అలాస్కా విశేషాలు

                అలాస్కా విశేషాలు 
                        అలాస్క ధ్రువ ప్రాంతం లో వున్న సంగతి అందరికి తెలుసు .ఇక్కడి క్యాలెండరు Tlingit–indian calender ను ఉపయోగిస్తారు .వీరి సంవత్చరం ఆగస్ట్ తో ప్రారంభం అవుతుంది .అప్పుడు పక్షులు పర్వతాల మీద నుండి కిందికి దిగుతాయి జంతువులూ శీతాకాలం గుహల్లోకి ప్రవేశిస్తాయి .సెప్టెంబర్ ను స్మాల్ మూన్ అంటారు .చేపలు ,బెర్రీలు కనిపించవు .నవంబర్ ను స్నో మూన్  అంటారు .నీళ్ళు గడ్డ కడతాయి .డిసెంబర్ ను సైలెంట్ మూన్ అంటారు .డోనట్లు తింటారు .దినసరి చర్యలేమీ వుండవు .
—                జనవరి లో గూస్ మూన్ వస్తుంది .బాతులు ఉత్తరం వైపు చూస్తాయి .సూర్యుడు నెమ్మది గా కనిపిస్తాడు తిరుగు ప్రయాణం లో .ఉత్తరాన గొప్ప ఆరోరా కనిపించి అద్భుతం అని పిస్తుంది .ఫెబ్రవరి లో కనిపించే చంద్రున్ని బేర్ మూన్ అంటారు .నిద్రలో వున్న నల్ల ఎలుగులు అన్నీ రెండవ వైపుకు తిరుగు తాయి .మార్చ్ లో వచ్చేదిసి ఫ్లవర్ మూన్    సముద్రం లోని జీవ జాతులన్నీ పెరగటం ప్రారంభిస్తాయి .ఏప్రిల్ చంద్రున్ని మూన్ ఆఫ్ రియల్ ఫ్లవరింగ్ అంటారు .భూమి మీద వున్నమొక్కలకు ప్రాణం వస్తుంది ..
                 మే లో హాచింగ్ మూన్ వస్తుంది .పక్షులు గుడ్లు పెడతాయి జూన్ లో సాల్మన్ మూన్ వస్తుంది .సముద్ర జలాల్లో సాల్మన్ చేపలు విపరీతం గా కన్పిస్తాయి .అక్కడ వుండే netive అలాస్కంలు చెట్టు కొమ్మలతో అదిరించి పట్టుకొంటారు జూలై లో మూన్ అఫ్ బర్త్ వస్తుంది .తీరాల్లో టెంట్లు వేసుకొని జనం చేరతారు .రద్దీ ఏర్పడుతుంది .చైతన్యం తోనికిస లాడు తుంది .ఆగస్ట్ నెలలో మొదటి పదిహేను రోజులను పదమూడవ నెలగా  భావిస్తారు .దీనికి ఇంకో పేరే ఫాట్టింగ్ మూన్ ..జంతువులూ kovvuto బలిసి వుంటాయి వీటితో వ్యాపారం బాగా చేస్తారు .సంపాదన కాలమ్ ఇదే .
                         అలాస్కా లోని  ప్రజల భాష ను చినూక్ అంటారు .దీనిలో 500 మాటలే వుంటాయి .ఇదంతా వ్యాపార పరిభాష గా వుంటుంది .దీనికి వ్యాకరణం లేదు .ఈ భాష ప్రదేశాన్ని బట్టి మారుతుంది .ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ పదాలు వచ్చి చేరు తున్నాయి .
సరదాగా కొన్ని పదాలు ,వాటి అర్ధాలు తెలుసు కొందాం.
హి-హి –అంటే నవ్వు -మనం కూడా హి హి అని నవ్వుతాము కదా .సరైన మాట.
pish అంటే చేప .–ఎఫ్ బదులు పీ వచ్చింది .ఒకరకం గా వికృతి అన్న మాట    —
హీ-హీ-house –వినోదం ఇచ్చే చోటు
ఇల్లాహీ–భూమి
hi -yu అంటే   చాలా . —
mukka a -muck – –ఆహారం —మన ముక్కా -ముడుసు లాటిదేమో ?
siwash –అంటే –ఇండియన్ —నీచుడు అనే అర్ధం లో వాడుతారు .అయ్యో రాత అక్కడా మనం నీచం గానే చూడబడుతున్నాం అన్న మాట .
tillicum   స్నేహితుడు .
                                    ఇట్లు మీ tillicum అంటే స్నేహితుడు ——గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -07 -11 –క్యాంపు —బెంగళూర్ .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.