టెంకణాదిత్య , కవిరాజశిఖా మణి నన్నె చో డుని కుమార సంభవం.1 వ భాగం.26.10.24.

టెంకణాదిత్య , కవిరాజశిఖా మణి నన్నె చో డుని కుమార సంభవం.1 వ భాగం.26.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.22 వ భాగం.26.10.24.

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.22 వ భాగం.26.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బుచ్చి బాబు (; శివరా జు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.20 వ భాగం.25.10.24.

శ్రీ బుచ్చి బాబు (; శివరా జు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.20 వ భాగం.25.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0 కటేశ్వర.25 వ భాగం.25.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0 కటేశ్వర.25 వ భాగం.25.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ సీతా రామాంజనేయ సంవాదం కర్త శ్రీ పరశురామ పంతుల లింగ మూర్తి గురు మూర్తి గారి జీవితం సాహిత్యం.5 వ చివరి భాగం.25.10.24.

శ్రీ సీతా రామాంజనేయ సంవాదం కర్త శ్రీ పరశురామ పంతుల లింగ మూర్తి గురు మూర్తి గారి జీవితం సాహిత్యం.5 వ చివరి భాగం.25.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.21 వ భాగం.25.10.24.

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.21 వ భాగం.25.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ క టికం.20 వ భాగం.24.20.24.

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ క టికం.20 వ భాగం.24.20.24.

Posted in రచనలు | Leave a comment

ఆత్మకూరు సంస్థాన విద్వత్ కవిశేఖరులు , అవధాని –శ్రీ కార్య (రేం )పూడి రాజమన్నారు కవి

ఆత్మకూరు సంస్థాన విద్వత్ కవిశేఖరులు , అవధాని –శ్రీ కార్య (రేం )పూడి రాజమన్నారు కవి

‘’ప్రకాశం జిల్లా పేరాల గ్రామం లో శ్రీ కార్యం పూడి రాజమన్నారు కవి1846లోజన్మించారు .మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు సంస్థానం లో స్థిర పడ్డారు .చిన్నతనం లోనే ప్రసిద్ధ అవధాని శ్రీ మాడభూషి వే౦కటా చార్యుల వారి వద్ద అవధాన పద్ధతులన్నీ అవపోశన పట్టారు .

 తెలుగు దేశం లో వివిధ ప్రాంతాలలో 78 అవధానాలు చేసి విస్తృత కేర్తి సంపాదించారు .బ,హు సన్మానాలు అందుకొన్నారు .ఆత్మకూరు వనపర్తి ,పిఠాపురం మొదలైన సంస్థానాలు దర్శించి జమీందారు ప్రభువులచే ఘన సన్మానాలు అందుకొన్నారు .’’వీపూరి పాలెపు వివిధావధానం ‘’,’’భగవన్నామ భాగవతం ‘’,కారంచేడు మాధవ స్వామి శతకం ‘’,’’మకర కుండల విజయం’’,మహేశ శతకం ,’’’’రాజవంశ రత్నావళి ‘’,’’శృంగార జావళీలు ‘’,’’శ్రీ కృష్ణ లీలలు ‘’,’’సమస్యా శతకం ‘’,’’హరిశ్చంద్ర శతకం ‘’,’’హేలాపురీ (ఏలూరు )కన్యకా పరమేశ్వరీ దండకం ‘’మొదలైన రచనలు చేశారు .ఆత్మకూరు సంస్థానం లో శ్రీ రాజా ముక్కండ సీతారామ భూపాలుదు ఈ అవధాన కవిని బాగా ఆదరించి గౌరవించారు.వీరు 72వ ఏట 1917లో స్వర్గస్తులయ్యారు  ‘’ఆని గుంటూరుజిల్లా చిలుమూరు రూరల్ కళాశాల లెక్చరర్ శ్రీ కొలసాని శ్రీరాములు రాయకపోతే ఈ విద్వత్ కవి ,అవధాని గురించి ఎవరికీ తెలిసేదికాదు .గూగుల్ ,వికి పీడియాలో కూడా వీరి గురించి ఒక్క ముక్క కూడా లేక పోవటం విడ్డూరం. ఫోటో కూడా అలభ్యం .బహుశ అవధాన చరిత్రలో వీరి గురించి ఉందేమో ?

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-24-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.9 వ భాగం.23.10.24.

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.9 వ భాగం.23.10.24.

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.9 వ భాగం.23.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే 0క టేశ్వర.24 వ భాగం.23.10.24.

శ్రీ సీతా రామాంజనేయ సంవాదం కర్త శ్రీ పరశురామ పంతుల లింగ మూర్తి గురు మూర్తి గారి జీవితం సాహిత్యం.4 వ భాగం.23.10.24.

శ్రీ సీతా రామాంజనేయ సంవాదం కర్త శ్రీ పరశురామ పంతుల లింగ మూర్తి గురు మూర్తి గారి జీవితం సాహిత్యం.4 వ భాగం.23.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.19 వ భాగం.23.10.24.

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.19 వ భాగం.23.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

త్యాగశీలి ,స్వాతంత్ర్య సమర యోధులు ,విశిష్టాద్వైత గురు –శ్రీ చిలక మర్రి వేంకట కృష్ణ మాచార్యులు

త్యాగశీలి ,స్వాతంత్ర్య సమర యోధులు ,విశిష్టాద్వైత గురు –శ్రీ చిలక మర్రి వేంకట కృష్ణ మాచార్యులు

1900లో కృష్ణా జిల్లా మచిలీ పట్నం లో శ్రీ వెంకటార్యులు శ్రీమతి ఆండాళమ్మదంపతులకు వేంకట కృష్ణ మాచార్యులు జన్మించారు .తండ్రి ఇంజనీర్ గా ఉద్యోగం లో చేరి ,,పంటపొలాలకు కాలువలు త్రవ్వించి వ్యవసాయాభి వృద్ధికి విశేషంగా తోడ్పడ్డారు .కాపురం విజయ వాడలో . టైఫాయిడ్ తొ మరణించారు .

  రెండేళ్ళ వయసున్న కృష్ణమా చార్యులను తల్లి ,నాయనమ్మ సూరమ్మ గుంటూరుజిల్లా  గోవాడ తీసుకు వెళ్లారు .యాభై ఎకరాల ఆస్తికి ఈయనే ఏకైక వంశాంకురం .వీధి బడిలోనే చదివి ఆంధ్ర నామ సంగ్రహం ,అమరకోశం పూర్తి చేసి ,తెనాలి హైస్కూల్ లో చదువుతూ ,గాంధీజీ పిలుపుతో 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొన్నారు .16వ ఏట బాపట్లలో శ్రీమాన్ కొమాండూరి రామానుజాచార్యుల వద్ద మూడేళ్ళు సంస్కృతం నేర్చారు .విశిష్టాద్వైత విధానం లో మంత్రాలు ,వాటి అర్ధాలు శ్రీ భాష్యం ,ద్రావిడ నాలాయిరం ,తిరువాయిమొడివగైరా అధ్యయనం చేసి మళ్లీ గోవాడ చేరారు . పదహారవ ఏట మొదటి వివాహం జరిగి ,భార్య కొద్దికాలం లోనే టైఫాయిడ్ తొ మరణించింది .22వ ఏటతల్లి నాయనమ్మ ల బలవంతం పై రామానుజమ్మ గారిని  ద్వితీయం చేసుకొని ,దంపతులిద్దరూ గాంధీ గారి నిర్మాణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు .గోవాడలో అస్పృశ్యతా నివారణ చేశారు .తల్లి ఎంత వద్దని వారించినా ఆచార్యులు గారు ఒక హరిజన సోదరుడి చేత ఇంటి బావి లోని నీరు తోడించి నోట్లో పోసుకొని తాగారు..ఆనాడు ఆచార్యశ్రీ చేసినది అత్యంత సాహసోపేత చర్యగా ప్రజలంతా చెప్పుకొనే వారు .

  1929లాహోరు కాంగ్రెస్ సభలలో పాల్గొని వచ్చి ఉన్నవ లక్ష్మీనారాయణ ,కొండా వెంకటప్పయ్య ,మద్ది సుదర్శనం మొదలైన ఆనాటి అగ్ర నాయకుల అడుగు జాడలలో నడుస్తూ ,పల్లెల్లో ,పట్టణాలలో అనేక ఉద్యమాలలలో పాల్గొన్నారు .స్వయంగా గోవాడ లో యువ మిత్రుల ఉద్యమం నడిపి ,బావినీరు కాచి ఉప్పు తయారు చేశారు .దీనికి ఈయన ఆబృందం అరెస్ట్ చేయబడి 7-8-1930 నుండి ఒక ఏడాది బి క్లాస్ జైలు శిక్ష విధీంప బడ్డారు .ఈ శిక్ష రాజమండ్రి ,రాయవెల్లూరు ,కన్ననూరు జైళ్ళలో అనుభవించారు .సత్యాగ్రహోద్యమం లో ఉండగా ఆచార్యుల వారు తనకున్న చాలాభూమిని అమ్మేశారు .

  తర్వాత ఆయన దృష్టివ్యాపారం పై పడింది .ఉన్న భూములన్నీ అమ్మేసి 1941లో తెనాలి లో ‘’గుడ్ విల్  అండ్ కొ ‘’సంస్థ స్థాపించి ,అయిదుగురు గుమాస్తాలతో ఫాన్సీ సామగ్రి, రేడియోలు, రికార్డ్ ప్లేయర్లు ,సంగీత పరికరాలు వంటివి అమ్మారు .అమ్మకాలు బాగా ఉన్నా  బాకీలు ఎక్కువై ,వసూలు కాకపోవటం తొ ,ఒత్తిడి చేయలేని మనస్తత్వం కల ఆచార్యస్వామి వ్యాపార౦ ఎత్తేసి ,గోవాడలో ఇల్లు అమ్మేసి ,తెనాలిలో డాబా కొన్నారు .అప్పటికే వైరాగ్యం ప్రవేశించి ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తూ ,ప్రచారం చేస్తూ 25-7-1975 న 75వ ఏట  శ్రీ కైవల్యం చేరారు .’’విశాల ఫాలభాగంతో ,,విరాజిల్లే ఊర్ధ్వ పు౦డ్రాలతో ,పెద్దంచు శాలువాతో వైష్ణవ సంప్రదాయ సంస్కృతిని ప్రతిబి౦బించేట్లు శ్రీమాన్ చిలకమర్రి వేంకట కృష్ణ మాచార్యులు గారు ఉండేవారు ‘’ఆని జ్ఞాపకం చేసుకొన్నారు గోవాడ వాస్తవ్యులు శ్రీ తుమ్మల వెంకటరత్నం గారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-24-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.8 వ భాగం.22.10.24.

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.8 వ భాగం.22.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0 కటేశ్వర.23 వ భాగం.22.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0 కటేశ్వర.23 వ భాగం.22.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ సీతా రామాంజనేయ సంవాదం కర్త శ్రీ పరశురామ పంతుల లింగ మూర్తి గురు మూర్తి గారి జీవితం,సాహిత్యం.3. వ భాగం.22.10.24.

శ్రీ సీతా రామాంజనేయ సంవాదం కర్త శ్రీ పరశురామ పంతుల లింగ మూర్తి గురు మూర్తి గారి జీవితం,సాహిత్యం.3. వ భాగం.22.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.18 వ భాగం.22.10.24.

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.18 వ భాగం.22.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ సీతా రామాంజనేయ సంవాదం కర్త – శ్రీ పరశురామ పంతుల లింగ మూర్తి గురు మూర్తి గారి జీవితం, సాహిత్యం.2 వ భాగం.21.10.24.

శ్రీ సీతా రామాంజనేయ సంవాదం కర్త – శ్రీ పరశురామ పంతుల లింగ మూర్తి గురు మూర్తి గారి జీవితం, సాహిత్యం.2 వ భాగం.21.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.22 వ భాగం.21.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.22 వ భాగం.21.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.17 వ భాగం.21.10.24.

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.17 వ భాగం.21.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.6 వ భాగం.20.10.24.

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.6 వ భాగం.20.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.21 వ భాగం.20.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.21 వ భాగం.20.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సీతా రామాంజ నేయ సంవాదం కర్త – శ్రీ పరశురామ పంతుల లింగ మూర్తి గారి జీవితం ,సాహిత్యం.1 వ భాగం.20.10.24.

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.16 వ భాగం.20.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సుప్రసిద్ధ పరిశోధకుడు భాషా శాస్త్ర వేత్త,తెలుగు వ్యాకరణ కర్త ,చే.రా.కు గైడ్ ,అంతర్జాతీయ తెలుగు సంస్థకు అంకురార్పణ చేసిన – ప్రొఫెసర్ కేలీ జేరల్ట్ ,బి.

సుప్రసిద్ధ పరిశోధకుడు భాషా శాస్త్ర వేత్త,తెలుగు వ్యాకరణ కర్త ,చే.రా.కు గైడ్ ,అంతర్జాతీయ తెలుగు సంస్థకు అంకురార్పణ చేసిన – ప్రొఫెసర్ కేలీ జేరల్ట్ ,బి.
ఈ శతాబ్దంలో యూరప్ అమెరికా ఖండాల్లో భాగా వ్యాప్తి చెంది న చెందిన భాషా శాస్త్ర మద్దతులలో తెలుగు భాష రహస్యాలు పరిశోధించిన వారిలో జరల్ట్ బి కేలి బుక్కులు తెలుగు భాష గురించి చాలా విషయాలు కొత్తగా ఈయన చెప్పారు వివిధ పరిశోధన సంచికలలో తెలుగు భాష గురించి 1954 నుంచి వ్యాసాలు రాస్తూ వచ్చారు ఈ అభిప్రాయాలని ఒకచోట చర్చ్ 1965 లో ఒక తెలుగు వ్యాకరణం రాశారు ప్రచురణ విషయంలో శ్రద్ధ చూపకపోవడంతో అది మరుగున పడింది.ఈయన 1926లో జన్మించి 1987డిసెంబర్ 8న61ఏళ్ల వయసులో మరణించారు .
తెలుగులో స్వర వర్ణాలు ,ఉచ్చారణలో సంధి చాలా మార్పులు పొందుతాయి .ఈ మార్పులుకుడి నుంచి ఎడమలకు విస్తరించి ఆ పక్కన ఉన్న అచ్చులను కూడా ప్రభావితం చేస్తాయి ఈ ప్రభావాలను వివృతీకరణ ,తాలవ్యీ కరణాలుగా గుర్తించి వాటి ప్రవర్తనలో క్రమపద్ధతులను వివిధ వ్యాసాలలో వివరించారు . తెలుగు అచ్చుల విచారణలో వచ్చే ధ్వని భేదాలపై అతి విస్తారమైనచర్చ చేసింది ఈయనే .
తెలుగు నామ సంబంధాలలో ,వివిధ విశేషణాల ప్రయోగం లో తెలుగు వారు పాటించే నియమాలను గురించి కూడా ఈయన ఒక వ్యాసం రాశారు .తెలుగు సర్వనామాల ప్రయోగానికి ,వాటి నిఘంటు అర్ధం తెలిస్తేచాలదు .వ్య్వహర్తలమధ్య ఉన్న సాంఘిక తేడాలు ,పరస్పర గౌరవ ఆదరణలు ,ఆత్మీయతా సంబంధాలు గురించి బాగా తెలియాలి .తన వ్యాకరణం లో వీటిని విస్తృతంగా చర్చించి రాశారు .
సామాజిక భాషా పరిశోధక పధ్ధతి (సోషియో –లింగ్విసిక్స్ )లో ఉపయోగిస్తారని కేలే నిరూపించారు .భారత భాషా వ్యవహారాలపై ఆసక్తి ఉన్న అమెరికన్ శాస్త్రజ్ఞులలో కూడా హిందీ భారతీయ సర్వ సామాన్యమైన భాషగా ఉండాలనే భావించేవారు మరి కొందరున్నారు .వీరంతా రెండవ వర్గానికి చెందిన వారు .
అమెరికాలోని మాడిసన్ నగరం లో ఈయన యూని వర్సిటి ఆఫ్ విస్కాన్సిన్ లో ఉన్నత విద్యాభ్యాసచేసి పిహెచ్ డి పొంది 1963నుంచి 1987లో మరణించే వరకు న్యూయార్క్ రాష్ట్రం ‘’ఇతాకా ‘’పట్టణం లో కోర్నేల్ యూని వర్సితిలో భాషా శాస్త్ర ప్రొఫెసర్ గా పని చేశారు .తరచుగా హైదరాబాద్ వస్తూ, ఉస్మానియా విశ్వ విద్యాలయ భాషా శాస్త్ర శాఖతో చాలా ఆత్మీయ సంబంధాలు కలిగి ఉండేవారు .1975లో హైదరాబాద్ లో మొదటి ప్రపంచ తెలుగు సమావేశం జరిగినప్పుడు కేలీ వచ్చి చురుకుగా పాల్గొన్నారు ..ఇందులో జెపి ఎల్ గ్విన్ తొ కలిసి అంతర్జాతీయ తెలుగు సంస్థకు ప్రాతిపదిక వేశారు .ఈ సంస్థ ఏర్పడి కొన్నాళ్ళు పని చేసి ,1986లో’’ తెలుగు విజ్ఞాన పీఠం ‘’గా మారి ,చివరికి తెలుగు విశ్వ విద్యాలయం లో కలిసి పోయింది .
కేలీ గొప్ప ఉపాధ్యాయులుగా పేరు పొందారు .భారతీయ భాషలపై పరిశోధన చేసిన చాలామంది విద్యార్ధులకు ఈయన పర్యవేక్షకులుగా ఉన్నారు .శ్రీ చేకూరి రామారావు’’ తెలుగు వాక్య నిర్మాణం ‘’పై చేసిన పరిశోధనకు కేలీ యే గైడ్ .ఈయనకు విద్యార్దులపైనా ఆదరణ ఎక్కువ విద్యార్ధులకు ఈయన అంటే అధిక గౌరవం .చే రా,1975లో రాసిన ‘’తెలుగు వాక్యం ‘’గ్రంథం ఈయనకే అ౦కిత మిచ్చి తన గురుభక్తి చాటుకొన్నారు .జీవితంలోనూ ,పరిశోధనలోనూ ఈయన ‘’నాన్ –కన్ఫార్మిస్ట్ ‘’భగవద్దత్త సత్య వాదమని (గాడ్స్ ట్రూత్ స్కూల్ ),కలగాపులగపు వాదమని (హోకస్ ఫోకస్ స్కూల్ )అనే రెండు వాదాలు ఉండేవి .తాను రెండవ దానికి చెందుతానని ఆయనే చెప్పుకొన్నారు .ఈ విశేషాలన్నీ ‘’చే రా ‘’గారు రాసిన వ్యాసం లోనివే .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-24-ఉయ్యూరు .

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు ) గారి సాహిత్య వ్యాసాలు.5 వ భాగం.19.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.20 వ భాగం.19.10.24

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.20 వ భాగం.19.10.24

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.20 వ భాగం.19.10.24

Posted in రచనలు | Leave a comment

పరాశర స్మృతి.4 వ భాగం.19.10.24.

పరాశర స్మృతి.4 వ భాగం.19.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.15 వ భాగం.19.10.24

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.15 వ భాగం.19.10.24

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.4 వ భాగం.18.10.24.

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.4 వ భాగం.18.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.19 వ భాగం.19.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.19 వ భాగం.19.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పరాశర స్మృతి.3 వ భాగం.18.10.24.

పరాశర స్మృతి.3 వ భాగం.18.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.14 వ భాగం.18.10.24.

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.14 వ భాగం.18.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు. 3 వ భాగం.17.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.18 వ భాగం.17.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.18 వ భాగం.17.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పరాశర స్మృతి.2 వ భాగం.17.10.24.

పరాశర స్మృతి.2 వ భాగం.17.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.13 వ భాగం.17.10.24.

శూద్ర క మహాకవి కృత నాటకం మృ చ్ఛ కటికం.13 వ భాగం.17.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.2 వ భాగం.16.10.24.

శ్రీ బుచ్చి బాబు ( శివరాజు వెంకట సుబ్బారావు) గారి సాహిత్య వ్యాసాలు.2 వ భాగం.16.10.24.

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.17 వ భాగం.16.10.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.17 వ భాగం.16.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

పరాశర స్మృతి.1 వ భాగం.16.10.24.

పరాశర స్మృతి.1 వ భాగం.16.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.12 వ భాగం.16.10.24.

శూద్ర క మహా కవి కృత నాటకం మృ చ్ఛ కటికం.12 వ భాగం.16.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రసిద్ధ జ్యోతిష ,ఆయుర్వేద పండితులు –సాహిత్యరత్న ,కవి సింహ శ్రీ గొల్లాపిన్ని రామ కృష్ణ శాస్త్రి

ప్రసిద్ధ జ్యోతిష ,ఆయుర్వేద పండితులు –సాహిత్యరత్న ,కవి సింహ శ్రీ గొల్లాపిన్ని రామ కృష్ణ శాస్త్రి

కర్నూలు జిల్లా కోడుమూరు లో వెలసిఉన్న ‘’పల్లెలా౦బా దేవి’’ని ఇల వేల్పుగా ఆరాధించే గోల్లాపిన్ని పండిత వంశం లో జన్మించారు శ్రీ గొల్లాపిన్ని రామ కృష్ణ శాస్త్రి .ఆవంశం వారందరికి ‘’కవేశ్వర ‘’బిరుదు వారసత్వంగా లభించింది .అక్ష విద్య ,జ్యోతిర్విద్య లలో  వారంతా సుప్రసిద్ధులు .గోల్లాపిన్నిమల్లికార్జున శాస్స్త్రి గారు ఈ వంశంలో లబ్ధ ప్రతిష్టులు .గొల్లాపిన్ని సోదర త్రయం లో  వాసుదేవ శాస్త్రి ,రామ చంద్ర శాస్త్రి ,రామ కృష్ణ శాస్త్రి ఆధ్యాత్మిక సంపన్నులు ,విద్వాంసులు అయిన శ్రీ గోల్లాపిన్ని సీతారామ శాస్త్రి ,శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు జన్మించారు .వీరిలో  మన రామకృష్ణ శాస్త్రి గారు ఉభయభాషలలో ,ఆయుర్వేద జ్యోతిషాలలో  ఉద్దండ పండిత వరేణ్యులు .

  రామకృష్ణ శాస్త్రిగారు 1922లో జన్మించి 79వ ఏట 2001లో స్వర్గస్తులయ్యారు .సర్వ తంత్ర స్వతంత్ర ,కవిసింహ ,విద్యానిధి బిరుదాంకితులు .తమ్ముడు రామ చంద్ర శాస్త్రిగారు మంచికవి ,జ్యోతిశ్శాస్త్ర పారంగతులు .శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారు రచించిన ‘’రఘునాథీయం ‘’ కావ్యానికి రామకృష్ణ శాస్త్రి గారు కృతి భర్తలు .రాష్ట్ర ఎక్సైజ్ శాఖాలో కడపలో ఆఫీసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు .నిత్యం ఊపిరి సలపని కార్యక్రమంలో ఉంటున్నా ,రోజూ కొంత సమయం సాహిత్యానికి కేటాయించేవారు .ఏపని అయినా ప్రతిఫలం ఆశించకుండా చేయటం ఆయన ప్రవృత్తి .అనంతపురంజిల్లా తాడిపత్రి లో ‘’రాయల కవితా కళా సమితి ‘’స్థాపించి మహాకవి గడియారం వెంకట శేష శాస్త్రి, సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణా చార్యులు మొదలైన వరిష్ఠ కవిపండితులను గజారోహణం ,గండ పెండేర ప్రదానం ,పౌరసన్మానం చేయించి ఘనంగా సత్కరించారు .పుట్టపర్తి వారి ‘’పాద్యం ‘’కావ్యావిష్కరణ రాయల  కళా సమితి లోనే గొప్పగా జరిగింది .కడప అనంతపురం జిల్లాల రచయితల సంఘాలు అనంతపురం విశ్వ కళా పరిషత్తు ,కర్నూలు జిల్లా బనగానపల్లి అరుణ భారతి ,అనంతపురం హిందూపురం స్వర్ణభారతి మొదలైన ప్రసిద్ధ సాహితీ సంస్థల లో శాస్త్రిగారు విశిష్ట సభ్యులై ఎన్నెన్నో  విశేష  కార్యక్రమాలు నిర్వహించారు .

  రామకృష్ణ శాస్త్రి గారికి అనంతపురం లోని ఇల్లే కార్యాలయంగా ,డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారితో కలిసి స్థాపించిన ‘’రాయల కళాసమితి ‘’తాడిపత్రిలో తమ కుటుంబ సభ్యులద్వారా ప్రముఖ జ్యోతిశ్శాస్త్ర పండితులు వశ్యవాక్కుఅయిన శ్రీ గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రిగారు రచించిన అపురూప గ్రంథాలు ‘’వాసు దేవానందం ‘’’’పురుషోత్తమశతకం’’. సవ్యాఖ్యానంగా ప్రచురించారు .రామకృష్ణ శాస్స్త్రి గారి సాహితీ సేవకు  హిందూపురం స్వర్ణభారతి ‘’సాహితీ రత్న ‘’బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది .2000లో కడప ‘’అల్లసాని పెద్దన సాహిత్య పీఠం ‘’శాస్త్రిగారిని మహోత్క్రుష్టంగా గౌరవించి సత్కరించింది .రాష్ట్రమంతా శాస్త్రిగారికి పలు సన్మానాలు పెద్ద ఎత్తున జరిగాయి .

   రామకృష్ణ శాస్త్రి గారు ‘’నాకవన కదంబం ‘’కవితాఖండికలను హైదరాబాద్ లోని విన్నకోట మాధవ రావు ట్రస్ట్ ప్రచురించింది..వీరు వచన కావ్యంగా  ‘’హంసానంద  యతీంద్రుల  జీవిత చరిత్ర ‘’రాశారు .వీరు రాసిన ఎన్నో సాహిత్యవ్యాసాలు విమర్శలు అనేక పత్రికలలో ప్రచురితాలు .గడియారంవారి ‘’శివ భారతం ‘’పై వచ్చిన విమర్శలపై  శాస్త్రి గారు శరపరంపరగా రాసిన ప్రతి విమర్శ వ్యాసాలు విద్వజ్జన ప్రశంసలు అందుకొని గడియారం వారి కీర్తి కిరీటం లో కలికి తురాయి లాభాసించాయి . .

 కడప, అనంతపుర౦ ఆకాశ వాణి కేంద్రాలనుండి శాస్త్రిగారి పురాణ కాలక్షేపాలు సాహిత్యోపన్యాసాలు ,సామెతలు బహుళంగా ప్రచారమై కీర్తికిమరింత వన్నెలు చిన్నెలు తెచ్చాయి ,ఎన్నో గ్రంథాలకు ,పరిశోధన వ్యాసాలకు ,సిద్ధాంత వ్యాసాలకు శాస్త్రి గారు  తనవంతు సహకార౦ పరోక్షంగా అందించారు.వాటికి మెరుగులు పెట్టటం ,పీఠికలు అభిప్రాయాలు రాయటం తో ఆయనకు చేతి నిండా ఎప్పుడూ పని ఉండేది .ఆధ్యాత్మిక రంగం లో ,జ్యోతిర్దర్శన విద్యలో ,ఆధునిక యోగాభ్యాసం ‘’రేకీ’’విధానంలో ఆయన గొప్ప సాధన చేశారు .

కర్నూలు జిల్లాలోకోడుమూరు లోని తమ కులదేవత ‘’పల్లెలాంబా దేవి ‘’ఆలయాన్ని అన్నగారు  రామ చంద్ర శాస్త్రి గారితో కలిసి జీర్ణోద్ధరణ చేశారు రామకృష్ణ శాస్త్రి గారు .దాదాపు 80ఏళ్ల జీవితాన్ని అత్యంత సార్ధకం చేసుకొన్నపుణ్యపురుషులు సాహితీ రత్న ,కవి సింహ  శ్రీ గొల్లాపిన్ని రామకృష్ణ శాస్త్రి గారు .ఈ విషయాలన్నీ శ్రీమతి గొల్లాపిన్ని వసుంధర గారు తెలియ జేశారు .చివరగా మచ్చుకు శాస్త్రిగారి పద్యాలు రెండు  రుచి చూద్దాం

1-      సీ. కాకతి క్ష్మాపతి కాంచుచున్నాడు హ
ర్షాశ్రు ముక్తామాల సంతరించి
హరిహర బుక్కరాయలు కాంచుచున్నారు
తెలినవ్వు చలువ వెన్నెలల బరసి
ఘనుడు విద్యారణ్యముని పలుకుచున్నాడు
సిరిలొల్క వైదికాశీస్సు గురుసి
శ్రీకృష్ణరాయలు వాకొనుచున్నాడు
శక్రుతో నాంధ్ర ప్రశస్తియేమొ

గీ. గురుని కెఱిగించు చుండె తిమ్మరుసుమంత్రి
ఆంధ్రమంత్రుల సాహసౌదార్యములను
గతచరిత్రకు నీకు దార్కాణవారె!
వచ్చియున్నారు నీయుత్సవంబుఁజూడ.
(మహాంధ్రోదయము నుండి)

2-      కొనకొమ్మ కోయిల –కొసరు కూతలలోన –ప్రియురాలి పిల్పు –విన్పిమ్పలేదే ?

నిండు జాబిల్లి పండించు  వెన్నెలలోన –వేల్లనౌ మోము కాన్పింప లేదే ?

చేరువ సరసి లో –చెంగల్వ రేకులో –చమరించు కనుల లక్షింప లేదే ?

రాయంచ నడకలో ,రవళించు  పల్కులో –నినదించు నందెల వినగా లేదే ?

నీవు తపియించు చుండ ,మై నీడ వోలె –ప్రకృతి లో లీనమౌచు నద్వైత భక్తి

జంట బాయక నీ వెను వెంటనున్న –నీ యశోధర నైన మన్నింప లెమ్ము ‘’( శాస్త్రి గారి ‘’నా కావన కదంబం ‘’లోని బుద్ధ దేవా! నమః ‘’అనే శీర్షికలోని పద్యం )

మీ- గబ్బిట దుర్గా ప్రసాద -16-10-24-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ బుచ్చి బాబు( శివరాజు వెంకట సుబ్బారావు ) గారి సాహిత్య వ్యాసాలు.1 వ భాగం.15.10.24.

శ్రీ బుచ్చి బాబు( శివరాజు వెంకట సుబ్బారావు ) గారి సాహిత్య వ్యాసాలు.1 వ భాగం.15.10.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అభ్యుదయకవి రచయిత,పండితుడు -వట్టి కొండ రంగయ్య 

అభ్యుదయకవి రచయిత,పండితుడు -వట్టికోట రంగయ్య 

 వట్టికోట రంగయ్య   1914లో జన్మించి  19 98లో  మరణించారు  ఆయన పాండిత్యం  నివురు  కప్పిన నిప్పు  .అంత పాండిట్యాం ఉండీ  తెరమరుగైన  పండితులు  ఆంధ్ర సాహిత్య లోకంలో  ఎవ్వరు లేరు  నిర్దిష్టమైన  భాష శైలి  అభ్యుదయ భావాలు  ఆయన సాహితీ పరికరాలు .  ఆ పాండిత్యం  ఆయన మృతితో  తెరమరుగైపోయింది  ఆంధ్రదేశంలో  అభ్యుదయ సాహిత్య  ఉద్యమం  ప్రారంభకులలో  ఈయన ఒకరు  .  19 43  ఫిబ్రవరిలో  తెనాలిలో  ఏర్పడిన  అభ్యుదయ  రచయితల సంఘం  తొలి కార్యవర్గంలో  వీరు , వీరి సతీమణి  విశాలాక్షి  సభ్యులుగా ఉన్నారు  ఈ తొలి కార్యవర్గంలో  తాపీ  ధర్మారావు  అధ్యక్షులు.  చదలవాడ పిచ్చయ్య  కార్యదర్శి  చాగంటి సోమయాజులు  అశ్విని కుమార్  దత్తు  మహీధర  జగన్మోహన్రావు  ప్రయాగ  కోదండ రామ శాస్త్రి   రాటకొండ  నరసింహారెడ్డి  ఎం సర్వేశ్వరరావు  పత్తికొండ రంగయ్య  విశాలాక్షి  తాపి మోహన్రావు  శెట్టి  ఈశ్వరరావు  ఉన్నారు

ఈ  చారితరాత్మక  ఉద్యమ ప్రారంభంలో  ఆ కార్యవర్గం వర్గంలో  దంపతులిద్దరూ  ఉండటం  వీధి ఘనతకు   తార్కాణ  ఆ రోజుల్లో  వీరు ‘’ రంగ కవి ‘’ అనే పేరుతో  చాలా పద్యాలు  అభ్యుదయ భావ గేయాలు  రాశారు.  వాటిలో  మధు దయం  అరుణోదయం  అభ్యుదయ కవి ,విప్లవ జ్వాల  అభ్యుదయ గీతాలు  ముఖ్యమైనవి  విశాలాక్షి గారు  మంచి నవలలు  కథలు  రాసేవారు  .ఆమె నవలలు  భారత నారి  యుగధర్మం  ఖైదీ  స్వప్న  భంగం  నిష్కామయోగి  ఆత్మబలి  ప్రసిద్ధమైనది  తర్వాత  ఇద్దరు రాయటం మానేశారు. అలా మానకుండా ఉండి ఉంటే  ఎంతో  ఉత్తమ సాహిత్యం  వారి ద్వారా  లోకానికి అందేది  .దాదాపు  నాలుగు దశాబ్దాల  పాటు  నివురు  కప్పి ఉన్న  రంగయ్య గారి పాండిత్యాన్ని  చేరా  ,  బిఎస్ఆర్ కృష్ణ  కొద్దిగా బయటపెట్టారు.

రంగయ్యలోని  హిందీ పాండిత్యాన్ని  గురించి  ఇంకా లోకానికి  పెద్దగా తెలియలేదు  పండితలోకల్లో  వారికి  రావాల్సిన  గుర్తింపు  లభించలేదు  రెండేళ్లపాటు  చెన్నైలో  అప్పటి  ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ  పత్రిక ‘’ కాంగ్రెస్’’ కు   సంపాదకులుగా  ఉండి  ఆ తరువాత  1954లో  గుంటూరు వెళ్లి  కొన్నాళ్లపాటు ‘’ ప్రజావాణి’’  వార పత్రిక  నడిపి ,  దానిని మూసేసి  పూర్తిగా  సాహిత్య రంగాన్ని వదిలి  వ్యాపార రంగంలో ప్రవేశించి  బాగా    రాణించారు . సరదాగా ఆయనతో ‘’ మీరు  సరస్వతి కి విడాకులు ఇచ్చి  లక్ష్మిని చేపట్టారు’’  అని అంటే  ముసి ముసి నవ్వులు  మాత్రం విసిరేవారు . రంగయ్య గారు  84 వ ఏట  3-6- 1998  గుంటూరులో  మరణించారు .ఈ విషయాలన్ని  బి ఎస్ ఆర్ కృష్ణ  తెలియచేశారు.

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-  15 10  -24-  ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.16 వ భాగం.15.20.24.

బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తిరుపతి శ్రీ వే0క టేశ్వర.16 వ భాగం.15.20.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment