బౌద్ధం లో వచ్చిన పరిణామాలు —-3 గుహ్య సమాజ తంత్రం

       బౌద్ధం లో వచ్చిన పరిణామాలు —-3
                                                                         గుహ్య సమాజ తంత్రం
                      ”  శరీరాన్ని కష్ట పెట్టటం వల్ల ,ఇంద్రియాలను నిగ్రహించుకోవటం వల్ల మోక్షం రాదు ,.ఇలాంటి కష్టతర మార్గాల వల్ల పరి పూర్ణత రాదు .కోరికలన్నీ పూర్తిగా అనుభవిస్తేనే మోక్షం ”అని గుహ్య సమాజ తంత్రం చెబుతుంది .బుద్ధుడు జీవ హింస ,మద్య ,మ్మాంసాలు విసర్జించమని కోరితే ,ఈ తంత్రం మాంసమే కాదు ,నరమాంసము భక్షణ చేయమన్నది .ఇష్టమైన స్త్రీ తో భోగించమన్నది .నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించ మన్నది .”నువ్వు యోగివి .సమాజం అసంపూర్నులతో నిండి వుంది .అసంపూర్నుల కోసమైన సామాజిక నియమాలు యోగులకు చెల్లవు ”అని తీర్పునిచ్చింది . .యదేచ్చా విహారానికి తెర లేపింది మంత్రాలు ,ముద్రలు ,మండలాలు వ్యాప్తిప్లోకి వచ్చాయి .జనాకర్షణ పెరిగింది .ఆ కాలమ్ లోనే ఉత్కళ దేశం లో” ఇంద్ర భూపతి ”అనే ఆయన ”మహా సుఖ వాదం ”తో ”వజ్ర యానం ”
అనే శాఖ ను ఏర్పరచాడు .ప్రాంచిక భోగాలన్నీ అనుభ వించ మన్నాడు .బోధి సత్వుని పురుషునిగా ,నైరాత్మ లేక శూన్యాన్ని స్త్రీ గా చెప్పాడు .స్త్రీ ని ఆలింగనం చేస్తేపురుషునికి ఎంతటి సుఖానందం కలుగు తుందో ,శూన్యాన్ని ఆలింగనం చేస్తే అంతటి సుఖానందాలు కలుగు తాయి .ఇంతకీ శూన్యం అంటే ఏమిటి ?అన్న దానికి సమాధానం చూద్దాం .నిర్వాణత్వం పొందిన మనస్సునుబోధి చిత్తం  అంటారు .ఆ స్థితి లో ఆ చిత్తం ఊర్ధ్వ లోకాలకు ఎగురు తుంది ..ఈ లోకాలలో బోధి సత్వుని రూపం వుంటుంది .అరూప లోకం లో రూపం నశించి పోతుంది .ఇదే చివరి లోకం .ఇక్కడ ”నమితా బుద్ధుడు ”దివ్య తేజస్సు తో ఉంటాడు .దాని పైన సుమేరు శిఖరం వుంటుంది .ఇక్కడికి చేరిన బోధి సత్వుడు శూన్యం లోకి ప్రవేశించి ,దానిలో లీనమైపోతాడు .ఇంకో చోట మహా సుఖ వాదమే ,తదాగత జ్ఞానం గా చెప్పాడు .
                      ఇంద్ర భూతి రాసిన ”జ్ఞాన సిద్ధి ”గ్రంధం లో జ్ఞానం వల్లే నిర్యాణం వస్తుందని చెప్పాడు .అన్ని విధాల్లో వజ్ర యానమే చాలా మేలైనదని అన్నాడు .ముద్రలు ,పాండిత్యాల వల్ల మోక్షం రాదు అన్నాడు  .వజ్ర యానం టిబెట్ దేశం లో ”రహష్య మంత్రం ”పేరుతొ ప్రచార మైంది .గురు పద్మ నందుడు టిబెట్ లో దీన్ని ప్రచారం చేశాడు .భారత్ నుంచి ఇతను టిబెట్ కు చేరి ”లామా ”పీఠం స్థాపించాడు .గురు పద్మ నందుడే మొదటి ”లామా.”.ఈయన శాంతి రక్షితుని బావ మరిది .
                                                                 సహజ యానం
                          క్క్రీ.శ.729  ప్రాంతం లో ఉద్యాన దేశ రాని ”లక్ష్మీ కర దేవి ””సహజ యానం ”ప్రవచించింది .వజ్ర యానానికి ఇది ఉప శాఖ .దీని ప్రకారం ఎవరూకష్ట పడక్కర లేదు .మోక్షం కోసం వేమ్పర్లాదక్కర లేదు .దేనికీ నిషేధమే లేదు .సత్యం తెలిస్తే ,యెట్లా తిరిగినా ఫరవాలేదు .సహజ యానం నుంచి ,కాల చక్ర యానం ,ముమ్నుగా యానం ,వచ్చాయి .
                                                           ప్రజ్నో పాయ నిశ్చయ సిద్ధి
                      ఇంద్ర భూతి రాసిన జ్ఞాన స్సిద్ధికి సారభూత మైనదే  అనంగ వజ్రుడు  క్రీ.శ.౧౦వ శతాబ్దం లో రాసిన ”ప్రజ్నో పాయ నిశ్చయగ్రంధం ” జైన మతం లోని ”నాద సంప్రదాయం ”కు అనుకూల మైన తత్ర శాఖ ఇది . .  .ప్రజ్న తో ఉపాయం కలిస్తే మోక్ష మార్గం తెలుస్తుంది .అద్వయత్వ సంయోగం లేనిదే మోక్షం రాదు .ప్రజ్ఞా పారమితత్వం లేక పోయినా మోక్షం రాదు .ఇది స్త్రీలు అందరిలో వుంది .కనుక వావి  వరుసలు లేకుండా స్త్రీలను అనుభవించాలి .భోగం తో యోగం యోగం తో మోక్షం వస్తుందట .అయితే మనస్సును చలిమ్పనియ్యకుండా ధ్యాన బుద్ధితో ఇదంతా చేయాలట .మనసు చాలిస్తే మోక్షం హుళక్కి .ఇలా తంత్ర సంప్రదాయం బౌద్ధం లో బాగా వెళ్ళు తన్నుకు పోయి వ్యాపించింది .దీనితో స్వైర విహారం పెరిగి పోయింది .క్రమ శిక్షణ మ్రుగ్యమయింది .శీలం గోడమీద మేకు కు తగిలించే శారు .వావి లేదు వరుస లేదు .అంతా సమానమే .శారీరక సుఖమే పరమ భాగ్యం అయి పోయింది .ఎంతో నియమ నిష్టలతో వర్ధిల్లిన బౌద్ధం ,బుద్ధి జాడ్య జనితోన్మాదం తో అధః పాతాళానికి పతనమైంది .భార్త్రు హరి పద్యం ”ఆకాశంబున నుండి శంభుని శిరంబు ——-పవనందోలోకమ్ము చేరె అనగా కూలం కష –పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్” గుర్తుకు వస్తుంది .దివ్య ఆపగ (నది )లాగా వుండే బౌద్ధం పాతాళానికి చేరింది .
ఇంకేముంది ?హిందూ మతస్తులకు గొప్ప అవకాశం చేతికి చిక్కింది .బౌద్ధం లోని చెడును భూతద్దం లో చూపించారు .మూడవ శతాబ్దం లో చొరబ్బడిన తంత్రం ఏడవ శతాబ్దం దాకా వ్యాప్తి చెందింది .44 సిద్ధులు ,పాటలు ఉపదేశాలతో ప్రచారం బాగా చేశారు .వజ్ర యానం టిబెట్ తో పాటు నేఆలు కు చేరింది .తాన్త్రికాలు టిబెట్ భాష లోకి అనువాదం చెందాయి .కొన్ని అనువాదాలు చైనా త్రిపితకాలలోను చేరాయి .వామాచారాలన్నీ ,భారత దేశం లోని ఆధ్యాత్మికతను ,విదేశీయుల అభిరుచుల్ని మేల వించి నవి గా విశ్లేషకులు భావించారు .ఇంత మహా ప్రయాణం సాగించి ,పరి వార్తన చెందింది బౌద్ధం .ఏ మార్గ మైనా సామాన్యుని దృష్టి లో పెట్టుకుని ఏర్పడిందే .
                           ఈ విషయాలన్నీ స్పృశిస్తూ ముక్త్యాల రాజా వాసిరెడ్డి రామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ ఒక కమ్మని పద్యం చెప్పారు
                     ”కరుణ లూనెడు నహింసే స్థిరమగుత –నవని నదే శాంతి యదె దాంతి యదియె  నీతి —
                        స్వరము మొదలైనవో పునర్జన్మ కే ,ఇక –రూపు లేని నిర్వాణమే ప్రాపు మనకు ”
          అంతు బుద్ధ భగ వానుని సూక్తులు గుర్తుచేశారు .ఆ శ్రీ చరణాలే అప్పుడు ,ఇప్పుడు ,ఎప్పుడూ ,అనుసరనీయాలు అంతు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి మహోదయులు సెలవిచ్చిన పద్యం తో నమస్కరిస్తూ సెలవ్
                                ”ప్రియ యువతిం బ్రభుత్వమును వీడి ,యరణ్యము జేరె దత్వ ,ని
                                 శ్చయ మునకై మహా తపము సల్పి ,క్రుతార్ధత గాంచె నెల్లడాన్
                                  దయాయు ,నహింస యుం ,బరమ ధర్మములన్ నెల కొల్ప ,నమ్మహో
                                   దయుడగు బుద్ధ దేవుని పదంబుల కేను నమస్కరించెదన్ ..
                                                 అయి పోయింది
                                                                                                                                    ఆధారం —-1956  బుద్ధ జయంతి పత్రిక
                                                                                                                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —02 -11 -11 .
Posted in సేకరణలు | Leave a comment

బౌద్ధం లో వచ్చిన పరిణామాలు –2 బౌద్ధ సంప్రదాయం

 

                                          బౌద్ధం లో వచ్చిన పరిణామాలు –2
                                                   బౌద్ధ సంప్రదాయం
                ప్రతి  జీవి బోధిసత్వుడు అవాలంటే జ్ఞానాన్ని మనసులో నిలుపు కోవాలి ప్రకనమ్ పోయే దాకా శ్రమ చేస్తూ ఆ” బోధి ”ని అంటే జ్ఞానాన్ని పొందుతానని శపథం చేయాలి .ప్రాణుల కోసం సర్వస్వం త్యాగం చేసి ,జనుల బాధలను తీర్చి ,వాళ్ళను నిర్వానుల్ని చేయాలి.ఇలాంటి బోధి సత్వుడు గృహస్తుడు గా నైనా ఉండ వచ్చు లేక భిక్ధువు గా జీవించ వచ్చు .
              ” బుద్ధులు ”అంటే సర్వ ధర్మ విరక్తులు ,అనంత శక్తి ,ఆయుస్సు వున్న వారు .నిద్ర ,స్వప్నం లేని వారు .ఎప్పుడూ సమాధి లో వుండే వారు .కొన్ని సమయాల్లో కొన్ని లోకాల్లో కని పించేవారు .
              ”బోధి సత్వులు ”పూర్తి జ్ఞానం తోనే మాత్రు గర్భం లో ప్రవేశిస్తారు .దీన జనోద్దరణ కోసం హీన జీవులు గా పుడతారు .కఠిన శ్రమ తో ,గురువుల వద్ద విద్య నేరుస్తారు .ప్రకృతికి విరుద్ధం గా చుండే అద్భుతాలను చేస్తారు .
            ”అర్హతులు ”అంటే బుద్ధులకు ఉన్నంత జ్ఞానం లేని వారు .అజ్ఞాన బంధాల నుంచి విముక్తి కాని వారు .అర్హత్వం నున్చిన్క్రింది దశలకు జారి పోయే ప్రమాదం వున్న వారు .ఈ విధం గా ,సాంఘిక సిద్దాంతా లలో మార్పు రావటం వల్ల మహా యాన బౌద్ధం ఏర్పడి నట్లు భావిస్తారు .
                                     బౌద్ధ మత శాఖలు
               మహా సాంఘిక సిద్ధాంతాలు మూడు దశలు  గా వుంటాయి .01 -పుట్టుట ,గిట్టుట లను దాటి పోయిన దశ ను తిరిగి రాని దశ అంటారు .02 -నిర్వాణం   దాటటానికి పూర్వం   జన్మించే దశ  .03-జననం    ,మరణం అనే ప్రవాహం లో కొట్టుకు పోయే దశ .ఈ పరిస్థితుల్లో బౌద్ధం లో రెండు శాఖలు ఏర్పడ్డాయి .అవి హీన యానం ,మహాయానం .పాళీ పితకాలలో వీటి ప్రస్తావన వుంది .హీన యానానికి శ్రావక యానం ,ప్రత్యెక బుద్ధ యానం అనే పేర్లు వున్నాయి .మహాయానానికి బుద్ధయానం అనీ ,తదాగత యానం ,బోధిసత్వ యానం అనీ పేర్లు .ఈ పేర్లు ఎందుకు ఏర్పడ్డాయో మహా యాన గ్రంధాలలో చెప్పబడింది .
            ”  హీన యానం ”అంటే –సామాన్య బుద్ధి వున్న వారు ధర్మాన్ని ,మతాన్ని శ్రద్ధగా విని ,తెలుసు కోని ఆచరించి ,బుద్ధుడు చూపిన మార్గం లో పరిపూర్ణత సాధించటం .ఇది శ్రావకులకు ఏర్పడిన ప్రత్యెక మార్గం .
            ”మహా యానం ”అంటే ఉత్తములు ఇంకెవరి సహాయం లేకుండానే ,తమ ముక్తిని తామే సాధించి ,ఇతరులకు దారి చూపిస్తూ ,సహాయం చేసే విధానం .                                   హీన యానం పరిపూర్నులైన అర్హతులను తయారు చేస్తే ,మహాయానం సిద్ధార్ధుడు పొందిన అత్యున్నత మైన బోధి సత్వాన్ని పొంద టానికి మార్గం చూపించింది .ఇంకాస్త వివరం గా చెప్పాలంటే ,ఇతరులు కూడా మోక్షం పొందనిదే తాము ముక్తిని కోరు కోని వారు  మహాయానులు .తమ స్వీయ ముక్తి కోసమే పాటు పడే వారు కనుక హీనులు అయారు .మొదటి దాని కంటే ఇది తక్కువ స్థాయి .అది లోకోద్ధారణ .ఇది స్వీయోద్ధారణ అన్న మాట . ,                                          సత్యాన్ని అనుభవించటానికి రెండు ఆవరణలు వుంటాయి .మొదటిది దుఃఖ (క్లేశ )ఆవరణ .రెండవది జ్ఞేయ ఆవరణ .నైతిక నియమాలను అనుసరించటం వల్ల నడ వాది మార్చుకొని క్లేశావరనాన్ని పోగొట్టు కో వచ్చు .క్లేశం తొలగితే” వ్యుద్గల శూన్యత ”,వ్యక్తిత్వ శూన్యత మాత్రమే తెలుస్తాయి .జ్నేయావరనాన్ని కూడా తొలగించుకుంటే ,పై ఎందితి తో పాటు ,ధర్మ శూన్యత అంటే ప్రపంచ విషయాలు మిధ్య అన్న భావం కూడా తెలుస్తుంది .ఈ రెండు ఆవ రాణాలు ఎవరు ,సాధన ద్వారా తొలగించు కొంటారో ,వారికి సత్య సందర్శన యోగం లబ్భిస్తుంది .మహాయానాన్ని బాగా వ్యాప్తి చెందించిన వాడు ఆచార్య నాగార్జునుడు .అ తర్వాత ,ఆర్యదేవుడు ,మైత్రేయ నాభుడు ,అసంగుడు వంటి పండితులు ,తార్కికులు దీని ఆదరించారు .దీనితో ఈ రకమైన బౌద్ధానికి తత్వ దృష్టి ఏర్పడింది .మహాయానానికి ”ప్రజ్ఞాపారమిత ”గ్రంధం ప్రమాణ మైనది .వీరంతా బుద్దున్ని దేవుణ్ణి చేశారు .వీరి ద్రుద్తి లో బుద్ధుడు పిపీపిలికాది సర్వ ప్రానుల్లోను ,ప్రచ్చన్నం గా వుంది ,జ్ఞానం కలిగిస్తూ ,దాన్నిని పెంచుతూ ఉంటాడని ”కారండ వ్యూహం ”అనే గ్రంధం తెలియ జేస్తోంది .బుద్ధ భగ వానుడు తన లక్ష్యం నిర్వాణం అని మాత్రమే చెప్పాడు .అయితే దాన్ని ఖచ్చితం గా నిర్వచిన్చలేదని  ,ఈ ఆలోచనలు బయలు దేరినట్లు కని పిస్తుంది .నిర్వచించమని బుద్ధున్నే అడిగితే మౌనమే ఆయన సమాధానం .మహాయాన ప్రచారకుడు నాఆర్జునుడు మాత్రం ఉన్నదీ ,లేనిదీ ఈ రెంటి నుంచి ,ఆ రెండు కాని వాటి నుంచి ,ఏది విడిచి పెట్ట బడు తుందో  ,దాని రూపం అని ,అదే ”శూన్యం ”అనీ నిర్వ చించాడు .(ఆస్థి నాస్తి తదుప యాను భయ వినిర్ముక్త స్వరూపం ).అశ్వ ఘోషుడు మాత్రం ”దీపం ఆరి పోయే స్థితి వంటిదే నిర్వాణం ”అని చక్కగా చెప్పాడు .
                       అశోక చక్ర వర్తి –హీన ,మహాయాన మార్గాలకు మధ్య మార్గాన్ని ఆచరించాడు .వైరాగ్యాన్ని అశోకుడు ఒప్పు కో లేదు .దానితో బుద్ధుల ఆలోచనలలో కొంత మార్పు వచ్చింది .సన్యాస స్వీకారానికి వ్యతి రేకం గ అశోకుని కాలమ్ లో ఒక ఉద్యమమే బయల్దేరింది .దీని ఫలితం గా ,బౌద్ధం ప్రజా జీవితానికి దగ్గరైంది .పల్లె ,పట్ణనాలకు వ్యాపించింది .కఠిన నియమా లన్నీ ,స్వార్ధ త్యాగంతో ,జయించటం ప్రారంభ మైంది .దీనితో ,ప్రజల్లో విశ్వాసం ,భక్తి పెరిగాయి .చైత్యం నిర్మించాలనో ,బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయాలనో ,కోరిక జన సామాన్యం లో పెరిగింది .ఆ ప్రతిమను భక్తి తోపూజించి ,ధన్యత చెందాలన్న తీవ్ర వాంచ ప్రబలింది .క్క్కడ మతాలలోను ,చైత్యాల్లోను భిక్షువులు సాధన చేస్తుండగా ,ఇక్కడ సామాన్యులు బుద్ధుని ఆరాధిస్తూ ధన్యత చెందు తున్నారు .నిత్య ప్రార్ధన ,పూజాదులతో ,ప్రజలు ప్రజలు బుద్ధుని ,తమ ముందు వున్నట్లు గా భావించారు .అప్పటి దాకాఆయన శాక్య ముని .ఇప్పటి నుంచి బుద్ధుడు సర్వ సమర్ధుడైన దేవాది దేవుడైనాడు .బుద్ధ జీవిత కధలను శిపాలుగా ,మలచి ,స్ఫూర్తి పొందారు .తెల్లటి నాప రాయి మీద ఉబ్బెత్తు ఆ బుద్ధుని శిపాలు చెక్కారు .అందు లో ఎన్నో భావాలను ఆవిష్కరించారు .వాటిని చూసి జనం తన్మయులయారు .శిల్పులు ,చిత్రకారులు ,తమ కళలను  బుద్ధ జీవిత కధలలో నిక్షిప్తం చేసి ధన్యత చెందారు .ఈ శిల్పులు ఆంద్ర దేశం లోను బహుళ వ్యాప్తమైన శిపాలు చెక్కారు .ఇదంతా క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ది లో జరిగి పోయిన విషయాలు .జనం లో బాగా వ్యాప్త మైంది కనుక మహాయానాన్ని ”జన బౌద్ధం ‘అన్నారు .అంత మాత్రం చేత హీన యానం కనుమరుగు కాలేదు .హీన యాన సూత్రాలు జన బౌద్ధం లో చేరి పోయాయి .భక్తీ ,శ్రద్ధ ,పూజలు అదనం అయాయి అంతే . దీనితో మహాయానం కొత్తరూపు దాల్చింది .ఖచ్చ్తం గా చెప్పా లంటే బాహ్య రూపం మహాయానం ,జీం మాత్రం హీనయానం గా వునదే జన బౌద్ధమయింది .దీనికే ఆదరణ బాగా పెరిగింది జన సామాన్యం లో .ఏ యానమైనా ,నైతికత కు వదిలి పెట్ట లేదు  ”శేలాన్ని జీవం గా ,కరుణ ఉగ్గుతో బెట్టిన విద్య గా”  భావించాయి
కాలమ్ ఎన్నో మార్పులు తేవటం సహజం .అభి రుచులు మారుతాయి .కఠోర నియమాలు కొందరికి ఇబ్బంది కలిగించాయి .బోధిసత్వ సాధన దుర్లభామని పించింది .దీనికి ఉపాయం వెదికారు .ప్రజలను ఆకర్షించాతమే బౌద్ధం ధ్యేయం అని పించింది .’అసంగు ”మొదలైన బౌద్ధ పండితులకు. .క్రీ శ.నాల్గవ శతాబ్దం లోనే .తంత్ర సంప్రదాయాలు వచ్చేశాయి .దీనికి మూలం .దీనికి మూలం ”వజ్ర భూతి ”అంటారు .”శాంతిదేవుడు ”మాత్రం మొదట ఈ ప్రస్తావన ను గ్రంధాలలో చేశాడు .అసంగుడు మహాయానానికి భాష్యం గా తంత్ర సిద్ధాంతాన్ని చొప్పించాడు .దీనితో మహాయానం లో అనేక మార్గాలు ఎర్పడాయి .అసంగునికి ఆధారం ఒకటి ,రెండు శతాబ్దాలకు చెందిన మంజుశ్రీ రాసిన ”మూల కల్పం ”అంటారు .తంత్రాలు పైకి కనిపించేవి .గూదార్ధం తో వున్నవి అని రెండు రకాలు .కనిపించని అర్ధం కలదే యదార్ధం అంటారు .ఇది ”సంధ్య ”భాష లో వుంటుంది .అంటే జ్ఞానంతో ఆలోచిస్తే జ్ఞానం ,అజ్న్నానం తో ఆలోచిస్తే అవినీతి అందులో కని పిస్తాయి  .
                                        సశేషం
                                          మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —02 -11 -11 .
Posted in రచనలు | Leave a comment

విరమణ కాదు విద్రోహమే

02_11_2011_004

Posted in సేకరణలు | Leave a comment

బౌద్ధం లో వచ్చిన పరిణామాలు —-1

       బౌద్ధం లో వచ్చిన పరిణామాలు —-1
                        ఏ  మతమైనా ,సమాజం లో వచ్చిన మార్పులకు ,వత్తిళ్ళకు ,ఇతర మతాల ప్రభావాలకు , ,అవసరాలకు మార్పు పొందుతూనే వుంటుంది .ఈ మార్పులు ఆ మతానికి కొన్ని సార్లు లాభదాయకం గా ,కొన్ని సార్లు కష్టం  కలిగించేవిగా వుంటాయి .లాభం వుంటే మతం పుంజుకుంటుంది .నష్టం కలిగితే కుంగి పోతుంది ఒక్కో సారి స్వార్ధ శక్తుల ప్రభావం వల్లచీలికలు ,పేలికలు అయి అసలు స్వరూపమే మారి పోతుంది  .దీనికి ఏ మతము అతీతం కాదు .బౌద్ధం కూడ ఎంతో ఆదర్శ ప్రాయంగా వచ్చింది కాలక్రమం లో అనేక మార్పులు పొందింది .చివరికి గుర్తు పట్టటానికి వీలు లేని రూపం గా మారింది .ఆ పరిణామాలను పరా మర్శించ టమే  ఈ వ్యాసం ధ్యేయం .
                                                 ఆదర్శ బౌద్ధం
                       ప్రాణులను చంపరాదని ,అన్ని జీవాలపై జాలి చూపించటం ముఖ్యమని బోధిసత్వుడైన బుద్ధుడు బోధించాడు .ధనం కోసం వంచన వద్దన్నాడు ,.పరస్పర ప్రేమ ఇచ్చి పుచ్చుకోవటం తో వృద్ధి చెందుతుంది .కూట సాక్ష్యం,నిందా ,అసత్యాలను దగ్గరకు చేర నీయ రాదు .సత్వ సంశుద్ధికి సత్యమే సరైన భాష .మోహ పరవశత్వం లో పరభార్యలను చేరితే శీలమే కాదు ,ధర్మ త్చ్యుతి కలిగి సమాజ వినాశన హేతువు అవుతుందని బుద్ధ భగ వానుని వాణి .బుద్ధుని విధానం వైరాగ్యం కాదు .ఆయన యోగ విధానానికి ఆధారం కరుణ .లోకం పట్ల జాలి కరుణ ,అనుకంప ఆయన్ను ఒక మహా శక్తి సంపన్నుని గా చేశాయి .అందుకే సంసారాన్ని త్యజించి ,జ్ఞాన సాధనకుఅడవులు   పట్టాడు .విశ్వ వ్యాపితమైన జాలితోనే బంధువు లందర్నీ వదులు కున్నాడు .మనశ్శాంతి కోసం తపస్సు చేశాడు .చివరకు నిర్వాణం పొందాడు .ఆ నిర్వాణం ఒట్టి కాంతి మాత్రమే కాదు .అది కరుణ రస సాక్షాత్కారం .మనిషి మనుగడ అర్ధవంతం కావ టానికి గౌతముడు ”పంచ శీల ”ను బోధించాడు .దాన్ని సమష్టి పరం చేయ గలిగితే లోక కళ్యాణమే .అసుర స్వభావం అయిన విరోధాన్ని పూర్తిగా వద లాలి .మానవ స్వభావ మైన స్నేహాన్ని సాధించాలి .భగవద్గీతలో భగవానుడు కృష్ణుడు చెప్పిందీ ఇదే కదా .సర్వభూతాల మీద ఎవరికి వైరం ఉండడో ,వారే తనను t పొందుతారు అని చెప్పాడు అదే గీతా సారం .కృష్ణుని సర్వ భూత ప్రేమ ,గౌతముని అహింస అన్ని కాలాలకు శ్రేయో దాయకమే .సంక్షుభిత స్థితి లో సమాజం వునప్పుడు   వీటికి ప్రత్యెక అవసరం వుంటుంది .
                                             ” అర్హతునికి ”అర్హతలు
               బౌద్ధ మతం లో సాధకులు” అర్హతులు ”అవుతారు .అన్నిటి లోను వున్న ”అతి ”ని విసర్జించి ,మధ్యమ మార్గం గా నడిస్తే నే అర్హతుడవు తాడు .దీనికి బుద్ధుడే ఆదర్శం .బుద్ధుడు జితేంద్రియుడు,గొప్ప ఆధ్యాత్మిక అనుభవం వున్న వాడు .ఆయనకు మంచి శరీర సౌష్టవం వుంది .అధిక క్రియా,శక్తి సంపన్నత కూడా వుంది .మంచి భోజనం చేసే వాడు .మంచి దుస్తులూ ధరించే వాడు .మధ్యమ మార్గం లో నడ వాలంటే ”అష్టాంగ సాధన ”చేయాలి .మానవుల్ని బంధించే దశ బంధాల నుంచి విముక్తి చెందాలి .అంటే వాటిని చేదించు కోవాలి .”నేను ”అన్న భ్రాంతి అందులో మొదటిది .సందేహం రెండోది .బాహ్యం గా చేసే మంచికర్మలె ప్రయోజనం అనే భావం ,విషయ వాంచ ,దుస్చింత ,ఐహిక సుఖం పై మమకారం ,ఈ శరీరం వదిలి స్వర్గసుఖాలు అనుభవించాలన్న ఆరాటం ,స్వాతిశయం ,దురహంకారం ,అవిద్యఅనే వాటినన్నిటినీ వదులు కోవాలి .అప్పుడే మార్గం తేలిక అవుతుంది .అష్టాంగ విధానాలతో సాధన చేశ్తే గమ్యం చేర గలరు .అవి సమ్యక్ దృక్పధం ,సమ్యక్ ఆశయం ,సమ్యక్ భాషణం ,సమ్యక్ప్రవర్తన    ,సమ్యక్ జీవనం ,సమ్యక్ కృషి ,సమ్యక్ భావం ,సమ్యక్ అను భూతి ఇవే అష్టాంగాలు .ఇంతకు ముందు చెప్పిన పది బంధనాలలో మొదటి మూడింటినీ వదిలేస్తే ,అతని లో గొప్ప శక్తి ఏర్పడి ,”అర్హతుడు ”ఆవ టానికి దారి సుగమం అవుతుంది .సత్వ గుణం తో ,తామసిక ,రాజ సిక  ,గుణాలను జయించి ముందుకు అడుగు వేయాలి .అప్పుడు ఏర్పడే ప్రత్యెక వ్యక్తిత్వాన్ని ప్రశాంతత లో లీనం చేసి,నిర్వాణం పొందటమే ఈ సాధన పరమార్ధం .
               ఆధునిక భారత దేశం లో అహింసా మార్గం లో ,సత్య భాషణం లో జీవితాన్ని పునీతం చేసుకున్న జాతి పిత మహాత్మా గాంధి గారు బుద్ధుని జీవితాన్ని బాగా అధ్యయనం చేశారు .”బుద్ధుడు నాస్తికుడు కాదని నేను చెప్పటానికి సాహశిస్తున్నాను .తోటి వారి కోసం హృదయం గాయ పడక పోతే ,హృదయం లోంచి రక్తం ధారాళంగా ప్రవహించక పోతే ,అతనిని బుద్ధ భగ వానుడు తన వాడి గా గుర్తించడు .గర్వం లేని ప్రజలు నమ్రత తో ,దేవుని చేరు తారు .ఇదే బౌద్ధ మతం ముఖ్య ధర్మం అని నా అభిప్రాయం”ఆన్నారు గాంధిజీ .శ్రీ అరవింద మహర్షి కూడా ”కర్మ బంధనం నుంచి,వ్యక్తిత్వం నుంచి దుఖం నుంచి ,విముక్తి చెందటమే బుద్ధుని లక్ష్యం .అప్పుడే నిత్యమూ ,సత్యము అయిన స్థితి పొంది బంధ విమోచనం కలుగు తుంది ”అన్నారు .వ్యక్తిత్వాన్ని దాటి ,అంతరంగం లో ప్రశాంత స్థితిని అనుభ విస్తు ,శాశ్వతమైన సత్యం ,ధర్మం ,ప్రేమ లకు సంబంధించిన కర్మల్ని బాహ్యం గా చేయటమే  బుద్ధుని సందేశం అని శ్రీ అరవిందుల భావం .దీనినే కవి ,సిని రచయిత ,నాటక రచయిత పింగళి నాగేంద్ర రావు ”కామాగ్ని జరిగేటి కామ దహనమురా –ఆనంద భోగమే అపరామ్రుతమురా —భువన భువనాలకు బుద్ధ గతి ఇదిరా ”అని చక్క గా వివరించారు .కక్షలు ,కార్పణ్యాలు అనంత మైన బాధకే దారి తీస్తాయి అందుకని మైత్రీ దీపమే రక్ష .అందుకే దీన్ని ఆవిష్కరిస్తూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు బుద్ధుని హృదయ రాణి ”యశోధరా ”హృదయాన్ని గొప్పగా ఆవిష్కరించారు  కమ్మని పద్యంలో .
                ”లోకాలు వెలిగించురాకాసుదాకరు –నింటిలో బంధింప జేయుటేట్లు !
                 జగతికిఅత్యుజ్వల   ప్రగతి జూపెడి ధ్రువ –జ్యోతి ని దాచుకో చూచు తేటలు !
                 విశ్వ జనీనమౌ నైశ్వర్యమును మేడ –గోడలలో నిల్పు కొనుట యెట్లు !
                 సర్వం కషంబైన  జ్ఞాన వారాసిని –పైట కొంగున మాటు పరుచుటేట్లు !
                 భ్హువన బంధుని మణిమయ భవన మందు –పవలు రాత్రులు నిర్బంధ పరచుటేట్లు !
                 ప్రేమ మయు నిన్ను నా బాహు సీమల –పట్టు కోని చుట్టు కొని నిల బెట్టు టెట్లు !”
                                      అని ఆ కరుణా మయుని విశ్వవ్యాప్తిత్వాన్ని ,ఆ ప్రేమ మూర్తి అనంతత్వాన్నిచక్కగా  అర్ధం చేసుకోంది యశోధర .తన పేరు సార్ధకం చేసు కోని తన యశస్సు ధరామండలం అంతా వ్యాపింప జేసి ధన్యురాలైంది .
                                              సశేషం
                                   మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —-02 -11 -౧౧.

Posted in రచనలు | Leave a comment

అన్నిటి కంటే ఆవల —–2

 అన్నిటి కంటే ఆవల —–2
                         హాప్కిన్ అనే శాస్త్రజ్ఞుడు హైపెర్ డైమెన్షనల్ వస్తువులు తయారు చేశాడు .హెచ్.జి .వేల్స్ కాలము ,స్పేస్ రెండు ఒకే ఎంటిటి (సత్వం ) యొక్క భాగమే అని  అభిప్రాయ పడ్డాడు .కాలమ్ లో ప్రయాణం (స్పేస్ ట్రావెల్)సాధ్యమే నన్నాడు .ఆయన కాలాన్ని నాలుగో డైమెన్షన్ గా గుర్తించాడు .
                         1905 లో ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ చాలా ఆశ్చర్య కర మైన విషయాలు కని పెట్టాడు .ఆయన జీవితం లో ఈ సంవత్చరానికి చాలా ప్రాముఖ్యత వుంది .కదిలే  వస్తువుల్లోని ఎలెక్ట్రో డైనమిక్స్ ,సాపేక్ష సిద్ధాంతం ,వస్తువులలోని జడత్వం ,అందు లోని శక్తి పై ఆధార పడి ఉంటుందా ?అనే విషయాలపై విష్ట్రుతం గా పరిశోధనా వ్యాసాలు రాశాడు .దీని తోనే E=mc2 అనే సూత్రాన్ని ప్రతి పాదించాడు .మాలిక్యూల్స్  సైజ్ ను లెక్క కట్టటం ,బ్రౌనియన్ మోషన్ గాపిలువ బడే  మాలిక్యులర్ మోషన్ ,ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ అయిన అటామిక్ బిహేవియర్ ల పై విస్తృతం గా రాశాడు .దీనికే 1921 లో నోబెల్ బహుమతి వచ్చింది.సాపేక్ష సిద్ధాంతానికి రా లేదు .
           హిల్బర్ట్ మిన్ కోవస్కి అనే శాస్త్ర వేత్త ఫోర్త్ డైమెన్షన్ పై చాలా ప్రయోగాలు చేశాడు .ఫోర్త్ డైమెన్షన్ ఆలోచన సరైనదే అన్నాడు .మూడు డైమెన్షన్ ల భావం ఒక మిధ్య అన్నాడు .అయితే ఆ తర్వాత త్రీ డైమెన్షన్ భాష లోనే ప్రపంచాన్ని అర్ధం చేసుకో గలం అని అన్నాడు .పాయిన్కేర్ అనే శాస్త్రజ్ఞుడు టైం ,స్పేస్ విడి సత్తాలు అన్నాడు .మిన్కోస్కి మాత్రం టైం ,స్పేస్ అనేవి ఒకే వస్తువు యొక్క వేర్వేరు అవస్థలు అని ముగించాడు .ఇతని అభిప్రాయం లో సాపేక్షత అంటే స్పేస్ -టైం మాని ఫోల్డ్ .దీనికే కంటిన్యుం అని పేరు పెట్టారు .అంటే అన్ని కాలాల్లో ను ఆవిష్కరిమ్పబడే వస్తువులు .ఇది వరకు జరిగినవి ,తర్వాత జరుగ బోయేవి అన్నీ శాశ్వతత్వం లోనివే . ఐన్స్టీన్ గొప్ప మేధావే కాని బద్ధకిస్టు అన్నాడు గురువు మిన్కోవిస్కి .అయితే గురువు చెప్పే పాఠాలు శిష్యుడైన ఐన్స్టీన్ కు బోరుగా ఉండేవి .అందుకని వినే వాడు కాదు .గురువు గారి సిద్ధాంతం నచ్చేది కాదు .ఫోర్త్ డైమెన్షన్ ఆలోచన గందర గోళానికి దారి తీస్తుందనే వాడు ఐన్స్టీన్ .అదంతా ,మిడి మిడి జ్ఞానం అని తేలిగ్గా కొట్టి పారేశాడు .1910  ,వచ్చేసరికి శిష్యుడి అభిప్రాయమే సరైనది అని తన అభిప్రాయం తప్పేనని గురువు ప్రకటించాడు .ప్రపంచ సంఘటనలు4D కంటిన్యుం  ను ఎర్పరుస్తాయన్నాడు .స్పేస్ కోసం క్యూబిజం ,టైం కోసం ఫ్యూచరిజం చిత్ర రచన లో తోడ్పడి నట్లే కని పిస్తుంది .క్యూబిజం ,ఫ్యూచరిజం వంటి అనేక శైలులు ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి జవాబులే .
                     స్టీన్ వీన్ బెర్గ్ ,అనే ఆయన texaas (అమెరికా )నుంచి వచ్చి డైమెన్షన్ల ఉత్చాహం తో మరింత కంగారు పెట్టాడు పార్టికల్  తీరిస్ట్ అయిన హోవార్డ్ జార్జ్” మూడు కంటే ఎక్కువ గా భావించే దైమేన్షన్లు ఒక బంతిలో చుట్టుకు పోయాయి .అవి మనపై ప్రభావం చూపని శూక్ష్మాతి శూక్ష్మ మైనవి ”అని తేల్చాడు .దీనిపై టోల్కీన్ రాసిన కవిత కు పేరడీ కవిత వచ్చింది .”ఒకే సిద్ధాంతం వాళ్ళందర్నీ పాలిస్తోంది .వాళ్ళు కనుక్కోవటానికి ఒకటే సిద్ధాంతం .ఒకే సిద్ధాంతం వాళ్ళందర్నీ kvaantaiz  చేస్తోంది .చీకట్లో వాళ్ళను బంధిస్తోంది అదీ బ్రౌన్ ప్రదేశం లో –నీడలు నర్తించే చోట ”.
   .               అధిక దైమేన్శాన్లు వున్నాయి అనే సిద్ధాంతం ఒక విప్లవాత్మక భావమే .ఒక వేళ ఆ దైమేన్షన్లు నిజం గా వుంటే ,ఇప్పుడు కని పిస్తున్న విశ్వం ఒక చిన్న తునక మాత్రమే .మిగిలింది అంతా అజ్ఞాత ,ప్రచ్చన్న దేశమే ”అన్నాడు భౌతిక శాస్త్ర వేత్త జోసెఫ్ లైకేన్ .
               పోతన గారు భాగవతం లో ”లోకంబులు .లోకేశులు —–అనే పద్యం లో పెంజీకటికి ఆవల ”అని ఏదో పరమాద్భుత మైనది వుంది అని చెప్పిన సంగతి గుర్తుంది కదా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —-01 -11 -11 –
Posted in రచనలు | Leave a comment

అన్నిటి కంటే ఆవల —1

అన్నిటి కంటే ఆవల   —1
                           అయిదు పరిమాణాల (dimention )విశ్వం ఒక ఊహ .1927 లో ”కలూజ ”అనే శాస్త్రజ్ఞుడు ప్రకృతి లోని అన్నిటిని ఏకీ కృతం చేసి నట్లు కనుగొన్నట్లు నమ్మాడు .1924  లో ఆస్కార్ క్లీన్ అదే భావాన్ని ,సిద్దాన్తీక రించాడు .అందువల్ల అధిక పరిమాణాల (higher dimentional )శక్తుల ఏకీకరణ సిద్ధాంతాన్ని ”కలూజ -క్లెన్ ” సిద్ధాంతం అన్నారు .చివరికి అందరు కలిసి అయిదవ పరిమాణం అక్కర లేదని తేల్చారు .
                    పొడవు ,వెడల్పు ,ఎత్తు అనేవి అనాదిగా వస్తున్న మూడు పరిమాణాలు .”కాలమ్ ”కూడా నాల్గవ పరిమాణం లోకి చాలా కాలమ్ కిందటే వచ్చింది .దీన్ని హెచ్ .జి .వేల్స్ కూడా తన ”టైం మెషిన్ ”గ్రంధం లో పేర్కొన్నాడు .ఈ విషయాలపై ,ఇమ్మానుఎల్ కాంట్ మొత్త మొదటి సారిగా దృష్టి సారించాడు .ఆయన 1747 లో thoughts on the true estimation of living force  అనే  గ్రంధం  లో   ప్రపంచం ను  మూడు పరిమాణాల ఆధారం గా ఎలా అర్ధం చేసుకో వచ్చో తెలియ జేశాడు .వస్తువులు ఒక దానిపై ఒకటి గురుత్వాకర్షణ వల్ల పని చేస్తాయి అని చెప్పాడు .  అవి పరస్పరం వున్న దూరాల వర్గాల విలోమాను పాఠం లో మారుతాయి అని కూడా తెలిపాడు (vary ).ఈ సూత్రం ప్రకారం అంతరిక్షం (స్పేస్ )మూడు పరి మాణాలకు బద్ధమై వుంటుంది .
                  అయితే వీటికి విరుద్ధం గా వున్న సూత్రాలు ఇతరమైన పరిమాణాలు వున్న వేరే అంత రిక్షా ప్రదేశాలు వుండే అవకాశాలు వున్నాయని చెప్పాడు మేధావి కాంట్.దేవుడు దేనినైనా సృష్టించ గలడు ,కనుక అలాంటి ప్రపంచాలు ఉండటానికి అవకాశం వుంది అన్నాడు .అవి మన ప్రపంచానికి సంబంధం లేకుండా ,విడి పోయి ఉండ వచ్చు .వాటిని కలిపే ఏ అవకాశమూ లేకుండా పోయి ఉండవచ్చు .నని అభిప్రాయ పడ్డాడు .భగవంతుడు విశ్వాన్ని త్రీ దిమెన్తిఒనల్ సత్వం గానే సృష్టించాడు తప్ప ,ఎన్నో దిమెన్తిఒన్ ల ప్రపంచం గా సృష్టించి గందర గోల పరిచిఉ ఉండదని నమ్మాడు కాంట్.
                    1777 లో జర్మించిన Carl Freidrich Gauss కు  మూడు  ఏళ్ళ  కే  అద్భుత  గణిత  మేదావిత్వం  కన్పించింది  .(power of computation ).ఒక సారి అతని తండ్రి ఉద్యోగస్తుల జీతాల పట్టిక ను కూడుతూ వుంటే (total )”సరిగ్గా ఇంత వుండాలి చూడండి ”అన్నాట్ట .తండ్రి కూడి అంతే వచ్చినందుకు ఆశ్చర్య పడ్డాడట.సరిగ్గా మాటలే రాని వయసు లో ,అతని కి గణితం స్వంత మై పోవటం అబ్బుర పరిచే విషయం .ఆయన కళల్లో భగవద్దట్ట మేధావి తనం కన్పించేది .స్కూల్ కు వెళ్లి నపుడు అతని లెక్కల మేష్టారు ఇతని ప్రతిభను చూసి అమితాస్చర్య పడ్డాడట .మనసు లో ఒకటి నుంచి ,వంద వరకు వున్న అంకెలని కూడి ఎంతో చెప్పాడట .లెక్కల పుస్తకం మొదలు పెట్టక ముందే దాని లో ఏముందో అవపోసన పట్టాదట .12 ఏళ్ళకే యూక్లిడ్ జామెట్రీ కి సవరణలు (alternatives )ప్రతి పాదిన్చాదట (వికల్పాలు )అతని అంకుల్ కి వున్న విమర్శనా జ్ఞానం ఇతని పై బాగా పనిచేసిందట .14  ఏళ్ళ వయసు లో గణిత శాస్త్రజ్ఞుడు ”జోహాన్ బార్తీస్ ”గాస్ కున్న మేధావి తనాన్ని చూసి అబ్బుర పది గణిత మేదావులైన Nichelm Ferdinand ,Duke of Brunswick లకు పరిచయం చేశాడు .గాస్ కున్న నమ్రతను గుర్తించి ,చదువుకు సాయం చేశాడు .Gotten gin University  లో 18  ఏళ్ళ వయసు లో చేరాడు .అక్కడ Wolfang Bolzai తో పరిచయం కలిగింది .గాస్ తల్లి ఆయన దగ్గరకు వెళ్లి ఒక సారి తన కొడుకు చదువు ఎలా సాగుతోంది అని అడిగింది .దానికి ఆయన The only greatest mathematician in Europe ”అని ఆనందం గా మెచ్చుతూ చెప్పాడట .అంటే ఐరోపా ఖండం లో వున్న ఏకైక గణిత శాస్త్రజ్ఞుడు,మేధావి  గాస్ అని అర్ధం .1806 లో డాక్టరేట్ అయాడు .నెపోలియన్ కు ఎదురు నిల్చి ,దేశం కోసం పోరాడాడు .తర్వాత gottengin  లో ప్రొఫెసర్ అయాడు గాస్.non Euclidian Geometry పై పరిశోదాహన చేశాడు .దీని పై bolzai  కొడుకు జానోస్ ,nicholas lobacheshky
 కూడా పరిశోధన చేశారు .1854 లో హైపెర్ స్పేస్  ఆవిషకరణ జరిగింది .
                       హెన్రి స్లాదేస్ అనే శాస్త్రజ్ఞుడు పొడవు ,వెడల్పు ,ఎత్తు లను దాటి వేరే dimention లో వస్తువులు కదలటం జరుగుతుందని భావించాడు .జోల్నార్ శాస్త్ర వేత్త higher dimention లు వున్నాయని చెప్పాడు .రహస్య జ్ఞాన వేత్తలు (occultists ) నాలుగో dimention ఉందన్నాడు .థియోసాఫికల్ సొసైటీ స్థాపకు రాలు madam  blavaatski  1875  లో higher dimentions విషయం పై వున్న మార్మిక విషయాలను తెలియ జేశారు .వీళ్ళందరికీ కాబాలిస్తిక్ గ్రంధాలు ,వెద ,ఉపనిషత్తులు ,గ్రీకు కు చెందిన సర్వోత్క్రుష్ట రచనలు ఆధారం .మేడం గారి విధానం లో వస్తువులు ఒక దాని లోనుంచి ఇంకొక దాని లోకి ప్రవేశిస్తాయి .ఈ విషయాన్నే slade కూడా  చెప్పాడు .దీనితో ఇరువైపులా ప్రధాన ధర్మాలలో మార్పులు సంభ విస్తాయి .ఆమె రాసిన The secret Doctrine లో ఫోర్త్ డైమెన్షన్ అయిన స్పెసియాల్   డైమెన్షన్ ను ఖండించింది .పదార్ధం పై ఆరో ధర్మాన్ని గురించివివ రించింది .డైమేన్స్హళ్ అనేది ఒక స్థాయి లోని ఆలోచన ,ఒక పరిణామం లో ని వి  భాగం,పదార్ధం లోని ఒక గుణం .లేద బీటర్ శాస్త్ర వేత్త astral plane  గురించి చెప్పాడు .1882 లో The society of physical research ” అనేది ఏర్పడింది .వీరంతా ,para normal experiences (బుద్ధి ఉన్మాదం )పొందిన వాళ్ళే .జోల్నార్ చెప్పిన దాన్ని సమర్ధించారు .ఈ ముఠాను oscaar wild   ఎద్దేవా చేస్తూ ”ది కాంటర్ విల్లె ఘోస్ట్ ”అన్నాడు ”.అంటే దయ్యం ఒక గది లోంచి నాల్గవ పరిమాణం ద్వారా పారి పోయినట్టుంది ”.అని లైట్ తీసుకున్నాడు .
                                              తరువాయి భాగం మరోసారి
                                                                                           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

శ్రీ సదశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం ——9

శ్రీ సదశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం ——9
బ్రహ్మా నందం
శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో ఇప్పటి వరకు ”రామ రసం ”,”కృష్ణా మృతం ”ఆత్మ బోధ ”శీర్షికల లో వున్న కీర్తన లను గురించి తెలుసు కున్నాం .ఇప్పుడు ”బ్రహ్మా నందం ”లోకి చేరి అందులోని కీర్తన వైభవాలను అర్ధం చేసు కుందాం.
పల్లవి —–             —నహిరే నహి శంకా చిత్ –నహిరే నహి శంకా ||
చరణాలు ———-01 –అజమక్షర మద్వైత మనంతం –ధ్యాయంతి బ్రహ్మ వరం శాంతం ||
02 —ఏ త్యజ్ఞాతి బహుకర పరితాపం –ఏ భజన్తి సత్చిత్చుఖ రూపం ||
03 —పరమ హంస గురు భనితం గీతం —ఏ పథంతి నిగమార్ధ సమేతం ||
భావం ——–”ఎవరు అనేక లౌకిక దుఖాలను వాది లేస్తారో ,సచ్చిదానంద రూపానీ సేవిద్తారో ,పరమ హంస గురువు లైన వారిచే స్తోత్రం చేయబడిన గీతాలను ,వేదార్దాల సాయం తో అధ్యయనం చేస్తారో ,వారంతా ,ఆది అంతం లేని ఏకమైన ,పరమ శాంత స్వరూపమైన బ్రహ్మాన్నే ధ్యానిస్తారు ,ఇందులో అనుమానం లేదు ,శంక కూడా లేదు ”
విశేషాలు —–స్థూల సూక్ష్మ శరీరాలను సాధన ద్వారా స్వాదీనక్మ్ చేసు కోవాలి .వాటి దుఖాలను వదిలి నప్పుడు ,వాటి లోని సత ,చిత్ ,సుఖం స్పష్టమవుతై .ఆ సుఖం పరమాత్మ స్వ రూపమే కాని వేరే కాదు .పరితాపాలు అనేవి శరీరం నుంచి ,మనసు నుంచి ,బయటికి తొంగి చూసి పొందేవి .ఇవి స్వతహాగా జీవుడికి వుండవు .మనసు వాటిని వదిలేస్తే ,మనసు అనేదే వుండదు .మనసుకు ఆధార మైన పరమ శాంతమైన బ్రహ్మమే దర్శనం అవుతుంది .మోక్షానికి కారణమైన ప్రతిదీ గురు కృప వల్లనే సాధ్యం .ఆ గురువు పరమ గురువు అయి వుండాలి .పరమ హంస లా వుండాలి .అప్పుడే తరుణోపాయం లభిస్తుంది .తాను పరమ హంస కనుక అందరు ,పరమ హంస స్థితి ని పొందాలని ప్రతి కీర్తన లోను ఎరుక గా తెలిపారు పరమ హంస అయిన సదాశివ బ్రహ్మేంద్ర యతీశ్వరులు .
రెండవ కీర్తన ——–
o2 —–పల్లవి —–ఖేలతి పిండాందే భగవాన్ –ఖేలతి పిండా న్డే ||
చరణాలు —01 —-హంసః సోహం హంస సోహం –హంస సోహం సోహమితి –పరమాత్మాహం పరిపూర్నోహం —బ్రహ్మివాహం బ్రహ్మేతి ||
02 –త్వక్చాక్షు శృతి జిహ్వ ఘ్రానే –పంచ విధ ప్రానోప స్థానే –శబ్ద స్పర్శ రసాదిక మాత్రే —సాత్విక రాజస తామస మిశ్రే ||
03 –బుద్ధి మనస్చిట్టా హన్కారే –భూజస తేజో గగన సమీరే –పరమ హంస రూపేన విహార్తా –బ్రహ్మ విష్ణు రుద్రాది క కర్తా ||
భావం ——–”శరీరం లోనే భగవంతుడు ఆడుతున్నాడు .హంసను నేనే .నేనే హంసను .పరమాత్మను .పరిపూర్ణ బ్రహ్మం నేనే .పంచేంద్రియ గోళాలలో ,పంచ ప్రాణ స్థానాలలో ,శబ్ద ,స్పర్శ తన్మాత్రలలో ,త్రిగుణాల కలయిక లో ,శరీరం లో క్రీడా ఖేలనం చేస్తున్నారు పరమాత్మ.నాలుగు అంతః కరనలలో ,పంచ భూతాలలో ,పరమ హంస లా విహరిస్తూ ,త్రిమూర్తుల సృష్టి కర్త గా శరీరం లో ఆడి ,పాడి ,రమిస్తున్నాడు ”
విశేషం —ప్రపంచం అనేది దేశ ,కాలాలో కదుల్తుంది .ఇది పరమాత్మ పరిపాలన వల్లనే సాధ్యం .ప్రపంచాన్ని చూసే పరికరాలు అన్నీ ఆయన స్వరూపాలే .వేరు కాదు .సృష్టి ,స్థితి ,లయలుజీవుని అనుభవాలే .వాటిని అనుభవానికి తెచ్చేదీ పరమాత్మ ఏ .
మూడవ కీర్తన లోకి చేరు కుందాం
03 —పల్లవి —-ఆనంద పూర్ణ బోదోహం—సతత మానంద పూర్ణ బోదోహం ||
చరణాలు —-01 —ప్రత్యగద్వైత సారోహం –సకల శ్రుత్యంత తలత్ర విదితోహం,అమ్రుతోహం ||
మత్యనంతర భావితోహం –విదిత నిత్య నిష్కల రూప నిర్గుణ పదోహం ||
02 —సాక్షి చిన్మాత్ర గాత్రోహం -పరమ మోక్ష సామ్రాజ్యాదిపోహం
పక్ష పాతాతి దూరోహం -అనవధిక సుఖ సాగరోహం ||
03 —స్వప్రకాశైక సారోహం –సదహమప్రపంచాత్మ భావోహం అభయోహం
చిదహమప్రమెయాఅఖ్య మూర్తి రేవాహం |\
భావం ——ఈ కీర్తన కూడా ఆత్మాను భూతి పొందిన ఒక సిద్ధ పురుషుని ఆనంద మయ ,చిన్మయ ,చిద్రూప అద్భుత వర్ణన .ప్రాపంచిక కొలతలకు పరిమానాలకు అందని ఉన్నతోన్నత ,ఉత్తమోత్తమ స్థితి అది .వేదం చదవక్కర లేదు .ఉపనిషత్తులు అధ్యనం చెయ్యక్కర లేదు ,శాస్త్రాల సారం పిండ నక్కర లేదు .ఈ కీర్తన చదివినా ,విన్నా ,అర్ధం చేసు కున్నా అంతా బ్రహ్మ జ్ఞానమే .హాయిగా సంగీతం తో మేళవించి ,అన్నీ రంగరించి అందించిన రస గుళిక .
నాక్ల్గవ కీర్తన లోకి చేరుకుందాం
04 —పల్లవి —-ఆనంద పూర్ణ బోదోహం –సచ్చిదానంద పూర్ణ బోదోహం ||
చరణాలు —-01 –సర్వాత్మ చరోహం –పరి నిర్వాన నిర్గుణ నిఖిలాత్మ కోహం —
గీర్వాణ వర్యానతోహం –కామ గర్వ నిర్వాపణ ధీరతోహం ||
02 –సత్య స్వరూప పరోహం –వర శ్రుత్యంత బోధిత సుఖ సాగరోహం
ప్రత్యగాభిన్న పరోహం –శుద్ధ మంతు రహిత మాయా తీతోహం |\
03 –అవబోధ రస సాగరోహం –వ్యోమ పవనాది పంచాభూతాతి దూరోహం
కవి వర సంసేవ్యోహం -ఘోర భవ సింధు తారక పరమసూక్ష్మొహం ||
04 –బాధిత గుణ కలనోహం –బుద్ధ శోదిత సమరస పరమాత్మాహం
సాధన జాతాతీతోహం –నిరుపాధిక నిస్శీమ భూమానందోహం ||
05 –నిరవయవోహం అజోహం –నిరుపమ మహిమని నిహిత మహితోహం
నిరవధి సత్త్వఘనోహం –ధీర పరమ శివేంద్ర శ్రీ గురు బోధి తోహం ||
భావం —–నేను ఎవర్ని ?అన్న దానికి సమాధానమే ఈ కీర్తన .”సచ్చిదానంద పూర్ణ చైతన్యాన్ని నేను .అందరి లోని ఆత్మ మూర్తిని నేను .మోక్ష స్వరూపుడైన నిర్గునున్ని .దేవతలు నన్ను అర్చిస్తారు .కామ గర్వాప హారిని .సత్య సుఖ స్వరూపుడిని .శాస్త్రాల చేత బోధింప బడిన వాడిని .భేదాలు లేని ప్రత్యక రూప మాయా తీతున్ని .జ్ఞానంద స్వరూపున్ని .పంచ భూతాలకు అతీతున్ని .రుషి గణ పూజితున్ని .ఘోర భవ సముద్రాన్ని దాటించే పరమాత్మను .గుణ క్రీడా లో ప్రబోధం చేత శుద్ధీ చేయబడిన సమ రస పరమాత్మను .సాధనాతీత మైన ,ఉపాధి పరిధికి అతీత మైన పరమానందాన్ని నేను .అవయవ రహితున్ని .పుట్టుక లేని వాడిని .నిరుపమ మహిమ లో నిలిచి న గొప్పదనాన్ని నేనే .నిరవధిక శుద్ధ సత్యాన్ని .శ్రీ గురు పరమ శివేంద్ర స్వామి చేత బోధితున్ని అయిన వాడిని నేనే ”
వేదాలలోనిరుక్కులు చదువుతున్న    అనుభూతి లభిస్తుంది ఈ కీర్తనలో అంతా బ్రహ్మ మయమే .నేనే బ్రహ్మని”అహమాత్మా పరబ్రహ్మ ”సోహం ”బ్రహ్మ ఇవాహం ”అనే మహా వాక్య రహస్యాలన్నీ గుది గుచ్చి ,హాయిగా పాడుకుంటూ మనసారా అనుభవిస్తూ,ఆనంద పారవశ్యం కలిగించే రచన బ్రహ్మేన్ద్రులది .మాటల లో వర్ణించటం కష్టం .అనుభవించాలి తరించాలి ఆత్మాను భూతి పొందిన మహాత్ముని అనుభవమే ఈ కీర్తన .ఈ అనుభూతికి కారణమయిన శ్రీ గురువు పరమశివేంద్ర స్వామిని రెండో సారి స్మరించి సంప్రదాయాన్ని అవిచ్చిన్నం గా కాపాడారు శిష్యులైన సదా శివ  బ్రహ్మేన్ద్రులు
ఇప్పటికి ”బ్రహ్మానందం ”పూర్తిగా అనుభవిన్చాము .
బ్రహ్మేన్డ్రుల కీర్తనల లో ఇరవై నాల్గవది ,చివరిది అయిన ది ”గంగా నది పైకీర్తన  .ఆ పవిత్ర నదీమ తల్లి పావన తోయాన్ని తాగి మొక్షానందాన్ని పొందుదాం
24 —పల్లవి —–జయ తుంగ తరంగే గంగే –జయ తుంగ తరంగే ||
చరణాలు —01 –కమల భవాండ కరండ పవిత్రే —బహు విధ బంధచ్చేద లవిత్రే ||
02 –దూరీకృత జన పాప సమూహే –పూరిత కచ్చ స గుచ్చ గ్రాహే ||
03 –పరమ హంస గురు భణిత చరిత్రే –బ్రహ్మ విష్ణు శంకర నుతి పాత్రే ||
భావం ——-”ఉత్తుంగ తరంగ విరాజిత గంగా మాతా !నీకు జయం .బ్రహ్మాండాన్ని పవిత్రం చేస్తూ ,అనేక బంధనాలను విచ్చేదం చేస్తూ ,వుండే నీకు జయమగు గాక .ప్రజల పాపాలను ప్రక్షాళన చేస్తూ ,తాబెళ్ళను (కచ్ఛప ),మొసళ్ళను (గుచ్చ )నిండుగా కలిగిన వో నదీమ తల్లీ నీకు జయం .పరమ హంస పరివ్రాజక గురు పరంపర చేత కీర్తింప బడిన గంగా మాయీ నీకు జయం .త్రిమూర్తుల స్తుతికి పాత్రమైన పవిత్ర గంగా దేవీ !నీకు సర్వదా జయము ”
విశేషం —-భారతీయ సాహిత్యం లో గంగానదికి ప్రత్యెక స్థానం వుంది .ఆ నదీమ తల్లి త్రిపద గామి అంటే స్వర్గ మర్త్య ,పాతాళాలలో ప్రవహిస్తుంది .భూలోకాన్ని పవిత్రం చేయ టానికి దివి నుండి భువికి దిగిన భాగీరధి ఆమె .ఆమె పవిత్ర తీరాలలో నాగరకత విస్తరించింది .భూములను సస్య శ్యామలం చేసి ,బంగారు పంటలు పండించే అమృత జలాలను అందించే నదీ మాత .గంగా స్నానం పవిత్రం .మోక్ష ప్రదం .అంతటి శుద్ధ జలం ప్రపంచం లో లేనే లేదు .ఎన్నో పరీక్షలకు తట్టు కుంది .ఆమె తో సంబంధం లేకుండా రామాయణ ,భరత ,భాగవత కధ లేదు .ఆ పవిత్ర జలం స్వచ్చం ,పవిత్రం ,నిర్మలం .గంగా మాయి లేక పోతే భారతీయ లౌకిక ,ఆధ్యాత్మిక జీవనమే లేదని అందరి భావన .ఆ గంగా మాతను స్తుతిస్తూ అందుకే సదాశివ బ్రహ్మేన్ద్రులు జయ గానాన్ని వినిపించారు .ఆ జయం ఆమెకే కాదు లోకాలన్నిటికీ .ఇదీ ఉదాత్త భారతీయభావన .జయ మంగళం నిత్య శుభ మంగళం .
”   శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం ”అనే ఈ నవరత్నాల వ్యాసపరంపరకు  ప్రేరణ ,పూర్తి ఆధారం ”స్వామిని శారదా ప్రియానంద ”గారు రచించిన గ్రంధం ”సంగీత వేదాంతం ”.ఆ స్వామినికి మనసులో సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ నా కృతజ్ఞతలను తెలుపు కుంటున్నాను .ఇందులోని విషయ వివరణ అంతా శారదా ప్రియానంద స్వామినిదే నని సవినయం గామనవి చేస్తున్నాను .   నన్ను .ఎంతో ప్రభావితం చేసిన రచన ఇది .దీని ని మీకూ అందించాలనే తపన తో ఈ ప్రయత్నం చేశాను .                        సంపూర్ణం
నమస్తే
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —30 -10 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం —8 ఆత్మ బోధ

              శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతా మృతం —8
                                                                       ఆత్మ బోధ
                          శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతామృతాం లో ఆత్మ బోధ లో నాల్గవ కీర్తన గురించి తెలుసు కుందాం
           04 —-పల్లవి —-సర్వం బ్రహ్మమయం   రే రే –సర్వం బ్రహ్మ మయం  ||
                                     చరణాలు —01 –    కిం వచనీయం ,కిమవచనీయం –కిం రచనీయం ,కిమరచనీయం ||
                                                     02 —కిం పథ నీయం కిమ పథనీయం , –కిం భజనీయం ,కిమభజ నీయం ||
                                                      03 —కిం బోద్ధవ్యం ,కిమబోద్ధవ్యం —కిం భోక్తవ్యం ,కిమభోక్తవ్యం   ||
                                                      04 —సర్వత్ర సదా హంస ధ్యానం –కర్తవ్యం–భో ముక్తి నిదానం ||
                   భావం ——” వోరీ  !సర్వము బ్రహ్మమే .ఇందు లో చెప్ప తగినది ,చెప్ప తగనిది ఏమీ లేదు .వ్రాయ తగినది ,వ్రాయ తగనిది లేదు .చదవ తగినది ,చదవ కూడనిది లేదు .సేవింప తగిన్దీ ,సేవింప రానిదీ అంటూ ఏమీ లేదు .నేర్వ వలసిందీ ,నేర్వ రానిదీ లేదు .తిన తగింది ,తిన రానిది అనే భేదమే లేదు .సర్వ వేళల ,సర్వావస్థలలో ,”హంస ”ధ్యానం చేయటమే మన కర్తవ్యం .అదే మోక్షానికి సరైన దారి ”
                     విశేషం —భో అంటే అయ్యా అని అర్ధం .ఈ ప్రపంచం అంతా పరమాత్మ స్వరూపమే అయినపుడు దేనిని స్వీకరించాలి ,దేన్నీ వదిలేయాలి అన్న సమస్యే లేదు .”సర్వం ఖిల్విదం బ్రహ్మ ”
               ఆయిద వ కీర్తనకు దారి తీద్దాం
                o5 –పల్లవి —–బ్రహ్మై వాహం –  కిలసద్గురు కృపయా   —బ్ర్సహ్మైవాహం ||
                                       చరణాలు —-01 —బ్రహ్మై వాహం కిల ,గురు కృపయా–చిన్మయ బోధానంద ఘనం తత్ –శ్రుత్యంతైక నిరూపిత మతులం –సత్య సుఖామ్బుది సమరస మనఘం ||
                                                       02 —కర్మాకర్మ వికర్మ విదూరం –నిర్మల సంవి దఖండ మపారం –నిరవధి సత్తాస్పద పద మజరం –నిరుపమ మహిమనినిహిత మనీహం ||
                                                       03 –ఆశా పాశ వినాశన చతురం –కోశ పంచకాతీత మనంతం –కారణ కారణ మేక మనేకం —-కాలకాల కలి దోష విహీనం ||
                                                       04 –అప్రమేయ పద మఖిలాధారం –నిష్ప్రపంచ నిజ నిష్క్రియ రూపం —స్వప్రకాశ శివ మద్వయ మభయం –నిష్ప్రతర్క్య మన పాయ మకాయం |\
              భావం ——-”సద్గురు కటాక్షం వల్ల నేను సాక్షాత్తు బ్రహ్మమే .గురు కృప చేత చిన్మయ ,జ్ఞానానంద ఘన స్వరూప బ్రహ్మమే నేను .ఉపనిషత్ నిరూపించిండీ ఎకమే అయినదీ ,సాటి లేనిదీ,పాప రహితమైనదీ ,సర్వ వ్యాపక మైనదీ ,సత్య,సుఖసముద్రం అయిన బ్రహ్మను నేనే .సత్కర్మకు ,ఆకర్మకు ,దుష్కర్మలకు దొరమైన ,అఖండ ,అపార ,నిర్మల ,శుద్ధమైన ,బ్రహ్మము నేనే .హద్దులు లేని సత్తా కు ఆధారం నేనే .జరాదూరమై ,నిరూప మానమై ,మహిమాన్వితమై ,కామనా రహిత బ్రహ్మను నేనే .ఆశాపాశాలను చేదించే శక్తి కలిగి ,పంచ కోశాలకు అతీత మైన ,అనంతమైన బ్రహ్మము నేనే ,.కారణాలన్నీ టికి మొదటి కారణమై ,ప్రపంచం లోని అనేకం అంతా తానే అయి ,నల్లని మృత్యు రూప కలి దోష రహిత బ్రహ్మం నేనే .కొలవటాని వీలు లేని పరమై ,సర్వాదారమై ,ప్రపంచం లో క్రియా రహిత పదం అయిన బ్రహ్మం నేనే .స్వయం ప్రకాశమై ,మంగళ ప్రదమై ,అద్వయం ,అభయం అయి ,తర్కానికి అతీత మై ,అపాయం లేని ,శరీర రహిత మైన బ్రహ్మం నేనే కదా .సద్గురు కృప వల్ల నేనే బ్రహ్మం కదా ”.
                        విశేషం —వేదాలలో ఉపనిషత్ లలోని సారం అంతా ఇందులో ఇమిడ్చారు బ్రహ్మేన్ద్రులు .అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ ,విజ్ఞాన మయ ,ఆనందమయ ,అనేవి పంచ కోశాలు .అవి ఒకదాని కంటే ఒకటి వ్యాపన శక్త్హి కలవి .ఆనందమయ కోశానికి అవతల వున్న అనంత వస్తువే బ్రహ్మం .ప్రపంచం లోని ప్రతి వస్తువుకి ,ప్రాణికి ,ఒక కారణం వుంటుంది .కారణానికి వెనుక ఇంకో కారణం వుంటుంది .ఇలా అనంత కారణాలు .ఇన్ని కారణాలకు అసలు కారణం పరమాత్మ .ఆయన ఒక్కడే కారణం .ప్రపంచ వ్యాపిత అంతర్గత పరమాత్మను చూడ గలిగితే ,ఇంద్రియాలు మూగ పోయి ,ఇంద్రియాలకు కనిపించే ప్రపంచం మాయమవుతుంది
             ఆరవ కీర్తన గురించి చర్చిద్దాం
06 —పల్లవి —–పూర్ణ బోదోహం,సదానంద–పూర్ణ బోదోహం ||
               అను పల్లవి —-వర్నాశ్రమాచ్చార కర్మాతి దూరోహం –స్వర్నవదఖిల వికార గతోహం ||
                చరణాలు —01 —ప్రత్యగాత్మాహం ప్రవితత సత్య మనోహం –శ్రుత్యంత శత కోటి ప్రకటిత బ్రహ్మ హం —నిత్యో హమ మభాయోహమద్వితీయోహం ||
   02 –సాక్షీ మాత్రోహం,ప్రగలిత పక్ష పాతోహం —మోక్ష స్వరూపోహమొంకార గంయోహం —సూక్ష్మోహ మనఘోహ మద్భుతాత్మాహాం ||
    03 –స్వప్రకాశోహం విభురహం,నిష్ప్రపంచోహం —అప్రమేయోహమచాలోహమకాలోహం —నిష్ప్రతర్క్యాఖండైక రసోహం .||
     04 –అజ నిర్మమొహం ,బుధ జన భజనీయోహం –అజ రోహామమరోహమమ్రుత స్వరూపోహం —నిజ పూర్ణ మహిమని నిహిత మహితోహం ||      05 –నిరవయవోహం ,నిరుపమ నిష్కలన్కోహం —పరమశివేంద్ర శ్రీ గురు సోమ సముదిత —-నిరవధి నిర్వాణ సుఖ సాగరోహం ||
                     భావం —–ఆత్మానుభావం పొందిన అనుభవ స్థాయి నుంచి ఉద్భవించిన మధు మధుర గీతం,సంగీతముపనిశద్ ఉపదేశం ఈ కీర్తన
                                ”నేను పూర్ణ జ్ఞాన ఆనంద స్వరూపుడిని .వర్ణాశ్రమ ,ఆచార ,కర్మ ధర్మాలకు అతీతుడిని .బాంగారం లాగా అనేక మార్పులు పొందే వాణ్ని .అందరిలో వున్న ఆత్మను ,నామ రూప జగత్తు లో వ్యాపించిన సత్య స్వరూపున్ని .ఉపనిషత్ చెప్పిన పరబ్రహ్మను .నిత్య ,అభయ,అద్వితీయ ,బ్రహ్మను .అన్నిటికి సాక్షీ భూతుడను .పక్ష పాత రహితున్ని .ఓంకారంవల్ల   చేరదగిన వాడిని .సూక్ష్మమై ,పాప రహితమైన అద్భుత ఆత్మను .నేను స్వయం ప్రకాశ కుడిని .అన్ని రూపాలు నేనే .ప్రపంచాతీతుడిని నేను .కొలతలకు అందని వాడిని .సర్వ వ్యాపకుడిని .విభజన ,కదలిక లేని వాడిని .తర్కానికి అతీత మైన ఏక రసాన్ని.జన్మ ,మమకారం లేకుండా ,బుధ జన ఆరాధకుడిని .జనన ,మరణాలు లేని అమృత స్వరూపుడిని .నా మహిమ లోనే నిలిచి వుండే మహా మహితాత్ముడిని .అవయవాలు లేని ,అనుపమాన మైన ,నిష్కలంకున్ని నేను .శ్రీ పరమ శివేంద్ర గురు దేవుల నే ,చంద్రుని ద్వారా ఉదయించిన సుఖ సాగ రాన్ని నేను .”
            విశేషం —-ఇది ఆత్మను దర్శించే సందర్భం .అంటే ఆత్మ ఆవిష్కారం .ఈ సమయం లోనూ ,తన గురు పాదులు శ్రీ పరమ శివెంద్రులను సస్మరించారు . సదాశివ బ్రహ్మేన్ద్రులు .గురు కటాక్షం సంపూర్ణం గా పొందిన వారు కనుక ,గురు స్మరణే ముక్తి దాయకం గా భావించారు .రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు .గురువు చంద్రుడు అయితే గురువు నుండి ఆత్మ జ్ఞానం పొందిన శిష్యుడు చంద్రుని వెన్నెలకు ఉప్పొంగే అనంత సాగరం నిగూధం కూడా .కొందరు బాహ్య విషయాల వల్ల మహిమలు పొందు తారు ..వీరు సామాన్యులు తన మహిమతో తానే నిలిచే ఆత్మ స్వరూపుడుమహాత్ముడు .
                            ఇక్కడితో ఆత్మ బోధ పూర్తి అయింది .తర్వాత ”బ్రహ్మానందం ”అనుభ విద్దాం .
                                                              సశేషం
                                                                             మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —30 -10 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతా మృతం —–7 ఆత్మ బోధ

శ్రీ సదాశివబ్రహ్మేంద్ర   కీర్తనలలో అద్వైతా మృతం —–7
                                                                     ఆత్మ బోధ
      ఇంత వరకు శ్రీ సదాశివ బ్రమ్హేంద్ర కీర్తనల లో రామ రసాయనం ,క్రిష్ణామ్రుతం చవి చూశాం .ఇప్పుడు అద్వైత బోధ ను తెలుసు కుందాం .ఇందులో మొదటికీర్తన ”  ‘చింతా నాస్తి కిలా ”.ను గురించి తెలుసు కుందాం.
   01 —   పల్లవి —చింతా నాస్తి కిలా తేషాం —చింతా నాస్తి కిలా ||
                       చరణాలు —-01 -శమ దమ కరుణా సంపూర్ణానాం —సాదు సమాగమ సంకీర్తానాం ||
                                        02 —కాలత్రయ జిత కందర్పానాం —ఖండిత సర్వేంద్రియ  దర్పానాం ||
                                         03 —పరమహంస గురు పద చిత్తానాం –బ్రహ్మానందామ్రుత  మత్తానాం ||
                  భావం —–ఇది ఆత్మ బోధ లో మొదటి కీర్తన .మానసిక పరిణతి కి మార్గోప దేశం చేశారు బ్రహ్మేన్ద్రులు .”మనో నిగ్రహం ,ఇంద్రియ నిగ్రహం వుండి ,కరుణా పూర్ణులై ,నిరంతరం సత్పురుష సాంగత్యం లో వుండే వారికి ,కామాన్ని ,ఇంద్రియ దర్పాన్ని అన్ని కాలాల్లోను జయించిన వారికి ,పరమ హంసలైన గురు పాదాల మీద ధ్యాస వున్న వారికి ,బ్రహ్మానందం అనే అమృతాన్ని గ్రోలి మత్తెక్కిన వారికి చింత అనేది లేదు -లేదు -లేదు ”
                       విశేషం —–లోక విషయాల నుంచే చింతలు వస్తాయి .వీటిని చూసేవి ఇంద్రియాలు .,ప్రేమించేది మనసు .వీటి వల్ల స్వార్ధం ,ద్వేషం కలుగు తాయి ..ప్రేమ తగ్గి పోతుంది .జితేన్ద్రియులకు,కామాన్ని జయించిన వారికి ప్రాపంచిక , వాంచలు వుండవు . వాటి పై అర్రులు చాచే వారిపై జాలి కలుగు తుందే కాని ,కోపం రాదు .మనసు చంచల మైంది .ఎప్పుడూ స్థిరం గా వుండదు .స్థిర చిత్తం కావాలంటే సజ్జన సాంగత్యం నిరంతరం కావాలి .మహాత్ముడైన గురువు ను చేరి ,ఆత్మార్పణ చేసు కుంటే ,గురువు అనుగ్రహం తో ,చెడు భావనలు దగ్గరకు చేరావు .బ్రహ్మ పదార్ధాన్ని అందుకొని ,ఆ ఆనందం లో నిలిచి పోయిన వారికి మనస్సు అంతరిస్తుంది .మనస్సు నాశనం అయితే ,చింతలు అసలు ఉండనే వుండవు ..శాస్వతానందానికి ఇదే మార్గం అని సదాశివులు బోధించారు .
                       ఇప్పుడు రెండో కీర్తన లోకి వెళ్దాం
                    02 —పల్లవి —-స్థిరతా నహి నహి రే ,మానస —స్థిరతా నహి నహి రే ||
                                    చరణాలు —-01 -తాపత్రయ సాగర మగ్నానాం —దర్పాహన్కార విలగ్నానాం ||
                                                    02 –విషయ పాశ వేష్టిత చిత్తానాం –విపరీత జ్ఞాన విమత్తానాం  ||
                                                     03 –పరమ హంస యోగ విరుద్దానాం —బహు చంచలతర సుఖ సిద్ధానాం ||
                       భావం ——ఈ కీర్తన లో మనసుకు స్థిరత్వం అనేది లేదు అని  రూధిగా తెలియ జేశారు .ఎవరికి లేదు ?అని విచారించారు .”మనసా !తాపత్ర్యాలలో మునిగిన వారికి ,అహంకార దర్పాన్ని పట్టుకొని వ్రేలాడే వారికి ,విషయ వాంచలు అనే తాళ్ళతో బద్ధులైన మనసు కల వారికి ,చంచల మైన సుఖాల కోసం అర్రులు చాచే వారికి ఎన్నడు మనశ్శాంతి లభించదు ”అని నిర్ద్వందంగా చెప్పారు .
                     విశేషం —-తాపత్రయాలు మూడు .ఆది దైవిక ,ఆది భౌతిక ,ఆధ్యాత్మిక బాధలు .ఇతరుల పట్ల ప్రదర్శించేది దర్పం .తనలో వుండేది అహంకారం .ప్రపంచమే నిజం,దేవుడు అబద్ధమనుకునే జ్ఞానమే విపరీత జ్ఞానం .దర్పము ,అహంకారము పరమాత్మకుదూరం   చేస్తాయి .విషయ వ్యామోహం కూడా పరమాత్మను చేర నివ్వదు .స్థిరత అంటే శాశ్వత మైన దానిలో స్థానం .చలించే విషయాలపై వచ్చే జ్ఞానం కూడా చంచలమైనదే .దాని వల్ల శాంతి ,స్థైర్యం లభించవు .కనుక స్థిరమై ,శాశ్వతమై ,అఖండమై ,అక్షరమైన పరబ్రహ్మం లోనే స్థిరత్వం ,శాంతి లభిస్తాయని సందేశం .
                       మూడవ కీర్తన లోకి ప్రవేశిద్దాం
                 03 –పల్లవి —-తత్త్వజ్జీవత్వం బ్రహ్మణి–తత్త్వజ్జీవత్వం  ||
                                 చరణాలు -01 –యద్వాత్తోయే చంద్ర ద్విత్వం —-యద్వాన్ముకురే ప్రతి బిమ్బత్వ ||
                                               02 -స్థానౌ యద్వత్ నర రూపత్వం —భాను కరే యద్వత్ తోయత్వం ||
                                               03 —శుక్తౌ  యద్వత్ రజతమయత్వం  —రాజ్జౌ యద్వత్ ఫణి దేహత్వం ||
—                                             04 –  పరమ హంస గురునాద్వైత విద్యా —భనితా ధిక్క్రుత మాయా విద్యా |\
                       భావం —–ఈకీర్తన లో  ఉపనిషత్ రహశ్యం అంతా ,గాన రూపం లో వెన్న లా అందించారు .మాయ ఎలా భ్రమింప జేస్తుందో ,దాన్ని ఎలా తొలగించుకోవాలో ,బహు చక్కగా వివరించారు బ్రహ్మేన్ద్రులు .”నీటి లో రెండవ చంద్రునిలా ,అద్దం లోని ప్రతి బింబం లా ,మ్రోడు వారిన చెట్టు లో మానవ రూపం గా ,ఎడారిలో ఎండ మావి లా ,ముత్యపు చిప్ప లో మెరిసే వెండి లా,త్రాడు లో కనబడే పాము లా,బ్రహ్మం లో జీవత్వం అనేది భ్రమ వల్ల కని పిస్తోంది .పరమహంస వరేన్యులైన గురు అనుగ్రహం వల్ల ,అద్వైత విద్య తో అజ్ఞానం అనే మాయ తొలగి ,జ్ఞాన  ప్రకాశం లభిస్తుంది .
                                  విశేషం —-దీనికి కొంత వివరణ ఇవ్వాలి .నీటి లో చంద్ర బింబం ,మరుభూమి లో ఎండ మావి ,ముత్యపు చిప్ప లో వెండి కనిపించటం లోక సహజం .కొద్దిగా విచారించి చూస్తే ,అసలు రూపం బయట పడుతుంది .అదంతా భ్రమ అని తెలిసి పోతుంది .తర్వాత కూడా అవి కనబడు తున్నా ,భ్రాంతి మాత్రం తొలగి పోతుంది చెట్టు లో అందరు మనిషి ని చూడ లేరు .అజ్ఞానం పొరలు తొలగితే భ్రాంతి దూరమవు తుంది .రెండు రకాల భ్రాంతులు .భ్రాంతికి కారణం అజ్ఞానమే .ప్రపంచము ,అందు లోని అనుభవాలు రెండు రకాల భ్రాంతులు అసలు సమష్టి వాసనలే మూల అజ్ఞానం అంటారు విజ్ఞులు .వాటి వల్లే మనకు కని పించే ప్రపంచం ఏర్పడింది .అందరికీ చెందిన ఈ ప్రపంచం లో ఎవరి స్వంత వాసనల తో వారు వెలుగు తూంటారు .అందుకే వ్యక్తి గతమైన దుఖాలు ,కష్టాలు ,అనుభూతులు కలుగు తాయి .గురు ముఖతా అద్వైత విద్య పొందితే భ్రమ నాశనం అవుతుంది .సమష్టిప్రపంచం  జనానికి కనిపిస్తున్నా ,వ్యక్తిగత భ్రాంతి నశించటం వల్ల ,ఆ మహాత్ముడు ప్రపంచాన్ని ఒక ఖేలగా అంటే ఆటగా భావిస్తాడు .ఇదే ఇందులో వున్న పరమార్ధం
                                          సశేషం
                                       మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —29 -10 -11 .

 

Posted in రచనలు | Leave a comment

అవసర రచనలతో అందరి వాడైన” అవసరాల .రామ కృష్ణ రావు ”

  అవసర రచనలతో అందరి వాడైన” అవసరాల .రామ కృష్ణ రావు ”
                  విశాఖ లో ఇంకో సాహితీ శిఖరం కూలి పోయింది .హాస్య ద్వయం గా విశాఖను ఏలిన జంట రచయితల్లో భ.రా.గో .మరణించిన తరువాత ఇప్పుడు అవసరాల రామ కృష్ణా రావు గారి మరణం ఆంద్ర దేశానికి తీవ్ర శోకమే మిగిల్చింది లెక్కలు అంటే భయమున్న రోజుల్లో ,ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అనుకొనే కాలం లో ,అన్కగనితం అంటే వెర్రి కుంకలు మాత్రమే నేర్చేది అన్న అభి ప్రాయం ఉన్న సమయం లో   ,జామెట్రి అంటే ”జా మెన్త్రి ” అని తప్పుగా పలికే కాలం లో లెక్కలు అంటే భయం లేకుండా చేసి ,అది అందరు నేర్వ దగిన్దేనని ధైర్యం చెప్పి ,హాయిగా గణితాన్ని ఏలా నేర్చుకోవచ్చో నని తెలియ జెప్పి ”METHAME TRIKS ” గా దాన్ని దివి నుండి భువికి దింపి అందుబాటు లోకి తెచ్చారు రావు గారు .ఇంగ్లీష్ చదువు చదువు తున్నా ,అది గ్రీక అండ్ లాటిన్ గా భావించే వారికి ఆ భయాన్ని పోగొట్టి ,అభయం ఇచ్చి ”AANGREJI MADE EASY ”అని వెన్ను తట్టి అందులో ప్రవేశం కల్గించారు రామ కృష్ణా రావు గారు .ఈ రెండు  ఆ నాటి   జనాలకు అవసరమైన వె .అందుకే అవసరానికి తగిన రచనలు చేశారు అవసరాల వారు అన్నాను .ప్రాస కోసంకాదని  మనవి .అట్లాగే ,మునిమాణిక్యం ,భమిడి పాటి తర్వాత తెలుగు హాశ్యం తగ్గింది ,పలచబడింది ,ఎబ్బెట్టు గా వుంది అనుకున్నప్పుడు భమిడి పాటి రామ గోపాలం ,అవసరాల రామ కృష్ణా రావు గార్లు సున్నితమైన హాశ్యాన్ని వ్యంగ్యం తో రంగరించి అంగ రంగ వైభవం కలిగించారు .విభిన్న మార్గాలలో దాన్ని పండించారు ..విశాఖలో రావి శాస్త్రి ,భ.రా గో .,,అవసరాల హాష్య త్రయం గా నిలిచారు .ఆ త్రాయం క్రమం గా ద్వాయమై ,ఒంటరి ఆయీ  అదీ నిన్న నిష్క్ర మించింది .ఏంచేద్దాం .మన దురదృష్టం .
                   ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఆంగ్లం లో డాక్ట రేట్ సాధించారు రామ కృష్ణా రావు గారు .ఒరిస్సా లో ని ”బలన్గీర్ ”ప్రభుత్వ కళా శాలలో ముప్ఫై ఏళ్ళు ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేసి రీడర్ గా రిటైర్ అయారు .విశాఖ లో స్థిర పడ్డారు .వీరు 1931 డిసెంబర్ 21  న మద్రాస్ లో జన్మించారు .తండ్రి జగన్నాధ రావు ,తల్లి తిరుపతమ్మ గార్లు .వీరిది తూర్పు గోదావరి జిల్లా తుని .17 వ ఏటనే 1947 లో    పొట్టి పిచ్చుక ”అనే కధ తో వీరి సాహితీ జీవితం ప్రారంభ మైంది .అది చందమామ మాస పత్రిక లో ప్రచ్రితమైంది .600 లకు పైగా కధలు రాశారు  ”పేక ముక్కలు ‘అనే పేరుతో మొదటి యాభై రెండు కదల  సంపుటి   తెచ్చారు ..మొత్తమ్మీద ఎనిమిది కదా సంపుటులను వెలువరించారు .”సంపెంగలు -సన్న జాజులు ,సహజీవన భాగ స్వామ్యం ,రామ చిలుక ,అదుగో మామయ్యా –ఆ  వెనుక మేం  ,జై కు బహు వచనం జైలు మొదలైన ఎనిమిది నవలలు రాశారు .వివిధ పత్రికల లో చాలా కాలం శీర్షికలు నిర్వ హించారు .ఆయన హాస్య వ్యంగ్య రచనా నిర్మాణానికి ”కేటు -డూప్లికేటు ”గొప్ప ఉదాహరణ.అవసరాల .ఆవ  అనగానే ఆ పేరు జ్ఞాపకం వస్తుంది ముందు .అదొక చక్కని COINAGE WORD  .ఆయన  గణిత విశారద అనేపుస్తకం రాశారు .అందుకే లెక్కల్ని అంత సులభం గా అందరి ముందుకు లాక్కొచ్చారు .
                  1985 లో అవసరాల వారికి ఆంద్ర విశ్వ విద్యాలయం డాక్టరేట్ నిచ్చి సత్కరించింది .1994 లో తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ హాస్య రచయిత గా గుర్తించి సన్మానించింది 1996 లో జ్యేష్ట లిటరరీ అవార్డును పొందారు .2000 సంవత్చారం లో కేంద్ర సాహిత్యఅకాడెమి పురస్కారాన్ని అందుకున్నారు .అదే సంవత్చారం లో చండీఘర్ ఆంద్ర సారస్వత సంఘం విశేషం గా సన్మానించి గౌరవించింది 2004 లో అమెరిక లోని తెలుగు సంఘం ఆయన్ను ఆహ్వానించి ఘనం గా సత్కరించింది .విజయనగర తెలుగు భాషా పురస్కారాన్ని అందించి విజయ నగర వాసులు ధన్యులయారు .ఇలా వారికి అన్ని రకాల అవార్డులు  రివార్డులు ,లభించాయి . ఇది ఆంధ్రులందరికీ గర్వ కారణం .ఒక సాహితీ శిఖరం గావున్నారు .తన అభిప్రాయాలను నిర్మోహ మాతం గా పత్రికా ముఖం గా వెలువరిస్తూనే వున్నారు .  .
                 మధ్య తరగతి మంద హాసాన్ని పుణికి పుచ్చుకున్న రచయిత అవసరాల వారు .వారి జీవితా లలోని చీకటి ,వెలుగులనుహాయిగా   ,కవ్విస్తూ ,నవ్విస్తూ ,వ్యంగ్యవైభవం  జోడిస్తూ రచనలు చేశారు .ఆయన కధ చెప్పే తీరు పరమ రమణీయం గా వుంటుంది అందుకే ఆయనను””కదా కదన భీష్ముడు ”అన్నారు .ఆయన తన మనోభావాలను చక్కగా తెలియ జేశారు ”దుఖాన్ని బిగ బట్టి -సుఖాన్ని బయట పెడితే జీవితం బాలన్స్ అవుతుంది .హాస్యం ఆర్త హృదయానికి దివ్యౌషధం .అనుభవాలు ఆనందాన్నిస్తాయి .అదే బ్రహ్మానంద సదృశ రసానందం .ఏమి రాశాము అన్నది ముఖ్యం కాదు .ఎలా రాశాము అన్నది ముఖ్యం ” అదేఆదర్శం   గా ఆయన రచనలు చేశారు .అందుకే అవి అంత పాపులర్ అయాయి ..
              రామ కృష్ణా రావు గారు అభ్యుదయ వాది .తాను నాస్తికుడిని అనేచెప్పే   వారు .మానవీయ మూర్తి అవసరాల వారు .తాము మరణించిన తర్వాతతమ పార్ధివ దేహాన్ని    వైద్య కళా శాలకు అప్పగించాలని 2005 లోప్రచ్రించిన  తమ కదా సంపుటి ”ఆస్థి పంజరం ”  లో కోరిన పుణ్య పురుషులు ఆయన .పరోప కారార్ధం ఇదం శరీరం అని జీవితం అంతమైన తరువాతకూడా రుజువు చేసిన సమాజ హితైషి .  ”నేను -నేనే ”అని చెప్పుకునే అవసరాల రామ కృష్ణా రావు గారు నిజం గానే ఆ మాటను నిలుపు కున్నారు .81 యొక్క ఏళ్ళు నిండు గా జీవించారు .
                                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లో అద్వైతా మృతం ——6 క్రిష్ణామృతం

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లో అద్వైతా మృతం ——6
                                                                        క్రిష్ణామృతం
                 బ్రహ్మేన్ద్రులు శ్రీ కృష్ణుని ఉద్దేశించి రాసిన కీర్తన లలో ఆరవ దాన్ని గరించి ముచ్చటించు కుందాం
            06 —-పల్లవి —-క్రీడతి వన మాలీ ,గొష్టే –క్రీడతి వనమాలీ ||
                         చరణాలు —01 —ప్రహ్లాద పరాశర పరిపాలీ –పవనాత్మజ జామ్బవదను కూలీ ||
                                        02 -పద్మా కుఛ – పరిరంభన శాలీ —పాటు తరశాసిత   మాలి సుమాలీ |
                                        03 –పరమ      హంస వర కుసుమ సుమాలీ — ప్రణవ పయోరుహ గర్భక  పాలీ
                  భావం    ——తోట మాలి అయిన శ్రీ కృష్ణుడు గోశాలలో ఆడుతున్నాడు .ప్రహ్లాద ,పరాశారులను పాలించే వాడు ,ఆంజనేయ ,జాంబ వంతులకు అణు కూలుడు ,శ్రీ లక్క్ష్మి వక్ష స్థలం లో విహరించే వాడు ,మహా బల వంతు లైన మాలి ,సుమాలీ అనే రాక్షసులను సంహరించిన వాడు ,పరమ హంసల చేత కూర్చినఅందమైన పూల హారం కాంత సీమ లో వున్న వాడు ,ఓంకారం అనే తామర పుష్పానికి విత్త నాన్ని కాపాడే వాడు , అయిన్క వన మాలి గోవుల కొష్టం (శాల )లో ఆనందం గా క్రీడిస్తున్నాడు ఆయన్ను భజించి తరించమని చెబుతున్నారు .,
                      విశేషం —–వనమాలీ అనేది చక్కటి పదం .వనం అంటే కోరిక అనే అర్ధం వుంది కొష్టం అంటే గోవుల శాల .గోవు అంటే ఇంద్రియాలు అనే అర్ధం వుంది .కోరికల మాల ధరించి ,ఇంద్రియ విషయాలతో పరిగెత్తే జీవుడు కూడా దేవుడే .ఆ రూపం లో వున్న భగ వంతుడే పరిగెత్తు తున్నాడని భావం .ప్రహ్లాద ,పరాశారులు అనటం లోను లోతు వుంది .ప్ర్కహ్లాదుదు మహాభక్తుడు .పరాశరుడు జ్ఞాని .సాకార ,నిరాకారా లతో ఇద్దరినీ పాలించేది ఒకే భ్క్యగా వంతుడు అని నిగూఢ రహశ్యం .పద్మ అనేది సంపద కు చిహ్నం .ప్రాపంచిక ,పార మార్ధిక సంపద అంతా లక్ష్మీదేవియే ..ఈ సంపదను అంతా కాపాడేది భగ వంతుడే .
                  రావణాసురుని తల్లికి తండ్రి సుమాలీ .వాడి తమ్ముడు మాలి .మాల్య వంతుడు అనే ఇంకో తమ్ముడు వున్నాడు .ఈ ముగ్గురు లంకలో ఉంటూ ,స్వర్గం మీదికి దండెత్తితే శ్రీ మహా విష్ణువు వాళ్ళతో యుద్ధం చేశాడు .వాళ్ళు తట్టు కో లేక పారి పోయారు .లంకలో  తల దాచుకున్నారు .మాల్య వంతుడు చచ్చాడు యుద్ధం లో .మిగిలిన ఇద్దరూ పాతాళం లోకి పారి పోయి దాక్కున్నారు .ఇంత కధను వాళ్ళిద్దరి పేర్లు చెప్పటం తో బయట పెట్టారు సదా శివులు .ఇదివరకటి కీర్తన లో ”ప్రణవ పయోధర ”అని రాస్తే ,ఈ కీర్తన లో ”ప్రణవ పయోరుహ ”అన్నారు .ప్రణవం తామర పువ్వు లాంటిది .ప్రపంచ రూపం గా వికశిస్తుంది .మళ్ళీ బీజ రూపం లోకి మూసుకు పోతుంది .బీజ (విత్తనం )రూపం లో ప్రపంచం అవ్యక్త మైన పుదు ,దాన్ని రక్షించి వుండేదీ పరమేశ్వరుడే .అందుకే ”ప్రణవ పయోరుహ గర్భక ,పాలీ ”అన్నారు .శివేంద్ర యోగి .గర్భక అంటే విత్తనాన్ని ,పాలి అంటే రక్షించే వాడు అని అర్ధం ”.కపాలి ”అని కలిపి చదవ కూడదు .గర్భక ,పాలి అని చద వాలి  విత్తనం . లో సర్వ వృక్షం దాగి వున్నట్లు చిన్న మాట లో విశ్వ మంత భావాన్ని ఇమిడ్చిన మహా కవి శేఖరులు ,పరమ హంస శ్రీ బ్రహ్మేన్ద్రులు .ఇవి ఏదో బుద్ధి తో రాసినది కాదు .ఒక తన్మయా వస్థ లో ,సమాధి స్థితి లో రాసిన మహత్తర కీర్తనలు ఇవన్నీ .అందుకే అంత మధురం ,అంతటి లోతు .
                ఏడవకీర్తన లోకి చేరు కుందాం .
            07 —-పల్లవి ——మానస సంచరరే ,బ్రహ్మని –మానస సంచరరే ||
           అను పల్లవి —     –  –మద శిఖి పించ అలంకృత చికురే —మహనీయ కపోల విజిత ముకురే ||
                             చరణం — శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే –సేవక జన మందిర మందారే ||
                                          పరమ హంస ముఖ చంద్ర చకోరే —పరి పూరిత మురళీ రవ దారే ||
                భావం —-ఇదీ మానస బోదె .చాలా బాగా ప్రాచుర్యం చెందిన కీర్తన .”శంకరాభరణం సినిమా లో ఈ కీర్తనను దర్శకుడు విశ్వ నాద్ అద్భతం గా ,రసాత్మకం గా ,అత్యంత ఆర్ద్రం గా చిత్రీకరించి షాహ బాష్ అని పించారు .ఆ సన్ని వేశం చూసి ఆనంద బాష్పాలు రాల్చని వారు లేరు
                         వో మనసా !పరబ్రహ్మం లో సదా సంచరించు .లక్ష్మీ కుఛ విహారి శ్రీమన్నారాయణుని లో సంచరించు .సేవించే భక్త జనులకు మందారం ఆయన .నెమలి పించం తో వున్న ముంగురులు వున్న వాడు ,.ఆయన నున్నని చెక్కిలి అద్దాలకంటే దీతైనది .పరమ హంస ముఖ చంద్ర కాంతిని ఆస్వాదించే చకోరం శ్రీ కృష్ణ పరమాత్మ .మురళి ని పూరించి నాద రసాన్ని ప్రవహింప జేస్తాడు .అలాంటి శ్రీ కృష్ణ పరబ్రహ్మం లో సదా సంచరించు అని మనసుకుని కోరారు
                        విశేషం —-భక్తులకు ఇల్లు భగవానుని లోగిళ్ళు .చంద్రుని కోసం చకోరాలు తపిస్తాయి .చంద్ర కాంతిని ఆస్వాదించి సంతృప్తి చెందు తాయి .అలాగే జ్ఞానుల జ్ఞానం లో పరమాత్మ సంతృప్తి చెందుతాడు .శ్రీ కృష్ణుని దివ్య రూపం కళ్ళ ముందు సక్షాత్కారించేట్లు చేసిన రచన .విన్తునా ,ఆ మూర్తిని ఊహించుకున్నా మనసు ఆనంద పులకాన్కితం అవుతుంది .పరబ్రహ్మ సామీప్యం లో వున్న అనుభూతి లభిస్తుంది .అదీ ఈ కీర్తన వైశిష్ట్యం
                    క్రిష్ణామృతం లో ఎనిమిదవది ,చివరిది అయిన కీర్తన లో కి ప్రవేశిద్దాం రండి
                   08 —–పల్లవి —-భజరే యమునాతీరా విహారం ||భజ మన యదుకుల నంద కిశోరం ||
                             చరణాలు —01 –పరమానందం పరబ్రహ్మ రూపం –పావన గాత్రం –పుణ్య చరిత్రం ||
                                             02 —నంద కుమారం నవనీత చోరం —నారద వందిత నారాయణం |\
            భావం —-యమునా తీర విహారీ రసమయ మూర్తీ ,శ్రీ కృష్ణ మూర్తిని భజించమని మానస బోధ ఈ కీర్తన .”పరమానంద స్వరూపుడు ,పరబ్రహ్మ స్వరూపుడు ,శ్రీ కృష్ణ పరమాత్మ .పవిత్ర శరీరుడు .నంద కిశోరుడు పుణ్య చరితుడు .నవనీత చోరుడు,నారదుని చే అను క్షణం కీర్తింప బడే వాడు ,నారాయణుడు .భక్తి తో భజించి తరించు .
              విశేషం —–శ్రీ కృష్ణుడు యమునా తీరం లో సామాన్యులకు కని పించడు .శరీర మనో ,బుద్ధుల్ని అణచు కున్నప్పుడే అంటే సంయమనం చేసిన తర్వాతే భగ వంతుని దర్శనం లభిస్తుందనివూహ  చేశారు బ్రహ్మేన్ద్రులు ..ఈ విధం గా శ్రీ కృష్ణ గుణ గానాన్ని ,మురళీ రవామ్రుతాన్ని ,శ్రీ కృష్ణ పరబ్రహ్మ దివ్య దర్శనాన్ని ,కర్ణామృతం గా శ్రీ కృష్ణుని లీలల్ని ప్రదర్శించి కీర్తనల్ తో రసానందాన్ని కలిగించిన మహా పరమ హంస సదాశివ బ్రహ్మేంద్ర యోగి వరేన్యులు .
                                  ఇంతటి తో కర్ణామృతం సమాప్తం .తరువాత ”ఆత్మ బోధ”ను గురించి తెలుసు కుందాం
                                                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లలోఅద్వైతా మృతం —5 కృష్ణా మృతం

    శ్రీ  సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లలోఅద్వైతా   మృతం —5
                                                                    కృష్ణా మృతం
 –                      బ్రహ్మేన్డ్రుల కృశా మృతం లో ని మూడవ కీర్తన
      3—పల్లవి —  బ్రూహి ముకున్దేతి రసనే –పాహి ముకున్దేతి ||
          చరణాలు —-01 -కేశవా మాధవ గోవిన్దేతి —క్రిష్ణానంత సదా నందేతి ||
                           02 -రాదా రమణ హరే రామేతి –రాజీ వాక్ష ఘన శ్యామేతి ||
                          03 –గరుడ గమన నందక హస్తేతి –ఖండిత దశ కంధర మస్తేతి ||
                          04 –అక్రూర ప్రియ చక్ర ధరేతి –హంస నిరంజన కంస హరేతి ||
                                       భావం —-  వో నాలుకా! (రసనే ) ముకుందా అని పలుకు .ముకుందా రక్షించు (బ్రూహి )అని కోరు .కేశవా మాధవా ,గోవిందా ,కృష్ణా ,అనంతా,సదానందా ,రాదా రమణా ,హరే రామా ,రాజీ వాక్షా ,ఘన శ్యామా ,గరుడ గమనా ,నందక హస్తా ,రావణ సంహారా ,అక్రూర వరదా ,చక్ర ధారీ ,హంసా ,నిరంజనా ,కంసారీ అని నోరారా పలుకు .అని నాలుకకు ఉపదేశం చేశారు సదాశివులు
            విశేషం —-గోవింద నామాలన్నీ ఏర్చి కూర్చిన కీర్తన ఇది .ప్రతి నామ వెనుక ఒక కధ వుందని మనకు తెలుసు .నామ మాహాత్మ్యాన్ని ఇందులో చూపారు పరమ హంస .పరవశించి పలికితే పరమ పదమే లభిస్తుందని తెలియ జేశారు .నాలుక ఏ నామాన్ని పలికితే ,మనసు ఆరూపాన్ని   తలుచు కుంటుంది .నామానికీ ,రూపానికి వున్న సంబంధం ,అనుబంధం ఇది .మనసు దేనిని తలిస్తే దాని పై ప్రేమకూడా కలగటం సహజం .ప్రపంచం మీద ప్రేమ తగ్గించుకుని ,భగ వంతుని పై ప్రేమ పెంచుకోవ టానికి ఏకైక మార్గం కృష్ణ నామ స్మరణ అన్న సూక్ష్మాన్ని ఈ కీర్తన ద్వారాతెలియ   జెప్పారు బ్రహ్మేంద్ర స్వామి .
               నాల్గవ కీర్తన లోకి ప్రవేశిద్దాం
                4—పల్లవి  —–భజరే గోపాలం మానస –భజరే గోపాలం ||
                   చరణాలు —01 –భజ గోపాలం భజిత కుచేలం –త్రిజగన్మూలం దితి సుత కాలమ్ |\
                                  02 –ఆగమ సారం యోగ విచారం –భోగ శరీరం భువనాధారం |\
                                  03 –కదన కథోరం కలుష విదూరం –మదన కుమారం మధు సంహారం |
                                  04 –నత మందారం నంద కిశోరం –హత చాణూరం హంస విహారం ||
                                       భావం —-గోపాల కృష్ణుని భజించమని మనసుకు చేసే బోధ ఇది .”స్నేహితుడైన కుచేలుని చే సేవింప బడిన వానినీ ,మూడు లోకా లకుమూల మైన   వాడినీ ,దితి కుమారులైన రాక్షసులను సంహరించిన వాడినీ ,భాజించవే మనసా !.వేద సారం అయిన వాడినీ ,యోగం ద్వారానే విచారించి తెలుసుకో వలసిన వాడినీ ,కేవలం భోగం కోసమే అవతారం ఎత్తిన వాడినీ భువనాలకు ఆధారం అయిన వాడినీ ,అయిన శ్రీ కృష్ణుని భజించు .శరణు అన వాడికి మందారం ,నందబాలం .చానూరాన్తకుడు ,హంస లాగా విహరించే గోపాల కృష్ణుని భజించి తరించు .
                        విశేషం —-కుచేలుడు శ్రీ కృష్ణుని చిన్న నాటి  స్నేహితుడు .అతడు శ్రీకృష్ణున్ని శ్రీ కృష్ణుని భక్తునిగా ,స్నేహితునిగా భగవంతుని గా సేవించాడు .కృష్ణుడు కుచేలుడిని బాహ్యం గా ,అతిధి సత్కారాలు చేసి పూజించాడు .భగవంతునికి భక్తునికి భేదం లేదని తెలియ జేసే సందర్భం ఇది .శ్రీ క్రిష్ణునిది భోగ శరీరం .అంటే ఈ ప్రపంచం లో సంచ రించా టానికి  శరీరం ..ఆయనే కల్పించ్కున శరీరం .”మదన కుమారం ‘అంటే మన్మధుని వంటి కుమారుడు అనీ ,మన్మధుని కుమారునిగా పొందిన వాడు అనీ శ్రీ కృష్ణ పరం గా రెండు అర్ధాలు వున్నాయి .”హంస ”అనే పదం చాలా విశేష మైనది .విచక్షణా జ్ఞానం తో వ్యవహరించే బుద్ధిని హంస అంటారు .ఈ హంస పై విహరించే వాడే భగ వంతుడు .అందుకే హంస విహారి అయాడు ..పదాలు అన్నీ నాదానుగునం గా నర్తనాను గుణం గా వుండి మనసు ను పరవశింప జేస్తాయి .rhytham మనలను విశేషం గా ఆకర్దిస్తుంది .క్షణం యెడ బాటు కని పించదు .ప్రవాహం లా పదాలు ప్రవహిస్తుంటాయి . శ్రవణ శుభగత్వం అంటే ఇదే .
                       ”భజరే యదు నాదం ”అనే అయిదవ కీర్తన లో కి ప్రవేశిద్దాం
                 5— పల్లవి —భజరే యదునాధం మానస —భజరే యదు నాదం ||
                                చరణాలు —01 -గోప వధూ పరి రంభన లోలం –గోపా కిశోరక మద్భుత లీలం ||
                                                02 –కపతాన్గీక్రుత మానుష వేషం —కపట నాట్య కృత కుత్చిత వేషం |||\
                                                 03 –  పరమ హంస హ్రుత్తత్వ స్వరూపం –ప్రణవ పయోధర ప్రణవ స్వ రూపం -||
                భావం ——యదు వంశ కిశోరాన్ని (శిశువు )భజించ మని మనసుకు బోధిస్తునాడు .”యదుకుల నాధుడు ,గోపికలను ,ఆలింగనం చేసుకోవటం లో ఆసక్తుడైన వాడు ,బాల క్రిషుడు ,అద్భుత లీలలను ప్రదర్శించిన వాడు ,లీలా మానుష విగ్రహుడు ,నాట కాల లో పాత్ర లాగ క్షుద్ర పాత్రలూ ధరించిన వాడు ,పరమ హంస హృదయాలలో ఆత్మ స్వరోపం గా వున్న వాడు ఓంకార స్వరూపుడు ,అయిన బాల కృష్ణ భగవానుడిని స్మరించు ”
                       విశేషం —-గోప వధూ అనటం లో త్రిగుణాలతో వున్న జీవు లందరూ స్త్రీ మూర్తులే అన భావం వుంది .స,ర ,త అనే మూడు అక్షరాలూ ఈ కారం తో కలిస్తే స్త్రీ అవుతుంది .అంటే కదిలే మూడుగుణా అని అర్ధం .ఈ జీవుల్లో భగవద్ భక్తులైన వాళ్ళు గోప వధువులు( స్త్రీలు ).వారినే భగ వంతుడు ప్రేమతో ఆలింగనం చేసు కుంటాడు .”కపతాన్గీక్రుత వేషం ”అంటే ప్రారబ్ధం వల్ల కాకుండా లీల కోసం శరీరాన్ని ధరించిన వాడు అని అర్ధం .”కపట నాట్య కృత కుత్చిత వేషం ”వేశాడు కృష్ణుడు .అంటే గొల్ల పిల్ల వాడుగా ,అల్లరి కన్నయ్య గా ,సామాన్య వేషం ధరించాడు .ఇది భగవంతుని కపట నాటకమే ”.ప్రణవ పయోధర ”శబ్దం లోను లోతైన భావం వుంది .ఓంకారం నిరాకారం గా వుండే పరమాత్మ మాత్రమే కాదు ,మనకు కని పించే ప్రపంచం కూడా ఆయనే ..నిశ్చల మైన పరమాత్మ ఆధారం గా చలించే ఈ ప్రపంచం మేఘం వంటిది .అందుకే మేఘాన్ని ప్రణవ పయోధరం అన్నారు బ్రహ్మేన్ద్రులు .పరమాత్మ ప్రణవ స్వరూపం .ఇంకో రహస్యం వుంది యోగ శాస్త్రం లో ”లయ ”అనే యోగం లో ,లోపల వినపడే పది రకాల నాదాలలో చివరిది మేఘ నాదం .అదే ప్రణవం అని పిలువ బడే ఓంకారం .,ఇన్ని యోగ ,శాస్త్ర ,వేద ,ఉపనిషద్ రహస్యాలన్నీనిక్షిప్తం   చేసి రమ్య నాద భరితం గా చేసినకీర్తన  ఇది .ఆ నాద బ్రహ్మ కు కై మోడ్చి అంజలి ఘటిద్దాం ..
                                                               సశేషం
                                                                                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —28 -10 -11 .

 

Posted in రచనలు | 1 Comment

సాఫ్ట్ కార్నెర్ నియంతలు

సాఫ్ట్ కార్నెర్ నియంతలు
                     ఈ మధ్యనే జనం చేతిలో ,అమెరికా వాళ్ల సాయం తో హత్య చేయ బడ్డ లిబియా అధ్యక్షుడు గడాఫీ కల్నల్ మాత్రమే కాదు ,ప్రజల యోగ క్షేమాలను పట్టించుకున్న వాడూ అని తెలుస్తోంది .అతను ఎంత సంపాదించుకుని దాచుకుని ,పిల్లా లిద్దరికీ పంచి ,దోచ్కోన్నాడని అందరు చెప్పుకుంటున్నారు .అయితే ఆ దేశం లోని ప్రజలపై అతడు చూపిన శ్రద్ధా ,వాళ్ల సంఖేమానికి తీసుకున్న జాగ్రత్తలు చూస్తుంటే నియంతల్లో ను మంచి వాళ్ళు అంటే సాఫ్ట్ కార్నెర్ వున్న వాళ్ళు వున్నట్లు తెలుస్తోంది ”కన్యాశుల్కం లో చెప్పినట్లు ”బ్రాహ్మల్లోను ,మంచి వాళ్ళుంటారు ”అన్నది రుజువు అవుతోంది .ఇంతకీ ఈ సుత్తి అంతా ఎందుకు అసలు విషయానికి రాకుండా అంటారా .వచ్చే ముందు ఒక చిన్న మాట .మన పంచ కట్టు పెద్దాయనా పావలాలు జనం మీదికి విసిరి కోట్లు ఎరుకున్నాడని ప్రతి పక్షాల ఆరోపణ -అయితేనేం ,జలయజ్ఞం ,రాజీవ్ ఇందిరా సంతర్పణలు బాగానే చేశాడు కదా అని ఆ యన వత్తాసు దార్ల ఎదురు సమాధానం .
                      గద్దాఫీ పాలన లో లిబియా దేశం అక్షరాశ్యతా శాతం 83 శాతం  ట. అదీ యువకుల్లో అయితే 100 శాతం ట .ఆశ్చర్యం గా లేదా .మరి ఎక్కడైనా అలా ఉందా ?లేదనే దాప్పు చెప్ప వచ్చు .రెండోది లిబియా లో విద్యార్ధులు ఎంత వరకు చదువు కున్నా ,ఎన్నేళ్ళు చదువు కున్నా ప్రభుత్వామీ ఆ ఖర్చు అంతా భరిస్తుంది ట .చదువు పూర్తి క్యినా తర్వాత మన దేశస్తులు లాగానో ఇతర దేశస్తులు లాగానో ,దేశం విడిచి పొట్ట చేత పట్టుకుని ఇతర దేశాలకు ఒకారు గాక ఒక్కరు కూఫా వెళ్లారట.వారందరికీ అక్కడే ఉద్యోగాలు దొరుకు తాయట .ఇతర దేశాల్లో ఉద్యోగం చేసే లిబియా వాళ్ళు ఒక్కరు కూడా లేరంటే నమ్మ శక్యం గా లేదా ?ఇది ముమ్మాటికీ నిజం ..జబ్బుచేసి ఆస్పత్రికి వెళ్లి తే చేరిన్దగ్గర్నుంచి నయం అయి ఇంటికి తిరిగి వచ్చే దాకా ఖర్చు అంతా ప్రభుత్వమే భారిస్తుందట .ఒక వేలా లిబియా నయం కాని జబ్బు వుంటే ఏ దేశం వెళ్లి నయం చేసుకున్నా కూడా ప్రభుత్వమే మొత్తం ఖర్చు భారిస్తుందట .ఇక్కడ కుటుంబానికి నెలకు 2500  డాలర్లు ఇచ్చి కుటుంబ పోషణకు సాయ పడుతుందట .
                  లిబియన్ ప్రజలకు కరెంట్ బిల్లంటే ఏమిటో తెలీదట .అంటే కరెంట్ బిల్ కట్టే పని ప్రజలకు లేదు .అంతా ఉచిత విద్యుత్తే .తేవరైనా పెళ్లి చేసుకుని ,ఇల్లు కట్టు కోవాలను కుంటే ప్రభుత్వం వాళ్లకు 50000  డాలర్లు గిఫ్ట్ గా ఇస్తుందట .స్వంత కార్ కొనుక్కో వాలనుకుంటే సగం ఖర్చు ప్రభుత్వమే భారిస్తుందట .పెట్రోల్ 15  సెంట్లకే గాల్లోన్ లభిస్తుందట ..యువకులు వ్యవ సాయం చెయ్యాలను కుంటే భూమి ని ఉచితం గా ఇవ్వటమే కాదు ,వ్యవ సాయానికి కావాల్సిన విత్తాలు ,ఎరువులు ,యంత్రాలు అన్నీ ఉచితం గా అందిస్తుందట ప్రభుత్వం .అవసరం వచ్చి ఋణం తీసు కోవాలంటే నిముషాల మీద బాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయట .వడ్డీ  అసలు ఉండనే వుండదట .లిబియా పెట్టు బదులు అమెరికా లో 100 బిలియన్లు ,ఇతర దేశాల్లో 50 బిలియన్ డాలర్లుట .ఇవన్నే చేయటానికి ,ఇంత ప్రజా సంక్షేమం ఆలోచించటానికి నియంత గడాఫీ కి ఎంత సాఫ్ట్ కార్నెర్ హృదయం వుందో ?అతను దాచుకున్న డబ్బు 200  బిలియన్ డాలర్లని అంచనా .అతని దగ్గర చచ్చే సమయానికి వున్న బంగారం 140 టన్ను లట . .కిలోలుకాదండోయ్ బాబు అక్షరాలా టన్నులు టన్నులు .కిలోలు మయితే ఇండియా లో మన వాళ్ళు చాలా మంది ఆ జాబితాలో చేరుతారు .ఇంత సంపాదించినా ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్ప లేదు .ఇంత ప్రజా సేవ చేసినా ,విదిలించింది చిటికెడు ,నొక్కేసింది గుప్పెడు అనుకున్నారు ప్రజలు .అందుకే అంత విప్లవం వచ్చింది .దీనికి వత్తాసు బయటి నుంచి లభించింది .అక్కడ అస్తిరత్వం ఏర్పడాలి .ఆయిల్ అంతా తమ చేతి కిందకు రావాలి .నెమ్మది గా ఉక్కు పాదం మోపాలి .అని” డేగ ”వ్యూహం . .ఇదేదో గడాఫీ ని నేను వెనకేసు కొచ్చి రాసిన మాటలు కావు .పేపర్ ,చానెళ్ళ వాళ్ళు చెప్పినవే
                      1162  లో పుట్టిన మంగోలియా దేశ నాయకుడు ”చెంఘిజ్ ఖాన్ ”ప్రపంచాన్ని గద గద లాడించి విశాల మంగోలియన్ సామ్రాజ్యాన్ని ఏర్పర చదువు .ఎదిరించే మొన గాదె లేకపోయాడు ఆ నాడు .అతని క్రూరత్వానికి రాజులు ,చక్ర వర్తులు పారిపోయి ఎక్కడో తల దాచు కున్నారు .ఇంత గోపా విజయం సాధించిన ఖాన్ గారికి అక్షరం ముక్క కూడా రాదు అంటే ముక్కున వేలు వేసుకో వాల్సిందే .చదువు కో లేక పోయినందుకు బాధ పది తన పిల్ల లకు చదువు బానే చెప్పించాదట .అతని మతం ”షామా ఇజం ”.వీళ్ళు ఆకాశాన్ని ఆరాదిస్తారట.అయితే చెంఘిజ్ ఏ మతాన్ని ద్వేషించ లేదట .
అన్ని మతాల వారు అతన్ని తమ మతం లో చేరమని ప్రార్దిన్చారట .దేని లోను చేరా లేదు .ఎంతో సంపదను దోచుకున్నా ,దేశానికి రాజా మందిరం కట్టు కోలేదట .తాను ఏ తెగ నుంచి వచ్చాడో ,ఆ తెగకు చెందిన గుడారం లో నే వుండే వాడట .పట్టణాలు ,నగరాలు అంటే ఇష్టం లేదు అతనికి .సామాన్యులు తినే తిండే తినే వాడు .విలాసాలకు ,ఆడంబరాలకు దూరం .అతని సామ్రాజ్యం లో దొంగ తనం మహా నేరం .అక్రమ సంబంధం వుంటే ఉరితీతే .నెలకు మూడు సార్లే మద్యం తాగే వాడు .అతడి సామ్రాజ్యం నల్ల సముద్రం నుండి పసఫిక్ సముద్రం వరకు విస్తరించిన ఘనుడు చెంఘిజ్ ఖాన్.అందర్నీ అణచి వేసినా పరమత సహనం అతని లోని సాఫ్ట్ కార్నెర్ .
                                             మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ —28 -10 -11 .

 

Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లోఅద్వైతా మృతం —4 క్రిష్ణామృతం

    శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లోఅద్వైతా మృతం  —4
                                                                              క్రిష్ణామృతం
శ్రీ సదాశివ బ్రహ్మేన్డ్రుల కీర్తన లలో రామ రసాయన పానం ఇంతవరకు చేశాం .ఇక ఇప్పుడు క్రిష్ణామ్రుతాన్ని అందుకుందాం .
                 ఇందులో మొదటిది ”స్మర వారం వారం ”పూర్తిగా వివరిస్తాను
 01 -పల్లవి —–స్మర  వారం వారం మానస —స్మర నంద కుమారం ||
       చరణాలు —01 -ఘోష కుటీర   పయోఘ్రుత చోరం –గోకుల బృందావన సంచారం ||
                       02 -వేణు రవామ్రుత పాన కథోరం –విశ్వ స్థితి లయ హేతు విహారం ||
                       03 –పరమ హంస హృత్ పంజర కీరం —పటు తర ధేనుక బక సంహారం||
            భావం —ఓమనసా !నందకుమారుడైన శ్రీ కృష్ణుని నిరంతరం స్మరించు .గోళ్ళ వాళ్ల ఇళ్ళల్లో పాలు ,పెరుగు ,వెన్న ,నెయ్యి దొంగిలిస్తూ ,బృందావనం లో సంచరిస్తూ ,వేణు గాన లోలుడై ప్రపంచం యొక్క సృష్టి ,స్థితి ,లయాలకు కారకుడై ,పరమ హంస లైన యోగుల హృదయం అనే పంజరం లో చిలుక గా వున్న వాడు,ధేనుక ,బకాసురాది రాక్షసులను వధించిన వాడు ,అయిన ఆ నందకుమారుడిని ఆనందం గా పదే పదే స్మరించు .అని సదాశివులు      ఉపదేశం చేస్తున్నారు .
            విశేషం —-ప్రపంచం అంటే అనేకం .పరమాత్మ ఒక్కడే .కనుక అనేకాన్ని వదిలి ఏకమైన పరమాత్మను ధ్యానించాలి .అప్పుడే సుఖం ,శాంతి లభిస్తాయి .భగవత్  ధ్యానానికి ,ఆయన లీలా స్మరణకు మంచి మార్గం ఇదే .నంద శిశువు (కిశోరం )చేసిన చిలిపి పనులు అమాయకులకు ఆనంద ప్రసాదం .అవే మహా యోగులకు అద్భుత భావ దర్శనాలు .”ఘోష కుటీర పయోఘ్రుత చోరం –గోకుల బృందావన సంచారం ”ఇందులో వేదాంత పరమైన అర్ధాన్ని విచారిద్దాం .గోవులు అంటే ఇంద్రియాలు అనే అర్ధం వుంది .వాటి వల్ల కలిగే విషయ జ్ఞానమే పాలు .పాలను చిలికితే వచ్చే వెన్న -లోకానుభవం .వెన్న కరిగితే వచ్చే నెయ్యి –సూక్ష్మవిచక్షణా జ్ఞానం . తనను అనుక్షణం స్మరించే గోపికల విషయ జ్ఞానాన్ని ,విచక్షణా జ్ఞాఆన్ని స్వీకరించి ,శ్రీ కృష్ణుడు వారికి ఆత్మానందం కలిగిస్తాడు ..
               ”వేణు రవామ్రుత పాన కథోరం –విశ్వ స్థితి లయ హేతు విహారం ”లోని పరమార్ధమేమిటో తెలుసు కోవాలి .వెదురు ముక్కను ఎండ బెట్టి ,లోపల అంతా కాళీ చేసి ,ఏడు రంధ్రాలు చేస్తే ,వేణువు తయారవు తుంది .దాన్ని పెదవుల తో గాలి పూరించి పలికిస్తే ,మధుర సంగీతం వచ్చి హృదయానికి ఆహ్లాదం కలిగిస్తుంది .ఇది మనుషులకూ వర్తిస్తుంది .మనిషి లోని లౌకిక వ్యక్తిత్వాలను భగ్నం చేసుకొని ,దర్పం ,అహంకారం లను తొలిచి ,డొల్ల గా( ఖాళీ )చేస్తే అయిదు జ్ఞానేంద్రియాలు ,మనసు ,బుద్ధి అనే ఎదింటినీ ఖాళీ కన్నాలుగా అర్పణ చేస్తే ,ఆంటి మహాత్ములను భగ వంతుడు తన మధుర సంగీతం ,సందేశం విని పించాతానికి తగిన పరికరం గా గ్రహిస్తాడు .ఇంతటి గహన విషయాన్ని మధు మధుర పదాల మురళీ రవం గా మార్చి మనకు ,ఆ మోహన మురళీ కృష్ణుని దివ్య దర్శనం చేయించారు బ్రహ్మేన్ద్రులు .కృష్ణ అంటే సర్వం కరోతి ఇతి కృష్ణః .అని వుంది .అంటే అన్నీ చేయించేవాడు అని అర్ధం .కృష్ణ అంటే ఆకర్షించే వాడు అనీ అర్ధం ..సర్వజీవ్లులను ఆకర్షించే వాడు ,అందరితో పని చేయించే వాడు ,ఆ శ్రీ కృష్ణ పర బ్రహ్మమే .అందుకే వారం వారం అంటే ప్రతి క్షణం ,నిరంతరం ఆ గోపాల కృష్ణుని నే స్మరించాలి అని బోధ ఇందులో వుంది
                           ఇప్పుడు రెండవ కీర్తన లోకి వెళ్దాం
2——-పల్లవి  — గాయతి వన మాలీ మధురం –గాయతి వన మాలీ ||
         చరణాలు —1–పుష్ప సుగంధ సుమలయ సమీరే —ముని జన సేవిత యమునా తీరే ||
                         2—కూజిత శుక పిక ముఖ ఖగ కుంజే —కుటిలాలక బహు నీరద పుంజే ||
                         3—తులసీ దామ విభూషణ హారీ –జలజ భవస్తుత సద్గుణ శౌరీ ||
                         4– పరమ హంస హ్రుదయోత్చావ కారీ –పరి పూరిత మురళీ రవ దారీ ||
          భావం —-వన మాలీ అంటే పుష్ప హారాలు  ధరించిన శ్రీ కృష్ణుడు మధుర గానం చేస్తున్నాడు .పూల గంధాలతో వస్తున్నచల్లని గాలితో ,ముని జన సమూహం తో ,యమునా తీరం లో సేవింప బడుతు ,చిలుకలు ,గోరు వంకలు మొదలైన పక్షుల కిల కిలారవాలు విని పిస్తుంటే ,వంకీలు తిరిగిన ముంగురులు లాగా వ్రేలాడేనల్లని   మేఘాలతో ,వనమాలీ ,యదువంశ విభుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ ,మధుర మనోహరంగా వేణు గానం చేస్తూ ,ఉల్లానికి ఉల్లాసం కలిగిస్తున్నాడు .
    విశేషం ——యమునా తీరం లో వేణు గానామృతం చేసే ఆ శ్రీ కృష్ణుని దివ్య దర్శాన్ని చిత్రం లో వ్హూపించి నట్లు మన ముందు నిల బెట్టారు బ్రహ్మేన్ద్రులు .”జలజ భవ స్తుత సద్గుణ షోరి ‘ఆయన .అంటే బ్రహ్మ చేత స్తుతింప బడే శ్రీ కృష్ణుడు అని అర్ధం .”యమునా ”అనే మాటలో కూడా విశేషార్ధం వుంది .యం అంటే నిగ్రహం .మునులు అందరు ఆత్మ నిగరం కలవాళ్ళు .అందుకే వారు యమునా తీరం లో విహరించటానికి ఇష్ట పడతారు .”జలజ భవ స్తుత ”లో ఒక చిన్న కధ దాగి వుంది .పూర్వం ఒక సారి బ్రహ్మ దేవుడికి బాల కృష్ణుని మీద ,యాదవుల మీద కోపం వచ్చింది .ఆయన బారి నుంచి వీళ్ళందర్నీ రక్షించటానికి బ్రహ్మకు కనపడ కుండా ఒక ఏడాది పాటు ఒక గుహలో గోవులను ,గోపాలురను దాచి రక్షించాడు బాల కృష్ణుడు .చివరికి బ్రహ్మ దేవుడే తప్పు తెలుసుకొని వచ్చి శ్రీ కృష్ణుని పాదాల పై పడి క్షమించమని వేడుతూ సంస్తుతించాడు ఆ బ్రహ్మ ఈ శ్రీ కృష్ణ పర బ్రహ్మాన్ని .ఈ సంఘటనను అంతాఒకే   పదం లో ఫ్లాష్-బాక్  గా మన ముందుంచారు సదా శివేన్ద్రులు .శ్రీ కృష్ణుడు ఎవరో కాదు ”పరమ హంస హ్రుదయోత్చవ విహారి ”.కృష్ణ అనే పేరు వింటేనే పరవశం వస్తుంది .అవ్యక్త మాధుర్యం ఆవహిస్తుంది .అలౌకిక సౌందర్య దర్శనం లభిస్తుంది .అలాంటి పరమ విభూతిని మనకు అందించారు సదాశివులు
                                                             సశేషం
                                                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -10 -11
Posted in రచనలు | 1 Comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లలో అద్వైతా మృతం —3

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లలో అద్వైతా మృతం  —3
                                                                           రామ రసాయనం
                     సదాశివ బ్రహ్మేన్డ్రుల కీర్తనలలో రామ రసాయనం లో మొదటి కీర్తన గురించి తెలుసు కున్నాం.ఇప్పుడు రెండో కీర్తన వివరిస్తాను
02 -పల్లవి –ప్రతి వారం వారం మానస -భజరే రఘు వీరం
      చరణం —కాలామ్బోధర కాంత శరీరం —-కౌశిక శుక శౌనక పరి వారం-||
                  కౌశల్యా దశరధ సుకుమారం –కలి కల్మష భయ గహన కుథారిం ||
                  పరమ హంస హ్రుత్పద్మ విహారం -ప్రతి హత దశముఖ బల విస్తారం ||
                  భావం ——నీల మేఘం వంటి శరీరపు రంగు కలవాడు ,శుకుడు శౌనకుడు,కౌశికుడు  (విశ్వా మిత్రుడు )అనే పరివారం కలవాడు ,కౌసల్యా దశరదుల  గారాబు పట్టి ,కలి చేత కల్మషం (మురికి )అయిన భయం అనే అరణ్యాన్ని చేదించే (నరికే )గొడ్డలి అయిన వాడు ,సదా పరమ హంసల హృదయ పద్మ విహారుడు ,రావణ ,బల దర్పాన్ని నాశనం చేసిన వాడు ,అయిన ఆ  రాఘవుడిని
భజించు అని మనసుకు సలహా ఇస్తున్నారు బ్రహ్మేన్ద్రులు .
                      వారం వారం అంటే వారానికో సారి అని కాదు అర్ధం .ప్రతిక్షణం అంటే యెడ తెరిపి లేకుండా .”పరమహంస హ్రుత్పద్మ విహారం-ప్రతి హత దశముఖ బల విస్తారం ‘అనటం లో ఆనందానుభూతి  ఉంది . ,అధర్మం చేసిన వాడు పదిముఖాలున్న వాడైనా ,ఎంత మొనగాడైనా ధర్మం చేతి లో చని పోవాల్సిందే అని సూచన వుంది .రాముడు పరబ్రహ్మ స్వరూపుడే మాయామానుష విగ్రహ రూపం గా అవతరించాడు .యోగుల హృదయాలలో ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటాడు .వాళ్ళు కూడా ఆయన దర్శనం తో పులకిస్తూనే వుంటారు .దశేన్ద్రియాలను అదుపు లో ఉంచుకున్న వాడు శ్రీ రామ చంద్రుడు .ఇంద్రియ వ్యామోహం తో చెలరేగిన వాడు రావణాసురుడు .అలాంటి ఇంద్రియ గర్వాన్ని బ్రహ్మాస్త్రం తో నాశనం చేసిన వాడు రాముడు .ఇంద్రియాలు అదుపు లో వుంటే మోక్షం అదుపు తప్పితే వినాశం .అనే గొప్ప సత్యాన్ని అనుకూల మైన పదాలను ఉపయోగించి భావ గర్భితం గా రాశారు సదాశివులు .ఎక్కడా ఒక్క అనవసర పదం వుండదు .ప్రతి మాట లో జరిగిన కధను గుర్తు చేసే వైనం వారిది .
                     ఇప్పుడు రామ రసాయనం లో మూడవ కీర్తన
03 —         పల్లవి –చేతః శ్రీ రామం చిన్తయ జీమూత శ్యామం “”
              చరణాలు —-01 -అంగీకృత తుంబురు సంగీతం — హనుమద్ గవయ గవాక్ష సమేతం ||
                               02 -నవరత్న స్థాపిత కోటీరం —-నవ తులసీ దళ కల్పిత హారం .
                               03 -పరమ హంస హృద్గోపుర దీపం —చరణ దళిత ముని తరుణీ శాపం ||
                 భావం —-మేఘశ్యామల దేహం కలవాడు ,తుమ్బురునిసంగీతానందాన్ని పొందిన వాడు ,హనుమ ,గవయ గావాక్షులతో నిత్యం సంచరించే వాడు ,నవరత్నాలు పొదిగిన జటాజూటం (కోటీరం )వున్న వాడు ,తులసి మాలలచే శోభించే వాడు ,పరమ హంసల హృదయ దీపం అయిన వాడు ,పాద స్పర్శ చేత అహల్యకు శాప విమోచనం చేసిన వాడు అయిన శ్రీ రాముని ధ్యానించమని మనసుకు బోధ చేస్తున్నారు బ్రహ్మేన్ద్రులు .”నవ రత్న స్థాపిత కోటీరం ,–నవ తులసీదల కల్పిత హారం ,”–”పరమ హంస హృద్గోపుర దీపం –చరన దళిత ముని తరుణీ శాపం ‘పదాలను అర్ధవంతం గా అవుచిత్యం గా ,పొదుపుగా వాడి బంధం సడలకుండా నిండుదనం చేకూర్చే నేర్పు ప్రతి పాదం లో ప్రస్ఫుటం గా కన్పిస్తుంది .హనుమ ఎంతటి భక్తుడైనా ,daggari వాడైనా ,నారద ,తుంబురుల సంగీతా జ్ఞాన పరీక్షలో తుమ్బురుని సంగీతమే గొప్పదని నిష్కర్ష గా చెప్పాడు శ్రీ రాముడు .సామర్ధ్యమే ముఖ్యం కాని స్వామి భక్తి మాత్రమే కాదని చెప్పే సంఘటన ఇది .అయినా హనుమతో సదా విహరిస్తూనే ఉంటాడు రాముడు .ఆయనా శ్రీ రాముని అనుసరించే ఉంటాడు .ధర్మమేరిగిన మహానుభావులు వారిద్దరూ అని మరో సారి గుర్తు చేస్తున్నారు సదాషేన్ద్రులు .
                    రామ రసం లో నాల్గవ కీర్తన సౌభాగ్యాన్ని దర్శిద్దాం
04 —-పల్లవి –పిబరే రామ – రసం,రసనే –పిబరే రామ రసం ||
          చరణాలు —౦౧-దూరీకృత పాతక సంసర్గం —పూరిత నానావిధ ఫల వర్గం ||
                         02 -జనన మరణ భయ శోక విదూరం–సకల శాస్త్ర నిగమాగమ సారం ||
                          03 -పరిపాలిత సరసిజ గర్భాండం —పరమ పవిత్రీకృత పాషండం ||
                          04 -వ్శుద్ధ పరమ హంస ఆశ్రమ గీతం -శుక శౌనక కౌశిక ముఖ పీతం |\
          భావం —-రుచిని గ్రహించే నాలుక కు రామ రసాయన పానం రుచిని ఎరుక పరుస్తున్నారు బ్రహ్మేన్ద్రులు .”పాపాల పొత్తును నాశనం చేసేది ,కర్మ ఫలాలను దూరం చేసేది ,జనన ,మరణ భయం పోగొట్టేది ,శాస్త్ర నిగమ ,ఆగమాల సరం అయినది ,బ్రహ్మాండాన్ని రక్షించి కాపాడేది ,పరమ నాస్తికులను కూడా పవిత్రం చేసేది పరమహంసలైన యోగుల ఆశ్రమాలలో అణు నిత్యం గానం చేయ బడేది ,శుక శౌనక ,కౌశిక మహర్షులచేత పానం చేయ బడే మధుర రసమే రామ నామం .నాలుకా  ! నువ్వు కూడా ఆస్వాదించి తరించు .’
                    విశేషాలు —ముఖ అంటే శుకుడు అని అర్ధం .వ్యాసుని కుమారుడే శుకుడు .పరమ వైరాగ్యం తో భాసించే వాడు .పుట్టుక  ,చావు వల్ల భయం ,శోకం కలుగు తాయి .పార్వతీ దేవి గురు స్థానం లోవుంది   బోధించినవి” నిగమాలు” .మహేశ్వరుడు గురువు గా బోధించినవి ఆగమాలు (శాస్త్రాలు).ఈ రెండింటినీ వేదాలు అనటం లోక రీతి .సరసిజ గర్భాండం అంటే హిరణ్య గర్భుడు -అంటే బ్రహ్మాన్డమే .పరమ పవిత్రీకృత పాషండం అన్నారు వాల్మీకి మహర్షిని .అంటే ఆటవికుడు గా వుండి  దేవునిపై ధ్యాసే లేకుండా  అనేక పాప కార్యాలు చేస్తున్నా ,ఉపదేశం పొందినా రామా అనటానికి బదులు తిరగేసి ”మారా ”అన్నఅజ్ఞాని ,వివేకం లేని వాడు .అలాంటి వాడిని ఉద్ధరించి మహర్షి వాల్మీకి గా మార్చిన దయాళువు శ్రీ రాముడు .అతని ఆంతర్యాన్ని గ్రహించి అనుగ్రహించాడు కాని ,అతని శబ్దోచ్చారణ చూసి కాదు అని భావం .జన్మతోనే తండ్రిని మించిన జ్ఞానం తో అవధూత అయిన వాడు శుక మహర్షి .కర్మ ద్వారా జ్ఞానం పొందిన వాడు శౌనకుడు .క్షత్రియత్వాన్ని వదిలి తీవ్ర తపస్సు తో బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మర్షి ఐన వాడు కౌశికుడైన విశ్వా మిత్రుడు .వీరంతా తర తమ భేదాలు లేకుండా రామ పరబ్రహ్మ నామామ్రుతాని కడుపారా గ్రోలారు .రామ రసాయనాన్ని ఆస్వాదించి ధన్యులయారు .మనమూ ,ఆ రామ రసాయనాన్ని జిహ్వాగ్రం తో రుచి చూస్తే ,పునరా వ్రుత్తి రహిత బ్రహ్మ పదమే లభిస్తుంది
                 రామ రసాయనం లో అయిదవాదీ  చివరిదీ అయిన కీర్తన  గురించి తెలుసు కుందాం
   05 –  పల్లవి —ఖేలతి మమ హృదయే రామ –ఖేలతి మమ హృదయే |
 చరణాలు —-01 –మోహ మహార్నవ తారక కారీ —రాగ ద్వేష ముఖాసుర మారీ |||\
                          02 -శాంతి విదేహ సుతా సహ చారీ  –దహరాయోధ్యా నగర విహారీ |||\
                          03 -పరమ హంస సామ్రోజ్యోద్ధారీ –సత్య జ్ఞానా నంద శరీరీ ||
                 భావం —సదాశివ బ్రహ్మేన్ద్రులు తన హృదయం లో ఆనంద తానడవం చేసే శ్రీ రామ పరబ్రహ్మాన్ని తనివి తీరా కీర్తిస్తున్నారు .”మొహం అనే సముద్రాన్ని దాటి రాగ ద్వేషాలు అనే రాక్షసులనుసంహరిం చే రాముడు –నా హృదయం లో హాయిగా ,చిదానందం గా ,ఆడుతున్నాడు .దేహభావం నశించటం వల్ల పుట్టిన పరమ శాంతి అనే సహచరిణి తో ,లోపల వుండే (దహర )అయోధ్యా నగరం లో శ్రీ రాముడు వున్నాడు .పరమ హంసలైన యోగుల ఆత్మ సామ్రాజ్య ఉద్ధరణ కోసం శ్రీ రాముడు సచ్చిదానంద రోపం లో ,నా హృదయం లో ఆడుతూ (ఖేలతి )వున్నాడు .
              విశేషాలు —-ఇదే ఆధ్యాత్మ రామాయణ అనుభూతి .ఆత్మా రాముణ్ణి తన హృదయం లో దర్శించుకునే పరమ ఉత్కృష్ట స్థితి .శ్ర్ర్ మద్రామాయణ  .కధ ఆధ్యాత్మిక మైన సాధన లో అనుభూతికి వస్తుంది .అని బ్రహ్మేన్ద్రులు తెలియ బరుస్తున్నారు .రాముడు రాముడు మాత్రమే కాదు రామ పరబ్రహ్మమనే భావన .మొదటి కీర్తన లో మనసుకు శ్రీ రామ తత్వాన్ని బోధించారు .మనసులో రామ ముద్ర వేశారు .ఆ ముద్ర స్థిరం గా నిలిచి పోవాలంటే అణు క్షణం రామ నామ స్మరణ చేయాల్సిందే నని రెండవ కీర్తన లో చెపారు .మనసు లో సదా శ్రీరాముని ధ్యానించి ,కాయన తత్వాన్ని ఆకళింపు చేసుకొని ,ఆరాధించమని మూడో దానిలో బోధించారు .నాల్గవ కీర్హన లో రామ రసాయనం కలి కల్మష నాశనం అని ,నిగమాగమ సారం అని ,అంతకు మించి ఇంకేమీ లేదని యోగుల హ్రుత్పద్మ నివాసి గా వుండి ,ఆనందాన్ని పంచె వాడు రాముడే నని తెలిపారు .అయిదవ కీర్తన లో –ఇవన్నీ ఆచరిస్తే -శ్రీ రాముడు మన హృదయం లోనే నిలిచి వుండి ,ఆనంద ఖేలనం చేసి తరింప జేస్తాడు .దేహభావం   నశించి ,పరమ ఉత్కృష్ట కాంతి భాసించి ,దహరా కాశం లో ఆత్మా రాముడు గా వెలుగు లీనుతూ ఆత్మను ఉద్ధరించి ,సచ్చిదానంద స్వరూపుడై ,ఆనందాన్ని అందిస్తూ ,తాను పొందుతూ రమిస్తూ ,, ,మోక్షాన్ని కల్గిస్తాడని సోపాన (మెట్లు) ప్రక్రియ గా తెలియ జేశారు సదా శివ బ్రహ్మేన్ద్రులు .అర్ధం కాక పోయినా ,ఆ శబ్ద మాధుర్యం ,నడక ,కూర్పు ,ధ్వని  ,రవళి ,దైహిక ,మానసిక ఆరోగ్యాన్ని ,ఆనందాన్ని అందాన్ని ఇచ్చి శ్రేయో దాయకం అవుతుంది .లలిత మైన పదాలు ,చెవులకు ఇంపైన మాటల ధ్వని ,మనోహర మైన శైలి భావ గాంభీర్యం ,తరచి చూస్తె లోతైన భావం సదాశివుల కీర్తన లలో నిండి వున్నాయి.వింటే చాలు పరమానందం ,పరమాద్భుతం .
                    ఇప్పటి దాకా రామ రసాయనం గ్రోలాం.ఇక క్రిష్ణామ్రుతం ను సేవిద్దాంవచ్చే భాగం నుండి .
                                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —17 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

శ్రీ సదాశివబ్రహ్మేన్డ్రుల కీర్హనలలోఅద్వాతా మృతం —2 ”రామరసం ”

శ్రీ సదాశివబ్రహ్మేన్డ్రుల   కీర్హనలలోఅద్వాతా మృతం —2
                                                                           ”రామరసం ”
                    శ్రీరాముని పై రాసిన మొదటి కీర్తన భజరే రఘువీరం .ఆ కీర్తనను పూర్తిగా అందిస్తాను
              పల్లవి —భజరే రఘువీరం ,మానస –భజరే రఘు ధీరం
              అనుపల్లవి –అం బుద డింభ విడంబన గాత్రం —అం బుద  వాహన నందన దాత్రం
              చరణం –01 -కుశిక సుతార్పిత కార్ముక వేదం –వశి హృదయాంబుజ భాస్కర పాదం
                               కుండల మండల మండిత కర్ణం –కుండల మంచక మద్భుత వర్ణం
               చరణం –02 -దండిత సుంద సుతాదిక వీరం –మండిత మనుకుల మాశ్రయ శౌరిం
                                పరమహంస మఖిలాగమ వేద్యం —పరమ వేద మకుటీ ప్రతి పాద్యం .
 భావం —-మన మనసును ఉద్దేశించి బ్రహ్మేన్ద్రులు ఉపదేశం చేస్తున్నారు .బహు ధీరుడైన రఘు వీరుణ్ణి భాజించమని మనసు బోధ చేస్తున్నారు .నీల మేఘ శకలం (ముక్క )కాంతిని వాదించే శరీర వర్ణం కలవాడు ,భక్తుడైన హనుమ కోర్కెలు తీర్చే వాడు ,విశ్వామిత్ర గురు అనుగ్రహం తో విలు విద్యను పొంది ,భక్తుల హృదయ పద్మాలకు వికాసాన్నిచ్చే సూర్య కిరణం అయిన వాడు ,చెవులకు వుండే కుండలాల శోభ చేత కనువిందు చేసే కర్ణాలు (చెవులు )వున్న వాడు ,ఆది శేషుని పాన్పుగా చేసుకుని నిద్రించే వాడు ,మారీచాది రాక్షసులను సంహరించిన వాడు ,మను వంశానికే వన్నె తెచ్చిన వాడు ,పరమహంస అయిన వాదూ ,వేదాల ద్వారా మాత్రమే తెలుసుకో తగిన వాడు ,వేదం ప్రతిపాదించిన వాటిలో మకుటాయమాన (peak )మైన వాడు ,అయిన శ్రీ రఘు రాముని భాజించమని హితవు చెప్పాడు
                    నిరా కారం అయిన బ్రహ్మ బుద్ధి శూక్ష్మం వల్ల,వేదం లో ప్రతి పాదించిన దాన్ని తెలుసుకోవటం వల్లనే తెలియ బడ తాడు .ఆకారం వున్న వాడు గా ఆకారం లేని వాడుగా రెండు రకాలుగా శ్రీరామ పరబ్రహ్మం కని పిస్తాడు .ఆయనను సేవించటం ఉత్తమం .”కుండల మండల మండిత కర్ణం –కుండల మంచక మద్భుత వర్ణం ”అనటం లో కుండల మంచక అంటే చుట్లు చుట్లు కోని వున ఆదిశేషుని పడక గా వున్న వాడు అని అంటే అనంత పద్మనాభుడు అని భావం .పదాల పరుగు మనసును శ్రీ రాముని మనోహర రూపం దగ్గరకు చేరుస్తుంది శబ్దాలన్నీ చెవులకు నాద శోభను కలిగిస్తాయి .పద నర్తనం ప్రత్యక్షం గా చూడ గలం .పదం ఎంత సాభిప్రాయం గా ప్రయోగించాడో ,అందులోని భావం కూడా అంత లోతుగా వుండటం బ్రహ్మేన్డ్రుల ప్రత్యేకత ..హాయిగా వినచ్చుఅర్ధం   తెలియక పోయినా ఆ శబ్దాలు మనసు లో నర్తిస్తాయి .చెవులకు ఇంపు కలిగించే పద శౌరభం లయ తో కూడిన నడక  సదాశివుల రచనా వైభవం .మనసు తో రాస్తారు కనుక మహా మహిమాన్వితం గా వుంది కీర్తన . .
                                          సశేషం
                                                        మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —26 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

కాసేపైనా నవ్వు కోండి ——దీపావళి స్పెషల్

      కాసేపైనా నవ్వు కోండి  ——దీపావళి స్పెషల్
 
  •  ఓకె పుస్తకం రెండు కోన్నా వెందుకు ?—ఈ పుస్తకం కొంటె సగం మార్కులు వచ్చినట్లే అని రాసి వుంది పూర్తి  . మార్కులు రావాలని రెండు కోన్నా
  • విస్కీ తో పాటు స్ట్రా క్కూడా తీసుకు రా —-స్ట్రాఎందుకు   సార్ —మందు ముట్టుకోనని మా ఆవిడకు ఒట్టేసి చెప్పా అందుకు
  • ఏమండీ కాస్త మా ఆయన్ను పిలుస్తారా ?—నంబెర్ ప్లీజ్ —-నీ బొంద –నాకేమైనా పది మంది మోగుల్లున్నారను కున్నారా ?
  • మీరు చూస్తె చిన్న లాయర్లా వున్నారు .నా కేసు ని వాదించ గలరా ?—–కంగారు పడ కండి మీ కేసు పూర్తి అయేసరికి పెద్ద లాయరునవుతాను .
  • సిస్టర్ ఒక బాటిల్ రక్తం ఇవ్వండి —ఏ గ్రూపు రక్తం ?–ఏ గ్రూపుది అయినా పరవా లేదు .నా గర్ల్ ఫ్రెండ్ కు లవ్ లెటర్ రాయ టానికి
  • పెళ్ళికి ముందు డబ్బు నీళ్ళ లాగా ఖర్చు పెడతానని బడాయిలు పోయారు .ఇప్పుడు మరీ ఏదడిగినా వెనకా ముందు చూస్తున్నా రేమిటి ?—అవును నీళ్ళను కూడా చాలా పొడుపు గా వాడుతాను నేను
  • ఒక బకరా గాడికి దారిలో వెయ్యి రూపాయిల నోట్ కనిపించింది .దాని మీద ”హాపీ న్యూ య్వర్ ”అని రాసి వుంది .వీడు నోట్ ని జేబులో పెట్టు కోని ,పర్స్ లోంచి తన  దగ్గరున్న ఇంకో వెయ్యి రూపాయిల నోట్ తీసి దాని మీద ”same  to you  ”  అని రాసి దారిలో వదిలేసి వెళ్ళాడు వెంగళప్ప
  • మహేష్ బాబు సినిమా పది సార్లు చూస్తాను —-నేను ఒక్క సారి చూస్తేనే నాకు అర్ధమై పోతుంది
  • బైకు  కాస్త    నెమ్మది గా   నడ  పండి   కళ్ళు  తిరుగు  తున్నాయి  —- పిరికి దాని లా మాట్లాడకు నేను మూసుకున్నట్లు కళ్ళు గట్టి గా మూసుకో
  •  2012  లో ప్రళయంవస్తుందట   ప్రపంచం మునిగి పోతుందట —-నమ్మకు .నేను వాషింగ్ మెషిన్ మొన్ననే కొన్నాను దాని మీద 2014 వరకు    గారంటీ అని వుంది
  • అర్ధ రాత్రి ఎంత ఆలస్యం గా ఇంటికి వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు వేడి నీళ్ళు కాచి రెడీ గా ఉంచుతుంది —ఎంత అదృష్ట వంతుడివి రా ?—-చలికాలం కదా చన్నీటితో గిన్నెలు తోమటం కష్టమని నాకోసం వేన్నీళ్ళుకాస్తుందిరా   తోమ టానికి
  • మీ తాత గారు కనిపించగానే అందరు ”విరోధి,విరోధి ”అని పిలుస్తా రెందుకు ?—ఆయన విరోధి సంవత్చరం లో పుట్టినందుకు —–ఇంకా నయం” రాక్షసనామ సంవత్చరం లో పుట్టలేదాయన
  •  పెళ్ళికి ముందు మీ ఇంట్లో కుక్క ఉండాలిగా? అవును వుండేది మా ఆవిడ దానికి మొరిగే అవకాశం ఇవ్వట్లేదు అందుకని పారిపోయింది –
  • డాక్టర్ గారూ మళ్ళీ నన్ను ఎప్పుడురమ్మంటారు ? ?–ఆర్ధికం గా బాగా కోలుకున్న తర్వాత
  • మమ్మీ డాడీలతో చాలా ఇబ్బంది గా వుందిరా __ఏమైంది ?—రాత్రి చదువు కొంటుంటే నిద్రపొమ్మని తిడ తారు .పొద్దుట పడుకుంటే లేపి చదువు కోమని వాయిస్తారు
  • మిడత ,ఉడత ,పిడత ,మడత ,చిడత ఇవేమీ టైటిల్స్ అయ్యా ?—-అవన్నీ ప్రముఖ హీరో ల పుత్రరత్నాలు             నటించ బోయే సినిమాలు  .”.చిరుత ”హిట్అయింతర్వాత   రిజిస్ట్రేషన్కోసం వచ్చిన పేర్లు అవి  .

  కాసేపైనా నవ్వు కోటానికి మీ కోసం సేకరించిన నవ్వుల పువ్వులు ఇవి .అనుభవించి ఆనందించండి దీపావళి రోజున  .
గబ్బిట దుర్గా ప్రసాద్                                                                                                              దీపావళి శుభా కాంక్షలతో —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -10 -11 .

Posted in రచనలు | 5 Comments

దీపావళి టపాసులు

  దీపావళి టపాసులు 
                      మనవళ్ళ కోసం చిచ్చుబుడ్లు   కూరుతున్నాను .మతాబాలు, అవ్వయిలు కట్టటం అయిపొయింది . saample గా కాల్చి చూశాను .బానే కాలాయి .ఇంతలో మా బామ్మర్ది బ్రహ్మం ఆదరాబాదరా రొ ప్పుకుంటూ వచ్చాడు .ఎక్కడి నుంచి రాక ? .ఏమిటా రొప్పుల మోత ?అన్నాను .చొక్కాతో చెమట తుడుచు కొంటు ”నీకేం బావ!! తాపీగా చిచ్చుబుడ్లు కూరుకుంటూ కూర్చున్నావు. అక్కడ  కొంపలంటు కుంటుంటే “”అన్నాడు .”అసలు విషయం చెప్పకుండా ఈ సుత్తేమిటి రా బాబూ ?”అన్నా..”.అదికాదుబావా -నిన్న ఒక చానెల్ లో నారదుడు రాజకీయ నాయకుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఎవరెవరు దీపావళి నాడు ఏమి కాలుస్తారు ?అని అడిగాడు .ఒక్కొక్కరు భలే తమాషా గా జవాబులు చెప్పారు .నువ్వు చూడ లేదా ?”అన్నాడు .”ఎన్నని చూడను ?దేన్ని చూడను  ?  బోరు కొడుతున్నాయి .నాకా ఓపిక లేదు ”అంటూ ఇంతకీ వాళ్ల సమాధానాలు ఏమి చెప్పారో చెప్పనే లేదు  ”అన్నాను .” ” సరే వినుబావా .ముందుగా కిరణ్ కుమార్ ను అడిగితే –”నేను రచ్చబండ లలో వచ్చిన ఆర్జీలను తీర్చలేక పోతున్నాను .చూసే టైంకూడా   లేదు . అందుకని దీపావళి నాడు వాటినన్నీ కాల్చేసి పండగ చేసుకుంటాను ”అన్నాడు .చంద్రబాబు ను అడిగితే ”విజయమ్మ నా మీద మూడు వేల పేజీల అభియోగాలు మోపింది .హాయిగా వాటిని కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తాను ”అన్నాడు .చిరంజీవిని అడిగితే ”ప్రజా రాజ్యం మాని ఫెస్టోలు,  బానర్లు ,రసీదు పుస్తకాలు ఇక పనికి రావు కనుక వాటిని కాల్చుకొని ఆనందం అనుభవిస్తాను ”అన్నాడు .కే.సి.ఆర్ ను అడిగితే ”ఏముంది అన్నా ! పనికి రాని శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ వున్నది కదా, దాన్ని బొందపెట్టి కాల్చి నుసి చేసి పండగ జేసుకునేది ”అన్నాడట .,
                   ”  ఇంతకీ మనం పండగ యెట్లా చేసుకుందాం బావా ?”అని అడిగాడు బామ్మర్ది బ్రహ్మం ”ఒరే –ఇంకా కాల్చటానికి ఏముందిరా .నలభై రోజులనుంచి పరువు కాల్చారు .ప్రతిష్ట మంటగలిపారు ,నీతి కి నిప్పు పెట్టారు .నిజాయితీని నిలువునా దహనం చేశారు .కుంభకోణాలతో దేశ గౌరవాన్నే తగలేశారు .గనుల్లో అవినీతి ఘనులు దేశ సంపదనే మసి చేసారు .సెజ్ ల పేర రైతుల వెన్నెముకలనే నుసి చేశారు .ఆందోళన పేరుతో ,సమ్మె ల పేరుతో జన జీవితాన్ని ప్రాణాలను కాల్చి బుగ్గి చేశారు .పంటకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ,చాలినంత కరెంట్ ఇవ్వకుండా రైతుల్ని క్రాప్ హాలిడే లోకి నెట్టి ,పంటలను మసి చేస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్న ప్రభుత్వానికి ,సంజాయిషీ చెప్పుకోలేని కేంద్రానికీ ,తెలంగాణా వస్తుందని ,ఇచ్చేస్తునామని ,వాళ్ళతో ,అబ్బే అదేమీ లేదు అని వీళ్ళతో గోడమీది పిల్లి వాటం గా ఏళ్ళకు ఏళ్ళు గడుపుతూ ప్రాణాల్ని బుగ్గి చేస్తున్నారు .అవును ఇంకా ఏమి మిగిలింది ?కాల్చు కోవటానికి ? సిగ్గు, శరం తప్ప ” ఆన్నాను .మా వాడికి బుర్ర తిరిగింది ‘.”బావా!!  బుద్ధి గడ్డి తిని నీ దగ్గర కొచ్చినందుకు చె౦పలేసుకొంటున్నాను . ఏదో సరదాగా నవ్వించి పండగ పూటా కాలక్షేపం చేద్దామని వస్తే ,నీ అక్కస్సంతా తీర్చుకున్నావు ””ఇక చాలు బాబూ .”అంటూ అసలు ఏం కాల్చుకు౦దామంటే సమాధానం చెప్పలేదు ”అన్నాడు .”మనం ఇప్పటికే ఒళ్లంతా కాల్చుకున్నాం రాష్ట్రం పేరుతో ”ఇంకేమీ కాల్చుకో నక్కర లేదు ”అన్నాను .బావా topik మారుద్దాం ఆనాడు వాడు .సరే అన్నా.  బజారులో కొత్త టపాసులు ఏమి ఉన్నాయిరా ”అని అడిగాను .బావా చెబితే నమ్మవు కాని చాలా వారైటీ లు వచ్చాయి ”అన్నాడు ”పేర్లు చెప్పి ఏడు ”అంటే మొదలు పెట్టాడు ”హర్షద్ ఔట్లు !!   రాజా  బా౦బులు !!  కని అవ్వాయిలు ,గాలి తూటాలు ,జగ్గు fighterlu ,ఎడ్డి కడ్డీలు ,అమర్ నోట్ల అవుట్లు ,గడాఫీ బంగారు బిస్కట్లు ,మరాండీ మతాబాలు ,లాడెన్ లౌడ్ బ్రేకర్స్ ”అన్నాడు .”హాయిగా అవి కోనికాల్చు కొక   పొద్దున్నే ఈ కూరుడేమిటి బావా .నీ చాదస్తం తో అందర్నీ బాదిస్తున్నావ్ ”అని సలహా పారేశాడు .”ఒరే .-కొనటానికి వెళ్ళా .కాని అవ్వాయి రేట్లు ఆకాశాన్ని చూస్తున్నాయి మతాబాలు తబలా దెబ్బల్ల ఉన్నాయి .చిచ్చు బుడ్ల రేట్లు చెలరేగుతున్నాయి ..నేలటపాకాయలు నేలలోనే వున్నాయి బయటికి రావటం లేదు చాలా కాలంగా .జిల్లీలు జెల్లీ చేపల రేట్లను తలపిస్తున్నాయి .పాము  బిళ్ళల రేట్లు అందకుండా పారి పోతున్నాయి .కాకర పువ్వొత్తులు కోర కోరా చూస్తున్నాయి .రోలు రోకలి మందు లేనేలేదు .దివిటీలు లేవు .భూచక్రాల రేట్లు కళ్ళు తిరిగే లా వున్నాయి .విష్ణు చక్రాలు తల తిరిగే రేట్లలో  వున్నాయి ”అ౦దుకే  కొన కుండా తిరిగి వచ్చి ఈ పనిలో పడ్డా .”అన్నాను” బ్రహ్మం !అవేవో హస్బండ్ వాలాలు ట ఏమిటిరా అవి !! “?అని అడిగాను .వాడు మతాబా నవ్వు నవ్వి ”అవి థౌసంద్ వాలా బావా హస్బండ్ వాలా కాదు ”అన్నాడు .”ఇదివరకు టెలిఫోన్ లని వచ్చేవి ఇప్పుడు లేవా ?”అడిగాను .”ఇంకేం ఫోన్ లు బావా అంతా సెల్ లేగా -కొన్ని సెల్లులు పేలుతున్నాయిగా ఇంకా  బా౦బు లె౦దుకు “‘అన్నాడు .”ఏరా !! తెలంగాణా   ,ఆంధ్రా ,విశాలాంధ్ర ,సమైక్యాంధ్ర ,సీమాంధ్ర,రాయల  తెలంగాణా   బాంబులు రాలేదా “‘?అని అడిగితే వాడు ‘అవి రోజూ పెలుస్తూనే ఉన్నారుగా బావా!! పేపర్ వాళ్ళు, చాన్నేల్ వాళ్ళు, రాజకీయులు అన్నాడు .ఒరే నీకూ జోకుల డోకులు  బానే వస్తున్నాయిరా ”అన్నాను .నవ్వాడు వాడు .”సరే బావా వెళ్ళొస్త.ఇంటి దగ్గర మీ చెల్లెలు ఎదురు చూస్తు౦టుంది.ఆలస్యమైతే మాటల బాంబులు పేలుస్తుంది ”అంటూ జారుకున్నాడు .
                        దీపావళి శుభా కాంక్షలతో —మీ –దుర్గా   ప్రసాద్  —25 -10 -11 .
—

Posted in సమయం - సందర్భం | 2 Comments

తెలిసిన పాటలు – తెలియని మాటలు

03.రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ అర్థ విశేషాలు ((25-10-2011 తేదీన  మరికొంత విషయం కలుపబడింది.)

 

తిరుమల గర్భగుడి లోని శ్రీ రాముడు ఫట్నం సుబ్రమణ్య అయ్యర్

(చాయా చిత్రాలు:గూగుల్ సౌజన్యం)

 

తమిళనాడు తంజావూరు జిల్లాలో తిరువాయూర్ లో జన్మించిన   ఫట్నం  సుబ్రమణ్య అయ్యర్ (1845 – జూలై 31, 1902)  చక్కటి  స్వరకర్త. త్యాగరాజ ప్రభావితులు. వారి ప్రసిద్ధ కృతి “రఘువంశ సుధాంబుధి”. ఈ కీర్తన అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకొందాం.

 

పల్లవి:

 

1.రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ

 

రామ రామ రాజేశ్వర

 

అనుపల్లవి:

 

2.అఘ మేఘ మారుత శ్రీకర

 

అసురేంద్ర మృగేంద్ర వర జగన్నాథ

 

చరణం1:

 

3.జమదగ్నిజ గర్వ ఖండన జయ రుద్రాది విస్మిత భండన

 

కమలాప్తాన్వయ మండన అగణిత అ ద్భు త శౌర్య శ్రీ వేంకటేశ్వర

 

చరణం2:

 

4.భృగునందనా కవిభంజనా బృందారక బృందహితా

 

నిగమాంతవ సుబుధావనా నీరజాక్ష శ్రీ వేంకటేశ్వర

 

 

 

భావం

 

1.శ్రీరామా! రఘువంశము అనే అమృతసాగరమును వృద్ధి పొందించు చంద్రుడా! రాజులకు అధిపతీ   !

 

2. పాపమనే మేఘాలను తరిమికొట్టే  పెనుగాలివంటి వాడా! శుభాన్ని ఇచ్చేవాడా! , రాక్షస శ్రేష్ఠులకు సింహములాంటి వాడా! శ్రేష్ఠుడా ! జగత్ప్రభూ!

 

3.జమదగ్నికి జన్మించిన పరశురాముని గర్వము పోగొట్టిన  వాడా! శివుడు మొదలైన వారికి  యుద్ధంలో  ఆశ్చర్యం కలిగించి విస్మయము కలిగించిన వాడా ! కమలాలకు ఇష్టుడైన సూర్యుని వంశంలో జన్మించి, ఆ వంశానికి అలంకారమైన వాడా ! లెక్కపెట్టడానికి వీలులేని అద్భుతమైన పరాక్రమము కలిగిన వాడా! , శ్రీ వేంకటేశా!

 

4. భార్గవరామా! , శుక్రునిజయించిన  వాడా!,  దేవతల బృందానికి రక్షకుడా!  వేదాంతమునుచదువుకొనే  గొప్ప గొప్ప పండితులనురక్షించే వాడా, కమలముల వంటి కన్నులు కలవాడా!  శ్రీ వేంకటేశా!

 

అంతరార్థం

 

రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ

 

ఇక్ష్వాకు వంశంలో రఘువు అనే  మహారాజు జన్మించి అత్యద్భుతమైన దాన పరాక్రమ విశేషాలు ప్రదర్శించాడు కనుక అతని పేరు మీదుగ ఇక్ష్వాకు వంశానికి రఘువంశమనే పేరు వచ్చింది.

 

పౌర్ణమినాడు చంద్రుని చూస్తే సముద్రం పొంగుతుంది. దీనిని వర్ణించటం మన కవులకు చాలా ఇష్టం.

 

రఘు మహారాజు పుట్టినప్పుడు , దిలీప మహారాజు   మొట్ట మొదటిసారి చూసాడు. చంద్రోదయ కాలంలో సముద్రం అనందం పొంది ఒడ్డులని ఒరుసుకొన్నట్లు , పుత్రున్ని చూసిన ఆనందం దిలీప మహారాజులో ఇమడలేక బయటికి వచ్చిందని కాళిదాసు మనోహర వర్ణన. (రఘు వంశం-03-17 శ్లో)

 

శ్రీరాఘవం ధశరధాత్మజమప్రమేయం

 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

 

ఆజానుభాహుం అరవిందదళాయతాక్షం

 

రామం నిశాచర వినాశకరం.. నమామి…

 

అనే శ్లోకం మనందరికీ తెలిసిందే. ఇందులో రఘుకులాన్వయ రత్నదీపం  అనే సమాసానికి రాముడు రఘుకులమనే  సముద్రానికి చంద్రుడిలాంటి వాడని పెద్దలు అర్థం చెబుతారు.  ప్రాచీన కవులందరికీ   ఇష్టమైన ఈ “సముద్ర చంద్ర” సమాసానికి “సుధ” అనే విశేషణం అదనంగా చేర్చి పట్నం వారు ఈ కీర్తనలో రాముని సంబోధించారు.

 

అఘ మేఘ మారుత శ్రీకర

 

పాపానికి ఇంకోపేరు అఘం.   కర్తని  పొందేది, దుఃఖాన్ని   విడువనిది అఘం.  ఈ అఘం మేఘంలాంటిదట. “మేహతీతి మేఘః”  తడుపుతుంది కాబట్టి మబ్బుని మేఘమన్నారు.

 

పుణ్యపు వెలుగుకి అడ్డువచ్చి , బతుకును చీకటి చేసేది మేఘం. ఈ  మేఘం- గాలివల్ల  తొలిగితే మళ్ళీపుణ్యాల వెలుతురు. రామచంద్రమూర్తి మన పాపాల మేఘాలను  తొలగించే శీతల స్పర్శ ..

 

అసురేంద్ర మృగేంద్ర వర జగన్నాథ

 

అసురులంటే రాక్షసులని సామాన్యార్థం.అసురులనే పేరు వాళ్ళకి మూడు కారణాల వల్ల వచ్చింది.

 

1.సుర(అమృతము ) లేనివారు కాబట్టి అసురులు.

 

2.దేవతలు (సురులు)కానివారు కనుక అసురులు.

 

3.అసువులంటే ప్రాణాలు. వీటిని గ్రహించేవారు కనుక అసురులు.

 

ఇటువంటి రాక్షసులలో మహా భయంకరులైన వారి పాలిటి సింహంగా రాముడిని పట్నం వారి వర్ణించారు.

 

అసురేంద్రుడంటే హిరణ్య కశిపునిగా , మృగేంద్ర అంటే నరసింహావతారంగా కూడా స్వీకరించవచ్చు.

 

“వర” శబ్దాన్ని కవులు శ్రేష్ఠమైన అనే అర్థంలో తరచుగా వాడుతుంటారు. ఉదాహరణకి త్యాగరాజ స్వామి వారు   “మానస వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారు’ (ఎందరో మహానుభావులు) ప్రయోగించారు. చిన్న త్యాగరాజుగా ప్రసిద్ధి పొందిన పట్నం వారు కూడా “‘శ్రేష్ఠుడైన జగన్నాథుడా'” అనే అర్థంలో రాముడిని “వరజగన్నాథా ”   శబ్దంతో  సంబోధించారు.

 

జమదగ్నిజ గర్వ ఖండన

 

ఋచీకుడు అనేవాని  కుమారుడు జమదగ్ని. ఆ

 

ఆ జమదగ్ని కొడుకు  పరశురాముడు. (జమదగ్నిజ) .ఆయన  భార్య పేరు  రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.

 

పరశురాముడు  .కూడా తక్కువ వాడు కాదు. దశావతారాలలో ఒకడు.

 

ఇరువదియొక్క మాఱు ధరణీశులనెల్ల వధించి తత్కళే

 

బర రుధిర ప్రవాహమున బైతృక తర్పణమొప్పజేసి భూ

 

సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై

 

ధరణినొసంగితీవు కద దాశరధీ కరుణా పయోనిధీ.(రామదాసు)

 

 

 

క్షత్రియ రుధిర మయే జగదపగతపాపమ్

 

స్నపయసి పయసి శమిత భవ తాపమ్

 

కేశవ! ధృత భృగుపతి రూప!

 

జయ జగదీశ ! హరే! (జయదేవుడు)

 

ఇలా మహాకవుల చేత స్తుతి పొందిన వాడు పరశురాముడు.

 

“పరాన్ శృణాతీతి పరశుః” శత్రువులను హింసించునది అనే అర్థంలో గండ గొడ్డలిని పరశువు అన్నారు. దానిని ధరించిన వాడు పరశురాముడు.

 

పరశురామునిది ఆవేశావతారం. ఒక పనికోసం జీవునిలో భగవంతుని తేజస్సు ఆవేశిస్తే దానిని ఆవేశావతారం అంటారు. ఇటువంటి ఆవేశావతారాలు పూజించదగినవి కావని పద్మ పురాణంలో ఉంది. (నోపాస్యహి భవేత్తస్మాత్ భక్త్యావేశాత్మహాత్మనః )పూర్ణావతారం,(రాముడు)  ఆవేశావతారం(పరశురాముడు)  రెండు కలుసుకొన్నప్పుడు  పూర్ణావతారంలో  ఆవేశావతారం కలుస్తుంది. పరశురాముని విషయంలో ఇదే జరిగింది.  దీనినే గర్వ భంగం  జరిగినట్లుగా పట్నం వారు పేర్కొన్నారు.

 

పరశురాముడు రామునితో అన్న మాటలు:

 

“ఓ రామా! నీకు శక్తి ఉంటే  శత్రు  పురాలను జయించే బాణాన్ని ఈ వైష్ణ వ ధనుస్సుకు సంధించు. అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధం చేయటానికి నిన్ను అనుమతిస్తాను. (వాల్మీకి రామాయణం- 75వ సర్గ 28-29 శ్లోకాలు) శక్తి ఉంటే ( యది శక్నోషి ) అనే మాట గర్వంతో కూడుకొన్నది. ఆధునిక కాలంలో కూడా “నీకు దమ్ముంటే రా రా! చూసుకొందాం ! “అనే మాటలు వింటుంటాం కదా! ఇటువంటి గర్వోక్తులనే పరశురాముడు పలికాడు. “నాతో యుద్ధం చేయాలంటే ఒక అర్హత కావాలి.ఈ వైష్ణవ ధనుస్సు సంధిస్తే నాతో యుద్ధం చేసే అర్హత నీకు కల్పిస్తాను” అనే  మాటలు  కూడా ఇంకా గర్వంతో కూడుకొన్నవి. శ్రీ రాముడు ఆ వైష్ణవ    ధనుస్సును ఎక్కు పెట్టగానే  భార్గవ రాముడు తేజస్సు  కోల్పోయాడు. (76వ సర్గ-11వశ్లోకం) ఇదే గర్వ భంగం .

 

(25-10-2011 సశేషం )

 

నాకు నచ్చినది – మీకోసం

 

http://tadepallipatanjali.hpage.in/

 

 

Posted in సేకరణలు | Leave a comment

గురజాడ 150 జయంతి – వార్తా పత్రికలలో …

IMG

Posted in వార్తా పత్రికలో, సభలు సమావేశాలు | Leave a comment

ఆవరణం- డా. దేవరాజు మహారాజు


Aavaranam

Posted in రచనలు | Leave a comment

నవ దీపావళి

           నవ దీపావళి  
                         నరకు లేక్కడో లేరు బాబూ
                         నీ నా మధ్యనే నక్కి వున్నారు
                         స్వార్ధం పెంచి ,దౌష్ట్యం నించి
                         విర్రవీగే వారంతా ఎవరనుకున్నావ్
                        బందులు చేయించే వాళ్ళు ,
                        స్కూళ్ళు మూయిన్చేవాళ్ళు
                        పసిపిల్లల్ని హత్యచేసే వాళ్ళు
                       ఆసిడ్ దాడితో జీవితాలతో
                        చెలగాటం ఆడే వాళ్ళు
                        అందరు నరకాసురులే
                        వీళ్ళను సంస్కారం అనే
                        మందుతో కూరి
                        కాల్చండి చిచ్చుబుడ్లు
                        కోపం గంధకం తో ,మార్పు
                       అనే రజను తో మతాబా కూరి
                      వెలిగించండి వెలుగు దివ్వెలు
                      చిటపట మనసులు కొరకొర చూపుల
                     సిసిన్ద్రీలతో కవ్వించే వారిని
                     క్షమాగుణంవెన్న ముద్దలు   వెలిగించి
                     శాంతి కలిగించండి ,ఆనందం పంచండి
                    మనశ్శాంతి లేకుండా చేసే మానవ హంతకుల గుండెల్లో
                    ఔట్లు బాంబులు పెలేట్లు
                    మాటల తూటాలు పెల్చండి
                    .కాకరపువ్వత్తుల్లాంటి
                    కారుణ్య పు చిరు వేలుగులివ్వండి .
                   దుర్మార్గాన్ని ,హింసను
                   అవ్వాయిచువ్వాయిలు చేసి అంటించి
                  ఆకాశం లోకి వదలండి .
                  కాలి మసై పోతాయి
                గుండె నిండు గా మంచి అనే
                మతాబా వెలిగించండి
                ఆ కాంతుల్లో జగతిని
                వెలుగు వెల్లువతోనింపండి
                 ఈ దీపావళి  నాడు శోకావలిని పోగొట్టి
                జ్ఞాన జ్నోత్నావళి గా మార్చండి .
                                                                               దీపావళి శుభా కాంక్షలతో
                                                                            మీ— గబ్బిట దుర్గా ప్రసాద్ —25 -10 -11 .
Posted in కవితలు | Leave a comment

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతామృతం —1

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతామృతం —1
                                                                     జీవితం
                         ”భజరే రఘువీరం –మానస భజరే రఘువీరామ్ ”–”సర్వం బ్రహ్మమయం రేరే ”—బ్రూహి ముకున్దేతి ”—క్రీడతి వనమాలీ ”—”పిబరే రామ రసం ”–”మానస సంచరరే ”మొదలైన భక్తీ కీర్తనలతో భక్తీ,జ్ఞాన ,వైరాగ్యాలు అనే త్రివేణీ సంగమాన్ని సృష్టించిన భక్త మహాకవి శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్రులు ..ఆ కీర్తనలను తన స్వరమాధుర్యం తో అమృతమయం చేసి గానంతో సకల జనులను భక్తి లహరి లో ముంచి తేల్చిన ప్రముఖ వాగ్గేయకారులు పద్మవిభూషణ్ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ .బంగారానికి తావి అద్దారు .వింటుంటే మానసం ఎక్కడికో సంచారానికి వెళ్తుంది .ఎక్కడి కేమిటి ఆ పరబ్రహ్మ సందర్శనకే .బ్రహ్మ పదానికి చేరువ చేస్తుంది .అట్టి మహనీయ కేర్తనలో ఆధ్యాత్మిక భావం అంతరంగాన్ని ప్రక్షాళనం చేసి రసోవై సహ అనిపిస్తూ  అద్వైతామృత వర్షాన్ని కురిపించి తనియిమ్పజేసి ,తరింప జేస్తుంది .ఆ మహామహుని దివ్య జీవిత తరంగినిని దర్శించి ధన్యులమవుదాం.
                       బ్రహ్మేన్డ్రుల అసలు పేరు శివ రాముడు .ఆంధ్రుల ముద్దు బిడ్డ మన సదాశివుడు .తండ్రి మోక్ష సుందర అవధాని .తల్లి పార్వతమ్మ .18 వ శతాబ్దం లో తమిళనాడు లో కాఎరి తీరం లో కుంభకోణం దగ్గర చిన్న గ్రామం లో జన్మించారు .చిన్నతనం నుంచే వైరాగ్యం అలవడింది పిల్లాడు .ఎమైపోతాదేమో నని భయం తో పెళ్లి చేశారు .భార్య పుష్పవతి అయిందని కబురు వచ్చింది తల్లి పిండివంటలు చేస్తోంది .ఇంటికి వచ్చిన బ్రహ్మేన్ద్రుని ఆత్రం చూసి కాసేపు ఆగమనీ ,అత్తవారింటికి వాటిని తీసుకు వెళ్లాలనీ చెప్పింది .అప్పటికప్పుడు ఆయన మనో కవాటం తెరుచుకుంది .విషయవాసనలు వుంటే పడిగాపులు తప్పవు అని జ్ఞానోదయమయింది .ఏదో తెలుసుకోవాలనే కాంక్ష మిన్ను ముట్టింది .పరమశివేంద్ర గురు దర్శనం చేసి ,అనుగ్రహం పొందాడు ఆయన ”సదాశివ బ్రహ్మెంద్రుడు ”అనే పేరు పెట్టి ,శాస్త్ర బోధ చేశాడు .తర్కం అంతు చూశాడు .అందరిని వాదానికి పిలిచి గెలిచి,ఓడినవారిని హేళన చేశాడు .అతని అతి ప్రవర్తనను ,వాచాలత్వాన్ని గ్రహించిన గురువు ”సదాశివా !నీ నోరు ఎప్పుడు మూత పడుతుంది ?అని తీవ్రం గా అన్నాడు .వెంటనే శిష్యుడు ”ఇదిగో ఇప్పుడే ”అనినమస్కారం చేసి బయటకు వెళ్లి పోయాడు .ఇలావైరాగ్యమూ  ,మౌనము ఆయనకు క్షణాలమీద కలగటం ఆశ్చర్యం .మౌన ముద్రాలన్క్రుతుదయాడు . .మనస్సును పరబ్రహ్మం పై లగ్నం చేసి ,పర్సమహంస లా ఉన్మత్తునిలా సంచరించ సాగాడు .గురువుకు విషయం తెలిసి తన కంటే తన శిష్యుడు ధన్యుడయాడని భావించి పరవశించాడు .
                  పుదుక్కొట సంస్థానాదీశుడు సదాశివులను దర్శించి మహిమను గుర్తించి ఉపదేశం కోరాడు .ఇసుక మీద మంత్రం రాసి మౌన ఉపదేశం చేశాడు .ఆ పవిత్ర అక్షరాలున్న ఇసుకను ,మట్టితో సహా తవ్వించి తన పూజా మందిరం లో భద్రపరచుకున్నాడు రాజు .బ్రహ్మేన్డ్రుల ఆత్మ జ్యోతి ప్రకాశిస్తున్న కొద్దీ ఆయన చేష్టలన్నీ మహిమాన్వితమవుతున్నాయి .ఒక రైతు ధాన్యం నూర్చి రాసిగా పోసిన చోట అసంగతం గా బ్రహ్మేన్ద్రులు వెళ్లి కూర్చుని ధ్యానం లో మగ్నమయారు .రైతు రాత్రి కాపలాకు వచ్చి ఆయన్ను దొంగగా బావించి కొట్టబోతే చెయ్యి అలాగే స్తంభించి పోయిందట .తెల్లవారి సమాధిలోంచి లేచి రైతువంక చూస్తూ,వెళ్ళిపోగానే రైతు చెయ్యి మళ్ళీ స్వాధీనం లోకి వచ్చిందట .ఇంకోసారి ఒక పెళ్ళికూతుర్ని పాము కరిస్తే సదాశివుల అనుగ్రహం తో ఆమె లేచి కూర్చుందట .మరోసారి తన్మయత్వం లో పాడుకుంటూ వెళ్తుంటే ,ఒక డేరా లో నిద్రిస్తున్న నవాబుకు నిద్రాభంగమయి ,పిచ్చి కోపంతో బ్రహ్మేన్డ్రుల చేతిని కత్తి తో   నరికేశాడట .రక్తం ప్రవాహం గా కార్తోంది .నగ్నం గా నడిచి పోతున్న ఆయనకు బాహ్య స్పృహ లేదు .తప్పు తెలుసుకున్న నవాబు పాదాలపై పది క్షమించమని ప్రార్దిన్చాదట .”దేనికి క్షమాపణ ?అన్నారట యతీంద్రులు. ”మీరెవరో ఎలీక మీ చేయి నరికాను స్వామీ ”అని ఏడ్చాడట నవాబు .”నా చేయినా ”అంటూ చేతి వంక చూసుకున్నాడట .చెయ్యి కనిపించలేదు .క్రింద .పడి వుంది .దాన్ని తీసుకొని యద్గాస్తానం లోపెట్టుకోగానే  పెటు  అతుక్కు పోయిందట .మళ్ళీ పాడుకుంటూ ,తనకేమీ తెలియని స్థితిలో వెళ్లిపోయారట బ్రహ్మేన్ద్రులు .
కొడుమూడు అనేఉపనది   ఒడ్డున సమాధి స్థితి లో వుండగా ,అకస్మాత్తుగా వరద వచ్చి అంతా ముంచేసింది .అందరు హెచ్చరిస్త్యన్నా ,సదాశివులకు ఏమీ పట్ట లేదు .శరేరం వరదలో కొట్టుకు పోయి ఇసుక లో కూరుకు పోయింది .నాలుగు నెలల తర్వాత రైతులు ఇసుక మేట ను తవ్వు తుంటే శరీరం బయట పడింది .జనమంతా ఆశ్చర్య పోయారు .ఆయన సమాధి నుంచి లేచి ,మాట్లాడ కుండా వెళ్లి పోయారు .బ్రహ్మేన్ద్రులు చిన్న పిల్లల తో చాలా సరదాగా గడిపే వారట .ఒకసారి పిల్లలంతా ఆయన చుట్టూ చేరి తిరువాలూర్ లో జరిగే సంబరాలు చూపించమని కోరారట .వాళ్ళందర్నీ తన దగ్గర కూర్చో పెట్టుకుని ,తాకుతూ ,కళ్ళు మూసుకో మాన్నాడట /.కళ్ళు తెరిచేసరికి అందరు తిరువళ్లూర్ లో ఉన్నారట .ఉత్చవాలు చూపించి ప్రసాదాలు ,తినుబండారాలు కొనిచ్చి మళ్ళీ కళ్ళు మూసుకో మన్నారట .కళ్ళు తెరిచే సరికి వాళ్ల వూరు ”కరూర్ ”లో ఉన్నారట .ఆయన ఆ గ్రామం లోనే స్థిర పడ్డారు .పిల్ల లంతా పెద్దవాళ్ళకు చెప్పి ,తాము తెచ్చినవాన్నే చూపిస్తే అందరు ఆశ్చర్య పోయారట .
                 జ్యేష్ట శుద్ధ దశమి నాడు తాను దేహ త్యాగం చేస్తానని ,కరూర్ లోనే తనను సమాధి చేయమని ,కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు శివలింగాన్ని తెస్తాదనీ ,దాన్ని తన సమాధిపై ప్రతిష్టించమని భక్తులకు ముందే చెప్పి బ్రహ్మైక్యం చెందిన పరమ హంస సదాశివ బ్రహ్మేన్ద్రులు .పుదుక్కొట సంస్తానాదీశులే ఇప్పటికీ సమాధి సంరక్షణ చేస్తూ వుంటారు .
                        సదాశివెంద్రులు చాలా గ్రంధాలు రాశారు .బ్రహ్మసూత్రాలకు   అద్భత వ్యాఖ్యానం రాశారు .”ఆత్మ విద్యావిలాసం ”,’శివ మానషిక పూజ ‘వారి ప్రఖ్యాత రచనలు .వీటన్నిటికంటే బాగా ప్రచారం లో వున్నవి వారి కీర్తనలు .అవి ఇరవై నాలుగు మాత్రమే .వాటి లోని భాషా మాధుర్యం ,శైలి ,భావం ,గాంభీర్యం ,భక్తి,ఆధ్యాత్మిక సంపద ముగ్ధుల్ని చేస్తాయి .అద్వైతామృత వర్షం కురిపించారు ..ఆత్మ బోధ చేశారు .అర్ధ గాంభీర్యం తో పాటు సంగీతా మాధుర్యం తొణికిసలాడే కీర్తనలు అవి .”అద్వైతం త్రిషు లోకేషు–నా ద్వైతం గురునా సహా ”అన్నది శ్రీ సదాశివుల బ్రాహ్మీ భావం .అలాంటి పరమ గురువు ప్రణామం చేస్తూ ,ఆఅద్వైత భావ   లహరి లో తరిద్దాం ..ఆరస గుళిక లను  ఆస్వాదిద్దాం .
                      ఇందులోఅయిదు  శ్రీరాముని పరంగా ,ఎనిమిది  కీర్తనలు శ్రీ కృష్ణునిపై ,మనసును ఉద్దేశించి ఆత్మబోదగా అయిదు గురువు పరమశివెంద్రులను కీర్తిస్తూ ఒకటి ,గంగానది పరంగా ఒకటి మిగిలిన నాలుగు బ్రహ్మానందానుభవం గా రాశారు .ఇవి సోపాన క్రమం లో వుండి మోక్ష సాధనకు మెట్లుగా కనిపిస్తాయి .గురు సాన్నిధ్యం లోనే చిత్త వికారాలు తొలగి మనసు పరిపూర్నమవుతుందని  చెప్పారు .చివరి కీర్తన గంగామతల్లి పై రాసిన సంగతి చెప్పాను .భారతీయ ఆధ్యాత్మిక భావనకు ,అనుభవాలకు తర తరాల సాక్షీభూతం గా నిలిచింది పవిత్ర భాగీరధి .బ్రహానందం,అమ్రుతానందం.ప్రణవమే సర్వార్ధ సాధకంఅన్నార బ్రహ్మేన్ద్రులు .అమేయమైన అనుబూతి కలిగించే ఆ కీర్తనా వైభవాన్ని ”రామ రసాయనం ”గా .”క్రిష్ణామ్రుతం ‘గా ,”ఆత్మానందం ”గా ,”బ్రహ్మానుభూతి ”గా వింగడించి తెలుసు కోని ,ఆ అమ్రుతానందాన్ని అందుకొందాం .మానషిక పున్డరీకాన్ని శత పత్ర వికసనం చేసు కుందాం .దివ్యానందాన్ని అనుభవిద్దాం .శ్రీ సదా శివ బ్రహ్మేంద్ర పరమహంస పవిత్ర కీర్తనామ్రుతాన్ని తనివి తీర గ్రోలి మోక్షాన్ని పొందుదాం .
                                             సశేషం
                                                                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —25 -10 -1
Posted in రచనలు | Leave a comment

తెలుగు బాషా కేంద్రం మైసూర్ లోనా ?

Telugu peetamu 1

Posted in సేకరణలు | Leave a comment

” ప్రపంచ తెలుగు – తొలిఅడుగు ” సభ

Prapancha Telugu

Posted in సభలు సమావేశాలు | 2 Comments

మంచి నియంత గడాఫీ

Gaddafi

Posted in సేకరణలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం —–7

                      గురజాడ కన్యాశుల్కం —–7
                                                      ఆని ముత్యాలు అనిపిస్తూ జనం నోట నిత్యం వినిపించే అనిపించే often quoted lines
                  కన్యాశుల్కం నాటకం ఆంద్ర జనజీవితం లో కలిసి పోయింది .అందులోని మాటలు అన్నీ జనం నోట ఏదో సందర్భం గా  పలకబడేవే .అవి అంటూ సందర్భాన్ని పుష్టి పరిచేవే .అందులో నవ్వు పుట్టిన్చేసేవీ ,.  ,పరిహాసం చేసేవీ ,అశాదభూతిత్వాన్ని చాటేవీ ,తప్పించుకోవటానికి అతుక్కు పోయేవీ ,నమ్మకం కలిగించేట్లు చేసేవీ ,అవి అన్నీ ఇన్నా నా ఎన్నో .అన్నిటిని వినాల్సిందే సారి చదవాల్సిందే .ఆ మాటల వైభోగం చూడండి
          బిచానా ఎత్తేయటం —అట్నుంచి నరుక్కు రమ్మన్నాడు –ఏమివాయ్ మై డియర్ shakespere  —  నాతో మాట్లాడటమే వో ఎడ్యుకేషన్ –మనవాల్లోట్టి వెధవాయిలోయ్ — బొట్లేరు ఇంగ్లీష్ –పిల్లా అగ్గిపుల్లా –ఈ శషభిషలు పనికి రావు —తాంబోలం ఇచ్చాను ఇహ తన్నుకు చావండి –కాపర్సేమయినా ఉన్నాయా —చెట్లకు చేవ నలుపు ,మనిషికి చేవ తెలుపు (జుట్టు తెల్లబడటం )–నమ్మినచోట చేస్తే మోసం ,నమ్మని చోట చేస్తే లోక్యవూ –నకార ప్రయోగం చేయకు (నువ్వు అని పిలవటం )–  two birds at one shot –సత్రాభోజనం ,మఠా నిద్రా —అన్యాయం పాప నాశనం –మాటలు నేర్చిన శునకాన్ని వేటకు పంపితే వుసుకో మంటే  వుసుకో  మందట.–పిత్రార్జితం అంతా కరారావుడు చుట్టేశాను (అవగోట్టేశాను )–అన్చారాష –వస్తున్నారాష —దాని తస్సా దియ్యా –చక్రం అడ్డం వేయడం –అచ్చాణీ –కందిగుండాచమే ,ఇంగువాచమే –తొమ్మిదో అష్టం ఘనం పారాయణ చేస్తాడు (బూతులు మాట్లాడుతాడు )—వల్లకాట్లో రామ నాదాయ (అనామకుడు )—లాంతరేశావు (పేకాటలో చేతులేతేయటం )–సకేశా ,అకేశా /(జుట్టున్నదా ,విధవా?)–మ్ముక్కస్య ముక్కర్ధః( భావం తెలీకుండా –ఏమాటకు ఆమాట అర్ధం చెప్పటం )—పిండం పిల్లులకు పెట్టా —నీ ఇంట కోడి కాల్చా —nepolian of anti nautch —
kick the bucket –whats in name ?పేరులోన నేమి పెన్నిధి యున్నది ?—దామిట్ !కధ అడ్డం గా తిరిగింది –జాతకం బనాయించటం (దొంగ జాతకాలు రాయించటం )–శాంతం భోషాణం –గోతాలు కోయటం –గురో –సిగదరగా –మూడో కాలమ్ లో వున్నారు (పూటుగా తాగారు ).
                                                           జీవిత సత్యాలు
01 -”ఇన్నాళ్ళకు జన్జేప్పోగు వినియోగం లోకి వచ్చింది ”–ఆపదలో శపథం చేయటానికి జందెం వుపయోగపడినని అర్ధం
02 -ఏదో రకం గా అగ్నిహోత్రావధానుల ను ఒప్పించటానికి గిరీశం చేసిన ప్రయోగం బెడిసి కొడితే చేసేది లేక ఆయన చెప్పినట్లే చేయటానికి సిద్ధ పడ్డాడు .అప్పుడు శిష్యుడు వెంకటేశం ”ఆయన దారి లోకే మీరు వచారా ?అని అడుగుతే గిరీశం సమాధానం ”కుంచం నిలువుగా కొలవటానికి వీలు లేనపుడు తిరగేసినా కొలిస్తే నాల్గు గింజలు మిగుల్తాయ్.
03 -జాతకం బనాయించటం మోసం అంది మధురవాణి పంతులుతో .”లౌక్యం ”అణు అంటాడు .”రెంటికీ భేదం ఏమిటి ”?అని అడిగితే ”నమ్మిన చోట చేస్తే మోసం -నమ్మని చోట చేస్తే లౌక్యం ”అని తేడా తెలియజేశాడు .
04 -మీనాక్షి ప్రవర్హన మంచిది కాడుఅని పంతులు చెబితే ఆమె ”మీరు కన్తబడ్డ తరువాత ఏ ఆడ దాని ప్రవర్తన తినగా వుంటుంది “”/?అని దెబ్బతీసింది .
05 -విద్యవంటి వస్తువు లేదు నిజమే ఒక్కటి తప్ప అదేమిటి అంటే విత్తం అంటుంది డబ్బురాని విద్య దారిద్ర్య హేతువు అని జీవిత సత్యం తెలుపుతుంది .

06 –కరటకశాస్త్రి ”గిరీశం చెదిపోయాడు ”అంటాడు .దానికి మధురవాణి ”నా దగ్గరకి వచ్చినందుకు మీ భార్య మీ ఇంట్లోంచి తరమవలసింది -తనకు రోట్టా ఒహడికి ముక్కానా ”అని తిప్పికొట్టింది
-07 –కరటక శాస్త్రి శిష్యుడి అందానికి ముచ్చట పడింది మధురం ”ఈ పిల్ల దగ్గర నా బొట్లు దివిటీ ముందర దీపాలు ”అంది దానికి శాస్తి ”ఆడది మెచ్చిందే అందం ,మగాడి కన్ను మసక ”అంటాడు

08 -తనులేని కోర్టులు ,వ్యవహారాలూ లేవని చెబుతూ రామప్ప ”రామప్పంతులు పప్పులేని పులగం వుండదు ‘అంటాడు g
09 -గాడిద అందట పాటకి నేను –అందానికి మా అప్పా అని అంటుంది మధురం .
10 –మధురం పంతుల్తో ”గాడ్ది గాడిదలు తింటాయి .మనుష్యులు తినరు ”అంటే పంతులు గాడిదే అని ఎత్తి పొడుపు
11 -రామప్ప ”పంచాంగాని కేల –ఈ వెధవ పాలే తూల్లో సిద్ధాంతి ఆడింది ఆట పాడింది పాట ”అంటే ఎప్పుడు కావాంటే అప్పుడు అడ్డగోలుగా ముహూర్తాలు పెడతాడు అని .
12 -లుబ్దావదాన్లు రెండో పెళ్లి పిల్లను చేసుకోన్నాదేమోనని అనుమానం ప్రాయశ్చిత్తం చేయించుకుందామని అనుకుంటూ ”శంకరాచార్లు పాద కట్నం (పాద పూజకు డబ్బు )పెట్టమంటాడు .బ్రాహ్మలు ఇల్లు తినేస్తారు ”అంటే పూజలు ,పునస్కారాలు ,ప్రాయశ్చిత్తాల పేరుతో డబ్బు దోచేస్తారని అర్ధం .ఆనాడే కాదు ఈ నాడూ అదే స్థితి
13 -మీనాక్షి ”ఇద్దర్నీ ఒకే సీసాలో పెడ్తే దేయ్యప్పిల్లల్ని పెడతారేమో “?చమత్కారం
14 –మునసబు బైరాగితో ”గురో !బంగారం చేస్తారు కదా .అదేట్టి హరిద్దోరం (హరిద్వారం )లో మతం కట్టించక మా లాతోల్లని డబ్బెందుకు అడుగు తారు.ద్కానికి బైరాగి ”మేము చేసే స్వర్గం మేమే వాడుక చేస్తే తల పగిలి పోతుంది ”లౌక్యపు సమాధానం
15 -బైరాగి ”బ్రాహ్మల్లో కూడా మహాత్ములుంటారు ‘ఆనాటి బ్రాహ్మణీకం దిగజారుడు స్థితి .”కనుక్కోగాలిగిన జనానికి గంగానది అంతా సారాయి కదా ”ఇదే స్సారోపనిషత్
16 –నీతికి పోలీసొంని ,ఘనానికి సాతానోన్నీ అడగమన్నారు .”అంటే ఇద్దరు అబదాలే చెబుతారని అర్ధం
17 -హవల్దార్ ‘చపన్నదేశాలు చూశాను భాయ్ .పరిపరి విధాలు ఆచారాలు,వ్యవహారాలూ వున్నాయి కానీ నీతి ఒకటే ”కన్యాశుల్కం లో హవల్దార్ ఒక్కడే డబ్బుకు కక్కుర్తి పడని వాడు .
18 –మీనాక్షి ”పవిత్రం అంటే మీది నాదీ –రామప్ప ”అదేమ అలా అంటున్నావు /–మీనా”నేను వెధవ ముందనీ మీరు సరసులున్నూ ,మనకంటే మరీ పవిత్రం అయిన వారేవరుంటారు ?తాను ,పంతులు కాలు జారిన వాళ్ళమే నని నిర్మొహమాటం గా చెప్పింది ”బ్రాహ్మలం పవిత్రమైన వాళ్ళం కదా “”/అన్న రామప్పకు చెప్పిన సమాధానమే అది .
19 -అగ్నిహోత్రావధాన్లు ”చేసేవి మాఘ స్నానాలు ,దూరేవి దొమ్మరి గుదిశేలు .జటాంత స్వాధ్యాయిని నన్నుముంద లింటికి (మధురవాణి ) తీసుకుని వేల్తావషయ్యా ”
20 –పంతులు ”మరి ఎకొంపలు తిరక్క పోతే కేసులు గెలవటం ఎలా ?అది సంసారి వంటిది .”అంటే ఎన్ని ఎద్దే ,మోద్దె పనులు చేయాలో చెప్పే మాట
21 -హెడ్ ”అబద్ధం లేకుండా సాక్ష్యం కావాలంటే ఈ భూప్రపంచం మీద ఎక్కడా దొరకదు
22 -నాయుడు ”ఆ తాగుబోతు మీకెలా దొరికాడు ?”అగ్ని ”రామప్పంతులు తాగుచాడా ?”నాయుడు ”మరి –మీ కంటే ,కడియం తాగేశాడు కదా ?;”అగ్ని ”అప్పు పత్రం రాయనని మా తండ్రి చచ్చిపోఎతప్పుడు నా చేత ప్రమాణం చేయించాడు .
23 -దుకాణదారు ”డబ్బు యగేయ్యతపు యోగం న దగ్గర పారాడు రహస్యవేటి ?ఆ విద్యకు అంతా గురువులే ”–అంటే అందరు డబ్బు ఎగేసే వాళ్ళే నని .
24 -కలెక్టర్ అగ్నిహోత్రం తో ”ఆంగీరస అనావు జాతకం లో భావ వుంది బ్రాహ్మణ్యం పరువంతా తీస్తివి .బ్రాహ్మల్లో వున్న కంగాళీ మాలకూడూ మరెక్కడా లేదు .నీ దుర్మార్గం వల్ల నీ కుమార్తెకు ఈ అవస్థ వచ్చింది మళ్ళీ abduction కేసు కూడానా ?ఈ పొట్ట కరిగించేస్తాను ” —-సంపూర్ణం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -10 -11
Posted in రచనలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం ——6

                               గురజాడ కన్యాశుల్కం ——6
                        ఇంత గొప్ప నాటకం ”కన్యాశుల్కం ”రాసినా గురజాడ ను” కవి కాదు ”అన్నారు కొందరు కుహనా వాదులు .ఇప్పుడు కూడా డా ఈ మధ్యే మళ్ళీ దుమారం లేపుతున్నారట ఒకవార్తా పత్రికలో .ఎవరేమి మొరిగినా ఏనుగుకు ఏమి అవుతుంది ?ముత్యాలసరాలను ఈసడించారు .కన్యాశుల్కాన్ని నాటకమే కాదు పొమ్మన్నారు .అదొక ప్రహసనం అని తేల్చారు .ఆ భాషేమిటి ?అని దేప్పారు .ఆ పాత్ర్లేమిటి >?అని నిలదీశారు .అయినా ప్రజల అభిమానం చిన్తాకైనా తగ్గలేదు సరికదా ,దినదిన ప్రవర్ధమానం అయింది .దానితో తోక జాదించిన వారంతా తోక ముడుచుకు పారి పోయారు .అన్నిటికి ఎదురు నిల్చి నూట ఇరవైయేళ్ళు బతికింది .ఇంకా బతుకు తుంది .నిత్యనూతన నాటకం గా పేరు తెచ్చుకుంది .వన్నె ,వాసి తగ్గ లేదు .ఇప్పటికీ చదువుతూనే వున్నారు .ప్రదర్శిస్తూనే వున్నారు .ఈ నాటకం పై వచ్చినంత విమర్శ ,జరిగిన పరిశోధనా ఏ సాహిత్య మ్ప్రక్రియ మీదా రాలేదు .మొదట దూకుడు గా మాట్లాడిన వారే ,క్రమంగా దగ్గరయారు .అభిప్రాయాలు మార్చుకున్నారు .అదీ సాహిత్య సృష్టి అంటే .అంత గొప్ప సృజన అప్పారావు గారిది .ఆయన మనకు ఒక ”సుబ్రహ్మణ్య భారతి ”వంటి వాడు ,తెలుగుల ”టాగూర్ ”.తన అడుగు జాడలను ఇప్పటికీ భద్రం గా నిల్పుకున్న నూత్న పదగామి .కాని మనప్రభుత్వాలు గుడ్డివి ,మూగావి ,చేవిటివి .వారు దీని గురించి వినరు ,కానరు మూర్కొనారు .ఇంకా చైనా చూపే .సముచిత గౌరవం లేదు .చాసో అన్నట్లు ”గురజాడ ఆంధ్రుడు ,భారతీయుడు,ప్రపంచ పౌరుడు ”అందుకే” మనవాళ్ళు వుట్టివెధవాయిలోయ్” అన్నాడు గురజాడ .అది ఈనాడూ రుజువు చేస్తున్నే వున్నారు మన” చెవలాయిలు ”భమిడి పాటి వారి భాషలో .శ్రీ కేతవరపు రామకోటి శాస్త్రి 1931 లో ”కన్యాశుల్కం నాటకమే కాదు .గురజాడ సరిగ్గా నిర్వహించ లేదు .”అన్నాడు .ఆ తర్వాత గిరీశం లాగా opinyans chenge చేసుకున్నాడు .1992  ఆగస్ట్ 13  తన కొత్త అభిప్రాయాలతో ఒక పుస్తకం రాసి ప్రచురించాలని సంకల్పించారు .అయితే 1991  అక్టోబర్ 28  న రోడ్ ప్రమాదం లో మరణిచారు .ఆయన కుమార్తె ,డాక్టర్ కాత్యాయినీ విద్మహే ఆ పుస్తకాన్ని ప్రచురించారు .గిరీశం నెపోలియన్ లా ఆన్తినాచ్ ఉద్యమానికి ప్రతినిధి అని కితాబు ఇచ్చారు .ఆ పుస్తకం అందరు చదువ తగిన పుస్తకం .లోతైన పరిశీలన .లోగడ తాను ఎక్కడెక్కడ భ్రమ ,ప్రమాదాలకు లోనైన్డీ తెలుపుతూ ,దాన్ని చక్కగా సంతృప్తికరంగా సరిదిద్దుకున్నారు .వసంతసేన కన్న మధురవాణి గొప్పదని మెచ్చారు .కారణం మహిళాభ్యుదయానికి ఆమె చేయూత నీయతమే నంటారు .ఆమె అప్పారావు గారి ”సృజన ప్రతిభ ”గా అభివర్ణించారు వేశ్యల్ని బహిష్కరించాలి అని వీరేశలింగం గారు అంటే వారిని సంస్కరించాలి అని గురజాడ అన్నారు .ఇష్టా నిష్టాలతో ప్రమేయం లేకుండా విధవా వివాహాలు చేయాలని వీరేశలింగం అంటే వాళ్ల చైతన్య స్థాయిని పెంచాలని అప్పా రావు భావించారు .”బ్రాహ్మణులలో కూడా మహాత్ములుంటారు ”అనే దానిని వివరిస్తూ ”ఆ నాటి సమాజం నిండా  వున్నదిబ్రాహ్మనేతరులు  సమాజాన్ని నడిపిస్తున్నది బ్రాహ్మణులు .నైతికం గా పతనమైన బ్రాహ్మణులు నడిపిస్తున్న సమాజాన్ని సంస్కరించటం అంటే బ్రాహ్మల నైతిక పతనాన్ని సంఘం ముందు ప్రదర్శించటమే ”అంటారు .ఈ పనిని అప్పా రావు గారు గొప్పగా ,ప్రతిభావంతంగా చూపారు .అందుకే అది నాటికీ నేటికీ అపూర్వ సృష్టి అయింది .ఆదర్శం అయింది ,ఆదరమూ అయింది .
                   ప్రఖ్యాత విమర్శకులు కే.వి.రమణా రెడ్డి ”నిర్దిష్టమైన ఒకానొక జీవిత పార్శ్వాన్ని సాకల్యం గా ,గాదం గా చిత్రించడం వలెనే ఈ నాటకానికి సర్వకాలీనత సిద్ధించింది ”అని మహత్తరమైన ఆవిష్కరణ చేశారు .అవును కన్యాశుల్కం స్థానే ”కన్యే శుల్కం ”అనే భావం రావాలని ,ఆశించారు గురజాడ .ఆడురాచారం నేడు ”వరకట్నం ”గా మారింది .అయినా స్త్రీ బాధ తప్ప లేదు .”వరుడే కట్నం ‘అనే భావన బలపడి ఆ వైపు యువత నడిస్తే మహిళాభ్యుదయం జరగటానికి ఆస్కారం అవుతుంది .ఆ మహాకవి ఆత్మ శాంతిస్తుంది ”     ‘.
       దేవుదేచాతో దాగే నంటూ –కొండ కోణాల వెతుకు లాడే వేలా ?–కన్ను తెరచిన కనబడదో ?—మనిషిమాత్రుని యందు లేడో ?? అంటాడు గురజాడ ఇంతకంటే మానవుని ఉత్కృష్ట స్థితిని గురించి ఏ వామ పార్టీ చెప్పింది ?అలాగీ ఆయన రాసిన ”దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా -దేశమంటే మట్టికాదోయ్ -దేశమంటే మనుషులోయ్ ”–అన్న ప్రబోధ గీతం నిజం గా ”విశ్వ గీతమే ”దీనికి సాటి ఇంకేదీ లేదు .జనతాజనార్దానుడిని చూడమని హెచ్చరించాడు .మనిషికోసం ,మానవత్వం కోసం ,ప్రపంచ పౌరసత్వం కోసం తపన పడ్డా ఆ మహా మనీషి కి ఆంద్ర దేశం ఎంతో రుణ పది వుంది .ఆ ఋణం తీరిస్తే తీరేది కాదు .ఆచరించి ఋణం తీర్చుకోవాలి
                      ”నరుల నోళ్లను నలిగి వుండిన –నానేమైన పదాల లోపల –ఆడుచుండును ప్రకృతి యంతా యని —అందరికి తెలిపితివి గదరా “‘అని ప్రస్తుతించారు స్వాతంత్రోజ్యమ కవి గరిమెళ్ళ సత్యనారాయణ .నవయుగ వైతాలుడైన గురజాడ స్ఫూర్తి మనలో నిత్యం జాగ్రుతమవాలి .
                 గురజాడ పూర్వీకులు కృష్ణా జిల్లా వుయ్యురుకు దగ్గరలో వున్న గురజాడ గ్రామం లో వుండే వారట .ఆయన పూర్వీకుడైన పట్టాభిరామయ్య 200  ఏళ్ళ క్రితమే వేరొక శాఖకు చెందిన స్త్రీని వివాహం ఆడారట .అప్పారావు గారు తన తల్లికి ఏడవనేలలో జన్మించారట .అందుకే ల్పాయుష్కులయారట.ఆయాసం కూడా దాని ఫలితం గా వచ్చిందట .గురజాడ నుండి ఆకుటుంబం మచిలీపట్నానికి ,ఆ తర్వాత విజయనగారానికీ వలస పోయారట .అప్పారావు గారు ”రీస్ అండ్ రయ్యత్ ”అనే పత్రిక లో ఎబ్గ్లిష్ లో వ్యాసాలు రాసే వాడు .ఆ పత్రికా సంపాదకుడు శంభు చంద్ర ముఖర్జీ సలహాతో తెలుగులో రచన ప్రారంభించాడు .గురజాడ లో ఒక స్రష్ట ,ద్రష్ట వునాడు .కన్యాశుల్కం ”మహోత్కృష్ట గ్రంధం ””(క్లాసిక్ ),మాత్రమే కాదు ”ఆధునిక ఇతిహాసం  (ఎపిక్ ).అది ఒక అక్షర తూణీరం .తరగని పంట .In between lines ”చాలా వుంది అన్నాడు పత్రికా సంపాదకుడు కవి ,రచయిత నవలా కారుడు ,విమర్శకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ .”ఆంద్ర దేశానికి మహోదయం తెచ్చిన వేగు చుక్క గురజాడ ”అన్నారు ప్రసిద్ధ హాస్యరచయిత హాస్యబ్రహ్మ భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు ..”మానవుడు మహ్హకవి అయినపుడు అతీంద్రియ జ్ఞానం తో పని చేస్తాడు .అప్పుడతని వాక్కు ఆదిమధ్యాంత రహితం అవుతుంది ”అంటాడు శ్రీ శ్రీ కన్యాశుల్కాన్ని గురించి .Though art is my maaster ,I have a duty to society ”అని బాధ్యత గుర్తెరిగి అలానే ప్రయాణించిన మార్గ దర్శి గురజాడ .”లోన్గాదీయలేని అలెక్షాన్దెర్ గుర్రం -కన్యాశుల్కం ”అంటాడు ప్రఖ్యాత నటుడు ,ప్రయోక్త ,కన్యాశుల్కం లో గిరీశం పాత్రధారి శ్రీ జే.వి .రమణమూర్తి . .
                  ”Gurajada was a genius.He produced a very great drama that caught the imaaginations of English educated youth of his times and it came to stay .He heralded a new era in telugu literature .The era of colloquilism ”అని కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ కూడా మనసారా మెచ్చిన మహాకవి గురజాడ .
                       దీని తర్వాత కన్యాశుల్కం లోని జనం నోట నానిన” oft quoted lines ” మీ ముందుంచుతాను .అందుకని ఇప్పటికి ఇంకా సశేషమే
                                         మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ -24 -10 -1
Posted in రచనలు | Leave a comment

మన్నుమడ్తలు దాసుకొన్న నల్లమబ్బు

ఆంధ్రజ్యోతి లో వచ్చిన 24.10.2011. నాకు నచ్చిన కవిత

Posted in సేకరణలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం — 5 —స్త్రీ పాత్రలు

గురజాడ కన్యాశుల్కం — 5  —స్త్రీ పాత్రలు
                        అగ్నిహోత్రావధానులు పెద్ద కూతురు బుచ్చమ్మ .తల చెడింది .”మంచం మీంచి దిన్చేయ్యతానికి సిద్ధం గా ఉన్న వాడికి 1500 రూపాయలు కు ”వధువు ”పేరుతొ అమ్మబడిన పిల్ల .గిరీశం బొట్లేరు ఇంగ్లీష్ కు మురిసి ,అతనొక సంస్కారి అనినమ్మిన పల్లెటూరి పిల్ల .విధివంచిత .మధురవాణి ,సౌజన్యారావు ల సౌజన్యం తో బయట పడింది .తనకు జరిగిన అన్యాయం తన చెల్లెలికి జరుగ రాదనీ ప్రయత్నించిన సహృదయ .చెల్లెలి బలిని ఆపటానికి గిరీశం మాటలు నమ్మింది పాపం .లేచిపోవటానికి సిద్ధపడిన అమాయిక .
                       వీళ్ళిద్దరి తల్లి వెంకమ్మ .కూతురికి మొగుడు చస్తే ఎంత ఆస్తి వస్తుంది అని లేక్కలేసే అగ్నిహోత్రావధాన్ల పెళ్ళాం .పెద్ద కూతురు బతుకు బుగ్గి అయింది -అలా చిన్న కూతురుకు కాకూఅదని భావించి ఎదిరించే ధైర్యం లేక నుయ్యో గొయ్యో చూసుకుంటానని ,నిజంగానే దూకేసిన ఆనాటి వెర్రి  తల్లులకు ప్రతీక .చండ కోపిష్టి ,అపర దూర్వాసుడు నిజంగానే అగ్నిహోత్రుడు అయిన మొగుడు కొట్టినా ,తిట్టినా ,ఏ చెడ్డ నిర్ణయం ఆయన తీసుకున్నా ,నోరెత్తని ,సాహసం లేనిబానిస   బతుకు బతికింది
                   మీనాక్షి లుబ్దావధాన్ల కూతురు .విధవ .ఆమె ప్రవర్తన మంచిది కాదనిరామప్ప పంతులు మధుర వాణికి ,గిరీశం బుచ్చమ్మ కు చెప్తారు .బాలవితంతువు పక్క మార్గం పట్టటానికి కారణం బాల వైధవ్యమే .విధవా వివాహాలు ఆనాడు లేవు వయస్సులో వుంది ,శారీరక సుఖాలు తీరని యవ్వన స్త్రీ.కట్టు దాటటం సహజమే .అది వయసు చేసే పొరపాటు .అక్రమ సంబంధం ఆమెతో  పెట్టుకోవటానికి
రామప్ప పంతులికి ఇష్టమే .వివాహం మాత్రం చేసుకోడు .పైగా ఆమెను ”చెడిన ఆడది ‘అనే ముద్ర వేష్తాడు ఇంకెవరు ఆమె దగ్గరికి రాకుండా ఉండాలనే ఉపాయం తో ..
                 పూతకూల్లమ్మడీ ఇదే తంతు .వీరంతా విధి వంచితలు గా కనిపిస్తారు .ఒక్క వెంకమ్మ మాత్రం డబ్బు కాపీనం ,దుష్టపన్నాగం వున్న భర్తకు లొంగి పోయింది పైవాళ్ళు సంఘం లోని దురాచారాలకు ,కాపత్యానికి ,దుష్ట శక్తులకు బలి పోయారు .మనకు వీరందరి మీద సానుభూతి కలిగిస్తాడు గురజాడ .వాళ్ళు ఏ పరిస్థితుల్లో దారి తప్పారో ఆలోచింప జేస్తారు వారి అంతరంగాలలో పరకాయ ప్రవేశం చేసి సజీవ పాత్రలుగా మనముందు నిలబెడతాడు .అవి మట్టి బొమ్మలు కాదు .ఉప్పూ ,కారం తింటున్న మనుషులు .మనకున్నట్లే వాలకూ కోరికలుంటాయి .అవి తీరక తీర్చుకోలేక నలిగే విధి వంచితలు .బాధా సర్ప దష్టులు .
                                                                         మద్ధుర వాణి
                            కన్యాశుల్కం మణిపూస మధురవాణి .మృదు మధుర వాణి .అప్పారావు గారి తలలోంచి ఊడిపడిన గడుసు పిండం అన్నారామెను .ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలిసిన సరసురాలు .వేశ్య .ఆ వృత్తిలోనే జీవించాల్సి వచ్చిన పరిస్థితి ఆమెది ”తనను తాను రకరకాలైన మగవాల్లకీ ,విభిన్న వయసున్న వారికీ అమ్ముకుంటే తప్ప బతుకు గడవని దైన్యం ఆమెది .అందం ,తెలివి తేటలు ,సమయస్ఫూర్తి ,విద్య ,  మాటకారి తనం అన్నీ   వున్నా చెడిపోయిన ఆడది .ఆర్ధిక ,సాంఘిక ,సామాజిక భద్రత లేని ,వాటికి నోచుకోని  అభాగిని .,పతిత .గిరీశం వలలో పడిందీ ,రామపకు చిక్కిందీ డబ్బు ,గౌరవం కోసమే ..”అని ఆ పాత్రను విశ్లేషించారు
                    ఒకసారి రామప్ప పంతులుతో ”నేను డబ్బు ఇక్కడ దాచుకుంటే ,అక్కడ మాతలి కాలక్షేపం చేయటం ఎలా ?”అంటుంది .తల్లి పోషణకు ఈ వృత్తే ఆమెకు ఆధారం .ద్రవ్యాకర్షణ వున్నా సుబ్బమ్మ ,లుబ్దావధాన్ల పెళ్లి ఆపటానికి ప్రయత్నం చేసే సందర్భం లో కరటక శాస్త్రి తో ”మధుర వాణికి దయా దాక్షిణ్యాలు సున్నా అని మీరు తలచారో?మీ తోడబుట్టిన దానికి ప్రమాదం వచ్చినపుడు నేను డబ్బుకు ఆశిస్తానా ?అని చెప్పిన సంస్కారం ఆమెది .
                లుబ్దావధాన్లు చేయని నేరానికి శిక్ష పడకుండా కాపాడటానికి మగవేశం లో aantinaach అయిన సౌజన్యారావు ను కలిసింది .శిక్ష పడకుండా కాపాడింది .బుచ్చమ్మ ను గిరీశం బారి నుండి రక్షించింది .లుబ్దున్ని కాపాడటానికి తన ఫీజు గా” చిన్న ముద్దు ”ఇవ్వాలని చిలిపితనంతో షరతు మ్పెట్టింది .అయినా సౌజన్యారావు వంటి పెద్దమనుష్యులకు ”వ్రతభంగం ”చేయరాదని భావించి ”చెడని వారిని చెడగొట్టవద్దని మా అమ్మ చెప్పింది ”అని అతన్ని వరిస్తుంది .తన లిమిట్ ఏమో బాగా తెలిసిన జాణ .
                     కరటక శాస్త్రిఆమె విద్యా,సౌందర్యాలను వర్ణిస్తే ”కాపు మనిషిని పుట్టి ,మొగుడి పొలం లో వంగాలకు మేరపలకు దోహదం చేస్తే ,యావజ్జీవితం కాపాడే తన వాల్లన వాళ్ళు వుండే వారేమో ?అని చెప్పి తన వ్రుత్తి తనకు కల్పించని భద్రతకు బాధ ,విచారం పడుతుంది .ఆనాటి సమాజం లో పరస్త్రీ సంపర్కం ,సరసం ,రసికత్వం గా చెలామణీ గా వుండేది .వేశ్యను వుంచుకోవటం సమాజం లో స్టేటస్ .సింబల్ .కాని స్త్రీ తన జీవనోపాధికి శరీరాన్ని అమ్ముకోవటం ,చనువు గా వుండటం జరిగితే పతిత గా ముద్ర వేసే వారు .చీడ పురుగ్గా చూసే వారు .సౌజన్యారావు లాంటి సహృదయులు కోడా వేశ్యలను పెళ్లి చేసుకోవటానికి జంకారు .
                   కరటక శాస్త్రి ని ఆడుకోవటం లో ,మీనాక్షిని పెళ్ళిచేసుకోమని రామప్ప పంతులుకు చెప్పటం లో మధురవాణి మంచి మనసున్న ఆడది అనిపిస్తుంది .మృచ్చకటికం నాటకం లోని ”వసంతసేన’సరి జోడు అనిపిస్తుంది .రామప్ప ను నిజమైన భర్త గానే చూసింది మకాం విశాఖపట్నానికి మార్చింది .తన వ్రుత్తి లో హైన్యాన్ని ,దైన్యాన్ని,మాలిన్యాన్ని క్రమంగా గుర్తించింది .మహిళా జీవన వికాసానికి ధనసంపాదన –హేయమైన వ్రుత్తి ,అతిభోగం మార్గాలు కావు అని గ్రహించింది .
                     కరటక శాస్త్రి తన స్వార్ధం కోసం మధురవాణి ని డిప్యూటి కలెక్టర్ కు అంతగాత్తతానికి ప్రయత్నిస్తే అప్పుడామే ఎంతో నిజాయితీగా చెప్పిన మాటలు చెన్నా కోలు దేబ్బల్లాగావున్నాయి చూడండి  .”నేను వేల్లదలచుకో లేదు .ఇటుపైన ఊర కుక్కలకు ,సీమ కుక్కలకు దూరం గా ఉండ టానికి ఆలోచిస్తునాను ”ఆమె లో ఆత్మ గౌరవం ఏ స్థాయిలోకి పెరిగిందో ,చదువుకున్న శాస్త్రి బతుకు ఎంత బస్టాండ్ అయిందో తెలుస్తుంది .
            మధుర వాణి సుభాషిని ,సుమధుర భాషిని .చతుర సంభాషిని ,చమత్కార వాహిని .వేశ్యాల్లో కూడా ఉన్నత లక్షణాలు ,లక్ష్యాలు ,లాలిత్యం ,గాంభీర్యం ,కరుణ,మానవత్వం ఉంటాయని నిరూపించిన వేశ్య శిఖామణి మధుర వాణి .ఆమె ను వేశ్యగా చూసినందుకు మనం సిగ్గు తో తల vanchukovaalemo >సంజీవదేవ్ ”మధురవాణి ఆస్థి ,చర్మ ,రక్త మాంస శరీరం లో మేఘాలమీది ఇంద్రధనుస్సును ప్రత్యక్ష పరచాడు గురజాడ ”అన్న మాట అక్షర సత్యం .
” కన్యాశుల్కం లో పాత్రలన్నీ మానస శిఖరాలే వాటిలో మధురవాణి మహోన్నత శిఖరం .ఈనాడు మనం ఎంత అభివృద్ధి సాధించినా ఆకాశం కాంతితో వున్నా భూమిమీద శాంతి కరువైంది .మధురవాణి పదును గల మేధావి గా సరళమైన రసజీవిగా మలిచారు నిపుణ సాహితీ శిల్పి గురజాడ .సున్నిత వైవిధ్యాలకు ,చురుకైన వైరుధ్యాలకు ఆమె నికేతనం -వ్యక్త జీవితం లోని గుప్త జేవితం మధుర వాణి ”
అన్న రసరేఖల సంజీవ దేవ్ రసహృదయం మధుర వాణి సరసహృదయాన్ని రసమయం గా ఆవిష్కరించారు
                                                  సశేషం
                                                              మీ  — గబ్బిట దుర్గా ప్రసాద్ -24 -10 -11
Posted in రచనలు | 1 Comment

కలాసాక్షి లేపాక్షి 64 కళలు – అక్టోబర్ సంచిక

http://64kalalu.com/samskruthi

64 కళలు లో

Posted in రచనలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం –4

గురజాడ  కన్యాశుల్కం  –4
                అంపశయ్య నవీన్ అంటే స్ట్రేం  of consciousness  గుర్తుకు వస్తుంది దీన్నే తెలుగు లో చైతన్య స్రవంతి  అంటారని అందరికి తెలుసు .ఆయన కన్యాశుల్కాన్ని estimate చేస్తూ ”ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా టాకు టాకీ  అన్యులమనముల్నొప్పించక  తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ ”లా మనమనస్సుల లో సుప్తచైతన్యం లో దాగిన అనేక ప్రవ్రుత్తుల్ని గిరీశం ద్వారా బహిర్గాతమయాయి .అందుకే గిరీశం అందరి హృదయాలలోనూ పలుకు తాడు .”అన్నారు .గురజాడ లో కూడా ఇలాంటి ప్రవ్రుత్తి తనలో అణచబడి వుండాలి.ఆయానా వ్యక్తిత్వం లో ఒక భాగమే గిరీశం .అన్నాడాయన .ప్రముఖ విమర్శకుడు ఆర్.ఎస్ .సుదర్శనం ”గిరీశం పాత్రలో హాస్య రసానుభూతి పొందాలంటే నీతి అనే కొలబద్దను తాత్కాలికం గా నైనా పక్కకు పెట్టాల్సిందే .అప్పుడే గిరీశం మాటలు ,సమయస్ఫూర్తి ,మనకు ఆహ్లాదం కలిగిస్తాయి ”అని వివరించారు .పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకున్న ఉబలాటం వున్న నాటి యువకులకు అతను ప్రతీక .అతనికి ఆర్ధిక స్తోమత లేదు .ఏది సంపాదిన్చాలన్నా అడ్డదారే గతి అనుకొన్నాడు .ఎదుటి వాడిని మాటలతో బురిడీ కొట్టించే వాక్చాతుర్యం వుంది ..అందుకే ”నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్  ”అన్నాడు అంత ధైర్యం గా .అది డబ్బా కొట్టటం కాదు తనకు ఆ శక్తి వుందని చాటి చెప్పటమే .మధురవాణని ”It is that seduces all mankind ”అన్నాడు .బుచ్చమ్మ ను చేసుకోవాలనే కోరిక లో స్వార్ధం తో పాటు పరార్ధం కూడా వుంది .చాందస కుటుంబం లో పుట్టిన గిరీశానికి తన కాలమ్ కంటే ముందు ఆలోచించే శక్తి వుందని తెలిపాడు .ముక్కు పచ్చలారని సుబ్బమ్మకు ,ముసలి లుబ్దావదాన్లతో పెళ్లి జరగబోతోందని తెలిసి ఆపటానికి గట్టి ప్రయత్నమే చేశాడు .బుచ్చమ్మ ను లేవదీసుకొని వెళ్తే సుబ్బి పెళ్లి ఆగిపోతుందని ప్లాన్ వేశాడు .సుబ్బికి లుబ్దునికి పెళ్లి ఆపటం లో తన స్వార్ధం వున్నా దాన్ని తప్పించి తన స్వార్ధం కోసం వాడుకున్నాడు .
                       ప్రతి పరిస్థితినీ తనకు అనుకూలం గా మలుచుకున్న నేర్పు అతనిది .అయితేనేమి చివరి సీన్ లో కధ అద్దం గా తిరిగింది .దామిట్ అన్నాడు దాన్ని .సౌజన్యా రావు పంతులు దగ్గర తనను ”నెపోలియన్ ఆఫ్ అంటి నాచ్ ”అని డబ్బా కొట్టుకున్నాడు .అక్కడే పప్పులోనూ ,తప్పులోను కాలు వేశాడు .అతి తెలివి తేటలతో బొక్క బోర్లా పడ్డాడు .తాను వేశ్య మధుర వాణిని ఉంచుకున్న సంగతి పంతులు గారికి తెలీదనుకున్నాడు పాపం .బయటపడటానికి ,ఆయన్ను ప్రసన్నం చేసుకోవటానికీ చివరి ప్రయత్నం చేశాడు ”కొంత కాలమ్ కింద గిరీశం అనేఫూలిష్యంగ్యంగ్   మ్యానోకడు ఉండేవాడు .మధురవాణి అనే బ్యూటిఫుల్  యంగ్ నాచ్ డెవిల్ ఒకటి వుండేది .వాడి దురదృష్టం వల్ల దాని వలలో చిక్కి ,మైమరచి ,అంధకారం లో పడిపోయిన మాట వాస్తవం .గురువుల ఉపదేశం కొంతకాలానికి జ్ఞప్తికి తెచ్చుకొని ,ఆ అంధకారం లోంచి వెలువడి ,గురువుల పాదములు చేరుకొని ,గతం కళగా భావించి మంచి తోవలో పడ్డాడు .ఆ గిరీశమే ఈ గిరీశం ,ఆ మధుర వానే ఈ మధుర వాణి ”అంటూ పశ్చాత్తాపం తో చెంపలు వేసుకోన్నట్లు నటించి బయటపడాలని పాచిక వేశాడు .తనను క్షమించి ఉచ్చమ్మ తో పెళ్లి చేయించమని కోరాడు .మంచిగా బతకటానికి అవకాశం ఇవ్వమని కోరుతాడు .”నా వంటి sinners   కు సాయం చేసి  సహాయం చేసిమంచ్చ్చచ్చ్చ్చి వాళ్ళను చేయటంతమకు బిరుదు కాని బతుకు చేరచటం న్యాయం కాదు ”అని ములగచెట్టు ఎక్కిన్చాలనుకొన్నాడు .ఆవులిస్తే పేగులే కాదు అన్నీ లెక్కించే నేర్పున్న ఆడు సౌజన్యా రావు పంతులు గారు .”ఎంనేల్లయిన్దేమిటి చీకటి లోంచి వెలుగు లోకి వురికి ?”అని అడిగితే చెప్పలేక తబ్బిబ్బయి ”ఎన్నాల్లయితే నేమండీ ట్రూ రిపెంటేన్స్ కు త్వేంటి ఫర్ అవర్స్ చాలదా ”అని బుకాయించాడు .ఆయన క్ష్మించలేదు ఈ ఆషాఢ భూతిని .బుచ్చమ్మనుపూనా లో  విడోస్ హోం లో చేర్పిస్తాడు .ఆమె చదువుకు ఏర్పాట్లు చేస్తాడు .చదువు అయింతర్వాత ఆమె ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకొంటుంది అని వివరం గా చెప్పాడు .గిరీశాన్ని కూడా కాలేజి లో చదివి పైకి రమ్మని సలహా ఇచ్చాడు .ఇకనుంచైనా మంచి బుద్ధితో మెలగమని ఆదేశిస్తూ ”తక్షణం ఇంట్లోంచి ఫో ‘అని అని గెంటేశాడు .అప్పుడే famous quotation ”కధ అడ్డం తిరిగింది ‘  ‘అంటూ గిరీశం వెళ్ళిపోతాడు .విధవా వివాహాలను ప్రోత్చాహించాల్సిందే .కాని గిరీశం లాంటి కపటులకు వారిని దూరం చేయాలి .వీరి కుహనా సంస్కరణ లనుంచి వాళ్ళను కాపాడాలి .అందుకే పంతులు గారు ”త్వేంటి ఫౌర్ హౌర్స్ లో వచ్చిన రేపెంతెన్సు ట్రూ రేపెంతెన్సు కాదు .అది నిలబడాలి .అతని కాలమీద అతను నిలబడాలి .బుచ్చమ్మ కూడా ఈ లోపల ప్రపంచాన్ని అర్ధం చేసుకుంటుంది .కావాలంటే అప్పుడే పెళ్లి చేసుకో వచ్చు .ఇలా ఒక అర్ధవంతమైన ముగింపు ఇస్తాడు గురజాడ .గిరీశం మాట్లాడిన మాటల వెనుక గురజాడ హృదయం వుంది అంటారు నవీన్ .
                                                        సశేషం
                                                                        మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -10 -11
Posted in రచనలు | Leave a comment

గురజాడ కన్యా శుల్కం —3

                గురజాడ కన్యా శుల్కం —3
                          ”చూసే కల్లున్నవారికి ,చూడగల మనసున్న వారికి ,కన్యాశుల్కం techni కలర్ లో కనిపిస్తుంది .అదొక అక్షయ తూఈరం .తరగని పంట .in between lines చాలా వుంది వ్యవహారభాషను రంయాతిరమ్యం గా మలచిన శిల్పం .ఈ క్ర్శిలో సంఘోద్ధరను మించి సాహిత్యోద్ధారణ జరిగింది ”అంటారు ప్రఖ్యాత రచయిత ,పత్రికా సంపాదకులు స్వర్గీయ పురాణం సుబ్రహ్మణ్యశర్మ  .1915 లో గురజాడచని పోయినా   1915 తర్వాతే జీవించటం ప్రారంభించాడు  అన్నారు కృష్ణ శాస్త్రి గారు .”వాడుకభాష కు ఇంతటి గౌరవం సంపాదించి పెట్టింది గురజాడే .కులాలకూ ,మనః ప్రవృత్తులకు చెందిన ఎందరో వ్యక్తులు నిత్యజీవితం లో తాము ఎలామాట్లాడుతారో అలాగే కన్యాశుల్కం లో మాట్లాడతారు .కృత్రిమత కన్పించాడు .అందుకే కాన్యాశుల్క రచనకు ప్రేరకమైన భాషా సంస్కరణ సృష్టి ఆ నాటకం లో
మహోనాహం గా వుంది .”అంటాడు ఆరాధనా భావంతో శ్రీ శ్రీ.
                                                                 పాత్రల మనో విశ్లేషణ —గిరీశం
                 ఇంత గొప్ప నాటకం ఇంత చిరస్మరణీయం గా నిలిచింది అంటే పాత్రలన్నీ సజీవాలై వుండటం వల్లే .వాటికి ఒక లక్ష్య నిర్దేశం ,గమ్యం వుండటం సామాజిక స్థితిని ప్రతిబిమ్బించటం ఆ పాత్రలు ఎలా ప్రవర్తిన్చాయో చూద్దాం .పాత్రల స్వభావం తెలియజేసే విధం గా పేర్లు పెట్టాడు గురజాడ .పీనాసితనం మూర్తీభవించిన వాడిని లుబ్ధావధానులు అనీ ,చాన్దాసం కోపం ఉద్రేకం వున్న వాడిని అగ్నిహోత్రావధాని అనీ ,కరణపు తెలివితేటలున్న లితిగతిఒన్ చక్రవర్తికి రామప్ప పంతులు ,ఆయన చేతిలో మోసపోయిన మీనాక్షి ,అమాయకత్వానికి మారు పేరైన బుచ్చమ్మ ,కుహనా సంస్కరణ వాది గిరీశం మంచి మాట కారీ అందర్నీ రేమోతే కంట్రోల్ తో ఆడించిన మధురవాణి ,పేర్లన్నీ తగినట్లు పెట్టాడు .ఆ పాత్రలే నేటికీ మనకు సమాజం లో కనిపిస్తున్నాయి ఆనాడే పోలీసులు కొట్టే దెబ్బల సంగతి చెపాడు గురజాడ .అవి ఈనాడూ ,వికృతం గా మారి ,థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ .లూ ,లాకప్ మరణాలు ఎన్కౌంటర్లు గా మార్పు చెందాయి .”నేషనల్ కాంగ్రెస్ గురించి లెచ్తురె ఇస్తూ ,వాళ్ల వోరి హెడ్ కానిస్తాబుల్ని ఎప్పుడు బదిలీ చేస్తారు అని అడుగుతాడు పోలీసు .ఈనాడు కూడా వ్యవస్థకు వ్యతిరేకం గా మాట్లాడిన వాడి గతి అంతే కదా .నూరేళ్ళు దాటినా తీరు లో మార్పు లేదు .కన్యాశుల్కం పోయింది కాని వరకట్నం దాని స్థానం లో రాజ్యమేలుతోంది .అప్పుడు ,ఇప్పుడు ఈ బాధలకు గురి అయింది స్త్రీ ఏ. కనుకనే కాలాన్ని దాటి కన్యాశుల్కనాటకం బతుకు తోంది .
                        కన్యాశుల్క నాటకం లో కధానాయకుడు లేదు .కాని గిరీశమే అందరి మనసుల్ని లాగేసే పాత్ర .సమాజం లోని కపట ప్రవర్తనకు ,కుహనా సంస్కర్తలకు నాయకులకు సజీవ ప్రతీక  .మొదటి స్సీన్ లోనే దర్శనం ఇస్తాడు .తనను తాను పరిచయం చేసుకుంటాడు .సంస్కరణ ఉద్యమాలలో ఫలితాన్ని సొంతానికి వాడుకునే ”ఆశాధభూతి ‘గిరేశం .బొంకులదిబ్బ దగ్గర పరిచయమవుతాడు మనకు .ఇరవై రూపాయలు డాన్సింగ్ గాళ్ కోసం ఖర్చుపెట్టిన వేశ్యాలోలుడు .పోతకూల్లమ్మకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టే సిద్ధహస్తుడు ..”వెంకుపంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసిన జులాయి  .శిష్యుడు వెంకటేశానికి పాఠాలు చెప్పకుండా చుట్టకాల్చటం నేర్పిన కొంటె గురువు .ఒకరకం గా గిరీశానికి miniyeture వెంకటేశం .గిరీశం శిష్యరికం లో అబ్బిన దుర్వ్యసనాలు ,అగ్రహారపు జిద్దుతనం పోత పోసిన విగ్రహం వాడు .బ్కదుద్ధాయిలా కన్పించినా అవసరం వస్తే గురువుకి     మించిన శిష్యుడే .  ఇలాంటి శిష్యుల్ని తయారు చేసిన కపట సంస్కర్తల నిజ స్వరూపాన్ని గిరీశం గా మనకు ముందే పరిచయం చేసి జాగ్రత్త అని చెప్పకనే చెప్పాడు .”బుచ్చమ్మ లాంటి యంగ్ విడోలు సమాజం లో ఉండాలంటే విదోమారేజీలు జరపాలి ట .ఈ ఉద్యమం నడపాలంటే ఇన్ఫాంట్ మారేజీలూ ఉండాలట .”విధవా వివాహమే నాగరకతకు నిగ్గు అయితే బాల్యవివాహాలు లేకపోతే నాగరకత ఆగిపోతుందట ”అని మోకాలికి బట్టతలకు ముడివేసి వాదిస్తాడు .ఇదో కొత్త discovery . ”కన్యాశుల్కం లేని మారేజీ ఈ భూప్రపంచం లో లేదు అని వెంకటేశం తో వాదిస్తాడు .బుద్ధిని నాలుకను ఎలాగయినా మలచగల నేర్పరి .
             ”లుబ్దావధాన్లు ముసిలాడు .బంగారప్పిచ్చికాసు .రెండేళ్లలో బాల్చీ తన్నేస్తాడు .దాంతో నీ చెల్లెలు రిచ్ విడో అవుతుంది నువ్వు పెద్దవదివై దానికి విదోమారేజి చేసి శాశ్వతమైన కీర్తి సంపాదించవచ్చు ”అని వెంకటేశానికి క్లాస్స్ పీకుతాడు .”The widow ”అనే కవిత లో తనభావాలను ఆవిష్కరిస్తాడు .
తన అమర ప్రేమను వెల్లడిస్తాడుi.చివరలో I love the widow however she be –married again or single be ‘
”ఈ విడో బ్యూటీ చొస్తే ఏమీ తోచకుండా వుంది .అయితే ఇది చెప్పినత్లుఅల్ల వశమయ్యేది కాదు .పాథ దస్తాలెం పనికి రావటం లేదు .నా experience ,శృంగార చేష్టలు ,గుడ్డిగావ్వంత కోడా పనిచేయటం లేదు .దీనికి లవ్ సిగ్నల్స్ రామ రామా ఏమీ తెలియవు .దీన్ని చూసిందగ్గర్నుంచి టౌన్ లవ్ అన్నా డాన్సింగ్ గాళ్ ఆ అసహ్యం వేస్తోంది .మధురవానికీ ఈ మనిషికీ కంపారిజన్ ఉందా ?అది రంగు వేసిన గాజు పూసా .ఇది ప్యూర్ డయమండ్ .దీనిని చెదగోత్తతానికి ప్రయత్నం చెయ్యకూడదు .చేసినా సాగేది కాదు .కనుక కొత్తదారీ ,కొంత న్యాయమైన దారీ తొక్కాలి .homely is the best way . మాయోపాయం చేసి దీన్ని లేవదీసుకొని పోయి విడో మారేజీ చేసుకుంటే నట్టాయినా కీర్తి సుఖం దక్కుతాయి ”’అని పాచిక వేస్తాడు .ఆమెను వివాహం చేసుకోవటం వల్ల వచ్చే లాభాలు ,నష్టాలు బెరీఎజు వేసుకొంటాడు .ఇకాడే నిజమైన స్సంస్కర్త హృదయాన్ని ఆవిష్కరించాడు .”బుచ్చమ్మ లాంటి అమాయకపు పిలను ఒప్పించి పెళ్లాడితే మజా ప్రయోజకత్వం కానీ రెండేసి మూడేసి సంతానాలు కలిగి తురకదితోనో దూదేకులాదితోనో లేచిపోవటానికి సిద్ధం గా వున్న దండుమున్దల్ని పెళ్ళాడడం విడో మారేజీ అనిపించుకోదు ..అది దొంగముండా మారేజీ ”అదీ గిరీశం ఆదర్శం .మహోన్నతాభిప్రాయం ,చమత్కారంకూడా .ఈ మాటలతోనే బుచ్చమ్మ అతని వలలో పడింది .అందుకే గిరీశాన్ని ఒక లవబుల్ స్కౌంద్రల్ అన్నారు .అప్పారావు గారి ఊహకు మించి పెరిగిపోయాదన్నారు .”Gireesham must have taken the author imself by storm and argued and bluffed his way into the drama ‘అని తేల్చారు ప్రముఖ విమర్శకులు శ్రీ ఎస్ .వై .ఏం స్వామి .
Posted in రచనలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం —2

గురజాడ కన్యాశుల్కం —2
                   తెలుగు లో ఆధునిక యుగం కీ.శ.1800 నుంచి ప్రారంభం అయింది .1800 –1850   కాలాన్ని బ్రౌన్ యుగం అనీ ,1850 నుంచి 1900  కాలాన్ని వీరేశాలింగాయుగం అనీ 1900 —1915 వరకు ఉన్న కాలాన్ని గురజాడ యుగమనీ అంటారు .అంటే గురజాడ యుగపురుషుడు .బాలా వితంతువుల దుర్భర జీవితం ,కన్యాశుల్కం బిల్లు విఫలత ,శిధిల సామాజికి స్థితి ,విజ్రుమ్భించిన వేశ్యావృత్తి ,గురజాడను కన్యాశుల్క రచనకు ప్రోత్చాహించాయి .”నేను రచయితను కావాలనుకోలేదు ”అన్న గురజాడ రాజు గారి ప్రేరణతో తెలుగులో రచన ప్రారంభించాడు .అప్పటికే విశ్వ సాహిత్య పరిచయం వుంది .సాంఘిక దురన్యాయాలను వ్యతిరేకిన్చాతానికి ప్రజాభిప్రాయం కొద గట్టాలి అందుకు నాటకమే సరైన ప్రక్రియ అని భావించాడు .కదా వస్తువును హాశ్యం తో మేళవించి ,సమశ్యను వివిధ కోణాల్లో చిత్రించటం ,పరిష్కారం సూచిన్చాకుండా ప్రజలకే వదిలేయటం ఆయన మార్గం .ఈ నాటకంనూటైరవై ఏళ్ళ చరిత్ర అలిగి వుంది .దీన్ని కన్నడం ,తమిళం ,ఇంగ్లీష్ ల లోకి రష్యన్ భాష లోకి హిందీ లోకి అనువాదం జరిగింది .”కన్యాశుల్కం భూమిక గా ,బాల్యవివాహాలు ,విధవా పునర్వివాహాలు వేశ్యాసమస్యాల సోపానం తో గురజాడ నిర్మించిన మహాసౌధం కన్యాశుల్కం ”అనారు విశ్లేషకులు .ఈ సౌద నిర్మాణానికి సంఘ సంస్కరణ ,భాషా సంస్కరణ ,ఉత్తమ నాటక సృష్టి మూల స్తంభాలు .
                           సామాన్య జనానీకానికి తనభావాలు చేరాలంటే వాళ్ళ వ్యవహారిక భాష లోనే రాయాలి .కనుక మాండలీకాల స్ఫూర్తి కలిగించాలి .మాటలతో గాయాలు చేయకుండా సుతి మెత్తని హాశ్యం తో గిలిగింతలు పెడుతూ ,ఆలోచిమ్పజేయాలి .తానూ భావించిన లక్ష్యాలకు లక్షణం గా నాటకాన్ని తెర్చిదిడ్డాలి అని గురజాడ ఆలోచించి ఆచరించాడు .”నాది ప్రజల ఉద్యమం ‘అన్నాడాయన .అందుకే ”ఆధునిక తెలుగు నాటకకానికి కన్యాశుల్కం ప్రామాణికం ”అని అంటాడు ,నటుడు రచయిత ప్రయోక్త ,విమర్శకుడు కాకరాల .కర్చీఫులు ,కొంగులు తడిసి పోయేట్లుఏది పించ రాదు అన్యాయాల మూలాలు అందించాలి  వాటిపై ప్రజలు ఆలోచించాలి అని గురజాడ ఆరాటం .”నేను మితమైన మిత వాదిని ,మితమైన అతి వాదిని ”అని తనను ఆవిష్కరించుకున్నాడు ..౧౯౦౮ లో మద్రాస్ లో జరిగిన కాంగ్రెస్ సభలకు హాజరైనాడు .జాతీయభావాలు ఆకళింపు చేసుకున్నాడు .అప్పటికే 19 వ శతాబ్దపు కవులు కొందరు దేశభాషలలో రచనలు చేశారు .గురజాడ జాతీయోద్యమ స్ఫూర్తి తో ”ముత్యాల సరాలు ”అనే స్వీయ ఛందస్సులో రచనలు చేశాడు .”మేలుకొలుపుల కోడి కూసేనాను ”అనీ ,”చదల చీకటి కదలబారెను ”అనీ కొత్త గోతుకతో మేలుకొలుపులు చేశాడు .అదే సమయం లో ఆంద్ర దేశం లో సురెంద్రనాద్ బెనర్జీ సుడిగాలి లా తిరిగి ఉపన్యాస ఝారితో ఉత్తేజితులను చేశాడు ”ఎల్లలోకము ఒక్క ఇల్లై -వర్నభేదములేల్ల కలి ,మమతలన్న్యు మాసి పోయి జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును ”అని అంతర్జాతీయ స్పృహను కలిగించాడు .మరి తాను రాసే కన్యాశుల్కనాటకం ఆస్తాయికి తగ్గరాదు ,దానిని మించి ఉండాలన్న తపన చెందాడు .అందుకే ఆయన హృదయపు లోతులోంచి కన్యాశుల్కం అచ్చమైన నీల ముత్యం లా ప్రభాసించింది అంటారు విమర్శకులు .”జీవితం లోంచి పుట్టుకొచ్చింది ,జీవితాన్ని వ్యాఖ్యానించింది సమాజ రుగ్మతకు శస్త్ర చికిత్చ చేసింది వాస్తవికతనుప్రతిబింబింప జేశింది .తన నాటకానికి నైతిక ప్రయోజనం వుందని గురజాడే తెలిపాడు .
                 ఒంగోలు లోని తన మిత్రుడు ముని సుబ్రహ్మణ్యానికి ఈ విషాలన్ని పూసా గుచ్చినట్లు లేఖ లో తెలిపాడు .పాత్రోచితమైన భాష ,జీవకళ ఉట్టిపడే పాత్రలు ,సులభమైన భాషా ,తేలికైన శైలీ ,భావగర్భిత పదజాలం ,చమత్కార కల్పనలతో నాటకానికి సమగ్రత్వం తెచ్చారు .”ఆయన ప్రతిభా సర్వస్వం ప్రతిఫలించిన అద్భుత మని దర్పం కన్యాశుల్కం ”అంటారు అందుకనే .”రాబోయే యుగం రూపు రేఖలు ,రాబోయే సమాజ స్వరూపం ,స్వహావాం ,రావాల్సిన మార్పులు ,చేయాల్సిన చేర్పులు తెలుగుభాషకు అవసరమైన చర్యలు ఉత్తమ , మానవ సమాజ స్థాపన ”ఇందులో అనిపిస్తాయి,ప్రతిబింబిస్తాయి .
                     సంస్కృతరూపకాలలో   శూద్రక మహాకవి రాసిన మ్రుత్చాకటికం ఎంత విశిష్ట మైనదో ,తెలుగులో కన్యాశుల్కం అంత గొప్పది . రెండూ సామాజిక ఇతి వృత్తం కలవే లోక వృత్తం వుంది .సామాన్యులే పాత్రధారులు .అభ్యుదయ వాదుల దృష్టి లో ఆ రెండూ ఉత్తమ నాటకాలే .అని మహాకవి శ్ర్రీ శ్రీ కి భావకవి అబ్బూరికి అనిపించాయి .
                       ప్రపంచనాటక రంగం లో గురజాడతో పోల్చదగిన వారు ఎవరైనా వున్నారా అని ఆలోచిస్తే జర్మనీ నాటక రచయిత HOSTMAN  కనిపిస్తాడు .ఇద్దరు ఒకే సంవత్చారం అంటే 1862 లో జన్మించారు . కన్యాశుల్కానికి ముందు తెలుగు దేశం లో ఏ పరిస్థితులు వున్నాయో జర్మని లోనూ అవే పరిస్థితులున్నాయి .HOSTMAN ”THE WEAVERS “‘ .అనే నాటకాన్ని రాసే వరకు సామాన్య మానవుడిని ఎవరూ అక్కడ పట్టించుకోలేదు .ఏ రచయితా వాళ్ళ జీవితాలపై రచన చేయ లేదు .వెట్టిచాకిరీ చేసే సామాన్య నేత కార్మికుల కరుణామయ గాధను నాటకీకరించి ,ప్రజాదరణ పొందాడు .గ్రామీణ ,ప్రాంతీయ వ్యావహారిక భాషను హోస్త్మన్ వాడి నాటకాన్ని సామాన్యుల దగ్గరకు చేర్చాడు .దాదాపు గురజాడ ,ఆయన ఒకే సమయం లో ఈ నాటకాలు రాశారు .ఒకరికొకరు తెలియరు .ఒకరి నాటకం ఇంకొరు చదివే అవకాశమూ లేదు .ఆయన  కూడా  సామాన్యులేనా  నా యకులు అన్నాడు .అందులో నాయకులు అంటే హీరో ఎవరు లేరు.  హోస్త్మన్ ,గురజాడలు ఆధునిక నాటక రంగానికి మరపు రానిమనీషులు  .ప్రగతిపద కేతనం ఎగరేసిన వీరులు .ఈ విషయమంతా అబ్బూరి రామ కృష్ణా రావు గారు తెలియ జేస్తూ ”ఎన్ని నేరజాడలున్నా గురజాడకు సాటి రారు ‘అని కితాబు ఇచ్చారు .
                                                                సశేషం
                                                                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

గురజాడ కన్యాశుల్కం —–1

గురజాడ కన్యాశుల్కం —–1
                          నవయుగ వైతాళికుడు ,తెలుగు జాతి కి మహోదయాన్ని తెచ్చిన వేగుచుక ,యుగపురుషుడు గురజాడ వెంకట అప్పా రావు కన్యాశుల్క నాటకం గురజాడ అపూర్వ సృష్టి .ఈ నాటకాన్ని 1892 ఆగస్ట్ 13 న   జగ్కన్నాధ విలాసినీ నాటక సమాజం వారు మొట్టమొదటి సారిగా విజయనగరం లో ప్రదర్శించారు .ప్రజలంతా తండోప తండాలుగా వచ్చి చూశారు .చాలా బాగుందని మెచ్చారు .పౌరాణిక నాటకాలతో విసిగి పోయిన వారికి ఒక గొప్ప రిలీఫ్ ను ఈ నాటకం ఇచ్చింది .అందులోని పాత్రలన్నీ నిజజీవితం లోనివి అవటం ,భాష సజీవం గా వుంది విజయనగర మాండలీకాన్ని ఉపయోగించటం జనానికి నచ్చింది .ప్రదర్శన్ అత్యద్భుత విజయం .ఈ నాటక ప్రదర్శన పై విజయనగర ఆంగ్ల పత్రిక ”The telugu harp ”ఆంగ్లం లో ”కన్యాశుల్కం రచనలో ,ఆంద్ర నాటక సాహిత్యం లో ఒక సరికొత్త పద్ధతి,కొత్తమార్గాన్ని ప్రారంభించిందనీ ఇతివృత్తం తో మన కళ్ళ ఎదుట జర్గే సంఘటనల్ని ,మనం రోజూ చూసే మనుషుల్ని గొప్ప గా పాత్రలుగా చిత్రిన్చారానీ సన్నివేశ కల్పన ,హాస్యరస పోషణ తో పాటు చిత్రీకరణ ,characterization  చాలా బాగా వుంది ”అని ప్రశంశించింది
                      ఆ తర్వాత అనేక నాటక బృందాలు కన్యాశుల్కాన్ని ప్రదర్శించాయి .శ్రీ స్థానం నరశింహారావు గారు వంద సార్లు ప్రదర్శించి నట్లు చెపారు .శ్రీకులం నటరాజ సమితి 350 కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు .అబ్బూరి రామ కృష్ణా రావు గారు కూడా 100  ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు .ఆయనే ”కన్యాశుల్కం నేడే కాదు రేపతికోడా ఆడదగిందీ ,చూడ దగిందీ ”అన్నారు .నటరాజ కళాసమితి వారు వారు జే.వి.సోమయాజులు రామప్ప పంతులుగా ,ఆయన తమ్ముడు రమణమూర్తి గిరీశం గా నటించి ,నాటకానికి మంచి సౌష్టవం ,పేరు ,ప్రఖ్యాతులు తెచ్చారు .వీరిదరు ఆ తర్వాత సినిమా నటులూ అయారు .అయినా వీలు దొరికి నప్పుడల్లా నాటకాన్ని ప్రదర్శించే వారు .కన్యాశుల్కానికి వందేళ్ళు వచ్చిన సందర్భం గా 1992 జూన్ 27 న విశాఖపట్నం లో గొప్ప ప్రదర్శన ఇచ్చారు .ప్రేక్షకులు విపరీతం గా మెచ్చి మర్నాడు కూడా నాటకం వేయమని కోరితే వేసి ప్రేక్షక దేవుళ్ళ మనోభీష్టాన్ని నెరవేర్చారు సోమయాజులుసోదరులు . . గిరీశం లోని ఆశాధభూతిత్వాన్ని లౌక్యాన్ని రమణమూర్తి రక్తి కట్టించారు .సంహాశానలను చాలా సహజం గా పలికి,modulation  తో జనఃరుదయం గెలిచారు గిరీశం అంటే రామనమూర్తే వేయాలి అనిపించారు .ఆయన హావ ,భావ ప్రకటనకు ముగ్దులయారు జనం .సోమయాజులు రామప్ప పంతులుగా దామ్బికాన్ని ,భేషజాన్ని ,జాకాల్ తత్వాని బహు ప్రశంశనీయం గా నటించి జీవించారు .వీరిద్దరి combination ఆ రోజుల్లో అదుర్స్ అనిపించేది ..
                    ప్రముఖ రంగస్థల నటుడు ,ఆంద్ర విశ్వ విద్యాలి నాటక రంగ దర్శకులు స్వర్గీయ కత్తుల వెంకటేశ్వర రావు radio  లో కన్యాశుల్కాన్ని ఆకర్షణీయం గా వేసి మెప్పించాడు .తాను గిరీశం పాత్రధారణ చేశాడు .విజయనగారమాన్దలికాన్ని అర్ధవంతం గా పలికే నేర్పు ఆయనకు బాగా వుండేది .నటనలోగొప్ప ease  వుండేది  .
                 ఆ కాలమ్ లో కన్యాశుల్కాన్ని మూడు గంటల పాటు ప్రదర్శించేవారు .నాటకాన్ని కుదించటం వల్ల ప్రయోజనం దెబ్బతింటోంది అనే భావన కలిగింది చాలా మందిలో .అందుకనే నూరేళ్ళ పండుగ నాడు 1992  నవంబర్ లో నాటకాన్ని 49 మంది కళాకారులతో ,తొమ్మిది గంటల పాటు ప్రదర్శన్ జరిపారు .అది ఒక గొప్ప అనుభూతి గా మిగిలి పోయింది .కన్యాశుల్కాన్ని ఒకే వేదిక మీద కంటే ,వేదికల సముదాయలపై ప్రదర్శిస్తే ఇంకా గొప్ప గా ఉంటుందనే ఆలోచన వచ్చింది .డ్రామా అండ్ సౌండ్ విభాగం వారు ”రూప వాణి ”(లైట్ అండ్ సౌండ్ )ద్వారా ప్రదర్శిస్తే అనుభూతి గొప్పగా ఉంటుందని భావించి ప్రఖ్యాత నటులు ,పత్రికా రచయిత శ్రీ ఏ.ఆర్ .కృష్ణ నాటకం గా మలిచి ప్రదర్శించి మంచి ఫలితం సాధించారు .అప్పుడే నాటకం చోశామన్న సంతృప్తి కలిగింది అందరికి .కన్యాశుల్కం సినిమా గా కూడా వచ్చింది యెన్.టి .రామా రావు గిరీశం గా ,సావిత్రి మధురవానిగా ,సి.ఎస్ ఆర్ .రామప్పపంతులుగా ,నాటక రంగస్థల ,నటుడు రామప్పపంతులు నులక అగ్నిహోత్రావధానులు గా ,గోవిందరాజుల సుబ్బా రావు లుబ్దావదానులుగా ,జానకి బుచ్చెమ్మ గా నటించిన ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించి అందరినుంచి మంచి నటన రాబట్టారు .”చిటారు కొమ్మన మిథాయి పొట్లం ”పాట ,శ్రీ శ్రీ రాసిన ”ఆనందం అ అర్ణవమైతే అనురాగం అంబరమైతే ఆనందపు అంచులు చోద్దాం అనురాగపు లోతులు చూద్దాం ”పాట మంచి హిట్టు .గుమ్మడి సౌజన్యారావు పంతులు గా సహజనటన ప్రదర్శించాడు .ఘంటసాల సంగీతం వన్నె తెచ్చింది .సావిత్రి నటన అమోఘం ..అప్పా రావు గారు రాసి నట్లే చేసి అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది .అయితే రామా రావు కష్ట పడ్డాడు కాని నటన లో సహజత్వం కనిపించలేదు .ప్రేక్షకులకు నచ్చలేదు .ఫ్లాప్ సినిమా లో చేరింది .గొప్ప విషయం ఏమిటంటే సినిమా గా తీయటం .అందరు అత్యద్భుతం గా నటించటం .ఆ పాత్రలకు వారు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరని పించటం .మా తరం వారు బాగా ఆరాధించిన సినిమా అది .సావిత్రి నటన కోసం అందరు చూడాల్సిందే .
                                                        నాటక రచన
                       కన్యాశుల్కం నాటకాన్ని మొదటిసారి 1892 లో ప్రదర్శిస్తే 1897 లో మాత్రమే అది అక్షర రూపం దాల్చి అచ్చు అయింది .మొదటి కూర్పులో అయిదు అంకాలు ,ముప్ఫై రెండు రంగాలు ఉనాయి .మళ్ళీ దాన్ని పోర్తిగా మార్చి ఏడు అన్కాలతో ,ముప్ఫిమూడు రంగాలతో తీర్చి దిద్దాడు గురజాడ .దీనితో నాటక స్వరూపమే మారిపోయింది .పాత్రల తీరు ,తెన్ను పోర్తిగా మారిపోయాయి .రంగాలు మారాయి .మరింత జాగ్రత్త తీసుకుని అప్పారావు గారు నాటకాన్ని ఇప్పుడున ఈ రూపం లోకి తెచ్చారు .మొదటి కూర్పులో మధురవాణి ఒకవేష్య మాత్రమే .రెండవ దానిలో ఆమె ఒక సజీవ పాత్ర ,అందరికి బుద్ధి చెప్పే పాత్ర ,సంఘం లో తానూ మంచి చేయగలను అని  రుజువు చేసిన పాత్ర .
                                                   కన్యాశుల్కానికి నేపధ్యం
                      గ్గురజాడ జాతీయ పునరుజ్జీవన( Renaissance period )కు చెందిన కవి .ఇంగ్లీష్ లో దిట్ట హేతువాదం ,వైజ్ఞానిక దృక్పధం వన్న వాడు .ఆధునిక ఆలోచన కలవాడు .సామాజిక స్పృహ వుంది .రీస్ అండ్ రయ్యత్ అనే పత్రికలో ఇంగ్లీష్ లో వ్యాసాలు రాస్తూందే వాడు .దాని సంపాదకుడు శంభుచంద్ర ముఖేర్జీ తెలుగులో రచనలు చేయమని గురాడకు సలహా నిచ్చాడు .దానితో తెలుగులో రాయటం ప్రారంభించాడు .ఆ సమయం లో తెలుగు సాహిత్యాన్ని పాథశాల పండితులు ,కవులే రాస్తుండేవారు .భాష పరమ గ్రాంధికం గా వుండేది .కొత్తదనం అసలు మచ్చుకు కూడా కనిపించేది కాదు .ఆ నాడు విజయనగరం ప్రాంతాల్లో డబ్బుకు పిలను అమ్ముకోవటం అనే దురాచారం వుండేది దీన్నే కన్యాశుల్కం అంటారు .ఇది ఉన్నత కుటుంబాలలో ముఖ్యం గా బ్రాహ్మణ కుటుంబాలలో జాస్తి .దీనికి తోడు అతిబాల్య వివాహాలు జరిపే వారు .ఆ నాటి విజయనగర రాజు పోసపాటి ఆనంద గజపతి రాజు సర్వే చేయిస్తే సంవత్చారానికి 344 కన్యాశుల్క వివాహాలు జరుగుతున్నట్లు తెలిసింది .అందులో ఒకటి నుంచి అయిదేళ్ళ కన్యాలకే 188   మందికి వివాహాలు జరిగాయట .శుల్కం దాదాపు నాలుగు వందల రూపాయిలు ఆనాడే .ఇప్పటి లెక్క లో ఎంతుంటుందో ఆలోచించండి .పొత్తిళ్ళ లోని పసి కందుల్ని కూడా బేరం చేసే వారు .ఉత్తరాంధ్ర ,కాలింగ ,సర్కారు జిల్లాల్లో ఈ వివాహాలు బాగా ఎక్కువ .బానిసలను అమ్మినట్లు కనేలను అమ్మటం ,కొనటం జరిగేది .ముసలి వరులకు ఆస్తికోసం పసిపిల్లలను బలి పెట్టె వారు .చావు సమీపిస్తున్నా వాడికి పిల్లను కట్టబెట్టి ఆస్తి దక్కించుకోవాలన్న అత్యాశ తండ్రులకు బాగా వుండేది .ఇదో దురాచారం గా మారింది .వీటిని మహారాజు ”రాక్షస వివాహాలు ”అని ఈసడించుకున్నాడు .the kanyasulka act 1889 ప్రవేశపెట్టాడు .ప్రభుత్వం ఇద్దరు అనధికారుల అభిప్రాయం కోరితే వారిద్దరూ బిల్లును వ్యతిరేకిన్చారుట .బాల్య వివాహాల వల్లనే కన్యాశుల్కం ఎక్కువ అవుతోందని ,దీన్ని తొలగిస్తే అదికూడా పోతుందని సలహా ఇచ్చారు .దేనికి ప్రత్యెక శాసనం అక్కరలేదన్నారు  ప్రభ్త్వ . జోక్యం వద్దన్నారు .గజపతి నిరుత్చాహపడ లేదు .దివాన్ అయిన గురజాడ ను ఈ దురాచారాన్ని రూపు మాపటానికి ఒక మంచి నాటకం రాయమని సూచించారు .”ప్రజాబాహుళ్యానికి పుస్తకపథానం అలవాటయ్యేంతవరకు ,అలాంటి ఆరోగ్య కరమైన భావ వ్యాప్తికి నాటకరంగాని ఆశ్రయించాల్సి వుంటుంది .కన్యాశుల్క నాటక రచనకు నన్ను ప్రోత్చాహించింది అదే ”అన్నాడు గురజాడ
                                            సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —23 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

గురజాడ ల 150 జయంతి ఉత్చవ సభలు -ఉయ్యూరు లో

విశ్వకవి రవీంద్ర, మహాకవి గురజాడ (150)  వ జయంతి ఉత్సవ సభలు ఉయ్యూరు లో 22.10.2011 AG & SG కాలేజీ లో జరిగాయి

సాహితీ బంధువులకు –దీపావళి శుభా కాంక్షలు .ఇవాళ సరసభారతి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ,ఉయ్యూరు డిగ్రీ కాలేజి సంయుక్తం గా నిర్వహించిన టాగూర్ ,గురజాడ ల 150  జయంతి ఉత్చావ సభలు అద్భుతం గా జరిగాయి .విద్యార్ధులు బాగా స్పందించారు .ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు మధ్యలో ఒక గంట విరామం తో జరిగాయి అందరు బాగా మాట్లాడి విద్యార్ధులను ఆకర్షించారు .ఇద్దరు విద్యార్ధులతో రవీంద్రుని ,గురజాడ వేషాలు వేయించి స్టేజి మీద మీటింగ్ అయేవరకు కూర్చో పెట్టాం .అంటే వారిద్దరి సమక్షం లో సభ జరిగిన అనుభూతి కల్గిన్చాము .ఆలోచన నాది ఆచరణ ఫ్లోరా హై స్చ్ల్ ప్రిన్సిపాల్ అయిన శ్యామలా దేవి గారికిది .చాలా అద్భుతం అని అందరు అభినందించారు .ఇలా ఇద్దరి జయంతి ఒకే వేదిక మీద ఎవరు ఇంతవరకు చెయ్యలేదు .ఈ వేషాలు అదనపు ఆకర్షణ .వారిద్దరికీ మండలి బుధ ప్రసాద్ గారి తో జ్ఞాపికలు అంద జేయిన్చాము .చాలాగొప్పగా   జరిపించినందుకు అందరు మమ్మల్ని  అభినందించారు .అతిదులందరికి ,వచ్చిన సాహితీ ప్రియులకు ఉదయం టిఫిన్ ,మధ్యాహ్నం భోజనం ,సాఉయన్త్రమ్ టిఫిన్ టీ ,మధ్యాహ్నం పదకొండు గంటలకు టీ ఇచ్చారు clollege వాళ్ళు .ఆ సభలో రచయితల సంఘం సరసభారతి కలిసి ప్రిన్సిపాల్ శ్రీ రాయుడు గారికి surprise గా సన్మానం చేశాం .ఆనందం తో ఆయనకు నోట మాట రాలేదు .విద్యార్ధులతో వారి స్పందనను తెలియజేయిన్చాము .ఉదయం ఇద్దరు శ్రీ మాదిరాజు రామలింగేస్వర రావు గారు ,ద్వా.నా. శాస్త్రి ,గారు సాయంత్రం శ్రీ ఎస్.వి రావు ,శ్రీమతి కే.లావణ్య ,శ్రీ గుమ్మా సాంబశివ రావు లు వరుసగా గీతాంజలి ,కన్యాశుల్కం ,టాగూర్ జీవితం ,టాగూర్ ఇతర రచనలు ,గురజాడ ,రచనలు జీవితం పై అద్భుత ప్రసంగాలు చేశారు .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిధి గా విచ్చేసి స్ఫోర్తి కలగే టట్లు మాట్లాడారు .కే సి పీ .జెనెరల్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర రావు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షా కార్యదర్శులు శ్రీ సుబ్బా రావు .శ్రీ పూర్ణచంద్ సభాధ్యక్షత ,లక్ష్య ప్రస్తావన చేశారు .విద్యార్ధులకు గురజాడ టాగూర్ లపై వ్యాస రచన ,వక్తృత్వం లో పోటీలు నిర్వైంచి విజేతలకు బుద్ధ ప్రసాద్ గారిచే బహుమతులు అంద జేశాము .అందరికి గొప్ప సంతృప్తిని కల్గించిన సభ గా మన్ననలు   అందుకొన్నాము .—మీ దుర్గా ప్రసాద్

Posted in సభలు సమావేశాలు | Leave a comment

మార్టిన్ గార్దేనేర్ —2

    మార్టిన్ గార్దేనేర్ —2
                    తాను రాసిన వ్యాసాలలో ఎందరికో తెలియని సంగతులను తెలియజేశాడు గార్దేనేర్ .hesenberg అనే జర్మనీ కి చెందిన యూదు శాస్త్రవేత్త ,నాజీలకు సలాం చేసే వాడట .”heir Hitler ‘అని గౌరవం గా ఉత్తరాలు రాసే వాడట .హిట్లర్ కోసం ప్రాణాలైనా ఇస్తానని అనే వాడటహిట్లర్ జ్యూల ను అంతహిమ్సిన్చినా ,అంతమంది యూదుల్ని అన్యాయం గా చంపేసినా .కాసిడే అనే సైంటిస్ట్ ”అన్ని విషయాలు లాగానే సైన్సు కూడ జాతిరక్తం వల్ల నియంత్రిన్చాబడుతుంది ”అన్నాడట .జర్మని ,ఫ్రాన్సు దేశాలలోని ఆర్యులు అయిస్తీన్ కంటే ముందే సాపేక్ష సిద్ధాంతం పై ఆలోచన చేశారు అన్నాడు .టి.ఎస్.ఇలియట్ రాసిన వాక్యాన్ని గుర్తు చేశాడు గార్దేనేర్ ” .When Apolinax visited the United States ,his laughter tinkled among the tea cups ”.అలాగే గణితం గురించి ఒక అజ్ఞాత కవి రాసిన కవితను గుర్తు చేశాడు ”IIn the world of Math –That man has wrought –The great gain –Was the thought of naught ;”‘;అట్లాగే పియాట్ హీన్ అనే కవి రాసిన కవిత ”Life is two locked boxes –each containing the other”s key ”.
                     కాలమ్ మీద ఎడ్గార్ అల్లెన్ పో రాసిన కవిత ను మెచ్చాడు గార్దేనేర్  By a route obscure aand lonely –haunted by ill angels only –where as Eidolin nnamed night –on a black throne reigns upright –I have reached these lands but newly –from an ultimate dim –Thule –from a wild weird clime that lieth sublime out of space –out of time ”ఇది  రాసి  అలెన్  పో  యురేకా  అని  అరిచాడట  archimedees లాగా .అనటమే కాదు ఈ కవితను 500  కాపీలు తీసి స్నేహితులందరికీ పంచిపెట్టాదట .దీని పేరు కూడా యురేకా నే .ఈ కవిత రాసిన ఆనందం  లో ”I have no desire to live since I have done EUreka “”అనిసంబర పది పోయాడట   .అంతకు మించిన కవిత్వం ఇక రాయాలేమో నని భావిన్చాడన్నమాట .ఈ కవిత్వాని ఆంగ్లం లోనే అనుభవిస్తే బాగుంటుందని ఆ స్క్రిప్ట్ నే ఇచ్చాను నేను. .ఇంతకంటే తాను సాధించాల్సింది ఇంకేమీ లేదనే పరమ సంతృప్తి ని పొందాడన్నా మాట .
                       అమెరికన్ తొలి కవుల్లో ఒకడైన పో ను మహా  దార్శనికుడు అంటాడు గార్దేనేర్  .ఆనాటికే బ్లాక్ హోల్ పై సమగ్ర అవగాహన వున్న  సైంటిస్ట్ అలెన్ పో అని అభిప్రాయ పడ్డాడు .ఆయన ప్రతిభకు జేజేలు పలికాడు .ఒక్క సారి ఆ” కృష్ణ బిలం ”లోకి తొంగి చూద్దాం .”భగవంతుడు శూన్యం లో నుంచి ఒక మూల కణాన్ని (pre-mordial particle )ను సృష్టించటం తో విశ్వ జననం  ప్రారంభమైంది .దాని నుంచి పదార్ధం గోళా కారం గాఅన్ని వైపులకు వ్యాపించింది .ఆ వ్యాపనం వ్యక్తీకరణకు అతీతం గా ,బృహత్తరం గా అతితక్కువగా వున్న ,ఊహలకు అందని రీతిగా అనంతం కాని ,అతి సూక్ష్మ పరమాణువులచే జరిగింది .విశ్వం వ్యాపించిన కొద్దీ గురుత్వాకర్షణ శక్తిది పై చేయి అయింది .దానితో పదార్ధం నక్షత్రాలుగా ,గ్రహాలుగా ఘనీభవించింది .అదే సమయం లో గురుత్వాకర్షణ బలం వ్యాపనాన్ని నియంత్రించింది .విశ్వం క్రమం గా సంకోచించటం ప్రారంభించి మళ్ళీ  శూన్యం లోకి ప్రవేశించింది .గ్రహ తారకల తో కూడిన విశ్వం అకస్మాత్తుగా అంతలోనే అదృశ్యమై పోతుంది ”  ఆనాడే బ్లాక్ హోల్లెస్ ను ఎలా ఊహించాడో అలెన్ పో అని ఆశ్చర్య పోయాడు గార్దేనేర్ .”మన విశ్వానికి చెందిన మనభగవంతుడు   అన్నిటి లోను ఎప్పుడు ఉంటాడు ”అని అల్లెన్ పో భావించటం అతని దార్శనికత కు నిదర్శనం అన్నాడు గార్దేనేర్ .
                      గార్దేనేర్ చెప్పిన ఇంకోవింతను   ను మీ ముందుంచుతాను .”పూఫ్ బర్డ్ ”అనే పక్షి ,వెనక్కి పరిగెట్టడం లో ఘటికు రాలు .క్రమం గా తగ్గిపోయే చక్రభ్రమణం తో వెనక్కు ఎగురుతూ చివరికి పాపం( పూఫ్ )దాని గుదం( Anus )లోకి అదృశ్యమై పోతుందట ”.దీని లాగానే మన విశ్వం కూడా అదృశ్యమై పోతుందా /అలా అవటానికి భౌతిక శాస్త్ర సిదాన్తాలు ఒప్పుకోవు కదా  కాని . అలా జరగటం అనేది సత్య విషయమేగా /అలాగే ఏమీ లేకపోవటం ,అన్నీ వున్న దాంట్లో భాగమే .(nothing is a part of every thing ).
                 అలాగే వ్హీలేర్ అనే శాస్త్రవేత్తచెప్పిన   భావాలను ఆవిష్కరిస్తూ ”మన విశ్వం అనంత కోటి విశ్వాలలో ఒకటి .అది సూపెర్ స్పేస్ అనే కొత్త అంతరిక్షం చేత పోదగాబడింది ”అన్నాడు .దీనినే అల్లెన్ పో కవి కూడా దర్శించాడని చెబుతూ ”పవిత్ర హృదయం (heart divine ),మన విశ్వ దేవుడు ,లేక అందరికంటే ఘనమైన దేవత ,ఈ చిల్లరదేవుళ్ళ నందర్నీ కంటితో గమనిస్తూనే ఉంటాడు(వుంటుంది )ఎక్కడినుంచి చూస్తుందంటే సూపెర్ స్పేస్ లోని స్థావరం నుంచి ”.వీరిదరిభావాలు ఒకటిగా వుండటం సత్యదర్శనం గా వుందని అంటాడు గార్దేనేర్ .దీన్నే హిందూ మతానికి అన్వయిస్తే ”నేతి,నేతి అనే వేదాంతులు బావన చేస్తూ ,చివరికి నిగూఢమైన ,సర్వోత్కృష్టమైన పరబ్రహ్మను చేరుతారు .ఆయనను దర్శించాలంటే సూపెర్ సూపెర్ సోపెర్ డూపర్ నేత్రం కావాలి అతి ఉత్కృష్ట నేత్రం మాత్రమే ఆ పరబ్రహ్మ ను దర్శించగలదు ;”
                   ఋగ్వేద సంహిత లో ”ప్రపంచం ఏర్పడిందా /స్వయం ఆవిష్కారమా ?అనేది ఆయనకే పూర్తిగా తెలుసు .నిర్ధారణగా ఆయనకు మాత్రమే తెలుసు .అన్నిటికి ఆయన  పరమ స్థానం లో వుండి ,అంతటిని రక్షిస్తూ  గమనిస్తుంటాడు ,.నిజం గా ఆయనకే తెలుసు .బహుశా ఆయనకే తెలుసు అన్నది ఆయనకు తెలియదేమో ?”అని వుందని గార్దేనేర్ గుర్తు చేశాడు .విల్లియం జేమ్స్ ఒక తమాసా చెప్పాడట ”ఒక బిషప్పవిత్ర వాక్యం వివరిస్తూ   ,దేవుని ఉనికి గురించి చెప్పిన మాటలు విన్న ఒకరైతు   ”మీరు చెప్పిన పవిత్ర వాక్యం చాలా అద్భుతం గా వుంది .కాని చివరికి భగవంతుడు ఉన్నాడని నాకు నమ్మకం ఎప్పుడో కలిగింది ;’అని రివర్స్ పంచ్ ఇచ్చాడని మార్టిన్ గార్దేనేర్ తెలియ జేశాడు .
                                                   సమాప్తం
                                                      మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -10 -11 .

 

Posted in అనువాదాలు | Leave a comment

ఇరవ్యవ శతాబ్దపు మహా మేధావి మార్టిన్ గార్దేనేర్ –1

                       ఇరవ్యవ శతాబ్దపు మహా మేధావి మార్టిన్ గార్దేనేర్ –1
                          అరుదైన వ్యక్తిత్వం తో ,తనను తాను ఆవిష్కరించుకున్న మహా మేధావి మార్టిన్ గార్దేనేర్ .చాలా కష్టతర మైన విషయాలంటే అతనికి మహా ఇష్టం .,ఆకర్షణ కూడా .దాదాపు డెబ్భై సంవత్చరాల రచనా  వ్యాసంగం లో పండిన వాడు .ఇరవయవ శతాబ్దపు గార్దేనేర్ లలో గార్దేనేర్ ఒకరు .సాహిత్యం ,సైన్సు ,గణితం ల పై 1930 నుంచి అమెరికా లోని చికాగో విశ్వ విద్యాలయం లో ఉంటూ ,సాదిఆరిక వ్యాసాలు రాశాడు .అమెరికా లో సాఫల్యవంతమైన రచనా ప్రవీణుడు గా గుర్తింపు పొందాడు .”సమాధానాలు దొరకని ప్రశ్నలు ”కు అద్భుత విశ్లేషణ చేసి సంతృప్తికరం గా సమాధానాలు చెప్పిన ఆలోచనా పరుడు .సైన్సు లోని క్వాంటం సిద్ధాంతం దగ్గర నుంచి భగవంతుని అస్తిత్వం దాకా విశ్లేషణ చేసిన మేదోత్పన్న బుద్ధి జీవి .చాలా తెలివిగల వాడిగా వున్నా .ఆటకోలు తనం కూడా వుండేది .అయితే మంచి అణకువ గలవాడు అని పేరు .ఒక తరం పాతకులకు ,రచయితలకు ప్రేరణ గా నిఇచిన మేధోమధన జీవి గార్దేనేర్ .
                         సైంటిఫిక్ అమెరికన్ జర్నల్ లో 25  సంవత్చరాల పాటు మతేమతిచ్స్ గేమ్స్ ఏకధాటిగా నిర్వహించాడు .The unoted Alice ,The whys of a philosophical scrivener అనే గొప్ప పుస్తకాలు రాశాడు .మేధో జీవులను నిరంతరం తట్టి లేపే వ్యాస పరంపర రాశాడు .1914 లో జన్మించి అమెరికా లోని నార్త్ కెరొలినా లో హిందేర్సన్ విల్లీ లో జీవితం గడిపాడు .thenewyork రివ్యూ కు నిరంతర సమీక్షకుడు .సైంటిఫిక్ అమెరికన్ జర్నల్ కు చాయా వ్యాసాలు ,పుస్తకాలు రాశాడు .నీటికి వృత్త సౌష్టవం (spherical symmetry ) వుందని చెప్పాడు .అంతరిక్ష నౌక లోని కాలం కు భోమి మీద కాలమ్ కు తేడా ఉంటుందని వివరించాడు .దీనినే టైం dilation  అంటారు .దీనికి ఒక కధ కూడా చెపాడు ”bright అనే యువతీ వుండేది .ఆమె కాంతి వేగం కంటే వేగం గా ప్రయానించేది .ఒక రోజూ ఆమె ప్రయాణం ప్రారంభించి ,ఆ ముందు రోజూ రాత్రికే బయల్దేరిన చోటుకు తిరిగి వచ్చింది .ఇదే సాపేక్ష సిద్ధాంతం అంటే ”అన్నాడు .ముందు రోజుకే తిరిగి రావటం తో తన dooplicate నే చూసిందని భావం .టైం travel లో జ్ఞాపక శక్తి పోవటం వల్ల అలా జరిగిందంటాడు బుద్ధి గ్రహించక పోతే ఏ వస్తువు కు అస్తిత్వం వుండదు .వుండటం అంటే గ్రహించటం .(Nothing can exist unless it is perceived by a mind .To be is to perceive .)దేవుడు  విశ్వం  తో  పాచికలు  ఆడుతాడు  అని Einstein        చెప్పలేదు     అంటాడు    గార్దేనేర్  .అలాగే ఎలేక్ట్రోన్ ను కొలిస్తే తప్ప దాని ఉనికిని చెప్పలేము అన్నాడు
                                            సశేషం
                                మీ దుర్గా ప్రసాద్ –21 -10 -11

 

Posted in అనువాదాలు | Leave a comment

దార్సినికుడు మాల్ రక్స్ —2

         దార్సినికుడు మాల్ రక్స్ —2
                  1957  కేమాస్ కు నోబెల్ పురస్కారం ప్రకటిస్తే ”నోబెల్ బహుమతి మాల్ రక్స్ కు ఇచ్చి వుండాల్సింది ‘అని బాహాటం గానే ప్రకటించుకున్న నోబెల్ పిచ్చాడుమాల్ రక్స్ .1966 లో Grand and petit  palace లో pikasso retrospect  (సింహావలోకనం )నుమాల్ రాక్స్  అత్యద్భుతం గా నిర్వహించాడు .అయితేఅధికారుల  అలసత్వం తో ఆ కార్యక్రమ ఆహ్వానం చిత్రకారుడు పికాసో కు అందలేదు .పికాసో కు ఎక్కడో మండి ”నేను చచ్చానను కున్నారా ?”అని మాల్ రక్స్ కు టెలిగ్రాం ఇచ్చాడు .మనవాడు ”నేనేమైనా మినిస్టర్ ను అనుకున్నావా ”అని గోల్మాల్ సమాధానం ఇచ్చాట్ట .చైనా అధ్యక్షుడు మావ్ సే టుంగ్ తన జీవిత చరిత్రను memoirs  పేరుతో రాస్తే మనవాడు అంటి మేమోఇర్స్ (అపస్మ్రుతులు )రాశాడు .మాల్ రక్స్ కు భారతదేశం అంటే వల్లమాలిన గౌరవం ,అభిమానం .”అన్ని నాగారకతలు సమానమే ,కాని భారతీయ నాగరకత సమానమైన కొన్నిటికంటే ఇంకా ఎక్కువ (more equal )అని కితాబు ఇచ్చాడు .మనదేశామంటే విపరీతమైన వ్యామోహం కూడా వుండేది .నమ్మకం లేని మతపరమైన నమ్మకం వున్న వాడు (religious mind without faith ).”గాంధి మహాత్ముడు అడ్డుపడక పోతే ,ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్యోతిని ప్రసాదిస్తున్న భారత దేశం ,ఆసియా లోనే తిరుగు బాటు స్థానం గా చరిత్రలో మిగిలి వుండేది ”అనిమహోన్నతం గా భారతీయ సనాతన పరంపరను ,అహింసా మూర్తి ,గాంధీ మహాత్ముని విశిష్ట వ్యక్తిత్వాన్ని ఆరాధనాభావం తో విశ్లేషించాడు .” భారతీయ ఆత్మను దర్శిస్తేనే భారతీయులు అర్ధమవుతారు ‘,వారి మేధోవిజ్ఞానం  తెలుస్తుంది ”అని పరమాద్భుతం గా చెప్పాడు రక్స్ .
                               మాల్ రక్స్ కు భారతదేశం లో గొప్ప గణిత శాస్త్రజ్ఞులు ,వైద్యులు ఉన్నట్లు తెలియదు .మధుర మీనాక్షి దేవాలయం ను సందర్శించినపుడు డాక్టర్ రాజా రావు గైడు గా వ్యవహరించారు .”సూర్యుడు శిఖరాన్ని వెలిగించేది , శిల్ప కళా వైభవాన్ని  చాటి చెప్పేది ఈ దేవాలయమేనా ?అని అడిగారు మాల్ రక్స్ ఆశ్చర్యం గా .దానికి రావు గారు ”మనిషి ఒక వస్తువు మీద దృష్టి పెడితే అది అతని లో కరిగి పోతుంది .ఇక్కడి గోపురం అంతరిక్షానికి  చిహ్నం .ఆకాశం లోని సూర్యుడు క్రిందిభూమినిచల్లబరుస్తాడు .ఇక్కడి అసంగత విషయం( Absurd )ఏమిటంటే దానికి సమాధానం అనేది దొరకదు ”అని చెప్పారట .
                    1958  లో ప్రఖ్యాత రచయిత కుష్వంత్ సింగ్ మాల్ రక్స్ ను ఇంటర్వ్యూ చేశాడు .”మాల్ రక్స్ ఫ్రేజులు టపా కాయలు లాగాపేలుతాయి      .అందులో భయంకర శబ్దాలు మెరుపులు కనిపిస్తాయి .అంతా అయాక మిగిలేది వట్టి నల్లటి పొగ మాత్రమే ”అని తేల్చాడు .కాశీ క్షేత్రం లో గంగానదిని చూసి ”ఈ గంగా జలం సగం నోరు తెరిచి చనిపోయిన వారి నోల్లల్లోకి చేరి పవిత్రం చేస్తాయి ”అన్నాడు .ఫ్రాన్సు దేశం లో భారత దేశ రాయబారి రామేశ్వర్ దయాళ్ -మాల్ రక్స్ ను చూడటానికి వస్తానని చెబితే మాల్ రక్స్ వచ్చేటప్పుడు పవిత్ర గంగాజలం ను తీసుకుని రమ్మని చెప్పాడట .అంతటి పవిత్రభావం ఆయనకు వుండేది గంగా నది పైన .ఆయన కోరినట్లే గంగాజలం తెప్పించి ,వెండి పాత్రలో పోసి తీసుకొని వెళ్లి అందించాడు దయాళ్ .
                       తాను లెక్కించదగిన రచయితనుఅని తానే దంకా   బాజా ఇంచాడు మాల్ రక్స్ .1969  లో జార్జెస్ పామ్పిడో -దేగాల్లి ని వోడించి  ఫ్రాన్సు అధ్యక్షుడు అయాడు . .రాజకీయం గా తెరమరుగైనాడు మాల్ రక్స్ .”రాయటం ఒక బలమైన మందు ”అంటాడు రక్స్ .”దీనిపై స్పందించిన డేగాల్లి ”మూటలో ఏముందో మరిచేట్లు చేస్తుంది .అది చాలా ముఖ్యం ”అని తిప్పి కొట్టాడు .తాను పికాసో అంత జీనియస్ అని స్వంత డబ్బా కొట్టుకోవటం పాపం అతని బలహీనత .”నాకు పాబ్లో ఎవరో తెలీదు .అతనొక ఏకాంత వాసి .కాని పికాసో అంటే బాగా తెలుసు ”అని అమాయకం గా అంటూ అసలు పికాసో కు అస్తిత్వం వుండటం ఆశ్చర్యకరం అని చెబుతూఅలాగే  మాల్ రక్స్ జీవించివున్నాడుఅంటమ్  కూడా అంతే ఆశ్చర్యం అన్నాడు మాల్ రక్స్ .
                  తాగుడుకు పూర్తి బానిస అయినా అది మాల్రక్స్ బుద్ధి కుశలతను తగ్గించలేక పోయింది 71 వ ఏట తన తోటి వారు ,తాను అత్యధికం గా ప్రేమించిన వారు ప్రమాదాలలో మరణించినందుకు చాలా కలత చెండాడు .ఈ స్థితి లో ఇంకా బతికి వుండటం చావుతో సమానం అన్నాడు .అతని ఆర్ట్ పుస్తకాలు గొప్ప ఆల్బం లు గా ప్రసిద్ధి చెందాయి .”విషయం ఎంత ప్రాముఖ్యం పొందిందో ,చిత్రాలు అంతే ప్రాముఖ్యం పొందాయి కాలమ్ తో బాటు రచన ఎలా రూపాంతరం  చెందుతుందో సోదాహరణం గా వివరించాడు .శతాబ్దాలు గడిచిపోయిన తర్వాత ,ఆ రచన దేనికోసం ఉద్దేశింపబడి చేయబడిందో ,దాని నుంచి వేరై పవిత్రాక్రుతి దాలుస్తుంది అంటాడు .”ప్రతి సంస్కృతి విశ్వజనీనమై ,సత్యమై వుంటుంది .కళా కృత్యం ఆ కాలమ్ లో ఆవిర్భవించి అందులోనే జీవించి ,అది కళాత్మకం గా కాలాన్ని దాటి నిలిచి పోతుంది .
దాన్ని అర్ధం చేసుకోవా టానికి కావలసిన సమస్తమైన సమాధానాలు అందులోనే కనిపిస్తాయి .వెతికే ఓపిక వుండాలి సంస్కృతి కేవలం జ్ఞానమే కాదు అదొక గొప్ప ఆవిష్కరణ .మేధావి సత్యాన్నే గ్రహిస్తాడు .కళ లో అంతకు ముందు లేని భావాన్ని మేధావి అయిన రచయిత ,కళా కారుడు ఆవిష్కరిస్తాడు అతను చారిత్రాత్మక నాయకునితో సమానం .హీరో లకుగొప్ప శక్తి వుంటుంది .అది వారికి మాత్రమే చెందినది కాదు కలాక్రుతిలో సౌందర్యం ముఖ్య కారణం గా వుంటుంది .కళ అమరత్వానికి అవతార స్వరూపం అది అనంతత్వానికి ,తిరుగుబాటు కు ,విప్లవానికి ,మానవ జీవితం లో రోజూ అనుభవించే దాని తిరస్కారానికి ప్రతీక .మనం కాలాన్ని మోయటానికి జన్మిస్తునాం.దాని నుంచి తప్పించుకోవటానికి కాదు .”అని చాలా అనుభవ పూర్వకం గాఅనుభూతి కలిగిస్తాడు .ఇవి చాలా విలువైన మాటలు అతని విశ్లేషణ శక్తికి ఆనవాళ్ళు ..ఇవన్నీ ఆయన నిర్దుష్ట అభిప్రాయాలు .”నా జీవితమే ఒక నవల ”అని challenge  చేసి  చెప్పిన రచయిత ,చిత్రకారుడు ,వార్ హీరో ,రాజకీయ చతురుడు ,మంత్రిసత్తముడు ,మాటల మార్మికుడు ,మహత్తర ఆలోచంనాపరుడు ,మేధావి ,కళా సౌందర్య పిపాసి ,వ్యాఖ్యాత ఆండ్రీ . మాల్ రక్స్
                                                      అయిపొయింది
                                            మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -10 -11
Posted in అనువాదాలు | Leave a comment

డాంబికుడు మాల్-రక్స్ —1

డాంబికుడు మాల్-రక్స్ —1
                    ఫ్రెంచ్ రచయిత ,విమర్శకుడు ,కళాచరిత్ర కారుడు ,,యుద్ధ వీరుడు ,రాజకీయనాయకుడు ,మంత్రి డాంబికుడు ఆండ్రే మాల్ రక్స్ .జననం-03 -11 -1901 -మరణం -23 -11 -1976
la condition humane ,the voice of silence ,history and philosophy of world art ,museum without walls మొదలైన గ్రంధాలు రాశాడు .సంపన్న కుటుంబం జన్మించాడు .౧౯౨౯ లో ఆఫ్ఘనిస్తాన్ లో గ్రీకో బుద్ధిష్ట్ కళను గుర్తించాడు .౧౯౩౪ లో అరబియా లో queen sheebaa  నగరాన్ని కనుగొన్నాడు .1926 లో మొదటి నవల The temptations of the West రాశాడు .ల కండిషన్ హుమనే కు మంచి పేరు వచ్చింది .మాస్టర్ పీస్ అన్నారు  అంతా .ఫ్రెంచ్ నవలాకారులలో అగ్రేసరుడు అయాడు .ఆయన వచన రచన కవిత్వం లాగా వుంటుంది .అద్భుత జ్ఞాపకశక్తి కలవాడు .అపారజ్ఞాన సంపన్నుడు .1936  లో స్పానిష్ యుద్ధం తర్వాత స్పైన్ వెళ్లి అక్కడినుంచి అమెరికా చేరి ,స్పైన్ కు వైద్య సేవ అందేట్లు చేశాడు .L-espoir సినిమా కు దర్శకుడయాడు .ఆ సినిమా రెండవ ప్రపంచయుద్ధం తర్వాతే విడుదల అయింది .ఆ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫ్రెంచ్ ట్యాంక్ unit లో చేరాడు .1944 కాల్పుల్లో గాయపడ్డాడు .బందీ కూడా అయాడు .ఫ్రీ ఫ్రెంచ్ brigadior  ఏర్పరచి కమాన్దర్ అయాడు .చాలా ప్రతిభ తో శక్తివంత మైన నవలలు రాశాడు .1945    తర్వాత చరిత్రకారునిగా ,క్రిటిక్ గా మారాడు .కళా విమర్శకుడు గా మంచి పేరు వచ్చింది .తన జీవిత చరిత్రను Antimemoirs   గా 1967 లో రాశాడు  ఇదంతా ఒక పార్శ్వ్యం .దీనికి మించి అతనిలోని ఇంకా చాలా పార్శ్వ్యాలు వున్నాయి .వాటిలోకి ప్రవేశిద్దాం .
                            1920  లో కళలకు పుట్టినిల్లు అయిన పారిస్ నగరం నుంచి మిలిటరీ ప్రభుత్వాలైన కంబోడియా ,చైనా ,స్పైన్ దేశాల మీదుగా ,అంతర్యుద్ధ కాలమ్ లో మారాడు .సరదాగా అబదాలాడే నైజం వున్న వాడు .గొప్పలు చెప్పుకోవటం మహా ఇష్తం .చైనా కమ్యూనిస్ట్ అధినేత మావో తనకు మంచిమిత్రుడు అనే వాడు .అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ ను ఒక్కసారి మాత్రమే చూసినా ,ఆయన తనను ట్యూటర్ గా వున్దమన్నాడని కోతలు కోసేవాడు .యుద్ధభూమికి దగ్గరలో తనే చేసుకున్న గాయం తో ఫ్రెంచ్ యుద్ధవీరుడు అయి పోయాడని చెప్పుకుంటారు .అతని రేనైసేన్స్ కధలు ,గాధలు విపరీతం గా ప్రచారం పొందాయి .అక్షదేశాలు యుద్ధం ప్రారంభించాతానికి కొన్ని వారాల క్రితమే అతను సైన్యం లో చేరాడు అనీ ,ఒక విమర్శ కూడా వుంది .తనను గురించి చెప్పుకున్న గొప్పలుకోతలు దాటే టట్లు చెప్పే నేర్పున్న వాడు . ..
                          మాల్ రాక్స్ మంచి చిత్రకారుడు .వందకు పైగా అద్భుత చిత్రాలు గీశాడు .అవి మ్యూజియం లలో ,యాత్రా ప్రదర్శనల లో వన్నె కెక్కాయి .ఫ్రాన్సు దేశ సైన్యాధ్యక్షుడు (జనరల్),ఆ తర్వాత దేశాధ్యక్షుడు అయిన డేగాల్లీ కు తానే దిక్కు అని బడాయి కబుర్లు చెప్పేవాడు .దేగాలీ ఏ పనీ సరిగ్గా చేయడు ,చేయలేదు అని ఒక statement పారేశాడు ఫ్రాన్సు ప్రజలకు యామి కావాలో దాన్ని డేగాల్లి చేయలేదని విమర్శించాడు .మాల్ రాక్స్ అంటేనే wine ,whisky  తాగుడు గాడు అని అభిప్రాయం వుంది .జనరల్ డేగాల్లి ని ఆరు ఏళ్ళు ఆరాధించి ,ఆ తర్వాత మళ్ళీ సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నాడు .కంయూనిస్తులనే ఎందుకో చిరాకు .వాళ్ళు కోరుకొనేది సరైనదే నని అయితే వారు చేసే తీరు నీచం గా వుంటుంది అనే వాడు .మాల్ రాక్స్ charactor  అపకేంద్రగామి (సెంట్రిఫుగల్ )గా కంటే (centripetal )కేంద్రాకర్షణ గామి గా వుండే వాడు .1958  లో డేగాల్లి అధికారం హస్తగతం చేసుకోవటం ప్రారంభించాడు .డేగాల్లి మంత్ర్వర్గం లో మాల్ రాక్స్ సంస్కృతి శాఖ మంత్రి గా పని చేశాడు .దాన్ని గురించి పత్రికల   వారికి చెబుతూ ”నేను చేబట్టే మంత్రిత్వ శాఖ శ్మశానం లాంటిది .దాని పని అయిపోగానే ,నన్ను కలిసి మాట్లాడమని కోరుతాను ”అన్నాడు .అతని దృష్టి లో ఫ్రాన్సు దేశం లో రెండు విహార స్థలాలు  వునాయత .ఒకటి అధ్యక్షుడు డేగాల్లి ,రెండు తాను .
                    ఫ్రాన్సు దేశపు జనరల్ radio గురించి మాట్లాడుతూ ”ఇదొక దెయ్యపు నౌక -అది ఇంకా కుంచిన్చుకుపోలేదు .రాజకీయ పక్షాలకు ధర్మ సంస్థ గా వుంది .పదవిలోకి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ ,తనకు అనుకూలం గా వున్న ప్రతి వారికీ ,ముఖ్యం గా కమ్యూనిస్టుల నుంచి వలస వచ్చిన వాళ్లకు నిలయం గా వుంది .”అన్నాడు .రాజకీయ సంమేలలో దీన్నే ప్రధానం గా ఎంచుకుంటారు .దీన్ని నడపటానికి కనీసం యాభై మంది సాంకేతిక నిపుణులు వుంటే చాలు .అన్నాడు
                     గాలిజం (డేగాలిజం )లోని వామ భావాలకు మాల్ రాక్స్ ప్రతినిధి .మాల్ రాక్స్ ను ”జనరల్ దేగాల్లి daancer ”అనే వారు .అంటే ఆయన చెప్పినట్లు ఆడేవాడు అని భావం .ప్రపంచం లోని ప్రజాస్వామ్య దేశాలలో సంస్కృతికి ఒక మంత్రి ని ఏర్పాటు చేసిన అతి కొద్ది దేశాల్లో ఫ్రాన్సు ఒకటి అయింది అని గొప్పగా చెప్పాడు .ఇందులో నిజం లేక పోలేదు .1958  డిసెంబర్ 21 న డేగాల్లి అయిదవ రిపబ్లిక్ అయిన ఫ్రాన్సు కు మొదటి అధ్యక్షుడు అయాడు .మాల్ రాక్స్ ” Ministre -da -etat”అంటే సాంస్కృతిక శాఖకు అమాత్యుడు అయాడు .కేబినేట్ సమేవేశాల్లో డేగాల్లి కుడి పక్కనే కూర్చునే వాడు .అంటే చాలా ప్రాముఖ్యమైన స్థానం అని అర్ధం చేసుకోవాలి .పదేళ్ళ పరిపాలన లో మంత్రిగా 26  సార్లు మాత్రమే అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఘనుడు .మాల్ రాక్స్ ను సహజ మేధావి గా ,ఆలోచనాపరుడు గా అందరు భావిస్తారు .”సంస్కృతి అంటే ఏమిటో తెలియని ఏకైక మంత్రిని నేనే ”అని గప్పాలు పలికాడు .అయితే డేగాల్లి అతన్ని తమ జాతి ఉత్తమోత్తమ రచయిత గా అందరికి చెప్పేవాడు .కళా చరిత్ర మంత్రిగా వున్నవాడు చివరికి ఉత్త చరిత్ర మంత్రి అయాడు పాపం ”.విషయాన్ని విష్పస్తం గా చెప్పలేని వారు హృదయం లేని వారు ”.అన్నాడు ఒక సారి .భావ వ్యక్తీకరణ ,ఆత్మ ,ఆధ్యాత్మికత క్రైస్తవ కళ లో వున్నాయని భావించాడు .జగత్ప్రసిద్ద చిత్రకారుడు డావిన్సి తాను గీసినా వర్జిన్ చిత్రం లో ,నవ్వులో వీటిని చూపాడు అని విశ్లేషించాడు .అందుకే దాన్ని secular చిత్రం గా మలిచాడని అభిప్రాయ పడ్డాడు .లియోనార్డో డావిన్సి స్త్రీల ఆత్మను మనోహరం గా దర్శింప   జేశాడుఅని నిర్ధారించాడు
              ”  రాజకీయాగ్ని లో ఇనుము ”అని మాల్ రాక్స్ ను అనే వారు .అధ్యక్షుడు దేగాల్లిని సరదాగా ”the girafee ”అన్నాడు .నిజం గా దేగాల్లిఅలానే   వుండే వాడు ఆరడుగులు పైన వుండే అందగానిలా .”జెనరల్ దేగాల్లి సాధించిన ఏకైక విజం మాల్ రాక్స్ ‘అని డబ్బా కొట్టుకొనేవాడు .”అయితే నేనెప్పుడు ఆయనకు ఆ మాట చెప్పలేక పోయాను ”అని మరోముక్తాయింపు ఇచ్చాడు .డేగాల్లి తనను” ఫ్రాన్సు దేశం తో అభిన్నుడు” .గా భావించుకొనే వాడు .పాపం మాల్ రాక్స్ తానే డేగాల్లి అనుకొనేవాడు .మాల్ రాక్స్ ఆఫీసు లోని లాంప్ నెపోలియన్ ది అని గర్వం గా చెప్పుకొనే వాడు .అలేక్జాన్దర్ ద్యూమాస్ కూర్చున్న చోటే తానూ కూర్చుని పని చేస్తున్నందుకు సంతోషం గా వుండేది ఆయనకు .తన పనిథేఎరు ను గురించి వివరిస్తూ ”నాకు కావలసింది దుస్సాహసం ,వెర్రి నేను చేయగలిగింది మాత్రం ఏమీ లేదు ”అని తనను ఆవిష్కరించుకునేవాడు .విపరీతం గా స్మోకే చేసే” SMO -కింగ్ ”అతను .తనకు నోబెల్ బహుమతి రాలేదని తెగ బాధ పడే వాడు .నోబెల్ పురస్కారం రా తగిన అర్హత తనకే ఉందనే వాడు .అమెరికా నవలా రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే కు నోబెల్ పురస్కారం ప్రకటించినపుడు ,అతని కంటే తానే గొప్పవాడినని అన్నాడు .ఆనాటి సాటి రచయితలలో తానే సిఖరాయమానం అని ప్రగల్భాలు పలికాడు .జీన్పాల్ సాత్రే ,అలేగాన్ లు తన తర్వాతే అని చెప్పుకున్నాడు .అమెరికా రచయిత జాన్ స్తీన్బెక్ కు నోబెల్ వస్తే పెదవి విరిచిన ప్రబుద్ధుడు మాల్ రాక్స్ .
                                        మిగిలిన విషయాలు ఇంకో సారి .
                                              మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -20 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

పద్మ ప్రాభ్రుతకం (తామర పువ్వు కానుక )–అలంకార సంపద –3

పద్మ ప్రాభ్రుతకం (తామర పువ్వు కానుక )–అలంకార సంపద –3
                పేర్లు పెట్టటం లోను మహాకవి శూద్రకుడు మంచి చమత్కారం చేశాడు .ఒక విటుడి పేరు ”హ్రీ రమ్యుడు ”  అంటే సిగ్గుతో శోభించేవాడు అని అర్ధం .కాని ఇక్కడ వీడు పట్టపగలే శృంగారక్రీద చేసే వాడు .    అందుకే వాడికి  ”పట్టపగటి ప్రణయ కళా పట్టభద్రుడు ”అని సరదా బిరుదు తగిలించాడు .ఎగతాళి చేయటం ఒక కళ అట .అది ఎలాంటిది అంటే ”ఆకారం పైన వేసిన ముసుగు కూడా అదే ఆకారాన్ని ధరించి నట్లుందట ””నడుస్తున్న కామ రధం కాడి విరుగకొట్ట రాదు ”అనే విట సామెత కూడా చక్కగా సరిపోయేట్లు చెప్పాడు .దీవెన కోద్కా అదే స్థాయిలో వుండాలి కదా ”అవిరళ కామోత్చవోస్తూ ”
అని గార్గి గారి అబ్బాయిని ఆశీర్వదిస్తాడు .సందర్భానికి తగినట్లుగా .ఇదే విధం గా మగధసుందరి అనే గణిక (వేశ్య ) బ్రహ్మచారి గా ఉంటూ వసంతుడిని ఉపాశిస్తోందని తెలిసి ”దంతపు గాట్లతో నీ పెదవులు నలిగినట్లున్నాయి.నీ అంతకు నీవే నియమాలు పెట్టుకోవటం ఎలా వుందంటే ”వ్రతము భంగంము కాని చాన్ద్రాయనమున ముద్దులు ఉద్యాపనంమగు సుద్ది తోచే ”అంటాడు .వ్రతభంగం లేని చాంద్రాయణం లో ముద్దులే వ్రతం చివర చేసే ఉద్యాపనం అని భలే చాకచక్యం గా ,వ్రాతభాష లో సమర్ధించాడు కవి .”తోట అంటే మదన కర్మాంత భూమి ”అని చక్కని పేరు పెట్టాడు .
                       సిగ్గు అనేది యుక్త వయసు వచ్చిన ఆడడానికి ,పైపెచ్చు ప్రౌఢ కాని ముద్దు గుమ్మకు అరణపు సొమ్ము లాంటిది .అంటే సహజమైనది కాదు .–ఎరువు తెచ్చుకున్నది అంటాడు చమత్కారం గా .ఒకడే అనేకమంది స్త్రీలను కట్టుకోవటం కొత్తకాడని చెబుతూ దక్షప్రజాపతి కూతుళ్ళు ఇరవైఏడు మంది చంద్రుని భార్యలు అయారు కదా అంటాడు .అలాగే మామిడి చెట్టుకు ఒకే వేరు నుంచి రెండు తీగలు సాగి అల్లుకోవటం సహజమే కదా అని సమర్ధించాడు .దేవసేన అనే వేశ్య ఆప్యాయం గా తామర పువ్వును కానుకగా కర్నిపుత్రుడికి ఇవ్వమని ఈ విటుడికి అంటే మన భాణం లోని బాణం లాంటి వాడైన వాడికి అందిస్తుంది .ఇదే కారని పుత్రుడైన ఆచార్య మూలదేవుడికి సంజీవి ఆగా పనిచేస్తుందన్న ఆశను వేలిబుచ్చటం తో భాణం ముగుస్తుంది .
                       రజనీకాంత రావు గారి తెనుగు సేత రజనీ గంధం లా సువాసనలీనింది .పద్యం ,గద్యం హృద్యం గా సాగాయి .అసలవి తెలుగు లోనే ఉన్నాయా అన్నంత సహజం గా ,ఆశ్చర్య జనకం గా వున్నాయి .చతుర్భాని నేడు జనరంజకంగా లేకపోయినా ఆ నాడు జనఃరుదయాలను గెలిచినవే .శూద్రకుని భాణం తెలుగు పత్రికా సరస్వతి ”భారతి ”లో ప్రచురితమైంది .భాణం రాసిన వాళ్ళలో వరరుచి ముందు వాడు .రజని గారు వరరుచి రాసిన భాణం ”ఉభాయాభిసారిక ”ను ఆంద్ర ప్రాధ్యాపకులు ,హైదరాబాద్ లోని శారదానగర్ పారదర్శి విద్వ్కద్వరెన్యులు ,చాతుర్భానిని తెలిగిమ్పప్రోత్చాహించిన వారు అయిన శ్రీ ఇప్పగుంట స్సయిబాబా గారికి అంకితమిచ్చారు .ఋణం తీర్చుకున్నారు .
               శ్రీ సాయిబాబా గారు నా అడ్రస్ యెట్లా సంపాదించారో నాకు తెలియదు కాని పుస్తకాన్ని పోస్ట్ లో పంపారు (ఆంద్ర చతుర్భాని) .నేను అందిన వెంటనే వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలను చెప్పి నా అడ్రస్ ఎలా తెలిసింది అని అడిగాను .వారు నేను రాసిన పుస్తకం ఎవరో ఇస్తే చదివానని అందులోని అడ్రెస్స్ చూసి మంచి సాహితీ సేవ చేసే వారి గా గుర్తించి పంపాను అని చెప్పారు .నేను సరసభారతి ప్రచురించిన అయిదు పుస్తకాలను వారికి పంపాను .వారు అందినట్లు జాబు రాసి తమ సహ్రుదయతను చాటారు .ఇది అంతా యాదృచ్చికం గా జరిగిన విషయం .ఎవరు ఎప్పుడు ఎలా చేరువవుతారో మనకే తెలీదు .పుస్తకం చదువు తుంటే శూద్రకుని భాణం అడుగడుగునా నన్ను ఆశ్చర్య పరిచింది,మనసుకు పట్టేసింది .అందులోని అలంకారం,నిర్వహణ ,లోకోక్తులు ఆకర్షించాయి .దీనిపై చిన్న వ్యాసం రాయాలనిపించింది .అది క్రమం గా పెరిగి ఇంత అయింది .ఈ వ్యాసం శ్రీ సాయిబాబా గారికి రజనీ కాంత రావు గారి భాష లో ‘హరిచందనపు పూత.”గా అందిస్తూ ,వారికే అంకితం చేస్తున్నాను .
                        చక్కని ముద్రణ ,ఆకర్షణీయమైన ముఖచిత్రం ఈ పుస్తకానికి వన్నె చిన్నెలు .మొదటి ముద్రణ 2005  లోనే జరిగినా ,శ్రీ సాయిబాబా గారి వల్ల ఇప్పుడే చూడగలిగాను .ఇప్ప పూవు ఒక రకమైన రుచిగా ,మత్తునిచ్చే ద్రవ్య నిదిగా ,భద్రాచల శ్రీరాముని ప్రసాదం గా మనందరికీ తెలుసు .మరి ఇది ”ఇప్పగుంట ”కదా .శృంగార ఖని గా భాసించింది .దాన్ని ఆడరించ్ ప్రోత్చాహించింది .శూద్రక కవి ”తామరపువ్వుకానుక ”లో పుష్పవీది లోని వసంత వధువును నానా కుసుమ సముదాయం గా వర్ణించిన తీరు ,దాన్ని రజని గారి అనువాదం  పుష్పసుగందాన్ని రాశీభూతం చేస్తే ,దాన్ని అత్యంత సుందరం గా చిత్రించారు ”బ్నిం ”.ముఖ చిత్రం ,ఉజ్జయిని లో ఒజ్జల వద్ద విద్యనేర్చే చాత్రవరుల లోపలి చిత్రం ,అట్టచివర సంగీత సాహిత్య బయకారుడు ,ఉభయకారుడు ,వాగ్గేయకారుడు అయిన మాన్యశ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారి చిత్రం ఆకట్టు కుంటాయి .శూద్రుని భాణం ”పద్మ ప్రాభ్రుతకం ”ను స్నిగ్ధ హృదయుడు ,కళా హృదయుడు అయిన సొగసు కాడు స్వర్గీయ ఆచంట జానకి రాం గారికి అంకితమిచ్చారు.  ఈశ్వరదత్తభానం ‘  ధూర్త విట  సంవాదం ”ను ఆకాశవాణి పూర్వ సంచాలకులు కీర్తిశేషులు పెనుబోలు బాల గురుమూర్తి (బాలు )గారికి అంకితం చేసి సహృదయత చాటుకున్నారు సౌమిల్లకునిభాణం ”పాద తాడితం ”ను ప్రముఖ పరిష్కర్త ,85 ఏళ్ళ క్రితమే ”పాటలీపుత్ర చతుర్భాని ” పేర ముద్రించి వెలుగులోకి తెచ్చిన కీర్తి శేషులు మానవల్లి రామ క్రిష్నయ్య కవి పంతులు గారికి అంకితమిచ్చి తన కృతజ్ఞతను తెలియ జేసుకున్నారు .
                     ఇవన్నీ పాటలీపుత్రం లో జరిగే శృంగార కధలే ఇవి .పాటలీపుత్రానికే కుసుమపురం అనే పేరుంది .అదే నేడు పాట్నా అయింది .ఆందరూ లబ్ధ ప్రతిష్టులైన కవీశ్వరులే నవరత్న కవుల సరసన వున్న వారే .శ్రీ ఇప్పగుంట సాయిబాబా గారు విస్తృతమైన ”భూమిక ”కూర్చి ,తమ సంస్కృత ,ఆంద్ర భాషా శేముషిని ఎరుక పరచారు .నాలుగు భాణాల్లో” పుష్ప  భాణం ”గా ఎదను తాకిన శూద్రక భాణం నిజం గా రసజ్ఞులకు ”పద్మ ప్రాభ్రుతకమే ”అంటే ”తామర పువ్వు కానుకే ”.
                                                                       సంపూర్ణం
                                                            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

పద్మ ప్రాభ్రుతకం (తామర పువ్వు కానుక )–అలంకార సంపద —-2

          పద్మ ప్రాభ్రుతకం (తామర పువ్వు కానుక )–అలంకార సంపద —-2
                           వసంతుడిని పుష్పాలతో అర్చించటం ఉచితమేనా ?ఉచితమే అంటూ బహు గొప్పగా సమర్ధించాడు శూద్రక కవి .సూర్యునికి దీపారాధనతో ,సముద్రానికి అందులోని నీటితో పూజ చేయటం లోక సహజమే .వాక్కు కు ప్రభువైన బ్రహ్మదేవుడిని వాక్కులతో అర్చించటం లోక రీతి .అలాగే వసంతుడినీ ఆయన ఇచ్చే పూలతో పూజించటం సహజమేనంటాడు కవి .తనను చూసి తప్పించుకు పోతున్న విపులామాత్యుడిని పలకరిస్తూ ”కలువ స్నేహితులను మేలుకొలపని,పగటి చంద్రుడిలాగా దాటుకు పోతున్నావెం?”అని ఆలంకారికం గా ప్రశ్నిస్తాడు .వాన ,బురద తో ,వరదలతో నది కలుషితమైనపుదు ,దాన్ని శుభ్రపరచాటానికి శరదృతువు వస్తుంది .తీవ్రమైన చలి రాత్రిలో విసనకర్ర తో విసురు కోవటం వ్యర్ధం .వ్యాకరణ పాండిత్యం తో హడలగొట్టే ”దత్తకలాషి ”అనే విటుడికి స్వాగతం చెబుతూ ”స్వాగతం అక్షరాల బందెల దొడ్డికి ‘అని చురుక్కున మాటల ఈటెలతో పొడుస్తాడు .ఉక్కనేలపై తాబేలుగా తిస్తవేయటం ,వారుణీ జఘన పాత్రం గంగా తీర్ధం లాగా పవిత్రం అనటం ,గొల్లపేట లో పెరుగు అమ్మటం ,కపటప్రచార కంచుకం తీసివేయటం చక్కని పలుకుబళ్ళు .దీనికి సంస్కృతం లో శూద్రకునికి ,తెలుగు చేసిన రజనికి వందనాలు .
                      పువ్వులు అమ్మే వీధిలో అనేక పూలసముదాయం అంగ ప్రత్యన్గాలుగా రూపుదాల్చిన వసంత వధువు లాగా ఉందట పూలు అమ్మే వీధి అంతా .ఆ వర్ణనా  మనోహరం గా వుంది . .పదండి నాతో పూలరంగడులు లా ఆ వీధిలోకి .బాగా విచ్చుకొన్న తామర పూవు వసంతం అనే వధువు సిరిమోము (శ్రీముఖం )లాగా ,విరజాజిమొగ్గలు పలువరుసగా ,కలువపూలె కన్నులుగా ,ఎర్రమద్ది పూవు క్రింది పెదవిగా ,తుమ్మెద రోద తేట తేనె పలుకులా ,పూలగుత్తులు రోమ్ములుగా ,సిగచుట్టు దండలే నగలుగా ,పేర్చిన పుష్ప్పాలే వస్త్రాలుగా ,పూలమాలలేమొలనూలుగా  ,పుష్పాలతో అమరిన స్త్రీ రూపు ధరించి పుష్పవీది వసంతుని రాణి లాగా శోభలీనుతోందట ..సాహిత్యచరిత్రలో పుష్పవీధిని ఇంత ఊహాత్మకం గా వ్యూహాత్మకంగా చిత్రించిన కవి లేడేమో /
                        పండుముసలివాడిని చూసి ”ముసలితనం బాగా పండుతోంది కదా ?’అని అంటే వాడు ”ముదిసిన పాములాగా ముసలితనపు కుబుసం వదలగోట్టుకున్తున్నాను ”అని గడుసు సమాధానం చెప్తాడు .ముసలాయన సోయగాన్ని ఎట్టిపోదిచినట్లు మెచ్చుకుంటూ ”కట్టి అంటని గండభాగం తో ముఖం ,పాథ ఇంటికి సున్నం కొడితే శోభించినట్లు గా వుంది ”అని నర్మ గర్భం గా అంటాడు పాత్రధారి సూత్రధారి ,అయిన విటుడు.ముందే చెప్పినట్లు అన్ని పాత్రలు అతనే పోషిస్తాడు .వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతున్నట్లుంటాడు .అవతలి వాడు అనవలసిన మాటల్ని ,వాళ్ళు అన్నట్లు గా భావించి తనే అనటం భాణం లో ప్రత్యేకత .ఇదే కవి కున్న నేర్పు .ఇంకో బకరా గాడు తనను తప్పించుకొని పోతుంటే ,వాదిమొహం మీదే ”వెన్నెల్ని తప్పించుకొని ,గొడుగులో తలదాచుకోన్నట్లు ,స్నేహితుడిని అయిన నన్ను తప్పించుకుని ,స్థంభం చాటుకు చేరావెందుకురా ?”అని గద్దిస్తాడు .అలాగే ”అందని కోరికలు పొందే లోగా ,అందిన సుఖాలను త్యాగం చేయటం పురుషలక్షణం కాదు అని అంటూ నిప్పు వెదకటానికి దీపం కావాలా?”అని సందేశం ఇస్తాడు కోరిన స్త్రీ ని వాడు చేరు కోవటానికి వీలుగా .
                            వేశ్యవాటికను కూడా సందర్భోచితం గా వర్ణిస్తాడు శూద్రక మహాకవి .మన్మధుని ఇల్లు ,జూదరి పాథశాల ,మాయలకు నిలయం ,వంచనకు పంచ ,అది .అక్కడ డబ్బులేని వాడికి స్వాగతం హుళక్కి .వెతలు కూడా రామ్యమఎదే వేశ్యాగృహం ట.విటుడి అనుభవాలన్నీ కవి ఏకరువు పెట్టాడు .ఆయనకూ అనుభవైక వేద్యాలా ?ఒక బౌద్ధ సన్యాసి ,దొంగచాటుగా వేశ్యా సాంగత్యం పొంది ,ముఖానికి ముసుగేసుకొని ,బయటకు వస్తు మన విటశిఖా మణికి   అడ్డం గా దొరికి పోయాడు .అతన్ని ఆటపట్టిస్తూ ,పనిలో పనిగా బౌద్ధం మీద క్లాస్స్ తీసుకుంటూ విరుచుకు పడ్డాడు .”అర్ధం లేని బోడి దొంగ సన్యాసుల చేత మైలపడి పోతున్న బుద్ధ ధర్మానికి ఎటువంటి దుర్గతి పట్టింది /కాకుల ఎంగిలికి తీర్ధజలం మైలపడటం లేదా ?”అనుకొంటూ ,వాడిని ”విహార బేతాళా ?”‘అని సంబోధించాడు .”వేశ్యా వాటిక అనే దిగుడుబావి దగ్గర అప్పుడే వాలిన కొంగలా ,దొంగ అడుగులు వేస్తూ పోతావెం ?సురత (రతి) పిందపాతం అనుష్టీయతేనా ?చీకటి తప్పూ చేసి ,చేయి కడుకోవటం కాదు కదా ?”అని ఝాడించి పారేశాడు .అప్పటికే బౌద్ధం వెర్రితలలు వేసి ,ధర్మభ్రష్తమై క్షీణదశకు చేరుకోన్నట్లుంది .సంఘం నైతికం గా ,సాంఘికం గా దిగజారిన స్థితి .మళ్ళీ సనాతన ధర్మం వైపుకు ప్రజలు అడుగులు వేస్తున్న జాడ కనబడుతోంది .కాంక్షతో కాని అనుకోకుండా కాని వేశ్యల కొమ్పలకు చేరే భిక్షువులు ,జైన బౌద్ధ సూత్రాలను ఓంకార శబ్దం లాగా విఫలురు అవుతారు కాని దాని నుంచి ఏ వెలుగునూ పొందలేరు ‘అని కవి వాక్కులు .కాలమ్ దానినే రుజువు చేసింది కదా /కవిచెప్పినవన్నీ  తాను ప్రత్యక్షం గా చూసినవే ,అనుభవాలే .”సకల జనులమీద ప్రసన్న చిత్తం వుండాలి కదా ?”అని ఆ భిక్షువు,తనచేష్ట nu సమర్దిన్చుకొంటే ,మనవాడు ”అర్ధం లేని తల గోరుగుడుకి ,స్థిరం లేని మనస్సు వల్ల సిగ్గు కాక  మరేమిటి ?”అని గడ్డి పెడతాడు .,మందలిస్తాడు .”మదన భ్రమ చేత శుద్ధ ఆచమనం లాగా ,నీ వల్ల బుద్ధవచనం భ్రష్టం అయింది ”అని మనవాడు బాధ ,సానుభూతి వ్యక్తం చేస్తాడు .ధర్మ భ్రష్టులుఏ కాలమ్  లోనైనా వుంటారు అని తెలియజెప్పే సన్ని వేశం .ఇలా శూద్రక కవి ఎన్నోసామాజికాంశాలను   స్పృశించి వెలుగు లోకి తెచ్చాడు .భాణం అని పేరే కాని చెడు మీదకు ,అధర్మం మీదకు ,అపకారం మీదకు ,అశ్లీలత పైకి ,అధర్మం మీదకు ,చాపల్యం మీదకు సంధించిన బాణం అది అనిపిస్తుంది లోతుగా పరిశీలిస్తే .వ్యంగ్యవైభవం మూర్తీభావించింది ఇందులో . ,
                              ఇంకాసిని విశేషాలు ఇంకోసారి .
                                                                       మీ –గబ్బిట దుర్గాప్రసాద్ .—19 -10 -11
Posted in రచనలు | Leave a comment

పద్మ ప్రాభ్రుతకం భాణం –లో అలంకార సంపద –1

       పద్మ ప్రాభ్రుతకం భాణం –లో అలంకార సంపద –1
                 శూద్రక మహా కవి సంస్కృతం లో ”మ్రుత్చాకటికం ”(మట్టి బండి )అనే నాటకం రాశాడు .అది చాలా ప్రసిద్ధమైనది .అదే తెలుగులో ”వసంత సేన ”అనే సినిమా గా వచ్చింది .ఆ నాటకం లో వసంతసేన అనే వేశ్య పాత్రను అత్యద్భుతం గా తీర్చి దిద్దాడు .మన గురజాడ వారి ”కన్యాశుల్కం ”నాటకం లోని మధురవాణి నిని వసంతసేన తో పోలుస్తారు .ఆ శోద్రక మహా కవే ”పద్మ ప్రాభ్రుతకం అంటే ”తామర పువ్వు కానుక ”అనే భాణం కూడా రాశాడు .అన్ని భాణాల లో అది చాలా విశిష్ట మైంది .ఈ కవి క్రీస్తు పూర్వం రెండువందల ఏళ్ళ నాటి కవి .ఇంతకీ భాణం అంటే ఏమిటో తెలుసు కుందాం .సంస్కృత నాటకాలలో కధానాయకుడు పురాణపురుషుడు కాని ,ఉదాత్తపురుషుడు కాని అయి ఉంటాడు .అయితే రూపకం అనే పిలువబడే ప్రకరణం ,ప్రహసనం ,వీధీ ,భాణం లలో కధానాయకుడు మధ్యతరగతి వాడు.విషయం కూడా మధ్యతరగతికి చెందినది అయి వుంటుంది .సాంఘిక ఇతివృత్తం అన్న మాట భాణం లో ఒకే ఒక పాత్ర రంగస్థలం మీద కన్పిస్తుంది ..ఇతడే విటుడు .కదాఆయకుడు కాదు .కాని ,నాయకునికి ,నాయికకు మిత్రుడు ,సచివుడు లాంటి వాడు .ధూర్తుడు అని ముద్ర పడ్డ వాడు .శతుడు (shathudu ).కళా శాస్త్ర ప్రావీణ్యం వున్న వేశ్యాలోలుడు .అందచందాలున్న కొత్త నాయికలను ప్రేమించి,ప్రేమిమ్పజేసుకొనే వాడు .వీడినే ధీరలలితుడు అంటారు .ఇతని ప్రేయసిలందరూ సామాన్యలె .ఒకరకం గా చెప్పాలంటే ఈ విటుడు ఇవాల్టి మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అనిపిస్తాడు .అన్నిపాత్రల సంభాషణల్ని ,తన గొంతులో పలికించే నేర్పున్న వాడు .దీన్నే ”స్వర వ్యంజనం ”అంటారు .కనుక విటుడి అనుభవానికి హద్దులు వుండవు .రెచ్చిపోవటానికి హద్దులు లేని అవకాశాలు .అభినయానికి పుష్కలం గా సామగ్రి వుంటుంది .పరిమితి లేని నటన తో పండించ గలడు .శృంగారం పుష్కలం .ఆ రోజుల్లో భాణం ప్రక్రియ అందర్నీ ఆకర్షించింది,ఆహ్లాద పరిచేది .దీనిలో రసం కంటే రసాభాసం ఎక్కువ .రసాస్వాదన లో దగ్గరదారి ”భాణం ”అని విమర్శకుల అభిప్రాయం .భాణం లో సమకాలీన సాంఘిక జీవనం  ప్రతిఫలించడం విశేషం .
                         ఆకాలానికి ఆధునికం గా మొదట రూపకం గా ”ధూర్త విట సంవాదం ”అనే భానాన్ని ఈశ్వర దత్తు అనే కవి సంస్కృతం లో రాశాడు .రెండవ భాణం వరరుచి కవి రాసిన ‘ఉభయాభి సారిక ‘
మూడవది శూద్రక కవి రాసిన ”పద్మ ప్రాభ్రుతక మ్ ”.నాల్గవ భాణంఈశ్వరదట్టు  కుమారుడు సౌమిల్లకుడు రాసిన ‘పాద తాదితం ‘;.ఈ నాలుగింటినీ కలిపి ”చతుర్భాని ”అంటారు వీటిని తెలుగు లోకి ”ఆంద్ర చతుర్భాని ‘గా తేట తెల్లం గా ,కవిహృదయ విశ్లేశకం గా అనువదించిన వారు ప్రముఖ వాగ్గేయ కారులు ,ఆకాశవాణి పూర్వ సంచాలకులు  ,కళాప్రపూర్ణ .శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు .ఇవి ఆకాశవాణి ద్వారా ప్రసారం కూడా అయాయి .రసికజనులను అలరించాయి .వీటిలో శూద్రక మహ్హకవి రాసిన భాణం పద్మ ప్రాభ్రుతకం (తామరపువ్వు కానుక )లో మెరిసిన అలంకార సంపదనన్నెంతో ఆకర్షించింది .ఆ సంపదను నేను మాత్రమే అనుభవించే సంకుచిత బుద్ధి నాకు లేదు .కనుక ఆ సంపదను మీకూ పంచి ,నేనూ ఆనందాన్ని పొందుతున్నాను .అక్కడకడ పండిన మధుర  హాస్యాన్ని అందిస్తున్నాను .
                          సంవత్చరం అనే విలాస పురుషుడికి చలికాలపు ముసలితనం లో సర్వమూ వుడిగిపోయాయత .అయితేనేమి హిమరసాయనం సేవించటం వల్ల మళ్ళీ వసంత కిశోరత్వం (చిన్న తనం )వచ్చిందట .రుతుపరం గా సంవత్చారాన్ని అద్భుతం గా ఆవిష్కరించాడు ఆలన్కారికం గా శూద్రక మహా కవి .అప్పుడున్న వసంత శోభ ఎలా వుందో తెలియజేస్తున్నాడు చూడండి .చివర్లు అలల్లాడుతుంటే చెట్లు నృత్యం చేస్తున్నట్లుందట .దానితో తీగలు ,పూలు పూసి యవ్వనాన్ని పొందాయత .తిలకం అనే చెట్టు శిరస్సు పై వున్న కోయిల కొత్తముడి గా ఉందట .కుందపుశ్పం మీద కూర్చున్న తుమ్మెద అందమైన స్త్రీ చూపు లాగా ఉందట .ఆకుపచ్చని తామర మొగ్గ అప్పుడే తల ఊపే కన్నె పిల్ల లాగా ఉందట .ఆమని (వసంతం )అనే కోడె (యువకుడు )గాలి వీస్తుంటే వలపు చెలగాటం లో అలసి చెమర్చిన జవరాలి (యవ్వనం లో వున్న )స్థనాల స్పర్శ సుఖం లాగా ఉందట .
                     ఇంకో చోట ”దేవదత్త తో సాంగత్యం అనే మధుపానికి (తుమ్మెద )పక్కనంజుడు కూరలాంటిది దానిచెల్లెలి పొత్తు ”అంటాడు .ఆ పరిసరాలు ,ఆ తాగుడు ,చీకుల నంజుడు   భాషలో .వేరొక చోట ”మదనజ్వరం తేలికగా కనబడుతున్నా ,మహాచేడ్డబలమైనది అంటాడు .ఉజ్జయినీ నగరవైభావం చాలా కొత్తభాషలో చెప్పాడు .”వసుంధర (భూమి )అనే వధువుకి జంబూద్వీపం వదన కపోలం (చెక్కిలి )అయితే దానిమీద చిత్రలేఖనం గా అనిపించే అవంతి సుందరి ఈ ఉజ్జయిని అపర లక్ష్మీదేవి లా విరాజిల్లుతోంది .చాలా గొప్ప ఆవిష్కరణ ఇది .అలాగే అర్ధవంతమైన మాటల సంభాషానాన్ని ‘సరస్వతీ లతకు పూసిన వాక్ పుష్పాలు ”అనటం శూద్రక మహాకవికే చెల్లింది .
                                       మరిన్ని విశేషాలు మరోసారి
                                                                                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —19 -10 -11 .
Posted in రచనలు | Leave a comment

వైల్దేరిసం (Wilderism )

     వైల్దేరిసం               (Wilderism )
Thornton Wilder గొప్ప అమెరికన్ నాటక రచయిత అని చేపాను కదా .ఇప్పుడు అతని మనోభావాలు తెలియ జేస్తాను .అవి అందరు తెలుసుకోవలసినవే ..రచయిత రాసే భాష అతను జీర్ణించుకున్న అనుభవం ద్వారా తనను గురించి తనకు తాను తెలియ జెప్పుకొంటాడు అంటాడు ఆయన .నాటక రంగం మీద ప్రతిక్షణం ”ఇప్పుడే ”అనిపిస్తుంది .భవిష్యత్తుకు ,భూతకాలానికి మధ్య పాత్రధారులు ఖడ్గ ధార (rajor edge )మీద నిలబడి ,అత్యంత అవసరమైన అంతరాత్మ ప్రబోధకం గా మాటలు పెదాలు దాటి అప్పటికపుడు ప్రయత్నా రహితం గా మాట్లాడుతారు .నవలా అంటే జరిగి పోయిన విషయం .చెప్పేవాడికి స్వయం గారద్దు పరచేదేమి లేక  ఉండక విషయాన్ని దాచి మనకు అతని గొంతు వినిపించేట్లు చేస్తాడు .మళ్ళీ మళ్ళీ లేక్కలేసుకుంటూ జరిగి పోయిన సంఘటనలతో తాను ఎంచుకున్న సంఘటనలను జ్ఞాపకం చేసు కుంటాడు .ఇతను లెక్కించటానికి వీలు కాని ఇతరుల కంటే మనముందు నిలిచి తనకున్న పరిజ్ఞానాన్ని ఆవిష్కరిస్తాడు అంటాడు వైల్దేర్
                   నాటక రంగం అన్ని కళల కంటే మహోన్నత మైనదని అతని భావన .మానవుడు తన లాంటి మరో మానవుని మనోభావాలను అప్పటికప్పుడు  పంచుకొనే వీలున్న  రంగం .రచయిత లందరికి ఏదో కొంత నీతిని బోధించాలని పిస్తుంది .అక్కడినుంచి ,యంత్రం కదలటం మొదలవుతుంది .ఇంకో రకం గా చెప్పాలంటే మనం గాస్ స్టవ్ మీద వండుకొన్న పదార్ధం ఆ గాస్ వాసనతో వుండదు .కాని మనం అందులే వేసిన దినుసుల లోని రుచే వస్తుంది .నాటకం చెప్పేదేమిటంటే -జీవితం జీవిస్తూ ,అందులోనే జీవితాన్ని తెలుసుకోవటం లా వుంటుంది .”మీరు ఎందుకు రాస్తున్నారు ?”అని వైల్దేర్ ను అడిగితే ”నేను ఎందుకు రాస్తున్నాను అంటే -నాపై నేను ప్రయోగం చేసుకుంటూ ,కొత్తపుస్తకాన్ని ఆవిష్కరించాతానికే ,అది చదివి నేను ఆనందించటానికి,లేకపోతే ఒక కొత్త నాటకం తో నన్ను నేను మరచిపోవటానికి,లేక తాదాత్మ్యం చెందటానికి”అన్నాడు ”మీరు చెప్పిన విషయాలన్నీ మీరు రాసిన పుస్తకాలు నేరవేర్చాయా ?”అని ప్రశ్నిస్తే ”లేదు ”అని ఖచ్చితం గా చెప్పాడు .
                         వైల్దేర్ అభిప్రాయం ప్రకారం రచయిత తప్పని సరిగా విమర్శకుడు అయివుండాలి ..ప్రతి వాక్యం శక్తివంతం గా తిరస్కరిమ్పబడే అస్తిపంజరమే నంటాడు .ప్రతి అంగీకారం సత్యం శక్తి ,సౌందర్యం మొదలైన వాటిని పాలించేదే .రచనావ్యాసంగం చాలాభాగం వదలివేయబడే వ్యూహాత్మక అంతశ్చేతనా విధానమే .విమర్శకుడు పందోమిదిభాగాలు నీళ్ళలోనే మునిగివుందే మంచుపర్వతమే (ఐస్ బెర్గ్ )అంటాడు నాటక కర్త వైల్దేర్ .ఎందుకు ,ఎలా రాశాడు అనే విషయం మీద రాసే వారిని W.B.yeats  ”వసంతాన్ని మురికి చేయటం వంటిది ”అన్న మహాకవి బ్రౌనింగ్ వాక్యం తో హెచ్చరించినట్లు వైల్దేర్ చెప్పాడు చివరగా వైల్దేర్ ”ఆపిల్ పండుఎర్రబడిన   చోట తొంగి చూడకు-చూస్తే   మన స్వంత ఎడెన్ కాని నువ్వు కాని నేను కాని ఉండము ‘.అని హితవు చెప్తాడు
                                                       మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –18 -10 -11 .

 

Posted in అనువాదాలు | Leave a comment

నాటక రచయిత wilder

                        నాటక రచయిత wilder
ప్రయోగాత్మక నాటక రచయిత గా ప్రపంచ ప్రసిద్ధి పొందిన నాటక రచయిత  Thorton wilder .అమెరికా లోని విస్కాన్సిన్ లో ని మాడిసన్ లో 17 -04 -1897  లో జన్మించాడు .సృజాత్మక నవలా కారుడు ,నాటక రచయిత .విశ్వం మీదఆయన  ఆలోచనలు ఆశ్చర్యం కలిగిస్తాయి .1920 లో yale  విశ్వ విద్యాలయం లో డిగ్రీ పూర్తి చేశాడు .1930 -37 మధ్య చికాగో విశ్వ విద్యాలయం లో డ్రా ,క్లాసిక్స్ బోధించాడు .1926 లో   the kobaala అనే  మొదటి    నవల  రాశాడు   .తర్వాతి   నవల   bridge of saint louis   1927 లో రాస్తే దాన్ని సినిమా తీశారు .టి.వి .లో కూడా వాడుకునారు .1930 లో the women of andros రాశాడు .ఆయన రాసిన దాన్ని బట్టి ఆయన్ను అమెరికన్ అని అనుకోలేదు .గ్రీకు రచయిత ఏమో ననుకున్నారు .అంటే అతని కృషి యెంత గొప్పదో తెలుస్తుంది .1948 లో the ides of march ,1967  లో  The english day ,1973 లో    Thiophilus North రాశాడు  .
                 అతని నాటకాలు కొత్త తరహా గా వుంటాయి .అందులోని పాత్రలు ప్రేక్షకులతో మాట్లాడు తాయి .అంటే ఆ కాలాన్ని మనముందు ఆవిష్కరిస్తాడు . . .మనం ఆ కాలమ్ లో వున్న  అనుభూతి వుంటుంది .అందులో భాగస్వాములం అవుతాం .అదొక గొప్ప థ్రిల్లింగ్ .1938 లో రాసిన నాటకం అవర్ టౌన్ ..ఇందులో స్టేజి మేనేజర్ పాత్ర సృష్టికి ఆశ్చర్య పోతాం .1958 లో వచ్చిన the match maker  లో కూడా ఇలాంటి సృజనాత్మక ప్రయోగమే చేశాడు .ప్రేక్షకులతో మాట్లాడటమే వీటి ప్రత్యేకత .helo daddy naatakam కూడా  super hit .ఇది ముసిచల్ డ్రామా గా సినిమా గా వచ్చింది .
                      the skin of our teeth నాటకం 1942 లో ఒక కాలానికి చెందిన విషయాలను వరుస తప్పించి ,తారుమారు చేసే పధ్ధతి anachronism అంటే కాల వ్యతిక్రమం అనే కొత్త విధానం తో రాశాడు .ఆ నాటి భౌగోళిక చారిత్రాత్మక కాలాల లోని పాత్రలను తీసుకొని వారి తోనే ప్రేక్షకులతో మాట్లాడించే విధానం ఇందులో వుంది .ఇదో నూతన ప్రక్రియ .దీని వల మానవ అనుభవాలు ఏ కాలమ్ లో నైనా ,ఏ ప్రదేశం లో నైనా ఒకటి గానే వుంటాయి అని చెప్పటం అతను సాధించిన విజయం .ఇలా కొత్త తరహా ప్రయోగాలను నాటక రంగం లో చేసి సఫలీక్రుతుదయాడు .విపరీతం గా ప్రేక్షక ఆదరణ పొందాడు
wilder .అతని అనుభవాలను గురించి ఇంకో సారి తెలియ జేస్తాను .
                                                             మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -10 -1
Posted in సేకరణలు | Leave a comment