శ్రీ నార్ల వెంకటేశ్వర రావు 30వ వర్ధంతి మార్చి 13, 2015

శ్రీ నార్ల వెంకటేశ్వర రావు 30వ వర్ధంతి మార్చి 13, 2015



Narla Venkateswara Rao

 

Narla Venkateshwara Pramastenakshmi Preval Argurananda Veramesh Kashturambigrana Mitall Rao

or V. R. Narla (1 December 1908 – 13 March 1985) is a Telugu language writer, journalist and politician from

Andhra Pradesh in India. He was Rajya Sabha member twice from 3 April 1958 to 2 April 1970, and wrote a

satakam in Telugu along with several other books.

Narla Venkateswara Rao started as a journalist and ascended the pinnacle of fame as a humanist. It was

great evolution worthy of emulation by future generations.

http://en.wikipedia.org/wiki/Narla_Venkateswara_Rao







 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -89 భారతం పై తుది తీర్పు

నా దారి తీరు -89

భారతం పై తుది తీర్పు

జగ్గయ్య పేట గెంటేల శకుంతలమ్మ డిగ్రీ కాలేజి లో ఒక రోజు సాయంత్రం ఆరు గంటలు ‘’భారతం పై తుది తీర్పు ‘’అనే కార్యక్రమం జరుగుతుందని ఈ నాడు పేపర్లో చదివి ఆ రాత్రికి ట్యూషన్ లేదని చెప్పి జగ్గయ్య పేట వెళ్లాను .కాలేజి చిల్లకల్లు నుంచి జగ్గయ్య పేట కోచ్చే అయిదు కిలోమీటర్ల దారిమధ్య లో ఉంటుంది .ఉయ్యూరునుంచి వచ్చినప్పుడల్లా ఆకాలేజి మీదనుంచే బస్ లో కాలేజీని చూసేవాడిని .ఇప్పుడు మొదటిసారిగా కాలేజిలో అడుగుపెడుతున్నాను  గెంటేల వారు బ్రాహ్మణులు .శకు౦తలమ్మ గారి పేర భర్తా మిగిలిన కుటుంబ సభ్యులు దాతలు కలిపి  కట్టిన  కాలేజి.  మంచి పేరే ఉంది .   ఈ కార్యక్రమం ముగ్గురు మాత్రమె ముఖ్య పాత్రలుగా నిర్వహిస్తూ రాష్ట్రం అంతా తిరిగి ప్రదర్శిస్తున్నారు .అందులో జడ్జి పాత్రను ప్రముఖ ఐఎస్ ఆఫీసర్ ,సాహితీ వేత్త డా.శ్రీ కనుపుల వెంకట శివయ్య గారు ,పాండవుల తరఫున న్యాయ వాది.గా డా. శ్రీ ప్రసాద  రాయ కులపతి ,కౌరవ ప్లీడర్ గా డా. శ్రీ మొవ్వ వృషాద్రి పతి ధరించారు .ముందుగా న్యాయాధిపతి కేసు పూర్వాపరాలను వివరించి  కక్షిదారుల ప్లీడర్ లను వాదించ మంటాడు .అంటే దీని ఉద్దేశ్యం ధర్మం న్యాయం పాండవుల పక్షాన ఉందా ?కౌరవుల పక్షాన ఉందా ?అన్నదానిపై ఆర్గ్యు మెంట్లు .చివరికి జడ్జి గారి తీర్పు .రసవత్తరం గా దాదాపు గంటన్నర సేపు కులపతిగారు, వృషాద్రిపతి గారు తమ వాగ్దోరణితో రసవత్తరమైన భారత పద్యాలతో వ్యాస శ్లోకాలతో ఎవరి వాదన వారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాదించారు .అది వింటూ ఉంటె న్యాయం ఎవరి పక్షాన ఉందొ తెలియనంత కన్ఫ్యూజన్ కు లోను చేశారు .శివయ్య గారు ధర్మ న్యాయ పక్షపాతం గా పాండవుల వైపే తీర్పు చెప్పటం తో క్లైమాక్స్ బాగా పండింది .ముగ్గురూ ఆంద్ర దేశం లో దిగ్గజాలైన పండితులు ,కవులు విమర్స కులు కులపతిగారు అష్టావధాన శతావధాన   దురంధరులు .అవధానాలపై పుస్తకాలు రాసిన వారు . వృషాద్రిపతి గారు నాగార్జున యూని వర్సిటిలో తెలుగు లెక్చరర్ అని గుర్తు .   చివరికి నాకేమనిపించింది అంటే ‘’అసలు భారతం మీద తుది తీర్పు చెప్పే యోగ్యతా ,సామర్ధ్యం మనకు ఉందా?’’ అని .ఏమైనా ఒక కొత్త ప్రయోగం .ఈ ముగ్గురే మిగిలిన కవి పండితులను కలుపుకొని’’ భువన విజయం ‘’ చాలా చోట్ల ప్రదర్శించి నీరాజనాలు అందుకొన్నారు .’’తీర్పు ‘’ అంత క్లిక్ అయినట్లు లేదు .అవదుకూడా  .

నా సూచన –ముట్నూరి కృష్ణారావు గారి సాహితీ దర్బార్

అంతా అయిపోయిన తర్వాత  ఒక కాగితం మీద కులపతి గారికి ‘’అయ్యా !ఈ వాదాలు తీర్పుల వలన ధర్మ చ్యుతి తప్ప ధర్మ సంస్థాపన జరగదు .నెగటివ్ భావ వ్యాప్తి చేయటం మంచిది కాదు. అయినా మీ ప్రదర్శన ప్రదర్శనగా బాగుంది .నాదొక విన్నపం –ఎన్నో చోట్ల భువన విజయం ఆడారు .సంతోషం .కాని మహాను భావుడు  ,ఆలోచనా సంస్కారం ఉన్నవారు కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణా రావు గారి సమక్షం లో  విశ్వనాధ, కాటూరి, పింగళి ,బాపిరాజు  వంటి ప్రసిద్ధులు ‘’దర్బారు ‘’జరిపే వారని మనకు తెలుసు .ఆ ప్రక్రియను కూడా చేబట్టి ప్రదర్శిస్తే ఏంతో ఉచితం గా ఉన్నతం గా ఉంటుంది .ఆ ప్రయత్నం చేసి నాబోటి’’ కృష్ణరాయ ‘’విధేయులకు ఆనందం కల్గించండి –‘’అని రాసి  అడ్రస్ రాసి ఇచ్చి ,అప్పటికే రాత్రి తొమ్మిది అయినందువల్ల  ,బయల్దేరి బస్ ఎక్కి చివరిబస్ లో గండ్రాయి రాత్రి పదిన్నరకు చేరుకొన్నాను .

అమలైన నా సూచన -ముట్నూరి సాహితీ దర్బార్

నాఆలోచనా, సూచనా వారు చదివారో లేదో నాకు తెలియదు .కాని అది అమలయింది .కృష్ణా పత్రిక ఎడిటర్ శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లుగారు కృష్ణా రావు గారుగా , కులపతి గారు ,వృషాద్రి పతి గారు  మొదలైన వారంతా కలిసి ‘’ముట్నూరి వారి సాహితీ దర్బార్ ‘’నిర్వహిస్తున్నట్లు పేపర్ లో చదివి పిరాట్ల వారితో నాకు సాన్నిహిత్యం ఉండటం వలన ఒక కార్డు రాసి ఈ కార్యక్రమం జరగటం ముదావహవమని ,నేను సుమారు అయిదేళ్ళ క్రితం ఈ సూచనను రాత పూర్వకం గా జగ్గయ్య పేట లో కులపతి గారికి  తెలియ జేశానని నాకల ఈ నాడు సాకారం అయిందని రాశాను .ఇందులో నాపాత్ర ఉందొ లేదో నాకు తెలీడుకాని నేను కోరింది జరిగింది .ఈ దర్బారునూ చాలా చోట్ల ప్రదర్శించి పేరు తెచ్చుకొన్నారు .’’మై డ్రీం హాస్ కం ట్రూ ‘’   అదీ నాకు మహదానందం .ఈ ముఠాయే ‘’ఇంద్ర సభ ‘’కూడా దేశమంతా ప్రదర్శించారన్న సంగతి సాహితీ వేత్తలకు తెలిసిన విషయమే .

ప్రభావతి గండ్రాయి రాక

గండ్రాయి లో నా ‘’ఒంటి గది కాపురం ‘’చూడటానికి నా భార్య  ప్రభావతిని ఒక సారి ఉయ్యూరు నుంచి వస్తూ నాతొ తీసుకొచ్చాను .ఒక వారం ఉందని జ్ఞాపకం .నాకు కావలసినవన్నీ ఉన్న ఒకే  స్టవ్ మీద  ఉన్నకాసిని గిన్నేలతో వంట చేసి పెట్టింది .ఒక సారి మా మరదలు దుర్గా వాళ్ళింటికి మిర్యాల గూడా వెళ్లి వచ్చాము .ఆ తర్వాత దుర్గ భర్త శంకరం కూడా వచ్చారు గండ్రాయికి .మా ఇంటి వారి ఆతిధ్యానికి అందరూ ఆశ్చర్య పోయారు .అలాగే ఖమ్మం మేమిద్దరం వెళ్లి మా పెద్ద తోడల్లుడి గారింటికి ఒక రోజు వెళ్లి వచ్చాం .పేటలో శోభనాద్రి ఇంటికి వెళ్లి  సత్యవతి పిన్నిని కుటుంబాన్ని చూసి వచ్చాం .ఒక రోజు మధ్యాహ్నం మా హెడ్ మాస్టారు సుబ్రహ్మణ్యం గారిని భోజనానికి ఆహ్వానించి ఆ ఇరుకు గదిలోనే షడ్రసోపేత భోజనం వండించి పెట్టాం.ఆ యన సంత్రుప్తికి అవధుల్లేవు . ఇంత లిమిటెడ్ సామగ్రితో మీ శ్రీమతి ఎన్ని వడ్డించారండీ అని ఆయన నాతొ  ఆశ్చర్య పోతూ అని , స్టాఫ్ అందరితోనూ చెప్పారు .సుధాకర్ దంపతులనూ పిలిచి భోజనం పెట్టాం .ప్రైవేట్ పిల్లకు లడ్డూ ,బూంది చేసి తినిపించాం .

మామయ్య మరణం

గండ్రాయి లో పనిచేస్తున్న కాలం లోనే మా మేనమామ గుండు గంగయ్య గారు అనే గంగాధర శాస్త్రి దాదాపు అయిదేళ్లుగా పక్షవాతం తో తీసుకొని ,మూడవ కొడుకు మోహనాయ్ రోడ్డుమీద యాక్సి డెంట్ లో చనిపోవటం తో కుంగిపోయి చిక్కి శల్యమై హాస్పిటల్ లో చేరి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు .నాకు తెలియంగానే వెళ్లి కార్యక్రమాలో పాల్గొన్నాను .మా మయ్య లేని లోటు మా కుటుంబానికి తీరది కాదు .నేనంటే మహా అభిమానం ఆయనకు .అప్పుడేవో శలవలోచ్చాయి ,శలవల్లో ట్యూషన్ పెట్టి కోర్సు లాగించాను .

నా సైన్స్ టీచరే మా గజెటెడ్ ఇన్స్పెక్టర్

నేను ఉయ్యూరు హైస్కూల్ లో ఎస్ ఎస్ ఎల్ సి చదువుతున్నప్పుడు మాకు సైన్స్ టీచర్ గా1956లో  వచ్చిన శ్రీ మతి పుష్పావతమ్మ గారు కొద్ది కాలమే అక్కడ పని చేశారు అప్పుడు ఆమె భర్త ఎదోకాలేజీ లో లెక్చరర్ గా పని చేసేవారు .ఉయ్యూరులో వాళ్ళ నాన్నగారింట ఉండేవారు .తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా ప్రమోషన్ పొంది చాల చోట్లపని చేసి ఇప్పుడు విజయవాడ డివిజన్ కు గజెటెడ్ ఇస్పెక్టర్ గా అంటే సహాయ జిల్లా విద్యా శాఖాదికారిణిగా (డి వై ఇ ఒ ) వచ్చి ,గండ్రాయి హైస్కూల్ కు ఇన్స్పెక్షన్ కు వచ్చారు .నేను ఆమె శిష్యుడనని గుర్తు చేస్తే  ఏంతో సంబరపడ్డారు .అన్ని సబ్జెక్టులు ఆమె తనిఖీ చేశారు .నా ఫిజిక్స్ బోధన బాగా ఉందని నేచురల్ సైన్స్ లో అంతగా సంతృప్తి చెందలేదని చెప్పారు .ఆ మాట నిజమే .పుష్పావతమ్మగారు నేను మంగళాపురం హెడ్ మాస్టారుగా పని చేసినపుడు మచిలీపట్నం గజెటెడ్ ఇన్స్పెక్టర్ గా వచ్చారు. మళ్ళీ ఆమెతో పరిచయం కలిగింది .ఆమె కు ఒక కన్ను మెల్ల .ఆ కన్ను సగం మూసి చూస్తారు .మంచిమాటకారి .హుందాగా ఉండేవారు .రూల్స్ బాగా తెలిసిన వారే .

వత్సవాయి హైస్కూల్ లో టెన్త్ పరీక్షల ప్రహసనం

1987 మార్చ్ టెన్త్ క్లాస్ పరీక్షలకు నన్ను డిపార్ట్ మెంట్ ఆఫీసర్ గా ,తెలుగు మేష్టారు సుధాకరరావు ఇన్విజిలేటర్ గా వత్సవాయి హైస్కూల్ కు నియమించారు .రోజూ గండ్రాయి నుండే వెళ్లి వచ్చే వాళ్ళం .అక్కడ హెడ్ మాస్టారు లింగం వెంకటేశ్వరరావు  గుడివాడ ప్రాంతం వాడు .కాని విపరీతమైన కాపీలు చేసేవారుపిల్లలు .ఎక్కడేక్కడి నుంచో స్లిప్పులు  గైడ్లు వచ్చిపడేవి .కాపలా కాయటం చాలా కష్టం గా ఉండేది .ఇంవిజిలేషన్ కు వచ్చిన టీచర్స్ కూడా కాపీకి సాయం చేసేవారు .అక్కడ చదువు అంతంత మాత్రమే .నేను సహించలేక పోయాను .పరీక్ష హాల్ లోకి వచ్చిన పిల్లల్ని ముందే చే చేయించి నేనూ  చేసి ఆడపిల్లలను లేడీ టీచర్స్ చేత చెక్ చేయించి లోపలి పంపేవాడిని .రెండున్నర గంటల పరీక్ష లో ఒక్క క్షణం కూడా కూర్చునే వాడిని కాను .భయం వేసి క్రమంగా రెండో రోజునుంచి కాపీలు తగ్గి కంట్రోల్ లోకి వచ్చింది సెంటర్ .సుధాకరరావు కూడా బాగా సహకరించాడు .ఇద్దరం కలిపి ముతక భాషలో చెప్పాలంటే ‘’రేకాడించాం ‘’.సోషల్ పేపర్ ఎక్కడో లీక్ అయి ఆ పరీక్ష వాయిదా పడింది .దానికోసం మళ్ళీ రావాల్సి వచ్చింది పదిహేను ఇరవై రోజుల తర్వాత .అలాంటి స్కూల్ కు నేను తర్వాత హెడ్ మాస్టారు గా ప్రమోషన్ మీద వచ్చాను. చాలా విచిత్రం గా ఉంది .ఈ అనుభవం .

నా హెడ్ మాస్టర్  ప్రమోషన్

అప్పటికే సుమారు గా 24 ఏళ్ళు సైన్స్ మేస్టరుగా పని చేశాను. ఎప్పుడెప్పుడా ప్రమోషన్ అని ఎదురు చూస్తున్నాను .మా తమ్ముడు మోహన్ పూనా నుంచి అప్పటికే హైదరాబాద్ వచ్చి స్తిరపడ్డాడు .మా హెడ్ మాస్టర్ పరీక్షా ఫలితాలు ముందుగా గెజిట్ లో ప్రచురిస్తారు .అవి జిల్లాకు చేరటానికి వారం పది రోజులు పడుతుంది .అప్పుడు నెట్ సర్వీస్ లేదు .అందుకని మోహన్ కు ముందే చెప్పి ఉంచా గెజెట్ నోటిఫికేషన్ రాగానే ఒక కాపీ తీసుకొని నాకు అర్జెంట్ గా పంపమని .అలాగే చేశాడు .ఆగస్ట్ మొదటి వారం లో ఒక కాపి ఉయ్యూరుకు అందింది .నేను ఉయ్యూరు వెళ్లి దాన్ని’’ ట్రూకాపీలు’’ తీయించి (అప్పటికి జిరాక్స్ రాలేదు ) కాపీలు చేతితో తీసుకొని బందర్ వెళ్లాను. జిల్లాపరిషత్ కు వెళ్లాను అనుకోకుండా అప్పుడు చైర్మన్ శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు గారు  ఆఫీసులోనే ఉన్నారు .ఆయన్నుకలిసి నేను టెస్ట్ పాస్ అయ్యానని కొత్తగా తీసే హెచ్ ఏం పానల్ లో నన్ను చేర్చమని ఒక గజెట్ కాపీ ఇచ్చాను. ఆయన వెంటనే అక్కడే ఉన్న కాంప్ క్లెర్క్ కు ఇచ్చి దీని విషయం  అర్జెంట్ గా   చూడమని చెప్పారు . .పరిషద్ ఎడ్యు కేషన్ ఆఫీసర్ శ్రీ నూకల శ్రీరామ మూర్తి గారినీఆఫీస్ లోకలిసి కాపీ ఇచ్చి విషయం చెప్పాను .తప్పకుండా ఇంక్లూడ్ చేస్తామన్నారు . హెడ్ మాస్టర్  క్లెర్క్ శ్రీ శేష గిరి రావు నుకూడా కలిసి కాపీ ఇచ్చిపానెల్ ల లిస్టు లో  చేర్చమని ,మళ్ళీ వచ్చికలుస్తానని చెప్పి మా హెడ్ మాస్టర్ల  సంఘం అధ్యక్షులు, మా గాడ్ ఫాదర్ ‘’శ్రీ సోమంచి రామం గారిని ఫోర్ట్ రోడ్ లో వారింటిలోకలిసి చెప్పి ఆయన ఆశీస్సుల౦దుకొని ఉయ్యూరు ఇంటికి చేరా .మర్నాడు గండ్రాయి వెళ్లి హెడ్ మాస్టారికి మిగిలిన వారికీ తెలియజేశా .నాకు ప్రమోషన్ వస్తోందన్న సంతోషం నా ప్రైవేట్ పిల్లల ముఖాలలో కనిపించలేదు .నేను  వెళ్లిపోతున్నాననే బాధ కనిపించింది .రుణానుబంధం ఎన్నాళ్ళో తెలీదు కదా .నన్నుపేనల్లిస్టు  లో చేర్చమని అడిగానే కాని నేను కలిసిన ఎవరికీ నాకు ఫలానా చోటు కావాలని కోరలేదు. కోరాలని తెలియదుకూడా . తర్వాత తెలిసింది యెంత తప్పు చేశానో .

నన్ను వత్సవాయి హైస్కూల్ కు హెడ్ మాస్టర్ గా ప్రమోట్  చేస్తూ ఆర్డర్ వచ్సుస్తున్నాయని వార్తా ముందే తెలిసింది .మళ్ళీ ప్రభావతిని తీసుకొచ్చాను .హెడ్ మాస్టారి భార్య గారినీ ఆయన్ను మా ఇంటికి (గదికి-సింగిల్ రూమ్)  ఆహ్వానించి మంచి భోజనం పెట్టి నూతన వస్త్రాలు పెట్టాం .దంపతులు ఏంతో సంతోషించారు .ట్యూషన్ పిల్లలకూ స్వీటు హాటు చేసి అందరికి ఇచ్చి మా ఆనందం లో భాగస్వాములను చేశాం .అలాగే పిచ్చయ్యగారు భారతమ్మ దంపతులకు కూడా .గండ్రాయి నాకు సైన్స్ మేష్టారు గా చివరి మజిలి .నా జీవితం లో మరపు రాని అనుభూతులను నింపిన గ్రామం ,స్కూలు . ఇక్కడి విద్యార్ధుల మనస్సులోస్తిరమైన స్థానం పొన్ది ఆదరాభిమానాలకు మన్ననలకు గౌరవానికి పాత్రుడనవటం  నా అదృష్టం . ఎందుకు ఈ మాట అన్నానంటే ఆగిరిపల్లిలో మా దూరపు చుట్టరికం ఉన్న సూరి శోభనాద్రి గారనే అక్కడి సంస్కృత పాఠ శాల నిర్వాహకుడి కొడుకు సోమశేఖరం ఒక సారెప్పుడో కనిపించి మాటల సందర్భం గా నేను గండ్రాయి లో పని చేశానని చెబితే ఆశ్చర్య పడి ‘’యెట్లా పని చేశావయ్యా అక్కడ .అక్కడ ఉండాలంటేనే చిరాకేసింది నాకు ఉండలేక పోయాను యు ఆర్ గ్రేట్ ‘’అన్నాడు .అంతే కాదు గండ్రాయిలో నేనున్న పిచ్చయ్య గారికి బాగా ఇష్టమైన సైన్స్ మేస్టారు ప్రసాద్ ఇక్కడ పని చేసి వీరి కుటుంబానికి చాలా సన్నిహితుడై ఉండేవాడు  ఆతను తర్వాత కపిళేశ్వర పురం సైన్స్ మేస్టారుగా  చేసి ప్రమోషన్ మీద పునాదిపాడు హెడ్ మాస్టార్ అయి అక్కడే రిటైర్ అయ్యాడు .పిచ్చయ్యగారి కుటుంబం ఇతని కుటుంబానికి రాకపోకలు బాగా ఉన్నాయి. మంచి టీచర్ గా ప్రసాద్ కు ఇక్కడ పేరుంది .అలాంటి వాడి స్థానం లో నేను పని చేసి ఇ౦త అభిమానం పొందటం మామూలు విషయం కాదు. ఏదో దివ్య శక్తి నడిపించిందనే అనిపిస్తుంది .

గండ్రాయిలో లో 750-30-1020-35-1300 స్కేల్ లో  బేసిక్ 1055+14(f p I )గా1-8-86 నుంచి  జీతం తీసుకొన్నాను .rc no.6468 /81b1 dt 12-9-1987 of the p e.o and d.d.o..krishna  ననుసరించి నన్ను గండ్రాయి నుంచి వత్సవాయి హైస్కూల్ కు హెడ్ మాస్టారుగా ప్రమోట్ చేశారు 15-9-87  సాయంత్రం సైన్స్ మాస్టర్ గా రిలీవ్ అయ్యాను .ఇక్కడ ఉండగానే 1986  వేతన సవరణ అమలులోకి వచ్చింది.2070+14 గా1330-60-1930-70-2630  స్కేల్ లో బేసిక్ ఫిక్స్ అయింది .

నాకు స్కూల్ లో వీడ్కోలు విందు ఇచ్చారు .అందరూ అభిమానం చూపారు .పిల్లల మొహాల్లో ఏడుపే తక్కువ .నామీది అభిమానాని రాఘవులు సహించలేక వారి ఎమోషన్ కు అడ్డ కట్ట వేసినట్లు కనిపించింది .అందరికీ వీడ్కోలు పలికి  16 వ తేదీ ట్రాన్సిట్ వాడుకొని వత్సవాయి హైస్కూల్ లో 17-9-87ఉదయం హెడ్ మాస్టర్ గా జాయిన్ అయాను.

సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-15- ఉయ్యూరు .

..

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -88 గండ్రాయి శిష్యుడు గోపయ్య ఉదంతం

నా దారి తీరు -88

గండ్రాయి శిష్యుడు గోపయ్య ఉదంతం

గోపయ్య ఎనిమిదోక్లాస్ చదివేవాడు .ఎరుకుల కులం కుర్రాడు .ఎర్రగా అందం గా ఉండేవాడు. వెడల్పు నవ్వు ముఖం ..అసలు చదివే వాడుకాదు అల్లరి విపరీతం గా చేసేవాడని మిగిలిన మేస్టార్లు చెప్పేవారు. నేనే ఆ క్లాస్ టీచర్ని .ఇంగ్లీష్ సైన్స్ చెప్పేవాడిని నాక్లాసుల్లో అల్లరి అసలు చేసే వాడుకాదు. చాలా వినయం గా అమాయకం గా ఉండేవాడు .నేను క్లాస్ నుంచి బయటికి వస్తే చాలు మిగిలిన ఏమాస్టారు నైనా ఆటపట్టిన్చేవాడట .ఒకటి రెండుసార్లు క్లాస్ కు వెళ్ళకుండా దూరం గా ఉండి గమనించాను .అప్పుడు తెలిసింది నాకు వాడి విశ్వ రూపం .బాగా పేదవాడు .ఇంటి దగ్గర తీరు బాగా ఉండక పట్టించుకొనే వాళ్ళు లేక అలా తయారయ్యాడనిపించింది .రెండు నెలల తర్వాత ఒక రోజు ఇంటికి వచ్చి ‘’సార్!నాకు ట్యూషన్ చెప్పాలిమీరు మీ దగ్గర చదవాలని ఉంది .యెంత ఫీజు అడిగితె అంతా ఇచ్చి చేరతాను ‘’అన్నాడు చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడి .ఆహా దొరికాడు అనుకొన్నా .వాడిలో మార్పు రావాలి తేవాలి అనే దృఢమైన ఆలోచన వచ్చింది .’’ఒరే !క్లాసులో విపరీతంగా అల్లరి చేస్తావని అసలు చెప్పేదివినవని విననీయవని అందరూ చెబుతున్నారు .నిన్ను ప్రైవేట్ లో చేర్చుకొంటే వీళ్ళను కూడా చెడగోడ తావేమో  వద్దులే . నీ తంటాలేవో నువ్వు పడు ‘’అని బెదిరిస్తూ అన్నాను .వాడు కదలలేదు .అలాగే నిలబడ్డాడు ‘’సార్ !మీరు కొట్టండి చంపండి .ఏమైనా చేయండి మిమ్మల్ని వదలను. మీ దగ్గరే చదవాలినేను .మీరు కాదంటే స్కూల్ కూడా మానేస్తాను ‘’అన్నాడు మహా వినయం గా .దారిలోకి వచ్చాడనుకొని ‘’సరేరా !ఎంతిస్తావు ఫీజు ?’’అన్నా ‘’సార్!మీరెంత అడిగితె అంతా ఎక్కడో అక్కడ తెచ్చి మీకు ఇస్తా .చదువుకొంటా ‘’అన్నాడు నిశ్చయం గా .వీడు పనికోస్తాడనిపించింది .’’సరే ! నీబుద్ధి సరైన దారిలోకి వస్తోందనిపిస్తోంది .నువ్వు బాగుపడటం నాకు కావాలి .మీరు ఎస్ టి విద్యార్ధులు .ఏమాత్రం టెన్త్ పాసైనా మీకు ఉద్యోగాలను ప్రభుత్వం కళ్ళకు అద్దుకొని ఇస్తుంది .అవకాశాన్ని జార విడుచుకొంటే ఏ ఖూనీకోరువో దొంగవో అవుతావు  భవిష్యత్తు బాగా ఉండాలంటే కష్టపడాలి చదవాలి .నాకు ఒక్క రూపాయి కూడా ఫీజు అక్కర్లేదు .నువ్వు బాగు పడటమే నాకు ఫీజు ‘’అన్నాను .అమాంతం కాళ్ళ మీద పడిపోయాడు కళ్ళల్లో ఏడుపు తన్నుకొచ్చింది గోపయ్యకు  .నాకూ అదే పరిస్తితి .అంతే ఆ రోజు నుంచే ప్రైవేట్ కు వచ్చాడు .

మారిన గోపయ్యనే క్లాస్ లీడర్ చేసి బాధ్యత అప్పగించా .అంటే దొంగకు తాళం చెవి అప్పగించానన్నమాట .అంతే-అల్లరీ గిల్లరీ ఏమైపోయాయో తెలీదు .మహా బుద్ధి మంతుడుగా ఉన్నాడు .ఏ సబ్జెక్ట్ లోను వాడికి ప్రోగ్రెస్ లేదు .వాడికోసం పది లైన్లఇంగ్లీష్  స్టోరీని అయిదు లైన్లకి కుదించి ప్రత్యేకం గా వాడి నోటు పుస్తకం మీద నేనే రాసి చదివిన్చేవాడిని . రెండూ మూడు లైన్ల షార్ట్ ఆన్సర్ ను లైనున్నరకి కుదించి అనిపించి రాయించి అప్పగించుకొని వచ్చేట్లు చేశా .అక్కడ అందరూ బి సి ఎసి ఎస్ టి లే కనుక అసలే తక్కువలోనే నోట్స్ ఇచ్చేవాడిని. వీడికోసం ఇంకొంచెం కుదింపు .నాపద్ధతులన్నీ అలువాటు పడి కస్టపడి చదివి క్రమంగా హాఫ్ యియర్లీ పరీక్షలకు కొద్దిగా ఇంప్రూవ్ మెంట్ చూపించాడు .యాన్న్యువాల్ పరీక్షల్లో బాగా పికప్ అయ్యాడు. నేనంటే వాడికి దేవుడే అయ్యాను .నాకు అన్ని పనులు చేసి పెట్టేవాడు .ఇంత గణనీయ మైన మార్పు గోపయ్యలో రావటం నాకు ఏంతో ఆనందం గా ఉండేది. గర్వం గా ఉండేది .వాడిలో కృతజ్ఞతా భావం అడుగడుగునా కన్పించేది .నాకెందుకో వాడి కళ్ళల్లో వెలుగు ముఖం లో వర్చస్సు కనిపించేవి. అవే నన్ను వాడికి దగ్గరకు చేర్చాయి . స్వభావం వాడికి నచ్చింది .యక్కడ ఉయ్యూరు ఎక్కడ గండ్రాయి ?ఎక్కడిదీ అనుబంధం?తలచుకొంటే ఆశ్చర్యం కలిగిస్తాయి. గోపయ్యలో వచ్చిన మార్పుకు విద్యార్ధులు మేస్టార్లు తలిదండ్రులు చూసి మహదానంద పడ్డారు .

ఎనిమిది పాసై తొమ్మిదికి వచ్చాడు గోపయ్య .మళ్ళీ నాదగ్గరే ట్యూషన్ .ఇంకా జాగ్రత్తగా ఉన్నాడు .అంతేజాగ్రత్త నేనూ వాడివిషయం లో తీసుకొన్నాను .ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న హెడ్ మాస్టర్ ప్రమోషన్ నాకు వచ్చింది. ఆ వివరాలు తర్వాత రాస్తాను .వత్సవాయి హెడ్ మాస్టర్ గా ఆర్డర్ వచ్చింది .ఇక గోపయ్య ఏడుపుకి అంతు లేదు నన్ను వేల్లద్దంటాడు ఇక్కడే ఉండిపోమ్మంటాడు   ఉండటం కుదరదు అంటే వినడు .నాతొ వత్సవాయి వచ్చి అక్కడే స్కూల్ లో చేరతానంటాడు .నన్ను మాత్రం వదలనన్నాడు .ఆ భక్తీ ఏమిటో ఆ నమ్మకం ఏమిటో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఇంతవరకు అలాంటి శిష్యుడు నాకు తటస్త పడలేదు .వాడికి నచ్చచేబుతూ ‘’ఒరే! నేను ఇక్కడ ఉండి వత్స వాయి రోజూ  వెళ్లి ఉద్యోగం చెయ్యకూడదు అక్కడే ఉండాలి .నేను లేనని నువ్వు చదువుమానేస్తే ణీ జీవితం బాగు పడదు ఎవరు ఉన్నా లేకున్నా నీ చదువు మీద నువ్వు దృష్టిపెట్టి చదువుకోవాలి. ఎవరూ ఎప్పుడూ వెంట ఉండరు .నిన్ను నువ్వే తీర్చిదిద్దుకోవాలి .నువ్వు నాతొ బాటు వస్తానన్నా నేను తీసుకుకు వెళ్ళను నీ భవిష్యత్తు నాకు ముఖ్యం ‘’అని చెప్పి ఒప్పించాను .ఆ తర్వాత అగోపయ్య టెన్త్  పాసవటం  ఇంటర్ డిగ్రీ చదివి డిగ్రీ సాధించటం బెజవాడలో  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించటం వరుసగా జరిగిపోయాయి .ఈ విషయాలన్నీ బాబ్జీ వాళ్ళు మొదటి సారి గండ్రాయి స్కూలు లో స్వాతంత్ర దినోత్సవం చేసినపుడు నేను వెడితే తెలిసింది .అప్పుడే మళ్ళీ నేను గోపయ్యను చూడటం తటస్తించింది .ఇప్పుడు గేజేటేడ్ హోదా కూడా వచ్చిఉంటుంది. బాబ్జీ బృందం తోకలిసి ఉయ్యూరు మా ఇంటికి వచ్చాడు నిజం గా నా ఆనందానికి అంతేలేదు గోపయ్యను చూసి గర్వపడతాను .గోపయ్యానే ముడి సరుకు వజ్రం గా మారింది ఆ గ్ఫ్హంత నాదే అయినా ఆటను ఆ ఒరిపిడికి తట్టుకొని నిలబడి తానేమిటో రుజువు చేసుకొన్నాడు

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

అపర భగీరధుడు k.l.rao

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా షార్ట్‌ స్టోరీ

 

నా షార్ట్‌ స్టోరీ
అందరిలా కాకుండా కాస్త భిన్నంగా కనిపిస్తే చాలు ఒకటికి నాలుగుసార్లు చూస్తారు. వింతగానూ చూస్తారు. అలాంటిది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తుతో ఉన్న మనిషి కనిపిస్తే… కళ్లముందు కనిపించేది మనిషా, బొమ్మా అని ఆశ్చర్యంగా చూడడం, వింతగా మాట్లాడడం ఖాయం. కానీ ఆ చూపులు, మాటలు వాళ్లనెంతగా బాధిస్తాయో ఆ మాటలు అనేవాళ్లకి తెలియదు. అలాంటి అనుభవాలు ఇరవైయొక్కేళ్ల జ్యోతి ఆమ్గేకు ఎన్నో ఉన్నాయి. తక్కువ ఎత్తుతో గిన్ని్‌సబుక్‌ రికార్డుల్లోకిఎక్కడమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆమె తన రోజూవారీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఓపెన్‌ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
‘‘నాకు మూడేళ్లు వయసులో నన్ను పరీక్షించిన డాక్టర్లు నాకున్న అరుదైన పరిస్థితి (మరుగుజ్జుతనం) గురించి అమ్మావాళ్లకి చెప్పారు. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలిశాక మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇంటికి ‘జ్యోతిహౌస్‌’ అని పేరు పెట్టారు. నాగపూర్‌లో నన్నందరూ ‘లివింగ్‌ డాల్‌’, ‘లిటిల్‌ వండర్‌’, ‘థంబెలినా’ అని పిలుస్తుంటారు. లేత గులాబీ రంగంటే నాకు చాలా ఇష్టం. అందుకే నా గదికి, మెట్లకి అదే రంగు వేయించారు మావాళ్లు. నా గది చూస్తే మీకు మిర్రర్‌ ఇమేజ్‌ ఏమైనా ఉందా అనుకుంటారు. ఎందుకంటే మామూలు సోఫాలు, కుర్చీలు ఒక పక్కన ఉంటాయి. అవే సోఫాలు, కుర్చీలు మరోవైపు మినియేచర్‌ సైజుల్లో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ‘బొమ్మరిల్లు’లా కనిపిస్తుందన్నమాట. నా కోసమే ప్రత్యేకంగా బెడ్‌, డెస్క్‌, కుర్చీ తయారు చేయించారు. వంటగదిలో గిన్నెలు, ప్లేట్లు కూడా రెండు సైజుల్లో ఉంటాయి. కుటుంబమంతటికీ ఒక సైజు నాకోసం మరో సైజు. నేను కడుపులో పడిన దగ్గర్నించీ ఇప్పటివరకు మా అమ్మ నన్ను మోస్తూనే ఉంది. అదెలాగంటే నేను ఎక్కువసేపు నడవలేను. అందుకని ఎక్కువ సమయం మా అమ్మ నన్ను ఎత్తుకునే ఉంటుంది.
హారర్‌ స్టోరీ అభిమానులను ఇచ్చింది
నేషనల్‌ జియోగ్రఫిక్‌ వాళ్లు తీసిన డాక్యుమెంటరీతో మొదలైన ప్రయాణం 2012లో బిగ్‌బాస్‌ షోలో, మైకా సింగ్‌ మ్యూజిక్‌ వీడియోలో కనిపించేలా చేసింది. 2014లో ‘అమెరికన్‌ హార్రర్‌ స్టోరీ’ అనే టెలివిజన్‌ షోలో నటించే అవకాశం వచ్చింది. అందులో ‘మా పిటైట్‌’ పాత్రలో కనిపించాను. ఆ పాత్ర దారుణంగా హత్యగావించబడుతుంది. అది చూసిన అభిమానులు ఇంటర్నెట్‌లో తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. విషాదకరమైన సందేశాలు పెట్టారు. పెద్ద మీడియా సంస్థలయిన ‘ప్యూపుల్‌’, ‘హపింగ్టన్‌ పోస్టు’, ‘ఎబిసి న్యూస్‌’, ‘స్లేట్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టునైట్‌’లలో నా లైఫ్‌స్టోరీని ప్రచురించాయి. అప్పటివరకు నన్ను నీడలా వెంటాడిన ‘బేబీ’, ‘డాల్‌’ అనే పదాలు ఒక్కసారిగా మాయమైపోయాయి. అదే విషయాన్ని నా ఫేస్‌బుక్‌ మెసేజ్‌లో ‘నన్ను బేబీ లేదా డాల్‌ అని పిలవనందుకు నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ అమెరికన్‌ హారర్‌ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. నా ప్రయత్నం నేను చేశాను’ అని పెట్టాను. ఈ షో ప్రీమియర్‌కి గులాబీరంగు గౌను వేసుకుని, జుట్టును రింగులు రింగులు తిప్పుకుని, భారీ మేకప్‌ వేసుకుని వెళ్లింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ ‘‘నేనిదంతా కల అనుకుంటున్నాను. ఇలా హాలీవుడ్‌లో ఉంటానని నేను అనుకోలేద’’ని తన సన్నటి గొంతుతో మాట్లాడింది జ్యోతి. ఎక్కువ సమయాన్ని తన స్మార్ట్‌ఫోన్‌ మీద వేళ్లు కదిలిస్తూ సోషల్‌ మీడియాలో ఉన్న అభిమానులతో బిజీగా ఉంటుంది. ఆమె ఉపయోగిస్తున్న ఐఫోన్‌ 5 ఆమె చేతిలో చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోను పొడవు ఆమె ముంజేయి వరకు ఉంటుంది. షూ బాక్స్‌లో తనకి చేతిరాతతో వచ్చిన ఉత్తరాలను, కార్డులను జాగ్రత్తగా పెట్టుకుంటుంది. అందులో ఆమెని పెళ్లాడతామంటూ వచ్చిన ఉత్తరాలు కూడా ఉంటాయి. అమెరికా వీరాభిమాని ఒకరు ఆమెను ఫేస్‌బుక్‌లో విపరీతంగా ఇబ్బందిపెడుతుంటే అతడ్ని బ్లాక్‌ చేద్దామని కూడా అనుకుందట.
పొడవు జుట్టుతో మరోసారి
ఆమెను తెరమీద, ఫోటోల్లో చూస్తే మరీ అంత తక్కువ ఎత్తు ఉన్నట్టు కనిపించదు. కానీ వాస్తవంగా వాటిలో కనిపించేదానికంటే ఎత్తు చాలా తక్కువగా ఉంటుందామె. ‘‘నా కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తులు కొనుక్కోవడం అంటే ఇష్టం. అలాగే ఎత్తుమడమల చెప్పులు వేసుకోవడమంటే కూడా చాలా చాలా ఇష్టం. కాని నేనెప్పటికీ వాటిని వేసుకోలేను. చిన్నప్పుడు కాళ్లు విరిగిపోయాయి. అవి నన్ను ఇప్పటికీ బాధిస్తుంటాయి. ఎందుకంటే నా వంట్లో క్యాల్షియం తయారవదు. అందుకే ఎత్తుమడమలు వేసుకోవడం అనేది నాకు కలగానే మిగిలిపోతుంది. నా జుట్టు ఎప్పుడూ చక్కగా అల్లి జడవేస్తారు అమ్మావాళ్లు. అలాకాకుండా వదిలేసానంటే నాకంటే జుట్టే పొడవుగా ఉంటుంది. ఈ కారణంతో మరోసారి గిన్నిస్‌ బుక్‌ రికార్డు ఎక్కాలనుకుంటున్నాను. కానీ అతి తక్కువ ఎత్తున్న వాళ్లకి పొడవైన జుట్టు ఉండడం అనే విభాగం రికార్డుల్లో లేదు. ఆ విభాగం కూడా పెడతారనేది నా నమ్మకం.
కుర్చీ హ్యాండిలే నాకు సీటు
వయసు పెరిగే కొద్దీ మిగతా పిల్లలతో కలిసి ఆడుకునేందుకు బయటికి వెళ్లేందుకు నాకు ఓపిక ఉండేది కాదు. స్కూల్‌ అయిపోయిన తరువాత ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ కూర్చునేదాన్ని. నన్ను నేను స్ర్కీన్‌ మీద చూసుకున్నట్టు ఊహించుకుంటూ ఉండేదాన్ని. సల్మాన్‌ఖాన్‌ సినిమా ఒక్కటి కూడా వదలకుండా చూశాను. ఆయనతో కలిసి నటించాలనుకున్నాను కూడా. అయితే ఎత్తు తక్కువగా ఉండే నటులకు హారర్‌, మూఖాభినయం వంటి వాటిలోకి వెళ్లడం పెద్ద చాలెంజ్‌. అమెరికన్‌ హారర్‌ స్టోరీని విచిత్రమైనదిగా చూస్తారు. అయితే హారర్‌ షోలో నటించడం వల్ల విచిత్రవ్యక్తులవుతామని నేను అనుకోవడం లేదు. మేము కూడా మిగతా వాళ్లలా మామూలు మనుషులమే. అదే విషయాన్ని ఈ షో ద్వారా చూపించడం మాలాంటి వాళ్లకి ఆనందాన్నిస్తుంది.
మకావు నుంచి మనదేశానికి రాగానే థియేటర్‌కి వెళ్లి ిపీకే సినిమా చూశాను. తెర కనిపించడం కోసమని కుర్చీహ్యాండిల్‌ మీద కూర్చున్నాను. థియేటర్‌లో ఎప్పుడు సినిమా చూసినా కుర్చీ హ్యాండిలే నా సీటు. గదిలో ఉండే లైట్‌ స్విచ్‌లు వేయలేను. టేబుల్‌ మీద రిమోట్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ వంటివి పెడితే వాటిని అందుకోలేను. కారు సీటులో కూర్చోలేను. చిన్న పిల్లల మధ్య ఉన్నానంటే చాలా జాగ్రతగా ఉంటాను. ఎందుకంటే వాళ్లు నన్ను నెట్టేస్తారు. నన్ను చూసినప్పుడు ‘ఈమె పెద్దావిడా, చిన్న పిల్లా లేకపోతే బొమ్మా’’ అనే గందరగోళ పరిస్థితిలో ఉంటారా పిల్లలు.
ఆ భయం పోయింది
నాకున్న మరో సమస్య నా అంతట నేనుగా ఎక్కడికీ వెళ్లలేకపోవడం. నేను కాలేజికి వెళ్లాలంటే మా నాన్నో, అక్కల్లో ఎవరో ఒకరు ప్రతిరోజూ నాకు తోడుగా రావాల్సిందే. హోంసైన్సు చదువుతున్నాను. కాఫీ షాపు, మాల్స్‌ వంటి బహిరంగ ప్రదేశాలకి స్నేహితులతో వెళ్తే జనాలు చుట్టుముడతారు. నాతో వాళ్లు చాలా వింతగా ప్రవర్తిస్తారు. ఏమేమో మాట్లాడతారు. ‘జ్యోతీ, నీ పేరేంటి’ అని అడుగుతారు. ‘నా పేరు మీకు తెలిసినప్పుడు మళ్లీ నన్నెందుకు అడుగుతార’ని నేనంటే ‘ఓరి దేవుడా, ఈమె మాట్లాడుతుంద’ని ఆశ్చర్యపోతారు. నాకిష్టంలేకపోయినా, నేను వద్దని వారించినా నా ఫోటోలు తీసుకుంటారు. అటువంటివన్నీ చాలా చిరాకుగా అనిపిస్తాయి. నా జీవితంలో ఇప్పటివరకు నా వైపు ఆశ్చర్యంగా, వింతగా చూసేవాళ్లే ఎదురయ్యారు. దానివల్ల చాలాసార్లు ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాను. అందుకే బయటకు వెళ్లాలంటే భయం వేసేది. కాని ఇప్పుడు ఎంతమంది శ్రోతలు ఉన్నా మైకులో భయం లేకుండా మాట్లాడగలను. ఎత్తు తక్కువ ఉన్న వాళ్లు కూడా బయటికి వచ్చి వాళ్ల అనుభవాలను నాలాగానే పంచుకోవాలి.’’
ప్రపంచం చుట్టి వస్తుందన్నాడు
నాగపూర్‌లో నివాసులైన రంజన, కిషన్‌జీ ఆమ్గే దంపతుల ఐదో సంతానం జ్యోతి. ఆమె జాతకం చూసిన జ్యోతిష్యుడు ‘ఈ అమ్మాయి వల్ల కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయ’ని చెప్పాడు. అంతేకాదు ఆ బిడ్డ ప్రపంచమంతా చుట్టి వస్తుందని, తనతో పాటు కుటుంబం కూడా పర్యటిస్తుందని చెప్పాడు. ఆ మధ్య తరగతి జంటకి అప్పట్లో అదో అందమైన కల. అందుకే ఆ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలను అంతగా పట్టించుకోలేదు వాళ్లు. ‘నాగపూర్‌ నుంచి ముంబయి వెళ్లడానికే మాకు కష్టం. అలాంటిది ప్రపంచం చుట్టి రావడం ఏమిటి అనుకున్నాం’’ అన్నారు కిషన్‌జి. కాని ఇప్పుడు వాళ్లు బ్రెజిల్‌, అర్జెంటీనా, జపాన్‌, టర్కీ, ఇటలీ, రొమేనియా,చైనా, కువైట్‌ దేశాలు చుట్టేసి వచ్చారు. ఇదంతా ఆఖరున పుట్టిన ఆ అమ్మాయి వల్లే సాధ్యమైంది. ఆ జ్యోతిష్యుడి మాటలు నిజమయ్యాయి. జ్యోతికి రాజకీయ కెరీర్‌ను చూపించే పనిలో ఉన్నాడు ఆమె నాన్న. దాంతోపాటు ఆమె కథను పబ్లిషర్లకు అమ్మే ప్రయత్నంలో కూడా ఉన్నాడు.
పేరు: జ్యోతి ఆమ్గే
ఎత్తు: 62.8 సెంటీమీటర్లు (24.7 అంగుళాలు)
బరువు: కేవలం
5 కేజీలు

నేషనల్‌ జియోగ్రఫిక్‌ ‘ది వరల్డ్స్‌ స్మాలెస్ట్‌ గర్ల్‌’ డాక్యుమెంటరీ తీసే సమయంలో జ్యోతిని తల్లిదండ్రులు ఒక దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడున్న ప్రజలు ఆమెను దేవిగా పూజించడం మొదలుపెట్టారు. ఇలా ఇబ్బంది పెట్టే విషయం ఆమెకు చాలాసార్లు ఎదురైంది. ‘‘ఒకవేళ నాలో నిజంగా ప్రత్యేక శక్తులు ఉంటే, నేను ఎత్తు పెరిగే దాన్ని కదా. నేను పొడవు అవ్వడం అనేది అసాధ్యం. ఒక రకంగా చెప్పాలంటే నా ఎత్తే నన్ను ప్రముఖురాల్ని చేసింది. ఇంకా ఎత్తు ఎదిగేలా చేస్తోంది కూడా’’ అంటుంది జ్యోతి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాబు ఒంటరిపోరు సాగర్ నీటికి తాళం ,కల తప్పిన మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -87 గండ్రాయి –సహచరులు – నా ఐడియా

నా దారి తీరు -87

గండ్రాయి –సహచరులు – నా ఐడియా

గండ్రాయి స్కూల్ జీవితం సరదాగానే ఉంది .సోషల్ మేష్టారు రాఘవులు ఇదివరకు పెదఓగిరాల అప్పర్ ప్రైమరీ స్కూలో లో పని చేసి ,అక్కడ మంచి పేరుతెచ్చుకొన్నారు .అప్పుడు కొంత దూరపు పరిచయం ఉండేది .క్రిస్టియన్ అయిన ఆయన చాపకింద తేలులాగా బోధ చేసేవాడు .పాఠాలు చెప్పటం కంటే నీతి బోధ ఎక్కువ .హెడ్ గారికి తలలో నాలుక .ఇద్దరూ జగ్గయ్యపేట  నుండే వచ్చేవారు .రాఘవులు తిరుమల గిరి లో మామిడి తోట వేశారు .ఆ కబుర్లే ఎక్కువగా చెప్పేవాడు .కొంచెం స్వార్ధం ఉన్నమనిషి పైకి సాదు లోపల వ్యతిరేకం .అదీ స్ప్లిట్ పర్సనాలిటి .లెక్కల మేష్టారు కృష్ణ మూర్తి కూడా’’ పేట ‘’నుండే వచ్చేవాడు .అక్కడ హైస్కూల్ లో అవినీతి ఆరోపణ మీద సస్పెండ్ అయి కాళ్ళూ గడ్డాలు పట్టుకొని ఇక్కడికి బదిలీ చేయి౦చు కొన్నాడు .సబ్జెక్ట్ లో సరుకు లేదు. చెప్పటం అసలు వచ్చేదికాదు .సొల్లు కబుర్లు చెప్పేవాడు .కాని మంచి స్నేహితుడు అనిపించాడు. నాతొ బాగా ఉండేవాడు .అతని సస్పెన్షన్ పీరియడ్ రాటిఫై  అయితే కాని జీతం రాదు .రోజూ గోల పెట్టేవాడు .నేనొక ఉపాయం చెప్పాను .కృష్ణా జిల్లాలో కమ్యూనిస్ట్ హెడ్ మాస్టారు గా పేరొందిన వారు ,ఉయ్యూరు హైస్కూల్ ప్రారంభకులు అయిన శ్రీ వై గోపాలరావు గారురిటైరై  ఉయ్యూరులో ఉండగా చనిపోయారు .ఆయన కొడుకు రవీంద్ర కు జిల్లాపరిషత్ లో కంపాషనేట్ గ్రౌండ్స్ మీద గుమాస్తా ఉద్యోగం వచ్చింది .కొద్ది కాలం లోనే ఆతను ముదిరి పోయి లంచాలు మరిగి ట్రాన్స్ ఫర్లు ,బిల్లులు సాంక్షన్ చేయించటం పాస్ చేయించటం చాలా  ఈజీ  గా చేసేవాడని చెప్పుకొనేవారు .జిల్లాలో బాగా అందరికీ తెలిసిన విషయమే ఇది .మంచి అవకాశం  ఈ విషయం కృష్ణ మూర్తికి చెప్పి అతన్ని మేనేజ్ చేసి పని చేయించుకోమని సలహా ఇచ్చాను .అది క్లిక్ అయింది బందరు వెళ్లి కావాల్సినవి ‘’చూసి ‘’తన సస్పెన్షన్ పీరియడ్ ను రాటిఫై చేయించుకొని ఆర్డర్ తెచ్చు కొన్నాడు. హెడ్ మాస్టారు బిల్ చేశారు , బందరు వెళ్లి డబ్బు వెదజల్లి  బిల్ సాంక్షన్ చేయిన్చుకొన్నాడు .ఆల్ హాపీస్ .నన్ను ఈ సలహా  ఇచ్చినందుకు  ఏంతో అభినందించాడు కృష్ణ మూర్తి .’’తిలాపాపం తలా పిడికెడు ‘’.ఒక రోజు మా మొత్తం స్టాఫ్ కు జగ్గయ్య పేట లో వాళ్ళ స్వంత ఇంట్లో బ్రహ్మాండమైన విందు ఇచ్చాడు .కార్య సాధకుడు కృష్ణ మూర్తి .ఒక ఐడియా ఆయన జీవితాన్నే కాదు కాదు’’ జీతాన్నే’’ మార్చేసింది .

అప్పుడు మా రెండో అబ్బాయి శర్మ హర్యానా రొహ్ టక్ లో మహర్షి దయానంద యూని వర్సిటి లో ఏం ఎస్ సి చదువుతున్నాడు .వాడికి డబ్బు పంపాలంటే గండ్రాయిలో ఆంధ్రా బ్యా౦క్  ద్వారా పంపేవాడిని .ఒకోసారి నా దగ్గర డబ్బు లేకపోతె తెలుగు మేష్టారు సుధాకరరావు సర్దేవాడు .జీతం రాగానే ఇచ్చేసేవాడిని .ఆ బ్యాంక్ మేనేజర్ కూతురు ఎనిమిదో క్లాస్ చదువుతూ నా దగ్గర ట్యూషన్ చదివేది .సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు సుబ్బారావు బ్రాహ్మణుడు . ఏలూరు వాడు .ఇక్కడికొచ్చి చేరి ఇక్కడే పని చేసి ఇక్కడే రిటైర్ అయ్యాడు .హెడ్ గారికి ఆఫీస్ వర్క్, టైం టేబిల్ వేయటం ఎక్సట్రా వర్క్ వేయటం అన్నీ ఆయన పనే .లేక పొతే  హెడ్ మాస్టారే చూసుకునేవారు .మాలో సీనియర్ రాఘవులు కనుక ఆయనే ఇంచార్జి హెడ్ .పరీక్షల నిర్వహణ ఆయనపనే .కృష్ణ మూర్తి వచ్చిన తర్వాత సీనియర్ అయినా ఈ బాదర బందీ అంతా పట్టేదికాదు.రాఘవులే చూసేవాడు .లేకపోతె తరువాత నేనే సీనియర్ ను  నేను చూసేవాడిని .రాఘవులు  ఊరి పెద్దలతో బాగా పరిచయం ఉంది .చాలాకాలం నుంచి ఇక్కడే ఉన్నాడు .అందరి ఇళ్ళకు వెళ్లి పలకరించేవాడు ,దీన్ని మేము ‘’గడప పూజ ‘’అనే వాళ్ళం .కొద్దిరోజులు కాపురం పెట్టి  ప్రైవేట్ కూడా చెప్పాడు .

నా గండ్రాయి శిష్యుదు బాబ్జీ

నాకు మంచి శిష్యులు దొరికారు గండ్రాయి లో .పిచ్చయ్యగారి అబ్బాయి ప్రసాద్ చాలా అణకువ గా ఉండేవాడు ఎప్పుడూ చేతులు కట్టుకొని తల వన్చుకొనే మాట్లాడేవాడు .బాబ్జీ అనే కుర్రాడు  పిచ్చయ్యగారి ఇంటికి కొద్ది దూరం లో ఉండేవాడు .వాళ్ళనాన్న ఏదో వ్యాపారం చేసేవాడు. ఎనిమిదీ తొమ్మిదీ బాబ్జీ నా దగ్గర ట్యూషన్ చదివేవాడు .చాలా మంచికుర్రాడు .లీడర్షిప్ లక్షణాలున్నవాడు.టెన్త్ పాసై డిగ్రీ చదివి ,బెజవాడ నారాయణ లో ఫిజిక్స్ లెక్చరర్ అయి ,ఇప్పుడు ఈడుపుగల్లు లో గాయత్రి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు .ఆ నాటి అభిమానం, గౌరవం ఇప్పటికీ చూపిస్తాడు ఫోన్లు చేస్తుంటాడు .గృహ ప్రవేశానికి కూడా పిలిస్తే వెళ్లి వచ్చాం .నా దగ్గర చదివిని మిగిలిన పిల్లల నందర్నీ కలుపుకొని ఉయ్యూరు వచ్చి చూసి వెళ్తాడు .అతని భార్య బెజవాడలో టీచర్ .అతని తండ్రికూడా ఏంతోఆప్యాయం గా ఉంటాడు. అతని తల్లి గండ్రాయి సర్పంచ్ గా పని చేసింది . బాబ్జీ స్నేహితులను అందర్నీ కలుపుకొని గండ్రాయి స్కూల్ లో అయిదేళ్ళ క్రితం స్వాతంత్ర దినోత్సవం జరిపాడు .విద్యార్ధులు బహుమతులు అందించారు ఈ స్నేహ బృందం .నన్ను గెస్ట్ గా ఆహ్వానిస్టే వెళ్లాను. నాకు సత్కారం చేయించారు హెడ్ మాస్టారితో ..అప్పుడు నేను ఆ ఏడాది టెన్త్ పబ్లిక్  లో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్ధికి 500 రూపాయలు పారితోషికం అందజేసి ప్రతి ఏడాది ఇస్తానని ప్రకటించి ,అలా చేస్తూనే ఉన్నాను .ఒక వేళ హెడ్ మాస్టారు నాకు  ముందుగా  తెలియ జేయక పొతే, బాబ్జీ తో డబ్బు సర్దు బాటు చేయించి నేను తర్వాత అతనికి మని ఆర్డర్ పంపుతాను .అలాంటి కత్తి లాంటి శిష్యుడు బాబ్జి .స్కూల్ స్వర్నోత్సవానికి మళ్ళీ ఆహ్వానించి అక్కడ పని చేసిన వారందరినీ సత్కరించారు నాతొ సహా .హెడ్ సుబ్రహ్మణ్యం గారు రెండు సార్లూ రాలేదు రాఘవులు వచ్చాడు .మళ్ళీ పాత శిష్యులను కలిసే అవకాశం వచ్చింది .జగ్గయ్య పేటలో రాముడూ వాళ్ళింటికి వెళ్లి చూసి వచ్చాను .గంద్రాయిలో పిచ్చయ్యగారింటికీ వెళ్లి మాట్లాడాను .పాత రోజులన్నీ గుర్తు చేసుకోన్నాం .ఆ నాటి ఆప్యాయతే ఆ దంపతులు చూపారు .

మిగిలిన శిష్యులు

అప్పుడే నా దగ్గర చదివిన శిష్యులు అందరూ ఒక్కసారి కనిపించారు .దాదాపు అందర్నీ గుర్తు పట్టాను అందులో జానకి రామయ్య గోపయ్య ,మొదలైన వారున్నారు .అందరికి భోజనాలు పెట్టారు .మొత్తం ఖర్చు మిత్ర బృందమే భరించింది .అప్పటినుండి ప్రతిఏడాది స్వతంత్ర దినోత్సవం జరుపుతూనే ఉన్నారు మిత్ర బృందం .తారకేశ్వరి కూడా కనిపించింది ,నా దగ్గర ప్రైవేట్ చదివిన వారిలో బుడ్డి శిరీష అనే అమ్మాయి ,పోతిన రజని అనే అమ్మాయి చాల మంచి విద్యార్ధినులు .బాగా చదివేవారు .ఎప్పుడు ట్యూషన్ కు రమ్మంటే అప్పుడు వచ్చేవారు.శ్రద్దగా చదివి అభిమానం పొందారు .కాని శిరీష కు పెళ్లి అయి భర్త చనిపోయాడట బాబ్జీ చెప్పాడు .బెజవాడలో ఉంటోందట .రజని గుంటూరు అమ్మాయి అదే యాస తో మాట్లాడేది .నవ్వుముఖం .సరదాగా మాట్లాడేది. వాళ్ళ నాన్న వాళ్ళు ఇక్కడ పొలాలు కౌలు కు తీసుకొని పొగాకు పండించేవారు .పొగాకు నారు పెంచటాన్ని ‘’మట్లు ‘’పెట్టటం అని అంటారని రజని ద్వారానే తెలిసింది .ఇద్దరూ మంచిమార్కులతో పాసైనారు టెన్త్ క్లాస్ .శిరీష అన్న టెన్త్ లెక్కల్లో తప్పి నాదగ్గర అక్టోబర్ పరీక్ష కు లెక్కలు ట్యూషన్ కు వచ్చాడు .బాగా తెలివి ఉన్నవాడే .రెండు నెలల్లో మొత్తం సబ్జెక్ట్ అంతాబోధించాను బిట్స్ అన్నీ బాగా చేయించాను పాత పేపర్లు ఆన్సర్ చేయించాను .యిట్టె అందుకోనేవాడు పేరు. శ్రీనివాసని గుర్తు .సప్ప్లిమెంటరిపరీక్ష లో ఆతను 85 శాతం మార్కులు తెచ్చుకొని పాసవటం అతనికంటే నాకు చాలా ఆనందం గా ఉండేది .చెల్లెలు శిరీష ఎంతగానో పొంగిపోయింది .క్రాఫ్ట్ మేస్టారి బంధువుల అమ్మాయి లెక్కలు, సైన్స్ లో తప్పితే ఆయన నన్ను ప్రైవేట్ చెప్పమని కోరితే టైం లేక మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ టైం లో ఇంటికి వచ్చిన సమయం లో రమ్మంటే వచ్చేది .ఆ ముప్పావుగంట కాలం  ,సాయంత్రాలలో చెప్పితే ఆ అమ్మాయి శ్రద్ధగా చదివి పాసయింది .ఇదికూడా క్రెడిటే.అంత తెలివైన అమ్మాయికాకపోయినా కస్టపడి ఫలితం సాధించింది .హాస్టల్ కుర్రాడు హనుమంతరావు కూడా చాలా అణకువగా ఉండి చదివాడు .అలాగే ఇద్దరన్న దమ్ములు ఎనిమిదీ తొమ్మిదీ చదివారు బుద్ధిమంతులు ఇద్దరూ .మంచి ఉద్యోగాలలో స్తిర పడ్డారు .జానకి రామయ్య అనే కుర్రాడు తొమ్మిదో తరగతి నా దగ్గర ట్యూషన్ చదివాడు DSCN9981.ఏంతో వినయ విదేయతలున్న వాడు .పాలుపోసేవాడు .డబ్బిస్తే మంచి వెన్నపూస తెచ్చిపెట్టేవాడు . బాగా చదువుకొని డిగ్రీ పాసై ఇప్పుడు ఉయ్యూరు బాంక్ ఆఫ్ ఇండియా పని చేస్తూ ఈ మధ్యనే ఇంటికి వచ్చి కలిసి వెళ్ళాడు .ఇప్పుడూ అతని పద్ధతిలో ఏ మాత్రం తేడాలేదు . శ్రీరామ మూర్తి అనే కుర్రాడు వైశ్యుడు .బాగా చదివి వ్యాపారం లో స్తిరపడ్డాడు  .కొండపల్లి లక్ష్మి చివర్లో ట్యూషన్ లో చేరింది టెన్త్ లో .చురుకైన అమ్మాయి .మంచిమార్కులతో పాసై ఖమ్మం లో ఇంటర్ చదవటం తెలుసు ఒకసారి వాళ్ళ నాన్న గారు ఇంటికి రమ్మంటే వెళ్లాను .ఇంటివాడు ప్రసాద్ చదువులో ప్రగతి పెద్దగా సాధించలేదు .అసలైన ఇంకో సేలిబ్రటి  శిష్యుడు  గోపయ్య ది ఒక చరిత్ర .తర్వాత తీరికగా తెలియ జేస్తాను .

సశేషం

మీ- గబ్బిట  దుర్గాప్రసాద్ -11-2-15- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -10

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -10

5-   ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్-3(చివరిభాగం )

అనుకోకుండా అకస్మాత్తుగా విట్మన్ కు వార్ధక్యపు చాయలు చోటు చేసుకొన్నాయి .నడక మందగించిది .శరీర బాధలు ఇబ్బందిపెడుతున్నాయి .అశక్తత పెరిగింది .శక్తి క్షీణించింది .అప్పుడప్పుడు ఉద్రేకానికి లోనౌతున్నాడు .సరస్వతి కరుణించినా లక్ష్మీ ప్రసన్నం కాలేదు .కాండెన్ వీధుల్లో బాక్సులలో పుస్తకాలు మోసుకొంటూ హోమ్ డెలివరీ చేస్తున్నాడు .నడవ లేకపోయేవాడు . బరువు  మోయటం అసాధ్యమైపోయింది .యాభై వ పడిలో వచ్చిన స్ట్రోక్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఇంకో ఇరవై ఏళ్ళు అలాగే జీవితాన్ని లాగేలా చేసింది .అరవైలో కొంత కుదుటబడ్డాడు .అతి దూరంగా ఉన్న కొలరాడో వెళ్లి లింకన్ పై ప్రసంగాలు చేశాడు .అక్కడ ‘’when Lilacs last in the dooryard Bloomed ‘’కవిత చదివి అందరిని సమ్మోహితుల్ని చేశాడు .దాన్ని ‘’నేటివ్ క్లాసిక్ ‘’అన్నారు .

అరవై అయిదో ఏట ఒక చిన్న గదిలో రైల్వే క్రాసింగ్ దగ్గర  న్యూస్ పేపర్ల మధ్య గడిపాడు . రైళ్ళ మోత, ఫాక్టరీల రసాయనిక వాయువులు చిమ్నీలనుండి వెదజల్లే దుర్గంధం లో నరకం అనుభవించాడు .ఒక టైలర్ విధవ భార్య వండి పెట్టేది ఇంటిని చూసేది .చినిగిన చొక్కాలు ,పాంటులకు అతుకులు వేసేది .విట్మన్ వీరాభిమానాలు ముప్ఫై రెండుమంది ఒక గుర్రబ్బగ్గీ కొనిచ్చారు .  ఈ బృందం లో  శామ్యూల్ ఇ క్లేమిన్స్ కూడా ఉన్నాడు .అరవై తొమ్మిదో ఏట కొత్తగా పక్షవాతం ప్రవేశించింది .నరాల బాధ పెరగటమే కాక  కిడ్నీ ట్రబుల్ కూడా వచ్చిపడింది మూలిగే నక్క పై తాడి  పండు చందం అయింది ఆ మహా కవి బతుకు .డెబ్భై వ పుట్టిన రోజుకు లేచి నిలబడ్డాడు .ఆ తర్వాత ఓపిక తెచ్చుకొని దగ్గరలోనే ఉన్న ఫిలడెల్ఫియాలో లి౦కన్ లెక్చర్ ఇచ్చాడు .మిగిలిన కాలమంతా ఇంటి పై భాగానకాని ,కామ్దేన్ లో మికిల్ స్ట్రీట్ లోకాని గడిపాడు .చనిపోతున్నా ఓడిపోలేదు .శరీరం వేడి చేసుకోవటానికి స్టవ్ దగ్గర గంటల కొద్దీ ఏ ఆలోచనా లేకుండా కూర్చుని పోయే వాడు .చావు వచ్చి మీద పడుతోందని గ్రహించాడు తుది యాత్రకు ప్లాన్ సిద్ధం చేసుకొంటున్నాడు .

72 ప్రవేశించింది .1891 లో చివరి ఎడిషన్ గా ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’ను ౩౦౦ కు పైగా కవితలతో ప్రచురించాడు .దీనినే ‘’డెత్ బెడ్ ఎడిషన్ ‘’అంటారు అందులో తనను తాను ‘’hard cased dilapidated ,grim ,ancient selfish or time banged conch –no legs ,utterly un locomotive –cast up high and dry on the shore sands ‘’అని వర్ణించుకొన్నాడు .1891లో న్యుమోనియా సోకింది .దీనికి తోడూ క్షయ ముదిరిపోయిందని రిపోర్టులు తెలిపాయి .వింటర్ గడిచింది .26-3- 1892 న 73 వ పుట్టిన రోజు ఇంకొక రెండు నెలలు ఉందనగా అమెరికన్ ఆధునిక మహాకవి వాల్ట్ విట్మన్ భువి నుండి దివికి చేరాడు .

పెళ్ళికాని ముదురు బ్రహ్మ చారి విట్మన్ .ఎక్కడా లవ్ అఫైర్ లేనివాడు .ఆయన పుస్తకమే ‘’ఒక వర్డ్ ‘’అంటే శాసనం .ప్రజాస్వామ్య బైబిల్ ‘’అన్నారు లీవ్స్ ఆఫ్ గ్రాస్  పుస్తకాన్ని .’’a better ,fresher ,busier sphere ,a wide ,untried domain awaits –demands you ‘’అని అభయమిచ్చి పిలిచాడు .ఆధునిక కవిత్వ పరిధిని పెంచినవాడు విట్మన్ .అతని సాంకేతిక సృజన అతి వేగ వంతమైన నాగరకత కు అనునాదం .అతనికవిత్వం భాషలో గొప్ప ప్రయోగం .వాడుక భాషకు అందం కూర్చి  అందలం ఎక్కించాడు.  దాని మూలాలు  అతి విస్త్రుతమై భూమికి దగ్గరై ,ప్రజా హృదయాలకు చేరువైంది .అట్టడుగు జన ఘోషకు దర్పణమైంది .ఆ  భాషా చాతుర్యం అనితర సాధ్యం చేశాడు .గుండెలకు తాకే కవిత్వం విట్మన్ ది .నీ, నా,మనందరి భావాలకు ఆలవాలం .

తాను వివాదాస్పదుడినే   అని చెబుతూ ‘’very well .I contradict my self .I am large –I contain multitudes ‘’ ప్రపంచం అంతా నాలో ఉన్న విశ్వ రూపుడిని అన్నాడు .తన గడ్డిపరక ‘’is no less than the journey work of the stars ‘’అని దాని విస్తృత ప్రయాణాన్ని తెలిపాడు .అందుకే ఎమర్సన్ మహాశయుడు ‘’I expected him to make the songs of the nation –but he seems content to make the inventories ‘’అని విట్మన్ ప్రతిభా విస్తృతికి నీరాజనం పలికాడు .మంచిని చెడుని అందాన్ని వికారాన్ని సమానం గా ఆదరించాడు .లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’monumental mountanious book ‘’అంటారు .అనేక శృంగాలతో పార్శ్వాలతో దేదీప్యమానం గా వెలిగే పుస్తకం .ఆ శిఖరాలు మిరుమిట్లు గొలుపుతాయి .వాటిని చేరటం ,అధిగమించటం ఎవరి వల్లా సాధ్యం కాదు .’’అది ఒక మనిషి’’ ,-_the book is the man ‘’.వాల్ట్ విట్మన్ తన కాలం లోనే కాదు నేటికాలం లో కూడా ‘’టైటానిక్ ఫిగర్ ‘’.

Image result for walt whitmanImage result for walt whitman

మరోప్రముఖునితో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-2-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘంటసాల గానం చేసిన సంప్రదాయ గణేశగీతం

ఘంటసాల గానం చేసిన సంప్రదాయ గణేశగీతం
ఘంటసాల గానంతోనే ఈ నాటికీ దినచర్యను ఆరంభించేవారెందరో ఉన్నారు… విఘ్నాలు తొలగించమంటూ తొలివేలుపుగా వినాయకుని పూజించడం మన సంప్రదాయం… గణపతి సంప్రదాయ గీతం ఘంటసాల గళంలో జాలువారి మనలో భక్తిభావాన్ని నింపింది… గణపతిని స్మరించుకోగానే ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని ధ్యానించుకోవడమూ ఎందరికో ఆచారం… అక్కడా ఆయన గాత్రంలో చిందులు వేసిన గీతమే మన మదిలో మెదలి పులకింప చేస్తుంది…
ఆ పాట నా నోట

హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని ‘ఘంటసాల సంగీత కళాశాల’లోకి ప్రవేశించగానే అదో ధ్యానమందిరంలా తోచింది. టైం పదకొండు అవుతోంది.. లోపలినుంచి ‘నమో వెంకటేశ నమోతిరుమలేశా’… పాట వినిపిస్తోంది. ఎదురుగా కుర్చీలో తామడ శరత్‌చంద్ర ఉన్నారు. ఆయన వెనుక గోడకి వేంకటేశ్వరస్వామి పెద్దచిత్రం ఉంటే.. ఆయనకి ఎదురుగా గోడకి ఘంటసాల వెంకటేశ్వరావు ఫొటో ఉంది. ఘంటసాలగారికి వేంకటేశ్వరుడు ఇష్టం, నాకు ఘంటసాల ఇష్టం అంటూ శరత్‌చంద్ర తన అంతరంగాన్ని ‘నవ్య’తో పంచుకున్నారిలా…
ఘంటసాల పాట సమ్మోహనం.. అది శ్రోతల్ని వివశుల్ని చేసి పరవశింపచేస్తుంది. అలాగే నేనూ పులకించిన వాణ్ణే. అందరూ ‘శరత్‌చంద్రది ఘంటసాల గొంతు…’ అంటారే గానీ అది నిజం కాదు… ‘ఘంటసాల లాగే పాడతాడు’ అనటం కరెక్ట్‌. నేనిలా ఉన్నానంటే అదంతా ఘంటసాల చలువే.. ఆయన పేరుమీద సేవ చేస్తున్నానంతే. మాది శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలోని లంకపేట గ్రామం. అమ్మ పేరు పద్మావతి, గృహిణి. నాన్నగారు బ్రహ్మం పేరున్న నాటకాల గురువు. ఆయన ధర్మరాజు, హరిశ్చంద్ర, అర్జునుడు వేషాలు వేసేవారు. తిరుపతి వేంకటకవుల పద్యాలు బాగా పాడేవారు. హార్మోనియం వాయించేవారు. ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉండడం వల్ల సంగీత రుచి నాకు తెలిసింది… రాగజ్ఞానానికి మా నాన్నగారే నా తొలి గురువు. మేం ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండోవాణ్ణి.
ఆ అందమే చిత్తు చేసింది…
ఏడో తరగతి నుంచే మా ఊరి రామమందిరంలో రాముని చరితపై భజనలు చేసేవాడిని. అప్పటినుంచే భజనలకి హార్మోనియం వాయించటం నేర్చుకున్నాను. పదోతరగతిలో ఉండగా మా రమణాచారి మాస్టారు ‘బ్రతుకుతెరువు’ చిత్రంలో ‘అందమె ఆనందం …ఆనందమె జీవిత మకరందం..’ పాట నేర్పించారు. ఆ పాటని వింటూ పాడుతుంటే ఆ గొంతులో ఏదో తెలియని గమ్మత్తు ఉందనిపించేది.
ఇంటరుమీడియేట్‌లో చదివేటపుడు భజన కార్యాక్రమాలతో పాటు ‘పేరడీలు’ పాడేవాడిని. సినిమా పాటల ట్యూన్స్‌ ఆధారం చేసుకుని దేవుళ్ళ పాటలు పేరడీలుగా పాడేవాణ్ణి. పేరడీ వల్ల ఒరిజినల్‌ సాంగ్‌పై మక్కువ కలిగేది. మంచి హార్మోనిస్టుగా కూడా మా జిల్లాలో నాకు పేరుంది. డిగ్రీ చదివేటప్పుడు ఎలిశెట్టి రామ్మోహనరావు గారి ప్రోత్సాహంతో విజయనగరం జిల్లా గరివిడిలో ‘ఘంటసాల సంగీత సమాఖ్య’ను 1994లో నెలకొల్పాను. ‘జగదేకవీరుని కథ’ చిత్రంలో శివశంకరీ … , ‘పాండురంగమహత్యం’ చిత్రంలోని ‘అమ్మా అనిపిలిచినా…’ పాటలు స్టేజ్‌ ఎక్కి పాడుతుంటే శ్రోతలు ఎంతగానో స్పందించేవారు. తర్వాత తర్వాత నేను ఘంటసాల గారి ప్రభావానికి లోనయ్యాను. ఘంటసాల పాటంటే వెర్రెత్తిపోయేవాణ్ణి. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ఘంటసాల గారి పెద్దబ్బాయి విజయ పేరుమీద మ్యూజిక్‌ చేసేవారు. అందుకని ‘విజయ ఆర్కెసా్ట్ర’ నెలకొల్పి అక్కడిప్రాంతాల్లోని చాలామందిని గాయకులుగా తయారు చేశాను. సింగర్‌ టి.పి. రామకృష్ణగారు పరిచయం కావటం నా జీవితంలోని మరో ముఖ్యమైన మలుపు. వారి ఫ్యామిలీ నన్ను హైదరాబాద్‌ పంపించారు. హైదరాబాద్‌ వచ్చాక కోరమాండల్‌ సిమెంట్స్‌ అధినేతలు లక్ష్మీచంద్రమోహన్‌గారి సహాయంతో ‘స్వరనిధి’, ‘భాగేశ్వరీ సాంస్కృతిక సంస్థ’ లు ప్రారంభించి కొన్ని వందలమంది గాయకుల్ని తయారు చేశాను. ఎన్నో జిల్లాల్లో ప్రోగ్రామ్స్‌ చేశాను.
ఆరు సంవత్సరాల పాటు ఏకధాటిగా హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో సాధన చేశాను. ఘంటసాలగారి పాటలకి నోట్స్‌ తయారు చేసుకున్నాను. అప్పటి సంగీత దర్శకులు ప్లే చేసిన సంగీత పరికరాలు వాడి పాటలు పాడించేవాడిని. పాడేవాడిని. 1994 డిసెంబరు 14 వ తేదీ త్యాగరాయగానసభలో అక్కినేని, నటుడు టి.ఎల్‌.కాంతారావు, జమున, సినారే సమక్షంలో ‘ఘంటసాల సంగీత విభావరి’ చేశాను. అక్కడ దేవదేవ నారాయణ.., మురిపించే అందాలే పాటలు పాడినపుడు ఎంతోమంది నన్ను అభినందించారు. అక్కినేని గారు ‘దేవదాసు’ రాసిన శరత్‌చంద్రని ఎలా మర్చిపోలేనో ఈ శరత్‌ చంద్రని మర్చిపోలేను అన్నారు. సినారె ‘తరుణ ఘంటసాల’ అంటే లేత ఘంటసాల అని అన్నారు.
ఆ మహానుభావుడికి గుడి
2001లో శ్రీకాకుళం జిల్లాలోని లంకపేట గ్రామంలో ఆరెకరాల స్థలంలో ఘంటసాల గుడి ప్రారంభించాను. 2005లో ఆ గుడి పూర్తి అయ్యింది. ఘంటసాల ఆధ్యాత్మిక విగ్రహం ఉన్న ఆ గుడి పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. ఈ గుడిద్వారా సామాజిక సేవ చేస్తున్నాం. గ్రామాలకి మంచినీళ్ళు ఇస్తున్నాం. చెరువులు తవ్విస్తున్నాం. 18 పాఠశాలల్ని దత్తత తీసుకుని అందులోని పేద విద్యార్థులకి ‘స్వామి వివేకానంద మోరల్‌ అండ్‌ టెక్నిక్స్‌’ ద్వారా కంప్యూటర్స్‌ ఇచ్చి 200 మంది పేద పిల్లలకి ఉచిత విద్యను అందిస్తున్నాం. ఇవన్నీ ఘంటసాల పాటల కచ్చేరీల ద్వారా వచ్చిన డబ్బులతోనే సాధ్యమవుతోంది.
ఘంటసాల పాటలు ప్రపంచానికి తెలియజేయాలన్నదే నా ఉద్దేశ్యం. ‘ఘంటసాల సంగీత కళాశాల’ పేరుతో ఘంటసాల పాడిన ఎంతోమంది కవుల సినీ సాహిత్యాన్ని 24 వ్యాల్యూమ్స్‌గా విడుదల చేశాను. తెలుగురాషా్ట్రల్లో మొత్తం ఏడు సంగీత కళాశాలలు నెలకొల్పాను. హైదరాబాద్‌లో ‘ఘంటసాల సంగీత కళాశాల’ ప్రారంభించాను. 2012లో విశాఖపట్నం, ఏలూరు, మహబూబ్‌నగర్‌, తిరుపతి, గుంటూరు, వరంగల్‌ జిల్లాల్లో ఆరు కాలేజీలు నెలకొల్పాను. ఇందులో ఏడు కోర్సులు ఉంటాయి. కోర్సుల్లో ఘంటసాల సబ్జెక్టులు ఉంటాయి.
1. వేదిక (సినిమా సంగీతం), 2.వాహిని(లలిత సంగీతం), 3. విపంచి(లలిత సంగీతం), 4.సంకీర్తన(అన్నమాచార్యుల సిలబస్‌), 5.విశద(యాంకరింగ్‌), 6.సురభి(పద్యసంగీతం), 7.రాగిణి(వాద్యసంగీతం). ఇవి కంప్లీట్‌ చేసుకున్న వారికి సంగీతంలో డిప్లమో సర్టిఫికేట్‌ ఇస్తున్నాం.
ఆ సప్తస్వరాలు కాలేజీలకి అంకితం
ఘంటసాల పాటలపై 2012 సంవత్సరంలో శాంతాబయోటెక్‌ అధినేత వరప్రసాదరెడ్డి గారి సహాయంతో ‘సప్తస్వరాలు’ అనే ఏడు పుస్తకాల్ని విడుదలచేశాను. ఏడు కళాశాలలకు సంబంధించి స- షడ్జమం పుస్తకం హైదరాబాదు కళాశాలకి అంకితం చేశాను. అలానే రి- రిషభం(విశాఖపట్నం), గ-గాంధారం(ఏలూరు), మ-మధ్యమం(మహబూబ్‌నగర్‌), ప-పంచమం(తిరుపతి), ద- దైవతం(గుంటూరు), ని-నిషాదం(వరంగల్‌)కి అంకితం చేశాను. ఇందులో అన్నీ ఘంటసాల గారి పద్యాలు, పాటలే ఉన్నాయి.
ఆయనే నా ఆయుధం
ఘంటసాల సంగీత కళాశాలలో ఏడేళ్ల వయసు నుంచి 70 యేళ్ళవాళ్ల వరకూ విద్యార్థులున్నారు. సంవత్సరానికి 500 మంది విద్యార్థులు ఉతీర్ణులవుతుంటారు. మా కళాశాలలో ఓ ఘంటసాల పాట పాడాలంటే ముందు ఓ పద్యం పాడాలి. పద్యం అమ్మ లాగ, పాట తండ్రిలాగా భావిస్తాను. ప్రపంచంలోని భాషలన్నింటిలో తెలుగువారికి ఉన్న ఒకే ఒక గొప్ప సాహిత్యం పద్యం. ఈ సంగీత కళాశాలలో అందరూ సాధకులే. నేను ఇప్పటివరకూ 3870 కచ్చేరీలు చేశాను. నాకు ప్రదానం చేసిన ‘అభినవ ఘంటసాల’ బిరుదును ఎంతో అమూల్యంగా భావిస్తాను. భారతీయ మహిళాశక్తి సంస్థ గండపెండేరాన్ని తొడిగారు. ఆంధ్రాయూనివర్శిటీ తెలుగు సాహిత్యానికి సేవ చేసినందుకు సత్కరించింది. హార్మోనియంలో అన్ని ఇన్‌సు్ట్రమెంట్స్‌ను పలికించటం చూసి ముగ్ధులై అమెరికాలోని తెలుగువారు 500 ఇంసు్ట్రమెంట్స్‌ ఉండే కీబోర్డుని నాకు బహుమతిగా ఇవ్వడాన్ని నేను మర్చిపోలేను. ఘంటసాల ఆరాధకుడిని. ఆయన పాటే నా ఆయుధం.
నా దృష్టిలో ఘంటసాల
దేవుళ్ళందరూ కలిసి తయారుచేసిన గొప్ప వ్యక్తిగా ఘంటసాలగారు నాకు కనిపిస్తారు. గొప్ప తెలుగుభాషా సేవకుడిగా అనిపిస్తారు. 56 తెలుగు అక్షరాల్ని స్పష్టంగా పలుకుతూ పాడే ఘంటసాల గురించి ఎంత చెప్పిన తక్కువే… అందుకే ‘ఘంటసాల… సంగీత కళాశాల’ అంటాను నేను. ఆయన 658 చిత్రాల్లో 2700 పాటలు పాడారు. 450 పద్యాలు ఆలపించారు. ఘంటసాల ‘భగవద్గీత’ అద్భుతం. 110 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అందులో తెలుగుచిత్రాలు 83. సంగీతజ్ఞులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, జేసుదాసు, బాలు లాంటి గొప్పవారు ఘంటసాల గారిని గ్రేట్‌ అంటారు. నన్ను ఏ ప్రభుత్వాలూ, సంస్థలూ గుర్తించకపోయినా ఫరవాలేదు. ఘంటసాల పాటని ప్రపంచం నలుదిశలా విస్తరింపచేయటమే నా లక్ష్యం. ఓ మ్యూజిక్‌ యూనివర్శిటీని కూడా నెలకొల్పాలని ఉంది నాకు.
 నవ్య డెస్క్‌
ఫోటోలు: జి.శ్రీనివాస్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు –ఆహ్వానం సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

అక్షరం లోక రక్షకం

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు –ఆహ్వానం

76 వ సమావేశం –నమూనా ఆహ్వాన పత్రిక

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలను సరసభారతి 76వ సమావేశం గా ఉగాదికి(మార్చ్ 21) ఆరు  రోజులముందు అంటే 15-3-15 ఆదివారం సాయంత్రం 3-30 గం కు  ఏ .సి . లైబ్రరీలో నిర్వహిస్తోంది .సాహిత్యా భిమానులు ,కవులు పాల్గొని జయప్రదం చేయప్రార్ధన .ఇందులో  పేర్కొన బడిన వారు కాకుండా మరో ఇద్దరు ప్రముఖుల తో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం  .వారి అంగీకారం తెలియ గానే పూర్తీ వివరాలతో ఆహ్వాన పత్రిక ను ఫిబ్రవరి 23 వ తేదీ తర్వాత అంద జేస్తాము .దాన్ని బట్టి వేదిక కూడా మారవచ్చు .

పాల్గొను అతిధులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి మాజీ సభ్యులు

శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు –ఉయ్యూరు నగర పంచాయితీ  చైర్మన్

శ్రీ చలసాని రాజేంద్ర ప్రసాద్ –ఆంద్ర జ్యోతి ఇన్ చార్జ్  –విజయవాడ

డా. శ్రీ జి వి పూర్ణ చంద్-కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి

శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి పత్రిక సంపాదకులు

కార్యక్రమం

1-కవి సమ్మేళనం –జిల్లాలోని ప్రముఖ కవులందరు పాల్గొంటారు –విషయం –‘’నవ్యాంధ్ర ప్రదేశ్ -మరియు హుద్ హు ద్  తుఫాను’’ .-కవిత 10 పంక్తులకు మించ రాదని మనవి .

2-పుస్తకాల ఆవిష్కరణ

1-     శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచన –‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’(2000 ఏళ్ళ సంస్కృత సాహిత్యం లో 145 మంది ప్రముఖ కవుల సాహిత్య పరామర్శ )-

అంకితం –శ్రీ మైనేని గోపాల కృష్ణ(అమెరికా) గారికి –గ్రంధ ప్రాయోజకులు (స్పాన్సర్స్)- శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి మేనకోడలు -డా జ్యోతి ,ఆమె సోదర , సోదరీమణులు (అమెరికా).

‘’పేరడీలు ‘’  రచన – ప్రముఖ హాస్య రచయిత-శ్రీ తాడిమేటి సత్యనారాయణ –అంకితం –స్వర్గీయ బాపు –రమణ లకు  – ప్రచురణ –సరసభారతి

3-స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కార ప్రదానం

పురస్కార గ్రహీతలు -1.శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ –రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ –ఆకాశ వాణి-హైదరాబాద్

2-డా.శ్రీ శలాక రఘునాధ శర్మ –విశ్రాంత  సంస్కృత  ఆచార్యులు –శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం –రాజమండ్రి

3-శ్రీ గుత్తికొండ సుబ్బారావు –కృష్ణా జిలా రచయితల సంఘం –అధ్యక్షులు –మచిలీపట్నం

4-డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ –విశ్రాంత తెలుగు అధ్యాపకులు –గుంటూరు

4-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల ఉగాది ప్రోత్సాహక పురస్కార ప్రదానం

1-‘’స్వయం సిద్ధ ‘’ప్రత్యక పురస్కారంప్రదానం  –

పురస్కార గ్రహీత –శ్రీమతి పెద్దిభొట్ల సౌభాగ్య లక్ష్మి –తెలుగు పండిట్ –ఉయ్యూరు .

2- వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి పురస్కార ప్రదానం –

పురస్కార గ్రహీతలు –   1-శ్రీ కళాసాగర్ –‘ప్రముఖ చిత్రకారులు ‘’64 కళలు ‘’మాసపత్రిక సంపాదకులు – విజయవాడ

2-శ్రీమతి చలపాక శిరీష –డి.టి పి స్పెషలిస్ట్ –విజయవాడ

3-శ్రీ పాషా –ఈనాడు –విలేకరి –ఉయ్యూరు

4-శ్రీ రాజా –‘’మనచానల్ ‘’రిపోర్టర్ –ఉయ్యూరు

5- శ్రీ గూడవల్లి రామా రావు –పోస్ట్ మాస్టర్ –ఉయ్యూరు

6-శ్రీ జి వి.రమణ –మేనేజింగ్ డైరెక్టర్ –జాగృతి పొదుపు సహకార సంస్థ –ఉయ్యూరు

జోశ్యుల శ్యామలాదేవి    మాదిరాజు శివలక్ష్మి గబ్బిట వెంకట రమణ వి బి జి. రావు    గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు             కార్య దర్శి             కోశాధికారి        సాంకేతిక నిపుణులు   సరసభారతి అధ్యక్షులు

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

12-2-15 –ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అమరగాయకుడు ఘంట సాల వర్ధంతి-అక్షర నివాళి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వీడు సామాన్యుడు కాదు


 


 


గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-2

 మినీ  ద్విపద్స్-2

13-ధిల్లీ లో ‘’చీపురు ‘’

  తీసిన కాంగీ’’ ఉసురు ‘’.

14-భారీ మెజార్టీ లో’’ ఆప్’’

   బి .జె.పి. పరువు ‘’చుప్ ‘’

15-కేర్జీ’’ సామాన్యుడు ‘’

   నేడు ‘’అసామాన్యుడు ‘’.

16-వ్యూహం బెడిసి’’ అమిత్ షా ‘’

    రాచకీయ చదరంగానికి   ‘’బిగ్  షా ‘’.

17- వేతన జీవులకు భారీ హిట్ ‘’ఫిట్ మెంట్ ‘’

  బాబు ఆలోచనలో గొప్ప ‘’బెటర్ మెంట్ .’’

18- మళ్ళీ’’ నితీష్ ‘’బీహార్

  మాంఘి బతుకు ‘’బేజార్ ‘’.

19-కేజ్రీవాల్  నేడు ధిల్లీ’’ పాదుషా ‘’

   అమిత్ పని పొయ్యిలో ‘’బాదుషా’’.

20-అవినీతి అంతానికి ‘’పట్టాభిషేకం ‘’

  ధిల్లీ వోటర్ చేసిన’’హర్షాభిషేకం ‘’.

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-2-15- ఉయ్యూరు

 

 

Posted in కవితలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -6(చివరిభాగం )

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -6(చివరిభాగం )

హైదరాబాద్ లో ‘’కదా సమ్మే ళనాలలో ‘’పాల్గొన్నారు .అజంతా ఎల్లోరాలు చూసి ఆ నేపధ్యం తో కద రాశారు .శ్రీ కృష్ణ దేవా రాయా౦ధ్ర భాషా నిలయం లో బుచ్చి బాబు అధ్యక్షత జరిగిన తోలి కధక సమ్మేళనం లో పాల్గొని బుచ్చిబాబు చేత ‘’ఇంత వరకు సాహిత్య వారసులు లేని నాకు –వారసుడై వచ్చి –నన్ను మురిపిస్తున్న వీరుడు ఈ వీర్రాజు –ముందు ముందు నన్ను మరిపించినా మరి పించగలడు’’అని సభా ముఖం గా వీర్రాజు గారికి కితాబిచ్చాడు .ఆ మాటల్లో ‘’బలమైన ఇతి వృత్తం  దొరికి –కొత్తగా చెప్పగల నేర్పుంటేనే రాయటానికి ప్రయత్నిం చాలనే ‘’హెచ్చరిక కనిపించింది .తన కధలన్నీ కలిపి’’ చేతి  కందేవి  ఓ పిడికెడు మాత్రమె ‘’అని అన్నారు .తురగా దంపతులు ,వాకాటి పోరంకిలు ,సింగరాజు ,నిఖిలేశ్వర్ వగైరా సాహితీ మిత్రులతో కాలక్షేపం బాగానే ఉండేది .తనను తానూ చైతన్య పరచుకొని –ఆధునిక చిత్రాలు వేశాకే –భాగ్య నగర చిత్రకారులు వీర్రాజు గారిని గుర్తించారు .వడ్లమాని మధుసూదన రావు ప్రతిభ గల చిత్రకారుడు .ఆయన్ను గురించి ఆర్ట్ మేగజైన్ ‘’కళా రత్న ‘’లో ప్రశంసా వ్యాసం రాశారు .ఆయన ఒక సంస్థకు ఆఫీస్ బేరర్ గా ఉండి ఆర్ట్ ఎక్సి బిషన్ లో పాల్గొనడం నచ్చక చిన్న చురక కూడా వేశారు వ్యాసం లో .దానికి ఆయనకు కోపం కూడా వచ్చింది .ఇద్దరికీ షస్టాస్టకం అయి అకాడెమీ మెట్లేక్కడం మానేశారు వీరాజీ .

పుస్తకాలకు ముఖ చిత్రాలేసి తృణమో ఫణమో రాబడిపొందారు .అదే తన ‘’కళా మార్గమైంది ‘’.’’సాహిత్యం పడుగై –చిత్రలేఖనం పేకై –కలనేతగా జీవితాన్ని  అల్లుకున్నాయి ‘’.’’జీవితాన్ని కళాత్మకం గా తీర్చి దిద్దుకొనే మిత్రుడు దివి శ్రీధర బాబు పరిచయం తో సంగీతం లోనూ వేళ్ళు పెట్టి అది రాని విద్యని రూఢి చేసుకొన్నారు .’’భారత్ కళా పరిషత్ ‘’లో సంయుక్త కార్య దర్శి పదవి కట్టబెడితే సమర్ధ వంతం గా పనిచేసి సభలు ప్రదర్శనలు నిర్వహించి ‘’కళ’’వార్షిక సంచికలను సుందరంగా తీర్చి చిత్రకళా రంగం లో గ్రంధాలు లేని లోటు తీర్చారు వీర్రాజుగారు .ఈ సంచికల సంపాదకుడు చలసాని ప్రసాద రావు ‘’మాటలకు అంటిన రాగాన్ని తుడిచి –కవిత్వాన్ని అద్దిన వాడు ‘’సామాన్యుల బాధల గూళ్ళల్లోకి కవిత్వాన్ని లాక్కొచ్చిన వాడు –వచన కవిత్వ జెండాను ఎత్తు గా ఎగరేసిన వాడు ‘’వచన కవిత్వానికి కేటలిస్టై వ్యాప్తిని వేగవంతం చేసినవాడు’’గా  కుందుర్తిని కీర్తించారు .

‘’కొడిగట్టిన సూర్యుడు ‘’కి ఫ్రీ వర్ష ఫ్రంట్ అవార్డ్ రావటం వీర్రాజు గారి ‘’సాహిత్య జీవితానికి తోలి బహుమతి ‘’.అడక్కుండానే ఒకటీ అరా  ఆకాశ వాణి ప్రోగ్రాములు వర్షించాయి .ఆ వాణి తనకు ‘’రాదారి కాదు ‘’అని తెలుసుకొన్నారు .’’సిగరెట్ పాకెట్ తెమ్మన్న ‘’అధికారి ఆధిపత్యాన్ని కాదని వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ఆకాశ వాణి మెట్లు ఎక్కనే లేదు అభిమానధనుడైన వీర్రాజుగారు .ఆయన మీదేకాదు ‘’ఆకాశ వాణిమీద సైతం అసహ్యం తుళ్ళి పడి ఇప్పటికీ నన్ను –నా కాళ్ళు  ఆ మెట్లు ఎక్కనివ్వలేదు ‘’అని సగర్వం గా చెప్పుకొన్నారు .ఆంద్ర ప్రదేశ్ పత్రిక చిత్రాలకోసం  కుందుర్తి ,గోపాల చక్ర వర్తి తో బాటు కాకతీయ చిత్ర వైభవాలను కళ్ళారా చూసి ,యాదగిరి లో నరసింహ స్వామి గుడిప్రదక్షిణ కోసంసం అవిటికాలి చక్రవర్తికి బుజాలు ఆసరాగా తానకు  ఇష్టం లేకున్నా తిరిగారు .స్నేహితుడి ఊరికి వెళ్లి ‘’ఒక్క కరెంటు తీగైనా ఊరిని అల్లుకోకపోవటం ‘’చూసి ఆశ్చర్య పోయారు .

సాహితీ సాంస్కృతిక సంస్థ  వారి’’ యువ భారతి ‘’లో ‘’నా ముఖ చిత్రాను బంధం –నాకో చిక్కని సాధనమై –సాహితీ వేత్తలకు మా ఇంటికి రహదారి మార్గమైంది ‘’అని సంతోషం తో ఉప్పొంగారు .అది ‘’తెరిచిన ద్వారమే ‘’అయింది అందులో వందకు పైగా ముఖ చిత్రాలు వేసిన ఘనత రాజు గారిది .’’సాహితీ వేత్తలకు నేనొక చిత్రకారుడిని మాత్రమె –కవులకు కధకుడిని –కధలకు  కవిని ‘’అని ఆవేదన చెందారు .ఎవరికి వారు వీర్రాజుగారిని వారి రంగం లో చొరబాటు దారునిగానే భావించారు .అదీ ఆశ్చర్యం .ఒరిస్సా లో భువనేశ్వర్ వెళ్లి అక్కడి కళా సంస్కృతికి నీరాజనాలు అందించారు ‘’కలింగ రాజుల దిల్ప కళాభిమానానికి –శిధిల భువనేశ్వరం ఒక నిదర్శనం ‘’అన్నారు .’’లింగ రాజుదేవాలయం ‘’ఒక దేవాలయ గుచ్చం ‘’అని ముగ్ధులయ్యారు .అవన్నీ స్కెచ్ బుక్ నిండా నింపుకొని సంతోష పడ్డారు .వాటిని దర్శించటానికి రెండుకళ్ళు చాలవు అన్నారు .

యెర్ర భావాలు మనసులో పరచుకొని కొత్తగా రాసింది అంతా వామపక్షం గానే కనిపించింది .మెల్లగా కద వెనక బడి కవిత్వం ముందుకు సాగింది ‘’.మైనా నవలకు అకాడెమీ పురస్కారం వచ్చినా ఆ ప్రభావం పడలేదు. కదా ,నవలా  మళ్ళీ  బలాన్ని పుంజు కోలేదు ‘’అని నిజాయితీగా చెప్పారు .దిగంబర కవులలో ఆరుగురి లో అయిదుగురు  తన ఆత్మీయ మిత్రులే అయినా ‘’యెంత మాత్రం వారి చర్యల్ని సమర్ధిం చని వాడిని .’’అన్నారు ‘’రాజ్యం మీద చూపాల్సిన కోపాన్ని –సమాజం మీద చూపటం సరికాదు ‘’అని తన మనసులో మాట బయట పెట్టారు .’’విరసం తెలుగు సాహిత్యాన్ని –ఒక మలుపు తిప్పింది ‘’అని నమ్మారు .’’విరసీయున్ని ‘’కావటానికి ప్రయత్ని౦చ లేదన్నారు .

లేపాక్షి శిల్ప సౌందర్యాన్ని చూడటానికి వెడితే ‘’ఆరు బయట తాపీగా చతికిల బడి గత వైభవాన్ని నేమరేసుకొంటూ –ఇళ్ళ కప్పుల మీద నుంచే’’ మూపెత్తి’’స్వాగతం పలికాడు –నల్ల సేనాపు రాతి లేపాక్షి బసవయ్య ‘’.లేపాక్షి శిలా సంపదను కాపాడిన వాడు ‘’కల్లూరి సుబ్బారావు – అందుకాయనకు  తెలుగు  జాతి –రుణ పడి ఉండక తప్పదు ‘’అన్నారు .శ్రీధర బాబు జర్మనీ వెళ్లి అక్కడ వీర్రాజుగారి చిత్రాలను ‘’వన్ మాన్ షో  ‘’గా ఏర్పాటు చేయగా ‘’నా కళా జీవితానికి ఒక కలికితురాయి అయింది ‘’అని ఏంతో సంతృప్తి చెంది మిత్రునికి క్రుతజ్ఞాతాంజలి ఘటించారు .శ్రావణ  బెల్గోలా వగైరా దర్శించి రేఖల్లో చిత్రాలుగా మార్చుకొని లారీ ప్రయాణం లో ఆ ‘’చిత్ర సంపద ‘’క్రిష్ణార్పణ’’మై చేజారిపోయింది .గుర్తొచ్చినప్పుడల్లా అది ‘’మనసులో ముల్లై కలుక్కున –గుచ్చుకొని బాధిస్తూనే ఉంది ‘’అంటారు.

వీర్రాజు గారికి ‘’స్నేహం ఊపిరి –చైతన్య లహరి ‘’.’’కవితా జైత్ర యాత్రలో –రధం మీద రక్తం  సూర్యుడ్ని –జెండాగా పాతుకున్నకవి –కవిత్వాకాశం లో మధ్యందిన మార్తాండుడు ‘’కే శివారెడ్డి అని ఆయన తన సన్నిహిత మిత్రుడని చెప్పుకొన్నారు ‘’’స్వాతి మాస  పత్రికకి  -ఇంట్లోనే పురుడు పోసి –ఏడాదిపాటు సాకిన ‘సాహితీ చిత్రకళా మంత్రం సాని వీర్రాజుగారు  .’’నడిచే చదువుల చెట్టు-రోణంకి అప్పలస్వామి ‘’పట్ల గౌరవం తోబాటు మేన మామ కుటుంబం తో ఆయనకున్న సాన్నిహిత్యం మరీ దగ్గరకు చేర్చింది .ఉత్తరాయణం ప్రేమాయణం గా  మారి మేనమామ కూతురు ‘’ఉత్తరాల సుభద్రా దేవి ‘’తో వివాహం  అప్పలస్వామి గారి అధ్యక్షతన –వైదిక ఆచారాలకి –వేద మంత్రాలకీ  దూరం గా’’బంధు మిత్రుల చప్పట్లే –బాజా భజంత్రీలు బ్యాండ్ వాయిద్యాలుగా –సభా వివాహం గా ‘’జరిగింది .’’ఒకరికొకరు తోడుగా ఉండాలని –ఒకరి కొకరం నీడగా ఉండాలని –సమిష్టిగా నిర్ణయించుకొని –గట్టిగా చేతుల్ని పెనవేసుకొని –వ్యక్తీ నుంచి కుటుంబం లోకి –కుటుంబం నుంచి సమాజం లోకి –అడుగు తీసి అడుగు వేస్తూ –పరస్పరాభి రుచుల కల నేతగా –జీవితాన్ని నేయటానికి –శ్రీకారం చుట్టుకోన్నాం ‘’అని వీర్రాజు గారు వివాహ మహాత్మ్యాన్ని సింపుల్ గా వివరించి శుభం పలికారు .

శుభం భూయాత్

Inline image 1Inline image 2

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-2-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -5

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -5

యువజనోత్సవాలలో గీసిన చిత్రాలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాటిని చూసి రాజమండ్రి సబ్ కలెక్టర్ ‘’పెంకులు విరిగిపడి ,గోడలు పెచ్చులూడి –రోగిష్టి రూపు తేరిన ‘’వీర్రాజుగారింటికి వస్తే ఆశ్చర్యం తో నమస్కారమైనా చేశాడో లేదో తెలీని అయోమయం లోపడ్డారు .చిత్రాలు చూసి  రెండుకోనుక్కొని వెళ్ళారు .హైదరాబద్ వస్తే కలవమని చెప్పారు .’’చిత్రకళలోనూ ,చదువు లోను విద్యార్ధి దశ దాటని నన్ను –వెతుక్కుంటూ వచ్చిన ఆ కళాభిమాని కి –కప్పూ సాసర్లు మంచివి లేవని –కాఫీ నీళ్ళయినా ఇవ్వనందుకు ‘’సిగ్గుపడ్డారు .కాని ‘’విరిగిన కప్పులనైనా ఆత్మీయం గా అందుకొనే ఆయన  హృదయ సౌందర్యాన్ని –గుర్తించని గుడ్డి  వాడి నయినందుకు  ‘’–మరింత సిగ్గు తో కుంచించుకు పోయారు .

పోటీల  ఇన్ చార్జి లెక్చరర్ రెబ్బా ప్రగడ సూర్య నారాయణ మూర్తిగారు ‘’వాటర్ బరీస్ కాంపౌండ్ టానిక్ ‘’ఇంటికొచ్చి మరీ చేతిలో పెడితే ఆయన అభిమానాన్ని వెర్రిగా భావించి ఫ్రెండ్స్ తో కలిసి పకపకా నవ్వుకున్నారు.కాని వారం తిరక్కుండా అనారోగ్యం పాలై పొడి దగ్గుతో బాధ పదడి డాక్టర్ కు చూపిస్తే అర్భకుడైన ఆయనకు బలమైన ఆహారం అవసరం అని చెప్పితే కాని లెక్చరర్ గారి ఔదార్యం తెలిసిరాలేదు .తెలిసి  ఎన్నో సార్లు కనిపించినపుడు చేతులెత్తి నమ్స్కరించారో తెలీదు .రోగం సంగతి కప్పిపెట్టి ఇంట్లో ఎవరికి చెప్పలేదు .రాసిన ప్రతి దానికీ డబ్బు రాలేదుకాని గీసిన ప్రతిదీ డబ్బు సంపాదించి ఇచ్చింది .ఆంద్ర ప్రభ వీక్లీ లో’’ పిల్లల బొమ్మల జాతకకధ’’లకు  ముప్ఫై వారాలపాటు చిత్రాలు గీసి  రెగ్యులర్ ఆదాయం పొందారు .మూడోపుస్తకం అమ్ముడై ,నవల ఒక ప్రసిద్ధ పత్రికలో సీరియల్ గా వచ్చింది .

కాకినాడ కరెంటాఫీసులో ఉద్యోగం వచ్చినా చేరకుండా హైదరాబద్ లో కృష్ణా పత్రిక లో ఉద్యోగానికే మొగ్గుచూపారు .పర్మనెంట్ ఉద్యోగం కాకపోయినా అభిరుచి అటు లాక్కెళ్ళింది .గోదావరి తీరాన్ని వదిలి ‘’మూసీ కే కినారే’’ కి చేరారు .’’నెలకు ఒకటిన్నర పచ్చ నోట్ల జీతం ‘’.’’అర్ధ రాత్రి దాటేవరకూ మేలుకొని –ఉదయం బారెడు పోద్దేక్కే దాక లేవక పోవటం –నవాబుల నగరానికి అలవాటు ‘’అని వచ్చిన రోజే గ్రహించారు .తోలి జీతం ఇంటికి పంపి తృప్తి చెందారు .కృష్ణా పత్రిక కాంట్రాక్ట్  కంట్రీబ్యూటర్ రావూరి భరద్వాజ .ఆయన రాస్తున్న సీరియల్ ‘’పరిస్తితుల వారసులు ‘’పత్రికలో వస్తోంది ‘’ఇప్పటికీ నాకు గుర్తుండిపోయిన మంచికద ‘’అని మెచ్చారు .’’మంజు శ్రీ గా లబ్ధ ప్రతిస్తుడైన అక్కిరాజు రమాకాంతరావు ‘’రిసేర్చ కుడు .‘’ నగ్నముని అయిన కేశవ రావు పుస్తక భా౦ డాగారుడు .రామడుగు రాదా కృష్ణ మూర్తీ మిత్రులయ్యారు

వీర్రాజు గారి పొడి దగ్గు క్షయ గా మారింది .’’’క్షయ పురుగులు ఊపిరి తిత్తుల్ని కావలించుకొని అల్లుకు పోయి,.మూడు చోట్ల కేవిటీలు (బొక్కలు)పెట్టాయి  ‘’అని చెప్పుకొన్నారు .ఆదుకొని హాస్పిటల్ లో చేర్పించిన వాడు కళాభిమాని పంజాబీ సింగు గారు. ‘’నిజం గా పునర్జన్మ ప్రసాదించిన మహానుభావుడు ‘’అని సింగుకు వందనం చేశారుకవిత్వం లో .ఇంట్లో వారికి తెలీకుండా మేనేజ్ చేశారు .ఆస్పత్రి వాతావరణాన్ని వర్ణిస్తూ ‘’బంధువుల పరామర్శల పవన స్పర్శలు లేవు-ఆత్మీయుల సానుభూతి శీతల తుషారాలు లేవు—మిత్రుల స్నేహ కరచాలనలూ లేవు ‘’అని బాధపడ్డారు మరి ఉన్నదేమిటి ?’’నిశ్శబ్దాన్ని తూట్లు పొడిచే రోగుల మూల్గులు తప్ప ‘’—భయం చిలుము పట్టి వన్నె తరిగిన పీడాకార ముఖాలున్నతప్ప –కన్నీటి కెరటాల మీద తేలి పోయే రోగిష్టి శరీరాలు తప్ప –‘’అని ఆ భయంకర వాతావరణాన్ని తెలిపి ఇంకాస్త వివరంగా ‘’గుండె గుబురులో –గుబులు ముళ్ళ గాయానికి –చిరు నవ్వు లేపనాల చల్లని పూతల్లేని –సంతోష సరోవరం లో ఆహ్లాద వివరాల్లేని –కంటి రెప్పల వెనక సుందర స్వప్నాలు లేని –భయ పెట్టె కల్లోల సముద్రం లో –చిల్లు పడవ ప్రయాణం –ఇదీ ఇక్కడి జీవితం ‘’ ఈ విచిత్ర భయానక పరిస్తితులలో’’అందాలోలికే  హాస్పిటల్ బిల్డింగ్ –‘’చిక్కటి చీకటి మధ్య తెల్లగా మెరిసిపోయే –సామూహిక సమాధి అవుతుంది ‘’అన్నారు .

ప్రక్రుతి ఎలాకనిపించింది  ‘’చల్లగా కనిపించే మచ్చల చంద్రుడు –చీడ పట్టిన ఊపిరి తిత్తి అవుతాడు –నిద్ర పోయే ముందు కన్ను గీటి కవ్వించిన నక్షత్రాలు –మెరిసే గుడ్ల గూబల కళ్ళవుతాయి .’’అని చెప్పారు .రోగులెలా ఉంటారు ?’’ఒకరికొకరు మిత్రులై –ఒకరికొకరు ఆత్మీయులై –ఆప్తులై –  యేకాంతాలను దాటుకొని తమ నుంచి తాము దూరం గా పారిపోతూ౦టారు ‘’అని క్షవ్యాదిగ్రస్తుల మనోభావాలను తెలిపారు .క్షయకు’’ స్త్రేప్టో మైసిన్ ‘సంజీవనిగా మందు వచ్చి నాలుగేళ్ళు అయినా ఇంకా జనాలలో భయం పోలేదన్నారు .’’ఒక్కన్నే-నే నోక్కన్నే-నాలో నేను చూసుకొంటూ –‘’గడిపానని చెప్పుకొన్నారు .పూర్తిగా వ్యాదినయమై ఇంటికి చేరారు ‘’తమ్ముళ్ళు చెల్లాయిల కళ్ళు పుచ్చపువ్వులయ్యాయి ‘’మిత్రులు కళ్ళతోనే చురకలేశారు .వీరాజీ మళ్ళీ జన జీవన స్రవంతిలో చేరిపోయారు .

‘’నిస్వార్ధ స్నేహానికి ,నిజమైన మైత్రికి –శిల్పించిన చిహ్నమై ‘’న మల్లెశుకు ‘’రంగుటద్దాలు ‘’అంకితమిచ్చి అభిమానాని ప్రకటించుకొన్నారు .వినుకొండ నాగరాజు నవల ‘’తాగు బోతు’’కు ‘’ముందుమాట రాయించి –లేని గౌరవం కల్పించటం ‘’అతని ఆత్మీయతకు చిహ్నం అని చెప్పుకొన్నారు .అరవై దశకం లోనే రెండు నవలలను పూర్తిగా ‘’చైతన్య స్రవంతి ‘’ శిల్పం లో చెక్కాడు నాగరాజు .’’ఎనిమిది నెలల శ్రమ ఫలితం గా ‘’మైనా ‘’నవల యెగిరి వచ్చింది .ఆ  నవలను ఆంధ్రపత్రికకు పంపిస్తే ‘’పాఠకులకు శైలీ ,ఇతి వృత్తాలు  అందుబాటులో లేవు  ‘’ అని తిరస్కరించి పంపిన నవల మైనా అవార్డ్ విన్నర్ అయింది తర్వాత..నగరం లోని సాహితీ వేత్తలకు పరిచయం చేశాడు వీర్రాజుగార్ని శ్రీ వాత్సవ .’’కొత్త ఆలోచనలకు అవకాశం లేని –చాదస్తాల ముక్క వాసనల మధ్య –ఊపిరి సలపక ‘’కృష్ణా పత్రిక ‘’నుండి వైదొలగారు .పరిచయాలు స్నేహాలతో –సాహిత్య  వాతావరణాన్ని నా చుట్టూ అల్లుకొని –నన్ను నేనే వెలిగించుకొంటూ –నాకు నేనే ప్రోత్సాహం ఇ చ్చుకొంటూ ‘’ మరోనవలకు శ్రీకారం చుట్టారు .

సమాచార శాఖలో ద్యోగం ఉందని చెప్పి బోయి భీమన్న ప్రభుతోద్యోగానికి ఇష్టపడని వీర్రాజుగారిని ఒప్పించి దరఖాస్తు చేయించారు .ఇంటర్వ్యు లో  సెలక్ట్ అయి ‘’సహాయ అనువాదకుడు ‘’గా చేరారు .’’ఆంద్ర ప్రదేశ్ ‘’మాసపత్రికకు ఎడిటర్ వడ్లమూడి గోపాల క్రిష్నయ్య సంతకం కింద ఎప్పుడూ ‘’వాజ్మయ మహాధ్యక్ష ‘’అని చేర్చి రాయటం అలవాటున్నవాడు .తన నీడను చూసి తానె భయపడే వింత మనిషి .ఆయనకున్న బ్రాహ్మణ ద్వేషమే వీర్రాజు ను దగ్గరకు తీసిందట ‘’విజ్ఞానం  తో వికసిం చాల్సిన బుద్ధి కుం చిం చుకు పోవటానికి హేతువు అక్కర్లేడుకదా “’అంటారు విశాల హృదయం తో .కుందుర్తి ఆంజనేయులు గోపాల చక్రవర్తి ‘’సమాచార శాఖకు కవితాలంకారులు ‘’అన్నారు .ఏడాది తర్వాత కవిత్వాన్ని మోసుకెల్లి  కుందుర్తి కి  చూపి దగ్గరయ్యారు ‘’ఇదేనోయ్ నేను కోరేదీ –నాకు కావాల్సిందీ ‘’అని మెప్పుకూడా లభించింది .ఆయన ‘’అభినందన చూపులతో ఆలింగనం చేసుకొంటే-ఆనంద బాష్ప దారనై కారిపోయాను నేను –దూదిపింజనై తేలిపోయాను ‘’ అని ఆ ఆత్మీయతకు కవితాత్మ చేర్చి పొంగిపోయారు .’’కవుల దారిలో చొరబాటు దారుడిని నేను ‘’కసురుకోకుండా మెచ్చుకున్నందుకు మురిసిపోయారు .కుందుర్తి పీఠికతో ‘’కొడిగట్టిన సూర్యుడు ‘’రాస్తే శ్రీపతి అచ్చేసి జనం ముందు నిలబెట్టాడు .

 

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-2-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మన్మథ నామ సంవత్సరపంచాంగ ఆవిష్కరణం

ఆస్తిక  మహాశయులకు నమస్కారం,

శ్రీ కంచికామకోటి పీఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ జయేన్ద్రసరస్వతీ స్వామివారు ఫిబ్రవరి 10 (మంగళ వారం) సాయంత్రం 4:30 కు , సికిందరాబాదు స్కందగిరి దేవాలయము నందు, మన శ్రీ జనార్దనానన్ద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ యొక్క మన్మథ నామ సంవత్సర పంచాంగమును ఆవిష్కరించబోవుచున్నారు.

కావున మీరందరూ ఈ కార్యక్రమముయందు పాల్గొని శ్రీ స్వామివారి ఆశీస్సులను పొందవలసినదిగా కోరుచున్నాము.

తూములురు శాయినాథ  శర్మ, శ్రీ జనార్దనానన్ద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ +91-94905-13438 
పసుమర్తి బ్రహ్మానంద శర్మ, శ్రీ జనార్దనానన్ద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ +91-98490-11009
కుప్పా శ్రీ ఆంజనేయ శాస్త్రి, శ్రీ వేద వ్యాస పాఠశాల, +91-40-6444-8800

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -9

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -9

5-   ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్-2

అమెరికా పేపర్లన్నీ విరుచుకుపడ్డాయి .’’A mass of mombast ,,egotism ,vulgarity ,and nonsense ‘’విట్మన్ రాసిన ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్’’ను నిజంగానే గడ్డిపరకల కింద జమకట్టాయి .ఇంకొంచెం ముందుకు వెళ్లి ‘’the author should be kicked from all decent society as below the level of the brute ‘’అన్నారు .విదేశాలలో సైతం ఇదే విమర్శలోచ్చాయి ‘’ది లండన్ క్రిటిక్ ‘’ఇంత అమర్యాద కవిని అమెరికా ఎలా భరిస్తోందో ?’’అని ఛీత్కరించింది .న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ‘’గడ్డిపరకల రచయిత సగం మనిషి సగం మృగం .అతని మూలాలు పంది దొర్లే బురద గుంటలో ఉన్నాయి ‘’అన్నది .వీటికి అతీతం గా మొదటి గుర్తింపు ,ప్రశంసా న్యు ఇంగ్లాండ్ ప్యూరిటన్ చార్లెస్ ఇలియట్ నార్టాన్ ‘’నుంచి లభించింది ‘’whitman is a new light in poetry ‘’అంటే ,ఎడ్వార్డ్ ఎవెరెట్ హేల్ అనే బోస్టన్ క్లేర్జిమన్ ‘’కొత్తదనం తో కవిత్వం వచ్చింది .తాజాగా ఉంది .చాలా సాధారణం గా ఉంది .మనసులోని భావాలను మాటల్లో ఎలా చేబుతామో కవిత్వం లో అలాచేప్పి కొత్త దారి తొక్కాడు ‘’అన్నాడు .

వీటన్నిటికి మించి గొప్ప కవి రచయితా దార్శనికుడు ఎమర్సన్ ‘’Dear sir ,I am not blind to the worth of the wonderful gift of ‘’Leaves of Grass ‘’.I find it the most extraordinary piece of wit and wisdom that America has yet contributed .I am very happy in reading it ,as great power makes us happy – I give you joy of your free and brave thought .I agree you at the beginning of a great career ‘’అని ఆ కొత్త గొంతుకను మెచ్చి వెన్ను తట్టాడు .ఆ దార్శనికుని అభినందన కోటి ఏనుగులబలమైంది విట్మన్ కు .అంతే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలగ లేదు .ఈ భవిష్యత్ దీవన ఫలించటానికి మరికొంతకాలం పట్టింది .మధ్యలో అనేక అవాంతరాలు అడ్డంకులు కల్లోలాలు ఎదురు దెబ్బలు వైఫల్యాలు ఎదుర్కోవాల్సి వచ్చింది

విట్మన్ దృష్టిలో సెక్స్ అనేది మనిషి జీవితం నుంచి దూరంపెట్టాల్సిన విషయం కాదు జీవితం లో భాగమే .ఇప్పటి మన’’ జగన్’’ లాగా అందర్నీ కౌగలించుకొని ఓదార్చేవాడు .సానుభూతి చూపేవాడు .నుదురు మెడ వక్షోజాలు అన్నీ తాకి ఆడా మగా తేడా లేకుండా హత్తుకొని వారితో కలిసిపో యేవాడు .అందరు అతని ఒడార్పులో కరిగి నీరయ్యేవారు .దుఖోపశమానం పొందేవారు. హృదయం లో ఉన్న బాదాగ్ని ని అతని చల్లని స్పర్శ చేత పోగొట్టుకోనేవారు .అంటే అతనిది ‘’హీలింగ్ టచ్ ‘’అన్న మాట .’’సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్ ‘’లో తన మనోభావాన్ని ‘’I celebrate my self ,and sing my self –And what I assume you shall assume –For every atom belonging to me ,as good belongs to you ‘’అని వారితో అభేదాన్ని పొందాడు .తాదాత్మ్యత చెందాడు. సహ వేదన చూపాడు. సాను భూతి ప్రదర్శించాడు .మమేకం అయ్యాడు . అమెరికా చరిత్రలో ఒక కవి ఇంతగా ప్రజా సన్నిహితుడు అవటం ఇంతకూ ముందెన్నడూ లేదు .ఇదే మొదలు అందుకే ఆరాధనీయుడయ్యాడు .దీనజన బా౦ధ వుడయ్యాడు .అదో జగత్ సహోదరులకు ఆప్తుడయ్యాడు .శ్రీ శ్రీ లాగా కవిత్వం రాసి వారి మానాన వారిని వదిలేయ లేదు .వారిలో ఒకడయ్యాడు .అదీ విట్మన్ ప్రత్యేకత .

గడ్డిపరకల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి .కొత్తవి చేర్చి ప్రచురిస్తూనే ఉన్నాడు .మూడవ ముద్రణ తర్వాత 456 పేజీలతో 124 కొత్త కవితలను చేర్చి ప్రచురించాడు .1891 విట్మన్ కంటి తో చూసుకొన్న తొమ్మిదవ ప్రచురణ వచ్చింది .పేజీలు  ముద్రణ సంఖ్యా పెరుగుతోన్దేకాని ఆదాయం దానిపైన ఏమీ పెద్దగా రాలేదు .దాదాపు రెండేళ్ళు నిరాహారం గా ఉండిపోయాడు అంటే ముక్కున వేలేసుకొంటాం .లాభం లేదని మళ్ళీ జర్నలిజం గడప తొక్కాడు .బ్రూక్లిన్ డైలీ టైమ్స్ ఎడిటర్ అయ్యాడు .బాగా రాసి దూసుకుపోతుండగా అమెరికన్ రాష్ట్రాల మధ్య అంతర్ యుద్ధం వచ్చి సోదరుడు జార్జి  ఫ్రెడరిక్ బర్గ్ యుద్ధం లో తీవ్రం గా గాయపడితే అతనికోసం బ్రూక్లిన్ వదిలి వెళ్ళాల్సోచ్చింది .

అప్పటికే నలభై రెండేళ్ళు వచ్చిన విట్మన్ ముసలాడినని భావించటం క్వేకర్ భావాలున్డటం వలన ఆయుధం పట్టకూడని  సైనికుడుగా నమోదు కాలేదు .గాయాలపాలైన జార్జికి కట్టు కడుతూ వాషింగ్టన్లోనే 12ఏళ్ళు ఉండిపోయాడు .అంతకు ముందే బ్రూక్లిన్ ,న్యు యార్క్ లలో సైనికుల గాయాలకు సేవ చేసిన అనుభవం ఉంది .దీనితో వాషింగ్టన్ హాస్పిటల్ లో మానవత్వం తో అసహాయుల పాలిటి సేవకుడై సేవలందించాడు .’’హాస్పిటల్ విజిట్స్ ‘’అనేదానిలో రాస్తూ ‘’there is something in personal love ,caresses ,and the magnetic flood of sympathy ‘’అని రాసుకొన్నాడు .దీనివలన మందులకంటే సైనికులకు విట్మన్ చూపిన ఆదరణ ఆత్మీయతలే గోప్పమందుగా పని చేసి కోలుకొన్నారు .అధికారుల పత్రాలను కాపీ చేసిపెట్టాడు ,పత్రికలకు ఏదో విషయం పై రాసి వచ్చేడబ్బును గాయపడి కోలుకొంటున్న సైనికులకు పళ్ళు , పొగాకు ,స్టాంపులు ,చేతి అవసరాలకు డబ్బు పండ్ల రసాలు ,పుస్తకాలకోసం ఖర్చుచేసి అందించి వారికి మానసిక సంతృప్తి కలిగించి తానూ ఆనందం పొందేవాడు మానవీయ విట్మన్ .క్షతగాత్రుల ప్రక్కలో కూచుని చక్కగా సంభాషించి ఊరటకల్గిన్చేవాడు .వారు రాయమన్న ఉత్తరాలు బంధువులకు రాసిపంపెవాడు .ఇవన్నీ చాలా హృదయ విదారకం గా ఉండేవి .వీటిని అక్షరబద్ధం చేసి సీరియల్ గా రాసి పత్రికలకు పంపుతూ గడిపాడు .ఇదంతా దయనీయమైన బాధామయమైన అనుభవమే .ఇతరులకోసం జీవించటం అనే గొప్ప మానవీయ కోణాన్ని విట్మన్ ఆవిష్కరింప జేసుకొన్నాడు .జీవితం లో టెర్రర్ ను, ప్రేమను అనుభవైక వేద్యం గా ‘’’డ్రం-టాప్స్ ‘’(మద్దెల దరువులు )రాసి చలించేట్లు చేయగలిగాడు .ఏదో దేశ భక్తీ రచనలు చేసి చేతులు దులుపుకోలేదు .యదార్ధ సంఘటనలకు మానవీయతను జోడించి రాసి స్పందింప జేశాడు .తోటివారితో సహజీవనం చేసిన మహా మనిషిగా మార్పు చెంది మాననీయుడనిపించుకొన్నాడు .

ఇప్పటికి పత్రికలూ కళ్ళు తెరచి అతని లోని మానవత్వాన్ని అర్ధం చేసుకొన్నాయి .లెంపలేసుకొన్న ‘’టైమ్స్ ‘’తన కధనం లో Whitman s devotion to the most painful of duties in the hospitals at Washinton during the war will confer honor on the memory when ‘’leaves of grass ‘’are withered and when the drum –taps have ceased to vibrate ‘’అన్నది .ప్రభుత్వమూ అతన్ని గుర్తించి ‘’ఇండియన్ బ్యూరో ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ ‘’లోప్రెసిడెంట్  అబ్రహాం లింకన్ కేబినేట్ లో  గుమాస్తా ఉద్యోగం ఇచ్చింది .కొంతకాలానికి ఇంటీరియర్ కు సెక్రెటరి గా ఉన్న జేమ్స్ హార్లాండ్ ఒక ప్రైవేట్  డ్రాయర్ సొరుగు లో విట్మన్ లీవ్స్ ఆఫ్ గ్రాస్ పుస్తకం చూసి కొంపలు మునుగుతాయేమోనన్న భయం తో ఎవరికీ చెప్పకుండా విట్మన్ ఉద్యోగం నుంచి తప్పించాడు  .దీన్ని జీర్ణించుకోలేని విట్మన్ కవి అభిమానులు విలియం డగ్లాస్ కానేరీ నాయకత్వం లో ‘’ది గుడ్ గ్రే పోయెట్ ‘’అనే పేర ఒక కరపత్రం ముద్రించి పంచారు .తప్పు తెలుసుకొన్న అధికారులు విట్మన్ ను అటార్నీ జెనరల్ ఆఫీస్ కు బదిలీ  చేశారు .యాభై మూడవ ఏడు వచ్చేదాకా ఇక్కడే హాయిగా విట్మన్ ఉద్యోగం చేశాడు కాని  జీతం చాలకు తన పుస్తకాలు స్వయం గా అమ్ముకొని బతికాడు కవి .

తలలో నొప్పుల బాధలు అనుభవించాడు .రోగులకు సేవ చేసినప్పుడు కొన్ని క్రిములు చేరి ఉంటాయని భావించాడు . వాషింగ్టన్ నగరమంటే చెప్పరాని మక్కువ ఏర్పడింది .సైనిలను ఒక తల్లిలాగా పలరించేవాడు ఆదరించేవాడు .అతనిలోని ఆ మాత్రు భావనకు వాళ్ళ హృదయాలు కరిగిపోయేవి .మరింత సన్నిహితులయ్యేవారు .’’I think to be a woman is greater than to be a man ‘’అని మహిళా శ్రేస్టతను, మాతృత్వ గరిమను చెప్పాడు విట్మన్ .పీటర్ డయోల్ అనే బాలుడికి తల్లి వాత్సల్యం తో ఉత్తరాలు రాసి అతనికి జీవితేచ్చ కల్గించి ఆదుకొన్నాడు .అతనితో పన్నెండేళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి మాతృ వాత్సల్యం పంచిన మహా మానవీయకవి వాల్ట్ విట్మన్ .

Inline image 1  Inline image 2    

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-2-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేటి తెలుగు కథ, నవల ఎక్కడిదాకా వచ్చింది

నేటి తెలుగు కథ, నవల ఎక్కడిదాకా వచ్చింది

ANDHRAPRABHA –   Mon, 9 Feb 2015, IST
\

ఎవరిని గురించి రాస్తున్నారో వారిని పాఠకులుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని 1967లో సింహగర్జనతో దళిత పాంథర్స్‌ మరాఠీ, హిందీ సాహిత్యాల్లో ప్రవేశించారు. ఈ ప్రశ్నను బలంగా ముందుకు తెచ్చారు. నలభయ్యేళ్ల తర్వాత వర్ణఆధిక్యవాదులు ఈ ప్రశ్నను పట్టించుకోవడం మొదలైంది. అలా వారు నలభయ్యేళ్లుగా భారతీయ సాహిత్యంలో జరుగుతూ వస్తున్న పరిణామాలు ప్రధాన సాహిత్య స్రవంతిని మార్చి తామే ప్రధాన సాహిత్య స్రవంతిగా ఎదిగిన తీరును గమనించి వాస్తవాలను విశ్లేషించడం మొదలైంది.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇంగ్లీషులో వచ్చిన కథలను డిక్షనరీ ఆఫ్‌ షార్ట్‌ స్టోరీస్‌గా 1950 నుండి కథా నిఘంటువులను ప్రచురిస్తున్నారు. మా రెండో కొడుకు శ్రీకాంత్‌ కిరాయికున్న న్యూజెర్సీలోని కార్టరెట్‌ -ఎడిసన్‌ ప్రాంతంలో ఉన్న వాడకట్టు లైబ్రరీలో కూడా ఇవి కనపడ్డాయి. మా వాడి ఇంటి నుండి రోజూ ఆ లైబ్రరీకి నడిచి వెళ్లేవాడిని. కొన్ని గంటలు కూర్చుండే వాడిని. 50 దాకా ఇంటర్నెట్‌, కంప్యూటర్లు, సీడీలు, డీవీడీలతో లైబ్రరీ, అలాగే బుక్‌ లైబ్రరీ అందులో ఉంది. సగం బుక్‌ లైబ్రరీ, సగం సీడీల లైబ్రరీగా మార్పు చెందింది. అక్కడ కథల నిఘంటువులు ఆరు, ఏడు వందల పేజీలతో 15 -16 దాకా ఇటీవలి కథలతో సహా నిఘంటువులు కనపడ్డాయి. అలాగే డిక్షనరీ ఆఫ్‌ నావెల్స్‌, డిక్షనరీ ఆఫ్‌ సినిమాస్‌ ఇలా అనేక రంగాల డిక్షనరీలు అంత చిన్న లైబ్రరీలో దర్శనమిచ్చాయి. ఇంటర్నెట్‌ వచ్చాక మన ఇంట్లోకి టేబుల్‌పైకి ప్రపంచ గ్రంథాలయాలు అన్నీ నడిచివచ్చాయి. యుట్యూబ్‌ టెక్నాలజీ ద్వారా దృశ్య మీడియా ప్రక్రియలన్నీ అక్షరాల వలెనే మనింటికి చేరవచ్చాయి.

భారతీయ కథా పరిణామాలు: భారతీయ కథా పరిణామాలను ఒక విషయం తెలుస్తుంది. ఆయా సమాజాలను అనుసరించి, చరిత్రను అనుసరించి ఆయా ప్రక్రియల్లో పరిణామాలు సాగుతూ వచ్చాయి. వేల ఏళ్ళ నుండి వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతాలు, బౌద్ధ అట్టకథలు, పురాణాలు, మృచ్ఛకటికం, ముద్రారాక్షసం, పంచతంత్ర కథలు, బృహత్‌ కథ, సతీసావిత్రి, సతీ అనసూయ కథలు, శైవ, వైష్ణవ బౌద్ధ, జైన సాహిత్యం, భక్తి సాహిత్యం, భక్తుల కథలు, ఆయా కాలాలననుసరించి వెలువడుతూ వచ్చాయి. వ్యాస వాల్మీక, ఆది కవుల రచనలు, నేటికీ భారతీయ సమాజంపై బలమైన ప్రభావం వేస్తున్నాయి. కాళిదాసు రచనలు, ప్రబంధ సాహిత్యం, యక్షగానాలు, జానపద కళారూపాలు మరొక్కదశ. ఆలీబాబా 40 దొంగలు, సింద్‌బాద్‌ సాహసిక యాత్రలు, గలీవర్‌ కథలు, అక్బర్‌ బీర్బల్‌ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, నసీరుద్దీన్‌ కథలు, తెనాలి రామలింగడు కథలు, పరమానందయ్య శిష్యుల కథలు మొదలైనవి సాహసిక, హాస్య, రస ఉత్పన్నం చేయడంతోపాటు వివేచనను పెంచుతాయి. బట్టివిక్రమార్క బేతాళ కథలు, హరివశం, విక్రమోర్వశీయం, నలదమయంతిల కథలు, సత్యహరిశ్చంద్ర కథలు, సాలభంజిక కథలు మొదలైనవి ప్రేమ, సత్యాన్వేషణ వంటి వాటికై సృష్టించబడ్డాయి. ఇవన్నీ నూతన ప్రక్రియగా ప్రారంభమయ్యే క్రమంలో సినిమాల్లో అదే వరుసలో ప్రవేశించాయి. చాలా సినిమాలు రామాయణ భారతాల కథల్ని సాంఘికాలుగా మార్చి తీసిన కథలే అని కొందరు విశ్లేషించారు.

18వ శతాబ్దినుంచి మధ్యతరగతి, కార్మికవర్గం ఎదుగుతూ వచ్చింది. కథలో వస్తువు మారింది. పాఠకులూ, ప్రేక్షకులూ మారారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రస్తుత ప్రక్రియల పరిణామం మలుపు తిరిగి ఈ దశను తీసుకుంది. ఇలా క్రీస్తుపూర్వందంతా ఒక పరిణామ దశ. తర్వాత ప్రతి 500 సంవత్సరాలకు ఒక దశగా పరిగణించి, పరిశీలించవచ్చు. 1500 నుండి 1800, 1800 నుండి 1850, 1851 నుండి 1900, 1901 నుండి 1950, 1951 నుండి 1980 అనే దశలుగా సాహిత్యాన్ని పరిశీలించవచ్చు. చివరి మూడు శతాబ్దాల్లో పరిణామాలు వేగంగా సాగాయి. సైన్స్‌ ఆవిష్కరణలు సమాజంలో అనేక మార్పులను తెచ్చాయి. వ్యవస్థలు మారాయి. ప్రజాస్వామ్యం, సోషలిజం, నియంతృత్వం వంటి పరిపాలనా వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాల స్థానంలో, దేశాల భావన స్థిరపడింది.

పాట, నృత్య, సంగీతాల ద్వారా సృజించబడే రసాలు, స్పందనలు, మూడ్స్‌ ప్రస్తుతం సినిమా, టీవీ ప్రక్రియల్లో బాగా సృష్టించబడుతున్నాయి. కథా నవల, వచన కవిత, ప్రక్రియల్లో ఈ మూడ్స్‌ని రసాలను, సాధించడం ద్వారా ధ్వని అనే సారానికి ఆకర్షణీయమైన రూపం ఏర్పడుతుంది. రూపం ద్వారా సారాన్ని చేరుకోవడమే సాహిత్యం, కళల అలంకార శాస్త్రాల జ్ఞాన శాస్త్రం.

ఇలా నేటి కథా నవల, సినిమా మధ్యతరగతి గురించి, కష్టజీవుల గురించి, ఉన్నత వర్గీయుల గురించి, సాహసికుల గురించి, వీరుల గురించి, నైతిక విలువల గురించి, సంస్కృతి గురించి, స్వేచ్ఛ గురించి, సత్యం గురించి, అస్థిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి, ఆశల గురించి, వస్తువుగా స్వీకరించి చిత్రిస్తున్నాయి. జీవితంలోని అనేక పార్శ్వాలను, కోణాలను చిత్రించడం అనేది బహుముఖాలుగా సాగుతున్నది. ఆయా వస్తువును అనుసరించి వాటిని వర్గీకరిస్తుంటారు. అలాగే ఆయా శిల్పాన్ని, శైలిని, ప్రెజెంటేషన్‌ని అనుసరించి, వర్గీకరిస్తుంటారు. ఇలాఆధునిక సాహిత్యం, కళలు, నేటి దశకు చేరుకున్నాయి.

స్త్రీవాద, అస్తిత్వవాద సాహిత్యం సిద్ధాంతాలు: స్త్రీవాద సిద్ధాంతాలు 1850 నుండే ప్రారంభమైనప్పటికీ 1960 ల నుండి నూతన సిద్ధాంతాలు బలంగా, ఉద్యమాలుగా ముందుకు వచ్చాయి. ఫెమినిస్టు తాత్విక సిద్ధాంతాల నేపథ్యంలో 1980ల నుండి నూతన సాహిత్య సిద్ధాంతాలు వేగం పుంజుకున్నాయి. మా గురించి మేమే రాసుకుంటాం అని స్త్రీలు, బహుజనులు, కష్టజీవులు, కార్మికులు సాహితీవేత్తలుగా ముందుకు వచ్చారు. తమ గురించి ఇంత దాకా రాసిన సాహిత్యమంతా తమపై గల సానుభూతితో రాసిన సాహిత్యమే తప్ప అనుభవాల నుండి రాసిన సాహిత్యం కాదని విశ్లేషించారు. స్వయంగా తమ అనుభవాలను, అనుభూతులను, సంస్కృతిని, జీవన విధానాలను, ఆశలను, ఆరాటాలను, దృక్పథాలను కథలుగా, నవలలుగా రాయడం వేగం పుంజుకుంది.మరాఠి, హిందీ సాహిత్యాల్లో ఇలాంటి ఆత్మకథల సాహిత్య విస్తారంగా ప్రాచుర్యం పొందింది.

భారతీయ భాషల్లో స్త్రీవాద సాహిత్యం అనేక కోణాలను ముందుకు తెచ్చి ఇంతదాకా కొనసాగిన సాహిత్యంలో పితృస్వామిక పురుషాధిపత్య భావాలు, సంస్కృతి, దృక్పథం ఎలా కొనసాగాయో కథలు, నవలల్లో చిత్రించారు. అలాగే బహుజనులు అనగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఇంతదాకా సాహిత్యంలో వర్ణాధిక్య, కులాధిక్య దృక్పథం కొనసాగుతూ తమ జీవితాలను, సంస్కృతిని తమపై గల అణచివేతను ఆధిపత్యాన్ని ఎలా కొనసాగిస్తూ వస్తున్నాయో విశ్లేషించారు. దాంతో సాహిత్యం రెండు చీలిపోయింది. ఎవరి గురించి, ఎవరి కోసం రాస్తున్నారో అనే ప్రశ్నబలంగా ముందుకు వచ్చింది.

నేను 1990 నుండి ఈ విషయమై వందలాది ప్రసంగాలు, వ్యాసాలు అనేక గ్రంథాలు వెలువరించడం జరిగింది. ఇంతకుముందే చెప్పినట్టు వీటిని సమగ్ర సామాజిక కథ యాభయ్యేళ్ల తెలుగు కథ తీరుతెన్నులు, కథలబడి కథా సాహిత్య అలంకార శాస్త్రం, గతితర్క తత్వదర్శన భూమిక, సాహిత్య చరిత్ర కొత్త చూపుతో తిరగరాయాలి, వ్యక్తిత్వ వికాసం సామాజిక నాయకత్వం, జీవితం అంటే ఏమిటి? అరవయ్యేళ్ల తాత్విక సామాజిక పరిణామాలు తదితర గ్రంథాల్లో కొంతమేరకు పొందుపరచడం జరిగింది. తెలుగు లేదా భారతీయ కథ గురించి పరిశీలించే ముందు ఈ ప్రక్రియ పుట్టిన ఐరోపా సమాజం గురించి ఆలోచించాలి. ఐరోపా సమాజంలోనూ, దాని నుండి పుట్టిన అమెరికా సమాజంలోనూ ప్రధాన మతం క్రైస్తవం. కథానిక పుట్టే నాటికి శారీరక కన్నా, ఆర్థిక కారణాల వల్ల దేవుడు చెప్పిన సిన్‌ (పాపం) చేసేవారు హెచ్చారు. సంపన్న వర్గాలు, రైతాంగం అన్న విభజిత సమూహాల మధ్య మధ్య తరగతి వచ్చింది. వీరు వర్తక వ్యాపారులు ధనం కలిగి వుండడం ద్వారా గౌరవనీయులు, సామాన్యులు అన్న విభజన వచ్చి సామాన్యులను న్యూనతగా చూడ్డం వచ్చింది. యూరోపియన్‌ కథ గొగోల్‌ ఓవర్‌ కోట్‌ నుండి పుట్టిందంటారు. అందులో కథకుడు న్యూనతగా చూడబడిన సామాన్యుడిని కథా నాయకుడ్ని చేస్తారు. మపాసా, చెకోవ్‌, లారెన్స్‌ వంటి తొలి విఖ్యాత కథకుల కథలన్నీ న్యూనతగా చూడబడేవారు ఎంత మాన్యులో, న్యూనతకు కారణమైన ఆర్థిక లేమి ఎటువంటిదో చెబుతాయి. వ్యక్తుల నైతిక స్థాయిని చూపిస్తారు. పాత్రలో పాఠకుడు తనను గుర్తు పడతాడు. (వివిన మూర్తి -ఒక దినపత్రిక, సాహిత్య వేదిక 24 జనవరి 2011) సాహిత్యం, కళలు జీవితంలో భాగంగా మారాలంటే అవి వారి జీవితాలకు కాలక్షేపాన్నయినా ఇవ్వాలి. మంచి సాహిత్యం, కళలు, సామాజిక శాస్త్రాలు జీవితంలో కాస్త స్ఫూర్తిని, ఉత్తేజాన్ని, వెలుగును, ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కలిగించాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాల్యం ఉన్నంత వరకు బాలానందం ఉంటుంది..!

బాల్యం ఉన్నంత వరకు బాలానందం ఉంటుంది..!

రేడియో అన్నయ్య, అక్కయ్య గారి ‘ఆంధ్రబాలానంద సంఘం’ … అంటే తెలుగువారికి ఇట్స్‌ ఎ బ్రాండ్‌ నేమ్‌. అందరూ ఈ సంఘాన్ని ముద్దుగా బాలానందం అని పిల్చుకుంటారు. పిల్లల మనోవికాసానికి పెద్దపీట వేస్తూ, పిల్లలకి అందమైన బాల్యాన్నిచ్చే సంస్థగా గుర్తింపు పొందిన బాలానందం స్థాపించి 75 యేళ్ళు . ఈ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ‘నవ్య’తో పంచుకున్నారు ఆ సంస్థ కార్యదర్శి జె.వి.కామేశ్వరి..
‘‘ఈ రోజుల్లో ఒక సంస్థ రెండు దశాబ్దాలు బతకటమంటే గొప్ప. అలాంటిది మా బాలానందానికి 75 యేళ్ళంటే మహదానందంగా ఉంది. బాలానందంతోనే నా జీవితం ముడిపడి ఉంది. నన్నందరూ ఇప్పటికీ రేడియో అక్కయ్యగారి పాప అనే అంటారు. ఒకరోజు అక్కినేని నాగేశ్వరరావు ఉదయాన్నే ఫోన్‌ చేసి ‘పాపా నీ పేరేమిటీ?’ అన్నారు. ఇన్నాళ్ళకు సందేహం ఎందుకొచ్చింది అని అడిగితే ‘నా భార్య అన్నపూర్ణ, నేను.. రేడియో అక్కయ్య, అన్నయ్యల గురించి మాట్లాడుతూ నిన్ను అక్కయ్యగారి పాప అనుకున్నాం. కానీ పేరు తెలీక ఇలా పెందలాడే కాల్‌ చేశాను’’ అన్నారు ఏఎన్నార్‌. ‘నా పేరు జె.వి.కామేశ్వరి’ అని చెప్పాను. అక్కయ్య, అన్నయ్య ఇద్దరూ పాప అని పిలుచుకోవటం వల్ల ఇలా అరవయ్యవ పడిలోనూ అందరిచేతా చంటిపిల్లలా ‘పాప’ అనిపించుకుంటున్నాన్నేను. అటు న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య) గారికి మా అమ్మ సొంత మేనకోడలు, ఇటు న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) గారికి మా నాన్న తమ్ముడు. నేను 1952 సంవత్సరంలో పుట్టాను. మా అమ్మ పేరు కమల, నాన్న సూర్యనారాయణ. అమ్మానాన్నల దగ్గర కాకుండా చిన్నప్పటి నుంచీ రేడియో అన్నయ్య, అక్కయ్యగారి దగ్గరే పెరిగాను. అక్కయ్యని అమ్మా అనేదాన్ని, అన్నయ్యగారిని మాత్రం మామా అనేదాన్ని. వాళ్లకి పిల్లలు లేకపోవటంతో నన్ను సొంత బిడ్డకంటే ఎక్కువగా చూసుకున్నారు.
రేడియోస్టార్‌లు..
అన్నయ్య, అక్కయ్యలది వాత్సల్యపూరితమైన అనుబంధం. అన్నయ్యకు సినిమాలంటే ప్రీతి. అక్కయ్య మనసున్న మనిషి. ఎనిమిది మంది బంధువుల పిల్లల్ని పెంచేది. మా ఇంట్లో ఎప్పుడూ పెళ్ళి వాతావరణముండేది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరూ బాలానందానికి చేరుకునేవారు. ఆహా.. ఆ రోజులు తల్చుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. బాలానందం ఏర్పాటు చేసే వేసవి శిక్షణా శిబిరాలు, పోటీల సమయంలో రేడియో అక్కయ్య, అన్నయ్యగార్లు వచ్చారనే వార్త విని వాళ్ళని చూడాలని తండోపతండాలుగా జనాలొచ్చేవారు. సినిమా స్టార్లకుండే ఫాలోయింగ్‌ వారి కుండేది.
ఆ ఇద్దరి ప్రేమకథ..
నిద్రకుముందు అక్కయ్యగారు నాతో బోలెడన్ని కబుర్లు చెప్పేవారు. వారిరువురి నేపథ్యం, ప్రేమ, పెళ్ళి విశేషాలను ఒక రోజున గుర్తు చేసుకుంటూ ‘‘మీ అన్నయ్యది బరంపురం. నాది విజయనగరం. బి.ఎ.లో ఇద్దరం క్లాస్‌మేట్స్‌. నేను గుర్రపుబండిలో కాలేజీకి వెళుతుంటే ‘మగరాయుడిలా ఆ చదువులేమిటీ?’ అంటూ చుట్టుపక్కల వాళ్లు ఎత్తిపొడిచేవాళ్లు. క్లాస్‌రూంలో అబ్బాయిలకి దూరంగా కూర్చొనేవాళ్లం. ఓ రోజు ఓ కుర్రోడు ‘అలా ఆడపిల్లల్ని దూరంగా ఎందుకు కూర్చోబెట్టారు? అనడిగాడు. వెంటనే ‘వాళ్ళు అంటరాని వాళ్లేమో!’ అనే డైలాగ్‌ వినిపించింది. ఎవరా అని విసురుగా ఆ అబ్బాయి వేపు చూశాను. అతనే న్యాయపతి రాఘవరావు. ఆ తర్వాత పరిచయం, ఆయన మనస్తత్వం నచ్చటంతో ఇష్టపడ్డాను. ఆయనా నన్ను అమితంగా ఇష్టపడ్డారు. ఇద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో వాళ్ళని అడిగి పెళ్ళి చేసుకున్నాం..’’ అంది అక్కయ్య. అదీ వారి ప్రేమ కథ!
ముఖ్యమంత్రే రమ్మన్నారు..
అక్కయ్యగారు బి.ఎ.లో ఇంగ్లీష్‌ స్షెషల్‌ చేశారు. ఆ తర్వాత బి.ఎడ్‌ చేశారు. అన్నయ్య ఎం.ఎ. మధ్యలోనే ఆగిపోయింది. ‘స్వరాజ్యం జన్మహక్కు’ అంటూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారట. పిల్లలకీ ఆశలుంటాయి, కలలుంటాయి. ఆ చిన్నారి మనసులకి ఆహ్లాదం కావాలి. అందుకు ఓ వేదిక అవసరం. అలాంటి వేదిక కోసమే అక్కయ్య, అన్నయ్యలు ఏకనిర్ణయంతో 1940లో ‘బాలానందం’ సంస్థను చెన్నైలో స్థాపించారు. ఆ ఏడాదే రేడియోలో అక్కయ్య, అన్నయ్యగారిద్దరూ శని, ఆదివారాల్లో బాలవినోదం, బాలానందం కార్యక్రమాలను చేసేవారు. అక్కయ్య అదనంగా మహిళా కార్యక్రమాలు చేసేది. దర్శకులు కె.ఎస్‌. ప్రకాశరావు గారు 1949లో బాలానందం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఇక్కడున్న పిల్లలనే నటీనటులుగా పెట్టి.. ‘బాలానందం’ పేరుతో మూడు చిన్నచిత్రాలు రూపొందించారాయన. స్వాతంత్య్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి అన్నయ్య, అక్కయ్య గారిని హైదరాబాద్‌ రమ్మని అడిగారు. సీఎం కోరిక మేరకు అక్కడి బాలానందాన్ని ఇంకొకరికి అప్పజెప్పి, 1956 జూన్‌లో హైదరాబాద్‌కి వచ్చి అదే సంవత్సరం అక్టోబరు 23 వ తేదీన నారాయణగూడలో ‘ఆంధ్రబాలానంద సంఘం’ స్థాపించి ప్రారంభించారు.
చిన్న జీతంతోనే పెద్ద కార్యం..
హైదరాబాద్‌కి వచ్చాక బాలనందంని గాడిలో పెట్టడానికి మూడు నెలలు పట్టింది. నారాయణగూడలోని అక్కయ్య గారి పేరుమీదున్న స్థలం బాలానందానికి కేటాయించింది. భార్యాభర్తలిద్దరూ బాలానందంలో ఉంటూనే అద్దె కట్టారంటే వాళ్లదెంత గొప్ప మనసు. మీ ఇంటికే అద్దె ఎందుకు అంటే ‘బాలానందం’ కోసం మా తరఫున కొంచెం సేవ అనేవారు. అన్నయ్యగారు హిందూ రిపోర్టర్‌గా వర్క్‌ చేస్తూ, అక్కయ్యగారు ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూనే హైదరాబాద్‌ రేడియో స్టేషన్‌లో ప్రోగ్రామ్స్‌ చేసేవారు. కేవలం వారిరువురికి కలిపి వచ్చే 130 రూపాయల జీతంతోనే బాలానందాన్ని బతికించుకున్నారు. తెలుగులో తొలి బాలల మ్యాగజైన్‌ అన్నయ్య, అక్కయ్య గారే ప్రారంభించారు. అదే ‘బాల’. అందులో ‘చందమామ’ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత ఆ పత్రిక ఉన్నతస్థాయికి వెళ్లింది. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడింది.
అదే లక్ష్యం..
తెలుగువారు తెలుగు మాట్లాడాలి, తెలుగు సంస్కృతీ-సంప్రదాయాలు తెలియాలన్న బాలానందం ఉద్దేశ్యాన్ని అలాగే కొనసాగిస్తున్నాం. వేమన పద్యాలు, రామదాసు, అన్నమాచార్య కీర్తనలు, లలితసంగీతం, కర్నాటక సంగీతం, కూచిపూడి, భరతనాట్యం మొదలైన వాటిని సాధారణ ఫీజుతో నేర్పిస్తాం. పిల్లలు రోజూ సాయంత్రం నాలుగున్నరకి వస్తారు. లలితసంగీతకారులు ఎమ్‌.చిత్తరంజన్‌ బాలానందం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ట్రస్ట్‌ కిందే ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇంతకు ముందులాగే ప్రతీ ఏడాది నవంబర్‌ రెండో వారానికి ముందు పిల్లల కోసం పోటీలు పెడుతున్నాం. ఈ పోటీల్లో రెండువేల మంది పిల్లలు పాల్గొంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఒక సంస్థను సేవాదృక్ఫథంతో నడపడం కష్టం. నిధులు కావాలి. అయితే మాకు అలాంటి ఇబ్బందులున్నా అధిగమిస్తున్నాము. రేడియో అన్నయ్య, అక్కయ్యల మీదున్న అభిమానంతో.. తలా ఒక చెయ్యి వేస్తున్నారు. అదే చాలు. ఇక సంస్థ అంటారా? ప్రతి తరానికి బాల్యం ఉంటుంది. కనక బాలానందమూ చిరకాలం వర్ధిల్లుతుంది..’’
‘‘మా ఇంట్లో ఎప్పుడూ పెళ్ళి వాతావరణముండేది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరూ బాలానందానికి చేరుకునేవారు. ఆహా.. ఆ రోజులు తల్చుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. బాలానందం ఏర్పాటు చేసే వేసవి శిక్షణా శిబిరాలు, పోటీల సమయంలో రేడియో అక్కయ్య, అన్నయ్యగార్లు వచ్చారనే వార్త విని వాళ్ళని చూడాలని తండోపతండాలుగా జనాలొచ్చేవారు. సినిమా స్టార్లకుండే ఫాలోయింగ్‌ వారి కుండేది..’’
 – నవ్య డెస్క్‌  
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు వచన శైలిపై రామతీర్ధ ప్రశ్నలకు నరసింహ మూర్తిగారి సమాధానం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షర ప్రపంచం లోకి అద్భుత యాత్ర-మృణాలిని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

టివి ఆన్ న్యూస్ ప్రేసేన్తర్ బద్రి ప్రమాదం లో మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-1

 మినీ  ద్విపద్స్-1

1-బుల్లి తెరపై చిరునవ్వు  ‘’సుమ ‘’

 మినీ మాక్సి రోడ్లపైపరిగెత్తే  ‘’సుమో ‘’.

2-యాంకర్ ‘’ఝాన్సీ’’

 ఏదైనా చేస్తుంది  ‘’ఫాన్సీ’’

3- మాటల మోడీ

  మోళీ ,గారడీ .

4- సి ఏం బాబు

 దర్పం తో ‘’డాబు ‘’

5-కేజ్రీ క్రేజీ చీపురు

 ఊడ్చేసిన  మోడీ చీపురు.

6-లేడీ లయన్’’ బేడీ’’

మోడీ ప్రోగ్రెస్ కు  ‘’బేడీ ‘’.

7-బీహార్ ‘సియం మా౦ఘీ

 వ్యూహం బెడిసి’ మాజీ ‘’.

8-ఆశల్లో ‘’నితీష్’’

నిరాశ లో ‘’అమితాష్  ‘’

9-ఉద్యోగుల ప్రోగ్రెస్’’ నిల్’’

 చంద్ర ది మాత్రం ‘’ఫుల్?’’

10-వాస్తు పిచ్చలో గులాబీ నాయన

 కుర్చీ  పై భయమే!నాయనా ?

11-ఉయ్యూరు రోడ్ క్వీన్’’ ‘’టు ట్వెంటీ టు ‘’

   కలెక్షన్ లో ఫోర్ ట్వెంటీ –ట్రూ ‘’

12-పామర్రు రోడ్డు’’ కింగ్ ‘’మూడు మూళ్లు’’

    బాగ్ నిండా చేరే  భారీ వసూళ్లు .

మీ-  గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-15- ఉయ్యూరు 

 

Posted in కవితలు | Tagged | Leave a comment

విజయ వాడలో 2007 ఏళ్ళక్రితం ఆలయం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దుబాయ్ లో విశ్వనాధ్ కు బ్రహ్మానందం పాదాభి వందనం

వందనం… పాదాభివందనం

దుబాయ్‌లో శుక్రవారం జరిగిన గామా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు జీనన సాఫల్య పురస్కారం అందచేశారు. కృష్ణంరాజు, హాస్యనటుడు బ్రహ్మానందం సంయుక్తంగా ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం శిరసు వంచి విశ్వనాథ్‌కు పాదాభివందనం చేయడం వేదికపైనున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. కె.విశ్వనాథ్‌వంటి ధన్యజీవిని సత్కరించడం తెలుగు వారందరికీ జీవనసాఫల్య పురస్కారం వంటిదని సిరివెన్నెల సీతారామశాసి్త్ర వ్యాఖ్యానించారు. అనంతరం విశ్వనాథ్‌ మాట్లాడుతూ ‘ ‘‘నేను గొప్పవాడిని కాదు. అద్భుత శక్తులేమీ లేవు. చదుకున్నదీ అంతంత మాత్రమే. కానీ నా పని నేను చేసుకోవడం, నమ్మినదానికి కట్టుబడటం నా విజయ రహస్యం. తపస్సు అంటే దేవుడికోసం చేసేది కాదు. చేసే పనిని ఇష్టపడి, ప్రేమించి సంపూర్ణం చేసినవాడే తపస్వి’’ అని అన్నారు. . ఈ కార్యక్రమంలో కోటి, చిత్ర, దేవిశ్రీ ప్రసాద్‌, అల్లరి నరేష్‌, శర్వానంద్‌, ఎం.ఎం.శ్రీలేఖ, రఘు కుంచె, అలీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

33 కథల తర్వాత నచ్చిందిది.. ‘షమితాబ్‌’.

33 కథల తర్వాత నచ్చిందిది..
ఎనిమిదిన్నర నెలల గ్యాప్‌… 33 ిస్ర్కిప్టులు… ధను్‌షకు ఏవీ నచ్చలేదు. ఒకరోజు డైరెక్టర్‌ బాల్కీ నుంచి ఫోన్‌
వచ్చింది. స్టోరీ చెబితే వావ్‌ అన్నాడు. ఈ సినిమాలో ఇంకో పాత్ర చేసేది అమితాబచ్చన్‌ అని చెప్పేసరికి
మరుక్షణమే ఓకే చెప్పేశాడు. ఆ సినిమానే ‘షమితాబ్‌’. దాని ప్రమోషన్‌లో భాగంగా ధనుష్‌ హైదరాబాద్‌కు
వచ్చినపుడు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం…
హైదరాబాద్‌కు మీరు తరచుగా వస్తుంటారా?
ఇక్కడ షూటింగ్‌ ఉన్నప్పుడు, స్నేహితులను కలవాలనుకున్నప్పుడు వస్తుంటాను. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. హైదరాబాదీలు చూపించే ఆప్యాయతను ఎప్పటికీ మరచిపోలేను. ఇక్కడి ఫుడ్‌ అన్నా కూడా నాకు చాలా ఇష్టం.
హిందీలో మీరు చేస్తున్న రెండో సినిమా ‘షమితాబ్‌’. ఆ సినిమా విశేషాలు ఏంటి? ఆ సినిమాను ఎంచుకోవడానికి కారణం ఏంటి? 
‘రాంజిహనా’ తరువాత సుమారు ఎనిమిదిన్నర నెలల పాటు 33 స్ర్కిప్టులు విన్నాను. కానీ ఏదీ నచ్చలేదు. ఫైనల్‌గా షమితాబ్‌ కథ బాగా నచ్చింది. ఎనిమిదిన్నర నెలల తరువాత ఒకరోజు బాల్కిగారు ఫోన్‌ చేసి ఒక సారి ఆఫీ్‌సకు రమ్మన్నారు. వెడితే కథ చెప్పారు. ఆయన స్టోరీ చెప్పిన విధానం బాగా నచ్చింది. అప్పుడే అనుకున్నాను. హిందీలో ఇదే నా రెండో సినిమా అని. పూర్తి ఫ్రెష్‌ కాన్సెప్ట్‌. ఈ సినిమాలో అమితాబ్‌ ఉన్నారని కూడా ఆయన చెప్పారు. వెంటనే ఓకె చెప్పాను.
‘షమితాబ్‌’ పేరు పెట్టడం వెనక ఏదైనా కారణం ఉందా? 
నా పేరు ధను్‌షలోని ‘ష్‌’, అమితాబ్‌ పేరు కలిపి టైటిల్‌ ఖరారు చేశారు. కానీ టైటిల్‌కు మరో ప్రాముఖ్యత కూడా ఉంది. బాల్కి తప్ప మరెవరూ ఇలాంటి టైటిల్‌ పెట్టలేరు. ఈ సినిమాలో నన్ను మాత్రం ధనుష్‌ అని పిలవరు. అది మాత్రం చెప్పగలను.
ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి?
నటుడు కావాలనే లక్ష్యంతో గ్రామం నుంచి పట్టణానికి వచ్చిన యువకుడి పాత్రను చేశాను. అతనికి మాటలు రావు. అమితాబ్‌ అతనికి వాయి్‌సను అందిస్తారు. వీళ్లద్దరి టాలెంట్స్‌ వృథా కానివ్వకూడదని కలిపే ప్రయత్నం చేస్తుంది హీరోయిన్‌ అక్షర. అయితే వీళ్లిద్దరి ఇగోలు దెబ్బతిని క్లాషెస్‌ వస్తాయి. జీవితంలో సక్సెస్‌ కావాలంటే ఎందుకు కలిసి ఉండాలో, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలియజేస్తుందీ చిత్రం.
మీ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు కదా! ఎలా ఫీలయ్యారు?
షమితాబ్‌ ఒక్కటే కాదు. నేను చేసిన ఏ సినిమా అయినా ఆయన సంగీతం నుంచి ఇనిస్పిరేషన్‌ పొందుతాను. ఆయన సంగీతం నుంచి సంతోషాన్ని, ప్రేమను పొందుతాను. ఇళయారాజా గారు తన సంగీతంతో షమితాబ్‌ను ఆశీర్వదించారు. తన పాటల ద్వారా స్టోరీ వెర్షన్‌ను చెబుతారు. షమితాబ్‌ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది.
తెలుగు బాగా మాట్లాడతారా?
తెలుగు నాకు బాగా అర్థమవుతుంది. మాట్లాడటం మాత్రమే రాదు.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం అలవాటు లేదని గతంలా అన్నారు. ఎందుకు?
నిజంగా అది చాలా కష్టం. అందరూ ఎలా ఇస్తారో నాకు తెలియదు. ఒక్కో సినిమాకు మూడు నాలుగు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తోంది. అయితే ప్రతి సినిమాకు నాలుగైదు కామన్‌ క్వశ్చన్లు ఉంటున్నాయి.
ట్రేలర్‌లో అమితాబ్‌ కాలర్‌ పట్టుకుని లాగుతున్న సీన్‌ ఉంది. అలాంటి సీన్‌ చేయడం కష్టమనిపించిందా?
మీరు చెబుతున్న దాన్ని నేను కరెక్ట్‌ చేస్తాను. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్‌ మరో క్యారెక్టర్‌ కాలర్‌ పట్టుకుని లాగుతోంది. అంతే! ఒకవేళ నేను అమితాబ్‌గారి కాలర్‌ పట్టుకుని లాగుతున్నానని అనుకున్నట్లయితే ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేయలేను. కాబట్టి నేను ఎలాంటి సంకోచం లేకుండా చేశాను. ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ సినిమానే ముఖ్యం. అమితాబ్‌ సర్‌కి మేజర్‌ క్రెడిట్‌ దక్కుతుంది. ఎందుకంటే మేమందరం కంఫర్టబుల్‌గా నటించేలా చే శారు. ఈ సినిమాలో నాపాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను.
నార్త్‌ ఇండియాలోనూ, సౌత్‌ ఇండియాలోనూ హీరోలను ఫ్యాన్స్‌ ఆరాధించే విధానంలో తేడాను గమనించారా?
ఒకరోజు ఢిల్లీలో ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లాం. అమితాబ్‌ గారిని చూడటానికి చాలామంది ఎగబడ్డారు. అదే సీన్‌ దక్షిణాదిలోనూ కనిపిస్తుంది. ఒకవేళ రజనీ సర్‌ పబ్లిక్‌ ప్లేస్‌కి వెళితే సేమ్‌ సీన్‌ కనిపిస్తుంది. తేడా ఎక్కడ చూసానంటే మొదటి రోజు, మొదటి షో సెలబ్రేషన్‌లా ఉంటుంది. దాన్ని మీరు కూడా గమనించవచ్చు. కొందరి స్టార్స్‌ సినిమాలు రిలీజ్‌ అయిన రోజు పండగే. దీపావళి, దసరా ప్రతీ ఏడాది వస్తాయి. కానీ రజనీ సినిమా కోసం మనం ఎదురు చూడాలి. ఆ రోజు మనందరికీ పెద్ద పండగ.
మీ యంగర్‌ జనరేషన్‌లో హీరోలందరూ స్టార్స్‌గా ఫీలవుతున్నారా?
మేం కూడా స్టార్స్‌లా ఫీలయ్యేలా చేస్తుంటారు అభిమానులు. ఫ్యాన్స్‌ నుంచి లభించే ప్రేమ, మద్దతు మేం స్టార్స్‌ అనిపించేలా చేస్తాయి. దాన్ని మేం గౌరవంగా భావిస్తాం.
మీ డైరెక్టర్‌ బాల్కి గురించి చెప్పండి?
చాలా గొప్ప దర్శకుడు. ఆయనకు గొప్ప గొప్ప ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అతనికి ఏం కావాలో అది బాగా తెలుసు. దేశంలో ఉన్న గొప్ప దర్శకుల్లో అతనొకరు. షమితాబ్‌లో నాకు గొప్ప క్యారెక్టర్‌ ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
అమితాబ్‌ గారే మీ పేరును బాల్కీకి సూచించారట. నిజమేనా?
నేననుకోవడం సౌత్‌లో ఈ సినిమా ఎవరు చేస్తే బాగుంటుందని బాల్కీగారు అమితాబ్‌ సర్‌ని అడిగి ఉంటారు. అప్పుడు అమితాబ్‌ గారు రజనీ సర్‌, ధనుష్‌ చేస్తే బాగుంటుందని చెప్పి ఉంటారు. ఆ తరువాత అమితాబ్‌గారే ధనుష్‌ ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు అని ఉంటారు.
శృతిహాసన్‌, అక్షరహాసన్‌ ఇద్దరితో కలిసి పనిచేశారు కదా? ఇద్దరిలో తేడా ఏంటి?
ఇద్దరూ వేరీ టాలెంటెడ్‌. ఇద్దరూ ఇండివిడ్యువాలిటీ కోసం కష్టపడి పనిచేస్తారు.
 నేహారెడ్డి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతరిక్షం లో నాసా మెనూ

అంతరిక్షం లో నాసా మెనూ

ఆకలేస్తే- ఇంట్లో అయినా, ఆఫీసులో
అయినా ఏదో ఒకటి లాగించేస్తాం. అదే
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగా
ములయితే ఏం చేస్తారు? భూమికి 400
కిలోమీటర్లపైన ఎటువంటి గురుత్వాకర్షణ
శక్తి లేని వాతావరణంలో ఉండే వ్యోమగా
ములు ఎలాంటి ఆహారం తింటారు?వాళ్లూ
మనలాంటి ఆహారమే తింటారంటే ఆశ్చర్యంగా
అనిపిస్తుంది. ఇటీవలే అక్కడి వ్యోమగాముల
కోసం రకరకాల ఆహార పదార్థాలను తీసుకొని
ఒక వ్యోమనౌక వెళ్లింది కూడా..

ఇటీవల వర్జీనీయాలోని వాలప్స్‌ ఫ్లైట్‌ ఫెసిలిటీ నుంచి ఒక వ్యోమనౌక ఐఎ్‌సఎస్‌కు బయలుదేరి వెళ్లింది. దీనిలో 3000 పౌండ్ల బరువైన ఆహార పదార్థాలు, ఇతర సరుకులు ఉన్నాయి. ఇవన్నీ ఐఎ్‌సఎ్‌సలో ఉండే వ్యోమగాములకు ఉపయోగపడేవే. ఇప్పటిదాకా ఐఎ్‌సఎ్‌సలో 15 దేశాలకు చెందిన 200 మంది వ్యోమగాములు నివసించారు. వీరికి అవసరమైన ఆహారపదార్థాలను సరఫరా చేసే బాధ్యత హుస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌ది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది. ఆహార పదార్థాలంటే- ప్రతి రోజు మనం తినే వంటలు కావు. అవి ఆరునెలల పాటు తాజాగా ఉండాలి. వ్యోమగాములకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించాలి. ఐఎ్‌సఎ్‌సలో ఎక్కువ స్పేస్‌ ఉండదు కాబట్టి వీలైనంత తక్కువ పరిమాణంలో ఉండాలి. ఐఎ్‌సఎస్‌లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. పౌష్టికాహార నిపుణుల అంచనాల ప్రకారం ఒక వ్యోమగామికి ప్రతి రోజు మూడువేల కాలరీలు అవసరమవుతాయి. దీనికి తగ్గట్టుగా జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లోని నిపుణులు ఆహారాన్ని తయారుచేస్తారు.
ఒకప్పుడు వ్యోమగాములకు అవసరమైన ఆహారాన్ని పేస్ట్‌గా చేసి ట్యూబ్‌లలో పెట్టి పంపేవారు. అయితే వ్యోమగాములు ఆ ఆహారాన్ని తినటానికి ఎక్కువ ఇష్టపడేవారు కాదు. ఆహారం కేవలం శరీరానికి శక్తిని ఇవ్వటానికి మాత్రమే కాకుండా మంచి అనుభూతిని కూడా ఇవ్వటానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్న తర్వాత వ్యోమగాములకు ఎలాంటి ఆహారాన్ని అందివ్వాలనే విషయంలో అనేక పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఐఎ్‌సఎ్‌సలో రిఫ్రిజిరేటర్లు ఉండవు కాబట్టి- ఆహారాన్ని ఎక్కువ కాలం ఎలా నిల్వ ఉంచాలనే సమస్య ప్రధానంగా ఎదురయింది. అందువల్ల ఆహారంలో ఉన్న తేమను పూర్తిగా తొలగించి అంతరిక్షంలోకి చిన్న సంచులలో పంపితే ఈ సమస్య తీరుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక వ్యోమగామికి ఎన్ని కేలరీలు అవసరమవుతాయో గమనించి దానికి తగినట్లు సంచులను తయారుచేయటం ప్రారంభించారు. శాస్త్రవేత్తలు రూపొందించిన మెనూలో మన దేశానికి చెందిన చేపల కూర ఉండటం విశేషం. వ్యోమగాములకు రకరకాల ఆహార పదార్థాలతో పాటుగా చాక్‌లెట్‌ పుడ్డింగ్‌, లెమన్‌ కర్డ్‌ కేక్‌, అప్రికాట్‌ కాబ్లర్‌ వంటి తీపి పదార్థాలను కూడా పంపుతారు. వ్యోమగాముల పుట్టిన రోజులకు కేక్‌లను కూడా ఈ మధ్య పంపుతున్నారు. ఇటీవల కాలంలో వ్యోమగాములకు పంపే ఆహారంలో సోడియం పరిమాణాన్ని చాలా వరకు తగ్గించారు.
గురుత్వాకర్షణ శక్తి లేని ప్రాంతంలో ద్రవ పదార్థాలు కిందకు పడవు. గాలిలోనే తేలుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశంలో కాఫీ లేదా వేడి వేడి సూప్‌ను ఎలా తాగాలి? సా్ట్రతో తాగితే నోరు కాలిపోతుంది కాబట్టి పోర్ట్‌ల్యాండ్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన కప్పును తయారుచేశారు. చిన్న పిల్లలు వేసుకొనే బూట్ల మాదిరిగా ఉండే ఈ కప్పులో కాఫీని గురుత్వాకర్షణ శక్తి లేని ప్రదేశంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగచ్చు. అయితే ఈ కప్పు కూడా అంత సులభంగా తయారవలేదు. దీనిని రూపొందించటానికి లక్ష డాలర్ల (దాదాపు 63 లక్షల రూపాయలు) ఖర్చు అయింది. ఒకో కప్పు ఖరీదు దాదాపు 500 డాలర్లు (దాదాపు 30 వేల రూపాయలు) దాకా ఉంటుంది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏదండీ మహాభారతం! రంగనాయకమ్మ గారి మహాభారత మహా పరిజ్ఞానం!

ఏదండీ మహాభారతం!

andhraprabha –   Mon, 2 Feb 2015, IST
  • రంగనాయకమ్మ గారి మహాభారత మహా పరిజ్ఞానం!

మొన్న ‘రామాయణ విషవృక్షం’ రాసి, అఖండకీర్తి ప్రకీర్తుల్ని మూటగట్టుకొన్న రంగనాయకమ్మ ఇప్పుడు ‘ఇదండీ మహాభారతం’ అన్న ఉద్గ్రంధాన్ని రచించి, వ్యాసుని బొడ్లో వ్రేలెట్టి, నడిబజారులోకి ఈడుస్తోంది! శ్రీకృష్ణుణ్ణి, ధర్మజునీ, ద్రౌపదినీ కడిగేస్తోంది!

ఆమె మాటల్లోనే చెప్పాలంటే;

”మొగ్గా పువ్వూలేని, కాయా పండూ లేని మోడు/ మాయల, మంత్రాల, వ్యర్థాల, వైరుధ్యాల, వికృతాల, వికారాల, క్రూరత్వాల, అబద్ధాల, కట్టుకథల, పుక్కిటి పురాణాల పుట్ట మహాభారతం!” (అట్టమీద)

ఇంతటి పనికిరాని చెత్తపుస్తకాన్ని ఇంతకాలంగా బుద్ధిలేని హైందవజాతి ఎలా తలెకెత్తుకు పూజిస్తోందీ అర్థంకావడం లేదు నాకు, ఇప్పటికైనా బుద్ధితెచ్చుకొని, ఏ చెత్తకుండీలోనో, ఏ మూసీ నదిలోనో, ఏ మురిక్కాలవలోనో పారేసి, డెట్టాలుతో చేతుల్ని కడిగేసుకోవడం మంచిది.

చివరి మాటగా ఈ రచయిత్రి ఏమంటోందో చెప్పమంటారా?…

”మహాభారతం గురించి ఒక్కమాటతో చెప్పుకోవాలంటే, అది వ్యర్థమహాభారతం!” అని. (పి.474)

మన చెవిటి మేళానికి అనగా హైందవజాతికి ఈ మాట వినిపించిందో లేదో? ఈ పుస్తకం కనిపించిందో లేదో? కళ్ళూ, చెవులూ, ముక్కూ… పంచేంద్రియాలూ మూసుక్కుచుందో తెలీదు!

రామాయణ భారత భాగవతాదులూ, పురాణాలూ, జరిగిన కథలేననీ, చరిత్రలేననీ, చాలామంది అమాయకుల ప్రగాఢ విశ్వాసం. దాన్ని ‘క్యాష్‌’ చేసుకోవాలని చూస్తోంది ఈ నోటిదురుసు మేధావురాలు!

ఒకప్పుడు స్త్రీవాదులంటే వేశ్యలేనని అరచి గగ్గోలుపెట్టింది. మరోసారి హిందువులకు జుట్టెందుకు? బొట్టెందుకు? నామాలెందుకు? గడ్డాలూ మీసాలూ ఎందుకు? అంటూ వెక్కిరించింది, ఆ పై రామాయణాన్ని ‘విషవృక్ష’మంటూ ఖూనీ చేసింది. ఇప్పుడు ఏకంగా మహాభారతాన్నే ఖైమా చేసేస్తోంది. అఖిల భారత జనానీకం సాక్షిగా!

భేషు! రంగనాయకమ్మా! నీకు నీవేసాటి! మా మగధీరులంతా నీపాద గోటికి సరికారు!

భారతం ఒక చరిత్రనుకోవడం మన అమాయకత్వమే, విజ్ఞాన రాహిత్యమే. చివరికి రామాయణమైనా, పురాణాలైనా అంతే! అవి ప్రతీకాత్మక కావ్యాలు. అనగా మహాప్రహేళికలు.

అసలు పేరులోనే ఉంది అర్థం. భారతం (భా ్శ రతం) అంటే, కిరణాల క్రీడ! వెలుగూ చీకట్లయుద్ధం!

‘విశ్వమ్‌’ అంటే ‘శివమ్‌’ అనీ, ‘వేదమ్‌’ అంటే ‘దేవమ్‌’ అనీ, ‘కురుక్షేత్రం’మంటే ‘రుక్‌ క్షేత్రం’ (వేదభూమి) అనీ అర్థం చేసుకోవాలి.

‘ధృతరాష్ట్రుడు’ ఒక విశ్వప్రతీక. (దశరథుడూ అంతే!) అనగా ‘ధరించిన రాష్ట్రం కలవాడ’ని అర్థం. ‘రాష్ట్ర’ మనగా శరీరం, దేశం, విశ్వం. అందువల్ల ఇక్కడ ధృతరాష్ట్రుడనగా విశ్వాన్ని ధరించిన వాడన్న అర్థాన్ని చెప్పుకోవాలి. విశ్వంలో వెలుగులకన్నా చీకట్లే ఎక్కువ. అందుకే, అతడు పుట్టుగ్రుడ్డి.

‘దుర్యోధనాదులు’ కాలమేఘ ప్రతీకలు. వాళ్ళు నూరుగురు. అనగా మేఘాలు అనంతమని అర్థం.

‘శ్రీకృష్ణుడు’ సూర్యప్రతీక. ‘కృష్ణ’ శబ్దానికి నలుపులేదా నీలి రంగనీ, ‘ఆకర్షణ’ అనీ అర్థాలు. సూర్యుడు ‘నీలలోహిత కిరణుడు’, ఆపై ఆకర్షణ శక్తికలవాడు’ కదా? (సైన్సు) ‘పాండవులు’ చంద్రవంశం వారు. అనగా చంద్రప్రతీకలు. భీష్ముడు, కర్ణుడు, ధర్మజుడు, అభిమన్యుడు మొదలైనవారలంతా చంద్రప్రతీకలే!

పంచపాండవులు పంచభూతాలకు ప్రతీకలన్నది తప్పుడు అభిప్రాయం. మహాభారతం లోని ‘రాజసూయయాగ’ ఘట్టాన్ని చూస్తే, తెలుస్తుందది. ధర్మజుడు ‘ఇంద్రప్రస్థపురాన్ని’ (ఆకాశం లేదా అంతరిక్షాన్ని) ఏలుకొంటే, మిగతా నలుగురూ నాలుగు దిక్కుల్ని ఏలుకున్నారు. అనగా ఆ మిగతానలుగురు దిక్పాలకులని ధ్వని.

ద్రౌపది ధరిత్రీప్రతీక. అందుకే ఐదుగుర్నీ కట్టుకుంది. అలాగే కుంతీ, గాంధారీ, సత్యభామా మొదలైన పాత్రలూ భూప్రతీకలే!

అర్జునుడు సూర్యునకు వెనకనున్న ప్రకాశం. సూర్యుడు కదిలితేనే ఈ ప్రకాశం కదుల్తుంది. అందుకే, కృష్ణుడు ‘విజయసారధి’ కావడం.

బలరాముడు. సూర్యునకు ముందున్న ప్రకాశం. భూమ్మీద ముందుకాలు పెట్టేవాడు. అందుకే కృష్ణునికి అన్న.

ఇలా, ఇవి ‘మహాభారతం’లోని ప్రధాన పాత్రల వెనకనున్న ప్రతీకలు. ఆపై, వాల్మీక వ్యాసాది ఋషి, మునులంతా నక్షత్రప్రతీకలు. శ్రీకృష్ణుని అష్టభార్యలు సూర్యుని చుట్టూ తిరిగే అష్టగ్రహాలు. తెల్లనిమబ్బులు యక్ష, గంధర్వ, కిన్నెర కింపురష, అప్సరాదులు. పదహారు వేలమంది కన్యలూ నక్షత్ర ప్రతీకలే! ‘రాధ’ ఒకనక్షత్ర కాంతి ‘ధార’. ఈ విషయం ఎందరికి తెలుసు? ముఖ్యంగా ఈ రచయిత్రికి ఎంతవరకు తెలుసు? అన్నదే ప్రశ్న.

ఆమె మరో పెద్దపొరపాటే చేశారు. వ్యాసుని మూలగ్రంథాన్ని చూడలేదు. కవిత్రయ భారతాన్ని చూశారు. అది వ్యాసభారతానికి ఛాయామాత్రమే! ఆపై గంగూలీ గారి ఆంగ్లానువాదాన్నీ, పురిపండావారి వచన భారతాన్ని చూశారు. అవి ప్రచ్ఛాయలు మాత్రమే!

అనగా, నీడల్ని పట్టుకు వేలాడారన్నమాట. ‘యజ్ఞమంటే వీరికి సరియైన అవగాహన లేన’ట్టుగా ఉంది. అందుకే, యజ్ఞాలనీ తిట్టిపోసింది. క్యాపిటల్‌ (మూలధనం) అంటే పెట్టుబడి (ఇన్వెస్ట్‌మెంట్‌) అని తప్పుడర్థం చెబుతూ, సంపుటాలు సంపుటాలుగా వెలువరించిన ఘనత వీరిది? అంతటి పరిజ్ఞానం మనకెక్కడిది?

‘యజ్ఞా’నికి అనేకార్థాలున్నాయి. ‘ప్రకృతి యజ్ఞం’ ఒకటి, ‘వికృతి యజ్ఞం’ మరొకటి. ఆమె మాట్లాడేది వికృతి యజ్ఞాల గురించే. విశ్వమే ఒక యజ్ఞశాల యనీ, విశ్వవ్యాపారమే ఒక యజ్ఞమనీ, అణువణువూ యజ్ఞకుండమేననీ, చివరికి మనిషి కూడా ఒక యజ్ఞ కుండమేననీ, జీవితమే ఒక యజ్ఞమనీ, నేను చెబితే వీరికర్థమవుతుందా?…

నాకు తెలిసినంతవరకు దశరథుని యజ్ఞంలో కానీ, రాముని యజ్ఞంలో కానీ, (రామాయణం) చివరికి ధర్మజుని యజ్ఞం (భారతం)లో కానీ, జంతుబలి జరిగినట్లు చెప్పబడలేదు. వీరు ఏ రామాయణ భారతాల్ని తిరగేశారో నాకు తెలీదు.

ఇక ‘సతీ సహగమనం’ గూర్చి ఒకమాట. అది దురాచారమే. దాన్ని ఖండించాల్సిందే! కానీ, భారతంలో స్త్రీలతో బలవంతంగా సహగమనం చేయించినట్లు ఎక్కడా లేదు. మాద్రి తన యిష్టప్రకారం, తనకు తానుగా సహగమనం చేస్తే, కుంతి చేయనంది. చేయలేదు. ఈ విషయాన్ని మనం విస్మరిస్తే ఎలా?

చివరిగా ‘కులవ్యవస్థ’ గురించి మరోమాట. క్షసగశn|d ాు-|షా (పటిష్టమైన వ్యవస్థ)కు అది అవసరమే. కులవ్యవస్థలో తప్పులేదు. కులవివక్ష తప్పు. అంటరాని తనం తప్పు.

ఐనా, హిందువులు ఎంతో మారారు. జైన బౌద్ధమతాలనుండీ, ఆర్య సమాజం నుండీ ఎన్నో నేర్చుకున్నారు. ఇప్పుడు సతీసహగమనాలు లేవు. అంటరాని తనమూ లేదు. యజ్ఞాల్లో బలులూ లేవు. బాల్య వివాహాలూ తగ్గాయి. వితంతు వివాహాలూ కోకొల్లలు. ఆపై మతాంతర. కులాంతర వివాహాలకూ లెక్కలేదు. బ్రాహ్మణాధిపత్యమూ తగ్గింది. ఇవన్నీ మార్పులు కావా?… మనిషన్నవాడు రెండు కళ్ళతో చూడాలికదా?…

ఇక్కడ మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఋషి ప్రోక్తలైన వేదాలకీ, రామాయణ భారత భాగవతాది మహాకావ్యాలకీ నాలుగేసి అర్థాలుంటాయి. అవి (1) ఆదిభౌతిక (2) ఆధిదైవిక (3) ఆధ్యాత్మిక (4) ఆధియాజ్ఞిక దృక్కోణాలు వాటిని మనం విస్మరించకూడదు (వివరాలకు చూడుడు నా పరిశోధనలు (1) రాముడంటే ఎవరు? రామాయణమంటే ఏమిటి? (2) కృష్ణాయనం ఒక నక్షత్ర మహాయానం (3) ఋషి హృదయం, (4) చతుర్వేద సాగర మధనం)

ఇక ద్వ్యర్థి, త్య్రర్థి కావ్యాలూ ఉన్నాయి. ఏకాక్షర రామాయణమూ ఉంది. ముందునుండి ఒక అర్థం, వెనకనుండి మరో అర్థం వచ్చే శ్లోకాలూ ఉన్నాయి. అవి మనకందుతాయా? మన మిడి మిడి జ్ఞానం సరిపోతుందా? అన్నవి ప్రశ్నలు.

వీరొకచోట ‘కుక్కతిట్లకి జడిసిన చక్రవర్తి’ (పి.36) అంటూ వెక్కిరించారు. ఇక్కడ కుక్కంటే కుక్కకాదు తల్లీ! అది నల్లని మేఘానికి సంకేతం. అది అరచిందంటే మేఘం గర్జించిందని ధ్వని. ఈ విషయం వేదాల్లోనూ ఉంది. ‘సోమరసాన్ని నల్లకుక్కకి దూరంగా, భద్రంగా ఉంచండి!’ అంటూ ఓ వేదమంత్రం (సామవేదంలో ఉంది. అక్కడా కుక్కంటే మేఘమే!

అమ్మా? తమరెక్కడ చదువుకున్నారు తల్లీ? శబ్దాలకి అనేకార్ధాలుంటాయి. ఒక్క వాచ్యార్థాన్నే పట్టుకుంటే ఎలా? అంతరార్థాల్నీ, ప్రతీకాత్మకతల్నీ, శ్లేషార్థాల్నీ, ధ్వనినీ విస్మరిస్తానంటే కూడదు తల్లీ?

ఇప్పటికైనా కళ్ళు తెరవండి! మన వేదాల్ని పాశ్చాత్యులు తలకెత్తుకుంటున్నారు. వాటిపై విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిల్లో బోలెడు సైన్సుంది. మన రామాయణ భారత భాగవతాదులూ విశ్వవిఖ్యాతి నందాయి. గ్రీకుల ‘ఇలియడ్‌’ ‘ఒడిస్సీ’ గ్రంథాలు వీటికి ఛాయాప్రచ్ఛాయలని విదేశీ మేధావులే అంటున్నారు. ఆకాశమ్మీదా, నక్షత్రాలమీదా, సూర్యచంద్రులమీదా దోసిళ్ళకొద్దీ మట్టిపోస్తానంటే ఎలా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరీమళాల కథా పుష్ప వృక్షం

పరీమళాల కథా పుష్ప వృక్షం

  • -సన్నిధానం నరసింహశర్మ
  • 07/02/2015
TAGS:

కథాకృతి-3
పరిచయాలు పరామర్శలు
రచన: విహారి;
పుటలు: 166,
వెల: రూ.100/-లు
ప్రతులకు: వేదగిరి
కమ్యూనికేషన్స్, బ్లాక్-6, ఫ్లాటు: 10, హెచ్‌ఐజి-1,
బాగ్‌లింగంపల్లి,
హైదరాబాదు- 44

సమీక్షలు వ్రాసేటప్పుడు ఆ రచయితలతోను, ఆ రచనా ప్రకాశకులతోనూ సమీక్షకుడు తన సంబంధాల పెరుగుదలలు తరుగుదలలు గురించి ఆలోచించరాదు, సమీక్షల్నీ, సమీక్షకుల్నీ గమనిస్తూ ఆలోచనలతో ప్రశ్నించే పాఠక వ్యవస్థ ఒకటి వుందనుకుంటే మంచి సమీక్షలూ సమీక్షా గ్రంథాలూ వస్తాయి. అలా వచ్చిన మంచి ప్రయోజనాత్మక గ్రంథం ఈ కథాకృతి గ్రంథం. ఇది మూడవ భాగంగా పరిచయాలు, పరామర్శలుగా వచ్చింది ఏ భాగానికాభాగమే ప్రత్యేక గ్రంథంగా భాసించేదే.
మామూలు సమీక్షలకు భిన్నంగా కొత్తచూపులతో తమవైన బేరీజులతో 51 కథల ఆత్మీయకోణ ప్రదర్శనలతో విహారిగారు ఈ పుస్తకాన్ని సంతరించారు.
ఎ కంపేనియన్ ఆఫ్ ఇంగ్లీషు లిటరేచర్ అని ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంవారు, సాహిత్య కోశము (ప్రాచీనము), సాహిత్య కోశము (ఆధునికము) అని తెలుగు అకాడమీ వారు వేసిన గ్రంథాలు అవి పరిశోధక సంబంధాలు.
విహారిగారి ప్రణాళిక విభిన్నమైంది. పత్రికల్లో, కథాసంపుటాల్లో పుంఖానుపుంఖాలుగా కథలు వస్తున్నాయి. కథల పోటీలూ పెరిగాయి సాంవత్సరిక ప్రకిగణీయ కథాసంకలనాలు వ్యక్తులో విశ్వవిద్యాలయాలవారో వేస్తూనే వుంటున్నారు. మనం కొన్నిటిని చదివినా కొన్ని తప్పుకునే అవకాశాలుంటాయి.
సుప్రసిద్ధులు కథల్నే కాదు సుప్రసిద్ధులు కావలసిన కథారచయితల కథలూ ఎన్నో చదివి గుణకారణంగా కొన్నిటిని ఎంపికచేసుకుని హృదయాల్ని స్పృశించే కదిలించే విశేషాల్ని తెలపటం ఇందులో రచయితకు గల పండిన అనుభవం కనిపిస్తుంది.
ఈ పుస్తకం చదవడంవలన బహుళార్థసాధక ప్రయోజనాలున్నాయి. ఇందులో మనం చదివిన కథావిశే్లషణలుంటే- ఇందువలనా మనకీ కథ నచ్చింది అని క్రొత్తగా అనిపిస్తుంది. చదవని కథల పరామర్శల్ని చదివితే ఇంత మంచి కథగా మనం చదవలేదని కొత్తగా మనం వానిని చదివి తీరుతాం. ఇంత గొప్ప కథల్లో మనం కొన్నిటినైనా ఇతర భాషల్లోకి అనువదించుకోగలుగుతున్నామా అనే ఆవేదన కలుగుతుంది.
ఒక్కొక్క కథకు ఆత్మనే ఎక్సరే తీసి శీర్షిక పెట్టారా అనిపించేటంతగా ఉంటుంది శీర్షిక. రచయిత్రి లేక రచయిత జీవన పరిచయాలు కథారచనల కీర్తులతో జోడించి ఇచ్చిన తరువాత కథా ప్రధాన ఘట్టవిశేషాలు చెప్పడం కథారచనా రంగంలో ఆ కథల స్థారుూభేదాల్ని తార్కికంగా చెప్పడం ఈ గ్రంథ విశేషం.
దహనం, ఆకాశదేవర, దగ్ధగీతం, వీరుడు మహావీరుడు, అడుగు, వేషం వంటి కథలు ఎందువల్ల గొప్పవో విహారి చెప్పారు.
రాయలసీమ రైతు వెతల్ని జీవద్భాషలో రాసిన శాంతి నారాయణకథ ‘కల్లమయిపాయ’ కథకు సేద్యం బరువునుమోస్తూ విరిగిన జాతి వెనె్నముక’ అని శీర్షిక పెట్టడం కథను విశే్లషిస్తూ ఎవరి ఉటంకింపునోకాక రచయిత ఉటంకింపుగా కథ అంటే రాయటంకాదు, చెప్పడమూ కాదు. ప్రదర్శించడం’ అని ఇవ్వడం బాగుంది. ఇప్పటికే పేరున్న పాత కథల్ని వాటి విలువల్ని గౌరవిస్తూ, 21వ శతాబ్ద కథల్నీ అధ్యయనం చేసి రాయడంకి ఉదాహరణగా కాంతి అవరోధాన్ని కళ్ళముందు నిలబెట్టిన ఖదీర్‌బాబు కథానిక; గెట్ పబ్లిష్‌డ్‌ని చెప్పవచ్చు.
అందులో విహారిగారు ‘‘తెలుగు కథానిక పురోగమనం నూరేళ్ళకు పైగా సాగుతూ వుంది. ఈ సుదీర్ఘ జైత్రయాత్రలో ఎనె్నన్ని విజయాలు ఎనె్నన్ని మైలురాళ్ళు!… కథానిక పరిణామ వికాసాల్లో ఇరవై ఒకటో శతాబ్దం ఒక కొండ గుర్తుకానున్నది. దానికి సూచనగా ఈ పదేళ్ళ కాలంలోనూ చాలా గొప్ప కథలు వచ్చాయి. అవన్నీ దిగ్భ్రమ కలిగించే తేజోరేఖలు’ అని అన్నారు. అటువంటి తేజోరేఖల్ని దర్శింపజేయడానికి ఇటువంటి కథాకృతులు మరిన్ని విహారి వంటివారి లేఖినుల నుండి రావాలి.
ఆయా కథల గురించి రాస్తున్న సందర్భాలలో విహారి కథ/ కథానిక రచనా పరిణామ ప్రస్థానాలను అలవోకగా ఆలోచనాంశాలు చెప్పడం పాఠక ప్రయోజనదాయకం. ‘మానవీయ విలువల్ని’ వినిపించే కథలు డా.ఎన్. రామచంద్ర స్వప్నదారులు అనే రచనలో సందర్భశుద్ధిగా రామచంద్ర ఇలా అన్నారని చెప్పారు. ప్రజల అవసరాలు, ఆలోచనలు, అవకాశాలు, ఆవిష్కరణలు పెరిగాయి. బాహిరమైన భౌతికావసరాలతో పాటు, ఆంతరమైన తాత్త్విక ధోరణులు చర్చల్లో నిలబడ్డాయి. సాహిత్యానికి కేవలం స్థానికతేకాక కొంతవరకైనా సార్వకాలికత, సార్వజనీనత, సార్వదేశికతా స్పర్శ అవసరం లేకపోతే మూస రచనలే సాహిత్య వౌలికత అయి కూర్చుంటుంది. కరువులు, కక్షలు, మట్టిమనుషుల కష్టాలు, స్ర్తి అస్తిత్వ వేదనలు, ఉద్యమాలు, వాదాలు, వివాదాలు, మనిషి సమాజం ప్రకృతి అనే త్రిపుటి చుట్టూ పరిభ్రమణంతోపాటు మానవ జీవితంలోని సున్నిత పార్శ్వాలన్నీ స్పృశించవలసి వుంటుంది. కళాత్మకంగా రచయతలకు ఆత్మవిశ్వాసం కొరవడే గుంపులతత్వం త్వరగా సమసిపోతే సాహిత్యానికి మరింత ఆదరణ, గౌరవం వుంటుంది’. ఈ వాక్యాలు వర్తమాన సాహితీ లోకంలో ఆలోచనాత్మకాలే.
ప్రసిద్ధులు చెప్పే వాక్యాల్నేకాక సామాన్యులు చెప్పే అసామాన్య ఆలోచనా వాక్యాలకు విలువ ఇవ్వడం వాటిని పాఠకులకి అందించడం విహారిగారి రచనా విశేషం.
లోగడ కథాకృతి రెండు భాగాల్లోనూ వందేసి పరిచయాలుండగా ఈ మూడవ భాగంలో యాభై కథావిహారాలున్నాయి. ఈ గ్రంథాన్ని విలక్షణ సమీక్షాగ్రంథంగా, తేజోరేఖల పరామర్శల గ్రంథంగా చెప్పుకోవచ్చు.
చాలా ప్రక్రియల్లో రచయితగా, అర్ధశతాబ్దంగా కథారచనల అధ్యయనపరునిగా పేరుపొందిన విహారి మంచి కథల్ని ఈతరం పఠితల దృష్టికి పరిచయం చేయాలనే సంకల్పం గొప్పది. నవలల గురించీ ఇటువంటి గ్రంథాలు అవసరం. రచయిత ‘గుప్పెడు జ్ఞాపకాల పూలపొట్లంగా ఈ గ్రంథాన్ని అభివర్ణించుకున్నారు. మనం దీనిని పరీమళాల కథా పుష్ప వృక్షంగా భావిద్దా0

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళలు నిండిన జీవితం

కళలు నిండిన జీవితం

ANDHRAPRABHA –   Sun, 8 Feb 2015, IST

ప్రపంచంలోని మేధస్సుకు శిరోభాగం, సాహిత్యానికి హృదయ భాగం భారతదేశం. అద్భుతమైన శాస్త్రాలు, అనేకమైన సాహితీ సంపద ఎందరో మహానుభావుల కృషిఫలంగా సనాతన సంప్రదాయం వారసత్వ ధనాన్ని అందిస్తూనే ఉంది. సాహితీ సుహృదయులలో తన సుమధుర కవితాధారచే విరాజిల్లిన ఆప్తకవీశ్వరుడు. రాటుదేలిన కవిపండితుడు మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ.

తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో జన్మించిన మధురకవి సాహిత్యోద్యమంలో అపారకృషి చేసిన మహానుభావులు. మామిడిపల్లి సాంబశివశర్మగారు అనేక గ్రంథ స్రష్టతా, ద్రష్టలు, బహుముఖ ప్రజ్ఞాధురీణులు. కమ్మని గానం రమ్యమైన గాత్రం మృదుమధురమైన హాస్యప్రియత్వం వారి సొంతం. వీరు కేవలం కవులే కాదు, నటకులు నాటక క్రోడీకర్తలు. గేయరచన, సంగీత దర్శకత్వం, నటనాదర్శకత్వం. రంగస్థల రచనా నైపుణ్యం. తెలుగు, హిందీ, సంస్కృత భాషలలో వైదుష్యం, ఉర్దూ పరిచయం, చక్కని వావదూకత, హరికథనం, పురాణ ప్రవచనం, భాషాంతరీకరణ సామర్థ్యం మొదలగునవి వీరి ప్రత్యేకత. స్వాతంత్య్ర సమరయోధులుగా పేరుగాంచినారు.

అనేక రేడియో కార్యక్రమాలు చేసిన ఘనులు. అష్టావధానం చేసిన సుప్రసిద్ధులు మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ.

భగవంతుని మేల్కొలిపే సుమధుర సాహితీగానం సుప్రభాతం. మధురకవి రచనాధురి వివిధ సుప్రభాతాల వెల్లువై అలరారింది. లోకప్రసిద్ధమైన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమునూ, స్తోత్ర ప్రపత్తులనూ తలపించే రీతి మధురకవి శ్రీ రాజరాజేశ్వర సుప్రభాతం రచించబడింది. దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రంలో నేటికీ ఈ కవి వ్రాసిన శ్రీరాజ రాజేశ్వర సుప్రభాతం ఆలపించబడుతూ ప్రభాత వెలుగులను భాసింపచేస్తుంది. ఇదే కాకుండా కాళేశ్వరమునకు సంబంధించిన ముక్తేశ్వర సుప్రభాతం, బాసర సరస్వతీ సుప్రభాతం, గంగాసుప్రభాతం, శ్రీ గౌరీశంకర సుప్రభాతంత. శ్రీ ఆదిశంకర సుప్రభాతం వీరు రచించారు. కొమురవెల్లి మల్లన్న, సుప్రభాతం, బెల్లంపల్లి శ్రీరామచంద్ర సుప్రభాతం. బెజ్జంకి శ్రీ నృసింహసుప్రభాతం. సికింద్రాబాద్‌ మహంకాళి సుప్రభాతం మొదలగునవి కూడా వీరి కలం నుండి జాలువారినవే.

మధురకవి జయశ్రీ, ముక్తాహారం, కుంజవిహారం. శ్రీ రాజేశ్వర తారావళి అనే పద్యకావ్యాలు అద్భుతంగా రచించారు. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలతో ఈ కవి వ్రాసిన ద్విపద రామాయణం రామకథా సముద్రంలో ఓలలాడిన ఎందరో కవిపుంగవుల పంచన మధురకవినీ సత్కరించిందంటే అతిశయోక్తి లేదు. శ్రీ రాజరాజేశ్వర క్షేత్రమహత్యం, తరిగొండ వెంగమాంబ చరిత్ర హరికథలుగా, భద్రావతి, త్యాగయ్య నాటకాలుగా శ్రీ నృసింహశతకం శతకంగా, దక్షయజ్ఞం, ముగ్గురు మరాఠీలు, దీపావళి, బుర్రకథలుగా, మధుర ఝంకారం, భక్తిగీతాలు, మంగళహారతులు భజన కీర్తనలుగా, లోభసంహారం అనే విలక్షణ రచన అధిక్షేప కావ్యంగా మధురకవి రచనలు ప్రసిద్ధిగాంచాయి. జీవితకాలంలో అనేక రచనలు గావించి విభిన్న కళలలో విశేష ప్రజ్ఞను చెప్పకనే చాటిచెప్పిన నిరాడంబర సామాజిక కవి మధురకవి.

మామిడిపల్లి సాంబశివశర్మగారు సాంబకవిగా సుపరిచితులు సాంబకవి పవిత్ర కవితాజీవనులు. వీరి సాహితీ జీవనం సువిశాలమైంది. కవిసార్వభౌముడు శ్రీనాథుని పోలిన జీవితం వీరిది. సర్వసౌఖ్యాలూ, సత్కారాలూ, కష్టములూ అనుభవించారు. అనేకుల సహృదయ మన్ననలు పొందినవారై మధురకవి, విద్వత్కవి అనే బిరుదులను గ్రహించారు సాంబకవి. సాంప్రదాయ ఛాయలో అభ్యుదయ ఆలోచనలకు రూపమిచ్చిన పండితులు వీరు. ప్రాథమిక విద్యనే అభ్యసించిన ఈ కవి సరస్వతీ కఠాక్షంతో అనేక కావ్యరచనలు చేసారు.

మానవత్వాన్ని మోసం చేస్తున్నది దైవం కాదనీ, దానవత్వం ఆవహించిన మానవ సమాజమేననీ సమాజమేననీ గుర్తించిన సాంబకవి లోభసంహార కావ్యం ద్వారా సమసమాజ స్థితిగతులను వర్ణించారు. మనిషికి వివేకం నశింపజేసే ఒక్క లోభమే అనేక అనర్థాలకు కారణమైతే మిగతా కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు మానవులలో మూర్తీభవిస్తే మానవుల పరిస్థితేమిటోనని దిగులు పడుతూ తస్మాత్‌ జాగ్రత్త అంటూ సమాజానికి సందేశమిచ్చిన అద్భుత అభ్యుదయ కావ్యం లోభసంహారం.

సాంబకవి ప్రగతిశీలి. జీవితంలోని ఒడిదుకులను తట్టుకోలేక పరితపించినా ఎదుటివారికి జీవన పంథాను తన రచనల ద్వారా నిర్దేశించారు. తెలంగాణా కవులు నివురుగప్పిన నిప్పులని నిరూపించిన ధీరోధాత్తులు సాంబశివశర్మ బహుముఖ ప్రజ్ఞాపాండిత్యము గల అరుదైన కవులలో వీరూ ఒకరు. వీరి అప్రతిమ ప్రతిభావిశేషం ప్రాజ్ఞ ప్రశంసాపత్రమై అలరారుతుంది. కళాసాహితీరంగాలను బట్టి, చారిత్రక ఆధారాలను బట్టి ఇంతటి కళాకారుడు, కవిపుంగవుడు గత శతాబ్దకాలంలో ఉద్భవించిన దాఖలాలు లేవు అనలేక ఉండలేము.

అనంతమైన సాహితీ ప్రపంచంలో, కళాప్రకృతిలో రవిగాంచని మహా వట వృక్షంలాంటి కవిపుంగవుడు, సంస్థాస్వరూప వ్యక్తి, మహామనీషి, బహుముఖ ప్రజ్ఞాశాలి. కళాతపస్వి, ధన్యజీవి, అమరజీవి మామిడిపల్లి సాంబశివశర్మ.

సరస కవిత్వంలో, గంభీర భావుకతలో, నటనా వైదుష్యంలో, నర్మగర్భ వ్యవహారశైలిలో, హరికథాకథన చాతుర్యంలో, వివిధ రచనా పటుత్వంలో సాంబకవికి సాంబకవే సాటి. సహజ పాండిత్య సంపన్నులై, సరస సద్గుణాలంకార శోభితులై, బహుముఖ ప్రజ్ఞాధురంధరులై విరాజిల్లిన మధురకవి రచనలు అమృత గుళికలు, ఆపాత మధురాలు.

దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీరాజరాజేశ్వరపురం వేములవాడలో సుప్రభారత గీతమై, విద్వద్వరేణ్యుల ప్రశంసలలో భాగమై, ముద్రిత రచనలలో చిక్కిన అక్షరమై అముద్రిత రచనల్లో కనిపించని భావమై శ్రీ మామిడిపల్లి సాంబశివశర్మ మధురకవిగా, సాంబకవిగా అలరారుతారు. కవితా సామ్రాజ్యానికి శాశ్వత చక్రవర్తియై వెలుగొందుతారు.

‘జయంతితే సుకృతి నోరససిద్ధా: కవీశ్వరా:

నాస్తిమేషాం యశ: కాయే జరామరణజం భయమ్‌.’

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహాత్ముని బాటలో నడచిన బీబీ అమతుస్సాలాం

మహాత్ముని బాటలో నడచిన బీబీ అమతుస్సాలాం

ANDHRAPRABHA –   Sun, 8 Feb 2015, IST

అమతుస్సలాం అన్ని కష్టాలను, నష్టాలను, అనారోగ్యాన్ని తన దృఢసంకల్పంతో అధిగమించి మహాత్ముని ప్రశంసలకు పాత్రురాలయ్యారు. మహాత్ముని ప్రియ పుత్రికగా ఖ్యాతి పొందారు. 1922లో గాంధీజీ సబర్మతి ఆశ్రమం మూసివేశారు. ఆ సమయంలో గాంధీజీ అనుమతితో ఆశ్రమంలోని ఇతర మహిళలతో ఆమె కూడాజైలు కెళ్లారు. స్వరాజ్యసాధనతో పాటు హిందూ -ముస్లింల ఐక్యత, హరిజనుల సంక్షేమం తన జీవితలక్ష్యమని ప్రకటించారు ఆమె.మహాత్ముని బాటన జాతీయోద్యమంలో నడిచిన బీబీ అమతుస్సలాం హిందూ-ముస్లిం ఐక్యతా చిహ్నమయ్యారు. మత కలహాలు నివారించేందుకు ఆమె నిరంతరం పాటు పడ్డారు. వాయువ్య సరిహద్దులు, సిందు నౌఖాళి ప్రాంతాలలో మత కలహాలు విజృంభించినప్పుడు సామరస్యం ప్రభోదించేందుకు తన ప్రత్యేక దూతగా గాంధీజీ ఆమెను పంపారు.

స్వాతంత్య్రోద్యమ చరిత్రలో భాగంగా పరాయి పాలకుల బానిసత్వం నుండి గాంధేయ మార్గాన మాత్రమే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సాధ్యమని భావించి మహాత్ముని సాన్నిత్యంలో జీవిత చరమాంకం వరకు గడిపిన మహత్తర చారిత్రక అవకాశం అతికొద్దిమందికి మాత్రమే దక్కింది. అటువంటి అద్భుత అవకావాన్ని సొంతం చేసుకున్న అదృష్టవంతులలో ప్రముఖ స్థానమాక్ర మించారు ‘బీబీ అమత్సులాం’

భారత జాతీయోద్యమం పట్ల అపారగౌరవాభిమానాలను ఆచరణలో వ్యక్తం చేసిన పాటియాలా రాజపుఠాణా పరివారంలో 1907లో బీబీ అమతుల్సలాం జన్మించారు. తల్లిపేరు అమతుర్రెహమాన్‌, తండ్రి కల్నల్‌ అబ్దుల్‌ హమీద్‌ పాటియాలా సంస్థానంలో ఆర్థిక మంత్రి. ఆయన 1920 ప్రాంతంలో కన్నుమూసారు. ఆరుగురు అన్నదమ్ములకు ఏకైక చెల్లెలుగా అమతుస్సలాం గారా బంగా పెరిగారు.

చిన్ననాటి నుంచి స్వేచ్ఛా స్వభావాన్ని వ్యక్తం చేసేవారు. సమకాలీన సమాజాన్ని అధ్యయనం చేసి పురాతన రీతి రివాజులను, అహేతుక అచార, సంప్రదాయాలను వ్యతిరేకించారు. సామాజిక, రాజకీయ సమస్యలపట్ల మంచి అవగాహన కలిగి ఉన్నా శారీరకంగా చాలా బలహీనం కావటంతో ఆమెకు ఆరోగ్యం అంతగా సహకరించేది కాదు.

ఆమె 13 సంవత్సరాల వయసులోనే ఖురాన్‌ మజీద్‌ను అనువాదంతో సహా చదివారు. కొన్ని ధార్మిక గ్రంథాలను కూడా అధ్యయనం చేశారు. వారి కుటుంబంలో పర్దాను కఠినంగా అమలు చేసేవారు. స్వంత అన్నదమ్ముల ఎదుట కూడా సంచరించటానికి అనుమతి లభించేది కాదు. ఆకారణంగా స్కూలుకు వెళ్లే ప్రశ్నే తలెత్తలేదు. ఆమె తండ్రి అలీఘర్‌లోని బాలికల స్కూలుకు పంపాలనుకున్నారు. జాతి అభివృద్ధి కోసం సామాజిక ఆక్షలను ఉల్లంఘించగల సాహసం ఆయనకుంది. దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో అవకాశం ఆమెకు లభించలేదు. ఆయన మరణం వల్ల ఆమె చదువు ఉర్దూ చదవటం, రాయటం వరకు పరిమితమైయింది. ఆమె పెద్దన్న మహమ్మద్‌ అబ్దుర్రషీద్‌ ఖాన్‌ జాతి జనుల సేవ చేయాలన్న ఆలోచనలు ఆమెలో కలిగించారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1920లో సాగిన ఖిలాఫత్‌ – సహాయం నిరాకరణ ఉద్యమంతో ఆయన పాల్గొన్నారు. త్వరితగతిన ఆమె పెళ్లి చేయాలన్న తల్లి ఆలోచనలను అన్న మాటలతో మార్చుకున్నారు. చిన్నప్పటి నుండి విలాసవంతంగా గడపడం, విలువైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు ధరించడం అంటే అయిష్టతతో ఉండేది అమతుల్సలాం.

ఆమె పెద్దన్నయ్య అబ్దుర్రషీద్‌ ఖాన్‌ 1922లో జిల్లా కాంగ్రేసు కమిటి అధ్యక్షుడయ్యాడు. ఆయన ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆరు మాసాలు జైలు శిక్షకు గురయ్యాడు. అమతుస్సలాం బుర్ఖా ధరించి అంబాలాలోని వీధుల్లో తిరిగి ఖద్దరు ప్రచారం చేయసాగారు. పలు సమావేశాలకు, సభలకు హాజరయ్యారు.

మహమ్మద్‌ అలీ జౌహర్‌, ఆయన తల్లి బీబీ అమ్మల పర్యటనలు తరచుగా పంజాబులో జరిగేవి. ఆ పర్యటన ప్రభావం ఆమె మీద ఉండేది. ప్రజాసేవ చేయాలన్న ఉత్సాంహం ఆమెలో పెరిగింది.

భిలాఫత్‌ ఉద్యమం సందర్భంగా హిందూ ముస్లీంలో వ్యక్తమైన ఏకతా భావనను మరిచిపోలేనంటారు ఆమె. బాపు 21 రోజులపాటు నిర్వహించిన వ్రతం ఆమె హృదయంలో గాఢమైన ప్రభావం చూపింది. మహాత్ముడు నిర్వహిస్తున్న పలు ఆందోళనా కార్యక్రమాల గురించి ఆమె ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. బ్రిటీషు వారి బానిసత్వంలో న్యాయవాదవృత్తి చేయకూడదని ఆబ్దుర్రషీద్‌ నిర్ణయించుకున్నాడు. ఆయన స్నేహితుడు ఆయన్ను ఇండోరు మహా రాజు కార్యదర్శిగా ఇండోరు తీసుకెళ్లారు. జాతీయోద్యమం గురించిన విశేషాలను అన్నద్వారా తెలుసుకునేవారు. అనేక గ్రంథాలను, పత్రికలను చదివేవారు. మహాత్ముని అహింసా సిద్ధాంతంపట్ల అమతుస్సలాం ఆకర్షితులయ్యారు. మహాత్ముని బాటలో నడవాలని నిర్ణయించుకొని సబర్మతీ ఆశ్రమానికి వెళతానని అన్నకు తెలిపారు. ఆయన నవ్వి ఊరుకున్నారు. ఆమె సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. కేవలం ఒక అతిథిగా కొన్నాళ్లు ఉండటానికి మాత్రమే గాంధీజీ అంగీకరించించారు.

ఆశ్రమ కఠిన నియమ నిబంధనలను పాటిస్తూ, అంకితభావంతో, నిబద్ధతతో, సేవాతత్పరతతో, చక్కని క్రమశిక్షణతో ఆశ్రమ వాసులలో ఒకరిగా ఇమిడిపోయారు. ఆమె కస్తూర్భా గాంధీజీలకు కన్నబిడ్డ సమానమయ్యారు. ఆశ్రమంలో అతిధిగా ఆహ్వానించబడ్డ ఆమె చివరకు ఆశ్రమ సేవికయ్యారు. ఒక ప్రసిద్ధ ముస్లిం రాజపుఠానా కుటుంబానికి చెందిన అమ్మాయి ఆశ్రమంలో చేరి అవివాహితగా జాతీయోద్యమానికి తనను తాను సమర్పించుకోవడం ఆనాడు ఊహించని సంఘటన.

స్వేచ్ఛా భారతం కోసం కలలు కన్న జాతీయోద్యమకారులు తాముకన్న కలలను భగ్నం చేస్తూ ఇండియా ముక్కలయ్యింది. ఆ విభజన కూడా మతం పేరిట సాగటం అమతుల్సలాం చలించిపోయారు. ఆ విఘాతం నుంచి బయటపడే లోపే గాంధీజీ హత్యకు గురి అవ్వడం ఆమె తట్టుకోలేకపోయారు. ఆ వేదన నుండి కొంత తేరుకున్న తర్వాత ఆమె పూర్తిగా పునరంకింతమయ్యారు.

మృదులా సారాబాయి, సుభద్రాజ్యోషిలతో కలసి అటు పాకిస్తాను ఇటు ఇండియా నుండి వేరు పడిన మహిళలను తమ వారున్న ప్రాంతాలకు చేర్చారు. దీని కోసం ఆమె తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

తరువాత ఆమె పంజాబ్‌లోని రాజపూర్‌ గ్రామంలో కస్తూర్భా పేరిట ‘కస్తుర్భా మందిరం’ అనే ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆ ఆశ్రమంలో చేతివృత్తులు నేర్పటం, అక్షర జ్ఞానం అందించటం తదితర కార్యక్రమాలు చేపట్టారు. నిస్సాహాయులయిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పలు పథకాలు రూపొందించి అమలు చేశారు. ఆమె దళితలు, మహిళల సేవలకు అంకితమయ్యారు. అనితర సాధ్యమైన రీతిలో సేవ చేసిన గొప్ప మహిళామూర్తి బీబీ అమతుల్సలాం చివరి వరకు గాంధేయమార్గాన్ని వీడలేదు. సమరశీల జీవితాన్ని గడిపిన ఆ మహా మానవి 1985 అక్టోబర్‌ 29న తుది శ్వాస విడిచారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పగిలిన గాజుపలక ఆర్ కె లక్ష్మణ్ కు ప్రపంచాన్ని చూపిందట

rk1 001 rk2 001 rk3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ డైలాగే నాకు టర్నింగ్ – డబ్బింగ్ ఆర్టిస్ట్ స్వగతం – ఆమెకు న వాయీస్ సుట్ అవ్వదు – డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఘంటసాల గారి మనవ రాలు

ఆ డైలాగే నాకు టర్నింగ్

 

‘‘కళ్ళతో కోటి భావాలు పలికిస్తే సరిపోదు.. ఉచ్ఛారణలో జ్ఞానాన్ని కూడా పలికిస్తేనే అదీ అసలైన నటన. అందుకే వాచికం సర్వవాంగ్మయం అన్నారు. ఇప్పటి కథానాయికల్లో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలిన అందరి దృష్టి అభినయం, ఆహార్యంపైనే ఉంటుంది. వాచికంతో వాళ్ళకు పనిలేదు. ఇది బాధకరమైన విషయం. తెలుగురాని ఈ ముద్దుగుమ్మల పుణ్యమాని అందమైన హస్కీ వాయి్‌సలను వినే అవకాశం మన
ప్రేక్షకులకు దక్కింది. అలాంటి వాయిస్‌లతో తమన్నా, శ్రుతిహాసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హన్సిక, రెజీనా, నందితలకు డబ్బింగ్‌ చెబుతున్నది ఎవరో తెలుసా? హరిత. ఈ అమ్మాయి కోవలోనే ‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాలో అదాశర్మతోపాటు అనుష్క, హన్సికల పాత్రలకు డబ్బింగ్‌ చెప్పిన మరో అమ్మాయి ఘంటసాల వీణ. డబ్బింగ్‌ కెరీర్‌లో దూసుకుపోతున్న వారిద్దరే ఈ వారం మన సండే సెలబ్రిటీలు..
‘‘చెన్నైలో పుట్టాను. పాఠశాల చదువంతా అక్కడ, కాలేజీ చదువంతా హైదరాబాద్‌లో సాగింది. బీకామ్‌ కంప్యూటర్స్‌ పూర్తి చేశాను. మా పిన్ని అనురాధ సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. గతంలో చాలామంది నటీమణులకు ఆమె గొంతు అరువిచ్చారు. ప్రస్తుతం ‘చిన్నారి పెళ్లికూతురు’లో అవికాగోర్‌ బామ్మ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారు. ఆమె ప్రోత్సాహంతో నేనీ రంగంలోకి అడుగుపెట్టాను. చిన్నప్పటి నుంచే డబ్బింగ్‌ స్టూడియోలకు వెళ్ళి అన్నీ పరిశీలించేదాన్ని. 13 ఏళ్ళ వయసులో చిన్న క్యారెక్టర్లకు, సీరియల్‌ ఆర్టి్‌స్టలకు డబ్బింగ్‌ చెప్పాను. ‘ఛత్రపతి’ సినిమాలో అజయ్‌ చెల్లి పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. కాంచబాబుగారి ద్వారా ‘కొత్త బంగారులోకం’ ఆడిషన్స్‌కి వెళ్లాను. అక్కడికొచ్చిన ముఫ్పై మందిలో నేనొకదాన్ని. నేను చెప్పిన ట్రాక్‌ నచ్చడంతో శ్వేతాబసు ప్రసాద్‌కి డబ్బింగ్‌ చెప్పే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ‘యే..కడా.. ఏ..పుడూ…’ (ఎక్కడ ఎప్పుడు) అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ అవ్వడంతో తొలి సినిమాతోనే గుర్తింపు లభించింది. అక్కడి నుండి డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నా కెరీర్‌ ప్రారంభమైంది. ‘కిక్‌’తో ఇలియానాకు మొదలుపెట్టాను. ప్రస్తుతం తమన్నా, శ్రుతిహాసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హన్సిక, రెజీనా, నందితలకు రెగ్యులర్‌గా డబ్బింగ్‌ చెబుతున్నాను. అవికాగోర్‌, (లక్ష్మీ రావే మా ఇంటికి), పూజా హెగ్డే (ముకుంద), రాశిఖన్నా (జోరు), మిష్టీ (చిన్నదాన నీకోసం), ఎమీజాక్సన్‌ (ఐ), యామీగౌతమ్‌ (కొరియర్‌బాయ్‌ కల్యాణ్‌)కు కూడా డబ్బింగ్‌ చెప్పాను. ఇప్పటి వరకు 350 సినిమాలకు పనిచేశాను. ప్రస్తుతం మెటర్నటీ లీవ్‌లో ఉన్నాను. ఏప్రిల్‌ నుండి మళ్ళీ బిజీ అవుతాను.
పరకాయ ప్రవేశం చేస్తా
తెలియని వ్యక్తికి వాయిస్‌ ఇవ్వడం అంటే సవాల్‌తో కూడిన పనే. వాళ్ళ మాట తీరు, బాడీ లాంగ్వేజ్‌ వేరుగా ఉంటాయి. వారు చేసిన పాత్రను, సన్నివేశాన్ని అర్థం చేసుకుంటే డబ్బింగ్‌ చెప్పడం చాలా ఈజీ. నేనయితే చెప్పాల్సిన సన్నివేశాన్ని ఓసారి చూస్తే చాలు పట్టేస్తా. ఒక్కోసారి ఎమోషన్స్‌ సీన్స్‌లో హీరోయిన్లు హై లెవల్‌ ఎమోషన్స్‌ క్యారీ చేస్తారు. మేము కూడా ఆ ఎమోషన్స్‌ క్యారీ చేస్తూనే వాయిస్‌ తగ్గించి, ఇంకోసారి పెంచి చెప్పాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సెంటిమెంట్‌, కామెడీ, రొమాన్స్‌ ఏదైనా అలవోకగా చెప్పగలను. ఫన్నీ సీన్స్‌, ఎమోషన్‌ సీన్స్‌కి వాయిస్‌ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. హీరోయిన్‌ ఎవరైనా సరే వారి డైలాగ్‌లు ఒక్కసారి చదివితే చాలు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాను, ఇలియానాకు డబ్బింగ్‌ చెబితే ఇలియానా, తమన్నాకు చెబితే తమన్నాగా మారిపోతా. చెన్నైలో పుట్టాను కాబట్టి మొదట్లో నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు. ఐదేళ్ళ క్రితమే తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్నాను. ఇప్పుడు తెలుగులో పర్‌ఫెక్ట్‌ నేను.
డిమాండ్‌ను బట్టి పారితోషికం
ఎన్నో కెరీర్‌ల మాదిరి ఇది కూడా ఒక కెరీరే! ఆసక్తితో వచ్చాం కాబట్టి.. ఇష్టంగా పనిచేస్తున్నాను. ఇక, పారితోషికం సంగతికొస్తే – డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించిన పారితోషికాన్నే మేం తీసుకుంటాం. అది సినిమా మీద, క్యారెక్టర్‌ లెంగ్త్‌ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హీరోయిన్‌ను బట్టి డిమాండ్‌ ఉంటుంది. పెద్ద సినిమాలకు వారం రోజులు పనిచేయాల్సొస్తుంది. చిన్న సినిమాలకు రెండు, మూడు రోజులు, ఇంకొన్ని సినిమాలకైతే కేవలం ఒక్కరోజు చెప్పేస్తాను. కొందరు దర్శకులు సింగిల్‌ టేక్‌లో చెప్తే అంగీకరించరు. ఇంకా బెటర్‌మెంట్‌ కావాలంటారు. అలాంటప్పుడు కాస్త సమయం పడుతుంది. ఇటీవల కాలంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టిన సినిమా ‘చక్కిలిగింత’. డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నేను అందుకున్న తొలి పారితోషికం రూ.300. పదమూడేళ్ళ వయసులో అది.
ఊహించని నంది
నంది అవార్డ్‌ వంద సినిమాలు చేస్తే వస్తుందేమో అనుకునేదానిని. కానీ నా రెండో సినిమా ‘నచ్చావులే’కి తొలిసారి నంది అవార్డ్‌ రావడం మధురమైన జ్ఞాపకం. అసలు నేను ఊహించని అవార్డ్‌ అది. టీవీలో న్యూస్‌ చూసి మా అంకుల్‌ కాల్‌ చేసి ‘నీకు నంది అవార్డు వచ్చింది’ అని చెబితే నమ్మలేదు. న్యూస్‌ చూసి నన్ను నేను గిల్లుకుని చూసుకున్నాను. ఆ రోజు అనుభవించిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అలాగే ‘రాధామధు’ సీరియల్‌కి కూడా ఓ నంది వరించింది. ఎప్పుడైతే నంది అవార్డ్‌ అందుకున్నానో అప్పటి నుంచి వృత్తిపై మరింత బాధ్యత పెరిగింది. ఇంకా కష్టపడి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నా వాయిస్‌ నచ్చి చాలామంది పాటలు పాడమని అడిగారు. సున్నితంగా తిరస్కరించా.
నచ్చిన సన్నివేశాలు
నేను డబ్బింగ్‌ చెప్పిన సినిమాల్లో ‘కొత్త బంగారులోకం’లో వరుణ్‌, శ్వేతా సినిమాకెళ్ళొచ్చి కాలేజీ టెర్రస్‌ మీద మాట్లాడుకొనే సందర్భం, ‘కిక్‌’లో ఇలియానా రవితేజను తిట్టే సన్నివేశం, ‘ఊసరవెల్లి’లో తమన్నా.. నాకు సహాయం చెయ్యి అనడిగే సీన్‌, ‘రేసుగుర్రం’లో శ్రుతిహాసన్‌ మనసులో నవ్వుకున్నాను అనే సీన్‌, ‘ఓ మై ఫ్రెండ్‌’లో వర్షం సీన్‌ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ డబ్బింగ్‌ చెబుతూ నేను ఎంజాయ్‌ చేసిన సన్నివేశాలు.
పర్సనల్‌ టచ్‌
అమ్మానాన్న చాలా సపోర్టివ్‌ పర్సన్స్‌. నాది ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతోనే పెళ్ళి చేసుకున్నాము. ఆయన పేరు రఘు. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే. అన్యోన్యమైన జంట మాది. ఖాళీ సమయంలో పాటలు ఎక్కువగా పాడతా. పజిల్స్‌, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడతాను. ఒకప్పుడు సౌందర్య, రమ్యకృష్ణలకు, ఇప్పుడు నదియాకు డబ్బింగ్‌ చెబుతున్న సరితగారు నాకు స్పూర్తి. అలాగే సునీతగారంటే చాలా ఇష్టం..’’
ఆమెకు న వాయీస్ సుట్ అవ్వదు
పదేళ్ళ వయసులోనే డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించాను. చిన్నతనంలో నాన్నతోపాటు డబ్బింగ్‌ స్టూడియోలకు వెళ్ళేదాన్ని. అప్పుడు నాన్న ‘అభినందన’, ‘మౌనరాగం’, ‘రోజా’ చిత్రాలకు డబ్బింగ్‌ చెబుతున్నట్లు గుర్తుంది. నేను కూడా డబ్బింగ్‌ చెబుతా అని నాన్నని అడిగాను. తొలిసారి ‘మోగ్లీ’ సీరియల్‌కి నా గొంతు అరువిచ్చా. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘సూర్యవంశం’ సీరియల్‌లో ఒక ప్రధాన పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. అలా చిన్నతనంలోనే డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా కెరీర్‌ ప్రారంభమైంది. తర్వాత వెన్నెలకంటి శశాంక్‌ పని చేసిన మాగ్జిమమ్‌ సినిమాలకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పాను. బింధుమాధవి (సెగ), జెనీలియా (ఉరిమి), పియా బాజ్‌పయ్‌ (గోవా), కంగనారనౌత్‌, హన్సిక (బిరియాని), ‘ఏమాయ చేశావె’లో నాగచైతన్య సిస్టర్‌ పాత్రకు ఇలా చాలా సినిమాలకు పనిచేశాను. ఉరిమిలో ‘చిన్ని చిన్ని వెన్నెల’ ‘అందాల రాక్షసి’లో ‘నిన్ను చేరవచ్చేలా’ పాటలు కూడా పాడాను. నాన్న చదువు పూర్తి చేసి ఈ రంగంలోకి అడుగుపెట్టు అనడంతో ఎమ్‌బీఏ పూర్తి చేశాను. నేను పనిచేసిన తొలి స్ర్టెయిట్‌ సినిమా ‘హార్ట్‌ ఎటాక్‌’. డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నాకెంతో గుర్తింపు, ఎన్నో అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. ‘కరెంట్‌ తీగ’లో సన్నిలియోన్‌కి కూడా వాయిస్‌ నాదే.
నన్ను మార్చేద్దాం అన్నారు
డబ్బింగ్‌ పట్ల నాకున్న ఇంట్రెస్ట్‌ గురించి డబ్బింగ్‌ ఇంజనీర్‌ పప్పుగారి ముందుంచాను. ‘హార్ట్‌ ఎటాక్‌ ’ సినిమా హీరోయిన్‌కి ఓ ఫ్రెష్‌ వాయిస్‌ కోసం పూరీగారు ట్రై చేస్తున్నారని చెప్పి నన్ను సజెస్ట్‌ చేశారు. హయాతీ క్యారెక్టర్‌కి డబ్బింగ్‌ స్టార్ట్‌ చేశాక కొత్త హీరోయిన్‌కి కొత్త డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ సూట్‌ కాదు. రిస్క్‌ చేయడం ఎందుకు ఇంకెవరితోనైనా చెప్పిద్దాం అని చాలామంది పూరి జగన్నాథ్‌గారిని భయపెట్టారు. ఆయన మాత్రం నాతోనే చెప్పించారు. నేను పాటలు పాడతాను అని తెలిసుంటే ఇందులో ఓ పాట కూడా పాడించేవాణ్ణి.. అని ఆయన నాతో అన్నారు కూడా. సినిమా ప్రివ్యూ అయిన వెంటనే మా టీమంతా నన్ను మెచ్చుకున్నారు. మీ గొంతు సూపర్‌’ అని మెసేజ్‌లు, మెయిల్స్‌ రావడం నాకు మరింత బలానిచ్చింది. కొత్త ఆర్టి్‌స్టకి ఇంతకన్నా గొప్ప ప్రశంస ఇంకేం ఉంటుంది. అలాగే తొలిసాని ఓ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ పనితనం గురించి పలు వెబ్‌సైట్లలో ప్రస్తావించడంతో నేను ఇక్కడ రాణించగలను అనే నమ్మకాన్ని కలిగించింది. ఇప్పటి వరకు డబ్బింగ్‌ చెప్పిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ‘హార్ట్‌ఎటాక్‌’ మరో ఎత్తు. ఆ సినిమా ఇచ్చిన కిక్‌తో ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన మొదలైంది. అందుకే పప్పుగారి దగ్గర డబ్బింగ్‌ మెళకువలు నేర్చుకున్నా.
తాతగారి పాటలే నాకు పాఠాలు
ఘంటసాల వారి కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. తాతయ్యని నేను చూడకపోయినా సినీ పరిశ్రమలో ఆయన ఎలా నిలదొక్కుకున్నారనే విషయాన్ని నానమ్మ తరచూ చెబుతుండేవారు. ఆయన పాటలు వింటుంటాను. సంగీతం మీదు నాకు పట్టుంది. తాతగారి పాటలే ఈ రంగంలో నాకు పాఠాలు. తాతయ్య, నాన్న నాకు స్ఫూర్తి. వారిద్దరూ నా రియల్‌ లైఫ్‌ హీరోలు. చిన్నతనం నుంచే వారిద్దరిలా పేరు తెచ్చుకోవాలని ఆశ పడేదాన్ని. గాయనిగా తాతయ్య వారసత్వాన్ని, డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నాన్న వారసత్వాన్ని నిలబెట్టాలనేది నా తాపత్రయం. తెలుగు స్పష్టంగా మాట్లాడడం నా కుటుంబం నాకిచ్చిన గొప్ప బహుమతి. మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే నాన్న అస్సలు ఊరుకోరు. నాన్న గైడెన్స్‌ ఇవ్వరు. జస్ట్‌ ప్రీడమ్‌ ఇస్తారంతే.
నా వరకు రొమాంటిక్‌ సీన్స్‌కి డబ్బింగ్‌ చెప్పడం కాస్త కష్టంగా ఉంటుంది. ఏడుపు సన్నివేశాలను చాలా బాగా పండించగలను. అలాగే పాజిటివ్‌ సీన్స్‌కి కూడా చక్కగా చెప్పగలను. రొమాంటిక్‌ సినిమాలకు గౌతమ్‌మీనన్‌ పెట్టింది పేరు. తాజాగా ఆయన దర్శకత్వంలో అజిత్‌, అనుష్క, త్రిష నటించిన ‘ఎన్నై ఆరిందాళ్‌’ సినిమాలో అనుష్కకు నా వాయిస్‌ ఇచ్చాను..’’
 ఆలపాటి మధు, చిత్రజ్యోతి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాకలు తీరిన యోధుడు -చారూ మజుందార్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

42ఏళ్ళక్రితం నాతొ పామర్రు లోను ,22ఏళ్ళ క్రితం నాదగ్గర అడ్డాడ హైస్కూల్ లోను రైటర్ గా పని చేసిన అంజిరెడ్డి మనవరాలి పెళ్లి పామర్రులో 7-2-15 శ్రీ సాయిబాబా దేవాలయ కళ్యాణ మందిరం లో జరిగిన సందర్భం గా  అంజిరెడ్డి తో నేను .

42ఏళ్ళక్రితం నాతొ పామర్రు లోను ,22ఏళ్ళ క్రితం నాదగ్గర అడ్డాడ హైస్కూల్ లోను రైటర్ గా పని చేసిన అంజిరెడ్డి మనవరాలి పెళ్లి పామర్రులో 7-2-15 శ్రీ సాయిబాబా దేవాలయ కళ్యాణ మందిరం లో జరిగిన సందర్భం గా  అంజిరెడ్డి తో నేను .DSCN0001 DSCN0003 DSCN0004 DSCN0005

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వజ్రోత్సవం లో బాలానందం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కుచేల కుబేర వరాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్రేజీ కేరజీ వాల్ -హస్తిన పీఠం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -4

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -4

చిత్రకారుడైన వీర్రాజు గారి మదిలో ఆ కళ’’రేఖలతో రేరంగులతో రేకులు తొడిగి రంగులతో పువ్వై మరిమళించింది’’  రాజమండ్రి పరిసరాలు స్పూర్తినిచ్చాయి ఎన్నో సార్లు ఈ అందాల్ని తన చిత్రాల్లో ఓంపుకున్నారు .రేఖల్లోఒదగదీసుకొన్నారు .అక్షరాల్లో విస్తరించారు .అందుకే తన రచనల్లో ప్రకృతి పరుచుకొని ఉంటుంది .ఇంటర్ పరీక్ష లెక్కల్లో పోయింది .ఇంట్లో వాళ్ళు ఏమీ అనక పోయినా మనసులో బాధ కెలక వేసింది .అడ్డమైన ప్రతివాడి  దగ్గరా ,అభిమానం చంపుకొని తలొంచుకొని అడ్డ దిడ్డ ప్రశ్నలకు జవాబులిస్తూ గడిపి ఉద్యోగం రాక స్వశక్తితో బి ఏ చదవాలని చేరారు .పరీక్ష ఒక సారి తప్పితే స్కాలర్షిప్ రాదనీ తెలుసుకొని ఒళ్ళు దగ్గరేట్టుకొని శ్రద్ధగా చదివారు .తండ్రి తల తాకట్టు పెట్టి తోలి తరం ఫీజు కట్టారు .మళ్ళీ ఎప్పుడూ వారి సాయం కోసం అర్రులు చాచలేదు .

అప్పుడప్పుడు వేసిన చిత్రాలకు ,బరికిన కధలకు డబ్బులోస్తే వాటితోనే గడిపారు ‘’’డబ్బున్న మిత్రుడు బసవ రాజు ‘’కు చిత్రాన్ని అమ్మి ఆయనిచ్చిన ‘’పచ్చనోటు ‘’తో కాలేజి ,వెల్ఫేర్ ఫండ్ నుంచి ఒక టరం ఫీజు డబ్బులు ముట్టాక ఇబ్బంది లేకుండా పోయింది తనపై తనకు నమ్మకం వచ్చింది .’’సంతోషం గుండెల్లోంచి ముఖం లోకి తన్ను కొచ్చింది ‘’ట.’’చరిత్ర గత కాలానికి ఆల్బం అయితే రాజకీయం వర్తమానానికి అద్దం’’అన్నారు .తన్ను అంటి పెట్టుకొని కనిపెట్టుకొన్న స్నేహితునికి ‘’కదక్ మిత్ర ‘’అని పేరుపెట్టి కాలేజీ రోజులు అతనితోనే గడిపారు .కాలేజీ లో సీనియర్ ‘’కనక ప్రవాసి ‘’అంటే శ్రీపాద వారి సాహిత్యాన్ని కూలం కషం గా అధ్యయనం చేసి ఎన్నో విషయాలు రాసినవాడు .తరుణ సాహితీ సభ ఏర్పాటు చేసి శీలా వారికి ఆహ్వానం పంపాడు .అదే ఆయనకోచ్చిన మొదటిదీ ,ఆఖరిదీ .’’జీవితం లోను ,సాహిత్యం లోను  నాకన్నా ముందుపుట్టిన రంది సోమరాజు ‘’తెలుగు స్వతంత్రలో దూసుకు పోతున్నాడు .’’సహ రచయితగా గుర్తించి ,-సాదరం గా ఆహ్వానించి –స్నేహహస్తం తో నావేళ్ళనే పెనవేసుకొన్నాడు ‘’అని కృతజ్ఞత తెల్పి ఆప్తుడైనారు .ఇంతకీరంది సోమరాజు ఎవరు –అని ప్రశ్నించుకొని సమాధానం మనకోసం చెప్పారు వీర్రాజుగారు ‘’రాజమండ్రిని రాజ మహేంద్ర వరం అని పిలవాలనే ఉద్యమాలతో –పాతకాలపు సాహిత్య వాతావరణం జీవనది గోదారిలా –సజావుగా సాగిపోతుంటే –ఆధునిక సాహిత్యం ఇంకా –కుంటి నడకలు నడుస్తుంటే –తొలిరోజుల్లో బొగ్గుల కుంపటి లా భగ్గున మండి –ఆ తర్వాత నివురు గప్పిన కదా సాహిత్యం –శ్రీపాద నుంచి అందుకొనే కొత్త తరం కోసం –దిక్కులు చూస్తున్నప్పుడు –కధను పట్టుకున్న మలితరం కధకుల్లో –రంది సోమరాజు ముఖ్యుడు ‘’అని ఆయన కదా నేపధ్యాన్ని వివరించారు .సోమరాజు అంటే అభిమానమే కాదు గౌరవంతో కూడిన ‘’రంధి’’కూడా ఏర్పడింది .ఒక బ్రాహ్మణుడు చనిపోయిన తమ్ముడి కోసం వీర్రాజు గారి పుస్తకం అచ్చేసి అంకితం ఇద్దామని అనుకోని ఇంటికి పిలిపిస్తే వెళ్లి సమర్పిస్తే భోం చేయమని అడిగితె సరేనని ‘’వీధి అరుగు మీద  విస్తరేసి వడ్డించి తినమంటే –నేను చేసిన పొరపాటు తెలిసేదికాదు ‘’అహం ఆత్మ గౌరవాలు దెబ్బతిని కొన్ని మార్పులు చేసి ఇస్తానని బొంకి   స్క్రిప్ట్ తీసుకొని ‘’మళ్ళీ తిరిగి వెడితే ఒట్టు ‘’.ఇలాంటివి మరో రెండు సార్లూ ఎదుర్కోవాల్సి వచ్చింది యెంత జాగ్రత్తగా ఉన్నా .’’మోటు దేరిన హృదయానికి –సున్నితత్వం ఇంకా  మిగిలి ఉంటుందా ?’’అని ప్రశ్నించారు .

బుచ్చి బాబు రాసిన ‘’అరకు లోయలో కూలిన శిఖరం ‘’కద చదివి ‘’అడవి గుండెల్లో దూరి-గుండె గుబుర్లోకి చూసి –గుబురు పొదల్లోకి నడిచి –దారుల్లేని అడవి నేలను –పాదాలతో తట్టి –చూపులతో చుట్టి –అడవి అందాన్ని మోపులకెత్తు కొని రావాలి ‘’అని ఆరాట పడ్డారు .దీన్ని గ్రహించిన మిత్రుడు తన ఊరికి ఆహ్వానిస్తే వెళ్లి ఆ సోయగాలను స్వయం గా అనుభవించి గుండెలో పదిలం గా భద్రపరచుకొన్నారు .బుచ్చిబాబు రచనా ప్రభావం అంతటిది .ఈ అనుభవం తో ‘’అస్తిపంజరం ‘’కద రూపు దిద్దుకోన్నది .తర్వాత సీరియస్ గా ‘’సమాధి ‘’ ,ముగ్గురు వ్యక్తుల విచిత్ర ప్రవర్తనకు అద్దం పట్టే ‘’విచిత్ర త్రయం ‘’కధలు రాశారు .మిత్రుడు ప్రకాశ రావు ‘’సమాధి ‘’ని లేపి సాహిత్యం లో నిలబెట్టాడు .అది అరడజను కధలకు జన్మనిచ్చింది .పత్రికలో మెచ్చుకోళ్ళు లభించాయి. ప్రతిఏడాది సాహిత్య సమీక్ష చేసి కొత్త వరవడి సృష్టించిన శ్రీ వాత్సవ ఘనం గా శ్లాఘించాడు .’’అనుకోని ప్రోత్సాహం –అన్ని కోణాల్లోనూ వర్షించింది ‘’

మాదేటి రాజాజీ అనే కొత్త మిత్రుడు పరిచయం అయాడు .ఇంతకీ రాజాజీ ఎవరు?’’వరదా వెంకటా రత్నం గారి శిష్య రికం తో –చెయ్యి తిరిగి –బొంబాయి జే జే స్కూల్ ఆఫ్ఆర్ట్స్ లో శిక్షణ పొంది –వచ్చిన ఉద్యోగాన్ని బేఖాతర్ చేసి –ఆర్టిస్ట్ డిప్లమా తో స్వస్థలం రాజ మండ్రి కి తిరిగొచ్చిన హీరో ‘’ ‘’డబ్బు సంపాదనకు దూరం గా నిలిచి –కళని అమ్మకానికి పెట్టక –కీర్తి ప్రతిష్టలకు దగ్గరి దారిపట్టక –నిరంతర విద్యార్ధిగా ఉన్నవాడు –చిత్ర కళ కే అంకితమైన అరుదైన వ్యక్తీ ‘’అని ఆరాధనా భావం ప్రకటించారు .ఆప్తుల్లో ఆప్తుడైనాడు’’ వీరాజీకి రాజాజీ ‘’.కాలేజీ లో సీనియర్ బసవ రాజు ‘సాహి త్యాభి రుచిన సెంటులా పూసుకొని –కళాభి రుచిని పౌడర్లా పూసుకొని –ఖరీదైన పెంటాక్స్ కెమెరా తో కాలేజీ కాంపౌండ్ ‘’లో తిరిగేవాడు ‘’ఘాటైన స్నేహ పరిమళాలు వెదజల్లేవాడు ‘’ఇదంతా పైకే ,కనిపించినప్పుడే అని అర్ధమైపోయింది వీరాజీకి .’’కనిపించినప్పుడు ఆప్యాయం గ అభిమానం తో ముంచేసి ఉక్కిరి బిక్కిరి చేసి –ఆ తర్వాత పూర్తిగా మరిచిపోయే వ్యక్తీ ‘’’’అది స్నేహం గా పరిగణించడం ఎలా ని బాధ పడ్డారు .కాలేజీ అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలలో నటుడు గా కూడా వీర్రాజు పాల్గొన్నారు .’’జీవితం లో కాస్తయినా నటించటం చేత నైతే –రంగ స్థలం మీద కొంతైనా రాణించే వాడిని ‘’అని నిజం ఒప్పుకొన్నారు .ఆఫీసర్ పాత్ర పోషించి డైలాగు చెప్పటం రాక అప్ప చెప్పేసి రసాభాస కాకుండా కాపాడుకోన్నానని  చెప్పారు .’’గతస్మృతులు ‘’చిత్రానికి ప్రధమ బహుమతిపొందారు. ప్రిన్సిపాల్ స్వయంగా పిలిచికాఫీ ఇచ్చి అభినందించారు .’’సమాధి ‘’కదాభిమాని గా వినుకొండ నాగ రాజు పరిచయమైనారు .అతని వలన ‘’బంగోరె ‘’పరిచయం కలిగింది .’’కాలేజి మేగజైన్ కోసం కవిత రాయక తప్ప లేదు’’.స్వతంత్ర పత్రిక పుణ్యమా అని ఆధునిక కవిత్వం పై అవగాహన కలిగింది .’’అసమర్ధుని ఆత్మకధ ‘’గేయం రాశారు .’’గతాన్నంతా తవ్వి గుట్టగా వేసి కొండలాంటి ఆ మేటను చూసి –నాగుండె గడియారం ముళ్ళు –వంద మైళ్ళ వేగం తో పరుగెత్తుతుంటే ‘’రాశానని అవే పంక్తుల్ని రాసి చెప్పారు .ఫినిషింగ్ టచ్ గా ‘’ ఈ విశాల పృధివిలో –నే కోరినదేమీ లేదు –నన్నూ నాఆశల్నీ కప్పెట్టే –ఆరడుగుల నేల తప్ప’’ అని ముగించారు దాన్ని .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ –  7-2-15- ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -8

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -8

5-   ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్

పన్నెండు పేరు లేని కవితలతో వచ్చిన చిన్ని పుస్తకం ఒక సంస్కృతి బాటను  పూర్తిగా మార్చేసి  నూతన సంస్కృతి దారిపట్టించింది . ఈ చిన్ని పుస్తకం జులై 4 న  అమెరికా పరాయి పాలన నుండి విముక్తి చెంది స్వాతంత్ర్య డిక్లరేషన్  విడుదల చేసిన రోజునే  వెలువడటం యాద్రుచ్చికమే అయినా  ,అదే ప్రభావాన్ని సాహిత్యం లోనూ చూపటం విశేషం .అదే ప్రఖ్యాత అమెరికా కవి వాల్ట్ విట్మన్ రాసిన ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’కవితా సంపుటి .పాత సంప్రదాయాన్ని వదిలేసి కవిత్వం కొత్త సంప్రదాయాన్ని ఎన్నుకొని దారిచూపి ఆధునిక కవిత్వానికి మార్గ దర్శి అయ్యాడు విట్మన్ .అమెరికన్ దేశీయ కవిత్వం  విట్మన్ తో నే ప్రారంభమైంది .అప్పటిదాకా బ్రిటిష్ కవిత్వ ధోరణే అమెరికా కవిత్వం లో ప్రతిధ్వనించింది దీనితో పూర్తిగా స్వంత కాళ్ళపై అమెరికన్ కవిత్వం నిలబడింది. తన జాతి జీవనాన్ని జీవితాన్ని  ప్రపంచానికి చాటింది అందులోని జవసత్వాలను తెలియ జేసింది .అమెరికన్ ప్రజలే అందులో ప్రతిఫలించారు .వాళ్ళ వేషం భాషా అలవాట్లు వృత్తులు అన్నిటికీ ఆ కవిత్వం అద్దం పట్టింది . ఘన విజయాన్ని సాధించి అమెరికా జాతీయ కవిగా గుర్తింపు పొందాడు వాల్ట్ విట్మన్ .

తొమ్మిదిమంది సంతానం లో విట్మన్ రెండవ వాడు .తల్లి అంటే వీరాభిమానం ,ఆరాధన ఉన్నవాడు .క్వేకర్ ల మధ్య అమెరికా లాంగ్ ఐలాండ్ లో పెరిగాడు .సుఖమయ  బాల్యం గడపలేదు.తల్లి జబ్బు మనిషి .చదువులేనిది .తండ్రి ఇళ్ళు కట్టేవాడు   పెద్దగా అందులో బాగు పడిందేమీ లేదు . ఒక చెల్లెలు నరాల వ్యాధి తో బాధ పడేది .ఒక తమ్ముడు ప్రయోజకుడై ఇంజినీర్ అయ్యాడు .పదకొండేళ్ళకే స్కూలు చదువు అయిపొయింది .ఇక బతకటానికి ఏ పని దొరికితే అది చేసేవాడు .పన్నెండే ళ్ళకు ఒక ప్రింటర్ దగ్గర సహాయకుడి టైప్ చేయటం నేర్చాడు  .లాంగ్ ఐలాండ్ స్టార్ పత్రికలో ప్రెస్ లో కొద్దికాలం ఉన్నాడు .టీనేజి అంతా దొరికిన ప్రతి పనీ చేసి రేస్ట్లేస్ అయి ఊర్లు తిరగటం తో నే సరిపోయింది .తిరుగుడు వంట బట్టి జీవితమంతా అదే ధోరణిలో నడిచింది .’’బతకటం ‘’మాత్రమె తానూ చేస్తున్నానని చెప్పేవాడు .తర్వాత న్యు యార్క్ లో ప్రెస్ కంపోసిటర్ అయ్యాడు .ఇక జర్నలిజం మొహం మొత్తి టీచర్ కావలను కొన్నాడు . ఏడు పల్లెటూళ్ళ స్కూళ్ళలో చదువు చెప్పి యువ విట్మన్ ఆ బులపాటమూ తీర్చుకొన్నాడు .పిల్లల ఇంటిలోనే ఉండి భోజనం వసతి పొందేవాడు .

బుద్ధి మళ్ళీ మరి ఎడిటర్ అవ్వాలనిపించింది .ఒక చిన్న  ప్రెస్ కొని తన స్వగ్రామం హంటింగ్ టన్లో ‘’లాంగ్ ఐలాండర్ ‘’అనే స్వంత పత్రిక ప్రారంభించి నడిపాడు .కూర్పు ,ప్రింటింగ్ అన్నీ తానె చేసి పేపర్ రిలీజ్ చేసేవాడు .బోర్ కొట్టి చేతులుకాలి ఉద్యోగం కోసం వెతికాడు .ఆరేళ్ళు ఆరు వేర్వేరు పత్రికలలో పని చేసి బతకటానికి సంపాదించాడు .చివరికి ఎడిటర్ అవ్వాలన్న కోరిక  ఇరవై ఏడవ ఏట తీరి ‘’బ్రూక్లిన్ ఈగిల్ ‘’పత్రికా సంపాదకుడయ్యాడు .అప్పటికే ఏదో  కవిత్వమో వచనమో రాస్తూ ఉండేవాడు .అవి ప్రచురణ భాగ్యమూ పొందాయికూడా .వాటిశీర్షికలూ  తమాషాగా నే పెట్టాడు అందులోకొన్ని –‘’వన్  వికేడ్ ఇమ్పల్స్ ‘’,’’డెత్ ఇన్ ది స్కూల్ రూమ్ ‘’,రివెంజ్ అండ్ రిక్విటల్’’,ఏ టేల్ ఆఫ్ ఏ మర్దరార్ ఎస్కేపేడ్ ‘’వగైరా .చెత్త కవిత్వాలే ఇవి సంప్రదాయ రైమ్ లోనే  రాశాడు.సెంటిమెంట్ వండాడు .టెక్నిక్ అంటూ ఏమీలేదు .

ముప్ఫై ఏళ్ళు వచ్చాక తండ్రి బిల్డింగ్ పనుల్లో సాయం  చేస్తూ తోచిందేదో రాస్తూ కాలక్షేపం చేశాడు .నాటక శాలలకు ,ఒపెరాలకు వెళ్ళేవాడు .సెంటిమెంట్ థ్రిల్లర్స్ కొన్ని రాశాడు .ఈ వయసులో ‘’సోగ్గాడు’’గా వేషంలో ఉండేవాడు ఫ్రాక్ కోట్ వేసి ,ఎత్తైన టోపీ పెట్టి చేతిలో చిన్న బెత్తం పట్టుకొని చొక్కా గుండీ దగ్గర పువ్వు పెట్టుకొనే వాడు .తమ్ముడు జెఫ్ ను వెంటేసుకొని అమెరికా దక్షిణ ప్రాంతం ఆల్ఘేరీస్ ,ఒహాయో మిసిసిపి తిరిగొచ్చాడు .న్యు ఆర్లియాన్స్ లోను ,క్రేసేంట్ పత్రికలోను ఏదో మొక్కుబడి జర్నలిస్ట్ ఉద్యాగాలే చేశాడు .ఏదీ కడుపు నిండా తిండి పెట్టినవికావు .ఆ అసంతృప్తి పీడిస్తోంది .మళ్ళీ బ్రూక్లిన్ చేరి ‘’ఫ్రీమాన్ ‘’వార పత్రిక ఎడిటర్ అయ్యాడు విట్మన్ ..హోమో సెక్సువల్ అయి అనామక పిల్లలతో సెక్స్ జరిపాడని అభియోగం ఎదుర్కొన్నాడు .’’డార్క్ లేడీ ‘’ తో గడిపాడని పుకార్లు రేగాయి కాని ఏవీ నిజం కాదని తేలిందని విట్మన్ చరిత్రకారుడు రాశాడు .

ముదురు ముప్ఫై వ ఏట కవిత్వపు శైలి విట్మన్ కు అలవడింది .అది అప్పటి కాలం లో కొత్తదికాకపోయినా విట్మన్ కు మాత్రం కొత్తదే .తానూ ఇదివరకు రాసిన వాటికి పూర్తిగా భిన్నం గా ఇప్పుడు రాస్తున్నాడు .విషయం లో స్వేచ్చ ఉంది లయలో మార్పు ఉంది అంత్యాను నుప్రాస కు మంగళం పాడాడు  .చెవులకు కింగ్ జేమ్స్ రాసిన బైబిల్ పాదాలలాగా వినిపించాయి .హీబ్రూ కవిత్వపు పోకడలు కన్పించాయి .ఛందో నియమ౦  ఏమీ పాటి౦చనే లేదు .35వ ఏట ఈ ప్రయోగాలన్నీ ఒక రూపు దాల్చి వాల్ట్ విట్మన్ కవిత్వం గా ముద్ర వేసుకొని ఉప్పొంగి ప్రవహించింది .అప్పటిదాకా  ‘’వాల్టర్ విట్మన్ జూనియర్ ‘’  గా ఉన్న పేరునూ  ‘’వాల్ట్ విట్మన్ ‘’గా మార్చుకొని కవిత్వం తో పాటు పేరులోనూ నూతన వరవడి సృష్టించాడు .ఈ పేరే నిలిచిపోయింది చిర స్థాయిగా .తండ్రిలో కొంత అంశాన్ని తీసుకొని మిగిలినదంతా నూతన విధానాన్ని ఆవిష్కరింప జేసుకొన్నాడు .దీనితోనే ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’ను బ్రూక్లిన్ ప్రింట్ షాప్ లో ప్రింట్ చేసి దేశం మీదికి వదిలాడు .అమెరికా ఆత్మ తో మమేకం అయి ప్రజాస్వామ్య పచ్చిక మొలిపించాడు. ప్రజాస్వామ్య మూలికల దివ్యౌషధం  (డెమోక్రాటిక్ హీర్బెజ్) జనాలకు అందజేశాడు .ఈ పుస్తకం ముఖ చిత్రం లోనూ విట్మన్ కవి బాహ్య స్వరూపం పూర్తిగా మారిపోయింది .ఫ్రాక్ కోట్ ,చేతిలో బెత్తం మాయమైనాయి .ముతక కార్మికుల బట్టలేసుకొన్నాడు .ట్రౌజర్కు బెల్ట్ పెట్టుకొన్నాడు .హిప్ బూట్లు ధరించాడు .కేర్లెస్ పోజ్ తో కోటు లేకుండా మెడ దగ్గర చొక్కా ఓపెన్ అయి ,లోపలి రంగు అండర్ షర్ట్ కనిపిస్తూ  బెఫర్వాగా దర్శన మిచ్చాడు .దీనితో’’ వాల్ట్ విట్మన్ కల్చర్ ‘’ప్రారంభమైంది ఆరాధనీయుడయ్యాడు . ఐడల్ అనిపించుకొన్నాడు.రోల్ మోడల్ గా మారాడు .కవిత్వం తోబాటు వేష భాషలన్నిటి లోనూ సమూలమైన మార్పు మార్పు రావాలని చెప్పటమే కాదు తానూ ఆచరించి చూపి మార్గ దర్శి అయ్యాడు విట్మన్ .అదీ’’విట్మనీయం ‘’.

తాను  కార్మిక సోదరుడిని చేలికాడిని స్నేహితుడిని అని చెప్పుకొన్నాడు .అక్షరజ్ఞానం లేని వారి సహచరుడిని అని ప్రకటించుకొన్నాడు .వారి ఆత్మీయుడిని అన్నాడు .తనను తానూ పరిచయం చేసుకొంటూ ‘’of pure American breed ,large and lusty –age thirty six years –never once using medicine-never dressed in black ,always dressed freshly ,and cleanly in strong clothes –neck open ,shirt collar flat ,and broad ,red beard with white hair ike hay beloved and looked toward especially by young men and the illiterate –one who does not associate with literary people –never on platforms amid the crowds of clergy men or aldermen or professors ,rather down ni the bay with fishers in the fishing smacks or riding on Broadway omnibus ,side by side with the driver or with a band of loungers over the open grounds of the country .Has the easy fascination of what is homely and accustomed –as of something you knew before and waiting for –there you have Walt Whitman ,the begetter of a new offspring in literature ‘’అని తెలియ జేసుకొన్నాడు .ఇది చదివి జనాల ‘’మైండ్ బ్లాక్ ‘’అయింది .తమవాడు ,తాము కావాలనుకొన్నవాడు ,తమకోసం వచ్చాడని మురిసిపోయారు .అదీ విట్మన్ సాధించిన నూతనత్వం .ఇప్పటిదాకా కార్మిక కర్షక వర్గాన్ని పట్టించుకొన్న అమెరికన్ కవే లేడు .ఇప్పుడు వారి బాధలను గాధుగా చెప్పెఆత్మీయుడు  లభించాడన్న పరమానందాన్ని ప్రజలు పొందారు ఆరాధించారు .తమ కోసమే కలంపట్టిన వీరుడని కీర్తించారు .ఇదొక చారిత్రాత్మక విప్లవమే అమెరికన్ సాహిత్యం లో ముఖ్యం గా కవిత్వం లో .

If you are American, then Walt Whitman is your imaginative father and mother, even if, like myself, you have never composed a line of verse. You can nominate a fair number of literary works as candidates for the secular Scripture of the United States. They might include Melville’s Moby-DickTwain’sAdventures of Huckleberry Finn, and Emerson’s two series of Essays and The Conduct of Life. None of those, not even Emerson’s, are as central as the first edition of Leaves of Grass.

అని ప్రముఖ అమెరికన్ విమర్శకుడు హోరాల్ద్ బ్లూమ్ విట్మన్ ను ఆవిష్కరించి సాహిత్యం లో ఆయన స్థానం ఏమిటో తెలియ జేశాడు .

Walt Whitman - George Collins Cox.jpg

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-2-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దారులేసిన అక్షరాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా దొడ్లో పూసిన దేవ గన్నేరు ,అమెరికా మెట్టతామర ,నీల౦ పూలు 

DSCN9981 DSCN9982 DSCN9983(1) DSCN9983 DSCN9984 DSCN9985 DSCN9986 DSCN9987మా దొడ్లో పూసిన దేవ గన్నేరు ,అమెరికా మెట్టతామర ,నీల౦  పూలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

చరిత్ర చదువుదాం (భారతీయం)

 

చరిత్ర చదువుదాం (భారతీయం)

పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో చాలామంది సంస్కృతం, గ్రీకు, లాటిన్‌ మొదలైన భాషల్ని నేటికీ చదువుతారు. వీటినే కాక ప్రపంచంలోని అన్నిదేశాల సంస్కృతుల్నీ అధ్యయనం చేసి మూల్యాంకనం చేస్తుంటే మనం ఇతరులు చెప్పిందే ప్రమాణంగా తీసుకుంటున్నాం. గ్రీకు, లాటిన్‌, హిబ్రూ మొదలైన భాషలు తెలిసి ఆ సంస్కృతుల్ని చదివిన ఒక భారతీయ పండితుణ్ణి కూడా మనం చూడలేం. ఒకప్పటి మన సంప్రదాయం చూస్తే మన ప్రాచీనులు తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు ఎదుటివారి సిద్ధాంతాలన్నింటినీ బాగా తెలుసుకుని వాటిలోని దోషాల్ని చూపి తమ సిద్ధాంతాల్ని చెప్పేవారని తెలుస్తుంది. ఈ పరంపర, శ్రద్ధ మనలో లోపించడం మన పండిత వర్గానికి చాలా అవమానకరం.
ఇప్పుడు మన దేశంలో వేడివేడిగా జరుగుతున్న చర్చల్లో చరిత్ర పుస్తకాల్ని సరిచేయడం అనేది ఒకటి. చరిత్రను తిరిగి రాయటం ఎందుకు అని మనకు వెంటనే అర్థం కాదు. మనమిప్పుడు చదువుతున్న చరిత్ర అంతా మన పాలకులైన ఆంగ్లేయులు రాసిందే. మనకు రాజతరంగిణి, హర్షచరితము, ప్రతాపరుద్రీయం లాంటి పుస్తకాలు, ఇతర చారిత్రక ప్రబంధాలు చాలా ఉన్నా వాటిని ఆస్థానకవులు రాయడం వల్ల చరిత్ర కొంత తెలిసినా, దానిలో కల్పనలు, అతిశయోక్తుల పాలు ఎక్కువ. వాటిని చరిత్రగా భావించలేం. విదేశీ పర్యాటకులు, మొగల్‌
దర్బారులో చరిత్రకారులు రాసిన విషయాలు కొంతవరకు ఉపయోగపడతాయి..
చరిత్ర అంటే మనందరికీ చిన్న చూపే. అయినా చరిత్ర దాని పని అది చేసుకుపోతుంది. ‘A nation which does not know history is condemned to repeat it’’ అంటాడు అమెరికన్‌ తత్త్వవేత్త జార్జి శాంటయనా. అందువల్ల కనీసం విద్యావంతులైనా చరిత్రను చదవాల్సిన అవసరం ఉంది.
‘The most effective way to destroy people is to deny and obliterate their understanding of their own history’’ అని ప్రముఖ ఆంగ్ల రచయిత జార్జి ఆర్వెల్‌ చెప్పారు. చరిత్ర మనకు స్ఫూర్తినీ ఇవ్వగలదు, మనల్ని మనమే చరిత్రహీనులుగా నిందించుకునే స్థితికి తేగలదు. చరిత్రను కంట్రోల్‌ చేసినవారు ప్రజలను కంట్రోల్‌ చేయగలరు. చరిత్రను ఎలా రాయాలో, దాని ద్వారా ఎలా ప్రజలను అదుపులో ఉంచుకోవాలో, ఒక దేశ ప్రజల్ని ఎలా మేధోపరమైన బానిసలుగా చేయాలో బ్రిటీ్‌షవారికంటే ఎక్కువ ఎవరికీ తెలీదు. మొట్టమొదటగా మన చరిత్రను పాశ్చాత్యులే రాశారు. వారి పాలనకు అనుకూలంగా ఉండటానికి, వారి సంస్కృతిని గొప్పదిగా నిరూపించడానికి మన సంస్కృతిలో కొన్ని విషయాల్ని దాచడం, కొన్నింటిని వక్రీకరించి వివరించడం ద్వారా విద్యావంతుల్ని తమ భావజాలానికి అనుగుణంగా మార్చుకోగలిగారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పాశ్చాత్య భావజాలంలో ఉన్న రచయితలే చరిత్ర పుస్తకాలు రాయడం వల్ల నిజంగా మన చరిత్రలో ఏం జరిగిందో మనకు తెలిసే అవకాశం లేకపోయింది.
ఒక జాతి గొప్పదనాన్ని తెలుసుకోవడానికి ఆ జాతి, లేదా సంస్కృతి ప్రపంచానికి ఎలాంటి విజ్ఞానాన్ని అందించింది అన్నది ఒక కొలబద్ద. ఒక సంస్కృతిలో రూపొందిన అనేక తాత్త్విక సిద్ధాంతాలు, ధర్మాధర్మాలకు సంబంధించిన విషయాలు, ఆ సంస్కృతిలో ఉన్న సాహిత్యం – వీటన్నింటినీ కలిపి సమగ్రంగా మూల్యాంకనం చేస్తే అది ఆ సంస్కృతి యొక్క సారాంశంగా ఉంటుంది. దీన్ని ఇటీవల కాలంలో ఒక జాతి యొక్క మెటా నెరేటివ్‌ లేదా గ్రాండ్‌ నెరేటివ్‌ అంటున్నారు. మన దురదృష్టవశాత్తు మన జాతి మెటా నెరేటివ్‌. అంతా మరెవరో రాసి మనకందించారే కాని మనం స్వంతంగా తయారుచేయలేదు.
ఎందుకు అలా జరిగింది? యూరోపియన్‌ సామ్రాజ్యవాదులు 15వ శతాబ్దంలో మొదలుగా ప్రపంచంలోని అన్ని దేశాల్ని లొంగదీసుకుంటూ వెళ్లడంతో పాటు ఆయా దేశాల సంస్కృతుల్ని కూడా అధ్యయనం చేస్తూ వెళ్లారు. ప్రపంచంలో అన్ని దేశాల నెరెటివ్‌ కూడా పాశ్చాత్యుల దృష్టికోణం నుంచే తయారుచేయబడింది. సామ్రాజ్యవాదంతో పాటు వారి మతాన్ని కూడా స్థాపించడం అనే ఉద్దేశ్యం ఉండడం వల్ల తాము అడుగుపెట్టిన దేశాల్లోని సంస్కృతుల్ని పూర్తిగా అధ్యయనం చేసి వాటిని అవహేళన చేసి ఆయాదేశ ప్రజలకు తమ తమ సంస్కృతిపైనే ఏహ్యభావం వచ్చేట్లు రచనలు చేశారు. ఇలా చేయడంలో వారు మిగతా దేశాల్లో విజయం సాధించినా మన దేశ సంస్కృతిని పూర్తిగా తృణీకరించలేకపోయారు. మనల్ని చాలాకాలం ఏలినవారు బ్రిటీష్‌ వారు. వారి ప్రభుత్వ ఉద్దేశాలు ఉలా ఉన్నా ఆ దేశ విద్వాంసులు మాత్రం సత్యాన్ని కప్పిపుచ్చలేకపోయారు. కొందరు గొప్పగా ప్రశంసించారు కూడా. అయినా మరికొందరు రంగు కళ్ళద్దాల ద్వారా మనకు మన సంస్కృతిని చూపించారు.
దాదాపు 130 సంవత్సరాల క్రితం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మన దేశ సంస్కృతిని గురించి మ్యాక్స్‌ ముల్లర్‌ ఆనాటి ఐ.సి.ఎస్‌ ఆఫీసర్లను ఉద్దేశించి కొన్ని ప్రసంగాలు చేశాడు. ఆ ప్రసంగాలు-  ‘India what it can Teach Us ’’ అనే పుస్తక రూపంలో వచ్చాయి. ఈ పుస్తకం మనదేశం యొక్క తొలి మెటా నెరేటివ్‌ లాంటిది. వేదాలకాలం నుంచి చర్చిస్తూ అనేక విషయాల్లో భారతదేశం ఎంత పురోగమించింది.. అన్నది ఒక వైపు చెబుతూనే మరో వైపు దేశప్రజల్ని జాతుల పేరిట విడగొట్టడానికి ఎన్ని బీజాలు నాటాల్నో అన్నీ నాటాడు. వందలాది పాశ్చాత్య పండితులు సంస్కృతంలోని మూల గ్రంథాలను చదివి వాటిపై ఇంగ్లీషులో పుస్తకాలు రాశారు. ఇలాంటి పుస్తకాలు వచ్చే వరకూ జనసామాన్యానికి మన పుస్తకాల్లో ఏముందో తెలియకపోవడం, మన పండితులకు ఆధునిక దృక్పథం లేకపోవడం వల్ల పాశ్చాత్యుల ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడం దురదృష్టం. ప్రతి సంస్కృతిలోనూ సమాజాన్ని సంఘటిత పరిచే అంశాలూ, సమాజాన్ని బలహీనపరిచే అంశాలు ఉంటాయి. మన బలహీనతల్ని మాత్రమే వివరిస్తూ వచ్చిన గ్రంథాలు మన సమాజాన్ని ప్రభావితం చేశాయి.
గత రెండు శతాబ్దాలుగా విద్యాధికులందరూ ఇంగ్లీషు మాధ్యమంలోకి వెళ్ళడంతో అందరికీ పాశ్చాత్యులు రాసిన పుస్తకాలే ప్రామాణిక గ్రంథాలయ్యాయి. ఈ పుస్తకాల్లో సత్యం ఎంతవరకూ ఉంది అని తెలుసుకోవాలంటే సంస్కృతభాష తెలిసి ఉండాలి. ఈ శ్రద్ధ దురదృష్టవశాత్తూ మన మేధావులకు కలగడం లేదు.
పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో చాలామంది సంస్కృతం, గ్రీకు, లాటిన్‌ మొదలైన భాషల్ని నేటికీ చదువుతారు. వీటినే కాక ప్రపంచంలోని అన్నిదేశాల సంస్కృతుల్నీ అధ్యయనం చేసి మూల్యాంకనం చేస్తుంటే మనం ఇతరులు చెప్పిందే ప్రమాణంగా తీసుకుంటున్నాం. గ్రీకు, లాటిన్‌, హిబ్రూ మొదలైన భాషలు తెలిసి ఆ సంస్కృతుల్ని చదివిన ఒక భారతీయ పండితుణ్ణి కూడా మనం చూడలేం. ఒకప్పటి మన సంప్రదాయం చూస్తే మన ప్రాచీనులు తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు ఎదుటివారి సిద్ధాంతాలన్నింటినీ బాగా తెలుసుకుని వాటిలోని దోషాల్ని చూపి తమ సిద్ధాంతాల్ని చెప్పేవారని తెలుస్తుంది. ఈ పరంపర, శ్రద్ధ మనలో లోపించడం మన పండిత వర్గానికి చాలా అవమానకరం.
మన దేశ చరిత్రను సవరించాలంటే దృక్పథంతో ప్రస్తుత చరిత్రకారులు ప్రయత్నం చేస్తున్నారు. మన చరిత్ర ఎలా ఉన్నా మనం ప్రపంచ చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఇంటర్నెట్‌ మొదలైన మాధ్యమాల వల్ల ప్రపంచ చరిత్ర అంతా మన ముందున్నది. అందులో ప్రామాణికంగా, నిబద్ధతతో పాశ్చాత్యులు రాసిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. చాలా కాలం క్రితం నేను పోలీసు అకాడమీలో ఉన్నప్పుడు ’’A history of Torture Throughout the Ages ‘ అనే పుస్తకాన్ని చూశాను. వివిధ రకాల చిత్రహింసల్ని కనిపెట్టిన ఘనత అతి పవిత్రమైన మత సంస్థలకే ఉందనే విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే మనకు నీతులు చెప్పే దేశాలు ఎలా మారణకాండ చేశాయి, ఎలా కొన్ని సంస్కృతుల్ని నిర్మూలించాయి అని తెలుసుకోవడానికే ‘History of Genocide’, ‘History of Slavery’, మొదలైన పుస్తకాల్ని చదవాలి. మనకు సెక్యులరిజం గురించి చెప్పేవారి గురించి ‘History of Inquisition’ లాంటి పుస్తకాలలో చదవగలం. బ్రిటీష్‌ వారి క్రూర పాలనకు ఉదాహరణ కావాలంటే ‘Impeachment of Warren Hastings’
గూర్చి Edmund burke ఏమి చెప్పాడో చూడాలి. వీటి నేపథ్యంలో మన చరిత్రను అమెరికన్‌ తత్త్వవేత్త Will Durant రాసిన ‘Story of Civilization’ లో చూస్తే మనమెంతో గర్వంతో ఉండగలం. మన యొక్క తప్పుల్ని సవరించుకునే శక్తి మన సంస్కృతిలోనే ఉంది.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ

ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.com కు పంపండి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధిల్లీ ఎన్నికల ముఖ చిత్రాలు -మోడీ ఫ్లాప్ షో తో సహా

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -3

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -3

కదా లేఖన పోటీ లో పాల్గొని ‘’పోటీ ఉంటేనే ప్రతిభకి రాణింపు ‘’అని తెలుసుకొని ‘’ఒక నోటు పుస్తకం నిండా సాగి- అన్న ప్రాసన నాడే ఆవకాయ అయ్యింది ‘’అని అత్యుత్సాహాన్ని తెలియబరుస్తూ కలం పట్టించిన తన చేత కద రాయిన్చించి’’అని సంబర పడ్డారు .ఆ ‘’నవలా కద’’ పత్రికకు పంపిస్తే అడ్రస్ గల్లంతయ్యింది .ఆని నిరాశపడలేదు .’’ముడుచుకొన్న ఆలోచనల్లో చురుకుదనం పుష్పించి –అభిరుచుల్లో –కొత్తదనం అల్లు కుంటోంది ‘’అని ముచ్చటపడ్డారు .తెలుగు స్వతంత్రలో రెందోపెజీ లోపడే కవిత్వాలు చూసి కవిత్వపఠనం పై దృష్టి మళ్ళింది .బహుమతులు ప్రతిభకు కొలబద్దలూ అద్దాలు కాక కపొవచ్చు కాని  ‘’ప్రోత్సాహానికి ప్రేరకాలు ‘’అని నమ్మారు .జిళ్ళా యువజనోత్సవ  చిత్ర లేఖన పోటీలలో ‘’పొందిన ప్రధమ బహుమతి కేటలిస్ట్  అయి,కళా రంగం లో ముందుకు కదిలించింది ‘’.ఆ బహుమతి డాక్టర్ గరిక పాటి రాజా రావు గారి చేతులమీదుగాగ్రహించటం గౌరవం, చిరస్మరణీయం అయింది .

తాము ఉండే పేటలో కాంగ్రెస్ జండా ఎగరగా ఎన్నడూ చూడలేదట వీర్రాజుగారు .ఎక్కడ చూసినా ‘’యెర్ర జండేర్ర జండా  ఎర్రెర్రని జెండా ఎర్రజండా ‘’అని నారాయణ మూర్తి పాటలాగా రెప రెప లాడేవి .’’పార్టీ మీద నిషేధం ఉక్కు పాదమై వాలినప్పుడు –ఇంటిమీది జెండా పీకేసుకోన్నారుకాని –పార్టీ మీద నమ్మకాన్ని వదులుకోలేదు ‘’అని పార్టీపై  తన అభిమానాన్నితెలిపారు .కమ్యూనిస్ట్ మిత్రుడు కుందుం ప్రకాశ రావు  ఆప్తమిత్రుడు .’’నా అక్షర గమనానికి ప్రత్యక్ష కారణం అతనే ‘’అని కృతజ్ఞత చెప్పుకొన్నారు .ఆవంత్స సోమ సుందర్ ఆధునిక సాహిత్య పరిచయం చేశాడు .’’రచన బాగోగులని తూకం వేసే తూనిక రాళ్ళూ యేవో అతని దగ్గరున్నాయి ‘’అని ఆయన ప్రతిభను కీర్తించారు .’’నన్ను రచయితగా శిల్పించిన వాడు అక్షరాలా అతనే ‘’అని అన్నారు.’’వయసు పెరుగుతున్న కొద్దీ –ఇంటి పరిస్తితులు అర్ధమై –మనసులో చిక్క పడి –బాల్యం మెల మెల్లగా పట్టు సడలించుకొని –‘’దూరం గా జరిగిపోయింది .

నూనుగు మీసాలు తేనే రంగులో మెరుస్తున్నప్పుడు –‘’అందం అప్పుడు కాంటాక్ట్ లెన్స్ అయి –నాకళ్ళల్లో అమరిందేమో ?’’అన్నారు యవ్వన ప్రాదుర్భవాన్ని కవిత్వం లో ఒలక బోస్తూ .వందేళ్ళ చరిత్రగల కాలేజి లో చేరి ‘’ఆనంద గర్వాలు –మనసును ఉయ్యాల లూపాయి ‘’.అంటారు .దీనికి కారణం ‘’ఓ చారిత్రిక వార సత్వపు స్రవంతిలో –నేనో బిందు వౌతున్నందుకు ‘’పొందిన గర్వం అది .సంస్కృతీ వారసత్వానికి ముచ్చట అది .పెదనాన్న ఇల్లు గుల్ల చేసుకొని ,నిండు దరిద్రం తో మంచాన పదడి చనిపోతే ,పెద్దమ్మ  భారమూ తండ్రిమీద పడి నా తండ్రిబెదరలేదట .తల్లి ఒంటిమీద నగ నట్రా కాళ్ళోచ్చి కదిలిపోయాయి .పెదమామయ్య సాయమే దిక్కైంది.స్కాలర్ షిప్ అంది తల్లి చేతుల్లో డబ్బు పెడితే ‘’తన కలల సాకారానికి –వర్తమాన చిత్రం –ఆమె మనసులో –అస్పష్టంగా కదిలి ఉండాలి ‘’అని ఊహించారు .

కాలేజిలో పై ఖర్చులకు గాను ఊళ్ళో చిన్న పత్రికలకు కోరిన బొమ్మలేసి చిలక్కొట్టుడు డబ్బు సంపాదిస్తూ కుటుంబం పై భారం పడ కుండా చూసుకొన్నారు.దామెర్ల రామా రావు గారంటే ‘’అజంతా చిత్రాల రేఖల లాలిత్యానికి –దాని సమవర్ణ లేపన సౌందర్యానికి –పాశ్చాత్య దేశాల అంగ సౌష్టవాన్ని జోడించి –వంగ దేశపు వాష్ టెక్నిక్ ను మేళవించి –సరి కొత్త ఆంద్ర చిత్రకళా శైలిని  సృష్టించిన ‘’మహానుభావుడు అని కీర్తి కిరీటం చిత్రకళా భాష లో చెప్పి, పెట్టారు .’’ఆంద్ర చిత్ర కళా పునరుజ్జీవన వైతాళికుడు ‘’అన్నారు .మూడు పదుల వయసులోనే నూరేళ్ళు నిండిన  దురదృష్ట వంతుడు రామారావు . ఆయన స్మ్రుతి చిహ్నమే రాజమండ్రి లో వెలసిన ‘’కళా గౌతమి ‘.’రామారావు ఆప్తమిత్రుడు ,చిత్రకళలో మరో మేరువు అయిన వరదా వెంకట రత్నం గారి శిక్షణలో వీర్రాజు గారు చిత్రకళా రహస్యాలు తెలుసుకొన్నారు .స్కెచ్ పుస్తకాలను చిత్రాలతో నింపి వేళ్ళకు రేఖా సోయగాన్ని సమకూర్చుకొన్నారు .

చిత్రాల్లో జీవాన్ని ,చైతన్యాన్ని వేగాన్ని ని౦పు కొంటూ వెలుగు నీడల సహజ సౌందర్యాన్ని అడ్డుకొంటూ తనను తానూ చిత్రకారుడిగా ఆవిష్కరించుకొన్నారు వీర్రాజు గారు .తన ప్రయతనం కీర్తికోసం కాదని ఆర్దికావసారలకోసమే నని నిజాయితీ గా చెప్పారు .ఆస్థానకవి శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి చేతులమీదుగా చిత్రకార సన్మానం అందుకొని పులకించారు .అప్పటికి వయసు పద్దెనిమిదే అన్నది కొసమెరుపు .

‘’బిడియానికి పై తొడుగు మౌనం .చొరవకు పై తొడుగు మాటకారి తనం ‘’అని చక్కని అర్ధం చెప్పారు .ఆ రెండూ తనకు లేవు .’’గుండేల్లోతుల్లోకి తొంగి చూస్తె కాని అర్ధం కాని వాడిని ‘’అని ఆవిష్కరించుకొన్నారు తన్ను తాను .కాలేజీ తెలుగు శాఖ ఆహ్వానంపై వచ్చిన బాల బంధు బి. వి .నరసింహా రావు గారు ‘’ఆడుతూ పాడుతూ –హావ భావాతో చేసిన ఉపన్యాసం ‘’ఆకట్టుకొని ప్రేరణ కల్గించి ,ఎప్పటికైనా ఆ కాలేజీ వేదికపై ఓసాహిత్యో పన్యాసాన్నివ్వాలని ‘కోరిక ‘’మనసు పొరల్ని తోలుచుకొని –బీజ దళం లోంచి –చిగురాకై విచ్చుకొంది’’అని బయాలజీ భాష లో బాగా చెప్పారు .’’చప్పట్ల అభినందన హారం –మెళ్ళో వేసుకోవాలని ‘’ఆశ పడ్డారు .కాని ఆ అవకాశమే రాలేదట .

శరత్ సాహిత్యం చదివి అదే మూసలో అవే పాత్రల్ని మూస పోసి అచ్చులు పోసుకొని నవల రాశారు .’’చిదికే వరకు సెగ్గడ్డ సలపరం పెట్టి నట్లు ఆలోచనలు అక్షరాలై కాగితం మీద రాలే వరకు –మనసుకు పట్టిన జ్వరం –నిమ్మళించి తేలిక పడనే లేదు ‘’ఆయనకు .ప్రజా మత వార పత్రిక దీన్ని సీరియల్ ప్రచురించి గుర్తింపు పొంది’’ రచయిత గా చెప్పుకొనే వీలిచ్చింది ‘’అది మరోకొత్త నవలకు ఊపు నిచ్చింది .అప్పటికి అయన ఇంటర్ రాసిన విద్యార్ధి మాత్రమే .

 

 

వరదా వెంకట రత్నం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment