హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —4
———————————————–
ఇంతవరకు హోసూరు తెలుగు ప్రజలు నిర్వహించిన వివిధ సాహిత్య ,కార్య క్రమాలను గురించి తెలుసు కొన్నాం .ఇంత చేస్తున్నా తమిళ తంబి కరుణ తెలుగు వారికి నిధి ఇవ్వ లేదు ,విధి ఇవ్వలేదు .తన తమిళ ఆధిపత్యం నెత్తి కెక్కింది .”ఎంగుం తమిళం –ఎదలుం తమిళం ”అనే నినాదం తో శివాలెత్తి పోతున్నాడు కరుణ .ఈ మాటలకు అర్ధం ఎక్కడైనా ,ఎందులోనైనా తమిళం మాత్రమే ఉండాలట .మిగతా భాష లన్ని తీసి కట్టు అట. ఇప్పుడు ఒక్క ఓటర్ లిస్టు లో మాత్రమే తెలుగు పేర్లు కనిపిస్తాయి .మిగత ఎక్కడా తెలుగు వాసన కూడా లేదు .అయితె ఓటర్ పేరు పక్క వూరి పేరు మాత్రం తమిళం లోనే ఉంటుందట .ఇంకా పిచ్చి ముదిరి అసలు మీ పేర్లు తెలుగు లో రాయలేక చస్తున్నాం .పేర్లు తమిళ పేర్లు పెట్టు కొండి అని ఉచిత సలహా పారేశాడు కళ్ళ జోడు కరుణ .లోకం అంతా పచ్చ గా కనిపిస్తుందట కామెర్ల వాడికి ..ఇది మరీ చిచ్చు పెట్టింది .తెలుగుల ఆత్మ గౌరవం దెబ్బతింది .తెలుగు వారికే కాదు కన్నడ ,మలయాళీ ,ఉర్దూ మైనారిటీ లకు కూడా ఇదే దుస్థితి ..ఇక సహించ లేక పోయారు .ఎదురు తిరగటం ప్రారంభించారు .మైనారిటీ లంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని గ్రహించారు .ఇంకా వూరు కొంటె అసమర్ధత అవుతుందని ,తొండ ముదిరితే ఊసర వెల్లి అవుతుందని అర్ధమయింది అందరికి .. కర్నాటక లో ముప్ఫై మూడు శాతం తెలుగు వారు న్నారు .ఏడు జిల్లాలలో మెజారిటీ తెలుగు వారిదే .అయితె తెలుగు స్చూల్స్ మాత్రం 170 మాత్రమే నట .వీటినీ పెంచుకోవాలనే స్థిర సంకల్పం తో వున్నారు .కన్నడ ప్రభుత్వం తో పేచీ లేదు .
అన్ని సమస్యలు ఒక్కటొక్కటే పరిష్కరించు కుంటు వస్తున్నారు హోసూర్ తెలుగు వారు .అయితె ఇప్పుడు ఇంకో కొత్త ప్రమాదం వచ్చి పడింది వారికి .హోసూర్ లో రెండు పారిశ్రామిక వాడలను తమిళ నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది తూర్పు ,పడమరలు గా .ఇండియా లోనే ఇంత పెద్ద పరిశ్రమలు ఇంక ఎక్కడా లేవట .ఇవన్నీ sipcot
అనే పేర వెలిశాయి .అంటె ”smaall scale industries promotion corporation of tamil naadu ”మొత్తం ఏడు వేల కోట్ల పెట్టుబడి .ఇక్కడ గుండు సూది మొదలు చిన్న విమానాలు వరకు తయారు చేస్తారు .టి.వి.ఎస్. ,titan ,అశోక్ లేలాండ్ ,ఇండియన్ నిప్పాన్ మొదలైన 5000 లకు పైగా భారీ ,మధ్య తరగతి పరిష్మలున్నాయి .లారీలు బైకులు ,ఆటోలు చిన్న విమానాలు ఇక్కడ తయారు చేస్తారు .ఇ.టి .పార్క్ ,500 కోట్లతో సెజ్ వున్నాయి అటో mobiles leather,ప్లాస్టిక్పరిశ్రమలు వుండి ఎగుమతులకు బాగా తోడ్పడు తున్నాయి .ఉపాధి అవకాశాలు బాగా నే వున్నా,పంట భూములన్నీ హారతి కర్పూరం అయి పోయాయని ఇక్కడి రైతులు నిర్వేదం గా వున్నారు .60 ,౦౦౦మన్దికి ఇవి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి .కానీ తమిళులు వచ్చి ఇక్కడ ఉద్యోగాలలో స్థిర పడ టం తో మళ్ళీ తెలుగు భాషా వ్యాప్తికి చాలా అడ్డంకి కలుగు తోందని భాషాభిమానుల మనో వేదన .రెడ్డొచ్చె మొదలాడు అన్న తీరు గా వుంది ఈ పారిశ్రామీకరణ 2005 నుంచే ప్రారంభం అయింది .రెండు దశల్లో .ఇదికూడా కరుణానిధి ఇక్కడి తెలుగును ,తెలుగు వారినీ దెబ్బ తీయటానికి పన్నిన పన్నుగడ అని అంటున్నారు మిత్రులు .నోటితో పలకరించి నొసలు తో వెక్కి రించి నట్టుంది .
ఇవీ హోసూరు లోని తెలుగు వాళ్ల మనో వేదన ,బాధ ..ఒక పక్క ఆధునికత వచ్చిందని ఆనందం ఇంకో పక్క తెలుగు అస్తిత్వానికి మళ్ళీ ప్రమాదం ఏర్పడుతోందని బాధ
ఏమైనా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పోరాట పటిమ గల ఇక్కడి తెలుగు ప్రజలు సమస్యలను వ్యూహాత్మకం గా పరిష్క రించు కో గలరనే గొప్ప విశ్వాసం వాళ్ళను ,వారి అకున్తిత దీక్షను ,పట్టు వదలని విక్రమాదిత్యాన్ని .ఓర్పు నేర్పు లను చూసిన తరువాత నాకు అని పించింది ..భవిష్యత్తు వారందరికీ భద్రం గా వుండాలని ,తెలుగు కు పట్టాభిషేకం జరుపుతూ తెలుగు తేజాన్ని దశ దిశలా వెద జల్లు తారని భావిస్తున్నాను .వారందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ధైర్య స్తైర్యాలు ప్రాసాదించ వలసినది గా భగ వంతుడిని ప్రార్ధిస్తున్నాను .సరస్వతీ దేవి వారికి ఎప్పుడు అండ గా నిలుస్తుందని భావిస్తాను .హోసూరు తెలుగు వాణి హోరెత్తి దశ దిశలా మారు మోగాలి .అందరికీ హోసూరు ఆదర్శం కావాలి .హోసూర్ మిత్రు లందరికి మరొక్క సారి నమస్సులు ,అభినందనలు తెలియ జేస్తున్నాను
.. మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -07 -11 .–క్యాంపు –బెంగళూర్
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

