కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –9

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –9

                           కరటకశాస్త్రి   ”అల్ప స్వభావం ”పై ఆమెకింకా భయం గా వుంది .వెళ్ళే వాడ్నే పిలిచి ”మీ శిష్యుడిని ఇక నాటకాలాడించి ,ముండలిళ్లకు తిప్పి చెడ గొట్ట కండి ”అంది మధుర వాణి ..అందులో తనకు పాపం వుందని ,ఇదే ఆఖరి మజిలీ అవ్వాలనీ .”నీది గురోపదేశం మధుర వాణీ.”అంటాడు శాస్త్రి .బ్రాహ్మల్నందర్నీచదివింది ఆమె . ”బ్రాహ్మల్లో ఉపదేశం లావూ ,ఆచరణ తక్కువా -ఖరారేనా ?”అంది .బిక్కచచ్చి పోయాడు శాస్త్రి .హితవు పోయింది ,వ్రతము చెడింది .ఫలితం మాత్రం పరమేశ్వరునికి ఎరుక .తిట్లు ,చివాట్లకు లంకిన్చుకుందని అర్ధ మైంది .కరటకం లాంటి వాళ్ళు దేనికైనా వెనక్కి తీయరు .వాగ్దానాలనేం అమలు చేస్తారు ?గోతులు తవ్వటం అలవాటైన వారికి డబ్బుకోసం కన్యల్నిఅమ్మే  వారికిసుఖం కోసం వేశ్యల్ని మరిగే వారికి లంచం ఇచ్చి వేశ్యల చేత యెంత పని అయినా చేయించే వారికి ఎన్నటికి బుద్ధిరాదనీ ఆమె నమ్మకం .అలాంటి వాళ్ళు ”చిత్ర గుప్తుడికి కూడా లంచం ఇవ్వ గలరు .మీరు నన్ను అతడి దగ్గరికి పంపించేసి ,చేసిన పాపాలు అన్నీ తుడుపు పెట్టిన్చాటానికి వీలుండదు కాబోలు .”అంది .అదిరి పోయాడు శాస్త్రి .అమ్మో ఇక వుంటే ధనుతేగిరి పోతుంది-శీఘ్రం పలాయనం ”అను కోని పని వుందని చెప్పి పరుగు లంకిన్చుకొనే ప్రయత్నం చేస్తాడు .ఆమెకు నవ్వు ఆగలేదు .శిష్యుడి నుంచి కంటే తీసుకొనే ముందు ”ఆకాశవాణి లా చిలకపాట పాడి నీ మామ గారికి బుద్ధి చెప్పు ”అంది .అంతే కాదు ,తన మూలంగా ,ఒక ముసలి బ్రాహ్మడుకి ముప్పు వస్తుంటే ఎవరికీ కనపడ కుండా ఇంత కాల౦  దాక్కున్నందుకు చీవాట్లు పెట్టింది శాస్త్రి ని .చచ్చి పోయినంత పని అయింది .తన నిజ స్వరూపాన్ని ఎంత గొప్పగా ,చేదుగా ,బాధగా ,జుగుప్స గా ,చీత్కారం గా, అమోఘం గా ఆవిష్కరించిందో అర్ధం చేసుకొన్నాడు .తన విశ్వ రూపాన్ని తనకే వెగటు పుట్టేట్లు చూపించింది మధుర వాణి . 

              ”చెప్పిన పని చెయ్యక పో జైలు సిద్ధం ”అని బెదిరించింది .అయిపొయింది శాస్త్రి పని .పరాభవం పరాకాష్టకు చేరింది .”ఎన్నాళ్ళు బతికినా ఏమి సామ్రాజ్యంము -కొన్నాళ్లకో రామ చిలుకా –మూణ్నాళ్ళ ముచ్చటకు మురిసి తుళ్ళేవు -ముందు గతి కానవే చిలుకా ”అని సందేశం ఇచ్చే పాట శిష్యుడు పాడు తుండ గా ఇక తట్టు కోలేక   పారిపోతాడు కరటక శాస్త్రి .వెళ్తూ ”తల వాయ కొట్టింది -వెంట్రుకలు లావైనాయి -మనసుకొంచం  మళ్ళించు కొందాం ”అను కుంటు నిష్క్ర మిస్తాడు .అవును అతని లోను పరివర్తన వచ్చింది .వేశ్య తో చెప్పించుకొనే హీన స్థితికి దిగ జారాడు .ఇక ఈ మార్గం వదలాలి బాగు పడాలి అనే భావం కలిగింది .ఆ పాత్రకు ఇక్కడ పరమార్ధం లభించింది .
              కరటక శాస్త్రి చదువు కున్న వాడు .మంచి చేయాలనే తత్త్వం వున్న వాడే .అయితె ఆనాటి సమాజం ప్రభావం మీద పడింది .వేశ్యల్ని మరిగాడు .నాటాకాలు ఆడాడు .లోకజ్ఞానం వున్నా కుటిలత్వం పోలేదు .అది ఎంత పనికైనా సిద్ధం చేయించింది .చివరి దాకా నిజం ఒప్పుకొనే సద్భావన కలగ లేదు .మాయోపాయం తోనే కార్యం సాధించాలను కొనే వాడు .ఈ నాటకం లో పరివర్తన రాని వారు ఇద్దరే .శాస్త్రి ,రామప్ప పంతులు .అన్ని ముఖ్య మైన పాత్రల్నీ సౌజన్యా రావు దగ్గరకు చేర్చి న అప్పా రావు గారు ఈ జాకాల్స్ ను మాత్రం అక్కడకు పంప లేదు .అక్కడా వాతావరణాన్ని కలుషితం చేస్తారని అను కొన్నారేమో ?అందరు కొంత కాక పొతే కొంత అంత రాత్మల్ని శోధించుకొని మార్గం మళ్ళించు కొన్న వారే .అందుకే వారికి ”సౌజన్య భాగ్యం ”లభించింది .గీతా ప్రవచనం లబ్ధ మైంది .కరటక ,దమన కులైన శాస్త్రికి ,పంతులికి అది నిషిద్ధ మైంది .True repentence  వాళ్ళలో రాక పోవటమే కారణం .సమాజం లో అందరు మారినా ,మారని వారు ప్రతినిధులు గా ఉంటూనే వుంటారు .
                             ”  కన్యాశుల్కం లో కరటక శాస్త్రి” అనే ఈ నవాంగాలు ఇంతటి తో సమాప్తం 
              దీనిని చదివిన వారు స్పందిస్తే సంతోషిస్తాను .
                                                మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -11 -11 .
Posted in రచనలు | 2 Comments

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —8

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —8 

                                                       కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —8

                  మధురవాణి తల్లిని జ్ఞాపకం చేసుకొంటూ ,ఆమె చెప్పిన మాటలు శాస్త్రికి చెబుతోంది ”నా తల్లి ధర్మవా అని నా చెవిలో గూడు కట్టుకొని చెప్ప బట్టి కాని ,లేకుంటే మీ లాంటి విద్వాంసుల ఇచ్చ కాలకి మై మరచి ఈ పాటికి వూళ్ళో సానుల వలె చెడి ఉండనా ?అంటుంది .తాను ఎంత ఎత్తు లో వుందో గుర్తించమని హెచ్చరిక .ఎంత నీచపు ఆలోచన లో కరటకం ఉన్నాడో ఆలోచించుకోమని  ఆవేదన .తనను మళ్ళీ ఏదైనా పావుగా వాడు కొంటాడేమోనని అనుమానం కూడా ..ఆమె చెప్పినవి అక్షర సత్యాలు .కుహనా ఆదర్శాల పాలిటి చెంప దెబ్బలు .సంఘం చేసిన కులటల్లో తన స్థానం ఎలా పెంచుకొని ,దిగ జారక ,వ్రుత్తి రీత్యా అందులో వున్నా  ఎంత ఎదిగానో చూడమని అతనికే కాదు మనందరికీ కళ్ళు తేరి పించింది .కాదు తెరిపించాడు గురజాడ .
               చావు దెబ్బ తిన్నా ఇంకా ఆశ చావ లేదు గుంటూరు శాస్త్రికి .పొగడ్తల ధూపం వేస్తూనే ,తన మనసు లోని మాటను బయట పెట్ట టానికి ఎత్తులు ఎత్తుతున్నాడు .”మధుర వాణి అనే వేశ్య శిఖామణి ఈ కళింగ రాజ్యం లో ఉండక పొతే ,భగవంతుడి సృష్టికి యెంత, యెంత లోపం వచ్చి ఉండును ?”అంటాడు .ఈ పొగడ్తలకు లొంగే స్థితి దాటి పోయింది .తనను సౌజన్యా రావు గారి దగ్గరకు తీసుకొని వెళ్ళమని కోరింది .అతను బాధ తో అంటాడు ”ఆయన కోపిష్టి కాదు .అందుకే భయం .చెడ్డ వారి వల్ల చెప్పు దెబ్బలు తినవచ్చు కాని ,మంచి వారి వాళ్ళ మాట కాయటం కష్టం .”అదీ అతని రీడింగ్ .సౌజన్యం దగ్గరకు కరటకుడు  వెళ్ళ లేని పరిస్థితి .”డిప్టీ కలెక్టరు కుక్కనాయుడు చేత రాయ బారాలు నడుపు తునాదని చెబుతుంది . ఎగిరి గంతేస్తాడు శాస్త్రి .కాగల కార్యం గంధర్వులు తీర్చి నట్లుంది .ఈమె వాని పట్టిందా తన కొంగు బంగారమే .
                ”వెళ్ళు ,వెళ్ళు -ఇంకా ఆలశ్యం చేస్తావేం ?నీ అదృష్టం ,నా అదృష్టం యేమనిచెప్పను” ? అని పొంగి పోతాడు .పొమ్మని బలవంత పెడతాడు .దాని వాళ్ళ కలిగే లాభాల బేరీజు వేస్తాడు .తన నిజాన్ని ,సిగ్గు మాలిన తనాన్ని మళ్ళీ బయట పడేసుకొంటాడు .ఆమె లోని ఔన్నత్యాన్ని ఇంకా అర్ధం చేసు కో లేని మూర్ఖత్వమే అది .’అయన ఒక్కడే మమల్ని కాపాడ గల వాడు ”అని ముక్తా యిస్తాడు .దివి నుండి భువికి దిగి రాను దిగి రాను అన్నట్లు ఆమె వీటి నన్నిటినీ అదిగా మించింది .ఈ రొంపిలో పద్మం లా వుంది ,రోమ్పిని ,కంపును పునీతం చేయాలనే కలలో వుంది .అది నిజం చేసుకోవాలనే ఆలోచనా ,ఆత్మ స్థైర్యం ,ధైర్యం వుంది .ఇంకెవరు తన్ను కిందికి లాగ లేరు వెయ్యి మంది డిప్టీ లైనా ,కర్కటు లైనా ..ఆ బంధాలన్నీ విచ్చేడా లైనాయి .ఒక దివ్య కాంతి ఆమెలో ఆవరించింది .దివ్య జ్యోతి కానీ పించింది .ఆ జ్యోతిని కరటక శాస్త్రి దర్శించ లేడు ..చూడ లేడు చూసినా తట్టు కో లేడు .
              ”ఇటు పై ఊర కుక్కలకు ,సీమ కుక్కలకు దూరంగా ఉండ  దలిచాను .”అద్భత మైన మాటలు .కొరడాలు .రక్త మాంసాల్ని పీల్చి, పిప్పి చేసి ,సమాజ బాహ్యులను చేసే వీరంతా ,అంట కంటే గొప్ప పదాలకు అర్హులు కాదు .అందుకే కరటకుడు ఒక జాతి కుక్క సందేహం లెదు .ఆ మొహం లో పడ్డ వాడే .మళ్ళీ  అదే ఆలోచన లో ఉన్న వాడే .అందుకే అంత గట్టి గా తన నిర్ణ యాన్ని చెప్పింది .శాస్త్రి కి ఇంకా ఆమె అర్ధం కాలేదు .”ఆయన చేతికి ఎముక లెదు .హెడ్ కాని స్టేబుల్ కు తీసి పోడా ?” అని సూటి పోటి మాటలతో రెచ్చ గొట్టాలని చూశాడు .ఇంకా దింపుడు కళ్ళం ఆశలో వున్నాడు .విని  తట్టు కోవటం కష్టం  .నిజం నిష్టురం గానే వుంటుంది .”హెడ్డు ను నౌకరు లాగా తిప్పుకోన్నాను .ఆ నాల్గురోజులు సర్కారు కొలువు మాని ,నా కొలువు చేశాడు .అతడి సాయం లేక పొతే మీరు ఆ వూరి పోలి మేర దాటే వారా ?లోకం అంతా ఏమి స్వప్రయోజన పరులు ?”అని బాధ పడింది .శాస్త్రిని ఇంత బాగా కాపాడినందుకు అతనిచ్చిన కితాబుకు రోత వేసింది .అర్ధం చేసుకోనందుకు బాధ ,ఈ సమాజం లో నిస్వార్ధ పరుల యెడ తూష్ణీ భావం .వ్యక్తమైంది .అదీ పాత్ర చిత్రణ అంటే .అదే అప్ప రావు గారి అంతః పరిశీలన .
            శాస్త్రికి తల వాచీ ,తిరిగి పోయింది .చెంపలు వేసుకోన్నంత పని చేశాడు .”అపరాధ శతం ”చెప్పు కొన్నాడు .క్షమించామంనంత పని చేశాడు .డిప్టీ కలెక్టర్ను చూడను అనటం అతనిమనసు   చివుక్కు మందట .ఈ విషయం సౌజన్యా రావు గారు ఏమంటారో అంది .”పీక కత్తరిస్తారు ”అంటాడు శాస్త్రి. అదేదో చూస్తాను అంది ఆమె .”బ్రహ్మ హత్యా పాతకం కట్టు కుంటావా “?అని తెగ బాధ పడతాడు .ఎక్కడ ఈమె సౌజన్యా రావు తో చెప్పి ,నిజం బైట పడుతుందోననే ఆందోళన శాస్త్రి లో తగ్గలేదు .”ఆహా ఏమి బ్రాహ్మలు ? పోలి శెట్టి చెప్పి నట్లు ఎంత చెడ్డా బ్రాహ్మలు కదా ”అని కంటే ఇస్తూ ,”తిలోదకాలేనా ?”‘అంటుంది .పువ్వుల్లో పెట్టి తిరిగి ఇస్తానంటాడుశాస్త్రి కృతజ్ఞత తో .”నీ లాంటి మనిషి లేదు .కించిత్ తిక్క లేకుంటే నా “”అని ఉబ్బెస్తాడు .”ఆ తిక్కే మిమ్మల్ని కాపాడింది ‘అదే నా భూషణం,అన్నంత ధీమాతో .అదే విశ్వనాధ  ”దిశానా హన్కారం ”లోకానికి లొంగని అంతః సౌందర్యం .ఆ శక్తి దేనికీ లొంగదు .బ్రాహ్మణీకం లో తప్ప పుట్టావు అని శాస్త్రికి  వెక్కి రింపు . .
                 కరక టానికి ఆశ ఇంకా చావలేదు డొంక తిరుగుడు మాన  లేదు .నిజం ఒప్పుకుంటే కొంప మునుగుతుందనే తప్ప ,ఒప్పుకొని నిటారుగా నిలబడ లేని వాడు .కరటక బుద్ధి శల్య గతం కదా .ప్రాదేయకం గా ,చివరి అస్త్రం గా ”ఆ డిప్టీ కలెక్తర్ని ఒక సారి చూసి ఈ బీద ప్రాణినికాపాడితే  ? అని సన్నాయి నొక్కులు నొక్కాడు .ఆమెకు అసహ్యం వేసింది .ఇక అతడు అక్కడ వుంటే ఆమె తట్టుకోలేదు .ఉద్ధరిస్తారని అనుకుంటే దిగజార్చాలని ప్రయత్నిస్తునాడు .తక్షణం వెళ్లి పొమ్మంది శాస్త్రి ని .
                                 సశేషం 
                 
 గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –5 పాపం- వెంపటి శర్మ గారి శ్రమకు ఏం మిగిలింది ?-

ఊసుల్లో ఉయ్యూరు –5

                                                       పాపం- వెంపటి శర్మ గారి శ్రమకు ఏం మిగిలింది ?-

—                     ఒక్కొక్క ఇంటికి ఒక భోగం వుంటుంది .ఒక్కో సారి ఇళ్ళను దురదృష్టం వెన్నంటి వుంటుంది .ఆ ఇంటి లోని వారిని పాపం ఆ భగ వంతుడు కూడా కాపాడ లేడేమో నని పిస్తుంది .యెంత సుఖం ,భోగం ఆ ఇంట్లో చేరి నప్పుడు వారు అనుభ విన్చారో ,చివరికి అంతటి దీన ,హీన స్థితి పొంది అందు లోంచి నిష్క్ర మించాల్సి వస్తుంది .అది వాస్తు దోషమో ,వారి జాతక ఫలమో ,చేతులారా చేసు కోవటమో తేల్చి చెప్ప లెం.అలాంటి ఒక కుటుంబీకుడు స్వర్గీయ వెంపటి శివ రామ కృష్ణ శర్మ గారు .ఎలెమెంటరీ  స్కూల్ ఉపాధ్యాయుడు ..చాలా వైభోగం గా ఆ ఇంటిలో చేరారు .చాలా మార్పులు చేశారు .చివరికి అన్నీ అమ్ముకొని ఇక్కడి నుంచి వెళ్ళారు .ఆ ఇల్లే వెంపటి వారిల్లు .అంతకు ముందు అంటే మా చిన్నతనం లో రాయప్రోలు వారిల్లు .రాయప్రోలు సీతమ్మ ,కావమ్మ అనే అక్క చెల్లెళ్ళ ఇల్లు గా నాకు గుర్తు .వాళ్ళు చిరి వాడ ఆగ్రహారానికి చెందిన వారు .ఇది తండ్రి ఆస్తి అను కుంటాను .మేము చూసి నప్పటినుంచీ అంటే 1945  నుంచి వారిని వైధవ్యం లోనే చూశాం .పిల్లా ,జెల్లా వున్నట్లు జ్ఞాపకం లేదు .ఒకావిడ ఎర్రగా పిల్లి కళ్ళ తో వుండేది .ఇంకో ఆవిడ చామన ఛాయా గా వుండేది .ఇద్దరు కవలలా అన్నట్లుండే వారు . .మా అమ్మ వాళ్ళను సీతక్కాయ్ ,కాక్కాయ్ అని పిలి చేది .మా ఇంట్లో అందరం ఆ పేరు తోనే పిలిచే వాళ్ళం .గల గలా మాట్లాడే వారు .ఎప్పుడు ఇక్కడ వుండే వాళ్ళు కాదేమో అద్దెకు ఇచ్చే వారు .ఆ ఇల్లు మా ఇంటికి దక్షిణాన మూడో ఇల్లు .అక్కడే మాకు చిన్న తనం లో చదువు చెప్పిన గురువు గారు కోట సూర్య నారాయణ గారు అద్దె కుండే వారు .ఆ తర్వాత యనమండ్ర కుటుంబయ్య గారి కుటుంబం ,రుక్మిణమ్మ వాళ్ల కుటుంబం అంటే గోసుకొండ శాస్త్రి గారి కుటుంబం వుండేది .ఆ తర్వాత ఆ యిల్లును అమ్మేస్తే చివుకుల వెంకట రమణ సిద్ధాంతి గారు కొన్నారని జ్ఞాపకం .వీరు గుంటూరు జిల్లా వేమూరు వాస్తవ్యులు .మా నాన్న గారు మా మేన మామ ,వార నాసి సదా శివ రావు గారు ,చోడ వరపు చంద్ర శేఖర రావు గారు ,వేదార్ధం నేర్చుకోవటానికి వారిని ఉయ్యూరు తీసుకొని వచ్చారు .మొదట మా ప్రక్క ఇల్లు బ్రహ్మాజోష్యుల వారింట్లో అద్దె కు ఉంచారు .తరువాత సిద్ధాంతి గారు రాయ ప్రోలు సీతక్కాయ్ ,కాక్కాయ్ ఇల్లు కొనుక్కొన్నారు .ఆయనా అందులో లాభ పడిందేమి లేదు .ఆర్ధిక బాధలు ,కుటుంబ బాధలతో అల్లుడు వెంపటి శర్మ గారికి అమ్మారు .శర్మ గారు కూడా దాన్ని నిలబెట్టు కో లేక పోయారు .ఆయనా అమ్మేశారు ప్రసాద రావు గారు అనే retired బాంక్ ఉద్యోగి కొన్నారు .ఆయన తాకట్టు వ్యాపారం చేసి నష్ట పోయి ఆ ఇంటిని అమ్మేసుకున్నారు .ఉయ్యూరు హై స్కూల్ లో లెక్కల మాస్టారు గా పని చేసిన వల్లూరు పాలెం వాస్తవుడు చిగురు పాటి ఉమా మహేశ్వర రావు కొన్నాడు .కొంత కాలానికి ఆయన ఏ.జి.కే.నగర్ లో ఇల్లు కట్టుకొని ఆరేళ్ళ క్రితం అకస్మాత్తు గా మరణించారు .ఇల్లు ఇంకా వారి అబ్బాయి ప్రసాద్ స్వాధీనం లో నే వుంది కాని శిధిలా వస్త లో వుంది .ఇదీ వెంపటి శర్మ గారి ఇంటికి నేపధ్యం నడిచిన , చరిత్ర .శర్మ గారితో మొదలు పెట్టి చాలా దూరం వచ్చేశాం .మరి ఇవి జ్ఞాపకాల దొంతరలు కదా .అలా దొర్లు కొస్తాయి .

                          శర్మ గారు పొడవుగా వుండే వారు పంచె ,చొక్కా వేసే వారు .కీచు గొంతు .స్కూల్ కు వెళ్ళే టప్పుడే పంచ .మిగతా కాలమ్ అంతా లున్గీయే .చొక్కా సాధారణం గా వుండేది కాదు ఆయనకు ఒక సైకిల్ వుండేది .ఉయ్యూరు ,చుట్టూ పక్కల elementari స్చూల్స్ లోపని చేశారు .ఎప్పుడు బిజీ ఏ..అప్పుడు బ్లాక్ డెవలప్ మెంట్ వారి అధీనం లోస్చూల్స్   ఉండేవి .ఉద్యోగం నుంచి వచ్చిన క్షణం లో భోజనం చేసి బ్లాక్ ఆఫీసు కు వెళ్ళే వారు .ఆయనకు ఆఫీసు పని బాగా వచ్చు .అందరి పని ఒక్కడే చేసే వారు .అక్కడ ఆఫీసులో గుమాస్తాల చాకిరి ఈయన తో నే చేయించే వారు .ఇంక్రి మెంట్ల saanction ,శలవుల మంజూరు ,నెల నెల అన్ని స్చూల్ల్ల జీతాల బిల్లులు ఒకటేమిటి సమస్తం ఆయనే చేసే వారు .ఆయనకు అంత సరదా .అక్కడ అందరికి కాఫీలు ,టిఫిన్లు ,సిగరెట్లు ఖార్చులన్నీ శర్మ గారివే .ఆఫీసు వాళ్ళు పైసా కూడా చెపే వారు కాదు .ఇవి ఎప్పుడు ఆయన చెప్పుకొనే వారు కాదు .మిగిలిన మేస్టార్లు ఆయన మీద సానుభూతి తో మా కు చెప్పే ఆరు .అసలు అప్పుడు జీతాలెంత ?చాలా తక్కువ .అందులో elementari వారికి మరీ తక్కువా.కుటుంబమా పెద్దది ముగ్గురు మగ పిల్లలు ఇద్దరాడ పిల్లలు .భార్య కు అనా రోగ్యం .ఇవన్నీ ఆయన జీతం లోనే గడ వాలి .సాధ్యమయ్యే పనా ?కాదు .కాని ఆ బ్రాహ్మడు అభిమానం కల వాడు .ఇవన్నీ తట్టు కోటానికి అప్పు లు చెయ్యాల్సివచ్చేది   .అవి క్రమంగా పెరిగి చుట్టేశాయి .ఆ ఊబి లోంచి బయట పడటం కష్ట మైంది .ఆయన్ను చూసి నవ్విన వాళ్ళే కాని సహాయం చేసిన వారు లేరు .అయినా ఆ యన అడవా చాకిరి మాన లేదు .అ ఖర్చు మాన లేదు .ఆఫీసు ఆయనతో చాకిరీ చేయిన్చుకోనేదే కాని ,ఆయనకు సరైన గౌరవం కూడా ఇచ్చి న దాఖలా లేదు .నేను అప్పుడప్పుడు అంటుండే వాణ్ని ”శర్మ గారు !ఎందుకొచ్చిన ఈ కంచి గరుడ సేవ ?మీకు వాళ్ళిచ్చే విలువ లఏమీ లేదు .మీ శరమంతా సాటి వారి కోసంధార పోస్తున్నారు  .దానికి తగిన గుర్తింపు లేదు .మీకు కావలసిన చోట పోస్టింగ్ ఇవ్వరు .మిమ్మల్ని పీల్చి పిప్పి చెయ్యటమే కాని వారి వల్ల మీకు ఒరిగేది ఏదీ లేదు /.దానితో పాటు చేతి చమురు బాగా వాది లించుకున్తున్నారు ”అనే వాణ్ని .నవ్వే వారే కాని సమాధానం చెప్పే వారు కాదు .పని అనేది ఆయనకు పాపం ఒక వ్యసన మై పోయింది .అందులోంచి బయట పడ లేక పోయారు .ఆరోగ్యం క్షీణించింది .మందులు వాడుకోవ టానికి కూడా ఇబ్బంది పడే వారు ,
                   మా నాన్న గారంటే చాలా గౌరవం .తరచూ మా ఇంటికి వచ్చి మాట్లాడుతుందే వారు .కాఫీ బాగా తాగే వారు .ఆయన మామ గారు నిత్యాగ్ని హోత్రులు ,త్రికాల సంధ్యా వందనం చేసే వారు .విభూతి పెట్టినప్పుడు చూస్తే పరమ శివుడి లాగా వుండే వారు దబ్బ పండు ఛాయా .కుది మట్టం గా ఒడ్డు ,పొడుగు గా వున్దేవారాయన ”.వేదార్ధ ప్రవీణ ”అని వారికి బిరుదు .భగవద్గీత ,మీద ఉపనిషత్ ల మీద పుస్తకాలు రాశారు .వారు ఇక్కడి నుంచి మళ్ళీ వేమూరు వెళ్ళిన తర్వాత అన్ని విధాలా వారికి కలిసి వచ్చింది .పేరు ప్రఖ్యాతులు ,గౌరవాలు ,సన్మానాలు బాగా లభించాయి .ఆ తర్వాత ఎప్పుడో వారి అబ్బాయి కలిశాడు .వారి కుటుంబ విషయాలన్నీ చెప్పాడు .అప్పటికే సిద్ధాంతి గారు పరమ పాడించారు .ఆయన పంచాంగ గణనము చేసే వారు ..ఇక శర్మ గారికి అవేమీ అలవడ లేదు .ఆయన అల్లుడు ఈయన అని చెప్పటం వింత గా వుండేది .శర్మ గారిపెద్దబ్బాయి భాస్కర సోమయాజులు ,రెండో ఆతను రాదా కృష్ణ మూడో అతను మోహన్ అని జ్ఞాపకం .అమ్మాయి సన్న గా అందంగా వుండేది .పెద్దబ్బాయి ధనుర్మాసం లో వాళ్ల ఇంట్లోనే కాక మా ఇంట్లో,ప్రక్క బెల్ల కొండ వారి వాకిళ్ళలో ముగ్గులు వేసే వాడు .ఆడ వాళ్ల కంటే బాగా వేసే వాడు అని చెప్పుకొనే వాళ్ళం .అతను అప్పుడు కొంచెం ఆడంగి లేకి గా అనిపించే వాడు కులుకుతూ నడ వాటం  ,మాట్లాడటం వల్ల నేమో ..తరువాత మిలిటరీ లో చేరి మంచి ఉద్యోగం చేశాడు .రెండో అతను బాంక్ ఉద్యోగి మూడు కూడా ఉద్యోగే ..ఎప్పుడైనా హైదరా బాద్ లో పెళ్ళిళ్ళలో కలుస్తారు. శర్మ గారు ఆడ పిల్లల పెళ్లి చేశారు .
                    కాలమ్ చాలా మార్పు తెచ్చింది .శర్మ గారి బిజీ జీవితం కుటుంబానికి ఇబ్బంది కరం అయింది .భార్య అనారోగ్యం వల్ల ఆర్ధికం గా చితికి పోయారు .అప్పులేక్కువయ్యాయి .ఎంతో ఆనందం గా ఆ యింట్లో ప్రవేశించిన శర్మ గారు ,అప్పుల బాధ నున్చీ తప్పించు కోవ టానికి ఇల్లు అమ్మ క తప్పలేదు .రిటైర్ అయారు కూడా .అప్పుడు పెన్షన్ కూడా నామ మాత్రమే .అదేమీ చాల్ల్తుంది అంతటి సంసారానికి? .గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇల్లు అమ్మేశారు .అప్పు లన్నీ అణ పైసలతో బాకీ దారులకు తీర్చేసి చేతులు దులుపు కున్నారు .ఇక్కడి నుంచి కుటుంబాన్ని మచిలీ పట్నానికి తరలించారు .అక్కడికి చేరిన కొన్నేళ్ల కే భార్య మరణించారు .అ తర్వాత కుటుంబం హైదరా బాద్ చేరింది .పిల్లలు చదువుకొని మన్చీ అభి వృద్ధి లోకి వచ్చారు .గౌరవ ప్రద మైన జీవితాలు గడుపు తున్నారు .స్వంత ఇల్లు ఏర్పాటు చేసు కొన్నారు .నా స్నేహితుడు స్వర్గీయ పెద్ది భొట్ల ఆది నారాయణ కుమార్తె వివాహం లో ,కొడుకు వివాహం లో స్వర్గీయ వెంపటి శర్మ గారి పిల్లలు దాదాపు పదేళ్ళ క్రితం కలిశారు .మళ్ళీ పాత రోజులన్నీ గుర్తుకు చేసు కున్నాం .వాళ్ళందరికీ మేమంటే మంచి అభిమానం ,గౌరవం .చాలా ఆప్యాయం గా పలకరిస్తారు .ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి ఇటు వైపు వస్తే వీలు చేసుకొని తప్పకుండా మా ఇంటికి వచ్చి చూసి వెళ్ళే సంస్కారం వాళ్ళది .”ఊసుల్లో ఉయ్యూరు ”ఎవరి ద్వారానో విని చదివి నిన్నా మొన్న వాళ్ళు ఉయ్యూరు కు ఫోన్ చేసి అన్నీ జ్ఞాపకం చేసు కొన్నారు .అందుకే వారి నాన్న గారు వెంపటి శర్మ గారి పై రాయాలని పించి రాశాను .వాళ్లకు ఆనందం .నాకు కూడా ఒక సేవాపరాయనున్ని ,నిస్వార్ధ పరుణ్ణి గురించి రాసే అవకాశం కల్గిందని సంతోషం .
                     ఇప్పుడు ఉపాధ్యాయుల సేవ అని చెప్పి చేసే వారు వున్నారు .వాళ్ళు అంతా రేట్ల ప్రకారం డబ్బు వసూలు చేస్తారు .ఇంక్రిమెంట్ కు ఇంత ,ఫిక్సేషన్ కు ఇంత ,పెన్షన్ పేపర్లు పూర్తి చేస్తే ఇంత ,వాటిని saanction చేయించు కొస్తే ఇంత అని వేలకు  వేలు సంపాదించే వార్ని మా కళ్ళతో చూస్తున్నాం ,.వీటిని కాదని తన కు చేత నయినంత సహాయం చేస్తూ ,ప్రతిఫలా పేక్ష లేకుండా ఉపాధ్యాయ  లోకానికితనువు మనసు ధనము తో  సేవ చేశారు వెంపటి శర్మ గారు .అందుకీ ,ఆయన అనుభ వించ లేక పోయినా ,వారి సేవా ఫలితంగా  పిల్లలు అభి వృద్ధి చెంది సుఖం గా వున్నారు .ఇది మాత్రమే వారి ఆత్మకు శాంతి నిచ్చేది .అదే ఆ కుటుంబానికి శ్రీ రామ రక్ష అయింది .శర్మ గారి శ్రమ ఆయనకుజీవిత కాలమ్ లో ఉపయోగించ కున్నా ,గుర్తింపు రాకున్నా   ఆ తర్వాత పిల్లల శ్రేయస్సుకు ఆశీస్సు గా   ఉపయోగ పడింది .
 
 
 
 
 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –7

కన్యా  శుల్కం లో కరటక శాస్త్రి –7

                     మధుర వాణి కి ఒక సందేహం వచ్చింది .లుబ్దున్ని కాపాడ టానికి కారణం ఏమిటి ?”చాపలు ఈద టానికి ,పిట్టలు ఎగారటానికి ఏం కారణమో అదే కారణం[అంటూ శాస్త్రి పరోప కారం సౌజన్యా రావు గారి సహజ గుణం అంటాడు .గడుసు కదా మధురం ”మీరెందుకు ఆ కొంచెం ఈదటంఎగరటం   నేర్చుకో కూడదు?”అన్నది మధురం .అర్ధం కాలేదు శాస్త్రికి .నిజం చెప్పి లోకోప కారం చెయ్య రాదా అని ఉపదేశం .”Do as I say but do not do as I do ”అనే తత్త్వం కొంత ఆస్థి గతం గా వుందిశాస్త్రి కి .”నిజం చెప్తేజెయిల్లో   పెట్టిస్తారు -కనుక కార్యం సానుకూలం కోసం ఈ ఎత్తు ఎత్తాను ”అని నిజం ఒప్పుకుంటాడు .సరే నంటుంది ఆమె .”ఒక వేళ మీరు మఠం లో ప్రవేశిస్తే కంటే ఖరీదు యెట్లా  ?”మళ్ళీ సందేహం .కనుక శిష్యుడు తాకట్టు అయాడు .ఏదో రకం గా గండం గడవటమే శాస్త్రికి కావాల్సింది .పాల ముంచినా ,నీట ముంచినా మధుర వాణే ?”నీవే  తప్ప ఇతః పరంబెరుగా ”ననే దీన స్థితి .శిష్యుణ్ణి మధుర వాణికి తాకట్టు పెట్టాడు .అయినా గుంటూరు శాస్త్రి తెలివి గలవాడే .కాలమ్ గడిస్తే ,మధుర వాణి యేలు బడి లో శిష్యుడు పెరిగి తనకు పంగనామం పెట్టచ్చు .ఆషాఢ భూతి అవచ్చు .అందుకే హెడ్డు వచ్చే లోపల కంటే తెమ్మని ,లోపలి పంపించి ,శిష్యుడి తో అంటున్నాడు .ఎంత జాగ్రత్త వుందో ?ముందు చూపు వుందో .నమ్మినా ,చక్రం అద్దం వేస్తున్నా ,తన పెడ బుద్ధి మాత్రం ఎముకలతో పుర్రెతో పుట్టింది కదా .అందుకని  ”అది చెప్పిందల్లా చెయ్యక .కొంచెం పై ఒచ్చేది కానీ .మరీ నడుస్తూ వుండు .ఏవైనా వుంటే నా చెవిని పడేస్తుండు ”.అని గురుపదేశం ,హితోప దేశము చేస్తాడు .చెవిలో చెవి పెట్టి పోరాడు .అదే కరటక బుద్ధి ..శిష్యుడు గట్టి పిండం .”ఎవరి దగ్గర వున్నప్పుడు వారు చెప్పినట్లల్లా చెయ్యడమే నా నిర్ణయం ”అని చెప్పు దెబ్బ లాగా కొడ్తూ ”మళ్ళీ అడ వేషం వేసి పెళ్లి చేశారో ?అని అర్దోక్తి గా ,ఆపుతాడు .గురువు ఎంత కైనా తెగిస్తాడని .కాచి వడ పోశాడు కదా .ఎంత గొప్ప పరిశీలన చిన్న క్యారెక్టర్ లో .”ప్రమాదో ధీమతామపి .ఎంత వాడికైనా ,ఒకప్పుడు కాలు జారుతున్దిరా ”అని తప్పు ఒప్పుకొంటాడు గురువు .దాదాపు లెంపలేసుకోన్నంత పని .శిష్యుడి దగ్గర గురువుకు ఆ శిక్ష చాలు .
                మధుర వాణికి అనుమానం వస్తుంది .”తన దగ్గర వున్నది తాకట్టు మనిషి .కట్టు తెంచుకో డని  నమ్మకం ఏదీ .ఆమె నైజం బాగా తెలిసిన వాడిగా నేర్పుతో ”నీ వల్లో పడ్డ ప్రాణి తప్పించుకు పారి పోవటం ఎలాగా ?వానికి వున్న పటుత్వం నీ గొలుసుకు ఉందీ ?”అంటాడు .ఎంత పోలికో చూడండి .వేశ్యాకర్శనే కాదు ,ఆమె ముగ్ధ మనోహరత్వం ,మాట తీరు ,నేరజాణత్వం ,లౌక్యం ,అభినయం ,ఆదరణ ,ఆత్మ స్థైర్యం ముందు ”ఇనుపకచ్చ డాలు  కట్టిన  ముని మ్రుచ్చు లైనా గోచీలు విప్పాల్సిందే.ఇంక తన శిష్యుడెంత?పాల బుగ్గల పసి వాడు .ఆ మొహం లో ,లోభం లో ఆకర్షణ లో పడి ,వాడిన్కేక్కడికో జారుకోడని చెప్పినట్లు ,అయస్కాంతం కంటే బల మైన ఆకర్షణ ఆమె యవ్వనం ,శృంగారం దేవతా స్త్రీల కంటే శాశ్వతం అంటాడు .ఆమె ”వలలో ముత్యపు చిప్పలు పడితే లాభం కాని నత్త గుల్లలు పడితే ఏం లాభం ?అంటుంది-శిష్యుడి తాహతును గుర్తు చేస్తూ .”ఆర్జిన్చిన్దంతా ,మీ పాలు చేస్తున్నా .కొద్ది కాలమ్ వుండే యవ్వనాన్ని జీవనాధారం గా చేసుకొన్నా ,మా కులానికి వలపు అంతా బంగారం మీదే .అదీ మీకు అర్పిస్తున్నాను .”అంటుంది .దెబ్బ తిన్నాడు శాస్త్రి .
               ఆమె శృంగారఅ  శాశ్వతత్వాన్ని మెచ్చుతాడు .ఆమెకు జీవితం మీద విరక్తి కల్గింది .ఈ రొచ్చు లోంచి బయట పడాలని వుంది .సౌజన్యా రావు సౌజన్యం తో జీవితం లోని పర మార్ధాన్ని గుర్తించి ,తరించాలనే నిశ్చయానికి వచ్చింది .ఇప్పుడు శాస్త్రి పెట్టె ప్రలోభాలకు లొంగే స్థితి లో లేదు .ఒక ఉత్కృష్ట స్థితిని పొందే దశ లో వుంది .శాస్త్రి కంటే ఆమె ఎంతో ఎత్తుకు ఏది గింది .కరటకం ఆమె ముందు మరీ కుంచించుకు పోయాడు .ఆమె అతన్ని మాటల మంటలతో కాల్చింది .మీ వల్లే మేం పాడయ్యాం .మీరు చేసిన వేశ్యలం మేం.మీ కోసం రొచ్చులో బతుకు తున్నాం .పైకి రాలేక ఎంతో మంది కుళ్ళి పోతున్నారు .అని క్లాస్ పీకింది .ఆమెకు .శాస్త్రికి జరుగ బోయే సంభాషణలు రసవత్తరం గా వుంటాయి .అవి . ప్రత్యేకం గా ఈ సారి తెలియ జేస్తాను .
                                           సశేషం
                                                         మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20 -11 -11 .
Posted in రచనలు | Leave a comment

వందేళ్ళ విశాఖ కు సాక్షి

Posted in మహానుభావులు, సేకరణలు | 1 Comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —6

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —6

విశాఖ పట్నం లో మధుర వాణి ఇల్లు .శిష్యుడు కంటే ఎత్తు కొచ్చినందుకీ తిప్పలుఅంటాడు శాస్త్రి .అది తన తప్పూ ఎలా అయిందని ప్రశ్నిస్తాడు సదానంద శిష్యుడు ,.”నువ్వు ఇచ్చావని అది ఒప్పుకుందా ?తే” ధగిడీ కే ”కంటే తెస్తావా ,చస్తావా ?అని రామప్ప పీక పిండేట్టు౦ది .దానికి వాడు ”కూనీ కేసని ”ఎత్తు ఎత్తాడు .ముసలాడికి శిక్ష అయిందంటే బ్రహ్మహత్య నా మెడకు చుట్టు కుంటుంది .నువ్వు ఆ కంటే వాళ్ళింట్లోనే వదిలేస్తే ఈ చిక్కు లేక పోవును ”అని శాస్త్రి బాధ పడుతాడు .ఇక్కడ అతనిలోని నిజాయితీ ,మనుషులను చదవ గల నేర్పు మనకు కన్పిస్తాయి .లుబ్దునికి శిక్ష పడుతుందేమో నని బాధా వుంది అతని లో .
శిష్యుడు గురువుని మిచాడు ”పన్యండు వందలు మీరు పట్రాగా లేంది ,నాకు పెళ్లి లో పెట్టిన కంటే నేను తెచ్చుకుంటే తప్పు పడ్తున్నారు .ఆ కంటైనా దక్కిందా ? చూస్తూనే మధురవాణి లాక్కుంది . ”అని తన బాధ బయట పెడ్తూ ,గురువును ఏకేశాడు .కరకటానికి విదూషకుడి వేషం వేయటం అలవాటే అయితే తన హాశ్యం అంతా ఈ కూనీ కేసులో అణగి పోయింది ”నేను తీసుకున్న రూపాయలు లుబ్ధావదాన్లకు ఎప్పటి కైనా పంపించ టానికే తలచాను .అపహరిద్దామని ఆశ లేదు .”అని తన నిజాయితీని ఆవిష్క రించు కొన్నాడు .అంతే కాదు ఈ కేసు లోంచి లుబ్దున్ని తప్పించా టానికి మధుర వాణి దగ్గర కంటే ఎరువు తీసుకొని ,ఆ డబ్బులు ,ఆ కంటే లుబ్దుడికి ఇచ్చి ఈ ఊబి నుంచి అతన్ని బయట పడేయాలనే తన సత్ సంకల్పాన్ని తెల్పాడు కూడా .”నాకు ఈ బ్రహ్మ హత్య తప్పి పోతుంది ”అని నిట్టూరుస్తాడు .
అయితే విషయం సౌజన్యా రావు కు చెప్పి తప్పించు కోవచ్చు .కాని దానికో చిక్కు వచ్చింది .”ఆయన తో వున్న మాట చెప్పేస్తే ఆయన కోర్టులో నిజం చెప్పేస్తాడు .ఆ పైన లుబ్ధావ దాన్ల వురి మన పీకకు తగులు కుంటుంది ”అంటాడు ”.మన ”అంటే శిష్యుడు కూడా అని ధ్వనించేట్లు అన్నాడు ..”మన అంటా రేమిటి ?”’అంటాడు సందేహించి ,గురువు గారి గురించి ఢక్కా ముక్క్కీలు తిన్న శిష్యుడు .”మాట పొరపాటు ”అని సర్దేస్తాడు గురువు .మధుర వాణి కంటే అరువిస్తే ”ఆంజనేయ స్వామికివో పది శేర్లు నెయ్యి దీపారాధన చేస్తాను ”అని ఒట్టు పెట్టు కొంటాడు .శిష్యుడి లోని సామాజిక స్పృహను అప్పా రావు గారు వెలికి తీస్తూ ”కడుపు లోకి వెళ్ళాల్సిన నెయ్యి కాచేయ్యటం నాకేమీ ఇష్టం లేదు -అమృత గుండీ మొక్కు కొండి ”అని ఉపదేశం చేశాడు .చస్తుంటే సంధి మంత్రం లా వుంది గురువుకి .ఆ మాత్రం హాశ్యానికే కోపం వచ్చింది ”హాశ్యం చాలించు .బెడిసి కొడుతుంది ”అని తాను జీవితం లో నేర్చిన పాఠం చెప్పాడు .తాను ఆడిన హాష్య నాటకం ఎలా బెడిసి కొట్టిందో తెలుసు కొన్నాడు .బైట పడే ఉపాయం కోసం బుర్ర బద్దలు కొట్టు కుంటున్నాడు .అందుకే అలా అన్నాడు పాపం కరటకం ..ఇదీ పాత్రల ద్వారా అప్పా రావు గారు చెప్పిన భావం ,భ్హాష్యం ,జీవిత విశ్లేషణ.
మధుర వాణి శిష్యుణ్ణి ముద్దు పెట్టు కొంటుంది .”నా అల్లుణ్ణి చెడ గొట్టకు ”అని వాపోతాడు శాస్త్రి .అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు ..ఆమె ”జైలు నుంచి వచ్చిన్తర్వాతా ?లేక పెళ్లి చేసుకొని మరీ మఠా ప్రవేశామా ?”అంటుంది నవ్వుతు .అర్ధం కాక శిష్యుడు ”జైలేమిటి ?”అంటాడు ..క్షణం ఆలశ్యం కాకుండా శాస్త్రి ”ఆ !హాశ్యానికి అన్దిలే ”అని సర్దేసాడు .”కొంపా ముంచారో ”అని గగ్గోలు పడ తాడు శిష్యుడు .”హాశ్యం చాలించమని ”శాస్త్రి అన్నాడు .గురువు చేసి నట్లే చేశాను .నా తప్పేమీ లేదంటాడు .”మీ ఇద్దరి కోసం హెడ్డు గాలిస్తున్నాడు దొరకం గానే మఠం ప్రవేశమే ”అంటుంది మధురం .
”ఇదేనా మీరు నాకు చేసే పెళ్లి ?”అంటాడు మునిగి పోయానేమో ననే సందేహం తో శిష్య పర మాణువు .”నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు ”అని అభయం ఇస్తాడు గురువు .నమ్మకం లేని శిష్యుడు మధుర వాణి తో ”మా గురూ గారు ఎవోచ్చినా సర్దుకో గల్రు .నన్ను రక్షించు ”.అని ప్రాధేయ పడ్డాడు ..”గురువుని వదిలి నా శిష్యరికం చేస్తావా ?”అని అడి గింది అభిప్రాయం లాగ టానికి .”ఇదిగో ఈ నిమిషం నుంచే -మీ నేస్తం ఈ వేళ తో సరి .మరి ఆడ వేశం ఈ జన్మ కు వేయను ”
అని జెల్ల కొట్టేస్తాడు గురువు కు ..”శిష్యరికం అంటే ఏం చెయ్యాలో తెల్సునా “‘అంది ఉడికిస్తూ .”నీళ్ళు తోడతా ,బట్టలుతుకుతా ,చిడప్పోక్కులు నొక్కుతా ”
అని తాను రోజూ గురువింట్లో చేసే అరవా చాకిరీ అంతా బయట పెట్టేస్తాడు .”ఇదేనా నీ గురువు దగ్గిర చేసిన శిష్యరికం “”అని ఎద్దేవా చేస్తుంది .కాళ్ళు పట్టటం తో సహా సకల ఉపచారాలు చేయించుకొని చదువు అక్షరముక్క కూడా చెప్పని కరటక శాస్త్రి నిజ స్వరూపం బయట పెట్టాడు శిష్యుడు .ఇదీ మొండి గురువు ,బండ శిష్యుల తమాషా .కళ్ళకు కట్టించాడు గురజాడ .నాలుగు ముక్కలు చెప్పి జ్ఞాన జ్యోతిని వేల్గించాల్సిన అవసరాన్ని ఉపదేశం గా దీనిలో చెప్పాడు గురజాడ .యెంత అమాయకం గా వున్నా ,శిష్యులు గురువుని చక్కగా అంచనా వెయ గలరు అని కూడా నిరూపించారు .వాళ్ళ అమాయకత్వాన్ని కాష్ చేసుకో వద్దనే హెచ్చరిక చేశారు .
సరే ముద్దు లోంచి చాలా దూరం జరిగామా ?”ముద్దు పెట్టు కొమన్నప్పుడల్లా పెట్టు కుంటే చాలు ” అని అంటుంది శిష్యుడితో మధురం .తన శిష్యుడు తనకు దక్క కుండా పోతాడేమో నని ,చేతికొచ్చిన అల్లుడు జారి పోతాడేమో నని కంగారు పట్టు కుంది గురువుకి .అలాంటిపని కైతే తాను సిద్ధం గా వున్నానని లౌక్యం గా చెప్పాడు ”ఆ శిష్యరిక మేదో వాడి తరఫునా ,నా తరఫునా కూడా నేనే చేస్తాను .చక్రం అడ్డం వెయ్యి ”అని బతి మాలుతాడు . మళ్ళీ తనకో ఛాన్స్ ఇవ్వమని లోపలి భావం కూడా .తన కంటే అరువు ఇవ్వ మంటాడు .ఇదే ఈ కేసులో బయట పడ టానికి మార్గం అని ప్రాధేయ పడ్డాడు .
”బ్రాహ్మలు ఎంత కయినా తగుదురు .”అంటుంది అతన్ని బాగా స్టడీ చేసిన ఆమె .సౌజన్యా రావు గారి ద్వారా పొంద వచ్చని చెబ్తాడు .ఆమెకు సౌజన్యా రావు గురించీ పూర్తిగా విడమర్చి వివరిస్తాడు .అంత కంటే మంచి వాడు లోకం లో లేడనీ అయితె ఆయన ఆన్టినాచ్ అని సాని వాళ్ళనుచూడరనీ అంటాడు .గిరీశానికి ,సౌజన్యా రావు గారికి తేడా ఏమిటని అడుగు తుంది ఇక్కడ కరటక శాస్త్రి లో అప్పా రావు గారు పరకాయ ప్రవేశం చేస్తారు ఇద్దరికీ వున్న వ్యత్యాసాన్ని ,మనకు ,మధుర వానికీ చూపిస్తాడు .ఎక్కడో వున్న సౌజన్యా రావు పై మనకందరికీ సౌజన్యం కల్గిస్తారు ..మాటలు అన్నది శాస్త్రి అయినా అందులో గురజాడ హృదయం వుంది
కరటక శాస్త్రి ”కుక్కకి ,గంగి గోవుకి ఎంత వారో (తేడా )అంత వార .ఆయన మనసా వాచా ,కర్మణా anti nautch .వేశ్య అనే పదం ఆయన వద్ద వినిపించ కూడదు .ఆయన లాంటి ”అచ్చాణీలు ” అరుదు .మిగిలిన వారంతా యధా శక్తి ఆంటి నాచ్ లే .ఫోజు ,ప్ఫోజు అంతా .మాటల్లో మహా వీరులే .అందులో గిరీశం అగ్ర గణ్యుడు .కొందరు బంట్లు పగలు అంటి నాచ్ ,రాత్రి ప్రో నాచ్.కొందరు వూళ్ళో అంటి నాచ్ ,పరాయి వూళ్ళో ప్రో నాచ్ ..కొందరు శరీర దార్ధ్యం ఉన్నంత కాలమ్ ప్రో నాచ్ శరీరం చెడ్డ తర్వాత అంటి నాచ్.కొందరు అదృష్ట వంతులు చచ్చిన తర్వాత కూడా ప్రో నాచే .అనగా యజ్ఞం చేసి పర లోకం లో భోగాలకు టికెట్టు కొనుక్కుంటారు .నా లాంటి అల్ప ప్రజ్న కల వాళ్ళు లభ్యం కా నప్పుడల్లా అంటి నాచే .
ఇదీ కరటక శాస్త్రి విశాల మైన ఆలోచనలకు ,అనుభవానికి study of characters కు దర్పణం .నాటకం వేసే వాడు కనుక పాత్రలను పరిశీలించే నేర్పు అలవడింది .ఇంగ్లీష్ భాషా ,భావం తెలిశాయి .మనస్సుల్ని estimate చేసే నేర్పు లభించింది .తానేమిటో .లోకమేమిటో ,మంచి చెడు ఎలా పక్కనే ఉంటాయో అవగతమయింది .అప్పా రావు గారి లోకజ్నత స్పష్టం గా కని పిస్తుంది .కరటక శాస్త్రి పాత్రకు నిర్దుష్టం గా ప్రాణ ప్రతిష్ట చేశారు .మంచిని ఎన్నుకొనే గుణం కల్పించారిక్కడ .జీవితాన్ని చదివించారు ,అనుభవ సారం అందించారు
సశేషం —
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19 -11 -11 .

Posted in రచనలు | Leave a comment

అమ్మోయ్ ఆధార్

andhra jyothy 2nd page article

Posted in సేకరణలు | Leave a comment

ఒక ‘కీర్తి ‘ శేషురాలు

ఒక ‘కీర్తి ‘ శేషురాలు

ఒక ‘కీర్తి ‘ శేషురాలు 
గొల్లపూడి మారుతీరావు
gmrsivani@gmail.com

మంచి పని ఎప్పుడూ ఒద్దికగా జరుగుతుంది. దౌర్భాగ్యపు పని బాహాటంగా ఒళ్ళు విరుచుకుంటుంది. ఒక 70 సంవత్సరాలలో మానవాళి మరిచిపోలేని దౌర్భాగ్యపు పని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల మారణ హోమం. మూలపురుషుడు హిట్లర్.
ఆ మారణ హోమం నుంచి తనదైన ప్రయత్నంలో కొందరు యూదుల్ని రక్షించిన జర్మన్ షిండ్లర్ కథని ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ చిత్రంగా తీసి అజరామరం చేశాడు. అలాంటి మరొక అద్భుతమైన వ్యక్తి కథ ఇది. మానవాళి కృతజ్ఞతతో పులకించి చిరస్మరణీయం చేసుకోవలసిన కథ.
ఆమె పేరు ఇరీనా శాండ్లర్. పోలెండ్ దేశస్తురాలు. రెండవ ప్రపంచ యుద్దకాలంలో జర్మనీ పోలెండుని ఆక్రమించాక పోలెండులో యూదుల మారణహోమానికి తలపెట్టింది. అందుకు వార్సాలో ఒక శిబిరాన్ని ఏర్పరిచింది. దాన్ని ఘెట్టో అంటారు. ఇరీనా సాంఘిక సేవా సంస్థలలో పనిచేసేది. పాలక వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేసే జెగోటా అనే రహస్య (అండర్ గ్రౌండ్) సంస్థలో ఇరీనా సభ్యురాలు. ఈ వార్సా ఘెట్టోలో కుళాయిలు, మురుగు కాలువల మరమ్మత్తు చేసే పనికి కుదురుకుంది. అప్పటికి ఇరీనా వయస్సు 23 సంవత్సరాలు.
రోజూ చేతిలో పనిముట్లు ఉన్న పెట్టె, వీపు మీద పెద గోనె గోతాంతో పనిలోకి వచ్చేది. కేవలం నౌఖరీ చెయ్యడం ఆమె లక్ష్యం కాదు. ఆ శిబిరాల్లో ఉన్న యూదుల పసిబిడ్డల్ని తన పనిముట్ల పెట్టిలో అడుగున దాచిపెట్టి బయటకు రహస్యంగా చేరవేసేది. కాస్త శరీరం పెద్దదిగా ఉన్న పిల్లల్ని వీపు మీద గోతంలోకి ఎత్తుకునేది. ఆమెతో ఓ కుక్క కూడా వచ్చేది. ఈ పిల్లలు ఏడిచి శబ్దం చేస్తే నాజీ సైనికుల చెవినిపడకుండా వాళ్ళని చూసినప్పుడల్లా మొరగడం కుక్కకి అలవాటు చేసింది. కుక్క అరుపులకు అలవాటు పడిపోయిన సైనికులు ఆమెను పట్టించుకునేవారు కాదు. అనుమానం వస్తే నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపే నరరూపరాక్షసుల మధ్య నుంచి అలా రెండు వేల అయిదువందల మంది పిల్లల్ని బయటికి చేర్చింది.
బయటికి తెచ్చాక వారి తల్లిదండ్రుల వివరాలు, అడ్రసులు – అన్నీ స్పష్టంగా రాసి – ఆ విలువైన జాబితాలను ఓ గాజు కుప్పెలో ఉంచి – ఇంటి వెనుక పెరట్లో ఓ చెట్టు కింద పాతిపెట్టింది. ఈ పిల్లలకి కొత్త పేర్లూ, కొత్త అడ్రసులూ సృష్టించి కొన్ని కుటుంబాలలో, బాల రక్షణ కేంద్రాలలో వారిని చేర్చింది. ఇదొక అపూర్వమైన విప్లవం. తల్లిదండ్రులని కాపాడడం సాధ్యంకాకపోయినా వారి సంతానాన్ని కాపాడే మానవీయ విప్లవం.
యుద్దం ముగిశాక – అడ్రసుల్లో వివరాల ప్రకారం ఆయా పసివారిని వారి వారి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని ఆమె పధకం. కానీ యుద్ధం ముగిసేనాటికి చాలా మంది తల్లిదండ్రులు ఈ నాజీ శిబిరాలలో విషవాయు ప్రయోగాలలో మరణించారు. తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్న ఏ కొద్దిమందో ఆచూకీ లేనంతగా మాయమయారు.
1943లో పిల్లల్ని చేరవేస్తూ ఇరీనా నాజీ సైనికులకు దొరికిపోయింది. అప్పుడామెకు 23 సంవత్సరాలు. (ఫోటో చూడండి). ఇలాంటి సాహసాలు తలపెట్టనక్కరలేని వయస్సది. కానీ మనస్సులో మానవతా చైతన్యం వెల్లివిరిసిన అమృతమూర్తి ఇరీనా. నాజీలకు పట్టుబడ్డాక నిర్దాక్షిణ్యంగా ఆమెని చావగొట్టారు. కాళ్ళూ చేతులూ విరగ్గొట్టారు. నానా చిత్రహింసలూ పెట్టారు. చివరికి మరణ శిక్షను విధించారు. ఆమెని కాల్చి చంపడానికి తీసుకువెళుతుండగా ఆమె పనిచేసే జెగోటా సంస్థ మనుషులు – నాజీ సైనికులకు లంచాలిచ్చి ఆమెని కాల్చి చంపకుండా తప్పించారు. కానీ బయటి ప్రపంచానికి ఇరీనా చచ్చిపోయినట్టే ప్రకటన వచ్చింది.
యుద్ధం తరువాత పోలెండుని సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంది. రహస్యంగా పనిచేసిన ఈ కార్యకర్తలందరిని ఆ ప్రభుత్వం రాసిరంపాన పెట్టింది. అప్పటికి ఇరీనాకి పెళ్ళయి – రెండోసారి గర్భస్రావమయింది. క్రమంగా రాజకీయ వాతావరణం మారింది. కమ్యూనిస్టు పాలన నుంచి పోలెండు విముక్తమయింది. కొత్త పోలెండు ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించింది. ఇజ్రేల్ ప్రభుత్వం యూదులకు చేసిన సేవలకుగాను ఆమెకు తమ దేశపు అత్యున్నత పురస్కారాన్నిచ్చింది. పోలెండు ప్రభుత్వం ఆమె స్వయంగా వెళ్ళి ఆదుకునేందుకు అనుమతినిచ్చింది.
2003లో రెండవ పోప్ పాల్ యుద్దకాలంలో ఆమె కృషిని అభినందిస్తూ ఉత్తరం రాశారు. అదే సంవత్సరం పోలెండు తమ దేశపు అత్యున్నత పురస్కారంతో ఇరీనాను సత్కరించింది. 2007లో పోలెండు సెనేట్ ఆమెను గౌరవించుకుంది. అప్పటికి ఆమె వయసు 97. లేచివెళ్ళలేని పరిస్థితి. ఆమె రక్షించిన బిడ్డలలో ఒకరయిన ఎలిజబెత్ ఫికోస్కా అనే ఆమె ఇరీనా తరపున వెళ్ళి ఆ గౌరవాన్ని అందుకుంది.
2009లో ఐక్యరాజ్యసమితి తరపున ప్రముఖ హాలీవుడ్ నటి – ఆడ్రీ హెప్ బర్న్ ( ”రోమన్ హాలీడే’ హీరోయిన్) పేరిట ఏర్పరిచిన మానవతా పురస్కారాన్ని ఆమెకి అందజేశారు. 2007 లో కాన్సాస్ లో ఒక ఉపాధ్యాయుడు నోబెల్ శాంతి బహుమతికి ఆమె పేరుని ప్రతిపాదించారు. బహుమతిని ప్రకటించాక – అంగీకరించని నామినేషన్లని గత 50 సంవత్సరాలుగా బయట పెటకపోవడం ఆచారం. కానీ ఇరినా శాండ్లర్ పేరు బయటికి వచ్చింది. శాంతి బహుమతికి ఆమె కంటే ఎవరికి అర్హత ఉంటుంది? మానవత్వాన్ని అంతకంటే ఎవరు ఉన్నత స్థాయిలో నిలపగలరు? ఒక మదర్ థెరిస్సా, ఒక దలైలామా, ఒక మహాత్మాగాంధీ (ఆయన పేరుని నోబెల్ శాంతి బహుమతికి సూచించలేదు!), ఒక ఇరీనా శాండ్లర్.
కాదు బాబూ! కాదు. అర్హతలు చాలామందికి ఉన్నాయి. నోబెల్ స్థాయి రాజకీయాలూ ఉన్నాయి. పర్యావరణ కాలుష్యానికి కృషిచేసిన అమెరికా ఉపాధ్యక్షులు ఆల్ గోరేకి ఆ సంవత్సరం శాంతి బహుమతిని ఇచ్చారు.
అది 2007. ఈ విషయాన్ని తెలిసిన ఇరీనా నవ్వుకుని ఉంటుంది. 68 సంవత్సరాల ముందు వీపు మీద మోసిన మానవాళి ఔన్నత్యానికి ఇలాంటి విలువల్ని ఆశించి ఉండదు. విరిగిన కాళ్ళూ, చేతులూ, దాదాపు చావుదాకా వెళ్ళిన ప్రయాణం, తన కళ్ళముందే పెరిగి పెద్దదయిన ఎలిజబెత్ ఫికోస్కా, ఇంకా 2499 మంది పిల్లలు ఆమెకి సజీవ నోబెల్ బహుమతులు. ఈ బహుమతి కేవలం ఒక సంస్థ గుర్తింపు. ఆ కృషి మానవత్వం ఆమెకిచ్చిన కితాబు. ప్రశంస.
తన 98 వ ఏట – ఆ మధ్యనే ఇరీనాశాండ్లర్ అనే దేవతామూర్తి కన్నుమూసింది.
దేవుడిని చాలామంది నమ్మరు. 23 ఏళ్ళ ఓ అందమయిన అమ్మాయి – 2500 పసి జీవితాలకు ప్రాణం పోసిన మాతృమూర్తిలో దైవత్వాన్ని – 98 సంవత్సరాలు ఆ జీవితాన్ని జీవనయోగ్యం చేసిన వైభవాన్ని అందరూ నమ్మక తప్పదు. ఇది వాస్తవం. 98 వ ఏట ఆ దేవత ముఖంలో చిరునవ్వు ఆ జీవన సాఫల్యానికి అద్దం పడుతుంది.

***

సెఫ్టెంబర్ 26, 2011

************               ************           *************          *************

Posted in మహానుభావులు, సేకరణలు | 1 Comment

సాహితీ మనడలి ఉయ్యూరు 261 వ సమావేశం

Sahithimandali 261 111120_0001

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సరి కొత్త వేదిక నిర్మిద్దాం 44 వ గ్రంధాలయ వారోత్చ వాల సందర్భం గా ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో ఈ రోజూఅంటే 18 వ తేది న జరిగిన”కవి సమ్మేళనం ”లో నేను రాసి చదివిన కవిత ఇది .

సరి కొత్త వేదిక నిర్మిద్దాం

44 వ గ్రంధాలయ వారోత్చ వాల సందర్భం గా ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో ఈ రోజూఅంటే   18 వ తేది న జరిగిన”కవి సమ్మేళనం ”లో నేను రాసి చదివిన కవిత ఇది  .
                ”గ్రంధాలయం మన పుస్తక దేవాలయం
                ఆధునిక మార్పులతో వర్దిష్ణ మవుతున్న సాంకేతిక నిలయం
                ప్రపంచ సాహిత్యాన్నంతా ఒక్క చోట చేర్చిన ప్రదర్శన శాల
                మానవ మేధను పదును పెట్టె సాధనం ఈ ఆలయం
                సార్ధక  జీవితాన్నందించే సరి కొత్త ప్రయోగం
                విజ్ఞానం లో వెనుకబడ టాన్ని -వెనక్కి నెట్టే ప్రయత్నం
                అందరి సర్వతోముఖాభి వృద్ధికి,సమగ్రత కు
                 సవ్య మార్గాన్ని చూపే నవ్య మార్గ దర్శి
                 అది  మానసిక పరిణతి కి సోపానం
                 చదివిన వాడికి చదివి నంత -లబ్ది పొందే వాడికి పొందినంత
                  ఎవరి కృషికి తగ్గ ఫలితాల నిచ్చే విద్యా తుల మానం
                  గ్రంధాలయ సందర్శనం ఒక హాబీ గా మాత్రమే ఉండ రాదు
                  గ్రంధ పథనం -అను నిత్య  అలవాటు గా మారాలి
                  అది పని వేళలకే పరిమిత మైనదని ,

        అధికారాల చట్రం లో ఇమడాలని

                   అనుకోవటం అవి వేకమే
                   ఇక్కడ సాహితీ సుగంధం -అనవరతం పరిమ ళించాలి
                    ఇక్కడ శాస్ర చర్చల ముచ్చట్లు చప్పట్లతో మార్మోగాలి
                     నిశ్శబ్దానికీ ,ప్రశాంతత కు భంగం యేర్పడ రాదు
                     ఇక్కడ సంగీత గంగా ఝరి మనల్ని పవిత్రం చేయాలి
                     ఇక్కడ నాటక ,నాటిక ప్రదర్శన నాణ్యమై రాణించాలి
                     ఆటల ,పాటలతో చిన్నారులకు -బృందావన మవాలి
                     ఇక్కడ మహా మహుల పవిత్ర జీవిత మహః స్ఫూర్తి కల్గించాలి
                      కవి సమ్మేళనాల తో, చిత్రకళా ప్రదర్శన తో, కళా జాతరలతో
                      సకల కళా నిలయం గా నిండుగా వెలగాలి
                      సమాజాభి వృద్ధి కేంద్రం గా ,ఆధునికతకు అద్దం గా వర్ధిల్లాలి
                       చదివిన పుస్తకాలపై అభిప్రాయ సమీక్షా నిలయమవాలి
                       అభి వృద్ధిసంఘానికి   సముచిత స్తానమవాలి
                       చదువరుల సంఘానికి గౌరవమేర్పర చాలి
                       ఏడాదికోసారి చేసే తూ తూ మంత్రపు వారోత్చ వాలు కాదు
                       అను నిత్య వారోత్చవ ,పక్షోత్చవ మాసోత్చవ,వార్శికోత్చవాలు
                       అత్యంత వైభ వో పేతం గా,అందరి సహకారం తో  జరగాలి
                       గ్రంధాలయం చీకట్లను తొలగించే వెలుగవ్వాలి
                       అజ్ఞానాన్ని దూరం చేసే విజ్ఞాన శిఖరం కావాలి
                       ఇరుకు ఆలోచన నుంచి ,విశాల దృక్పధాన్ని ఏర్పర చాలి
                       అప్పుడే అది గ్రంధాలయం అవుతుంది
                       లేకుంటే” దుర్గ న్ధాలయం ” అవుతుంది
                        మీరు ,మేము ,మనమందరం కలిస్తే
                        ఉజ్వల భవిష్యత్తు కు సరి కొత్త వేదిక అవుతుంది
                        ఆ దిశ గా అడుగులు వేద్దాం -సాధించి చూపిద్దాం .
                                        మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –18 -11 -11 .
Posted in కవితలు | 1 Comment

మా ఉ(య్యురు) సిరి వనం లో కార్తిక ‘సత్యనారయణ వ్రతం’

This slideshow requires JavaScript.

మా ఉ(య్యురు) సిరి  వనం లో  కార్తిక ‘సత్యనారయణ వ్రతం’

Posted in సమయం - సందర్భం | 1 Comment

భారత చరిత్ర భాస్కరులు

భారత చరిత్ర భాస్కరులు

ఆడియో -౧

ఆడియో – ౨

                     ఎవరెవరో  అడ్డ దిడ్డంగా రాసిన మన చరిత్రను

              మన వెద ,శాస్త్ర జ్యోతిష,పురాణేతి హాసాల నాధారం గా సరి దిద్ది, తిరగ రాసి

                     ”ఇదీ బారత చరిత్ర -ఇదే భారత చరిత్ర ”అని సగర్వంగా
                      ఎదురొడ్డి నిలిచి ప్రపంచానికి చాటిన పండిత విమర్శకులు
                       ”బ్రహ్మాండ సృష్టి రహశ్య విజ్ఞానాన్ని ”త్రవ్వి తీసిన విజ్ఞాన ఖని
                        ”మానవ సృష్టి విజ్ఞానాన్ని ”ఎరుకకు తెచ్చిన మేధావి ‘
                         ”ఆంధ్రుల సర్వతోముఖ విజ్ఞానాన్ని ”వెలికి తీసిన విజ్ఞాన మూర్తి
                          ”అన్య గ్రహ లోకాదుల్లో స్థూల దేహాలున్నాయని ”గుర్తించిన సూక్ష్మ గ్రాహి
                          ” భూగోళ స్థిత జంబూద్వీపాన్ని-నవ వర్ష విభాగాలుగా
                          సచిత్రం గా ”ఆవిష్కరించిన”  పరిశోధన ఘనా పాథీ
                          శ్రీ రామ సేతువును ,లంకా స్థల నిర్దేశాన్ని నిరూపించిన నిజ నిర్ధారక వేత్త
                         ” అలేగ్జాందర్ కు సమ కాలికుడు గుప్త చంద్ర గుప్తుడే
                          ”మౌర్య చంద్ర గుప్తుడు కాదని తేల్చి చెప్పిన వివేకి
                        ”  శ్రీ శంకర భగవత్పాదుల కాలాన్ని క్రీ.పూ.509 ” అని
                            సొప పత్తికం గా నిరూపించిన చారిత్రాకాన్వేషి
                           అందరం నెత్తి కేత్తుకొనే ”మాక్స్  ములర్ పండితుని ”
                           మూల సిద్ధాంతాన్నే తిప్పి కొట్టిన వెద శాస్త్ర ప్రజ్ఞా మూర్తి
                           ”వేదం అపౌరుషేయం ;;అని మళ్ళీ నిరూపించిన ఆధునిక శాస్త్ర విజ్ఞాని
                           ” చారిత్రిక శకాలను” (era )స శాస్త్రీయం గా
                            అక్షర బద్ధం చేసిన మహా మహో పాద్యాయుడు
                           ” కలి రాజ వంశాన్ని” కల్మష రహితం గా రాసిన కాల వేది
                             భారత యుద్ధ కాలాన్ని, కలి ప్రవేశ కాలాన్ని
                            శాస్తోక్తం  గా చెప్పిన చారిత్రకాగ్రేసరుడు
                           ”  తిలక్ చెప్పిన ఆర్యుల ధ్రువ ఖండ నివాసాన్ని ”
                              ఖండన మండనం చేసి ,నిజాన్ని నిర్భయం గా చెప్పిన శేముషీ దురంధరుడు
                            ”ఆంద్ర ,ఆంగ్ల ,గీర్వాణా లలో అద్వితీయ ప్రతిభా సంపన్నులు
                             తన అభిప్రాయాలను నిర్మోహ మాటం గా ప్రకటించి
                            ఆ నాటి దేశ ,విదేశీ చరిత్ర కారుల ,పండితుల ,పరిశోద కారుల తో
                            చర్చించి నిగ్గు తెల్చుకొన్న” అసలు సిసలు చరిత్ర కారులు ”
                            ఆయనే మన” విజయ వాటికా” పుర వాస్తవ్యులు
                             ”భారత చరిత్ర భాస్కరులు ”-
                             ”-శ్రీ కోట వెంకటాచలం -మాన్యులు ”
                             ” శ్రీ మదభి నవ విరూపాక్ష జగద్గురు పీథాదిపతులు ”
                             ” శ్రీ శ్రీ శ్రీ అద్వయా నంద శంకర భారతీ స్వాములు ”
                              విజయ వాడ తో సహా ,భారత దేశ జనులు
                              అందరకు” నిత్య ప్రాతస్మర నీయులు ”
                              ఆ సార్ధక నామాన్ని” చిరంజీవి” చేయాలి మనం అందరం ‘
                                                      గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -11 -11 .
           .
   44 వ జాతీయ గ్రంధాలయ వారోత్చావాల సందర్భం గా విజయ వాడ చిత్త రంజన్ గ్రంధాలయం లో ”రమ్య భారతి ”ఆధ్వర్యం లో ”మన విజయ వాడ ”అనే అంశం పై జరిగిన కవి సమ్మె లనం లో నేను చదివిన కవిత ఇది .
       శ్రీ కోట వెంకటా చలం గారు సుమారు 1925 నుంచి 1995  వరకు విజయ వాడ లో వున్నారు .వారు ఒంటి చేతితో సాగించిన చారిత్రిక పరిశోధన ,ఆంద్ర ఆంగ్ల భాషల్లో వెలువరించిన పుస్త కాలు అమూల్య మైనవి .వారు సార్ధక జీవితాన్ని గడిపి తురీయా ఆశ్రమం లో సన్యశించి   శ్రీమదభినవ విరుపాక్ష జగద్గురు పీతాది పతులై  ”అద్వాయానంద శంకర భారతీ  స్వాములు” గా చరితార్దులై నారు ..వారి కుమారులు ,తండ్రి అంతటి పరిశోధకులు ,ఆయుర్వేద వైద్య శిఖా మణి శ్రీ కోట నిత్యానంద శాస్త్రి గారి తో నాకు మంచి పరిచయం వుంది .నిత్యానంద శాస్త్రి గారిని( 84 ) రెండేళ్ళ క్రితం ”సరసభారతి ”కి ఆహ్వానించి ,వారి తండ్రి గారిని ఆ సభలో సంస్మరించుకొని వారికి ఆత్మీయ సత్కారం చేశాం .ఇప్పటికీవారితో   ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే వున్నాను .వెంకటా చలం గారిపై భారదేశ చారిత్రిక పరిశోధన శాఖ వారు ఈ సంవత్చరంమే నెలలో  హైదరా బాద్ లో ఒక గొప్ప సభ చేసి ,వారిపై ఒక” ప్రత్యెక సంచిక ”ను వెలువరించి ,వారి కుమారులు నిత్యానంద శాస్త్రి గారిని ఘనం గా సన్మానించారు
              నేనుపైన రాసిన కవితను నిన్న విజయ వాడ లో  చదివితే ఒక్కరికి కూడా వెంకటా చలం గారు తెలియదు అని చెప్పారు .వారిని ,ఆ కార్య క్రమం లో గుర్తు చేసినందుకు నన్ను అందరు అభినందించారు .నాకూ,ఆనందం గా వుంది
                                     గబ్బిట దుర్గా ప్రసాద్ —18 -11 -11 .
Posted in కవితలు | 3 Comments

సంగీత యోగి – హిందు రివ్యూ

The Hindu Fridayreview 110805

Posted in మహానుభావులు, సేకరణలు | Leave a comment

పేరడీ

Posted in సేకరణలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –5

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –5

 

                                     కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –5 

                 కరటక శాస్త్రి తక్కువ వాడు కాదు .తాను వచ్చిన  కార్యాన్ని దీనితో సంధించి బాణం గురి తప్పకుండా కొట్టాడు .తన డబ్బు అవసరం ఎంత వుందో తెలపటానికి ”అంత అదృష్టవా అండీ .అల్లాంటి పిల్లే నాకుంటే ,మూడు ,నాలుగు వేలకు అమ్ముకుని ,రుణాలు ,పాణాలు ,లేకుండా ,కాలక్షేపం చేసి ఉండును ”అని మళ్ళీ తన దీన గాధ చెవిని వేస్తాడు .కరిగిన పంతులు తన సహాయ లోపం ఉండదని హామీ ఇవ్వ గానే ”అయితే కార్యవయిందే ”అని ,పంతులు చేతిలో పడితే తిమ్మిని బ్రహ్మిని చేస్తాడని ,లౌక్య ప్రభువు చాక చక్యం తెలుసు కనుక కార్యం సానుకూలం అవుతుందని ఘట్టిగా నమ్ముతాడు .”డబ్బుకు లోకం దాసోహం ”అయినందుకు సంతోషిస్తాడు .
               మళ్ళీ కరటక శాస్త్రి నాల్గవ అంకం లో మధుర వాణి ఇంట్లో బేరం  ఫైసలు చేసుకొనేందుకు కన్పిస్తాడు .అప్పటికే మధుర వాణి పంతులు నెత్తి మీద నీళ్ళ చెంబు కుమ్మరిస్తుంది .తలంతా తడిసి వుంది .మంచి హాశ్యం ,చమత్కారం వున్న   వాడు కదా కరట కుడు.”గంగా జలం శిరస్సున పోసుకున్నారా ఏమిటి పంతులు గారు” ?అంటాడు .సుబ్బి పెళ్ళికి ముందే శిష్యుడికి లుబ్ధావధాన్లతో పెళ్లి అయిపోవాలి .దీని కోసం సిద్ధాంతి జాతకం ,ముహూర్తం సిద్ధం చేశాడు .ఆ రోజుల్లో అయిదు రోజుల పెళ్లి .అలా చెయ్యక పొతే అది పెళ్లి అనిపించు కోదు .పైగా పరువు తక్కువ కూడా .”ఏక రాత్రి వివాహం చాలు ”అంటాడు శాస్త్రి . ”దివ్య స్థలాల్లోనే ఆ రోజుల్లో ఏక రాత్రి వివాహాలు జరిగేవి ఈ విషయం అల్లుడు లుబ్ధుడు బయట పెట్టాడు .మామ తక్కువ వాడా /ఏదో మతలబు చేసి ”ఎకరాత్రానికి ఒప్పించాలి ”లేక పొతే ”ఆబోరు ”దక్కదు .చాలా మంది ఎకరాత్రాలే చేస్తున్నారని చెప్తూ ”మీ వూళ్ళో కోదండరామస్వామి స్వయం వ్యక్తవూ ,హనుమత్ ప్రతిష్టా అయినపుడు దివ్య స్థలం కాదని ఎవడనగలడు ? అని దబాయిస్తాడు .స్థల మహాత్య్మం అంట గట్టేశాడు .ఇంక దీనికి తిరుగేముంది ?”అయినా ఇక్కడ ఇంతవరకు అలా ఎవరు చేయ లేదండీ ”?అని సందేహిస్తాడు .ఇక శాస్త్రి దబాయింపు సెక్షన్ లోకి వస్తాడు  .”దివ్య స్థలం అయింతర్వాత ఎవడేమంటే మనకేం పోయింది ?”అంటాడు .ఎందుకైనా మంచిది పంతులు తో చేబ్దామంటాడు లుబ్ధుడు . ..పంతుల్తో చెబ్తే కొంప మునుగు తుంది .మధుర వాణి వేసిన ఎత్తు పారదు .అభాసు పాలవుతుంది .అంతా అంతర్నాటకం .ఒకళ్ళకి తెలీకుండా ఒకళ్ళ ఎత్తు .జిత్తు .పంతులు పై కొంత అసహ్యం కలగటానికి పాచిక వేస్తాడు శాస్త్రి .మిత్ర భేదం ప్రయోగిస్తాడు .అఘటన ఘటనా సమర్ధుడు కరటకం ..
                          ”ఈ పెళ్లి లో నాలుగు డబ్బులు సంపాదించా లనుకొనే పంతులు ,పోలి శెట్టి ఏక రాత్రి వివాహానికి అంగీకరిస్తారా ?పుస్తె కట్టిందాకా ఆ మాట వాళ్ళతో చెప్పకండి ”అంటాడు .”అయిదు రోజుల పెళ్లి అయితే  నీ కొంప గుండమే” ”.’కొంప కొల్లేరు  చేస్తారనట్లుగా చెప్పాడు .చెప్పక పొతే ”ఏం జట్టీ తెస్తాడో ”అని లుబ్దుడికి లోపల భయం .ఇక గట్టిగా బాదక పొతే కధ అడ్డం తిరుగు తుంది ..”అతగాడు మీకు యజ మానా ?జట్టీ ,గిట్టీ పెడితే ‘పెణ తూడ  గొడతాను”’ అని భరోసా ఇస్తాడు .”పావంటి దానికి విరుగుడు వుంది .పంతులు కుండదా ?”అని ఒక సామెత చెప్పి ఒప్పిస్తాడు .ఇక్కడ కధ మంచి రస పట్టు లో జరిగింది .ఎవరు ఎవరికి వెన్ను పోటు పోడుస్తున్నారో మనకు అర్ధ మై పోతుంది .డబ్బు తో సాధించ లేదని ఏదీ లేదని నిర్ధారణ అయింది .
             పెళ్లి అయి పోయింది .అంపకాల శీను లో కరటక శాస్త్రి ”అపర కన్వుడి” లాగ విలపిస్తాడు .లుబ్ధుని కూతురు మీనాక్షి  చేతి లో శిష్యుణ్ణి  పెట్టి ,”కడుపు కదా అమ్మా !అంచేత పదే పదే చెప్తున్నాను .”అని భోరున ఏడుస్తాడు .”విషాదం ”మంచి పాకాన పడింది .సిద్ధాంతి వచ్చే లోపలే శాస్త్రి ఉడాయించేస్తాడు .కొంప మునుగు తుందనే భయం .మళ్ళీ చాలా కాలానికి కాని కనపడ్డు .    .  
              పోలీసులు గుంటూరు శాస్త్రి కోసం వెతుకు తుంటారు .తన తెలివీ ,పంతులు తెలివే ,మధుర వాణి అతి గొప్ప చాక చక్యం కలిసి ”మగాడి ”తో మగాడి పెళ్లి జరగటం తమాషా పెళ్లి అని పించింది .లుబ్దుడికి ఇంక పెళ్లి మీద విరక్తి కల్గెట్లు చేస్తాడు శాస్త్రి .”సుబ్బి పెళ్లి ”తప్పి పోవటానికి యెంత కష్ట పడ వలసి వచ్చిందో పాపం కరటక శాస్త్రికి  .నిందలు మోశాడు .వేషాలు వేశాడు .కేసులో ఇరుక్కున్నాడు .ఇదంతా ఒక మంచి పనికే .అతి బాల్య వివాహాలు ఆప టానికి ,కన్యా శుల్కాన్ని నిరోధించటం ,ముసలాడికి మళ్ళీ పెళ్లి ఆశ లేకుండా చేయటం .ఇవన్నీ ఈ అంతర్నాటకం లో కరటక శాస్త్రి సాధించిన విజయాలు .వెయ్యి అబద్ధాల తో ఒక Homo sexual ”మారేజీ చాలా ఈజీ గా చేయించిన ఘటికుడు .గుంటూరు శాస్త్రి .
           కరటక శాస్త్రి పూర్తి నిజస్వరూపం  ,ఇంకా అతని లో  నిగూఢ౦  గా వున్న భావాలు ,సామాజిక స్పృహ మనకు ఆరవ అంకం లో విశాఖ పట్నం లో మధుర వాణి ఇంటి దగ్గర తెలుస్తాయి .
                                      సశేషం                           మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -11  -11
                 గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –4

                కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –4               గుంటూరు శాస్త్రి మధుర వాణికి తన గోడు వెళ్ళ బోసుకుంటాడు .ఈ పిల్లని లుబ్దావధాన్లకు ఇచ్చి పెళ్లి చేసి ,తన మేనగోడలి బతుకు కాపాడ మంటాడు. అందుకే ”పంతులు లేని సమయం చూసుకొని” వచ్చానని చెబుతాడు .ఒక వేళ ఈ నాటకం బయట పడితే ,ఎమౌతున్దోనని ఆమె అనుమానిస్తుంది .భరోసాయిస్తూ ,శాస్త్రి ”మధ్యనకు నాకు వచ్చిన ఫరవా ఏమిటి ?ఈ కత్తెర మీసం ,కత్తెర గడ్డం కదిగేసుకోని నా తోవన నేను పోతాను .ఈ కొక నీ దగ్గరే పారేసి మా శిష్యుడూ ,వెడతాడు .”అని ధైర్యం చెప్పాడు .రామప్ప పంతులుతో మాట్లాడి దీన్ని ఖాయ పర్చమంటాడు .ఇంకా ఎవరెవరి కాళ్ళు పట్టుకోవాలన్నా పట్టుకుంటా నంటాడు .మీనాక్షిని ,సిద్దాన్తినీ బుట్ట లో వేయటానికి సిద్ధమౌతాడు ఆమె సలహా ప్రకారం .ఇదంతా చేస్తే ”నీ మాట వేరే చెప్పాలా ?నిన్ను సంతోష పెట్టడం నా విధి ”అని తిలా పాపం తలా పిడికెడు గా ఇస్తానంటాడు .ఆమె బాధ పడుతుంది .శాస్త్రి ఇంతేనా తనను అర్ధం చేసుకోండీ ?అణు కుంటుంది ”మీ తోడ బుట్టువుకు ప్రమాదం వస్తే డబ్బుకు ఆశిస్తానా ?యటుంచి యటోచ్చినా   కాపాడుతాను .”అని భరోసా ఇస్తుంది .శాస్త్రి మనసు కుదుట పడుతుంది
               రామప్ప పంతుల్ని కూడా మచ్చిక చేసుకొనే అవకాశం వచ్చింది .పంతులు లోపలకు వస్తాడు .డబ్బు కావాల్సి వస్తే ”ఒపాతిక” సర్డుతాడు గుర్రబ్బండీ వాడి కిరాయిగా .మాటల్లో మంచి నాణ్య౦  వుంది .”ఈ పిల్లకు పెళ్లి చెయ్యాలి మీరు ”అన్నాడు ..రామప్ప నియోగి దర్జా వొలక పోస్టు ”నేను వైదీకిని కాను .నాకు మంత్రాలు రావు ”అంటాడు .దానికి శాస్త్రి ఇచ్చిన సమాధానం మహా గడుసు గా వుంటుంది .”ఈ రోజుల్లో వైదిక మంత్రాల మహిమ పోయింది .మంత్రమంటే నియోగ ప్రభువులాడే మంత్రం ”అని పొగడ్త ధూపం వేస్తాడు,మాటల మంత్రం ప్రయోగిస్తాడు .ఇంకేం మిడతం భొట్లు చిక్కాడు .వలలో పడ్డాడు .పంతులు ఆడ వేష౦  లో వున్న శాస్త్రి శిష్యుడు  ‘మహేశాన్ని ” తేరి పార చూసి ”ఈ పిల్లను నేను పెళ్లి చేసుకు౦ దునా ?అంటాడు మధుర వాణి తో .ఆమె మూతి తిప్పుతూ అక్కడినుంచి వెళ్లి పోయింది .ఇప్పుడే కాష్ చేసుకో వాలను కుంటాడు కరటకం .కాచుక్కూచున్న నక్క వినయం తో ”వైదీక పాల్లం మాకు శ్రుంగారాలేలా అనుభవ మౌతాయండీ ? మా ఇల్లాళ్ళకు కోపం వస్తే చీపురు కట్టలు ఎగుర్తాయి .సరసమన్నది పుస్తకాల్లో చదవటమే గాని మాకు అనుభవ వేద్యం కాదండీ ”అన్నాడు .మధురానికి ,పంతులుకు జరిగిన సరసాన్ని చూశాడు.  ”సొగసు కత్తెలకు అలక కూడా అదో శృంగారం సుమండీ” అని ఆమె కోపాన్ని పంతులు సమర్ధిస్తే ”శృంగారం నియోగ ప్రభువులదే ”అని తనకు తెలుసునని ఉబ్బెస్తాడు .తనకూ ,ఆ స్వార్ష్యం వున్నా ,బయట పడ కుండా ,తనకేమీ తెలీదన్నట్లు నటించాడు .నంగ నాచి అంటే ఇలాంటి వాడే .
               మధురాన్ని పంతులు వుంచుకున్నాడని తెలిసిన లౌక్యం గా ”ఆమె మీ భార్య కాదండీ !సంసారి కన్నా మర్యాదగా వుంది ఈ వేశ్య అని అతని అదృష్టాన్ని పొగుడుతాడు .అతడు ఐసు అయి పోయి కరిగి పోయాడు .”ఎంపికలో వుంది ”అని తన గొప్ప చెప్పుకొన్నాడు ఇంతకు ముందు ”ఎందరో అయినారు ”అని తెలిసినా డాంబికం గా.తాను వచ్చిన విషయ౦  వివరించాడు శాస్త్రిచాలా గడుసుగా .”పని చేయ్యాలన్నా ,ఇంత కథకా లన్నా నియ్యోగులకే చెల్లు అని తీర్మానిస్తాడు .”ఇయ్యా ,ఇప్పించ గల అయ్యలకే కాని మీసము అన్యులకేలా ,రొయ్యకు లేవా తెగ బారెడు మీసము ”అని వైదీకుల అసమర్ధతను తెలుపుతాడు .తాను చిక్కుల్లో వున్నానని దావా ఒకటి సిద్ధం గా ఉందనీ ,డబ్బు అవసరం అనీ ఈ పిల్లను అమి దావా వేయాలనీ ,బేరం కుదర్చ మని ప్రాధేయ పడుతాడు .తనకు1600  రూపాయలు అవసరమనీ   అవసరం అనీ ఆపైన ఎంత వచ్చినా  తీసుకో మని ఆశ చూపిస్తాడు .,  ,
          పంతులు దగ్గర ఈ శషభిషలు పని చేయ లేదు .నూర్రూపాయల ఫీజు ఇస్తే ,సంబంధం చెడ గొట్టి ,ఇది లుబ్దుడికి ఖాయం చేస్తానంటాడు .దారిలో పడ్డాడు గురుడు అని తెలుసు కోని ,పదో వంతు సొమ్ముతో సంతృప్తి పడమంటాడు .సగానికి సగం అంటాడాయన .శాస్త్రి యుక్తి యుక్తం గా ”రక్త,మాంసం అమ్ముకొంతున్నప్పుడు ,ఆ కాని కూడు అయినా సంతుష్టి గా దొరకటం న్యాయం కదండీ .ఈ పాపపు సోమ్ముకే తమరు ఆశిన్చాలా ?అని సన్నాయి నొక్కులు నొక్కుతాడు .ఏమైనా ” ఖాళి చేస్తాడేమో  ”నని .పంతులు తక్కువ వాడా ?”పాపపు సొమ్ము మా దగ్గర కొస్తే పవిత్రం అయి పోతుంది ”అంటాడు .చివరికి సరే నంటాడు .మధుర వాణి లాంటి వజ్రాన్ని సంపా దించు కొన్నందుకు అభినందిస్తాడు శాస్త్రి పంతుల్ని .”ఆడదాన్ని ఆట్టే రోకా యించ కూడదని ”సలహా పారేస్తాడు .”నాజూకైన స్త్రీని మల్లె పూలాగా వాడుకోవాలని ”ఇంకో చిట్కా   చెప్పాడు .”నాజూకులు మీ కెట్లా తెలుసు ?అని ఆవలించాకుండానే శాస్త్రి పేగులు లేక్కేశాడు పంతులు .ఆనుమానము వస్తుంది ”వీడు ”మధురానికి ”ఎర ”వేస్తున్నాడేమోనని కంగారు పడతాడు .  ”మహా కవుల నాటకాల్లో అట్లాగే జరిగినట్టు రాశారండీ ”అని తప్పించుకున్నాడు .అయినా పంతులుకు అనుమానం చావలేదు .శాస్త్రి ఇందాక చెప్పిందొకటి ,ఇప్పుడు చెప్పిందొకటి .”మీరు తండ్రి లాంటి వారు కదా కాస్త బుద్ధి చెప్పండి ”అంటాడు తండ్రి అనే మాట తో ఆట కడుతుందని భావించి ..
                                      సశేషం

                                      సశేషం

                                                     గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -11 -11 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –4 కనుమరుగైన వ్రుత్తి కళలు

ఊసుల్లో ఉయ్యూరు –4

                                         కనుమరుగైన వ్రుత్తి  కళలు

—                   ఉయ్యూరు లో చేనేత ,కంచడం ,కమ్మరం ,చెప్పులు కుట్టటం ,కుమ్మరం ,వెదురు ,బుట్టలల్లటం ,ఈతాకు చాపలు ,ఈత బుట్టలు అల్లటం తేనే తీగలను పెంచటం ,పశువాలను పెంచటం ,కోళ్ళను ,మేకల ను ,గొర్రె లను పెంచటం ,పందుల పెంపకం మొదలైన వృత్తులు ఉండేవి .నాన్యం గా చేసినవన్నీ కలలే .అట్లాగే చేపలు పట్టటం బాగా ఉండేవి

ఇవాళ దాదాపు అవన్నీ మా కళ్ళ ముందే కను మరుగై పోయాయి .ముఖ్యం గా ఇత్తడి బిందెలు ,రాగి బిందెలు ,కంచు సామాన్లు చేయటం మహా జోరుగా జరిగేవి ..నాలుగైదు కుటుంబాలు వాటి పై ఆధార పడి ఉండేవి .ఇవి ఉయ్యూరు సెంటర్ దాటి ఎకామ్బరేస్వర టాకీస్ వైపు వెళుతుంటే రోడ్డుకు ఇరు వైపులాఉండేవి .కుటుంబ పని గా కొన సాఎవి .కుటుంబం లోని వారంతా స హక రిస్తుండే వారు .టింగ్ టింగ్ మని ఆ పాత్రలు తయారు చేస్తుంటే తమాషా గా శబ్దం వచ్చేది ఆ శబ్దం చాలా విన ముచ్చటగా వుండేది .పెద్ద పెద్ద బిందెలు తయారు చేయటానికి రేకులు తయారు చేసిగుంటలు పడేట్లు  సాగ కొట్టుతూ వాటింతో షాపులు తయారు చేసే వారు .భలే సరదా గా ఉండేవి .ఇత్తడి బకెట్లు ,ఇత్తడి కాగులు ఇత్తడి గ్లాసులు ,రాగి చెంబులు ,పల్లాలు బాయిలర్లు వ్హాలా నాన్యం గా చేసే వారు .వీత్కి అతుకు లూడినా ,కారుతున్నా తీసుకొని వెళ్లి బాగు చేయించే వాళ్ళం .చాలా బాగా రేపైర్ చేసే వారు ,.అట్లాగే సత్తు వస్తువులు చేసే వారు .పాల గిన్నెలు ,మజ్జిగ తప్పాలాలు గరిటెలు తయారు చేసే వారు ఇత్తడి కుందులు బాగుండేవి .కంచు తో కుందులు ,మర చెంబులు ,పూజా పాత్రలు ,విగ్ర హారాలు కూడా చేసే వారు .

మేము ఎనిమిదో క్లాస్ చదివే టప్పుడు మాకు సోషల్ మేష్టారు స్వర్గీయ లంకా బసవా చారి గారు .విద్యార్దులన్దర్నీ అక్కడికి తీసు కోని వెళ్లి ఆ పని చేయటం ప్రత్యక్షం గా చూపించారు .నాకు ఇప్పటికీ గుర్తు .ప్రతివాళ్ల జేబులో     ఒక నోట్ బుక్ ఉండాల్సిందే .దానిలో చూసిన ,విన్న ,చాదివినా విశేషాలు రాయటం ఆయనే మాకు నేర్పారు .అప్పటి నుంచి నేను దానిని అనుసరిస్తూనే వున్నాను .ఈ పనిని ”కంచరం ”పని అనే వారు .ఆ ఫీల్డ్ ట్రిప్ అయింతర్వాత స్కూల్ కు వచ్చిన తరువాత మేము చూసిన విషయాలనుమాతో  చెప్పించే వారు బసవా చారి మేష్టారు .స్టాంప్ collection హాబీ నేర్పారు . నిన్న పొద్దున్న  ఈ పని చేసే వారేవరున్నారో అని వెళ్లి చూస్తే ఒకే ఒక కుటుంబం మాత్రమే కని పించింది .వాళ్ళు కూడాతాము  వస్తువులం చేయటం లేదని ,సామాన్లు కోని తెచ్చి అమ్ముతున్నామని చెప్పారు .అంతే ఏమి గిడు తుంది ?అన్నీ యాంత్రికం అయిన రోజుల్లో .సరే నని బాధ పడి ఆ సామాన్లును షాప్ ను ఫోటో తీశాను .ఇది కధ కంచికి చేరిన కంచరం కధ .  ,

                      రెండోది చేనేత వ్రుత్తి .ఎక్కడ పడితే అక్కడ నేత మగ్గాలు ఉయ్యూరు లోను ,చుట్టూ పక్కల గ్రామాల్లో ను విపరీతం గా వుండే వారు .రోడ్లమీద  ఆ దారాలను పొడుగ్గా వుండే టట్లు తాడుకు బిగించిన  చట్రం లో నేస్తు కనిపించే వారు ఆ పడుగు ,పేక నేత చూడ టానికి సరదా గా వుండేది ఇంటి లోపల మగ్గాలున్దేవి .ఇదీ కుటుంబం అందరు కలిసి చేసే వారు .మంచి నేత చీరలు ,పంచలు ,లుంగీలు ,తువ్వాళ్ళు జేబు రుమాళ్ళు నేసె వారు .మార్కండేయ వస్త్రాలయం అనే చేనేత షాప్ వుండేది సెంటర్ లో వారి కింద చాలా కుటుంబాలు బట్టలు నేసి అందించే వారు .వారు స్వయం గా సాలీలే అవటం తో మంచి అజ మాయిషీ వుండేది . నాణ్య  మైన వస్రాలు అక్కడే లభించేవి .ఉయ్యూరు కాలేజి దగ్గర అప్పుడు అంతా ఖాళీ ప్రదేశమే .ఆ చుట్టూ చాలా కుటుంబాలు నేత వ్రుత్తి లో వుండే వారు .నందం వారు ,కొడాలి వారు ఈ వ్రుత్తి లో నేర్పరులు .నందం వారి అబ్బాయినాకు   క్లాస్ మేట్ .అట్లాగే కరణం గారి బజారు ,హై స్కూల్ దగ్గర నేత గాళ్ళు అద్భుతంగా నేత నేసె వారు .చిన్నపిల్లలకు అది బాగా వారసత్వం గా వచ్చేది .గండిగుంట ,ఆకునూరు మొదలైన ఊళ్ళల్లో ను మంచి నేత నేసె వారుండే వారు ఇవాళఉయ్యూరు   తో సహా ఈ గ్రామాలలో ఒక్కటంటే ఒకటికూడా   నేత కుటుంబం లేదు .ప్రభ్త్వం ఉదాసీనత ,నేసిన బట్టకు డబ్బు తగినంత రాక పోవత్సం ,ప్రభుత్వ సబ్సిడీ తగ్గటం ,మర మగ్గాలు అన్నీ వారి పాలిటి శాపాలయాయి .నేత బతుకులు బుగ్గి అయాయి .ఎందరో నేత కార్మికులు అప్పుల బాధ భరించ లేక ఆత్మ హత్యలు చేసు కొన్నారు .చేసు కొంటునే వున్నారు .నేత కార్మిక జీవిత వ్యధలపై   కవులు మంచి కవితలు రాస్తూనే వున్నారు .కన్నీళ్ళతో వారి జీవితాలను పరిచయం చేస్తూ ,వారి కద  గండ్లను వెలుగు లోకి తెస్తూనే వున్నారు
అనంత పురం లో తెలుగు అధ్యాపకులు శ్రీ ”రాధేయ ”గొప్ప కవి .చేనేత వ్రుత్తి పని వారల దయామయ గాధను ఒక కవితా సంకలనం గా తెచ్చారు .చాల స్పందన కల్గించే కవితలు అందు లో ఆయన రాశారు .ఆయన ”ఉమ్మడి శెట్టి అవార్డ్ ”అని ఒక అవార్డ్ ను ఏర్పాటు చేసి ప్రతి సంవత్చరం ఉత్తమ కవితా సంకల నానికి అయిదు వేల రూపాయల నగదు బహుమతి నిస్తున్నారు .ఈ అవార్డ్కు  చాలా నిర్దుష్టం గా ఎంపిక చేస్తారు .అందుకని అది చాలా విశిష్ట మైన బహుమతి గా భావిస్తుంది సాహితీ లోకం ..దాదాపు ఈ వ్రుత్తి కల కూడా అంతరించటం శోచనీయమే .కాల మహిమ .
         ఉయ్యూరు లో కమ్మరి పని వాళ్ళు బాగానే వుండే వారు .పలుగు ,పార,కత్తులు కొడవళ్ళు , ,గొడ్డళ్ళు చేసే వారు కక్కులు పెట్టటం ,పిడులు వేయటం వుండేది పెద్ద చక్రం తిప్పుతూ మంట కొలిమి వెలిగించి ఇనుమును కాల్చి దాగలి మీద కాలిన వస్తువునుంచి ,సుత్తి తో బలం గా కొడుతూ సాగ దీసి కావలసిన ఆకారం తెచ్చే వారు .ఇది నాకు చాలా కష్టమైన పని గా కన్పించేది .రెక్కలు ముక్క లవాల్సిందే .బ్రహ్మం అనే ఆయన పని బాగా చేసే వాడు .వెంకటేశ్వర టాకీస్ దగ్గర ,రోడ్డు మీద కాటూరు రోడ్ లో ఈ వ్రుత్తి ఆపని బాగా చేసే వారు .కొడవల్లకు ,చెరుకు కత్తులకు కాటూరు బాగా ప్రసిద్ధి ,ఆరు నెలలకు ముందే ఆర్డర్ ఇస్తేనే అక్కడ వస్తువులు దొరికేవి .నాణ్యానికి  ,మన్నికకు వాటికి పేరు .ఆకునూరు లో కూడా చేసినవి బాగుంటాయి .  ఒగిరాలలో కూడా చేసే వారు .ఇప్పుడ ఈ వృత్తీ బాగా తగ్గి పోయింది వూరికి ఒకరున్నారేమో నని పిస్తుంది .పాపం వారి శ్రమకు తగిన ప్రతి ఫలం రాదు .ఆడ వాళ్ళు కూడా ఇందులో చాలా శ్రమ చేయాలి .ఊక ,బొగ్గులు ప్రియం అవటం కూడా వారికి ఇబ్బందే పారలకు కర్రలు, పలుగు ను సాగ దీసి పదును తేవటం చాలా కష్టం తో నేర్పుతో చేయాలి .అల్లాగే గోద్దల్లకు పదును ,కర్ర తొడగటం చూస్తుంటే భలే గా వుంటుంది .ఇవాళ ఉయ్యూరు మొత్తం మీద హై స్కూల్ దగ్గర ఒకే ఒక కుటుంబం వుంది .అతని పేరు అబ్రహాం పూర్వపు పేరు రాదా కృష్ణ .
                 నాణ్యమైన ఎడ్ల బండ్లు తయారు చేయటానికి ఉయ్యూరు ప్రసిద్ధి .సాయిబులు బాగా చేస్తారు .ఇప్పుడున్న కాకాని పార్క్ దగర పూర్వం బండ్లు తయారు చేసే వారు .అవి చేసే విధానం చూడాల్సిందే .బండి చక్రాలు తయారు చేయటం ,వాటికి చుట్టూ కర్ర లమర్చటం(ఆకులు)  ,ఆ shape తీసుకు రావటం కాడి తయారు చట్రం చేయటం నగిషీ చెక్కటం గొప్ప పని కళకు స్థానం .ఇదంతా ముస్లిములిద్దరు సిబ్బందిని పెట్టు కోని చేసే వారు .అందులో సత్తార్ సాహెబ్ గారు చాలకాలం ఆ పని చేసి తరువాత వడ్రంగం లోకి దిగారు .మా ఇంట్లో మంచాలు మడత మంచాలు చేశారు .పందిరి పట్టు మంచాలు మడత మంచాలు చేసే వడ్రంగులు బానే వుండే వారు వారిని ”బ్రహ్మం గారు ”అని పిలిచే వాళ్ళం .కుర్చీలు ,బల్లలు ఉయ్యాలలు   , బాగా చేసే వారు” హాఫ్ సుందరయ్య”  గా(half sundarayya ) పిలువబడే నరసింహారావు అనే కమ్యునిస్ట్ నాయకుడి కొడుకు నా దగ్గర  tution చదివి జీతం బదులు కుర్చీ ,టేబులు  ,నవారు మంచం చేసి ఇచ్చాడు . నలభై ఏళ్ళు దాటినా ఇంకా బాగున్నాయి .కోటేశ్వరమ్మ  బ్రహ్మం ,ఆయన కొడుకు కోటేశ్వర రావు ఆనాటి నుంచీఈ  పనిలో బాగానే రాణించారు .ఇప్పుడు వెంకటేశ్వర రావు ,షఫీ ,సత్య నారాయణ మొదలైన వాళ్ళు బిజీ పని వారు .వడ్రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లు తోంది .తలుపుల మీద  పని కూడా వుండేది .పెంకు టిల్లు నిర్మించటం ఆ నాడు వీళ్ళ పనే .ఇప్పుడవి కనుమరుగు .దీనితో పాటు పెంకు నేయటం ఒక వ్రుత్తి గా వుండేది .భిక్షాలు ,సూర్య నారాయణ్ ,ఒకరిద్దరు సాహేబులు మంచి పెంకు నేత నేసె వారు .అందులో భిక్షాలు బ్రాహ్మణ ,కోమట్ల ఇళ్ళలో ఎక్కువ పని చేసే వాడు .తాపీ పనీ అతనికి వచ్చు .సీతారామయ్య ఆనాటి తాపీ మేస్త్రి .సాహేబులు మంచి తాపీ పని వారు.పెంకు  నేత పని దాదాపు లేనట్లే .చాల కొద్ది మంది అంటే ఒకరిద్దరే వున్నారు .పెంకునేత చాలా నైపుణ్యం తో కూడిన పని .
              కిర్రు చెప్పులకు ఉయ్యూరు ప్రసిద్ధి .ఆ రోజుల్లో అందరు అవే వాడే వారు .వాటి ఆకారం భలే గా వుండేది .ముందుకు తోసుకోచ్చే ఆకారం .నల్లగా నిగ నిగ లాడుతూ ఉండేవి .నడుస్తుంటే ”కిర్రు కిర్రు ”శబ్దం వచ్చేవి అందుకని ఆ పేరు .ఇప్పుడు శబ్దం లేని చెప్పులే .చెప్పులు కుట్టే వారుమాదిగా     వారు బాగా కుట్టే వారు .ప్రస్తుతం చెప్పులు కుట్టీ వారు లేరు ఒక్క అతను సాముఎలు మాత్రమే వున్నాడు .అతను సినిమా స్టార్లకు మాత్రమే కిర్రు చెప్పులుఇరవై ఏళ్ళు కుట్టాడు . .నాలుగేళ్ల క్రితం అతన్ని గురించి ఆంద్ర జ్యోతి ఆది వారం అనుబంధం లో స్పెషల్ గా రాశారు .
                   ఇదివరకు చాలా ఇళ్ళల్లో తేనే పరిశ్రమ వృత్తిగా హాబీగా వుండేది .చుట్టూ ప్రక్కల గ్రామాల్లో కూడా ఇప్పుడు బాగా తగ్గి పోయింది ,   మా  డ్రాయింగ్ మేష్టారు తాడినాడ శేష గిరి రావు గారు తేనె టీగలును     పెంచి    నాణ్య మైన తేనే తీసే వారు .ఆయన మంచి హోమియో వైద్యులు కూడా సబ్సిడీ కి తేనే పెట్టెలు ఇచ్చే వారు .పెంపకం దార్ల సంహ్ఘాలున్దేవి .మంచి పరిశ్రమ గా వర్ధిల్లింది ఒకప్పుడు .బంగారం పని బాగా చేసే కుటుంబాలు చాలా ఉండేవి .ఒక బజారు బజారు  వాళ్ళదే ;కంసాలి బజార్”అంటారు .చేవురి వారు మంచి పని వారు సుదర్శనమనే నా క్లాస్ మేట్ కూడా బాగా చేసే వాడు ,ఇంకో సుదర్శనం హరికధాదాసు గారు చేవురి కనక రత్నం గారు బంగారం పని చేసే వారు .మాచిన్న తనం  లో సుబ్రహ్మణ్యం గారు అనే ఆయనవృద్దు  మాకు బంగారు వస్తువులు చేసే వారు .తూకం ,పని అంతా చాలా నమ్మకం .గురివింద గింజలతోత్రాసుతో     తూస్తుంటే భలేగా  వుండేది .అన్న సమయానికి చేసి ఇచ్చే వారు .అంత నమ్మకస్తులు మళ్ళీ మాకు కని పించలేదు .కళ్ళ జోడు లోపలి నుంచి కిందకుచూసే వారు .ఇప్పటికీ గుర్తు .వెండి పని కూడా వాళ్ళు చేసే వారు .ఇప్పుడంతా బెజవాడ లో చేయించ టమే . అందరు .చేయించి తెచ్చి ఇవ్వటమే .
     పాడి పశువుల పెంపకం భారం అయింది ద్సాన్నీ వదిలేశారు .మేకలు ల;గొర్రెలు బాతులు ,కోళ్ళు పెంచటం లేదు .కోళ్ళ పరిశ్రమ   ఒక వెలుగు వెలిగి ఇప్పుడు మృగ్యం అయాయి .ఏనాది వాళ్ళు ఈతాకు చాపలు ఈత బుట్టలు అల్లే వారు .మా ఆంజ నేయ స్వామి దేవాలయం చుట్టూ వాళ్ల గుడిసేలే  ఉండేవి .అదీ లేదు .వాళ్ళే పందుల్ని పెంచే వారు .పందులు ఉయ్యూరు ”చామల ”లో తెగ ఉండేవి .బురద లో పొర్లుతూఎప్పుడు మొరుగుతూ ఉండేవి .ఒక పెద్ద కర్ర ,తాడుతో పందుల్ని పట్టు కొనే వారు .అవి దొరికితే విపరీతం గా మొరిగేవి భీభాత్చం ఆ దృశ్యం .
                  అడితీ ల దగ్గర ,ఏకాంబరేశ్వర టాకీస్ ,శివాలయం ఎదురు గా  మేదర వాళ్ళు వున్నారు .బుట్టలు ,విసన కర్రలు ,గంపలు ,తట్టలు తడికెలు బాగా అల్లే వారు ఇప్పుడు తడికెల వాడకమే లేదు .ఎక్కడైనా పల్లె టూల్లల్లో  వున్నాయేమో .అయినా వారి వ్రుత్తి మాత్రం క్షేమంగా నీవుంది .అ కుటుంబాలన్నీ వున్నాయి .వారికి గిరాకీ కూడా బాగానే వుంది
                  కుమ్మరి పని శివాలయం ఎదురు గాను  ,కాపుల వీధి లోను కుమ్మరి కుటుంబాలు వున్నాయి .  .కుండలు ,మూకుళ్ళు ప్రమిదేలు విగ్రహాలు మంచినీళ్ళబానలు    చట్టలు ,డబ్బుదాచే  కిడ్డీ బాంక్ లు బాగా చేస్తారు చేసే వారు .సంక్రాంతి బొమ్మల కొలువు కు వారి బొమ్మలే కొనే వారు .వినాయక చవితికి ఆ కుటుంబాలే మట్టి వినాయకులను తాయారు చేస్తారు .రంగువి కూడా సరసమైన ధరలకే అమ్ముతారు .అ’వీరమ్మ తల్లి తిరినాలకు గండ దీపాలు పట్టుకొని అందరు వెంట వెళ్తారు .వీరందరి చేతుల్లో ప్రమిదా దీపం వుండటం ప్రత్యేకత .బాతుల పెంపకం ఇది వరకుండేది .ఇప్పుడు చెరువులే లేవు కనుక అదీ అదృశ్యం .ఈ విధం గా ఉయ్యూరు లో వ్రుత్తి కళలు మంచిఉత్చ స్థితి లో  లో వుంది నేడు కనుమరుగై పోయే స్థితి లో వున్నాయి
                                           మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -11 -11 .

This slideshow requires JavaScript.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 4 Comments

ఆహ్వానం – 44 వ గ్రంధాలయ వారోత్సవాలు – “మన విజయవాడ” కవి సమ్మేళనం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి -3

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి -3

                 కరటక శాస్త్రి   ఒక శిష్యుడిని పాఠాలు చెప్పటానికి తన ఇంట్లోనే వుంచుకున్నాడు .వీలైతే కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనా వుంది .అయితె తాను చెప్పే చదువు వానా కాలమ్ చదువే .”నాతొ వేషం కట్టించి ,పెద్ద చాన్తాల్లాటి హిందూ స్థానీ ముక్కలు ,సంస్కృతం ముక్కలు ,అర్ధం తెలీకుండా భట్టీయం వేయించ టానికి  మీకు ఓపిక వుంది కాని ,నాల్రోజులకో శ్లోకంచేప్పటానికి శ్రద్ధ లేదు కదా ?అంటాడు శిష్యుడు గురువు తో .స్వగతం లో యేమని అనుకున్తున్నాడో చెప్ప మంటే ”పట్నం వదిలి ఆర్నెల్ల కోమారు అగ్రహారాలంట వచ్చినపుడు మాత్రమే ”పుస్తకం తియ్యి ”అని మాట వరుసకు అనే ఘటం గురువు గారు ”కొత్త శ్లోకం చదవ మంటే ”అస్త్యుత్తరశ్యా”చదువు తాడు ”.ఇది పాత శ్లోకమే కదా “‘అంటాడు .”మొదలు ,కొసా ఒకలాగే    కనపడుతున్నాయి .”అంటూ గురువు శిక్షణ పై అసంతృప్తి ప్రకటిస్తాడు .అందుకే శిష్యుడికి గిరీశం దగ్గర నాలుగు ఇంగ్లీషు ముక్కలు  నేర్చుకుంటే బాగుండు ననే స్థితి కి తెచ్చింది ..

—               చదువుకునేది పొట్ట పోషించుకోవ టానికే  -ఈ రోజుల్లో సంస్కృతం యెవడికి కావాలి అని తనే అంటాడు శిష్యుడితో .ఇంగ్లీషు చదువు తనే చెప్పిస్తానని ఆశ పెడతాడు .”పది ”రోజులు ఆడ వేషం వేస్తె ఇంగ్లీష్ నేర్పిస్తానని  శరతూ  పెడతాడు .తగిన వ్యూహం పన్ని ,ఆ వివరాలన్నీ శిష్యుడికి చక్కగా అవగతం చేస్తాడు .”అదెంత పని ?”అంటాడు శిష్యుడు .-అంటే నాటకాల్లో వాడితో బాగానే వేశం కట్టే నేర్పు కల్గించాడు అన్న  మాట .అది ఇప్పుడు అక్కరకు వచ్చింది .శిష్యుణ్ణి ఇలా వాడుకొని ,లుబ్ధావ దాన్లకు వీడి తో ముందే పెళ్లి చేసి వేశం విప్పి పారి పోయి రావటం -ఇదీ ఎత్తు .దీన్ని చక్కగా నిర్వర్తిస్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ”ఇల్లరికం ”వుంచుకున్తానని ఆశ కూడా పెట్టాడు .పుస్తకం మీద ప్రమాణం చేస్తానంటాడు శాస్త్రి .”సంస్కృతం పుస్తకం మీద నమ్మకం పోయింది ఇంకో పుస్తకం మీద ప్రమాణం చెయ్య” మంటాడు శిష్యుడు .”తప్పితే ,భూమి తోడ్రా ”అంటాడు గురువు .గురువు స్వభావం తెలిసిన శిష్యుడు నమ్మలేడు ,నమ్మకుండా ఉండను లేడు .”మీరు ఎగేస్తే భూవేమ్చేస్తుంది ?-మీ మాటే చాలు ”అంటాడు .ఇదీ గురువు పై శిష్యుడికి వున్న నమ్మకం

            తన వ్యూహం పార టానికి ”మధుర వాణి ”,”రామప్ప పంతుల ”సహాయం కావాలి .అందుకే శిష్యుడికి ఆడ వేశం వేసి రామచంద్ర పురం చేరతాడు .మధుర వాణి ఇంటి తలుపు తడతాడు .మాంచి మాట కారి శాస్త్రి .ఎదుటి వారికి ముందే బంధం వెయ గల నేర్పున్న వాడు .”బంధువులా ”/అని ఆమె అడిగితె ”ఆపదకడ్డం బడ్డ వారే బంధువులు -మీరు మాకు బంధువులు కాగలరు ”అని చమత్కారం తో అంటాడు .బంధుత్వం కలుపు తాడు మాటలతోనే .మధుర వాణికంఠాన్ని  పోల్చుకొన్నాడు .ఆమెతో కొంత” గ్రంధం ”సాగించిన వాడే పూర్వం .వేషాన్ని చూసి విస్తు పోతుంది .”ఉదర  నిమిత్తం బహుకృత వేషం -ఇది దేవుడిచ్చిన వేషం ”అంటే పూర్వం అతను” గుంటూరు శాస్త్రి” గా పరిచయం వున్న వాడే ఇప్పుడీ వేషం ఏమిటని విస్తు పోయింది .కొత్త గా వుంది .
       ” నాటక     ‘ మెల్లా  చెడి పగటి వేషాల్లో దిగిందా ?పెట్టి పుట్టారుగా ?ఏల  ఈ అవస్థ “”అంటుంది .”ఇన్నాళ్ళకు దయ కలిగిందా” ?అని కవ్విమ్పుగాను అంది .శాస్త్రి నిజం చెప్పాడు .డిప్టీ కలెక్టర్ కొడుకు ఆమెను ఉంచుకున్న దగ్గర్నించీ తాను ఆమె ఇంటికి వచ్చాడని తెలిస్తే ”పీక ఉత్తరిస్తాడేమో ””అనే భయం చేత రాలేదని సంజాయిషీ ఇచ్చుకున్నాడు .ఆయనకు ఎప్పుడు బదిలీ అవుతుందా ,మధుర వాణి ని ఎప్పుడు చూస్తానా అని దేవుణ్ణి ప్రార్దిస్తున్నాదట  .దేవుడి మీద నెట్టాడు కనుక నమ్ముతుంది అనే   భావం .ఆమె మాటల్లో ”గిరీశం ”తనను ఉంచుకున్నాడని చెబుతుంది .”వాడికి పెంద్రాలే ఉద్వాసన చెప్పాలి ”అంటాడు మధుర వాణి నెమ్మదిగా ,నషాళానికి అన్తెట్లు వాయిస్తుంది ”నా దగ్గర కొచ్చినందుకు మీ భార్య గారు ,ముందు మిమ్మల్నిమెడ బెట్టు కోని   ఇంట్లోంచి తరవ్వలసింది .తనకి రోట్టా ?ఒహడికి ముక్కానా “”?అని అతని నైత్యాన్ని కడి  గేస్తుంది  .గిరీశం సంగతి సరే నీ బుద్ధి బుగ్గిలం కాలేదా అనిఎద్దేవా   .”నా ఇంటికి వచ్చిన వాడల్లా చెడిన వాడేనా “?అనే ధ్వని .ఇంటి దగ్గర తన బతుకేమీ గొప్ప గా లేదని ,తన భార్య ఆ మర్యాదను మాటల్లో చేస్తూనే వుందని క్రియ లోకి ఇంకా దిగ లేదని చెబ్తాడు .అంటే అతని బతుకు ఇంటి దగ్గర” బస్తాండే” అయిందని చెప్పకనే చెప్పాడు .అంతే కదా ?చెడ తిరిగే నైష్టిక బ్రాహ్మలకు అంత కంటే గౌరవం భార్యలు ఎందుకు ,ఎలా ఇస్తారు ?ఎక్కడి వేషం అక్కడ .ఏ ఎండాకా గొడుగు పట్టటం కరటక శాస్త్రి అంటే గుంటూరు శాస్త్రికి వెన్నతో బెట్టిన విద్యే .
                                  సశేషం
                                                         మీ గబ్బిట  దుర్గా ప్రసాద్ –15 -11 -11 .
Posted in రచనలు | Leave a comment

కన్యాశుల్కం లో కరటక శాస్త్రి —2

          కన్యాశుల్కం లో కరటక శాస్త్రి —2
               కరటక శాస్త్రి పాత్ర ప్రవేశం పై వివరించాను .ఆమె పుట్టింటి సొమ్మును కూడా ”అగ్ని ”లో వ్రేల్చేసి ,చెయ్యి దులుపు కుంటున్నాడు బావ నిజాన్ని ,నైత్యాన్ని ,తూర్పార బట్ట గల గలిగిన ధైర్యం ఉన్న వాడు కరటకం .అతన్ని ఏమీ అనలేక పోయాడు ”అగ్ని ”.కారణం తన నిజరూపాన్ని అతడు కాచి వడ పోశాడని తెలియబట్టే .ఇంతలో గురు శిష్య ప్రవేశం జరిగింది .”మాన్”అన్నందుకు అగ్ని హోత్రం పేలి పోతే ,”ఇంగిలీషు మాటలంటే -పుచ్చ కాయల దొంగ అంటే బుజాలు తడువు న్నట్లు నీ మీద పెట్టు కుంటావెం ?అని బావ ను మళ్ళీ దెబ్బ కొట్టాడు .మానులా పెరిగావు కాని బుద్ధి ఏదీ ,మర్యాద ఎదీఅని ఎద్దేవా చేసి నట్లుంది శాస్త్రిమాటలు .గిరీశం భాషలో అతడొక విదూషకుడు .చప్పన్న భాషలు తెలిసిన మనిషి .సంస్కృతం మంచి నీళ్ళ ప్రవాహం లా మాట్లాడే వాడు. .
                  వెంకటేశం చదువుకు డబ్బు ఖర్చు బాగా అవుతుందని ,బావ బాధ పడుతుంటే ”బుచ్చమ్మ ను అమ్మిన పదిహేను వందల రూపాయలు ఎంచేశావ్ ?”అని నిల దీస్తాడు శాస్త్రి .ఆ డబ్బుతో వెంకటేశం కు చదువు చెప్పించ కూడదా అని సూచన చేస్తూ ,ఆడ పిల్లను అమ్మటం పాపం అని కూడా అభిప్రాయ పడ్డట్లుంది .అతనికి పిల్లల్ని అమ్మటం ఇష్టం లేని విషయమే .”మంచం మీంచి దించెయ్య టానకి సిద్ధం గా ఉన్న వాడికి కట్ట బెడ్తే చావడా వాడు ?ఇదేనా నీ చదువు ,సంస్కారం ?”అని ఎదిరిస్తాడు .ఈ మాట తో ఈయనే నులక అగ్ని  హోత్రావధానులు  అని రూధి చేసుకొని గిరీశం ”జటలో ”అంతటి వాడు లేదని ,కొమ్మ ఎక్కిస్తాడు .అగ్ని చల్లారి శాంత పడి ,దర్వాజా అయి తన ప్రధమ కోపానికి క్షమాపణ చెబుతాడు .ఈ ఇద్దరి భాగోతం అర్ధమయింది కరకటానికి .ఇన్నాళ్ళ కు మా అగ్ని హోత్రుడికి తగిన వాడు దొరికాడు ”అని తనలో అనుకొంటాడు .అగ్నిని నీరు కార్చే పొగడ్తల జల్లు ఉన్న వాడు గిరీశం అని తెలుసు కొన్నాడు .బావ పని పట్టీ టందుకు ఒకడు దొరికి నందుకు సంతోషం వేసింది .తను చేయ లేని పని గిరీశం చేస్తున్నాడని ఆనందము  కొంత వుంది అతని లో .
               వెంకటేశం చదువు ఎలా సాగుతోందో ననితెలుసు  కోవా టానికి ఉబలాట పడుతాడు  .వాళ్లిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడ మంటే ”ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ”అని పాడుకుంటూ ,ఇంగ్లీష్ వొలక బోస్తు పెద్ద బిల్డప్ ఇస్తారు .తెలుగు పద్యం చదవ మంటాడు మామ .”పొగ చుట్టకు సతి మోవికి ;;అని ఎత్తుకుంటాడు ముద్దుల మేనల్లుడు .ఇక అర్ధమై పోయింది వీడి వానా కాలం చదువు .గురువు తన లాగానే చదువు చెప్పే ఘటం కాదు .వీడికి ఒచ్చిన్దేమీ లేదనే నిర్ణయానికి వచ్చే శాడు .పరీక్ష గా ”మనః ప్రభవానలం ”అంటే అర్ధమేమిటి ?అని అడిగాడు అల్లుణ్ణి .ఇంతలో తన పరువు పోతోందని గిరీశం అడ్డ పడి అలాంటి కఠిన పద్యాలకు అర్ధాలు పసి పిల్లలకు ఎలా తెలుస్తాయని దబాయిస్తాడు .ఈ పద్య స్వారశ్యం శాస్త్రికి తెలుసు ,అది కఠిన మైనదీ కాదని తెలుసు .గురువు శిష్యుణ్ణి మోసం చేస్తున్నాడని తెలిసి పోయింది .మరి ,తనకు ఒక శిష్యుడున్నాడుగా .
”తర్ఫీదు మా చక్క గా వుంది .వీణ్ణి పెందరాలే తోవ పెట్టక పొతే మోసం వస్తుంది ”అని అనుకుంటాడు .గిరీశాన్ని ఆ కొద్ది సేపట్లోనే అంచనావేసిన  నేర్పు శాస్త్రిది .”ఆషాఢ భూతి ”తత్త్వం అర్ధమై పోయింది .కొంప ముంచుతాడు అనిపించింది .
             ఇంతలో వెంకటేశం పెళ్లి విషయం వచ్చింది .”డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తా నంటాడు  బావ.లుబ్ధావ దాన్లు కు కూతురు సుబ్బిని అమ్మి ,ఆ డబ్బుతో వెంకడి పెళ్లి చేస్తానని పధకం చెబ్తాడు .ఇప్పటికే ఒకతే నెత్తి మీద గుడ్దేసుకొని గుండె మీద కుంపటి లా వుంది .మళ్ళీ ఈ లంపటం ఏమిటో అని ఆలోచించి ”బావా !ఈ సంబంధం చేస్తే నీ కొమ్పకగ్గేట్టేస్తాను”అంటాడు పాపం అక్క మీద జాలి ,మేన కోడలి జీవితంబుగ్గి అవుతుందనే ఆరాటం తో బావ మీద ఉన్న కసితో . ఈ సంబంధం చేసుకొంటేనుయ్యో , గొయ్యో చూసుకుంటానని అక్క ప్రతిజ్న చేసింది . ” బావ .వట్టి మూర్ఖపు గాడిద కొడుకు .చెబితే వినే ఘటం కాదు” .మరి అక్కయ్య కు ఎలా భరోసా ఇవ్వాలో తెలీని వింత స్థితిలో పడ్డాడు .ఏమీ పాలు పోవటం లేదు .ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది .అక్కకి చెప్పాడు .తన ప్రయత్నం తానూ చేయటానికి సిద్ధమయినాడు .ఇలా ఎదుటి వారిని చదివే నేర్పు ,అవసరానికి తగిన ఓర్పు ,దెబ్బ కొట్ట టానికి తగ్గ పటిమ ఉన్న వాడు కరటక శాస్త్రి .అక్క సంసారానికి అవసర సమయం లో ఆదుకున్న తమ్ముడు శాస్త్రి
                                   సశేషం
                                                               మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ –14-11 -11 ..
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

సరదా సరదా సాహిత్యం సాక్షి లో ఇవ్వాళ

Posted in సేకరణలు | Leave a comment

కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –1

 

                                            కన్యా శుల్కం లో కరటక శాస్త్రి  –1
                  మహా  కవి గురజాడ అప్పా రావు గారు రాసిన కన్యా శుల్క నాటకం 27 -06 -1892 లోవిజయ నగరం   లో మొట్ట మొదటి సారిగా ప్రదర్శించారు ..ఆ ప్రదర్శనకు వందేళ్ళ పండుగ 1992 లో దేశమంతా భారీగా జరిగింది .అంతకు ముందు  ఆ నాటకాన్ని నేను రెండు మూడు సార్లుచదివాను  .కాని అప్పుడు ఇంకొంచం శ్రద్ధ తో చదివాను .పాత్రల మీద దృష్టి పెట్టి చదివాను .ముందుగా అందరి దృష్టి గిరీశం మీద ,మధుర వాణిమీద  పడుతుంది .వారిద్దరి పాత్రలమీడా లోతైన చర్చలు ,విస్తృత మైన రచనలు జరిగాయి .అల్లాగే మిగిలిన పాత్రలను స్థాలీ పులాక న్యాయం గా పరామర్శించారు .నేను చదివినంత  వరకు అందులో దాక్కున్న ”కరటక శాస్త్రి ”గురించి అంత తీవ్రంగా రాసినదేదీ కనిపించలేదు .మళ్ళీ చదువుతూ ,ఆ పాత్ర మీద దృష్టి పెట్టి చదివా .చదివిన కొద్దీ అతని పాత్ర చాలా లోతైనదని ,నాటక నిర్వహణ లో బాగా సాయపడిన పాత్ర అని ,లోతైన మనిషి అనీ ,కొంత లోకజ్ఞానం   వున్నా ,స్వార్ధం అతన్ని బాగా కిందికి లాగేసిందనీ ,తన పని నేర వేర్చుకోవ టానికి ఎంత కైనా దిగాజారుతాడనీ అని పించింది .అతను నాటకం లో ప్రవేశించిన దగ్గర్నుంచి ,నిష్కర మించే దాకా అతని తీరు తెన్నుల గురించి 1992 సెప్టెంబర్ లో  సుదీర్ఘ రచన చేశా .దేనికీ పంపలేదు .నా దగ్గరే వుంది .అప్పా రావు గారి నూట యాభై వ జయంతి సందర్భం గా దాన్ని మీ అందరి కోసం అందిస్తున్నాను .ఇది పరిశోధన అనే పెద్ద పేరు పెట్టె సాహసం చేయలేను .కాని ,నా అవగాహన ,నా పరిశీలన గా మాత్రం వినమ్రం గా చెప్పు కొంటాను .ఇదీ కరటక శాస్రి కినేపధ్యం
                మనుష్యుల స్వభావాలక్ను బాగా అంచనా వెయ గల దిట్ట గురజాడ .అందుకే తన కన్యాశుల్క నాటకం లో ప్రతి పాత్రా నిండుగా ,జీవం తో తోనికిస లాడు తుంది .పాత్రల స్వరూప ,స్వభావాలను బట్టి ఆయన పేర్లు పెట్టారు .PILGRIMS ప్రోగ్రేస్స్లో పేర్లు అలానే వుంటాయి .అప్పా రావు గారు కుడా అందుకే అర్ధ వంత మైన పేర్లు సార్ధకం గా పెట్టారు .అవి క్లిక్ అయాయి .ఆపాత్రలకు యా పేర్లు LABELS  లాగా వుంటాయి .చిత్రణ ,మనః ప్రవ్రుత్తి ,నడత ,నడక ,అంతా ,ఆ పేరును బట్టే అర్ధమై పోతుంది .అలాంటి వారిలో నులక అగ్ని హోత్రావధానులు ,బావ మరిది కరటక శాస్త్రి .పంచ తత్రం లో కరటక దమనకులు కలిసి ఒక్కరైఅట్లున్తుంది .సింహం వద్ద స్నేహం చేసి ,తంపులు పెట్టి ,పొట్ట పోసుకొనే నైజం గలనక్కలు అవి .కరటక శాస్త్రి సింహం వంటి అగ్ని హోత్రావదావదానులకు స్వయానా బావ మరిది .కొంత లోక ధర్మం తెలిసిన వాడు .జిత్తుల మారి తెలివి తేటలతో తాను అనుకొన్నది సాధించ గల వాడు .ఎత్తుకు పై ఎట్టు వెయ తానికీ ,ఏ ఎండ కు ఆగోడుగు పట్ట టానికి  సర్వ సమర్ధుడు . .అవతలి వారిని ఉబ్బేసి పనులు జరిపించుకొనే నేర్పున్న వాడు .తన చెల్లెలు బాధ ,మేన కోడలు అన్యాయంగా విధవ రాలు కావటం ,రెండో మేన కోడల్ని బావ అమ్మకానికి పెట్టటం బావ గారి అగ్గిమీద గుగ్గిలం తత్త్వం ,ఎరిగి కీలెరిగి వాత పెట్ట టానికి తన శిష్యుడి సహాయం తో ప్రయత్నం చేయ టానికి సిద్ధ మైన బావ మరది కరటక శాస్త్రి .అక్క గారి కాపురం పచ్చ గా వుండాలని తపనతో సాహసం చేసిన తమ్ముడు .దేశ వ్యవహారాలూ ,దేశం లో వస్తున్నా మార్పులు ఎప్పటికప్పుడు ఒంటబత్తించు కొన్న    వాడు .అందు వల్ల పని సులువు తెలిసిన వాడు .ఆవలిస్తే పేగులే కాదు సర్వము లెక్క పెట్ట గలిగే గణికుడు ..
                 కరటక శాస్త్రి పరిచయం మనకు కృష్ణ రాయ పురాగ్రహారం లో నులక అగ్ని హోత్రావదానుల ఇంటిలో జరుగుతుంది .గిరీశం అక్కడికి ”బిచానా ”వేయటానికి వస్తాడు .తన పేరా ఉన్న భూమి అమ్మి కొడుకు వెంకటేశానికి చదువు చెప్పించమని అతని అక్క వెంకమ్మ భర్త అవధాన్లతో అంటుంది .బావ గారి డబ్బు కాపీనం అర్ధం చేసు కొన్న కరటక శాస్త్రి ”నీ భూవెందుకు అమ్మా లామా .-మన సొమ్ము చాడ తిని కొవ్వున్నాడు .అతడే పెట్టుకుంటాడు ”అని బావను కడగటం తో పరిచయ మవుతాడు .
Posted in రచనలు | 2 Comments

ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –6 నూజి వీడు సంచలనం

         ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –6
                                                                     నూజి వీడు సంచలనం
                       1967 లో అద్దాడ నుంచి నూజివీడు బదిలీ అయారు  రావు గారు .షరా మామూలే .77 ఏళ్ళ స్కూల్ చరిత్రలో లేని ”బాల ప్రతిభ ‘అనే స్కూల్ magazine  తయారు చేయించి ప్రచురించారు .నూజివీడు రాజా ఏం .ఆర్ .అప్పా రావు వీరి సేవా కార్య క్రమాలకు అండ గా నిలిచారు .”బాల సాహిత్య acaademi ”స్థాపించి చిన్నారి గూఢ చారి ,మహా కవులు ప్రచురించారు ”.విద్యానగర్ ”కాలనీ ఏర్పాటు చేశారు .అక్కడ ”శాంతి నిలయం ”నిర్మించి విద్యా ,సాహిత్య ,సాంఘిక ,సాంస్కృతిక సేవ సేయటం మొదలు పెట్టారు .ఊపు ఏమీ తగ్గ లేదు .చేసే చెయ్యి ,తిరిగే కాలు ఊరుకో లేవు కదా ..అయినా ఏమీ మార లేదు .కొత్తగా ఏర్పడిన జూనియర్ కాలేజి లోలెక్చరర్ గా promotion పొందారు . .జిల్లా lecturerla సంఘం ,రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయటానికి గొప్ప కృషి చేశారు .రేపల్లె కు బదిలీ అయితె satya sayi స్కూల్ అందరి సహకారం తో నెల కోల్పారు ..Multi faceted personality ”గా గుర్తింపు పొందారు .పుస్తకాలు సేకరించి బుక్ బాంక్ ,బుక్ స్టోరే ఏర్పరచి పేద విద్యార్ధులు పాఠ్య పుస్తకాలు కొనుక్కో కుండా చదివే వీలు కల్గించారు .లైబ్రరి ని ఏర్పాటు చేశారు  నేత్ర శిబిరం నిర్వ హించారు .  రావు గారి పైప్రత్యెక  సావెనీర్ తయారు చేయించి శ్రీ రామా రూరల్ కాలేజి లో ఆవిష్కరింప జేశారు వి.వి.రాఘవయ్య గారు .అప్పుడే ”బాల బంధు ”బిరుదును రేడియో అన్నయ్య గారి సమక్షం లో అంద జేశారు .ఒక ఉపాధ్యాయుడి పై ప్రత్యెక సంచిక రావటం చారిత్రాత్మక మైన విషయం .ఆ అదృష్టం రావు గారికే దక్కింది .అభిమానానికి ,సేవకు దర్పణం గా నిలిచింది ..బాపట్లలో పని చేసినప్పుడు యువకులకు నిర్మాణ కార్య క్రమాలు చేబట్టారు .
                                                    విశ్రాంత జీవిత సేవలు
                 నూజి వీడు లో స్థిరపడ్డారు రిటైర్ అయిన తర్వాత .విద్యానగర్ కాలనీకి రోడ్డ్లు వేయించారు .కల్చరల్ అసోసియేషన్ స్థాపించి అన్ని రంగాల్లో సేవలు చేశారు .దాని అధ్యక్షులయారు .పౌర సౌకర్యాభి వృద్ధి సంఘం ,పోస్టాఫీసు వారి వల్లే ఏర్పడ్డాయి .కొత్తగా పెట్టిన జూనియర్ కాలేజి లో ఇచ్చికం గా ఇంగ్లీష్ బోధించారు .పిల్లల పార్కు ,గ్రంధాలయం నిర్మాణం చేశారు .శ్రీ రామ కృష్ణ సేవా సమితి స్థాపించి ఆధ్యాత్మిక సేవలో ను ధన్యులయారు .శ్రీ సత్యసాయి   కూచి పూడి నాట్య కేంద్రం ,జానపద నాట్య కేంద్రం ఏర్పరచి ఎంతో మందికి నాట్యం లో అభిరుచి కలిగించారు ,మైలవరం ,విస్సన్న పేట లలో బ్రాంచీలు ఏర్పాటు చేశారు .వీరికి ఏలూరు కు చెందిన సినీ నాట్యా చార్యులు శ్రీ కే.వి.సత్య నారాయణ గారు మంచి సహకారం చేశారు .1989 లో గాంధి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వావిలాల గోపాల క్రిష్నయ్య గారిచే ఆవిష్కరణ జారి పించారు .నేతాజీ 96 వ జయంతిని అతి ఘనం గా జరిపారు .
                   ఇన్ని పనులు ఇంత కాలమ్ చేసిన రావు గారి జీవితం నల్లేరు మీద బండి గా సాగింది అనుకో వాటం పొర బాటే .వారి భార్య గారికి పెండ్లి అయిన దగ్గర్నుంచి అనా రోగ్యమే .వంట కూడా చేసే వారు కాదావిడ .పెండ్లి అయిన పదేళ్లకు కాని పిల్లలు పుట్ట లేదు .నెమ్మది నెమ్మది గా ఆమె జన జీవితం లోకి వచ్చారు ..వీరి అక్క గారి సాయం కొండంత అండ ,దీనిని ఆదిగ మించి రావు గారు  బహుముఖ సేవలు అందించారని మరువ రాదు .మొక్క వోని ధైర్యం ఆ ”రాముని ”మీద పూర్తి విశ్వాసం ,మానవ ప్రయత్నం ఆయన్ను అందరి కంటే ముందు నిల బెట్టాయి .భార్య మరణం ,కుమారుని మరణం తో కొంత కలత చెందినా ,అవి మరిచిపోవటానికి ఇంకా సాహిత్య కృషి చేస్తూనే వున్నారు .పిల్లలు హైదరాబాద్ లో వుండటం వల్ల అక్కడికి చేరారు
                     వి.జి.ఎస్.వారికి ఆంగ్ల -తెలుగు నిఘంటువు ను ఒక్క చేతి మీదుగా తయారు చేసి ఇచ్చారు .ఇటీవలే అది ప్రచురింప బడి అందరి ప్రశంసలు పొందింది .ఏ నిఘంటు కారుడు ఆలోచించని రీతి గా ,ఆలోచించి కొత్త ప్రయోగాలు చేశారు .విస్తృత ప్రయోజనం కల్గించారు .సార్ధకం చేశారు .ఇంకా ఏవేవో రాస్తూనే వున్నారు .రోజుకు కనీసం పన్నెండు ఘంటల రచన నిరంతరం సాగిస్తూనే వున్నారు ఈ 88 ఏళ్ళపండు ముసలి .ఆయన తనకు వార్ధక్యం వచ్చిందని భావించటం లేదు .ఇంకా ఏదో చేయాలనీ ,ఇంకా సమాజానికి ఉపయోగ పడాలనే తాపత్రయం వారిది . నిత్యం ఉదయం నడక వారి జీవితం తో పెన వేసుకు పోయిన దిన చర్య.
                    మహోన్నత గురువు ,యువనేత ,విశిష్ట జాతీయ వాది ,అభ్యుదయ కాళాభి మాని ,ముద్దుల మామయ్య ,గాంధేయ వాది అని అందరి చేత ఆత్మీయం గా పిలువబడే రావు గారు ధన్య జీవి .సప్త గిరి చానెల్ లో ఇటీవలే కొన్ని ఎపిసోడ్లకు ర చనలు చేశారు .వారి ‘తాతయ్య లేఖలు ”అనే పుస్తకం పిల్లల చేతి కరదీపికే కాదు ”పిల్లల విజ్ఞాన సర్వస్వం ”అని గుర్తింప బడింది .ఎన్నో సంస్థలు వారిని ఘనం గా సత్కరించాయి ఈ మధ్యే పద్మ భూషణ్ ,నారాయణ రెడ్డి గారి చేతుల మీద గా హైదరా బాద్ లో సన్మానం అందుకొని ఆయన తో ”బాల సాహిత్య చక్ర వర్తి ”అనే సార్ధక బిరుదునుపొందారు   .వారి సేవలకు ఏలూరు లో .పద్మశ్రీ తుర్ల పాటి కుటుంబ రావు గారి ఆధ్వర్యం లో కనకాభిషేకం జరిపి గండ పెండేరం తొడిగారు -వదాన్యులు ,అభిమానులు ..నాకు తెలిసినంత వరకు ఏ ఉపాధ్యాయునికి కాని అధ్యాపకునికి గాని ఇంతటి ఘన సన్మానం జర గ లేదు .ఆంద్ర దేశం గర్వం గా చెప్పు కో వలసిన జీవితం రావు గారిది .”మహాత్ముల బాట లో” నడుస్తూ ,మహాత్ములై ,మనల్నీ మహాత్ములయే రీతిగా ప్రేరణ, స్ఫూర్తి కల్గిస్తున్నఆదర్శ శాంత రచనా తపస్వి  శ్రీ ముదునూరు వెంకటేశ్వ రావు గారు శాతాధికం గా ,ఆయురారోగ్య అయిశ్వర్యాలతో వర్ధిల్లుతూ ,సాహితీ సమార్చనం చేస్తూ వుండాలని ఆకాంక్షిస్తూ —సెలవు
                                   సమాప్తం
                                                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -11 -11 .
Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —–5 హయ్యర్ సెకండరి ఉద్యోగం

          ముదిమి లోను యవ్వనో త్చాహి  శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —–5
                                                     హయ్యర్ సెకండరి ఉద్యోగం
                  అది హయ్యర్ సెకండరిఅంటే  యుగం పన్నెండో తరగతిని high స్చూల్స్ లో ప్రవేశ పెట్టారు .దీని బోధనకు పోస్ట్ గ్రాద్యుఎట్లే అర్హులు .రావు గారు ఏం.ఏ.పస అయారు కనుక దానికి అర్హులు .అద్దాడ స్కూల్ కు promotion పై బదిలీ అయారు .మైలవరం రాజా గారి ఆధ్వర్యం లో గొప్ప సన్మాన సభ ఏర్పాటైంది .రావు గారితో అక్కడ ఒక ఇంగ్లీష్ కాన్వెంట్ ను ఏర్పాటు చేయాలనే సూచన వచ్చింది .వదాన్యుల సహకారం తో ఆగస్ట్ పదిహేనున ప్రారంభించారు రావు గారు .అయితె కొద్ది కాలానికే నిర్వహణ లోపం వల్ల మూత పడింది .పశువుల హాస్పిటల్ అందులో వచ్చింది .రావు గారు చాలా బాధ పడ్డారు . .
                  గుంటూరు లో వీరి అన్న గారు ”శాంతి నిలాయం ”బ్రాన్చిని స్థాపించి విద్యాలయం గా తీర్చి దిద్దారు .మధ్య తరగతి వారి విద్యావసరకలను తీర్చింది .ఇక్కడే పూర్వం బాపిరాజు గారి కళా పీఠం వుండేది .1962 లో చిత్రకారుల అభిరుచులకు అనుగుణం గా ”మళ్ళీ ”మాపిరాజు కళా పీఠం ”స్థాపించారు సోదరులు .ఉన్నత స్థాయిలో కార్య క్రమాలు జరిగేవి .న్యాయవాది నడింపల్లి రామయ్య అధ్యక్షులు .గొప్ప చిత్రకారులు పుప్పాల రాజా నరసింహం కార్య దర్శి ,లక్కరాజు సూర్య నారాయణ ప్రధాన కార్య దర్శి ,బిత్రా శ్రీనివాస రావు కళా ఊపనాసకులు .శ్రీ మారేమండ శ్రీని వాస రావు ,పోరాస్మల్ జైన ,వారణాసి రామ మూర్తి (రేణు)ఈ కళా పీఠం లో పరిమళించిన కళా పుష్పాలు .౧౯౬౩ లో చిత్ర కళా ప్రదర్శన నిర్వ హించారు .శ్రీ నడింపల్లి నరసింహారావు ,”చుక్కాని ”సంపాదకులు ,బందరు వాసి కే.ఆర్.కే..మోహన్ .శ్రీ వత్చవ  వంటి పెద్దలు వచ్చి చూసి అభినందించారు .ముదునూరు సోదరులు ”సంస్కృతీ ”అనే ప్రత్యెక సంచిక ను వెలువ రించారు .
                                                    అద్దాడ లో సేవలు
              రావు గారుఅడ్డాడ   లోచేరారు .  .”బాలానందం ”పత్రిక ప్రారంభించారు .దీనిలో సైన్సు విషయాలను శ్రీ వసంత రావు వెంకట రావు ,రాసే వారు .సోమంచి రామం ,కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ,నార్ల చిరంజీవి ,శ్రీ వత్చవ  ,తంగెళ్ల పాండురంగ శర్మ ,శ్రీమతి హేమలతా లవణం,ఆచంట జానకి రాం ,కవిరావు ,మారేమండ ,శంకర రామా రావు వంటి ప్రముఖుల రచనలతో పత్రిక శోభించేది .గీతా సుబ్బారావు సాంబు ,సత్యమూర్తి నిర్వహణ సహకారం అందించారు .ఆర్ధికం గా  ఆదుకున్న దాతలు వున్నారు .పత్రిక పంపితే హాయిగా చదివే వారే కాని చందా పంపే వారు లేరు అది ఏనుగును పోషించే చందంగా తయారయిన్దన్నారు రావు జీ .అందులో ”అన్నయ్య ”శేర్శికను రావు గారు చూసే వారు .అందులో గొప్ప వారి జీవితాలను ఆకర్షణీయం గా రాసే వారు .”కవుల గాధలు ”,బాలల నవల ”,పెజీలున్దేవి .చిన్నారిగూద చారి  కధలు బాగా ఆకర్షించేవి .ఈ రచనలన్నీ కలిపి ”బాల సాహిత్య అకాడెమి ”ప్రచురణ గా తెచ్చారు .”బాల కవిత ”,బాల వేదిక ”,”కార్డు కధలు ”,గేయాలు ,ఆరోగ్య సౌందర్యం ,సామెతలు ,మాటా మంచి ,ఒకటేమిటి ?అల్ ఇన్ వన్ గా వుండేది లెక్కల పజ్ల్స్ తో మేతమే ట్రిక్స్ రాశారు .ముఖ చిత్రం గా ఆనేలలో జన్మించిన మహామహుల చిత్రాలు వేసే వారు .వెనుక పేజి లో ;;వివేక వాణి ”,గాంధీ అమర వాణి ,రాధాకృష్ణ వాణి ,రమణ వాణి ,పరమహంస వాణి ,నెహ్రు వాణి ప్రచురించి స్ఫూర్తి కలిగించే వారు .పిల్లల సర్వతోముఖాభి వృద్ధికి బాలా నందంద్వారా  అద్భుత సేవ చేశారు .బాలా నందం అంటే ”వైజ్ఞానిక మాస పత్రిక ”అనే గుర్తింపు పొందటం విశేషం .ఇదంతా రావు గారి డ్రీం ప్రాజెక్ట్ గా ప్రొజెక్ట్ అయింది .
                      addada అనే పేరులో మూడుడలు వుండటం అక్కడ  దీడిక్కులు ఎక్కువ .పరీక్షల్లో మార్కులకు గిరాకీ వున్న రోజులవి .మార్కుల కోసం tutions  చదివే వారు పిల్లలు తమ దగ్గర చదివే వారికి ఎక్కువ మార్కులు ,మిగిలిన వారికి తక్కువ వేసే వారు .దీనితో ముఠా తగాదాలు .అధికారుల రాక .రిపోర్టులు .భీభాత్చం గా వుండేది వాతా వరణం .క్రమ శిక్షణ లేదు .అప్పుడు రావు గారు స్కూల్ లోనే tution చెప్పే విధానం  అందరిని ఒప్పించి అమలు చేశారు .గొడవలు తగ్గాయి .దీనినే insti tutionalised tution అంటారు .దేన్నీ మిగిలిన పాతశాలలు ఆదర్శం గా తీసుకొని అమలు పరిచాయి .విద్యార్ధులు రెండు సార్లు సమ్మె చేసే ప్రయత్నం చేస్తే నచ్చ చెప్పి నివారించారు .కరెంట్ సౌకర్యం స్కూల్ లో లేకపోతె ,పిల్లల్ని వరి  కోత కు తీసుకొని వెళ్లి ఆ డబ్బుతో కరెంట్ కల్పించారు .జిల్లా విద్యా శాఖాధి కారి గారు మెచ్చి వీరిని ”krishna jillaa secondary schools cultural asociation ”ఏర్పర చటానికి constitution  రాయించారు .ఆయనే ప్రెసిడెంట్ గా జిల్లా పరిషద్ అధ్యక్షులు శ్రీ పిన్నమ నేని కోటేశ్వ ర రావు గౌరవాధ్యక్షులు గా ,రావు గారు convenor గా కమిటీ ఏర్పడింది .ప్రతి సంవత్చరం జరిగే గ్రిగ్గ్ స్పోర్ట్స్ జరిగే పాథ శాలలో మూడు భాషలలోను దేబాటే ,వ్యాస రచన ,చేతి పనులు ,చిత్ర రచన ,ఏక పాత్రాభినయం పోటీలు నిర్వహించే వారు .బహుమతు లిచ్చే వారు .అడ్డాడ పాథ శాల పత్రిక ”తెలుగు బాల ”అచ్చు పత్రికను విద్యార్ధుల ,ఉపాధ్యాయుల రచనలతో తెచ్చారు .
                                                నా స్వంత విషయం
                 నేను అడ్డాడ హై స్కూల్ లో 1991 నుంచి 1998 వరకు ఏడేళ్ళు ప్రదానో పాద్యాయుని గా పనిచేశాను .అక్కడే రిటైర్ అయాను .అప్పటికి రావు గారి గురించి నాకేమీ తెలీదు .వినటమేతప్ప  .ఆయన చేసిన బాలల కార్య క్రమాలను గురించి విన్తుందే వాడిని .అంత కంటే తెలీదు .నేను చేరే టప్పటికి స్కూల్ లో కరెంట్ లేదు .సర్వీసు వైర్ లేక  పోవటం వల్ల .ఎవరు పట్టించుకోలేదు .నేను ఆగస్ట్ 14  న చేరాను . మర్నాడు జండా వందనం చేయాలంటే జండా చిరిగి పోయిందన్నారు .అప్పటికప్పుడు అక్కడ అంజి రెడ్డి అనే నా పూర్వపు మిత్రుడు ,అప్పుడు గుమాస్తా గా వున్న అన్జిరేడ్డికి చెప్పి మర్నాదుకు సిద్ధం చేయించాను .ఆగస్ట్ పదిహేను అయిందని పించాము .కరెంట్ సమష్య యెట్లా తీర్చాలి అనుకొంటుంటే ,బాల కృష్ణ అనే ల్యాబ్ అసిస్టంట్ ముందుకు వచ్చారు .తన స్వంత ఖర్చుతో కరెంట్ వైర్ కోని సర్వీసు వచ్చేట్లు చేశారు ,నాకు అది శుభ సూచకం గా కనిపించింది .స్తాఫ్ఫ్ అసోసియేషన్ ఏర్పాటు చేయించాను .పామర్రు లో నాతొ పని చేసినవీరభద్ర రావు అనే  సెకండరి ఉపాధ్యాయుడిని అందరి అంగీ కారం తో సెక్రటరీ ని చేశాము .ఆయన అప్పటి నుంచి ,నేను రిటైర్ ఆయె దాకా గొప్ప సహకారం అందించారు .అక్కడి నా ప్రతివిజయం లోను ఆయన పాత్ర వుంది .క్రమం గా కార్య క్రమాలను ఒక్కొక్కటే చే బట్టాను .కొత్త ఆలోచనలతో ముందుకు సాగాను .అందరిది .సహకారం బాగా లభించింది .స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ అడుసు మిల్లి రామ బ్రహ్మం గారు తన వంతు సహకారం ఇచ్చారు .అక్కడ విద్యార్ధులంతా బి.సి.ఎస్.సి విద్యార్ధులే .ఉత్తీర్ణతా శాతం తక్కువ .అందుకని స్పెషల్ క్లాసులు తీసుకొనే వాళ్ళం .ఇంటర్వల్ లో నేను ఇంగ్లీష్ గ్రామర్ ,లెక్కలు చెప్పే వాడిని .సాయంత్రం స్కూల్ అయింతర్వాత ఒక గంట చది వించే వాళ్ళం .నెమ్మది గా పిల్లల్లో హుషారు పెరిగి చదవటం ప్రారంభించారు .క్రమంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది .
                    సైన్సు ప్రదర్శన పుస్తక  , ప్రదర్శన ఏర్పాటు చేయించాను .చుట్టు పక్కల స్కూల్ వాళ్ళను కూడా ఆహ్వానించి చూసే ఏర్పాటు చేశాం .అప్పటికి వార్షి కొత్చావాలు అక్కడ లేవు .డబ్బు లేదు .అందరి సహకారం తో వరికోతలు ,మినప తీతలు చేసి డబ్బు సంపాదించివార్షి కొత్చావాన్ని  ప్రతియేడు ఘనం గా జరిపాము .నాటికలు ,పాటలు డాన్సులు అన్ని ఉండేవి .పిల్లలలతో ”భారతావతరణం ”అనే పద్య నాటికను వేయించాను ,నోరు తిరగని విద్యార్ధులతో శ్రమ తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వేయించాను .పద్యం చదవటం అందులో రాగ యుక్తం గా పాడటం నేర్పాను.వాళ్ళందరూ బి.సి .,ఎస్,సి విద్యార్ధులే .అవన్నే టేప్ రికార్డర్ లో రికార్డు చేయించాను .ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చిన విషయం ..ఆడ పిల్లలు ఆటలు ఆడే వారు కాదు విద్యార్ధులకు ఆటల్లో చదువుల్లో మంచి బహుమతులు ఇచ్చే వాళ్ళం .వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ల కోసమే ఖర్చు చేసే వాళ్ళం . .జగన్మోహన రావు ,ది.నాగేశ్వర రావు అనే డ్రిల్ మాస్టర్లను ఉత్చాహ పరిచి ఆడ పిల్లల ఆటలు జరిగే చోటికి ఆడ పిల్లలనుఅపంపించి వాళ్లకు ప్రేరణ కలిగించి క్రమంగా ఆటలలో పాల్గోనేట్లు చేశాం .కబాడీ ,త్రో బాల్ అదే టట్లు చేశాం .సబ్ జానే లో వరుస గా ఫస్ట్ వచ్చారు .అలాగే మగ పిల్లలు  వాలి బాల .బాడ్మింటన్ లో ఎప్పుడు ఫస్ట్ .ఉపాధ్యాయ్లం వాలీ బాల్ .బాద్ మింటన రోజూ ఆడే వాళ్ళం .పోటీలలో గెల్పు అడ్డాడ ఉపాధ్యాయులదే అన్నట్లు వుండేది .సెంట్రల్ జోను లోను ఇదా హవా . గుడివాడ యెన్.టి.ఆర్ స్టేడియం లో పోటీలు జరిగేవి .నేను లెఫ్ట్ ఫ్రంట్ ఆడే వాణ్ని .నా సర్వీస్ అంటే కనీసం నాలుగు అయిదు పాయిన్ట్లినా రావాల్సిందే .అలాగే వాలి బాల్ సర్వీసు లో కూడా సర్వీసు కు నాలుగు కంటే ఎక్కువ వచ్చేవి .నేను సర్వీసు చేస్తుంటే జనం విపరీతం గా చప్పట్లు కొట్టే వారు .అంత గొప్ప ప్రోత్చాహం లభించేది ”.ముసిలాడు బాగా అడుతున్నాడ్రా” అని కామెంట్లు .ఇంకా రెచ్చి పోయేవాడిని .ఆట బాగాఆడే  వీరభద్ర రావు ,నాగేశ్వర రావు లను బాగా ప్రోత్చాహించే వాడిని .తప్పు చేస్తే అరిచే వాడిని కూడా .నెక్స్ట్ టైం బెటర్ లాక్ అంటుండే వాడిని .janam నాకు ఇచ్చే ప్రోత్చాహం ఒక సచిన్ కో ,కపిల్దేవ్ కో ఇచ్చినత గొప్ప గా వుండేది .అది మరువ లేని విషయం    .నా జీవితం లో .అద్దాడ టీం వస్తోందంటే హడలు అన్నట్లుండేది .
                      అంగలూరు లో వున్న దయట్ కాలేజీ నుంచి lecturerlnu పిలిపించి ఉపన్యాసాలు ఇప్పించే వాడిని .ఉయ్యూరు వాడు ఫణి రాజా మోహన అనే గణిత ఉపాధ్యాయునితో విద్యార్ధులే ప్రుచ్చకులుగా ”గణిత అష్టావధానం ”చేయించా.అతను నా   శిష్యుడే .దయట్ ప్రిన్సిపాల్ చాగంటి వెంకటేశ్వర రావు గారు వచ్చి మా కార్య క్రమాలకు మురిసి పోయారు .సెప్టెంబర్ అయిదు ఉపాధ్యాయ దినోత్చావం అనే గురు పూజోత్చ వాణ్ని విద్యార్ధులతో ఘనం గా జరిపించే వాడిని విద్యార్ధులు స్వయం గా ముందుకు వచ్చి డబ్బులు వసూలు  చేసుకొని ఉపాధ్యాయులన్దరినీ ఆరోజు సన్మానించే వారు .నేను ప్రతి సంవత్చరం ఆ రోజున ఒక టీచర్ ను ఎన్నిక చేసి స్టాఫ్ తరఫున సన్మానం చేసే వాడిని .అక్కడ పని చేసి  రిటైర్ అయిన టీచర్స్ ను కూడా ఆహ్వానించిసన్మానించే వాళ్ళం . చుట్టూ పక్కల ఏ స్కూల్ లోను ఇలా జరిగేవి కావు .అందుకని గొప్ప ఫీల్ ఆయె వారు .ఇదంతా అందరి సహకారం తో జరిపిన పంలె .విద్యార్ధులను ఆంద్ర బాంక్ కు  ,పోస్ట్ ఆఫీస్ కు పంపి లావా దేవీలు జరిగే తీరు నేర్చుకోనేట్లు చేశాను .ఇది కొత్త ప్రయోగం . .ఇన్స్పెక్టర్లు వచ్చి అద్దాడ ప్రగతిని చూసి మెచ్చే వారు .అద్ద్కాదను చూసి నేర్చుకోండి అని మిగిలిన స్చూల్స్ లో చెప్పే వారట .ఆడ పిల్లలకు సుబ్జోనే ఆతల పోటీలు రెండు రోజులు గ్రామస్తుల ,పరిసర గ్రామస్తుల సహకారం తో అత్యంత వైభవం గా జరిపాము .మంచి భోజనం ,వసతి గొప్ప బహుమతులు .అందరికి ఆశ్చర్యం కలిగింది .అడ్డాడ హై స్కూల్ కు నాకు మంచి పేరు రావటం నా అదృష్టం .టీచర్స్ రిటైర్ అయితే ఘనం గా సన్మానించే వాళ్ళం .ఊళ్ళో వాళ్ళను ప్రోత్చ హించి విద్యార్ధులకు అనేక బహుమతులు ఇచ్చే ఏర్పాటు చేశాను .సైన్సు పరికరాలు ,ఆట వస్తువులు ,క్రాఫ్ట్ కు కావలసిన సామాను కొనే వాడిని .అక్కడి డ్రాయింగ్ మేష్టారు అప్పా రావు మంచి ఆర్టిస్ట్ ,స్కూల్ మగజైన్ ఆయన సహకారంతో వ్రాత ప్రతి గా తెచ్చే వాళ్ళం .దేనికీ డబ్బు లేదు అనే మాట వుండేది కాదు .పిల్లల డబ్బే పిల్లల సౌకర్యాలకు ఉపయోగించాము .మంచి నీరుకు బావి మాత్రమే వుండేది మోటర్ ఎప్పుడో చెడి పోయింది .దాన్ని బాగు చేయించి రక్షిత మంచ్ నీతి సరఫరా ఏర్పాటు చేశాను .స్కూల్ చరిత్ర ను రాయించాను .పని చేసిన ప్రదానో పాద్యాయుల పేర్లున్న బోర్డు రాయించాను .స్కూల్ ఫస్ట్ విద్యార్ధుల పేర్లు రాయిన్చాము .దాతల పేర్లు పర్మనెంటబోర్డు మీద రాయించాను .మొక్కల పెంపకం వుండేది కొబ్బరి చెట్లకు పోషణ బాగాచేయించి ఫలా సాయం తీశాం .పాట పెట్టి ఆ డబ్బు జమ చేసే వాళ్ళం .ఒక రూరల్ స్కూల్ లో ఇదంతా అసాధ్యమే కాని సుసాధ్యమయింది పిల్లల ,పెద్దల ,గ్రామస్తుల ,సిబ్బంది సహాయ సహకారం తో .ఇదో దివ్యానుభూతి నాకు .చాలా సంతృప్తిగా 1998 జూన్ 30 న రిటైర్ అవటం నా అదృష్టం .ఇందుకు నాకు సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలు .
                     ఇదంతా ఎందుకు అంటే నా బావ మరిది టి  .వి.ఎస్,.బి.శాస్త్రి నూజివీడు లో వెంకటేశ్వర రావుగారి శిష్యుడు .  తన జీవిత చరిత్రలో ఆయన అడ్డాడ లో పని చేసిన విషయం వుందని చెప్పాడు .అతను ముసునూరు బాంక్ లో పని చేసే వాడు .అప్పుడు నేను మా స్టాఫ్ తో సంప్ర దించి ,16 ఏళ్ళ క్రితం
రావు గారిని ఒక స్వాతంత్ర దినోత్చావం నాడు ఆహ్వానించి ,విద్యార్ధులకు సందేశం ఇప్పించి ,ఘనం గా సన్మానం చేశాము.మా బావ మరిది కూడా వచ్చాడు .అతని paintings ప్రదర్శన ఏర్పాటు చేశాం కూడ .రావు  గారు చాలా సంతోషించారు .ఎప్పుడో పని చేసిన తనను గుర్తుంచుకొని ఆహ్వానించి సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు .మళ్ళీ ఈ సంవత్చరం సెప్టెంబర్ 28 న ఉయ్యూరు లో” సరస భారతి ”29 వ సమావేశానికి ముఖ్య అతిధి గా ఆహ్వానించి శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వార్ల దేవాలయం లో ”మహిత మందిరం ”లోఘనం గా  ”బాల సాహిత్య చక్ర వర్తి ”బిరుదాంకితులు శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారిని  సత్కరించాము .ఆ కార్య క్రమానికి అనుకోని అతిధులు గా కృష్ణా జిల్లా రచయితల అధ్యక్షా ,కార్య దర్సులు శ్రీ గుత్తికొండ సుబ్బా రావు గారు ,దా.జి.వి పూర్ణ చంద్ గార్ల సమక్షం లో  లో ఈ సన్మానం జరగటం విశేషం .ఇది నా జీవితం లో మరుపు రాని సంఘటన .రావు గారు చాలా సంతోషం వెలి బుచ్చారు మా బావ మరది శాస్త్రి కూడా వచ్చాడు .రావు గారు రెండు గంటలు పై గా మా ఇంట్లో వుండటం గొప్ప అనుభూతిని మిగిల్చింది .వారు రాసిన వారి పుస్తకాలు నాకు అండ జేశారు .
                                                    మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -11 -11 .
Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

Gurajada 96 years oldman

This slideshow requires JavaScript.

This slideshow requires JavaScript.

Posted in మహానుభావులు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు —3 పశు వైద్యో కోటయ్యో నారాయనో హరిహ్

      ఊసుల్లో ఉయ్యూరు —3
                                             పశు వైద్యో కోటయ్యో నారాయనో హరిహ్
                మా ఉయ్యూరు లో పూర్వంపశువుల  పశ్వుల ఆస్పత్రి మాసువర్చ లాంజనేయ స్వామి   దేవాలయానికి దగ్గర సూరి వారి బజారు లో వేదాంతం రామాచార్ల గారి ఇంటి వద్ద వుడేది .అద్దె కే .ఒక చిన్న పెంకుటిల్లు .అందులో డాక్టర్ గారి ఆఫీసు ,బీరువాలలో మందులు ,కత్తులు కతార్లు మొదలైన శస్త్ర పరికరాలు ఉండేవి .బయట ఒక తాటాకుల పాక .డాక్టర్ గారుపశువుల యజమానుల్ని  ఈ పాక లో వుండి ,ఒక రిజిస్టర్ లో వివ రాలు అడిగి రాసుకొనే వారు .పాపం ఆయనకు ఒక చిన్న కొయ్యకుర్చీ ,చిన్న  , కొయ్య  బల్ల .చేతులు కడుక్కోవటానికి స్టాండ్ బేసిన్ .లైఫ్ buoy సబ్బు ,చిన్న తువాలు .రెడీ గా చేతికి గ్లోవేలు ,కాళ్ళకు పొడవైన మోకాళ్ళ దాకా వచ్చే బూట్లు .ఒక కామ్పౌందర్ సహాయకారి .ఇద్దరు అటెండర్లు  .అక్కడికి వెడితే భలే తమాషా మందుల వాసన వచ్చేది .నా చిన్నప్పటి నుంచి ఆ ఆస్పత్రితో సంబంధం వుండేది .మాకు గేదెలు ,ఆవులు ఉండేవి పాలేరు వుండే వాడు .దాదాపు వూళ్ళో చాలా మందికి ఆనాడు పశువులు ఉండేవి .వ్యవసాయం వున్న వారికి ఎడ్లు ,బండీ పెద్ద పాలేరు వుంటారు … .
                         ఆ కాలమ్ లో పశువులకు జబ్బులు బాగా నే వచ్చేవి .గాళ్ళు అనే వ్యాధి కాళ్ళకు వచ్చేది .దీన్నే గాలి కుంటు వ్యాధి అంటారు .పాపం అవి విపరీతం గా బాధ పడేవి .ఈగలు    ఆ పుళ్ళ మీద ముసి రెవి .ఆజబ్బు సోకితే తిండి తినేవి కావు .వాటి బాధ వర్ణనా తీతం .కొన్ని పశువులు లేవ గలిగే స్థితి లో ఉండేవి కావు .లేస్తే ఆస్పత్రికి పాలేళ్ళు తోలుకు వెళ్లి మందు వేయించే వారు .ఆస్పత్రి లో అన్నిరకాల   పశువులకు వైద్యం వుండేది .గొప్ప తనం ఏమిటీ అంటే  దమ్మిడీ కూడా డాక్టర్లు కాని ,సహాయకులు కాని ఏ జబ్బుకు డబ్బు తీసుకోక పోవటం .అన్ని మందులు ఆస్పత్రి లోనే ఉండేవి .అన్నీ ఉచితమే .అవసరమై ఇంటి దగ్గర వేయాల్సి వస్తే వాళ్ళే ఇచ్చే వాళ్ళు .దానికీ డబ్బు లేదు .
                       పాలేల్లతో పాటు చిన్నప్పుడు ,ఆ తర్వాత ఉద్యోగం చేసే టప్పుడు నేను హాస్పత్రికి వెళ్ళే వాడిని .అక్కడ గొడ్లను నుంచో పెట్టి మందు నోటిలోకి పోయటానికి రెండు అడ్డ కర్రలు భూమిలో సపోర్ట్ తోనూ ,ముందు ఒక బలమైన కొయ్య స్థంభం సుమారు అయిదారు అడుగుల పొడవుతో ఉండేవి .దీనికి పశువును కట్టి మొర పైకెత్తించి నోటిలో పొడవైన వెదురు గొట్టంలో మందు పోసి నాలుక అదిమి పట్టి నోటిలోకి చెయ్యి పెట్టి పోసే వారు .అవి గుట గుట తాగుతుంటే తమాషాగా వుండేది .తాగింతరవాత పొట్ట మీద చరిచే వారు .పూర్తి గా లోపలి చేరా టానికి .
                    ఎద్దులు దున్నలు వస్తే వాటికి మూపురం మీద ,కంఠం కింద ,గంగ డోలు వాచినపుడు వాటిని పట్టుకొని వైద్యం చేయటం కష్టం .అందుకని ఇసక తో పూడ్చిన గొయ్యి లాంటి వెడల్పైన దాంట్లో కాళ్ళకు బందాలు వేసి ఒక్క సారిగా పడి పడుకొనే ట్లు చేయటం భలేగా వుండేది .గంగ డోలు వాస్తే ఒక రకమైన ఆయింట్ మెంట్ రాసే వారు సహాయకులు .అది రాసింతర్వాత పసుపు రంగులో మారేది .వింతవాసన వచ్చేది .ఈ పనులన్నీ  చేయ టానికి నాకు తెలిసిన దగ్గర్నుంచి కోటయ్య,పరసు రాముడు  అనే చాకలి వాళ్ళు ఇద్దరు అటెండర్లు గా వుండే వారు .వాళ్లకు retirement వుండదేమో నని పించేది .ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి చీకటి పడే వరకు ద్యుటి ఏ.విసుగు విరామం లేదు .అందులో పెద్ద అతని పేరు కోటయ్య .నల్లగా ,పెద్దముక్కు తో ,బలం గా ,కొంచెంగండు మొహం తో   వుండే వాడు .కీచు గొంతు ,.తెల్లని పంచె ,తెల్లని చొక్కా ఉండేవి .అవి ఎంత కష్టమైనా పని చేసినా మాయటం నేను చూడ లేదు .మా ఇస్త్రీ చాకలి మాణిక్యం అనే అమ్మాయికి తమ్ముడు కోటయ్య .రెండ వ అతను పరశు రాముడు కాకి నిక్కర్ ,బనీను తో వుండే వాడు .ఇందులో కోటయ్య ఆరితేరిన మనిషి .డాక్టర్లు ఆ కాలమ్ లో తక్కువ ,సరిగా వచ్చే వారు  కాదు .కనుక హాస్పటల్  లో కోటయ్య వుంటే డాక్టర్ వున్నా .లేక పోయిన ఫరవాలేదు .అందరికి అదో ధైర్యం . అతని అనుభావసమే అతను డాక్టర్ కంటే గొప్ప వాడిని చేసింది .అందుకే నాకు అతనే పశువుల పాటి నారాయణుడు అనిపించే వాడు .ఆ ఇద్దరు అశ్వినీ దేవతల్లా అని పించే వారు .వారి సేవలు నిరూప మానం ..మాటలతో వర్నించలేనివి .కనీసం ఈ రూపం గా నైనా వాళ్ళిద్దర్నీ తలిచి ఉయ్యూరు వాసుల ఋణం తీర్చు కోవటమే నేను చేస్తున్న పని .వాళ్లకు ఏమిచ్చి ఋణం తీర్చుకో గలం  ?ఉయ్యూరు చుట్టూ పక్క గ్రామాలకు అప్పుడు ఇదే ఆస్పత్రి .ఆ తర్వాత చుట్టూ వచ్చాయి  గేదెల గేదేలాక్ అరుపులతో ,ఆవుల అమ్బారవాలతో దూడల అరుపులతో ,ఎద్దుల  రంకె లతో భలే సందడి గా వుండేది .కొల్ల కొక్కొరో కోలు,కుక్కలా నాలుకల విసుర్లు భౌ భౌ లు వింత గా ఉండేవి .
                      పశువులకు పారుడు వ్యాధి బాగా వుండేది .అవి పారుకొంటు ఆస్పత్రి అంతా చెడగొట్టేవి   .పాలేళ్ళు జాగ్రత్త గా ,శుభ్ర పరిచే వారు .గోడలకు injection   చెయ్యటం చూడ ముచ్చట గా వండేది .సహాయకులు తాడు వేసి బిగించి పశువును రాటకు కట్టిఅదిలిస్తూనే డాక్టర్   గారు కావలసిన మందును సిరంజి లో ఎక్కించి  తుంటి మీదో ,మెడ మీదో మూపురం మీదో బలం గా సూదిని లాగి పెట్టి పొడి చే వాడు .అది నిలబదిన్తర్వాట ,సిరంజి లోని మందు దానిలోకి ఎక్కించే వాడు .సరదా గా వుండేది చూడ టానికి .అవును బాధ పశువుది ఆనందం ఈ నర పశువుది కదా ..అర్రు మీద పుల్లు ఏర్పడేవి .సరైన సమయం లో మందు వేయక పొతే అది బాగా లోతు గా పెరిగేది .అలాంటి వాటికి రోజూ డ్రెస్సింగ్ చేసే వాళ్ళు కోటయ్య ,పరశు రాముడు .అయోడిన ఆయింట్ మెంట్ రాసే వారు .బొరిక పౌడర్ అద్దె వారు .tncture   లో దూది ,అద్ది పట్టు కార లాంటి సాధనం తో పుండు లోపలి పోనిచ్చి చెడు పదార్ధం అంతా బయటికి తీసేసి గాజు గుడ్డకు మందు రాసి అందులో పెట్టి డ్రెస్సింగ్ చేసే వారు.చేతులు కడుక్కోవతానికీ పుల్లు కడగా టానికీ పోతాస్సియం పెర్మాంగా నెట్ వాడే వారు . .కొన్ని ఆవులు,గేదెలు ఈనిన తర్వాత మాయ వేసేవి కాదు .ఒక రోజూ చూసి వాటిని తీసుకొచ్చే వారు .గ్లోవులు తొడుక్కొని పరసురాముడు ,కోటయ్య దాన్ని బయటికి తీసీ వారు .అప్పుడు డాక్తో చెక్ చేసి మందు రాసే వాడు .మంచి ఆబోతు ,దున్న పోతు కొంత కాలమ్ వున్నట్లు జ్ఞాపకం .ఎద కు వస్తే వాటితో దాటిన్చ్ వారు .ఏదైనా యజమాని ఇస్తే తీసుకొనే వారు .ఆ పనీ కోటయ్య సమర్ధం గా చేసే వాడు .చూడి నిలిచిందో లేదో మూడో నెల నుంచి పరీక్షకు తెచ్చే వారు .దానికీ కోటయ్యే ముందు .’కోడె దూడలకు వృషణాలు కొట్టటం కూడా చేసే వారు .పశువును ఒడుపుగా తాళ్ళు నడుం చుట్టూ వేసి బిగించి ఒక్క ఉదుటున పడుకో బెట్టె నేర్పు . కోటయ్యడే ఎంత లావు పశువైనా అతని లాఘవం ముందు బలాదూరే . .పాలు సరిగ్గా ఇవ్వటం లేదనో దూడ , పాలు తాగటం లేదనో వచ్చే వాళ్ళు .డాక్టర్ వుంటే సరే .ఏక పోతే కోటయ్యే కామ్పౌందర్ తో కేసు రాయించి మందు ఇచ్చి పంపేవాడు .లేగ  దూడలకు మట్టి తింటే పేడలో  పురుగులు పడేవి .చాలా బాధ పడేవి .మెలికలు తిరిగేవి .వాటికీ చక్కని మందు ఇచ్చే వారు .నాకు తెలిసినంత వరకు ఏ పశువు వైద్య లోపం వల్ల అక్కడ చని పోలేదు .ఇది చాలు కోటయ్య సేవకు .
                     డాక్టర్లలో నాకు కొంత వరకు తేతలి సుబ్బా రావు గారు తెలుసు .అ తర్వాత చాలా మంది వచ్చే వారు ,పోయే వారు .ఎవరు వచ్చినా ,పోయినా కోటయ్యే అసలు డాక్టర్ నా దృష్టిలో .వాళ్లకు పెద్ద గా జీతాలున్దేవి కాదను కుంటా .దేవిరింపు లేదు .దసరాకు మాత్రం అన్ని ఇళ్ళకు మామూళ్ళ కు వచ్చే వారిద్దరూ .చాల సంతోషం గా యజమానులు తోచింది ఇచ్చి సంతృప్తి పరిచే వారు .ఆరగా ఆరగా బీడీలు తాగే వారు .రాత్రి పూట పొద్దున్నించీ చేసిన పనికి ఒళ్ళు పులిసి మందు కొట్టే వారు .అయితే ఎప్పుడు వీధిన పడే వారు కాదు .తెల్లార గానే ద్యుటి కి మళ్ళీ హాజరు .ఆ హాంగోవర్ కని పించేది కాదు .పనిలో బద్ధకం ,అశ్రద్ధ లేవు .క్రమం గా ఆస్పత్రి లో డబ్బు ప్రవేశించింది .,వీళ్ళు రిటైర్ అయింతర్వాత .మందులు ఉండేవి కావు .డాక్టర్ రాసిస్తేబయట  కోని తెచ్చుకోవాలి .artficial insemination వచ్చింది .బలమైన ,పాలిచ్చే సంతాతి ,జెర్సీ ఆవులు ,వచ్చాయి .ఒక సారి ఒక కుర్ర డాక్టర్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు .నాగేంద్ర మూర్తి అని పేరు అని అజ్నాపకం .పశువుల పెంపకం లో మంచి సలహాలనిచ్చాడు .పాలిచ్చే వాటినే వుంచి మిగిలినవిఅమ్మేయమని   సలహా ఇచ్చాడు .నేను పాటించాను .సరదాగా నవ్వుతు మాట్లాడే వాడు .అప్పుడువసతులు లేవు .కానిడ్యూటి   మీద శ్రద్ధ బానే వుండేది వున్న దాంట్లోనే చక్కని వైద్య సేవలు అందించే వారు .
                           ఇప్పుడు పశువుల ఆస్పత్రి అమెరికా లో ఉంటున్న ఉయ్యూరు నివాసిఅక్కడ  retired లైబ్రరియన్ అయిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి భారీ విరాళం తో నిర్మింపబడిన ఏ.సి .గ్రంధాలయం ప్రక్కన వుంది .మంచి బిల్డింగ్ ను ,వసతులను ఉయ్యూరు కే.సి .పీ .వారు కలుగ జేశారు .బాగానే నడుస్తోంది సమర్ధులైన స్తాఫ్ఫ్ వున్నట్లు తెలిసింది .కొయ్య చట్రాలు పోయి ఇనుపవి వచ్చాయి .వీటిని ఫోటో లలో చూడ వచ్చు .
             వైద్యో నారాయనో హరిహ్ .అని సామెత .మా పశు వైద్య శాలకు కోటయ్యే మాకువైద్యుడు  ,నారాయణుడు ,హరీ అన బోయే పశువులకు ప్రాణ దాత .అందుకే అతన్ని ,అతని సహచరుడు పర్సు రాముడిని జ్ఞాపకం చేసుకున్నాను
                                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -11 -11
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —4

       ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —4
                                                  సాంఘిక సాహిత్య సంక్షేమ కార్య పరం పర
                   1953 లో గోదావరి నదికి వరదలు వచ్చాయి .పిల్లలను ,పెద్దలను ,యువకులను చేర దీసి వరద సహాయ నిధి కోసం గ్రామాలన్నీ తిరిగి బుర్రకధలు చెప్పించారు .నాటికలు వేయించారు ,పంచ వర్ష . ప్రణాళికలు ,గ్రామ స్వరాజ్యం ,మహిళాభ్యుదయం పై ఉపన్యాసాలను తయారు చేసి ,విద్యార్ధులతో మాట్లాడించే వారు .శాంతి నిలయం సేవా సంఘం ద్వారా ,ముదునూరు లో రోడ్లను అభివృద్ధి చేశారు .”ఉచిత హిందీ శిక్షణా సౌకర్యం ”ను పువ్వుల రామ మోహన రావు వంటి హిందీ ప్రేమికుల ద్వారా కల్పించారు .రైతు బిడ్డలను విహార ,విజ్ఞాన యాత్రలకు తీసుకొని వారి జ్ఞానాభి వృద్ధికి దోహదం చేశారు .కుల మతాలకు అతీతం గా పని చేశారు .అందుకే అది ”సోషియోఎడ్యుకేషనల్ కల్త్యరల్  సెంటర్ ”గా గుర్తింపు పొందింది .ఆ కాలమ్ లో ఎన్నో సాహిత్య ,కళా సంస్థలు పుబ్బలో పుట్టి మఖ లో మాడి పోయాయి .దానికి కారణం సంకుచితత్వం,ఈర్ష్యాద్వేషాలు అని బాధ పడుతారు రావు గారు .అందుకే వాటికి అతీతసం గా ,ముదునూరు సంఘం సేవలందించింది .బాధ్యతలు అందరికి ,సామర్ధ్యాన్ని బట్టి అప్పగించే వారు .మంచి పర్య వేక్షణ వుండేది .వీటికి మించి సేవా దృక్పధం వుంది .”రాము -రాజా ”అనే ఇద్దరబ్బాయిలు పిల్లల కార్యక్రమ రూప కల్పనలో నిర్వహణ లో బాగా తోడ్పడ్డారు .
                     radio అన్నయ్య శ్రీ ఏడిద కామేశ్వర రావు ముదునూరు వచ్చి కార్యక్రమాలను పరిశీలించారు . radio వారే వచ్చి పిల్లల కార్యక్రమాలు రికార్డు చేసి ప్రసారం చేశే వారు .ఉయ్యూరు మొదలైన గ్రామాలలో ”బాల రాజ్యం ”బ్రాంచీలు ఏర్పాటి చేశారు .మేము అందరం అందు లో పాల్గొనే వాళ్ళం .అప్పుడు ఆయన్ను చూసిన గుర్తు నాకు లేదు .ముదునూరు నుంచి సుమారు 100 ”బాల రాజ్యం ”కార్యక్రమాలు నిర్వహించిన ఘనా పాటి రావు గారు . ఆరుగొలను నుంచి నండూరి సుబ్బారావు అనే హాష్య నటులు ,ముదునూరు నుంచి ఈ సోదరులు పిల్లలను radio కార్య క్రమాలకు విజయవాడ  తీసుకొని వెళ్ళే వారు .రావు గారిని ”radio కార్యక్రమ సభ్యుని ”గా చేశారు వీరు ప్రదర్శించిన ”ఉగాది అల్లుడు ”నాటిక బాగా క్లిక్ అయింది .గంగిరెద్దు ,హరిదాసు ,గొబ్బిపాట ,లతో సంక్రాంతి శోభను రేడియోలో కల్పించారు .పిల్లలు లంబాడి డాన్స్ చేసి అచ్చంగా లంబాడీలే క్యని పించే వారు .రావు గారి శిక్షణ అంత నిర్దుష్టం గా వుండేది .వీరు రచించి ప్రదర్శించిన గంట నాటిక ”కనువిప్పు ”పోటీలలో బహుమతి సాధించింది .ఉమ్మడి డబ్బు సమాజానికి ఎలా ఉపయోగించాలో తెలియ జేసే కధ ఇది .  .
                  1955 లో భూదానోద్యమ నాయకులు వినోబా భావే విజయ వాడ వచ్చార్రు .వారి సమక్షం లోవారి జీవిత కధ ను   బుర్రకధ గా మలిచి రాము బృందం తో ప్రదర్శించి భావే మెప్పు పొందారు .దాన్ని ఆయనకే అంకితమిచ్చారు .రచనకు క్రియాశీల ప్రయోజాం వుండాలని ,ఉన్నత భావావిశాకరణ జర గాలాని రావు గారి అభిప్రాయం .కరుణశ్రీ ,ఉత్పల ,ముదిగొండ ,వంటి కవులు ,ముదునూరు వచ్చి శాంతినిలయం కార్యక్రమాలు చూసి ముచ్చట పడ్డారు .;”భారత సేవా సమాజ్ ”ఇచ్చిన ఆర్ధిక సాయం తో ముదునూరు లో డొంక రోడ్డు నిర్మించారు .వీరి రేడియో కార్యక్రమాలు విని ఆనాటి బందరు పార్లమెంట్ సభ్యులు మండలి వెంకట కృష్ణా రావు అభినందన లేఖ రాశారు .గ్రామ మహిళా సంఘం ఏర్పరచి ,”మరుగుదొడ్డి ”అవసరాన్ని వివరించి అమలు పరిచారు .40 మంది మహిళల తో ”అంబర్ చరఖా కేంద్రం ”ఏర్పాటు చేసి ,బ్లాక్ డెవలప్మెంట్ వారి ఆర్ధిక సాయం తో ,శిక్షణ నిప్పించారు .దీనితో పేద కుటుంబాలకు జీవనో పాది లభించింది .కుట్టు పనులు నేర్పించారు గృహా లంకరణ .నేర్పించారు . .తాటాకు చాపలు ,ఈతాకు చాపలు విసన కర్రలు తుంగ చాపలు జేబు రుమాళ్ళు తయారు చేయించే వారు .కవర్ల తయారు చేయటం లో శిక్షణ నిప్పించారు .ఇవన్నీ మంచి ఉపాధి కల్పించాయి ..ఇవన్నీ రావు గారిమెదడు   లోని ఆలోచనలు .అవి సమర్దవంతం గా అమలయాయి .స్వంత కాళ్ళపై నిలబడే గొప్ప  అవకాశం కల్పించారు రావు గారు .ముదునూరు గ్రామ జీవనం లో ఈ కేంద్రం మైలు రాయి గా నిలిచి ,ఆడర్శవంతమైంది  ‘చేతి పనుల ప్రదర్శన ఏర్పాటుచేసి అందరి ప్రశంసలు పొందారు .
                     ఏడు ఏళ్ళు ముదునూరు లో గ్రామ ప్రజల చైతన్య కార్య క్రమం నిర్విఘ్నం గా జరిపిన ఘనత వెంకటేశ్వరావు సోదరులాడే .ఆ సమయం లోనే మద్రాస్ ,హైదరాబాద్ ,ధిల్లీ లకు విజ్ఞాన యాత్రలు నిర్వహించారు ధిల్లీ లో భారత ప్రధాని నెహ్రూను దర్శించి మాట్లాడి ,ఆ జ్ఞాపకాలను ”పండితజీ తో పది నిమిషాలు ”వ్యాసం లో నిక్షిప్తం చేశారు .ఋసీ కేష్ లో స్వామి శివానంద ను సందర్శించి ,ఆధ్యాత్మిక అనుభూతి పొందారు .ఇంత తీరిక లేని కార్య క్రమాలు నిర్వ హిస్తూనే 1961 లో బనారస్ విశ్వ విద్యాలయం నుంచి ప్రైవేటు గా చదివి ఏం .ఏ.సాధించారు .ఇదీ సార్ధక జీవితం అంటే -తాను తరిస్తూ ,ఇతరులను తరింపజేయటమే .
              1961 లో ముదునూరు లో జిల్లా స్థాయి నాటిక ,ఏక పాత్రాభినయం పోటీలను శాంతి నిలయం లో మూడు రాత్రులు ఘనంగా నిర్వహించారు .కవి కాటూరి తో ప్రారంభం చేయించారు .బాలకవి బి.వి.నరసింహారావు .పైడి పాటి వంటి కవులు ,రచయితలు పాల్గొన్నారు .న్యాయ నిర్ణేతలుగా ,ఎర్రోజు మాధవా చార్యులు ,రామచంద్ర కాశ్యప్ ,విన్న కోట రామన్న పంతులు వ్యవహరించారు .అత్యంత భారీగా ,సమర్దవంతం గా నిర్వహించటం చెప్పుకోదగిన విషయమే .పాల్గొన్న సమాజాల వారికి ,నటీ నటులకు సహాయకులకు ఉచిత వసతి ,భోజన సౌకర్యం కల్పించారు .
                1962 లో మైలవరం హై స్కూల్ కు బదిలీ అయారు .అక్కడా ఇదే విధానం అవలంబించి అందరి అభిమానం పొందారు .మైలవరం రాజా నరసింహారావు గారు మంచి ప్రోత్చాహం అందించారు .యు.యెన్.వో .పరీక్షలకు శిక్షణ ఇచ్చారు .”గోడ పత్రిక ”నిర్వహించారు .విద్యార్ధులతో పదిహేను రోజులకో సారి వార్తా సమీక్ష చేయించే  వారు .దీనితో జెనెరల్ నాలెడ్జి బాగా పెరిగేది .రేడియో పాఠాలను రికార్డు చేసి ఖాళీ పిరియడ్లలో వినిపించే వారు .”బాల భారతి ”అనే వార్షిక పత్రిక నడిపారు .విద్యార్ధులను ప్రోత్చాహించి కవితలు కధలు వ్యాసాలు రాయించారు .పాఠాశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలను” సినిమా ”తీయించి వార్శికోత్చావం రోజున అందరికి ప్రదర్శించి చూపే వారు .ఆనాడు ఇది చాలా సాహసో పేత మైన చర్య.ఎక్కడా ,ఎవరు చేసిన దాఖలాలు లేవు .
కేంద్ర ప్రభుత్వ పరిశీలన బృందం మైలవరం ”బాల రాజ్యం ”పనులను పరిశీలించారు .ఆ సందర్భం గా హస్త కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు .మూడు రోజులు నాటికలు ప్రదర్శించారు .మైలవరం మొదటి నుంచి నాటక రంగానికి గొప్ప కేంద్రం .ఆ రాజు లందరూ బాగా ప్రోత్చాహించారు .నాటకం మొదట పాడే ”పరా బ్రహ్మ పరమేశ్వర ”అనే ప్రార్ధనా గీతం అక్కడే రూపు దిద్దుకుంది .ఆ ఆస్థాన కవి దాన్ని రాశారు ..ఆ తర్వాత అన్ని సమాజాలు దాన్ని అనుసరించాయి .రేడియో గాయకురాలు వింజమూరి లక్ష్మి ,రేడియో అన్నయ్య ,నటుడు కందుకూరు రామ భద్ర రావు గార్లకు ఆ వేదికపై ఘన సన్మానం చేశారు .ప్రజా సహకారం తో ”బాల రాజ్యం ”అనే ప్రత్యెక సంచికను వెలువరించి ,అందులో మైలవరం నాటకరంగ సేవ పై ప్రత్యెక వ్యాసాలు రాయిస్తూ ,పిల్లల .పెద్దల .ఉపాధ్యాయుల రచనలతో దాన్ని అతి సుందరం గా ముద్రించి రికార్డు నెలకోల్పారు రావు గారు .వూరు ఏదైనా ,వారి తీరు అదే .
                                             సశేషం
                                                                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -11 -11 .
Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –2 పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని

   ఊసుల్లో ఉయ్యూరు –2
                                               పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని
                       మా నాన్న గారికి అన్న దమ్ములు ,అక్క చెల్లెళ్ళు లేరు .ఆయనఒక్కరే  మా తాత గారి సంతానం .అంటే ఏక్ నిరంజన్ .అందుకని మాకు బాబాయి ,పెదనాన్న ,అత్తయ్య లంటే ,ఆనుబంధం అంటే తెలీదు ,.మా నాయనమ్మ ను మేము మామ్మ అంటాం .మామ్మ పేరు నాగమ్మ గారు .మా ప్రక్క ఇల్లు గుండు వారి ఆడ పడుచు .ఆమె అక్కయ్య మహాలక్ష్మమ్మ గారు రేపల్లె లో వుండేది .మాకు తెలిసిన దగ్గర్నించీ ఆమె వైధవ్యం లోనే వుంది .ఆమె కుమారుడు రాయప్రోలు శివ రామ దీక్షితులు గారు .ఆయనే మాకు బాబాయి .పొట్టిగా ,ఎర్రగా ,గోచీ పోసి పంచేకట్టే వాడు .త్రికాలాల్లో సంధ్యా వందనం చేసే వారు .దేవుడి పూజ అనుష్టానం దాదాపు నాలుగైదు గంటలు పట్టేది .వాళ్ళింట్లో కాఫీ అలవాటు లేదు ,మా పిన్న లక్ష్మి కాంతం మా అమ్మను అక్కయ్యా ,అని బాబాయి మా నాన్ననూ అన్నయ్యా అని చాలా ఆప్యాయం గా సంబోధించే వారు .రాక పోకలు బాగా ఉండేవి .బాబాయి అంటే గౌరవం తో కూడిన భయం .రైల్వే స్టేషన్ దగ్గరే వాళ్లకు డాబా వుండేది మంచి స్థితి పరులు బాబాయి పొట్టిగా ,పిన్ని పొడుగ్గా వుండే వారు .మా కుటుంబం అంటే తగని ఆపేక్ష .నాకు బాబాయి దగ్గర చనువు వుండేది .బాబాయి పావు గంటకో సారి గోచి సవరించుకోవటం బాగా గుర్తు ,.నవ్వుకొనే వాళ్ళం .అతిధి అభ్యాగాతులతో వాళ్ల ఇల్లు  ఎప్పుడు సందడి గా వుండేది .అసలు బాబాయి,పిన్ని  లేని లోటు ను   ఈ  బాబాయి పిన్ని కొంత వరకు తీర్చారు
                      మా మామ్మ పెద్ద చెల్లెలు అంటే మా చిన్న మామ్మ బ్రహ్మా జోశ్యుల వారి ఆడ పడుచు .మా ఇంటికి దక్షిణాన వారిల్లు .దాన్ని మేము త్కర్వాథ కోన్నా ,ఇంకా చిన్న మామ్మ గారి ఇల్లనీ ,బ్రహ్మా జోశ్యుల వారి ఇల్లని అంటాం .ఆవిడకు మెల్ల కన్ను పన్ను . కొంచెం ముందుకు వచ్చి నట్లుండేది .పెద్దమామ్మ పొడవుగా గంభీరం గా వుంటే ,ఈవిడ పొట్టిగా వుండేది .ఆవిడ పీట మీద చివరగా కూచుని భోజనం చేస్తుంటే నవ్వు వచ్చేది .ఆవిడా వితంతువే నాకు గ్రాహకం  వచ్చిన దగ్గర్నుంచి .ఆమె కు ఒక కొడుకు .ఆయనా చిన్న తనం లోనే పెండ్లి అయి ఒక కొడుకు పుట్టాక చని పోయాడు .కనుక మాకు ఈ బాబాయి గురించి వినటమే కాని మనిషిని నేను చూడ లేదు .ఈయన  భార్యయే నందిగామ యడ వల్లి వారి ఆడ పడుచు మహాలక్ష్మి గారు .ఆ పేరు తో ఎవరు పిలిచే వారు కాదు పాపాయమ్మ అనే వారు .ఆవిడే మా పాపాయి పిన్ని .ఆవిడకు చిన్న మూతి వుండేది .అందుకని బుల్లి మూతి పిన్ని అనే వాళ్ళం .నా అనుబంధం అంతా ఆవిడతోనే .ఆమె ప్రభావం నా మీద ఎక్కువ .ఆ వివ రాలు  తర్వాత తెలియ జేస్తాను ..
                  మా మామ్మ చివరి  చెల్లెలు సౌభాగ్యమ్మ గారు .ఆవిడా మాకు తెలిసిన  దగ్గరనుంచీ వితంతువే .ఆమెను బుల్లి మామ్మ అనటం మాకు అలవాటు .ఆమె ఉయ్యూరు లో సూరి వారి  బజారు లో స్వంత ఇంట్లో వుండేది.సూరి వారి కోడలు . .ఆమె కుమారుడే శ్రీ రామ మూర్తి బాబాయి .ఆయన లీలగా గుర్తున్నాడు నాకు .ఆయన భార్య సరస్వతి ..ఈ పిన్ని కొంత గుర్తుంది .ఈ బాబాయి మా ఇంట్లో నాన్న దగ్గర చదువు కొనే వాడట .భార్యా భర్తలిద్దరూ అమ్మా ,నాన్న అంటే పరమ ఆపేక్ష గా వుండే వారని అమ్మ చెప్పేది .ఆన్నయ్యా అంటూ నాన్నను ,అక్కయ్యా అంటూ అమ్మను మహా ఆపేక్షగా పిలిచే వారు .ఈ బాబాయికి తమ్ముడు లక్ష్మణ స్వామి వెలమ కన్ని వారికి పెంపుడు వెళ్ళాడు .చిన్న తనం లోనే ముగ్గురు పిల్లలు పుట్టింతర్వాత చని పోయాడు ..ఆయన అన్నయ్య ఒకాయన వుండే వాడు పెళ్లి అయి పిల్లలు లేకుండా నే చని పోయాడు .మాకు అసలు పరిచయం లేరు పై ఇద్దరు బాబాయిలు .ఈయన భార్య సీతా రామమ్మ పిన్ని .ఈ విడతో మా కు చాలా అనుబంధం వుంది .మా మామ్మ లంత వైధవ్యం లోనే వుండటం చిన్నతనం నుంచి చూశాం .పాపాయి పిన్ని ,సేఎథ పిన్ని కూడా వైధవ్యం లోనే వుండే వారు .నెత్తి మీద ముసుగు ,తేల్లా సైను బట్టలు .దేవుడు ,పురాణం ,పూజా ,పునస్కారం దేవుడు పాటలతోనే కాలక్షేపం వాళ్లకు .భగవంతుడు వీరందరికీ ఇలా ఎలా రాశాడో అని అనిపించేది
                         పాపాయి పిన్ని అంటే నాకు తగనిఆపేక్ష. a .ఆవిడకు ,నేనంటే వల్లమాలిన మమకారం .స్కూల్ కి వెళ్లేముందు ,స్కూల్ కు వెళ్లి వచ్చిన తరువాత ఆవిడతోనే నాకు కాల క్షేపం .ఆవిడను విడిచి ఒక్క క్షణం వుండే వాణ్ని కాదు .ఆవిడా నా కోసం ఎదురు చూసేది .ఆవిడ నాపై గొప్ప ప్రభావం కల్గించింది .బుల్లి మూతి తో ముద్దు ముద్దు గా మాట్లాడేది .ఆ మాటలు చాలా మధురం గా ఉండేవి .చెవుల మీద ముసుగు తరచుగా సవరించుకోవటం ఇప్పటికీ జ్ఞాపకమే .ఆమెకు ఎన్నో కధలు వచ్చు .మనసు కు నచ్చి నట్లు చెప్పేది .ఆ కధలను నేను మా చిన్నక్కయ్య దుర్గా ,మా తమ్ముడు మోహన్ ఆసక్తి గా వినే వాళ్ళం .చాలా కమ్మగా పాటలు పాడేది .వాళ్ల ఇల్లు ఎప్పుడూ అలికి ముగ్గు వేసి చాలా పరిశుభ్రం గా వుండేది .ఇదంతా పిన్ని చేసేది .మా చిన మామ్మ పరిశుభ్రత చాలా ఎక్కువ .ఇల్లంతా చాలా అందంగా వుంచేది
పాపాయి పిన్నిని బుల్లి మూతి పిన్నీ అని ఒక వేళ అన్నా కోపం వచ్చేది కాదు .నవ్వేది . రోజూ రాత్రి పూట పిన్ని దగ్గర కధలు చెప్పించుకోవటం అలవాటు .ఎన్ని కధలు చెప్పినా చివరికి ”ఆవు పులి ”కధ చెప్పాల్సిందే .అది విన్న తరువాతే నిద్ర .ఆ కధ చిన్నతనం లో నా సహచారి అయింది .బహుశా ఆవు సత్య సంధత మనసు పై గాఢ ముద్ర పడేట్లు పిన్ని చెప్పినందుకే ఆయి వుంటుంది .ఒకసారి కాదు కనీసం రెండు మూడు సార్లైనా నిద్ర పోయే ముందు ఆ కధ చెప్పేది .భారత ,భాగవత ,రామాయణ కధలు ఎన్ని చెప్పినా ఫినిషింగ్ టచ్ ఆవు పులి కధే వుండాలి .అందుకు పాపాయి పిన్నికి నేను ఎంతో రుణ పడి వున్నాను .ఆమె ఋణం తీర్చుకో లేనిది .ఇంకా రుణ గ్రస్తుడినే అనుకుంటాను .ఆమె కు తేలు మంత్రం వచ్చు .ఎవరికి తేలు కుట్టినా పిన్ని దగ్గరకు వచ్చి మంత్రం వేయించుకొనే వాళ్ళు .తక్కున తగ్గేది .దానితో పాత గ్రామ ఫోన్  రికార్డు ముక్కను ఆరగ దీసి ఆ గంధాన్ని కుట్టిన చోట పెట్టేది .నొప్పి తగ్గి నవ్వు కుంటు వెళ్ళే వారు
               ఒక సారి మా మామయ్య గంగయ్య గారింట్లో సావిట్లో తిరుగు తుండగా సాయంత్రం పూట  నాకు ,మా మామయ్య మొదటి భార్య ప్రంటే పెద్దత్తయ్య ప్రకాశమ్మ గారికి ఒకే సారి తేలు కుట్టింది .మా పాపాయి పిన్ని కి తెలిసి పరిగెత్తుకొచ్చి నన్ను చంకన వేసుకొని ఇంటికి తీసుకొని వెళ్లి మంత్రం పెట్టి ,గంధం పూసి ఏడవ కుండా ఉండ టానికి సరదా గా కబుర్లు చెబుతూ ,నన్ను ఊర డించింది .నాకు తగ్గే దాకా ఆమె ప్రాణం విల విల లాడింది మా అత్తయ్యకు మంత్రం పెట్టి సపర్యలు చేసింది ..ఎందుకో నామీద ఆమెకు అంత ఆప్యాయత ?అసలైన పిన్ని అంటే ఏమిటో పాపాయి పిన్ని చూపించింది .నాకు ఆరాధ్య దైవం అయింది .ఆవు,పులి కధ నా నర నరాల్లో జీర్ణించుకు పోయింది .ఎన్ని వందల సార్లు విసుక్కో కుండా చెప్పిందో పిన్ని?అందుకే నేమో నిజం మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం ,మాట్లాడే వారంటే గౌరవం .నూటికి నూరు పాళ్ళు అబద్ధం చెప్పలేదని చెప్పలేను కాని దాదాపు అదొక నియమం గా నే పాటించే ప్రయత్నం చేస్తున్నాను .that is paapaayi pinni .నాకు జీవితం లో దొరికిన వరం పాపాయి పిన్ని .మా అమ్మను ”భవానక్కయ్యా”’.అని చాలా ప్రేమతో పిలిచేది .ప్రతిదానికి ఇంటికి వచ్చిం సహాయం చేసేది .
                కాని ఆవిడ జీవితం సవ్యం గా సాగ లేదు చివర్లో ఒక్క గానొక్క కొడుకు కృష్ణ మూర్తి చెడు అలవాట్లకు బానిసై హింసించాడు పాల్ఘాట్ పిల్లను పెళ్లి చేసు కోని కష్టాలు కోని తెచ్చుకున్నాడు .పాపాయి పిన్ని ఇవన్నేఎ భరించలేక ,అత్త గారు అంటే మా చిన్న మామ్మ చని పోగానే పుట్టిల్లు నంది గామ చేరి తమ్ముడి దగ్గరుండి .అప్పులు పాలైన కొడుకు ఇక్కడి ఇల్లు అమ్ముదామని ప్రయత్నం చేస్తుంటే చాలా రోజులు వారించింది .అయిన కాడికి అమ్మే ప్రయత్నాలు చేస్తూ ఎవరికో అమ్మా లని చూశాడు .పిన్ని మనసు గిల గిల లాడింది .ఆ ఇల్లు ఎవరికో అమ్మటం ఆవిడకు ఇష్టం లేదు .చివరికి ఉయ్యూరు వచ్చి మమ్మల్ని ప్రోత్చ హించింది కొనమని .అప్పటికి మా నాన్న గారు చని పోయారు .మేమంతా చదువుల్లో వున్నాం .కొనే ధైర్యం లేదు .మా మామయ్యను మధ్య వర్తి గా చేసి మాకు అమ్మక పోతే తాను ఆత్మ హత్య చేసుకొంటానని కొడుకును బెది రించింది .వాదినిమేము అన్నయ్యా అని పిలుస్తాం .చాల ప్రేమగా నే వుండే వాడు .భోజనం అదీ మా ఇంట్లోనే .కాని అప్పుల బాధా ,తాగుడు వ్యసనం వాడిని నిలవ నీయ లేదు .మామయ్య నచ్చచెప్పిన తర్వాత ఇల్లు మాకు అమ్మాడు .అప్పుడు మా పాపాయి పిన్ని మనసు శాంతించింది రాత కోత లయిన్తర్వాత నందిగామ వెళ్లి పోయింది .ఇది చాలా విషాద సంఘటన .పగ వారికి కూడా వద్దు అనిపించేది .పాపం పిన్ని ఎంత మానసిక క్షోభానుభావిన్చిందో .’ఆ తర్వాత్ ఆ డబ్బుతో కొడుకు మరీ రెచ్చి పోయాడు .భార్య వదిలేసింది .ఎక్కడో దిక్కులేని చావు చచ్చాడు .మా కుటుంబాలకు కృష్ణ మూర్తి జీవితం ఒక హెచ్చరిక గామిగిలింది . .సవ్య మార్గాన నడ వ టానికి తోడ్పడింది ..మళ్ళీ పిన్నిని చూసి నట్లు గుర్తు లేదు .రాక పోకలు లేవు .పాపం ఆవిడకు ఉయ్యూరు రావటానికి మనస్సు ఎలా ఒప్పు కొంటుంది ?
              పిన్ని చెప్పిన కధ ఏ గ్రంధం లోదో అప్పుడు నాకు తెలియదు .ఫోర్త్ ఫాం చదువుతుండగా ”సత్య వ్రతము ”అనే పేర పాత్యాంశం గా చదివాం .అనంతా మాత్యుని  భోజ రాజీయం లోని కధ .అందులో తల్లి లేని పిల్లాడు ఎంత చులకనో ఒక పద్యం లో గొప్ప గా చెప్పాడు కవి ”చులకన జలరుహ తంతువు ,చులకన ధూళి కణం ,చులకన గడ్డి పరక చులకన తల్లి లేనిసుతుడు   కుమారా ”అని ఆవు తన లేగా దూడకు హితవు చెబుతుంది .సత్యానికి వున్న గొప్ప తనాన్ని వివరిస్తుంది .అనంతా మాత్యుడు మా ఉయ్యూరు కు నాలుగు కిలో మీటర్ల దూరం లో వున్న పెనమ కూరు వాడే అవటం మాకు గర్వ కారణం .పెనమ కూరు లోనే పౌరాణిక నాటకాలలో కృష్ణ పాత్ర వేసే మహానటుడు ,గాయకుడు అబ్బూరి వర ప్రసాద రావు జన్మించాడు .మా చిన్న  తనం లో తోట్ల వల్లూరు లో
శివరాత్రి నాడు శివాలయం లో ఆయన నాటకం చూసే అదృష్టం కల్గింది .ఆయన రాగాలు ఇంకా చెవుల్లో గింగురు మంటున్నాయి .ఫోర్త్ ఫాం లో మాకు ఆ పాఠ్య భాగాన్ని గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారు అనే తెలుగు పండితులు బోధించిన జ్ఞాపకం వుంది .ఆ తర్వాత ద్వా.నా.శాస్త్రి గారితో పరిచయం అయిన తర్వాత మాకు రెండు కిలో మీటర్ల దూరం లో వున్న కనకవల్లి అగ్రహారం లో మారేపల్లి రామచంద్ర శాస్త్రి అనే కవి గారు జన్మించారని ,ఆయనపై తాను పరిశోధన చేశానని ఒక ఉత్తరం లో ఆయన రాశారు .శాస్త్రి గారిని ”కవి గారు ”అనే వారు .వారు విశాఖ పట్నం వెళ్లి తమ కార్య క్రమాలు జోరుగా కొన సాగించారు .గొప్ప సంస్కరణ వాడి .ఆయన గురించి చదివి ఒక పెద్ద కవిత రాసి ఆ తర్వాత ద్వా.నా..గారికి పంపిస్తే చదివి బాగుందని మెచ్చి ఉత్తరం రాశారు .
                  నేను ఉయ్యూరు హై స్కూల్ లో సైన్సు మేస్టార్ గా పని చేసే టప్పుడు స్కూల్ లో 16mm  ప్రొజెక్టర్ తో పిల్లల కోసం విజయ వాడ extention  ofice నుంచి ఉచితం గా రీళ్ళు తెచ్చి వేస్తుందే వాళ్ళం .అందులో పని చేసే ఒక ఆఫీసర్ నాకు బాగా పరిచయం అయారు .ఆయన ఒక సారి నన్ను ”భోజ రాజీయం ”చదివారా ?”అని అడిగారు .చదవ లేదన్నాను .వెంటనే చదవమని  చెప్పారు .కోని చదివాను .ఎంతో నచ్చింది .నన్ను దానిపై వ్యాసాలు రాయ మని కోరారాయన .ఒక సారి ”అనంతామాత్యుడు ”అనే శీర్షికతో వ్యాసం రాశా .అది ”తెలుగు విద్యార్ధి ”లో అచ్చు అయింది .దానికి కొంత రేపైర్ చేసి radio లో
మాట్లాడాను .ఇదంతా మా పాపాయి పిన్ని ఋణం తీర్చుకోవటానికి కొంత ఉపయోగ పడింది .
                   రెండేళ్ళ క్రితం ”సరసభారతి ”ఆధ్వర్యం లో జరిపిన ఒక సభలో నరసరావు పేట నుండి యడ వల్లి మనోరమ అనే తెలుగు లెక్చరర్ ను ఉపన్యాసానికి పిలిచాం .ఆవిడ అది అయింతర్వాత మా ఇంటికి వచ్చింది .మా అమ్మ నాన్న ఫోటోలు చూసింది .ఈ పరిసరాలు తానేప్పుడో చిన్నప్పుడు చూసినట్లు చెప్పింది .వరస పెట్టి తిర గేస్తే ఆవిడ మా పాపాయి పిన్ని మేన కోడలే అని తెలిసింది .ఆ నాటి ఆనందం వర్ణనా తీతం .అప్పటినుంచి తరుచుగా ఫోన్ లో మాట్లాడు కుంటున్నాం .నన్ను నాన్న గారు అనీ ,మా శ్రీమతిని అమ్మ అని పిలవటంమనోరమ  సంస్కారం .ఇలా ఎలా భగ వంతుడు మనుష్య్ల్ని కలుపు తాడో తెలీదు .అంతే కాదు వారం క్రితం మనోరమ ఫోన్ చేసి ”మీ బంధువు మాకాలేజికి ఉపన్యాసం ఇవ్వటానికి వచ్చారు .”అని చెప్పి ఆయన ఫోన్ నంబెర్ ఇస్తే మాట్లాడాను .ఆయన ఏలూరు లోని మా జ్ఞాతి గబ్బిట దక్షిణా మూర్తి గారి మనవడు ,అని కంచిలో ని వెద పాథ శాల లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనీ తెలిసింది .మా కుటుంబం అంతా అతనికి బాగా తెలుసునట /నన్ను ”పెద నాన్న గారు ”అని పలకరిస్తే పులకరించి పోయాను ..ఇదీ ఒక బంధం మనోరమ మహాత్య్మం .
 మా పాపాయి పిన్ని ని ఈ విధం గా మీ అందరికి పరిచయం చేసి నేను కొంత వరకు ధన్యుణ్ణి అయాను .
                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -11 -11 .
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 4 Comments

విశ్వం చాలని కవి సమ్రాట్ విశ్వ నాద

 

                                                 విశ్వం చాలని కవి  సమ్రాట్  విశ్వ నాద 
                   విజయ వాడ లో శ్రీ విశ్వ నాద సత్యనారాయణ గారి సాహిత్య సమాలోచనం ఘంటసాల సంగీతా కళా శాల లో నిన్నటి నుంచి మూడు రోజులు జరుగుతున్న సందర్భం గా చంద్రునికో నూలు పోగు గా ఆయన విశిష్ట రచన కల్పవృక్షం నుండి కొన్ని పద్యాలు మీ కోసం .నాక్కు తెలిసింత వరకు భారతీయ్ సాహిత్యం లో ప్రకృతిని ఒక యజ్ఞం గా భావించి రాసిన కవి విశ్వ నాద ఒక్కడే .ఇది వేదం లోని భావం .దాన్ని తన రచనలో వీలున్నప్పుడల్లా యజ్నభావాన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు .అందుకే అందరికంటే ఊహల్లో ,ఆలోచనల్లో ఆయన అందనంత ఎత్తున ఉంటాడు .వన శోభలో ఆ యన దర్శించిన యజ్న విభూతి చూడండి .బాల కాండం లోని పద్యమిది 
                 ”ఎర్రనౌ నేత్రంములిష్టి వేలానల-ధూమ సంతానంబు తూరినట్లు —ఆకులు తినుట దీక్షా కాల భోజన -నియమ తీవ్రత చేత నెగడి నట్లు 
                  చిగురాకు ముక్కున జిమ్ముతి జుహుపుచే -బాత్రాదికంములు పట్టి నట్లు –పంచమ స్వరము స్తోభాలు చక్కగా జాచి –సామ గానంములు సదివి నట్లు 
                 రేకలీకల నలుపు ధరించినట్టి ,-నియమ వస్త్ర మాలిన్యంబు నెరయు నట్లు –సప్త తంతు మహాకార్య సమయమందు –గర్త వోలిక కోకిల గాను పించే .
                     రెండో పద్యం 
             ప్రతి రసాల కుంజంబు బచ్చి పిందెల తోడ -నెల మసలిన కాంత వలె దోచే –ప్రతి నిష్వన ద్బంభరము యజ్న దక్షిణ -కై ఎగు బ్రాహ్మను నట్లు తోచే 
             ప్రతి మల్లె పూవు సవా ప్రేష్ఠ హవిరార్ధ -సుగ్రుహీత లాజల చొప్పు దోచే -ప్రతి చిన్న పూదోట పాలిత దోహద ధూప -మూల యజ్న వాటిక వలెను తోచే 
             మాధవుడు సవా ప్రీతుదంమాట కలిమి -నెల్ల రీతుల సాగింప నేమో యనగా –దాను దద్ధిత రూప మాధవుడు వచ్చే -దీప్త మఖ యోగ్య నిర్వర్షి దిష్ట మొర్తి .
                             మూడవ పద్యం సుందరకాండ లో హనుమ దర్శించిన సీతా సాధ్వి స్వరూపం .సీతా రాములు ఎక్కడ వున్నా అభిన్నులే అనే గొప్ప భావాన్ని పోదిగిన్ పద్యం .ఈ వూహ కూడా ఏ కవికీ రాక పోవటం విశ్వ నాద ప్రజ్న కు పట్టాబ్భి షేకమే .
            ”ఆక్ర్రుతి రామ చంద్రు విరహాక్రుతి ,కన్బొమ తీరు స్వామి చాపాక్రుతి -కన్నులన్ ప్రభు క్రుపాక్రుతి ,కైశిక మందు( శిరోజాలు)రామ దేహాక్రుతి 
             సర్వ దేహమున యందున ,రాఘవ వంశ మౌళి ధర్మాక్రుతి -కూరుచున్న విధమంతయు స్వామి ప్రజ్ఞా మూర్తియై .”
                      అంతటి మహాను భావుని గురించి స్వర్గీయ కేతవరపు రామ కోటి శాస్త్రి గారి కైమోడ్పు –ఇందులో భావం –విశ్వ నాద సాహిత్య స్నానమే ముక్తి కంటే ముందు తాను కోరుకుంటాను అని చెప్పటమే .మోక్షం కన్నా విశ్వ నాద రచనలే శ్రేష్టం అనే గొప్ప భావన శాస్త్రి గారిది . 
                 ”పోరపాటై జనియిన్చితిన్ ప్రభూ -సరే పోనీ -మరీ జన్మకున్ 
                  పరమోపజ్న నిధాన ,దివ్య దిషనా భ్రాజిష్ణువౌ ,విశ్వ నా 
                  ద ,రసోదంచిత ,సాహితీ విమల తీర్ది ,స్నాన పూతాత్మా గా 
                   కరునిమ్పం దగు  ,ముక్తిమాట  అటుపై కాశ్మీర నేత్రచ్చవీ .
                                      11 .11 .11 శుభాకాంక్షలతో —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ .
Posted in కవితలు | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు —1

   ఊసుల్లో ఉయ్యూరు —1
                                                       అమ్మ బోణీ -నాన్న కాణీ
                 మనవి -నాచిన్న తనం   లోను ,ఆ తర్వాత నాకు గుర్తున్న విషయాలను ”ఊసుల్లో ఉయ్యూరు ”శీర్షికన రాస్తున్నాను .ఇవన్నీ యదార్ధ సంఘటనలే .ఎక్కడైనా కధనం కోసం కొంచెం మిర్చి ,మసాలాదట్టించ వలసి రావచ్చు .అంతమాత్రం తో అతిశయోక్తులు కావు .ఇవన్నీ ,ఆనాటి అనుబంధాలకు ,ఆత్మీయతలకు ,అభిరుచులకు ,ఆనవాళ్ళు .ఇందులో మా కుటుంబానికి సంబంధించినవీ ,మా కుటుంబం తో ఉయ్యూరు గ్రామ ప్ప్రజలకు ,వారితో మాకు వున్న సంబంధ విషయాలు వుంటాయి .ఇవన్నీ చూసిన నాకు అనిపించిన భావాలు ,అందులోంచి నేను తీలుసుకొన్న జీవిత సత్యాలు ,అవి నా జీవితానికి ఉపయోగ పడిన రీతులు కూడా ఉండ వచ్చు .ఇదంతా ఒక మధ్య తరగతి కుటుంబ జీవితమే .అర్ధాలు ,అపార్ధాలు నొప్పించ టాలు ,నొప్పిమ్పబదతాలు ,సంతోషాలు ,ఒకటేమిటీ ఎన్నో emotions  కలగలిపి వుంటాయి .ఈ వయసు (72 ) ,లో అవి గుర్తుండటం కొంత కష్టమే కాని ప్రయత్నం చేస్తాను .ఇవి ఒక వరుస క్రమం లో జరిగిన సంఘటనలు కానక్కర లేదు .జ్న్కాపకమ్  వచ్చినవి రాయటమే పనిగా  పెట్టు కోని రాస్తున్నవి .ముందు రాసి పెట్టుకున్నవి అసలే కాదు .కంప్యుటర్ ముందు కూచుని అప్పటికప్పుడు రాస్తున్నవి . ,ఇందులో జన జీవితం ప్రతిబిమ్బిస్తుందనే భావమే నన్ను ఈ సాహసానికి పురికొల్పింది .హాస్యం vandi  వడ్డించ టానికో ,వ్యంగ్య వైభవం ప్రదర్శించ టానికో కాదు .అసలు విషయాన్ని కొంతైనా అందం గా చెప్పాలనే తాపత్రయం .ఈ కార్తీక పౌర్ణమి మహా పర్వ దినాన నా ఊసులు మీతో పంచుకోవటం కోసం ప్రారంభిస్తున్నాను .అవును అసలుహెడ్డింగ్ ఒకటి పెట్టి ఈ  శాఖా చంక్రమణం ఏమిటి ?అని విసుగోచ్చిందా -సరే బోణీ లోకి కాణీ లోకి ప్రవేశిస్తున్నాను .
                 మా చిన్నప్పుడు మా ఉయ్యూరు లో కూర గాయలు పెద్దగా అమ్మ కానికి వచ్చేవి కావు .దాదాపు ప్రతి ఇంట్లో పెరడు వుండేది .అందులో సొర బీర ,కాకర ,చిక్కుడు ,తోటకూర గోంగూర వగైరాలు పండించే వాళ్ళు . .ఎక్కువ గా కాస్తే ఇరుగింటి వాళ్లకు పొరుగింటి వాళ్లకు ఇస్తుండే వారు .అమ్మటం తెలీదు .ఒక రకం ఇచ్చి పుచ్చు కోవటం లాంటిది .అయితే కొయ్య తోట కూర చాలా రుచిగా వుండేది .కొంచెం ఎరుపు దౌలితో మహారుచికరం గా వుండేది .దాని నెవరు ఇళ్ళల్లో పండించటం నాకు తెలియదు .మావూరికి రెండు కిలో మీటర్ల దూరం లో చిన వోగిరాల ,కూరలకు తమల పాకు తోటలకు ,అరటి కంద పెండలం కు ప్రసిద్ధి .అక్కడి నుంచి కోటయ్య అనే ఎర్రటి ఆయన కావడిలో కొయ్య తోట కూర తెచ్చి అమ్మే వాడు .నవ నవ లాడుతూ వుండేది .అప్పుడు డబ్బులకంటే వడ్లు ,బియ్యం ఇచ్చి కొనుక్కోవటం ఎక్కువ గా వుండేది .కోటయ్య కు బొర్ర బాగా వుండేది బుర్ర కాదు బాబు బొర్రా .చొక్కా వేసుకొనే వాడు కాదు .దానితో బొర్రా బాగా కని పించేది నీరుకావి పంచ కట్టే వాడు .తోటకూర రంగు అదీ ఒకటి గా నే ఉండేవి .ఆయనా ఎరుపే కదా .ఒగిరాల నుంచి రావటం రావటం ఇంక ఎవరి ఇంటికీ వెళ్ళ కుండా మా ఇంటికే వచ్చే వాడు .అప్పటికే వాకిళ్ళలో మా పాలేళ్ళు పెడ కల్లాపి జల్లి ముగ్గులు వేసే వారు .వాకిళ్ళు లక్ష్మి కళతో కల కల లాడేవి .ఆ పెడ వాసన ఒక రకం గా గమ్మత్తు గా వుండేది .ఆవు పెడ మరీ ఆరోగ్యకరం .వాకిలి నిండా ముగ్గులే .ఆపసోపాలు పడుతూ ,కిర్రు చెప్పుల మోతతో వాకిట్లో కావిడి దించే వాడు కోటయ్య .”అమ్మ గారు .అమ్మ గారు ”అని పిలిచే వాడు మా అమ్మగారిని .ఆవిడ ఏ పనిలో వున్నా విడిచి వాకిట్లోకి రావాల్సిందే .మా దొడ్డి చాలా పెద్దది .ఆవిడ అక్కడ వుంటే వినిపించేది కాదు .మేమేవరమైన విని పిలుచుకోచ్చే వాళ్ళం .. ,
                 అమ్మ బేరం చేసేది .కోటయ్య కొంత తగ్గే వాడు .తప్పని సారిగా అమ్మ కొనాలి డబ్బు ఇవ్వాలి .ఆ తర్వాతే ఊళ్లోకి వెళ్ళటం .అంటే మొట్ట మొదటగా అమ్మ కొంటె అతనికి అమ్మకం బాగా జరుగుతుందని నమ్మకం .దీన్నే బోణీ చేయటం అంటారు .అమ్మ కావాల్సింది కొని డబ్బులో వడ్లో మాతో ఎంత ఇవ్వాలో చెప్పేది .అది డబ్బు అయితే నాన్నను అడిగి ధాన్యం అయితే కొట్లోంచి తీసి ఇచ్చే వాళ్ళం .రోజూ అతను ఇలా వస్తూనే వుండే వాడు .మరి రోజూ కొనం కదా.అయినా తప్పదు .కొనక పోయినా కావడి మీద మా అమ్మ చెయ్యి వేస్తె చాలు అని చెప్పి కావడిని తాకించి ఇంకో ఇంటికి వెళ్ళే వాడు కోటయ్య .గల గలా నవ్వే వాడు ఇప్పటికీ అతని నవ్వు నాకు జ్ఞాపకమే ..ఆ తర్వాత కూడా మా నాన్న గారు చని పోయిన తర్వాత కూడా మా అమ్మ విధవ రాలు అనే సంకోచం లేకుండా వచ్చి బోణీ చేయించుకోవటం అతని నమ్మకానికి ,విశాల భావానికి గుర్తు .కొయ్య తోటకూర అంటే కోటయ్య అప్పుడే కాదు ఎప్పుడు గుర్తొస్తాడు నాకు .అదో అనుబంధం
                         ఆ రోజుల్లో వేసవి వస్తే కూర గాయాలు దొరికేవి కావు .అందుకనిముందు  గానే బుడం దోస కాయ ఒరుగులు ,నక్క దోస కాయ ఒరుగులు తయారు చేసుకొని దాచుకోవటం చేసే వాళ్ళు .జగ్గయ్య పేట నుంచి దోస కాయలు లారీల్లో వచ్చేవి .సెంటర్ లో లారీ దింపి కుప్ప పోసే వారు .కావాల్సిన వాళ్ళు కొనుక్కొని దాచుకొనే వారు .దాదాపు ఆ దోస కాయలు రెండు నెలల వరకు నిలవ ఉండేవి .అప్పుడు మందుల వాడకం లేదు కదా.కందా ,పెండలాలను మణుగులకు మణుగులు కోని మంచాల కింద ,బోషానాల పైన దాచుకొనే వాళ్ళం .పరశు రామయ్య అనే అతను ,పంచె ,చొక్కా ,తలపాగా చుట్టూ కోని చిన ఒగిరాలనుంచి ఈ రెండిటినీ తెచ్చి అమ్మే వాడు .ఆయన కూడా మా ఇంట్లో కొన్న తర్వాతే మిగతా ఇళ్ళకు వెళ్ళే వాడు .చాలా నిదానస్తుడు .నవ్వుతు మాట్లాడే వాడు .పెద్దగా బేరం వుండేది కాదు .కోటయ్య ,పరశురామయ్య ఇద్దరు కమ్మ వారే .అయినా భేషజాలు ఆనాడు లేవు .వాళ్ళు అమ్ముతున్నారని ,మనం కొంటున్నామని వుండేది కాదు .అదో ఆత్మీయ పరామర్శ.అని పించేది .మా అమ్మ తరం అయింతర్వాత ,నా తరం లో కూడా అలాగే మా ఇంటికి బోణీ బేరానికి వచ్చే వారు .ఇక్కడ మనుషులుమాత్రమే కాదు ,ఆ ఇంటి మీదా అంత నమ్మకం అన్న మాట .ప్రతివేసవి లోను ఎన్నో మణుగులు కందా పెండలం కోని దాచే వాళ్ళం .వేసవి లో అవే దిక్కు .కంద ఉడికించి నిమ్మ కాయ తో కూర వండితే బహురుచి గా వుండేది .కంద వేపుడు రాత్రిళ్ళు చేసే వారు .పెండలం వేపుడు అదుర్సే .పెండలాన్ని ఉడికించి కర్వేపాకు వగైరాలు వేసి కూర చేస్తే అద్భుతం .మా అమ్మ కూరలు వండటం లో మహా నేర్పరి .అమ్మ వంట తింటే ఇంకో వంట నచ్చేది కాదు .ఈ నాటి బంగాళా దుమ్పకు ఆనాడు అవి సాటి .ఇలా అమ్మ చేతి బోణీ కాయకూరల అమ్మకం దార్లకు లాభసాటి అనే గొప్ప నమ్మకం కల్గించింది
                       మా నాన్న గారు వెద ,శాస్త్రాలు క్షుణ్ణం గా అధ్యనం చేసిన మహా పండితులు .పిలక జుట్టు ,నుదుట విభూతి రేఖలు పంచ లాల్చీ ఖండువా తో అపర పరమేశ్వరులు గా వుండే వారు .తెలుగు విద్వాన్ చేశారు .ఈ జిల్లాలోనే గొప్ప తెలుగు పండితులని చెప్పుకొనే వారు .నాన్న గారి పేరు మృత్యుంజయ శాస్త్రి .అమ్మ పేరు భవానమ్మ  .పార్వతీ పరమేశ్వరుల పేర్లు .అచ్చం గా అలాగే వుండే వారు .అమ్మ దబ్బపండు ఛాయా.నాన్న బంగారు వర్ణం .అన్యోన్య దాంపత్యం .ఆ రోజుల్లో వెద పండితు లుసంవత్చారానికి  ఒకసారి ఉయ్యూరు వచ్చి బ్రాహ్మణుల ఇళ్ళ కు  వార్షికం గా సంభావన తీసుకొనే వారు .బెజవాడ లో వేద సభలు జరిగేవి .అవి అయిన తర్వాత వచ్చే వారు . .వాళ్ల భోజనం మా ఇంటి ప్రక్కనే వున్న మా మేన మామ గుండు గంగయ్య గారింట్లో .మడి తో మా అత్తయ్య మహాలక్ష్మమ్మ గారు వంటచేసిపెట్టేది  .అక్కడ ఎక్కువైతే మా ఇంటికీ భోజనానికి వచ్చే వారు కొందరు .అప్పటికి ఇంకా మా ఇంట్లోను మడి వంటలే ..మా మయ్య గారి వాకిట్లో కొందరు ,మా వసారా లో కొందరు రాత్రిళ్ళు పడుకొనే వారు .ఉదయమే లేచి సంధ్యా వందనం ,జపతపాలు పూర్తి చేసుకొని సంభావన కోసం బయల్దేరే వాళ్ళు .వాళ్ళు ముందుగా మా ఇంటికి వచ్చి ఆశీర్వచన పనస చదివే వారు .నాన్న గారికి వారి విద్వత్తు ఏమిటో తెలుసు .వారి స్థాయిని బట్టి తాంబూలం లో డబ్బు పెట్టి నమస్కరించి ఇచ్చే వారు .ఆ తర్వాతే ఊళ్ళోకి వెళ్ళే వారు .భోజనం మామయ్య గారింట్లో బోణీ మాయింట్లో నాన్న గారి చేతితో .ఆయన ఒక కాణీ ఇచ్చినా చాలు మాకు ఊళ్ళో మంచి ఆదరణ లభిస్తుంది అనే వారు .నాన్న గారికి వారి తాహతు తెలుసు కనుక ,దాన్ని బట్టే ఇస్తారు కనుక ఎవరు అసంతృప్తి పడే వారుకాదు . ‘అలాగీ కూచి పూడి  నుంచి కూడా భాగవతులు వచ్చే వారు .వారూ అంతే .భోజనాలు మామయ్య గారింట్లో బోణీ మా ఇంట్లో  .వారు దశావ తార కీర్తనలు పాడిఆశీర్వదించే వారు .కొందరు గొంతెత్తి అద్భతం గా పాడి ఆడే వారు కూడా .చేతిలో తాళాలు ఉండేవి  .వారి సామర్ధ్యము నాన్న కు తెలుసు  కనుక వారి నేర్పును బట్టి తాంబూలం ఇచ్చే వారు .ఇదంతా ,చిన్నప్పటి నుంచి నేను బాగా గమనిస్తుందే వాడిని
                       1961 లో నాన్న గారి మరణం తర్వాత అమ్మ ఈ విషయాలు చూసేది .ఆమెకు వారి తాహతు తెలుసు కనుక తగినట్లుగా ఇచ్చేది .ఆ తర్వాత నాతొ కూడా అలానే చేయించేది .ఆవిడ చెప్పినట్లే చేసే వాడిని నాకు వారి విషయం ఆవ గాహన కాక ముందు ..ఒక వేల ఎప్పుడైనా ఎక్కువ తక్కువలు ఇస్తే నాకు క్లాస్ పీకేది అమ్మ .మనుషులను అంచనా వేయటం  లో నాన్న ,అమ్మలు దిట్టలు .అలాగీ చాలా కాలమ్ జరిగి పోయింది .ఇప్పుడు సుమారు పది ఏళ్ళ నుంచి ,వెద పండితులు రావటం లేదు .కూచిపూడి భాగవతులు రావటం లేదు .రాక పోవటం వెలితి గానే వుంది .కారణం వారి వేద ,కళా ఆశీర్వచనాలు లభ్యం కాక పోవటమే .ఇదీ బోణీ కాణీ కధ .
                                                           మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 6 Comments

ముదిమిలోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —3

 ముదిమిలోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —3
                                                                డిగ్రీ చదువు 
                   గుంటూరు ఏ.సి .కాలేజి లో రావు గారు బి.ఏ. లో చేరారు .అప్పుడే బాపిరాజు గారు కూడా మీజాన్ వదిలిగుంటూరు   చేరుకున్నారు .మళ్ళీ గురుశిష్య సంబంధం గట్టి పడింది .అప్పుడే విజయంవాడ లో ఆకాశవాణి కేంద్రం మొదలైంది .బాపిరాజు దానికి సలహాదారు అయారు .గుంటూరు లో ”కళా పీఠం ”ఏర్పరచి ,చిత్రలేఖనం లో బాపిరాజు శిక్షణ ఇచ్చే వారు .యువకులైన వెంకటేశ్వర రావు వంటి వారి సాయం తో గొప్ప చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు .ఆ సమయం లో బి.ఎస్ .కృష్ణ ”కాంగ్రెస్ ”పత్రిక నడిపే వారు .”ఆంధ్రా రిపబ్లిక్ ”పత్రిక కూడా వస్తుండేది .రాజ్యం సిన్హా మద్రాస్ నుంచి ”మాతృభూమి ”మాస పత్రికను నడిపే వారు .ఆమె ముదునూరు కాంగ్రెస్ నాయకులు అన్నే  అంజయ్య గారి అన్న కుమార్తె .శాంతినికేతన్ విద్యార్ధిని .ఆమె భర్త విజయకుమార్ సిన్హా ” The Times of India ” లో ఎడిటింగ్ సెక్షన్ లో పని చేసే వారు .ఆయన విప్లవ వీరుడు ,అకలంక దేశభక్తుడు అయిన షహీద్ భగత్ సింగ్ అనుచరుడు .భగత్ సింగ్ ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసిన తరువాత సిన్హా గారిని మైనర్ అయినందు వల్ల  అండమాన్ దీవులకు పంపిందిప్రభుత్వం  .ఆయన అక్కడ జైలర్లకు ఒక విద్యాలయం ఏర్పాటు చేసి ,దేశ స్వాతంత్ర్యం అవసరాన్ని జాతీయ , పోరాటచరిత్ర  మున్నగు విషయాలను ప్రభావం చేస్తూ ప్రసంగించే వారు .తన అండమాన్ జీవితాన్ని గురించి ”,The Andamaan’s –The Indian Bastille ”. అనే గ్రంధం రాశారు .ఫ్రెంచ్ విప్లవం లో bastille జైలు కు వున్న ప్రాముఖ్యత అందరికి తెలిసిందే .సిన్హా జీవితం రావు గారిపై మంచి ప్రభావాన్ని చూపింది .  .
                    ఎకనామిక్స్ అసోసియేషన్ కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి విజయవాడ బాచ్ కు ,గుంటూరు బాచ్ కు పోటీ తీవ్రం గా వుంది .యెన్.టి .రామా రావు విజయవా డబాచ్   తరఫున వైస్ ప్రెసిడెంట్ గా పోటి చేశాడు .రావు గారిని తన పానెల్ ఎన్నికయేట్లు సహాయం చేయమని అడిగారు .గుంటూరు మిత్రులు అడ్డుకున్నారు .ఇద్దరికీ రాజీ మార్గంగా అందరితో మాట్లాడి రామా రావు ను వైస్ ప్రెసిడెంట్ గా ,కార్యవర్గం గుంటూరు వారికి ఇచ్చేట్లు రావు గారు ఒప్పందం కుదిర్చి ఘర్షణ నివారించారు .అందరు హాపీ .కాలేజి గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంచుకొన్నారు .పబ్లిక్ ఫైనాన్స్ డెమోక్రసీ చదివి ,దేశాన్ని ఆర్ధికం గా అభివృద్ధి చేసే విషయాలు తెలుసుకున్నారు .నెలకోసారి ”చర్చా సమావేశాలు ”జరిపే వారు .చర్చ రోజున రావు గారు ఖద్దర్ పైజమా ,చొక్కా ధరించే వారు .వారు అది ధరిస్తే ఆనాడు చర్చ ఉన్నట్లే లెక్క .రామా రావు ,జగ్గయ్య ,వల్లభ జోశ్యుల శివ రాం కాలేజీ లో నాటకాలు దర్శకత్వం చేస్తూ ఆడే వారు .రావు గారు కాలేజి మాగజైనును ఎడిటర్ గా వుండి నడి పెవారు .డిగ్రీ పూర్తి అవగానే ఉద్యోగాల వేట లో పడ్డారు .దేనిలోనూ ఎక్కువ కాలమ్ పని చేయ లేదు .
                                                ఉద్యోగ పర్వం 
                   గుంటూరు జిల్లా అమరావతి లో 1950 లో సోషల్ టీచర్ గా చేరారు అందరికంటే చిన్న ఆయనే.1950 ఆగస్ట్ 10 న తండ్రి గారు ముదునూరు లో ”జీవ ప్రాయశ్చిత్తం ”చేసుకొని స్వచ్చంద మరణం పొందారు .ఇక్కడ దీని గురించి వివరిస్తాను .మరణం ఆసన్నం అయింది తెలియగానే వెద పండితుల్ని పిలిపించి ”జీవ ప్రాయస్చ్ట్టం ”చేసు కోవటం విజ్ఞులకు అలవాటు గా వుండేది .దాదాపు ఆరు గంటలు వేదోచ్చారనతో జరుగు తుంది .అలా చేస్తే తెలిసి చేసినవి,తెలియక చేసినవి పాపాలన్నీ నశిస్తాయని నమ్మకం .అంతే కాదు ఆ కార్య క్రమం అయి పోగానే యజమాని అనాయాసం గా మరణిస్తాడు .వీరి తండ్రి గారు కూడా ఆ రకం గాప్రాయశ్చిత్తం   చేసుకొని తీర్ధం తీసుకున్న వెంటనే మరణించారు .అదీ ”జీవ ప్రాయశ్చిత్తం ”మహాత్మ్యం .రావు గారి అన్న గారు శేషగిరి రావు కుటుంబ బాధ్యత స్వీకరించారు .”శాంతి నిలయం ”అనే ప్రైవేటు స్కూల్ నడపటం ప్రారంభించారు .
                   అమరావతి హై స్కూల్ లో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రావు గారికి సహ ఉపాధ్యాడు .ఆయన హిందీ పండిట్ .పాతశాలకు వచ్చే పత్రికలను విద్యార్ధులు చదివే ఏర్పాటు రావు గారు చేశారు .వీరి ప్రోత్చాహం చూసి చుట్టూ పరకాల గ్రామాల విద్యార్ధులు ఇక్కడికి వచ్చి ,పాథశాల గ్రంధాలయాన్ని ఉపయోగించుకొనే వారు .రావు గార్తో [పరిసర గ్రామాలలో గ్రంధాలయాలను రావు గారితో స్థాపింప జేశే వారు .శిష్యులతో కలిసి గ్రంధాలయం   ఉద్యమాన్ని హరికధలు ,బుర్ర కధల ద్వారా వ్యాపింప జేశారు .విద్యార్ధుల విజ్ఞానాభి వృద్ధి కి ”విజ్ఞాన యాత్ర ”లకు తీసుకొని వెళ్ళేవారు .ఇటువంటివి ఆకాలాల్లో   ఏ స్కూల్ లోను జరిగేవి కావు .రావు గారి ముందు చూపు వల్లనే ఇక్కడ సాధ్యమైంది .”అమర జ్యోతి ”అనే పాథశాల పత్రిక ను కరుణశ్రీ తో కలిపి నిర్వహించారు . కరుణశ్రీ కి   మసూచి సోకితే ,నిర్భయం గా ఆయనకు సేవ చేసి నయం ఆయె దాకా కని పెట్టి వున్న మంచి మిత్రుడు రావు గారు .A friend in need is a friend indeed ”అన్నది అక్షరాల పాటించి చూపిన నిజమైన స్నేహితుడు రావు గారు .
                     1951 లో కృష్ణా జిల్లా కాటూరు హై స్కూల్ లో సోషల్ టీచర్ గా చేరారు .ఆ ఊరిని   మాస్కో అఫ్ ఆంధ్ర అంటారు .దగ్గరలోనే వున్న స్వగ్రామం   ముదునూరు లో అన్నయ్య తో కలిసి ”వయోజన విద్యా కార్య క్రమాలు ”ప్రారంభించారు .దగ్గరలోనే వున్న బొల్లపాడు లో వయోజన విద్యా తరగతులు ఏర్పాటు చేశారు .ఇక్కడే గ్రంధాలయాన్ని స్థాపించారు .కాటూరు లో ప్రఖ్యాత కవి కాటూరి వెంకటేశ్వర రావు గారి అభ్యర్ధన పై వారింట్లోనేలోనే కాపురం వున్నారు .ఆవూరు లో వున్న’ సూరి స్కూల్ ‘లో సాయంత్ర వేళల్లో పిల్లల కార్య క్రమాలు మొదలు పెట్టారు .రాత్రి తరగతులు నిర్వహించారు .రాత్రి తొమ్మిది గంటలకు మహాకవి గురజాడ రచించిన ”దేశమును ప్రేమించుమన్నా ”అనే ప్రబోధ గీతం తో కార్య క్రమాలు ప్రారంభమై రాత్రి పదకొండు గంటలకు ”జన గణ మన ”తో పూర్తి అయేవి .పశువులకు వచ్చే అంటు వ్యాధులను గురించి slides వేసి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియ జేసే వారు .వయోజనులకోసం ”బుర్ర కధ దళం ”,”నాటక శాఖ ”ఏర్పాటు చేశారు .వీరి సాంఘిక కలాపాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభించింది చర్చా గోష్టులు జరిపే వారు .మోడల్ పార్లమెంట్ నిర్వహించే వారు .అందు లో సాంఘిక సమశ్యలపై ప్రత్యక్ష అనుభవం కల్గించే వారు రావు గారు .ఇవన్నీ  వారి బుద్ధి లో జన్మించిన అభ్యుదయ భావ పరంపరలే .అంత దూర దృష్టి వారిది .మళ్ళీ ఉదయం స్కూలు ,పాఠాలు యధాప్రకారమే .దానికీ ,దీనికీ వైరుధ్యం లేకుండా ,రెండిటిని సమర్ధ వంతం గా నిర్వహించటం కార్య శూరు లైన రావు గారికే సాధ్యం అని పించేవి .ఆ రోజుల్లో కరుణ శ్రీ నిర్వహించే ”శుభాషిని ‘పత్రిక లో మహిళా కార్య క్రమాలు చూసే వారు .”;;గొప్పవారి భార్యలు ”శీర్షికలో ప్రముఖులైన వారి సతీమణులు చేసిన ,చేస్తున్న ప్రజా సేవను గురించి రాసే వారు .radio లో రావు గారు ప్రముఖ రష్యా  కమ్యునిస్ట్ నేత లెనిన్ పై ప్రసంగించారు .
                      1952 -53 -లో గుంటూరు బి ,యిడి ,లో చేరారు .అప్పుడే హై స్కూల్ విద్యార్ధుల కోసం ”హై స్కూల్ గ్రామర్ రాశారు .1953 లో ముదునూరు హై   స్కూల్ లో బి.యిడి . టీచర్ గా చేరారు ”శాంతి నిలయం ”పాథ శాల” మధుకరి” వ్రాత పత్రిక రావు గారి ఆద్వర్యం లో వచ్చింది .”శేఖర్ విద్యాలయం ”,శేఖర్ గ్రంధాలయం ”ఏర్పాటు చేశారు .పత్రికా రచనలో శిక్షణ నిచ్చారు .slides తయారు చేయటం నేర్పించారు .1953 నుంచి ముదునూరు లో పిల్లల కోసం ”బాల రాజ్యం ”,యువకులకు”సాంస్కృతిక కార్య క్రమ శాఖ” ఏర్పరచారు .మహిళ ల కోసం ”మహిళా శాఖ” నిర్వహించారు .చేతి పనుల శాఖ కూడా దిగ్విజం గా చేబట్టారు .ఇంటిముందున్న విశాలమైన హాల్ లో పిల్లలకు ,పెద్దవారికి విడి విడి గా గ్రంధాలయాలు ఏర్పాటు చేశారు .ఆదివారాల్లో జేబురుమాలలు ,దిండు గలీబులు మహిళల చేత తయారు చేయించే వారు .వీటిని హైమవతి గారు పర్య వేక్షించే వారు .’ఈ విధం గా విభిన్న మైన కార్యక్రమాలు ప్రజలందరి కోసం చేబట్టిన గొప్ప ఆలోచనా పరుడు రావు గారు .ఒక రకం గా ముదునూరు గ్రామం వారికి ఎంతో రుణ పడి వుంది .దాని అభివృద్ధి లో ప్రతి అంగుళం లోను ఆయనకు భాగస్వామ్యం వుంది.ఆయన సేవలు నిరుపమానం .లెక్కకు మిక్కిలివి .వీటికి తోడు కుట్టు పని వయోలిన్ లో శిక్షణ ఇప్పించారు 
                                                 సశేషం 
                                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -11 -11 .
సెప్టెంబర్ 27 న జరిగిన సన్మానం
http://wp.me/p1jQnd-rh
Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –2

        ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –2
                                                                   విద్యార్ధి దశ
మేము చేసిన సన్మానం
                శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారు తమ జీవిత చరిత్ర ను ”మహాత్ముల బాట లో ”అన్న పేర రాశారు .  .ఇక్కడే కనపడు తుంది ఆయన ఆదర్శం ఏమిటో ,వినయ భంగిమ ఏమిటో .ఈ పుస్తకం ఆధారం గానే నా రచన సాగుతుంది .విద్యార్ధిగా ,యువకునిగా ,ఉపాధ్యాయునిగా ,అధ్యాపకునిగా ,విశ్రాంత జీవిగా ,ఆయన జీవించిన ,జీవిస్తున్న ,విధానం ,ఆ యా దశల్లో చేసిన సాహిత్య సేవ ,నడిపిన పత్రికలు ,సమాజ సేవ అన్నీ వివరంగా విన్న విస్తాను .                                             కృష్ణా జిల్లా ముదునూరు లో జన్మించిన వెంకటేశ్వర రావు గారు ,చిన్న  తనం లోనే ,వాళ్ల స్వగ్రామం లో మహాత్మా గాంధి జీ ని చూచే మహద్భాగ్యం పొందారు .ఆయన ప్రభావం బాగా పని చేసింది .అప్పటినుంచే అస్పృశ్యతను ఏవగించుకున్నారు .హరిజనోద్ధరణ చేయాలని సంకల్పించారు .ప్రైవేటు స్కూల్ లోనే ప్రాధమిక విద్య పూర్తి చేసి,బందరు లో శ్రీ రామా హై స్కూల్ లో చేరారు .ఆనాటి ఉపాధ్యాయులంతా క్రమ శిక్షణకు మారు పేరు గా వుండే వారు .స్కూల్ లోనే విద్యార్ధులకు పాఠాలన్నీ వచ్చే టట్లు బోధించే వారు .ఇంటి వద్ద విద్యార్ధికి ఇంకా ఏమి పని వుండేది కాదు .ఆ విధానం రావు గారిని బాగా  ఆకర్షించింది .మునిమాణిక్యం నరసింహా రావు హిస్టరీ మేష్టారు .1937 లో శ్రీమతి సరోజినీ నాయుడు బందరు విచ్చేశారు .ఆమె ఉపన్యాసం విని ఉప్పొంగి పోయి గొప్ప ప్రేరణ పొందారు .ఆమె వాగ్దోరని ,ప్రసన్న హృదయం నచ్చింది .
                  రావు గారి తల్లి గారు చేసే రామ నామం ఆయనకు చాలా ఇష్టం .తండ్రి  గారు ఆదిత్య హృదయం నేర్పారు .మొదటిది ముక్తికి ,రెండోది ఆరోగ్యానికి అవసర మైనవి .చిన్నప్పటి నుంచి జేబు లో పాకెట్ నోట్ బుక్ వుండేది .గమనించిన ముఖ్య విషయాలు అందులోవెంటనే   రాసు కొనే వారు అది వారికి ఎన్నో రచనలు చేయటానికి దోహదం చేసింది ..మునిపల్లె రామా రావు గారి ద్వారా కమ్యునిస్ట్ పార్టి కి దగ్గరయారు .పార్టి వీరికి కొన్ని కార్య క్రమాలు అప్పగించింది .పోలీసులు వెంట బడితే కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకొనే వారు .మినర్వా టాకీస్ లో ఒక సారి కర పత్రాలను పంచి ,అందకుండా పారి పోయారు ..poleesula     పోలీsula   interogation  ఇన్  లో ఆకుకు అందాకా ,పోకకు పొందక సమాధానాలు చెప్పి ,హెడ్ మాస్టర్ గారి అభిమానం తో బయట పడ్డారు .క్రమం గా పార్టీ కార్య క్రమాలకు దూరమై ,చాడువుమ్మీద శ్రద్ధ పెట్టి ,సాంస్కృతిక కార్య క్రమాలకే పరిమితమయారు .
                ప్రముఖ నాస్తిక ప్రచారకులు గోపరాజు రామ చంద్ర రావు (గోరా)గారు ముదునూరు లో ”వయోజన పాథ   శాల” స్థాపించారు .ఆయనే ప్రిన్సిపాల్ .అయ్యదేవర కాలేశ్వర రావు పంతులు ,త్రిపురనేని రామస్వామి చౌదరి ,దుర్గాబాయి దేశముఖ్ ,టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన హేమా హేమీలంత వచ్చి అక్కడజాతీయ ,అంతర్జాతీయ ,సాంఘిక విషయాలపై ప్రసంగిస్తూ అభిరుచి కలిగించే వారు .మేజిక్ లాంటేర్న్ తో slide  లు  వేస్తూమాగంటి బాపినీడు  పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించే వారు .ఇవన్నీ రావు గారు దగ్గరుండి క్షుణ్ణం గా గమనించేవారు .మనసు లో ఏవేవో ఊహలు మేదిలేవి మెట్రిక్ పరీక్షలకు శిక్షణ కూడా ఇచ్చే వారు .అయితే వీటి మీద కంటే నాస్తిక ప్రచారానికి గోరా ఎక్కువ ప్రాముఖ్యత నివ్వటం తో క్రమంగా ఆకర్షణ తగ్గి పోయింది .ఆవు మాంసం పంది   మాంసం లతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసే వారు గోరా .ఇవి జనానికి రోత పుట్టించాయి .ప్రజలు నాస్తిక కేంద్రం అంటే మండి  పడే వారు .అ వూరి రైతు పెద్ద ,కాంగ్రెస్ నాయకుడు సశ్రీ అనే అంజయ్య గారు కూడా అసహ్యించుకొనే స్థితిని తెచ్చుకోనారు గోరా .ఇక” గో–రా ”అని పించికోకుండా నెమ్మదిగా ఆ వూరు వదిలేశారు .
రావు గారు ఆ కేంద్రం లో వున్న లైబ్రరీ పుస్తకాలు చదివి విజ్ఞానం పొందారు .గోరాతో సరదాగా మాట్లాడే వారు .”దారి తప్పిన ప్రయాణీకుడు గోరా ”అంటారు రావు గారు గోరాను .ఎప్పుడు ఏదో ఒక జబ్బుతో బాధ పడే వారు .అందుకని చాల సున్నితం గా కన పడే వారు .దీని వల్ల ఉపాధ్యాయులు ఆయన్ను” జపాన్ toy ”అని  పిలిచే  వారు ఆనాటిహెడ్మాస్టర్   పోక్కునూరి వెంకట రత్నం ,ఇంగ్లీష్ మేస్టారు చంద్ర శేఖర రావు లు ఆయనపై గాఢ ముద్ర వేశారు .వారి బోధన ప్రభావమే రావు గారిని ”హై స్కూల్ గ్రామర్ ”రాయటానికి కారణం అయింది . ” .
                                           రచనా జీవిత ప్రారంభం
                బందరు నోబుల్ హై స్కూల్ లో రా గారు ఎస్ .ఎస్ .ఎల్ .సి .లో చేరారు .ఇంగ్లీష్ లో చిన్న వ్యాసాలు రాసి ”అర్బుదం ”మేస్టారి తో దిద్దిన్చుకొనే వారు .1941 లోవిశ్వ కవి  రవీంద్ర నాద్ టాగూర్ మరణించారు .వారిపై ఇంగ్లీష్ లో మంచి వ్యాసం రాశారు .తరువాత రాసిన ”The teacher I like ,the teacher I wish to be ”వ్యాసం కాలేజి మాగజైన్ ”The noble comrade ”ప్రచురిత మైంది .ఈ వ్యాసం రాయటం లో రావు గారికి ఉపాధ్యాయ వ్రుత్తి పట్ల వున్న గౌరవం ,సంఘం లో ఉపాధ్యాయుని పాత్ర అర్ధమవుతాయి .
                                                       కళాశాల జీవితం
                   1943 లో గుంటూరు హిందూ కాలేజి లో రావు గారు ఇంటర్ లో చేరిఅర్త్స్ సబ్జెక్ట్ తీసుకొన్నారు .పిల్లలమర్రివెంకట హనుమంత రావు గారు తెలుగులెక్చరర్  .వారి ప్రభావం బాగాపడింది  .ఆనాడు గుంటూరు ను” కల్చరల్ కాపిటల్ ఆఫ్ ఆంద్ర ”అనే వారు .ఆ కాలమ్ లో ”నవ్య    సాహిత్య పరిషత్ ”మంచి ఊపులో వుండేది.వాళ్ళు ”ప్రతిభ ”అనే మాస పత్రిక నడిపేవాళ్ళు ..ఆంద్ర దేశం లోని సుప్రసిద్ధ రచయితలకు అది వేదిక . .దాని ప్రబావం రావు గారి మీద వుంది .ఏదో సాహితీ సేవ చేయాలనే ఆలోచనలు సుళ్ళు తిరిగాయి .”సరస సారస్వత సమితి ”అనే సంస్థ రావు గారికి కలిగింది .”’శోభ ”అనే వార పత్రికా కూడా వారి ఊహల్లో వుంది,కార్యరూపం  దాల్చింది ఆయనే ఎడిటర్ .గోళ్ళ మూడి   రాధాకృష్ణ మూర్తి అనే చిత్రకారుడు ,హాష్య రచయిత ,సినీ నటుడు కొంగర జగ్గయ్య కళాదర్శకుడు వి.సూరన్న సుభద్రా దేవి సహకారం తో ;;శోభ ”శోభాయమానం గా వెలువడేది .జగ్గయ్య చక్కని దస్తూరి తో తీర్చి దిద్దే వాడు .కుందుర్తి ,కరుణశ్రీ ,మాచిరాజు దేవీ ప్రసాద్ ,బొడ్డు పల్లి పురుషోత్తం లాంటి ఉద్దండులు శోభకు రచనలు పంపే వారు .ఆంద్రవిశ్వ విద్యాలయ registraar    శ్రీ కూర్మా వేణుగోపాల స్వామి నాయుడు నుంచి మంచి సహకారం అందేది .సర్వశ్రీ కొండావెంకట  ప్పయ్య ,ఉన్నవ లక్ష్మి    నారాయణ ,మల్లం పల్లి సోమ శేఖర శర్మ ,అడివి బాపిరాజు ,సలహా సంఘ సభ్యులు .సంఘం తరఫున ఉచిత చిత్ర కళా శిక్షణ తరగతులు శ్రీ రాజా సింహ ఆధ్వర్యం లో జరిగేవి .ధర్మ వరం రామ కృష్ణ మాచార్యులు ,గురజాడ అప్పా రావు గార్ల వర్దంతులు జరిపే వారు .ప్రముఖులను ఆహ్వానించి ఉపన్యాసాలను ఏర్పాటు చేసే వారు .నాటికలు వేయించే వారు .ఫోటోగ్రఫి నేర్పేవారు .విహార  యాత్రలకు వెళ్ళే వారు .ఇవన్నీ రావు గారి ఆలోచనలే మంచి కార్యక్రమాలకు రూప కల్పన అమలు , .అందరు వారి మాటకు విలువ నిచ్చే వారు .
                   1945  లో జరిగిన గురజాడ వర్ధంతి సభలో రావు గారు మొదటి ఉపన్యాసం చేశారు .అది ఆంద్ర ప్రభలో ప్రచురితమైంది .ఇలా రెండేళ్ళు వివిధ సాహిత్య ,సాంస్కృతిక కార్య క్రమాలు దిగ్విజం గా నిర్వహించి సమాజానికి కొత్తఆలోచనలను   పరిచయం చేశారు విద్యార్ధి దశ లోనే ఇంకా ఇంటర్ విద్యార్హి గా ఉండ గానే .1944 -45 -ల మధ్య ”జ్ఞాన ”అనే మాస పత్రిక నిర్వహించటానికి అనుమతి పొందినా ఆర్ధిక కారణాల వల్ల నిర్వహించ లేక వదిలేశారు .ఆ పత్రిక పేరు లోనే వారి జిజ్ఞాస ,అందించాల్సిన భావ ఔన్నత్యాలు మనకు అర్దమవుతున్నాయి అది కార్యరూపం  దాల్చక పోవటం మన దురదృష్టం .
                         1945 -బాపిరాజు ముదునూరు వారిని తాను సంపాదకుడు గా వుంటూ హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్న ”మీజాన్ ”పత్రికకు సబ్ ఎడిటర్ ని చేశారు .ఒకరకం గా ఆయన పెన్మన్ ఈయన .కోణంగి ,నరుడు నవలలను అలవోకగా బాపిరాజు గారు చెబుతుంటే రావు గారు రాసే వారు .అవి పత్రిక లో ధారా వాహికం గా వచ్చేవి .బాపిరాజు గారింట్లోనే వీరి మకాం .ఆయనకు పెళ్లీడు ఆడ పిల్ల లున్నారు .అందుకని ఈయన్ని ”బాపిరాజు గారి అల్లుడు ”అని సరదాగా అనే వాళ్ళు .ఈయనకు అసలలాంటి అభిప్రాయమే లేదు .ఆయన్ను తండ్రి లాగా చూశారు .ఆయింట్లో ఒకడు అంతే .బాపి బావ తో గడపటం ఒక గ్రందాగ్రందాలయం లో గడిపిన అనుభూతి అంటారు రావు గారు .రాజు గారిది చాలా విశాల దృక్పధం .బహుభాషా పండితుడు ,నిగర్వి ,సహృదయుడు ,.”ప్రాచీనులలో నవీనుడు -నవీనులలు ప్రాచీనుడు బాపి రాజు గారు ”అంటారు ముదునూరు వారు .శ్రీ శ్రీనివాస చక్ర వర్తి ,తిరుమల రామ చంద్ర ,రాంభొట్ల కృష్ణ మూర్తి వీరి తో పాటు మీజాన్ కు సబ్ ఎడిటర్లు .అంతా హేమ హేమీలే .వారి సాహచర్యం బంగారానికి తావి అబ్బినట్లు అయింది రావు గారికి ‘1946  లో వెంకటేశ్వర రావు గారి వివాహం పెదముత్తేవికి  చెందిన శాంత గారితో జరిగింది .ఆ వివాహ వేడుకలలో పెదముత్తేవి ఆశ్రమ యతీంద్రులు ,ముముక్షు పీథ అధిపతి  శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు ”బుర్ర కధ ”చెప్పటం గొప్ప హై లైట్ .
                                              సశేషం
                                                                        మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -11 -11 .
సెప్టెంబర్ 27 న జరిగిన సన్మానం
Posted in రచనలు | 3 Comments

ముదిమి లోను యౌవనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –1

    ముదిమి లోను యౌవనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు  –1
             ఆయన 88 ఏళ్ళ  వృద్ధుడు .వృద్ధాప్యం రెండో బాల్యం అన్నారు కదా .అందుకని బాలుడే .అయితే ,ఆయన నిత్య జీవితం క్రియా , శీలత్వం ,సామాజిక సేవ ,నిరంతర పథనం ,రోజుకు  కనీసం పన్నెండు గంటల రచనా వ్యాసంగం ,ఈ వృద్ధాప్యం లో ,గమనిస్తే ,ఆయన నిత్య యౌవనుడు గా కని పిస్తారు .ముఖం పై ముడుతలు వచ్చినా ,కళ్ళు తెల్లబడు తున్నా,అందులో విజ్ఞాన జ్యోతి ప్రకాశించటం ,ప్రసరించటం చూస్తాం .ఒక రాజకీయ నాయకుడో ,సంఘ సంస్కర్తో ,సామాజిక కార్య కార్తో ,ఉత్తమ ఉపాధ్యాయుడో ,నిర్వహించ వలసిన కార్య క్రమాలను అన్నిటినీ ,తానొక్కడే ,కొద్ది మంది సహాయం తో,నిర్వహించిన  ,అనుక్షణ కార్య కర్త ,.ఆ నిర్వహణ లో అలుపు లేదు ,విశ్రాంతి లేదు .అకుంతిత దీక్ష ,సమాజ సేవా తపన ఉత్తమ బోధ నందిన్చాలన్న ఆరాటం ,తన చుట్టూ వున్న సమాజం తన తో పాటు అన్ని రంగాల్లో అగ్రగామి గాఉండాలన్న   ఆకాంక్ష ,సంపూర్ణ వికాసం తో ,జీవితాలు వెలగా లన్న దృఢ సంకల్పం ఆయన్ను ,ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకొని నిలబడేట్లు చేసింది ..సమాజం లో అన్ని వర్గాలు ,కులాలు ,ఆబాల వృద్ధులు తన వాళ్ళే అనే విశాల దృక్పధం ,ఆయన్ను అందరి కంటే అగ్రేసరుడిని చేసింది .ఆయన సాధించిన విజయాలు ఇన్నో ,అన్నో కావు .ఎక్కడ ఏ పరిస్థితులలో సమాజానికి తాను అవసరమైతే అక్కడ ఆయన ప్రత్యక్షం .నీతికి ,నిర్భీతికి,పేరుగా నిలిచి ,వ్యక్తిత్వం తో ,జీవితాన్ని పండించుకొని ,”బహుజన హితాయ -బహుజన సుఖాయ ”గా జీవితం గడుపుతూ ,అందరిని ప్రేమ ,ఆప్యాయత ,మమతాను రాగాల తో ,తన వాళ్ళను చేసు కోని ,తన వాక్కే వేద వాక్కు గా అందరు భావించే స్ఫూర్తిని కలుగ జేసి సకల కళా రహశ్యాలను అవగాహన చేసుకొని,ఇతరులకు తెలియ జెప్పి ,పెద్దన్నగా ,గుర్తింప బడి ,తాను చేసిన దేదో ,మహత్కార్యం అనీ ,సమాజ సేవ అనీ భావించక ,అదొక మానవ ధర్మంగా ,కనీస విధిగా భావించి ,తన మార్గాన తాను నడుస్తూ ,ప్రేరణ పొందిన వారిని తనతో కలుపు కొంటు ,ద్వేషం ,అసూయ ,అహంకారం కోపతాపాలకు ,అతీతం గా ,అజాత శత్రుత్వం తో ,వ్యవహరిస్తూ ,తాను నమ్మిన ”రాముని ”బంటు గా వ్యవహరిస్తూ ,కుటుంబానికీ ,గ్రామానికీ ,పరిసర ప్రదేశాలవారికీ ,తలలో నాలుక గా నడుస్తూ ,పెద్దరికాన్ని నిల బెట్టు కుంటు ,ఆదర్శం లో ,ఏమాత్రం అటు ఇటు లేక నవ్య ,సవ్య పదగామి గా వుంటూ ,బాల సాహిత్యసేవ లో ధన్యులై ,యువకులకు  ఉత్చాహ పాత్రులై ,తోటి ఉపాధ్యాయులకు ఆదర్శ మూర్తి యై ,విశ్రాంత ఉపాధ్యాయులైనా ,అవిశ్రాంత కృషి చేస్తున్న వారు ,కర్మ యోగి ,క్రియా శీలి ,”బాల సాహిత్య చక్ర వర్తి ,మాన్యులు శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు .
                 శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారిది ఓకే ప్రత్యెక స్కూల్ అఫ్  థాట్ .ఆయన ఒక విశ్వ విద్యాలయం .knowledge pool  జ్ఞాన ఖని .విశుద్ధ మనస్కులు .నిరామయ జీవి .నిర పేక్ష కార్య శూరుడు .ఆయనజీవితాన్ని   అర్ధం చేసు కోవ టానికి ,ఆయన వివిధ దశల్లో చేబట్టిన కార్య క్రమాలనుపరామర్శించాతానికి ,  ,ఆదర్శ శిఖరా రోహనం చేయ టానికీ ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాల్సిందే .ఆయన రచనా శైలి ,నిరాడంబరం .,మెత్తని పూల మీద నడుస్తున్నట్లుంటుంది . .ఏది చెప్పినా సుతి మెత్త గా ,సూటిగా మనసుకు తాకేట్లు చెప్పటం ఆయన ప్రత్యేకత .పదాడంబరం వుండదు .ఎక్కువ తక్కువలుండవు .అతిశయోక్తులకు దూరం .యదార్ధ వాది-కాని లోక విరోధి మాత్రం కాక పోవటమాయన ప్రత్యేకత .అదే ఆయన విశిష్ట వ్యక్తిత్వం .ఆయన కార్య క్రమాలను ,,జీవితం తో అనుసంధానం చేస్తూ ,వివిధ దశల లో వింగడించి తెలుసు కొందాం
                                           సశేషం
                                                           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 —11 -11 .
సెప్టెంబర్ 27 న జరిగిన సన్మానం
http://wp.me/p1jQnd-rh
Posted in మహానుభావులు, రచనలు | Leave a comment

రవి కవి రవీంద్ర నాద్ టాగూర్

            రవి కవి
                        రవీంద్ర నాద్ టాగూర్ నూట ఎభైవ జయంతి సంవత్చరం ఇది .విశ్వ కవి గా సుప్రసిద్ధుడైన రవి కవి గురించి మళ్ళీ ఒక సారి జ్ఞాపకం చేసు కొందాం .రవీంద్రుడు 1861  మే నెల ఆరవ తేదిన జన్మించాడు ,తండ్రి మహర్షి దేవేంద్ర నాద టాగూర్ .తాత గారు ద్వారకా నాద్ టాగూర్.రవీంద్రుడు కవి ,కారుణ్య మూర్హి ,తాత్వికుడు ,ధార్మికుడు ,చిత్రకళా మర్మజ్ఞుడు ,నటుడు ,నాటక రచయిత ,కధకుడు ,నవలా కారుడు ,సంగీతజ్ఞుడు,నాట్య శాస్త్ర వేత్త  .అంటే సకల కళా సమగ్ర స్వరూపం .విశ్వ మోహనుడు .పూర్ణ పురుషుడు అంటారు అందుకే .ఆయన చదువు అంతా ఇంటి వద్దే సాగింది .ప్రకృతి ఒడిలో విద్య నేర్చాడు .అందుకే ప్రకృతి అంటే విపరీత మైన మమకారం .పదిహేనవ ఏట ;”;కవిగాద ”,అడవి పూలు” అనే కవితలు రాశాడు .1878 లో బారిస్టర్ చదువు కోసం లండన్ వెళ్ళాడు .౧౮౮౧ లో ;;ప్రభాత గీతికలు ”,సంధ్యా గీతికలు ‘రాశాడు .ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ,దాన్ని నాశనం చేయ టానికి ప్రయత్నిస్తే అది మన మీద ప్రతీకారం తీర్చుకుంటుంది  అనే సందేశం తో ”మానసిని ”రాశాడు .చిత్ర ,తోటమాలి ,వెన్నెల గొప్ప రచనలు .జలియన్ వాలా baagh హత్య సందర్భం గా తనకు ప్రభుత్వం ఇచ్చిన సర్ బిరుదును తిరిగి ఇచ్చేసిన దేశాభిమాని .బ్రిటన్ ,ఫ్రాన్సు మొదలైన దేశాలు పర్య టించి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటిన విశ్వ మానవుడు .1940 లో   ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం డాక్టర్ అఫ్ లెటర్స్ బిరుదు  నిచ్చి సత్కరించింది .గోరా నౌకా భంగం నవలలు మంచి పేరుతెచ్చాయి  .నౌకాభంగం నవలనే ”తెలుగు లో ”చరణ దాసి ”సినిమా గా తీశారు .రామ రావు ,నాగేశ్వర రావు ,అంజలి ,సావిత్రి అందులో నటించారు .
                    రవీంద్రుడు రాసిన ”కాబూలి వాలా ”.పదిక్ చక్రవర్తి  ”మొదలైన నవలలు మంచి ఆదరణ పొందాయి .పాఠ్యాంశాలు గా కూడా వచ్చాయి .రవీంద్రుడు అంటే మనకు గుర్తుకు వచ్చేది గీతాంజలి పద్య కావ్యం .బెంగాలి భాషలో రాశాడు .తరువాత ఆయనే దాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేశాడు .దీనికే 1913 లో సాహిత్యం లో నోబెల్ బహుమతి లభించింది .ప్రపంచం అంతామొదటి  ప్రపంచ యుద్ధ సన్నద్ధం లో వున్నప్పుడు మనిషికి ,మాన వత్వానికి విలువ తగ్గి పోతున్న సమయం లో మనిషి అల్పత్వాన్ని తెలియజేస్తూ ,పరమాత్మ ఔన్నత్యాన్ని ,మనిషి లోని విశ్వాసాన్ని ,ప్రకృతి శోభను ,కళారాదనను ప్రతిబింబించే గీతాంజలి కవితలు శాంతికి ,విశ్వ మానవ సోదరాత్వానికి ,హింసా ,దౌర్జన్యా రాహిత్యానికి ప్రతీకలు గా వుండటం చేత మానవీయ విలువలకు పట్టంకడుతూ నోబెల్ పురస్కారాన్ని అందించారు .
               19 వ ఏటనే ”వాల్మీకి ప్రతిభ ”నాటకం రాశాడు .విసర్జన ,రాజు రాణి ,చిత్రాంగద ,కర్ణ-కుంతి శరదు త్చవ ,ప్రాయశ్చిత్త  , ,పోస్టాఫీస్ ,అనే మనోరంజకమైన నాట కాలు రాశాడు .ముక్త ధార నాటకం లో బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ప్రతినిధి గ రాజు పాత్రను సృష్టించాడు .ఆయనకు చాలా ఇష్టమైన నాటకం ”నటీర్ పూజ ”రవీంద్రుని ”చండాలిక ”నాటకం బుద్ధ భగవానుని కాలమ్ లోని  నిమ్న జాతి స్త్రీ కధ ను అతి రమణీయం గా చిత్రించి ,ఆమెకు భగవాన్ అనుగ్రహంకలిగిన విధానాన్ని అత్యుత్తమం గా చిత్రించాడు .దీనినే ప్రఖ్యాత కూచి  పూడి నాట్యా చార్యులు శ్రీ వెంపటి చిన సత్యం గారు సంగీత నాటకం గా మలచి అద్భుత విజయం సాధించారు .శ్రీమతి శోభా నాయుడు చండాలిక వేషం లో నభూతో గా నటించి మెప్పించారు .సత్యం గారికి ఇది ఎన లేని కీర్తి తెచ్చింది .ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు .
                     రవీంద్రుడు మానసిక శాస్త్రం బాగా తెలిసిన మహా మానవుడు .స్త్ర్రేలకు కావలసిన విద్య బోధించటానికి శాంతి నికేతన్ నిర్మించాడు .అది విశ్వ భారతి గా రూపుదిద్దు   కొంది తరువాత విశ్వ విద్యాలయం అయింది .రవీంద్రుని మరో సృష్టి ”శ్రీ కేతన్ .”ఇందులో నూతన వ్యవసాయ పద్ధతులను ,గ్రామాల పునర్నిర్మానాన్ని నేర్పించాడు .ఆయనది సంస్కృతీ వికాస దృష్టి .దానికి అవిరళ కృషి చేశాడు .అంతర్జాతీయ సౌభ్రాతృత్వం ఆయన ఆశయం .కనుకనే ఆయన్ను మహాపురుషుడని ,యుగ పురుషుడని అంటారు .వంగ కవి సార్వభౌముడు అయినా ,ఆయన భావాలన్నీ విశ్వ వ్యాప్తమైనందున విశ్వ కవి అయాడు .రవీంద్ర సంగీతాన్ని సృష్టించాడు .ఇందులో భారతీయ ,పాశ్చాత్య సంగీతాలను ఫ్యూజన్ చేశాడు పాట ,ఫణితి దేశీయ మైనవి .ఆడుతూ పాడే విధానం .ఇందులో ”ఏక్ ల చల్ ఏక్ ల చల్ ఏక్ లచలోరె ”  అనే పాట అందరికి ప్రేరణ.ముఖ్యం గా ఇందిరా గాంధికి . .అలాగే ఆయన గీతం ”Where the mind is without fear and the head is held high ”అనేది ఒక మహత్తర సందేశమే .పాత్యాంశం గా బోధిస్తూనే వున్నారు .ఇది విశ్వ వ్యాప్త ఆదరణ పొందింది .
                   విల్ డ్యురాంట్ అనే తత్వ వేత్త ”భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వ టానికి రవీంద్రుడు ఒక్కడు చాలు ”అన్నాడంటే ఆయన భారతీయులందరి ప్రతినిధి అని అర్ధమై పోతుంది .అంతటి ఉత్కృష్ట మానవుడు రవీంద్రుడు .రవీంద్ర ,టాగూర్ ,గీతాంజలి పేర్లు తెలిగింట పిల్లలకు పెట్టు కోవటం అలవాటు బాగా వుంది .ఆయన్ను మనం స్వంతం చేసు కున్నాం .
                      విశ్వ భారతి లో ”యత్ర విశ్వం భవతి ఏక నీడం ”అనే సూక్తి రాయించాడు రవి కవి .అంటే అర్ధం ;;ఎక్కడ విశ్వం అంతా ఒకే గూటిలో వుంటుందో ”అని .అంతటి విశ్వ జనీన భావం ఆయనది ఆనాడే ప్రపంచం అంతా ఒక కుగ్రామం (global villege )అవుతుందని ఊహించాడు దార్శనికుడైన రవీంద్రుడు .ఆయన వేషమే రుషి వేషం.అ గడ్డం ,కాంతులు వెదజల్లే ఆ కళ్ళు ,చూస్తె ఒక అలౌకిక వ్యక్తి మనకు కన్పిస్తాడు .ప్రేరణ గా నిలుస్తాడు .రవీంద్రుడు సౌందర్య మూర్తి .రూపం లో ,పలుకు లో ,పాట లో అంతా సౌందర్యమే .ఆయన జీవితమే సౌందర్య మయం రస విహారం అన్నారు ముట్నూరి కృష్ణా రావు గారు .శాంత రసమైన  గాంభీర్యం ,బంగారు కాంతివెదజల్లే వర్చస్సు ,మధుర మంజల రూప సంపదా ,ఓజస్సుప్రదర్శించే ఠీవి ,రమ్య లోకాలను చూపే చిరునవ్వు హృదయానికి పండుగ చేస్తాయి .ఆధునిక మహర్షి చంద్రుడు రవీంద్రుడు .
                         మన జాతీయ గీత రచయిత రవీన్ద్రుడే నని గుర్తు చేయక్కరలేదనుకుంటా .అంతే కాదు బంకిం చంద్ర చటర్జీ రచించిన  ”వందే మాతరం ప్రార్ధనా గీతానికి స్వర రచన చేసింది రవీన్ద్రుడే అని మర్చి పోయి వుంటారు చాలా మంది .ఒక సారి ప్రముఖ బెంగాలి నవలా రచయిత శరత్ బాబును కొందరు పాథకులు ”మీ రచనలు మాకు బాగా .తేలిగ్గా అర్ధమవుతాయి .రవీంద్రుని రచనలు అర్ధం కావటం కష్టం గా వుంది ”అన్నారట ”’.దానికి వెంటనే శరత్ ”నేను మీకోసం రాస్తాను .రవీంద్రుడు మా కోసం రాస్తారు ”అని రవీంద్రుని స్థాయినిగొప్పగా   ఆవిష్కరించాడు .ఒక సారి ఆంద్ర దేశ ప్రముఖ  వైణిక విద్వాంశులు ,పిఠాపురం సంస్థాన సంగీతవిద్వాంసులు   తుమురాడ సంగమేశ్వర శాస్త్రి గారి వీణా వాడనాన్ని గంటల తరబడి వింటూ అలాగే తన్మయులు. అయారట . .శాస్రి గారిని శాంతి నికేతన్ కు తీసుకొని వెళ్లి అందరికి ”శాస్త్రి గారు నా గురువు గారు ”అని ఆనందం గా పరిచయం చేసిన వినయ సంపన్నుడు .శాంతి నికేతన్ లో మన ఆంద్ర ప్రముఖులు రాయప్రోలు సుబ్బా రావు ,బెజవాడ గోపాలరెడ్డి ,సంజీవ దేవ్ లు విద్య నేర్చి న వారే .గాంధీ మహాత్ముడు రవీంద్రుని తన గురువు గా చెప్పుకొన్నారు .రావీన్ద్రుడే గాంధి గారికి ”మహాత్మా ”బిరుదును ఇచ్చారు .”రేఖల్లో నృత్యాని ,రంగుల్లో సంగీతాన్ని ,దర్శించ టం ద్వారా విశ్వ చిత్ర కళా రంగం లో ఆరని జ్వాలా తోరణాన్ని వెలిగించాడు . .రవీంద్రుని చిత్రకళా సాధన -విశ్వ సౌందర్య సాధనే .”అని కీర్తించారు  ప్రముఖ చిత్రకారులు ,రచయిత ,తాత్వికులు ,భావుకులు అయిన స్వర్గీయ  సంజీవ దేవ్ .”విశ్వ కవి ”అనే పేరు ప్రపపంచం మొత్తం మీద ఒక్క రవీన్ద్రునికే వుంది ”అని తేల్చి చెప్పారు ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం .స్వాతంత్ర్య సమర సాధనలో ఎందరో నాయకులకుస్ఫూర్తినీ   ప్రేరణనుఅందించిన   దేశభక్తుడు  రవీంద్రుడు .
                 రవీంద్రునిగీతాంజలి కి   తెలుగు లోనే యాభై కి పైగా అనువాదాలు వచ్చాయి .మరి ఇతరభాషల్లో ఎన్ని వచ్చాయో .అది నిత్య నూతనం గా అని పిస్తుంది ,చదివిన కొద్దీ మళ్ళీ చద వాలి అని పించే  మహోత్కృష్ట రచన .మనిషిని మహోన్నతుని చేసే తపన .ఈపరిధి   దాటి ఇంకో plane లోకి   తీసుకు  వెళ్ళే అమోల్య రచన .అందుకే ”రవీంద్రుని ఆరాధనా దైవం నిఖిల రసామృత మూర్తి అయిన ”విశ్వ మానవుడు ”అన్నారు ముట్నూరి వారు .ఆయన మనిషి కోసం పడే తపన తెలిపే కవితచూడండి .
                ”Into the mouths of these -dumb ,pale ,and meek —We have to infuse the language of the soul
                 Into the hearts of these weary ,worn ,and forlorn —we have to minstrel the hope of humanity ”
                     చివరగా మన కవుల నీరాజనం తో ముగిస్తాను .నారాయణ రెడ్డి గారు రవి కవిని ప్రసంషిస్తూ —
              ”ఒ కవితా రసాలపుం స్కోకిలమా -వ్యాకులమౌ మా జాతికి ,నీ గీతిక -మధుమాస మహోదయమ్ము
               ఎల్లలు దాటి జనించిన షెల్లీ వందురే  కాని –ఆలశ్యముగా పుట్టిన అపర కాళిదాసువు నీవు
               నీవు ప్రభుని చరణమ్ముల నివేదించు గీతాంజలి –నిత్యమూ బీటేట్టిన గుండెల పండించు రసాంజలి ”అన్నారు
                             ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన కవి స్వర్గీయ దాశరధి రవీంద్రుని   ప్రస్తుతిస్తూ
                                          ”ఈ లోకమ్మొక  నాకమౌనటుల నీవే చేయగా  జాలెదు ఈ
                                            హాలాహాల మయ ప్రపంచము ,సుధా వ్యాప్తమ్ము  గావింతువు ఈ
                                             వ్యాలా భీల వనమ్ము ,నందన  వన ప్రాయమ్ము గావించి క్రోం
                                             బూలన్ నిండిన పారిజాతములతో పొంగింతువో సత్కవీ !
                                                                   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | 1 Comment

నిమ్బార్కర్ ఆచార్యులు —2 నిమ్బార్కర్ వేదాంత దర్శనం

 

                                                 నిమ్బార్కర్ ఆచార్యులు —2
                                                      నిమ్బార్కర్ వేదాంత దర్శనం 
            నిమ్బార్కర్ దర్శనం లో మూడు తత్వాలు వున్నాయి .అవి చిత్ ,అచిత్ ఈశ్వరుడు .వీటినే భోక్త ,భోగ్యం ,శ్వేతాశ్వ తరం అంటారు .ఆయన దృష్టి లో శ్రీ కృష్ణుడే పర తత్త్వం .ఆయన సర్వ నియంత .ఆయన కంటే అధికులు లేరు .నిమిత్తము ,ఉపాదాన కారణం కృష్ణుడే .పరబ్రహ్మానికి పర (transcendent ),అంతర్యామి (Immanent )అనే రెండు రూపాలున్నాయి .పర రూపం లో పరబ్రహ్మ ప్రపంచం నుండి వేరుగాను ,అంతర్యామి రూపం లో అభిన్నం గాను ఉంటాడు .ప్రపంచం పరమేశ్వరుని శక్తి నుంచి ఏర్పడింది .పర,అంతర్యామిత్వాల సమతుల (balance )స్థితి ఏ ప్రపంచానికి కారణం .ఈ రెండు సమాన ప్రాధాన్యత కలవే .పరబ్రహ్మ ప్రపంచరూపం  లో వున్నా ,,ఆయన ప్రపంచానికి అతీతుడు .ప్రపంచం లేకుండా బ్రహ్మ లేడు .
                  జీవాత్మ —నిమ్బార్కర్ భావన లో జీవుడు జ్ఞాన స్వరూపుడు .అతడు శరీరము ,ఇంద్రియాలు ,ప్రాణము ,మనస్సు ,బుద్ధి వీటికి భిన్నుడు .జీవాత్మ జ్ఞానానికి ఆశ్రయం కూడా .అంటే జ్ఞానమే ధర్మం గా వున్న వాడు .జీవాత్మకు ఆది అంతం లేవు .పరబ్రహ్మ అంశమే జీవాత్మ .అందుకే పరబ్రహ్మ కన్న ,భిన్నుడు ,అభిన్నుడు కూడా .అనేక జీవాత్మలు వున్నా ,అన్నీ పరబ్రహ్మ అంశాలే .జీవాత్మకు ఎనిమిది గుణాలున్నా ,అవిద్య వల్ల తెలుసు కో లేక సంసారి అవుతాడు .జీవాత్మ అణువు లాంటి వాడు .అంటే అతి అల్పమైన వాడు .కాని తాను చేసే ధర్మం అనే జ్ఞానం వల్ల సుఖం ,దుఖం అనుభ విస్తాడు .
                జగత్తు —దీనినే అచిత్ అంటారు .ఇది మూడు విధాలు .ప్రాకృతం ,అంటే కేవల సత్వం ,రెండు అప్రాక్రుతం అంటే ప్రకృతి చేత ఎర్పదనిది .మూడ వది కాలము .ఇది ప్రకృతి ,పరబ్రహ్మ ల చేత ప్రేరితం అయి ప్రపంచానికి ఉపాదాన కారణం అవుతోంది .ప్రపంచం అంటే పరబ్రహ్మ చేసే కృత్యం .అది నిత్యం ,సత్వ ,రాజా ,తమో గుణాత్మికం .
       ప్రపంచోత్పత్తి —-పరమాత్మ ,ఆకాశం ,వాయువు ,అగ్ని ,జలం ,పృథ్వి అన్నీ పరబ్రహ్మం నుండే ఏర్పడ్డాయి .
           బ్రహ్మం ,చిత్ ,అచిత్ —వీటి మధ్య వున్నది భేదా భేదం అంటాడు నిమ్బార్కరుడు .బ్రహ్మ నియంత ,చిత్తు భోక్త ,అచిత్ భాగ్యం .బ్రహ్మము అంశి జీవుడు అంశము .ఈ రెండు వేరు కావు .బ్రహ్మాన్ని ఉపాశించాలి .దాన్ని అందు కోవాలి .జీవుడు జ్ఞాత ,ఉపాసకుడు ,ప్రాప్త అంటే పొందే వాడు .వీరిద్దరి మధ్య భేదం తప్పదు జీవాత్మ అవిద్యావిషయం కాని ,అవిద్యా పదం కాని కానేరదు .అయితే బ్రహ్మం మాత్రం పాప రహితం ,సత్య కామం ,సర్వ వ్యాపి .బ్రహ్మం నిత్యం ఎదురు లేనివాడు అతడు పురుషోత్తముడు .
                    బ్రహ్మము కారణం .జగత్తు కార్యం అంటాడు నిమ్బార్కర పండితుడు .బ్రహ్మ చైతన్య స్వ రూపం .అస్తూలం ,అనణువు .,నిత్య శుద్ధం .బ్రహ్మము నియంత అయితే జగత్తు నియమిమ్పబడేది .జీవాత్మ ,జగత్తుబ్రహ్మ అంశాలే . బ్రహ్మ కన్న భిన్నాలు గా కని పించినా ,అభిన్నాలే , .కార్యము ,కారణం ,అంశములు ,అంశి కేవలంభిన్నాలు   కావు ,అభిన్నాలు  కావు .వాటి మధ్య వున్నది భేదా భేద సంబంధము .సూర్యుడికి ,ఆయన కాంతికి మధ్య వున్న సంబంధం లాంటిదే బ్రహ్మానికి ,జీవునికి ,జగత్తుకు వుంది .భేదం ,అభేదం కూడా సమాన సత్యాలే .స్వాభావికాలే ..
             మోక్షం —నిమ్బార్కర్ భావనలో మోక్షం అంటే జీవాత్మ స్వభావం లోను ,గుణాలలోను  పరబ్రహ్మము తో సామ్యన్న్ని పొందటమే .ఆ పరబ్రహ్మ బ్భావం పొంద టానికి పరబ్రహ్మ అనుగ్రహము ,ప్రసాదమే శరణ్యం.మోక్ష సాధనకు కర్మ ,జ్ఞానం ,ఉపాసన ,భక్తి ,ప్రపత్తి ,గురూప పత్తిఅనే ఆరు సాధనాలను చెప్పాడు నిమ్బార్కరాచార్యుడు . 
          కర్మ –కర్మ మోక్షానికి ప్రత్యక్ష సాధనం కాదు .జ్ఞానానికి మార్గం .విధ్యుక్త కర్మ అందరు తప్పని సరిగా చేయాలి 
          జ్ఞానం లేక విద్య —విద్య వల్లనే పరబ్రహ్మను పొంద గలం .విద్య స్వతంత్ర సాధనం .
          ఉపాసన లేక ధ్యానం –ముముక్షువు కళంక రహిత మైన ఆత్మను ఉపాశించాలి .పరమాత్మ భావన పొందిన ఆత్మను ఉపాశించటం ఉత్తమం 
            భక్తి –భక్తి ,ఉపాసన ఒకటి కావు .సాధకునికి ఈశ్వరుని యందు ప్రేమయే భక్తి .భక్తి ,,ధ్యానం,పరస్పర సంబంధం కలవి .భక్తి మోక్షానికి గొప్ప సాధనం .పరమేశ్వర ప్రసాదం వల్లనే ఇది పొంద బడుతుంది .
            ప్రపత్తి –ఇదంతా విశిష్టా ద్వైత విధానం లాగానే వుంటుంది .
            గురూప పత్తి —ప్రపత్తి రెండు రకాలు .ఒకటి ఈశ్వరుని గురించి రెండు ఆచార్యుడైన గురువు ను గురించి .జీవాక్త్మకు ,పరమాత్మకు మధ్య వర్తి గురువు .జీవాత్మ గురు అనుగ్రహం వల్లే పరమాత్మను పొంద గలడు .తన మనసు ,ధనము ,ఆత్మ ను గురువు అధీనం లో ఉంచాలి .పరమేశ్వరుని గురించి ప్రపత్తి వుంటే మోక్షం వస్తుందో రాదో చెప్ప లేము .కాని గురువు ప్రసన్నతను పొందితే అలాంటి సందేహం వుండదు .
                                              సమాప్తం                                             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –07 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

నిమ్బార్కర్ ఆచార్యుడు

     నిమ్బార్కర్ ఆచార్యుడు 
                       వేద వ్యాసుడు రచించిన ”బ్రహ్మ సూత్రాలు ”కు వ్యాఖ్యానం రాసిన మహా పండితుడు నిమ్బార్కరాచార్యుడు .ఆయన తెలుగు వారు అవటం తెలుగు వారి అదృష్టం .ఆయన జీవిత కాలమ్ పై చాలా వివాదాలున్నాయి .కానీ విశేష పరిశోధన లు జరిగిన తర్వాత ఆయన కాలమ్ కొంత వరకు స్పష్టమైంది .కొందరి భావన లో ఆయన శంకరాచార్యులకు పూర్వుడని ,కొందరి ఆలోచన లో మాధవా చార్యులకు ముందు వాడు అని అంటారు .కాని ఇవేవి నిజం కాదు అని అభిప్రాయ పడ్డారు .భగవద్రామానుజా చార్యులకు సమ కాలీనులు అన్నది కొంత వరకు నిజం గా కన్పిస్తోంది .క్రీ శ .పదమూడో శతాబ్ది వాడు అని స్థూలం గా భావించ వచ్చు వీరి గురించి తెలిసిన విషయాలు చాలా తక్కువ గానే వున్నాయి .అందులో ఆంధ్రులు మన వాడే ఆయన అని మర్చి పోయారు కూడా అందుకే ఆయన జీవిత విశేషాలు మీ ముందు ఉంచుతున్నాను .కనీసం ఒక సారి అయినా అలాంటి మహా మహుల్ని స్మరిస్తే మన జీవితం ధన్య మవుతుంది .మన తెలుగు వాడు ఇంత గొప్ప వాడా అని ఆశ్చర్యం వేస్తుంది .అందులో కార్తీక పూర్ణిమ నాడు నిమ్బార్కర్ జన్మించటం వల్ల మూడు రోజుల్లో కార్తీక పున్నమి వస్తోంది కనుక ఈ వ్యాసం రాయాలనే సంకల్పం కలిగింది ..ఇప్పుడుమహా మహితాత్మమైన నిమ్బార్కరు పండితుల    జీవిత విశేషాలను గురించి తెలుసు కుందాం 
                                                     జీవిత విశేషాలు 
                      నిమ్బార్కర్ అనే పేరు ఆయనకు చాలా కాలమ్ తరు వాత మాత్రమే వచ్చింది .ఆయన శ్రీ మహా విష్ణువు  ”సుదర్శన  చక్రం ”అవతారమే  అని ”భవిష్య పురాణం ”లో వుంది .కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆయన జన్మించి నట్లు తెలుస్తోంది .క్రీ;శ.3096  లో జన్మించినట్లు గా భావిస్తున్నారు .తల్లి పేరు భారతి .తండ్రి అరుణ .తెలగాణ్య శాఖ కు చెందిన బ్రాహ్మణుడు .గోదా వారి నది (దేవ నది )ఒడ్డున వైడూర్య పట్టణం లో ఆయన జన్మించారు .తల్లి దండ్రులు పెట్టిన పేరు ”నియమానంద ”.పదహారవ ఏటనే వెద ,శాస్త్రాలలో అద్వితీయుడైనాడు .ఉత్తర ప్రదేశ్ లోని మధుర కు వెళ్లి గోవర్ధనా చార్య దర్శనం చేశారు .ద్వైత వేదాంతాన్ని నేర్చారు గురువు వద్ద ..చదువు అంతా నిమ్మ చెట్టు క్రింద నేర్వటం ఆయనకు ఇష్టం గా వుండేది .ఈయనశ్రద్ధ ,  ,ఆసక్తులను గమనించిన నారద మహర్షి ”ద్వైతాద్వైత వేదాంతం ”బోధించాడు .అంటే ద్వంద్వం లో ఏకత్వ భావన అని అర్ధం .నియమానందుడు నారదుణ్ణి తనను శిష్యునిగా స్వీకరించ మని కోరాడు .వైష్ణవ సంప్రదాయం లో ,శ్రీ సర్వేశ్వర దేవుల అనుగ్రహం తో శిష్యునిగా స్వీకరించాడు .నారదుడు ”హరిప్రియ ”అనే పేరు పెట్టాడు .మహా మంత్రమైన ”గోపాల మంత్రం ”ఉపదేశించాడు .ఇది ”గోపాల పిని ఉపనిషత్ ”లో వుంది .నియమా నంద గోపాల మంత్రాన్ని తీవ్రం గా జపించాడు .అప్పుడు ఆయనకు ”గోపాల దేవుడు ”రాదా కృష్ణ ”రూపం లో దర్శనం ఇచ్చాడు .తానే శ్రీకృష్ణుడి నని  తెలియ    జేశాడు .నియమానండుడే ”సుదర్శన చక్రం ”అనే ఎరుక కల్గించాడు .రాధాకృష్ణ వేదాంతాన్ని ప్రచారం చేయమని ఆదేశించాడు .
                          గోవర్ధన అని పిలువ బడే ;;నింబ గ్రామం ”లో ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు నియమానందుడు .ఒక రోజున బ్రహ్మ దేవుడు చీకటి పడుతుండ గా ,శిష్యుని వేషం లో ఈయన దగ్గరకు వచ్చాడు .ఇద్దరు వేదాంత చర్చ చాలా సేపు చేశారు .బ్రహ్మ ,నియమానందుని చేతి లో ఓడి పోయాడు .చీకటి బాగా పడింది .ఏదైనా ఉపాహారం స్వీకరించమని శిష్యుడైన బ్రహ్మను కోరాడు .చీకటి పడిన తర్వాత ఏదీ స్వీకరించ రాదు అన్నాడు మాయా బ్రహ్మ .ఉపాహారం తీసుకోక పొతే ఆతిధ్యం ఇచ్చే వారికి ఫలితం దక్కదని తెలియ జేసి ,అర్కుడు అంటే సూర్యుడిని నిమ్మ చెట్ల మధ్య స్తంభిప బడేట్లు చేశాడు నియమానందుడు .చీకటి పడటం ఆగి పోయింది .అప్పుడు ఈయన ఇచ్చిన ఆతిధ్యం బ్రహ్మ స్వీకరించాడు .ఆతిధ్య ఫలితం నియమనండునికి దక్కింది .నియముని భక్తి శ్రద్దలకు వివేకానికీ ,మహిమకు విజ్ఞత కు బ్రహ్మానంద పడ్డాడు బ్రహ్మ .నిజ రూపం ప్రదర్శించాడు నలువ .నింబ వృక్షాల మధ్య సూర్య గమనాన్ని ఆపివేయటం వల్ల నియమానందునికి బ్రహ్మ ”నిమ్బార్కర ”అనే బిరుదు ప్రసాదించాడు .అప్పటి నుంచి నిమ్బార్కర అనే పేరు స్థిరమైంది .
ఆయన ప్రవచించిన ద్వైతాద్వైత వేదాంతం లో మోక్షానికి అయిదు సోపానాలు చెప్పాడు .అవి కర్మ ,విద్య ,ఉపాసన ప్రపత్తి ,,గురూప పత్తి .ఆయన రచించిన ‘బ్రహ్మ సూత్రా భాష్యానికి ‘వేదాంత పారిజాత సౌరభం ”అని పేరు .తన సిద్ధాంతాన్ని ”దశ శ్లోకి ”అనే పది శ్లోకాలలో నిక్షిప్తం చేశాడు నిమ్బార్కరా చార్యుడు”సావి శేష ,నిర్విశేష శ్రీ కృష్ణ రాజా స్తవం ”అనే పేర ఒక స్తోత్ర గ్రంధాన్ని నిమ్బార్కర్ రచించారు . .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

ప్రపంచ తెలుగు —తొలి అడుగు

      ప్రపంచ తెలుగు —తొలి అడుగు
                  కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో తెలుగు భాషకు ,సంస్కృతికి చేస్తున్న సేవలు అత్యంత విలువైనవి .ఈ సంస్థకు నాలుగు స్తంభాలు ఒకరు ఆలోచనా పరులు ,భాషా ప్రేమికులు ,సంస్కృతి అంటే విపరీతమైన అభిమానం మాటల్లో కాక చేతల్లో వున్న వారు ,తండ్రి మండలివెంకట   కృష్ణా రావు గారి వారసత్వాన్ని అంది పుచ్చుకున్న యువనేత  కృష్ణ జిల్లా రచయితల సంఘానికి గౌరవ అధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ .రెండవ వారు కేంద్రం లోను ,రాష్ట్రం లోను రాచకీయ పలుకు బడి ,చాణక్యం ,తెలిసి ,హిందీ అకాడమీకి అధ్యక్షులైన వారు ,కార్య నిర్వాహక అధ్యక్షులు ,తెలుగు భాష ,సంస్కృతి లపై ప్రేమ ,అభిమానంఅణువణువునా వున్న వారు   ,పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు .మిగిలిన యిద్దరు ,జంట కవులు గా ,జీవికా జీవులు గా ,కృష్ణార్జునులుగా ,అలసట లేని నిరంతర సాహితీ శ్రమ జీవులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘానికి అధ్యక్ష ,కార్య దర్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు ,డాక్టర్ జి .వి.పూర్ణ చంద్ గార్లు .వీరిద్దరిని అందరుగుత్తికొండ  పూర్ణచంద్ అని అని ముద్దు గా పిలుస్తారు .అంటే అంత అవినాభావ సంబంధం వున్న వారు .అలాగే పై ఇద్దరినీ మండలి లక్ష్మి ప్రసాద్ అనీ పిలవటం వుంది .వారిద్దరూ అలానే కలిసి పని చేస్తారు .భాషా సాహిత్యాల మీద ,సంస్కృతి మీద ,వ్యవాహార భాష మీద ,తెలుగు అమలు అవుతున్న తీరు మీద ,ప్రాచీనత మీద ఎన్నో సదస్సులు అత్యద్భుతం గా నిర్వహించి స్ఫూర్తి కలిగించారు .జాతీయ తెలుగు రచయితల సభలను విజయ వాడ లో నిర్వహించి రచయితలనందర్నీ ఒకే వేదిక పైకి తెచ్చి ఒక గొప్ప అడుగు వేశారుముందుకు .అ తర్వాత మొదటి ప్రపంచ తెలుగు రచయితల సభలను విజయ వాడ లోనే నాలు గేళ్ళ క్రితం నిర్వ హించి తెలుగుకు ప్రాచీన భాష హోదా కావాలన్న కాంక్షను ప్రపంచానికి అంతటికి తెలియ జేశారు .దాని ఫలితం గా 2008  నవంబర్ ఒకటి అంటే ఆంద్ర ప్రదేశ్ అవతారన  దినోత్చావం నాడు కేంద్ర ప్రభుత్వం తెలుగు కన్నడాలకు ప్రాచీన హోదా ఇచ్చింది .2010 లో ప్రపంచ తెలుగు రచయితల రెండవ సభలు మళ్ళీ విజయ వాడ లో జరిపారు .దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు హాజరై తెలుగు భాషను బ్రతికించుకోవాలనే ఆలోచన నుంచి తెలుగు చిరంజీవి అనే నమ్మ కాన్ని కల్గించారు ..అంతే కాదు తెలుగు విశ్వ వ్యాప్తమై న భాష గా చేయాలి అని నిర్ణ యానికి వచ్చారు .అంతే కాదు ,నానాటికి విస్తరిస్తున్న శాస్త్ర ,సాంకేతిక వ్విజ్ఞానాన్ని అనుసంధానం చేసి ,యువకులు తెలుగును చక్క గా వినియోగించు కొనే టట్లు చేయాలని ,ఇంటర్నెట్  లో,సెల్ ఫోన్ లలో  తెలుగు వాడే స్థితికి తేవాలని ,తెలుగు చదివే వారికి ప్రోత్చాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు .దీనితో ప్రభుత్వం కది లింది .ఇది గో ఇప్పుడే ప్రపంచ భాష కోసం తొలి అడుగు పడింది అన్న మాట .
                   దీనిని సాకారం చేయ టానికి ఈ సంవత్చరం సెప్టెంబర్ లో అమెరికా లో సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ,శ్రీ కూచి భొట్ల ఆనంద్ ,గిఫ్ట్ సంస్థ ,మండలి బుద్ధ ప్రసాద్ ,యార్ల గడ్డలు ,మంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు ఇంటర్నెట్ పై ప్రపంచ సదస్సు జరిపారు .అక్కడ చేసిన నిర్ణయాలు చాలా ఆశను కలిగించాయి .అంటే మొదటి ప్రపంచ సభలు తెలుగుకు ప్రాచీన హోదాను సంపాదిస్తే ,రెండవ సభలు శాస్త్ర సాంకేతికాలను తెలుగుకు అనుసంధానం చేసి విశ్వ వ్యాప్త మైంది తెలుగు .తెలుగు నశించిపోతుంది -మాట్లాడే వారు లేక పోవటం వల్ల అన్న అనుమానం పోయింది ,తెలుగు చిరంజీవి అనే భావం కలిగింది .తెలుగు ఒక జీవ భాష గా వర్ధిల్లు తుంది అని నమ్మకం కలిగించింది .ఈ విషయం లోమనం అందరి కంటే ముందున్నాం అని పిస్తోంది .
                     అనేక సంకేతాల లిపులను యూని కోడ్ ద్వారా సాధిస్తే ఏ కంప్యుటర్ లో నైన అది ఓపెన్ అయి  ఉపయోగ పడుతుంది .దీని వల్ల వివిధ సాంకేతిక సంస్థలు తమ ఉప కారణాలలో తెలుగును ఉపయోగించే వీలు కలుగు తుంది .దీంతో internationailation ,localisation ఒకే సారి జరుగు తాయి .ప్రపంచ భాష గా  తెలుగు భాష ను తీర్చి దిద్ద టానికి ఇది తొలి అడుగు .దీని వల్ల ప్రపంచ వ్యాప్తం గా వున్న 18 కోట్ల తెలుగువారిని తెలుగు భూమి తో అను సంధానం చేయటం జరు గుతుంది .  మనకు కావలసిన సాఫ్ట్ వేర్ తయారీకి ,వాటిని ప్రపంచ వ్యాప్తం గా అన్వయించా టానికి ,అందరి కన్నా ముందుంది నాయ కత్వం చేబట్టా టానికి యూని కోడ్ లో సభ్యత్వం అవసరం .అప్పుడిది భాషా పరిశ్రమ గా అభి వృద్ధి చెందుతుంది .జీవిత సభ్యత్వం పొందితే ఎన్నో ఉపయోగాలు వున్నాయి .దీనికి మన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం   మంత్రి శ్రీ  సి పొన్నాల లక్ష్మయ్య  గారి నాయ కత్వం లో ముందుకు వచ్చి ఆ సభ్యత్వాన్ని అంటే సంవత్చ రానికి 15000  డాలర్ల సభ్యత్వం కట్టి జీవిత సభ్యత్వం మన రాష్ట్రం పొందింది .ప్రతి సంవత్చరం డబ్బు కట్టి renue చేసు కోవాలి .ఇది ఆంద్ర ప్రదేశ్ చరిత్ర లో మైలు రాయి . యా తర్వాత ఒక్కొక్క యూని కోడ్ కు ఆరు లక్షల రూపాయలు కట్టి ఆరు తెలుగు ఫాంట్ లను కొను గోలు చేసి అందరికి వాటిని అందు బాటులోకి తెచ్చే యోచనలో వుంది .ఎనిమిది లక్ష ల తో ఒక సెల్ఫ్ చెకర్ ను ,పది లక్ష లతో ఒక ఎడిటర్ ,అయిదు లక్షలతో ఒక కీ బోర్డ్ ,ఆరు లక్ష లతో తెలుగు దాక్యుమేన్తషణ్ ,ఉపకరణాలు రూపొందించటానికి నిర్ణయించారు .తెలుగు భాష కోసం ఒకే సారి దాదాపు ఒక కోటి రూపాయలను  ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేయటం చారిత్రాత్మక మైంది .అరవై ఏళ్ళ రాష్ట్ర చరిత్రలో ఒకే సారి ఇంత డబ్బు ప్రభుత్వం ఖర్చు చేయటం ఇదే మొదటి సారి ..దీనికి మంత్రి పొన్నాల అభినంద నీయులు .బుద్ధ ప్రసాద్ చొరవ ,ఆనంద్ గారి కార్య దీక్ష ,సాంకేతిక నిపును లైన శ్రీ గారపాటి ఉమా మహేస్వ ర రావు ,పెరి భాస్కర రావు గారల సాంకేతిక ఆలోచన మెప్పు పొందాయి .
                        దీనితో మనకు ఒరిగిందేమిటి ?అని అనుమానం రా వచ్చు .ఇప్పుడు మనం తమిళుల కంటే ఒక అడుగు ముందున్నాం కారణం -వాళ్ళు u యునికోడ్   లో సభ్యత్వం పొంద లేదు .వాళ్ళే కాదు మరే భారతీయ భాషా సభ్యత్వం తీసుకో లేదు .అందుకే మనం ముందున్నాం .చదువు వచ్చినవారి  కంప్యూటర్ల లోకి తెలుగు వచ్చి చేరి  పోతుంది .అనుక్షణం పలకరిస్తుంది .  .తెలుగు వస్తేనే వుద్యోగం అనే స్థితికి అందరు వస్తారు .దీనితో ఉద్యోగావ కాశాలు పెరుగు తాయి .ఇప్పటి దాకా ”నాకు తెలుగు చదవటం రాదు ,”అని గొప్పలు చెప్పు కొనే వారి ఆటలు కట్టుతాయి .తెలుగు ఉద్యోవకాశం ఇస్తుంది అనే నమ్మకం కలుగు తుంది .బేర సారాలకు ,ఈ సేవా కార్య క్రమాకు తెలుగు తప్పని సరి అవుతుంది .సెల్ ఫోన్ లో మెసేజెస్ అన్నీ తెలుగు లోనే వచ్చి గ్రామీనులకు చాలా ఉపయోగ కరం గా వుంటుంది .
                  ఏ భాష అయినా అన్నం పెడుతుంది అని తెలిస్తే ,తప్పక ప్రజలు నేరు స్తారు .నేర్వాల్సిన అవసరం కలుగు తుంది .ఇప్పుడున్న కార్పోరేట్ కల్చర్
ఆటకేక్కుతుంది .తెలుగు మీడియం అంటే ఆరాధ్యం అవుతుంది .తెలుగుకు పట్టం కట్టే రోజూ రానే వచ్చింది .ఈ దిశ గా ప్రభుత్వం పై కదలటానికి కావలసిన ఒత్తిడి చేయాలి మనం ..ఇంత మార్పు కేవలం మూడు నెలల్లో జరిగిందంటే నమ్మ శక్యం కానంత నిజం .తెలుగు వాడు నిజం గా గర్వ పడే రోజూ .గూగుల్ ,యాహూ ,మైక్రోసాఫ్ట్ సంస్థలు తెలుగు భాషకు ప్రాధాన్యత నిచ్చే చర్యలను త్వరలో చేబట్ట బోతున్నారు .మూడేళ్ళ క్రితం తమిళం కంటే వెనక బడిన తెలుగు నేడు మూడు అడుగుల ముందు వుంది అని గర్వం గా చెప్ప గలుగు తున్నాం .తమిళులు ప్రతి ఏడు అంతర్జాతీయ ఇంటర్నెట్ సదస్సులను పదేళ్ళుగా  జరుపు కొంటున్నారు .మనము ఇక నుంచి చెయ్యాలి .
                    తెలుగు ప్రాచీన భాష హోదా సాధించిన మూడేళ్ళకు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం దానికి సంవత్చ రానికి 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది .ఆ డబ్బు తో తెలుగు భాష ప్రాచీన భాష అని రుజువు చేసే పరిశోధనలు చేబట్టాలి .భాషా కేంద్రాన్ని కేంద్రం మైసూర్ లో ఏర్పాటు చేయాలని భావించి ప్రకటించింది .కాని ఆంద్ర ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు .హైదరాబాద్ లో నే ఏర్పాటు చేయాలని మన ముఖ్య మంత్రి కూడాకేంద్రం పై   వత్తిడి తెస్తున్నారు .త్వరలోనే అధ్యన సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు అవుతుందని నమ్మకం గా వున్నాం .
                 సరియైన తెలుగు అనువాద పద్ధతులు త్వర లోనే ఏర్పాటు కావాలి కంప్యూటర్ ద్వారా సాధించే” వర్క్యుఅల్  ”విశ్వ విద్యాలయం రావాలి .వివిధ సంస్థలు సేకరించిన సమాచారాన్ని అందరు స్వేచ్చ గా ఉపయోగించు కొనే ఆవ కాశం కలగాలి .
                   ప్రాచీన హోదా నుంచి తెలుగు ప్రపంచ భాష కు ఒక గొప్ప చారిత్రాత్మకమైన ముందడుగు వేసిన శుభ సమయం ఇది .దీనికి కారణ మైన కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ,వారికి సహకరించిన విశ్వ వ్యాప్త సాంకేతిక నిపుణు లకు ,రాష్ట్రప్రభుత్వానికీ ,  ,అభినందనలు .యువతకు చేరువై తెలుగు ఒక గొప్ప వెలుగు వెలుగుతూ ,విశ్వ భాష గా ఎదగాలనీ ,చిరంజీవి గా నిలవాలనీ ఆశిద్దాం .కొద్ది కాలమ్ లో తెలుగు ”i-pad ”లు మన చిన్న నాడు పట్టు కున్న ”పలకలు ”లాగా ప్రతివాళ్ళ చేతిలోకి చేరతాయి .అంతేనా –”తెలుగులో చదువు -ఉద్యోగం పట్టు ”అనే స్లోగన్ గన్ లాగా పేలే రోజూ వస్తుంది .అంతే కాదు రాజకీయ పక్షాలు ఎన్నిక వాగ్దానం గా” రూపాయికి కిలో బియ్యం ”కి బదులు ‘రూపాయికి కంప్యుటర్ ”అనే వాగ్దానం తో ఆకర్షించే రోజూ ఎంతో దూరం లో లేదు ..విజ్ఞానం ,వివేకం కలిస్తే మనమే అందరికంటే నంబర్ వన్ .అందుకే ఆరుద్ర ”విజ్ఞానం వికసించిన మూడో కన్ను –వివేకం మీకున్న ఒకే ఒక దన్ను .”అన్నాడు .                                                                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —05 —11 -11 .
Posted in రచనలు | Leave a comment

మారుతున్న విలువలు – ఆంధ్ర జనజీవితం

MaruthunnaviluvaluOm_0003Om_0004

Posted in రచనలు | Leave a comment

ప్రపంచ తెలుగు సభలు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 
Posted in సభలు సమావేశాలు | Leave a comment

మాన వీయ మూర్తి సేనేకా వేదాంతి —-4 మరణం తో సమరం

  మాన వీయ మూర్తి సేనేకా వేదాంతి —-4
                                                          మరణం తో సమరం    
               నీరో సృజనాత్మక కళ లో ప్రతిభా వంతుడు .కవి ,చిత్ర కారుడు ,శిల్పి  కూడా .ఏది  చేసినా చాలా ఉన్నతం గా ఉండేవి .ఏది నిర్మించినా అంతే స్థాయి వుండేది .అతను రాసిన ”ఫెయిర్ పారిస్ ”కవిత ప్రశంస నీయం అంటారు .రోం చరిత్ర మీద మహా కావ్యం రాశాడు .వయసు పెరిగిన కొద్దీ సెనేట్ ను చులకన చేయటం ప్రారంభించాడు .సేనేకా పదవీ విరమణ చేసిన తర్వాత ,రాజకీయాలపై శ్రద్ధానూ ,తగ్గించు కొన్నాడు .క్రీ.శ.67 లో మిలిటరీ కమాండర్ల శిబిరం లో తిరుగు బాటు జరిగింది .పిచ్చ కోపం వచ్చి ,సేనేటర్లను ,గవర్నర్లను హత్య చేయించాడు .రోం నగ రాన్ని తగుల బెట్టించాడు .అడవి జంతువుల్ని వదిలేయించాడు జనం మీదకు .ఆ తర్వాత పశ్చాత్తాప పడ్డాడు .ఆయుధాలు దరించ కుండా సైన్యాధి కారి దగ్గరకు వెళ్లి ఏడ్చేశాదట   . .మృతులకోసం ఆడాడు .పాడాడు .తనకు ఒక గవర్నర్ పదవి ఇస్తే చాలు అని ప్రాధేయ పడ్డాడట . తాను లేకుంటే రోం కు చాలా నష్టం అన్నాట్ట .తన లాంటి కళా కారుడు మళ్ళీ దొరకడు అని సుత్తి కొట్టాడట .అతన్ని పట్టు కుందామని ప్రయత్నిస్తే దొరక్కుండా తప్పించుకొని ”ఇప్పటికే చాలా ఆలస్యమై పోయింది ”అను కుంటు కత్తి తో పొడుచుకుని చచ్చాడునీరో .పొగరు ,గర్వం అంతా జీరో అయి పోయాయి .చరిత్రలో క్షుద్రుడు గా మిగిలి పోయాడు పాపం .రోమన్ సమాజాన్ని సర్వ నాశనం చేసిన పాపం అంతా నేరో దే .అత్యుత్తమ మైన విలువలన్నిటినీ రూపు మాపాడు .నీచం గా ప్రవర్తించి ,స్వంత తల్లి నే హత్య చేసిన పరమ కిరాతకుడు అని పించుకున్నాడు .చివరికి అధికారాన్ని పోగొట్టుకొని నీరో హీరో జీరో అయాడు .అతని పాలన రోమన్ సామ్రాజ్యానికి ఒక పీడ కల అని పించాడు .చరిత్ర హీనుడు అని పించుకున్నాడు .ఇదీ సేనేకా వేదాంతి శిష్యుడైన నీరో దుస్థితి .
                    ఇప్పుడు గురువు సేనేకా మరణ ఉదంతాన్ని చూద్దాం .సేనేకా కు ఉబ్బస వ్యాధి వుంది .చావుకు భయ పడ రాదనీ ఆయన భావన .”చని పోయిన వాడి స్థితి పుట్టబోయే బిడ్డ స్థితి వంటిదే ”అంటాడాయన .చావు కూడా ఒక దశ మాత్రమే నని అభిప్రాయ పడ్డాడు .శాశ్వతత్వం ఒక కల మాత్రమే న్నాడు ..అప్పటికే వయసు 70 ..”ఆన్ గుడ్ డీడ్స్ ” పుస్తకం రాస్తూ ”ఒక క్రూర నియంతను చంపటం ,అతనికి ,ప్రజలకు మేలే చేస్తుంది-చాలా అరుదైన సందర్భాలలో .నీరో చావూ అలాంటిదే .”అన్నాడు శిష్యుడైన నీరో గురించి .క్రీ.శ.62  వరకు ఇద్దరు జిగినీ దోస్తులే .తరువాత బద్ధ విరోదులైనారు .తల్లిని ,సోదరున్ని చంపిన నీరో కు గురువు సేనేక అడ్డం వచ్చాడని పించింది .ఇది తెలుసుకున్న సేనేకా తన చావు తన ఇష్టం ప్రకారం జరిగే ఏర్పాట్లు చేసు కున్నాడు .భర్త తో పాటు తానూ చస్తానంది భార్య.”నీ జీవితాన్ని సహనం తో ఎలా సాగించాలో నేను నీకు నేర్పాను .కాని నువ్వు గౌరవాత్మకం గా ,నాతొ సహగమనం చేసి ,ఆదర్శం గా వుండాలను కోవటం మంచిదే .ఇద్దరం ఇదే ధృఢ సంకల్పం తో ,ధైర్యం గా మరణిద్దాం ”అని చెప్పాడు భార్య పాలీనా కు సేనేక.
                       ఇద్దరు ఒక గది లో కి చేరారు తమ ఇంటిలో .ఒకే ఒక కత్తి వేటు తో ఇద్దరూ ,రక్త నాళాలను తెగ కొట్టు కున్నారు .సేనేకా తన మోకాళ్ళు ,కాళ్ళ నాళాలు తెగ కోసుకున్నాడు .బలహీనుడు ,తగినంత ఆహారం లేక కృశించిన వాడు అయినందున రక్తం చాలా నెమ్మది గా కారు తోంది .తన బాధ చూసి భార్య తట్టు కో లేక పోతోందని తెలిసి ఆమెను పక్క గది లోకి వెళ్ళ మన్నాడు .ఇంకా మాట్లాడే శక్తి వుండటం తో తన సందేశాన్ని చెబుతూ ,శిష్యుడి తో రాయించాడు .అది సేనేకా మరణం తర్వాత ప్రచు రించ బడింది . .నీరో కు సేనేకా మీదే కోపం గురు పత్ని పాలీనా మీద కోపం లేదు . .ఇక్కడి విషయాలు వేగుల వాళ్ల ద్వారా తెలుసు కొని సైనికులను పంపించి పాలీనా ను కాపాడాడు .దోషులను శిక్షించటానికి తన దగ్గర దాచుకున్న విషాన్ని  .కొంత  ఇప్పుడు అతను తాగాడు .మిగిలిన విషాన్ని డాక్టర్ ద్వారా పారేయించాడు-ఇంకెవరికి ఉపయోగ పడ కుండా .అప్పటికే సేనేకా శరీర భాగాలు మొద్దు బారి పోయాయి .
అతన్ని పాపం విషం కూడా ఏమీ చేయ లేక పోయింది .వేన్నీళ్ళ తొట్టెలో స్నానం చేశాడు .కొంత నీటిని”జూపిటర్ లిబెరేటార్ ” దేవతకు అర్ఘ్యం గా సమర్పించాడు .తర్వాత శిష్యులు ,ఆవిరి స్నానం చేయించారు .అందులో ఊపిరి ఆడకుండా ఉండేట్లు చేయించుకొని ఊపిరి తీసుకొని  చని పోయాడు వేదాంతి సేనేకా .ఏ విధ మైన రాచ మర్యాదలు లేకుండా సేనేకా అంత్య క్రియలు జరిగాయి .
                          ఒకసారి సింహావలోకనం చేద్దాం .సేనేకా కు ఇష్టమైన దర్శనం స్టాయిసిజం .అది ఒక వైఖరిఅని ,అది చాలా ముఖ్య మైనదని అతని భావం .మనతోనే ఏదైనా ప్రారంభించాలి అని అతని సిద్ధాంతం .మనకు వచ్చే భావాలతో మనం జీవిత నాణ్యత ను పెంచుకోవాలి .ఆ తర్వాత ఇతరులకు ఏదైనా బోధించాలి .సేనేకా అసలు స్పైన్ దేశస్థుడు .తర్వాత రోం చేరాడు .అనర్గల వాగ్ధాటి వున్న వాడు .శాస్త్ర ,సాహిత్య ,అలంకార ,వేత్త .గొప్ప రాజా నీతిజ్ఞుడు .వేదాంతి.నాటక రచయిత .దీనికి మించి గొప్ప కవి .సేనేకా యేసు క్రీస్తు సమకాలికుడు .రాజుల ,అధికారుల ,రాజా బంధువుల అవినీతిని వ్యతిరేకించి ,పతన మవు తున్న గ్రామీణ వ్యవస్థను కాపాడ టానికి యోధుడు గా పోరాడి నూత్న దృక్పధం లో ,జీవించిన మానవీయ మూర్తి ,స్టాయిసిజం వేదాంతి సేనేకా .
                                            సంపూర్ణం 
                                                                    మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ —04 -11 .11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad 
Rtd. head Master
Sivalayam Street 
Vuyyuru 

Krishan District 
Andhra Pradesh 
India 
 phone : 08676-232797
           958676-232797
Cell :     9989066375 

(248) 786-8594

 
 
 
 
Posted in రచనలు | Leave a comment

కార్టూన్ రంగం లో సంచలనం

Charles M Schulz

 

Posted in రచనలు | Leave a comment

మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —-3

మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —-3
                                                            rome is burning
                        కవిత్వం రాయటానికి నీరో ఉత్చాహం చూపించే వాడు .దీని వల్ల గ్రీక్ ,లాటిన కవులకు మంచి ప్రోత్చాహం కలిగింది .తల్లి అగ్రి పీనా మరణం తర్వాత ”నీరోనిమాయే ”కొత్త ఆవిష్కారం గా మారింది .  క్రీ..శ.64  జూన్ 18 న  రోం లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది .ఆరు రోజులు పాటు సాగింది .రోం లోని 14 ప్రాంతాలలో మూడు పూర్తిగా మాడి బుగ్గి అయ్యాయి .క్రీ .పూ.388 లో గాళ్స్ దాడిలో నష్ట పోయి నంతగా మళ్ళీ రోం అంత నష్టాన్ని పొందింది .దీన్నే చరిత్ర కారులు
Universal cATOSTROPHY ”అంటే ప్రపంచ వినాశనం అన్నారు .కాని నీరో చక్ర వార్తే తగుల బెట్టాడని క్రిస్తియన్లు నమ్మారు .దీనికి మూఢ నమ్మకం తోడైంది .జుడాక్ లో ప్రారంభమై ,మళ్ళీ రోం దాకా అగ్ని వ్యాపించింది .క్రిస్తియన్లను అందర్నీ అరెస్ట్ చేయించాడు నీరో .హింసించాడు ,చంపించాడు .చస్తుంటే విక్రుతానందాన్ని పొందాడు .అందుకే ”రోం తగలడుతుంటే నీరో ఫిడేల్ వాయించాడు ”అనటానికి కారణమైంది .శవాలను కుక్కల పాలు చేశాడు .చీకటి పడ గానే శిలువ వేయించే వాడు .శవాల మంటలే రాత్రికి రోం లో దీపాలు .శవ దీపాలన్న మాట .రధాన్ని నడుపు కుంటూ జనం లోకి వచ్చాడు .రాక్షసానందాన్ని అనుభవిన్చాతానికి  .యేసు క్రీస్తు పడ్డ బాధలన్ని నీరో హయాం లో క్రిస్తియన్లు అనుభ వించారు .ఒకే ఒక్క నర రూప  రాక్షసుడి వల్ల ,దౌష్ట్యం వల్ల వీళ్ళంతా సమిధల్లా మాడి పోయారు .అప్పుడే
రోమన్ సామ్రాజ్యాన్ని ”క్రీస్తు వ్యతి రేక రాజ్యం ”గా ప్రకటించాడు .దీనితో క్రిస్తియన్లు అంతా ఏకమై నీరో పై పోరాటం చేశారు .
                           ఇవన్నీ చూస్తూ సేనేక ఒక విషయం తెలిపాడు .”నువ్వు భయ పడే వాడిని నువ్వు ప్రేమించ లేవు .దేవతలు భయ కార కత్వం కలి గించరు .సేనేకా ద్రుష్టి లో చెడ్డ వారికీ మంచే చేయాలి .భార తీయ భావనలో చెప్పినట్లు సూర్యుడు అందరి మీద పక్ష పాతం లేకుండా కాంతిని ప్రసరింప జేస్తాడు అన్నట్లే పాపాత్ముల పైనా ప్రేమను చూపించాలి ..సముద్రం సముద్రపు దొంగలకు కూడా చోటు కల్పిస్తోంది .,.ఇచ్చి ,నష్టం పొందిన దాని కంటే పోగొట్టుకొని ఇవ్వటం చాలా ఉత్తమం, ఉదాత్త మైన  విషయం అంటాడు సేనేకా .భూమి కంటే అనేక రెట్లు పెద్దదైన సూర్య గోళం భూమి నుంచి పోషకత్వం పొందు తుంది .సూర్యుడు ప్రాణ శక్తిని ,పోశాకత్వాన్ని భూమికి తిరిగి ఇచ్చేస్తాడు .గుడ్డు  పిల్ల గా ఎదగ టానికి కావలసిన పోషణ  అంతాలోపలి నుంచే జరుగు తుంది .అలానేప్రపంచం అంతా ఉద్భావన్చిన కాలం నుంచే అభి వృద్ధి బీజం వుంది . మంచిని కనుక్కోవటం చాలా కష్టం .దానికి ఒక నాయకుడు ,ఒక మార్గ దర్శి కావాలి .చెడును గురువు అవసరం లేకుండా నే నేర్చు కో వచ్చు .నైలు నది వరదల గురించి ,భూకంపాలను గురించి ,చాలా శాస్త్రీయం గానే సేనేక చెప్పినట్లు జర్మన్ పండితుడు ,మేధావి” గోథె ”  రాశాడు .తోక చుక్కలు ,మెరుపుల గురించీ వివరించాడు సేనేక.గ్రహాలూ లాగానే కామేట్స్ స్థిర మార్గం లో చలిస్తాయి అన్నాడు .  .
                 కొద్ది కాలం లోనే కామేట్స్ గురించి పూర్తి సమాచారాన్ని చెప్ప గల వారు భవిష్యత్ లో వస్తారు అన్నాడు .నీరో కాలం లోనే 211  వ ఒలింపిక్స్ ,క్రీ.శ.65 నుండి 67 కు వాయిదా పడ్డాయి .చరిత్ర లో ఇలా జరగటం అదే మొదటి సారి .సంగీత ,నాటకాలలో ను పోటి పెట్టారు .ఈ రెండింటి లోను నీరో నే మొదటి బహుమతి పొందటం విశేషం .క్రీ.శ.67  నవంబర్ 28  న గ్రీకులకు స్వాతంత్ర్యం ప్రకటించాడు నీరో .
                                                                 సశేషం
                                                                                          మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ .—03 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు | Leave a comment

మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —–2

            మానవీయ మూర్తి సేనేకా వేదాంతి —–2
                                                                 స్టాయిసిజం
                  స్టాయిసిజం అంటే ఏమిటో తెలిసింది .ఇప్పుడు అది వ్యాపించినవిధం  చూద్దాం .గ్రీకు దర్శన చరిత్ర లో చివరి యుగం లోనిదే ”స్టాయిసిజం ”నైతికం ,దార్శనికం ఇందులో ముఖ్య భాగాలు .క్రీ.పూ.300  లో ఎతేన్సు లో ”జీనో ”అనే వేదాంతి దీన్ని ప్రారంభించాడు ”.స్టోవా ”అంటే చిత్రాలు వేసే చోటు .యా చోటులో ప్రారంభించారు కనుక ”స్టాయిసిజం ”అనే పేరు వచ్చింది .సినిక్ దార్శనికుడైన క్రేటాస్ శిష్యుడే జీనో .అందులోని సిద్ధాంతాల ఆధారం గానే దీన్ని అభివృద్ధి చేశాడు .హిరక్లైటాస్ అనే వేదాంతి మన విశ్వాన్ని విశ్వాగ్ని అనీ ,అంటే లాగోస్ అనీ ,–కాలమ్ అనీ సిద్ధాంతం చేశాడు .క్రిసిప్పాస్ అనే ఆయన దీన్ని అందరికి అందుబాటు లోకి తెచ్చాడు .క్రీ.పూ.189 -109  లో పేనేటియాస్ ఈ సిద్ధాంతాన్ని రోమన్ సామ్రాజ్యం లో ప్రవేశ పెట్టాడు .దీన్నే ”మిడ్ -స్టోవా ”అన్నారు .రోమన్ ఉన్నత కుటుంబాలలో ,ఈ సిద్ధాంతం బాగా వ్యాపించి రెండు శతాబ్దాలు జీవించింది .క్రీ శ.ఒకటవ శతాబ్దం లో సేనేకా ,ఎపిక్తేతాస్  ,ఒరీలియాస్ లు బాగా వ్యవస్థీకరించారు .మూడవ శతాబ్దం లో ఈ భావాలన్నే క్రైస్తవ మతం లోకి చేరి పోయాయి .రోమన్ ధర్మ శాస్త్రం పై స్టాయిసిజం ప్రభావం ఎక్కువ గా వుంది .ఇందులో తర్కం ,భౌతిక,నీతి శాస్త్రాలు
                     తర్క శాస్త్రం —-దీనిలో గుణాలు ,సంబంధాలు మనసు చేత సంకల్ప మైనవి కావు .ప్రకృతి సహజాలు .సత్య దర్శనానికి అనుమాన ప్రమాణం మార్గమే .అరిస్టాటిల్ న్యాయ ప్రయోగ సిద్ధాంతాలు దీనికి మూలం
             భౌతిక శాస్త్రం —-ఇందులో విశ్వానికి కారణం అగ్ని అంటారు .అదే ఈశ్వరుడు .సత్తా లో రెండు సత్వాలు వున్నాయి .ఒకటి సచేతన మైనది  –ఇదే కార్య కారకం .రెండు స్వయం చాలకం . –ఇతర వస్తువుల్ని రూప కల్పన చేస్తుంది .అలాగే వీరి దృష్టిలో జడం కూడా మార్పు పొందుతుంది .-ఆలోచనల తో విడదీయ వచ్చు .నియత వాదాన్ని( Determinism )సమర్ధించారు .ప్రతి విషయం కూడా ఇది వరకే నిర్ణ యిమ్పబడి వుంటుంది .మన మహా భారతం లో కూడా కురుక్షేత్ర యుద్ధం ముందే పైలోకాలలో జరిగింది.ఇక్కడ మళ్లే జరుగు తోంది అని వ్యాసుడు చెప్పాడు .విధిని అంగీకరించాలి .దీనికీ స్వేచ్చ వుంది .
                 నీతి శాస్త్రం —-సృష్టి ణియమం అంటే లోగోస్ దాని క్రమ హేతువును తెలుసు కోవటం మానవ కర్తవ్యం .హేతు బుద్ధి తో ఉన్నత జీవితాన్నిగడపాలి  .సుఖం ధర్మానికి భిన్న మైనది .సుఖం ఒక రాగమే .స్తాయిక్ అంటే ఆ సిద్ధాంత అవలంబకుడు రాగాలను లోబరచు కోవాలి .రాగాల వల్ల బాహ్య పరిస్థితులకు లోబడ తారు .ఆరోగ్యం ,జీవితం ,మర్యాద ,ధనం ,హోదా ,అధికారం స్నేహం ,విజయం స్వతస్సిద్ధాలే .అవి శ్రేయస్కరాలు శ కావు .వీటి ఆచరణ మన లక్ష్యం కాదు .స్వేచ్చ ,ఆనంద సాధన మన శక్తికి మించినవి .వాటి పై దృష్టి మార్చుకో వచ్చు .వాటి విలువ మన ”శీలం ”పై ప్రభావం చూపు తుంది .ధర్మమే అన్నిటిలోనూ ఉత్తమ మైనది .అదే ఆనందాన్ని ఇస్తుంది .విచక్షణ తో జీవించాలి .వైరాగ్యం ,రాగ సంబంధ విమోచానాలే వీళ్ళ నైతిక లక్ష్యం .వీళ్ళు ఆత్మ హత్యను సమర్ధించారు .
                                       నీరో –హీరో —జీరో
                రోమన్ సామ్రాజ్యం లో చక్ర వర్తి నీరో కు ,వేదాంతి సేనేకా కు చాల ప్రాముఖ్యం వుంది .నీరో ను హీరో ను చేసింది ఈయనే చివరికి శిష్యుడి చేతి లో జీరో అయి పోయాడు పాపం.వాళ్ళిద్దరి హవా సరదాగా నేసాగింది  మొదట .తర్వాత ఆది పత్య పోరు మొదలైంది .రాజా కీయం లో ఎవరు పాచికలు చురుకు గాఆడితే   వాళ్ళే గెలుస్తారు .మన దేశం లో కూడా నెహ్రు కుటుంబం లో ఇందిరా గాంధికి ,విజయ లక్ష్మి పండిట్ కు రాజకీయ  పోటీ వస్తే పావులు చక చకా కదిపి మేనత్తకు చెక్ పెట్టింది ఇందిరా అన్న సంగతి మనకూ తెలిసిందే .”మీ ఓటమికి కారణం ఏమిటి “?అని పండిట్ ను అడిగితే”’ నా కంటే నా మేన కోడలు వేగం గా పావులు కదపటమే ”అంది పాపం విజయ లక్ష్మి చేజార్చుకున్న విజయం పై ..అలాగే సేనేకా ,నీరోలు .
                    రోమన్ సామ్రాజ్యం లో ఒక వెలుగు వెలిగిన వేదాంతి గా సేనేకా ను చెప్తారు .క్రీ.పూ.ఏడవ శతాబ్దం లోనే ”వర్క్స్ అండ్ డేస్ ”అనే ”హిసాయిడ్” కవిత రాశాడు .ప్రపంచ విప్లవ చరిత్ర లో ఇదే మొదటి విప్లవ కవిత .రైతులు పొలం పనులు ,ఇంటి పనులు ఎలా చక్క దిద్దు కోవాలో ఇందులో వివ రించాడు .ఏది చెప్పినా సహజ పధ్ధతి లో చెప్పటం సేనేకా ప్రత్యేకత .సి -ఫారింగ్ (sea  faring) అంటే  సముద్ర   వ్యాపారం  గురించి  ఇందులో వివరం   గా చెప్పాడు .సమాజం లో నీతి ,న్యాయం వుంటే మనుష్యులు సముద్రం జోలికి వెళ్ళ నక్కర లేదని అప్పుడు భూమి సస్యశ్యామలమై ,అధిక పంటలను అందిస్తుందని చెప్పాడు .రోమన్ సామెత ఒకటి వుంది ”ఎవరి అదృష్టానికి వారే కర్తలు –ధైర్యే సాహసే లక్ష్మి ”.రోమన్ యోధులు అదృష్టానికి పరికరాలు .కాలమ్ లో ప్రతిదీ పుట్టి ,కాలమ్ లోనే కలిసి పోవటం సహజం .ఇది ఒక జీవన వృత్తం (లైఫ్ సైకిల్ ).బయటి దాని వల్ల నాశనం కాక పొతే ,లోపలి పరిస్థితుల వల్ల నైనా నశిస్తుంది .ఇదే విధం గా రోం ఉత్థానం ,పథనం చెందింది .డబ్బు కాంక్ష మొదలై ,దాన్ని అధికార కాంక్ష ఆవహిస్తుంది .ఈ రెండే చెడుకు ఆధారాలు అవుతాయి .జూలియస్ సీజర్ 365  రోజుల సంవత్చర కాలెండర్ ను ప్రవేశ పెట్టాడు .రోం ఏర్పడిన 365  సంవత్చ రాలకు” gauls ”రోం ను జయించి క్రీ.పూ.388 లో స్వాధీనం చేసు కున్నాడు .క్రీ .పూ. 23 న రోం లో మళ్ళీ సంక్షోభం ఏర్పడింది .సీజర్ మరణం తో 44 బి సి.లో మళ్ళీ అంతర్యుద్ధం చేల రేగింది .
                     రోమన్ రాజు క్లాడియస్ ,అగ్రిపీనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .ఆమె కొడుకు లూసియాస్ దోమితాస్ ను దత్తత చేసు కొన్నాడు .అతనికి ”నీరో క్లాడియస్ ద్రూసాస్ జేర్మేనికాస్ సీజర్ ”గా పేరు మార్చాడు .ఇతడే మన హీరో ”నీరో ”.అతనికి తన కూతురు ఆక్టేవియ తోనిశ్చి తార్ధం   జరి పించాడు .క్లాడియస్ తర్వాత నీరో ను వారసునిగా తెచ్చే ప్రయత్నం లో తల్లి అగ్రి పీన వుంది .అడ్డం వచ్చిన వాళ్ళను నిర్దాక్షిణ్యం గా తొలగించే ఏర్పాట్లు చేస్తోంది కూడా .నీరో కు మాత్రం ప్రజలకు దగ్గర అవాలన్న కోరిక బలీయం గా వుంది .అతను రాచ మర్యాదలు దాటు తాడేమో నని తల్లి ఆరాట పడేది .కొడుకును గుప్పిట్లో పెట్టుకుంది .నీరో ను ఇతరుల కంటే మహా బల వంతునిగా ,సృజన కారుని గా చేయాలనే కోర్కె సేనేకా కు వుండేది .గురు భక్తీ ప్రదర్శించి నీరో సేనేకా మనసు గెలిచాడు .కళా ,శాస్త్ర విషయాలను నీరో కు బోధించాడు గురువు సేనేక.తల్లికి ఇష్టం లేని తర్క శాష్ట్రాన్ని మాత్రం నేర్చుకో లేదు .నీరో కళ కళ కోసం కాకుండా జీవితం కోసం నేర్చాడు .అవసరం వస్తే ,సందర్భాన్ని బట్టి తన వాగ్దాటిని ప్రదర్శించే వాడు .అతని ప్రసంగాలను సేనేకా నే రాసి పెట్టె వాడు .సేనేకా సూచించిన విధం గా ఆసియా మైనర్ లో వున్న ”ఇలీయం ”కు ట్రాయ్ లో లాగా పన్నులు లేకుండా స్వతంత్రాన్ని ఇప్పించాడు నీరో చక్ర వర్తి చేత గురువు సేనేక ..
                    నీరో కలిగువా కుమార్తెను వివాహం చేసుకొని ,అగస్తస్ సీజర్ లాగ సంపూర్ణ అధికారాలు పొందాడు .క్రీ.శ.లో తండ్రి క్లాడియస్ మరణించాడు .శవ యాత్ర లో నీరో గొప్ప ప్రసంగం చేసి ప్రజల మనసు దోచాడు .ఈ ప్రసంగాన్నీ సేనేకా ఏ రాశాడు .క్లాడియస్ పరిపాలనా విశేషాలను ,అతను శాస్త్రీయం గా సాధించిన పురోగమనాన్ని ,వివరించాడు ప్రసంగం లో .అంతఃపురం లో రాజా కుట్రలు సాగుతున్నాయి .నీరో తన మాట వినటం లేదని తల్లి అతన్ని గద్దె  దించటానికి సేనేకా సాయం కోరింది .ఆ స్థితి లో ఆమెకు వ్యతి రేకులు బలం గానే వున్నారు .వాళ్ళను అడ్డు తొలగించ్కునీ ఏర్పాట్లు ముమ్మరం గా చేస్తోంది .నీరో హీరో ను చక్ర వర్తిని చేసేసింది కదా ముందే తన కున్న అధికారం ,ముందు చూపుతో .
                     క్రమంగా పరిస్థితులు మారి పోయాయి .తల్లికి కొడుకు దూరం అవుతున్నాడు .దీన్ని జీర్నిచుకో లేక పోతోంది తల్లి .తన స్వతంత్ర భావాలను ప్రకటించటం ప్రారంభించాడు .దేశం లో మొత్త మొదటి సారిగా ఆటలను ప్రోత్చ హించాడు .తన రధం తానే తోలు కుంటు ,ప్రజల మధ్యకు వచ్చే వాడు .దియేటర్లలో నాటకాలు ఆడే వాడు .కవిత్వమూ చెప్పే వాడు .సర్కస్ ప్రదర్శన ఏర్పాటు చేసి ,ప్రజలంతా వచ్చి చూసే వీలు కల్పించాడు .పై అంతస్తు లోని ప్రజలు కూడా వచ్చి పాల్గొనే టట్లు చేశాడు .గ్రీక్ ,లాటిన్ డ్రామాలను ఆడించాడు .గుర్రపు స్వారీ పోటీలు నిర్వహించాడు .ఆటలు ,క్రీడలు కు ప్రాధాన్యత నిచ్చాడు .ప్రతి అయిదు ఏళ్ళ కోసారి పోటీలు జరిపించే వాడు .ఈ పోటీల వల్ల సంఘం లో నైతిక పథనం ఏర్పడిందని తాక్తికాస్ అనే చరిత్ర కారుడు ఆనాడు .జిమ్నేసియం కూడా ఏర్పరచాడు .దిగంబర పోటీలూ నిర్వహించాడు .సెనెటర్లకు ,నోబుల్స్ కు కూడా అవకాశం కల్పించాడు .ఈ పద్ధతు లన్నీ గ్రీకుల నుండి సంకర మించినవే .నీరోయిక్ పోటీలు అని పిలువ బడే ఈ పోటీలలో గ్లాడియేటర్ పోటీలు అంటే మల్ల యుద్ధాలు లేవు .ప్రశాంత మైన ఆటలకే ప్రాధాన్యత హెచ్చు .హాని చేసే పోటీలు లేవు .పై అంతస్తు జనాన్ని అవమాన పరచటానికే వీటిని నీరో ఏర్పాటు  చేశాడనే విమర్శ వుంది .ఇవన్నీ ప్రభుత్వం ఖర్చుతో ఏర్పాటు చేసినవే .క్రీ;శ.65  వరకు నీరో వీటిలో ప్రత్యక్షం గా పాల్గొన్నాడు .ఈ రకం గా సాంస్కృతిక కార్య క్రమాలలో గొప్పమార్పులు  తెచ్చిన హీరో  నీరో చక్ర వర్తి .ఏది చేసినా సేనేకా తో సంప్ర దిస్తూనే వుండే వాడు .
                                     సశేషం
                                                           మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —03 -11 -11 .
Posted in రచనలు | 1 Comment

చివరికి మిగిలేది ఎన్ని భాషలలో వచ్చినా నటన పరంగా చివరికి మిగిలేది సావిత్రే

ఎన్ని చివరికి మిగిలేది ఎన్ని భాషలలో వచ్చినా నటన పరంగా చివరికి మిగిలేది సావిత్రే ——-దుర్గా ప్రసాద్

Posted in సేకరణలు | Leave a comment

మాన వీయ మూర్తి సేనేకా వేదాంతి ——-1

మాన వీయ మూర్తి సేనేకా వేదాంతి ——-1

                                                                        జీవిత విశేషాలు
సేనేకా వేదాంతి క్రీ.పూ.నాలుగు నుంచి క్రీ.శ.65 వరకు జీవించాడు .రోమన్ వేదాంతి గా ,మహా వక్త గా ,విషాదాంత జీవి గా ,రోంసామ్రాజ్యం లో అత్యంత మేధావి గా పేరు పొందాడు .54ad  నుంచి 62ad  మధ్య కాలమ్ లో రోమన్ సామ్రాజ్యానికి పరోక్ష పరిపాలకుని గా వెలిగాడు .అప్పుడు నీరో రాజు ఇంకా బాలుడే .సేనేకా ధనిక కుటుంబం లో జన్మించాడు .తండ్రి ఏవియస్ -ఉపాధ్యాయుడు .తల్లి హేన్వియ -బాగా చదువుకున్న స్త్రీ .ఆమె పెద్దన్నయ్యే గెలీలియో శాస్త్ర వేత్త .సేనేకా అంటి రోం కు తీసుకుని వెళ్లి మంచి శిక్షణ నిప్పించింది .sexti  స్కూల్ లో వేదాంతం చదివాడు .ఆ స్కూల్ లోనే స్టాయిసం పుట్టింది . దీనినే” నియో పైథాగరిజం” అంటారు .ఆరోగ్యం పాడైతే ఈజిప్ట్ చేరాడు ..
            క్రీ.షా.31 లో మళ్ళీ రోం లో కాలు పెట్టాడు . రాజకీయాలు ,న్యాయ శాస్త్రం లో నిష్ణాతుడు అయాడు .రోం చక్ర వర్తి ”కాలిగులా ”చేస్తున్న తప్పులన్నీ బయట పెట్టె వాడు .చక్ర వర్తి కి చావు దగ్గరకు వస్తూండటం తో   ఏమీ చేయ లేక పోయాడు .క్రీ.శ.41 లో  రాకుమారి ”జూలియ విలియ”తో వ్యభిచారించాడనే ఆరోపణతో ,దేశ బహిష్కారానికి గురైనాడు .ప్రకృతి శాస్త్రం ,వేదాన్తాలను బాగా కాచి వడపోసి గొప్ప వాడైనాడు” consolations  ”  అనే మూడు ఉద్గ్రంధాలు (tritain )  రాశాడు .చక్ర వర్తి భార్య ”అగ్రిపీనా ”అభ్యర్ధన పై మళ్ళీ రోం కు చేరాడు .క్రీ/శ.50 లో praetor  అయాడు .”పామ్పియా పాలినా ”ను వివాహం చేసు కున్నాడు .నెమ్మదిగా బాలనీరో   కు గురువు అయాడు .క్రీ.శ.54 లో  క్లాడియన్ హత్య తో సేనేకా ,అతని స్నేహితుడు బర్స్  ఇద్దరు అధికార ప్రాభవం సంపాదించారు .వీరిద్దరి స్నేహితులు అంతా కలిసి ఒక శైనిక సమూహాన్ని తయారు చేసి ,జర్మన్లను ,పార్దియన్లను అదుపు లోకి తెచ్చి సామ్రాజ్యాన్ని కాపాడారు .
                       చక్ర వర్తి నీరో మొదటి ఉపన్యాసాన్ని సేనేకా నే తయారు చేశాడు .అందు లో రోమన్ సెనేట్ కు స్వేచ్చ ను ప్రకటించాడు .నీరో పై తల్లి అగ్రి పీనా ఆధిపత్యం ఎక్కు వై పోయింది .రోమన్ సామ్రాజ్య స్థితి గతులు ,సేనేకా ,బార్స్ లకు బాగా ఆకళింపు అయాయి .బానిసల మీద మాన వత్వం తో ప్రవర్తించే శాసనాలు ప్రవేశ పెట్టించారు .ఆర్ధిక ,న్యాయ విషయాలలో ప్రజలకు అను కూలంగా సంస్కరణలు తెచ్చాడు సేనేకా …సేనేకా ప్రతినిధి అయిన ”కార్బులో ”పార్దియన్లను ఓడించి ,రాజ్యానికి స్థిరత్వం కల్పించాడు .అప్పటి దాకా వున్న అంతర్యుద్ధంపూర్తిగా అణగి పోయింది .క్రీ.శ.59 లో నీరో తన తల్లి ని హత్య చేశాడు .దీన్ని సేనేకా బాహాటం గానే ఖండించాడు .బార్స్ మరణించాడు .అది సేనేకా ను కలచి వేసింది .పదవీ విరమణ చేశాడు .ఆ  తర్వాత అత్యున్నత స్థాయి వేదాంత గ్రంధాలు రాశాడు .సేనేక శత్రువులు ,అతనిపై ,”పిసో ”అనే వాడితో కలిసి కుట్రకు తోడ్పద్దాడని రాజా ద్రోహ నేరం మోపి ,ఆత్మ హత్య చేసుకోమని హుకుం జారీ చేయించారు నీరో తో .అలాగే కత్తితో కాలు కోసుకొని రక్త స్రావం తో మరణించాడు సేనేకా వేదాంతి .ఆ వివ రాలు తరువాత తెలుసు కుందాం .
                                            రచనలు
                   సేనేకా రాసిన ”క్లాడియాన్ జీవిత చరిత్ర ”గొప్ప గ్రంధం గా పేరు పొందింది .అలాగే కొడుకు చని పోయిన తల్లిని ఓదార్చే consolations  ఉత్తమ రచన గ గుర్తింపు పొందింది .స్టాయిజం సిద్ధాంత కర్తల జీవితాలు ,రచనల పై సాధికారం గా Devitis ,Devita ,Beata  అనే అత్యుత్తమ గ్రంధ రచన చేశాడు సేనేకా .విషాదాంత రచనలు (trajedies )పది రాశాడు .staayk వేదాంతం సేనేకా ను నిత్య స్మరనీయున్ని చేసింది .
                                                    స్టాయిసిజం( Stoicism )
                అసలు స్టాయిసిజం అంటే ఏమిటో ముందు తెలుసు కుందాం .ఇదొక వేదాంత విధానం .గ్రీకో -రోమన్ నాటిది .ఇందులో విధ్యుక్త ధ్రర్మం( డ్యూటీ)కి ప్రాధాన్యత ఎక్కువ .హేతువు (Reason )తో విశ్వాన్ని అర్ధం చేసు కోవాలి .విధి బలీయం .ప్రపంచం లో జరిగే వాటిని ప్రశాంత చిత్తం తో అనుభవించాలి .స్తాయిజం సిద్ధాంతాన్ని క్రీ.పూ.300 లో ”జీనో అఫ్ సిటియం ”ప్రతి పాదించి ,ఉద్యమం గా నడిపాడు .అది 200 ad  వరకు బ్రతికింది .మనిషికి ఆరోగ్యం ,సంపద మాత్రమే అవసరం కాదు .పరంపరగా వస్తున్న నైతిక సిద్ధాంతాలపై విరుచుకు పడ్డ సిద్ధాంతంఇది .సుఖము ,శాంతి మనిషికి చాలా ముఖ్యం .ధర్మం లేక సన్మార్గం (Virtue ).
అధర్మం లేక దుర్మార్గం (Vice )అనేవే మంచి ,చెడు .సన్మార్గం  లాభదాయకం .దుర్మార్గం అపాయ కరం .మిగిలిన వన్నీ వీటి తర్వాతే .ఆనందం ,దుఖం అనేవి పుట్టుక ,పెంపకం మీద ఆధార పడి వుండవు .ధర్మంగా వుంటే అంతా మంచే జరుగు తుంది .జాతి ,స్థితి (హోదా ),లింగ భేదాలకు అతీతం గా వుండే సిద్ధాంతం ఇది .Ethical Docrine was the core of Stoicism ‘అంటారు .అంటే నీతి సిద్ధాంతమే ఇందులో అతి ముఖ్య మైన భాగం .ఇది పాశ్చాత్య నాగరకత పై గొప్ప ప్రభావం కల్గించింది .,సేనేకా ,ఎపిక్తకస్ ,మార్క్ ఆరిలాస్ అనే ముగ్గురు ఈ సిద్ధాంతాన్ని ,బాగా వ్యాప్తి చేశారు .సిసిరో కాలానికి స్టాయిసిజం బాగా తగ్గి పోయింది .క్రమంగా స్టాయిసిజం లోప్లాటో నిజం   కలిసి పోయింది ..
                                     సశేషం
                                                               మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —03 -11 -11 .
Posted in రచనలు | Leave a comment