అమెరికా డైరీ సంకీర్తన షవర్ల తో పులకిస్తున్న షార్లెట్

  అమెరికా డైరీ
సంకీర్తన షవర్ల తో పులకిస్తున్న షార్లెట్
           మేము ఇక్కడికి  వచ్చి పది రోజులు దాటింది .రోజూ ఎక్కడో ఒకరింట్లో సాయి భజన ,ఆహ్వానం అందు కొంటున్నాం . .వెళ్లి వస్తున్నాం .రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు .భక్తీ ,శ్రద్ధలతో ఇక్కడి భక్తులు నిర్వ హించటం ఆసక్తి కరం గా ఉంది .చిన్న పిల్లల తో సహా యువకులు ,వృద్ధులు పాల్గొనట మే కాదు, పాడుతూ తమ భక్తీ వైదుష్యాన్ని చాటు కొంటున్నారు .
నిన్న అంటే 21 వ తేదీ శని వారం మా ఇంటికి దగ్గర లో పది నిమిషాల ప్రయాణ దూరం లో ఉన్న ”ఆక్సా కమ్యూనిటి సెంటర్ ”
లో షార్లెట్  సాయి సేవా సంఘం వారు గ్రీన్ బరో మొదలైన ప్రాంతాలలో ఉన్న మిగిలిన సాయి సెంటర్ వాళ్ళను అందర్నీ ఆహ్వానించి ఉదయం పది గంటల నుండి రాత్రి ఏడు వరకు ఒక కార్య క్రమాన్ని నిర్వ హించారు .దాదాపు నూట యాభై మంది హాజ రైన పెద్ద సమా వేశం .ఉదయం అందరికి టిఫిన్, కాఫీ ఇచ్చారు .పది గంటలకు సభ ప్రారంభ మైంది ”.టెడ్ హెన్రి ” ఫ్లారిడా కు చెందిన  అమెరికన్ సాయి భక్తుడు. సత్య సాయి తో తనకున్న పరిచయం ,అనుభవాలను గురించి సుమారు ముప్పావు గంట మాట్లాడారు .ఆయన మొన్న సత్యా వాళ్ళింట్లో పరిచయం అయారు .సుమారు అరవై ఏళ్ళుంటాయి .మంచి పర్స నాలిటి . ఆ తర్వాత కాలి ఫోర్నియ కు చెందిన శ్రీ మతి సీమా మిల్లర్ .ఆ తరువాత శ్రీ సునీల్ కస్తూరి తమ అనుభవాలను వర్ణించారు .వీరందరూ  సాయి తో ప్రత్యక్ష పరిచయం ఉంది ఆయన అభిమానాన్ని పొందిన వారే .కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటకు అయింది .అప్పుడు లంచ్ ఏర్పాటు చేశారు .పొంగల్ తో లంచ్ .
మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ సమా వేశం ప్రారంభం .చిన్న పిల్లలు సత్య సాయి, మదర్ తెరెసా ,కబీర్, మార్టిన్ లూధర్ కింగ్ ,మీరా, కృష్ణా,గాంధి మొదలైన వేష ధారణ లతో వారి సందేశాలను విని పించారు .అయితె ఎవరు వచ్చి ఏ పాత్ర పోషిస్తున్నారో వాళ్ళిచ్చే సందేశం ఏమిటో ఒకరిద్దరు పిల్లలతో చెప్పిస్తే ఇంకా నిండు గా ఉండేది .పిల్లలకు ప్రోత్సాహం గా ఉండేదని పించింది .ఇక్కడఅవగాహనా లోపం కని పించింది .
మూడు గంటల నుంచి మళ్ళీ మిల్లర్ ,కస్తూరి ల అనుభవ సందేశాలు .ఆ తర్వాత టీ బ్రేక్ .అయిదింటి నుంచి వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన సాయి కేంద్రాల వారు ఆలాపించిన భజనల తో ఆధ్యాత్మిక వాతా వరణాన్ని కల్గించారు .
దీనికి ముందు అతిదులైన టెడ్ ,మిల్లర్ .కస్తూరి లకు జ్ఞాపికలు అందించారు .రేవతీ రామ చంద్రన్ గారి అమ్మాయి కి ,ఇంకొక అతను సైన్సు లో అవార్డ్ పొందినందుకు సత్యా వాళ్ళిద్దరిని పరిచయం చేసి జ్ఞాపికలను అంద జేశారు .వారిద్దరూ తమ కృషిని క్లుప్తం గా వివ రించారు . .
రాత్రి ఏడు గంటలకు డిన్నర్ .చపాతి ,రెండు కూరలు ,వెజిటబుల్ బిర్యాని ,పెరుగన్నం ,సేమ్యా పాయసం .తో విందు సుష్టు గా ఉంది .మా అమ్మాయి విజ్జి ,రాధ .సీతా, ఉషా ,మొదలైన వారంతా ఇంత మన్దికీ ఇన్ని రకాల అయిటంస్ ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొని వచ్చి ఆప్యాయం గా వడ్డించి అతిధి మర్యాదలు చేశారు .నాన్ స్టాప్ గా కాఫీ ,తేనీరు అందిస్తూనే ఉన్నారు .పిల్లలకు బిస్కట్లు .పీజా బర్గర్లు పెడు తూనే  ఉన్నారు .భజన బృందం లో సత్య గొప్ప హార్మని విద్వాంసుడు .ఇంకో సత్య మంచి తబలా వాద్య కారుడు .కంజీర రవి బాగా వాయిస్తాడు .డాక్టర్ సదా శివ గారబ్బాయి పియానో కళా కారుడు .వీరందరినీ సమీకరించి నిర్వహణ చేయటం లో సుబ్బ రాజ్ కృత క్రుత్యుడయారు .ఈ భజన బృందం మంచి క్రమ శిక్షణ కలిగి అందరి అభి మానాన్ని పొందింది .
నాకు అని పించిన విషయాలు –ఒక హాలిడే రిసార్ట్ కు వచ్చిన భావం కలిగించేట్లుంది .కాని ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చిన అనుభూతి కల్గించ లేక పోయారు .ఏ సమయం లో పడితే ఆసమయం లో కాఫీ టిఫిన్ తింటున్డటం సమావేశానికి ఇబ్బంది కరం అని పించింది . బహుశా ఇక్కడి  పధ్ధతి ఇంతే నేమో ?  కాని ఇళ్ళ దగ్గర ఎవరు ఇలా చేయటం నాకు ఈ పది రోజుల్లోనూ కని పించలేదు .నిర్ణీత సమయం లోనే వాటిని అంద జేయాలి .లేక పొతే అనుకున్న ఫలం రాదు .పిల్లలను ప్రభావితం చేసే అంశాలతో వారిని ఆకర్షించే ,వారి జీవితాలను ప్రభావితం చేసే   విధానం గా కార్య క్రమాలున్డాలి .మంచి కధలను మానిటర్ ద్వారాతెలియ జేయాలి .వాళ్ళు నేర్చుకోన్నని ప్రదర్శించే వీలు కల్పించాలి .అలాగే అవధాని రావణ భుజంగ స్తోత్రం, నమక చమకాలు, ఉపనిషత్తులు స్వయం గా నేర్చు కొంటున్నాడు .ప్రోత్సాహకరం గా వారినిసభకు పరిచయం చేయాలి .ఇంకేదైనా విద్యలో ప్రావీణ్యం ఉన్న వారిని పరిచయం చేయాలి .ఉపన్యాసాలు సుదీర్ఘం అని పించ కుండా జాగ్రత్త పడుతూ మధ్య మధ్యలో బాగా పాడే వారితో మంచి పాటలను పాడిస్తే ఇంకా బాగా కార్య క్రమం రక్తి కట్టేది .వారికీ గొప్ప ప్రోత్సాహం లభించేది .మూస ప్రోగ్రామ్స్ వల్ల ఆశించిన ఫలితం రాదు .సృజనకు ఎక్కువ ఆదరణ నివ్వాలి .
సత్య సాయి ఉన్న కాలమ్ ”బంగారు యుగం ”అనే భావనతో నిర్వ హించిన కార్య క్రమం ఇది .  ఆయన అందర్నీ ”బంగారు ”అని పిలవటం అందరికి తెలిసిన విషయమే .ఆ స్ఫూర్తి ని   కల్గించటం లో ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసు కొంటె బాగుండేదని పించింది .కార్య కర్తలు బాగా శ్రమించారు .ఖర్చూ పెట్టారు .ఆడ వాళ్ళు శ్రమ పడి కమ్మని వంటలు వండి, వడ్డించారు .దీనికి తగ్గ ప్రతిఫలం రావాలి .అందరు స్వచ్చందం గా సేవ చేయటం బాగా ఉంది .విరాళాల జోలికి పోకుండా ఎవరికి అప్ప గించిన పని వాళ్ళు చేసుకు పోతున్నారు .మెడికల్ కాంప్ లను .పేద జనులకు ఆహార సరఫరా ను నిర్వహించటం షార్లెట్ కేంద్రం సాధించిన విజయాలు .సమష్టి బాధ్యత తో అంతా నిర్వహిస్తూ అందరి అభిమానాన్ని పొంద గలుగు తున్నందుకు అభి నంద నీయులు.సేవా భావం ,అంకిత భావం లతో నిర్వ హిస్తున్న కార్య క్రమాలివి . అందుకే ”సాయి సంకీర్తన  షవర్ల తో పునీత మైంది షార్లెట్ ”అని పించింది .

అమెరికా డైరీ సంకీర్తన షవర్ల తో పులకిస్తున్న షార్లెట్ -2
.              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -04 -12
కాంప్ –అమెరికా

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

పంచెకట్టు “వుడ్ హౌస్” – ఆదివారం ఈనాడు పుస్తక సమీక్ష

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –8

  వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –8
                                                తండ్రీ కొడుకులకు గుడులున్న ”భైరవ కొండ ”
బ్రహ్మకు ఆలయాలు ఉండటమే వింత అయితె ,ఆయన తండ్రి విష్ణువు తో కూడిన ఆలయం వుండటం మరీ వింత .ఆ విచిత్రానికి నిలయమే నెల్లూరు జిల్లా లోని ఉదయగిరికి దగ్గర లో ఉన్న భైరవ కొండ గ్రామం .ఒకే రాతి తో చేసిన  ఎనిమిది గుహాలయాల సముదాయం లో శివ లింగాలున్డటం ఇక్కడ మరో విశేషం .ముందు ముఖ మండపం ,తర్వాత గర్భ గుడి ఉంటాయి .ఈ గుహలన్నీ తూర్పు ముఖం గా ఉంటె ,ఒక్కటి మాత్రం ఉత్తర ముఖం గా ఉంటుంది .గుహల ముందు చిన్న సెలయేరు ఉంటుంది .దక్షిణాన వైపు బ్రహ్మ విగ్రహం ,ఉత్తరం వైపు విష్ణు విగ్రహం ఉంటాయి .అంటే బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులను అంటే త్రిమూర్తులను ఒక్క చోటే దర్శించే మహద్భాగ్యం కలుగు తుందన్న మాట .
                 బొట్టు పెట్టు కోని లచ్చి
  నెల్లూరు జిల్లా పెంచల కోన గ్రామం లో నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది .స్వామిని ”పెంచలయ్య ”అని భక్తులు ఆప్యాయం గా పిలుచు కొంటారు .ఆ పేరునే పిల్లలకు పెట్టు కొంటారు భక్తిగా .ఆ స్వామికి నిత్య పూజ ఉండదు .ఇదే ఇక్కడి వింత .ఒక్క శని వారమే పూజాదికాలు నిర్వ హిస్తారు .
మూల విరాట్టు అయిన నరసింహ స్వామి రెండు రాళ్ళు పెన వేసుకోన్నట్లు ఉండే శిలా ప్రతిమ .ఆయనకు లచ్చి (లక్ష్మి ),చెంచీత అనే ఇద్దరు భార్యలున్నారని మనకు తెలుసు .చెంచీతను పెండ్లాడాడని లచ్చి  కి కోపం వచ్చింది .ఇంకేముంది -అలిగి బొట్టు చెరుపు కోని ,చీకట్లో ఒక మూల కూర్చుందట .అందుకే లచ్చి విగ్రహానికి భక్తులు ఎన్ని సార్లు కుంకుమ అద్ద టానికి ప్రయత్నం చేసినా అతకదట .జారి పోతుందట .తమాషా గా ఉంది కదా !అదీ ఆడ వారి ప్రతిజ్ఞా ,సాధింపూ.
 
   ఒంటి పాదం పై లక్ష్మీ నృసింహులు
    అంత పురం జిల్లా లో అనంత పురానికి దగ్గరలో ”పెన్న అహోబిల క్షేత్రం ”ఉంది .సముద్ర మట్టానికి 1360 అడుగుల ఎత్తున శ్రీ లక్ష్మీ నర సింహ ఆలయం ఉంది .అయితె వింత ఏమిటంటే విగ్రహం లేని ఆలయం ఇది .నల్ల రాతి మీద లక్ష్మీ నార సిమ్హుని పాదం ఒక్కటి మాత్రమే కన్పిస్తుంది .హిరణ్య కశిపుని వధ తర్వాత స్వామి ఇక్కడికి వచ్చి ,ఒంటి పాదం పై నిల బడ్డాడని ఐతిహ్యం .పాదం కింద ఒక బిలం ఉంది .ఎన్ని బిందెల నీరు స్వామి పాదానికి అభిషేకం చేసినా ఆ నీరు ఆ బిలం లోకి జారి పోతుందట .ఆ బిలం ఎప్పుడూ నిండదు  .ఇదీ విచిత్రం .కొండ  కింద లక్ష్మీ దేవి ఆలయం ఉంది .ఇక్కడా అమ్మ వారి విగ్రహం లేదు .ఒక్క శిల మాత్రమే ఉంది .గుడికి కొద్ది దూరం లో ఒక రాతి మీద వరాహ పాద చిహ్నాలు కన్పిస్తాయి .కనుక స్వామి వరాహాన్ని వేట ఆడాడని   భక్తుల విశ్వాసం .
                 
  రంగులు మారే కోనేరు
 అనంత పురం జిల్లా లోని ”హేమా వతి ”అతి ప్రాచీన చోళ రాజ దాని .ఇక్కడ గొప్ప విశ్వ విద్యాలయం ఉందట .దానికి అనంత శివ దేవుడు అది పతి అని చరిత్ర .ఇక్కడే సిద్దేశ్వర ,మల్లేశ్వర ఆలయాలున్నాయి .ఆలయం లోని కోనేరు లో ని నీరు ఉదయం ఎరుపు రంగులో మధ్యాహ్నం ఆకుపచ్చగా ,సాయంత్రం పసుపు రంగు  లోను కన్పించి చిత్రాతి చిత్రం అని పిస్తుంది .ఈ విచిత్రానికి కారణం ఏమిటో ఇప్పటి వరకు ఎవ్వరూ కని పెట్ట లేక పోయారు .
                             నారాయణ పాద పూజ చేసే సూర్య నారాయణుడు
  చిత్తూరు జిల్లా తిరుపతి కి దగ్గరలో ”నాగలా పురం ”లో శ్రీ కృష్ణ దేవ రాయల చే నిర్మింప బడిన ”వేద నారాయణ స్వామి ”ఆలయం ఉంది .సూర్య కిరణాలు వేద నారాయణ స్వామి పాదాలపై పడిన సమయం లోనే ,ఇక్కడి నారాయణ స్వామికి పూజ జరగటం ప్రారంభమవుతుంది అదీ విశేషం .
తాత్కాలిక విరామం —మళ్ళీ ఈ విశేషాలను మరి కొన్ని రోజుల తారు వాత కొన సాగిస్తాను .ఇప్పటకి ఈ దర్శనాలు చాలు
                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -04 -12 .
         కాంప్ –అమెరికా

Posted in సేకరణలు | Tagged | 1 Comment

ఊసుల్లో ఉయ్యూరు –28 ముత్తయ్య మేష్టారు

    ఊసుల్లో ఉయ్యూరు –28 ముత్తయ్య మేష్టారు


నల్లని నిగ నిగ లాడే శరీరం ,ఉండీ లేని నెత్తి మీది తెల్లని వెంట్రుకలు ,తెల్లని కను బొమలు .మెడలో పెద్ద సైజు రుద్రాక్ష మాల ,తెల్లని గ్లాస్కో పంచె మడచి కట్టి ,సగం పైకి ఎత్తి నడుం దగ్గర దోపిన పల్చని లుంగి,  చొక్కా లేకుండా , చేతి లో తాటాకు విసన కర్ర , చంకలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపరు తో ఏవ రైనా అరవై అయిదేళ్ళ వ్యక్తీ కని పించారు అంటే ఆయనే మా ముత్తయ్య మేష్టారు .తూర్పు గోదా వారి జిల్లా లో మిడిల్ స్కూల్ హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయి అత్త వారి ఊరైన ఉయ్యూరు లో స్థిర పడ్డారు స్వంత ఇల్లు  ఏర్పాటు చేసుకొన్నారు . దేవుల పల్లి వారింటి పక్క ఇల్లే .ముందు రోడ్ మీదకు ఒక పాక ,వెనక పెంకుటిల్లు .పిల్లలు లేరు .ఆయన గరుగు మీద కృష్ణ మూర్తి అని అందరి చేత పిలువ బడే సోమయాజుల కృష్ణ మూర్తి గారికి అక్క గారి భర్త అంటే బావ గారు . ఆ కాలమ్ బి.ఏ.పట్ట భద్రుడు . మంచి ఇంగ్లీష్ మాట్లాడే వారు చక్కని ఇంగ్లీష్ లో రాసే వారు .మా కంటే  అరవై దశకం లో నే మాకంటే చాలా పెద్ద వారు . కృష్ణ  మూర్తి  గారి    పిల్లలనే  స్వంత  పిల్లలుగా  చూసు  కొనే  వారు  .భార్య  ఉత్తమా   ఇల్లాలు .

ఇంతకీ ముత్తయ్య మేస్టారి అసలు పేరు పళ్ళా వజ్ఝాల మృత్యుంజయ శర్మ గారు .ఆ పేరు ఎవరికీ తెలీదు .ముత్తయ్య మేష్టారు అంటేనే   అందరికి తెలుసు . గరుగు మీద  నుంచి పొద్దున్నే కృష్ణ మూర్తి గారి అబ్బాయిలు చిక్కని గేదె పాలు తెచ్చి ఆయనకు ఇచ్చే వారు. దానితో కాఫీ కాస్తే మహా రుచిగా ఉండేది . డికాషన్ కాఫీ .మా కు ఇంటికి వెడితే తప్పక ఇచ్చేవారు .ఆయన రోజుకు చాలా సార్లు కాఫీ తాగే వారు .అందుకని పెద్ద ఫ్లాస్క్ లో కాఫీ ఎప్పుడు రెడి గా ఉంచే వారు ఆయన భార్య గారు .మేష్టారు గోదావరి జిల్లా వారు కనుక మాట లో ఆ యాస ఉండేది .ఇంటి దగ్గర లెక్కలు ,ఇంగ్లీష్ ప్రైవేటు చెప్పే వారు .వారిది నిర్దుష్ట మైన బోధన . పదానికి అర్ధం వివరం తో బోధించే వారు .ren అండ్ మార్టిన్ గ్రామర్ లో నిధి . వ్యాకరణం లో మహా దిట్ట .రాసినదేదైనా నిర్దుష్టం గా ఉండేది .ఆయనతో మాట్లాడటం ఒక ఎడ్యు కేషన్ గా అని పించేది .కావాలని ఇంగ్లీష్ కోసం ఆయన దగ్గర చదివే వారు .కొంచెం కోపం ఎక్కువే .
            మాస్టారికి ఏదైనా చెప్పా లంటే పూర్వకాలం లోకి ఫ్లాష్ బాక్ గా వెళ్ళే వారు .nainteen ఫార్టీ లో అనో nainteen ఫిఫ్టీ లో అనో సందర్భాన్ని గుర్తు చేసుకొని ఇప్పటి దానికి ఉదాహరణ గా చెప్పటం ఆయన అల వాటు .అది మా బోటి వాళ్లకు తమాషాగా ఉండేది .తాసిల్దార్ సినిమా లో సి.ఎస్.ఆర్ .”ఆ రోజుల్లో నేను కాలేజీ లో చదివే టప్పుడు ”అని ఊత పదం గా చెప్పే వాడు .అది జ్ఞాపకం వచ్చి నవ్వు కొనే వాళ్ళం .ఒక్కో సారి నేను ఆయన ఆ మాట మర్చి పోయినా, కొంత ఆట పట్టించాలని ”మాస్టారూ !మీ రోజుల్లో ఇలాంటి సంఘటన ఎప్పు డైనా జరిగిందా “”/అనే వాణ్ని .ఇంకేముంది -వెంటనే సంవత్సరం నెల ,తేదీ ఊరు తో సహా ఆ వివ రాలన్ని అమాయకం గా చెప్పేసే వారు .మేము ఆయనకు తెలీకుండా ముసి ముసి నవ్వులు నవ్వే వాళ్ళం .అదో సరదా మాకు .మమ్మల్ని ”ఏమయ్యా ”అని పిలిచే వారు .చాలా చనువు గా మాతో ఉండే వారు మాస్టారు బాగా నాటకాలు ఆడించి ఆడే వారు .వారిలో గొప్ప నటుడున్నాడు .
1962 లేక  63 లో ఉయ్యూరు హై స్కూల్ వార్షి కొత్సవ సందర్భం గా పూర్వ విద్యార్దులేవరైనా నాటిక వేయ దలచుకొంటే అవకాశం ఇస్తామని కబురు చేశారు .అప్పుడు మేమందరం కలిసి భమిడి పాటి కామేశ్వర రావు గారి ”అంతా ఇంతే ”అనే హాస్య నాటకాన్ని వేయాలనుకోన్నాం .మాకు అంతకు ముందు స్టేజి అనుభవం లేదు .ఎలా అనుకొంటుండగా మాస్టారికి తెలిసి తాను దర్శకత్వం వహిస్తానని చెప్పారు .ఎంతో సంతోషించాం .నేను యజ మానిగా మా తమ్ముడుడోక్కా లంబోదరం గా ,పార్ధి తమ్ముడు భాస్కర్ ఇంకో వేషం గా ప్రాక్టీసు చేశాం .మాస్టారి పాకలో రోజూ రిహార్సిల్లు చేసే వారం ముత్తయ్య గారు దగ్గ రుండి ఏ పాత్ర ఎలా మాట్లాడాలో దాని స్వరూప స్వ భావాలేమిటో డైలాగ్ ఎలా చెప్పాలో ,ఎక్కడ ఒత్తి పలకాలో ఎక్కడ తేల్చి చెప్పాలో అన్నీ వివరం గా చెప్పి చేయించే వారు .డైలాగ్ సరిగ్గా చెప్పే దాకా వదిలే వారు కాదు .ఖచ్చిత మైన సమయ పాలన చేసే వారు .దాదాపు నెల రోజులు అలా తీవ్రం గా ప్రాక్టీస్ చేయించారు .నాటకం బాగా అందరికి కంతో పాఠం గా వచ్చే సింది .వార్షి కొత్సవం నాడు అద్భుతం గా ప్రదర్శించాం .అదిరి పోయింది .అందరు విప రీతం గా మమ్మల్ని అభి నందించారు .మాస్టారు మాకు మేకప్ చేశారు .ఆయన డైలాగులు పలికే విధానం మాకు ఆశ్చర్య మేసేది .ఒత్తి ఒత్తి పలికే వారు అలానే మాతో పలికించే వారు .ముఖ్యంగా ”డొక్కా లంబోదరం నిమ్మ పళ్ళ రోడ్డు ”పాత్ర ను మా తమ్ముడు బాగా చేశాడు .ఆ నాటకాన్ని నేను హై స్కూల్ లో పని చోటల్లా విద్యార్ధులతో వేయించే వాడిని .మాకు బాగా నచ్చిన నాటకం .అలానే బి .వి.రమణ మూర్తి రాసిన ”భర్త మార్కండేయ ”కూడా వేయించే వాడిని .రెండు కడుపు చేక్కలఎట్లు నవ్వించే నాతికలే .మాకు కొద్దో గొప్పో నాటకాను భవం రావ టానికి ముఖ్య కారకులు ముత్తయ్య మాస్టారు నని నిస్సందేహం గా చెప్పగలను .
పార్ధి మాస్టారి అరుగు మీద రోజూ సాయంత్రం మేమంతా భేటి అయే వారం .ముత్తయ్య గారు తప్పని సరి .ఆయన కు రాజకీయా లన్ని బాగా తెలుసు .మంచి జెనెరల్ నాలెడ్జి ఉండేది .అది మాకు బాగా ఉపయోగ పడేది .మమల్ని చాలా ఆప్యాయం గా చూసే వారు .గొంతు కొంచెం గంభీరం గా ఉండేది .బయటి ఊరికి వెళ్ళే టప్పుడు చిన్న చేతు లున్న కుట్టిన తెల్ల బనీను వేసుకొనే వారు. చొక్కా వేసుకోవటం నేను చూడ లేదు .ఆ బనీనుకు లోపలా బయటా రెండు వైపులా పెద్ద జేబు లుండేవి .అందులోనే డబ్బు దస్కం పెట్టు కొనే వారు .మా అందరికి నాటక గురువు మా ముత్తయ్య మాస్టారు .వారి జ్ఞాపకాలు ఒక మధురాను భూతి
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -04 -12 .
కాంప్ –అమెరికా

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –7

 వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –7
                                                        నడుం లోతు నీటి లో శివ లింగం
—           నల్గొండ జిల్లాలో నల్గొండకు అతి సమీ పం లో ”పాను గల్లు ”గ్రామం ఉంది .అక్కడున్న ఛాయా సోమేశ్వర ఆలయం ప్రసిద్ధ మైనది .ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న మండపాలున్డటం ప్రత్యేకత .వీటి మధ్యలో మూడు గర్భ గుడులు ఉన్న దేవాలయం ఉండటం విశేషం .దీన్నే ”త్రికూటాలయం ”అంటారు .గర్భాలయం లో నడుము లోతు జలం లో శివలింగం ఉండటం ప్రత్యేకత .ఈ జలం అన్ని కాలాల్లో అదే లోతు లో ఉండటం విచిత్రం .ఈ జల లింగం పైన అన్ని సమయాల్లో స్తంభాకారం లో నీడ పడటం మరో వింత .సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీడ ఒకే రకం గా పడటం వింతల్లో వింత .ఇదే ”ఛాయా సోమేశ్వరం ”ఈ రహశ్యం ఇప్పటికీ దుర్భేద్యం  గానే ఉంది .ఇంకో వింత కూడా ఉందండోయ్ .సింహ ద్వారానికి ఎదురుగా ,గర్భాలయం ద్వారం లో నిల బడితే ,మన నీడ ఒకటి మూడు చాయాల్లో ,అయిదు చాయాల్లో ఎదుటి గోడ మీద పడుతుందట .ఈ కాంతి రహశ్యం తెలిసిన ఆ అజ్ఞాత శిల్పి చాతుర్యానికి మప్పి దాలు .
అంతే కాదండోయ్ .ఈ ఊరి దగ్గరే ”పచ్చల సోమేశ్వరాలయం ”ఉందట .నల్ల రాతి స్థంభ నిర్మాణం అది .ఆ స్తంభాలపై మన ప్రతి బింబాన్ని చూసు కో వచ్చు నట .అంటే అంత నున్నగా చేక్కారన్న మాట .అద్దం లాగా ఉంటుందన్న మాట .లింగం లో ”ఒక పచ్చ ”ను శిల్పి పోదిగాడట .పచ్చల హారం నిత్యం స్వామికి ధరింప జేయటం వల్ల పచ్చల సోమేశ్వరుడు అయాడు . 

                                           కొలను పాక కోటి లింగం
.            నల్గొండ జిల్లా భువన గిరికి ముప్ఫై కిలో మీటర్ల దూరం లో ”కొలను పాక”ఉంది .ఇక్కడి 
కాశీ బుగ్గ అనే బావి లో ని నీరు ”గంగా జలం ”గా భావిస్తారు .దీని ప్రక్కనే  శివాలయం ఉంది .అందులోని స్వామి ని ”అపర కాశీ  విశ్వ నాధుడు ”గా పూజిస్తారు .దీనికి దాదాపు ఎనిమిది వందల సంవత్స రాల చరిత్ర ఉంది .ఈ వూరికి నైరుతి భాగం లో ఒక చిన్న దేవాలయం లో ఒక శివ లింగం ఉంది .దీన్నే ”కోటి లింగం ”అంటారు .లింగం చుట్టూ గొలుసు లాగా అనేక లింగాలున్డటం ప్రత్యేకత .అందుకే ఆపేరు వచ్చింది .

      యజ్ఞోప వీతం ఉన్న కాళింగ  దేవి
   కరీం నగర్ జిల్లా లో మందెన గ్రామం ప్రసిద్ధి చెందినదే .మంత్ర కూటం అనే పేరు దానికి ఉండేది .నేపాల్ లోని పశు పతేశ్వర దేవాలయం లోని పూజారులు మందెన గ్రామ వాసు లేనట .ఇక్కడ గౌతమ మహర్షి తపస్సు చేశాడట .ఇక్కడి శివాలయాన్ని అందుకే ”గౌతమేశ్వర ఆలయం ”అంటారు .ఇక్కడ భూమిని తవ్వితే బయట పడ్డ ఇటుకలను నీటి పై వేస్తె తేలి పోతాయట .ఇదీ ఇక్కడి వింత .అమ్మ వారు కాళిందీ దేవి .నల్ల రాతి విగ్రహం .ఆమెకు యజ్ఞోప వీతం ఉండటం విశేషం .అంతే కాదు గోదావరి నది మధ్యలో ఒక దిబ్బ మీద పాను వట్టం లో పద కొండు శివ లింగాలున్డటం వింతల్లో వింత అయితె నందీశ్వర విగ్రహం లో పద కొండు నందులున్డటం మరీ విడ్డూరం అని పిస్తుంది .మందెన గోదావరి తీర గ్రామం .వేద పండితులకు నిలయం .మన పూర్వ ముఖ్యమంత్రి మాజీ ప్రధాని బహు భాషా వేత్త పీ.వి.నర సింహా రావు గారిది కూడా ఈ గ్రామం కావటం మరో విశేషం .
                                                            మన వైపే చూసే నందీశ్వరుడు
        వరంగల్ జిల్లా హనుమ కొండ  కు 70 కి.మీ.దూరం లోఉన్న ”పాలం పేట ”చిన్న గ్రామం .గ్రామానికి ,చెరువుకు మధ్య రామప్ప దేవాలయం ఉంది .కాకతి చక్ర వర్తిన్గన పతి దేవుడు నిర్మించిన రుద్రేశ్వరాలయం ఇకడే ఉంది .నక్షత్ర ఆకారం గా ఉండే వేదిక పై ఆలయం నిర్మించారు .పన్నెండు నల్ల రాతి యక్షినీ విగ్ర హాలు,ఆలయ పై భాగాన్ని మోస్తున్నట్లు గా శిల్పాలుంటాయి .అనీ కదులు తున్న బొమ్మల్లాగా కని పించటం విశేషం .ఆ శిల్ప శోభ అనన్య సదృశం .ఆలయ నిర్మాణానికి చాలా పెద్ద సైజు ఇటుకలను ఉపయోగించారు .అవి తేలికగా ఉండటమే కాదు ,నీటి పై తేలటం విచిత్రం గా వుంటుంది .రుద్రేశ్వర స్వామి భారీ శివ లింగం .నాగిని అనే నగ్న స్త్రీ శిల్పం అందర్నీ యిట్టె ఆకర్షిస్తుంది .ఆమె శరీరం చుట్టూ పాములు చుట్టూ కొన్నట్లుగా నిర్మించి ,అబ్బుర పరుస్తాడు శిల్పా చార్యుడు .ఆ శిల్ప సోయగం ఆనందపు అంచుల్ని చేరుస్తుంది .ఇక్కడి రుద్ర స్వామికి అభి ముఖం గా ఉండే నందీశ్వర విగ్రహం వింత గోలు పు తుంది .నందీశ్వరుని కళ్ళు మన వైపే చూస్తున్నట్లు గా ఉంటాయి .ఏ వైపు నుంచి చూసినా ,మనల్నే ఆయన చూస్తున్నట్లు గా చెక్కటం పరమాద్భుతం అని పిస్తుంది .నల్ల రాతి విగ్రహం లో అనంత మైన శిల్ప విన్నానాన్ని దర్శింప జేసిన ఆ శిల్ప బ్రహ్మ ..సృష్టికే ప్రతి సృష్టి చేశాడని పిస్తుంది .
                                                                  భారీ శిలా ధ్వజ స్తంభం
చిత్తూరు జిల్లా మదన పల్లి కి దగ్గర లో ”సోమ పాలెం ”శివాలయం లో 45 మీటర్ల ఎత్తు ఉన్ననాల్గు పలకల రాతి తో చేయ బడిన ధ్వజ స్తంభం చూపరులను విప రీతం గా ఆకర్షిస్తుంది .ఆనందం తో పాటు విప రీత మైన ఆశ్చర్యాన్నీ కలిగిస్తుంది .ఇంత భారీ రాతి ధ్వజ స్తంభం ఇంకెక్కడా లేదని చెబుతారు .ఈ స్వామికి రాతి రధం కూడా ఉండటం మరో విశేషం .ఈ భారీఆలయాన్ని విజయ నగర రాజులు నిర్మించారట .వారి కళా పోషణకు ,భక్తీ వైభవానికి ఇది మచ్చు తునక .
             సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -04 -12 .
                            కాంప్–అమెరి

Posted in సేకరణలు | Tagged | 1 Comment

ఎల్లలు దాటిన శ్రీ ఎల్లా మృదంగ నాదం -2

This slideshow requires JavaScript.

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

ఊసుల్లో ఉయ్యూరు –27 ఇక్కడి మన వాళ్ళు –2

  ఊసుల్లో ఉయ్యూరు –27
ఇక్కడి మన వాళ్ళు –2
 మొదటి సారి అమెరికా కు వచ్చిన తర్వాత ఆరు నెలలు ఉండి  డిసెంబర్ మొదటి వారం లో ఇండియా కు తిరిగి వెళ్లాం .మళ్ళీ రెండోసారి మిచిగాన్ లో ని ట్రాయ్ కు 2005 నవంబర్ లో వచ్చి 2006   మే నెలలో తిరిగి వెళ్లాం .అయితె 2004 లో జనవరి నెలలో ఇప్పటి ఏం .ఎల్ .సి .శ్రీ రాజేంద్ర ప్రసాద్ నన్ను ఉయ్యూరు పంచాయితీ కి రావాల్సింది గా ఫోన్ చేశాడు .ఆతని భార్య భ్రమ రాంబ ఉయ్యూరు సర్పంచ్ అతను  z.p.t.c.membar . అమెరికా లోని మైనేని గోపాల క్రిష్ణయ్య గారు ఇక్కడ స్లాబ్ మాత్రమే వేసి ఉన్న కొత్త లైబ్రరి కి అధిక మొత్తం లో విరాళం అందించారని దాన్ని సర్వాంగ సుందరం గా ఏ.సి.లైబ్రరి గా నిర్మించాలని దానికి ఒక కమిటీ ని వేస్తున్నామని నన్ను దానికి కన్వీనర్ గ చేస్తున్నామని అందరికి తెలియ జేశాడు .ఆ డబ్బు ను గోపాల కృష్ణ గారి అన్న గారు తాతయ్య గారి ఎకౌంటు లో జమ చేసి ఖర్చు పెట్టాలని చెప్పారు సరే అన్నాను .నిర్మాణ కమిటీ లో మిగిలిన వారందరూ సరే నన్నారు. హై స్కూల్ దగ్గర ఉన్న దీన్ని తీర్చి  దిద్దటానికి వెలగా  వెంకటప్పయ్య గారు, అప్పటి కృష్ణా జిల్లా గ్రంధా లయ సంస్థ చైర్మన్ గొర్రె పాటి గోపీచంద్ వగైరాలంతా సహక రించారు రెండు పూట్ల పని చూసి డబ్బు లెక్కలు వేసి తాతయ్య గారి ద్వారా బట్వాడా చేయించే వాడిని .ఆయన మా ఇంటికి కారు లో వచ్చి నన్ను తీసుకొని వెళ్ళే వారు .అంతా బానే జరిగి పోతోంది .దక్షిణ భారత దేశం లో ఏ.సి .లైబ్రరి మొదటగా ఉయ్యూరు లో నే ఏర్పడు తోంది .మంచి ప్రచారం కల్గింది .ఆ నాటి ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు దీన్ని ప్రారంభించాలని చాలా ఉవ్విల్లూరారాని   రాజేంద్ర చెబుతూ ఉండే వాడు .కాని మే నెలలో జరిగిన ఎన్నికల లో తెలుగు దేశం ఓడి పోయి రాజ శేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది .2004 జూలై  రెండో వారం లో లైబ్రరీ ప్రారంభోత్సం అత్యంత వైభవం గా కొత్త మంత్రులైన జక్కం పూడి రామ మోహన రావు కోనేరు రంగా రావు శాసన సభ్యులు సారధి ,రాజేంద్ర ప్రసాద్ వంటి వారందరూ హాజరై జరిపించారు .ఆ సభకు అమెరికా నుండి మైనేని గోపాల కృష్ణ గారు కూడా హాజ రైనారు. అదే మొదటి సారి వారిని చూడటం .ఒకటి రెండు సార్లు అమెరికా నుంచి నేను చేస్తున్న పనిని తాతయ్య గారు చెబితే నాకు ఫోన్ చేసి మాట్లాడిన గుర్తు .ఆయన అక్కగారు అన్న పూర్ణమ్మ గారు బావ గారు రాచ కొండ నరసింహ శర్మ గారు ఇంకో అక్క గారు అందరు వచ్చారు .అమెరికా నుండి గోపాల కృష్ణ గారు అతి ఖరీదైన రెఫెరెన్సు పుస్తకాలను ఆంగ్ల సాహిత్యాన్ని షిప్పింగ్ ద్వారా మా ఇంటికి పంపించారు. వాటిని జాగ్రత్త చేసి ఆవిష్కరణ రోజున లైబ్రరీ లో ఉంచాము. దీనికే చాలా ఖర్చు చేశారు .అంతే కాదు ప్రారంభోత్సవ ఖర్చు కూడా వారే భరించారు . చాలా ఉదార హృదయులని పించారు .వారందరినీ అంటే మన ఉయ్యూరు వారందర్నీ అక్కడ చూడటం చాలా విశేషం అని పించింది .నేను దగ్గరుండి నిర్మాణం చేయించి నందుకు నాకు సత్కారం కూడా చేశారు .లెక్క లన్ని పూర్తి చేసి తాతయ్య గారికి అందించి నా బాధ్యత ను నేను నెర వేర్చాను .మర్నాడు కూడా వారంతా తాతయ్య గారిట్లో ఉండి తర్వాత వెళ్లి పోయారు .అదే గోపాల కృష్ణ గారితో పరిచయం .అమెరికా వెళ్లి ఒకటి రెండు సార్లు ఫోన్ చేశారు
మేము రెండో సారి 2005 లో అమెరికా వెళ్లి నప్పుడు వారి ఫోన్ నంబర్ కు చేస్తే లైన్ కలవ లేదు న్యు జెర్సీ కి ప్రయత్నించా .మా బంధువు పవన్ కూడా అక్కడికి వెళ్లి అడ్డ్రెస్ కోసం ప్రయత్నించాడు .దొరక లేదు అంటే రెండో సారి ఇక్కడికి వచ్చి నప్పుడు వారితో మాట్లాడే ఆవ  కాశం .కలగ లేదు .ప్రయత్నం విర మించాను. అయితె ట్రాయ్ లో మా అమ్మాయికి మంచి స్నేహితులున్నారు జ్యోతి ,ప్రీతి బిందు ,హరిణి ,లావణ్య ,నాగమణి అనూరాధ .అందరు మంచి ఆప్తు లయారు వీరంతా మన రాష్ట్రం వారే .అందరి కుటుంబాలు కలిసి మెలసి మేలిగేవి. వారానికి ఎక్కడో అక్కడ భోజనాలు బర్త్ డీ పార్టీలు విష్ణు సహశ్ర నామ ,లలితా సహస్ర నామ పారాయణాలు తో కాలమ్ గడిచి పోయింది మంచి చలి కాలమ్ అడుగు ఎత్తున స్నో పడేది. ఒళ్లంతా స్వెట్టర్లు కోట్లు బూట్లు గ్లోవేస్ తో బయటికి వెళ్ళే వాళ్ళం .యుద్ధానికి వెళ్ళే సైనికుల్లాగా తయారయ్యే వాళ్ళం ..హరిణి ఇంట్లో ఉగాది నాడు పంచాంగ  శ్రవణం చేశాను .సంక్రాంతికి అక్కడి అందరి పిల్లలకు మా ఇంట్లో భోగి పళ్ళు మా  మన వళ్ళ తో పాటు పోయిన్చాం .ప్రీతి వాళ్లకు సత్య నారాయణ స్వామి వ్రతం చేయించాను .చిన్న పిల్లలు అవటం తో ఎక్కడికీ వెళ్ళ లేదు .ఒక్క పిట్స్ బర్గ్  దగ్గరున్న వెంకటేశ్వర స్వామి గుడికి మాత్రం కార్ లో అందరం వెళ్లి వచ్చాం .
                 ఆ అర్వాత ఎప్పుడో గోపాల కృష్ణ గారి అబ్బాయి  కృష్ణ  అమెరికా నుంచి ఉయ్యూరు వచ్చి లైబ్రరి కి కంప్యుటర్ బహూక రించాడు .నాకు ఫోన్ చేస్తే వెళ్లాను అప్పుడు గోపాల క్రిష్నయ్య గారి సరైన ఫోన్  నంబర్ అతను ఇచ్చాడు. అలబామా లో ఉంటున్నట్లు చెప్పాడు .అతను తండ్రిని మించిన తనయుడు అని పించాడు .సంస్కారి గా అని పించాడు .
మూడో సారి మేము 2008 మే లో మిచిగాన్ లోని స్టెర్లింగ్ హైట్స్ కు మా అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లాం .వేసవి కాలమ్ చాలా బాగా ఉన్ది. ఇక్కడ కడప అమ్మాయి మాధవి వాళ్ల కుటుంబం తో పరిచయం అయింది.చాలా మంచి కుటుంబం .వాళ్ల మామ గారు అత్త గారు కూడా హైదరా బాద్ నుండి వచ్చారు .వారానికో సారి కలుస్తూ రోజూ ఫోన్ చేసు కొంటు ఉండే వాళ్ళం. ఆ అమ్మాయి భర్త సుధీంద్ర యోగ్యుడు .ఒక అబ్బాయి అప్పటికే .మళ్ళీ అమ్మాయి పుట్టింది .ఇక్కడి వాళ్ళందరికీ మా అమ్మాయి విజయలక్ష్మి సామూహిక సీమంతం అందరి సహకారం తో నిర్వ హించేది .లడ్డు లు కట్టి అందరికి ఇచ్చేది దాన్లో  మా అమ్మాయి స్పెషల్ .మూడు నెలలు గడిచి పోయాయి ఒక సారి ఎందుకో మైనేని గోపాల కృష్ణ గారికి ఫోన్ చేయాలని పించి, చేశా .వాళ్ళంతా పెద్ద వాళ్ళు మన తో మాట్లాడు తారో లేదో అని అనుమానం .కాని ఆయన వెంటనే మాట్లాడారు .ఎంతో ఆత్మీయతను కలిగించారు .ఈ మూడు నెలలు ఆయనతో మాట్లాడక పోవటం బాధ అని పించింది .ఆయన అమెరికా లో విశ్వ విద్యాలయాలలో సీనియర్ లైబ్రేరియన్ గా పని చేసి పదవీ విరమణ చేశారు ఉయ్యూరు దగ్గర కుమ్మ మూరు నివాసి .వారి అక్క గారు గాంధీ గారి దర్శనం తో ప్రభావం పొంది సాధారణ జీవితం గడుపుతూ ఖద్దరు ధరిస్తూ ఉన్ది .భార్య భర్త లిద్దరూ డాక్టర్లే .ఆయన ప్రఖ్యాత కధకుడు రా.వి .శాస్త్రి గారి తమ్ముడు .మేమున్నపుడు ఇక్కడే ఫీల డెల్ఫియా లో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉన్నారు. ఫోన్ లో సంభాషించే వారు. మంచి కవి .కవితలు పుస్తక రూపం లో కి తెచ్చారు ఉయ్యూరు కు మేము వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడుతూనే ఉండే వారు విశాఖ లో ఆ వృద్ధ దంపతులున్నారు .శర్మ గారు వదాన్యులు .చేతికి ఎముక లేదు .పుస్తక ప్రియులు .ఎక్కడ ఏ కొత్త  పుస్తకం వచ్చినా కోని చదివే వారు .ఇలా గోపాల కృష్ణాయ గారి ద్వారా వారి బావ గారు శర్మ గారు పరిచయం అయారు .గోపాల కృష్ణ గారు మా కుటుంబానికి ఆప్తులై మరీ దగ్గరయారు. దాదాపు రోజూ మెయిల్ లోనో ఫోన్ లోనో పలకరించు కొనే వాళ్ళం .నాకు ఎన్నో ఖరీదైన చద వాల్సిన పుస్తకాలు పంపించి చదివించారు . నా అభిమాని ఇమాన్యుల్ కాంట్ పుస్తకాలను నాకు పంపారు .కాంట్ పై నేను సుదీర్ఘం రాయాలని ప్రారంభించాను .ఈ ప్రయాణం తోఆపేశాను .మళ్ళీ వెళ్లి పూర్తి చేయాలి ఇప్పటికి మంచి పుస్తకాలు కోని పంపుతూనే ఉన్నారు .ఆయనకు నేనేమీ పంపలేక పోయాను .  .వారి సౌజన్యం జనం జన్మ కు మరువ లేము ..మా ఉయ్యూరు నివాసి మైనేని వారు .వారి భార్య సత్య వతి గారు కూడా వారికేమీ తీసి పోలేదు ఆప్యాయం గా పలక రిస్తారు అలబామా లో ఉంటూ  పెరట్లో కూరలు పండించి మాకు పోస్ట్ లో పంపిన  సాధ్వి ఆమె .మూడు నెలలు ఎలా గడిచి పోయాయో తెలీదు .వారు మా ఉయ్యూరు లో సరస్వతి tutorial   కాలేజి ని నిర్మించి పుచ్చా శివయ్య  గారి తో కలిసి వంద లాది  విద్యార్ధులకు విద్యా దానం చేసిన అనే   హను మంత రావు గారిని నాకు ఇక్కడ పరిచయంచేశారు మైనేని గారి దగ్గర బంధువే అన్నే వారు ..ఉయ్యూరు లో ఉండగా ఆయన నాకు చాలా పరిచయం.మా నాన్న గారు ఆ కాలేజి లో తెలుగు పండితులు గా   పని చేశారు కూడా .మా తమ్ముడు కొంత కాలమ్ చేశాడు .హనుమంత రావు గారు చాలా కాలమ్ కిందటే అమెరికా వచ్చి చికాగో లోడిగ్రీ విద్యార్ధులకు  లెక్కలు బోదించి ఇప్పుడు డెట్రాయిట్ లో ఉంటున్నారు .లెక్కల బోధన లో ఆయనకు మంచి పేరు ఉన్ది .మెట్రిక్ కు విద్యార్ధులను తయారు చేసే వారు .ఆయన దగ్గర చదివారంటే పాస్ గ్యారంటీ .ఇప్పుడు ఆయనకు ఎనభై ఏళ్ళ వయసున్నట్లు మై నేని వారు తెలిపారు .వారబ్బాయి సురేష్ ఉయ్యూరు విద్యార్దియే .ఎలర్జీ డాక్టర్ గా, డెట్రాయిట్ మెడికల్ అసోసియేషన్ కు ముఖ్యుడు గా ఉంటున్నాడు .

  ఈ మూడవ ట్రిప్ లో పరి చయం  అయిన మరో ప్రముఖ వ్యక్తీ శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారు .మా ఉయ్యూరు నివాసే .ప్రపంచ బాంక్ లో నాలుగు దశాబ్దాలు వివిధ హోదాల్లో పని చేసి అత్యున్నత పదవి నలంకరించి ఎన్నో దేశాలు సందర్శించి వాటికి ఆర్ధిక సలహా దారు గా పని చేస్తున్న  ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక వేత్త  ప్రేమ చంద్ గారు .నాకు వీరిని మైనేని వారే పరిచయం చేశారు ఫోన్ ద్వారా .ప్రేమ చంద్ అంటే మైనేని వారికి వీర అభిమానం .ఆయన్ను దేవుడు గా భావించే ఆరాధనా భావం .ప్రేమ్చంద్ ఇంగ్లీష్ లో రాసిన తన జీవిత చరిత్ర ను మైనేని నాకు ఇక్కడికిపంపి చదవ మన్నారు .అద్భుతం గా వుంది .ప్రతి పంక్తిని క్షుణ్ణం  గా చదివాను .వారి చిన్నతనం లో ఉయ్యూరు ,పరిసరప్రాంతాలు  వారి విద్యా, ఉద్యోగం వగైరాలన్నీ ఒక డాక్యు mentari లాగా కళ్ళకు కట్టేట్లు రాశారు .చాలా సులభ మైన శైలి .నేను చదివి తెలుగు లో దాదాపు ముప్ఫై పేజీల నా స్పందనను గోపాల కృష్ణ గారికి రాసి పంపాను .ఆయన దాన్ని ప్రేమ చంద్ గారికి పంపారు .ఆయన చదివి నాకు ధన్య వాదలను ఫోన్ లో తెలియ జేశారు .అప్పటి నుంచి తరచుగా ఫోన్ సంభాషణ జరిపే వాళ్ళం .మైనేని వారు మేము ఇండియా వెళ్ళ గానే ప్రేమ చంద్ గారికి ఉయ్యురులో ఘన సన్మానంఎర్పాటు చేయించమని దానికి పూర్తి స్పాన్సర్ తానె ఉంటానని కోరారు నాకూ అలాంటి వారికి తగినట్లు సన్మానం చేయాలనే అని పించి సరే నన్నాను .మేము నవంబర్ లో ఇండియా వెళ్లాం .ప్రేమ చంద్ గారు కూడా ప్రతి సంవత్సరం నవంబర్ లో తప్పక భారత్ ను సందర్శిస్తారు .అలానే వచ్చారు 2008 డిసెంబర్ 21 తేది ఆది వారం ప్రేమ చంద్ గారికి సాహితీమండలి తరఫున ఏ.సి లైబ్రరి లో  లో  ఘన  సన్మానం చేశాం .ఏం.ఎల్ సి .రాజేంద్ర ప్రసాద్ .విజయ వాడ ఆకాశ వాణి డైరెక్టర్ శ్రీమంగళ గిరి  ఆదిత్య ప్రసాద్ కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష ,కార్య దర్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు ,పూర్ణచంద్ వగైరా హేమా హేమీల సమక్షం లో ఘన సత్కారం చేశాం .ఖర్చు అంతా మైనేని వారిదే .భూమి పుత్రుడికి సన్మానం .పట్టు బట్టలు ,పట్టు శాలువా తో సన్మా నిన్చాం .నన్ను పట్టు బట్టలు కొనుక్కో మన్నారు మైనేని వారు .వారి ఆజ్ఞా శిరో దార్యం .వాటిని నాకు ప్రేమ చంద్ గారు అంద జేశారు.ప్రపంచ ఆర్ధిక పరిస్తితి పై చాలా స్పందన  కలిగే ప్రసంగం చేసి ప్రేమ చంద్ గారు అందర్నీ ఆకట్టు కొన్నారు .వారు ప్రచారం కోరు కోని మనిషి .నేను వారి గురించి పరిచయం రాసి అందరికి పంచి పెట్టాను. మీడియా వాళ్ళు వారిని ఇంటర్వ్యూ తీసుకొన్నారు .మంచి ప్రచారమే చేశారు .ఆకాశ వాణి వారు వారిని ఆహ్వానించి వారి ఇంటర్ వ్యూ  తీసుకొని ప్రసారం చేశారు .అలా చాలా మందికి ప్రేమ చంద్ గారిని పరిచయం చేసే అదృష్టం మాకు కల్గించిన విశాల హృదయులు మైనేని గోపాల కృష్ణ గారు .ఇప్పటికీ తరచుగా ఫోన్ చేయటమో మెయిల్ లో పలకరించాటమో చేస్తారు .ప్రేమ చంద్ గారు కనీసం డజను పుస్తకాల నైనా రాసి ఉంటారు . ఎన్నో విలువైన గ్రంధాలను పంపి నాతొ చదివించిన సరస హృదయులు .మైనేని వారు .వారు నాకు పంపిన డబ్బు చాలా ఉన్ది. దాన్ని ప్రేమ చంద్ గారి సన్మానానికి ఖర్చు పెట్ట గా మిగిలిన ధనాన్ని వారి అను మతి తో బందరు లో కొత్త గా ఏర్పాటు చేసిన కృష్ణా విశ్వ విద్యా లాయానికి వారి పేరు మీద గా నేను, గుత్తి కొండ సుబ్బా రావు గారు మండలి బుద్ధ ప్రసాద్ గారి సమక్షం లో అంద జేశాము .అక్కడ కూడా మైనేని వారి దాతృత్వాన్ని తెలియ జేయ గలిగాము .
ప్రేమ చంద్ గారు ,మైనేని గారు -నేను సరస భారతి లో రాసే ప్రతి విషయాన్నీ చదివి వెంటనే స్పందిస్తున్నారు .నాకు గొప్ప ప్రేరణ కల్గిస్తున్నారు .ఇలా ఇద్దరు మహాను భావులు ఉయ్యూరు వారు ఇక్కడ ఉంటూ మాత్రు దేశాన్ని మరువ కుండా సేవ చేస్తున్నారు ఇద్దరు దాదాపు నలభై ఏళ్ళ నుండి అమెరికా లో ఉంటున్న ప్రముఖులే -మా ఉయ్యూరు వారే .వారిని ఇలా మా వాళ్ళందరికీ పరిచయం చేయటం నా బాధ్యత గా భావించాను .
ఉయ్యూరు కు చెందిన ప్రముఖ వ్యాపారస్తులు ఊర తాతయ్య గారి కుమారులిద్దరూ ఊర సాంబశివ రావు ఊర సాయి బాబు ఇద్దరు ఇక్కడ చాల కాలమ్ నుంచి డాక్టర్లు గా ఉన్నారు .ఉయ్యూరు దగ్గర వున్న తోట్ల వల్లూరు కు చెందిన నోరి దత్తాత్రేయుడు గారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాన్సర్ స్పెషలిస్ట్ అన్న సంగతి విశ్వ వ్యాప్తం గా అందరికి తెలిసిన విషయమే .
అలాగే మైల వరం శాసన సభ్యులు స్వర్గీయ కోమటి భాస్కర రావు గారి కుమారులు ఇక్కడి  తానా కు అధ్యక్షులు గా ఉన్నారు .భాస్కర రావు    గారు నేను మైల వరం దగ్గర చిలుకూరి వారి గూడెం హై స్కూల్ హెడ్ మాస్టర్ గా   పని చేసినపుడు పరిచయం .భాస్కర రావు గారి అబ్బాయి గారు వాళ్ళు నాలుగేళ్ల క్రితం ఇండియా వచ్చి తానా ద్వారా కృష్ణా జిల్లా అభివృద్ధి చేయాలని ఒక సమా వేశం జరిపారు. వివిధ రంగాలలో  నిష్ణాతు లైన వారిని కమిటీ సభ్యులు గ తీసు కొన్నారు .అప్పటి కృష్ణా జిల్లా పరిషద్ చైర్మన్ శ్రీ కుక్కల నాగేశ్వరరావు గారి సారధ్యం లో విజయ వాడ లో వీరందరి విస్తృత సమా వేశం జరిగింది. అందులోవిద్యా విషయం మీద  నన్ను సభ్యుని గా తీసుకొన్నారు .ఆ మీటింగ్ లో నేను చేయ వలసిన సంస్కరణలను గురించి విపులం గా మాట్లాడి ఒక రిపోర్ట్ వారికి అంద జేశాను .ఆ సభలో పిన్నమ నేని కోటేశ్వర రావు చనుమోలు వెంకట్రావు గారు జంధ్యాల శంకర్ వంటి ప్రముఖులున్నారు ఆ సమావేశం తరువాత మళ్ళీ ఏమి జరిగిందో ఎవరికి తెలీదు .
ఇప్పుడు తానా ప్రెసిడెంట్ గా వున్న తోట కూర ప్రసాద్ గారు కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ కార్య దర్శిగా అధ్యక్షునిగా పని చేసి న గన్న వరానికి చెందిన  హిందీ పండితులు తోట కూర అప్పా రాయ వర్మ గారి కుమారుడే .వర్మ మా కు ఆత్మీయుడు ,నాకు చాలా అభిమాని .మా ఇంట్లో పెళ్లిళ్లకు ఉయ్యూరు వచ్చి ఆశీర్వ దించిన సహృదయుడు వర్మ గారు .పెద్ద మనిషి. హుందా తనం ఉన్న వ్యక్తీ .ఈ విధం గా ఇంకా ఎందరెందరో పరిచయం ఉన్న వారందరూ ఇక్కడ తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వ హిస్తూ  మాత్రు దేశానికి సేవ చేస్తూ మన భాష ను ,సంస్కృతిని పరి రక్షించు కొంటు భావి తరాలకు అంద జేస్తూ శ్లాఘ నీయ మైన సేవలందిస్తున్నారు .మచిలీ పట్నానికి చెందిన సిలికాన్ వాలీ లో తన సేవా విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తున్న శ్రీ కూచి భొట్ల ఆనంద్ గారు అందరి అభిమానం సంపాదించిన వారే .ఈ మధ్య ఉయ్యూరు కు కూడా వచ్చిన వారే ;కృష్ణా జిల్లా  రచయితల సంఘం నిర్వ హించే జాతీయ .ప్రపంచ తెలుగు రచయితల సభలకు ఆనంద్ గారు ప్రత్యెక ఆకర్షణే .తెలుగు తనం మూర్తీ భావించే కట్టు బొట్టు తో వారెక్కడైనా ప్రత్యక్షం .ఎన్నో గిన్నీ బుక్ రికార్డులను సాధించిన నిరంతర సంస్కృతీ ప్రచార సారధి .శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారు యెన్.ఆర్.ఐ .లు భారత దేశానికి చేస్తున్న సేవలను వారి ద్వారా జరిగిన ,జరుగుతున్న అభివృద్ధి ని తాను వ్రాసిన పుస్తకం లో విపులం గా చర్చించారు .దాన్ని చదివి నేను ప్రవాస భారతీయులు చేసిన సేవల గురించి ఒక వ్యాసం రాసి విజయ వాడ రేడియో స్టేషన్ కు పంపితే దాన్ని ఇంటర్వ్యూ గా ప్రసారం చేశారు .ఈ విధం గా వారి సేవలను ప్రజా లందరికి తెలియ జేసే అవకాశం నాకు లభించింది .దీన్ని వ్రాసిన ప్రేమ చంద్ గారికిఅభి నందనాలు.
ఇప్పుడు నాతొ పాటు ఇక్కడ ముగ్గురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు .వారిలో శ్రీ దేవి నేని మధు సూదన రావు గారు ఒకరు .కృష్ణా జిల్లా కంకిపాడు దగ్గర తెన్నేరు నివాసి .గన్నవరం దగ్గర హై టెక్ ప్రింట్స్ అది పతి గా చాలా కాలమ్ ఉన్నారు .తర్వాత దాన్ని వదిలేసి వారి స్వగ్రామం లో ఆధునిక వ్యవ సాయ పద్ధతులతో పంటలు పండిస్తున్నారు .గొప్ప సాహిత్యాభి మాని ఎందరికో పుస్తకాలను కోని ముద్రించి ఆప్యాయం గా అంద జేసే వ్యక్తీ విద్యార్ధులను తీర్చి దిద్దాలనే తపన ఉన్న వారు. వారి శ్రీ మతి వారికి గొప్ప సహకారం. తల్లి గారి పేర  ఒక సేవా సంస్థను నెల కొల్పి పుస్తక ప్రచురణ చేసి అందరికి సాహిత్యాన్ని అందు బాటు లోకి తెస్తున్నారు .ఇటీవలే పిల్లల కోసం ముఖ్యమైన పద్యాలు పాటలు రెండు పుస్తకాలుగా ముద్రించి స్చూల్స్ కు  ఉచితం గా పంపిణీ చేశారు .కృష్ణా జిల్లా ప్రదానో పాధ్యాయ  సంఘానికి వెన్నెముక గా నిలిచి మేము చేబట్టిన ఎన్నో కార్య క్రమాలకు స్పాన్సర్ గా ఉన్నారు .సమాజానికి ఇంకా ఏదో చేయాలనే తపన వారిని నిద్ర పోనీదు .ఆధునిక పరికరాల వాడకం వారికి కరతలా మలకం . .వారిద్దరమ్మాయిలు అమెరికా లోనే ఉన్నారు .సంవత్స రానికి రెండు మూడు సార్లైనా అమెరికా  వస్తుంటారు .నాతొ తరచు ఫోన్ సంభాషణ చేస్తున్నారు .ప్రేమ చంద్ గారి సన్మానానికి విచ్చేశారు ఆయన కార్య క్రమాలకు నన్ను ఆహ్వానిస్తే వెళ్తుంటాను .మంచి మనిషి ,యోగ్యులు మధు సూదన రావు గారు .
ఇక్కడున్న రెండవ ప్రముఖ వ్యక్తీ మా ఉయ్యూరు లో కమ్మర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా పని చేసి రిటైర్ అయిన సాహితీ ప్రియులు శ్రీ ముత్తేవి రవీంద్ర నాద్ .తెనాలి వాసి .ఆధునిక భావాలలున్న వారు .మంచి హేతు వాది .ఆయన భావాలతో మనం ఏకీభవించక పోయినా స్నేహ శీలి. ఉయ్యూరు లో పని చేస్తుంద గానె పరిచయం .ఎన్నో విషయాల మీద పుంఖాను పుంఖాలుగా  వ్యాసాలను సమగ్రం గా  రచించిన సాహిత్య కృషీ వలుడు .ఆరోగ్యం మీదా ఆహార పదార్ధాల మీద రచనలు చేశారు .ఆయనకు గొప్ప పేరు సంపాదించి పెట్టింది ”తెనాలి రామ కృష్ణుడు ”అనే పుస్తకం .పాండు రంగ మహాత్మ్యాన్ని ఆధారం గా చేసుకొని గొప్ప విశ్లేశానాత్మకం గా బృహత్ గ్రంధాన్ని రాశారు అదొక విజ్ఞాన సర్వస్వం గా వుంటుంది.ఎదైనాలోతులు తరచి ఆది కారం గా రాసే ఓపికా తీరికా బాధ్యతా ఉన్న వారు .నాకు గొప్ప ప్రేరణ వారి రచనలు .వారి అమ్మాయి దగ్గర ఇక్కడే అమెరికా లో ఉన్నారు .తరచూ మెయిల్ ద్వారా కలుస్తారు .నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడారు .
ఇప్పుడు రవి గారు ”శ్రీ కృష్ణ దేవరాయలు -ఆముక్త మాల్యద ”పై సమగ్ర గ్రంధం రాస్తున్నట్లు ఫోన్ లో తెలియ జేశారు .అదొక సర్వస్వం గా తీసుకు  వచ్చే కార్యక్రమం .అభినందించాను .త్వరలో ఆ పుస్తకం వెలుగు చూడాలి. వారు జూన్ లో ఇండియా వెళ్లి పోతారు .
మూడవ ప్రముఖుడు ఆత్మీయుడు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారు .రచయితల సంఘానికి వెన్నెముక .ఎన్నో ఘన కార్యాలను సంఘం ద్వారా చేసిన మనిషి .మా సాహితీ మండలి, సరస భారతికి గొప్ప అభి మాని .మేము ఏ పెద్ద కార్య క్రమం చేసినా సుబ్బారావు పూర్ణ చంద్ లేకుండా చెయ్యం .పిలవ గానే తప్పని సరిగా హాజరయ్యే సహృదయత వారిద్దరిది. ఎంతో సాహితీ సేవ చేసిన రధ సారధులు సుబ్బారావు పూర్ణ చందులు. ఒక రకం గా సూర్య చంద్రుల వంటి వారు .సుబ్బా రావు గారు మాతో పాటే అమెరికా వచ్చారు. ఈ నెలాఖరుకు ఇండియా వెళ్తారు .మెయిల్ లో తరచూ కలుస్తూ ఉంటాము
ఇలా ఎందరెందరో మహాను భావులు -అందరికి వందనాలు .
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -04 -12 .
కాంప్ –అమెరికా 

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

స్టేట్ లీడర్ పక్ష పత్రిక లో 1 – 4 -2012 లో వచ్చిన వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –6

      వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –6
                                                 రస భాండ నిలయం -సిద్ధ వటం
  కడప జిల్లా పెన్నా నదీ తీరాన సిద్ధ వటం అనే గ్రామం లో అనేక సిద్ధ పురుషులు ఉండే వారట .అందుకే ఆ పేరు సార్ధక మైంది .అందులో ”రస సిద్ధులు ”చాలా మంది ఉండే వారట .అక్కడ భూమి ని తవ్వితే నేక రస భాండాలు కన్పించాయత .వాటి లో ఏమి ఉందొ ,వాటి వివ రాలు ఇప్పటికీ ఎవరికీ తెలియదట .ఆ రసం ఎందుకు ఉప యోగించారో ,ఉపయోగిస్తారో ఈ నాటికి అంతు పట్టని మిస్టరి గా నే ఉందట .అదీ సిద్ధ వటం హిస్టరీ .తిరునాళ్ళ లో ఇక్కడి నీటి బుగ్గలు ఉబుకు తాయత .అదొక వింత గా చెప్పు కొంటారు .
         గోపాద ముద్రలున్న మహా నందీశ్వరుడు
                 కర్నూలు జిల్లా నంద్యాలకు దగ్గరలో ఉన్న మహా నంది గొప్ప శైవ క్షేత్రం .మహా నందీశ్వర లింగం కింద ”రుద్ర కుండం ”అనే కోనేటి లోకి ,నీరు నిరంతరం గా ప్రవహిస్తూ ఉంటుంది .లింగం మీద ఆవు పాద ముద్రలు కని పించటం ఇక్కడి వింత .అది సాలగ్రామ లింగం అవటం మరీ విశేషం .పుష్కరిణి లో నీళ్ళు ఎప్పుడు అయిదు అడుగుల లోతు లో ఉండటం మరో విశేషం .దీని లో స్నానం చేయటం పరమానందం ,వింత అనుభవం .అడుగున వేసిన చిన్న పైసా కూడా స్పష్టం గా కని పిస్తుంది .స్నానం చేస్తుంటే మనం దేవతలమేమో నన్న దివ్య భ్రాంతి ,కాంతి మన శరీరాలకు కలిగి మరిచి పోలేని అనుభూతి గా మిగిలి పోతుంది .ఆనంద పార వశ్యం కల్గిస్తుంది .దీని కంతటికీ కారణం ఆ జలం శుద్ధ స్పటిక జలం అవటమే .దివ్యాను భూతి అంటే ఏమిటో ఇక్కడే మనం పొందగలం .
                                          అభిషేక జలం బయటకు రానివ్వని బాల బ్రహ్మేశ్వర లింగం
 మహబూబ్  నగర్ జిల్లా లో  ,కర్నూలు కు దగ్గరగా ,’అలంపురం ‘చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం .దక్షిణ కాశి అంటారు .తుంగ భద్రా నదీ తీరం .ఇక్కడా నవ బ్రహ్మ లకు ఆలయాలున్నాయి .ఇక్కడి బాల బ్రహ్మా లయం చాలా ప్రసిద్ధి పొందింది .బాల బ్రహ్మేశ్వర లింగానికి ఎంత నీటి తో అభిషేకం చేసినా ,ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదట .గుడి లోపల ఉన్న గణ పతి విగ్ర హాన్ని వన మూలికలు ,పసరులు ,ఇసుక తో కలిపి ,ఈ ఆలయాన్ని నిర్మించిన రస సిద్ధుడు తయారు చేశాడట .ముట్టు కుంటే గరుకు గా ఉంటుందట .ఇక్కడి ఆలయాలన్నీ  మహోన్నత శిల్పాలతో విరాజిల్లుతూ ఉంటాయి జోగులాంబా దేవి శక్తి క్షేత్రం ఇది .ఆలాయా లన్ని గుహల్లా గా ఉండటం  విచిత్రం .రాతికీ ,రాతికీ మధ్య అతికించా టానికి  సున్నం లాంటిది ఏదీ వాడక పోవటం మరీ విచిత్రం .
       
 బోయలే పూజారు  లైన బీచు పల్లి 
    మహబూబ్ నగర్ జిల్లా లో కృష్ణా తీరాన బీచు పల్లి ఆంజనేయ స్వామి ఆలయం ,మహిమాన్విత మై ప్రసిద్ధి చెందింది .స్వామి స్వయం గా వెలసిన దివ్య క్షేత్రం.
స్వామి అర్చకులు బోయ వాళ్ళే .స్వామి దర్శనం తో దీర్ఘ వ్యాదు లన్నీ మాటు మాయం అవుతాయని భక్త జన విశ్వాసం .స్వామి సమీ పం లో ఉన్న ”కడిమి చెట్టు ”మహా మహిమాన్విత మైనదని ఇక్కడి ప్రజల అచంచల విశ్వాసం .
    
 లింగం మీద ఒకే మట్టం లో నీరు ఉండే వాడ పల్లి
 మూసీ నదికి ముచి కుంద నది అని పేరు 
.ఇది నల్గొండ జిల్లా వాడ పల్లి వద్ద కృష్ణా నది లో కలుస్తుంది .ఇక్కడి అగస్స్త్యేశ్వర దేవాలయం పురాణ ప్రసిద్ధ మైనది .శివ లింగం మీద నీరు ఎప్పుడూ ఒకే ఎత్తు లో ఊరుతూ ఉండటం ఇక్కడి విశేషం .దీనికి దగ్గర లో నర సింహ స్వామి ఆలయమూ విశిష్ట మైనదే .స్వామికి ఎదురుగా పద కొండు దీపాలు నిరంతరం వెలుగు తూ ఉండటం విశేషం .అందులో నర సింహ స్వామి ముక్కు కు దగ్గర గా ఉన్న దీపం గాలికి రెప రెప లాడుతూ కన్పించటం మరీ విచిత్రం. .మిగిలిన దీపాలు నిశ్చలం గా వెలుగుతూ కన్పిస్తాయి .దేవుడు ఊపిరి పీలుస్తున్నాడు అన్న భావన కలిగేట్లు శిల్పి నిర్మించిన నిర్మాణ చాతుర్యం ఆశ్చర్యం కలిగించి ఆతని చాతుర్యానికి జోహారు లర్పిస్తాం .శైవ ,వైష్ణవ దివ్య  క్షేత్రం వాడ పల్లి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -04 -12

క్యాంపు –అమెరికా 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –26 ఇక్కడి మన వాళ్ళు

  ఊసుల్లో ఉయ్యూరు –26
                                                                 ఇక్కడి మన వాళ్ళు
          ఇక్కడి మన వాళ్ళు అంటే నా ఉద్దేశ్యం లో ”అమెరికా లో నాకు తెలిసిన మన వాళ్ళు ”అని భావం .నేను నా శ్రీ మతి మొదటి సారిగా అమెరికా కు మా అమ్మాయి ,అల్లుడు ఇంటికి టెక్సాస్ లోని హూస్టన్ కు 2002  లో  వచ్చాము .
అప్పుడు మాకు మొదట ఇక్కడ పరిచయ మైన వారు  శ్రీ మతి వావిలాల లక్ష్మి శ్రీ వావిలాల కృష్ణ దంపతులు .మా అమ్మాయి వారిద్దరిని అమ్మక్కయ్య ,పెద నాన్న అని పిలిచేది .వాళ్ళూ హూస్టన్ లోనే ఉండే వారు .దాదాపు ప్రతి వారం కలుసు కొనే వారం .లక్ష్మి గారు నాకు బంధువే .మా ఉయ్యూరు లో మా అమ్మ గారి బాబాయి గుండు అంతర్వేది గారి మనుమ రాలు .అంటే ఆయన కుమారుడు మేమందరం ”అప్పన్న కొండ మామయ్య ”అని పిలిచే గుండు వరాహ లక్ష్మీ నర సింహ మూర్తి (డాక్టర్ జి.వి.ఎల్ .యెన్ .మూర్తి )గారి అమ్మాయే .ఆయన జేమ్షేడ్పూర్ టాటా ఐరన అండ్ స్టీల్ ఫాక్టరీ లో చీఫ్ కెమిస్ట్ .అంతర్వేది గారు పోలిస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజ మండ్రి లో చేసి ఉయ్యూరు లో స్తిర పడ్డారు .అప్పన్న  కొండ మామయ్య  సంవత్స రానికి కనీసం రెండు మూడు సార్లు ఉయ్యూరు వచ్చే వాడు .వచ్చి నప్పుడల్లా మా ఇంటికీ ,మా మేన మామ గంగయ్య గారింటికి తప్పక వచ్చి కని పించి వెళ్ళే వాడు. ఆ కాలమ్ లోనే ఆయన విజయ వాడ హోటల్ లో దిగి ఉయ్యూరు కు కార్ లో వచ్చే వాడు .మమ్మలనందరినీ ఆప్యాయం గా పలకరించే వాడు .ఒళ్లో కూర్చో పెట్టు కోని కబుర్లు చెప్పే వాడు .తెల్లని బెంగాలి పంచె ,లాల్చీ తో వుండే వాడు చాలా ఎత్తు దానికి తగ్గ శరీరం .బాగా అందం గా వుండే వాడు .నుదుటి మీద    కాల్చిన మచ్చ ఉండేది .సత్య సాయి బాబా భక్తుడు .అమ్మను అక్కయ్యా  అని మామయ్యను అన్నయ్యా అని ఆప్యాయం గా పిలిచే వాడు .నేను బి.ఎస్.సి పాసై తరువాత చదువు కోసం ఆలో చిస్తుంటే వేసవి సెలవుల్లో ఆయన వచ్చి ఆంద్ర యూని వేర్సిటి registraar మహా దేవన్ తనకు బాగా తెలుసనీ recommendation    లెటర్ ఇచ్చి నన్ను విశాఖ పంపించాడు .ఆయన కూడా ఎంతో ఆదరం గా మాట్లాడి ఫిజిక్స్ లో సీట్లు అయి పోయాయని marine  ఫిజిక్స్   లో ఇస్తానని చెప్పారు .లేను చేర లేదు .అంతటి సహాయ కారి అప్పన కొండ మామయ్య .
ఆయన కూతురే లక్ష్మి గారు .ఆవిడ భర్త గారే వావి లాల కృష్ణ గారు .రాజ మండ్రి నివాసి .అక్కడే పుట్టారు .అనసూయమ్మ గారి మనవడు ..వావిలాల వాసు దేవ శాస్త్రి గారు అంటే సాహిత్యం లో పరిచయం ఉన్న వారి కి బానే తెలుస్తుంది .శాస్త్రి గారు షేక్స్ పియర్ నాటకాలను మొట్ట మొదట తెలుగు లోకి అనువదించిన వారు .అంతే కాదు ”నందక రాజ్యం ”అనే తొలిస్వతంత్ర  నాటకాన్ని , తొలి సాంఘిక నాట కాన్ని రాసిన కవి  పండితులు .వీరేశ లింగం గారు ,వడ్డాది సుబ్బా రాయ కవి గారు ,వావి లాల వాసు దేవ శాస్త్రి గారు ఆ నాడు సమ కాలికులు .వీరు ముగ్గురిని ”ఆధునిక కవిత్రయం ”అని పిలిచే వారు .అలాంటి శాస్త్రి గారి మనుమడే కృష్ణ గారు .శాస్త్రి గారి రచనలను నాకు ఇచ్చారు ఇక్కడ .అంతే కాదు కృష్ణ గారు హూస్టన్ లో ”తెలుగు సంఘం ”ను మొట్ట మొదట గా ఏర్పరచి ,తెలుగు వారందరినీ కలిపిన వ్యక్తీ .అప్పుడు వీరికి సహకరించిన వారి లో చిట్టెన్ రాజు గారు ప్రముఖులు .వీరంతా తెలుగు భాష ,సంస్కృతీ లకు వ్యాప్తికి నిల బెట్ట టానికి అహర్నిశలు పని చేసిన తొలి తరం వ్యక్తులు .
          లక్ష్మి గారు  మమ్మల్ని  మీనాక్షి దేవాలయం , ,దుర్గాలయం ,ఇస్కాన్ దేవాలయాలకు వెంట పెట్టు కోని తీసుకొని వెళ్లి చూపించారు .రైస్ యుని versity లో ఒక తెలుగు  అమ్మాయి కూచి పూడి నాట్యాన్ని తొలి సారిగా రంగం మీద ప్రదర్శిస్తుంటే తీసుకొని వెళ్లి చూపించారు .దంపతు లిద్దరూ ఎంతో అప్యాయం గా పలకరించి సంభాషించే వారు .ఇండియా వచ్చినా తప్పక మాకు ఫోన్ చేస్తారు ఈ మార్చ్ లో అప్పన్న కొండ మామయ్య శత జయంతి కోసం రాజ మండ్రి వచ్చి ,ఆయన చదివిన కాలేజి లో ఆ కార్య క్రమాన్ని ఘనం గా నిర్వ హింప జేసి మాకు తెలియ జేశారు
హూస్టన్ లో ఉండగానే ప్రఖ్యాత నాట్యా చారిని వింజ మూరి రత్న పాప పరిచయం అయారు .ఆమె సుమారు పాతిక ఏళ్ళ క్రితం అమెరికా వచ్చి ఇక్కడ నాట్య కళాశాల స్తాపించి వేలాది మందికి భరత నాట్యం కూచి పూడి నేరించారు నేర్పిస్తున్నారు .రైస్ universiti  లో పరిచయం అయారు హాస్టన్ లో నే ఉంటారు . ఆ రోజే ఆమె తల్లి గారు వింజ మూరి అనసూయ గారు కూడా పరిచయ మయారు .ఆమె పేరు మా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం సీతా అనసూయలు గా ప్రసిద్ధులు ఆ అక్కా చెల్లెళ్ళు .జాన పడ సాహిత్యాన్ని అద్భుతం గా ప్రచారం చేసిన విదుషీ మణులు .దేవుల పల్లి కృష్ణ శాస్త్రి  గారి మేన కోడళ్ళు .ఆయన పాటలను ఊరూరా  సంగీతా మేనా లో ఊరేగించిన వారు .కృష్ణ శాస్త్రి గారు మా పెద్దక్కయ్యా గాడే పల్లి లోపాముద్ర ,బావ కృపానిధి గార్లకు దగ్గర బంధువు  .శాస్త్రి గారు మద్రాస్ లో టి.నగర్ లో ఉండే వారు .మద్రాస్ కు నేను వెళ్లి నప్పుడల్లా కృష్ణ శాస్త్రి గారింటికి మాక్కయ్య తీసుకొని వెళ్ళేది ఆయన ఎంతో ప్రేమతో పలకరించే వారు స్క్రిబ్లింగ్ పాడ్ పై సంభాషణ జారి పే వారు .ఒకటి రెండు సార్లు ఆయన కారు లో నన్ను ,నా మేన కోడలు సత్య కళ ను తీసుకొని వెళ్లి తిప్పారు ఆయన ఇంకో ఇరవై రోజులకు చని పోతారంగా నేను చివరి సారిగా వారిని వారింట్లో దర్శించాను .అప్పటికి ఆరోగ్యం బానే ఉంది .ఎన్నెన్నో విషయాలు అడిగి తెలుసు కొనే వారు .ఇలా రత్న పాప ,సీతా అనసూయ లకు మా ఉయ్యూరు సంబంధం వుంది .

      అయిదు లేక ఆరేళ్ళ  క్రితం చిట్టెన్ రాజు గారు హైదరా బాద్ లో తొలి ప్రపంచ తెలుగు సభలు నిర్వహిస్తూ శ్రీ బాపు ,రమణ ల స్నేహ షష్టి పూర్తి  జరిపారు దానికి నేను హాజ రైనాను .అనసూయ గారు అప్పుడు హైదరాబాద్ వచ్చి తన పుస్తకాన్ని ఆవిష్కరించారు. బాపు రమణలకు అద్భుత సన్మానం జరిపారు రాజు గారు .చిరస్మర ణీయం అది .అనసూయ గారిని పలకరించాను .ఆవిడ బందుత్వాన్ని అంతా ఏకరువు పెట్టారు .
               మూడేళ్ళ క్రితం కూచి పూడి లో వెంపటి చిన సత్యం గారి ఆధ్వర్యం లో మూడు రోజుల సిద్ధేంద్ర ఉత్స వాలు జరిగితే రత్న  పాప వచ్చారు .ఆమె సత్యం గారి శిష్యురాలే .నేను మా హూస్టన్ పరిచయాన్ని జ్ఞాపకం  చేశాను .చాలా ఆనందించారు . .నేను శ్రీ నాధుడు రాసిన శివుడు పార్వతీ మీది  పద్యాన్ని ఎందుకో స్టేజి మీద చదివితే ఆమె తనకు ఆ పద్యం కావాలని ఆంటే రాసి ఇచ్చాను .దాన్ని తాను నేర్పే నాట్యం లో చేరుస్తానని అంత బాగా ఉందని అన్నారు .ఆ పద్యం”చంద్ర బింబానన ,చంద్ర రేఖా  మౌళి ,నీల కుంతల ఫాల నీల గళుడు —”
మేమిద్దరం ,మా అమ్మాయి మనవడు శ్రీ కెత్ నవంబర్  లో కాలి ఫోర్నియా వెళ్లి మా మేనల్లుడు వేలూరి మృత్యుంజయ శాస్త్రి (jay veluri )ఇంట్లో ఫ్రీమాంట్ లో పది హీను రోజులున్నం .వాడి  భార్య విజయ లక్ష్మి మమ్మల్నిబాబాయి గారు ,పిన్ని గారు  అంటు ఎంతో ఆదరం గా చూశారు .చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూపించారు .అక్కడే మన ఉయ్యూరు లో చోడ వరపు చంద్రశేఖర రావు గారి మనవడు మృత్యుంజయ మూర్తి కనిపించాడు అతన్ని నేను ”పొట్టి ”అని పిలిచే వాడిని మంచి intelligent .బాంక్ ఆఫ్ అమెరికా లో పెద్ద ఉద్యోగి .ఇక్కడికి రాక ముందు ఇండియా లో స్టేట్ బాంక్ లో కూడా పెద్ద ఉద్యోగం చేశాడు .మా వాళ్ళింటికి వచ్చి మమ్మల్ని అందరిని వాళ్ళింటికి భోజనానికి ఆహ్వానించి పిల్లలకు పరిచయం చేసి ఎంతో గౌరవం చూపించాడు మూర్తి అతని భార్యా.అక్కడే మా వాడి ఇంటికి ఎదురు గా పింగళి వారి కుటుంబం పరి చయం+ అయింది .వృద్ధ దంపతులు .చాలా నియమ నిష్టలతో ఉంటారు ;కార్తీక మాసం లో వచ్చాం కనుక సత్య నారాయణ వ్రతం చేసి మమ్మల్నందర్నీ భోజ నానికి పిలిచారు .సాయంత్రం మేమందరం స్కూల్ గ్రౌండ్ కు నడక కు వెళ్ళే వాళ్ళం .ఆ పది హీను రోజులు యిట్టె గడి ఛి పోయాయి శాస్త్రి కొడుకు కృష్ణ కూతురు వీణా బాగా మమ్మల్ని ఆకట్టు కున్నారు .
నేను రోజూ అభిషే+కం చేసి పౌర్ణమి నాడు సత్య నారాయణ వ్రతం కూడా చేశాను.
               మా మేనల్లుడు శాస్త్రి దాదాపు ఇరవై ఏళ్ళ క్రితమే మిచిగాన్ చదువు కోవటానికి వచ్చి ,పూర్తి చేసి క్రమంగా ఉద్యోగం సంపాదించి ,భార్యకు కూడా ఉద్యోగం చూపించాడు.మా అక్కా   బావ లను కనీసం ఎనిమిది సార్లైనా ఇక్కడికితీసు కోని వచ్చి ఉంటాడు .అతను అతని పెద నాన్న ముకుందం గారి అబ్బాయిని పవన్ ను కూడా ఇక్కడికి తెచ్చి నిలబడేట్లు చేశాడు. బావ మరిదిని భార్యను ,మా తమ్ముడు కొడుకు ను  తీసుకొచ్చి ఆవ కాశాలు కలిగించాడు. పావన్ ఇప్పుడు మా అమ్మాయి వాళ్ల ఇళ్ళ దగ్గరే షార్లెట్ లో ఉన్నాడు .ఈ విధం గా మా జాయ్ వేలూరి వేలూరి సామ్రాజ్యాన్ని ఇక్కడ చక్కగా స్తిర పరిచి అందరికి అండ గా నిలి చాడు .అతను మొదటి సారిగా ఇక్కడికి రావా టానికి అతని స్నేహితుడు కొడాలి శ్రీనివాస్ ,ఇతర మిత్రులే నిలబడి నిల బెట్టారు  .కొడాలి బందర్లో మా వాడి క్లాస్ మేట్ .స్నేహితం అంతే ఇదీ అని రుజువు చేసిన వాళ్ళు వీరంతా .


సశేషం —-రెండో సారి ప్రయాణం లో విశేషాలు 
  ఇంకో సారి

—- మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —18 -04 -12 .
కాంప్ –యు.ఎస్ ఏ.  

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –5

  వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –5
                                                  లింగోద్భావాన్ని చూపే శివ లింగం
గుంటూరు జిల్లా చండ వోలు లో చాలా పురాతన మైన ”లింగోద్భవ స్వామి ”దేవాలయం ఉంది .శివ రాత్రి నాడు లింగోద్భవ సమయం లో శివుడు ఇక్కడ లింగ రూపం పొందాడని ప్రజల విశ్వాసం .ఆ లింగం ఆది ,అంతాలను తెలుసు కోవ టానికి బ్రహ్మా ,విష్ణువు ప్రయత్నించి విఫలు రైనా సంగతి అందరికి తెలిసిన విషయమే .చిన్న లింగం గుది లోను ,పెద్ద లింగం బయటా ఉంటాయి .మొగలి రేకు గుర్తు ,హంస గుర్తు ఈ లింగాల పై ఉండటం చిత్రాతి చిత్రం .లింగోద్భవం జరిగింది ఇక్కడే నని చెప్ప టానికి ఈ రెండు గుర్తులు సాక్ష్యం  గా ఉన్నాయని ఇక్కడి వారి విశ్వాసం .
        చేజెర్ల కపోతెశ్వరుడు
                  గుంటూరు జిల్లా నరస రావు పేట కు ౨౫ కి.మీ.దూరం లో ”చేజెర్ల ”గ్రామం లో కపోతేశ్వర స్వామి ఆలయం ఉంది .ఇది చతుర్భుజా కారం లో ఉండటం విశేషం .స్వామి పావురం ఆకారం లో లింగ రూపం లో ఉండటం మరో విచిత్రం .శిబి చక్ర వర్తి ,త్యాగ ఉద్ది తో తన తోడ లోని మాంసాన్ని కోసి పావురాయిని కాపాడిన ప్రదేశం ఇదే అని జనుల విశ్వాసం .దాని గుర్తు గానే ఇక్కడ శివుడు కపోతేశ్వరు డై ,శిబి త్యాగానికి చిహ్నం గా నిలి చాడు .
                                 అయిదంతస్తుల మహా ద్వారం ఉన్న పుష్ప గరి
 కడప జిల్లా లో పినాకినీ నదికి తూర్పున కొండ పై పుష్ప గిరి ఉంది .దీని పైనే గొప్ప ప్రాకారం ,మహా ద్వారం ఉన్నాయి .దీని లోపల చెన్న కేశవా స్వామి ,ఆయనకు ఉత్తరం గా ”పుష్పాచ లింగం ”ఉండటం విశేషం .మహాద్వారం అయిదు అంతస్తులు కలిగి విపరీతమైన ఆశ్చర్యం కలిగిస్తుంది .పుష్పాచ లింగేశ్వరునికి ,ఎడమ వైపు ఉమా మహేశ్వర లింగం ఉండటం విశేషం .కొండ కింద ”ప్రయాగ మాధవ మూర్తి ”ఉన్నాడు .ఈ స్వామికి పశ్చిమం వైపు ”రుద్ర పాదం ”ఉంది .24 అడుగుల పొడవు ,ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న కుడి పాదం ఇది .దీనికి సుమారు కిలో మీటర్ దూరం లో ”ముని పాక ”అనే గ్రామం లో విష్ణు పాదం ఉంది .ఆంధ్రులకు ఏకైక పీఠం పుష్ప గిరి యే.
                 తేళ్ళ మండపం
    ఆ సమ  కడప జిల్లా లో ”రాయచోటి ”లో వీర భద్ర స్వామి ఆలయం ఉంది .దసరా పండుగ రోజున స్వామి వారి గ్రామ విహారం లో ”పారు వేట ”ఉత్సవం జర్గు తుంది .ఈ ఉత్స వాన్ని ”తేళ్ళ మండపం ”అనే చోట జర పటం ఆన వాయితీ గా వస్తోంది  ఆ సమయం లో  వేలాది తేళ్ళు అక్కడికి చేరు కొంటాయి .ఎవర్నీ ఏమీ చేయవు .ఉత్సవం అయి పోగానే ఒక్క తేలు కూడా అక్కడ ఉండ కుండా వెళ్లి పోవటం చిత్రాతి చిత్రం .
సశేషం  ——–మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —18 -04 -12 .
కాంప్-యు.ఎస్.యే.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –4

 వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –4
                                                    స్వయంభు లింగం తాడి పత్రీ
              అనంత పురం జిల్లా తాడి పత్రీ లో సి రామేశ్వర ఆలయం ఉంది .ఇది పస్చిమా భి ముఖం గా ఉందాం విశేషం .పాన వాట్టం ఆకారం లో ఒక శీలా ఉంటుంది .లింగం ఉండదు .ప్రతిష్ట జరగా లేదు .దీన్ని స్వయం భూ లింగం గా భావిస్తారు .తురుష్కుల దండ యాత్ర లో లింగం అపహరణకు గురైందట .ఆలయపు గోపురం అంతా నల్ల రాతి కట్టడం గా ఉండటం విచిత్రం                      
       
 మత సామరస్యం విలసిల్లె కదిరి సమాధి
           
  అనంత పురం జిల్లా కదిరి పట్టణం లో ,”చంద్ర వాదన మొహియార్ ”అనే సమాధిని హిందువులు ,ముస్లిములు సమానంగా దర్శిస్తారు .ఈ సమాధి దగ్గర లో ఉన్న మట్టిని చేతి లో పట్టు కొంటె విడి పోయిన భార్యా భర్తలు కలిసి పోతారనే నమ్మకం ఉంది .సంసారం లో కలతలు రావనీ ,కార్పణ్యాలు రావని విశ్వ సిస్తారు .
                   
కంచు శబ్దం చేసే రాతి నంది
ప్రకాశం జిల్లా అద్దంకికి పది కిలో మీటర్ల దూరం లో ధర్మ వ రం ఉంది .చుట్టూ ఎత్తైన కొండలు ,అనేక జీర్ణ ఆలయాల నిలయం .ఒక కొండ మీద శ్రీ నీల కన్తేశ్వర ఆలయం ఉంది .శిధిల మైన స్తితి లో స్వామికి ఎదురుగా రాతి నంది ఉంది .ఈ నందిని రాయి తో కొడితే ”కంచు శబ్దం ”విని పించటం అపూర్వ మైన వింత .ఇక్కడున్న కొండల చుట్టూ ”రాక్షస గుడులు ;;ఉన్నాయి .ఇవి ,రాతి యుగం నాటి మానవ ఆవాస భూమి గా భావిస్తున్నారు .
       
   అభిషేక జలాన్ని మాయం చేసే  మహేశ్వరుడు
   ప్రకాశం జిల్లా లో కనిగిరి పట్ట ణానికి ఇరవై కిలో మీటర్ల దూరం లో ”మల్లప్ప సెల ”అనే ఊరిలో ,ఈశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది .శివునికి చేసిన అభిషేక జలం బయటకు పోయే మార్గం లో ఒక రుషి శయ నించి ఉన్నట్లుగా ఒక శిల్పం ఉంది .స్వామి వారి పుష్కరిణీ జలాన్ని తెచ్చి ,అభిషేకం చేస్తే ఒక్క చుక్క నీరు కూడా కని పించాడు . .పుష్కరిణి నీరు కాకుండా ,ఇంకే రక మైన నీటి తోఅభిషేకం చేసినా ,ఆ నీరు అక్కడే నిలచిఉండి పోవటం చూస్తె ముక్కు మీద వేలు వేసు  కొని ఆశ్చర్య పోతాం .
సశేషం —

              మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -04 -12 .
 క్యాంపు–యు.ఎస్.ఏ.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు —25 మా కుటుంబ వైద్య నారాయణులు

 ఊసుల్లో ఉయ్యూరు —25
మా కుటుంబ వైద్య నారాయణులు
               నా చిన్న తనం లో మేము కొంత కాలమ్  అనంత పురం జిల్లా హిందూ పురం లో ఉన్నామన్న సంగతి చాలా సార్లు రాశాను .అక్కడ నాకు బాగా గుర్తు ఉన్న డాక్టర్ శ్రీ కాశీ నాద గారు .కన్నడం వారు .తెలుగు బాగానే అర్ధ మయేది .కొంచెం తెలుగు మాట్లాడే వారు .మా ఇంటికి దగ్గర లో శివాలయం ఉండేది .దానికి అవతలఆయన వైద్య శాల ఉండేది .అవసరం అయితె ఇంటికి వచ్చి చూసే వారు .లేక పోతే డిస్పెంసరి కి వెళ్లి జబ్బు విషయాలు చెబితే మందు ఇచ్చే వారు ఆ కాలమ్ లో మందు అంటే సీసాలలో యెర్రని నీళ్ళు .అందులో ఏం కలిపే వారో తెలీదు . రెండు మూడు డోసులకు ఇచ్చే వారు .అది తాగితే జ్వరం లాంటివి ,కడుపు నెప్పి ,విరేచనాలు పోయేవి .ఆయన చాలా హుందా గా ఉండే వారు .కొంచెం ఎత్తుగా పాంట్ ,షర్టు పైన తెల్ల కోటు , మెడలో స్టేతస్కోప్  తో ఉండే వారు .కామ్ పౌన్దర్  కూడా ఉండే వాడు .నాడి చూసే వారునాలుక జాపించి పరీక్షించే వారు .డాక్టర్     గారు  నాన్నకు  మంచి స్నేహితులు .మాకు తెలిసిన వారందరికీ ఆయనే వైద్యులు .హస్త వాసి మంచిదిఅని చెప్పు కొనే వారు .దాని అర్ధం ఏమిటో నాకు అప్పుడు తెలిసేది కాదు  .నాకు తెలిసిన మొదటి మా కుటుంబ వైద్యులు డాక్టర్ కాశీ నాద్ గారే
   డాక్టర్    మామిళ్ళ పల్లి నరసింహ మూర్తి గారు
 1950 లో మేము హిందూ పురం నుంచి ఉయ్యూరు కు శాశ్వతం గా కుటుంబాన్ని మార్చేశాము . 
నాన్న గారు అక్కడి మునిసి పల్ హై స్కూల్ నుంచి కృష్ణా జిల్లా బోర్డ్ కు బదిలీ అయారు సీనియర్ తెలుగు పండితులుగా జగ్గయ్య పేట లో చేరి ఉయ్యూరు స్కూల్ లో పదవీ విరమణ చేశారు .ఆ కాలమ్ లో మాకు మా ఇంటి వైద్య దేవుడు శ్రీ నరసింహ మూర్తి గారు .మాకే కాదు దాదాపు ఊర్లో అందరికీ .ఆయనకు గుర్రం బండి ఉండేది .ఇళ్ళకు రావాలంటే దాని మీదే వచ్చే వారు .తోలటానికి ఒక ముస్లిం వుండే వాడు .డాక్టర్ గారు మా ఇంటికి దగ్గరలో ఇప్పుడు ఉన్న నీళ్ళ టాంక్ ఎదురుగా , రాయప్రోలు వెంకాయమ్మ గారింట్లో ఉండేవారు . ముందు ఎడమ వైపు ఒక గది దానిలో మందులు అంటే క్లినిక్ గా ఉండేది .పెద్ద హాలు డాక్టర్ గారు హాల్ లో కుర్చీలో కూర్చుని వైద్యులకు పరీక్ష చేసే వారు .ఆయనది బాగా భారీ పార్స నాలిటి .వెనక పెంకు టింట్లో కుటుంబం ఉండేది .
దాదాపు ఎస్వీ రంగా రావు అంత ఉండే వారు .తెల్లని మల్లు పంచ గోచి పోసి కట్టే వారు .దాని పై తెల్లని పొడ వైన చొక్కా .మేడలో ఉత్తరీయం కొసలు ముందుకు వెనక్కు వేలాడుతూ వేసు కొనే వారు .మేడలో స్టేత స్కోపు  .injection చేయ టానికి చిన్న రేకు పెట్టె .అందులో సూదులు ,స్పిరిట్ దూది వగైరా ఉండేవి .ఆయన మన రావి కొండల రావు లాగా మొద్దు పెదవులతో ఉండే వారు .చాలా నెమ్మదిగా మాట్లాడే వారు .ఉదయం తొమ్మిదికి ఆస్పత్రి తెరచే వారు .నాడి నాలుక చూసి మందులు రాసిచ్చే వారు .
మందులను మనం తెచ్చు కొన్న సీసాలలో మందులు కలిపి వాళ్ళ అబ్బాయి ఇచ్చే వాడు . ధర్మా మీటర్ తో జ్వరం చూసే వారు .మందులను రాసిస్తే వాళ్ల అబ్బాయి హరి లిపి ఇచ్చి ఎలా వాడాలో చెప్పే వాడు .అతను నాకు సీనియర్ .ఫీజు తక్కువ గానే ఉండేది .సంవత్స రానికి ధాన్యం కొలిచే వారం అని జ్ఞాపకం .పాలేళ్ళతో ఇంటికి పంపే వాళ్ళం .డాక్టర్ గారు ఆయుర్వేద మందులు కూడా తయారు చేసే వారని గుర్తు . .ఇంట్లో సన్ని కల్లు వగైరా ఉండేవని జ్ఞాపకం .మిల్క్ ఆఫ్ మగ్నీశియా సోడియం   బై కార్బోనేట్ వగైరాలు కలిపిన అరకులే ఆనాడు మందులు .ఎర్రగా తెల్లగా ఉండేవి అరకులు .బజార్లో కోని వాడే మందులు తక్కువే..injections కూడా కావలసినవి  ఆయనే చేసే వారు  .నరసింహ మూర్తి డాక్టర్ గారిని ఊరిలో అందరు దేవుడు గా భావించే వారు .మంచి గౌరవం .కక్కుర్తి ఉండేది కాదు .మా ఇళ్ళకు కబురు చేస్తే సైకిల్ మీద వచ్చి వాలే వారు .నాన్నకు మంచి స్నేహితులు .ఊళ్ళో నాన్న ,ఆది రాజు నరసింహా రావు చోడవరపు  చంద్ర శేఖర రావు ,డాక్టర్ గారు  వారణాసి ,సదా శివ రావు గారు ,మామయ్య గంగయ్య గారు అందరికి పెద్దలు .వారేమి చెబితే అందరు అది చేయటం ఉండేది .మంచి కార్య క్రమాలకు డాక్టర్ గారి సాయం బాగా ఉండేది
ఇంత మంచి డాక్టర్ గారికి భార్య మాత్రం ఆయన్ను అర్ధం చేసుకొనేది కాక పోవటం ఆశ్చర్యం వేస్తుంది .చింపిరి జుట్టు తో ,చాలా అసహ్యం గా కని పించేది .ఎప్పుడూ ,ఎవరితోనో పోట్లాడుతూ ఉండేది .డాక్టర్ గారు బయటికి వెళ్లి నప్పుడు రోగుల్ని సత్యవతి గారు  పీడించేదని అనే వారు .ఎవరింటికి పెద్ద గా వచ్చేది కాదు .డాక్టర్ గారు మాత్రం భోజ నాలకు పిలిస్తే రాత్రి  పూట మాత్రం వచ్చే వారు .ఆయనకు ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు .ఆయన  చెల్లెలు సత్యవతమ్మ గారు .చాలా లోకజ్ఞానం ,ఆధ్యాత్మిక భావాలు ఉన్నది .చిన్నప్పుడే ఒక కొడుకు పుట్టిన తర్వాత భర్త చని పోయాడు .అన్న గారి దగ్గరే కొడుకు తో ఉండేది సత్యవతమ్మ గారు అంటే ఊళ్ళో అందరికి చాలా గౌరవం .మంచిగా మాట్లాడు తుంది సాయం   చేసేది చక్కని సలహాల నిచ్చేది నా పెళ్లి వరకు ఉయ్యూరు లోనే ఉన్నారామే .మా అమ్మకు మంచి స్నేహితు రాలు నాకు గురు సమాను రాలు .డాక్టర్ గారి పిల్లలకు చదువు అబ్బలేదు .ఒకడు కామ్పౌందర్ గా ఉన్నాడు .రెండో వాడు జులాయిగా తిరిగే వాడు .ఇంట్లో సంసారం చిద్రం గ ఉండేది .డాక్టర్ గారికి మనశ్శాంతి లేకుండా పోయింది .కూతురికీ చదువు అబ్బలేదు .అకస్మాత్తు గా డాక్టర్ నరసింహ మూర్తి గారు మర నించారు .కుటుంబం బజారు పాలైంది .అప్పుడు సత్యవతమ్మ గారు అంటే డాక్టర్ గారి చెల్లెలు పెద్ద మనసు తో కొడుకు ప్రసన్న ను ఒప్పించి మేన కోడలితో వివాహం జారి పించించి కోడలితో విశాఖ పట్నం వెళ్ళింది .అక్కడ  షిప్ యార్డ్ లో ప్రసన్నకు మంచి ఉద్యోగం .ఆ తరు వాత నర సింహ మూర్తి గారి కుటుంబం ఉయ్యూరు నుంచి వెళ్లి పోయింది .ఆ తరు వాత వారి గురించి తెలీదు .

              నేను డిగ్రీ పాసై విశాఖ పట్నం మెడికల్ కాలేజి లో ఒక సంవత్సరం ఫిజికల్ dimonstrator    గా పని చేసి నపుడు   ప్రతి వారం షిప్ యార్డ్ లో వారింటికి వెళ్లి రెండు పూటలు అక్కడే ఉండి వచ్చే వాడిని సత్యవతమ్మ గారు కొడుకు ప్రసన్న నన్ను ఎంతో ఆప్యాయం గా చూసే వారు .కోడ లు కూడా మంచి తనం తో అత్త గారిని మెప్పించేది .నేను అక్కడ ఉయ్యూరు లో మా ఇంట్లో ఉన్నంత స్వేచ్చ గా ఉండే వాడిని .అది సత్య వతమ్మ గారి మంచి తనానికి నిదర్శనం .ఆమె కు ఎన్నో పాటలు భజనలు భగవద్గీత ఉపనిషత్తులు అన్నీ కన్తతా వచ్చు .ఎప్పుడు వాటిని స్మరించు కొంటు అందరితో సత్కాల క్షేపం చేసేది . ఆ తరువాత చాలా సంవత్స రాలు ఆవిడ కాని ప్రసన్న కాని ఉయ్యూరు వస్తే మా ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళు .నేనెప్పుడైనా విశాఖ వెళ్తే వారింటికి వెళ్ళే వాణ్ని .ఇప్పడు మాకు వారి వివ రాలేమీ తెలీవు .అదీ డాక్టర్ నరసింహ మూర్తి గారి కుటుంబ కధ .
నరసింహ మూర్తి గారు మాకు వైద్య నారాయణ మూర్తే
ఆ కాలమ్ లో రావి చెట్టు బజారు లో ఇప్పుడున్న ప్రెసిడెంట్ రామా రావు ఇంట్లో వాకిలి అరుగు మీద ఒక హోమియో క్లినిక్ ను హరి ఇంటి పేరున్న సోదరులు నడిపారు .ఎప్పుడైనా అక్కడ మందులు తెచ్చు కొనే వాళ్ళం .
ఆయుర్వేదానికి  ఉయ్యూరు మంచి ప్రసిద్ధి .మాకు తెలిసిన వారిలో వేదాంతం నారా యణా చార్యులు గారు ముఖ్యులు .ఆయన విష్ణ్వాలయ అర్చకులు .రోగ నిదానం బాగా తెలిసిన వారు .నాడి పట్టు కోని జబ్బు ను యిట్టె పసి కట్టి చెప్పే వారు .యాభై ,అరవై దశకం లో ఆయనే ఆయుర్వేదం లో దిట్ట .ఆలయం ప్రక్కనే ఇల్లు సంచి కట్టు వైద్యం .అప్పటికే చాలా వయో వృద్ధులు .దైవ సేవ కే సమయం ఎక్కువ వెచ్చించే వారు .సాధారణ జ్వరాలకు మాత్రలు కట్టి ఇచ్చే వారు .ఊర్ధ్వ పున్ద్రాలతో ,చామన చాయగా వెడల్పైన ముఖం తో ఆకర్షణీయం గా దైవ వర్చస్సు తో ఉండే వారు .పైత్యాన్తకం కుప్పె మాదీ ఫల రసాయనం భావనా అల్లం వగైరా లను ఇచ్చే వారు .కుప్పె లను సాన మీద తేనెతో రంగ రించి అరటి ఆకులో వేసుకొని  నాలుకతోనాకే వాళ్ళం .కాషాయాలు కాచుకొనే విధానం చెప్పే వారు అప్పుడు లంఖణం పరమఔషధం  .అమ్మ ఆయన్ను బాబాయి గారు అని పిలిచేది .నేను తరచూ ఆయన నామాలు పెట్టు కొనే విధానం చూస్తూ ముచ్చట పడే వాడిని .అద్దం లేకుండా అద్భుతం గా నామ ధారణ చేసే వారు వారికి రామా చార్యులు ,వాసుదేవా చార్యులు  రాదా కృష్ణ మా చార్యులు అనే కుమారులు .చివరి వాడు   హై స్కూల్ లో నాకు సహాధ్యాయి .చిన్న వయసు లోనే అంటే అరవై దశకం లో చని పోయాడు .మిగిలిన వారిలో శ్రీ రామా చార్యులు గారు ఆగమ పండితులు ప్రతిష్ట మొదలైనవి సాది కారం గా చేసే వారు మా దేవాలయ ప్పునః ప్రతిష్ట వారితోనే చేయించాము .పిల్లా పాప లతో వర్దిల్లారు .గాయత్రి ప్రెస్ పెట్టి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలను ముద్రించారు .గాయత్రి గురుకులం పెట్టి సంగీతా నాట్యాలలో శిక్షణ నిప్పించారు .చివరగా వాన ప్రస్తాశ్రమం స్వీకరించి రెండేళ్ళ క్రితమే విష్ణు సాయుజ్యాన్ని పొందారు .వాసు దేవా చార్లు గారు అర్చకత్వం లో ఉన్నారు ఆయనా నాలుగేళ్ల  క్రితమే మర ణించారు .మా ఆంజనేయ దేవాలయ పునర్నిర్మాణానికి మాకు మంచి ప్రేరణ నిచ్చిన వారు వాసు దేవా చార్యులు .
  వీరి తరువాత పేర్కొన బడ దగింది  వేదాంతం రామ చంద్రా చార్యులు గారు  రు.విష్ణాలయ అర్చకులు . దగ్గరే పెద్ద ఇల్లు. మహా భారీ పర్స నాలిటి .ఊర్ధ్వ  పున్డ్రాలతో పంచ ,లాల్చి తో ఉత్తరీయం తో ఉండే వారు 
.ఇంట్లో ఆయుర్వేద మందులు తయారు చేసే సామగ్రి అంతా ఉండేది .ముఖ్యం గా కోరింత దగ్గుకు మంచి మందు ఇచ్చే వారు .ఇంటికి వచ్చే వారు .అమ్మ ఆయన్ను బాబాయి గారు అని పిలిచేది .ఆయన సోదరులే వేదాంతం అనంత పద్మ నాభా చార్యుల వారు .వాస్తు జ్యోతిశాలలో ఉద్దండులు .మా దేవాలయ పునః ప్రతిష్టకు వారితోనే ముహూర్తం పెట్టిన్చాం .బందర్లో హయ గ్రీవ సదనం ఏర్పాటు చేసిఎన్నో గ్రంధాలు రాశారు డబ్బు మీద ఆశ లేదుగాయత్రి అమ్మ వారి భక్తులు .వారింటికివేల్తే భోజనం పెట్ట కుండా పంపరు పరమ నిష్టా గరిష్టులు .వీరి సోదరులే నూజివీడు ఆచార్యులు గారు అని పిలువ బడే మహా గొప్ప ఆయుర్వేద వైద్యులు .దేశ దేశాలలో లబ్ధ ప్రతిష్టులు .రామ చంద్రా చార్యుల వారికి సంతానం లేదు తోడల్లుడి కుమారుడు రమణ ను దత్తత తీసుకొని వివాహం చేశారు .అతనే ఆయనకు ఉత్తరాది కారి .ఆచార్యుల వారికి దూర్వాస మహర్షికి ఉన్నంత కోపం ఉండేది .ఎవరి మాటా లెక్క పెట్టె వారు కాదు .కాంగ్రెస్ అంటే విప రీత అభిమానం .వైఖానస జయంతి జరిపి సంగీత విద్వాంసులను సత్కరించి వారితో కచ్చేరీలు పెట్టించే వారు మామయ్య ఆయన్ను ”మామా ”అని పిలిచే వాడు .మేము తాత గారు అనే వాళ్ళం .నేనంటే అభిమానం గా ఉండే వారు .ఆయన భార్య ప్రసాదాలను చాలా రుచి కరం గా చేసే వారు .చని పోయే వరకు చేస్తూనే ఉండే వారు కుటుంబ స్నేహం మా కు .
మామిళ్ళ పల్లి నాగేశ్వర రావు గారు
శివాలయ అర్చకులైన శ్రీ నాగేశ్వర రావు గారిల్లు మా కు దగ్గరే .వాళ్ళబ్బాయి సత్య నారాయణ నాకు సహాధ్యాయి .పెద్దబ్బాయి 
ఆయుర్వేద డాక్టర్ .మంచి
రోగ నిదానం ఉంది .లేబర్ కు డాక్టర్ గా వుండే వారు .మాకు ఆత్మీయులు .ఇంటికి వచ్చి మాట్లాడే వారు .మందులు తెచ్చి ఇచ్చే వారు .1961 లో నాన్న గారికి తీవ్రం గా జబ్బు చేసింది .అందరు వైద్యులను సంప్రదిన్చాం .వీరిని కూడా పిలిచాం .దాదాపు చివరి గడియలు అని చెప్పి ఇంటికి వెళ్లి ”గరళం ”తెచ్చి వేశారు .అదే మొదట ఆ మాట వినటం .మామయ్య అమ్మా అందరు ఆశ గా ఎదురు చూశారు .కాని ఆయుర్దాయమున్న వారికి పని చేస్తుంది కాని ఇప్పుడు పని చేసే సమయం కాదేమో .అదేమీ పని చేయ లేదు .మళ్ళీ మా కుటుంబ డాక్టర్ శ్రీ మిక్కిలి నేని సాంబశివ రావు గారిని నేనే వెళ్లి పిల్చుకోచ్చాను .అప్పటికే అయి పోయిందని ఆయన పెదవి విరిచాడు .ఈ విధం గా నాన్న గారిని చివరి ప్రయత్నం గా రక్షించాలని నాగేశ్వర రావు గారు ప్రయత్నించారు .నాన్న మాకు దక్కే యోగం లేక పోవటం వల్ల వారి ప్రయత్నాలేవీ ఫలించ లేదు
ఆ తర్వాత కూడా చాలా కాలమ్ మా కుటుంబ వైద్యులు గా నాగేశ్వర రావు గారు వ్యవ హరించారు
  డాక్టర్ మిక్కిలి నేని సాంబ శివ రావు గారు
 మా కుటుంబానికి దాదాపు ముప్ఫై ఏళ్ళు డాక్టర్ గా వ్యవహరించిన వారు డాక్టర్ మిక్కిలి నేని సాంబ శివ రావు గారు .ఏం .బి .బి.ఎస్ .నెమ్మదిన వారు భారీ గా ఉండే వారు ఆయన ఇల్లు ఏకాంబరేశ్వర పాలస్ దాటిన తర్వాత ఉండేది .బాగా స్తితి పరులు .భార్య చాలా యోగ్యురాలు కొడుకులలో ఇద్దరు డాక్టర్లు ఒకరు కే.సి .పీ లో ఉద్యోగి .హంబర్ సైకిల్ మీద వచ్చే వారు దానికి చిన్న సీటు .ఒక పిర్ర కూడా ఆనదు .  .అయినా దాన్నే వాడే వారు. గేర్ కేసు ఉండేది కాదు .ఆయన హాస్పిటల్ ఉమా ప్రెస్ కు ఎదురు గా వుండేది .ఒక నర్సు కామ్పౌందర్ వుండే వారు అన్ని మందులు ఉండేవి .ఓపిక ఉంటె నడిచో రిక్షా మీదో సైకిల్ మీదో ఆస్పత్రికి వెళ్ళే వాళ్ళం .ఒక వేళ లేవ లేని పరిస్తితి లో ఉంటె పాలేల్లతో కబురు చేస్తే వచ్చే వారు ;ఇంషర్ట్ వేసే వారు .మందుల పెట్టె తో వచ్చే వారు స్టేత స్కోపు వుండేది .ఒక్కో సారి బుష్ షర్ట్ వేసే వారు .ఓపిగ్గా అన్నీ అడిగి తెలుసు కొనే వారు .ఆయన వద్ద ఉన్న injections చేసే వారు .త్వరలోనే వ్యాధి తగ్గేది దాదాపు ఆయన వాడే బిళ్ళలు ”ఎల్కొసిన్ ”.దేనికైనా అవే నని అనుకున్తుండే వాళ్ళం .మర్యాద గా వుండే వారు .నాన్న కు ఆయనంటే మహా అభిమానం .నాన్న అంటే ఆయనకు గౌరవం .వ్యవ సాయం పాలేరు ఎడ్లు పాడి ఉండేవి .మా పొలాల దగ్గరే వారి పొలాలు .తరచూ పొలాల దగ్గరకలుస్తుండే వాళ్ళం .చికాకు ఉండేది కాదు.కోపం లేదు .అందరు ఆయన్ను దేవుడు గానే చూసే వారు .ఊళ్ళో అప్పుడు ఆయన ఒక్కరే డాక్టర్ .కనుక అందరికి ఆయనే వైద్యులు. బాగా సంపాదించారు .నాన్న గారి చివరి ఘడియల్లో కూడా వచ్చి తగిన వైద్యం చేశారు .మా అందరికి దేవుడు వంటి డాక్టర్ శ్రీ సాంబ శివ రావు గారు
  డాక్టర్ వెంపటి కుమార స్వామి గారు
 అమ్మ కు చాలా అభిమానుడైన డాక్టర్ కుమార స్వామి గారు .అతను నాకు హై స్కూల్  లో జూనియర్ .అతని అన్న నాకు క్లాస్ మేట్ .
ఏం.బి.బి ఎస్ .పాసై ఉయ్యూరు లో క్లినిక్ పెట్టాడు .కనక వల్లి నివాసి .బానే జనం లోకి చొచ్చుకు పోయాడు .నిదానం గా అన్నీ వివరం గా చెప్పే వాడు .వేదాలు ,ఉపనిషత్తులు పురాణాలు చదివే వాడు కొని వాటిని తెప్పించే వాడు మసీదు దగ్గర ఆస్పత్రి ఉండేది కొబ్బరి తోట లో స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకొన్నాడు కనక వల్లి లో పొలాలున్నాయి .కూతురు ,కొడుకు .అమ్మ కు బి.పీ.వస్తే ఆయన దగ్గరకు తీసుకొని వెళ్లాం .అప్పటి నుంచి సుమారు ఇరవై ఏళ్ళు మా కుటుంబానికి డాక్టర్ గా వున్నాడు .చిరు నవ్వు తో పలకరించే వాడు దాదాపు బ్రాహ్మణ్యం అంతా అతని దగ్గరే వైద్యం .చుట్టు పక్కల ఊళ్ళ వాళ్ళు కూడా వచ్చే వారు .అప్పటికే పోటీ పెరిగింది .అమ్మను ఇంకెక్కడి కైనా తీసుకొని వెళ్లి చూపిద్దామని ప్రయత్నం చేస్తే ఒప్పు కొనేది కాదు ”నేను పోతే కుమార స్వామి చేతుల మీదు గానే పోతాను .నన్ను ఇంకో డాక్టరు దగ్గరకు తీస్సుకు వెళ్ళద్దు ”అని ఖచ్చితం గా చెప్పింది .అన్నట్లు గానే జరిగింది .మా ప్రయత్నాలు విర మిన్చుకోన్నాం .అంతటి నమ్మకం ఆయన మీద .1982 లో నేను ఉయ్యూరు హై స్కూల్ లో పని చేస్తుండగా అమ్మకు సీరియస్ అయితే కుమారస్వామి ఆస్పత్రి లో చేర్పించాం .మందులు వాడాడు కొంత నయం అని పించింది .నన్ను స్కూల్ కు వెళ్ళ మన్నాడు కంగారు లేదన్నాడు .స్కూల్ కు వెళ్తూ ఆస్పత్రి కి వెళ్లి అమ్మ ను చూశా .”ఒరే కంగారేమీ లేదు నువ్వ్వు స్కూల్ కు వెళ్ళు .నాకు బానే ఉంది ”అంది అమ్మ .అట్నించి స్కూల్ కు వెళ్లాను మధ్యాహ్నం పన్నెండిటికి స్కూల్ కు కబురు వచ్చింది .పరిస్తితి బాగా లేదని వెంటనే వెళ్లాను .నా కోసమే ఉన్నట్లని పించింది .అప్పటికే ప్రభావతి మామయ్య అక్కడ ఉన్నారు .అంతే నన్ను చూసిన కాసేపటికి కన్ను మూసింది .ఇలా సాంబశివ రావు గారి చేతి లో నాన్న ,కుమార స్వామి గారి చేతిలో అమ్మా చివరి శ్వాస పీల్చారు .
ఇప్పుడు మాకు కుమారస్వామి కుమారుడు వెంపటి కృష్ణ యాజీ డాక్టరు. మంచి వాడు .ప్రభుత్వ డాక్టర్ గా బందర్ లో పని చేసి ,ఈ చట్రం లో ఇమడ లేక శ్రీ రామ చంద్ర SENTINARI హాస్పిటల్ — విజయ నగర్ హైదరాబాద్ లో స్వచ్చంద సేవ చేస్తున్నాడు అయిదారేళ్ళ నుంచి అతనే మాకు కన్సల్టంట్ డాక్టర్ .మూడో సారి అమెరికా వెళ్లి నప్పుడు ప్రభావతికి బి.ఫై.పెరిగితే మెయిల్ లో విషయం తెలియ జేస్తే వెంటనే తగిన మందులు సూచించి కంగారు తగ్గించాడు ఇప్పుడు కూడా వచ్చే టప్పుడు ఒక సారి మేమిద్దరం చెక్ చేయించుకొని వచ్చాం .ఇంకా అతనికి ఉయ్యూరు లో ఇల్లు కనక వల్లి లో పొలాలు ఉన్నాయి .మా అబ్బాయి రమణ వివాహానికి గుంటూరు కు కుటుంబం తో వచ్చిన సంస్కారి .సరస భారతి లో రాసే దంతా తప్పక చదివి స్పందిస్తూ ఉంటాడు ”మాస్టారు”అని మర్యాదగా సంబోధిస్తాడు .నిజం గానే అతను అతని అక్కయ్య ఉయ్యూరు హై స్కూల్ లో నాకు శిష్యులే .ఫిజికల్ సైన్సు బోధించాను .ఆ అమ్మాయి అమెరికా లో ఉంది. మంచి తెలివి తేట లున్న పిల్లలు వారిద్దరూ .కుమారస్వామి అతి చిన్న వయసు లో నే మర  నించటం ఆ కుటుంబానికి ఆశని పాతమే
  బుర్రా శేషయ్య డాక్టర్ గారు
            బుర్రా శేషయ్య గారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు .మామయ్య  ద్వారా పరిచయం .నాకు మొహం మీద నల్లని మచ్చలు ఏర్పడేవి దానికి వారి దగ్గర ఆయుర్వేద మందు పుచ్చు కొన్నాను .వేడి వల్ల  వచ్చిందని వేడి తగ్గ టానికి మందు ఇచ్చారు .బాగా పని చేసింది మళ్ళీ ఆ నలుపు రాలేదు పంచె ,లాల్చి తో ఉండే వారు .ఎత్తు గా ఉండే వారి నిమ్మదస్తులు నవ్వు ముఖం .అప్పటికే అరవై పైగా .నేను మరచి పోలేని ఆయుర్వేద భిషగ్వరులు శేషయ్య గారు
 డాక్టర్ కనక మేడల రంగా రావు గారు
            అసలు డాక్టర్ల లో దేవుడు ఉంటాడు అనటానికి నిదర్శనం మా కనక మేడల రంగా రావు గారు .ఉయ్యూరు పంచాయితీ కి ఎదురు లేకుండా నాలుగైదు పర్యాయాలు ఎన్నికైన ప్రజల మనిషి .జారి పోతున్న పాన్టును పైకి లాక్కొంటు తెల్లని ఖద్దరు పాంటు ఖద్దరు బుష్ షర్ట్ వేసుకొని మూర్తీ భావించిన స్వచ్చ రూపం గా ఆరోగ్య దేవత లా కని పించే వారు .పాపం ఆయనకు ఉబ్బసం ఉండేది అలానే బాధ పడుతూ వైద్యం చేసే వారు .ఆయన రోగి చెయ్యి పట్టు కుంటే చాలు మూడు వంతుల్ రోగం తగ్గి పోయేది .ఎవ్వరి దగ్గరా డబ్బు తీసుకొనే వారు కాదు .అంతా ఉచిత వైద్యమే .మందులు కూడా ఉచితమే .పేదల పాలిటి పెన్నిధి రంగ రాయలు . .అతి తక్కువ ఖరీదు గల మందులతో నయం చేయటం రంగా రావుడాక్టర్ గారి ప్రత్యేకం .ఆయన దగ్గర కామ్పౌన్దర్ దాదాపు నలభై ఏళ్ళు పని చేశాడంటే యెంత మంచి డాక్టరో ఆయన మనకు తెలుస్తుంది .రిక్షాలో వెళ్ళే వారు .తర్వాతా అందరి కోరిక పై ఉయ్యూరు శాసన  సభకు కాకాని వెంకట రత్నం  గారి కుమారుడు రామ మోహన రావు పై పోటీ చేసి అతి సునాయాసం గా గెలు పొంది ఏం ..ఎల్ .ఏ.అయారు .శాసన సభ్యులు గా నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేశారు .అప్పుడు కూడా ఆయన జీవన శైలి మార లేదు .ఆయన కని పిస్తే ఆటో మాటిక్ గా మన రెండు చేతులు ముడిచి నమస్కరిస్తాయి .అదీ ఆయన ఆకర్షణ ,పవిత్రత ,ప్రజా సేవ .ఇలాంటి వారుంటారా అని పించిన ప్రజా సేవకులు డాక్టర్ రంగా రావు గారు .ఒక సారి నాకు బదిలీ కావాల్సి వస్తే ఆయన తన కారు లో నన్ను కొలచల చలపతి ని బందరు తీస్సుకొని వెళ్లి ఆఫీసర్ల తో మాట్లాడి వెంటనే ట్రాన్స్ఫర్ చేయించిన మంచి మనిషి .ఆయన మొదటి సారి ఉయ్యూరు కు పంచాయితీ ప్రెసిడెంట్ గా పోటీ చేసినపుడు వర్గ కులాలకు అతీతం గా అందరు కలిసి ఆయన్ను భారీ మెజారిటీ తో  గేలి పించి తమ కృతజ్ఞతను ప్రజలంతా తెలియ జేసుకొన్నారు .ఇలాంటి వైద్య దేవతలను ఒక సారి స్మరించే అదృష్టం నాకు కల్గి నందుకు ఆనందం  గా వుంది .కృతజ్ఞతలను తెల్పు కొనే అవకాశం కలిగి నందుకు సంతృప్తి గా ఉంది అందుకే మన వాళ్ళు ”వైద్యో నారాయణో HARIH   అని ప్రస్తు తించారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -04 -12 –
కాంప్  –యు.ఎస్.ఏ.

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

చిత్ర కళ

చిత్ర కళ
చిత్రకళ  మానవ  జీవితం పై గొప్ప ప్రభావమే చూపించింది
.ఇది చదివే వాళ్ళంతా కుంచె వీరులు ,భావుకత వున్న వాళ్ళు .కళా తపస్సమాధిలో
రసానందాన్నిపొంది , రస హృదయులను ఆనంద పారవశ్యం లో ముంచి తేల్చే వారు  .మీ
కు చిత్ర కళ గురించి నేను రాయటం నా వరకు నాకు విచిత్రం గానే వుంది .కుంచె
ఏమిటో ,రంగు లేమితో ,కాన్వాస్ ఏమిటో తెలీని నేను రాయటం నాకే ఆశ్చర్యం
.అయినా ఒక ధైర్యం ”.అరవై నాలుగు కళ ల పత్రిక ”దగ్గర వున్నప్పుడు ,నాపని
విక్రమార్కుని మార్కు సింహాసనం మీద కూర్చుంటే అంతా తెలిసి నట్లే
వుంటుందిఅన్నట్లు గా వుంది ..ఆ ధైర్యమే నన్ను మీ ముందుంచి ,చేత్తో
రాయిస్తోంది .
ఒక చిన్న కధ చెప్తాను .ఒక కార్టూనిస్టు -బౌద్ధ
గురువు దలైలామా పుట్టిన రోజూ నాడు ఒక కార్టూన్ వేస్తూ ,-దలైలామా ఒక
గిఫ్ట్ పాకెట్ విప్పు తున్నట్లు ,దానిలో ఎన్ని మడతలు విప్పినా ,చివరికి
ఏమీ లేనట్లు వేశాడు .దలైలామా ఎప్పుడు చిరు నవ్వు చిన్దిస్తుంటారు .ఆయన అ
కార్టూన్ చూసి చిత్రకారునితో ”Yes.nothing.just what I have always
wanted ”అంటారు వేదాంతాన్ని ఒలక బోస్తు .అదీ దాని ప్రభావం
ఇవాళ గ్లోబల్ villege లో వున్నాం అందుకే దేశాలకు
,భాషలకు ,జాతులకు మధ్య పొరలు తొలగి పోతున్నాయి .విశ్వ మానవత కు స్వాగతం
పలుకు తున్నాం .ఇంత మందిని కలిపే ఒక కళ అవసర మైంది .అదేఇమ్ప్రేశానిజం
.దీన్ని గురించి వివ రిస్తూ ”I n their paintings ,a mysterious bridge
is established between the soul of the figures and that of the
spectator ”..అన్నారు . .The ultimate is God అన్న ప్రాధమిక దృక్పధం
నుంచి ,కళ abstractism  కు చేరింది .అదే క్యూబిజం .ఇక్కడ కళా కారుని
ద్రుష్టి లో ”There is nothing real out of us ”అన్నది కళా వాక్కు
అయింది .”painting reached zenith ”అనుకొన్నారు అందుకే . ”I paint
there fore I exist ”అన్న  ఆత్మ విశ్వాశం కల్గింది .భిన్న భావాలు
,విభిన్న ఆలోచనలు ,పరిశీలనలు తో చిత్రకళ విస్తృత మైంది .విశ్వ వ్యాప్త
మైంది అందర్నీ దగ్గరకు తెచ్చింది .ఎంత దాకా వచ్చిందంటే” చిరాకో” అనే
చిత్ర రచయిత తనభావాన్ని   ఇలా విస్పష్టం గా ప్రకటించాడు ”A work of art
to be really ,immortal it must go completely ,out side     of human
limits ”modern art began as an out burst of the heart .I t is by its
own essence and closer ”అన్నాడు . .
మానవ జీవితావిర్భావం ఆఫ్రికా ఖండం లోజరిగిందని
అంటారు కదా .అలాగే కళ కూడా చివరకు African రిథెంకు చేరు తోంది అంటాడు
Senghor  ”.Rhythm is the principle value contributed bya Black Africa
to the contemporary world .I t invades every thing music ,dance
,painting and sculpture ”దీనినే Spreading of African rhythm ”
అన్నారు .
చిత్రకారుడు తాను ఏకాంత సౌధంలో కూర్చొని ,తదేక ధ్యానం తో ,తన
చిత్తం వచ్చి నట్లు చిత్రాలను వేసి ,ప్రపంచం అర్ధం చేసు కోవటం లేదు అంటే
అది అతని అతని ఆలోచన లో లోపమే అని పిస్తుంది .సహృదయ కర స్పర్శ తో ,కళా
కారుని ,హృదయ కమలం  వికసించాలి .తాను అనుభవించిన ఆనందం సరసులు,రస హృదయులు
అనుభవించాలి .అదే ఉత్కృష్ట మైన స్తితి .అందుకే ప్లాస్టర్ సర్రోగాటే
ఆర్టిస్ట్ అయినRoss Blickner ఇలా అంటాడు .” I want my paintings to have
a relation ship to the world ,,to know how the world works and
neverthe less to retain an optimism ” అన్నాడు …
ప్రపంచ వ్యాప్తం గా చిత్ర కళ లో ఎన్నో ప్రక్రియలు
ఏర్పడ్డాయి .మనం సాధారణం గా చెప్పు కోనేవి కాక ”hard edge painting
,kinetic art ,minimalism ,mixed media ,newe wilde ,opart ,performance
,pitura popart ,redymade ,super masterism ,tachism ,video art
,”ఇవన్నీ కాక జీరో ఆర్ట్ కూడా వచ్చింది .ఎంత వైవిధ్యమో ,ఎన్ని రంగులో
,ఎన్ని shades అఫ్ ఒపినిఒన్స్ /”పూర్ణష్య పూర్ణ మాదాయ ”చందం గా జీరో
ఆర్ట్ .చాతుర్వర్ణం మయా సృష్టం అన్నాడు భగవద్గీతా కారుడు .అవి ఒక దానితో
ఒకటి కలిస్తే వర్ణ సంకరం అని భయ పడుతాం  .కాకుండా ఉండ టానికి పడని పాట్లు
లేవు .కాని ఈ” గీత కారుడు ”మూడు ప్రాధమిక రంగుల్ని మాత్రమే  వాడడు
.వర్ణ సంకరం చేస్తాడు .అద్భుత మైన వర్ణ విన్యాసాన్ని చూపిస్తాడు
.భావానికి తగిన రంగులు తయారు చేసు కొంటాడు .సంతృప్తి పొందు తాడు .గిరి
గీసిన సరి హద్దుల్ని చేరి పెస్తాడు .విస్తృత పరిధికి విస్తా రిస్తాడు
.”గీత కార్మికుడు ‘కల్లు ‘ తో మైకం కల్గిస్తాడు .ఈ గీత కళా కారుడు
చిత్రం తో మై మరపిస్తాడు .
కళ అంటే ?
ఉన్న దాన్ని ఉన్నట్టు గా చూసిన   వాడు కళా కారుడు
కాదు .అలా చూసిన క్షణం లో నే అతను ఆర్టిస్ట్ గా నశించి నట్లే .అంటాడు
ప్రశిద్ధ చిత్రకారుడు ,విమర్శకుడు ఆస్కార్ వైల్డ్ .”All bad art comes
from returning to life and nature and elevating them into ideals.Real
service to art is to translate into artisticconventions ”అన్నాడు
వైల్డ్  .జీవితం   నుంచే కళ    పుడుతుంది  అన్న  దాని  కంటే  ,జీవితం కళ
నుంచే  ఎక్కువ  గా   పుడుతుంది  అంటాడు  ఆస్కార్ .అంటే ఆడు అతని
ద్రుష్టి లో lying –అంటేThe telling of beautiful ,untrue things ,is
proper aim of art .”   .
ఫ్రాన్సు లో ఒకప్పుడు చిత్రకారులు కాళ్ళ ను ఒక ప్రత్యెక ఆకారం లో
చిత్రించే వారట .కొంత కాలానికి జన్మించిన పిల్లలంతా అలాంటి కాళ్ళతో నే
పుట్టారట .
సహృదయ విమర్శ లేక పోతే ,కళా సృష్టి నీరసం అవుతుంది అని  వైల్డ్
అభిప్రాయం కూడా .””Without the critical  faculty ,there is no artistic
creation at all.”అయితె ఏ కళ  కైనా ,ఒరిపిడి రాయి కావాలి .అదే నిగ్గు
తెలుస్తుంది .దాన్నే శైలి అంటారు .స్టైల్ .స్టైల్ తోనే ఆర్ట్ కు గొప్పతనం
వస్తుంది .
”there is no art if there is no style .No style if there is ni unity
-the unity is of the individual ”అందుకే వ్యక్తీ గత మై ,శిల్ప శైలీ
విన్యాసమైన ది ఉత్తమ కళ .ఇక్కడే పునరుక్తి వుంటుంది ఆర్టిస్ట్ పని తనం లో
.”The tendency of creation is to repeat it self ”అన్న వైల్డ్ ఉక్తి
నిజ మావు తుంది .అందుకే” I would call criticism ,a creation with
creation .”అంటాడు క్రిటిసిసం ఒక కళ .వ్యక్తీ ఆత్మ సర్వస్వమే అది .
కనుక ప్రతి దానికీ ఒక సంబంధం వుంటుంది .ప్రభావం వుంటుంది .ఆ
ప్రభావం ధనాత్మకం అయితె మంచి ,రునాత్మకమైతే చెడు పెరుగుతుంది .భావుకుడైన
పోలిష్ కవి” జేస్లామిలోజ్ ”కు ”the whole earth is like a poem -while
the sun above represents the artist”.గా అనిపించింది.దివి ,భువులను
కలిపిన కళాత్మ క మైన దేదైనా హృద్యం ,అనుభవైక వేద్యం
కళ -ప్రకృతి -ప్రభావం
రంగుల్లో రాగాలు ,రాగాల్లో రంగులు చూపించిన వాడు విశ్వ కవి
రవీంద్రుడు .మహా గొప్ప చిత్రకారుడు కూడా. విశ్వ విఖ్యాతుడైన వాడు .చైనా
లో వెదురు చెట్టు కున్న ప్రాధాన్యత -అక్కడి కళాక్రుతుల్లో ప్రతి
ఫలించింది .తన చుట్టూ వున్న ప్రకృతిని చూసి మురిసి లాండ్ స్కేపే లు తయారు
చేశారు విదేశీ దండ యాత్ర లతో చిత్ర కళ కొత్తరూపాల్ని   సంత రించు కుంది
.renaiscence  ప్రభావం కళ మీద పడి వన్నెలు చిందించింది .జన పదాలలో ఆ
ప్రాంత ప్రభావం వుంటుంది .ప్రాకృతిక వాస్తవ వాదాల్లో ఆధ్యాత్మిక భావ
ప్రకటన ,ఆయా కాల మాన పరిస్తితులను బట్టి అవసర మయింది .జైన ,బౌద్ధ మత
ప్రభావాలకు లోని ,ఎన్నో మార్పులు చెందింది .సెయింట్ ఫ్రాన్సిస్ అసిస్సి
అనే క్రైస్తవ మత ప్రచారకుని ప్రభావం 13 వ శతాబ్దం లో చిత్ర కళ పై పడింది
.మార్పు ,విలువా ఏర్పడ్డాయి .”మానవీయ అభి వ్యక్తీకరణ ”కళ కు అబ్బింది
.అబ్బుర పరిచింది కూడా .బైజాన్తాన్ చిత్ర కళ లో గ్రీక్ ,రోమన్ ,ఈజిప్ట్
సంస్కృతుల సమ్మేళనం వచ్చింది .
మన మహా చిత్ర కారులు
రవి వర్మ లేక పొతే మన దేవతా మూర్తులే లేరు .బాపి రాజు
లేక పొతే నన్నయ ,తిక్కన లు ఎలా వుండే వారో మనకు తెలిసేది కాదు .తెలుగు
చిత్ర కళా పితామహుడు దామెర్ల రామా రావు భారతీయ చిత్రానికి రవి వర్మ
తర్వాత అంతర్జాతీయ కీర్తి తెచ్చి పెట్టాడు” .ఆంధ్రా స్టైల్ అఫ్ ఆర్ట్
”ప్రవేశ పెట్టిన మార్గ దర్శి రామా రావు .విదేశీయ చిత్ర కారులని కూడా తన
చిత్రాలతో ముగ్ధుల్ని చేసిన చిత్రకార రారాజు .1897 లో మార్చ్ ఎనిమిదిఆయన
జన్మించిన రోజూ .వాటర్ painings లో పురుషుల్ని  అందం గా చిత్రించాడని
కీర్తి పొందాడు .
చుట్టూ ప్రళయం కమ్ముకొని వస్తున్నా  నీటి ధారలు   ,మెరుపులు
,ఉరుములు ,చూసి మనసును రసమయం చేసు కొంటాడు రస హృదయం  కల వాడు .దానినే”
psychic distance ” అంటాడు ఎడ్వర్డ్ బుల్లో అనే కళా కారుడు .ఆ ఆకర్షణ
ముందు అంతా బలాదూరే .నంద లాల్ బోస్ చిత్రించిన చిత్రాల్లో మనిషి  బలిష్టం
గా ఉంటాడు .దుర్బల మానవుల వల్ల సమాజానికి ప్రయోజనం లేదని ఆయన భావం
అన్నారు విశ్లేష కులు ”.నాకు ఉక్కు కండరాలు కావాలి ”
అన్నాడు కదా స్వామి వివేకా నంద .ఆమాటలకు యదార్ధ రూపాలే నంద లాల్ చిత్రాలు .
గ్రీక్,దేశం నగర ప్రాధాన్యత కలది .అందుకే శాస్త్రీయ కళ ఎక్కువ .మన భారత
దేశం పల్లె పట్టు లకు నిలయం .కనుక జాన  పద కళా వికసనం ఎక్కువ .మార్గ
,దేశిపద్ధతులు  దీని వల్లే ఏర్పడ్డాయి .రాజుల కాలమ్ లో ,ఆ రాజులు
అభిమానించే విషయాలకే ప్రాధాన్యత వుండేది .అవే కళ లలో ప్రతి బింబిం చేవి
.జహంగీర్ కాలమ్ లో పక్షుల చిత్రణ అలానే ప్రాముఖ్యత పొందింది  ”చిత్ర
కారుని సఫలత -తన ద్రుష్టి కి కని పించిన్దంతా తన సృష్టి లో అభివ్యక్త పరచ
కుండా వుండటం లోనేవుంది ”అంటాడు ప్రముఖ చిత్ర కారుడు ,కవి ,రచయిత సంజీవ
దేవ్ .సృష్టికి హద్దు లున్నాయి .దృష్టికి హద్దుల్లేవు అంటాడాయన . .  .
అజంతా చిత్ర కళ కు రూపంప్రధానం మొగలాయి  చిత్ర కళ కు
రంగు ప్రధానం ”రంగు పడుద్ది ”అని భయ పడక్కర లేదు .అది సరిగ్గా ,మోతాదు
లో పడితే చిత్రం పండుతుంది .రూపం లేని రంగు ఇంకా ఎక్కువ
ఆనందాన్నిస్తున్దంటాడు సంజీవ దేవ్ .మనో రూపాన్ని నిర్మించ టానికి ఏళ్ళు
,పూళ్ళు పడితే ,భౌతిక రూపం రచించ టానికి నిముషాలు చాలంటారు  నియమం  అన్ని
వేళలా పనికి రాదు అని నిరూపించాయి అవనీంద్ర నాద్ టాగూర్ చిత్రాలు .టి.ఎస్
ఇలియట్ ”Man is not man at all ,unless social ,but he is not much
above beast unless he is more than social ”అన్నాడు .కనుక నియతిని దాట
టమే   ఆదర్శ మానవునిలక్ష్యం  .గిరి గీసుకొని కళా కారుడు ఉండ లేడు .ఏదైనా
”లక్ష్మణ రేఖ ‘దాటితేనే కదా కధా ,కమామీషు వుండేది ?అందుకే టాగూర్
”My song has put off her adornments -she had no pride of dress and
decoration -they would mar our union ”అన్నాడు .ఆధునిక భారతీయ రస
తత్వజ్ఞుడు ”ఆనంద కుమార స్వామి ”అంతర్జాతీయ సాంస్కృతిక రంగం లో మంచి
పేరున్న వాడు .గొప్ప చిత్ర ,శిల్ప కళా మర్మజ్ఞుడు .
తెలుగు వాడు మొక్క పాటి కృష్ణ మూర్తి
,బెంగాల్విధానాన్ని  ,ఆధునిక పద్ధతుల్ని తన చిత్రాలలో చూపాడు .ఎక్కడి
రోరిక్ ?ఎక్కడి హిమాలయాలు?వాటి అందాన్ని రంగుల్లో ముగ్ధ మోహనం చేశి జన్మ
చరితార్ధం చేసు కొన్నాడు .దేశ ,విదేశ సంచారం కళా జగత్తు ను వ్యాప్తం
చేస్తుంది .కొత్త కోణాలను ,లోకాలను చూపిస్తుంది .”చిత్రకారుడు -భాగీరధ
”వ్యంజనకు పెద్ద పీట వేశాడని చెబుతారుమహాకవి కాళిదాసు కృతులకు అద్భుత
చిత్రాలు వేశారు ఆశిత్ కుమార్ హాల్దార్ .ఒమర్ ఖయ్యాం గీతికలకు ఔచిత్య వంత
మైన ,లావణ్య చిత్రాలూ రచించాడు .కనుక ఒక చోట ప్రారంభ మైన కొత్త శైలి
,విశ్వ మంతా వ్యాపించింది .,వ్యాపిస్తుంది .కళా కారులను ప్రభావితం
చేస్తుంది .రసజ్నులను ఆకర్షిస్తుంది .ఎల్లలు కల్లలౌతాయి .నైరూప్య
చిత్రకళా లో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఎస్.వి.రామా రావు కృష్ణా జిల్లా
వారే .
కళ వాస్తవం లో ప్రారంభమైనా ,ఆదర్శం లో వికసించి ,కల్పన
లో పరిణతి చెందుతుంది ..ఆధునిక చత్రా కారుడు అవనీంద్ర నాద్ టాగూర్ -చైనా
,జపాన్ చిత్ర కళను పరిశీలించి ,సాంప్రదాయ భారతీయ చిత్ర కళ కు ఆధునికతను
అలంకారం గా అందించాడు .ప్రపంచం లో ప్రకృతి చిత్ర కళ లో మకుటం లేని
మహారాజు ”టర్నర్ ”ప్రభావం అనేక దేశాల చిత్ర కారులపై పది ,ఆ శైలికి
దగ్గరకు చేర్చింది .పర్వత ప్రాంతాల చిత్ర కళ ”బషోలీ ”లేక ”పహాడీ
”చిత్రకళా అయింది మన దేశం లో .అజంతా గుహలలో ప్రకృతి రంగుల చిత్రాలు
ప్రపంచ యాత్రికులను ,చిత్రకారుల్ని ఇంకా అబ్బుర పరుస్తూనే వున్నాయి వర్ణ
మేళ నానికి జోహార్లు అర్పిస్తున్నారు కళా ప్రియులు ..
విభిన్న రీతులు
బాలల చిత్ర కళా  ప్రపంచామూ విస్తరించింది .శంకర్ ప్రేరణ
,స్ఫూర్తి వరాలేఅయాయి .పత్రిక లన్నీ నేడు విసృతం గా చిత్రాలకు ప్రాధాన్యత
కల్పిస్తున్నాయి .”లఘు చిత్ర కళ ”-మినీ కవిత్వం లా ప్రాచుర్య మైంది
.వ్యంగ్య చిత్ర కళ -కార్టూన్ చిత్రకళా బహుల ప్రచారం పొందింది .బాపు
,శంకర్ ,మోహన్ ,శేఖర్ ,మొదలైన వారంతా ఈ కళకు పట్టాభి షేకం చేశారు .ముఖ్యం
గా బాపు దేవతా చిత్రాలు ,రామాయణ చిత్రాలు విశ్వ విఖ్యాత మైనాయి .అట్ట
మీది బొమ్మ లకు ఒక కొత్త స్టైల్ తెచ్చాడు బాపు .బాపు బొమ్మ అంటే అచ్చ
తెలుగుదన  ఉట్టి పడుతుంది .తెలుగు వాడి అన్ని వికారాలు ఆరేసిన వాడు
,ఆవిష్కరించిన వాడు బాపు .కార్టూన్ల ద్వారా పత్రికల వ్యాపారము పెరిగింది
.ముందు కార్టూన్లు చూసే స్థితి వుంది నేడు .ఊమెన్ కార్టూన్లు ఊపేశాయి
.ఆర్ కే లక్ష్మన్ సామాన్య్దిని చిత్రకళా మాన్యున్ని చేశాడు .పత్రికలు
హాట్ కాకేస్ లా అమ్ముదవటానికి ఇవి బాగా దోహద పడుతున్నాయి .వంద మాటల్లో
చెప్పేది నాలుగు స్త్రోకుల్లో  దిమ్మ తిరి గెట్టు చెప్ప వచ్చు .దాన్ని
గురించి చర్చించుకోవటం గొప్ప గా ఉంటోంది .దీనికి ఆద్యుడు ”తెలిసేట్టి
రామా రావు ”అని చాలా మందికి తెలిసి వుండదు .వ్యాపార రంగం లో ,ప్రకటనలకు
దీని పట్టు బాగా వుంది .ఇదొక వ్యావృత్తి మాత్రమే కాదు వృత్తిగా
జీవిస్తున్నారు చిత్ర కారులు .చార్లెస్ మన్రో శుల్జ్ అనే అమెరికన్
కార్టూనిస్ట్ కోట్లకు పడగ లెత్తాడు అని తెలిస్తేఆశ్చర్య మేస్తుంది . .
”నేటి రాజకీయ ,ఆర్ధిక ,సామాజిక ,సాంఘిక ,సాంస్కృతిక
వ్యవస్తాలన్నీ భౌతిక భారం నుంచి విముక్తి పొంది ,స్వేచ్చా పూరిత సామ్య
స్తితికి చేరుకోవాలని తపిస్తున్నాయి .భౌతిక వాదం కంటే ఆధ్యాత్మికతకు
దగ్గరవు తున్నాయి .అంటే జడ పదార్ధం ,చైతన్య వంతమై ,లయతో
స్పందిస్తున్నాయి ”అన్న నిరంతర అన్వేషి ,ఆలోచనా పరుడు ,స్వయం సిద్ధుడు
,పరి పూర్ణుడు ,కళా స్రష్ట ,ద్రష్ట స్వర్గీయ సంజీవ దేవ్ మాటలు
చిరస్మరణీయాలు .హార్ట్ లో ఆర్ట్ జత కలవాలి .ఆర్టిస్టిక్ గా నిలవాలి
.ఆర్టిఫిషియల్ కారాదు .హార్ట్ ను ఆకర్షించాలి .కాని గందర గోళం తో హార్ట్
అట్టాక్ తెప్పించ రాదు .రస రమ్యతే మన ధ్యేయం .విశ్వ జనీన కళ రూపొందాలి
.నవ మానవతకు ”సృజన ”ధార కావాలి ”లోక భయంకర సంక్షోభాలను కల్గించే
తుఫానుల తీవ్రతను నాశనం చేసి పరమ శాంతి ని నెల కోల్పుతుంది ”సౌందర్యం
అనే విశ్వ గానం ”అన్నాడు . విశ్వకవి రవీంద్రుడు ..
ఇక్కడ మన కళ కారులకో విషయం విన్న  విస్తాను .అమెరికా
కవి ,విమర్శకుడు ,రచయిత , ,కధకుడు,శాస్త్ర వేత్త all in one  అయిన
ఎడ్గార్ ఎల్లెన్ పో   ..ఆయన పై అభిమానులు అందరు కలిసి ‘Poe Encyclo
paedia ”ప్రచురించారు .అందులో ఆయన అన్ని రచనలు ,కుటుంబం ,స్నేహితులు
,బంధువులు ,ఉత్తర ప్రత్యుత్త రాలు ,వారి వివ రాలు ,ఫోటోలు ,ఆయన
నిర్మించిన కధా పాత్రలు ,కవితలు వగైరా లన్నీ అందులో నిక్షిప్తం చేశారు
.అలాగే మనం కూడా మన ప్రముఖ చిత్ర కళా కారులైన దామెర్ల రామా రావు మీద
,అడివి ఆపి రాజు మీద  ,సంజీవ దేవ్ మీద అలాంటి   విజ్ఞాన సర్వస్వాన్ని
తేలేమా ?పూను కొంటె కష్టమేమీ కాదు .పూనిక కావాలి అంతే .ఆ దిశ గా
ఆలోచించాలని కోరుతున్నాను
కళా కారుడు స్రష్ట ,ద్రష్ట  .విశ్వ కళ్యాణ కాంక్ష అతని
ఊపిరి .అందుకే ఆ ఆకాంక్ష తో స్వర్గీయ దాశరధి రచించిన పద్యాన్ని గుర్తు
చేస్తూ సెలవ్
”ఈ లోకమ్మొక   ,నాక మౌనటుల ,నీవే చేయ గా జాలే ,దీ
హాలా హల మయ ప్రపంచము ,సుధా  వ్యాప్తమ్ము గావింతు ,వీ
.           వ్యాలా భీల వనమ్ము ,నందన వన ప్రాయంబు గావించి ,క్రోం
బూలన్ నిండిన ,పారిజాతములతో పొంగింతువో భావుకా ”.
గబ్బిట దుర్గా
ప్రసాద్ –28 -11 -11 .

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –3

    వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –3
                                                అభిషేక జలం హరించే ఉమా కమండ లేశ్వరుడు
 తూర్పు గోదావరి జిల్లా లో వసిష్ఠ నదీ తీరం లో ఉన్న క్షేత్రం ర్యాలి .అక్కడ జగన్మోహన ఆలయం తో బాటు ఉమా కమండ లేశ్వర దేవాలయం కూడా ప్రసిద్ధి చెందంది .బ్రహ్మ దేవుడు తపస్సు చేసిన ప్రదేశం గా పేరు పొందింది .బ్రహ్మ ,తన కమండలం పై ఉమా దేవితో కూడిన శివుడిని ప్రతిష్టించాడు .అదే ఉమా కమండ లేశ్వర ఆలయం .శివ లింగం రుద్రాక్ష లాగా గరుకు గా ఉంటుంది .సోమ సూత్రం లేక పోవటం ప్రత్యేకత .శంకరుడు కాముడిని దాహించాడు కనుక చాలా వేడి గా ఉంటాడు .అందుకని అభిషేకం చేసిన గంగా జలం అంతా అప్పటి కప్పుడు హరించుకు పోవటం వింత గా అని పిస్తుంది .బయటకు కాని ,కిందకు కాని నీళ్ళు పోయే మార్గ మే లేదు .అక్కడజగన్మోహన కేశవాలయం లో నీరు ఎప్పుడూ ఊరుతుంది .ఇక్కడ హరించుకు పోతుంది .అదీ చిత్రాతి చిత్రం .
    నాట్యాభి నయ  కరణాలు ఉన్న  కూచి పూడి రామ లింగని గుడి
           కృష్ణా జిల్లా కూచి పూడి కూచి పూడి నాట్య సిద్ధాంత కర్త సిద్ధేంద్ర యతీంద్రుల జనం స్థానం .కూచి పూడి నాట్యానికి కేంద్రం గా వర్ధిల్లింది .శ్రీ బాలా త్రిపుర సుందరీ సాహిత శ్రీ రామ లింగేశ్వర  స్వామిని శ్రీ రాముడు ప్రతిష్టించి నట్లు స్థల పురాణ కధనం .ఆలయ ముఖ మంద పం లో 108   నాట్యాభినయ కారణాలను అత్యద్భుతం గా చెక్కారు .చిదంబరం ఆలయం లోని కరణాలను చూసి  ,ప్రముఖ కూచి పూడి నాట్యా చార్యులు పద్మ శ్రీ వెంపటి చిన సత్యం గారు వీటిని ఏర్పాటు చేసి తమ కళా భిమానాన్ని చాటుకొన్నారు .

      పడమర ద్వారం -తూర్పు ఆలయం ఉన్న -కోడూరు
 కృష్ణా జిల్లా దివి తాలూకా లో అవని గడ్డ కు దగ్గరలో కోడూరు గ్రామం లో శ్రీ సోమ శేఖర స్వామి ఆలయం తూర్పు వైపున ఉన్నా ,ద్వారం మాత్రం పడ మర వైపుకు ఉండటం విశేషం .ఈ ఆలయాన్ని ప్రఖ్యాత కవి ,పండితుడు ,శతాధిక గ్రంధ కర్త అయిన నాదెళ్ళ పురు షోత్తమ కవి 1894 లో నిర్మించారు .కోడూరు ఒకప్పటి రేవు పట్టణం .”దివి దుర్గం ”అనే పేరు  దీనికి సార్ధక నామం గా ఉండేది .ఇప్పుడు మంచి వ్యాపార కేంద్రం .నిత్య ధూప దీప  నైవేద్యాలతో అభిషేకాలతో ఆలయం వర్ధిల్లు తోంది .
సశేషం —- గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -04 -12
               క్యాంపు -యు.ఎస్.ఏ
Posted in సేకరణలు | Tagged | Leave a comment

అమెరికా డైరి 15 -04 -12 ఆది వారం

అమెరికా డైరి 
                               15 -04 -12 ఆది వారం
ఉదయం ఆరు గంటలకే మెలకువ వచ్చి లేచి ప్రముఖ కధకులు ,విమర్శ్శకులు ,పడ చిత్ర రామాయణ కర్త అయిన శ్రీ విహారి గారి ”అయోధ్యా కాండం ”పుస్తకం చదవటం మొదలు పెట్టాను .దీనికో ఫ్లాష్ బాక్ ఉంది .సుమారు నాలుగైదేళ్ళ కిందట ఉయ్యూరు లో సాహితీ మండలి ఆధ్వర్యం లో శ్రీ విహారి రాసిన పద చిత్ర రామాయణం లోని సుందర కాండ ను పరిచయం చేసే కార్య క్రమం జరిపాం .దాని స్పాన్సర్ శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు గారు .శ్రీ మాది రాజు రామ లింగేశ్వర రావు గారు పుస్తకాన్ని పరిచయం చేసి అందులోని విశేషాలను వివ రించారు .పూర్ణ చంద్ ,శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ వంటి ప్రముఖులు హాజ రైనారు .అప్పుడు నేను కూడా అందులోని సొగసుల్ని గురించి చెప్పాను .ఆ తర్వాత హైదరా బాద్ నుండి విహారి గారు ఫోన్ చేసి నేను చెప్పిన విష యాలు ఎవరు చెప్పనివని దాన్ని ఒక వ్యాసం లాగా రాసి పంపమని కోరారు .అలానే రాసి పంపాను .దాన్ని ”బాల కాండ ”లో ప్రచురించారు .ఆ పుస్తకం నాకు పంపారు .దాన్ని చదివి నేను ”బాల కాండ పద చిత్రాలలో -పలు విచిత్రాలు ”అన్న శీర్షిక తో నా స్పందన రాసి ఆయనకు పంపాను .ఆ తర్వాత ఎప్పుడో విజయ వాడ లో ఒక సభ లో కలిసి నేను రాసినది చాలా అద్భుతం గా ఉందని దాన్నంతటిని ఒక్క అక్షరం కూడా వదిలి పెట్టకుండా ”అయోధ్య కాండ”లో ప్రచురిస్తున్నానని చెప్పి ఆ పుస్తకం ఆవిష్కరణ తర్వాత నాకు నాలు గు నెలల కిందట పంపారు .చదవటం కుదర లేదు నిజంగా నే నేను రాసింది అక్షరం కూడా వదల కుండా అందులో వేసి ,అన్న మాట నిలుపు కొన్నారు విహారి .దాన్ని ఇక్కడికి తెచ్చుకొన్నాను చదువుకోవటానికి .అదే ఇవాళ మొదలు పెట్టాను .కధ అందరికి తెలిసిందే అయినా విహారి చెప్పిన తీరు ప్రయోగించిన జాతీయాలు ఆవిష్కరించిన భావాలు మనసు ను పట్టేస్తాయి భిన్న ఛందస్సు లను వాడి అర్ధ పుష్టి కల్గిస్తారు .సుమారు ఇరవై పేజీలు  ఇవాళ ఉదయం చదివి ఉంటాను .
దయం స్నానం సంధ్య ,పూజ తర్వాత ప్రభావతి తప్ప మేమందరం ఒక పావు గంట ప్రయాణ దూరం లో ఉన్న సాయి సెంటర్ కు వెళ్లాం .ప్రతి ఆది వారం ఇక్కడ సాయి భక్తులూదయమ్ పది నుండి పన్నెండు వరకు కలిసి సత్సంగ్ భజన నిర్వ హిస్తారు .ఇరవై మంది ఆడ వారు ,పదిహేను మంది మగ వారు ,పది మంది పిల్లలు వచ్చారు .పిల్లలకు నీతి బోధ క్లాస్ ఉంటుంది ఒక గంట సేపు .పది నుండి పద కొండు గంటల వరకు సత్సంగ్ జరిగింది .పిల్లల్ని పెంచటం లో ఇబ్బడులు వాటిని అదిగా మించే మార్గాలు సత్య సాయి ఈ విషయం లో చేసిన మార్గ నిర్దేశకాల గురించి అందరు తమ మనసు లోని ఆటలను తెలుపు కొన్నారు సుబ్బు మానిటరింగ్ చేశాడు .నిలు వెట్టు సత్య సాయి ఫోటో ,దాని ప్రక్కన కుర్చీలో సత్య సాయి ధరించే కాషాయ చొక్కా ఒక కుర్చీలో ఏర్పాటు చేశారు .ఫోటో కు ఎదురుగా ఒక రెడ్ కార్పెట్ ,దాని పై గులాబి పూలు ఆయన రాక కోసం అన్నట్లుగా ఏర్పాటు చేశారు .ఒక పెద్ద స్క్రీన్ మీద సాయి సూక్తులు ,ఫోటో ను కంప్యుటర్ ద్వారా చూపించారు .
పద కొండు నుంచి పన్నెండు వరకు సుబ్బు బృందం భజన కార్య క్రమం నిర్వ హించారు .అందరు తలో గీతం పాడి భజన అన్ని భాషల్లో ను చేశారు .ఆ తర్వాత హారతి .విభూతి ప్రసాదం .పుష్ప అనే ఒకావిడ తన ఇంటిలో కింది భాగాన్ని సత్సాన్గానికి ఇచ్చింది .ఇక్కడే ప్రతి వారం సమా వేశాలు జరుగు తాయి .ఇక్కడే ఉయ్యూరు లో నా గురువు గారు వేమూరి శివ రామ క్రిష్నయ్య గారి రెండవ కుమారుడు ,నా క్లాస్ మేట దుర్గయ్య అన గారు అయిన కామేశ్వర శర్మ గారి కూతురు ,అల్లుడు కలిశారు .తమాషా పరిచయాలు ఏర్పడు తున్నాయి .నిన్న కోట వారి బంధువుల పరిచయం ఇవాళ ఇది .కామేశ్వర శర్మ మాకు సీనియర్ .ఏదో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయి సాయి సేవ లో ఉంటున్నాడట .
తారు వాత బెల్లంకొండ ఉషా రవి వాళ్ల అమ్మాయి పుట్టిన రోజూ పండుగకు అందరం అంటే భక్త బృందం లో ఒక పాతిక మందిమి వెళ్లాం .వెళ్ళే తప్పటికే ఒంటి గంట దాటింది .కమ్మటి భోజనం తయారు చేసింది ఉష .పూరి కూర చాలా బాగున్నాయి .మినప సున్ని ఉండలు ,కిచిడీ అన్నం ,పెరుగన్నం ,మినీ ఆవడ ,కోకా ఐస్ క్రీం,కర్బూజా ,పుచ్చ్చ కాయ ముక్కలు .అన్ని కడుపు నిండా తిన్నాం .ఆ తర్వాత బర్త్ డే కేక్ కట్ చేశారు .అందరికి కేక్ పెట్టారు .పిల్ల లందరికి తలో అయిదు ఫ్దాలర్లగిఫ్ట్ కార్డు లిచ్చారు రవి ఉషా దంపతులు .పవన్ భార్య రాధ పిల్లలు కూడా వచ్చారు .అడుసు మిల్లి అతను ”అంకుల్ ఎలా కాలక్షేపం చేస్తున్నారు ?”అని అడిగితె ,వివరం గా చెబితే నోరు వెళ్ళ బెట్టాడు .ఇంటికి వచ్చే సరికి నాలుగున్నర అయింది రవి వాళ్ళున్న  ఏరియా ను కాన్కార్డ్  అంటారట .అమెరికా లో ఏ ఊరు అయినా ,ఏ ప్రదేశం అయినా ఒక్కటే .అన్నీ ఒకటి లానే దాదాపు గా ఉంటాయి .ఇళ్ళు అన్నీ ఒకటిగా ఉన్నట్లే .మొత్తం మీద అందరం తరచుగా కలుస్తున్నండుకుపరిచయాలు పెరుగు తున్నందుకు  హాయిగా ఉంది సాయంత్రం శ్రీకేత్  కు తెలుగు tution    పవన్ వాళ్ల ఇంటి దగ్గర ఉంటె విజ్జి వాళ్ళమ్మను కూడా తీసుకొని వెళ్ళింది .వీళ్ళింటికి నడి ఛి  వెళ్ళేంత దగ్గిరే .అరవై మంది పిల్లలకు తెలుగు నేర్పుతున్నారు రాదా ,ఇంకో అమ్మాయి కలిసి .మంచి పని చేస్తున్నందుకు అభి నందనలు .
మాధవికి ,మైనేని గారికి మెయిల్ రాశాను .విజ్జి ,వేద వల్లి కొడుకు హరి కి ఫోన్ చేసి మాట్లాడింది .వాడికి ఉన్న చోటు నుండి traansfer అయిందట .కొత్త చోటు లో త్వరలో చేరుతాడట .అక్కడికి వెళ్ళే లోపు వాళ్ల అమ్మ మాతో పంపిన వాటిని తీసుకొని వెళ్ళమని విజ్జి చెప్పింది .ఎప్పుడో వస్తాడు .ఇవీ  ఈరోజు విశేషాలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-04-12
camp–charlotte —n.c–.u.s.a.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –2

 వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –2
మూడు రోజులు వెలిగే అగ్ని గుండం –తిరువన్నా మలై
— తిరువన్నామలై తమిళ నాడు లో ప్రసిద్ధ శివ క్షేత్రం .అరుణా చలేశ్వరుడు అగ్ని స్వరూప శివ లింగం .లింగోద్భవ కాలమ్ లో శివుని రూప రహశ్యం తెలుసు కోవాలని బ్రహ్మ ,విష్ణువు ,ప్రయత్నిస్తారు .వారికి అంతు దొరక లేదు .అప్పుడు శివుడు తన అగ్ని స్వరూపాన్ని ఉప సంహరించు కోని ,కొండ రూపం లో వారి ముందు వెలిశాడు .ఆలయానికి వెనుకగా ఈ కొండ ఉండటం మనం చూస్తాం .కార్తీక పౌర్ణమి నాడు లక్షలాది భక్తులు అరుణా చలేశ్వరుని సందర్శించి తరిస్తారు .ఆ రోజూ కొండ చివరి శిఖరం పై,పెద్ద అగ్ని గుండాన్ని వెలిగిస్తారు .అది మూడు రోజులు దాకా  వెలుగుతూ చుట్టూ యాభై కిలో మీటర్ల దూరం వరకు కన బడుతుంది .
అరుణా చలం  కొండ మీద ఒక గుహలో శ్రీ రమణ మహార్స్షి తపస్సు చేసి దివ్యాను భూతి పొందారు .కావ్య కంత వాసిష్ట గణ పతి గారు వీరికి ”శ్రీ రమణులు ”అని పేరు పెట్టారు .ఇక్కడి రమణాశ్రమం ప్రశాంత తకు నిలయం .అందరు తప్పక సందర్శించ వలసినది .
     అయ్య వారికి దూరం గా అమ్మ వారున్న కంచి
 కంచి కామాక్షి క్షేత్రం పరమ పవిత్ర మైనది .ఏకాంబరేశ్వరుడు దర్శనీయుడు .సాధారణం గా స్వామి వారి విగ్రహానికి ఎడమ వైపు అమ్మ వారి విగ్రహం ఉంటుంది .అయితె కంచిలో మాత్రం ,ఎకామ్రారేశ్వర ఆలయానికి సుమారు రెండు ఫర్లాంగుల దూరం లో కామాక్షి దేవి ఆలయం ఉండటం విశేషం .కామాక్షి ఆలయం లో ,అమ్మ వారి ఎదుట బీజాక్షరాల తో ఉన్న యంత్రం ప్రతిష్టించ బడి ఉంది .పూజాదికాలను యంత్రానికే చేయటం ఇక్కడి ప్రత్యేకత .
ఇక్కడే శ్రీ కంచి కామ కోటి పీఠం ఉంది .విష్ణు కంచి లో వరద స్వామి ఆలయం ఉంది .ఇక్కడి వెండి బల్లి ని తాకితెపాపాలు పోతాయని భక్తుల నమ్మకం .కామ కోటి అంటే కామం తర్వాత వచ్చే మోక్ష దశ్శ  .అంటే మోక్షం పొంద టానికి దారి చూపేది కామ కోటి పీఠం అని అర్ధం .
                         రావణ బ్రహ్మ వాహనం పై ఊరేగే క్షీర లింగేశ్వరుడు
  పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో క్షీర రామ లింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు .పాల తాతి స్పటిక లింగం .అయిదు అడుగుల ఎత్తు ఉంటుంది .లింగం వెనుక వైపు మూడు గీత లుండటం ప్రత్యేకత .నారద ప్రతిష్ట గా ప్రసిద్ధి .శివుడు శూలం తో నేల మీద గుచ్చితే పాలు చిమ్మి కొలను గా ఏర్పడింది కనుక ”పాల కొలను ”అయి ,క్రమంగా ”పాల కొల్లు ”అయింది .దుగ్దోవన పురం ,ఉప మాన్యు పురం అనే పేర్లు కూడా ఉన్నాయి .
శివ రాత్రి ఉత్సవం లో శివుడు ”రావణ బ్రహ్మ వాహనం ”పై ఊరేగటం ఇక్కడి విశేషం .చైత్ర శుద్ధ దశమి నాడు ఒకే  సమయం లో  శ్రీ లక్ష్మీ జనార్దనుల ,పార్వతీ రామ లింగేశ్వారుల కల్యాణం జరగటం మరో విశేషం .జనార్దనుడు క్స్శేత్ర పాలకుడు .శివ కల్యాణం జరిగిన మరు నాటి ఉదయం సూర్య కిర ణాలు క్షీర రామేశ్వర లింగం పై పడటం చిత్రాతి చిత్రం .
                            మత సామరస్యం తో వెలిగే వేముల వాడ
             కరీం నగరం జిల్లా వేముల వాడ లో 
శ్రీ రాజా రాజేశ్వర స్వామి ఆలయం ఉంది .ఇది ఒకప్పటి  రాజ దాని .జైన ,బౌద్ధాలు విలసిల్లిన ప్రదేశం .ఒక ముస్లిం ముల్లా గారి స్మారక చిహ్నం  ఈ ఆలయం లో ఉండటం ఇక్కడి ప్రత్యేకత .రాజా రాజేశ్వర లింగం ”నీల మాణిక్య లింగం. ”పాన వట్టం కింద బ్రహ్మ ,మధ్య విష్ణువు ,పైన శివుడు ఉంటారు .అమ్మ వారు శ్రీ రాజ రాజేశ్వరి దేవి .ఆమె వాహనం వ్యాఘ్రం కాదు ”వరాహం ”.ఇదీ ఇక్కడి  విశేషం .వెయ్యి బంగారు నాణాలతో శివుడికి అభి షేకం చేయటం ఇక్కడి మరో విచిత్ర విషయం .అంటే కాదు అన్నం తో కూడా స్వామికి అభిషేకం నిర్వహించటం మరో వింత .కోడె గిత్తలను స్వామికి సమర్పించటం మరో వింత .అవి రాత్రి పూట ఆలయం, లో నిద్రిస్తాయి .దీన్నే ”కోడె కట్టటం ”అంటారు .ఆలయం లో బౌద్ధ ,జైన విగ్రహాలు కూడా ఉండటం అబ్బుర పరుస్తుంది .దీనికి దక్షిణ కాశి అని పేరుంది .నన్నయ గారి భారత రచనకు రాజ రాజ నరేంద్రుడు ప్రేరణ గా నిలిస్తే ,వేముల వాడ రాజు ”అరి కేసరి ”10 వ శతాబ్ది లోనే తన ఆస్తాన కవి ”పంప ”కవి ని ప్రేరేపించి కన్నడ భారతాన్ని రాయించి కృతిని అంకితం గా పొందటం విశేషం .పంపకవి జైనుడు .అతని సోదరుడు జన వల్లభుడు ఇక్కడి వాడే .ఇతడు తెలుగు లో ”కంద పద్యాలు ”రాసిన మొదటి కవి గా ప్రసిద్ధి చెందాడు .”లేగల వాడ ”,వెంబుల వాడ అయి చివరికి  వేముల వాడ అయిందని చెబుతారు .
సశేషం
                                  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ —15 -04 -12
కాంప్ -షార్లెట్ -నార్త్ కెరొలిన -యు.ఎస్.ఏ.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ 13, 14th ఏప్రిల్

అమెరికా డైరీ
            13 -04 -12 -శుక్ర వారం
నిన్న అంటే పన్నెండో తారీకు నుంచి ఉదయం స్నానం చేసిన తరువాత సంధ్యా వందనం ,పూజా ప్రారంభించాను .మొన్న బుధ వారం రాత్రి షార్లెట్ లో ”ఎల్లా ”వారి స్టార్ నైట్
గురించి రాశాను .షార్లెట్ లోని భారతీయులంతా షార్ప్ గ ఉన్నారన్న భావం కనిపించింది .ఏళ్ళ వారు ఆ రోజూ స్టార్ ఆఫ్ attraaction గా నిలిచారు .
ఇవాళ ఉదయం పూజా కార్య క్రమం పూర్తి అయిన తరువాత .ఇక్కడ విజ్జి స్నేహితురాలు శ్రీ మతి ప్రియా అనే అమ్మాయి ఇంటికి వచ్చింది .ఆమెది గుంటూరు అని భర్త వెంకట్ ది నెల్లూర్ ఆని ,వారిద్దరూ ఒక ఇల్లు ఇక్కడే కట్టిస్తున్నామని మే నెలలో దాన్ని బిల్డర్ స్వాధీనం చేస్తాడని ,గృహ ప్రవేశానికి ముహూర్తం చూడ మని కోరింది .ఇద్దరి నక్షత్రాలను బట్టి ఈ నెల 16 సోమ వారం ,25 బుధ వారం రెండు ముహూర్తాలు బాగా ఉన్నాయని చెప్పాను .మళ్ళీ జూన్ పది హీను తర్వాత కాని ముహూర్తాలు లేవని తెలియ జేశాను .ఈ రెంటి లో ఏది వీలయితే ఆ రోజూ పాలు పొంగించమని సలహా చెప్పాను .సంతోషం గా ఆమె వెళ్ళింది .చక్కని సంస్కారం ఉన్న అమ్మాయి లా గా కని పించింది .
నేను ఉయ్యూరు నుంచి ఇక్కడికి బయల్దేరే ముందు వారం తెలుగు విద్యార్ధి మాస పత్రిక సంపాదకులు ,నాకు ఆప్తులు స్నేహితులు శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారు ఫోన్ చేసి ,కొన్ని ఇంగ్లీష్ ఆర్టికల్స్ పంపిస్తున్నానని వాటిని తెలుగు లోకి అనువాదం చేసి పంపమని కోరారు .దానికి సమాధానం గా నేను అమెరికా వెళ్తున్నానని వీలుని బట్టి అక్కడికి తీసుకొని వెళ్లి చేసి మెయిల్ చేస్తానని చెప్పాను .టెక్ యువర్ వోన్ టైం అన్నారాయన .అంతకు ముందే విజయ వాడ ఆకాశ వాణి డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు నేను రాసిన ”దర్శ నీయ దేవాలయాలు ”పుస్తకం చదివి వెంటనే ఫోన్ చేసి అందులో కృష్ణా జిల్లా దేవాలయాలా గురించి అర్జెంట్ గా అయిదారు రోజుల్లోపు రాసి పంపమని కోరారు .వెంటనే మొదలు పెట్టి మూడు రోజుల్లో 25 పేజీలు  రాసి పంపించాను .
దాన్ని మార్చ్ 31 శుక్రవారం ఉదయం 07 -15 నిమిషాలకు ఏప్రిల్ 06 శుక్రవారం ,ఏప్రిల్ 13 శుక్రవారం ప్రసారం చేశారు .అలాగే ఏప్రిల్ ఒకటి శ్రీ రామ నవమి నాడు శ్రీ సువర్చలాంజ నేయా దేవాలయం లో సీతా రామ కళ్యాణ మహోత్సవం సమయం లో నేను రాసిన ”శ్రీ హనుమత్ కధా నిధి ”పుస్తకాన్ని ఆవిష్కరించిన సంగతి మీకు ఇది వరకే తెలియ జేశాను .ఆ పుస్తకం చదివిన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారు వెంటనే ఫోన్ చేసి ”హనుమజ్జయంతి -విశేషాలు ”అనే వ్యాసం నేను అమెరికా వెళ్ళే లోపు రాసి పంపించమని ఆదేస్శించారు .అంతే ఏప్రిల్ మూడు మంగళ వారం తెల్ల వారు జామున మూడున్నరకు లేచి రాయటం మొదలు పెట్టి అయిదు గంటలకు పూర్తి చేసి నాల్గవ తేది ఉయ్యూరు నుంచి హైదరా బాద్ బయల్దేరే రోజూ కొరియర్ లో పంపాను .అందుకని అసలేమీ సమయం చాలక కొల్లూరి వారి అనువాదం జోలికి వెళ్ళ లేక పోయాను .ఈ  రోజూ సాయంత్రం కూర్చుని ఆయన పంపిన 16 పేజీలలో రెండు పేజీలు  అనువదించి మెయిల్ చేశాను .ఇదీ ఈనాటి కార్య క్రమం.
విజ్జి వాళ్ళింటికి ఎదురుగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు జరుగు తోంది .ఎదురు గా రెండు ఇల్లు శర వేగం గా తయారవ్సుతున్నాయి .అంతా చెక్కలతో నేగా .చాలా తేలిక .ఇక్కడి పని వాళ్ళు మెక్సికో వాళ్ళు .ఇల్లు చూడటానికి వెడితే ఒకతను ”నమస్తే ”అన్నాడు .ఏదేశం అని అడిగితె మెక్సికో అని చెప్పి వాళ్ళు నేపాల్ దేశం నుంచి వలస వచ్చి  నట్లు చెప్పాడు .పనిలో ఎక్కడా అలసత్వసం కని పించలేదు .ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతున్నారు
14 -04 -12 -శని వారం
ఉదయం ఆరు గంటలకే లేచి పూ జాదికాలు పూర్తి చేసి టిఫిన్ తిని అందరం  కార్ లో ఎనిమిదింటికి ఇక్కడికి రెండు గంటల ప్రయాణ దూరం లో  barligtan రోడ్లో ఉన్న ”గ్రీన్  బరో  ”కు బయల్దేరాం ఒక గంట ప్రయాణం తరువాత బందరు కు చెందిన అడుసు మిల్లి రామ కృష్ణ ,ఉషా కుటుంబం తో కలిసి ఐ హోప్ హోటల్ దగ్గర ఆగి కాఫీ తాగి విజ్జి తెచ్చిన ఇడ్లీలు వాళ్లకు పెట్టాం. గ్రీన్స్ బరో అనే చోట దేవాలయం ఉంది అక్కడ రాదా కృష్ణ ,రామ పరివారం ఆంజనేయ స్వామి బాలాజీ అందారు దేవుళ్ళు ఉన్నారు ఇవాళ తమిళ ఉగాది సందర్భం గా అక్కడ షార్లెట్ సాయి భజన సమాజం లోని అయిదు కుటుంబాల వారిని ఆహ్వానించారు .అందు లో మేము ఉన్నాం .పదిన్నరకు స్వామి రాజేంద్రన్ కార్య క్రమ వివ రాలను తెలియ జేశారు .అందరు కలిసి తామిలా నూతన సంవత్స రాదిని  జరుపు కోవాలని ఈ  ఏర్పాటు చేసి నట్లు తెలిపారు .నాద ప్రియుడు భజన ప్రియుడు భగ వంతుడని నాదో పాసన కు మించింది లేదని ,త్యాగయ్య అన్నమయ్య ,పురందర దాసు మీరా మొదలైన వారంతా దీనితోనే తరించారని చెప్పారు షార్లెట్ లోని సుబ్బు అధ్యక్షత లో ఉన్న భక్త బృందాన్ని ఆహ్వానించామని వారు నామ సంకీర్త్తనతో మనల్ని తన్మయులను చేస్తారని అన్నారు సరిగ్గా పద కొందు గంటలకు భజన ప్రారంభ మైంది అంతా యువకులే ముప్ఫై మంది మహిళలు నలభై మంది పురుషులు పది మంది పిల్లలు హాజ రైనారు .డోలక్ మద్దెల హార్మని తప్పెట లతో భజన చాలా హాయిగా సాగింది మా అమ్మాయి విజ్జి ,ఉషా ,సౌమ్య  ,చిన్న పిల్లలు సాయి సహానా ,ఆనుషా వగైరా అందరు అద్భుత మైన గానం తో మై మర పించేట్లు భజన చేశారు అన్ని భాషల పాటలు పాడారు పిబరే రామ రసం ,”భక్త జన వాత్సల్ ;;శంకరా చార్య స్తోత్రాలు అన్నీ  కమ్మ గా పాడారు .వాయిద్యాల వాళ్ళు శ్రుతి మధురం గా వాయించి వన్నె తెచ్చ్చారు .సుబ్బు షార్లెట్ సాయి భజన మండలి అధ్యక్షుడు ఏ.రవి బి రవి .సత్యనారాయణ ,సత్య గోపాల్ ,సుబ్బు భక్తీ రసాన్ని ప్రవహింప జేశారు .భజన తో అందరు తన్మయులయారు .అందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులే అందరు సాయి భక్తులే .నాకు అని పించింది అమెరికా లోని భారతీయులందరి హృదయాల్లో సత్య సాయి ,షిర్డీ సాయి నెలకొని నడి పిస్తున్నారేమో నని .సంస్కృతీ ప్రవాహం అవిచ్చిన్నం గా ఇక్కడ ప్రవహిస్తున్నందుకు పర మానందం గా ఉంది .వార సత్వాన్ని తరువాతి తరాలకు అంద జేస్తున్నారు .రెండు గంటల పాటు నాదో పాసన సాగింది .ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో అన్ని వయసుల వారు ఉండటం విశేషం
ఇండియా నుంచి ఒక పూజారిని సెలెక్ట్ చేసి ఈ రోజే ఆయనకు బాధ్యతలు అప్పగించారు .ముప్ఫై అయిదేల్లుండ వచ్చు హైదరా బాద్ కు చెందిన వాడు భువన గిరి మురళీ కృష్ణ శర్మ .ప్రస్తుతం ఒక్కడే వచ్చాడు .తరువాత భార్య పిల్లలు వస్తారట .పడ మూడు మంది అప్ప్లై చేస్తే అన్ని స్క్రీనింగులు అయి ఇతన్ని సెలెక్ట్ చేసింది కమిటీ .అంటే నియామకం అంత పకడ్బందీ గా జరిగిందన్న మాట .అతను కుర్తాళం పీఠాది పతి పూర్వాశ్రమం లో ప్రసాద రాయ కుల పతి గారి శిష్యుడు .వేదం చదివి అధ్యాపనం చెప్ప గల సమర్ధుడు .అన్ని వైదిక కార్య క్రమాలు నిర్వ హించ గలడు విగ్రహ ప్రతిష్ట కలశ ప్రతిష్ట హోమాలు యజ్ఞాలు యాగాలు నిర్వ హించ గలడు నాలుగైదు భాషల్లో ప్రావీణ్యం ఉంది .భక్తీ చానెల్ లో ”నోములు -వ్రతాలు ”శీర్షిక ను నిర్వ హించి నంది బహు మతి పొందాడట .అలంకార బ్రహ్మ ,మహాదా చార్య బిరుదు లు పొందిన వాడు .ఉపనయనం వివాహాది కార్య క్రమాలను నిర్వ హించ గలడు అంటే సర్వ సమర్దుడినే  పూజారిగ్స  నియమించారన్న మాట .పూజారిని అందరికి పరిచయం చేశారు .అందరం హర్ష ధ్వానాలతో స్వాగాతిన్చాం .
ఆ తర్వాత హారతి ప్రసాద విని యోగం .అందరికి పులిహోర చక్ర పొంగలి ,రవ్వ కేసరి ,పెరుగు వడ ,చేర్ర్రి పండ్ల ముక్కలు ,ఆపిల్స్ ఆరంజ్ చపాతి, కూర ,మజ్జిగ ,పానకం ప్రసాదం గా తిన్నంత పెట్టారు .అందరు తృప్తిగా తిన్నారు .అక్కడే ఉయ్యూరు లో కోట శ్రీ రామ మూర్తి గారి కుమారుడు ప్రభాకర్ అన్న భార్యకు మేనల్లుడు ,భార్య పరిచయ మయారు వాళ్ళ ఇంటి పేరు భాగవతుల వారు .కూచి పూడి నివాసులు ఇలా యాదృచ్చికం గా కలవటం భలే తమాషా గా ఉంది
స్వామి రాజేంద్రన్ గారు ఉగాది సందర్భం గా షార్లెట్ నుంచి వచ్చిన కుటుంబాలను వారింటికి ఆహ్వానించారు దంపతులు చాలా మంచివారు .ఆయన అక్కడ సాయి సమాజానికి అధ్యక్షులె కాదు ఆలయ నిర్వాహకులు కూడా .వారింట్లో నిలువెత్తు సత్య సాయి ఫోటో ఉంది .సుబ్బు బృందం కొంత సేపు మళ్ళీ భజన చేశారు మా మనుమడు శ్రీ కేత్ కూడా ఒక భజన గీతం  పాడాడు .అందరికి కాఫీ టీ బిస్కట్లు ఇచ్చారు అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు  బయల్దేరి సాయంత్రం అయిదు గంటలకు ఇంటికి చేరాం .
ఇంటికి రాగానే మొబైల్ వాన్ లో ఫర్నిచర్ అమ్మటానికి వచ్చారు మంచం వగైరా ఐదింటిని 1500 డాలర్లు పెట్టి కొన్నారు .ఇలా ఈ రోజు గడిచింది .పిల్లలు బానే ఎంజాయ్ చేశారు .
వెళ్ళే టప్పుడు దారిలో ఒక పెద్ద వాన్ మీద ”UNITED HOUSE OF PRAYER FOR ALL PEOPLE ”అని రాసి ఉన్న దాన్ని చూశాం .వారి విశాల దృక్పధానికి జోహార్ అని పించింది .అదేమిటో నాకు తేలీ లేదు కాని వారి భావన నచ్చింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14 -04 -12 .
కాంప్ –షార్లెట్ –యు.ఎస్.ఏ.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –1

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –1
    కుంభ కోణం
            తమిళ నాడు లోని కుంభ కోణం లోని కుమ్భేశ్వర ఆలయం అత్యంత ప్రాచీన మైనది .ఇక్కడ బ్రహ్మ దేవుడికి ఆలయం ఉండటం ఒక విశేషం . దక్షిణ దేశం లో ఇంకెక్కడా బ్రహ్మ కు గుడి లేదు .కుంభాలు అంటే కుండలు .కుండల్ని చేసే మట్టి తో శివుడు లింగాన్ని చేసి ప్రతిష్టించాదట .ఇక్కడ మహా మాఘ ,బంగారు తామర అనే రెండు పుష్కరిణులున్నాయి .మొదటిది చాలా పవిత్ర మైంది .పన్నెండు ఏళ్ళ కొక సారి ”మహా మాఘ ”వస్తుంది .అప్పుడు పౌర్ణమి నాడు చంద్రుడు మఖా నక్షత్రం లో ప్రవేశిస్తాడు .శుక్రుడు చంద్రుని తో కలుస్తాడు .లక్షలాది భక్త జనం వచ్చి పుష్కరిణి లో పవిత్ర స్నానాలు చేసి స్వామిని దర్శిస్తారు .అంటే పుష్కరానికి ఒక సారేమహా మాఘ ఉత్సవం జరుగు తుంది అన్న మాట .అదీ విశేషం .
  చిదంబర రహస్యం
  పంచ తత్వ లింగాలలో ”ఆకాశ లింగం ”ఉన్న పవిత్ర క్షేత్రం చిదంబరం.ఇక్కడి నట రాజా దేవాలయం నాట్య శాస్త్ర ప్రాముఖ్యత కలిగింది .ఆలయం ఫర్లాంగు పొడవు ,ఫర్లాంగు వెడల్పు ఉంటుంది .చక్కని కను విందు చేసే శిల్పాలు ఆకర్షిస్తాయి .శతాబ్దాలు గడ   చినా రంగు మారని  చిత్ర కళా రహశ్యం అబ్బుర పరుస్తుంది .నట రాజా ఆలయం ఆరు అడుగుల ఎత్తు మండపం .అంత రాలయం ,గర్భాలయం ఉంటాయి .మానవ రూపం లో  శివుడు నృత్యం చేసే భంగిమ లో విగ్రహం దర్శన మిస్తుంది .ఇక్కడే శివ లింగం ఉంది .అయినా పూజలన్ని నట రాజా స్వామికే జరగటం విశేషం .
             గర్భ గుడికి కుడి వైపు ఒక గది ఉంటుంది .గుడ్డ తెరలతో చీకటి గా ఉంటుంది .అర్చకుడు తెర తొల గించ గానే ,గోడ మీద బంగారు ఆకుల లాంటి వాటితో ఒక తోరణం వేలాడుతూ ఉంటుంది /శివుడు ఆకాశ రూపం లో ఉన్నాడు అని చెప్పి పూజారి తెర ను మూసేస్తాడు ./అదే చిదంబర రహశ్యం .సృష్టి లో మొదటిది ఆకాశం .దాని నుంచే మిగిలినవి ఏర్పడి,చివరికి అన్నీ ఆకాశం లో అంటే శూన్యం లో చేరి పోతాయి .కనుక ,ఏ తాపత్రయము లేకుండా ,ఆకాశం లాగా మనసు ను నిర్మలం గా ఉంచు కోవాలి .చిత్ అంటే మనసు .అంబరం అంటే ఆకాశం.నిర్మల మైన మనసు ను కలిగి ఉండాలి అని చెప్పేదే చిదంబర రహశ్యం .
నట రాజా స్వామి ఎడమ కాలు కొంచెం పైకి ఎత్తి ,కుడి కాలు వైపుగా మడిచి ,నాట్యం చేస్తున్నట్లు ఉంటాడు .దీన్ని ”భుజంగ త్రాస ”అభినయం అంటారు .ఆయన చేతి లో ఉన్న డమరుకం నుంచి సృష్టి ఏర్పడిందని,అభయ హస్తాలు సృష్టిని రక్షిస్తున్నాయని ,ఎడమ చేతి లోని అగ్ని లయ కారకత్వానికి చిహ్నం అని ,పాదం కొంచెం ఎత్తి ఉండటం వల్ల మోక్షం ఇస్తున్నట్లు సూచన అని శిల్ప రహశ్యం తెలిసిన వారు శిల్పార్ధాన్ని వివ రిస్తారు
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -04 -12 
          camp-charlotte -n.c.-u.s.a. 248-212-0366

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సరసభారతి – అమెరికా డైరి – మూడవ రోజు

మంగళ వారం రాత్రి అమెరికా చేరాం .బుధ వారం అంతా శ్రీ ఎల్లా వారి రేడియో ప్రోగ్రాం
,సాయంత్రం పరిచయ వేదిక తో సరి పోయింది .నిన్న గురు వారం మూడవ రోజూ .ఉదయం ఎల్లా వారు ఫోన్ చేసి మ్-బుధవారం కార్యక్రమం బాగా జరిగిందని ,సంతృప్తి చెందానని నేనిచ్చిన పుస్తకాలు చదివానని చాలా బాగా ఉన్నాయని .తనను రేడియోకు చాలా గొప్పగా పరిచయం చేసినందుకు క్రుతజ్ఞాతలని చెప్పారు .నిన్న మధ్యాహ్నం ఫ్లైట్ లో వారు ఇండియ వెళ్ళారు ..ఈరేడియో ప్రోగ్రాం టి.వి. .ద్వారా అన్ని దేశాలకు ప్రసార మవుతుందట .మొదటి సారిగా అంతర్జాతీయ వేదిక పై నేను మాట్లాడటం మహదానందం గా వుంది .
మధ్యాహ్నం మంచి నిద్ర పోయాం .రాత్రి ఏడున్నరకు మా అమ్మాయి విజ్జి, దగ్గరలో వున్న మంజులత ,రమేష్ వాళ్ళింటికి తీసుకొని వెళ్ళింది .అక్కడ శ్రీ సత్య సాయి బాబా భజన కార్యక్రమం గంటకు పైగా జరిగింది .అంతా యువకులే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లె .దాదాపు ఇరవై మంది యువతీ యువకులు ,ఇద్దరు పెద్ద వాళ్ళు పాల్గొన్నారు .అందరు సామూహిక భజన చేశారు .అంతా బాగా భక్తితో పాడారు .అందరు గొంతు కలిపి పాడటం విశేషం .డోలక్ తప్పెట లతో ఇద్దరు పాటలకు అనుగుణం గా వాయించి ఆనందా ను భూతి ని కలిగించారు .
కంప్యూటరే దైవం గా భావించి జీవించే యువత ,దానికి మించి ఒక అపూర్వ  శక్తి ఈ విశ్వాన్ని నడి పిస్తోందని నమ్మి ,ఆ శక్తిని సాయి బాబా లో దర్శించి ప్రేరణ పొందటం ఆశ్చర్య మేసింది .వారి మనో భావనకు అభినందించాను .
నాలుగైదు ప్రసాదాలను నైవేద్యం పెట్టి అందరికి అంద జేశారు .ఇద్దరు చిన్న పిల్లలు కమ్మగా భజన గీతాలను పాడి ఆకట్టు కోవటం విశేషం .ఇది చూస్తె నా మనసు దాదాపు అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది .మా చిన్నప్పుడు ఉయ్యూరు లో మా గురువు గారుమహన్కాలి సుబ్బరామయ్య గారు ,నరసింహా రావు గారు ముళ్ళ పూడి ఆయన ,ఇత్తడి కొట్టు చంద్రయ్య గారు మా గుడి దగ్గర ఉండే వెంకటేశ్వర రావు జగన్నాధ దాసు గారు నా మిత్రుడు ఆదినారాయణ ప్రతి గురు వారం చేసే భజనలు జ్ఞాపకం వచ్చాయి .ప్రసాదాలు తిన్నంత పెట్టె వారు .మధ్య మధ్యలో కాఫీ టీ లు ఇచ్చ్చేవారు .అప్పుడు ఆది నారాయణ మమ్మల్ని తీసుకొని వెళ్ళే వాడు .మాకు భజన మీద కన్నా ప్రసాదాల మీదే భక్తీ ఎక్కువ గా ఉండేది .భజన ఎప్పుడవుతుందా ?ప్రసాదాలు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూసే వాళ్ళం .ఇన్నేళ్ళకు మళ్ళీ భజన కార్యక్రమం లో అదీ ఒకరింట్లో పాల్గొనటం ఇదే .మా ఆంజనేయ స్వామి దేవాలయం లో భజన్ లలో పాల్గొనటం మామూలే .ఒక్క సారి ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి .ఇక్కడ భజనకు ఆహ్వానించిన మంజులత ,రమేష్ దంపతులుయువకులే .వారి భక్తీ భావానికి ఆనందం గా వుంది .
ఈ నెల ఇరవై ఆరవ తేది శ్రీ సత్య సాయి 86 వ జయంతి అట .అందుకని ఈ లోపు 86 చోట్ల భజనలు నిర్వహించాలనే తలంపుతో ఉత్సాహం గా వీరంతా రోజూ కొకరింట్లో చేస్తుండటం విశేషం .రాత్రి ఇంటికి వచ్చే సరికి తొమ్మిదిన్నర అయింది .ఇలా  గురు వారం గడిచింది
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -13 -04 -12
camp -charlotte -n.c-.u.s.a.—248-212-03-66

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఎల్లలు దాటిన శ్రీ ఎల్లా మృదంగ నాదం

     ఎల్లలు దాటిన శ్రీ ఎల్లా మృదంగ నాదం

నిన్న అంటే బుధవారం 11  వ తేది ఇక్కడి షార్లెట్ ఆంధ్రులకు పర్వదినం. మృదంగ వాద్యం లో అనితర సాధ్యo. ప్రతిభ కనపరచిన  ,పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వ్వర రావు గారు ఇక్కడికి విచ్చేసిన సందర్భం  గా తెలుగు వారు ,సంగీత ప్రియులు .సంగీత,సాహిత్యాభిమానులు వారికి ఘన స్వగాతంపలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు .ఎల్లా వారు వారి అమ్మాయిని చూడటానికే ఇక్కడికి వచ్చినా,ఇక్కడి వారంతా వారిని దర్శించి ,వారితో పరిచయం పొందటానికి మంచి కృషి చేసి ,సఫలీక్రుతూ లయారు .మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక్కడి రేడియో ప్రతి బుధవారం నిర్వహించే తెలుగు కార్య క్రమం లో వారిని ఇంటర్వ్యు చేశారు . శ్రీ మతి నాగమణి ఆ కార్య క్రమాన్ని నిర్వహించారు స్టూడియో లో.కాని ఇంటర్వ్యు మాత్రం అంతా  మా అమ్మాయి వాళ్ళ ఇంటినుంచే జరిగింది ఫోన్ పైన .సరీగ్గా పావు తక్కువ పన్నెండు కు వారు మా ఇంటికి విచ్చేశారు .పట్ట్టు పంచను లుంగి గా కట్టి ,పట్టు లాల్చీ తో నుదుట యెర్రని నిలువు బొట్టుతో ,మెడ లో రుద్రాక్ష మాల,స్పటిక మాలతో ముఖం పై చెరగని చిరు నవ్వుతో ,మూర్తీ భవించిన మృదంగ దేవతలా .వెలిగి పోతున్న ముఖ వర్చస్సు తో శ్రీ ఎల్లా వెంకటేశ్వర రావు గారు మా ఇంట్లోకి ఆడు గు పెట్టారు .నేను ,ఆ అమ్మాయి విజయ లక్ష్మి సాదరం గా స్వాగతం  చెప్పి మేడ  మీదకు వారిని తీసుకొని వెళ్లి కూర్చో బెట్టాం .సరిగ్గా పన్నెండు గంటలకు ఇంటర్వ్యు ను నాగమణి ప్రారంభించారు .నన్ను పరిచయం చేసి ,నా ద్వారా ఎల్లా వారిని శ్రోతలకు పరిచయం చేయమని కోరారు.సంతోషం తో అంగీక రించిన నేను ఇలా ఎల్లా వారిని పరిచయం చేశాను .వారి ప్రక్కనే కూర్చొని  ఫోన్ ద్వారా వారిని గురించి నేను చెప్పిన మాటలు వినండి.-
                  ”గానానికి సహకార వాద్యం గా మాత్రమే ఉన్న మృదంగాన్ని ,ఎన్నో ప్రయోగాలు చేసి ,ఎంతో పెంపొందించి ,సంగీత వాద్యాలలో ఒక స్తితిని ,స్థాయిని మృదంగానికి కల్పించిన ఘనత పద్మశ్రీ  ఎల్లావెంకటేశ్వర రావు గారిదే.మృదంగం పై ఆయన వేళ్ళు  అలా అలవోకగా నాట్య మాడుతూ ,ఎల్లా పలికిస్తారో తెలీకుండా ,అలా ఎలా వాయిన్చారబ్బా అని ఆశ్చర్యం లో మునిగే టట్లు ,చేసే ప్రతిభ ఎల్లా వారిది.మృదంగం భారత దేశానికి మాత్రమే పరిమితమైంది అన్న అప ప్రదను తొలగించి ,,భారత దేశపు ఎల్లలు దాటించి న మార్దంగిక సార్వ భౌములు ఎల్లా వారు .ఎన్ని ప్రయోగాలు /ఎన్నెన్ని ప్రదర్శనలో తలచు కుంటే ఆశ్చర్యమేస్తుంది .ఇది సాధ్యమా అని పిస్తుంది .ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ,తనతో బాటు ,తన మృదంగ విద్యనూ ,శిఖరారోహనం  చేయించి న మహా మార్దంగికులు శ్రీ వెంకటేశ్వర రావు గారు .
మృదంగం తో మార్దవ స్వరాలను పలికించి ,అతి లలిత ధ్వనులను విని పించి ,మాధ్యమం లో కదను తొక్కి ,తారాస్తాయి లోను ,హృదయాలపై నాద స్వరాలను నాట్య మాడిస్తారు. .నాదా మ్రుతాన్ని ఒలికిస్తారు .రస గంగ లో స్నానం చేయిస్తారు .నవ మృదంగ ప్రయోగం లో అనితర సాధ్యం గా నిలిచి ,నాద బ్రహ్మయై ,నవ నాద బ్రహ్మ గా సాక్షాత్కరిస్తారు .ఎల్లా వారి ప్రతిభను ,ఎల్లా వర్నిన్చాగలం /ఎందరో ప్రసిద్ధకర్ణాటక గాయకులకు మృదంగ సహకారం అందించి ,ఆ కచేరీలకు వన్నె ,వాసి కల్పించిన కళా తపస్వి ఎల్లా వారు .
.                  ”ముఖ్యం గా ,ప్రముఖ వాగ్గేయ కారు లైన పద్మ విభూషణ్ శ్రీ మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారి గాత్రం .ఎల్లా వారి మృదంగ సహకారం .అన్నవరపు రామ స్వామిగారి వయోలిన్ తోడూ  వింటే చూస్తే  అదొక రస త్రివేణీ సంగమమే అని పిస్తుంది .రస గంగా ప్రవాహమే అని పించేది .మనసులను  పరవశిమ్పజేయటమే  కాదు పవిత్రతను సంతరించిన మహద్భాయ్గం  ఈ సంగీత విద్వాంసత్రయం కొన్ని దశాబ్దాల పాటు ఆంద్ర సంగీత లోకాన్ని ఏలారు .సుస్వర సంగీత ఝరులనుప్రవహింప జేసి తన్మయులను చేశారు ..ప్రస్తుతం ఎల్లా వారు ఆంద్ర దేశపు సరిహద్దు దాటి .అమెరికా కు వచ్చి న శుభ సందర్భం గా ఇక్కడి సంగీత ప్రియులంతా ,ఎల్లలు లేని ఆనంద ఉత్సాహాలతో వారికి స్వాగతం చెప్పి వారి ముఖతా వారి జీవిత విశేషాలను ,వారు పొందిన సత్కారాలను ,చేసిన ప్రయోగాలను ,సాధించిన విజయాలను ,ఇంకా సాధించాలను కొన్న విషయాలను ,భవిష్యత్ లో వారు చే బట్టే కార్య క్రమాలను వివరం గా తెలుసు కోవాలని ఉవ్విళ్ళూరు తున్నారు ..ఇదంతా ఎల్లా వారి .ఇక్కడి సంగీత ప్రియుల విశాల హృదయానికి దర్పణం .ఎల్లా వారి మృదంగ విన్యాసాలకు ఎల్లలు లేనట్లే వారు పొందిన బిరుదులకు ,అందుకొన్న సత్కారాలకు ఎల్లలు లేవు .ఎల్లా వెంకటేశ్వర రావు గారు భారత దేశానికి ముఖ్యం గా ఆంద్ర దేశ సాంస్కృతిక రాయ బారి గా నేను భావిస్తున్నాను .ఇప్పుడు వారు తమను తాము ఆవిష్కరించుకొని విశేషాలను  అంద జేయ వలసినదిగా కోరుతున్నాను అని చెప్పాను .ఆయనచాలా సంబర పడ్డారు .నాగమణి గారు ఆన్ లైన్ లో వారు చెప్పిన వాటిని శ్రోతలకు అందించారు .చివరికి నేను మళ్ళీ లైన్ లోకి వచ్చి వారు సధించిన విషయాలపై సంతృప్తి పొందారా /భవిష్యత్ ప్రణాళిక లేమిటి?మీ కుటుంబం నుంచి మీ వారసులేవరైనా ఈ విద్యలో రానిస్తున్నారా /అని ప్రశ్నించాను .అన్నిటికి చక్కని సమాధానాలను తెలిపి గంటకు పైగా నడిచిన కార్య క్రమాన్ని రక్తి కట్టించారు .అలవోకగా వారు మాట్లాడిన తీరు శ్రోతలను బాగా ఆకట్టు కొంది. .నాగమణి గారి బృందం అభినంద నీయులు .ఇప్పుడు ఎల్లా వారు చెప్పిన విషయాలను మీకు వివరిస్తాను
.
వారు ముందుగా దుర్గా ప్రసాద్ గారు పరిచయం చేసిన తీరు చాలా బాగుందని ,తానేమి చెప్పాలో దిశా నిర్దేశం చేసి ప్రేరణ కల్గిన్చారని ,చెప్పిన తీరు ఆకట్టు కోనేట్లుందని అని చెప్పారు .  ఎల్లా వారిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర పాల కోడేరు పెదతండ్రి ఎల్లా సోమయ్య గారే వీరి గురువు .ఆ కుటుంబం అప్పటి కే  నాలుగు తరాలుగా సంగీతం లో ప్రాముఖ్యం సంత రిచుకోన్నది .వీరు అయిదవ తరం వారు.నాయనమ్మ గారి ద్వారా ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు ,పాటలు వింటూ సంగీతం పై మక్కువ పెంచుకొన్నారు .తల్లి గారు మహాలక్ష్మ గారు వీరిని కడుపు  తో ఉన్నప్పుడే ఆమె పాడుకొనే భక్తీ గీతాలన్నీ వినిప్రహ్లాదుడు తల్లి గర్భం లో వుండగా నారద మహర్షి చెప్పిన హరి భక్తీ విషయాలన్నీ విని మహా భక్తు దైనట్లు .ఎల్లా వారు కూడా  సంగీతాన్ని తల్లి గర్భం లో ఉండగానే ఒంట బట్టిన్చుకొన్నారు .ఒక వినాయకచవితి నాడు పందిళ్ళ లో జరిగే కచేరీకి మృదంగం వాయించే ఆయన రాక పొతే ఎల్లా వారిని వాయించ మన్నారటఅప్పటికి ఆయన వయస్సు ఏడు మాత్రమెధైర్యం గా వాయించి అందరి ప్రశంసలు పొందారు .అప్పటి నుంచి నాన్ స్టాప్ గా మృదంగం వాయిస్తూనే వున్నారు దాదాపు అర్ధ శతాబ్ది మృదంగ లోకం లో విహరిస్తున్నారు .వాయించి నందుకు మెచ్చి బహుమతులు అంద  జేశే వారట .అది గొప్ప ప్రోత్సాహం గా ఉండేది .ఎందరో ప్రసిద్ధులైన గాయకులకు మృదంగ సహకారం అందించారు .క్రోవి సత్య నారాయణ గారు ,ద్వారం వెంకట స్వామి నాయుడు గారు ,బాల మురళి కృష్ణ వంటి దిగ్దంతుల సభల్లో వీరి మృదంగ విన్యాసం పలు  పోకడలు పోయింది .ఏడవ ఏట ప్రారంభ మైన  కచేరీ యాభై తొమ్మిదవ ఏటి దాకా  అవిచ్చిన్నం గా కొన సాగుతోంది .అంతకు ముందు ఎవరూ  మృదంగం తో సోలో కచేరి చేసిన వారు లేరు .ఎల్లా తో నే అది ప్రారంభమైనది అదీ వారి ఘనత .రోజుకు 16 గంటలు కఠోర సాధన చేసే వారు.ఆ విద్య అంతు చూడాలనీ ఆరాటం వారిని అంత పని చేయించింది .ఇంకో ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే వారు అసలు స్కూల్ కు వెళ్లి చదువు కొనే లేదు .ఆ తర్వాత ఎప్పుడో మృదంగ విద్య లో ఏం.ఏ.పీ.హెచ్.డి.చేశారు.
            మొదటి సారిగా భారత రాష్ట్ర పతి శ్రీ సర్వే పల్లి రాదా కృష్ణన్ చేతుల మీదుగా ప్రధమ బహుమతిగా బంగారు వీణ ను పొందారత. .అది ఆరుగురు రాష్ట్ర పతుల నుంచి పురస్కారాలను పొందిన ఘనత వారిది .అందరుప్రదాన మంత్రుల నుండి బహుతులను స్వీకరించారు .1984 లో అమెరికా లోని నార్త్కరోలిన లో ఉన్న షార్లెట్ కు వచ్చి కచేరి చేశారట .మళ్ళీ ఇదే రావటం .శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి భక్తులు ఎల్లా వార.తన బలం అంతా ఆ అమ్మదనంటారు .ప్రభుత్వం  తో సంప్రదించి ఏం .ఏ.మృదంగ కోర్సు ను ఏర్పాటు చేయించారట .అప్పటికి సిలబస్ అనేది లేదు వీరే సిలబస్ ను తయారు చేసి అందించారు.ఆ ఘనత ఎల్లా వారిదే .ఎన్నో విశ్వ విద్యా లయాలలో మృదంగ విద్యను ప్రవేశ పెట్టించారు .కోర్సులను ఏర్పాటు చేసి పర్య వేక్షిస్తున్నారు .నిరంతరం అదొక తపస్సు గా కొన సాగిస్తున్నారు .వీరి పరిశోధనకుమొదటి స్థాయి జాతీయ బహుమతి పొందారు ఘన సత్కారం జరిగింది .తానొక బాల మేధావిని అనిఆయన చెప్పు కొన్నారు .లేకుంటే ఇంత విద్య తనకు సాధ్య మ యేది కాదంటారు
.            
ఇప్పుడు వారు చేసిన ప్రయోగాల గురించి తెలుసు కొందాం -మొదటి సారిగా 30 వాద్యాలతో శివ తాండవం చేశారు .దీనికి అంతర్జాతీయ బహుమతి పొందారు .ఆది శంకరా చార్యుల వారి స్తోత్రాలకు సంగీతాన్ని సమకూర్చి మంచి ప్రచారం చేశారు వారికి కీర్తి లభించింది .150 మంది తో త్రివేణి సంగమంఅనే సంగీత నాట్య ,వాద్య సంగీతం తో అద్భుత కళా రూపాన్ని  రూపొందించి పలు  ప్రశంసలందు కొన్నారు .ఇది ప్రత్యక్ష ప్రసారమై అన్దరిని ఆకట్టు కొన్నది హైదరా బాద్ లోని కలిత కళా తోరణం లో మూడు గంటల పాటు సాగిన ఎల్లా వారి కళా సృష్టి .ఇది .              తనకు దేశ విదేశాలలో రెండు వేల మంది శిష్యులున్నారని గర్వం గా చెప్పు కొన్నారు .అందులో పది మంది ఏ వన్   మృదంగ వాద్యకారులున్నారనిఇంతమంది ఇంకే కళా కారునికి లేరని చెప్పారు .1972  నుంచి తన విదేశీ పర్యటన ప్రారంభమైందని ఇప్పటికి 70  దేశాలు పర్యటించానని తెలియ జేశారు . అమెరికా కు పన్నెండు సార్లు వచ్చానన్నారు .
సంగీతం వినటం ఒక కళ   అని ,ప్రదర్శన ఇంకో కళ అనీ ఆ రెండిటి మీద ఇప్పుడు ద్రుష్టి పెట్టి యువకులకు నేర్పు తున్నానని చెప్పారు .వీణా ,వేణువు మృదంగం మాత్రమే భారతీయ వాద్యాల్ని సామ వేదం లో నుంచి సంగీతం జన్మించిందని యజుర్వేదం నుంచి మృదంగా విర్భావం  జరిగిందని వివ రించారు .యెన్.టి.రామా రావు ముఖ్య మంత్రి గా ఉన్న కాలమ్ లో విద్యాలయాలలో సంగీతం నాట్యం నేర్పే ఏర్పాటు చేయించానని అన్నారు .

Posted in సభలు సమావేశాలు | Tagged | 2 Comments

అమెరికా ప్రయాణం

సాహితీ బంధువులకు శుభా కాంక్షలు –
                         దాదాపు పది రోజుల తరువాత మిమ్మల్ని  పల్కరిస్తున్నాను .మేమిప్పుడు అమెరికా లో ఉన్నాం .నేను నా భార్య ఇద్దరం ఈ నెల నాల్గవ తేది రాత్రి ఉయ్యూరు లో బయల్దేరి అయిదు ఉదయం హైదరాబాద్ కు మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి చేరాం .మర్నాడు ఉదయం మా క్కయ్య ,బావ లను బోయినపల్లి లో వాళ్ళింట్లో కలిశాము .అంతకు ముందు మా కుటుంబ డాక్టర్ ఛి యాజీ ని విజయ నగర్ కాలని లో క్లినిక్ లో కలిసి మామూలు హెల్త్ చెకప్ చేయిన్చుకోన్న్నాం .ఆ తర్వాత ,ఉయ్యూరు గ్రామస్తులు ,ప్రతుత అమెరికా నివాసి ,35 ఏళ్ళకు పైగా ప్రపంచ బాంక్ లో అత్యున్నత స్తాయి లో పని చేసి ,రిటైర్ అయి ,ప్రతి సంవత్సరం ఇండియా వస్తు ,జన్మ భూమి పై ఉన్న అభిమానాన్ని కాపాడు కొంటు ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక శాస్త్ర వేత్త శ్రీ ఆరిక పూడి ప్రేమ్చంద్ గారిని దర్గా కు దగ్గరలో ఉన్న విస్పర్ వాలీ లో ,ముందు అనుమతితో కలిసాము .నేను నా భార్య ,పెద్ద కోడలు ,మనవడు భువన వారినీ వారి సతీమణి గారిని సందర్శించం .చాలా ఆదర పూర్వక స్వాగతం పలికారు .మేము అమెరికా వెళ్తున్న సంగతి అంతకు ముందే వారికి తెలియ జేశాను .వారు చాలా ఆనందించారు .ఒక అరగంట వారింట్లో గడిపి ,బాచుపల్లి లో ఉన్న మా రేదో అబ్బాయి శర్మ వాళ్ళింటికి వెళ్లి భోజనం చేశాం .సాయంత్రం వోల్డ్ బోయిన్ పల్లి లో ఉన్న మా అక్కయ్య బావలను కలిసి ఆశీర్వాదం తీసుకొని రాత్రి మా శాస్త్రి వాళ్ళింటికి చేరాం .
తొమ్మిది తెల్ల వారు ఝామున నాలుగు గంటల కతార్ ఫ్లైట్ లో బయల్దేరి దోహా న్యూయార్క్ ల మీదుగా పదవ తేది మంగళ వారం రాత్రి నార్త్ కరోలిన లో ని చార్లోట్టే కు అంటే మా అమ్మాయి వాళ్ళింటికి రాత్రి తొమ్మిది గంటలకు  కులాసా గా చేరాం .ప్రయాణం హాయిగా జరిగింది .మా ఆవిడకు వీల్ చైర్ ఏర్పాటు ఉండబట్టి ,ఎక్కడి కక్కడ వేగం గా పనులు పూర్తి  అయాయి .చాలా శ్రద్ధ వహించారు అన్ని చోట్లా.వారందరికీ ప్రత్యెక ధన్య వాదాలు తెలియ జేయాల్సిందేమా ఆవిడ వి .సి .అయితె (వీల్ చైర్ )నేను వి.సి.కి ఫాలోయర్ అయాను ..ఎయిర్ పోర్ట్ కు మా అమ్మాయివిజయ లక్ష్మి  అల్లుడు అవధాని మనుమలు శ్రీ కెత్ ,అసుతోష్ ,పియూష్ లు వచ్చారు ..రాత్రి నిద్ర బానే పోయాం ..
ఇవ్వాళ ఇక్కడికి  ప్రసిద్ధ మృదంగ విద్వాంసులు పద్మశ్రీ ఎళ్ళా వెంకటేశ్వర రావు గారు వస్తున్నారు .మా అమ్మాయి గారింట్లోనే మధ్యాహ్న భోజనం .సాయంత్రం ఆరు గంటలకు పబ్లిక్ మీటింగ్ .రావటం తోనే మంచి కార్య క్రమం తో ఇక్కడి జీవితం పారంభం అవుతున్నందుకు ఆనందం గా ఉంది .మన సరస భారతి ఇక నుంచి రోజూ మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటుంది .
     మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -11 -04 -12
camp- -షార్లెట్ –నార్త్ కరోలిన –అమెరికా .–001-248-212-03-66

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ఏప్రిల్ 9 వ తేదిన వార్త దిన పత్రిక లో చెలి పేజిలో వచ్చిన వ్యాసం .

 

ఏప్రిల్  9 వ తేదిన  వార్త దిన పత్రిక లో చెలి పేజిలో వచ్చిన వ్యాసం .

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితి మండలి ఉయ్యూరు 266 వ సమావేశం

Sahithi Mandali 266 120415_0001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

హైదరాబాద్ లో మా మజిలి

అమెరికా 9th ఏప్రిల్ బయలు దేరటానికి హైదరాబాద్ వచ్చి ఫామిలీ డాక్టర్ యాజి, ప్రేమచంద్, అబ్బాయి శర్మ వాళ్ళింటికి , అక్క దుర్గ బావ వేవేకానంద గారితో.

This slideshow requires JavaScript.

మనుమలు హర్ష, హర్షిత , భువన్

Posted in సమయం - సందర్భం | 3 Comments

ప్రజా స్వామ్య విజయ సూచి -సూకీ

    ప్రజా స్వామ్య విజయ సూచి -సూకీ 

                                                                          కవిత 
       మాయా మేయ మయన్మార్ లో
నవ శకం ప్రారంభ మౌతోంది .
మిలిటరీ జుంటాను మట్టి కరిపించి
అబల సబలై ప్రజాస్వామ్య పతాకను ఎగుర వేసింది .
మిలిటరీ కోరల్లో నలిగి ,క్రుంగి కృశించిన
బర్మా జనుల పాలిటి ఆపద్బాన్ధవే అయింది .
ఆన్ సాన్ సూకీ సుదీర్ఘ పోరాటం ఫలించింది .
నెల్సన్ మండేలా అనే నల్ల సూర్యుని తర్వాత
ఇంత సుదీర్ఘ పోరాటం చేసిన వీర వనిత
ఎప్పుడు జైలో ,ఎప్పుడు బెయిలో తెలీక
సుదీర్ఘ కాలమ్ చీకటి గుహలో మగ్గింది
మహాత్ముడు ,మండేలా తర్వాత అదే బాటలో
తాను నమ్మిన బౌద్ధ ధర్మ ప్రాతి పదిక మీద
మౌన ,అహింసా యుత   రక్త రహిత శాంతి
పోరాటం చేసి విజయం సాధించింది ..
అస్తవ్యస్త మైన దేశాన్ని సరి దిద్దే సువర్ణావకాశాన్ని
మయన్మార్ ప్రజలు ఆమెకు అప్ప గించి ,విశ్వాసం ప్రకటించారు .
మానవ హక్కుల కోసం ,విశ్వ శాంతి కోసం
ఆమె పడే ఆరాటం , ,చేసే పోరాటం చిరస్మర ణీయం .
ఆమె ముందు ఏ నియంత్రుత్వము  నిలవ  లేక   నీరు కారింది
ప్రపంచ నోబుల్  శాంతి బహుమతి గ్రహీత
వీర ,ధీర వనిత ఆన్ సాన్ సూకీ
,విశ్వ కుటుంబ భవనం  పై
ఎగరేసిన శాంతి పతాక
బర్మా ప్రజల ఆశాజ్యోతి ఆన్ సాన్ సూకీ
నిజం గానే  ప్రపంచ ప్రజాస్వామ్య విజయ సూచీ .

సూకీ –అత్యధిక మెజార్టి తో బర్మా  పార్ల మెంట్ కు   ఎన్నికైన  శుభ సందర్భం గా

గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -04 -12 .

Posted in కవితలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –24 నిప్పు లాంటి పాలేరు -అప్పల సూరి

ఊసుల్లో ఉయ్యూరు –24

                                                     నిప్పు లాంటి పాలేరు -అప్పల సూరి
 మా ఇంట్లో సుమారు ముప్ఫై సంవత్స రాలు గొడ్డు ,గోదా ఉండేవి .పశువులుంటే ,పాలేరు ఉండటం సహజం .పొలాలున్నాయి కనుక మేతకు ఇబ్బంది వుండేది కాదు .స్వంత వ్యవసాయం చేయక పోయినా ,పశువుల మేతకు ,మా చిన్న తనం లో కొరత లేదు .ఎక్కడైనా పచ్చని మేత దొరికేది .చెరుకు సీజన్ లో చెరుకు దవ్వ కనీసం ఆరు నెలలు గ్రాసం .బాగా ఇష్టపడి తినేవి గొడ్లు .ఒక రకం గా చెప్పాలంటే గొడ్లకు బలే తియ్యని రోజులు కే.సి.పీ.పని చేసిన రోజులన్నీ .అక్కడికే గొడ్లను తోలు కోని వెళ్లి ,దవ్వ కోసి మేపుకొని వచ్చే వారు పాలేళ్ళు .కడుపు నిండా తిని వచ్చి ,చెంబుల నిండా పాలు పిండేవి  గేదెలు ,ఆవులు .ఇప్పుడు నేను చెప్పినదంతా నా చిన్ననాటి విషయాలు .అంటే సుమారు అరవై ఏళ్ళ కింది మాటలు .
మా నాన్న గారు ,మా అమ్మ ప్రోద్బలం తో ఇంట్లో పాడి కోసం గేదె ను కొన్నారు .ఒకటి రెండైనాయి .వాటికోసం గొడ్ల పాక .మా పక్కిల్లు మా మేన మామ గారిది .వారింటి పక్క మా కు గొడ్ల దొడ్డి ఉంది .అక్కడే పాక ,గడ్డి వాము ఉండేవి . పసుపు లేటి సీతా రామయ్య అనే గొడ్ల బేర గాడు ఉండే వాడు .చాలా మంచి వాడు .మంచి గేదె ను కోని పించాడు .దాన్నే పెద్ద గేదె అనే వాళ్ళం .చాలా అందం     గా ఉండేది .పాలు కూడా ధారా పాతమే .మంచి పాలేరు ను కూడా సీతా రామయ్యే కుదిర్చాడు .అప్పల సూరి అనే తూర్పు కాపుల కుర్రాడు పాలేరు గా కుది రాడు .కుది మట్టం గా లాగు చొక్కాతో నల్లగా గుండ్రని ముఖం తో ఉండే వాడు .దుస్తులను శుభ్రం గా ఉంచుకొనే వాడు .పశువులను అంత శుభ్రం గా ఉంచే వాడు .కడిగిన ముత్యాల్లా మెరుస్తుండేవి .ఎప్పుడు గడ్డి పరకలు పెట్టి ఒళ్ళంతా తుడుస్తూ ఒంటికి పేడ అంట కుండా చూసే వాడు .అప్పుడు చిన్న పాలేల్లకు జీతం ఏడాదికి నాలుగు బస్తాల ధాన్యం .ఒక జత బట్టలు .తిండి మా ఇంట్లోనే .అన్ని పనులు చేసేవాడు . .నిగ నిగ లాడుతూ కని పించే వాడు .మంచి నవ్వు ముఖం .మేము అంటే బాగా ఇష్ట పడే వాడు ”అప్పల సూరి ,అప్పల సూరి ”అని అన్నిటికి వాడినే పిలిచి పని చెపే వాళ్ళం .ఏ పనీ విసుక్కోకుండా చేసే వాడు .అప్పుడు పాలేల్లే వాకిలి ఊడ్చి ,పేడ కలాపు జల్లే వారు . .ఇంట్లో వాళ్ళు ముగ్గులు వేసు కొనే వారు ..మా వాకిలి పెద్దదే .మట్టి .పేడ కల్లాపి జల్లితే పచ్చగా మెరిసి పోయేది .ముగ్గులతో పల్లె టూరి శోభ అంతా కన్పించేది .సూరి మా అందరికి తలలో నాలుక లా ఉండే వాడు .రాత్రి నిద్ర కూడా మా ఇంట్లోనే .మంచి దుప్పటి ,కప్పుకొనే దుప్పటి ఉండేవి .వాటిని వాకిటి అరుగు మీద ఒక మూల చూరు లో దాచుకొనే వాడు ..వాడు భోజనం చేయ టానికి ఒక సత్తు  గిన్నె అడుగున వెడల్పు తక్కువ ,పైన వెడల్పు ఎక్కువగా ,కింద మట్టు తో వుండేది .ఆ రోజుల్లో పాలేల్లందరికి అలాంటి గిన్నె లే ఉండేవి . మంచినీళ్ళ కోసం పొడవైన సత్తు గ్లాసు .వీటిని దొడ్లో దాచుకొనే వాడు .ఒంటి మీద ఎప్పుడు గళ్ళ తువ్వాలుండేది .పని చేసే టప్పుడు నెత్తికి చుట్టూ కొనే వాడు .
చాలా నిదానం గా మాట్లాడే వాడు అప్పల సూరి .పని మాత్రం మహా వేగం .పరుష పదం కాని ,కోపం కాని అసలుండేవి కాదు .అందుకే అందరికి అతనంటే అభిమానం .ఇంట్లో పాలేల్లకు పొద్దున్నే ,రాత్రి వండిన అన్నమే చద్దన్నం గా పెట్టె వారు .ఇంటి పని ,దొడ్డి పని అయి న తరువాతే  వాడికి అన్నం .చక్కగా కుది మట్టం గా కూచునిఆవకాయ  ,లేక మాగాయ ,చింతకాయ గోంగూర పచ్చడి తో చద్దన్నం .మజ్జిగ పోసే వారు .గొడ్ల దొడ్డి ని అతి శుభ్రం గా ఊడ్చే వాడు .ఆ కాలమ్ లో ఊడవ టానికి ”పోలి కట్టలు ”ఉండేవి .చాలా మెత్తగా ఊడవటానికి అడుగు  న వెడల్పుగా ,పైన వెడల్పు తక్కువగా వాటిని కట్టటం ఒక నేర్పు .జారిపోకుండా పూరి కొస  తో అడ్డం గా పాయలు పాయలుగా కట్టే వాళ్ళు .ఇది పాలేళ్ళే కట్టు కొనే వారు .కట్టినవి అమ్మినా దాన్ని సరి చేసుకోవాలి .మా గొడ్ల దొడ్డి చాలా పెద్దది .అక్కడే మూడడుగుల ఇటుక రాతి కట్టడం వున్న నీటి బావి ఉండేది .గొడ్లకు అందులోని నీళ్ళే తోడి, తోట్టేల్లో పోసి తాగించే వారు .వాటిని ఎప్పటి కప్పుడు కడుపు నిండా నీళ్ళు పెట్టె వాడు సూరి .గేదెల డొక్కలు ఎప్పుడు నిండి ఉండటం అతని కాలమ్ లో నే చూసాం .పదింటి కల్లా గొడ్లను విప్పి మేతకు తోలుకొని పోయే వాడు .ఎక్కడ పచ్చదనం ఉంటె అక్కడ మేపే వారు .అప్పుడు మా ఇంటి వెనక చామలి నిండా మోకాలి లోతు పచ్చ మేత ఉండేది .అక్కడ మేపే వారు .వీలయితే కోసుకోచ్చే వారు .కనీసం మూడు గంటలు బయట మేత మేసి ,హాయిగా తిరిరిగి వచ్చేవి గొడ్లు .కాలికి పని బాగా ఉండేది .పుల్లేరు కాలువ లో వాటిని దింపి ,ఒళ్లంతా వరి గడ్డి చెత్తతో తోమి నిగ నిగ లాదేట్లు చేసి ఇంటికి తోలుకొని వచ్చే వాడు .మళ్ళీ మధ్యాహ్న భోజనం చేసే వాడు .పొలం వెళ్లి పచ్చి గడ్డి కోసుకొని వచ్చే వాడు .చాలా పెద్ద మోపు తెచ్చే వాడు .అందారు ఆశ్చర్య పోయే వారు .మోపు ను నెత్తిన పెట్టుకోని ,చేతిలో కర్ర భుజం మీదుగా దానికి ఆసరా గా ఉంచుకొని గడ్డి మోపులు పాలేళ్ళు తేవటం బలే గా చూడ ముచ్చట గా ఉండేది .అలానే తెచ్చేవాడు అప్పల సూరి .గొడ్లకు పచ్చగడ్డి వేస్తూ ,తినగానే మళ్ళీ వేస్తూ  చాలా అపురూపం గా చూసే వాడు .రాత్రి పూట ఎండు గడ్డి వేసే వాడు .చక్కగా పక్క పరి చే వాడు .ఎత్తు పల్లాలు లేకుండా ,పడుకోవ టానికి వీలుగా ఎప్పుడు పారతో చెక్కుతూ చదును గా ఉండేట్లు చేసే వాడు .పేడ ,ఉచ్చ లను కిందికి కారెట్లు చేసే వాడు .ఎప్పటి పేడ కడి అప్పుడే తీసి పేడను పోగేసే వాడు మూడు రోజుల కోసారిఊక తో కలిపి పిడకలు చేసి గోడలకు కొట్టే వాడు .ఎండిన తరువాత ఒలిచి ,నెల మీద తిరగేసి ఆర బెట్టె వాడు .బాగా ఎండిన తర్వాత గూడుగా తయారు చేసే వాడు .ఇంట్లో పాలు కాచుకోవటానికి పిడకలే   వాడే వాళ్ళం .పిడకలు కాలుతుంటే భలే వాసన వచ్చేది .పిడకలు కాలగా వచ్చే కచ్చిక అంట్లు తోము కోవ టానికి ,పళ్ళు తోము కోవ టానికి ఉప యోగించే వాళ్ళం .అందరం కచ్చిక తోనే పళ్ళు తోమే వాళ్ళం .అప్పల సూరి నాన్న ,అమ్మ ల కోసం వేప పుల్లలు పచ్చివి కోసి కట్టగా తెచ్చే వాడు .వాళ్ళిద్దరూ వేప పుల్లతో పళ్ళు తోమే వారు .రాత్రి ఎనిమిదింటి దాకా దొడ్లోకి వెళ్లి ,పశువుల ఆలనా ,పాలనా చూస్తూ అప్పుడు మళ్ళీ అన్నం తిని ,ఒక వారగా వాకిట్లోనో లేక వేసవి కాలమ్ అయితె దొడ్లోనో పడుకొని నిద్ర పోయేవాడు .తెల్లవారుజ్హామున అయిదింటికే లేచి పనిలో  దిగే వాడు .ఒకటి రెండు కేకలకే నిద్ర లేచేవాడు .ఇల్లు ఊడవటం కూడా అతనే చేసే వాడు .వంట ఇల్లు ,పదమ టిల్లు లోకి రానిచ్చే వారు కాదు. సావిడి హాలు ,గది మాత్రం కొబ్బరి లేక పూచిక లేక కుంచె చీపురు తోనే ఊడ్పు .పోలి కట్టలు దొరక్కపొతే  తాటాకు చీపుళ్ళు ఉండేవి గొడ్ల దొడ్డి ఊడవ టానికి .బాగా వంగి ఊడవలసి వచ్చేది. గొడ్ల దొడ్లో రొచ్చు కంపు అసలుండ కుండా చేసే వాడు సూరి ..పాలు ,మేత ,పిడకలు ,శుభ్రత ,అన్నీ అతని టైం లో బాగుండేవి .
సూరి కి నాన్న లేడు .అమ్మ వారానికో సారి మా ఇంటికి వచ్చి వాడి యోగ క్షేమాలు విచారించేది .మంచి మాటలు వాడికి చెప్పేది .ఆమె నల్లగా ,పొడుగ్గా ,ముక్కుకు ,చెవులకు ఇత్తడి ఆభరణాలతో వుండేది తెల్ల బట్టలు కట్టేది తూర్పు యాసతో మాట్లాడేది .తల తిప్పుడు  .చాలా మర్యాదగా ఉండేది .అతని అన్నయ్యలు గంగయ్య ,రామా రావు లు వంగల దత్తు గారిదగ్గర పెద్ద పాలీళ్లు గా పని చేశారు .వాళ్ళిద్దరి భార్యలు చాలా మంచివాళ్ళు ..ఇంటికి వచ్చి అతని సంగతులు తెలుసు కొనే వారు .ఇంకో అన్న రామా రావు కట్టెల అడితి లో కట్టెలు కొట్టే వాడు .మంచి బలిస్తుడు .తర్వాతవాడు కనకా రావు .కొంతకాలం పాలేరు తనం చేసి ,చివరికి టైర్   చక్రాల బండి మీద బిస్కట్లు వగైరా అమ్మే వాడు .సూరి పెద్దన భార్య పచ్చగా పెద్ద బొట్టు తో పెద్ద ముత్తైదువు లా ఉండేది .ఇప్పటికి ఎక్కడ కని పించినా పలకరించి ,ఆప్యాయం గా మాట్లాడుతుంది .మా అమ్మ పాలేల్లను చాలా శ్రద్ధ గా చూసేది .కడుపు నిండా తిండి పెట్టేది .సినిమా లకు వెళ్ళ టానికి డబ్బు లిచ్చెది .సంక్రాంతి ,దసరా ,వీరమ్మ తల్లి తిరు నాళ్ళ లోపాలేల్లకు మామూళ్ళు ఇచ్చేది .వాళ్ళంతా ఆమ్మ గారు అమ్మ గారు అంటూ నాన్న ను అయ్యా గారు ,అయ్యా గారు అంటూ ఎంతో మర్యాదగా ఉండేవారు .క్రమంగా గేదెలు ,ఆవులు చేరాయి .అన్నిటిని జాగ్రత్త గా చూసే  వాడు సూరి .కబుర్లు బాగా చెప్పే వాడు .పాటలు పాడే వాడు .అక్కయ్యలతో కబుర్లు బాగా చెప్పే వాడు .వాడు మాట్లాడుతుంటే ముచ్చటగా ఉండేది .తల ఒంచుకొనే ఉండే వాడు .అంత మర్యాద .ఏ పనీ చెప్పించుకొనే వాడు కాదు .అన్నిటికి ముందుండే వాడు .ఒడ్లు మర పట్టించాలంటే మేమెవరం వెళ్ళక్కర్లేదు .అన్నీ వాడే చూసే వాడు .మా ఇంట్లో చాలా మంది ఉండేవారం .అందరికి ఇంటి దొడ్డిలో నీళ్ళు తోడి గంగాళాలు ,కాగులు ,బకెట్లు ,గుండిగలు ఎప్పటికప్పుడు నింపి సిద్ధం చేసే వాడు .అందరికి తలలో నాలుక గా మెసిలే వాడు .దాదాపు నాలుగైదేళ్ళు మా దగ్గర పాలేరు తనం చేశాడు .ఆ తర్వాత చాలా మంది పాలేళ్ళు పని చేశారు కాని మా కుటుంబం మాత్రం అప్పల సూరి ని మరిచి పోలేదు .గొడ్లు ఇల్లు ,మనుషులం అందరం అతని పనితనానికి అబ్బుర పడే వాళ్ళం .అతనుమానేసినా అతన్ని గురించే చెప్పు కొనే వాళ్ళం .నిజాయితీకి మారు పేరుగా ,ప్రవర్తనకు నిప్పుగా అప్పల సూరి వున్నాడు .పెళ్లి చేసు కొన్నాడని తెలిసింది .తరువాత ఏమి జరిగిందో తెలీదు కాని అకస్మాత్తుగా చని పోయాడని తెలిసింది .దురదృష్ట వంతుడు అప్పల సూరి .మాకు ఉప యోగ పడి నట్లు ,వాళ్ల కుటుంబానికి ఉపయోగ పది ఉంటె ఎంతో బాగుండేదని పిస్తుంది .
మా దగ్గర ఆ తరువాత పని చేసిన పాలేళ్ళలో అప్పారావు కూడా జాగ్రత్తగా చేశాడు .ఎర్రగా ఉండి  మంచితనం గా ఉండేవాడు .అప్పటికి ఇంటి దగ్గర భోజనాలు తీసేసాం .అరవై ఏళ్ళ పల్లె  రాఘవులు ,కొడుకుశ్రీ రాములు  కొంత కాలమ్ చేశారు .రాఘవులు కు ఇరవై బస్తా లిచ్చే వాళ్ళం .కృష్ణ అనే గౌల్ల కుర్రాడు చలాకీ గా చేసినా ,పని దొంగ ,మాటకారి .వాడి టైం లో గొడ్లు చాలా ఇబ్బందులు పడ్డాయి .తరచుగా మేతకు తోలుకొని వెళ్లి వదిలేసే వాడు .అవి పారి పోవటం లేక బందెల దొడ్లో పెట్టటం జరిగేది .వాడే వెతుక్కోచ్చే వాడు .వాళ్ల అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు .వీడి ఆకతాయి తనానికి బాధ పడే వాళ్ళు . ఒక సారి వాడి ని భరించలేక కిందపడేసి బెల్టుతో బాది పారేశాను .అమ్మా అయ్యా అంటూ విపరీతం ఏడ్చి దెబ్బలు తట్టు కోలేక ఆరడుగుల గోడ అమాంతం దూకి పారి పోయాడు .ఇక రాడేమో ననుకోన్నాం .మర్నాడు వాడి మేన మామ వచ్చి క్షమించమని చెప్పించిపనిలో మల్ల్లీ చేర్పించాడు ..ఉయ్యూరు కాటూరు పొలాలకు  వెళ్లి మేత కోసుకొని వచ్చే వాడు కాని రెగ్యులర్ గా వక్చెది  లేదు .నరసింహ నే అతను నిజాయితీ గా చేశాడు అతను పెద్ద పాలేరు .అతని కాలమ్ లో వరి, అపరాలు విపరీతం గా పండాయి .నేను దగ్గర లేక పోయినా పొలం  పనులన్నీ పురమాయించి బాగా చేసే వాడు .మల్లిగాడు భోజనం ,పడక తో సహా పాలేరుగా పనిచేశాడు .కబుర్ల పోచికోలు . ,.రాశులకు రాసులు తినే వాడు .పనిఅలానే  చేశాడు .గొడ్లను బానే చూశాడు .ఆ తర్వాత, ముందు కొందరు చేశారు కాని ఎవ్వరు సంతృప్తి కలిగేట్లు చేయలేదు .క్రమంగా గొడ్లను మేపటం కష్టమైంది .తిరిగే చోటు తగ్గి పోయింది .మేత ఖరీదైంది .వాటి దానా రెట్లు పెరిగి పోయాయి .అన్నీ పెట్టినా పాలు ఇచ్చేది తక్కువ .పిల్లలంతా చదువులకు వెళ్ళారు .వాటి పాలు తీయటం తాగ లేక పందారాలు చేయటం  ఇక కుదరని పని అనుకోని క్రమంగా తగ్గించే శాం .పాలేళ్ళు దొరకటం కష్టమైంది .దొరికినా చేసే వాడు తక్కువ .ఇదంతా విసుగని పించింది .ఎప్పుడు వాటి యావే .వాటికి మేత వేశారా ,నీళ్ళు పెట్టారా జనప కట్ట కోసి వేశారా ,రాత్రి ఎండు గడ్డి బాగా వేశారా ,పచ్చిమేత ,,దవ్వా తెస్తున్నారా అని ఆరాలు .ఇలా వుండగా  అవి దొడ్లోంచి పారి పోవటాలు .చాలా చికాగ్గా ఉండేది .దొడ్డిన్నిండా పెద్ద గడ్డివాము .వాటిలో జానప కట్టలు .ఆ వాసన బలేగా ఉండేది కమ్మని వాసన . తౌడు ,చిట్టు బస్తాలకు బస్తాలు కొనే వాళ్ళం .రెండు కలిపి పెద్ద డ్రమ్ములో పోసే వాళ్ళం .చిక్కని  కుడితి గేదెలకు ,ఆవులకు పెట్టించే వాళ్ళం .అప్పల సూరి పిల్లి పిసర్లు,ఉలవలు కలిపి  రుబ్బి కుడితి లో కలిపే వాడు. బాగా పాలిచ్చేవి గేదెలు ..ఉలవల దాలి వేసి ఉడికిన ఉలవాలను బలం కోసం పెట్టె వాళ్ళం ..ఇదో భోగం .దానా బస్తాలు కొనే వాళ్ళం .యంత తిన్నా ఇచ్చే పాలు తక్కువ .తాగే వారూ  లేరు.ఇలాంటి స్తితిలో దూడల్ని ఎవరైనా కావాలి అని అడిగితె ఇచ్చేసే వాళ్ళం .మొదట కొన్న పెద్ద గేదె సంతానం నిర్విఘ్నం గా చాలా కాలమ్ కొన సాగింది .పెద్ద పడ్డ ,చిన్న పడ్డ ,చిన్న గేదె బండ గేదె ,కొమ్ముల గేదె ,యెర్ర గేదె ఇలా ఎన్నో మా దొడ్లో మాకు కనులకు విందు చేసి ఆనందాన్నిచ్చాయి .హాస్పేట్ నుంచి మా అన్నయ్య ఆవు దూడ వచ్చాయి .అవి మైసూర్ జాతివి .వాటి అసంతానం కూడా చాలా కాలమ్ కొన సాగింది .పెయ్య దూడలకంటే జెర్సీ మగ దూడలు పుట్టాయి .రోగాలు ,రోస్తులు /కాటూరు పొలం చేసిన సీతా రామయ్యకు ఒకజెర్సీ  కోడె దూడను ఇచ్చేశాను .అతనికి బాగా దానితో కలిసి వచ్చింది .ఎప్పుడు అది బుసలు కొట్టుతూ మీదకు దూకుతుండేది .ఇదీ మా పశు పరిశ్రమ .కంకిపాడు సంతలో లేక పొతే గుడ్ల వల్లేరు సంతలో పశువుల్ని కొనే వాళ్ళం .అక్కడ అంతా  మాయ బేర గాళ్ళు .ఒక్క సీతా రామయ్య తప్ప నిజాయితీ గా బేర గాల్లుండే వారు కాదు .ఇదీ మా పశువుల  పెంపకం ,యాజ మాన్యమూను . .౩౦ ఏళ్ళు పైగా  పశువుల ను అజమాయిషీ చేసినా మాకు నచ్చిన వాడు ,మేము మెచ్చిన వాడు అయిన పాలేరు అప్పల సూరి ఒకడే అని మళ్ళీ మళ్ళీ చెబుతాము .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -04 -12 .
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 2 Comments

ఈ దేశం లో మళ్ళి బౌద్ధం కోసం ,,,

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ హనుమత్ కధా నిది – పుస్తకా విష్కరణ – వార్తా పత్రికలలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దశోపనిషత్ సారం —7 -చివరి భాగం

దశోపనిషత్ సారం —7 -చివరి భాగం 

                                                         09 -ఛాందోగ్య ఉపనిషత్
   సామ వేదానికి చెందింది ఈ ఉపనిషత్. ”తత్వ మసి  ”అనేది ముఖ్య విషయం . .ఎనిమిది ప్రపాథకాలున్నాయి .ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతి పత్తి -మూడవ పాతకం లో ”సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జా నీతి శాంత ఉపాసీత ”అని బోధింప బడింది .దృశ్య ప్రపంచం అంతా పర బ్రహ్మమే .దాని వల్లనే సృష్టి ,స్తితి ,లయాలు జరుగు తున్నాయి .”ఏకస్మిన్ విదుషి భుక్తే సర్వం జగ త్రుప్తం భవతి ”అంటే జ్ఞాని త్రుప్తుడైతే ,జగత్తంతా తృప్తి చెందుతుంది .
శ్వేత కేతువు తో తండ్రి ఉద్దాలకుడు ”తగిన గురువు వద్ద వేదాధ్యయనం చేయి ”అన్నాడు .విద్య నేర్చి గర్విష్టి యై తండ్రి దగ్గరకు వచ్చాడు .”ఏది తెలిస్తే అన్నీ తెలుస్తాయో ,దేనిని వింటే అన్నిటినీ విన్నట్లో ,దీనిని ఊహిస్తే సర్వాన్ని ఊహించినట్లో ”అలాంటి విద్య నేర్చావా ?అని అడిగాడు .లేదని చెప్పాడు కొడుకు .తానే వివరం గా బోధించాడు .మట్టి తో చేసిన వస్తువు మట్టి కన్నా వేరు కాదు .కుండ నామ మాత్రమె .సత్యమైనది మన్ను .మన్ను విషయం తెలిస్తే వాటి లోంచి వచ్చిన అన్ని విషయాలు తెలుస్తాయి .ఈ దృశ్య జగత్తు అంతా పూర్వం ”సత్ ”గా ఉండేది .అది ”ఏక మేవా ద్వితీయం ”అంటే ,సజాతీయ ,విజాతీయ భేదాలు లేనిది .దాని లోంచి అన్నీ వచ్చాయి .వీటి నామ రూపాలు తీసేస్తే బ్రహ్మ పదార్దమే మిగులు తుంది .కనుక బ్రహ్మను తెలుసుకొంటే జగత్తు తెలిసి నట్లే .ఆ సద్వస్తువే జాల రూపం పొందింది .దాని లోంచి పృథ్వి ,దాని నుంచి పంటలు ,వచ్చాయి .కనుక మూలం సత్ .దాని వల్లే సృష్టి జరిగింది .
చరా చర భుతాలన్ని అన్డజాలు ,జరాయుజాలు ,,ఉద్భవించాయి .కనుక జీవులన్నీ సత్ రూపమే  .తేజస్సు ,జాలం ,పృథ్వి ,”త్రివ్రుట్ కరణం ”చేయ బడి నాయి .ప్రతి భూతాన్ని రెండు భాగాలు చేసి ,ఒక భాగం అలానే ఉంచి ,మిగతా సగాన్ని రెండు భాగాలు చేసి ,ప్రతి భూతం యొక్క పెద్ద భాగం లో ఇతర భూతాల చిన్న భాగాలను కలపతామే ”త్రివ్రుట్ కరణం ”.దీని వల్లనే అగ్ని లోని ఎరుపు ,త్రివ్రుట్ కృతం కాని తేజోరుపం ,,దాని లోని శుక్ల రూపం ఏర్పడు తాయి .త్రివ్రుట్ కృతం కాని జలరుపం ,కృష్ణుని వర్ణం త్రివ్రుట్ కృతం కాని పృధ్వీ రూపం .అంటే అగ్ని ,ఆ భూత త్రయానికి భిన్నం కాదని భావం ..పురుషుడు తిన్న అన్నం జథారాగ్ని  చే పచనమయి మూడు భాగాలవుతుంది .స్తూల ,మధ్యమ ,శూక్ష్మం .స్తూలం  పురీషం గా బయటకు పోతుంది .మధ్యమ భాగం మాంసమవుతుంది .సుక్ష్మ భాగం మనస్సు అవుతుంది .జలం కూడా అంతే .స్తూలం మూత్రం గా ,మధ్యమం రక్తం గా ,సూక్ష్మం ప్రాణం గా మారుతుంది .మిగిలిన వాటి లో స్తూలం  ఎముక గా ,మధ్యమం మజ్జ గా ,సుక్ష్మం వాక్కు గా మారుతుంది .రక్త మాంసాదులు పృధివి ఆపం ,తేజో త్రివ్రుట్ కారణాలే .
అన్నం యొక్క సుక్ష్మ భాగం మనసు ను చేరి షోడశ కళలు గా మారుతాయి .అవే దర్శన ,శ్రవణ ,మననాలు .మానసిక వీర్యం గల పురుషుడు ”షోడశ కళా ప్రపూర్ణుడు   ”.మనస్సు అన్న మయం .అన్నం తింటేనే మనసు ద్రుధం అవుతుంది .  .”సత్వాత్  సంజాయతే జ్ఞానం ”అన్నారు అందుకే .సుషుప్తి స్తితి లో జీవుడిని ”స్వపితి ”అంటారు .అంటే సత్  అనే పదార్ధం తో ఏకం అవుతున్నాడని అర్ధం .పక్షి కాలికి తాడు కడితే ,అది తిరిగి తిరిగి అక్కడికే చేరుతుంది .అలాగే జీవుడు కూడా .జీవుడు మనసు ద్వారా కలిగే అనేక కామాలు అనే జాగ్రత్ స్వప్నా లలో ఎగ బడి సుఖాలను భావించి ,విశ్రాంతి లేక ,సుషుప్తి లో తన నిజ స్వరూపం తో అంటే సత్ తో  ఏకీభవించి ,నిజ మైన విశ్రాంతి పొందుతున్నాడు .పురుషుడు మరణిస్తే ”వాక్కు -మనసులో చేరుతుంది .మనసు ప్రాణాన్ని ,ప్రాణం తేజస్సు లో ,చేరుతాయి .ఇదే ”తత్వమసి ”.కనుక సత్ పదార్దమే శరీరం లో ప్రవేశించి ,జీవుడు గా వ్యవహరింప బడు తున్నాడు .జీవునికి ,బ్రహ్మానికి అద్వితీయమే .అంటే రెండు ఒకటే అని ఈ ఉపనిషత్  సారం .
  10 -బృహదారణ్యక  ఉపనిషత్ 
ఇది శుక్ల యజుర్వేదానికి చెందింది .పరిమాణం లో ,అర్ధ గౌరవం లో గొప్పది కనుక ఆ పేరు .అరణ్యం లో పథనం చేశారు  కనుక ఆరణ్యకం .
వాజసని పుత్రుడు ,వైశంపాయనుని శిష్యుడు ,అయిన  యాజ్న వల్క్యుడు గురువు గారి ఆగ్రహానికి బలై  నాడు .తన విద్య తనకు ఇమ్మన్నాడు .విద్యనూ అంతటిని భౌతికం చేసి ”వమనం ”చేశాడు .దీనిని ”తిత్తిరి పక్షులు ”భాక్షించాగా ,వాటి ద్వారానే ,వచ్చిన విద్యయే ”తైత్తిరీయ ఉపనిషత్”.యాజ్న్య వల్కుడు మళ్ళీ సూర్యుని నుండి విద్య నేర్చుకొన్నాడు అదే ”శుక్ల యజుర్వేదం ”దానినే ”వాజస నేయం ”అన్నారు .కాన్వ ,మాధ్యందిన శాఖలు గా ప్రచారం పొందింది .ఈశావాస్య ఉపనిషత్ మాధ్యందిన శాఖ కు చెందింది .బృహదారణ్యకం ”కాణ్వ శాఖ ”కు చెందినది .ఇందులో ఎనిమిది అధ్యాయాలున్నాయి .
జనక మహారాజు బ్రహ్మ విద్య నేర్చుకొన దలిచి ,”బహు దక్షినాకం ”అనే యజ్ఞం చేశాడు .ఉత్తమ గురువు ఎవరో తెలుసు కొన్నాడు .100 గోవులను తెప్పించి కొమ్ములను బంగారం తో అలంకరించి ,”మీలో బ్రహ్మ విద్య లో గొప్ప వారు గ్రహించండి ”అన్నాడు .యాజ్న్య వల్క్యుడు  తన శిష్యుడు సామశ్రవ వసువు ”ను గోవులను ఇంటికి తోలుకొని పొమ్మన్నాడు .మిగతా వారికి కోపమొచ్చింది .ఆశ్వలుడు ”నువ్వు బ్రహ్మష్టుడవని గర్వమా ?”అని అడిగాడు .ఆయన ”విద్వాద్వారేన్యులగు బ్రహ్మష్టులకు నమస్కారం .నేను గోవులను అపెక్షిస్తున్నాను .అందుకే అలా చేశాను ”అని వినయం గా చెప్పాడు .అందర్నీ వాక్యార్ధాలతో ఓడించాడు .వారందరూ ఆయన్ను గొప్ప ”బ్రహ్మ వేత్త ”గా తీర్పు చెప్పారు .ఆయన వద్దే జనక చక్ర వర్తి బ్రహ్మ విద్య నేర్చాడు .
ఆరవ అధ్యాయం -ఒక రోజూ యాజ్న్య వల్కుడు జనకుని కొలువుకు వెళ్ళాడు .కారణం అడిగాడు .తాను పూర్వం ;;జిత్వా ”గురువు వద్ద ”వాగ్దేవతయే బ్రహ్మం ”అని తెలుసుకోన్నానని  చెప్పాడు .అది అసంపూర్తి విద్య అని తెలిసినా ,ఆ గురువు పై గురు భావం తగ్గ లేదు అన్నాడు .”మీ గురువు గారు బాగా చెప్పారు .దాని ఆయతనం ,ప్రతిష్టా స్థానం గురించి చెప్పారా “”/?అని అడిగాడు .లేదన్నాడు .అయితె విద్యలో ఒక పాదమే తెలుసుకున్నావు .శిష్యుని ప్రార్ధన తో అంతా నేర్ప టానికి సిద్ధ పడ్డాడు .గో సహశ్రం దానం ఇవ్వ బోయాడు .విద్య నేర్చిన తర్వాతే దానం అన్నాడు యాజ్న్య వల్క్యుడు .జనకుడు తనకు ”ఉదంకుడు ”ప్రాణమే బ్రహ్మం ”అని ,బర్కుడు ఆదిత్యుడే బ్రహ్మం గర్దభీ విపేతుడు శ్రోత్రమే బ్రహ్మం ,అని ,విడగ్ధుడు హృదయ మే బ్రహ్మం ,అని చెప్పారని  అంటాడు .ఇదంతా అసమగ్రం అని తేల్చి సత్య  స్వరూప విజ్ఞానాన్నిబోదిస్తాడు .
 ద్వితీయ బ్రాహ్మణం
కుడి కంటి లోని పురుషుడు ”ఇందుడు ”అతడే ఇంద్రుడు .దీప్తి కలవాడే ఇందుడు .అతనినే వైశ్వానరుని గా ఉపాసించాలి .ఎడమ కంటి లోని వాడు ”పత్ని ”హృదయాకాశం వీరి స్థానం .అక్కడి రక్త పిండం వారి ఆహారం .అక్కడి వలయాకారం గా ఉన్న దోమ తెర వంటిది అక్కడి నుంచి పోయే ఊర్ధ్వ నాడి ,సంచారీ స్తానం .అది అతని శూక్ష్మం గా విభజింప బడి ,చీలి పోతుంది .హృదయం లో ”హితం ”అనే నరాలున్నాయి .అన్నరసం వీటి ద్వారా ప్రసరిస్తుంది .భోక్త్రు రూపమై ,వైశ్వానరుడు భోగ్య రూపమై న విరాట్టు ,ఇంద్ర ,ఇంద్రాణి దంపతులుగా వర్ణింప బడ్డారు .
తైజసుని తూర్పున తూర్పు ప్రాణం ,దక్షిణాన దక్షిణ ప్రాణం ,పశ్చి మాన పశ్చిమ ప్రాణం ,ఉత్త రాణ ఉత్తర ప్రాణం ,ఊర్ధ్వం గా ఊర్ధ్వ ప్రాణం ,అదో భాగం లో అధః ప్రాణం ,సమస్త దిక్కులలో ,సమస్త ప్రాణాలు ఉండటం తో తైజసుడు ప్రాణం తో ఏకత్వం పొందుతాడు .ప్రాణం అంటే ప్రాజ్ఞుడే .నేతి ,నేతి లో తురీయసాక్షీ భావం పొందు తాడు .
తృతీయ బ్రాహ్మణం -పురుషుడు ఏ జ్యోతిస్సుచే వ్యవహరిస్తున్నాడు ?అని జనకుని ప్రశ్న .సూర్యుడు అనే జ్యోతిస్సు వలన ,అస్త మించే టప్పుడు అని మళ్ళీ ప్రశ్న .చంద్రుడు అనే జ్యోతిస్సు తో అని సమాధానం .ఇద్దరు లేనప్పుడు అని ప్రశ్న .అగ్ని ,అదీ లేక పొతే ,వాక్కు ,వాక్కు కూడా లేక పొతే ఆత్మయే .ఆత్మ ఇంద్రియాలలో ఒకటా ?భిన్నమా ?అని మళ్ళీ ప్రశ్న .ఆత్మ విజ్ఞాన మయం .ఇంద్రియ మధ్యగతం .స్వయం జ్యోతి స్వరూపం .హృదయ అంతరస్త  పురుషుడే అని సమాధానం .నది రెండు ఒడ్డుల మధ్య ఈదే చేప లాగ జాగ్రత్ ,సుషుప్తి ల మధ్య లో తిరుగు తాడు .
చతుర్ధ బ్రాహ్మణం -ఆత్మ దుర్బలమై ,బుద్ధి పని చేయక ,స్మ్రుతి తప్పినపుడు ,తేజో రూప మైన ఇంద్రియాలను తనతో తీసుకొని హృదయం చేరతాడు .మరణ కాలం లో కన్ను చూడ లేదు .సూర్యాంశ కనుక సూర్యుని చేరు తుంది .జీవుడు ఏదో మార్గం గుండా ,బయటికి పోవ టానికి ప్రయత్నిస్తాడు .మంచి కర్మ చేస్తే కంటిద్వారా ప్రాణం పోతుంది .ఆదిత్య లోకం వస్తుంది .ఉపాసన చేస్తే శిరస్సు పగిలి ప్రాణం పోతుంది .హిరణ్య గర్భున్ని చేరతాడు .
ఆత్మను విద్య ,కర్మలు పూర్వానుభవం మే బాధిస్తాయి . .ఏ వస్తువు ను కోరుతాడో ,దానికి తగిన కర్మలు చేస్తాడు .-ఫలితం పొందుతాడు .
బ్రహ్మ విద్యకు విరుద్ధ మైన కర్మ మార్గం అవలంబిస్తే అజ్ఞానం లోనే ఉంటాడు .ఆత్మా ఆదిత్యుడు జ్యోతిస్సులన్నిటి కంటే జ్యోతిస్సు .అదే ఆయుస్సు .అంతా ఆత్మ లోనే ప్రతిష్టితం .”అమృత స్వరూప మైన ఆత్మను నేనే ”అనే జ్ఞానం కలవాడు ”అమృతుడు ”ఆత్మ దర్శనానికి మనస్సు సాధనం .బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన జనకుడు ”నా విదేహ రాజ్యం దానం చేసి ,మీకు దాస్యం చేయటానికి నన్ను నేను సమర్పించు కుంటున్నాను ”అని జనక చక్ర వర్తి గురు భక్తి ప్రకటించాడు .
పంచమ బ్రాహ్మణం –యాజ్న్య వల్కునికి మైత్రేయి ,కాత్యాయిని భార్యలు .సన్యసించ బోయి ”ఏమి కావాలి ”అని వారిని అడిగాడు .మైత్రేయి ”అమృతత్వం పొందే విద్య చెప్పండి ”అని అడిగింది .”ప్రతి వాడు తన ప్రయోజనం కోసం వస్తువు ను ప్రేమిస్తాడు .ఆంటే ప్రేమ ముఖ్యం .శ్రవణ ,మననాలతో ఇది సాధ్యం .ఆత్మ నశించదు .విజ్ఞాన ఘన రూపం లో వుంటుంది .ఆత్మ సాక్షాత్కారమే అమృతత్వ మైన ముక్తి .అని జనకునికి  బోధించి ,యాజ్న వల్క్యుడు సన్యాసాశ్రమం స్వీకరించాడు .
ఇదీ బృహదారణ్యక సారం
దశోపనిషత్ సారం ఇంతటి తో సంపూర్ణం .
ఆధారం –శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారు రచించిన ”ఉపనిషత్ కౌముది ”.
ఉపనిషత్తు లకు  తేలిక భాష లో ,ఆహ్లాదం ,ఆనందం కల్గించి తేలిగ్గా అందరికి అర్ధం అయే టట్లు తాత్పర్యం, వ్యాఖ్యానం రాసి, బ్రహ్మ సూత్ర భాష్యానికి తేలికైన వివరణ రాసి ,ఒక యజ్ఞం గా ఆ కార్య క్రమాన్ని పూర్తి చేసి లోకానికి అందించి ,నాకు ఆ పుస్తకాలను స్వయం గా వచ్చి అంద జేసి ,నాలో ఆధ్యాత్మిక అవగాహనను పెంచి, ఉపనిషత్తులపై అవ గహన కల్పించి విజ్ఞాన మయ లోకానికి దారి చూపించిన వారు –  మా రెండో అబ్బాయి శర్మ భార్య ఆంటే మాకోడలు ఇందిరకు మాతామహులు అయిన స్వర్గీయ నోరి శ్రీనాధ వెంకట సోమయాజులు గారికి ఈ ”దశోపనిషత్ సార వ్యాస పరంపరను ”స భక్తికం  గా అంకిత మిస్తూ ,వారికి నాపై ఉన్న అపారమైన ఆప్యాయతకు కృతజ్ఞత తెలియ జేసుకొంటున్నాను .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -04 -12 .—శ్రీ రామ నవమి శుభా కాంక్షలు 
Posted in సేకరణలు | Tagged | Leave a comment

దశోపనిషత్ సారం –6

 దశోపనిషత్ సారం –6

                                    ఐతరేయ ఉపనిషత్
  ఇది ఋగ్వేదానికి చెందింది .30 అధ్యాయాలు ,ఎనిమిది ఖండాలున్నాయి .ఒకటవ అధ్యాయం  మొదటి ఖండం లో సృష్టికి పూర్వం ఆత్మ ఒక్కటే .దాని నుండి నామ రూపాత్మక జగత్తు సృష్టి జరిగింది .ఆత్మ నిజం గా త్రికాలాతీతం ,నిత్యం .దానికి పూర్వ ,పరాలు లేవు .సాంఖ్యులు సృష్టికి ముందు ఏమీ లేదు అంటారు .తార్కికులు పరమాణువులు అంటారు .ఆత్మ ”లోకాన్ని సృష్టిస్తాను ”అన గానే సృష్టి జరిగింది .మాయ అంటే ఆత్మ శక్తిమాత్రమే .ఆ శక్తి విజ్రుమ్భానే ఆలోచించటం మొద లైన క్రియలు .ఆ ఆలోచన ల తో ”అమ్భస్సు ‘,,కిరణం ,మారం ,జలం ఏర్పడ్డాయి .ద్యులోకానికి అవతల అంభో లోకం .కిరణం అంటే అంత రిక్షం .మారం అంటే భూలోకం .అధోలోకాలు జలాలు .అమ్భోజానికి అంటే విద్యుల్లోకానికి పైన మహర్లోక ,జనోలోక ,తపోలోక సత్య లోకాలున్నాయి.వాటి నుండి వర్ష రూపం గా జలం వస్తుంది .కనుక ఇవన్నీ అంభో లోకాలే .సూర్య కిరణాల ఆధారం వల్ల అంతరిక్షం ,మరీచీ లోకం ,ఏర్పడ్డాయి .భూలోక వాసులు మరణ జీవులు కనుక ”మర లోకం ”అన్నారు .మర అంటే మరణం .అడుగున ఉన్నవాన్ని భోగాభుములు అయిన జల లోకాలు .ఆత్మ నుంచి పుట్టిన ఈ నాలుగు లోకాల ద్వారా సృష్టి జరిగింది .లోకాల తర్వాత లోక పాలకులను సృజించాడు .సంరక్షకుడు విరాట్ పురుషుని ,అతని శిరస్సు ,హస్త,పాదం అనే అవయవాలన్నీ పంచ భూతాలే .విరాట్ పురుషుని నుంచి లోక పాలకు లేర్పడ్డారు .
ఆ విరాట్ పురుషుని  ముఖ గోళం ,దానిలో వాగింద్రియాలు ,దాని అధిష్టాన దేవత అగ్ని ,నాశిక గోళం ,ఘ్రానేన్ద్రియం ,అధిష్టాన దేవత వాయువు ,నేత్ర గోళం దర్శనం అధిష్టాన దేవత సూర్యుడు ఏర్పడ్డాయి .కర్ణం -శ్రోత్రిన్ద్రియం .దిక్కులే దేవతలు .చర్మం స్పర్షేన్ద్రియం .ఓషధి వనస్పతులు దేవతలు .హృదయం అంతః కారణ అనే మనస్సు .దేవత చంద్రుడు .సర్వ బంధన స్తానం నాభి విసర్జనేన్ద్రియం మృత్యువు .శిశినం ,రేతస్స్సు జలం ప్రజా పతి .ఇంద్రియ గోళాలు స్తులం .వ్యవహరించే ఇంద్రియాలు సూక్ష్మం అధిష్టాన దేవతల అనుగ్రహం తో యింద్రియ వ్యాపారాలు జరుగు తున్నాయి .
రెండవ ఖండం లో ఇంద్రియాలకు అధిష్టాన దేవత లైన అగ్ని మొదలైన వారు ,తాము నివశించ టానికి తగిన శరీరాన్ని సృస్టించ మని సృష్టి కర్తను ప్రార్ధించారు .గోవులను సృష్టించాడు .పై దంతాలు లేవు పనికి రాదన్నారు .అశ్వాన్ని సృష్టించాడు .విజ్ఞానంలేదు కనుక ఒద్దన్నారు .పురుషున్ని సృష్టించాడు .వివేక సంపన్నం కనుక అందులో ప్రవేశిస్తాం అన్నారు దేవతలు .మానవ శరీరమే మోక్ష సాధనం కనుక అందులో ప్రవేశిస్తా మన్నారు .పురుష శరీరం లో ,ఆయా ఇంద్రియ గోళాల్లో ప్రవేశించమని ఆజ్ఞా పించాడు .అగ్ని -వాగ్రూప లో ముఖం లో ,వాయువు ప్రాణ వాయువు గా నాశిక లో ,సూర్యుడు తేజో రూపం గా కళ్ళలో ,దిక్కులు శ్రోత్రెంద్రియంగా చెవుల్లో ,ఓషధులు ,వనస్పతులు మరో రూపం లో చర్మం లో ,చంద్రుడు మనో రూపం లో హృదయం లో ,మృత్యుదేవత అపాన రూపం గా నాభిలో ,జలాలు రేతస్సు రూపం గా శిశినం లో ,చేరారు .ఇంద్రియ గోళాలు ఆది భౌతికాలు .ఇంద్రియాలు ఆధ్యాత్మికాలు .అగ్ని మొద లైనవి ఆది దైవికాలు .జీవుని ప్రయోజనానికే ఇవన్నీ ఏర్పాటు చేశాడు .
ఆకలి ,దప్పిక ఉన్న వారికి ఆహారం లోనే భోగం కల్పించాడు .ఆహారం చేత తృప్తి పొందితే ఖుత్పిపాసలు కూడా తృప్తి చెందుతాయి .జీవుడు ఈ సంఘానికి అధ్యక్షుడు భోక్త .మూడవ ఖండం లో ఈ దేవత లందరికి అన్నాన్ని సృష్టించినా విధానం ఉంది .దీన్ని గ్రహించ టానికి అపాన వాయువును సృష్టించి పురుషునికి ఇచ్చాడు .అది ,పురుషుని లో చేరి ,తన శక్తి తో అన్నం ముఖం ద్వారం గుండా లోపలి పోయి జతరాగ్ని తో హుతమై మల రూపం లో బయటికి వెళ్తుంది .అపానం అంటే ప్రాణ ఉదాన ,అపాన ,వ్యాన ,సమాన అన్న అయిదు పేర్లతో పిలువ బడే వాయువే .
పరమేశ్వరుడు శిరస్సు ద్వారా ప్రవేశించాలని నిశ్చయించుకొని శిరస్సు చీల్చుకొని ప్రవేశించాడు .ఈ ద్వారాన్ని ”విద్రుతి ”అంటారు .”నందవ ”అనే పేరూ ఉంది .పర మేశ్వరుడు పురుష శరీరం లో జీవుడు అయాడు .ప్రాణ రూపం గా పాదాల్లో చేరాడు .జ్ఞానేన్ద్రియాలన్ని శిరో భాగం లోను ,కర్మేన్ద్రియాలన్ని అదోభాగం లోను ఉన్నాయి .విద్రుతి -సుషుమ్నా నాడి చివరి భాగం .బ్రహ్మాన్ని చేరే మార్గం కనుక దీన్ని బ్రహ్మ రంధ్రం అన్నారు .బ్రహ్మానంద కారణం కనుక ”నందనం ”అని పేరు .జీవుడికి మూడు నివాసాలున్నాయి .జాగ్రత్ కాలమ్ లో నేత్రాలలో ,స్వప్నం లో కంఠం లో ,సుషుప్తి లో హృదయం లో క్రీదిస్తాడు .బ్రహ్మ వర్చస్సు నేత్రం లో కన్పిస్తుంది .దీనికే అవస్తా త్రయం అని పేరు .జ్ఞానం తో తురీయ అవస్త పొంది ,సమాధి స్తితి లో బ్రహ్మానందం పొందుతాడు .అవసాన కాలమ్ లో బ్రహ్మ రంధ్రం ద్వారా ప్రానోత్క్రమణ చేసి ఉత్తమ లోకం చేరతాడు .సుకృతం తో సంసారం మాయ అని తెలుసు కోని ,సాక్షాత్కారం పొంది ముక్తుదౌతాడు .,
బ్రహ్మాత్మిక సాక్షాత్కారం పొందిన జ్ఞాని నిత్య పరోక్ష అఖండ ఆనందాత్మక మైన నిజ స్వరూపాన్ని కనుగొని ,”ఇప్పటికి నేను ఆనందించ గలిగాను కదా ”అనుకోని ఆనందిస్తాడు .అందుచే అతడు ”ఇదంద్రుడు ”అని పిలువ బాదుతాడు .ఇదం అంటే ఈ జీవ బ్రహ్మిక్యాన్ని ద్ర అంటే చూసిన వాణ్ని అని అర్ధం .పరమాత్మ తత్వాన్ని పొందిన వారిని ,ఇదంద్రాదులు ”ఇంద్రుడు ”అంటారు .
రెండవ అధ్యాయం లో జీవుడు ఆహార రూపం లో ”రేతస్సు ”అవుతున్నాడని చెప్పారు .స్త్రీ తో కలిసి నపుడు పిండం ఏర్పడుతుంది .పిత్రుశారీరం ప్రధమ స్తానం .స్త్రీ గర్భం లో చేరి బయటకు రావటం ద్వితీయ జన్మం .పుత్రాత్మక మైన దేహం తండ్రిదే .పుణ్య కర్మ కోసం తన రూపమే అయిన కుమారుడు ప్రతినిధి గా అవసాన కాలమ్ లో ఉంటాడు .శరీరం వదిలి ,ఇంకో దానిలో చేరటం తృతీయ జన్మ .వామా దేవుడు మాత్రు గర్భం లో ఉండే ,”ఆత్త్మ జ్ఞానం తో అజ్ఞానం పోయింది .సంసార బంధం నుంచి తప్పించుకొన్నాను అ”’అన్నాడు .అంటే ప్రతి బంధకం లేక పొతే వెంటనే మోక్షం వస్తుంది .వామా దేవుడు మాత్రు గర్భం లోనే ఆత్మ స్వరూపం టుసు కొన్నాడు .అందుకే మ్రుత్యుగార్భ నివాస మాత్రం గానే సర్వ బంధాలు తొలగి పోయాయి .అజర ,అమృత ,అభయ ,అపూర్వ ,అనపర ,అనంతర ,అబాహ్య ప్రజ్ఞా నామ్రుతైక రస మైన స్వస్వరుప పర మాత్మ భావం పొంది అమ్రుతుడయాడు .మర్త్య భావం పోయి జీవన్ముక్తుడైనాడు .అందుకని ప్రాణ ఉత్క్రమణ లేదు ..అమ్రుతత్వమే లభించింది .
మూడవ అధ్యాయం లో ప్రజ్ఞాన రూప మైన ఆత్మ -శరీరం లో ప్రవేశించి ,హిరణ్య గర్భ ,ఇంద్ర ,ప్రజాపతి ,అగ్ని మొదలైన దేవతలు ,పంచ భూతాలు ,,జంతువులూ ,,సర్పాది అన్దజాలు ,జరాయుజాలు ,స్వేదజాలు ,ఉద్భిజాలు ,అశ్వ ,గో ,పురుషాదులు ,ఏనుగులు ,స్తావరాలు మొదలైన వన్నీ ప్రజ్ఞాన నేత్రాలే .అందుచే ప్రజ్ఞానమే బ్రహ్మ .సర్వ ప్రాణుల్లో ప్రకాశించే చైతన్య స్వరూప మైన ఆత్మ ప్రకాశమే నిర్గుణ పర బ్రహ్మ .ఇది తెలిసిన వామ దేవాదులు అమ్రుతులయారు .
చివరి భాగం గా ఛాందోగ్య ,బృహదారణ్యక ఉపనిషత్ లను తరువాత తెలియ  జేస్తాను
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -04 -12 .చైత్ర శుద్ధ నవమి -ఆది వారం -శ్రీరామ నవమి శుభాకాంక్షలతో

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పేర్లు -పేర డాక్స్ కవిత -శ్రీ కొట్టి రామా రావు

   పేర్లు -పేర డాక్స్ 

                                                            కవిత -శ్రీ కొట్టి రామా రావు
-ఆంద్ర సారస్వత సమితి అధ్యక్షులు  -మచిలీ పట్నం 

 అన్నపూర్ణ కుక్కల్ని ఉసి గోల్పుతుంటే -సరస్వతి స్టాంప్ పాడ్ వెతుక్కుంటోంది
లక్ష్మీ దేవి అడుక్కు తింటుంటే -అనసూయ త్రిమూర్తి రావు తో జంప్ జిలాని
భీమ రాజు బలానికి మందు పుచ్చుకుంటుంటే -ధన్వంతరి కీళ్ళ  వాతం తో తీసు కుంటున్నాడు .
సత్య నారాయణ అబద్ధం సాక్ష్యం చెబుతుంటే -ధర్మా రావు న్యాయానికి సంకెళ్ళు వేస్తున్నాడు
బైరాగి మూడంతుస్తుల భవనం తో మురుస్తుంటే -కోటేశ్వర రావు  పైసల కోసం చెయ్యి జాస్తున్నాడు .
భగీరధుడు గోళ్ళు గిల్లు కొంటుంటే -రామ చంద్రుడు పర దార కోసం పహారా కాస్తున్నాడు
ధరలు వింధ్య పర్వ తాలను దాటు తుంటే -నెట్ జీతాలు అగస్త్యుని కోసం ఎదురు చూస్తున్నాయి .
కలెక్టర్ కావాలని కలలు కన్న కొడుకు -బిల్ కలెక్తరైనా కాలేక బికారి గా తిరుగు తున్నాడు
కోరికల చంద మామ శ్రీ మతికి అందించ లేక -ఓదార్పుల పన్నీటి లో ఓలలాడించి
కబుర్ల లడ్డూ లతో కడుపు నింపి -పొద్దు గడు పు కొంటున్న బుద్ధావ తారాలు
ఇవీ ఖర వత్సర లీలలు –చుట్టూ చిక్కు వలలు పన్ను తున్న చీకటి హేలలు
వంచనకు ,స్వార్ధానికి ప్రతీక -గతించిన పాలన
మంచికే ,మాన వత్వానికే రావాలి కాలం -ఈ చీకటి రాక్ష సుణ్ణి కాంతి కిరణాలతో చీల్చి
నీతి ,నిజాయితీ మెట్ల మీద పయనించి -ఆశల శిఖరాన్ని అధి రోహిద్దాం .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in కవితలు | Tagged , | Leave a comment

దశోపనిషత్ సారం –5

దశోపనిషత్ సారం –5

                                                  తైత్తిరీయ ఉపనిషత్ -2 –ఆనంద వల్లి 
బ్రహ్మ -సత్యం ,జ్ఞానం అనంతం .జ్ఞానం అంటే జ్ఞాన స్వరూపమే .ఒకటవ అను వాకం లో అన్నమయ కోశ విచారణ చేశారు .అన్నమయ కోశం పంచ భూతాలతో ఏర్పడింది .ఆకాశం ముందు పుట్టింది .తర్వాత వాయువు ,అగ్ని జలం ,పృథ్వి రూపాలు దాల్చింది .పృథ్వి లో ఓషధులు ,దాని నుంచి అన్నం ,అన్నం  నుంచి పురుషుడు పుట్టారు .అన్నమే సృష్టి  స్తితి లయాలకు కారణం .భూతాలలో జ్యేష్టం .అన్నమే బ్రహ్మ .అన్నం అంటే తిన బడేది ,తినేది .                   రెండ వ అను వాకం లో ప్రాణ మయ కోశ విచారణ జరిగింది .వీనిలో సద్రుప ,చిద్రుపాలు లేవు .కనుక నిజ మైన బ్రహ్మ కాదు .ప్రాణమే శిరస్సు .వ్యాన ,అపానాలు బాహువులు .సమానం దేహం .ప్రాణమే ఆయుస్వరుపం .ప్రాణమే బ్రహ్మ .మూడవ అను వాకం లో మనోమయ కోశ విచారణ చేశారు .ఇదీ అనిత్యమే .యజుర్వేదమే శిరస్సు .రుక్ ,సామాలు కుడి ,ఎడమ చేతులు .ఆదేశమే దేహ భాగం అధర్వనం ఆధారం .సర్వ విద్య లకు ఈ కోశమే ఆధారం .గురు ముఖం గా అధ్యయనం సాగాలి .మంత్రాదిస్తానం వల్ల మనసు స్వాధీన మవుతుంది .దీని వల్లనే బ్రహ్మ పదం వస్తుంది .
నాలుగవ అనువాకం లో విజ్ఞాన మయ కోశం గురించి వివరణ ఉంది .శ్రద్ధ ఏ శిరస్సు .రుతం కుడి చేయి .సత్యం ఎడమ చేయి .యోగమే శరీరం .మహస్సు ఆధారం .విజ్ఞానం అంటే వేదార్ధ నిశ్చయ జ్ఞానం .శ్రద్ధా ,మానసిక ,వాచిక సత్యత ,యోగం చాలా అవసరం .అయిదవ అనువాకం ఆనంద మయ ,జీవ బ్రహ్మిక్యాన్ని వివరించింది .శిరస్సు ప్రియ మైంది .మోదం దక్షిణ బాహువు .ఆనందం దేహం .బ్రహ్మ ఆధారం .ప్రతి జీవుడు బ్రహ్మమే .బ్రహ్మం లేదు అంటే తానె లేనట్లు .ఇదే జీవ బ్రహ్మైక్యం .అది పొందిన వాడు పూజ్యుడు .బ్రహ్మ వేత్త ,బ్రహ్మ సాయుజ్యాన్ని పొందుతాడు .ఆరవ అనువాకం సృష్టి అంతా బ్రహ్మ స్వరూపమే నని చెప్పింది .సృష్టికి పూర్వం అవ్యాకృత నామ రూపాత్మకం .సృష్టి అయినపుడు వ్యాకృత నామ రుపాత్మకం .భగ వంతుడు సృష్టి రూపం గావ్యక్త మౌతాడు .తనను తానె సృష్టి గా చేసుకొంటాడు .కనుక సృష్టి ”సుకృతం ”.ఏడవ అను వాకం భగ వంతుడు  ఆనంద స్వరూపుడు ,ఆభయమే మోక్షం అని తెలిపింది .జడ రూప మైన సృష్టి లో ”రస స్వరూపుడు ”గా భగ వంతుడున్నాడు .అవాగ్మానస గోచర మైన బ్రహ్మమే తాను అని ”అపరోక్ష జ్ఞానం ”కలిగి నప్పుడు ”అభయ ప్రతిష్ట ‘కలుగు తుంది .ఆస్తితినే మోక్షం అన్నారు .వేరు ,వేరు గ భావిస్తే ‘భయం ”.కలుగు తుంది .భయమే సంసారానికి కారణం . యెనిమిద వ అనువాకం లో ”బ్రహ్మానంద మీమాంస ”వుంది .యువకుడు సాధువై ,విద్యా ,చురుకు దనం , దనం ,మనోబలం ,ఈ ప్రుద్వికి ప్రభువై ఉన్న వారికి ఆనందం మానుషా నందం .తొమ్మిద వ అను వాకం లో పర బ్రహ్మానందం కల వాడు భయ రహితుడు అని చెప్పారు .కార్య రూప భయం ,కారణ రూప జగత్తు భయం అని భయం రెండు రూపాలు .నాల్గవ అను వాకం ద్వారా కార్య రూప భయం లేదు .దీనిలో కారణ రూప భయం లేదు .జగత్తు కార్యం .దానికి కారణం మాయ .లేక అవిద్య ,ప్రకృతి .కార్య రూప మాయను దాటాడు కనుక నిత్య బ్రహ్మానంద అనుభవమే . .భయమే ఉండదు .ఆత్మ జ్ఞానికి పరితాపం లేదు .పుణ్య ,పాపాలు ఆత్మ కంటే వేరు కావు .అంటే అంతా ఆత్మా లోనే కన్పిస్తాయి .
  భ్రుగు వల్లి
ఒకటవ అనువాకం బ్రహ్మ జ్ఞాన బోధ .పంచ కోశ విచారణ జరిగింది .ఇదంతా పితా ,పుత్రా ఆఖ్యాయిక .వరుణుని కుమారుడు భ్రుగువు తండ్రిని బ్రహ్మ విద్య బోధించమని కోరుతాడు .రెండు నుంచి ఆరు అనువాకాలలో భ్రుగువు తపస్సు చేసి అన్నం ,సృష్టి పుట్టుక ,స్తితి లయాలకు కారణం అని అన్నమే బ్రహ్మ అని తెలుసు కొన్నాను అంటాడు .మళ్ళీ తపస్సు చేసి ప్రాణమే బ్రహ్మ అని గ్రహిస్తాడు .తండ్రి కాదు అంటే మళ్ళీ తపస్సు చేసి మనస్సు బ్రహ్మం అంటాడు .విజ్ఞానం బ్రహ్మ నని ,,ఆ తర్వాత ఆనందమే బ్రహ్మమని తెలుసు కొంటాడు .అదే సరైనదని తండ్రి చెబుతాడు .”దీనినే భార్గవీ -వారుణీ విద్య ”అన్నారు .
ఏడవ అను వాకం లో బ్రహ్మ జ్ఞానానికి మొదటి సాధనం అన్నం అని తెలుస్తుంది . అన్నాన్ని నినదించ రాదు   .శరీరం అన్నాద స్వరూపం .ప్రాణం లో శరీరం ఉంది .శరీరం లో ప్రాణం ఉంది .ఇది తెలిస్తే బ్రహ్మ వర్చస్సు లభిస్తుంది .ఎనిమిదవ అనువాకం అన్నాన్ని  పరి హరిన్చరాదని ,జలమే అన్నమని ,.జ్యోతిస్సు అని చెప్పారు .ఉదకం లో జ్యోతిస్సు ప్రతిష్టితం .జ్యోతిస్సు లో ఉదకం ఉంది .ఇది తెలిసిన వారికి అన్న ,పశు ,సంతాన ,కీర్తి వృద్ధి ,బ్రహ్మ వర్చస్సు కల్గుతాయి .తొమ్మిదవ అనువాకం లో అన్నాన్ని  వృద్ధి చేయాలని వుంది .పూజించాలి .పృథ్వి ఏ అన్నం .ఆకాశం అన్నం . .పృథ్వి లో ఆకాశం ఆకాశం లో పృథ్వి ప్రతిస్టితం .ఇది తెలిస్తే కీర్తి వర్చస్సు కలుగు తాయి .
పదవ అనువాకం -ఇంటికి వస్తే విశ్రమించ టానికి వసతి చూపాలి .దీన్ని వ్రతం గా ఆచరించాలి .అతిధి పూజ శ్రేష్టం .వాక్కు లో క్షేమ స్వరుపు డైన భగ వంతుని ,ప్రాణా అపానాలలో యోగ క్షేమ భగ వానుని ,హస్తం లో కర్మ రూప భగ వానుని ,పాదం లో గమన రూప భగ వానుని ,పాయువు లో విసర్జక రూప భగ వానుని ,ఉపాశిస్తే ,అవన్నీ సక్రమంగా పనిచేసి ఆధ్యాత్మిక జీవ నానికి తోడ్పడు తాయి .ఇవన్నీ వ్యవ హారం లో బ్రహ్మోపాసనా విధానాలు .దేవతా స్వరూప బ్రహ్మో పాసన అంటే -వర్షం లో తృప్తి రూప భగ వానుని ,మెరుపు లో బల రూప భగ వానుని ,పశువు లో యశో రూప పర మాత్మను ,నక్షత్రం లో జ్యోతి రూప పర మాత్మను ,ఉపస్థ లో ప్రజా పతిని ,ఆనంద రూపాన్ని ఉపాశించాలి .ఆకాశం లో స్వస్వరుప పరమాత్మను ఉపాసించాలి .గొప్ప వాణ్ని గా ఉపాసిస్తే ,గొప్ప వాడు అవుతాడు .మనసు అని ఉప్పాసిస్తే ,గౌరవం లభిస్తుంది .నమస్కారం గా భావిస్తే ,కోరిక తీరు తుంది .బ్రహ్మ గా ఉపాసిస్తే ,బ్రహ్మయే ఆవు తాడు .లయ రూపుని గా భావిస్తే సర్వ శత్రు సంహారం జరుగు తుంది .
మానవుని లోని తేజస్సు సూర్యుని లో వుంది .తేజస్సు లో భేదం లేదు కనుక జీవ బ్రహ్మైక్యం చెప్ప బడింది .ఇలా జీవ బ్రహ్మైక్య అపరోక్ష జ్ఞానం కల వారు అన్నమయ ,ప్రాణ మయ ,మనోమయ ,విజ్ఞాన మయ ,ఆనంద మయ  పంచ కోశాలు దాటి పరి పూర్ణ బ్రహ్మాండా కారం పొంది ,సర్వ కామ రూపులై సకల విధ ఆనందాలను అనుభ విస్తు ,తమ స్వస్వరుపం ,అత్యాశ్చర్య కరం గా ఉందని ఆశ్చర్యం తో ”హా హా,హా”అని గానం చేస్తారు .తిన బడే అన్నం ,తినే వాడు ,ఏక స్వరూపం గా కన్పించటం చేత ఆశ్చర్యం కలిగిందన్న మాట .సర్వ పూజ్యం ,స్తుత్యం అయిన పర మాత్మ తానే నని దేవతలకు అమృత స్వరూపుడు తానే నని ,సాక్షాత్కారం పొందుతాడు .అన్నార్తునికి అన్నం పెట్టని స్వార్ధుని భగ వంతుడు నశింప జేస్తాడు .అతిధి ,అభ్యాగతులను ఆదరించే వారిని రక్షిస్తాడు .భగ వంతుడు తన స్వర్ణ మయ ప్రకాశం తో విశ్వ మంతా నిండి ,ప్రకాశిస్తాడు అని తెలిస్తే మోక్షమే అంటుంది తైత్తిరీయ ఉపనిషత్ లోని భ్రుగు వల్లి .
దీని తరువాత ఐతరేయ ఉపనిషత్ గురించి తెలియ జేస్తాను .
సశేషం –31 -03 -12 .
Posted in సేకరణలు | Tagged | Leave a comment

దశోప నిషత్ సారం –4

దశోప నిషత్ సారం –4

                              o6– మాండుక్య  ఉపనిషత్  
   అధర్వణ వేదానికి చెందింది .ముక్తికి ఈ ఉపనిషత్ ఒక్కటే చాలు అనే అభిప్రాయం వుంది .ఇందులో జాగ్రత్ స్వప్న సుషుప్తి వ్యవస్థ ల వర్ణన ఉంది .ఓంకారమే సర్వం .భూత భవిష్యత్ ,వర్తమానా లన్ని అదే .ఈ మూడిన్తికన్నా అధిక మైన దేదో ,అదీ ఓంకారమే .బ్రహ్మమే ఓంకారం .సగుణ ,నిర్గుణ బ్రహ్మ లను ఓంకారం ద్వారా నే తెలియాలి .ఆత్మ కు నాలుగు పాదాలున్నాయి .విశ్వ ,తైజస ,ప్రాజ్న ,తురీయ అనే నాలుగు పాదాలు వీటి ఆత్మ పరబ్రహ్మమే .”అయమాత్మా బ్రహ్మ ”విశ్వ అంటే విశ్వా నరుడు .జాగ్రదవస్త ..బాహ్య విషయాలను తెలుసు కొనే కోరిక కల వాడు .శిరస్సు ,నేత్రాలు ,దేహం ,మూత్ర స్తానం ,పాదాలు ముఖం అవయవాలు కల వాడు .అయిదు జ్ఞాన ,అయిదు కర్మేంద్రియాలు ,ప్రాణ ,మనో ,బుద్ధి ,చిత్త ,అహంకారం ,అనే 19 అతని ముఖాలు .వీటి వల్ల శబ్దాది విషయాలు అనుభ విస్తాడు .తైజసుడికి స్వప్నం స్తానం .స్వప్నాను భవం మనస్సు చేస్తుంది .కనుక వీటిని అనుభావిన్వ్చే జీవుడు అంతః ప్రజ్ఞుడు .మానసిక  వాసన లన్ని తేజస్సు వచే ఉద్దీప్తాలై అనుభవింప బడటం చేత తైజసుడయాడు .శుశుప్తి లో స్వప్నాలుండవు .కోరిక లుండవు .అప్పుడే ప్రజ్ఞాన ఘన మాత్రుడు .శుశుప్తి నుంచి జాగ్రద వస్త కు వస్తే ఘనీ భూతాలైన వాసన లన్ని అంకురిస్తాయి .ప్రాజ్ఞుడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు ,సర్వాంతర్యామి  .అయి సకల ప్రానోత్పత్తి ,స్తితి లయాలకు కారణం అవుతున్నాడు .అంటే ఆధ్యాత్మిక ,ఆది భౌతిక ,ఆది దైవిక భేద విశిష్ట మైన ప్రపంచానికి కారణం అతడే .
   తురీయావాస్త లో ఆకారం లేదు .జ్ఞానేంద్రియాలకు అగోచరుడు .కనుక ”అదృష్టం ”.అను మానాదులచే తెలియ బడని వాడు .అచిన్త్యుడు .శివ స్వరూపుడు .ఓంకారానికి ,ఆత్మ కు భేదం లేదు .తురీయాత్మ ఓంకారమే .ఆత్మకు నాలుగు పాదాలే .ఓంకారానికీ నాలుగు అక్షరాలే (మాత్రలే )విశ్వ ,తైజస ,ప్రాజ్న లనే మూడు పాదాలే  అ+ఉ+మ్ కారాలు .ఓంకారం తురీయ మాత్రమైన ఆత్మయే.ఓంకారం ఉపశమనాన్ని స్తుంది .పరమానందాన్నిస్తుంది .ద్వైత రహిత మైనది .ఓంకారం తెలిస్తే ఆత్మ స్వరూపం తెలిసి నట్లే .ఇదీ మాండుక్య ఉపనిషత్ లోని సారం .
  07 –  తైత్తిరీయ ఉపనిషత్ 
               కృష్ణ యజుర్వేదం లో తైత్తిరీయ శాఖ కు చెందింది .దీనిలో మూడు ”వల్లులు ”ఉన్నాయి .బ్రహ్మ విద్యకు అవసర మైన ఉపాసనలు శిక్షావల్లి లో,తపస్సు గురించి భ్రుగు వల్లి లో ,బ్రహ్మ నిర్వచనం బ్రహ్మ వల్లి లో చెప్పారు .
   శిక్షా వల్లి 
  మొదటి అనువాకం లో శాంతి మంత్రం చెప్పారు .రెండవ దానిలో ఉచ్చారణ ,మూడు లో సంహితో పాసన .వుంది .మోక్షానికి పూర్వం చిత్త ఏకాగ్రత ,సత్ ప్రవర్తన ,అవసరం .దానికి ఉపాసనలు తెలిపారు .అక్ష రాలు కూడి అంటే కలిసి వేద రూపం పొందటం సంహిత .ఇవి అయిదు .లోకాలు ,జ్యోతిస్వరుపం ,విద్య ,సంతానం ,దేహం .
ఇకారం లో పృథ్వి ,శే కారం లో ద్యులోక ద్రుష్టి ,,ఆకాశ సంధి ,వాయువు అను సంధానం గా ఉపాశించాలి .మొదటి అక్షరం అగ్ని .రెండవది సూర్య స్వరూపం .ఉదకం సంధి ,మెరుపు అనుసంధానం .గురువు మొదటి అక్షరం .శిష్యుడు రెండ వ అక్షరం .విద్య సంధి విధానమే సంధానం ..తండ్రిమొదటి   అక్షరం ,తల్లి రెండవ అక్షరం .సంతానం సంధి .సంసార ప్రవ్రుత్తి సంధానం .కింది దవడ మొదటి అక్షరం పైది రెండవ అక్షరం .వాక్ సంధి జిహ్వ సంధానం .ఈ అయిదు రకాల ఉపాసనా ప్రక్రియలకు ”మహా సంహిత ”అని పేరు .ఇది చేస్తే ప్రజాభి వృద్ధి ,పశు వృద్ధి ,బ్రహ్మ వర్చస్సు ,స్వర్గ ప్రాప్తి కల్గుతుంది .
                        నాలుగవ అనువాకం లో బ్రహ్మ ,వేదాన్ని విమర్శించి వేద సార మైన ఓంకారాన్ని గ్రహించాడు .అది శరీ రాన్ని ఆరోగ్యం గా ఉంచుతుంది .పరమాత్మ ఉప లబ్ధికి  స్తానం .మనన ,శ్రవణాలతో అనుభవం లోకి తెచ్చుకోవాలి .మేధా సంపత్తి ,దాని తరువాత సంపద కలుగు తాయి .అయిదవ అనువాకం ”వ్యాహృత్ ఉపాసన ”-bhooh ,భువః,సువః ,తో పాటు మహః అనేది నాల్గవ వ్యావ్రుత్తి .bhooh అంటే భూలోకం .భువః అంటే అంత రిక్షం .సువః అంటే స్వర్గం .మహః -సూర్యుడు .సూర్యుడే బ్రహ్మ .bhooh అంటే అగ్ని .భువః అంటే వాయువు సువః అంటే సూర్యుడు .మహః -చంద్రుడు .జ్యోతి స్వరుపాలన్ని చంద్రుని అమృత కళలను పొందుతాయి .bhooh అంటే ఋగ్వేదం ,భువః సామం ,సువః యజుర్వేదం మహః పర బ్రహ్మ .bhooh -రానం ,భువః-అపానం ,సువః -వ్యానం ,మహః-అన్నం ,అన్నం వల్ల అన్నీ అభివృద్ధి చెందు తాయి కనుక అన్నం  పర బ్రహ్మ .ఇలా వ్యాహృతులను 16 రకాలుగా ఉపాశించిన వారికి బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది .చక్ర వర్తి కి లోబడిన సామంత రాజుల్లాగా ఇంద్రియాలన్నీ అతని స్వాధీనం లో ఉంటాయి . 
  ఆరవ అను వాకం లో ”వ్యాహృత్ ఉపాసనా ఫలం ”చెప్పారు .హృదయం లో చిదాకాశం ఉంది .సుషుమ్న మార్గం లో ”వ్రుత్తి ”పవహించి కొండ నాలుక ద్వారా ,బ్రహ్మ రంధ్రాన్ని చేర్తుంది .శిరస్సు ,కపాలం కలిసే చోటే ”బ్రహ్మ రంధ్రం ”.చని పోయేటప్పుడు భోహ్ వలన అగ్ని లోకం ,భువః వల్ల వాయులోకం ,సువః వల్ల సూర్య లోకం ,మహః వల్ల బ్రహ్మత్వం ఒండుతాడు .ఇవి బ్రహ్మ రంధ్రం ద్వారా నిష్కర మిస్తే బ్రహ్మ లోకా వాప్తి మాత్రమే కాక ,స్వస్వరూపానుభావం ,సర్వ మానవ నియంతృత్వం ,దూర శ్రవణం ,దూర దర్శనం ,సమస్త బుద్ధి వ్రుత్తి నియంతృత్వం ,పర బ్రహ్మ భావన ,సర్వ వ్యాప కత్వం ,మనశ్శాంతి పొంది చిన్మాత్ర లో విశ్రాంతి  పొందు తాడు .
   ఏడవ అనువాకం లో ”పాన్క్తో  పాసన ”వుంది .పాన్క్తం అయిదు పాదాలది .పృధివి ,అంతరిక్షం ,ద్యులోకం ,దిక్కులు ,అవాంతర దిక్కులు కలిసి ఒక పాన్క్తం .అగ్ని ,వాయువు ,సూర్యుడు ,చంద్రుడు, నక్షత్రాలు ఒక పాన్క్తం .ఉదకం ,ఓషధులు ,వనస్పతులు ,ఆకాశం ,శరీరం ఒక పాన్క్తం .ప్రాణ ,అపాన ,వ్యాన ఉ ,దాన ,సమానాలు   ఒక పాన్క్తం .చక్షు ,శ్రోత్ర ,మనో ,వాక్ ,త్వక్ లు ఒక పాన్క్తం .చర్మ ,మాంస నరాలు ,ఎముకలు ,మజ్జ ఒక పాన్క్తం .ఇవన్ని స్తూల సూక్ష్మ శరీరాలకు చెంది నవి .ప్రపంచాన్ని ఈ విధం గా అయిదు భాగాలు చేసి ఉపాశించాతమే పాన్క్తో పాసన.
                 యెనిమిద వ అను వాకం లో ఓంకారం విశిష్టత తెలిపారు .యజ్ఞాదులు అన్ని ఓంకార పురస్సరం గా నే జరుగు తాయి .బ్రహ్మ ఓంకారం తోనే ఆమోదిస్తాడు .మంత్రాలన్నీ ఓంకార పురస్సరాలే .వేదాధ్యయనం ,ముగింపు ఓంకారం తోటే .ఓంకారమే ప్రణవం .దాని ఉపాసనే బ్రహ్మత్వం .
  తొమ్మిదవ అను వాకం లో ”స్వాధ్యాయ ప్రవచన విశిష్టత ”వుంది .మానసిక సత్యం తోనే వేదాధ్యయనం చేయాలి .తపస్సు ,దమం ,శమం కలిగి స్వాధ్యాయ ప్రవచనం చేయాలి .సత్యమే గొప్పదని ,”రాదేతరుడు ”తపస్సే అని” ,పౌరుశిస్టి ”స్వాధ్యాయనమే అని మౌద్గల్యుడు చెప్పాడు .త్రేతాగ్ని ఉపాసన ,అతిధి పూజ ,సంసారం అన్ని ,స్వాధ్యాయ ప్రవచనం తోనే చేయాలి .వేదం కూడా వీటికే ప్రాధాన్యత నిచ్చింది .సత్య ,తపస్సు ఫలాలు స్వాధ్యాయ ప్రవచనం లోనే ఉన్నాయి .
                       పదవ అనువాకం లో బ్రహ్మ విద్య విశిష్టత చెప్పారు .అహంకార వృక్షానికి మూలాధారం పర మాత్మే .బ్రహ్మ విద్యా సంపన్నుల కీర్తి అన్ని లోకాలకు వ్యాపిస్తుంది అని ”త్రిశంకు ”చెప్పాడు .పదకొండవ అను వాకం లో ”హితోప దేశాలు ఉన్నాయి .సత్య ,ధర్మాల నుండి ప్రమాదం రాకూడదు .తన ,ఇతర ,సర్వ భూత క్షేమం ,తో ప్రవర్తించాలి .తల్లి ,తండ్రి ,గురువు ,అతిధులను దేవతలు గా పూజించాలి .శ్రద్ధ  తో దానం చేయాలి .భయం తో చేయాలి .యోగ్యత ,పాండిత్యం ,తెలిసి దానం చేయాలి .సంశయాలు తీర్చు కోవాలి .రాగ ద్వేషాలతో ప్రవర్తించ రాదు .ఇదే వేద ఉపదేశం .,ఆదేశం శాసనం కూడా .
 ఈ ఉపనిషత్ లోని ”ఆనంద వల్లి ”ని గురించి  తరువాత తెలియ జేస్తాను .
సశేషం –మీ –గబిత దుర్గా ప్రసాద్ –31 -03 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ రామ స్తోత్రం

  శ్రీ రామ స్తోత్రం
01 -హృదయ కుహర మధ్య జ్యోతి తన్మంత్ర సారం –నిగమ ,నియమగమ్య ,వేద శాస్త్ర రచింత్యం
        హరి హర విధి వంద్యం ,హంస మంత్రాంత రస్థం -దశరధ సుత మీళే ,దైవతం దేవతానం
02 -దేవేంద్ర నీల నవ మేఘ వినిర్జి తాంగం -పూర్ణేందు బింబ వదనం ,శర చాప హస్తం 

  సీతా సమేత మనిశం,శరణం శరణ్యం -చేతో మదీయ మభి వాంచాతి రామ చంద్రం  
03 -కోదండ దీక్షా గురు మాది మూలం -గుణా శ్రయం  చందన కుంకు మాంకం 
 స లక్ష్మణం ,సర్వ జనాంత రస్థం -పరాత్పరం ,రామ మహం నమామి .
04 -విలోల మణి కుండలం  ,విమల చంద్ర బిమ్బాననం –విఖండిత దశాననం,వితత చాప బాణోజ్వలం    
 విమోహిత జగత్రయం ,వికచ పద్మ పత్రేక్షణం –విభీషణం సురక్షకం ,విజయ రామ మీళే హరిం .
05  -రామం రాక్షస మర్దనం ,రఘు వరం ,దైతేయ విధ్వంసినం -సుగ్రీవేప్సిత రాజ్యదం ,సుర పతే ర్బీత్యంతరం శార్జ్నినం
       భక్తానా మభయ ప్రదం ,భయ హరం ,పాపౌఘ విధ్వంసినం -సామీరి స్తుత పాద పద్మ యుగళం ,సీతా సమేతం భజే 
06 -యత్పాదాంబుజ రేణునా ,ముని సతీ ముక్తిం గతా యన్మహః  -పుణ్యం పాతక నాశనం ,త్రిజగతాం భాతి స్మృతం పావనం 
  స్మృత్వా రాఘవ మప్ర మేయ మమలం ,పూర్ణేందు మంద స్మితం -తం ,రామం ,సరసీ రుహాక్ష మమలం ,సీతా సమేతం భజే .
07 – ప్రణవ  నిలయ మంత్రం ,ప్రాణ నిర్వాణ మంత్రం -ప్రకృతి పురుష మంత్రం ,బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం –
ప్రకటిత దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం –రఘు పతి నిజ మంత్రం ,రామ రామేతి మంత్రం .
08 -దశరధ సుత మంత్రం ,దైత్య సంహార మంత్రం –విబుధ వినుత మంత్రం ,విశ్వ విఖ్యాత మంత్రం
ముని గణ నుత మంత్రం ,ముక్తి మార్గైక మంత్రం –రఘు పతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం .
09 -సంసార సాగర భయా పఃహ  విశ్వ మంత్రం -సాక్షాన్ముముక్షు జన సేవిత సిద్ధ మంత్రం
సారంగ హస్త ,ముఖ హస్త ,నివాస మంత్రం -కైవల్య మంత్ర మనిశం ,భాజ రామ మంత్రం .
10 -జయతు జయతు మంత్రం ,జన్మ సాఫల్య మంత్రం -జనన మరణ భేద  క్లేశ విచ్చేద మంత్రం
సకల నిగమ మంత్రం ,సర్వ శాస్త్రైక మంత్రం –రఘు పతి నిజ మంత్రం ,రామ రామేతి మంత్రం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -03 -12 .



గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సేకరణలు | Tagged | Leave a comment

దశోప నిషత్ సారం –3

  దశోప నిషత్ సారం –3

                               ముండక ఉపనిషత్ 
                 ఇది అధర్వణ వేదానికి చెందింది .మూడు అధ్యాయాలు ,రెండేసి ఖండాలున్నాయి .బ్రహ్మ విద్యను గురించి చెప్పినది .ముండక అంటే శిరస్సు .శబ్ద ,శైలీ ,ఛందస్సు విషయ గాంభీర్యం వల్ల ఇది శిరో భూషణ మైంది .అందుకే ఆ పేరు .చివరి మంత్రం లో ”శిరో వ్రతం ”చెప్ప బడటం తో అన్వార్ధ మైంది .”సంపూర్ణం గా క్షుర కర్మ చేసిన శిరస్సు మీద అగ్ని ధరించి వ్రతం ఆచా రించే వారికే ఈ ఉపనిషత్ లోని బ్రహ్మ విద్య ఉపదేశం చేస్తారు ”కానుకను మున్దకోపనిశాతయింది .ఇందు లోని కొన్ని భాగాలు ”బ్రహ్మ సూత్రాలు ”లో విని యోగింప బడినవే .
సృష్టి కర్త అయిన హిరణ్య గర్భుడు దేవతలలో ప్రధముడై ,అభివ్యక్తి ని పొంది ,బ్రహ్మ విద్య ను నేర్చి ,తన పుత్రుడైన ”అధర్వుని ”కి ఉప దేశించాడు .ఇందు పరాపర విద్య బోధింప బడింది .నిర్గుణ బ్రహ్మాన్ని బోధించేది పర విద్య .సగుణ బ్రహ్మాన్ని తెలిపేది అపర విద్య .ధర్మా ధర్మాలు ,సాధనా,ఫలాలు ,ను చెప్పేది అపారం .ఇది పర విద్యకు మార్గం చూపిస్తుంది .శౌనకుడు అనే మహర్షి అంగీరసుడు అనే గురువు వద్ద కు కానుక ను తీసుకొని వెళ్లి ”ఏ వస్తువు ను గురించి తెలుసు కొంటె ,సర్వం తెలియ బడు తుందో దాన్ని నేర్పండి ”అని అడిగాడు .అందుకే దీన్ని ”ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రసంగం ”అంటారు .తత్వాలు మూడు .జగత్తు ,జీవుడు ,ఈశ్వరుడు .దీనిలో దేని తత్వాన్ని తెలుసు కోన్నా మిగిలిన రెండు తెలుస్తాయి .నాలుగు వేదాలు ,శాస్త్రాలు ,మొదలైన వన్నీ అపర విద్యలు .దేనితో పర బ్రహ్మాన్ని పొంద గలమో దాన్ని  చెప్పేది పర విద్య . అక్షర బ్రహ్మాన్ని చెప్పేది ఉపనిషత్ .ఇవీ అపర విద్యలే .దీని వల్ల పర బ్రహ్మ ప్రాప్తి లభిస్తుంది కనుక ఆ విజ్ఞానం పర విద్యే .పర విద్య అదృశ్యం ,అగ్రాహ్యం .అగోత్రం ,అవర్నం ,నిత్యం ,విభువు ,సర్వత్వం ,సూక్ష్మం ,సర్వ వ్యాపకం ,అవ్యయం ,సర్వ భూత కారణం .సాలె పురుగు తన లో నుంచే దారాన్ని తీసి గూడు కట్టి నట్లు ,ఓషధులు తమంత తాము జన్మించి నట్లు ,మానవుని కేశాలు ,రోమాలు సహజ మైనట్లు అక్షర పర బ్రహ్మం నుంచి సృష్టి ఏర్పడుతుంది .
సాలె పురుగు ఉదాహరణం వల్ల బ్రహ్మం ,జగత్తుకు నిమిత్త ఉపాదాన కారణం .ఒశాధులకు పృథ్వి ఆధార భూతం .మూడవ దాని వల పురుష ప్రయత్నం లేకుండా నే జగత్ సృష్టి జరిగింది .చైతన్యం తో పాటు ,జడమైన కేశాలు ,గోళ్ళు సహజం గా ఏర్పడుతున్నాయి .అలాగే బ్రహ్మ ప్రయత్నం లేకుండా ఆయన లక్షానికి విలక్షణ మైన జడ స్వరూపం గాను సృష్టి జరుగు తోంది .అన్ని కార్యాలకు కారణం ఎలా అవసరమో ,కార్య మైన జగత్తు కు కారణం ఉండాలి .అదే సర్వజన మైన బ్రహ్మం .బ్రహ్మం ప్రయత్నం లేకుండా సృష్టి జరుగు తోంది కనుక ,జగత్తు ను సృష్టించిన మరో శక్తి బ్రహ్మం లోనే ఉంది .బ్రహ్మం వివర్త రూపం లో వృద్ధి చెందగా ,ఆయన లోని శక్తి (మాయా శక్తి )ఇచ్చా శక్తి,హిరణ్య గర్భుడు ,మనస్సు ,భూతాలు ,ప్రాణులు ,కర్మలు ,ఫలాలు కల్గుతున్నాయి .కర్మ ఫలమే అమృతం .అక్షర పరమాత్మ సర్వజ్ఞుడు ,సర్వ వేత్త ,జ్ఞాన తపస్సు కల వాడు ..జీవుల అనుభవాలు విచిత్రం గా ఉండ టానికి కారణాలు పూర్వ కర్మ ఫలమే .అంటే కాని పరమేశ్వర పక్ష పాఠం కాదు .
   ద్వితీయ ఖండం
అగ్ని హోత్రాది కర్మలు విద్యుక్తం గా చేయక పొతే వచ్చే దోషాలు ,చేస్తే వచ్చే ఫలితాలు మొదటి ఆరు మంత్రాలలో చెప్పారు .కర్మ ఫలం అనిత్యం కనుక వైరాగ్యం అవసరం .యజ్ఞాది కర్మలు వాటి పడవల వంటివి .సంసార సాగరాన్ని దాటింప లేవు .వీటి లో తిరిగే వారు గుడ్డి వారే .యజ్న ఫలం గా స్వర్గాన్ని పొంది మళ్ళీ జన్మిస్తారు .వైరాగ్యం ఒండితే మళ్ళీ బ్రహ్మను చేరతాడు .
 ద్వితీయోధ్యాయం -ప్రధమ ఖండం 
ప్రజ్వ లించే అగ్ని నుంచి సమాన రూపాలైన అగ్ని కణాలు పుట్టి నట్లు ,సత్య పర బ్రహ్మం నుంచి వివిధ జీవులు పుదు తున్నాయ్ .అందులోనే లయమవుతున్నాయి .అగ్నికి ,అగ్ని కణానికి ఎలా భేదం లేదో జీవునికి ,బ్రహ్మానికి భేదం లేదు .కర్మ వాసన చేత సృష్టి జరుగు తోంది .శరీర ఉపాధులు నశిస్తే ,ఘటా కాశం ,మహా కాశం లో కలిసి నట్లు బ్రహ్మం లో జీవులు ఐక్యమౌతారు .ఇదే విరాట్ పురుషుని వల్ల శకలం సృష్టింప బడు తోంది .ఆతనికి కూడా బ్రహ్మమే కారణం .అది తెలిసి న వాడు జీవన్ముక్తి పొందు తాడు .
ద్వితీయ ఖండం
మనసు ద్వారా బ్రహ్మాన్ని తెలియాలి .ఓంకారమనే ధనుస్సు తో ,చిత్త ఏకాగ్రత అనే లక్ష్యాన్ని ,జీవుడు అనే బాణం తో బ్రహ్మ మనే లక్ష్యాన్ని కొట్టాలి .ఓంకారం తో ఏకాగ్రత ను సాధించాలి .ఆత్మేతర ప్రసంగాలు మానె యాలి .అంతటా బ్రహ్మమే .హృదయాకాశం లోనే ఆత్మ సాక్షాత్కరిస్తుంది .”సర్వం ఖల్విదం బ్రహ్మ ”
 తృతీయ ముండకం -ప్రధమ భాగం 
ఒకే మోస్తరు గా ఉన్న విడదీయ లేని జంట  పక్షులు ఒకే వృక్షాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి .అందులో ఒకటి కమ్మని ఫలాలు తింటోంది .రెండవది ఏదీ పట్ట నట్టు ఉంది .ఇవేజీవ ,ఈశ్వరులు .మొదటిది కర్మ ఫలం అనుభ విస్తుంటే ,రెండవ దానికి సర్వజ్ఞత్వం వల్ల ఆ ఫలం లేదు .శరీరమే వృక్షం .జీవేశ్వారులు నిజం గా ఒక్కరే .ఉపాధి భేదం వల్ల ఇద్దరు గా కని పిస్తున్నారు .అజ్ఞానం చేత జీవుడు దుఖితుడు .జ్ఞానం తో శోక రహితుడు -ఈశ్వరుడు .జ్ఞానం వల్లనే జీవుడు ఈశ్వరుదౌతాడు .ప్కరమాత్మ స్వరూపం తెలిసిన వాడు ”ముని ”యై ,ఆత్మ లోనే క్రీడించి ,రామిస్తాడు .అతడు బ్రహ్మ వేత్త లలో శ్రేష్టుడు .ఆహ్య సాధనా పేక్ష ఏ క్రీడా .నిర పెక్షయే ”రతి ”
సత్యం తో ,ఏకాగ్ర తపస్సు తో యాత్మ జ్ఞానం తో ,ఆత్మ సాక్షాత్కారం పొందాలి యతీశ్వరులు హృదయా కాశం లో ఆత్మ సాక్షాత్కారం పొందుతారు ”.సత్యమే జయం ”.ఆత్మకు రూపం లేదు కనుక కంటికి కన్పించదు .వాక్ చెప్ప లేదు .ఇంద్రియ గొచరం కాదు .ఆత్మ జ్ఞానికి భోగేచ్చ లేదు .                                                                                                                    ద్వితీయ ఖండం 
పరబ్రహ్మాన్ని తెలిసిన పురుషుని సేవించిన వారికి కూడా బ్రహ్మో పాసన ఫలం కలుగు తుంది .బ్రహ్మ వేత్త సాక్షాత్తు బ్రహ్మమే .అలాంటి పురుషుని ఉపాసన బ్రహ్మో పాసనే .ప్రాపంచిక విషయాలను కోరే వారు జన్మ పరం పర లో పడి మోక్షాన్ని పొంద లేరు .కామ త్యాగం వల్ల ఆత్మ కాముడు ఆప్త కాము డౌతాడు .ఆత్మ జ్ఞానం తోవిషయ ,కామాలు నశిస్తాయి .సర్వ కామాల సంపూర్ణ త్యాగమే మోక్ష సాధనం .బహు వేదాధ్యయనం చేత మేధా ,అన్య శాస్త్ర ప్రావీణ్యం చేత లభ్యం .ఆత్మేచ్చ కల వారికి పర మాత్మ తన పార మార్ధిక స్వరూపాన్ని ప్రకాశింప జేస్తాడు సన్యాస పూర్వక జ్ఞానమే బ్రహ్మ లోకా వాప్తి .బ్రహ్మ లోకం అంటే బ్రహ్మమే లోకం .బ్రహ్మ జ్ఞానికి బ్రహ్మ విదుడే జన్మిస్తాడు .
సశేషం
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -03 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సేకరణలు | Tagged | Leave a comment

దశోప నిషత్ సారం –2

దశోప నిషత్ సారం –2

                                                                         ౦౩-kathopanishath –కధోప నిషత్ 
               ఇది కృష్ణ యజుర్వేదానికి చెందింది .ఇందు లో ఆరు భాగాలు .వాటికి వల్లి అని పేరు .నచి కేతునికి యమ ధర్మ రాజు బ్రహ్మ విద్య ను బోధించటం దీని లోని విషయం .మొదటి వల్లి లో బ్రహ్మ విద్యను అధికారిత్వం వున్న వాడికే నేర్పాలి .యమ ధర్మ రాజు నచి కేతున్ని పరీక్షించి ,నేర్ప టానికి అంగీక రించాడు .అన్నదాన కీర్తి  పొందాలని ,”వాజస్ర వసుడు ”అనే బ్రాహ్మణుడు ”సర్వ స్వ దక్షినాక యాగం ”చేశాడు .యాగ సమయం లో యజ మాని తన సర్వస్వాన్ని దానం చేయాలి .ఆయన ,పనికి రాని గోవుల్ని దానం చేశాడు .కొడుకు నచి కేతుడు చూసి తండ్రికి నరకం వస్తుందేమో నని భయ పడ్డాడు .అతనికి గొప్ప ”శ్రద్ధ ”ఆవహించింది .తండ్రి తో ”నన్ను ఎవరికి దానం ఇస్తావు ?”అని అడిగాడు .కోపం తో ఊగి పోయిన తండ్రి ”యముడికి ”అన్నాడు .అన్న మాట ప్రకారం కొడుకు యమ పురికి చేరాడు .అప్పుడు యముడు అక్కడ లేడు .మూడు రోజులు పడి గాపులు కాశాడు .ఆహారం కూడా లేదు .యముడు వచ్చి విషయం గ్రహించాడు .యజ మాని పుణ్యమంతా నశిస్తుంది అన్న విషయం తెలిసి ,క్షమా పణ కోరాడు యముడు .మూడు వరాలిస్తానన్నాడు .తండ్రికి తన మీద కోపం లేకుండా చేయమని ,అగ్ని విద్య ను నేర్పమని కోరాడు .యముడు అలాగే నేర్పి ”నచికేత చయనం ”అని పేరు పెట్టాడు .మూడవ వరం గా ”ఆత్మ విద్య ”ను బోధించ మని కోరాడు .”ఇహ లోకానికి చెందిన ”పితృ సౌమనశ్యం ”,పర లోకానికి చెందిన అగ్ని విద్య ,పునరావృత్తి రహితా మైన మోక్ష విద్య కోరు కొన్నందుకు యముడు సంతో షించాడు .మూడవ దాని నుంచి దృష్టి మరల్చ టానికి లోభ పెట్టాడు .కాని బాలుడు లొంగ లేదు .బ్రహ్మ విద్య ను తెలుసు కోవ టానికి కావలసిన వైరాగ్యం ,ముముక్షుత్వం మొద లైన సాధన సంపత్తి నచి కేతుని లో ఉన్నాయని తెలుసు కోని నేర్ప టానికి యముడు సిద్ధ  పడ్డాడు .
రెండవ వల్లి లో మానవుడు కోరదగినవి ప్రేయస్సు ,శ్రేయస్సు .అన్న వివరణ చేశారు .ప్రేయో మార్గం ఇహం లో సుఖం ,పరం లో స్వర్గం ఇస్తుంది .శ్రేయో మార్గం మొక్షాన్నిస్తుంది .బాలు డైనా శ్రేయో మార్గాన్నే కోరు కొన్నాడు నచి కేతుడు .”బ్రహ్మ విద్య వినే వాళ్ళే అరుదు .విని ,తెలిసి కొనే వారు మరీ అరుదు .తెలిసి సాధన చేసే వారు ఇంకా అరుదు .శ్రవణ ,మనన ,అది ధ్యాస చేసిన వారు అప రోక్ష సాక్షాత్కారం పొందు తారు .ముక్తు లౌతారు ”అని వివరించాడు .పంచ కోశాలకు అతీత మైన ఆత్మ సాక్షాత్కారమే మోక్షం .హృదయమే ఉప లబ్ది స్థానం .బ్రహ్మం ”హృదయ గుహ అనే చిదా కాశం లో వ్యక్త మౌతాడు .ఓంకారం వల్ల బ్రహ్మ సాక్షాత్కారం కలుగు తుంది దీని ఉపాసన వల్లే సగుణ ,నిర్గుణ బ్రహ్మ ప్రాప్తి కలుగు తుంది .వారే జీవన్ముక్తులు .జీవన్ముక్తుని దూషించే వారికి అతని పాపాలేమైనా ఉంటె సంక్ర మిస్తాయి .స్తుతించే వారికి పుణ్యంకలుగు తుంది .ప్రతి వాడు జీవన్ముక్తి సాధించాలి .
మూడవ వల్లి లో దేహ ,ఇంద్రియ ,మనో ,బుద్ధి మొదలైన వాటిలో వ్యక్తం గా ఆత్మ కర్త గా ,భోక్త గా ,జ్ఞాత గా కని పిస్తాడు .ఈశ్వ రార్పణ బుద్ధి తో నిష్కామ కర్మ చేసిన వారి మనస్సు శుద్ధం గా ఉంటుంది .వాళ్లకు ఆత్మ జ్ఞానం తేలిగ్గా కల్గుతుంది .శరీరమే రధం .జీవుడు రధికుడు .సారధి -బుద్ధి .గుర్రాలు ఇంద్రియాలు .కళ్ళెం మనస్సు .ఈ రధం తోనే మోక్షం పొందాలి .ఇంద్రియాల కంటే శబ్దాదులు ,వాటికంటే మనస్సు సూక్షమైనవి .మనసు కంటే బుద్ధి ,దాని కంటే మహత్వం ,దానికంటే అవ్యక్తం ,దాని కంటే పురుషుడు సూక్షం .శరీరం లో ఉన్నాడు కనుక పురుషుడు .శబ్డాడు లను ఇంద్రియాల్లో ,ఇంద్రియాలను మనసు లో ,మనసును బుద్ధి లో .బుద్ధిని మహత్వం లో ,దాన్ని అవ్యక్తం లో ,దానిని పురుషుని లో లయింప జేస్తే ఆత్మ సాక్షాత్కారమై మోక్షం లభిస్తుంది .గురు సేవ తో దీన్ని సాధించాలి .ఇదంతా విన్న వారికి బ్రహ్మ లోక ప్రాప్తి లభిస్తుంది .కతోపనిశాత్ పారాయణం అనంత ఫలం అని యముడు నచి కేతునికి బోధించాడు .
నాల్గవ వల్లి లో బ్రహ్మ శ్రుస్తి చేసే టప్పుడు ఇంద్రియాలను ”బహిర్ముఖ ప్రవ్రుత్తి కల వాణిని ”గా శ్రుస్తించాడు .అందుకే శబ్దం మొద లైన వాటి పై వాటికి ఆకర్ద్షణ ఎక్కువ .అంతర్ముఖం కాలేవు .వీటికి అతీతం గా ఉన్న వాడు మోక్షం పొందుతాడు .మనసు శుద్ధం కాక పొతే ప్రపంచమే నిజం అని నమ్ముతాడు .సు సంస్కృత మైన ఆత్మ సజాతీయ ,విజాతీయ ,స్వ ,పర ,భేద శూన్యమై న పర మాత్మే అవుతుంది   .
అయిదవ వల్లి లో దేహం లో 11 ద్వారాలున్నాయని ,శరీరం అద్దె ఇల్లు అనుకోవాలని ,అన్నిటా పర మాత్మ వ్యాపించి ఉన్నాడని ,ఆత్మకు ఆకారం లేదని ,ఏ ఆకారమూ లేని పరమాత్మ  ,అన్ని ఆకారాలు పొందుతాడని చెప్పారు .సూర్య ప్రకాశం అన్ని వస్తు వు లపై పడినా ,దానికి దోషం లేనట్లే పరమాత్మకు కూడా ప్రపంచం లోని గుణ ,దోషాలు అంటవు .
ఆరవ వల్లి లో సంసార వృక్షానికి మూలం -పైనా ,శాఖలు కిందా వున్నాయి .అంటే లోకం అంతా పర మాత్మ యందు ఆధార పడి ఉంది .ఇంద్రియాదులు పర మాత్మ కంటే వేరైనవి అని ,పరమాత్మ తన స్వరూపమే నని తెలిసిన వాడే ముక్తుడు .కనపడ లేదు కనుక లేడు అన రాదు .మనసు ,ఇంద్రియ నిగ్రహమే యోగం .యోగి మొక్షార్హుడు .సాగునా రాదన తో ప్రార్సంభించి ,నిర్గుణ పర బ్రహ్మ ను చేరాలి .కోరిక నశిస్తే హృదయ గ్రంధులు వివ్వ్హిన్న మౌతాయి .అదే ముక్తి .హృదయం లో 101 నాడుల్లో ”సుషుమ్న ”ముఖ్య మైంది .అది బ్రహ్మ రంధ్రం వరకు వ్యాపించి వుంటుంది .దాని ద్వారా ,ప్రాణం ఉత్క్రమాణం చెందితే ముక్తి .హృదయాకాశం లో ”అంగుష్ఠ  మాత్రం ”గా ఆత్మ ప్రకాశిస్తుంది .అన్న ,ప్రాణ ,మన ,విజ్ఞాన ,ఆనంద మయ మైన పంచ కోశాలను వేరు పరచి ఆత్మ సాక్షాత్కారం పొందాలి .
    4–ప్రశ్నోపనిషత్
                ఇది అధర్వణ వేదానికి చెందింది .ప్రశ్నే జవాబుగా ఉండటం చేత ,ఆ పేరు వచ్చింది .ముండకోపనిషత్ లోని విషయాలు కూడా ఇందులో కొన్ని ఉన్నాయి .వేద విదు లైన సుకేషుడు ,సత్య కాముడు ,సౌర్యాయని ,కౌశల్యుడు ,కాత్యాయనుడు ,భార్గవ వై దర్భి అనే ఆరుగురు మహర్షులు పిప్పలాదుని ఆచార్యుని గా స్వీ కరించి ప్రశ్నలు అడిగితె ఆయన చెప్పిన సమాధానమే ఈ ఉపనిషత్ .
  కాత్యాయనుడు ”దేని వల్ల ప్రజలు పుదు తున్నారు “”?అని అడిగాడు .పిప్పల మహర్షి ”హిరణ్య గర్భుడు అనే ప్రజా పతి తపస్సు చేసి ”రయి ”(ధనం )శబ్ద బోధితుడై న చంద్రుని ,ప్రాణ శబ్ద బోధితుడైన సూర్యుని ,సృజించారు .వీరిద్దరూ కలిసి సకల ప్రపంచాన్ని సృష్టించారు .సూర్యా చంద్రుల స్వరూపమే సంవత్సరం .దక్షణా యన ,ఉత్త రాయనాలు .చంద్ర లోకం చేరి మళ్ళీ భూమికి చేరే వారి మార్గం దక్షిణాయనం .జితేంద్రియత్వం బ్రహ్మ చర్యం ,ఆస్తిక్యం ,జ్ఞానం కల వారు సూర్య లోకానికి ఉత్తరాయణ మార్గం ద్వారా పోతారు .ఇక్కడ బ్రహ్మ తో పాటు మోక్షం పొందు తారు .దక్షిణాయన మార్గం వారికి పునర్జన్మ ఉంటుంది . .సూర్య సంచారం వల్ల అహోరాత్రాలు ,చంద్రుని వల్ల తిధులు యేర్పడ తాయి .ఋతువులు ,మాసాలు సూర్యుని వల్లనే కనుక ”ప్రజా పతి ”అయాడు .అన్నం వల్ల ప్రజలు పుడు తున్నారు కనుక ”అన్నమూ ”ప్రజా పతి స్వరూపమే .ఋతు కాలమ్ లో స్వ భార్య తో సంగ మించాటమే ప్రాజా పత్యం .
  భార్గవ మహర్షి ”ఎందరు దేవతలు ఈ దేహాన్ని ధరిస్తున్నారు -ఎవరు ఇందులో గొప్ప వారు ?”అని ప్రశ్నించాడు .దానికి సమాధానం గా పిప్పల మహర్షి చెప్పిన సమాధానం తెలుసు కొందాం .”పంచ భూతాల మ్కర్మెంద్రియ,జ్ఞానేంద్రియాల మనో బుద్ధుల అభిమాన దేవస్థ లంతా దేహాన్ని ధరిస్తారు .వీరిలో ఎవరికి వారే గొప్ప గా భావించారు .అయితె ప్రాణం లేక పొతే శరీరం లేదు కనుక ప్రాణమే అన్నిటి కంటే గొప్పదని తీర్మానించారు .దేవతలంతా ప్రాణాన్ని ”నీవే అగ్నివి ,సూర్య ,మేఘ ,పృధివీ చంద్రుడివి .అమృత రూపుడివి ,సమస్తం నీ లో ఉన్నాయి .నీవే ప్రజా పతివి .భోగ్య భోక్తలు నీవే .దేవతలకు హవిస్సు లందించేది ,పితృదేవతలకు ”స్వద ”అందించేది నీవే .సత్యం ,రుద్రం జ్యోతి నీవే .ప్రధమ శరీరివి నీవే .తల్లి ,తండ్రి నీవే .సర్వ సంపదలకు కారణం నువ్వే .ప్రజ్ఞా ను మాకు ప్రసాదించు ”అని ప్రార్ధించారు .
  కౌశల్యుడు -”ప్రానోత్పత్తి ఎలా జరుగు తుంది ?”అని అడిగాడు .పిప్పలుని సమాధానం –”ఆత్మ వల్ల ప్రాణం కల్గుతుంది .చాయ లాగ ఆత్మకు ప్రాణం అంటే వుంటుంది .ప్రాణం ఆత్మ లోనే లయమవుతుంది .నాసిక ద్వారా ప్రవర్తిస్తుంది .మల మూత్రాలకు అపాన వాయువు లా ఉంది .తిన్నస ఆహారం నాభి లో పచనమై సమానంగా వ్యాపించ టానికి ”సమాన వాయువు ”గా ,హృదయం లో ఆత్మ తో కలిసి ఉంది .నాడులలో ”వ్యాన వాయువు ”ఉంది .ఉదాన వాయువు ఊర్ధ్వ ముఖ ప్రయాణానికి దారి .సూర్యుడు ముఖ్య ప్రాణాన్ని ”నేత్రం ”లో ఉంచాడు .దాని వల్ల రూపం తెలుస్తుంది .శరీరం పడి పోకుండా అపాన వాయువు కాపాడుతుంది .శరీరాంతర్గత మైంది సమాన వాయివు .వ్యాన వాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది .ఉదాన వాయువు ”ప్రాణ ఉత్క్రమనకు ”కారణం అవుతుంది .మిగతా నాలుగు శరీరం నిలవ టానికి కారణం .ప్రాణాన్ని తెలిసి కోని ప్రాణో పాసన చేస్తే పుత్ర పౌత్రాది సంతానం నశించదు .అమరత్వం  చెందు తాడు .
 నాల్గవ ప్రశ్నను సౌర్యాయన రుషి వేశాడు .”ఏ ఇంద్రియాలు నిద్రా స్థితి లో ఉంటాయి?”జాగ్రదవాస్త లోనివి ఏవి ?స్వప్నం ఎవరు చూస్తారు ?దేనిలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి?”సమాధానం గా పిప్పల మహర్షి ”స్వప్నం లో ఇంద్రియాలన్నీ మనసు లో లయం అవుతాయి .జాగ్రత్ స్తితి లో మళ్ళీ బహిర్గాతమావు తాయి .స్వప్నం లో చూపు ,వినికిడి ,వాసన ,రుచి స్పృహ ఉండదు .నడవటం మాట్లాడటం ,విసర్జన ,ఆనంద్సం అనుభవించ లేదు .ఇంద్రియాలు నిద్రిస్తున్నా ,పంచ ప్రాణాలు మేల్కొనే ఉంటాయి .అపానం ;;గార్హ పత్యం ”గా ,ప్రాణ వాయువు ”ఆహ్వ నీయం ”గా ,వ్యాన వాయువు ”దక్షిణాగ్ని ”గా ,సమాన వాయువు ”హోత ”గా ,ఉదాన వాయువు ”యాగ ఫలం  ”గా ,మనస్సు ”యజ మాని ”గా ఉంటాయి .ఉదాన వాయువు ఆనంద రాసైక స్వరూపమై బ్రహ్మాన్ని సుషుప్తి లో పొందుతుంది .స్వప్నం లో ఆత్మ తన మహిమలను అనుభ వీస్తుంది .జాగ్రత స్తితి లో పొందిన అనుభవాన్ని వాసనా రూపం గా అనుభ వీస్తుంది .వెనుకటి జన్మ లోని విశాలను కూడా ”మనసు ”చేత స్వప్నం లో చూస్తుంది .
                       మనో రూప మైన జీవుడు తేజస్సు తో ఎప్పుడు అభి భుతూ దౌతాడో అప్పుడు స్వప్నాలను చూడ లేక ,స్వ స్వరూప మైన సుఖాన్ని నిద్ర లో అనుభ విస్తాడు .సర్వం పరమాత్మను ఆశ్రయించే ఉంటుంది .అంటే ఆత్మాశ్రయమే .ఆత్మ చూసేది వినేది ,తెలిపేది ,తెలుసుకొనేది .కర్త ,జ్ఞానం కూడా ఆత్మే .ధర్మా లన్ని ఆత్మ లోనే ఉన్నాయి .ఈ ధర్మా లన్ని అవిద్య చే ఆత్మ లో ఆలోచించ బడుతాయి .ఇదే ఆత్మ జీవిత్వ దశ .ఉపాధి తొలగి ,పోగానే ,జీవత్వం పయి ,స్వస్వరూపం మిగుల్తుంది .జలం లోని ప్రతి బింబం ,,జలం ఎలా ఎండి పొతే బింబం తో కలిసి పోయి నట్లు ,జీవుడు పరమాత్మ లో ఐక్యం అవుతాడు .ఎవరు నామ ,రూప కల్పిత మైన ఉపాధి లేని వాడు ,రాజసాది గుణాలు లేని వాడు శుద్ధుడు .అక్షరుడు అయిన పరమాత్మను తెలుసు కొంతాడో ,అతడే సర్వజ్ఞుడు .సర్వ స్వరూపుడు .సర్వాత్మ భావుడు .అంటే పరమాత్మ స్వరూపుడు అవుతాడు .ఈ విధం గా స్వప్నం సుషుప్తి ,విచారణ తో జీవాత్మ .పర మాత్మ ల అనన్యత్వం నిరుపించ్బడింది .
   అయిదవ ప్రశ్న ను సత్య కామ రుషి వేశాడు /”ఓంకారం జపిస్తే ఫల మేమిటి ?”అని అడిగితె ”ఓంకారం పర ,అపర బ్రహ్మ సాక్షాత్కారన్నిస్తుంది .అ వు అం అనే మూడు మాత్ర లతో ఏర్పడింది .అ కారాన్ని ఉపాశిస్తే సంపన్న మైన మనిషి జన్మిస్తాడు .తపస్సు ,బ్రహ్మ చర్యం శార్ద్ధ కలిగి మానుశానందాన్ని పొందు తాడు .ఉకారాన్ని ఉపాశిఅస్తే యజురాభి మాన దేవతక్ల చే సోమ లోకం పొంది ఐశ్వర్యాన్ని అనుభవించి ,మళ్లి మనుష్యులు గా జన్మిస్తారు .ఓం ను జపించిన వాడు సూర్య లోకం చేరతాడు .సామ వేదాభి మాన దేవతలు బ్రహ్మ లోకాన్ని ,(హిరణ్య గర్భం )ఇస్తారు .ఆయనే జ్ఞానం పొంది ,బ్రహ్మత్వం పొందుతారు .అంటే ఓంకారం ఉపాశిఅస్తే హిరణ్య గర్భుని కంటే ఉత్కృష్ట మైన పర బ్రహ్మ సాక్షాత్కారం పొందు తాడు .
ఆరవ ప్రశ్న సుకేశ మహర్షి అడిగాడు .”షోడశ కళా పూర్ణుడైన పురుషు డెవరు ?”దానికి సమాధానం -”శాదశ కలా పురుషుడు మన శరీరం లోనే హృదయా కాశం లో ఉన్నాడు .అతని వల్లనే ఆ కళలు పుడుతున్నాయి .ఆత్మ నిష్కలుడు ,అవయవ హీనుడు కదా .మరి ఎలా పుదు తున్నాయి /అవిద్య వల్ల అతనిలో వున్నట్లు అని పిస్తాయి .విద్య వల్ల ఉపాధులు నశించి ,నిర్వి శేషుదౌతాడు .సృష్టి విధానం ఇలా జరిగింది –పరమ పురుషుని ఆలోచనా ఫలితం గా సృష్టి  ఏర్పడింది .మొదట హిరణ్య గర్భం ,ఆ తరువాత వరుసగా శ్రద్ధ ,ఆకాశం ,వాయువు ,తేజస్సు ,జలం ,పృథ్వి ,,,జ్ఞాన కర్మేంద్రియాలు మనసు ,అన్నం ,వీర్యం ,తపస్సు మంత్రాలు ,కర్మా ,లోకాలు పేర్లు వరుసగా సృష్టింప బడి నాయి .అవిద్య వల్ల ఇవి ఏర్పడి విద్య లో నశిస్తున్నాయి .పిప్పలుని ఉప దేశానికి మహర్షులు చాలా సంతోషించి కృతజ్ఞత తెలిపారు .

     దీని తర్వాత ”మున్డకోప నిషత్ ”గురించి తెలుసు కొందాం

 సశేషం —మీ–గబ్బిట దుర్గా ప్రసాద్–30 -03 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in సేకరణలు | Tagged | Leave a comment

దశోప నిషత్ సారం –1

 దశోప నిషత్ సారం –1

                   ”వేద -య తీ తి వేదః ”-తెలియ జేయునది వేదం .వేదం భగవంతుని ఉచ్చ్వాస ,నిస్శ్వాసం వంటిది .”అస్య మహతో భూతస్య విశ్వ సిత మే వితత్ రుగ్వేదో ,యజుర్వేదః ,సామ వేదః అధర్వణ వేదః ”.శ్వాస మానవు తో కూడా పుట్టింది .దానికి కర్త కాదు .అంటే భగ వంతుడు కూడా .ఆయన అనాది కనుక శ్వాస అయిన వేదమూ ఆనాడే .భగ వంతుడు నిత్యం కనుక వేదం కూడా నిత్యమే .వేదమే శ్రుతిఅంటే ”విన బడి నది ”.బ్రహ్మ కు విని పిస్తే మహర్షులకు ఆయన చెబితే ,అలా పరం పర గా వ్యాపించింది .కనుకనే వేదం అపౌరుషేయం అంటారు . .

—               ఉప+ని+శదుల్ అనేది ధాతువు .శదుల్ అంటే విశరణ ,గతి ,ఆవ సాదన అనే అర్ధాలున్నాయి .కార్య రూప సంసారాన్ని ,శరణం అంటే ,శిధిలం చేసి ,అజ్ఞానాన్ని ,ఆవ సాదనం  (నశింప )జేసి ,బ్రహ్మ ను గతి గా పొందించేది -ఉపనిషత్ .”విశాన్న మాస్యం ఆత్మ తత్త్వం ఇతి ఉపనిషత్ ”ఆత్మ తత్త్వం  దేనిలో పూర్తిగా నిండి ఉన్నదో ,అది ఉపనిషత్ .గురువు సమీ పం లో కూర్చుని నేర్చు కొనే విద్య అనే అర్ధమూ వుంది .మోక్షాన్ని చ్చె విద్యే ఉపనిషద్ విద్య .బ్రహ్మ విద్య ను ప్రధానం గా ఇవి బోధిస్తాయి .దాన్ని నేర్చు కొనే విధానాన్ని తెలియ జేస్తాయి .మనకు ఉన్న దశోపనిషత్ లలో వున్న సారాన్ని గురించి తెలుసు కొందాము .
   ఈశా వాస్య ఉప నిషత్ 
  ”ఈశా వాస్యం ”అనే మాట తో ప్రారంభ మైంది కనుక ఆ పేరు వచ్చింది .శుక్ల యజుర్వేదానికి చెందింది .18 మంత్రాలున్నాయి .దీని శాంతి మంత్రం ”పూర్ణ మదః పూర్ణ మిదం ,పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే -పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవా వశిష్యతే ”ఇదే అద్వైతం .త్రాడును చూసి పాము అనుకుంటాం .వెలుగు లో తాడు లానే కన్పిస్తుంది .దానిలో మార్పు లేదు .అట్లాగే బ్రహ్మ వస్తువే ప్రపంచం గా కని పిస్తుంది .అయితె బ్రహ్మత్వం లో మార్పు లేదు .అట్లాగే ,సత్య మైన బ్రహ్మమే పూర్ణ వస్తువు .వస్తుత్వం లేని ప్రపంచం మిధ్య .
 మొదటి మంత్రం లో ”ఈశా వాస్య మిదం సర్వం యత్కించ జగత్యా జగత్ ”అంటే కన బడేది జగత్తు .అంతా బ్రహ్మమే .అంటే జగత్తు బ్రహ్మము భిన్నం కావు .కనబడే జగత్తు అనే భావాన్ని వదిలి దాని ఆధార మైన బ్రహ్మకై అన్వేషించాలి .ఎవరి ధనాన్ని ఆశించ రాదు .ముముక్షు మార్గాన్ని పొందాలి .మూడు నుంచి ఎనిమిది మంత్రాలలో ఆత్మ సర్వ వ్యాపక మైనదని ,సర్వాత్మ భావన వల్ల శోక మొహాలు లేని నిత్య ,శుద్ధ ,బుద్ధ ,ముక్తి స్వభావం గల బ్రహ్మమే తాను గా మారి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పారు ..రెండవ మంత్రం లో జ్ఞాన మార్గం తెలియని వారికి భక్తీ ఏ శరణ్య మని నిష్కామ కర్మ రహశ్యాన్ని చెప్పారు .తొమ్మిది నుంచి పద్నాలుగు మంత్రాలలో ,కర్మ ను విడిచి ఉపాసన కాని ,ఉపాసన లేని కర్మ కాని చేయ రాదనీ తెలిపారు .
15 నుంచి 18 వరకు ఉన్న మంత్రాలలో దీని వల్ల లభించే క్రమ మైన ముక్తి తెలప బడింది .ఉపాసకుడు సూర్య  గోళం ద్వారా ,బ్రహ్మ లోకం చేరి ముక్తు డౌతాడు .అయితే క్రమ ముక్త్రి మార్గం అను సరించని పుణ్య కర్మ ఏ ధూమాది మార్గం ద్వారా చంద్ర లోకం చేరి ,సుఖాను భావం పొంది ,మళ్ళీ భూలోకం చేరతారు. కనుక ఆ మార్గం కాకుండా ,”అగ్నే నయ సుపదా ”అనే 18 వ మంత్రం లో అగ్ని ద్వారా పునరా వ్రుత్తి రహిత మైన ముక్తి ని పొందాలని సారాంశం .
   కేన ఉపనిషత్ 
               సామ వేదానికి చెందినదీ ఉపనిషత్ .”కేన ”అనే మంత్రం తో ప్రారంభ మైంది .నాలుగు ఖండాలు ,34 మంత్రాలు .ఒకటి నుంచి ఎనిమిది మంత్రాలలో ఆత్మ తత్వ నిరూపణ ,తొమ్మిది నుంచి పన్నెండు ,పద్నాలుగు నుంచి ముప్ఫై ఒకటి మంత్రాలలో ”ఆత్మా దుర్విజ్నేయ బోధ ”,32 -34 లలో ”ఆత్మా జ్ఞాన సాధన ,13 లో మనుష్య జన్మ ఉత్క్రుష్టత  చెప్ప బడింది .ఇది గురు శిష్య సంవాదం గా ఉంటుంది .జడాలైన దేహం ,ఇంద్రియాలు ,అంతః కరణాలు ,ప్రాణాలు ఎవరి ప్రేరణ చేత ప్రవర్తిస్తున్నాయి అనే ప్రశ్న ను శిష్యుడు  వేస్తాడు .వీటన్నిటిని పరమాత్మయే ప్రవర్తింప జేస్తాడని సమాధానం .ఆ పరమాత్మ జ్ఞానమే మోక్షం .ఇంద్రియాలు ,మనస్సు ఆయన్ను తెలియ లేవు .ఏ వస్తువుని వాక్కు తో చెప్ప లేమో ,ఏది వాగింద్రియాలను ప్రవర్తింప జేస్తుందో ,దేని వల్ల మనసు కు మనన శక్తి కలుగు తుందో ,ఏ వస్తు వును మనసు చింతింప జాలదో ,దేని వల్ల ప్రాణానికి చలన శక్తి కలుగు తుందో ,అదియే పరమాత్మ ,బ్రహ్మ వస్తువు .”ద్వితీయాద్వై భయం భవతి ”తానె కదా అని ,తెలియ బడేది కాదు .అంటే ఆత్మా జ్ఞాన స్వరూపం .అంటే ”తెలివియే ఆత్మా ”ద్రస్త్రు దృశ్య భావ విరహిత కేవల ద్రుజ్నంత్రమే ఆత్మ .
  ఆత్మకు పుట్టుక లేదు కనుక జాతి మొదలైనవి లేవు .శబ్దములు దాన్ని చెప్ప లేవు .ఆత్మ నిష్క్రియం కనుక క్రియా శబ్దాలు చెప్ప లేవు .రెండో వస్తువు లేదు కనుక సంబంధం లేదు .ఏకం ,అద్వితీయం ,సర్వ వ్యాపకం ,అనంతం కనుక శబ్దాదులు ఆత్మ ను వివ రించ లేవు .”ఆత్మ దుర్విజ్నేయం ”.ఆత్మను తెలుసు కొన్నాను అని తెలిపే వాడు నిజం గా తెలిసి కో లేదని అర్ధం .ఆత్మ తెలియ బడ లేదని భావించే వాడు నిజం గా ఆత్మ తత్త్వం తెలిసి కొన్న వాడు .తెలిసిన వస్తుజ్ఞానం నుంచి ,”నేతి ,నేతి ”ద్వారా తీసేస్తూ పోతే మిగిలిన ఏక రూప జ్ఞానమే ఆత్మ .ఆత్మ జ్ఞానంపొంది తే  అమృతత్వం అంటే మోక్షం వస్తుంది .
   దేవాసుర యుద్ధం తర్వాత దేవత లంతా గెలుపు తమ శక్తుల వల్లనే లభించిందని విర్ర వీగుతూ ఉత్సవం చేసుకొంటున్నారు .బ్రహ్మం  -యక్ష రూపం లో వాళ్ళని పరీక్షిస్తుంది .వారి లోని ఆ శక్తిని తెసి వేస్తె వారు ఏ పనీ చేయ లేక పోతారు .పర బ్రహ్మ సహాయ సంపత్తి వల్లనే క్రియ జరుగు తోందని అనుగ్రహ శక్తి తీసేస్తే నిర్వీర్యత మిగుల్తుందని సారాంశం .ఆ బ్రహ్మమే” ఉమ ”గా దేవేంద్రునికి సాక్షాత్కరించి నిజ బోధ చేసి కళ్ళు తేరి పించింది .ఆత్మ జ్ఞానం ఎలా సాధించాలని శిష్యుడు అడుగు తాడు .వేద వేదంగా  అధ్యయనం  ,నిష్కామ కర్మాను ష్టానం ,సత్య వ్రతం ,శమ దమాదుల వల్లనే సాధ్యం అని గురువు సమాధానం చెబుతాడు .ఇలాంటి జ్ఞానం పొంద టానికి మానవ జన్మమే ఉత్కృష్ట మైనదని తెలియజేస్తాడు .మానవ జన్మ ను సార్ధకం చేసుకొని మోక్షం సాధించాలి .అదే మాన వ గమ్యం .అని కేనోపనిషత్ సారాంశం .
 సశేషం
                               మీ— గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -03 -12 .

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –5 -చివరి భాగం

 వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –5 -చివరి భాగం
సంప్రదించే చేరండి తొందర లేదు ”అంది .బతికి బయట పడ్డాం అను కుంటు బయటకు వచ్చే శాడు .
   రామా రావు తన్ను తాను అమ్బుజానికి పరిచయం చేసు కొన్నాడు పాపం.”రామా రావు బి.ఏ.ఆన్స్  మీరేనా  ?”అని అడిగింది .అవునన్నాడు .చాలా అల్లశ్యం గా వక్చ్చాడని ,200 మంది ఆ పోస్ట్ కు అప్ప్లై చేశారని ,150 మంది బి.ఏ.లు నలభై రూపాయలకే పని చెయ్య టానికి సిద్ధం అని చెప్పారని ,ఏం .ఏ.ల ఉదారత ఏమిటో చూసే ప్రయత్నం లో ఆ పోస్ట్ ఎవరికి ఇవ్వ లేదని తాను ఏ మాత్రం త్యాగం చేయ గలదో చెప్ప మని ,అడిగింది .రామా రావు పరిస్థితి అడ కత్తెర లో పోక అయింది .ఏం చెప్ప లేక ”ఇంట్లో సంప్ర దించి చెప్తాను ”అన్నాడు .”భార్య తోనా ?వాళ్లకు మగల కంటే ఉదారత ఎక్కువ ”అన్నది .బెంగ పడి రామా రావు ఏమీ అన లేక పోయాడు .ఆమె మళ్ళీ ”మీ వాళ్ళను సంప్ర దించే చేరండి .తొందర లేదు ”అని తాపీగా చెప్పింది .బతికి బయట పడ్డాం అనుకొంటూ బయటికి వచ్చే శాడు .
  బయట ”భిక్షాం దేహి ”అనే మాట ఖంగున విని పించింది .రామా రావు ,అంబుజం తొందర గా బయటికి వచ్చే శారు .”డిప్రెషన్ చెంబు  మిసెస్ -రామా రావు -ద్వివేదీ బి.ఏ.ఆన్స్ ”అని ”తారు తో ”రాసిన బాగా తోమి ,నిగ నిగ లాడే రాగి చెంబు మీద చూశారు .తులసి దాన్ని చేత్తో పట్టు కోని ,వెనక ,సుందరి ,రమణ ,పద్మ నాభుడు అంతా కలిసి ”భిక్షాం దేహి ”అంతు ,ఇల్లిల్లు తిరుగు తున్నారు .హతాశుడై రామా రావు ,,ఆశ్చర్య పోయి అంబుజం  చూశారు .విధి వైపు రీత్యం .ఆది భిక్షువు చూపిన బాటే అది .ఆ కుటుంబాలలో అది మామూలే .అదేమీ నీచమైన పని కాదు .ఉన్నది అమ్ముకొని తినటం అయి పోయి ,భర్త చేసిన ఆకారమ నత్వానికి విసిగి తులసి తీసు కొన్న నిర్ణయమే అది .చాలా మంచి  నిర్ణయమే నని పిస్తుంది .అంత కంటే గత్యంతరం లేదామెకు .ఆ పనే భర్త చేసి ఉంటె ,చాలా సంతోషించి ఉండేది .కాని ,ఆ డిగ్రీ భుజ కీర్తు లున్న వాడికి ఇంకా అహం చావా లేదు .అడుక్కుని తినటం కంటే ,అప్పు చేసుకొని జీవించటం మేలు అను కొనే స్వభావం .ఉద్యోగం వచ్చేదే కాని అక్కడా జీతం కోసం ”శాక్రి ఫైస్ ”చేయాల్సి వచ్చింది .ఇవన్నీ ముందే గ్రహించిన తులసి చేసిన నిర్ణయం చాలా విలు వైనది .కడు పు నిండే ఉపాయం కూడా .ఆ నిర్ణయం ఆ కుటుంబాన్ని ఆడుకొంటే ,ఆమె త్యాగం గొప్ప ఫలితాన్ని   స్తుంది .అలా సత్ ఫలితం ఉంటున్నందన్న ఆశ తోనే ఆమె ,ఆ వైపు కు అడుగు లేసింది . ఆ కుటుంబానికి తన ఋణం తీర్చుకొంది .తన మరుదులు ,ఆడ పడచు అత్త గారు రెండేళ్ళ నుంచి చేసిన శాక్రి ఫైస్ ముందు ,తాను చేస్తున్న ఈ భిక్షాటన” బలా దూర్” .అనుకోండి .అందుకే అంత కఠోర నిర్ణయం తీసు కొంది .మనసా వ,వాచా ,కర్మణా ,ఎలా గినా ఆ కుటుంబాన్ని సహాయ శక్తులా  ఆదు కోవటమే తులసి ధ్యేయం .మాటలు కాదు -చేతలతో చేసి చూపిస్తోంది .బాధ్యత గల భార్యగా ,ఓడినగా ,కొడాలి గా ,ఆమె పాత్ర చిరస్మర ణీయం . కధా ప్రపంచం లో వెలిగి పోయే పాత్ర ”తులసి ”.
శతావ దాని వేలూరి శివ రామ శాస్త్రి గారి శిల్ప  కళా నైపుణ్యం అడుగడుక్కీ కన్పిస్తుంది .డిప్రెషన్ వికృత రూపాన్ని ,అన్ని కొనాల్లోనుంచి ,అత్యంత సహజం గా ,చమత్కారం గా ,దయ నీయం గా చూపించి ,కధా చక్ర వర్తి అని పించుకొన్నారు శాస్త్రి గారు .ఆయన కధల్లో ని ”పంచామృతం ”మీకు అందించాను .అవి మనసుకు ఉత్తేజం కల్పించి ,కర్తవ్యాన్ని బోధించి ,ఆనందం కల్గించేవే .ఆ మహా కధక సమ్రాట్టు కు శిరసు వంచి పాదా భి వందనం చేస్తున్నాను .  ఆ intellectual giant కు జోహార్లు అర్పిస్తున్నాను .
 
               శ్రీ శివ రాం అశాస్త్రీ గారు జన్మించిన గ్రామం కృష్ణా జిల్లా తేలప్రోలు దగ్గరున్న ”చిరి వాడ అగ్రహారం ”.అక్కడ వారిని చాలా సార్లు దర్శించాను .మాట్లాడిన అనుభవం ఉంది .అప్పటికి సాహిత్యం లో తప్ప తడుగులు వేసే వయస్సు నాది .మా రెండ వ బావ గారు వేలూరి వివేకానంద గారు, శాస్త్రి గారి 
తమ్ముడు గారు వేలూరి కృష్ణ మూర్తి (మిల్లు కృష్ణ మూర్తి )గారి కుమారులే .అందుకే చిరి వాడ తో మా బాంధవ్యం వుంది .అలాంటి మహా శతావ దానిని ,సకల శాస్త్ర పారంగతుని ,వేద ,వేదాంత భావ జలధిని ,పద్యం తో పాటు వచనాన్ని పండించి ,గాంధి జీవితాన్ని ,శరత్ సాహిత్యాన్ని అనువ దించి,గురువులైన  తిరు పతి కవుల నిజ వారసు లని పించు కొన్న వారు అయిన వేలూరి శివ రామ శాస్త్రి గారిని తెలుగు దేశానికి అందించిన చిరివాడ గ్రామం ధన్య అయింది .అందుకే ”వేలూరి వారి కధా పంచామ్రుతాన్ని ”,మిగిలిన కధా స్రవంతి  తో పాటు” చిరివాడ గ్రామానికి ”అంకితమిస్తున్నాను .
సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -03 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అభద్ర భారత దేశం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –4

 వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –4

              మూర్తి కూడా బి.ఏ.ఆన్సే. చిన్న బోయిన ముఖం తో వరండా లో కుర్చుని ఉండగా మరో ఆన్స్ రామా రావు చేరాదక్కడికి .”మూర్తి ది కో-ఆపరేటర్ అని సంబోధించాడు .”మధ్యాహ్నము -మిస్టర్ ద్వివేదీ -ది ఇంటల్లుడు ”అని బదులిచ్చాడు మూర్తి .ఇప్పుడు సింహాసనం మీద చక్ర వర్తి ని తీసేసి డిప్రెషన్ రాజ్యములు తోందని అందువల్ల ఇంటల్లుడు ,ఊరల్లుడు ,విడాకులల్లుడు  ,వాకిటల్లుడు ఉంటారని ,తనకు ఉద్యోగం దొరక నంత వరకు వాకిటల్లుడు గానే ఉన్నానని మూర్తి చెప్పాడు .బయట ఎందుకు కూర్చున్నాడో అర్ధమయింది రావు కు .తన వంటి వాడికి వాకిటల్లుడు పనే నయం అనీ ,చెప్పాడు .హతాశు దిన రావు మళ్ళీ రోడ్డు న పడ్డాడు .                            

  ”అప రాహ్న సూర్యుడు అతని తలను ,ఖుత్ సూర్యుడు అతని ఉదరమును మల మల మాడ్చెను ”.భార్య జ్ఞాపకం వచ్చి ఇంటికి పరి గేత్తే ప్రయత్నం చేశాడు రావు .మళ్ళీ ఆలోచనలో పడి ”పైసా లేనిచో పర స్త్రీ విముఖుడను మాట ఝూటా -పైసా లేనిచో స్వ ,పర స్త్రీ విముఖుడు ‘అనే జీవిత సత్యాన్ని తెలుసు కున్నాడు .మిగిలిన స్నేహితుడు శర్మ .try and try again అన్నారుగా .శర్మ ఏం .ఏ.బి.ఎల్ .అయినా వాకిట్లో పార్టీల సంద డేమీ లేదు .”ప్లీడర్ల ఇళ్ళు కల్లు అంగళ్లు కదా ఈ సందు ఇంత అరణ్యం గా ఉందేమి ?”‘అని అనుకొన్నాడు .కోర్టు వేళ కదా అని వెళ్లి పోతుంటే శర్మ కన్పించాడు .శర్మ కు చత్వారమే కాక ,రెండు రోజులనుంచి ,”తిమిర రోగం ”కూడా ప్రవేశించింది .అందుకే పాపం కళ్ళ జోడు కూడా పగిలి పోయింది .కొనే స్తోమత లేదు .అందుకనే జోడు అల వాటు మాని వేయాలని నిర్ణ యించు కొన్నాడు .”జోడు పనిని మనసు చేత నే చేయించి సమాధాన పడు తున్నాడు ”అని కధకుని గా శాస్త్రి గారంటారు .
తన నెవరు చూడటం లేదని భావిస్తున్న శర్మ గోడ కున్న తన” నేం  ప్లేటు ”ను పీకేసి ఇంట్లో దాచేసి, ఏదో కాగితం తీసి రాస్తున్నాడు .”దారిద్ర్య దేవత వికట హస్తాన్ని ”విస్పష్టంగా  చూశాడు రావు .ఇక్కడా హుళక్కే అని అనుకున్నాడు .”శర్మా ది నిహిలిస్ట్ !దేవుడున్నాడని రాస్తున్నావా ?”అని పలకరించాడు .అంత దరిద్రం లోను శర్మ హాష్య ప్రియత్వం ఆగ లేదు .”ఆకాలపు ఎండ ,ఇంటి యల్లుడా !నీ కెందుకీ కాండ దేవుడెక్కడ ఉన్నాడు ?ఉన్న దంతా డిప్రేశానే .యు.పీ.లో గ్రాడ్యు ఎట్లకు పది ఎకరాలు భూదానం గా ఇస్తున్నారని తెలిసి అప్ప్లి కేషన్ రాస్తున్నాను .దాని రిజిస్ట్రేషన్ ఖర్చులకు ఒక పావలా దానం చెయ్యి ”అన్నాడు శర్మ .”మా ఆయనే ఉంటె ,మంగలి తో పనేమిటి ?”అన్నట్లు ,ఆ పావలా ఉంటె ,ఈ పూట నిర్వి చారం గా గది ఛి పోయేదే అని లోపల అనుకోని ,”ఆ దానం యు.పీ.లో ఒక జిల్లా కు మాత్రమే కనుక నా దానం అప్రశస్తా దానం ”అని తేల్చేసి బయటికి వెళ్ళాడు .ఇలా సుందరం ,మూర్తి ,శర్మా గర్భ దరిద్రాన్ని అను భావిస్తున్నా దానికి అలా వాటు పడి ,ఏదో పని చేస్తూ ,మాటలతో ఊరట చెందుతూ చేరా గని చిరు నవ్వు తో ,కాల క్షేపం చేస్తున్నారు .ఎవరో వస్తా రని ,ఏదో చేస్తారని ,ఎదురు చూడటం లేదు .తమ ప్రయత్నాలను తాము చేస్తూ ,బతుకు బండీ ఈడు స్తున్నారు .చిన్న చిన్న మాటలతో శాస్త్రి గారు మహా గొప్ప గా మదింపు వేసి చూపారు .”ఇలా డిప్రెషన్ బజారు నుండి ,అసలు బజార్లో ”పడ్డాడు ఆశోప హతుడైన రావు ఆన్స్ .వాళ్ళెవరు వ్యవస్థ మీద నిప్పులు చెరగలేదు .ప్రభుత్వం మీద ప్రతీకారం చేస్తామని ఊగి పోలేదు .వామ పక్ష భావాల సుడి గుండం లో పడి కొట్టు కు పోలేదు పరిస్తితులను అర్ధం చేసుకొని ,కాళ్ళ మీద నిలిచే ప్రయత్నాలే చేశారు .దేబిరించి అడుక్కు తినాలని ఆలోచించ లేదు .లేదా ఉన్న వాడిని దోచుకోవాలనే ఆలోచన వారికి లేనే లేదు .బాలన్స్ గా విషయాన్ని అధ్యయనం చేసి ,తమ మార్గాన తాము సాగి పోతున్నారు …

  ఇక్కడ ఇంటి దగ్గర ”తులసి ””ఈ రోజూ మా కెవరికి అన్న ప్రాప్తి లేదు ”అను కొంది .మొగుడి నిర్వాకం తెలిసింది .మూడు గంటలు మోగాయి .”నిజం ,నిజం ”అను కోని భోషాణం తలుపు తీసి వెదికి ,వెదికి పెద్ద రాగి చెంబు తీసి ,చింత పండు తో తోమి శుభ్రం చేసింది .
   సశేషం          వచ్చే దే ఆఖరి భాగం
                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -03 -12 .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –3

  వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు –3

             తులసి స్నానం చేస్తుంటే తలు పు తట్టి చివాట్లు తిన్నాడు రావు .అతని తో ఆమె తెగేసి ”రెండేళ్ళ నుంచి మీకు తల్లి విందు .నేడు ఆలి మందు .మీ అమ్మ నగలు మీ కడుపు లోకి .నా నగలు నా ఒంటి మీదికి .మీరు పాసైన ఏం,ఏ.ఫలితమే నేడు మనం అనుభ వించేది .ఈ పిల్లల్ని పోషించే భారం తీసు కొంటారా ?”అని కడిగేసింది .దగ్గర కు రావ టానికి అతను ప్రయత్నిస్తే ”మీ వంటి వారి యెడ ,అస్పృశ్యతా ,స్పృశ్యతా , ,అసంభావ్యతా ఉన్నాయి ”అని ,అతని చేత కాని తనానికి ,అసమర్ధతకు ,బద్ధకానికి ,ప్రయత్నా శూన్యత కు ,ఫాల్స్ ప్రిస్టేజి కూ శాస్తి అన్నట్లు చెప్పింది .ఆమె లోని ”నాగ కన్యను ,సత్య భామను ”ఇంతకు ముందు చూడని వాడు కనుక కొంచెం జంకాడు .”ఏమిటీ రావణ వ్యాపారం ‘?’.అంది అతడు ఆ మెను ఏదో చేయ బోతాడని భయ పడింది .”భరింప బడేది భార్య అయితే నేను  మీ అమ్మ గారికే భార్యను మీకు కాదు ”అంది .ఇంత కాలం తనను పోషించింది అత్తా గారే అని గుర్తు చేసింది .కర్తవ్యమ్ ఇప్పటి కైనా తెల్సు కో మంది .అయినా ఆమె ను పొదివి పట్టు కున్నాడు .ఆమె తప్పించుకు పారి పోయింది .అప్పుడు శాస్త్రి గారు అన్న  మాటలు ఆణి ముత్యాలు .”కన్నుల నుండి ఒకా నొక కృష్ణ ప్రవహిన్చుటకు గాను ,కట్టలను తప్పించు కొను చుండెను ”అని కన్నీటి వరద క్రిష్ణమ్మే ,కష్టాల గోదారే అయింది తులశమ్మ .
అయినా అతని శృంగారానికి కట్ట వేయ లేక పోయింది .దగ్గరకు వస్తే ”చడేల్ ”మని చెంప పగల కొట్టింది .తానేదో శ్రీ కృష్ణు డైనట్లు ,ఆమె సత్య భామ గా కాలితో తన్ని నట్లు భావించి రెండో చెంప  ఇస్తే ”చాచి మళ్ళీ వాయించింది ”.అయితె పట్టు వదలని విక్ర మార్కుడి లా బుగ్గ లపై ముద్దుల ముద్ర వేశాడు .”ఇది శిలువ గుర్తు ”అందామె భరించ లేక .తానూ యేసు క్రీస్తు లాగా రెండు చెంపలు ఇచ్చానని ,ఘనం గా అన్నాడు .”క్రీస్తు పేరు చెప్పే వారు ఇంటిల్లి పాదినీ పస్తు లున్చరుఅని చెంప దెబ్బ కంటే పెద్ద దెబ్బే కొట్టింది .తల్లి ఇచ్చినఅపోట్లం లో  మట్టెలు ,మంగళ సూత్రాలు ఉన్నాయని తెలుసు కొని ,”అమ్మ వచ్చే వరకు తిండికి ఆటంకం లేదు ”అన్నాడు ఆ ప్రబుద్ధుడు .ఆమె విపరీతమైన కోపం తో ”నేను చచ్చినా ,వీటిని ఇవ్వను -కాని నా తాళి తీసి ”అని పుటుక్కున తాళి తెంపి మొగుడి మొహాన విసిరేసింది .ఆ బంధం తెగి నందుకు ఆనందం అను భావిస్తున్నట్లుంది ఆమె .విషయం ముదిరి పాకాన పడిందని తెలిసి నెమ్మది గా జారు కున్నాడు ఆనర్స్ రాముడు .ఇదంతా ‘అతని కళ్ళు మూసు కొని పాలు తాగే పిల్లి మనస్తత్వం ”ఆమె కార్యాచరణకు నాంది పలికింది .తమ కోసం ,అత్తా ,మరుదులు ,ఆడ పడుచులు చేసిన త్యాగం ఆమె ను కర్త వ్య పరాయణు రాలిని చేసింది .బాధ్యతా ను గుర్తించింది .ఇక తన సంసారం ఏ మైనా ఫరవా లేదు .వారికి ఊరట .కడు పు నిండా కాక పోయినా ,బత కటానికి ఇంత అన్నం పెట్టటం తన విధిగా భావించింది .ఉత్తమా ఇల్లాలు ”తులసి ”పేరు సార్ధకం చేసుకొంది .ఆ పవిత్ర త ను కూడా పొందింది .మన  మన్ననా పొందింది .కష్టాల కడలి లో మునిగి పోతున్నా ,కర్తవ్యమ్  తెర చాప సహాయం తో ప్రయాణం సాగించాలని నిశ్చయించు కొంది .అమృత స్వరూపిణి గా ,సాక్షాత్తు అన్న పూర్ణా దేవి గా రూపు దాల్చింది .ఆ ఇంటికి తానె ”మగ దిక్కు ”అయింది .ఎగా తాళి చేసే తాళి అవసరం లేదను కొంది .కష్టాలకు తాళ లేక పోయింది .కాళి లా ప్రవర్తించి కను విప్పు కల్గించింది ..

     శాస్త్రి గారి హాష్య చతురతా ,సంభాషణా చాతుర్యం ,విజ్రుమ్భింప జేయ టానికి తగిన వాటా వరం శ్రుస్తించు కొన్నారు .డిప్రెషన్ వాళ్ళ అప్రేస్ ,సప్రేస్ అయిన వారి జీవితాలను ఫోకస్ చేయ టానికి మంచి వ్యక్తులను ఎన్ను కొన్నారు .వారి జీవిత విధానాలను డిప్రెషన్ వారి లో తెచ్చిన మార్పులను గొప్ప గా చిత్రించారు .తవ్విన కొద్దీ తేనే లూరే తుట్ట .హాశ్యపు పుట్ట .పెళ్ళాం కొట్టిన చెంప దెబ్బలకి మొహం వాచ్ పోయిన రామా రావు ఇంట్లోంచి బయట పది స్నేహితుల దగ్గరకు ”హలో వో నోటివ్వు ”అని అడగ టానికి బయల్దేరాడు .ఉద్యోగం లేక పొతే కనీసం అప్పు చేసినా కొంత సాధించా వచ్చు ననే ధీమా .”అప్పు చేసి పప్పు కూడు తినటం హాయి .కాస్త పది పదో పాతికో సంపాదించటం కష్టం -బిలో దిగ్నిటి ”అని భావించిన రావు ఆనర్స్ మొదటగా ”సుందరం ”అనే లాయలిస్ట్ ఇంటికి వెళ్ళాడు . అతడు ”మోకాలు దిగని కొల్లాయి గుడ్డ కట్టు కొని ,వేరు సెనగ కాయలు ఒలుస్తూ ,తింటూ కన్పించాడు ”రామా రావు ను చూడ గానే హేళన గా ”ఈ ఇల్లతపు అల్లుడు ,ఆ హిమాలయం నుండి ,ఆ ఒశాడీ ప్రస్థం నుండి ఎపుడు దిగెను ?అన్నాడు .ఎంతటి వాడు ఎలా బజారు పాలైనాడో తెలీక .రామా రావేమీ తక్కువ  తిన లేదు ”ఈ కద్దరు కొల్లాఎమిటి -సుందరం ది లాయలిస్ట్ గాంధి ఎపుడాఎను ?”అని అంటించాడు .
                 తన కొల్లాయి దొంగ ఖద్దరని మాంచెస్తర్ ది . అని అంటూ ”కుక్క పిల్ల  ఇంకా కనులు తెరువ నట్లున్నది నాయనా–డిప్రెషన్ -డిప్రెషన్-డిప్రెషన్ ”అని గోల చేశాడు .ఇదంతా డిప్రెషన్ మహా మారి ప్రభావమే నని చెప్పకనే చెప్పాడు .కళ్ళు తెరిచి లోకం చూడమనే సలహా కూడా ఇచ్చాడు .”ఉద్యోగం దొరక లేదా “‘అన్నాడు రాం .”దొరికింది .గంగా దేవి ని నమ్ము కొంటి .బి ఏ నీళ్ళు ,బి,ఏ.నీళ్ళు అంటూ నీళ్ళ కావిడి వేసి బిందె అర్ధణా కు అమ్ముచుంటిని .వెల తగ్గె నని వేరు సెనగ కాయలు తింటిని ”అన్నాడు .జీవిత విధానాన్ని  మార్చుకోన్నానని ,కాలానికి తగి నట్లే ప్రవర్తించాలని ”క్లాస్ పీకాడు .ఇక అతనికి లాయలిస్ట్ బిరుదు అనవసర మని ఇక నుంచి సుందరం ది బాంకర్ ”అన్నాడు రావు .పాపం ఏదో ఆశ పడి వచ్చాడని గ్రహించి ,బాంకర్ అని ఎందుకు వచ్చాడో గ్రహించాడు .తన నీటి మోత వల్ల రోజుకు సంపాదన మూడణాలు అని ,వేరు సెనగ పప్పు ఖరీదు కూడా అంతే నని ,బాంక్ బాలన్స్ నిల్ అని నిజం చెప్పే శాడు సుందరం .వేసిన ఎత్తు చిత్తయింది .పాచిక పార లేదు .పైగా నీతి బోధ .బుర్ర తిరిగి చెప్ప కుండానే అక్కడి నుంచి జారు కున్నారు రామా రావు .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

ఆర్టిస్ట్ బ్రతికితే కళ వెలుగుతుంది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు -2

వేలూరి వారి కధ –డిప్రెషన్ చెంబు -2

                  శ్రీ రస్తు చిరంజీవి ద్వివేదుల రామయ్య అని పోస్ట్ వచ్చింది .ద్వివేది అని కాని డిగ్రీ కని దాని మీద లేక పోయేసరికి చిన్న బుచ్చు కొన్నాడు .హాన్స్ దొరకు అవమానం అని పించింది .”పేరు చేతనే గౌరవం పుడికి పుచ్చు కొనే వారికి మొండి పేరు -బండ బూతు ”అంటారు కధకులు .అతని మేన మామకు సీరియస్ అని లేఖ సారాంశం .తల్లికి చెప్పి రమ్మని భార్యను కిందికి పంపాడు .ఆమె దిగి ,చెప్పి పైకి రాగానే సమయం కని పెట్టి ,వాటేసుకొని ,నలిపేశాడు .”ఏమిటీ మోట పని ?లంఘనం లో మను గుడుపు ”అని ఈస డించింది .సంధిలో మంత్రం లాగా .అమ్మని ,తమ్ముళ్ళను పంపిస్తా నని తాను వెళ్ళ నని అన్నాడు .అతను వెళ్ళటం మంచిది అంది .ఆమె విరహం భరించ లేని స్వాప్నికుడు కదా .”నీ యెడ బాటు నాకు అనార్కి .అమ్మా ,పిల్లలు వెళ్తే స్వరాజ్ అన్నాడు .పాత్రల స్వభావాలను బహిర్గతం చేసే విలువైన మాటలివి .కాదు”డయార్కి” అందామె .తనకో ఉద్యోగం ఆఫర్ లో ఉండటంవల్ల రావటం లేదని తల్లిని వెళ్లి రమ్మన్నాడు .ఆమె పాపం కొడుకు సంగతి తెలిసి ”మామయ్యకు ఎప్పుడు ఇలానే వస్తుంది లే .నీ ఉద్యోగ ప్రయత్నం చెయ్యి ”అంది .పిల్లల్ని ఇక్కడే వది లేయ మంది కోడలు .అత్త చాలా మంచిది .”వీళ్ళు నెత్తి మీద బండలు .మీరు మోయలేరు ”అన్నది .కోడలు ”బండలు కాదు ,నెత్తికి కిరీటాలు ”అని తన సహృదయత ,వారి పై ప్రేమ వెలి బుచ్చింది .చిన్న కొడుకు ను మాత్రం తీసుకొని తల్లి వెళ్ళింది .అత్త కోడలితో ”ఎన్నడూ ఎరగని దానివి –ఈ ఇంటి మొహం సూది -పొట్ట మాత్రం పాము పొట్ట ”అని అలాంటి సంసారాని భుజాన పెట్టి వెళ్తున్నందుకు బాధ పడింది .
                       వెళ్తూ అత్త ,కోడలికి ఒక పొట్లం ఇస్తూ ”దీనిలో వంట ఇంటి సామానంతా వుంది ”అని చెప్పింది .ఇంట్లోకి వెళ్లి తులసి పొట్లం విప్పితే ,”మట్టెలు ,మంగళ సూత్రాలు ”కన్పించాయి .అవి ”తన సంసార యాత్ర కు దారి బత్తెం ”అట్టం గారి దుఖానికి అర్ధం తెలిసిన్దామెకు .”మంగళ సూత్రం చుట్టూ గుది కట్టిన మగలు లేని వారి మనో రహశ్యాలు అన్నీ ,ఆమె మనస్సు లో మేడి లాయి ”అత్తను అర్ధం చేసుకొన్నా కోడలిగా ఆమె ను ఆవిష్కరించారు శాస్త్రి గారు .ఒక సారి ఆ ఇంటి మ్పరిస్తితి ఫ్లాష్ బాక్ గా కని పించింది .పెద్ద కొడుకు సంసారాన్ని ఉద్ద రిస్తాడని ,చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాడని తల్లి ఉన్నదంతా కొడుకు ,కోడలికి పెట్టి ,మిగిలిన వారిని మాడ్చింది .తాను కాపు రానికి వచ్చే సరికి పిల్లలు ముద్దు గా ,బొద్దుగా నాగా ,నటరా తో ఉత్సవ విగ్ర హాల్లా ఉన్నారు .”ఇపుడు లజ్జా దేవి వారి పై కాపురం ”అని ఆ తేడా ను గొప్ప గా చెప్పారు .”పుండు వంటి పుష్య మాసం లో కూడా కప్పు కోటానికి దుప్పటి లేదు .”పద్మ  నాభుడు గోచీతో ,మూడో వాడు మొల నూలుతో ,మురిసి పోయారట .పెద్ద ఆడ పిల్లకు మాసికల పరికిణీ ,చిన్న దానికి చిరుగులది .రాత్రి పూట వారందరికీ ”ఒకరి చర్మం ఇంకొకరికి దుప్పటి ”దరిద్రాన్ని కళ్ళకు కట్టించారు .పిల్లల కోడిలా తల్లి తన కోకతో వారిని పొదుగు తుంది .ఇదే చివరి నాగ అని తెలుసు కొంది .                         తల్లి చూపే ఆ పిల్లలకు సుగ్రీవాజ్న .భూగోళం వారికి చీకటి గది .అన్నకు పెట్టె వంట కాల వాసనే వాళ్లకు ”మీదు ”ట .అన్నా ,వదినా అనే అర్ధ నారీశ్వ ర మూర్తే వాళ్లకు అది దైవం .దాని లోని నారీ మూర్తి ఇప్పుడు తమకు ప్రత్యక్ష దేవత యై ,ఆ పిల్లలకు ఇప్పుడు సాక్షాత్కరించింది .ప్డ్డ్డున చద్దన్నం లో ఏం తినారని పిల్లల్ని అడిగింది తులసి .చద్దన్నం రుచి చూసి ఆరు నెల లైంది అన్నారు .అన్నయ్య కు ఉద్యోగం వచ్చిన తర్వాత వేడి అన్నం పెడతానని అమ్మ చెప్పిందని ,చలిది అన్నం జబ్బు చేస్తుందని అన్నారు సుందరి ,రమణా .తల్లి పెంపకం వాళ్ల లో అంతటి ఉదాత్త భావాలను కల్గించాయి .లోకజ్ఞా తకు నిదర్శన మైంది .ఉన్న కొద్ది బియ్యం ఉడ కేసి వాళ్లకు పెట్టె ప్రయత్నం చేసింది .నిన్న రాత్రి ,వాళ్ళు ””యెర్ర మందు ”అంటే ఆవ కాయ వేసుకొని తిన్నారట .ఇకా ఏం తిన్నారని అడిగితె ”ఆకాశం ”అన్నారు .అంటే మజ్జిగ .వాళ్ల అమ్మ కూర అదీ వేసి ఎందుకు పెట్ట లేదని అడిగింది .”మీరు చదువు కున్నారుగా అందుకని అమ్మ మీకే పెడ్తుంది ”అని వాళ్ల సమాధానం  .”అన్నాయికి ఉద్యోగం వచ్చింతర్వాత మాగ్గూడా పెడు తుంది” .అన్నది సుందరి .అన్నయ్య తమక్కూడా చదువు చెప్పిస్తాడని అమ్మ చెప్పిందని అన్నాడు రమణ  .ఆశ్చర్య పోయింది తులసి ఆ నిర్వి కార పర  బ్రహ్మ అయిన బర్తను తలచుకొని .
     సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -03 -12 .
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

దుర్గమ్మకు లక్ష తామరలతో పుష్పార్చన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment