అక్రమార్కుల పాలిటి రుద్రకళ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి

గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి

స్పానిష్ మహిళ

‘’సంస్కార ‘’సినిమా పేరు వినగానే అందులోని కదా నాయిక స్నేహలతా రెడ్డి జ్ఞాపకం వస్తుంది .ఇందిర ఎమర్జెన్సీ లో చనిపోయిన స్నేహలత గుర్తొస్తుంది .పఠాభి భార్య అని తెలుస్తుంది .ఆమె జననం మనదేశం కాదని వింటే ఆశ్చర్యమూ వేస్తుంది .నాట్యం ,బాలల అభ్యుదయం ,ప్రగతి శీల స్వభావం  నటనా  అన్నిటికి మించి ఆప్యాయతా మూర్తీభవించిన స్నేహలతా రెడ్డి ఆరేబియా దేశంలో ఆడెన్ నగరం లో సంపన్నస్పానిష్  క్రైస్తవ కుటుంబం లో 1934లో జన్మించింది .పేరు స్నేహలతా పావెల్ .ఆమె తండ్రి రాయల్ ఆర్మీ సర్వీస్ కోర్ లో మేనేజర్ .

నేర్చిన నాట్య రీతులు

జబల్పూర్ లో ప్రాధమిక విద్య పూర్తీ చేసి  మద్రాస్ లో చదివి డిగ్రీ పాసైంది .బెంగుళూరు లో కదక్ నృత్యాన్ని సోహన్ లాల్ దగ్గర ,భారత నాట్యాన్ని మీనాక్షి సుందరం ఎల్లప్ప  ల వద్ద అభ్యసించి మెరుగులు దిద్దుకొంది .ఈ రెండు నాట్యాలలో గొప్ప ప్రావీణ్యం సాధించి దేశ వ్యాప్తంగా పర్యటించి అనేక ప్రదర్శనలిచ్చి ప్రతిభా పాటవమూ ప్రదర్శించి మెప్పునూ పొందింది .పాశ్చాత్య నృత్య రీతులనూ తెలుసుకోవాలనే కాంక్ష ఆమెకు బాగా ఉండేది .అందుకోసం స్పెయిన్ దేశం వెళ్లి రెండేళ్ళు ఉండి వివిధ  పాశ్చాత్య నృత్య విధానాలను నేర్చి ఆకళింపు చేసుకొన్నది .

నాటక సమాజం –ప్రదర్శనలు

1959లో మద్రాస్ కు తిరిగి వచ్చి స్థిర పడింది .అక్కడి కళా కారులను సమీకరించి ‘’మద్రాస్ ప్లేయర్స్ ‘’అనే నాటక సమాజాన్ని నెల కోల్పింది .చాలా నాటక ప్రదర్శనలిచ్చి గుర్తింపు పొందింది. ఇబ్సన్ రాసిన ‘’పీర్ జ్యంట్ ‘’,షేక్స్పియర్ రచించిన ‘’ట్వెల్ఫ్త్  నైట్’’,టేన్నీసీ విలియమ్స్ రాసిన ‘’నైట్ ఆఫ్ ది ఇగూనా ‘’మొదలైన నాటకాలను ప్రదర్శించి పేరు తెచ్చుకోంది .ప్రసిద్ధ దర్శకులు డగ్లాస్ అల్జీర్స్ పీటర్ కో  వీటికి దర్శకత్వం వహించారు . తానూ స్వయంగా నటించి డైరెక్ట్ చేసిన నాటకాలలో ముఖ్యమైనవి –‘’ఏ వ్యూ ఫ్రం దిబ్రిడ్జ్ ‘’,’’దిహౌస్ ఆఫ్ బెర్నార్డా అలబా ‘’మొదలైనవి ఉన్నాయి.

తిక్కవరపు తో పెళ్లితో అయిన  –ఆంధ్రా కోడలు

.  .నెల్లూరుకువాసి తిక్కరపు పటాభి రామ రెడ్డి  అనేకవి సంపన్నుడు సామాజిక సేవకుడు స్నేహలతను వలచి వలపింప జేసుకొని ,ఆమెకోసం ఆస్తినీ త్యాగం చేసి  పెళ్లి చేసుకొన్నాడు  .అప్పటి నుండి స్నేహలతా రెడ్డి అయింది .వీరికుమారుడు కోణార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్య కారుడు .కూతురు నందనా రెడ్డి కార్మిక న్యాయ వాది,సంఘ సేవకురాలు .అప్పటికే రెడ్డి ‘’పఠాభి ‘’పేరు తో అభ్యుదయ వాద సంచలన  కవిత్వం రాసి ప్రాచుర్యం పొందాడు .ఛందస్సు ను అటకెక్కించి చిన్నయ సూరికి పాడే కట్టించి ,కొత్త సంప్రదాయాలతో కవిత్వం లో దూసుకు పోయాడు .‘’ఫిడేలు రాగాల డజన్ ‘’పఠాభి పంచాంగం ‘’లతో’’ పన్ ‘’(శ్లేష)ను పండించాడు .భర్త మార్గం లోనే స్నేహలత నడిచింది అభ్యుదయ భావాల తో మమైకం అయింది .

సంస్కార

పఠాభి కన్నడ భాషలో ‘’సంస్కార ‘’అనే గొప్ప చలన చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించాడు .దీనికి ఆధారం   జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత యు. ఏ .అనంత మూర్తి  రాసిన సంస్కార నవల . అందులో స్నేహలత నాయిక పాత్ర పోషించింది .  గిరీష్ కర్నాడ్  . ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది .రాష్ట్ర పతి స్వర్ణకమలం అవార్డు తో బాటు అంతర్జాతీయ ప్రశంసలూ దక్కాయి .రెండవ సినిమా’’సోనే కంసారి ‘’ఒ నటించింది భర్త దర్శ కత్వం లో .ఆ సినిమా స్నేహలత మరణానంతరం 1977 లో విడుదలైంది .పఠాభి –చండ మారుత ,శృంగార మాస, దేవర కాడుకన్నడ  సినిమాలు కూడా తీసి డైరెక్ట్ చేశాడు .తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు , శ్రీకృష్ణార్జున యుద్ధం భాగ్య చక్రం సినిమాలు నిర్మించాడు .పఠాభి ని ”ఫాదర్ ఆఫ్ పారలల్ సినిమా ” సంబోధిస్తారు గౌరవంగా

సోషలిస్టు స్నేహలత-పౌరహక్కుల ఉద్యమం

స్నేహలత పై సోషలిస్ట్ నాయకుడు రామ మనోహర్ లోహియా ప్రభావం పడింది .ఆ భావాలకు ఆకర్షితురాలైంది .లోహియా నడుపుతున్న ‘’మ్యాన్ కైండ్’’మాస పత్రిక సంపాదక వర్గ సభ్యురాలైంది .పత్రిక ప్రచురణ బాధ్యతను స్వయం గా నిర్వహించి సోషలిస్టు భావ వ్యాప్తికి దోహద పడింది . ప్రసిద్ధ సోషలిస్ట్ నాయకుడు కార్మిక సంఘాల నేత జార్జి ఫెర్నాండెజ్ కు అత్యంత సన్నిహితురాలైంది స్నేహలత .ఈ సాన్నిహిత్యమే ఆమె మరణానికి దారి తీసింది .’’పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ‘’ను భార్యా భర్తలు స్థాపించి పౌరహక్కుల ఉద్యమాన్ని సోషలిస్ట్ పంధాలో నడిపారు .

 

పత్రికా వ్యాసంగం –

స్నేహలత ‘’ఫోకస్ ‘’అనే రాజ కీయ పత్రికను ,’’బాలల కోసం ‘’మ్యూజిక్ గార్డెన్ ‘’అనే బాల మాస పత్రికలను కూడా తన సంపాదకత్వం లో వెలువరించి తనకు ,ఆ పత్రికలకూ చిర కీర్తి నార్జించింది .

గౌరవ స్థానం

1956-57లో మద్రాస్ లో బాల నేరస్తుల కోర్టుకు ‘’గౌరవ మాజిస్త్రేట్ ‘’గా వ్యవహరించింది .1964 బ్రిటిష్ రాణి ఎలిజబెత్ భారతదేశం లో పర్యటిస్తూ మద్రాస్ వచ్చినప్పుడు స్నేహలత వ్యాఖ్యాతగా పని చేసింది .1967-68కాలం లో మద్రాస్ ఫిలిం సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా ఉంది .

ఎమర్జెన్సీ లో వీరమరణం

1977 లో ఇందిరా గాంధితన ప్రాబల్యం కోసం  దేశం లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీ ని వ్యతిరేకించిన జయప్రకాష్ నారాయణ ,అటల్ బిహారీ వాజ్ పాయ్ లాల్ కృష్ణ ఆద్వానీ ,ఫెర్నాండెజ్   మధు దండా వతే ,స్నేహలతా ,పఠాబి  మొదలైన వారందరినీ అరెస్ట్ చేసి జైలు లో పెట్టించిన చీకటి రోజులు మనకు ఇంకా గుర్తు ఉంది .ఆ చీకటి రోజుల్లో ఆ రాక్ష ప్రభుత్వం స్నేహలత   కుటుంబాన్ని  కూడా జైలు లో పెట్టి ఎన్నో ఇబ్బందుల పాలు చేసింది .ఫెర్నాండెజ్ పై బరోడా డైనమైట్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు .ఫెర్నాండజ్ తో సాన్నిహిత్యం ఉన్నందున స్నేహలతనూ ఆ కేసులో ఇరికించారు .కాని ఫైనల్ చార్జి షీట్ లో స్నేహలతపేరు లేదు .అయినా ఆమెను బెంగుళూరు  జైలు లో నానా ఇబ్బందీ పెట్టారు .మనుషులు ఉండలేని పరమ దారుణమైన గదిలో ఆమెను ఉంచారు. అసలే అతి సున్నితం గా ఉండే ఆమె దీర్ఘకాలంగా ఉబ్బస వ్యాధితో బాధ పడుతూ  ఇవి తట్టుకో లేక పోయింది .ఆమె జైలు లో ఉండగానే అనారోగ్యం పెరిగిపోయింది .లంగ్స్ కు ఇన్ఫెక్షన్ సోకింది . .సమయానికి తగిన వైద్య సేవలను ప్రభుత్వం అందించ లేదు .ఆరోగ్యం విపరీత్ర్హం గా క్షీణించి పెరోల్ పై15-1-1977న విడుదల అయింది .అదే జైలు లో మరో సోషలిస్ట్ నాయకుడూ మాజీ రైల్వే మంత్రి మధు దండావాతే కూడా ఉన్నారు .స్నేహలత శ్వాస పీల్చుకోలేక పడుతున్న బాధ  అంతా ఆయనకు వినిపించేదని జ్ఞాపకాలలో రాశాడు .సరిగ్గా అయిదు రోజుల తర్వాత 20-1-1977 నస్నేహలతా రెడ్డి అసువులు బాసింది .  ఇందిరా ఎమర్జన్సీ బాధితులలో అసువులు బాసి వీర మరణం పొందిన మొదటి బాచీ నాయకులలో స్నేహలత ఒకరు .

పఠాభి నివాళి

2003పఠాభి అరవిందుని సావిత్రి కావ్యాన్ని ఆధారం గా చేసుకొని ‘’ఇన్ దిఅవర్ ఆఫ్ గాడ్ ‘’అనే నాటకం రాసి భార్య స్నేహలతకు అంకితమిచ్చాడు .ప్రేమ కోసం యముడినే ఎదిరించిన సావిత్రి తో స్నేహలతను పోల్చిరాశాడు.

మనవి- దాదాపు వారం రోజులుగా నేను మహిళామతల్లుల పై రాసిన పదికి పైగా వ్యాసాలన్నిటికి ఆధారం –శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురించిన ‘’20  వ శతాబ్దపు తెలుగు వెలుగులు (ఒకటి రెండు భాగాలు ) తెలుగు విజ్ఞాస సర్వస్వం ,వీకీ పీడియాలు  అని మనవి చేస్తున్నాను .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

తులసీ దాస దాసి –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి, దుఃఖ భాగినుల పాలిటి కల్ప తరువు –ముత్తా ఆండాళమ్మ

తులసీ దాస దాసి  –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి

తెలుగు హిందీ భాషలలో సవ్య సాచిలాగా కవిత్వం అల్లిన దిట్ట శ్రీమతి నేల నూతుల పార్వతి .మర్మావుల సుబ్రహ్మణ్యం ,లక్ష్మీ నరసమ్మలు తలిదండ్రులు .1922లో సనాతన బ్రాహ్మణ సంప్రదాయం లో జన్మించారు .పదకొండేళ్ళకే నెల్లూరు వాసి నేల నూతుల  కృష్ణ మూర్తిగారి తో వివాహమై పార్వతీ కృష్ణ మూర్తి అయ్యారు .పెళ్లినాటికి పార్వతి చదువు మూడవ తరగతిమాత్రమే .

Inline image 2

భర్త కృష్ణ మూర్తి గారిచ్చిన ప్రోత్సాహం తో రెట్టింపు ఉత్సాహం తో ,ఆమె ఆయన గురుత్వం లోనే హిందీ తమిళ ,తెలుగు సాహిత్య మధనం చేశారు .తులసీ దాసు అంటే విపరీతమైన అభిమానం ఆమెకు. ఈ ఆరాధనా భావం తోనే ఆయన రచించిన ‘’శ్రీ రామ చరిత మానస’’ ను సరళ సుందర మైన శైలిలో తెలుగులోకి ‘’శ్రీరామ చరిత మానసామ్రుతం ‘’గా అనువాదం చేసి ,1961లో ప్రచురించారు..అంతేకాదు తన కలం పేరును ‘’తులసీ దాస దాసీ ‘’అని పెట్టుకొని ఆయనపై ఉన్న అనన్య భక్తీ ప్రపత్తులను తెలియ జేసుకొన్నారు .దీనితో ప్రముఖ ఆంద్ర కవయిత్రుల సరసన స్థానం పొందారు .తన పేరును ఎప్పుడూ అజ్ఞాతం గానే ఉంచుకొని ‘’తులసీ దాస దాసీ ‘’పేరుతోనే రచనలు చేశారు .

ప్రాచీన తెలుగు భాషలోని సంప్రదాయాలను అవగాహన చేసుకొని ,వచన రచనలో కొత్త మార్గాలలో ప్రయాణించారు .ధ్వని ప్రాధాన్యం ఉన్న పలుకు బడులతో ,సలక్షణ భాష తో భావ గాంభీర్య మున్న చిక్కని చక్కని వచనాన్ని రాశారు .భాషకు కొత్త సోయగాన్ని ,అందాన్ని అలంకారాన్ని సంతరించారు .చమత్క్రుతికి ప్రాధాన్యం ఇచ్చారు .కాశ్మీరీ భాషలో ప్రముఖ కవి మాలిక్ మొహమ్మద్ జాయ్సీ రాసిన ‘’పదుమావత్’’అనే హిందీ గ్రంధాన్ని ‘’పద్మావతి ‘’గా తెలి గీకరించారు .’’పవిత్ర గోదావరి ‘’మోనోగ్రాఫ్ రాశారు .దీన్ని బెంగుళూర్ లోని ఇండియన్ బుక్ హౌస్ ముద్రించింది .

తీరిక ఉన్నప్పుడు ‘’కల్కి ‘’,’’ఆనంద  వికటన్ ‘’తమిళ పత్రికలూ చదివి ఆ భాషలో వస్తున్న రచనలను ఆకళింపు చేసుకొనే వారు .పెళ్లి నాటికి మూడవ తరగతిమాత్రమే చదివిన పార్వతీ స్వయం కృషితో ఇంత సాహిత్య మధనం చేసి అపూర్వ సాహిత్యాన్ని సృజన చేసి అబ్బుర పరచారు .కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ భర్తకు చేదోడు వాదోడుగా సాయపడుతూ ,ఆదర్శ గృహిణి అయ్యారు .రోజూ నృత్యం ,సంగీతం ,సాహిత్యం చరిత్ర పరిశోధనలో భర్త కృష్ణ మూర్తిగారు క్షణం తీరిక  లేకుండా ఉండేవారు .ఆయన బహుముఖీన వ్యాసంగానికి ఏ మాత్రం భంగం కలుగ కుండా ,ఇతోధిక సహకారం అందజేసి భర్త ఔన్నత్యానికి వన్నె తెస్తూ నిజ ధర్మ పత్ని అనిపించుకొన్నారు .20-10-1993నఎనభై ఒక్క సంవత్సరాల వయసులో భర్తచేతుల మీదుగా శ్రీమతి  పార్వతీ కృష్ణ మూర్తి పరమ శివ సాన్నిధ్యం చేరారు .

దుఃఖ భాగినుల పాలిటి కల్ప తరువు –ముత్తా ఆండాళమ్మ

Inline image 3

పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలియని సౌజన్య మూర్తి ముత్తాఆండాలమ్మ గారు 1923లో ఒక చిన్న ఇంట్లో ఏడుగురు బాలికల తో తమళనాడులో మద్రా స్ నగరం లో   ఏర్పాటు చేసిన సేవాసదనం ఇంతింతై పెరిగి అనాధ బాలికల పాలిటి వట వ్రుక్షమైంది .దుఃఖ భాగినులైన స్త్రీలను సాంత్వన పరచి స్వయం కృషితో వారు  జీవించాలి అన్న  ముందు చూపుతో ఆమె ఏర్పరచిన సేవాసదనం ఇది .ఒక శరణాలయం గా విద్యాలయం గా  వృద్ధి చెందింది .తమిళ నాడుకే శ్రీలంక బర్మా దేశాల నుండి కాక ఇతర రాష్ట్రాలనుంచి , వచ్చి చేరే బాలికలకు ఆశ్రయ స్థానమైంది .విద్యతో బాటు చేతిపని కూడా నేర్పే ఏర్పాటు జరిగింది .గిల్టు పూత ,లక్క పూత ,ఎలక్ట్రికల్ దీపాలకు రంగు రంగుల డోమ్ లను ఏర్పాటు చేయటం ,పట్టు గుడ్డలతో షెడ్ లు కల్పించటం ఇక్కడ నేర్పించేవారు .కుట్టుపని ,అల్లిక ,జలతారు నగిషి ,దుస్తుల తయారీ  ఫేం కుర్చీలు అల్లటం అన్నీ కొత్త విధానాలలో విద్యార్ధినులకు నేర్పుతున్నారు .

ఈ సేవాసదనం ఆదర్శ ప్రాయం గా నడవటం చూసి మెచ్చుకొన్న దాతలు స్వయం గా ముందుకు వచ్చి ఆర్దికసాయమేకాకుండా వనరులను కూడా కల్పించి అభివృద్ధికి చేయూత నిస్తున్నారు .ఇందులో పని చేసే ఉపాధ్యాయినులు ఆదర్శం గా అంకిత భావం తో పని చేసి విద్యార్ధినులను తీర్చిదిద్దటం ఇక్కడి ప్రత్యేకత .ఇప్పుడు పాతిక మంది ఉపాధ్యాయినులు ఇక్కడ పని చేస్తున్నారు .వారి వసతి భోజనం జీతాలు అన్నీ సేవాసదనమే భరిస్తుంది .ఈ నాడు రెండు వందల పది మంది విద్యార్ధినులకు ఆశ్రయం గా ఉంది .తమిళ నాడు మొత్తం మీద ఇలాంటి సంస్థ ఇదొక్కటే నని అంటారు .పాసశ్చాత్య దేశాలనుండి కూడా ఆర్ధిక సాయం అందుతోంది ఇప్పుడు .విద్యార్ధుల ఆర్ధిక స్థాయిని బట్టి రుసుము వసూలు చేస్తారు .ఏమీ లేని వారికి అన్నీ ఉచితం గానే ఏర్పాటు చేసి ఆదుకొంటారు .నిజానికి వీరి సంఖ్యే బాగా ఎక్కువ . ఇలాంటి  వారికి సేవ చేయటానికే ఆండాళమ్మ గారు దీన్ని ఏర్పాటు చేశారు కదా .

వీరి భర్త  జస్టిస్ ముత్తావెంకట సుబ్బా రావు గారు మద్రాస్ లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన సేవాసదనం ఇది .దిక్కులేని మహిళలను ఆదుకోవటమే ధ్యేయం .అ నాటి గవర్నర్ జనరల్,మద్రాస్ గవర్నర్ భార్యలు దీనిపై ప్రత్యెక శ్రద్ధ తీసుకొని నిర్వహణ కు అన్నివిధాలా సహాయం అందించేవారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన –కోటికల పూడి సీతమ్మ,రాత్రి పాఠ శాల నడిపిన -జయంతి సూరమ్మ

వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన  –కోటికల పూడి సీతమ్మ

Inline image 1

అబ్బూరి వారి ఇంటి ఆడపడుచు ,కోటికలపూడి వారింటి కోడలు అయిన సీతమ్మగారు 1874లో పుట్టారు .భర్త కోటికలపూడి రామారాగారు .భర్త రాజమండ్రిలో ఉద్యోగి అయినందున కాపురం అక్కడే పెట్టారు .అప్పుడే ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీర్శ లింగం పంతులుగారి శిష్యరికం చేసింది వారి వద్దనే తెలుగు నేర్చుకొన్నది కవితా ప్రతిభా పంతులుగారి ఆశీర్వాద బలం తో అబ్బింది .వీరేశ లింగం గారి జీవిత చరిత్రను పద్య కావ్యం గా సీతమ్మ గారు రాసింది .రాణి అహల్యాబాయి జీవిత చరిత్రను కూడా కావ్య బద్ధం చేసింది .

సీతమ్మ గారు ‘’సాదు రక్షక శతకం ‘’,’’ఒక మహమ్మదీయ వనిత ‘’అనే కరుణ రస భరిత పద్య రచన చేసింది .చిన్నకావ్యాలలో ఆమె రాసిన ‘’లేడీ జేన్ గ్రే ‘’పేరు పొందింది .తానూ వివిధ సందర్భాలో  వైవిధ్య విషయాలపై చేసిన ఉపన్యాసాలను సేకరించి ఒక సంపుటిగా ప్రచురించింది .1913లో బాపట్ల ఆంద్ర మహిళా సభకు అధ్యక్షురాలై సేవలందించిందిజీవిత చరమాంకం లో పిఠాపురం మహా రాణి చిన్న మాంబ గారికి విద్య నేర్పే అరుదైన అవకాశం పొందింది ఈ విధం గా ఆ ఆస్థాన గురు పీఠం అలంకరించి గౌరవం పొందింది .వీరేశ లింగం గారి అంటే వాసిగా జీవిస్తూ స్త్రీ సంక్షేమం కోసం అవిరళ కృషి చేసింది . అరవై రెండేళ్ళు మాత్రమె జీవించిన సీతమ్మగారు 1936లో మరణించింది .

రాత్రి పాఠశాల నడిపిన -జయంతి సూరమ్మ

శ్రీకాకుళం జిల్లా కవట అగ్రహారం లో 1887లో సీతారామయ్య ,కనకమ్మ దంపతులకు జన్మించారు .ఎనిమిదవ ఏట బరంపురం వాస్తవ్యుడు జయంతి వెంకట నారాయణ గారితో సూరమ్మ గారి వివాహం జరిగింది .ఇద్దరూ శుద్ధ శ్రోత్రియ  కుటుంబీకులే .భర్త తన పందొమ్మిదవ ఏట బ్రహ్మ సమాజం లో చేరారు .బంధువులు అడ్డు చెప్పినా వినలేదు .భర్తతో బాటు సూరమ్మ గారు కూడా  బ్రహ్మ సమాజం లో చేరి ఊరూరా తిరిగి ప్రచారం చేసేవారు .ఇద్దరూ రాజమండ్రిలో  స్థిర పడి వీరేశలింగం గారి ప్రభావానికి లోనైనారు .వారి నుండి సంస్కారం ,సంఘ సంస్కరణ నేర్చుకొన్నారు .

దంపతులు కలకత్తా వెళ్లి సాధన ఆశ్రమం లో శిక్షణ పొంది ,కాకినాడ లో పిఠాపురం రాజ స్థాపించిన ‘’బ్రహ్మ మందిరం ‘’,అనాధ శరణాలయాలను నిర్వ హించే బాధ్యత తీసుకొన్నారు .హరిజన సేవ చేస్తూ ,వారి విద్యకై కృషి చేశారు . చెన్నై వెళ్లి అక్కడ ప్రచారకులుగా ఉండి రాత్రి పాఠశాలలు నడిపారు .రామ మోహన రాయ్ పేరుతొ ఒక లాడ్జి నీ నడిపారు  .బ్రహ్మ సమాజ యువకులకు ఇది విశ్రాంతి భవనం గా ఉండేది .వేశ్యా వ్రుత్తి నిర్మూలన కార్య క్రమంలో సూరమ్మ గారు ప్రత్యెక శ్రద్ధ తీసుకొన్నారు .అనిబి సెంట్ ప్రభావానికి లోని సభ్యులై కాంగ్రెస్ సమావేశాలకు హాజరైనారు .

సూరమ్మ గారు పిల్లల చదువులకోసం బరంపురం వెళ్ళారు .ఇంగ్లీష్ చదువులపై విరక్తి కలిగి తమ పిల్లలను చదువు మాన్పించారు .వ్రుత్తి విద్య నేర్పే జాతీయ విద్యాలయం లో చేర్పించారు .భర్త ‘’హ్యుమనిటి ‘’అనే ఆంగ్ల వారపత్రిక నిర్వహించేవారు .దానిలో హిందీలో వ్యాసాలూ రాసేవారు సూరమ్మ గారు .విదేశీ వస్త్రా బహిష్కరణ ఉద్యమం లో చేరి తన ఇంట్లోని విదేశీ వస్త్రాలన్నీ తగల బెట్టారు .రాట్నాలు ,యేకులు కొని కొని ఊరంతా పంచిపెట్టారు .అప్పుడు ఊరు ఊరంతా రాట్నాల సవ్వడే వినిపించేది. సూరమ్మ గారు నూలు వడకటం లో ప్రవీణురాలు .అతి సన్నని నాజూకైన నూలు తీసి బట్టలు తయారు చేయించేవారు ప్రతి ఇంటికి ఖద్దరు బట్టలను తీసుకొని వెళ్లి అమ్మేవారు .

1922లో బరంపురం కాంగ్రెస్ సభలో పాల్గొన్నారు .భర్త ,ఆయన సోదరులు అరెస్టయ్యారు .అయినా భయపడక ఖాదీ ప్రచారం చేస్తూ ఖాదీ బట్టలు అమ్మేవారు .’’కల్లు మానం డోయ్ బాబూ’’ అంటూ కల్లు  దుకాణాల వద్ద పికెటింగ్ చేసేవారు .తాగుడు వల్ల వచ్చే అనర్ధాలను తెలియ జేస్తూ పాటలు రాసి పాడి ప్రచారం చేశారు .తాగు బోతుల వెకిలి చేస్టలను ప్రాహసనాలుగా చేసి వారిముందే ప్రదర్శించి బుద్ధి తెచ్చుకోనేట్లు చేసి వారితో నే  స్వయం గా ఒట్టు వేయించి  కల్లుజోలికి పోము అని శపథం చేయించే వారట. ఆమె మాట మీద అంట గౌరవం అన్నమాట.ప్రాక్టికల్ మనిషి అని రుజువు చేసుకొన్నారు .

బరంపురం లో జాతీయ విద్యాలయం స్థాపించి తమ పిల్లలను అందులోనే చదివించారు .జీతం, భత్యం లేని కాంగ్రెస్ వాలంటీర్ గా చాలా చురుకుగా పని చేశారు భర్త అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు పిల్లల చదువుచూస్తూ  వారిని తీర్చి దిద్దుకోవటం లో శ్రద్ధ వహించేవారు .’’మా కొద్దీ తెల్ల దొరతనం ‘అనే గరిమెళ్ళ వారి గీతాన్ని ఊరూరా తిరిగి పాడుతూ ప్రబోధించి దేశ భక్తీ రగుల్కొల్పేవారు .ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని ఆరు నెలలు కఠిన జైలు శిక్ష అనుభవించారు .జైలులో కనీస వసతులకోసం పోరాటం జరిపారు .విడుదల అవగానే మళ్ళీ ఉత్సాహం గా ఉద్యమాలు నడిపారు .కాంగ్రెస్ విరాళాల కోసం జోలె పట్టి మిగిలిన వారినీ సంఘటిత పరచి గ్రామాలు తిరిగి చందాలు వసూలు చేసి పార్టీకి సమర్పించేవారు .’’గాంధీ టోపీనే జోలెగా’’వాడి కొత్త తరహా జోలెకు దారి చూపారు .తెలుగు హిందీ ఒరియా భాషల్లో పాటలు రాసి ప్రచారం చేసేవారు .ప్రజలను బాగా ఉత్తేజితులను చేయటం లో సూరమ్మ గారికి  గొప్ప చాకచక్యం ఉండేది .

చదివి డిగ్రీలుపొందక పోయినా లౌకికజ్ఞానం పుష్కలం గా ఉండేది సూరమ్మ గారికి. తన పిల్లలను విద్యా వంతులను చేసి ప్రయోజకులను చేశారు .సంస్కారం ఆత్మ విశ్వాసం ఆమెకు పెట్టని ఆభరణాలు .స్వతంత్ర జీవనం పై అందరికి అవగాహన కల్పించేవారు .ఆమె కుమారులు ,అల్లుళ్ళు అందరూ స్వాతంత్ర్యోద్యమం లో పాల్గొని జైలుకెళ్ళిన వారే .అదీ ఆమె తర్ఫీదు ప్రభావం .సూరమ్మ గారి కుటుంబం అంతా దేశ సేవలో పునీతులైన వారే .మనం గర్వం గా చెప్పుకోదగ్గ చరిత్ర సాధించిన వారే .జీవితాన్ని సేవగా ,అభ్యుదయ పధం లో నడవాలన్న ధ్యేయం గా ,సంస్క్రణాభి లాషిగా   జాతీయతా స్పూర్తిగా గడిపిన సూరమ్మ గారు ఎనభై రెండేళ్ళు సార్ధకం గా జీవించి 10-2-1969న అనాయాసం గా మరణించారు. ఆమె పేరిట హైదరాబాద్ లో ఆంద్ర మహిళా సభ వారు నిర్వహిస్తున్న నర్సింగ్ హమ్ లో ఒక వార్డుకు ‘’జయంతి సూరమ్మ వార్డు ‘’అని పేరుపెట్టి గౌరవించారు .అది పది మంచాల వార్డు అందులో  జయంతి  సూరమ్మ గారి ఫోటో ఉంటుంది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆర్గానిక్ “రామారం”

 ఆర్గానిక్ రామారం

‘‘పురుగు మందులు పురుగుల్ని కాదు. మనుషుల్ని చంపుతున్నాయి. పంటపొలాలకు మితిమీరి కొడుతున్న మందుల వల్ల తినే ఆహారం రసాయనాలతో నిండిపోతోంది. ఫలితంగా ఎన్నడూ లేని పెద్ద వ్యాధులు వస్తున్నాయిప్పుడు. రైతులు, మందుల కంపెనీలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది’’ అంటున్నారు రామారంలోని ఒక మహిళా రైతు. ఆ చైతన్యం వెనక ఎంతో కష్టం ఉంది. నల్లగొండ జిల్లా గుండాల మండలంలోని రామారానికి ఎన్నడూ లేని ప్రత్యేకత వచ్చింది. ఇదివరకు అది అన్ని ఊర్లలో ఒక ఊరు. ఇప్పుడు అనేక ఊర్లకు స్ఫూర్తి ఈ ఊరు..
ఊర్లో మూడొందల రైతులు ఉన్నారు. వరి, కంది, పెసర, కూరగాయలు ప్రధాన పంటలు. చుట్టుపక్కల ఊళ్లలోని రైతుల్లాగే వీళ్లు కూడా రసాయన మందులు, ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేవారు. ‘‘మా జిల్లాలో ఇప్పటికే అధిక ఫ్లోరైడ్‌ నీళ్లు తాగుతున్నాం. దీనికి తోడు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల తినేతిండి విషతుల్యమైపోతోంది. దీనికొక మార్గం కనిపెట్టాలనుకున్నాం’’ అన్నారు జైకిసాన్‌ మహిళా సంఘం సభ్యులు స్వప్న, అనిత. కార్బండిజంతో వరికి విత్తనశుద్ధి చేస్తారు. దమ్ము చేసేప్పుడు ఎకరాకు రెండు బస్తాల డీఏపీ, నాట్లు వేశాక రెండు, మూడుసార్లు యూరియా, ఆ తర్వాత క్రిమిసంహారక గుళికలు వేయడం సహజం. దోమపోటు రాకుండా పలుమార్లు మందులు పిచికారి చేయక తప్పదు. కూరగాయల్లో బెండకు అయితే రెండు మూడు రోజులకు ఒకసారి మందుల్ని కొట్టాలి. ప్రతి గ్రామంలో చేసే పనే ఇది. అయితే మందుల మీద ఆధారపడి సేద్యం చేసే అలవాటు రైతుల్లో పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పద్ధతికి కొంత వరకైనా అడ్డుకట్టవేయాలన్నది గ్రామీణ్‌మాల్‌ ఫౌండేషన్‌ ఆలోచన.
సీతారాం కృషి..
రామారం గ్రామాన్ని పూర్తిస్థాయి సేంద్రీయ సేద్యపు గ్రామంగా తీర్చిదిద్దేందుకు నడుం కట్టారు ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు కె.సీతారం. ‘‘మీరు ఏ పంట పండించినా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వేయకండి. కేవలం సేంద్రీయ పద్ధతుల్లోనే పంటలు పండిద్దాం’’ అని చెబితే నేడు ఏ రైతు ముందుకు రాని పరిస్థితి. ఇవన్నీ గమనించిన సీతారాం.. ముందుగా గ్రామంలోని మహిళారైతులందర్నీ ఒక చోటకు చేర్చారు. అవగాహన కోసమే కొన్ని రోజులపాటు తరగతులు నిర్వహించారాయన. ‘‘మార్పు అనేది ఒకటి రెండు రోజుల్లో వచ్చేది కాదు. దానికి కొంత సమయం పడుతుంది. అసలు సేంద్రీయసేద్యం రైతులకే కాదు, భూమికి, పర్యావరణానికి, ఈ దేశప్రజల ఆరోగ్యానికి ఎంత అవసరమో రైతులందరికీ విడమరిచి చెబుతున్నాం. కేవలం రసాయన మందులతోనే అధిక దిగుబడులు సాధ్యమన్న అపోహల్ని ఆచరణాత్మకంగా తొలగిస్తున్నాం..’’ అన్నారు సీతారం. గ్రామంలో ఎనిమిది నెలలు కష్టపడి రైతులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలను పల్లెకు తీసుకొచ్చి తరగతులు నిర్వహిస్తుండటం విశేషం.
మహిళలు కలిసికట్టుగా..
గ్రామంలో జైకిసాన్‌ మహిళా సేంద్రీయ పరస్పర సహాయ కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రం సేంద్రీయ సేద్యానికి కావాల్సిన సహాయ సహకారాలను, పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ‘‘మొదట్లో సేంద్రీయ సాగు చేస్తే పంటలు పండుతాయో లేదోనన్న అపోహలు ఉండేవి. అయితే కొంత అవగాహన వచ్చాక ధైర్యంగా ముందడుగు వేశాం. వరి, కంది, పెసర మూడు పంటలను ఎంచుకున్నాము. మా ఊళ్లో మూడొందలకు పైగా రైతులుంటే నాన్‌ ఫెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌పీఎం) పద్ధతిలో సాగు చేసేందుకు రెండొందల యాభై మంది రైతులు ముందుకు వచ్చారు. వరి, కంది, పెసరలతోపాటు కూరగాయలు కూడా పండిస్తున్నారు’’ అన్నారు మహిళా సంఘ సభ్యులు.
ఏ పంట పండించినా మార్కెటింగ్‌ చేయడమే పెద్ద సమస్య. ఇక, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసిన పంటను ప్రత్యేకంగా అమ్ముకుంటేగాని గిట్టుబాటు కాదు. అందుకోసం గ్రామీణ్‌మాల్‌ ఫౌండేషన్‌ ఊళ్లోనే మార్కెటింగ్‌ సదుపాయం కల్పించింది. దీంతో అక్కడే ధాన్యం కోనుగోలు కేంద్రం ఏర్పాటైంది. రసాయన మందులతో పండించిన వరి ధాన్యం మార్కెట్‌లో క్వింటాలు రూ.1700 పలుకుతోంది. అందులో బస్తాకు హమాలికి ఆరురూపాయలు, వందకు రెండు రూపాయలు చొప్పున ఇరవై నాలుగు రూపాయల కమీషన్‌, మరో, ఇరవై రవాణాఛార్జీలు కలిపి.. యాభై అవుతోంది. అలాంటి భారం రైతుల మీద మోపకుండా రూ.1750 కి కొని వెంటనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే సీతారం కృషి వల్ల.. మరింత అధిక ధరలకు కొనేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయిప్పుడు. ఫ్యూర్‌ అండ్‌ హానెస్ట్‌ సంస్థ ప్రతినిఽధులు క్వింటాలుకు రూ.2100 చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రామారంకు వస్తున్న గుర్తింపు చుట్టుపక్కల ఊళ్లకు పాకింది. దీంతో ఇప్పుడందరు ఆ ఊరి రైతులకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు.
గ్రామంలో మహిళా సంఘం సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తున్న పంటలను ప్రోత్సహించేందుకు.. సెర్ఫ్‌ సంస్థ అయిదు లక్షలు రుణం మంజూరు చేసింది.
సీజన్‌లో సాగుకు శ్రీకారం చుట్టాలంటే ఏ రైతుకు అయినా విత్తనాల సేకరణే పెద్ద సమస్య. ఆ ఇబ్బంది రామారం గ్రామస్థులకు ఎదురవ్వలేదు. ఎందుకంటే వారే స్వయంగా విత్తనబ్యాంకు ఏర్పాటు చేసుకున్నారు.
రసాయన మందులకు ప్రత్యామ్నాయం పశువులపేడ, చెట్ల ఆకులు, పచ్చిరొట్ట ఎరువులు. ఇక, మోనో, క్లోరోఫైరిపాస్‌, గుళికలకు బదులు లింగాకర్షణ బుట్టలు, దీపపు ఎరలు, చెట్ల ఆకులు, గోమూత్రంతో తయారైన కషాయాలు వాడుతున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతోంది.
‘‘రైతులను వ్యవస్థీకృతం చేసి, విత్తనబ్యాంకును పటిష్టం చేయడం నా లక్ష్యం. రైతుల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే.. ఆర్థిక ఎదుగుదల దానంతట అదే వస్తుంది. వాళ్లల్లో వ్యవసాయం మీద నమ్మకం ఏర్పడుతుంది’’
– సీతారాం,
గ్రామీణ్‌మాల్‌ ఫౌండర్‌
‘‘మా గ్రామాన్ని ఎన్‌ఐఆర్‌డి దత్తతకు తీసుకుంది. ఇది మాకు మరింత ప్రోత్సాహకరం. మహిళా రైతుల్ని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రదర్శన క్షేత్రాలు చూపిస్తున్నారు. దీనివల్ల సేద్యం పట్ల మా పరిధి మరింత విస్తృతం అవుతోంది.’’

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంస్క్రుతమంటే భయమెవరికి ?డా అరవింద రావు ,తిరుప్పావై వగైరా

సంస్కృతమంటే భయమెవరికి…

గత సంవత్సరం జూన్‌ మాసంలో అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. మా అబ్బాయికి పిహెచ్‌.డి డిగ్రీ ఇచ్చే సమయం కాబట్టి కుటుంబసహితంగా వెళ్లాం. విశ్వవిద్యాలయం ప్రధాన అధికారులైన ప్రెసిడెంటు మరియు డీన్‌లు లాటిన్‌భాషలో వాళ్ల ప్రసంగాలు ప్రారంభించి తర్వాత ఆంగ్లభాషలో మాట్లాడారు. డిగ్రీ సర్టిఫికేట్లు కూడా లాటిన్‌ భాషలోనే ఉన్నాయి. అదేమిటని విచారిస్తే కేవలం అక్కడే కాకుండా అమెరికాలోని టాప్‌ యూనివర్శిటీలలో అది పరిపాటి అని తెలిసింది. అమెరికా దేశానికి కేవలం అయిదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అయినా తమకు గొప్ప చరిత్ర ఉంది అని చెప్పుకోవడానికి ఆ విధంగా లాటిన్‌ తమ భాషగా చెప్పుకుంటున్నారు.
అమెరికాకు, రోమ్‌కూ మతం తప్ప మిగతా ఏ సంబంధమూ లేదు. వారి మతగ్రంథాలు లాటిన్‌ భాషలో ఉండడమొక్కటే వారికి సంబంధం. సంస్కృతం అలా కాదు. సంస్కృతమంటే కేవలం హిందూమతం కాదు. ఇంగ్లీషు అంటే క్రైస్తవమతం ఎలా కాదో అలాగే సంస్కృతమంటే హిందూమతం అని అర్థం కాదు. వేదాల్నీ, దేవుడిని అంగీకరించని బౌద్ధులు, జైనులు, అలాగే పూర్తిగా నాస్తికులైన చార్వాకులు మొదలైన వాళ్లందరూ సంస్కృతంలోనే రచనలు చేశారు. మొదట్లో బౌద్ధులు పాళీభాషలో పుస్తకాలు రాశారు. అయితే అవి ఒక చిన్న ప్రాంతానికే పరిమితమయ్యాయి. ఈనాడు ఇంగ్లీషులో రాయటం వల్ల ప్రపంచమంతా ఎలా చదవగలరో అలాగే ఆనాడు వారందరూ పాళీభాష వదిలి సంస్కృతంలో రాయటం మొదలుపెట్టారు. లాజిక్‌, తత్త్వశాస్త్రం, గణితం, ఖగోళశాస్త్రం, రసాయనశాస్త్రం, దండనీతి శాస్త్రం, ధర్మశాసా్త్రలు, ఆయుర్వేదం లాంటి విషయాలపై రచనలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఒకే వర్గం వారే దీన్ని నేర్చుకున్నారనడం బొత్తిగా అవగాహన లేని వాదన. ప్రపంచంలోనే మొట్టమొదటి నిఘంటువు శ్లోకాల రూపంలో రాసిన అమరసింహుడు జైనుడు. పాణిని వ్యాకరణానికి వ్యాఖ్యలు రాసినవారు బౌద్ధులు, జైనులు. అనేకమంది రాజులు కావ్యాలు, నాటకాలు రాశారు. క్రమక్రమంగా సంస్కృతం భరతఖండం మొత్తానికి జూజీుఽజు జ్చూుఽజఠ్చజ్ఛ గా బ్రిటీష్‌వారు వచ్చేవరకూ కూడా కొనసాగింది.
మన ప్రాచీన గ్రంఽథాల్ని చాలా వాటిని వెలికితీసిన ఘనత బ్రిటీష్‌ వారికి ఇవ్వాలి. వారి పాలనలో బౌద్ధ గ్రంఽథాలనేకం ఆఫ్ఘనిస్తాన్‌లో లభించాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం సమగ్రప్రతి కేరళలో లభించింది. దేశంలో విద్యార్థులు ఒక మూల నుండి మరొక మూలకు వెళ్లి చదువుకున్నారు. సంస్కృతం జాతి మొత్తానికి చెందిన భాష కేరళ నుండి గాంధార దేశం (ఆఫ్ఘనిస్తాన్‌) వరకూ వ్యాపించిన భాష స్వతంత్రం వచ్చిన సమయంలో పార్లమెంటులో జాతీయభాష ఏది ఉండాలి అనే ప్రశ్నపై అంబేద్కర్‌ కూడా సంస్కృతాన్ని సమర్థించడం మనం గమనించాలి.
‘ఈ దేశం సంస్కృతిని పెకలించే ఉద్దేశంతో పనిచేస్తున్న మన మిషనరీలందరూ సంస్కృతాన్ని బాగా చదవాలి. ఆ భాషలోని, శాసా్త్రల్లోని మెళకువల్ని గమనించి మన కార్యకలాపాలు చేయాలి. సంస్కృతం అనే ఆయుధంతో పాటు లాజిక్‌ కూడా చదవాలి. ఇక్కడ పండితులు, తెలివైనవాళ్లు. ఇది చాలా కష్టమైన పని అయినా ఇష్టంగా చేయాలి’. (పేజీ 4849) అని ప్రఖ్యాత సంస్కృత విద్వాంసుడు మోనియర్‌ విలియమ్స్‌ ‘‘అ ట్టఠఛీడ ౌజ ట్చుఽటజుటజ్టీ జీుఽ ఖ్ఛజ్చ్టూజీౌుఽ ్టౌ ఝజీటటజీౌుఽ్చటడ గిౌటజు జీుఽ ఐుఽఛీజ్చీ’’ అనే ప్రసంగంలో 1861లో ఆక్ప్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చెప్పాడు. ఈ ప్రసంగంలో ప్రారంభమయిన ఆయన మాటలు గమనించదగ్గవి. ‘(ఐుఽఛీజ్చీ) ్చ్ట్ట్చజీుఽ్ఛఛీ ్చ జిజీజజి ఛ్ఛీజట్ఛ్ఛ ౌజ ఛిజీఠిజీజూజ్డ్చ్టీజీౌుఽ ఠీజ్ఛిుఽ ౌఠట జౌట్ఛజ్చ్టజ్ఛిటట ఠ్ఛీట్ఛ ఛ్చటఛ్చటజ్చీుఽట, ్చుఽఛీ జ్చిఛీ ్చ ఞౌజూజీటజ్ఛిఛీ జ్చూుఽజఠ్చజ్ఛ ్చుఽఛీ జూజ్ట్ఛీట్చ్టఠట్ఛ ఠీజ్ఛిుఽ ఉుఽజజూజీటజి ఠ్చీట ఠుఽజుుఽౌఠీుఽ’’. ఈ ప్రసంగం మొత్తం పుస్తకరూపంలో ఇంటర్‌నెట్‌లో మనం చూడవచ్చు. మ్యాక్స్‌ముల్లర్‌ లాంటి పండితులందరూ భారతీయ సంస్కృతిని నిర్మూలించాలనే ధోరణితో సంస్కృతాన్ని చదివారు. అంతవరకూ ముద్రించని వేదాల్లాంటి గ్రంథాల్ని ముద్రించడం. వాటిపైన ఇంగ్లీషులో వ్యాఖ్యలు రాయటంతో భారతదేశంలోని విద్యావంతులందరూ వాటినే ప్రమాణ గ్రంథాలుగా, ఞటజీఝ్చటడ టౌఠటఛ్ఛిట గా భావించే వాతావరణం ఏర్పడింది.
మోనియర్‌ విలియమ్స్‌ చెప్పినదే అతనికి ముందు వచ్చినవారూ, తర్వాత వారూ కూడా ఆచరించారు. రాబర్ట్‌ నొబిలి అనే ప్రచారకుడు జందెం వేసుకుని రోమన్‌ బ్రాహ్మణుడు అని పరిచయం చేసుకుని అయిదవ వేదం అంటూ ఒక పదాన్నే సృష్టించాడు. ఆయన మతానికి అనుకూలంగా ఉన్న గ్రంథమిది. సాక్షాత్తూ నేడు మనం ఇంటర్‌నెట్‌లో ఈశావాస్య ఉపనిషత్‌ కోసం చూస్తే ఒకానొక తమిళ పండితుడు రాసిన ఈ వ్యాఖ్య కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తులో ‘ఈశ’ అంటే ‘జీసెస్‌’ అని చెప్పి ఒక పి.హెచ్‌.డి. కూడా తీసుకున్నాడు. సన్మానాలు కూడా పొందాడు. యూట్యూబ్‌లో ్ఖఐఖఇ అనే వెబ్‌సైట్‌ చూస్తే కొందరు ముస్లిం సోదరులు కూడా ఉపనిషత్తుల్లోని మంత్రాలు చెబుతూ మీ పుస్తకాల్లో ఉన్నది మా దేవుడే అని ప్రచారం చేయడం చూడగలం. ఇదంతా మనం చిన్నప్పుడు చదివిన బ్రాహ్మణుడు మేకపిల్ల కథకు చక్కని ఉదాహరణ. కుక్క అనే భ్రమతో బ్రాహ్మణుడు మేకపిల్లను పారవేసినట్లే మనం ఈనాడు మన సంస్కృతిని పారవేస్తున్నాం.
ప్రభుత్వం సంస్కృతాన్ని స్కూళ్లలో ప్రవేశపెడితే హిందూత్వం పెరిగిపోతుందని కొందరి ఆందోళన. సంస్కృతం నేర్చుకోవడం వల్లనే హిందుత్వాన్ని పెకలించి వేయగలమని మరికొందరి వాదన. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా ఈ రెండోవర్గం వారు పట్టుదలగా సంస్కృతం నేర్చుకుంటూనే ఉన్నారు. మూడోవర్గం, అంటే హిందూత్వం గురించి మాట్లాడే వాళ్లు గొప్పగా సంస్కృతం నేర్చుకున్న దాఖలాలు లేవు. అసలైన సంస్కృత పండితులకి ఈ గొడవంతా అసలే తెలియదు. ఎవరు ఎలాంటి రచనలు చేస్తున్నారో అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో వీరికి బొత్తిగా తెలియదు. అన్ని విమర్శలకూ సమాఽధానం చెప్పగలిగే అనర్గళమైన పాండిత్యం మాత్రం వీరి దగ్గర ఉంది. వివేకానందుడు చెప్పినట్లు వీళ్లందరూ బంగారు నిధిపై కూర్చు ని పేద బతుకులు గడుపుతున్నా వారు.
సత్యమేవ జయతే- ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. అనేది మన సిద్థాతం. అయితే సత్యమేమిటో మనమే తెలుసుకోవాలంటే ఇతరులు ఎవరు చెప్పిన మాటలు కాకుండా మనమే దాన్ని పరిశీలించాలి. మనల్ని పాలించడానికి వచ్చినవాళ్లు, వాళ్ల సంస్కృతిని మనపై రుద్దాలని వచ్చిన వాళ్లూ మనల్ని గురించి నిజాలు రాస్తారని భావించడం మన అమాయకత. అందమైన ఆంగ్లభాషలో అసత్యాలు చెపితే అవి నిజం కావు. మన పుస్తకాల్లో ఎలాంటివి నెగిటివ్‌గా చెప్పగలరో అవన్నీ ఇతరులు చెప్పేసారు. ఆ ప్రచారం అలాగే ఉండాలి. మంచి విషయాలు బయటకు రాకూడదు అనుకునేవాళ్లు సంస్కృతాన్ని వ్యతిరేకిస్తారు. మీ పుస్తకాల్లో ఏముందో మేము అందంగా చెప్పేశాం. అందమైన పుస్తకాల్లో అందించాం. మీరు మీ మూలగ్రంథాల్ని చదవాల్సిన పనిలేదు అనే వాళ్లు వ్యతిరేకిస్తారు.
ప్రభుత్వం సంస్కృతాన్ని నిర్బంధంగా ప్రవేశపెటాలి. ఎవరో చదవాలి, నాకు మాత్రం టైమ్‌ లేదు అనడం పలాయనవాదం. మన సంస్కృతిలో రుషి రుణం అనే భావన ఒకటి ఉంది. మన ప్రాచీనులు మనకు చెప్పిన విషయాల్ని సరిగా అర్థం చేసుకోవడం, ఆ సంస్కృతిని నిలపడం మన కర్తవ్యం అనేది ఈ పదం యొక్క అర్థం. ఆధునిక ప్రపంచంలోని ప్రచార ధోరణుల నేపథ్యంలో ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా సత్యమేమిటో తెలుసుకోవాల్సిన కర్తవ్యం చదువువుకున్న మనందరిదీ. కొత్త వేదాన్ని రాసే స్థాయికి నొబిలి మహాశయుడు వెళ్లినపుడు మనమెందుకు ఈ భాషను తెలుసుకోలేం? ఈ ప్రశ్నపై ఆలోచించాలి.
గోదాదేవి పాశురాలు
ఆళి మళైక్కణ్ణా! ఒన్రు నీ కైకరవేల్‌
ఆళియుళ్‌ పుక్కుముగన్దు కొడార్‌ త్తేరి
ఊళి ముదల్‌వన్‌ ఉరువమ్‌ పోల్‌ మెయ్‌కరుత్తు
పాళియన్‌ తోళుడైప్పర్పనాబన్‌ కైయిల్‌
ఆళిపోల్‌ మిన్ని, వలంబురి పోల్‌ నిన్రు అదిర్‌న్దు
తాళాదే శార్‌ఙ్గ ముదైత్త శరమళైపోల్‌
వాళ ఉలగినిల్‌ పెయ్‌దిడాయ్‌ నాంగళుమ్‌
మార్గళి నీరాడ మగిళ్‌న్దు ఏల్‌ ఓర్‌ ఎంబావాయ్‌
ఠి ఠి ఠి
సిరి చిరునవ్వులతొ నారి కట్టాలి
హరి! విల్లు శార్‌ఙ్గాన్ని ఎక్కుపెట్టాలి
వరపాంచజన్యంబు ఉరుములురవాలి
గురు సుదర్శనంబు మెరుపుల్లు మెరవాలి
శరపరంపరలాటి వానచినుకుల్లు
కురవాలి కురవాలి మూడు వరసల్లు
వరిచేలు పండాలి గాదెల్లు పొర్లాలి
చిన్నపిల్లల నవ్వులూ కన్నెపిల్లల కోర్కెలూ
అన్ని పువ్వుల రంగులూ ఆకుపచ్చ హొరంగులూ
కర్పూరనీరాజనాలుగా – అందుకో
నల్లనయ్యా – మా పల్లె నీలిమేఘమా
దివినుంచి భువిముంచ వర్షించు వర్షించు
మా నోము పండాలి మన పెళ్లి జరగాలి
అనుచు కన్నయ్యనూ వరములడగాలి
సిరినోము – హరిపూజ – గిరిపుత్రివరము
గోకులం కన్నెలకు కల్యాణకరము
లోకులం దరికిదే సౌభాగ్యప్రదము
పల్లెపిల్లా మేలుకో
రే- పల్లెపిలాల మేలుకో
ఏకాక్షర వేదాంతం!

కం!! నేనను నేనున్నానా?
నేనని నన్నేన్ని నన్నునేనన్నానా?
నేనే నేననినేనన
నేనని నన్ననని నేనునేనౌనాన్నా?
(దేహాభిమాని అయిన అహం నిజమైన నేను కాదనీ, నేను అని చెప్పుకోని సాక్షిభూతమైనన ఆత్మ నిజమైన నేను అనీ చెబుతుంది భారతీయుల ఆత్మతత్వం. దానిని గ్రహించిన ఆత్మజ్ఞాని దానిని తండ్రికి తెలియజేస్తున్నాడు. ఉపనిషత్తులలో తండ్రీకొడకులు గురుశిష్యులుగా ఉంటారు కూడా..)
– ధనికొండ రవిప్రసాద్‌, ఖమ్మం
ఇస్లాం ఏం చెబుతోంది?

ప్రపంచంలో ఏ మతం ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వదు. ఇస్లాంలో కూడా తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ అనేక భావాలున్నాయి. వీటిలో కొన్ని తెలుసుకుందాం..

1. ఉగ్రవాదం అంటే హతమార్చటం. ఇస్లాం దీనిని నిషేధించింది. ఖురాన్‌లోని 6ఫ 151 ప్రకారం- సృష్టికర్త పవిత్రాత్మను సృష్టించాడు. దీనిని ఎటువంటి పరిస్థితుల్లోను చంపకూడదు. న్యాయబద్ధంగా దీనిని కాపాడాలి. (అయితే రాజ్యం విధించే మరణశిక్షను ఖురాన్‌ సమర్థించింది)

2. భయం ద్వారా మతాన్ని ఆపాదించటాన్ని ఖురాన్‌ నిషేధించింది. మత ఉగ్రవాదాన్ని వ్యతిరేకించింది. 2: 256 ప్రకారం- అనివార్య పరిస్థితుల ద్వారా మతంలోనికి మారకూడదు.
3. ఇతరులపై దాడులు చేయటాన్ని కూడా ఖురాన్‌లో వ్యతిరేకించారు. ‘‘శత్రువులు శాంతి మార్గంలో ప్రయాణించాలనుకుంటే.. ముందు ఆ మార్గాన్నే ఆచరించాలి. దేవుడిని పూర్తిగా నమ్మాలి.. ఆయనే అన్నీ చూడగలుగుతాడు..వినగలుగుతాడు.
4. యుద్ధం కూడా ఎవరుపడితే వారు ప్రకటించటానికి వీలు లేదు. ఖురాన్‌ ప్రకారం- ఇస్లాం మత పెద్దలు మాత్రమే యుద్ధాన్ని ప్రకటించాలి లేదా ఒక రాజ్యాధినేత యుద్ధాన్ని ప్రకటించాలి.
5. అమాయకులను, నిరాయుధులను హతమార్చటాన్ని నిషేధించారు. సున్నీ మత తొలి కాలిఫా- అబూ బకరల్‌ సిద్ధఖీ తన సేనలను- ‘‘మహిళలను, పిల్లలను, ముసలివారిని, వికలాంగులను హతమార్చవద్దు. పళ్లను ఇచ్చే చెట్లను కొట్టేయవద్దు. ఏ నగరాన్ని నాశనం చేయవద్దు..’’ అని ఆజ్ఞాపించాడు.
6. గెరిల్లా పద్ధతిలో దాడులు చేయటాన్ని కూడా ఖురాన్‌ నిషేధించింది. శత్రువులకు ముందుగా హెచ్చరికలు జారీ చేయాలని స్పష్టం చేసింది. ఒక సమయంలో మహ్మద్‌ ప్రవక్త తన శత్రువులకు నాలుగు నెలల ముందే హెచ్చరికలు జారీ చేశాడు.
7. చెడు చేసిన వారికి కూడా మంచి చేయమని మహ్మద్‌ ప్రవక్త ప్రవచించాడు. సొంత తెలివితేటలతో ఆలోచించండి. ఇతరులు మేలు చేస్తే మేము మేలు చేస్తాం.. వారు హాని చేస్తే మేము హాని చేస్తాం అనే బదులుగా- ఇతరులు మేలు చేస్తే మీరు మేలు చేయండి. వారు హాని చేసినా మీరు మేలు చేయండి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిల్లల్ని చంపేశాం ఇప్పుడెం చేయాలి?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందూ ముస్లిం ఐక్యతా స్పూర్తి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రైతుల్ని కాపాడే దెట్ల?కంచ ఐలయ్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇస్రో మార్కు విజయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బొట్టు పెట్టనివాడు

బొట్టు పెట్టనివాడు 

తుపాకి నెక్కు బెట్టి  
 బొట్టికాయల ఉసురుతీసి   
పైశాచికా నంద మనుభవించి 
నెత్తుటిబొట్టు  పెట్టినాడు . 
వీర తిలకమ్మని వాడు పొంగిపోవ 
బుద్ధి  చెప్పగ  బుద్ధి జీవులంత  
ప్రతిన బూనుడయ్య ఒట్టు వేసి 
నాగరక సీమలొ రాక్షస విహారమ్ము  
మట్టు బెట్ట బొట్టు పెట్టి మనము 
ఉద్య మించి  గట్టిగ కదల  వలయు  
 
 గబ్బట  దుర్గా ప్రసాద్ 
Posted in రచనలు | Tagged | Leave a comment

స్త్రీజన సేవకు రాలైన విదుషీ మణి-యల్లాప్రగడ సీతాకుమారి

స్త్రీజన సేవకు రాలైన విదుషీ మణి-యల్లాప్రగడ సీతాకుమారి

1-1-1911 లో జన్మించిన యల్లాప్రగడ సీతాకుమారి హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రుల అభ్యున్నతికి తోడ్పడ్డారు .సికంద్రా బాద్ కీస్ బాలికా విద్యాలయం లో చదివి విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై తెలుగు పండితురాలుగా ఉద్యోగించారు .జాతీయోద్యమ కాలం లో హైదరాబాద్ లో ఖాదీ వస్త్రాల అమ్మకం ,ప్రచారం విస్తృతం గ చేశారు .1934నిజాం రాష్ట్ర ఆంద్ర మహాసభకు అధ్యక్షత వహించారు .హైదరాబాద్ లో ఆంద్ర యువతీ మండలి స్థాపనలో భాగస్వాములయ్యారు .’’ఆంద్ర ‘’అనే మాటను తెలంగాణా ప్రాంతం లో విస్తృతంగా ప్రచారం చేయటానికి విస్తృత ప్రయత్నం చేశారు .చిక్కడ పల్లి ‘’ప్రమదావనం ‘’స్తాపకురాలై ప్రమదల సేవ లో చొరవ చూపారు .

స్త్రీ విద్య ,మహిళా స్వాతంత్ర్యం ,వరకట్న నిషేధం ,వితంతు వివాహం మొదలైన విషయాలపై తీవ్ర కృషి చేశారు .నిజాం నిరంకుశ పాలనలో ‘’అక్కి రెడ్డి పల్లి ‘’ గ్రామం లో జరిగిన స్త్రీ ల అత్యాచారాలపై విచారణ జరిపే సంఘం లో సభ్యురాలైనారు .అత్యాచారం జరిగిన అన్ని ప్రాంతాల్లో పర్యటించి స్త్రీలకు ధైర్యం చెప్పారు సీతాదేవి .అనాధలకు వితంతువులకు భర్తలు వదిలేసిన భార్యలకు ఆశ్రయం కల్పించి ఆదుకొన్నారు .ఆంద్ర ,తెలంగాణా రాష్ట్రాలను ఏకీకృతం చేసి విశాలాంధ్ర ఎర్పడాలన్ను ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు .నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ నియోజక వర్గం నుంచి పోటీలేకుండా 1957లో ఆంద్ర ప్రదేశ్ శాసన సభ కు ఎన్నికయ్యారు .ఆంధ్రులకు సంబంధించిన అన్ని ఉద్యమాలలో ముందు ఉండి నడిపించారు .సీతాదేవి గారి భర్త వై వి.ఎల్ నారాయణ రావు గారు పేరు పొందిన సర్వోదయ కార్య కర్త .Inline image 1

సీతాదేవి కధానికలు రచించి సాహిత్యాన్ని పండించారు .ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు హాట్ న్యూస్ గా ‘’గోల్కొండ పత్రిక ‘’లో రాసేవారు .సంస్కరణ ద్రుష్టి నిండుగా మెండుగా ఉన్న విదుషీమణి సీతా దేవిగారు .నిర్భీకత ఆమె సొమ్ము .స్త్రీ జనాభ్యుదయమే  ధ్యేయం గా డెబ్భై అయిదు సంవత్సరాలు జీవించిన సంస్కర్త ,విదుషీమణి  ఏకీక్రుతాంధ్ర దేశంకోసం  పాటు పడిన మహిళ శ్రీమతి ఎల్లాప్రగడ సీతాకుమారిగారు2-1-1986న మరణించారు .

దేశ బాంధవి –దువ్వూరి సుబ్బమ్మ

తూర్పు గోదావరిజిల్లా రామచంద్రా పురం తాలూకా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ,పంచారామాలలో ముఖ్యమైనది అయిన దాక్షారామం లో సువ్వూరి సుబ్బమ్మ గారు 1880లో జన్మించారు .తండ్రి మల్లాది సుబ్బావధాని గారు .దువ్వూరి వెంకయ్యగారితో ఆమె వివాహమైంది . ఆంద్ర దేశం లో స్వాతంత్ర్య యుద్ధం లో మార్గ దర్శి గా పని చేసిన వారిలో సుబ్బమ్మ గారిది ప్రధమ తాంబూలం .ఆమె ధైర్య సాహసాలు చొరవ అనితర సాధ్యం గా ఉండేవి .

సహాయ నిరాకరణ ఉద్యమం లో ఆమె ప్రముఖ పాత్ర వహించారు .ఉద్యమ శిక్షణ పొందిన భారతీయ మహిళలో సుబ్బమ్మ  గారు రెండవ వారు .అంతగా ఆమె వ్యక్తిత్వం  భాసించింది అన్నమాట .1922ఉద్యమం లో నాయకత్వం వహించి బ్రిటిష్ ప్రభుత్వానికి వణుకు పుట్టించారు. ఆమె ను అరెస్ట్ చేసి ఏడాది కాలం జైలు శిక్ష వేశారు .రాజ మండ్రి జైలులో ఈ శిక్ష  అనుభవించారు సుబ్బమ్మగారు .విడుదలై మళ్ళీ విజ్రుమ్భించి ఉప్పు సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయి 31-3-1930 నుండి ఆరు నెలలు వెల్లూరు జైలులో కారాగార వాసం అనుభవించారు .శిక్ష పూర్తికాగానే క్విట్ ఇండియా ఉద్యమం లో చేరి పెద్దాపురం లో గొప్ప ప్రదర్శన నిర్వహించి లాఠీ చార్జీకి గురైనారు .

సుబ్బమ్మగారు పదహారు సంవత్సరాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు .1923లో కాకినాడ లో జరిగిన కాంగ్రెస్ సభలో సుబ్బమ్మగారికి ‘’దేశ బాంధవి ‘’బిరుదునిచ్చి సత్కరించారు .రాజమండ్రిలోని సనాతన విద్యాలయ మేనేజర్ గా కొంతకాలం సేవ చేశారు .1964లో సుబ్బమ్మగారికి తీవ్రం గా జబ్బు చేసింది .ఆ జబ్బులోనే నెహ్రు మరణించాడన్న వార్త విన్నారు .దీనితో మానసికం గా కుంగిపోయి మందులు తీసుకొనే లేదు .ఎనభై నాలుగేళ్ళు దేశ సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నా ధైర్య శీలి దువ్వూరి సుబ్బమ్మగారు 31-5-1964న నెహ్రు చనిపోయిన నాలుగు రోజులకే మరణించారు .

Inline image 2

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-12-14-ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అనాథలకో సూపర్‌ స్పెషాలిటీ

అనాథలకో సూపర్‌ స్పెషాలిటీ

సమాజంలో అనాథలకు ఆదరణ లభించటం అంత సులువు కాదు. అదే అనాథ బాలికలయితే వాళ్లకి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఒక వేళ ఏదైనా అనాథాశ్రమంలో చేరినా… వారికి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లభించటం అసాధ్యం. ఈ జఠిలమైన సమస్యను తీర్చటానికి ‘యశోదా పౌండేషన్‌’ ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొంది.
సాధారణంగా అనాథాశ్రమాలు తమ వద్ద ఉన్న పిల్లలకు పదో తరగతి వరకు మాత్రమే విద్యను అందించగలుగుతాయి. ఆ తర్వాత ఏదో ఒక వృత్తి పనిచేసుకొమ్మని ప్రోత్సహిస్తాయి. చాలా సార్లు ఈ పోటీ ప్రపంచంలో ఉపాధి దొరకాలంటే రకరకాల నైపుణ్యాలు అవసరమవుతాయి. ఈ నైపుణ్యాలను పెంపొందించే సంస్థలు ఎక్కుగా లేవు. ‘‘దీనిని మేం గుర్తించాం. అందుకే ఈ ఫౌండేషన్‌ను స్థాపించాం. పిల్లలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించటం, వారు మంచి వ్యక్తిత్వం ఉన్నవారిగా మారేలా శిక్షణ ఇప్పించటం, ఆ తర్వాత మా సంస్థల్లోనే ఉద్యోగం ఇవ్వటం మా ప్రధానోద్దేశం’’ అంటారు యశోద హాస్పిటల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జి.రవీందర్‌ రావు. ఇప్పటి దాకా ఈ సంస్థ నుంచి 2108 మంది శిక్షణ పొందితే, వారిలో 1882 మందికి ఉద్యోగాలు లభించాయి.
రాష్ట్రంలోని వివిధ అనాథాశ్రమాలలో 16-20 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలను ఎంపిక చేసి ఫౌండేషన్‌లో 65 రోజుల శిక్షణ ఇస్తారు. ‘‘మా దగ్గర శిక్షణ పొందే వారిలో 80 శాతం మంది అమ్మాయిలే. సాధారణంగా అనాథాశ్రమాలలో ఉన్న అబ్బాయిలను ఎక్కువగా దత్తత తీసుకుంటుంటారు. అమ్మాయిలను దత్తత తీసుకొనేవారు తక్కువ. యుక్త వయస్సు వచ్చిన తర్వాత వారికి రక్షణ ఉండాలంటే ఉపాధి తప్పనిసరి. అందుకే మేము అమ్మాయిలనే పౌండేషన్‌లో చేర్చుకుంటామ’’ని రవీందర్‌ రావు వివరించారు. ఫౌండేషన్‌లో చేరిన వెంటనే వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఇంగ్లీషు, గణితం మొదలైన సబ్జెక్టులలో, ఉద్యోగానికి అవసరమైన కొన్ని మౌలికాంశాలలో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటుగా ఉపకార వేతనం కూడా చెల్లిస్తారు. పిల్లలలో ఉన్న ప్రత్యేక ఆసక్తులను గమనించి డీఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఈసీజీ టెక్నీషియన్‌, సీఎస్‌ఏలాంటి సాంకేతిక వృత్తి విద్యా కోర్సులతోపాటు ఎలకి్ట్రషియన్‌, ప్లంబింగ్‌, డ్రైవింగ్‌, కార్పెంటరీ లాంటి వృత్తుల్లో కూడా శిక్షణ ఇస్తారు. 60 రోజుల తర్వాత శిక్షణ పొందిన వారికి మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఒకసారి శిక్షణ పొందిన తర్వాత వారికి యశోదా ఆసుపత్రి గ్రూపులో ఉద్యోగాలు ఇస్తారు. మరికొన్ని సంస్థలు కూడా ఉపాధి కల్పిస్తున్నాయి.
మానసిక కౌన్సిలింగ్‌
ఫౌండేషన్‌లో శిక్షణ కోసం అనాథలు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తుంటారు. వాళ్లు పెరిగిన వాతావరణం, పరిస్థితులు, మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. అనాథలమనే ఆత్మన్యూనత, అగమ్యగోచరమైన భవిష్యత్తు అనాథలను మానసికంగా కుంగదీస్తుంటాయి. దాంతో తామేమీ చేయలేమని, తమకేమీ చేతకాదనే నిరాశలో కూరుకుపోతుంటారు. వాళ్లలో నెలకొనే ఈ భావనలను వదిలించి ఆత్మస్థయిర్యాన్ని నింపాలంటే తప్పనిసరిగా కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. అందుకే యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఉపాధి శిక్షణలో భాగంగా పిల్లలకు మానసిక కౌన్సిలింగ్‌ కూడా ఇస్తోంది. దాంతో జీవితం పట్ల సానుకూల ధృక్పథాన్ని అలవరచుకోవటానికి వీలవుతుంది. వారికి మానసికంగా సాయం చేయటం ఉపాధి పొందిన తర్వాత కూడా కొనసాగుతుంది. కొన్ని సార్లు ఉద్యోగం చేసే సమయంలో వారు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వారికి నైతికంగా మద్దతు ఇచ్చేవారు ఎవరూ ఉండరు కాబట్టి ఫౌండేషనే ఆ సాయాన్ని అందిస్తుంది.
సమస్యలనేకం..
మన దేశంలో అనాథలకు సంబంధించిన చట్టాలపై అవగాహన చాలా తక్కువ. చాలా మంది అనాథాశ్రమాలను సేవా భావంతోనే నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించుకున్న సంస్థలు కూడా తక్కువే. ‘‘మన రాష్ట్రంలో ఉన్న అనాథాశ్రమాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మేము సేకరిస్తున్నాం. అంతే కాకుండా అనాథలకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలపై అవగాహన తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభించాం.
ఉదాహరణకు మన ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం రిజర్వేషన్ల విషయంలో ఎస్సీలకు లభించే అవకాశాలు అనాథలకూ ఉంటాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇలాంటి అనేక అంశాలపై అవగాహన కల్పించటానికి ప్రయత్నిస్తున్నామ’ని రవీందర్‌ రావు వివరించారు.
అనాథలకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలపై అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మన ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం రిజర్వేషన్ల విషయంలో ఎస్సీలకు లభించే అవకాశాలు అనాథలకూ ఉంటాయనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గూగుల్ లో ”అన్న ”గారి ఫాంట్

ఎన్టీఆర్ ను గౌరవించిన గూగుల్

విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా పేరొందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తన జీవన, నట ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, గౌరవాలు, సత్కారాలు అందుకున్నారు. తాజాగా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎన్టీఆర్ ను ఘనంగా గౌరవించింది. ఎన్టీఆర్ పేరు మీద ఒక ప్రత్యేక ఫాంట్ ను తమ డేటాబేస్ లో చేర్చింది. సిలికాన్ ఆంధ్ర డెవలప్ చేసిన ఈ ఫాంట్ లను ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా డేటాబేస్ లో మరిన్ని తెలుగు ఫాంట్లు జోడించడానికి గూగుల్ ప్లాన్ చేస్తుంది.
ఎన్టీఆర్ ఫాంట్ కొరకు ఈ లింకు క్లిక్ చేయండి : http://www.google.com/fonts/earlyaccess

NTR (Telugu)

NTR is a Telugu font, made available by Silicon Andhra under the SIL Open Font License v1.1.

Link

@import url(http://fonts.googleapis.com/earlyaccess/ntr.css);

Example

font-family: 'NTR', serif;

SIL Open Font License, 1.1 | Download

Nanum Brush Script (Korean)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదాదేవి పాశురాలు

ఆంధ్ర జ్యోతి

గోదాదేవి పాశురాలు
ఓంగి ఉలగళంద ఉత్తమన్‌ పేర్‌ పాడి
నాంగళ్‌ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్‌
తీంగిన్రి నాడెల్లామ్‌ తింగళ్‌ ముమ్మారి పేయ్‌దు
ఓంగు పెరుం శెన్నల్‌ ఊడు కయల్‌ ఉగళ
పూంగువళై ప్పోదిల్‌ పొరివండు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తి
వాంగక్కుడమ్‌ నిరైక్కుమ్‌ వళ్ళల్‌ పెరుమ్‌ పశుక్కళ్‌
నీంగాద శెల్వమ్‌ నిరైందు ఏల్‌ ఓర్‌ ఎంబావాయ్‌.
ఛఛఛ
పొట్టివాడైనా చాలా గట్టివాడమ్మా
చెయిజోచి అర్థించి కాలితో మర్దించి
బలిని పాతాళానికంపెనమ్మా
భువనమే మాధవునిదైనా – భూమి మాత్రం తనది అనుకొని
స్వామికే భూదానమిచ్చిన – బలిని పాతాళమునకణచిన
స్వామి వీడమ్మా – అంతర్యామి వీడమ్మా !
మూడు అడుగులమేర అడిగీ- ముజ్జగాలను ఆక్రమించీ
సంహరించక సంస్కరించీ – పాతాళమును పాలించమంటూ
తానె రక్షగ నిలిచినట్టీ – పొట్టివాడమ్మా చాలా గట్టివాడమ్మా !
అట్టివాడిని తట్టిలేపీ – గట్టిగా తలపెట్టినట్టీ
నోముకోసం సంభారాలను కోరుదామమ్మా !
నెలకు మూడు వానల్లు నందనందనా !
గోలచ్చిమి పాలవరద గోవర్ధనా
పూలు విరగబూయాలి చేలన్నీ పండాలి
చేలలోని నీటిలోన మీలు తుళ్ళి ఎగరాలి
బాలపాపలందరూ పూలమల్లెనవ్వాలి
కన్నెపిల్లలందరూ కాత్యాయని నోముపట్టి-
గోపబాలుని చేయిపట్టీ ఆ గడపమెట్టాలీ
సిరినోము – హరిపూజ – గిరిపుత్రివరము
గోకులం కన్నెలకు కల్యాణకరము
లోకులం దరికిదే సౌభాగ్యప్రదము
పల్లెపిల్లా మేలుకో
రే- పల్లె పిల్లా మేలుకో
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాక్ ,ఇరాక్ లలో నర మేధ పర్వం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్కినేని ఒక వ్యక్తీ కాదు -వ్యవస్త్గ, ,కత్తి కాంతారావు భార్యకు పెన్షన్

 anr statue1 001 anr2 001 anr3 001
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

17-12-14 అఖిల భారత పెన్షనర్స్ డే -ఉయ్యూరు పెన్షనర్స్ వార్షిక సమా వేశం

17-12-14 అఖిల భారత పెన్షనర్స్ డే -ఉయ్యూరు పెన్షనర్స్ వార్షిక సమా వేశం లో ణా అధ్యక్షతన  జరిగిన కార్యక్రమం -మరియు సాయంత్ర శ్రీ సువర్చలాంజ నేయ స్వామి గుడిలో ”శ్రీ అగ్ని హోత్రం చక్ర వర్తి గారి చే తిరుప్పావై ప్రవచన ప్రారంభం  దృశ్యాలుpapercoverage- 001

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి –శ్రీమతి గోళ్ళమూడి రత్నమ్మ

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి   –శ్రీమతి  గోళ్ళమూడి రత్నమ్మ

Inline image 3

1886లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలులో వాసి రెడ్డి సాంబయ్య ,పార్వతమ్మలకు గొల్లమూడి తత్నమ్మ ఏకైక సంతానం గా  జన్మించారు .చిన్ననాటి నుంచి చదువుపై అమిత శ్రద్ధ కనబరచేవారు .సంపన్న కుటుంబం కనుక ఆడ వారికి ఘోషా పధ్ధతి ఉండేది .స్వయం గా నేర్చి తెలుగు కవిత్వం అల్లేవారు .చేబ్రోలుకు చెందిన గొల్లమూడి చంద్ర మౌళి గారితో రత్నమ్మ గారి వివాహం జరిగింది .1921లో గాంధీజీ చేబ్రోలు సందర్శించారు .ఆయన ఉపన్యాసాలకు ప్రభావితురాలైనారు .దేశ సేవలో పాల్గొని తానూ ధన్యత చెందాలని నిశ్చయించుకొన్నారు .గాంధీ ప్రభావం తో రాట్నం వడకటం నూలు తీయటం ఖాదీ ధరించటం చేశారు .

దురదృష్ట వశాత్తు రత్నమ్మ గారి భర్త అకస్మాత్తుగా చనిపోవటం తో ఆమె జీవితం లో శూన్యం ఏర్పడింది .సంతానమూ లేదు .ఈ బాధ భరించలేక తల్లడిల్లి పోయారు .క్రమంగా కోలుకొని 1928మద్రాస్ కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో ఉత్సాహం గా పాల్గొన్నారు .తానూ ,తన తల్లిగారు సన్నని నూలు వాడికి దానితో వస్త్రాలు నేయించి కాంగ్రెస్ నేతలకు కానుకగా ఇచ్చేవారు .విదేశీ వస్త్ర బహిష్కరణ లోనూ తీవ్రం గా పాల్గొని విదేశీ వస్త్ర దుకాణాల ముందు పికెటింగ్ నిర్వహించి వాటిని మూయిన్చేవారు .చక్కగా ఉపన్యాసాలు చేస్తూ తోటివారిని ప్రోత్సహించి ఉద్యమం లో పాల్గొనే నేర్పు రత్నమ్మ గారికి ఉండేది .ఇవన్నీ బ్రిటిష్ ప్రభుత్వానికి కారం రాసినట్లనిపించేవి .ఆమెను ‘’విప్లవ వనిత’‘గా ముద్ర వేసి అరెస్ట్ చేసి ఆరు నెలలు జైలు శిక్ష వేశారు .పది హీను రోజులు జైలులో గడిపిన తర్వాత గాంధి –ఇర్విన్ ఒడంబడిక ననుసరించి జైలు నుండి విడుదలయ్యారు ..

అయినా రత్నమ్మగారు ఉద్యమ కార్యక్రమాలను ఆపలేదు. మరింత ఉత్సాహం గా నిర్వహించారు కాంగ్రెస్ వాలంటీర్ లతో కలిసి గ్రామాలు పర్య టించి స్వాతంత్ర సముపార్జన అవసరాన్ని తెలియ జేసేవారు ఖాదీ ప్రచారమూ నిర్వహించారు .శాంతి సైనికుల శిక్షణ కోసం శిబిరాలు నిర్వహించారు.పురుషులపై పోలీసులు లాఠీ చార్జి చేసి అరెస్ట్ చేస్తే స్త్రీలతో కలిసి పికెటింగ్ చేశారు .ఆమె మహా చురుకుగా ఆలోచించి అంతే వేగం గా కదిలేవారు .ఎక్కడ పికెటింగ్ జరిగినా రత్నమ్మ  గారు ముందు ఉండేవారు .మార్గ దర్శనం చేసేవారు .ప్రోత్సాహం ఇచ్చి ముందు నిలిచేవారు .

1923శాసనోల్లంఘన సమయం లో ఆమె ముందుండి ఉద్యమించి ,పికెటింగ్ చేస్తే అరెస్ట్ చేసి వదిలిపెట్టారు  .ఏ మాత్రం భయ పడకుండా మళ్ళీ స్త్రీలతో 75 ఏళ్ళ వృద్ధురాలైన తల్లిగారితో కలిసి సత్యాగ్రహం చేశారు .పోలీసులు మళ్ళీ వీరందర్నీ అరెస్ట్ చేసి విచారణ జరిపి ఆరు నెలలు ఖైదు విధించారు .విడుదల వగానే తీవ్రంగా మళ్ళీ ఉద్యమాలు నిర్వహించారు .

1935గుంటూరు ‘’ఆంధ్ర రాష్ట్ర మహిళా సభ ‘’కు అధ్యక్షత వహించి ఉద్యమ తీవ్రతను తన ప్రసంగం లో వివరించారు .ఆమె కృషికి మెచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ సంఘం  రత్నమ్మగారిని ‘’మహిళా నియంత లందరిపైనా ‘’దళాది పతిగా ,ప్రధాన నియంతగా’’ నియమించింది .రెట్టించిన ఉత్సాహం తో స్త్రీలందరినీ అధిక సంఖ్యలో ప్రోత్సహించి శాసన ధిక్కారం చేయిన్చారామే .ఇక ఆమెను ఆపటం కష్టం అనుకొన్న బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి పది నెలలు శిక్ష విధించింది .రైతు బాంధవుడు ఆచార్య రంగా నిడుబ్రోలు లో ప్రతి ఏడాది నిర్వహించే రాజ కీయ పాఠశాలో రత్నమ్మ పాల్గొనేవారు .దేశం లో ఏమూల కాంగ్రెస్ సమావేశాలు ,సభలూ జరిగినా తప్పకుండా వెళ్లి హాజరయ్యేవారు  .జిల్లా కాంగ్రెస్ ,రాష్ట్ర కాంగ్రెస్ సభ్యురాలై కాంగ్రెస్ ప్రచారం చేశారు.

1936ఎన్నికలలో గుంటూరు జిల్లా బోర్డుకు తెనాలి రెవిన్యు ఫిర్కా నుండి రత్నమ్మగారిని కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపిక చేశారు .1939లో గుంటూరు జిల్లాబోర్డు సభ్యలయ్యారు .1939లో చేబ్రోలు లో మహిళా గ్రంధాలయాన్ని స్థాపించి అధ్యక్షురాలైనారు .మహిళాభి వృద్ధే దేశాభి వృద్ధి అని త్రికరణ శుద్ధిగా నమ్మి పని చేసేవారు .చేబ్రోలు లో మరుసటి ఏడాది స్త్రీలకూ హిందీ విద్యాలయం ఏర్పాటుకు సాయపడ్డారు .అదే తర్వాత గుంటూరు హిందీ మహా విద్యాలయం గా పేరు పొందింది .ఏది చేపట్టినా అభి వృద్ధి చేసి చూపి సామర్ధ్యాన్ని నిరూపించిన మహిళా మాణిక్యం రత్నమ్మ గారు .ఆమె చొరవ ,పూనిక అలాంటిది .ధన సహాయం విరాళాల సేకరణ వనరుల చేకూర్పు లలో ఆమె తోడ్పాటు మరువ లేనిది .

1940వ్యక్తీ సత్యాగ్రహం లో ముందున్నారు .క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని అరెస్ట్ అయి శిక్ష పడకుండానే విడుదలయ్యారు రత్నమ్మగారు .1944జనవరి 26స్వతంత్ర దిం వేడుక లను పెద్ద ఎత్తున బ్రహ్మాండం గా జరిపారు .దీనికి ఫలితం ఆరు నెలల కారాగార శిక్ష అనుభవం .1945నిడుబ్రోలు ఆంద్ర మహిళా శిక్షణ కేంద్రం ఏర్పరచారు .గురువుగా ఉండి అన్నీ పకడ్బందీ గా చేశారు .అదొక పండుగ లాగా జరిగిందని ఇప్పటికీ జనం చెప్పుకొంటారు .1946 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధుల విజయానికి తీవ్ర కృషి చేశారు .

సత్తెన పల్లి లో తన గురువు గారి మఠానికి విరాళాలు ఇచ్చి ,సేకరించి తోడ్పడ్డారు .శాశ్వత ఆదాయం లభించే ఏర్పాటు చేశారు . చేబ్రోలు లో గురువుగారి పేర మఠం కట్టించినిర్వహణ కోసం  భూమిని ,నిధిని సమకూర్చారు .స్వయం గా బ్రహ్మ విద్య బోధించారు .ఇక్కడే మహాత్ముని కస్తూరి బాయిల చిత్రపటాలను ఆవిష్కరించారు .గ్రందాలయాన్నికూడా స్థాపించి స్వాతంత్ర్య సమరయోధులను ఆహ్వానించి గౌరవించి సత్కరించేవారు .రత్నమ్మ గారి తల్లిగారు స్వాతంత్రోద్యమం లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు .ఆమె 91 ఏట గాంధీజీ జయంతి నాడు మరణించారు .అప్పటినుండి రత్నమ్మ గారు గాంధి జయంతిని ,తల్లిగారి వర్ధంతిని కలిపి ఘనం గా నిర్వహించేవారు  .తనకున్న సంపద నంతటినీ దేశం కోసం వినియోగించిన త్యాగ మూర్తి రత్నమ్మగారు .88ఏళ్ళ ధన్య జీవితాన్ని గడిపి దేశ భక్త గొల్లమూడి రత్నమ్మ గారు 5-7-1972న స్వర్గస్తులయ్యారు .రత్నమ్మ గారి జీవితం స్పూర్తిదాయకం ,చిరస్మరణీయం .ఆమె ఒక మహిళా మాణిక్యం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-12-14-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ముళ్ళపూడి &బాపు తో కాసేపు గడపిన క్షణాలు

IMG_5360 IMG_5361 IMG_5362 IMG_5363 IMG_5364 IMG_5365 IMG_5366 IMG_5367 IMG_5368 IMG_5369 IMG_5370 IMG_5371 IMG_5372 IMG_5373 IMG_5374 IMG_5375 IMG_5376 IMG_5377 IMG_5378 IMG_5379 IMG_5380 IMG_5381 IMG_5382 IMG_5383 IMG_5384 IMG_5385

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | 1 Comment

తెలుగు తల్లికి కవితా మల్లె పూ దండ – శంకరంబాడి శత జయంతి

తెలుగు తల్లికి కవితా మల్లె పూ దండ

Inline image 1

శంకరంబాడి శత జయంతి

‘’అయ్యా !మీ విద్వత్తును తెలుసుకొన్నాను .మీకు ఏ విధమైన సన్మానం కావాలో చెప్పండి ?రాష్ట్ర పతి

‘’అయ్యా  గుర్తించి నందుకు  ధన్యవాదాలు. అది మీ విజ్ఞత .నాకు  116 రూపాయలు ,ఒక శాలువాచాలండి ‘’కవి జవాబు .ఆ ప్రశ్నించిన రాష్ట్ర పతి  అకలంక దేశ భక్తులు ,భారత దేశ ప్రధమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు .ఆ జవాబు చెప్పిన కవి ‘’మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ ‘’గీతం రాసి నేటి మన రాష్ట్ర గీతం గా గౌరవిం అందుకొనేట్లు  చేసిన వినయ మూర్తి అయిన తెలుగు కవి స్వర్గీయ శంకరం బాడి సుందరా చారి గారు  .ఇది  వారి శత జయంతి సంవత్సరం .మన ప్రభుత్వాలకు పెద్దగా పట్టి నట్లు లేదు .బడా బడా సాహిత్య సంస్థలూ బుజాన వేసుకోలేదు .ఏదో ఇంకా సాహిత్యాభిమానం ఉన్న మధ్య తరగతి  సంస్థలు మాత్రం భక్తిగా ఆరాధనా భావం తో నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకొంటున్నాయి .సరస భారతి కూడా ఉడతా భక్తిగా ఈ నెలలో 27వ తేదీ శనివారం73వ సమావేశం గా  ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో శంకరం బాడి సుందరా చారి గారి శత జయంతి వేడుకలను విద్యార్ధుల మధ్య జరుపుతూ వారికి అవగాహన కల్గించటానికి వ్యాస రచన పోటీ ని నిర్వహిస్తూ అభిమానాన్ని తెలియ జేస్తోంది .అలాంటి మహా నీయుని ఒక సారి గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నమే ఈ వ్యాసం .

అచ్చిరాని చదువు

ఇంతటి మహాకవి జన్మ దినం కూడాచరిత్రలో మనం నమోదు చేసుకోలేక పోవటం దురదృష్టం .వారు 10-8-1914 న తిరుపతి  దగ్గర తిరు చానూర్ లో  శంకరం బాడి అనేసంప్రదాయ  వైష్ణవ కుటుంబం లో సుందరాచారిజన్మించారు .తిరుపతిలోనే  దేవస్థానం పాఠ శాలలో చదివి  తెలుగు  సంస్క్రుతాలను నేర్చుకొన్నారు .ఆయన్ను బాగా ప్రభావితం చేసిన గురువు గారు ‘’పాతాళ భేది సుబ్రహ్మణ్య శర్మ ‘’ ‘’అల్లసాని రామనాధ శర్మ ‘’గార్లు  అని ఆయన ఎప్పుడూ భక్తితో తలపోస్తూ ఉండేవారు . ఇక్కడ ఎస్ ఎస్ ఎల్సి చదువుతుండగానే నాస్తిక భావన లో కొట్టుకుపోయారు .తలిదండ్రులు మందలించారు .ఇంట్లో ఉండలేక బయటికి వచ్చి స్వతంత్రం గా జీవిస్తూ హోటల్ సర్వర్ గా కూడా పని చేశారు   .చిన్ననాటి కవి మిత్రుడు శ్రీ రంగాచారి పాతికేళ్ళ లోపే చనిపోయాడు యా దిగులు వీరిని నిరంతరం బాధిస్తూ ఉండేది .

నిలకడ లేని జీవితం

ఈ చిలక్కొట్టుడు ఉద్యోగాలు విసుగు తెప్పించాయి .ఆంద్ర పత్రికలో ఉద్యోగం సంపాదించాలనే కోరికతో దాని వ్యవస్థాపకులు కాశీ నాధుని నాగేశ్వర రావు పంతులు గారిని మద్రాస్ వెళ్లి కలిశారు .వీరి ప్రతిభను గుర్తించిన ఆయన పత్రికలో ఉద్యోగం ఇచ్చారు .కొద్దికాలమే చేసి స్వతంత్ర జీవనం అలవాటు పడ్డ అయన రాజీనామా చేసేశారు ..బి ఏ పాసైన ఆచారిగారు చిత్తూరు జిల్లా స్కూల్ ఇన్స్పెక్టర్ గా కొద్దికాలం పని చేశారు .విధి నిర్వహణ లో చాలా కఠినం గా ఉండేవారు అందరిని ప్రోత్సహించేవారు .దీనితో ఆచారి గారంటే అభిమానం ఎక్కువైంది అందరిలో .

ఆకస్మిక నిర్ణయం –ఫలితం

ప్రతి ఆదివారం కంచి వెళ్లి కామాక్షీ అమ్మవారిని సందర్శించి శని ఆదివారాలు అక్కడే గడిపి రాత్త్రికి  ఏ ఇంటి అరుగు మీదనో పడుకొని సోమవారం మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవారు .ఒక సారి అలా పడుకొని ఉన్న సమయం లో ఆ ఇంటిలోని భార్యా భర్తలు తమ కుమార్తె పెళ్లి విషయమై తగాదా పడటం విన్నారు .తలుపు కొట్టి లోపలి వెళ్లి వారు పోట్లాడుకోవాల్సిన పని లేదని వారి అమ్మాయిని తానూ వివాహం చేసుకొంటానని తిరుపతి వచ్చి తన తల్లిదండ్రులను సంపర దించమని ఆకస్మిక నిర్ణయాన్ని ప్రకటించి  తగాదాను తీర్చి అన్నమాట ప్రకారం ఆమెనే వివాహం చేసుకొన్నారు .త్వరలోనే భార్యకు మతి స్తిమితం తప్పిపోవటం తోకొద్దికాలం లోనే చనిపోయింది . ఆచారిగారు మొదటి సారిగా కుంగిపోయారు .విరక్తి కలిగి ఉద్యోగానికి రాజీనామా చేసేశారు .

దేశ దిమ్మరి జీవితం

అప్పటికే వారికి జిల్లా అంతటా కవిమిత్రులు స్నేహితులు చాలా మంది ఉండేవారు వారి దగ్గరకు తిరుగుతూ ఏదీ పట్టించుకోకుండా తిరిగారు .వీలైనప్పుడు నాటక సమాజాలకునాటకాలు రాసి ఇస్తూ వారి వెంట దేశ ద్రిమ్మరిగా తిరిగారు  స్థిర మైన ఆదాయం ,నిలకడ అయిన జీవితం కోల్పోయారు .1940-50మధ్య కొన్ని సినిమా లు  .బిల్హణీయం ,మహాత్మా గాంధి దీన బంధులకు సంభాషణలు రాసి దీనబందులో నటించారు కూడా .

మా తెలుగు తల్లికి గీతం  ఆవిర్భావం

ఒక సారి ‘’దీన బంధు ‘’ చిత్ర దర్శకుడు తెలుగు తల్లిపై పాట రాయమని కోరాడు .అప్పుదు  వీరి కలం నుండి జాలువారిన అద్భుత గీతమే  ‘’మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ ‘’కాని ఆ సినిమాలో ఆ పాటను డైరెక్టర్ వాడుకోలేక పోయాడు అలానే ఉండిపోయింది .

ఇంటింటా మారు మోగిన మా తెలుగు తల్లి

హెచ్ ఏం వి. గ్రామ ఫోన్ కంపెని ఆ పాటకు సుందరాచారి గారికి నూట పదహారు రూపాయలు ముట్ట జెప్పి  ఎస్ బాలసరస్వతి ,మధుర గాయిని టంగుటూరి సూర్య కుమారి గారి చేత బాణీ కట్టించి  సూర్య కుమారితో  పాడించి రికార్డ్ చేసి దేశానికి అందజేసి మహోపకారమే చేసింది .ఇంటింటా ఆ పాట ఆమె గాన  మాధుర్యం తోనూ ఆయన గీత మాధుర్యం తోనూ మారు మొగి పోయి యేన లేని ప్రచారాన్ని తెచ్చింది .

ఇతర రచనలు

ఆచారిగారు భారత ,రామాయణ ,భాగవతాలను  సరళమైన ఆట వెలది పద్యాలలో ‘’సుందర రామాయణం, సుందరభారతం, సుందర భాగవతం ‘’గా రాసి తమ ప్రతిభను చూపించారు .దాతల ఆర్ధిక సాయం తో వాటిని ముద్రించి ఊరూరు తిరిగి పాఠశాలలో అమ్ముకొని జీవించేవారు .అడిగిన వారికి ప్రతిఫలాపేక్ష లేకుండా ఉచితం గా అందజేసేవారు .  . ‘’ బుద్ధ గీత  ను రాసి పది వేల కాపీలు ముద్రిస్తే హాట్ కేకుల్లాగా చెల్లిపోయాయి .వారిపై అంత గొప్ప అభిమానం అన్న మాట .ఏకలవ్యుడు ఖండకావ్యం,బలిదానం కెరటాలు ,సుందర బిందువులు ,జానపద గీతాలు స్థల

సాహిత్య రాజకీయ ప్రోత్సాహం

కపిస్థలం శ్రీ రంగా చారి గారితో నిరంతర సాన్నిహిత్యం ఏర్పరచుకొని వారితో సాహిత్య విషయాలను సుందరాచారిగారు చర్చిస్తూ ఉండేవారు .రాజ కీయ విషయాలను లోక సభ  స్పీకర్ మాడ భూషి అనంత శయనం అయ్యంగార్ తో చర్చించేవారు .వీరిద్దరూ అదే వీధిలో ఉండేవారు .

నిరుపేద జీవితం

‘అంతటి కవికి ఎంతటి కస్టాలోచ్చాయో తలుచుకొంటే గుండె బరువెక్కుతుంది  . నిరాడంబర జీవితమే గడిపిన దేశ భక్తులు .బీద తనమే ఆచారి గారి ఆరోగ్యాన్ని కబలిమ్చింది దీన్ని మర్చిపోవటానికి మద్యానికి బానిస అయ్యారు .ప్రతిభ ఉన్నా ఆదరించి ఆదుకొనే సహృదయత ఎవరూ చూపలేదు నిరాదరణకు గురైనారు .ఎన్నో అవకాశాలు దీనివల్ల చేజారిపోయాయి .ఎన్నో గౌరవ పురస్కారాలూ దూరమైపోయిన మిక్కిలి దురదృష్ట వంతులు .

మొక్కుబడి గౌరవ పురస్కారాలు

ప్రధమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ,ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు చేతుల మీదుగా అందుకొన్న శాలువా ,116 రూపాయలు మాత్రమె వారి జీవితం లో ఘనం గా చెప్పుకోదగిన బహుమతి పురస్కారం .తిరుపతి వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ‘’ప్రసన్న కవి ‘’ బిరుదు నిచ్చి సత్కరించింది .ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో జరిగినపుడు ఆచారి గారిని సగౌరవం గా ఆహ్వానించి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం సన్మానించింది .తిరుపతి నగరపాలక సంస్థ వారి కాంశ్య విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించి గౌరవించింది .వీరిపై ఆకాశవాణి మాజీ స్టేషన్ డైరెక్టర్ శ్రీ  ఆర్ అనంత పద్మ బాభ రావు గారు విపుల పరిశీలనతో గొప్ప గ్రంధం రచించారు

1977లో  తెలుగు తల్లికి కవితా మల్లె పూదండ అల్లిన శంకరంబాడి సుందరాచారి గారు 1977లో మరణించారు.

Inline image 2 Inline image 3    Inline image 4

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-14-ఉయ్యూరు .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -95 – 140 –గురువులకు గురువు ,సర్వ శాస్త్ర వేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -95

 

140 –గురువులకు గురువు ,సర్వ శాస్త్ర వేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి

గురువులకు గురువులు

దాదాపు అరవై డెబ్భై ఏళ్ళ క్రితం ఏ సంస్కృత పండితుడిని అడిగినా తాను  తాతా సుబ్బరాయ శాస్త్రి గారి శిష్యుడి నని కాలర్ –సారీ ఖండువా ఎగరేసి చెప్పేవారు .అంతటి విఖ్యాతి వారిది .విజయనగరానికి సమీపం లో ఒంటి తాడి అగ్రహారం లో 25-1-1867 న తాతా సూర్య నారాయణావధాని ,సోమి దేవమ్మ దంపతులకు సుబ్బరాయ శాస్త్రి గారు జన్మించారు .కొడుకును శాస్త్ర పండితుడిని చేయాలనే బలీయమైన కోరిక ఉన్న వీరి తల్లిగారు కొడుకును చంకన ఎత్తుకొని దాదాపు రెండుకిలో మీటర్లు నడిచి విజయనగరం లో గురువుగారి వద్ద దింపి వచ్చేది .అంత పట్టుదల చూపింది ఆ మహా ఇల్లాలు కుమారుని విద్యకోసం .ఆ శ్రమ ఊరికే పోలేదు ఫలించింది .తల్లి ఋణం తీర్చుకొన్నారు శాస్త్రి గారు .పెరిగి పెద్ద వారైన శాస్త్రి గారు విజయ నగరం లో బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద చేరి సంస్కృత సాహిత్యం అభ్యసింఛి ప్రావీణ్యం సాధించారు .శాస్త్రి గారిది పాదరసం లాంటి చురుకైన బుద్ధి .మేధావిగా పరిగణన చెందారు .వీరి శ్రద్ధాసక్తులు ,వినయం, మేధావి తనం కర్ణాకర్ణీగా విన్న రుద్రా భట్ల రామ శాస్త్రి లక్ష్మణ శాస్త్రి సోదరులు సుబ్బరాయ శాస్త్రిగారిని ఆహ్వానించి ,చేర దీసి, వ్యాకరణ అలంకార శాస్త్రాలు నేర్పి అసామాన్య పండితునిగా తీర్చి దిద్దారు .గొప్ప శిష్యునికోసం వెదికిన ఆ గురు సోదరులు ధన్యులు .వారు నేర్పిన విద్యనేర్చి ఈశిష్యుడూ గురూణంతీర్చుకొన్నారు .

బహు శాస్త్ర పరిజ్ఞానం

ధర్మ శాస్త్రం నేర్వాలన్న కోరిక కలిగి గుమ్మలూరు సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులై ఆసాంతం అభ్యసించారు .కొల్లూరు కామ శాస్త్రి గారిని చేరి వేదాంతం అంతం చూశారు .సంగీతం మీద మోజు కలిగి కట్టు సూర్య నారాయణ గారి వద్ద సంగీత గుట్టు మట్టులన్నీ గ్రహించారు .ఇలా శాస్త్రి గారి బహుశాస్త్ర పరిజ్ఞానం దేశమంతా వ్యాపించి గొప్ప గుర్తింపు నిచ్చింది .ఆంధ్రా దేశం లో ఏ శాస్త్రం లో ఏ రకమైన సందేహాలు వచ్చినా చివరికి వీరి దగ్గరకు రావాలి సిందే. వీరి తీర్పే తుది తీర్పు ,శిరోదార్యమూ అయింది. అంతటి నిష్పాక్ష పాతం గా శాస్త్ర బద్ధం గా ధర్మ,  న్యాయ బద్ధం గా వ్యవహరించేవారు .గంభీర హృదయులు .తొట్రు పాటు లేని ప్రశాంత మూర్తి శాస్త్రి గారు .

సుదీర్ఘ విద్యాదానం –అరుదైన రికార్డు

ఆ నాటి మేటి పండితులలో సుబ్బా రాయ శాస్త్రి గారు నాగరికులు అనిపించుకొన్నారు .లౌకిక జ్ఞానం లోనూ అసాధారణ ప్రజ్ఞ ఉండేది .వీటి వలననే విజయ నగర పురపాలక సంఘం లోను, సహకార సంఘం లోను సభ్యులై స్థానిక సంస్థలలో ప్రధాన సభ్యులుగా అనేక మార్లు ఎన్నుకో బడ్డారు .అంతటి విశేష మైన మూర్తిమత్వం వారిది .విజయనగరం రాజా వారి సంస్కృత కళాశాలలో శాస్త్రిగారు నలభై ఏళ్ళు సుదీర్ఘ కాలం ప్రధానాచార్యులుగా పని చేసి శాస్త్రాధ్యాపనం చేశారు .ఒక రకం గా ఇదొక రికార్డే .

గ్రంధ రచన లో మేటి

 

భారత దేశం లో ఉత్తమ వ్యాకరణ గ్రంధం గా పరిగణింప బడుతున్న నాగశ భట్టు రచించిన ‘’శబ్దెందు శేఖరం ‘’ను ఉత్తరదేశ పండితులు ఖండించటం మొదలు పెట్టి గ్రందాలుకూడా రాశారు .శాస్త్రి గారు వారి వాదాలనన్నిటిని గడ్డిపోచల్లాగా తేలిగ్గా తీసి పారేసి ,ఖండనలకు ప్రతిఖందనలు చేసి నాగశ భట్ట హృదయాన్ని ఆవిష్కరిస్తూ ‘’గురు ప్రసాదం ‘’అనే మహా ఉద్గ్రంధం రాసి ,నోరు మూయించారు .ఈ గ్రంధాన్ని  ఆంద్ర  విశ్వా విద్యాయం గౌరవం గా ముద్రించించి లోకానికి అందించింది .దీనితో మారుమూల ప్రాంతాల వారికి కూడా శాస్త్రి గారి పాండితీ గరిమ తెలిసి శిష్యులై విద్య నేర్చుకొన్నారు .అంతటి ప్రభావం చూపింది. ఆ గురుప్రసాద శిష్యుల పాలిటి వరమే అయింది .శాస్త్రిగారు ఈ గ్రంధాన్ని ‘’స్వర సంధి ‘’వరకు రాశారు .శిష్యులు పేరి వెంకటేశ్వర శాస్త్రి ‘’గురు ప్రసాద శేషం ‘’పేరిట ‘’కారకాంతం ‘’వరకు రాసి పూర్తీ చేశారు .అంతటి గొప్ప శిష్యులను తయారు చేశారు తాతా వారు .శాస్త్రి గారి అమోఘ పాండిత్యానికి వారసులుగా వీరు ఉన్నారు అనటానికి ఇది  ఒక ప్రత్యక్ష సాక్షం .దీనినీ ఆంధ్రా యూని వర్సిటీ యే ముద్రించింది . సుబ్బరాయ శాస్త్రి గారు హరి శాస్త్రి రాసిన ‘’శ్శబ్ద రత్న ‘’వ్యాఖ్యను పరిశీలించి టీకా రాసి పరిష్కరిస్తే ఆంద్ర విశ్వ కళా పరిషత్ ప్రచురించింది .

పురస్కార గౌరవ రికార్డ్

1912లో ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదం శాస్త్రి గారిని వరించింది .ఆ బిరుదు పొందిన మొట్ట మొదటి వ్యక్తీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారే ఇదీ ఒక  రికార్డే  .ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇండియా వచ్చినప్పుడు శాస్త్రిగారిని సగౌరవం గా మద్రాస్ కు ఆహ్వానించి ,తనపేరు చెక్కబడిన ‘’సువర్ణ కంకణాన్ని ‘’స్వయం గా శాస్త్రిగారి చేతికి తొడిగి అలంకరించాడు .ఇది ఒక భారతీయ అందునా ఆంద్ర దేశానికి చెందినా శాస్త్ర పండితునికి లభించిన అరుదైన గౌరవం .ఇది మూడవ రికార్డు .వి జయనగరం లోనే కాక ఉర్లాం ,పిఠాపురం సంస్థాన పండిత పరీక్షలకు శాస్త్రి గారు ఎప్పుడూ ప్రధాన  పరీక్షకులుగా ఉండేవారు .ఇంతటి శాస్త్ర పండితునికి సంఘ సంస్కరణ పై మిక్కిలి అభిమానం ఉండటం ఆ రోజుల్లో ఆశ్చర్య పడే విషయం .దురాచారాలను కాలాన్ని బట్టి మార్చుకొని సంస్కరించుకొని శాస్త్ర సమ్మతాలైన వానిని అనుసరించాలని ఎప్పుడూ ప్రబోధించేవారు .మహాత్ముని ఖద్దరు వస్త్ర ధారణా ,వీరిపై ప్రభావం చూపింది .నిత్యం సన్నని పొందూరు ఖద్దరు వస్త్రాలే జీవితాంతం ధరించేవారు .

శాస్త్ర వాద తీర్పరి

ఆంద్ర సాహిత్య పరిషత్తు సమావేశానికి ఒక సారి అధ్యక్ష స్థానం లో ఉండి ఆంద్ర భాష ఔన్నత్యం కోసం మార్గ నిర్దేశం చేస్తూ చేసిన ప్రసంగం మహోపన్యాసం అనిపించింది .రాజ మండ్రి శ్రోత్రియ మహాసభ ,విశాఖ జ్యోతిశ్శాస్త్ర సభలలో పండితులు చేసిన చర్చోప చర్చలకు శాస్త్రి గారినే ఉభయ పక్షాల వారు’’ తీర్పరిగా’’ఉండమని వేడుకోవటం ,శాస్త్రిగారి సర్వతోముఖ ప్రతిభకు ,నిష్పాక్షికతకు నిలు వెత్తు నిదర్శనం .శాస్త్రిగారు కాశీ ,దర్భంగా ,పుదుక్కొట వగైరా సంస్థానాలను దర్శించి శాస్త్ర చర్చలు జరిపి పండితులను ఓడించి గెలిచి’’ జయ పత్రాలు ‘’అందుకొన్నారు .శాస్త్ర వాదాలలో అగ్ర గణ్యులని గుర్తింపు పొందిన కాశీ పండితుడైన ‘’జయ దేవ మిశ్ర ‘’పండితుడు –సుబ్బరాయ శాస్త్రి గారి ‘’పేరు విన్నంతనే ,’’అమాంతం ‘’రెండు చేతులు జోడించి’’ నమస్కరించే వారట .అంతటి మహోన్నత పండితులు మన సుబ్బా రాయ శాస్త్రి గారు .సుబ్రహ్మణ్యం పేరులోనే ఉంది ఆ ధిషణ.శాస్త్రి గారి 63 వ జన్మ దినోత్సవం నాడు శిష్య ,ప్రశిష్య బ్రందం  ఆత్మయ పండిత సాహితీ బృందం అందరూ కలిసి మహా వైభవం గా గురు పూజోత్సవం  జరిపి కృతజ్ఞతలు తెలియ జేసుకొని ఘంగా సన్మానించి గౌరవించి చిరకీర్తి ని  ఆర్జించారు .

మహా మహోపాధ్యాయ ,గుగ్గురువులు శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రిగారు 77 సంవత్సరాలు శాస్త్ర సింహులుగా ,ఓటమి ఎరుగని పండితులుగా ,బహు గ్రంధ కర్త గా జీవించి1944లో కీర్తి  శేషులయ్యారు .

రెండవ విరామం

 

మనవి-    సాహితీ బంధువులకు శుభ కామనలు-‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గా ఇంగ్లాండ్ ,అమెరికా దేశపు 125 మంది పూర్వకవుల పై రాసి ప్రచురించిన తర్వాత ,నా మనసులో ఒక బాధ పీడిస్తూనే ఉంది .మన దేశ పూర్వ కవులపై ఇంతవరకు రాయలేక పోయానే అనేది మనసులో తొలుస్తూనే ఉంది .ముఖ్యం గా మన సాహిత్యానికి మూలం సంస్కృతం కనుక పూర్వ సంస్కృత కవులపై రాసి ఆ లోటు భర్తీ చేయాలని పించింది .శీర్షిక కోసం రెండు మూడు రోజులు ఆలోచిస్తే ఫ్లాష్ గా ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’పేరు స్పురించింది .వెంటనే రాయటం మొదలు పెట్టాను .అది పెరిగి పెరిగి విస్తృత రూపం దాల్చింది .మధ్యలో కొద్ది రోజులు విరామం తర్వాత కొన సాగించి ఈ రోజుకు 95 ఎపి సోడ్ లలో ,140మంది సంస్కృత కవుల గురించి రాశాను .నా అంతర్జాల రాత ప్రయత్నాలలో ఇది చాలా బృహత్తరమైనదే .నేను రాసినవి చాలా ప్రాధమిక విషయాలే .వారిగురించి తెలుసుకోవాల్సింది చాలా ఉండి ఉంటుంది నాకు లభించిన సోర్సు ల నుండి గ్రహించి మీ కు తెలియ జేశాను అంతే .ఇంకా ఎందరో నా దృష్టికి రాని వారు ఉండవచ్చు .

ఇంత మంది సంస్కృత  మహా కవులు, రచయితలను సంస్మరించగలిగాను .వారి గురు పరంపరను స్పృశించి ధన్యమయ్యాను .ఇది నా అదృష్టం గా భావిస్తున్నాను .ఇంకా నా దృష్టికి రాని వారిగురించి తెలుసుకొని వారినీ చేర్చే ప్రయత్నం చేస్తాను .అంత వరకు ఈ శీర్షిక కు ‘’మరొక కామా లేక మరో విరామం ‘’గా భావించండి .ఆదరించిన వారందరికీ ధన్యవాదాతో కూడిన కృతజ్ఞతలు .

మరొక ముఖ్య విషయం –నేను ఎప్పటికప్పుడు తనకు అంకితం ఇద్దామను కొన్న నాలుగు పుస్తకాలను ఒకటి తమ తల్లి కీ శే .సౌభాగ్యమ్మగారికి ,రెండవది అర్ధాంగి శ్రీమతి సత్య వతి గారికి ,మూడవది తన బావ గారు డాక్టర్  శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారికి కి  నాల్గవది తన జీవితానికి మార్గ దర్శి అయిన ‘’కపటమెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి’’ శ్రీ కోగంటి సుబ్బారావు గారికి అంకితం ఇవ్వమని చెప్పి ,ఇప్పించిన  స్పాన్సర్ గా ఉన్న ఉదార హృదయులు నాకు బహు ఆత్మీయులు ,సరసభారతి కి అత్యంత శ్రేయోభిలాషులు ,,మార్గ దర్శి శ్రీ మైనేని  గోపాల కృష్ణ –(అమెరికా )గారికి ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అనే ఈ అంతర్జాల గ్రంధం ,అంతర్జాల సాక్షిగా –రూపాయి కూడా వారికీ నాకు ఖర్చు లేని విధం గా  వారి సాహిత్యాభి లాషకు ,సరస హృదయానికి ,సౌశీల్యతకు  స్నేహ ధర్మానికి మాతృ దేశాభిమానానికి మాతృభాషా భిమానానికి ,భారతీయ అధ్యాత్మకత పై ఉన్న గౌరవానికి ,  గుర్తింపు గా   10-1-2015న శ్రీ గోపాల కృష్ణ గారి 80 వ జన్మ దినోత్సవం సందర్భం గా ఇప్పుడే కృతజ్ఞతా పూర్వకం గా , చిరుకానుక గా ఈ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అంతర్జాల గ్రంధాన్ని  అంకితమిస్తున్నాను  .

ఇదేదో వారిని మభ్య పెట్టి గ్రంధ రూపం లో దీనిని తీసుకు రావానే ఆలోచన తో మాత్రం కాదని ,వారు ‘’ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న అంకిత విషయం ‘’పై నా  నిర్ణయమే నని సవినయం గా మనవి చేస్తున్నాను .వారికి తెలియ బరచ కుండా నే  నేను చేసిన ఈ సాహసానికి గోపాల కృష్ణ గారు సహృదయం తో అర్ధం చేసుకొంటారని భావిస్తున్నాను .

పూర్వం పెట్టిన కామా తర్వాత – ఈ రచనకు తోడ్పడిన  గ్రంధాలు

1-తెలుగు విజ్ఞాన సర్వస్వం

2-20 వ శతాబ్ది తెలుగు వెలుగులు (1,2 భాగాలు )-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ

3-వీకీ పీడియా

మొదలైనవి

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-14-ఉయ్యూరు

 

 

.

 

 

 

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఏటా బాపు ఉత్సవాలు ,విశ్వనాధ్ కు బాపు రామణ లపురస్కారం పుస్తకాలు సమాజ నిర్మాణాలు ,వగైరా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీత” చక్రి ”వర్తి

న్నాడు అలా వెళ్ళిపోయాడు..!

‘చక్రి .. హృదయమున్న మనిషి. ఒక్క ట్యూన్‌ ఇచ్చాడంటే చాలు.. అది గుండెల్ని తాకాల్సిందే..’ అంటున్నారు దర్శకుడు వంశీ. చక్రి సంగీత సారథ్యంలో వచ్చిన తన చిత్రం ‘గోపి గోపిక గోదావరి’లో ‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల’ పాటను గుర్తు చేసుకున్నారాయన. చక్రి గురించి వంశీ చెప్పిన మరిన్ని విషయాలే ఇవి…
‘‘ఈ మధ్యనే చక్రి ఆఫీసుకు వెళ్లాను నేను. వాణ్ణి అదే ఆఖరుసారి కలవడం. మాటల్లో ‘‘మనమిద్దరం త్వరలో ఒక అద్భుతం చేయబోతున్నాం’’ అన్నాడు. ఆ అద్భుతం చేయకుండానే అలా వెళ్లిపోయాడు. చక్రికి నాకు ఉన్న బంధం ఈనాటిది కాదు. డేటు సరిగా గుర్తు లేదు కాని.. కొన్నేళ్ల కిందట సిరివెన్నెల సీతారామశాసి్త్ర మిత్రుడు సాయి అనే వ్యక్తి నాకు చక్రిని పరిచయం చేశాడు. మేమిద్దరం కలవడం అదే తొలిసారి. అప్పటి వరకు నా సినిమాలకు ఇళయరాజా గారు సంగీతం అందించారు. అయితే తక్కువ బడ్జెట్‌లో ఒక సినిమాను తీయాలనుకున్నాం. అలా తీసిన సినిమానే ‘ఔను… వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’. ఇళయరాజాతో మ్యూజిక్‌ చేయిస్తే బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది కాబట్టి.. చక్రీని అప్రోచ్‌ అయ్యాను. మా సినిమా బడ్జెట్‌ను చూసి.. అతను సరే అన్నాడు. చక్రితో నా మొదటి చిత్రం అదే అయ్యింది! అతనితో ఉన్న సౌలభ్యం ఏమిటంటే – మనకు ఏ ట్యూన్స్‌ కావాలంటే ఆ ట్యూన్స్‌ను అందించడం. మళ్లీ మళ్లీ మార్చమని అడిగినా సరే.. కించిత్తు విసుక్కోడు. అయితే అతనితో సమస్యల్లా ఆలస్యంగా రావడం. అడిగింది ఇచ్చేవాడు కాబట్టి.. అదేమంత పెద్ద సమస్య అనిపించలేదు నాకు. కొత్తపాత ఏమీ లేదు. భేషజాలైతే మచ్చుకు ఉండవు. చక్రితో ఒకసారి పరిచయం అయితే ఇక ఆ వ్యక్తి ఫ్రెండ్‌ అయిపోయినట్లే! అతని వ్యక్తిత్వాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే ‘హెవీఫ్రెండ్లీ మనిషి’.
హౌస్‌బోట్‌లో కంపోజింగ్‌..
నా సినిమాల్లో ఏడింటికి చక్రి మ్యూజిక్‌ అందించాడు. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా’ చిత్రం కోసం ఇద్దరం ఆసి్ట్రయా వెళ్లాము. కేవలం మ్యూజిక్‌ను కంపోజ్‌ చేసేందుకే అక్కడికి చేరుకున్నాం. చక్రి ఒక కీబోర్డుతో వచ్చాడు. ఆ చిత్రంలోని పాటలన్నీ అద్భుతం. ‘సరేలే సరేలే..’ అనే పాట నాకు బాగా ఇష్టం. ఆ పాట ట్యూన్‌ పండింది. చక్రిలో ఉన్న నైపుణ్యం ఏంటంటే.. అతను కంపోజ్‌ చేసే ట్యూన్‌లోనే పల్లవి పలుకుతుంది. ‘గోపి గోపిక గోదావరి’ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చేందుకు కేరళకు వెళ్లడం కూడా అద్భుతమైన అనుభవం. అప్పుడు నేను, చక్రి ఒక హౌస్‌బోట్‌ తీసుకున్నాం. బ్యాక్‌వాటర్‌లోనే పదిరోజులు ప్రయాణిస్తూ.. రకరకాల ట్యూన్స్‌ను సెట్‌ చేసుకున్నాం. ఆ బోట్‌ సకల సౌకర్యాల విడిది. ‘గోపి గోపిక..’ చిత్రంలో ఇప్పటికీ వినిపిస్తూ ఉండే పాట‘‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా..’’. ఆ పాటకు ట్యూన్‌ చెప్పినప్పుడే లిరిక్‌ పాడాడు చక్రి.
పల్లవి చెబితే హిట్‌..
నేను నిత్య చదువరిని. సాహిత్యాన్ని బాగా చదువుకున్న వాణ్ణి. అయితే చక్రి పెద్దగా సాహిత్యాన్ని చదువుకోలేదు. అయితే అతను పల్లవి చెప్పాడంటే ఆ పాట సూపర్‌హిట్‌ అయ్యేది. అదే అతని ప్రత్యేకం. ఆ సృజనాత్మక నైపుణ్యం అతనికి.. తండ్రి నుంచి అబ్బింది అనుకుంటా. వాళ్ల నాన్న కూడా మంచి కళాకారుడు కదా! మ్యూజిక్‌ కంపోజింగ్‌లో మా ఇద్దరి మధ్య ఏనాడు విపరీతమైన భేదాభిప్రాయాలు వచ్చిన సందర్భాలు లేవు. నేనే కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడినా.. తిరిగి పల్లెత్తు మాట అనేవాడు కాదు. చాలా నిగ్రహశీలి. సహృదయుడు. ఎంత చిన్నోళ్లయినా పెద్దోళ్లయినా హర్ట్‌ చేసేవాడే కాదు. ఏదైనా ఓపిగ్గా కన్విన్స్‌ చేసేవాడు.
ఇక, ఫ్యామిలీ విషయానికొస్తే – పని ఒత్తిడిలో ఉన్నాసరే కుటుంబానికి ఏ కొరత రానిచ్చేవాడు కాదు. తల్లిని, భార్యను, ఇద్దరు చెల్లెళ్లను ఆప్యాయంగా చూసుకునేవాడు. ఎవరికీ ఏ లోటు రానివ్వడు. చనిపోయేముందు ‘మీరు టీనేజ్‌ లవ్‌ స్టోరీ చేస్తే బావుంటుందేమో ఆలోచించండి’ అన్నాడు. ఈ లోపు వాడు వెళ్లిపోయాడు. చక్రిని మాత్రమే నేను ‘ఒరే బిడ్డా’ అనేవాణ్ణి. వాడంటే నాకు అంత ప్రేమ.
చక్రిలోని మరో కోణం..
యాదృచ్చికమో ఏమో కాని.. సరిగ్గా ఇదే డిసెంబరులో (2009) వంశీ, చక్రిలను ఒక చోట కలిపింది ‘నవ్య’. వారిద్దరి మధ్య అల్లుకున్న స్నేహబంధాన్ని ‘జుగల్‌బందీ’ శీర్షికన పాఠకులకు అందించింది. అప్పట్లో చక్రి గురించి వంశీ పంచుకున్న అనుభవాలలో కొన్ని ఇవి..
‘‘మాది తూర్పుగోదావరి. అంటే కోస్తా. వీడిది వరంగల్‌. అంటే తెలంగాణ. వీడితో స్నేహం చేసిన తర్వాత తెలంగాణ అంటే అపారమైన ప్రేమ ఏర్పడింది. వీడితో పరిచయం అయ్యే వరకు తెలంగాణ ప్రజలు ఇంత గొప్పగా ఉంటారని తెలియదు. ఎక్కడ చక్రీ. ఎక్కడ నేను’’
‘‘సినిమా వాళ్లకు అభిమానుల నుంచి ఫోన్లు రావడం సహజం. అలా ఒక రోజున – ఒక వ్యక్తి చక్రీకి ఫోన్‌ చేసి ‘‘మా రెండేళ్ల పాపకు హార్ట్‌ ప్రాబ్లమండీ. వైద్యం కోసం డబ్బులు సరిపోవడం లేదు. మీరు సహాయం చేస్తారా?’’ అని అడిగాడతను. సమయం మించిపోతే పాప బతకదు. అందుకని చక్రీ ఒక మనిషికి డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తి వద్దకు పంపించాడు. ‘‘ఆపరేషన్‌ అయిన తర్వాత ఆ బిడ్డ యోగక్షేమాలు నాకు తెలియజేయండి’’ అని చెప్పి మరీ పంపించాడు. సినిమా వాళ్లలో ఎంతమందికి ఇంత ఉదారత ఉంటుంది? మనుషులకు ఆపదొస్తే ఆదుకునే కోణం చక్రిలో నేను చూశాను’’
‘‘అన్నం, ఆవకాయ ఎప్పుడూ టేస్టే కదా! అలా వాడు నేను కలిస్తే బావుంటుంది. అన్నం, ఆవకాయే కాదు.. అన్నం, మెంతి మాగాయ కూడా. అలాంటిదే మా మధ్య అల్లుకున్న బంధం’’
ఆరు రూపాయల అన్నంతో కడుపునింపుకున్నా..
చక్రివి సినిమా కష్టాలు కాదు. బతుకుపోరాటంలో ఎదురైన ఆటుపోట్లు. సినిమాల మీద మమకారంతో.. ఎవరి అండదండలు లేకపోయినా.. ధైర్యంగా సంగీత ప్రపంచంలోకి వచ్చి.. తనకంటూ ప్రత్యేకముద్రను సాధించుకున్నారు. చిన్న వయసులోనే కెరీర్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నేళ్ల కిందట ‘నవ్య’కు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారాయన. ‘అనుభవం’ శీర్షిక కింద ప్రచురితమైన ఆ ఇంటర్వ్యూను మళ్లీ సంక్షిప్తంగా ఇస్తున్నాం..
‘‘మాది మహబూబాబాద్‌ మండలంలో కంబాలపల్లి గ్రామం. సినిమాల మీద పిచ్చితో హైదరాబాద్‌కు వచ్చి కృష్ణానగర్‌లో రూమ్‌ తీసుకుని ఉండేవాణ్ణి. ఒక్కణ్ణే అద్దె కట్టలేక ముగ్గురితో షేర్‌ చేసుకున్నాను. మొదట్లో డబ్బులకు ఇబ్బందులొచ్చి.. చిన్న ఉద్యోగం చేశా. అయితే మ్యూజిక్‌ నేర్చుకోవడానికి కష్టమని దాన్ని మానేశాను. కొన్నాళ్లు ఆర్కెసా్ట్ర నడిపా. సొంతంగా ఆల్బమ్స్‌ చేశా. ఆ అనుభవంతో కోఠిలోని ఆడియో సంస్థల వాళ్ల నుంచి పిలుపు వస్తుందని ఎదురుచూసేవాణ్ణి. కొన్నిసార్లు రమ్మని కబురుపెట్టేవాళ్లు. తీరా వెళితే గంటలు గంటలు ఎదురుచూడ్డం నా వంతు అయ్యేది. జేబులో అయితే పది, ఇరవై రూపాయలకంటే ఎక్కువ ఉండేదే కాదు. ‘‘ఇప్పుడే పిలుస్తాం. కాసేపు వెయిట్‌ చేయండి’’ అనేవాళ్లు. ఎదురుచూసి చూసి మధ్యాహ్నం అయ్యేది. మంచి భోజనం చేయడానికి పైసలు లేవు కాబట్టి.. ఆరు రూపాయలు ఇస్తే దాల్‌-రైస్‌ వచ్చేది. అదే నా భోజనం. సాయంత్రం రెండు మిరపకాయ బజ్జీలు. అంతే! పూట గడిచేది. రాత్రి తొమ్మిదింటికి ఆడియో కంపెనీల వాళ్లు నా వద్దకు వచ్చి ‘‘ప్రస్తుతం ఆడియో బిజినెస్‌ టైట్‌గా ఉంది. మీ కాన్‌సెప్ట్‌తో వర్కవుట్‌ కావు. అనుకూలించినప్పుడు కబురు పెడతాం రండి’’ అని చావుకబురు చల్లగా చెప్పేటోళ్లు.
రిజెక్ట్‌ చేసేవాణ్ణి..
సినీరంగం వైపు అడుగులు వేశాను. ఆ సినిమా తీస్తున్నాం. ఈ సినిమా తీస్తున్నాం.. అంటూ నా జేబులోని డబ్బునే ఖర్చు పెట్టించేవారు తప్పిస్తే.. ఆఖరికి అవకాశం వచ్చేది కాదు. ఓ పది సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. అప్పట్లో ‘చిరునవ్వు’ అనే నా ఆల్బమ్‌తో నాక్కొంచెం గుర్తింపు వచ్చింది. ‘వందేమాతరం’ ఆల్బమ్‌తో సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా కొన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చే ఛాన్స్‌ వచ్చింది. పాటలు రికార్డ్‌ అయ్యేవి కాని సినిమా షూటింగ్‌ జరిగేది కాదు. ‘లిటిల్‌హార్ట్స్‌’ అనే చిత్రానికి పనిచేస్తున్నప్పుడు పూరిజగన్నాథ్‌ ‘బాచి’కి అవకాశం ఇచ్చారు. అప్పటికి నాకు అంత అనుభవం లేదు. సింగర్స్‌ విషయంలో పూరిజగన్నాథ్‌ తీసుకున్న నిర్ణయాలను నేను కాదన్నాను. నేను రిజెక్ట్‌ చేసిన వారిలో అందరు సీనియర్‌ సింగర్సే! నా దృష్టిలో ఉన్నికృష్ణన్‌, మనోహర్‌, హరిహరన్‌, ఉదిత్‌ నారాయణ్‌, సిక్విందర్‌ల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లనే అందరికీ చెబుతున్నాను. ఈ ధోరణి వల్ల అవతలి వాళ్ల మనసు నొచ్చుకుంటుందని గ్రహించలేకపోయాను. పూరి వద్దకు వెళ్లి ‘‘సారీ సార్‌, ఇప్పటి వరకు మీరు చెప్పింది వినిపించుకోలేదు’’ అన్నాను. ఆయన చిరునవ్వుతో భుజం మీద చేయివేసి ‘సరేసరే’ అన్నారు. ‘బాచి’ యావరేజ్‌గా ఆడినా పాటలు మాత్రం నాకు పేరుతెచ్చాయి. ఆ తర్వాత సినిమాల్లో వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి..’’
జగనన్నను చూడాలని ఉంది : చక్రి ఆఖరి మాట
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ఇమేజ్‌ ఏర్పాటు చేసుకున్న సంగీత దర్శకుడు చక్రి చనిపోక ముందు మాట్లాడిన మాటలు….
ఎందుకో జగనన్న ( పూరిజగన్నాథ్‌ )ను చూడాలని ఉందిరా అంటూ ఆదివారం అర్థరాత్రి తన ఆఫీసు బాయ్‌తో అన్నారు. తన రికార్డింగ్‌ స్టూడియోలో పని ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు
కారులో ఆఫీసు బాయ్‌కు చక్రికి మధ్య జరిగిన సంభాషణ.

పూరిజగన్‌, చక్రికి మధ్య ఉన్న సంబంధం వేరే చెప్పనక్కర్లేదు. వీరి కాంబినేషన్‌లో ఎన్నో హిట్‌ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ‘బాచి, ఇట్టు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, 143, నేనింతే, గోలిమార్‌, ఆంధ్రావాలా’ వంటి మ్యూజికల్‌ హిట్స్‌ వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఒకేసారి కెరీర్‌ మొదలుపెట్టిన వీరి మధ్య అన్నదమ్ముల సంబంధం కొనసాగేది అంటే అతిశయోక్తి కాదు. చక్రి మృతిపట్ల పూరి స్పందిస్తూ ‘ నా సోదరుడు (చక్రి)ని నేను చాలా మిస్‌ అవుతున్నానంటూ ట్వీట్‌ చేస్తూ చక్రికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు’.
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి చిత్ర పరిశ్రమ సంతాపం..

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చక్రి మృతి పట్ల మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నిర్మాత రామానాయుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు, నటులు రవితేజ, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌, దర్శకుడు మారుతి, సంగీత దర్శకురాలు శ్రీలేఖతో సహా పలువురు చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేశారు. చక్రి మరణ వార్త విని నమ్మలేకపోయానని చిరంజీవి అన్నారు. చక్రి చాలా మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి దూరం కావడం బాధకరమని నిర్మాత రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
చక్రి నాకు తమ్ముడు లాంటివాడని, చక్రికి నేను పెద్ద అభిమానిని, తను లేని లోటు తీర్చలేనిది అని బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. చక్రి లేడనే వార్తను నేను నమ్మలేక పోతున్నానని సంగీత దర్శకురాలు శ్రీలేఖ అన్నారు. చక్రి మన మధ్య లేకపోయినా..ఆయన అందించిన పాటల్లో బతికే ఉన్నారు. ‘జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది’ అంటూ ఆయన ఎందుకు కంపోజ్‌ చేశారో తెలియదు కానీ అది సరిగ్గా ఆయనకే వర్తిస్తుందనుకుంటున్నానని శ్రీలేఖ సంతాపం తెలిపారు.
చక్రి మృతి పట్ల పూరి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ – ”నా సోదరుడు (చక్రి)ని చాలా మిస్ అవుతున్నాను. మా ఇద్దరి కెరియర్ ఒకేసారి ఆరంభమయ్యింది, ఎన్నో అనుభూతులు పంచుకున్నాం. నా సినిమాలకు ఎన్నో మంచి పాటలిచ్చారు” అని పేర్కొన్నారు.
జగమంత కుటుంబాన్ని వదిలి… ఏకాకిగా వెళ్లిపోయాడు
పొద్దున్నే న్యూస్‌ చానళ్లలో ‘సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం’ అనే వార్త చూసినవాళ్లు ఓ పట్టాన నమ్మలేకపోయారు. సినీ వర్గాలు, ముఖ్యంగా సంగీత ప్రపంచం అసలు నమ్మలేకపోయాయి. చక్రి అనగానే ముఖాన చిరునవ్వులు చిందించే అతని స్థూలకాయమే కళ్లముందు కదులుతుంది.
‘అతను ఒళ్లు తగ్గించుకుంటే బాగుంటుంది కదా’ అనే అభిప్రాయం కలుగుతుంది. అంటే చక్రిని తెలుగువాళ్లంతా తమ ఇంటి సభ్యుడిలా సొంతం చేసుకున్నారన్న మాట. అతి కొద్దిమందే తమ మంచితనంతో ఇలా తమ ప్రభావాన్ని చూపగలుగుతారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లోని కంభాలపల్లిలో పుట్టి పెరిగిన జిల్లా చక్రధర్‌ హైస్కూల్‌ రోజుల నుంచే సంగీతంలో తొలి అడుగులు వేసి, స్టేజ్‌ మీద పాటలు పాడటం మొదలుపెట్టాడు. డిగ్రీ ఫస్టియర్‌లో ‘ఒకే జాతి మనదిరా, ఒకే బాట మనదిరా, కులభేదం లేదురా, ఒకే కులం మనదిరా’ అంటూ ఓ దేశభక్తి గీతం రాసి, దానికి బాణీలు కూడా కట్టి, ఆ పాటను పాడి బహుమతి సంపాదించేశాడు. సెకండియర్‌లో ‘సాహితి కళాభారతి’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి, ప్రోగ్రామ్స్‌ చేస్తూ వచ్చాడు. సినిమాల్లో ప్రయత్నిస్తే రాణిస్తావంటూ స్నేహితులు పోరుపెడుతుంటే, పదివేల రూపాయలు అప్పుచేసి మరీ హైదరాబాద్‌ వచ్చి వాలాడు. ఇక్కడి వాతావరణం చూసి, హైదరాబాద్‌పై పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడు. ‘హైదరాబాద్‌ నాదే’ అనుకున్నాడు. అప్పుచేసిన డబ్బు ఖర్చుపెట్టి ‘పండు వెన్నెల’ అనే ఆల్బమ్‌ తయారు చేయించాడు. కానీ కొనేవాళ్లు కనిపించక పోవడంతో దాన్ని పక్కనపెట్టేశాడు. జీవిక కోసం ఓ హాస్పిటల్‌లో డిమాన్‌సే్ట్రటర్‌గా చేరి, మూడేళ్లు పనిచేశాడు. ఆ టైమ్‌లోనే ‘పండు వెన్నెల’ను బయటకు తెచ్చాడు. అది డబ్బు తేకపోయినా, పేరుతెచ్చింది. ఆడియో కంపెనీలతో పరిచయాలు కలిగేలా చేసింది. మరో మూడేళ్లలో 30 ఆల్బమ్స్‌ విడుదల చేశాడు. చక్రధర్‌ను ‘చక్రి’గా మార్చుకున్నాడు. తన ఆల్బమ్స్‌లో ఎక్కువ పాటలను ‘చల్లగాలి’ అనే కలంపేరుతో రాశాడు. మొత్తం పాటలు తనే రాసిన ‘చిరుగాలి’ ఆల్బమ్‌ను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశాడు. అప్పటివరకూ చేసిన ఆల్బమ్స్‌ అన్నింటికంటే ‘చిరుగాలి’ సూపర్‌హిట్‌. చిత్రమేమంటే అతడికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కాక గేయ రచయితగా సినీ పరిశ్రమ నుంచి ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఓ చిరంజీవి సినిమా కూడా ఉంది. కానీ గీత రచయితగా కాకుండా సంగీత దర్శకుడిగా కెరీర్‌ కొనసాగించాలనే అభిప్రాయంతో ఉన్న చక్రి ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలకు సంగీత దర్శకుడి ఆఫర్లు వచ్చాయి. వాటినీ వద్దనుకున్నాడు చక్రి. ఎందుకంటే అతని లక్ష్యం పెద్ద సినిమా. కానీ ‘మరో చరిత్ర’ సృష్టిస్తుందని చెప్పడంతో ‘మరో ప్రేమకథ’ అనే సినిమాకు ఎంతో ఇష్టంగా ఐదు పాటలు కంపోజ్‌ చేశాడు. కానీ ఆ సినిమా వెలుగు చూడలేదు. కానీ వాటిలో ఒక పాటను ఆ తర్వాత నాగార్జున నటించిన ‘శివమణి’ సినిమాకు వాడుకున్నాడు. ఆ పాట ‘మోనా మోనా మోనా’. ఈసారి ఏ తప్పూ చేయకూడదనుకుంటూనే ‘లైఫ్‌’ అనే సినిమాని ఒప్పేసుకున్నాడు. అదీ ఆగిపోయింది. ఆ తర్వాత ఆ సినిమాలు ఆగిపోవడంలో తన బాధ్యత ఏమీ లేదని సర్దిచెప్పుకున్నాడు. ‘లిటిల్‌ హార్ట్స్‌’కు ట్యూన్స్‌ ఇచ్చాడు. ఆ సినిమా రిలీజయ్యింది, కాకపోతే కాస్త ఆలస్యంగా. ఆ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌తో తొలి సినిమా ‘బద్రి’ చేసి, సూపర్‌హిట్‌నిచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పరిచయం కలిగింది. అప్పుడు జగన్నాథ్‌, తన రెండో సినిమా ‘బాచి’ని తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆల్బమ్స్‌కు చక్రి కట్టిన బాణీలు విన్న ఆయన ‘బాచి’కి బాణీలు కట్టే బాధ్యతను చక్రికి అప్పగించాడు. ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో బాణీలు కట్టాడు. పెద్ద చిత్రం కదా, తన దశ తిరుగుతుందనుకున్నాడు. కానీ ‘బాచి’ బాక్సాఫీస్‌ వద్ద పల్టీకొట్టడంతో, చక్రికి ఎవరూ ఆఫర్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ జగన్నాథ్‌ తన తదుపరి చిత్రం ‘ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం’కు కూడా చక్రినే తీసుకున్నాడు. ప్రొడ్యూసర్లు ఒప్పుకోకపోవడంతో, చక్రి కోసం వాళ్లనే మార్చేశాడు జగన్నాథ్‌. ‘‘పైసలు పెట్టే ప్రొడ్యూసర్‌ వద్దంటే డైరెక్టర్‌ ఏం చేస్తాడు? కానీ జగన్‌ అన్నయ్య అలా చెయ్యలేదు.
నాకిచ్చిన మాట కోసం వేరే నిర్మాతను వెతుక్కున్నాడు తప్ప, మాట తప్పలేదు. అందుకే మా అమ్మానాన్నల తర్వాత నేను ఆజన్మాంతం రుణపడి ఉండాల్సింది జగన్‌ అన్నయ్యకే’’ అని ఓసారి చెప్పాడు చక్రి. ‘ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం’ విడుదలైంది. సినిమా హిట్‌. మ్యూజిక్‌ సూపర్‌ హిట్‌. ఆ సినిమాతో సంగీత దర్శకునిగా చక్రికీ, హీరోగా రవితేజకూ బ్రేక్‌ లభించింది. ఆ సినిమా తర్వాత చక్రి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలుగలేదు. జగన్నాథ్‌ డైరెక్షన్‌లోనే మరో ఎనిమిది సినిమాలకు బాణీలు కూర్చాడు. వాటిలో ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘దేశముదురు’ వంటి హిట్లున్నాయి. ‘నేనింతే’లో అతను బాణీలు కూర్చగా, భాస్కరభట్ల రాసిన ‘కృష్ణానగరే మామా..’ పాట తెలుగు సినిమా పరిశ్రమకు జాతీయగీతం లాంటిదని కితాబిచ్చాడు జగన్నాథ్‌. చివరిగా వారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గోలీమార్‌’. అలాగే వంశీ సినిమాలు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘గోపి గోపిక గోదావరి’లతో పాటు, ‘సత్యం’, ‘చక్రం’, ‘దేవదాస్‌’, ‘కృష్ణ’, ‘ఢీ’, ‘సింహా’, ‘జై బోలో తెలంగాణ’, ‘దేనికైనా రెడీ’ వంటి సినిమాలు సంగీత దర్శకునిగా అతనికి పాపులారిటీని తెచ్చాయి. వీటిలో ‘సింహా’ సినిమా అతనికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డును అందించగా, అంతకంటే ముందు ‘సత్యం’ సినిమా సంగీతం ఫిల్మ్‌ఫేర్‌ను తెచ్చింది. ఇప్పటివరకూ అతను వందకు మించిన చిత్రాలకు సంగీతం సమకూర్చగా, 97 చిత్రాల వరకూ విడుదలయ్యాయి. ‘ఢీ అంటే ఢీ’, ‘టామీ’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. చక్రి సంగీతంలోని ఆకర్షణ ఏమంటే, అవి మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా అందరినీ అలరించగలగడం. ఈ మధ్యే అతను ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాడు – ‘పనిని మరో పది రెట్లు ఎక్కువగా ప్రేమించాలి. సంగీతంతోనే ఎక్కువ సమయం స్నేహం చేస్తూ సంగీత జీవన సౌందర్యాన్ని ఆస్వాదించాలి’ అని. కానీ ఆ కోరికను తీర్చుకోకుండానే నాలుగు పదుల చిన్న వయసులోనే, సంగీత ప్రియులనందరినీ విషాదంలో ముంచేసి వెళ్లిపోయాడు.
స్థూలకాయమే శాపం
కేవలం నలభై ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చక్రి మరణించడానికి స్థూలకాయమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెరీర్‌ కొత్తలో ముద్దుగా, బొద్దుగా ఉన్న చక్రి తర్వాత స్థూలకాయునిగా మారిపోయారు. అందుకే ఆయనను టాలీవుడ్‌ బప్పీలహిరి అని సరదాగా అనేవారు. చక్రి భోజనప్రియుడనే సంగతి ఆయన సన్నిహితులందరికీ తెలిసిన విషయమే. అయితే అది మామూలు భోజనప్రియత్వం కాదు. అపరిమితమైన భోజనప్రియత్వం. సంగీత దర్శకునిగా బాగా బిజీగా ఉన్న కాలంలో రాత్రి వేళల్లోనూ పనిచేస్తూ రావడంతో ఆయన ఆహారపుటలవాట్లు, తద్వారా ఆయన జీవన విధానం మారిపోయాయి. రాత్రంతా పనిచేసి, తెల్లవారుఝామున నాలుగింటికి ఆయన ఆహారం తీసుకున్న సందర్భాలు చాలా ఎక్కువనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఇలా ఎప్పుడుపడితే అప్పుడు ఆహారం ఎక్కువగా భుజిస్తూ రావడం వల్ల ఆయన స్థూలకాయునిగా మారిపోయారు. దానితో పాటు ముఖం కూడా నలుపు తిరిగిపోయింది. ‘‘నేను కూడా ఒకానొక సమయంలో 148 కిలోల బరువు వరకూ పెరిగాను. అప్పుడు బరువుతగ్గమని చక్రి నాకు పలుసార్లు సలహా ఇచ్చాడు. నేనేమో అతన్ని తగ్గమని చెప్పేవాణ్ణి. అతని సలహాను నేను పాటించాను. ఇప్పుడు నా బరువు 75 కిలోలు. కానీ తను మాత్రం మరింత బరువు పెరిగిపోయాడు’’ అని కన్నీళ్ల పర్యంతమయ్యారు దర్శకుడు సూర్యకిరణ్‌. ఆయన డైరెక్ట్‌ చేసిన ‘సత్యం’ సినిమాకు సమకూర్చిన సంగీతంతో చక్రి మొదటిసారిగా ఉత్తమ సంగీత దర్శకునిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు. ఒక్క సూర్యకిరణే కాదు, సన్నిహితులు చాలామంది బరువు తగ్గించుకొమ్మని చక్రికి చెబుతూనే ఉండేవాళ్లు. లైపోసెక్షన్‌ చేయించుకుంటే, దాని వల్ల తర్వాత దుష్ఫరిణామాలు ఎదురవుతాయేమోననే సందేహాన్ని ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే ఆయన తన ఆహార అలవాట్లనూ మార్చుకోలేక పోయారు. ఆ బలహీనతే చివరకు గుండెపోటు రూపంలో ఆయన ప్రాణాన్ని కబళించిందని చెప్పాలి.
 
ఆంధ్రా బప్పీలహరి – చక్రి
బప్పీలహరిని ఎప్పుడూ కావాలని అనుకరించలేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు చక్రి. ఆయన ఒకప్పుడు బంగారు గొలుసులను ఇష్టంగా ధరించేవారు. వాటి గురించి గతంలో ఓ సారి చక్రి చెబుతూ ‘‘నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు చెయిన్‌ వేసుకోవాలని ఉండేది. కానీ అప్పుడు కుదరలేదు. పైగా నా ఫ్రెండ్‌ చెయిన్‌ ఒకటి తీసుకొచ్చి తాకట్టు పెట్టేశాను. దాన్ని విడిపించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. సంగీత దర్శకుడిగా స్థిరపడ్డాక ఓ సారి మా అమ్మతో కలిసి నగల దుకాణానికి వెళ్లా. అక్కడ సన్నటి చెయిన్‌ తీసుకున్నా. అది ఎప్పుడూ మెడలో ఉండేది. ఆ తర్వాత ఓ సారి దుబాయ్‌కి వెళ్లినప్పుడు లావు గొలుసులు వేసుకున్నవారిని చూశా. అప్పట్లో మన పరిశ్రమలో ఫైట్‌ మాస్టర్లు కూడా అంత పెద్ద గొలుసులు వేసుకునేవారు. దాంతో మోజుపడి నేను కొనుక్కున్నా. మ్యూజిక్‌ డైరక్టర్‌ అలా ధరించడం అందరికీ కొత్తగా అనిపించిందేమో.. అందరి దృష్టి నామీదే పడింది. దాంతో అందరూ నన్ను ఆంధ్రా బప్పీలహరి అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన్ని నేనెప్పుడూ కావాలని అనుకరించలేదు. విదేశాలకు వెళ్లి ముంబైలో ఫ్లైట్‌ దిగి వస్తుంటే ‘హలో బప్పీజీ’ అని పలకరించేవారు. నేను కూడా హాయ్‌ అని చెప్పేవాడిని. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో మా ఇంటికి మా కజిన్‌ ఓ అమ్మాయి వచ్చింది. తన కాలేజీలో నాకు ఓ పేరు ఉందని చెప్పుకొచ్చింది. ‘ఆంధ్రా బప్పీలహరి అని అంటారా’ అని అడిగా. కాదని చెప్పింది. ఇంకేంటని ఉత్సాహంతో ఆరాతీస్తే ‘గొలుసుల రామన్న’ అని పిలుస్తారని చెప్పింది. ఆ రోజు నుంచి నా మెడలో గొలుసులు వేసుకోవడం మానేశాను. ఎక్కడికైనా ఫంక్షన్లకి వెళ్తుంటే మాత్రం అమ్మ గొలుసు వేస్తుంది. చేతికి మాత్రం ఎనిమిదేళ్ల క్రితం మా సోదరి తొడిగిన కడియం ఉంటుంది. అలాగే నా భార్య శ్రావణి చేయించిన బ్రేస్‌లెట్‌ ఎప్పుడూ ఉంటుంది’’ అని అన్నారు.
జీవితగమకాలు..
పలు సందర్భాల్లో చక్రి తన గురించి పలు అంశాలను స్నేహపూర్వకంగా చెప్పుకొచ్చేవారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆ వివరాలు…
జూ వరంగల్‌లో విజయలక్ష్మి దగ్గర వయొలిన్‌ నేర్చుకున్నారు. తిరుపతయ్య దగ్గర కర్ణాటక సంగీతం (గాత్రం) మూడేళ్లు అభ్యసించారు. చక్రి విద్యార్హత ఎం.కాం.
మెహబూబాబాద్‌లో వినాయకచవితి, శ్రీరామనవమి పర్వదినాల్లో తన ఆర్కెసా్ట్రతో స్టేజ్‌షోలు చేసేవారు.
కంబాలపల్లిలో ఉండగా కబడ్డీ, కోకో బాగా ఆడేవారు. ఇంటర్‌ స్థాయిలో క్రికెట్‌, డిగ్రీలో ఉండగా టేబుల్‌ టెన్నిస్‌ ఆడటం అలవాటయ్యాయి. తన కుటుంబసభ్యులతో ఇంట్లో ఉన్నప్పుడు చక్రి చెస్‌ ఆడటానికి మొగ్గుచూపేవారు. ఎప్పుడూ ఆయనదే పైచేయి.
చక్రి తన నివాసానికి పెట్టుకున్న పేరు ‘పూజ కుటీర్‌’. తనకు సినీ పరిశ్రమలో ‘బాచి’తో తొలి అవకాశాన్నిచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ పేరును కుదించి పూజ కుటీర్‌ అని పెట్టుకున్నారు.
జూ పూరి జగన్నాథ్‌ను అన్నయ్య అని పిలిచేవారు. దర్శకుడు వం శీని అంకుల్‌ అనేవారు. చక్రిని వంశీ బిడ్డ అని పిలిచేవారు.
ఏ మాత్రం ఖాళీ దొరికినా కేరళకు వెళ్లి సేదతీరడానికి ఇష్టపడేవారు చక్రి. మున్నార్‌ అంటే ప్రత్యేకమైన ప్రీతి.
స్టూడియోలో సరిగమలు కూర్చడం మాత్రమే కాదు. గరిట పట్టి చికెన్‌ వండటంలోనూ దిట్ట చక్రి. పెన్ను పట్టి పాటలు రాయడంలోనూ సిద్ధహస్తుడు. కెరీర్‌ ప్రారంభంలో సంగీత దర్శకత్వం కోసం వెతుకుతున్నప్పుడు ఆయన చేసిన ‘పండు వెన్నెల’ ఆల్బమ్‌ విన్నవారు ‘పాటలు రాస్తావా’ అని అడిగేవారట. చిరంజీవి సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చినా నిక్కచ్చినా కాదనుకున్నారు చక్రి.
చక్రి జాతకాలను నమ్మేవారు. ఎప్పుడూ పగడపుటుంగరాన్ని కుడిచేతికి ధరించేవారు.
ప్రతి పుట్టినరోజుకు తన స్నేహితులు, అభిమానులు, బంధుమిత్రులతో రక్తదానం, నేత్రదానం చేయించేవారు.
ఫ్రెండ్‌షిప్‌ డే రోజు ప్రత్యేకంగా తన చిన్ననాటి స్నేహితులను, పరిశ్రమలోని మిత్రులను పిలిచి షడ్‌రుచులతో భోజనాలు పెట్టించేవారు.
సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తల్లో చక్రి ఫిట్‌గా కనిపించేవారు. ‘ఏమయ్యా.. నువ్వు మ్యూజిక్‌ డైరక్టర్‌వా? ఫైట్‌ మాస్టర్‌వా?’ అని తమ్మారెడ్డి భరద్వాజ ఓ సారి చమత్కరించారట. 2007 తర్వాతే తనకి భారీకాయం వచ్చిందని, సమయానికి భోజనం, నిద్ర లేకపోవడమే తన ఊబకాయానికి కారణమని, పరిశ్రమకి రాకముందు తప్పనిసరిగా వ్యాయామం చేసేవాడినని చెప్పేవారు చక్రి.
చక్రికి జేసుదాస్‌ గాత్రం అంటే ప్రాణం. జేసుదాస్‌ పాటలను చక్రి పాడగా విన్నవారు ఆయన వారసుడేనని అనుకున్న సందర్భాలూ ఉన్నాయట.
చక్రి దగ్గర రెండు సెల్‌ఫోన్‌లుంటాయి. ఓ సెల్‌ఫోన్‌లో కేవలం తన భార్య శ్రావణి నెంబర్‌ మాత్రమే ఉంటుంది. ఆమెకి తప్ప ఆ నెంబర్‌ ఇంకెవరికీ తెలియదు. ఆ ఫోన్‌ని ఇప్పటిదాకా స్విచ్ఛాఫ్‌ కూడా చేయలేదట.
తండ్రి జిల్లా వెంకటనారాయణ, సోదరి ఆదర్శిని చేత తన సినిమాల్లో పలు పాటలు పాడించారు చక్రి. ఆయన బలవంతం మీదే శ్రావణి ‘శ్రీమన్నారాయణ’లో కోరస్‌ పాడారు. చక్రి తమ్ముడు మహిత్‌ నారాయణ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.
‘జై బోలో తెలంగాణ’ కోసం కేసీఆర్‌ రాసిన పాటను స్వరపరచిన ఘనత తనదేనని అంటుండేవారు. ఆ చిత్రంలోనే ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానమా..’ పాటను గద్దర్‌ ఆలపించారు.
Related News

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -94- 139- అవధూత –శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యతి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం  -94

139- అవధూత  –శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యతి

ఆతుర సన్యాసం

ఎన్నో సంస్కృత గ్రంధాలు రచించిన సదా శివ బ్రహ్మేంద్ర యతి తమిళ దేశం లో జన్మించారు .కాలం పద్దెనిమిదవ శతాబ్దం గా భావిస్తున్నారు .జన్మ నామం శివ రామ కృష్ణుడు .కావేరీ తీరం లో ‘’తిరు విశవల్లూరు’’అనే షాహాజీ పురం లో జన్మించారు .తండ్రి మోక్షం సోమ సుందరం అవధాని , గురుకుల విద్యాభ్యాసం లో విద్య నేర్చారు .అప్పటికే వివాహమైంది .భార్య పుష్ప వతి అయిందన్న వార్తా గురుకులం లో ఉండగా మామ గారు  వార్త పంపారు .గుర్వాజ్న తో ఆఘ మేఘాల మీద మామగారింటికి చేరుకొన్నారు .కాని అక్కడ ఆయనను ఎవరూ పట్టించుకో లేదు .నడిచి అంత దూరం వెళ్ళటం తో విపరీత మైన బడలిక కలిగి ఆకలి కూడా విజ్రుమ్భించింది  ఎవరికీ అల్లుదిగారి అతీ గతీ పట్ట లేదు ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు .ఇది అవమానం గా ,బాధగా అని పించింది .అంతే- శివరామ కృష్ణ కు ఆ క్షణం లో సంసారం పై తీవ్ర విరక్తి కలిగింది .వెంటనే సన్య సించాడు .తురీయాశ్రమ నామమే   ‘’సదాశివ బ్ర హ్మేంద్రుడు .’’ .ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కాని ఒక సంఘటనే ఆయన జీవితాన్ని మలుపు తిప్పేసింది .సంసార  జంఝాటం నుంచి తప్పించింది .

కంచి వారి శిష్యరికం –యోగ సిద్ధి సాధన

ఆ నాటి కంచి కామ కోటి పీఠాదిపతిశ్రీశ్రీ పరమ శివేంద్ర సరస్వతి  సన్నిధిని చేరి శిష్యులై పోయారు సదాశివ బ్రహ్మేన్ద్రులు .వారి వద్దనే విజ్ఞాన గ్రంధాలన్నీ క్షుణ్ణంగా అభ్యసించారు .నిత్యాభ్యాసం పూర్వ జన్మ సంస్కారం ,స్వంత మేధస్సు లతో అనేక యోగ శక్తులను స్వాధీనం చేసుకొన్నారు .పరిపూర్ణ సిద్ధులు అనిపించు కొన్నారు .భాగవత జడ భరతుని లాగ అవధూత గా మారిపోయారు .గురువు గారి దగ్గరకు వచ్చిన శాస్త్ర వాదులను ఎదుర్కొని గురువుగారి తరఫున తానే వాదించి గురు విజయం చేకూర్చేవారు .ఈ విషయాన్ని అసూయా గ్రస్త శిష్యులు గురువు గారికి ‘’మోశారు .’’.  గురువు గారు తెలుసుకొని శిష్యుడినే మందలించి అలాంటి పని చేయవద్దన్నారు .ఆ రోజు నుండి నిరంతర మౌన మే  వ్రతం గా గడిపారు .

మహిమా విభూతి

సదాశివుని మహత్తులు చాలా ప్రచారం లో ఉన్నాయి .ఒక సారి ఒక పొలం లో చేయి తలకింద దిడుగా పెట్టుకొని పడుకొంటే ఒక రైతు  వచ్చి సర్వ సంగ పరిత్యాగికి దిండు కావాల్సి వచ్చిందా అని ఎద్దేవా చేశాడట .తన యోగ శక్తి రైతుకు చూపించాలన్న తపన తో చెయ్యి లేకుండానే గాలిలో తేలి పడుకొన్నారు .అదే రైతు మళ్ళీ వచ్చి ఒక్కొక్కడికి యోగి అయినా అహంకారం వదలదు అన్నాడట .అప్పుడు అర్ధమయింది తన అహంకారానికి అంతం చేయటానికి రైతు వేషం లో లో వచ్చినవాడు సాక్షాత్తు  భగవంతుడే అని గ్రహిం చారు .ఏది దొరికితే అది తింటూ ఎక్కడ చోటు దొరికితే అక్కడే ఉంటూ పరమ హంస లా  అవధూత లాగా సంచరించారు .శిష్యుడు పొందిన ఉన్నత యోగ స్థితిని గుర్తించి తాను  ఆ ఉన్నతదశను  అందుకోలేక పోయానని బాధ పడే వారట .పుదుక్కొట రాజు తొండర మాన్ కు దక్షిణా మూర్తి మంత్రోపదేశం చేసినట్లు కనపడుతోంది .తంజావూర్ లో పున్ననల్లూర్ మరియమ్మ ,దేవ దాన పట్టిలో కామాక్షీ దేవాలయం ,తంజావూరులో నాలుకాల్ మండపం లో వెంకటేశ్వర దేవాలయం లో హనుమాన్ విగ్రహం ప్రతిస్టించ  టానికి ప్రోత్సహించారు .కుంభ కోణం లో తిరు రాఘ వెండ్ర రాహు స్థలం లో వెంకటేశ్వర  దేవాలయం లో మహా మహిమాన్విత గణపతి యంత్రాన్ని ప్రతిష్టించి అక్కడ గణపతిని ప్రతిష్టచేసి  దేవాలయం కట్టించారు .

బ్రహ్మేంద్ర యతి సాహిత్య వైభవం

జీవిత చరమాకం లో అవధూత గారు ‘’నేరూరు ‘’లో ఉండిపోయారు .తాను  మిధున మాసం లో శుద్ధ దశమి రోజున ముక్తి పొందుతానని ,ఆ రోజే కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు ‘’బాణ లింగాన్ని ‘’తెస్తాడని ,దాన్ని తమ సమాధిపై ప్రతిస్టించమని శిష్యులకు ముందే చెప్పారు .వారు అన్నట్లే ఖచ్చితం గా జరిగింది. ప్రతి ఏడాది ఆ తిది నాడు  బ్రహ్మాండమైన  ఉత్సవం నిర్వ హిస్తారు .

సదాశివేంద్ర యతి రచించిన పుస్తకాలు అనేకం ఉన్నాయి .బ్రహ్మ సూత్రాలపై ‘’బ్రహ్మ తత్వ ప్రకాశిక ‘’,వ్యాఖ్యానం ,’’యోగ సుధాకరం ‘’,అని పతంజలి సూత్రాలకు వ్యాఖ్యానం ,’’సిద్ధాంత వల్లి ,’’కేసర వల్లి ,అనే రెండు గ్రంధాలను అప్పయ్య దీక్షితుల సిద్ధాంతాలకు సంగ్రహ రూపాలుగా రాశారు .’’నవ మణి మాల ‘’,ఆత్మాను సంధానం ,స్వప్నోదితం ,స్వాను భూతి ప్రకాశిక, ఆత్మ విద్యా విలాసం ,రాశారు ఇవి కాక ద్వాదశోప షత్తులపై వ్యాఖ్యానాలు రచించారు .పురాణాలలో ఉన్నఅపూర్వ  అద్వైత వేదాంత  విశేషాలను సేకరించి గ్రంధస్తం చేశారు .హాయిగా తేలికగా భజనరూపం లోఅద్వైత వేదాంతాన్ని  పాడుకొనే పాటలుగానూ రాశారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92 – 138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92

138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి

గోదావరి జిల్లా కండ్రిక అగ్రహారం లో సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సుబ్బయ్య ,బుచ్చి నరసమ్మ దంపతులకు 10-12-1897 న జన్మించారు .కృష్ణా జిల్లా చిరివాడ వాస్తవ్యులు శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద కావ్య ,నాటక అలంకార  వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనం చేశారు .తిరుపతి ,మద్రాస్ ప్రాచ్య కళాశాలలలో చదివి శిరోమణి ,విద్వాన్, పి.ఒ.ఎల్.మొదలైన పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు .సికందరాబాద్ మహబూబ్ కాలేజి హైస్కూల్ లో ఉపాధ్యాయులుగా చేరి ముప్ఫై అయిదేళ్ళు పనిచేశారు .తర్వాత రావు బహద్దర్ వెంకట రామ రెడ్డి కాలేజిలో సంస్క్రుతోపన్యాసకులుగా 1954 నుండి ఎనిమిదేళ్ళు ఉన్నారు .

శాస్త్రి గారి భార్య అకాల మరణం చెందారు .ఈ బాధను మర్చిపోవటానికి సాహిత్య రచన ప్రారంభిం చారు .రచన అంటే వీరికి నిద్రా హారాలు గుర్తుకు రావు .అలా పని చేసి రామ రాజ భూషణుని ‘’కావ్యాలంకార సంగ్రహం ‘’కావ్యానికి సమగ్ర మైన వ్యాఖ్య రాసి సమర్ధత ను రుజూవు  చేసుకొన్నారు .ఈ అపూర్వ గ్రంధం ప్రాచ్య ,పాశ్చాత్య ఆలంకారికుల పాలిటి చింతామణి , కల్ప వృక్షమే, కామ దేనువే  అయింది .వీరి ‘’తత్సమ చంద్రిక ‘’వ్యాకరణ గ్రంధం వ్యాకరణ శాస్త్రం లో తలమానిక మైనది .చిన్నయ సూరి బాలవ్యాకరణానికి కూడా వ్యాఖ్యానం రాశారు .సంస్కృతాంధ్ర వ్యాకరణాలు మొత్తం చదివి అర్ధం చేసుకొని వ్యాఖ్యానించి రాసిన శాస్త్రి గారి పై రెండు గ్రంధాలు వ్యాకరణ విద్యార్ధులకు ,వ్యాకరణం బోధించే పండితులకు శిరో దార్యాలుగా నిలిచాయి .

శాస్త్రి గారు సంస్క్తుతం లో 20 కి పైగా గ్రంధాలు రచించారు .తెలుగులో 25వరకు అరుదైన పుస్తకాలు రాశారు .రెండు భాషల లోను వీరు రచించిన గ్రంధాలు మృదు మధుర శైలిలో ఉండి  రసజ్నులను ఆకట్టుకొన్నాయి .వీటిలో కొన్ని ముక్తకాలు, కొన్ని ఖండకావ్యాలు ఉన్నాయి .తెలుగు నుంచి సంస్కృతం లోకి ,సంస్కృతం నుండి తెలుగు లోకి శాస్త్రి గారు తర్జుమా చేసిన గ్రందాలెన్నో ఉన్నాయి .అంటే అనువాదకులుగా శాస్త్రిగారు గొప్ప కృషి చేశారు .రచనలన్నీ శిష్ట వ్యాకరణ ప్రయోగాలతో ఉంటాయి. అందుకే వీరిని ‘’ఆ జన్మ సిద్ధ కవి ‘’అన్నారు .జాతక కధలను కొన్నిటిని ‘’జాతక కదా గుచ్చం ‘’పేరుతొ సంతరించారు .’’గోవర్ధనుడి ‘’సప్త శతీ సారం ‘’ను తెలుగు లోకి అనువాదం చేశారు . ముక్కు తిమ్మన పారిజాతాపహరణం ను ‘’భర్త్రు దానం ‘’గాను ,పోతన గారి కొన్ని భాగవత ఉపాఖ్యానాలను ‘’భాగవతాను వాదః ‘’,పింగళి సూరన కళా పూర్ణోదయ ప్రబంధాన్ని ‘’కళా పూర్ణోదయం ‘’గా సంస్కృతీకరించారు .దీని వలన తెలుగు కవుల ప్రబంధ నిర్మాణ సౌందర్యాన్ని యావద్భారత సంస్కృత పండితులకు మ్రుస్టాన్న భోజనం గా అందజేశారు .రుక్మిణీ కళ్యాణం ను ‘’కీర సందేశం ‘’గా ,రాశారు .ద్వంద్వ యుద్ధం ,ఖడ్గ తిక్కన ,వాసవ దత్త ,రేణుక విజయం వివేకానందం అనే సుప్రసిద్ధ రచనలు చేశారు .

అమృత కణాలు ,స్మరగీతి ,మొదలైన ముక్తక సంకలనాలు తెచ్చారు .’’నది మంత్రపు సిరి ‘’అనే అధిక్షేప కావ్యాన్ని రాశారు .తెలుగు లోని మను చరిత్రాది పంచ మహాకావ్య కధలను ‘’ఆంధ్ర ప్రబంధ కధలు ‘’గా రాశారు .దీనినే ‘’ఆంద్ర కావ్య కతాః’’గాను ,తెనాలి రామ కృష్ణుని కధలను ‘’ఆంద్ర దేశ హాస్య కదాః ‘’గా ను సంస్కృతం లో రాసి ఆ భాషాభిమానులకుతెలుగు రుచి చూపించి  పరిచయం చేశారు .శాస్త్రి గారు ‘’కాదంబరీ పరిణయః ‘’అనే స్వతంత్ర సంస్కృత నాటకం రాశారు .స్వంత తెలుగు రచనలను సంస్కృతం లో కి అనువదించుకొన్న వారిలో సూర్య నారాయణ శాస్త్రి గారే ప్రప్రధములు .ఆ కీర్తి చిరస్మరణీయం .

వన పర్తి ,గద్వాల ,సంస్థానాధీశులు శాస్త్రి గారిని ఆహ్వానించి  గౌరవించి సత్కరించారు .ప్రతి ఏటా వార్షికాలు ప్రదానం చేశారు .ఎందరో జమీన్ దారులు ,సాహిత్య సంస్థలు శాస్త్రిగారిని సన్మానించాయి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ లో విశిష్ట సభ్యులను చేసి ప్రభుత్వం గౌరవించింది .ఖమ్మం జిల్లా ఇల్లెందువిద్వత్ సమావేశం లో ‘’విద్యా రత్న ‘’బిరుదు అందుకొన్నారు .ఆఖరి శ్వాస వరకు సాహిత్య జీవనం సాగించిన సాహిత్య్పజీవి సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారుఎనభై  అయిదేళ్ళు జీవించి 14-10-1982న సరస్వతీ సన్నిధానం చేరారు .వారి లోటు సాహిత్య లోకం లో తీరనిదిగా మిగిలిపోయింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు

 

.

 

 

 

.

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

సంగీత దర్శకుడు చక్రి ఆకస్మిక మృతి

మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి కన్నుమూత..

ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి (40) ఈరోజు ఉదయం మృతి చెందారు. గుండె పోటుతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చక్రి తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్ర్బాంతికి గురైంది. చక్రి అసలు పేరు చక్రధర్‌ జిల్లా. చక్రి జూన్‌ 15న 1974 వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌లో జన్మించారు. పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన ‘బాచి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయమైన చక్రి…ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌ అందించారు. ఇప్పటి వరకు చక్రి 85 సినిమాలకు మ్యూజిక్‌ అందించారు. చక్రి సంగీతం అందించిన చివరి చిత్రం దర్శకరత్న దాసరినారాయణరావు రూపొందించిన ‘ఎర్రబస్సు’ సినిమాకి చక్రి మ్యూజిక్‌ సమకూర్చారు. ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు వంటి చిత్రాలను మ్యూజికల్‌ హిట్స్‌గా నిలబెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘సింహా’ సినిమాకుగాను చక్రి అందించిన స్వరాలకు నంది అవార్డు అందుకున్నారు. సత్యం చిత్రంలో ఆయన గాయకుడిగా పాడిన పాటకు ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి చిత్ర పరిశ్రమ సంతాపం..

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చక్రి మృతి పట్ల మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నిర్మాత రామానాయుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు, నటులు రవితేజ, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌, దర్శకుడు మారుతి, సంగీత దర్శకురాలు శ్రీలేఖతో సహా పలువురు చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేశారు. చక్రి మరణ వార్త విని నమ్మలేకపోయానని చిరంజీవి అన్నారు. చక్రి చాలా మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి దూరం కావడం బాధకరమని నిర్మాత రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చక్రి నాకు తమ్ముడు లాంటివాడని, చక్రికి నేను పెద్ద అభిమానిని, తను లేని లోటు తీర్చలేనిది అని బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. చక్రి లేడనే వార్తను నేను నమ్మలేక పోతున్నానని సంగీత దర్శకురాలు శ్రీలేఖ అన్నారు. చక్రి మన మధ్య లేకపోయినా..ఆయన అందించిన పాటల్లో బతికే ఉన్నారు. ‘జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది’ అంటూ ఆయన ఎందుకు కంపోజ్‌ చేశారో తెలియదు కానీ అది సరిగ్గా ఆయనకే వర్తిస్తుందనుకుంటున్నానని శ్రీలేఖ సంతాపం తెలిపారు.
చక్రి మృతి పట్ల పూరి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ – ”నా సోదరుడు (చక్రి)ని చాలా మిస్ అవుతున్నాను. మా ఇద్దరి కెరియర్ ఒకేసారి ఆరంభమయ్యింది, ఎన్నో అనుభూతులు పంచుకున్నాం. నా సినిమాలకు ఎన్నో మంచి పాటలిచ్చారు” అని పేర్కొన్నారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెండి తెర జడ్జి పి జె. శర్మకు కి వెయ్యి అవమానాలు

వెండితెర జడ్జి

ఆదివారం మృతి చెందిన పి.జె. శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వరశర్మ. విజయనగరం జిల్లా కల్లేపల్లిలో పుట్టి పెరిగిన శర్మ మొదట రంగస్థలంపై పేరు తెచ్చుకొని, సినీ నటుడు కావాలనే సంకల్పంతో మద్రాస్‌ వెళ్లారు. ‘ఇల్లరికం’లో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు స్నేహితుల్లో ఒకడిగా చేసిన చిన్న పాత్రతో నటునిగా పరిచయమయ్యారు. శ్రీశ్రీ, ఆరుద్ర ఆయనకు సమీప బంధువులు. అప్పట్లో శ్రీశ్రీ తెలుగు డబ్బింగ్‌ సినిమాలతో బిజీగా ఉండేవాళ్లు.
నటుడిగా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న శర్మను డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ప్రయత్నించమని సలహా ఇచ్చింది వాళ్లే. అలా కంఠమే పెట్టుబడిగా ఆయన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మారి, బిజీ అయ్యారు. తన కెరీర్‌లో దాదాపు వెయ్యి సినిమాల్లో వివిధ పాత్రలకు ఆయన తన కంఠాన్ని అరువిచ్చారు. అయితే నటుడిగా పేరు సంపాదించుకోవాలనేదే ఆయన ప్రగాఢ వాంఛ. కానీ వందలాది సినిమాలు చేసినా, ఆయనకు బలమైన పాత్రనిచ్చేవాళ్లే లేకపోయారు. నటునిగా ఆయనది విఫల చరిత్ర. సాధారణంగా ఆయన దగ్గరకు వచ్చేవి జడ్జి పాత్రలు, డీజీపీ, ఐజీ స్థాయి పోలీసు పాత్రలు వంటి హుందా పాత్రలే. చేసినవాటిలో కాస్త మెరుగైనవి ‘తల్లి ప్రేమ’, ‘తుకారాం’, ‘దాన వీర శూర కర్ణ’, ‘ఎర్ర మల్లెలు’, ‘కలెక్టర్‌ జానకి’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలు.
అడుగడుగునా అవమానాలే

అప్పట్లో చెన్నైలోని తేనాంపేటలో ఉన్న ఫిల్మ్‌చాంబర్‌ ప్రివ్యూ థియేటర్‌లో సినిమాల ప్రివ్యూలు ప్రదర్శించేవాళ్లు. తను నటించిన సినిమాల ప్రివ్యూలకు కుటుంబంతో కలిసి వెళ్లే ఆయనకు అవమానాలు ఎదురయ్యేవి. కుర్చీలు నిండాక ఎవరైనా ప్రముఖులు వస్తే, మొదట కుర్చీల నుంచి లేపేది శర్మ కుటుంబాన్నే. వాళ్లను నిల్చుని చూడమని చెప్పేవాళ్లు, లేదంటే బయటకు వెళ్లమనేవాళ్లు. ఈ అవమానాలు తట్టుకోలేక ఆయన ప్రివ్యూలకు వెళ్లడం మానేశారు. ‘‘ఆ రోజుల్లో మా అమ్మానాన్నలకు గౌరవప్రదంగా ప్రివ్యూ చూపించాలనేది నా కల. చెన్నైలోని దేవి-శ్రీదేవి ప్రివ్యూ థియేటర్‌లో నా ‘పోలీస్‌ స్టోరీ’ని వాళ్లకు చూపించడం ద్వారా ఆ కలను నిజం చేసుకున్నా. థియేటర్‌లో అమ్మానాన్నలిద్దరే కూర్చుని సినిమా చూశారు. నేను కూడా వాళ్ల పక్కన కూర్చోకుండా, ప్రొజెక్షన్‌ రూమ్‌లో కూర్చున్నాను’’ అని చెప్పారు సాయికుమార్‌. తన కెరీర్‌లో శర్మ మంచి అవకాశాల కోసం మధనపడని రోజు లేదు. ఏదైనా సినిమా ప్రారంభమైతే, అందులో తనకు పాత్ర ఉంటుందా, ఒక వేళ ఉంటే, దానికి నాలుగు డైలాగులన్నా ఉంటాయా, లేదా అని మధనపడేవాళ్లు. ఆయన గంభీరమైన గొంతును ఉపయోగపెట్టుకొనే పాత్రలు రాకపోవడం నిజంగా విచారించదగ్గ విషయం.
ఆజానుబాహువైన ఆయన బూట్ల సైజు 11 అంగుళాలు. ఆ సైజు బూట్లను తెప్పించకుండా సొంత బూట్లనే తెచ్చుకోమనేవాళ్లు ప్రొడక్షన్‌ మేనేజర్లు. అంతేకాదు, ఎక్కువ సందర్భాల్లో సొంత కాస్ట్యూమ్స్‌నే ఆయన వాడాల్సి వచ్చేది. ఇంతాచేసి, ఆ పాత్ర చేశాక, సినిమాలో అది ఉంటుందా, ఎడిటింగ్‌లో పోతుందా అనే టెన్షన్‌ కూడా ఆయనను వేధించేది. ఎందుకంటే సినిమా నిడివి ఎక్కువైనప్పుడు ఎడిటింగ్‌లో ఆయన పాత్రను తీసేసిన సందర్భాలు కూడా తక్కువేమీ కాదు. ఆయన నటించిన సినిమాలు వంద రోజుల వేడుక జరుపుకున్నప్పుడు జ్ఞాపిక ఇచ్చినట్లే ఇచ్చి, ఆయన వేదిక దిగాక, ఆయన చేతుల్లోంచి నిర్వాహకులు ఆ జ్ఞాపికను తిరిగి తీసేసుకున్న సందర్భాలూ ఎక్కువే. అలాగే ఆ వేడుకల తర్వాత యూనిట్‌కు ఏర్పాటుచేసే పార్టీకి ఎవరైనా ముఖ్యమైన వాళ్లు వస్తే టేబుల్‌ దగ్గర నుంచి మొదట లేవమని చెప్పేది కూడా ఆయననే. శర్మ ఎదుర్కొన్న ఇలాంటి అవమానకర సంఘటనలకు ఆయనతో పాటు కలిసి తిరిగే ఆయన పెద్ద కుమారుడు సాయికుమార్‌ ప్రత్యక్ష సాక్షి. అందుకే తన కుమారులు సినిమాల్లోకి రావాలని శర్మ కోరుకోలేదు. కానీ ఆయన అనుకున్నట్లు జరగలేదు. ముగ్గురు కొడుకులూ సినిమాల్లోనే కెరీర్‌ను వెతుక్కోవడం విధి వైచిత్రి.
సంతాపం

పి.జె. శర్మ మృతికి చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం శర్మ అంత్యక్రియలకు ముందు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన చిరంజీవి, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. అలాగే ఓ ప్రకటనలో శర్మ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మురళీమోహన్‌, అలీ సంతాపం తెలిపారు.
  
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాచకొండను రక్షించు కొందాం

rachakonda1 001 rachakonda2 001 rachakonda3 001 rachakonda4 001 rachakonda5 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 91 – 137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని –పేరి సూర్య నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –   91

137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని  –పేరి సూర్య నారాయణ శాస్త్రి

 

గురుముఖ విద్య

20-8-1910జన్మ దినం గా కల పేరి సూర్య నారాయణ శాస్త్రి గారు విజయ నగరం జిల్లా పెదనందిపల్లిలో సర్వేశం ,సోమమ్మ దంపతులకు జన్మించారు .పేరి అప్పల నరసయ్య శాస్త్రి గారివద్ద కావ్య నాటక ,అలంకారాలను అధ్యయనం చేశారు .పేరి వెంకటేశ్వర శాస్త్రిగారి నుండి భాష్యంత వ్యాకరణంఅభ్యసించారు .’’వైయాకరణ భూషణ సారం ‘’ ,’’లఘు మంజూష ‘’,శబ్ద కౌస్తుభ ‘’,,’’భాట్ట దీపిక ‘’,’’కావ్య ప్రకాశిక ‘’,’’రస గంగాధరం ‘’గ్రంధాలను తాతారాయుడు శాస్త్రిగారి శిష్యరికం లో నేర్చారు .’’ఖండన అద్వైత ప్రస్తానం .’’,చతుస్తంత్రి ‘’,’’న్యాయ కాణాది ‘’మున్నగు వానిని పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి ,కొల్లూరు  సోమ శేఖర శాస్త్రి ,కొల్లూరు లక్ష్మణ మూర్తి శాస్త్రి ల నుండి గురుముఖతా అధ్యయనం చేశారు .

వ్యాకరణ బోధనా సామర్ధ్యం –

విద్యార్ధిగా ఉంటూనే ఉద్యోగం చేశారు .సింహాచల సంస్కృత పాఠ శాల అధ్యాపకులయ్యారు ..1940విజయ నగర మహారాజా వారి సంస్కృత కళాశాలలో అధ్యాపకుగా నియమింప బడ్డారు .ముప్ఫై ఏళ్ళు విద్యా బోధన కొనసాగించారు  వేలాది మంది  ప్రతిభా వంతులైన శిష్యులను తయారు చేశారు .’’కౌముది ‘’అంటే ఇనప ముద్ద అని భయపడే వారు బోధకులు అలాంటి అయః పిండమైన కౌముదిని వెన్నెల అంత ఆహ్లాదం గా శాస్త్రి గారు బోధించి మనసుకు ఆహ్లాదం కలిగించేవారు .ఒక రకం గా ‘’కౌముది శాస్త్రి ‘’గారు అనిపించుకొన్నారు .

అమూల్య గ్రంధ రచనా పాటవం

విద్యా బోధనా కొన సాగిస్తూనే అమూల్య గ్రంధ రచనా చేశారు .సంస్కృత భాషలో ‘’నాగేష లఘు మంజూష ‘’కు ‘’నాగేశ భావ ప్రకాశ వ్యాఖ్య ‘’,’’వైయాకరణ భూషణ సారం ‘’కు ‘’తత్వ దర్శిని ‘’వ్యాఖ్య ,’’’’ఖండ దేవా భట్ట రహస్యం ‘’కు ‘’భావ ప్రకాశ వ్యాఖ్య ‘’’’వైయాకరణ భూష సారం ‘’కు’’తత్వ దర్శిని వ్యాఖ్య ‘’,’’ఖండదేవ భాట్ట రహస్యం ‘ ‘’రచించిన మహా పండితులు సూర్య నార్యయన శాస్త్రి గారు .తెలుగు భాషలో న్యాయ ,వైశేషిక ,సాంఖ్య,పూర్వ మీమాంస ,ఉత్తర మీమాంస లకు వ్యాకరణ శాస్త్రాన్నికూడా జోడించి ‘’  షడ్ దర్శనములు’’ పేరిట అనువదించారు ‘’వ్రుత్తి విచార’’అనే గ్రంధం  ‘’పంచ వృత్తి  విచారం ‘’కు ఆంధ్రానువాదం గా రచించారు .పతంజలి మహర్షి ‘’అద్వైత ప్రకరణం ‘’ను ‘’ఆంద్ర వివరణ సారం ‘’,’’పరమార్ధ సారం ‘’గా తెలిగీకరించారు .’’భర్త్రు హరి వాక్య నదీయం ‘’ను  శ్రీభాష్యం అప్పలాచార్యుల వారితో కలిసి అనువదించారు .’’కుమార సంభావ విమర్శ ‘’ను శాస్త్రిగారు రాశారు .పత్రికలకు అనేక వ్యాసాలు రాశారు. అందులో ముఖ్యమైనవి ‘’స్పాటి స్పోటనం ,’’బహువ్రీహి సమాసం’’ బాగా ప్రసిద్ధి చెందాయి .ఆంధ్రా యూనివర్సిటి సైన్స్ అధ్యాపకులు వసంత రావు వెంకట రావు గారితోకలిసి ఆంద్ర ప్రభ లో ‘’కాల తత్త్వం ‘’ధారా వాహిక గా రాశారు .’’కౌముదికి ‘’తెలుగులో సులభ విధానం ‘’లో ‘’వ్యాకరణ సిద్ధాంత మంజరి ‘’పేరిట అనువాదం చేశారు .రసగంగాధర వ్యాఖ్యలన్నీ క్రోడీకరించి ‘’జగన్నాధ గూడార్ధ దీపిక ‘’రాసి జగన్నాధ పండితుని శేముషీ వైభవాన్ని ఆవిష్కరించి తన ఆరాధనా భావాన్ని చాటుకొన్నారు .

జంగమ పాణిని- అలంకారాలైన  బిరుదులు  సత్కారాలు

ఈ ప్రతిభను గుర్తించి శృంగేరీ పీఠాదిపతులు శాస్త్రి గారిని ‘’జంగమ పాణినః ‘’అంటే ‘’నడిచే పాణిని ‘’. ,అని గౌరవించి ఘనం గా సత్కరించారు .మన రాష్ట్రం లోనే కాకుండా ఉజ్జయిని జయపూర్ , ,పూనా మున్నగు ప్రదేశాలలో జరిగిన విద్వత్ సభలకు ఆహ్వానింపబడి  సన్మానితులయ్యారు .శాస్త్రి గారికి గొప్ప నటనా కౌశలం దర్శ కత్వ ప్రతిభా ఉన్నాయి ఉజ్జయిని నగరం లో 14 రాష్ట్రాల మధ్య ‘’కాళిదాస అభిజ్ఞాన శాకుంతల ‘’నాటక పోటీ జరిగితే అందులో ‘’రాజ పురోహితుడు ‘’గా నటించి నాటకాన్ని నిర్వహించి ప్రధమ స్థానాన్ని ఉత్తమ ప్రదర్శనకు ఉత్తమ నటనకు ఎంపికై ‘’స్వర్ణ కమలం ‘’బహుమతిగాపొందిన విశేష ప్రజ్ఞా శీలి .

వ్యాకరణ రత్న ,వ్యాకరణాచార్య ,ఉపనిషద్ధర్మ వాచస్పతి ,దర్శనా చార్య ,పద వాక్య ప్రమాణజ్న వంటి సార్ధక బిరుదులెన్నో శాస్త్రిగారిని వరించి  సార్ధకమై ,గౌరవం పొందాయి .’’విశ్వ సంస్కృత భారతి ‘’సంస్థ శాస్త్రి గారిని సగౌరవం గా ఆహ్వానించి లక్ష రూపాయల నగదు ప్రశంసా పత్రం అందజేసి సత్కరించింది .కాశీ  విశ్వవిద్యాలయం ‘’మహా మహోపాధ్యాయ ‘’గౌరవ బిరుదునిచ్చి గౌరవించి సన్మానించింది .అరవై వ ఏడు మీద పడినా , పదవీ విరమణ చేసినా శాస్ట్రి గారు  శిష్యులకు బోధించటం మాన లేదు .సంస్కృత బోధనా చేస్తూనే ఉన్నారు .రాజమండ్రి గౌతమీ విద్యా పీఠం,మంత్రాలయం ,తిరుపతి కేంద్రీయ విద్యా పీఠాలలో సంస్కృతం బోధిస్తూనే ఉన్నారు .అదే వారికి మహదా నందమైన వ్యాపకం గా ఉండేది .

ఎనభై అయిదేళ్ళు చక్కని ఆరోగయం తో   జీవించి ,అధ్యయన ,అధ్యాపన, గ్రంధ రచనలను నిరంతరం కొనసాగించి సార్ధక జీవి అనిపించుకొన్న పేరి సూర్య నారాయణ శాస్త్రిగారు1995 సెప్టెంబర్ లో ‘’సవిత్రు మండల నారాయణ మూర్తి ‘’ని చేరుకొన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు

.

 

 

 

.

 

 

ణం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 74 వ సమావేశం – దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ – ఆహ్వానం

promplet sarasabharathi


0001invitation 1 001invitation 2 001invitation 3 001


Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బాపు పేరు వెనక ఏముందో చెప్పిన -ప్రొఫైల్ఆర్టిస్ట్ శంకర నారాయణ –

పేరు వెనక…

మర్రిచెట్టు కింద ఏ మొక్కా ఎదగదని నానుడి ఉంది. కానీ ఆ మహా మర్రి వృక్షం స్వయంగా వంగి తన కంటే చిన్నవాడ్ని చేయి పట్టి నడిపించింది. రేఖా చిత్రాలు ఎలా గీయాలో చూపింది. కొంత కాలానికి ‘ఒట్టి రేఖా చిత్రాలేనా? రంగులు కూడా వేయరా!’ అంటూ ప్రోత్సహించింది. ఆ మహా వృక్షం పేరు ‘బాపు’. ఆయన తమ్ముడు శంకరనారాయణ కూడా చేయి తిరిగిన చిత్రకారుడు. బాపు ప్రథమ జయంతి సందర్భంగా అన్నయ్య జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే…  
‘‘మేం నలుగురు అన్నదమ్ములం, ఒక అక్క. ఆమే అందరి కంటే పెద్దది. మా బాల్యం మద్రాసులోనే గడిచింది. పుట్టింది నరసాపురంలో అయినా, పెరిగిందంతా ఇక్కడే. ప్రతి వేసవిలో ఊరికి వెళ్లే వాళ్లం. అక్కడ ‘స్టీమర్‌ స్ర్టీట్‌’ అని గోదావరి ఒడ్డున ఓ వీధి ఉండేది. మా ఆరుగురు మావయ్యలు అక్కడే ఉండేవారు. అక్కడికి వెళ్లినప్పుడు గోదావరి, లాంచీలు, పడవలు చూడ్డం సరదాగా ఉండేది. నేను, బాపు గోదావరిలో ఈతకు వెళ్లేందుకు భయపడి అటు వైపు వెళ్లేవాళ్లం కాదు.

బాపు – కలం పేరు కాదు…
మా నాన్నకు గాంధీ గారంటే చాలా అభిమానం. అందువల్లే అన్నయ్యను ముద్దుగా ‘బాపు’ అని పిలిచేవారు. అంతేకానీ అది మా అన్నయ్య కలం పేరు కాదు. చిన్నతనంలో కాస్త నల్లగా ఉన్నా… బొద్దుగా ముద్దుగా ఉండేవాడు బాపు. అన్నయ్య బాగా అల్లరి చేసేవాడు. ఆ అల్లరి భరించలేక మా అమ్మ తాడుతో స్తంభానికి కట్టేసేది. చిన్నతనం నుంచీ బాపుకి పట్టుదల చాలా ఎక్కువ. ఒక పని అనుకుంటే జరిగి తీరాల్సిందే. అందుకోసం ఎంతో శ్రమించేవాడు. బీచ్‌కి వెళ్లినా అక్కడ కూడా పుస్తకాలు చదువుకుంటూ, బొమ్మలు వేసేవాడు. బొమ్మల వ్యామోహం ఎంతలా ఉండేదంటే మా నాన్నగారి కోర్టు కాగితాలపైనా వేసేవాడు. నాన్న కోప్పడి, అరిచేవారు కానీ తన క్లయింట్‌లకు మాత్రం ‘చూడండయ్యా, మా వాడు వేశాడు’ అని వాటిని చూపించి, మెచ్చుకునేవారు. మా నాన్న, చిన్నాన్న (బుచ్చిబాబు) కూడా చిత్రకారులే.
‘లా’ చదివారు కానీ…
చిన్నతనంలో ఆర్ట్‌ స్కూల్‌లో చదువుకోవాలనుకునేవాడు. కానీ పరిస్ధితులు అనుకూలించక ఆ కోరిక తీరలేదు. మా నాన్న తన 49వ ఏటే పోయారు. నాన్న మమ్మల్ని బాగా చదువుకోవాలని చెప్పేవారు. అందుకే అన్నయ్య ‘లా’ చదివాడు. లాయరుగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ ప్రాక్టీస్‌ మాత్రం చేయలేదు. కుటుంబ పోషణార్థం సంపాదన మొదలుపెట్టాడు. ‘ఆనంద వికటన్‌’లో పనిచేసిన ‘గోకుల్‌’ అనే చిత్రకారుడంటే ఆయనకెంతో ఇష్టం. ఇటీవల నేనాయన్ని కలిసినపుడు ‘ప్రపంచంలో బాపు వంటి చిత్రకారుడు లేడయ్యా, అన్ని రంగాల్లో ఇంతటి నైపుణ్యం చూపిన వారే లేరు. మీ వాడికి సమస్తం వచ్చు’నని మెచ్చుకున్నారు.
సమయపాలన ముఖ్యం
అన్నయ్య తన సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాలకే ఖర్చు చేశాడు. విదేశాలకు వెళ్లేవాళ్లకి ‘ఫలానా పుస్తకం అక్కడ దొరుకుతుందట, తీసుకురండి’ అని చెప్పేవాడు. సమయపాలనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఐదు గంటలకు వస్తామని ఎవరైనా చెప్తే.. పది నిమిషాలు ముందే వారికోసం తయారై ఎదురు చూసేవాడు. వాళ్లు రావడం ఆలస్యమయితే.. చిరాకు పడిపోయేవాడు. తను ఎవరినైనా కలుస్తానని మాటిస్తే ఆ సమయానికి సిద్ధంగా ఉండేవాడు. బొమ్మలు, పుస్తకాలతో పాటు సంగీతమంటే కూడా చాలా ఇష్టం. చిన్నపుడు మౌత్‌ఆర్గాన్‌ బాగా వాయించేవాడు. ఖరీదైన హార్మోనియం కూడా ఉండేది. అన్నయ్య మంచి ఫోటోగ్రాఫర్‌ అనే విషయం చాలామందికి తెలియదు. నేను ఎంఏ చదివిన తరువాత ఉద్యోగం రాక ఆరు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. ఆ రోజుల్లో పూర్తిగా
మర్రిచెట్టు కింద ఏ మొక్కా ఎదగదని నానుడి ఉంది. కానీ ఆ మహా మర్రి వృక్షం స్వయంగా వంగి తన కంటే చిన్నవాడ్ని చేయి పట్టి నడిపించింది. రేఖా చిత్రాలు ఎలా గీయాలో చూపింది. కొంత కాలానికి ‘ఒట్టి రేఖా చిత్రాలేనా? రంగులు కూడా వేయరా!’ అంటూ ప్రోత్సహించింది. ఆ మహా వృక్షం పేరు ‘బాపు’. ఆయన తమ్ముడు శంకరనారాయణ కూడా చేయి తిరిగిన చిత్రకారుడు. బాపు ప్రథమ జయంతి సందర్భంగా అన్నయ్య జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే…
‘‘మా నాన్నంటే మాకందరికీ చాలా భయం. అందుకని మా నాన్నని ఏమైనా అడగాలంటే, నన్ను ముందుకు తోసి నా ద్వారా అడిగించేవాడు. లేదా మా బామ్మతో చెప్పించేవాడు. ఆయనకు కోపం ముక్కుమీదే ఉండేది. అదే బాపుకీ వచ్చింది. ఏ మాత్రం తేడా వచ్చినా కోపం వచ్చేస్తుంది. అయితే అదంతా కొన్ని క్షణాలే తరువాత తనే దగ్గరికి తీసేవాడు. నన్ను బొమ్మలు వేయమని బాపు-రమణ ఇద్దరూ ప్రోత్సహించేవారు. ఎలా వేయాలో బాపు గైడ్‌ చేసేవాడు’’
మా నాన్నగారు గతించిన ఏడాదిన్నరకే మరో అన్నకూడా చనిపోయారు. అప్పుడు బాపు మాకు పెద్దదిక్కయ్యాడు. ఎంత ఇబ్బంది ఉన్నా ఏనాడూ నిరుత్సాహంగా మాట్లాడేవాడు కాదు. బొమ్మలు గీయడం, రేడియో నాటికలు ఆయన వ్యాపకం. ఆయనే నాకు స్ఫూర్తి.
బాపు-రమణలతో ఉన్నాను. రమణగారిని సినిమా ఆఫీసులకు తిప్పడం, బాపు వేసిన బొమ్మలు పత్రికల ఆఫీసులకు తీసుకువెళ్లి ఇవ్వడం నా డ్యూటీ. ఆ తరువాత నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.
కబుర్లు, షికార్లు రమణతోనే
బాపు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఇంట్లో పిల్లలతో కూడా అలానే ఉండేవాడు. కానీ అన్ని విషయాలు ఆయనకు తెలిసేవి. రమణగారే అంతా చూసుకునేవారు. మాతో సరదాగా ఉండేవారు. కబుర్లు, షికార్లు అన్నీ రమణతోనే. మా అమ్మ రమణను పెద్ద కొడుకనుకునేది. బాపు-రమణల మధ్య సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాయంత్రాలు వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు తెలిసేవి. ఇద్దరూ బాగా చదువుతారు కాబట్టి వాళ్ల మాటల్లో పలు అంశాలు చోటు చేసుకునేవి. అంత స్నేహంగా ఉన్నా, ఎవరి నిర్ణయాలు వారివే. ఇండివిడ్యువాలిటీ తప్పేవారు కాదు.
బొమ్మ వేయని రోజు లేదు
రవీంద్రభారతిలో నా బొమ్మల ప్రదర్శన జరిగినపుడు ఎవరికీ తెలియకుండా వచ్చి ప్రదర్శన తిలకించాడు. ‘నీ బొమ్మలు వారంవారం చూస్తున్నా, ఇన్ని బొమ్మలు ఇలా ప్రదర్శనగా చూడ్డం గొప్పగా ఉందిరా’ అన్నాడు. ఆ మెచ్చుకోలే నాకు గొప్ప బహుమతి. ఆ తరువాత 2008లో అనుకుంటా ‘ఎంతకాలం రేఖా చిత్రాలేనా! రంగులు ట్రై చెయ్‌రా!’ అంటూ ఉత్తరం రాశాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, బొమ్మ వేయకుండా ఉన్న రోజు లేదు. రమణ వెళ్లి పోయిన తరువాత శూన్యంగా మారిపోయాడు. అప్పటి వరకూ రమణ లేకుండా భోజనం కూడా చేసేవాడు కాదు. రమణ లేకపోవడం తీవ్రమైన వెలితిగా భావించేవాడు. నిరాడంబరంగా ఉండడం, మౌనంగా తన పని తాను చేసుకోవడం బాపుకి ఇష్టం. అలాగే ఉన్నాడు. అలాగే వెళ్లిపోయాడు.’’
మన్నవ గంగాధరప్రసాద్‌, చెన్నై

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

”బాపు అనిర్వచనీయుడు ”-వి ఏ కె రంగారావు

.ఏ నిర్వచనానికి లొంగని వారు
– విఏకె రంగారావు
‘‘బాపు-రమణలతో నా పరిచయం 1957 నాటిది. అప్పట్లో నేను ఆటోమొబైల్‌ ప్రొడక్ట్స్‌ ఆఫ్‌ ఇండియా అనే ఒక స్కూటర్‌ (లాంబ్రెట్టా) కంపెనీలో పనిచేస్తూ ముంబైలో ఉండే వాడ్ని. ఆ రోజుల్లో మల్లీశ్వరి సినిమాలో చిన్న నాగరాజుగా వేసిన నా స్నేహితుడు వెంకటరమణతో కలిసి ఇద్దరూ నేను ఉంటున్న పేయింగ్‌ గెస్ట్‌ గదికి వచ్చారు. అందులో ఒకరు బాపు. ఈ వెంకటరమణ గోవిందరాజు సుబ్బారావు తమ్ముడి కుమారుడు. పిల్లలు లేకపోవడంతో సుబ్బారావు పెంచుకునే వారు. ఈ వెంకటరమణ సోదరి బాపు భార్య. ఆ రోజు ముంబైలో కలవడానికి ముందే బాపు గారి కార్టూన్‌ కథ పుస్తకం ‘సుహేళి’ చూశాను అన్నాను. బాపు ‘చూశారా?’ అని సంతోషించారు. ఆ మధ్యలో రెండు సంవత్సరాలు బొబ్బిలిలో ఉంటూ, తరచూ మద్రాసు వెళ్లేవాణ్ని, ఆ రోజుల్లో బాపుతో పాటు వారి మేడ మీద ఉండే రమణను కూడా కలిసేవాణ్ని. చివరకు 1960లో నేను చెన్నైలో స్ధిరపడిన తరువాత బాపు-రమణలతో పరిచయం స్నేహంగా మారింది. వీరి ద్వారా నాకు మల్లాది రామకృష్ణ శాస్ర్తిగారు, పి.బి. శ్రీనివాస్‌, బెంగళూరుకు చెందిన సినిమా నిర్మాత, థియేటర్‌ యజమాని (బాపు రమణలకు మంచి మిత్రుడు) భక్తవత్సలం వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. అంటే 1960 తరువాతే నాకు రామకృష్ణ శాస్ర్తిగారితో పరిచయం కలిగింది. అప్పటికే శాస్ర్తి గారి పేరుతో వచ్చిన ‘చిన్నకోడలు’, ‘రేచుక్క’, ‘రాజనందిని’ సినిమాలు నేను చూశాను. మల్లాది వారి రచన ‘రాజనందిని’ నాకు ఎంతో నచ్చిన సినిమా. ఆ సినిమా ఎక్కడ ఆడుతూ కనిపించినా చూశాను. బాపు-రమణలే నన్ను ఆంధ్రపత్రిక వీక్లీ సంపాదకులు శివలెంక రాధాకృష్ణగారికి ‘ఈయన రికార్డుల గురించి రాస్తా‘రని పరిచయం చేశారు. అపుడు నేను రాయవలసిన వ్యాసాలకు శీర్షికగా రమణ ఏవో పేర్లు చెప్పినా నాకు అంతగా నచ్చలేదు. రామకృష్ణ శాస్ర్తి గారే ‘సరాగమాల’ అన్నారు. వెంటనే అంగీకరించాను. తరువాత జ్యోతి మాసపత్రిక కోసం ఒకసారి కృష్ణ జయంతి సందర్భంగా కృష్ణునిపై ప్రత్యేక సంచిక ‘కృష్ణజ్యోతి’ తేవాలనుకున్నాం. దానికి రమణ సకాలంలో కథ ఇవ్వలేదు. కానీ మరో వారంలోనే కృష్ణునిపై రమణ రాసిన ‘కానుక’ అనే కథ వేరే వార పత్రికలో వచ్చింది, నాకు ఎంతో కోపం వచ్చి, ‘‘యు ట్రైటర్‌’’ అంటూ టెలిగ్రాం యిచ్చాను. ఆ తరువాత ఆ కథను రమణ ఒక పుస్తకంగా వేసి నాకే అంకితమిచ్చారు! అలాగే ‘ప్రేమించి చూడు’ షూటింగ్‌ సమయంలో హార్సిలీ హిల్స్‌లో ఏఎన్‌ఆర్‌తో అనుబంధం కూడా బాపు-రమణల ద్వారానే జరిగింది. అంతకు ముందు పరిచయం ఉన్నా, స్నేహంగా బలపడింది బాపు-రమణ ద్వారానే. ఇక నా ‘జనార్దనాష్టకం’ పుస్తకానికి అందమైన బొమ్మలు బాపు ఉచితంగా వేసిచ్చారు. బాపు-రమణలకు సంబంధించి వారి చిత్రాల్లో ‘వంశవృక్షం’, ‘గోరంత దీపం’ నాకు ఎంతో నచ్చుతాయి. ఒకసారి ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో అనుకుంటాను ‘మంచిదినము నేడు’ అనే మూవనల్లూరు సభాపతయ్య గారి ‘పదం’ పెట్టాలన్నారు. నేను వద్దు అది చాలా స్లోగా ఉంటుంది. ఎవరూ యిష్టపడరు కొంత స్పీడున్న ‘కృష్ణం కలయ సఖీ సుందరం’ పెట్టమన్నాను. అయితే సినిమాలో ఆ పాటను వారు వాడుకున్న తీరు నాకు నచ్చలేదు. ఆదే వారికి చెప్పాను. మా మధ్య అన్నీ అంగీకారాలే అంటే అది అసత్యం. మేం ఎన్నో విషయాల్లో విభేదించుకునేవారం. కోతి కొమ్మచ్చిలో రమణ సూచనగా అన్నాడు కూడా ‘రంగారావు ఆయనతో ఆయనే ఏకీభవించడు’ అని. అంతవరకే. బుల్లెట్‌ సినిమాలో కూడా ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటలో ‘అమరావతినగర అపురూప శిల్పాలు’ అని ఉంది. దీనిపై నాకు రమణ గారికి పెద్ద పంచాయతీ జరిగింది. అయితే రచయిత శ్రీరమణ మార్చాడు అన్నారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డు నావద్ద ఉంది అందులో ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అనే ఉంది. రచయిత రాసిన దానిని మార్చకూడదు అనేది నా వాదన. అంతవరకే, దీని వలన మా స్నేహానికి వచ్చిన యిబ్బంది ఏమీ లేదు. రమణ నన్ను ‘చిక్కి’ అంటారు. ఇతరులను నొప్పించే గుణం ఏమాత్రం లేదు. వీరు కళాకారులుగా నిర్వచనానికి అందరు. బాపు దర్శకత్వ ప్రతిభలో 20శాతం రమణకు, రమణ రచనా నైపుణ్యంలో 20 శాతం బాపుకీ దక్కుతుందని నా నమ్మకం. ఒక్కోసారి రమణ ఏమైనా అంటారు కానీ, బాపు దేనికి స్పందించరు. సినిమా బాగాలేదు అన్నా ‘అలాగా? సరే!‘ అంటారు. చాలా బావుంది అన్నా ‘అలాగా! సరే!’ అని నవ్వి ఊరుకుంటారు.
బాపు బొమ్మ అంత అందంగా బొమ్మ వేసేవారు లేదు. బాపు లాగా ‘పెర్స్‌పెక్టివ్‌’ తెలిసేలా చిత్రించిన వారు లేదు. దేశంలోనే అటువంటి చిత్రకారుడు లేడు. అమ్మాయి చదువుతుంటుంది, అటుపక్క తలుపు, ఓ దీపం, మరచెంబు, వాకిలి, గేటు వద్ద పూల తీగ వంటివి ‘ఒక ఫ్రేమ్‌’ చిత్రించడం బాపు ప్రత్యేకత. బాపుకి పాత హిందీ సినిమా సంగీతం తెలిసినంతగా మరో దర్శకునికి తెలియదు. ఆయన మా యింటికి వచ్చి ఎన్నో పాటలు స్వయంగా రికార్డు చేసుకువెళ్లేరు. బాపుకి గజళ్లపై కూడా మంచి పట్టుంది. ఒక్క సంగీత దర్శకుడు సత్యం గారికే అంతటి అవగాహన ఉండేది. రమణకు సినిమా పాటలు రాయడం యిష్టం లేదు. కానీ దగ్గరుండి మంచి పాటలు రాయించుకోగలరు. ‘సీతాకల్యాణం’, ‘సంపూర్ణరామాయణం’ రెండూ రామాయణ కథలే అయినా, వాటిని తీసిన పద్ధతిలో ఎంతో తేడా ఉంది. ‘బాపురమణీయం’ పుస్తకంలో తప్పులను సవివరంగా పేర్కొన్నపుడు కూడా అంతే, మరుసటి రోజు రమణ బొకే పట్టుకుని వచ్చి ‘‘చిక్కీ, నువ్వు రాసినట్లు మరెవ్వరూ రాయలేదు. అయితే, ఆ పుస్తకం మీద నువ్వు పెట్టినంత శ్రద్ధ మేం పెట్టలేదు’’ అన్నారు. మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా అవి స్నేహానికి ఎన్నడూ అడ్డురాలేదు. రమణ రాసిన ‘కానుక’, ‘ఒకబృందావన విహారం’, ‘రాధా గోపాలం’ కథలు జీవితానికి దగ్గరగా ఉంటాయి. అవీ నాకు ఎంతో యిష్టం. మేం అప్పట్లో (1960-65) ఎల్‌ఫిన్‌స్టన్‌ థియేటర్‌ వద్ద సోడా ఫౌంటెన్‌కి (ఐస్‌క్రీం పార్లర్‌) తరచూ వెళ్లే వాళ్లం. అక్కడ లభించే ఫ్లేవర్స్‌ అంటే బాపు, రమణలకి ఎంతో యిష్టం. అప్పట్లోనే అక్కడ ఎనిమిది రకాల ఫ్లేవర్స్‌లో ఐస్‌క్రీంలు లభించేవి. ఆ షాపతను స్వీడన్‌ నుంచీ ఎసెన్స్‌లు తెప్పించే వారు. బాపు రమణలతోనే నాకు రామకృష్ణ శాస్ర్తి అనే నిధితో పరిచయం కలిగింది. అలాగే నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘సరాగమాల’ ప్రారంభానికి వారే కారకులు. ఆ విధంగా నేను వారికి ఎంతో రుణపడి ఉంటాను. బాపు- రమణలు గొప్ప వారని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు ఏ నిర్వచనానికీ లొంగని వారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నన్ను మామిడి పండులా ఉన్నావు ”అని బాపు అన్నారని”ముత్యాలముగ్గు” నటి సంగీత

మామిడి పండులా ఉందన్నారు

బాపు సినీకావ్యాల్లో చెప్పుకోదగినది ‘ముత్యాలముగ్గు’. ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపించే చిత్రం అది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆ టైటిల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీనియర్‌ నటి సంగీత. బాపు మలచిన కుందనపు ‘బొమ్మ’ల్లో సంగీత కూడా ఒకరు. బాపు జయంతి సందర్భంగా ఆయన గురించి సంగీత చెబుతున్న విశేషాలు…
‘‘నేను మేగజైన్‌లో యాడ్‌లు చేసేదాన్ని. ఒకసారి ప్రకటనల కోసమని స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ భూషణ్‌ నా ఫోటోల్ని తీశారు. ఆయన బాపుగారి సినిమాలకు కూడా పనిచేసేవారు. నా ఫోటోలు బాపుగారికి చూపించడం, ఆయనకి నచ్చడంతో ‘ముత్యాలముగ్గు’లో అవకాశం వచ్చింది. ఈ సినిమా కంటే ముందు ‘అందాలరాముడు’ చేయాల్సింది. కానీ, కుదరలేదు. నేనేమో ఇండస్ర్టీకి కొత్త. ఏం తెలిసేది కాదు. అవే ఫోటోలు చూసి విశ్వశ్వరరావుగారు ‘తీర్పు’లో అవకాశం ఇచ్చారు. అది హీరోయిన్‌గా నాకు తొలి సినిమా కాగా విడుదలైంది మాత్రం ‘ముత్యాలముగ్గు’.
మేకప్‌ లేకుండా నటించమన్నారు

‘తీర్పు’ షూటింగ్‌ జరుగుతుండగానే ‘ముత్యాలముగ్గు’కి నన్ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు చెప్పారు. మేకప్‌ లేకుండా నటించాలన్నప్పుడు కొంచెం ఫీలయ్యాను. ‘సినిమా అంటే గ్లామర్‌ కదా, మేకప్‌ లేకుండా నటించామంటారేంటి?’ అనుకున్నాను. అంతకుముందు బాపుగారి గురించి నాకు తెలీదు. సినిమా అంటేనే పెద్దగా తెలీదు. స్కూల్లో స్కిట్స్‌ చేసేదాన్ని. మా స్వస్థలం వరంగల్‌. సెలవులకు సికింద్రాబాద్‌లో ఉన్న మా పెద్దక్క దగ్గరకి వెళ్లినప్పుడు పక్కనే ఉన్న డాన్స్‌ స్కూల్‌లో డాన్స్‌ నేర్చుకున్నాను. మద్రాసుకి వచ్చిన తరువాత కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం చేశాను. చిన్నప్పుడు స్కూల్లో చేసిన డాన్స్‌లతోనే సినిమాపై ఇష్టం పెరిగింది. ‘మంచి ఫోటోజెనిక్‌ ఫేసు. సినిమాల్లో ఎందుకు ట్రై చేయకూడదు’ అని మా ఫ్రెండ్స్‌ అనేవారు. ‘తీర్పు’ పూర్తికాకుండానే ‘ముత్యాలముగ్గు’లో నటించాను. సరదాగా కూర్చుని మాట్లాకుంటున్నప్పుడు షాట్‌ రెడీ అంటే వెళ్లిపోయేవాళ్లం. కొద్దిగా టచప్‌ చేసేవాళ్లంతే.

పాట నా ఫస్ట్‌ షాట్‌
నా ఫస్ట్‌ షాట్‌ ‘ముత్యమంత ముగ్గు…’ పాట. ముఖం పక్కకు తిప్పి చూడాలి. అలా రెండు, మూడు షాట్‌లు తీసి వేరే వర్క్‌ చేసుకున్నారు. నన్ను మళ్లీ పిలవలేదు. ‘రెండు షాట్‌లే తీశారు. మళ్లీ పిలవడం లేదు. ఈ సినిమాలో ఉంటామా, లేదా’ అని ఫీలయ్యాను. మరుసటి రోజు ఉదయం సెట్స్‌కి వచ్చి చూస్తే అందరి ముఖాల్లో ఒకటే సంతోషం. బాపుగారు, రమణగారు… అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. బాపు నా చేయి పట్టుకుని ‘మామిడిపండులా ఉంది నీ ముఖం’ అన్నారు. మేకప్‌ లేకుండా చేయడం సినిమాలో ఎలా ఉంటుందోనని టెస్ట్‌ చేశారనుకుంటా. ముఖానికి పసుపు రాసుకుని, కుంకుమ పెట్టుకోవాలంతే. లిప్‌స్టిక్‌ రాసుకుంటే.. రవ్వంత ఎక్కువైనా ‘తుడిచేయ్‌ తుడిచేయ్‌..’ అనేవారు.
స్ర్కిప్టు చూస్తే సినిమా చూసినట్టే…
సెట్‌లో బాపుగారు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు. అలాగే పని చేయించుకుంటారు. ‘ఇలా చేయమ్మా, అలా చేయమ్మా’ అని చెప్పరాయన. స్ర్కిప్టు చేతికిచ్చేస్తారు. స్ర్కిప్టు ప్యాడ్‌ ఇచ్చి, బొమ్మలు చూపించి అలా చేయమనేవారు. అందులో బొమ్మలు, సీను, డైలాగులు.. అన్నీ ఉంటాయి. ప్రతి షాట్‌ బొమ్మ గీసేస్తారు. ఒక సీనులో 50 షాట్లుంటే, 50 బొమ్మలుంటాయి. బాపుగారి స్ర్కిప్టు చూస్తే సినిమా చూసినట్టే ఉంటుంది. అన్ని క్యారెక్టర్లకి బొమ్మలు గీసేస్తారు. ఆయన దర్శకత్వంలో ఏడెనిమిది సినిమాలు చేసుంటాను. అన్నింట్లోను ఇంతే. ‘ముత్యాలముగ్గు’ షూటింగ్‌ పూర్తయ్యాక ప్రొజెక్షన్స్‌ వేశారు. నేను 10-15 ప్రొజెక్షన్స్‌ చూసుంటాను. ఎవరి కోసం ప్రొజెక్షన్‌ వేసినా వెళ్లేదాన్ని. నా సినిమా చూడాలని అంత ఆసక్తిగా, ఆరాటంగా ఉండేది. తరువాత ఏ సినిమానూ నేనన్ని సార్లు చూడలేదు.
మాది తండ్రీ కూతుళ్ల బంధం
ముత్యాలముగ్గు సినిమాతో బాపుగారి కుటుంబానికి బాగా దగ్గరయ్యాను. రమణగారి కుటుంబం కూడా అంతే. బాపు ఎంత తక్కువగా మాట్లాడేవారో, రమణ అంత బాగా మాట్లాడేవారు. మంచిచెడ్డలు చెప్పుకోవడం రమణగారితోనే. బాపుతో మాట్లాడాలంటే కొంచెం భయంగానే ఉండేది. అనవసరంగా కదిపితే విసుక్కునేవారు. ఒకసారి ‘పెళ్లి కొడుకు’ షూటింగ్‌లో ఒక ఆర్టిస్ట్‌ సమయానికి రాలేదని బాపుగారికి కోపం వచ్చింది. షూటింగ్‌ ఆలస్యమవుతోంది, వెలుతురుపోతుందన్న టెన్షన్‌ ఆయనది. ఆ మూడ్‌లోనే నాపై కూడా కేకలు వేశారు. నాకేం అర్థం కాలేదు. ‘నేనేం తప్పుచేయలేదు, నన్నెందుకు తిడుతున్నారు’ అని బాధపడ్డాను. ఆర్టిస్ట్‌ వచ్చాక రెడీ అవుదామన్న ఉద్దేశంతో నేనున్నాను. ఆ ఆర్టిస్ట్‌ వచ్చాక నేను రెడీ అవుతున్నాను వెంటనే ఆయన రూమ్‌కి వచ్చి ‘ఏంటమ్మా ఏమనుకుంటున్నావు. ఆలస్యం ఏమిటి? ఇలా అయితే ఎలా..’ అని తిట్టారు. ఆ తరువాత షాట్‌ తీశారు. ఆ తరువాత బాపుగారు నన్ను దగ్గరకి పిలిచి ‘సారీ సంగీత, టెన్షన్‌లో అనేశాను. అయినా నీపై నాకు ఆ చొరవ ఉందమ్మాయ్‌. అందుకే తిట్టాను’ అన్నారు. ఆ మాటతో అప్పటి వరకు పడిన బాధంతా పోయింది.
దీర్ఘం తీసి తిట్లు తిన్నాను…
బాపుగారితో ‘పెళ్లీడు పిల్లలు’, ‘త్యాగయ్య’, ‘పెళ్లికొడుకు’, ‘సుందరకాండ’ సినిమాలతోపాటు భాగవతం సీరియల్‌ చేశాను. అందులో రామాయణం ఎపిసోడ్‌లో ‘కైకేయి’ పాత్ర ఇచ్చారు నాకు. బాపుగారు ఆ విషయం చెప్పగానే ‘కైకేయి.. పాత్రా…’ అని కాస్త దీర్ఘం తీశాను. వెంటనే ఆయన ‘ఏం చేయలేవా? ఆ రోజుల్లో జమున చేసింది. ఎంత పెద్ద హీరోయిన్‌ ఆవిడ’ అంటూ మందలించి ఆ సినిమా చూడమని చెప్పారు. ఆ క్యారెక్టర్‌కి నన్ను అడిగారేంటబ్బా అని దీర్ఘం తీయడంతో నేను నటించనని చెప్తున్నాను అనుకున్నట్టున్నారు.
అంతా బొమ్మల ప్రపంచమే…
ఆయన దగ్గర నేను నేర్చుకున్నది చేసే పనిని సంతోషంగా 100 శాతం ఇన్వాల్వ్‌మెంట్‌తో చేయడం. సెట్‌లో రమణతో లేక కెమెరామెన్‌తో డిస్కస్‌ చేస్తారేగానీ, సరదాగా కబుర్లు చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. షూటింగ్‌ గ్యాప్‌లో కూడా స్ర్కిప్టుతోనే ఉంటారు. సెట్లోనే కాదు ఇంట్లో కూడా ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎప్పుడు చూసినా ఇంట్లోని స్టూడియో రూమ్‌లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవారు. చివరిగా ‘సుందరకాండ’లో ఆయనతో పనిచేశాను. ఒంట్లో బాగోలేదని రమణగారు చెన్నైలోనే ఉండిపోయి షూటింగ్‌ రాకపోతే బాపు చాలా ఒంటరిగా ఫీలయ్యేవారు. 

అలా మాట్లాడ్డం చాలా అరుదు…

ఇండస్ర్టీకి వచ్చి 35 ఏళ్లు దాటింది. ఇప్పటికీ నన్ను చూస్తే ‘ముత్యాలముగ్గు సంగీత’ అనే అంటారు. ‘లవకుశ’ సినిమాకి సాంఘిక రూపం ‘ముత్యాలముగ్గు’. దాన్ని మరిపింపచేసేలా ఈ సినిమా తీశారు. ఇన్నేళ్లయినా ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే అదే ‘బాపు రమణీయం’. ‘పద్మశ్రీ’ వచ్చినప్పుడు శుభాకాంక్షలు చెబుదామని ఇంటికి వెళ్లాను. మీకు ‘పద్మభూషణ్‌’ వస్తే బాగుంటుంది అన్నాను. ‘ఏ ఎందుకు భారతరత్న వస్తే బాగుండదా?’ అని గట్టిగా నవ్వేశారు. అవార్డుల్ని ఆశించే తత్వం కాదని తమాషాగా చెప్పారు. ఆయన ఇలా జోక్‌గా మాట్లాడ్డం చాలా అరుదు.

ఆ షాక్‌లో ఏడుపు రాలేదు…
బాపుగారి మరణం చాలా పెద్ద షాక్‌. టీ వీలో బాపుగారు మరణించారని చూసినప్పుడు నాకస్సలేమీ అర్థం కాలేదు. ‘బాపు ఇక లేరు’ అన్నది తప్పేమో, ఇంకెవరైనా అయ్యుంటారేమో అన్న భావనలోనే ఉన్నాను. అబద్ధం అయితే బాగుండని దేవుడ్ని కోరుకున్నాను. ఆ షాక్‌లో ఏడుపు రాలేదు. వృత్తిపరంగా డబ్బు కోసం సినిమాల్లో నటించడం పక్కనబెడితే, మనసుకి నచ్చి పనిచేయడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. అలా చేసిన సినిమాలు బాపు సినిమాలు. ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మాకెప్పుడూ ఉంటాయి. ఆయన నాకిచ్చిన ‘ముత్యాలముగ్గు సంగీత’ అన్న పేరు నిలబెట్టుకుంటే నా జీవితం ధన్యమైనట్లే.’’
‘‘ఆయన ఆఖరి సినిమా ‘శ్రీరామరాజ్యం’లో నటించే అవకాశం చేజారిందన్న బాధ ఉంది. ఈ సినిమాలో క్యారెక్టర్‌ ఉంది, తరువాత చెబుతాను అన్నారు. ఒకరోజు రాత్రి కో-డైరెక్టర్‌ ఫోన్‌ చేసి ‘రేపు ఉదయం షూటింగ్‌ ఉంది. రండి’ అన్నారు. అప్పుడు నేనో తమిళ సినిమాలో నటిస్తున్నాను. మరుసటి రోజు షూటింగ్‌ ఉంది. వాళ్లని పర్మిషన్‌ అడిగితే ‘కాంబినేషన్‌ సీన్‌ ఉంది, కుదరద’న్నారు. ఎల్లుండి వస్తానని కో-డైరెక్టర్‌కి చెప్పాను. వేరే కారణాలతో ఆ పాత్రలో నటించలేకపోయాను. రాముడి సోదరి పాత్ర నేను చేయాల్సింది..’’
 గనిరెడ్డి అరుణ్‌కుమార్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

సింగమనేని నారాయణకు పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నీరుకొండపై అతి పెద్ద ”అన్న గారి” విగ్రహం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు చిత్ర కళా ప్రస్తానం -(బాపు 82 వ పుట్టిన రోజు )నండూరి పార్ధ సారధి –

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

హరిజన సేవలో ధన్యురాలైన శ్రీమతి రామి నేని రామానుజమ్మ

హరిజన సేవలో ధన్యురాలైన శ్రీమతి రామి నేని రామానుజమ్మ

Inline image 1

ఎక్కడో మధ్య ప్రదేశ్ లోని బిలాస పూర్ లో జన్మించి ,ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణాజిల్లాలో ఒక కుగ్రామానికి కోడలుగా వచ్చి  మహాత్ముని పిలుపుకు స్పందించి సంఘ సేవలో అందునా ముఖ్యం గా హరిజన సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్న పునీతురాలు శ్రీమతి రామినేని రామానుజమ్మ .ఆమె చరిత్ర అన్ని తరాలకూ ఆదర్శమే .

‘’ గాంధీ టోపీ గవర్నర్ ‘’అని ప్రసిద్ధి చెందిన కృష్ణా జిల్లా పామర్రుకు దాగ్గరలో ఉన్న పెదమద్దాలి  కు చెందిన ఈడ్పు గంటి  రాఘవేంద్ర రావు గారి అక్కగారు   రామినేని రామనుజమ్మ గారు .తండ్రిగారు నాగన్న గారు . తమ్ముడు  రాఘ వేంద్ర రావు గారు మధ్య ప్రదేశ్ లోని బిలాస పూర్ లో వ్యాపారం చేస్తున్నప్పుడు 1880 లో జన్మించారు .రాఘ  వేంద్ర రావు గారు ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పాసై ఇండియా కు తిరిగివచ్చి కొంతకాలం న్యాయ వాద వ్రుత్తి చేసి జాతీయ నాయకులు  బాల గంగాధర తిలక్ ప్రభావంతో రాజకేయ ప్రవేశం చేసి  బిలాస పూర్  మునిసిపల్ చైర్మన్ అయ్యారు .గాంధీజీ నాయకత్వాన ఉద్యమాలలో పాల్గొన్నారు .స్వశక్తితో ఎదిగి రెండేళ్ళు నాగపూర్ ప్రావిన్స్ ప్రధాన మంత్రిగా ,ఏడేళ్ళు హోమ్ మంత్రిగా  నాలుగు నెలలు గవర్నర్ గా పని చేశారు .ఇంతటి చైతన్య శీలి కి రామానుజమ్మ గారు అక్కగా   పుట్టటం అదృష్టం .

రామానుజమ్మ గారు  కృష్ణా జిల్లా ఉయ్యూరు కు దగ్గరలో ఉన్న కుమ్మమూరు గ్రామం లో  రామినేని వియ్యన్న గారి ని  వివాహ మాడి రామినేని వారి  ఇంటికోడలయ్యారు .భర్త మంచి స్థితి పరులు గొప్ప భూస్వామి , గ్రామ మునసబు .వియ్యన్న గారు ఉయ్యూరు లో1909 లో ఏర్పడిన ‘’ఉయ్యూరు లిటరరీ అసోసియేషన్ అండ్ సోషల్ క్లబ్ ‘’కు వ్యవస్థాపక సభ్యులు .ఒక కుమారుడు కౌసలేంద్ర రావు పుట్టిన తర్వాత భర్త మరణించారు .కౌసలేంద్ర రావు గారికి ఈడుపు గంటి రాఘ వేంద్రరావు గారు మేనమామ  .హిందీ రాష్ట్రం లో ఉండటం వలన రామానుజమ్మ గారికి  సహజం గా హిందీ అలవడింది .మరాఠీలో ప్రావీణ్యం సంపాదించారు .విజయవాడ లో భండారు అచ్చమాంబ గారి వద్ద ఇంగ్లీషు ,తెలుగు నేర్చారు .అత్తవారింట కుమ్మమూరు గ్రామం లోనే ఉంటూ పిల్లవానిని పెంచుతూ సమాజ సేవ చేశారు .

హరిజనుల కోసం పాఠ శాలను కుమ్మమూరు గ్రామం లో నిర్మించి పేద హరిజన విద్యార్ధులకు విద్యా సౌకర్యం కలిగించిన వితరణ శీలి రామానుజమ్మ గారు .భారత జాతీయోద్యమం లో చురుకుగా పాల్గొన్నారు .హిందీ భాషలో మంచి ప్రజ్ఞ ఉండటం చేత 1921లో ‘’పుత్రోపహారం ‘’అనే హిందీ గ్రంధాన్ని తెలుగులోకి అనువదించారు .దీనిలో బాలలు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని దానికోసం ఎలా నడుచుకోవాలో తెలియ జేశారు .ఆదర్శం గా జీవించి అనేక సంస్థలకు వ్యక్తులకు దాన ధర్మాలు చేసి విద్యా వ్యాప్తికీ సాంఘిక మార్పులకు దోహద పడ్డారు .

ఆణి ముత్యం లాంటి వీరి కుమారుడు రామి నేని కౌసలేంద్ర రావు విదేశాలలో న్యాయ శాస్త్ర విద్య నభ్యసించి ,నాగపూరు హైకోర్ట్ న్యాయ వాదిగా పని చేశారు .తర్వాత ప్రభుత్వ న్యాయ వాదియై ,అడ్వకేట్ జనరల్ అయి ,నాగ పూరు హైకోర్ట్ న్యాయ మూర్తిగా ఉన్నారు  . ఫైనాన్స్ కమీషన్ సభ్యులుగా నియమింప బడి గౌరవం పొందారు.తల్లి రామానుజమ్మ గారి గొప్ప సుగుణాలైన విశాల ద్రుష్టి ,నిష్పాక్ష పాతం ,సత్ప్రవర్తన   సాటి వారి యెడ ప్రేమాదరణలు కౌసలేంద్ర రావు గారికి సంక్రమించాయి .

కౌసలేంద్ర రావు గారి భార్య శ్రీమతి సరోజినీ దేవి మదన పల్లి లో రాటకొండ వారి ఆడపడుచు . కుమారుడు అంటే రామానుజమ్మ గారి మనుమడు శ్రీ రామి నేని భాస్కరేంద్ర రావు ‘’ఇండిపెండెంట్ చార్టర్డ్ అకౌంటెంట్.గా ఉంటున్నారు . మనం అందరం మర్చి పోయిన ఎన్నో చారిత్రిక విశేషాలను ఆయన కంప్యూటర్ లో భద్ర పరచి అందిస్తూ ఉంటారు .’’ఇరవై వ శతాబ్దపు తెలుగు వెలుగులు ‘’అనే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంప్రచురించిన  విస్తృత ఆచూకీ (రిఫెరెంస్ ).గ్రంధ రచన ‘’సంపాదక సలహా మండలి ‘’లో సభ్యులు .గొప్ప పుత్రుడైన  –కౌసలేంద్ర రావు గారిని ,సమర్ధ వంతుడైన మనుమడు భాస్కరేంద్ర రావు ను తన వారసులుగా అందించిన రామినేని రామానుజమ్మ గారు97 ఏళ్ళు  సార్ధక జీవితం గడిపి 1977లో మరణించారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-14-ఉయ్యూరు

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -90- 135-వ్యుత్పత్తి నిఘంటు రచయిత –తాత వెళ్లి మిఠాచార్ శేషగిరి శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -90

135-వ్యుత్పత్తి నిఘంటు రచయిత –తాత వెళ్లి మిఠాచార్  శేషగిరి శాస్త్రి

తమిళదేశం లో గీర్వాణ  పంట

తమిళనాడు ఉత్తర ఆర్కాట్ జిల్లా తిరువత్తూరు తాలూకా లో పుదూరు ద్రావిడ కుటుంబం లో తాతవెళ్ళి మిఠాచార్ శేష గిరి శాస్త్రి 1847 లో జన్మించారు .వారిది విద్వత్ కుటుంబం .చిన్నతనం లోనే అసాధారణ ప్రతిభా ప్రదర్శనం చూపించారు .మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి లో 1871 లో పట్ట భద్రులయ్యారు .అదే కాలేజిలో సంస్కృత పండితులుగా పని చేశారు .తర్వాత 1875లో సంస్కృతాంధ్రాలలో ఏం ఏ .సాధించారు .మద్రాస్ లో మొట్టమొదటి సారిగా సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ పొందిన వ్యక్తిగా చరిత్రకెక్కారు .

ఉద్యోగ వైబోగం

విద్యాశాఖలో చేరి స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గా ,ప్రెసిడెన్సి కాలేజిలో గీర్వాణ భాషా మహోపాద్యాయులుగా సేవ చేశారు .తర్వాత మద్రాస్ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం లో ‘’క్యూరేటర్ ‘’గా  చివరి వరకు పదవి నిర్వహించి చివరలో 1893 లో ‘’డాక్టర్ అవార్డ్ ‘’ను పొందారు .పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రెసిడెన్సి కాలేజి ‘’ప్రాక్తన శాఖాధ్యక్షులు’’ గా కొనసాగారు .సంస్కృత ,తమిళ భాషలకు ఫైలాలజికి ,మరాఠీ భాష కు ఎన్నో సంవత్సరాలు పరీక్షకులుగా ఉన్నారు .

బహుభాషలలో  భాషా సేవ

శాస్త్రిగారు విస్తృత పరిశోధకులు .తులనాత్మక పరిశోధనలు చేసిన భాషాభిమాని .’’ఆంద్ర శబ్ద తత్త్వం ‘’అనే రెండు భాగాలతెలుగులో  ఉద్గ్రంధం రాశారు .’’తమిళ శబ్ద తత్త్వం ‘’ఆనే తమిళ భాషలో గ్రంధం రచించారు .’’ఆంద్ర భాషా తత్వ పరిశీలనం ‘’అనే ప్రధమ భాగాన్ని ఇంగ్లీష్ లో రాశారు .’’తమిళ సారస్వత చరిత్ర ‘’ను ఆంగ్లం లో వెలయింప జేశారు .‘’అర్దానుసార తత్త్వం ‘’ తెలుగు గ్రంధమూ రాశారు .

శేషగిరి శాస్త్రి గారి వివిధ  భాషా పరిశోధనకు ప్రావీణ్య నైపుణ్యాలకు మేటి ఉదాహరణలు  వీరు రాసిన సంస్కృత ,ఆంద్ర ,కన్నడ ,తమిళ మళయాళ భాషలకు రాసిన ‘’ప్రత్యెక వ్యుత్పత్తి నిఘంటువులు ‘’ అనితర సాధ్యమైన కృషి ఇది అని భాషా శాస్త్ర వేత్తలు బహుదా ప్రస్తుతించారు శాస్త్రిగారిని .కాని ఇవి పూర్తీ గా రాయకుండానే శాస్త్రి గారు మరణించటం ఆ  భాషలు చేసుకొన్న దురదృష్టం .యాభై నాలుగేళ్ళు మాత్రమె జీవించి ఇంతటి భాషా సంపదను భాషలకు అందజేసిన శేష గిరి శాస్త్రిగారు 1901లో పరమ పదించారు . .

136-బాల వ్యాస ,వ్యాకరణాలంకార –వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి

విద్యార్జన

వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తూర్పు గోదావరిజిల్లా కాకినాడ తాలూకా వాజులూరులో భావనారాయణ ,కామేశ్వరమ్మ దంపతులకు1894 లొ జన్మించారు .షష్టి నాడు పుట్టారు కనుక చదువుల మేటి సుబ్రహ్మణ్యీశ్వరుని పేరు పెట్టారు .పేరు సార్ధకం చేశారు శాస్త్రిగారు. మాతామహులు రేగిళ్ళకామ శాస్త్రి గారి దగ్గార సంస్క్రుతకావ్యాలు చదివి ,పిఠాపురం చేరి పేరి పేరయ్య శాస్త్రిగారి వద్ద సిద్ధాంత కౌముది ని నేర్చారు .పితాపురాస్థాన  విద్వాంసులైన వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారి సన్నిధానం లో మహా భాష్యాంతం వ్యాకరణాన్ని మంజూష తో సహా ఆపోసన పట్టారు .ఆస్థాన తర్క విద్వాంసులైన శ్రీపాద లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి శిష్యులై న్యాయ శాస్త్రాన్ని నేర్చుకొన్నారు .ఆస్థాన వేదాంత శాస్త్రజ్ఞులైన దెందుకూరి నరసింహ శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాన్ని గ్రహించారు .

విద్యాదానం

అనేక ప్రాంతాలనుండి తన వద్దకు విద్య నేర్వటానికి వచ్చిన యాభై కి పైగా విద్యార్ధులకు భోజన వసతులు ఏర్పాటు చేసి విద్య గరపారు .శిష్యులకు కావ్య నాటకాలంకారాలను  వ్యాకరణాన్ని బోధించారు .1930-50మధ్య ఇరవై ఏళ్ళు పిఠాపురం లోని వీరి గృహం ఒక ఆదర్శ గురుకులం గా భాసించేది .నిత్య పాఠ ప్రవచనాలు ,ఆర్హ గ్రంధ పరిశీలనం  గ్రంధ రచన చేయటం వీరి దిన క్రుత్యమైపోయింది .వీరి శిష్యులందరూ వీరి అంత పాండిత్యం సంపాదించి గురువుగారి పేరు నిలబెట్టి శాస్త్ర పాఠాలు చెప్పి శాస్త్ర విద్యా ప్రచారం చేసి ఆర్ష ధర్మాన్ని నిలబెట్టినవారే .అలాంటి వారిలో కప్పగంతుల సుబ్రహ్మణ్య శాస్త్రి ,ముళ్ళపూడి నారాయణ శాస్త్రి ,ప్రతాప హనుమచ్చాస్త్రి మొదలైన వారున్నారు .

ప్రజ్ఞా సుబ్రహ్మణ్యీయం

పిఠాపురం ప్రజల అభ్యర్ధన మేరకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ మద్రామయణాన్ని ధారావాహికం గా ప్రవచనం చేసి అందరి అభిమానాన్ని సంపాదించి ఘన సత్కారం తోబాటు గురువుగారి సమక్షం లో ‘’బాల వ్యాస ‘’బిరుదును ,గుర్తుగా బంగారు ఉంగరాన్ని తమ గురు బ్రహ్మ చేత వెలికి తోడిగించుకొన్న  అదృష్ట వంతులు . .ఆంద్ర దేశం లోని విద్వాద్ లోకం వీరికి ‘’తర్క వ్యాకరణ వేదాంత కేసరి ‘’,’’మహోపాధ్యాయ ‘’గౌరవం తో సన్మానించింది .విజయ వాడ పండిత పరిషత్తు ‘’వ్యాకరణాలంకార ‘’బిరుదు నంద జేసింది .అయోధ్య సంస్కృత పత్రికాదిపతులు ‘’మహా భారత మర్మజ్న ‘’తో గౌరవించి సత్కరించారు .ఇతర రాష్ట్రాలవారు ఆహ్వానించి సన్మానించారు .

మహా గ్రంధ రచన

శాస్త్రి గారు విమర్శనా సాహిత్యం లో అందే వేసిన చేయి .వ్యాసభారతం పై వచ్చిన దుర్విమర్శలకు దీటైన సమాధానాలు చెప్పి ,భారత ప్రామాణ్యాన్ని నిరూపించి ‘’మహా భారత తత్వ కధనం ‘’అనే ఆరుభాగాల మహా గ్రంధం రచించారు .’’కర్ణోత్పత్తి ‘’గ్రంధం కూడా రాశారు .’’శ్రీ మద్రామాయణ తత్వ కధనం ‘’,రామాయణ రహస్యాల సమీక్ష ‘’అనేవి మరో రెండు ముఖ్య గ్రంధాలు రాశారు .నాస్తికత్వానికి సరైన సమాధానాలు విపులంగా రాసి ‘’ఆస్తికత్వం ‘’అనే పేరుతొ మూడు భాగాల అద్భుత రచన చేశారు .సంస్కృత భాషలో ‘’మహా భారత తత్వ దీపః ‘’అనే మహోన్నత గ్రంధం రాశారు .ఈ గ్రంధానికి ఉత్తర ప్రదేశ్ ,ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాలు పురస్కారాలు అంద జేశాయి .ఈ దేశం లోనే కాక విదేశాలలోనూ విద్వాంసుల ప్రశంసలనూ అందుకొన్న గ్రంధ రాజం ఇది .శాస్త్రిజీ అనేక పత్రికలకు వివిధ విషయాలపై ఎన్నో వ్యాసాలూ రాసి జ్ఞాన బోధ చేశారు .’’శాస్త్రి గారి వాణి  ఆర్ష వాజ్మయానికి భద్ర కవచం ‘’అన్నారు విద్వాంసులు .అన్నిటా విఖ్యాత ప్రామాణికులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .ఈ విద్యా తపస్వివారణాసి వారు  ఎనభై నాలుగు సంవత్సరాలు ఆరోగ్యం గా జీవించి సార్ధక జీవనం సాగించి 1979 లో  ఆ వారణాసి విశ్వనాదునిలో ఐక్యంయ్యారు .

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- 89 – 132-క్రోడ పత్ర రచయిత-గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- 89

132-క్రోడ పత్ర రచయిత-గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి

ఏదైనా ఒక శాస్త్రం మీద రాసిన సంగ్రహ విమర్శను ‘’క్రోడ పత్రం ‘’అంటారు .గుమ్మలూరి  సంగమేశ్వర శాస్త్రి గారు రాసిన క్రోడపత్రాలు నేటికీ తర్క శాస్త్రాధ్యయనం చేసే వారికి కరదీపికలుగా నిలిచాయి .అంతటి ధిషణ శాస్త్రి గారిది .తర్కాన్ని తక్రం (మజ్జిగ  )తాగినట్లు అలవోకగా నేర్చి నేర్పిన విదుషీ మణి.

జననం –విద్య

శాస్త్రిగారు బొబ్బిలి తాలూకా గంగన్న పాడు గ్రామం లో గుమ్మలూరి లక్ష్మీనారాయణ ,వెంకమాంబ దంపతులకు 1863లో జన్మించారు .బొబ్బిలి ఆస్థాన పండితులైన మండపాక పార్వతీశ్వర కవి వద్ద సంస్కృత కావ్యాధ్యయనం చేశారు .సుసర్ల సీతా రామ శాస్త్రి గారి దగ్గర తర్క శాస్త్రం చదువుకొన్నారు .శ్రీపాద రామ శాస్త్రి గారి నుండి న్యాయ శాస్త్రాన్ని మధించారు .ఇప్పటికే వీరి కీర్తి చంద్రికలు దశ దిశలా వ్యాపించాయి .

నేర్చుకోవాలన్న తపన మాత్రం శాస్త్రి గారిని వదిలి పెట్టలేదు .విజయనగరం చేరి భీమాచార్యుల వారి వద్ద ,కాశీ వెళ్లి ప్రఖ్యాత పండితుల వద్ద తాను నేర్చిన పాండిత్యానికి మెరుగులు దిద్దుకొన్నారు .స్వగ్రామం చేరారు .అప్పటికే శాస్త్రి గారి బహుముఖీన ప్రజ్ఞ లోకం లో విశదమై దాదాపు ఎనభై మంది శిష్యులు గా చేరి విద్య నేర్చారు .వీరందరికీ గురుకుల వాసం లో వసతి ,భోజనాలు కల్పించి విద్యా బోధనా చేయాలి .అప్పుడే పశ్చమ గోదావరిజిల్లా కాకర పర్రు గ్రామస్తులు శాస్త్రిగారిని శిష్య సమేతం గా తమ గ్రామం వచ్చి ఉండమని విన్నవించుకొన్నారు .వారి అభ్యర్ధన మేరకు అక్కడికి చేరుకొన్నారు .మూడున్నర ఏళ్ళు గ్రామస్తులిచ్చిన సహకారం తో కాకర పర్రులోనే ఉంది శిష్యులకు విద్యాదానం చేశారు.

ఉద్యోగ వ్యాసంగం

1898లో విజయ నగరం మహారాజా ఆనంద గజ పతి గారు శాస్త్రి గారిని ఆహ్వానింఛి తమ సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా నియమించి గౌరవించారు .శాస్త్రి గారి శాస్త్ర వాదనా పటిమ ముందు యెంత కొమ్ములు తిరిగిన పండితుడైనా బోల్తా కొట్టాల్సిందే .అంత ఉద్దండ పండితులు సంగమేశ్వర శాస్త్రి గారు .1921లో మధ్వస్వామి  ‘నైయాయిక మహా సభ నిర్వహించారు .శాస్త్రి గారు పాల్గొని ,తన నిరుపమాన వాదనా సామర్ధ్యం తో అందరినీ చకితులను చేసి మధ్వ స్వామి వారి మెప్పు పొంది ఘనంగా సత్కరింప  బడ్డారు  నవద్వీపం వెళ్లి అక్కడి తర్క శాస్త్ర మేధావులను మెప్పించి  మురిపించి ప్రశంసా పత్రాలను అందుకొన్నారు .

పాశ్చాత్య ప్రశంస

భారతీయ పండితులే కాదు పాశ్చాత్య పండితులు కూడా శాస్త్రిగారి వాదనా నైపుణ్యానికి అబ్బుర పడేవారు .వారి వైదుష్యానికి జోహార్లు పలికారు .అలాంటి వారిలో ‘’జాన్సన్ అనే జర్మనీ పండితుడు ‘’శాస్త్రిగారి శాస్త్ర సామర్ధ్యానికి ముగ్ధుడై ఆయన వద్ద చేరి శాస్త్ర రహస్యాలను ఆకళింపు చేసుకొనేవాడు .దీనితో శాస్త్రి గారి కీర్తి దేశం లోనే కాక విదేశాలలోనూ మారు మోగిపోయింది .పాశ్చాత్యులు మెచ్చి శాస్త్రిగారికి గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేశారు .

క్రోడ పత్ర క్రోడీకరణ

శాస్త్రిగారు పిఠాపురం ,ఉర్లాం సంస్థానాలలో తర్క శాస్త్ర పరీక్షాదికారిగా ఉన్నారు .సంగమేశ్వర శాస్త్రి గారి పేరు వినగానే అందరికి వీరి ‘’క్రోడ పత్రాలు ‘’చప్పున జ్ఞాపకానికి వస్తాయి .శాస్త్రి గారు రాసిన ‘’మాధురీ పంచ లక్షణీ క్రోడపత్రాలను 1933 లో మైసూరు ప్రభుత్వం ముద్రించి గౌరవిస్తే ,’’జగదీశ్వర సిద్ధాంత లక్షణ క్రోడపత్రం ‘’ను ఆంద్ర విశ్వ కళాపరిషత్తు ప్రచురించి  గౌరవించింది .తర్క శాస్త్రం చదివే మన దేశ పండిత విద్యార్ధులకు శాస్త్రిగారి క్రోడపత్రాలు కరదీపికలు .యాభై సంవత్సరాలు మాత్రమె జీవించిన ఈ తర్క న్యాయ శాస్త్ర మహా విద్వాంసుడు గుమ్మలూరి సంగ మేశ్వర శాస్త్రి గారు 1913లో శివైక్య మయ్యారు .

133-శంకరాద్వైత నిష్ణాతులు –చదల వాడ సుందర రామ శాస్త్రి

ఆంద్ర దేశం లో వావిళ్ళ రామ స్వామి అండ్ సన్స్ ప్రెస్ ప్రఖ్యాతి చెందింది .దీని స్థాపకులే వావిళ్ళ రామ స్వామి శాస్త్రిగారు .వీరు సంస్కృతాంధ్రాలలో అరుదైన పుస్తకాలన్నీ సేకరించి పరిష్కరించి ప్రచురించారు .పుస్తక ముద్రణకు ఒక ‘’హాల్ మార్కు ‘’రామ స్వామి శాస్త్రి గారు .వీరి అల్లుడే చదల వాడ సుందర రామ శాస్త్రి గారు .1840 లో జన్మించారు .రామ శాస్త్రిగారు సంస్కృతాంధ్రాలలో దిట్ట .పందొమ్మిదవ శతాబ్దపు ప్రసిద్ధ పండితులలో ఒకరుగా గుర్తింపు పొందారు శంకరాద్వైతం లో నిష్ణాతులు .సంస్కృతం లో స్రగ్ధరా వృత్తం లో ‘’ఆదిత్య స్తవం ‘’అనే శతకం రచించారు .ఇది మయూరుడు సంస్కృతం లో రాసిన సూర్య శతకానికి దీటుగా ఉందని పండితులు ప్రశంసించారు .భగవద్గీతా భాష్యాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ,పరిశీలించి ,పరిశోధించి ,’’ఆనంద చంద్రిక ‘’అనే వ్యాఖ్యానం తో ఆరు సంపుటాలు ప్రచురించారు .వాల్మీకి మహర్షి రాచిన శ్రీ మద్రామాయణానికి ప్రతి పద ,టీకా తాత్పర్యాలు రాసి 15 సంపుటాలుగా ముద్రించారు మామగారు మరణించిన తర్వాత వావిళ్ళ వారి ప్రెస్ బాధ్యతలను చేబట్టి పుస్తక ప్రచురణను కొన సాగించారు ..డెబ్భై అయిదేళ్ళు జీవించి 1925 లో మరణించారు .

 

134-కులపతి –కప్ప గంతుల సుబ్రహ్మణ్య శాస్త్ర్తి

బాల్యం –విద్యాభ్యాసం

1911లో పశ్చిమ గోదావరిజిల్లా నిడమర్రు మండలం ‘’చిన నిండ్ర కొలను ‘’గ్రామం (ఫత్తేపురం )లో పోతుకూచి వారి కన్నాపురం అగ్రహారం లో వేదం శాస్త్ర పారంగతులు కప్పగంతుల  కామావధానులు ,మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .తండ్రి వద్దే వేదాధ్యయనం చేశారు .పిసుపాటి రామ చంద్రయ్య గారి దగ్గర ఆంద్ర ,ఆంగ్ల హిందీలను నేర్చుకొన్నారు .గుంటూరులో ప్రతాప కృష్ణ మూర్తి శాస్త్రి గారి దగ్గర సాహిత్యం చదివారు .కంభం పాటి రామ మూర్తి ,అభినవ విద్యా రణ్య ,పద్మ విభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి ,బాలవ్యాస వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారల  నుండి ‘’భాష్యంత వ్యాకరణం‘’ఆసాంతం నేర్చుకొన్నారు .బ్రహ్మశ్రీ మండలీకా వెంకట రామ శాస్త్రి గారి శిష్యులై వేదాంత ,న్యాయ శాస్త్రాలను ,సంపూర్ణం గా గ్రహించారు .చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారి వద్ద ‘’కావ్యజ్న శిక్షా భ్యాసం ‘’చేశారు .

ప్రతిభా సుబ్రహ్మణ్యీయం

సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మహా వక్త .వారి వాగ్ధాటి అమోఘం .కాళిదాస శ్రీ  హర్షాది  కవుల సౌందర్య ప్రతిభపై ఎన్నో ప్రసంగాలు చేశారు వ్యాకరణ శాస్త్ర గాంభీర్యాన్ని గూర్చి ,సంస్కృత సాహిత్య లోతులపైనా ,వేదం శాస్త్ర విషయాల గురించి ,వేదాంత శాస్త్ర రహస్యాలపైనా పలు ప్రసంగాలు చేసి శ్రోతలను ఆకట్టుకొనే వారు .పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరు లో స్తిరపడ్డారు

సంస్కృత విద్యాలయ ప్రారంభం

ఏలూరు లో  గుండు కృష్ణ మూర్తి ,సోమంచి లింగయ్య ,సభాపతి వంటి వారి సహాయ సహకారాలతో పవరుపేట లో ‘’హేలాపురి సంస్కృత పాఠశాల ‘’ను 4-3-1943 నస్థాపించి ప్రాచీన సంప్రదాయ విధానం లో విద్యార్ధులకు సాహిత్య ,వ్యాకరణ ,వేదాంత శాస్త్రాలు బోధించేవారు .విద్యార్ధులకు ఉచిత భోజన వసతి ,ప్రతిభా వంతులైన వారికి ఉపకార వేతనాలు కల్పించి ప్రోత్సహించారు .శాస్త్రి గారు ఈ విద్యాలయానికి ‘’కుల పతి ‘’గా వ్యవహరించేవారు .విద్యా ప్రవీణ భాషా ప్రవీణ  హిందీ  బి ఏ .పరీక్షలకు విద్యార్ధులకు శిక్షణ నిచ్చేవారు ఉపాధి అవకాశాలున్న విద్యలనూ నేర్పించేవారు .                     శిష్య మహానుభావులు

పెదముత్తేవి  ముముక్షు పీఠాదిపతులు .శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రులు ,ప్రసిద్ధ సంస్కృత కవి పండితులు ఏలూరు పాటి అనంతరామయ్య ,మానాప్రగడ శేష సాయి ,సూరి భోగేశ్వర శాస్త్రి ,కప్పగంతుల వీర భద్ర శాస్త్రి ,శ్రీమాన్ రొంపి చర్ల శ్రీనివాసా చార్యులు ,మొదలైన ఉద్దండ శాస్త్ర పండితులందరూ ఈ పాఠశాలలో చదివి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శిష్యరికం చేసిన వారే .ఆ నాటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ పి.ఎల్.శివరాం ,ఈవిద్యాలయం లోనే చదివి ,శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యాయం చేశారు .ఈ సంస్కృత విద్యాలయాన్ని రాష్ట్రం లోనే ప్రామాణిక మైన విద్యా సంస్థగా శాస్త్రి గారు తీర్చి దిద్దారు .

ఉపన్యాస లహరి –వితరణ

శాస్త్రి గారు భారత భాగవత రామాయణ పురాణాలపై  ,వేదాంత భాష్య విచారణ పై ఎన్నో ప్రవచనాలు ,ప్రసంగాలు చేసి వచ్చే ఆదాయాన్ని విద్యాలయ విద్యార్ధుల పోషణకు ,విద్యాలయాభి వృద్ధికి విని యోగించిన ధర్మ పరాయణులు .వీరి సంస్కృత భాషా సేవకు పాండిత్యానికి కంచి కామ కోటి పీఠాది పతులు . గౌరవించి సత్కరించి ప్రశంసించారు .నిరంతర గీర్వాణ విద్యా సేవలో జన్మ చరితార్ధం చేసుకొన్నా కప్పు గంతుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 14-10-1974 న అరవై మూడవ ఏట సుబ్రహ్మణ్య సన్నిధి చేరారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-14-ఉయ్యూరు

 

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బొట్టు మీద మంచి పట్టుగా

బొట్టు మీద మంచి పట్టుగా

రసపట్టుగా కవితలల్లి కట్టు బాటు
చెప్పి ,మంచి విప్పి గుట్టు మట్టు
లన్ని ఎరుక పరచి దారి చూపి నట్టి
సంస్కారులకు  పట్టు చుంటినేను  ప్రణతి
    గబ్బిట  దుర్గా ప్రసాద్ – 14-12-14 ఉయ్యూరు
Posted in రచనలు | Tagged | Leave a comment

అత్యధునాతన కవిత్వం – అనుభవవాదం – ఓ ఇంట్రో

అత్యధునాతన కవిత్వం – అనుభవవాదం – ఓ ఇంట్రో

  • కాసుల ప్రతాపరెడ్డి, 9848956375
  • 07/12/2014
TAGS:

అధునాతన సమాచార సాంకేతిక విజ్ఞానం సాహిత్యానికి మనుషులను ముఖ్యంగా యువకులను దూరం చేస్తుందనే అభిప్రాయం ఇంకా బలంగానే ఉంది. ఇంటర్నెట్ వంటి ఆధునిక సమాచార వినిమయ సాధనాలవల్ల యువత సాహిత్యంవైపు చూడడం లేదని కూడా భావిస్తూ వస్తున్నాం. స్పందనలు నశించి సెన్సిటివిటీ కోల్పోతున్నారనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. సెన్సిటివిటీ కోల్పోయినప్పుడు మనిషిలో స్పందనలు కరువవుతాయని అంటారు. అదేవిధంగా మనిషి ఒంటరి గుహలోకి పారిపోతున్నాడని, సామాజిక సంబంధాల ప్రాధాన్యత తగ్గిందని అనుకుంటూ వస్తున్నాం. కానీ అదంతా అపప్రథ మాత్రమేనని ఇటీవల వచ్చిన కవితా సంకలనాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి ఒంటరివాడవుతున్న మాట నిజమే గానీ ఆ ఒంటరితనాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు వర్తమాన కవులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకుంటూనే వినూత్న రీతిలో కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. అనుభవ వాదానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ అనుభవవాదం తెలుగు కవిత్వానికి కొత్తదేమీ కాదు. ఆధునిక కవిత్వానికి వచ్చినపుడు దాన్ని బైరాగితో మొదలుపెట్టవచ్చు కాబోలు. ఈ అనుభవవాదం రెండు రకాలుగా భిన్నమైంది. ఒకటి- ఇది ఇస్మాయిల్, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ వంటి అనుభూతివాద కవులు మీదుగా నడిచి వచ్చింది కాదు. బాహ్యమైన దృశ్యాలను చూసి స్పందించి ఊహలను, ఆలోచనలను మాత్రమే ఆవిష్కరించే కవిత్వం కాదు. రెండోది- ఇది భౌతికమైన లేదా బాహ్యమైన అనుభవవాదం కన్నా ఆత్మగత అనుభవవాదానికి ప్రాధాన్యం ఇచ్చింది. అంటే ఆత్మికమైన అనుభవవాదం. తన ఆత్మగత అనుభవం నుంచి, అంటే అమూర్తమైన అనుభవం నుంచి వచ్చే అనుభవవాద కవిత్వం. ఈ రకంగా ఈ కవిత్వం వస్తువులోనే కాకుండా వ్యక్తీకరణ తీరులోకూడా సమూలమైన మార్పును తెలుగుకు అందించింది.
అఫ్సర్, సీతారాం, ప్రసేన్ వెలువరించిన రక్తస్పర్శ కవితా సంకలనంతో స్పష్టంగా ఇది తెలుగు కవిత్వంలో వ్యక్తీకరణ రూపం తీసుకుందని భావించవచ్చు. ఇది సామాజిక ప్రయోజనం కోసం సాహిత్యం అనే నినాదాన్ని తోసిపుచ్చే అనుభూతివాద కవులకు సంబంధించింది కాదు. ఏదైనా సరే, తన వైయక్తిక అనుభవం నుంచి వ్యక్తీకరించడమే దీని ప్రధాన లక్షణం. పులిపాటి గురుస్వామి, శ్రీకాంత్, ఎం.ఎస్.నాయుడు ఈ ఒరవడిని ముందుకు తీసుకుని వచ్చారు. యాకూబ్ తన పూర్వ కవిత్వానికి భిన్నంగా నదీ మూలం లాంటి ఇల్లు కవితా సంకలనం ద్వారా తనను తాను బ్రేక్ చేసి ఆ వైపు దూసుకొచ్చాడు. కొత్త కవుల ద్వారా మమేకం కావడంవల్ల అతని వస్తువులోనే కాకుండా వ్యక్తీకరణలోనూ మార్పు వచ్చింది కావచ్చు. మోహన్ రుషి, నందకిశోర్, బాలసుధాకరవౌళి, కాశిరాజు వంటి కవులు వస్తువులోనూ అభివ్యక్తిలోనూ కొత్తదనానికి పీఠం వేశారు, వేస్తున్నారు.
మోహన్ రుషి జీరో డిగ్రీ, బాలసుధాకర్ వౌళి ఎగరాల్సిన సమయం, నందకిశోర్ నీలాగే ఒకడుండేవాడు, కాశిరాజు భూమధ్యరేఖ వంటి ఇటీవల వచ్చిన కవితా సంకలనాలు తెలుగు కవిత్వానికి కొత్త పరీమళాన్ని అద్దాయి. వీరు తమ మూలాలనుంచి ఆధునికతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచీకరణ కారణంగా వచ్చిన భౌతికమైన మార్పులనే కాకుండా ఆత్మికమైన మార్పులు, అంటే మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులను తమ మూలాల నుంచి పలుకుతున్నారు. జీవితానికి కొత్త అర్థాలు కూడా ఇస్తున్నారు. వీరు సామాజిక ప్రయోజనం కోసం సాహిత్య సృజన జరగాలనే నినాదానికి వ్యతికమేమీ కాదు. కులాలను, మతాలను, ప్రాంతాలను, జెండర్‌ను సానుకూల దృష్టితోనే, ప్రజాదృక్కోణం నుంచే చూస్తున్నారు. కానీ, దాన్ని వైయక్తికం చేసుకుని, ఆత్మగతం చేసుకుని తన వ్యక్తిగత అంతర్లోకాల నుంచి పలుకుతున్నారు. బాహిర్‌లోకానికన్నా అంతర్లోకాన్ని ప్రధానం చేసి మాట్లాడుతున్నారు.
చచ్చేలోపు చాలాసార్లు నిశ్శబ్దపు చావులకు గురవుతుండడమే జీవితం అని మోహన్ రుషి రాసిన వాక్యాన్ని ఎన్ని రకాలుగానైనా విశే్లషించుకోవచ్చు. ఆధునిక జీవితంలోని అన్నిరకాల పెడధోరణులకు, అంటే యాంత్రిక జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. ఆధునికతలోని సంక్లిష్టతను వ్యక్తం చేయడానికి వాక్యం కింద వాక్యాన్ని రాయాలనే నిబంధనను ఈ కవులు ఉల్లంఘించారు. మోహన్ రుషి కవిత చూస్తే ఇది వైయక్తిత అనుభవాలను బాహిర్లోకాలుగా, ఉమ్మడి అనుభవాలుగా మారుస్తున్నారు.
ఇటువంటి కవులు ఇంకా చాలామందే వున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినవి కొద్దిమంది కవితా సంకలనాలు మాత్రమే. అవి వస్తే ప్రస్తుత కవిత్వం డిక్షన్ మాత్రమే కాకుండా వస్తువు కూడా ఎంత మారిందో అర్థమవుతుంది. ఏదో ఒక వాదానికి కట్టుబడి కవిత్వం కవిత్వ విశే్లషణలో ఇరికిపోతాడు. కానీ, ఈ కవులు అటువంటి కవిత్వ వర్గీకరణకు అందకుండా పోతున్నారు. కవులను కాకుండా కవిత్వాన్ని మాత్రమే విశే్లషించే పరిస్థితి వచ్చినపుడు ఈ కవులకు కూడా కవిత్వ విమర్శలో చోటు దొరుకుతుంది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధర్మ మార్గానికి దారిచూపే కొత్తమ్మ తల్లి

ధర్మ మార్గానికి దారిచూపే కొత్తమ్మ తల్లి

  • -జి.కృష్ణమూర్తి
  • 29/09/2014
TAGS:

అఖిలాండకోటి బ్రహ్మాండములకు అధిదేవతయైన భగవతి శ్రీ దుర్గాదేవియే సమస్త విశ్వానికి, ఉనికిని నిలబట్టేది. ఈ తల్లే లక్ష్మి, సరస్వతి, పార్వతి రూపాలుగా తన్ను తాను సృజియంచు కొంటుంది. వైకుంఠ వాసునిచేత లక్ష్మిగా గౌరవింప బడినా, కైలాస వాసునికి అర్థనారీశ్వరి అయనా చతుర్ముఖునికి ఇల్లాలైనా ఆ తల్లి రూపాలే అవన్నీ. ఆ తల్లే నేడు శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళిలో శ్రీ కొత్తమ్మ తల్లిగా కొలువు దీరింది. కలియుగ ప్రభావం చేత మానవులల్లో దుష టచింతనలు కలుగుతున్నాయ. అటువంటి వాటిని పరిహరించి మానవులంతా ధర్మమార్గంలో నడిచేట్టు చేయటానికే ఈ తల్లి కాలాతీత, గుణాతీత శ్రీ ఆదిపరాశక్తి స్వరూపిణి శ్రీ కొత్తమ్మ తల్లిగా కొలువైంది. ఈ తల్లిని ఆరాధిస్తే, స్మరిస్తే, స్త్రోత్రం చేస్తే సర్వదుఃఖాల నుంచి, బాధల నుంచి రక్షణ పొంది, విముక్తులయ వారు ధర్మమూర్తులుగా మారుతారని భక్తుల పరిపూర్ణ విశ్వాసం.
స్థల పురాణం: 1925 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళికి చెందిన కమ్మకట్టు చినఅప్పలనాయుడు కోటబొమ్మాళి మండలం నారాయణవలసలో వారపు సంతకు ఎడ్లబండిపై వెళ్ళివస్తూ ఉండేవాడు. ఓ రోజు సంత నుంచి వస్తుండగా మార్గమధ్యలో ఓ ముతైదువ బండి ఆపి, ‘నాయనా ముసలిదాన్ని నాకు నీవు వెళ్ళే దారిలో నన్ను దించేయమని’అడిగింది. అందుకు చిన అప్పలనాయుడు సరేనని బండి ఎక్కించుకున్నాడు. వేకువజామున కోటబొమ్మాళి గ్రామంలోకి వెళ్ళిన తోవ, శ్రీ పట్నాయికుని వెంకటేశ్వరరావు గారి తోట వద్దకు బండి రాగానే ఆమె బండిని ఆపమని దేవతామూర్తి స్వరూపంగా దిగి తోటలోనికి వెళ్ళిపోయింది. అదిచూచి ఆశ్చర్యపోయి నోటమాటరాక నిల్చున్న వాడల్లా ఇంటికి వెళ్లిపో యాడు. ఆ తర్వాత చిన అప్పలనాయుడికి ఆ రాత్రి కలలో ఆమె కనిపించి, నేను కొత్తమ్మ తల్లిని, నీవు బండి ఆపిన తోటవద్ద నేను వెలిశాను. ప్రతి భాద్రపద మాసంలో వచ్చే పోలాల ఆమావాస్య తర్వాత వచ్చిన మంగళ, బుధవరాల్లో నీ ఇంటి వద్ద అర్చించి, గురువారం నాయుడు అమ్మవారి జంగిడిను నీ భార్య తలపై పెట్టి పసుపు కలశాలతోను, ఘటాలతోను, నృత్య వాయిద్యాలతో నా నివాసానికి వచ్చి నన్ను కొలిస్తే నీ కోర్కెలను తీరుస్తానని చెప్పింది. ఈ సంగతి ఊరివారందరికి చెప్పి అప్పలనాయుడు అమ్మ కొలువుకు బయలుదేరగా ఊరి వారంతా అమ్మ అనుగ్రహాన్ని పొందటానికి అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఈ ఉత్సవాలను అత్యంత వైభంగా జరుపుతున్నారు. కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా రాష్ట్రేతర ప్రాంతాల నుంచికూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కానుకల, విరాళాలు ఇచ్చి అమ్మవారి మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ మూడు రోజులు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ మండలంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మసీదులో వేదమంత్రం — అసలు మహాత్ముడు

మసీదులో వేదమంత్రం — అసలు మహాత్ముడు

  • 30/11/2014
  • |

  • – ఎం.వి.ఆర్.శాస్త్రి

మసీదులో వేదమంత్రం!!
కల కాదు నిజం. ఊహ కాదు – వాస్తవం.
అయితే కావొచ్చు. అది మారుమూల, ఊరవతల – మనుషులెవరూ లేని ఏ పాడుబడ్డ మసీదులోనో అయి వుంటుంది – అనుకుంటున్నారా?
కాదు. అది జరిగింది దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో. అందునా – సుప్రసిద్ధమైన జుమ్మా మసీదులో. అది కూడా శుక్రవారం ప్రార్థన సమయాన వేల మంది మహమ్మదీయుల సమక్షంలో!

ఓహో! అయితే – నమాజు వేళ ఏ హిందూ మతోన్మాదో చొరబడి, ముస్లింలను రెచ్చగొట్టటానికి మంత్రాలు వినిపించాడేమో…!?
వినిపించినవాడు హిందువే. పైగా కాషాయం కట్టిన స్వామి. కాని దొంగతనంగా చొరబడలేదు. ముసల్మాన్లను రెచ్చగొట్టటానికి ఆ పని చేయలేదు. ముస్లిం నాయకులే, మహమ్మదీయ మతం పెద్దలే పట్టుబట్టి ఆయనను అక్కడికి ప్రత్యేకంగా పిలిపించారు. సందేశం ఇమ్మని సాదరంగా కోరారు. ఆయన పలికింది శ్రద్ధగా విన్నారు. మెచ్చుకున్నారు.
ఇది జరిగింది 1919 సంవత్సరం ఏప్రిల్ 4న.
ఆ స్వామి పేరు శ్రద్ధానంద సరస్వతి.
ఇస్లాం తప్ప వేరొక మతాన్ని మహమ్మదీయులు గుర్తించరు. అందునా ఒక ప్రవక్తగాని, ఒక పవిత్ర గ్రంథంగాని లేకుండా విగ్రహాలను ఆరాధించే హిందువులతో మతపరంగా, తాత్వికంగా వారికి ప్రాథమికమైన విభేదాలు ఉన్నాయి. హిందువులతో కలిసిమెలిసి సామరస్యంగా సహజీవనం చేయాలని కోరే మహమ్మదీయులు కూడా హిందూ పెద్దలను తమ పవిత్ర ప్రార్థనా స్థలంలోకి ఆహ్వానించి (వారు ఎంతటి మహాత్ములైనా సరే), వారి చేత సందేశం ఇప్పించాలని కోరుకోరు. అలాంటిది – అత్యంత ప్రధానమైన మసీదులో వేలాది ముసల్మాన్లను ఉద్దేశించి ఒక హిందూ మతాచార్యుడు ప్రసంగించటం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని అపురూప ఘట్టం. ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే అది అపూర్వం.
‘హిందూ-ముస్లిం ఐక్యత స్వరాజ్యం కంటే గొప్పది; ఆ ఐక్యత లేనప్పుడు స్వాతంత్య్రం కూడా నాకు అక్కర్లేదు’ అని పదేపదే చాటి, ముస్లింల సుహృద్భావం కోసం ఎంత దూరమైనా వెళ్లి దేనికైనా తెగించిన మహాత్మాగాంధిని కూడా తమ మసీదులో అడుగుపెట్టమని మహమ్మదీయులు ఏనాడూ కోరలేదు. అంతటి మహాత్ముడికే చిక్కని ఆ అవకాశం శ్రద్ధానంద సన్యాసికి ఎలా దక్కింది? యథార్థంగా జరిగిందేమిటో నేరుగా స్వామి శ్రద్ధానంద మాటల్లోనే వివరంగా వినండి:

ఏప్రిల్ 4 ఢిల్లీ చరిత్రలో రెడ్ లెటర్ డే! విచ్చలవిడి కాల్పుల తరవాత వచ్చిన మొదటి శుక్రవారం అది. ది గ్రేట్ జుమ్మా మసీదులో మృతవీరులకు ఆత్మశాంతిని కోరుతూ సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి.
మామూలు ప్రకారం నేను నగరంలో తిరుగుతున్నాను. ‘హిందువులు కూడా మసీదుకు వచ్చి సంస్మరణ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ముసల్మాన్ సోదరులు పట్టుబడుతున్నారు. మనం ఏమి చెయ్యాలి’ అని చాలామంది పెద్ద మనుషులు నా దగ్గరికి వచ్చి అడిగారు. వాళ్లకు సందేహం ఎందుకు వచ్చిందంటే – మేనేజింగు కమిటీ అనుమతి లేకుండా మసీదులోకి ప్రవేశించే హక్కు ముస్లింలు కానివారికి ఉండదు. మరీ ముఖ్యంగా నమాజు సమయంలో. నేను వాళ్లను కాసేపు ఆగమని చెప్పి దగ్గర్లోనే ఉన్న అబ్దుల్ రహమాన్ వకీల్ ఆఫీసుకు వెళ్లాను. హకీం సాహెబ్‌ను సంప్రదించకుండా మసీదుకు వెళ్లవద్దని రహమాన్‌గారు సలహా ఇచ్చారు. హకీం సాహెబ్ ఇంట్లో లేరు. దాంతో నేను నా ఆశ్రమానికి తిరిగొచ్చాను. నమాజు ముగిసేదాకా వెళ్లకూడదనే నేను నిశ్చయించాను.
నేను ఏదో రాసుకుంటూండగా మధ్యాహ్నం 1 గంటకి దాదాపు యాభై మంది ముసల్మాన్లు నా నివాసం మెట్లెక్కి వచ్చి, ప్రేమపూర్వకంగా బలవంతపెట్టి బయటికి తీసుకెళ్లారు. టాంగాలోకి ఎక్కించారు. కొంతదూరం వెళ్లాక దానికంటే వేగంగా వెళ్లే వాహనంలోకి.. అలా వాహనాలు మారుస్తూ చివరికి మోటారుకారు ఖాళీగా దొరికితే అందులోకి ఎక్కించి హుటాహుటిన తీసుకువెళ్లారు. జుమ్మామసీదు చేరగానే తొందరబెట్టి, దక్షిణం వైపు మెట్ల దగ్గరికి పరిగెత్తించారు. ‘మహాత్మాగాంధీకీ జై’ ‘హిందూ – ముసల్మాన్‌కీ జై’ అన్న కేకల మధ్య నేను మెట్లెక్కాను.
లోపల గుమికూడినవారు 30 వేలకు తక్కువ ఉండరు. నేను చివరి వరసలో కూచోబోతూండగా ముసల్మాన్ సోదరులు పరిగెత్తుకుంటూ వచ్చి లోపలి భవనాల గుండా బయటికి వెళ్లి… మత బోధకుడి (పేష్ ఇమాం) ముందు ఆసా బల్ల (pulpit) అమర్చిన చోటికి తీసుకెళ్లారు. వౌల్వీ అబ్దుల్ మజీద్ జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. నన్ను గమనించి ఆగాడు. నేను సందేహించాను. పైకి వెళ్లమని వందల మంది అరిచారు. రెండు మెట్లు ఎక్కాక నేను మళ్లీ తటపటాయించాను. జన సమూహం ఒక్క ఉదటున లేచి ‘పైకి వెళ్లండి వెళ్లండి’ అని కేకలు పెట్టారు. నేను బల్ల దగ్గరికి చేరాక వారు కూర్చున్నారు.
వౌల్వీ అబ్దుల్ మజీద్ తన ప్రవచనాన్ని కొనసాగిస్తారని నేను అనుకున్నాను. కాని ఆయన ‘అమరవీరుల రక్తం గురించి పవిత్ర ఖురాన్ ఏమనేదీ మీరు ఇప్పటిదాకా విన్నారు. ఇదే విషయాన్ని మన హిందూ సోదరుల పవిత్ర గ్రంథమైన వేదం కూడా ఎలా ప్రబోధిస్తుందన్నది స్వామి శ్రద్ధానంద మీకు ఇప్పుడు చెబుతారు’ అని పలికి ప్రసంగం ముగించారు. హఠాత్తుగా నేను మాట్లాడవలసి వచ్చింది.
త్వంహి నః పితా వసో త్వం మాతా శతక్రతో బభూవిథః
అధాతే సమ్నమీమహే
నీవే తల్లివి; తండ్రివి; మా అందరికీ నీవే శరణు… అంటూ భగవంతుడిని ప్రస్తుతించే ఋగ్వేద మంత్రంతో నేను ప్రారంభించాను. మృతవీరుల నిష్కళంక బలిదానాన్ని ప్రస్తావించి, హిందూ – ముస్లిం సంఘీభావాన్ని ఉగ్గడించే ఈ కవితను వినిపించాను:
‘హిందూ నే సనమ్ మే జల్వా పాయా తేరా
ఆతిష్ పాయి ఫిగాన్ నే రాస్ గయా తేరా
దేహ్రీ నే కియా దెహ్ సే తబీర్ తుఝే
ఇన్‌కార్ కిసీ సే బన్‌నా ఆయా తేరా’
ఆ సమయాన అక్కడ ఉన్నవారు నాటి సన్నివేశాన్ని చక్కగా వర్ణించగలరు. చివరలో నేను మూడుసార్లు ‘ఓం శాంతి’, ‘ఆమీన్’ అని ఉచ్చరించగానే మొత్తం జనమంతా నాతో గొంతు కలిపారు. అది ఉత్తేజకరమైన దృశ్యం. నేను కిందికి దిగి నిష్క్రమిస్తుండగా ప్రజలు మెచ్చుకోలుగా చూశారు.
లోపల ఈ సుందర సన్నివేశం నడుస్తూండగా మసీదు వెలుపల మిలిటరీ, పోలీసులు సాయుధ శకటాలతో మోహరించి ఉన్నారు. నాయకులు ఉద్బోధించిన ప్రకారం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు.
[Inside Congress, Swami Shraddhananda, pp.68-70]

ఈ కాలంలో చాలామంథికి ఇది సహజంగానే నమ్మబుద్ధి కాదు. ఔనుమరి. హిందువులు, ముస్లింలు పరస్పర శత్రువులనీ… ఏ మాత్రం సందు దొరికినా హిందూ మతోన్మాదులు అమాయక ముస్లింలను ఊచకోత కోస్తారనీ… వారి బారి నుంచి మైనారిటీలను రక్షించటానికే సెక్యులర్ నేతాశ్రీలు స్పెషల్ డ్యూటీ మీద భూమిపై అవతరించారనీ… అమాంబాపతు రాజకీయ నాయకులు అనేక దశాబ్దాలుగా నూరిపోశారాయె! హిందువులు, ముసల్మాన్లు ఒకచోట గుంపుగా తారసపడ్డారంటే తలలు పగిలాయనే, గొంతులు కోసుకుంటారనే మనకు లెక్క! అలాంటి ఘోరాలేవీ జరగకుండా రెండు వైరి వర్గాలనూ అదుపులో ఉంచి, శాంతి భద్రతలు కాపాడటానికే పోలీసులు, పారా మిలిటరీ బలగాలు కళ్లలో వొత్తులు వేసుకుని కాపలా కాస్తుంటారని అనుకుంటాం.
అలాంటిది దేశంలోకెల్లా పేరుమోసిన జామా మసీదులో హిందువులు, ముస్లింలు కలిసి ప్రార్థనలు చేయడమేమిటి? కాషాయం కట్టిన హిందూ సన్యాసి వారికి హితబోధ కావించడమేమిటి? మసీదు లోపల హిందూ – ముస్లిం జనాలుంటే వెలుపల పోలీసు, మిలిటరీ సాయుధ శకటాలు బారులు తీరడమేమిటి? తుపాకులు, శతఘ్నలు నోళ్లు తెరిచి చూస్తూంటే ఇరు మతాల ప్రజలు ప్రశాంతంగా నిష్క్రమించడమేమిటి? దీనికి మించిన అద్భుతం ఇంకేముంటుంది?
కాని చరిత్ర పుస్తకాల్లో కాని… మత సామరస్యం కోసమే, హిందూ ముస్లిం సఖ్యత కోసమే ఊపిరి పీలుస్తున్నామని చెప్పే ‘సెక్యులర్’ నాయకమ్మన్యుల మాటల్లో కాని దీని ఊసే వినపడదేమి? ఎవరూ పట్టించుకోలేదంటే నిజానికి ఇది జరగలేదేమో!? అలా శంకించడానికీ వీలు లేదు. హిందూ పక్షపాతి అని ఎవరూ నింద వెయ్యలేని… జవహర్లాల్ నెహ్రుగారే తన ఆత్మకథలో ఈ అపూర్వ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు ఇలా:

Swami Shraddhanand, an Arya Samajist leader had stood in the pulpit of the great Jame Masjid of Delhi and preached to a mighty gathering of Muslims and Hindus of unity and India’s freedom. And that great multitude had greeted him with loud cries of Hindu – Musalman – ki – jai, and outside in the streets they had jointly sealed that cry with their blood.
[An Autobiography, Jawaharlal Nehru, P160]

(ఆర్య సమాజ్ నాయకుఢు స్వామి శ్రథ్ధానంద ఢిల్లీలో ది గ్రేట్ జామే మసీదులో బోధకుడి వేదికపై నిలబడి ముస్లింలు, హిందువులు కూడిన మహా జనసమూహానికి ఐక్యత గురించి, భారత స్వరాజ్యం గురించి ప్రబోధించాడు. ‘హిందూ-ముసల్మాన్‌కీ జై’ అని జనబాహుళ్యం బిగ్గరగా కేకలు వేశారు. బయట, వీధుల్లోనూ హిందువులు, ముస్లింలు కలిసి ఆ నినాదాన్ని తమ రక్తంతో సీలు చేశారు.) *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరుగునపడ్డ మహనీయుడు — అసలు మహాత్ముడు – 2

మరుగునపడ్డ మహనీయుడు — అసలు మహాత్ముడు – 2

  • 07/12/2014
  • |

  • – ఎం.వి.ఆర్. శాస్త్రి

మన పుణ్యభూమిలో మహాత్ములకు కొదవలేదు. ఏ కాలంలో, ఏ రంగంలో చూసినా తమ ఉనికి చేతనే లోకానికి వెలుగు చూపిన మహనీయులు ఆట్టే కష్టపడకుండానే కనిపిస్తారు. అయినా ‘మహాత్ముడు’ అనగానే మనకు స్ఫురించేది మోహన్‌దాస్ కరంచంద్ గాంధీగారే.
గాంధీజీ జీవించి ఉన్న కాలంలో ఆయన మహాత్మ్యాన్ని దేశం యావత్తూ ఏనాడూ ఏకగ్రీవంగా అంగీకరించలేదు. ఆయనను సాక్షాత్తూ దేవుడిగా, లేక అవతార పురుషుడుగా కొలిచినవారు, ఆయన మాటను వేదవాక్కుగా తలిచిన వారు, ఆయన నిప్పుల్లో దూకమంటే దూకడానికి సిద్ధపడినవారు, ఆయనలో ఇసుమంత దోషాన్ని కలనైనా ఊహించలేనివారు ఎంతమంది ఉండేవారో-

గాంధీగారితో తీవ్రంగా విభేదించినవారు… ఆయన సిద్ధాంతాలు, విధానాలు దేశానికి అరిష్టమని నమ్మినవారు… ఆయనను కపటిగా, పక్షపాతిగా, చపలచిత్తుడిగా, అబద్ధాలకోరుగా, నీతిమాలిన వాడిగా ఏవగించుకున్నవారు కూడా అంతే మంది – ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే ఉండేవారు. జాతీయోద్యమంలో చిరస్మరణీయులైన మహా దేశభక్తులు చాలామంది ఏదో ఒక సమయంలో గాంధీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించినవారే. ఆఖరికి నెహ్రు, పటేల్ వంటి అనుంగు శిష్యులు కూడా గాంధీ నడవడిని, పోకడను ఏదో ఒక సమయంలో తప్పుపట్టినవారే.
కోట్ల మందికి ఆరాధ్యుడై, లక్షల మందిని స్వాతంత్య్ర సమరానికి కదిలించి, మొత్తం జాతీయోద్యమ గతిని మార్చిన మహానాయకుడిగా గాంధీగారి ప్రాముఖ్యాన్ని ఎవరూ తక్కువ చేయలేరు. నీతికి, నియమబద్ధతకు, సత్యసంధతకు మారుపేరైన సత్యాగ్రహ ప్రవక్తగా ప్రపంచం మీద ఆయన వేసిన చెరగని ముద్రను సగౌరవంగా స్మరించవలసిందే. ఎంతైనా మనిషే కనక మానవ సహజమైన బలహీనతలు గాంధీజీలోనూ ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన వల్ల పెద్ద తప్పులు జరిగాయి. వాటికి దేశం భయానకమైన మూల్యం చెల్లించింది.
గాంధీగారి జీవిత కాలంలోనే ఆయన లోపాలను, వైరుధ్యాలను ఎంతోమంది ఆయన మొగం మీదే తూర్పారబట్టినప్పుడు… కాలం గడిచి, ఆయా ఘటనలూ వివాదాలూ వేడి తగ్గి చరిత్ర పుటలకెక్కి, తరాలు మారాక – జాతి జీవితంలో, జాతీయోద్యమంలో గాంధీజీ పాత్ర, దాని మంచి చెడ్డల గురించి ఇంకా లోతైన మూల్యాంకనం జరిగి ఉండాల్సింది. చిత్రమేమిటంటే – కాలం గడిచేకొద్దీ మన అవగాహన మరింత తేటపడవలసింది పోయి అంతకంతకూ మసకబారిపోయింది. జాతీయోద్యమంలో గాంధీ, నెహ్రులను మాత్రమే విరాట్ పురుషులుగా చిత్రిస్తూ, వారిలోని చీకటి కోణాలను కప్పేస్తూ… వారికి గిట్టని వారి, వారితో విభేదించిన వారి ప్రాధాన్యాన్ని పథకం ప్రకారం హరిస్తూ… పథకం ప్రకారం చరిత్రకు వెల్లవేత జరిగింది. దాంతో ఎందరో మహా వ్యక్తులు, వారు సాగించిన ఎన్నో గొప్ప పోరాటాలు, వారు దేశానికి చేసిన అమోఘమైన సేవలు జాతి స్మృతిపథం నుంచి క్రమంగా చెదిరిపోయాయి.
అలా మరుగున పడ్డ మహాపురుషుల్లో మొదటి వరసలో ఎన్నదగిన వాడు స్వామి శ్రద్ధానంద. ఆయన అసలైన మహాత్ముడు. ఆ మాటంటే బహుశా మహాత్మాగాంధీకి కూడా అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఆయనను మహాత్ముడిగా మొట్టమొదట గుర్తించిన వాడు మోహన్‌గాంధీగారే. దక్షిణాఫ్రికా నుంచి ఆయన రాసిన జాబే ఇందుకు రుజువు:

Phoenix, Natal
21 Oct, 1914
Dear Mahatmaji
Mr.Andrews has familiarised your name and your work to me. I feel that I am writing to no stranger. I hope, therefore, that you will pardon me addressing you by the title which both Mr.Andrews and I have used in discussing you and your work. Mr.Andrews told also how you, Gurudeva and Mr.Rudra had influenced him. He described to me the work your pupils did for the passive resisters and gave such word pictures of the life at Gurukula that as I am writing this I seem to be transported to the Gurukula. Indeed he has made me impatient to visit the three places described by Mr.Andrews and to pay my respects to the three good sons of India who are at the head of these institutions.
I remain,
Yours,
Mohandas K. Gandhi
[Inside Congress, Swami Shraddhanand, p.48]

ఫీనిక్స్, నేటాల్
21 అక్టోబర్, 1914
ప్రియమైన మహాత్మా
మీ పేరు, మీరు చేస్తున్న పని మిస్టర్ (సి.ఎఫ్) ఆండ్రూస్ నాకు పరిచయం చేశాడు. నాకు తెలియని కొత్త మనిషికి ఉత్తరం రాస్తున్నానని నాకు అనిపించటం లేథు. మీ గురించి, మీరు చేస్తున్న పని గురించి మాట్లాడుకునేటప్పుడు నేను, ఆండ్రూస్ ఉపయోగించే బిరుదుతోనే మిమ్మల్ని సంబోధించాను. ఇందుకు మన్నిస్తారని ఆశిస్తున్నాను. మీరు, గురుదేవ (రవీంద్రనాథ్ టాగోర్), మిస్టర్ రుద్ర (్ఢల్లీలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజి ప్రిన్సిపాల్) తనను ఎలా ప్రభావితం చేసిందీ ఆండ్రూస్ చెప్పాడు. సత్యాగ్రహుల కోసం మీరు, మీ విద్యార్థులు ఏమి చేశారో అతడు నాకు వివరించాడు. గురుకులంలో జీవితాన్నీ కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఆండ్రూస్ వర్ణించిన ఆ మూడు చోట్లకు వెళ్లి, ఆ సంస్థలను నడిపిస్తున్న భారతమాత గొప్ప పుత్రులు ముగ్గురినీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని నేను తహతహలాడుతున్నాను.
ఇట్లు
మీ మోహన్‌దాస్ కె.గాంధి

దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహాన్ని గాంధీజీ 1914లో మళ్లీ మొదలెట్టాడు. అక్కడి సత్యాగ్రహులకు సహాయంగా లక్షల రూపాయల విరాళాలు పంపించాలని గోపాలకృష్ణ గోఖలే భారతీయులకు విజ్ఞప్తి చేశాడు. దానికి ఆశించినంత స్పందన రాలేదు. ఆ సమయాన స్వామి శ్రద్ధానంద (అప్పట్లో ఆయన పేరు లాలా మున్షీరాం. ఇంకా సన్యాసాశ్రమం స్వీకరించలేదు) గాంధీ మొగం ఎరగకపోయినా, ఆయన సాగిస్తున్న దక్షిణాఫ్రికా ధర్మ యుద్ధానికి మద్దతుగా నిధుల సేకరణకు నడుము కట్టాడు. హరిద్వార్‌లో ఆయన గురుకులంలోని బ్రహ్మచారులు నెల రోజుల పాటు పాలు, నెయ్యి మానేసి, సెలవు రోజుల్లో కూలీ పని చేసి 1500 రూపాయలు పోగు చేశారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఉత్తరంలో గాంధీజీ ప్రస్తావించింది ఈ సహాయానే్న.
‘విశ్వకవి టాగోర్, శ్రద్ధానంద, ప్రిన్సిపాల్ సుశీల్‌రుద్ర – ఈ ముగ్గురు ఆండ్రూస్ దృష్టిలో త్రిమూర్తులు. దక్షిణాఫ్రికాలో ఉండగా అతడు ఎప్పుడూ వాళ్ల గురించి చెబుతూండేవాడు’ అని గాంధీజీ తన ఆత్మకథ “The First Experience” అధ్యాయం)లో రాశాడు.
1914లో సత్యాగ్రహం ముగించాక ఫీనిక్స్ ఆశ్రమం సహచరులు, గాంధీ స్వదేశానికి మరలారు. లండన్‌లో ఆగి తనను కలసి వెళ్లవలసిందని గోఖలేగారు గాంధీకి చెప్పాడు. ఆయన కోసం ఎదురుచూస్తూ, ఇతర రాచకార్యాలు చక్కబెడుతూ గాంధీ లండన్‌లో ఉండగా, ఫీనిక్స్ బృందం ఇండియా వచ్చేసింది. వారిని ఎక్కడ ఉంచాలన్న సమస్య ఎదురైంది. అప్పుడు ఆండ్రూస్ సలహాపై వారికి హరిద్వార్‌లోని కాంగ్‌డీ గురుకులంలో బస ఏర్పాటు చేశారు. ‘స్వామి శ్రద్ధానందజీ వారిని సొంత పిల్లల్లా చూసుకున్నాడు’ అని గాంధీజీ ‘ఆత్మకథ’లో మెచ్చుకున్నాడు.
ఇండియాకు తిరిగొచ్చాక సంవత్సరంపాటు దేశమంతా తిరిగి రమ్మన్న గోఖలే మాట మీద చేసిన దేశాటనలో గాంధీగారు హరిద్వార్ వెళ్లి తాను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న మహాత్ముడిని కలిశాడు. అది 1915లో కుంభమేళా కాలం.
‘గురుకుల్ చేరి మహాత్మా మున్షీరాంజీని కలవటం గొప్ప అనుభూతి. ఆయనది భారీ విగ్రహం. బయటి రణగొణ ధ్వనికీ, గురుకులంలోని ప్రశాంతికీ అద్భుతమైన తేడా కనిపించింది. మహాత్ముడు నన్ను తన ప్రేమతో ముంచెత్తాడు. బ్రహ్మచారులు నన్ను చక్కగా చూసుకున్నారు’ అని ‘ఆత్మకథ’లో గాంధీజీ గుర్తు చేసుకున్నాడు.
తనకు సమయానికి సహాయం చేసిన మహాత్ముడిని కలిసి, ఆయన ప్రేమకు, అక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడయ్యాక ఆయనతో గాంధీగారి అనుబంధం మరింత గట్టిపడి ఉండాలి. గట్టిపడింది కూడా. మున్షీరాంజీకీ గాంధి మహా నచ్చాడు. ఆయన ప్రభావంవల్లే గురుకులాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనను సంప్రదించే, ఆయన సలహా మేరకే సత్యాగ్రహ సమరంలో తొలి అడుగులు వేశాడు.
కాని ఈ అన్యోన్య మైత్రి ఎక్కువ కాలం నిలవలేదు. లోతుకు వెళ్లే కొద్దీ, చేదు అనుభవాలు అయ్యే కొద్దీ, గాంధీ తత్వం స్వామీజీకి బోధపడింది. క్రమేణా దూరం పెరిగింది. శ్రద్ధానందకు లౌక్యం తెలియదు. తాను నమ్మింది కుండబద్దలు కొట్టినట్టు ఎదుటి వారి మొగం మీదే చెప్పడం ఆయనకు అలవాటు.
ఆ సంగతి మొదటి ఉత్తరంతోనే గాంధీగారికి అర్థమైంది. దక్షిణాఫ్రికా నుంచి ఆయన ఇంగ్లీషులో జాబు రాస్తే ‘మహాత్మా మున్షీరాం’ హిందీలో జవాబు రాశాడు. పైగా ‘హిందీని ‘జాతీయ భాష’ చేయాలని కోరుకునేవాడికి తన దేశవాసులతో విదేశీ భాషలో ఉత్తరాలు రాసే హక్కు లేదు’ అని నిష్కర్షగా చెప్పాడు కూడా. గాంధీగారు మళ్లీ ఎన్నడూ ఆయనకి ఇంగ్లీషులో రాయలేదు. ఇద్దరి మధ్య ఉత్తరాలన్నీ హిందీలోనే నడిచాయి.
కొసమెరపు: పైన ఉటంకించిన తొలిజాబు కోసం గాంధిగారి ‘కలెక్టెడ్ వర్క్స్’లో వెతక్కండి. అది మీకు అక్కడ కనపడదు. వేరొకరిని ‘మహాత్మా’ అని సంబోధించడం మహాత్ముడి కాంతి వలయానికి శోభనివ్వదని అనుకున్నారో?! అలా సంబోధించబడ్డ వాడు ఉత్తరోత్తరా తమ మహాత్ముడికి ఎదురు తిరిగినవాడు కావటం ఇబ్బందిగా తోచిందో?! గాంధీగారి ఉత్తరాలను, అన్ని రకాల రాతలను సంపుటీకరించిన మహాత్ములు మొత్తానికి ఆ ఉత్తరాన్ని దాచేశారు.
పైన చెప్పుకున్న చరిత్ర వెల్లవేతకు ఇదో చిన్న ఉదాహరణ!
*

స్వార్థం లేని విరాగి
లాలా మున్షీరాం మొదటి నుంచీ దమ్మున్న కార్యకర్త. ఆయన చేసే పనే ఆయనకు నాయక స్థానాన్ని ఎల్లప్పుడూ తెచ్చిపెడుతూ వచ్చింది. ప్రజలను ఆకర్షించే లక్షణం ఆయనలో ఉంది. ఆయన మొహమాటం లేకుండా మాట్లాడుతాడు. తాను నమ్మినదాన్ని పట్టుదలతో ఆచరిస్తాడు. 1892-93లోనూ, ఆ తరవాతా జరిగిన కొన్ని సంఘటనలనుబట్టి మున్షీరాంజీ ప్రాచుర్యం కోసం, నాయకత్వం కోసం పాకులాడుతాడని నేను భావించాను. ఆ అభిప్రాయం తప్పని నెమ్మది మీద గ్రహించాను. ప్రతి గొప్ప వ్యక్తికీ ఉన్నట్టే మున్షీరాంజీలోనూ కొన్ని లోపాలు ఉండవచ్చు. ఆయన త్వరగా ఉద్వేగానికి లోనవుతాడు. కాని అది తాను మనస్ఫూర్తిగా అంకితమైన ఆశయాల విషయంలోనే. ఆయన సేవానిరతి గొప్పది. తన విశ్వాసాల కోసం ఎంతటి కష్టనష్టాలకైనా వెనుదీయడు. ఆయన లేశమైనా స్వార్థం లేని విరాగి.
-లాలా లజపతిరాయ్ (‘ఆత్మకథ’లో)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment