ధర్మ ధార
”నేను అజ్ఞానానికి సాక్షి గా వుండే దేవుడిని ”అనే నిశ్చయం వల్ల అనర్ధాలన్నీ తొలగి పోతాయి .”నా జ్ఞానం స్యామాహం దేవో జ్ఞాన సాక్షేతి నిశ్చయాత్ -సర్వానర్ధ నివ్రుత్తిస్యాత్ ”అంటుంది వేదాంత డిండి మం .
కాళీయ మర్దనం అంటె jump into the nector
గుడాకేశ అంటె అజ్ఞానం అనే నిద్రను జయించిన వాడు –అర్జునుడు
బయట వున్న కుండలో ,లోపల బయట అంతా శున్యమే .నీళ్ళతో వున్న కుండలో లోపల బయట అంతా పూర్ణం గానే వుంటుంది ఇదే ఆత్మ సర్వ వ్యాపికత్వం అంటారు రమణ భగవాన్
బలరాముడి మామ తన కూతుర్ని ఎవరిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు .బ్రహ్మ నవ్వి .నా దగ్గర వున్న క్షణ కాలమ్ లో భూలోకం లో యుగాలు గడిచి పోయాయి .ద్వాపరయుగం నడుస్తోంది .వెళ్లి బలరామునికిచ్చి పెళ్లి చెయ్యి అని పంపించేసాడు ఇది భాగవత కధ .మన శాస్త్రజ్ఞులు తెలుసు కొన్న black hole ,event horizon ఇలాంటివే .
ఒక సారి తద్దినం పెడితే ,పితృదేవతలకు రోజూ ,భోజనం పెట్టినట్లే .
శ్రీ రామ కృష్ణ పరమ హంసకు నోటి కాన్సెర్ వచ్చింది .ఏమీ తినలేక పోయేవారు .ద్రవ పదార్ధం కూడా లోపలి వెళ్ళేది కాదట .ఒక శిష్యుడు ఆయన బాధ చూడలేక దగ్గరకు వెళ్లి ”స్వామీ !అమ్మను ప్రత్యక్షం చేసుకొని వ్యాధి నివారించుకో వచ్చు కదా ”అని సలహా చెప్పాడట .అప్పుడు పరమ హంస నవ్వి ”అన్ని నోళ్ళతో అంతా తింటున్నారు కదా ఈ ఒక్కనోటితో తినక పొతే ఏం అని అమ్మ నన్ను అడిగితె నా దగ్గర సమాధానం లేదు ”అని తన సర్వాత్మనా భావాన్ని ఎరుక పరిచారట .
తార అంటె తరించేది అని అర్ధం .మనమంతా తారలమే .అందుకే ఆమె ప్రాతస్మరనీయురాలు .
వాలి అంటే వలయితేవాలి .మాయా మొహం చుట్టేసి వున్న వాడు అని భావం దైవ కృపతో మాయ తొలగాటమే వాలి వధ .
సుగ్రీవుడు అంటె షట్విశిష్ట మైన శుద్ధి –ఇది దాటితే కనుబొమల మధ్య ఆజ్ఞా చక్రం వుంటుంది .విశుద్ధులైన వారికి పరమేశ్వరాజ్న అమృత స్వరూపాన్ని చేస్తుంది . చక్రాలతో గ్రీవం అంటె కంఠం దగ్గర విశుద్ధ చక్రం వున్న వాడుసుగ్రీవుడు ..అందుకే తార వాలి వధ తర్వాత సుగ్రీవుని భార్య అయి పతివ్రతల్లో స్థానం పొందింది .
విగ్రహం అంటె విశిష్టం గా గ్రహించేది అని భావం
తులసీ దాసు శ్రీ రాముని ప్రార్ధిస్తూ ”రామా !నీ నివాసమైన నా హృదయం లో నిన్ను వెళ్లగొట్టే కామ,క్రోధాదులైన ఆరుగురు శత్రువులు ఆక్రమించారు .వాళ్ళను బయటికి పంపి ,నీ స్థానం లో నువ్వు ఉండక పోతే నీ గొప్ప తనం ఏమిటి ?అని గడుసుగా ప్రశ్నించాడు .
మానవుడు ఒక్కడే తల పైకి ఎత్తుకొని తిరగ గలడు .జంతువులవన్నీ అదో ముఖాలే .
చిల్లులు వున్న కుండ లోని దీపం చిల్లుల ద్వారా కాంతిని గది అంతా ప్రసరింప జేస్తుంది .అలాగే మన లోని ఆత్మ చైతన్యం జ్ఞానేంద్రియాల ద్వారా బయటకు ప్రకాశించి ప్రపంచాన్ని ప్రకాశింప జేస్తుంది .జ్ఞానం పొందుతుంది .అదే ఆత్మ దీపం .అందర్లోనూ ఆ జ్యోతి వుంది .
కృష్ణార్జునులు ఒక సారి ఒక పేద వాడింటికి వెళ్ళారు .వాడు ఆవు పాలు ఇచ్చి సేవించాడు వారిద్దరినీ .కృష్ణుడు పాలు తాగి ”నీ ఆవు చావ ”అని దీవించాడట వాణ్ని .తర్వాత ఒక ధనవంతుడింటికి వెళ్ళారు వాడేమి వీళ్ళకుపెట్టలేదు పైగా ”దున్న పోతుల్లాగా వున్నారు .పనిచేసుకొని బతక లేరా ”అని తిట్టాడు ..”నీ సంపదా ,పిల్లలు పెరగాలి ”అని కృష్ణుడు వీడిని దీవించాడు .కృష్ణుని భావం ఏమిటో అర్జునునికి అర్ధం కాక వివరించమని కోరాడు .కృష్ణుడు ”పేద వాడు నన్ను చేర టానికి వాడి ఆవే అడ్డం .అది పొతే నాలో ఐక్యం అవుతాడు .అందుకని అలా అన్నాను .ధనవంతుడు సంతానం పెరిగి ధన గర్వంతో పుడుతూ ,చస్తూ జంజాటం లో మునిగి అలానే వుండాలని దీవించా ”అని వివరించాడు .త్యాగమే మోక్షానికి మార్గం అని దీని వల్ల తెలుసుకో తగిన సత్యం .
పండితుడు ”అహమేవ పండితః ”అనుకొన్నాడు .తర్వాత ”అహమపి పండితః ”అని తెలుసు కున్నాడు .చివరికి ”అహం న పండితః ”అని జ్ఞానం తెచ్చుకొన్నాడు .
హనుమ అంటె బుద్ధి —సీతా అంటె ప్రకృతి .–అంటె పరమేశ్వరుని నుంచి వేరు అయినది .వారిద్దరిని సంధానం చేశాడు హనుమ అదే సుందర కాండ .
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -07 -11 క్యాంపు —బెంగళూర్ .

