సరసభారతి
సాహిత్య సాంస్కృతిక సంస్థ — ఉయ్యూరు
42 వ సమావేశము ఆహ్వానము
తేది, సమయము – 26-2-2013 మంగళవారము సాయంత్రము గం 6-30 నికు
వేదిక – శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయము – మహిత మందిరము
ప్రసంగ విషయము – ప్రయాగ కుంభ మేళ విశేషాలు
ప్రసంగించు వారు –
ప్రయాగ (అలహాబాద్ ) త్రివేణి సంగం లో జరుగుచున్న“శ్రీ మహా కుంభ మేళ” లో శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు నిర్వహించిన ” శ్రీ గీతా జ్ఞాన మహా యజ్ఞం” లో ప్రత్యక్షంగా పాల్గొన్న సరసభారతి కార్యదర్శి శ్రీమతి . మాదిరాజు శివలక్ష్మి, సరసభారతి కార్య వర్గ సభ్యులు శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ మరియు దేశ విదేశాలలో జరిగిన శ్రీమత్ భగవత్ గీత పోటిలలో పాల్గొని ఆనేక బహుమతులను సాధించిన (భగవత్ గీత ఫేం) చి. మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ లు తమ అనుభవాలను, కుంభ మేళా విశేషాలను వివరిస్తారు.
సభాధ్యక్షులు — శ్రీమతి . జోశ్యుల శ్యామలా దేవి – సరసభారతి గౌరవాధ్యక్షులు
ఆత్మీయ అతిధి Dr.దీవి చిన్మయ – సరసభారతి ఉపాధ్యక్షులు
సరసభారతి ఎర్పాటు చేసిన ఈ అరుదైన” ధార్మిక సాంస్కృతిక కార్యక్రమములో ”అందరు పాల్గొని మన సంస్కృతీ వారసత్వాన్ని, వైభవాన్ని తెలుసుకుని ధన్యులు కావలసినదిగా ప్రార్ధన
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు |
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివలక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి అధ్యక్షులు – సరసభారతి
99890 66375