టర్కీ రచయిత ఒర్హం పానుక్
—————————–
సాహిత్యం అంటె ఒక మందు .అన్నాడు టర్కీ రచయిత ఒర్హం పానుక్ .టర్కీ భాష లో ఏడు నవలలు రాశాడు .స్వీయ అనుభవాల గురించి చాలా వ్యాసాలు రాశాడు .వీటిలో తన జీవిత కవాటాలను అందరి కోసం తెరిచాడు ..బాగా చైన్స్మోకింగ్ చేసే వాడు .దాని దుష్ఫలితాలను అనుభవించి పూర్తిగా మానేశాడు .తన జీవిత చరిత్రను ”other colours ”గా రాశాడు .దీనికే ఆయనకు నోబెల్ బహుమతి లభించింది చాలా తమాషా గా ,కదిలించేట్లుగా ఆడుతూ పాడుతూ చెప్పినట్లు వుంటుంది ఆయన కధనం .తన సాహిత్య జీవితం లో ఆయనే తల మానిక .తన కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూపించే నేర్పు ఆయనది .చాలా భావ శ్పోరకం గా ,సప్త వర్ణ మాలగా ఆయన రచన వుంటుంది .ముఖ్య మైన విషయాన్ని దేనినీ ఆయన దాచడు ,వదిలి పెట్టడు . .
ఆయన నవల ”my name is red ”కు డబ్లిన్ లిటరరీ అవార్డ్ వచ్చింది .పానుక్ రచనలు యాభై పైగా ఇతర భాషల్లోకి అనువదింప బడినాయి ..ఆయన స్వగ్రామం ఇస్తాంబుల్ .దానితో ఆయన అనుబంధం విడ దీయ లేనిది ..ఆయన రచన లన్నీ దాని చుట్టే తిరుగు తాయి రాస్శ్యా కు చెందిన ప్రఖ్యాత నవలా రచయిత దాస్తోవిస్కీ కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ గురించీ ,దానితో తన సంబంధం గురించే ఎక్కువ గా రాశాడని అందరికి తెలుసు .అలాగే జేమ్స్ జాయిస్ డబ్లిన్ గురించీ,ప్రౌస్ట్ పారిస్ గురించీ ఇలానే రాశారు .అది వారికి తీపి అనుబంధం .ఏది చెప్పినా వాటి చుట్టూనేకధ తిరుగుతుంది .ఇలా రాయటం వల్ల ప్రపంచం లోని అన్ని దేశాల పాథాకులు ,తాము స్వయం గా ఆ పట్టణాలలో తిరుగుతూ ,ఆ కధా విధానాన్ని అనుభూతి పొందినట్లున్తుంది .అదీ వారి ప్రత్యేకత .ఈ విషయాన్ని తానె స్వయం గా నోబెల్ బహుమతి తీసుకొనే టప్పుడు ఉపన్యాసం గా చెప్పాడు పానుక్ .
మీరు కవి ఎందుకు కాలేదు అని అడిగితె ఆయన ”God was not speaking to me –I realised that a poet is some one through whom God is speaking .You have to be possessed by poetry ”.అని తనకు దేవుని అనుగ్రహం లేదని ,కవిత్వం భగవద్దత్తం అయిన వరం అని ,.కవిత్వం ద్వారా భగవంతుడు మాట్లాడు తాడని చాలా నిజాయితీ గా చెప్పాడు .అందుకని తాను ఒక గుమాస్తా లాగా పని చేస్తున్నానని అంటె వచనమే రాస్తున్నానని తమాషా గా అంటాడు .తనకు Thomas Man ”ఆదర్శ రచయిత అన్నాడు తన తలలో screw లూజు ”అనీ చెప్పాడాయన . .
తన తరం రచయితలు జాతీయ భావం తో కూడిన ఆదునిక సాహిత్యం సృష్టించాలని కోరాడు ఎందుకు అంటె తాను ”I am a westernizer ”అని ఒప్పుఒన్నాదు కనుక తాను కోరినట్లు మిగతా వారైనా రాస్తే బాగుంటుందని భావించాడు ..భేషజం లేకుండా చెప్పాడు .
ఒర్హం పానుక్ ఒక తమాషా కధ చెప్పాడు .అది ఇబ్ని అరేబి చెప్పిన కధ అని ఆయనే చెప్పాడు .ఒక సుల్తాన్ చిత్ర రచనలో పోటీలు పెట్టాడటచైనా అరిస్ట్ లకు ,మిగతా వారికి .రెండు గోడల మధ్య తెర కట్టించాడు .ఒక గోడపై చైనా చిత్ర కారులు ,ఇంకో గోడపై మిగిలిన దేశాల చిత్రకారులు painting వేయాలి .మిగిలిన వారు చాలా కష్ట పడి చిత్ర రచన చేశారు ..చైనా వాళ్ళు మాత్రం గోడంతా గోకి అద్దం లా పైంట్ చేశారు .సుల్తాన్ పరీక్షించ టానికి వచ్చాడు ..ముందుగా మిగిలిన దేశాల వారి పైంటింగ్ చూశాడు .అద్భతం అన్నాడు .తర్వాత తెర తీయించి చైనా వాళ్ల పైంటింగ్ చూశాడు .అందులో ఏమీ లేదు .అవతలి వారు వేసిన painting ను ఈ గోడ అద్దం లాగా చూపించేట్లు చేశారు చైనా వాళ్ళు .చైనా వాళ్ళకే బహుమతిని ఇచ్చాడు సుల్తాన్ .గోడ ను అద్దం లా మార్చిన వారి కళా హృదయాన్ని మెచ్చాడన్నా మాట సుల్తాన్ .
రచన గురించి పానుక్ కు కొన్ని నిశ్చితాభిప్రాయాలు వున్నాయి .వాటిని గురించి తెలుసు కొందాం .
”A writer talks of things that every one knows ,but does know they know .”
”I write because I want to read books like the ones I write ”
I can only part take in real life by changing it .I write because it is a habit ,a passion .I write because I am afraid of being forgotten .I like the glory and interest that writing brings .I write to be alone ..Every one expects me to write .”
ఇలా కుండ బద్దలు కొట్టి నట్లు చెప్పటం పానుక్ ప్రత్యేకత .ముసుగు వుండదు .సూటిగా హృదయానికి తాకుతుంది .ఆలోచన రేకెత్తిస్తుంది అదీ పానుక్ ప్రత్యేకత .ఒక టర్కీ రచయిత నోబెల్ పొందటం పానుక్ తో నేప్రారంభం అనుకొంటా ..
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -07 -11 .–క్యాంపు –బెంగళూర్

