నీలంరాజు జీవితంలో..

నీలంరాజు జీవితంలో..


పదిహేనేళ్ల వయసులోనే గాంధీ పిలుపుకు స్పందించి విద్యాలయాల బహిష్కరణ చేసిన దేశభక్తుడు నీలంరాజు వేంకట శేషయ్య. తరువాతి కాలంలో ఆయన ప్రకాశం పంతులుగారికి ప్రైవేట్ సెక్రటరీగా పని చేశారు. అతి పిన్న వయసులోనే పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించి ‘స్వరాజ్య’, ‘ఆంధ్రపత్రిక’లలో పని చేసి తర్వాత సొంత వార పత్రిక ‘నవోదయ’ను స్థాపించారు. చాలాకాలం పాటు ‘ఆంధ్రప్రభ’ డైలీకి సంపాదకునిగా కూడా నీలంరాజు వేంకట శేషయ్య వ్యవహరించారు. ఆయన గురించిన విశేషాలను, అనుభవాలను కుమారుడు నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ ‘నీలంరాజు వేంకట శేషయ్య జీవితం’ అనే పుస్తకంగా వెలువరించారు. అందులోని కొన్ని ఆసక్తికర భాగాలు ఇక్కడ ఇస్తున్నాం…

” శ్రీశ్రీ రాతలో ఎంతటి ‘ఇమేజరీ’ ప్రవేశపెట్టి రాసేవాడో, మాట్లాడేటప్పుడు అంత నెమ్మదిగా, ఆవేశం లేకుండా సింపుల్‌గా మాట్లాడేవాడు. చమత్కారాలు వాడుతూ సంతోషిస్తూండే వాడు. ఎడం చేత్తో కారమ్స్ ఆడేవాడు. మీరు ఈ చేత్తోనే ఆడుతుంటారా? అని నేను అడిగినప్పుడు “ఔను, నేను లెఫ్టిస్టుని” అన్నాడు.” 

‘నవోదయ’ పత్రిక ప్రముఖ రచయితలనందరినీ ఆకర్షించేది. అందులో శ్రీశ్రీ ‘వారం వారం’ అనే శీర్షిక రాస్తుండేవారు. నెలకు ముప్ఫైరూపాయలు ఇచ్చేవాళ్లం. మా తాహతు అంతే. శేషయ్యగారికున్న వనరుల దృష్ట్యా శ్రీశ్రీ అంతకన్నా ఆశించేవాడు కూడా కాదు (ఆయనకు ‘అవసరమైతే’ ఎంతైనా ఉంటుంది) ‘ఢంకా’ అనే నెలసరి పత్రిక నడిపే ఢంకాచార్యులు గారు -(ఆయనకు ఒక చేయి ఉండేది కాదు -ఎప్పుడూ ఖద్దరు శాలువా కప్పుకొని ఉండేవాడు) శ్రీశ్రీ కనిపిస్తే “శ్రీశ్రీ గారూ మా మీద దయలేదు” అని సరదాగా అనేవాడు. ‘గివ్ ఫైవ్‌రూపీస్ అండ్ టేక్ ది ఆర్టికల్’ అనేవాడు శ్రీశ్రీ బదులుగా. రాసినది జేబులో ఉంటే అప్పటికప్పుడే ఇవ్వగలిగి వుండేవాడు.

లేదంటే, ఆఫీసులో కూచొని నాలుగు తెల్ల కాగితాలడిగి తీసుకొని, ఓ అరగంటలో రాసి (కొట్టివేతలుండేవి కాదు) ఎడిటర్ చేతుల్లో పెట్టి వెళ్లేవాడు. ఆయన డబ్బు అవసరం కూడా అలాంటిదే. ఒక రూపాయైనా అడిగి తీసుకొని సిజర్సు సిగరెట్ పెట్టెలు కొనుక్కునేవాడు. నవోదయ నెలవారీ పారితోషికం నేను ఇవ్వబూనుకున్నప్పుడు, ‘ఆ ముప్ఫైలో మీ రూపాయి మినహాయించుకొని ఇవ్వండి’ అనేవాడు. ఆ రోజుల్లో ఆయన ఒక్కడి పరిస్థితే కాదు, అనేకమంది రచయితల పరిస్థితి అలానే ఉండేది. ఎక్కడా డబ్బు పుట్టేది కాదు. పేరు పేరునా చెప్పడం అనవసరం కానీ, రచయితలు చాలా కష్టం మీద తమ రచనా వ్యాసంగానికి అంకితమై ఉండేవారు. శ్రీశ్రీ ప్రభృతుల మీద నాకు అమిత అభిమానం ఉండేది.


ఆరుద్ర కూడా నవోదయకు వారం వారం రాసేవాడు. తన ‘సినీ వాలీ’ పుస్తకాన్ని శేషయ్యగారికి తర్వాతి కాలంలో అంకితమిస్తూ, ‘వైమానిక దళం నుండి సాహితీ తలానికి తెచ్చిన శేషయ్యగారికి’ అని వ్రాసాడంటే, బహుశా మద్రాసుకు రాగానే ఈయనని కలిసి, నెలకు ముప్ఫై రూపాయల పారితోషికంతో రాస్తానని ఒప్పందం కుదుర్చుకోనుంటాడు. నేను నవోదయలో ‘చైనా బజార్’ అని సంకర తెనుగు భాష (అరవ తెలుగు)లో ‘ఫీచర్’ రాయడం మొదలెడితే ఆయన అభిమానం దాని మీద ఎంతగా ఉండేదంటే సాయంత్రం పానగల్ పార్కు, టి. నగర్‌కు తీసుకువెళ్లి అక్కడ సమావేశమయ్యే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, శ్రీశ్రీ, గోరాశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లు మరికొందరు సాహితీ వేత్తల (చెంతన ఉండి రాకపోతే, రాని వారిదే నష్టం) మధ్య చదివి వినిపించేవాడు. వారంతా పగలబడి నవ్వడం ఒకటే ఆరుద్ర అభిలషించింది. ఈ మధ్యనే ద్రవిడ విశ్వవిద్యాలయం వారు ఆ ఫీచర్‌లోని కథల్ని ‘చైనా బజార్ కథలు’ అనే శీర్షికతో చిన్న పుస్తకంగా ప్రచురించారు.

ఒకసారి శ్రీ గోరాశాస్త్రి తన బంధువు ఒకాయన రాసిన ఒక చిన్న నవలిక -లేక అతిపెద్ద కథ ఒకటి తీసుకుని రచయితను కూడా వెంటబెట్టుకొని శేషయ్యగారి వద్దకొచ్చాడు. “ఇది మన నవోదయలో ధారావాహికంగా ప్రచురించడానికి ” అని ఆయన చేతికిచ్చాడు. “అలాగే, చూసి చెప్తాను” అన్నారు శేషయ్యగారు. రెండు రోజులయిన తర్వాత సాయంత్రం తాపీగా వారు ఇద్దరూ కలిసి శేషయ్యగారి వద్దకొచ్చారు. శ్రీ గోరాకూ ఎడిటర్‌కూ సుమారు గంటన్నర, రెండు గంటల వాదం నడిచింది. మొత్తం నేను వినలేదు కానీ, “కథ నడిపిన తీరు బాగానే ఉంది – కాని ఇతివృత్తం నాకు సమ్మతం కాదు” అంటారు ఎడిటర్. “ఇతివృత్తంతో మీకేమి పని? రచన బాగుంది కదా? వేయండి” అంటారు శ్రీ గోరా శాస్త్రి. “అలా కుదరదు. సమాజంలో అక్రమ సంబంధాలను ప్రోత్సహించే వీలుపడదు” అంటారు ఎడిటర్. ” క్రమ అక్రమ సంబంధాల సంగతి ఎడిటర్లకక్కరలేదు, బాగా రాసివుంటే వేయడమే”అని గోరా. “ఎడిటర్, పోస్ట్‌మాన్ కాదు.

పాఠకుల యెడల అతడికో బాధ్యత ఉంది”అని ఎడిటర్ శేషయ్యగారు. “ఎడిటర్ కర్తవ్యమంతే అయివుండాలి” అని గోరా. “ఈ ఎడిటర్ అట్లా అనుకోవడం లేదు” శేషయ్యగారు. చాలా పెనుగులాడాడు శ్రీ గోరా -కొంత దబాయింపు- ‘మారల్ బ్రిగేడ్, నైతిక పోలీసు దళం’ అనేవి ఆయనకి కిట్టేవి కాదు. ‘నవోదయ’ శేషయ్యగారి సొంత పేపరైనప్పుడే శ్రీ గోరా అంతసేపు వాదించాడు. శేషయ్యగారు ఆంధ్రపత్రికలో కూచున్నప్పుడు అయితే ఎంత వాదించేవాడో అనుకున్నాను. చివరకు ఆ పెద్ద కథను మా తండ్రి తిరిగి ఇచ్చారు. గోరా అన్నట్లు, రచనా నైపుణ్యం, శిల్పాన్ని చూచి వేసే వారుండవచ్చు. ‘సంఘం మీద దీని ప్రభావం ఎట్లా ఉంటుంది?’ అనే బాధ్యత గుర్తుంచుకొని ఆగే వారుండవచ్చు.

నవోదయలో శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి రాసిన ఏదో గేయ కవిత్వాన్ని చూసి అమంచర్ల గోపాలరావుగారు ఎంతగా మెచ్చుకున్నారంటే (అప్పుడు ఆయన బొంబైలో ఉన్నాడు) ఆ సంచిక చేత నిడుకొని, బొంబైలో తన ఆంధ్ర స్నేహితులందరి వద్దకూ వెళ్లి, అది వారందరికీ చదివి వినిపించి, నాలుగైదు గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజుల్లో మనుషులకు కవితావేశం అలా ఉండేది. దానికై శ్రమనీ, ఖర్చునీ లెక్కచేసే వారు కాదు. ఇప్పుడు ధనమొక్కటే ఆవేశాన్ని జనింపజేస్తున్నట్లున్నది.

రష్యన్ రచయిత చెహోవ్ రాసిన చెర్రీ ఆర్చర్డ్ తెనుగులో అనువాదం చేస్తూ ‘సంపెంగతోట’ అని పేరు పెట్టారు శ్రీశ్రీ. పూర్వమెప్పుడో ‘ఇది అనువదిస్తే బాగుంటుంద’ని అబ్బూరి రామకృష్ణరావుగారు, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు ఇద్దరూ ఉన్నప్పుడు అన్నట్లున్నారు. శ్రీరంగం నారాయణబాబుగారు తాను అనువదించాలి అనుకున్నట్లున్నాడు. ఎవరు ముందు మొదలెట్టారు, ఎవరు పోటీ పడ్డారు అనేదాని మీద ఏదో చర్చచేస్తూ తన ‘వారం వారం’లో శ్రీశ్రీ ఏదో రాశాడు. శ్రీరంగం నారాయణబాబుకు కోపం వచ్చింది. ఆయన మధ్య పాపిడి, గిరజాల జుట్టు, కవి వర్యుడి కట్టు బొట్టు విశిష్టంగా కనిపించేవాడు.

ఆహార్యం కూడా నాటకీయంగా ఉండేది. గంభీర వదనంతో నవోదయ ఆఫీసుకు వచ్చి “శేషయ్యగారూ, ఏమి చెప్పను? భాషా దేవిని బలిమి చెరగొన్నాడు శ్రీశ్రీ” అని నాటకీయంగా అన్నాడు. దాని మీద ఏదో కొంత చర్చ జరిగింది. తర్వాత ఎప్పుడో శ్రీశ్రీ ‘వారం వారం’ రాయడానికి నవోదయలో వచ్చి కూచున్నప్పుడు ఆయనతో నారాయణబాబు ఇలా అన్నాడని చెప్తే “అలా అన్నాడా? వాడి మొహం” అని తన పాటికి తాను రాసుకుంటూపోయాడు. శ్రీశ్రీ రాతలో ఎంతటి ‘ఇమేజరీ’ ప్రవేశపెట్టి రాసేవాడో, మాట్లాడేటప్పుడు అంత నెమ్మదిగా, ఆవేశం లేకుండా సింపుల్‌గా మాట్లాడేవాడు. చమత్కారాలు వాడుతూ సంతోషిస్తూండే వాడు. ఎడం చేత్తో కారమ్స్ ఆడేవాడు. మీరు ఈ చేత్తోనే ఆడుతుంటారా? అని నేను అడిగినప్పుడు “ఔను, నేను లెఫ్టిస్టుని” అన్నాడు.

నీలంరాజు వేంకటశేషయ్య జీవితం
నీలంరాజు లక్ష్మీ ప్రసాద్
పేజీలు: 244, ధర: 100
పుస్తకాలకు: నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్
040 – 24652337

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు

గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు


పేదరికం అతని కళాతృష్ణను అణగారనివ్వలేదు. కళ్ల జోడు షాపులో పనిచేస్తూనే కనికట్టు విద్యలో నిష్ణాతునిగా మారాడాయన. ఆయనే ప్రముఖ మెజిషియన్ అలీ. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్మించిన ఆయన అంతర్జాతీయ స్థాయి మెజిషియన్‌గా ఎదిగారు. పేకముక్కలు, పావురాలు వంటివి ఖాళీ చేతులలో సృష్టించడం ఆయన ప్రత్యేకత. తన మేజిక్ ప్రదర్శనలతో ప్రేక్షకులలో మానసికోల్లాసాన్ని నింపుతున్న అలీ అంతరంగం ఆయన మాటల్లోనే…

“మాది తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు తాలూకాకు చెందిన మామిడికుదురు. పక్కనే నగరంలో పదవ తరగతి దాకా చదువుకున్నాను. మా తాత(అమ్మగారి తండ్రి) హుస్సేన్‌గారు అప్పట్లో చాలా పెద్ద మెజిషియన్. పెద్ద పెద్ద ఐటమ్స్ చేసేవారాయన. వాటిని చూసి ఏమిటీ మాయలు మంత్రాలు అని చిన్నప్పుడు అనుకునేవాణ్ణి. ఆయన దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ నేర్చుకున్నాను. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న చిన్న వ్యాపారం చేసేవారు. మేము మొత్తం ఐదుగురం. నేను రెండవవాణ్ణి. నాకో అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఆఖరున మరో తమ్ముడు.

చదువును కొనసాగించే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో 25 ఏళ్ల కిత్రం హైదరాబాద్ వచ్చి ఆబిడ్స్‌లో ఒక కళ్ల జోళ్ల షాపులో పనిచేశాను. వచ్చే రెండువేల జీతంలోనే కొంత మొత్తం ఇంటికి పంపాల్సిన పరిస్థితి. 13 గంటలు నిలబడి ఉద్యోగం చేసేవాణ్ణి. కూర్చోడానికి కూడా సమయం ఉండేది కాదు. ఆ సమయంలోనే అమెరికన్ మెజిషియన్ చానిగ్ పొలాక్ మేజిక్ వీడియో క్యాసెట్ చూశాను. పేక ముక్కలతో మేజిక్ చేయడంలో ఆయన నిష్ణాతుడు. అది చూసి నాక్కూడా ఆ విద్యను నేర్చుకోవాలనిపించింది. షాపు యజమాని పేక ముక్కలను చూస్తే తిడతాడని పనిచేస్తూనే అట్టముక్కలతో ప్రాక్టీస్ చేసేవాడిని. రూముకు వచ్చిన తర్వాత గంటల తరబడి ప్రాక్టీస్ కొనసాగేది.

చూసేందుకు వెళితే అవార్డు!
1988లో హైదరాబాద్‌లో ఒక మేజిక్ ఫెస్టివల్ జరిగితే చూసేందుకు వెళ్లాను. మేజిక్ పోటీలు జరుగుతుంటే నాపేరు కూడా పోటీకి ఇచ్చాను. ఆ పోటీల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలలకు చెందిన పెద్ద పెద్ద మేజిషియన్లు వచ్చారు. వాళ్లంతా మేకప్‌లు వేసుకుని, భారీ కోట్లు వేసుకుని ఉన్నారు. నా దగ్గర కోటు కాదు కదా వేసుకున్న చొక్కా కూడా దమ్ముకొట్టుకుపోయి, దయనీయంగా ఉంది. అలాగే భయపడుతూ నా ప్రదర్శన పూర్తి చేశాను. పోటీ విజేతల పేర్లు ప్రకటిస్తున్నారు. మొదటి బహుమతి విజేత ‘అలీ’ అని ప్రకటించగానే నేను కాదు వేరే ఎవరో ఉన్నారులే అనుకున్నాను. కాని, విచిత్రంగా మొదటిసారి నేను ఇచ్చిన ప్రదర్శనలోనే నాకు మొదటి బహుమతి లభించింది. బహుమతి తీసుకుంటుంటే నా కళ్లలోంచి నీరు… ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు.

కేరళలో అపురూప సత్కారం
కేరళలో గోపీనాథ్ ముత్తుక్కడ్ అనే ప్రఖ్యాత మెజిషియన్ ఒక మేజిక్ అకాడమి నిర్వహిస్తున్నారు. పిసి సర్కార్, కె.లాల్ లాంటి ప్రముఖుల స్థాయిలో ఆయన నిలుస్తారు. ప్లేయింగ్ కార్డ్స్ మేనిప్యులేషన్ (పేకముక్కలతో ఇంద్రజాలం)లో ఈ అకాడమి శిక్షణ ఇస్తుంటుంది. ఒకరోజు గోపీనాథ్‌గారు మా షాపునకు ఫోన్ చేసి “అలీగారూ! మీకు కేరళ ప్రభుత్వం తరఫున ఆలిండియా బెస్ట్ కార్డునేషన్ అవార్డు ఇద్దామనుకుంటున్నాము” అని చెప్పారు.

1989లో త్రివేండ్రం వెళ్లాను. 35 గంటలు రైలు ప్రయాణం చేయడంతో నా బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి. స్టేషన్‌లో నేను కాలు పెట్టగానే నన్ను రెండవ నంబర్ గేట్ దగ్గర వచ్చి గోపీనాథ్‌గారిని కలవాలని అనౌన్స్‌మెంట్ వస్తోంది. చొక్కా మార్చుకోవడానికి కూడా టైము లేకపోవడంతో నేను అలాగే అక్కడకు వెళ్లాను. పూలమాలలు పట్టుకుని మెజిషియన్లు, విద్యార్థినీ విద్యార్థులు అక్కడ గుమికూడి నా రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆ అవార్డు ప్రదానోత్సవం నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతిగా మిగిలిపోయింది. షాపులో పనిచేస్తూనే సొంతంగా నేర్చుకోవడం కొనసాగించాను.

ఎన్నెన్నో అద్భుతాలు…
మేజిక్‌లు మూడు రకాలు. ఒకటి ఇల్యూజన్(భ్రమ). అమ్మాయిని గాలిలో లేపడం, మధ్యలో సగానికి కోయడం, పెట్టెలో ఉంచి తాళం వేసి బయటకు రప్పించడంలాంటివి ఈ కోవలోకి వస్తాయి. ఖాళీ చేతులలో నుంచి వస్తువులను సృష్టించడాన్ని కంజ్యూరింగ్ అంటారు. ఉదాహరణకు ఖాళీ చేతులలో పావురాలు, పేకముక్కలను సృష్టించడం. మూడవది క్లోజప్. అంటే చిన్న చిన్న నాణేలను సృష్టించడం, ఒక కాగితం ముక్కను ఇచ్చి దాన్ని వెయ్యిరూపాయల నోటుగా మార్చడం లాంటివి. నేను ప్రధానంగా కంజ్యూరింగ్, క్లోజప్ మేజిక్‌ను చేయడానికే ప్రాధాన్యమిస్తాను.

52 పేకముక్కలు రెండు ఖాళీ చేతులలో రావడం, వాటితో విన్యాసాలు చేయడం, పేకముక్కలు రంగులు మారిపోవడం, గాలిలోనుంచి పావురాలు ఎగురుకుంటూ రావడం, చేతిలో పట్టుకోగానే పావురం చిలుకగా మారిపోవడం, ఒక గుడ్డు పగలగొట్టగానే అందులోనుంచి పావురం రావడం ఇలా దాదాపు 150కి పైగా ఐటమ్స్ చేస్తాను. గంటన్నరపాటు ఒక్కో ప్రదర్శన ఉంటుంది. నాకు ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు. ఇప్పటిదాకా 6 వేలకు పైగా ప్రదర్శనలు దేశవ్యాప్తంగా ఇచ్చాను. 13 సార్లు జాతీయస్థాయి పోటీలలో ప్రథమ బహుమతి సంపాదించాను. ముంబాయిలో జరిగిన సార్క్ దేశాల మేజిక్ పోటీలలో కూడా ప్రథమ బహుమతి లభించింది.

జాదూరత్న
2000 సంవత్సరంలో దేశంలోని మెజిషియన్లంతా కలసి నాకు జాదూ రత్న అవార్డు ఇచ్చారు. 2002లో జాదూ శిరోమణి అవార్డు లభించింది. త్యాగరాయగానసభలో కళ్లకు గంతలు కట్టుకుని గంటలో వంద ఐటమ్స్ చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కింది. అలాగే కళ్లకు గంతలు కట్టుకుని ట్యాంక్‌బండ్ నెక్లెస్‌రోడ్‌లో బండి నడిపాను. ఇప్పటిదాకా సింగపూర్, మలేషియా, దుబాయ్, కువైట్, బహెరిన్ దేశాలలో ప్రదర్శనలు ఇచ్చాను.

ఎక్కువగా కార్పొరేట్ ఆఫీసులు, ఐటి కంపెనీలు, హోటల్స్‌లో జరిగే పుట్టిన రోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో నా ప్రదర్శనలు ఉంటాయి. ఒరిస్సాలోని పూరీలో ఏప్రిల్ 13, 14, 15 తేదీలలో మూడు రోజులపాటు జాతీయ స్థాయి మేజిక్ కన్వెన్షన్ జరుగుతోంది. అందులో నా ప్రత్యేక ప్రదర్శన(గాలా షో) ఉంటుంది. అలాగే జూన్‌లో బెంగళూరులో జరిగే అంతర్జాతీయ మేజిక్ ఫెస్టివల్‌లో కూడా పాల్గొంటున్నాను.

జనచైతన్యం కోసం…
రాష్ట్రంలోని చాలా గ్రామాలలో ఇంకా మూఢనమ్మకాలు పోలేదు. వీటి మీద ప్రజలను చైతన్యపరుస్తూ నేను, మరికొందరం మెజిషియన్లు కలసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. కొంతమంది బాబాలు గాలిలో సృష్టించి ఇచ్చే వస్తువులు ఎలా వస్తాయో నా ప్రదర్శనల్లో రెండు మూడు ఐటమ్స్‌ని తప్పనిసరిగా చూపిస్తాను. ఇలా చేయడం వల్ల ప్రజలలో మూఢ విశ్వాసాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది.

మాయలు మంత్రాలు ఏవీ లేవని చెప్పడమే మా ఉద్దేశం. అనాథాశ్రమాలలోని పిల్లల కోసం కూడా ఉచితంగా మేజిక్ ప్రదర్శనలు ఇస్తుంటాను. మేజిక్‌లో నాకంటూ గురువు ఎవరూ లేరు. సొంతంగా నేర్చుకున్నదే ఈ విద్యంతా. సినిమాలలో హీరోలకు కూడా అప్పుడప్పుడు మేజిక్ ట్రెయినింగ్ ఇస్తుంటాను. మా తమ్ముడికి హైదరాబాద్‌లో కళ్లజోడు షాపు ఉంది. ఇప్పటికీ ఖాళీ దొరికితే ఆ షాపులో కూర్చుని కళ్లజోళ్లు రిపేర్ చేస్తుంటాను. కళ అనేది కేవలం మానసిక ఉల్లాసానికే కాదు సామాజిక ప్రయోజనం కూడా సాధించే విధంగా ఉండాలన్నదే నా ఆశయం” అని ముగించారు అలీ. ఆయన ఫోన్ నంబర్: 9849191212.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన తెలుగును రక్షించు కొందాం -పూరి పండా అప్పల స్వామి

puripanda-1puripanda-2

Posted in సేకరణలు | Tagged | Leave a comment

రాజువయ్యా !- మహా రాజు వయ్యా !! – శోభన్ బాబు

shobhanbabu -1shobhanbabu -2

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గొర్రె పొట్టేలు బండి వీరమ్మ తిరునాళ్ళు- ఊరిస్తున్న మా తోట ఉసిరి కాయలు

This gallery contains 13 photos.

More Galleries | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -5 విజ్ఞాన ప్రదాత నారదుడు

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -5

                    విజ్ఞాన ప్రదాత నారదుడు

  ఆపదలో ఉన్న వారికి భగవద్ విలాసం తెలిపి చిత్తానికి శాంతి కల్గిస్తాడు నారద మహర్షి.అకంపనుడు పుత్రశోకం తో విలపిస్తుంటే ‘’మృత్యు స్వభావం ‘’తెలియ జేసి ఊరట కల్గిస్తాడు .సృన్జయునికి పదహారు రాజుల చరిత్ర చెప్పి దుఖోప శమనం కల్గించాడు .అతని పుత్రుని కూడా రెండు సార్లు తానే బ్రతికించి మామ గారి వంశాన్ని నిలబెట్టాడు .హిరణ్య కశిపుని భార్య లీలావతి ని దేవేంద్రుడు సంహరింప బోతే ,ఆమె గర్భం లో పెరుగుతున్నది పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు అని తెలిపి ఆమె ను కాపాడాడు .గర్భం లోనే ఉన్న ప్రహ్లాద శిశువుకు భగవద్ భక్తిని నేర్పాడు .ధర్మరాజాదులకు అవసర మైన నీతి బోధ చేశాడు .రామ లక్ష్మణులు నాగాస్త్రం చేత బంధింప బడితే గరుత్మంతుని స్మరించమని హితవు చెప్పి అపాయం నుండి కాపాడిన వాడు నారద మహర్షి .

                         మార్గ దర్శి మహర్షి నారదుడు

    శ్రీ మద్రామాయణం లో వాల్మీకి మహర్షికి సందేహం కలిగింది .తన సందేహాలను తీర్చగలిగేది నారద మహర్షి యేనని గ్రహించాడు ‘’తపస్వాధ్యాయ నిరతం –తపస్వీ వాగ్విదాం వరాం

 నారదం పరి ప్రప్రచ్చ –వాల్మీకిర్ముని పుంగవం ‘’-తపస్సు ,వేదాధ్యనలలో నిరంతరం నిరతుడైన నారద మహర్షిని ,వాక్య వేత్తలలో శ్రేష్టుడైన వాడిని, తపస్వి వాల్మీకి ప్రశ్నించాడని అర్ధం .ఇందులో వాల్మీకి కి నారదుని లో ఎన్ని విశేషణాలుకనిపించాయో చూశారు కదా .

  ‘’కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ ,కస్చ వీర్యవాన్ –ధర్మజ్నస్చ క్రుతజ్ఞస్చ –సత్య వాక్యో దృఢవ్రతః –చారిత్రేనా చ కో యుక్త సర్వ భూతేషు కొ హితః –విద్వాన్ కః కస్య మర్ధశ్చ ,కశ్చైవ ప్రియ దర్శనః –ఆత్మవాన్ జిత క్రోధో ద్యుతిమాన్ కోనసూయకః–కస్య బిజ్యతి దేవాశ్చ –జాత రోష స్య సంయుగే ‘’

       అని వాల్మీకి అడిగిన ఈ ప్రశ్నలకు మహర్షి నారదుడు సూత్రప్రాయం గా శ్రీ రామ చరిత్ర ను చెప్పి ,జ్ఞానాన్ని కలిగిస్తాడు .వ్యాస మహర్షి వచ్చి ‘’అన్నీ నీకే తెలుస్తాయి ‘’అని ప్రోత్సహించాడు వాల్మీకిని .ఈ విధం గా అవసర సమయం లో వచ్చి కర్తవ్య బోధ చేసి ,జ్ఞాన భిక్ష పెట్టి మార్గ దర్శనం చేసిన మహాను భావుడు నారదుడు .ఆదికవినీ ,ఆది కావ్యాన్ని ప్రపంచానికి అందజేసిన మహర్షి .’’సా తరతి –లోకాన్ తారాయతి ‘’అన్న దాన్ననుసరించి తాను తరించి లోకాన్ని తరింపజేసే వారే మహాత్ములని పించుకొంటారు .ఆ కోవకు చెందిన వాడే నారదుడు .ధన్య జీవి సందిగ్ధా వస్త లో ఉన్న జీవులకు తగిన మార్గ నిర్దేశం చేసి ,వారి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి వారిచే ఉత్తమ ఫలితాన్ని లోకాలకు అందజేసే మహానేర్పు నారదునిది .అందుకే పధ నిర్దేశకుడు అని పించుకొన్నాడు .సూక్ష్మం గా రామ చరితను వాల్మీకి మనస్సు లో ఆవిష్కరింప జేశాడు .మహర్షి ప్రేరితుడైన కవి వాల్మీకి మహాద్భుత కావ్య గానం చేసి ,మహోన్నత ఆదర్శ దాంపత్యాన్ని ఇలలో సీతా రాములుగా తీర్చి దిద్దాడు .

                      సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-3-13-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’రాజస’’ (సు ) లోచన

   ‘’రాజస’’ (సు ) లోచన

     రాజసులోచన అంటే వెడల్పైన అందమైన ముఖం ,పెద్ద బొట్టు తో రాజసం తాండ వించే చూపులతో అభినయానికి ఉదాహరణ గా కని పిస్తుంది .రాజసులోచన అంటే ‘’వెలుగు నీడలు   ‘’సినిమా లో ‘’పాడవోయి భారతీయుడా ‘’పాటే ఎప్పుడూ ముందు గుర్తుకొస్తుంది .అందులో శ్రీ శ్రీ రచన ,పెండ్యాల స్వర లహరి రాజసులోచన నృత్యాభినయం గుర్తుకొచ్చిన తర్వాతే మిగిలినవి జ్ఞాపకం వస్తాయి ఆ చీర కట్టిన విధానం అ నిండుదనం నృత్యం చేసి మెప్పించిన తీరు తెలుగు ప్రేక్షకుడేవ్వడు ఎప్పటికి మరిచి పోలేడు.రాజసులోచన అంటే ‘’మాంగల్య బలం ‘’చిత్రం లో రేలంగితో నటించిన అమాయకురాలు చివరికి రేలంగినే మురిపించిన నటి నాకు ఎప్పుడూ గుర్తుకొస్తుంది ఆ చిలిపితనం ,బేల తనం అందులో వారిద్దరి యుగళ గీతం మరచినా మరుపు రానిది .రాజసులోచన అంటే శాంతి నివాసం ‘’చిత్రం లో నాగేశ్వర రావు తో బృందావన్ గార్డెన్స్ లో ఆడుతూ పాడుతూ ‘’రావే రాదా రాణీ రావే రాధ  నీవే క్రిష్ణుడునేనే –రమ్యమైన శారద రాత్రి–రాసలీలా వేళఇదే ‘’అనే పాటే గురుకొస్తుంది. అ జంట పాటల పంట కోసం ఆ సిని మాను ఎన్ని సార్లు చూశానో జ్ఞాపకం లేదు అంత క్రేజ్ ఉండేది రాజ సులోచన మీద,అక్కినేని మీద   .రాజసులోచన అంటే అందరికీ  రాజకుమారుడైన యెన్ .టి.రామా రావు తలను ఒడిలో పెట్ట్టుకొని అతనికి నిద్రా భంగం చెయ్య వద్దని గాలిని బతిమాలే ‘’సడిసేయకో గాలి సడి సేయ బోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే ‘’అన్న కృష్ణ శాస్త్రి గారి గీతం రాజసులోచన ప్రేమ ,తపనా ,రామా రావు అంద చందాలు ,సులోచన నయనాల భావ ప్రకటనా నాకింకా జ్ఞాపకమే .ఆ సినిమా ఆడక పోయినా ఈ పట మాత్రం అందరి హృదయాల మీద పెద్ద ముద్రే వేసింది బి.యెన్.రెడ్డి గారి చిత్రీకరణ ,స్వరం చేసిన సంగీత దర్శకుడు మాస్టర్ వేణు మనసులో నిలిచి పోతారు నిశ్చలన చిత్రమై ఉండి పోతుంది

r1

 

 

         పెంకి పెళ్ళాం సినిమా లో ‘’పడుచుదనం రైలు బండి పోతున్నది .పడుచు  వారికందులోన చోటున్నది ‘’అని ఆరుద్ర రాసిన పాటకు రాజసులోచన అభినయ వేడుక ఎన్న దగింది . రామా రావు తో ఆమె చూపిన చిలిపి శృంగార చేష్టలన్నీ మరచి పోలేనివే .తోడికోడళ్ళు సినిమాలో వాంప్ పాత్రనూ అత్యంత సమర్ధం గా పోషించింది రేలంగి తో ఆమె సరదా డైలాగులు అదిరి పోతాయి .జయ భేరి చిత్రం  లో రాజ నర్తకి గా ,నాగేశ్వర రావు ను వక్ర మార్గం లోకి నెట్టేసే పాత్రనూ ఆమె చేసి సుభాష్ అని పించు కొందీ..ఇద్దరు మిత్రులు లో నాగేశ్వర రావు జోడీగా బలే చలాకీగా నటించి అభినయానికి సోగసులద్దింది.

rajasulochana

              దాసరి మొదటి సినిమా తాతా మనవళ్ళు లో సత్యనారాయణ జోడీ గా ,విలనీ ని పండించి తన సమర్ధత ను రుజువు చేసుకోంది .కత్తివీరుడు కాంతా రావు సరసన నటించి జానపదనికీ సోయగాలు అద్దింది . .దాదాపు అగ్రనటు లందరితో ఆమె నటించి తన నటనకు మెరుగులు దిద్దు కొన్నది .భాగ్యదేవత చిత్రం లో మహానటిసావిత్రికి చెల్లెలు గా వేసి అమాయకురాలైన అక్క కుటుంబాన్ని  సరిదిద్ది న చెల్లెలుగా తన పాత్ర ను సమర్ధ వంతం గా పోషించింది .కలకాలం గుర్తుండే ఈ పాత్ర లో రాజసులోచన జీవించింది అని చెప్పాలి .’’మంచి మనసుకు మంచి రోజులు ‘’చిత్రం లో ‘’దరణికి గిరి భారమా గిరికి తరువు భారమా ,తరువుకు కాయ భారమా  కని పించే తల్లికి పిల్ల భారమా “’అన్న పాటను  ఆమె చెట్టుకింద కూర్చుని పాడుతుంటే రావు బాల సరస్వతి ఆర్ద్రం గా పాడిన ఆ పాటకు రాజ సులోచన అభినయం కన్నీళ్లు తెప్పిస్తుంది గుండెలు పిండిన్చేస్తుంది ఘంటసాల సంగీతం మాధుర్యం లో అతి విషాదాన్ని ఆవిష్కరిస్తుంది .అలాగే ఈ సినిమా లోనే ‘’కలవారి స్వార్ధం నిరు పేద దుఖం ఏనాటి కైనా మారేనా “”?అంటూ రామా రావు రాజ సులోచన పాడుతున్నా మన దుఖం కట్టలు త్రెంచు కొంటుంది .

 images       తెలుగు  చిత్రసీమ లో జయభేరి మోగించిన ‘’జయభేరి ‘’సినిమా లో ‘’నీ వెంత నెరజాణ వౌరా ‘’అన్న మల్లాది వారు రాసిన జావళీని ఏం.ఎల్.వసంత కుమారి అద్భుతం గా గానం చేస్తే రాజసులోచన దానికి చేసిన నృత్యాభినయం‘’నభూతో ‘’అని పిస్తుంది .సవాలు ,ప్రతి సవాళ్ళ తో అక్కినేని తో పోటీ పడి నటించిన గొప్ప సినిమా .ఇది ఆమె నృత్యాభినయానికి అవధులు లేవని పిస్తుంది .పెండ్యాల మ్యూజిక్ గురించి చెప్పనే అక్కర్లేదు .అదొక రసధుని .

    తమిళ హీరోలు రామచంద్రన్, శివాజీ లతో ,కన్నడం లో రాజకుమార్ తో, మలయాళం లో ప్రేమ నజీర్ తో రాజసులోచన నటించి మెప్పించింది .హిందీలో చోరీ చోరీ నయా ఆద్మీ ,మొదలైన చిత్రాలలో నటించి తన నటనకు అవధులు లేవని నిరూపించింది .సుమారు మూడొందల చిత్రాలలో ఆమె హీరోయిన్ వాంప్ ,కేరక్టర్ యాక్టర్ ,నాత్యాలతో అభినయం తో నిత్య నూతనం గా కని పించేది .ఆమె మాటలు చాలా ముద్దు ముద్దుగా ఉండేవి .నవ్వు తమాషాగా ఉండేది ఆమె వెండి తెరకే వెండి వెలుగు లాడ్డింది .ఆమె ను  చూస్తె మనసు పరవశం చెందేది .ప్రేక్షకాదరణ ను పుష్కలం గా పొందిన నటి’’ రాజ స లోచన’’ అయిన  రాజ సులోచన .విజయవాడ అమ్మాయే అయినా మద్రాస్ లో పెరిగింది .సంగీతం నేర్చుకోమని తలిదండ్రులు ఒత్తిడి చేశారు చిన్నప్పుడు కానీ అది ఆమెకు అలవడలేదు .డాన్సు మీద ద్రుష్టి పడింది .డాన్సులో డిప్లోమో సాధించింది .మద్రాస్ లో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి టి.ఎల్.వెంకట్రామన్ ముఖ్య అతిధి గా పాల్గొన్న సభలో హిందూ హైస్కూల్ లో రాజ సులోచన తొలి నృత్య ప్రదర్శన నిచ్చి ‘’అరంగేట్రం’’చేసింది ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేక పోయింది .

            ఇన్ని సినిమాలో ఇన్ని రకాల వేషాలు వేసి మెప్పించినా ఆమె కు కూచి పూడి ,కధా కళీ ,కదక్ భారత నాట్యాలంటే మిక్కుటమైన మక్కువ .పాశ్చాత్య నాట్య రీతులను దీక్షతో అభ్యసించి తన నృత్యానికి అవధులు లేవని నిరూపించింది .కదక్ నృత్యాన్ని లక్నో శైలిలోను, ,జైపురి శైలి లోను ఒకే సారి నేర్చున్న ఏకైన కళా కారిణిగా అరుదైన గుర్తింపు పొందింది రాజ సులోచన .వీటిని అందరికి నేర్పాలనే సదుద్దేశం తో మద్రాస్ మహా నగరం లో ‘’పుష్పాంజలి నృత్య కళా కేంద్రం ‘’ను ఏర్పరచి ,ఎందరికో నేర్పింది తను నేర్చిన  విద్య కు సార్ధకత తెచ్చింది .

            సావిత్రి దర్శకత్వం వహించి నిర్మించిన ‘’చిన్నారి పాపలు ‘’సినిమాకు నృత్య దర్శ కత్వం చేసి, తొలి మహిళా నృత్య దర్శకురాలైంది రాజ సులోచన .మహా కవి కాళిదాసు చిత్రం లో తాను పాడిన పాటకు వీణ ను కూడా తానే వాయించి తన వీణా గాన విద్వత్తును లోకానికి తెలియ జేసింది  .ఇలా ఎన్నో విధాల రాజ సులోచన తన సర్వ సమర్ధత ను అన్ని రంగాలలో సాధించి నిరూపించుకోన్నది .అయితే ఈ నృత్యాభినయ నేత్రిని  మన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ గౌరవించలేక పోవటం దాని గుడ్డితనానికి మన దురదృష్టానికి దృష్టాంతం గా నిలిచి పోయింది. కానీ తమిళ నాడు ప్రభుత్వం ఆమె ప్రతిభకు పట్టం కట్టింది .ఆమె కు  ‘’కలై మా మణి’’బిరుదు నిచ్చి అపూర్వ గౌరవాన్ని కల్గించింది .ఎన్నో వైవిధ్య భరిత పాత్రలకు జీవం పోసిన సంగీత ,నృత్యాభినయ తార రాజ సులోచన తన 78 వ ఏట ‘’సడి సేయకుండా‘’దివికి చేరి పంచ భూతాలతో  తన ప్రావీణ్యాన్ని పంచుకొని నట చిరంజీవి అయింది

            మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –6-3-13-ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -4 గాన విద్యా పరీక్షకుడు నారదుడు

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -4

                       గాన విద్యా పరీక్షకుడు  నారదుడు

మార్కండేయ పురాణం లో ఒక అద్భుత మైన కధ ఉంది .ఒక నాడు ఇంద్ర సభ లో రంభాదులు నృత్యం చేస్తున్నారు .నారదుడు ఆ సమయం లో అక్కడికి వెళ్ళాడు .వీరిలో ఎవరి గానం ఇంపు గ ఉందోపరీక్షించి తేల్చమని ఇంద్రుడు నారదుడిని అడిగాడు .ఎవరు హావభావాలతో విర్రవీగుతారో వారి గానం గొప్పది అంటాడు మహర్షి .ఎవరికి వారు తామే ఎక్కువ అని వాదు లాడుకొంటారు .అప్పుడు నారదుడు ‘’ఎవరు దుర్వాస మహర్షి ని చలింప జేస్తారో వాళ్ళే గొప్ప ‘’అంటాడు .అప్పుడు ‘’వపువు ‘’అనే అప్సరస తాను ఆ పని చేయగలనని బయల్దేరి వెళ్ళింది .దుర్వాసుడు ఆమె ప్రయత్నానికి కోపం చెంది ‘’పక్షి ‘’గా మారి పొమ్మని శపిస్తాడు .పిల్లల్ని కనీ ,ఖడ్గం చేత నరక బడి మళ్ళీ దేవలోకం చేరుతావని ఆమె ప్రాధేయ పడితే చెప్పాడు .ఆమెయే ‘’తార్క్షి ‘’అనే పేరు తో భూలోకం లో జన్మించి ,ద్రణాచార్యులను వివాహ మాడుతుంది .గర్భవతి యై ,భారత యుద్ధం లో భూమి పై ఎగురుతు ఉండేది .భగాదత్తుని పై అర్జునుడు వేసే బాణాలు ఈమె కు తగిలి గర్భం చీలి గ్రుడ్లు కిందపడి పోగా శాప విమోచనమై మళ్ళీ దేవలోకం చేరుతుంది .శమీకుడు ఈ గ్రుడ్లను పెంచుతాడు .ఈ శమీక మహర్షి యే పరీక్షిత్తు మహా రాజుకు శాపం ఇచ్చిన వాడు .

                   గాన విద్యా విశారదుడు నారదుడు

   అద్భుత రామాయణం కధనం ప్రకారం  కౌశికుడు అనే వాడు స్వర్గ లోకం లో గానం చేస్తున్నాడు .లక్ష్మి నారదాదులు అక్కడికి వచ్చారు .లక్ష్మీ దేవి తుమ్బురుని పిలిచి కౌశికుని తో కలిసి గానం చేయమని కోరింది .నారదుడు దీన్ని తనకు జరిగిన అవమానం గా భావించాడు .నారదుడు కోపం తో లక్ష్మీ దేవిని ‘’దనుజ గర్భం లో పుడతావని ‘’శపించాడు .పాపం విష్ణు మూర్తి నారదుడిని ఊరడించాడు .భక్తిజ్ఞానం తో తుంబురుడు పాడుతాడు కనుక అతనికి అంతటి ప్రభావం వచ్చిందని తెలియ జేస్తాడు .నారదునికి అంతటి ప్రభావం రావాలంటే ‘’మానసోత్తర పర్వతం ‘’పై ఉన్న ‘’గాన బంధుడు ‘’అనే గుడ్ల గూబ ఉందని ,దాని దగ్గర గాన విద్య నేర్చుకోమని సలహా ఇస్తాడు .నారదుడు అలానే నేర్చి సుశిక్షితుడైనా, తుమ్బురునితో సమానం కాలేక పోతాడు .అసూయ తో మళ్ళీ విష్ణు మూర్తిని చేరి సంగీతం నేర్ప మంటాడు .శ్రీకృష్ణావతారం లో తాను నారదునికి సంగీతం నేర్పగలనని శ్రీహరి చెప్పి ఊరట కల్గించాడు .

       శ్రీ కృష్ణావతారం లో నారదుడు స్వామిని చేరి సంగీతం నేర్పమంటాడు .జాంబవతి మొదలైన అష్ట భార్యల వద్దా ఒక్కొక్క సంవత్సరం గానం నేర్చుకోమంటాడు .అంత చేసినా గాన విద్య అబ్బలేదు .చివరికి శ్రీ కృష్ణుడే స్వయం గా నారదునికి సంగీత విద్య నేర్పి గాన విశారడుడిని చేశాడు .అప్పటి నుంచే ఈర్ష్య పూర్తిగా పోయింది నారదునికి .

                    త్రిలోక సంచారి

       తండ్రి ఆజ్ఞవల్ల దక్షులు సృష్టి చేయటం ప్రారంభించారు .’’ముక్తి సాధన ‘’చూసుకో కుండా ఈ సంసార లంపటంమయేమిటని వారిచేత నారదుడు ఆ పని మాన్పించాడు .దక్షునికి తెలిసి బ్రహ్మ తో మొరపెట్టుకొన్నాడు .దక్షుని పుత్రికకు నారదుడు మళ్ళీ జన్మిస్తాడని బ్రహ్మ శపిస్తాడు .ఒక్క చోట కూడా కాలు నిలువ కుండా తిరుగుతూనే ఉంటావని ,సంతానం కూడా లేకుండా పోతుందని దక్షుడు శపిస్తాడు .బ్రహ్మ వైవర్త పురాణం లో ఈ కధ ఉంది . .

                     కలహా భోజనుడు నారదుడు

    తాను విన్న ,తెలుసుకొన్న విషయాలను ఇంకొకరికి చెప్పక పోతే నారదుడి కి నిద్ర పట్టదు, .తోచదు కూడా .అదే కలహా కారణం అయింది .దానివల్ల అపోహలు ముసురుకొన్నాయి .చివరికి ఆనందం ,శాంతి సంతృప్తి .అయితే నారదునికి మాత్రం తిట్లు ,అక్షింతలూను .విష్ణువు రామావతారం దాలుస్తాడని వాల్మీకికి చెప్పిన వాడు నారదుడే .జలన్ధరాసురుని వధకు నారదుని నేర్పే కారణం .అలాగే గరుత్మంతునికి పాముల పై కోపం నారదుని వల్లనే కలిగింది .కాలయవనుని వధ  కూడా నారద నిర్వాకమే .ఇలా తంపుల మారిగా మారాడు ఇదంతా లోక హితం కోసమే. ఇందులో ఆయన స్వార్ధం ఇసుమంత కూడా లేదు .

             వరాహ పురాణం లో నారదుడు రావణుని దగ్గరకు వెళ్లి ‘’నరులను జయించానని గర్వ పడుతున్నావు .దేవతలు ,యముడు మదించి ఉన్నారు .వాళ్ళను ఓడించు ‘’అని ఎక్కేశాడు .యముడి దగ్గరకు వెల్లి ‘’రావణ గర్వం పెరిగి పోయింది .నీ పైకే వస్తున్నాడు చూసుకో కాసుకో ‘’అని ఉసి గోల్పాడు

             మహిషాసురుని వల్ల లోకం బాధ పడుతోందని ‘’నారాయణి ‘’కి తెలిపి, మళ్ళీ వాడిని చేరి ‘’మలయసానువుఅలలో అందమైన నారాయణి ఉంది .చే బట్టమని ‘’ప్రోత్సహించాడు .చివరికి మహిషాసుర మర్దని ఆమె అయినా ప్రోత్సాహం అంతా నారదునిదే .ఈ విధం గా అసుర సంహారానికి తగిన ప్రాతి పదిక లేర్పరచి ,మానవ లోకానికి మహత్తర సౌభాగ్యాన్ని కల్పించాడు .కలహభోజనుడైన నారదుడు .లోక హితమే నారదుని  మతం .

            సశేషం

               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-3-13-ఉయ్యూరు 

 
Posted in రచనలు | Tagged | Leave a comment

ఉయ్యూరు – వీరమ్మ – సిడి బండి – దృశ్యాలు

This gallery contains 18 photos.

More Galleries | Tagged | Leave a comment

విక్టోరియారాణి కాలపు మహిళ

విక్టోరియారాణి కాలపు మహిళ

  స్త్రీ జనాభ్యుదయానికి కృషి చేసి, స్త్రీ వాద రచయిత్రి అని పేరు పొంది   అంతర్జాతీయం గా గుర్తింపు పొందిన నవలా కథా రచయిత్రి ఇంగ్లాండ్ దేశానికి చెందిన వర్జీనియా ఉల్ఫ్. స్త్రీల మనో వేదనల పై ఎన్నో సమా వేశాలలో ఉద్వేగం గా ప్రసంగించింది .వారి దయ నీయ పరిస్థితులకు విచలితు రాలయింది .ముఖ్యం గా ఆమె బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కాలం లో స్త్రీల దుర్భర  పరిస్తితులను అధ్యయనం చేసింది. వారి పట్ల సాను భూతిని కనపరిచింది ఆ కాలపు స్త్రీ లగురించి స్త్రీ రచయితలు అసలేమీ రాయక పోవటాన్ని ఉల్ఫ్ జీర్ణించుకోలేక పోయింది .వారి స్వాతంత్ర్యం అణచి వేయ బడిందని ఆవేదన చెందింది .వీలైనప్పుడల్లా మహిళా రచయితలను వాటి పై సమగ్ర అద్యయనం చేయమని కోరింది …వెలుగు లోకి రానిఎన్నో విషయాలున్నాయని ,ఇప్పటికీ అవి ప్రపంచం ముందు ఉంచక పోతే తమల్ని చరిత్ర క్షమించదని చెప్పేది .స్త్రీ రచయిత కు స్వేచ్చ ఉండాలని ,ఆమె కొక ప్రత్యేక గది ,ధనమూ ఉంటేనే ఆమె రచనలను స్వేచ్చగా చేయ గలుగుతుందని అభి ప్రాయ పడింది .ఆమె ఆరాటం ఎలాంటిది అంటే  ఒక రోజు రోజంతా ఇవాళ బ్రిటిష్ లైబ్రరీ అనబడే ఆనాటి బ్రిటిష్ మ్యూజియం లో స్త్రీ జీవితాలకు సంబంధించిన సమా చారాన్ని సేకరించ టానికి గడిపింది .అనేక చరిత్ర పుటల్ని తిరగేసింది .

              ఆమె సేకరించిన సమాచారం ప్రకారం ఎథెన్స్ నగరం లో ఆడ వాళ్ళను తూర్పు భాష లను నేర్చుకో కుండా కట్టడి చేశారని తెలియ జేసింది .ఈరిపిడియస్ రాసిన నాటకాలలో ప్రసిద్ధ నాయికలైన ఆంటిగన్ ,కసండ్రా , నేస్త్ర ,ఫీద్రి మీడియామొదలైనపాత్ర ధారణచేసి సెభాష్ అని పించుకొన్న మహిళా నటీ మణు  లందరూ కూటికి గడవని నిరు పేదలే నని బయట పెట్టింది ఉల్ఫ్ ..సమాజం లో గౌరవ కుటుంబాలలో నుండి వచ్చిన స్త్రీలు ఎన్నడూ బజారు లో ఒంటరిగా దర్శన మిచ్చేవారు  కాదని చెప్పింది .కాని స్త్రీ వేషం వేసే నటీమణులు మాత్రం నాటక రంగం లో విజ్రుంభించి పురుషులతో సమానం గా నటించి మెప్పు పొందేవారని,ఒక్కో సారి నాయక వేషం వేసిన వారి కంటే నాయిక వేషం వేసిన మహిళ లే అత్యున్నత ప్రమాణ మైన నటన కన బరచే వారని ఆమె స్పష్టం చేసింది .
ఇవాళ మనం అను కొంటున్న ఆధునిక సమాజం లో కూడా అదే విషాద దృశ్యం కనిపించటం సిగ్గు చేటు అంటుంది వర్జీనియా ఉల్ఫ్ తన ఉల్ఫ్ స్వరం తో .ఈ విషయం లో షేక్స్ పియర్ నాటకాల కాలం లో కూడా రోసా లిండ్ ,లేడి మెక్బెత్ పాత్రల్ని పోషించిన స్త్రీలు అందరి కంటే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొన్నారని వీటిపై అధ్యనం చేసిన చరిత్ర కారులు చెప్పారని ఆమె అన్నది .అంతే కాదు రీన్స్  రాసిన ఆరు విషాదాంత నాటకాలలో కూడా నాయికా పాత్రధారులే చిరంజీవులై నిలిచారు .మగ వారి సంగతి దేవుడికే ఎరుక .ఈ నాటక పాత్రలలో హీర్మియాన్ ,ఆండ్రీ మాక్ బెరింన్స్  పాత్రలను జీవింప జేశారు .ఇక ఇబ్సన్ నాటకాలను చూస్తే కూడా ఇదే అభిప్రాయం బల పడుతుంది .సోలేగ్ ,నారా ,హిల్డా ,వేగాల్ ,రెబెక్క ,వెస్ట్ లతో పోల్చదగిన మగ పాత్రలు కలికానికి కూడా కనీ పించవు .అని ఉల్ఫ్ ఉవాచ . .

              షేక్స్ పియర్ కాలం లో పురుష రచయితలందరూ సానెట్ ను ,పాటను విజ్రుంభించి రాసి ప్రాచుర్యం తెస్తే ఒక్క గానొక్క స్త్రీ రచయిత కూడా వీటి వైపు కన్నెత్తి చూడక పోవటం ఉల్ఫ్ కు ఆశ్చర్య మేసింది .షేక్స్ పియర్ నాటకాలు  అలా నిశ్చల చిత్రాలుగా గోడకు వేలాడుతూ ఉంటాయి. లేక సాలీడు గూడు లాగ అల్లుకొని రహస్య గృహాలు లాగా  కని పిస్తాయి  ఒక సారి ఆ గూడు ఛేదిస్తే అవి గాలిలో కట్టిన గూళ్ళు  కాదని,యేవో క్షుద్ర కీటకాలు నిర్మించినవి కాదని తెలుస్తుంది అవి బాధలతో బరువు తో జీవించిన మానవ మాత్రులు నిర్మించిన అందమైన గూడులని, అవి  మెరిసే దారాలన బడే డబ్బు ,ఆరోగ్యం తో నిర్మించ బడినవని ఆమె అంటుంది .అవి మనం నివసించే మన  ఇంటి వంటివే నన్న భావన కలిగిస్తాడు షేక్స్ పియర్ అన్నదిఆమె .

           ఉల్ఫ్ తాను ఒక సారి ట్రేవిలియాన్ రాసిన ‘’హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్‘’చదువుతుంటే అందులో కొన్ని దిగ్భ్రాంతి కలిగించే విషయాలు చదివి చలించి పోయానన్నది .అందులో భార్య ను కొట్టే హక్కు భర్తకు ఉందని ,దాన్ని గొప్పగా భావించి స్త్రీలను విపరీతం గా హింసించే వారని తెలుసుకొని నిశ్చేష్టురాల నయ్యానని  చెప్పింది .తండ్రి కుదిర్చిన సంబంధాన్ని కూతురు అంగీకరించి పెళ్లి చేసుకోక పోతే ,ఆమెను కొట్టి ,ఒంటరిగా గదిలో బంధించ టానికి బల వంతం గా తోసేసి, షాకులు కూడా ఇచ్చే వారని చదివా నని చెప్పింది .వివాహం అనేది స్త్రేకి స్వయం నిర్ణయం కాదని , అది కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయమని ఆ నాటి పై తరగతి కుటుంబాలలో ఇది సర్వ సాధారణం అని ఆమె తెలుసుకొన్నట్లు వివరించింది..క్రీ.శ 1470 లో మత ప్రవక్త ,రచయిత అయిన చాసర్ కాలం తర్వాత,పెండ్లికి ముందు చేసే ప్రదానం ఆడపిల్ల ఉయ్యాలలో ఉన్నప్పుడే జరిగి పోయేదని, .దాది లేక నర్సు పెంపకం అయి పోగానే ఆడ పిల్ల మగ పిల్లాడి తలిదండ్రులు పెళ్లి చేసే వారని చదివి ఆమె అవాక్కయ్యానని.చెప్పింది .

           తర్వాత రెండు వందల ఏళ్ళకు కూడా స్టువార్ట్ రాజుల కాలం లో  ఉన్నత ,మధ్య తరగతి కుటుంబ వధువుకు కొంత హద్దు లో ఉన్న స్వేచ్చ లభించిందని ,ఆమె బాగా సంపన్నుని ,హోదా ఉన్న వాడిని ,సంఘం లో గౌరవ స్థానం  లో ఉండే వాడిని పెళ్లి చేసుకోవాలని ఆంక్ష లుండేవని చదివింది .ఉల్ఫ్ .ట్రావేల్యాన్ చరిత్ర కారుడు రాసిన దాని బట్టి షేక్స్ పియర్ స్త్రీలు ,పది హేడవ శతాబ్ది స్త్రీలు అయిన వేర్నీస్ ,హచిన్సన్ లు వ్యక్తిత్వానికి ,శీలానికి విలువ నిచ్చినట్లు కని పించదన్నాడట

        క్లియోపాత్రా మాత్రం తన దారి తాను తొక్కింది .అలాగే లేడి మెక్బెత్ అరుదైన తరహా  ఉన్న స్త్రీ లా కని పిస్తుంది .ప్రొఫెసర్ ట్రేవేల్యాన్ రాసిన ప్రకారం షేక్స్పియర్ స్త్రీలు వ్యక్తిత్వానికి ,శీలానికి ప్రాధాన్యత నిచ్చే వారు కాదు ..ప్రాచీన కాలం నుండి కవులు క్లెమెన్స్త్రె ,ఆన్టిగన్ ,క్లియో పాత్రా లేడీ మెక్బెత్ ,ఫిదేరీ ,క్రేస్సిడా ,రోసాలిండ్ ,దేస్డోమోనా ,మాల్ఫీ లోని డచేస్ వంటి స్త్రీ లను ఓడలకు దీపం వత్తి కాల్చి దీపం వెలిగించి నట్లు చేశారన్నాడు .వచన రచయితలు మిలియా మాంట్ ,క్లారిసా ,బెకీ షార్ప్ అన్న కేరీనినా ,ఎమ్మా బోవారి ,మేడం డీ గుర్మాన్టిస్ లు ఆడవారిలో వ్యక్తిత్వం ,శీలం లేవనే అభిప్రాయ పడ్డారని తేల్చాడు .కాని కల్పనా సాహిత్యం లో ముఖ్యం గా మగ రచయితలు రాసినవాటిలో వీరోచితం గా  స్త్రీ ప్రవర్తించి నట్లు , మగవారితో సమాన ఫాయిదా లో ఉన్నట్లు రాశారు ఇది కల్పనా సాహిత్యం కదా .అలా రాసి తృప్తి పడ్డారంతే . కొన్ని సార్లు మగ వారి కంటే ఆధిక్యత లో ఉన్నట్లుకూడా రాశారు  .నిజం గా స్త్రీ ని గదిలో బంధించి ,కొట్టి, హింసించి ,ఆమె సర్వ హక్కులు హరించిన కాలమే అది అంతా .

            స్త్రీ స్థానం ఎంత ఉన్నత మైనదైనా ,ఆమెకు ఎంత ప్రాముఖ్యం ఉన్నా ,ఆమె సంఘం లో విలువ లేనిదే అయి పోయింది .ప్రత్రి పుస్తకం లో ,ప్రతి పుస్తక కవర్ పేజీ పైన ఆమె ను అద్భుతం గా చిత్రించే వారు .ఆమె కు  మాత్రం చరిత్ర లో స్థానం కల్పించలేదు   ఆమె కు తీరని అన్యాయమే చేశారు .కల్పిత కదా సాహిత్యం లో స్త్రీ -రాజులను ,విజేతలను సామ్రాజ్యాలను ప్రభావితం చేసి విజ్రుంభించింది .కాని నిజానికి ఆమె ఎవరో ఒక కుర్రాడికి బానిస గానే ఉండి పోయింది .తలిదంద్రులిష్ట పడిన వారితో ఉంగరాలు  మార్చుకొంది తప్ప వ్యక్తిత్వాన్ని చూప లేదు .ఆమె నోటి నుండి ఉత్తేజ పూర్వక వాక్యాలు కాని ,ఉత్తమ మైన ఆలోచనలు కాని ఆమెగురించిన సాహిత్యం లో  ఆమె ఆమె పెదవి దాటి బయటకు రాక పోవటం అత్యాశ్చర్యకరమే ., ఆమె ఎప్పుడూ భర్త ఆస్తి గానే పరిగణింప బడింది అని వాపోయింది రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్

            విక్టోరియా రాణి కాలంలోని సాహిత్యం లో ఉన్న స్త్రీలందరూ ఎముకలు, కండరాలు ఉన్న మాంసపు ముద్దల్లాగా కని పిస్తారు కాని వారి ఆలోచనలు, మనసు, తెలియ జెప్పిన రచన లేవీ రాక పోవటం విచారకరం అన్నది ఉల్ఫ్ .ఒక గాజు బొమ్మ లాగా ,షోకేసు లో బొమ్మ లాగా ఉంటుంది కాని వ్యక్తిత్వం ఉన్న మహిళగా ఎక్కడా కనిపించదు జీవచైతన్యం తో తోణికిసలాడే మహిళ మచ్చుకైనా కని పించక పోవటం దురదృష్టకరం .  .తనకు ప్రొఫెసర్ ట్రేవిల్యాన్ దృష్టిలో చరిత్ర అంటే ఏమిటో తెలుసుకోవాలని పించి, ఆయన రాసిన వాటిని చదివానని అందులో ఎలిజబెత్ పేరు, మేరీ పేర్లు అప్పుడప్పుడు కనిపించాయని అవీఒక రాణి గారి పేరో, లేదా ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ పేరో తప్ప సామాన్య స్త్రీ ల పేర్ల గురించి ఎక్కడా కనిపించదుఅన్నది. .మధ్యతరగతి స్త్రీలు, చరిత్ర ను తిరగ రాసిన వారు, గత కాలానికి వెలుగు దివ్వెలు అయిన మహిళా జాతి రత్నాల ఊసెక్కడా కనిపించక పోవటం మరీ వింత ..చరిత్ర లో సరే సరి కాని ఎక్కడైనా ముచ్చట కైనా కధల్లో  లో కూడా ఆమె ప్రసక్తి లేదు .జాన్ ఆరబీ అనే ఆమె తన జీవిత చరిత్ర రాసుకొన్నాఆమె మరణం తర్వాత ప్రచురింప బడింది . ఆమె గురించి చెప్పుకొన్నది చాలా అరుదు .ఆమెకు  డైరీ రాసే అలవాటు కూడా లేదు .ఆమె రాసిన కొన్ని ఉత్తరాలు మాత్రమే లభించాయి .ఆమె ను అర్ధం చేసుకోవా టానికి,ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించటానికి  ఆమె రాసిన నాటకాలు ,కవిత్వం కూడా లభించలేదు .ఆమె ఎలా జీవించింది స్వంత ఇల్లు ఉందా ,నౌకర్లు చాకర్లు ఉన్నారా ,ఆమె ఇస్టాయిస్టాలేమిటి?ఆమెకు వంట చేయటం వచ్చా ఆమె పుట్టిన తేదీ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏ చర్చి ఫాదర్ దగ్గరో ఉన్న సమాచారం , లేక చర్చి రిజిస్టర్లు,జమా ఖర్చుల పుస్తకాలే ఆధారం .ఎలిజ బెత్ రాణి కాలపు మహిళలు ఎక్కడో విసిరేసి నట్లుంటారు వారి ని గురించిన సమాచారం సేకరించటానికి చరిత్ర కారులు ప్రయత్నించనే లేదని అభియోగం తెచ్చింది వర్జీనియా ఉల్ఫ్ .జేన్  ఆస్టిన్ గురించి, మేరి రస్సెల్ మిల్ ఫోర్డ్ గురించి చరిత్ర అంతా ఒక శతాబ్దం కాలం పబ్లిక్ దృష్టిలో పడకుండా చరిత్ర మరుగున ఉండిపోవటం విచారకరం అంటుంది బాధ గా వర్జీనియా ఉల్ఫ్ .ఆమె తపన అందరికి ఉంటే ఈపాటికి ఆ నాటి మహిళా  జీవితం గురించి సమగ్ర మైన చరిత్ర లభించి ఉండేది .ఆ చరిత్ర జ్ఞాపకాల లోకి ఆమె తొంగి చూసి,  ఆనాటి స్త్రీ జీవితం పై కొద్దో గొప్పో వెలుగు ప్రసరింప జేసి మహిళా మన్ననలను పొందింది వర్జీనియా ఉల్ఫ్ ..స్త్రీ జాతి  వర్జీనియా ఉల్ఫ్ కు చాలా రుణ పడి ఉంది .

 – గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– See more at: http://vihanga.com/?p=7413#sthash.qcFD99zh.WYN8P3jN.dpuf

Posted in రచనలు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు -3

  జ్ఞానదుడు మహర్షి నారదుడు -3

         లింగ ,శివ పురాణాలలో నారదీయం

 ఒకప్పుడు నారదుడు హిమాలయం పై తపస్సు చేస్తున్నాడు .ఇంద్రుడు విఘ్నం చేయమని దేవకన్యల్ని పంపాడు నారదుడు శివారాధకుడు కూడా కనుక శివ ప్రభావం వల్ల మనసు చలించలేదు .దీనితో గర్వం వచ్చింది .తపస్సు ముగించి ,బ్రహ్మ విష్ణువు లను చూడటానికి వెళ్ళాడు .తన ప్రభావం వల్లనే శివుడు కాముడిని జయించాడని విష్ణు మూర్తి తో అంటాడు .పరీక్షించే నెపం తో విష్ణు మూర్తి మార్గ మద్యం లో ఒక నగరాన్ని నిర్మించి ,అందులో అతి లోక సౌందర్య రాశి ని సృష్టించి ఉంచుతాడు .ఆమెను చూడగానే ప్రేమలో పడ్డ నారదుడు ఆమె ను వివాహమాడే నిమిత్తం విష్ణు రూపాన్ని తనకిమ్మని కోరుకొంటాడు .

   , నారదుడు ,అతని మేనల్లుడు పర్వతుడు అంబరీషుని నగరానికి వచ్చి అతని కుమార్తె శ్రీమతిని చూస్తారు ఇద్దరు  ఆమె పై మనసు పదడి పోటీ పడతారు .ఇద్దరిలో ఒక్కరికే తన కుమార్తె నిస్తానంటాడు తండ్రి .ఇంతలో ఒకరికి తెలియ కుండా ఇంకొకరు విష్ణువు ను చేరి అవతలి వాడి ముఖం కోతి ముఖం చేయమని కోరుకొంటారు .స్వయం వరం లో శ్రీమతి విష్ణువునే వరిస్తుంది .ఆమెతో వైకుంఠానికి విష్ణువు చేరుకొంటాడు .వీరిద్దరికీ కోపమొచ్చింది .అమ్బరీషునితో తగాదా పడతారు .అతడిని ‘’తమో మయుడవు కావలసినది ‘’అని శపిస్తారు .ఇంతలో విష్ణు చక్రం వీరిద్దరిని తరుము కొం.టు వచ్చింది .పారి పోయి విష్ణు లోకం చేరారు .’’వానర ముఖాలు మాకు ఇచ్చి నువ్వు కన్య ను కొట్టేశావు ‘’కనుక నరుడి వై వియోగ దుఖం అనుభవించమని విష్ణువు ను శపించారు .చివరికి ఆ వానరుల సహాయంవల్లనే భార్యను మళ్ళీ పొందుతావు అని చెప్పారు .ఇదంతా శివుని ప్రభావమే నని వీరిద్దరికీ తెలియ జెప్పి విష్ణువు అంతర్ధాన మయ్యాడు .ఇదే శ్రీ రామావతారానికి ప్రాతి పాదిక అయింది

                                                              మహా భారత కదా విధానం

                   నారద పర్వతులు లోక సంచారం చేస్తూ ఒకరి హృదయం లో ఉన్నది వేరొకరికి  దాచకుండా చెప్పుకోవాలని ,అలా చెప్పుకోక పోతే అవతల వాడిని శపించాలని ఒక ఒడంబడిక చేసుకొన్నారు .ఇద్దరు సృన్జయుడు అనే రాజు దగ్గరకు వచ్చారు .వీరి పరిచర్యలకు తన కుమార్తె ‘’సుమాలిని ‘’ని నియమించాడు .నారదుడు ఆమె పై మనసు పారేసుకొన్నాడు కాని ఆ సంగతి పర్వతుడికి చెప్పలేదు .పర్వతుడు ఇది గ్రహించి నారదుడి ని కోతి ముఖం తో ఉండమని శపించాడు .నారదుడు పర్వతునికి లోక సంచారం లేకుండా ఉండే శాపం ఇచ్చాడు .నారద సుకుమారిల పరిణయం జరిగింది .కొంతకాలానికి మామా అల్లుడు కలుసుకొన్నారు .శాప విమోచనం చేసుకొన్నారు .ఇంటికి తిరిగి వచ్చిన నారదుడిని భార్య గుర్తించలేదు అప్పుడు పర్వతుడే ఆమె కు అతనే ఆమె భర్త అని నిజాన్ని చెప్పాడు .

             నారదుడు మామ సృన్జయునికి  దేవతలను మించిపోయే పుత్రుదు కలిగే వరం ఇచ్చాడు అక్కడే ఉన్న పర్వతుడు ఆ పుట్టబోయే వాడు అల్పాయుష్కుడు ‘’అన్నాడు . .రాజు దుఖిస్తే ‘’ఇంద్రుడు నీ పుత్రుడిని సంహరిస్తాడు .అప్పుడు నన్ను తలచుకో.నేనే బ్రతికిస్తాను ‘’అని అభయమిస్తాడు నారదుడు .సృన్జయుడికి పుత్రుడు కలిగాడు అతని నిస్టేవనం(ఉమ్మి, విసర్జనం మొదలైనవి ) బంగారు అవటం వల్ల అతనికి  ‘’సువర్ణ స్టేవి ‘’అని పేరు పెట్టారు .అతని శరీరం అంతా బంగారుమయమే నని భ్రమించి దొంగలు అతన్ని చంపేశారు .నారడుకి ఈ విషయం తెలిసి పునర్జీవితుడిని చేశాడు కాని  .ఇంద్రుడు కోపం తో చంపమని వజ్రాయుధం పంపాడు  .రాజు తన అల్లుడైన నారదుడిని తలచుకొన్నాడు .మళ్ళీ బ్రతికించి తన మాట నిల బెట్టుకొన్నాడు నారదుడు ఇలా మామ గారి వంశాన్ని నిల బెట్టి పుణ్యం కట్టుకొన్నాడు అల్లుడైన నారదుడు

              సశేషం

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-3-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

బడి ‘భాగవతం’

బడి ‘భాగవతం’


అరుణ పప్పు

ఇక్కడ నడుస్తున్న విద్యావిధానానికి ముగ్థురాలైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి వాళ్లకో చక్కటి భవనాన్ని కానుకగా ఇచ్చారు. అంతేనా, ప్రతి తరగతి గదికీ ఓ కంప్యూటర్. అందులోనే పాఠాలన్నీ నిక్షిప్తమయి ఉంటాయి. లెక్కలైనా, సైన్సయినా, ఇంగ్లీషయినా… కంప్యూటర్‌లో సినిమా చూసినంత సులువుగా చూసెయ్యడమే. తర్వాత దాని గురించిన చర్చ, రన్నింగ్ నోట్సు రాసుకోవడం, విషయాన్ని అర్థం చేసుకోవడం. పాఠం మేస్టార్లు చెప్పడమూ, విద్యార్థులు కష్టపడి గుర్తుంచుకోవడమూ అన్న పద్ధతే రద్దయిపోయింది. దానికి మారుగా నేర్చుకున్న ప్రతి విషయమూ ఆ పసిమనసుల్లో అక్షరమక్షరమూ అచ్చయిపోతుందంతే.

– అక్కడి బడికి పిల్లలు పరుగులు తీస్తూ వెళతారు, లోపల పనులు చేస్తూ కనిపిస్తారు. ఈ చిత్రం చూసి ముచ్చటపడి ఇన్ఫోసిస్ సుధామూర్తి వాళ్లకో చక్కటి భవనం కట్టించి ఇచ్చారు!
– అక్కడి రైతులు నిరుపయోగమైన మడులను తీసుకుంటారు, వాటిని సాగుచేస్తూ కనిపిస్తారు. ఈ విచిత్రానికి ఆశ్చర్యపోయి ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఒక కృషి విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించి ఇచ్చింది.
– అక్కడి గుడులు భజనలు చేస్తూనే సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతుంటాయి.
ఎక్కడ ఇదంతా?
విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి సమీప గ్రామం హరిపురమే కేంద్రం.
ఎవరు చేస్తున్నారిలాగ?
భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు.
‘ఓ ఇదా, మాకు తెలుసు’ అంటారా, మరిన్ని వివరాలు తెలుసుకుందురుగాని పదండి. 

‘ఈ సంస్థ పేరే వినలేదే’ అంటారా, అయితే ఇంకా జాగ్రత్తగా తెలుసుకోవాలి లోపలికి వెళ్ళండి.
చెట్టు పైకి ఎంత ఎదుగుతుందో, భూమి లోపలికీ అంతే ఎదుగుతుందట. వేళ్లు ఎంత బలంగా ఉంటే పైన కొమ్మలంత పచ్చగా ఉంటాయి. అది తెలియకపోతే ఎంత తొందరగా విస్తరిస్తామా అనే ఆరాటపడతాం. కుదుళ్లలోనే బలం పుంజుకోవాలన్నది అర్థమైతే గనక ‘భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు’ పనితీరును అర్థం చేసుకోగలుగుతాం. ఇతర రాష్ట్రాల్లోనే కాదు, కనీసం ఇతర జిల్లాలకైనా విస్తరించకుండా కేవలం విశాఖపట్నం జిల్లాకే పరిమితమయిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినదెలాగో తెలుసుకుంటాం. ఎలమంచిలి చుట్టుపక్కల వేలమంది గ్రామీణుల జీవితాల్లో వచ్చిన మార్పును వీక్షించగలుగుతాం.

బడి మడి గుడి – ఈ మూడింటినీ కార్యక్షేత్రాలుగా ఎంచుకుని నలభయ్యేళ్లుగా కృషి చేస్తున్న ఈ సంస్థ తీరుతెన్నులే ఈవారం మన కవర్‌స్టోరీ. హరిపురం ఎలమంచిలికి సమీప గ్రామం. అక్కడ పచ్చని పరిసరాల మధ్యన ఉంది భాగవతుల ట్రస్టు ప్రారంభించిన రెసిడెన్షియల్ మోడల్ హైస్కూల్. ఆరు నుంచి పదో క్లాసు దాకా తెలుగు మీడియమ్‌లో చదువు. చుట్టుపక్కల వంద గ్రామాల పిల్లలు పోటాపోటీగా ప్రవేశ పరీక్ష రాసి మరీ చేరుతారు. అలాగని లక్షల్లో ఫీజులు, ఆకాశాన్నంటే భవనాలు ఉన్నాయనుకుంటే పొరపాటే. చేరేవాళ్లంతా పేద గ్రామీణుల బిడ్డలే కనుక ఫీజులు నామమాత్రం. మొన్నటి వరకూ చెట్ల నీడన, తాటాకు కప్పుల కింద చల్లగా వాళ్ల చదువులు సాగేవి. పాఠాలను బట్టీ పెట్టడాలు, ముక్కున పెట్టి పరీక్షలు రాయడాలు కుదరనే కుదరదు అక్కడ. పని చేస్తేనే చదువొచ్చేది. ఏమిటీ విచిత్రమంటే ఆ బడి ఉన్నది ఒక వ్యవసాయ క్షేత్రంలో.

మామిడి, సపోటా, జీడిమావిడి, అరటి, పనస ఇలా పెద్దపెద్ద పళ్ల చెట్లు, ఆ నీడనే కూరగాయల మడులు, పక్కనే పూల మొక్కలు. కొంతమంది పిల్లలు, ఒక ఉపాధ్యాయుడు కలిసి బృందంగా ఏర్పడి తమకు కేటాయించిన భూమిలోని అన్నిటి సంరక్షణా చూసుకుంటారు. నీళ్లు పొయ్యడం, పూల మొక్కలకు అంట్లు కట్టడం, కూరగాయలనేరడం, తమ మెస్ దాకా చేర్చడం… ఒకటేమిటి అన్నీ వాళ్ల బాధ్యతే. అయితే అన్నిటినీ ఎంతో ఇష్టంగా చేస్తారా బాలలు. అవి చేస్తూనే తమ ఊపిరితిత్తుల నిండా స్వచ్ఛమైన గాలిని నింపుకొంటారు. పురుగు మందులు కలవని పంటతో చక్కటి ఆహారాన్ని తింటారు. చదువు మాటకొస్తే పుస్తకాల మోత బరువు లేదు. ప్రతిరోజూ టెస్ట్‌లని విసిగించే మాస్టార్లుండరు.

కొత్త బోధన పద్ధతుల్లో శిక్షణ పొందిన మంచి ఉపాధ్యాయులు – పిల్లలే స్వయంగా చేసి, చూసి నేర్చుకునేలా రూపొందించిన సిలబస్ – ఇక పాఠాలు నేర్చుకోవడానికి బెదురెందుకు? అందుకే ఇక్కడ పదో తరగతి ఫలితాలు కార్పొరేట్ స్కూళ్లను మించి వస్తాయి. ‘విద్య అంటే జీవిక కోసం ఏదో ఒకటి నేర్పించడం కాదు. చక్కటి జీవనం ఎలాగో నేర్పించడం’ అన్న సూక్తిని బీసీటీ అక్షరాలా పాటిస్తుంది. ఇక్కడ నడుస్తున్న విద్యావిధానానికి ముగ్థురాలైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి వాళ్లకో చక్కటి భవనాన్ని కానుకగా ఇచ్చారు. అంతేనా, ప్రతి తరగతి గదికీ ఓ కంప్యూటర్. అందులోనే పాఠాలన్నీ నిక్షిప్తమయి ఉంటాయి. లెక్కలైనా, సైన్సయినా, ఇంగ్లీషయినా… కంప్యూటర్‌లో సినిమా చూసినంత సులువుగా చూసెయ్యడమే.

తర్వాత దాని గురించిన చర్చ, రన్నింగ్ నోట్సు రాసుకోవడం, విషయాన్ని అర్థం చేసుకోవడం. పాఠం మేస్టార్లు చెప్పడమూ, విద్యార్థులు కష్టపడి గుర్తుంచుకోవడమూ అన్న పద్ధతే రద్దయిపోయింది. దానికి మారుగా నేర్చుకున్న ప్రతి విషయమూ ఆ పసిమనసుల్లో అక్షరమక్షరమూ అచ్చయిపోతుందంతే. మామూలు పాఠశాలల్లో సబ్జెక్టు వారీగా టీచర్లు వస్తుంటారు గంట కొట్టినప్పుడల్లా. బీసీటీ స్కూల్లో ‘తెలుగు గది’, ‘లెక్కల గది’… ఇలా ఉంటాయి, అక్కడ ఆ సబ్జెక్టు టీచర్లుంటారు. విద్యార్థులే తమ పీరియడ్ ప్రకారం అక్కడికి మారుతుంటారు. దీనివల్ల అక్కడికి వెళ్లగానే ఆ సబ్జెక్టుకు సంబంధించిన వాతావరణంలోకి ఇమిడిపోతారు.

ఎలా మొదలయిందంటే….
హరిపురం చిన్న గ్రామం. చిన్నాచితకా పనులు చేసి పొట్టపోసుకునేవారే అక్కడంతా. కలుపు తియ్యడమో, పశువులకు కుడితి పెట్టడమో… ఇలా తమతోపాటు పిల్లలూ ఏదొక పని చెయ్యకపోతే గడిచే ఇళ్లు కావు అవి. అలాంటి పిల్లల కోసమంటూ 1993లో మొదలయింది భాగవతుల సంస్థ బడి. వ్యవసాయప్పనులతో బాల కార్మికులుగా బడి ముఖమే తెలియకుండా మగ్గిపోతున్న పిల్లల్లో వారు అక్షర కాంతులు నింపారు. దాదాపు ఇరవై స్వచ్ఛంద సంస్థలతో కలిసి చుట్టుపక్కల 800 ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసినప్పుడు మూస చదువులు విద్యార్థులను బట్టీ యంత్రాలుగా మారుస్తున్నాయన్న సంగతి బీసీటీ గ్రహింపులోకొచ్చింది.

దాంతో 1995లో తన సొంత బడి ని ప్రారంభించి, సొంత సిలబస్‌ను రూపొందించుకుని గ్రామీణ పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ చదువంటే కేవలం పాఠాలూ మార్కులూ కాదు. ప్రతి విద్యార్థి చర్ఖా తిప్పి నూలు వడకడం, వ్యవసాయ పనులు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, బేకరీ ఉత్పత్తుల తయారీ – వీటిలో ఏదో ఒకటి తప్పక నేర్చుకోవాలి. సూల్లో చేరిన మూడు నెలల్లోనే వాళ్లకవి నేర్పేస్తారు. తర్వాత ఆ పనుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పిల్లల అకౌంట్లో జమ చేస్తుంది స్కూలు. ఇవిగాక చుట్టుపక్కల గ్రామస్థులు వచ్చి తమ పనుల్లోని సాధకబాధకాలను బాలలకు అర్థమయ్యేలా చెప్పి వెళుతుంటారు. కమ్మరి, కుమ్మరి, చాకలి, కూరగాయల రైతు… వీళ్లే ఆ స్కూలుకు విజిటింగ్ ప్రొఫెసర్లు. అందుకే ఇక్కడి పిల్లలు మార్కులూ సాధిస్తారు, మానవత్వాన్నీ ప్రదర్శిస్తారు.

చేసి చూపిస్తారు…
విద్యార్థుల్లో మానవీయ విలువలను పెంచాలి, వాళ్ళకు తమ కాళ్ల మీద తాము నిలబడే నైపుణ్యాలుండాలి – ఇదీ బీసీటీ స్కూలు లక్ష్యం. అది సాధించాలంటే ముందు తాము కూడా ఆ విలువలను ఆచరణలో చూపెట్టాలి. అందుకే స్కూల్లో చేరతామని వచ్చే వికలాంగ బాలబాలికలను కాదనకుండా చేర్చుకోవడం మొదలెట్టారు. వీరిలో కొందరు వినలేరు, కొందరు మాట్లాడలేరు. కొందరికి బుద్ధి మాంద్యం. మామూలుగానైతే అలాంటివారిని ప్రత్యేక స్కూళ్లలో వేసెయ్యమని తిప్పి పంపేస్తాయి యాజమాన్యాలు. కానీ బీసీటీ అలాంటివారినీ అక్కున చేర్చుకుంది. వీళ్లు చరఖా తిప్పి దారం తీస్తారు. కుట్లు, అల్లికలు, రెడీమేడ్ వస్త్రాల కోసం బట్ట కత్తిరింపులూ నేర్చుకుంటారు.

పద్దెనిమిది నెలల కోర్సు తర్వాత సొంతంగా ఒక టైలరింగ్ దుకాణం పెట్టుకోగలిగిన స్థాయికి చేరుకుంటుంది వారి నైపుణ్యం. వీరు తయారు చేసే గుడ్డ సంచులు గొప్ప ఆకర్షణీయంగా ఉండి, ఎక్కడ ప్రదర్శన జరిగినా హాట్ కేకుల్లాగా అమ్ముడయిపోతాయి. ప్రతి సంచీ అమ్మకం ద్వారా వచ్చే సొమ్మును ఆ సంచీ తయారీలో పాల్గొన్న విద్యార్థులందరికీ చేరేలా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది బీసీటీ. మరో ముఖ్యమైన సంగతేమంటే – ఈ స్కూల్లో విద్యార్థులను ఒకరితో ఒక రిని పోటీ పడమని చెప్పరు. ఒకరికొకరు సాయం చేసుకోమని చెబుతారు. “బయటివాళ్లు దీన్ని బడి అంటారుగానీ, మేం మాత్రం ఈ ఆవరణను ఒక ‘లెర్నింగ్ సెంటర్’గా వ్యవహరిస్తాం. విలువలనూ, నైపుణ్యాన్నీ రెండింటినీ విద్యార్థికి పట్టుబడేలా చేస్తుంది ఇది. పిప్పి చదువులు కాకుండా సారవంతమైన విద్య నేర్చుకుంటున్నారు మా పిల్లలు” అని చెప్పారు బీసీటీ కార్యదర్శి భాగవతుల శ్రీరామ్మూర్తి. పదిహేనేళ్లలో 3500 మంది పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసింది ఈ స్కూలు.

గుడి భాగవతం
గ్రామీణ బాలల్లో ఆత్మవిశ్వాసం పెరగడానికి గ్రామాల్లో మార్పు దిశగా అడుగులు పడడానికి- రెండిటికీ ఒకటే మంత్రం వేసింది భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు. పిల్లల్లో, యువతలో సంప్రదాయ కళల పట్ల ఆసక్తిని పెంచడమే ఆ తారక మంత్రం. అంతరించిపోతున్న మన గ్రామీణ కళారూపాలను పిల్లల చేతిలో ఆయుధంగా మలుస్తోందీ సంస్థ. ఉత్తేజకరమైన దేశభక్తి గీతాలను పాడటం, జానపద గేయాలను ఆలపించడంతో వీరి కళాపోషణ మొదలవుతుంది. తర్వాత తప్పెటగుళ్లు, కోలాటం, చెక్కభజన, బుర్రకథ, జముకులు, చిటికెలు, డప్పుడ్యాన్స్, పల్లెసుద్దులు, సామాజిక నాటకాలు ప్రదర్శించడం వరకూ రకరకాలు నేర్చుకుంటారు.

తాము నేర్చుకున్న వాటిని మూడు నెలలకోసారి బృందాలుగా వెళ్లి దగ్గర్లోని గ్రామాల్లో గుడినో, రామమందిరాన్నో వేదికగా చేసుకొని ప్రదర్శిస్తారు. పనిలో పనిగా అక్కడ అవసరమైన సందేశాలను గ్రామస్థుల మదిలో విత్తనాలుగా నాటుతారు. సారా తాగడం, బహిరంగ మలమూత్ర విసర్జన వంటి అంశాలు మొదలుకొని మహిళా సంఘాల పనితీరు, నోట్లకు ఓట్లు అమ్ముకోవడం, ఎన్నికల్లో అవినీతి వరకూ దేన్నీ వదలకుండా తమ ఆటపాటలతోనే ఆలోచనలు రేకెత్తిస్తారు. హరిపురం చుట్టుపక్కల గ్రామాల్లో సారా తాగే అలవాటును అరికట్టడంలో బీసీటీ స్కూలు విద్యార్థుల పాత్ర ఎనలేనిది. ‘పెద్దలు మారితేనే పిల్లలకు భవిష్యత్తు’ అన్న విషయాన్ని గ్రామీణులకు అర్థమయ్యేలా చెప్పడానికి వీరికి ఈ కళారూపాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటన్నిటికీ భూమికగా స్కూలు ఆవరణలోని గుడిలో ప్రతి సాయంత్రమూ అరగంట పాటు భజన చేస్తారు. దాని తర్వాత మానవీయ విలువలను పెంచే చిట్టిపొట్టి కథలతో పాటు ఆరోజు తమలోతాము ఎవరెవరికి ఏ రకంగా సాయం చేసిందీ చెప్పుకొంటారు విద్యార్థులు.

ఈ భజనల వల్ల చేరిన నెల రోజుల్లోనే విద్యార్థి ప్రవర్తనలో గణనీయమైన మార్పు కనిపిస్తుందని ఘంటాపథంగా చెబుతోంది భాగవతుల ట్రస్టు. దుడుకుతనం, ఒంటరితనం తగ్గి, మృదువైన స్నేహపూర్వకమైన ప్రవర్తనతో మెలగడం పెరుగుతుంది. చదువుల్లో ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతున్నాయని చెపుతున్నారు అటు ఉపాధ్యాయులూ, ఇటు విద్యార్థులూ కూడా. తాము నేర్చుకున్న కళారూపాలన్నిటితో దాదాపు రెండొందల మంది బీసీటీ స్కూలు పిల్లలు విశాఖపట్నంలో ఇరవైనాలుగ్గంటల పాటు నిరంతరాయంగా ప్రదర్శన ఇచ్చినప్పుడు పట్నవాసులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారంటే అతిశయోక్తి కాదు.

మడి భాగవతం
‘రైతే ఎప్పటికైనా రాజు, అతను లేని భారతదేశమే లేదు’ అని నమ్మే భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ నలభయ్యేళ్ల ప్రయాణంలో విశాఖ జిల్లాలోని సుమారు వంద గ్రామాల ప్రజలకు దారి దీపమై నిలిచింది. వేలమంది గ్రామస్థుల జీవితాలను అనేక రకాలుగా మెరుగు పరిచింది. సమీప గ్రామమైన పంచదార్లలో యాభై ఎకరాల బీడు భూమిని ప్రయోగాత్మకంగా తీసుకుంది బీసీటీ. గులకరాళ్లు తప్ప మరేమీ లేని భూమి అది. పైగా కొండవాలు ప్రాంతం, వర్షచ్ఛాయా ప్రదేశం. ఏడాదికి సగటు వర్షపాతం 24 సెంటీమీటర్లే. అలాంటి చోట అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల సాయంతో స్థానిక రైతులకు శిక్షణ శిబిరాలు నిర్వహించింది. దాంతో వారు రాతి గట్లను కట్టి, కుండలతో బిందు సేద్యం చేసి భూసారాన్ని కాపాడారు.

కొన్నిచోట్ల పళ్ల మొక్కలు, కొన్నిచోట్ల పూలమొక్కలు, మరికొంత జాగాలో పశుగ్రాసానికి పనికొచ్చే గడ్డినీ నాటారు. మూడేళ్లు తిరిగేసరికల్లా వంద రకాల మొక్కలు ఏపుగా పెరిగాయి. పచ్చదనంతో ఆ ప్రాంతం రూపు మారిపోయింది. ఈ ప్రయోగం సఫలం కావడంతో రైతులు హరిపురంలో 50 ఎకరాలు, గోకివాడలో 44 ఎకరాలు, గొర్లిధర్మవరంలో 120 ఎకరాల బీడు భూమిని తీసుకున్నారు. ఈ క్షేత్రాల్లో ఫలితాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 1995లో హరిపురంలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ కూడా కలిసొచ్చింది. ఆరుగురు మంచి శాస్త్రవేత్తలను రైతులకు అందుబాటులో ఉంచింది.

ఫలితంగా దాదాపు 5000 ఎకరాలకు పైగా బీడు భూములు ఆకుపచ్చని రంగులోకి మారిపోయి రైతులకు పండగ చేస్తున్నాయి. శాస్త్రపరిజ్ఞానం దగ్గరలో ఉండటంతో ఏ సమయంలో ఏ సందేహం వచ్చినా వెంటనే బీసీటీని సంప్రదిస్తారు పరిసర వ్యవసాయదారులు. సెల్‌ఫోన్ ద్వారా కూడా సలహాలను అందుకునే స్థాయికి ఎదిగారు ఇక్కడి రైతులు. ‘బీడు భూములంటూ ఏమీ ఉండవు, బీడు పెట్టిన భూములుండొచ్చు కాని’ అంటున్నారు అక్కడి రైతులు, పనిలో పనిగా బీసీటీ నర్సరీలను నిర్వహించింది. కమ్యూనిటీ నిర్వహణ కింద బోర్లను తవ్వించింది. పశుగ్రాసాన్ని పెంచి పాడి పరిశ్రమ వృద్ధికు ఊతమిచ్చింది. దాంతో పాటు పౌల్ట్రీకీ ప్రాధాన్యమిచ్చింది. 1980 నుంచీ గ్రామీణ మహిళలకు పొదుపు సంఘాలు, స్వయం ఉపాధి పథకాలు నిర్వహిస్తూనే యువతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ సెంటర్, ఐటీఐలనూ నిర్వహిస్తోంది బీసీటీ.

ఆరోగ్య రక్ష
‘దేశాభివృద్ధికి రైతే వెన్నెముక’ అని ఉపన్యాసాలిస్తే చాలదు. ఉత్తి మాటలకు కాలం చెల్లింది. నిజంగా రైతన్నల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాల్సిన కాలం వచ్చేసింది. విషతుల్యమైన రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకం వల్ల పంటకు సత్తువ సంగతి అటుంచి రైతు ఆరోగ్యం క్షీణిస్తోంది. రైతొక్కడే కాదు, పౌష్టికాహార లోపాలు, అపరిశుభ్ర పరిసరాలు కలిసి అతని కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తున్నాయి. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే తప్ప గడవని పరిస్థితుల్లో అనారోగ్యంతో పడకెయ్యడం కుదరదు.

ఆస్పత్రుల కోసం పట్నాలు వెళ్లాలంటే అదో మొయ్యలేని భారం. వీటన్నిటినీ గమనించిన భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ గ్రామీణుల ఆరోగ్య పరిరక్షణ కోసం 1985 నుంచే చిన్నచిన్న ఆరోగ్య శిబిరాలను నిర్వహించేది. చిన్నపిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకూ అందరినీ లెక్కలోకి తీసుకొని వివిధ అవసరాలను తీర్చేది. ప్రస్తుతం హరిపురం, దిమిలి గ్రామాల్లో ఆస్పత్రులు నిర్వహి స్తోంది. మహిళలకు అత్యవసర వైద్యం మీద అవగాహన కల్పించడం అన్నిటికన్నా అక్కరకొచ్చే పని. ఈ అవగాహన వల్ల వారు తమ పిల్లల్లో హిమోగ్లోబిన్ స్థాయి పడిపోకుండా, కడుపులో నులిపురుగులు రాకుండా, సరైన బరువులో ఉండేట్టు చూసుకోగలుగుతున్నారు. రైతుకు ప్రాణం పశువులే కనుక, వాటి బాగోగులు చూడటమూ అంతే ముఖ్యం. దానికోసం స్థానిక స్త్రీలకే పశువైద్యంలో ఆర్నెల్ల కోర్సు నిర్వహించి ప్రోత్సహిస్తోంది.

తొలి అడుగు వేసిందీయనే…
వందల గ్రామాలకు మేలు చేస్తున్న భాగవతుల ఛారిటబుల్ ట్రస్టును ప్రారంభించింది భాగవతుల వెంకట పరమేశ్వరరావు. 1933 జనవరి 17న పుట్టిన ఆయన అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి అణుభౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టాపుచ్చుకున్నారు. గ్రామాల్లో సేవ చెయ్యాలన్న ఉద్దేశంతో తాను పెరిగిన దిమిలి గ్రామానికి తిరిగి వచ్చి అక్కడి హైస్కూలు నిర్మాణంలో తొలి అడుగులు వేశారు. వ్యక్తిగా కన్న సంస్థగానైతే పక్కాగా పని చెయ్యగలమన్న ఆలోచనతో 1976 నవంబరులో ట్రస్టును నెలకొల్పారు. సుమారు నలభయ్యేళ్లకు చేరువ కావస్తున్న ఈ సంస్థలో పనిచేసిన మహామహులెందరో.

ప్రతి దరిద్రానికీ ఒక విరుగుడుంది
“మనకు ఏడురకాల పేదరికాలున్నాయి. ఆర్థిక పేదరికాన్ని ఉత్పత్తి కార్యక్రమాల ద్వారా పారద్రోలాలి. గ్రామ పారిశుధ్యాన్ని కాపాడుకుంటూ పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఆరోగ్య పేదరికం అంతమవుతుంది. అక్షరాస్యత ద్వారా మానసిక పేదరికం తొలగిపోతుంది. శ్రమదానం, పరస్పర సహాయం ద్వారా సామాజిక పేదరికం, కళారూపాలను కాపాడుకోవడం ద్వారా సాంస్కృతిక బీదరికం పోతాయి. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేస్తే రాజకీయ పేదరికం అంతరిస్తుంది. కనీసం అరగంట అయినా సామూహికంగా భజన చేస్తే ఆధ్యాత్మిక పేదరికం తొలగిపోయి అందరిలోనూ మానవత్వం వెల్లివిరుస్తుంది.
– ‘నమ్మలేని నిజాలు నా గ్రామానుభవాలు’ పుస్తకం నుంచి

అన్నీ మాకే అనుకున్నా
మురకాడ చిన్న గ్రామం. మహిళా మండలి ఏర్పడక ముందు అంటరానితనం తీవ్రంగా ఉండేది. ఐదేళ్లలోనే పరిస్థితిలో మార్పొచ్చి దళిత మహిళ అనుకు అచ్చయ్యమ్మ ప్రెసిడెంటు కూడా అయింది. ఆర్నెల్లలో మహిళామండలి సభ్యులంతా వచ్చి గగ్గోలు పెట్టారు. ‘గ్రామానికి ఏ స్కీము వచ్చినా అచ్చయ్యమ్యే తీసేసుకుంటోంది. అన్నీ తన చుట్టాలికిపక్కాలికేగానీ, వేరెవ్వరికీ దక్కనివ్వడం లేదు’ అని. ఇదేమిటో తెలుసుకుందామని నేనా ఊరికెళ్లాను. అందరిమధ్యనా ఆమె ఏం చెప్పిందంటే ‘బాబూ, ఇన్నాళ్లు పనిచేసిన ప్రెసిడెంట్లందరూ తన కుటుంబానికీ బంధువులకే అన్నీ చేసుకున్నారు. ప్రెసిడెంటవుతే మనమూ అలాగే చెయ్యాలనుకున్నానుగానీ, అందరికీ అన్నీ ఇచ్చాక నేను తీసుకోవాల అని నాకు తెలియదు బాబూ. ప్రజలు ముందు నేను వెనకాల అని మాకు చెప్పినోళ్లు లేరు బాబూ’ అంటూ అమాయకంగా మాట్లాడింది. తర్వాతి ఆర్నెల్లలో ఊరికెంతో మేలు చేసి చూపించింది. నాయకులు ఎలా ప్రవర్తిస్తే, సామాన్యులూ అలాగే ఆలోచిస్తారు. వారు మారితే సమాజంలో మార్పు సాధ్యమే.
– పరమేశ్వరరావు అనుభవాల్లో ఒకటి.

అరుణ పప్పు, విశాఖపట్నం, ఫోటోలు : వై. రామకృష్ణ
భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు ఫోన్ నెంబర్ : 08924 253770
ఈమెయిల్ : info@bctindia.org 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాకెట్ ఎగిరినపుడంతా ‘మొగల్తూరు’ రైతే గుర్తొస్తాడు

రాకెట్ ఎగిరినపుడంతా ‘మొగల్తూరు’ రైతే గుర్తొస్తాడు

మొగల్తూరు అనగానే టక్కున చిరంజీవి గుర్తొస్తాడు. అరే, కృష్ణంరాజుదీ అదే ఊరు కదా అనుకుంటాం. ఈ సినిమా వ్యవహారం పట్టని పాత తరం వాళ్ళయితే, బారిష్టర్ పార్వతీశంని గుర్తు చేసుకుంటారు. ఈ ముగ్గురూ కాకుండా నాలుగో హీరోని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. పేరు ఎంవైఎస్ ప్రసాద్. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం డైరెక్టర్. అంతరిక్ష శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి గడించినవాడు. పాతిక దేశాలు తిరిగినవాడు.

ఐక్యరాజ్య సమితిలో భారత దేశపు అంతరిక్ష స్వరాన్ని పదకొండేళ్ళ పాటు వినిపించినవాడు. ఉపగ్రహాన్ని మోసుకుని మన నేల మీద నుంచి ఎగిరిన తొలి రాకెట్టు ఎస్ఎల్‌వీ నుంచి నిన్నటి పీఎస్ఎల్‌వీ-సి20 దాకా ప్రతి ప్రయోగంలోనూ భాగం అయినవాడు. మన దేశపు ఖ్యాతిని అంతరిక్షంలో రెపరెపలాడిస్తున్న శాస్త్రవేత్త ప్రసాద్ పుట్టి పెరిగింది పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోనే మొగల్తూరు జ్ఞాపకాలే ఈ వారం మా ఊరు..

మా నాన్న మలపాక రామ సూర్యనారాయణ మూర్తి మొగల్తూరులో టీచరు. హైస్కూల్‌లో ఇంగ్లీషు, లెక్కలు చెప్పేవారు. చెట్లూ, బావులూ, పొలాలూ.. నా బాల్యం అంతా అందమైన ఆ పచ్చని పల్లెలోనే గడిచింది. నాకు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు, ఇద్దరు అక్కలు. అమ్మ భాస్కరం ఎస్ఎస్ఎల్‌సీ దాకా చదువుకుంది. పిల్లలంతా బాగా చదువుకోవాలని నాన్న కోరిక. పెద్ద కుటుంబం. జీతం సరిపోయేది కాదు. మాకు కొద్దిగా పొలాలుండేవి. రైతులకి కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఏడాదికి రెండు పంటలు పండేవి. ఆ పంటల ఆదాయమే కుటుంబాన్ని నడిపేది. అన్నలంతా అప్పటికే పై చదువుల కోసం మొగల్తూరు దాటేశారు. ప్రతి నెలా వాళ్ళకి డబ్బులు పంపాలి. ఏలూరులో పీయూసీలో చేరేదాకా నాకు కొరతంటే ఏమిటో తెలీదు.

మాకు చదువులకి అవసరమైనపుడంతా నాన్న తడుముకోకుండా డబ్బులు పంపడానికి ఒక కారణం ఉంది. మొగల్తూరులో అనంతపల్లి వారని కోమట్ల కుటుంబం ఉండేది. వాళ్ళకి బియ్యం మిల్లు ఉండేది. ఇంకా బట్టల షాపులూ, సరుకుల షాపులూ ఉండేవి. ఆ కుటుంబం మాకు పెద్ద బ్యాంకు. ఎప్పుడు అవసరమైనా, ఎంత అవసరమైనా అప్పు పుట్టేది. మా పొలంలో పండిన పంటంతా నాన్న వాళ్ళకే అమ్మి అప్పు తీర్చేవారు. ప్రతి యేటా ఇంతే. అవసరమైనపుడు తీసుకోవడం, పంటొచ్చినపుడు తీర్చడం. ఎక్కడా మా చదువులు ఆగకూడదని నాన్న పట్టుదల. మేం కూడా అట్లాగే చదివే వాళ్ళం. ఆటలూ పాటలూ ఉన్నా, చదువులో మాత్రం ఎప్పుడూ నేను వెనకబడలేదు.

నాన్న పుస్తకాలు బాగా చదివేవారు. మాతో కూడా చదివించేవారు. పద్యాలు రాసేవారు. ఇంటి నిండా పుస్తకాలుండేవి. ఎస్ఎస్ఎల్‌సీలో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. నాకు బహుమతిగా మహాభారతం ఒరిజినల్ సెట్ ఇచ్చారు నాన్న. ఇప్పటికీ అది నా దగ్గరుంది. చిన్నతనంలో నేను బాగా ఇష్టంగా చదువుకున్న పుస్తకం ‘ఆంధ్రశ్రీ’. అల్లూరి సీతారామరాజు మీద రాసిన పద్య కావ్యం. బహుశా పడాల రామారావు రాసిందనుకుంటాను. ఆ పుస్తకం చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచేది.

గురువులకి నమస్కారం
నా తొలి గురువు పొదిల కృష్ణమూర్తి గారు. మా ఇంటి పక్కనే బడి ఉండేది. అమ్మాయిల బడి. నేను ఒకటో తరగతిలో చేరే సంవత్సరమే దాన్ని కో-ఎడ్యుకేషన్ చేశారు. అప్పటిదాకా గర్ల్స్ స్కూల్ కాబట్టి అందరూ అమ్మాయిలే ఉండేవారు. నేనొక్కడినే అబ్బాయిని. ఆడపిల్లల మధ్య కూర్చోకుండా టీచర్ కుర్చీ పక్కనే కింద కూర్చునేవాడిని. బాగా చదువుకున్న వారు కృష్ణమూర్తిగారు. ఇప్పటికీ ఊరెళ్ళినపుడు ఆయనకి నమస్కారం పెట్టుకుంటాను. ఆరు, ఏడు తరగతుల్లో ఉస్మానీ గారని ఇంకో టీచర్ ఉండేవారు.

ఆయన ఏ పాఠాన్నయినా కథగా మార్చి చెప్పేవారు. ఎంత అల్లరి చేస్తున్నా, కోపంగా గాక, సరదా మాటలతోనే సద్దు మణిగేట్టు చేసేవారు. ప్రతి మాటా చమత్కారంగానే ఉండేది. లెక్కల టీచర్ రామకృష్ణరావు అంటే మాత్రం అందరికీ హడల్. చాలా స్ట్రిక్ట్. హిందీ అయ్యవారు బాపిరాజు గారు పక్క ఊరి నుంచి సైకిలు మీద వచ్చేవారు. హిందీలో నాకు మంచి మార్కులు వచ్చేవి. పులికొండ వెంకటేశ్వరరావు గారు తెలుగు చెప్పేవారు. ఎంత శ్రావ్యంగా ఉండేదో ఆయన పాఠం, పాటలాగా. పిల్లలతో ఎంత ప్రేమగా, ఎంత దయగా ఉండేవారో వీళ్ళంతా. ఇటువంటి టీచర్ల వల్ల నాకు చదువంటే ఇష్టంగా ఉండేది. గౌరవంగా ఉండేది.

హైస్కూల్‌లో సత్యనారాయణ రాజు గారని సైన్స్ టీచర్ ఉండేవారు. పిల్లల్తో అవీ ఇవీ మాట్లాడుతూ ఉండేవారు. ఒక సారి క్లాసులో ఒక్కొక్కరినీ లేపి, పెద్దయ్యాక నువ్వేం కావాలనుకుంటున్నావ్? అని అడుగుతున్నారు. నా వంతు వచ్చింది. , ‘ ఫారిన్ రిటర్డ్న్ ఇంజనీరు అవ్వాలనుకుంటున్నా సార్’ అన్నా. ఆయనతో సహా అందరూ నవ్వారు. నేను అలా అనడానికి ఒక కారణం ఉంది. ఊళ్ళో ఎవరికైనా జబ్బు చేస్తే, ఏలూరెల్లండి, బెజవాడెల్లండి, ఫలానా ఆయన ఫారిన్ రిటర్న్ డాక్టర్..ఆయన దగ్గరకే వెళ్ళండి అని చెప్పే వాళ్ళు. ఫారిన్ రిటర్డ్న్ అంటే గొప్ప కదా అని నేను అట్లా చెప్పాను. అయితే, నేను పెద్దయ్యాక అదే నిజమైంది.

ఇంజనీరుగా ఇరవై అయిదు దేశాలు పర్యటించాను. ప్యారిస్‌లో నాలుగేళ్ళున్నాను. ఇటీవల మొగల్తూరు వెళ్ళినపుడు అప్పటి మా సైన్స్ టీచర్ సత్యనారాయణ రాజు గారికి ఆ సంఘటన గుర్తు చేశాను. నాతో పాటు మొగల్తూరులో చదువుకున్న ఎందరితోనో ఇప్పటికీ నా స్నేహం కొనసాగుతోంది. అనంతపల్లివారి రాధాకృష్ణ అక్కడే వ్యాపారం చేస్తున్నాడు. మధిర సీతారాం నర్సాపురం కాలేజీలో పనిచేసి రిటైరయ్యాడు. సుబ్బరాజు భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయ్యాడు. పాలా వెంకటేశ్వరరావు నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌లో ఫైనాన్స్ మేనేజర్‌గా చేశాడు. పడాల భాస్కరరావు హైస్కూల్ హెడ్‌మాస్టర్‌గా చేశాడు. అయిసం సుబ్బారావు ఊళ్లోనో ఉన్నాడు, వ్యవసాయం చేసుకుంటూ. ముత్యాల్లాంటి అక్షరాలు రాసేవాడు. అతని పక్కనే కూర్చునే వాడిని నేను. వీళ్ళ స్నేహాభిమానాలు ఇప్పటికీ నాకు అలాగే ఉన్నాయి.

ముంచెత్తిన అభిమానం
1982లో నాన్న చనిపోయారు. అమ్మ మొగల్తూరులోనే ఉండేవారు. అమ్మ కూడా పోయాక 20 యేళ్ళపాటు నేను మొగల్తూరులో అడుగు పెట్టలేదు. 2006లో వెళ్ళాను. అమ్మా నాన్నా దూరమైనా, అమ్మలాంటి ఊరుంది కదా అనిపించింది. సుదీర్ఘ విరామం తర్వాత వెళ్లినా ఆ ప్రయాణం ఎన్నటికీ మరచిపోలేని అనుభూతినిచ్చింది. కొద్దిగా పొలాలూ, పాడుబడిపోయిన ఇల్లూ తప్ప నా అనుకోవడానికి అక్కడేమీ లేదు. ఊరికి వస్తున్నానని ఒక రోజు ముందు పాత స్నేహితులకి ఫోన్‌లో చెప్పాను. ఊళ్ళో అడుగు పెట్టగానే నాకు లభించిన స్వాగతం అపూర్వం. మా ఇల్లూ, పెరడూ శుభ్రం చేయించారు. షామియానాలు వేయించారు.

ఊరంతా వచ్చారు, నన్ను పలకరించడానికి. నాకు చదువు చెప్పిన టీచర్లు, నాతో కలిసి చదువుకున్నవాళ్ళు అందరూ. ఆశ్చర్యం, ఆనందం. చంద్రయాన్ ప్రాజెక్టు గురించి అంతకు మునుపే పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కీలక బాధ్యతల్లో నేను కూడా ఉన్నానని రాశారు. నాకు సంబంధించినంత వరకూ, వరుస రాకెట్ ప్రయోగాల్లో చంద్రయాన్ కూడా ఒకటి. అంతకన్నా ప్రాధాన్యం లేదు. మొగల్తూరుకి మాత్రం అది ప్రత్యేకం. మా మొగల్తూరు వాడు చంద్రుడి మీదకి రాకెట్ పంపుతున్నాడని వాళ్ళ సంబరం. మొన్న నాకు నాయుడమ్మ అవార్డు ప్రకటించినపుడు కూడా మా ఊళ్ళో నా ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారని తెలిసినపుడు కలిగిన పులకింత, ఐక్యరాజ్యసమితిలో అంతరిక్ష వ్యర్థాల మీద భారత వాదనను వినిపించి మెప్పించి ఒప్పించినప్పుడు కూడా కలగలేదు. మొగల్తూరు పేరు వినగానే కలిగే పులకింత అది. ఊరితో, మట్టితో, మనుషులతో ఉండే అనుబంధం అది.

లాంతర్ల వెలుగులో ఇంజనీరింగ్
పీయూసీ పాసయ్యాక ఇంజనీరింగ్‌లో చేరాను. సెలవు దొరికితే చాలు మొగల్తూరులో వాలిపోయేవాణ్ణి. కరెంటు లేదు. ఇంజనీరింగ్ సెకండియర్ దాకా లాంతర్ల కిందే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచీ అలాగే చదువుకున్నాను కనుక నాకేం పెద్ద తేడా తెలిసేది కాదు. పొలానికెళ్ళి వ్యవసాయం చెయ్యకపోయినా ఇంటి పెరట్లో ఆకు కూరలూ, కూరగాయలూ మేమే పండించుకునేవాళ్ళం. ఆ పనిలో గొప్ప ఆనందం ఉండేది. ఉద్యోగం వచ్చి ఊరొదిలే దాకా కూడా స్నేహితులతో కలిసి ఊరెమ్మట మామిడి తోటల్లో తిరిగేవాడిని. రేడియోలో బీబీసీ వింటూనే చదువుకునే వాడిని. పాటలు వినడం, పాడడం, సాహిత్య పుస్తకాలు చదవడం, నాటకాలు వేయడం వంటివి నాకు ఇష్టమైన పనులు. నా చదువుకి ఇవి ఎప్పుడూ ఆటంకం కాలేదు. విదేశాలకు వెళ్ళినా, హసన్‌లో, త్రివేండ్రంలో ఏ హోదాలో ఉన్నా నా చదువు ఆగలేదు. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ఫిక్షన్‌నే ఎక్కువగా ఇష్టపడేవాడిని. పత్రికల్లో వచ్చే కథలూ, సీరియల్సూ కూడా వదలకుండా చదివేవాడిని.

రావిశాస్త్రి చూపిన దారి
రాచకొండ విశ్వనాథశాస్త్రి నవలలన్నా, కథలన్నా చాలా ఇష్టం నాకు. కొడవటిగంటి కుటుంబరావు కథలు కూడా చదివేవాడిని. అయితే రావిశాస్త్రి రచనా శైలి ఎక్కువగా నచ్చేది. శ్రీశ్రీ కవిత్వాన్ని ఇష్టపడినంతగా రావిశాస్త్రి వచనాన్నీ ఇష్టపడేవాడిని. ‘రత్తాలు రాంబాబు’ నవల కనీసం మూడు నాలుగు సార్లన్నా చదివుంటాను. ఆయన ‘సొమ్మలు పోనాయండీ’ కూడా అంతే. ‘వార్ అండ్ పీస్’ చదివినపుడు నాకు ఎటువంటి ఫీలింగ్ కలిగిందో, అటువంటి ఫీలింగే నాకు ‘రత్తాలు రాంబాబు’ చదివినపుడూ కలిగింది. గొప్ప రచయితలు ఎవ్వరూ తమ పాత్రలకి అన్యాయం చేయరు. ఏ పాత్రనీ తక్కువగా చూపించరు. సమన్యాయం పాటిస్తారు. ‘వార్ అండ్ పీస్’ నవల చదివితే, కనీసం ముప్పయి నలభై యేళ్ళ జీవితానుభవం మనకు అదనంగా లభిస్తుంది. చెహోవ్ కథలు కూడా గొప్పగా ఉంటాయి. మనకు ఉన్నది ఒకే జీవితం. పుస్తకాలు చదవడం వల్ల అనేక జీవితాలు లభిస్తాయి.

మాది చాలా ఒత్తిడి ఉండే ఉద్యోగం. ఒక్కోసారి నెలల తరబడి ఆ ఒత్తిడిని పగలూ రాత్రీ తేడా లేకుండా మోయాల్సి వస్తుంది. ఏఎస్ఎల్‌వీ రాకెట్‌లు రెండు వరుసగా ఫెయిలయినపుడు విపరీతమైన టెన్షన్‌కు గురవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒత్తిడి నుంచి నన్ను కాపాడింది మొగల్తూరులో నాన్న నాకు నేర్పిన పుస్తక పఠనమే. ఆఫీసు నుంచి రాత్రి పదింటికి ఇల్లు చేరినా స్నానం చేసి, భోంచేసి మూడింటి దాకా పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. ఎక్కువగా రెండో ప్రపంచ యుద్ధకాలానికి సంబంధించిన రచనలు చదివాను. యుద్ధ కాలంలో మానవ జీవన సంఘర్షణను అర్థం చేసుకున్నాక, వాళ్ళు అనుభవించిన ఒత్తిళ్ళ ముందు మనవి ఎంత అనిపించేది. మనసు తేలిక పడేది. పొద్దున్నే కొత్త శక్తితో మళ్ళీ పనిలో పడేవాడిని.

రైతూ, నేనూ వేరు కాదు

రాకెట్ విఫలమైనపుడు మీరెందుకు అంతగా కుంగిపోతారు? అని అడుగుతుంటారు కొంతమంది. రాకెట్ ఒక యంత్రమే కావచ్చు, కానీ అందులోని అనేక భాగాలను రూపొందించి, అమర్చిన వాళ్ళకి అది ఒట్టి యంత్రం మాత్రమే కాదు. ఎస్ఎల్‌వీ అపజయం సమయంలో తొలుత నేను గంభీరంగానే ఉన్నాను. అప్పుడు మా టీం లీడర్ కలాంగారు. రాకెట్ విఫలమైందని నిర్ధారించుకున్న కొంత సేపటి తర్వాత ఆయన్ని కలిశాం. కలాంగారిని చూడగానే దుఃఖం కట్టలు తెంచుకుంది. ఏఎస్ఎల్‌వీ రెండు వైఫల్యాల వేళ కూడా నేను కన్నీళ్ళని ఆపుకోలేక పోయాను. 40 యేళ్ళ లోపల యువకుడిగా ఆ మాత్రం భావోద్వేగాలు ఉండడం సహజమే అనుకుంటాను. ఇప్పటికీ రాకెట్ ఎగిరిన ప్రతి సారీ నాకు మా మొగల్తూరు రైతులే గుర్తొస్తారు. నారు పోసి, నీరు పెట్టి, కలుపు తీసి ఫలితం చేతికి వచ్చేదాకా వాళ్లు పడే టెన్షన్ గుర్తొస్తుంది. ఏ వరదో వచ్చి పంట పోయినపుడు భోరున ఏడ్చే ఏడుపు గుర్తొస్తుంది. ఆర్థికంగా నష్టపోయామనే కాదు, ఆ ఏడుపు. ఆ పైరుతో రైతుకి పెనవేసుకున్న అనుబంధం అది. రైతుకి పైరుతో ఉండే అనుబంధమే, రాకెట్‌తో శాస్త్రవేత్తకీ ఉంటుంది. బంధానుబంధాలు, భావోద్వేగాలు మనుషులందరిలోనూ ఒక్కటిగానే ఉంటాయి. వాళ్ళు రైతులా శాస్త్రవేత్తలా అని కాదు, వాళ్ళు మనుషులైతే చాలు.

– ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు
మొగల్తూరు ఫోటోలు: జి.వి.వి. రమాకుమార్

Posted in సేకరణలు | Tagged | 1 Comment

నా దారి తీరు -11 రాజకీయం రుచి

  నా దారి తీరు -11

               రాజకీయం రుచి

   ఉయ్యురులో చేరిన తర్వాత క్రమంగా రాజకీయ అవగాహన పెరిగింది ఖాళీ సమయం లో స్టాఫ్ రూమ్ లో చేరినపుడు రాజకీయాల  గురించే మాట్లాడుకొనే వాళ్ళం .అన్నే ఉమా మహేశ్వర రావు అనే లెక్కల మేష్టారు మంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు .ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివే వారు .అందులో ఎడిటర్ ఫ్రాంక్ మొరెస్  రాసే సంపాదకీయాలను చదివి నన్ను కూడా చదవమనే వారు చదివే వాడిని అప్పటి నుండి రోజు ఎక్స్ ప్రెస్ చదవటం ఒక హాబీ అయింది నాకు మొదటి నుంచి ఆర్ ఎస్ ఎస్ అంటే అభిమానం .చాలా కాలం దానిలో స్వయం సేవకుడిగా ఉన్నాను .గణ వేషంఅంటే ఖాఖీ నిక్కరు తెల్ల చొక్కా ఇంశార్ట్ వేసుకొని లాఠీతో శివాలయం లో జరిగే శాఖా కు వెళ్ళే వాడిని .దానితో జనసంఘ పార్టి  మీద అభిమానం పెరిగింది .’’ఆర్గనైజర్ ‘’వార పత్రికను రెగ్యులర్ గా తెప్పించి చదివే వాడిని .జాగృతి వార పత్రిక కూడా చదివే వాడిని .మా రెగ్యులర్ దిన పత్రిక ఆంద్ర ప్రభ ఆ తర్వాతా ఆంద్ర జ్యోతి .కాంగ్రెస్ అంటే ఎందుకో ఇష్టం ఉండేది కాదు .అందుకని కాంగ్రెస్ వ్యతిరేక భావం బాగా పెరిగింది .అందులోను దేశ రాజకీయాలలో చాలా మార్పులు వస్తున్నాయి నెహ్రు చని పోయి లాల్బహదూర్ ప్రధాని అయి తాష్కెంట్ లో ఆయన మరణించటం తో సిండికేట్ నాయకులు కామరాజ్ పావులు కదపటం తో ఇందిరా గాంధి ప్రధాని అయింది .ఆమె ఒక్కొక్క ఎత్తు వేస్తూ పార్టీ లో ఎదురు లేకుండా చేసుకోంది .తనదైన శక్తి సామర్ధ్యాలను నిరూపించుకొంది .పరాభవం చెందిన నాయకులంతా ఒక కూటమి అయారు .వీరంతా గ్రాండ్ అలయన్స్ అనే పేర ఎన్నికలకు సిద్ధమయ్యారు ఇందిరకమ్యూనిస్టులను దువ్వి వారి ప్రాపకం సంపాదించింది ఇవన్నీ చదువుతుంటే తమాషా గా ఉండేది .గ్రాండ్ అలయన్స్ ఎన్నికలలో తుస్సు మంది .

                 1967 ఎన్నికలు వచ్చాయి ఉయ్యూరు నియోజక వర్గానికి కాంగ్రే అభ్యర్ధి గా కురువృద్ధులు కాకాని వెంకట రత్నం గార్ని పార్టీ నిర్ణయించింది ఇక్కడి స్థానిక నాయకులు ,లెఫ్ట్ నాయకులు కలిసి లంకపల్లి నివాసి కడియాల వెంకటేశ్వర రావు గారిని స్వతంత్ర అభ్యర్ధి గా నిల బెట్టారు .చాలా హోరాహోరీ గా ఎన్నిక ప్రచారం జరిగింది .కాంగ్రెస్ ప్రతిష్టాత్మకం గా తీసుకొన్నది .మొత్తం నాయకులను మొహరించి ఇంటింటికీ ప్రచారం చేయించింది .కాని ఎందులో అందరికి కడియాల మీద గురి కుదిరింది .ఆయన్నే గెల్పించారు ప్రజలు .కాకాని ఓడిపోయారు మేమందరం కడియాల కే సపోర్ట్ చేశాం .ఇక్కడి కాంగ్రే నాయకులకు నేనంటే గుర్రుగా ఉండేది. .నేనేమీ భయ పడలేదు అప్పుడు పోలగాని రామ లింగం అనే కాంగ్రే నాయకుడు ఉండే వాడు ఖద్దరు బట్టలు టోపీ తో ఉండేవాడు ఆయన కొడుకు నా క్లాస్ మేట్ .రామలింగం కూతురుకృష్ణ కుమారి  నా దగ్గిర ట్యూషన్ కూడా చదివింది డబ్బు ఇచ్చింది లేదు .మా హెడ్ మాస్టారు నరసింహా రావు గారు నన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు .కాంగ్రే స వాళ్ళు నా మీద పగ బట్టి ట్రాన్స్ ఫర్ కు ప్రయత్నం చేస్తున్నారని రామ లింగాన్ని కలిసి ట్రాన్స్ ఫర్ ఆపమని చెప్పమనిఅన్నారు .నేను ఆయన దగ్గరకు వేల్లనన్నాను .తాను కాకాని దగ్గరకు తీసుకొని వెళ్తానన్నారు నన్ను .నేను రానన్నాను . బదిలీ తప్పదని తేలింది .దేనికనా రెడీ గా ఉన్నానునేను .

                        హెడ్ మాస్టారి వాత్సల్యం

         హెడ్ మాస్టారు నరసింహా రావు గారు నేనంటే చాలా ఇష్టపడే వారు .అప్పుడు పబ్లిక్ పరీక్ష జవాబు పత్రాలను ఇంటికే పంపేవారు ఇంటి దగ్గర వాటిని దిద్ది స్క్రూటినీ కి చీఫ్ కు పంపే వారు .ఆయన ఒకస్పెషల్ అసిస్టంట్ ను పెట్టుకొని ఆ మార్కులను సరి చూసే వారు .అక్కడి నుండి హైదరాబాద్ కు పంపేవారు నరసింహారావు ఇంగ్లిష్ కు చీఫ్ గా చేస్తున్నారు వారు నన్ను ఇంటికి పిలిచి  స్పెషల్ అసిస్టంట్ గా ఉండమని కోరారు .అదినాకు కొత్త అయినా సరే నన్నాను .పేపర్ కు పది పైసలో ఎంతో ఇస్తారు .నేను ఉదయం సాయంత్రం ఆయన దగ్గర ఈ పని చేశాను .నా పని మేస్తారికి నచ్చింది రెండు మూడు సార్లు నన్నే స్పెషల్ అసిస్టంట్ గా చేసుకొన్నారు .నాకూ అప్పటి నుంచే పబ్లిక్ పేపర్లు వాటి వాల్యుయేషన్ వగైరా లు తెలిశాయి .డబ్బూ గిట్టింది మేష్టారు మా ఇంట్లో వడ్ల బస్తాలు కొనేవారు చేతిలో డబ్బున్నప్పుడు ఇచ్చే వారు .ఒక్కో సారి స్కూల్ లో వింతగా ప్రవర్తించే వారు సెలవు కావాలని అడిగితే’’ కుర్రాడివి నీ కెందుకోయ్ సెలవా !ఇవ్వను’’ అనే వారు .నా మొహం మాడి పోయేది కాని రాత్రి ఇంటికి వచ్చి ‘’ప్రసాదూ !ఏదో స్కూల్లో అలా అన్నాను కాని నువ్వు రేపు సెలవు వాడుకో ‘’అనే వాత్సల్యం ఆయనది ఆయన కు చాలా మంది ఆడ పిల్లలు ఒక్కడే కొడుకు ..ఎలా బతుకుతారో అని అందరు అనుకొనే వారు .కాని అందరి కంటే ఆయన ధన్య జీవి అందరి పెళ్ళిళ్ళు చేసి తన బాధ్యత బాగా నిర్వర్తించారు .మంచి మనిషి

                   నరసింహారావు గారు కొంతకాలం జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ గా చేసి రిటైర్ అయారు .అందుకని ఆయన్ను ప్రిన్సిపాల్ నరసింహా రావు అనే వారు .పంచ ఇంశార్ట్ వేసే వారు ,పాంటు షార్ట్ వేసేవారు .ఆయనకు రాని విద్య లేదు కవిత్వం కధ నాటికా ఆట ,పాటా చిత్రలేఖనం అన్నీ వచ్చు .బాపిరాజు గారి శిష్యడాయన .ఎన్నో సాహిత్య సభలకు వెళ్ళేవారని చెప్పేవారు నవ్య సాహిత్య పరిషత్ ను భుజానికేత్తుకొన్నారు .ఆయన తన మాటల్లో ‘’నేను జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ ‘’అని నవ్వుతు అనేవారు .యిట్టె కోపం వచ్చేది అట్టే పోయేది బాద్ మింటన్ ,చెస్ లో మంచి ప్రవేశం ఉంది .వాలీబాల్ బాగా ఆడే వారు .ఒక్కోసారి కోపం వచ్చి కోర్టులో బాట్ విసిరి నేలకేసి కొట్టే వారు .మంచి అఫెన్సు ,డిఫెన్సు ఆడే వారు .వార్షికోత్సవాలను ఘనం గా నిర్వహించే వారు .పిల్లల తో నాటికలు వేయించారు .పాటలు డాన్సులు ఒకటేమిటి అన్నీఆయన తానే అయి చేసేవారు .గలగలా మాట్లాడేవారు ఇంగ్లీష్ లోను మంచి స్పీకర్ .’’పాకీ వాన్నండోవై బాబు పాకీ వాన్నండీ’’అనే పాట రాశారు గొప్ప సామాజిక స్పృహ ఉన్న వారు .ఇప్పుడు పూర్తిగా సాయి భక్తులై ఎన్నో పుస్తకాలు రాసి ప్రచురించారు .తొంభై రెండేళ్ళ వయసులో కొద్ది అనారోగ్యం ఉన్నా సుఖం గా ఉన్నారు .అయన నమేము నిర్వహించే సాహిత్య సభలకు వచ్చి ఆశీర్వదించే వారు

             సాయంత్రాలలో అన్నే ఆయనా, నేను, సైన్సు మేష్టారు ప్రసాద శర్మ గారు సెంటర్ లో ఉన్న జనతా ఫాన్సీ షాప్ దగ్గర కూర్చుని బాతాఖాని చేసే వాళ్ళం ఆ షాప్ ఓనర్ మూసా గారు  చాలా మంచి వారు వాళ్ళ అబ్బాయిలు స్కూల్ లో చదివే వారు .అక్కడా రాజకీయాలే మాట్లాడే వాళ్ళం .సాయిబు గారు కౌలుకు చెరుకు సాగు చేసి మంచి దిగుబడి సాధించే వారు  మా పిల్లల పుస్తకాలూ పెన్నులు వగైరా స్టేషనరి అక్కడే కొనే వాళ్ళం ..

                 ప్రైవేట్

         ఇంటి దగ్గర చాలా మంది విద్యార్ధులు నా దగ్గర ట్యూషన్ చదివే వాళ్ళు ఆడపిల్లలు మా ఇంట్లోనే మా వడ్ల కొట్లోనో సావిడి లోనో పడుకొనే వారు భాగ్య లక్ష్మి ,ఆమె చెల్లెలు విజయ లక్ష్మి, ప్రసన్న ,రోజా అనే క్రిస్టియన్ అమ్మాయి ,కాలని లోని ఇంకో అమ్మాయి నాంచారమ్మ ఆలూరి విజయ లక్ష్మి, కరుణ వగైరా పిల్లలు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నారు కోట శ్రీ రామ మూర్తిగారి అబ్బాయి శ్రీనివాస్ ,ఫైర్మన్ గారి కొడుకులు భాస్కరరావు సోదరులు ఇలా ఎందరో ఉన్నారు ఇక్కడా డిసిప్లిన్ కు ఝడిసే వారు అన్ని సబ్జెక్టులు నేనే చెప్పేవాడిని ఒక పేకాట క్లబ్ యజమాని కూతురు జ్యోత్స్నా రాయ్ ,ఆమె చెల్లెలు మంచి తెలివి తేటలున్న వారు .అప్పుడు ఇంకా డి టేన్షన్ విధానం ఉంది మార్కులు చాలా అవసరం .కస్టపడి చెప్పటం పక్షపాతం లేకుండా వాల్యు చేయటం నాకు నాకు మొదటి నుంచి అలవాటు మేస్టార్ల మీద చాలా ఒత్తిడి తెచ్చేవారు మార్కుల కోసం .కాని నా దగ్గరకు ఎవరు రాలేదు .ఒత్తిడికి లోన్గనని అందరికి తెలుసు .కనుక ఆ ప్రయత్నం ఎవరు చేయలేదు తెల్లవారు ఝామునే పిల్లల్ని లేపి చదివించే వాడిని ఆరింటికల్లా పళ్ళు తోమించి కాలువ స్నానానికి మగపిల్లలను తీసుకొని వెళ్ళే వాడిని అంతకు ముందు ప్రాతస్మరణ చేయించే వాడిని .లెక్కల మేస్టార్ల తో పోటీ పది లెక్కలు చెప్పేవాడిని అన్ని సెక్షన్ల కంటే నేను బోధించే సెక్షను పిల్లకు యావరేజ్ మార్కులు బాగా వచేట్లు కష్టపడే వాడిని పిల్లలతో కస్టపడి చదివించే వాడిని మంచి పోటీ మనస్తత్వం తో పని చేశాను .పిల్లలు కూడా చాలా ఉత్సాహం గా చదివే వారు .వాళ్ళలో కూడా పోటీ భావం పెంచాగాలిగాను కస్టపడి మార్కులు సాధించాలనే తత్త్వం అలవాటు చేశాను చోడవరపు మృత్యుంజయ మూర్తి నా శిష్యుడు ‘’పొట్టి ‘’అని పిలిచే వాడిని .అతను స్టేట్ బాంక్ ఆఫీసర్ గా ట్రేయినింగ్ఆఫీసర్ గా చేసి అమెరికా లో బాంకు లో పని చేశాడు మొదటి సారి మేము అమెరికా వెళ్లి నప్పుడు కాలిఫోర్నియా కు మా మేనల్లుడి దగ్గరకు వెళ్లి నప్పుడు మేము వచ్చామని మా మేనల్లుడి ద్వారా తెలుసుకొని ఇంటికి వచ్చి ఒక ఆదివారం వారింటికి భోజనానికి పిలిచి తన పిల్లలకు ‘’మా మేష్టారు ‘’అని గర్వం గా చెప్పాడు మేస్టరుకు ఇంతకంటే ఆనందం ఏముంది ? .ఇలా చాలా ఆనందం గా మొదటి సారి ఉయ్యూరు   లో ఉద్యోగం గడిచి పోయింది

              సశేషం

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-3-13 ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

జ్ఞానదుడు మహర్షి నారదుడు –2

  జ్ఞానదుడు మహర్షి నారదుడు –2

 

 వరాహ పురాణాన్ని అనుసరించి నారదుడు సారస్వతుడు అనే బ్రాహ్మణుడు .సంసార భారం అంతా పుత్రుని పై పడేసి వనం లో తపస్సు చేశాడు ..విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు .’’విష్ణు సాయుజ్యం కావాలి ‘’అని కోరాడు .తన తర్వాతవాడు బ్రహ్మ అనీ ,ఆ బ్రహ్మకు జన్మించి ,ఆ తర్వాత సాయుజ్యాన్ని పొందమని విష్ణువు చెప్పాడు .ఇతరులకు నీరు (జ్ఞానం )ఇస్టూ ఉంటావుకనుక ‘’నారదుడు ‘’గా ప్రసిద్ధి చెందు తావని అనుగ్రహిస్తాడు .ఈ విధం గా నారదుని జన్మ పరి పరి విధాలుగా పలుచోట్ల కన్పిస్తుంది .

              నారద జీవిత విశేషాలు

        బ్రహ్మ ,ప్రియల సుపుత్రుడైన నారదుడు బ్రహ్మ గారి ఆజ్ఞప్రకారం సృష్టి పెంపు చేయటానికి ఇష్టపడడు..సంసార పంకిలం లో దిగననీ ,మోహ బంధనం వద్దని ,కనుక తాను సృష్టి చేయ లేనని చెప్పుకొన్నాడు .బ్రహ్మ కు కోపం వచ్చి ‘’కాముకుడ వై  స్త్ర్ర్ లోలడవై ,శూద్ర యోని లో జన్మించమని శాపం ఇస్తాడు .అయితే బ్ర్రాహ్మణ సంపర్కం లో విష్ణు భక్తీ మాత్రం వెంట ఉంటుందని ఊరడిస్తాడు .నారదుడు కూడా కోపం తో తండ్రి బ్రహ్మ కు ‘’పూజా ,కవచాలు లేకుండా పోతాయని ‘’ప్రతి శాపం ఇస్తాడు .ఇది బ్రహ్మ వైవర్త్త పురాణ కద .

          నారద నారది

    వరాహ పురాణం.దేవీ భాగవతం  ప్రకారం ఒక సారి నారదుడు శ్వేత ద్వీపం ‘’వెళ్తాడు .అక్కడ మన్మధా కారులైన వాళ్ళు చాలా మంది కన్పిస్తారు .వారిలో విష్ణు మూర్తి ఎవరో తెలుసుకోలేక ఆయన్నే ప్రార్ధిస్తాడు .ఆయన ప్రత్యక్షమై వరం కోరుకో మంటే తనకు ‘’విష్ణు మాయలు ‘’తెలియ జేయమని ప్రార్ధిస్తాడు .సరేనని దగ్గరలో ఉన్న కొలువు లో స్నానం చేసి రమ్మంటాడు .మునిగి లేవగానే స్త్రీ గా మారి పోతాడు .చారుమతి అనే పేరు తో కాశీ రాజు కుమార్తె గా జన్మిస్తాడు .’’శిబి ‘’అనే వాడిని పెళ్లి చేసుకొన్నాడు నగ్న జిత్తి ,విప్రజిత్తి ,విచిత్తి ,చారు వక్త్రుడు ,చిత్తుడు అనే కొడుకులు పుట్టారు .తండ్రీ కొడుకులు దేశాలను జయిస్తూ కాశీ రాజు చేత చంప బడుతారు .చారుమతి భర్త్రు ,పుత్ర శోకం తో చితి పేర్చుకొని చని పోవటానికి సిద్ధమవుతుంటే ,పూర్వ రూపం పొంది నారడుదయ్యాడు .ఇది కలా /వైష్ణవ మాయా /అని చింతించి విష్ణు మహిమను తెలుసుకొన్నాడు .

       నారదుడు రావటం చూసి శ్రీ లక్ష్మి ,విష్ణువు దగ్గర నుంచి బయటకు వెళ్ళింది .తనేమో వృద్ధ తాపసి తనను చూసి తొలగటం ఏమిటి అని ప్రశ్నిస్తాడు .’’పర పురుషులను చూసి తొలగాలి కదా ‘’అంటాడు స్వామి .మాయ ఎంతటి పనైనా చేస్తున్దంటాడు విష్ణు మూర్తి .తన మాయా ప్రభావం చూపించమని కోరగా ,గరుడుని పై ఎక్కించి ,కన్యా కుబ్జం దగ్గర కొలను దగ్గర దింపి అందులో స్నానం చేసి రమ్మంటాడు .

           కొలను నుంచి బయట పడగానే అందమైన స్త్రీ గా మారి పోతాడు .విష్ణువు నెమ్మదిగా జారుకుంటాడు .తాళధ్వజుడనే రాజు మోహించి ,తన నగరానికి తీసుకు వెళ్తాడు .వివాహమాడి రాణి ని చేస్తాడు .పుత్ర సంతానం కలిగింది .కొంత కాలానికి శత్రువులు దండెత్తి కుమారులను సంహరిస్తారు .నారది విలపిస్తుంది .విష్ణువు వృద్ధ బ్రాహ్మణ రూపం లో వచ్చి ,పుత్రాదులు నిత్యం కాదని చెప్పి ,తన వెంట తీసుకొని వెళ్లి ,కొలను లో స్నానం చేయిస్తాడు .పూర్వరూపం వచ్చేస్తుంది .శ్రీ కృష్ణ మాయ స్త్రీ రూపం లో అనుభవించి రెండు సార్లు తెలుసుకొన్నాడు .అంటే విష్ణు భక్తీ గాఢం చేయటానికి ఆ విష్ణు మూర్తి యే పరీక్షలు చేసి నిగ్గు తేల్చాడు .నారదుడిని జ్ఞాన సార సంపన్నుని చేశాడు .

           సశేషం

             మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -2-3-13-ఉయ్యూరు

      .

Posted in కవితలు | Tagged | Leave a comment

ఉయ్యూరు – శ్రీ వీరమ్మ తల్లి తిరునాళ్ళు

This gallery contains 31 photos.

More Galleries | Tagged | Leave a comment

నా దారి తీరు -10 రెండవ స్కూల్ –ఉయ్యూరు –మొదటి సారి రాక

                  నా దారి తీరు -10

               రెండవ స్కూల్ –ఉయ్యూరు –మొదటి సారి రాక

   సుమారు మూడు ఏళ్ళు మోపి దేవి లో పని చేసి ఉయ్యూరు కు బదిలీ చేయించుకొన్నాను 27-7-1965సాయంత్రం  మోపిదేవిలో రిలీవ్ అయాను .రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కనుక మర్నాడే జాయిన్ అవాలి .అంటే జాయినింగ్ టైం ఉండదు . 28-7-1965 ఉదయం ఉయ్యూరు హైస్కూల్ లో చేరాను .అప్పుడు హెడ్ మాస్టర్ శ్రీ రాళ్ళ బండి సత్యనారాయణ గారు .అప్పుడే బండి సుబ్బయ్య గారు అనే హిందీ పండిట్ పని చేసే వారు సరదా గా వీళ్ళిద్దరిలో ఎవర్ని గురించిఅయిన యినా చెప్పేటప్పుడు ‘’ఒట్టి బండా?రాళ్ళ బండా’’అని అనుకొనే వాళ్ళం .హేమా హేమీలున్నారు మేస్తర్లుగా ..నాకు లెక్కల క్లాసులుండేవి ..ఎస్.ఎస్.ఎల్.సి జెనరల్ లెక్కలు చెప్పేవాడిని మా గురువు గారు జంధ్యాల ప్రసాద శర్మ గారు సైన్సు హెడ్ నేనూ, గన్నె వెంకటేశ్వర రావు ,మొదలైన వాళ్ళం సైన్సు చెప్పే వాళ్ళం .వి.రామ కృష్ణా రావు గారు సోషల్ మేష్టారు అన్నే ఉమా మహేశ్వరరావు   ఘంటా కోటేశ్వర రావు లెక్కల మేస్టార్లు .మల్లికాంబ అనే సోషల్ టీచర్ ఉండేది ఆవిడ గురించి నేను వచ్చేసరికి కధలు గాధలుగా చెప్పుకొనె వారు గోడలపైకి కూడా ఎక్కించారు .కాని ఆమె మాతో చాలా స్నేహం గా ఉండేది .సోషల్ గా ఉండేది .అందుకని ఇలా ప్రచారం చేసి ఉంటారు అని పించింది .మంచి టీచర్ .ఆమె చెల్లెలు స్కూల్ లో చదివేది .మంచి క్లెవర్ .అప్పుడు విద్యార్ధులు విద్యార్ధినులు చాలా తెలివిగా ఉండేవారు ,బాగా చదివే వారు .ఎంతో సరదాగా ఉండేది విద్య బోధించటం .చాలా ఇష్టం గా బోధించాను .         

           హెడ్ మాస్టర్ బదిలీ అయి మేము హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి లో చేరి నపుడు ఉన్న హెడ్ మాస్టర్ శ్రీ కే.వి.ఎస్.ఎల్ .నరసింహా రావు గారు ఇప్పుడు హెడ్ మాస్టారుగా వచ్చారు నేనంటే బాగా ఇష్టపడే వారు గన్నె మేష్టారు మహా కరుగ్గా ఉండేవారు ఆయనకు బెజవాడ లో లిక్కర్ షాప్ ఉండేదని చెబుతారు కళ్ళు ఎప్పుడూ ఎర్రబడి ఉండేవి  ఆయన తొమ్మిదో తరగతికి క్లాస్ టీచర్ .ఆయన ట్రాన్స్ ఫర్ అయారు ఆ క్లాస్ నాకు ఇచ్చారు .కనుక ఏ మాత్రం రాజీ పడకుండా ఉండాలినేను .పెద్ద ముదుళ్ళు ఉండే వారు .ఎవరి మాటా వినే వాళ్ళు కాదు వీళ్ళని నేనే దారిలో పెట్టగలనని నరసింహా రావు గారు నాకే ఆ క్లాస్ ఇచ్చారు మా అన్నయ్య గారమ్మాయి వేదవల్లి కూడా అదే క్లాస్ బెల్లంకొండ సుశీల ,కాళీ ప్రసాద్ చెల్లెలు లక్ష్మీ కామేశ్వరి .వీళ్ళంతా మా ఇంట్లో ట్యూషన్ చదివే వారు .

                             సైన్సు ఎక్సి బిషన్

              ఉయ్య్రురు లో నేను ,ప్రసాద శర్మ గారు ఆలోచించి హైస్కూల్ లో సైన్సు ఎక్సిబిషన్ నిర్వహించాం .నా శిష్యులు ఎల్లాప్రగడ సాంబశివరావు ,వెంట్రప్రగడ ఉమా మహేశ్వర రావు మొదలైన శిష్యులు గొప్ప కృషి చేశారు  సాంబశివ రావు  తర్వాత డాక్టర్ అయి మంచి పేరు పొందాడు .భలే తెలివి తేటలున్న కుర్రాడు ఉమా కి మంచి ఆలోచనా ఆచరణ ఉన్నాయి .అందుకని ధైర్యం గా రెండు పెద్ద పాకలలో నిర్వహించాము .విద్యార్దులకు ఎలా వివరించాలో తెలియ జేశాం ..పిల్లలు అద్భుతం గా చెప్పారు వేలాది మంది వచ్చి చూశారు చుట్టూ పక్కల స్కూళ్ళ వాళ్ళు కూడా వచ్చారు లెక్కల లోను ఎక్సిబిషన్ పెట్టాము సోషల్లో  కూడా .ఎస్కిమోజీవితం  బాగా పేరొచ్చింది మేముచేసిన  పింగ్పాంగ్ బాల్స్ పిపేట్ నీటి జెట్ పై తిరిగే ఏర్పాటు బాగా ఆకర్షణీయమైంది .హెడ్ మాస్టారు గాగా ప్రోత్సహించారు .అప్పుడు స్వర్గీయ కాకాని వెంకట రత్నం గారు  పాడి పరిశ్రమ ,వ్యవసాయ మంత్రి వారే ఎక్సిబిషన్ ను ప్రారంభించటం మాకు ఎంతో గర్వం గా ఉంది .అందరు మమ్మల్ని మెచ్చ్చుకొన్నారు .మాకు అదొక గొప్ప అనుభవం

                            క్లాస్ టీచర్

          తొమ్మిదో తరగతి డి సెక్షన్ కు నేను క్లాస్ టీచర్ని .ముదుళ్ళున్నారని ముందే చెప్పాను .యాకూబ్ అనే ఒక ముస్లిం విద్యార్ధి చాలా తల బిరుసు గా ఉండే వాడు .వస్తుతహా మంచి వాడు .వాడిని రెచ్చగొట్టి పక్క దారి పట్టించారు .వాడొక సారి క్లాసులో వాడు కొద్దిగా బిరుసు గా ఉంటె పీత కొట్టుడు కోటాను మర్నాటి నుండి వాడు స్కూల్ కి రాలేదు ఆ తర్వాతెప్పుడో పదేళ్లకు నేను నా శ్రీమతి బెజవాడ కనక దుర్గమ్మ దర్శానికి దసరాలలో వెళ్ళినప్పుడు ఒక కాన్స్టేబుల్ నాకు వంగి వంగి నమస్కరించాడు .’’సార్ నీను మీ శిష్యుడిని యాకూబ్ ని మీరు ఆ రోజు అలాస్కూల్లో  కొట్టి ఉండక పోతే ఎందుకూ పనికి రాకుండా  పోయే వాడిని మా వాళ్ళు నా ప్రవర్తనకు విసిగి పోయి వదిలేశారు నేను నెమ్మదిగా కానిస్టేబుల్ ట్రైనింగ్ కు సెలెక్ట్ అయి ఉద్యోగం సాధించి ఇప్పుడు ఇక్కడ డ్యూటీ వేస్తె పని చేస్త్యున్నాను ‘’అన్నాడు‘’అవాక్కయ్యాను ‘’నేను .ఇలా మరీన వారుకూడా ఉన్నారని ఆనందించి అభి నందించాను మా ఇద్దర్ని దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించి వీడ్కోలు పలికాడు యాకూబ్ .అది నేను మరిచి పోలేని సంఘటన .నేను క్లాస్ లో పాఠంచెబుతూ ఉంటె ఎవరు ఎటూ దిక్కులు చూడ టానికి వీలు లేదు వాళ్ళ మనసులు శరీరాలు పాఠం మీదే ఉంచాలి ఎక్కడైనా ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకొనే వాడిని కాదు కొట్టటం ప్రారంభిస్తే స్కూల్ అంతా వినపడేట్లు కొట్టేవాడిని వీపు మీద చరిస్తే అంతా విన పడేది అన్నిక్లాసుల వాళ్ళు ఇక్కడేదో జరిగి పోయిందని ద్రుష్టి అంతా మా క్లాస్ పైనే పెట్టె వారు నేను ఏ క్లాస్ కు వెళ్ళినా ఇదే పద్ధతి .కనుక స్కూల్ లో నేను అంటే ఒక రకం గా భయం ఉండేది .ఎవ్వరు ఎదురు తిరిగే సాహసం చెయ్యలేదు .అది నా అదృష్టం అనుకొంటాను .చదువు బాగా చెప్పే వాళ్ళు అంటే విద్యార్ధులు నిజం గా నే ఇష్టపడుతారు .వాళ్ళు కొట్టినా ,తిట్టినా ఏమీ అనరు .తలిదండ్రులు కూడా ఏమీ అనుకోరు .అప్పటి స్తితి అది .ఇది నా సర్వీస్ అంతా అనుసరించాను .క్లాస్ లో పాఠాన్ని వివర గా చెప్పటం ,పిల్లల తో చెప్పించటం ముఖ్య మైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నోట్సు రాయించటం సైన్సు రికార్డ్ రాయించటం బొమ్మలు వేయించటం మర్నాడు క్లాస్ లో ముందు రోజు చెప్పిన పాఠంపై ప్రశ్నలు వేయిటం ముఖ్యమైన ఒకటి లేక రెండు ప్రశ్నలకు జవాబులు ఇంటి దగ్గర రాయించి నాకు రోజూ చూపించటం చేయించే వాడిని .ఇది దిన చర్య .అన్నిక్లాసులకు ఇదే పద్ధతి ఇంగ్లీష్ అన్నా ,లేక్కలన్నా ఇదే పద్ధతి అనుసరించేవాడిని ఇంగ్లిష్ లో స్పెల్లింగ్ లు రాయిన్చేవాడిని చూచిరాతా కాపీ తప్పని సరి .మోడల్ లెక్కలు చేయిన్చేవాడిని . ప్రతి పాఠానికి ముఖ్య మైన బిట్లు చెప్పి రాయించే వాడిని వాటిలో రెండు బాచీలు చేసి వాళ్ళతో నే అడిగిన్చేవాడిని ముఖ్య మైన ప్రయోగాలు చేయించి చూపెవాడిని సైన్సు క్లాస్ అంటే లాబ్ లోకి పిల్లలు వచ్చేవారు .ప్రతి స్కూల్ లోను లాబరేటరి లో’’మహాకవి  దాశరధి’’ కవితా పంక్తి ‘’మధన పడే మేధావుల చిగురాశలు చిగవురించే రస రాజ్యం ‘’LABORATORY ‘’అని తప్పకుండా రాయించే వాడిని ఈ లైన్ నాకు అమితం గా ఇష్టం

                  సశేషం

               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-3-13-ఉయ్యూరు 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఫ్రాన్స్‌లో ‘సురభి’ జిలుగులు

ఫ్రాన్స్‌లో ‘సురభి’ జిలుగులు

తెలుగు నాటక ఖ్యాతిని ఎల్లలు దాటించడంలో సురభి నాటక సమాజం ముందంజలో ఉంది. ఆ కుటుంబాల పెద్దగా సురభి నాటకాలకు కొత్త దశ, దిశ నిర్దేశం చేసిన పద్మశ్రీ రేకందార్ నాగేశ్వరరావు అలియాస్ బాబ్జీ తెలుగు నాటక వైభవాన్ని ఫ్రాన్సు ప్రేక్షకులకు త్వరలో రుచి చూపించబోతున్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కారాన్ని, ముంబాయిలో ఆదిత్య బిర్లా నెలకొల్పిన ‘కళా శిఖర’ అవార్డును సొంతం చేసుకున్న బాబ్జీ చెబుతున్న సురభి నాటక సం’గతులు’ ఆయన మాటల్లోనే…

“తెలుగు నాటకరంగంలో 123 ఏళ్ల క్రితం ఆవిర్భవించి ఈనాటికీ వన్నె చెరగని రీతిలో ప్రేక్షకులను రంజింపచేస్తున్న సురభి నాటక కుటుంబం మాది. చిత్రవిచిత్రమైన తెరలు, సెట్టింగ్‌లు, వైర్ వర్కులు, ట్రిక్కులతో ప్రేక్షకులను మైమరిపించే విధంగా నాటకాలు ప్రదర్శించడం మా ప్రత్యేకత. ఒక దశలో 3500 మంది కళాకారుల కుటుంబంగా, 45 నాటక సమాజాలుగా అన్ని పల్లెలు, పట్టణాలలో గుడారాలు వేసుకుని మరీ నాటకాలను ప్రదర్శించి తెలుగు పద్యనాటకానికి విశేష ఖ్యాతిని సంపాదించిపెట్టింది మా సంస్థ.

ప్రపంచదేశాలలో గర్వంగా చెప్పుకునే నాటకాల స్థాయిలో మన తెలుగు నాటకానికి కొత్త అందాలను తీసుకురావడంలో సురభి నాటక సంస్థ చేసిన కృషి ఎనలేనిది. 1937లో నెలకొల్పిన శ్రీ వేంకటేశ్వర నాట్యమండలిలో నేను పుట్టిపెరిగాను. నాటకాలు తప్ప నాకు మరో ప్రపంచం తెలియదు. అయితే మారిన ప్రేక్షకుల అభిరుచులు, నాటకాలకు ఆదరణ తగ్గిపోవడంతో మా కుటుంబాలకు చెందిన కళాకారులు పొట్టకూటి కోసం తలోదారి పట్టారు. 2000 సంవత్సరం నాటికి క్రమంగా మా కుటుంబ కళాకారుల సంఖ్య 200కు కుంచించుకుపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సురభి నాటకాలు కనుమరుగైపోయే ప్రమాద పరిస్థితి నెలకొంది.

పెద్దల అండతో పునర్వైభవం
ఆ దశలోనే గరిమెళ్ల రామమూర్తి, పూర్వ డిజిపి హెచ్‌జె దొర, కె.వి.రమణ వంటి పెద్దల ప్రోత్సాహంతో మళ్లీ సురభికి పునరుత్తేజం లభించింది. వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న సురభి కళాకారులందరికి భువనగిరి, చందానగర్ ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు ప్రభుత్వం అండగా నిలిచింది. కేంద్రప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వనరులతో మాకు గృహవసతి, నెలవారీ వేతన భృతి లభ్యమైంది. ప్రస్తుతం మాలో 60 మందికి నెలవారీ జీతం, చాలామందికి పెన్షనలు వంటివి లభిస్తున్నాయి. బతుకు భరోసా లభించడంతో సురభి కుటుంబాలు నాటక ప్రదర్శనల పట్ల కొత్త ఉత్సాహం చూపించాయి. అన్నీ కూడగట్టుకుని సరికొత్త ప్రదర్శనలతో సమాయత్తం అయ్యాము.

2006 సంక్రాంతి పండుగ మాకొక శాశ్వత వేదికకు శుభారంభం పలికింది. భాగ్యనగరంలోని లలిత కళాతోరణం ప్రాంగణంలో సురభి నాటకశాలను ప్రారంభించాము. ఐదు నాటక సమాజాలుగా మిగిలి ఉన్న కళాకారులందరం కలసి వరుసపెట్టు ప్రదర్శనలతో మళ్లీ సురభికి జవజీవాలు కల్పించాము. పాతతరం అభిమానులతో పాటు కొత్త తరం యువతరానికి మా నాటకాలు చూపించి వారిని కూడా మెప్పించడానికి మేము తీసుకువచ్చిన కొత్త ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఒక్క ఏడాదిలోనే 440కి పైగా ప్రదర్శనలు ఇచ్చాము. రాష్ట్రప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటుతోపాటు ప్రదర్శనలకు అవకాశాలు మెరుగయ్యాయి. ఒక దశాబ్ద కాలం మేము పడిన కష్టానికి సురభి నాటకాలు మళ్లీ జనానికి చేరువయ్యాయి. రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా మా నాటకాలకు ఆదరణ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే నాటకోత్సవాలలో సైతం మా నాటకాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ‘మాయాబజార్’ నాటకం ఇప్పటికి 22,600 ప్రదర్శనలు పూర్తిచేసుకుంది. అలాగే ‘పాతాళభైరవి’కి కూడా అపూర్వ ఆదరణ లభిస్తోంది.

యువతరానికి చేరువగా…
మా కుటుంబాలకు చెందిన పాతతరంలో విద్యావంతులు లేరు. ఇప్పుడు ఎంబిఎతోపాటు యూనివర్సిటీలలో రంగస్థల కళలో ఎంఎ, పిహెచ్‌డి, గోల్డ్ మెడల్ పొందిన యువత మా కుటుంబాల సొంతం. రోజూ 124 కిలోమీటర్ల దూర ప్రయాణం చేస్తూ కాలేజీలలో చదువుకుంటున్న మా పిల్లలు నాటకంవైపే మొగ్గుచూపుతున్నారు. మాయాబజార్‌లో అభిమన్యుడు, శశిరేఖలుగా నటిస్తున్న మా పిల్లల చదువుల గురించి తెలుసుకుని ప్రేక్షకులు కూడా అభినందిస్తూ వారి నటనను ఆస్వాదిస్తున్నారు. ఇటీవల కాలంలో టిక్కెట్టు కొని మా నాటకాలను చూసే వారి సంఖ్య పెరగడం నాకు ఆనందాన్నిస్తోంది. నాటకాల పట్ల తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పు ఆహ్వానించదగిన పరిణామం.

ఫ్రాన్సు నుంచి ఆహ్వానం
తాజాగా మా నాటకాలను ప్రదర్శించవలసిందిగా ఫ్రాన్సు దేశానికి చెందిన ఒక సంస్థ నుంచి ఆహ్వానం అందింది. ఏప్రిల్‌లో ఈ ప్రదర్శనలు ఉంటాయి. హైదరాబాద్‌కు చెందిన అలయెన్స్ ఫ్రాంచేజ్ వారు ఫ్రాన్సులో ప్రదర్శనలకు కావలసిన హంగులు, పద్ధతులపై మాకు సూచనలు, సలహాలు అందచేస్తున్నారు. మాతోపాటు ఇతర సమాజాల్లోని మెరికల్లాంటి కళాకారులను కూడగట్టుకుని మొత్తం 43 మంది కళాకారులతో ఫ్రాన్స్ పర్యటన కోసం సమాయాత్తం అవుతున్నాము. ఈ పర్యటనతో మన నాటకాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మాకు మంచి పేరు తెచ్చిపెట్టిన 60 నాటకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆధునిక పద్ధతుల్లో భద్రపరుస్తున్నాము. అన్నీ సీడీల రూపంలో ముందుతరాల వారికి అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తున్నాము.

మా కుటుంబానికి చెందిన రచయిత రామమోహనరావు రచించిన ‘కలియుగ వైకుంఠం’ నాటకాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము. శ్రీవేంకటేశ్వరుడి అవతార విలాసంపై అద్భుతమైన సంగీత దృశ్య కావ్యంగా ఈ నాటకాన్ని మలచడానికి కృషి చేస్తున్నాము. ఫ్రాన్సు పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ నాటకాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. ప్రేక్షకుల ఆదరాభిమానాలే మా సురభి కుటుంబాలకు రక్ష” అంటూ ముగించారు నాగేశ్వరరావు. ఆయన ఫోన్ నంబర్: 9849026386. ం జిఎల్ఎన్ మూర్తి

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది కవితా కదంబం

శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది కవితా కదంబం

 
సాహితీ బంధువులకు -సాహిత్యాభి మానులకు –
          సరసభారతి 43 వ సమావేశం -ఉయ్యూరు  శాఖా గ్రంధాలయం(ఎ .సి.లైబ్రరి ) లో శ్రీ విజయ నామ సంవత్సర ఉగాదిసందర్భం గా,ఉగాదికి నాలుగు రోజుల ముందు  7-4-13 ఆదివారం సాయంత్రం 4 గంటలకు ”కవితా కదంబం (  వివిధ సామాజికాంశా లపై -15 పంక్తుల లోపు- మినీకద ,పద్య కవిత్వం వచన కవిత్వం, పాట)   ,ఉగాది పురస్కారాలు ,పుస్తకావిష్కరణ సభ గా నిర్వహిస్తోంది ఎందరో పెద్దలు పాల్గొంటున్న ఈ సమావేశానికి అందరు ఆహ్వానితులే .వివరాలు త్వరలో ఆహ్వానం రూపం లో అందిస్తాము –దుర్గా ప్రసాద్ 
Posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

సరసభారతి 42 వ సమావేశము – విశేషాలు

This gallery contains 53 photos.

More Galleries | Tagged | Leave a comment

జాతీయ కవి సమ్మేళనం

 జాతీయ కవి సమ్మేళనం 

సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు కవులకు –శుభ వార్త 
                      కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర ఉన్న లంకపల్లి లోని సన్ ఫ్లవర్ ఇంజినీరింగ్ కళాశాల లో మార్చి 21,22,23 తేదీలలో ”జాతీయ కవి సమ్మేళనం ”నుమూడు రోజుల పాటు నిర్వహింప బోతున్నట్లు ప్రధాన కార్య దర్శి డాక్టర్ శ్రీ జి.,వి. పూర్ణ చందు ప్రకటించారు త్వరలోనే వివరాలు అంద జేయ బడతాయి  –గబ్బిట దుర్గా ప్రసాద్ —
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గాయనీమణి శారదా రెడ్డి 40 వసంతాల గానకళా ప్రస్థానం – లవకుశ 50 ఏళ్ళ పండుగ -ఆహ్వానం

Sarada Reddy Invitation (1)

00010002

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

నా దారి తీరు -9 బదిలీ ప్రయత్నాలు –నిలుపుదల –అయిన బదిలీ

  నా దారి తీరు -9

          బదిలీ ప్రయత్నాలు –నిలుపుదల –అయిన బదిలీ

  మోపిదేవి లో పని చేస్తుండగా ఒక సారి ఉయ్యూరు లో నా తో పాటు హైస్కూల్ లో చదివిన నా స్నేహితుడు గండి వాసు అనే తూర్పు కాపుల కుర్రాడు  నాతో మాట్లాడుతూ ‘’ఏమయ్యా !మోపిదేవి లోనే ఉండి పోతావా /ఉయ్యూరు రావా ?’’అన్నాడు అప్పుడు నాకు ఓహో మనం ఉయ్యూరు రావాలి కదా అనే ఆలోచన కలిగింది .అతనే ఇంకోసారి ‘’నీకు రావాలని ఉంటె చెప్పు .మనకు తెలిసిన ఒక పెద్దాయన కపిలేశ్వర పురం లో ఉన్నారు మనంఎంత చెబితే అంత ట్రాన్స్ఫర్ చేయించి పెడతారు ‘’అన్నాడు సరే నన్నాను .ఈ విషయం మా హెడ్ మాస్టారు కోటేశ్వర రావు గారితో చెప్పాను.ఆయన’’ప్రసాద్ గారూ ! మా అమ్మాయి ప్రభావతి ఎస్.ఎస్.ఎల్.సి. క్లాస్ కు వచ్చింది మీరే సైన్సు చెప్పాలి కనుక ఈ సంవత్సరం ఇక్కడే ఉండి పొమ్మని కోరుతున్నాను .ఒక వేళమీరు ప్రయత్నాలు చేసినా నేను వెళ్ళనివ్వను ‘’అన్నారు నా శ్రేయోభిలాషి, నా మీద అంత నమ్మకం ఉన్న ఆయన మాట నేనుకాదన లేక పోయి ఆ ఏడాది ఉండి పోయాను .కోటేశ్వర రావు గారి దగ్గర బంధువు తూమాటి బాల కోటేశ్వర రావు లాయరు .సోషల్ వర్కర్ కూడా .అవని గడ్డ లో ఉండేవారు అవని గడ్డలో అప్పుటి రాజకీయ నాయకులలో సనక బుచ్చి కోటయ్య గారు అన్నప రెడ్డి సత్యనారాయణ ,మండల రామారావు గార్లు భోగాది దుర్గా ప్రసాద్ ప్రసిధులు కొమరగిరి కృష్ణ మొహాన రావు గారికి అవని గడ్డలో ఒక హోటల్ ఉండేదని విన్నాను అలాగే జాగృతి వార పత్రికలో రాసే ఒక మీసాల లావు ఆయనదీ అవని గడ్డ ఏ .మాస్కూల్ లో నాన్చారయ్య అనే పదో తరగతి కుర్రాడు జెనరల్ నాలెడ్జి లో భలే తెలివి తేటలు చూపేవాడు అతన చేతిలో ఎప్పుడూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ఉండేది అంత చురుకైన కుర్రాడు .

                 నెహ్రు మరణం –లాల్ బహదూర్ ప్రధాని –  గుంటూరులో కాంగ్రెస్ సభలు –

మోపిదేవిలో పని చేసినప్పుడే గుంటూర్ లో అఖిల భారత కాంగ్రెస్ సభలు రంగ రంగ వైభవం గా జరిగాయి కాసు బ్రహ్మా నంద రెడ్డి అప్పుడు ఆంధ్రా చీఫ్ మినిస్టర్ .మా పెళ్లి అయిన ఏడాదే పంచాయితీ ఎన్నికలు జరిగాయి ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రు వేసవిలో చని పోయాడు ఎన్నికలు వాయిదా పద కుండా జరిగాయి అదే నేను ఎన్నికల విధి నిర్వహణ లోమొదటి సారిగా . పాల్గొనటం మోపిదేవి దగ్గర నాగాయ తిప్ప ఎన్నికలకు వెళ్లాం రాజ మర్యాదలు చేశారు .ఏ గొడవా లేకుండా నిర్వహించాం నిజాయితీకి నిలువు అడ్డం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యారు తాష్కెంట్ లో ఆయన అకస్మాత్తు గా మరణించారు కామరాజ్డులు తెరవంక ప్రయత్నం చేసి ఇందిరా గాంధి ని గద్దె పై కూర్చో బెట్టారు ఆమె ఆధ్వర్యం లోనే గుంటూరు  కాంగ్రెస్  సభలు జరిగిన జ్ఞాపకం .

                            అతి రహస్యం కాపాడాను  

              ఉయ్యుర్లో మా ఇంటి దగ్గరే దేవుల పల్లి వారింట్లో అంటే వెంపటి శర్మ గారింట్లో ఉయ్యూరు హై స్కూల్ లో హెడ్మాస్టర్ గా పని చేస్తున్న శ్రీ రాళ్ళబండి సత్యనారాయణ గారుండే వారు .ఆయన నా గురించి తెలుసుకొని నన్ను ఒక సారి ఇంటికి పిలిపించుకొన్నారు ఆ రోజుల్లో డిటేన్షన్న్ విధానం ఉంది మార్కులోస్తేనే ప్రమోషన్ ఉండేది .కనుక మేస్టార్లు తమ దగ్గర ప్రైవేట్ చదివే విద్యార్ధులకు పరీక్షల్లో ఎక్కువ మార్కు లేసి తప్పి పోకండా జాగ్రత్త పడే వారు . అన్ని రకాల అవినీతికి ఆస్కారం ఉండేది సత్యనారాయణ గారికి అప్పుడు ఉయ్య్రు హైస్కూల్ లో పని చేసే ఎ మాస్టర్ మీదా నమ్మకం ఉండేది కాదు .అందుకని వేసవిలో తానే ఇంటి దగ్గర మార్కుల లిస్టులు దగ్గర పెట్టుకొని మార్కులరిజిస్టర్లో పోస్ట్ వేసుకొనే వారు ఆయన నన్ను తనకు సహాయం చేయమన్నారు ఇదంతా సీక్రెట్ గా జరగాలని చెప్పారు ‘’నిన్ను చూస్తె నాకెందుకో నా మాట మీద గౌరవం తో రహస్యం గా ఉంచుతావనే నమ్మకం కలిగింది .నాకు హెల్ప్ చేయండి ‘’అన్నారు అలానే రెండేళ్ళు వారికి సహాయ పడ్డాను వారమ్మాయి వివాహం జరిగితే మా ఇంట్లోనే విడిది ఏర్పాటు చేశాం ఆయన చాలా లావుగా ఎత్తుగా ,గంభీరం గా పంచ ,లాల్చి తో నెహ్రు కోట్ పైన వేసుకొని ఉండే వారు సైకిల్ మీద స్కూల్ కు వెళ్లి వచ్చే వారు నాతో పని ఉంటె వాళ్ళ అమ్మాయితో మా ఇంటికి కబురు చేసే వారు .నా పని తీరు మెచ్చి ఒక సారి ‘’I want to help you gentleman ‘’అన్నారు అయన నాకేమి సహాయం చేస్తారా అని నేను ఆశ్చర్య పోయాను ఏదో మాట వరసుకు అని ఉంటార్లే అనుకోని మర్చి పోయాను

                         పొలం నూర్పిడులలో మాధవ ,శ్రీరామ మూర్తి సహాయం –డబ్బాకేమేరా

               కాటూరు పొలం నూర్పిడులలో నాకు సహాయం చేయటానికి ఒక ఏడు శ్రీరామ మూర్తి ,మాధవ వచ్చి సంక్రాంతి సెలవుల్లో వచ్చి పది రోజుల పై గా ఉండి  పోయారు అప్పుడు పొలం కుప్ప నూర్చటానికి పది రోజులు పట్టేది. నాకు కాఫీ టిఫిన్ తేవటం ,అన్నం కారియర్లో తెచ్చివ్వటం ,నా తో పాటు పొలం లో కాపలా పడుకోవటం వాళ్ళు చేసి నాకెంతో సాయం చేశారు .మా పెళ్ళికి మా చిన్న బావ గారు ఒక నల్లటి’’ కోడాక్ డబ్బా కెమెరా’’ బహుమతి గా ఇచ్చారు .దానితోనే ఫోటోలు చాలా తీశాను .దాని ఖరీదు అప్పుడు పాతిక రూపాయలు  ఇప్పటికి జాగ్రత్త గానే ఉంది .పొలం లో వీల్లిద్దరితో ఫోటోలు తీసుకొన్నాం మా వేదవల్లి వాళ్ళు కూడాపొలం  వచ్చారు .ఇదో వింత అనుభవం ఏ నాటి రుణానుబంధమో మాతో  మాధవ్, శ్రీరామ మూర్తిలది వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టినట్లు గుర్తు .మా వివాహాన్ని వీరిద్దరూ దగ్గ్గరుండి జరిపించారు .మా ఆవిడను ‘’పిన్ని గారూ పిన్ని గారూ ‘’అని పిలిచే వారు .ఇప్పటికీ అదే ఆత్మీయత వారిది .మహా సరదా గా ఉన్నారు ఎంతో సహాయం చేశారు అన్నీ తామే అయి ప్రవర్తించి మా అమ్మా వాళ్లకు ఏ ఇబ్బందీ కలక్కుండా చేసిన ఈ జంట మిత్రుల గురించి ఎంత చెప్పినా తక్కువే .

                    శ్రీ కొల్లిపర సూరయ్య  గారి మాట –ఉయ్యూరు బదిలీ

      ఒక సారి మా ఫ్రెండ్ వాసు నన్ను వేసవిలో కపిలేశ్వర పురం లో ఉన్న మాజీ శాసన సభ్యులు శ్రీ కొల్లిపర సూర్య గారి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు ఆయన చాలా సహృదయులు .ఎంతో మర్యాద చేశారు గుబురు మీసాలు ఖాదీ వస్త్ర ధారణా .గాంధీ గారి అనుయాయి .వాసు బదిలీ విషయం చెప్పాడు ఆయన ‘’మేస్టారూ !ఇప్పుడు జిల్లా బోర్డు ప్రెసిడెంట్ మాగంటి అంకినీడు .అయన కు చెప్పినా పని కాదు .ఒక వేళ బదిలీ చేసినా సాయంకాలం దాకా అది నిలబడని అనిశ్చిత మనసు అతనిది . .ఒక్క నెలలో మాంచి కుర్రాడు బాగా అవగాహన ఉన్న వాడు రుద్రపాక పంచాయితీ బోర్డు ప్రెసిడెంట్ పిన్నమ నేని కోటేశ్వర రావు జిల్లా బోర్డ్ ప్రెసి డెంట్ అవుతాడు అతను సంస్క్కారి అతను అన్నమాట నిల బెట్టుకొనే రకం .కనుక అప్పుడు నేను మిమ్మల్ని బదిలీ చేయిస్తాను మీ డైరీలో స్కూల్ తెరిచే సరికి ఉయ్యురులో ఉన్నట్లు ఈ రోజే రాసుకోండి ‘’అని భరోసా ఇచ్చారు .అంత గొప్ప మనసు వారిది .నేనూ నా ప్రయత్నాలు చేశాను .ఆఫీసులో గుమాస్తా లు ఫైల్ పుటప్ చేస్తారు వాల్లేదైనాకొర్రి పెడతారేమో నని మా లాబ్ అసిస్టంట్ భాస్కర రావు నన్ను బందరు కు తీసుకొని వెళ్లి అక్కడి ఆఫీసులో పని చేసే క్రుపారావు దగ్గరకు తీసుకు వెళ్లి పరిచయం చేసి పాతిక రూపాయలు ఇప్పించాడు ఆయన తాను అంతా చూసుకొంటాను అని హామీ ఇచ్చాడు మా హెడ్ మాస్టారూ తన నోటి సాయం చేశారు .పిన్నమనేని బోర్డు అధ్యక్షులైన కొద్ది రోజులకే జరిగిన మొదటి బాచ్ ట్రాన్స్ ఫర్లలో నా కు మోపి దేవి నుంచి ఉయ్యూరు హైస్కూల్ కు బదిలీ అయింది .అందరు సంతోషించారు .ఇక్కడ ఒక తిర కాసు జరిగింది ఉయ్యురులో అప్పుడు సైన్సు పోస్ట్ కు ఖాళీ లేదు అందుకని ఇక్కడి హెడ్ మాస్టారు తనకు లెక్కలు సైన్సు చెప్పే వాళ్ళు కావాలని ప్రత్యేకం గా ఒక లెటర్ రాశారట .దాని ప్రకారం లెక్కలు ఎక్కువ గా చెప్పాల్సిన అవసరం కలిగింది .అలా ఖాళీ లేదని తోసేయకుండా లెక్కల పోస్ట్ లో నన్ను వేశారన్నమాట అదీ రాళ్ళ బండి సత్యనారాయణ గారు చేసిన గొప్ప సాయం .ట్రాన్స్ఫర్ అవగానే సూరయ్య గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పి వచ్చాం నేను వాసు .వాసుకేమైనా డబ్బు ఇవ్వాలని పించింది .ఇస్తే తీసుకో లేదు ఆ తర్వాతా ఎప్పుడో ఒక వంద రూపాయలు జేబులో కుక్కాను .సూర్య గారికి వాసు కుటుంబం బాగా పరిచయం వారికి కావలసిన ఊరగాయలన్నీ పెట్టి పంపించే వారట వాసు వాళ్ళు .వాసు నాన్న, అన్న నాగేశ్వర రావు మామిడి తోటలు కొని కాయలు దిగుమతి చేసి మార్కెట్ కు వేసే వారు .వాసు తర్వాతా నెమ్మదిగా మందుకు బానిసై పోయాడు ఎప్పుడు రక్తం చిమ్మినట్లుండేకళ్ళ తో ఉండే వాడు నన్ను ‘’బ్రదర్ ‘’అని పిలిచే వాడు మంచి మనిషి వాళ్ళ నాన్న కూడా బాగా పరిచయమే .

              మోపిదేవి లో నాకు ఘనమైన వీడ్కోలు సభ జరిపారు అందరికి కృతజ్ఞతలు చెప్పాను హేద్మాస్తారి అమ్మాయి స్కూల్ ఫాస్ట్ వచ్చింది సైన్సు లో చాలా ఎక్కువ మార్కులోచ్చాయి ఆమె డాక్టరీ చదివి పాసైంది ఆమె తమ్ముడు రామ కృష్ణ కూడా బాగా చదివి ఉన్నత ఉద్యోగం సంపాదించాడని విన్నాను ..ఇలా నా జీవితం లో నా మొదటి స్కూలు మోపిదేవి ఎన్నో జ్ఞాపకాలకు నిలయ మైంది .ఎప్పుడు అటు వెళ్ళినా మోపిదేవి శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామిని దర్శించటం ఒక అలవాటు గా మారింది .నరసింహారావు లెక్కల మేష్టారు ,తెలుగు మేస్టర్ సత్యనారాయణ (గోపాల కృష్ణ అని ఇప్పటి దాకా రాశాను పొరబాటు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది అయన పేరు సత్యనారాయణ—అదే మా ‘’వాసన మేష్టారు ‘’),పెదప్రోలు కాపురం ,అడవి శ్రీరామ మూర్తి కృత్తి వెంటి మాధవ ,శ్రీరామ మూర్తి తల్లి గారు వారింట్లో నాకు అన్నం వండి పెట్టి అన్నపూర్ణ గా ఆదరించిన తీరు, నా బోధనా విధానం మెరుగు పరచుకొన్న విధానం, హెడ్ మాస్టర్ గారు శ్రీ తూమాటి కోటేశ్వర రావు గారికి నాపై ఉన్న అభిమానం ,నమ్మకం, నాపై చూపిన గౌరవం, ఇవన్నీ అక్కడి తీపి గుర్తులు .

              సశేషం 

మీ –గబ్బిట.దుర్గా ప్రసాద్ -25-2-13-ఉయ్యూరు 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

కూచిపూడి నాట్యోత్సవాలు

koochi poodi naatyotsavaalu -1koochi poodi naatyotsavaalu -2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా మంచి స్నేహితుడు మా నాన్న

మా మంచి స్నేహితుడు

తెలుగు సినీ సాహితీ లోకంలో పండువెన్నెలలు కురిపించే నిండుచంద్రుడు పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణరెడ్డి. నదీమ తల్లులను తన నలుగురు కుమార్తెల పేర్లలో ఇముడ్చుకున్న ఆయన తన ప్రేమతో అల్లుళ్ల హృదయాలనూ దోచుకున్నారు. ఒకే కుటుంబంలా జీవిస్తున్న ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉంటూ 82 ఏళ్ల వయసులో సైతం సాహితీ సేవను కొనసాగిస్తున్నారు. ఆయన పెద్దకుమార్తె సింగిరెడ్డి గంగ తండ్రితో తన అనుబంధాన్ని గురించి తెలియచేస్తున్న విశేషాలే ఈ వారం ‘నాన్న-నేను’.
మేము నలుగురం అక్కచెల్లెళ్లం. నేను పుట్టకముందు మా అమ్మకు నలుగురు మగపిల్లలు పుట్టి పురిట్లోనే చనిపోయారు. దాంతో నేను బతికి బట్టకడితే నాకు గోదావరి నది పేరును పెట్టుకుంటానని అమ్మ మొక్కుకుందిట. దాంతో, మా ఊరికి దగ్గర్లో ప్రవహించే గోదావరిపాయ పేరిట ‘గంగ’ అని పెట్టింది. నాన్నకు నదులన్నా, ప్రకృతి అన్నా చాలా ఇష్టం. అలా మా చెల్లెళ్లకు వరుసగా యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేర్లు పెట్టారు. 1962లో నాన్న సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్.టి.రామారావుగారు నటించిన ‘గులేబకావళి కథ’ పాటల రచయితగా నాన్న మొదటి సినిమా.

అప్పటికి నాకు ఏడేళ్లు. మొదటి సినిమాతోనే నాన్న చాలా బిజీ అయిపోయారు. పాటలు రాయడానికి మద్రాసుకు వెళ్లి రోజుల తరబడి ఉండిపోయేవారు. నాన్న అక్కడకు వెళ్లినా మనసంతా ఇక్కడే ఉండేది. అప్పట్లో ఎస్‌టిడి సౌకర్యం లేదు. ట్రంక్‌కాల్ చేసి రెండు రోజులకోసారి మాట్లాడేవారు.

నాన్న అక్కడి నుంచి మా యోగ క్షేమాలు అమ్మను అడిగి కనుక్కునేవారు. అయితే ఆయన ఎప్పుడు మాట్లాడినా “పిల్లలు రోజూ శుభ్రంగా పళ్లు తోముకుంటున్నారా?” అని మాత్రం అడగడం మరచిపోయేవారు కాదు. ఊరు నుంచి తిరిగిరాగానే ఆయన మొదట చేసే పని మా నలుగురిని వరుసగా నిలబెట్టి పళ్లు చెక్ చేయడం. పళ్లు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని ఆయనకు గట్టి నమ్మకం. ఇప్పటికీ మునిమనవళ్లను దగ్గరకు పిలిచి వాళ్ల పళ్లను చెక్ చేస్తుంటారు నాన్న.

భాషాభిమాని
నాన్నకు తెలుగు భాషంటే ఎంతో మమకారం. ఆ కారణం చేతనే నన్ను, ఇద్దరు చెల్లెళ్లను తెలుగు మీడియంలోనే చదివించారు. ఆఖరు చెల్లెలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివింది. నాకు ఊహ తెలిసేసరికి మేము అశోక్‌నగర్‌లో ఉండేవాళ్లం. అప్పట్లో చాలామంది సాహితీ ప్రముఖులు నాన్న కోసం ఇంటికి వచ్చేవారు. వారు మాట్లాడుకుంటుంటే ఆసక్తిగా వినేదాన్ని. ఆ రోజుల్లో నాన్న సాహితీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం ఎక్కడో అక్కడ సన్మానం లేదా విందు సమావేశాలు జరుగుతుండేవి. దీంతో నాన్న సాయంత్రం బయటకు వెళుతుంటే రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేస్తారో లేదో కనుక్కోమనేది అమ్మ.

“నాన్నా! దండల మీటింగా… భోజనాల మీటింగా?” అని అడిగేదాన్ని. సన్మాన సభలైతే ఇంటికి దండలు వచ్చేవి. అదే విందు సమావేశాలైతే అక్కడే భోంచేసి వచ్చేవారు నాన్న. నాన్నకు మనసులో ఏ విషయం దాచుకోవడం అలవాటు లేదు. ఏ ఊరెళ్లి వచ్చినా అన్ని విషయాలు సినిమా కథలా కూర్చోబెట్టి చెప్పేవారు. మాకు చిన్నప్పటి నుంచి నాన్న దగ్గర చనువు ఎక్కువ. ఆయన కూడా ఒక స్నేహితుడిలా మాతో ఉంటారే తప్ప తన పట్ల భయభక్తులు ప్రదర్శించాలని ఏనాడూ కోరుకోరు.

అనారోగ్యంలోనూ నాన్న కోసమే…
అమ్మకు 1962లో పక్షవాతం వచ్చింది. చికిత్స కోసం నాన్న, నేను, పెద్దచెల్లెలు అమ్మను తీసుకుని మద్రాసు వెళ్లాం. మిగిలిన ఇద్దరు చెల్లెళ్లు అమ్మమ్మ వాళ్ల ఊర్లో ఉండిపోయారు. మద్రాసులో ఒక ఏడాదిన్నర పాటు ఉన్నాం. అప్పుడు నాన్న చాలా కష్టపడ్డారు. ఒక పక్క సినిమాలకు పాటలు రాయడం, మరో పక్క అమ్మకోసం ఆసుపత్రుల చుట్టూ తిరగడం. మద్రాసులో కొంతకాలం, రాయవెల్లూరులో కొంతకాలం అమ్మకు చికిత్స జరిగింది. ఏమాత్రం గుణం కనిపించకపోవడంతో మళ్లీ అమ్మను తీసుకుని హైదరాబాద్ వచ్చేశాం. అమ్మ లేవలేని పరిస్థితిలో ఉండడంతో మా నలుగురి బాధ్యత నాన్నపైన పడింది. కొంతకాలానికి అమ్మకు ఒక కాలు, ఒక చెయ్యి మాత్రం స్వాధీనంలోకి వచ్చాయి.

ఒక మనిషి సాయంతో వంటింట్లో స్టూలు పైన కూర్చుని నాన్నకు ఇష్టమంటూ నాన్‌వెజ్ తనే చేసేది. అమ్మకు దైవభక్తి ఎక్కువ. నాన్నకు అలాంటివేవీ లేవు. అమ్మ ప్రతి శనివారం ఉపవాసం ఉండేది. “ఆ దేవుడు నీకు ఏమిచ్చాడని అమ్మా ఇంకా ఆయననే నమ్ముతున్నావు?” అని నేనెప్పుడైనా అంటే “మీ నాన్నను, మిమ్మల్ని కనీసం ఈ కళ్లతో చూసే భాగ్యాన్ని కల్పించాడు కదమ్మా” అంటూ నవ్వేది. నాన్నకు అమ్మ వంట అంటే చాలా ఇష్టం. కొర్రమీను చేపన్నా, ఉలవచారన్నా చాలా ఇష్టంగా తినేవారు. చిన్నప్పుడు వాళ్లమ్మ హనుమాజీపేటలో రోజూ మాంసం దొరకదని పక్క ఊర్ల నుంచి తెప్పించి మరీ పెట్టేదట.

ఒక్కరోజు నాన్‌వెజ్ లేకపోయినా నాన్న అలిగి అన్నం తినడం మానేసేవారట. అలా అమ్మ గారాబంలో పెరిగిన నాన్నకు రుచుల విషయంలో మాత్రం పట్టింపులెక్కువ. కూరలు ఒకేలా వండితే ఆయనకు నచ్చదు. అవి ఇవి కలిపి వండొచ్చు కదా అంటూ ఉంటారు. ఇప్పటికీ వంటలు రుచిగా లేకపోతే మాతోపాటే పెరిగిన మా నాన్న సహాయకుడు రాములును మెచ్చుకుంటూ “మీకన్నా వాడే నయం… అమ్మ దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి చక్కగా వంటలు చేస్తాడు” అని దెప్పిపొడుస్తుంటారు.

ఎన్టీఆర్‌తో అనుబంధం
నాన్నకు సినిమారంగంలో కొందరు ఆత్మీయమైన స్నేహితులు ఉండేవారు. నిర్మాత డీవీఎస్ రాజుగారు, ఎస్వీఎస్ ఫిలింస్ అధినేత మిద్దె జగన్నాథరావుగారు నాన్నకు మంచి మిత్రులు. మద్రాసులో ఎక్కువగా జగన్నాథరావుగారింట్లోనే ఉండేవారు నాన్న. అలాగే గుమ్మడిగారు, మిక్కిలినేనిగారు, పుండరీకాక్షయ్యగారు కూడా నాన్నకు ఆప్తులు. అక్కినేని నాగేశ్వరరావుగారంటే కూడా నాన్నకు చాలా అభిమానం. ఇక, ఎన్టీ రామారావుగారితో నాన్నగారి అనుబంధం అందరికీ తెలిసిందే. రామారావుగారికి కూడా మేమంటే చాలా అభిమానం. ఎప్పుడూ మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవారు.

శ్రీనాథుడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాలకు నాన్న పాటలు రాసినప్పుడు రామారావుగారు ఓకే చేసిన పాటలను నాన్న డిక్టేట్ చేస్తుంటే నేను ఫెయిర్ కాపీ రాసేదాన్ని. వాటిని తీసుకెళ్లి రామారావుగారికి ఇచ్చినప్పుడు, “అమ్మాయిగారు రాసిన తర్వాత మళ్లీ వేరే వాళ్లతో కాపీ చేయించడం ఎందుకు? ఇదే చాలా బాగుంది” అంటూ ఆయన నా రాతను మెచ్చుకునేవారు.

మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు ఆయన తప్పకుండా వచ్చేవారు. నాన్న కంట్లో నీళ్లు రెండు సార్లే చూశాను. ఎన్టీరామారావుగారు మరణించినప్పుడు తన సొంత సోదరుడిని కోల్పోయినట్లు బాధపడ్డారు. అలాగే తన బాల్యస్నేహితుడు, యూనివర్సిటీలో తన సహచర అధ్యాపకుడు అయిన ఇరివెంటి కృష్ణమూర్తిగారి మరణం కూడా నాన్నను బాగా కృంగదీసింది. ‘విశ్వంభర’ రచనాకాలంలో ఆయన నాన్నకు కుడిభుజంలా ఉండేవారు.

నాన్న జేబులు ఖాళీ
నాన్నకు మొదటి నుంచి డబ్బు వ్యవహారాలంటే పట్టదు. ఆయన జేబులో ఒక్క రూపాయి కూడా ఉంచుకోరు. నాకు కొంచెం జ్ఞానం వచ్చినప్పటి నుంచి నా చేతికే నాన్న డబ్బులిచ్చేవారు. మద్రాసు నుంచి నాన్న వస్తున్నారంటే నేను కారు తీసుకుని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాల్సిందే. విమానం దిగి బయటకు వచ్చిన వెంటనే తన చేతిలోని బ్రీఫ్‌కేసును నా చేతిలో పెట్టేసి “హమ్మయ్య! భారం దిగింది” అంటూ ఊపిరి పీల్చుకునే వారు నాన్న. మా ఇంట్లో నాన్న కవిత్వ వారసత్వం నా మనవరాలు(కూతురి కూతురు) వరేణ్యకు వచ్చింది. ఇప్పుడు దానికి 12 ఏళ్లు. నాలుగేళ్ల కిత్రమే అమెరికాలో ఉన్నప్పుడు ఒకఆంగ్ల కవితల సంకలనాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు మరో సంకలనం తెస్తోంది. మా ఇంట్లో పిల్లలందరికీ నాన్నే పేర్లు పెట్టారు.

అందులోనూ నాన్న కవిహృదయం కనపడుతుంది. మా అబ్బాయి పుట్టినప్పుడు నాన్న రాసిన ‘ఇంటి పేరు చైతన్యం’ పుస్తకం విడుదలైంది. దాంతో వాడికి ‘చైతన్య’ అని పేరుపెట్టారు. మా అమ్మాయికి మనస్విని అని, పుట్టినప్పుడు బాగా కాళ్లు ఆడించే చెల్లెలి కొడుకుకు ‘లయచరణ్’ అని, ఎప్పుడూ కళ్లతో వెదికే మరో చెల్లెలి కొడుక్కి ‘అన్వేష్’ అని, మేడే నాడు పుట్టిన మనవడికి ‘క్రాంతి కేతన్’ అని, పుట్టినప్పుడు కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉన్న మనవరాలికి ‘మౌక్తిక’ అని పేర్లు పెట్టారు.

కలసి ఉంటేనే సుఖం: నాన్నకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే చాలా ఇష్టం. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉండాలని ఆయన కోరుకుంటారు. నాలుగు తరాలు ఒకే ఇంట్లో నివసించడం మా ఇంటి ప్రత్యేకత. పెళ్లయినా అమ్మానాన్నలను విడిచి వెళ్లకూడదని నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. పెళ్లయిన తర్వాత కుమార్తెలు అత్తగారింటికి ఎందుకు వెళ్లాలి? తల్లిదండ్రుల దగ్గరే ఎందుకు ఉండకూడదు? అని అనుకునేదాన్ని. జన్మతః వచ్చిన ఇంటిపేరు పెళ్లి తర్వాత మారిపోవడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. మా వారు ఒకసారి నాకు తెలియకుండా తన ఇంటి పేరును చేర్చి నా పేరిట ఒక ఇంటి స్థలం కొన్నారు.

ఆ విషయం తెలిసి మళ్లీ ‘సింగిరెడ్డి గంగ’ పేరిట ఆ దస్తావేజులను మార్చేంతవరకు నేను నిద్రపోలేదు. నేనే కాదు మా చెల్లెళ్లు ఎవరూ తమ ఇంటి పేరు మార్చుకోలేదు. నా పెళ్లయిన తర్వాత నేను, నా భర్త నాన్న దగ్గరే ఉండిపోయాం. ఆ తర్వాత చెల్లెళ్లు, వాళ్ల భర్తలు కూడా మాతోనే కలసి ఉంటున్నారు. అలా మా పిల్లలు, వాళ్ల పిల్లలు కూడా ఒకే కుటుంబంగా ఉంటున్నాం. మాకు మా నాన్న ముఖ్యం. మా పిల్లలకు కూడా తాతయ్యంటే ప్రాణం. నాన్నకు మేమే కాదు మనవళ్లు, మునిమనవళ్లతో కూడా మంచి అనుబంధమే ఉంది.

మా అమ్మాయి తన భర్తతో కలసి అమెరికాలో పదేళ్లు ఉండి వచ్చింది. అప్పట్లో అమ్మాయి డెలివరీ కోసం నేను నాన్నను వదిలి నాలుగు నెలలు అమెరికా వెళ్లాల్సి వచ్చింది. నాన్నను అంతకాలం ఎప్పుడూ వదిలి ఉండకపోవడంతో విమానం ఎక్కిన వెంటనే నాకు ఏడుపు ఆగలేదు. పక్కనే కూర్చున్న ఓ విదేశీ వనిత ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే విషయం చెప్పాను.

మీ వయసెంతని ఆమె అడిగి “ఈ వయసులో కూడా తండ్రి కోసం తపిస్తున్నారా? మీ దేశంలో ఇంతలా సెంటిమెంట్స్ ఉంటాయా” అంటూ ఆశ్చర్యపోయింది. మా నాన్నను మేము ఎంతగా ప్రేమిస్తామో ఆయన మమ్మల్ని అంతకన్నా రెట్టింపుగా ప్రేమిస్తారు. అనుక్షణం మా కోసం తపిస్తారు. కూతుళ్లమైన మాపైనే కాదు…అల్లుళ్లపైన కూడా అంతే ప్రేమాభిమానాలు కనబరుస్తారు. నాన్న కలం నుంచి జాలువారే కవితలే కాదు..ఆయన హృదయమూ ప్రేమామృతమే.

సుధాకర్ తొయ్యేటి
ఫోటో : నరేష్ వరికిల్ల

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు –8 సాంస్కృతిక కార్యక్రమాలు

 నా దారి తీరు –8

            సాంస్కృతిక కార్యక్రమాలు

    మోపిదేవి స్కూల్ లో వార్శికోత్సవాలను బాగా నిర్వహించే వారు .నేను కృష్ణ శాస్త్రి గారు రాసిన ‘’జయ జయ ప్రియ భారత జనయిత్రి పుణ్య ధాత్రి ‘’జాతీయ గీతాన్ని  ఇద్దరు తొమ్మిదో తరగతి ఆడ పిల్లలకు నేర్పి పాదించాను చాలా అద్భుతం గా పాడారు అందులో ఒకమ్మాయి ఎర్రగా సన్నగా ఉండేది కమ్మ వారమ్మాయి .రెండో అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి ఇద్దరిది రావి వారి పాలేమే . రెండేళ్ళ క్రితం పడమట హైస్కూల్ లో రామ లక్ష్మణా చార్యులు అనే తెలుగు పండితుల రిటైర్ మెంట్ సభలో అయన నాకు మొదట సన్మానం చేసి తర్వాత స్కూల్ వాళ్ళతో చేయిన్చుకొన్నారు అది ఆయన నాకు ఇచ్చిన గౌరవం స్నేహం .పైన చెప్పిన మొదటి అమ్మాయి అప్పుడు పెద్దావిడ గా కనీ పించి నా దగ్గరకు వచ్చి తాను మోపిదేవిలో నా దగ్గర చదువుకోన్నానని ,పాటలు నేర్పించి పాడిం చానని  తాను  తెలుగు పండిట్ చేసి ఇక్కడే రిటైర్ అయ్యానని గుర్తు చేసింది నా శిష్యులు రిటైర్ అవ్వటం నాకే ఆశ్చర్యం గా ఉంది .మోపిదేవి లో నేను మహా మంత్రి తిమ్మరుసు ఖైదు లో ఉండి పడే బాధను, రాజ్య రక్షణ గురించిన ఆలోచనలను ఏక పాత్రాభినయం గా రాసి ,నాన్చారయ్య అనే ముఖం మీద వెడల్పైన చుట్ట కాల్చిన గుర్తు గల పదవ తరగతి విద్యార్ధికి నేర్పి వేయించా అతను చాలా బాగా నటించి నాకు ,తనకి పేరు తెచ్చాడు .అలాగే భమిడి పాటి వారి ‘’అంతా ఇంతే ‘’నాటిక ను నేను విద్యార్ధులకు నేర్పి ,వేయించాను అందులో కొక్కిలి గడ్డ సుబ్బారావు అనే తొమ్మిదో తరగతి విద్యార్ధి చేత ‘’డొక్కా లంబోదరం ‘’పాత్ర వేయించాను .చాలా గొప్ప గా చేశాడు వేషం సరిగ్గా సరిపోయింది నల్లగా పొట్టిగా ఉంటాడు .ఆ తర్వాతా ఉయ్యూరు రెండు మూడు సార్లు వచ్చి ఆ నాటకం జ్ఞాపకం చేశాడు అతను కాంట్రాక్టర్ గా ఉన్నాడు .మిగిలిన పోర్షన్లు ఎవరు వేశారో గుర్తు లేదు ‘’పడవ పాట‘’ను నేను బి.యి.డి.చదువుతున్నప్పుడు ఒకతను మా కాలేజి లో గొప్పగా పాడేవాడు ఆ పాట గుర్తు పెట్టుకొని నేర్పించాను ఇందాక చెప్పిన ఆడ పిల్లలిద్దరూ బాగా పాడారు .ఇక్కడి నుంచి  నేను పని చేసిన ప్రతి స్కూల్ లోను ఈ విధ మైన సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించాను .భారతి అనే అమ్మాయి  అప్పడు చదివింది ఆమె మాతో పాటు మేస్టర్ర్ అయి స్పాట్ వాల్యుయేషన్ లో కనీ పించేది ఆమె బందరు మునిసిపల్ స్కూల్ హెడ్ గా పని చేసి రిటైర్ అయింది ఇప్పటికి కనీ పించినప్పడల్లా ఆ నాటి విద్యార్ధి గానే ఉంటుంది సంస్కారం అది ‘’జయ జయ ప్రియ భారత జనయిత్రి ‘’పాటను ఎప్పుడు కనపడ్డా గుర్తు చేస్తుంది .

                      ఘంటసాల గారి దర్శనం

                  స్కూల్ లో సుబ్రహ్మణ్య దేవాలయం పూజారి గారబ్బాయి సుబ్బయ్య చదివే వాడు అతని తండ్రిడ్రి ప్రఖ్యాత గాయకులూ స్వర్గీయ ఘంట సాల వెంకటేశ్వర రావు గారి మేన మామ .ఒక గారి ఘంట సాల పూజారి గారింటికి వచ్చారు సుబ్బయ్య ఆ విషయం మాకు తెలియ జేసి వారింటికి రమ్మన్నాడు మేము పర్మిషన్ తీసుకొని వెళ్లాం అప్పుడే ఆయన దేవాలయం లో దైవ దర్శనం చేసుకొని వీధి అరుగు మీద చాప మీద కూర్చున్నారు మేము వెళ్ళ గానే మమ్మల్ని ఆదరం గా పలకరించారు .సుమారు గంట సేపు వారితో వివిధ విషయాలను ముచ్చటిమ్చాం అన్నిటికి చక్కని సమాధానాలు చెప్పారు నేను ‘’మీరు ఇప్పటికే పేరు, ప్రఖ్యాతి, ధనమూ సంపాదించుకొన్నారు కదా .ఎవరైనా ఏ ఊరుకైనా పిలిచి కచేరీ చేయమంటే ఉచితం గా చేస్తారా ?’’అని అడిగాను .అప్పుడు వారు నవ్వుతు ‘’చూడు బాబూ ! చాలా కాలం నా బృందాన్ని తీసుకొని ఖర్చులన్నీ నేనే పెట్టుకొని అడిగిన చోట్ల కచేరీలు చేశాను వారిచ్చినా ఇవ్వక పోయినా దేశ మంతా తిరిగాను .కాని నా వయసు మీద పడుతోంది బృందమూ పెరిగింది వారి అవసరాలు పెరిగాయి నన్ను నమ్ముకొన్న వారు మరి నేను వారి సంగతి చూడాలి కదా నా కు అంటుఎమీ ఇవ్వక్కర్లేదుకాని వారికయ్యే ఖర్చులు భరిస్తే చాలు వెళ్లి వస్తున్నాను ‘’అన్నారు .వారితో సంభాషించే మహద్భాగ్యం మాకు కలిగిందని చెప్పుకొని గర్వ పడే వాళ్ళం .మా అదృష్టం .ఎవరికీ దక్కని అనుభవం మాది ఈ అరుదైన అదృష్టం కల్గించిన మా సుబ్బయ్య అభి నందనీయుడు .ఆ తర్వాత రెండు మూడు సార్లు ఆ దేవాలయానికి వెళ్లాను .సుబ్బయ్య కనీ పించి పలకరించి మాకు స్పెషల్ గా పూజ చేసే వాడు సుమారు పాతికేళ్ళ క్రితం అతను  పోయాడని తెలిసి బాధ పడ్డాం .ఘంట సాల పుట్టింది పేద కళ్ళే పల్లి దగ్గర టేకు పల్లి లో మేన మామ గారింట్లోనే .ఆ తర్వాత్ గుడివాడ దగ్గర ఇంకో మేనమామ గారింటి వద్ద పెరిగారు .

                     ప్రభావతి కాపురానికి రావటం

    మా వివాహం 1964 ఫిబ్రవరి ఇరవై ఒకటి న జారి గిందని ముందే చెప్పాను పెళ్లి అయిన నెల రోజుల్లోపే ప్రభావతి కాపురానికి వచ్చింది అప్పుడు మా కు ఉన్నది ఒకే ఒక మడత మంచం .దాని మీదే మా కాపురం .లెక్కల మేష్టారి భార్య కమలమ్మగారు మా ఆవిడకు మంచి దోస్తీ .బాగా కబుర్లు చెప్పుకొనే వారు ఆవిడ అత్తగారు మహా చిలిపిగా మాట్లాడే వారట సరదాగా ..కొత్తకాపురం కదా ఉడికించే వారట .మా మరదలు దుర్గ వేల్పు చర్ల నుంచి చూడ టానికి వచ్చింది కొన్ని రోజులుఉన్నది ..మా అమ్మ కూడా వచ్చింది మాపెళ్ళి అయిన నెల తర్వాత లొల్ల బాల కోటేశ్వర రావు గారు మాతో శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి కల్యాణాన్ని దేవాలయం లో చేయించారు నూట పదహారు రూపాయలు కడితే అన్నీ వాళ్ళే ఏర్పాటు చేసి కల్యాణం చేయిస్తారు అమ్మ కూడా వచ్చింది .ఇలా రోజుకొకరు చొప్పున నెల రోజులు చేశారు .మా అదృష్టం అది అనుకొంటాం ఇప్పటికి ..చల్ల పల్లి వెళ్లి సినిమాలు చూసే వాళ్ళం .ఒక సారి బందరు మధ్యాహ్నం వెళ్లి సాయంత్రం ఆట భాను తి రామా రావు ల సినిమా ‘’వివాహ బంధం ‘’చూసి రాత్రికి ఇంటికి చేరాం శివ గంగ దేవాలయం దర్శించాం .చిలకల పూడి పాండురంగ స్వామిని చూశాం..పెదప్రోలు నుండి వేల్పు చర్ల వెళ్ళేవాడిని ప్రభావతి పుట్టింటికి వెళ్ళినప్పుడు ,గర్భవతి గ ఉన్నప్పుడు .వెళ్ళేవాడిని .కోడూరు గుడివాడ బస్ ఎక్కి గుడివాడ దిగి అక్కడ ఎలూర్ బస్ పట్టుకొని ఎలూర్  వెళ్లి అక్కడ ప్రైవేట్ బస్ ఎక్కి వేల్పు చర్ల వెళ్ళేవాడిని ఒక సారి ఆలస్యం అయితే నాగయ్య గారి ‘’రామ దాసు ‘’సినిమా చూసి తెల్లారే దాక బస్టాండులో గడిపి ఫస్ట్ బస్ కు వెళ్ళాను అలాగే మేమిద్దరం వేల్పు చర్ల నుండి బస్ ఎక్కి వచ్చి ఎలూర్ లో సినిమా చూసి రాత్రికి హోటల్ లో పడుకొని ఉదయం వేల్పు చర్ల వెళ్లాం మా ‘’అత్తక్క గారు‘’బాగా చూసేది మా మామ గారు ఎప్పుడైనా ఎలూర్ బస్ నాతో పాటు ఎక్కితే తన టికెట్టు తాను తీసుకొనే వాడు .మోపిదేవి లో ఉండగానే మా పెద్దబ్బాయి శాస్త్రి పుట్టాడు .

                        ఇంకొందరు మేస్టార్లు

 

                   కే.శ్రీరామా మూర్తి అనే క్రాఫ్ట్ మేష్టారు మాతో కలిసే తిరిగే వారు కోమట్లు వ్యాపారం ఉండేది పెదప్రోలు నివాసి . మంచి మనిషి .రోడ్డు మీద పింగళి వారుండే వారు ఆయన రాజా గారి దివాణం లో పని చేసే వారు పింగళి లక్ష్మీ కాంతం గారి బంధువులే ఏలేశ్వరపు కృష్ణ మూర్తి గారనే బ్రాహ్మణులు రాజావారి పెర్సనల్ సెక్రెటరి .రాజా గారు ఏ హోదాలో ఉన్నా అంతా ఈయన చేతి మీదే నడిచేది త్రాన్స్ఫెర్ల దగ్గర నుండి పోస్టింగు దాకా అయన ప్రభావం ఉండేది వాళ్ళమ్మాయి అప్పుడు స్కూల్ లో చదివేది .ఆయన మేము పని చేస్తుండగానే చని పోయారు ఆయన అబ్బాయికి బందరు పీచు గారు అంటే చింతల పాటి వారి అమ్మాయి నిచ్చారు .అంటే బాలమ్మ గారి అమ్మాయి ..లెక్కల మేష్టారు గా మస్తాన్ రావు గారనే కమ్మాయన గుంటూరు జిల్లా వారు వచ్చారు .ఆయన పలుచని గ్లాస్కో పంచ కట్టే వారు డ్రాయర్ ఉండేది కాదు .లోపల అంతా కనీ పించేది గుంటూర్ యాస తో మాట్లాడే వారు ఆడ పిల్లలు ఇబ్బంది పడే వారు ఎవరో హెడ్ మాస్టర్ గారి దృష్టికి తెస్తే ఆయన కొంత కౌన్సెలింగ్ ఇచ్చి జాగ్రత్త పడేట్లు చేశారు ఆయన చివర్లో వి.కొత్తపాలెం హెడ్ గ పని చేశాడు నాకు మంచి ఫాను దోస్తీ .చల్ల పల్లి లో రాజ గారి కోట ఉంది .విశ్వనాధ పల్లి తిరుణాల చాలా ప్రసిద్ధ మైనది నేనెప్పుడు వెల్ల లేదు అప్పుడు విజయ వాడకు ఉదయం తోమ్మిది గంటలకో  బస్సు సాయంత్రం అయిదింటికో బస్సు ఉండేది అది అందకా పోతే వచ్చేదాకా పడిగాపులే నన్ను బస్సు ఎక్కిన్చేదాకా శ్రీరామ మూర్తి ,మాధవ నిలువు కాళ్ళ జీతం మీద ఉండే వాళ్ళు వాళ్ళ ఋణం నేను తీర్చుకోలేనిది .ఆ తర్వాత నేను అక్కడి నుండి వచ్చే ముందే బస్సులు పెరిగాయి .లేక పోతే పామర్రు దిగి అక్కడినుండి ఉయ్యూరు వెళ్ళాల్సి వచ్చేది రోడ్డు కూడా దారుణం గా ఉండేది .ఇన్ని కష్టాలున్నా ఉద్యోగం హాయిగా ఉండేది మంచి విద్యార్ధులు ,మంచి మేస్టార్లు మంచి హెడ్ మాస్టర్ నాకు చదువు చెప్పుకోవటానికి మంచి అవకాశం అన్నీ కుదిరాయి అందుకని నాకు ఇంకా ట్రాన్స్ఫర్ మీద ధ్యాస రాలేదు

                   కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్

          ఈ సంస్థ చాలా బలం గా ఉండేది కాకాని వెంకట రత్నం గారు పెంచిన సంస్థ తర్వాత పిన్నమనేని కోటేశ్వర రావు గారు కొల్లూరి కోటేశ్వర రావు గారి పోషణ లో బాగా వట వ్రుక్షమైంది .అప్పుడు ఆరిక పూడి పూర్ణ చంద్ర రావు గారనే భారీ పర్సనాలిటి ఉన్న హెడ్ మాస్టర్ పామర్రు హెడ్ గా ఉండే వారు తర్వాత పడమట కు వెళ్ళారు ఆయనే గిల్డు గిల్డు అంటే ఆయనే .అలా ఉండేది ఆయనంటే పి.శ్రీ రామ మూర్తి గారికి పడలేదు శ్రీరామ మూర్తి గారు టీచర్ ఏం ఎల్ సి గా చేసి మంచి పేరు పొందారు .పెద్ద మనిషి గా అందరు గౌరవించే వారు అయన పూర్ణ గారి పధ్ధతి నచ్చక గిల్డ్ ను స్వంతం చేసుకోవాలని చూశారు పామర్రు లో ఒక సారి సమావెశం జరిగి రాజీ ప్రయత్నాలు కుదర్లలేదు .తర్వాతా మొవ్వ హెడ్ మాస్టర్ ,తూమాటి వారు ప్రభాకర రావు గారనే సెకండరి మేష్టారు అంతా కలిసి బెజవాడ లో మళ్ళీ ఒక సమావెశం జరిపారు మినిట్స్ పుస్తకాన్ని ఎత్తుకు పోవటానికి ప్రత్యర్ధులు ప్రయత్నిస్తే ఈ వర్గం వారి ఆటలు సాగ నివ్వ లేదు అప్పుడు తూమాటి కోటేశ్వర రావు గారిని తాత్కాలిక అధ్యక్షుని గా చేశారని జ్ఞాపకం .మమ్మల్నందర్నీ తీసుకు వెళ్ళటం తీసుకు రావటం ఉండేది .తర్వాత ప్రభాకర రావు గారు అధ్యక్షులాయి నట్లు  లయి గుర్తు అయన నిడుమోలు లో సెకండరి ఉపాధ్యాయులు రూల్సు బాగా తెలిసిన వారని చెప్పుకొనే వారు .ఇంటిపేరు వేములపల్లి అని గుర్తు .గిల్డ్ వ్యవహారాల గురించే ఖాళీ సమయాలలో చర్చించు కొంటు ఉండే వాళ్ళం .మధ్యాహ్నం హోటల్ లో టీ త్రాగి స్కూల్ వెనక ఉన్న పి.డబ్ల్యు .వారి చిన్న ఆఫీస్ బిల్డింగ్ దగ్గర చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకొని ఫస్ట్ బెల్ కు స్కూల్ లోకి చేరే వాళ్ళం సాయంత్రాలు ఆడే వాళ్ళం బాద్ మింటన్ వాలీ బాల్ అక్కడే   నాకు అలవాటయ్యాయి రిటైర్ అయ్యేదాకా ఆడుతూనే ఉన్నాను మధ్యలో టేన్నికాయిట్ అనే రింగ్ టెన్నిస్ ,షటిల్ కూడా అలవాటయి ఆడను ..

                   సశేషం

                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-2-13-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శ్రీ సర్వజిత్ గారి నవలల ఆవిష్కరణ సభ –ఆహ్వానం

sree sarvajith navalala aavishkarana sabha (1)

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పంచమ సోమేపల్లి సాహితీ పురస్కారాలు

This gallery contains 58 photos.

More Galleries | Tagged | Leave a comment

సరసభారతి 42 వ సమావేశము ఆహ్వానము

సరసభారతి
సాహిత్య సాంస్కృతిక సంస్థ — ఉయ్యూరు  
 cropped-dscf1667
    42 వ సమావేశము                          ఆహ్వానము 
 
తేది, సమయము – 26-2-2013 మంగళవారము సాయంత్రము గం 6-30 నికు 
 
వేదిక –  శ్రీ సువర్చలాంజనేయ  స్వామి దేవాలయము – మహిత మందిరము 
 
ప్రసంగ  విషయము –  ప్రయాగ కుంభ మేళ విశేషాలు 
 
ప్రసంగించు వారు – 
 
ప్రయాగ (అలహాబాద్ ) త్రివేణి సంగం లో జరుగుచున్న“శ్రీ మహా కుంభ మేళ” లో శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద  స్వామి వారు నిర్వహించిన ” శ్రీ గీతా జ్ఞాన మహా యజ్ఞం” లో ప్రత్యక్షంగా పాల్గొన్న సరసభారతి కార్యదర్శి శ్రీమతి . మాదిరాజు శివలక్ష్మి,  సరసభారతి కార్య వర్గ సభ్యులు శ్రీ మాదిరాజు  శ్రీనివాస శర్మ మరియు దేశ  విదేశాలలో జరిగిన శ్రీమత్ భగవత్ గీత పోటిలలో పాల్గొని ఆనేక బహుమతులను సాధించిన (భగవత్ గీత ఫేం) చి. మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ లు తమ అనుభవాలను, కుంభ మేళా విశేషాలను వివరిస్తారు.  
 
సభాధ్యక్షులు — శ్రీమతి . జోశ్యుల  శ్యామలా దేవి – సరసభారతి గౌరవాధ్యక్షులు 
 
ఆత్మీయ అతిధి  Dr.దీవి  చిన్మయ – సరసభారతి ఉపాధ్యక్షులు 
 
సరసభారతి ఎర్పాటు చేసిన ఈ అరుదైన” ధార్మిక సాంస్కృతిక కార్యక్రమములో ”అందరు పాల్గొని మన సంస్కృతీ  వారసత్వాన్ని,  వైభవాన్ని తెలుసుకుని ధన్యులు కావలసినదిగా ప్రార్ధన
 
 

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

జోశ్యుల  శ్యామలాదేవి   మాదిరాజు శివలక్ష్మి     గబ్బిట వెంకట రమణ     గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు           కార్యదర్శి                    కోశాధికారి               అధ్యక్షులు – సరసభారతి

                                                                                  99890 66375

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నాదారి తీరు -7 నా బోధన–పెద్దల మెప్పు

     నాదారి తీరు -7

                          నా బోధన–పెద్దల మెప్పు

మోపిదేవి లో నా మొదటి ఉద్యోగం ‘’.ఫ్రేష్ ఫ్రం కాలేజి .’’సబ్జెక్టు లో పెద్దగా లోతులు తెలియవు .అందుకని చాలా  కష్ట పడి నేర్చి చెప్పాలి .లేక పోతే మా తెలుగు మేష్టారు అన్నట్లు ‘’వాసనేసి పోతాను ‘’.ఒళ్ళు జాగ్రత్త గా పెట్టు కోవాలి .అందుకని ఇంటి దగ్గర సబ్జెక్ట్ బాగా చదువు కొని ఒంటికి పట్టించు కొనే వాడిని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ చదివి జీర్ణించుకొని సబ్జెక్ట్ ను హస్త గతం చేసుకొన్నాను .అప్పుడు పిల్లలకు ప్రాక్టికల్స్ ఉండేవి నేను చాలా శ్రద్ధ తీసుకొని అందరికి అర్ధమయ్యేట్లు చెప్పి చేయించే వాడిని ఆది వారాలు కూడా క్లాసులు పెట్టె వాడిని పిల్లల్లో ఉత్సాహం పెరిగింది .టెక్స్ట్ బుక్ చూడ కుండా పాఠాలు చెప్పటం తో పిల్లల్లో మంచి క్రేజ్ వచ్చింది నా మీద .నోట్స్ బదులు కాలేజి లో ఇచ్చి నట్లు ముఖ్య మైన పాయింట్స్ చెప్పి రాయించే వాడిని అవి రాస్తే ప్రశ్నలకు సమాధానాలు సరి పోఎట్లున్దేవి .అందుకని నా నోట్స్ కు కూడా మంచి డిమాండ్ వచ్చింది క్లాస్ కు ఇన్ షర్ట్ ర్ట్ తో కాలేజి లో వెళ్లి నట్లు వెళ్ళేవాడిని అందుకని గౌరవమూ ,ఆకర్షణా పెరిగాయి .హెడ్ మాస్టర్  తూమాటి  కోటేశ్వర రావు గారు నేనంటే పరమ అభిమానం గా ఉండే వారు .ఎవరు స్కూల్ కు వచ్చినా నా గురించి వారి కి చెప్పే వారు నా బోధన ను ఆయన బాగా ప్రశంశించే వారు .ఇది నాకు లోపల సంతోషం గా ఉన్నా .దాన్ని నిల బెట్టుకోవాల్సిన బాధ్యత పెంచింది కనుక ఆ స్తాయి తగ్గకుండా ఉండాలని ఇంకా జాగ్రత్తగా బోధించే వాడిని .మిగతా టీచర్లు  కూడా నా మీదే  మంచి అభిమానం చూపే వారు కనుక ఇటు పిల్లల్లో మేస్తార్లలో నాకొక ప్రత్యెక స్థానం వచ్చింది

                        బాబు గారి దగ్గర ప్రశంస

    మొవ్వ జిల్లా బోర్డ్ హెడ్ మాస్టర్,బ్రాహ్మణులు అయిన  మొవ్వ వెంకట కృష్ణా రావు గారు ఒక సారి నేను చేరిన ఒక నెల లోపే మా స్కూల్ కు వచ్చారు .ఆయన కు నన్ను మా హెడ్ మాస్టర్ గారు పరిచయం చేస్తూ ‘’మా సైన్సు మేష్టారు చాలా బాగా పాఠా లు చెబుతారు .పిల్లలకు అయన క్లాసంటే మరీ ఇష్టం .బద్ధకం అనేది లేదు కుర్రాళ్ళ లో ఇలాంటి ఉత్సాహం ఉన్న్న వారిని నేనెప్పుడు చూడ లేదు ‘’అని చెప్పారు .ఆయన పెద్ద పేరున్న హెడ్ మాస్టర్ .ఆయన్ను అందరు ‘’బాబు గారు ‘’అని గౌరవం గా పిలిచే వారట .అదే మొదటి సారి నేను వారిని చూడటం .అయన సంతోషం తెలియ జేస్తూ ‘’కోటేశ్వర రావు !కొత్తలో అందరూ ఇట్లాగే ఉంటారు .ఒక ఏడాది దాటితే ఈ పొంగూ ,ఉత్సాహం నీళ్ళు కారి పోతాయి .మనం ఏం చేశాం జ్ఞాపకం లేదా “?అని తేలిగ్గా తీసి పారేశారు .వెంటనే మా హెడ్ మాస్టారు ‘’బాబు గారూ !ఇప్పుడు కాదు అయన సర్వీసు అంతా ఇలానే ఉంటారు నాది గారంటీ .మెతుకు చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పినట్లు ఈ నెల లోనే వారి సత్తా ఏమిటో నాకు తెలిసింది బోధనా అణకువా ,వినయం ,విధి నిర్వహణా ,గౌరవం అన్నీ ఉన్న వారు నాకు ఆయన మీద ఏమీ అనుమానం లేదు ‘’అని భరోసాగా  మాట్లాడి ఆయనకు సమాధానం చెప్పారు నా మీద మా హెడ్ మాస్టర్ గారికి ఒక్క నెలలో ఇంత సదభి ప్రాయం కలగటం దాన్ని బాబు గారు లాంటి పెద్దల సమక్షం లో ప్రశాసించటం నాకు మరీ ఆశ్చర్యం కలిగించి నన్ను నేను ఎప్పుడు కరెక్ట్ చేసుకోవటానికి వీలు చిక్కి ఆ స్తాయి బోధనా ,ప్రవర్తన నుండి ఒక్క సెంటి మీటర్ కూడాజారకుండా  నా సర్వీసు అంతా కాపాడుకో గలిగాను ఇది కోటేశ్వర రావు గారి అభిమానం .ఒక రకం గా ఆశీర్వాదం కూడా..నాకు మార్గ నిర్దేశం చేసినట్లయింది .అంత కంటే కొత్త గా ఉద్యోగం లో చేరిన వాడికి కావల్సిందేముంది ?అప్పుడు సైన్సు అంటే భౌతిక ,రసాయన శాస్త్రాలు జంతు వృక్ష శాస్త్రాలు పాఠాలుగా ఉండేవి అన్నీ ఒక్క మేస్టారే చెప్పాలి .అన్నీ బాగా ప్రిపేర్ అయి చెప్పేవాడిని పిల్లలకు ఆపి చదువులకు వెళ్తే ఉపయోగ పాడుతాయని తెలుగు పదాలకు ఆంగ్ల సమాన పదాలు కూడా చెప్పేవాడిని .అవసరమైతే ఇంగ్లీష్ లో కూడా బోధించేవాడిని సైన్సు ను .అది మరీ నచ్చేది విద్యార్ధులకు యెన్.ఎస్ ప్రసాద రావు పుస్తకమేఉండేది ..

                          నాకు మొదటి ఇన్ స్పెక్షన్–సీతారావమ్మ గారి తనిఖీ 

         నేను చేరిన రెండు నెలలకే సీతా రావమ్మా గారు అనే డి.యి.వో.స్కూల్ ఇన్స్పెక్షన్ కు వచ్చారు ఆమె అంటే అందరికి హడల్ అని చెప్పుకొనే వారు చాలా నిజాయితీ గా ఉండే వారని పేరు ..రూల్స్ అన్నీ బాగా తెలిసినావిడ అని అనుకొనే వారు .హెడ్ మాష్టారంటే ఆమెకు మహా గౌరవం ఆయన కూడా ‘’అమ్మా అమ్మా ‘’అంటూ భక్తీ చూపే వారు .ఆవిడ అన్ని క్లాసులు చూసే వారు దీన్ని తనిఖీ అంటారు .అన్ని సబ్జెక్టులు చూసే వారు లెక్కలు తెలుగు అంటే ఆమెకు అభిమానం .నాక్లాస్ కు రమ్మ మని నేను కోరాను భయం లేకుండా ‘’నువ్వు కొత్తగా వచ్చావు .నీ క్లాస్ చూడన్లె ..అంత అవసరం లేదు నీ క్లాసులకు వెళ్లి సబ్జెక్టు చెప్పుకో ‘’అన్నారు .నేను వెనక్కి తగ్గకుండా ‘’అమ్మా ! నా ఖాళీ పీరియడ్లలో మీరు ఇన్స్పెక్షన్ చేసే క్లాస్ లకు వచ్చి కూచోవటానికి పర్మిషన్ ఇస్వ్వండి ‘’అన్నాను ఆవిడ నవ్వుతు ‘’సరే నీ ఇష్టం‘’అంది అలాగే ఆమె వెంట క్లాస్ లకు వెళ్లి వెనక బెంచి లో కూర్చుని ఆమె వేసే ప్రశ్నలు మేస్టార్లు బోధించే తీరు ఆకళింపు చేసుకొన్నాను .ఒకో సారి ధైర్యం గా పిల్లల్ని ఆవిడ బదులు నేనే ప్రశ్నించే వాడిని ఆవిడా నవ్వుతు నా చొరవ కు ఆనందించేది .ఇది నాకు మరీ హుషారు నిచ్చింది .రెండు రోజుల ఇన్స్పెక్షన్ .రోజు బందరు నుంచి వచ్చేది అసెంబ్లీ నుండి అన్నీ చూసేది నేను పిల్లలతో చార్టులు వేయించాను ప్రాక్టికల్స్ చేయిన్చినవన్నీ రికార్డ్ రాయించి ఆవిడాతనిఖీ కి పెట్టాను అన్నీ చూసింది చిన్న  తెలుగు మేస్టారు అదే ‘’వాసన మేస్టారు ‘’క్లాస్ కు వెళ్లి ఆయన పద్యం బోధించే తీరుకు చదివే విధానానికి అత్యాస్చర్య పోయింది భలే మెచ్చింది స్టాఫ్ మీటింగ్ సమయం లో .రెండు రోజులు సరదాగా గడిచి పోయాయి స్కూల్ అన్నిటా ముందు ఉంది అని హెడ్ మాస్టార్ని ప్రశంసించింది .

               వాసన మేస్టారి నాన్న గారు గొప్ప సంస్కృత పండితులు .శివాలయం లో ఉండి అభిషేకాలు అవీ చేయించే వారు గోపాల కృష్ణ కు పిల్లలు లేరు యెర్రని కుంకుమ నుదుట పెట్టుకొనే వాడు .మేమిద్దరం ఖాళీ పీరియడ్ లలో కలిసి నప్పుడు సాహిత్యం గురించే మాట్లాడుకొనే వాళ్ళం అయన సాహితీ నిధి అని అని పించింది నాకు .ఒక సారి ఏదో ప్రస్తావన లో మను చరిత్ర లో పెద్దన గారి ‘’పూత మేరుమ్గులున్ ‘’అన్న పెద్ద పద్యం విషయం వచ్చింది నీకోచ్చా ఆపద్యం అని అడిగా రాదన్నాడు నాకూ రాదన్నాను అయితే ఒక వారం లో మనం దాన్ని సాధన చేసి బట్టీ పట్టుదాం అన్నుకోన్నాం ఇద్దరం రోజూ చదువు కొనే వాళ్ళం వారాని కంటెముందే ఆ పద్యం నాకు కంఠతా వచ్చేసింది ఆయనకు నాకంటే ఆలస్యం గా వచ్చింది .అప్పుడు ‘’బలే వాసనేశావ్ తెలుగు మేస్తర్ కంటే ముందే నేర్చాశావ్ .అందుకే నువ్వంటే నాకు ఇష్టం‘’అన్నాడు నన్ను అభి నందిస్తూ ఆ ఉత్పల మాలా దీర్ఘ పద్యం నిద్ర లేపి అడిగినా చెప్పగలిగే వాణ్ని ఆ తర్వాతా .ఇది ఆయన చలవే .ఆ పోటీ లేక పోతే అది నోటికి వచ్చేది కాదు ఆయన్ను ‘’నీకు రాకుండా నాకు ముందు ఎలా వచ్చిందో ఆశ్చర్యం నువ్వు కావాలనే అశ్రద్ధ చేశావ్ ‘’అన్నాను కాదని తనకంటే నేను లేత కనుక వెంటనే వచ్చిందని  తనకేమీ బాధ లేదని ఆనందం గా ఉందని అన్నాడు అతను సిగరెట్లు బానే పీల్చేవాడు క్లాసు అవటం ఆలస్యం దమ్ము కొట్టే వాడు అసలే నలుపు .పెదిమలు ఇంకా నల్ల బడేవి పొగకు .అలా మా స్నేహంగట్టి పడింది .పెద్ద తెలుగు మేస్టారు రామ క్రిష్నయ్య గారికి ఈయన తో చనువుగా ఉండటం నచ్చేది కాదు .ఆయన పెద్దగా సాహిత్య విషయాలు మాట్లాడే వాడు కాదు ఇక్కడే కాదు ఆ తర్వాతా నేను పని చేసిన ప్రతి స్కూల్లో ను తెలుగు మేస్తర్లె నాకు ఆప్తులయ్యే వారు .గోపాల కృష్ణ నేను అక్కడి నుండి వచ్చిన తర్వాతా ప్రొమోషన్ పొంది సీనియర్ తెలుగు పండిట్ గా ఏంటి.రామా రావు ఊరు నందమూర్ హైస్కూల్ లో పని చేశాడు రామా రావు కొడుకు హరికృష్ణ ఈయన విద్యార్ధి అని చెప్పేవాడు అతనితో డ్రామాలు వేయించే వాడినని చెప్పాడు .

                      వెంకయ్య గారి ఇన్స్పెక్షన్ –బూజు పాఠం

     సీతారావమ్మ గారి తర్వాత పి. వెంకయ్య గారు అనే ఆయన డి.యి.వో.గా వచ్చారు .ఈయనకూ మంచి పేరుంది మూతి తమాషా గా ఉండేది నల్లగా ఉండే వారు సీతా రావమ్మ గారు చీరే తో ఉండేవారు ఈయన కోటు బూటు తో ఉండేవారు రెండో ఏడాది వెంకయ్య గారు ఇన్స్పెక్షన్ కు వచ్చారు అప్పుడే బందరు అతను వావిలాల వారబ్బాయి సోషల్ కు ఇక్కడికి వచ్చి చేరాడు మనిషి చూడటానికి స్పోటకం మచ్చలతో వికృతంగా ఉండే వాడు బోధనా సరిగ్గా ఉండేది కాదు .మాట విని పించేది కాదు తనకి తెలీకుండా ఇక్కడికి వచ్చాడని హెడ్ మాస్టర్ గారికి ఆయన మీద కోపం .ఎలాగైనా డి.యి.వో.తో అయన క్లాస్ కు రప్పించి అభాసు చేయాలని కోటేశ్వర రావు గారు అన్ని రకాల పన్నాగాలు పన్నారు .కానీ వాళ్ళ నాన్న బందరు లో పెద్ద పేరున్న లాయర్ .మాకు బంధువులు .ఆయన ఉయ్యూరు వస్తూండే వారు వెంకయ్య గారిని బందర్లో ముందే కలిసి కొడుకు సంగతి చెప్పి జాగ్రత్త పడ్డారు .నేనూ ఇక్కడ అతనికి బాసట గ నిల బడ్డాను .ఎంత ప్రయత్నం చేసి ఈయన క్లాస్ కు తీసుకు వెళ్దామని ప్రయత్నించినా వెంకయ్య గారు నవ్వుతు దాటేసి వేరే క్లాస్ లకు వెళ్ళే వారు అసలు ఆయన్ను చూడకుండానే ఇంకో సోషల్ మేస్తర్ క్లాస్ చూసి అయిందని పించి హెడ్ గారికి దిమ్మ తిరిగేట్లు చేశారు ఈయన నిప్పు తొక్కిన కోతి లా గంతులు వేస్తూనే ఉన్నారు .అదీ అధికారి చాకచక్యం ..

           వెంకయ్య గారి తనిఖీ లో నేను ‘’బూజు ‘’పాఠం’’ను ఎస్ ఎస్ ఎల్ సి క్లాస్ కు . ఆయన పరమానందం పొందారు నన్ను బాగా మెచ్చారు .స్టాఫ్ మీటింగ్ లో మాట్లాడుతూ కూడా నన్ను గురించి మంచి మాటలు చెప్పటం హెడ్ మాస్టారికి ఆనందం కల్గించింది కొంత కాలానికి ఈ వావిలాల సోషల్ మేస్తార్ని ట్రాన్స్ఫర్ చేయించేశారు తూమాటి వారు .ఒక లేడి విజయ లక్ష్మి అనే ఆవిడ వచ్చింది తర్వాతా కైకలూర్ నుండి గోపాల కృష్ణమూర్తి  అనే అయన వచ్చాడు ఈయన సరదా మనిషి ఆవిడ మంచి మనిషి .ఇలా నా కు అక్కడ ఉండగా రెండు సార్లు ఇన్స్పెక్షన్ జరిగింది .

                          పరీక్ష

        తొమ్మిదో తరగతి చదివే రావివారి పాలెం ఆర్.ఏం.పి.బ్రాహ్మాణ డాక్టర్ గారి చెల్లెలు .ఎందుకో రోజు క్లాస్ కు వెళ్లి నప్పుడు బయటా నవ్వుతు ఉండేది చనువు గా దగ్గరికి రావటానికి ప్రయత్నించేసెది.నేనేమీ చనువు ఇవ్వలేదు .ఒక సారి ఒక కవర్ లో’’ ప్రేమ లేఖ ‘’రాసి పోస్ట్ చేసింది నాకు ముచ్చెమటలు పట్టాయి .ఏం చేయాలో తోచలేదు .రామణా రావు గారు నా అంత రంగికులు ఆయన తో రహస్యం గా చెప్పాను .ఆయనా కంగారు పడ్డారు ఇది అందరికీ తెలిస్తే నాకే కాదు ఆ అమ్మాయికీ ప్రమాదం .అని మేమిద్దరం శర్మ గారికి చెప్పాం .ఆయన కంగారేమీ పడ వద్దని ఆ అమ్మాయి అన్నగారు తనకు చాలా కాలం గా తెలిసిన వారేనని మనముగ్గురం ఒక రోజు వాళ్ళింటికి వెళ్లి ఆయనతో చెబుదామని భరోసా ఇచ్చారు సరే నన్నాం .ఒక ఆదివారం మేము ముగ్గురం సైకిళ్ళు వేసుకొని రావి వారి పాలెం వెళ్ళాం. డాక్టర్ గారు మమ్మల్ని సాదరం గా ఆహ్వానించారు కాఫీలు ఇచ్చారు అప్పుడు నెమ్మదిగా శర్మ గారు ఆ అమ్మాయి రాసిన ఉత్తరం సంగతి చెప్పారు ఆయన ఆశ్చర్య పడ్డారు అయితే శర్మ గారు చాలా లౌక్యులు ఆ అమ్మాయికి ఈ విషయం చెప్ప వద్దని మేము మామూలుగా వచ్చినట్లే నని అనుకోనేట్లు చేయమని చెప్పి ఆ అమ్మాయి రాసిన లేఖ ను ఆయన చేతిలో పెట్టారు .అయన చదివి ముఖం చిన్న బుచ్చుకొని తన కుటుంబం పరువు కాపాడి బజారున పడ కుండా చేసిన మ ముగ్గురికి కృతజ్ఞత చెప్పారు ఇక నుండి ఆమెను జాగ్రత్త గా కనీ పెట్టి ఉంటానని ఈవిషయాలేవీ తనకు తెలియనట్లు గానే ఉంటానని చెప్పి మా ఎదుటే ఆమె రాసిన ఉత్తరాన్ని చించి పారేశారు కవరు తో సహా..హమ్మయ్య అనుకొన్నాం .శర్మ గారి తెలివికి మేమందరం ఆశ్చర్య పడ్డాం ఈ విషయం ఎవ్వరికీ మాకు తప్ప తెలీకుండా జాగ్రత్త పడ్డం ఇలా ఒక కఠిన పరీక్ష నుంచి నన్ను గట్టున పడేశారు శర్మ గారు .ఆయన ఋణం తీర్చుకో లేనిది .ఈ ఉదంతం తో శర్మ గారికి నా మీద బోలెడు అభిమానం కలిగింది మరీ దగ్గిరయ్యాను అయన చెల్లెలు దుర్గ అనే అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయాలనే కోరిక ను ఒక సారి తెలియ జేశారు నేను నాకు మేన మామ కూతురు ఉందని మర్యాదగా చెప్పి ఆ విషయం లో ఇక ముందుకు వెళ్ళకుండా చేశాను అయినా అలాచెప్పి నందుకు ఆయన సంతోషించి స్నేహం పెంచుకొన్నారు కాని తుంచు కోలేని సంస్కారం శర్మ గారిది అలాంటి వారు దొరకటం నా అదృష్టం .ఆ తర్వాతా శర్మ గారికి హెడ్ మాస్టర్ గా ప్రొమోషన్ వచ్చి వెళ్ళారు పడమట హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు .కృష్ణ జిల్లా గిల్డ్ ప్రెసిడెంట్ ను చేశాం ఆయన్ను .ఆదర్శ వంతమైన హెడ్ మాస్టర్ గా పేరు పొందారు శర్మ గారు . అ నేను స్కూల్లో చేరక ముందే కుటుంబ శాస్త్రి అనే లెక్కల మేష్టారు జూనియర్ కాలేజికి పింగళి అయన ,హెడ్ గా మా ఇంటి ఓనర్ గోపాల కృష్ణ మూర్తి గారు లెక్చరర్ గా మార్కండేయులు గారు హెడ్ గా ప్రొమోషన్ మీద వెళ్లి పోయారు వీరంతా దిగ్దంతులని పేరు పొందిన వారే మార్కండేయులు గారు నూజివీడు హెడ్ గా పని చేసి రిటైర్ అయారు .వాళ్ళబ్బాయి అమర్ నాద్ మా  అబ్బాయిలకు లెక్కలు చెప్పేవాడు ఒల్లో లేకలాల్ ప్రైవేట్ మేస్తర్ గా బాగా పెఉ ,డబ్బూ సంపాదించాడు డిగ్రీ ,ఇంటర్ లకు బాచీలు బాచీలుగా తూషణ్ చెప్పాడు .అమ్మాయిలూ మాకు బాగా పరిచయం ఆయన గుర్రప్పందాలలో డబ్బు కాసే వాడని పేకాడే వాడని ప్రసిద్ధి నస్యం పీల్చేవాడు .పింగళి అయన తో కూడా కొంత పరిచయం .

             సశేషం

                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్—23-2-13- ఉయ్యూరు 

 

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -6 మోపిదేవి సర్వీసు విశేషాలు

    నా దారి తీరు -6

               మోపిదేవి సర్వీసు విశేషాలు

 మొదటి సారిగా ఉపాధ్యాయ ఉద్యోగం లో చేరాను .నేను వెళ్లి జాయినవబోతు ఉంటె హెడ్ మాస్టర్ కోటేశ్వర రావు గారు ,సెకండరీ మేష్టారు కావూరు చిదంబర రావు గారు వరండాలో పోట్లాడుకొంటున్నారు .అది వారికీ మామూలే అని తెలిసింది .చిదంబర రావు గారు రావి వారి పాలెం అనే దగ్గర ఊరి వారు .మోతు బరి రైతు .ఎడ్లను బాగా మేపెవారు .చాలా సార్లు వారి ఎడ్ల జతకు ప్రధమ బహుమతి వచ్చింది .ఖద్దరు పంచ ,లాల్చి తో వచ్చే వారు హంబార్ సైకిల్ ఉండేది ఆయన తోడల్లుడే కావూరు  రామ క్రిష్నయ్య గారు మోతుబరి రైతు మరియు సీనియర్ తెలుగు పండితులు  .చాలా వెడల్పు ముఖం తో పంచ లాల్చీ తో వచ్చే వారు ఇస్త్రీ లేకుండా నీరుకావి బట్టలు కట్టే వారు .టీచర్ గా మంచి పేరుంది .చిన్న తెలుగు పండితులు నల్లగా ఉండేకూచి భోట్ల గోపాల కృష్ణ మూర్తి గారు గ్లాస్కో పంచ ,చొక్కా తో గుండీలు లేకుండా బె ఫర్వాగా ఉండే వాడు మాంచి సాహితీ సంపన్నులు .నాకు మహా దోస్తీ .ప్రతి దానికి ‘’వాసన ‘’అనే వారు .’’వాసనేసి పోయింది’’ ‘’ఏమిటీ వాసనా’’ అని ఎప్పుడూ నోటంట మాట వచ్చేది మేము ఆయన్ను ‘’వాసన మేష్టారు ‘’.అనే వాళ్ళం .పద్యాలు చాలా శ్రావ్యం గా పాడే వాడు రామకృష్ణయ్య గారికి పద్యం పాడటం వచ్చేది కాదు .అందుకని గోపాల కృష్ణ కు ఈయనంటే అలుసు ‘’ఏమిటండీ ఆయన పద్యం వాసనేస్తోంది‘’అనే వాడు మాతో

        స్కూల్ లో సీనియర్ ఉపాద్యాయులు వేమూరి  శర్మ గారు బాగా సంపన్నబ్రాహ్మణులు పెదప్రోలు నివాసి .పరిచయం అవగానే మా మనసు లాగేశారు .సరదాగా మాట్లాడే వారు గ్లాస్కో పంచ ,లాల్చీ వేసేవారు .ముందు రెండు పళ్ళు కొంచెం వెడల్పు గా ఉండేవి నవ్వు తుంటే సందడి గా ఉండేది .ఆయన వారింటికి తీసుకొని వెళ్లి భోజనం టిఫిన్లు పెట్టేవారు .ఆయన్నే ఫాస్ట్ అసిస్టెంట్ అంటారు అదేమిటో నాకు చేరినప్పుడు తెలీదు నెమ్మదిగా తెలిసింది .ఒక వారం రోజులు వారి ఇంటిలోనే న రాజ భోగాలనుభవిన్చాం నేనూ లెక్కల మేష్టారు జే.వి.రమణ రావు గారు .రామనణా రావు గారి తండ్రి గారు డి.యి.వో.ఆఫీస్ లో కాంప్ క్లెర్క్ గా పని చేసి రిటైర్ అయారు .బక్క పలచటి మనిషి .లెక్కల మేస్టారి కి అప్పటికే పెళ్లి అయింది .నా కంటే ఒక ఏడాది సీనియర్ .గంపల గూడెం నుంచి బదిలీ మీద ఇక్కడికి వచ్చారు .నేను ఆయన కలిసి పెదప్రోలు లో పెదప్రోలు గోపాల కృష్ణ మూర్తి గారి డాబా ఇంట్లో అద్దేకున్నాం .ప్రక్క ప్రక్క పోర్షన్లు .ఆయనది తూర్పు ద్వారం నాది దక్షిణ ద్వారం .ఒక గది ,ఒక వంటిల్లె .పైన డాబా కు మెట్లున్నాయి సాంబశివరావు, రాధాకృష్ణ మూర్తి ఈ ఇంటి ఓనరు అన్నదమ్ములు పొలాలన్నీ సాంబశివరావు గారే చూసే వారు బాగా సంపన్న కుటుంబం .అన్నదమ్ముల డాబాలు ఒకే వరుస లో ఉండేవి ..

       ఒక వారం శర్మ గారి ఆతిధ్యం తర్వాత నేను ,రమణ రావు గారు కాపురాలు పెట్టాం .నేనప్పటికి ఏక్ నిరంజన్ పెళ్లి కాలేదు .ఆయన భార్య కమలమ్మ గారితో కాపురం పెట్టాడు ఆమె సరదా మనిషి మా ఇద్దర్ని అన్నదమ్ములని ,కృష్ణార్జునులు అని అనుకొనే వారు .ఇద్దరం సైకిల్ మీద మోపి దేవికి వెళ్ళే వాళ్ళం కలిసి వచ్చే వాళ్ళం .నేను వంట చేసుకొనే వాడిని .నాకు సహాయం అడవి శ్రీరామ మూర్తి, చిన్న కారణం గారిఅబ్బాయి కృత్తి వెంటి  మాధవరావు .ఇద్దరు తోమ్మిదోక్లాస్ చాలా కలివిడి గా ఉండే వారు మాధవ చిలిపి .శ్రీరామ మూర్తి పెద్ద మనిషి గా ఉండే వాడు ఇంటి పనులన్నీ వాళ్ళే చేసే వారు నేను ఊరికే చూడటమే .గిన్నెలు తోమే వారు .పక్క వేసే వారు కాఫీ పెట్టి ఇచ్చే వారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మళ్ళీ పనులు మామూలే కుంపటి బొగ్గుల మీద వంట .నేను రామణా రావు గారు కలిసి ట్యూషన్ చెప్పాం .ఆయన లెక్కలు నేను సైన్సు మిగిలిన సబ్జెక్టులు సోషల్ ను శర్మ గారు చెప్పే వారు .జనం బానే ఉన్నారు కష్టపడిచెప్పే వాళ్ళం శర్మ గారి నాన్న గారు అమ్మ గారు ఉన్నారు చాలా ఆహితాగ్నులు వారు .వృద్ధ దంపతులు .శర్మ గారి తమ్ముడు నా పేరు వాడే ఒకడు స్కూల్లో చదివే వాడు .మా ఇంటికి ఎదురు గా గొల్ల వారుండే వారు నాంచారమ్మ పాలు పోసేది బానే ఉండేవి. వెన్నా నెయ్యి వాళ్ళదగ్గరే .ఆమె భర్త కోటయ్య,కొడుకు కోడలు అంతా కలిసే ఉండే వారు .మా వీధిలోనే హిందీ మేష్టారు లక్ష్మీ నారాయణ గారు అత్తారింట్లో ఉండేవారు ఎప్పుడూ ముక్కు పొడి పీలుస్తూఉండే వారు .వేమూరి గోపాల కృష్ణ మూర్తి సెకండరి టీచర్ .ఇక్కడే కాపురం .అయన వక్క పొడి పోట్లాలకు పొట్లాలు నవిలే వాడు మాకూ పెట్టె వాడు నస్యం బాగా పీల్చే వాడు హిందీ మేస్టారిని బావా అనే వాడు సరదా మనిషి మంచి పార్టీలు చేసే వాడు రూపాయికి వెనకాడే వాడు కాదు .

       పెదప్రోలు లోనే కృత్తి వెంటి లక్ష్మీ నరసింహా రావు అనే సెకండరి మేస్తర్ మాకు దోస్త్ .మేము ముగ్గురం కలిసి సాయంత్రాలలో చెరువు ఒడ్డుకో ,కాలవ గట్టు లకో వెళ్లి కూర్చుని కబుర్లు చెప్పుకొనే వాళ్ళం మంచి హాస్య ప్రియుడు బలే సరదా గా మాట్లాడే వాడు నల్లగా ఉన్నా మంచి ఆకర్షేనీయ ముఖం వాళ్ళమ్మాయి మా దగ్గిర ప్రైవేట్ చదివింది .నళినీ జయంత్ అనే మండవ వారమ్మాయి కూడా ట్యూషన్ చది వేది .కమ్యూనిస్ట్ నాయకుడు మండవ వెంకటేశ్వర రావు ఆయన ఒకాయన నల్లగా ఉండేవాడు ఆయన కూతురు స్కూల్లో చదివింది .ఆయన బాగా లిటరేచర్ చదివిన వాడని చెప్పుకొనే వారు .కరణం గారబ్బాయి సాయి కూడా మా దగ్గిరే చదివాడు .హిందీ చెప్పే ఒకావిడ ఆవిడ భర్త కూడా ఆ ఊళ్ళో పేరు పొందారు .యార్ల గడ్డ బాల గంగాధర రావు గారు సెకండరి పాసై ఉద్యోగం లేకుండా ఉండేవారు సాయంత్రాలు మాతో కలిసే వాడు అయన తర్వాతా ఏం ఏ.తెలుగు పాసై లెక్చరర్ అయి నాగార్జున వర్సిటి లో చేరి క్రమం గా దోణప్ప గారి శిష్యుడై గ్రామ నామాల మీద రిసెర్చ్ చేసి ఆచార్య పదవినలన్కరించారు నాతో ఇప్పటికి ఫోన్ లో సంభాషిస్తారు కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించే కార్య క్రమాలలో ప్రముఖ పాత్ర వహిస్తారు తన పుస్తకాలన్నీ నాకు పంపారు నేను మన సరస భారతి ప్రచురణలు వారికి పంపాను .

      వంట పని చేయటం బద్ధక మైతే అడవి శ్రీ రామ మూర్తి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళే వాడు అతఃని అమ్మగారు నాకు స్కూల్ సమయానికి వంట చేసి భోజనం పెట్టె వారు రాత్రిళ్ళు  కూడా వారిన్ట్లోనే భోజనం అతని తండ్రిది పెద కళ్ళే పల్లె వేటూరి సుందర రామ మూర్తి గారి తో ఆ కుటుంబానికి సంబంధం ఉంది .వంట గండం గడిచి ఇట్లా కాల క్షేపం చేసేవాడిని ఏదో వారికి ఇచ్చే వాడిని .నేనిచ్చిన్దేమీ లెక్క లోకి రాదు ఆమె నన్ను మాత్రు వాత్సల్యం తో చూసి పెట్టిన అన్నం  విలువ నేను కట్టే సమర్దుడిని కాను .ఆమె నాకు అపర అన్న పూర్నా దేవి వీరి కుటుంబం చాలా పేదరికం లో ఉండే ది.మా అమ్మ ఒక సారి పెదప్రోలు వచ్చి ఆమె గర్భవతి అని తెలిసి మందులు ఇప్పించిందట ఆవిడే ఈ మధ్య ఉయ్యూరు రాత్రి కంటి హాస్పటల్ లో కంటి ఆపరేషన్ చేసుకోవా టానికి వచ్చినప్పుడు నాకు తెలిసి ఆ అన్న పూర్ణమ్మ ను చూసి నప్పుడు ఆమె చెప్పారు .ఆవిడను చూసి దాదాపు యాభై ఏళ్ళయింది ఆరోగ్యం గా శ్రీ రామ మూర్తి దగ్గర కప్తాను పాలెం లో ఉంటున్నారావిడవిడ స్కూల్ ఫీజులు కట్టేవాడిని మాధవ్ కుటుంబానికి ఏమీ ఆధారం లేదు తండ్రి సర్వ్ చేసే చిన్న కారణం ఆయన ఏదైనా సంపాదించి తెస్తేనే పొయిలో పిల్లి లేచేది అంతా బాధ పడే వారు అయినా ఎవ్వరని యాచించే వారు కాదు .అభిమాన వంతులు మా ఇంటి ప్రక్కనే ఉండే వారు తాటాకుల పాక అదే వారి ఆస్తి పిల్లలు ఎక్కువే .ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడెమి కార్య దర్స్ది అయిన కృత్తి వెంటి శ్రీనివాస రావు మాధవ్ తమ్ముడే మా ఇళ్ళల్లో చిన్నప్పుడు తిరిగిన కుర్రాడే మాధవ్ టెన్త్ తప్పి బొంబాయి వెళ్లి అందర్నీ పైకి తీసుకొచ్చాడు .ఇప్పుడు వాళ్లకు మిగి లింది ఆ పాక మాత్త్రమే .

         స్కూల్ లో మండవ లక్ష్మయ్య గారు శోభనాద్రి గారు అనే ఇద్దరు డ్రిల్లు మేస్టార్లు ఉండే వారు లక్ష్మయ్య గారు బలే సరదా మనిషి పాంటు షార్ట్ వేసే వాడు శోభనాద్రి గారు పంచా లాల్చి తో ఉండేవారు హెడ్ మాస్టర్ కు కుడి భుజం సర్వీస్ రూల్స్ అన్ని క్షున్నం గా  గా తెలిసిన వాడు ఆఫీస్ వర్క్ లో సాయం చేసే వారు కోటేశ్వర రావు గారికి ఆయన మాటంటే గురి. కోటేశ్వర రావు గారి చేతుల్లో ఎప్పుడు తాళం చెవుల గుత్తి ఉండేది .ఖద్దరు పంచ లాల్చి ఉత్తరీయం తో మహా దర్జాగా ఉండే వారు .డ్రిల్ మేస్టార్లు మమ్మల్ని సాయంత్రం బాద్మింటన్, వాలీ బాల ఆడించే వారు మొదటి సారిగా ఆటలు ఆడటం ఇక్కడే ప్రారంభ మైంది .అందులో లక్ష్మయ్య గారు రెండిటి లోను గొప్ప ప్లేయర్ .షాట్ట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే .మమ్మల్ని ప్రోత్సహించి ఆడించే వారు .నాగాయ లంక లో జరిగిన గ్రిగ్ స్పోర్ట్స్ కు వెళ్లి ఆడాం .అప్పుడు హెడ్ మోచర్ల పూర్ణ చంద్ర రావు గారు అనే బ్రాహ్మిన్ .చాలా రాయసం గా ఉండే వారు .తర్వాతా అయన పామర్రు హెడ్ అయితే నేను అక్కడ సైన్సు అసిస్టంట్ గా పని చేశా .ఒక బ్రాహ్మాణ ఇంట్లో మాకు భోజనం ..ఏదైనా గెలిచామో లేదో గుర్తు లేదు .

          అవని గడ్డలో వారానికో సారి సంత జరిగేది స్కూల్ నుంచి సరాసరి వెళ్లి కూరలు కొని తెచ్చుకొనే వాళ్ళం నేనూ రామణా రావు గారు ఆయన తలి దండ్రులు బందరు నుండి తరచు వచ్చి వెళ్ళే వారు ఆవిడ మంచి మాటకారి .ఒక సారి కృష్ణా నదికి వరదలు వస్తే అంతా కలిసి చూడటానికి వెళ్లాం పులిగడ్డ దగ్గర ఆక్విడేక్ట్ గొప్ప వండర్ .సెకండరి ఉపాధ్యాయ్లోకాయన కారు నలుపు లో ఉండేవారు బల్కక పలచ మనిషి మంచి లిటిగెంట్ .వాళ్ళమ్మాయి స్కూల్లో చదివి తర్వాతాతెలుగు  టీచర్ అయింది .మండల రామా రావు లోకనాద రావు లు గుమాస్తాలు ఒక నల్లని కుంతీ అతను లైబ్రేరియన్ .భాస్కర రావు అనే క్రిస్టియన్ లాబ్ అసిస్టంట్ .చాలా సహకరిగాస ఉండే వాడు నాకు ప్రాక్టికల్స్ చేయటం లో సహాయం చేసే వాడు నా ట్రాన్స్ ఫర్ కోసం సహాయ పడ్డాడు కూడా .కోటయ్య అని కుమ్మరి లావు గా ఉండే వాడు అటెండర్ నైట్ వాచ్ మాన్ నల్ల గా ఉండే పొడుగాటి అతను చాకలి అని గుర్తు .అంతా కలివిడి గా ఉండే వాళ్ళు కొతయ్యకు ఆరు వెళ్ళు చేతికి అదృష్ట వంతుడనే వాళ్ళు అతని కొడుకు నేను  వత్స వాయిహెచ్.ఏం.గా ఉండగా   అటెండర్ గా వచ్చాడు

  సశేషం

        మీ –గబ్బిట.దుర్గా ప్రసాద్ –22-2-13-ఉయ్యూరు

         . .

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -5 శ్రీ శైల సందర్శనం –టీచర్ ట్రెయినింగ్ -సైన్సు మేస్టర్ గా ఉద్యోగం

నాదారి తీరు -5

         శ్రీ శైల సందర్శనం –టీచర్ ట్రెయినింగ్ -సైన్సు మేస్టర్ గా ఉద్యోగం

                   రాజమండ్రి ట్రెయినింగ్   

  బందరు హిందూ కాలేజి ,విశాఖ మెడికల్ కాలేజీ లలో దిమాన్స్త్రేటర్ ఉద్యోగాలతో 1962 వరకు సరి పోయింది . రాజ మండ్రి ప్రభుత్వ ట్రేయినింగ  కాలేజి లో చేరటానికి అప్లికేషన్ పెట్టాను సీటు వచ్చింది .సైన్సు లెక్కలు తీసుకొన్నాను .ఆయేడాదే షార్తెండ్ బి.యి.డి.కూడా వచ్చింది హాస్టల్ లో ఉన్నాను చాలా సరదాగా గదడి చింది నా రూమ్ మేట్ రెడ్ది గారు గుంటూర్ జిల్లా వాడు నాకంటే పెద్ద వాడు సరదాగా ఉండే వాడు నాగేంద్ర నాద్ అనే కాకినాడ కుర్రాడు నేను బాబాయ్ అని పిలుచుకొనే వాళ్ళం .ఏం.ఏ.పాల్ పొట్టమీద పాడుకొనే వాణ్ని నీల కంఠం ,అమరావతికి చెందిన సుబ్బారావు గారు చందోలుకు చెందిన వేదాంతం కృష్ణ మూర్తిఅనే విష్ణ్వాలయ అర్చకుడు , పిట్ల వాని పాలానికి చెందినా సుబ్బయ్య అనే శివాలయ పూజారి బాగా కలిసి ఉండే వాళ్ళం కలిసి సినిమాలు చూసి ముచ్చటలు చెప్పుకొనే వాళ్ళం బాబాయ్ అనే ఒకర్నొకరు పిలుచుకొనే వాళ్ళం .నాగేంద్ర మహాదోస్తి .కాలేజి లో విశాలాక్షి అనే అమ్మాయిమల్లంపల్లి  సోమశేఖర శర్మ  గారి మేనకోడలు బాగా పరిచయం . అక్కడ సుబ్బమ్మ అనే అమ్మాయి ని మా వాళ్ళంతా పిన్ని అని నన్ను సరదా చేసే వారు హబిబుల్లా గారు ప్రిన్సిపాల్ .కరెంట్ టాపిక్స్ బాగా చెప్పే వారు .రాజు గారు కొత్తగా వచ్చారు అయన మాకు ఇంచార్జి .బేసిక్ ఎద్యుకేషన్ చెప్పే వారు .వీర భద్ర రావు .లెక్కల హెడ్ ఆయనంటే హడలు దువ్వూరి సూర్యనారాయణ గారు లెక్కలు బాగా చెప్పేవారు ఈయనంటే అందరికి ఆప్యాయత వీరు తర్వాతా బందరు త్రేయింగ్ కాలేజి ప్రిన్సిపాల్ అయ్యారు కలిసి మాట్లాడాం చాలా అనలిటికల్ గా బోధించే వారు .నాని పంతులు గారు చాల తేలిగ్గా ప్రతి దాన్ని తీసుకొనే వారు .స్సిన్సు లో నటరాజ్ అనే అరవాయన గొప్ప పేరు ప్రతిష్టలున్నవారు బాగా చెప్పే వారు అప్పారావు గారు హెడ్ ఆయన్ను ‘’చేమ్బిస్త్రీ ‘’అనే వాళ్ళం ఆయన పాంటు కోటు బాగా నలిగి చెంబుతో ఇస్త్రీ చేసి నట్లున్దేవి .ఒక లేడీ లెక్చరర్ బాగా చెప్పేవారు ప్రాక్టికల్స్ ఆమె చూసే వారు .

       బేసిక్ కాంప్ అని వారం రోజులు రాజు గారు బ్రహ్మాండం గా నిర్వ హించారు .డ్రామాలు ,పాటలు డాన్సులు హడావిడి .నేనూ ఏలూరి పాటి అనంత రామయ్య గారు ప్రతాపరుద్రీయం నాటకం లో యుగంధరుని గా ఆయన కింద సేవకుడిగా వేషంవేశాను . .నేనూ విశాలాక్షీ పాటలు పాడాం  ఆమె చాలా కాలం ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపింది .తన గోడు నాతో వెల్ల బుచ్చుకోనేది ఆమె అక్క వరలక్ష్మి కూడా మా తో ట్రెయినింగ్ అయింది ఇంటికి ఒకటి రెండు సార్లు వెళ్లాను ..అక్కడ ఉండగానే చైనా యుద్ధం రావటం నేను దేశ భక్తీ గీతాలు రాసి ఆంద్ర ప్రభకు పంపటం అవి అచ్చు అవటం జరి గింది అలా గే జాగృతి వార పత్రిక లోనో రాసే వాడిని .రాజ మందరి ఆర్ట్స్ కాలేజి లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్య క్రమాలు జరిగితే దేశం లోని ప్ప్రసిద్ధ కవులు పండితులు ,నటులు కళా కారులు రచయితలు వచ్చారు అక్కడి నుండి మా ట్రెయినింగ్ కాలేజీకి వచ్చారు అందర్నీ ఒక్క చోట చూడటం మరువ లేని అనుభూతి .శ్రీ కాశీ కృష్ణా చార్యులు గారిని కుర్చీలో కూర్చో పెట్టి మేడ మీదకు మెట్ల మీదు గా మోసుకొని వెళ్లాం నా జన్మ చరితార్ధం అని పించింది .రాజు గారు బలే డిసిప్లిన్ మెయింటేన్ చేసే వారు .చివరి రోజు కాంప్ ఫైర్..బాగా జరిగింది నేను రాజు గారిని అభి నందిస్తూ మాట్లాడాను ఆయన తర్వాతా గుడి వాడ కు గెజిటెడ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా వచ్చారు .ఆ రోజులు గుర్తు చేసుకోన్నాం చాలా నిర్దుష్టం గా నిజాయితీ గా ఉండే వారు వివాహం కాలేదు ప్రొమోషన్ రావాల్సిన వారే అకస్మాత్తు గా చని పోయారు సైన్సు ఎక్సి బిషన్ ను న భూతో అన్నట్లు జరిపించారు .హాస్టల్ భోజనం బానే ఉండేది .నాకు ఒక సారి విపరీతం గా బంక విరోచనాలు వారం రోజులు వచ్చాయి డాక్టర్ ను చూపించి మందు వదినా తగ్గలేదు ఇది హాస్టల్ వంతాయన గమనించి నేను సరిగ్గా అన్నం తినక పోవటానికి కారణం అడిగి గసగసాల రసం తీసి ఇచ్చి తగ మన్నాడు వెంటనే కట్టింది .హాయిగా ఉన్నాను పేరయ్య అనే లాయర్ మాతో ట్రెయిన్ అయాడు ఒంగోలు యాస .నేల్లోరు నుండి అప్పారావు ఆయన రూమ్ మేట చాలా బెఫర్వాగా ఉండే వారు సిగరెట్లు బాగా పీల్చే వారు .వీర భద్ర రావు అనే ఆయన డి.యి.వో.సేలేక్తేడ్ కాండిడేట్ మాతో ట్రెయిన్ అయ్యాడు .అందరం ఉదయం హాస్టల్ బావి నీళ్ళు తోడి పోసుకొంటూ స్నానం చేసే వాళ్ళం జాన్ అనే క్రిస్టియన్ ఉండేవాడు .రమణ మూర్తి గారు అనే పెద్దాయన హాస్టల్ కు లీడర్ గా ఉండే వారు చౌదరి పాండురంగారావు ,చెన్నారావు లు మా కృష్ణా జిల్లా మిత్రులు వారు నాతో పాటు త్రేయింగ్ అయి స్సిన్సు మాస్త్రాలు గా చేరి హెడ్ మాస్తార్లయ్యారు చెన్నా రావు లెక్కల వాడు .పాల్ కూడా .నాగేంద్ర సైన్సువాడే సుబ్బయ్య ,సుబ్బారావు సోషల్ .జగన్నాధా చారి లెక్కలు .అతను పశ్చిమ గోదావరి జిల్లా పరిషద్ లో చేరాడు ఒకటి రెండు సార్లు కలిశాడు .కృష్ణ మూర్తి గుంటూరు జిల్లా పరిషద్ .రెండు మూడు సార్లు కలుసుకొన్నాం చందోలుకు ఒక సారి వెళ్లాను పిట్ల వాని పాలెం కు కూడా సుబ్బయ్య ఘంటసాల లో అక్కడంమాయితో వివాహమైతే వెళ్లాను .సుబ్బారావు గారు కొద్ది కాలానికే చని పోయారు .కృష్ణ మూర్తి తో జాబులు జవాబులు చాలా కాలం జరిపాను .

         అప్పడు వరద రావు హోటల్ కు మంచి పేరు టిఫిన్ బాగా ఉండేది పంచవటి అనే హోటల్ లో పేపర్ అట్టు అని చాలా పల్చగా చేత అంత ఉండేది అందరు అక్కడికెళ్ళి అదే తినే వారు వరద రాజు కాఫీ త్రాగే వారు .మార్కండేయ స్వామి దేవాలయ దర్శనం బానే చేసే వాళ్ళం అప్పుడు రైలు గోదావరి స్టేషన్ లో ఎక్కి అక్కడే దిగే వాళ్ళం హాస్టల్ దీనికి దగ్గర గా ఉండేది .గోదావరికి వరదలు వచ్చాయి చాలా భీభత్సం గా వచ్చాయి .గోదావరి ఉధృతాన్ని అప్పుడే చూడటం మొదటి సారి ఆంధ్రా పేపర్ మిల్ చూశాను .

             సాయంత్రం పూట గోదావరి ఒడ్డుకు చేరి కబుర్లు చెప్పుకొనే వాళ్ళం చిన్న పడవ లో లంకలకు వెళ్లి కూర్చుని వచ్చే వాళ్ళం శ్రీ కృష్ణా ర్జున యుద్ధం సినిమా పరీక్షల ముందు వచ్చినా అందరం కలిసి వెళ్లి చూశాం .మంచి మార్కులతో బి యి.డి.పాస్ అయ్యాను .కష్టానికి తగిన ప్రతి ఫలం లభించింది .ఇక ఉద్యోగం వేట .రాజ మండ్రి స్టేషన్ లో అక్కినేనిని ఒక సారి చూశాను

                            శ్రీశైల సందర్శనం

     వేసవి సెలవల్లో గురజాడ ఆయన ,నీలగిరి కాఫీ స్టోర్స్యజమాని శ్రీశైలం వెళ్తూ వస్తారా అని అడిగారు మా అమ్మ తో చెప్పాను .ఆమె బయటికి ఇప్పటి దాకా రాలేదు సరే వెళ్దాం అంది ఆయనే ప్రయాణం ఏర్పాట్లు చేశారు బెజవాడ కృష్ణ లంక లో వారమ్మాయి ఇంటికి వెళ్లి రాత్రి పడుకోన్నాం మర్నాడు ఉదయం గుంటూరు వెళ్లాం అక్కడ దేవస్థానం వారి బస్సు ఒక్కటే అప్పుడు ఉంది దానిలో ఎక్కి ఆయన ఫామిలి మేమిద్దర్సం శ్రీ శైలం వెళ్లాం మా బస్సు లోనే గోపా రాజు రామ చంద్ర రావు గారు అంటే సర్వోదయనాయకులు గో.రా.గారు కూడా ఉన్నారు .ఆయన గురించి అయన అతి వాద  పద్ధతుల గురించి ప్పటికే విని ఉన్నాను .పంచ ,ఉత్తరీయం.చొక్కా లేదు సాదా సీదా గా ఉన్నారు .దిగేదాకా మాట్లాడుతూనే ఉన్నారు .నెహ్రు ఈ మధ్యనే అక్కడికి వచ్చి వెళ్లి నట్లు చెప్పుకున్నారు .శ్రీ శైలం లో మాకు దేవస్థానంరూములు ఇచ్చారు పంతులు గారి  కుటుంబం ఒక గదిలో ,మా అమ్మా నేను ఒక దాన్లో ఉన్నాము .అమ్మ వంట చేసేది మల్లికార్జున స్వామి ధూళి దర్శనం చేశాం .దారిలో శిఖర దర్శనం కూడా చేయించారు .వసతి బాగా ఉంది రెండు పూటలా దైవ దర్శనం .అదే మొదటి సారి నేను రావటం ఒక సారి సాక్షి గణపతి దేవాలయానికి వెళ్లాం .అక్కడి నుంచి ఇంటికి రావటానికి అప్పుడు అంతా చెట్లు ,పుట్టలు దారి తప్పాం దాదాపు అడవి మధ్యలోకి వెళ్లాం .అప్పుడు ఒక చెంచు అతను కనీ పించి మమ్మల్ని సరైన మార్గం లో ప్రవేశ పెట్టాడు .నిజం గా మల్లికార్జున స్వామి యేఆ రూపం లో వచ్చి దారి చూపాడని అమ్మా నేను అనుకొన్నాం ..పాతాళగంగ కు నడిచిమోకాలి లోతు  మెట్లు దిగి కృష్ణా స్నానం ఉదయంపూట చేసే వాళ్ళం .నాన్న గారికి అమ్మ హిరణ్య శ్రాద్దం పెట్టించింది నాచేత .శ్రీ శీలం లో ప్రసాద శర్మ మేస్టారి తమ్ముడు ఇంజినీర్ ఉంటె ఒక రోజు వాళ్ళింటికి వెళ్లాం భోజనం పెట్టి మర్యాద చేశారు .దాదాపు పది రోజులున్నాం .శ్రీ శైలం లో భ్రమ రాంబా మల్లి కార్జున స్వాముల దర్శనం మహానందం గా ఉండేది అప్పుడు కరివేన వారి సత్రం ఉందొ లేదో తెలీదు .

               శ్రీ శైలం నుండి ఘాట్ రోడ్డు మీదు గా మహా నంది వెళ్లాం .గురజాడ వారు అక్కడే ఉండి పోయారు .ఒక గదిలో ఉన్నాం ఇక్కడా వంట చేసుకోవటమే .అక్కడి జలకుండం లో స్నానం దివ్యాను భూతి .అడుగున ఉన్న ఇసుక స్పటికం లా ఉంటుంది సూది వేసినా కనీ ప్పిస్తుంది ఎక్కడో కొండల్లో నుంచి జల ధార ఇక్కడ ఆలయం ముదుకు నంది ముఖం లో నుంచి జాలు వారుతుంది ఆ స్నానం ఒక సారి చేస్తే తృప్తి కలుగదు మళ్ళీ మళ్ళీ రావాలని పిస్తుంది ఆ నీటి తో అరటి ,కొబ్బరి తోటలు వరి పంట పండిస్తారు .మహా నందీశ్వర దర్శనం సర్వపుణ్య ప్రదం .మూడు రోజులు సుమారుగా ఉంది గుంటూర్ మీదు గా ఉయ్యూరు చేరాం .

 

                       కృష్ణా జిల్లా పరిషత్ లో ఉద్యోగం

          ఇంటికి వచ్చే సరికి కృష్ణా జిల్లా పరిషత్ వారు మేమిదివరకే పంపిన అప్లికేషన్లుబట్టి ఉద్యోగాలు ఇస్తున్నట్లు తెలిసింది నాతో బాటు ట్రెయినింగ్ పొందిన కొందరు ఉద్యోగాల్లో చేరారు ప్రసాద శర్మ మేష్టారు ఒక రోజు ఇంటికి వచ్చి నాతో వేరే అప్లికేషన్ రాయించి జిల్లా పరిషత్ కు పంపించే ఏర్పాటు చేశారు నాలుగు రోజుల తర్వాతా ఆయనబందరు వెళ్లి నప్పుడు నా పోస్టింగ్ ఆర్డర్లు రెడీ గా ఉంటె ,తీసుకొని వచ్చి నన్ను వెంటనే జాయిన్ అవమన్నారు .అమావాస్య నాడు నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్సు మేస్తర్ గా 19-8-1963 న జాయిన్ అయాను అప్పుడు హెడ్ మాస్ద్తారు తూమాటికోటేశ్వర రావు గారు .చాలా ఆప్యాయం గా ఉండే వారు .నేనంటే మహా గౌరవం గా ఉండే వారు సరుకును బట్టి విలువఇచ్చే మనిషి . .ఆయన అమ్మాయి ప్రభావతి పదోక్లాస్ చదువుతోంది .కొడుకు రామ కృష్ణ ఎనిమిదిలో ఉన్నాడు .

                            ప్రభావతి తో పెళ్లి

                 నాకు మోపిదేవిలో పని చేస్తుండగానే మా అమ్మ చెల్లెలి కూతురు తూటుపల్లి పద్మావతమ్మ ,సూర్య ప్రకాశశాస్త్రి గార్ల కుమార్తె ప్రభావతి తో 21-2-19 64 న ఏలూరు దగ్గర వేల్పు చర్ల లో వివాహం జరిగింది.నా భార్య మా అమ్మ చెల్లెలి మనుమరాలు .మా మేన మామ కుదిర్చిన సంబంధమిది .నేనెవర్నీ పెళ్లి చూపులు చూడ లేదు ఈవిదడని చూడటం,ఒప్పుకోవటం, పెళ్లి జరగటం జరిగి పోయింది .సరిగ్గా ఈ రోజుకు మా దంపతుల వివాహం జరిగి 49 ఏళ్ళు దాటి యాభయ్యవ ఏడాది లో కి వచ్చాం . ‘’మా దంపతుల వివాహ అర్ధ శతాబ్ది ‘’ అన్న మాట .మా వివాహం అజరిగిన కొద్ది రోజులకే శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి కల్యాణాన్ని మా దంపతులతో చేయించారు అప్పుడు మాతో పాటు హైస్కూల్ లో పని చేస్తున్న శ్రీ లోల్లా బాలకృష్ణ మూర్తి గారు అనే సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయులు ఆయన్ను హెడ్ మాస్టర్ తో సహా అందరు ‘’గురువు గారు ‘’అనే వారు .ఆలయం వ్యవహారాలు చూసే వారు వరుసగా నెల రోజులు కళ్యాణాలు జరిపించారాయన .మాకు మొదటిది ఎంతో అదృష్ట వంతులం అను కొన్నాం .అందుకనే ఈ అర్ధ శతాబ్ది వివాహ వేడుక రోజున మోపి దేవి వెళ్లి స్వామిని దర్శించి మా దంపతులం అభిషేకం చేయించాం.పనిలో పనిగా శ్రీ కాకుళం కూడా వెళ్లి శ్రీకకులేశ్వరుని కులేశ్వర స్వామి అయిన ఆంధ్ర మహా విష్ణు సందర్శనమూ చేశాం .ఇవాళ ముందుగా మా సువర్చలన్జనేయ స్వామిని దర్శించే ఈ క్షేత్రాలకు వెళ్ళాం .ఇదో దివ్యాను భూతి అని పించింది

        సశేషం

 

 

               మీ –గబ్బిట దుర్గా ప్రాసాద్ -21-2-2013

.  

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మా జంట వివాహ అర్ధ శతాబ్ది

ముందుగా అందరికి ”మాతృభాషా దినోత్సవ శుభా కాంక్షలు ”-

     ఈ రోజు   ” మా జంట వివాహ అర్ధ శతాబ్ది ”సందర్భం గా సాహితీ బంధువులకు ,కుటుంబ సభ్యులకు సాహిత్యాభిమానులకు ,అభిమానులకు బంధువులకు హితులు స్నేహితులకు అందరికి మా శుభ కామనలు .–మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ మరియు ప్రభావతి -21-2-13-ఉయ్యూరు .

ఇవాళ ఉదయం కార్ లో బయల్దేరి మన ఆంజనేయస్వామి ని దర్శించి ,శ్రీకాకుళం వెళ్లి అక్కడ శ్రీ ఆంద్ర మహావిష్ణు దర్శనం చేసుకొని మోపిదేవి చేరి శ్రీ సుబ్రహ్మన్యేశ్వర  స్వామి ని దర్శించి,అభిషేకం జరిపించాము మా ఇద్దరి తో పాటు ప్రక్కింటి మేస్టారి భార్య సీతా రావమ్మ గారు కూడా వచ్చారు . అక్కడి  నుండి పులిగడ్డ లో, 94ఏళ్ళ స్వాతంత్ర సమార యోధులు శ్రీ మండలి రాజ గోపాల రావు గారిని,దివిసీమ గాంధి వారి శ్రీమతి గారిని వారింటి వద్ద దర్షించాము వారి ఆశీస్సులు పొందాము ఆయన నాకు గొప్ప వీరాభిమాని .ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు . ఆయన శ్రీమతి గారికి జాకెట్ ,ఆయనకు పండ్లు బృహదీశ్వరాలయ ప్రసాదం కుంభమేళా జలం అందజేస్తే వీరిద్దరికీ ఆమె జాకెట్ లు పెట్టారు . అక్కడి నుండిపెనుమూడి వద్ద ఉన్న  శ్రీ మండలి వెంకట కృష్ణా రావు గారి వారధి మీదుగా రేపల్లె వెళ్లి పేటేరు లో అక్కడి పేటేరు నేత చీరలను కొన్నాం . అక్కడి నుండి సరాసరి  బయల్దేరి నాలుగింటికి ఉయ్యూరు చేరాం వచ్చిన తర్వాతే భోజనం పొద్దున్న టిఫిన్ తిని వెళ్లాం వెళ్ళేటప్పుడు కృష్ణ కర కట్ట మీదు గా వెళ్లి, వచ్చేటప్పుడు చల్లపల్లి ,పామర్రు మీదు గా వచ్చాం .

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

నాదారి తీరు -4 పై చదువు –ఉద్యోగ ప్రయత్నాలు

నాదారి తీరు -4

 

             పై చదువు –ఉద్యోగ ప్రయత్నాలు

 1956-60 మధ్య నాలుగేళ్ళలోఇంటర్ ,డిగ్రీ లు పూర్తీ అయాయి .ఈ నాలుగేళ్ళలో రెండు మూడు సార్లు కృష్ణా నదికి తీవ్రం గా వరదలు వచ్చాయి .గడ్డి వాములు చెట్లు పెద్ద పెద్ద కొయ్య దుంగలు పెద్ద పాములు కొట్టుకోచ్చేవి వీటిని బారేజి దగ్గరకు వెళ్లి చూసే వాళ్ళం .ప్రకాశం బారేజి కట్టక ముందు దాని ముందు ఆనకట్ట ఉండేది దాని మీంచే నడిచి కాని బోట్లలో కాని కృష్ణ అవతలి ఒడ్డుకు వెళ్ళే వాళ్ళం కార్లు లారీలు కూడా పెద్ద పెద్ద పడవల మీదే అవతలి ఒడ్డుకు చేరేవి అవతలి తీరం గుంటూరు జిల్లా సీతా నగరం అంటారు .ఇప్పుడక్కడ శ్రీ జియ్యర్ గారి ఆశ్రమం వేద పాఠశాల ఉన్నాయి ..నాతోపాటు డిగ్రీ చదివిన పురుషోత్తం ఫిజిక్స్ లెక్చరర్ అయ్యాడు .తర్వాత మొవ్వ కాలేజి ప్రిన్సిపాల్ కూడా అయ్యాడు గంగాధర శాస్త్రి సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉద్యగం లో చేరాడు .రాదా కృష్ణ కృష్ణా జిల్లా పరిషత్ లో నాతో పాటు సైన్సు మేస్టర్ర్ గా చేరి చివరికి గండేపల్లి హెడ్ మాస్టర్ గా రిటైర్ అయాడు .హెడ్ మాస్టర్ కాన్ఫరెన్సు జరిగి నప్పుడు ఒక సారి మా ఆతిధ్యం తీసుకొని వెళ్ళాడు .విశ్వేశ్వర రావు జగ్గయ్య పేట లో లెక్కల మేష్టారు అయి తర్వాతా హెడ్ మాస్టర్ అయాడు .మిగిలిన వారి సంగతి పెద్ద గా తెలీదు .ఒక శాస్త్రి ఎల్ ఐ.సి.లో పెద్ద ఆఫీసర్ అయి ఒకటి రెండు సార్లు కనిపించాడు .చిరంజీవులు సినిమా నాతో పాటు క్లాస్ లోపాడిన జి.బి.శాస్త్రి సంగతి పెద్ద గా తెలీదు .

        ఇంటర్ అవగనే ఆ కాలం లో బాపట్ల అగ్రికల్చర్ కాలేజి మీద అందరి దృష్టి ఉండేది నేనూ అప్ప్లై చేశా.దానికి ఇంటర్వ్యు కి పిలిచారు .నన్ను అడిగిన ప్రశ్నలు ‘’వరి ఏయే దేశాల్లో పండుతుంది ?’’నేను తడుము కోకుండా ‘’రష్యా ఇంగ్లాండ్ జెర్మని జపాన్ ‘’అని చెప్పాను వాళ్ళు నవ్వు కొన్నారు .ఇంటికి వచ్చిన తర్వాతా మా నాన్న అడిగాడు .నేను చెప్పాను వరి ఎక్కడ పండుతుందో తెలీని నీకు ఆ చదువెందుకు చలి దేశాల్లో వారి పండదని తెలీదా నీకు ?జెనరల్ నాలెడ్జి ఉండాలి ‘’అని చీవాట్లు పెట్టాడు .నేనేదో పొడి చేశానని కాలర్ ఎగరేసిన వాడిని తప్పు తెలిసి నోరు మూసుకోన్నాను .ఇదీ మన జ్ఞాన సంపద .డిగ్రీ అయిన తర్వాత గంగాధర శాస్త్రి నన్ను కాగజ్ నగర్ కు ఉద్యోగానికి రమ్మని ఉత్తరం రాశాడు అప్పుడు ఉత్తరాలే ఇంకా ఏమీ కమ్మ్యునికేషణ్ లేదు రాను పోను ఖర్చులు కంపెనీ ఏ ఇచ్చింది టిఫిన్ భోజనం కూడా ఏర్పాటయింది .అక్కడి వాతా వరణం ఆ వేడి ఆ నైట్ డ్యూటీలు షిప్టు డ్యూటీలు  విని నాకు నచ్చని ఉద్యోగం అని ఫిక్స్ అయి పోయాను ఉద్యోగం రాలేదు అక్కడ సిల్క్ పాంట్ షర్టు కోసం సిల్కు బట్ట కోని  ఇంటికొచ్చి కుట్టించుకోని చాలా కాలం తొడిగాను .ఇలా ఉద్యోగ ప్రయత్నం కలిసి రాలేదు .

           మా మేన మామ వరుస అయిన అప్పన్న కొండ మామయయ్య జేమ్షేద్పూర్ తాతా స్టీల్స్ లో చీఫ్ కెమిస్ట్ .ఉయ్యూరు వచ్చినప్పుడు నా చదువు గురించి తెలుసుకొని విశాఖ పట్నం ఆంధ్రా యూని వర్సిటి లో రిజిస్త్రార్ మహదేవన్  ఒక  తన స్నేహితుడని నాకు కావాల్సిన బ్రాంచ్ లో ఏం .ఎస్.సి .చదవమని రికమండేషన్ లెటర్ రాసి ఇచ్చి వెళ్ళమన్నాడు .మా నాన్న నన్ను పంపారు వెళ్లి కలిశాను .ఆయన ‘’ఈ ఉత్తరం చూసి నీకు సీటు ఇవ్వాల్సిందే.కాని ఫిజిక్స్ సీట్లు అయి పోయాయి .కావాలంటే జియో ఫిజిక్స్ లో ఖాళీలున్నాయి చేరతా నంటే సీట్ ఇస్తాను ‘’అన్నాడు నేను ఏమీ ఇష్టం చూప లేదు తిరిగి వచ్చేశాను ఈ విధం గా పై చదువు ప్రయత్నమూ బెడిసి కొట్టింది అయితే నాలో ఉపాధ్యాయుడు అవాలనే కోరిక బలం గా వేల్లూను కొన్నది .అది అయితే అమ్మా నాన్న ల దగ్గర ఉండ టానికి వీలు అని నా ఉద్దేశ్యం ఈ విషయం నాలో నేఉంచాను .ఎవరికి చెప్పలేదు .

            ఇంతలో మోహన్ బందరులో బి.ఎస్.సి ఫైనల్ యియర్ చదువు కోసం విజయ వాడ నుండి బందరు హిందూ కాలేజి లో చేరాడు .చకేమిస్త్రి మెయిన్ బాటని జువాలజీ లు ఇతర సబ్జెక్టులు .అక్కడ కాంతా రావు గారనే ఆయన దగ్గర ట్యూషన్ లో చేరాడు .ఒక సారి నేను బందరు వెళ్లాను అక్కడ బుద్ధి రాజు విఠల్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ గారు కనీ పించారు .అలాగే ‘’పొట్టి ‘’అని నేను పిలిచే వల్లూరు రామకృష్ణ కూడా మొహన్ క్లాస్ మేట్ గా ఉన్నాడు .కలగా కృష్ణ మోహన్ అనే తోటల వల్లూర్ అయన కూడా ఏదో ఉద్యోగం లో అక్కడ ఉండి పరిచయం అయాడు ఆయన బాగా పాడే వాడు .ఈయనే ఇప్పుడు టి.వి.లో కనిపించే కృష్ణ మోహన్ ఈయనే నని నా అనుమానం .నన్ను హిందూ కాలేజి లో ఫిజిక్స్ దిమాన్స్త్రేటర్ పోస్ట్ కు అప్ప్లై చేయమని చెప్పారు .ఒక పావుఠాఉ   పేపర్ మీద అప్లికేషన్ రాసి హిందూ కాలేజి ప్రిన్సిపాల్ జంధ్యాల గౌరీ నాద శాస్త్రి గారిని సాయంత్రం నాలుగింటికి కలిశాను .ఆయన నా అప్లికేషన్ చూసి ‘’ఎప్పుడు జాయిన్ అవుతారు /అని అడిగితే ఆశ్చర్య పోయాను ఆయనే మంచి రోజు చూసి జాయినవమని చెప్పారు .రాత్రికి ఇంటికి వచ్చి మా అమ్మా వాళ్లకు చెప్పి మర్నాడో ఆ మర్నాడో వెళ్లి చేరిపోయాను .నాజీతం 108 రూపాయలు నెలకు అని జ్ఞాపకం .

            ఫిజిక్స్ హెడ్ ‘పెద్దసోడా బుడ్డి కళ్ళద్దాలతో చారల పాంటు కోటు వేసుకొనే ఆయన .ఆయన్ను అందర్నీ ‘’డెవిల్‘’గారు అనే వారు .కుటుంబ శాస్త్రి గారు నాకు సీనియర్ అయన ఏం ఎస్ సి చదివి పాస్ అయినా విపరీత మైన ఉబ్బసం ఆయాసం తో బాధ పదుతూఉండేవారు మాట రావటం కష్టం గా ఉండేది కర్మిష్టి .చాలా మంచి వారు నాకు ధైర్యం చెప్పి నిల దోక్కుకోనేట్లు చేశారు .శివ రామ కృష్ణ శాస్త్రి అనే ఫిజిక్స్ లెక్చరర్ చాలా సరదాగా ఉండేవారు చనువుగానూ ఉండేవారు మంచి బోధకులు .కేమిస్త్రి లో ఎర్రటి ఆయన రామ కృష్ణ శాస్త్రి  ఉండేవారు జయ దేవుని అష్టపదులు బాగా పాడే వారు సాయంత్ర వేళల్లో వారింటికి వెళ్లి కూర్చుని కాలక్షేపం చేసే వాడిని మంచి పాటలు జయదేవునివి పాడే వారుఆయన ఇంటి దగ్గరే వి.వి.టోన్ పే అనే లెక్చరర్ వుండే వారు .ఆయన గొప్ప పైంటర్ .చాలా బాగా స్నేహం గా మాట్లాడే వారు .అప్పటికే లబ్ధ ప్రతిష్టులు ..అలాగే గోఖలే అని మా గోఖలే అన్నగారు ఇంగ్లీష్ హెడ్డు .పంచా లాల్చీ తో ఉండే వారు గొప్ప ఉపన్యాసకులని పేరు .ఒకటి రెండు సార్లు ఇంటికి వెళ్లి మాట్లాడాను .వేదాంతం రామ చంద్ర రావు షేక్స్ పియర్ నాటకాల పై అధారిటీ .చాలా ఉన్నత ప్రమాణం గా బోధించే వారు .ఎన్నో చోట్ల కు ఉపన్యాసాలకు వెళ్ళే వారు అలాగే జోగా రావు కూడా ఆంగ్లం లో మంచి బోధకులు గా గుర్తింపు పొందారు .డి/అర/ఎస్/అనే లెక్కల హెడ్ దైతా శ్రీరాములు గారిఅబ్బాయి ఆయనదే కాలేజి ఈయన తమ్ముడు డి.ఎస్.ఎస్.ఆంగ్ల ఉపన్యాసకులు .

             రామణారావు అనే కుర్రాడు తెలుగు హెడ్ మంచి పేరుంది అద్దె పల్లి రామ మోహన రావు గారు ఈ కాలేజిలో లెక్చరర్ గా పని చేశారు ఆయన తండ్రి జానకి రామయ్య గారు కాలేజి లో హెడ్ గుమాస్తా మంచి వారు నాకు బాగా పరిచయం .దుర్గా టాకీస్ దగ్గర పెంకు టింట్లో ఉండే వారు .హిందీ హెడ్ చలసాని సుబ్బారావు గారు మల్లు పంచా మల్లు షర్ట్ తో మల్లె ప్పూవు గా యెర్రని రంగులో ఉండే వారు .అయన గొప్ప వక్త .ఎన్నో పుస్తకాలు రాశారు .బాగా పేరు ప్రసిద్ధి ఉన్న వారు వెంపటి రామయ్య గారు తెలుగు లెక్చరర్ ఆయన తల పాగా చుట్టి ఉండే వారు /.ఆయన్ను ‘’టర్బన్ ‘’గారు అనే వారు .హాస్టల్ ను బాగా నిర్వహించారు

        నేను క్లాసులను బాగా నిర్వహించి మంచి పేరు పొందాను .నాతో పాటు ఇంకో కుర్రాడు శాస్త్రి కూడా చేరాడు అతను బాగా ప్రాక్టికల్స్ చేయించే వాడు ఆ తర్వాతా తను జాతక చక్ర వర్తి అయాడు లెక్చరర్ అయాడు .చిల్లరిగె శ్రీనివాస రావు అనే అతను మాతో పని చేశాడు అతను మంచి కార్టూనిస్టు .భలే సరదాగా ఉండేవాడు .ఎప్పుడు నవ్వించే వాడు కవిత్వమూ రాసే వాడు .మా తమ్ముడు ఉపనయనానికి ఉయ్యూరు వచ్చాడు .అప్పటి నుంచి అతనితో దోస్తీ పెరిగింది అతను తర్వాతా ఆర్.టి.సి.లో చేరి క్రమంగా ఎదిగి డిపో మేనేజర్ గా తిరుపతి ఉయ్యూరు విజయ వాడ లలో చేశాడు .మా పెద్దబ్బాయి పెళ్ళికి బస్ ను ఏర్పాటు చేశాడు బెజవాడకు .

         సెలవల్లో బీచ్ కు వెళ్ళే వాళ్ళం అక్కడ సరదాగా గడిపే వాళ్ళం శ్రీ పాండు రంగ స్వామిని వీలైనప్పుడల్లా దర్శించే వాళ్ళం .రామానాయుడు పెట్ సెంటర్ లో డాబా మీద పైన అందరం కలిసి కొంతకాలం అద్దె కున్నాం .అప్పుడే ‘’చివరికి మిగిలేది ‘’సినిమా వచ్చింది అది వెళ్లి పోయే లోగా చాలా సార్లు చూశాను అందులో మల్లాది పాటలు అణి ముత్యాలు సావిత్రి నటన సుపర్బ్ .రామి నీడుడైరెక్షన్,అశ్వత్థామ సంగీతం  మహా బాగు నాకు ఈ సినిమా తర్వాతే ,ఏ సినిమా అయినా అని పిస్తుంది .పొట్టి మాకు స్దినిమా లకు గైడు .ఇప్పుడే ‘’భార్యా భర్తలు ‘’సినిమా చూశాం .ఎన్నో సార్లు చూశాం .బృందావన్ దియేటర్ లో మంచి సినిమాలు వచ్చేవి .హోటల్ భోజనం మహంకాళి వెంకయ్య మేస్ లో భోజనం చాలా బాగా ఉండేది .హోమిలీ అంటారు అలా ఉండేది బ్రాహ్మణులంతా అక్కడే భోజనం .కొసరి కొసరి వెంకయ్య అక్కగారు వడ్డించి తిని పించే వారు .అక్కడే వెంకయ్యని ఒక సారి చూశాం సువర్ణ సుందరి లో రాక్షసుడు వంటి చాలా వేషాలు వేశాడాయన .బచ్చు పేట పోస్టాఫీస్ దగ్గర ఒక వర్తకుడుందే వాడు .ఆయనకు బాస్కెట్ బాలాంత బుడ్డ ఉండేది దాని మీద పాడ్ పెట్టి రాసుకొనే వాడని అందరు చెప్పుకొనే వారు .

               బచ్చు పేట రామానుజం కూటం దగ్గర వేలూరి వారి ఇంట్లో అద్దేకున్నాం .వాళ్లకి ఒక ఎలిమెంటరి స్కూల్ ఉంది కుటుంబం అంతా అందులో మేస్టార్లు .రాము అని ఆయన కొడుకు మంచి పైంటర్ .గాయకుడు అతని భార్య అప్పటికే ఎస్ ఎస్.ఎల్.సి పాసై టీచర్ గా పని చేస్తోంది మా ఇంటి అవతలే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా కాస్త్లి గా ఉండేది మంచి కార్య క్రమాలు జరిగేవి .పూజారి గారు మందు కోడతారనే పుకారు ఉండేది .ఎప్పుడు తాంబూలం తో ఉండే వారు .నేను మోహన్ వంట చేసుకొనే వాళ్ళం తాళం వేసి గుమ్మం పైన గూడు లో ఉంచి వెళ్ళే వాళ్ళం ఒక సారి అలా వెళ్తే ఇంట్లో దొంగలు పడి నా ఎస్.ఎసి.సి సర్టిఫికేట్ కొంత డబ్బు దోచుకు పోయారు డూప్లికేట్ సర్తి  ఫికేట్ తెప్పించటానికి గురువు గారు ప్రసాద శర్మ గారుసాయం చేశారు .రెండో ఏడాది కూడా ఉద్యోగం ఇస్తామన్నారు వేసవి లో జీతం లేదని జ్ఞాపకం .మొత్తం మీద ఒక ఏడాది భలే జాలీగా గడిచింది లెక్చరర్ల తో కలిసి మొదటి సారి క్రికెట్ ఆడాను మొదటి సరిగా టెన్నిస్ కూడా ఆడాను ఈ రెండిటిలో ప్రిన్సిపాల్ గారు మంచి ప్రావీణ్యం ఉన్న వారు .సభలు చేసే వారు  రాదా కృష్ణన్ గారిని జాతీయ కళా శాలలో చూశాను . దైతా శ్రీ రాములు గారు నేను పని చేస్తున్నప్పుడే చని పోయారు అందరం వెళ్లి చూసి వచ్చాం .భట్టు గారు కేమిస్త్రి లెక్చరర్ .ఆయనకు విజయ వాడ రోడ్డు లో ఒక హోటల్ ఉండేది ఉదయం తొమ్మిదిన్నర దాకా హోటల్ సాయంత్రం అయిదున్నర నుండి హోటల్ లో ఉండేవారు భట్టు గారి హోటల్ అని బాగా ప్రసిద్ది అన్ని బాగా ఉండేవి .అయన ప్రత్యెక శ్రద్ధ తీసుకొనే వారు .

              రామ కృష్ణ నన్ను ,మొహన్ని ‘’బాబాయ్ ‘’అని పిలిచే వాడు .అతన్ని మేము ‘’పొట్టి ‘అనే పిలిచే వాళ్ళం .అతని తండ్రి ఉయ్యూరు కే.సి.పి.లో టైపిస్ట్ .అతని చెల్లెలు ఉయ్యూరు లో నాదగ్గర ట్యూషన్ చదివింది అతని అక్క ఒక సెకండరి మేస్తర్ భార్య .మంచి కుటుంబ సంబంధాలు మెయింటైన్ చేశాము .బుద్ధి రాజు విఠఠల్ ఇల్లు మా ఇంటిదగ్గరే బందర్లో తరచు వాళ్ళింటికి వెళ్ళే వాళ్ళం వాళ్ళమ్మ గారు చాలా మంచిది .అతని అన్న రాజ హంస విద్యా శాఖ లో ఉద్యోగి అతని భార్య ఉయ్యురులో ఆదిరాజు శ్రీ రాములు గారి అమ్మాయి మా క్లాస్ మేట్. విఠ ల్ మంచిమాట కారి  ఒక పన్ను  మీద ఇంకో పన్ను ఎక్కి తమాషా గా ఉండేది అన్నీ తెలిసి నట్లే మాట్లాడే వాడు డిగ్రీ ఏదో రకం గా పాసై ఎన్నో ఉద్యోగాలు చేసి ఏదీ కలిసి రాక సబ్బులు తయారు చేసి అమ్మేవాడు .మా ఇంటికి ఉయ్యురు కు తరచుగా వచ్చే వాడు .రామ కృష్ణ కూడా అన్నీ చేసి చివరికి హైదరాబాద్ లో హేచ్ ఏం,.టి.లో పని చేశాడు .కనీ పించి దాదాపు ముప్పయి  ఏళ్ళు అయి ఉంటుంది .ఇలా ఒక ఏడాది బందర్లో ఆడుతూ పాడుతూ దిమాన్స్త్రేతర్ ఉద్యోగం చేశాను ఇంశార్ట్ వేయటం అప్పుడే అల వాటైనది .

                    విశాఖ లో ఉద్యోగం

              డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇంస్ట్రక్షన్-హైదరా బాద్ కు  ఒక పావు పేజి మీద నా అర్హతలను తెలియ జేస్తూ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వమని అప్లికేషన్ పెట్టాను . పిచ్చి రోజులు వెంటనే విశాఖ పట్నం మెడికల్ కాలేజి లో ఫిజిక్స్ శాఖ కొత్తగా ఏర్పాటు చేసి వెంకటేశ్వర్లు అనే గుంటూరు ఆయన్ను ఫిజిక్స్ లెక్చరర్ గా నన్ను దిమాన్స్త్రేటర్ గా అప్పాయింట్ చేస్తూ ఆర్డర్ పంపారు మంచో చెడో వెళ్లి చేరాను మిసెస్ ఏ.వి.యెన్.కాలేజిఎడురుగా డాబామీద రూమ్ తీసుకొని నలుగురం ఉండే వాళ్ళం అందులో రెడ్డి గారొకరు నేను ఒక ఆక్సిలరి హెల్త్ వర్కర్ బ్రాహ్మణుడు .భలే సరదా గా గడిపాం .భోజనం హోటలో లో ఏదీ రుచించేది కాదు ఉదయం టిఫిన్ బన్ను టీ .కాలేజి లో క్లాసులు బానే ఎంగేజ్ చేసి పేరు పొందాను వెంకటేశ్వర్లు గారు కమ్మ వారు చాలా ఆప్యాయం గా ఉండే వారు కొత్తగా వచ్చిన పరికారాలన్ని సర్దుకోవటం ప్రాక్టికల్స్ చేయించటం  అవసర మైతే క్లాస్ లకు వెళ్లి ఫిజిక్స్ బోధించటం .నా బోధనా ఇంగ్లీష్ లోనే సాగేది జాగ్రత్త గా ఉండే వాడిని .స్టూడెంట్స్ కు నేనంటే అభిమానం .చాలా గౌరవం చూపించే వారు సాయంత్రాలు ఆడ మగా కలిసి ఎంజాయ్ చేయటం తమాషా గా ఉండేది .చూస్తూ నవ్వుకొంటూ సాగే వాళ్ళం రెడ్డి గారు కేమిస్త్రి లెక్చరర్ .కందరికీ ఒకటే విశ్రాంతి రూమ్ ఉండేది .పద్మావతి గారు అనే లెక్చరర్ చాలా ఆప్యాయం గా పలకరించే వారు నాకు పెద్దరికం ఇచ్చే వారు నాకు అప్పుడు చేవులకు పోగులున్దేవి .ఎవరు ఏమీ ఏది పించటం కాని ,చులకన గా చూడటం కనిఉండేది కాదు ఆమె ఎన్నో విషయాలు చెప్పే వారు నా సినిమా డైలాగులు పడే పడే చెప్పించుకొనే వారు మాకు అక్క లాగా ఉండే వారు రమణ మూర్తి అనే కేమిస్త్రి లెక్చరర్ చాలా మంచి వాడు మంచి జోస్తీ గా ఉండే వాడు మంచి పేరు తెచ్చుకొన్నాడు .వీళ్ళందరితో బాగా గడిచి పోయేది ఆదివారాల్లో డాబా గార్డెన్ దగ్గర హోటల్ కు వెళ్లి మంచి భోజనం చేసే వాడిని ఇక్కడ గోంగూర తో మజ్జిగ పులుసు భలే రుచిగా ఉండేది .

             ఆది వారాల్లో నూకల సత్య వతి గారింటికి వెళ్ళే వాడిని సిటీ బస్ లో ఆమె అమ్మకు గురువు లాంటిది మా నరసింహ మూర్తి డాక్టర్ గారి చెల్లెలు ఆమె కొడుకే ప్రసన్న డాక్ యార్డ్ లో ఉద్యోగం నన్ను ఎంతో ఆప్యాయం గా చూసుకొనే వారు .ప్రసన్న భార్య మా డాక్టర్ నరసింహ మూర్తి గారమ్మాయే . .అక్కడికి వెళ్తే మా స్వంత ఇంట్లో ఉన్నట్లుండేది .ఒక వారం విశాఖ అప్ లాండ్ లో ఉన్న గుండు సుబ్రహ్మణ్య దీక్షితుల గారింటికి వెళ్ళే వాడిని ఈయనే తర్వాత సూరి నరసింహం చెల్లెలు అన్నపూర్ణ భర్త యాడు .ఆ అమ్మాయి నా శిష్యురాలు కూడా మన్యం గారు తమ్ముడు వల్లీశ్వర్ ఇసుక పల్లి బ్రహ్మం మొదలైన వారు రెండు గదుల ఇంట్లో వర్సిటి కి దగ్గర గా ఉండే వారు వాళ్ళ నాయనమ్మ వీరికి వంట చేసి పెట్టేది .బాగా వా అఆవిడ ఒక సారి రిక్షాలో ఆశు పత్రికి వెళ్తూ బోల్తా పది అక్కడి కక్కడే చని పోయింది . .అక్కడే భోజనం చేసి రాత్రికి రూమ్ కు చేరే వాడిని .ఒక సారి ప్రసన్న నౌకాశ్రయం నుండి ఒక నౌక ను సముద్ర ప్రవేశం చేయటం దగ్గరుండి చూపించాడు ఒక స్టీమర్ లో సముద్రం మీద పది కిలో మీటర్లు తిప్పాడు అది గొప్ప అనుభూతి .నెలకోసారి ఇంటికి వచ్చే వాడిని .జీతం బానే ఉండేది .

             నవంబర్ లో నాన్న కు ఒంట్లో బాగా లేదని టెలిగ్రాం వస్తే ఉయ్యూరు వెళ్లాను .చాలా ప్రమాదం లో ఉన్నారు .మళ్ళీ వెళ్లాను ఒక పది హీను రోజుల తర్వాతా సీరియస్ అంటే తిరిగి వచ్చాను సెలవు పెట్టి .నాన్న దక్కలేదు కార్హీక శుద ఏకాదశి నాడు 1961నవంబర్  21 న మరణించారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కలేదు .నాకు అమ్మను విడిచి వెళ్ళాలని పించలేదు .లీవ్ ను పోడిగించాను అంగీకరించారు .మళ్ళీ పోడిగించాను ఈ సారి నన్ను నిజామా బాద్పాలిటెక్నిక్ కాలేజికి బదిలీ చేశారు చేరమని అంతా చెప్పారు .వెళ్లాను కాని ఆ వాతావరణం నచ్చ లేదు మళ్ళీ సెలవు పెట్టి వచ్చేశాను .మళ్ళీ లీవ్ గ్రాంట్ చేశారు .కాని మళ్ళీ సెలవు పెంచాను చివరికి హోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు .హమ్మయ్య అను కొన్నానునా అంతకు నేను రిజైన్ చేయకుండా ఇలా జరిగింది అనుకొన్నాను .

           ఇంటికి వచ్చి ఏదీ చేయకుండా కొంత కాలం గడిపాను అయితే నా దృష్టి టీచర్ మీద్స బి .యి.డి ట్రైనింగ్ మీద ఉంది .దత్తు గారింట్లో బాల భారతి ,నన్నయ కల సమితి కార్య క్రమాలు పుస్తకాలు చదవటం తో కలం గడిపాను .అమ్మ ఊరట చెందుతోంది ఎక్కడికి పోవటం లేదామే చెట్టంత కొడుకు పోవటం ,నాన్న అనుకో కుండా మరణించటం తో అమ్మ చాలా దిగులు గా ఉండేది .ఊళ్ళో పురాణాలకు కూడా వెళ్ళేది కాదు .చివరికి మామయ్య నచ్చ చెబితే ఆయన నిర్వహించే శ్రీ రామ చంద్ర వైదిక మహాసభ కార్య క్రమాలకు విశ్వాలయం లో పురాణానికి వెళ్ళటం ఏడాదిన్నర తర్వాత ప్రారంభించింది .

               సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-2-13-ఉయ్యూరు 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -3 డిగ్రీ చదువు –మొదటి ఏడాది

    నా దారి తీరు -3

                      డిగ్రీ చదువు –మొదటి ఏడాది

    1958 మార్చి కి ఇంటర్ పూర్తి అయింది .ఏమి చదవాలి అన్నప్రశ్న .అప్పుడున్న సోపానం డిగ్రీ .కనుక అదే ఎక్కాను .ఈ కాలేజి లోనే చదవాలని మా వాళ్ళన్నారు సరే అనటం నా వంతు కాని ఆ ఏడాదే మా కాలేజి లో ఫిజిక్స్ మెయిన్ ను ప్రారం భిస్తున్నారు .అప్పటి దాకా లేదు లెక్కలు కేమిస్త్రి మాతమే ఉన్నాయి .లెక్కలు తీసుకొన్నా భావిష్యత్తు ఏమీ  లేదని అందరు చెప్పే వారు కేమిస్త్రి కి అవకాశాలేక్కువన్నారు .నాకు కొత్త సబ్జెక్ట్ ఫిజిక్స్ మీద నా ద్రుష్టి పడింది .నా స్నేహితుడు తెనాలి వాస్తవ్యుడు తాడేపల్లి గంగాధర శాస్త్రి కూడా దానినే వరించాడు అతను అన్నపూర్ణమ్మ హాస్టల్ లో ఉండే వాడు ఇది అజంతా టాకీస్ కు ఎదురుగా ఉండేది మేడ పైనే భోజనం ,వసతి పేద మెరిట్ బ్రాహ్మణ విద్యార్ధులకు అందించే వారు కొత్త సబ్జెక్టు ప్రవేశం ,బోధించే వారెలాంటి వారు ఉంటారో తెలీదు .పుస్తకాలు కూడా కొత్తవి .సరే నని చేరేశాను .,

           దాదాపు పాతిక మంది మా బాచ్ లో ఉన్నారు .రాదా కృష్ణ ,బి.జి.శాస్త్రి ‘’,విష్ణు అండ్ కో వాళ్ళబ్బాయి ,జగ్గయ్య పేటకు చెందినా విశ్వేశ్వర రావు మొదలైన వారు నాతో ఫిజిక్స్ మెయిన్ చది వారు మేధ మేటిక్స్ ,కేమిస్త్రి మాకు సబ్సిదియరీ సబ్జెక్టులు .ఫిజిక్స్ లో light ,electricity ,magnetism ,dynamics ,statics ,properties of matterఉండేవి మొదటి మూడు మా గుర్రాజు మేస్టారే బోధించే వారు ఆయనే హెడ్ .బానే చెప్పేవారు .ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్ ను మొదలైనవి బి.ఆర్.ఏం.ఎస్.గారు బోధించే వారు గుర్రాజు గారి క్లాస్ అంటే చాల ఉత్సాహం గా ఉండేది .ఈయన క్లాస్ అంటే బోర్ .ఈయన సబ్జెక్ట్ చెబుతూ తరచుగా బోర్డు దగ్గరకు వెళ్లి రాస్తూ వస్తూందే వారు .ఆ సమయం లో అప్పుడే రిలీజ్ అయిన ‘’చిరంజీవులు ‘’సినిమా చూసి ఉన్నాం కనుక అందులో మల్లాది వారి పాట ‘’చికిలింత చిగురు చిన్న దానీ మనసు చిన్న దాని మీద మనసు’’ .అనేదీ .’’విరజాజి కెందూలి కలిసేందుకే –మనసందుకే ‘’అనే పాటలు గొంతు కలిపి పాడే వాళ్ళం విని పించీ విని పించకుండా .ఆయన చెవిన పడి ‘’ఎవడ్రా పాడింది ?’’అని అరిచే వారు ‘’గప్చుప్.సాంబారు బుడ్డీ ‘’మళ్ళీ బోర్డు దగ్గరకేల్లటం మేము మళ్ళీ పాడటం ఇలా గంటలు గడిపేశాం సబ్జెక్టు బుర్రలోకి ఎక్కేది కాదు .ఆ తర్వాత ప్రజాపతి రావు గారు ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్ చెప్పారు కష్టపడి చెప్పే వారు తెల్ల పాంటు ఇన్ షర్టుతో కొంచెం వెడల్పు ముఖం తో నల్ల గా ఉండే వారు ఆయన కు డిగ్రీ బోధించటం ఇదే మొదలు మా మీద ప్రయోగం .ప్రాక్టికల్స్ బానే చేయించి ప్రోత్సహించారు .సరైన లాబ్ ఫిజిక్స్ కు యేర్పడ లేదు .

             మా నివాసం ఈ సారి బుల్లి మామ్మ ఇంట్లో కాదు నాతో బాటు మా తమ్ముడు మోహన్ కూడా పి.యు.సి.లో చేరాడు .కనుక మామ్మకు ఇబ్బంది కలిగించ రాదనుకొన్నారు మా వాళ్ళు అందుకని మాచవరం డౌన్ లో రొంపిచర్ల ఆచార్యుల వారి కొత్త ఇంట్లో అద్దెకు చేరాము .ఒక వైపు వాళ్ళు ,రెండో వైపు మేము ఉండే వాళ్ళం .మా అమ్మ మొదట్లో వచ్చి కాపురం పెట్టి అన్ని ఏర్పాట్లు చూసింది .అన్నట్లు మా మేన మామ గారబ్బాయి పద్మనాభం కూడా మా ఇంట్లోనే ఉన్నాడు .ఆచార్లు గారు చాలా మంచి వారు .ఆయన భార్య కూడా అంతే .ఆయన అక్కగారు విధవ ఆవిడ కూడా వారింట్లో ఉండే వారు .అందరు మమ్మల్ని బాగా ఆదరించే వారు .వారింట్లో చేసినవి మాకు పెట్టె వారు .కొంత కాలం తర్వాతా మా మామ్మ నాగమ్మ గారు వచ్చి మాతో ఉండేది .ఆమె ఆ వయసులో మాకు బాధ్యత గా వండి పెట్టేది .సాయంత్రాలు వెనకే ఉన్న ఏలూరు  కాలువ దగ్గరికి వెళ్లి కూచునే వాళ్ళం రైల్ పట్టాలు కూడా అక్కడే ఉండేవి మాచవరం దాసాంజనేయ స్వామి ని తరచు దర్శించే వారం .

        మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వచ్చే వాళ్ళం .ఉయ్యూరు వాడు సూరి శోభనాద్రి గారబ్బాయి రమణ కూడా వాళ్ళ అక్క గారింట్లో ఉందడిమధ్యాహ్నం భోజనం తెచ్చుకొని మాతో పాటు తినే వాడు .నేను ,పద్మ నాభం ఇంటర్ లోను ,డిగ్రీ లోను రెండు పూటలా సంధ్యా వందనం చేసు కొనే వాళ్ళం .కాలేశ్వర  రావు మార్కెట్ కు వెళ్లి కూరలు తెచ్చుకొనే వాళ్ళం .మామ్మకు బురిడీ కొట్టి సినిమాలకు వెళ్ళే వాళ్ళం అలా చూసిందే రాజ నందిని .సినిమా .నాకు అందులోని జాన పద సాహిత్యం బాగా నచ్చింది స్క్రిప్ట్ అంతా మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారిదే .సంగీతం ఘంట సాల అని గుర్తు .దర్శకుడు వేదాంతం రాఘవయ్య అను కొంటాను .చాలా సినిమాలు చూశాం .మల్లాది మీద గొప్ప అభిప్రాయం ఏర్పడింది .మధుమతి కాగజ్ కే ఫూల్ వగైరా హిందీ సినిమాలు చూసిన జ్ఞాపకం .

                    డిగ్రీ రెండో ఏడాది

                  మొదటి సంవత్సరం చివర పరీక్షలు బానే రాశాను కాని రెండో ఏడాది కి కొంత అసౌకర్యం కల్గింది .మా అన్నయ్య శర్మ కు అంతకు ముందే వేదవల్లి అనే ఆడపిల్ల పుట్టింది .మా వదిన మఇప్పుడు మగ పిల్లాడిని కన్నది .అమ్మా నాన్న ,అన్నయ్యలు బారసాల చేసుకొని వచ్చారు అన్నయ్య హోస్పేట లో రైల్వే స్టేషన్ మాస్టర్ గా ఉండే వాడు .నేను ఇంటర్ మొదటేఏ డాది వేసవి సెలవల్లో హోస్పేట కు వెళ్లి ఒక పది హీను రోజు లుండి వచ్చాను .రెండో ఏడాది అవగానే నాన్న వాళ్ళతో పోట్లాడి తిరుపతి ఒంటరి గా వెళ్లాను .సుమారు పది రోజులు అక్కడ దేవస్థానం వారిచ్చిన ఉచిత రూమ్ లో ఉన్నాను అక్కడ కలిసిన మిత్రులతో అందరం రోజూ శ్రీ వెంకటేశ్వర దర్శనం చేసి ఎక్కడికో అక్కడి కొత్త ప్రదేశాలకు నడిచి వెళ్లి వచ్చే వారం .పాప నాశనం వగైరాలు ఇలానే చూశాం .అప్పుడు అంతా నడకే .చాలా ఆందం గా గడిచి పోయాయి రోజులు తిరుపతి లో హోటల్ లో భోజనం చేసే వాళ్ళం .రోజుకో హోటల్ .రాత్రికి టిఫిన్ చేసే వాళ్ళం బావుల్లో నీళ్ళు తోడుకొని పోసుకొనే వాళ్ళం .ప్రసాదాలు దేవాలయం లో ఉచితం గా పెట్టె వారు వీలైతే రెండు పూటలా దర్శనం చేసుకొనే వాళ్ళం .దిగువ తిరుపతి కి వచ్చి పద్మా వతి అమ్మ వారిని దర్శించే వాళ్ళం .జట్కా బందీ లో నలుగురు లేక అయిదుగురు కలిసి వెళ్ళే వాళ్ళం దారి ఏమీ బాగుండేది కాదు అంతా నిర్జన ప్రదేశమే అప్పుడు .కాల హస్తి కూడా వెళ్లాం .

                       డిగ్రీ మొదటి ఏడాది పూర్తీ అయింది .ఓదిన రామ నాద ను ప్రసవించిన పది హీను రోజులకే అన్నయ్య హోస్పేట లో అకస్మాత్తు గా మరణించి నట్లు టెలిగ్రాం వచ్చింది ఇంట్లో ఎవరికి కాళ్ళు చేతులు ఆడ లేదు .ఇంత విషాదం మా ఇంట్లో ఇప్పటికి లేదు. చేతికి అంది వచ్చిన కొడుకు సుదూర లోకాలకు వెళ్లి పోయాడంటే ఆ తల్లి దండ్రుల బాధ వర్ణనా తీతం ఆమ్మా నాన్న ఎంతో విల పించారు నాన్న ,మామయ్య సాయం తీసుకొని హోస్పేట వెళ్లి అక్కడే దహన కార్యక్రమం నిర్వ హించి ,చితా భస్మం అక్కడే తుంగ భద్రలో కలిపారు అన్నయ్యకు అక్కడ మైసూరు ఎర్రటి ఆవు దూడాఉన్నాయి సామానును  వాటిని వాగన్ లో ఎక్కించి దగ్గరి స్టేషన్ అయిన ఇందుపల్లికి తెప్పించారు వాటి వెంట మింట సత్యం అనే మా చేలు చేసే వాడున్నాడు ఇంటికి క్షేమం గా అవి చేరాయి .ఆ ఆవు అంటే మాకు మహా ఆపేక్ష గా ఉండేది అవతలో గొడ్ల పాక ఉన్నా వీటి కోసం ఇంటి పక్కనే నూతి వద్ద పాక వేసి కంటికి రెప్ప గా కాపాడారు మా వాళ్ళు . దాదాపు పాతికేళ్ళు ఈ ఆవు సంతానం మా దొడ్డిలో పెరిగింది అ తర్వాతా వాటి దూదలన్నీ కోడె దూదలవటం తో కాటూరు చేను చేసే సీతా రామయ్యకు ఉచితం గా ఇచ్చే శాం .అన్నయ్య లేని లోటు పూడేది కాదు .అన్నయ్య వివాహం బందరు లో జరిగింది వారణాసి కృష్ణ మూర్తి అనే ఆంధ్రా బాంక్ మేనేజర్ బందర్లో ఉండే వారు .ఆయన మా ఓదిన గారికి బాబాయి .ఆయన ఆధ్వర్యం లోనే వివాహం జరిగింది .మంచి కుటుంబం .ఓడిన తల్లి సుబ్బమ్మ గారిది భీమ డోలు దగ్గర పొలసాని పల్లి ఆమె చెల్లెలే కృష్ణ మూర్తి గారి భార్య .ఆయనకు కృష్ణ వేణమ్మ అనే విధవ అక్క గారుండేది చాలా మర్యాద గా చూసేది .బందరు నుండి మూడు నిద్రలకు ఉయ్యూరు కి చిన్న కారు లో వచ్చాం దారిలో చాలా సార్లు ఆగి పోయేది ఈ సంఘటన బాగా జ్ఞాపకం ఉంది .

           మా అన్నయ్య దుర్ఘటన వాళ్ళ అమ్మ కాని మామ్మ కాని బెజవాడ లో కాపురం పెట్టె వీలు లేదు కనుక నన్ను ఒంటరిగ ఉండేట్లు చేయించారు .అందుకని బుల్లి మామ్మ గారింటి ప్రక్కనే ఉన్న మధిర సుబ్బన్న దీక్షిత్ల గారింట్లో వీధి వాకిట్లో ఒక చిన్న గది లో అద్దేకున్నాను .అద్దె నెలకు పాతిక రూపాయలు .వాళ్ళూ చాలా మంచి దంపతులు వాళ్లకు కొండయ్య అనే కొడుకు ఎస్ ఎస్.ఎల్ .సి చదివే వాడు ఉండే వాడు .  .ఒకమ్మాయి ఇంకో చిన్న కూతురు దీక్షితులు గారు పవర్ ప్రాజెక్ట్ లో ఇంజినీర్ .చాల గౌరవం గా చూసే వారు ఆప్యాయం గా ఉండే వారు .మధిర సుబ్బన్న దీక్షితులనే ఆయన ‘’కాశీ మజిలీ కధలు ‘’రాసినట్లు చదివాను .ఆయన ఈయన కాదని తెలుసు కోవటానికి చాలా కాలం పట్టింది .ఒక మడత మంచం మీద నా కాపురం .కిటికీ లో పుస్తకాలు .హోటల్ లో టిఫి న్ ,భోజనం నెలకు ముప్ఫై రూపాయలు భోజనానికి టికెట్లు ఒకే సర్రి చెల్లించి కొనే వాడిని .మధ్యలో అయి పోతే మళ్ళీ కొనుక్కోవటమే .బుల్లి మామ్మ ఇల్లు ప్రక్కనే కనుక కాలక్షేపానికేమీ కొదవ లేదు .నెమ్మదిగా బాధలు మరిచి జీవన స్రవంతిలో కలిసి పోయాను .అప్పుడు ‘’ఆరోరా‘’వాళ్ళ గైడ్లు బాగా ఉండేవి లైట్ కు మాగ్నేతటిజం ఎలక్ట్రిసిటి లకు అవే మాకు సంజీవిని లు .వాటి తో నే జీవితం అవే పదే  పదే చదివి మార్కులు తెచ్చుకొన్నాను ,’’విజువల్  మెమరి ‘’ అని ఒక దాన్ని ప్రాక్టీస్ చేశాను అదే నాకు శరణ్యం .ఎన్ని పేజీ లైనాఅలా కళ్ళ ముందు కానీ పించేవి .దానితో మార్కులు బానే కొట్టే సె వాడిని .కనుక నేను రుణ పడాల్సింది ఆరోరా వారికి అని పిస్తుంది .గజి బి.శాస్త్రి గారు అనే ఆయన లైట్ సబ్జెక్ట్ ను రెండో ఏడాది బోధించారు ఆది వారాల్లో వారింటికి రామ్మనమనే వారు అక్కడ అనుమానాలుంటే తీర్చే వారు .ప్రాక్టికల్స్ లో బాగా సహాయం చేశారు .

     మొదటి ఏడాది ఇంగ్లీష్ ప్రోజు ,ఒక నాందడి టల్డ్టిల్డ్ మాత్రమె ఉండేవి ప్రోజు లో ఐన్స్టీన్ రాసిన ‘’సైన్సు అండ్ రెలిజియన్’’ వ్యాసం నాకు శిరో దార్యం గా ఉండేది ఇప్పటికీ ఇష్టం .జాన్ గాళ్స్ వర్దీ రాసిన నవల the forsite saga ‘’ఉపవాచకం గా చదువు కొన్నాం .పరీక్ష కూడా ఆఏడాదే . .రెండో ఏడాది లాంగ్వేజి ఉండేది కాదు అంతా సబ్జేక్తులే .లెక్కలలో ఆల్జీబ్రా  ఏ.కృష్ణ మూర్తి గారు ,అనలిటికల్ జామెట్రీ ని రామ కోటేశ్వరరావు గారు ,’’నేగటివ్న్ నంబర్స్’’ ను రాఘవా చారి గారు కాల్క్యులస్ ను యెన్.ఆర్.కే.గారు అత్యద్భుతం గా చెప్పారు .చాలా కాలం అది నా మనసు లో దాగి ఉండేది .’’ఇంటిగ్రేషన్, దిఫెరెంసి ఏషన్’’  మహా ఇష్టం . ..ఆచారి గారి బోధన అందేది కాదు .ఏమైనా లేక్కలులో మంచి మార్కులు వచ్చాయి .లెక్కల్లో పెరి శాస్త్రి గారు మంచి బోధకులు గా పేరొందారు మాకెప్పుడూ రాలేదు .కేమిస్త్రి లో ఫిజికల్ చేమిస్త్రి కి గుర్రాజు గారి తమ్ముడు శ్రీ రామ మూర్తి గారు బోధించారు ఆర్గానిక్ కేమిస్త్రి ని సోమయాజులు గొప్ప గా నేర్పారు .అందుకనే సబ్సిడరి సబ్జెక్టు లైన ఈ రెండిటి లో ఫస్ట్ క్లాస్ మార్కులోచ్చాయి .మెయిన్ ఫిజిక్స్ లో సెకండ్ క్లాస్ మార్కులు వస్తే ప్రాక్టికల్స్ లో మొదటి మార్కులొచ్చి మొత్తం మీద సెకండ్ క్లాస్ లో ఉతీర్నుడైనాను .గంగాధర శాస్త్రి ఫిస్ట్ క్లాస్ సాధించాడు అతను చాలా కాలం ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపే వాడు .రిజల్ట్స్ మార్చిలోనే వచ్చాయి .ఇంతటితో రెండో ఏడాది డిగ్రీ పూర్తీ అయింది .మంచి స్నేహితులు ,మంచి కుటుంబం తో స్నేహం ,పట్టాభి రామయ్య గారింటికి తరచు వెళ్ళటం వారి ఆతిధ్యాన్ని పొందటం వారానికి ఖచ్చితం గా ఉయ్యూరు వెళ్ళటం ఉండేది నా చదువు గురించి మా వాళ్ళెవరు పర్య వేక్షించ లేదు ఇలా చదువు ,అలా చదువు అని చెప్పలేదు .అన్నయ్య లేదు కనుక ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకు గా నా బాధ్యత కొంత ఉంది అని అనుకోని చాలా బాధ్యత గా నడిచాను ..నన్ను నేనే చెక్ చేసుకొంటూ ముందుకు సాగాను .అదే నాకు బాగా తోడ్పడింది .

           తర్వాత నా జీవిత గమనాన్ని గురించి తర్వాతా ముచ్చ టి స్తాను

         సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్—19-2-13-ఉయ్యూరు   ..

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మోమేపల్లి సాహితీ పురస్కారం – 24.02.2013 విజయవాడ లో

somepalli saahithee puraskaralu -1somepalli saahithee puraskaralu -2

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -2 ఇంగ్లీష్ సబ్జెక్ట్

 నా దారి తీరు -2

                         ఇంగ్లీష్ సబ్జెక్ట్ 

    ఇంటర్ లో మాకు ఇంగ్లీష్ పోయిట్రీ కి సుబ్రహ్మణ్యం గారు అనే అరవ ఆయన వచ్చే వారు .చాలా బాగా చెప్పే వారు  .ఆర్ దయా  నిధి గారు ప్రోస్ చెప్పే వారు ఈయన ఎప్పుడు నల్ల పాంటు కోటు తోఉండే వారు నాండి టటైల్డ్ కు కే.హిరయన్నయ్య అనే ఎర్రటి ,పొట్టి కోటు బూటు వేసే కన్నడం ఆయన వచ్చే వారు .ఆయనకు తెలుగు రాదు .ఈయ నే మాకు డికెన్స్ రాసిన ‘’A taale of two cities ‘’బోధించారు ఆయన ప్రారంభ వాక్యాలను అద్భుతం గా చదివి చెప్పటం ఇప్పటికి గుర్తుంది “’it was the good of time it was the bad of time ‘’ అన్న మాటలు ఇంకా చెవుల్లో రింగు మంటున్నాయి అందులో పాత్రలు వాటి స్వభావాలు త్యాగం ,ప్రేమా అన్నీ గొప్ప గా ఆవిష్కరించి డికెన్స్ అంటే వీరాభి మానాన్ని కల్గించారు .అందుకే అమెరికా వెళ్లి నప్పుడల్లా డికెన్స్ పుస్తకాలు ,ఆయన పై ఆధునికులు రాసిన విశ్లేషణ చదవటం మహా ఇష్టం గా ఉండేది .విలియం బ్లేక్ రాసిన the tiger పద్యాన్ని సుబ్రహ్మణ్యం గారు విరగ దీసి చెప్పి ఆయనంటే అభిరుచి కల్గించారు .ప్రోజు లో బైరన్ రాసిన వ్యాసాలున్దేవి చదువు మీద పుస్తకం మీద స్నేహితుల మీద ,రాయటం మీద గొప్ప ఎస్సేలు చదువుకొన్నాం .జూలియస్ సీసర్ నాటకం కూడా హిరణ్నయ్య గారే చెప్పిన జ్ఞాపకం .

                             గణితం

     లెక్కల్లో ఆల్జీబ్రా, కాల్క్యులస్, జామెట్రీ,ఎనలిటికల్ జామెట్రీ వగైరాలున్దేవి .ప్యూర్ జమేత్రిని నోరి రాదా కృష్ణ మూర్తి గారు (n.r.k.),ఆల్జీబ్రా ను అనుముల కృష్ణ మూర్తి గారు (a.k.),ఎనలిటికల్ ను రామ కోటేశ్వర రావు గారు బోధించారు .ముడుంబై రాఘవా చారి గారు హెడ్ .ఆయన కూడా ఆల్జీబ్రా చెప్పారు .ఇందులో నోరి వారి బోధన పరవశం కలిగించెడి .ప్రతి స్టెప్ బోర్డ్ మీద వేసే వారు అనుమానాలు తీర్చే వారు .ఏ.కే .గారు చాలా స్టైల్ గా ఉండే వారు .ఆయనతో చనువుండేది కాదు .రాఘ వా చారి గారు కోపం తెలీని మనిషి కోపం వస్తే యెర్ర కణాలు పాడై పోతాయని ఎవ్వర్నీ కోపగించే వారు కాదని ఆయనే చెప్పారు . ఆర్.ఎస్.ఎస్.మనిషి మంచి పద్ధతులున్న వారు .సిల్కు పంచె ,సిల్కు లాల్చి తో నుదుట నిలువు బొట్టుతో దబ్బ పండు లా ఉండే వారు ..

                            కేమిస్ట్రి

             ఇనార్గానిక్ చేమిస్త్రి కి వింజమూరి భాస్కర రావు గారు వచ్చే వారు .వారే మొదటి గంట కు వచ్చి క్లాస్ టీచర్ గా ఉండే వారు .ఇన్ షర్ట్ర్ట్ వేసుకొని ఉండే వారు నల్లటి పొట్టి మనిషి .అయినా గొప్పా ఆకర్శన ఉండేది గాయకురాలు విజమూరి లక్ష్మి గారికి అన్న గారు .భాస్కర రావు గారు నాకు రోల్ మోడల్ .పా ఠాన్ని చెప్పిrecapitulation  చేసి మర్నాడు క్లాస్ కు రాగానే నిన్నటి రోజు లెసన్ పై ప్రశ్నలు వేసి సబ్జెక్ట్ మీద నా కు మంచి అభిమానాన్నిఅభిని వేశాన్ని కల్గించారు .దీనినే నేనూ స్కూల్ లో బోధనకు ఉపయోగించి విజయం సాధించాను .భాస్కర పణిక్కర్ అనే ఆయన రాసిన నిక్ కు చపుస్తకం ఇనార్గాదివాను .చాలా సింపుల్ గా ఉండేది పాత పుస్తకాల షాపు లు అలంకార్ టాకీస్ దగ్గర ఉండేవి అక్కడ రెండున్నర రూపాయలకు దాన్ని కొన్నాను ..అలాగే ఇంగ్లీష్ గైడ్ రూపాయిన్నరకు ఫిజిక్స్ రెండు కు కొన్న గుర్తు .ఆర్గానిక్ కేమిస్త్రి కి సోమయాజులు గారు అనే హెడ్ వచ్చే వారు .పంచా లాల్చీ తో శుద్ధ వైదికుని లా నల్ల బొట్టు తో ఉండే వారు .అద్భుత బోధన వారిది .ఇంటికి వెళ్లి చదవక్కర్లేక పోయేది అంతా క్లాస్ లోనే వచ్చేసేది ..ప్రాక్టికల్స్ కు లాబ్ ఉండేది .అందులో మూర్తి గారు అనే ఎప్పుడు కారా కిళ్ళీ నవిలే ఆయన ఇంచార్జి గా ఉండే వారు .ఏదో దూరపు బంధుత్వం ఉంది మాకు.ఆయన్ను అందరు ‘’కారా కిల్లి ‘అనే వారు .నన్ను బాగా చూసుకొనే వారు .నాకు ప్రాక్టికల్స్ చెయ్యటం వచ్చేది  కాదు .ఎప్పుడూ రిజల్ట్ కోసం ‘’కుకింగ్ ‘’చేసే వాడిని

                                  ఫిజిక్స్

         ఫిజిక్స్ కు గుర్రాజు గారు వచ్చే వారు .ఆయనే హెడ్.ఎప్పుడు పాంట్ కోట్ వేసుకొని బూట్ లతో వచ్చే వారు .ఆయనంటే భయం .బాగా బోధించే వారు .ఆయన కు ఒక కాలు కొంచెం పొట్టి .ఫిజిక్స్ పై మంచి అభిమానం రావటానికి కారకులయ్యారు .ఫిజిక్స్ లాబ్ కు వెంకటేశ్వర్లు అనే అసిస్టెంట్ ఉండే వాడు నల్లగా నిక్కర్ లో ఉండేవాడు అతనే అందరికి ప్రాక్టికల్స్ కు సాయం చేసే వాడు .పరీక్షల్లో కూడా ..ఫిజిక్స్ లాబ్ పైన కేమిస్త్రి ది కింద ఉండేవి .లైట్ ఎలేక్త్రిసిటి ,మాగ్నేటిజం ,డైనమిక్స్ వగైరాలున్దేవి బుద్ధి రాజు రామ మోహన శర్మ గారు స్తాటిక్స్ చెప్పేవారని జ్ఞాపకం .అయన పంచ  మీద బుష్ షార్ట్ వేసుకొని కోటు తొడుక్కొని వచ్చే వారు .ఆయన్ను ‘’బెజవాడరామవరప్పాడు  మోటార్ సర్విస్‘’(b.r.m.s.)అనే వాళ్ళం ఆయన యూని వెర్సిటి గోల్డ్ మెడలిశ్టే కాని మాకేమీ అర్ధమయ్యేది కాదు .రెండో ఏడు కొత్తగా ప్రజాపతి రావు గారు వచ్చారు కష్ట పడి చెప్పేవారు ఆయనే తర్వాతా శారదా కాలేజి ప్రిన్సిపాల్ అయి అవినీతి ఆరోపణ లేదుర్కొని ఉద్యోగం కోల్పోయారు

                     కొందరు ప్రముఖులు .

           ఇంగ్లీష్ హెడ్ గా జొన్నల గడ్డ సత్య నారాయణ మూర్తి గారుండే వారు .ఆయన క్లాసులు R4 అని ప్లే గ్రౌండ్ దగ్గర పెద్ద రేకుల షెడ్ లో జరిగేవి .మాకూ ఒకటి రెండు సార్లు క్లాస్ కు వచ్చి బోధించారు .ఆయన డ్రామాకు స్పెషల్ .అంతా అభి నయించి చెప్పేవారు ఆ ఉచ్చారణ ,పాత్రల స్వభావం కళ్ళకు కట్టించే వారు .అందుకే ఆయన క్లాస్ అంటే అందరు ఎగ బడి వెళ్లి వినే వారు ఇతర సబ్జెక్టుల వారూ .వచ్చే వారు .హాలంతా నిండి పోయేది ఆయన ఏడెనిమిది భాషల్లో అపూర్వమైన పాండిత్యం ,ప్రజ్ఞా ఉన్న వారు .హిందూ పూర్ లో మా నాన్న గారు మునిసిపల్ హై స్కూల్ లో పని చేస్తున్నప్పుడు వీరు ఉపన్యాసాలకోసం మా ఇంట్లో ఉండే వారట మా నాన్నా గారు అమ్మా గుర్తు చేశారు మహా గంగా ఝరి తో ఆయన ఉపన్యాసాలు సాగేవి అందులో తెలుగు ఇంగ్లీష్ సంస్కృతం వేదాలు శాస్త్రాలు పురాణాలు అలా దొరలు కొంటు వచ్చేవి ఒక మాటకు ఎన్నెన్ని అర్ధాలున్నాయో ఆయన  ఇంగ్లీష్ బోధించే టప్పుడు చెప్పే వారు మా రెండవ ఏడాది ఆయన కు రష్యా ఆహ్వానం వస్తే వెళ్ళారు అనువాదం చేయటానికి .వెళ్ళే ముందు మేము ఆయనకు గొప్ప సన్మానం, వీడ్కోలు సభా చేశాము .అప్పుడు మాట్లాడుతూ ఆయన ‘’ఆ మంచు గడ్డ లో ఈ జొన్నల గడ్డ ఏమై పోతాడో ?’’అని చమత్కరించిన మాట ఇప్పటికీ గుర్తుంది .అలాగే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఒకాయన హిందీ నటుడు దిలీప్ కుమార్ లా జుట్టు, వేషం తో ఉండే వారు ఆయన్ను అందరు దిలీప్ కుమార్ అనే పిలిచే వారు .ఆయనా అస్సాం ప్రభుత్వ ఆహ్వానం పై గౌహతి వెళ్ళారు ఇద్దరూ ఎక్కువ కాలం లేరు .మూడేళ్లకే తిరిగి వచ్చారని జ్ఞాపకం .

               లెక్కల ప్రైవేటు

             నా చదువు ఏదో వానాకాలం చదువు లా సాగింది పెద్ద గా లెక్కలు అర్ధమయ్యేవి కావు .ఎవరికి చెప్పలేదు .కాని మొదటి ఏడాది అవగానే ప్రోగ్రెస్ కార్డు ఇంటికి వచ్చింది .అందులో మార్కులు చూసి మా నాన్న ‘’ఏమిట్రా ఈ అత్తిసరు మార్కులు .యెట్లా రెండో ఏడు లాగిస్తావ్ ?’’అని అడిగారు .లెక్కల్లో ట్యూషన్ పెట్టాలి అని అడిగాను .సరే నని రెండో ఏడాది మొదటి నుంచీ నోరి రాదా కృష్ణ మూర్తి గారి దగ్గర ట్యూషన్లు కు చేరాను .మేమున్న ఇంటికి ప్రక్క బజారు లోనే ఉన్నారాయాన .ఒక డాబా ఇల్లు కింద రూమ్ లో సుమారు ఇరవై మంది కూర్చునే వీలు అక్కడే బోర్డు .చాప మీద కూర్చుని బోధించే వారు .అసలు లెక్క లంటే హై స్కూల్ లోనే భయం .ఎట్లాగో తప్పకుండా పాస్ మార్కులోచ్చాయి మేస్టారి బోధన అద్వితీయం ఎంతో ఓర్పు వారిది ఆయన బాచీలు బాచీలు గా చెప్పే వారు .తెల్ల వారు ఝామున నాలుగున్నర గంటల నుండి గంట కోక బాచి వచ్చేది డిగ్రీ ,ఇంటర్ వాళ్లకు చెప్పేవారు తొమ్మిదింటి దాకా క్లాసులు .మళ్ళీ పదింటి కల్లా కాలేజి కి తయారు .ఇక్కడ చెప్పాం కదా అని అక్కడేమీ బద్ధ కించే వారు కాదు .అక్కడా ఇంతకంటే బాగా చెప్పే వారు .నాకు గొప్ప ఆదర్శం నోరి వారు .రెండో సంవత్సరం అంటే మొదటి ఏడాది లెక్కలన్నీ మళ్ళీ నేర్చుకోవాల్సిందే .అన్నీ చెప్పేవారు .మంచి మార్కులు వచ్చాయి లెక్క లంటే గొప్ప అభిమానం ,ఆపేక్ష  కల్పించింది నోరి మేస్టారే .ట్యూషన్ ఫీజు స్సంవత్సరానికి రెండు వందల యాభై .ముందు నూట యాభై కట్టాలి .ఫస్ట్ క్లాస్ లో ఇంటర్ పాస్ అయాను అన్నిటికన్నా లెక్కల్లో ఎక్కువ మార్కులోచ్చాయి .మిగిలిన సబ్జెక్టు లన్ని నేనే చదువు కొన్నాను .లెక్కల్లో వచ్చిన ఇంట్రెస్ట్ మిగిలిన వాటిని చదవటానికి బాగా ఉప యోగ పడింది .రిజల్ట్ రాగానే నేనూ మా నాన్నా వెళ్లి నోరి వారికి కృతజ్ఞతలు చెప్పాము అప్పటికే నేను ఇన్ లాండ్ లెటర్ రాసి నా కృతజ్ఞతలు తెలియ జేశాను ..ఆయనా సంతోషించారు .లెక్కలకు నాకు ఆదర్శం  నోరి రాదా కృష్ణ మూర్తి గారే ఆప్పుడు ఇప్పుటికీ , ఎప్పుడూ కూడా .అందుకే నేను హైస్కూల్లో బోధించేటప్పుడు లెక్కలు కూడా చెప్పి మెప్పించే వాడిని .లెక్కల మేస్తార్లతో పోటీ గా బోధించి విద్యార్ధుల మనసు ఆకట్టు కొనే వాడిని దీనికి భిక్ష పెట్టింది యెన్.ఆర్.కే.గారే .

                    నేను చూసిన పెద్దలు

         మా కాలేజి కి సాంస్కృతిక శాఖ చాల కార్య క్రమాలు చే బట్టేది .బాలాంత్రపు రజనీ కాంత రావు గారు ఆకాశ వాణి లో ఉండే వారు .వారు వచ్చి ఆర్ ఫోర్ లో సంగీత విభావరి నిర్వహించటం బాగా గుర్తు .వింజమూరి లక్ష్మి గారు కూడా పాడారు రజని తెల్లని అపైజమా ,లాల్చీతో వచ్చారు .అల్లాగే బందా కనక లింగేశ్వర రావు గారు నాటకం మీద ప్రసంగించి పద్యాలు పాడటం జ్ఞాపకం .జి.సి.కొండయ్య గారు తన రష్యా అను భావాలు వివరించటం మనసు లో నిలిచే ఉంది .పి.డి.గారు జానకి రామయ్య గారు పంచా లాల్చీ త్హో ఉండే వారు .ఆయన సోమయాజుల గారి తమ్ముడని గుర్తు ఈయన అంటే హడలు గా ఉండేది .నేనేమీ పెద్ద గా ఆడిందేమీ లేదు .వీలు చిక్కి నప్పుడల్లా సినిమాలు చూసే వాడిని హిందీ సినిమాలు నవ రాగ్ ఝనక్ ఝనక్ పాయల్ బాజే వంటివి చూసి శాంతా రాం అంటే అభిమానం పెరిగింది .అప్పుడు వినాయక చవితి సినిమా జైహింద్ టాకీస్ లో నేల మీద కూర్చుని పావలా టికెట్ తో చూసాం వేసవి .చెమటలు కక్కి నేలంతా చెమటతో తడిస్తే చెప్పులు ముడ్డి కింద పెట్టుకోన్నాం నేనూ రాదా కృష్ణ మూర్తి శోభనాద్రి, రాముడు .

                         సాయంత్రాలు

               రోజు సాయంత్రం హోటల్ కు వెళ్ళే వాళ్ళు రాధుడు ,దిగ వల్లి శివ రావు గారి అబ్బాయి సూర్య నారాయణ ఇంకో సూర్య నారాయణ శివ రావు గారి పెద్ద బ్బాయి ఒక  రోజు నన్నూ వాళ్ళతో రమ్మంటే వెళ్లాను ,మర్నాటి నుంచి వాళ్ళు రమ్మనక  పోయినాఎగేసుకొని  వెంట వెళ్లాను డబ్బులన్నీ దిగ వల్లి వారే పెట్టె వారు .నన్నేమీ తక్కువ గా చూసే వారు కాదు .నాకే చివరికి సిగ్గు అని పించి అని పించింది ‘’ఈ బేవార్సు తిండియేమిటి ‘?/అని తర్వాతవెళ్ళటం మానె శాను .అజంతా హోటల్ లో మిన పట్టు బాగుండేది .వెల్కం హోటల్ లో కాఫే బాగుండేది మోడరన్ హోటల్ లో బొండా బాగా నచ్చేది .ఇలా ఎక్కడ వీలైతే అక్కడ తినే వాడిని ఒక టిఫిన్ ఒక కాఫీ .అప్పుడు మెట్రిక్ పద్ధతి వచ్చేసింది .పావలాకు ప్లేట్ ఇడ్లి పన్నెండు పైసలకు కాఫీ ఉవాచ్చేదని జ్ఞాపకం .కాలేజి దగ్గర హోటల్ ఉన్నా ఎప్పుడైనా టీ తాగే వాడిని టిఫి చేసే వాడిని కాదు .ఆకలితో అలానే గడిపాను .

           నడిచి దుర్గ కొండ కు వెళ్ళే వాడిని బారేజ్ నడిచి వెళ్లి చూసే వాడిని .హనుమంత రాయ గ్రంధాలయానికి వెళ్లి పేపర్లు చదివే వాడిని అక్కడి మీటింగులు నాటకాలు చూసే వాడిని దారిలో స్దినిమా ఆఫీసుల్లో కొత్త సినిమా బోర్డులు చూసుకొనే వాడిని శర్మా ఆర్ట్స్ అనేది ఆ రోజుల్లో బానర్లు తయారు చేసేది’’ లితో వర్కు’’ బాగా ఉండేది .నెహ్రు ను రెండు సార్లు విజయ వాడ పి.డబ్ల్యు గ్రౌండ్ మీటింగ్ లో చూశాను .ఎర్రగా కోతి ముడ్డి మామిడి పండు రంగులో ఉండే వాడు చాలా చలాకీ గా వేదిక ఎక్కే వాడు .ఏలూరు అమ్మాయిమోతే వేద కుమారి .వందే మాతరం పాడేది ఆమె తర్వాతా ఏం ఎల్. ఏ .అయింది .చాలా హుషారు గా మాట్లాడే వాడు నెహ్రు .

     మామ్మా వాళ్ళింటి ప్రక్కన రుక్మిణమ్మ అనే విధవ రాలుండేది ఆమె ఒక పురోహితుని కూతురు వచ్చీ రాని  ఇంగ్లీష్ మాట్లాడేది ‘’దానికో పెద్ద స్టోరు (స్టోరీ )ఉంది అనేది స్టోరీ కి బదులు .రిక్షా బదులు ‘’రిష్కా ‘’అనేది కావాలని నేను ఆవిడ తో ఆమా టలు అని పిన్చి నవ్వుకొనే వాడిని ఆమె తండ్రి పున్నయ్య గారు మంచి కుటుంబం చాలా ఆప్యాయం గా ఉండే వారు .

                                 చెరుకు పల్లి పట్టాభి రామయ్య గారు  

                    ప్రక్క వీధిలో చెరుకు పల్లి పట్టాభి రామయ్య గారు అనే గొప్ప ప్లీడర్ ఉండే వారు మా బుల్లి మామ్మ మనవరాలు శారదక్కయ్యకు మామ గారు .ఆమె భర్త శ్రీ రామ మూర్తి గారు బి.ఎల్.చదివినా ప్రాక్టీస్ చేయ లేదు ఆయన తమ్ముడు శాస్త్రి ని మేము ఏడి పించే వాళ్ళంఅతను అమాయకం గా ఉండే వాడు మేతక మనిషి . పట్టాభి రామయ్య గారు నన్ను బాగా ఆదరించే వారు కాని శారదక్కయ్య స్వంత తమ్ముల్లైన శోభనాద్రి రాముడంటే ఆయన కెందుకో కొంచెం కోపం .అలానే రాధ కృష్ణ మూర్తి అన్నా అంతే .లీడింగ్ లాయర్ ఆయన భార్య కూడా మాపై ఆప్యాయత కన పరచేది వాళ్ళమ్మాయి భారతి మాకు కాలేజి లో సీనియర్ రోజు రిక్షా లో వెళ్లి వచ్చేది .ఆమె అక్క పిచ్చిది ఇంట్లోనే ఉండేది .శారదక్కయ్య భర్త ‘’స్కాట్ నవల ‘’టాలిస్మన్ ‘’కు’’గీటు రాయి ‘’పేరు తో  మంచి అనువాదం చేసి ప్రచురించారు .బాగా జ్ఞానం ఉన్నా ఉత్త బద్ధ కిష్టు..రాత్రిళ్ళు పట్టాభి రామయ్య గారు కుంపటి దగ్గర పెట్టుకొని చలి కాచుకొంటూ భోజనం చేసే వారు మమ్మల్నీ పక్కన కూర్చో పెట్టుకొనే వారు మాటలు బాగా మాట్లాడే వారు ఉదయం సాయం సంధ్యా వందనం చేసే వారు .ఆమె కు చక్కని ని పూజ గది ఉండేది మడి వంట చేయటానికి వంటా విడ ఉండేది ఒక రకం గా దివాణం వారి ఇల్లు .ఎంతో మంది సాహితీ వేత్తలు సంగీతజ్ఞులు ఆయన కోసం వచ్చే వారు మంచి ఆతిధ్యం ఇచ్చే వారు ఆయన తమ్ముడు కోదండ రామయ్య గారు కూడా లాయరు ప్రక్క వీధి లో ఉండే వారు ఆయనకు ఒక కాలు కుంటి సంతానం లేదు మరదలి కొడుకును దత్తత చేసుకొన్నాడు పెద్ద గా ప్రాక్టీస్ ఉండేది కాదు అయితేనేం మంచి ఆస్తి ఉంది .ఇప్పుడు ఆ వీధికి ”చెరుకు పల్లి వారి వీధి ”అని పేరొచ్చింది .వాళ్ళింటి ప్రక్కనే మా ఓడిన కమలమ్మ గారి బాబాయి వాళ్ళ ఇల్లు ఉంది .

          బుల్లి మామ్మ కు ఉయ్యూరు నుండి బియ్యం తెచ్చి ఇచ్చే వాడిని వీలైతే కాళేశ్వర రావు మార్కెట్ కు వెళ్లి కూరలు తెచ్చే వాడిని .శోభనాద్రి వాళ్ళు శోభనాద్రి గూడెం నుండి బియ్యం పప్పులు మిర్చి వగైరా వాళ్ళ చేలో పండినవి బస్ లో తెచ్చి పడేసే వాళ్ళు .లేక పోతే వాళ్ళ నిఖామాన్ మస్తాన్ తెచ్చి పడేసే వాడు ,చెరుకు పల్లి రామ శర్మ అని శారదక్కయ్య పిన్ని కొడుకు రామ మోహన ఆయుర్వేద శాలలో ఆయుర్వేదం నేర్చుకొంటూ మాతో ఆది వారాలు వచ్చి మాట్లాడి వెళ్తుండే వాడు .అతన్ని వీళ్ళు ‘’సాయిబూ ‘’అని సరదా గా పిలిచే వారు నవ్వే వాడు .గొప్ప ఆహితాగ్ని ఆయన .వాళ్ళ అబ్బాయి గణేష్ శర్మ ఇప్పుడు మా ఇంట్లో అద్దెకు ఉండి మధునా పురం లో వేదం నేర్చుకొంటూ కూతుర్ని ఫ్లోరా లో చదివిస్తున్నాడు .సెలవలు దగ్గర కొస్తే ఇంటికి ఎప్పుడెప్పుడా వెళ్ళేది అని రోజులు లెక్క వేసే వాడిని ‘’ఇంకా నాలుగు రోజులు ఎనిమిది భోజనాలు ‘అనే వాడిని శోభనాద్రి, రాముడు నవ్వే వాళ్ళు వీళ్ళు నన్ను ‘’దుర్గా పతీ ‘’అని పిలిచే వారు .నేను శోభనాద్రిని ,రాదా కృష్ణ ను ‘’గురూ ‘’అనే వాడిని రాముడు మాత్రం నన్ను ‘’పతీ ‘’అని షార్ట్ కట్ గా పిలిచే వాడు .బలే సరదాగా రెండేళ్ళు గడిచాయి జామెట్రీ లెక్కలు ‘’nine point theorem ‘’ను కింద గచ్చు మీద ఫిగర్ వేసి మొత్తం చూడ కుండా రాయటం అల వాటు చేసుకొన్నాను .దిగ వల్లి శివ రావు గారు కూడా పెద్ద లాయర్ చారిత్రిక పరిశోధకులు ఎన్నో పుస్తకాలు రాశారు వారిల్లు మామ్మ వాళ్ళింటికి ఎదురిల్లె .రామ మందిరానికి వెళ్లి వచ్చే వాడిని రహిమాన్ పార్కుకు, అక్కడే ఉన్న లైబ్రరీకి ఆది వారాలలో వెళ్ళే వాడిని .మామ్మ వాళ్ళు సరుకులులను రామ మందిరం దగ్గర ఉన్న కోమటి కోట్టులో పద్దు పెట్టి తెచ్చే వాళ్ళు.అతను నవ్వుతు పలకరించే వాడు .డబ్బుకు ఒత్తిడి చేసే వాడు కాదు .’

                  మరి కొందరు ప్రముఖ లెక్చరర్లు

           జటావల్లభుల పురుషోత్తం గారు సంకృత అధ్యాపకు లూ, హెడ్డు కూడా మంచి వక్త .ఎన్నో పుస్తకాలు రాశారు పంచ లాల్చీ మ వల్లే వాటు తో ఉండే వారు నుదుట పెద్ద కుంకుమ బొట్టు వారంటే విపరీత మైన గౌరవం అందరికి .వారూ  విశ్వనాధ వారు హిందూ పూర్ వచ్చి నప్పుడు మా ఇంట్లో నే ఉండే వారట .అన్నే రాదా కృష్ణ మూర్తి గారు లాజిక్ కు మోనార్క్ .తెల్లటి దుస్తులు ధరించి నల్లటి చెప్పులతో వచ్చే వారు .వారు లాజిక్ చెబుతుంటే నోళ్ళు వెల్ల బెట్టి వినే వారు ఎన్నో గ్రంధాలు చదివి అవలోడనం చేసుకొన్నారని చెప్పే వారు .ఒక రకం గా ఈ కాలేజీ కి ‘’ప్లేటో ‘’లాంటి వారు చాలా నిదానం గా ఉండే వారు .

                 ఎస్వీ ప్రభావం

         సుమారు నల భై ఏళ్ళ వయసున్న ఎస్.వెంకటేశ్వర్లు గారనే ఎకనామిక్స్ లెక్చరర్ అంటే కుర్రకారుకు మహా క్రేఇజీ గా ఉండేది .బక్క పలుచని మనిషి .కొటూ బూటు టై తో చాలా స్టైలిష్ గా వచ్చే వారు .స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే లకు ఆయన మాట్లాడుతుంటే అలా నిశ్చేష్టులై వినే వాళ్ళం అనర్గళమైన వాగ్దోరణి .ఇంగ్లీష్ లోనే మాట్లాడే వారు .ఖచ్చితం గా పది నిమిషాలు లేక పావు గంట మాత్రమె మాట్లాడే వారు ఎంతో గొప్ప గా ప్రారంభించే వారో అంత గొప్ప గా ముగించే వారు .ఉపన్యాసం అంటే ఇలా ఉండాలి అన్న ధోరణి వారిది ఆ సమయం లోనే వారు కర్తవ్య బోధనా చేసే వారు ..న భూతో అని పించేది నాకు మాత్రం .

                   నా ప్రిన్సి పాల్స్ మరియు కొందరు ముఖ్య ఉపన్యాసకులు

    నేను కాలేజి లో చేరి నప్పుడు మాగంటి సూర్య నారాయణ గారు ప్రిన్సిపాల్ ఒక ఏడాదికే రిటైర్ అయారు ఆయన వస్తుంటే అంత భయ పడి పోయే వారు ,కోటు బూటు తో గంభీరం గా ఉండే వారు .తర్వాతఎస్.త్యాగ రాజు ,ఎఫ్ త్యాగ రాజులు ప్రిన్సిపాల్స్ .డి.వి.క్రిష్నయ్య గారు తర్వాతా అయారు .రాఘవా చార్లు గారు కూడా అయ్యారు .కామర్స్ లో కృష్ణా రావు గారికి మంచి పేరుండేది .ఈయనా తర్వాతా అయారు .సూరి రామ నరసింహం గారు పాలిటిక్స్ లెక్చరర్ అని జ్ఞాపకం .ఆయన మాకు దూరపు బంధువు బాహు బలేంద్ర గూడెం అగ్రహారీకులు ..ఆయన తమ్ముడు మాతో పాటు జిల్లా పరిషత్ లో ఉపాధ్యాయులు .రామ నరసింహం గారు ‘’వోరోశషియస్ రీడర్ ‘’అనే వారు బల్ల మీద బాసిం పట్టు వేసి కూర్చుని లెక్చర్ ప్రారంభించే వారు .అలా అలవోకగా ధోరణి సాగి పోయేది ఎవ్వరు కదిలే వారు కాదు ఆయన ఆకారం వికృతం గా ముక్కు పొడవుగా ఉండేది పంచే లాల్చీ తెల్లనివి .వింత గా కనీ పించే వారు .సరస్వతి ఆయన ముఖం లో ప్రత్యక్ష మయి నట్లుండేది .ఒక సారి ఇంటికి వెళ్లి కలిశాం ఉయ్యాల బల్ల మీద ఊగుతూ కనీ పించారు చాలా ఆప్యాయం గా మాట్లాడారు .ప్రముఖ శాస్త్ర వేత్త ,నెహ్రు కు సైంటిఫిక్ సలహా దారు, సత్య సాయి శిష్యుడు అయిన సూరి భగ వంతం గారు బాహుబలేంద్ర గూడెం అగ్రహారీకులే .

                                దిగవల్లి శివ రావు గారు 

                దిగ వల్లి శివ రావు గారు చొక్కా మీద పంచ కట్టి బెల్టు పెట్టి  కోటు వేసే వారు .వారింటి నిండా పుస్తకాలే. లా పుస్తకాలతో బాటు సాహిత్యం కూడా అనంతం గా ఉండేది .చూస్తె కడుపు నిండి పోయేది .వీరి పెద్ద బ్బాయి కాలేజీ లో ఒక డిబేట్ లో పాల్గొని పరీక్షా విధానం మీద మాట్లాడుతూ ‘’examinations are botheration for Indian nation ‘’అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుంది .అతన్ని అందరు అభి నందిన్చారప్పుడు .చాలా కాలం రాదా కృష్ణ మూర్తి వాళ్ళింటికి వెళ్లి నప్పుడల్లా వీరిని తమ్ముడు  సూర్యాన్ని కలిసే వాడిని ..చెరుకు పల్లి పట్టాభి రామయ్య గారు లేత తమల పాకు లా ముసలి తనం లొనోఉండే వారు చలం, ఆయుర్వేద వైద్యులు ,గూడూరి నమశ్శివాయ ,పౌరాణిక నటుడు అబ్బూరి వర ప్రసాద రావు ,లతా ,మొదలైన సాహితీ వేత్తలు  వీరింటికి వచ్చే వారని పట్టాభి రామయ్య గారు నాతో ఎప్పుడో అన్నారు .శారదక్కయ్య పిన్ని రాజేశ్వరి కొడుకులు ప్రభాకర్ అతని అన్న ఇక్కడే చదివారు వేరే రూమ్ లో ఉండే వారు .నెల కోసారి కలిసే వాళ్ళం .వాళ్ళ గది దగ్గరే ఆర్ .ఎస్.ఎస్.ఆఫీస్ ఉండేది నాకున్న పరిచయం తో అక్కడికి వెళ్ళే వాడిని వరుసకు నాకు మేన మామ అయిన బాచ్చి (గుండు భాస్కర్ ) ఈ ఆఫీసులో ఉండిలయోలా కాలేజి లో చదివే వాడు శాఖలకు కూడా తీసుకొనే వాడు ఇక్కడే ఆర్ ఎస్ ఎస్ నాయకులు ఠాకూర్ గారు గోపాల్ రావు గారు వగైరాలను చూశాను ఠాకూర్ గారు ఉయ్యూరు వచ్చి నప్పుడు మా ఇంటికి వచ్చే వారు అలానే సంగమేశ్వర శాస్త్రి గారు కూడా .నేనంటే చాలా అభిమానం బాచ్చికి  పుయ్యురు లో శారదా త్యుటోరియాల్ కాలేజి పెట్టి బాగానే నడిపాడు వాళ్ళ ఆవిడ రామ లక్ష్మి రాజ మంద్రిలో నాకు ట్రయినింగ్ మేట్ .గవర్నమెంట్ హైస్కూల్ లో పని చేసి హెడ్ మిస్త్రేస్ చేసి రిటైర్ అయింది బాచ్చి పదేళ్ళ క్రితం బాల్చీ తన్నేయటం తో ఆమె ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ వదిలేసితిరుపతి లో ఉన్న అన్నగారి దగ్గరకు వెళ్ళింది శారదా లో నేను కొంతకాలం లెక్కలు ,ఫిజిక్సు చెప్పా మా రెండో వాడు శర్మ అక్కడే ట్యూషన్ చదివాడు టెన్త్ క్లాస్ కు

            ఇలా రెండేళ్ళు ఇంటర్ చదివి పూర్తీ చేసి 1958లో పాస్ అయాను .రెండేళ్ళు బుల్లి మామ్మ ఇంట్లోనే ఉన్నాను మామ్మ కోడలు సీతమ్మ పిన్ని కూడా రమా రెండో ఏడు వీళ్ళింట్లో ఉంది మామ్మకు సాయం చేసింది .  కాలేజీ లో విద్యార్ధి ఎన్నికల హడా విడి బాగా ఉండేది అన్గారీకుల వెంకటేశ్వర రావు అనే అతను ప్రెసిడెంట్ కు నిల బడి గెలిచి నట్లు జ్ఞాపకం సేక్రేతరిగా చొక్కాకి గుండీలు పెట్టని డి.సురేష్బాబు  అనే రాజ కేయ నాయకుడి కొడుకు గెలిచాడు .సైన్సు సెక్రెటరి గా మా బంధువు ,రేపల్లె లక్ష్మీ కాంతం పిన్ని అన్న కొడుకు సూర్య నారాయణ ఎన్నికయ్యాడు రెండో ఏడు చివరలో గ్రూప్ ఫోటో, పార్టీ చేశాడు .డబ్బులు బాగానే సంపాదించి మిగుల్చు కొన్నాడని అందరు అనుకొన్నారు .అతడిని నిజమేనా అని అడిగితే ‘’తప్పదు బ్రదర్’’అన్నాడు ఇతని తమ్ముడే దక్షిణా మూర్తి మా మరదలు భారతి ని వివాహం చేసుకొన్నాడు . దీని తర్వాత డిగ్రీ చదువు గురించి రాస్తాను .       సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-13-ఉయ్యూరు

       

 

 
 
 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

రధసప్తమి పూజ

This gallery contains 20 photos.

More Galleries | Tagged | Leave a comment

కృష్ణ శాస్త్ర్ గారితో ముఖా ముఖి

krishna sastri tho mukhamukhi -1krishna sastri tho mukhamukhi -4 krishna sastri tho mukhamukhi -2 krishna sastri tho mukhamukhi -3

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కళ కాలం జీవిస్తారు

కళ కాలం జీవిస్తారు

కూచిపూడి నృత్యానికి కొత్త సొబగులు అద్ది దేశ, విదేశాలకు వ్యాప్తి చేసిన మేటి నాట్య గురువు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం. అగ్రశ్రేణి సినీ తారలకే కాక నేడు నాట్యగురువులుగా, కళాకారులుగా అగ్రస్థానంలో ఉన్న వారిలో చాలామంది సత్యంగారి శిష్యులే. కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆశయంతో శ్రమించిన ఆయన మొదట్లో తన పిల్లలు నాట్యరంగంలోకి రాకూడదని ఎందుకు భావించారు? ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫి చేసిన ఆయన సినిమా రంగాన్ని వద్దనుకుని నృత్య శిక్షణకే ఎందుకు పరిమితమయ్యారు? 80వ పడిలో కూడా కూచిపూడి నాట్య వ్యాప్తి కోసం తపించిన తన తండ్రి గురించి, ఆయనతో తన అనుబంధాన్ని గురించి ‘నవ్య’తో పంచుకున్నారు ఆయన పెద్దకుమార్తె మేళ్లచెరువు కామేశ్వరి.

నాన్నది చాలా జాలిగుండె. ఎవరికైనా వొంట్లో బాగాలేదంటే తన జేబులో ఉన్న డబ్బంతా ఇచ్చేసి వచ్చేసేవారు. అప్పట్లో మద్రాసులో మేమున్న ఇల్లు ‘అయ్యర్ వీడు'(బ్రాహ్మణుల ఇల్లు)గా ఫేమస్. టి.నగర్‌లో అయ్యర్ వీడు అంటే రిక్షావాడు నేరుగా తీసికెళతాడు. నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ నా కళ్లముందు సజీవంగా ఉంది. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు ఉంటాయేమో. ఒక రోజు రాత్రి భోరున వర్షం కురుస్తోంది. మేమంతా ఇంట్లో ఉన్నాము. ఇంతలో ‘సత్యం సార్ యార్’ అంటూ ఎవరో వీధిలో గట్టిగా అరుస్తున్నారు.

ఆ అరుపులకు నాన్న గబగబ ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తారు. వీధిలో ఒక రిక్షా ఆగిఉంది. అందులో ఒక వృద్ధుడు పూర్తిగా తడిసిపోయి పడిపోయి ఉన్నాడు. నాన్న అతనిదగ్గరకు వెళ్లి ‘నేనే సత్యాన్ని…ఏమైంది?’ అని అడిగారు. అప్పుడా ఆ రిక్షా అబ్బాయి రిక్షాలో ఉన్న వృద్ధుడిని చూపిస్తూ “ఎవరో సార్ ఇతను…సత్యం సార్ దగ్గరకు తీసుకెళ్లు..ఆయనే నన్ను చూసుకుంటాడు అని చెప్పాడు..ఇప్పుడేమో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు” అనడంతో నాన్న స్పృహలో లేని ఆ వ్యక్తిని తన రెండు చేతులతో మోసుకుని ఇంట్లోకి తెచ్చారు.

నాన్నే అతని తడిబట్టలు విప్పి, పొడి పంచె కట్టి ఆటోలో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఆ వ్యక్తి ఎవరో నాన్నకు తెలియదని ఆ తర్వాత తెలిసింది. పేదవారికి ఎవరికైనా సుస్తీ చేస్తే ”సత్యంసార్ ఇంటికి వెళితే ఆయనో, ఆయన భార్యో అసుపత్రిలో చేర్పిస్తారు” అని అనేవారట అప్పట్లో. “మనం తింటే అది నేలపాలు..ఇతరులకు పెడితే దేవునిపాలు” అని మా నాయనమ్మ మా చిన్నప్పుడు అనేది. అదే సూత్రాన్ని నాన్న పాటించారు. మనం తినడమే కాదు ఇతరులకూ పెట్టాలి అని భావించే దయాగుణం నాన్నది.

మాకు డ్యాన్స్ వద్దన్నారు
మేము ఐదుగురం సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అందరిలోకి నేనే పెద్దదాన్ని. నా తర్వాత కాత్యాయని, వెంకటాచలపతి, బాలా త్రిపురసుందరి, రవిశంకర్. మేము పుట్టింది, పెరిగింది మద్రాసులోనే. నాన్న కూచిపూడి నుంచి మద్రాసుకు వెళ్లి స్థిరపడ్డారు కదా. నేను చదువుకుంది టి.నగర్‌లోని శారదా విద్యాలయలో. మా నాన్న టి.నగర్‌లోని పానగల్‌పార్క్ పక్కన ఇంట్లో కూచిపూడి ఆర్ట్ అకాడమి నిర్వహించేవారు. మొదట్లో విడిగా వేరే ఇంట్లో ఉండేవాళ్లం. తర్వాత ఇల్లు, డ్యాన్స్ స్కూలు ఒకటే అయింది.

మేము నృత్యం నేర్చుకోవడానికి నాన్న మొదట్లో ఒప్పుకోలేదు. తాను చాలా కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి తన పిల్లలు ఈ రంగంలోకి వచ్చి కష్టపడకూడదన్న ఉద్దేశంతో అమ్మా నాన్నలిద్దరికీ మేము ఎవరమూ ఈ రంగంలో రావడం ఇష్టం ఉండేది కాదు. అయితే నిద్రలేచింది మొదలు మా కళ్లకు కనిపించేది నృత్యమే కాబట్టి మేము కూడా నేర్చుకుంటామని నాన్నతో పోట్లాడేవాళ్లం. మా నాయనమ్మ మా తరఫున వకాల్తా పుచ్చుకుని నాన్నతో వాదించేది. “ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది అమ్మాయిలు వచ్చి నేర్చుకుంటున్నారు.

మన పిల్లలను కూడా నేర్చుకోనీరా అబ్బాయ్” అని నాయనమ్మ గట్టిగా పట్టుపట్టడంతో నాన్న కూడా సరేననక తప్పలేదు. అలా మేము కూడా చిన్నప్పటి నుంచే నాట్యం నేర్చుకున్నాము. మా నాన్న దగ్గర శేషుగారు(శంకరాభరణం ఫేమ్), దుర్గక్క అసిస్టెంట్స్‌గా ఉండేవారు. నాన్న వందనంతో శ్రీకారం చుడితే అసిస్టెంట్స్ జతులు, కొన్ని ఐటమ్స్ నేర్పించేవారు. ఆ తర్వాత నాన్న పర్యవేక్షణలో నృత్య శిక్షణ జరిగేది.

ఎందరో ప్రముఖ శిష్యులు
నాన్న తన శిష్యులతో విస్తృతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. నా చిన్నప్పుడు ఆయన కొన్ని సినిమాలకు కొరియోగ్రఫి నిర్వహించడం నాకు గుర్తు. 1968 ప్రాంతంలో ఎన్టీఆర్ రామారావుగారు ఒక సినిమా కోసం నాన్న దగ్గర నృత్యం నేర్చుకున్నారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే మా ఇంటికి కారు పంపేవారు. నాన్న వెళ్లే సరికే రామారావుగారు సిద్ధంగా ఉండేవారట. రెండు, మూడు గంటలపాటు ఆయన డ్యాన్స్ నేర్చుకునేవారు. మా చిన్నతమ్ముడు రవిశంకర్ పుట్టినప్పుడు నామకరణం రోజున రామారావుగారు మా ఇంటికి వచ్చి మాతో పాటే కూర్చుని భోజనం చేయడం నాకిప్పటికీ గుర్తుంది.

ఎన్టీఆర్ కుమార్తెలు పురందేశ్వరిగారు, భువనేశ్వరిగారు మాతోపాటే నాట్యం నేర్చుకున్నారు. నాన్నగారి దగ్గర నృత్యం నేర్చుకున్న వారిలో చాలామంది ఆ తర్వాత సినిమారంగంలో అగ్రతారలుగా వెలుగొందారు. హేమమాలినిగారు సినిమారంగంలోకి రాకముందు మా ఇంటికి వచ్చి నాన్న దగ్గర నృత్యం నేర్చుకునేవారు.

సావిత్రిగారు కూడా తన దగ్గర నృత్యం నేర్చుకున్నారని నాన్న మాతో చెప్పేవారు. ఒక చిత్రం కోసం ఇప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారితో పాటు నటీమణులు చంద్రకళ, కాంచన, వైజయంతిమాల, వాణిశ్రీ మొదలైనవారంతా నాన్న దగ్గర నృత్యం నేర్చుకున్నారు. అప్పట్లో సినిమాల్లో ఒక్కపాటకైనా నాన్న నృత్య దర్శకత్వం ఉండాలని నిర్మాత, దర్శకులు పట్టుపట్టేవారు. అయితే రానురాను సినిమారంగంలో వ్యాపార ధోరణులు పెరిగిపోవడంతో నాన్న సినిమాలకు కొరియోగ్రఫి చేయడం మానేశారు. పూర్తిగా నాట్య శిక్షణకే అంకితమయ్యారు.

 నాన్నతో ముద్దుమురిపాలు
మొదటి ఆడ శిశువుకు కామేశ్వరి అని పేరుపెట్టడం మా నాన్నగారి పూర్వీకులకు సాంప్రదాయంగా వస్తోంది. మా మేనత్త పేరు కూడా కామేశ్వరే. మా తమ్ముడు కుమార్తె పేరు కూడా కామేశ్వరే. కామేశ్వరీదేవి మా ఇలవేలుపు. మా ఇంట్లో నేనే మొదటి సంతానం కావడంతో మా నాన్న నన్ను గారాబంగా ‘కామయ్య’ అని పిలిచేవారు. నాన్నకు పూజలు చేసే అలవాటు పెద్దగా లేదు. కాఫీ తాగుతూ పేపర్ చదవడం నాన్న దినచర్యలో భాగం. పిల్లలమంతా హాలులో కింద పడుకునేవాళ్లం.

నాన్న మా దగ్గరకు వచ్చి కూర్చుని ‘లేవండ్రా, డ్యాన్సు కోసం పిల్లలు వచ్చే టైమయ్యింది’ అంటూ మమ్మల్ని నిద్రలేపేసేవారు. మేమంతా బద్దకంగా పడుకుని ఉంటే ఒక్కొక్కర్ని బతిమాలుతూ, ముద్దాడుతూ లాలించడం ఇన్నేళ్లయినా మరచిపోలేని మధురస్మృతి. మా ఇంటి ఆవరణలోనే చిన్న చిన్న పర్ణశాలల్లాంటి పాకలు వేయించారు నాన్న. అందులో విద్యార్థులు, వారి పేరెంట్స్ ఉండేవారు. ఒంటరిగా ఉండే ఆడపిల్లలైతే మాతో పాటే హాల్లో పడుకునేవారు. తన దగ్గర నాట్యం నేర్చుకునే ఆడపిల్లల సంరక్షణను నాన్న ఎంతో బాధ్యతగా నిర్వర్తించేవారు.

మేము స్కూలుకు వెళ్లి భోజనానికి ఇంటికి వచ్చే సమయానికి వాళ్ల క్లాసులు కూడా పూర్తయ్యేవి. భోజనం చేసేటప్పుడు నేను, మా పెద్దచెల్లెలు నాన్నకు చెరోవైపు కూర్చోవాల్సిందే. మా ఇద్దరి నోట్లో ముద్దలు పెడుతూ బిక్కమొఖం వేసుకుని చూస్తున్న ఆఖరుచెల్లెల్ని ఉడికించేవారు నాన్న. ‘చూడండ్రా…దాని ముఖం ఎలా ఉడికిపోతోందో’ అంటూ ‘బాలిగా రా…'(బాల) అంటూ దాన్ని ఒడిలోకి లాక్కుని దానికి కూడా ముద్ద పెట్టి అప్పుడు నాన్న తినేవారు. మమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకున్నారు నాన్న. జీవితంలో ఆయన ఎంత కష్టపడ్డారో, ఎలా కష్టపడ్డారో కాని మాకు మాత్రం ఏలోటు రానివ్వలేదు.

శ్రీనివాస కల్యాణం-నా వివాహం
నాన్న చేసిన నృత్యప్రదర్శనల్లో ‘పద్మావతీ శ్రీనివాస కల్యాణం’ ఆయనకు విశేషమైన కీర్తిప్రతిష్టలు తెచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే శ్రీనివాస కల్యాణం మా ఇంట్లో జరిగిన మొదటి కల్యాణం. ఒక పెళ్లిలా ఆ నృత్యరూపకానికి సన్నాహాలు జరిగాయి. దాదాపు ఏడాదిపాటు సంగీత దర్శకులు సంగీతరావుగారు, రచయిత భుజంగరాయశర్మగారు, నాన్న కలిసి ఒక యజ్ఞంలా దాన్ని తీర్చిదిద్దారు. తెల్లవార్లూ కూర్చుని పాటలకు బాణీలు కట్టేవారు. ఒక్కో సీన్ గురించి గంటల తరబడి చర్చించుకునేవారు. నాన్న అప్పుడు టిటిడి ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారు.

తిరుపతిలో ‘శ్రీనివాస కల్యాణం’ తొలి ప్రదర్శన జరిగింది. మా అమ్మ స్వరాజ్యలక్ష్మి వేంకటేశ్వరస్వామి భక్తురాలు. శోభానాయుడు, మంజుభార్గవి పద్మావతీ శ్రీనివాసులుగా అభినయించారు. ఈ ప్రదర్శన జరుగుతుండగా అమ్మకు పూనకం వచ్చినట్లు ఏడ్చింది. ఎవరెంత నచ్చచెప్పినా, సముదాయించినా ఆమె ఏడుపు ఆగడం లేదు. మాకెవరికీ ఏమీ అర్థం కావడం లేదు.

జరుగుతున్నది శ్రీనివాస కల్యాణం కాబట్టి వేంకటేశ్వరుడే ఆమెను ఆవహించాడని ఎవరో చెప్పడంతో వెంటనే అమ్మకు హారతి ఇచ్చారు. ఆ తర్వాతే ఆమె మనలోకంలోకి వచ్చింది. శ్రీనివాస కల్యాణం ప్రదర్శన ఎక్కడ జరిగినా ప్రేక్షకులు గోవిందా, గోవిందా అంటూ కొబ్బరికాయలు కొడుతూ బ్రహ్మరథం పట్టేవారు. ఆ నృత్యాన్ని ప్రదర్శించిన ఏడాదిలోపే నా వివాహం జరిగింది.

సత్యంగారు శ్రీనివాసుడి కల్యాణం తర్వాత తన కుమార్తె కల్యాణం కూడా చేసేశారని నాన్న మిత్రులు చమత్కరించేవారు. 1979లో మేళ్లచెరువు నాగభూషణశాస్త్రిగారితో వివాహమై హైదరాబాద్ వచ్చేశాను. నాకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే కూడా చాలా ఇష్టం.

పెళ్లయిన తర్వాత నా భర్త సహకారంతో జెఎన్‌టియులో ఫైనార్ట్స్ చేసి డ్రాయింగ్ టీచర్‌గా కొంతకాలం ఒక స్కూల్లో పనిచేశాను. అయితే అక్కడ కూడా డ్రాయింగ్ క్లాసెస్ కన్నా నృత్యం నేర్పించమనే అందరూ అడిగేవారు. నాన్న ఆశయాల కోసం 2005 నుంచి ఇంటి దగ్గర నృత్య తరగతులు నిర్వహించడం మొదలుపెట్టాను. 2008లో నాన్న పేరిట ‘సత్యం అకాడమి’ని స్థాపించి శ్రీనగర్ కాలనీలోని మహిళా మండలిలో రెగ్యులర్‌గా క్లాసులు తీసుకుంటున్నాను.

కళ వ్యాపారం కాదు…
గత ఏడాది ఫిబ్రవరిలో నాన్నకు అస్వస్థత ఏర్పడింది. అన్నం తినడానికి చాలా ఇబ్బంది పడేవారు. అంతకుముందు వరకు మోకాళ్ల నొప్పులు ఉన్నా తమ్ముడు రవిశంకర్ నిర్వహించే డ్యాన్స్ అకాడమిని నాన్నే పర్యవేక్షించేవారు. వీల్ చెయిర్‌లో కూర్చుని రవి కంపోజ్ చేసే నృత్యాన్ని చూసి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. గత ఏడాది జూలై 29న తన 83వ ఏట కన్నుమూయడానికి రెండు రోజుల ముందు వరకు నాన్న అందరినీ పలకరిస్తూనే ఉన్నారు. కళ కళ కోసమే తప్ప కాసుల కోసం కాదని నాన్న భావించేవారు. నాన్న నాట్యం నేర్పించడానికి ఎవరి దగ్గరా డబ్బు డిమాండ్ చేసేవారు కాదు. నాన్న వారసులుగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మా బాధ్యత. ఈరోజు కూడా మేము ఎక్కడకు వెళ్లినా ముందు మా నాన్న పేరుతోనే మమ్మల్ని పలకరిస్తారు. ఆయన సంపాదించుకున్న కీర్తిప్రతిష్టలే మాకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర-5 పళని

త్యాగయ్య- బాల(మురళి)య్య దర్సనం

ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర

సంగీత పెన్నిధి సన్నిధిలో మేము

Posted in ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర | Tagged | Leave a comment

ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర -3 కుంభకోణం- తంజావూరు-తిరువయ్యారు

త్యాగయ్య- బాల(మురళి)య్య దర్సనం

ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర

సంగీత పెన్నిధి సన్నిధిలో మేము

Posted in ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర | Tagged | Leave a comment

ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర -2 శ్రీరంగం – త్రిచి

త్యాగయ్య- బాల(మురళి)య్య దర్సనం

ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర

సంగీత పెన్నిధి సన్నిధిలో మేము

Posted in ఎనిమిది రోజుల్లో చెన్నై తో సహా చిన్న యాత్ర | Tagged | Leave a comment

నా దారి తీరు -1

            నా దారి తీరు -1

‘’ఊసుల్లో ఉయ్యురు ‘’ఊసుల్లో ఉయ్యూరురాసినప్పటి నుండి మా శ్రీమతి ప్రభావతి ‘’అందరి గురించి రాస్తారు కాని మీ గురించి రాసుకోరా‘’?/అని అడిగింది .నేను ‘’నా గురించి రాసుకోవటానికి ఏముంది ?ఎం పొడిచేశానని ,ఏం సాధించానని రాసుకొను ?’’అనే వాడిని ‘’కాదండీ మీ చదువు ,ఉద్యోగం మీ చదువు చెప్పే విధానం ,మీ మిత్రులు ఆ నాటి హెడ్ మాస్టర్లు వారి పద్ధతులు మీరు చదువు కొన్న కాలేజి అప్పటి చదువులు మీపై మీ లెక్చరర్ల ప్రభావం ,మీరు చూసిన మహా మహులు ,తిరిగిన ఊళ్లు ,విశేషాలు ,పిల్లల్ని పెంచిన విధానం మీ బంధు గణం ,జీవితం లో ఎదుర్కొన్న ఇబ్బందులు ,వాటి లోంచి బయట పడ్డ తీరు ఇలా రాయాలె కాని ఎన్నో ఉంటాయి కదా ..వాటిని రాయండి ‘’అనేది ‘’మన సాధారణ జీవితం లో ఏ ప్రత్యేకతలుంటాయి ?అందరి లా నే మనమూ జీవితం లాగిస్తున్నాం ..దీనికోసం రాసుకోవాలా ‘’?అనే వాడిని .’’అది సరే–మన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని జీర్నోర్ధారణం చేయ గలిగాం ,ఎన్నో సాహిత్య సభల్లో పాల్గొన్నారు .జిల్లాలో మంచి సైన్సు మేష్టారు గా ,హెడ్ మాస్టర్ గా గుర్తింపూ పొందారు .సాహిత్య సభలు నిర్వహిస్తున్నారు .ఇవి రాసుకోకూడదా ?’’అనేది ‘’ఇవి అందరు చేసేవే గా .నా ప్రత్యేకత ఏముంది ?ఏదో మన శక్తి  పరిధిలో చేస్తున్నాం .అంత చాటు కోవాల్సిన్దేముంది ?’’అని నీళ్ళు చల్లే వాణ్ని .’’ఇవన్నీ రాసి పుస్తకాలు అచ్చేసి ఊరి మీద పడి అమ్మలేను బాబూ .’’అన్నానొక సారి ‘’.అచ్చేయ్యటం ఎందుకు / ఉందిగా నా సవితి ఒకటి .ఇరవై నాల్గు గంటలు దానితోనే గా మీరు గడపటం ?’’అంది ‘’అంటే కంప్యుటర్ లో ఎప్పుడూ మునిగి తెలుతున్నానై దేప్పుడా ?’’అన్నాను ‘’అంత సీన్ లేదు లెండి మీకు .ఇది ఎవరి  కోసమో కాదండి .మన పిల్లలకి మనవాళ్ళకు తెలియని విశేషాలుంటాయి అవి వాళ్ళు చదివి కొంతైనా తెలుసు కొంటారు ..ఒక ‘’బ్లాగ్ బాగ్ ‘’ను బుజానేసుకొని ఊరేగుతున్నారుగా .అందులో రాయండి చదివే వాళ్ళు చదువుతారు .లేక పోతే అక్షయం గా అక్షరం గా అందులో ఉండి పోతుంది .దీనికేమీ ఖర్చు లేదు కదా .నెట్ డబ్బులు నెల నేలా కడుతూనే వదిలిన్చుకొంటున్నారుగా .ఇదీ ఒక చేతి చమురు భాగోతం అను కొండి ‘’రాయండి ఇక మాటలు కట్టి పెట్టండి ‘’అని హుకుం జారీ చేసి నంత పని చేసింది .

           సరే నని ఈ విషయం పై ఆలోచించ సాగాను .ఏ పేరు పెట్టాలి ?అని మొదటనే వచ్చిన సందేహం .ఎన్నో పేర్లు ఆలోచించాను .ఏదీ నచ్చలేదు .చివరికి రెండు శీర్షికలు ఖరారు చేసుకొన్నాను .ఒకటి ‘’అనంత కాలం లో నేనూ ‘’అనేది .నేనూ అనటం లో కాలం అనంత మైనా నాకూ ఒక ప్రత్యేకత ఉంది అని ధ్వనిస్తుందనే అభిప్రాయం .మరీ డబ్బా కొట్టు కోవటమేమో అని పించి వదిలేశాను .రెండో పేరు ‘’కాల సింధువు లో నేనొక బిందువును ‘’ఇదీ అంత నచ్చ లేదు .ఇవాళ ఇప్పుడే దీన్ని రాస్తున్నప్పుడు ‘’నా దారి తీరు ‘’ అని శీర్షిక బాగుంటుందని అని పించి అదే ఖాయం చేసి మొదలు పెడుతున్నాను .ఊసుల్లో ఉయ్యూరు లో నా స్కూల్ ఫైనల్ వరకు విద్యాభ్యాసం గురించి ,నా చిన్న నాటి స్నేహితుల గురించి ,అప్పటికి నాకు మా ఊర్లో తెలిసిన వారి గురించి యాభై ఎపిసోడులు రాయటం దాన్ని అందరు చదివి అభి నందించటం జరిగింది .కనుక దీన్ని నా కళాశాల విద్య తో ప్రారంభిస్తున్నాను .అంటే సుమారు 56 ఏళ్ళ క్రిందాటి విశేషాలన్న మాట .ఇందులో ఎన్ని గుర్తుకోస్తాయో తెలీదు  జ్ఞాపక శక్తి కూడా కొంత తగ్గింది .డెట్లు సంవత్సరాలు కలవక పొవచ్చు .అందుకని వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా రాయాలను కొంటున్నాను .అప్పటి రాజకీయాలు గుర్తున్నంత వరకు రాస్తాను .సాదా సీదా జీవితమే కనుక సస్పెన్సు, త్రిల్లింగు ఏమీ ఉండవు .సంఘటనల్ని క్రోడీకరిస్తాను .ఒక రకం గా నా జ్ఞాపక శక్తికి పరీక్షే …నాకు చదువు చెప్పిన లెక్చరర్ల పేర్లు ఎన్ని గుర్తుకోస్తాయో ,వారు బోధించిన విషయాలేమిటో స్పశ్టాస్పష్టం  గా ఉండచ్చు .కాని వారిని నేను జ్ఞాపకం చేసుకోవటం నా ధర్మం ,విధి, కృతజ్ఞత .అందుకే ఈ ప్రయత్నం ఇందులో కృత క్రుత్యుడిని కావాలని కోరుకొంటున్నాను .శ్రీ సరస్వతీ దేవి కటాక్షం, మా ఇల వేల్పు శ్రీ ఆంజనేయ స్వామి కరుణా నన్ను ముందుకు నడి పిస్తాయనే బల మైన నమ్మకం తో ఉపక్ర మిస్తున్నాను .

                                ఇంటర్ చదువు

1956 మార్చి లో ఉయ్యూరు జిల్లా బోర్డ్  హైస్కూల్ లో స్కూల్ ఫైనల్ అంటే ఎస్ .ఎస్.ఎల్.సి .పాసయ్యాను .ఎక్కడ చదవాలి అనేది నాకేమీ స్పష్టత లేదు ఇది చదవి ఏదో సాధించాలనే ఆలోచనా లేదు ఉయ్యురులో ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది అందులో అప్పటికి సివిల్ కు ప్రాదాన్యత ఎక్కువ నాకు చేరాలని ఉన్నా మా అమ్మ ఈ ‘’-సుత్తి కొట్టుడు –బజార్లంట సర్వ్ చేయటాలు ఎందుకురా ?’’అంది నాన్నదీ అదే అభిప్రాయం .సరే నని బెజవాడ ఎస్ ఆర్.అండ్ సి వి.ఆర్ కాలేజీ కి దరఖాస్తు పెట్టాను దానితో బాటు లయోలా కీలేజికీ పంపాను ఏం .పి.సి కి అప్పుడు డిమాండు ఎక్కువ .రెండు చోట్లా సీట్ వచ్చింది .మళ్ళీ ఇందులో దేన్నీ ఎన్ను కోవాలి .మా నాన్న ‘’మన ఉయ్య్రు రాజా గారి కాలేజి లో చదివితే మంచిది .ఆ క్రిస్టియన్ కాలేజి ఎందుకు ?’’అని నిర్ణయించి ఎస్ అర్,ఆర్ .లో చేర్పించారు .

         ఎక్కడ ఉండిచదవాలి అన్న సమస్య ను కూడా మా వాళ్ళే తీర్చారు .బెజవాడ లో మా బుల్లి మామ్మ సౌభాగ్యమ్మ గారు అరండల్ పేట రామ మందిరం వీధిలో ఒక ఇంట్లో అద్దె కున్నది ఆమె మా నాయనమ్మకు స్వయాన చెల్లెలు .ఆమె గారి మనవడు సూరి రాదా కృష్ణ మూర్తి అదే కాలేజీలో బి.కాం.రెండో ఏడు చదువుతున్నాడు .అలాగే మా బుల్లి మామ్మ మనుమలు వేలమకన్ని శోభనాద్రీశ్వర రావు ఇంటర్ రెండో ఏడు ,వాడి తమ్ముడు శ్రీ రామ మూర్తి ఇంటర్ నాతో పాటు మొదటి ఏడాది చదువుతున్నారు మామ్మా వాళ్ళింట్లోనే ఉన్నారు .అందుకని నన్నూ అక్కడే బుల్లి మామ్మ పర్య వేక్షణ లో ఉంచారు .ఒక వంటిల్లు ఒక గది మాత్రేఅమే ఉన్న డాబా ఇల్లు .అలానే మేం నలుగురం అందులోనే ఉండి చదువు కొన్నాం .మామ్మ వంట చేసి పెట్టేది ఉదయాన్నే కాఫీ ఇచ్చేది కాలేజి సమయానికి వంట చేసి రెడీ గా ఉంచేది .తిని కాలేజేకి నడిచి కాని సిటీ బస్ ఎక్కి కాని లేక పోతే రాముడి సైకిల్ మీద వెనక కూర్చుని కాని వెళ్ళే వాడిని తిరిగి వచ్చేటప్పుడు ఎవరి దారి వారిదే .దాదాపు నడిచే వచ్చే వాడిని చుట్టు గుంట వరకు అప్పటికి అంతా నిర్జన ప్రదేశమే .రెండో నంబర్ సిటీ బస్ ను విజయా టాకీస్ దగ్గర ఎక్కి వెళ్ళే వాళ్ళం అప్పుడే కొత్తగా ఎనిమిదో నంబర్ బస్ పడింది .చాలా క్లాస్ గా ఉండేది అది ఎనికే పాడు దాకా వెళ్ళేది .

            మొదటి ,రెండు సంవత్సరాల నా చదువు గురించి ముందుగా తెలియ జేస్తాను .సెక్షన్ కు వంద మంది ఉండే వాళ్ళు .మా ఏం పి.సి. గ్రూప్ కు రెండు సెక్షన్లు .నేను మొదటి సెక్షన్ లో ఉన్నాను .తెలుగు కు శ్రీ పాటి బండ్ల మాధవ శర్మ గారు వచ్చే వారు .ఆయన ‘’ఉదంకో పాఖ్యానం ‘’వ్యాస నిష్కాసనం ‘’పద్య భాగాలు అత్యద్భుతం గా వివరించి చెప్పేవారు .తెల్లని మల్లు పంచా ,మల్లు లాల్చి తో కొంచెం నల్లగా మోటార్ సైకిల్ మీద వచ్చే వారు సిగార్రెట్లు తాగే వారను కొంటాను .అయితేనేమి మహా గొప్పగా బోధనా ఉండేది .తంగిరాల వెంకట సుబ్బా రావు గారు అనే ‘’తెల్ల జుట్టు ‘’ఎర్రటి ఆయన ప్రోజు చెప్పేవారు .ఆయన్ను అందరు ‘’మురిగ్గుంట ‘’అనే వారు .ఎందుకా పేరొచ్చిందో తెలీదు అందరూ అదే పేరుతో నే పిలవటం జరిగేది .దోమా వెంకట స్వామి గుప్తా గారు పొట్టిగా పంచె కట్టుకొని బుష్ షార్ట్ వేసి కాలికి టెన్నిస్ బూట్ల తో బుజాన పంచాంగం ఉన్న సంచీతో నుదుట యెర్రని పెద్ద బొట్టు తో ఉండే వారు .మాట స్పష్టం గా వచ్చేది కాదు అప్పటికే బాగా ముసలి వారు ఆయన గొప్ప పంచాంగ కర్త నాయి చెప్పుకొనే వారు .ధూళి పాళ శ్రీ రామ మూర్తి గారు నాటకం బోధించే వారని గుర్తు .శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి ‘’యజ్న ఫల నాటకం ‘’ఉండేది .మల్లాది వసుంధర రాసిన‘’తంజా వూర్ విజయం ‘’సప్త పర్ని ‘’ఉపవాచకాలు చదివాం .

         దువ్వూరి రామి రెడ్డి గారి పానశాల ఉండేది .దాన్ని ఒక సారి ఎక్ష్ట్రా క్లాస్ కు వచ్చిన శ్రీ విశ్వనాధ సత్య నారాయణ గారు వచ్చి చెప్పారు .చెప్పి నంత సేపు రామి రెడ్డి గారిని విమర్శించటమే సరి పోయింది అందులో కవిత్వం ఆయనకు ‘’ఆని నట్లని పించలేదు ‘’విసుక్కొంటు నే చెప్పారు ‘అలాగే ఇంకోసారి యజ్న ఫల నాటకం చెబుతూ శ్రీ పాద వారి కవిత్వాన్ని చెండాడారు నిజం గా మాకే అందులో స్వారస్యం ఏమీ కనిపించలేదు .మహా కవికి నచ్చుతుందా .?పేరాల భారత శర్మ గారు పొట్టిగా గోచీ పోసి పంచ తో ,పొట్ల పల్లి సీతా రామా రావు గారు తెలుగు బోధించే వారు .వీరందరూ లబ్ధ ప్రతిష్టులైన కవులే విశ్వ నాద వారి అంతే వాసులే విశ్వనాధ వారి ఇల్లు కాలేజి ప్రక్కనే ఉండేది .ఆయన మధ్యాహ్నం ఇంటికి వెళ్లి వచ్చే వారు .పొట్లూరి వారు ఖద్దర్ పంచ ,లాల్చీతో ఉండే వారు .సుబ్బారావు గారు తెల్లని జుట్టు ,బట్టలతో ఉండేవారు ధూళి పాల వార పీలక తో నుదుట కుంకుమ తో పంచ లాల్చీ తో ఉండేవారు .వీరందర్నీ చూస్తేనే కడుపు నిండి పోయేది అందరు జ్ఞాన నిధులే ‘’క్రీం ఆఫ్ ఇంటలిజెన్స్ ‘’అంతా ఈ కాలేజీ లోనే ఉండేది .లయోలా కాలేజి లో ఇలాంటి వారు బాగా తక్కువ .ఫిజిక్స్ కు కృష్ణ రావు గారు ,తెలుగుకు పెద్ది భొట్ల సుబ్బరామయ్య  గారు ,సంస్కృతానికి కేశవ పంతుల నరసింహ శాస్త్రి గారు మాత్రమె ఉండే వారు .అందుకని మేము  మా కాలేజి లో చదువు కొంటున్నందుకు గొప్పగా ఫీలయ్యే వాళ్ళం .విశ్వ నాధ వారు కిళ్ళీ చుట్టించి వేసుకొనే రాముల బడ్డీ కొట్టు రోజూ చూస్తుండే వాళ్ళం ..పాటి బండ్ల వారి ఉదంకో పాఖ్యానం బోధనా పరవశం కలిగేట్లుండేది నాగ స్తుతి ని మాతో బట్టీ పట్టించారు .అలాగే శ్రీనాధుని భీమ ఖండం లోని వ్యాస నిష్కాసనం పద్యాల సోయగాన్నీ  పరమాద్భుతం గా వర్ణించి చెప్పారు అందులో ఉన్న డెబ్భై పైగా పద్యాలూ నాకు నోటికి వచ్చాయి .అదే పరీక్ష రాయటానికి దోహద పడింది .అప్పటికి తెలుగుకు గైడులు లేవు .పుస్తకాలే ఆధారం .కాలేజి స్కాలర్షిప్ కోసం ఒక అది వారం పరీక్ష పెట్టారు నేనూ హాజర్యాను దారుణం గా రాశాన కొన్నాను .రాలేదు .కాలేజి లో మా మేన మామ కూతురు రాజమ్మ భర్త అన్న గారు సూరి రామ చంద్ర మూర్తి ఆఫీస్ లో గుమాస్తా నా క్లాస్ మెట్లు రాదా కృష్ణ మూర్తి ,పెద్ది భొట్ల వీరయ్య గారి,అబ్బాయి .తాడేపల్లి గంగాధర శాస్త్రి   వగైరాలున్నారు ..తెలుగు  టుటర్ గా పెద్ది భొట్ల వారు (మా శిష్యుడు పెద్ది భొట్ల శ్రీ రాములు అన్నగారు )ఉండే వారు అనువాదం ఉండేది వారానికి ఒకటో రెండో క్లాసులు చివరి గంటలో ఉండేవి .సాధారణం గా అందరు ఎగా కొట్టే వారు .నేనెప్పుడూ మానేయ్యలేదు

             సశేషం

          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-13 –ఉయ్యూరు

        

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

హిస్టరీ కాంగ్రెస్

history congres -3 history congres -1 history congres -2

Posted in సేకరణలు | Tagged | Leave a comment