వాల్ట్ విట్మన్ —–4

వాల్ట్ విట్మన్ —–4
                      ఫ్రీ వెర్సె కు ఆద్యుడై ,తన ప్రయోగాలను విశ్వవ్యాప్తం చేసి ,ఎందరో ఆగామి యువకవులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచి ,కష్టాల కడలి ఈదుతున్నా ,దుఖాల సుడిగుండం లో చిక్కు కున్నా ,చేతిలో చిల్లి గవ్వ నిలవ కున్నా ,చెయ్యి పెట్టిన ప్రతి చోటా విధి వక్రించినా వాల్ట్ విట్మన్ లోని కవితా జ్వాల ఆరలేదు .అను నిత్యం ప్రజ్వలిస్తూనే వుంది .కవితా లహరి ఆగలేదు ,నిత్య శ్రోతస్వినిలా పరుగిడుతూనే వుంది .ఎందరికో ప్రేరణ కల్గించాడు .కవిత్వాన్ని సామాన్యుడి ముందుకు తెచ్చి నిలిపాడు  .అసలైన జాతీయ అమెరికా కవిత్వాన్ని సృష్టించాడు .slang కు నీరాజనాలు ఇచ్చాడు .
               ఆనాటి ప్రముఖ గాయకుల౦దరితో మంచి పరిచయం ఏర్పడింది .beatles  తో పరిచయం ధృఢ౦ అయింది.  వీళ్ళలో ఏదో కొత్తదనం ,అసలైన అమెరికన్ సంగీతం వున్నాయని చెప్పాడు .They are democratic –they wished to be the bard of democracy ” అని beetel సంగీతానికి జేజే లు పలికాడు .
”I sing myself -walt whitman ,an American ,one of the roughs ,a cosmos ”అని పాడుకొన్నాడు .సెక్స్ ను ప్రకృతి సిద్ధమైనది గా , భావించాడు .”Exaggerations will be revenged in human phisiology ”అని హెచ్చరించాడు .””of phisiology from top to toe I sing ”అని  రాశాడు ,అలానే చేశాడు కూడా. దానినే popular pornography అని పిలిచారు .
ఈసడించిన ఎమెర్సన్ మహాశయుడే ”The most extraordinary piece of wit and wisdom that america has yet contributed .I greet you at the beginning of a great career which yet must have a long foreground some where for such a star ”అని మనసార దీవించాడు .ఆల్కాట్ మురిసే పోయాడు .ఆయన్ను అమెరికన్ బార్డ్ అంటే  మహర్షి అని అంతా అన్నారు ఉత్తర దక్షిణాలను, చదువుకొన్న వారినీ ,చదువు లేని వారినీ  సమానం చేసిన మహానీయుడిగా గుర్తించారు .అమెరికన్ జాతి మొత్తాన్ని ఏకీకృతం చేసిన మహాకవి గా ప్రశంశించారు .కాని కొందరు మాత్రం పిచ్చి ఆస్పత్రినుంచి పారిపోయిన పిచ్చోడు  అన్నారు . దయనీయమైన మనో వైకల్యం తో ఉన్నాడని అన్న వారు వున్నారు . .
                       విట్మన్ అవతారం చాలా విచిత్రం గా వుండేది ”rough satyr ,broad shouldered ,gray beard ,wearing a strpped calico jacket over a red flannel shirt and coarse overalls ”ఇదీ అతని వేషం .మన గద్దర్ లాగా ఊహించుకో వచ్చు నేమో . 1857 -59 మధ్య డైలీ టైమ్స్ లో పనిచేశాడు అప్పుడే వ్యభి చారాన్ని చట్ట పరిధి లోకి తేవాలని రాశాడు తర్వాత చాలా చిన్న ఉద్యోగాలు చేశాడు .తండ్రి చనిపోయాడు .వాషింగ్టన్ వార్ హాస్పిటల్ లో నర్స్  గా చేరి పనిచేశాడు .గాయపడిన సైనికులను ఓదార్చే వాడు .600 సార్లు ఆ ఆస్పత్రిని సందర్శించాడు .సహాయ సహకారాలు అందించాడు .దాదాపు లక్ష మంది సైనికులను పలక రించాడు .ఒక కవి ఇలా ప్రజా సేవలో వుండటం అరుదైన విషయం .రాయటం నా వంతు సేవ మీ వంతు అనే లోకం లో ఇది చాలా విడ్డురం గా వుంది కదూ .1865  లో తన యుద్ధ కవితలనుdrum taps పేర వెలువరించాడు .finest poetry produced by the civil war ”గా  పేరు  పొందింది .ఇందులో దేశ భక్తి ప్రతిధ్వనించింది .1873 లో  cerebrial hemorrage   వచ్చింది .గడ్డిపరకలను చివరిసారిగా 1881 లో ప్రచురించాడు .చాల గొప్ప రెస్పాన్స్ వచ్చింది ఇన్నేళ్ళ తర్వాత కూడా .    .
                        అబ్రహం లింకన్ మరణం తో చలించి పోయాడు .ఆయనపై అనేక ప్రసంగాలు చేశాడు .andru కార్నెజీ ,జేమ్స్ రుస్సేల్ మార్క్ ట్విన్ వంటి మహామహులంతా విని మెచ్చారు .చాలా వస్తువులు విట్మన్ పేర మార్కెట్ లోకి విడుదల అయాయి .అందులో వాల్ట్ విట్మన్ సిగార్ ,ఒకటి .చాలా దేశాల్లో విట్మన్ societies ఏర్పడ్డాయి .మిక్కి వీధిలో రెండు అంతస్తుల భవనం కొన్నాడు .తన సమాధి నిర్మింప జేసుకొన్నాడు .తన కుటుంబ సభ్యులకు అందులో స్థానం కల్పించాడు .ఇదే ప్రసిద్ధ walt witman tomb ”
                 1881 లో కొత్త కవితలు రాశాడు వీటిని death bed edition అన్నారు ,1891 లో న్యుమోనియా వచ్చింది .అతని ఆత్మ శక్తే అతనికి తోడూ .1892  మార్చ్ 26 న విట్మన్ మహా కవి మరణించాడు .సెక్స్ ను విశాల వేదిక పై చర్చింప జేసిన మొట్ట మొదటి కవి విట్మన్ .
              విట్మన్ సకల కళా వల్లభుడు .థియేటర్ ఆర్ట్ ,శిల్ప కల సంగీతం ,ఫోటోగ్రఫి ,painting మొదలైన కళలో లోతైన అవగాహన వుంది .ఆ కళల్లో నిపుణులైన వారందరితో పరిచయం వుంది  photography afterall was the merging of sight and chemistry of eye and machine of organism and mechanism ముచ్ as American instrument of seeing .no culture was more in love with science and technology than America was and the camera was the perfect emblem of the joining of the human senses to chemistry and physics via machine ”
అని ఫోటోగ్రఫి కళను అద్భుతం గా ఆవిష్కరించాడు విట్మన్ .సాంకేతిక పరిజ్ఞానంలోను ,architecture లోను గొప్ప ప్రవేశం వుంది .1853 లో newyork లో వరల్డ్ ఫెయిర్ జరిగితే వెళ్లి చూసి మురిసి song of exposition గా కవిత రాశాడు .డెమోక్రాటిక్ రాజకీయాలపై మోజుండేది .లిబెరల్ democracy కావాలి అనే వాడు .  చివరగా అతని కవితా పంక్తుల్ని రుచి చూద్దాం
”I raise voice for far superber themes for poets and for art .To exalt the present and the real –To teach the average man the glory of his daily walk and trade ” సామాన్యునికి అందుబాటు లో వున్న సకల విషయాల లోతులు చూడాలి అని భావం .
     reynolds అనే విమర్శకుడు ”walt whitman’s boundless love and inclusive language make his writing attractive and exciting practically all readers ”అని విట్మన్ కవిత్వాన్ని అంచనా వేశాడు .మరువ తగని ,మరువ లేని మహా కవి ,ప్రజా కవి ,అమెరికా హృదయాన్ని ఆవిష్కరింసిన దార్శనికుడు ,మానవతా వాది ,సకల జన హితుడు ,ప్రపంచాన్ని తనలో ,తనలో ప్రపంచాన్ని చూసుకొన్న మాన వీయ మూర్తి వాల్ట్ విట్మన్ .
                  మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -07 -11 .క్యాంపు –బెంగళూర్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.