చంద్ర నివాసం

    చంద్ర నివాసం
                 చంద్ర  యానం తేలికై పోయింది .అక్కడ వుండి జనంజీవించాలంటే చాలా కష్టమే .దాన్ని వాస యోగ్యం చేసు కోవాలి .భూభారం తగ్గించి చంద్ర లోకం లో నివశించాలని అందరు ఉబలాట పడుతున్నారు .స్థలాల అమ్మకాలు జరుగు తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే .పూర్తి జన జీవితం అక్కడ వర్ధిల్లాలి అంటే ఏమి చేయాలి అని శాస్త్రజ్ఞులు బుర్రలు బద్దల కొట్టు కుంటున్నారు .అయితె అది అసాధ్యం కాదు ,కష్టమైనా సుసాధ్యమే నని తెలియ జేస్తున్నారు .దానికి అనుసరించాల్సిన వ్యూహాలను రచించు కొని వాటి ప్రకారం నడిస్తే చంద్ర నివాసం తేలికే నని నీల్ అనే స్పేస్ శాస్త్ర వేత్త చాలా వ్యాసాల ద్వారా ఊహించి సూచించారు .అందు లోని కొన్ని విషయాలు మీ ముందుంచుతున్నాను .
                       ముందుగా చంద్రుని పై మూడు islaands   ను ఏర్పాటు చేయాలి మొదటి islaand ను చాలా పెద్ద గోలాకారపు  donut shape   వున్న  tori లాంటిది ఏర్పాటు చేయాలి .దీనిలో మనకు కావలసిన ఆహార ధాన్యాలనుకూరలు పండ్లు  పండించుకో వచ్చు ..ఇది స్వయం పోషకం గా వుండే collony  లాగా పని చేయాలి అంతే కాక భూమికి ఆర్ధికం గా సాయం చేసే ట్లు నిర్వహించు కోవాలి .ఇది ఒక పక్కా గా    చాలా పెద్దది గా వుండాలి /.భూమి చంద్రుల మధ్య సయోధ్య వున్నంతకాలం ఇది  ఉండాల్సిందే .ఎల్.  5 అనే   సొసైటీ ఏర్పడాలి .ఇది స్పేస్ లో colonization ఏర్పరిచి ,,దీన్ని నేషనల్  స్పేస్ institution తో కలిపేయాలి .దీని వల్ల ఇప్పుడు నేషనల్ స్పేస్ సొసైటీ ఏర్పడుతుంది .
        రెండవ island  గురించి తెలుసు కొందాం .చంద్రుని మీద workers  కోసం కాలనీ ఏర్పాటు చేయాలి .  ఇది మాస్ డ్రైవర్ లాగా పని చేయాలని నీల్ భావించాడు .ఇందులోని   ఎలెక్ట్రో మాగ్నెటిక్ re -circulating conveyor బెల్ట్ లెక్క పెట్ట టానికి వీలు లేనన్ని buckets ను అనంతం గా లునార్ పదార్ధం తో నింపి ఎల్ five కు అంటే పైన చెప్పిన చోటికి పంపుతూనే వుంటుంది .దీనితో అక్కడ నిర్మాణ కార్య  క్రమాన్ని నిరాఘాటం గా కోన సాగించ వచ్చు .ఇది ఆరు వేల అడుగుల పొడవు ఉండి ,నాలుగు మైళ్ళ eqatorial పరిధి  తో ,140 ,౦౦౦  ల జనాభా j తోఉంటుందట .  .
                             island  –3  అన్నిటికంటే పెద్ద ది. .నాలుగు మైళ్ళ వెడల్పు ,ఇరవై మైళ్ళ పొడవు తో 500 చదరపు మైళ్ళ వైశాల్యం తో వుంటుంది . ఈ దీవిని మామూలు material  తో కట్ట వచ్చునట .అంటే ఇనుము ,అల్యుమినుం ,స్పెషల్ గ్లాస్స్ , లను ఉపయోగించి కట్టచ్చు .అయితె దీనిలో oxygen పీడనం  సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తున వున్నట్లుఎనభై మైళ్ళ పొడవు ,పదహారు మైళ్ళ వెడల్పు తో వుండాలి .స్విర్జేర్లాండ్ లో సగం అన్న మాట ఇక్కడ artificial గ్రావిటీ వుంటుంది భూమి మీద ఉన్నట్లే ఇక్కడ కూడా ,గాలి ,భూమి ,నీరు ,సహజ సూర్య కాంతి
లభిస్తాయి .20   మైళ్ళ  పొడవు ఇరవై మైళ్ళ వెడల్పు వున్న cylinders .  ఒకదానికి ఒకటి  సమాంతరం గా నిర్మించి ,వాటి చివరలను అర్ధ గోలాకారపు మూత లతో మూసేయాలి .ఆ సిలెండర్లు భ్రమణం చెందు తూంటే గ్రావిటీ ఏర్పడు తుంది .ఒక అద్భుత మైన లోయ లో ఉంటున్న అనుభవం కలుగు తుందట  దీనినే కమ్యునిటీ అంటారు . సూర్య కాంతి నే శక్తి జనకం గా ఉపయోగిస్తారు .ఇక్కడ మచ్చు కైనా తుఫాన్లు ,మంచు ,వరదల బెడద ,మంచు తుఫాన్లు ఉండక పోవటం ఆశ్చర్యం కల్గిస్తుంది .;ఇంకో విశేషం ఏమిటంటే చలి కాలమ్ అనేది ఇక్కడికి ప్రవేశించనే ప్రవేశించదు .ఈ మూడవ islaand లో
పది మిలియన్ల జనం నివశించ వచ్చునట    మనుష్యులతో పాటు ,కోళ్ళు ,టర్కీలు ,పందులను కూడా పెంచుకో వచ్చు నట ఇక్కడ ..ఇన్ని అవకాశాలుంటే ఎందుకండీ భూమిని నమ్ము కోని వుండటం?కొంప ,గోడు మ్ముకొని చంద్ర మండలం పై .జెండా పాతెద్దాం.భూమి మీద జన సమ్మర్దం తగ్గిద్దాం ..అయితె బాబుల్లారా.!ఇవన్నీ శాస్త్ర వేత్త నీల్ గారి ఊహలు .అవి ఆచరణ లోకి రావటం ఎప్పుడో ?మనం చంద్ర సదనం చేరటం ఎప్పుడో ?నిరాశ వద్దు .నేటి శాస్త్ర వేత్త ఊహే రేపటి ఆవిష్కారం అని చాలా సార్లు రుజు వైంది .జలాంతర్గామి ,చంద్ర మండల యాత్ర missile ఇవన్నీ ఊహల్లోంచి అంటే సైన్సు fiction లోంచి సైంటిఫిక్ truth గా మారినవే ..”ఉందిలే మంచి కాలమ్ ముందు ముందునా ”అని పాడు కొంటు ఎదురు చూద్దాం .
                                                 మొత్తం మీద మొన్న కుజ గ్రహం మీద ,ఇవాళ చంద్రగ్రహం మీద నివాసం వుండే అవకాశాలు  అన్నీ చూసారు నాతొ పాటు వచ్చి..థాంక్స్
                                             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -07 -11 .క్యాంపు—బెంగళూర్
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.