అమృత బిందువులు

అమృత బిందువులు
”దయా సర్వ భూతేషు ”అనేది లక్ష్యం కావాలి .శాంతి ,అనసూయ శౌచం ముఖ్యం .దయ అంటే ”పర దుఃఖ ప్రహరనోచ్చాయా –దయా ”ఇతరుల బాధ తీర్చటమే దయ ”.తతోపి ఆశా గరీయశి ”అంటే భగవంతుని కంటే గొప్పది ఆశ.
రామాయణ సారం ”రామా వర్ద్వర్తి తవ్యం -రావణా వన్నవర్తి తవ్యం ”  రాముడి లా ప్రవర్తించండి .రావణునిలా వద్దు .
దొరికిన దానితో తృప్తి పడాలి
నీలకంఠ దీక్షితులు మామూలు మనిషే.  మనిషి కి ,కవికి గల తేడా గురించి బాగా చెప్పారు .మామూలు మనుష్యులు ఉపయోగించే శబ్దాలే కులూ ఉపయోగిస్తారు .అయితే వారి చేతిలో ఆ శబ్దాలకు మహత్తు ,సంమోహనత్వం కలుగుతుంది .కవి భావాన్ని స్పష్టం గా చెప్పగలడు .అదే గీటు రాయి గొప్ప కవి అని చెప్పటానికి .ఆది శంకరాచార్యులు అలాంటి అపురూప కవి .
          శివ పాదాది కేశాంత స్తోత్రం లోశివుని   గ్రీవాన్ని అంటే కంఠాన్నిశంకరాచార్య గొప్పగా వర్ణించారు
”సంభ్రాన్తాయాఃశివాయః పఠర్విలయ భియా సర్వలోకోప తాపం —త్శం విగ్నస్సాపి విశ్నొహ్  సరభ సముభాయో ర్వారనా ప్రేరనాభ్యాం
మధ్యే త్రి శంక వీయమను భవతి దశాం యత్ర హాలాహలోష్మా –సోయం సర్వ పదాం నః శమయతు నిచయం నీలకంతస్య కష్తః ”
సగభాగం పార్వతి ,సగభాగం విష్ణువు ,శివుని శరీరం లో ఆక్రమించారు .క్షీర సాగర మధనం లో హాలాహలం ఉద్భవించి ,లోకాలను తల్లదింప జేస్తోంది .దాన్ని ఎలా ఆపాలో ఎవరికి తెలియటం లేదు .అప్పుడు శివుడు అకస్మాత్తు గా దాన్ని మింగేశాడు .పార్వతి భయ భ్రాంత మైంది .అది లోపలి పోతే తాను నాశనం అని పార్వతి ,బయటకు వదిలేస్తే లోకాలు దహించి పోతాయని విష్ణువు బాధ పడ్డారట అని దీని భావం .అందుకని విషం శివుని కంఠం లోనే దాచేశాడు .త్రిశంకువు లాగ అటు లోపలి చేరక బయటకు రాక కంత   భాగం లో చేరి నీల కంట నామం సార్ధక మైంది .ఇదీ భగవత్పాదుల అపూర్వ కవితా దృష్టి ,సృష్టి .
అలాగే వేరొ శ్లోకం లో ”నా బుద్ధి పరిపరి విధాల పోతోంది .అది నేఐ ద్రుధం గా ఉండేట్లు చెయ్యి చూసిన్డల్లా కావాలని పిస్తోంది వ్యామోహాన్ని అనగేట్లు చేయి సంత్రుప్తినివ్వు .సంసారాన్ని దరిచేరే మార్గం చూపించు .మోక్షం ప్రసాదించు .ఇది ఆయన తనకు తాను చెప్పుకున్నా ,మనందరి తరఫునా చెప్పారు .లేకపోతే ఆయనకు వ్యామోహాదులు ఉంటాయా ?   .
”ఉధృత నగాభి దనుజ ,దనుజ కులా మిత్ర ,మిత్ర శశి హ్రుస్టే –హ్రుష్టే భవతి ప్రభావతి ,న భవతి ,కిం భవ ,తిరస్కారః ”అంటారు ముక్తపద గ్రస్తం లో అపూర్వం గా .ప్రతి శ్లోకం లో గొప్ప అనుభవం ,అనుభూతి వుంటుంది .పరిణత ప్రజ్ఞకు నిదర్శనం వారి కవిత .సత్ఫలాలను ,ఫలితాలను ఇస్తాయి .
”వేద పూర్వకస్తు నాస్యాదికార ఇతి సిద్ధం ”.జ్ఞాన సముపార్జనకు వేదాన్ని అందరు తెలుసుకోవాలి అనిశంకరుల  .భావన .
”దానేన ద్విషంతో ”దానం వల్ల శత్రువులు కూడా మిత్రులవుతారు .దానం ప్రియవాక్య హితం గా వుండాలి దీనినే శ్రీ కృష్ణుడు సాత్విక దానం అన్నాడు ..”దాతవ్యమితి ”అనగా ప్రతిఫలా పేక్ష లేకుండా దానం చేయాలి .
”క్రుత్వాసహితం హి సంతాపం శాపం దేహేతి నో వదేత్ ”–ఇతరుల మనసును కష్త పెడితే తప్పక కష్టాల పాలు అవుతారు .అందులో అవతలి వారి ప్రమేయం వుండదు
”జ్ఞానం అగర్వః ”జ్ఞానం గర్వాన్ని చేదించాలి అని భగవత్    పాదులన్నారు .ఒకడు జ్ఞాని దగ్గరకు వెళ్లి అజ్ఞానాన్ని పోగోత్తమన్నాడు .ఆయన ఈ లోపల మీరు దానిపై విచారణ చేస్తుండండి .ఆ తర్వాత రండి నాకు తెలిసింది అనిపిస్తే మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను ”అన్నాడట .
”క్షమాన్వితం శౌర్యం ”క్షమా ,ఓర్పు ఉన్నదే శౌర్యం .శౌర్యం తో కలిసిన క్షమ వల్లే శోభిస్తారు .
                  మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —10 -07 -11 క్యాంపు —బెంగళూర్ .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.