బ్లాకు హోల్ (కృష్ణ బిలం ) —౨ సెకను
అకస్మాత్తు గా నక్షత్ర ద్రవ్య రాశి అంతా కేంద్ర బిందువు దగ్గరకి సంకోచం చెందిచేరుతుంది .ఈ క్రియ అతి వేగం గా జరుగుతుంది కనుక చూడలేరు .ఒక వద్ద సెకను లో మిలియన్ భాగం కాలమ్ లో ఇది జరిగి పోతుంది .అపుడు అతి శక్తి వంత మైన గామా కిరణాలు వెలువడతాయి .ఇలా ఏర్పడిన బ్లాకు హోల్ యొక్క density ,gravitation ఫోర్సు లు ఈ పాయింట్ వద్ద అనంతం గా అయిపోతాయి .. దీనినే singularity అంటారు అప్పుడు స్టార్ లోని ద్రవ్యపదార్ధం పూర్తిగా అణచి వేయబడి ఉనికినే కోల్పోతుంది .ఈ singularity చుట్టూ అంతరిక్ష volume అందులో పదార్ధం అంతా పడి పోయి ,ఏదీ దాని నుంచి తప్పించు కోలేని పరిస్థితిఏర్పడు తుంది .ఇదే బ్లాకు హోల్ .నల్ల బిలం దీని వ్యాసార్ధాన్ని .”schwarzschild radius కేంద్రం నుంచి కొలుస్తారు .
ఏ నక్షత్రం ద్రవ్య రాశి అయినా పది సోలార్ మాస్ కంటే ఎక్కువైతే ,బ్లాకు హోల్ ఏర్పడి హైడ్రోజెన్ అంతా ఖర్చు అయి పోయి ,దాని పతనానికి ఏదీ అడ్డు పడ లేని పరిస్థితి ఏర్పడుతుంది .దీనికి సూపర్ నోవా ఏర్పడే అవసరము ,రాదు .దాని బరువే దాని పతన హేతువు .బరువంతా బ్లాకు హోల్ లోకి కుంచించుకు పోతుంది .
సోలార్ మాస్ ఒకటి పాయింట్ నాలుగు కంటే తక్కువ గా వుంటే అవి వైట్ dvarf స్టార్స్ అవుతాయి .అంటే వాటిలోని న్యూక్లియర్ energy పూర్తిగా ఖర్చు అయి పోయిందన్న మాట .
ఇది వరకు చెప్పు కొన్న రెడ్ giant తెల్ల వామన నక్షత్రం లాగా మారి స్థిర పడి పోతుంది . ఈ తెల్ల వామన నక్షత్రాలు ఇంకా సంద్రం గానే వుంటాయి .దీన్నికి కారణం వీటి లోని degenerated మేటర్ .
న్యూట్రాన్ స్టార్ కు అందులో కొంత స్థిరమన critical ద్రవ్యం వుంది ,తదుపరి పతనాన్ని ఆపే శక్తి కలిగి ఉండదు ఈ లిమిట్ నే ”చంద్ర శేఖర్ లిమిట్ ”అని నోబెల్ బహుమతి గ్రహీత మన చంద్ర శేఖర్ పేరు గా పిలుస్తారు .అదే ఒకటి పాయింట్ నాలుగు సోలార్ మాస్ .దీనికి మించిన తెల్ల వామన తార బరువు గా వుంటే అది collaapsar స్టార్ అయి చివరికి బ్లాకు హోల్ గా మారి పోతుంది
బ్లాకు హోల్ చుట్టూ వున్న పరిధి ని ఈవెంట్ horizon అంటారు దేనికి వెలుపల వున్న అంత రిక్ష యాత్రికునికి ఈవెంట్ హారిసన్ లోపల ఏమి జరుగు తున్నది తెలియదు .అంటే బ్లాకు హోల్ లోపల ఏమి జరిగేదీ ఎవరికి తెలియదన్న మాట .దీనికి కారణం ఏమిటీ అని ఆలోచిస్తే బ్లాకు హోల్ గ్రావిటీ చాలా లోతుగా సాంద్రం గా వుండి ,కాంతికూడా ఈవెంట్ హోరిజోన్ నుంచి తప్పించుకో లేక పోవటమే .
సాధారణం గా శక్తి frequency కి అనులోమాను పాతం గా వుంటుంది .కాంతి శక్తిని కోల్పోతే దాని frequency కూడా తగ్గి పోతుంది . frequency ,మరియు తరంగ దైర్ఘ్యం అంటే wave length లు విలోమాను పాతం లో వుంటాయి .కనుక frequency తగ్గితే wave length పెరుగు తుంది .ఇలా తరంగ దైర్ఘ్యం పెరగటాన్ని రెడ్ షిఫ్ట్ అంటారు .దీనికి కారణం ఎరుపు రంగు wave length .ఎక్కువకావటమే మిగతా రంగుల కంటే ..బ్లాకు హోల్ కేంద్రం లో గ్రావిటీ అనంతం .కనుక దీనినుంచి తప్పించు కోవాలి అనుకొనే కాంతి అనంతం గా శక్తిని కోల్పోతుంది .అందుకే రెడ్ షిఫ్ట్ ఈ ప్రాంతం లో అనంతం గా వుంటుంది ..
ఈవెంట్ హోరిజోన్ లో కాలమ్ కూడా స్తంభించి పోతుంది అంటే అంతరిక్ష నావికుడికి ఇక్కడ ఒక సెకండ్ కాలమ్ గడిస్తే మిగతా విశ్వం లో అనంత కాలమ్ గడిచి పోయినట్లే .దీనినే టైం ఫ్రోజెన్ అంటారు .అంతరిక్ష నావికుడు తన telescope లో చూస్తూ వుంటే ఇక్కడ ఆస్ట్రోనాట్ నెమ్మది నెమ్మదిగా ఈవెంట్ హోరిజోన్ వైపుకు పడి పోతున్నట్లు గమనిస్తాడు .చివరిగా ఈవెంట్ హోరిజోన్ లో ప్రయాణీకుడుశాశ్వతం గాఫ్రోజెన్ అయినట్లు అనిపిస్తుంది . einstein శాస్త్రజ్ఞుడు అందుకే ద్రవ్యం ,కాలమ్ ,పొడవు అన్నీ సాపెక్షాలు అన్నాడు .ఇవి మనం చూసే పాయింట్ అఫ్ viiew ,మరియు, చూసే ప్రదేశం అంటే frame ల మీద ఆధార పడి వుంటాయి అని వివరించాడు . .
iఇవీ నల్ల బిల విశేషాలు ..దాని ప్రభావం లోకి జార కుండా జాగ్రత్త వహిద్దాం .ఇంత సేపు నాతొ అంత రిక్ష యానం చేసి ,బ్లాకు హోల్ విశేషాలను తెలుసు కొన్నందుకు కృతజ్ఞతలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -07 -11 .క్యాంపు–బెంగళూర్


Hi we seen your blog it’s quite interesting please visit our blog kalahastikalavahini.blogspot.com it also matter something – Thank you
LikeLike