శ్రావణ బెలగోల ,బేలూర్ ,హలేబేడు యాత్ర —-1
ఈ నెల ఇరవై మూడు శనివారం పై మూడు ప్రదేశ సందర్శనకు కే.ఎస్.టి.డి .అంటే కర్ణాటకస్టేట్ టూరిసం దేవేలోప్మేంట్ వాళ్ల బస్ లో వెళ్లాన్ను .రాను ,పోను 500ki .మీ. దూరం .935 rs ఉదయం నాలుగింటికే లేచి ,స్నానం ,సంధ్య ,పూజ చేసుకొని ,పొద్దున్నే అయిద్య్మ్బావుకు మార్త హళ్లి బస్ స్టాండ్ లో corporation సర్కిల్ కు అక్కడి బాదామి హుసే దగ్గర బస్ ఎక్కాను .పావు తక్కువ ఏడుకు బయల్దేరింది .వోల్వ బస్ ,ఏ.సి . మంచి రోడ్ ,లాంకో వాళ్ళు నిర్మించిన యెన్.హెచ్ .48 .హసన్ మీదు గా వెళుతుంది ,ఇది దాటితే మాంగాలుర్ ,మలబారు తీరం .అవి కాఫీ ,తేయాకు ,రబ్బర్ తోటలకు ప్రసిద్ధి .ఉదయం ఎనిమిదిన్నరకు”” ఎద్యుర్ ”అనేకి.మీ. చోట కాఫీ ,తిఫ్ఫిన్లకు ఆపాడు .గారే తిని ,కాఫీ తాగాను .బానే వున్నాయి తొమ్మిదిన్నరకు శ్రావణ బెలగోలా చేరింది బస్ .బెంగళూర్ నుంచి 160, కి.మీ.కొబ్బరి తోటలు ,పనస చెట్లు ,చెరుకు తోటల మధ్య ప్రయాణం .మెయిన్ రోడ్ నుంచి ,single రూట్ లో ప్రయాణం .మన కోన సీమ అందాలన్నీ ఇక్కడ క్కనిపిస్తాయి .అయితె అక్కడి లాగా కాలువలుండవు ..పరవశించే ప్రకృతి .ఉదయం కదా చాలా ఆహ్లాదం గా వుంది .
గంట సమయం ఇచ్చారు .పైకి వెళ్లి ”జైన ముని బాహుబలిని దర్శించి తిరిగి రావా టానికి .రాను పోను 1282 రాతి మెట్లు .పట్టుకొని నడవ టానికి ఇనుప రాడులున్నాయి ..మొదట్లో మెట్లు చిన్ని గా వున్నా పోను పోను మోకాళ్ళు ఎత్తి అడుగులు వేయాలి .మొత్తం మీద రొప్పు కొంటు ,రోజూ కొంటు పైకి వెళ్లి గోమాతేస్వర దర్శనం చేశాను .58 అడుగుల ఎనిమిది అంగుళాల ఏకశిలా విగ్రహం .తెల్ల graanite రాయితో చేయ బడింది .ఇదంతా కొండపై చెక్కారు .చూడ ముచ్చట గా వుంది విగ్రహం .కళ్ళు చాలా పైకెత్తి చూడాలి .మహా నగిషీ గా చెక్కాడు శిల్పి .బాహుబలి కాళ్ళ కు చుట్టూ కొన్న లతలు ,,నుంచొని తపస్సు చేస్తుంటే పేరిగినా పొదలు చెట్లను సూచిస్తుంది పక్కనే పాము .తపస్సును భంగం చేయ టానికి వచ్చిందట .ఇవేమీ గమనించక తీవ్ర తపస్సును నుంచునే ఆయన చేశారట జ్ఞానోదయాన్ని పొందారు మా బాచ్ పదిఎడు మంది .అందర్లో ముందు దర్శించి కిందికి దిగింది నేనే .ఒక అమ్మాయి ఇరవై ఎల్లున్తాఎమో ,నా నడక .స్పీడు చూసి తన వాళ్ళతో ”this gentle man seems much younger to me ”అంటున్డటం విన్నాను .జైనులు ,నడవలేని వాళ్ళు phrame పడక కుర్చీ లో పడుకుంటే కూలీలు మోసుకు పోతున్నారు పైకి .డోలీ అంటారు .అంతా భక్తీ భావం తో వస్తారు ఇన్ని మెట్లు ఎక్కి దిగటం చాలా కష్టమే .కాని ఇస్టమై వస్తున్నాము కనుక ఏమీ అనిపించదు .ఈ మధ్యే జైన ,బౌద్ధ మతాలను గురించి రాశాను కనుక ఇప్పుడిక్కడ చూడటం ఆనందం ,జీవిత సాఫల్యం ..ఇన్నాళ్ళ కు కోరిక తీర్చాడు జైన ముని .మనసార నమస్కరించాను .ప్రపంచం లో శాంతి విస్తరిమ్పజేయ మని ఆ మహా బలిని కోరాను
ఇప్పుడు ఈ క్షేత్రం లోని విశేషాలను వివరిస్తాను .బెల్ అంటే తెల్లని కోలా అంటే సరస్సు .కొలను అన్న మాట .స్వచ్చమైన తెల్లని నీటితో నిండిన సరస్సుఅని పూర్తి అర్ధం శ్వేత సరోవరం ..అలాంటి సరస్సు ,దానికి మెట్లు ,నిండా నీరు తో కనపడి దాని అర్ధాన్ని తెలియ జేస్తుంది గ్రామ మధ్యమం లో ఉందీ కొలను .ఈ మూడు క్షేత్రాలు హసన్ జిల్లా లో వుండటం విశేషం .తలకాడుకు చెందిన విశ్వకర్మ స్థపతులు ,ఈ మహా విగ్రహాన్ని చెక్కిన శిల్పులు .ప్రపంచం లో దీనికి మించిన ఏక శిలా విగ్రహం ఇంకీక్కడా లేదు .ఇక్కడ రెండు కొండలున్నా యి ఇంద్ర గిరి ,చంద్ర గిరి .మౌర్య చంద్ర గుప్తుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేయటం వల్ల చంద్ర గిరి అనే పేరు వచ్చింది .దానికి జ్ఞాపకం గా అశోకుడు ఇక్కడ ఒక బాసాది నిక్రీస్తు పూర్వం,మూడవ శతాబ్దం లో నిర్మించాడు దీనితో పాటు ఇక్కడ తపస్సు చేసిన వివిధ మత గురువుల ,అంటే శ్రమనకుల ఆలయాలు క్రీస్తు తర్వాత అయిదు ,ఆరు శతాబ్దుల లో నిర్మించారు .నేమి చంద్ర సిద్ధాంత చక్ర వర్తికి శిష్యుడైన చాముండా రాయలు అనే రాష్ట్ర కూట రాజు చంద్ర గిరి మీద దేవాలయం కట్టించాడు .ఇక్కడ 800 కు పైగా శిలా శాశనాలు కనిపించాయట .ఇవి పూర్వ కనడ అంటే హల కనడ భాష లో వుంటాయి ఇది భట్టారక మతానికి పీఠం .వీరు దేశీయ గంగ మూల సంఘానికి చెందిన వారు . .
జైన తీర్ధన్కరులు ఇరవై నలుగురు .మొదటి ఆయన పురు దేవుడు .ఈ యాన్నె వృషభ దేవ అనీ ఆది నాదుదని అంటారు .ఈయనకు ఇద్దరు భార్యలు పెద్ద రాణి యశస్వతి .ఈమెకు భరతుడు అనే కుమారుడు,ఇంకా వందమంది కొడుకులు ,బ్రహ్మ అనే కుమార్తె కలిగారాట్ .చిన్న రాణి సునందకు బాహుబలి అనే కొడుకు పుట్టాడు .ఒకప్పుడు ఇంద్రుడు నీలాంజన అనే దేవ దాసీ చేత వ్రుశాభుడి కొలువు లో నాట్యం చేయిన్చాదట .భరతునికి పట్టాభిషేకం చేసి రాజ్యం ఇచ్చాడు .బాహు బాల్ని .యువ రాజు గా అభిషేకించాడు రాజు వృషభ దేవుడు .భరతుడు అయోధ్యను ,బాహు బలి పౌదానా పురాన్ని రాజధానులు గా చేసుకొని పాలించారు .ఒక రోజూ భరతుని ఆయుధాగారం లో చక్ర రత్న అనే విసిరే గుండ్రటి వస్తువు కనిపించింది .దీన్ని చూసిన జ్యోతిష్యులు హరతుడు చక్ర వర్తి అవుతాడని చెప్పారు .దీనితో ఆశ పెరిగి తాను జగజ్జేత కావాలని నిర్ణయించుకొని ,తన కింద వున్న సామంతుల్నందర్నీ లొంగి పోమన్నాడు .యుద్ధం ప్రకటించాడు .కాని తమ్ముడు బాహుబలి లొంగ లేదు .పెద్ద యుద్ధమే జరిగి వేలాది మంది చనిపోయే ప్రమాదం వుందని ఇరువైపులా మంత్రులు సమాలోచనలు జరిపి ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేశేట్లు నిర్ణయించారు .యుద్ధం తీవ్రం గా జరిగింది .బాహుబలిదే పైచేయి అయింది ..అన్న తల వంచాడు .విజయం తమ్ముడిదే నని ఒప్పుకొన్నాడు .కాని వెంటనే బాహు బలికి జ్ఞానోదయం అయింది .ఈ ప్రపంచం శాశ్వతం కాదు ,ఈ భోగాలు ,రాజ్యం శాశ్వతం కాదు అనిపించింది .తన రాజ్యాన్ని కూడా అన్న భారతునికే ఇచ్చి ,అతడే చక్రవర్తి అని ప్రకటించి తపస్సు కోసం అడవులకు వెంటనే బయల్దేరి వెళ్ళాడు .
భగవాన్ బాహుబలి నుంచునే ఘోర తపస్సు ధ్యానం చేశాడు .ఆయన చుట్టూ చీమలు పుట్టలు పెట్టాయి .ఆయన ఏమీ చలించ లేదు .పాములు కాళ్ళకు చుట్టుకోన్నాయి .లతలు ఒళ్ళంతా అల్లుకు పోయాయి .కేవల జ్ఞానాన్ని సాధించటం కోసం వేటినీ లెక్క పెట్ట లేదు .కాని మనసు ఇంకాస్థిర పడ లేదు .రాజ్యం మీద ఏమూలనో కాంక్ష వున్నట్లు అనిపించింది .అన్న కు ఇది తెలిసి వచ్చాడు .తన కిరీటాన్ని తీసి తమ్ముడి పాదాల చెంత పెట్టాడు .”ఇది నీ రాజ్యం .నువ్వు నాకు ఇచ్చావు .దీని గురించి చింత వద్దు ”.అన్నాడు .అప్పుడు ఒక్క సారిగా బాహుబలి మనో కవాటాలు విచ్చుకొన్నాయి .సంకుచితత్వం పోయింది కేవల జ్ఞానం సాధించి చివరికి నిర్వాణం ప్న్డాడు .వేలాది మందికి జ్ఞానం కలిగించాడు . గాంగ వంశానికి చెందిన రెండవ రాచమల్లు .మహా రాజు గారి మంత్రి చావుండా రాయాలె ఇక్కడి బాహుబలి విగ్రహాన్ని చేక్కించింది .ఆచార్య నేమి చంద్ర సిద్ధాంత చక్ర వర్తి గారి ఆధ్వర్యం లో క్రీస్తు శకం 981 లో ఈ మహా నిర్మాణం జరిగింది . అంటే 1030 .సంవత్చరాల నాటి విగ్రహం చావుందరాయలను గోమాథ gomatha అని కూడా అంటారు .అందుకే బహుబలిని gomathesvaru డు అంటారు ఆచార్య నేమి రెండు సిద్ధాంతాలని ప్రతిపాదించాడు .ఆయన ప్రియ శిష్యుడైన గోమాథుడు వాటిని gomatha సార జీవకాండ అని ,gomatha సార కర్మ కాండ అని ప్రచారం లో వున్నాయి ..
గోమతేస్వరుడు అనే బాహుబలి విగ్రహం పీఠం మీద కన్నడ ,తమిళ పూర్వ maraatha అక్షరాలూ కని పిస్తాయి ఇవి 981 కాలానికి చెందినవి .ఇంత మహా విగ్రహం చేక్కిన్చాటానికి కారణం ఏమిటి ?అని ఆలో చిస్తే కర్మ పై మానవుడు సాధించిన విజయమే అది అని తెలుస్తుంది .ఒక మహాజ్ఞాని ,మహాతపస్సంపంనుడుఅత్యంత ప్రశాంతితో ఎలా ఉంటాడో తెలియ జేస్తుంది కూడా .విగ్రహం వెడల్పు 26 అడుగులు .పూర్తి దిగంబర విగ్రహం .అక్కడికి వెళ్లి దర్శిస్తుంటే ఏ మనో వికారాలు కలగక పోవటం నాకే ఆశ్చర్యం గా వుంది .అంతటి ప్రభావం వుంది అక్కడ .అద్భత శిల్ప చాతుర్యం ,సునిశిత చెక్కడం మనకు ఆశ్చర్యం కల్గిస్తాయి ఒక్కొక్క కాలు పది అడుగుల పొడవు .పూర్తి సౌష్టవం తో శిల్ప కళా మర్మజ్నం తో చెక్కిన విగ్రగ్రహం .బాహుబలి జుట్టువంకీలు తిరిగి poduggవుంటుంది .ఆయన వున్న తపో భంగిమకు ”కాయతోత్సర్గ ”అంటారు .కళ్ళు తెరుచుకొని వుంటాయి .చెవులు విశాల మైనవి .పెదిమల చివర చిరు నవ్వు ,ప్రపంచాన్ని చూస్తున్న ద్రుష్టి ,ప్రశాంతత ,మూర్తీభవించి నట్లుండె మంగళ కర విగ్రహం .విశాల బాహువులు చేతులను కిందికి వదిలేసినట్లున్తాయి .యే రక మైన ఆధారం లేకుండా ఇంత భారీ విగ్రహం అన్ని ఆటు పోట్లు తట్టుకొని శతాబ్దాల పాటు నిలిచి ,ఇప్పటికి దేశ విదేశాలనుంచి జైన మతారాధకులను ఆకర్షిస్తోంది .పన్నెండు సంవత్చారాల్కు ఒక సారి బాహు బలికి మహా కుంభాభిషేకం జరుగు తుంది .ఆవుపాలునెయ్యి పెరుగు గంధం .. పూల్లు మస్తాకానికి అభిషేకం నిర్వహిస్తారు .లక్ష లాది జనం పాల్గొని భక్తీ ప్రపత్తులతో దర్శించి ,పూజించి ,తరిస్తారు .ఇందిరా గాంధి ప్రధాన మంత్రి గా అక్కడికి వెళ్లి కుంభాభిషేకం లో ఒక సారి పాల్గొన్నారు .పైనుంచి పడిన అభిషేక పదార్ధాలు పాదాల మీద పడాలి .అప్పుడే అది పూర్తి అయినట్లు ఒక సారి అలాజరగ లేదట ఒక భక్తురాలు ”గుల్లిక యాజ్జి ”అనే ఆమె పోసింతర్వాత అభిషేక జలం పాదాలను తాకిందట అందుకని ఆమె జ్ఞాప కార్ధం ఒక
చిన్న గుడీ కట్టారు అక్కడే . ఈ వూరు హసన్ కు పదిహేను కిలో మీటర్లు .ఆచార్య నిమికి దేవాలయం వుంది .
మహా బాహుబలి దివ్యదర్శనం తో మనసంతా ఆనందాన్ని నింపుకొని ,,పురాతన చరిత్రను మననం చేసుకొంటూ బస్ ఎక్కాను .పదకొండు గంటలకు బస్ బయల్దేరి బెలూరుకు పన్న్నేన్డుం బావుకు తొంభై కిలో మీటర్లు ప్రయాణించి చేరింది
బేలూరు విశేషాలు మరో సారి తెలియ జేస్తాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —25-07-11.–క్యాంపు –బెంగళూర్








