మరిన్ని నటరాజు జ్ఞాపకాలు

          మరిన్ని నటరాజు జ్ఞాపకాలు 
          స్వర్గీయ నటరాజ రామ కృష్ణను మొన్న నేను ”నవీన భరత ముని ”అని రాశాను .ఆ మాటను ప్రఖ్యాత రచయిత ,పరిశోధకులు శ్రీ వకుళాభరణం రామ కృష్ణ గారు కూడా తమ వ్యాసం లో పేర్కొన్నారు . అందు లోని మరి కొన్ని విశేషాలు వివరిస్తాను .కృష్ణా జిల్లా దివి తాలూకా లో జన్మించి ,కాకతీయ సామ్రాజ్య ములో సేనా నాయకత్వం వహించిన జాయప సేనాని రచించిన ”నృత్త రత్నావళి ”ని అధ్యయనం చేసి రామప్ప గుడి లోని శిల్ప రీతులను పరిశీలించి ,”పేరిణి ”నృత్యాన్ని అందించిన మరో భరత ముని రామ కృష్ణ అప్పటికే అనేక నృత్య రీతుల్ని అధ్యయనం చేసిన అనుభవం సంపాదించారు .దేవదాసీల నృత్యం అంతరిస్తున్న సమయం లో ,తన సర్వస్వాన్ని ,ఆనృత్యాన్ని కాపాడ టానికి వినియోగించి ,సంఘం విధించినా ఆంక్షలను ఎదిరించి కాళహస్తి రాజమ్మ ను తన గురువు గా స్వీకరించారు .నవజనార్దన పారిజాతం అభినయించే ప్రసిద్ధ కళాకారిణి పెండేల సత్య భామను ,బొబ్బిలి జీవ రత్నమ్మ ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు గానంచేసి   అభినయించే సరిదే మాణిక్యమ్మ ,మొదలయిన వారి వద్ద నెలల తరబడి విద్య నేర్చి ”ఆంద్ర నాట్యాన్ని ”పునరుద్ధరించారు నటరాజు .పైన పేర్కొన్న వారందరికీ ఆంద్ర దేశం రుణ పడి వుంది .ఈ నాట్యానికి ఒక రూపం కల్పించి ,పాఠ్య ప్రణాలికను తయారు చేసి ,నృత్య కళాశాలలో పాత్యాంశం గా ప్రవేశ పెట్టించే వరకు విశ్రాంతి తీసుకో లేదు .నాట్యాన్ని అన్ని కులాల వారు నేర్చుకో వచ్చని ప్రకటించి అందరికి నేర్పారు .భారత నాట్యం ,కదక్ ,మణిపురి నాట్యాలు ఆయనకు అప్పటికే కరతలామలకాలు .కూచి పూడి సంప్రదాయంలో  దిట్ట అయిన వేదాంతం లక్ష్మి నారాయణ గారి శిష్యరికం చేసి అదీ అభ్యశించిన నిత్య విద్యార్ధి నట రాజు .దానిలో తన ముద్రను ప్రవేశ పెట్టి వన్నె తెచ్చారు .దీనితో ఒక నూతన అభినయ ప్రక్రియ ను రామ కృష్ణ ఏర్పరచి నట్లయింది .కూచిపూడి నాట్య కళకు జాతీయ హోదా సాధించటానికి ,శాస్త్రీయ కళగా గుర్తింపు పొందటానికి 1959 లో హైదరాబాద్ లో ఒక జాతీయ సదస్సును తన ఆధ్వర్యం లో నిర్వహించారు .ఆ సభల్లో ప్రఖ్యాత కళాకారిణులు మారం పల్లి వైదేహి ,ఇందువదన లచేత రెండు గంటల పాటు అభినయం చేయించారు .తెలుగు వారి లాస్య నర్త నానికి అందరు ఆశ్చర్య పోయారట .
                         హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయానికి నృత్య విభాగానికి పెద్ద గా ఉండమని vice chancellor ఆచార్య భద్రి రాజు కృష్ణ మూర్తి కోరగా అంగీకరించి పనిచేశారు .విశ్వ విద్యాలయంలో post graduate స్త్హాయిలో నృత్యాన్ని అధ్యయన అంశం గాచ్ర్చటం   ఇదే మొదలు .ఆరుద్ర ,,ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గార్లతో చర్చించి  నాట్య కళ నేర్చుకోవటానికి కావలసిన వాటిని పాఠ్య ప్రణాళిక లో చేర్చారు .సమాజానికి ,కళకు వున్న సంబంధాన్ని సోదాహరణం గా వివరిస్తూ ,కళలన్నీ సమాజం నుండే వస్తాయని అవి ప్రజల వుమ్మడి కృషి అని వివరిస్తూ విద్యార్ధులలో ఆసక్తి కల్పించి నేర్పించే వారు .కలపి సామాజిక స్పృహ కల్గించారు .భారతేయ నృత్య రేతులతో పాటు ,ప్రపంచ వ్యాప్తం గా వున్న నాట్య సంప్రదాయాలను మిళితం చేసి నాట్య విద్యకు ఒక సమగ్ర ఆకృతిని కల్పించిన నాట్య విరించి ,నటరాజు .అనేక నాట్య రీతుల మూలాలలోకి వెళ్లి పరిశోధించిశాశ్త్రీయ  , దృక్పధాన్ని జోడించి ,డాక్టరేట్ పట్టాల కోసం పరిశోధనలకు ప్రోత్చాహించిన విశాల హృదయుడు .నాట్య వ్యాప్తికోసం అభినయ సదస్సులు నిర్వహించారు .కళాకారులకు ఆర్ధికం గా సాయం అందించారు .దొమ్మరి ఆట ,వీధి నాటకం ,తోలు బొమ్మ లాట ,తూర్పు భాగవతమ్ ,చిందు భాగవతం ,వంటిగ్రామీణ   కలలనుకూడా పరిశోధించి వాటి వ్యాప్తికి సహాయ పడ్డారు .ముస్లిం ,క్రైస్తవ ,బంజారా గిరిజన దళిత విద్యార్ధులకు కులమత భేదం లేకుండా నాట్యం నేర్పి న మనీషి ఒక దళిత యువతికి నాట్యం నేర్పి విదేశాలకు కూడా పంపిన నిజ మైన కర్మ యోగి నాట్య యోగి .. నాట్యాచార్యుడు ,,. ,నాట్య శాస్త్ర వ్యాఖ్యాత ఒకరే గా వుండటం అరుదైన విషయం .ఈ రెండింటి సమగ్ర స్వరూపమే మన నట రాజు .ఆంద్ర దేశం లోని కూచిపూడి వారి బాణీ ,కాకర పర్రు వారి బాణీ ,మైనం పాటి వారి బాణీ ఈ మూడు బాణీలాను అర్ధం చేసు కోన్నా” త్రిబాణీ త్రివేణీ సంగమం నటరాజ రామ కృష్ణ” .ఆయన వార సత్వ సంపద అనంతం గా కోన సాగాలాన్నదే అందరి వాంచితం    .
                                                                         ఆధారం –”-అభినవ భరతుడు ”   –రచన   — వకుళాభరణం లలిత ,రామ కృష్ణ
                                                                                  సేకరణ ,కూర్పు ——-గబ్బిట దుర్గా ప్రసాద్ ——–13 -06 -11

 

Posted in సేకరణలు | Leave a comment

జై బోలో బాపు మహారాజ కీ – దీక్షో రక్షిత రక్షితః

నేను చదివిన ఆర్టికల్ మీకోసం

Posted in సేకరణలు | Leave a comment

మూడు ముత్యాలు

నమస్తే శ్యాం గారు

                                మీరు పంపిన పుస్తకాలు మూడు చదివాను .ఒమర్ ఖాయం కవితల్ని సంస్కృతం లో శ్లోకాలుగా రాసిన హరికధా పితామహుడు ,అచ్చ తెలుగు కవి ,మహా పండితుడు స్వర్గీయ ఆది భట్ల నారాయణ దాసు గారి కి ఆంద్ర జాతి రుణ పడి వుంది వారు రాసిన ఉపోద్గాతంలో  చాల విలువైన విశేషాలు చర్చించారు .”సుర ”ను దైవ భక్తీ గా ”  సాకీ  ని శ్రద్ధ గా పేర్కొనటం తో ఖయ్యాం మీద గొప్ప గౌరవం కలుగు తుంది .మితాహారం ,అరణ్య వాసం ,శివ శక్తి నామ సంకీర్తనం ను దాసు గారు ఆ కవితల్లో దర్శించటం బాగుంది వున్నత జీవిత సత్యాలవి .ఉమర్ పెద్ద జ్యోతిష్యుడని ,ప్రారంభం లో సూర్య దేవ స్తుతి చేయటం దీనికి నిదర్శనం అనటం భావ్యం గా వుంది .ఆయనలో గణిత శాస్త్ర వేత్తను చూపారు .ప్రాచీన పార శీకమే ప్రాకృత భాషా విశేషం గా గుర్తించటం విశేషం .ఒక గొప్ప ఆరాధనా భావం తో దేవ భాష లోకి దాసు గారు ఖయ్యాం ను ప్రవేశ పెట్టటం సాహసం తో చేసిన పనే .ఆనాటి సాహితీ వేత్తలపై విరుపులు ,మరకలు ఆదిభట్ల వారు విసిరారు .చాలా ఉదాత్తం గానే వారి రచన సాగింది అయితే నాకు ఏమనిపించిందంటే  ఒమర్ చాలా లలితమైన భాషను ఉపయోగిస్తే దాసు గారు కొంత క్లిష్టమైన ,భారమైన పదాలనుపయోగిన్చారనిపించింది ఆయన పాండిత్య ప్రతిభకు అదొక నిదర్శనం కావచ్చు .లాలిత్యం లేక పోవటం కొంత ఇబ్బంది అని పించింది ఆ ఇబ్బందిని స్వర్గీయ యామిజాల పద్మ నాభ స్వామి తన అనుభవాన్ని రంగ రించి చాలా తేలిక మాటలతో ,లలిత సుందరం గా అనువాదం చేసి ఖయ్యాం ను తెలుగు వాడిని చేసి సఫలీ క్రుతులైనారు .హట్స్ ఆఫ్ to svaami  మంచి పుస్తకము,అరుదైనది అందజేసి నందుకు అభినందనలు
                             రెండోది రావు బాల సరస్వతి గారి అభినందన సంచిక .అరుదైన ఫోటో లతో ,ఆంద్ర ,ఆంగ్ల భాషల్లో వ్యాసాలు ,ఆకర్షణీయ మైన ముద్రణా మనసుకు హత్తు కోనేట్లుంది .ఆ సంగీత సరస్వతికి అపు రూప కానుకే ఇది .thanks .ఇందులో సరస్వతి భర్త గారి ఫోటో లో ఆయన కళ్ళుచూస్తె   ఆనాటి వేమూరి గగ్గయ్య గారి కళ్ళు కన పడి భయమేసింది .పాపం ఆమె యెంత భయ పడ్డారో అని పించింది .ఈ సంచిక రావటానికి భ.రా.గో .గారు యెంత శ్రమ పడ్డారో తెలుస్తుంది .ఇలాటివి తెసుకు రావటం లో ఆయనకు ఆయనే సాటి .మరనిచే వరకు ఆయన ఫోన్ లో మాట్లాడే వారు .ఆయనంటే నాకు అభిమానం ,మాత్రమే కాదు ,ఆరాధన కూడా .ఆయన జీవిత చరిత్ర ”ఆరామ  గోపాలం’ చదివి స్పందించి రాస్తే ,దాన్ని ఫోటో స్టేట్ తీయించి బంధువు లందరికి పంపించి నట్లు ఫోన్ చేసి చెప్పిన సహృదయుడు గోపాలం గారు .ప్రత్యెక అభినందన సంచికలు తేవటం లో ఆయన నిబద్ధత ,కృషి పై ఎవరైనా చక్కని విశ్లేషణ చేయ తగిన సమాచారం వుందని పిస్తుంది .
          పతంజలి గారి మూడు నవలలు .సామాన్య జన జీవితం లో వున్న భయాలు ,పీడన ,వేదన లను హాష్యం తో మేళవించి రాయ గల సామర్ధ్యం పతన్జలిది .సీరియల్ గా వచ్చిన వాటిని చదివాను .ఇంకొంచెం శ్రద్ధ గా వీటిని చద వాలి ఇదేమిటి ఇలా వుంది ,అనిపిస్తూనే ముందుకు నడిపిస్తాడు .వ్యంగ్యం అంగాంగం లో వుంటుంది .ఆలోచన రేకెత్తిస్తుంది .ఇదీ అందరినీ అలరించేది .
                     పాథకుల అభిప్రాయాలకు అనుగుణ మైన అపురూప విషయాలను అందిస్తున్నందుకు మరో మారు అభినందనలు .
                                                                                         మీ– గబ్బిట  దుర్గా ప్రసాద్ —12 -06 -11
                        
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

కొడవటి గంటి చెప్పిన కధ కాని కధలు

      కొడవటి గంటి  చెప్పిన కధ కాని కధలు 
      ——————————————-
తెలుగు సాహిత్యం లో కొడవటి గంటి కుటుంబరావు కు ప్రత్యెక స్థానం వుంది .కధ ,నవల,వ్యాసం ,గల్పిక విమర్శ ,విశ్లేషణ ,సినిమా ,రాజకీయ సంగీతా లపై సాధికారత ,ఆయనది .చాలా మామూలు భాషలో అలంకారాలు లేకుండా నిసర్గాన్ గా రాయటం ఆయన ప్రత్యేకత .అలా చదువుకుంటూ పోతూనే వుంటాం .క్లిష్టత ,డొంక తిరు గుళ్ళు వుండవు .పాఠకుడి మనసులోకి సూటిగా హత్తుకు పోయేట్లు రాయటం ఆయన శైలి .దేనిమీద రాసినా ఇదే విధానం .చదివించే మహత్తర శక్తి వుంది .అభ్యుదయ భావాల గని .మానవుడి బలం ,బలహీనతలు తెలిసిన వాడు .ప్రపంచ సాహిత్యం పూర్తిగా అధ్యనంచేశాడు  .సైంటిఫిక్ గా ఆలోచించే తత్త్వం వున్న వాడు .ఆయన రాసిన వన్నీ రాసి పోయాల్సినంత వుంది .సమగ్ర సాహిత్యం లభ్యమవుతోంది చదివి తెలుసు కావలసినవి ఎన్నో వున్నాయి రుచి కోసం కొన్ని మీకు అందిస్తున్నాను
                          ఎనిమిది వందల ఏళ్ళ క్రితం హేమ చంద్రుడు అనే జైన ఆచార్యుడు ;”సవిరావాలీ చరితం ”అనే పుస్తకం రాశాడు అందులో కధలపై వ్యాఖ్యానం లాంటి ”గల్పిక ”రాశాడు .
రమణీయం అనే దేశానికి రాజుకు కధలంటే మోజు .పౌరుల్లో రోజు ఒకరిని పిలిపించి కధ చెప్పించుకొనే వాడట .ఒక రోజు ఒక చదువు రాని పూజారి వంతు వచ్చింది .ఆయన కుమార్తె నాగశ్రీ .తండ్రికి బదులు కధ చెప్ప టానికి వెళ్ళింది .కధ చెప్పటం ప్రారంభించింది నా పేరు నాగ శ్రీ .నా తండ్రి నాగ శర్మ .తల్లి సోమశ్రీ .నా తలిదండ్రులు నన్ను ”చట్టుడు ”అనే వాడికి ప్రధానం చేసి పెళ్లి నిశ్చయించారు .ఒక రోజు వాళ్ళిద్దరూ వూరెళ్ళారు .చట్టుడు వచ్చాడు .మర్యాదలు చేశాను .నా మంచం అతనికిచ్చి ,నేను కింద పడుకున్నాను .అర్ధ రాత్రి దాకా వుండి ,నిద్ర పట్టక ,ఆ మంచం దగ్గరకు వెళ్ళా .అతను మేలుకొనే వున్నాడు .ఉద్రేకం తో ఊగి ,నిగ్రహించుకోలేక ప్రాణం వదిలాడు .నేనే చంపానని అంతా అనుకుంటారని భయ పడ్డా .శిక్ష తప్పదు అనిపించింది .అతని శరీరాన్ని ముక్కలు,ముక్కలు చేసి రహశ్యం గా పాతి పెట్టా .అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డా .ఇంతలో మా వాళ్ళు వూరినుంచి తిరిగి వచ్చారు .”ఇంతవరకు కధ విన రాజు ”ఇది నిజమా ?అని అడిగాడు  ”మీరు రోజూ వినే కధలు ఎంత నిజమో యిదీ అంతే నిజం ”అని చెప్పింది నాగ శ్రీ .ఆమె గడుసు తనానికి రాజు అబ్బుర పడ్డాడు .దీన్ని బట్టి తెలిసేదేమి టంటే వాస్తవికత వుంటే వినే వాడిలో ఎంత చైతన్యం వస్తుందో తెలియ జేస్తుంది అని ముగిస్తాడు కో.కు .
        దక్షిణాంధ్ర            రాజు రఘు నాద నాయకుడు గొప్ప prodigy  పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని ఒక్క రాత్రిలో  ఆశువు గా చెప్పి తన తండ్రి చేతనే నిండు సభలో కనకాభి షేకం చేయించుకొన్న విద్వత్ కవి .
             నవలను నిర్మించటం లో” విశ్వ నాద ”కు వున్న శ్రద్ధ చాలామంది నవలా కారుల్లో లేదు .అన్నారు కుటుంబరావు
        ర్రావిశాస్త్రి” master of monologue ” అంటారు కుటుంబరావు
”దేశమును ప్రేమించు మన్నా ”అన్న గురజాడ గీతానికి విశ్వ సాహిత్యం లో స్థానం వుందని రావు అభిప్రాయం .’
”వీరేశలింగం కర్మిష్టి .జాతి చెవులు పిండి .బుద్ధి చెప్పి ,కోప్పడి ,అడుగడుగునా విమర్శిస్తూ ,మంచి మార్గం చూపిస్తూ ఒక  పెద్ద దిక్కై కాపాడాడు .గారాబం ,మెప్పు ,లాలన చూపి ,తెలుగు జాతిని ”పాడు ”చెయ్య లేదు .మౌధ్యం ,మరుకు తనం ,వున్న తెలుగు జాతి ,వీరేశ లింగం పెంపకానికి లొంగి వచ్చింది .మరొకరి వల్ల ఇది సాధ్యమయ్యేది  కాదు .తన ద్వారా జాతి పైకి రావటమే ”లింగం”గారి ఆత్మ విశ్వాసం ,కీర్తనం .సంఘం కార్యం నేట్టికేసు కొన్న వాడేవాడు సాహిత్యం జోలికి పోడు .దీనికి వ్యతిరేకం గా వీరేశలింగం పని చేసి చూపించాడు .”veereshlingam ”రాక్షసుడు అన్నాడు కృష్ణ శాస్త్రి .అంచనాలకు అందనిది రాక్షస బలమే .అందుకే ఆయన శత్రువుల్ని హడల కొట్టాడు .సర్వతోముఖాభి వృద్ధి కోరే వాడెవడైనా ఇలానే చేస్తాడు .అయితే వీరేశలింగం పుట్టి 160  ఏళ్ళు దాటినా ఆయన రచనల అవసరామ్  ఏమాత్రం తీరలేదు .దేశాభ్య్దయం కోరే ఏ రాజ కీయ పక్షమైనా ఆయన్ను ,ఆయన భావాల్ని  విస్మరించ రాదు ”అని చాల గొప్పగా estimate వేశాడు కుటుంబరావు .
”మిమ్మల్ని ఆంద్ర చెకోవ్ ”అంటారు మీ కామెంట్  ?అని ఒక విలేకరి కుటుంబరావు ను అడిగితే నిర్మోహ మాటం గా ,నిజాయితీ గా ”విశ్వ సాహిత్యం లో చెకోవ్ ఒక్కడే వున్నాడు ”అని బదులిచ్చాడు .
”శ్రీ కి ఏ మాత్రం తీసి పోని అంత కంటే ఎక్కువ గానే కృషి చేసిన మీకు వామ పక్షాలు శ్రీ శ్రీ కిచ్చినంత ప్రచారం ఇవ్వలేడెం ?”అని అడిగాడు ఒక విలేకరి ”దానికి  స్పందనగా ”శ్రీ శ్రీ కి populaarity  వుంది దాన్ని వాళ్ళు వాడుకొన్నారు .నాకు లేదు .వాడుకో లేదు ”అని తక్కున చెప్పాడు .
  మాధవ పెద్ది గోఖలే ను మా,.గోఖలే అంటారు .మంచి కధకుడు దళితుల జీవితాన్ని కధల్లో వారి భాషలో అద్భుతం గా చిత్రించిన బ్రాహ్మణుడు .ఆ కధలు చదివి ఒక royist  మిత్రుడు ”యెంత అన్యాయం జరిగిందండీ .నేను రాయాల్సిన కధలు మీ బ్రాహ్మణ అబ్బాయి రాసేశాడు ”అని నెత్తీ ,నోరు కొట్టుకోన్నాదట .అంత గొప్పగా గోఖలేకధలుంటాయి  అని కుటుంబరావు కితాబు .
సోమర్సెట్ maaughum   చివరి రోజుల్లోతన  కధా సంపుటిని చదివి ఆయనే ”ఈ కధలు రాయ కుండా వుంటే బాగుండేది ”అని ఆత్మ విమర్శ గా చెప్పాడట .మంచి రచయిత లక్షణం.
”తెలుగు వాడి జాతీయ గుణం -ఓర్వలేని తనం –జాతీయ కార్య క్రమం –కోడిగుడ్డు మీద వెంట్రుకలు లెక్కించటం ”అన్నాట్ట శ్రీ శ్రీ అని మనకు చెప్పాడు కో.కు .
”విశ్వ నాద తన రామాయణాన్ని చదివి వినిపిస్తుంటే ఆ పథనాన్ని ప్రేక్షకులు యే విధం గా స్వీకరించినదీ ,నేను సయం గా చూశాను .అలాగే శ్రీ శ్రీ ,కృష్ణ శాస్త్రి ,ఏ వ్యాఖ్యానం లేకుండా పద్యాలు చదువుతుంటే శ్రోతలు వింటూ ఎలా కంగారు పడ్డది నేను స్వయం గా చూశాను ”అని కుటుంబరావు వారి వారి ధోరణుల ప్రభావంపై చక్క గా స్పందించారు
                                                                                  మీ  గబ్బిట దుర్గా ప్రసాద్ ——11 -06 -11 –
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | 1 Comment

‘మాదీ స్వతంత్ర దేశం–మాదే స్వతంత్ర జాతీ శ్రీ బాలాంత్రపు రజనీ కాంతా రావు గారి గీత ప్రతిభ

   శ్రీ బాలాంత్రపు రజనీ కాంతా రావు గారి గీత ప్రతిభ 
                                లలిత సంగీతం ఆంటే తెలుగు లో ముందు గుర్తొచ్చే వారు బాలాంత్రపు రజనీ కాంత రావు గారు .గీత రచయిత ,సంగీత కర్తగా ప్రయోక్తగా radio డైరెక్టర్ గాసినీ   నేపధ్య గాయకునిగా వాగ్గేయ కారునిగా బహుముఖ ప్రతిభ వారిది .భానుమతి తో ఆయన పాడిన పాటలు మనసులను ఉయ్యాల లూగించాయి .ఆంద్ర వాగ్గేయ  కార చరిత్ర రాసి న ఘనుడాయన ఎన్నో మధుర గీతాలను పాడి రసమయం చేశారు .ఎన్నిటికో బాణీల  వోణీలు కట్టారు .రామాయణ ఆవిర్భావాన్ని మహోన్నతం గా radio లో ప్రదర్శించి ఆకాశ వాణి విజయ వాడ కేంద్రానికి బహుమతిని సంపాదించారు .ప్రయోగా లెన్నో చేసి ప్రయోక్త గా గణన పొందారు .స్వయం గ కవి అయిన ఆయన కలం లోంచి జాలు వారిన కొన్ని పాటలను మీకు పరిచయం చేస్తాను .ఈ తరం  వారికి చాలా మందికి అవి తెలియవు ..”చల్లగాలిలో ”అని వినపడంగానే అది రజని పాట అని చెవులు రిక్కించి వినే వాళ్ళం .”స్వైరిణి అన్నారు నన్ను శ్యామ సుందరా ”అని వింపిస్తే చాలు పరవశమే .”మాదీ స్వతంత్ర దేశం ,మాదీ స్వతంత్ర జాతి ”వినిపిస్తే దేశ భక్తి వుప్పొంగేది అదీ ఆయన రచన స్వర ,రాగ  ప్రతిభ .ఆది వారం నాడు  ”శ్రీ సూర్య నారాయణా వెద పారాయనా ”అన్నది వింటే మనసు గగన తలం లో భక్తి తో విహరిన్చాల్సిందే .”ఓహో పావురమా ఒహోహో పావురమా ”అని భానుమతి పాడే పాటకురాగపు పయ్యెద   వేసింది రజనీయే ..ఇప్పుడు రజని పాటలను అనుభవించండి .
  01 –                  చల్ల గాలిలో యమునా తటి పై శ్యామసుందరునీ   మురళి —–ఉల్లము కొల్ల గోనే మధు గీతాలు –మెల్ల మెల్ల  చెవి సోకు నవే –తూలి రాలు వటపత్రమ్ముల పయి  -తేలి తేలి పడు నడుగులవే —పూల తీవ పొదరిండ్ల మాటుగా —పొంచి చూచు శిఖిపించమదే –తరువు తరువు కడ డాగి డాగిన –న్నర  యు కన్నుగవ మురుపులవే —మురిసి మురిసి నావెనుక దరసి– కను మూయు చివురు కేంగేలులివే —
02 -”స్వైరిణి అన్నారు నన్ను శ్యామ సుందరా =–నీరవ  నిశి వెన్నెలలో –నీదు మధు మురళీ రవము —ద్వారములను తెరచి ప్రతి హృదయము పిలుచు –నిలువ నీదే –
        స్నాన సమయమున యమునా సరిత్తటిని  సఖీ జనులు
        నిన్ను జూచి మైమరచిన నన్ను జూచి నవ్వి నారు —-స్వైరిణి అన్నారు —
        బంధువులను ,పతిని ,సకల బంధములను ,వదలి వైచి
        బృందావని నీదు రాగ బంధ మొదవ తరలితి   నని –స్వైరిణి అన్నారు –
03 -”మాదీ స్వతంత్ర దేశం–మాదే స్వతంత్ర జాతీ
        భరత దేశమే మాదేశం–భారతీయులం మా ప్రజలం
        ఆలయంముల శిల్ప విలాసం –ఆరామంముల కళా ప్రకాశం
        మొఘల్ సమాధుల రస దరహాసం –మాకు నిత్యనూతనేతి హాసం
        అహింసా పరమోధర్మః –సత్యం వద ధర్మం చర
        ఆది ఋషుల వెద వాక్కులు –మా గాంధి ,గౌతమ సువాక్కులు
        స్వతంత్ర భ్రాత్రుత్వాలూ –సమతా మా సదాశాయాలు
        జననీ — స్వతంత్ర దేవీ —
        కొనుమా -నివాళులు మావి         మాదీ స్వతంత్ర దేశం-
                                                                                               సేకరణ —–గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -06 -11

 

Posted in సేకరణలు | Leave a comment

కృష్ణా జిల్లా రచయతల సంఘం – ఆహ్వానం నా రచన రేపటి తెలుగు ప్రజలు

ప్రస్తుతం అది వ్రాసే పని లో ఉన్నాను…….

Posted in సభలు సమావేశాలు | Leave a comment

పద్య మంద హాసం

పద్య మంద హాసం

————————–

తెలుగు పద్యాలు కొన్ని విన్నవి గానే వుంటాయి .కాని అందులోని భావం తెలుసు కోవాలంటే బుర్ర బద్దలు కొట్టు కోవాల్సిందే. అలాంటి తెలుగు పద్యాలు ,అందు లో నిక్షిప్త మైన భావ ధారను తెలుసు కోని తెలుగు పద్య వైభవానికి జే జే లు పలుకుదాం శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానం లో అష్ట దిగ్గజ మహా కవులున్నారని మనకు తెలుసు .స్వయం గా రాయలే మహా కవి .ఎప్పుడు ఇతర దేశ కవులు రావటం ,తమ పాండిత్య ప్రకర్ష చూపి బహుమతులందు కోవటం పరి పాటే .రోజు కవితా గోష్టి ,రాయల భుజ శౌర్య దాన ధర్మాల మీదా కవితా పాండిత్యం మీద కవులు ప్రశంసల వర్షం కురిపిస్తూనే వుంటారు .కొన్ని సామాన్యులకు అర్ధమవుతాయి కొన్ని ఆ కవే విప్పి అర్ధం చెబితే కాని తెలియని సందర్భాలు వుంటాయి ఒక రోజు అల్లా సాని పెద్దన గారు రాయలను కీర్తిస్తూ చెప్పిన పద్యాన్ని తెనాలి రామ లింగ వికట కవి స౦దర్భ శుద్ధి గా లేదు అన్నాడు .పెద్దన నొచ్చు కున్నాడు .రాయలకు ఆంతర్యం తెలుసు కనుక నువ్వో పద్యం చెప్పు అన్నారు. మంచి సమయం .తన ప్రతిభ బయట పడేఆలోచించి సందర్భం .తన ఊహకు పదును .అని చిన్న పద్యమే పెద్ద భావం ఇమిడే లా చెప్పాడు .ఆ పద్యం అందరికి తెలిసిందే .వినటానికి సరదా గా వుంటుంది .అయితె బావం అంత తేలిగ్గా అందదు తనే ఆ భావావిష్కరణ చేసి అందర్నీ ,ఆశ్చర్య పడేట్లు చేశాడు . ”నర సింహ కృష్ణ రాయని –కరమరుదగు కీర్తి యొప్పె –కరిభిద్గరిభిత్కారి కరి కరిభిద్ –త్కరి భిద్గిరి భిత్తురంగ కమనీయంబై ..” రాయల కేర్తి కరిభిత్ –గజాసురున్ని సంహరించిన శివునిలా ,గిరిభిత్కరి –ఇంద్రుని ఐరావతం లా ,కరిభిద్గిరి –కైలాస పర్వతం లా ,గిరిభిత్ –వజ్రాయుధం లా ,కరిభిద్గిరిభిత్తురంగ –శివుని ఇంద్రుని వాహనాలైన నంది ,వుచ్చైశ్వరం లా అండం గా అతి స్వచ్చంగా అతి తెల్లగా వుందని అర్ధం .ఆయన కీర్తి అంత స్వచ్చం గా వుందని భావం . రెండో పద్యం శ్రీ హను మంతుని గురించిన ది ఎవరు రాశారో తెలీదు కాని చమత్కారం గా వుంది నర్మ గర్భం గా వుండటం దీని ప్రత్యేకత ”అంచిత చతుర్ధ జాతుడు —పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్ —గాంచి తృతీయం బక్కట —-నుంచి ద్వితీయంబు దాటి యొప్పగా వచ్చెన్ పంచ భూతాలు ఆంటే మొదటిది భూమి ,రెండు నీరు మూడు అగ్ని ,నాలుగు వాయువు అయిదు ఆకాశం .దీన్ని బట్టి అన్వయం చేసుకోవాలి చతుర్ధ జాతుడు ఆంటే నాల్గవది అయిన వాయువు కు జన్మించిన వాడు ఆంజనేయుడు .పంచమ మార్గామమున ఆంటే అయిదవది అయిన ఆకాశ మార్గం లో ,ప్రధమ తనూజ ఆంటే మొదటిది అయిన భూమి కుమార్తెను ఆంటే సీతా దేవిని ,త్రుతీయంబక్కత నిల్పి అనగా మూడవదైన అగ్నిని అక్కడ అంటించి ,ద్వితీయంబు దాటి ఆంటే నీటిని ఆంటే సముద్రాన్ని దాటి ,వచ్చాడు .అని భావం మూడవదైన ముచ్చటైన పద్యం ”నలుగురు పలికిరి సరియని —నలుగురు బలికిరి సురూప ,నయన ,దాన ,ధారా—వలయ ధారా చరణోన్నతి —పొలుపుగ గద్వాల సోమ భూపాలునకున్ ” గద్వాల ప్రభువు సోమ రాజు గారిని పొగిడిన పద్యం ఇది .గద్వాల రాజు గారు సురూప ఆంటే అందం లో నలుడు .నయ -బుద్ధిలో –గురుడుంటే బృహస్పతి –దానం లో బలి చక్ర వర్తి –భూమిని మోయటం లో -కిరి వరాహ అవతారం ఆంటే ఆది వరాహమైన విష్ణు మూర్తి –సరి యని ఆంటే ఒప్పుకొని -నలు-గురూ-బలి–కిరి .అందరు పలికారని ,చెప్పిన మాటలనే వేరే అర్ధం లో అద్భుతం గా చెప్పి తమాషా గా ఆయన కీర్తిని ఆవిష్కరించాడు ఆ కవి . సంస్కృత శ్లోక వైభోగం ఒకటి చూడండి ”శతేషు జాయతే శూరః –సహస్రేషు చ పండితః -వక్తా దశ సహస్రేషు —దాతా భవతి వానవా ” వందలో ఒకడు శూరుడు అవుతాడు .వెయ్యిమందిలో ఒకడు పండితుడవు తాడు .పది వేలలో ఒక్కడు మహా వక్త కా వచ్చు .కానీ దాత అనే వాడు ఉంటాడో ఉండడో ?అని సందేహం దాత అవటం చాల కష్టం అని భావం . ఇలాంటి అద్భుత పద్యాలను చాలా గొప్పగా ఆవిష్కరించారు స్వర్గీయ ఆచార్య తిరుమల సేకరణ —గబ్బిట దుర్గా ప్రసాద్ ——11 -06 -11 .

Posted in రచనలు | 1 Comment

రెండు మహోన్నత శిఖరాలు

            రెండు మహోన్నత శిఖరాలు 
         ———————————
ఒక రోజు తేడా తో ఇద్దరు మహోన్నతులు అస్తమించారు .ఒకరు కళా ప్రపూర్ణ ,పద్మశ్రీ నటరాజ రామ కృష్ణ అయితే రెండవ వారు పద్మ విభూషణ్ పురస్కార గ్గ్రహీత ప్రఖ్యాత చిత్ర కారులు ఏం .ఎఫ్ .హుస్సేన్ .మొదటి వారు మన రాష్ట్రానికీ ,రెండవ వ్వారు ,మహారాష్ట్రానికి చెందిన వారు ఇద్దరు జీవిత సర్వస్వం తమ కళకు అంకితం చేసి ధన్య జీవులైన వారే .నటరాజు తాను సంపాదించినదంతా కళ కోసమే ఖర్చు చేసి తనకంటూ ఇల్లు కూడా మిగుల్చు కొకండా అచ్చమైన భారతీయ ధర్మానికి ప్రతీక గా నిలిచారు .హుసేన్జీ చిత్ర కళ లోని వివిధ అంగాలను స్పృశించి తనదైన శైలిలో పరిపుష్టి చేసి ,కోట్లు ఖరీదు చేసే చిత్రాలు గీసి ,సంపాదన అంతుచూసి ,ఈ దేశం పై ప్రేమాభి మానాలు వున్నా ఇక్కడి వారి మనోభావాలను కించ పరిచారనే ఆరోపణ కు ఖిన్నుడై లండన్ చేరి ,ప్రవాసి గానే వుండి పోయారు .మొదటి వారు భారతీయ ధర్మానికి ,రెండవ వారు అంతర్జాతీయ విదానాన్కి ప్రతి బింబాలు ..ఇద్దరు సృజన తో ఉన్నత శిఖా రాలు చేరు కొన్న వారే. వారి మరణం కళామ తల్లికి గర్భ శోకమే .అభిమానులకు అనంత శోకమే .
                            రామ కృష్ణ గారికి చిన్నాప్పుడే తలి దండ్రులు చనిపోతే రామ కృష్ణ ఆశ్రమం లో పెరిగారు .వారి పుట్టుక ఇండొనీషియా లోని బాలి ద్వీపం .18  వ ఏటనే ప్రఖ్యాత నాట్యా చార్యులయారు నటరాజ ”బిరుదు పొందారు ,అదే ఆ తర్వాత ఆయన ఇంటి పేరు అయింది దేవదాసీ నాట్యానికి స్థాయి కల్పించిన సంస్కారి .దాన్ని శాస్త్రీయ నాట్యం గా మలిచారు .పది వేల ప్రదర్శనలిచ్చి వేలాది మందికి శిక్షణ నిచ్చారు .విద్యార్ధులకు అన్నీ తానే అయి ,ఖర్చు అంతా భరించి నాట్యం నేర్పారు .ఆయన దశ భాషా పండితుడని చాలా మందికి తెలియదు .నిగర్వి .తన పని తాను చేసుకు పోయేవారు అవసరమైతే . ప్రభ్హుత్వం పై వత్తిడి తెచ్చి కళకు న్యాయం చేసే వారు .ఆయన నల్లభై రెండు ప్పుస్తకాలను నాట్య శాస్త్రం పై రాశారు .వాటిపై దాదాపు పది మంది పరిశోధనలు చేయటం విశేషం .తన అనుభవాలను ‘[‘అర్ధ శతాబ్ది ఆంద్ర నాట్యం ”లో వివరించారు .ఇది వారి జీవిత చరిత్రే ..జీవితాంతం వివాహం చేసు కోకుండా ,ఆంద్ర నాట్య కళకే అన్కితమయారు .
                       తెలుగు వారి అసలు నాట్యం మూలాలను వెదికి ,ఆంద్ర నాట్యం పేరున దాన్ని నేర్చి నేర్పించి వ్యాప్తి చేసిన మహానుభావుడు నటరాజు .కాక తీయుల నాటి పేరిణి శివ తాండవం కు పరిపుష్టి కల్గించి రామప్ప దేవాలయం లో ప్రదర్శనలు ఇచ్చారు ..ఆయన సృష్టించిన ”నవ జనార్దన పారిజాతం ..”ప్రముఖ నగరాలన్నిట ప్రదర్శించారు ..ఆయనకు ”నటరాజ ”బిరుదును బందార సంస్థాన  రాజు గణపతి పాండ్య గారు పద్దెనిమిదవ ఏట ప్రదానం చేశారు ..ఆయన కు భారత కలా ప్రపూర్ణ బిరుదుంది .దక్షిణ భారత ఉత్తమ నాత్యాచార్యుని గా మంచి గుర్తింపు పొందారు .ఆయన శ్రీశైలం దేవస్థాన నాట్యాచార్యులైనారు .ఆంద్రప్రభ్త్వం   ఆస్థాన నాట్యా చార్యునిగా నియమించింది(1980 ) ప్రఖ్యాత రాజ్య లక్ష్మి ఫౌండేషన్ పురస్కారం పొందారు .నిబద్ధత ,నిమగ్నత గల నాట్యా చార్యులు రామ కృష్ణ అని చుక్కా రామయ్య ,జితేంద్ర బాబు వంటి వుద్దండులన్నమాట నూటికి నూరు పాళ్ళు సత్యం .కళను కాసులకు అమ్ముకోలేదు .అదొక తపస్సు గ భావించి జీవించిన” ”నృత్య తపస్వి ”నాట్యాన్ని ఉద్యమం గా నడిపిన కారణ జన్ముడు .”శ్రీ వెంకటేశ్వర కల్యాణం ”,కుమార సంభవం ,,మేఘసందేశం నృత్య రూపకాలను ఆయన రూపొందించి ప్రదర్శనలు ఇచ్చారు .”నవ జనార్దన పారిజాతం ”నృత్యాన్ని ,తొమ్మిది రాత్రులు ,తొమ్మిదిమంది నర్తకులు ,తొమ్మిది మంది నర్తాకీమనులతో ,తొమ్మిది వాయిద్యాలతో ప్రదర్శించిన ఘనత నట రాజు ది ..ఆయన శిష్యులలో ప్రధముడు కలా కృష్ణ ఆయన్ను జీవితాంతం వెంట వున్నారు .ఇద్దరు  కళకు అన్కితమయారు ..త్యాగమయ జీవితం ఆయనది ఎందరినో ప్రభావితం చేసి ,నాట్యకళ జ్యోతి లా మిగిలి పోయారు నిండు జీవితం అనుభవించి పండు గా రాలి పోయారు విదేశ మైన ఇండోనేషియా లో జన్మించి ,భారత దేశం చేరి ఆంద్ర నాట్యానికి జీవం పోసి ,నిలబెట్టి ,మన సంస్కృతీ వైభవాన్ని పవిత్రం గా భావించి ఈ నేలలో కలిసి పోయిన మరో” నాట్య భరతుడు ‘నట రాజ రామ కృష్ణ .
                            అంతర్జాతీయ చిత్రకలాకారుడిగా హుస్సేన్ జీ పేరు ప్రపంచం అంతా మారు మోగింది .ఆధునిక పికాసో అని అంటారు .95 ఏళ్ళ వయసు లో తనువు చాలించారు .ఆయన ఎప్పుడు వివాదాల సుడి గుండం లో చిక్కుకొనే వాడు .900 కేసులు ఆయనపై వున్నాయి .స్థిర చిత్తం తక్కువ వైవిధ్యం కోసం ఆరాటం .హిందూ దేవతామూర్తులను నగ్నం గా చిత్రిన్చారనే ఆరోపణ తో పెద్ద దుమారం రేగి భారత్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లి పోయారు .ఆధునిక కళా జగత్తుకు ఊపిరి ఆయన అంటారు .గజగామిని అనే సినిమాను తన ఆరాధ్య దేవత, ప్రేరణ అయిన మాధురీ దీక్షిత్ ను heroyin  గా పెట్టి తీసాడు .తర్వాత ఆయన మనసు మీనాక్షి ,ఊర్మిలా వగైరాలపై మల్లిందట .నిలకడ లేని మనసు తో వుండటం .ఆయనకు మైనస్ పాయింట్ .ఎంత గొప్ప కళా కారుడైనా బుద్ధి వక్రిస్తే ఇలాగే బాధలు పడాల్సి వస్తుందని ఆయన జీఎవితం కళాకారులకు హెచ్చరిక .ప్రజల పొపులర్ సెంటిమెంట్ తో ఆడుకోరాదని ఆయన తెలుసు కోలేక పోవటం విచార కారం .ఇండియా పై ప్రేమ అభిమానం చివరి దాకా వున్నా ఇక్కడికి రాలేక పోవటం ఆయన చేతులారా చేసు కొన్నదే .అందుకే ఆయన అంత్య క్రియలు లండన్ లోనే జరుగు తున్నాయి .రాజ్య సభా సభ్యత్వం ఇచ్చి భారత జాతి ఆయన్ను గౌరవించింది పద్మ భూషణ్ ..,పద్మ విభూషణ్ లతో సత్కరించింది .అయినా ఆయన మన వాడే అని చెప్పుకో లేని దౌర్భాగ్యం .కేరళ ప్రభుత్వం ”రాజా రవి వర్మ ”పురస్కారాన్ని హుస్సేన్ కు 2007  లో ఇచ్చి గౌరవించింది మహారాష్ట్ర లో జన్మించి ,మంచి చిత్రకారునిగాఎదిగి  ముంబాయ చిత్ర కళా  మొఘల్ గా జీవించి అంతర్జాతీయ చిత్రకళా సీమలో చౌధవీకా చాంద్ గా వెలిగి చివరికి దేశం కాని దేశం ఇంగ్లాండ్ లో మరణించట .బాధాకరం
                                      ఒకరు మట్టిలో మాణిక్యం ఇంకొరు మినుకు మినుకనే సుదూర తార
                                  అందరికీ  నట రాజ రామ కృష్ణ జీవితం ఆదర్శం ఎందుకంటె ఎంత ఎదిగినా వొదిగి వున్న సంపూర్ణ కలాజీవి ఆయన .ఆయన్ను గురించి ఆయనే చెప్పుకున్న పద్యం  లోని భావం కళాకారులందరికీ  -కళాకారులే కాదు సమస్త జనానికీ అనుసరణీయం ,స్ఫూర్తి దాయకం
                                     ”చదివితి సకల శాస్త్రములు
                                       అందలి సారములెల్ల గ్రహించితి
                                       అంత విజ్ఞాన నేత్రంబు విప్పిచూడ
                                       తెలిసి కొంటిని నాకేమి తెలియదనుచు  ”.
                                                                                                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -06 -11

 

Posted in రచనలు | 3 Comments

ప్రసాద్” pun ” చేసే గాయాలు

 ప్రసాద్” pun ” చేసే గాయాలు 
01-అణు’ బుష్ ‘ కొటులో ఈ ”రాక్ ”తో తల బద్దలు కొట్టుకున్న బుష్
02 -రుక్కు’ l’ లతో రక్కినా చమ్మ గా వుండే’ జరుక్ ‘ వాక్కులు
03 -ప్రధాని సోమయాజిఅవ్వాలనే   ఆరాటం లో ”మండల ”కమందలోదకం తో ”సెక్యులర్ ”హోమ గుండం ఆర్పిన వాజ పేయి .
04 – బి.సి ‘గంగ  పై ప్రేమతో’ వో.సి ”పార్వతీ ఆంటే గంగా గౌరి సంవాదం లో రెంటికి చెడ్డ రేవడి ప్రతాపం ”విశ్వ నాధుని  ‘ది .
05 -తావు ఇస్తే పెళ్లి ‘తాపు ‘ఇస్తే పిండం పెట్టె ”థావూ శ్రీ ‘
06 – స్కడ్ దేశ ద్రోహాన్ని విచ్చిన్నం చేసిన అమెరికన్ ”petriat ‘.
07 -గోర్బ ”చెవులు ‘పట్టి ఆడిస్తున్న ”లుదివేనియా ”కన్నియ .
08 -ఆంద్ర కేసరి ఆంధ్రకే  సరా ?కాదు సారా భారత్ కేసరి” .sher e-bhaarath ”.
09-”పులులు”పై స్వారి చేస్తే ఎంత ”ప్రేమదాసు ”డైనా మరెంత ”కరుణా నిధి ”యైనా వేట పాలు కాక తప్పదు .
10 – ”చంద్ర స్వామి ”శేఖర్ నెత్తిన హస్తం —హిందూ jaw  కోరల్లో భారత్ .
11 – కాలమ్ జీలకర్ర ఏరుల రేవులు దాటినా ”సిరి మువ్వల సింగినాదం ”వినిపించడెం ”విశ్వనాధం ?( నాదం /)
12 -గల్ఫ్ లో ” నూ ‘నే”ఆధిపత్యం కోసం సెల్ఫ్ పోరు
13 -operation success కాని desert storm  లో ఇరాక్ patient డైడ్ .
14   -పాంచాలితో ,షత్రంజ్ తో ఆపూ సంసారం తో సినీశిఖరారోహనం చేశాడు వారే వా ”రే”
15 –  – దా  ”సరి” గా చేస్తే సూపెర్ హిట్ కాదా నారాయణా ?—-రా (ల)వు పైత్యం ప్రకోపిస్తే నిర్మాత ”హరి హరీ నారాయణా ”.
16 – అమృతం కురిసిన రా (దా )తరికి శోభా తిలకం బాల గంగాద్గారం —-విశ్వ కుతుమ్బ్బ భవనం పై ఎగరేసిన మాన వీయ విజయ కేతనం
17 ఘటోత్కచ ,కీచక ,రాక్షస గణం లోనే కాదు ”యశాస్వే’రంగా రావు   అన్నయ్యినా ,వియ్యన్న అయినా రారాజైనా ,దేనికైనా ”నట యశస్వీ ”
18 -,కళకు నటన తో, అందచందం తో, పట్టిన సుమాంజలి –సువర్ణ సుందరికీ ,అనార్ చిగుళ్ళ ”శోభ ‘సక్కు  ‘భక్త్యాంజలి .
19 -కావెషాల విలన్ వేషాలకు అందుకొన్న ”నీరాజనాల ”కా (క )లేశ్వరుని కి నేడు కాలే కడుపు దుస్థితి .
20 -ఇరాకీ ”రోమం ”తగల బడుతుంటే —బంకర్లో కదన కుతూహల ”రాగా ”లాలపిస్తున్న” నీరో ” హీరో సద్దాం
21 -స్వర ”చక్రవర్తి ”సంగీత హోరు .
22 – రాజుల ”ఉప్పుల దడియం ”అనే పోతాన్నే చిత్తూరు నాగయ్య –స్వరమాధురిలో త్యాగయ ,రామ భక్త గోపయ్య –”-నా ఇల్లు ”వదిలి ”నాదేశం ””అని ”వందే మాతరం ”,అన్నా ,చివరికి తప్పలేదు ”బీదల పాట్లు ”.
23 -”నిఘా ”తో ”నిఖా ”రద్దయింది ”.శేఖర్ ”తో రాజీవ్ పానిగ్రహనానికి ”తలాక్ ”.
24 – ప్రళయం ,ప్రణయం ,విరహం ,జాలి ,కరుణశ్రీ ఘంటా రావాలు నినదించే ”మొగ సాల ”
        ఏడు కొండ లేక్కినా భూకైలాసం చేరినా ,మాధుర్య భక్తీ ,సమ్మోహన శక్తీ పులకరించు ”ఘంట సాల ”
25 -నండూరి వారి చిన్నది ”ఎంకి నాయుడి ”ముగ్ధ ప్రణయ కవి సుబ్బా రావు
        సౌభద్రుని జైత్ర యాత్రా రధ సారధి సుబ్బా రావు ”నాయనే” .
                                                                                                   మీ
                                                                                       గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                                    రచనా కాలం 18 -02 -91
                                                                       విషయాలన్నీ ఆ కాలానికి  సంబందించినవి అని గుర్తు చేస్తున్నాను .
Posted in రచనలు | Leave a comment

నృత్య తపస్వి నట రాజ రామకృష్ణ ఆంద్ర పద్మశ్రీ

Posted in సేకరణలు | Leave a comment

మల్లాది వారి ”కృష్ణా తీరం ”నవలలో అన్నప్ప అన్న వైభోగం

        మల్లాది వారి ”కృష్ణా తీరం ”నవలలో అన్నప్ప అన్న వైభోగం 
                                                              ————————————————————-
  మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి నవల ”కృష్ణా తీరం ”అందరు తప్పక చదవాల్సినది .ఒకరకమైన చిలిపితనం ,పాండిత్యం ,లాలిత్యం కలగలిసిన వ్యక్తిత్వం మల్లాది వారిది .ఒకవైపు ఆధునిక శ్రీ నాధుని లా ,మరోవైపు ఆత్మీయ తాతయ్య లా కన్పిస్తారు .కధల్లో వర్ణనలు ,ముచ్చట్లు ఆయన ప్రత్యేకత .సంభాషణా చాతుర్యం అద్భుతం .నవలలు గోలుసుల్లా సాగుతాయి .చంద్ర హారం లో బిల్లల్లాగా పాత్రలు ఒకదానిలోనుంచి ఇంకోదానిలోకి సాగి పోతాయి .ఆయన శైలి ముత్యాల ముగ్గు .దస్తూరి ముత్యాల కోవ  .కృష్ణా తీరం నవల లో అన్నప్ప ప్రత్యెక పాత్ర .ఒక విధం గా అది మల్లాది వారే అని పిస్తారు .సహృదయత ,సౌమ్యత ,నిరాడంబరత ,సమన్వయము ,హాశ్యం ,వ్యంగ్యం ,పాండిత్యం భోజన ప్రియత్వం ,సంభాషణా చాతుర్యం ,అన్యోన్య దాంపత్యం పట్ల ఆరాధన ,స్త్రీ స్వాభిమానం పట్ల గౌరవం ,కులమత విచక్షణా రాహిత్యం ,అభ్యుదయ ధోరణి ,ఆచరణ శీలత శ్లాఘనీయాలు .చెయ్యి ఎత్తి నమస్కరించా బుద్ధి కలుగు తుంది .అన్నప్ప అందరికి ప్రీతి పాత్రుడు .సంసారాల్లోని కలతల్ని ,సామరస్యం గా పరిష్క రిస్తాడు .అన్ని వయస్సుల వారితోను సమానం గా మెలిగే నేపుఆయనది ,మల్లాది వారి కృష్ణా తీరం ఒక వచన కావ్యం అనిపిస్తుంది .ఆంధ్రుల వేదం .నిత్య పథనీయం .ఈ నవల శైలి కోసమే రాసింది కాదు .మానవ సంబంధాల్ని మెరుగు పరచటం కోసం ,మూఢ విశ్వాసాలను విసర్జించటం కోసం అందరు అన్యోన్యం గా మెలగటం కోసం ప్రేమతో వారధులు కట్టుకోవటం కోసం రాశారు .శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గోదావరీ తీర వ్యావహారిక భాష లోని నుడికారాలను ,ఉచ్చారణా వైచిత్రిని ప్రదర్శిస్తే ,మల్లాది వారు కృష్ణా తీరపు వ్యావహారిక భాష లోని వైవిధ్యాన్ని ,విలక్షణతను ,జోడించారు అందుకు ఈ నవల వో ప్రత్యేకత అని ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయా దేవి అన్న మాటలు అక్షర సత్యాలు .
                            అన్నప్ప ఒక సత్కార్యం కోసం ఒక వూరు వస్తాడు ,.లచ్చి ఇంటికి చేరాడు .ఆ ఇల్లు కడగొట్టు వారిది అవధాని గారి కొడుకు వీళ్ళ అమ్మాయిని  వలచి పెళ్లి చేసుకున్నాడు .ఆయన అగ్గి మీద గుగ్గిలం అయాడు కొడుకు ఇక్కడే ఉంటున్నాడు .ఈ రెండు కుటుంబాల్ని కలిపే బాధ్యత తీసుకున్నాడు అన్నప్ప అందుకే వీల్లిన్తికే వచ్చాడు .తన భోజనమూ వీల్లిన్ట్లోనే తనకు వంటలో ఏమి చేసి పెట్టాలో పురమాయిస్తున్నాడు చూడండి ”నా కోసం నవ కాయ పిండి వంటలేమీ చెయ్యద్దు .మరి ,వంకాయ నాలుగు పచ్చాలు చేసి పోపులో వేసి ,ఆనపకాయల (సొరకాయ )మీద ఇఇంత నువ్వు పప్పు జల్లి ,అరటి దూత (ఊచ )ముఖాన ఇంత  ఆవేట్టి ,తోటకూర కాడల్లో ఇంత పిండి బెల్లంపారెయ్యి   .కొబ్బరీ,మామిడీ అల్లం పచ్చళ్ళు చాల్లే .పెరుగు లో తిరగ బొత పెట్టి ,దాన్లో    పది గారెలు పడీ .రవంత శనగ పిండి కలిపి ,మిరప కాయలు ముంచి ,చమురు లో  వెయ.సరేక్షీరాన్నం   (పరవాన్నం )అంటావా ! అదోవంటా?  ?ములక్కాడలు మరి కాసిని వేసి పులుసు ఒక పొయ్యి మీద పడీ .ఈ పూటకు ఇలా లఘువు (తేలిగ్గా )పోనీయ్ .ఇదిగో నేను స్నానం చేసి వస్తున్నా గానీ వో అరతవ్వేడు గోదుం పిండి తడిప్పెట్టు   .రత్తమ్మ .వస్తే  నాలుగు వత్తి ,అలా పడేస్తుంది .మధ్యానం పంటికిన్డకు ఉంటాయ్.”ఈ మాటలకు అవధాని గారి కోడలు ముచ్చటపడి నవ్వేసింది
          ఇంతలో రత్తమ్మ వచ్చింది బచ్చల ,వామన గాయలతో  .”రాత్తమ్మప్పా !నాకుబచ్చలి   కూరంటే ప్రాణం .నాలుగు వెల్లుల్లి రెబ్బలండులో వేసి దిమ్మ తిరిగెట్లు తిరగ బోతేడితే ఆహా !ఇంకా పంచ భక్ష్య పరవాన్నలేందుకు ?ముఖ్యం గా బొబ్బట్లలో నంజుకునేందుకు మా మంచి వనరు .అలా నున్చున్తావెం మడి    కట్టుకో .నీవు కూడా చేయి చేసు కో పోతే మా ఇదరి వల్లా యెట్లు లేదు .”అని రాత్తమ్మకూ పురమాయిన్చిఅప్పుడే  ఆ ఇంటిలో ఒకడై పోయాడు అన్నప్ప శాస్త్రి .పెద్ద వైదిక బ్రాహ్మణుడు .అనుస్టాన పరుడు .అయినా కుల విచక్షణ చూపనిఉపనిషత్  ,వేదాంత విధానం .ఇక అన్నప్ప మాట వినకుండా ఎవరు వుంటారు .?అతను ఏది చెప్పిన పర హితం కోసమే ఏది చేసినా ఇతరులు బాగు పడాలనే .చివరికి అందరిలో మార్పు తెప్పించి ఆత్మ పరిశోదన చేయించి కర్తవ్యోన్ముఖులను చేస్తాడు అన్నప్ప ..ఇదీ అన్నప్ప పాత్ర ..వీలును బట్టి మరి కొన్ని కృష్ణా తీరం విశేషాలు  తరువాత తెలుసు కొందాం
                                                                                       మీ —దుర్గా ప్రసాద్    09 -06 -11 .

 

Posted in రచనలు | Leave a comment

మధుర మైన కొన్ని రాజా రాం కధలు

 

  మధుర మైన కొన్ని రాజా రాం కధలు 
    స                                                                     —————————————————————————————–
                     మధురాంతకం రాజా రాం కధల్లో మానవత్వానికి ఎంత ప్రాధాన్యత వుంటుందో తెలియ జేసే కొన్ని కధలు టూకీ గా మీకు తెలియ జేస్తున్నాను
                                    ”పిచ్చి వెంకట్రావు ”కధలో తన తోటి ఉపాధ్యాయుడికి ఆక్సిడెంట్ అయి చికిత్చ చేయించ టానికి వెంకట రావు మేష్టారు రైల్ ను ఆపాల్సి వస్తుంది పట్టాలమీద నిలబడి . చొక్కా విప్పి దాన్ని ఊపుతూ ,రైలును ఆపాడు వెంకట రావు మేష్టారు .ఆనుకోకుండా ఇంజెన్ డ్రైవర్ ఆయన శిష్యుడే అయాడు .గురువు గారి త్యాగానికి ముగ్దుడైనాడు .చికిత్చ జరిగి ఆ ఉపాధ్యాయుడు కోలు కున్నాడు .అప్పుడు మేష్టారు ”బోడి రూల్స్ నాకు చెప్పద్దు .మొదట మనిషి ,ఆ తర్వాతే రూల్స్ ”అన్నాడు అదీ ఆయన కధ .అయితే చెప్ప టానికి ,వినటానికి ఈ కధలు బానే వుంటాయి .యెక్క డైనా నిజ జీవితం లో అలాంటి మేస్టార్లు ఉంటారా ?అని మీకు ,నాకు సందేహం కలగటం సహజం .వున్నారు శ్రీ రాయసం వెంకట శివుడు ,కపిథలం కృష్ణ మా చార్యులు వంటి వారికి వ్రుత్తి ఏ దైవం .మనిషే దేవుడు .అలాంటి వారు జనం ద్రుష్టి లో పిచ్చ వారే .అందుకే దీన్ని ”పిచ్చి వెంకట్రావు”కధ అన్నాడు .
                      ఇంకో మంచి కధ ”రాతిలో తేమ ”భర్త అహంకారి .ఎన్ని చెప్పినా వినడు ,పంధా మార్చు కోడు మరి భార్య కర్తవ్య హీనం గా వున్దాల్సిన్దేనా ?కాదు ఆమె కర్త వ్యం ఆమె చేసి భర్త  మనసు మార్చిన మరో మానవతా మూర్తి అయిన మహిళ కధ ఇది .భర్త రెడ్డి గారి తో వచ్చిన భూమి తగాదా తో నిరాశ్రయులైన వూరి జనం రెడ్డి గారిన్టికే వచ్చారు .ఆయన పనులకు ఎప్పుడు అడ్డు చెప్పని భార్య సహజ కరుణామయి .నోరు లేని ఆ పాటక జనాన్ని బంధువులు గా భావించింది .వంటామెను పిలిచి వంట చేయించింది ఆమె ”అమ్మ గారూ !చుట్టా లెవరైనా వస్తున్నారా ”అంది అమాయకంగా .”ఇంకా రావటం ఏమిటి?   .ఎప్పుడో వచ్చారు .వీరంత్తా నా చుట్టాలే ”అంది ఆప్యాయత కురిపిస్తూ .రెడ్డి గారి మనసూ మారింది .ఆయనా తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాడు .వేరొక చోట వారందరికి పాకలు వేయించాడు .”యుద్ధాలు మనుష్యుల మెదళ్ల లోనే పుడతాయి ”అనేది ఐక్య రాజ్య సమితి నివేదిక .నిజానికి శాంతి ,సహజీవనం కూడా మనసు లోనే ఉదయిస్తాయి .అని అనితర సాధ్యం గా రాజా రాం ఈ కధను ముగిస్తారు .
                          మరో మంచి కధ ”నరసప్ప మేష్టారు ”ఆయన స్థావర జగత్తు లో సాహిత్య జగత్తును చూసే ”రాయవరం నరసప్ప మేష్టారు ”నరసప్పగారు  ”మిరప మొక్కలలో వేమన పద్యాల్ని ,మామిడి తోట లో రామాయణాన్ని ,బిల్వ(మారేడు )వృక్షం లో హరవిలాసాన్ని ,పనస చెట్టు లో ఆముక్త మాల్యదను ,ఏడాకుల అరటి చెట్టు లో భాగవతాన్ని” ,చూసు కుంటాడు .పోయిన బడి పంతుల వుద్యోగం లో రావలసిన జీత భత్యాల గురించి కించిత్తైనా చింతలేదు ఆయనకు. బహుశా ఆ నరసప్ప మేష్టారు మన దామల చెరువు మాస్టారు రాజా రాం గారేనేమో .
                     ఈ కధలు ”కూన లమ్మ కోన ”అనే రాజా రాం కదా సంపుటి లోవి .”అవక తవకలు అరికట్టే శక్తి మనకు లేక పోవచ్చు .అయినా మన చిన్న గొంతు తో అసమ్మతి తెలియ జేయాలి ..”అనేది మాస్టారిసిద్ధాంతం.  .ప్రజలే ఆయన పుస్తకాలు .దేవుని పట్ల ఎంత ఆరాధనా భావం వుంటుందో ,మానవ జీవితం పట్ల కూడా అంతే ఆరాధనా భావం ఆయనకు .జీవితం పట్ల ఆసక్తినీ ,అనురక్తినీ ,భక్తినీ కలిగివుంటేనే కదా వస్తువులకు కొదవ వుండదు అంటారాయన .ఉపాధ్యాయ వ్రుత్తి లో వుండటం వల్ల అద్భుత మైన లోక పరిశీలనా శక్తి కలిగింది .దానితో మాన వత్వం మూర్తీభావించే గొప్ప కధలు రాశారు .ఆంద్ర దేశం లోని అన్ని వృత్తుల వారి మనో విశ్లేషణను ఆయన తన కధల్లో చూపించారు .ఆయన శైలి నిర్మల ,పవిత్ర గంగా ప్రవాహమే .ఏ మాత్రం తెలుగు వచ్చిన వాడైనా హాయిగా చదువుకో గలడు .”మానవులంతా మాధవులు కాలేక పోవచ్చు కాని కనీసం సామాన్య మానవులు గా నైనా వుండాలి ”అన్నది మధురాంతకం గారి మనో భీస్తం .ఎప్పటి కైనా అది నెరవేరాలని ఆశిద్దాం .ఆ దిశ లో అడుగులు వేద్దాం .వీలైనప్పుడల్లా రాజా రాం కధలు చదువుదాం   .మనసు లో మాన వత్వం నింపుకుందాం . .జీవితాన్ని అమ్రుతోపమానం చేసు కుందాం
                                                                                                                             మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —09 -06 -11 .

 

Posted in రచనలు | Leave a comment

రాయల వసంత రుతు వర్ణన

   రాయల వసంత రుతు వర్ణన
                                                           —————————–
                         గోదా దేవి లోని సాత్విక భక్తినీ ,మధుర భక్తినీ భగవదర్పితం చేయ టానికి రాయలు వసంత ఋతువు ను అద్భుతం గా వర్ణించాడు .రుతు రాజైన వసంతాన్ని ,రాజ కవి రాయలు సందర్భ సుందరం గా వర్ణించాడు .
                ”ఆముక్త మాల్యద విరహ తాపం ఎక్కువైందని ,దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి 
చేరటం తో వసంతం ఆరంభమయింది .ఆమె విరహ నిట్టుర్పుల వేడికి ఆగ లేక సూర్యుడు చల్లగా ఉంటుందని హిమాలయం వద్ద ఉత్తరానికి మొగ్గాడట .విరహం అనే బాట సారికి దాహమైతే అగ్ని వెంట తడి కూడా వచ్చినట్లు మన్మధుడు దండెత్తి వస్తున్నాడని సూచించే అతని జెండా పై గల మీనం (చేప )తో పాటు మేషం (రాశి )కూడా వచ్చింది .హేమంత చలి యువతుల్ని కావలించింది .వసంతుడు అనే ప్రియుడు ముందుకు వచ్చి వెచ్చదనం కల్పిస్తాడనే భావంతో హేమంతం చివరి ముద్దు పెట్టుకొని వెళ్లిందట .చలాకీ చంద్రుడు సూర్య కిరనాలంత వేడి పుట్టించి విరహుల్ని వేధిస్తున్నాడు .వసంత రుతువు అనే మంత్రిని ,కొత్త గా పుట్టిన వసంతుని బొడ్డు కోసిన కొడవలి లాగా కోయిల కూత యువతీ యువకుల్ని విరహం తో కోస్తున్నాయి .శివునికీ పార్వతీ దేవికీ ప్రణయం కల్పించ టానికి మన్మధుడు వేసిన పూల బాణాల మొనలు విరిగి ,చివుళ్ళు గా వేలుస్తున్నాయత. భూదేవి కడుపు లోంచి పుట్టిన వ్రుక్షాలనే పిల్లలకు పాల పళ్ళు ,దంతాలు మొలిచి నట్లు లేత చిగుళ్ళు పువ్వులు ,పిందెలు పుడుతున్నాయి .వన లక్ష్మి రాబోయే మాధవుని అలంకరించ టానికి సింగారించు కొందిట .”.
                              దేవత్వం సిద్ధిన్చినా ,మధు పానం అనే దురభ్యాసాన్ని వదలని తుమ్మెదలను వెక్కిరిస్తూ ,తనకుపంచత్వం రారాదని ,పంచమ స్వరం తో కోయిల కూస్తోంది .మాధవుడు మామిళ్ళకు ,పూలను సృష్టించి ,పిందెలు గా మార్చి ,మన్మధునికి ఆయుధాలు ,సరఫరా చేస్తున్నాడట .దేవుడే శత్రువుకు మేలు చేస్తుంటే విరహ గ్రస్తులకు దిక్కు లేకుండా పోయిందట .మధు మాసం అనే ఆవు పొదుగు నుండి పాలు కారు తున్నట్లు చంద్రుని వెన్నెలల తో భూలోకం తడిసి ,కమ్మని వాసనలనిస్తోంది .తుమ్మెద బారులు మన్మధ బాణానికి నారిగా మారు తోమ్దట .యువతుల చంద్ర బింబాల వంటి మొహాల కన్నా ,చను దోయి కంటే మాకే ఎక్కువ యవ్వనం వుందని పద్మాలు విరగ బూసి నవ్వు తున్నాయట .భ్రుగు మహర్షి తన్నినా నవ్వేసిన విష్ణు మూర్తి వెంకటేశ్వరుడై ,పద్మాతిని పెళ్ళాడాడు .ఆమె సత్య భామ గా మారింది .స్త్రీలందరికీ ఆ అంశ అంటించింది .ఏ స్త్రీ తన్నినా అశోకవృక్షం బంగారు పూలతో పూసినట్లు navvu తోందట .మాధవుడు రాసాతలాన్ని ,మకరంద వర్షం తో ,భూమిని పూలతో ,ఆకాశాన్ని పుప్పొడి తో జయించి ,త్రిలోక విక్రముడైనాదట .చిలకకు జామి పళ్ళు మేత గా ఇచ్చిన వసంతుడు ,ప్రేయసీ ప్రియులకు పూలు పంచి ,తుమ్మెదలకు తేనె లిచ్చి ,వసంత లక్ష్మికి వెచ్చని కొగిలి ఇచ్చి ,పక్ష పాతం లేదని పించాడట  .–
                                                                 గోదా కల్యాణం
                                                                 ——————
                             వసంతం ఇంతగా విజ్రుమ్భిస్తే రంగ  నాద స్వామి విరహ వేదన తో  తపిస్తున్న గోదా దేవి బాధ ఏమిటో తండ్రి విష్ణు చిత్తుల వారికి తెలియనే తెలియదు .చివరికిమన్నారు దేవునికి మొర పెడ్తే ఆయన గోదాదేవిని శ్రీ రంగానికి తీసుకు వెళ్ళాడు .ఆమె పై స్వామి మరులు గోన్నాడు .పెళ్ళికి స్వామి విష్ణు చిత్తుల వారింటికి సపరి వారం గా తరలి వచ్చాడు .దేవలంతా పాల్గొన్నారు .దివ్య వేదిక పై శ్రీ గోదా రంగ నాయకుల వివాహం  శాస్తోక్తం      గా వైభవం గా జరిగింది .సప్తపది పూర్తి చేసి ,అరుంధతీ దర్శనం చేశారు .కాదు రాయల వారు చేయించారు .భార్యా భర్తలిద్దరూ కలియుగ వైకున్థం  నుంచి అసలువైకున్థం    చేరారు .అందుకే ఆముక్త మాల్యద ముక్తి మాల్యద అయింది చిర యశస్సును ఆర్జించింది ..
దీనితో  ఆముక్త మాల్యద లోని నాలుగు రుతువులను శ్రీ కృష్ణ దేవ రాయలు వర్ణించిన,తీరును ఆ వర్ణనలు కధకు ,.కదాగామనానికి తోడు పడిన విధానాన్ని తెలుసు కొన్నాం .ఇక చాలు సెలవ్
                                                                                        మీ —-గబ్బిట దుర్గా ప్రసాద్ 08 -06 -11
Posted in రచనలు | Leave a comment

ఆముక్త మాల్యద లో రాయల గ్రీష్మ వర్ష రుతు వర్ణన

   ఆముక్త   మాల్యద లో రాయల గ్రీష్మ వర్ష  రుతు వర్ణన 
                                                          —————————————————-
ఆముక్త మాల్యద లో గ్రీష్మ రుతువును ముందు ప్రవేశ పెట్టాడు కృష్ణ దేవ రాయలు .అదే ఆయన ప్రత్యేకత ,.కారణం లేకుండా చేసిన పని కాదిది .గ్రేష్మ ప్రతాపాన్ని అంత ప్రతిభావంతం గా వర్ణించి కధకు కావలసిన నేపధ్యాన్ని సృస్తిమ్చటం రాయల మార్గం రాజ మార్గం .తాను చెప్ప దలచు కొన్న కధకు జీవితాన్ని ప్రసాదిస్తాడు ఇదే ప్రకరణ వక్రత..
               ఆ వేసవిలో పుష్ప బాణుని విల్లు చేయి జారి పడిపోయిందట .చేతులు చేమరిస్తున్నాయి .రతి ప్రేరణకు అవకాసం లేదన్న మాట .జీవుల్లో అలసత్వం పెరిగింది .దంపతుల పొందు ”అనార్యుల పొందు ”గా ఉందట .రతి కి విమఖత చెమట అలసత్వం వల్ల కల్గింది .దీన్ని ”వాక్య వక్రత ”అన్నారు ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారు .వేసవి తాపానికి సోమ్మ సిల్లిన యువతీ ముఖ చంద్రుడు తన ఓషధ ధర్మాన్ని వుపయోగించి మన్మదునితో కలిసి ,పాతాళానికి పారి పోతున్నా ,కమ్మని పిల్ల తెమ్మెరను ,శీరాపు తాటి విసన కర్ర తో బలవంతం గా తెప్పించుకొని అనుభావిస్తున్నాడట .మలయ పావనమ్ లేదు కనుక మరుని బాధలే లేవు .మంట గాలిని మోయ లేక సూర్య రధ పగ్గాలైన పాములు ముడులు వదిలేశాయత .నీటి తో నిండి ఉండాల్సిన బావులు నీరు లేక చక్రాకారం లో ఆకాశానికి యెగిరి పోతున్నాయి .జల దేవతలు చలువ పందిళ్ళు కు చేరారు .కా ళ్ళు పడిపోయిన మన్మధుడు ,అక్కడే కుక్కి మంచం ఎక్కాడట .మల్లె మొగ్గలు అగ్గి బొబ్బల్లగా వున్నాయట          .చరకు పానకాలు,సేద తీరుస్తున్నాయత ..
                   మన్మధ రంగాస్తలమైన మధుర నగరం లో   వుంది ఈ గ్రీష్మం అంతా .ఆంటే శ్రుంగారం తగ్గి పోతోందని భావం .దంపతులు దగ్గరలో వున్నా పొందు సుఖం లేదు .ఇంతటి దారుణ గ్రీష్మం లలో రాజు మాత్య ద్వజుడు వేశ్య పొందు కోసం వెళ్తున్నాడు .వో పరదేశి బ్రాహ్మణుడి ప్ర్రబోధం విని ,మనసు మార్చుకున్నాడు .అదేవసంతం  అయితే అలా జరిగేది కాదు .కామోద్దీపన పెరిగేది .ఇలా గ్రీష్మం తో రాజు మనసు మార్చిన ఘనత రాయలది .”వక్రోక్తి స్వభావాన్ని అద్భుతం గా వుపయోగించి తాను చెప్ప బోయే కధకు బలాన్ని అందజేశాడు రాయలు ”అన్న ఆచార్యుల వారి విశ్లేషణ  అమోఘం అని పిస్తుంది
                     తరువాత యమునా చార్యుల వారి వివాహం జరుగు తుంది .అక్కడ వర్ష రుతువును అద్భుతం గా వర్ణిస్తాడు రాయలు గార్హస్త ధర్మ పోషణకువర్శర్తు   బాగా దోహదం చేస్తుంది .ఇక్కడ రాయల ప్రకృతి పరిశీలనకు ముక్కు మీద వేలు వేసు కోని ఆశ్చర్య పోతాము .వేసవి లో అతిగా సుద్రపు నీరు తాగిన సూర్యుని కడుపు లో ఉప్పు ద్రవం గా మారి దాన్ని వుముస్తుమ్తే ఫెళ ఫేలార్భాటులు విన్పిస్తు న్నాయట .పుట్తాల్లో వున్న కట్ల జెర్రి పాములు ఆకాశం లో నడుస్తున్నట్లు వర్ష మేఘాలున్నాయట .ఆ జెర్రుల వేయి కాళ్ళ లాగ వర్ష ధారలు పడుతున్నాయి .గాలితో కూడిన ధారలు వుట్టి త్రాళ్ళ లాగా గోగు పుల్లల్లా జనపనార లా తళ తళ లాడు తున్నాయట .ఆకాశం ,భూమి ,తెల్లని తాళ్ళతో ముడి వేసి నట్లుందట .ఇదంతా ఎంతో సహజ సుందర వర్ణన .ఇంతకు ముందు ఏ కవీ ఇలా వర్ణించ లేదు .
                      ఇంద్రుడు అడవి నెమిల్లను ఆడిమ్చతానికి .మేఘాలలు అనే మద్దేల్లను రెండు వైపులా మొగిస్తున్నాదట .వర్షుడు సముద్రాలన్నీ తాగేసి ,ఆ నేరంతా ఒక్క సారి కక్కితే భూమి వరదల్లో మునిగి పోతుందని జాలి పడి బ్రహ్మ సూర్యుని చుట్టూ ,గూడు కట్టాడట .కోకిల పంచమ స్వరం తో ,నెమలి షడ్జమం తో ,పాడుతున్నాయి .ఆ రెండు కలిసి పాడి నపుడు సముద్రుడనే భర్త దగ్గరకు నదులనే భార్యల్ని సాగనంపుతున్న చెలి కత్తెల పాటల్లా వున్నాయట .
                           వర్షా కాలమ్ రచ్చ సావిల్లలో చేరిన జనం కాలక్షేపం కోసం పులి ,మేక ఆటలు ఆడుతున్నారు .కాయ గూరలు దొరక్క జనం ఆకు కూరలను ,చింత చిగురుతో కలిపి వండుకున్తున్నారు .రెడ్డి దంపతులు పొలం గుడిసె లో మంచం కింద కుంపటి పెట్టు కోని ,దూరం గా కట్టివేయబడ్డ దూడలు తమ శరీరాల్ని నాకు తునా పట్టించు కోకుండా కామ కేళి జరుపు తున్నారు .రాజులు మాత్రం నెమల్లు కూసే దాక నిద్ర లేవటం లేదు .ఆంటే క వారి భోగాలకు ఏమీ కొరత లేదు అని ఒక చురక అంటించాడు రాజైన రాయలు .వాళ్లకు ఎన్ని సుఖాలైనా అమరుతాయి కదా అంటాడు .
                     ఆంటే వర్షా కలం లో ఎంత ముసురు పట్టినా ఇబ్బందు లేదురైనా ,అన్నంతినటం   తొనే తృప్తి పడ కుండా మన్మధుని మరచి పోలేని వారుగా జన జీవితం సాగుతోంది గ్రీష్మానికి వర్హ్ర్టు కు ఎంత తేడా ? ఇలాంటి పజల మనో ధర్మ వ్రుత్తి ద్వారా రాజు గారి ప్రవర్తన కూడా వుంది అని ధ్వని గర్భితం గా రాయలు తెలియ జేస్తున్నాడు .యామునా చార్యులు రాజుగా  హాయిగా వర్షా కాలమ్ లో దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు .ఇదంతా అతని జైత్ర యాత్ర కు ముందు చేసిన వర్ణన ..దీని తర్వాత శరదృతు వర్ణన చేసి కదా గమనాన్ని  మార్చి వేశాడు అది మీకు ఇదివరకే తెలియ జేశాను
                    ఇంకో సారి వసంత ఋతు వర్ణన తిలకిద్దాం
                                                                                                    మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —-08 -06 -11

 

Posted in రచనలు | 1 Comment

ఆముక్త మాల్యద —–శరదృతు వర్ణన

 ఆముక్త మాల్యద —–శరదృతు వర్ణన 
                                                      ——————————————
కృష్ణ దేవ రాయల ”ఆముక్త మాల్యద ”కావ్యం వర్ణనా విశేషాలతో నిండి వుంటుంది అందరు కవులు వసంత ఋతువు ను ముందు వర్ణిస్తే రాయలు గ్రీష్మ రుతువు తో ప్రారంభించాడు .రుతు వర్ణనకు ,కధకు లంకె పెట్టటం రాయల నేర్పు ప్రస్తుతం శరత్తు లో వున్నాం కనుక కధకు ,వర్ణనకు సంబంధం గురించి ఆలోచిద్దాం .యామునా చార్యుడు కాల ప్రభావం వల్ల భోగిగా వీరమయ జీవితం గడుపు తున్నాడు .ఆచార్యత్వాన్ని ,రాజరికం కమ్మేసింది .కాని అది ఆయన ప్రవ్రుత్తి కాక పోవటం ఇబ్బంది గా పరిణమించింది .మత్యధ్వజ రాజులో ,యామనప్రభవు   లో వున్న లోపలి ప్రవృత్తుల లోని భేదాలను రాయలు గొప్పగా ఆవిష్కరించాడు .దీన్ని వర్ణనా వక్రత అన్నారు ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారు .ఇదే అందరి కవుల కంటే రాయలని ప్రత్యేకం గా వేరు చేసింది .కధలో ప్రాణ చైతన్య స్పందన దీని వల్లే వచ్చినది mఅంటారు  జి.వి .కాల ప్రభావం ,రుతు ప్రభావం మానవునిపై పెద్ద ప్రభావాన్నే చూపుతాయి .రుతు వర్ణన లతో ,అద్భుత కదా సంవిధానాన్ని రాయలు సాధించాడని అర్ధం అవుతుంది .
                  వర్షా కాలమ్ లోపన్నాగ   శాయనుడైన విష్ణు మూర్తికి  ,ఆది శేషుని  పడగల  కదలికలతో మెలకువ వచ్చింది నిద్ర లేచి భూమి పై కాలు పెట్టి అనుగ్రహించి నట్లుగా భూమి పంటలతో నిండి పోయింది .సూరీడు నీటితో పాటు తాగిన ముత్యాలనూ ,వుమిసి (వుమ్మేసి)పద్మాల మీద ,తామరాకుల మీద కొత్త ముత్యాలతో అందాలుదిద్దు తున్నాడట  .ఆకాశం లో నక్షత్రాలు తలంటు పోసుకోనిన కుంకుడు రసం నురగలు ,నదుల మీద రెల్లు పూలతో కలిసి ,తేలు తున్నాయట .సముద్రం నుంచి చల్లదనాన్ని ,తియ్యని నీటినీ అప్పు తీసుకొన్న సూర్య చంద్రులు ఆ అప్పు తీర్చటమే కాదు ,అందాలు అనే నగలు కూడా ఇచ్చి వడ్డీ తీర్చేశారట .
                                చెరకు గడలంత ఎత్తుకు పెరగలేక పోయామని సిగ్గుతో వరిచేలు కంకులతో తలలువంచుకొని వున్నాయట      .విశ్వామిత్ర యాగం వంటి వేసంగి తొలకరి వచ్చింది .వర్షము ,గాలీ రామ లక్ష్మణుల లాగా వచ్చాయట .శరత్తులో రాముడు శివ ధనుస్సును ఎత్తి పట్టాడు .ఇక సీతా అనే భూదేవి మనసు నుంచి పొంగక ఏమి చేస్తుంది?అని కుప్ప నూర్పిల్ల ను గురించి పంట దిగుబడి గురించి అద్భుతం గా వర్ణించాడు .ఇది కధకు  ఏ విధం గా సహకరిస్తుంది అని మన సందేహం .ఆంటే యామున ప్రభువు జైత్ర యాత్ర చక్కని ఫలితాన్నిస్తుందని సూచన . ఇంత వివరం గా వర్ణన చేసిన రాజు రాయలు యామున ప్రభువు దిగ్విజయాన్ని ఒకే ఒక మహా స్రగ్ధర లో చెప్పి వదిలేశాడు .వర్ణనా నేపధ్యం లోంచి మంచి ఫలితాన్ని అందించి ఔచిత్యాన్ని ఘనం గా పోషించాడు .యుద్ధ  వర్ణనను అతి గా చేస్తే అది రాయల రచన అవుతుందా ?అందుకే కవులందరి లో కృష్ణ దేవ రాయలు అందనంత ఎత్తున వున్నాడు .రాయల్ టచ్ ఆంటే అదే .ఆముక్త మాల్యద రాయల ప్రతిభా దర్పణం .
               మరిన్ని విశేషాలు వరుస క్రమం లో తెలుసు కుందాం  .సెలవ్
                                                                                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్       08 -06 -11

 

Posted in రచనలు | Leave a comment

శ్రీ మధురాంతకం రాజా రాం

మధురాంతకం రాజా రాం

————————-

మధురాంతకం రాజా రాం ఆంటే నాకెందుకో విపరీత మయిన ఇష్టం .ఆయన చని పోవ టానికి ఒక సంవత్చరం క్రితం విజయ వాడ లో ఒక సన్మాన సభలోపాల్గొన్నారు . .ఆయన్ను చూడాలన్న తహ తహ తో వెళ్లాను .”అచ్చ తెలుగు కధకు నిలువు తద్దం రాజా రాం .”అని నా నోట్ బుక్ లో నేను రాసు కోని వారిని సంతకం పెట్ట మన్నాను .చదివి నవ్వుతు సంతకం చేశారు .నాకు మహదానందం కలిగింది కాళ్ళకు నమస్కారం చేసాను .”అదేన్దప్పా .ఒద్దప్పా అట్లా చేయ్యద్దప్పా ”అని వారించారు కాని నేను వినకుండా నా పనినేను చేశాను .ఆప్యాయం గా కౌగిలించు కున్నారు .ఎంత ఆనందాన్ని అనుభావిమ్చానో చెప్పలేను .నా కల సఫలం అయింది .ఆ నెల లోనే ఆయన రాసిన బెజవాడ కనక దుర్గమ్మ ముక్కెర మీద కధ ప్రచురితం అయింది .దాన్నిఇక్కడ మళ్ళీ చెప్పారు .ఆయనది అద్భుత మైన ఫినిషింగ్ .కావ్యం చదువు తున్నట్లు అనుభూతి కలుగు తుంది .మనిషి లోపలి పొరలను తాకే భావ జాలం ,వాక్య విన్యాసం రసార్ద్రత వారి కధల్లో కొల్లలు మనసు ద్రవిన్చాల్సిందే సున్నిత హాష్యం అనుపానం .న హృద్యమైన కదా విధానం ,వైవిధ్యమైన ఇతి వృత్తం ,మనోజ్ఞా మైన శైలి మధురాంతకం కధకు నిండు దానాన్ని ,పుష్టిని కలిగిస్తాయి .కధలను అల్లడం లో ఏ చిక్కులు వుండవు .మాటలను అత్యంత సమర్ధం గా ప్రయోగించే నేర్పు ఆయనది .ప్రతి కధ పాడి కుండ లానిమ్డు గా వుంటుంది మధించాలే . కాని అద్భుత మైన వెన్నా ,నెయ్యి లభిస్తాయి .అదో ప్రపంచమే .అందులో ప్రవేశించ గానే మనల్ని మనం మరచి పోతాం .కధ అయిపోయిందని పిస్తూనే ముందుకు సాగుతుంది .ఎలా మొదలు పెడతారో ,అలాగే అంత గొప్ప గా ముగిస్తారు .ఏ రచయితకు ఇంత భావ పుష్టి వున్నట్లు అనిపించదు .ఏ ఇజం వుండదు .ఏ స్లోగాన్ను పెన్ను గన్నుకు ఎక్కించాడు సాదా సీదా,ఆశా మాషీ గా సాగిపోతూ ,అడుగడుక్కు వెనక్కు చూసుకొన మనే హెచ్చరిక లాంటి హితోపదేశం కధల్లో కన్పిస్తాయి .జీవితం కన్పిస్తుంది .అందులో బాధలు ,కలిమి లేములు స్పష్టం గా కపిస్తాయి .గొప్ప వాడి పై ద్వేషం కాని ,లేమి వానిపై అసహ్యం కని కన్పించవు .ఆ రెండు అంతస్తులు సారి సమానం కావాలనే భావన వ్యాప్త మావు తుంది .ఇలపై గొప్ప సాంఘిక విప్లవం వస్తుందనే ఆశా రేఖ గోచరిస్తుంది .ఆ విప్లవం ”చంపు ,నరుకు ”అనే తీవ్ర వాదం కాదు .గాంధీ మార్గం .అహింసాయుతం .శాంతి యుతం .మనసు లో పూర్తిగా మార్పు రావాలని భావం ఆయనది .అందుకు తగిన విధం గా కధనం వుంటుంది .ఆంతరంగికం గా మార్పు రానప్పుడు సామాజిక మార్పు తేవటం భగీరధ ప్రయత్నమే నన్న భావం ఆ కధల్లో కన్పిస్తుంది .మనసు మారితే అది శాశ్వత మార్పు అవుతుంది .ఆ విలువలు కల కాలమ్ నిలుస్త్సాయి .హంగామాతో ,మాటల గారడీతో ,వచ్చే మార్పు తాత్కాలిక మైనదే .ఈ దృక్పధం రాజా రాం కధ లన్నిటి లోను దృగ్గోచరమవుతుంది ముద్దబంతి పూల వంటి మాటలనే ఆయన ఉపయోగిస్తారు .కొరడా ఝాలిపిమ్పులుండవు .కదా మార్గం లో వుమ్మేత్తలు ,జిల్లేళ్ళు కన్పించవు .అదొక రాజ మార్గం .హాయిగా నడవవచ్చు .గొప్పగా అనుభవం పొంద వచ్చు .మానసికం గా గొప్ప ఆనందాన్ని అనుభావిన్చచ్చు .కావ్యం లోనే కాదు కధలో కూడా ”రాసోవైసః ”అన్న సూక్తిని నిజం చేసిన మహా కధకుడు రాజా రాం .అందుకే ఆయన్ను నేను ”కుటుంబ కదాశ్రీ రాజా రాం ”అంటాను .. కధ చదివితే అనుభూతి మిగుల్తుంది .అది శాశ్వతం గా మనసు లో నిలిచి పోయి మళ్ళీ మళ్ళీ చదివింప జేస్తుంది రాజారం కధ రామాయణం లాగా ,భాగవతం లాగ .రాజారాం కధలను పారాయణం చేసే వారు ఆంద్ర దేశం లో కో కొల్లలు .ఏ విదేశీ భావ జాలం ఆయన పై పద లేదు .దేశీయ మైన కధ ,దాని బలం ,విభిన్నమైన శైలి ఆయన్ను రాయల సీమలో మట్టిలో మానిక్యాన్ని చేశాయి .అవి సజీవ చిత్రాలు .ఆ మాటల పోహలింపు ,వాక్య విన్యాసం ,గడుసు దనం ,అనుభవ సారం ఆయన్ను అంత ఎత్తులో నిల బెట్టాయి .ఆయనతో పోల్చటానికి ఏ ఇతర భాషా రచయిత మనకు కన్పించడు రాజారం కు సాటి రాజ రామే .కదా రాజా రాముడు ఆయన .నిసర్గ సుందర రచన .మాండలికాల జోరుండదు .అవసరమైన చోట వాటి వాడకం మానసిక ఆహ్లాదం గా వుంటుంది .పదాలు ఇబ్బంది పెట్టావు .హాయిగా తీయగా ,మల్లెల దొంతర లా మంచు చల్ల దనం లా,మంచి గంధం లా ,మధురసాయణం లా ,మానస్ తేలికగా ,సుందర దృశ్యం లా కధను రాయటం లో ,మధురం గా మలచటం లో ,మధు మధురం గా అంతం చేయటం లో ఇంటి పేరు సార్ధకం చేసు కొన్నారు మధురాంతకం . చిత్తూరు జిల్లా దామల చెరువు గ్రామం లో జన్మించి ఉపాధ్యాయ వృత్తిలో జీవితాన్ని సార్ధకం చేసు కోని ”దామల చెరువు అయ్యవారు ”గా లబ్ధ ప్రతిస్తులు .కేంద్ర సాహిత్య అకాడెమి వీరి కూన లమ్మ కోన ”కదా సంపుటికి పురస్కారం లభించింది 1996 జనవరి 14 న జీవన సాఫల్య పురస్కారాన్ని అప్పజోస్యుల విష్ణు భొట్ల ఫౌండేషన్ వారు రాజా రాం సాహిత్య కృషికి అందజేశారు .మానవ సంబంధాలను ప్రధానం గా దృష్టి లో పెట్టుకొని కధలు రాసిన మహా రచయిత ఈ మట్టి మనిషి మధురాంతకం రాజా రాం. .మూడేళ్ళ క్రితం తిరుపతి నుంచి కాణిప్పాకం వెళ్తుంటే దామల చెరువు గ్రామమ్ కన్పించింది చెరువు నిండా తామరపూలే తామరల చెరువు దామల చేరు వు అయిందేమో నని పించింది మనసారా అయ్య వారు ఆహ్వానిస్తున్నార నిపించింది .చెరువే రాజారాం గారు అనుకోని మనసులో నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగాము .ఆయన కధలు తామరపూలు లా ఆకర్షిస్తాయి ,మానసిక వికాసం ఇస్తాయి .పద్మం వికసనానికి చిహ్నం .అయ్య వారి కధల్లో ఆ వికసనం విస్పష్టం గా కన్పిస్తుంది .జై రాజా రాం . మీ గబ్బిట దుర్గా ప్రసాద్ 08 -06 -11 .

Posted in రచనలు | 1 Comment

అస్పృశ్యత పై సమరం – మహాత్ముని కంటే ముండు మొదలైంది

    అస్పృశ్యత  పై సమరం 
                                                                         ————————–
భారత దేశం లో అస్పృశ్యత ఒక అంటూ వ్యాధి లాగా దేశాన్ని తార తరాలు గా పట్టి పీడిస్తోంది .వారికి సంఘం లో గౌరవం లేదు .పక్కన కూర్చొనే యోగ్యత నివ్వ లేదు .దేవాలయ ప్రవేశం లేదు .అందరు దీన్ని రూపు మాపాలని అనుకుంటున్నా ముందుకు వచ్చిన వారు బహు కొద్ది మంది మాత్రమే .గాంధిజీ ఏ దీన్ని గురించి ముందు ఆలోచించారు అని అంతా అనుకుంటారు . .కాదు అని తెలుస్తోంది ఆయన వల్ల ఆ ఉద్యమం ఊపు అందుకొంది ,అంతకు ముందే కవులు సంస్కర్తలు  గళం విప్పారు .కొంత కృషి చేశారు  ఆ వివరాలు తెలియ జేస్తాను
                 1906  వ సంవత్చరం లోనే దేశోద్ధారక కాశీ నాధుని నాగేశ్వర రావు పంతులు గారు కృష్ణా జిల్లా లో వారి స్వగ్రామ మైన ఎలకుర్రు లో హరిజనులకు స్వంత డబ్బులు ఖర్చు పెట్టి హరిజనులకు ప్రత్యెక మైన కాలనీ నిర్మించారు .హరిజనులకు ప్రత్యేల మైన ప్రాధమికస్కూల్ నిర్మించారు ..ఇంతే కాదు ఆ వూరి వారి స్వంత శివాలయం లోకి హరిజనులకు ప్రవేశం కల్పించి దైవ దర్శనం చేయించి గాంధి గారి కంటే ఆదర్శం లో ముందున్నారు .అప్పటికి ఇంకా గాంధి భారత రాజ కీయాలలో పూర్తి గ ప్రవేశించ లేదు .ఈ విషయాలన్నీ  ఈ నెల నాల్గవ తేది న మచిలీ పట్నం లో ఆంద్ర సారస్వత సమితి అధ్యక్షులు ,కవి కదా రచయిత నవలా కారుడు అయిన శ్రీ కొట్టి రామా రావు గారికి స్వర్గీయ కాశీ నాధుని నాగేశ్వర రావు గారి ”విశ్వ దాత ”పురస్కారాన్ని వారి మనుమడు శ్రీ కాశీ నాధుని నాగేశ్వర రావు గారు అందజేసిన సందర్భం గా ,బందరు లో వివిధ సంస్థలు  ఏర్పాటు చేసిన అభినందించినా సభ లో . .కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి ,విశ్లేషకుడు డాక్టర్ జి .వి .పూర్ణ చంద్ తెలియ జేశారు .అంతే కాదు పంతులు గారు ఆంధ్ర దేశం లో జన్మించటం వల్ల ఆయనకు రావాల్సినంత కీర్తి రాలేదని అదే బెంగాల్ లో జన్మించి ఉన్నట్లయితే గాంధీ గారికి బదులు పంతులు గారికే ”మహాత్మా ”బిరుదు లభించేది అని అన్నారు .ఇది కాదన లేని సత్యమే నని పిస్తుంది
                                  ఇంకో విషయం మీ దృష్టికి తెస్తాను .1909 లో నే స్వర్గీయ మంగి పూడి వెంకటేశ్వర శర్మ గాంధిజీ కంటే ముందు గా అస్పృశ్యుల పై స్పందించి కవిత రాశారు .అప్పటికి ఇంకా హరిజనులు అన్న పేరు వారికి రాలేదు .
        ”అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి –అందారు ఒక్కటై వుండాలి సక్కంగా –కష్టమ్ములోచ్చినా- ,నిష్టూర మొచ్చినా –ఇష్టమ్ము గా నుండి కట్టూగా నుమ్దాము అందారూ –తమ్మూల మణి మీరు మామ్మూల జూడండి –అమ్మోరు దీవించి –ఐశ్వర్య మిచ్చేను ”అని గొప్ప సామాజిక స్పృహతో సంస్కరణాభి లాష తో శర్మ గారు ముందే స్పందించారు .
              శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారు అస్ప్రుష్యులకు ఆలయప్రవేశం లేనందుకు బాధ పడుతూ గొప్ప కవిత రాశారు
                   ”కుక్కలు చూడ వచ్చునట -కోతులు చేతులు సాచి –భక్తి మై మ్రొక్కగా వచ్చు ,–చీమలు ముంగిట సాగిల బార వచ్చు ,–నల్ప్రక్కల నీగలున్ ముసర వచ్చును గాని –మనుష్య కోటిలో నేనొక్కడ నయ్య నేనిచట నుండగ రాదు గదా శివా ”అంటూ అస్ప్రుష్యుని ఆవేదనను తన వేదన గా వెలి బుచ్చారు .
               1943 లో చదల వాడ నరశింహం గారు ”మూడు కొట్లామ్ద్రులను తోడును గల్గి –దీనుడఅరుంధతి కుమారుండు –అస్పృశ్యతా దోష మంట గట్టి అది –పక్ష పాత సమేత భారత మాత ”అని ఆ తప్పు అంతా తల్లి భారత మాత దే నని ఆమెకే  దోషాన్ని  అంట గట్టారు   .
   రాష్ట్ర కవి, ప్రబోధకులు రాయ ప్రోలు సుబ్బా రావు గారు ”ప్రేమ వృత్తికి జగడాల భేద మేల —బ్రాహ్మణాగ్ర హారము నందు పవలు రేయి –విసరు పవనుమ్డు –కడ జాతి వీటి యందు –తాక లేక వీచునే -పక్ష తంత్ర జడిమ ?”అని ప్రశ్నించారు .వాయుదేవుడికి పక్ష పాతం లేదు అగ్రహారం లోను ,అస్ప్రుశులున్న చోట ఒకటిగానే వీస్తాడు మనుష్యులకే ఈ మాయ దారి భేద భావం అని దెప్పి పొడిచారు .
  బసవ రాజు అప్పా రావు గారు ”డబ్బు గలోడు దారికి రానీరు —ఈ గోరా మేమి ,ఈ నేర మేమి –మాల మాదిగలం –మనుషులం గామా ?”అని అస్పృశ్యుల తరఫున వకాల్తా పుచ్చుకొని వాదించారు ..
                   దేశం లోని ప్రష్టుత పరిస్థితిని చూసి ఆచార్య కొలక లూరి ఇనాక్ గొప్ప కవితలోతనభావాన్ని ఆవిష్కరిస్తూ దేశానికి ఎలాటి వాడు ప్రధాని అయి ఎలా పాలించి ఎలా దిగి పోవాలి అనేది  అద్భతం గా వర్ణించారు
    ”పైసా లేని వాడు –పైగా హరిజనుడు –ప్రధాన మంత్రి కా గలిగి  —అయిదేళ్ళు వుండి  -ఆపైన వదిలి –పైసా లేకుండా పాత మనిషి గా –బ్రతగ్గలిగిన నాడు -భారత దేశం బాగు పడ్డట్టు .”ఇది భారతీయులందరి ఆకాంక్ష .అది తీరు తుందని ఆశిద్దాం .
                                                                          మీ
                                                                         గబ్బిట దుర్గా ప్రసాద్ —–08 -06 -11
Posted in రచనలు | 1 Comment

ఇంటింటికి విద్యుత్ కేంద్రం

Posted in సేకరణలు | Leave a comment

శంకర్ బొమ్మలకొలువు

Posted in సేకరణలు | Leave a comment

మరణం లేని ముళ్ళపూడి మార్క్ -శ్రీ రమణ

Posted in ముళ్ళపూడి & బాపు | Leave a comment

ముళ్ళ పూడి వెంకట రమణ శతకం ——అబ్బూరి రామ కృష్ణా రావు

ముళ్ళ పూడి వెంకట రమణ శతకం ——అబ్బూరి రామ కృష్ణా రావు

1        ‘’పున్నామ నరక భయమున

కన్నా డొక గేస్తు పుత్రికా రత్నములన్

పన్నెండుగురు ను వరుసగా

విన్నావా ముళ్ళ పూడి వెంకట రమణ

 

2.     అన్నా తురుడై  తానొక

సన్నాసిని  బిచ్చ  మడుగా

సరిరా పోదామన్నాడని బిచ్చమడుగా

విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా

 

  ఆరుద్ర –కూన లమ్మ పదం 

 

౩.      కొత్త పెళ్ళాము వండు

గొడ్డు కారము మెండు

తీపి యను హజ్బెండు

వో కూన లమ్మా

 

 పూర్ణచంద్   వెలుగు రాగాలు

 

4.     “ దోమ తెరకి  ప్రాంతీయ తత్త్వం జాస్తి

బైట దోమల్ని లోపలి రానీయదు

లోపలి దోమల్ని బయటకు పోనీయదు

మధ్య లో దూరాడంటూ

నా పైన లోపలి దోమల దాడి

ఈ  “పక్క” నాది కాదా ?
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ముళ్ళపూడి & బాపు | Leave a comment

ఆరుద్రాభిషేకం

                                         ఆరుద్రాభిషేకం 
                   ఒకసారి ఆరుద్రకు ఘన సన్మానం జరుగు తోంది వేదిక మీద విశ్వనాధ సత్యనారాయణ గారు వున్నారు ,ఆ ముచ్చట చూసి ”సాధారణం గా శివుడికి రుద్రాభిషేకం చేస్తారు .ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ”ఆరుద్రాభిషేకం ”అని అందరి హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారట .
                       ఇంతకీ ఆరుద్ర ఆంటే ఎవరు? ఆరుద్ర ఆంటే ”సిల్కు పురుగు ”.అందులోని సిల్కు దనం ఆరుద్ర రచనల్లో మిల మిల మెరుస్తుంది .ఆరుద్ర ఒక నక్షత్రం పేరు కూడా .దాని తళుకు మినుకు ,కులుకు ,నైశిత్యం అతని రచనలలో ప్రతిఫలిస్తాయి .లక్ష రూపాయల విలువ చేసే తన స్వంత గ్రంధాలయాన్ని ”సుందరయ్య విజ్ఞాన భవన్ ” కు    అర్పించి తన కంటూ ఏమీ మిగుల్చు కోని వితరణ శీలి ,త్యాగి ఆరుద్ర .
                    లబ్ధ ప్రతిష్టులైన ఎంతో మంది ఆరుద్రను మనసార అభినందించారు .ఆ అక్షరాభినందన అభిషేక వైభవాన్ని చూద్దాం ”ఛందస్సు చేత ఇంత వెట్టి చాకిరీ చేయించు కున్న ఆధునిక కవి  ఆరుద్ర కంటే ఎవరూ లేరు ”.  ”ఆరుద్ర ఒక చైతన్య కిరణం ”.
 ”సాహిత్య రుషీ —నీ కలం పేరు కృషి —నీ బలం పేరు కుషీ   జోహార్ —–వ్యాసానందా ,–   వాక్యాక్షర శబ్ద భావ విన్యాసానందా  ప్రసానందా’ అంత్య ప్రసానందా  జోహార్ ”వెయ్యేళ్ళు  నీ ఎకాడెమీ -నడిపించు సుమీ ” అని బాపు ,రమణ తమ ప్రియ మిత్రుని కీర్తించారు .
”ఆస్తి ఆంటే భువనాలు ,జాగీర్లు ,ఫ్యాక్టరీలు బ్లాకు మనీ ,గిద్డంగులూ ,కాదు కనుక తెలుగు వాడి ఆస్తి ,భాగవతుల శంకర శాస్త్రి ”అంటూపొగడ్తల బొగడ పూల దండ వేశాడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ
”ఆధునిక కవిత్వం పై ఆరుద్ర ముద్ర చిరస్థాయి ”అని చెరిగి పోని ముద్ర వేశారింకొకరు .
”వంద ఎకాడెమీ లకు మారు పేరు –నడుస్తున్న ఎన్సైక్లో పీడియ ఆరుద్ర ”అన్నారు  ఆయన సాహితీ కృషి చూసి ఇంకొకరు పొంగి పోయి
”ఆంద్ర సాహిత్యం లో ఆరుద్ర చిరంజీవి ”అని అతని సాహిత్యము ,అతను అమరం అనే భావం తో వేరొకరు
 ”పద్యం ,గేయం ,పాట అన్నీ సమాన ప్రతిభ తో వ్రాసిన శిల్పి ”అనీ ”స్నేహ శీలి ,చమత్కారి స్వంత వ్యక్తిత్వం వున్న మహా మనీషి ”అని శ్లాఘించిన వారున్నారు .
  ‘ఆకాశం వున్నాన్నాళ్ళు ,ఆరుద్ర నక్షత్రం వుంటుంది .ఈ కాలమ్ వున్నన్నాళ్ళు ఆరుద్ర సంతకం అలానే వుంటుంది ” అన్నాడు సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి  చంద్రుని వెన్నెల వుమ్దేంత కాలము    ఇది సత్యం
   ”ఆరుద్రకు ఆంద్ర లోకమే రుణ పడి వుంటుంది ”అనికితాబు ఒకరిస్తే ”ఒకే ఒకడు ఆరుద్ర ”అన్నది ఆంద్ర ప్రభ అతని సాహితీ ప్రభకు జీజీ లు పలుకుతూ .
”  versatile writer ” /’.అని పొంగిపోయారు ఇంకో   అభి మాని .
”ఒక శ్రీ శ్రీ ,ఒక రావి శాస్త్రి ,ఒక విశ్వ నాద లా ఒక ఆరుద్ర ఒకే ఒక ఆరుద్ర ..”అని బేరీజు వేసిన విశ్లేషకులు ఇంకొకరు .
 ”సాహితీ రంగం లో అందరు చేసిన వన్నీ ఆరుద్ర చేశాడు .కానీ ఆరుద్ర చేసినవన్నీ అందరూ చేయ లేదు ”అని అతని సాహితీ విశ్వ రూపాన్ని ఒక్క వాక్యం లో తేల్చి చెప్పారు మరో విశ్లేషకుడు
”కవిత లోన వేయిటు ,పరిశోధనకు లైటు –అన్నిటా హైలైటు  వో కూనలమ్మా ”అని గ్రేట్ గా గుర్తించారు ఆచార్య యెన్ .గోపి .ఇది నిజం గా చాలా  వెయిటే .’
”ఒకే కాలమ్  లో గుండెలో కవిత్వాన్నీ  ,గొంతు లో పాటనీ ,మస్తిష్కం లో పరిశోధనా పండించు కుంటూ ,ఆసాంతం జీవించిన ”సాహితీ త్రిమూర్తి స్వరూపం ‘ఆరుద్ర ”అన్న మాట కోట్లకుదీటైన  మాట ..
                              ఇన్ని రూపాలుగా విస్తరించిన ఆరుద్ర బహుముఖ వ్యక్తిత్వం ,సహస్ర ధార కల ఇంద్రుని వజ్రాయుధమే .అందుకే ఆయన్ను ”ఆరు రుద్రులు ”ఆంటే అదిచాలా చిన్న   మాటే అవుతుంది .”ఏకాదశ రుద్రులు ”అన్నా చాలదు . శైవ ఆగమం లో ”శత రుద్రీయం ”వుంది ‘అదీ సరిపోదని నాకు తోచింది .కనుక నేను ”శత మహా రుద్ర -ఆరుద్ర ”అని ఆ మహా మనీషికి, ఆ శేముషికి నమస్కరిస్తాను వినమ్రం గా .
  ”  ఎదగ  డాని కెందుకురా  తొందర ”అని హెచ్చరించిన ఆరుద్ర  తన చుట్టూ మరుగుజ్జు భావాదిపతున్న కాలమ్ లో అందరి కంటే తొందర పడి బాగా ఎదిగి పోయి ,దుర్నిరీక్షుదు అయినాడు .ఆ శ్రమ లో అలసట లో ,బడలికతో ,ఆరోగ్యం కోల్పోయి ,శాశ్వతం గా చదువుల తల్లి సరశ్వతి ఒడిలో ఒదిగి చంటి పిల్లాడిలా నిదుర పోయాడు  .ప్రభుత్వం పట్టించు కొక పోయినా ,అభిమానులు లక్షలు పోగు చేసి కిడ్నీ   చికిత్చ చేయించి రుణాని తీర్చుకున్నారు  .ఆ నిరంతర పరిశీలన పరిశోధనా వర్తికి ,సాహితీ విశ్వరూపునికి ఇదే నా అక్షర నివాళి ..
                   మహారచయిత, కవి ఆరుద్ర పై ఇది చివరి వ్యాసం ”
                                              06 -09 -98  న ఉయ్యూరు సాహితీ మండలి లో ఆరుద్ర మరణం తర్వాత నేను ”[ఆరుద్ర శత మహా రుద్ర ” అన్న పేరు తో చేసిన అక్షరాభి షేకమే ఈ వ్యాస పరంపర .
                                                                                      మీ
                                                                              గబ్బిట దుర్గా ప్రసాద్ 
                                                                                05 -06 -2011
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

ఆంధ్రప్రదేశ్ కు పేరు పెట్టినది ఈయనే – శ్రీ పాగ పుల్లారెడ్డి

ఆంధ్రప్రదేశ్ కు పేరు పెట్టిన తెలంగాణా నాయకుడు శ్రీ పాగ పుల్లారెడ్డి

Posted in సేకరణలు | 1 Comment

రెండవ కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రపంచ రచయితల మహా సభలు ఆగస్ట్ 13 ,14 ,15

జాల బంధువు లకు

                                 కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో విజయవాడ లో ఆగస్ట్ 13 ,14 ,15  తేదీలలో ”రెండవ ప్రపంచ రచయితల మహా సభలు ”అత్యంత వైభవం గా   నిర్వహింప బడుతున్నాయి .మీరు మీ సాహితీ మిత్రులు  ,దీనిలో పాల్గొని విజయవంతం చేయ వలసినది గా ఆహ్వానం పలుకు తున్నాం .రిజిస్ట్రేషన్ రుసుము 300 రూపాయలు ముందుగా కృష్ణా జిల్లా రచయితల సంఘానికి పంపి మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించు కోవలసినది గా అభ్యర్ధిస్తున్నాం   దీనితో జత జేయబడిన ఆహ్వాన పత్రికను సాకల్యం గా అధ్యయనం చేయ ప్రార్ధన .
                                                                                                                             భవ దీయుడు 
                                                                                                                     గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                                                                             05 -06 -20011
Posted in సభలు సమావేశాలు | 1 Comment

సరసభారతి ప్రగతి

సరసభారతి ప్రగతి
సరసభారతి జరిపిన కార్యక్రమాలు మీకోసం
వరుస సంఖ్య

 

తేది / వారం

 

కార్యక్రమం

 

ముఖ్య అతిధి

 

వేదిక

01 24-11-2009 మంగళ వారం సంగీత విభావరి శ్రీమతి సింగరాజు కళ్యాణి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
02 22-12-2009 మంగళవారం శ్రీ కృష్ణ తత్త్వం శతావధాని డా. శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
03 05-01-2010 మంగళ వారం త్యాగరాజ స్వామి ఆరాధన శ్రీమతి జోస్యుల శ్యామల దేవి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
04 27-01-2010బుధవారం వందేళ్ళ తెలుగు కద శ్రీ నండూరి రాజ గోపాల రావు (చినుకు పత్రిక సంపాదకులు) ఫ్లోరా హై స్కూల్
05 21-02-2010 ఆది వారం సుగమమైన తెలుగు పాట శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ (స్టేషన్ డైరెక్టర్ అల్ ఇండియా రేడియో ) శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
06 14-03-2010 ఆదివారం శ్రీ వికృతి ఉగాది మహా కవి సమ్మేళనం శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ (మాజీ మంత్రి)  శాఖ గ్రంధాలయం(A.C. Library)
07 24-03-2010మంగళ వారం శ్రీ రామ తత్త్వం శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
08 13-04-2010మంగళ వారం అన్నమయ్య పద కవిత డా. తుమ్మల శ్రీనివాస రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
09 18-05-2010 మంగళవారం శ్రీ శంకరాచార్య జయంతి శ్రిమతి మాదిరాజు శివ లక్ష్మి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
10 07-06-2010 సోమ వారం శ్రీ మద్ రామాయణంలో ఆంధ్రయణం శ్రీ స్వర్ణ రాజ హనుమంత రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
11 27-06-2010ఆదివారం పురాణాలు కావ్యాలు నేటి సమాజం డా. మడక సత్యనారాయణ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
12 24-07-2010  శని వారం కధా సదస్సు శ్రీ నండూరి రాజగోపాల్ & శ్రీ గుత్తికొండ సుబ్బారావు AG & SG SIDDHARDHA DEGREE COLLEGE
13 17-08-2010మంగళ వారం తెలుగు కావ్యాలలో ఉదయస్తమయాలు శ్రీ పెదపోలు విజయ సారధి & శ్రీ నారాయణం శ్రీనివాస మూర్తి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
14 26-09-2010ఆదివారం పుస్తకావిష్కరణ వేడుక శ్రీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ (M.L.C) శాఖ గ్రంధాలయం(A.C. Library)
15 26-10-2010ఆదివారం చితికే సాహిత్యం శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
16 23-11-2010మంగళ వారం శ్రీ శివ తత్త్వం –  శ్రీ నాదుడు శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
17 02-12-2010 బుధ వారం ఉయ్యూరు ఊసులు ఆవిష్కరణ డా. జి.వి. పూర్ణచంద్  & సి.హెచ్. వి.వి.కే. రాజు V.R.K.M SCHOOL AUDITORIUM
18 24-01-2011సోమ వారం త్యాగరాజ ఆరాధన శ్రీమతి జోస్యుల శ్యామలా దేవి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
19. 25-01-2011మంగళ వారం హాస్యం –త్యాగరాజ కృతి నీరాజనం– శ్రీ దండిభట్ల దత్త త్రేయ శర్మశ్రీమతి కాలిపత్నపు  ఉమ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
20 08-02-2011మంగళ వారం తెలుగు పౌరాణిక చలన చిత్ర వైభవం శ్రీ పొన్నాడ సత్య ప్రకాశ రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
        21. 26-02-2011 శనివారం అక్షర నివాళి–ముళ్ళపూడి రమణకు శ్రీ గుంతక వేణుగోపాల్ రెడ్డి శాఖ గ్రంధాలయం(A.C. Library)
22 13-03-2011 ఆది వారం శ్రీ అన్నప రెడ్డి సన్మాన సభ శ్రీ అన్నప రెడ్డి వెంకటేశ్వర రెడ్డి శాఖ గ్రంధాలయం(A.C. Library)
23 27-03-2011 ఆది వారం శ్రీ ఖర ఉగాది అనురాగ కవి సమ్మేళనం డా. రావి రంగా  రావు శాఖ గ్రంధాలయం(A.C. Library)
24 12-04-2011మంగళ వారం శ్రీమత్ రామాయణం శ్రీ గుడిసేవ భాస్కర రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
25 25-05-2011 బుధ వారం రామాయణం లో ఆయుర్వేదం డా. దీవి చిన్మయ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
26 26-05-2011 గురు వారం శ్రీ హనుమత్ వైభవం శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
27 27-05-2011శుక్రవారం శ్రీ హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

స్వర్గీయ ఏం.ఎస్ సుబ్బు లక్ష్మి కి ”స్మృతి గీతం ”

స్వర్గీయ ఏం.ఎస్ సుబ్బు లక్ష్మి కి ”స్మృతి గీతం ”

                                                                     ———————————————————-
                      తన గానాన్ని భగవదర్పితం చేసి ,స్వర రాగ రంజితం తో ప్రపంచాన్ని పరవశింప జేసి ,మధుర ,మంజుల గాత్రం తో సమ్మోహన పరచి ,భారత దేశానికి సాంస్కృతిక రాయ బారి గా నిలిచి భారత రత్నమైన సంగీత రత్నం స్వర్గీయ ఏం.ఎస్ .సుబ్బు లక్ష్మి .ఆమె పరమ పదించినా ఆ  పద మంజీరాలు వినిపిస్తూనే వున్నాయి .సంగీత రసజ్ఞుల హృదయాలలో శాశ్వతం గా నిలచిన ఆ సంగీత మహా సామ్రాజ్ఞి మరణించటం జీర్ణించు కో లేని అభిమానులు ,ఆమె స్వంత రాష్ట్రం లో కూడా చేయ లేని అపూర్వ స్మృతి గీతం ను ప్రచురించి ,సహృదయ స్పందనను ,అభిమానులకు అందించారు .ఇందులో ముఖ్య పాత్ర దారి ,కృష్ణా జిల్లా విస్సన్న పేట వాస్తవుడు ,ఆకునూరు వారి అల్లుడు ,నాగార్జున సాగర్ లో ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో ఆఫీసు superintendent  శ్రీ లకుమా అని పిలువ బడే బూదేస్వర రావు .నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చి ఆ పుస్త కాన్ని నాకు ఇచ్చారు .ఆయన మంచి కవి ,”రజనీ- కుందుర్తి అవార్డు ”గ్రహీత .సుబ్బు  లక్ష్మి ఫౌండేషన్ స్థాపకులు కూడా .ఆమె 95  వ జయంతి జూలై లో వస్తోంది .ఆ నాడు సమగ్ర మైన సుబ్బు లక్ష్మి జీవిత చరిత్రను వెలువరించే పనిలో వున్నట్లు చెప్పారు లకుమ ను .హార్ధికం గా అభినందించాను .అంతే కాదు షహనాయి మాస్ట్రో ,భారత రత్న బిస్మిల్లా ఖాన్ స్మృతి గీతం కూడా త్వరలో రాబోతోందని మంచి కబురు తెలియ జేశారు .వారి అకుమ్తిట దీక్షకు     ,కార్య దక్షతకు అభినందన శతం .
                                       ఇప్పుడు ”స్మృతి గీతం ”;;లోని విశేషాలను తెలియ జేస్తాను .భారతీయ మూర్తి మత్వాన్ని తన నడకలో ,ఆహార్యం లో ,స్వర ,రాగ గానం లో మేలవించుకొని చూడం గానే రెండు చేతులు ఎత్తి మనసార నమస్కరించాలనే భావన కలుగుతుంది .భారతేయ మహిళా స్వరూపానికి ఆమె నిలు వెత్తు అద్దం ‘.ఈ భావాన్ని ప్రతిబింబించే చక్కని చిత్రాలు ఈ పుస్తకం లో పొందు పరిచి అందరికే ఆనందం కల్గించారు .ఆమె మరణానికి బాష్పాంజలి ఘటించిన వారి కవితలు మనో భావాలు ఇందులో  పొందు పరిచారు .ముందున్న ముఖ చిత్రం లో ఆమె తన్మయ స్థితి లో పాడుతున్న అద్భుత రంగుల ఫోటో చిరస్మరణీయం గా వుంది .చివరి ముఖ చిత్రం రెండు చేతులు కలిపి నమస్కరిస్తున్న ఫోటో” గానానికి, లోకానికి ఇంక సెలవు ”,అన్న భావన కలిగించి కన్ను చెమరిస్తుంది .లకుమ గారి ఎడిటింగ్ కు అభినందనలు .
                                      మాజీ రాష్ట్ర పతి ,యువజన స్ఫూర్తి దాత భారత రత్న అబ్దుల్ కలాం సుబ్బు లక్ష్మి ని స్మరిస్తూ ఆమె వషంత యామిని అనీ ,అలనాటి తాన్సేన్ ను స్ఫురణకు తెచ్చిందని అంటారు .ఆమె కాల పురుషుడు బహూకరించిన కమనీయ బహుమతి అని కీర్తించారు .సర్వేశ్వరున్నే సంగీతం తో విభ్రం చెందించిన విదుషి అని మన సార ”గీతాంజలి ”గేయం లో అభి వర్ణించి ,నివాళు లర్పించారు .
                               ప్రతి భార్య వెనక ఒక భర్త ఉంటాడని ,ఆమె అభ్యుదయానికి సకల సహకారాలు అందించిన ఆమె భర్త” కల్కి ”అనే సదాశివం గారిని ప్రస్తుతించారు లకుమ 
.”ఆమె పాడక పోతే దేవుళ్ళకు కూడా తెల్ల వారదు ”అన్న గీతం లో ఈ భావాన్ని అత్యద్భుతం గా పలికించారు .ఆమెను” మెలోడి సబ్ lime  ”అన్నారు .తనకి తనే కాదు మనలోకీ తొంగి చూడ గల కమనీయ స్వరం అని .సంగీతాని ఊగించి ,శాసించి పాలించగల అసామాన్య ప్రావీణ్యం వున్న మహా విద్వాంశు రాలని మెచ్చారు .”బతుకు డొల్లను పూరించే స’జీవ’స్వరం అనటం ఆయనకే చెల్లింది ”నేను సుబ్బు లక్ష్మి సమకాలికున్ని ”అనే ఒకే ఒక్క వాక్యం తో దేవుణ్ణి గెలిచాను అని లకుమ మినీ కవితలో మెగా భావాన్ని పోదిగాడు .
                     డాక్టర్ భూసుర పల్లి వెంకటేశ్వర్లు ”friend of pleasure ”కవితలో  ఏం.ఎస్ ను రాధ చేతి లోంచి ద్వాపరం లో జారి పోయిన వేణువు అని ,ఆమె లేని ప్రపంచం పక్షు లేగిరి పోయిన గూడు లా వుందని ,ఆమె ఆధునిక మీరా అని భక్తి భావంతో అంజలి ఘటించారు .నన్నపనేని రాజకుమారి ఆమెను ”సంప్రదాయ మూర్తి నీవు ,సంగీత సామ్రాజ్య కీర్తి నీవు ”అని చెమ్మగిల్లిన కన్నులతోఅంటారు ”.గళ దేవత ” కవితలో చిల్లర భవానీ దేవి ”ఉదాత్త మృదు మధుర భక్తీ సంకేతాన్ని  –నాద మయం గా దర్శనం చేయిన్చిందనీ ,ప్రతి ఇంటి సుప్రభాతం     గా వెలిగిందనీ , మానవతా సంగీతాన్ని విన్పించిన మనస్విని అని    హృదయ పూర్వక నివాళు లందించి భవానీ మాత గా  ఈ జాతి అంతా ఆమెకు రునగ్రస్త  శ్రోతలే  నని     మన రుణాన్ని      గుర్తు     చేయటం   తో పాటు  శిరసు వంచి జోతలర్పించారు .
                                     ”జ్ఞాన రస సంగీత కర్మిని  ”అని లలిత సంగీత మధుర వాణి అని ,శ్రవణ పేయ అమేయ రసధుని అని ధ్వని తరంగాల రస రాణి  అంటూ ఆమె మరణ వార్తకు సంగీత వల్లి తల్లడిల్లిందని  కలత చెందారు కానూరి వెంకటేశ్వర రావు .నటుడు ఏ .వి ఎస్ ”సదా వెంకటేశం స్వరామి స్వరామి ”వచన రచనలో ”నా దేశం సంగెత భారత ప్రధానిని కోల్పోయింది .ఏం అనే మాధుర్యాన్ని ,ఎస్ అనే సుస్వరాన్ని ఆమె ఇంటి పేరు గా మార్చుకొంది .మా కోసం మళ్ళీ రా అమ్మా .  నువ్వొస్తే దేవతలంతా వస్తారు .నువ్వు కావాలి నీ పాట కావాలి .అందుకోసం మా మనో శ్వేత పత్రాలపై నూరు కోట్ల చే వ్రాల్లతో దేవతలకు దరఖాస్తు చేసు కుంటాం .నా  దేశం లో వో కాశ్మీరం ,వో స్వర్ణ దేవాలయం ,వో తిరుపతి క్షేత్రం ,వో సుబ్బు లక్ష్మి గాత్రం ”మాత్రమే వున్నాయని ఆమెకు భారతీయులకు వున్న సంగీత స్మరణీయ  వైభవ సత్ సంబంధాన్ని స్పష్టంగా తన శైలి లో చెప్పారు ఏ ,వి ఎస్ .
                 ”నిద్ర లేచిన దేవుడు సైతం –తలచుకొనే తొలి నామం ఏం .ఎస్ అని ,ఇప్పుడు కచ్చేరీలలో ”కల్యాణి ”విన్పించటం లేదని ,హృదయ లిపి లో ఒక గీతం శోక మూర్చనలు పోతూ తాళం వేస్తోందని ”తొలి నామం ”లో ఈత కోట సుబ్బా రావు బాధా తప్త హృదయం తో ఆవేదన చెందారు .మొహమ్మద్ ఖాదర్ ఖాన్ ”పునరపి  జననం  పునరపి మరణం –పదే పదే పాడే నీ పాట కోసం నువ్వు మళ్ళీ వెంటనే రావాలని        ఆశిస్తూ       ఆకాంక్షిస్తూ   శోకిస్తున్నాం తల్లీ ”అని ఆమెను పునః జన్మించమని  వేడు కొన్నారు         .స్వరాలమ్మ అని ఎల్ కే సుధాకర్   ఆంటే అమరగాన సరస్వతి అని ఏం వి అప్పారావు అన్నారు యి రఘు ”మల్లె పూలు ,మట్టి గాజులు  ”కవితలో ఆమెకు అవే ఇష్టమని ,అసలైన మట్టి మనిషని మెచ్చారు ,.కవి ,రచయిత నట దర్శకుడు భరణి ”ఆమె భారత ధాత్రి గౌరవ పతాకాన్ని –భూగోళం మీద పాతిన త్రివర్ణ గాత్రి –ఆమె సాక్షాత్తు వర వీణా మృదు పాణి ” అని సంగీత స్వరార్చనతో ఘన నివాళు లిచ్చారు . ”ఆమె పాటలపూదోట  లో   పూచిన ముకుందమాల -నిత్య నూతనం గా గుబాలిస్తుందని  భక్తి కుముద మాల వేసారు . ”పాటల పాల వెల్లి ” లో ప్రముఖ కవి శిఖామణి . .”సాధన చేసి చేసి -పరమపద సోపానానికి –చివరికి —గొంతునే సాధనం గా మలచుకున్దామే ”  అంటూ ఆమె పాట ఆపాత మధురం -అజరామరం -వెన్నెల కోయిల మల్లె పూవు  పసిపిల్లల నవ్వు ఉన్నంత కాలమ్ అని మురిసి పోయారు అక్షర మణి నీరాజనమందించారు శిఖా మణి .ప్రఖ్యాత సితార్ విద్వాంశుడు రవి శంకర్ తనకు తెలిసిన ఆమెను స్మరిస్తూ అహంభావం లేనిదని ,వినయ విధేయతలు ఆమె ఆభారణాలని .సంగీతాన్ని ఆమె లాగా ఆధ్యాత్మిక స్థితి కి తీసుకు వెళ్ళ గలిగిన సంగీతజ్ఞుడు తనకు ఇంత వరకు తారస పడ లేదని ,ఆమె దైవత్వం మూర్తీభవించిన సంగీత విద్వన్మని అన్నారు .భర్త  చేసే  దాన ధర్మాలను చూసి ఆయన్ను సదా” గివం” –ఆంటే ఎప్పుడూ ఏదో ఒకటి అవతలి వారికి ఇచ్చే వాడు అనే వారట సరదాగా .  .అమెది అన్ని శైలుల కంటే అతీత మైనదని గళం నిజంగా అద్వితీయమిందని ,చాలా లోతు గా పరిశుద్ధమైన భావోద్వేగం తో నిండి ఉంటుందని నిండు మనసుతో స్మృత్యంజలి ఘటించారు రవిశంకర్ నిజం గానే ఆయన సంగీత పండిట్ కదా .
                                 ఇవి కాక బాల మురళి ,జేసుదాస్ ,పట్టమ్మాళ్ ,సుశీల ,వైజయంతి మాల మున్నగు వారంతా ”ఆ గానం మధురామృతం ” అని మనస్ఫూర్తి గా జే జే లంద జేశారు .చివరలో ఆమె జీవితం లోని వివిధ ఘట్టాలను ”మైలు రాళ్ళు ” గా నిలిపారు ..       ఏం .ఎస్ అంత    అందంగా     ఆమె గాత్రమంత  పరిశుద్ధం గా           ,ఆమె గానం అంత       పవిత్రం   గా  ,,,ఈ స్మృతి గీతాలను  ఆంటే elegy  , లను  ఘన నివాళిగా ఆమెకు అందజేసిన ”లకుమ ;;గారిని మన సార అభినందిస్తున్నాను . .మన జాతి మణి దీపాలై ,మనల్ని సంస్కృతీ సుసంపంనులను చేసిన మహాను భావు లందరికి ఇలాంటి నీరాజనాలు మనం అందించాలి ..లకుమకు సహకరించిన వారందరినీఅభినందిస్తున్నాను     ఇది నిజం గా  అందరు గళం కలిపిన’ ‘ స్మృతి స్వరమే ” .
                                                                                                                         మీ
                                                                                                                    గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు | 1 Comment

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ”

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” —————————————————————–

కవన రుద్రుడు ,నిత్య ప్రయోగ శీలి ,బహుముఖ ప్రజ్ఞా శాలి అయిదు దశాబ్దాలు సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేసి ,73 మూడవ ఏట అలసి ,సొలసి ,దీర్ఘ నిద్ర లోకి జారు కున్న వాడు ఆరుద్ర అనే భాగవతుల సదా శివ శంకర శాస్త్రి .౭+౩=10 సంఖ్యా శాస్త్రం లో. వందా పూర్తి అయినట్లే . శ్రీ రంగం శ్రీని వాస రావు వైష్ణవ నామం .శంకర శాస్త్రి శివ నామం ..మేన మామ ,మేనల్లుడు విష్ణు ,శివ రూపాలుగా వెలిగి ,”త్వమే వాహం”ఆంటే నువ్వే నేను అనిపించుకున్నారు .బాంధవ్యం ,స్నేహం ,అపూర్వం .శ్రీ శ్రీ తర్వాతా పేర్కొనదగిన స్థాయి సంపాదించి ఆరుద్ర మామకుతగ్గ అల్లుడైనాడు .మహా ప్రస్తానం తర్వాత పేర్కొన దగిన రచన ”త్వమేవాహం ”.ఆధునిక మహా కావ్య త్రయం లో త్వమేవాహం ఒకటి .మొదట్లో శ్రీ రంగం నారాయణ బాబు ,శ్రీ శ్రీ పురిపండా ,పఠాభి ల ప్రభావం బాగా వున్నా ,క్రమం గా అందులోంచి జారి ,స్వంత గొంతుక తో ,స్వీయ వ్యక్తిత్వం తో ,మహాకవుల స్థాయికి ఎదిగిన వాడు ఆరుద్ర తెలంగాణా నేపధ్యం గా ”త్వమేవాహం ”రాశాడు ఆరుద్ర . యే నాటి తెలం గాణా కాదు .పొరపడ కండి .నిజాం నిరంకుశత్వాన్ని నిర్భయం గా ప్రత్యక్షర శిల్పం గా మలిచాడు .పొట్టి వాడినా గట్టివాడైన దాశారదికి తోడై ,గట్టిగా గళం విప్పాడు .ఇదొక సింబాలిక్ రచన .టి ఎస్ .ఇలియట్ రాసిన వేస్ట్ లాండ్ లోని లక్షణాలన్నీ నిక్షిప్తం చేసి ”,ఆంద్ర ఇలియట్ ”అనిపించు కున్నాడు .అయితే దీనికి టీకా ,టిప్పణి ఉంటేనే బోధ పడుతుంది .అందుకే మొదటి ప్రచురణ జన రంజకం కాలేదు .తర్వాత దాశరధి తో చక్కని ఉపోద్ఘాతం రాయించి ప్రచురించాడు .అతడు నిజం గా ఆరుద్ర హృదయాన్ని అద్భుతం గా ఆవిష్కా రించాడు .readability కలిగించాడు .అప్పటి నుంచే త్వమేవాహం పాథక హస్తాలను ,మస్తకాలను అలంకర్న్చింది .oft quoted lines కు జీవం పోసింది .హరీన్డ్ర్స నాథ చట్టోపాధ్యాయ రాసిన ”తెలంగాణా విప్లవ గాధలు ” ఆరుద్ర త్వమేవాహం కు ప్రేరణ .దీన్ని ఆరు కధలుగా కూర్చి కదా కావ్యం చేశాడు .ఈ ప్రక్రియ లో ఇదే మొదటిది ఆరుద్ర మౌలికం గా ప్రయోగ వాది .ఆవేశం కంటే ఆలోచనతో కవిత్వం రాస్తాడు .చమత్కారం ,శబ్దాలంకారం ,భావ వ్యక్తీకరణకు తోడ్పడేతట్లు రాయటం ఆయన ప్రత్యేకత .ఖండ కావ్యాన్ని కదా సూత్రం తో బంధించి ,పెద్ద కావ్యం గా ప్రయోగం గా రాశాడు .అభ్యుదయ కవితా చైతన్యాన్ని మరో మలుపు తిప్పాడు .”technic లేని కవిత్వాన్ని నేను ఊహించలేను ”అంటాడు .అయితే ”ఆరుద్ర కవిత్వం టెక్నిక్ లో కూరుకు పోయింది ”అన్న వాళ్ళూ వున్నారు . ”ట్రెయిన్ లో స్టీన్ గన్ .లా చెట్లు ,చిట్టెలుకలు —-చేయిన్సులో మగాళ్ళు -చెరచ బడ్డ ఆడాళ్ళు —చెడ పురుగులు –మదమెక్కిన సోల్జర్లు ”అనటం ఆరుద్ర మార్కు కవిత్వం . పైథాగరస్ సిద్ధాంతాన్ని చక్కగా కవిత్వీకరించాడు ”.చిన్ని చీమలు వగైరా అడుగు భుజం అనుకోండి —బలవంత మైన సర్పం -గట్రా ఎట్ సేటేరా -లంబం అవదా మరి ?–రెండు విభిన భుజాలపై గల చతురశ్రాలలోని తమిశ్రం –థీసీస్ ,యాంటి థీసీస్ సుల మిశ్రమ -రెండు భిన్న పక్ష సంజ్ఞల పోరాటం –అనగా ఒక నూతన వ్యవస్థ ” ఆరుద్ర కవిత్వం చదివి ”ఇంకా నేను కవిత్వం మానేసినా ఫర్వాలేదు ”అని కితాబు ఇచ్చాడు శ్రీ శ్రీ తన ముద్దుల మేనల్లుడికి .ఆంగ్లం లోని క్రియ ను తెలుగు లో కూడా వెర్బ్ గా చేసి ప్రయోగించాడు . చెరిష్+ఇంచు=చరిషించు అనీ రన్ +అండి ==రనండి ,అలాగే ఆమెన్ -ఆమెన్ ఒక చోట మెన్ అనీ ఇంకోచోట ఆమె అనీ శ్లేష . గతం లోని మంచి ద్వారా వర్త మానం తీర్చి దిద్ది ,భవిష్యత్తు పై ద్రుష్టి కేంద్రీకరించిన ప్రతిభా మూర్తి ఆరుద్ర అందుకే శ్రీ శ్రీ అంటాడు సాహిత్యోపనిషత్ లో ” చూశావా ఆరుద్రా !సంప్రదాయం నిలిచే వుంటుంది హమేషా –మూడ్హాచారాలు మారుతూన్తున్నాయి నిజం -కాని –సంప్రదాయం తాత ముత్తాతల ధనం -జాతికి జీవ నాళిక —జాన పద గీతిక ” .ఇదే మహా కవుల జంట ద్రుష్టి తెలుగు సాహిత్యాకాశం లో శ్రీ శ్రీ ,ఆరుద్రలు సూర్య చంద్రులు . .. ఈ వరుసలో చివరి భాగం రేపు మీ దుర్గా ప్రసాద్

Posted in రచనలు | 1 Comment

అరిచే కుక్కలు కరుస్తున్నాయి !! – ఏ వి స్

Posted in సేకరణలు | 2 Comments

విశ్వ నాధ ను గురించి శ్రీ శ్రీ

విశ్వ నాధ ను గురించి శ్రీ శ్రీ

 మాటలాడే వెన్నెముక ,–పాట పాడే సుషుమ్న
                              నిన్నటి నన్నయ భట్టు –ఈ నాటి కవి సామ్రాట్టు
                              గోదావరి పలకరింత –కృష్ణా నది పులక రింత
                              కొండవీటి పొగమబ్బు —తెలుగు వాళ్ల గోల్డు నిబ్బు
                              అకారాది క్షకారాంతం –ఆసేతు మిహికావంతం
                              అతడు తెలుగు వాళ్ల ఆస్తి –అనవరతం తెలుగు నాటి ప్రకాస్తి
                              ఛందస్సు లేని ఈ  ద్విపద
                              ”సత్యానికి”నా ఉపద ..
                                              ఆ –స్థాన కవులు 
                                              ——————-
                               అవాచ్యం అయితే కొట్టండి చెప్పు దెబ్బ
                               ఆది ఆంద్ర ఆస్థాన కవి మటుకు చెళ్ళ పిళ్ళ
                               శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి ద్వితీయుడు
                               పురాణేతి హాసాల రచనకు అద్వితీయుడు
                               సంస్కృత బోధిని కాశీ కృష్ణా చార్యుడు
                               కవి కాక పోతేనేం గాని అయినాడు మూడు
                               వేయిపడగల విశ్వనాధ సత్యనారాయణ
                              అందరికీ మిన్న అయినా నాలుగో ఆయన
                              శరధి ఘోష డాక్టరు దాశరధి ఇప్పుడు
\                             ఆంద్ర దేశానికి ఆస్థాన కవి ”పంచముడు ;”
                                                                                                   రచన —–శ్రీ విరించి
                                     మహా    గాయకుడు మహావాది వెంకటప్పయ్య శాస్త్రీ        ————--రచన కరుణ శ్రీ 
                               ”బోణీ   మచేసెను తెల్గు  నాట రసమున్ పొంగారు బంగారు ,నీ
                                 బాణీ ,తేట తెలుంగు పాటలకు ,మేల్ బంగారు ,నిద్దా   జరీ
                                వోనీ వేయుట నేర్పే ,నీ సరిగామల్ ”వోకల్ ”కళా కన్యకున్
                                వాణీ సుందరి మేజు వాణి యోనరిమ్పం బోలు నీ నాల్క పై .”
                                           ”కమ్మని కాంత మెట్టి రసిక ప్రవరుల్ తలలూచి మెచ్చ గా
                                            నమ్మోనరించు ,నీ మధుర నాద మికన్ వినలేము మేము ,స్వ
                                            ర్గంమున నమ్మహేంద్ర సముఖంమున  ,ముప్పది కోట్ల దేవతల్
                                            సమ్మద మంద నింక కోన సాగును లే ,భావ దీయ గానముల్ ”.
                                                              ”మధుర గాయక ”కుంతి కుమారి ”లేక
                                                               నీడు కచ్చేరియ లేదు  నేటి వరకు
                                                               నీవు లేవన్న రాదు కుంతీ కుమారి
                                                               మెడ దిగి వత్త మన్న ఆ ”మెట్లు” లేవు .
                                                                                                                             ఈ పద్య మధువును సేకరించి నిక్షిప్త పరచి మీ కోసం అందించాను .
                                                                                                                             తని వార గ్రోలి ఆనందాను భూతిని పొందండి .
                                                                                                                                       మీ ———–దుర్గా ప్రసాద్
                                                                                                                                                   01 -06 -11

 

Posted in రచనలు | Leave a comment

సినీ వాలి — ఆరుద్ర మరో పార్స్వ్యం

ఆరుద్ర మరో పార్స్వ్యం 
                                                 సినీ వాలి 
            ఆరుద్ర వచన కావ్యాలలో పేరు పొందింది ”సినీ వాలి ”ఆంటే అమావాశ్య ముందు కన్పించే ”చంద్ర రేఖ ”.పార్వతీ దేవికి కూడా ఆ పేరుంది .ఎంత కటిక చీకటి ముందు వున్నా ,ఆశా కిరణం తోడు వుంటుంది ,నిరాశ పనికి రాదనీ ఇందులోని ధ్వని .ఈ పేరు ఈ కావ్యానికి పెట్టి సార్ధకం చేసిన వారు ప్రముఖ కవి కాటూరి వెంకటేశ్వర రావు గారు .ఆధునిక కవిత్వానికి మూల వస్తువూ ,స్ఫూర్తీ ఆర్తీ అన్ని తనే అయిన వాడు ,మనిషిని ,అతని వ్యధను యుగయుగాల పీడనను ,వచ్చే యుగం పట్ల ఆశను ,ఆకాంక్షను ,తన కవితా దృష్టి లో ప్రతిఫలింప జేయటం ఆరుద్ర ఆనవాయితీ .అందుకే ప్రయోజన వాది గా గుర్తింపబడ్డాడు .అభ్యుదయం అతని వాదం .మనిషే అతని నాయకుడు .అనుభూతి తో పాటు ,ఆలోచన వైపు మనిషినీ ,patha కుడినీ     నడిపించిన మహా కవి . ..సినీ వాలి నగర జీవితం పై వ్రాసిన గేయ కావ్యం ..విలక్షణ హీరో జగ్గయ్యకు అంకితమిచ్చి మామ అయాడు .మధ్య తరగతి క్లార్కు సూర్యారావు జీవిత చిత్రమే ఇది .కాంక్రీటు  అరణ్యాలు అయిన నగర ఘోష ..
                                                         ప్రక్రియా వైవిధ్యం 
                                                       ——————–
               ” ఇంటింటి పద్యాలు ”రాసి ప్రతి ఇంట్లో పాడుకోనేట్లు చేశాడు ఆరుద్ర .”గాయాలు -గేయాలు ”రాసి మనసు లోని బాధను వెళ్ళ గక్కాడు ..”విశ్వ నాద నాయకుడు ”చరిత్రను నాటకం గా మలిచాడు .అందరు స్త్రీ పాత్రలే వుండే నాటికలు రాశాడు .”ఆరుద్ర నాటికలు ”పరమ ప్రయోజనం కోసమే రాశాడు .అవి కాలక్షేపం బఠానీలు కావు .”సర్రియలిస్ట్ ”కవిగా రాణ పొందాడు కధకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు .”నేను చెప్పానుగా ”అనే కదా సంపుటి తెచ్చాడు .దేశీయ ఛందస్సు లో ‘కూనలమ్మ పదాలు ” ”రాసి అందర్నీ కొరడాతో ఝళిపించాడు .”పైలా పచ్చీసులు ”తో పరవళ్ళు తొక్కాడు .”వెన్నెల -వేసవి-”లతో చల్లదనం ,చంద్ర గాడ్పులు విసిరాడు .”అచ్చు తప్పులు ”రాసి కొత్త వరవడి సృష్టించాడు .ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి .”కొండంత మనిషి చ (క) నుమరుగైనాడు ”
                     ”anthropology  ”,  ప్రీ హిస్టరీ వ్రాసి పాత చరిత్రను తవ్వి తలకెత్తాడు .”ఆరుద్ర గళ్ళ నుడికట్టు ”సాహితీ ప్రియులకు గొప్ప కని కట్టు గా వుండేది .”స్థల నామాలు ”పై తీవ్ర పరిశోధన చేశాడు .”వ్యాస పీఠం ”రాసి ఆధునిక వ్యాసుడే అయాడు .”detective ”సాహిత్యం సృస్తించి ,నేర పరిశోధన లో కొత్త దనం ప్రవేశ పెట్టాడు .జర్నలిస్ట్ గా పత్రికా సేవ కూడా చేశాడు .”సమగ్రాంధ్ర చరిత్ర ”తో ఆరుద్ర సాహితీ విశ్వ రూపం మనకు దర్శన మిస్తుంది .అంతకు ముందే ”త్వమే వాహం ”కావ్యాన్ని తెలంగాణ నేపధ్యం లో రాశాడు .ఇది symbolic  రచన   .చదరంగం మీద ప్రత్యెక అభిమానం వుంది దాని లోతులు తరిచి పుస్తకం రాశాడు .’ఇంత విస్త్రు తం గా వైవిధ్యం గా తన సాహితీ జేవితాన్ని పండించు కొన్నాడు భాగవతుల సదా శివ శంకర శాస్త్రి అయిన ఆరుద్ర ..సిని పాటల మాటల రచయిత గా శ్రీ శ్రీ తో పాటు నిలబడ్డాడు .డబ్బింగ్ రచయిత గా మామకు తగ్గ అల్లుడని పించు కున్నాడు . తాను చే బట్టిన ప్రతి ప్రక్రియను సర్వాంగ సుందరం చేసి భళా అనిపించుకున్న ఆరుద్రను గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే వుంటుంది ..మరిన్ని విశేషాలు మరోసారి .
                                                                                           మీ
                                                                                       దుర్గా ప్రసాద్
Posted in రచనలు | Leave a comment

సంస్కృత ముక్తకాలు

  సంస్కృత ముక్తకాలు 
          ”ముక్తకం”ఆంటే విడువబడినది అని అర్ధం .ఆంటే ఒక రాశి గా ,మాలగా కూర్చబడనిది అని భావం .అంతే కాక అందులోని భావమూ ,పాథకునికే వదిలి వేయబడింది అనే తాత్పర్యము వుంది .ఇవన్నీ కూర్చి ఒక చోట చేరిస్తే ”ముక్తక మాల ”అవుతుంది .ఇలాంటివి సంస్కృత సాహిత్యం లో కోకొల్లలు .ఆ ముత్యాలను ఏరుకొనే ఓపిక ఉండాలే కాని ,అనంతం గా సంస్కృత సాహితీ సింధువు లో లభిస్తాయి .వాటికి విలువ కట్టలేం .వెలలేని ఆ పద సంపద అనూచానం గా సాహిత్యం లో వచ్చిచేరుతూనే వుంది .”హాలుని గాదా సప్తశతి ”చాలా ప్రశిద్ధమైంది .దేనికి అదే ఒక అందమైన భావ కుసుమం .దేని అందం దానిదే .ఆఘ్రాణించి అందం అనుభవించే సంస్కారం వుంటే ఎన్నో జీవిత సత్యాలు తెలుస్తాయి .మరెన్నో శృంగార కధనాలు సరసంగా కవ్విస్తాయి .ఇంకెన్నో హాస్యపు చిరుజల్లులూ పన్నీరై చల్లబరుస్తాయి .నీతి బోధకాలుగా ,జ్ఞానబోధకాలుగా కూడా ముక్తకాలున్నాయి .మహారాజు నుంచి ,సామాన్యుని వరకు గల జనజీవితం అందులో ప్రతి ఫలిస్తుంది .అనంత వైవిధ్యమూ కన్పిస్తుంది .వాని కర్తల పేర్లు తెలియక పోయినా కవిత్వం లోని తీరు  సొబగు ఆశ్చర్య పరుస్తాయి
                            సంస్కృతం లోనే కాక ప్రాకృత భాష లోను ముక్తకాలు రత్నాలు గా భాశించాయి ..పథితల హృదయాలను అలరించాయి .ఇంచుమించుగా ఇవి ఆ తర్వాత తెలుగు లో ”చాటువులు”గా చెల్లుబాటు లోకి వచ్చాయి .ఏదో ఒక చాటువు రాని తెలుగు వాడు లేడు .అట్లాగే సంస్కృత ముక్తకం రాని వాడూ ఆ నాడు వుండే వాడు కాదు .ముక్తకం ఆ నాటి సాంఘిక ,రాజకీయ పరిస్థితులనే గాక ,మనుషుల మధ్య మానవీయ సంబంధాలను ,చిలిపి తనాలను ,చిలక్కోట్టుల్లను ,మోసాలను ,ఆవేశ కావేషాలను సరస సంభాషణలను ,దాంపత్య వైభావాన్నే ,చాటు మాటు ప్రేమల్ని చాల చక్కగా వివరిస్తాయి . ”వాక్యం రసాత్మకం కావ్యం ”అన్నట్లుగా ”ముక్తకం రసాత్మకం కావ్యం ”గా భావించ వచ్చు .అల్పాక్షరాల్లో అనంతార్ధం ఉండి ,అత్యద్భుత కవితా శిల్పం నిక్షిప్తమై ,జాతి ముత్యం గా ప్రకాశించింది ముక్తకం .జాతి ముక్తకం అయింది .జీవితం లోని అలుపును ,అలసటను ,దూరం చేసి ఆ బాధలకు విముక్తి కల్గించి ఆనంద రాసామ్రుతం పంచేవి ముక్తకాలు .
                          ప్రాచీన కాలమ్ లో ఎందరో మహానుభావులు ,కవి పండితులు ,సంస్కృత భాషా వ్యాప్తికి జవ జీవాల  నిచ్చి ,ప్రజల మధ్యకు సంస్కృతాన్ని తెచ్చారు .వారికి వందనాలు ..ఆధునిక కాలమ్ లో అమరావానికి నీరాజనం పట్టి ,సులువుగా నేర్చుకొనే దారి చూపి ,ఆ భాషోద్ధరణకు బాలలు కూడా సులభం గా నేర్చుకొనే వీలుగా సంస్కృత ప్రబోదినులను రచించి జీవిత సర్వస్వం దేవభాషా సేవనం లో కరగించిన  త్యాగధనుల్లో ఆస్థానకవి శ్రీ కాశీ కృష్ణాచార్యులు ,శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మ ,శ్రీ జటావల్లభుల పురుషోత్తం గార్లు చిరస్మరనీయులు ,ప్రాతస్మరనీయులు .వారికి ప్రత్యెక నమో వాకాలు .
                   ఇప్పుడు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు వ్రాసిన కొని ముక్తకాలను మీకు పరిచయం చేస్తాను .వారు విజయ వాడ లో srr ,cvr  కళాశాలలో సంస్కృత శాఖ ఆచార్యులు గా పని చేశారు .ఇవి ఈ నాటి సాంఘిక స్థితికి ,ధర్మ చ్యుతికి అద్దం పడతాయి .మన బాధ్యతనూ బాగా గుర్తు చేస్తాయి .చమత్కారం గానూ వుంటాయి .ముందుగా సంస్కృత భాషామతల్లికి వారి శ్లోకం తోనే వందనం చేస్తాను .
”సుధా స్రవంతీ సుర భాషి తాయా –సుచ్చానా సూక్తి సురత్న వార్ధిహ్—సుకావ్య సందోహ నిదిశ్చ వాణీ —సా  సంస్క్రుతాఖ్యా ,సుకృతి కలాభ్యా ”
            ”   మాతాహి   భాష వితతెస్చ లోకే —మాతేవ రక్ష్య త్య పితాశ్రితాన్హి —నా మాత్రు భాషా భువి సంస్క్రు తాఖ్యా —వాచ్యః కదం మాత్రు పడేవ చాన్యాః /.”
01 -అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేస్తుందట భారత దేశం .ఆమె ఉదాత్త బుద్ధి ,ఎత్తైన హిమాలయ శిఖరమనే శిరస్సు వల్లనే తెలిసి పోతుందట
            ”పున్యావనే ,ద్రోహమతీ న్విదేశ్యం ——సద్గర్భ నిష్టాన్ ,ఖలుసే హిషే ,త్వం —వుచ్చైస్శిరత్వం ,తవ శూచితం ,హి —హిమాద్రి శ్రుమ్గేన మహోన్నతేన ”
02 –    ఆ పరబ్రహ్మను ప్రత్యక్షం గా చూసిన రమణ మహర్షి ,శ్రీ రామ కృష్ణ పరమహంస మున్నగు మహర్షులు ఈ భూమి మీద నే ఎందుకు పుట్టారు?అని ప్రశ్నించే వారికి సమాధానం ”నక్షత్రాలు ఆకాశం లోనే పుట్టి ఎందుకు ప్రకాశిస్తున్నాయి?”
        ”నాన్యస్య భూమే ర్భారతాస్య జాతాః -శ్రీ రామ కృష్ణో రమణాదయశ్చ –అత్రైవకిం ,బ్రహ్మవిదాం ,సుజన్మ –తారోదయః కిం గగనే న భూమౌ .”
03 – లోకం లో అందమైన వాటిని చూసి మానవుడు తృప్తి చెందుతాడు .కానే స్త్రీ ని చూసి వికారం చెందటం వాడి దౌర్భాగ్యం
       ”ద్రుస్తాహి శోభాం ,గగనే మలే తాం —-తార గానశ్యామ్భాసి పద్మ పన్క్తిహ్ –తుస్తో జనః స్కాత్కిమ భాగ్యమస్య —–స్త్రీ రత్న మాలోక్య వికార మేగతి ”
04 – కొత్తగా కాపురానికి వచ్చి నట్టింట్లో ఎప్పుడు తిరుగుతుందా అని వువ్విల్లూరిన అత్తా గారు –కోడలు రాగానే ఆమె వ్యక్తిత్వాన్ని సాహిన్చలేదట ఇది లోక సహజం ‘
        ”కదా స్నుశామే గృహవర్తినేశ్యాత్ -కదాను పుత్రస్య తయా శుఖం స్యాత్ –స్వశ్రూర్వి లపైవ మనల్ప కాలమ్ —సమాగాతాం న సహేత చిత్రం ”
05 –  -భార్య అంతే ఎవరో కాదట .ధర్మం అనే గంగా ,కామం అనే యమునా ,అంతర్వాహిని గా దామ్పత్యమనే సరస్వతి తో కలిసే ప్రయాగ త్రివేణీ సంగమమే నట
         ”గంగా సమానః ఖాలు శుద్ధ ధర్మః–సత్కామ ఏవం యమునోపమస్చ –తన్మేలనం యత్ర తదేవ పూతం —క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి .
06 – స్త్రీ కి గౌరవం ఇవ్వాలి అనే ప్రబుద్ధుడు తన కుమార్తె వంటత చేయటానికి ఒప్పు కోడు .కానీ వంటలక్క తో వండించుకొని తృప్తిగా తింటాడు .ఆమె కూడా స్త్రీ అన్న స్మృతి వాడికి వుండదు ఇదీ లోక రీతి
      ”చిత్రోహి వా దోస్తీ మదీయ కన్యా –మహానసే నైవ నియోజ నీయా –పూజ్యా శ్రియః స్థార్హి కధన్ను భుక్తి –ర్భ్రుత్యాహి పక్త్రీ ;వడకిం న సా స్త్రీ ;”
07 – ఈ రోజు మెడలోపోల దండ వేసి ,హారతు లిచ్చి ,గౌరవించి మెచ్చి మేక తోలు కప్పు తారు .రేపే ఏదో నెపం మోపి ఆ కన్తాన్నే నరికేస్తారు .అందుకని కీర్తిని నమ్మ రాదు
        ”కన్చిత్ప్రజానే ,త్రుపదేని వేశ్య –స్వదేశ విద్రోహిని ,మా మానమతి   –కన్తేద్య నిక్షిప్యచ ,పుష్ప మాలాం —శ్వస్తీ ప్రదండం పరికల్ప ఏరన్ ”
08 -మానవుడు చిత్ర స్వభావుడు .తన కొడుకు చేసే దోషాలు తెలుసు కోడు .వాడిలో లేని మంచిగునాలన్నీ వున్నాయని భావిస్తాడు .వాడి కోసం ఎన్నో తప్పులు చసి లోకాప వాదం పొందుతాడు .పుత్ర ప్రేమ
       గుడ్డిది .గుడ్డి రాజు ద్రుత రాష్ట్రుడు దీనికి మంచి  ఉదాహరణ .
       ”జనో న జానాతి ,హి పుత్ర దోషాన్ —గునామ్స్చ తస్మిన్న సతోపి పశ్యేత్ –పాపం తదర్ధం i ,బహుదా కరోతి —బలీహి ,లోకే సుత మూల మోహః
                                                                  మీ
                                                              దుర్గా ప్రసాద్
                                                       ఇది 30 -07 -1998  లో చేసిన ప్రసంగం
Posted in రచనలు | Leave a comment

రెండవ ప్రపంచ తెలుగు మహా సభ విజయవాడ – కృష్ణా జిల్లా రచయతల సంఘం ఆగస్ట్ 13,14,15

second world telugu conference at vijayavaada by krishnaa jilla rachayitala samgham on August 13,14,15

Posted in సభలు సమావేశాలు | Leave a comment

చంప దెబ్బల చండ్ర నిప్పుల చంద్ర బాబు

చంప దెబ్బల  చండ్ర నిప్పుల   చంద్ర బాబు         ,
              గత రెండు దశాబ్దాల కాలమ్ లో ఆంద్ర ప్రదేశ్ ను పరిపాలించిన ముఖ్య మంత్రులలో గొప్ప ఆలోచన విజన్ ,అంకిత భావం ,పట్టుదల అవగాహన ,కార్య శూరత ,ప్రజల్ని సేవలో పాల్గోనేట్లు చేసే నేర్పు ,పార్టీ మీద ప్రభుత్వం లో గట్టి పట్టు ,వ్యూహ రచన ,గెలిపించుకొనే తపనా ప్రకృతి వైఫల్యాలు వస్తే ,ఒక్క క్షణం కూడా వ్యర్ధం కాకుండా ,ప్రజల దగ్గరకు చేరి ,వారి బాధలు స్వయం గా విచారించి ,అధికారులకు తగిన శూచనలు ఇస్తూ ,ప్రభుత్వ యంత్రాంగాన్ని చిత్త శుద్ధి తో పని చేయించే చాక చక్యం ,అధికారులలో నిబద్ధత తీసుకొని రావటం లో పడిన ఆరాటం జన్మభూమికి ఏదో సేవ చేయాలనే భావం కల్గించటం లో చూపిన చొరవ ,వీటిని మించి ఆధునిక యుగం లో ప్రపంచ దేశాలకు దీటుగా మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకంటే ముందుంచే ముందు చూపు ,,పారిశ్రామీకరణ తోనే అన్నీ సాధ్యం అనుకొన్న ఆలోచన నార చంద్ర బాబు నాయుడిని అందరి కంటే ముందు ఉంచింది .ఆయన సమీపం లోకి రా గలిగిన ముఖ్యమంత్రి లేదు అనిపించా గాలి గాడు .దేశం మొత్తం మీద పూర్వపు ముఖ్యమంత్రుల్లో ఇలా పేర్కొనదగిన వాళ్ళల్లో ,మహారాష్ట్ర లో చావాన్లు ,గుజరాత్ లో దేశాయ్ ,రాజస్థాన్ లో సుఖాడియ ,తమిళనాట అన్నాదురై ,రామచంద్రన్ ముదలైన వారు .అప్పటి పరిస్థితులు వేరు .చంద్ర బాబు నాటి పరిస్థితులు వేరు
                             పార్టీ ఒక స్త్రీ మూలం గా భ్రస్టు పట్టి పోతుంటే చూస్తూ ఊరుకోలేక అందర్నీ సంప్రదించి ,కలుపు కొని మామకు చెక్ పెట్టి అధికారం పొందిన వాడు బాబు .మామ వున్నప్పుడు కూడా తేరా వెనుక కధ నడిపించి తెలుగు దేశం పార్టీ ని బలోపేతం చేశాడు .కీలక నిర్ణయాలు బాబువే రామారావు వోట్ కాచెర్ మాత్రమే .పార్టీ లో ఏమి జరుగుతోందో ప్రభుత్వం ఎలా నడుస్తోందో నన్న అవగాహన అన్నగారికి తక్కువే .కనుక ప్రతి ఊళ్ళోనూ బాబుకు ,పార్టీ కి నమ్మక మైన వ్యక్తులు వున్నారు .వాళ్ళతో మంచి సంబంధాలు నేరిపాడు ..ప్రభుత్వం లో మంత్రి వర్గం లో పనిచేసినా దానికి మించిన అంతర్జాతీయ అవగాహన ఏర్పడింది కుర్రాడు కనుక .ప్రజలకు ఏమి కావాలో తెలిసింది .స్లోగన్లు ఎప్పుడు వోట్లు రాల్చవు అని అర్ధం చేసు కొన్నాడు .పకడ్బందీ వ్యూహం ,ఎత్తుగడ ,ప్రజా విశ్వాసం చూరగొనే పధకాలు  కావాలి ,వుండాలి అప్పుడే పార్టీ అధికారం లోకి వస్తుందని తెలుసుకున్నాడు .మామ డొల్ల తనం ముందే అర్ధమయింది .పార్టీ లో ఆయన పట్టు క్రమంగా తగ్గింది లక్ష్మి పార్వతి ఉదంతం అందర్నీ ఆశ్చర్య పరచిజాగ్రుత   పరచింది .ఇదే అదను అనుకోని మామకు ,కొత్త అత్తకు ముకు తాడు వేశాడు .పార్టీ అండగా నిల్చింది  .పార్టీని రాష్ట్రాన్ని తగిన సమయం లో కాపాడి నిలబెట్టాడు .ఇంత సాహసం ,చొరవ లేక పోతే తెలుగుదేశం పార్టి పార్వతి పార్టి లాగా కాల గర్భం లో కలిసి పోయేదే .పార్టీకి ప్రాణ భిక్ష పెట్టి కాపాడిన ఘనత బాబుదే .పాపం ఈ వ్యవహారం లో వెన్ను పోతూ దారుడనీ ,మామ మరణానికి కారకుదనీ అప్పటినించి ఇప్పటి దాకా ప్రత్యర్ధులు దుమ్మెత్తి పోస్తూనే వున్నారు .పార్టీని సంక్షోభం లోంచి రక్షించాడని చెప్పక పోవటం బాధ గానే వుంటుంది.
                        ఇంతటి అపవాదు ను భరిస్తూ ,పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ విధానాలలో మార్పులు తెస్తూ కొత్త ఆలోచనలను అమలు పరుస్తూ ముఖ్యమంత్రిగా అతి సమర్ధం గా పని చేసి ఏ రామ రావు ను దేవుడి గా భావించి ప్రజలు వెంట నడిచారో ఆప్రజల్ని తన పద కాలతో ఆకర్షించి తర్వాత వచ్చిన ఎన్నికలలో చంద్ర బాబు పార్టి చంద్ర బాబు ప్రభుత్వం అనిపించు కున్నాడంటే బాబు వ్యూహా శక్తి ,పాలనా సామర్ధ్యం ,పార్టీ క్రమశిక్షణ ,మిగిలిన పార్టీ లతో సఖ్యం ,అందర్నీ తనవెంట కదిలించిన చాణక్యం మరువ లేనిది negative  నుంచి పూర్తి గా positive  వైపు ప్రజా ద్రుష్టి ఆలోచన మార్చి ఎదురులేని సాహస వీరుడై చరిత్రలో నిలిచాడు .ఇంత దూర దృష్టి ,వ్యూహ రచన అలనాటి వి.బి .రాజు లాంటి వాళ్లలోనే చూశాం .పగ్గాలన్ని తన చేతి లో పెట్టుకొని ,మామ గారి బంధు గణాన్ని దారి లోకి తెచ్చుకొని ,
అవసరం వస్తే పదవి పారేస్తూ అక్కరలేడను కొన్నాప్పుడు కరివే పాకు లా తీసి పారేస్తూ  నందుల కాలమ్ నాటి రాక్షస ,చాణక్య మంత్రులను తలపిస్తూ ముందుకు దూసుకు వెళ్ళాడు బాబు .తనే పార్టి ,పార్టీయేతాను . ..బెసిగే పని లేదు .అలావున్నాడు కనుకే పార్టి బాబు వెంట నడిచింది .బాబు పార్టీని  నడిపాడు . అయితె సమర్దులయిన మంత్రుల్ని నియమించటం లో పప్పులో కాలు వేశాడు .కేండం తో మంచి సంబంధాలు నెల కోల్పాడు .బి.జే.పీ .తో జతకట్టి అందలం ఎక్కే అదృష్టం కేంద్రం   లో వచ్చినా కింగ్ maker గా నే వుండి పోయాడు .అంది వచ్చిన అదృష్టాన్ని మోకాలితో అడ్డుకున్నాడు .ఇక్కడి నుంచి కధ రివర్స్ గేరు లో నడిచింది
                      కేంద్రం లో మంత్రి పదవులు ఇస్తానని పెద్దాయన వాజిపాయి ఆహ్వానించినా ,వద్దని తిరస్కరించటం తో కధ మారింది .కేంద్రం లో తన పార్టీ వాళ్ళు మంత్రులు గా వుంటే తన మాట వినరేమో నన్న భ్రమ ,అభద్రతా భావం చోటు చేసు కుంది .speaker పదవి కి  నాయుడిని కాదని అందర్నీ ఆశ్చర్యం లో ముంచి ,బాలయోగి ని ఎన్నిక చేయటం పెద్ద పొరపాటే అయింది .రాష్ట్రం లో మంత్రులు యనమల రామ కృష్ణుడి తల తిక్క తనం వల్ల ప్రజా సంబందాలాల్ లో అతని వైఫల్యం వల్ల ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యాన్ని రెండేళ్ళు వాయిదా వేయటం వల్ల వుద్యోగ్గులు ,పెన్తిఒనెర్లు దూరం అయారు .వ్యతిరేకం గా వోట్ వేశారు .ప్రభుత్వాన్ని కుల్చేసారు .పంచె కట్టు కని కట్టు కు ఆకర్షితులయారు . ఇది చేజేతుల నాయకుడు అనుచర గణం చేసుకున్న స్వయం క్రుతాప రాదం .బి.జే.పీ .అంత రాని పార్టి అని ముద్ర వేసి ,కేంద్రాన్ని ఒత్తిడి తెచ్చి ముందస్తు ఎన్నికలు తెచ్చి అలిపిరి సంఘటన తనకు రాజ కీయ ఊపిరి తిరిగి పోస్తుందని నమ్మి పెద్దాయనను ముంచి తానూ మునిగాడు బాబు ..
                          2009 ఎన్నికల్లో బంచి ఊపు మీద ఉంది తెలుగు దేశం పార్టి  పంచె ఊడి పాంట్ అధికారం లోకి వస్తుందని అంతా భావించారు ,రావాలని ఆశించారు కూడా అయితె అర్ధం లేని వాగ్దానాలు ,మాట నిలకడ లేని గులాబిలాబీ తో దోస్తీ కొంప ముంచింది .ప్రజా రాజ్యం పార్టి పంచకట్టు ఆయన బుర్రలోడే నని పేపర్లు కోడై కూసిన ,మీడియా కధనాలు కుమ్మరించినా తగిన వ్యూహం లేక అధికారానికి అడుగు దూరం లో నిలిచి పోవాల్సి వచ్చింది .ప్రజలు అప్పటికే భస్మాసుర హస్తానికి గుడ్బై చెప్పే మూడ్ లోకి వచ్చారు .కని గులాబి మోజు కొంప ముంచింది .మొత్త లావు  వాళ్లకు రాజ్యసభ ,లోక సభా
సీట్లు ఇచ్చినా వారెవరు పార్టీకి ,బాబుకు ఉపయోగ పడింది లేదు .ఒక్క రామానాయుడు తప్ప .ఇక మూడవ ఫ్రంట్ మొహం పోయి నాల్గో ఫ్రంట్ తేరా మీదకు వచ్చింది .ఎవరితో చేతులు కలపాలో తెలియయని స్థితి .అసెంబ్లీలో పాత విషయాల చర్చే తప్ప అర్ధవంత మైన చర్చలు జరపటం లో తెలుగు దేశం వైఫల్యం .అవినీతి మీద అధినాయకుడి మీద దూకుడే కాని ప్రజా పక్షం వహించటం తగ్గింది అన్నిటికి తానె అందుకోవటం సభలో అవమానాలు భరించటం అలవాటై పోయింది ఎంచేసావు తోమ్మిదేల్లాల్లో అని దెప్పి పొడుస్తుంటే  సమాధానం చెప్పనీయ స్థితి సవ్యం గా సకగని సభలు .దేప్పులు చెప్పులు బూతులు వ్యక్తీ గత నిందలు ఇవన్నిటికీ ప్రభుత్వానిది యెంత బాధ్యతో ప్రతి పక్షానికి అంతే బాధ్యత అది కనుమరుగైంది .
                        అధికారం లో వుందా గా it  మోజు తో మానవీయ విలువలను తెలియ జెప్పే చరిత్ర పౌర శాస్త్రం మొదలయిన వాటికి గుంత కత్తి గంట వాయించాడు బాబు .దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం .మానవీయ కోణం లో చూసే చూపు పోయింది .కంప్యూటర్ కళ్ళ తో చూసే స్థితి వచ్చింది .మనిషి విలువ తగ్గి యంత్రానికి బానిసలవటం సంస్కృతిని దెబ్బ తీసింది .ఇందు లో బాబు పాత్ర చాలా ఉంది .humaanities చదవాల్సిన అవసరం లేదని తేల్చాడు .ఇదో దెబ్బ సంస్కృతీ పరమైన దెబ్బ ;దీన్ని జేర్నించుకో లేని వారు క్రమంగా దూరమయారు .రైతులను బుజానికి ఎత్తు కొన్నది లేదు .కార్మికులు దూరం అయారు .చేనేతని వుద్ధరించింది లేదు వీటికి మించి కరెంట్ కోత కస్టాలు .పులిమీద పుట్రలా చివరి నాలు గేళ్ళలోవర్షాభావం ,కరువు ,వరుసగా మీద పడ్డాయి ఇవన్నీ పాపం బాబును తీవ్ర వ్యధకు గురి చేసాయి .ఆత్మ స్థైర్యం దెబ్బతింది ..వరుసగా తప్పులు చేశాడు .కేడర్   దూరమయింది .కొటారి పెరిగింది .పని చేసే వాళ్ల కంటే పెత్తం దార్ల జులుం ఎక్కు వైంది సమీక్షల పేరుతో కాలయాపన పెరిగింది ఎవరుంటారో ఎవరు పోతారో అనే అభద్రతా భావం పెరిగింది నిర్ణయాలు ఆలస్యమైనాయి .జరగరాని అనర్ధం జరిగి పోయింది ఏడేళ్ళు అధికారానికి దూరం అవటం భరించ లేని బాధ అయింది అందుకే దూకు దు ,ఉద్రేకం పెరిగి తన కింది వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు తానె మాట్లాడి పల్చని పోయాడు .లెఫ్ట్ ను నమ్మలేదు .నమ్మకుండా వుందా లేదు జయ ఎప్పుడు ఎవరి పక్షమో తెలీదు .ములాయం ఎవరికి గొడుగు పడతాడో అర్ధం కాదు లాలు ఎవరి లాలి పాప తింటాడో తెలియదు .పాశ్వాన్ ,ను నమ్మ లేదు .ఇదీ విచిత్ర మైన పరిస్థితి బాబుది
                              ఈ నేపధ్యం మహా నాడు జరిగింది .కొడుకు లోకేష్ ను లోకానికి పరిచయం చేయాలి వున్న ,డైరెక్ట్ గా చేసుకోలేడు .ఇప్పటి దాకా అందర్నీ వంశ పాలనపై తిట్టాడు కదా .ఒక బావ మరది అంటీ అంతనట్లు మీసం మేలి వేయటం వియ్యంకుడు మరీ పూసుకోక పోవటం  బంధుత్వం కలుపుకున్నా మేనల్లుడు హ్యాండ్ ఇవ్వటం పైన పురందేస్వరి అధికారం లో ఉంది సన్నాయి నొక్కులు ,తోడల్లుడి పుస్తకం లో ఇంటి గుట్టు రాచ్చకీడ్వటం మండే ఎండలు ,విమర్శలు కారం రాచినట్లున్డటం మైసురా వోటమి ,అవినీతి పై గొంతు చించుకున్నా అదే రెండిట్లో గెలవటం బాబును కలవర పరిచింది .వెనక్కి తిరిగి చూసుకొనే వీలు కలిగింది కొత్త గెటప్ వుంటే తప్ప ఏది సాధ్యం కాదని తెలుసు కొన్నాడు .అందుకే చేసిన త్సప్పులకు చెంపలు వాయించు కున్నాడు మిగిలిన వారిపై కారాలు .మిరియాలు నూరి చంద్ర నిప్పులు చెరిగాడు ,విరుచుకు పడ్డాడు ..క్షమించి మళ్ళీ గద్దె మీద కూర్చో పెట్టమని కోరిక క్షమించి వదిలేద్దాం .అంత ఆలోచన వున్న వాడు మనకు దొరకడు ఆలోచించండి
                       పురందరేశ్వరిని రాష్ట్ర ముఖ్య మంత్రి గా కాంగ్రెస్ పార్టి  చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది .లేడీ చీఫ్ మినిస్టర్ వస్తుంది ,పార్టీ విదేయురాలు అవగాహన వున్నది ,అనుభవం వున్నది ,బాబును దీకొనే శక్తి ,యుక్తి ఉంది ,బంధుత్వము కలిసి రావచ్చు ..కాని సోనియమ్మా కు కీలు బొమ్మలు కావాలి కాని ,వ్యక్తిత్వం వున్న వాళ్ళు పనికి రారు కదా .కనుక నా ఆశ అడియాశే ..చంద్ర బాబు వచ్చే దాకా ఆగండి ప్లీజ్
                                                      మీ
                                                    దుర్గా ప్రసాద్

 

Posted in రాజకీయం | 1 Comment

నిత్య పరిశోధకుడు ఆరుద్ర

నిత్య పరిశోధకుడు ఆరుద్ర
                     తెలుగు సాహిత్యానికి సామాజిక నేపధ్యం లో సాహిత్య చరిత్ర రాసిన ఘనాఘనుడు  ఆరుద్ర .సప్త సాహితీ సముద్రాలను తానొక్కడే అవలీలగా ఈది ఒడ్డుకు చేరిన వాడు .సామాన్యుడు సైతం చక్కగా ,కధలా చదూకోనేట్లు ”సమగ్రాంధ్ర సాహిత్యం ”సృష్టించిన బహుముఖ  బ్రహ్మ .అనితర సాధ్యమైన దాన్ని తాను చేసి చూపాడు .మొదటి సారిగా పడి సంపుటాలు తెచ్చాడు ..ఆ త్తర్వాత రెఫెరెన్సు కోసం పది సంవత్చారాలు పరిశోధన చేసి ఇంగ్లాండ్ ,అమెరికా లైబ్రరీ లలో వున్న సమస్త విషయాలను సేకరించి మిగిలిన మూడు భాగాలు ప్రచురించాడు .కవి కాలమ్ పై చర్చలు ,కులం పై రాద్దాన్తాల అరణ్యం లో ,కొండల్లో చీకటి కోణం లో చిక్కుకున్న సాహితీ చరిత్ర అనే దివ్య గంగను భూమార్గం పట్టించి ,జనసామాన్యం కోసం జాతి తరించటం కోసం కృషి చేసిన ”సాహితీ భగీరధుడు ”ఆరుద్ర .పది universiteelu  ,వెయ్యి అకాడెమీలు చేయలేని పనిని ఒంటరిగా ఆరుద్ర చేసిజాతికి అంకితమిచ్చి ధన్యుడైనాడు .తన ఆరోగ్య సర్వస్వాన్ని కోల్పోయాడు .
   .           ”ప్రపంచ వాజ్న్=మయాన్ని ప్రజాపరం చేసి ,ప్రస్తాన భేరి మోగించి ,బావుటా ఎగుర వేసిన ప్రజా కవి ఆరుద్ర ”అన్న మాట సత్యం యుగావిభజన చేయటం లో ఆరుద్ర కొత్త మార్గం తొక్కాడు .పోషకులను ఆధారం గా చేసుకొని యుగావిభజన చేసి తన marxeeya  దృక్పధాన్ని నిల బెట్టుకున్నాడు .కవి ,పండితుడు ,విమర్శకుడు ,శాసన భాషావిష్కారుడు అన్నీ తానె కనుక సాహిత్య చరిత్ర అంత గొప్ప గా వచ్చింది .అందుకే సాహిత్య పండితుల్లో ఆరుద్ర అగ్రేసరుడు .”చుళికీ కృత సర్వ పాదోది పయస్కుడైన ముని ”అని నన్నయ గారు అగస్త్య మహర్షిని సంభావించారు .అలాగే బవిరి గడ్డం తో ,కాషాయ వస్త్రాల తో వున్న ఆరుద్ర  నిజం గానే” సాహితీ ఆగస్తి యార్ ”.  ,
                                               నిరంతర పరిశీలనా వ్యసనుడు 
                                                  తొమ్మిదవ ఆశియా క్రీడల సందర్భం గా పోస్టల్ శాఖ వారు ”మాత్య యంత్రాన్ని కొట్టే శ్రీ కృష్ణుని” చిత్రాన్ని స్టాంప్ గా వేశారు .దాన్ని చూసి చాలా మంది ఆక్షేపించారు .అయితె ఆరుద్ర ప్రాచీన తెలుగు కావ్యాలలో ఒక దాని నుంచి కృష్ణుడు మాత్య యంత్రాన్ని కొట్టే ఘట్టాన్ని వుదహరించి సమర్ధించాడు .
             ”  శ్రీ కృష్ణుడు అసలు సిసలు ఆంధ్రుడు ”అని కూడా వివరించాడు
             ఏకలవ్యుడు కుంతీ దేవి అక్క కొడకు అని సంస్కృత హరివంశం ఆధారంగా తెలిపాడు .
             కుమార్తె కు పుత్రిక కు భేదం వుందని”మనుధర్మ శాస్త్రం ”ఆధారం గా వివరించాడు .కుమార్తె ఆంటే తోడబుట్టిన అన్నదమ్ములు కల అమ్మాయి .పుత్రిక ఆంటే సహోదరులు లేనిది ..ఈమెకు పుత్రుని అధికారాలన్నీ దక్కు తాయి .
     ”  సీత రామునికి ఏమవుతుంది ?”అనే వ్యాసం లో వివిధ దేశాల లోని రామాయణాలను సాకల్యం గా పరిశీలించి వివరించాడు .
”  వేమన్న ” పై పరిశోధన చేసి ”వేమన్న వేదం ”అనే అభినవ వేదం రాసాడు /.
”  గురజాడ ”పై అంతులేని అభిమానం తో ”గురజాడ  గురు పీఠం ”రాసి ఆయనకు మహోన్నత పీఠం కల్పించాడు . ‘
తెలుగు వాళ్ళు చేసుకొనే ప్రతి పండుగ వెనుక వున్న ప్రతి ఆచారం వెనకా వున్న పరమార్ధాన్ని తెలియ జేసిన sixth sense వున్న ఆరో రుద్రుడు ఆరుద్ర .   చరిత్ర ,విజ్ఞానం ,దర్శనాలు ,నాట్య శాస్త్రం ,సంగీతం ,చదరంగం ,ఇంద్రజాలం మొదలయిన వాటన్నిటి పై సాధికారం గా రచనలు చేసిన సాహితీ విరాన్మూర్తి ఆరుద్ర .అయితే ప్రతి రచనను  ”  marxist దృక్పధం ”అనే గీటురాయి పై పరీక్షించాడు నిబద్ధత గల గొప్ప రచయిత అనిపించు కొన్నాడు ఆరుద్ర .
               నామో రుద్రాయ ఆరుద్రాయ  అని నమస్కరిస్తూ  ప్రస్తు తానికి సెలవ్
                                                                                       మీ
                                                                                  గబ్బిట దుర్గా ప్రసాద్

 

Posted in రచనలు | Leave a comment

గణిత అష్టావధానం

 గణిత అష్టావధానం 
                                                                 ——————————————
                  ఉయ్యూరు లో సాహితీ మండలి ఆధ్వర్యం లో 15 -04 -97  ఉగాది పర్వ దిన సందర్భం గా మా డ్రాయింగ్ మేస్టారు శ్రీ తాడినాడ శేషగిరి రావు గారి కుమారుడు ,,నా శిష్యుడు ,లెక్కల మేస్టారు అయిన ఛి .తాడినాడ ఫణి రాజ మోహన్ చేసిన గణిత అష్టావధానం  సందర్భం గా నేను చేసినఅధ్యక్ష   ఉపన్యాసం
                      ప్రాచీన గనితాచార్యులు ఆర్య భటున్నీ (476ad ,బ్రహ్మ గుపటున్నీ (1108ad )లను స్మరిస్తూ ,ఆధునిక గనితాచార్యుడు ,మహామేధావి ,ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో తన అమోఘ మేధా సంపదను ,కీర్తి చంద్రికలను వ్యాపింపజేసిన శ్రీనివాస రామానుజం ను సంస్మరిస్తూ వారికి అంకితం గా ఈ గనితవదాన ప్రక్రియను ప్రారంభిస్తున్నాము
                      బీజ గణితాన్ని ఆర్యభాటుడు ,వర్గ సమీకరణాన్ని బ్రహ్మ గుప్తుడు ,అంక గణితాన్ని భాస్కరా చార్యుడు ప్రతి పాడించారు .square root ,cube root ,,mensuration ,interminate eqations ,continued fractions ఇవి అన్నీ ఆ భాస్కరుని విజ్ఞాన కిరణాలే .భాస్కరుడు గణించిన గణితమే ”లీలావతి గణితం ”.లాలిత్య లీలావతీం అని ముద్దుగా దాన్ని పిలుస్తారు .లాలిత్యం దాని అంతర్భాగం అని భావం .ఆయన చెప్పిన మొదటి శ్లోకం ఒక సారి గుర్తు చేసుకుందాము ఇది మనందరికీ ప్రార్ధనా శ్లోకమే . .
”ప్రీతిం భక్త జనస్య యో ,జనయతే ,విఘ్నం ,వినిఘ్న న్స్మత
.స్టం ,బృందారక బృంద వందిత పదం ,నత్వా మతంగాననం
 పాటీం సద్గానితస్య ,వచ్మి చతుర ప్రీతి పదాం ప్రస్ఫుటాం
సంక్షిప్తాక్షర కొమలామల పదైర్లాలిత్య    లీలావతీం ”
                దీని లాగానే ఈ అవధానముకూడా లీలగా ,వినోదం గా లలితం గా వేగం గా ఆసక్తి భరితం గా జరగాలని కోరు తున్నానాను .
                    భాస్కరుడు లీలావతి ని శ్లోకాలలో రచిస్తే పావులూరి మల్లన కవి గణితాన్ని పద్య కావ్యం గా రాశాడు .గణితం తో సంబంధం లేకుండా ఛందస్సు లేదు .ఆంటే గనితానికీ ,అన్ని శాస్త్రాలకూ మంచి సంబంధం వుంది .మా సాహితీ మండలి కార్య క్రమం లో భాగం గా గణితానికి ప్రాధాన్యత నిస్తూ ఈనాటి ఉగాది కవి సమ్మేళనానికి ముందే గనితావదానాన్ని జరుపుతున్నాం
”That deeply emotional convictio of the presence of a superior reasoning power which revealed in the comprehensive universe forms my idea of God .”అంటాడు ప్రఖ్యాత శాస్త్ర వేత్త  einstein .బుద్ధికి కనిపించని ,విశ్వం లో కనిపించేది అయిన ఉత్కృష్ట ప్రజ్ఞా శక్తిని గూర్చిన హృదయ పూర్వక గాఢ విశ్వాషమే నాకు ఈశ్వర భావాన్ని కల్గిస్తోంది అని ఆ మహా మహుని భావం .”పూర్ణ మదః ,పూర్ణ మిదం ,పూర్ణాత్ పూర్ణ ముడుచ్యతే -పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్నమేవావ శిష్యతే ”ఆంటే బ్రహ్మం పూర్ణం .ప్రపంచమూ పూర్నమే .ఆ పూర్ణం నుంచే ఈ సంపూర్ణ జగత్తు ఏర్పడు తోంది .ఆ పూర్ణత తో ఈ పూర్ణతఏర్పడగా   అసలు పూర్ణ పదార్దానికేమి కొరత ఏర్పడదు .అదెప్పుడు పరి పూర్ణం గానే వుంటుంది .ఈ భావాన్ని ప్రపంచానికి చాటింది భారతీయ మహర్షులే .సున్నా కు అస్తిత్వాన్ని సాధించింది మన వాళ్ళే .
                       శ్రీ బెజవాడ గోపాలరెడ్డి చాలా చిన్న వయసు లోనే వుమ్మడి మద్రాసు రాష్ట్ర  మంత్రి అయారు .శ్రీ విశ్వనాధ సత్య నారాయణ రెడ్డి గారిని ”ద్రావిడావనీ బాల మంత్రీ”అని సంబోధించారు .అలాగే ఈ నాటి ఈ కుర్ర అవధానిని ”వుర్వరాపురీ బాల గణితావ దానీ ‘అని ఆంటే సముచితం గా వుంటుంది .ఇది ఇతని మొదటి సభా రంగ ప్రవేశం .ఆంటే అరంగేట్రం అన్న మాట..”గణిత అరంగేట్రం ”అందాం సరదాగా .ఇక్కడ తోడ గొట్టి గెలిచిన వాడు ఎక్కడైనా ,ఏ సవాలు నైనా ఎదుర్కొని నిలిచి ,ప్రజ్ఞా పాటవాలు చూపి ,మన్ననలు పొందు తాడు .అందుకే అతనికి  ఈ వేదిక నిచ్చాం .అతను సంపాదించే కీర్తిచంద్రికలు మనందరివీ .
                       లెక్కలు ఆంటే భయ పడే వాళ్లకు ఈ అవధానం చూస్తె తేలికగా లెక్కలు నేర్చు కో గలం అనిపిస్తుంది .easiness అలవడి interest పెరుగు తుంది .అదీ దీని మహిమ .ప్రజ్న పాటవం ,ధారణా ,మననం ,సంక్షిప్తత ,ఆశువుగా మాట్లాదటటం ,సరస సంభాషనంతో మెప్పు పొందటమే అవధాన కళ
                 ఎనిమిది మంది పృచ్చకులు వృస్చికాల్లాగా ఆంటే తేళ్ళు లాగా ప్రశ్నలతో కుట్టి బాధిస్తుంటే ఆ విషాని హరించు కుంటూ ,ఆ బాధను తట్టు కుంటూ ,అమ్రుతోపమన మైన జవాబులు ఇస్తూ ,నవ్విస్తూ ,అవసరమైతే రెట్టిస్తూ ,వాళ్ల ఎత్తులు జిత్తులను చిత్తూ చేస్తూ పైఎత్తులు వేస్తూ ,వారి వలలో పడకుండా దాటి పోతూ  మెప్పించతమే అష్టావధానం -కష్టావధానం -అందరికి ఇస్టావధానం చివరికి అందరికి మ్రుష్టావధానం .కోరి తెచ్చుకున్న తలబరువు .అయితె ఆ బరువు అంతా యిట్టె దిగి పోతుంది .ఇదొక కండూతి .ఆంటే దురద .”మాడు గుల పెడితే కవిత్వం తో అస్తావధానం ”.మేధ గుల పెడితే ”గనితాస్తావధానం ”.మేధమే ట్రిక్స్ -mathematics  .మేధమే sticks కాకూడదు .mathematrix అయితె మహదానందం
                  ఈ ఆనందం లో పాలు పంచుకోవటానికి వచ్చిన రసజ్ఞులకు ,విద్యార్ధినే విద్యార్ధులకు గణితాభిమానులకు ప్రుచ్చకులకు అందరికి సహృదయ ఆహ్వానం .గణితాన్ని పోషిస్తే అది మనల్ని పోషిస్తుంది ”గణితో రక్షతి రక్షితః ”
                    సావదానం గా ఈ అవధానాన్ని అవధరించండి .అవధాని ప్రజ్ఞా విశేషాలు పరికించండి .సహృదయత తో అభినందించి ప్రోత్చహిమ్చండి అవధాని గారి ఈ దెబ్బ ”గోల్కొండ లో అబ్బా” అవాలి ..”గణిత మొరబ్బా ”అవాలి .అతని కీర్తి  కిరీటం లో ఇది కలికి తురాయి అవాలి అతని ధీశక్తి ప్రతిభ” geometric progression ”లో వృద్ధి చెందాలి .మరిన్ని అవధానాలు చేసి  మళ్ళీ ఇక్కడే ఘన సన్మానం అందు కోవాలి .”ఈ మచ్చిష్యుడు -వర్దిష్ణుడు ”గా వెలగాలి ” గణిత ఫణి రాజాన్ని ”  మోహనం ”గా గణిత నాట్యావధానం చేసి అందర్నీ అలరించమని ఆశీర్వదిస్తున్నాను .
                                                               గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు | Leave a comment

టుమ్రీలు -(chiklets )–ద్విప్లేట్స్

                             టుమ్రీలు -(chiklets )–ద్విప్లేట్స్ 
                                               ————————————
01 – మనసు దోస్తే వాడు మగాడు
       మానం దోస్తే వాడే పగాడు
 02 -తమరి దయ వల్ల గర్భం వచ్చిందంటే తప్పు
       ఏదో పై వాడి దయ వల్ల ఆంటే ఒప్పు
03 -అన్ని పరీక్షల్లో అవుతున్నాయి పేపర్లులీక్
      పరీక్షా విధానం లోనే వుంది వీక్
04 -రామునికి రహీముకి వివాద వేదిక అయోధ్య
      ఏ నాటికైనా అక్కడ  వికశిస్తుందా సయోధ్య ?
05 అక్కర లేదనుకొనే వాడికి నేర్పటమే అక్షర కృష్ణ
     అక్షరానికి అంటుకొని పరవశించే వాడిది అక్షర తృష్ణ
06 -ఆపన్నులపై పన్నులు వడ్డించే మన్మోహన సింగ్
      సంపన్నులకు రాయితీ లిచ్చే సమ్మోహన సింగ్
07 -తెలుగు వాణికి ,బాణికి చుట్టిన శ్రీకారం
      రాగ గోపాల రత్నం  శ్రీరంగం నినదించే ఓంకారం
08 –  తనువు స్పర్శ లేకుండా జన్మిస్తే అయోనిజ
        మనువు కాకుండా జన్మిస్తే అయ్యో నీచ
09 –  ఉచ్చులు బిగించి విదిలించే భిక్షం IMF
         లబ్ది పొందని దేశం మన దృష్టిలో వుత్త ‘మఫ్’
10 – మానవ బాంబులు దాటింది స్కూటర్, కారు బాంబుల సంస్కృతి
       మానవ మారణ హోమానికి లేదా  ఎన్నడు నిష్కృతి?
11 – బొంబాయి తో తోడితే బొంబాయి లో పెట్రోలే
     బోంబే లో నేడు ఎక్కడ చూచినాబాంబులే  .
12 – చిందేస్తూ భక్తిని చిందించే లక్ష్మణ   యతీంద్రులు
      ఆముష్మిక భావ   సంపన్నులు, నిజంగా వ్యాజ రామానుజులు
13 – విప్లవ భావాల చీలిక  పేలిక నాయకుడు కొండపల్లి
       వైక్లబ్య గీతాలాపనకు అవుతుందా వేదిక మళ్లీ
14 –  అండం పిండం కడుపులో ఫలిస్తే పుడ్తుంది  బేబీ
       ప్రయోగం లో కలిపితే పుట్టేది టెస్ట్ ట్యూబ్   బేబీ
15 – రిక్షాల్లో కుక్కిన బస్తాల్లా పసిమొగ్గలు
       వీపులపై కేజీల బరువుతో  కుంగే పసి నిగ్గులు
16 –  శ్రీరంగనాధ పదాంభోజ చంచరీకం
        గోదావైభవ శ్రీ రంగం రాగ గోపాల రత్నం .
                                                                                                  గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                                     టుమ్రీల జననం —20 -03 -1993
Posted in రచనలు | Leave a comment

చిట్టి కవితల చిట్టా

చిట్టి కవితల చిట్టా 
01 –                                             భారత చరితం 
            వినరా భారత వీర కుమారా
            వీరుల చరితంబు
            వీరులు ,పాటు ధీరులు
            ధీమంతులు మరి శ్రీమంతులును
            కవి పండిత ఉద్దండులు
            నీతి శాస్త్ర కోవిదులు
          భారత దేశమందు
           ఉదయించి నారు –వెలుగొంది నారు .—వినరా భారత
                                చాణక్యుడు చాక చక్యముతో
                                మగదేస్వరులగు నవ నందులను
                                అనగా ద్రొక్కే -ఆర్పే తన కోపాగ్ని
                                చంద్ర గుప్తుని రాజాది రాజుగా
                                చేసే నా బ్రహ్మ తేజంబు .       —      వినరా భారత
             పరాక్రమంతో పరిపాలించే నశోకుడు
             పరువెట్టిరి శాత్రవ వీరులు
            విసుగేట్టేను కదన రంగము
            మొలకేత్తెను ఆహిమ్సామ్కురము
            ప్రబోధించే బుద్ధ సూక్తులు                                           c
            ప్రచారించే పాలు తావులందు —–వినర భారత                                                         28 -05 -1957
02 –                                  ఆంద్ర నందనం 
                        పవిత్రదేశం -ఆంద్ర దేశం
                        పవిత్ర స్థలాలు పలు తావులు
                         విజయ నగరపు విజయ పతాక
                        కాకతి యుగపు కరాల కాళి
                        రెడ్డి రాజుల శిల్ప సంపద
                        వెలుగొందిన వేల్గారిన దేశం
                        వాగను శాసనుడు ,యోగి వేమన
                        పెద్దన తిక్కన ఆంద్ర భోజుడు
                        పెంచిన  కవితా నందనారామం
                        విస్తరించిన విజయ భూమిరా
                                                                                                                                        15 -12 -1957
  03 –                            వక్కా పోచక్కా 
                 వక్కా పోచక్కా
                వొక్క పూట నీవు లేక
                గడువదు భోజనానంతరం
                వక్కా నిన్ను ముక్కలు చేసి
               ఏలక్కులు లవంగాలు
              మున్నగు సుగంధ ద్రవ్యాల పోపువేసి
              పట్క్కు పటుక్కు మని నమలనిచో
              మాకేదీ నాగరకత?
              ఒక్క క్షణం నీవు లేక పాట రాదు గాయకునికి
              ఒక్క క్షణం నీవు లేక పాఠం మాను పంతులు
              ఒక్క పూట నీవు లేక గడువదు నవ దాంపత్యం
                                          వక్కా నీవే దిక్కు
                                         తక్కిన వారంతా నీ తర్వాతే
                                         క్షణం కూడా మమ్ము విడువకుండా
                                         కాచి రక్షించు మమ్మ -నిను విడువ మమ్మ
                      శ్రీదేవిని ఉదరమందున శేష శయ్య స్వామి
                      అర్ధ భాగ మందు అంబను ఆది శంకరుడు
                      నాల్క పైన వాణిని నలువ
                      తాల్చి నట్లు మేము నిన్నేల్లప్పుడు
                      బుగ్గ కింద దాతుమమ్మ
                      కావవమ్మా వక్కా పోచక్కా                                                            01 -02 -1963
                                                                                                                        మీ
                                                                                                                దుర్గా ప్రసాద్
Posted in కవితలు | Leave a comment

శ్రీ దేవరాజు మహా రాజు కలసినప్పుడు

గూగిలీయులకు        హైదరాబాద్ లో ఉస్మానియా యూనివెర్సిటీ లో zoology ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రముఖ కధకులు ,కవి ,నవలా రచయిత పర్యావరణ ,శాస్త్రీయ అంశాలపై నిత్యాన్వేషణం చేస్తూ ,పుంఖాను పుంఖాలుగా రచనలు చేస్తున్న

గారిని వారి ఇంటివద్ద కలిసినప్పటి ఫోటో ప్రక్కన వారి శ్రీమతి గారు

              శ్రీ మహారాజు గారు యాభై ఏళ్ళకు పైగా చేస్తున్న సాహిత్య కృషి మీద సహృదయ స్పందనను ”ఆవరణం ”పేరిట త్వరలో వెలువరిస్తున్నారు .అందులో వారి కధలపై  నా సమీక్ష కూడా చేర్చటం వారి  సహృదయత  . 
—                                                                                                                     మీ దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment

కొమ్మ -బొమ్మ -అమ్మ

       కొమ్మ -బొమ్మ -అమ్మ 
                                        వసంతం హసించని కొమ్మతో
                                        బొమ్మ చేసి ,ఎత్తుగా వున్న పీఠం పై
                                        మోజుగా ,ముద్దుగా ,కూర్చోబెడితే
                                       ”అమ్మవారై,ఎక్కించిన వారి పాలిటి
                                        మహామ్మారై విజ్రుమ్భించింది
                                       కొమ్మ బొమ్మైంది ,బొమ్మ అమ్మైంది.
                         కొమ్మ బొమ్మ అమ్మ ముగురమ్మల
                         మూలపుటంమై విజ్రుమ్భించింది
                         పంచన జేరిన వాణ్ని పన్నీట ముంచింది
                        వంచన పేరుతొ వాణ్ణీ పాతాళం లో దించింది
                                          కల్ల కపటము లేనట్లు కపిల దేనువన్నట్లు
                                          పల్లు మాటాడనట్లు పసిహృదయమట్లు
                                          తన్ను తానేట్లో ప్రకటించు కుంది
                                          అశరీర వానితో శృతి చేయించుకున్నది .
                      ఎటు చూసినా నేడు దైన్యం
                      హైన్యం నైచ్యం ,పరతంత్రత
                    స్వచ్చత లేని బ్రతుకుల్లో నిత్యం గచ్చ పొదలు
                   ప్రతిదీ అందరానంత దూరం –ఆకసాన కుసుమం
                                                ప్రజ కదిలింది చైతన్య స్రవంతిలా
                                                కబంధ హస్తాలు తెంచి
                                                స్వేచ్చా పిపాసల నుంచి
                                                జగతి నవ్య దివ్య స్ఫూర్తి వహించే
                                                శుభ తరుణం చేరువైంది .
                   అమ్మ పతనం తప్పదు
                   బొమ్మ కావటం తప్పదు
                  వసంతం లేని కొమ్మ మళ్ళీ
                  నోరెత్తక పోవటం తప్పదు .
                                                                                  మీ
                                                                          గబ్బిట దుర్గా ప్రసాద్
     శ్రీ ప్రసాద రాయ కులపతి  సంపాదకులు గా                                            స్వర్గీయ ఆర్. ఎస్ .కే .మూర్తి (మచిలీ పట్నం ) ఉప సంపాదకులు గా నిర్వహింపబడిన ”సాందీపని ”మాస పత్రికలో నవంబర్ 1974 లో ప్రచురింపబడి ,,శ్రీ కందుకూరి వెంకటేశ్వర్లు గారి సంపాదకత్వం లో 1975  లో వెలువడిన కవితా సంపుటి ”నవ చేతన ” లో ప్రచురింపబడిన నా కవిత ఇది

 

Posted in రచనలు | Leave a comment

గద్య నన్నయ చిన్నయ సూరి

గద్య నన్నయ చిన్నయ సూరి 
—                          సకల సాహితీ” సుజన రంజకమైన” పత్రికను పుత్రికా  వాశ్చల్యం తో పెంచి ,ఎదుగుదలకు పులకించిన జనకునిగా ఆనందానుభూతి నంది ,పట్టరానంత సంబరాలతో అంబరాన్నంటే ఆనందం తో జరుపుకున్న సీమరాజు పట్టాభిషేకాన్ని అక్షరాభిషేకం తో అభినందించి ,భాట్టభానుని ,ముద్దు పట్టి కాదంబరిని అట్టహాసంగా ,ఆంద్ర కాదంబరిగా అవతరింప జేయటం లో తరించి ,గీర్వాణ కౌముదిని శాస్తాధ్యయన జనానికి వెన్నెల పర్వణం చేసి ,అమరలోకపు పారిజాతాన్ని తెలుగు భూరుహం గా నిలిపి ,పరిమళాలు నింపి ,గమ్మత్తు మత్తులో ఎదల నుయ్యాల లూగించి ,రంగు,రుచి వాసన గల తెలుగు అక్షరాలను గుది గుచ్చి అక్షరగుచ్చం చేసి ,శాస్వతకీర్తి నార్జించి ,ఆర్తజన బాన్ధవునిగా వర్ధిల్లమని పచ్చయప్ప నృపుని యశస్సు పదికాలాలు మండలాంతర విస్తృతి నందాలని మనసార ఆకాంక్షిమ్చి ,కృతజ్ఞత చాటించి ,బాలబోధకంగా   సంస్కృత బాలబోధ సాధన చేసి ,ఆకుచాటు పిందేల్లా  వుండి  చేటల్తో అర్ధాన్ని భావాన్ని చెరిగి ,జాతి జీవనానికి పట్టుగొమ్మలై నిలిచిన చాటువులను ఏర్చి కూర్చి ముత్తెపు సరులుగా తెలుగు తల్లికి ఆభరణంగా అరణం గా అందించి అఘటన ఘటనా సమర్ధం గా ఒంటిచేత ”అకారాది నిఘంటు ”నిర్మాణంతో తెలుగులకు వెలుగుల దారి చూపి తన చేత ,రాత ,అంతటి తో ఆగిపోనీక విశ్వ వ్యాప్తిత మయ్యే తపనతో ,తపస్సు తో ,”విశ్వ నిఘంటు ”వు కు టీకాతిలకం తీర్చి దిద్ది ,యాదవకులతిలకుని అభ్యుదయ పరంపరగా యాదవాభ్యుదయ యశోచంద్రికలను భువికి దించి, అలక్ష్మీ నిరసనగా శ్రీ లక్ష్మీ నారాయణ తంత్ర యంత్ర స్థాపన చేసి, అర్థము, పరమార్థము, లక్షంగా పదాలను సార్థకత చేకూర్చే సార్ధక పద మంజరి’ని, శారద  పద మంజీరంగా వేలయించి, అయోమయమైన దూమశకట విన్యాసాన్ని ధూం ధూం దండకంగా దండ గూర్చి , ప్రపంచ సర్వశాస్త్రాలకు ఆది, అనాది అనిపించుకున్న హిందూ ధర్మ శాస్త్రాన్ని అపర అగస్త్యునిగా  సంగ్రహించి చుళికీ కృతం చేసి,  సులభ గ్రహకంగా, నీతిని సంగ్రహించి, నీతి చంద్రికతో చిత్త శాంతిని సాధించి, సులభ భోధనకై విభక్త భోధిని కరతలా మలకం చేసి, ద్రావిడాంధ్ర గీర్వాణ ప్రాకృత భాషల పారమెరిగి, సారమెరిగి, సుసంస్క్రుతం అని చిరయశస్సు నార్జించిన సంస్కృత సూత్రాలకు ఆంద్ర వ్యాకరణాన్ని అక్షర రమ్యం గా మలచి ,”పద్యాంధ్ర వ్యాకరణం ”నిర్మించి ,శబ్ద శాసనుడైన నన్నయ్యకు సైదోడుగా ”ఆంద్ర శబ్ద శాసనాన్ని ”చేసి ,ప్రతిపర్వ మాధుర్య విలసిత మహాభారత నన్నయ కృత ఆదిపర్వానికి వన్నె ,చిన్నె లతో ,పరిపక్వ వచన రచన సొంపుల నందించి ,బాలలకే కాదు ,ఆబాల గోపాలానికి అవసరమయ్యే ,బాల వ్యాకరణాన్ని గ్రామ కరణం లెక్క గా నూలు అటూ ,యిటూ తేడా లేకుండా మంత్రాలల సూత్రబద్ధం చేసి ,,మననకు ,మాననీయతకు ,గణనీయతకు ,ఆదర్శంగా  నిలిపి ,”తెలుగు వ్యాకరణ దీపం చిన్నది ”అన్న వారికి ”తెలుగు వ్యాకరణ దీపంచిన్నది   కాదు చిన్నయ్యదే ”అని దాని కీర్తి చంద్రికలు పాణిని దాకా చేరేట్లు చేసి ,తెలుగు భాషకు వున్న నుడులు ,సంధులు ,సమాసాలు ,అలంకారాలను అద్భుతం గా ,కమనీయం గా మనోహరం గా కూర్చి ,కలకండ మాధుర్య ,గాంభీర్య వచన రచనకు మార్గ దర్శియై ,వచన విదాతయై ,తన వచన రచనతో ప్రాభవమ్ కల్పించి ,పోషించిన విష్ణువై,చివరికి తనలోనే ,తనతోనే లలయం చేసుకొన్న శివుడైన త్రిమూర్త్యాత్మక మూర్తి,తెలుగు గ్రాంధిక వచనావిన్యాసానికి చలువ కుటీరం నిర్మించిన  వాస్తుశిల్పి శ్రీ పరవస్తు చిన్నయ సూరి .ఆ వాస్తు అప్పుడు అందరి వస్తువే .కాలక్రమాన అది ”పరవస్తు”వు అయింది .మీగడ పెరుగు ఆయన భాష ..ఆ తర్వాత వ్యావహారికం తో పల్చని మజ్జిగ అయింది .అదీ జీర్ణించుకోలేక సతమతమాయే జీర్ణాశయ  బాధ మనది .ఆయన ఒక్క” సూరి  ” మాత్రమే కాదు పన్నిద్దరు (12 ), సూర్యుల తేజో విరాజితుడు .పద్యం లో నన్నయకు వున్న గౌరవం గద్యం లో చిన్నయ సాధించారు .పేరుకు చిన్నయ్యే కాని ప్ర జ్ఞా ప్రాభవాలకు   పెద్దయ్య పెద్దన్నే .ఆ మాధుర్య విలశిత మైన హృద్య గద్య వైభవ నిర్మాతకు వినమ్రం గా అంజలి ఘటిస్తూ      సెలవ్ .   i

                                                                                 మీ —————గబ్బిట దుర్గా ప్రసాద్
                                           పరవస్తు చిన్నయసూరి పీఠం ,నాగార్జున విశ్వ విద్యాలయం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తం గా 17 -01 -08 ,18 -01 -08 తేదీలలో గుంటూరు లోని నాగార్జున విశ్వ విద్యాలయం తెలుగు శాఖలో నిర్వహించిన చిన్నయ సూరి ద్విశతాబ్ది  ప్రారంభవ ఉత్చావ  సమా వేశం లో చివరి రోజున జరిపిన ”అక్షరాభిషేకం ”లో నేను చదివినది .ఇది తర్వాత ఆకాశవాణి విఇజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమైంది
Posted in రేడియో లో | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం

దర్శించండి

 శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం 

                             సాధారణం గా ఆంజనేయ స్వామి దేవాలయాలు భాక్తాన్జనేయం గానో దాసాన్జనేయం గానో వీరాన్జనేయం గానో ఎక్కువగా వుంటాయి సువర్చల తో కూడిన ఆంజనేయ దేవాలయాలు చాలా అరుదు .అలాంటి అరుదైన శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణ జిల్లలో వుయ్యూరు మండలం లోని వుయ్యూరు గ్రామం లో రావిచెట్టు బజారు చివర పుల్లేరు కాలువకు సమీపం లో వుంది అది గబ్బిట వారి దేవాలయం గా ప్రసిధి చెందింది ఆ ఆలయాన్ని మా తండ్రి గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారి మాతా మహులు ఆంటే మా నాయనమ్మ నాగమ్మ గారి తండ్రి గారు గుండు లక్ష్మీ నరసిమ్హావధానులు గారు సుమారు రెండు వందల సంవత్చరాల క్రితం స్వంత ఖర్చులతో ఆ దేవాలయాన్ని నిర్మించి ,ధూప దీప నైవేద్యాలకు ఏర్పాటు చేసారు .వుత్శవ మూర్తులను కూడా ఏర్పాటు చేసి ధ్వజ స్థంభ ప్రతిష్ట చేసారు .వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జన్మదినం నాడు శ్రీ హనుమజ్జయంతిని సువర్చలాన్జనేయ కల్యాణాన్ని చాల వైభవం గా జరిపే వారట .కోరిన కోరికలను తీర్చే దైవం స్వామి అందరికి అండగా వుండేవారు ఆవరణ లో ఈశాన్య భాగాన ఎత్తైన కళ్యాణ మండపం వుండేది .అర్చక స్వాములు శ్రద్ధగా స్వామి సేవ చేస్తూ తరించేవారు .నరసిమ్హావదానుల మరణం తర్వాత వారి దౌహిత్రుడి గా మా నాన్న గారు  వంశ పారంపర్య ధర్మ కర్తగా వున్నారు ..కార్యక్రమాలన్నీ బాగానే జరిగేవి ఆలయం బాగా ముందుకు వుండటం వ్వేనుక ఖాళీ ఎక్కువగా వుండటం వల్ల ఎక్కువ మంది కి దర్శన భాగ్యం కష్టం గా వుండేది .కళ్యాణం ,జయంతి తప్పక జరిగేవి .రోడ్డు ఎట్టు పెరగటం ఆలయం లోతుగా వుండటం వల్ల వర్షా కాలమ్ నీరంతా లోపలి చేరి చాల ఇబ్బందిగా వుండేది 1961 లో మా తండ్రి గారి నిర్యాణం తరువాత నేను వంశ పారంపర్య ధర్మ కర్త  గా ఉంటున్నాను .ఆలయం శిధిలమై పోతోంది ,ఇరుకు గా కూడా వుండటం కూడా బాధాకరం గా వుండేది ఎన్నో సార్లు మంచి ఆలయాన్ని అక్కడే నిర్మించాలని అనుకున్నాము మా ఒక్కరి వల్ల ఆయె పనికాదు అందరి సహకారం కావాలి ప్రయత్నం చేసాం ..కని స్వామి అనుగ్రహం లేనిది ఏపనీ కాదు
                       ఇంతలో ఆ రోడ్ చివర వంతెన నిర్మాణం అయింది .అప్పుడు మకుటుంబ,సభ్యులకు శ్రేయోభిలాషులకు గ్రామస్తులకు బలీయమైన ఆలోచనా కలిగి స్వామి ఆశీర్వాదబలం తోడై ఒక కమిటీ గా ఏర్పడి ఆలయ నిర్మాణం చేయాలని ద్రుఢమైన సంకల్పం కలిగింది .వరుసగా సమావేశాలు జరపటం చందాలు వసూలు చేయటం వసూలైన ధనాన్ని బ్యాంకు లో వేయటం రసీదులు ఇవ్వటం చేసాము .దీనికి నాకు పూర్తి సహకారాన్ని అందించిన వారు స్వర్గీయ మండా వీరభద్ర రావు ,సంజీవరావు ,.కాలికి బలపం కట్టుకొని మేము ముగ్గురం తిరిగాము ,.మంచి సహకారం లభించింది .ధనం పోగాయింది స్వచ్చందం గా ముందుకు వచ్చి ధనం అందించారు శ్రీ సుబ్బారావు గారు నిర్మాణ పర్య వేక్షణ చేసారు .స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్చర నిజ జ్యేష్ట నవమీ గురూ వారం హస్తా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరామః యందు అనగా 23 -06 -1988  న స్వామి వారి పునః ప్రతిష్ట కార్యక్రమం వైఖానస ఆగమ విధానం లో శ్రీ వేదాంతం శ్రీ రామా చార్యుల వారి ఆధ్వర్యం లో నేను నా భార్య ప్రభావతి దంపతులం స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట చేసాము .ఆ నాటి కే.సి పీ ప్లాంట్ మేనేజర్ స్వర్గీయ ఇంజేటి జగన్నాధరావు గారు శాసన సభ్యులు స్వర్గీయ అన్నే బాబూరావు గారు ముఖ్యులుగా విచ్చేసి కార్యక్రమానికి ఘనత చేకూర్చారు కే.సి పీ వారి వదాన్యత వుయ్యూరు ,చుట్టుపక్కల గ్రామస్తుల దాతృత్వం సహాయం మరువలేము పువ్వాడ వారు వెంట్రాప్రగడ వారు ఊర వారు చోడవరపు వారు మండా వారు ఒకరేమిటి అందరు పెద్ద మనసు తో ఈ పవిత్ర భగవత్ కార్యానికి  సహకరించారు వుత్శవ విగ్రహాలు తో ఆలయం శోభిల్లింది ఉచితం గా ఇసుక తోలారు కొందరు సిమెంట్ ,ఇచ్చారు కొందరు    స్వామి మీద వున్న అచంచల విశ్వాసమేఇంత  పని మా అందరితో చేయించింది .మా కుటుంబ సభ్యులు ధనం తో సేవతో సహకరించారు ..అదొక పండగ గా జరిగింది
                         ఇంత వున్న ధన లోపం వల్ల ధ్వజ స్థంభ నిర్మాణం చేయ లేక పోయాం .అయితె ప్రతి సంవత్షరం హనుమజ్జయంతిని వైభవోపేతం గా చేసి స్వామి వారి కళ్యాణం చేస్తూ తరించాము .భక్తులు పెరిగారు .ధనుర్మాస కార్య క్రమాలు ప్రారంభించాము .హనుమద్వ్రతం ప్రతి సంవత్చరం జరుపుతున్నాం. .చైనా వోగిరాల వాస్తవ్యులు ,వదాన్యులు స్వర్గీయ పాలడుగు నాగేశ్వర దాసు గారు ధ్వజస్తంభాన్ని ప్రదానం చేసారు స్వస్తీస్రే చాంద్రమాన శ్రీ ముఖ నామ సంవత్చర జ్యేష్ట బహుళ నవమి 13 -06 -93 ఆదివారం ఉదయం 07 -29  గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త మిధున ల్లగ్న పుష్కరాసము లో ధ్వజ ప్రతిష్టా మహోత్స్చావం అత్యంత వైభవం గా జరిగింది .శ్రీ దొడ్డ వెంకట రత్నం దంపతులు శ్రీ పరాశరం రామ కృష్ణ మాచార్యుల వారి ఆధ్వర్యం లో ధ్వజ ప్రతిష్ట జరిపారు .ఎందరో వదాన్యులు సహకరించారు .ఇత్తడి తొడుగు కూడా వేయించాము. మండా వీరభద్ర రావు సంజీవ రావు గారల,అవిశ్రాంత కృషి  అనుక్షణ పర్యవేక్షణ నాకు కొండంత బలం .వారి సేవలు మరువ లేనివి .

                             నిత్యం వందలాది భక్తులు శ్రీ సువర్చలన్జనేయ స్వామి వార్లను సేవించి తరిస్తున్నారు తమల పాకుల పూజ ,పండ్లతో పూజ గంధ శింధురం తో అర్చనా విసేసం గా జరుగుతాయి ధనుర్మాసం నెల రోజులు వేలాది మంది ప్రదఖినలు చేసి తమ మనోభీస్తాన్ని స్వామి వారికి నివేదించుకొని సఫల మనోరదులవుతున్నారు భక్తుల పాలిటి కొంగు బంగారం స్వామి .భోగి నాడు శాంతి కల్యాణం జరుగుతుంది ఊరేగింపు చేస్తాము ఒంటె వాహనం మీద .లాడ్డులతో ప్రత్యెక పూజ కాయ గురాలతో విశేష అర్చన చూడ ముచ్చటగా వుంటుంది భజనలు హనుమాన్ చాలీసా పారాయణ ,విష్ణు ,లలితా పారాయణ సాముహిక కుంకుమ పూజ యే ఆలయం ప్రత్యేకత మాన్యు సూక్తం తో స్వామి వారికి అభిషేకం జరుగ్గుతుంది
                                మూడు సంవత్శరాల క్రితం పదకొండు రోజులు ప్రత్యెక కార్యక్రమం నిర్వహించాము,ఆలయం పునర్నిర్మించి ఇరవై ఏళ్ళు అవుతున్న సందర్భం గా .ప్రతిరోజూ ఉదయం మన్యుసుక్తంతో స్వామి వారికి అభిషేకం హోమం సహస్రనామార్చన సాయంత్రం మళ్ళీ హోమంశాంతి   కల్యాణం ..అపూర్వ స్పందన లభించింది శ్రీ స్వర్ణ నాగేశ్వర రావు గారి నేతృత్వం లో ,ఏలూరు వెద పండిట్ల ఆధ్వర్యం లో మహత్తరం గా పదకొండు రోజుల కార్య క్రమాలు జరిగాయి .మంచి సహకారం లభించింది రోజు మా దంపతుల తో పాటు ఒకరిద్దరు దంపతులు కుర్చుని స్వామి వార్ల కల్యాణం చేయటటం మహద్భాగ్యం గా భక్తులు భావించారు ఆలయం లో భక్తులు అన్ని సౌకర్యాలు కల్గించా టానికి సహకరిస్తున్నారు
                         ఈ విధం గా వుయ్యూరు లోని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ధర్మ కర్తగా స్వామి సేవలో నా జీవితాన్ని పండించుకుంటున్నాను .
                       27 -05 -11  న వైశాఖ బహుళ దశమి శుక్రవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు స్వామి వార్ల కృపా కటాక్ష ప్రాప్తి రస్తు
                                                  సర్వ్ జనః సుఖినో భవంతు .విశ్వ శాంతి రస్తు .లోక కళ్యాణ మస్తు .
                                                                     మీ
                                                            గబ్బిట దుర్గా ప్రసాద్ ————-ధర్మ కర్త   –శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం –వుయ్యూరు
Posted in సమయం - సందర్భం | Leave a comment

సువర్చలాన్జనేయం

సువర్చలాన్జనేయం
                     శ్రీ ఆంజనేయుడు అంజనా దేవి కి ,కేసరి కి
 జన్మించిన కుమారుడు .బుద్ధిమంతుడు ,బలవంతుడు ,ప్రతాపశాలి .ఆయనకు చిన్న తనం లోనే వ్యాకరణం నేర్చుకోవాలని కోరిక కలిగింది .వ్యాకరణం ఆంటే ఒక్కటే కాదు .నవ విధ వ్యాకరనాలున్నాయి అవి పాణినీయం ,కలాపము ,సుపద్మము ,సారస్వతము ,ప్రాతి శాఖ్యము ,కుమారవ్యాకరణము ,ఇంద్రము వ్యాఘ్రభౌతికము శాకటాయనము .ఇవన్నీ నేర్చుకున్న వాడిని నవ వ్యాకరణ పండితుడు అంటారు .వీటిని పూర్తి అధ్యనము చేసి అధ్యాపనం (నేర్చుకోవటం ,బోధించటం )చేయగల నేర్పు వున్న వాడు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే ..హనుమంతుడు సూర్యుని దగ్గరకు వెళ్లి తనకు వ్యాకరణాలు బోధించ మని వేఉకున్నాడు .సూర్యుడు ”నేను ఉదయము నుంచి ,సాయంత్రం దాకా తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేస్తూంటాను .నిలకడ గా ఒక చోట ఉండను .నీకు నేర్పటం ఎలా సాధ్యం ?”అన్నాడు .దానికి మహా మతిమంతుడైన హనుమాన్ “”స్వామీ !నేను ఒక కాలు తూర్పుకొండ మీద ,రెందోకాలు పడమటి కొండ మీద వుంచి మీతోనే వుంటాను .కనుక నేర్పండి “‘అన్నాడు .సరే నని అయిదు వ్యాకరణాలు నేర్పాడు ఆ విధం గానే .మిగిలినవి కూడా మో నేర్పమని అడిగాడు .మారుతి .మిగిలినవి వివాహం అయిన వారికే నేర్పాలి అన్ననియమం వుంది అన్నాడు గురువు ..నేను బ్రహ్మ చారిని కదా ఎలా సాధ్యం అని అడిగాడు వాయుసుతుడు ..అయితే దీనికి ఒక పరిష్కారం వుంది ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అప్పుడు మిగిలిన వ్యాకరణా అన్నాడు రవి.
ఇంతకీ సూర్యుని కుమార్తె ఎవరు ఎలా పుట్టింది అని అనుమానం వచ్చింది హనుమకు .అప్పుడు సూర్యుడే సందేహ నివృత్తి చేశాడు .తాను చాలా తీవ్ర తేజంతో జ్వలిస్తుంటే తన భార్య చాయా దేవి భరించలేక పోయిందని ఆమె తండ్రి ,తన మామ గారు మయుడు తనను సాన పట్టాడని తీవ్రత తగ్గిందని ,సాన పట్టగా వచ్చిన రజను ఒక రాశి గా ఏర్పడిందని దేవతల వర ప్రభావం తో ఆ రాశి నుంచి మంచి వర్చసు దేహకాంతి తేజస్సు కల  అపురూప సౌందర్య రాశి ఆవిర్భవించిందని ,ఆమెయే తమ కుమార్తె సువర్చల అని వివరం గా చెప్పాడు సూర్యుడు .మంచి వర్చస్సు వుండటం చేత సువర్చల గా నామ కారణం చేసామని చెప్పాడు ఆమె ను వివాహం చేసుకోమని కోరాడు సరే నని ఒక షరతు పెట్టాడు హనుమ .తాను వివాహం అయినా బ్రహ్మ చారి గానే ఉంటానని దాంపత్య సౌఖ్యం ఉండదని తనకుమార్తెకు ఈ విషయం చెప్పి ఆమె అంగీకరిస్తే తాను వివాహం చేసుకుంటానని నిర్మొహమాటం గా చెప్పాడు .సువర్చలకు. ,బలశాలి ,మతి మంతుడుబుద్ధిమంతుడు  తనకు భర్తగా లభించటం  తన అదృష్టమని దాంపత్య సౌఖ్యం లేక పోయినా తనకు అమ్గీకారమే నని ఆమె బదులు చెప్పింది .అందరు ఆనందించారు వారి వివాహం వైభవం గా జరిగింది అప్పటినుంచి ఆంజనేయుడు సువర్చలాన్జనేయుడు
అయ్యాడు . వచ్చే మన్వంతరం లో హనుమ బ్రహ్మ దేవుడవుతాడు అందుకే ఆయన సహస్రనామం లో ”భవిష్యత్ బ్రహ్మనేనమః”అని వుంది సూర్యుడు తన అల్లుడైన హనుమంతునికి మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పాడు .గురువుకు తగిన శిష్యుడని పించు కున్నాడు ..ఇదే అందుకే ఆయన్ను ”నవ వ్యాకరణ పండితుడు ”అంటారు సువర్చలాన్జనేయం .
హనుమ చిరంజీవి అని మనకు.ఆయన వైశాఖ మాసం లో కృష్ణ పక్షం లో దశమి నాడు జన్మించాడు “”వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే ”అని దీని వివరణ ఆ రోజునే శ్రీ హనుమజ్జయంతి దేశ మంతటా చేస్తారు ..ఆయన పుట్టిన వారం శని వారం .శనివారం మంగళ వారం హనుమకు ప్రీతి కరమైనవి .ఆ రోజుల్లో విశేషం గా స్వామిని అర్చించి తరిస్తారు   .సువర్చలాన్జనేయ కల్యాణాన్ని వైశాఖ బహుళ దశమి నాడు ఆంటే హనుమజ్జయంతి నాడు జరపటం ఆచారం .తమల పాకులపూజ (నాగవల్లి )ఆయనకు ప్రీతికరం ..అప్పాలు నైవేద్యానికి శ్రేష్టం ..పానకం ఇష్టం .లడ్డూలు మరీ ఇష్టం ఆంజనేయుడు లంకను దాటి సీతా మాత ను దర్శించి స్వామి కార్య దురీనుదయాడు .రామ భక్త హనుమాన్ గా వీర హనుమాన్ గా దాసాంజనేయ స్వామిగా ,వీర ధీర హనుమాన్ గా సంజీవి పర్వతోద్ధారణ హనుమాన్ గా ,పంచముఖ అన్జనేయునిగా భక్తులచేత పూజలు అందుకుంటున్నాడు .ఆయన్ని సేవించితే భయాలు ఉండవు ,పాపాలు అంటవు .  దుస్వప్నాలు రావు శత్రువుని జయించే కోరిక తీరుతుంది .  అందుకే ఆయనకు ఊరూరా వీధి వీధినా దేవాలయాలు కత్తి భక్తీ శ్రద్ధలతో పూజించి సేవించి తరిస్తారు
ఆంజనేయ స్వామి ప్రవర తెలుసు కుందాము ఆయనది కౌన్డిన్యస గోత్రం ..వసిష్ఠ ,మైత్రావరణ కౌన్డిన్యస మహర్షులు ఆ గోత్ర ఋషులు .హనుమంతుని ముత్తాత గారి పేరు హేమగార్భ శర్మ ,తాత గారు పింగాక్ష శర్మ ,తండ్రి గారు కేసరి శర్మ .                             
సువర్చలా దేవి ప్రవర వినండి ఆమె గోత్రం కాస్యపస గోత్రం కాశ్యప ,వత్చార ,నైద్రువ అనే ముగ్గురు మహర్షులు  ఆ గోత్రం లోని ఋషులు .ఆమె ముత్తాత గారు చతుర్ముఖ బ్రహ్మ .తాత గారు కశ్యపబ్రహ్మ .తండ్రి వివస్వత బ్రహ్మ అనే సూర్యభగవానుడు .
        శ్రీ సువర్చలాదిస్గ్తిత వామ భాగం   -నిరస్త కందర్ప సురూప దర్శనం
       భాను ప్రభం రాఘవ కార్య దక్షం -అస్మత్కులేశం శ్రీ హనూమంత మీడే .
        .                            శ్రీ    హనుమజ్జయంతి 27 05 -11   సందర్భం గా అందరికి శుభాకాంక్షలు .శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల కృపా కటాక్ష సిద్ధి రస్తు.
                                                            
                                                    మీ
                                            దుర్గా ప్రసాద్

మా కొత్త బ్లాగ్ అదే రోజు ప్రారంభం

http://suvarchalaanjaneyaswami.wordpress.com/

Posted in సమయం - సందర్భం | Leave a comment

నిర్ వచనాలు

  నిర్ వచనాలు
గురూ గారు అంటూ శిష్యుడు పొద్దున్నే వచ్చాడు  నిన్న చెప్పినదానిమీద్ ప్రశ్నలు అడగనా అన్నాను .వద్దండి .రోజు మీరుప్రశ్నలడగటం   ,నేను జవాబ్బులు చెప్పటం తప్పు గా చెప్తే నెత్తిన మొట్టటం బుర్ర మీద కంది కాయల్లా అవి తయారవటం రోజు ఉండేదేగా .ఇవాళ నేను జనరల్ knowledge పెంచుకోవటానికి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా జవాబు చెప్పిన నావిజ్ఞానాన్ని   పెంచండి  .అన్నాడు . సరే అడుక్కో అన్నా .
     గురూజీ !టుజి త్రీజీ  అంటున్నారు కదా దాని అర్ధం ఏమిటి?
    టు అంతే రెండు త్రీ అంతే మూడు అని తెలుసు కదా .జి ఆంటే jeneration ఆంటే తరాలు ,అని అర్ధం .ప్రభుత్వం లో వుంటూ బొక్కసం లో డబ్బును బొక్కేసి ,నొక్కేసి దోచేసి దాచేసి  ,రెండు లేక మూడు తరాలదాక తిన్నా అరిగితరిగి  పోకుండా డబ్బును దాచుకునే  స్కీములు అని అర్ధం .
   అయ్యా !ఈ మధ్య ఒక వారం నుంచి కోవర్ట్ అనే మాట వింటున్నా .దాని లో గుట్టు విప్పండి ?
 వెరీ సింపులూ! .ప్రభుత్వ పార్టీ లో అద్దికారం చెలాయిస్తూ ఎప్పుడో ఎవరి ఉప్పో తిన్నందుకు ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వ పార్టీ రహస్యాల్ని వుప్పందిస్తూ తమ పార్టీ వాళ్ళను ఓడించటం లో ఆరి తేరిన వాళ్ళు అని అర్ధం
ఏది సరిగ్గా చెప్పరు కదా అంతా దొంక తిరుగుడే సరే —గిట్టు బాటు ధర ఆంటే ఏమిటి ?
అది గిట్టు బాట ధర .టు కాదు ట .ఆంటే రైతులు, చేనేత వారు తమ శ్రమకు తగిన ధరను నిర్ణయించమని ప్రభుత్వాన్ని కోరుతారు .దీన్ని తేలిగ్గా తీసుకొని ప్రభుత్వం పైరవీలకు లోగ్గి ఏదో ధర నిర్ణయిస్తుంది ..ఆ ధర వారికేమాత్రం చాలక వారు అప్పుల బాధ భరించ లేక ఆత్మ హత్యలు చేసుకుంటారు వాళ్ళు గిట్టటానికి ఆంటే చావటానికి దారి ఆంటే బాట ను చూపే ధర అని అర్ధం
 స్వామీ !చిదంబర రహస్యం ఆంటే?
 లుంగీ ,సోడాబుడ్డి కళ్ళజోడు వున్నయన క్రితం డిసెంబర్ లో చేసిన ప్రకటన కు తనకే అర్ధం తెలియక జుట్టంతా పీక్కోనో బోల్డు జుట్టు ఊడి బాల్డ్ హెడ్ గా మారినా,కమీషన్లతో ,కమిటీలతో తేలక చివరికి nostra  damas  ఏమైనా దీన్ని గురించి చెప్పదేమోనని torture కళ్ళతో వెదికినా దొరకంది
బాబోయ్ ! సరే తెలంగానం ఆంటే ఏంటి సారూ ?
తెలంగాణా ఇస్తే కొందరికి లాభం ఇవ్వక పొతే కొందరికి లాభం అందుకని ఇస్తామని చెబుతూ ,ఇవ్వకుండా జ్జో కోట్టతమే తెలంగానం
ఇప్పటి సి .యం .కొనసాగుతారా?
కోన సాగటం ఆయనకు ఇష్టం కోన సాగితే ప్రజలకు నష్టం వుంచతమా ,పీకటమా తేల్చుకోవటం పై వాళ్లకు కష్టం
మీరు చెప్పింది బహు శ్రేష్టం  సామాజిక న్యాయం ,నీతి ఆంటే ?
రెండేళ్ళ క్రితం పార్టీ పెట్టి అధికార పార్టీ ని దుమ్మెత్తి పోసి ,వేళ్ళ మీద లెక్కించదగిన సీట్లు మాత్రమే సంపాదించి ,అవీ జారి పోతుంటే దిక్కు తోచక తిట్ట్న పార్టీ లోనే స్వంత పార్టీ ని బొంద పెట్టటం
సిగ్గు  ,లజ్జ లేదంటారు  ఎలా?
అధికార పార్టీ పై పోటీ చేసి వాళ్ళను పంచలుడా దీసి కొడతామని బీరాలు పలికి చేసేదేమీమీ లేక ఆ   పంచ లోనే తల దాచుకోవటం .,
కర్నాటక కిరి కిరి ఏమిటి బాబూ?
రాజభవన్ లో చెడుగుడు ,అసెంబ్లీ లో కబాడీ .వీధుల్లో పోరాటం కోర్టుల్లో మునగటం ,తేలటం
అన్న హజారే ఉద్యమం మీద మీ కామెంట్/
పాపం ముసలాయన ,పెద్దమనిషి ని వీధుల్లోకి లాగి అవునని కాదని అనకుండా చెప్పినట్లే చేస్తామంటూ చెప్పకుండా చేయిస్తూ ,దాటేసే నవీన పంధా
ఇంతకీ రాహుల్ పీ యం  అవుతాడా ?
అవాలని ఆయనకు ,చేద్దామని తల్లికి వుంది .ఈయన పోడిచేసిన్దేమీ లేదని పార్టీకి వుంది చేస్తే ఎమవుతాదోనని భయము వుంది .పార్కలాం .
గురూ గారు ! నా తిత్తి తీసారు మీరు .చెప్పే వాడికి అడిగే వాడు లోకువ అని పించేట్లున్నాయి మీ నిర్ వచనాలు .గుడ్ బయ్
                                                                                   గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు | Leave a comment

మే ఎండలు …. మే ఎండలు …… మే ఎండలు ……….. !!!!!!! ?

                                              మే ఎండలు 
                  మే ఎండలు మెండుగా మండుతున్నాయి                                        
పగటికి రాత్రికి వేడిలో తేడా చాందీ కి —
               అచ్యతానందన్ కు వున్న అత్యల్ప సీట్ల తేడా అంతే
ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయ్
              జగన్ మెజారిటీ లా గా  అందకుండా
              రోడ్డు లన్నీ నిర్మానుష్యం గా వున్నాయి
             బెంగాల్లో లెఫ్ట్ వాళ్ల సీట్లు లా
             మల మల  మండి పోతున్నాయి రోడ్లు
            వోటమికి ,కూతురు జైలుకు
            మండి పోతున్న కరుణ లా
          కారం రాచినట్లుంది
       నిస్పృహా ,నీరసం తో  జనం అల్లాడి పోతున్నారు
      కోట్లు గుమ్మరించినా ఫలితం దక్కని అభ్యర్దుల్లా
      ఆశించిన ఫలితాలు రాక
   నిప్పుల సెగ కక్కుతున్నారు అధినాయకులు
  గుక్కెడు తాగు నీళ్ళకు ,కాసింత సాగు నీటికి
  కాసేపు  కరెంటు కు -మొగం వాచీ, గిట్టుబాటు  ధరకు
 ఎదురు చూస్తూ రోడ్డు మీదే భైతా ఇస్తుంటే
పదవి వుంటుందో ఊడు తుందో తెలీని
ఉక్కిరి బిక్కిరి వుక్క పోతలో అధికార గణం
గో  గాయ్ లా జాయ్ లేదు .మమత లా అంతులేని అధికారం లేదు
జయ లలిత లా వ్యూహం లేదని
కావు వేసిన మామిడి కాయల్లా మగ్గుతున్న ఆంధ్ర నాయక గణం
iఇంకెంత కాలం  వచ్చే వచ్చే వానా కాలం
అని మళ్ళీ electionla దాకా చాతక పక్షుల్లా
ఎదురు చూపే మిగిలింది పాపం
శాంతం పాపం .                                                                                        
                                                                                      దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | 1 Comment

ఏపులు మన పూర్వీకులే

  ఏపులు మన పూర్వీకులే
డాల్ఫిన్లు మనకజిన్లు అని రాసింది చదివి ఎట కారం గా ఒకావిడ అయితె ఏపులు మన మేనత్తలా అని ప్రశ్నించింది అమాయకం గానే అయినా పాపం యదార్ధమే వక్కాణించిందిఏపులు నూటికి నూరు శాతం మన కు పరిణామ క్రమంగా పూర్వపు చుట్టాలే నని మనందరికీ తెలిసిన విషయమే .అవి విచారం లో కుర్చ్నే బుద్ధుని లాగ కూర్చుంటాయి telusaa ?  వాటి కను ర్రేప్పలు దువ్వినట్లు వుండి కళ్ళ అడుగునుంచి మంటలు వ్యాపిస్తున్నట్లు వుండటం ఆశ్చర్యం వేస్తుంది .అయితె చింపాంజీలు  .ఇవి మానవులకు మరీ దగ్గర ,ఇవి తక్షొనొమిక్ కుటుంబానికి చెందినవి .కొన్ని మిలియన్ల సంవత్చారాలకు పూర్వం వాటికి మనకూ ఒకే పూర్వీకులుందే వారు .తర్వాత పరిణామ క్రమం లో విభజన జరిగి వేరయ్యాం .మనకున్న అసలైన పూర్వీకులు లేచి నిలబడి నడిచే వారు .వారి మెదడు అభివృద్ధి చెంది మేధస్సు పెరిగింది క్రమం గా .ఆఫ్రికా ,ఆసియా ల లోని ఉష్ణ మాపక అడవుల్లో గ్రేట్ ఏపులు వుంటాయి వాటి సంఖ్య రెండున్నర లశాలుగా తెల్చ్చారు .వీటిలో చింపాంజీలు రుజు రుజు కీ తగ్గి పోతున్నాయట .
                          egipt దేశం లో బాబూన్స్ అనే కోతి జాతి సూర్య ,చంద్ర నక్షత్రాలకు వారసులు గా భావిస్తారు వాటిని భక్తీ తో కొలుస్తారు .వీళ్ళకు ఏపులు ఆరాధ్య దైవాలే ప్రేమాస్పదులే ..పూర్వం egipt లో ఎపులను కుడా మమ్మీలు గా భద్ర పరచే వారట .2650 బి.సి .  లో ప్రారంభమైన పూర్వ రాజరికం లో బాబూన్లను చంద్ర దేవత ,జ్ఞాన దేవతలు  గా పూజించే వారు .చంద్రదేవతకు troth అనే పేరుంది ఆ దేవతను మానవ రూపం లో తలకాయ మాత్రం బబూన్ తలతో ఉండేట్లు చేసి ఆరాధించే వారు .ఇప్పుడు సూడాన్ ఈగిప్ట్  లలో వున్న నూబియన్ తెగ వారు ఎపులకు మానవ భాష బాగా అర్ధమవుతుందని నమ్ముతారు ,.మానవ పిల్లల కంటే ఎపుల పిల్లలు భాషను త్వరగా నేర్చి మించిపోతాయని భావిస్తారు .భారత దేశంలో రామాయణం అంతా వానర సమూహం తోనే నడిచింది అన్న సంగతి చారిత్రాత్మక సత్యం రామాయణం తోడు ,.వాల్మీకి పై వొట్టు .కాదంటారా మేడం ??
                         చినా ,జపాన్ ల లో రాతి యెపును “”SUN -Whiking ” గా భావిస్తారు వడానికి అతీంద్రియ శక్తులుమ్మాయని ,త్వరలో వానర సామ్రాజ్యాధిపతి అవుతాడని విశ్వ సిస్తారు .సన్ whiking కు తాను చిరం జీవి అవుతానని చెప్పాడట మన ఆంజనేయుడు జాంబవంతుడు చిరంజీవులే కదా ?ఆంటే కాదు వచ్చే మన్వంతరం లో ఆంజనేయుడు బ్రహ్మ అవుతాడు అందుకనే అస్తోత్తరం లో””భవిష్యత్  బ్రహ్మ నేనమః ”అని పూజిస్తారు .వ్హికినగ్ జ్ఞానాన్ని సంపాదించ టానికి ప్రపంచం అంతా తిరిగాడు .ఒక toist
రుషి కనపడితే జ్ఞాన భిక్ష పెట్టమన్నాడు .అతను ఇతనికి 72 గత జన్మల రహస్యాన్ని చెప్పాడట .మబ్బుల్లో ఎగిరే విద్య నేర్పించాడు.ఒక మంత్ర దండం తో చాలామందిచెందిరాక్షసులని చంపాడు వీళ్ళు jade సామ్రాట్టు సైనికులే ..అహం తగ్గి చివరకు స్వర్గం చేరాడు .jade కు కోపం వచ్చి ఇతనిపైకి పెద్ద సైన్యాన్ని పంపాడు . ఆ రాతి కోతి చాల శక్తి వంతుదని గ్రహించి బుద్దున్ని సరను కోరాడు  .ఇద్దరికీ సంధి చేసాడు ఆయన చాల కాలం స్వర్గ సుఖాలు అనుభవించి  jade తో మిత్రత్వం నేరిపాడు .””Buddha victorious against disaster ”అనే బిరుదు పొందాడు ..ఇప్పటికి ఈ రాతి కోతి ని అపురూపం గా భావించి 2008 ఒలింపిక్స్ కు మస్కట్ గా ఏర్పాటు చేసారని విన్నాను .ఇది మాత్రం సబ్జెక్టు to   correction
                            చైనా వాళ్ల కధల్లో సాని దేవత ఎపు shape లో విహరించి వినోదించి నట్లు కధనం ఉందిuravin .పాశ్చాత్య నాగరికత లో ఎపులను చిరంజీవులు గానే గౌరవించినట్లుంది .
                      మన కజిన్లు అని చెప్పుకున్న దాల్ఫిన్లు తమ జీవితాలను fission అండ్ fusion సంఘాలుగా గడుపుతాయని అంటారు .ఇంతకీ fission ఆంటే ?
  స్థానికం గా తమ కు పుట్టిన సంతానం ఆపు లేకుండా విభజింపబడి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వేరే విధం గా జీవించటం .fusion అంత అవి మళ్ళీ మాత్రు స్థానానికి తిరిగి రావటం నుక్లేఅర్ ర reactions అన్నీ fission and fusion అన్న సంగతి మనకూ తెలిసిందే కదా ?ఇలా సంఘ జీవనం లో మనము ఏపులు డాల్ఫిన్లు దాదాపు ఒకే పద్ధతి నే అనుసరిస్తున్నాము అందుకే అవి మన పూర్వీకులు ,కజిన్లు అన్నాం
                                                 అయ్యా !ఇదీ మన వార సత్వ ఆంటే వానరత్వ  కదా కమామీషు  ,
                                                                                                 మీ
                                                                                            దుర్గా ప్రసాద్
Posted in రచనలు | Leave a comment