థాయి ల్యాండ్ విశేషాలు
థాయి లాండ్ ప్రజల కళ్ళల్లోనే నవ్వు కన్పిస్తుంది .మంచి చిరు నవ్వు కోసం ఎదురు చూస్తుంటారు శ్మశానం లో కూడా నవ్వటం వారి ప్రత్యేకత ..ఈప్రజలు మన చిరుఅవ్వును మెచ్చుతారు .మనతో ఏకీభవించక పోయినా ,మన పద్ధతికి అడ్డు పడరు .ఏదైనా బాగా చెయ్యాలి అనే సంకల్పం వాళ్ళది .sad స్మైల్ కూడా వుంది .”నేను నవ్వ టానికి ప్రయత్నిస్తున్నా కాని ,నవ్వ లేక పోతున్నానని నిజాయితీ గా చెప్తారు .కస్టపడి పని చేసి సాధిస్తారు .సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు కొననే కొనరు ,చదవరు కూడా .సంతోషం గురించి ఆలోచిస్తుంటే ఆ ఆనందం తగ్గి పోతుంది అంటారు ,.సంతోషాన్ని వెలువ రించా టానికి మాటలు లెవ్వు ,చాలవు అని వారి విశ్వాశం .లైట్ గ తీసుకోవటం వాళ్ల పధ్ధతి .అందుకే ఏమి జరిగినా వాళ్ల భాష లో ”mai penlai ”అంటారు అంటే ”నెవెర్ మైండ్ ”.వాళ్ళది ”జై -యెన్ ”అనగా కూల్-హార్ట్ .గొప్ప కబుర్ల పోచిగోరులు .మాంచి వ్యూహ కర్తలు కూడా . .
వాళ్ల దేశం లో ఎక్కడ చూసినా”” హ్యాపీ ”అనే మాటే కన్పిస్తుంది .happy toilet ,హ్యాపీ లైఫ్ ,హ్యాపీ pub వగైరాలన్న మాట .వాళ్ల వంటకాలలో గొప్పది ”హ్యాపీ పబ్ ”ఇది noodles తో చేసిన వంటకం ,,ఇదే వాళ్లకు double happiness .దేని గురించీ seriousness లేదు .”We do not take anything seriously ..What ever it is we accept it ‘అనటం వాళ్ల నైజం .
”We laugh and laugh non stop .>We still run over and help ,but we are laughing at the same time .”అని వాళ్ల సహజ స్వభావాన్ని చక్కగా ఆవిష్కరిస్తారు .నడి రోడ్డు మీద ఎవరైనా పొరపాటున పడ్డా ,వారిని చూసి నవ్వుతూనే వుంటారు .అయితె వారికి చేయాల్సిన సహాయాన్ని నవ్వు తూనే చేస్తారు .అదీ వీరి ప్రత్యేకత .ఎవరికైనా ఒత్తిడి (stress )వుంటే ప్రవర్తన మార్చుకోమని సలహా ఇస్తారు .ఎంత ధన వంతు లైనా తోట పని చేసుకొంటారు .గడ్డిని mow చేసుకొంటారు .అదొక fun అంటారు .fun ను వాళ్ల భాషలో ”సానుక్ ”అంటారు .
సభల్లో ,సమావేశాల్లో కూడా నవ్వుతూనే వుంటారు .అది మాకు సహజం అంటారు వాళ్ళు .నవ్వు లేకుండా ఉండలేరు .ఊపిరి పీల్చినంత సహజం వాళ్లకు నవ్వు .లావుగా వుండే వాళ్ళను హాష్యం తో గేలి చేస్తుంటారు .వాళ్ళను ”హిప్పో ”అంటారు నవ్వుతూనే
2004 లో సునామి వచ్చినపుడు వేలాది మంది చని పోయారు .దీనికి కారణం ప్రభుత్వం అని నెపం వేయలేదు థాయి ప్రజలు .జరిగిన దాన్ని వినయం గా స్వీకరించారు . ఈ జన్మ లో అనుకొన్నది సాధించలేక పొతే మరుసటి జన్మ లో సాధించు కో వచ్చును అను కొంటారు .అయ్యో అయ్యో అయోయ్యో చెయ్యి జారి పోయిందే నని విచారీన్చరు,బాధ పడరు ,కుమిలి పోరు . భవిష్య వాణిని నమ్ముతారు .ముస్లిమ్స్ దాడి చేసి సర్వ నాశనం చేస్తే తిట్ట లేదు ,బజారున పడ లేదు ,ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయలేదు ..సహనం తో ఒర్చుకొన్నారు .ఆవేశం తో వివేకం కోల్పో లేదు .ఆయుధాలు సంధించి తిరగ బడ లేదు .శాంతి ,సహనమే వాళ్ల ఆభరణాలు .అహింసా పరమో ధర్మః అనేదే వాళ్ల నమ్మకం .వేల కొలది తెల్ల cranes ను తెల్ల కాగితాలతో తయారు చేసి విమానాల నుంచి శాంతి కోసం జారవిడిచి తమ శాంతి పధాన్ని ప్రపంచానికి చాటారు .శాంతి కాముకు లైన థాయి లాండ్ ప్రజలు .అందరికి వారు ఆదర్శం గా నిలిచారు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —27 -07 -11 –క్యాంపు –బెంగళూర్

