాడూ కనీసం కూలి పనికూడా చేయని కార్మిక నాయకుడు .మొదటి ప్రపంచ కార్మిక సంఘానికి అధ్యక్షుడు  .పుట్టింది జర్మనీలో అయినా ఎక్కువకాలం జీవితాన్ని గడిపింది ఇంగ్లాండ్ లో .ఇన్ని వైరుధ్యాలున్న మనిషి మార్క్స్ .ఆయన ప్రభావం రష్యాలోను  దూర ప్రాచ్య దేశాలలో ను ఎక్కువ .అయన రాసినఉద్గ్రంధం   ఆధునిక చరిత్రను మలుపు తిప్పింది  .కాని దాన్ని  ఎవరూ చదివిన దాఖలాలు లేవు .

అసలుపేరు హీన్రిచ్ కారల్ మార్క్స్ .యూదు కుటుంబం .లా చదివినా వారికి కోర్టులో ప్రవేశం లేకపోవటం తో క్రైస్తవం తీసుకొన్నారు .పెద్దకుటుంబం లో రెండవ వాడు .కొడుకు కవి గా వెలగాలని కోరుకొన్నాడు .బాన్ యూనివర్సిటీలో చేరి గురువు గార్గ్ విత్లెం హెగెల్ ప్రేరణతో దియాలజీ తీసుకొన్నాడు .మతం కంటే న్యాయ శాస్త్రం మీద మక్కువెక్కువ .తీసుకొన్న చాయిస్, గురూజీ సెలెక్షన్ రెండూ నచ్చలేదని పించింది ..యుక్త వయసు రాక ముందే చిన్న నాటి స్నేహితురాలు అందకత్తె తనకంటే నాలుగేళ్ళ పెద్ద అమ్మాయి ని వలచి ,ఆమె ప్రేమకూ లైన్ క్లియర్ తెచ్చుకొన్నాడు .ఆమె ఎందరో ప్రేమికుల్ని ఇతనికోసం వదిలేసింది .కాని ఆమె తండ్రికి ఇష్టం లేక పోవటం తో ఆరేళ్ళు ఆగి ఆయనా పచ్చజెండా ఊపిన తర్వాత పెళ్లి చేసుకోన్నారిద్దరూ .

దేనిలోనూ సరిగా ఇమడలేక తండ్రి మనసు  బాధపెట్టాడు కారల్ .బెర్లిన్ పంపితే వెళ్లి ధర్మ శాస్త్రం (జూరిస్పుడేన్స్)చదివి ప్రాక్టిస్ చేయటం ఇష్టం లేక చరిత్ర ,తత్వ శాస్త్రం  లో పడ్డాడు .క్రమంగా హెగెల్ చెప్పిన హేతువాదం పై ఆకర్షణ పెంచుకొన్నాడు .హెగెల్ భావ పరిధిని దాటి ముందుకు దూసుకు పోయాడు ‘’డయలేక్టిక్ మెటీరియలిజం’’ వ్యాప్తికి కారకుడయ్యాడు .జీవితం లో చావు దాక్కుని ఉంది అన్నది హెగెల్   భావన .దీన్ని ఆర్ధిక ,తాత్విక తత్వ శాస్త్రాలకు అనుసంధించాడు .భావాలను వాటిప్రభావాలను మరువలేదు .ఉన్నది ఉన్నట్లుగా నే ఉండాలి అన్న దానిపై పునరాలోచన చేశాడు .యేవో అస్పస్తాభావాలున్నాయికాని అవి స్పష్టం కావటం లేదు .కాని నోట్సుపుస్తకాలన్నీ తన ప్రియురాలిపై కవిత్వం తో మాత్రం నింపి పారేశాడు .టీచర్ అవాలనే కోరిక ఉండేది .తత్వ శాస్త్రం లో డాక్టరేట్ పొందాడు. కాని ఇతని విపరీత భావనలకు ఏ యూని వర్సిటీ అతనికి ఉద్యోగం ఇచ్చే సాహసం చేయలేదు .తత్వ శాస్త్రం కూడు గుడ్డ సమకూర్చదని గ్రహించి జర్నలిజం లో వేలుపెట్టాడు .రాడికల్ జర్నల్స్ ఆతను రాసినవి బాగానే ప్రచురించి వ్యాప్తి చెందించాయి .కాని తన సిద్ధాంతాలకు ఒక రూపం ఇవ్వాలనే తలంపుతో పారిస్ వెళ్ళాడు .

పారిస్ లో తనకన్నా రెండేళ్ళు చిన్న వాడైన  ఫ్రెడరిక్ ఎంగెల్స్కు శిష్యుడైనాడు .కలిసిపని చేశాడు చివరికి మార్క్స్  మరణానంతర సాహిత్యాన్నిఏంగిల్స్  ప్రచురించాడుకూడా .ఎంగెల్స్ సంపన్నుడు .మార్క్స్ ఆలోచనా పరంపరకు మద్దతు నిచ్చి ప్రోత్సహించాడు .సంపన్నులు పేదకార్మికుల  పోట్టకోడుతున్నారని ఇద్దరూ ఆలోచించారు.దీనికి భరత వాక్యంపలకాలని భావించారు    .కారల్ మార్క్స్ ఇక్కడే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచన ప్రారంభించాడు .అందులో ప్రసిద్ధ వాక్యం ‘’All history is the history of class struggle ‘’.పారిస్ నగర జీవితం రాజకీయం గా అస్పష్టం గా ఇబ్బందిగా  ఉంది .ఇక్కడే మొదటికూతురు పుట్టింది .పరిస్తితులు అనుకూలించక బ్రసెల్స్ వెళ్లి ఎంగెల్స్ నుకలిశాడు .జర్మన్  వర్కింగ్ మెన్ అసోసియేషన్ ఏర్పడటం లోఎంగేల్ కు   భాగ స్వామి అయ్యాడు .మొదటిసారిగా కమ్యూనిస్ట్ మాని ఫెస్టో ‘’అంతర్జాతీయ సామ్యవాదం ‘’విడుదల చేశాడు .ఫ్రెంచ్ భాషలో ఫ్రెంచ్ ఆర్ధిక వేత్త ప్రౌధాన్ రాసిన ‘’ఫిలాసఫీ ఆఫ్ పావర్టి ‘’గ్రంధానికి జవాబుగా మార్క్స్ ఫ్రెంచ్ భాషలోనే ‘’ది పావర్టి ఆఫ్ ఫిలాసఫీ ‘’రాశాడు .

ఫ్రాన్స్ లో విప్లవం 1848లో అణగారిపోయింది .కాని రాజకీయ పరిస్తితులు దారుణమైనాయి.సోషలిస్టు భావ వ్యాప్తి చేసినవారిపై నిఘా పెరగటం తో అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ మాత్రమె శరణ్యం అయ్యాయి  .బలీయ మైన ప్రష్యన్ సైన్యం అడుగడుగునా జల్లెడ పడుతోంది .మార్క్స్ తో సహా సోషలిస్టూలను అరెస్ట్ చేసి జైల్లో వేశారు .దేశ ద్రోహం నేరం మోపారు .కాని రుజువుకాక వదిలేసినా ప్రష్యా అధికారం లో ఉన్న భూమి నుండి బహిష్కరించారు .మళ్ళీ పారిసే  గతి అయింది . ఏదో ఒక చిన్న ప్రాంతం లో ఉండటమో లేక ఫ్రాన్స్ వదిలే పెట్టి వెళ్ళటమో  తేల్చుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది .గత్యంతరం లేక కుటుంబం తో ఇంగ్లాండ్ వెళ్లి జీవితాంతం అక్కడే ఉండిపోయాడు .

మార్క్స్ గొప్ప వక్త కాదు .నెమ్మదిగా పొడి పొడి వాక్యాలతో మాట్లాడేవాడు .అవతలివాడు చెప్పింది వినే తత్త్వం లేదు తను చెప్పిందే చివరిమాట అనే ధోరణిలో ప్రసంగాలు చేసేవాడు .’’దాస్ కాపిటల్ ‘’గ్రంధం రాసి 1867లో ప్రచురిస్తే మార్క్స్ మరణానంతరం ఎంగెల్స్ 1885లో మిగిలిన భాగాలను ప్రచురించాడు .మార్క్స్ ఒక’’ రాజకీ య ఆర్ధిక వేత్త’’.ఇంకోరకం గా ప్రాఫెట్ –దార్శనికుడు .తత్వ వేత్త మాత్రం కాదు. భార్య మరణం తో కుంగి పోయాడు .  .పార్శ్వ నేప్పితో బాధ పడ్డాడు .లండన్ లో అరవై అయిదవ ఏట 14-3-1883 నమార్క్స్ మరణించాడు .జన్మ దినం 5-5-1818.

సత్యాన్వేషకుడు అని అనుయాయులు ఆరాధిస్తే ‘’అబద్దాల పిత ‘’ అని నిందించారు గిట్టనివాళ్ళు .కార్మికుల పాలిటి దేవుడు- మెసయ్యా అని కొందరంటే క్రైస్తవ విరోధి అన్నారు మరికొందరు .మార్క్సిస్టులు ‘’దాస్ కాపిటల్ ‘’ను’’ ఆధునిక టేస్తామేంట్ ‘’అన్నారు .అయిదవ భాగం బాగా రాయలేదన్నారు .అందులో పద్ధతీ పాడూ ఏమీ లేదన్నారు .కొందరు దాన్ని ‘’కార్మికుల బైబిల్ ‘అని ఆకాశానికి ఎత్తేశారు .భవిష్యత్తును బాగా ఊహించాడు అని అంటే ఆయన చెప్పింది ఇంగ్లాండ్ లోనే జరగలేదు అని చెవులు కొరుక్కున్నారు .రష్యాలోని బోల్షేవిక్కులు దాస్ కాపిటల్ ను తిరస్కరించారు .ఏమైనా ఆయన భావాలకు ‘’మార్క్సిజం ‘’అనే ముద్ర పడి సజీవం గా నే ఉన్నాయి .మానవ చరిత్రలో అత్యధిక ప్రభావ శీలి కారల్ మార్క్స్ అన్నది నిర్వివాదం .ప్రపంచ వ్యాప్త కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు మార్క్స్ ప్రభావానికి లోని పని చేశాయి ,చేస్తున్నాయి .

Communism is for us not a state of affairs which is to be established, an ideal to which reality will have to adjust itself. We call communism the real movement which abolishes the present state of things. The conditions of this movement result from the premises now in existence.”

Inline image 1Inline image 2

అని కమ్యూనిజం గురించి మార్క్స్ వివరించాడు .మార్క్స్ ను ప్రభావితం చేసిన వారిలో హేగేల్స్ ,ఆడం స్మిత్ ,రూసో .మార్క్స్ ప్రభావితం చేయని రంగమే లేదు .మానవ ప్రకృతిని బాగా అర్ధం చేసుకొన్న వాడు మార్క్స్ .

మరో మహానుభావుడితో మళ్ళీ  కలుద్దాం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-2-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాల లో మనవరాలు రమ్య తో మామ్మ, తాత తో సహా మిగిలిన దృశ్యాలు 

4-2-15 బుధవారం శ్రీ ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాల లో మనవరాలు రమ్య తో మామ్మ, తాత  తో సహా మిగిలిన దృశ్యాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పీడిత ప్రజల పక్షపాతి – అమ్మంగి వేణుగోపాల్‌

పీడిత ప్రజల పక్షపాతి – అమ్మంగి వేణుగోపాల్‌

 


వట్టికోట ఆళ్వారుస్వామి ప్రత్యేకమైన రచయిత. లేదా అనేక ప్రత్యేకతలున్న విశిష్ట రచయిత. ఆళ్వారుస్వామి వంటి రచయిత మరొకరు లేకపోవటమే గొప్ప ప్రత్యేకత. ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు తలవొంచిన గడ్డిపోచగా కనిపిస్తూనే, ఉధృతి తగ్గగానే తలెత్తుకు నిలబడ్డ దేవదారువుగా కనిపిస్తారు ఆళ్వారుస్వామి. అవాంతరాలు వచ్చి వుండవచ్చు, కాని అదే ని బద్ధతతో చివరి నిమిషం దాకా తన కార్యక్రమాలను కొనసాగించారు. ఉదాహరణకు-1938లో దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి కొన్ని పుస్తకాలు వేసిన తర్వాత వారు జైలుకు వెళ్ళినప్పుడు ఆ ప్రచురణలు ఆగిపోయాయి. మళ్ళీ 1951లో విడుదలైన తర్వాత కొనసాగించారు. జైల్లో ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని కొనసాగించిన వారు గాని, 1961లో వారు చనిపోయిన తర్వాత చేపట్టిన వారు గాని ఎవరూ లేరు. పట్టుదల వున్నవాళ్ళెవరైనా పుస్తకాలు ప్రచురించి వుండేవారేమో. కాని ఊరూరు తిరిగి అమ్మే మార్కెటింగ్‌ శక్తి ఆళ్వారుస్వామి సొంతం.
గ్రామీణ ప్రాంతపు సమస్యల వలయంలో చిక్కుకున్న రైతుకూలీల బతుకువెతల పట్ల అవగాహన, నగరప్రాంతపు జీవిత చక్రాల కింద పడి నలుగుతున్న కార్మికుల జీవిత సమస్యల అవగాహన- పరస్పర పూరకంగా ఉన్నవారు ఆళ్వారుస్వామి…. రచయితగా జీవితం ప్రారంభించినప్పుడు ఏ ఆశయాలతో బయలుదేరారో ఆ ఆశయాలు ఆచరణలో పదునెక్కాయి. మాటలో, రాతలో, ఆచరణలో పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ రచయితగా ఆళ్వారుస్వామి స్థానం అందుకే ప్రత్యేకమైంది.
గ్రామీణ ప్రాంతపు సమస్యల వలయంలో చిక్కుకున్న రైతుకూలీల బతుకువెతల పట్ల అవగాహన, నగరప్రాంతపు జీవిత చక్రాల కింద పడి నలుగుతున్న కార్మికుల జీవిత సమస్యల అవగాహన- పరస్పర పూరకంగా ఉన్నవారు ఆళ్వారుస్వామి. కర్షక కార్మికులు ఇద్దరూ శ్రామికులే అయినా వాళ్ళను నియంత్రించే శక్తులు భిన్నమైనవి. ఆళ్వారుస్వామి ప్రధానమైన సృజనాత్మక రచనలన్నీ గ్రామీణ ప్రాంతానికి చెందినవే. అయితే, ఒక కార్యకర్తగా కార్మికసంఘాల నాయకునిగా వారి కార్యక్షేత్రం హైదరాబాదు సికిందరాబాదు జంటనగరాలే.
కడివెండిలో విసునూరు దేశ్‌ముఖ్‌ గూండాల చేతిలో 1946 జూలైలో దొడ్డికొమరయ్య హత్యజరిగిన తర్వాత, నిజనిర్ధారణ సంఘ సభ్యునిగా వెళ్ళినప్పుడు, బద్దం ఎల్లారెడ్డితో కలిసి గద్వాల ప్రాంతం పర్యటించి భూస్వాములకు వ్యతిరేకంగా సంచలనాత్మక నివేదికలిచ్చారు. వారి నివేదికల మూలంగానే ప్రపంచానికి వాస్తవాలు తెలిశాయి.
నగర ప్రాంతంలో వారు నిర్వహించిన ఉద్యమాల్లో గుమస్తాల సంక్షేమం కోసం 1944లో ప్రారంభించిన ఉద్యమం, 1946లో రిక్షా కార్మికుల కోసం చేసిన ఉద్యమం ప్రధానమైనవి. గుమాస్తాల కోసం చేసిన ఉద్యమం ప్రత్యక్షంగా ఆయా యాజమాన్యాలతో ఘర్షణ. గుమాస్తాలు మిలిటెంట్‌గా ఉండరు. వాళ్ళ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని భయపెట్టినా లొంగిపోతారు. అయినా, వాళ్ళనందరినీ ఆళ్వారుస్వామి సమైక్యంగా తమతో నడిపించగలిగారంటే, అది చిన్న విషయం కాదు. వారి పోరాటాల ఫలితంగా 1944 డిసెంబర్‌ 25 నుంచి గుమాస్తాలకు వారానికొక సెలవు అమలులోనికి వచ్చింది. వాళ్ళలో చైతన్యం పెంచటానికి ‘గుమాస్తా’ పత్రికను వారు నడిపించారు.
రెండవ ప్రపంచయుద్ధం తర్వాత 1946లో మనుషులు లాగే రిక్షాలను రద్దుచేయాలని నిజాం ప్రభుత్వం ప్రకటించటంతో జంట నగరాల్లోని వేలాది రిక్షా కార్మికుల్లో అభద్రత ఏర్పడింది. అప్పుడు రిక్షాకార్మికుల సంఘాన్ని ముందుకు తీసుకుపోయింది ఆళ్వారుస్వామే. ఏరోజుకారోజు సంపాదించి బతికే రిక్షా కార్మికుల్లో అభద్రత వల్ల ఆవేశం ఎక్కువ. ఈ వర్గంలో ముస్లింలు ఎక్కువే. హిందూ ముస్లిం విభేదాలు సృష్టించిగాని, మరో ముస్లింనాయకుణ్ణి ప్రోత్సహించిగాని ప్రభుత్వం ఆళ్వారుస్వామి ప్రాముఖ్యం తగ్గించివుండవచ్చు. కాని అట్లా జరగలేదు. గుమాస్తాలసంఘం నేతగా ఆళ్వారుస్వామి సాధించిన విజయం రిక్షా కార్మికులకు వారిలో విశ్వాసం కలిగించి వుంటుంది. అట్లా మరోవిజయం సాధించారు ఆళ్వారుస్వామి. నిజాం రైల్వేలో రిట్రెంచి అయిన కార్మికులకోసం కూడా వారు ఉద్యమం నడిపారు. జీవి తం అట్టడుగు స్థాయిలో ప్రారంభమైనప్పుడు పునాదులు గట్టిగానే పడతాయి. చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడే ఆళ్వారుస్వామిలో ఉదాత్తమైన లక్ష్యాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం గ్రంథపఠనం, చుట్టూరావున్న గ్రంథాలయోద్యమం. జైలును కూడా వారు స్కూల్‌గానే భావించారు. పుస్తకాల నుంచి ఎంత నేర్చుకున్నారో, జీవితం నుంచి, జీవితంలో ఎదురైన ఘట్టాల నుంచి అంతకంటే ఎక్కువగా నేర్చుకున్నారు.
1937 డిసెంబర్‌ 6, 7, 8 తేదీల్లో నిజామాబాద్‌లో జరిగిన ఆంధ్ర మహాసభలలో రాజ్యాంగ సంస్కరణల మీద, గష్తీ నిషాన్‌ 53 మీద జరిగిన చర్చోపచర్చల ప్రభావం మూలంగా స్వేచ్ఛాస్వాతంత్ర్యాల విలువలను ఆళ్వారుస్వామి గ్రహించగలిగారు. ఆ మరుసటి సంవత్సరం వారు దేశోద్ధారక గ్రంథమాల పక్షాన ప్రచురించిన రెండవ పుస్తకం సురవరం ప్రతాపరెడ్డి గారి ‘ప్రాథమిక స్వత్వములు’ కావటం యాదృచ్ఛికం కాదు.
వారు ప్రచురించిన 33 పుస్తకాలలో 6 మాత్రమే కవిత్వానికి సంబంధించినవి. తక్కినవి వచన గ్రంథాలే. అప్పటికే కొమర్రాజు, సురవరం, ఆదిరాజు వీరభద్రరావు వచనానికి పెద్దపీట వేయటం సాహిత్య చరిత్రలో భాగమైంది. ఆ వైతాళికుల వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవటానికి వచన మాధ్యమాన్నే ఎన్నుకోవటం ఆళ్వారుస్వామి ఆధునిక సంస్కారానికి నిదర్శనం. ‘సాలార్జంగ్‌ మ్యూజియం’ వంటి కొన్ని కవితలను మినహాయిస్తే, వారు వచన సాహిత్యాన్నే సృష్టించటం గమనార్హం.
కాళోజీ, దాశరథి వంటి అగ్రశ్రేణి రచయితలెవ్వరూ ఉండ నంత కాలం సుమారు ఆరేళ్ళు వారు జైల్లో వున్నారు. 1948 సెప్టెంబర్‌ పోలీస్‌యాక్షన్‌ తర్వాత చాలామంది విడుదల య్యారు. కాని ఆళ్వారుస్వామి విడుదల కాలేదు. ఇక్కడ నారాయణరావు పవార్‌ ప్రస్తావన అవసరం. 1947 డిసెంబర్‌ 4 నాడు నిజాం తన తల్లి సమాధిని దర్శించుకోవటానికి వెళ్తుంటే, ఆయన కారుమీద నారాయణరావు పవార్‌ బాంబు వేశాడు. నిజాం తప్పించుకున్నాడు. పవార్‌కు ఉరిశిక్ష పడింది. పోలీస్‌ యాక్షన్‌ కారణంగా అది యావజ్జీవ కారాగారవాసంగా మారింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వారు రామానంద తీర్థ నాయకత్వంలో ఒత్తిడి తేవటంతో 1949 ఆగస్టులో పవార్‌ విడుదలయ్యారు. బహుశా ఆయనకు స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌ కూడా మంజూరయి వుంటుంది. రాజుమీద బాంబు వేసినవాడు విడుదలయ్యాడు కాని; కమ్యూనిస్టు కావటం వల్ల, గుమాస్తాల కోసం, కార్మికుల కోసం ఉద్యమాలు నడిపిన కారణంగా ఆళ్వారుస్వామి 1951 దాకా నిర్బంధంలోనే వున్నారు.
ఆళ్వారుస్వామి రచనల్లో కనిపించే ఒక అంశం – సన్నివేశాలను, సంఘటనలను, పాత్రలను చరిత్రతో కలిపే ప్రయత్నం. ఆళ్వారుస్వామి స్వయంగా గ్రంథాలయోద్యమంతో ప్రభావితులై ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. ‘ప్రజలమనిషి’ నాయకుడు కంఠీరవం గ్రంథాలయం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధించి, భూస్వామ్య వ్యవస్థతో పోరాటం చేస్తాడు. ఆంధ్ర మహాసభల్లో తమతమ గ్రామాల్లో దౌర్జన్యాలు చేసిన భూస్వాములను కీలక హోదాలలో చూసిన ఆళ్వారుస్వామి, తన నవలల్లో రావుభూపాలరావును, జగ్గయ్యదొరను, వెంకటరావును సృష్టించారు. 1938లో స్టేట్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొన్ని కార్యకర్తల బృందాలు సత్యాగ్రహం చేసి అరెస్టుకావటం చరిత్ర. ‘ప్రజలమనిషి’ నవల ముగింపులో వెంకటేశ్వరరావు నాయకత్వంలో బషీరు, కంఠీరవం, పరంధాములు సత్యాగ్రహం చేసి అరెస్టవుతారు. ఈ రకంగా తన నవలలో ఆళ్వారుస్వామి రాజకీయ వాస్తవికతను సాధించారు.
1952లో పుస్తకరూపంలో వచ్చిన ‘జైలులోపల’ కథలు ఆరూ ప్రస్తావించదగ్గవే. ఇక్కడ ఒక్క ‘పతితుని హృదయం’ కథ మాత్రమే ప్రస్తావించటం జరుగుతుంది. ఆ రోజు ఉదయం ఉరితీయబడ్డ 25 ఏళ్ళ యువకుడి కోసం సాటి ఖైదీలు తల్లడిల్లే ఘట్టంలో ఈ కథ మొదలవుతుంది. ఈ ఉరితో తీవ్రంగా ప్రభావితుడైన గండయ్య అనే మరోఖైదీ జైలు అధికారులకు ఎదురు తిరుగుతాడు. ‘ఒకమనిషిని చంపటమే తప్పంటున్న భానూను ఇంకొకడిని ఉరితీసి చంపమని ఎట్లా అంటుంది?’ అన్న పెద్దప్రశ్న, బహుశా జవాబులేని ప్రశ్నను లేవదీసి ఉరిశిక్షను ప్రశ్నిస్తాడు. ఉరికి గురయిన యువకుడి గతం గూర్చి గాని, శిక్షకు కారణమైన నేరం గూర్చిగాని ప్రస్తావన లేదు. ఉరికి వేలాడి ప్రాణాలు విడవడమే ఆ తర్వాతి కథను నడిపిస్తుంది. అతని ఊరూ పేరూ లేవు. అంటే ప్రాంతం, కులం, మతం లేకపోవటంతో అతడు అందరివాడయ్యాడు. అతని జీవిత కథ లేనందువల్ల ఈ కథానికలోనూ పెద్దగా కథ లేదు. ఈ ఉరి వాతపడ్డ మనిషే ప్రతి పదంలోనూ, వాక్యంలోనూ వెంటాడుతుంటాడు. అందుకు ఈ యువకుడే ఈ కథానాయకుడనిపిస్తుంది.
వైరుధ్యాల కోణంలో రచనను నడిపించటం, మానవ భావోద్వేగాల పరంగా కథనం చేయటం ఆళ్వారుస్వామి రచనా శిల్పం. ‘ప్రజల మనిషి’నవల ప్రారంభంలోనే దొరకు, సామాన్య రైతు కోటయ్య కొడుకు కొమరయ్య మధ్య వైరుధ్యాన్ని సూచిస్తారు. ఆవుదూడలను దొరకు ఇవ్వటం ఏమాత్రం ఇష్టంలేని కొమరయ్య దుఃఖాన్ని ఎంతో సహజంగా చిత్రించటం మూలం గా దొర అసహజప్రవర్తన, దౌష్ట్యం పాఠకుని మనసులో ఇంకుతాయి. ‘గంగు’ నవల ప్రారంభంలో కూడా జగ్గయ్య దొర అంతమ్మ అన్న వివాహిత పట్ల కామవాంఛను ప్రదర్శించటం, స్ర్తీ సహజమైన అభద్రతకు లోనవుతూనే తన వైముఖ్యాన్ని, అస హ్యాన్ని ప్రదర్శించటాన్ని తగినంత కాన్వాసుమీద రచయిత చూపించారు. నవల మొదట్లోనే పడ్డ వర్గవైరుధ్య బీజం క్రమపరిణామం చెందుతుంది. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములైన కంఠీరవం, వెంకటాచార్యుల మధ్య, మతపరంగా దొరకు, దొర పెద్ద గుమాస్తా హైదరాలీకి మధ్య ఉన్న వైరుధ్యాలను కూడా రచయిత కథావసరాలకు అనుగుణంగా సమర్థంగా వాడుకున్నారు. ఒక్కోసారి భిన్నంగా కూడా ఇది వుండవచ్చు. ‘అవకాశమిస్తే’ కథలో భార్యాభర్తల సరససంభాషణ రూపంలో ‘స్వేచ్ఛ’ ను ప్రకటించిన రచయిత అదే కథలోని అంతరకథలో యువ పఠాన్‌ ‘నిర్బంధాన్ని’ జైలులోపటి జైలుగా కథనం చేశారు. ‘పతి తుని హృదయం’ కథలో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీ గండ య్య సంస్కరణోన్ముఖంగా ఆలోచిస్తుంటే, జైలుఅధికారులు అతన్ని మరింతగా నేరకూపంలోకి తోసేయటానికి ప్రయత్నిస్తారు.
1956, 57 నాటికి దేశంలోనూ, రాష్ట్రంలోనూ పెనుమార్పులు సంభవించాయి. ఆచరణలో నిజాయితీని ప్రదర్శించాల్సిన కాంగ్రెస్‌, కమ్యూనిస్టు నాయకులు ప్రజావ్యతిరేకులుగా మారుతున్నారు. విద్యావంతుల్లో రాజకీయ వ్యవస్థ పట్ల సందేహాలు ఏర్పడుతున్నాయి. సైద్ధాంతిక ఖాళీ ఏర్పడుతున్న వాతావరణంలో ఒక ద్వైధీ భావం కూడా ఏర్పడుతున్నది. కొంత కమ్యూనిస్టుగా, కొంత గాంధీయిస్టుగా సగటు మేధావి రూపొందుతున్నాడు.
‘రామప్ప రభస’లోని వ్యాసాల్లో రామప్ప ప్రదర్శించే ఆదర్శవాదంలో గాంధీతత్వం, తిరుగుబాటు ధోరణిలో కమ్యూనిజం కనిపిస్తాయి. ఆళ్వారుస్వామి నిజాయితీ చెక్కుచెదరలేదు. రచయితగా జీవితం ప్రారంభించినప్పుడు ఏ ఆశయాలతో బయలుదేరారో ఆ ఆశయాలు ఆచరణలో పదునెక్కాయి. తన ప్రతిబింబాలను సమాజంలో దర్శించాలన్న కల సాకారం కాలేదు. అది వారి వైఫల్యంకాదు. వ్యవస్థవైఫల్యమే. ‘రామప్ప రభస’ ఆళ్వారుస్వామి ఆత్మకథలోని 16 అధ్యాయాలే కాదు, ఒక ఆదర్శ పౌరసమాజం కోసం కలలుకన్న స్వాప్నికుడి అక్షర సంపుటి కూడా. ఆళ్వారుస్వామి కంటే గొప్పరచయితలు తెలుగులో చాలా మందే ఉండవచ్చు కానీ, ఆయనతో సమానులు మాత్రం ఎవరూ లేరు. మాటలో, రాతలో, ఆచరణలో పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ రచయితగా ఆళ్వారుస్వామి స్థానం అందుకే ప్రత్యేకమైంది.
 అమ్మంగి వేణుగోపాల్‌
9441054637
(నేడు వట్టికోట ఆళ్వారుస్వామి 54వ వర్ధంతి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం – 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం

(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 12015)                          

 

గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే “మన్మధ ” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 21, 2014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం – 20వ సారి పోటీ నిర్వహణ

ఏ వయస్సు వారైనా, ఏ దేశంలో ఉన్నా, తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులుఒక్కొక్కటీ $58

 

మొట్ట మొదటి రచనా విభాగం” –6 వ సారి పోటీ నిర్వహణ

కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆరవ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

“నా మొట్ట మొదటి కథ”: (ఉత్తమ కథ):  $116

“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కవిత): $58

యువతరం విభాగం- 2 వ సారి నిర్వహణ

ఈ నాటి యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల యువ రచయితలని ఈ నూతన విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ పత్రం, కళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) జతపరచాలి.

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

 

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

  • ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
  • తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
  • రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు కాని, అంతకు ముందు కానీ  (మార్చ్ 21, 2015) ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితల ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

Last Date to receive entries is:  March  1, 2015

Please send entries by e-mail attachments (PDF, JPEG or Unicode fonts)

sairacha2012@gmail.com  &  vangurifoundation@gmail.com

 

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు, (అధ్యక్షులు) & శాయి రాచకొండ (సంపాదకులు)

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

హ్యూస్టన్ & హైదరాబాద్

Phone: 832 594 9054

E-mail: vangurifoundation@gmail.com

www.vangurifoundation.blogspot.com

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -2

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -2

దీపావళికి ‘’ఉప్పూ సూరేకారాలతో కలిపి ఉప్పు పొట్లాలు కట్టి –రాత్రంతా విష్ణు చక్రాల్లా ‘’తిప్పారు .శ్రీరామనవమికి ఎదోఅరుగుమీద ‘’గొనె బరకాలు కట్టి –చిట్టీ పొట్టీ నాటకాలు వేసి –అట్టకిరీటాలకు, కత్తులకీ మెరుపుల ముచ్చి రేకులు అతికించి ‘’మురిసేవారు వీర్రాజు గారు .’’పండగంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకొనే వేడుక కాదు .పది మంది కలిసి చేసే వేడుక ‘’అని చక్కని అర్ధం చెప్పారు .శివరాత్రి ఉత్సవాల్లో పౌరాణిక జానపద సాంఘిక నాటకాలాడటం చూశారు .తోలుబొమ్మలాట మొదటి సారి చూసి కేతిగాడు –బంగారక్క కడుపుబ్బా నవ్వించటం తో మురిసిపోయారు .’’గొనె పట్టాలు చంకనేసుకెళ్ళి ముందు వరుసలలో పరుచుకొని –చివరికంటా మేలుకొని చూశారు .

బంధువులతో ఉప్పాడ సముద్రం చూసి ‘’మా ఊరి గోదారినే తన చట్రాల్లో బిగిన్చుకోలేని కళ్ళు –ఇంత విశాల సముద్రాన్ని ని౦పు కోటానికి –దృశ్య దృశ్యాలుగా పలు ఫ్రేముల్లోకి కత్తి రించుకొన్నారు ‘’.అసలే ఇల్లు ఇరుకు అందులో పూర్వకాలపు భోషాణం సగం స్థలాన్ని ఆక్రమించేసింది .ఇక హాలె అందరికి శరణ్యం .వానా కాలం శీతాకాలం అందులోనే అందరూ ‘’నత్త గుల్లలు ‘అయ్యేవారట .పెదనాన్న గౌరవం ఆస్తితో బాటు ‘’అనులో మాను పాతమైంది ‘’అంటారు .ఉమ్మడికుటుంబం .ఇల్లు ఒక్కటే ‘’కాని కుంపట్లు వేరు ‘’పెదనాన్న గదిలో ఉన్న రవివర్మ ప్రింటులు సీనరీ పటాలు ,’’బట్టల్లేని ఆడామే పాల రాతి విగ్రహం ‘’పాతకాలపు అందమైన పాత్ర సామాను ఉండేదట .పెదనాన్న పెంచుకొనే నెమలిని చూసి వీర్రాజు గారిమనసు నాట్యమే చేసేది .దాన్ని పిల్లి కరిచి తినేస్తే ‘’మనాది ‘’తో మూడు రోజులు బడికి ఎగగోట్టారు .పెదనాన్న గదిలో బొమ్మలే ‘’మనసుకు దారేయ్యక పొతే –ఇప్పటి ఈ నాబొమ్మలకొలువు ఇంట్లో వెలసేదే కాదు ‘’అని ఆస్పూర్తికి కృతజ్ఞతలు ఘటించారు .

బుల్లి వీర్రాజు గారి నెత్తిన చేయి పెడితే అదొక గొప్ప శుభ సూచకమని అందరూ అభిమానం గా దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా హత్తుకోనేవారట . బల్లి పడిన  దోష నివారణ చేసుకొనే వారట .కంచి బంగారు, వెండి బల్ల్లులను తన చిన్నారి చేతులతో తాకించిన ఫైలితమే ఇది అంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును గుర్తుకు చేసుకొని ఆరోజు ‘’ప్రతి చెట్టూ –త్రివర్ణ పతాకల ను పూసింది –ప్రతికొమ్మా –రంగుల తోరణాలను కాసింది ‘’అని భావ గర్భంగా చెప్పారు .కొత్త బట్టలు కట్టుకొని ,చొక్కాలకు జెండా బిళ్ళల్ని తగిలించుకొని ‘’కాగితం జెండాల్ని వెదురు బద్దల మీద ఎగరేసుకొంటూ బడికి వెళ్ళారు ‘’.

‘’ ఎదిగిన కొద్దీ ఎదురు దెబ్బలు తగిలి –అనుభవం పండిన కొద్దీ వాస్తవం తెలిసి వచ్చి –హైస్కూలు రోజుల్నాటికే –కళ్ళ ముందు –మేడిపండు కనిపించి వెక్కిరించింది ‘’అని జీవితం లోని బోలుతనాన్ని చెప్పారు .

క్రమంగా బొమ్మలపై ఆసక్తి ‘’రేఖలతో బాటు –రంగుల్నీ రంగరించటం మొదలు పెట్టాయి వేళ్ళు ‘’.పిల్లల రాతపత్రిక ‘’బాల సేన ‘’లో బొమ్మల్ని గీసి గీసి –నా వేళ్ళు నడకలు నేర్చుకోన్నాయి ‘’అని తన ప్రోగ్రెస్ తెలిపారు .’’కుల వ్రుత్తి చేనేతకు –మినియేచర్ రూపం –నవారు నేత నేర్చుకుంటున్నప్పుడు –నారక్తం లో ఆ పని తనం ఇంకా ఇగిరిపోక –జీవించి ప్రవహిస్తూ ఉందేమో మరి ‘’అంటూ ‘’వెళ్ళు చక చకా సాగి లాంగ్ బెల్ కొట్టేసరికి –అడుగున్నర నవారు తయారైంది ‘’అని స్కూల్ లో క్రాఫ్ట్ పీరియడ్ లో నవారు నేత నేసిన అనుభవాన్ని కవిత్వీకరించారు .

‘’నా బడి పుస్తకాలు తప్ప –రామాయణ భారతాలైనా లేని ఇంట –జోలపాటలే తప్ప –ఊర్మిళాదేవి నిద్రాలూ ,రుక్మణీ కళ్యాణాలు –వినిపించే అవకాశం లేని చోట మేగజైన్లేకాదు –దినపత్రికలూ కలికానికి కూడా  కనీ పించని ఇంట ‘’పుట్టిన తనకు పుస్తక పఠనం పిచ్చి ఎందుకు ఎలా పట్టిందో !అని ఆశ్చర్యపోయారు వీర్రాజు గారు .అర్ధణాకి అణాకి పిల్లల పుస్తకాలు కొని మిత్రులంతా వంతులవారీగా చదివే వారట .ఇక్కడే ‘’నా భవిష్యత్ సాహిత్య జీవితానికి –తోలి బీజంఇలా   పడి ఉండచ్చు ‘’అని ఊహించారు .

వేసవి తీవ్రతను చెబుతూ ‘’చెమటలో తడిసి ముద్దయిన పగటిని –గోదారి గట్టున రైలింగ్స్ మీద ఆర బెట్టుకోవ టానికి –పనిగట్టుకు వచ్చే –వేలాది ఊరి జనానికి –గోదావరి –విసన కర్ర అయ్యేది ‘అద్భుత భావ చిత్రమిది .’’చల్లని చూపుల్తో స్వాగతం పలికే స్నేహ మూర్తి అయింది  ‘’అని గోదావరిమాతకు క్రుతజ్ఞాతాంజలి పట్టారు కవిత్వం తో .సూర్యాస్తమయం ఆయనకు ఎలా ఉందొ తెలుసా?’’కొవ్వూరు  కొబ్బరి తోటల గూట్లోకి –చల్లగా సూర్యుడు దూరి తలుపేసుకోన్నట్లు ‘’ఉంది వేసవి గోదావరి వర్షాకాల గోదారి ఎలా కన్పించాయి వీర్రాజుగారికి ?’’వేసవిలో మన్ను తిన్న జెర్రి గొడ్డైన గోదావరి –వర్షాకాలం వచ్చేసరికి –కోడె తాచై బుసలుకోట్టేది ‘’వరద గోదారి భీభత్సాన్ని వర్ణిస్తూ ‘’గట్లని ఢీకొని –మట్టిని కరగించుకొని –యెగిరి పడుతూ –సుళ్ళు తిరుగుతూ –కూకటి వేళ్ళతో కూల్చిన చెట్లని –జుత్తట్టుకొని ఈడ్చుకు పోతోంది .‘మనుషుల శవాల్ని సైతం –సాగర శ్మశానానికి మోసుకుపోయే’’శవ వాహికగా కనిపించింది .చూడ వచ్చిన జనం తో తానూ ‘’గట్టున ప్రతిష్టించిన రాతి బొమ్మ ‘’అయ్యేవాడట .’’తాటేత్తు నీటిలో మునిగి-కలప దుంగలు నీటి వరవడికి –ఇళ్ళమీద విరుచుకు పడ్డప్పుడు –‘’విలాసాలు ‘’లేని దుంగలు వీదిజనాల పాలై –నాన్న వ్యాపారం గంగ పాలైంది ‘’అని మొత్తు కొన్నారు .పెదమామయ్య  తన తండ్రికి డబ్బిచ్చి కిరాణా కొట్టు పెట్టిస్తే  ఆరు నెలల్లో మూతపడింది .గోదావరి వరద మహాత్యం తో  కుటుంబం  ఆర్ధికం గా చితికి పోయింది .వెన్ను విరిగిపోయింది

Inline image 1

బాల్యం లో ధవళేశ్వరం ఆనకట్ట చూసి భావ కవిత్వం మనసులో పొంగి ‘’నీలం రంగు పులుముకొన్న నీలాకాశం –పై నించి కిందికి దిగి వచ్చి –ఆకాశమూ భూమీ ఒకటై –కళ్ళ ముందంతా –ఒకే రంగు పరచుకొని –కళ్ళల్లో ప్రతిఫలించిన నీలం రంగుకి –మా కళ్ళే నీలాలై మెరిసిపోయాయి ‘’మరో కృష్ణ శాస్త్రి మనకిక్కడ దర్శన మిస్తాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృష్ణాజిల్లా ఉయ్యూరు లో వేచేసిన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాడు అయ్యా వారలకు శాంతి కల్యాణ మహోత్సవం,

 

కృష్ణాజిల్లా ఉయ్యూరు లో వేచేసిన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాడు అయ్యా వారలకు శాంతి కల్యాణ మహోత్సవం, మంగళవారం నాడు శ్రీ వీరభద్ర పళ్ళెం కార్యక్రమాన్ని భక్తి శ్రధలతో పురోహితులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయితీ చైర్మెన్ శ్రీ జంపాన పూర్ణ చంద్రరావు , నూకల సాంబశివరావు, మేడి శెట్టి మస్తాన్ సహకారంతో గూడూరు సత్యనారాయణ కుందుర్తి సత్యనారాయణ మూర్తి, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

చక్కని పద్యాల సాహిత్యపు ముచ్చట్లు

కెసిఆర్ ఓ పిచ్చి తుగ్లక్..!

  • 04/02/2015
TAGS:

మహబూబాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వైఖరి పిచ్చి తుగ్లక్‌లా ఉందని.. త్వరలోనే ఆయన పిచ్చాసుపత్రికి వెళ్ల్లే రోజులు వస్తాయని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఫ్ల్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా విమర్శించారు. వరంగల్ జిల్లా మానుకోటలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేవలం మాటల గారడీతో.. తెలంగా ణ ఉద్యమ సెంటిమెంట్ బలంతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇప్పటికీ పిట్టలదొర మాటలు విడవడంలేదన్నారు. హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తా, వరంగల్‌ను లండన్ చేస్తా.. హుసేన్‌సాగర్‌ను సముద్రం చేస్తానంటూ ఇష్టమొచ్చినట్లు మాటలు చెప్పడమేతప్ప చేసిన పని ఒక్కటి కూడా లేదన్నారు. బలమైన కార్యకర్తలు, అంకితభావం ఉన్న నాయకులు ఉన్న తెలుగుదేశంతోనే తన పార్టీకి ప్రమాదం అనే ఆలోచనతోనే కెసిఆర్ టిడిపిని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేస్తున్న కెసిఆర్, మంత్రు లు కడియం శ్రీహరి, చందులాల్ వంటి నాయకులు రాజకీయంగా ఎక్కడ పుట్టారో మరిచిపోవద్దన్నారు. బజారుల్లో అడ్రస్ కూడా లేకుండా తిరుగుతున్న వ్యక్తులకు పచ్చ చొక్కాలు తొడిగి.. అధికారం ప్రసాదించి.. సమాజంలో నిలబెట్టిన తల్లిలాంటి పార్టీ తెలుగుదేశం అని మరిచిపోవద్దన్నారు.
కరెంట్ ఇవ్వడానికి
చంద్రబాబు సిద్ధమే…
కెసిఆర్ ముందుచూపు లేని ముఖ్యమంత్రి అని, ఒక్కమాటలో చెప్పాలంటే ఇంత చిల్లర ముఖ్యమంత్రిని తానెప్పుడు చూడలేదన్నారు. తెలంగాణ ప్రజలు విద్యుత్ కోతల మూలంగా ప్రాణాలు కోల్పోతుంటే అప్పుడు హడావిడిగా లేచిన కెసిఆర్ పరుగున ఛత్తీస్‌గఢ్ వెళ్లారని, కరెంట్ ఇవ్వడానికి కాలం పడుతుందని అక్కడ చెప్పడంతో తిరుగుముఖం పట్టారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అడిగితే తెలంగాణకు విద్యుత్ ఇవ్వడానికి చంద్రబాబు సిద్దంగా ఉన్నారని, కానీ కెసిఆర్ అడగడం లేదన్నారు. మానుకోటను జిల్లా కేంద్రం చేయాల్పిందేనని, మాట ఇచ్చిన కెసిఆర్ మరిచిపోవాలని చూస్తే టిడిపి తరపున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బాలుచౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, పార్లమెంట్ పార్టీ ఇన్‌చార్జి మోహన్‌లాల్, మాజీ ఎమ్మెల్యేలు వేంనరేందర్‌రెడ్డి, సీతక్క, పార్టీ నాయకులు గండ్ర సత్యనారాయణ, ఈగ మల్లేశం, భూపతి మల్లయ్య, సునిత, సంజీవరెడ్డి, రాంచందర్‌రావు, ఎడ్ల రమేష్, తెళ్ళ శ్రీనివాస్, మార్నెని రఘు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం… సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి ఫ్ల్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు

చక్కని పద్యాల సాహిత్యపు ముచ్చట్లు

  • – శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం
  • 31/01/2015
TAGS:

‘పద్య కథాపరిమళము’- -డా.కపిలవాయి
లింగమూర్తి;
వాణీ ప్రచురణలు,
నాగర్‌కర్నూలు, పుటలు: 100; వెల: 70రూ./-;
ప్రతులకు: 1) కపిలవాయి సంధ్య అశోక్
ఇంటి నెం.17-110, వాణీసదనం, విద్యానగర్ కాలనీ, నాగర్‌కర్నూలు- 509 209
2) అన్ని విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు

విస్తృత అధ్యయన- రచనలలో తలపండిన డాక్టర్ కపిలవాయి లింగమూర్తిగారి ఇటీవలి రచన ‘పద్యకథా పరిమళము’. ఇది ఒక ‘చల్లని పిల్లతెమ్మెర.’
ఇందులో నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతన మొదలైన కవుల కొన్ని ప్రసిద్ధ పద్య సందర్భాల ముచ్చట్లు, ప్రఖ్యాత సంస్కృత కవులైన భారవి, బిల్హణుల వృత్తాంతాలు, నాల్గణాల శ్లోకం అనే ఒక చమత్కార కథానిక – ఇలాంటివన్నీ కలిపి మొత్తం పదహారు అంశాలున్నాయి. దేనికవి చాలా పొందికగా సరళమైన భాషా వాక్యవిన్యాసంతో ఒప్పారింది.
‘‘తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణ చంద్రనిభాననే! (ఓ పూర్ణచంద్ర వదనా! త్వరగా ఇంత సున్నం తీసుకురా)’’అనే సంస్కృత వాక్యంలో మూడు ‘ణ’లు ఉన్నాయి. కానీ ‘‘పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతాయతలోచనే! (నిడుద కన్నుల దానా! బంగారు రంగు తమలపాకులు నాలుగు తెచ్చిపెట్టు’’ అనే వాక్యంలో నాలుగు ‘ణ’లు ఉన్నాయి. ‘ణ’ను తెలుగు పిల్లలు ‘అణా’అంటారు. రెండో సంస్కృత వాక్యంలో ఈ ‘అణా’లు నాలుగు ఉన్నాయి. కనుక ఆ వాక్యం అన్నదానికే ఎక్కువ విలువ, ప్రాధాన్యం దక్కాయి అనే చమత్కార భావ పూర్వక కథ బాగుంది.
భారవి, బిల్హణుల కథలను చాలా చక్కగా ఉత్కంఠ భరితంగాను, రసవత్తరంగాను రాశారు రచయిత. సాహిత్యం అంటే హితం కూర్చేది, మేలు చేసేది; సాహితీపరుడు ఒక ముని, ఒక యోగిలాంటివాడు అని తెలియజెప్పే వస్త్ధ్వునితో భారవి కథను చెప్పటంలోని కథన శిల్పం అనల్పం.
రమణులకు వన దశలో వక్షమ క్రింది నడుము సన్నబడిపోవటం అనే లలిత సుందర శారీరక పరిణామాన్ని పెద్దనాదుల వంటి ఆస్థాన విద్వాంసుల మధ్య తనలాంటి పేరులేని పెద్దయ్య నిలవలేడు (ఆశ్రయం దొరకదు)అనే బాధాకర అనుభవీయతకు ఉపమానంగా చెప్పటంలో సంకుసాల నృసింహకవి యొక్క ధ్వని ప్రధాన రీతిని, వ్యంగ్య వైభవ సహిత భావగాంభీర్య, సాదృశ్యాలను సుందరంగా ఆవిష్కరించారు లింగమూర్తిగారు. విషాదాన్ని కూడా శృంగారోపమానంతో చెప్పటం సంకుసాల కవి ప్రతిభకు దర్పణంగా చూపారు కపిలవాయి వారు.
నన్నయగారి భారతం మానవ నాయకం కనుక అది రాజాంకితం చేయనగును. కానీ భాగవత కథానాయకుడు నారాయణుడు కనుక దానిని మానవ మాత్రునికి అంకితం ఇవ్వలేను అంటూ పోతన తలపోసినట్లు ఆ మహాకవి అంతరంగాన్ని చాలా అర్థవంతంగా విశదీకరించారు.
‘‘రసికులైనవారు రమణులకు ఒకింత వంగియుండుట ధర్మవర్తనము- నారివైపుకు విల్లు వంగదా?’’ అంటూ ‘్ధర్మ’పదానికి, ‘నారి’ శబ్దానికీ ఉన్న ధనుస్సు, స్ర్తిఅనే అర్థాలతో అక్కడి శే్లషను వివరించటం మనోహరం.
‘పోతన రాసిన భాగవతంలోని గజేంద్రుడు పూర్వజన్మలో ఒక రాజు. కానీ, మనం ఈ జన్మలోనే గజేంద్రులం. గజం అంటే మదించి ఉండేది అని వ్యుత్పత్తి. కుల మదం, ధన మదం, విద్యామదం, రూప మదం, వన వదం- ఇలా అనేక మదాలతో ఉన్నాం’ అంటూ ప్రస్తుత సమాజం మీద ఒక చుఱక గూడా వేశారు.
చారిత్రక ప్రామాణికత, వాస్తవికతల తర్కాన్ని కొంచెంసేపు పక్కనబెట్టి, ఒక సాహిత్యపు పేరంటంలో కూర్చున్నాము అనే భావనతో చదివి ఆనందింపదగిన పుస్తకం ఇది.
సాహిత్య కథానికలు అల్లటానికి సాధనచేసే వాళ్ళకు ఈ పుస్తకం ఒక స్ఫూర్తిని, ఊపును, ఉత్సాహాన్ని, ఉత్ప్రేరణను ఇస్తుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్మశ్రీ నోరికి సత్కారం -కొత్త చుట్టాలు కొంగలు


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జపాన్ భాష నేర్చుకో -ఉద్యోగం పట్టుకో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అకాడెమీల పునరుద్ధరణ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నింగి నుంచి నే లకు దిగిన మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కేజ్రీ వాల్ వోట్లు చీల్చే కాంగ్రెస్ పైనే కమలం ఆశలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భావకవిత్వ మేస్త్రి –కృష్ణ శాస్త్రిగారి 35వ వర్ధంతి సభ

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

భావకవిత్వ మేస్త్రి –కృష్ణ శాస్త్రిగారి  35వ వర్ధంతి సభ

75 వ సమావేశం –ఆహ్వానం

‘’భావకవిత్వానికి మేస్త్రి -ఆంధ్రా షెల్లీ’’  స్వర్గీయ దేవులపల్లి కృష్ణ శాస్త్రి  గారి  వర్ధంతి సందర్భం గా విద్యార్ధులకు కృష్ణ శాస్త్రి గారి జీవితం ,కవిత్వం, రచనలు ,పాటలపై అవగాహన కల్పించటానికి ఉయ్యూరు కాకాని వెంకట రత్నం కాలనీ లో ఉన్న అమరవాణీ హైస్కూల్ లో 25-2-15 బుధవారం ఉదయం 10 గం.లకు సరసభారతి ,స్థానిక అమరవాణీ హైస్కూల్ సంయుక్తం గా సభ నిర్వహిస్తున్నాము .

.శ్రీమతి కావూరి సత్యవతి –(రిటైర్డ్ ప్రదానోపాధ్యాయురాలు ,తెలుగు పండిట్, కవి  విమర్శకురాలు-విజయవాడ) )మరియు శ్రీమతి మందరపు హైమవతి –(తెలుగు ఉపాధ్యాయురాలు ,కవి విమర్శకులు –విజయ వాడ )ఆత్మీయ అతిధులుగా విచ్చేసి కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం ,జీవితం పై ప్రసంగిస్తారు .

కృష్ణ శాస్త్రి గారి జాతీయ గీతం –‘’జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి ‘ పాట గానం  ,కృష్ణ శాస్త్రి గారి జీవితం పై వ్యాస రచన  ,కృష్ణశాస్త్రి గారి కవిత్వం పై వక్తృత్వం పోటీలలో విజేతలైన విద్యార్ధులకు బహుమతి ప్రదానం జరుగుతుంది .

సాహిత్యాభిమానులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

పి .నాగ రాజు                                                              గబ్బిట దుర్గా ప్రసాద్

ప్రిన్సిపాల్ –అమరవాణీ హైస్కూల్                                     సరసభారతి అధ్యక్షులు

నిర్వహణ సహకారం –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి-సరసభారతి కార్య దర్శి

గబ్బట  వెంకట రమణ -కోశాధికారి

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కోయల”మాఘ పున్నమి జాతర”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయవాడ ఎయిర్ పోర్ట్ లో నవ్యాంధ్ర టెర్మినల్ మోడల్

విజయవాడ ఎయిర్ పోర్ట్ లో నవ్యాంధ్ర టెర్మినల్ మోడల్

terminal 001

 

 

 

malam 001
terminal 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం-1

 

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం-1

 

ప్రముఖ చిత్రకారులు ,కవి, నవలా, కదా రచయిత సమాచార శాఖోద్యోగి,ఆంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ శీలా వీర్రాజుగారికి  శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచి సరసభారతిద్వారా మూడు నెలల క్రితం 21-9-14 బందరులో  అందజేసిన’’ బాపు –రమణ ల స్మారక పురస్కారం ‘’ప్రదానంచేసిన  రోజున రెండో సారి సన్నిహితం గా చూసి మాట్లాడే అవకాశం లభించింది .ఆనాడు ఆ దంపతులు ఇచ్చిన ‘’పడుగు పేకల మధ్య జీవితం ‘’అనే పుస్తకం  నాలుగు రోజుల క్రితమే చదివే వీలు కలిగి చదివి ముగ్దుడినయ్యా . అది  బాల్యం నుండి వివాహం దాకా వీర్రాజుగారి జీవిత చరిత్ర .దీర్ఘ కవిత .ఇందులో ఆయన కన్నీళ్లు కస్టాలు సుఖాలు దుఖాలు స్నేహాలు మానాలు అవమానాలు పురస్కారాలు ప్రోత్సాహాలు ,ఎక్కిన శిఖరాలు పడదోసిన అంశాలు అన్నీ పడుగూ పేకల్లా అల్లి రాసిన మనోహర కవిత .అన్నీ యదార్ధ సంఘటనలే .ప్రతి పదం శిల్పమే .ప్రతి వాక్యం చిత్రమే .ప్రతి పేజీ అనుభవానికి అద్దమే.నాకు ఏంతో నచ్చి మీలో ఎక్కువమంది చదివి ఉండరనే ఉద్దేశ్యం తో మీకు అందులోని స్వారస్యాన్ని అందజేయాలని  రాస్తున్న నా చాపల్యం ఇది .ఎక్కువగా వీర్రాజుగారి  మాటలనే ఉటంకిస్తూ ఆసొగసును అనుభవైక వేద్యం చేస్తున్నా .

తన పుట్టిన నేపధ్యాన్ని ముందుగా చెబుతూ రెండో ప్రపంచ యుద్ధం మరో  అయిదు  రోజుల్లో భూమిని ఆకాశాన్నీ ఏకం చేసే భయం తో విరుచుకు పడే ముందు రాజమండ్రి లో ‘’ఆసుకండేల పరుగులకీ –రాట్నం చక్రాల తిరుగుళ్ళకీ మధ్య నేత మగ్గాల రాత్రిం బవళ్ళ కదలికలకీ నిలయమైన ఓ చిరుగుల చేనేత పేటలో –హరికేన్  లాంతరు వెలుగులో’’ పుట్టానన్నారు .అప్పుడు ఆ వెలుతురూ ఇన్ని రంగుల్ని దాచిందని ,ఇంత అందం భూమ్మీద పరచుకుని ఉందని తెలీదట .ప్రతి శబ్దం లో సంగీతం ఒదిగిఉన్దని తెలీదు .అటక దూలానికి కట్టిన ఉయ్యాలలో ఊగానని ,అప్పుడే తొలిసారి సంగీతం విన్నాననీ ,నాన్న బుజం పై పడుకొని మొదటిసారి రంగుల ప్రపంచాన్ని చూశారు .మేనత్త చంకనేసుకొని తిప్పినప్పుడు ప్రపంచ అందాలు చూశారు .అన్నప్రాసనప్పుడు ఇష్టమైన పుస్తకాన్నే పట్టుకొన్నారు ‘’.ఊహ  వచ్చాక బాల్యం రెక్కల గుర్రమైంది . వేళ్ళ సందుల్లోంచి జారిపోయి కాలం వెంట పరుగిడింది ‘’.

‘’ఉత్తరాంధ్రలో విజీనగరం’’నగరం అవతల నిత్యం నిద్రపోయే ‘’జామి ‘’కుగ్రామం నుండి వీరి పెద్దలు పందొమ్మిదో శతాబ్దం లో పాతిక చేనేత కుటుంబాలతో  వలస వచ్చి రాజమండ్రి చేరి ‘’జాన్ దొర ‘’దయతో ఊరవతల ఊసర క్షేత్రం లో ఇల్లుకట్టుకొని కృతజ్ఞతగా ‘’జామ్ పేట ‘’అని ఎరుపెట్టుకొన్నారు ఆ ప్రాంతాన్ని .కులవృత్తి అయిన నేతను పక్కకు పెట్టి తాతలు వ్యవసాయం చేసి కూడబెట్టిన దాన్ని తండ్రులు హారతి కర్పూరం చేశారు .’’నేను అడుగు పెట్టేసరికి పూర్నానుస్వారమైంది ‘’అని గోడు వెళ్ళ బోశారు .కాకిపిల్ల కాకి కి ముద్దు అయినట్లు ఎవరిబాల్యం వారికి ముద్దే కదా .ముచ్చటేకదా ‘’బాల్యం అంటే జ్ఞాపకాల పొరల మధ్య దాచుకొన్న నెమలి కన్ను ‘’అన్నారు .అది చైతన్యం తో మెరుపు జలతారై తనను అలరిస్తూనే ఉందనిసంబరపడ్డారు .గోదారి తనకు పరుగు నేర్పిందట .ఏపని చెప్పినా పరిగెత్తుకు వెళ్లి చేసేయ్యటం ,రివర్స్ గేర్ లో వెనక్కి పరుగు పరుగున రావటం అలవాటై స్కూలు పరుగుపందాల్లో బహుమతులకు తోడ్పడింది .మన బాల్యమూ ఇలానే గడిచింది .రాళ్ళు తగిలి తూలిపడి మోకాలి చిప్పలు డొక్కు పోయాయి ఎన్నో సార్లు .ఆ మచ్చలు లు నేటికీ సాక్ష్యాలు .అక్షరాభ్యాసం నాడు ఆర్భాటం గా రిక్షాలో ఊరేగి స్కూల్ కు వెళ్ళారు. అది తమకు తలకు మించిన ఖర్చే అయినా ‘’చదువుకొని ఆఫీసరై కడుపులో చల్ల కదల కుండా తమని కూచో బెట్టి ఉద్ధరించి ఊళ్లేలుతాడని ‘’ తండ్రి  అంతటిఖర్చు చేశారట .కాని ఆనాడు ‘’చదువూ అర్హతా ఉన్నా ,ప్రమోషన్ లకు సవా లక్ష అడ్డంకులు ఉంటాయని –ఇతరేతర అర్హతలతో ఈజీగా నిచ్చేన్లేక్కి పోవచ్చని ‘’ఆ నాడు తన తండ్రికి తెలీదన్నారు .’’తమ ‘’బంగారు కొండ ‘’ఎంజీవోగా చేరి ఎంజీవోగానే పదవీ విరమణ చెయ్యాల్సి వస్తుందని సత్తెకాలపు మనిషి పాపం !నాన్నకి తెలీదు ‘’అన్నారు .

‘’యుద్ధాన్ని రెక్కల మీద మోసుకు పోతున్న విమానాల్ని చూసి –కళ్ళల్లో కాంతి మలగి –‘’భయం తో మాటిమాటికీ ఆకాశాన్ని చూసే పెద్దల ను చూసిన తనలాంటి పిల్లలకు ఆశ్చర్యమే .వారి ఆందోళనలు వీరికి తెలీని విషయాలు .ఎప్పుడూ చూడని ‘’లోహ పక్షులు ‘’ఈ అక్కు పక్షుల అక్షులకు వినోదం .’’కోడి గుడ్డు బుడ్డి  కిరసనాయిలు దీపం వెలుగులోనే కునికిపాట్లు పడుతూ సాగింది ‘’ఆయన చదువు .ఆనాటి మనకూ అంతేగా .ఇంట్లో హరికేను లాంతర్ ఉన్నా ‘’అది కిరసనాయిలు తాగు బోతు’’అని దాన్ని వెలిగించేవారు కాదు .పెద్దాబాల శిక్షతో వేసిన చదువు పునాది బలంగానే పడిందట .

‘’జన్మన్ సిల్వర్ పాత్రల పోతలతో ,శ్రమ జీవుల చెమట పూతలతో  ఎప్పుడూ హడావిడిగా ఉండే బస్తీలో ‘’నిదానం గా చదువుల ప్రస్తానం సాగింది .రామమూర్తి మేస్టారికి అర్ధో రూపాయో నెలసరి జీతం తో అక్షరాభ్యాసం ఆరంభమై నాలుగులో ప్రైవేటు చదువు మొదలై టైం మిగిలితే బొమ్మలేయించేవారు మేష్టారు. అప్పుడే ‘’ఎదుట ఉన్న మునిసిపాలిటీ వీధి లాంతర్ని చూసి అప్పుడే ఆకాశం లో ఎగిరిన విమానాన్ని గుర్తించి ఆ రెంటి మధ్యా ఒక ఇల్లు సృష్టించి ‘’పంతులుగారికి చూపి మెప్పుపొంది అరచేతిలో ‘’శ్రీ మార్కు ‘’పడటం అంబరాన్ని అంటే సంబరాన్ని కల్గించి అ పలకను పదిలంగా ఇంటికట్టుకెళ్ళిఅమ్మానాన్న మేనత్త ల అభినందన చూపుకు పులకించారు .పెదనాన్న చేతిలో పెట్టిన ‘’ప్రైజ్ మనీ అణాకాసు ‘’కు మురిసిపోయారు.ఆయన   రంగు పెన్సిళ్ళు రెండు  కొనిచ్చిన ప్రోత్సాహం తో బొమ్మలపై విజ్రుమ్భించారు .అప్పుడే తెలిసిందట ‘’నాచేతిలో బొమ్మల గీత ఉన్దని ,ఓపిగ్గా కూచుని వేస్తె పొందిగ్గా రేఖలు కుదురుతాయని ,చక్కగా బొమ్మలు  వేయ గలను ‘’అని .చిన్న ప్రోత్సాహం ఎంతటి బలీయమైన ఆలోచనకు పునాది అయిందో తెలుస్తున్దిమనకి .padugupeka 001

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-15- ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -6

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -6

ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -4(చివరి భాగం )

ఇంత చేసినా వాగ్నర్ సంగీతం ‘’కళకు  ,సౌందర్యానికి వ్యతిరేకమే కాక కామన్ సెన్స్ కు కూడా వ్యతిరేకమే ‘’అన్నారు విమర్శకులు .’’టాన్ హీసర్ ‘’కు కూర్చిన సంగీతం అంతా రణగొణ ద్వనియే’’అందిలండన్  టై మ్స్ పత్రిక .’’ట్రిస్టాన్ కు చేసిన సంగీతం ‘’ఒక బాంబు పేలి సంగీత స్వరరాగాలను విచ్చిన్నం చేసి నట్లుంది ‘’అన్నది .జర్మన్ విమర్శకుడు ఇంకొంచెం ముందుకు వెళ్లి వాగ్నర్ సమకూర్చినది ఏదీ మిగలదు నిలవదు అని ఖచ్చితం గా చెప్పాడు .చార్లటాన్’’హంబగ్ ‘’-కౌంటర్ పాయింట్ ను విషపూరితం చేశాడు –సంగీత విద్యా మూర్ఖుడు, శత్రువు ‘’అని శాపనార్ధాలు పెట్టాడు .’’ఇంపు సోంపు పిచ్చి చేష్టలకు బలైనాయి ‘’అన్నాడొక ప్రబుద్ధుడు .వాగ్నర్ కు సంగీత వరస కట్టటం రాదనీ  ,అతనిలో హాస్య ప్రియత్వం లేదని ,అణకువ అసలే ఉండదని ,ప్రతిదాని లోను రూపాన్ని రూప  శూన్యం లోకి లాక్కేళ్ళాడని ,అతనిదంతా పెద్ద మోత తప్ప చెవులకు  ఇంపైనది ఏదీ లేదన్నాడు బెక్ మేసర్ .’’it could be cruel to judge such trash by any known literary standard ‘’అని ‘’విమర్శ కుండ ‘’పగల కొట్టాడు స్టాతాన్ .

వాగ్నర్ భార్య హార్ట్ అటాక్ తో  చనిపోయింది .పెళ్ళాడిన కోసిమా ఇతనికి ముగ్గురు పిల్లని కనిపెట్టింది .కోసిమాలో ప్రేమ ఆపేక్ష కనిపించాయి .ఆమె ఆరాధనకు మురిసిపోయాడు. పిల్లలకు తన సంగీత పాత్రల పేర్లు –ఐసాల్ద్ ,ఈవా ,సీగ్  ఫ్రీడ్ అని పెట్టుకొన్నాడు  . అనూహ్యం గా వాగ్నర్ కు కొండంత అండగా నిలబడ్డాడు ప్రఖ్యాత ఫిలాసఫర్ ‘’Friedrich Neitzsche ‘’‘’ ‘’వాగ్నర్ విశ్వాన్ని అతి సూక్షం గా చేశాడు ‘’అని కీర్తించాడు .ఈ ఇద్దరి మధ్య అపూర్వ ఆకర్షణ ఏర్పడింది .నీషే క్రిష్టియానిటికి వ్యతిరేకం గా ఉన్నాడు .వాగ్నర్ కూడా అలాగే చేశాడని భావించాడు .వాగ్నర్ సంగీతం ప్రజలకు తీయని మత్తు మందు అని సంస్కృతికి ద్రోహం చేస్తున్నదని ,మత్తు మందు తో మభ్య పెడుతున్నాడని దియేటర్ యజమాలు గోల పెట్టారు ..

ఇంతటి వ్యతిరేక పరిస్తితులలో వాగ్నర్ కు విజయాలు నెమ్మదిగా చేరువైనాయి .జర్మనీ లో ఇమ్పీరియలిజం వ్యాపించింది .తమ గడ్డపై జన్మించిన వాడిని గౌరవించాలన్న బలమైన కోరిక ఏర్పడి అతని ప్రదర్శనలు బ్రహ్మ రధం పట్టటం ప్రారంభించారు .59వ ఏట ‘’బే రూత్ ఫెస్ట్ ఫీలస్ ‘’ కు సంకు స్థాపన చేశాడు .అరవై మూడవ ఏట బేరూత్ ఉత్సవాలు ఘనం గా నిర్వహింప బడ్డాయి .ఇద్దరు చక్ర వర్తులు, ఒక రాజు కొందరు ఉన్నతాధికారుల  సమక్షం లో రింగ్ సర్కిల్(దిరింగ్ ఆఫ్ దినీబే లంగ్స్ ‘’ ప్రదర్శించాడు  . ఇది అత్యంత విజయవంతం అయింది .అయినా అప్పుల్లో మునిగి ,తీర్చటానికి  కచేరీలకోసం దేశాటన చేశాడు .అప్పటికే జీవితం లో ఆసిపోయాడు .కాని మత ఉత్సవానికి సరిపడా ఆలోచనలతో ‘పార్సీ ఫాల్ ‘’చేయాలని బుర్రనిండా ఆలోచనలతో ఉన్నాడు .

పర్సిఫాల్ ఉపోద్ఘాతం ను ప్రదర్శించే టప్పుడు వాగ్నర్ వయసు అరవై అయిదు .నరాల వ్యాధి వచ్చింది .గుండె జబ్బు చోటు చేసుకొన్నది .దద్దుర్లు వచ్చాయి ఒళ్ళంతా .ఇటలీ లోని ప్రశాంత చల్లని వాతావరణం లో ఉండాలని వెళ్ళాడు ముందు నేపుల్స్ చేరి తర్వాత పలేర్మో వెళ్లి అక్కడ పార్సిఫాల్ సంగీతం పూర్తీ చేశాడు .అక్కాడ హార్ట్ ఏటాకులు వచ్చి మళ్ళీ జర్మనీ వచ్చేశాడు .ఉండలేక వెనిస్ వెళ్ళాడు .అక్కడ వెండ్రామిని పాలెస్ లో ‘’సింఫనీ ఇన్ సి ‘’మీద పని చేసి ‘’ఆన్ ది ఫెమినైన్ ఇన్ హ్యూమన్ నేచర్ ‘’పై ఒక కరపత్రం రాశాడు .తీవ్రమైన పని ఒత్తిడిలో ఉండగా చివరిసారిగా గుండెపోటు వచ్చి 13-2-1883 న వాగ్నర్ 70 వ ఏట మరణించాడు .అతని నోటి వెంట వచ్చిన చివరిమాటలు ‘’’’లీబ్ –ట్రాజిక్ ‘’ అంటే ప్రేమ- విషాదం ‘’అనే మాటలు .ఈ రెండే అతని జీవితం లో పెనవేసుకొన్న విషయాలు

వాగ్నర్ లోని రచయితను అతనిలోని సంగీతాన్ని వివిడిగా చూడలేము .’’the poet is a poor second best ‘’అన్నారు అందుకే .పురాతన ఉత్తర గాధా కవిత్వాన్నిఎంచుకొని ,స్కోపెంహార్ ఫాటలిజం అంటే విదిబలీయం ,జరిగేది జరక్క మానదు అనేదాన్ని కలిపాడు .అతని సంగీతాన్ని ‘’instinctive antipathy ‘ అన్నారు అతనికవిత్వం లో మార్మికత  ఎక్కువై ప్రజలకు సన్నిహితం కాలేక పోయిందన్నారు .కొన్ని సందర్భాలలో జర్మన్ ఫిలాసఫర్ కవి’’ గోదే ‘’ను కూడా మించి ముందుకు వెళ్ళాడు .కాని అతని సంగీతం ప్రపంచాన్ని ముంచేసింది .ముఖ్యం గా ఒపేరా సంగీతానికి కొత్త ద్వారాలు తెరిచాడు .అంతకు పూర్వం ఎన్నడూ లేని మహోన్నత వైభవాన్ని సాధించి దిగ్భ్రాంతి కల్గించాడు .తరువాతి వారు మొదట్లో అతని శైలిని కాదనుకొన్నా అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయారు .వాగ్నర్ స్టైల్ కు ఉన్న శక్తి అమోఘం .ఆర్కేస్త్రాకు ఉన్న వనరులనన్నిటినీ విస్తృత పరచాడు .సృజనాత్మక కళకు ప్రాదాన్యమిచ్చాడు .మానసికం గా గుండేలోతుల్ని స్పృశించింది వాగ్నర్ సంగీతం .కొత్త సంగీత రూపాన్ని ఆవిష్కరించి సంగీతానికి అర్కేస్ట్రాకు ప్రాధాన్యత తెచ్చి మార్గ దర్శి అనిపించుకొన్నాడు .’’The establishment of ‘’’.a new musical form ,the invention of a vast musical language ,and the total splendor of his achievement have the assurance of timelessness ‘’అలాంటి కాలాతీత సంగీతాన్ని అందించి చిరస్మరణీయుడైనాడు రిచార్డ్ వాగ్నర్ .

వాగ్నర్ మధుర శ్రావ్య సౌష్టవ  సమ్మేళనాన్ని  సాధించాడు సంగీతం లో .సాంప్రదాయక ధ్వని వాచ్యాల పరిధులను విస్తరింప జేశాడు .తాళానికి స్వరానికి ప్రాధాన్యతనిచ్చాడు .వాటి ఉనికికి కొత్త అర్ధాలు వెతికి ప్రదర్శించాడు .ఇదే ఇరవై వ శతాబ్దపు ‘’ఎటోనాలిటీ’’అయింది అంటే సంప్రదాయ స్వరాలకు మంగళం పాడి స్వర రాహిత్యానికి పట్టాభిషేకం చేశాడన్నమాట .అందుకే ఆధునిక పాశ్చాత్య సంగీతానికి వాగ్నర్ జనకుడు  అని,అతని  ట్రీస్టాన్న్ ‘’లో దీన్ని సృష్టించాడని అన్నారు .అందుకని దీన్ని ‘’త్రీస్టాన్ కార్డ్ ‘’అన్నారు .అంటే’’ త్రీస్టాన్ శృతి అన్నమాట .

వాగ్నర్ కచేరీల నిర్వహణలో  అభ్యాసం లో ప్రదర్శనలో ఉత్తమ విలువలతో కూడిన సిద్ధాంతాలను జోడించి ఆదర్శం గా నిలిచాడు .సంగీత సమ్మేళనం తో ఒక అపూర్వమైన అభిరుచిని ఆనందాన్ని మానసిక తృప్తిని ,పరిధికి మించిన అలౌకిక ఆనందాన్ని కల్గించాడు .అతనంటే ఇష్టపడని వాళ్ళే అతని ప్రతిభకు జోహార్లు పలికి అంతకంటే ఇంక ఏమీ లేదని చెంపలేసుకొన్నారు జర్మన్ బ్యాండ్ రామేస్తీన్ ఎలెక్ట్రానిక్ కంపోజర్ క్లాస్ శుజ్ మొదలైన వారందరూ వాగ్నర్ ను అనుసరించిన వారే .

[Wagner’s] protean abundance meant that he could inspire the use of literary motif in many a novel employing interior monologue; … the Symbolists saw him as a mystic hierophant; the Decadents found many a frisson in his work.

వాగ్నర్ సంగీత ప్రభావం 20 21 శతాబ్దపు సినిమా పై విపరీతం .హిట్లర్ స్వయం గా వాగ్నర్ కచేరీలకు హాజరై అందాన్ని అనుభవించేవాడు .తానుకోరుకొంటున్న జర్మనీని వాగ్నర్ సంగీతం లో సృస్తిస్తున్నాడని మెచ్చాడు .వాగ్నర్ భావాలు నాజీలు అనుకరించారు .1933-34లో నాజి కాన్సన్ ట్రేషన్ కాంప్ లలో వాగ్నర్ సంగీతాన్ని వినిపించి బంధితుల ఆలోచనా సరళిలో మార్పు తెచ్చి వారిలో జాతీయ భావం కలిగించేవారట .రెండవ ప్రపంచ యుద్ధ నాజీ డెత్ కాంప్ లలో వాగ్నర్ సంగీతం వినిపించేవారట .ఇదీ ఆధునిక సంగీత సృష్టికర్త రిచార్డ్ వాగ్నర్ జీవితం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-2-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఏరువాక పాట బొంబాయి లాక్కెళ్ళింది -వహీదా రెహ్మాన్ – 2019 లో ఒకరోజు సరదా కద –

1919 001

ఏరువాక పాట బొంబాయి లాక్కెళ్ళింది -వహీదా రెహ్మాన్ vahida1 001 vahida2 001 vahida3 001

Posted in సినిమా | Tagged | Leave a comment

7వ సోమేపల్లి కదా పురస్కార సభా దృశ్యాలు -1-2-15 ఆదివారం -ప్రెస్ క్లబ్ -విజయ వాడ 

7వ సోమేపల్లి కదా పురస్కార సభా దృశ్యాలు -1-2-15 ఆదివారం -ప్రెస్ క్లబ్  -విజయ వాడ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ప్రాంతీయ అస్తిత్వం – కోస్తాంధ్ర కథ – వాసిరెడ్డి నవీన్‌

ప్రాంతీయ అస్తిత్వం – కోస్తాంధ్ర కథ – వాసిరెడ్డి నవీన్‌

పోలవరపు కోటేశ్వరరావు, అక్కినేని కుటుంబ రావు రాసిన కథల్లో మాత్రమే ఒకటి రెండు మాండలికాలను వెతుక్కో        వలసి రావటం ఈ ప్రాంత అస్తిత్వవేదన కాక మరేమిటి?
సుమారు 80ల్లో ప్రారంభమైన అస్తిత్వవాద సిద్ధాంతాన్ని 80ల ముందు వచ్చిన కథలకు అన్వయించి చర్చించటం – అదీ కోస్తాంధ్ర ప్రాంత కథలకు అన్వయించటం సాహసమే అవుతుంది. అయితే ఇతర ప్రాంతాలకు ఉన్నట్లే కోస్తాంధ్ర ప్రాంతానికి ఉన్న ప్రత్యేక ముద్ర కలిగిన, స్థానీయ వాస్తవికతతో ముడిపడిన వస్తువుతో వచ్చిన కథలను పరిగణనలోకి తీసుకుని వాటిని చర్చించటం ఉపయుక్తంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆయా కథల్లో అక్కడక్కడా తొంగి చూసే అస్తిత్వవాద ఛాయల్ని పసికట్టి వాటి మూలాలను శోధించి చర్చించటం కొంతవరకు సబబు.
ఇలా చర్చించటం, విశ్లేషించటం ఈ ఒక్క వ్యాసంలో అయ్యే పనికాదు. ఆ చర్చకు ఈ వ్యాసం ఏ మాత్రం దోహదం చేసినా చాలు. తొలి నుంచీ తెలుగు సమాజంలో జరిగిన ఉద్యమాలు, స్థానీయ పరిణామాలు సాహిత్యానికి ప్రేరణగానో, మార్గదర్శకంగానో నిలిచినట్లే కథా సాహిత్యానికీ నిలిచాయి. కథా వికాసానికి దోహదం చేశాయి. స్థానీయ సమస్యల చిత్రణతో రాసిన రచనలు, అందులోని పాత్రలు విశ్వజనీనతను సంతరించుకోవటం ఈ పరిణామంలో గుర్తించదగిన అంశం. అందుకు ముఖ్యమైన ఉదాహరణ కన్యాశుల్కం నాటకం. విజయనగర సంస్థానంలో కొన్ని బ్రాహ్మణ అగ్రహారాలకి మాత్రమే పరిమితమైన కన్యాశుల్క దురాచారాన్ని నిరసిస్తూ గురజాడ అప్పారావు 1908 (మలిముద్రణ) లో రాసిన ఈ నాటకం ఆ సమస్యలేని ప్రాంతాల్లోనే కాక (వర విక్రయ ఆచారం ఉన్న ప్రాంతాల్లో కూడా) నూరు సంవత్సరాలు దాటినా నేటికీ సజీవంగా నిలబడింది. ఆయనే రాసిన ‘దేవుళ్లారా మీ పేరేమిటి’ కథ కూడా అంతే. అండప్రాయమైన చిన్న విషయంతో ప్రారంభమైన ఈ కథ మూఢాచారాలను నిరసించటంతో పాటు మరో 30 ఏళ్ళ తర్వాత మొదలైన స్ర్తీ స్వేచ్ఛ అనే విస్తృతాంశాన్ని ఆనాడే చర్చించి-వస్తువుకి విశ్వజనీనతను సంతరించి పెట్టింది. ఇలా స్థానీయత నుంచి విశ్వజనీనతకు విస్తరించటంలో తెలుగు సాహితీ ప్రక్రియల ఆరంభ దశ ఒక అద్భుతమైన చారిత్రక పరిణామంగా భావించవచ్చు.
ఉత్తరాంధ్రలో ప్రారంభమైన ఈ సాహితీ ప్రాభవం నెమ్మదిగా దక్షిణాంధ్రకూ విస్తరించింది. దీనికి కొంతకాలం గోదావరి మండలం, తర్వాత నెల్లూరు, గుంటూరు మండలాలు, అనంతరకాలంలో కృష్ణా తీర ప్రాంతాలు ఆలవాలమైనా యి. ఈ ఆధునిక సాంస్కృతిక భావజాలం ముందుగా గోదావరి మండలాలకు తాకటానికి ఉన్న చారిత్రక కారణలను ఒకసారి పరిశీలిద్దాం.
1832లో గోదావరి మండలాన్ని కుదిపేసిన నందన కరవు (నందన నామ సంవత్సరంలో వచ్చిన) వందలాది ప్రాణాలను బలి తీసుకుంది. ఆ తర్వాత సర్‌ ఆర్థర్‌ కాటన్‌ చొరవతో 1850లో పూర్తయిన గోదావరిపై ఆనకట్ట (ధవళేశ్వరం ఆనకట్ట) ఆ ప్రాంతపు రూపు రేఖలను సమూలంగా మార్చివేసింది. వ్యవసాయ పద్ధతులు మారాయి. చిత్తడినేలల వ్యవసాయం కాలవ నీళ్ళ వ్యవసాయంగా మారింది. ప్రజల జీవన స్థితిగతుల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఇదే కాలంలో ఈ ప్రాంతంలో కొత్తగా స్థాపించబడిన వందలాది పాఠశాలలు ఒక తరం ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చివేసాయి. దీనికితోడు క్రైస్తవ మత ప్రచారం ఊపందుకుంది. దళిత, బహుజన కుటుంబాల్లో చైతన్య దీప్తి ఆరంభమయింది. వ్యాపార పంటలతో సంపద పోగుపడింది. దేశంలోని వివిధ ప్రాంతాలతో సంపర్కం ఏర్పడింది. ముఖ్యంగా బెంగాలు ప్రాంతంతో, అక్కడి నుంచి వెల్లువలా వచ్చిపడుతున్న సాంసం్కృతిక పునరుజ్జీవనపు ఆధునిక పోకడలకు తోడు అభ్యుదయ భావజాలానికి గోదావరి మండలం నెలవయింది. ఈ మొత్తం పరిణామం సీ్త్ర విద్య, స్ర్తీ పునర్వివాహం, సీ్త్రస్వేచ్ఛ, దళిత బహుజన కులాల ఆత్మ స్థైర్యం మొదలైన సామాజికాంశాలకు ఊపిరులూందింది. ఈ క్రమంలో వచ్చిన కథా సాహి త్యం తెలుగు కథా సాహితీ వికాసానికి మార్గదర్శి అయింది. ఈ దశలో స్థానీయ సమస్యలను చిత్రంచిన కథలు విశ్వజనీన దృక్పథాన్ని సంతరించుకున్నాయి. తొలినాళ్ళలో శ్రీపాద ‘అలాంటి తవ్వాయి వస్తే’, ‘అరికాళ్ల క్రింది మంటలు’, ‘కొత్త చూపు’, ‘మార్గదర్శి’ కథలు ఆధునిక భావజాల పునాదిపై నిర్మించిన కథలుగా కలకాలం నిలబడిపోతాయి. అంటరానితనాన్ని నిరసించటం, సీ్త్ర పునర్వివాహం, వ్యాపార దృక్పథం వస్తువుగా వచ్చిన ఈ కథలతో పాటు చింతా దీక్షితులు, ముద్దు కృష్ణ రాసిన కథలు ఈ కాలానికి ప్రతీకలు. నేటికీ అవి కొత్త కథలుగానే అనిపిస్తాయి. వాటికున్న విశ్వజనీనత అది.
కోస్తాంధ్ర ప్రాంతానికి నదులు ఆభరణాలు, ఆ నదుల చుట్టూ ఎంతో సంస్కృతి, జీవన విధానం అల్లుకుని ఉన్నాయి. అటు నెల్లూరు మండలంలోని పెన్నానది, ఇటు గోదావరి, కృష్ణానదులు, ఈ ప్రాంతాలకు జీవధారలు. వీటిమీద ఆనకట్టలు కట్టాక చుట్టూ కాలువలు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత చేతివృత్తులు…వచ్చిన పంటలు ద్వారా పోగుపడిన సంపద, దాని ద్వారా అభివృద్ధి అయిన వ్యాపారం.. ఇలా మొత్తం కోస్తాంధ్ర సంస్కృతీ వికాసానికి నదులు పట్టుకొమ్మలుగా నిలిచాయి. నదీపరీవాహక ప్రాంతాల జీవన సంస్కృతి మీద ఎన్నో కథలు వచ్చాయి. ఇవన్నీ ఇక్కడి ప్రత్యేకతలు ఒడిసి పట్టుకున్నాయి. అలా వచ్చిన కథల్లో నదుల అందాలను వర్ణించినవీ, వరదకాలపు కష్టాలను చిత్రించినవీ, నదులను ఆరాధించినవీ, నదితో పంచుకున్న జీవితానుభవాలను పంచినవీ ఎన్నో  కథలున్నాయి.
కవికొండల వెంకటరావు గోదావరి వరద కష్టాలను కళ్ళ ముందుంచితే, కళ్ళు చెదిరే గోదావరి అందాలను బి.వి.ఎస్‌. రామారావు గోదావరి కథలుగా తీర్చిదిద్దితే, ఈ అందాలకు మానవ ప్రవృత్తిలోని మౌలిక లక్షణాలను జోడించి పాలగుమ్మి పద్మరాజు తాత్వ్తిక కోణాన్ని చూపించారు. గోదావరి తీర ప్రాంతం మీద డజన్ల కొద్దీ కథలు రాసిన వంశీ (80ల తర్వాత) రాసిన కథలో పోలవరం ప్రాజెక్టు కట్టాక భవిష్యత్‌ గోదావరిని ఆవిష్కరించారు. తొలితరంలో గౌతమీ గాథలను ఆవిష్కరించిన ఇంద్రగంటి హనుమత్‌చ్ఛాసి్త్రనీ మర్చిపోలేం. స్వాతంత్ర్యానంతరం గోదావరి నదిపై డజన్ల కథలు వెలువడ్డాయంటే అతిశయోక్తి కాదు.
తెలుగు కథా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేవి సాహిత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు. ఇవి ప్రధానంగా కృష్ణా తీర కథలు. వీటిల్లో రచయిత ప్రతిపాదించిన మానవతా విలువలు, సంప్రదాయక ఆధునిక భావజాలాల మేలు కలయక పాఠకులను తామెక్కడివారైనా అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తాయి. కృష్ణానది సముద్రంలో కలిసేప్రాంతంలో ఏర్పడిన లంకల్లోని ప్రజల జీవన స్థితిగతులను, విలువలను చిత్రించి పోలవరపు కోటేశ్వరరావు కృష్ణాతీరం కథలు తీర జీవనానికి మంచి వ్యాఖ్యానాలు. పెన్నాతీరం, గుండ్లకమ్మ తీరం కూడా కథావస్తువయింది. ఇవన్నీ ఈ ప్రాంత అస్తిత్వ సూచికలు. స్థానీయ వస్తువుతో రాసిన ఈ కథలన్నీ సార్వజనీనమైన మానవతా విలువలను, విలువల వైరుధ్యాలలోని సున్నితత్వాన్ని, వాటి సాంఘిక నేపథ్యాన్ని ప్రతిపాదించాయి. వీటన్నిటిలో అంతర్లీనంగా కనబడే పాత్ర నది. తెలుగు కథా సాహిత్యంలో కోస్తాంధ్ర ముద్ర స్పష్టంగా కనబడే కథలివి. నదుల కథలపై ప్రత్యేక అధ్యయనం అవసరం.
నీళ్ళు ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమానికి కారణమైన ఈ సందర్భంలో తప్పనిసరిగా ఉదహరించవలసిన కథ నీళ్ళు. రచయిత పెద్ధిభొట్ల సుబ్బరామయ్య. నీటి కొరత తెచ్చిపెట్టే ‘అనాగరిక’ జీవనానికి, నీరే సంస్కృతిగా భాసిల్లే ‘నాగరిక’ జీవనానికి మధ్య సాగిన అంతర్గత వైరుధ్యాల సమరం ఈ కథ. నీటికి నాగరికతకు ఉన్న సంబంధాన్ని నీటికొరత ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన యువకుడి కోణం నుంచి చెప్పిన కథ. అంతేకాదు, నీటిపై పెత్తనాన్ని నీటి నాగరికత ద్వారా ఏర్ప డిన దురహంకార భావజాలాన్ని ప్రశ్నించిన కథగా కూడా దీన్ని ఉదహరించవచ్చు. (ఆశ్చర్యమేమంటే ఈ కథలోని రెండు పాత్రలు కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవారే కావటం) ఈ ప్రశ్న నెమ్మదిగా ప్రాంతీయ అస్తిత్వవాద రూపును సంతరించుకున్న ఉద్యమాన్ని నడిపించింది.
కోస్తాంధ్ర ప్రాంతం మీద ప్రధాన ఆరోపణ ఒకటి ఉంది. మరీ ముఖ్యంగా, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల మీద ఈ రెండున్నర జిల్లాల భాషను ఆధిపత్యవాద దురహంకారంతో మొత్తం తెలుగు భాషగా ప్రామాణీకరించారని. అంటే ఇప్పుడు పత్రికల్లో, సినిమాల్లో, ఇతర మాధ్యమాల్లో వాడుతున్న భాష అంతా ఈ రెండున్నర జిల్లాలదని దీనర్థం. ఈ క్రమంలో ఇతర ప్రాంత మాండలికాలు దెబ్బతిన్నాయనేది ఈ ఆరోపణల్లో ప్రధానాంశం. ఈ ఆరోపణల్లోని నిజానిజాలను కాసేపు పక్కనబెట్టి ఒక్క విషయాన్ని మాత్రం అంగీకరించాలి. ప్రసార మాధ్యమాల్లో ఇతర ప్రాంత మాండలికాలను అవహేళన చెయ్యటం, తక్కువ పాత్రలకు ఆపాదించటం వెనక దురంహంకారం, ఆధిపత్యం ధోరణి ప్రస్ఫుటంగానే కనబడుతుంది. ఈ ఆరోపణల్లో తప్పిపోయిన మరో ముఖ్య విషయం- రెండున్నర జిల్లాలు ఈ ప్రామాణీకరణ క్రమంలో తమ తమ మాండలికాలను దారుణంగా పోగొట్టుకున్నాయన్నది. అక్కడక్కడ, అప్పుడప్పుడు గుంటూరు మాండలికం కనబడుతుంది కానీ కృష్ణా, గోదావరి (పశ్చిమ) మాండలికాలు ఏమయ్యాయో అంతు చిక్కదు.
ఇప్పుడిదంతా ఎందుకంటే..
వ్యాపారీకరణ సూత్రంగా ఎదిగిన, కోస్తా ప్రాంతాల పెట్టుబడిదారులు, ప్రసారమాధ్యమాల ద్వారా ప్రామాణీకరించిన భాష నిజానికి రెండున్నర జిల్లాల భాష కాదు. ఈ ప్రామాణీకరణ క్రమంలో ఈ రెండున్నర జిల్లాల సొంపైన మాండలికాలెన్నో కాలగర్భంలో కలిసిపోవటం వాస్తవమైన విషాదం. మాండలిక భాషపై ఎంతో ప్రేమాభిమానాలున్న సాహిత్యాభిమానులకు ఈ ప్రాంత మాండలికాలు కనుమరుగై పోయాయన్న ఆవేదనతో పాటు, రెండున్నర జిల్లాల ఆధిపత్య వాదులుగా (భాష విషయంలో) ముద్ర వేయించుకోవటం మరింత బాధాకరం.
ఇటీవల అక్కినేని కుటుంబరావు నవల కొల్లేటి జాడలు లోని మాండలిక పదాలను చదువుతోంటే ఒళ్ళు పులకరించి పోయింది. తెలంగాణ, రాయలసీమ, ఉత్త రాంధ్ర మాండలికాలను ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకున్న నా బోటివాడికి నా మాండలికం నాకు తెలియకపోవడం, రాయలేకపోవటం, ఆత్మహత్యా సదృశ్యమైన విషాదం. దీనికి కారణాలేమిటి?
కరుణకుమార నెల్లూరు మాండలికంలోను, మా గోఖలే గుంటూరు మాండలికంలోను కథలు రాసిన రోజుల్లోనే కృష్ణా, గోదావరి జిల్లాల రచయితలెవరూ ఆయా మాండలికాల్లో రాయలేకపోవటానికి ఏ పెట్టుబడి దానిని మింగేసిందో ఆలోచించాలి. (ఒకటి రెండు కథలు రాసిన కొసరాజు-అవును ఏరువాక సాగాలో.. పాట రాసిన కొసరాజే-దీనికి మినహాయింపే) ఇటీవల పోలవరపు కోటేశ్వరరావు, అక్కినేని కుటుంబ రావు రాసిన కథల్లో మాత్రమే ఒకటి రెండు మాండలికాలను వెతుక్కోవలసి రావటం ఈ ప్రాంత అస్తిత్వవేదన కాక మరేమిటి?
ఈ వేదనలోంచి భాష విషయంలోనైనా అస్తిత్వ చైతన్యం, ఉద్యమం ఈ ప్రాంతంలో మొదలవుతాయేమో చూద్దాం!
 వాసిరెడ్డి నవీన్‌
(‘తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం’ సంచికలో               ‘ప్రాంతీయ అస్తిత్వ మూలాల వెలుగులో కోస్తాంధ్ర కథ (1948-80)’ శీర్షికతో రాసిన సుదీర్ఘ వ్యాసంలోని కొన్ని భాగాలు)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాకు తెలిసిన ఆర్ కే లక్ష్మణ్ – కె. సదాశివరావు

నాకు తెలిసిన ఆర్ కే లక్ష్మణ్ – కె. సదాశివరావు

నేను ఆర్కే లక్ష్మణ్‌ దంపతులను మొదటిసారి        కలిసినది వైస్రాయ్‌ హోటల్‌లో ‘మీట్‌ ది ఆధర్‌’కార్యక్రమంలో. ఇది నాకు గుర్తుచేసింది అశోక్‌
(అశోక్‌ బుక్స్‌, విజయవాడ). లక్ష్మణ్‌ దంపతులు తర్వాత గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో బస చేశారు. మర్నాడు లంచ్‌కి బయటకు వెళ్దామని లక్ష్మణ్‌           దంపతులను తీసుకు వెళ్ళటానికి మేమిద్దరం వెళ్ళాము. నన్ను చూడగానే లక్ష్మణ్‌ ‘వాట్‌ పోలీస్‌ మన్‌! నన్ను అరెస్ట్‌ చేయటానికి వచ్చారా?’’ అన్నారు.
‘‘అవును, ఎక్కువ నవలలు రాయనందుకు మిమ్మల్ని నిజంగా అరెస్ట్‌ చేయవలసిందే’’నన్నాను.
లక్ష్మణ్‌, కమల, అశోక్‌… అందరూ నవ్వారు.
తర్వాత అక్కడే కూర్చుందామని నిర్ణయించుకుని లాంజ్‌లో కూర్చుని బీర్‌ తాగుతూ కబుర్లు చెప్పుకున్నాం. మా బీర్‌ కార్యక్రమం సమయంలో కమల, అశోక్‌ బయటకు వెళ్ళి లంచ్‌ సమయానికి వచ్చారు. తర్వాత కూడా లక్ష్మణ్‌ దంపతులను కలియటం జరిగింది. మేం మాట్లాడుకున్న విషయాలు ఎన్నో…
పంచ్‌ మాగజైన్‌ కార్టూనిస్టులూ… న్యూయార్కర్‌ కార్టూనిస్టులూ… ప్రపంచంలోని ముఖ్యమైన పొలిటికల్‌ కార్టూనిస్టులు ఇన్‌ జనరల్‌… డేవిడ్‌లో… ఓలిఫాంట్‌… ఇంకా ఎందరో. ఆయనకి బ్రిటిష్‌ కార్టూనిస్టులు… పంచ్‌ మాగజైన్‌తో విరివిగా వేస్తుండే ధెల్‌వెల్‌ (ఇతడి బొమ్మల్లో బొద్దుగా వుండే పిల్లలూ, బొద్దు గా వుండే పొట్టి గుర్రాలూ)…. రొనాల్డ్‌ సియిర్ల్‌… అంటే ఇష్టమని చెప్పారు.. న్యూయార్కర్‌ కార్టూనిస్టులలో జేమ్స్‌ దర్బర్‌… ఇంకా ఎందరినో ఆయన మెచ్చుకున్నారు.
‘‘స్టీన్‌బెర్గ్‌ ఎలా వుంటాయి’ అని అడిగాను.
‘‘బావుంటాయి కాని చాలా సొఫిస్టికేటెడ్‌… ఆబ్‌స్ర్టాక్‌’’ అన్నారు.
రచనల మీదకు మాటలు మళ్ళాయి. ఆయన ఆధునిక నవలలు… మంచివి దాదాపు చదువుతూనే వుంటానన్నారు. ముఖ్యంగా గ్రాహం గ్రీన్‌.
బైర్ట్రండ్‌ రసెల్‌ని కలసిన రోజున ఏం జరిగిందో చెప్పారు.
“You indians Discovered Nothing” అన్నాడు రసెల్‌. లక్ష్మణ్‌కి అర్థం కాలేదు. రసెల్‌ కాస్త రూడ్‌గా ఇన్‌సల్టింగ్‌గా మాట్లాడినట్లు అనిపించింది. కాని వెంటనే రసెల్‌ ‘‘మీరు గణితంలోని జీరోని కనుగొన్నవారు. గ్రేట్‌ కాంట్రిబ్యూషన్‌ టు మాధమెటిక్స్‌’’ అన్న తర్వాత అర్థమయింది రసెల్‌ పొగిడాడని.
ఆయనకీ కాకులకీ వున్న అవినాభావ సంబంధం గురించి బాగా చెప్పారు. ఉదయం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆఫీసుకి వెళ్ళి తన రూమ్‌లో కూర్చుని టీ తాగి అక్కడ వున్న అన్ని న్యూస్‌ పేపర్లని తిరగేయటం మొదటి కార్యక్రమం. దేశ కాల పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలను గురించి ఆలోచిస్తూ తన గది బయట వున్న చెట్టు మీద వాలి వుండే కాకుల మందలను చూస్తూ ఐడియాల కోసం ఎదురు చూసేవారు. మెల్లగా ఒకటో రెండో కార్టూన్‌ ఐడియాలు వస్తే రఫ్‌ స్కెచ్‌లను వేసి మళ్ళీ కాకుల విన్యాసాలను చూస్తూ గడపటం… కాస్త సమయం తర్వాత వచ్చిన ఐడియాలతో మళ్ళీ కొన్ని రఫ్‌ స్కెచ్‌ లు వేయటం- ఇలా జరిగేది. లంచ్‌ తర్వాత ఈ రఫ్‌ స్కెచ్‌ల నుండి పుట్టిన కార్టూనులు రెండో మూడో వేస్తే అవి ఎడిటర్‌ రూమ్‌కి వెళ్ళి తిరిగి వచ్చేవి. వాటికి కేప్షన్స్‌ రాసి ఫైనల్‌ డ్రాయింగ్‌ అయిపోతే రోజు పని పూర్తవుతుంది.
తన కార్టూన్ల సృష్టిలో బయట చెట్టు మీద సందడి చేస్తున్న కాకుల మందల విన్యాసాలు తన ఆలోచనలు ఓ దారికి రావటానికి దోహదం చేసేవని లక్ష్మణ్‌ అన్నారు. కాకులంటే లక్ష్మణ్‌కి ఎంతో ప్రేమ. వాటిని ఎన్నో మూడ్స్‌లో… ఎన్నో వేల బొమ్మలు వేశారాయన. ఆయన నాకు నాలుగు బొమ్మలు వేసి ఇచ్చారు. అవి (1) కామన్‌ మాన్‌ (2) కామన్‌ వుమన్‌ (3) గణేశుడు (4) కాకి. ఆ నాలుగు వేసి ఇచ్చాక నన్ను అడిగారు.
‘‘అవి ఎంత ఖరీదు వుంటాయో తెలుసా?’’
‘‘తెలియదు. బహుశా ప్రైస్‌ లెస్‌’’ అన్నాను
నవ్వి ఇలా చెప్పారు.
‘‘ఓ ఆరు నెలల నాడు బొంబాయిలో ఓ రోటరీ క్లబ్‌ సమావేశంలో నన్ను పిలచి మాట్లాడమని అడిగారు. ప్రసంగం పూర్తయ్యాక ఓ బొమ్మ వేయమని కోరారు. నేను ఓ బొమ్మ వేసి ఇచ్చాను. వెంటనే దానిని అక్కడ వేలానికి పెడితే క్లబ్‌కి ఓ యాభై వేలు వచ్చింది’’ అన్నారు.
‘‘థాంక్స్‌ ఫర్‌ మేకింగ్‌ మి రిచ్‌’’ అన్నాను. నవ్వేశారు లక్ష్మణ్‌. ఆ బొమ్మలు మా పిల్లలతో ప్రస్తుతం అమెరికాలో వున్నాయి.
ఓ సారి బాపు నన్ను అడిగారు.
‘‘లక్ష్మణ్‌ని నీ కారికేచర్‌ వేయమని ఎందుకు అడగలేదు?’’
‘‘నాకు అడగాలని తోచలేదు బాపూ’’ అని చెప్పాను.
ఎన్నో ఏళ్ళనాడు ఆర్కే లక్ష్మణ్‌ రెండు నవలలు కూడా రాయటం జరిగింది.
అవి (1) ది హోటెల్‌ రివియెరా (2) ది మెసెంజర్‌
ఆనాటి విమర్శకులు ఈ నవలలని సోదరుడు ఆర్‌.కె. నారాయణ్‌ నవలల తో పోల్చే ప్రయత్నం చేయటంతో నవలలు రాయటం విరమించుకుని కేవ లం డ్రాయింగ్స్‌, కార్టూన్ల మీద తన దృష్టిని కేంద్రీకరించటం జరిగింది. ఆర్‌.కె. నారాయణ్‌ రాసిన నవలలకీ కథలకీ, వాటి మీద ఆధారపడి తీసిన టీవీ సీరియల్స్‌కీ లక్ష్మణ్‌ వేసిన బొమ్మలతో వాటిలోని పాత్రలూ జీవం పోసుకుని ఆనా టి సమాజాన్ని, మనుషుల్ని ఎంతో ప్రతిభావంతంగా రూపొందటంలో భాగస్వాములయ్యాయి. నారాయణ్‌ వూహలకి లక్ష్మణ్‌ రూపాల్ని కల్పించటంలో వాటిలోని దృశ్యాలన్నీ మన కళ్ళ ముందు అద్భుతంగా ప్రత్యక్షమవుతాయి. మాల్గుడీ వూహా ప్రపంచంలోని మనుషులూ, ఇళ్ళూ వాకిళ్ళూ, బజారులూ అన్నీ మనకి స్పష్టంగా కనిపించి నారాయణ్‌ సృష్టించిన సాహిత్య ప్రపంచం మనకి అర్థమవుతుంది. పధ్నాలుగు ముఖ్య భాషలూ, ఇంకా ఎన్నెన్నో భాషలూ, 130 కోట్ల జనం వున్న ఈ దేశంలోని వైవిధ్యం, వైరుధ్యం అన్నీ ప్రస్ఫుటంగా నిత్యమూ చూపించటంలో లక్ష్మణ్‌ కృతకృత్యుడయ్యాడని వొప్పుకోక తప్పదు. అదే మన బలం… మన ఐక్యత..
అధికారగణాలలో, రాజకీయ వాదులలో, పారిశ్రామికాధిపతులలో, బ్యూరోక్రసీలలోని అన్ని లెవెల్స్‌లో వుండే రుగ్మతలూ, అధికార దాహంతో రాజకీయ నాయకులు చేపట్టే రధ యాత్రలూ, పాదయాత్రలూ, నిరాహార దీక్షలూ, ప్రజలను మభ్యపెట్టే ఇంకా ఎన్నో ఇతర కార్యక్రమాలనూ – వీటన్నింటినీ నమ్మి ఓట్లు వేసి మళ్ళీ అధికారాలను కట్టబెట్టి తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితి అన్ని వేళలా వుంటున్నది. అంతులేని అవినీతికి అడ్డుకట్టలు వేయటం ఎలాగో ఎవరికీ తెలియదు. ఇవన్నీ మనం అందరం నిత్యమూ అనుభవించేవే…ఇవన్నీ లక్ష్మణ్‌ కార్టూన్లకి మూల ధాతువు. మనందరి నిత్య జీవితాలనుండే ఈ సమస్యలన్నీ పుట్టాయన్న సంగతి మనకి తెలియదు.
మేం మాట్లాడుతున్న సమయంలో లక్ష్మణ్‌ – నాన్‌సెన్స్‌ కవితలు, వాటికి బొమ్మలు వేసిన ఆంగ్ల కవిని ప్రస్తావించారు. కాని మా ఇద్దరికీ ఆ పేరు గుర్తుకు రాలేదు. కాసేపు ప్రయత్నించి కవితల్ని గురించి మాట్లాడుకున్నాము. ఆ రోజు రాత్రి నాకు కవి పేరు గుర్తుకు వచ్చింది.
అది ఎడ్వర్డ్‌ లియర్‌. మర్నాడు మేం ఇద్దరం కలిసినప్పుడు వచ్చిన మొదటి మాట ‘‘ఎడ్వర్డ్‌ లియర్‌’’ అని ఇద్దరం ఒక్కసారి అన్నాం. తర్వాత నవ్వులు.
ఆయన పూర్తిగా రిలాక్స్‌ అయితే చెప్పే విషయాలు ఎంతో ఆత్మీయంగా, ఫన్నీగా వుంటాయి. ఆయనకి జపనీస్‌ సినిమాలు అంటే ఇష్టం. ముఖ్యంగా అకీరా కురసోవా. ఆ సినిమాలలో ఎక్కువగా నటించే ప్రముఖ నటుడు తోషిరో మిఫునె కోపం వస్తే జపనీ్‌సలో ఎలా మాట్లాడేవాడో లక్ష్మణ్‌ మిమిక్‌ చేస్తే చూడటం ఓ అపురూపమైన అనుభవం. ఆ భాష జపనీస్‌ కాదు.. జపనీస్‌ లాంటి జిబరిష్‌. కాని, జపనీ్‌సలా అనిపించి మనకి ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది. ఆయన మిమిక్రీ అద్భుతం.
ఇంతకీ కామన్‌ మాన్‌ ఎవరు? ఈ ప్రశ్నని నేను లక్ష్మణ్‌ని అడిగాను.ఆయన ఎనిగ్మాటిక్‌గా నవ్వారు.
మళ్ళీ దగ్గరున్న కార్టూన్‌ పుస్తకాలను ఓ సారి తిరిగేస్తే తోచింది- లక్ష్మణ్‌ సృష్టించిన కామన్‌ మాన్‌, అతని భార్య కామన్‌ వుమన్‌- మన వూహా ప్రపంచంలో భాగాలైపోయారు. కామన్‌ మాన్‌ సమస్యలు నిజానికి మన అందరి సమస్యలు అన్న భావన కలిగించటంలో లక్ష్మణ్‌ ప్రతి దినమూ ప్రయత్నం చేసేవారు. కామన్‌ మాన్‌ అసహాయత, కామన్‌ వుమన్‌ మాటలలో వుండే వ్యంగ్యం, వెటకారం గిలిగింతలు కలిగిస్తాయి. లక్ష్మణ్‌ కార్టూన్లని చూసే ప్రతి మనిషికీ తన జీవితంలోని పలు సందర్భాలలో తారసపడే మనుషులూ, గతుకుల రోడ్లూ, త్రవ్వేసి మళ్ళీ రిపేర్‌ చేయని పట్టణాల వీధులూ, రాజకీయ నాయకుల తెలివితక్కువ తనం, వారి వివిధ కార్యక్రమాలూ, కష్టాలూ, కన్నీళ్ళూ… ఇవన్నీ ఇలాగే వుంటాయి, మనం భరించక తప్పదు సుమా అన్నట్లు. ఆ సందర్భాలలో హాస్యాన్ని ఆస్వాదించటం మినహా ఏం చేయాలో తోచని పరిస్థితి అది. అందుకే ఆ కార్టూన్లు సందర్భోచితంగా, టైమ్‌ లెస్‌గా ఎంతకాలం గడిచినా రెలెవెంట్‌గా వుంటాయి.
దానికి గల ముఖ్యకారణం కామన్‌ మాన్‌ మనమే కాబట్టి.
నేను… మీరు…. మీరు… మనం అందరం…. ఆ కార్టూన్లన్నీ మన మీదే…
లక్ష్మణ్‌ లేరన్న మాట తెలిశాక పూనె  ఫోన్‌ చేసి కమలా లక్ష్మణ్‌తో మాట్లాడాను.  ‘‘అంతా అయిపోయింది. నేను అలసిపోయాను’’ అన్నారు.
ధైర్యం చెప్పి పెట్టేశాను.
ఎదురుగా వున్నాయి- లక్ష్మణ్‌ పుస్తకాలు
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వారు ఎంతో ప్రేమతో, ఎంతో ఆనందంగా ముద్రించిన లక్ష్మణ్‌ కార్టూన్ల నిధి.
అవి తరతరాలకూ ఆహ్లాదాన్నీ ఆలోచనలనీ కలిగించే గని.
మనం వాటిని చూస్తూ ఆనందిస్తే లక్ష్మణ్‌కి అది నివాళి.
ఎందరో రానున్న యువ కార్టూనిస్టులకి మార్గదర్శకత్వం ఇస్తాయని నా నమ్మకం.
థాంక్‌ యూ ఆర్కే లక్ష్మణ్‌!
 కె. సదాశివరావు
9848034662

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ లో మత సహనాన్ని బోధించిన ఇద్దరు మహిళా మణులు

కాశ్మీర్ లో మత సహనాన్ని బోధించిన ఇద్దరు మహిళా మణులు

1- లల్లేశ్వరి

కాశ్మీరీ కవయిత్రి లల్లేశ్వరి వేదాంత ధోరణిలో కవిత్వం రాసినా పరమత సహనం బోధించి గుర్తింపు పొందింది .14 వ శతాబ్ది మధ్యలో చ్నాష్టియన్ యుగం లో జన్మించింది .ఆకాలం లో కాశ్మీర్ రాజకీయ మత సంఘర్షణలతో అట్టుడికి పోతోంది .కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ కు అయిదు కిలో మీటర్ల దూరం లో ఉన్న పండ్రెంధాన్ శాంపూర్ లో ఆమె తలిదండ్రులు ఉండేవారు .లల్లేశ్వరికి బాల్యం లోనే వివాహం జరిగింది.పామ్పూర్ లోని అత్త వారింటికి కాపురానికి వెళ్ళింది .అక్కడ అత్తగారు విపరీతం గా ఆరళ్ళు పెట్టెది . మనిషికిచ్చేకనీస మర్యాదకూడా ఇవ్వక అత్తగారు కర్కోటకురాలై ఎన్నో ఇబ్బందులు పెట్టింది అవన్నీ సహనం తో భరించింది . తిండి పెట్ట్టకుండా మాడ్చింది కొత్త కోడలిని. .అన్నీ తట్టుకోన్నది ఆ మహా సహన శీలి .ఎన్నడూ అత్తను ఎదిరించలేదు .

ఒక రోజు అత్తగారింట్లో గొప్ప విందు ఏర్పాటు చేశారు .ఊరందరిని భోజనాలకు పిలిచారు .ఈమె నదికి వెళ్లి కడవలతో నీళ్ళు మోసింది . అక్కడ ఆడంగులు ఆమెతో ‘’ఈ రోజున మీ ఇంట్లో గొప్ప విందు కదా .రాత్రికి నీకు కడుపునిండా షడ్ర సోపేత భోజన పదార్ధాలు పెడతారులే ‘’అన్నారు .నిజమే నని నమ్మింది లల్లేశ్వరి’.మా ఇంట్లో ఎంతపెద్ద విందు జరిగినా నాకు పెట్టేది పెద్ద రాయి మాత్రమే ‘’అని జవాబు చెప్పింది .రోజూ ఆమె భోజన పళ్ళెం లో ఒక పెద్ద రాయి పెట్టి ,దానిపై కొద్దిగా బియ్యం ‘’ధాలి ‘’వేసి కప్పి ఏంతో పెద్ద భోజనం పెడుతున్నట్లు అత్తగారు అందరినీ భ్రమింప జేసేది .

ఇక అత్త వారింట్లో తట్టుకొనే ఓపిక లేక ఇల్లు వదిలి సన్యాసిని గా మారింది .గొప్ప సంస్కృత విద్వాంసుడైన ‘’సీదా బాయు ‘’శిష్యురాలైనది ‘గురువు వద్ద యోగా ,ధ్యానం నేర్చుకొని గురువును మించిన శిష్యురాలని పించుకొంది.ఇలా ఉండగా ఇరాక్ నుండి వచ్చిన సయ్యద్ లతో పరిచయం ఏర్పడింది .వారితో సుదీర్ఘం గా మత విషయాలపై చర్చించేది .అన్ని వేదాంత గ్రంధాలలోని మంచి విషయాలను సేకరించి బోధించేది . మతాలన్నీ ఒకే భగ వంతుని చేరే వేరు వేరు మార్గాలు అని నమ్మింది .హిందూ ముస్లిం ల మధ్య భేదాన్ని ఆమె పాటించ లేదు .సమానం గా సమాదరించింది .అన్నిమతాలు ఒకే సత్యాన్ని బోధిస్తాయని తెలియ జెప్పేది .

ఆహార పానీయాల విషయం లో నియమాలు పాటించాలని ఉద్బోధించింది .మితిమీరి ఏదీ చేయరాదని హితవు చెప్పింది .ప్రతి వ్యక్తీ ఆత్మ జ్ఞాన సంపన్నుడు కావాలని అదే అసలైన భగవంతుని కి చెందిన జ్ఞానమని చెప్పేది .మనిషి దుఖాలకు, బాధలకు కారణం అహంకారమే నని దాన్ని వదలించుకొంటే ముక్తి పొందటం తేలిక అని తెలియ జెప్పేది .అతి తిండి అనర్ధ దాయకం అన్నది .నిరాహారమూ మంచిదికాదని సరిపడా దేహ పోషణకోసం తినాలని హితవు చెప్పింది. మనిషి జీవించి ఉండగానే దైవాన్ని గురించి తెలుసుకోలేక పొతే మరణించాక ఎలా సాధ్యం అని ప్రశ్నించింది.ఆమె జీవితం లో ఎన్నో అద్భుత సంఘటనలు జరిగినట్లు కధనాలున్నాయి .అవన్నీ ఆమెపై హిందూ ముస్లిం లకు ఏర్పడిన వీర అభిమానమే కారణం .కాశ్మీర్ ప్రసిద్ధ రుషికవి ,చార్ ఏ –షరీఫ్ కు చెందిన నంద రుషి కి లల్లేశ్వరి అంటే విపరీత మైన గౌరవం, ఆరాధనా భావం ఉన్నాయి .ఆమె కాశ్మీరీ భాషలో రచించిన పదాలు(వాక్స్ ) పాడుతూ తరలాలకు వ్యాప్తి చెందారు కాశ్మీరీ ప్రజలు .ఈనాటికీ ఆమె పాటలు పాడుకొంటూ స్మరిస్తారు .కృతజ్ఞతను ప్రకటిస్తారు . ఆమె ను హిందూ ముస్లిం లు సమానం గా ఆదరించి సోదరభావాన్ని చాటుకొన్నారు .

2. రూపా భవానీ
1624లో సంస్కృత మహా పండితుడు మాధవ జూదార్ కు రూపా భవానీ కుమార్తె .పండిట్జీ కుటుంబం కాశ్మీర్ లో సఫా కదార్ దగ్గరున్న మొహల్లా ఖానాఖి సోక్తలో నివాసం ఉండేది .తండ్రి నిత్యం హరి పర్బాత్ సేవలో శారికాదేవి పూజలో ఉండేవాడు .ఆ దేవతానుగ్రహం లో రూప జన్మించటం తో ఆమెలో దైవీ లక్షణాలు చిన్నప్పటి నుండే కనిపించేవి .యుక్త వయసులో ఆమెను సప్రూ కుటుంబ యువకునికిచ్చివివాహం చేశారు .పెళ్లి ఆమె పాలిటి వరం కాకుండా శాపమే అయింది అత్తా ,భర్తా ఆమెను విపరీతం గా బాధ పెట్టేవారు .ఆమెలో ఉన్న ఆధ్యాత్మిక భావాలను వారిద్దరూ అర్ధం చేసుకోలేక పోయారు .ఈ సంసారలంపటం లో కూరుకు పోవటం ఇష్టం లేని రూప బయటికి వచ్చి సన్యాసినిగా మారిపోయింది .

వేదాంతాన్ని, యోగ శాస్త్రాన్ని మిగిలిన ఆధ్యాత్మ గ్రంధాలన్నీ చదివి విజ్ఞానం పెంచుకొన్నది .ఆమె గురువు తండ్రి అవటం బాగా కలిసి వచ్చింది .కాశ్మీర్ లోయ అంతటా పర్య తీస్తూ సాధువులతో ,సన్యాసులతో ,దర్వేష్ లతో ఆధ్యాత్మిక చర్చలు చేసేది .నిరంతర సాధన వల్లఆమెలో అలౌకిక దివ్య శక్తులెన్నో ఏర్పడ్డాయి .వాటిని సద్వినియోగంచేసింది అందులకు దృష్టిని ప్రసాదించింది .మనిగాం గ్రామం లో అగ్ని ప్రమాద౦ సంభవిస్తే కంటి చూపు తో ఆర్పి వేసింది ఈ నాటి కాశ్మీర్ రాజ భవన్ వద్ద ఉన్న అద్భుత ప్రక్రుతి సౌందర్యం మధ్య వాస్కూరా లోను ,చాష్మా సాహిలోను ధ్యానం లో కాలం గడిపింది .అక్కడికి చేరే భక్త జనాలకు ఆధ్యాత్మిక ప్రబోధం చేసేది .దీనితో హిందువులే కాక ముస్లిములు కూడా రూపా భవానీ కి భక్తులైపోయారు .కులమత భేదాలు లేకుండా అందరిని కన్న పిల్లలలాగా ఆదరించి వారి యోగ క్షేమాలను చూసేది .ఆమెను శారికా దేవి అవతారం గా కాశ్మీరీ ప్రజలు భావించి ఆరాధించేవారు .ఈ ప్రపంచానికి ఏకైక ప్రభువు భగవంతుడే నని నమ్మి అందరికి ఆ విషయాన్ని ప్రబోధించింది .

రూపా భవాని కి సంస్కృత ,పర్షియన్ భాషలలో అపార పాండిత్యం ఉన్నా కాశ్మీరీ భాషలోనే సరళం గా రాసేది ప్రసంగించేది . .ఆ నాటి ముస్లిం ఫకీర్ షా షాదిక్ కలందార్ కు రూపా భవానీ అంటే విపరీత మైన గౌరవం, భక్తీ ఉండేవి .ఆయనే ఆమె జీవిత చరిత్రను ,మరణం జరిగిన తేదీలను రాసి భద్రపరచాడు .మాఘమాసం కృష్ణ పక్ష సప్తమి నాడు-జనవరి నెలలో రూపా భవానీ భౌతిక శరీరాన్ని97 ఏడేళ్ళ వయసు లో విసర్జించి పరమాత్మ సన్నిధానం చేరింది .ఆమె మరణించిన సప్తమి తిధిని ఆనాటి నుండి ఈ నాటివరకు సుమారు 370 ఏళ్ళుగా ‘’సాహిబ్ సప్తమి ‘’పేరిట సంస్మరణ దినోత్సవం జరుపుతూ ఉండటం విశేషం .

రూపా భవానీ పేరిట వాస్కూరా ,మనిగాం,సఫా కదల్ మొదలైన చోట్ల ఆశ్రమాలను నిర్మించారు .’’రూపా భవనీఅలక్ సాహిబా ట్రస్ట్ ‘’ను ఏర్పరచి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు .ఈ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఆమె వర్ధంతిని మహా వైభవం గాయజ్ఞం చేసి నిర్వహిస్తున్నారు .ముస్లిములందరూ పూలు ,పళ్ళు పాలు స్వీట్లు ఆ రోజున భక్తులకు అమ్మి తమ వంతు భక్తిని ప్రకటించుకొంటారు. కాని ఉగ్రవాదుల దాడులతో అల్లాడిపోతున్న కాశ్మీర్ లో ఈ ఉత్సవం 1989-90నుండి ప్రజాక్షేమ దృష్ట్యా రద్దు చేశారు .ఉగ్రవాదుల దాడులకు అనేక ఇబ్బందులకు లోనైనా కాశ్మీరీ పండిట్స్ 1990 ఫిబ్రవరి –మార్చి నెలలలో కాశ్మీర్ నుండి భారీగా జమ్మూ కు వలసపోయారు .ఆమె జ్ఞాపకార్ధం జమ్మూ లో తాలాబ్ తిల్లో అనే ప్రదేశం లో రూపా భవానీ ఆశ్రమం నిర్మించుకొని పూజలు ఉత్సవాలు చేస్తున్నారు .ఇక్కడే ఆమె వర్ధంతిని యజ్న౦ తో నిర్వహిస్తున్నారు .వేలాది కాశ్మీరీ పండిట్ లు ఈ కార్యక్రమం లోపాల్గొని రూపా భవానీ ని సంస్మరిస్తారు .

కాశ్మీర్ లో హిందూ ముస్లిం సఖ్యత కోసం లల్లేశ్వరి ,రూపా భవానీ చేసిన సేవలు చిరస్మరణీయం ఆదర్శ ప్రాయం .నేటి కల్లోల కాశ్మీర్ కు వారిద్దరి స్మరణ .మార్గ దర్శనం చేస్తాయి .

– గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

నిజం పత్రికలో చలపాక ”జీవితం”రచన పై సమీక్ష ,పురస్కారం -దర్శనీయ దైవ క్షేత్రాల

29-1-15 నేటి నిజం పత్రికలో చలపాక ”జీవితం”రచన పై సమీక్ష ,పురస్కారం -దర్శనీయ దైవ క్షేత్రాలnetinijam 1 001 netinijam 2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్యనాటకం బండర్లోనే పుట్టింది

Untitled

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వీరమ్మ తల్లి ఊరేగింపు వైభోగం

Untitled

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గ్రాండ్‌ సలామ్‌ :@19

గ్రాండ్‌ సలామ్‌ :@19

ప్రైజ్‌ మనీ రూ.14 .9 కోట్లు
సెరెనాదే ఆసే్ట్రలియన్‌ ఓపెన్‌
పోరాడి ఓడిన షరపోవా

అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌ విశ్వ వేదికపై మరోసారి జూలువిదిల్చింది. వయసు పెరుగుతున్నా..! యువ రాకెట్లు దూసుకొస్తున్నా…! తన ముందు వారంతా బలాదూర్‌ అని చాటి చెప్పింది. ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో వరుసగా ఆరోసారి చాంపియన్‌గా నిలిచి కెరీర్‌లో 19వ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. స్టెఫీ గ్రాఫ్‌ (22) రికార్డుకు మరో మూడు అడుగుల దూరంలో నిలిచింది.
మెల్‌బోర్న్‌: ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌, టాప్‌ సీడ్‌ సెరెనా విలియమ్స్‌ విజేతగా నిలిచింది. శనివారమిక్కడ జరిగిన ఫైనల్లో సెరెనా 6-3, 7-6(7/5)తో రెండో ర్యాంకర్‌, రెండో సీడ్‌ షరపోవాపై చెమటోడ్చి నెగ్గింది. ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన ఆరుసార్లూ టైటిల్‌ ఆమెనే వరించడం మరో విశేషం. అదే విధంగా షరపోవాను వరుసగా 16వ సారి ఓడించి ఆధిక్యాన్ని చాటుకుంది. ఓపెన్‌ ఎరాలో అత్యధిక వయసులో ఈ టైటిల్‌ నెగ్గిన మహిళగా 33 ఏళ్ల సెరెనా రికార్డులెక్కింది. సెరెనా కెరీర్‌లో ఇది 23వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. దాదాపు దశాబ్దం తర్వాత ఇద్దరు టాప్‌ సీడ్‌ క్రీడాకారిణులు తలపడ్డ తుదిపోరులో సెరెనా తొలిసెట్‌ను సులభంగా నెగ్గింది. అయితే రెండో సెట్‌లో అద్భుతంగా పుంజుకున్న షరపోవా.. అమెరికా స్టార్‌కు గట్టి పోటీనిచ్చింది. కానీ, టై బ్రేకర్‌లో తన అనుభవంతో పాటు బలాన్ని రంగరించి మరియాను మరోసారి మట్టికరిపించింది. 203 కి.మీ. వేగంతో సర్వీస్‌ చేసిన ఆమె 18 ఏస్‌లు సంధించి రష్యా సుందరికి చెక్‌ పెట్టింది.
జలుబు బాధిస్తున్నా…: వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో సెరెనా జలుబుతో బాధ పడుతున్నప్పటికీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలిసెట్‌లో సెరెనా 3-2తో ఉన్న దశలో వర్షం రావడంతో 13 నిమిషాల పాటు మ్యాచ్‌ను నిలిపివేశారు. కొద్ది అలసటతో కోర్టును వీడిన సెరెనా బ్రేక్‌ సమయంలో వాంతి చేసుకుంది. వెంటనే వైద్యం చేయించుకుంది. ఇక విరామం తర్వాత సెరెనా అద్భుత ఏస్‌తో మ్యాచ్‌ను కొనసాగించింది. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గింది. అయితే సెట్‌ పాయింట్‌ వద్ద నిలిచిన సమయంలో ఆమె సర్వీస్‌ కోల్పోయింది. కానీ, మూడో అవకాశంలో ఆమె సెట్‌ గెలుచుకుని శుభారంభం చేసింది. రెండో సెట్‌లో షరపోవా పోరాడినప్పటికీ లాభం లేక పోయింది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల దృష్ట్యా 31-1-15శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య వర్గ సమావేశం దృశ్యాలు 

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల దృష్ట్యా 31-1-15శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్య వర్గ సమావేశం దృశ్యాలు

 

http://tnilive.com/?p=3192

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ రోజు సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కృష్ణా జిల్లా కార్య  లో ఫిబ్రవరి 21,22 శని,ఆదివారాలలో  జరిగేమూడవ  ప్రపంచ  తెలుగు రచయితల మహాసభల వేదికను క్షేత్రయ్య కళాక్షేత్రం నుండి బెంజ్ సర్కిల్ కు దగ్గరలో ఉన్న ”కృష్ణ వేణి టేలెంట్ స్కూల్ ”కు మార్చబడిందని తెలియ జేశారు మీగిలిన కార్యక్రమాలన్నీ  ఇది వరకు తెలియ బరచినట్లుగానే  జరుగుతాయి .

కార్య వర్గ సమావేశ ఫోటోలు గూగుల్ ప్లస్ లో పెట్టాను చూడండి -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

కెసిఅర్ సార్ స్టైలే వేరు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

థౌజండ్ వాలా బ్రహ్మానందం 30 యియర్స్ ఇన్ ఇండస్ట్రీ

థౌజండ్ వాలా బ్రహ్మానందం 30 యియర్స్ ఇన్ ఇండస్ట్రీ

 

 


థౌజండ్‌వాలా 30 ఇయర్స్‌ ఇండసీ్ట్ర

నేడు బ్రహ్మానందం పుట్టినరోజు
సినిమాల ద్వారా మీరు ప్రేక్షకుల్ని నవ్విస్తుంటారు? మరి, మిమ్మల్ని ఎక్కువగా ఎవరు నవ్విస్తుంటారు?
మా ఊళ్లో నాకు బాల్య స్నేహితులు ముగ్గురున్నారు. గంగారపు వెంకట్రావు, జింకా రామారావు, ఎం.పుల్లారెడ్డి అని. వీళ్లు ముగ్గురు హాస్యప్రియులు. మాటలతో, చేష్టలతో నవ్విస్తుంటారు. ఫోన్‌లలోనే సెటైర్లు వేస్తూ నాలో జోష్‌ నింపుతుంటారు. ఇక, నటుల్లో అయితే – రాజేంద్రప్రసాద్‌, కృష్ణభగవాన్‌, ఎంఎస్‌ నారాయణ, అలీ, వేణుమాధవ్‌, గుండు హనుమంతరావు వేసే జోకులకు నవ్వొస్తుంటుంది. వీళ్లలో ఏ ఒక్కరు షూటింగ్‌లో కలిసినా నవ్వులు పేలుతుంటాయి.
బ్రహ్మానందం వాడుకున్నోళ్లకు వాడుకున్నంత! ఆయనలో ఎన్ని వేరియేషన్లు ఉన్నాయో అన్నీ వాడుకునే ప్రయత్నం చేశారు తెలుగు సినీ దర్శకులు. వాటిలో పేలిన సినిమాలే ఎక్కువ! ఒక దశ వచ్చేసరికి – హీరో పక్కన బ్రహ్మానందం కాదు, బ్రహ్మానందం పక్కన హీరోలు అనే స్థాయికి వెళ్లాడీ కమెడియన్‌. ఈ రోజు ఆయన పుట్టినరోజు. నేటికి సరిగ్గా సినిమాల్లో కొచ్చి 30 ఏళ్లు అయ్యింది. 1000 సినిమాల మైలు రాయినీ దాటారాయన. ఈ సందర్భంగా.. ఇంతవరకు బ్రహ్మానందం గురించి తెలియని వేరియేషన్లను పట్టుకునే ప్రయత్నం చేసింది ‘నవ్య’. అప్పుడు థర్టీ ఇయర్స్‌ ఇండసీ్ట్రలో థౌజండ్‌వాలా పేల్చిన కబుర్లే ఇవి..
రోటీన్‌ అవ్వకూడదు. లేకపోతే అన్నేళ్లు సినీజీవితం ఉండదు? మీరు ఎలా మేనేజ్‌ చేస్తున్నారు?
అక్షరసత్యం ఏంటంటే – అలాంటి పాత్రల్ని సృష్టించడం బ్రహ్మానందం గొప్పదనం కాదు, రచయితల గొప్పదనం. అన్నిటికంటే ముఖ్యంగా – కెమెరా ముందుకు వస్తూనే.. నీకు ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి? బయట ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? వంటివన్నీ మరిచిపోయి నటించగలగాలి. పాత్రలో లీనమవ్వాలి. వీటన్నిటికీ భగవంతుడి దయ ఉండాలి. సిన్సియర్లీ ఐ బిలీవ్‌ దట్‌. మనం చేయలేని చాలా విషయాలు మన చేత చేయిస్తాడు భగవంతుడు. సహజంగా సినిమాల్లో ఒక కమెడియన్‌ జీవితకాలం ఎంత ఉంటుంది? అయిదేళ్లు, మహా అయితే పదేళ్లు? 30 ఏళ్లు దాటి వెయ్యి సినిమాలకు పైగా చేశానంటే ఏమనుకోవాలి? మొదట్లో నేను కూడా అనుకునేవాణ్ణి. ‘నేను చాలా టాలెంటెడ్‌. లేకపోతే ఇన్ని అవకాశాలు రావు కదా’ని! కాని ఒక దశకు వచ్చిన తరువాత.. మనకు తెలిసేది ఏంటంటే ‘మనది కాదు ఇది. మనకు తెలియనిది ఏదో ఉంది. అదే మన చేత ఇవన్నీ చేయిస్తోంది’ అని అర్థం అవుతుంది. అది ఆధ్యాత్మికభావన అనండి మరొకటి అనండి. తెలుగు సినీ పరిశ్రమకు కూడా నేనిక్కడ ధన్యావాదాలు చెప్పుకోవడం ధర్మం. లీజర్‌ టైమ్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తుంటారు..?
పుస్తకాలు చదువుతుంటాను. టీవీ చూస్తాను. ఒకప్పుడు కొమ్మూరి, ముప్పాళ్ల రంగనాయకమ్మ నవలలు ఎక్కువగా చదివేవాణ్ణి. ఈమధ్య రజనీష్‌, రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, జిడ్డుకృష్ణమూర్తి పుస్తకాలు చదువుతుంటాను. అన్ని చదివిన తరువాత తెలిసింది ఏంటంటే – పుస్తకంలో ఏమీ లేదు. ఉన్నదంతా మస్తకంలోనే అని.
వాళ్లు పేల్చే ఆ జోకులేవో మాక్కూడా చెప్పొచ్చు కదా?
ఉన్నఫలంగా జోక్‌ చేయడంలో కృష్ణభగవాన్‌ దిట్ట. మాట తడుముకోకుండా టకీమని అలా ఒక బిట్‌ విసురుతాడు. దాన్ని అర్థం చేసుకునేలోపే మనకు తెలియకుండానే నవ్వొస్తుంది. షూటింగ్‌లో ఒక రోజు కృష్ణభగవాన్‌ చాలా డల్‌గా కనిపిస్తే ‘‘ఏంటీ చాలా డల్‌గా ఉన్నావ్‌?’’ అడిగాను. ‘‘రాత్రి డబ్బు పోయిందండీ’’ అన్నాడు. ‘‘ఎందులో పోయింది’’ అన్నాను. ‘‘ఎందులో పోయినా పోయినట్లే కదండీ’’ అన్నాడు మళ్లీ. ‘‘అన్ని చోట్ల వెతికారా’’ అన్నాను. ‘‘మా భార్యను కూడా అడిగాను. షర్టు జేబు కూడా చూసుకున్నాను. కనబడలేదు’’ అంటూ చెప్పడం ఆపాడు. ‘‘మరి, ప్యాంటు జేబులో చూసుకున్నారా?’’ అన్నాను నేను. ‘‘చూల్లేదండీ’’ అన్నాడు. ‘‘మరి అక్కడ కూడా చూసుకోకపోయారా?’’అని గుర్తు చేశాను. ‘‘అక్కడ కూడా లేకపోతే టెన్షన్‌ ఎక్కువై మరీ బాధపడాల్సి వస్తుందని.. చూసుకోలేదు సార్‌..’’ అన్నాడు. అలా అతని మాటలు స్పాంటేనియ్‌సగా లాఫ్టర్‌ను క్రియేట్‌ చేస్తుంటాయి.
ఎంఎస్‌ నారాయణ, వేణుమాధవ్‌లు కలిసినప్పుడు కూడా ఇలాంటి నవ్వులే పూస్తుంటాయట కదా?
ఎంఎస్‌ మాట్లాడుతుంటే మ్యాజిక్‌ డాల్‌ మిమిక్రీ చేస్తున్నట్లే అనిపించేది. అతను విద్యాధికుడు కాబట్టి.. ఆ జోకుల్లో హాస్యంతో పాటు ఆలోచింపజేసే బిట్టు మిళితమై ఉండేది. అది ‘డబ్బు భలే జబ్బు’లో షూటింగ్‌ సమయం. ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడు ఎంఎస్‌ ‘‘సార్‌, చాలా ధైర్యం చేసి చెప్పాల్సొస్తోంది. మీరు ఏమీ అనుకోరు కదా?’’ అన్నాడు. ‘‘అనుకునేదేముంది? చెప్పవయ్యా?’’ అన్నాను నేను. అతనేదో పెద్ద మ్యాటరేదో చెబుతాడనుకుని తెగ ఫీలయ్యాను. ఆ వెంటనే ‘‘నా కాలు పొరపాటున మీ కాలికింద పడింది. తీసుకోవచ్చా సార్‌’’ అన్నాడు. ఆ మాట విన్న వెంటనే భళ్లున నవ్వొచ్చింది. ఇక, వేణుమాధవ్‌ చెప్పే జోకులు ఎలా ఉంటాయంటే.. అతని టేకాఫే ఏదో బద్దలైపోయేలా అనిపిస్తుంది. ‘భజంత్రీలు’ షూటింగ్‌ జరుగుతోందప్పుడు. వేణుమాధవ్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడేమో సమయం మించిపోయింది. షూటింగ్‌కు రాలేదు. ఆ చిత్ర దర్శకుడు ఎం.ఎస్‌. నారాయణకు కోపమొచ్చి ‘‘ఫోన్‌ చేయండి. వాడికి ఇష్టమొచ్చినప్పుడు షూటింగ్‌కు రావడం అలవాటైపోయింది. అసలు ఈ రోజు వస్తాడో రాడో కనుక్కోండి’’ అని అరుస్తున్నాడు. అతని కోపం చూసి ‘‘ఉండండి నేనే వేణుకు ఫోన్‌ చేస్తాను’’ అని ఫోన్‌ కొట్టాను. ఫోన్‌ ఎత్తిన వేణు ‘‘మీకేమయ్యా మీరు ఇష్టమొచ్చినప్పుడు రమ్మంటారు. ఆ మాత్రం వెయిట్‌ చెయ్యలేరా..? నా ప్రియమైన దర్శకుడు ఎంఎస్‌ నారాయణ నాటుకోడి మాంసం కావాలని అడిగాడు. పొద్దున్నే కోడిని పట్టుకుందామనుకుంటే.. అది నాగార్జునసాగర్‌ జంక్షన్‌ వరకు పరుగో పరుగు. ఆడికెళ్లి దాన్ని పట్టుకుని కూర వండుకుని తెస్తుంటే లేటు కాదామరి?’’ అంటూ అరిచినంత పనిచేశాడు. అంటే వాడప్పుడు నాగార్జునసాగర్‌ జంక్షన్‌ వద్ద ఉన్నాడన్నమాట. ఆ మాట చెబితే ఎంఎ్‌సకు ఇంకెంత కోపం వస్తుందో తల్చుకుని నవ్వొచ్చింది నాకు.
వార్తల్లోని ప్రముఖుల ఫోటోలతో మీ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి.. ఫేస్‌బుక్‌, వాట్స్‌పలలో పెడుతుంటారు. వాటిని చూసి నవ్వుకుంటుంటారా?
నాకు ఇంటర్‌నెట్‌ చూసే అలవాటు లేదు. నా ఫోను కూడా స్మార్ట్‌ఫోను కాదు. ఇదిగో మీరే చూడండి. పాత శ్యామ్‌సంగ్‌ ఫోను. మాట్లాడేందుకు, వినేందుకు తప్ప దేనికీ పనికిరాదు ఇది. నెట్‌లో నా మార్ఫింగ్‌ ఫోటోలను అప్పుడప్పుడు మా పిల్లలు నాకు చూపిస్తుంటారు. ఒబామా, గఢాఫీ, మోడీల ముఖాల్లో నా ముఖం పెట్టి చక్కగా గ్రాఫిక్స్‌ చేసిన ఆ ఫోటోలను చూస్తే నాకే నవ్వొస్తుంది. ఫేస్‌బుక్‌లో వాటికి లైక్స్‌ కూడా ఎక్కువేనట! మా వాళ్లు చెబితే తెలుస్తుంది.
సినిమాల్లో బ్రహ్మానందం అందరికీ తెలుసు. మరి, ఇంట్లో బ్రహ్మానందం ఎలా ఉంటారు?
ఇంట్లో ప్రత్యేకంగా జోకులు వేసుకునే సందర్భాలు తక్కువ. అదృష్టవశాత్తూ ఇంట్లో వాళ్లందరికీ సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువే! సరదాగా మాట్లాడుకునే మాటలను వాళ్లందరు పాజిటివ్‌గానే తీసుకుంటారు. నవ్వుతుంటారు. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర నేనేమో షూటింగ్‌ ముచ్చట్లు చెబుతుంటాను. బయట జరిగే విశేషాల్ని వాళ్లు చెబుతుంటారు. నా నటన మీద పాజిటివ్‌ కామెంట్లే చేస్తుంటారు కాని.. నెగిటివ్‌ కామెంట్స్‌ చేయరు. దేన్నయినా సానుకూల దృక్ఫథంతో చూసే వాతావరణమే ఇంట్లో ఉంటుంది. కొన్ని సినిమాల్లో నేను ఓవర్‌ యాక్షన్‌ చేస్తే – అది నేను చేశానా..? సినిమా వాళ్లు చేయించారా అన్న సంగతి వాళ్లకు బాగా తెలుసు. సినిమాల్లో నవ్వులు పండించడం అనేది కేవలం కమెడియన్‌ ఒక్కడి మీదే ఆధారపడి ఉండదు.
అక్కినేని నాగేశ్వరరావు మొదలు మొన్నటి ఎంఎస్‌ నారాయణ వరకు ఎంతోమంది పాతతరం నటులు వరుసగా చనిపోతున్నారు. వీళ్లందరితో సాన్నిహిత్యమున్న మీకు ఏమనిపిస్తోంది? జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఏదో ఒక రోజు మరణం దగ్గర ఆగిపోవాల్సిందేనన్న కఠోర సత్యాన్ని మీరెట్లా జీర్ణించుకుంటారు?
అందరూ చెప్పినట్లు చెప్పాలంటే ‘‘వాళ్లందరు పోవడం చాలా బాధగా ఉంది. నిజంగా ఏమిటో ఈ చలనచిత్ర పరిశ్రమకు ఏదో పట్టింది. భవిష్యత్తు ఏమైపోతుందో ఏమో’’ అంటూ దీర్ఘం తీసి చెప్పాల్సొస్తుంది. ఎవరికైనా మరణం అనేది చాలా సహజమైనది. పోవడం ఉండటం అనేది మన చేతుల్లో లేనిది. అయితే ఈవాళ మనందరి మధ్య మెలిగిన మనిషి రేపు శాశ్వతంగా కనిపించకపోవడం నిజంగా బాధాకరమే! అయితే మనుషులకు మరణం అనేది శాపం అనుకుంటారు. నేను మాత్రం వరం అనే అంటాను. ఎందుకంటే ఏదో ఒక టైమ్‌లో అందర్నీ వదిలిపెట్టి వెళ్లిపోకపోతే ఈ లోకం ఏమవుతుందో ఒకసారి ఊహించండి? ఎప్పుడో ఒకసారి జీవితం బోర్‌కొట్టి వెళ్లిపోవడానికి ఛాన్స్‌ లేకపోతే?! గాడ్‌ హ్యాజ్‌ గివెన్‌ దట్‌ ఛాన్స్‌! ప్రపంచంలో విచిత్రమైన విషయం – మానవుడు అన్నిట్లో ముందుండాలని కోరుకుంటాడు ఒక్క మరణానికి తప్ప! మరణానికి మాత్రం తరువాత వస్తాను. తరువాత వస్తాను అంటుంటాడు. జీవించింది చాలు మరణానికి నేనిక సిద్ధం అని ఏ ఒక్కరు అనరు. ఇదేమీ ఫిలాసపీ కాదు. జీవనసత్యం. ఈ రెండు మూడు నెలల్లో అక్కినేని, శ్రీహరి, ధర్మవరపు, ఏవీఎస్‌, ఆహుతిప్రసాద్‌, ఎంఎస్‌ వంటి వారు మనకు దూరమవ్వడం.. పరిశ్రమకు నిజంగానే తీరని లోటు. దాన్నెవరూ కాదనలేము.
తరతరానికి వేషభాషలు, జీవనశైలి, ఆలోచనలు, అభిరుచులు మారడం సహజం. ఆ మార్పుకు తగ్గట్టు ఆయా పాత్రల్లో మీరు సులభంగా ఒదిగిపోతారు. ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హావభావాలను కూడా అచ్చుగుద్దినట్లు పండించగలరు. ఎలా సాధ్యం అవుతోంది?
నిత్య జీవనగమనంలో మార్పును పసిగట్టే మనస్తత్వం నటుడికి చాలా అవసరం. అది ఏ శిక్షణ సంస్థలోనో శిక్షణను ఇచ్చే అంశం కాదు. కొత్త కొత్త సమూహాలను పరిశీలించడానికని చెప్పి ప్రత్యేకించి సమయం కేటాయించను. బయటికి వెళుతున్నప్పుడే మనుషుల్ని, వారి మనస్తత్వాల్ని, భావోద్వేగాల్ని పరిశీలిస్తుంటాను అంతే! నాకు తాగుడు అలవాటు లేదు. కాని తాగుడు యాక్టింగ్‌ చేస్తాను. దీనికి ఓ ఆ ఇంగ్లీషు పుస్తకాలు చదివాను.. ఈ పుస్తకాలు చదివాను. బార్‌లకు, పబ్బులకు వెళ్లి తెగ పరిశీలించాను అని చెప్పడం హాస్యాస్పదం. ఎవరో ఒక నటుడు అన్నాడట ‘‘భారతంలో శకుని పాత్రను చేయడానికి నేను చాలా పుస్తకాలు చదివాను’’ అని. ఆ మాటలు విన్న పక్క వ్యక్తి ‘‘అన్ని పుస్తకాలు చదవడం ఎందుకు? భారతం ఒక్కటే చదివితే సరిపోతుంది కదా’’ అన్నాడట.
మీరు ఇప్పటికే రకరకాల పాత్రలను చేశారు. మీరింకా వేయాల్సిన డ్రీమ్‌రోల్స్‌ ఏవైనా ఉన్నాయా?
చాలానే ఉన్నాయి. అందులో ఒకటి – రోడ్ల మీద తిరిగే పిచ్చోని పాత్ర ఒకటి. ఆ సంగతి అలా ఉంచితే – అసలు డ్రీమ్‌రోల్స్‌ అనే ముందు నేనెన్ని పాత్రలను చేశానని చెప్పుకోవాలి..? నేను చేసింది చాలా చాలా తక్కువనే చెప్పుకోవాలి. నేను చేసింది ఆఫా్ట్రల్‌ థౌజండ్‌ ఫిల్మ్స్‌. అందులోను రిపిటీషన్‌ ఉన్న పాత్రల్ని తీసేస్తే మిగిలేవి కొన్నే! మన దేశంలో నూటా ఇరవై కోట్లకు పైగానే జనాభా ఉంది. ఒక మనిషి ఉన్నట్లు మరొక మనిషి ఉండడు. నా దృష్టిలో ప్రతి మనిషీ ఒక క్యారెక్టరే. ఈ లెక్కన నేను ఇంకా చేయాల్సిన క్యారెక్టర్లు ఎన్ని ఉన్నాయో మీరే లెక్క వేసుకోండి. అందుకని నేను చేసింది కొంతే! అభిమానాలు, పొగడ్తలను చూసి మంచుదుప్పటి కప్పుకోలేను. బ్రహ్మానందం లేకపోతే సినిమానే లేదు అనే టాక్‌ను కూడా నేను ఒప్పుకోను. సర్క్‌సలో ఫోకస్‌ లైటు లాంటిది నటుడి జీవితం. సర్క్‌సకు వచ్చిన వీక్షకుల మీదికి అలా ఆ లైటును తిప్పుతుంటారు. ఒకరి మీద కాసేపు, మరొకరి మీద మరికొంతసేపు పడుతుంది. నా మీద పదినిమిషాలు పడింది. అంతే!
సినిమా వాళ్లకు సెంటిమెంట్లు, స్వర్గధామాలు ఎక్కువ. మీకు ఇష్టమైన డెస్టినేషన్స్‌ ఏమైనా ఉన్నాయా?
నాకు అలాంటివేవీ లేవు. నా ఆలోచనల తీరు ఎలా ఉంటుందంటే – మా నాన్న నిరుపేద. మా బతుకులంతా దిగువ మధ్యతరగతివి. పండగలు మా ఊళ్లోకి వస్తాయి కాని మా ఇంటికి రావు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాణ్ణి కనక.. నాకే ఆశలు లేవు. ఇప్పుడు ఆర్థికంగా అన్నీ సమకూరి ఉండవచ్చు కాని.. ఒక జీవనశైలికి అలవాటు పడిపోయిన తరువాత.. మళ్లీ ఖరీదైన ఆలోచనలు రావు. నాకు పేదరికం తెలుసు, ఆకలి తెలుసు, బతుకు భయం తెలుసు. ఈ పరిధి దాటి లగ్జరీ వైపు వెళ్లలేను. విలాసవంతమైన జీవితంలో ఉన్న మజాను తెలుసుకోవడానికి ఒక బేస్‌మెంట్‌ అంటూ ఉండాలి. అది నాకు లేదు. మొన్నామధ్య ఒక డాక్టర్‌ వద్దకు వెళితే ‘‘చిన్నప్పటి నుంచి మీకుగాని, మీ నాన్నగారికిగాని స్వీట్లు తినే అలవాటుందా?’’ అని అడిగారు. ‘‘స్వీట్లు కాదు కదా. మంచి భోజనం అడిగితేనే చితక్కొట్టేవాళ్లు. చిన్నప్పుడు అవేవీ తెలియవు నాకు’ అన్నాను. అటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాణ్ణి కనక ఇలాగే ఉండిపోయాను. అయితే ఆర్టిస్ట్‌ కావడం వల్ల ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు తిరిగే అవకాశం ఆయాచితంగా వచ్చింది నాకు. అది నా అదృష్టం.
పూజ ఎక్కువగా చేస్తుంటారట?
నేను ఎంతో మంది దేవుళ్లను నమ్మను. ఒకే ఒక్క దేవున్ని కొలుస్తాను. ఆ దేవునికి రూపం లేదు. ఇదివరకు మన పెద్దలు చెప్పినట్లు ‘దేవుడంటే ఒకరే – అతను నిర్వికారుడు, నిరంజనుడు’ ఈ మధ్య చాలామంది బుధవారం ఒక దేవుడని, శుక్రవారం ఇంకో దేవుడని.. గురువారం అది తినను. మంగళవారం ఇది తాగనని.. భక్తిని చాటుకుంటుంటారు. వాళ్లను చూస్తే నవ్వొస్తుంది. పాపం! ఆఖరికి దేవుణ్ణి కూడా కిచెన్‌ వరకు తీసుకొచ్చారు.
ఇంకా ఎంత కాలం నటిస్తారు? ప్రేక్షకులకు బోర్‌ కొట్టలేదు కాని.. మీకు మీరు ఎప్పుడైనా బోర్‌ కొట్టారా?
బ్రహ్మానందం కావాలి అనే డిమాండ్‌ ఉన్నంత వరకు నటిస్తుంటాను. ఇక నాకు నటన మీద ఎప్పుడూ బోర్‌ కొట్టదు. అదే నాకు జీవితాన్ని ఇచ్చింది. ఆనందాన్ని.. బ్రహ్మానందాన్ని ఇచ్చింది.
ఇంటర్వ్యూ : నవ్య డెస్క్‌
సహకారం : చిత్రజ్యోతి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కస్టాలు -కన్నీళ్లు

కస్టాలు -కన్నీళ్లు

బాధలు -వ్యధలు 
ఆప్యాయతలు  -అనురాగాలు 
స్నేహాలు -చుట్టరికాలు 
జీతం- నాతం 
కధలు -కవిత్వాలు 
బాధ్యతలు -బరువులు 
ఆకలీ -దప్పులు 
గుండె చప్పుళ్ళు-గుండె కోతలు
గోదారీ జలాలు -మూసీ తీరాలు 
నచ్చటా లు -మెచ్చటాలు  
ఆత్మ గౌరవాలు  -అహంభావం కాని ఆత్మాభిమానాలు  
ఆపేక్షలు – ఆత్మీయతలు 
చిత్రాలు -జీవిత విచిత్రాలు 
ఊహించని గౌరవాలు -ఊరించిన మెచ్చికోళ్ళు  
ప్రైజులు -పారితోషికాలు 
కుందుర్తి ,శ్రీవాత్సవలు -శివారెడ్డి  గోపాల చక్రవర్తులు    
మేనమామలు -పెద నాన్నలు 
ఊపిరి తిత్తులు తొలిచే పురుగులు -ఊరడించే సింగులు 
క్రిష్ణాపత్రికలు -సమాచార శాఖలూ 
అహంభావం తో కొట్టిన దెబ్బలు -మర్యాదగా తిరస్కరించిన తీరులూ 
ఉత్తరాలు -పరిచయాలు 
ఉత్తర పరిచయం తో -చేరువైన ఇల్లాలు 
ఇవన్నీ పడుగూ -పేకల్లా  
అల్లిన మీ జీవితం -ఒక చిక్కని గీతం 
వచన సంగీతం -కవిత్వ వచనం 
ప్రతి పదం లోపలి పొరలు చీల్చుకోచ్చినదే 
ప్రతిభావం నవ పరిమళ భరితమే 
చిత్రానికి సంగీతం అద్ది -కవిత్వానికి చిత్ర సొగసులు కూర్చి 
మీ జీవితాన్ని -జీవన గమనాన్ని 
ఆవిష్కరించిన తీరు -అమోఘం అత్యద్భుతం 
వీర్రాజు గారూ -అక్ష రాలను శోభావిలసిత శిల్పాలుగా 
చెక్కిన మీ ఓర్పూ -నేర్పూ నాన్యతో దర్శనం అనిపించింది 
అదొక ప్రవాహం -సుడిగుండం 
శక్తి జలపాతం -సంగమ క్షేత్రం 
భేషజం లేని -నిరాడంబర ఉత్కృష్ట  గమనం 
నిసర్గ రమణీ యానికి  నిలువెత్తు  దర్పణ మే  
శ్రీ వీర్రాజుదంపతులకు  నమస్కారాలు  మూడు నెలల క్రితం పరిచయమైనా మీరు ఆప్యాయం గా నాకు అందజేసిన ”పడుగు పెకల మధ్య జీవితం ” పుస్తకం నిన్నా ఇవాళ చదివే అవకాశం కలిగింది దాదాపుగా నాన్ స్టాప్ గా చదివా  ముగ్దుడిని  చేసింది . ఉండ బట్ట  లేక చేతకాని కవిత్వం షో కులకు  పోయి పైన ఏదో గిలికాను . నిజం చెప్పాలంటే మాటలు చాలవు చదివి అనుభవించాల్సిందే
ఇద్దరి ఆరోగ్యాలు బాగా ఉన్నాయని తలుస్తూ -దుర్గాప్రసాద్
Posted in రచనలు | Tagged | Leave a comment

శాత పత్ర సుందరుడు రజనికి శత వర్శోత్సవం (100 ఏళ్ళు )

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

vuyyuru veeramma tirunaallu

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మ్యూజిక్‌ సిస్టర్స్‌-, prajvala ,prayusha ,pravallika

మ్యూజిక్‌ సిస్టర్స్‌

‘‘సుస్వరాల సంగీత సాధనే మాకు ప్రభుత్వోద్యోగాన్ని లేదా జీవనభృతిని తప్పక కల్పిస్తుందని ఎంతో
నమ్మకంగా’’ చెప్తారు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన ఈ సోదరీమణులకి
సంగీతమే ప్రాణం. వీరిలో ఒకరు వీణ, కీబోర్డుల్లో నిష్ణాతురాలు కాగా మిగతా ఇద్దరు వయొలిన్‌, హార్మోనియంల్లో నైపుణ్యం సాధించారు. ప్రజ్వల, ప్రత్యూష, ప్రవళ్లిక అనే ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు గాత్ర సాధన కూడా చేస్తారు. సంగీతంలో రాణిస్తున్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల గురించి…
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కపాటిపాళెంకు చెందిన కమతం ప్రకాష్‌కు ముగ్గురు కూతుర్లు. ప్రజ్వల ఆఖరి అమ్మాయి. బాల్యం నుంచీ ఈ అమ్మాయికి సంగీతమంటే ప్రాణం. దాంతో టీవీ, రేడియోల్లో వచ్చే సంగీతాన్ని శ్రద్ధగా ఆలకించేది. వాళ్ల ఇంటి పక్కన ఉండే జాన్‌ అనే కీబోర్డు ప్లేయర్‌ దగ్గర కీబోర్డులో మెళకువలు నేర్చుకుంది. ‘‘ఆయన వద్ద రెండేళ్లలోనే కీబోర్డు ప్లే చేయడం బాగా నేర్చుకోగలిగాను. ఆ తరువాత వీణ వాయించడంలో మాదేష్‌కుమార్‌ వద్ద శిక్షణ పొందాను. ఇంట్లో ఉన్న హార్మోనియం పెట్టెతోనే సాధన చేసేదాన్ని. మా ఇంట్లో ఉన్న హార్మోనియంకు సుమారు వందేళ్లు ఉంటాయి. మా కుటుంబంలో తరతరాలుగా ఈ హార్మోనియం పెట్టెమీదే సంగీత సాధన చేసేవారట.
నెల్లూరులోని ప్రభుత్వ సంగీత పాఠశాలలో వీణావాయిద్యంలో, గాత్రంలో సర్టిఫికెట్‌ కోర్సు చేశాను. చక్కని గాత్రం కూడా ఉండడంతో పాఠశాల స్థాయి నుంచే పలు కార్యక్రమాల్లో పాడేదాన్ని. వీణ, హార్మోనియం వాయించేదాన్ని. నేను సంగీతంలో రాణించడం చూసిన ఇద్దరు అక్కలు ప్రత్యూష, ప్రవళ్లికలు కూడా నా బాటలోకి వచ్చారు. ప్రత్యూష బీటెక్‌ పూర్తి చేసింది. ప్రవళ్లిక బిబిఎ చదువుతూనే సంగీతంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ కోర్సు చేసింది.
గిన్నిస్‌బుక్‌ ఎక్కాం
హైదరాబాద్‌లో సిలికాన్‌ ఆంధ్రా వారు 2009లో నిర్వహించిన త్యాగరాయ లక్ష గళార్చన కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి మేం ముగ్గురం ఎంపికయ్యాం. లక్షా అరవై వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలోనే గిన్నిస్‌ రికార్డు అందుకున్నాం. అదే సంవత్సరం నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో అప్పటి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కాకాణి గోవర్దన్‌రెడ్డి ‘బహురూప’ అనే కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొని పలువురి ప్రశంసలు అందుకున్నాం. అప్పటి నుండి మా జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కచేరీలు చేయడం మొదలుపెట్టాం. 2009లోనే నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి యువజన పోటీల్లో పాల్గొని వీణా వాయిద్యంలో మొదటి స్థానం సాధించాం. కర్ణాటక మైసూరు రాజావారి ఇంట్లో ఉన్న పురాతన వీణను మంచి విద్వాంసులకు అందజేస్తామని వారు ప్రకటించినప్పుడు అక్కడికి వెళ్లి ఆ వీణ వాయించాను. నా ప్రతిభను మెచ్చి ఆ వీణనే నాకు బహుమతిగా ఇచ్చారు. 150 సంవత్సరాల క్రితానిదా వీణ’’ అని వివరించింది ప్రజ్వల.
ఫ కె.గయాజుద్దీన్‌, నెల్లూరు.
ఫోటోలు: అశోకుడు
సంగీతానికి ‘కమతం’
వీణ, హార్మోనియం, వయొలిన్‌ వంటి వాయిద్యాలను వాయించడం యువతీ యువకులకు నేర్పించాలనే ఉద్దేశంతో వాళ్ల ఇంటిపేరు కమతం పేరుతో ఇంట్లోనే సంగీత పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇదేకాకుండా కోవూరులో కూడా సంగీత పాఠశాలను స్థాపించారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు. నారాయణ వైద్య కళాశాలకు చెందిన ప్రముఖ వైద్యులు కూడా ప్రజల్వ దగ్గర వీణ, హార్మోనియం నేర్చుకుంటుండడం విశేషం.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జయంతి నటరాజన్ జంప్ -జయప్రద కూడా –


 
Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5

ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -3

వాగ్నర్ ‘’ఆర్ట్ వర్క్ ఆఫ్ ది ఫ్యూచర్ ‘’,’’ఆర్ట్ అండ్ రివల్యూషన్ ‘’ఓపెరా అండ్ డ్రామా ‘’లను ‘’జూడాయిజం ఇన్ మూజిక్ ‘’తో పాటు రాశాడు .మొదటి దానిలో తన గొప్పతనాన్ని డబ్బా కొట్టుకొంటే రెండో దానిలో తన జీవిత దుఖాన్ని ఆరబోసుకొన్నాడు .క్రమంగా ధోరణిమార్చి ఎక్కువమంది ఇస్టపడేదాన్ని చేతిలో రూపాయి పడేదాన్ని ఎంచుకొని రాయసాగాడు .1848-53మధ్య కాలం అతని వదిలేసిన కాలం వృధాగా నే గడిచిపోయిందని విమర్శకులు భావించారు .కాని ఆకాలం లో ఖాళీ గా ఏమీలేడు. లవ్ అఫైర్స్ లో మునిగి తేలాడు .35ఏళ్ళ వయసులో 22 ఏళ్ళ అమ్మాయిని ముగ్గులోకి దించితే  ఆమె  ధనిక భర్త ,తల్లీ వ్యతిరేకిస్తే ఆమెతో లేచిపోదామని ప్లాన్ వేసి ఆమె భర్త వాగ్నర్ ను కాల్చిపారేస్తానని భయపడితే ఆచిన్నది సాహసం చేయలేకపోతే  తనను ఆదుకోవటానికి ఆమె చేసిన ప్రయత్నం ఒక  చిన్నపిల్ల మనస్తత్వం అనుకోని సర్దుకు పోయాడు .మనవాడిని వలచిందీ మనవాడు వలచిండదీపెళ్లి అయిన భార్యలే . భర్త ఉన్న ఇంకో ధనవంతురాలితో ప్రేమాయణం సాగించి ఆ భార్యా భర్తల వలన తన సంగీతానికి ప్రచారం తెచ్చుకొన్నాడు .

‘’మై లైఫ్ ‘’అనే పుస్తకం వాగ్నర్ రాసి తన జీవిత విశేషాలను పొందుపరచాడు .ఈ సమయం లోనే ‘’రింగ్ ‘’అనే దానికి సంగీతం కూరుస్తూ ఆ కుటుంబం తో సాన్నిహిత్యం పెరిగి ఆమెను ప్రేమించి దగ్గరయ్యాడు .దీనితో ‘’రింగ్ ‘’ను పక్కన పెట్టాడు .భార్యా పిల్లా తిరిగి వచ్చి ఇతన్ని చేరాక ఈ తాత్కాలిక ప్రేమకు తెర పడింది .వెనిస్ వెళ్లి ‘’ట్రిస్టాన్ ‘’పూర్తీ చేశాడు .భార్య డ్రెస్ డేయిన్ వెళ్లి అ భర్త కు క్షమాభిక్ష కోసం ప్రయత్నించింది .ఆరేళ్ళు కస్టపడి ట్రిస్టాన్ ను పూర్తీ చేశాడు .భార్య ప్రయత్నం ఫలించి వాగ్నర్ కు క్షమా భిక్ష లభించి జర్మనీలో ఉండే అవకాశం ఏర్పడింది

జెర్మనీ స్పిరిట్ తో ఇంకా బాగా సంగీతం లో దూసుకుపోవాలన్న కోరిక బలీయమైంది .అంకిత భావం తో పనిచేసి ‘డస్క్ ఆఫ్ దిగాడ్స్ ‘’,డై వాకీర్ ‘’ ది రైన్గోల్డ్ ‘’చేసి హిట్లు కొట్టాడు .ఇలాంటి సంగీతం అంతకు ముందు ఎన్నడూ ఎవరూ ఎక్కడా విని ఉండలేదని గొప్పగా కీర్తించారు .అందులో వేగం ధృతి ,పెద్ద ధ్వని తో ఉన్నా అద్భుతమైన శ్రావ్యత ఉండటం వాగ్నర్ సంగీతం లో ప్రత్యేకత .ఛందస్సు బంధాలు తెంచేశాడు .సంప్రదాయాన్ని దూరం చేశాడు .ఉదాత్త అనుదాతాత్తలతో తీవ్ర సంచలనమే సృష్టించాడు .చెవులకు ఇంపైన సంగీతాన్ని ఆర్కెస్ట్రా లో మాధ్యమంగా చేసుకొని సృష్టించిన ఈ సంగీతం కొత్త రికార్డు సృష్టించింది .ఏక వాద్య సంగీతం కాక సామూహికం గా ఇంతటి మాధుర్యాన్ని సృష్టించటం అనితర సాధ్యం అని అందరూ మెచ్చుకొన్నారు

‘’ది లీడింగ్ మోటివ్ ‘’లో ఆర్కెస్ట్రా తో సర్కసే చేయించాడు ‘’లీట్ మోటివ్ ‘’అనే సంగీత రూపకం ‘’is the embodiment of a person or an idea .It identifies with figure ,comment upon  action ,and explains the fluctuating emotions and state of mind.’’అని పేరుపొందింది .శ్రోత చెవులకు ఇబ్బంది కలుగ కుండా దృశ్యాలు కనుల ముందు కదిలిపో యేట్లు తీర్చాడని అదొక స౦గీత చిత్రం musical portraitఅనీ తెగ మెచ్చారు. ట్రిస్టాన్ ను పారిస్ లో ప్రదర్శిద్దామనుకొంటే ‘’తన్నాహీసర్ ‘’ను వాళ్ళు సెలెక్ట్ చేయటం ఆశ్చర్య పరచింది వాగ్నర్ని .ఇంకో ఆశ్చర్యకరమైన వార్త విన్నాడు .గ్రాండ్ ఒపేరా హౌస్ లో బాలెట్ లేకుండా ఒపేరా ప్రదర్శన ఉండదు .తానూ రాసిన దానిలో బాలద్ద్ లేదు. అందుకని దానికోసం సంగీతం తయారు చేశాడు .ఏంతో కస్టపడి కూర్చాడు .కాని పారిస్ వనితలు పెదవివిరిచారు .గోల, అల్లరి ,ఆగం తో ప్రదర్శన సాగలేదు .మూడోసారి చేసిన ప్రయత్నమూ ముందుకు వెళ్ళక నిరాశ చెందాడు .పారిస్ అంటే రోత పుట్టింది. రైన్ నదీ తీరం లో బీబ్రిచ్ లో ఉన్నాడు .

యాభై ఏళ్ళ వయసులో అపజయాలు బాధించి కలవరపెట్టాయి .స్వదేశం లో మళ్ళీ తన ప్రతిభ నిరూపించుకోవాలనుకొన్నాడు .ఇంకో అమ్మాయిని లైన్ లో పెట్టి పెళ్ళాడాడు ప్రబుద్ధుడు .ఇద్దరిపెళ్ళాల ముద్దుల మొగుడు .ఎవరి మీద ద్రుస్ష్టిపెట్టాలో తెలియక తబ్బిబ్బయ్యాడు .ఇంటిలోని పోరుకు దూరం అవటానికి బెర్లిన్ ,ప్రేగ్ ,మాస్కో వగైరా ప్రదేశాలలో కచేరీలతో కాలక్షేపం చేశాడు .వలచి వలపించటం ఎక్కడికెళ్ళిన మానలేదు .మళ్ళీ రుణ బాధల్లో పీకల్లోతు కూరుకుపోయాడు .దీనిలోంచి బయటపడే గొప్ప సదవకాశం వెతుక్కొంటూ వచ్చింది .మ్యూనిచ్ లో బ్రవేరియా రాజు దర్బార్ లో పందొమ్మిదేళ్ళ లుడ్విగ్ తో సమానం గా హోదా లభించింది .అక్కడొక అమ్మాయి తో ఎఫైర్ సాగించి  గుప్పుమన్నది .డబ్బు వస్తోంది గదిలో అతి విలాసమైన రగ్గులకు  కర్టెన్ లకు  .మాంచి ఖరీదైన సిల్క్ డ్రెస్ లకు   డబ్బు బోలెడు ఖర్చు చేశాడు .ఇలాంటి సిల్క్ డ్రెస్సులు  ఇరవై నాలుగు ఉండేవి .అంత ఆడంబరం ఒలక పోశాడు సంగీత గురుడు .వాగ్నర్ విలాస జేవితం సామాన్యులు ఈస డించారు .దానికి మనవాడి సమాధానం ‘’నేను అరవై వేల ఫ్రాన్కులను దుబారా గా ఖర్చు చేయటం లో గొప్ప చాకచక్యం కలవాడిని. కాని ఆ డబ్బు సంపాదించటం లో కాదు ‘’అని గొప్పలు పోయేవాడు .ఇవన్నీ చూసి కుర్ర రాజు అసహ్యిన్చుకొన్నాడు .చర్చి అధికారులూ అయిష్టత చూపారు .అతనిలోని విప్లవ భావాలకు కలత చెంది అందరూ క్రమంగా దూరమైపోయారు .అధికారులు వాగ్నర్ జీవితం ప్రమాదం లో ఉందని రాజుకు  చెప్పగావిని  లుడ్విగ్ కన్నీరు పెట్టుకొని గురువును మ్యూనిచ్  వదిలి వెళ్ళిపొమ్మని బ్రతిమిలాడాడు .అక్కడి నుండి స్విట్జెర్లాండ్ వెళ్లి రాజు ఇచ్చిన పెన్షన్ తో స్వంత ఇల్లు ఏర్పరచుకొని ఆయన ఉదారత వలన బతికి పోయాడు. ‘

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-15 –ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

“శ్రీ పరవస్తు లోకేశ్వర్ సిల్క్ రూట్ లో సాహస యాత్ర” – గబ్బిట కృష్ణ మోహన్

silk route

Silk Route lo Saahasa Yaatra00010002 0003 0004

Posted in రచనలు | Tagged | Leave a comment

30-1-15 శుక్రవారం సాయంత్రం మా ఇంట్లో మా పూర్వ శిష్యుడు చిలుకూరి నరసింహం దంపతులు 

This gallery contains 10 photos.

More Galleries | Tagged | Leave a comment

సావిత్రి ఓ నిండుగోదారి -నాగేశ్వర రావు బుద్ధి మంతుడు అన్న శ్రీ సత్య ప్రకాష్

savitri 002anr 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చలపాక ‘’జీవితం ‘’

చలపాక ‘’జీవితం ‘’

మిత్రుడు ,ఆత్మీయుడు ,నిత్య సాహిత్యోపజీవి ,కవి ,కధకుడు, విమర్శక విశ్లేషకుడు సంపాదకుడు అనేక  సత్కారా పురస్కారాలు అందుకొన్న వారు ,  నాకు ,సరసభారతికి అత్యంత సన్నిహితుడు  తలిదండ్రుల మధ్య జీవిస్తూ ఆదరాభిమానాలు పొందుతూ ఆ జననీ జనకులకు తన జీవితమాదుర్యాన్నిపంచుతున్న  శ్రీ చలపాక ప్రకాష్ ఇటీ వలే వెలువరించి ఆవిష్కరించిన  కదా సంపుటి ‘’జీవితం ‘’ను వారికి కృతజ్ఞతగా అంకితమిచ్చారు .జీవితం లోని బహుపార్శ్వాలను అందులో స్పృశించి రాసిన కధలవి .కొన్నివెయ్యి రూపాయల పారితోషికాన్ని కూడా పొంది పేరు తెచ్చుకోన్నాయి .దీనికి ముందుమాట రాసి మెచ్చి ఆశీర్వదించారు ప్రముఖ కదా రచయిత శ్రీ వేదగిరి రాంబాబు.ఈ సంపుటిని నాకు అందజేశారు ప్రకాష్ ఇప్పుడే చదివే తీరిక దొరికి చదివి నా అభిప్రాయం రాస్తున్నాను .

జీవితం ఒక నాణెం .దానికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే జీవితానికి రెండు పార్శ్వాలున్నాయి. ఆ రెండు పార్శ్వాలను తరచి రాసిన 16 కధలివి .సమకాలీనతకు సన్నిహితమైనవీ కూడా .ఈ రోజు చానెళ్ళ భీభత్స ప్రసారానికి నిదర్శనం గా ‘’ప్రళయం ‘’కద రాశారు ప్రకాష్ .ఉన్నదానికంటే వెయ్యి రెట్లు భయం సృష్టించి క్షణ క్షణ నరకం చూపించి ఇక ప్రళయం ముంచుకొచ్చి ఈ ప్రపంచం ఉండదేమో అని భయం కలిగించి సొమ్ములు దన్నుకొనే చానెల్ సృష్టించిన విలయం తో ఓముసలి గుండె తనవారినందర్నీ ముంచుకొచ్చే తుఫాను కు దూరంగా పంపేసి భార్య తో ఇంట్లో ఉండి చివరి ఫ్లాష్  బ్రేకింగ్ న్యూస్ విని గుండె ఆగి చనిపోయిన ముసలాయన కధే .అద్భుతం గా ఉంది .ప్రసార మాధ్యమాల వికృత చేష్టలకు ఇది దర్పణం .రెందోకద ఇలాంటి బలిదానమే. ప్రభుత్వోద్యోగి సమైక్య ఉద్యమం లో పాల్గొని తిండీ తిప్పలూ లేకుండా తిరిగి అరిచి అలసిపోయి గుండె ఆగి ప్రాణాలుకోల్పోతే ‘’సమైక్యత కోసం అసువులు బాసిన అమరజీవి ‘’అని ముద్ర వేసి ఉద్యమా గ్నికి సమిధగా వాడుకోవటం .  మూడోకద’’ 3 జి మహిమ ‘’ సారాంశం  ప్రకాష్ మాటల్లోనే ఆధునిక టెక్నాలజీని మనిషి తన అవసరాలకు అనుగుణం గా ఎలా మలుచుకొంతటున్నాడో ,అంతకంటే వేగం గా అనవసర విశ్రు౦ఖలతల కు బానిస అవుతున్నాడు ‘’.సెల్, వీడియో ఫోన్ ఇంటర్ నెట్ లు ప్రదర్శించే అశ్లీలతపై అవి చూపే వ్యామోహం పై చాచికోట్టిన దెబ్బ .అలాగే ‘’బుల్లితెర ‘’భూతానికి  అతుక్కొనిపోయి  జీవిత మాధుర్యాన్ని మరచి జీవితాన్ని నరకం చేసుకొనే వారి కద’బుల్లితెర ‘’.

స్వతహాగా స్వర్నకారుడైన చలపాక కే .డి .య౦ .కిటుకును బయటపెట్టాడు .అది బంగారు వస్తువుల జాయింట్లకు వాడే ‘’అతుకు ‘’మాత్రమె ‘’నని నిజం చెప్పాడు   .కార్పోరేట్ జ్యూయలరీ మాయా జాలాన్ని గురించి తెలుసుకోక మైకం లో పడిపోయే వారి గురించి చెప్పిన కద’’గుర్తింపు .‘’స్వర్నకారుడి పని తనాన్ని గుర్తించాలని వారిలో డిజైన్ చేసి అద్భుతాలు సృష్టించే డిజైనర్  నైపుణ్యాన్ని మెచ్చుకొని వారికి ప్రోత్సాహకాలివ్వాలని సూచించారు . బంగారు పని చేస్తున్నానని  తాను  చెబితే తానేదో అంటరానివాడిని అన్నట్లు చూసే లోక జనాలే అంటరాని వారన్న ఫీలింగ్ కలిగిస్తాడు .కష్టాల్లో ఉన్న వారిని చూసి చేతనైనంత సహాయం చేయాలని అది ప్రభుత్వం ఇచ్చే అవార్డులు రివార్డులకోసం కాదని కనీస మానవ ధర్మమమని   తెలియ జెబుతూ రాసిన కద ‘’అభినందన ‘’.బలవంతపు బందులు నాయకుల దండాలు ,పీడించే  వసూళ్లు ఒక  బక్క స్వర్ణకార ప్రాణి ఆచారి జీవితాన్ని ఎలా బలి తీసుకోన్నదో చెప్పిన కద ‘’శిక్ష ‘’ వ్యవస్తలో ఎదురుతిరిగే అవకాశం లేని వారికి పడే శిక్ష మరణమే .అదిప్రమద వశాత్తో అయినా సరే కావాలనుకోన్నదో .ఈ శిక్ష ఎవరికి తనకా ?తనపై ఆధార పడ్డ  కుటుంబానికా?ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న  గా మిగిలే పోయింది ,పోతూనే ఉంటుంది .ఈ ఏడు కధలు ‘’జీవితానికి ఒక వైపు’’లోవి .అదీ విషాదం వైపువి .

‘’జీవితానికి మరోవైపు ‘’లోసరదా గా రాసిన  తొమ్మిది కధలున్నాయి .ఇందులోనూ మొదటికద ‘’టి వి రిపోర్టర్ ల అతి కి ప్రతిబింబం ‘’గోరంత –కొండంత ‘’.ఒకమ్మాయి ఆయాసపడుతూ టాంక్  బండ్ పై  పరుగెత్తుతూ ఉంటె వెనకో కుర్రోడు సీసా లో ఏదో ద్రవం పట్టుకొని ఆమె వెంట బడతాడు .ఇంకేముంది చానేల్ వాళ్ళు కెమెరా పెట్టేసి స్టూడియో నుంచి రిపోర్టర్ ను  ప్రశ్నలమీద ప్రశ్న సంధించటం వాడు సుళ్ళు తిరుగుతూ చొంగ కార్చుకొంటూ అదేదో రేప్ సీన్ గా ,లేక యాసిడ్ దాడిగా తన వాక్ ప్రవాహం తో కధలూ గాధలూ చెబుతూ ప్రేక్షకుల్ని టివిలకు కట్టి పడేయ్యటం –చివరికి ఆ కుర్రాడు మార్కెట్లో కొత్తగా వచ్చిన కూల్ డ్రింక్ ప్రేయసికోసం తెచ్చాడని ఆమెకొత్తడాన్ని టేస్టు చేయ్యటం ఇష్టం లేక పరిగెత్తుతోన్దని బలవంటంగా పట్టుకొని ఆమె నోట్లో దాన్ని పోసి ఆమె ఇష్టం గా తాగుతుంటే ఆనందం అనుభవించారని తెలిసి రిపోర్టర్ తో సహా అందరూ నోరెళ్ళ బెట్టాడమే ఇందులో తమాషా .కధ ,కధనం బాగా సాగాయి  .ఆద్యంతం రక్తికట్టి హుషారిచ్చింది  మరొకద ‘’భలే వ్యాపారం ‘’లో మినరల్ వాటర్ ఫాన్సీ పై చమక్కు .ఇపుడు అందరూ దాని వ్యామోహం లో పడిపోయారని వీధి కొళాయిల దగ్గర ‘’పానీ పట్టు ‘’యుద్ధాలు లేవని హాయిగా బిందెల నిండా నీళ్ళు దొరుకుతున్నాయని సరదాగా చెప్పిన కద.

దేవుడినే బోల్తా కొట్టించిన ఆనంద రావు కద.తర్వాతిది .డిష్ యాన్తీనా కింద కూర్చుని గడ్డాలు మీసాలు పెరిగి నేలకు తాకే దాకా తపస్సు చేసి దేవుడిని ప్రత్యక్షం చేసుకొని ‘’ధనకనక వస్తువాహనాలు తప్ప ఏదైనా కోరుకో ‘’అంటే ఏమీ అక్కర్లేదు ‘’నేను కాలం వెనక్కి వెళ్ళేట్లు చేయి స్వామీ ‘’అనికోరి వరం పొంది 1983  కంటే వెనక్కి వెళ్లి భార్య సంతృప్తికోసం బస్తాడు బంగారం అతి తక్కువ ధరలో కొని వీపు మీద మోసుకొచ్చాడు అతి తెలివి ఆనంద రావు. మనిషి పన్నిన ఉచ్చులో దేవుడు పడి గిలగిల లాడి  ఆనండుడితో నవ్వుతూ ‘’ఏ షరతు విధించినా దేవుడినైన నన్నే బోల్తా బురిడీ కొట్టించి మీ కోర్కెలు తీర్చుకొనే అపూర్వమైన మీ మానవ తెలివి తేటలకు జోహార్లు ‘’అన్నాడు .మంచి ఆలోచనా భలే కదా కధనం .’’డిష్ యా౦టేన్నా  తో ప్రసారాలపై ఒక చమక్కు చళుక్కు ‘’ఫామిలీ పాక్ ‘’కధ .ఇంట్లో అందరికి తలో  చానల్ కావాలి .యజమాని ముసలాయనకి మాత్రం రాత్రి 11-30 తర్వాత వచ్చే ‘’మిడ్ నైట్ మసాలా’’ కావాలి .ఇదీ రోజంతా రావాలని ఆయన ఆశ .అలాంటిది ఇంకారాలేదని వస్తే ఫస్ట్ చాన్స్ ఆయనకే ఇస్తానని డిష్ పెట్టించుకోమని ఏజెంట్ చెప్పగా ఇంతమందికి ఇన్ని చానెళ్ళు చూడటానికి అన్ని టి వి లు తానూ కొనలేనని ఆ అమాయక చక్ర వర్తి అనటం  తో నవ్వుల పువ్వులే పూస్తాయి

భార్య కొత్తకారు మీద మోజు  ‘’నానో కారు ‘’తో తీర్చిన భర్త  వచ్చిన కొత్తలోనే హెడ్ లైట్లు క్రికెట్ బంతికి కృష్ణార్పణం .కొడుకు కోపానికి అద్దాలు ధ్వంసం .రిపైర్లకు చాలని డబ్బు .పక్కింటి వారి పెళ్ళికొడుకు ఊరేగింపుకు కారు  ఇచ్చి అది కరెంట్ స్తంభాన్ని ముద్దేట్టుకొని ముక్కలవటం  .మనకు నవ్వుతో కడుపు చేక్కలవటం ‘’సంతోషానికి తాళం ‘’కదలో విషయం .సినీ హీరో సినిమా రిలీజ్ అయినా పుట్టిన రోజు జరిగినా అభిషేకాలే కాక ఇప్పుడు ‘పాలాభి షెకాలు ‘’చేసి ఆయన పాపాలు కడిగేస్తున్నారు .దీనితో ఎంతడబ్బు వృధానో ఎన్నిపాలు నేలపాలో అనే సామాజిక స్పృహ లోపించటం గురించి రాసి ‘’మంచి దొంగ ‘’కధలో ‘’అన్న ‘’అభిషేకానికి తెచ్చిన పాల కాన్ లను తెలీకుండా వ్రుదాతత్వాన్ని చూడలేక దొంగలించి అనాధ శరణాలయానికి తీసుకు వెళ్లి ‘’ఆ అన్న’’పేరిట ఉచితంగా పంచిన  వాడి కద.

దేవుడిని వరం అడిగితె ఏమిస్తాడు ఎవోపాతకాలపు సరుకు తప్ప అని భావించి ఒక ఆధునికుడు’’ బుడ్డా రావు  ‘’సైంటిస్ట్ కోసం తపస్సు చేసి మెప్పించి ముందు గ్రామఫోన్ తర్వాత  రేడియో టి వి ,కలర్ టివి ప్లాస్మా ఎల్సిడి  కంప్యూటర్ లాప్టాప్ వగైరాలు సృష్టింప జేసుకొని అవేవీ చాలక చివరికి సెల్ ఫోన్ అందులోనే ఇంటర్నెట్ తో సహా చేయించుకొని వీటన్నిటిని ఉపయోగించుకొనే సమయం చాలక వాటి ఆపరేషన్ కోసం  మరమనిషి రోబోను  కూడా సృష్టించి ఇచ్చాడు సైంటిస్ట్ .చివరకు  రచయిత ‘’అప్పటి వరకు ఉన్న ‘’మనిషి ‘’మాయమై రోబోలు మిగిలాయి .ఈ విశాల ప్రపంచం లో ‘’అని ‘’మాయం ‘’కదముగిస్తాడు .విలువలన్నీ మాయం అయి కృత్రిమత మాత్రమె ప్రపంచం లో రాజ్య మేలుతోందని అంతర్ ధ్వని  .దేవుడి సృష్టికంటే మానవ సృష్టి ‘’పాలిదిలీన్ ‘’తో విజ్రుమ్భించి అవి మట్టిలో కలిసిపోక పర్యావరణ కాలుష్యాన్ని పెంచి జంతు జీవావరణానికి హాని కలిగిస్తున్నాయని హెచ్చరించే కధే ‘’తరగని ముద్ద’’.

ఒక వేసవి లో దేవేంద్రుడు మానవుడికి ప్రత్యక్షమైతే వాడు  .అయన దాహార్తి తీర్చటానికి ద్రాక్షా పైనాపిల్  మాంగో జ్యూసులిప్పించి ఐస్ చేశాడు .వాటి బహురక రుచులకు ఇంద్రుడు సంప్రీతుడై దేవలోకం లో ఉన్న అమృతం ఎప్పుడూ ఒకటే రుచి కలిగిఉంటుందని ఈరుచుల జాడ దానికి లేదని వీటిని దేవలోకం పంపి అక్కడి అమృతం అందుకోమని భక్తుడిని దేవేంద్రుడు కోరటం భక్తుడు పారిపోవటం  కొసమెరుపు .బ్రహ్మకైన కలుగు రిమ్మ తెలుగు .కాదు ఇంద్ర కైనా  దిమ్మ తిరుగు అని పించేట్లు రాసిన చివరి కద ‘’అమృతాన్ని మించిన రుచి ‘’

ఇవన్నీ చివరికద లానే అమృతాన్ని మించిన రుచిగా ఉండటం ఈ సంపుటి ప్రత్యేకత .వీటిలో కొన్ని పత్రికలలో ముద్రితాలు .మొదటి ఏడు కధల్లో జీవితం లోని విషాద పార్శ్వాన్ని  చూపిస్తే,రెండు కధలు ఎక్కువగా రాసి  చివరి తొమ్మిదిలో ఆనందపు అంచుల్ని  చుంబింప  జేశారు . అంటే జీవితం లో నీరస నిరాశల కంటే ఆనందం తృప్తీ సంతోషం ఉన్నాయని రెండుకధలు ఎక్కువగా రాశారని పించింది నాకు. శ్రీ  ప్రకాష్ ఏ రకమైన కద నైనా తన విచక్షణా దృష్టితో లోక పరిశీలనతో గోప్పగా మలచగలిగిన ‘’కదా స్వర్ణకారుడు చలపాక’’  .ఆ ప్రకా(షం )శం మురిపించి ,మై మరపిస్తుంది ..జీవితానికి ఉన్న అన్నిరకాల అర్ధాలను ఇందులో మణులుగా పొదిగారు  .అందరూ కొనిచదివి ఆనందించాల్సిన కదా సంపుటి శ్రీ చలపాక ‘’జీవితం ‘’.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -4

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -4

ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -2

అప్పుల వాళ్ళను తప్పించుకోవటానికి రష్యా నుండి కుటుంబం తో పారిపోయిన వాగ్నర్ సముద్రం అల్ల కల్లోలం గా ఉండటం వలన వారం రోజుల్లో చేరాల్సిన ఓడ మూడు వారాలు పట్టింది ఇంగ్లాండ్ చేరటానికి .సముద్ర భీభత్సం ప్రక్రుతి అతనిలో అలజడి రేపి మూడ వ ఒపెరా ‘’ఫ్లైయింగ్ డచ్ మాన్ ‘’కు నేపధ్యం దొరికింది .అంతకు ముందే హీన్స్ రాసిన ‘’మేమాయిర్స్ ఆఫ్ శ్నాబెలోస్కి ‘’చదివి ఉన్నాడు. కనుక ఈ నల్లని మబ్బులతో నిండిన ఆకాశం, గర్జించే సముద్రం ఒక నేపధ్యం గా దానికి చేకూర్చాలని భావన కలిగింది .ఈ కొత్త సంఘటనల ముద్ర మనసులో గాఢమై అలజడి రేపింది .లండన్ నుంచి మధ్య ప్రాచ్యం లోని బోలోన్ చేరి అక్కడ తన రీన్జీ ని మెచ్చిన  మేయర్ బీర్ ను కలిశాడు .ఒక నెల గడిపి పారిస్ చేరాడు .చేరిన  ఊరుకోకుండా తనకు ఎక్కువ అప్పిచిన  వాడికి ‘’మీకు రుణపడి ఉండటం నాకు ఏంతో సంతోషం గా ఉంది ‘’అని ఉత్తరం గిలికి అయిదేళ్ళ తర్వాత తాను  కూర్చిన ‘’జూడాయిజం ఇన్  మూజిక్ ‘’లో అతనిని అతనితో పాటు అప్పులిచ్చిన మిగిలిన యూదుల్ని  తీవ్రం  గా దూషించాడు .

పారిస్ వచ్చాడే కాని వాగ్నర్ బతుకు పెనం మీంచి పొయ్యిలో పడినట్లయింది .నరకం అనుభవించాడు .కటిక దరిద్రాన్ని అనుభవించారు .ఈ పరిస్తితులన్నీ అతని మనో ఫలకం పై తీవ్ర మైన చెరగని ముద్రనే వేశాయి..ఒక గదిలో ఉంటె లాడ్జి వాడొచ్చి ఆక్రమించుకొని  ఇబ్బంది పెట్టటమే కాదు వాగ్నర్ భార్య మిన్నా తో  బూట్లు కూడా తుడిపించుకొని అవమానించాడు .అప్పటికే భార్య దగ్గర ఉన్నది అంతా ఊడ్చిపారేసిన వాగ్నర్ ఇంకా అడుగూ బొడుగూ ఉన్నాయేమో నని  డబ్బు కోసం పీడించి చివరికి ఆమె కట్టుబట్టలు తప్ప ఏమీ  లేకుండా చేశాడు ఈ  మహానుభావుడు  .రొట్టె కొనుక్కోవటానికీ  చేతిలో చిల్లి గవ్వ లేని నికృష్ట పరిస్తితి .పోట్టగడవాలి కనుక ఫ్రెంచ్ కవితలకు పియానో ట్యూన్లు కట్టాడు,ప్రూఫ్ రీడింగ్ లు చేశాడు  .లిబ్రేట్తో లను అనువాదం చేశాడు .చిన్న నవలలు స్కెచ్ లు వ్యాసాలూ పుస్తక సమీక్షలూ చేశాడు. చివరికి మురికి కూపం గా ఉన్న ఒక చిన్న దియేటర్ లో కోరస్ గ్రూప్ లో స్థానం పొంది పాడాడు కాని ఆర్కెస్ట్ర యజమాని వాగ్నర్ పాట సరిగ్గా పాడలేదని ,పాడటం రాదని గ్రహించి తీసేశాడని వాగ్నారే చెప్పుకొన్నాడు .ఇలా పారిస్ బులపాటం తీరింది .

తిండిలేక మాడుతూ దుర్భర ఒంటరి జీవితం గడుపుతూఉన్నా ‘’రీంజి ‘’కి సంగీతం కూరుస్తూనే ఉన్నాడు .దీని ని ప్రదర్శించటానికి డ్రెస్ దేయిన్ లోని ఒపేరా హౌస్ అంగీకరించింది .బెర్లిన్ లో హిట్ అయిన ‘’దిఫ్లైయింగ్ డచేస్ ‘’ను కూడా ప్రదర్శించే ఏర్పాటు జరిగింది .ఈ డచేస్ ప్రతి ఒపేరా హౌస్ లో ప్రతిధ్వనిస్తూనే ఉంది .తన జీవితపు చీకటిని ప్రతిఫలింప జేశాడు .భర్తకోసం సర్వస్వాన్ని త్యాగం చేయటానికి హక్కు కోరిన స్త్రీ కద అది .ఒక విధం గా ఇది వాగ్నర్ జీవిత చరిత్రే జర్మనీ లో ఉండటానికి నోచుకోలేక పారిస్ లో కనీసం ఉండటానికి ఇల్లుకూడా లేని జీవిత పరిస్తితి .మూడేళ్ళ ఈ దీన హీన నికృష్ట దుర్భర జీవితానికి తెరపడి ఆశా సూర్యోదయం అయింది .జీవితం లోచీకటి పోయి  వెలుగు రేఖలు ప్రసరించటం ప్రారంభ మైంది .

అప్పు చేసి ప్రయాణం టికెట్లు కొనుక్కొని రీంజి ప్రదర్శన కోసం డ్రెస్ డేయిన్ వెళ్ళాడు .ప్రదర్శన విపరీతమైన విజయాన్ని సాధించి బీద వాడిని భాగ్య వంతుడిని చేసింది .డచేస్ కూడా ప్రదర్శింపబడి ఆదాయాన్ని పెంచింది .ముప్ఫై రెండేళ్ళు నిరాశలో లో మగ్గిన వాడికి ముప్ఫై మూడవ ఏట అదృష్టం తలుపు తట్టింది .’’రాయల్ కండక్టర్ ‘’ఉద్యోగం వరించింది .హాయిగా కాలు కదల్చకుండా  కూర్చునే ఉద్యోగం గౌరవం. కాని మనవాడికి సంతృప్తి తక్కువ .ఆరేళ్ళు ఇక్కడే గడిపాడు . రొటీన్ గా రోజూ రిహార్సేల్స్ ,ప్రదర్శనలతో బోర్ కొట్టింది గురుడికి .సమకాలీన సంగీత కర్తలు మెండేల్సాన్,షూమన్ లతో పెద్దగా పరిచయం పెట్టుకోలేదు కారణం వారిని తనకు పోటీదార్లుగా భావిం చటమే .జీతం బాగానే ముడుతోంది కాని విలాసాలకు మరిగి వచ్చింది చాలటం లేదు .మళ్ళీ అప్పుల ఊబిలో నిలువునా కూరుకు పోయాడు .’’జేసేస్ ఆఫ్ నజారేత్ ‘’,ఫ్రెడరిక్ బార్బరోసా ‘’అనే రెందు సంగీతనాటకాలకు సంగీతం చేయాలనుకొన్నాడు కాని రెండిటినీ  వదిలేశాడు  ,చివరికి డ్రెస్ డేయిన్ లో ‘’ట్రాన్స్ హేజర్ ‘’కు  తర్వాత ‘’లోహేన్గ్రిన్ ‘’ లకు మాత్రం సంగీతం చేశాడు.ఇటాలియన్ శైలి ఒపెరాను ‘’దుస్తుల్లో  కచేరి  ‘’-concert in costume ‘’అని గేలి చేసేవాడు .

వాగ్నర్  కూర్చే సంగీతం లో సంగీతం సాహిత్యం ,నటన పూర్తిగా కలిసి పోయి ఉండేవి .అతనిలోని నాటకకవి పురి విప్పి నాట్యం చేసేవాడు .అతని ఊహ అత్యద్భుతం .అతని పాత్రలు రక్తమాంసాలతో సజీవం గా ఉంటాయి .ఆ కాలం లో వాగ్నర్ తన’’ లోహెన్ గ్రిన్ ‘’లో శక్తి యుక్తులన్నీ విజ్రుమ్భి౦భి౦ప జేసి  ఉన్నత శిఖరం చేరాడు ని విమర్శకులు ఆకాశానికి ఎత్తేశారు .అది వాగ్నర్ యుగం అన్నారు .ప్రశాంత మైన కాలం అని కితాబిచ్చారు . యెంత గొప్ప పేరు వచ్చిందో అంతే గొప్పగాడ్రెస్ డేయిన్ లో ‘’అప్పుల డ్రెయిన్’’ లో  దిగిపోయాడు .డ్రెస్ డేయిన్ ఆర్కెస్ట్రాలో తీవ్రమైన మార్పులు చేయాలని సూచించేవాడు కాని .ఎవరూ పట్టించుకో లేదు .సంస్కరణ చేద్దామంటే ఒప్పుకోక పోయే సరికి తిరుగుబాటు దారుడిగా అవతారం ఎత్తాడు వాగ్నర్ .రష్యా అరాజక వాది అంటే అనార్కిస్ట్ అయిన బకూనిన్ తో కలిసి ‘’సీగ్ ఫ్రీడ్స్ డెత్ ‘’అనే మహాకావ్య కధను తీసుకొని సంగీతం కూర్చాడు .అరిస్టాక్రసి కి వ్యతిరేకం గా సాగే కధగా తీర్చాడు .1849లో దేశం లో అశాంతి నెలకొని ప్రజలు తిరుగుబాటు చేశారు .వీదులన్నితికి బారికేడ్స్ పెట్టి  సైన్యం పహరాకాసింది.తిరుగుబాటు దారులపై సైన్యం తుపాకీ గుళ్ళ వర్షం కురిపించింది .వాగ్నర్ విప్లవవాదుల పక్షం లో చేరి పాల్గొన్నాడు ..తిరుగుబాటును సైన్యం అణచేసి నాయకులను అరెస్ట్ చేసింది .వాగ్నర్ ఒక’’ కోచ్ వాలా’’ వేషం లో వీమర్ కు పారిపోయాడు .అక్కడ ఫ్రాంజ్ లిజ్ అనే తన’’ట్రాన్స్ హేజర్ ‘’ను ప్రదర్శంచిన  అతని దగ్గర శరణార్ధిగా ఉందామనుకొన్నాడు .ఆయన ఒప్పుకోలేదు .జర్మనీలో ఎక్కడా ఉండటానికి నీడ దొరక లేదు .అతన్ని అరెస్ట్ చేయటానికి పోలీస్ వారంట్ సిద్ధం గా ఉంది .లీజ్  చూపిన ఔదార్యం తో ఎవరికీ తెలియకుండా జూరిచ్ చేరి  భార్య మిన్నాను కలుసుకొన్నాడు .ఇక్కడే పదేళ్ళు ప్రవాస జీవితం గడిపాడు ఆ సంగీత కర్త వాగ్నర్ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సమాధి లోంచి ఘోషిస్తున్న గాంధి -లవణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వర్ణం – కులం శ్రీ అరవింద రావు

వర్ణం – కులం

శ్రీకృష్ణుడు,
కుచేలుడు స్నేహితులనీ, వారిద్దరూ సాందీపని అనే గురువు వద్ద వేదాల్ని చదువుకున్నారనీ మనకు తెలుసు. కృష్ణుడు యాదవుడు కదా! మరి ఈనాటి యాదవులు వేదమెందుకు చదవడం లేదు? తమకు తామే శూద్రులని ఎలా అనుకుంటున్నారు? ఈ ప్రశ్న మన మెదడుకు రాకపోవచ్చు. దీనికి సమాధానం ద్విజుడు అనే పదానికి అర్థం గమనిస్తే తెలుస్తుంది.

ద్విజుడంటే ఎవరు?
బ్రాహ్మణుడని మనం అనుకుంటాం. కాని అది సరికాదు. ద్విజుడు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే మూడు వర్ణాలు కూడా. ఈ మూడు వర్ణాలవారూ వేదాల్ని చదివేవారు. ‘జన్మనా జాయతే శూద్రః’ అన్నట్లు పుట్టుకతో అందరూ శూద్రులే. ఉపనయనం అనే కర్మ వల్ల ‘కర్మణా జాయతే ద్విజః’ అన్నట్టు ద్విజులుగా మారేవారు. వేదంలో చెప్పిన అన్ని విషయాలపై వీరికి అధికారం ఉంది. ఇక్కడ మళ్ళీ వైశ్యుడు అనే పదానికి ఉన్న అర్థం చాలా ముఖ్యం. ‘కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం(గీత 18-44)’ అని దీని నిర్వచనం. అంటే సేద్యం చేయడం. పశువుల్ని కాయడం. అన్ని విధాల వ్యాపారాలు వైశ్యుడు అనే పదంలోకి వస్తాయి. అందువల్లే నిన్న మొన్నటివరకూ పల్లెల్లో పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు మొదలైన వాళ్లందరూ జందాలు వేసుకుని నియమ నిష్ఠలతో ఉండేవారు. ఇటీవలి కాలం వరకూ చాలామంది భారతం, భాగవతం మొదలైనవి బాగా చదువుకునేవారు. అలాగే క్షత్రియులు కాకుండా రాజ్యాలు పాలించిన మిగతా కులాలవారు బ్రాహ్మణులతో సమానంగా అన్ని శాసా్త్రలూ చదివారు. పుస్తకాలు రాశారు. ఈ వర్గాలవారు తమని తాము శూద్రులని అనుకుంటున్నారు కానీ వీరందరూ ద్విజులు అనే వర్ణంలో భాగమే.

నాలుగు వర్ణాలను తాను సృష్టించానని గీతలో శ్రీకృష్ణుడు చెప్పడం మనకు తెలుసు. గుణాన్ని బట్టి, అంటే వ్యక్తి యొక్క స్వభావసిద్ధమైన ప్రవర్తనను బట్టి ఈ విభజన అని ఆయన చెప్పాడు. కేవలం గీతలోనే కాక భారతంలో పలుచోట్ల వర్ణం ప్రస్తావన ఉంది. ఇప్పుడు సైకాలజీలో ఎలాగ పర్సనాలిటీ టైప్స్‌ అంటూ విశ్లేషిస్తున్నారో అలాగే పూర్వీకులు మనిషి స్వభావాన్ని నాలుగు విధాలుగా గమనించారు. క్షమాగుణం, అహింస, సత్యము, సంతుష్టి విద్య పట్ల ఆసక్తి, తపస్సు మొదలైన గుణాల్ని సత్త్వ గుణమన్నారు. శౌర్యము, ఇతరుల్ని శాసించే స్వభావం, అధికారం పట్ల, ధనం పట్ల కోరిక మొదలైన వాటిని రజో గుణమన్నారు. సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి లేకపోవడం, సోమరితనం, పట్టుదల, స్ఫూర్తి లేకపోవడం మొదలైన వాటిని తామస గుణమన్నారు. ప్రకృతిలో అన్ని జంతువుల్లోనూ, పదార్థాల్లోనూ, మనుషుల్లోనూ ఈ గుణాలున్నాయని గమనించారు. పుట్టిన ప్రతి మనిషిలోనూ ఈ మూడు గుణాలూ వివిధ నిష్పత్తులలో కలవడం వల్ల నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయని చెప్పారు. సత్త్వగుణం ముఖ్యంగా ఉంటే బ్రాహ్మణ వర్ణమనీ, రజో గుణంలోని శౌర్యము, శాసించే స్వభావం అధిక పాళ్లలో ఉంటే క్షత్రియ వర్ణమనీ, రజోగుణంలోనే ధనం పట్ల కోరిక ఎక్కువగా ఉంటే వైశ్యస్వభావమనీ, స్వయం స్ఫూర్తి తక్కువగా ఉంటే శూద్రస్వభావమనీ విభాగం చేశారు.
ఇంతవరకూ బాగానే ఉంది. పుట్టిన ప్రతి మనిషి వర్ణాన్ని ఎలా నిర్ణయించాలి? ఏదో ఒక లేబొరేటరీలో పరీక్షించి అతని స్వభావాన్ని కొంతకాలం గమనించి ఫలానా వర్ణమనీ నిర్ణయించే ప్రక్రియ ఉంటే తప్ప పేచీ వస్తుంది. తండ్రి సత్త్వగుణం కలవాడు కావచ్చు. కానీ అతని పిల్లలకు ఆ స్వభావం లేకపోవచ్చు. ఈ ప్రశ్న ఈనాడు మనమెంత తీవ్రంగా వేస్తున్నామో మహాభారతంలో కూడా అంతే ఉద్వేగంగా చర్చించారు. మనందరికీ తెలిసిన యక్షప్రశ్నలు, నహుష ప్రశ్నలు, ధర్మవ్యాధుని కథలలో ఎవరు బ్రాహ్మణుడు అన్నది ఒక ముఖ్య ప్రశ్న. వేదవ్యాసుడు నిర్మొహమాటంగా ఫలానా గుణాలున్న వాడే బ్రాహ్మణుడు, అవి లేనివాడు కాడు అని అనేకచోట్ల చెప్పాడు. భారతం మొత్తానికి సంస్కృతంలో వ్యాఖ్య వ్రాసిన నీలకంఠ పండితుడు మొదలైనవాళ్లు కూడా గుణాలకే ప్రాధాన్యమిస్తూ ఆయా గుణాలున్న వాణ్ణే బ్రాహ్మణుడనాలి, అవి లేనివాడు శూద్రుడే అని చెప్పారు. ఒక వర్ణాన్ని నిర్వచిస్తూ ఏ గుణాలు చెప్పారో అవి ఎవరిలో ఉన్నా, ఏ జాతిలో పుట్టినా అతన్ని ఆ వర్ణం వాడిగా గుర్తించాలి అని సూటిగా చెప్పారు. భాగవతంలోని 11వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని వ్యాసుడు మళ్ళీ చెప్పాడు. బ్రాహ్మణుల్లోని తపోబలం సన్నగిల్లినవాళ్లు, ఇంద్రియ సుఖాలకు అలవాటు పడ్డవాళ్ళు, క్షత్రియులుగా మారారనీ, మరికొందరు సేవాస్వభావం కలవారు శూద్రులుగా మారారనీ శాంతిపర్వం 188వ అధ్యాయం చెబుతుంది.
వేదాల్ని గమనించినా ఇలాంటి స్పష్ట అభిప్రాయమే కనిపిస్తుంది. శుక్లయజుర్వేదానికి చెందిన బృహదారణ్యక ఉపనిషత్తు (1411) లో ఇలా చెప్పారు- సృష్టిలో మొదట అందరూ బ్రాహ్మణులే. అది సమాజం అవసరాల్ని తీర్చలేకపోవడం వల్ల క్షత్రియవర్ణం అనేది ఏర్పడింది. అంటే ఇతరుల దాడుల్ని ఎదుర్కోవడం అవసరమైంది. పై రెండు కూడా సమాజాన్ని పూర్తిగా నిర్మించలేకపోయాయి. కాబట్టి వైశ్య అనే వర్ణం ఏర్పడింది. అంటే సంపదను సృష్టించే విభాగం ఒకటి ఉండాలి. పై మూడూ ఉన్నా వ్యవస్థ పూర్తి కాకపోవడం వల్ల శూద్ర అనే వర్ణం వచ్చింది. దీన్ని ఉపనిషత్తులో ‘పూష’ అన్నారు. అంటే అన్ని ప్రాణాలను పోషించేది అని దీని అర్థం. మనం ఈనాడు రైతును అన్నదాత అన్నట్లు.
పై చెప్పిన విధంగా వ్యక్తిని పరీక్షించడానికి ఎలాంటి లేబొరేటరీ వ్యవస్థ చేయలేం కాబట్టి ఆయా వర్ణాలవారు క్రమక్రమంగా తమ తండ్రి తాతలకు సంబంధించిన పనుల్నే కొనసాగించడ వల్ల వర్ణవ్యవస్థ కాస్తా కులవ్యవస్థగా మారింది. ప్రాచీన సమాజమంతా గ్రామీణ సమాజం. ప్రతి గ్రామం ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి గలదిగా ఉండేది. గుడ్డలు నేయడానికొకరు, వ్యవసాయ పనిముట్లు చేసేవారొకరు, బంగారు పనిచేసే వారొకరు ఇలా ఆయా వృత్తులు చేసే వాళ్లు తమ పిల్లలకు ఆ వృత్తుల్లోని మెళకువల్ని నేర్పడం వల్ల అలాంటి వాళ్లందరూ ఒక కులంగానే ఏర్పడ్డారు. పక్క గ్రామంలోని వ్యక్తికి అమ్మాయిని ఇవ్వాలన్నా ఆ నైపుణ్యం ఉన్న వ్యక్తికే ఇచ్చారు. ఇలాగ కులవ్యవస్థ ఏర్పడింది. ఇలా ఉన్నప్పటికీ వారు ఆయా కులాలకే పరిమితం కాలేదు. క్షత్రియులే కాకుండా యుద్ధాలు చేసి రాజ్యాలని స్థాపించిన అనేక కులాల్ని మనం చరిత్రలో చూడగలం. అందుకే కులాలెన్ని ఉన్నా సమాజంలో సమస్యలు రాలేదు. పండుగల్లో, ఉత్సవాల్లో అందరూ అవసరమే, అందరూ భాగస్వాములే.
బ్రిటీష్‌ కాలం వరకూ పై వ్యవస్థ సమాజ భద్రతకు సమస్య కాలేదు. విభజించి పాలించే సిద్ధాంతం, మతమార్పిడి అనే లక్ష్యంతో బ్రిటీష్‌ వారు మన సమాజాన్ని ఎన్ని విభాగాలుగా చేయవచ్చు అని పరిశీలించి మొదటిసారిగా కులాలన్నింటినీ లెక్కించి ఐదారు వేలల్లో ఉన్నట్లు నిర్ధారించారు. ఆ తర్వాత కొన్ని వర్గాలలో తాము అణగదొక్కబడిన వారమనే భావన(ఠిజీఛ్టిజీఝ ఝ్ఛుఽ్ట్చజూజ్టీడ)ని తీవ్రంగా సృష్టించారు. మన చరిత్రలో ఉన్న మంచిని దాచడం, చెడును మాత్రం పెద్దగా చేసి చూపడం వల్ల మన సంస్కృతిపై ద్వేషం కలిగించడమే వీరి ఉద్దేశం.
సమాజంలో మార్పును గుర్తించి మన మత గురువులు చాలామంది సమాజంలోని మార్పుకనుగుణంగా స్మృతుల్ని సవరించి వ్రాయాలని సూచించారు. ఇటీవలే సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ఆలోచన ప్రకారం మహామహోపాధ్యాయ, పద్మశ్రీ బిరుదు పొందిన శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వ్రాసిన ‘కౌండిన్యస్మృతి’ అనే పుస్తకం ఇందుకు ఉదాహరణ. ఈ పుస్తకం మన రాజ్యాంగ విలువలకు అద్దం పట్టడం చూడగలం. అస్పృశ్యత, కులం, వర్ణం మొదలైన విషయాలపై ఉపనిషత్తుల సిద్ధాంతం. మన రాజ్యాంగ సిద్ధాంతం రెండూ ఒకటే. మార్పు అంటే బ్రాహ్మణుడు తన విధుల్ని, ధర్మాన్ని మానేయాలని అర్థం కాదు. సమాజంలో అందరినీ అందులో భాగస్వామ్యులుగా చేయాలని అర్థం.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తూ సమాజాన్ని కలిపే శక్తులు తక్కువగా ఉండటం వల్లా, విభజించే శక్తులే ఎక్కువగా ఉండటం, ఆ తర్వాత ఓటుబ్యాంకు రాజకీయం వల్లా కులాలు మరింత పటిష్టంగా తయారయ్యాయి. అందరూ కులవ్యవస్థను తీవ్రంగా విమర్శించేవారే కానీ కులపు గోడలు మాత్రం మరింత గట్టిగా కట్టుకున్నారు. ఇది మన సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి. మిగతా సంస్కృతుల వాళ్ళు విమర్శించడానికున్న ఒక ముఖ్యమైన అంశం. ఒక్కొక్క కులాన్ని ఆకర్షించడానికి ఒక్కో ఊ్యహంతో మతమార్పిడులు చేయబూనడం దేశభద్రతకు మరొక సమస్య.
భారతీయ సంస్కృతి గూర్చి పని చేస్తున్న వ్యవస్థలు అస్పృశ్యతపై ఎలా స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందో అలాగే కుల నిర్మాణంపై కూడా స్పష్టత, విధాన పరమైన నిర్ణయం ఇవ్వడం ఈనాడు చాలా ముఖ్యం. అస్పృశ్యత ఎలాగ మన భారతీయ మత గ్రంథాల్లో లేదో కులాలు కూడా మత గ్రంథాల్లో లేవు. మనిషి స్వభావం ఆధారంగా చెప్పబడిన వర్ణం వేరు, మనమిప్పుడు చూస్తున్న కులం వేరు. ఈ అంశంపై విధానపరమైన ఒక నిర్ణయాన్ని ధర్మ సంసద్‌, సాధుపరిషత్‌ మొదలైన వ్యవస్థల ద్వారా అందించటం చాలా అవసరం.


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Click here to Reply, Reply to all, or Forward
10.55 GB (70%) of 15 GB used
©2015 GoogleTermsPrivacy
Last account activity: 11 hours ago

Details

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వీరమ్మ తల్లి తిరునాళ్ళు

సాహితీ బంధువులకు శుభకామనలు -ఉయ్యూరు వీరమ్మ తల్లి పేరంటాళ్ళు తిరునాళ్ళు ఈరోజు మాఘ శుద్ధ ఏకాదశి 30 1-15 శుక్రవారం నుండి 13-2-15 శుక్రవారం  వరకు 15 రోజులు వైభవం గా జరుగుతాయి .ఈ రోజు రాత్రి అమ్మవారు   ఊరేగింపు గా అత్త వారింటి నుంచి బయల్దేరి శనివారం రాత్రికి ఆలయ ప్రవేశం చేస్తుంది .11  వ రోజు  సిడి బండీ  ఉంటుంది   -దుర్గాప్రసాద్

Inline image 1Inline image 2

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment