“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” పాలగుమ్మి విశ్వనాధం గారు ఆకాశవాణి కోసం స్వర పరచిన ఒరిజినల్ పాట

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

దర్శ నీయ దేవాలయాలు -౩ శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి దేవాలయం

 

                                           దర్శ నీయ దేవాలయాలు -౩

శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి దేవాలయం

సాహితీ బంధువులకు కనుమ పండుగ శుభా కాంక్షలు .దర్శనీయ దేవాలయాలు శీర్షిక లొ సుమారు నేల క్రితం రెండు దేవాలయాల గురించి రాశాను .ఇప్పుడు మూడవ దేవాలయం ఈ శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంతో కొనసాగిస్తున్నాను .ముందుగా ఆంజనేయ స్వామి ఆలయాలు గురించి రాసి తరువాత మిగతా దేవాలయాల గురించి రాయాలన్నది నా సంకల్పం .వీటిలో నేను రాసిన విషయాలు సమగ్రం కాక పోవచ్చు .మీ దగ్గర అదనపు సమాచారం ,ఫోటోలు ఉంటె సరస భారతికి తెలియ జేసి మీరూ భాగా స్వాములై సమగ్రతకు సహకరించ వలసిన ది గా కోరుతున్నాను .

photo5 photo-big2

 

నెట్టి  కంటి అంటే ఒకే ఒక కన్ను గల వాడు అని అర్ధం .ఈ దేవాలయం అత్యంత ప్రాచీన మైనది .దీనికొక చరిత్ర ఉంది .క్రీ.శ.1521లొ హంపీ క్షేత్రం లొ శ్రీ వ్యాస రాయల వారు తుంగ భద్రా నదీ తీరం లొ నిత్య కర్మాను స్టానం చేస్తున్నారు .తాను ఒంటికి పూసు కొనే మంచి గంధం తో ,తన ఎదురుగా ఉన్న ఒక శిల మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించారట .అది నిజ రూపం ధరించి నడవటం ప్రారంభించిందట .వ్యాస రాయల వారు పట్టిన పట్టు విడవ కుండా అయిదారు సార్లు అలాగే చిత్రాన్ని రచించటం ,అది నడుస్తూ వెళ్ళి పోవటం జరి గిందట. .చివరికి వ్యాస రాయల వారు శ్రీ ఆంజనేయ స్వామివారి  ద్వాదశ నామాల బీజాక్ష రాలతో ఒక యంత్రం తయారు చేసి ,దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజ రూపాన్ని చిత్రించారట .అప్పుడు స్వామి ఆ యంత్రం లొ బంధింప బడి అందులో స్థిరం గా  ఉండి పోయారట .ఒక నాటి రాత్రి స్వామి వారు వ్యాస రాయల కలలో దర్శనమిచ్చి ‘’నన్ను కీర్తించి పూజిస్తే చాలదు .నాకొక ఆలయాన్ని నిర్మించు .అందులో నా విగ్రహం అత్యంత భక్తీ శ్రద్ధల తో ప్రతిష్టాపన చెయ్యి .’’అని చెప్పారట .

 

 photo4 photo-big5 photo-big3

 

వ్యాస రాయల వారు ఎంతో శ్రమించి ,అందరి సాయం తో ఆ ప్రాంతాననే 732 శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ట చేశారట .ఈ నాడు మనకు కని పించే ‘’చిప్ప గిరి ‘’గ్రామం లొ శ్రీ భోగేశ్వర స్వామి వారి దేవాలయం లొ వ్యాస రాయల వారు నిద్రిస్తుండగా శ్రీనేట్టి కంటి ఆంజనేయ స్వామి వారు కలలో కన్పించి తాను ఆ ప్రాంతం నుండి దక్షిణ దిశ గా ఉన్న ప్రాంతం లొ అతి చిన్న రూపం లొ భూమిలో ఉన్నానని తనను బయటికి తీసి మరలా ఆగమ సంప్రదాయాల నను సరించి ప్రతిష్ట చేయమని ఆనతిచ్చారట .ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నదో తమకు మార్గ దర్శనం చేయమని వ్యాస రాయల వారు కోరగా స్వామియే  ఒక ఎండిన వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గరకు వెళ్ళమని అక్కడికి చేర గానే అది చిగురిస్తుందని అక్కడే భూమిలో తాను ఉంటానని చెప్పారట .

 

photo-big1

 

 

వ్యాస రాయల వారు కలలో స్వామి చెప్పినట్లే మర్నాడు బయల్దేరి నడిచి వెళ్ళి కొంత దూరం లొ ఎండిన వేప చెట్టును కను గొన్నారు .రాయల వారు దాని సమీపానికి రాగానే ఆ వేప చెట్టు తక్షణమే ఆకు పచ్చ గా చిగురించిందట .ఆశ్చర్య పడిన వ్యాస రాయల వారు అక్కడ భూమిని త్రవ్విన్చారట .అక్కడ దొరికిన ఒంటి కంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు .దేవాలయాన్ని నిర్మించారు . ఈ ఆలయం కసాపురం .గ్రామానికి అతి దగ్గర లొ ఉండటం వల్ల శ్రీ ఆంజనేయ స్వామిని కసా పురం ఆంజనేయ స్వామి అని కూడా అంటారు .నెట్టి కల్లు లొ ఆవిర్భా వించాడు కనుక స్వామిని శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి అనీ భక్తులు ఆప్యాయం గా పిలుచు కొంటారు .

 

శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామికి ఒక విచక్షణ లక్షణం ఉంది .స్వామి కి కుడి కన్ను మాత్రమె ఉంటుంది .ఆ కంటి తోనే భక్తులను కృపా కటాక్షాల తో వీక్షిస్తూ ,వారి మనో భీష్టాలను నేర వేరుస్తారని ప్రతీతి .భక్తుల బాధలను స్వామి వారికి విన్న వించు కొంటె, కలలో కన్పించి నివారణ మార్గాలను సూచిస్తారట .స్వామి విగ్రహానికి అపూర్వ తేజస్సు ,సాటి లేని ఆకర్షణా ఉండి,ముగ్ధుల్ని చేస్తుంది . .అందుకే అశేష భక్త జనం స్వామి వారల నుదర్శించి ,స్వామి వారి అనుగ్రహం తో తమ జీవితాలను తీర్చి దిద్దు కొంటున్నారు .స్వామి విగ్రహం తూర్పు ముఖమై ,దక్షిణ దిశ ను చూస్తూ ,,భక్త జనుల మొరలు విని పించు కొంటూ ,బాధలను తీరుస్తూ ,ఉన్నట్లు గా అని పిస్తుంది .స్వామి నిజ రూప దర్శనంను  ఆ సుందర దివ్య సుందర విగ్రహానికి అభిషేక సమయం లొ కన్నుల పండువు గా దర్శించి ,తరించ వచ్చు.

hanuman

కసాపురం అనంత పురం జిల్లాలో గుంతకల్లు రైల్వే జంక్షన్ కు అయిదు కిలో మీటర్ల దూరం లొ ఉంది.బస మార్గం లొ గుత్తి కి 35కి.మీ .దూరం లొ ఉంది.. ప్రతి ఏడాది ఒక చర్మ కారుడు ఏక భుక్తం ఉంటూ ,బ్రహ్మ చర్యాన్ని పాటిస్తూ శ్రీ ఆంజనేయ స్వామికి ఒక చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు మర్నాడు వచ్చి చూస్తె అది అరిగి పోయి నట్లు చిరిగి పోయి నట్లు కని పించటం విశేషం .స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట వాహ్యాళి వెళ్ళి వస్తూంటాడని భక్తుల నమ్మకానికిది నిదర్శనం .  ప్రతి ఏటా వైశాఖ ,శ్రావణ ,కార్తీక ,మాఘ మాసాలలో శని వారం నాడు అసంఖ్యాకం గా భక్తులు స్వామిని సందర్శించి తమ మనో భీష్టాలను నేర వేర్చుకొంటారు .చైత్ర మాసం లొ పౌర్ణమి రోజున ఈ ఆలయం లొ శ్రీ హనుమద్ జయంతి జరపటం ప్రత్యేకత ..

photo-big4 photo7

           ఇప్పుడు వ్యాస రాయల (వ్యాస తీర్థులు) వారి గురించి కొంత తెలుసు కొందాం .

 vyasaraja

వ్యాస రాయల వారు బ్రహ్మ లోక నివాసి .బ్రహ్మ దేవునికి అత్యంత శ్రద్ధా భక్తులతో సేవ చేస్తూ ఆయన పూజ కు కావలసిన వన్నీ సమకూరుస్తూ ఉండే వారు .ఒక రోజున ఏదో ఏమరు పాటుగా ఉంది సకాలానికి బ్రాహ్మ గారి పూజకు సామాను సిద్ధం చెయ్య లేక పోయారట .బ్రహ్మ కు విపరీతం గా కోపం వచ్చి భూలోకం లొ జన్మించమని శపించాడు .ఆ శాప వశం గా ఆయనే కృత యుగం లొ రాక్షస రాజు అయిన హిరణ్య కషిపునికి శ్రీ హరి భక్తు డైన ప్రహ్లాదుని గా జన్మించారు .ద్వాపర యుగం లొ బాహ్లికుడు గా జన్మించి కురు క్షేత్ర సంగ్రామం లొ కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు .కలియుగం లొ పద్నాలుగవ శతాబ్దం లొ విజయ నగర సామ్రాజ్యం లొ శ్రీ కృష్ణ దేవ రాయల కాలం లొ వ్యాస రాయలుగా జన్మించారు .ఆ తర్వాతా జన్మ లొ వారే మంత్రాలయం శ్రీ రాఘ వేంద్ర స్వామి గాఆవిర్భవించారు .శ్రీ వ్యాస రాయలు కర్నూలు జిల్లా శిల్ప గిరి –అదే నేటి చిప్ప గిరి కి వారి గురువు గారు విజయ దాస తీర్ధ స్వామి దర్శనానికి వచ్చి నప్పుడు శ్రీ మిట్ట కంటి ఆంజనేయ స్వామి వారు కలలో కన్పించి తన ఉనికిని చెప్పి ఆలయాన్ని నిర్మించమని కోరారు .

photo-big6 photo-big7

 

 

.           మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం .

సశేషం-మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –15-1-13-ఉయ్యూరు

 

 

 


 
Posted in దేవాలయం | Tagged | Leave a comment

భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -4

 భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -4

     స్కూల్ లొ తనికీ ప్రారంభ మయింది .అక్కడ ఉన్నవి ఎన్ని క్లాసులు అని అడిగాడు అధికారి .సమాధానం గా ‘’అందరికీ ఏక మొత్తం గా గట్టి గా చెప్పటమే గాని ,క్లాసులంటూ ,భేషజం నేనెరుగను .ఆ ముగ్గురు పై క్లాసు ,ఈ కడం కింది క్లాసు ‘’అన్నాడు అయ్యవార్లు .అదీ అక్కడి చదువు .,చెప్పే రీతీ .’’ముని అనే మాటకు అర్ధం అడిగాడు అధికారి .మనిషి అన్నాడు ఒకడు .’’మరి నేను ముని నేనా ?’’అని ప్రశ్నించాడు మళ్ళీ .కాదన్నాడింకోడు.కారణం అడిగితే ‘’ముని అంటే మంచి మనిషి ‘’అని దెబ్బ కొట్టాడా కుర్రాడు ‘’ధణుతెరిగి పోయింది’’ అందరికి

            ఇప్పుడు మేష్టార్ని పాఠంచెప్పమన్నాడు .సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడని చెప్పాడు పంతులు .’’అబద్ధం ‘’అన్నాడు అధికారి .’’మీరు చెప్పండి .-ఇందాకట్నించి విన్నాగా నేను ‘’అని బరి తెగించాడు మేష్టారు .తను పిల్లలు గల వాడి నని మొత్తు కొన్నాడు .చివరికి ‘’అల్లా అయితే బాలు లారా !భూమేట సూర్యుడి చుట్టూ తిరుగు తుందట ‘’విన్నారా ?గిర గిరా ‘’అన్నాడు చివరికి .ఇంతట్లోకే నమ్మకం ఎలా మారిందని ఆశ్చర్య పడ్డాడు తల పాగా ఆయన .సమాధానం గా పంతులు గారు ‘’అయ్యా !నా జీతం రాళ్ళు నాలుగూ ,గిర గిరా తిరిగి వస్తుంటే చాలు .దేని చుట్టూ ఏది తిరిగితే పోయే దేముంది ?’’అన్నాడు గుక్క తిప్పు కొ కుండా .

          తాను ఇది వరకే రాసిఉంచిన తనికీ పత్రం తీసి చదవటం ప్రారంభించాడు అధికారి .ఎలా సాగిందో తిలకిద్దాం–‘’మనో గణితం –మోతాదు .లెక్కలు –సుమారు .తెలుగు –జబ్బు .స్కూలు లొ –స్వేచ్చ.దేశాయి కసరత్తు –సున్నా .అందరికి తెలిసిన విషయం గురించి –రమా రమి . ఒక మాదిరి పా ఠమిస్తిని .పిల్లలు పద్యములు అర్ధ మగు నట్లు చదువ కూడదు .గొంతెత్తి పాడవలెను .’’తల తిరిగి పోయింది వెంకటాయికి ..’’తమరు చదివిన వాటిల్లో చాలా ఇప్పుడు జరగనే లేదే ‘’?అని బోల్డు ఆశ్చర్య పోయాడు ‘’నా ఉద్దేశ్యం లొ –ఒక వేళ అవి కూడా జరిగి ఉంటె వాటి విమర్శ ఇల్లా ,ఇల్లా ఉంటుంది సుమా –ఖబడ్ దార్ జాగ్రత్త .’’అని సమాధానం ఇచ్చాడు .ప్యాసు చేసి వెళ్ళ మన్నాడు మేస్టారు .’’పెద్ద క్లాస్ అందరు ప్యాస్ .చిన్న క్లాసులో టీకాలు లేని వాణ్ణి తప్పిస్తున్నాను ‘’అని వివరం చెప్పాడు .

             రాత్రి స్కూల్ కూడా వెంకటాయ దే నిర్వాకం .అదీ చూడాలన్నాడు అధికారి .ఈ సారి చూస్తానని తప్పించు కొన్నాడు .’’పడక అరణ్య మెంటు ‘’జరిగి పోయింది .రాత్రికి రాత్రి ఇద్దరూ ,చెప్పా పెట్ట కుండా ఉడాయించారు .అర్ధం కాలేదు వెంకటాయి కి .మర్నాడు టపాలో నాల్గు రోజుల్లో స్కూలు తనిఖీ తంతు జరుగు తుందని సిద్ధం గా ఉండమని అసలు అది కారి నుండి ఉత్తరం వచ్చింది .అంటే వచ్చి మేసి వెళ్ళిన వాడు డూప్లికేట్, నకిలీ అన్న మాట .ఇలా ఆద్యంతం రక్తి కట్టించి నవ్వుల పాలు చేస్తారు భాకారా మేష్టారు కొసమెరుపు లొ ఆ నాటి తనిఖీ తంతు ప్రహసనం కళ్ళకు కట్టినట్లు చేస్తూ ,ప్రతి మాటలో హాస్యం మిళితం చేసి పండించారు హాస్య బ్రహ్మ భమిడి పాటి వారు .

                అలాగే రాజ మండ్రి లొ కొత్తగా విమానం వచ్చింది .అంతా సరదాగా ఎక్కి చిన్న బలా దూర్లు కొట్టి వస్తున్నారు .ఆ విషయాలు రాస్తూ చూసిన వారు ఎలా బడాయీలు పోతున్నారో చాలా బాగా వర్ణించారు భ.కా.రా.మేష్టారు .విమానం చూడ గానే అందరికీ ఊర్ధ్వ దృష్టీ ,ఊర్ధ్వ శ్వాశా  బయల్దేరి నాయని చేళుకులు .ఒక ఊల్లో తద్దినం జరుగు తోంది .విమానం ఆకాశం లొ ఎగురు తోంది .ఆ సన్ని  వేశాన్ని అత్యద్భుతం గా హాస్యం మేళవించి తిని పిస్తున్నారు చూడండి .

         ‘’భోక్తలు భక్ష్యాలు విరుస్తున్నారు .కర్త పారణ కలుపుతున్నాడు .విమానం హోరుకు యజమాని వీధి లోకి ఎగడి,పక్షి వతు గా యెగిరి పోతున్న విమానాన్ని చూసి ,పితృ స్తానం లొ కూర్చున్న గోపాలాన్ని రెక్క లంకించు కొని ,నడివీధి లోకి ఈడుస్తూ మొర్రో మొర్రో అంటూండగా చేతి లొ గారే పళం గాయెగిరి రాకా ?తద్దినం మళ్ళీ వచ్చేదే .’’అని కసురు కున్నాడట . ఇది అశాస్త్రీయం అయినా ఏం ఉపద్రవామో అని మాత్రం చెప్పే ఆయన .’’ఇక్కడికి మీ నాన్న గారి ఆత్మ కి విమాన దర్శనం చేయించారు .ఏమి పితృ భక్తీ ?’’అని మెచ్చు కొన్నాట్ట .శ్రద్ధ గా పెట్టాల్సిన తంతు ఎలా విన్తకీ ,చోద్యానికి గురైందో ,దాని ప్రభావం ఎంత ఉందొ చెప్పటమే కాదు యజ మానికి కోపం రాకుండా మాటలు ఫిరాయించే మంత్ర గాళ్ళ మనో భావం కూడా బాగా బయట పెట్టారు .

                   విమానం లోంచి చూస్తుంటే కింద అంతా ఎలా కని పిస్తుందో జనం గోలగా చెప్పు కొంటున్నారు .అందులో కొన్ని చమక్కులు ‘’ఇది వరకు నేను ఏరి గున్న బ్రాహ్మలూ,అబ్రాహ్మలూ ,హిందువులు ,ముస్లిములు ,పునిస్త్రీలు ,వెధవ ముండలు ,వీళ్ళ వయినం కన్పించకుండా కన్పించింది .పైకి వెళ్ళి కిందకి చూసే టప్పటికి భూమి మీద మానవులు పెట్టు గోనే తేడాలు .నా చర్మ చక్షువులే అంత రించాయి .విమానం చూస్తున్నప్పుడు మానవుడి ఆఖండత్వం –కిందికి చూస్తున్నప్పుడు మానవుడి అల్పత్వం కని పించాయి ‘’.ఇందులో ఎంత వేదాంత భావన ఇమిడ్చారు మేష్టారు .మనో నేత్రం విచ్చు కోవటానికి హాస్యం ఎంత పకడ్బందీగా విని యోగా పడిందో చూడండి .అల్పత్వం వదిలించుకొని జీవించమని హెచ్చరిక కూడా ఇందులో జోడించారు మేష్టారు .కాంతా సమ్మితంఅంటే ఇదేనేమో నని పిస్తుంది .

                      కనుమ శుభా కాంక్షలతో

             సశేషం ‘—మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –15-1-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

సంక్రాంతికి గోచీలు,నూలు పోగులు

         సంక్రాంతికి గోచీలు,నూలు పోగులు

    మనవళ్ళకు ,మనవ రాలికి సంక్రాంతి రోజున భోగి పళ్ళుపోసే హడా విడి లో ఉన్నాం మకర సంక్రాంతి నాడు పిల్లలకు భోగి పళ్ళు.పిల్లలందరూ వచ్చారు పిల్లా జేల్లాతో ఇల్లంతా సందడి సందడి గా ఉంది .చాలా రోజులకు మా ముఠాఅంతా దిగటం మా శ్రీ మతికి మహదానందం గా ఉంది .క్షణం ఖాళీ లేకుండా పనులు చేస్తూ ,చేయిస్తూ ఉంది..మా ‘’యం బ్రహ్మ ‘’ఈ వాసన ఎప్పుడో పసి కట్టేశాడు .ఈ పాటికి వచ్చి వాలాల్సిందే.ఆలస్యం అయిందని వాళ్ళక్క కళ్ళల్లో ఒత్తు లేసుకొని చూస్తోంది తమ్ముడికోసం, వాడి భార్యా పిల్లల కోసం . ఇంతలో అదేదో సినిమాలో లాగా ఏం ఎస్ నారాయణ లా మహా గాలిలా కొట్టుకోచ్చాడు  .రావటం రావటం వంటింట్లోకి పరి గెత్తి గిన్నేలన్నీ తిరగేశాడు .కావాల్సింది అక్కకు చెప్ప కుండా ప్లేటు లలో పెట్టు కొని లాగించేసి ,మేనల్లుళ్ళ ను పలకరించి ,వాళ్ళ సంతానానిన్ని కూడా పరా మర్శించి ,అప్పుడు నాఎదుట బడ్డాడు .నాకు లోపల రగిలి పోతోంది .ఏం చేస్తాం బామ్మర్ది కదా తమాయిన్చుకోన్నాను వాళ్ళఅక్క కోసం .

          ఎదురుగా కుర్చీలో చేరబడి ‘’బావా ! తెలంగాణా దానం ఇస్తారట గా ‘’అన్నాడు ఏదో మాట్లాడాలి కాబట్టి .’’దానం ఇవ్వ టానికి ఎవర్రా .అది వాళ్ళ హక్కు అని గోలా యాగీ చేస్తుంటే ‘’అన్నాను .’’బావా !అర్ధం లేకుండా మాట్లాడటం అంటే నీ దగ్గరే నేర్చుకోవాలేమో ?’’అన్నాడు ఖంగు తిన్నాను .పేపర్లు చదవ్వు ,చానళ్ళు చూడవు .నీతో వచ్చిన చెడ్డ చిక్కు ఇదే ‘’అంటు ‘’దానం అంటే దానం గా అని పోర బాటు పడ్డట్టున్నావు .’’నేనన్నది దానం నాగేందర్ అన్న మాట గురించి .ఇచ్చేస్తున్నట్లు తనకు సంకేతాలంది నట్లు ,కాపిటల్ విషయమూ తేలి పోయి నట్లు చెప్పాడుకదా!ఫాలో కాలేదా ?’’అన్నాడు అసహనం గా .’’లేదురా.ఎవరో ఒకరు ఏదో అనుక్షణం అంటూ ఉంటారు .అవన్నీ పట్టు కొని నమ్మలేం .ధిల్లీ యేమాలో చిస్తుందో చిదంబరానికీ తెలియని ‘’చిదంబర రహస్యం ‘’’’మరి షిండే గారి మాటో?’’అన్నాడు మళ్ళీ ..’’ఆయన పునశ్చరణ తరగతుల్లోపాఠాలు అభ్యసిస్తున్నాడు ‘’అన్నాను ‘’.అయినా పండగ నాడూ పాచి మాటలెందుకు రా –ఏదైనా కొత్త విషయం ఉంటె గిలకరించు ‘’అన్నాను .

         ‘’సరే కాని బావా !కొత్త కవిత్వం మార్కెట్లో రిలీజయింది నీకు తెలుసా ?’’అన్నాడు ‘’అదేదో అఘోరించు ‘’అన్నాను .వాడి సస్పెన్సు భరించలేక .’’అదే బావా !’’గోచీ’’కవిత్వం .వినలేదా ?’’అన్నాడు ‘’గోచీ కవిత్వం ఏమిట్రా పాచి కవిత్వం లా‘’అన్నాను .’’అదే నీతో వచ్చిన చిక్కు .కొత్త దాన్ని ఎంకరేజి చెయ్యాలి బావా మరీ సాంప్రదాయం అంటు మడి కట్టుకొని ఎన్నాళ్ళు కూర్చుంటావు “’అని కాస్త కసురు కొంటున్నట్లు ఉరిమాడు .’’నేను వినలేదు రా .ఆ గోచీ ఏదో విప్పి ఏడు“’అన్నాను .’’బాబోయ్ –విప్పితే నువ్వు చూసి తట్టుకోలేవు బావా .’’అన్నాడు .’’ఓరి నీ అఘాయిత్యం మండా!గోచి విప్పటం అంటే విశ్వ రూప సందర్శనం కాదు .అదేమి కవిత్వమో చెప్పమని అర్ధం ‘’అన్నాను ‘’హమ్మయ్య బతి కిన్చావు బా ‘’అని ‘’గోచీ కవిత్వం అంటే’’ గొప్ప చీవాట్ల కవిత్వం’’ ట..మొన్ననే రిలీజయింది .హాట్ హాట్ గా ఉంది బావా .’’అన్నాడు .’’అయితే ఆ గోచి లోనీ రహస్యమేమిటో విడిచి పెట్టు ‘’అన్నాను .దొరికింది కదా చాన్సు అని మా వాడు విజ్రుమ్భించాడు ‘’బవా ఇదో కొత్త రకం కవిత్వ ప్రక్రియట.మొత్తం అయిదు పాదాలు మొదటి నాలుగు పాదాల్లో నాలుగు రకాలైన తిట్లు ,ఐదో పాదం లో ఎవరిని తిడుతున్నామో వారి గురించి ఉంటుందట ‘’అన్నాడు .’’బాగుందిరా .ఒక  గోచీ లాగి వదులు ‘’అన్నాను .’’గూడ్సు బండి వెధవల్లారా –గడ్డి తినే గాడిదల్లారా –గుడ్ల గూబ గుంటల్లారా –అవి నీతి రాజ కీయ నాయకుల్లారా –మరెందుకు ఆలస్యం మీరు కూడా తెలుగు సాహిత్యానికి గోచీలు సమర్పించండి ‘’అని చది వాడు .’’బాగుందిరా .పూర్వం తిట్టు కవిత్వం అని ఉండేది .దాన్ని మించిన్దిరా నీ కవిత్వ గోచీ ‘’అన్నాను ‘’అన్నీ ఇలానే ఉంటాయా ?ఏమైనా మార్పుందా?/ప్రశ్నించాను .’’మగకవులతో పాటు ఆడకవులూ పెట్రేగి రాస్తున్నారు బావా ‘’అన్నాడు‘’విప్పు ‘’అన్నాను .వాడు సిగ్గు పడుతూ ,లంకిన్చుకొన్నాడు ‘’చిడతలు పంచె చిం పాంజీల్లారా –పిడకలు కూడా వదలని పింజారీ పిండాల్లారా –మరకలు పట్టిన సమాజం లో గురకలు పెట్టె గూండాల్లారా –ఎలుకల్లా కలుగుల్లో దాగుండే బంది పోటు తిండి పోతుల్లారా –మళ్ళీ మీరేగా గెల్చేది చా –చా చా ఛీ ఛీ ఛీ ‘’

               ‘’సరేరా .మనకే కవిత్వమైనా ఇతర దేశాల నుండి దిగు మతి అవుతుందికదా .మరి యే దేశం లో దీనికి ప్రాతి పదిక ఏర్పడింది ?’’అని అడిగాను .అప్పుడు వాడు సంబర పడి పోతు ‘’అమెరికా లోనీ అట్లాంటా నుండి ఒక గోఛీ  కవి గొప్పగా గోచీ ఝాడించాడు బావా ?’’అన్నాడు ‘’ఆ ఆంగ్ల గోచీ నీ విప్పు ‘’అన్నాను .’’match stick head idiots –drainage face stupids –devil hand’s twisted nails –slum  dog pappe rs –you ,sub prime culprits !shit shit shit ‘’

    ‘’ సరే .మగాల్లనే తిట్ల తో బాదుతున్నారా ?మహిళా మణులకీ సత్కారం చేస్తున్నారా ?/’’అన్నాను అమాయకం గా .’’బావా .కవి నిరంకుశుడు .వాళ్ళూ వీళ్ళూ భేదం లేదు అందర్నీ గోచీ  తో వాయిన్చేసి ఉతికేస్తాడు . ‘ఇదిగో చూడు అంటు ‘’ఒసేయ్ సోకుల పాపాయమ్మా –వంకర భాష వెంకాయమ్మా –ఎక్స్ ప్రెషన్ లేని ఎర్రి ఎంకమ్మా –కేటువాక్కుల తింగిరి బుచ్చీ –నేటి ‘’టేలుగు ‘’హీరోయినూ డౌను డౌను ‘’అని అలిసి పోయి ఆగి పోయాడు /’’ఓరి నీ దౌర్భాగ్యం కవిత్వం గోచీఊడి పోను .ఇదెక్కడి తిట్ల దండకం రా .ఈ ప్రక్రియ పేరు పెట్టుకొని అందర్ని పెట్రేగి పోయి తిట్టచ్చు నని విజ్రుమ్భిస్తున్నట్లున్నార్రా .’’అన్నాను .(ఆంద్ర జ్యోతి నిన్న ఆది వారం స్పెషల్ లో బ్లాగోతం –ఆధారం గా ఈ కవితలు మీకు అందించాను )

           ‘’బావా !నాకో అయిడియా వచ్చింది .నువ్వు తిట్టకపోతే చెబుతాను ‘’అన్నాడు బామ్మర్ది యం బ్రహ్మం .’’సరే వదులు గోచీ కంపే భరించిన వాడిని ఇంకా ఏముంది భరించటానికి ?’’అన్నాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్లు భావించి మా వాడు విజ్రుమ్భించటం మొదలెట్టాడు ‘’గోచీ కి కొద్దిగా నైనా గుడ్డ ముక్క కావాలి కదా బావా .నేను ఇంకో అడుగు ముందుకు వేసి ‘’నూ.పో’’అనే కొత్త ప్రక్రియ లో కవిత్వం రాద్దా మనుకొంటున్నాను నువ్వు పర్మిషన్ ఇస్తే వదుల్తాను’’అన్నాదు .’’సరే రోట్లో తల పెట్టిన వాడిని దేన్నైనా భరించాలి కదా .ఇంతకీ దాని వివరం చెప్పు ‘’అన్నాను ‘’ఏం లేదు బావా !నూ పో అంటే ‘’నూలు పోగు కవిత్వం’’.గోచీ కూడా ఉండదు .ఒక్క నూలు పోగే కవిత్వాన్ని కప్పు కోవటానికి ఉంటుంది అన్నమాట .’’అన్నాడు ‘’నాయనా ! తొందర పడొద్దు .కాస్త ఆలోచించి రంగం లో దిగి నూలు పోగు విప్పు ‘’అని సలహా ఇచ్చాను ‘’థాంక్స్ బావా ‘’అని అన్నాడు .

         ‘’బావా కరెంటు షాక్ తో జనం అల్లల్లాడుతున్నారు కదా నీ కామెంటు ఏంటి బా “’.’’ఏముందిరా .ఆంద్ర దేశం పేరు ఎప్పుడో’’ అంధేరా దేశం’’ అయి పోయిందిగా .ఇప్పుడు అఘోరించి ఏం లాభం ?’’అన్నాను .’’సరే కాని బా ఈ మధ్య మన ప్రేసి డెంటయ్య .చాలా బోల్డ్ స్టెప్ తీసుకొన్నారు కదా ‘’అన్నాడు .’’అవున్రా .నిజమే .దేశాధ్యక్షులు ప్రణబ్ ముఖర్జీ మన ప్రియ తమ ఆంద్ర నాయకుడు పి.వి.గారి పై ఒక ప్రైవేట్ చానెల్ వారి ఆహ్వానం పై హైదరా బాద్ లో ఆ పెద్దాయన పై అద్భుతం గా ,ఆనందం గా ,మనసు విప్పి మాట్లాడి మనలని రంజింప జేషి నందుకు మనం ఎంతో కృతజ్ఞత చూపాలి .అయితే సోనియా నుకాదని ఆమె అవమానించిన తెలుగు ప్రధాని పై ఇంత ధైర్యం గా మాట్లాడటం మనకు బానే ఉన్నా పాపం ఆ యన యే చిక్కుల్లో పడతారో నని పిస్తోంది .ఏమైనా రామచంద్ర మూర్తి గారి చొరవతో మొదటి పి.వి.స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయటం చానెల్ల లో కొత్తదనానికి ,నిర్భీతికి ,జరగాల్సిన న్యాయానికి మార్గ దర్శనం .ఇక్కడ మూర్తి గారూ అభి నందనీయులే ..

             ‘’బావా అదేదో సినిమా లో రేలంగి నీ బండ బడ .అంటాడు .నిజం గానే దానర్ధం నాకు తెలియదు .చెప్పు బావా‘’అన్నాడు ‘’ఏం లేదురా .సిలిండర్ అనే బండ రేటు పెంచు తు వాటి సప్లై నికోతకోస్తూ ,ఎక్స్ ట్రా గా  కావాల్సి వస్తే వెయ్యికి బాదుతున్నారే అదే బండ బడ అంటే ‘’అన్నాను ‘’.బ్రహ్మం గారిలా రేలంగి ఆ నాడే ఊహించి చెప్పి నట్లున్నాడు బా.’’అన్నాడు.’’ఆఖరి ప్రశ్న బా –తెలుగు సభల్లో నీ జాడ ఎక్కడా కని పింఛి నట్లు లేదే నువ్వూ బహిష్క రించావా ?‘’అన్నాడు .’’అవున్రా అంత రిస్కు తీసుకో దల్చుకోక వెళ్ళ లేదు .బహిష్కరించటానికి మనమెంత ?ఏముందిరా కొత్తదనం ?హాయిగా ‘’సప్త గిరి చానేల్ లో ‘’ఇంట్లో నె కూచుని తిలకించా సభల సౌభాగ్యం ..మహా మహుల్ని పిలిచి వాళ్ళతో వేషాలేయించి త్రిభువన విజయం అంటూ పాత పద్యాలే పాడించి కొత్త ఆలోచనలేమీ లేకుండా చేశారు .ఎవరు ఎవర్ని సంమానిస్తున్నారో తెలీకుండా వేదిక మీద ప్రభుత్వాధి కారులు ,బాల మురళి లాంటి విద్వాంశులు పాడాలా వద్దా అన్నట్లు పాడిన తీరు ,చూస్తె కసరత్తు సరిగ్గా చెయ్యక పోవటం కని పించింది ప్రముఖ సాహిత్య సంస్థలన్నీ బహిష్కరించటం అంత మంచిదని నాకు అని పించలేదు .ప్రభుత్వమూ అందర్నీ సంప్రదించి జరపాల్సిన సభలు ,ఫాక్షన్ సభల్లా జరగటం తెలుగు భాషకు సంస్కృతికి కొత్త వేలుగులొస్తాయన్న నమ్మకానికి గండి కొట్టింది .చేసిన తీర్మానాలు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరిగితే సభలు విజయ వంతమై నట్లే నని భావించ వచ్చు ‘’అన్నాను ‘’వస్తా బావా .విలువైన విషయం ముక్తా యింపు గా ఇచ్చావు ‘పొంగల్ శుభాకాంక్షలు అనబోయి నా కళ్ళల్లోకి చూసి సంక్రాంతి శుభా కాంక్షలు‘’అని దౌడు తీశాడు బామ్మర్ది యం బ్రహ్మం ..

            సంక్రాంతి శుభా కాంక్షల తో

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-1-13-ఉయ్యూరు 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మకర సంక్రాంతి నాడు పిల్లలకు భోగి పళ్ళు

అన్నయ్య గారి అబ్బయి రాంబాబు ఫామిలీ . హైదరాబాద్ లో ఉన్న మా పెద్దాబ్బాయి శాస్త్రి ఫామిలీ

మూడో అబ్బాయి మూర్తి ఫామిలీ

నాలుగో అబ్బాయి  రమణ ఫామిలీ

మొత్తం 16 మంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఉయ్యూరు లో సినిమా వీక్షణం

మకర సంక్రాంతి నాడు , మనుమలకు , మనవరాలి కి భోగి పళ్ళు

ఫామిలీ ఫోటో

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -3

 భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -3

 

  భమిడి పాటి వారు మేష్ట రీ చేశారు కనుక స్కూళ్ళ ఇన్స్పెక్షన్ బాగోతం చాలా బాగా చూపించారు ‘’పల్లె టూరు స్కూలు తణికీ తంతు ‘’కధ లో .ఆ పల్లె టూరి మేస్టారి నిర్వాకం ,పరీక్షాది కారుల చపలత్వం ,భేషజం తిండి మీద ఉన్న ఆసక్తి ,కళ్ళకు కట్టిస్తారు .

           వెంకటాయి గారు గడ్డి పాలెం లో’’ ఉదర నిమిత్తం’’బడి పంతులు .స్తిరాస్తి భార్య ,చరాస్తి తనూ.ఆయనకు నమ్మకం గా వచ్చే ‘’సాలాదాయం ‘’ఒక ఆడ శిశువు .కొండొకచో కవలలు .దసరా పేరుతో ,అక్షరాభ్యాసం హడా విడి తో పదీ ,పరకా ‘’గతుకు తాడు ‘’.ఓ దస్తా వేజు గీకి పెట్టో ,ఓ సంబంధం ముడి పెట్టించో,ఓ సాక్ష్యానికి తగలడో ,,ఓ బ్రాహ్మ ణార్దానికి ఏడిసో ,దిష్టి కొట్టకుండా ఇంతో అంతో ‘’కతుకు తాడు ‘’.తణికీ దారుకి ‘’మనుగుడుపులు ‘’మేపి గ్రాంటు కొట్టేస్తాడు .కిందటేడు మాత్రం ‘’ఏదో ఒకా నొక సప్లయి సంతృప్తి గా జరక్క ‘’గ్రాంటు సరిగ్గా ‘’పారే యించ లేదు‘’.బంధువులు ,పక్కాలు వచ్చీ పోయే ఇల్లు ..చాకిరితో బాటు డబ్బు ఊడటం –ఇదీ పల్లె టూరి బడి పంతులు పరి స్థితి  .’’వెంకటాయి గారు సంసారం విషయం లో వీల్లేక చదువు చెప్పటం విషయం లో మాత్రం’’ కుమ్మరి పురుగు’’ లా ఉంటూ,ఆర్జనకు అన్య మార్గాలు అన్వేషించాడు .’’ఎక్కడైనా ‘’కుండ తడిపినా’’,’’తూతూ బాకా విని పించినా ‘’అదే ఆఃహ్వానం గా భావించి హాజరయ్యే వాడు .

          ప్రస్తుతం కొడుకు ఈయన దగ్గరే ఉన్నాడు .పెళ్ళాం పురిటికి వెళ్ళింది .ఎవర్నో ముసలమ్మను వంటకు‘’ఫిరాయించాడు ‘’.ఆవిడకు ‘’పుట్ల చెముడు ‘’..సొదఎక్కువ. ఎవడైనా భోజనానికి వస్తే ‘’ఓ టాప్పడవెడు ‘’బూతులు దిమ్మ రించేది .లేక పోతే కుర్రాణ్ణి పిల్చి ‘’రుంజ వాయించి నట్లు వాయించేది ‘’.దాంతో వచ్చిన వాడు పరారు .ఒక రోజు పక్క ఊళ్ళో పెళ్ళి. .కొడుకుతో అక్కడికి హాజరయ్యాడు వెంకటాయి  .ఆయన ఖర్మ కాలి ,ఆ రోజునే ఇద్దరు ఊళ్లోకి ప్రవేశించారు .ఒకడి చేతిలో కాగితాలు ,గొడుగు ,రెండో వాడి నెత్తిన తలపాగా .ఊళ్ళో వాళ్ళు ఇనస్పెక్టర్ గా భావించి ,పక్క ఊర్లో ఉన్న పంతులు గారికి కబు రెట్టారు .’’ఓరి నీ ఇనుం కాల్చా .వచ్చింది ‘’మాసికం గారా ?’’’’కాళ్ళు కడగడం గారా ?’’పెళ్ళాం పిల్లలు కూడానా ?’’అని కనుక్కున్నాడు .పెళ్ళి పందిట్లో ఈ అప్రాచ్యపు మాట లేమిటనిఅంతా కేక లేశారు అర్ధం తెలీక .పెద్ద ఇనస్పెక్టర్ ని’’తద్దినం ‘’అనీ ,ఆయన కింది వాడిని ‘’మాసికంఅనీ , ‘ ,మైనర్ తనికీ గాడిని’’కాళ్ళు కడగటం ‘’అనీ  తన పరి భాష చెప్పి బయట పడ్డాడు .’’వారే మాకు పితృ ,పితామహ ,ప్రపితామహులు ‘’’’అన్నాడు .

               ఎంత లేదన్నా తెలివి గల పిండం కనుక ఆపసోపాలతో కొంపకు. చేరాడు ,దారిలో బొట్టు గిల్లుకొని ,,జుట్టు రక్కు కొని ,ముసలావిడతో ‘’గార్లోండి వంట కానివ్వ మ్మోయ్‘’అని చెప్పి ,స్కూలుకు చేరి బోజ్జాయన కాళ్ళ మీద పడి పోయాడు తెలివిగా .ఎండ దెబ్బ తగిలిందనుకొని సాను భూతి చూపించాడాయన .’’తమకు వేళ దాటింది .ఒళ్ళు తడుపు కొని మడి క ట్టు కొండి’’అన్నాడు .ఆయన పాపం సాను భూతి తో ‘’నా కోసం విశేషం ప్రయత్నించద్దు .గోకారం లో నాకు పెట్టిన భోజనం ఏం భోజనం అండీ .నాలుగు కూరలు ,నాలుగు పచ్చళ్ళు ,క్షీరాన్నం ,మాష చక్రాలు ,అబ్భ అబ్భ ,అంతా యధా విధే .నేను జఠరాజ్ఞి ,జీర్ణ పుష్టీ ఉన్న ఘటాన్ని గనక సరి పోయింది .’’అన్నాడు .వెంకటాయ గారు ‘’చిత్తం .పచ్చడి మెతుకులే నండీ .నాకే ముంది .బీద కుటుంబీ కుడిని.’’అని తన ఇంటికి తీసి కెళ్ళాడు .వంటాలస్యం ఉంది.అని ఒక తవ్వెడు పాలు ఇచ్చి ,పుచ్చు కొమన్నాడు .’’తమరికేమైనా మతి చలించిందా ఏం ?’’అంటు అతి సిగ్గుగా ,అయిష్టం గా విషం పుచ్చు కుంటున్నట్లు నటిస్తూ ,నిమిషం లో గిన్నె లో తడి అయినా మిగలకుండా ఊడి చేసి ,ఆయాసం నటించాడు .ఇందులో ఆ పాత్ర పోషణా ఆ నాడూ అంతే ఈనాడూ అంతే .తేడా ఏమీ లేదు .కాలం మారినా పద్ధతులవే .అదే మేపు ,అదే చేపు .

         అయ్యగారికి అభ్యంగన స్నానం చెయ్యాలనే కోర్కె అదీ ఆవు నెయ్యితో .తప్పించుకోవాలని చూసినా ,కొడుకు తొందర మాటలతో ఇంట్లోని ఆవు నెయ్యి తో ,భజంత్రీ వాడిసాయం తో ‘’తధికిణ ధోం’’అయిందని పించాడు .వడ్డన చేసి ,రమ్మని పిలిచాడు .విస్తట్లో ‘’బకాసురిడికి తోడి నట్లు కుంభం మటుకు తోడి ఉంది.’’దాని అగ్ర మందు ‘’సార్వా గడ్డి కొంప మీద కొండ ముచ్చు మొహం లా ‘’వెక్కిరిస్తూ ,’’ఉస్తికాయంత ఉసిరి పచ్చడి ఉంది’’ .అధికారి అంతటి మనిషీ కూడా‘’చలిమిడి ‘’అయి పోయి ,ఆముదం మొగం పెట్టాడు .’’కూచోండిపొద్దు పోయింది కావలసినవి అడిగి వడ్డించు కొండి’’అని‘’చేణికాడు ‘’పంతులు .అధికారి కన్నీళ్ళతో పరిశేచనం చేసి ‘’ఎల్లా నేనిది ఏడవటం ?’’అన్నాడు .తక్షణమే వెంకటాయి తనకు నిరుడు  గ్రాంటు వచ్చిన కాగితం చూపాడు .’’నె నేనెలా ఏడవడం ఇదీ ?’’అంటు ఒక్కొక్క అక్షరం ఒత్తి,ఒత్తిపలికాడు.సమయానికి తగూ అన్నట్లు ఠపీ

 మని ,ఎత్తుఎత్తాడు . పారింది పాచిక .’’నేను గ్రాంటు కురిపిస్తా .అన్నం మీద ఒట్టు ‘’అన్నాడు అధికారి .ఉబ్బి పోయిన వెంకటాయి ముసలమ్మకు సౌజ్న చేశాడు .  ఆవిడ ఈ విస్తరి పట్టుకొని వెళ్ళి తాజా విస్తరి పెట్టింది .అధికారి ముఖం వికశించి ‘’దంత పరిశ్రమ ‘’తో రంగ ప్రవేశం చేశాడు .’’గారెల పర్వం ‘’లోకి వచ్చాడు .’’ఏమిటో అనుకుంటాం .కాని’’భోజనం చేయటం కూడా కష్టమే సుమండీ ‘’..  అన్నాడు బొజ్జ నిమురు కంటూ .,గారెల పర్వతాన్ని ఊదేస్తూ .వేసిన కొద్దీ ఊదేస్తున్నాడు .విసుగెత్తింది ముసల్దానికి .పళ్ళెం లోనీ వన్నీ ,విస్తట్లోకి గిరాటేసి ,పళ్ళాన్ని వెంకటాయ నెత్తిన కొట్టింది .’’సత్రం బొక్కు జంతు వుల్ని తీసుకు రావద్దని ఎన్నో మాట్లుచెప్పినా సిగ్గు లేదు .మర్యాదా లేదు .తెచ్చి ,తెచ్చి ఎవడినో,’’సర్వ భక్ష కుడిని ‘’తెచ్చావు .కుర్రాడికి ఒక్క టైనా మిగల్చలేదు . వాడి కోసం మళ్ళీ వండి తగలడాలి ‘’అని తుర్రు మంది .అధికారి మింగా లేక,కక్కా లేక కాసేపు ఇదై ,తేరుకొని ,వెంకటాయ తో లౌక్యం గా ‘’నేను గనక సరి పోయింది .మరోళ్ళుఅయితే,లేచి పోయే వారు ‘’అని మళ్ళీ ‘’దంతాలను విసరటం ‘’ప్రారంభించాడు .’’గార్లె తర్వాత పెరుగైనా చేదే‘’అని మజ్జిగ కూడా లేకుండా లేచాడు .ఇన్స్పెక్షన్ కోసం స్కూల్ చేరాడు .ఆయాసం తో తెగ ఇదై పోయాడు .’’బొర్ర జారేశాడు’’ . రాత్రికి గార్లని పెరుగు లో నానవేయించమని ఫర్మానా జారీ చేశాడు .

                సంక్రాంతి శుభా కాంక్ష లతో –

              సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-1-13- ఉయ్యూరు . 

Posted in రచనలు | Tagged | Leave a comment

మకర సంక్రాంతి

   మకర సంక్రాంతి

    సూర్యుడు ప్రతి నెల ఒక్కో రాసిలో ప్రవేశిస్తుంటాడు దాన్ని సంక్రమణం అంటారు .సూర్యుడు కర్కాటక రాశి లో కి ప్రవేశించినపుడు కటక లేక కర్కాటక సంక్రమణం అంటారు దీంతో దక్షిణాయణం ప్రారంభమైనట్లు .ఇది సాధారణం గా జూలైపదిహేడు న వస్తుంది .ఇది పితృ దేవతల కాలం . ఆరు నెలలు ఉంటుందని మనకుతెలుసు . .అలాగే రవి మకర రాసిలో ప్రవేశించినపుడు వచ్చేది మకర సంక్రమణం .రేపు అంటే ఈ నెల పద్నాలుగవ తేది సోమవారం మధ్యాహ్నం గం.12-10 కు సూర్యుడు మకర రాశి లో ప్రవేశించటం తో మకర సంక్రమణం ప్రారంభమవుతుంది .ఈ ఆరు నెలలు దేవయానం గా భావిస్తారు .ఉపనయనాలు ఉత్తరాయణం లోనే చేస్తారు .సంక్రాంతి పురుషుడు ఒక్కో సారి ఒక్కో రకం గ వస్తాడు . ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఎలా ఉన్నాడో ,యేవాహనం ఎక్కి వచ్చాడో , వేషదారణం ఏమిటో ఆ వివరాలు తెలుసుకొందాం .photo

           రేపు వచ్చే సంక్రాంతి పురుషుని పేరు ‘’ద్వాం క్ష ‘’అందువల్ల వైశ్యులకు హాని అని తెలుస్తోంది .గజ వాహనం ఎక్కి రావటం వలన పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారికి భోగ భాగ్యాలతో పాటు అకారణం గా కలహాలేర్పడతాయని సూచన .చందన ఉదకం తో స్నానం చేయటం వల్ల పాడి పంటలు సమృద్ది గా ఉంటాయి .యవాక్షత ధారణం వలన అలచంద పంటకు నష్టాలుండ వచ్చు .నీలి రంగు వస్త్రం కట్టుకొన్నందున ప్రజలలో భయాందోళనలు ఎక్కువవ గా ఉండచ్చు .గోరోచనాన్ని లేపనం గా పూసుకొన్నందున విలాస వస్తువుల ధరలు ఆకాశమంత ఎత్తున ఉంటాయి .జపా పుష్పాన్ని ధరించటం వల్ల యుద్ధ భయం జాస్తి .గోమేధికాన్ని ఆభారణం గా ధరించటం వలన నవ రత్నాలకు గిరాకీ పెరుగుతుంది .తగరపు పాత్ర లో భోజనం చేయటం వల్ల లోహాలన్నిటికి గిరాకీ ఉంటుంది .పాలను తాగటం వల్ల శూద్రులకు అరిష్టం గా భావిస్తారు .

            రేగు పండ్ల ను తినటం వల్ల పండ్ల తోటలు జాస్తిగా పెరుగుతాయని అంటారు .కోదండాన్ని ఆయుధం గా వాడటం వలన పాలకులకు మనశ్శాంతి తక్కువ అని చెబుతారు .బంగారు గొడుగు వేసుకోవటం వలన ప్రజలకు ఆయురారోగ్యాలు ఉంటాయి .విస్మయం చేష్ట గా ఉన్నందున వర్షాలు అధికం గా కురుస్తాయని సూచన .సంక్రాంతి పురుషుడు కూర్చుని ఉన్నట్లు ఉండటం వలన అనారోగ్యాలు ఎక్కువే నని ఊహిస్తున్నారు .బల్లెం తో సంచరించటం వల్ల జంతు నష్టం ,దొంగలకు హాని .ఆగ్నేయ దిశలో ప్రయాణించటం –ఆగ్నేయ ప్రాంతాల వారికి అరిష్టం గా భావిస్తారు .శుక్ల పక్షం లో ప్రవేశించటం వలన అన్ని వస్తువుల ధరలూ పెరిగి పోతాయట .తదియ తిది వల్ల చిన్న వ్యాపారులకు లాభాలెక్కువ .సోమవారం నాడు రావటం –పంటలకు నష్టం ,చిన్న పరిశ్రమలకు వృద్ధి .మేష లగ్నం లో ప్రవేశం వలన స్త్రీలకూ ప్రాముఖ్యత పెరుగుతుంది .ధనిష్ఠా నక్షత్రం లో ప్రవేశం కనుక నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఊహిస్తున్నారు .మధ్యాహ్న కాలం లో ప్రవేశించటం అధికారులతో మనస్పర్ధలు ఎర్పడేట్లు సూచన కని పిస్తోందని పంచాంగ కర్తలు చెబుతున్నారు .

             సంక్రమణ సమయం లో జపం ,తపం చేయ గల వారు చేసుకో వచ్చు .సంక్రమణ ప్రవేశ సమయం లో దానాలు చేయాలి పితృదేవతలు సంతృప్తి పడతారు .బూడిద గుమ్మడి ని బ్రాహ్మణునికి వడ్ల తో దానం చేయాలి .పితృదేవతలకు తిలోదకాలు వదలాలి .ఇవన్నీ చేస్తే ఆయురారోగ్యాలు ,ఐశ్వర్యాలు ,పుత్రపౌత్రాభి వృద్ధి కలుగుతుంది ..

            సంక్రాంతి శుభా కాంక్షల తో

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-1-13-ఉయ్యూరు 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -2

 భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -2

  దేశ సేవ చేయాలనే ఆరాటం అందరిలో ఉంటుంది .సమాజ సేవలో తరించాలని కొందరను కొంటారు .ఏదో ఇంత తిని ఇంట్లో తొంగుంటే యెట్లా?’’కసింత కలా పోసాన ఉండాలిగా ‘’.దీనికోసం సమాజాలు ,దాని అధి పతులు ఉంటారు .నెలకో ,రెన్నెల్లకో సభ జరిపి ,ఉపన్యాసాలిప్పించి ,విని ,విని పించి ,అది పేపర్లో వస్తే చూసి చంకలు గుద్దు కోవటం మామూలై పోయింది .అలాంటి ‘’కండూతి రాయళ్ల ‘’గురించి ,,వారి బలహీనలత గురించి బయటకు లాగే రచనే భకరా గారి ‘’తుక్కు ముక్కల హక్కు చిక్కు ‘’.అంటే పర్మిషన్ లేకుండా నాటకం ఆడితే వచ్చే తంటా ఎలా ఉంటుందో చూపిస్తారు మేష్టారు .రాసిన వాడు ఒఠివెధవాయి అయినా పర్మిషన్ లేకుండా వేస్తే ఎంత హైరాన పడాలో తెలియ జెప్పిస్తారు .

             రచయిత గారికో సాహితీ సంస్థ ఉంది .’’ఉరమ గల వారి చేత ‘’ఉపన్యాసాలిప్పిస్తారు .మన సంస్థ వెల్లడి కోసం సభ చేసుకో వద్దు అని ఎద్దేవా ఇందులో కని పిస్తుంది .ఘోషణ అనేది ఈ నాడు ఎంతో అవసరం .ఘోషణ వల్లే పోషణ జరుగుతుందట .అని పబ్లిసిటి ని పబ్లిక్ గా యేకేస్తారు .మీటింగు ఏర్పాట్ల గురించి రాస్తూ ‘’డిన్నర్ భాజాయిమ్పులూ ,సభలో కూర్చోటానికి కట్టు దిట్టాలూ ,అధ్యక్షుని బస గురించి ,ఆశ్రయించిన కవుల్నీ ,ఉపన్యాసకుల్నీ ప్రణాళిక లో‘’జోనపడాన్ని ‘’గురించి తంటాలు ‘’వివరిస్తారు .హాస్యరసం ఒప్పించి మాట్లాడే వాళ్ళ పేర్లు తమాషా గా ఉంటాయి .వాళ్ళ చేష్టలు ఎలా ఉంటాయో చూడండి .’’హాస్య రచయిత రాసిన వంకర టింకర మాటలకి తరిమిణిపట్టి ,నునుపు జేసి ,నవ్వించే జీనియస్ -కాని ,పార్టు రాదు ,చేష్టలేదు ,చేత కాదు .నట యోగిది యావత్తూ ఇంగ్లీష్ నవ్వు ,అతడు పల్లె తూళ్ళమ్మటా ,పర్రలమ్మటా ,పడి ఫార్సు ముక్కలు మూటేట్టుకొని కప్పుల్లో మెడల్సూ లాగేశాడు .హాస్యార్నవం ఎప్పుడూ ఇవతల నవ్వించే మాటలే చెప్తాడు కనుక అతనికి పార్టే అక్కర్లేదు .అతడికి కోపం వచ్చేట్టు మనం తిట్టి నప్పుడు అతడికి మరీ నవ్వు పుడ్తోంది.

          వీల్లందరిలో ఒకాయన రాసిన నాటకాన్ని ‘’బోలెడు చోట్ల వాక్యాలు దిద్ది ,వాటికి మెరుగులు పెట్టి ,యే కోశాన స్పురించని హాస్య చేష్టలు చేసి ,చచ్చి చేడి జనాన్ని నవ్వించారు .’’ఇంత శ్రమ పడితే ఆ నాటక కర్త పర్మిషన్ తీసుకో లేదని ,పెట్రేగి పోయి కార్డులు బనాయించాడు .కేసులు వేస్తానని బెదిరిస్తూ ,దానికి ఈ సమాజం జవాబు ఇలా రాసింది‘’ఏం చేస్తాం ?మీరు యేడవ్వద్దు .మీకు గౌరవం తేవాలని మేం పడ్డ శ్రమకి ,మీరు చూపిన కృతఘ్నతకు రోజులు ఎలాంటి వి వచ్చాయో మీరు చూపించారు .మా కర పత్రం లో కొద్ది వాళ్ళ పేర్లే వేసి ,మీ బోటి పెద్ద వాళ్ళ పేర్లు తీసేశాం .మాకు మరో దిక్కు లేక మీ దిక్కు మాలిన నాటకం ఆడాం.మీకు రాయక పోవటానికీ కారణం ఉంది .నిజం చెప్పా లంటే మీ రచన దిక్కు లేని తెలుగు భాష .ఉన్నత భావ రహితం .పండిత శూన్యం .అందరికి తెలిసిన ముక్కలు .వీధిలో దొర్లాడే పడి కట్లూ .అందులో ఎందునా బొందని నీచం .ఇటు వంటి రచన చేసిన మీకు మీకు అనుమతి గురించి రాయటం కంటే ,మానేస్తేనే మీకు మీకు అనుమతి గురించి రాయటం కంటే మానేస్తేనే మీకు గర్వం తగ్గుతుందేమో నని మాకు తోచి ,మీ మేలు కోసమే మీ  పేరు విసర్జించాం .ఆ మేలు స్మరించుకొని ,మీరు మాకు కృతజ్నులై ఉండాలి .మేము ఎంతో సత్కరణం అని చేసిన పనినే మీరు గొప్ప తస్కరణం అని అంటున్నారు కనుక మాట తడ బడు తున్నది మీరె ను  ‘’మేం సత్కరించక మానం ‘’అని పోస్టు చేద్దామనుకొని ,చెయ్యకుండా చేశాట్ట రచయిత .అది మనో భావం అన్న మాట .

                 సాధారణం గా భాకారా మేష్టారు నాటికలు రాసి ‘’హెచ్చరిక ‘’గా ఒక మాట ముందు రాస్తారు .అది నిజం గా అందరికీ హెచ్చరికే .

     ‘’కేవలం వినోదం నిమిత్తమైనా సరే ,లేక సొమ్ము చేసుకొనే నిమిత్తమైనా సరే –ఈ ప్రదర్శన ఏదైనా సభ ఎదట ఆడ దలచిన ప్రతి సంఘం వారున్నూ ,ముందుగా నే ,గ్రంధ కర్తకి వ్రాసి ,లిఖితాను మతి పొందక పోవటం ,కాపీ రైట్ చట్ట ప్రకారం నేరం గనుక –ఆ సంగతి గమనించి లిఖితాను మతి పొంది ,తరువాతనే ఆడు కోవాలి ‘’

              సంక్రాంతి శుభా కాంక్షల తో –

 

             సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –13-1-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

సంక్రాంతి శుభా కాంక్షలు

pongal wishesసాహితీ బంధువు లందరికి -జనవరి పదమూడు ఆదివారం భోగి ,పద్నాలుగు సోమవారం సంక్రాంతి ,పదిహేను మంగళ వారం కనుమ పండగ శుభా కాంక్షలు .”సమ్” క్రాంతి కాకుండా పూర్తి క్రాంతి అందరి జీవితాలలో లభించాలని ,తెలుగు పండగ లకు ,సంస్కృతికి ,భాష కు అఖండ గౌరవాదరాభి మానాలు కలగాలని ఆశిస్తూ -మీ దుర్గా ప్రసాద్ 
100_8423 100_8422

 

ఉయ్యురులో ప్రభావతి పెరటిలో పూ సిన అమెరికా రోజా

 

 

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సితార రత్న రవి శంకర్ మరియు తెలుగు వైభవం =పద్య కవితలు

telugu vaibhavam

sithara ratna ravi shankar

Posted in కవితలు | Tagged | Leave a comment

భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ మిరియాలూ -1

భ.కా.రా.మేస్టారి చమత్ కారాలూ మిరియాలూ -1

  హాస్య బ్రహ్మ స్వర్గీయ భమిడి పాటి కామేశ్వరరావు  మేష్టారు  అంటే నాకెంతో ఇష్టం .ఆయన్ను మోలియర్ అనే నాటక రచయిత తో పోలుస్తుంటారు .అచ్చతెలుగు హాస్యాన్ని వండి వడ్డించిన సోషల్ మేష్టారాయన ..హైస్కూల్ విద్యార్ధుల కోసమే రాసిన నాటిక లైనా అందర్ని నవ్వుల్లో ముంచి తేలుస్తాయి .ఆయన రాసిన హాస్య నాటిక‘’అంతా ఇంతే‘’ను మేము స్కూలు వార్షికోత్స వాల్లో ఆడటమే కాక ,మా విద్యార్ధులతో కూడా వేయించి ఆ హాస్య రసాన్ని అందరికి పంచాము .అయితే అయన రాసిన ‘’అన్నీ తగాదాలే ‘’రచన చాలా మందికి పరిచయం తక్కువని నా అభిప్రాయం .అందులో హాస్య బ్రహ్మ చిలికించిన చమత్కారాలు ,మిరియాలు మీ అందరికి తెలియ జేయాలన్న సంకల్పమే ఈ రచన కు నేపధ్యంbkr

            సాంప్రదాయకం గా వస్తున్న కొన్ని విషయాల పై భ.కా.రా.మేస్టారికి తనదైన స్వంత అభి ప్రాయాలున్నాయి .అందుకే తన మనసు లోనీ చెప్పటానికి ఒక పుస్తకమే గీకి పారేశారు ‘’అన్నీ తగాదాలే ‘’నంటూ .ఆ తాగాదాలు భాషకు ,భావానికి ,పద్యానికి ,,వేషానికి చెందినా వై ఉంటాయి .నిష్కర్ష గా అందులో ఏదో పక పాత్ర చేత తన మాటల్ని మనకు విని పిస్తారు భమిడి పాటి మేష్టారు .

                పద్యం అంటే ,అర్ధం అంటే ఏమిటి ?అన్న విషయాలపై తగాదా పడతారు మిత్రులు .భావ రాజు పాత్ర ద్వారా తన అభి ప్రాయాలను మనసుకు హత్తుకోనేట్లు చెప్పిస్తారు .’’శాశ్వతత్వం పొందిన ప్రపంచ కవిత్వం పద్య రూపం లోనే నిల్చి ఉంది .  నడక అనేది వేద పురుషుని పాదాలు అని అందుకే అంటారు .సముద్రం లాంటి ప్రాపంచికాను భవం ,పైకి చెప్పుకో గల కవికి నడక ఈత లాంటిది .ఒక్కొక్కడు పద్యమే కాదు గద్యమైనా ,చివరికి కార్డు రాసినా తగల బెట్టి అతుకు తుంటాడు .నిశానీ కూడా పాడు చేసే వాడుండ వచ్చు .ఆలోచన పైకి రావాలంటే సాధన కావాలి .ఆ సాధన సముదాయమే ఆ భావానికి భాష .ఆ సాధనా ,చిత్త వృత్తీ మేళ వించిన మీదట ఆ భావం పండుతుంది .భావం భాష లోనే పుట్టి ,ప్రకటిత మై జీవిస్తుంది .’’ఇది పద్యాన్ని రాగం గా పాడాలి’’ అనే వారికి తగిన పాఠమే .భావ ప్రాధాన్యం వదిలి రాగాల జిలేబి చుట్టలు చుట్టకూడదని మేస్టారి మతం .ఇది అందరికి సమ్మతమే .అర్ధ ప్రాదాన్యానికి ఇచ్చిన విలువ ఇది ,ఇవ్వాల్సిన గౌరవం ఇది ..

               ఇక రాగం-పద్యం  విషయానికి వస్తే –శేషు అనే పాత్ర ద్వారా తన భావాలను ఆవిష్కరిస్తారు కామేశ్వరరావు మేష్టారు .’’భాష సముద్రం లాంటిది .సముద్రం లో అట్టడుగున పడి పోకుండా ,పై పైకి తేలగలిగిన ‘’ఆంద్ర కూర్మం ‘’’లాంటి దాన్ని ఆధారం గా చేసుకొని ,సంగతీ సందర్భాన్ని కవ్వం గా చేసుకొని ,నాలికలు అనే తాళ్ళతో జనం అంతా కలిసి మధనం చెయ్యగా చెయ్యగా బయల్దేరే హాలాహలాన్ని లయ కర్తకు వదిలేసి అమృతాన్ని మాత్రం తనకు చేత నయి నంత పట్టి నిలిపే వాణ్ణి కవి అంటారు .’’అని సమర్ధ వంత మైన నిర్వచనం చేస్తారు .అంతే కాదు –‘’తన భాష వాడు యెట్లా యెట్లా ఆలోచించి ఉండేవాడో ,అట్లా ఆలోచించి అప్పటి చిత్తవృత్తిని మాటల్లో బంధించే వాడే కవి .ఇంక రాగం తీయటం పై భకారా గారి భావం ఇలా ఉంటుంది ‘’పద్యం లో ఉండగల కవిత్వానికి అగమ్యత్వం  మొదటి పూత .రాగాలు తీయటం రెండో పూత .సగం విన పడీ సగం విన పడకుండా చేయడం మూడో పూత పూత మెరుగులు కవిత్వం కిందకి రావు .ఎల్లానో ఆకర్షించటం కాదు .ఆకర్షణ సక్రమం గానూ ,సవ్యం గానూ ఉండాలి .ప్రాణ ప్రతిష్ట చేసి ఆకర్షించాలి .మొదటే ,అతీతులం అని బయల్దేర రాదు అని హెచ్చరిస్తారు మేష్టారు .

          ‘’వేషం ‘’అనేది పాత్ర స్వభావాన్ని పెంచేదీ ,పాత్ర పై ఆవ గాహన హెచ్చిన్చేదీ గా ఉండాలి కాని –అది ఆసహ్యం గా ఉండ రాదనీ ,పాత్ర పై ఏహ్య భావం కల్గిన్చరాదని హాస్య బ్రహ్మ అభి ప్రాయం .’’భాష అంటే భావం దాల్చే వేషం .భావం ఆంతర్యం .వేషం ప్రత్యక్షం .ప్రకృతి భగ వంతుని వేషం ‘’అంటారు మేష్టారు ..ఈ విషయాలన్నీ బలరామయ్య పాత్ర ద్వారా చెప్పించారు .భావం లేని కవిత్వం గూర్చి ఒకానొక పెద్దాయనను గురించి ‘’ఈయన కవిత్వం చేసే టప్పుడు తప్ప ,కడం అప్పుడు భావం బోధ పడే లాగ వ్యవహరిస్తాడు .’’అని చురక అంటిస్తాడు .

          సాంఘిక నాటకాల్లో మరీ స్పష్టం గా వేష నిర్ణయం జరగ వచ్చు .పురాణ పాత్రల వేషమే తగాదా .వాళ్ళ వేషాలు పురాణ నాటక కారులు ఎరుగుదురేమో ?కాని చెప్పరు .’’అంతట బ్రహ్మ ప్రవేశించును ‘’’అంటారు యే తిట్ల కోసమో సిద్ధమై నటులే ,ఏదో ఏడుస్తారు .ఆ పాత్రలన్నీ సగ పాలు దేవుళ్ళు .-ఇమిటేషన్ దేవుళ్ళు .దేవుళ్ళ లాంటి మనుష్యులు .మనుష్యుల్లాంటి దేవుళ్ళు .ఋషుల గురించి చిన్తిల్లటం అనవసరమే .ఎటొచ్చీ వాళ్లకు కాస్త జనప నార గుడ్డ లూ ,వాటి కంపూ తప్ప ఇతర బాధే లేదు .’’అని వేష ధారణా ఎంత కృత్రి మత్వం దాల్చు తోందో కడిగేసేట్టు మాట్లాడిస్తారు పాత్ర ద్వారా .పెద్ద దేవుళ్ళకు మరీ కష్టాలోచ్చాయంటారు మేష్టారు .

         ఉదాహరణకు బ్రహ్మ పాత్ర ఎలా ఎడుస్తుందో స్టేజి నాటకం లో చూపిస్తారు ‘’పురాణ బ్రహ్మ చతుర్ముఖుడు ,వారిజాసనుడు ,సృష్టి కర్త ,వేద మూర్తి .నాటక బ్రహ్మ సాధారణం గా ‘’యం బ్రహ్మ ‘’ఒక్కొక్కప్పుడు పెట్టుడు తలకాయలు చెవులు మూసెయ్యడం వల్ల ,ప్రాంటింగ్ అందాక  ఒక్క మాట కూడా వాడికి విన బడి చావదు .’’ఇదే ఇట్లా ఉంటె విష్ణువు మామూలు మనుష్యుల కంటే హీనం గా ప్రవర్తిస్తాడు .శివుడు చంద మామ కాని ,త్రిశూలం కాని ,పాము కాని దొరికిన పరికరాలతో ‘’డబ్లీ పన్నా గడ్డం తో ‘’తయారు .శివ శివా నీ కెంత గతి పట్టిందిరా ‘’అన్న హేళన లో కొండంత నిజం స్పష్టం గా కని పిస్తుంది .

          ‘’ఇంద్రుడు ఒక అసందర్భపు కల్పన.ఆయన మీద ఎప్పుడు విశ్వాస రాహిత్యమే .ఎప్పుడూ ‘’తవ్వాయే ‘’.ఉల్టా సీదా భయమే .ఇతరుల నిష్ఠ చెడ గొట్ట టానికి ఎప్పుడూ స్త్రీలను పంపటమే .మామూలు సంగతులు కూడా ఎప్పుడూ ఇతరుల్ని అడగటమే .భోగ రాయుడు కనుక  కోర్టు లో ఎప్పుడూ బోగం ఆటే .’’అంటు ఇంద్ర పాత్ర ఎంత భ్రష్టు పట్టిందో తిట్టింది తిట్టకుండా కడిగేస్తారు కామేశ్వరరావు మేష్టారు .

          ‘’నారదుడు మరీ చులకన అయి పోయాడు. పౌరాణిక నాటకాల్లో .కాని ఆయన్ను పోతన అద్భుతం గా వర్ణించాడు .’’ఆత్మ వేది ,పారద రుచి దేహుడు ,అపార దయా మతి ,వివేక విశారదుడు ప్రాచీన బర్హికి ఆత్మా తత్త్వం ఉపదేశించిన వాడు .సప్త స్వరములు తన యంత నమ్రోయు చున్న వీణా లాపన రతిం జేసి నారాయణ కధా గానం చేయు వాడు .’’కాని మన నాటక నారదుడు పరమ పాపిష్టి రకం .వాడి వేషం బొంబాయి బాపతు గావును –తలంతా బాగా నున్నగా ‘’గవ్వ మెరుగు వచ్చే లాగా ‘’‘’డేక్కించటం’’ ,వెనక్కి నిగిడె పిలక ఉండడం ,అది అచ్చం గా ముచిగి పళం గా ఉన్న గంగా బొండాం అని పించడం ,పాం కోళ్ళు ,వాయిచని చిడతలు చేతిలో తీగల్లేని వీణ ,-కొందరు నటులు వీణకు తీగలున్నా ,చేత్తో ముట్టుకోరు .ముట్టుగున్నా ఒక చేత్తోనే ,తల్లకిందుగా వాయింపు .’’అంతే కాదు నాటక నారదుడు ‘’అగ్గి పెట్టె గాడు ‘’అన్నారు మేష్టారు .అందుకే మాటలు విని పించని పాటలు పడుతూ పాడు పన్లు చేస్తూంటాడు .వాడు దేవుడూ కాదు ,ఋషీ కాదు ,మనిషీ కాదు .మంచి రాక్షసుడూ కాదు .ఒకటో రకమైన లుచ్చా .అటు వంటి వాడు పట్టు బడితే మామూలుగా తవ్వి పాత రేస్తారు .’’

               రాగాలు మనకి లంచం గా ఇవ్వలేని నారదుణ్ణి నాటకం లో చూస్తె ఆపాత్ర ఎంత అపాత్రం అయి పోయిందో తెలుస్తుంది .ఇంకా –లోక మాతలుగా ఊహించుకో బడ్డ లక్ష్మి ,సరస్వతి ,పార్వతి దేవత్వ స్పురణ అవుతుంది అనుకోవటం హాస్యాస్పదమే వేషం ఎందుకు ?స్వభావాన్ని ప్రదర్శించాటానికా ?అన్న మీమాంస లో పడి తన భావాలనిలా చెప్పేస్తారు హాస్య బ్రహ్మ ‘’వేషం చూద్దాం విలాసం కావచ్చు ,వినోదం కావచ్చు .వేషం వెయ్యడం అంత కన్నా ఎక్కువాడే .ఒక్కొక్క వేషం సజీవం గా వ్రాసిన వాడి చేతా ,వేసిన వాడి చేతా ఒప్పించ బడితే అది నిజం గా మహోత్క్రుష్టమే .అట్టి వేషం ఒక్కొక్కటి నూరుగురు మనుష్యుల స్వభావ లేశాలని లోపల ఇముడ్చుకొని ఉంటుంది ‘’అని అభిప్రాయం వెలి బుచ్చారు .

               పాత్రలో ఇమిడి నటిస్తే పాత్ర సార్ధకమవుతుంది ‘’రాజూ మంత్రీ అంటూ లాంటి వేషం ఏదైనా సరే వేసి సర్వసమ  భూత సమత్వం స్థాపించి తనే ఒక కల్పిత పాత్ర అవస్థ గురించి ఏడిచి ,నవ్వి మొత్తు గోవడం లో ఆత్మా వత్ సర్వ భూతాని రుజువు చేసి తన నాశనం వల్ల ఏదో కల్పిత పాత్ర కి జీవం పోయ్యగల త్యాగి నటుడే ‘’అదే జీవిత పరమావధి .ఎంత అద్భుత మైన నిర్వచనమో చూడండి .సామాన్య మైన మాటల్లో ఎంతటి అసామాన్య విషయాన్ని ,ఎంత సూటిగా ,నిర్మోహ మాతం గా ,నిష్కర్ష గా నిజాన్ని తెలియ జేశారో మేష్టారు ?అదీ ఆయన ప్రతిభ ప్రతి పాత్ర లోను తొంగి చూసి పరకాయ ప్రవేశం చేసె నటనే అమోఘం కదా !

               సంక్రాంతి శుభా కాంక్ష లతో

              సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-1-13-ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

మార్గ దర్సనం చేసిన ముగ్గురు మహితాత్ములు

aadibhatla vaari aatmakadhashishtla srinivasvedam venkataachalayyar

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ముచ్చటయిన మూడు విషయాలు

kattabrahmanamahabrunda natyamshidhilaalayam

Posted in సేకరణలు | Tagged | Leave a comment

భగవంతుని మేడలో ‘కాచన హారం’

kanchana-1 kanchana-2 kanchana-3

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రజలకు చేరువ కావలసిన అమృత ఫలాలు – అంతర్జాల నిఘంటువులు

0001 0002 0003 0004 0005 0006 0007 0008 0009 0010 0011

 

Posted in సేకరణలు | Tagged | 1 Comment

తనికెళ్ళ భరణీయం

బంధాలు వికసిస్తేనే అందం

రంగస్థలాన్ని దాటి సినీరచయితగా పదేళ్లు, నటుడిగా పాతికేళ్లు సుదీర్ఘ ప్రస్థానం చేసిన వారు తనికెళ్ల భరణి. స్వేచ్ఛ లేని చోట బాధ్యత ఏముంటుంది? బాధ్యతాయుతంగా ఏమైనా చేయొచ్చనుకుని సినీరచనకు సిద్ధమైన భరణికి ఆక్కడున్న సంకెళ్లు ఎంతో మానసిక క్షోభకు గురిచేశాయి. అయినా ఓ పదేళ్లు ఆ బాధ్యతల్ని మోసి ఆ తరువాత సినీనటనకు శ్రీకారం చుట్టారు.

పాతికేళ్ల తర్వాత తాను ఆశించినంత పూర్తి స్వేచ్ఛతో రచన, దర్శకత్వం చేసే ఒక అవకాశం మి«థునం ద్వారా ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. ‘మిథునం’ తనకో గుర్తింపుగా మారబోతున్న ఈ తరుణంలో తనికెళ్ల భరణి జీవితంలోని కొన్ని అరుదైన సంఘటనల్ని మీ ముందు ఉంచుతోంది ‘ అనుభవం’ 
ఆనందంలోంచి కొంత నేర్చుకోవచ్చు. విషాదం లోంచీ కొంత నేర్చుకోవచ్చు. కానీ, ఆ రెండూ కలగలిసినప్పుడే సమస్య. అప్పుడూ నేర్చుకోవచ్చు. కాకపోతే, ఆ సత్యాలు కలగాపులగంగా ఉంటాయి. వాటిని జీర్ణించుకోవడం కొంత కష్టమయ్యే మాట నిజమే కానీ, అవే ఎంతో లోతైన సత్యాల్ని నేర్పుతాయి. దేవరకొండ నర్సింహకుమార్ అని నాకో మిత్రుడు ఉండేవాడు. ఇంటర్ నుంచి, డి గ్రీ దాకా వాడు నా క్లాస్‌మేట్. అప్పుడో ఇప్పుడో నేను రాసే కవితల్ని చదివి బాగా మెచ్చుకునే వాడు.

ఇంకా ఇంకా రాయమని ప్రోత్సహించే వాడు. వాడి ప్రోత్సాహమే నేను సాహిత్యం దిశగా పయనించడానికి అవసరమైన స్ఫూర్తినిచ్చింది. ఎవరెవరితోనో సాహిత్య చర్చలు చేస్తూ ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చేవాడ్ని. చాలా సార్లు ఆ టైంకి మా ఇంటికి వెళ్లలేక ఈ మిత్రుడి రూమ్‌కే వెళ్లి పడుకునే వాడ్ని. వాడి ధ్యాసంతా ఎప్పుడూ పుస్తకాల మీదే ఉండేది. నేను మొదట్నించీ కాస్త గాలివాటమే. బి.కాం చేసే రోజుల్లోనే వాడు టైప్, షార్ట్‌హ్యాండ్ కూడా నేర్చుకుంటూ ఉండేవాడు. కొద్దిరోజుల పాటు నేనూ టైపింగ్‌కు వెళ్లాను గానీ, నాకు అదేమీ అబ్బలేదు. మా నాన్నేమో అస్తమానం వాడితో పోలుస్తూ నన్ను అదేపనిగా తిడుతూ ఉండేవాడు. ఎప్పుడైనా వాడు మా ఇంటికి వస్తే చాలు మా నాన్న నా మీద వీర విహారం చేసేవాడు.

డిగ్రీ పూర్తయిన వెంటనే వాడికి ఒక మంచి కంపెనీలో స్టెనో ఉద్యోగం వచ్చింది. ఇంకేముంది? మా నాన్న తిట్లదండకం ఇంకా ఎక్కువయ్యింది. ఒక దశలో ‘ వీడివల్లే కదా నేను ఇన్ని తిట్లు తింటున్నాను’అన్న నెగెటివ్ ఫీలింగ్ నాలో మొదలయ్యింది. ‘అసలు వీడిని ఇంటికే రావద్దని చెప్పేస్తే బెటర్ కదా!’ అని కూడా అనుకున్నాను. చివరికి ఒకరోజు నేరుగా వాడితో ఆ మాటే అనేశాను. అందుకు వాడు బదులేమీ ఇవ్వకుండా, మౌనంగా నావైపు అలా చూస్తూ ఉండిపోయాడు. చివరికి నేనే తలతిప్పుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాను.

అప్పుడే తెగిపోతే…
అంత మాట అనేసినా వాడు నాకు దూరం కాలేదు. నా స్నేహాన్ని వదులుకోలేదు. సాహిత్యం విషయంలో నన్ను ప్రోత్సహించడమూ మానుకోలేదు. తొలిసారిగా పత్రికలో వచ్చిన ‘అగ్గిపుల్ల-ఆత్మహత్యలు’ అన్న నా కవితను చూసి ఏ మహాశిఖరమో నా చేరువైపోయినట్లు తెగ ఆనందపడ్డవాడు వాడే. వాస్తవానికి, ఆ రోజుల్లో అంతలా ప్రోత్సహించే వాళ్లు నాకు మరెవరూ లేరు. ఈ రోజు ఈ కాస్త స్థాయిలో నేనున్నానూ అంటే వాడి ప్రోత్సాహ ఫలమే.

నేను వాణ్ని మా ఇంటికి రావద్దని చెప్పానే గానీ, చూడకుండా ఉండలేకపోయే వాడ్ని. వాడూ అంతే. ఒకరోజు వాళ్ల ఆఫీసు వాళ్లతో కలిసి గండిపేటకు పిక్‌నిక్‌కు వెళ్లాడు. మ«ధ్యాహ్నం 3గంటల వేళ నా మిత్రుడొకడు వచ్చి కుమార్ గండిపేట చెరువులో మునిగి చనిపోయాడని చెప్పాడు. నా శరీరంలోని ప్రతి అణువూ కాలిపోతున్నట్లనిపించింది. ఆగమేఘాల మీద గండిపేటకు చేరుకున్నాం. వాడి తల్లిదండ్రుల దుఃఖానికి అంతు లేదు. స్మశానానికి చేరుకున్నాం.

ఒక్కగానొక్క కొడుకు కన్నుమూశాడన్న దుఃఖంతో వాడి తండ్రి కుప్పకూలిపోయాడు. చివరికి నా మిత్రుడికి నేనే కొరివి పెట్టాను. భౌతికంగా వాడు నా కళ్లముందు లేకపోవచ్చు గానీ, వాడు నాలోనే ఉండి, నాతోనే నడుస్తున్నాడనుకుంటాను. ఆ రోజు ఎంత తొందరపడ్డాను? మా ఇంటికి రావద్దని నేను అంత కఠినంగా మాట్లాడేసిన్నాడు నిజంగానే వాడు నాకు దూరమై ఉంటే ఏమయ్యేది? ఈ రోజు నేనిలా నిలబడే వాణ్నే కాదు. మన జీవితాన్ని నిలబెట్టే అత్యంత ఆత్మీయుల నుంచి కూడా వాళ్లకు తెలిసో, తెలియకో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎప్పుడైనా మన మనసు గాయమైఉండొచ్చు. అంత మాత్రానికే ఆ బంధాన్ని తెంచేసుకుని, వారికి దూరమైపోతే అది జీవితకాలమంతా తిరిగి పూడ్చుకోలేని భారీ నష్టమవుతుందన్న సత్యం ఆ అనుభవం నాకు నేర్పింది.

అన్నీ తెలియడం వల్లే…
పాతికేళ్ల క్రితం నాటి మాట. నాటకమే జీవితం అన్నట్లు ఎంతో ఉధృతంగా నాటకాలు వేస్తున్నాం. ఆ సమయంలో కళాసాగర్‌లో నాటకపోటీలు జరుగుతూ ఉంటే, నేను రాసిన ‘గోగ్రహణం’ నాటకాన్ని ప్రదర్శనకు తీసుకువెళ్లాం. తల్లావ ఝల సుందరం గారి దర్శకత్వంలో ఆ ప్రదర్శన జరిగింది. దాన్ని చూడటానికి ముఖ్య అతిథిగా ఆచార్య ఆత్రేయ గారు వచ్చారు. ప్రదర్శన తరువాత జరిగిన సభాకార్యక్రమంలో మాట్లాడుతూ, “సినిమాల్లోకి వచ్చాక నాటకాలు రాయడం మానేశాను. అయినా మళ్లీ నాటకాలు రాస్తాను… రాస్తాను అంటూ కొన్నేళ్లుగా మిమ్మల్ని భయపెడుతూ వచ్చాను.

కానీ, ఈ రోజు తేల్చిచెప్పేస్తున్నా.. తనికెళ్ల భరణి రాసిన ఈ గోగ్రహణం చూశాక నేనింక నాటకం రాయక్కర్లేదన్న నిర్ధారణకు వచ్చేశాను. అందుకే ఇంక నేను నాటకాలు రాయనంటే రాయను” అన్నారు. అంతటి ఒక మహా రచయిత నోట ఆ మాట రావడం నాకు గర్వకారణమే కానీ, ఆ మాటలతో నేను బాగా ఆలోచనలో పడిపోయాను. గొప్ప వాళ్లు తమను తాము నిలబెట్టుకోవడానికి ఎంతగా తపించిపోతారో… ఒక్కోసారి తమను తాము వదులుకోవడానికి కూడా అంతగానూ సిద్ధమైపోతారు కదా అనిపించింది. వాస్తవానికి ఆ సంస్కారమే వారిని ఆ శిఖరానికి చే ర్చింది. ఎదగాలనుకునే ఎవరికైనా ఆ సంస్కారం అవ సరం అనిపించింది. నాకైతే ఆ ప్రశంసల మాటున ఆ సత్యమే ప్రస్ఫుటంగా కనిపించింది.

“మన జీవితాన్ని నిలబెట్టే అత్యంత ఆత్మీయుల నుంచి కూడా వాళ్లకు తెలిసో, తెలియకో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎప్పుడైనా మన మనసు గాయమైఉండొచ్చు. అంత మాత్రానికే ఆ బంధాన్ని తెంచేసుకుని, వారికి దూరమైపోతే అది జీవితకాలమంతా తిరిగి పూడ్చుకోలేని భారీ నష్టమవుతుందన్న సత్యం ఆ అనుభవం నాకు నేర్పింది.

యువతలోనూ ఒక పెద్దతనం ఉంది
శ్రీరమణ గారి మిథునం చదివిన్నాడు నేను కన్నీటి పర్యంతం అయ్యాను. అప్పటి నుంచీ ఆ ఇతివృత్తం దృశ్యమానమైనా మనసులో కదులుతూ వచ్చింది. అదొక మానవ సంబంధాల కథ. సినిమా తీస్తే యువతను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీయాలన్న భావజాలం చాలా మంది సినీ నిర్మాతా, దర్శకుల మనసుల్లో బాగా పాతుకుపోయింది. అందుకే యువ జీవితాలకు సంబంధించిన ఇతివృత్తాలే ఎంచుకోవాలని, లేకపోతే ఫెయిల్ అవుతుంద ని చెబుతుంటారు. ఆ కారణంగానే వయసు పైబడిన జీవిత కథలేవీ నేడు తెరకెక్కడం లేదు. నిజానికి యువతలోనూ నిగూఢంగా ఒక పెద్దతనం ఉంటుందనే సత్యాన్ని చాలామంది విస్మరిస్తున్నారు.

వారి మనసుల్లో ఉండే ఆ కోణాన్ని ఎవరైనా బలంగా తాకగలిగితే యువత కూడా ఈ తరహా సినిమాలు చూస్తారనే ది వాస్తవం. పరోక్షంగానే కావచ్చు కానీ, యువతరాన్ని తాకే అంశాలు ఏ వయసు వారి కథలోనైనా ఉంటాయి. మిథునంలో చిత్రీకరించిన అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ అంశాలే అందుకు సరియైన ఉదాహరణ. కొడుకులనూ, కూతుళ్లనూ ప్రేమించు. అయితే మధ్యలో వచ్చిన వాళ్లు, మధ్యలో వెళ్లిపోతారు. చివరి దాకా ఉండేది ఎప్పడైనా భార్యాభర్తలే. వార్థక్యాన్ని బరువుగానో, భారంగానో కాకుండా ఆనందంగా గడపవచ్చని చెప్పే ఒక అందమైన కథనమది.

దాంపత్యం అంటే శాశ్వతమైన స్నేహం అన్నాడు భవభూతి. ఆ సత్యాన్ని ఈ సినిమా అందంగా చెబుతుంది. ఈ అంశం యువతకు సంబంధం లేని విషయమేమీ కాదు కదా! అందుకే మిథునం సినిమాను యువతీయువకులు కూడా పెద్దవారితో సమానంగా చూస్తున్నారు. ఎంతో యిష్టంగా తీసిన సినిమా ఇది. రాష్ట్రానికే పరిమితం కాకుండా అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది. పెద్దవారిలో ఉండే కుర్రతనాన్ని గమనించగలిగినంత స్పష్టంగా కుర్రవాళ్లలోని పెద్దతనాన్ని తాకగలిగితే కళాత్మక సృజనలో వయోభేదాలు అడ్డుగోడలు కావన్న సత్యం మిథునం సినిమా ద్వారా మరింత బలంగా రుజువయ్యింది. -బమ్మెర

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం –7(చివరి భాగం )

  చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం –7(చివరి భాగం )

                                     ఉత్తర కాండం

 

శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి

 అయోధ్య రాజుల పురోహితుడు వసిష్ట మహర్షి  సప్తర్షి మండలం లోనీ వశిష్టుని రూపాంతరమే .బ్రహ్మ దేవుడు మొదట గా జలాన్ని సృష్టించాడు .జల రక్షణ కోసం ప్రాణ సృష్టి చేశాడని అవి ఆహారం లేక నీర సించి బ్రహ్మ ను ప్రార్ధిస్తే ,వాటికి జావసత్వాలు ప్రసాదించి ,జల రాసిని కాపాడమని ఆదేశించాడు .అందులో ‘’అలాగే రక్షిస్తాం ‘’అన్న వారే రాక్షసులు గా పుడతారని ‘’అట్లాగే పూజిస్తాం ‘’అన్న వారు యక్షులు గా పుడతారని బ్రహ్మ అనటం తో ఈ జాతుల ఆవిర్భావం జరిగిందట .మన నోరే మన కర్మలను నిర్దేశిస్తుందని తెలియ జేసే యదార్ధ సన్నివేశం ఇది .

             రావణాసురుడికి ఆహుతి చేసుకొన్నా తొమ్మిది తలలను బ్రహ్మ మళ్ళీ ప్రసాదించటం ,కోరిన వరాలివ్వటం ,అతని చావుకు అతడే కారకుడవటం –అంటే -మానవులను తేలిగ్గా తీసి పారేయటం ,వారి వల్ల తనకే ప్రమాదం రాదన్న వాడి ధీమా వమ్ము అయి పోయింది .అదే విభీషణుడు అన్ని వేళలా తన బుద్ధి ధర్మ ము మీదే స్థిరం గా ఉండాలని కోరు కొంటాడు .అన్నదమ్ము లైనా ఆలోచనల్లో ,నడవడి లో ,ప్రవర్తనవర్తనలో ఎంతో భేదం కని పిస్తుంది .బుద్ధి కర్మను అను సరించే ఉంటుందికదా .కాలకేయాది రాక్షస సంహారం లో తన సోదరి శూర్పణఖ భర్తను కూడా చంపేశాడు రావణుడు .ఇదేమి ఘోరం అని ప్రశ్నించిన సోదరితో యుద్ధం లో బంధుత్వాలు గుర్తుకు రావు అన్నాడు .జరిగిన దానికి పరిహారం గా సోదర తుల్యు డైన ఖరున్ని దండకారణ్యానికి అనది కార రాజు గా ,సోదరుడు దూషణుడిని 14 వేల రాక్షస గణానికి సేనాధి పతి గా చేసి ,శూర్పణఖ కు తోడిచ్చి జనస్తానానికి పంపాడు .అంతే కాదు ఆమె ఆడింది ఆటగా ,పాడింది పాటగా హాయిగా ఉండే స్వేచ్చనూ ఇచ్చేశాడు .వారంతా చేయని అక్రుత్యమే లేదు .బరి తెగించి ప్రవర్తించారు .ఇష్టా రాజ్యం గా ప్రవర్తించారు .దానికి ప్రతి ఫలం గా జన స్థానం లో శ్రీ రాముడు వారందర్నీ వీర విక్రమంతో సంహరించి లోకోప కారం చేశాడు .ఇప్పుడు మనం ఉంటున్న ‘’జన దండకారణ్యానికి ‘’ఈ ఏడు ( april2011 )   ‘’ఖరుడే అది పతి .అంటే ఖరనామ సంవత్సరం లో ఉన్నాం కదా .ఇప్పటికే ఎన్నో నేరాలు ,ఘోరాలు చూస్తున్నాం ఇంకా యే విపరీతాలు చూడాలో ?

             ఇంద్రజిత్ పరాక్రమం అవక్ర మైంది .అందరు తపస్సు చేసి అమరత్వం కోరుకొంటే ,తన పరాక్రమాన్ని చూపి అమరత్వాన్ని సంపాదిన్చుకొంటానని బ్రహ్మ దేవునితో చెప్పి ,తధాస్తు అని పించుకొన్న రావణ కుమారుడతడు .ఇంద్రుడు అహల్యా జారత్వం చేసి నపుడు గౌతమ మహర్షి ఇంద్రుడు చేసిన ప్రతి చెడ్డ పని మనుష్యుల్లో కూడా వ్యాపిస్తుందని ,మానవులు చేసిన పాపం లో చేసిన వారికి సగం పాపం ఇంద్రుడికి మిగిలిన సగం పాపం సంక్రమిస్తుందని శపించటం పాప కార్య తీవ్ర పరిణామాలను తెలియ జేస్తుంది .ఇంద్రపదవికే అస్తిరత్వం తెచ్చిన పాపి అయాడు దేవేంద్రుడు .మహా అంద గత్తే అయిన అహల్య రూప గర్వం ఆమె నూ పతితు రాలిని చేసింది .గౌతముని శాపంతో ఆమె ఏకైక అంద గత్తే  అన్నది పోయి ,అందర్ని అంద గత్తేలను చేయటం జరిగింది .ఆమెకు ఖేదం ,సామాన్యులకు మోదం .రూప గర్వం పతనానికి పరా కాష్ట.అయింది అహల్య విషయం లో .

         1000 వ పేజి లో జనకుడిని విదేహుడు అనటం దేహం నుండి పుట్టుకోచ్చాడని చిలుకూరు వారు రాశారు .కాని‘’దేహ భ్రాంతి లేని వాడు కనుక విదేహుడు అయాడు ‘’అని పెద్దలు చెప్పగా ,చదవగా నేను తెలుసుకొన్న విషయం .

           భూమి పై రెండవ అధర్మ పాదం మోప బడటం తో ద్వాపర యుగం పేరు వచ్చింది అన్న మాట సరైనదే నని పిస్తుంది .ఎంత తపస్సు చేసినా ,శరీరం పై భ్రాంతిని పోగొట్టుకో లేక పోతే ‘’శ్వేతునికి ‘’పట్టిన గతే అందరికి పడుతుంది .

               తెలియని విషయాలను తెలుసుకొనే విద్యకు ‘’ఆవర్తని ‘’అని పేరుందని నాకు ఇది చదివిన తర్వాతే తెలిసింది .ఇంకా ఎన్నో విషయాలను వెంకటేశ్వర్లు గారు స్పృశించి వివరించి అంద జేశారు .ఉత్తర రామాయణం లో ‘’భిక్షు తాడిత ‘’కుక్క కధ లో దైవ ద్రవ్యాపహరణం ఎంతటి నేరమో దాని వల్ల  వచ్చే అనర్ధమేమితో తెలియ జెప్తుంది .ఇక్కడో విషయం మనవి చేస్తున్నాను .విజయ వాడ ఆకాశ వాణి వారు ‘’ఆలోచనా లోచనం ‘’శీర్షిక క్రింద ప్రతి మంగళ వారం ఉదయం ఏదుం పావు కు ప్రసారం చేస్తున్న దానికి నన్ను రాయమని డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు కోరగా నేను పద్నాలుగు ఎపి సొడ్లు రాస్తే, ప్రసారం చేశారు .ఆరవ ఎపిసోడ్ లో ‘’భిక్షు తాడిత ‘’కధ ప్రసార మైంది .దానికి నేను పెట్టిన పేరు ‘’దేవుని సొత్తు తింటే విపత్తే ‘’.

             శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు తక్కువ వ్యవధిలో వాల్మీకాన్ని నేర్పుగా అనువ దించారు .ఎక్కడా క్లిష్టత లేదు .అన్వయ కాఠిన్యమూ లేదు ద్రాక్షా పానకం గా రచన సాగింది .ఆస్వాదనీయం గా ఉంది..శ్రీ రామునికి ఆంద్ర దేశానికి చాలా అవినాభావ సంబంధం ఉందని, యుద్ధం తర్వాత రాముడు అయోధ్యకు వెళ్ళ కుండా భద్రాచలం లోనే కొలువై నిలిచి పోయాడని ప్రఖ్యాత కవి ,విమర్శకులు ,’’విశ్వనాధ కాళి దాసుకు మల్లి నాద సూరి’’అయిన స్వర్గీయ మల్లం పల్లి శరభయ్య అయ్యవారు చమత్క రించారు . .శ్రీ రామ నవమిని ఆంద్ర దేశం లో చేసి నంత వైభవం గా ఇంకెక్కడా చెయ్యరు ఊరూరా వీధి వీధినా శ్రీ రామ నవమి పందిళ్ళ తో కోలాహలం గా ఉంటుంది .రామాలయం లేని ఊరు ఉండదు .సీతా రాముల పేరులో ఏదో ఒక పేరు ప్రతి ఇంటిలోను ఒకరికి ఉంటుంది .అలాంటి రామ చరితను మహర్షి వాల్మీకి రాసి తాను ధన్యుడై లోకాన్ని ధన్యత చెందిస్తే చిలుకూరు వారు తెలుగు వచనం లో ఆ మాధుర్యాన్ని, విశేషాలను అందించి ,మళ్ళీ ఒక సారి ఆ వైభవాన్ని చూపించారు .రుషి ఋణం తీర్చుకొన్నారు .అభ్యుదయ కవి అనుభూతి కవి స్వర్గీయ దేవర కొండ బాల గంగా ధర తిలక్ (అమృతం కురిసిన రాత్రి ఫేం ),పరవశించి శ్రీ రాముని గురించి రామాయణాన్ని గురించి అద్భుతం గా చెప్పిన పద్యం గుర్తు చేస్తూ

  ‘’రామ శబ్దము చాలు రచ్చలో గట్టులో –పులకించ నట్టిది పూవు లేదు

    సీత శబ్దము చాలు శీతువో గ్రీష్మమో –వరదలై పారని వాగు లేదు

    రామ సీతా నామ రమ్య నాదము చాలు –కోవెల కానట్టి గుండె లేదు

    రామాభి రామ కీర్తనముతో మడియని –స్మయ భావ మద నిశాచరుడు లేడు

    వాడ వాడల నాడు జీవత్కదాంశ–సంపుతీక్రుత కాకుత్ష్య చరిత మ్రోగే

    దాని గైకొని ,ప్రతిభా నిదానుడైన –మౌని వాల్మీకి అక్షర మాల్య గూర్చే ‘’

              దీనికి ముక్తాయింపుగా సీతా రాముల అభేదాన్ని తెలియ జెప్పే కవి సమ్రాట్ విశ్వనాధ వారి రామాయణ కల్ప వృక్ష కావ్యం లో అశోక వనం లో హనుమ దర్శించిన సీతా మాత స్వరూపాన్ని వర్ణిస్తూ చెప్పిన  పద్య వైభవాన్ని ఒక్క సారి దృష్టికి తెస్తూ,సెలవు తీసుకొంటున్నాను

‘’ఆకృతి రామ చంద్రు విరహాకృతి ,కన్బొమ తీరు స్వామి చా

  పాకృతి ,కన్నులన్ ప్రభు క్రుపాకృతి ,కైశిక మందు రామ దే

  హాక్రుతి ,సర్వ దేహమున యందున ,రాఘవ వంశ మౌళి ,ధ

  ర్మాక్రుతి ,కూరుచునున్న విధ మంతయు ,స్వామి ప్రతిజ్ఞ మూర్తి యై ‘’

               సంపూర్ణం

                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-1-13-ఉయ్యూరు

 

About the Author Sri Venkateswarlu

Posted in రచనలు | Tagged | Leave a comment

చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -6 సుందర కాండ

 చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -6

                                   సుందర కాండ

 

శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి

శ్రీ హనుమ సముద్ర లంఘనం లో సురస ను ఎదుర్కొనే టప్పుడు శరీరాన్ని తొంభై యోజనాలకు పెంచాడు అనటం అసంబద్ధం గా ,పిల్లల సంతోషం కోసం చెప్పి నట్లుగా ఉందనటం నాకు నచ్చిన విషయం .కొన్ని చోట్ల ఇలాంటి ఔచిత్య భంగాలు బాధిస్తాయి .లంకలోని భావన సముదాయాలన్నిటి గురించి చెప్పిన విధానం తెలుసుకో తగినది .నాలుగు ద్వారాలుండేది ‘’పద్మం ‘’అని ,ఇవి సర్వతో భద్రమని ,పశ్చిమ ద్వారం లేక మధ్య వంపు తిరిగిన చతుస్శాల గృహాన్ని‘’హయాననం ‘’అంటే ,గుర్రపు ముఖం అని ,దక్షిణ ద్వారం లేని దాన్ని ‘’వర్ధమానం ‘’అంటారని ఇది ధన ప్రదమని ,తూర్పు ద్వారం లేని ది‘’స్వస్తిక గృహం ‘’అని ఇది పుత్ర ,ధన ,సంపదల నిస్తుందని కేటగరైజ్ చేయటం కొత్త విషయాలను తెలియ జేసింది .వీటి వివరణ ఇవ్వటానికి చిలుకూరు వారు ఎంతో శ్రమించి ఉంటారని పిస్తుంది .

                పుష్పక విమానం యజమాని మనస్సును బట్టి నడుస్తుందని ,యజమాని నియంత్రణ లోనే పని చేస్తుందని ,ఏ వేగం కావాలంటే ఆ వేగం లో వెళ్తుందని వాల్మీకి చక్కగా వర్ణించిన విషయాన్ని తేట తెలుగు మాటల్లో వర్ణించటం బాగుంది .మన విమానాల్లో ఇంకా రావాల్సిన మార్పులను ఈ పుష్పకం సూచిస్తోందని పిస్తుంది .రామ రాజ భూషణుడు రాసిన ‘’వసు చరిత్ర ‘’ప్రబంధం లో ఇంద్రుడు వసు రాజుకు మహా మహిమాన్విత మైన విమానాన్ని బహూక రిస్తాడు .అందులో ఎయిర్ కూల్ ,ఎయిర్ కండిషనింగ్ కూడా ఉంటాయి .పుష్పకం కంటే మెరుగైందన్న మాట .’’వసు రాజు విమానం ‘’పేరుతో చాలా ఏళ్ళ క్రితం నేనొక వ్యాసం రాశాను ‘’మూసీ మాస పత్రిక ‘’లో ప్రచురితమైంది .ఊరికే కంపారిజన్ కోసం చెప్పాను .రావణాసురుడు కుబేరుని దగ్గర నుంచి పుష్పకాన్ని లాక్కొంటే ,వసురాజు దివ్యత్వాన్ని మెచ్చి దేవేంద్రుడు ఈ విమానాన్ని కానుక గా ఇచ్చాడు అదీ కధ .

           సీతా దేవి ని తప్ప స్త్రీల నెవ్వరిని రావణుడు బలాత్కారం గా లంకకు తీసుకొని రాలేదని ,అతని గుణాలకు ఆకర్షితులై వారే వచ్చారని ,మరో పర పురుషుని పై వారికి ప్రేమ లేదని అందరు సత్కుల సంజాతలే నని ఈ కాండలో ఉన్నది .కాని ఉత్తర కాండ లో దీనికి విరుద్ధం గా విషయాలున్నాయి .రావణ గాంభీర్యానికి ప్రతిభకు ,హనుమ అప్రతి భుడయ్యాడని కాని భయ పడ లేదని మంచి వివరణ నిచ్చారు వెంకటేశ్వర్లు గారు .

                    యుద్ధ కాండం

          యుద్ధానికి బయల్దేరిన వానర సైన్యానికి సూచన లిస్టు ,సుగ్రీవునికి శ్రీ రాముడు చాలా హెచ్చరికలు చేశాడు .శత్రువులు కంద మూలాల్లో ,ఫలాల లో విషం కలిపే ప్రమాదం ఉందని ,ఏమరు పాటు ఏ మాత్రం తగదని ,భూ సైన్యానికి‘’air protection ‘’ఉండేట్లు చూడమని చెప్పటం యుద్ధ సమయం లో రాజు ఎన్ని జాగ్రత్తలు తీసుకో వాలో తెలియ జేసే యుద్ధ విధానమే కాక, యుద్ధ నీతి కూడా ఉంది.సూర్య మండలం చుట్టూ చిన్న యెర్రని గూడు కడితే అందులో నల్ల మచ్చ ఉంటె రాబోయే ప్రళయానికి సూచన అని మహర్షి వాల్మీకి తెలియ జేశాడు .ఇది లంకకు చేటు కనుక ,ఆ సమయం లోనే యుద్ధం ప్రకటించాలని రాముడు లక్ష్మణుడి తో అనటం రాజనీతికి గొప్ప ఉదాహరణ .యుద్ధ తన్త్రానికి మకుటం .జాంబ వంతుడు ‘’గద్గదుని ‘’కుమారుడని ,అతని తమ్ముడి పేరు ‘’ధూమ్రుడు ‘’అని మనం తెలుసు కొంటాం .

            మాల్య వంతుడు రావణుడి పిన తాత .రావణుడికి నీతి బోధిస్తూ మహర్షులు అగ్ని వలె ప్రకాశిస్తారని ,ధర్మ సంరక్షకులని ,వారి యాగ ధూమానికి రాక్షసులు చెల్లా చెదరౌతారని ,రాక్షస తేజాన్ని అణచే సర్వ సమర్ధులు మునులని ,వారి తపోగ్ని రాక్షసులకు తాపం కలిగిస్తుందని వారిని బాధించటం వల్ల రావణుడు పతనం కొని తెచ్చుకోన్నాడని బోధించాడు మాల్య వంతుడు .రామునితో సంధి చేసుకొమ్మని రావణుని తల్లి కైకసి ,’’అవిద్ధుడు ‘’అనే ముసలి మంత్రీ హితవు చెప్పారు .వినలేదు .వినాశ కాలే విప రీత బుద్ధి అంటే ఇదే .

               పాదాల్లో పద్మ రేఖలున్న స్త్రీలు సామ్రాజ్యాధి పతుల భార్య లవుతారని హస్త సాముద్రికం చెప్పాడు వాల్మీకి .పుష్పక విమానం విధవలను తీసుకొని పోదు అనే విషయం విమాన రహస్యం .భరద్వాజుడు విమాన శాస్త్రాన్ని రచించాడని మనకు తెలుసు .దీన్ని జర్మన్ ,జపాన్ దేశాల వారు తీసుకొని వెళ్ళి ,విమానాలు తాయారు చేశారని మన వాళ్ళ నమ్మకం .కుంభ కర్ణుడు నీతులు బోధిస్తుంటే నిండా మునిగిన రావణుడు నీతులతో చర్చించే సమయం కాదని తన తెలివి తక్కువ ,భ్రాంతి వల్ల లోపాలు చేశానని ఇప్పుడు కర్తవ్యమేమిటో ఆలోచించమని దశగ్రీవుడు అనటం తక్షణ కర్త్వవ్య బోధ యే.జరిగి పోయిన్దాన్ని గురించి నిర్ణయం తీసుకొనే సమయం లో ఆలోచిస్తూ కాలం వృధా చెయ్య రాదనీ అందరు గుర్తిన్చుకోవాల్సిన విషయం .అతని తప్పుల్లో  అందరికి బాధ్యత ఉంది..ఎలా అతడిని బైట పడేయ్యాలో ఇప్పుడు సూచించాలి .లక్ష్మణ మూర్చ సందర్భం గా రామ విలాపం లోనీ ఉచితానుచితాలను చిలుకూరు వారు చక్కగా చిలికి విశ్లేషించారు .ఆదిత్య హృదయాన్ని అతి తక్కువలో అందులోని ఆంతర్యాన్ని సూక్క్ష్మం గా చెప్పటం విశేషం .బాగుంది .

         ప్రేమించే గుణం లేని రాజుతో యుద్ధానికి పోవటం సైనికులు ఇష్టపడరని కనుక యుద్ధ ము లో పాల్గొనే వానర వీరులను ముందే సత్కరించమని రాముడు విభీషణుడికి చెప్పి చేయించాడు .ఇది త్యాగానికి తగిన గుర్తింపు నివ్వటమే .అందుకే మన ప్రభుత్వం వీర ,శౌర్య చక్ర,పరమ వీర చక్ర పురస్కారాలిచ్చి సత్కరిస్తోంది .సైనికులను సంతోష పరుస్తున్నారు .అయోధ్యకు వెళ్తూ శ్రీ రాముడు భరద్వాజ మహర్షి ని సందర్శించి తాను వెళ్ళే దారిలో వృక్షాలు అన్నీఅకాలం లో కూడా సమృద్ధిగా ఫలాల నివ్వాలని ,పుష్ప  ఫల భరితం గా ఉండాలని కోరాడు .ప్రజా క్షేమం అడుగుడుగునా రాజు కర్తవ్యం అని తెలియ జేసే సంఘటన .రాముని తరఫున రాజ్యం చేస్తున్న భరతుని కాలం లో అన్నీ పది రెట్లు అభి వృద్ధి చెందాయట .అది విని అందరు ఆనంద బాష్పాలు రాల్చారట .తన పై ఉంచిన బాధ్యతలను భరతుడు ఎంత సక్రమం గ నిర్వర్తిన్చాడో ,ఎంత నియమ బద్ధం గా పరి పాలన నిర్వ హించాడో మనకు తెలుస్తుంది .ఇదంతా తన గొప్ప కాదని రామ భద్రుని ప్రభావమే నని అతి వినమ్రం గా భరతుడు చెప్పటం అతని సుగుణ సంపత్తిని రెట్టింపు చేస్తుంది .

             సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-1-13—ఉయ్యూరు 

 

About the Author Sri Venkateswarlu

Posted in రచనలు | Tagged | Leave a comment

హైదరాబాద్ జనవరి ప్రయాణం

This gallery contains 59 photos.

More Galleries | Tagged | Leave a comment

— వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న ‘’మిధునం ‘’

This slideshow requires JavaScript.

— వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న ‘’మిధునం ‘’

 ఇన్నాళ్ళకు ఈ నెల ఆరవ తేది ఆది వారం హైదరా బాద్ లో ఉషా మయూరి సినిమా హాల్లో సాయంత్రం ఆరు గంటల ఆట కు మా పెద్దబ్బాయి శాస్త్రి ‘’మా మిదునానికి ’’ ఈ మిధునం సినిమా చూపించాడు .అందులో కొన్ని సన్నీ వేశాలు అచ్చం గా నేను ఇంట్లో ప్రవర్తించే తీరు లో ఉన్నాయని ,అంత కట్టే కొట్టే లా ప్రవర్తించటం,కొడుకుల్నించి ఫోన్లు వస్తే వాళ్ళమ్మకు ఇచ్చేయటం తమకు అనుభవమే నని ,తనకు మా కోడలు సమత కు నచ్చిందని , మేము కూడా చూడాలని,తాను ఇప్పుడు రెండో సారి చూస్తున్నానని  పట్టు బట్టి సినిమా చూపించాడు ..అక్కడ అందరు వృద్ధ మిదునాలే కని పించాయి . .హాలంతా నిండి పోవటం నాకు మహా ఆశ్చర్యాన్ని కల్గించింది .కాదు ఆనందాన్ని కూడా పంచింది .ప్రేక్షకులు ఎంత మెచ్చుకోక పోతే ఇంత మంది వస్తారు ?అందుకని ప్రేక్షక దేవుళ్ళను  మనసారా అభి నందిస్తున్నాను .ఇది ప్రేక్షకులు అందించిన గొప్ప విజయమే నని పించింది .తెల్ల జుట్టు వాళ్లను  హాలుకు తీసుకొచ్చిన నల్ల జుట్టు వాళ్ళు కొందరు ఉండటం విశేషమే .ఇది ‘’మన అమ్మా నాన్నల సినిమా ‘’అని యువత ఎగబ డటం లేదు కాని ఇది మన సినిమా అని మాత్రం వృద్ధులు అనుకొని చూడ టానికి బాగానే వస్తున్నారు .ఇలా ఉన్నామని  అనుకొనే వారు ,ఇలా ఉంటె బాగుంటుందను కొనే వారు ,ఇలా ఉండ బోతున్నాం అనుకొనే వారు ,మన వాళ్ళందరూ ఇలా ఉంటె మహా బాగుంటుంది అను కొనే వారు ఈ సినిమా చూసే వాళ్ళల్లో ఉన్నారు .మూడో వారం లో ఇంత మంది జనం ఈ ఆర్ట్ ఫిలిం లాంటి సినిమాకు రావటం గొప్ప విషయమే నని పించింది .

          ఇప్పుడు సినిమా లోనిఅసలు విశేషాలను తెలియ జేసే ప్రయత్నం చేస్తాను .అసలు మిధునం కధను అత్యద్భుతం గా రాశారు శ్రీ రమణ .దాన్ని అంత అద్భుతం గా తెరకెక్కించాలని భరణి చేసిన ప్రయత్నమే ఇది .అంతా పూర్తి సంతృప్తి ని కల్గించక పోవటం నిరాశే మిగి లించింది ..కధలో ఎన్నో మార్పులు చేశాడు భరణి .అవి కధా గమనాన్ని పెంచేవి గా ఏమీ లేవు ..హార్ట్ ఫుల్ గా ఈ సినిమా తీద్దామని ,ఆర్ట్ ఫిలిం గా మలిచి సత్తా చూపించుకోవాలని అనుకొని తీరా  ‘’డిం షో ‘’గా నిలబెట్టాడు .అదే పెద్ద లోపం .ఫోటోగ్రఫీ మిధునం దంపతులు ఎంతో ఆశగా పెంచుకొన్న తోటలోని పువ్వులా గువ్వలా ,మొక్కలా, తీగెలాఅందాలను ఆర బోయాల్సింది పోయి చీకటి గుయ్యారం గా తయారు చేశాడు .ఆ సోయగాల సౌరు ఆనందించ లేక పోతాం . అదే బాధ కల్గిస్తుంది .చాయాగ్రహణం ఇషాన్ ఆర్యా ఫోటోగ్రఫీ లా ఉంటె కన్నుల నిండా వెన్నెలే ,ఆనందపు  విన్దులే గా ఉండేవి అది కోల్పోయాం..అదే విచారం నూటికి నూరు శాతం మార్కులు కొట్టేయ్యాల్సింది పోయి పాస్ మార్కులతో సంతృప్తి పడాల్సి వచ్చింది .బహుశా ఇంకా భరణి తాను తీసిన ‘’సిరా ‘’బాటిల్ లోనుంచి ,‘’,గ్రహణం ‘’నుంచి దూరం కాలేక పోయాడని పిస్తుంది .అడే తీరు లో తీసి ఫోటోగ్రఫికి మార్కులు తెచ్చుకోలేక పోయాడు .

          అయితే –శబ్ద గ్రహణం మాత్రం నూటికి ఇన్నూరు మార్కులు పొందింది .అద్భుతం అత్యద్భుతం అని పిస్తుంది .వీణా పాణి సంగీతం సమ కూర్చాడని పించలేదు .అసలు కధలో కలిసి పోయిందని పిస్తుంది .హాట్స్ ఆఫ్ టు’’సంగీతవాణి , పాణి –వీణా పాణి ‘’.జేసుదాస్ పాడిన మిధునం టైటిల్ సాంగ్ అర్ధ వంతం గా ,వీనుల విందుగా ,ఉన్నది .కొన్ని మాటలు శబ్దాలు వెనుక నుంచి విని పించటం మరి గొప్ప ప్రయోగం .నిజం గా అభి నందనీయ మైన విషయం ..జొన్న విత్తుల కాఫీ దండకం నాకేమి కొత్తకాదు ,ఆయన బానే పాడాడని పించింది ..

          నటన విషయానికి వస్తే లక్ష్మి నటన నిజం గా సూపర్బ్ .అవధులకు మించి నటించి ‘’నట లక్ష్మి ‘’అని పించింది .ఆంగ్ల మాధ్యమం లో చదూకున్న అమ్మాయి అచ్చ తెనుగుకు పట్టం కట్టింది ..హావ భావ ప్రకటనలు మహా ముచ్చటగా ఉన్నాయి .చిలిపితనం ,గడుసు తనం ,ఆరిందాతనం ,ఉత్తమా ఇల్లాలు లక్షణం ,అందమైన కాపురానికి అందమైన గోపుర శిఖరం గా ఆమె నటన ఉంది. .అయినా ఆమె పాత్ర చిత్రీకరణ లో ఇంకా లోపం ఉందని పించింది .ఇంకా చేయగల చెవ ఉన్న నటి లక్ష్మి .రా బట్టాల్సిన నటన చాలా ఉందని పిస్తుంది .నూటికి రెండొందల మార్కులు కొట్టేస్తుంది లక్ష్మి .

                బాలు విషయానికి వస్తే అంతా తెచ్చి పెట్టుకోన్నట్లుంది ..నటన కన్నా డైలాగ్ డెలివరి బాగుంది .ఆయన ముఖం చూడ కుండా సంభాషణలు వింటే బాగా ఉండేది అని పిస్తుంది .కష్టపడ్డాడు .పీపా లా ఉన్నా పాకాడు ,గెంతాడు ,పరిగెత్తాడు చిలిపి తనం చూపించాడు .,అంతా ఏదో లా ఉంది..నేను ఇచ్చే మార్కులు యాభై శాతమే .

              మొక్కలు ,పూయటం కాయటం ,తీగెలు పాకటం పిందే,,కాయా,ఫలం కని పించింది అని మీడియా ఊదర కొట్టింది కాని అదేమీ ఇందులో కన్పించవు .కాయలు చూపినంత మాత్రాన అవి ఆ చెట్టువే నని నమ్మేంత గా లేక పోవటం వింత .అసలు ఆ చెట్ల లో ఆ మిధునం ప్రతి చేట్టులోను తమ సంతానాన్ని చూసుకొని వారిని గురించి వాటిని గురించి చెప్పుకొంటూ హాయిని , ,నిండైనన సంతృప్తి కరమైన జీవితం సా గించారు  .ఆ అను భూతిని మనం కధ చదువుతుంటే కలిగిస్తారు చూస్తుంటే ఇంకా గొప్ప భావన రావాల్సి ఉంది .అది రాక పోవటం అసలు కధకే దెబ్బ అని పిస్తుంది .కధ చదివి సినిమా చూసిన వారికి కళ్ళు ఏ మాత్రం చమర్చవు .చివ్వర మూడు నిమిషాల్లో లక్ష్మి చూపిన నటన ను చూసి నప్పుడు తప్ప .అదే పెద్ద లోపం .ఆర్ద్రత తో నిండిన మనస్సు తో కన్నీళ్లు కారుస్తూ హృదయం ద్రవించి పోతుంది మనమందరం ఆ కధ లో లీన మై పోతాం .ఆ మమైకత్వం సినిమా లో లేక పోవటం పెద్ద లోపమే .ఇక్కడ శ్రీ రమణ కు పూర్తీ అన్యాయమే జరిగింది ..

                       మిధునం తో నా సంబంధం

           దాదాపు ఇరవై ఏళ్ళ కిందట ‘’రచన ‘’మాస పత్రిక లోశ్రీ రమణ రాసిన ‘’మిధునం ‘’కధ చదివి ,ఆనంద పరవశత్వమే పొందాను .మళ్ళీ మళ్ళీ చదివాను .మా శ్రీమతి తో చది వించాను .ఆమె కూడా చాలా అనుభూతి పొందింది .ఎంతో మెచ్చింది .ఆ చెట్ల వాతావరణం మన ఇంటి వద్ద లేదు కదా అని బాధ పడింది .కాని ఇప్పుడు అనేక రకాల చెట్ల  శోభ అంతా మా ఆ వరణ లో నిండి కళ్ళకు విందు చేస్తున్నందుకు మహా ఆనంద పడుతోంది .ఆ తర్వాతప్రముఖ చిత్ర కారుడు బాపు గారు ఈ కధను స్వహస్తాలతో రాయగా మళ్ళీ పుస్తక రూపం లో వస్తే ,ముచ్చట పడి మళ్ళీ చదివాను .శ్రీ కొమ్మూరి వేణు గోపాల రావు గారు మరణించటానికి కొద్ది రోజుల ముందు ఆయన మచిలీ పట్నం లో శ్రీ రావి రంగా రావు గారు నిర్వ హించిన కధా సదస్సులో పాల్గొన్నారు సభాధ్యక్షులు గా ప్రముఖ కధా రచయిత శ్రీ వీరాజీ వ్యవహరించారు .మరో ప్రముఖ కధా రచయిత శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు మొదలైన వారందరూ ఉన్నారు .నేనూ సదస్సులో పాల్గొన్నాను .కధ ల విషయం అంతా మాట్లాడిన తర్వాతా అధ్యక్షుడిని నాకు అయిదు నిముషాలు మాట్లాడే అవకాశం ఇమ్మని కోరాను .ఇచ్చారు .అయిదారు నిమిషాలలో శ్రీ రమణ రాసిన ‘’మిధునం ‘’కధ గురించి హైలైట్ చేసి మాట్లాడాను .ఆ కధ ప్రతి తెలుగు వాడి కధ అని దాన్ని ముద్రించి ప్రతి తెలుగు వాడింట్లో పంచి,చదివించి  ఋణం తీర్చుకోవాలని చెప్పాను .అంత మంచి కధ ఆ మధ్య రాలేదని అన్నాను వీరాజీ ,కొమ్మూరి, త్రివిక్రమ్ గార్లు ఎంతో మెచ్చుకొన్నారు నన్ను .ఆ విషయాన్ని అక్కడే మర్చి పోయాను ..తర్వాతమూడు రోజుల కు రవీంద్ర త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు నాకు .కొమ్మూరి గారు నేను మిధునం పై మాట్లాడి మెచ్చిన తీరు ను శ్రీ రమణ గారికి ఫోన్ లో తెలియ జేశారని .,ఆయన ఎంతో ఆనంద పడ్డారని త్రివిక్రమ్ గారికి తెలియ జేశారట .ఆయన నాతో ఫోన్ లో ఈ విషయం చెప్పి నన్ను అభి నందించారు .దాదాపు ఏడాది క్రితం తెన్నేరు వాసి  మాకు ఆత్మీయ మిత్రులు శ్రీ దేవి నేని మధు సూదన రావు గారు తమ స్నేహితుని వివాహ సందర్భం గా ‘’మిధునం ‘’కధ ను ముద్రించి వివాహానికి వచ్చిన వారందరికి ఉచితం గా పంచి పెడుతూ నాకొక కాపీ పంపారు .మేమిద్దరం మళ్ళీ మహదానందం గా చదివి చలించి పోయాం .ఆ మిదునాన్ని మనసారా అభి నందించాం . .ఆ కధను నేను చదువుతూ వాయిస్ రికార్డర్లో రికార్డు చేశాను .చివరి పది నిమిషాలు నా కళ్ళ వెంట దారా పాతం గా ఆనంద బాష్పాలు కారి పోతూనే న్నాయి కళ్ళు తుడుచుకుంటూ గద్గదం గా అలానే చదివి పూర్తీ చేశాను .దాన్ని mp3లో నిక్షిప్తం చేసి సాహితీ బంధువులందరికీ పంపాను ..అది విని చాలా మంది తమ పరిస్తితి నా లా నె ఉందని కన్నీళ్లు ఆపు కో లేక పోయామని మెయిల్స్ రాశారు .ఫోన్లూ చేశారు .అంతటి ప్రభావాన్ని కలిగించిన కధ శ్రీ రమణ కద – మిధునంమిధునం .ఇలా మనల్ని కది లించలేక పోయిందే సినిమా అని మాత్ర్తం బాధ ఎక్కువ గానే ఉంది.

                   మిధునం లో పద నిసలు

          చిన్న ధియేటర్లు ‘’లో బడ్జెట్’’ సినిమాలు ఆడటానికి సహకరించటం లేదని రామోజీ హాలు కనుక నె ఇక్కడ ఈ సినిమా ఇంత కాలం ఆడుతోందని ఈ క్రెడిట్ అంతా రామోజీ రావుదే నని నాతో చూసిన వారు అన్నారు .టికెట్ కూడా యాభై రూపాయలే అత్యధికం గా ఉండటం కూడా బాగా ఆడటానికి వీలవుతోందని అంత మాత్రం చేత సౌకర్యాల కేమీ లోపం లేదని అన్నారు ..ఈ విషయం లో శ్రీ రామోజీ రావు ను అభి నందిన్చాల్సిందే అందరం .నిర్మాత ఆనంద రావు గారికి కూడా ఈ సినీమా నడక ఆనందాన్ని కల్గించే ఉంటుందని అనుకొంటున్నాను .దర్శకుడు భరణి సాహసానికి ,ఒక మంచి తెలుగు సినిమా తీసి అంతర్జాతీయం గా తెలుగు వాడి సత్తా ను ప్రపంచానికి చాటాలి అన్న తపన ఫలించిందనే అనుకొంటున్నాను .భరణి తన శక్తి సామర్ధ్యాలన్ని ఒలక పోశాడు .స్వయానా రచయిత అవటం ,దర్శకుని గా రాణించటం తానూ గొప్ప కారెక్టర్ నటుడవటం కలిసి వచ్చింది .ఇలాంటి ఇంకో సినిమా తీసే ధైర్యం వచ్చి ఉంటుంది ..అయితే పేపర్ వాళ్ళు బాగా బూస్ట్ ఇస్తున్నారనే మాట కూడా విని పించింది ..

మిధునం పై మధనం  మిధునం మన తెలుగు సినీ బావుటా ను ఆకాశ మంత ఎత్తుకు ఎగరేయాలని  ఆశిస్తూ –సెలవ్ –

మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు

                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-1-13-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | 4 Comments

స్వర్గీయ శ్రీ తిరుమల రామ చంద్ర శత జయంతి సభ

 స్వర్గీయ శ్రీ తిరుమల రామ చంద్ర శత జయంతి సభ

   విజయవాడ లో ఈ నెల ఒకటవ తేది నుండి పదకొండవ తేది వరకు 24వ పుస్తక మహోత్సవం జరుగుతోంది .నిన్న అంటే ఎనిమిదో తారీఖు మంగళ వారం సాయంత్రం నేను చూడ టానికి వెళ్లాను .నాకు కావాల్సిన పుస్తకాలు కొనుక్కొన్న తర్వాత‘’నండూరి రామ్మోహన రావు వేదిక ‘’పై జరిగిన సాహిత్య కార్యక్రమాలను చూశాను .మొదట బాల సాహిత్యం పై జరిగిన సభకు గ్రందాలయోద్యమ వృద్దు శ్రీ వెలగా వెంకటప్పయ్య అధ్యక్షత వహించగా విజయవాడ ఆకాశ వాణి ఇన్చార్జి డైరెక్టర్ శ్రీమతి మున్జలూరి కృష్ణ కుమారి,శ్రీ తుర్ల పాటి కుటుంబరావు  వగైరాలు వక్తలు గా పాల్గొన్నారు .బాల సాహిత్యం అనుకోన్నంతగా రావటం లేదని ,చదివే వారు తగ్గి పోయారని అందరు అన్నారు ..తుర్ల పాటి మాట్లాడుతూ అయిదు సి.లు పిల్లల్ని నాశనం చేస్తున్నాయన్నారు అవి సినిమా ,క్రికెట్ ,చానెల్ ,కంప్యుటర్ ,కార్టూన్ లని చెప్పారు .నేషనల్ బుక్ ట్రస్ట్ అధినేత కూడా సభలో పాల్గొన్నారు ..దీని తర్వాత జరిగిన సభ చిరస్మరణీయం గా ఉంది.

24 వ పుస్తక ప్రదర్సన విజయవాడ

                       సాహితీ మేరువు తిరుమల రామ చంద్ర

            తిరుమల రామ చంద్ర గారి శత జయంతిని పురస్కరించుకొని గొప్ప సభ జరిగింది .దీనికి అధ్యక్షత వహించింది రామ చంద్ర గారి కుమారుడు శేష సాయి గారు .వక్తలుగా రామ చంద్ర గారి అమ్మాయి ఆముక్త మాల్యద ,శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారి కుమార్తె ప్రఖ్యాత రచయితా విశ్లేషకు రాలు సప్త గిరి చానల్ కు ఎన్నో ఎపి సోడ్లులను నిర్మించిన శ్రీ మతి పుట్ట పర్తి నాగ పద్మిని గార్లు .రామ చంద్ర గారి పెద్దమ్మాయిరజని  ని కూడా ఆహ్వానించారు కాని ఆమె రాలేక పోయింది .

           తిరుమల శేష సాయి మాట్లాడుతూ తమ తండ్రి గారు అనుక్షణంసాహిత్యానికి అంకితమై పని చేశారని పొట్టకూటి కోసం ఆయన చేబట్టని ఉద్యోగం లేదని వారి ‘’హంపీ నుండి హరప్పా దాకా ‘’పుస్తకం లో ఆయన కలుసుకొన్న వివిధ వ్యక్తుల ప్రభా వాలను వివరించారని ఎక్కడ వసతి దొరికితే అక్కడ ఉన్నారని కష్టాలకు బాగా అలవాటు పడ్డ జీవితం ఆయనది అన్నారు .ఒక సారి పంజాబ్ లో ఒక సిక్కు గృహస్తు ఇంట్లో రామ చంద్ర బస చేసి నప్పుడు వారు ఆవ  తో చేసిన మిఠాయి ఆయనకు పెట్టారని దాన్ని తిని ఎలా తయారు చేశారో తెలుసుకోన్నారని తాను ఇదివరకే ఆవ తో స్వీట్లు చేస్తారని రాసిన దాన్ని గురువు మాన వల్లి రామ క్రిష్నయ్య గారు కాదని ఆక్షేపించారని వెంటనే ఆ ఇంటి వారి నడిగి వారుపెంచిన  ఆవ మొలకలను గురువు గారికి పోస్ట్ లో పంచ్పించారని చెప్పారు .ఏదైనా తనకు కాని కుటుంబ సభ్యులకు కాని కష్టం వస్తే ‘’ఇంకెంతకాలం రా ‘’ఆరు నెలల్లో ‘’అన్నీ సర్దుకుంటాయి రా ‘’అని అందర్ని ఓదార్చే వారని ఆరునెలల గడువు తో ఆయన సంతృప్తి చెందే వారని తెలియ జేశారు .రామ చంద్ర సుమారు 75దాకా పుస్తకాలు రాశారని ,గమ్యం లేని జీవితమే చాలా భాగం గడిపి చివరకు ప్రాకృత భాషా ధ్యయనాన్ని చేసి ఒక సుస్తిర స్థానం సంపాదిన్చుకోన్నారని చెప్పారు .అవన్నీ ముద్రణ పొంది యేన లేని కీర్తిని తెచ్చాయన్నారు ..ఆయన ను ఎవరైనా  ఏది నీకు ఇష్టం అంటే ‘’ఆకలి ‘’అనే వారని ,ఎంత సంపాదించినా ఆ రోజుల్లో వచ్చే జీతాలు కడుపు నింప లేక పోయాయని అందుకనే ఆకలి అనే వారని చెప్పారు .ప్రేక్షకుల కళ్ళల్లో కన్నీరు కారింది ఈ మాట వింటుంటే ..తామంతా తమిళ దేశం లో నె పుట్టి పెరిగినా తమ ఇంట్లో చక్క గా తెలుగే మాట్లాడుకోవటం తమ తండ్రి గారిచ్చిన సంస్కారం అన్నారు .ఒక తెలుగు బహిరంగ సభలో పాల్గొనడం అందునా తెలుగు లోనే మాట్లాడటం తనకు లభించిన మహత్తర అవకాశం అని పొంగి పోయారు .నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ..సాయి గారు చక్కని తెలుగులో ప్రసంగించి తమ హృదయాన్ని బాగా ఆవిష్కరించారు .

తిరుమల రామ చంద్ర గారి అమ్మాయి శ్రీ మతి ఆముక్త మాల్యద తండ్రి తో తనకున్న జ్ఞాపకాలను నేమరేసుకొన్నారు .రాత్రి ఏ వేళచూసినా రామ చంద్ర గారు ఏదో చదువుతూనో రాస్తూనో కని పించే వారని జీవితం బోర్ గా ఉంటోందని తాము అన్నప్పుడల్లా ‘’బోర్ కే బోర్ కొట్టేట్లు ప్రవర్తిన్చాలమ్మా ‘’అని సలహా చెప్పేవారని చెప్పారు .ఎంత దూరమైనా కాలి నడకనే వెళ్ళే వారని ,వాహనాల్లో వెళ్ళటానికి ఇష్టపడే వారు కాదని అన్నారు .తమ తండ్రి గారి మీద ఇంతటి ఆప్యాయతా ,ఆదరణా ,ఆరాధనా ఇక్కడి వారు చూపిస్తున్నందుకు తామెంతో గర్వ  పడుతున్నామని,అంతటి తండ్రికి సంతానం అయి నందుకు గర్వం గా ఉండని  , చెమ్మగిల్లిన నయనాలతో ఆముక్త మాల్యద అన్నారు .

           శ్రీమతి పుట్ట పర్తి నాగ పద్మిని అద్భుత ప్రసంగాన్ని చేశారు .తమ ‘’అయ్య’’పుట్ట పర్తి వారిని ,చిన్నయ్య అని తాను ఆప్యాయంగా పిలుచుకొనే ‘’తిరుమల రామ చంద్ర ను తెలుగు సాహిత్యం లో రెండు మేరు పర్వతాలనీ రెండు మహా సాహితీ సిన్దువులని పేర్కొన్నారు .ఇద్దరు జీవితం లో నిలకడ లేని జీవితాలనే గడిపారని రామ చంద్ర గారి తల్లి గారు బంధు జనం ఆయన్ను అతి గారాబం గా ,అతి ప్రేమ గా పెంచారని ,చూశారని అది ఆయనకు వెగటు పుట్టి వారికి దూరం గా వెళ్ళి పోయి స్వతంత్ర జీవనం సాగించారని చెప్పారు .తమ అయ్య దీనికి విరుద్ధం అని ఆయన తల్లి గారు చిన్నతనం లోనే చని పోవటం వల్ల ఆదరించే వారు లేక ఇంటికి దూరమయ్యారని ,స్వేచ్చా , ,విసృమ్ఖలత తో కొంత ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు .నారాయణా చార్యులు గారు కూడా అనేక సాహితీ ప్రక్రియలు చేబట్టి అనేక పోకడలు పోయి ,దేనిలోనూ స్తిరం గా ఉండలేక పోయారని చివరికి భక్తి ఒంట బట్టి దాని అంతు చూశారని తులసీ రామాయణాన్ని రాసి మంచి పేరు తెచ్చుకోన్నారని ,ఆచార్యుల వారి సకలోహ సర్వస్వమే ‘’శివ తాండవం ‘’అని అది వారి ‘’మాగ్నం ఓపస్ ‘’అయిందని దానితో వెనక్కి తిరిగి చూడలేదని ,ఆయన భాషా పాండిత్యం అందరికిరికి అబ్బుర పరచేదని ,పీఠాది పతులప్రశంశాల నందు కొని అనేక భాషలలో అపార పాండిత్యాన్ని సాధించి ‘’సరస్వతీ పుత్రులు ‘’అని పించుకోన్నారని గుర్తు చేశారు .ఈ ఇద్దరు మొదట్లో ను చివర్లోను ఒకే పద్ధతిలో చరించటం యాదృచ్చికం అన్నారు .రామ చంద్ర గారు ఏదైనా కొత్త విషయం కని పిస్తే దాన్ని నేర్చుకొనే దాకా వదిలి పెట్టరని అన్నారు .ఒక సారి కాశీ లో ఒక అస్సామీ ఆయన కలప వ్యాపారం లో మెళకువలు నేర్పుతాను అని చెప్పి నాలుగు రోజుల్లో వస్తానని ఇంటికి వెళ్ళిన వాడు నేల రోజులకీ పత్తా లేక పోతే ,ఆ నేల రోజులు ఆయన కోసం నిరీక్షిస్తూ తినటానికి తిండి కూడా లేక రెండు పూటలా కడుపు నిండా గంగా జలాన్ని త్రాగి బ్రతికిన పిచ్చి మారాజు చిన్నయ్య అనీ చెప్పారు .ఈ మాట అంటుంటే ఆమె కళ్ళు దారా పాతం గా కన్నీరు వర్షించాయి .అన్నీ తెలుసుకోవాలనే తపనతో ఒక సరి ‘’కొంచెం మందు ‘’కూడా పుచ్చుకోన్నారని,ఇది తెలిసిన గురువు గారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ‘’పెళ్ళాం ,పిల్లా పీచు ,సంసారం ఉన్న వాడివి ,ఇలా సాహసాలు చేస్తే బతుకులు  బజారు పాలౌతాయి జాగ్రత్త ‘’అని హెచ్చరించారని అప్పటి నుండి ఇలాంటి సాహసాలు చెయ్య లేదని గుర్తు చేశారు                    .         

                చిన్నయ్యకు తమ అయ్యగారి ‘’శివ తాండవం ‘’అంటే మహా ప్రీతీ అని అయ్య పాడగా అనేక సార్లు విన్నా తను కనిపించి నప్పుడల్లా తనతో ఒక్క సారైనా పాడించుకోకుండా ఉండే వారు కాదని చెప్పి అందులో నుండి కొంత భాగంఅద్భుతం గా పాడి మంత్ర ముగ్ధుల్ని చేశారు .ఆశైలి అనితర సాధ్యం అని గుర్తు చేశారు .  ఇది వారి సాహితీ మిత్రత్వానికి గొప్ప చిహ్నమని అన్నారు .తిరుమలకు ,పుట్టపర్తి వారికి ఇద్దరికీ విశ్వనాధ సత్యనారాయణ గారు అమిత అరాధ్యులని వారిని గురించి ప్రసంగం లేకుండా వారిద్దరూ ఉండలేరని గుర్తు చేసుకొన్నారు .వారిద్దరి రచనల్లో విశ్వనాధ వారి ప్రస్తావన చాలా చోట్ల కని పించటం విశేషం అన్నారు .విశ్వనాధకు తమ అయ్యకు జరిగే వాదోప వాదాల్లో తమ తల్లి గారు మధ్య వర్తిత్వం వహించటం ,ఆమె తీర్పును వారిద్దరూ గౌరవించటం తనకు తెలుసుననీ అన్నారు .తన రచనలకు రామ చంద్ర ఎంతో సహకారం అందించారని ముఖ్యం గా తుంగ భద్రా నదీ పావనోదకాలలో అనేక ఔషధ గుణాలున్నాయని తాను విని వాటిని వివరించమంటే చిన్నయ్య చక్కగా కూర్చుని తాను రాసుకొన్న నోట్సు దగ్గర పెట్టుకొని బోధించి మార్గ దర్శనం చేశారని ఆ రుణాన్ని తానేన్నటికి తీర్చు కోలేని రుణ గ్రస్తను అని  అన్నారు .అలాగే తాను హిందీ ,తెలుగు రామాయణాల తులనాత్మక పరిశీలన చేసి సీతా దేవి పాత్ర పై ప్రత్యెక ద్రుష్టి తో రిసెర్చ్ రచన చేస్తున్నప్పుడు పుట్ట పర్తి  వారు హిందీ రామాయణాల సారాంశాన్ని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టి నంతా తేలిగా వివరించి తన శ్రమ తగ్గించారని చెప్పారు .

        శాలి వాహన గాదా సప్త శతి ,బసవేశ్వర పురాణం అయ్యను చిన్నయ్యను గొప్పగా ప్రభావితం చేశాయని ,రామ చంద్ర గారి హంపీ నుండి హరప్పా వరకు అనే జీవిత చరిత్ర రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘’ఓల్గా సె గంగా ‘’కు ఏమా త్రం తక్కువ కాదని ఎన్నో చారిత్రాత్మక ,ఆధ్యాత్మిక సాంఘిక భౌతిక ,రాజకీయ పరిస్తితులను కళ్ళ కు కట్టి నట్లు రాసి, చిన్నయ్య గొప్ప సాహితీ ప్రస్తానం సాగించారని మనల్ని వారితో పాటు తిప్పుతూ ఆ ప్రదేశాలను మనుష్యులను చూపిస్తూ అనుభూతి కలిగిస్తూ విజ్ఞానం పంచుతూ సాగే మహా రచన అని వివ రించారు .చిన్నయ్యకు కనీసం షష్టి పూర్తీ కాని సప్తతి కాని ,సహస్ర మాస చందనోత్సవం కాని జరక్క పోవటం ఎవరూ దానికి పూనుకోక పోవటం  తనకు ఆశ్చర్యాన్ని బాధను కల్గిన్చాయని ఒక  సాహితీ మేరువు కు మనమిచ్చే మర్యాద ఇదేనా ‘అని ఆమె ఏడ్చేసి ప్రేక్షకులకు కన్నీరు తెప్పించారు .ఈ సభలో పాల్గొనడం తన అదృష్టమని బెజవాడ తో తనకు ఎంతో ఆత్మీయ అను బంధం ఉందని చెప్పారు .’’మన లిపి పుట్టు పూర్వోత్తరాలు ‘’సాహితీ సుగాతుని స్వగతం ‘’‘’మొదలైన తిరుమల వారి రచనలన్నీ ఎంతో లోతైన పరిశోధనా ,పరిశీలన తో రాసిన రిసెర్చ్ వర్క్ లాంటివే నని అవి సులభ శైలిలో రాసి చదువరులకు మనస్సుకు హత్తు కోనేట్లు చేసిన వారి నేర్పుకు జోహార్లు అని ప్రసంగాన్ని గద్గద కంఠం తో ముగించి అందరి ప్రశంశలను అందు కొన్నారు శ్రీ మతి నాగ పద్మిని .నా మటుకు నేను ఒక గొప్ప అను భూతి ని పొందాను .రామ చంద్ర గారన్నా ,పుట్ట పర్తి  వారన్నా అమిత ఆరాధన ఉన్న వాడిని .నాకు గొప్ప మానసికా నందాన్నిచ్చింది ఈ సభ .జనాన్ని కదిలించి రామ చంద్ర పై మహా భిమానాన్ని పెంచి సార్ధక మైంది .ఈ సభలో అమెరికా నివాసి అక్కడ తెలుగు భాషా సంస్కృతులకు సేవ చేసిన తొలి తరం తెలుగు సేవకుడు ,నిత్యం ఏదో రాస్తూ అనేక పుస్తకాలను ప్రచురిస్తూ హాస్యానికి పెద్ద పీట,వేసినవాడు , తానా ,ఆటా లకు సలహాదారు గా ఉండి వాటి వైభవానికి తోడ్పడుతూ ,తానూ అమెరికా నుండి వచ్చి ఒక సారి హైదరా బాద్ లో ‘’ప్రపంచ తెలుగు సభలు ‘’నిర్వహించి బాపు ,రమణ ల స్నేహ షష్టి పూర్తిని ఆ సభల్లో నిర్వ్హహించి ఘన సన్మానం చేసిన హూస్టన్ నివాసి శ్రీ చిట్టెన్ రాజు కూడా ఉండటం ఆయన నాగ పద్మినిని మనసారా కొనియాడటం ముచ్చటగా ఉంది .ఇండియాలో చిట్టెన్ రాజు గారి కార్యక్రమాలకు చేదోడు వాదోడు గా ఉంటూ తన స్వంత కార్యక్రమాలను చేబడుతున్న శ్రీ వంశీ రామ రాజు కూడా సభలో ఉన్నారు

                         సరస భారతికి ప్రశంశ

         సభ అయి పోగానే నేను నాగ పద్మిని గారి దగ్గరకు వెళ్ళి చాలా గొప్ప స్పూర్తి వంతమైన ప్రసంగం చేశారని అభి నందించి నా పేరు చెప్పగానే ‘’అమ్మమ్మా !మీరా దుర్గా ప్రసాద్ గారు ఎంత బాగా సరసభారతి బ్లాగ్ నిర్వ హిస్తున్నారండీ .నేను ఎప్పుడూ చదువుతూనే ఉంటాను ‘’అని మనస్పూర్తిగా ప్రశంశించి పక్కనే ఉన్న చిట్టెన్ రాజు గారితో ప్రత్యేకం గా ‘’వీరు దుర్గా ప్రసాద్ గారు సరస భారతి అనే బ్లాగ్ ను మహా గొప్ప గా నిర్వ హిస్తున్నారు ‘’అని ఆయనకు చెప్పటం ఆయన ఆనందం గా తన చేతుల్లోకి నా చేతులు తీసుకొని అభి నందించటం నాకు చిరస్మరణీయం .సరసభారతి నాగ పద్మిని గారి లాంటి వారిని అమితం గా ఆకర్షించి అభిమానుల్ని చేసి నందుకు మహదానందం గా ఉంది .మా ప్రక్కనే ‘’ప్రజాసాహితి’’ సంపాదకులు శ్రీ కొత్త పల్లి రవి బాబు ,ఆకాశ వాణి లో నాటక విభాగం లో చాలా కాలం పని చేసి అనేక నాటకాలను నిర్వహించిన శ్రీ పాండురంగ కూడా ఉండి ఆమె పొగడ్తను విని ఆనందించారు .’సరసభారాతికి నిన్న ఒక చారిత్రాత్మక మైన రోజు అని భావిస్తూ –సెలవ్

                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-1-13-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విజయవాడ కవయిత్రి శ్రీ మతి రాధికా శ్రీనివాస్ -రెండు కవితలు

raadhika kavitha-1raadhika kavitha-2

Posted in కవితలు | Tagged | Leave a comment

చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం –5

 చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం –5

శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి

  ‘’మాండమహర్షి ‘’తపో బలం చేత నిర్మించ బడిన ‘’పంచాప్సరస సరస్సు ‘’నుండి సంగీతం అన్నికాలాల్లోను ఒకే రకం గా విని పించటం చాలా వింతగా ఉంది .చిలుకూరు వారికి ఆ సంగీతం ఎలా విన్పించిందో ,ఎవ్వరూ  చెప్పని విషయమే నని నాకు అని పించింది .మూజికల్ ఫౌంటేన్స్ ఇప్పుడున్నాయి .అప్పుడు వీటిలో మహర్షి పేరు మీదుగా‘’మాండ లీన్ వాయిద్యం విని పించేదేమో ?14వేల మంది రాక్షసుల్ని ముహూర్త కాలం లో చంపేసిన శ్రీ రాముని కోదండ పాండిత్యానికి ,ఆనందం ,ఆశ్చర్యం,సంభ్రమం  ముప్పిరి గోనగా రాముడిని ఆప్యాయం గా సీతా సాధ్వి కౌగిలించుకోవటం ,ఆమెకు రామ చంద్రుని పై ఉన్న ఆరాధనా భావానికి పరాకాష్ట..ఆ సుఖం భర్తకు దేని వల్లా లభించదు .,తృప్తి నివ్వదు .ఔచిత్యపు హద్దులో జరిగిన మాధుర్య సంఘటనం ఇది .

           సీతా పహరణం తర్వాత విరహం తో వేదన చెందే రాముడు సకల జీవ రాశిని భస్మం చేస్తానని అనటం శోకానికి పరాకాష్ట ,ఉన్మత్త ప్రేలాపనే .ఇక్కడ ఉచితానుచితాలు కన్పించవు .’’నారాచం ‘’అంటేనే బాణం .ఇక్కడ చిలుకూరు వారు‘’నారాచ బాణాలు ‘’అనె మాట ను  ప్రయోగించారు .అవి ఇంకో రకమైన బాణాలా ?పోరాబడ్డారని పించింది ..లక్ష్మణుడు అన్నను అనునయిస్తూ ,హితం చెబుతూ ఆయనలో దుఖం చేత అణగి ఉన్నజ్ఞానాన్ని మాత్రమె మేల్కొల్పుతున్నానని ,తాను చెప్పేవన్నీ పూర్వం అన్నగారు తనకు చెప్పినవే నని ,అవి హిత వచనాలే అని అనటం లో సుమిత్రా నందనుడిలో హుందా తనం ,ఆరిందా తనం ,కర్తవ్య బోధ ప్రస్పుటం గా కన్పిస్తాయి .సీతాదేవిని రావణుడు ఆహరించిన ముహూర్తం ‘’వింద’అనె పేరు కలిగిందని ,ఆ సమయం లో పోగొట్టుకొన్నది ,తిరిగి యజమానికి తప్పక లభిస్తుందని జ్యోతిశ్శాస్త్ర రహస్యాన్ని తెలియ జేశాడు మహర్షి వాల్మీకి .’’వంచులక పక్షి ‘’ఆపు లేకుండా కూయటం శుభ సూచకమే నని ,’’జయమ్ము నిశ్చయమ్మురా ‘’అని పించటం పక్షుల కూతల్లో శుభాశుభాలు తెలియ జెప్పే పరి భాష ఆనాడు వాడుక లో ఉన్నట్లు తెలుస్తోంది . కదల లేని వారిని చంపటం ,యజ్న పశువును చంపటంఅంత నింద్యం అని కబంధుని విషయం లో రాముడు అనటం యజ్ఞాలలో అప్పుడు పశు హింస లేదనే అని పిస్తుంది . ,

        కిష్కింధ కాండ –రుష్య మూక పర్వతం పై నిద్రిస్తూ కల గన్న వాడికి ఆ కల యదార్ధం అవుతుందని ,పాపాత్ముడు ,దురాచారుడు దాన్ని ఎక్క లేరు అనటం స్థల మహాత్మ్యమే .వాలి  నాలుగు సముద్రాల్లలో వాలి ,సంధ్యోపాసన చేసే వాడు అన్న దానికి వివరణ గా సూర్యోదయానికి పూర్వమే పశ్చిమ సముద్రం నుండి తూర్పు సముద్రానికి ,దక్షిణ సముద్రం నుండి ఉత్తర సముద్రానికి వెళ్ళి సంధ్యా వందనం చేస్తాడని వెంకటేశ్వర్లు గారు చెప్పిన వివరణ చక్క గా సమన్వయము తో కుదిరింది .వాలి అడిగిన ధర్మ సందేహాలకు రాముడు దొంగను శిక్షించిన వెంటనే వాడి దోషాలన్నీ నశిస్తాయని ,శిక్షించక పోతే ఆ పాపం దొంగల కంటే రాజునే ఎక్కువ గా బాదిస్తుందని ,అందుకే పూర్వం మాంధాత చక్ర వర్తి ‘’శ్రమణకుడు ‘’అనే వాడు చేసిన మహా పాపానికి ఘోరమైన శిక్ష అనుభ విన్చాల్సి వచ్చిందని యుక్తి యుక్తం గా ధర్మ బోధ చేశాడు .’’దేవ సఖ  పర్వతం ‘’దాటితే వచ్చే 100యోజనాల ఎడారి రాజస్థాన్ ఎడారా ?అని సందేహం వస్తుంది .’’వైఖానస సరస్సు ‘’అవతల ఉన్న చీకటి ప్రదేశం లో స్వయం ప్రకాశులైన దేవతలు ,సిద్ధులు ,తమ దేహం నుండి ప్రసరించే కాంతి తో   తపస్సమాది లో ఉండటం ఆశ్చర్యకరం గా ఉన్నా ,అసాధ్యం కాదు ,సంభవనీయమే నని పిస్తుంది .ఎనిమిది బుద్ధి గుణాలు ,నాలుగు బలాలు ,పద్నాలుగు సద్గుణాలను సూక్ష్మం గా వివరించిన తీరు ముచ్చటగా ఉండి .అందరు చదివి తెలుసుకో తగ్గవి .

            సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –9-1-13-ఉయ్యూరు 

 About the Author Sri Venkateswarlu

Posted in కవితలు | Tagged | Leave a comment

24 వ పుస్తక ప్రదర్సన విజయవాడ

tirumala raama chandra gari shatha jayanthi sabha -aayana kumaarudu
saayi ,kumaarte aamukya maalyada putta parti naaraayanaa chaaryula
gaari ammaayi naaga padmini –mariyu amerikaa chitten raaju (red
shirt),vamshee raama raaju (chevi pogulu )-anthaku mundu sabha lo
turlapaati velagaa venkatappayya ,munjaluri krishna kumaari (radio
station director )modalaina vaaru .madhyalo devineni madhu soodana rao
(nilabadi )

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సమాజం కుళ్లి పోయింది !! శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి

thapovanam-1thapovanam-2thapovanam-3

Posted in సేకరణలు | Tagged | 1 Comment

శ్రీమతి రాధికా శ్రీనివాస్ కవిత

kavitha -radhika srinivas-1kavitha -radhika srinivas-2kavitha -radhika srinivas-3

Posted in కవితలు | Tagged | Leave a comment

నిర్భయ పాదముద్రలు – ఆంధ్రజ్యోతి

08_01_2013_004_007

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -4

       చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -4

శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి

  భరతునికి అన్న శ్రీ రాముడు చేసిన నీతి బోధ అన్ని కాలాల్లోనూ ఆచరణీయాలే –ఆ విషయాల్లోకి వెళ్దాం ‘’తెల్ల వారు ఝామున నిర్ణయాలు చేయాలి .రాజు ఆలోచనలు ముందుగా బయటి వారికి తెలియ రాదు .రాజనీతి విశారదుల్ని మాత్రమె మంత్రులు గా నియమించాలి .మంత్రి సమర్ధత పై రాజ్యాభి వృద్ధి ఆధార పడి ఉంటుంది .తగి నంత జీతాలు చెల్లించాలి .సమయానికి ఖచ్చితం గా జీతాలు బట్వాడా చేయాలి .ఇహాన్ని గురించి ఆలోచించే బ్రాహ్మణుల్ని దూరం గా ఉంచాలి .దేశ సరిహద్దుల విషయం లో అనుక్షణ జాగరూకత ఉండాలి .ఆదాయం ఎక్కువా ,ఖర్చు తక్కువ గా ఉండాలి .సైన్యానికి సకల ఆయుధాలు ,సంబారాలు సకాలం లో అందించాలి .దొంగను ,లంచ గొండిని వదిలి పెట్ట రాదు .మనస్సు ,దానం ,వాక్కులతతో ప్రజల్ని ఆ కట్టుకోవాలి .ఆలోచించి నిర్ణయాలు చేయాలి .ఏక పక్ష నిర్ణయాలు అనర్ధ హేతువులు .పండితులను నిర్లక్షం చేయరాదు .కిన్దివారిని ప్రేమతో ,చనువుతో చూడాలి ‘’నిజం గా ఇవన్నీ మన ప్రమ్భుత్వాలు మంత్రులు అమలు చేస్తే భూలోకం స్వర్గమే అవుతుంది .మన ఏలికలు వీటికి పూర్తిగా విశుద్ధం గా ప్రవర్తిస్తూ ,ప్రజా జీవితం తో ఆడుకొంటున్నారు .ప్రగతిని భ్రష్టు పట్టిస్తున్నారు .జాబాలి అనే ఆయన చెప్పిన నాస్తిక వాదాన్ని ఖండిస్తూ శ్రీ రాముడు ‘’లోకం లో సత్యమే ఈశ్వరుడు .లక్ష్మీ దేవి సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది .సత్యమే అన్నింటికి మూలం ‘’అని చెప్పినవి అక్షర సత్యాలే .దీన్ని వదిలి ‘’ధనమేరా అన్నిటికి మూలం ‘’గా మనం వ్యవహరిస్తూ చిక్కులు కొని తెచ్చుకుంటున్నాం .రాముడు బోధించిన నీతులతో ఉన్న దశ వర్గ ,పంచ వర్గ ,చతుర్వర్గ ,సప్త వర్గ ,అష్ట వర్గ ,త్రి వర్గాలను ,త్రయీ ,షాద్గున్య,దైవ మానుష ,కృత్య ,వింశతి వర్గ ,ప్రకృతి ,మండల ,ద్వియోనీ ,సంధి ,విగ్రహాలాను చాలా తేలిక మాటలతో సూటిగా అర్ధమయేట్లు చిలుకూరు వారు వివరించిన తీరు గొప్పగా ఉంది.

                   అరణ్య కాండ –విరాధుని ప్రవేశమే మహా భయానకం గా ఉంది  .రెండు తోడేల్లను ,పది జిన్కల్ని ,మూడు సింహాలను ,నాల్గు పెద్ద పులులను ఒక ఏనుగు తలను ఇనుప శూలానికి గుచ్చి భుజాన మోసుకు వస్తున్నాడట .వాడి అరుపులో బి.బి.శబ్ధం ధ్వనించటం వింత గొలిపే విషయం .దీన్ని పసి గట్టారు వెంకటేశ్వర్లు గారు .మునులు చేసే తపో ఫలం లో నాల్గవ వంతు రాజుకు చెందటం వల్ల రాజు తన రాజ్యం లో ఎంత ప్రశాంత వాతా వరణాన్నిన్ని నెలకొల్పుతాడో తెలుస్తుంది .దాని వల్ల ఉభయులకు క్షేమం ,భద్రతా కూడా .మునీశ్వరులతో రాముడు వారు తనను ఆజ్ఞా పించాలి కాని అర్ధించటం తగదు అని ,తన తండ్రి తనను మునుల సంరక్షణ కోసమే అరణ్యానికి పంపాడని అంతం లో రాముని లో విధ్యుక్త ధర్మాన్ని ,ప్రజలకు రాజు పై ఉన్న అధికారాన్ని తెలియ జేస్తాయి .’’యదా ప్రజా –తదా రాజా ‘’అన్నదానికి ఆ నాడే పునాది వేశాడు రాముడు అని పిస్తుంది .మనపాలకులు దీని సారం గ్రహిస్తే ,ఆందోళనలు హర్తాల్లు ఉండవు .ప్రజా జీవితం కుంటూ పడదు .

              సీతా దేవి రామునితో అతడు ధర్మ వేత్త అయినా సూక్ష్మం గా ఆలోచిస్తే కొద్దిగా అధర్మం తనకు గోచరిస్తోందని ,సత్య ధర్మ నిష్ఠ బాగానే ఉన్నా ,ఇతరుల ప్రాణాలు తీయటం అనే వ్యసనం తనకు భయంకరం అని పిస్తోందని తన సందేహాన్ని నిర్భయం గా రాముడికి తెలియ జేసింది .సాధారణం గా ఏ భర్త అయినా ,తీవ్రం గా గర్హిస్తాడు .కోపం ప్రకటించి ధూమ్ ధాంచేస్తాడు .చెంప చెళ్ళు మని పిస్తాడు .మర్యాదా రాముడు కనుక సీత జనక సుత కనుక ,ధర్మా ధర్మ విచాక్షణం కలదని ,తనపై ప్రేమతోనే అలా చెప్పిందని మెచ్చుకొన్నాడు రాముడు .భార్య అవసర సమయాల్లో చక్కగా కర్తవ్య బోధ చేయాల్సిందే నన్నాడు .ఆమె ప్రశ్న కు దీటైన సంతృప్తి కరమైన సమాధానం చెప్పాడు .తాపసులు తపో భంగం చేసే రాక్షసుల్ని తమ తపో బలం చేత సంహరించ గల సమర్దులే నని ,దాని వల్ల చిరకాలం గా తాము తపస్సు చేసిపొందిన ఫలం ఖర్చు అయి పోతుందని ,,లోక కల్యాణానికి ఖర్చు అయితే తమకంటే సంతోషించే వారు ఉండదని  కాని తమ ప్రాణాలను కాపాడు కోవటానికి దాన్ని ఉప యోగించి వ్యర్ధం చేయటం తమకు ఇష్టం లేదని వారు తనతో చెప్పారని ,తానే వారందరికి దిక్కు అని మొర పెట్టు కొన్నారని ,తాను దండకారణ్య మునులకు ,కండ కావరం తో హాని చేసే దనుజులను మర్దన చేస్తానని ప్రతిజ్ఞ చేశానని ,దాన్ని నిల బెట్టుకోవటం తన తన సత్య ధర్మమని చెప్పటం ,ఆమెకే కాదు మనందరికి సందేహ నివృత్తి అవుతుంది .అలాంటిటి మనసెరిగిన దంపతులు సీతా రాములు .అందుకే నేటికీ వారు ఆదర్శ దంపతులని పించు కొంటున్నారు .

             సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –.8-1-13- ఉయ్యూరు 

 
 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

విహంగ లో వచ్చిన వ్యాసం ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్

 

ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్

 

ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్

                           గొప్ప వంశం లో జన్మించి తండ్రి సంస్థానానికి వారసురాలై ఐరిష్ దేశ ఉత్కృష్టతను ,అందులోని లోపాలను తెలియ జేసి బాల సాహిత్యాన్నిసృష్టించి , ,స్త్రీ ల అభ్యున్నతికోసం రచనలు చేసి నవలా సాహిత్యానికి ఊపిరి లూదిన కొద్ది మంది తొలి తరం ఐరిష్ రచయితలలో ఒకరుగా నిల్చి ఇంగ్లాండ్ కు ఐరిష్ దేశం దేనిలోనూ తీసి పోదని నిరూపించి ,ఆ దేశ సాహిత్య సంస్కృతులను పరిపుష్టం చేసి ,రైతు ,బీద జన పక్ష పాతియై న పద్దెనిమిదో శతాబ్దపు ఐరిష్ రచయిత్రి మేరియాఎడ్జి వర్త్.250px-Maria_Edgeworth_by_John_Downman_1807

                        మేరియా1768 జనవరి ఒకటి న ఐర్లాండ్ లో ఆక్స్ ఫర్డ్ షైన్ లోని బ్లాక్ బోర్టాన్ లో జన్మించింది .తండ్రి రిచార్డ్ లోవేల్ ఎడ్జివర్త్ .తల్లి మేరియా .చిన్నతనం లో అయిదవ ఏటనే తల్లిని కోల్పోయిన అభాగ్యురాలు . బాల్యాన్ని అమ్మమ్మ గారింట్లో ఇంగ్లాండ్లో గడిపింది .తండ్రి రెండో పెళ్ళి చేసుకొన్నాడు . అప్పుడు మళ్ళీ తండ్రి ఎస్టేట్ ఎడ్జి వర్త్ టౌన్ కు తిరిగి వచ్చింది ..1775 లో ఐర్ లాండ్ లోని డర్బిన్ స్కూల్ లో చేరి చదివింది .మారుటి తల్లి కూడా మరణిస్తే ,ఆమె చెల్లినే తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడు .తర్వాత లండన్ లో చదువు కొంది .తండ్రి ఈమె పై శ్రద్ధ బానే తీసుకొన్నాడు .ఈమె కన్ను ఇన్ఫెక్షన్ కు గురై చూపు మందగించింది .తండ్రి వెంట ఉండి అన్నీ తానై వ్యవహరించాడు . ఉపాధ్యాయులను నియమించి ఇంట్లోనే అన్నీ చెప్పించాడు .ఆర్ధిక ,రాజకీయ ,విజ్ఞాన శాస్త్రాలను ,సాహిత్యాన్ని క్షుణ్ణం గా నేర్చింది .తండ్రి అన్నిటిని స్వయం గా ఆమెకు బోధించి మెరుగులు దిద్దాడు .తండ్రి గారి లూనార్ సొసైటీ పెద్ద మనుషులు ఇంటికి వచ్చేవారు .వారితో పరిచయాలు పెంచుకొని తనను తాను మలచు కొంది .

                     250px-Maria_Edgeworth    తండ్రి కి ఉన్న ఎస్టేట్ వ్యవహారాల్లో సాయ పాడేది. ఎడ్జి వర్త్.అక్కడే రాస్తూ ఉండేది .నౌకర్లు ,చాకర్లు బోలెడు సిబ్బంది .అందరి ఆలనా పాలనా స్వయం గా పర్య వేక్షించేది .ఎస్టేట్ ప్రజల నిత్య జీవిత వ్యవహారాలను పరి శీలించి గ్రంధస్థం చేసింది .ఇవి తరువాత ఆమె రచించిన నవలకు ఎంత గానో తోడ్పడ్డాయి .ఆంగ్లో ఐరిష్ వారితో సాన్నిహిత్యం పెంచుకొన్నది అందులో ముఖ్యం గా మొదటి డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ తో గొప్ప పరిచయమేర్పడటం ఆమెకు వరమైంది .బాల్యం అంతా ఇంగ్లాండ్ లో గడపటం వల్ల భాష ,సంస్కృతి,ఆలోచన విషయాలలో ఆమె పై ప్రభావం చూపాయి .వివాదాస్పద విషయాల పై ఆమె తన భావాలను విస్పష్టం గా ప్రకటించి కొంత అసౌకర్యానికి గురైంది .తన అభి ప్రాయాలను ‘castle rackrent ,హార్రిన్గ్టన్’ నవలల లో రాసింది .

                       ఐరిష్ ఫ్యూడల్ వ్యవస్థ లోనీ లోపాలను ఎండ గట్టింది .ఐరిష్ వారు ఇంగ్లాండ్ వారికి దేనిలోనూ తీసి పోరనే విషయాలను ఆమె తన రచనలలో విస్పష్టం గా తెలియబరచి,ఐరిష్ అస్తిత్వ వాదానికి మూల స్తంభం గా నిల బడింది . వారిని జాగృతం చేసి వారి అభి మానాన్ని సంపాదించింది .రెండు దేశాల భాష లో ఉన్న భేదాలను సోపత్తికం గా చూపింది …ఆంగ్లో ఐరిష్ కాస్మాపాలిటిక్స్ ను వివరిస్తు మొదటి ఫిక్షన్ కధలు రాసింది .ఐరిష్ జాతీయ అస్తిత్వాన్ని,జాతీయ శీల స్వభావాన్ని వాటిలో ప్రతిబింబింప జేసింది .ఆమెకు కొన్ని స్పష్టమైన భావాలున్నాయి .మగ వారితో సమానం గా ఆడ వారు ఉండాలని ,ముఖ్యం గా భర్తల విషయం లో వారు ఏమాత్రం న్యూన భావం తొ ఉండ రాదనీ చెప్పింది .ఆమె భావాల పై రూసో ప్రభావం బాగా ఉండేది .అంతే కాదు స్త్రీల విషయం లో అవగాహన ఉన్న వారినే భర్తలను గా స్వీక రించాలని మహిళలకు హితవు చెప్పింది .

                          200px-Practical_Education_1798  ఆమె రాసిన ‘’లివియన్ ‘’,ఫాషనబుల్ లైఫ్ అండ్ పాట్రో నేజ్ ‘’ లలో18 వ శతాబ్దపు ఐరిష్ విగ్ ప్రభుత్వాల అవినీతి ,ప్రాతినిధ్యాలను ఎత్తి చూపింది .’’హెలెన్ ‘’లో స్త్రీలు బాగా సంస్కృతీ కరణం చెందాలని ,మహిళలు రాజకీయాల్లో కి రావాలని ,స్త్రీలు ఆలోచనా ,వివేకం కలవారని చెప్పింది .కేథలిక్కు ల పై సాను భూతిని ప్రకటించింది .ఆమె రాసిన తొలి కధల్లో మెలో డ్రామా బాగా ఉండేది .వాస్తవికత ఉండేది కాదు .బాల సాహిత్యాన్ని విస్తృతం గా రాసింది .వారి కోసం ఎన్నో నీతి కధలు రాసింది .ఒక కధలో మనిషి శవం చర్మం తో మాస్క్ వేసుకొని ఒక విద్యార్ధి మాట్లాడి నట్లు చూపింది .ఆమె letters for literary ladies మొదటగా ప్రచురించినపుస్తకం . An essay on the noble science of self justification లో స్త్రీ శక్తిని గుర్తింప జేసి ,,మగవారి , అందునా భర్త ల దాష్టీకాన్ని సహించ వద్దని హెచ్చరించింది ‘’.parents assistance ‘’పుస్తకం రాసింది .బాలల విద్యకు ప్రోత్సాహమిచ్చింది .

                              మేరియా తండ్రి మంచి ముందు చూపున్న వాడు .గొప్ప ఇన్వెంటర్ అని పేరొందిన వాడు .కూతురి అభి వృద్ధికి అన్ని రకాలా తోడ్పడ్డాడు .ప్రఖ్యాత వేదాంతులు లాకె, రూసో ల ప్రభావం తొ ‘’praactical education ‘’ను విద్య కోసం రాసింది. అందరితో కలిసి మెలసి ఉండే తత్త్వం విద్యార్ధుల్లో ఉండాలని కోరింది .1800 లో మొదటి నవల-castle racknet తండ్రికి తెలియ కుండానే రాసి గొప్ప విజయం సాధించింది .ఇది ఆంగ్లో ఐరిష్ భూస్వాములపై సంధించిన వ్యంగ్యాస్త్రం .I rish land lording familiesలో నాలుగు తరాల వారి చరిత్ర ను పొందు పరిచింది . 1801 లో మూడు భాగాల’’ Belinda ‘’నవలను లండన్ లో ప్రచురించింది .ఇందు లో ప్రేమా ,ఆరాధన ,వివాహం ,సంఘర్షణ ల ను పొందు పరిచి పూర్తి విస్తృత స్తాయి నవల గా రాసింది .ఇందులో అంతర్జాతీయ వివాహాన్ని ప్రోత్సహించి,.ఆఫ్రికన్ బానిసకు ఇంగ్లిష్ భూస్వామ్య అమ్మాయితో వివాహాన్ని చేయించి సంచలనం సృష్టించింది .ఇది ఆ కాలానికి చాలా ముందడుగే .1809 లో tales of fashionable life ను చిన్న కధలను .స్త్రీల గురించి, వారికోసమే రాసింది .సమకాలీన నవలా రచయితలలో అగ్రశ్రేణి రచయిత గా గుర్తింపు పొందింది .ఒక నవలలో యూదులను కించ పరిచే విధం గా రాసిందని అమెరికన్ మహిళా రచయిత్రి విమర్శిస్తే ,వారికి క్షమాపణ చెబుతూ 1817 లోhamington రాసింది .ఆమెలో క్రమం గా పరివర్తన వచ్చింది ..నైతిక నిర్ణయాదికారాన్ని ,సాంఘిక అస్తిత్వాన్ని సాధించి ఆమె అందరికి ఆదర్శ ప్రాయ మైంది . ఆమె రచనల్లో వ్యంగ్యానికి పెద్ద పీటవేసింది .

                                ఫ్రాన్సిస్ బీ ఫోర్ట్ ను వివాహమాడింది .దంపతులు ఇంగ్లాండ్ అంతటా పర్యటించారు .అక్కడ కవి లార్డ్ బైరన్ తో సమావేశ మైంది .కాని బైరన్ అభిప్రాయాలతో ఏకీ భవించలేదు .హంఫ్రీ డేవి .ప్రముఖ నవలా కారుడు సర్ వాల్టర్ స్కాట్ లతో ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపింది .తండ్రి మరణం తర్వాత ఎస్టేట్ కు వారసు రాలైంది .1845-49 లలో’’ ఐరిష్ పొటాటో ఫామిన్ ‘’వచ్చింది .అపుడు రైతులకు అండ గా నిలిచి వాళ్ల బాధా నివారణ కోసం oriandino రాసింది .క్వేకర్ ఉద్యమ నాయకుల సాయం కోసం రిలీఫ్ ఫండ్ వసూలు చేసి అందించింది .అమెరికా నుండి వారికి కానుకల రూపం లో సహాయం రా బట్టింది .తన సంస్థానం లోని రైతుల రుణాల మాఫీ చేసింది

                          రాయల్ ఐరిష్ అకాడెమీ కి విలియం రావన్ హామిల్టన్ ఎన్నికయిన తర్వాత ఆయనకు ముఖ్య సలహాదారు అయింది .ఐర్లాండ్ సాహిత్య విషయం లో ఆమె ఎన్నో సూచనలు చేసి అమలు పరచేట్లు చేసింది .అకాడెమి లో స్త్రీలు భాగా స్వామ్యులు కావాలని తీర్మానించి ,వారిని చేర్పించి చురుగ్గా పని చేసేట్లు చేయ గలిగింది .హామిల్టన్ మేరియా కు గౌరవ సభ్యత్వం ఇచ్చి అపూర్వ గౌరవం కలిగించాడు .ఎనభై ఒక్క ఏళ్ళు నిండుగా ,గౌరవం గా జీవించి, స్త్రీల అభివృద్ధి కి , ,బాలల విద్యాభి వృద్ధికి , ఐరిష్ భాషా సంస్కృతి ,అస్తిత్వాలకు కృషి చేసి,ముప్ఫైకి పైగా పుస్తకాలను రచించిన మేరియా ఎడ్జి వర్త్ 22-5-1849 లో ఎడ్జి వర్త్ టౌన్ లో గుండె పోటు తో మరణించింది .

– గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి కృత్తివెన్ను శ్రీనివాసు మా ఇంటికి వచ్చిన సందర్భం

తెల్ల షర్ట్  ఉన్న ఆయనపేరు కృత్తివెన్ను  శ్రీనివాసు  కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి , అడవి శ్రీరామమూర్తి  విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ,
05.01.2013 ఉయ్యూరు  మా ఇంటికి వచ్చిన సందర్భం గా
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పి జి ఉడ్ హౌస్- ఫ్రోజెన్ అసెట్స్ – తెలుగు లో లంకె బిందెలు – గబ్బిట కృష్ణ మోహన్

లంకె బిందెలు

లంకె బిందెలు

 

0001000200030004

Posted in రచనలు | Tagged | Leave a comment

చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -3

చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -3
            అయోధ్యా కాండ విశేషాలను తెలుసుకొంటు న్నాం.వెదురు పోద కుప సిన పుష్పం ఆ వెదురు పొదలను కాల్చి  వేస్తుందిట .అన్న విషయం మనకు తెలియ జేశారు .గోమతీ తీరాన మను చక్ర వర్తి ఇస్ఖ్వాకునికి ఇచ్చిన భూ మండలం ను రాముడు సీతకు చూపించటం ,తన వంశ పరంపరను తెలియ జేయటం లా అని పిస్తుంది .”గంగా నది లోని నల్ల కలువలు గంగమ్మ తల్లి కల్లులాగా ఉన్నాయి .కమలాలు చేతుల్లా ఉన్నాయి తీరం లోని వృక్షాలు హారాల్లా ,ఇసుక తిన్నెలు జఘనాల్లా ఉన్నాయి ”అని మహర్షి వర్ణించిన తీరు మహా సౌరు గా ఉంది .కాళి దాస మహా కవికి మార్గ దర్శనం చేసి నట్లున్నది .గుహుడు తన బోయ జాతిని కన్నా బిడ్డల్లా పాలించటం వాళ్ళ అతన్ని ”స్తపతి ”అని గౌరవం గా పిలుస్తారని కొత్త గా తెలిసిన విషయం.నిషాద జాతి రత్నం గుహుడు .సంస్కారం జన్మను బట్టి కాదు ,సాధనను బట్టి లభిస్తుందని వాల్మీకి గొప్ప సందేశాన్నే ఇచ్చాడు .రాముడికి వాన ప్రస్తా మార్గాన్ని ఉపదేశించిన మహర్షి ”విఖనస్సు ”అని కొత్తగా తెలిసిన విషయం .సర్వజనుల శ్రేయస్సు కోసం శ్రీ రాముడు ‘దైవీ నావం ‘అనే మంత్రాన్ని జపించటం ‘బహుజన హితాయ బహుజన సుఖాయ”అన్న భారతీయ ధర్మానికి ప్రతీకయే .ఆచరించి చూపి ,ప్రతి సందర్భం లో ను శ్రీ రామ చంద్రుడు మార్గ దర్శి అని పించుకొన్నాడు .వనవాసం లో తమ్ముడు లక్ష్మణుడి తో కైక దౌష్ట్యాన్ని చెబుతూ ,తన తల్లి కౌసల్య వద్ద ఉన్న చిలుక ,గోరువంకలు రామ వన వాసం విషయం విన్నాయని ,అందులోని గోరు వంక చిలుకను వెళ్లి కైకేయి కాలు కొరికి పగతీర్చు కొని రమ్మని చెప్పిందని ,కౌసల్య మీద పక్షికి ఉన్న ఆదరణ తనకు లేక పోయిందని,కైకమాటను గుడ్డిగా అనుసరించి తన తల్లికి అపకారం చేశానని బాధ పడతాడు .ఇంత సూక్ష్మ విషయాన్ని నాకు తెలిసి నంత వరకు ఎవరు వ్యాప్తి లోకి ఇంతవరకు తీసుకు రాక పోవటం ఆశ్చర్యమే .వెంకటేశ్వర్లు గారు దీన్ని చక్కగా అందించి రామునికి తల్లి పట్ల ఉన్న ఆరాధనా భావాన్ని తెలియ జేసి అభి నందన లందు కొన్నారు .నాకు మాత్రం ఈ చిలుక గోరు వంక వృత్తాంతం పరమాద్భుతం గా ఉంది .సహవేదన అనేది జాతికి అతీతం గా ప్రతి బిమ్బించింది అని పించింది .
                    చిత్ర కూట  పర్వతం పై ఉండే వారంతా ధర్మ కార్యాలు చేసి ధన్యులవుతారట .యమునా నదిని దాటేటప్పుడు సీత ‘మద్యపు కుం.డ”లను సమర్పిస్తానని మొక్కు కోవటం ,ఆ నాటి వారి ఆన వాయితీ .నదిని తల్లిగా పూజించే సంస్కారం .రాముడు వాస్తు పూజ చేసి పర్ణ శాలలో ప్రవేశించటం ,మంత్రాలను తానే పఠిం చటంవల్ల రాజు అన్నిటా సమర్ధుడై ఉండాలి అన్న బోధ ఉంది .అంతః పురమైన ,అడవి అయినా ఆచారాన్ని పాటించాలనే ధర్మ సూక్ష్మం కనీ పిస్తుంది .రాముడికి వచ్చిన కలలో తండ్రి దశరధుడు నల్లని వస్త్రాలు ధరించి ,ఇనుపీట  లపై కూర్చున్నట్లు ,ఒళ్లంతా నల్ల రంగు పూసుకోన్నట్లు కని పించాడు ..ఒక రాక్షస స్త్రీ వికృతం గా నవ్వుతోంది .గాడిద రధం మీద నుంచి దశరధుడిని కిందికి నెట్టేసింది .ఈ కల రాముడికి ఏదో మరణ సూచికం గా అని పించి ,తమ్ముడికి చెప్పాడు .తండ్రి మరణం తధ్యం అని అని పించింది .స్వప్న వృత్తాంతాలు రామాయణం లో చాలా ఉన్నాయి .అన్ని దేశాల ఇతిహాసాలలోను ఇలానే ఉన్నాయి .వాటి ఫలితాలు వారు అనుభ వించారు .స్వప్నాలు దేశ కాలాతీతం అని పిస్తుంది .రాముడి ఈ కళను ఎవరు ఇంతగా ప్రచారం లోకి తేలేదు .ఒక్క వెంకటేశ్వర్లు గారే దీన్ని వెలుగు లోకి తెచ్చారని పించింది 
                భరతునికి అతని సైన్యానికి భరద్వాజ మహర్షి ఇచ్చిన ”విందు ”న భూతో న భవిష్యతి గా ఉంటుంది .ఈ నాటి ఫైవ్ స్టార్ హోటళ్ళుదీనిముందు బలాదూర్.ఎన్ని వసతులు ఎన్నెన్ని పిండి వంటలు ,ఎంత ఆనందం ,ఎంత ఆహ్లాదం ?మై మరపించి ,అక్కడే ఉండి  పోవాలని పించే వ్యామోహం .దీని మాయలో భరతుడు పడతాడా ?లేదా ?అని మహర్షి పెట్టిన పరీక్ష అని పిస్తుంది .జితేంద్రియుడు వీటిని తరుణ ప్రాయం గా భావించి రామ దర్శనానికి బయల్దేరి వెళ్ళటం ఆహా అని పిస్తుంది భరతుని కర్తవ్య దీక్షకు జేజేలు చెప్పాలని పిస్తుంది .సన్నివేశ కల్పనా ,నిర్వహణ పరమాద్భుతం గా చేశాడు మహర్షి వాల్మీకి .అంత గొప్ప గాను ఆతిధ్యమిచ్చాడు భరద్వాజ మహర్షి అందుకే అ నాటి నుండి ఎక్కడ మహా గొప్ప విందు జరిగినా ”భరద్వాజ విందు ”అనటం లోక సహజం అయింది .అదొక ”coinage word’అయి పోయింది .ఇంత గొప్ప విందును రాముడికి ఇచ్చే సాహసం చెయ్య లేదు భరద్వాజుడు .ఇదే డ్రమాటిక్ ఎలిమెంట్ .భరతుడు ఆశ్రమ జీవితం దెబ్బ తిన కుండా తన సైన్యాన్ని దూరం గానే ఉంచి ,తన లోని సంస్కారాన్ని తెలియ జేశాడు .అందుకే రామాయణం ఉత్తమ సంస్కారాన్ని అందించే మహా గ్రంధం గా పేర్కొనటం .కైక ను దూషించే భరతుడితో రామ వన వాసం దైవ ప్రేరితమని ,అతని తల్లి కైక నిమిత్త మాత్రురాలే నని ,రామ వన వాసం లోక కల్యాణా నికే నని బోధించటం ,మనసు కుదు ట పడె ట్లు చేయటం భరద్వాజ మహర్షి చేసిన మహా గొప్ప కార్యం .
                        సశేషం –మీ–గబ్బిట  దుర్గా ప్రసాద్ –5-1-13-ఉయ్యూరు    
 
 
 
 
 
 
 
 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -2

 చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -2

శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి

   బాలకాండ-ఆ నాడు సాంప్రదాయానికి విరుద్ధం గా యాగాలను నిర్వహించేవారు .తర్వాత బ్రహ్మ రాక్షసులై ,యాగ విధ్వంసం చేశారు .రాక్షసులు ఎక్కడి నుండో ఊడి పడరు .మనలోని అవ్యక్త శక్తులే ఆరూపం గా వ్యక్త మౌతాయి .అశ్వమేధం లో యజమాని భార్య ,కోన ఊపిరితో ఉన్న అశ్వాన్ని ,మూడు బంగారు సూదులతో గుచ్చగానే అది చని పోయేది అన్న వివరణ అవసరమైనదే. యాగం పై ఉన్న అపోహను పోగొట్టేది .జాంబ వంతుడు బ్రహ్మ దేవుడు ఆవలించిన ముఖం లో నుంచి జన్మించటం తెలియ దగిన విషయం .అందుకె  ఆయన వానర సేనకు గొప్ప సలహా దారు ,పెద్ద దిక్కు అవగాలిగాడు .మన్మధుడు కాలి బూడిద అయిన దేశం అంగ దేశం అయింది అన్న విషయం తెలియ దగింది .విశ్వా మిత్ర మహర్షి శ్రీ రామునికి ఇచ్చిన ‘’గాంధర్వ మానవాస్త్రం ‘’విచిత్ర మైనదే .కావాలని రామునికి దీన్ని అనుగ్రహించాడు మహర్షి .ఇచ్చిన వాటికి కృతజ్ఞత తెలుపుతూ ,స్మరించి నప్పుడు మాత్రమె వచ్చి సహాయం చేయమని అంత వరకు మనస్సులో మెదులుతుతు ఉండమని కోరటం ‘’రాముని బుద్ధి మంత తనం ‘’వామన జన్మ ద్వాదశి నాడు శ్రవణా నక్షత్త్ర ములో చంద్రుడు ఉన్న అభిజిథ్ నక్షత్రం  అని అదే వామన జయంతి అని అందరికి తెలియని విషయాన్ని ఎరుక పరచారు .

             పార్వతీ పరమేశ్వరుల రహస్య క్రీడను అడ్డు కొన్న దేవతలకు సంతానం కలగదని అమ్మ వారి శాపం ,భూదేవి కూడా తనకు సంతానం కలుగ కుండా చేసి నందుకు ఆమెకు బహు భత్రు త్వాన్ని ,పుత్ర సంతానలేమి కల్గించటం లో ,ఎంత మహిమాన్వితు లైనా ,తమకు కలిగిన బాధను తట్టుకో లేరని ,ఎదుటి వారికీ అలంటి బాధలు రావాలని కోరుకోవటం ఒక వింత నైజం గా కన్పిస్తుంది .ఇక్కడే పార్వతీ దేవి కూడా దీనికి ఏమీ అతీతం కాదని అని పిస్తుంది .భూ భారాన్ని మోసే ‘’విరూపాక్ష దిగ్గజం ‘’,అలసట కలిగి నప్పుడు తలను కదిలిస్తే ,భూ కంపాలు కలుగుతాయని అనటం లో భూ కాలుష్యం ప్రమాదం అనే హెచ్చరికి ఉంది .క్షీర సాగర మధనం లో జన్మించిన 60కోట్ల మంది అప్సరసలను దేవ ,దానవులేవరూ వివాహం చేసుకోవటానికి ముందుకు రాక పోవటం వాళ్ళ వారంతా వేశ్యలైనారని చెప్పటం లో ఇన్ డైరెక్ట్ గా వివాహ వ్యవస్థ అవసరాన్ని చెప్పకనే చెప్పి నట్లయింది ఒక రకం గా వారు సమాజం లో డ్రైనేజి వ్యవస్థ గా ఉండిపోవాల్సి వచ్చిందన్న సత్యం కని పిస్తుంది .

             ఇంద్రునికి మేష వృషణాల ను అమర్చటం వల్ల ,ఆ నాటి నుండి పితృ దేవతలు వృషణాలు లేని గోర్రేలనే భుజించారు .ఇదులో అవయవాల ట్రాన్స్ ప్లాంటేషన్  శాస్త్రం ఆనాడే అమల్లో ఉందని అర్ధమవుతుంది .ఈ రోజుల్లో మాంసం తినే వారికి గొర్రె వృషణాలు మహా ప్రీతీ పాత్రం అని వింటున్నాం .విశ్వా మిత్రుడు తన కుమారుల్ని యాగ పశువులు గా ప్రాణ త్యాగం చేయమని కోరితే ,వారందరూ తిరస్కరించగా ,వారిని అధమ జాతి మానవులు గా పుట్టమని శపిస్తాడు .ఆ జాతుల్లో ‘’అంధక ,ముష్టిక ‘’జాతులున్నాయి .అంధ జాతే ఆంద్ర జాతి అనే కధనం ఉంది .ఇది అంత సవ్యం గా లేదనుకొని వెంకటేశ్వర్లు గారు దాన్ని వదిలేశారు .గరళం తో కలిసి పుట్టిన వాడు సాగరుడు అవటం ,శాప జలం చేత కల్మషుడు అయిన వాడు కల్మష పాదుడు అవటం వ్యుత్పత్తి వ్యక్తీకరణాలు .భగుడు ఉత్తరా నక్షత్రం తో కూడిన రోజు వివాహానికి మంచి రోజు అని ,భగుడు సంతాన ప్రదాత అన్న మహర్షి జ్యోతిశ్శాస్త్ర పాండిత్యాన్ని వెలికి తీసి చూపారు .శ్రీ రాముని చేతిలో గర్వం ఖర్వం అయిన పరశు రాముడు రాత్రి పూట తాను భూమి పై ఉండ రాదనీ ,తన గమనానికి సహకరించే పాదాలపై బాణ ప్రయోగం చేయ వద్దని దశరధ రాముడైన  కళ్యాణ రాముడిని కోరుకోవటం మనకు కొత్త విషయం గాస అని పిస్తుంది .

           అయోధ్యకాండ –కోరికలతో కూడిన వ్యసనాలను ,క్రోధం  తో వచ్చే వ్యసనాలకు హెచ్చరిక గా మంచి వివరణ నిచ్చారు రచయిత .శ్రీ రామ పట్టాభి షెక ముహూర్తాన్ని సభలో ప్రకటించిన దశరధ మహా రాజు కీడు ను శంకిస్తాడు .ఇది ఆయన మనో వ్యాకులతకు అద్దం  పట్టు తుంది .రాబోయే అనర్దానికి సూచన కూడా .అలాగే రాముడు లక్ష్మణునితో తాను రాజ్యాభి షెకానికి అంగీకరించటం ,లక్ష్మణుడి కోసమే నని ,భోగాలు ,రాజ్య ఫలం లక్ష్మణుడు అనుభవించాలని తన మనో భావం అని తెలియ జేయటం లో రామునికి ఉన్న భ్రాత్రు ప్రేమ కు నిదర్శనం  గా ఉంది మంధర ను ‘’యతో జాతా‘’అని వాల్మీకి సంబోదిన్చాడని ,అంటే –‘’అడ్రెస్ లేనిది ‘’అని చక్కని వివరణ నిచ్చారు వెంకటేశ్వర్లు గారు .’’అలర్కుడు‘’అనే రాజు తనను యాచించిన ఒక గుడ్డి బ్రాహ్మణుడికి నేత్ర దానం చేశాడు .కనుక రామాయణ కాలం  లోనే ‘’నేత్ర దాన ప్రక్రియ ‘’ఉంది అని గ్రహించాలి .రాముడు పూసుకొన్న చందనం ‘’వరాహ రక్తం ‘’లా గా సుగంధాన్ని వేద జల్లుతోంది అన్న కొత్త విషయం తెలిపారు .అంటే వరాహ రక్తం అంత పరిమళ భరితం గా ఉంటుందని మనకు తెలియని విషయాన్ని రచయిత తెలియ జేశారు .

             వన వాసానికి వెళ్ళే ముందు రాముడు దాన ధర్మాలను విపరీతం గా చేశాడు .’’క ఠ.కలాప శాఖ ‘’కు చెందినబ్రాహ్మణులు ‘తీపి పదార్ధాలు బాగా తింటారని ,వారికి వేదాధ్యయనం తప్ప వేరొక పని  చేత కాదని కనుక వారికి కావలసిన సమస్తము సమ కూర్చమని తమ్ముడు లక్ష్మణుడిని రాముడు ఆదేశిస్తాడు .నిరంతర వేదాధ్యయ నం జరగాలి అని శ్రీ రామ చంద్రుని కోరిక అని ,వైదిక ధర్మ రక్షణ అందరి కర్తవ్యమని ఇందులోని సారాంశం .అసమన్జసుడి దురాగతాన్ని ప్రజలు రాజైన సగరునికివిన్న వీస్తే ,ప్రజా క్షేమం కోసం తన కుమారుడిని ,వాడి భార్యా పిల్లల్ని దేశం నుంచి కట్టు బట్టలతో బహిష్క రించి ప్రజా క్షేమం రాజు తక్షణ కర్తవ్యమ్ గా చేశాడు .ఆదర్శ ప్రాయు డైనాడు .ఇదీ ప్రజా భీష్టాన్ని నేర వేర్చటం అంటే .ఇవాళ మన నాయకులు వాళ్ళ కొడుకులు ,అల్లుళ్ళు ,బామ్మర్దులు ,వందిమాగధులు బంధు గణం అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయని దుష్క్రుత్యం లేదు .,ప్రజా పీడనా లేదు .ప్రజలు ఎంత మొత్తుకొన్నా వారికి చీమ కుట్టి నట్లుకూడా ఉండదు .ఇదీ మన ప్రజాస్వామ్యం .వారిని వెనకేసుకొచ్చి ఇంకా నెత్తికి ఎత్తు కొంటూ ‘’బె బె‘’అని మనల్నే ఎక్కి రిస్తున్నారు .వీటికి కోర్టులే శరణ్యం అయ్యాయి అందులోంచి ఫలితం తేలటా నికి ఏళ్ళూ ,పూళ్ళూ పడుతుంది .రాజ రిక వ్యవస్థ లో తక్షణ న్యాయం జరిగేది అని అని పిస్తుంది మనకు .వ్యవస్థ ఎంత పతనమైనదోఅర్ధమవుతుంది .ఆదర్శం అటకెక్కింది .అన్యాయం చంక నేక్కింది .ఇలాంటి ఎన్నో విషయాలు శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు మనకు తెలియ జేసి మార్గ దర్శనం చేశారు .

                  సశేషం

                మీ—గబ్బిట  దుర్గా ప్రసాద్ –4-1-13-కాంప్ –హైదరా బాద్

About the Author Sri Venkateswarlu

Posted in రచనలు | Tagged | Leave a comment

చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం

చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం

శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి

మనిషికి పుట్టగానే డబ్బు సంపాదన యావ ఉండటం సహజం .ధనాన్ని ఎన్ని రకాల వీలైతే అన్ని రకాల సాధించి ,అష్టైశ్వర్యాలతో తుల తూగాలని కాంక్ష  ఉంటుంది .దాన్ని సార్ధకం చేసుకోన్న్న వారెందరో మనకు తెలుసు .ఆ డబ్బును కొందరు సంఘ ప్రయోజనాల కోసం ధారాళం గా ఖర్చు ఠా అలాంటి అరుదైన మనిషి -మనీషిగా ఎదిగిన వారు బ్రాహ్మణులు అయిన శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు .గారు.

Sri-Venkateswarluశ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు మా ఉయ్యూరు దగ్గర తోట్ల వల్లూరు లో నోరి వారింట జన్మించారు .తర్వాత చిలుకూరు వారికీ దత్తత వెళ్లారు .మద్రాస్ చేరి పెయింట్  వ్యాపారం లో, ,ఫైనాన్స్ లో ,రియల్ ఎస్టేట్ లో పిచ్చగా సంపాదించారు .అరవైఏళ్ళ దాకా ధన యావ తప్ప రెండోది ఆయనకు తెలీదు .అప్పుడు ఆయన జ్ఞాన నేత్రం తెరుచుకోంది..జీవిత గమ్యాన్ని మార్చుకోవాలన్న ఆలోచన కలిగింది .తన డబ్బు ,సంపదా అంతా కొడుకులకు, వారికి దక్క వలసినది అంతా న్యాయం గా పంచేసి ,  ,తనకు వచ్చిన దానిలో చెన్నై లోని శ్రీరామ కృష్ణా మ ఠంకు చాలా భాగం రాసిచ్చి , ,అక్కడే తపోవనం లో సాధారణ జీవితాన్ని ,ధ్యాన దీక్ష ,సాహిత్య రచన తో గడుపుతూ శ్రీ రామ కృష్ణ పరమ హంస వారి దివ్య బోధా ప్రచారం కోసం పుస్తకాలను రాసి ప్రచురిస్తున్నారు .భాగవతాన్ని వచనం గా సరళ శైలిలో రాశారు .భగవద్గీత ను పదవ తర గతి విద్యార్ధులను  దృష్టిలో ఉంచుకొని ,వారికి అర్ధమై,అందే తీరులో శ్రీ పరమ హంస గారు చెప్పిన కధలను జోడిచి ,మనస్సుకు హత్తుకొనే రీతిగా రాసి ,విద్యార్ధులకు రామ కృష్ణ మిషన్ ద్వారా ఉచితం గా అంద జేశారు .తరువాత విద్యా రన్యస్వామి రచించిన శ్రీ శంకర విజయాన్ని అతి సుందర సుస్పష్ట తెలుగు వచనం గా అనువదించి ఇనుప గుగ్గేల్లను తీపి మిఠాయి చేసి అందించి ఏ కొద్ది మంది మాత్రమే  బాగా సంస్కృత ప్రావే న్యం ఉన్న వారికి మాత్రమె అర్ధమయ్యే విద్యారణ్య బోధనలను ,జన సామాన్య్లకు చేరువ చేసి సంచలనం సృష్టించారు ., , మంచి పేరూ  పొందారు .వాల్మీకి రచించిన శ్రీ మద్రామాయణాన్ని అత్యంత మెలకువ తో సులభ శిలిలోవచనం గా  రెండు భాగాలుగా అనువదించి ,మహర్షికి గొప్ప నీరాజనం ఇచ్చారు .ఎప్పుడో డెబ్భై ,ఎనభై ఏళ్ళ క్రితంమహా పండితులు ,మంత్ర ద్రష్ట ,అనేక ఆద్యాత్మిక గ్రంధ రచయిత అయిన  స్వర్గీయ జన మంచి శేషాద్రి శర్మ గారు రచించిన ‘’శ్రీ రామావతార తత్త్వం ‘’ను మళ్ళీ ఎవరు పునర్ముద్రించని కారణం గా వెంకటేశ్వర్లు గారు-శ్రీ  శర్మ గారి విధానం లోనే ఇంకా సులభ గ్రాహ్యం గాఅనేక విశేషాలతో ,పూర్వా పరాలతో గొప్ప సమన్వయ ద్రుక్పధంత్తో  రాసి ఆస్తిక జనానికి మహాద్భాగ్యాన్ని కల్గించారు .మా రెండో కోడలు ఇందిరకు ఆయన తాత గారు .నా అడ్రెస్ వారు సంపాదించి వారు ప్రచురించిన పుస్తకాలన్నీ పోస్ట్ లో పంపారు .అన్నీ చదివి ,వారికి వివరం గా నా అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియ జేశాను .అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడే వారు మన సరసభారతి ప్రచురించిన పుస్తకాలన్నీ వారికి పంపాను .చదివి స్పందించేవారు .ఇలా మా సాహిత్య బాంధవ్యం ఏర్పడింది .ఇప్పుడు నేను 7-4-2011 నవారికి రాసిన వారి వచన రామాయణ విశేషాలను మీ అందరికి అంద జేస్తున్నాను .About the Author Sri Venkateswarlu

శ్రీ మద్రామాయణం

వాల్మీకి కృత రామాయణానికి శ్రీ చిలుకూరు వెంక తెశ్వార్లు గారు చేసిన అను వాదం సరళం గా ,సహజం గా ,స్న్దరం గా ,నిసర్గ రమణీయం గా ఉంది .మంచి ముద్రణా ,అందమైన ముఖ చిత్రం తో సర్వాంగ సుందరం గా పుస్తకం హస్త భూషణం గా ఉంది .మొత్తం మీద ఒకే ఒక అచ్చు తప్పు కానీ పించింది అంటే ముద్రణ విషయం లో ఎంత జాగ్రత్త తీసుకొన్నారో అర్ధమవుతుంది ‘’మరి ఎలా రామాయణమ్మన్నచో ‘’అనుకొన్న విశ్వ నాద సత్య నారాయణ గారి మార్గం లోనే వీరూ ఆలోచించారు .ఆయన అనుభవ సారాన్ని ఇమిడ్చి రచించటం హర్షనీయం ,ఆనంద దాయకం .దగ్గర కూర్చో పెట్టుకొని ,ఆప్యాయం గా చక్కగా చిక్కగా కదా చెప్పి విని పించి నట్లు గా,హాయిగా  ఉండటం విశేషం ..కధా గమనానికి అవసర మయాన వాటినే గ్రహిస్తూ ,అతిగా ఉండే వర్ణనల జోలికి పోకుండా ,ప్రతి వాక్యం చదవాలి చదివి అందులోని సారాన్ని తెలుసు కోవాలన్న ధ్యేయం తో సాగిన రచన .సాంప్రదాయ రచనగా ,ఆర్ష ధర్మ వ్యాప్తి గా రాశారు .శ్రీ పరమహంస ల అవ్యాజ కరుణా రసం వీరిపై సంపూర్ణం గా ఉంది .అందుకే రచన హృద్యమైంది .ఎక్కడా సందిగ్ధత లేదు .సారళ్యం సర్వదా కానీ పిస్తుంది .మహర్షి వాల్మీకి రామాయణాన్ని హృద్గతం చేసుకొన్నారు కనుక ,ఆ భావ వ్యాప్తి అంత సులభ తార మైంది వెంకటేశ్వర్లు గారికి .మనసారా అందరు అభి నందిన్చాల్సిన ప్రయత్నం .

అగ్ని శర్మ అత్రి మహర్షి ప్రేరణ చేత తపస్సు చేసి ,వాల్మీకి మహర్షిగా అవత రించటం,ఆది కవి అయి ,ఆది కావ్య మైనశ్రీ మద్రామాయణాన్ని   రాయటం  మనసుకు హత్తుకొనే రీతిలో రాశారు .ఈ నాడు విప్ల వాత్మకం గా భావించే ‘’Fraternity of mankind ,world citizenship,human dignity concern for society ,nationalism ‘’అన్నభావాలను రామాయణం లో అడుగడుగునా దర్శన మిస్తాయని చిలుకూరు వారు తమ ప్రస్తావన లోపెర్కొనటం సముచితం చక్కని ప్రాతి పదిక కూడా.ఈ మొత్తం భావ వ్యాప్తియే రామాయణం.రాముని మార్గమే కాదు సీత మార్గమే కాదు మానవాళి ప్రయాణ మార్గాన్ని సూచించాడు మహర్షి వాల్మీకి కవి .అలాగే రాముడు మానవ మాత్రుడి గానే వ్యవహరించటానికి తన ‘’మాయ ‘’ఏ తనను ఆవహించాలని కోరుకోవటం వల్లనే అన్న విషయం సరిగ్గా సరిపోతాయి .యుద్ధ కాండ చివరలో దేవత లంతా శ్రీ రాముడిని శ్రీ మహా విష్ణువే అని ప్రస్తు తిన్చితే రాముడు మాత్రం తాను దశరధ  పుత్రుడినే  అనటం ,రామాయణ ఆత్మను ప్రదర్శింప జేయట మే..మానవుడు అనుకొంటే అన్నీ సాధించగలడు అని స్పష్టం గా తెలియ జేయట మే ఈ మాటల్లోని పరమార్ధం.అందుకే ‘’మనుష్యుడిల మాహాను బావుడే ‘’అన్నాడు ఆధునిక కవి .

సశేషం

About the Author Sri Venkateswarlu

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –3-1-13—కాంప్—హైదరాబాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు

మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు

సాహితీ బంధువులకు -ఈ నాడుపత్రిక  సినిమా విభాగం లో  మిధునం పై మంచి సమీక్ష చేశారు .అందులోని ముఖ్య విషయాలు వారి మాటలు ,నా మాటల మేళ వింపు తో  మీకోసం –

”మిధునం మన మూలాల్ని గుర్తు చేసింది .ఇప్పటి దాకా మనం చూసింది తెలుగు సినిమాలేనా అని పిస్తుంది .పేర్ల నుండి పతాక సన్నీ వేశాల వరకు పచ్చదనాన్ని నింపారు .ప్రేక్షకుల్ని కన్నీరు ఒలికించారు అవీ పచ్చగా ఉండటం విశేషం .తెలుగు కాయ గూరలు కాపు ను పువ్వు దశ నుంచి ,పిందే,కాయ దశ వరకు ఉన్న క్రమస్తితిని తెరకెక్కించి తెలుగు తోట తీయదనాన్ని ,వికసనాన్ని ప్రత్యక్షీకరించారు .నేటివిటి కి అద్దం పట్టారు .జీవిత చరమాంకం లో ఒంటరిగా దాంపత్య జీవితం అను భావించటం లో ఉన్న జీవిత మాధుర్యాన్ని కళ్ళకు కట్టించారు .గొప్ప అను భూతిని కల్గించారు .మనమూ ఈ ఆనందాన్ని అనుభవించి తరిద్దాం అనే భావన అందరికి కలిగించటం ఈ సినిమా సాధించిన గొప్ప విజయం .ముసలి దంపతుల చిలిపి తగూలు ,ప్రేమాను రాగాలు ,చిరు అనుమానాలు మనకు ఎంతో అనురక్తిని కలిగిస్తాయి .తన కంటే భర్తనే తన దగ్గరకు తీసుకు వెళ్ళమని భార్య భగ వంతుని కోరుకోవటం లో ఆమెకు భర్త పై ఉన్న పూర్తీ ప్రేమ గౌరవం ,ఆరాధనా ప్రస్పుటం గా కని పిస్తుంది .
               మనిషిగా పుట్టటం గొప్ప కాదు .మనిషి గా బతకటం గొప్ప అనే గొప్ప సందేశం ఇచ్చే చిత్రం .రిటైర్మెంట్ అంటే ఏ పనీ చేయకుండా కూర్చోవటం కాదని రొటీన్ పనులకు స్వస్తి చెప్పటమని మంచి భావనా వ్యాప్తిని తెచ్చిన సినిమా ఇది .శ్రీ రమణ రాసిన కధలో మూడు పాత్రలు ఉంటె దర్శకుడు భరణి రెండే పాత్రలతో ఆ సాంతం రక్తి కట్టించాడు .ఆ రెండు పాత్రల్లో బాలు ,లక్ష్మీ బాగా ఒదిగి పోయారు.పతాక సన్నీ వేశం లో లక్ష్మి నటన మనల్ని కట్టి పడేస్తే ,చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న అసలు సిసలు తెలుగు ముసలాయనగా ,మల్లాది వారి ”అన్నప్ప శాస్త్రి”లాగా  ఇందులో ”అప్ప దాసు ”గా బాలు పక్వ నటన ప్రదర్శించాడు .వీణా పాణి సంగీతం ,జేసుదాసు పాటలు ,సినిమావిజయానికి  చాలా బాగా సహకరించాయి .భరణి అన్నీ తానే అయి తన” సకల కళావిశ్వ రూపాన్ని” ప్రదర్శించాడు .ఈ సినిమా తీయటం సాహసమే .ఆ సాహసాన్ని చేసి సాహస వీరుడని పించుకొన్నాడు నిర్మాత ఆనంద రావు .అచ్చమైన తెలుగు వారి సినిమా అంటే ఇలాగ ఉండాలి ,ఇలాగే ఉండాలి అని దర్శకుడు భరణి సాహస వంతం గా మిదునాన్ని తెర కెక్కించాడు . అచ్చ మైన తెలుగు చిత్రమైన ఈ ”మిధునం ”హృద్య మైన చిత్రం ”అని  ఈనాడు సినిమా రివ్యు ప్రకటించింది .
                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-1-13-ఉయ్యూరు

 

 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

కాశీ ఖండం -45(చివరి భాగం ) కాశీ తీర్ధ పూజా విధి

  కాశీ ఖండం -45(చివరి భాగం )

 

                       కాశీ తీర్ధ పూజా విధి

    తీర్ధ యాత్ర ,దేవయాత్ర ,గురు యాత్ర అని మూడు రకాల యాత్రలున్నాయి .స్నాన ప్రధానంగా పుణ్య నదీ ప్రవాహాలున్న చోట్లకు వెళ్లటం తీర్ధ యాత్ర..దేవతా ప్రధానం గా ఉన్న క్షేత్ర దర్శనం దేవ యాత్ర .పరబ్రహ్మోప దేశం ,పంచాక్షరీ మంత్రోప దేశం పొంది వేద శాస్త్ర ఇతిహాస గ్రంధాలలోని జీవనో ద్దారక ,జన్మ తరణ సంబంధిత సూక్ష్మ ధర్మ విశేషాలను బోధిస్తూ సన్మార్గం లో నడిపే సద్గురు దర్శన ,సేవనం ,,పూజనంతో  కాలం గడి పితే గురు యాత్ర .

           సద్గురు కటాక్షం ద్వారా తప్ప జ్ఞాన ప్రాప్తి లభించదు .జ్ఞానం లేక పోతే దైవం ,దేవతా స్థలం ,తీర్ధ ,క్షేత్ర యాత్రల గురించి అవగాహన ,శ్రద్ధా ,విశ్వాసం ఏర్పడవు .అందరికి చివరి కాలం లో గురు యాత్ర కావాలి .గురు యాత్ర వల్ల సర్వ యాత్ర సంపూర్ణం గా  పుణ్య ఫలం లభిస్తుంది సర్వ తీర్ధాలలో ప్రయాగ శ్రేష్టం .ఆ ప్రయాగ జలం కాశీ లోనీ గంగా జాలం పంచ గంగా ఘాట్ లో కలుస్తుంది .సమస్త క్షేత్రాలలో, దేవ యాత్రలలో ముఖ్య మైనది కాశీ యాత్ర .కాశీ యాత్ర చేసి వచ్చిన వారు కాశీ పూజ లేక తీర్ధ పూజ చేస్తారు .కాశీ తీర్ధ పూజా విధానం తెలుసు కొందాం

                       కాశీ గంగోదకాన్ని మూడు రాగి కలశాలలో నింపి సీల్ వేసి తెచ్చుకోవాలి ఆ నీటిలో ప్రయాగ సంగమ నీరు ,పంచ గంగానీరు ,మణి కర్ణిక నీరు తప్పక కలపాలి ..ఈ మూడూ కలిసిన జలాన్నే రాగి చెంబుల్లో పోసి సీల్ చేయించి ఇంటికి తెచ్చుకోవాలి .ఇంటి వద్ద ఈ మూడు కళాశాలకు భక్తీ తో పూజ చేయాలి .ఒక ఏడాది లోపు ,లేదా తొమ్మిది నెలల లోపు ,,లేక తొంభై రోజుల లోపు రామేశ్వరం వెళ్ళి ,ఒక కలశం లోనీ నీటిని అక్కడి పూజారికిఇచ్చి రామేశ్వర జ్యోతిర్లింగం పై గోత్ర నామాలు చెప్పించి ,అభిషేకం చేయించాలి ..తర్వాతా రామేశ్వరం లోనీ ఇసుకను ఒక డబ్బాలో పోగు చేసి ,ఏడాది లేక తొమ్మిది నెలలు ,లేక తొంభై రోజులు లోపల ,మళ్ళీ కాశీ చేరి ,ప్రయాగ సంగమ స్థలం లో రామేశ్వరం లోనీ ఇసుకతో శివ లింగాన్ని ఒక పాత్రలో చేసి పూజించి ,దక్షిణ ,వస్త్రాలతో పాటు ఆ పాత్రను దానం చేయాలి .ఆ సేతు శివ లింగాన్ని నిమజ్జనం చేయాలి .

         రెండవ కలశం లోనీ తీర్ధ జలాన్ని పూజ చేసిన తర్వాతా విప్పి ,అందరికి ప్రోక్షణ చేయాలి .తీర్ధం గా కూడా గ్రహించాలి .యజమాని మూడవ కలశం లోనీ తీర్ధాన్ని పూజా గదిలో జాగ్రత్త గా భద్ర పరచి రోజు పూజ చేయాలి .ఆ నిండు కలశం లో కాశీ తీర్ధం మూడు చుక్కలు కలుపు కొని ,తర్వాత దేవుళ్ళను కడగాలి .రోజూ పూజ లో ఉపయోగించాలి .పండుగ రోజుల్లో ,పర్వ కాలాలలో ,గ్రహణ సమయం లో స్నానం చేసే టప్పుడు ఆ జలాన్ని మూడు చుక్కలు కలిపి స్నానం చేస్తే కాశీలో స్నానం చేసిన ఫలితం వస్తుంది .

          తూర్పు లేక పడమర వైపు చుట్టూ స్థలం వదిలి తొమ్మిది ఫీట్ల స్థలాన్ని ఆవు పేడ ,ఆవు మూత్రం ,గంగాజలం తో శుద్ధి చేసి ,అయిదు రకాల రంగులతో ముగ్గు లు వేయాలి .ఆ ముగ్గుల్లో‘’కాశీ విశ్వేశ్వరాయ నమః ‘’అనే అక్షరాలూ కూడా ముగ్గు తో రాయాలి .సరి పడ బల్ల పీటా వేయాలి .ముగ్గు పై ఒక తెల్ల వస్త్రాన్ని మూడు వరుసలుగా పరవాలి .దాని పై తొమ్మిది కిలోల శుభ్రం చేసిన బియ్యాన్ని పోయాలి ..ఆ బియ్యం మధ్య అయిదు పావు సేర్ల బియ్యం ఉడికే ఇత్తడి కలశాన్ని సున్నం రాసి అయిదు పోగుల దారానికి మామిడాకు ,లేక తమల పాకు ను మడిచి కట్టి కలశానికి అయిదు చుట్లు చుట్టి ,,పసుపు ,కుంకుమ తో అయిదు బోట్లు పెట్టి ,అలంకరించాలి .ఈ కలశాన్ని నీతితో నింపాలి .పంచ పల్ల వాలు   అంటే అయిదు రకాల చిగురు టాకులచిన్న కొమ్మలనుదగ్గర గా చేర్చి పచ్చని బట్టతో కట్టి ,కలశం లో ఉంచాలి దాని పై పెద్ద కొబ్బరి కాయను ,అడ్డం గా యజమాని వైపు ముఖం ఉన్దేట్లుఉంచాలి .చుట్టూ ఎనిమిది దిక్కులా ,రెండు తమల పాకుల్లో వక్కలు ,కర్జూర,బాదం వేయాలి .ఈశాన్యం లో నవగ్రహాలను కూడుక లో అమర్చాలి .ఆగ్నేయ ,నైరుతి ,వాయవ్య ఈశాన్య కోణాలలో వరుసగా అష్ట భైరవులను ,56వినాయకులను ,ద్వాదశాదిత్యులను ఏర్పాటు చేయాలి .వీటిలో వక్కలు కర్జూరం ఉంచాలి .ఉత్తరం లో నవ దుర్గలను ,గంగా దేవి మణి కర్ణికా లను ,తూర్పున ఏకాదశ రుద్రులను ,శివలింగాలను ,దక్షిణం లో దండ పాణి ,కాశీ గుహ భావానీలను ,బిందు మాధవుడిని ,పడమరగంగా ఘట్టాలను అమర్చాలి ఇరవై అయిదు కుడుకలు ,రెండు వందల ఎనిమిది పోకలు ,అన్నే కర్జూరాలు ,నూట ఎనిమిది తమల పాకులు కావాలి తొమ్మిది పోగులతో కూడిన కంకణాలను సిద్ధం చేసుకోవాలి .మండపాన్ని కొబ్బరి అరటి లతో అలంకరించాలి మామిడి తోరణాలు కట్టాలి .బంధువు లందర్నీ ఆహ్వానించాలి పైన ఉన్న అందరి దేవతలను ఆహ్వానించి యదా శక్తి గా పూజ చేసి నైవేద్యం పెట్టి హారతివ్వాలి ప్రదక్షిణ నమస్కారం చేయాలి ..ఈ కింది స్తోత్రం చెబుతూ సాష్టాంగ నమస్కారం చేయాలి

‘’జన్మ కారణ మైన కర్మకు –జన్మ మే లేని విధముగా –కర్మ భూమి లో వాసి కెక్కిన శర్మ భూమియే కాశి క్షేత్రము

పంచ భౌతిక దేహమిదియే –పంచ ప్రాణాత్మకము ఇదియే –పంచ క్రోశము తిరిగి నంతనె –పంచ ముఖు నె చేరులే

శక్తి తో అనురక్తి వీడి –యుక్తి తో ఆసక్తి వదిలి –అవి ముక్తమునే గాన్చుమా –ముక్తి పదవినే పొందుమా

ఆశా పాశము ద్రెంచుమా –ఆశను దాసిగా జేయుమా –క్లేశములే యెడ బాపుమా –కాశీ వాసము నీయుమా

దేవ దానవ మానవాళికి –దివ్య ధామము ,పాప నాశము –కవి కేదారుని ప్రాణ సమము –భువి లో వెలసిన భవు నివాసము ‘’

వారణా సీకీ జై –శ్రీ కాశీ విశ్వనాధ భగవాన్ కీ జై అని బిగ్గర అనాలి .

‘’హర హర మహాదేవ సాంబా –కాశీ విశ్వనాధ గంగా –మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ

మహా కాల మహా కాల రక్ష హర హర –హర సాంబ హర సాంబ సాంబ  సాంబ హర హర

హర శంభో హర శంభో శంభో శంభో హర హర అని అయిదు సార్లు అనాలి .

 కాశీ అన్న పూర్ణా విశాలాక్షీ సమేత విశ్వేశ్వర భగవాన్ కీ జై ,గంగా మాతకు జై అని గట్టిగా నినాదం చేయాలి .పరమేశ్వరార్పణం అని అక్షతలు నీరు వదలాలి .తొమ్మిది మంది దంపతులకు భోజనం పెట్టాలి

  ఈ విధంగా , విధి విధానం గా పూజ చేసిన వారికీ సర్వ తీర్ధ స్నాన ఫలం ,సమస్త క్షేత్ర దర్శన ఫలం ,కాశీ నివాస ,యాత్రా సంపూర్ణ ఫలం లభిస్తాయి 

              నాతో పాటు మీరందరూ కాశీ యాత్రలో సుమారు నలభై అయిదు రోజులు పాల్గొన్నందుకు ”శుభం భూయాత్ ”–స్వస్తి 

            శ్రీ కాశీ ఖండం సర్వం సంపూర్ణం

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —2-1-13-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | 1 Comment

నూతన సంవత్సరం – మొదటి సన్మానం

This gallery contains 12 photos.

More Galleries | Tagged | Leave a comment

వివేక శంఖా రావం మరియు కడప లో శ్రీ రామ కృష్ణ దేవాలయం

viveka shankhaa raavamkadapa-raama krishna devaalayam

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాశీ ఖండం –44 శ్రీ కేదారేశ్వర మహాత్మ్యం

  కాశీ ఖండం –44

                        శ్రీ కేదారేశ్వర మహాత్మ్యం

ఒకసారి పార్వతి దేవి భర్త అయిన పరమశివుని కాశీ క్షత్రం లో కేదార ఖండ విశేషాలను తెలియ జేయమని కోరింది .అప్పుడు శివుడు ఈ విధం గా చెప్పాడు .పూర్వం ఉజ్జయిని పట్టణం లో ఒక బ్రాహ్మనుడుండేవాడు .ధర్మ పత్ని తో సహజీవనం చేస్తున్న దరిద్రుడు .పుత్ర సంతానం లేదు మహా కాలుడిని  భక్తితో సేవిస్తున్నాడు .కొంత కాలానికి ఈశ్వరానుగ్రహం వల్ల పుత్రోదయం జరిగింది ఆబాలుడికి వసిష్టుడు అని పేరు పెట్టారు .ఎనిమిదో ఏట ఉపనయనం చేశారు .రోజు దశ సహస్ర గాయత్రి జపం చేసే వాడు వసిష్టుడు .అకస్మాత్తుగా తల్లి మరణించింది ..మరో ఏడాదికి తండ్రిని కోల్పోయాడు .వికల మనస్కుడైన ఆ బాలుడు మంచి గురువును అన్వేషించి పరమార్ధ జ్ఞానం పొందాలని భావించాడు .

          కాశీ క్షేత్రానికి చేరాడు .అక్కడ గంగా స్నానం విశ్వనాదాది దేవతా సందర్శనం  చేశాడు .హిరణ్య గర్భుడు అనే గురువు అనుగ్రహం పొందాడు .పంచాక్షరి దీక్ష పొందాడు .అచంచల భక్తీ తో విశ్వనాధుని కొలుస్తున్నాడు .శివుడే గురువు ,గురువే శివుడు అనే భావం కలిగింది .ఒక రోజు గురువు తనకు కేదార క్షేత్రం దర్శించి కేదా రేశ్వరుడిని కనులారా చూచి ధన్యం కావా లని ఉందని చెప్పాడు .అలాంటి క్షేత్రానికి తానూ చూడాలని ఉందని శిష్యుడన్నాడు .ఇద్దరు కేదారం బయల్దేరి వెళ్లారు .

    ‘’కేదారే ఉదకం పీత్వా –పునర్జన్మ న విద్య తే ‘’అనే కేదారఖండ గ్రంధ ప్రమాణం గా తీసుకొని ‘’రేత కుండం ‘’లోనీ అద్భుత మహిమాన్విత జలాన్ని స్వీకరిస్తే పునర్జన్మ ఉండదని గ్రోలారు .కేదారేశ్వర దర్శనం చేసి జన్మ చరితార్ధం చేసుకొన్నారు .కేదారేశుని చూస్తుండి పోయిన గురువు కన్నుల లో నుంచి జ్యోతి బయటకు వచ్చి ఆకాశమార్గం లోకి వెళ్లటం,దివ్య విమానం లో దేవతలు వచ్చి ఆయన్ను తీసుకు వెళ్లటం  అందరు గమనించారు .శిష్యుడు వశిష్టుడు గురువు గారి అంత్య క్రియలను భక్తితో విధి విధం గా  చేశాడు .కాశీ చేరి గురువు గారి ఆదర్శాలను అమలు చేయటానికి పీఠాన్ని అధి రోహించాడు .

      నిత్య గంగా స్నానం విశ్వనాధ దర్శనం పరమశివ ధ్యానం తో కాలం గడిపాడు .అనుక్షణ దైవనామ జప తపాల తో జీవితాన్ని అర్ధ వంతం గా కోన సాగిస్తున్నాడు .శివుడు పరమ ప్రీతీ చెంది దర్శనమిచ్చాడు .వరం కోరుకో మన్నాడు అప్పుడు వసిష్టుడు ‘’దేవా !ఎక్కడో హిమాలయాలలో నువ్వు ఉంటావు .నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకో లేని వా రెందరో ఉన్నారు .కనుక కేదార ,విశ్వనాధ జ్యోతిర్లింగాలు రెండు కలిసి కాశీ లో నె ఉండేట్లు నీవు కరుణిస్తే నీ భక్తులు ధన్యు లవుతారు ‘’అని కోరాడు /.ఆతని కోరిక ను నేర వేరుస్తాను అని శివుడు అన్నాడు ‘’నీ కోసం ఏదీ కోరుకో కుండా ,అందరికోసం కోరావు చాలా సంతోషం .నీ ముక్తి నీ స్వాధీనం ‘’అన్నాడు ..హిమాలయం లోనీ సర్వ తీర్ధాల గౌరీ కుండం హంస తీర్ధం మొదలైన వాటి శక్తు లన్ని వశిష్ట నివాసం దగ్గరున్న ‘’హర పాప హ్రద ‘’తీర్ధం లో నిక్షిప్తం అవుతాయి .అరవై నాలుగు కళల్లో ఒక్క కళ ను మాత్రమె కేదార క్షేత్రం లో నిలిపి మిగిలిన సర్వ కళలను  కేదార్ ఘాట్ ఒడ్డున ఉన్న కేదారేశ్వరునిలో లీన మాఎట్లు చేసి భక్తుని కోరిక తీరి కాశి లో కేదార క్షేత్రం వెలిసింది ..కేదార్ ఘాట్ స్నానం ,కేదారేశ్వర దర్శనం ,స్పర్శనం పరమ పుణ్య ప్రదం .ఇక్కడ పితృ కర్మ చేస్తే 101తరాల వారు తరిస్తారు .చైత్ర బహుళ చతుర్ధి నాడు ఉప వాసం ఉండి మూడు పూటలా మూడు పుక్కిల్ల కేదార్ జలాన్ని సేవించిన వారు శివైక్యం చెందు తారు .కేదారేశ్వరునికి ఉత్తరం లో చిత్రాన్గాదేశ్వరుడు ,దక్షిణం లో నీల కంఠుడు ,వాయువ్యం లో అమ్బరీకేశ్వరుడు ,అక్కడే ఇంద్రద్యుమ్నేశ్వరుడు ,దీనికి దక్షిణం లో కాలన్జేశ్వరుడు ,చిత్రాన్గాదేశ్వరుని ఉత్తరాన క్షేమేశ్వరుడు,కేదారేశ్వరుని పరి వారం గా ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తారు

 ‘’కేదారేశ్వర లింగస్య –శ్రుత్వోత్పత్తిం చ యో నరః –శివలోక మావా ప్నోతి –విశ్వాపో జాయతే క్షణాత్ ‘’

                     

          ఈ కధ విన్నా చదివినా ముక్తి పొందటం ఖాయం

                            సశేషం

                 కొత్త ఏడాది శుభ కామనలతో

         మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –1-1-2013 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మన పి.వి.కి మన ఘన నివాళి

సాహితీ బంధువులకు -నూతన సంవత్సర శుభా కాంక్షలు -ఇప్పుడే హేచ్ .ఏం,.టి.వి.లో మాజీ ప్రధాని పి.వి.నరసింహా రావుగారి కి  హంసా ఇండియా ,మరియు హైదారా  బాద్ మీడియా హౌస్ లు 245px-P_V_Narasimha_Raoసంయుక్తం గా నిర్వ హించిన”మన పి.వి కి మన నివాళి ” అనే తొలి స్మారక ఉపన్యాస కార్య క్రమం లైవ్ చూశాను .ముఖ్యం గా కే.రామ చంద్ర మూర్తి గారి పూనిక ,చొరవకు అభినందనలు .గవర్నర్ శ్రీ నరసింహం గారు చాలా గొప్ప గా పి.వి.ఘనకీర్తిని కీఎర్తించారు .మాటలన్నీ మనసు లోతు నుండే వచ్చాయి .ఆ తర్వాత కీలక ఉపన్యాసం చేసిన రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ చాలా స్పూర్తి దాయక ప్రసంగం చేశారు .నర సింహా రావు గారి బహు ముఖీన ప్రజ్ఞా ,పాటవాలను వెలికి తీశారు .ఆర్ధిక ,విదేశీ విధానాలలో ఆయన చొరవ ,పంజాబ్ లో శాంతి నేల కొల్పటం ,సంస్కరణలకు పెద్ద పీట వేయటం నేమరేసుకొన్నారు .ఆయన తో తాను చాలా సన్నిహితం గా పనిచేయటం తన అదృష్టం అన్నారు .పి.వి.మీ తెలుగు సాహిత్యం లో మేరు పర్వతం .మిగిలిన ప్రపంచ భాషలన్నీ ఆయనకు వాచో విదేయాలు .బహు గ్రంధ కర్త .మంచి వక్త .మెజారిటి లేని కాంగ్రెస్ ను ఒడి దుడుకులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరచి సాఫీ గా నడి పించటం ఒక్క ప్.వి.కే చెల్లు బాటయింది .ఆనాటి ప్రధమ ప్రధాని ఆర్ధిక శాఖ ను నిర్వహించ టానికి సి.డి.దేశ్ ముఖ ను  మంత్రి వర్గం లోకి తీసుకొని సాహసం చేస్తే ,మళ్ళీ అదే పద్ధతిలో పి.వి.గారు మన్మోహన్ సింగ్ ను తీసుకొని వచ్చి ఆర్ధిక సంస్కరణలకు రాచ బాట వేశారు .ఇవ్వాళ మనం 2gదేశాల సరసన కూర్చున్నాము అంటే అది పి.వి.చలవే అని విస్పష్టం గా తెలిపారు .సంస్థా గతం గా కాంగ్రెస్ కు ఆయన చేసిన సేవలు మరచి పోలేనివి .అని తన ప్రసంగ పాఠాన్ని పక్కన పెట్టి  ,extempor గా అనర్గళం గా ప్రణబ్ దాదా మాట్లాడటం ఎంతో గొప్ప గా ఉంది .మనస్సంతా పి.వి.ని నింపుకొని మాట్లాడారు ముఖర్జీ సాబ్ .తన ప్రసంగ పాఠాన్ని కార్య కర్తలకు అందజేసి వెళ్తానని చెప్పారు ప్రెసిడెంట్ ముఖర్జీ .నిజం గానే ఇది ఘన నివాళి అని పించింది .సోనియా ,మన పి..వి.నిఅన్ని రకాల అవమానాలు చేసినా ఆంధ్రులం మనం నోరు మూసుకు కూర్చున్నాం .మన శాసన సభ్యులు ,పార్ల మెంట్ సభ్యులు అవమానాన్ని దిగ మింగుకొని ఏమీ చేయలేని అచేతన స్తితిలో ఇంత కాలం ఉండి పోవటం తెలుగు జాతికి అత్యంత అవమానం .ఇంకో రాష్ట్రం వారెవ్వరూ ఇంత నిర్లజ్జగా ఒక మహా నాయకుడిని ఆవ మానిస్తుంటే ఊర్కోరు .తగిన బుద్ధి చెప్పి అన్ని రకాలా అంటే రాజ కీయం గా నైనా దెబ్బ తీస్తారు .కాని మనం నిర్వీర్య్లమే అయాం .యే కొద్ది మందో ఆయన్ను మనస్పూర్తిగా శ్లాఘించిన వారున్నారు .వారైనా ఉన్నందుకు అభి నందనాలు .ఇలాంటి సమయం లో ప్రెసిడెంట్ పదవి లో ఉన్న ఒక గొప్ప వ్యక్తీ వచ్చి ,ఈ సభలో పాల్గొని పి.వి.ప్రతిభా పాటవాలను ప్రజ్ఞా నైపుణ్యాన్ని  మనస్పూర్తిగా శ్లాఘించటం నాకు సాహసమే నని పించింది .ఇన్నాళ్ళకు ఒక మంచి పని జరిగింది అందరికి అభినందనాలు హేమ్ .టి.వి.అధినేత రామ చంద్ర మూర్తి గారిని మనసారా అభి నందిస్తున్నాను –మీ దుర్గా ప్రసాద్ 

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -50 (చివరి భాగం ) వీళ్ళూ మా వాళ్ళే

 ఊసుల్లో ఉయ్యూరు -50 (చివరి భాగం )

                వీళ్ళూ మా వాళ్ళే

ఊసుల్లో ఉయ్యూరు లో ఎంతో మందిమా ఊరి  ప్రముఖులను ,మా బంధు గణాన్ని,మాఊరి సంబరాలను వృ త్తుల్నీ ,కళలను ,పండుగలను అన్నీ నాకు గుర్తున్నంత వరకు రాశాను .రాస్తూ పోతుంటే ఎన్నో ఉంటాయి .ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి  .కనుక ఈ ఎపిసోడ్ తో స్వస్తి పలుకు తున్నాను .దీనిలో మా ఊళ్ళో మాకు నిత్యం కన పడ్డ వారు ,ఏదో కొంత వారిలో మాకేదో ప్రత్యేకత కని పించిన వారు ,నవ్వించే వారో లేక మేం వారిని చూసి నవ్వినా వారో ,ఉంటారు .వారినేవరినీ కించ పరచే ఉద్దేశ్యం కాదు .వారిని గుర్తించిన వారు ఉండరని  వారు కూడా అందరికో  కొందరికో  దృష్టిలో పడిన వారే నని తెలియ జేస్తూ ‘’వీళ్ళూ మా వాళ్ళే ‘’అన్నాను .

          గుండు అంజయ్య గారు అని ఒక షావుకారు గారుందే వాడు .లావు మనిషి .పెద్ద పొట్ట .ఊర తాతయ్య గారి మామ గారు ..డబ్బు పెట్టు బడి అంతా ఆయనదే ననే వారు బుర్ర మీసాలు .చిన్న తుండు కట్టుకొని అరుగు మీద కూర్చుని చుట్ట తాగుతూ దారిన పోయే వారిని పలకరిస్తూ బూతు  మాటలంటూ ,అని పించుకొంటు ఉండే వాడు .తాతయ్య గారి అబ్బాయి మల్లి కార్జున రావు(ఊర మల్లి ) ను దత్తత చేసు కోన్నాడని మొదట్లో గుండు అంజయ్య గారి పేరే లైసెన్సు తీసుకొని కొత్త వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాతా తన పేర మార్చుకున్నట్లు జ్ఞాపకం .’’ఇహి ఇహి ‘’అని నవ్వుతు మాట్లడే వాడు .అందరితోను చలోక్తులేసి నవ్వుతు నవ్వించే వాడు

          ఇవాళ పట్టాభి స్వీట్స్ అన్న దుకాణం అసలు యజమాని కూడా చాలా లావుగా పంచె చొక్కాతో నుదుట నామం తో ఉండేవాడు .అప్పటికే స్వీట్ షాప్ బాగా నడిపే వాడు .మంచి పెరేఉండేది .తన వ్యాపారం గొడవే తప్ప మిగతా వాటిలో జోక్యం ఉండేది కాదు

             బూర గడ్డ బసవయ్య గారు కూడా గొప్ప వ్యాపారి .రావి చెట్టు బజార లో చెట్టుకు ఎదురుగా ఇల్లు .వద్డీ వ్యాపారం బాగా చేసే వాడని అనే వారు .లుంగీ తో పైన కాశీ తువ్వాలతో వీధి అరుగు మీద కూర్చునే వారు .వ్యవహారానికి ప్రసిద్ధి అనుకొనే వారు .ఊరిలో పెద్ద మనిషి గా చెలామణీ .వాళ్ళ అబ్బాయి నాగేశ్వర రావు ఉయ్యూరు సెంటర్ లో కొట్టు పెట్టాడు మంచి సరుకు కోసం అక్కడికే వెళ్ళే వాళ్ళం .

              వెంట్ర ప్రగడ భోగేంద్రుడు అనే వ్యాపారి చాలా పెద్ద కిరాణా షాప్ ను నిర్వ హించే వాడు .ప్రక్క గ్రామాల నుండి వచ్చి సరుకు కొనుక్కునే వారు నాణ్యమైన సరుక్కు భోగేన్ద్రుడే చిరునామా .బాగా సంపాదించాడు .ఉయ్యూరు కిరాణాషాపుల్లో మకుటం లేని మహా రాజు గా వెలిగాడు దాదాపు పదిహేనేళ్ళు .ఆ తర్వాత ఏమయిందో పూర్తిగా డౌన్ అయింది వ్యాపారం .ఒకబ్బాయి నాకు హైస్కూల్ లో క్లాస్ మేట్ .కాని ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయలేక పోయాడు మగపిల్లలకు చదువు అబ్బలేదు వ్యాపారం ,ఆస్తి అన్నీ పోయాయి .దివాలా తీశాడు పాపం .

  మిఠాయి రాఘవులు మా నాన్న శిష్యుడు .మొదట్లో మిఠాయి దుకాణమే .భారీ మనిషి పంచె లాల్చీ తో ఉండే వాడు .తర్వాత కట్టెల దుకాణం శివాలయం ఎదురు గా స్వంత స్తలం లో పెట్టాడు మాకు అక్కడే ఖాతా .అప్పు తో తెచ్చుకొని తీరుస్తుందే వాళ్ళం .పెద్ద పెద్ద బొగ్గుల బస్తాలు కొనే వాళ్ళం బస్తా రెండు రూపాయలే తర్వాతా పెరిగి పోయింది .నుదుట సన్నని నామం పెట్టె వాడు .నవ్వుతు పలకరించే వాడు అతని  భార్య సన్నగా ,పొడుగ్గా ఉండేది .అతను చని పోయినా అక్కడే కొనే వాళ్ళం తుమ్మ కట్టలే కొనే వాళ్ళం

             శివ రామయ్య అనే ఆయన సెంటర్ లో కట్టెల దుకాణం నడిపాడు సన్నని మనిషి పంచె చొక్కా వేసే వాడు .అప్పు పెట్టి నాన్న టైం నుండి అక్కడే కొని జీతాల్లో డబ్బులు ఇచ్చే వాళ్ళం మంచి వాడు కమ్మ వారు .తర్వాత రంపం మిల్లు దగ్గరే తుమ్మ పోరాట్లు కొనే వాళ్ళం .నిలిచి కాలేవి అంతా బొగ్గే .భలే లాభ సాటి గా ఉండేది

          తాడేపల్లి ఖాదర్ అని ఒక వైశ్యుడు నాకు క్లాస్ మేట్ .అతని తండ్రి పెద్ద బానలాంటి పొట్టతో పొట్టిగా ఉండేవాడు గోచీ పోసి పంచె  మోకాళ్ళకు పైగా ఉండేట్లు కట్టే వాడు .పొగాకు వ్యాపారం చేసే వాడు .ఎవరితోను మాట్లాడే వాడు కాదు ఖాదర్ ఆర్ .ఎస్.ఎస్.లో ముఖ్య కార్య కర్త .తర్వాత పిండి మర పెట్టాడు

      నెప్పల్లి మల్లికార్జున రావు అనే కమ్మాయన నాన్నకు సహాధ్యాయి కాంగ్రెస్ నాయకుడు .బట్టల వ్యాపారం చేసే వాడు అప్పుడు ఆయనే పెద్ద వస్త్ర వ్యాపారి .ఆయన షాపు ఇల్లు ఇప్పుడు లక్ష్మీ టాకీస్ ఎదుట ఉండేది .ఆయన కొట్లోనే ఇంటికి కావలసిన బట్టలన్నీ కొనే వాడు మా నాన్న .ఆయన కూతురు మా రెండో అక్కయ్య దుర్గ కు క్లాస్ మేట్ .ఆయన ఖద్దరు పంచె ,లాల్చీ ఉత్తరీయం తో నె ఎప్పుడూ ఉండే వాడు ముఖాన నిలువు యెర్ర బొట్టుండేది .వాళ్ళబ్బాయి గాంధి నేను ఉయ్యూరు హైస్కూల్ లో పని చేస్తున్నప్పుడు శిష్యుడు .గొప్ప వాలీ బాల్ బాడ్ మింటన్ ఆట గాడు .మేస్టర్ల తో కలిసి ఆడే వాడు ఆడించే వాడు మల్లికార్జున రావు గారు కాకాని వెంకట రత్నం గారికి దగ్గరి వాడు .ఉయ్యూరు రాజకీయం లో ఆయన మాట చెల్లు బాటయ్యేది

           వెంట్ర ప్రగడ రామ బ్రహ్మం వడ్డీ వ్యాపారి .రాజా గారి కోటను కొన్న డబ్బున్న షావుకారు .తాకట్టు పై డబ్బు అప్పిచ్చే వాడు .లావు పొట్ట తో కదలటం కష్టం గా ఉండే మనిషి .జనాలతో డబ్బు సంబంధాలే తప్ప మిగిలిన వేమీలేవు .వాళ్ళ తమ్ముడు  కుటుంబ రావు .ఈయనకు పూర్తీ వ్యతి రేకం మోటార్ సైకిల్ మహా వేగం గా ,లాఘవం గా నడిపెవాడని పేరు .ఆ వేగానికి మా ఊళ్ళో ఒక కధ చెప్పే వారు .ఒక సారి ఏదో పని మీద అన్న ను ఎక్కించుకొని కుటుంబ రావు మోటార్ సైకిల్ పై బందరు బయల్దేరాడు .పెద్ద వాడు అన్న ఉన్నాడని కొంచెం నెమ్మదిగా నె తోల్తున్నాదట .’’ఎరా తమ్ముడూ !నువ్వేదో బాగా స్పీడ్ గా నడుపుతావని అందరు అంటారు ఇదేనా స్పీడు ?’’అన్నాడట .ఇంకే ముంది తమ్ముడు రెచ్చి పోయాడు .పామర్రు దగ్గర వెనక్కి తిరిగి చూస్తె అన్న కని పించాలేదట .దారిలో ఎక్కడో ఆ స్పీడ్ కి పడి పోయాట్ట .మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తె నడుం విరిగి రోడ్డు మీద పది ఉన్నాడు  రామ బ్రహ్మం .అప్పటి నుండి ఆయన నడుం పట్టేసి, లేవ లేక పోయే వాడు వాళ్ళ అబ్బాయిలే డిబి.ఆర్ ‘’బట్టల దుకాణం నడుపుతున్నారు .

        కోలచల చలపతి మా కంటే పెద్ద వాడు మంచి మాట కారి వ్యవహార దక్షుడు ,రాజకీయం బాగా తెలుసు .మా వార్డు మెంబరు .నా ట్రాన్స్ ఫర్ కోసం ఎప్పుడూ సహాయం చేసే వాడు బండ బూతులు ధారాళం గా వచ్చిన వాడు .అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించే వాడు .వాళ్ళ ఇంట్లో ఉసిరి చెట్టుకింద కార్తీక వన సమారాధన చేసే వాడు మమ్మల్ని పిలిచే వాడు ఇంటిల్లి పాతీ వెళ్ళే వాళ్ళం యెర్రని మనిషి వెడల్పు ముఖం ఎప్పుడు గ్లాస్కో లుంగీ చొక్కా  తో ఉండేవాడు ఒక రకం గా నాకు ‘’గాడ్ ఫాదర్ ‘’అసలు పేరు వెంకటా చల పతి

                 గోవింద రాజు సత్యం –పొడుగ్గా యెర్ర లుంగీతో చొక్క తో ఎర్రగా ఉండే వాడు మంచి మాటకారి చలపతికి స్నేహితుడు బంధువు .వ్యవసాయం చేసే వాడు ఉయ్యూరు శివాలయం లో హరికధలుఏర్పాటు చేసిన ఘనుడు చాలా ఏళ్ళు అద్భుతం గా నిర్వ హించాడు .తక్కువ వయసు లోనే చని పోయాడు .

          యన మండ్ర సు బ్రహ్మణ్యం కొద్దిగా గుర్తు .కుటుంబయ్య గారి అబ్బాయి మా ఇళ్ళ దగ్గర ఉండే వాడు .ఆర్ ఎస్ .ఎస్ మనిషి .బాగా బలిస్టుడు ,గొప్ప తిండి పుష్టి కల వాడని చల పతే చెప్పే వాడు .దానికి ఒక విషయం చెప్పేవాడు .అతన్ని తద్దినం రోజున బ్రాహ్మ నార్తానికి పిలిస్తే ,చేసిన వన్నీ తినేసి గిన్నెలు ఖాళీ చేసే వాడట .ఇంట్లో వాళ్ళకోసం మళ్ళీ వండుకో వాల్సి వచ్చేదట .తక్కువ వయసులోనే చని పోయాడు వాళ్ళ అన్నయ్య పేరయ్య గారు కే;సి.పి.లో ఉద్యోగి మాకు కాఫీ పొడి పంచదార స్టోర్స్ నుండి తెచ్చి పెట్టె వాడు తమ్ముడు సత్య నారాయణ తెలుగు పండిట్ మంచి  వక్త .తండ్రి పేరయ్య గారు బలే సరదా మనిషి .నవ్వ కుండా మాటలతో నవ్వించే వాడు .పెద్ద పొట్ట అన్గోస్త్రం తోనే ఉండే వాడేప్పుడు ,యాయ వారం చేసే వాడు

     గోవింద రాజుల శ్రీ రామ మూర్తి గారు ఊళ్ళో పెద్ద మనిషి నిజాయితీ పరుడు వ్యవసాయం చేసే వారు స్తితి పరుడు .అందరికి తలలో నాలుక .ఉయ్యూరు శివాలయం ఈవిధం గా అభి వృద్ధి చెందింది అంటే ఆయన పుణ్యమే నిర్మాణ కమిటీ అధ్యక్షుడి గా ఉండి అందరి వద్దా చందాలు వసూలు చేసి అనేక మంది దేవతల ప్రతిష్టలు చేయించారు .దీనికి చల పతి ,ఆయన తమ్ముడు సత్యం కూడా బాగా తోడ్పడ్డారు .

 

         వారణాసి సదాశివ రావు గారు మేజిస్ట్రేట్ గా బందరు లో పని చేశారు ..వితరణ శీలి .వ్యవహార దక్షుడు .సహస్ర ఘటాభిషేకం వేద సభలు ,నిర్వహణ లో ముందుండే వారు .వీరికి సాయం మా నాన్న గారు, చోడవరపు చంద్ర శేఖర రావు ,మా మామయ్య గంగయ్య గారు ,బావ మరిది ఆదిరాజు నరసింహా రావు మొదలైన వారు

           చెరుకు పల్లి నరసింహ శాస్త్రి గారు నాన్న గారికి గురువు .వృద్దు .భార్య అన్న పూర్ణమ్మ గారు .పార్వతీ పరమేశ్వరులు గా ఉండే వారు .నృసింహ జయంతి బాగా చేసి బ్రాహ్మణు లందరికి సంతర్పణ చేసే వారు .చెవులకు బంగారు పోగులు .దబ్బపండు ఛాయా .ఎత్తరి మనిషి .తల ఊగుతూ ఉండేది .శాస్త్రాలు ,వేదం బాగా చదివిన వారట .చాలా మంది ఆయనకు శిష్యులున్నారు మా మామయ్యతో సహా .

            సూరి శోభనా చాల పతి గారిల్లు మా ఇంటికి ఎదురిల్లె ఉదయం సాయంత్రం వీధి అరుగు మీద కూర్చొనే వారు ఒక కన్ను మూసి మాట్లాడటం ఆయనకు అల వాటు .మా  స్నేహితుడు సూరి నరసింహా నికి అన్నయ్య .కాంగ్రెస్ వాడు .గాంధీ గారు ఉయ్యూరు వచ్చినప్పుడు ఈయనే అందరికి వాళ్ళ ఇంట్లో వంట చేయించి అస్పృశ్యతను పాటించ కుండా భోజనాలు పెట్టారని చెప్పుకొనే వారు .నేను మా తమ్ముడు మోహన్ అంటే మహా ప్రేమ చూపించే వారు .ఆ రోజుల్లో మేమిద్దరం ఒకే రక మైన డ్రెస్ వేసే వాళ్ళం ఆయన కంట పడితే ‘’ఒర్ నాయన్నాయన!ఈ ఊరి వాళ్ళ కళ్ళు మంచివి కావు మీకు దిష్టి తగుల్తుంది అలా ఒకే రక మైన బట్టలు వేసుకోకండి నాయనా “’అని చెప్పే వారు.ఆయన మాట మేము పాటించాం .ఆయన కుమారుడే ‘’గోవా వీరుడు రామం ‘’అనే సూరి సీతా రాం .

          సూరి బుచ్చి రామయ్య గారు నరసింహం తండ్రి. మా చిన్నప్పుడే ఆయనకు ఎనభై ఏళ్ళు ఎలిమెంటరి స్కూల్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయారు .రెండో భార్య మంగమ్మ గారు నరసింహానికి తల్లి.కంది పచ్చడి బాగా చేసేది .వాళ్ళింట్లో పచ్చడి చేస్తే మాకు తప్పక పంపించేది ‘’దుర్గా ప్రసాదూ ‘’అని ఆప్యాయం గా పలకరించేది  శోభనా చలపతి గారు మొదటి భార్య కొడుకు .‘నరసింహం ఇంటి పక్కనే సూరి వెంకటప్పయ్య గారుండే వారు .వాళ్ళబ్బాయే పార్ది మేష్టారు .ఈయనా ఎక్కడో మేస్టేరి  చేసి రిటైర్ అయారు .భార్య అన్న పూర్ణమ్మ గారు దొడ్డ ఇల్లాలు

     సుబ్రహ్మణ్యం అని విశ్వ బ్రాహ్మణుడు మంచి బంగారు నగలు చేసేవాడు .మా చిన్నప్పటికే చాలా పెద్ద వాడు .నీరు కావి పంచ కట్టు కొని చొక్కా తో వచ్చే వాడుఇంటికి. నమ్మ కస్తుడు .ఆయనకు బంగారమిస్తే భయమే ఉండేదికాదని అందరి అభిప్రాయం .చెవులకు పోగులు కిందికి జారిపోతున్న కళ్ళ జోడు దానికి చెవులకు తాడు  కింది చూపు .తల ఊగుతూ ఉండేది .కాని అదే బజారు లో ఇంకో విశ్వ బ్రాహ్మనుడుండే వాడు .పేరు ఉమా పతి .రాత్రిళ్ళు రామ భజన చేసే వాడు. కాని బంగారం ఇస్తే అసలు వచ్చేది కాదు కల్తీ బంగారం తో చేసి తిప్పి తిప్పి విసుగు వచ్చిన తర్వాతా ఇచ్చే వాడు అతని మోసం బయట పడి అరెస్ట్ కూడా చేశారు దుకాణం ఎత్తేసి బెజ వాడ పోయాడు .మేమూ ఆయన చేతిలో మోసపోయాం .ఇక్కడే చేవూరి కనక రత్నం గారు గొప్ప హరికధకుడు ఉండే వాడు .ఉయ్యూరు లో పేరు లేదు కాని బందరులో బ్రహ్మ రధం పట్టే వారు ఒళ్లంతా బంగారం తో పట్టు పంచె శాలువా తో ఉండే వాడు .బంగారం పనీ చేసే వాడు .’’పెళ్ళి కొడుకు ‘’అని పిలిచే వారు .కాని కొడుకులుచేతికి అంది రాలేదు వైభవం అంతా పోయింది చాలా దీనం గా బతికాడు చివరి రోజుల్లో .

       వెన్న పూస సుబ్బమ్మ –అనే ఆవిడ తండ్రి దగ్గర ఉండి వెన్నా ,నెయ్యి వ్యాపారం చేసేది వీసేలకు వీసేలు వెన్న కొనే వాళ్ళం అప్పు పెట్టటం తీర్చటం .జీతం దానికే సరిపోయేది ఆమె పెంపుడు కొడుకే మండా వీర భద్ర రావు మా ఆంజనేయ దేవాలయం నిర్మాణానికి నాకు గొప్ప గా సహకరించాడు .నేను వెనక్కి తగ్గి నప్పుడల్లా నాకు స్పూర్తినిచ్చే వాడు .ఊళ్ళో ఎంతో మంది ధనికులున్నా అతన్నే నేను నమ్మి నిర్మాణం అప్పగించాను .నిజాయితీకి మారు పేరు .ఆర్ ఎస్ .ఎస్ వర్కర్ .నిదానస్తుడు .అలాగే లంకా సంజీవ రావు గారు విద్యుత్ శాఖ లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు .ఆయనా నేను వీర భద్ర రావు కాలికి బలపం కట్టుకొని తిరిగి ఆలయం నిర్మించటానికి కృషి చేశాం వారిద్దరూ లేక పోతే నిర్మాణం విషయం లో నేను ముందుకు వెళ్ళే వాణ్ణి కాను సంజీవ రావు గారు గొప్ప అ హనుమద్ భక్తుడు .మా ఇద్దరినీ ఎప్పుడు హెచ్చ రించి పని చేయించే వాడు ఈ ఇద్దరు స్వర్గస్తులయారు .

                ఆముదం వ్యాపారం  అమోఘం గా చేసిన వాడు నూనె చంద్రయ్య .ఇంటి పేరు తేలేదు .ఎర్రగా నుదుట యెర్రని నిలువు బొట్టు గోచీపోసి తెల్ల పంచ తెల్ల చొక్కా తో వచ్చే వాడు , చేతిలో ఒక డబ్బా దానిలో కోల పాత్రలు ,తుడుచుకొనే గుడ్డ ,చేత్తో ఇంకో డబ్బా అందులో ఆముదం నూనె దానికి ఒక నాజిల్ తో ప్రత్యక్షం .మంచి ఆముదం అమ్ముతాడని పేరు ఎక్కడో విదేశం లోను వంట వాడిగా పని చేశాడని మైనేని గోపాల కృష్ణ గారు చెప్పారు తెలగ కులస్తుడు ..అయితే కాకాని వెంకట రత్నం గారి కాంగ్రెస్ సభలకు ఉప్మా చేయటం నాకు తెలుసు. బాగా రుచిగా చేసే వాడు .ఆదినారాయణ అనే మా స్నేహితుడు తీసుకొని వెళ్ళే వాడు తర్వాతపూర్తీ గా వంట చంద్రయ్య అయ్యాడు బాగా పేరు తెచ్చుకొన్నాడు .వాళ్ళబ్బాయి కూడా దీనిలోనే ఉన్నాడు చంద్రయ్య మాట కొంత యాస గా తమాషా గా ఉండేది .అలానే ఆముదం అమ్మే వైశ్యుడు ఒకాయన  సీతా రామయ్య ఉండే వాడు ఇళ్లకు వచ్చి ఆముదం పోసే వాడు .తర్వాతా ఆముదం అమ్మకాలు తగ్గితే ఇడ్లీ ళు ఇంటింటికి తెచ్చి అమ్మే వాడు .తర్వాతా మిగిలిన నూనెలూ వేరిద్దరూ అమ్మే వారని విన్నాను .

          సీతం రాజు సత్య నారాయణ గారు ‘’ఆంధ్రా  టై ప్ ఇన్స్టిట్యుట్ ‘’పెట్టి టైపు షార్ట్ హాండ్ వేలాది మందికి నేర్పించి ఉద్యోగా వకశాలు కల్పించిన ముందు చూపున్న మనిషి .ఎర్రగా గ్లాస్కో పంచె ఖద్దర్ లాల్చితో ఉండే వారు .కొంచెం చిరుబురులాడే తత్వమే అయినా మంచి ఆలోచనా పరుడు బ్రాహ్మణ సంఘాన్ని చావ కుండా కాపాడిన వాడు. నేనూ మా తమ్ముడు కూడా ఆయన శిష్యులమే .

             కొబ్బరి తోట దగ్గర తల్లా  వఝల సూర్యం అనే ఆయన బాగా బలిష్టుడు మినీ భీముడి లా ఉండేవాడు.స్వంత ఇల్లు ఉండేది కొడుకు రాజా అతని అన్న రాజేంద్ర మాతో చదువు కొన్నారు సీతం రాజు కోటేశ్వర రావు గారి ప్రైవేట్ లో చదివే వారు .సూర్యం గారికి పాపం పిచ్చి ఎక్కింది .మా చిన్నప్పటి నుంచి అంతే .లావు పాటి గొలుసులతో ఇంట్లో కట్టేసే వారు .అయినా తెంపుకొని బజార్లోకి వచ్చే వాడు బాగా తిట్టే వాడు .పాపం ఆయన్ను మళ్ళీ ఇంట్లోకి తీసుకు వెళ్లటం బ్రహ్మ ప్రళయం అయ్యేది .విధి కృతం .

               వెంట్ర ప్రగడ మాణిక్యం, వెంకటేశ్వరు తల్లి కొడుకులు .మా ఇంటికి ముందు ఇల్లు వెన్న పూసవ్యాపారం ,మాణిక్యం మడికట్టుకోనేది .దేవర పల్లి పుట్టిన ఊరు .అక్కడి నుంచి వెన్న డబ్బాలతో వచ్చేది వీళ్ళ దగ్గరే కొనే వాళ్ళం పద్దు రాయటం తీర్చటం వీసె రెండు రూపాయలే వెంకటేశ్వర్లు చిల్లర దుకాణం కూడా నడిపాడు ..సరుకులు అక్కడే .పద్దు పుస్తకం ఉండేది .వచ్చి నప్పుడు డబ్బు ఇచ్చే వాళ్ళం .అడిగే వాడు కాదు .పద్దు పుస్తకం ఉంటె అప్పు ఎక్కు వచేస్తామని పుస్తకం తీసేసి డబ్బు ఇచ్చి కొనటం మొదలు పెట్టాం .అప్పుడు డబ్బు విలువ తెలిసింది .ఇంట్లో గేదెలు, పాలు ఉన్నా, వెన్న కొనే వాళ్ళం అదే తమాషా .వీళ్ళపక్కనే వెంట్ర ప్రగడ పిచ్చయ్య ఇల్లు సాహసానికి మారు పేరు .ఎక్కడైనా దొంగతనాలు జరిగినా, అగ్ని ప్రమాదాలు జరిగినా ఈ బక్క పలుచటి మనిషి పరిగెత్తుకొని వెళ్ళి సాయం చేసే వాడు వైశ్యుడు అయినా  భయం యే కోశానా లేని వాడు .ఎప్పుడు తెల్ల లుంగి తెల్ల చొక్క తో ఉండే వాడు గెల్లి వాళ్ళ బట్టల కొట్లో గుమాస్తా చేశాడు .వీళ్ళ ఇంటి  పక్కనే వెంట్ర ప్రగడ సాంబయ్య గారిల్లు .మాంచి మాట కారి ,నల్ల గా బారుగా ఉండే వాడు వెంకటరత్నం గారి అబ్బాయి తండ్రి బంది పోటు దొంగలను మా తాతయ్య నరసింహం గారు సింగిరి శాస్త్రి గార్లతో కలిసి ఎదిరించారట . సాంబయ్య గారు ఒట్టిపిరికి .ఎవరైనా డబ్బు అప్పు అడిగితే రేపు మాపు అని తిప్పేవాడు విసుగొచ్చి వాడు మానేయాల్సిందే

                 పామర్తి సీతా రామయ్య గారని శాయి పురం ఆయన మా ఇళ్లకు ప్రతి వారం వచ్చే వాడు మాటల పోగు మా నరసింహం తాతకు అంతే వాసి .ఆయనా సీతం రాజు లక్ష్మీ నారాయణ గారు, తాతయ్య అనేక ఊళ్లు తిరిగి చందాలు పోగు చేసి కనక వల్లి లో మా మామయ్యా వాళ్ళు ప్రతిష్టించి నిర్మించిన శివాలయ నిర్మాణానికి ఎంతో తోడ్పడ్డారు .ఉయ్యూరు అంటే వాం వాటర్ కు ప్రసిద్ధి .కంతేటి విశ్వనాధం తయారు చేసే వాడు కడుపు నొప్పికి గొప్ప వైద్యం మంచి వ్యాపారం దానితో చేశాడాయన ..కాటూరు రోడ్డులో పొగాకు ముసలయ్య కు వడ్ల మర ఉండేది నీర్కావి పంచె చొక్కా మీసాలు యెర్ర బొట్టు తో ఉండేవాడు .మిల్లు బాగా నడిచేది .ఆదిరాజు చంద్ర మౌళీశ్వర రావు గారి దంపుడు మిల్లు కంతేటి వారి అతుకుల మిల్లు ప్రసిద్ధి చెందాయి ఉమా ప్రెస్ స్తాపించి ప్రింటింగ్ ను ఉయ్యూరు లో మొదలు పెట్టిన వారు చంద్ర మౌళీశ్వర రావు గారు .వాళ్ళ అబ్బాయిల్లో రాధుడు నా క్లాస్ మేట్ .ఆనంద మోహన్ సినీ డైరెక్టర్ .కృష్ణ మోహన్ స్టేజి నటుడు .

          చివరి గా మా నరసింహం  తాత గురించి రాస్తున్నాను .మా అమ్మకు బాబాయి నల్లగా తుమ్మ మొద్దు రంగు .విభూతి ,రుద్రాక్షలు నుదుట కుంకుమ బొట్టు మోకాలి పైకి పంచె చొక్కా .అసలు వేసే వాడే కాదు .మద్రాస్ వెళ్ళినా యే ఊరేల్లినా చొక్కా ఉండేది కాదు .చూస్తేనే వణుకు పుట్టించే వాడు వేదం బాగా నేర్చిన వాడు పరీక్షించే సత్తా ఉన్న వాడు వ్యవహార దక్షుడు .లా పాయింట్లు బాగా తెలిసిన వాడు .మా చిన్నపటికే చాలా  ముసలి వాడు నా  ఉపనయననానికి ఉన్నాడు కోర్టుకు వెళ్తే గెలవటమే .మా నాన్న హిందూ  పూర్ లో పని చేస్తుంటే ,ఇంటి వ్యవహారాలు అ గ్రహారం వ్యవహారాలూ ,ఇక్కడి పొలం వ్యవహారాలూ అన్నీ ఆయనే చూసే వాడు .నిక్కచ్చి అయిన మనిషి.బండ బూతులు కూడా తిట్టే వాడు .తురకం బాగా మాట్లాడే వాడు .మా అమ్మను ‘’అమ్మాయ్ ‘’అని మా మామయ్యను ‘’అబ్బాయ్ ‘’అని ప్రేమ గా పిలిచే వాడు .మా కొంపా గోడు నిలిచి ఇప్పటికి ఇలా ఉన్నాము అంటే ఆయన చలవే .

        ఇలా తవ్వుకొంటు పోతుంటే జ్ఞాపకాల పాతర లో ఏదో ఒకటి దొరుకు తూనే ఉంటుంది .వీరందరూ మా పై ఏదో విషయం లో ప్రభావం చూపిన వారే అందుకే వారిని స్మరించాను అది నా ధర్మం, కర్తవ్యమ్ గా భావించాను .కనుక‘’ఎందరో మహాను భావులు –అందరికి వందనములు ‘’అని ముగిస్తున్నాను .

           ఏదో ఆషామాషీ గా ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’మొదలు పెట్టి రాయటం ప్రారంభించాను .ఒక ప్రణాళిక లేదు .జ్ఞాపకం వచ్చిన విషయాలను రాశాను. నా జ్ఞాపక శక్తి పై నాకే అను మానం .అందుకే సంవత్సరాలు డేట్ల జోలికి పోలేదుఎక్కువ గా .వీటిని చదువుతూ నన్ను ప్రోత్స హించిన వారు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు .కొంత అదనపు సమాచారం కూడా వారు నాకు అందించారు .అలాగే ఇంకా ఆసక్తితో చదివి నన్ను ప్రోత్సహించిన వారు ప్రఖ్యాత ఆర్ధిక శాస్త్ర వేత్త శ్రీ ఆరిక పూడి ప్రేమ్  చంద్ గారు .బాగున్న వాటి పై వెంటనే స్పందించే వారు .నన్ను ‘’మేస్టారూ ‘’అని సంబోధిస్తూ ఎత్తు పీట మీద కూర్చో పెట్టి మెయిల్స్ రాస్తారు .మెచ్చుకొంటారు తగ్గిన సమాచారాన్ని అందిస్తారు .ఇవి రాస్తూనె ఉండండి .పుస్తక రూపం లో తెస్తే బాగుంటుంది అన్న సూచనా చేశారు నేను అక్టోబర్ లో అమెరికా నుండి తిరిగి వచ్చి హైదరా బాద్ నుండి వారితో మాట్లాడి నప్పుడు .అది కాలం తేల్చాల్సిన సంగతి ఇన్ని అంటే యాభై ఎపి సోడ్ లు నేను రాస్తానని ఊహించనే లేదు .అలా నడిచి వెళ్ళి పోయాయి కంప్యూటర్ ముందు కూచోటం , రాయటం ప్రారంభించటమే. విషయాలు అలా తామర తంపర  గా దొర్లు కొచ్చాయి భగ వత్ సంకల్పం అని అనుకొంటాను .

               ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’అనే ఈ యాభై వ్యాసాల పరం పరను నా  శ్రేయోభి లాషి,ఆత్మీయులు, మా ఉయ్యూరు వాసి ,ఉయ్యూరు అంటే తీరని అభిమానం ఉన్న శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారికి సవినయం గా అంకితమిస్స్తున్నాను .

             సమాప్తం

           నూతన సంవత్సర శుభా కాంక్షలతో

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31-12-12-

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

కాశీ ఖండం -43 సప్తర్షి యాత్ర

  కాశీ ఖండం -43

                           సప్తర్షి యాత్ర

  ప్రతి నెల పంచమి తిది నాడు సప్తర్షి యాత్ర చేస్తే ధర్మబుద్ధి ,వృద్ధి అవుతుంది .

జంగం వాడీ దగ్గర కశ్యాపెశ్వరుడు  ,కాదయాకీ చొక్ వద్ద అత్రీశ్వరుడు (ఇప్పుడిది లేదు ),నాగ కూపం దగ్గ్గర మరీచీశ్వరుడు ,గోదేలియా కాశీ నరేష్ సమీపం లో గౌత మేశ్వరుడు ,మణికర్ణికా స్వర్గ ద్వారం వద్ద పులస్త్యేశ్వరుడు ,సంకట ఘాట్ వద్ద వసిష్టేశ్వరుడు ,,అరున్ధతీశ్వర దర్శనం తో సప్తర్షి యాత్ర పూర్తీ

                           నవ దుర్గా యాత్ర

             ప్రతినెలా అష్టమి లేక నవమి తిధులలో ఈ యాత్ర చేయాలి తొమ్మిది రోజుల్లో తొమ్మిది దుర్గ లను సందర్శించాలి ఇదే చండీ యాత్ర అనీ అంటారు

 వరుణా నది ఒడ్డున –శైల పుత్రీ దుర్గా దేవి ,పంచ గంగా ఘాట్ వద్ద –బ్బ్రహ్మ చారిణీ దుర్గా దేవీ ,చందూకీ వద్ద –చిత్ర ఘంటా దుర్గా దేవి ,దుర్గా కుండం అంటే ప్రసిద్ధి వద్ద –కూష్మాండ దుర్గా దేవి ,జిత పురా లో స్కంద మాతా లేక వాగీశ్వరి దుర్గా దేవి ,ఆత్మ వీరేశ్వర మందిరం లో కాత్యాయినీ దుర్గా దేవి ,కాళికా గల్లి లో –కాల రాత్రీ దుర్గా దేవి పంచ గంగ దగ్గర మహా గౌరీ దుర్గా దేవి లేక మంగళ గౌరీ దుర్గా దేవి ,సంకట దేవి, దుబులా వాలాలో సిద్ధి ధాత్రి దుర్గా దేవిల సందర్శనమే నవ దుర్గా యాత్ర .

                      ఏకా దశ మహా రుద్రులు

శివుడికి పద కొండు సంఖ్య చాలా ఇష్టమైనది .పద కొండు సార్లు రుద్ర మంత్రాలతో అభి షెకిస్తి మహా ప్రీతీ చెందుతాడు .కనుక ఏకాదశ రుద్ర దర్శన ,ప్రార్ధన ,పూజలు శివసాయుజ్యాన్నిస్తాయి

ఇసర్ గంగీ జాగేశ్వార్ –అగ్నీద్రేశ్వర లింగం ,ఔసాన్ గంజ్ లో ఊర్వశీశ్వర లింగ్సం ,విశ్వనాధుని దగ్గర హనుమాన్ మందిరం లో నాకు లేశ్వర లింగం ,కాశీ పురా రాజా బెంతియా ఆవరణ లో ఆశాఢేశ్వర లింగం ,రాజా దర్వాజా లో భార భూతేశ్వర లింగం ,కొనా బజార్  లో –లాంగీశ్వర లింగం ,బోలా లో ఉన్న త్రిపురాన్తకేశ్వర లింగం ,సాఖీ వినాయకుడి దగ్గరున్న –మనః ప్రకామేశ్వర లింగం ,కాళికా గల్లీ లో ప్రీతీ కేశవర లింగం ,మదాలసేశ్వర లింగం ,దుర్గా కుండం దగ్గర–తిల వర్నేశ్వర లింగ దర్శనమే ద్వాదశ మహా రుద్రా దర్శనం

                            వార యాత్రలు

ఆదివారం –సూర్య యాత్ర –లోలార్క ,ఉత్తరార్క ,సామ్బాదిత్య ,ద్రౌపదాదిత్య మయూఖాదిత్య ,ఖఖో లాదిత్య ,అరునాదిత్య ,వ్రుద్దాదిత్య ,కేశవా దిత్య ,విమలాదిత్య ,గంగా దిత్య ,యమాదిత్య లను శాస్తి సప్తమి ,లేక ఆదివారం చేస్తే పద్మక యోగం లభిస్తుంది

సోమ వారం –జ్ఞాన వాపీ స్నానం చంద్రేశ్వర దర్శనం చేయాలి సోమవారం ,అమా వాస్య కలిస్తే సోమవతీ అమా వాస్య అంటారు 

 మంగళ వారం –దుర్గా దేవి భైరవుడు ,వందీ దేవి ,అంగారకేశ్వర ,హనుమాన్ లను దర్శించాలి

అష్ట భైరవులు –హనుమాన్ ఘాట్ లో రురు భైరవ ,దుర్గాజీ ఆవరణ లో –చండా భైరవ ,వృద్ధ కాళేశ్వర్ వద్ద –అసితాంగా భైరవ ,ప్రసిద్ధం లో –కపాల భైరవ ,కామక్షా లో –క్రోధ భైరవ ,భీమ చండీ దగ్గర –ఉన్మత్త భైరవ ,త్రిలోచన గంజ్ వద్ద–సంహార భైరవ ,కాశీ పురాలో –భీషణ లేక భూత భైరవ లను దర్శిస్తే యే భయమూ ఉండదు .

 బుధ వారం –బుదేశ్వర లేక ఆత్మా వీరేశ్వర దర్శనం అధిక ఫలితాన్నిస్తుంది .బుధ వారం అస్టేమి  తిదితో కలిస్తే విశేషం

గురువారం –శుక్రేశ్వర దర్శనం చేయాలి .కాని ఇప్పుడు అందరు శ్రీ మహా లక్ష్మీ ,సంకట దేవి ,వాగీశ్వరీ దేవి లను శ్రావణ శుక్ర వారం దుర్గా దేవిని దర్శించి తరిస్తున్నారు .

శని వారం –విశ్వనాదాలయం దగ్గరున్న శనైస్చర్య దర్శనం చేయాలి శని వారం ప్రదోష కాలం లో త్రిలోచన కామేషుని ,నక్షత్రేశ్వర దర్శనం పుణ్యం

 సూర్య ,చంద్ర గ్రహణాల సమయం లో గంగా స్నానం స్నానం మోక్ష దాయకం .ఈ శ్లోకాన్ని చదువు కోవాలి

‘’కురుక్షేత్ర సమా గంగా –యత్రా కుత్రావ గాహితా –కురుక్షేత్రా ద్దశ గునా –యాత్ర విందయె న సంగాతః

తస్మాత్ సహస్ర గుణ ప్రోక్తా –యాత్ర పశ్చిమ వాహినీ –తస్మాత్ సహస్ర గుణితా –కాశ్యాం ఉత్తర వాహినీ ‘’

           దశాశ్వ మేధ ఘాట్ లో యమునా ,గంగా సంగమం జరుగుతుంది .మణి కర్ణికా కుండం లో బ్రహ్మ నాశం నుండి బ్రహ్మ ద్రవ జలం గోముఖీ ద్వారా వస్తుంది .దత్తాత్రేయ మందిరం అడుగు నుండి బయల్దేరి గంగలో కలుస్తుంది పంచ గంగా ఘాట్ లో గాభాస్తేశ్వర లింగం అడుగు నుండి ఒక జల ధార వచ్చి లీన మవుతుంది అదే కిరణా నదీ అంశ అంటారు .

                     సశేషం

              నూతన సంవత్సర శుభా కాంక్షలతో

                –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-12-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -49 మా ప్రాంతం లో అరుదై పోయిన వృక్ష సంపద

ఊసుల్లో ఉయ్యూరు -49

          మా ప్రాంతం లో అరుదై పోయిన వృక్ష సంపద

   మా చిన్న తనం లోమా ఉయ్యూరు , పరిసర ప్రాంతాలలో  ఉన్న అనేక జాతుల వృక్షాలు , పూల మొక్కలు ఆకుకూరలు ఔషధీయ మొక్కలు కంచే మొక్కలు ఇవాళ కలికానికి కూడా కని పించాకుండా పోయాయి .బహుళ అంతస్తుల భవనాల వల్ల పెరటి మొక్కలూ కరువైనాయి .ఇంటికి రక్షణ గా ఉండే అనేక రకాలైన కంచే మొక్కలు అసలు కని పించటమే లేదు .అన్నీ జ్ఞాపకం లేవు కాని జ్ఞాపకం ఉన్న సుమారు నలభై  రకాలను మాత్రమె ప్రస్తావిస్తున్నాను..ఈ పరిస్తితి అన్ని ప్రాంతాలలోను ఉండి ఉండ వచ్చు .నేను మా ప్రాంతం లో గమనించిన వాటినే దృష్టికి తెస్తున్నాను .

        మా చిన్నప్పుడు మెయిన్ రోడ్డు మీద ఎత్తైన లావు పాటి వ్రుక్షాలున్దేవి .వాటికి పొడవైన,లావైన  గోధుమ రంగుకాయలు వేలాడుతూ ఉండేవి .ఆకాలాలో ఏనుగు లపై వచ్చే రాజు గారు వారి సైన్యం విశ్రాంతి తీసుకోవ టానికి ఈ చెట్లు ఉపయోగ పడే వట .ఏనుగు లకు ఎండ వడ తగల కుండా ఇవి కాపాడేవి అందుకని వీటిని ‘’ఏనుగు ల వడ చెట్లు‘’ అనే వారు .కొందరు కొంటె కొనంగులు ఆ మూడు మాటలను కలిపి బూతు అర్ధం సృష్టించే వారు .బెజవాడ బందరు రోడ్డంతా ఈ చేట్లున్దేవి చల్లని నీడకివి ప్రత్యేకం వెడల్పు ఆకులు విస్తరించి గుబురుగా ఉండే కొమ్మల తో మార్గ గాములఅలసట తీర్చేవి అవి దాదాపు యాభై ఏళ్ళ నుంచి అసలు కని పించటమే లేదు

              అలాగే జువ్వి చెట్లు ,మర్రి చెట్లు ,రావి చెట్లు కూడా దారి వెంబడి ఉండి బాట సారులపాలిటి కల్ప వృక్షాలు గా ఉండేవి .మర్రి పళ్ళు ఎర్రగా పండి మహా ముచ్చటగా ఉండేవి .మర్రి చెట్టుకు ఊడలు దిగి బాగా విస్త రించేది మద్రాస్ లోనీ అడయార్ మర్రి వృక్షం యాత్రీకులకు సందర్శనీయం .పక్షులకు మంచి ఇష్టమైన ఆహారం ఆకులు వెడల్పుగా సందులేకుండా ఉండేవి .జువ్వి చెట్లు గొప్ప నీడ నిచ్చేవి .రావి చెట్ల పై పక్షులు గూళ్ళు కట్టుకొని హాయిగా యే చీకు చింతా లేకుండా ఉండేవి .తెల్ల వారుజ్హామున పక్షుల రొదలు కర్ణ పేయం గా విని పించేవి. కాకులు నిద్ర లేపేవి .రోడ్ల విస్తరణ ,కమ్యునికేషన్ సౌకర్యాలకోసం ఈ చెట్లనన్నిటి.ని ధ్వంసం చేశారు ..యే గంగానమ్మ గుడి దగ్గరో రచ్చ బండ దగ్గరో మనకు రావి చెట్టు కని పిస్తుంది .రావి దేవత తో సమానం .మర్రి ,రావి పెనవేసుకొంటే మహా పవిత్రం గా భావించే వారు  .అనంత పురం జిల్లాలో హిందూ పూర్ కు దగ్గర ‘’విదు రాశ్వద్ధం ‘’ప్రఖ్యాతి చెందింది .ఆశ్వత్తం  అంటే రావి. ఉయ్యూరు లో బజార్లు కూడా రవి చెట్టు బజార్ మరి కొన్ని ఊళ్ళలో మర్రి చెట్టు బజార్ ఉండేవి 

      మా ఇళ్ళల్లో తప్పకుండా బాదం చెట్టు పెంచటం అలవాటు గా ఉండేది .బాదం కాయ పండితే యెర్ర గా ఉంటుంది దాన్ని పై తోలు చక్క గా నమిలి మింగే వాళ్ళం మహా తియ్య గా ఉండేది .లోపల పొడవైన పప్పు భలే రుచి .పిల్లలకు ఆ రోజుల్లో బాల వర్ధక ఆహారం కూడా. బాదం పప్పు తినటం ఆ నాడు ఫాషన్.బాదం ఆకుల తో విస్తళ్ళు కుట్టే వాళ్ళు .అందరి భోజనాలు బాదం ఆకు విస్తల్లలోనే .ఆకులు పండ బారితే ఎర్రగా  చూట్టానికి బాగుండేవి .లేత ఆకులు నవ నవ లాడుతూ ముచ్చట గోలిపేవి .ఇప్పుడు ఎక్కడో తప్ప బాదం చెట్లు లేవు బాదం పప్పు బజార్లో కొని తినటం అలవాటైంది .అలాగే పిస్తా కూడా

         మా చిన్నతనం లో రబ్బరు చేట్లు అని ఇళ్లకు కంచే గా ఉండేవి .బాగా పెళుసైన ఓ మాదిరి వెడల్పు ఆకులతో , కాడలో చాలా సున్నితంగా ఉండేవి . .ఆకుల్ని చేత్తో పట్టుకొని మధ్యకు విరిస్తే చ ప్పుడయ్యేది అందులోంచి పాలు కారేవి .అందుకే దీన్ని రబ్బరు చెట్టు అనే వాళ్ళం .అంతే  కాని అసలు కేరళ లోనీ రబ్బరు చెట్టు కాదు .లతలా పాకేది దట్టం గా విస్త రించి పేద వాడికి దడి లాగాఉపయోగ పడేది . ..ఇప్పుడేక్కడా కని పించటం లేదు .ఎక్కడో పార్కుల్లో తప్ప .

         పూచిగ చెట్లు ఎక్కడ పడితే అక్కడ మోలిచేవి .వాటికి యెర్రని,ఆకు పచ్చని వెన్ను ఉండేది దాన్ని చివర తుంపి ఆటగాయి తనం గా అవతలి వాడికి తెలీకుండా వాడి వీపు మీద విసిరితే చొక్కాకు అంటుకు పోయేది .పూచిక చీపుళ్ళు బాగా వాడుక లో ఉండేవి వాటితోనే ఇంటి లోపల ఊడ్చే  వారు .కొబ్బరి చీపుల్లకు అసలు విలువే లేదప్పుడు .అందరు పూచిక చీపుల్లనే వాడే వారు .దాని పుల్లలు భలే సున్నితం గా మెరుస్తూ జారి పోయేట్లు బోలుగా ఉండేవి .ఇప్పుడు ఔట్ ఆఫ్ ఫాషన్ .అసలు దొరకటమే లేదు కుంచె చీపుళ్ళు వచ్చాక ఇవి కను మరుగైనాయి .అయితే వీటితో ఒక ఇబ్బంది ఉంది .పూచిక ముళ్ళు గుచ్చుకొని మహా బాధ పెట్టేవి .ఆ ముళ్ళు పోగొట్టేట్టు వాటిని బయట దులపటం ఒక ప్రహసనం ఇప్పుడు ఇంటి బయట ఊడవ టానికి కొబ్బరి ఈనెల  చీపుళ్ళు వచ్చాయి .కొంతకాల తాటాకు చీపుళ్ళు వాడే వారు .ఈత మండలతో చీపుళ్ళు చేసి పాలేల్లు ఊడ్చే వారు ఈత మండలను గుత్తిగా కర్ర చివర కట్టిఇంట్లో బూజు దులపటం ఆ నాడు సర్వ సాధారణం .ఈత చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి మా ఇంటి వెనక ఉన్న చామలి లో  అంతా ఈత పోదలే ఈత పళ్ళు మహా రుచి .ఈతాకు చాపలు నేసె వారు .వాటిని ఇళ్ళల్లో కంటే బయట కూర్చునేందుకు వాడటం సాంప్రదాయ కుటుంబాలలో ఉండేది ఇళ్ళల్లో తుంగ చాపలె వాడే వారు ..బహిర్భూమికిఈత చెట్లు మరుగ్గా బాగా ఉపయోగ పడేవి .ఊడవటానికి పోలి కట్టలు కూడా వాడే వారు పాలేల్లు రెండు చెట్ల తో దట్టమైన చీపిరి తయారు చేసే వారు . .పొలం లో ధాన్యం రాసిని పొల్లు, తాలు తప్ప,నుండి వేరు చేయటానికి బాగా ఉపయోగించేవారు పొలం గట్లఇంటి మీద దొడ్లో  విత్తనాలు వేసి వాటిని పండించే వాళ్ళు .ఆ తర్వాత కొను బడికి దొరికేవి .ఇప్పుడు కోన తానికీ అరుదై పోయాయి . కని పించటం లేదు .అలాగే ధాన్యం పండిన తర్వాతా మోపులు కట్టి,కుప్ప వేసే వారు.దాని పై మధ్య మధ్య గొబ్బి చెట్లు లేక మండలు పెట్టె వారు దిష్టి తగలకుండా  .కొంచెం నీలం రంగు పూలతో చిన్న ముళ్ళతో  చిన్న గా చేట్లుఉండేవి . పొలం గట్ల మీద మోలిచేవి ఇప్పుడవి లేవు .ఎక్కడైనా బాగా పల్లె టూళ్ళ ల్లో ఉన్నాయేమో తెలీదు

                 అలాగే ఖాళీ ప్రదేశాలలో దురద గొండి మొక్కలు బాగా మోలిచేవి .చిలిపి గా వాటి ఆకుల్ని జాగ్రత్త గా కోసి అవతలి వాడి చేతి కి ,వాడికి తెలీకుండా రుద్దే వాళ్ళం వాడు దురద గోక్కో లేక బాగా బాధ పడే వాడు అది తగిలిన చోట ఎర్రగా వాచీ పోయేది .ఇప్పుడు అది లేదు . .పల్లేరు చెట్లు కూడా బాగా ఉండేవి .కళ్ళకు చెప్పులు లేకుండా వాటి పై నడిస్తే యమ లోకం కని పించేది .పల్లేరు కాయల్ని వినాయక చవితి రోజు రాత్రి వేళ ఇళ్ళ పైకి విసరటంఒక ఆనవాయితీ.తెల్ల వారు ఝామున ఇళ్ళ నడకలో పోసేవారు పొరపాటున వాటి పైకాలు వేసి కుయ్యో మొర్రో అని అనుకుంటూ పోసిన వాడిని బండ బూతులు తిట్టే వారు అవి తిట్టించుకొనే వాడికి దీవెనలు గా భావించే వారు . .మా చామల్లో లో వెడల్పు గా దట్టం గా ఉండే చిన్న చెట్లు ఉండేవి .వాటికీ గుత్తులు గుత్తులుగా కాయలు చిన్నవి కాసేవి అ చెట్టు ఒక రకమైన వెగటు వాసన తో ఉండేది అది ఎందుకు ఉపయోగిస్తుందో తెలీదు కాని దసరాల్లో దీపం పురుగులు వేలాదిగా వస్తే వాటిని తట్టుకోవటానికి ఈ మొక్కల్ని ఇళ్ళల్లో ,గుళ్ళల్లో వేలాడ దీసే వారు అందులో చిక్కుకొని ఆ వాసన భరించ లేక చచ్చేవి. కాయలకు చారలున్డటం వీటి ప్రత్యేకత .ఇప్పుడుకాగితానికి నూనె రాసి వేలాడ దీసి దీపం పురుగుల ను అంటుకోనేట్లు చేస్తున్నారు .ఈ చెట్లూ ఆనవాలు లేవు .

     మా చామల్లో  లో కర్ర పెండలం పండించే వాళ్ళు .బాగా ఏపుగా ఎత్తు  గా పెరిగేవి కర్ర పెండలం తో సగ్గు బియ్యం తయారు చేసే వారని చెప్పుకొనే వారు .ఆ తర్వాత దాన్ని పంచ దార తయారీలోను వాడే వారని చదివా..ఇప్పుడు అసలు ఆ పంట మా ప్రాంతలో లేనే లేదు .అలాగే వెలగచెట్లు మా చేమలి లో ఉండేవి పూర్వం రాజులు ఏనుగులు గుర్రాలతో  వచ్చినప్పుడు వాటికి కట్టే సె వారట..వేలక్కాయలు ఎవరిష్టం వచ్చి నట్లు వాళ్ళు కోసుకొనే వారు .తుఫానుల్లో దారి వెంట చెట్లు ,ఈ వెలగచెట్లు అన్నీ పోయాయి ఇప్పుడు వెలగ పండు కావాలంటే బెజ వాడ మార్కెట్ లోనో శ్రీ శైలం లోనో, హైదరా బాద్ కోఠీదగ్గరో మాత్రమె దొరుకు తాయి . వెలగపచ్చడి అదుర్స్ .పెరుగులో కలిపితే మహా రుచి .వెలగ పండు గుజ్జు తీసి బెల్లం తో తింటే స్వర్గమే .అసలా వాసనే మహా గొప్ప .ఇప్పుడివి కనిపించటమే లేదు .

           ప్రతి ఇంట్లో రాచ ఉసిరి చేట్లున్దేవి .ఆ కాయలు తింటుంటే తియ్య తియ్యగా పుల్ల పుల్లగా బాగుండేవి .పిల్లలు బాగా ఇష్టపడే వారు .కాయలు గోలీకాయలంత ఉండి లోపలి చారలున్దేవి .ఉసిరి పప్పు నిలవ చేసుకొనే వారు వక్క పొడి బదులు ఉసిరి బద్ద బుగ్గన పెట్టు కొనే వారు .పైత్యాన్ని తగ్గించేది .పెద్ద ఉసిరి కొందరి దొడ్లోనే ఉండేవి ఈ ఉసిరి కిందే కార్తీక వన భోజనాలు చేయటం సంప్రదాయం .

          పూర్వం ఊరి చెరువు లన్ని తామర పూలతో కలవ పూలతో కళకళ లాడుతున్దేవి .తామ ర లక్ష్మీ ప్రదం దురద తామర కాదు మహా ప్రభో .తామర పూల వాసన ,కలువ పూల సౌరు మహాదా హ్లాదం .తామర తూడు ను మధ్య మధ్యలో తుంచి ఆ దారం తో పువ్వు కు దండ చేసే వాళ్ళం బలేగా  ఉండేది .తామర కాయలో తినే పదార్ధం ఉండేది మధురమే అది .ఇవాళ చేపల ,రొయ్యలా చెరువు లోచ్చిన తర్వాత ఈ చెరువులే లేవు. కొన్ని పల్లె టూళ్ళ లో ఇంకా తామర ,కలువ ఉండటం చూశా .తామరాకు ల్లో భోజనం కూడా చేసే వారు .అంతే కాదు బందరు హోటళ్ళలో తామరాకు లో నె టిఫిన్ పెట్టె వారు .కొంచెం వెగటు వాసనేస్తుంది .

             ప్రతి ఇంటా పత్తిచెట్టు ఉండేది కృష్ణ పత్తిశ్రేష్టం .దాని పత్తితో వత్తులు చేసుకొని నిలవ చేసుకొనే వారు. శ్రోత్రియులు పత్తి  తో దారం తీసి జంధ్యాలు తయారు చేసుకొనే వారు .ఇప్పుడీ చెట్లే ఎవరూ పెంచటంలేదు ఆముదం చెట్లు ప్రతి పెరడు లోను ఉండేవి .ఆముదం కాయలు తమాషా గా ఉండేవి .ఆముదం ఆకు వాపులకు గొప్ప వైద్యం .ఆకును వెచ్చచేసి నొప్పి ఉన్న చోట వేస్తె వాపు మటుమాయం .ముదం ఇచ్చే ఆముదం కను మరు గైంది .వైద్య ప్రక్రియ లో వాడే వన్నీ ఇంటి దొడ్లోనే పెంచుకొనే వారు .వారికే కాక ఇతరులకూ ఉపయోగ పడుతుందనే విశాల భావం ఆకాలం వారిది అలాగే నేపాల చెట్లూ వైద్యానికి పని కొచ్చేవి అవీ లేవు ఇంటికి దడి గా బాడిస  చెట్లు ఉండేవి దట్టం గా ఎత్తు గా పెరిగి రక్షణ నిచ్చేవి .పేద వారి కంచే బాడిస ఇప్పుడు చూపులక్కూడా  లేదు

           పున్నాగ చెట్లు ఎత్తుగా పెరిగేవి దాని పూలు గోట్టాల్లా తెల్లగా ఉండేవి భలే వాసన .అయితే పాములు వస్తాయని భయం .ఇప్పుడేవరు ఇళ్ళల్లో పెంచటం లేదు పూల మొక్కల్లో దేవకాంచన ,బిళ్ళ గన్నేరు మనోహరంమైన పూలు పూసేవి దొడ్లలో పెంచే వారు పూజా పుష్పాలివి ఇప్పుడు లేవు పచ్చ గన్నేరు పూలల్లో మకరందం మహా తియ్యగా ఉండేది .పూలు అందం గా ఉండేవి శివ విష్ణువులకు ఇష్టమైనవి .దేవాలయాల్లో, ఇళ్ళల్లో కూడా ఉండేవి కాని వాటి కాయల్లో ఉన్న గింజల్ని తిని ఆత్మహత్య చేసుకొనే వారు అందుకని పెంచటం మానె శారు .కృష్ణ తులసి ప్రతి ఇంట్లో ఉండేది తులసి వనాన్ని బృందా వనం అనే వారు తులసికి పూజ చేయకుండా స్త్రీలు యే పనీ చేయరు ఇప్పుడు కూడా ప్రతిఇంట్లో ఒక్క మొక్కైనా పెంచుతున్నారు తులసి దళాలు విష్ణువుకు మహా ప్రీతీ .

           పెరటి చెట్టు గా అవిసె ,తమ్మ చెట్లను పెంచే వారు అవిసె పూవు, కాయలు మంచి రుచికరమే కాక కొలెస్టరాల్ తగ్గిస్తుంది సంపూర్ణ ఆహారం అవిసె కు అగస్త్య అనే పేరుంది .అగస్త్య నక్షత్రోదయ వేళ అవిసె బాగా పూస్తుంది .భగవత్ ప్రసాదం గా ఆంజనేయుడు వానరు లందరికి అవిసె ఆకులు పెట్టి తిని పించాడు .అంటే అతి పవిత్రమైనదికూడా .తమ్మ కాయలతో పులుసు పెట్టికూర, ,పులుసుకూడా  చేస్తారు .పొడవుగా కొంచెం వెడల్పు గా ఆకుపచ్చ  గా కాయలు ఉంటాయి ఈ రెండు కను మరుగై పోయాయి

            పూలలో సంపెంగ అంటే ఇష్టం లేని వారుండరు .సంపెంగ పూలు ఎంత దూరానికి కూడా మంచి సువాసన వేద జల్లు తాయి విడి పోయినట్లుందే కొంచెం పెళుసు, పొడవు ఉన్న ఆకుల్లా గా ఉంటాయి బజారులో బాగా లభించేవి .పువ్వు వాడిపోయిన తర్వాతా చీరల్లో పెట్టి ఆ సువాసన చీరలకు  అంటేటట్లు  జాగ్రత్త  చేయటం తెలుగింట్లో ఉండి. గన్ధ ఫలి అంటారు దీనిపై కవులు పద్యాలూ చెప్పారు .ప్రస్తుతం సింహాచలం లో నే  లభిస్తున్నాయి ఇది వరకు బెజ వాడ బీసెంట్ రోడ్డు మీద కుప్పలు పోసి అమ్మే వారు .ఇలాగే కను  మరుగైన మరో  పువ్వు మొగలి పువ్వు .సముద్ర తీర ప్రాంతాలలో పెద్ద పొదల్లాగా పెరిగే చెట్టు .మాకు బందరు నుంచి మొగలి పొత్తులు వచ్చేవి .పైన ముళ్ళతో ఉన్న గరుకు  ఆకులు లోపల పసుపు పచ్చని పుప్పొడి తో గుత్తులు .మొగలి వాసన పాములకు ఇష్టం ‘’రగులుతోంది మొగలి పోద‘’పాట అందుకే వచ్చింది ఇప్పుడు బందర్లో కూడా చిరునామా దొరకటం లేదు బందరు వెళ్ళి నప్పుడల్లా కొనుక్కోస్తూ ఉండే వాడిని .వీటి ని కూడా వస్త్రాలలో పెట్టి ఆ సుగంధాన్ని కాపాడే వారు. సెంట్లు అత్తర్లు పెరిగిన తర్వాతా వీటి అవసరం పోయింది

          గానుగ లేక కానుగా చెట్లు కూడా రోడ్ల వెంబడి ఉండేవి ఇవి కనుమరుగైపోయాయి .తేలు కొండి కాయళు అని  చెట్లకు పెరిగేవి. కాయ చివర కొండి లాంటి ముల్లుఉండేది అదీ ఇప్పుడు లేదు .ఉమ్మెత్త ,చెట్లు గొట్టాల లాంటి పూలతో ,ముళ్ళ వంటి గుండ్రని కాయలతో కని పించేవి ఎక్కడ పడితే అక్కడ .వినాయక చవితి పూజకు  దీని పువ్వు, కాయలుఉపయోగిస్తారు . .గచ్చ పొదలు ప్రతి పల్లె టూల్లలో ఉండేవి వాటి కాయలే గచ్చకాయలు .స్త్రీలు ఇంట్లో గచ్చకాయల తో ఆడే వారు .గచ్చ కాయ ను కొద్దిగా అరగదీసి చర్మానికి తగిలిస్తే వేడి తగిలి చురుక్కు మనేది .అవతలి వాళ్ళను ఉడికిన్చాటానికి ఇలా చేసేవారు .ఉత్తరేణి మొక్కలు దొడ్లలో బాగా పెరిగేవి .దాని కాండం తో అందరు పండ్లు తోముకొనే వారు .ఔశదీయ విలువ లున్న మొక్క .వినాయక పూజ లో ఉత్తరేణికి ఎక్కువ విలువ ఉండేది .ఇదీ అలభ్యం గా నె ఉంది .గంజేరు కూడా ఇలా కను మరుగైంది .తెల్ల , ,యెర్ర గంజేరు అని రెండు రకాలు కూర చేసుకొని తినే వారు .

             శొంఠి, కరక్కాయ  ,సునాముఖి లను ప్రతి ఇంట్లోను ఉంచుకొనే వారు ఇవి మందులు గా ఉపయోగ పడేవి .కఫం దగ్గులకు మొదటి రెండు, విరేచన  కారి గా సునాముఖి ని వాడే వారు సునాముఖి చారు ఉదయమే తాగించే వారు .లోపల మురిగి పోయి ఉన్న చెడు అంతా ఝాడించిచి విరేచనాల ద్వారా కొట్టేసి కడుపు క్లీన్ చేసేది .కనీసం రెండు నెలలకో సారైనా ఈ చారు తాగించే వారు .ఇప్పుడు డాక్టర్లే వద్దు అంటున్నారు

          చిట్టింత పొట్టు అని అమ్మే వారు .పల్లె టూల్లలో ముఖ్యం గా మెట్ట ప్రాంతాలలో బాగా దొరికేది .దాని కూర మహా రుచి గా ఉండేది .ఎండు మిరపకాయలు వేయించి ఈకూరలో కొరికి తింటే భలే రుచిగా ఉండేది ఇప్పుడు కలికానికి కూడా కని పించటం లేదు .పొదల్లో బుడం దోసకాయలు కాసేవి చిన్నగా కోలగా ఆకు పచ్చ  చారలతో ఉండేవి. వీటిని కొని నిలువు ముక్కలు గా తరిగి,ఉప్పు ,కారం ,వాము కలిపి అందులో ఊర బెట్టి ఎండ పెట్టాలి .బాగా ఎండిన తర్వాతా నూనె లో వేయించి ఊరు మేరపకాయలలాగా కొరికి కూరల్లో నంచుకొనే వారు .ఇప్పుడసలు కని పించటంలేదు వీటినే బుడం బద్దలనే వారు  ఎండే దాకా కొంచెం చేదుగా ఉండి ఎండిన తర్వాతా రుచికరం గా ఉండేవి బుడం దోస బద్దలు

                 అలాగే పూర్తి  గా కను మరుగైంది .అత్తపత్తి .దాని ఆకులను తాకితే ముడుచుకు పోయేవి భలే సరదా గా ఉండేది .దొడ్లలో నీలం రంగు పూలతో పొడవైన కాయల తో ఉన్న చేట్లున్దేవి కాయలు ఎండి నల్ల బడితే ఎండకు కాని ,లేక నీటి తడి తగి లినప్పుడు కాని కాయలు నిలువుగా పగిలి భలే శబ్ధం చేసేవి .పేరు గుర్తుకు రాలేదు .వామింట చెట్టు కూడా ఇళ్లలో ఉండేవి దీని పసరు చెవిలో పోస్తే నొప్పి మాయమే .

          ఇలా ఎన్నో మొక్కలు ,వృక్షాలు మా ప్రాంతం లో లభించేవి అన్నీ మేము చూస్తుండగానే కను మరుగై పోయాయి .ఇవన్నీ ఔషధ విలువ లున్నవే నని ఆయుర్వేదం చెబుతోంది .గుర్తించి ,గుణాలు తెలుసుకొని వాడుకొంటే వైద్యుఅల తో పనేమీ ఉండదు బిళ్ళలు మింగటం అల వాటు పడ్డ జీవితాలు మనవి .అంత ఓపికా పికా ,తీరికా లేవు .మనకు .

              సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-12-12-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

2012 in review- 2013నూతన సంవత్సర శుభా కాంక్షలు

సాహితీ బంధువు లందరికి -2013నూతన సంవత్సర శుభా కాంక్షలు -పాత కేలండర్ ను మార్చటమే కాక ,పాత చెడు ఆలోచనలేమైనా ఉంటె చించేసి కొత్త మంచి ఆలోచనలను హృదయం నిండా నింపుకొని ముందుకు పయనిద్దాం కొత్త ఏడాది లో అందరికి శుభం ,అభి వృద్ధి కలగాలని ఆకాంక్షిస్తోంది సరస భారతి .సరస భారతి కి మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి సదా కృతజ్ఞతలు .

          నేను రాసిన ”సిద్ధ యోగి పుంగవులు ”పుస్తకాన్ని ముద్రణకు ఇచ్చాం .రమ్య భారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ఆ బాధ్యతను ఆనందం తో స్వీకరించి నందుకు వారికి కృతజ్ఞతలు .శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )వారి సౌజన్యం ,పూర్తీ ఆర్ధిక సాయం తో ఈ పుస్తకం వెలువడుతోంది .వారి కోరిక పై ఈ పుస్తకాన్ని వారి మాత్రు మూర్తి స్వర్గీయ మైనేని సౌభాగ్యమ్మ గారికి అంకిత మిస్తున్నాం .దీనిని జనవరి చివర్లో లేక ఫిబ్రవరి మొదటి వారం లో ఆవిష్కరించాలని నిర్ణయించాం .గోపాల కృష్ణ గారి స్నేహ హస్తం మరువ లేనిది .
             నేను రాసిన మరో పుస్తకం ”శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం ”అనే 50కదల సంపుటిని కూడా ప్రచురణ కు సిద్ధం చేశాం .దీన్ని ఉగాదికి ఆవిష్కరించాలని ఆలోచన .దీనికీ దాతలు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు .ఇప్పటి దాకా వదాన్యుల దాతృత్వం తోనే సరస భారతి పుస్తక ప్రచురణ జరుగు తు, ఉచితం గా అందరికి అంద జేస్తున్నాం .
                      మరో మారు అందరికి శుభాకాంక్షలు అంద జేస్తూ -మీ దుర్గా ప్రసాద్ 

 

 

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

19,000 people fit into the new Barclays Center to see Jay-Z perform. This blog was viewed about 62,000 times in 2012. If it were a concert at the Barclays Center, it would take about 3 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ వద్దే శోభనాద్రి UGC multipurpose ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం – ప్రారంభం ఫోటోలు

This gallery contains 28 photos.

More Galleries | Tagged | Leave a comment