సత్య కధా సుధ -6

    భక్తుడు’’ రక్షించు మహా ప్రభో’’ అని ఆర్తిగా ప్రార్ధిస్తూ ఉంటె వీడు ఏమైనా  పుణ్య కర్మ చేశాడా అని భగవంతుడు ఆలోచిస్తాడట .దీనికి సంబంధించిన కధ తెలుసు కొందాం .

            ఒక సారి పాండవులందరూ ద్రౌపది తో సహా సముద్ర స్నానానికి వెళ్లారట .దాదాపు అంతా గంటకు పైగా స్నానాలు చేసి పైకి వచ్చి కూర్చున్నారు .కాని తమతో పాటు సముద్ర స్నానానికి వచ్చిన ఒక సాధువు ఎంత సేపైనా నీటి నుంచి బయటికి రాకుండా ,నీళ్ళలో వణుకుతూ కని పించాడు .ద్రౌపది ఆయన విషయం కనుక్కో మని ధర్మ రాజుకు చెప్పింది .ఆయన సేవకుల ద్వారా విచారించాడు .సాధువు కౌపీనం సముద్ర కెరటా లకు కొట్టు కు పోయిందట .నగ్నం గా బయటకు రావటానికి ఇబ్బంది పడుతూ ఆ చలిలో అలానే వణుకు తున్నాడని చెప్పారు .వెంటనే ద్రౌపదీ దేవి క్షణం ఆలో చించ కుండా తన చీర చెరగు చింపి ,ఆ సాధువు కు ఇమ్మని పంపించిందట .పాపం ఆయన అది కట్టు కొని తీరం పైకి వచ్చాడట .అందుకనే నిండు సభలో ద్రౌపది కి వస్త్రాపహరణాన్ని దుశ్శాసనుడు చేసి నప్పుడు శ్రీ కృష్ణ పరమాత్మ ఈ పుణ్యాన్ని దృష్టి లో ఉంచు కొని రంగు రంగుల విలువైన చీరలు అసంఖ్యాకం గా అందించి ఆమె గౌరవాన్ని ,శీలాన్ని కాపాడాడట .అవే’’ అక్షయ వలువలు’’ గా ప్రసిద్ధి చెందాయి పాపం దుర్యోధనుడికి ద్రౌపదీ మానాన్ని మంట గలుపు  దామని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది ‘

            చేసుకొన్న వారికి చేసుకోన్నంత .ప్రపంచం లో అంతకు ముందు ఎవ్వరు చూడని రంగు రంగుల ఖరీదైన చీరల వర్షం ద్రౌపది మీద కృష్ణుడు కురి పించే సరికి దుర్యోధనుడికి కడుపు ఉబ్బరం చేసింది .తట్టు కొ లేక పోయాడు .దేశమంతా వెతికించి అతి విలువైన చీరలను తమ సోదరుల భార్య లందరికి అంటే నూరు చీరెలు తెప్పించి ఇచ్చి ,వారిని కట్టు కొ మన్నా ట .వారందరూ ఎంతోసంతోషం గా వాటిని ధరించి ,వాటి సౌందర్యాన్ని నగర వాసుల కు కూడా చూపించాలనే ఉత్సాహం తో అంత పురం పైకి చేరి ప్రజలకు కని పించే టట్లు పచార్లు చేస్తున్నారట .ఇంతలో శ్రీ కృష్ణ పరమాత్మ మురళి ని అద్భుతం గా వాయిమ్చాడ ట…ఆ వేణు గానానికి ముచ్చట పడి  ఆ చీరలన్నీ చిలకలుగా  మా రి పోయి, మధుర వైపు యెగిరి పోయాయట .పాపం కక్కా లేక మింగా గా లేక, శీలం కాపాడు కొనే వీలు లేక ,ప్రజల ద్రుష్టి నుంచి తప్పించు కోలేక, నానా ఇబ్బందీ పడ్డారట ఆ నూరుగురు రాణులు  . ఒక్క ద్రౌపదీమాన సంరక్షణ చేసిన వాడే ఒకే సారి నూరుగురికి వస్త్రాపహరణం చేసి బుద్ధి తెప్పించాడ న్న మాట .కన్నయ్య లీలలు అందుకే అద్భుతాలు .గుణ ప్రదానాలు .

                            భగవంతుని కంటే ఆయన నామం గొప్పది అని తెలియ జేసే కధలు చాలా విన్నాం .శ్రీ రాముని గురించిన కధ ఒకటి చెప్పుతున్నాను .సముద్ర లంఘనం చేసి నప్పుడు హనుమ రామ నామాని జపిస్తూ సునాయాసం గా లంకకు చేరాడని మనకు తెలుసు .శ్రీ రాముని సైన్యం రావణ సంహారం కోసం సముద్ర తీరం చేరింది .సముద్రం పై వారధి నిర్మించే ఏర్పాటు నీలుడు అనే ఇంజనీర్ చూస్తున్నాడు .రావణ వధ తర్వాత ఒక రోజు రాముడు ఒంటరి గా సముద్రం ఒడ్డున కూర్చున్నాడు .ఆ నాడు వానరులు కట్టిన సేతువు దృశ్య మానం గా కని పించింది .అంటే  మనసు ఫ్లాష్ బాక్ లో కి వెళ్ళింది .ఎలా కట్టామా అని ఆశ్చర్య పోతున్నాడు . సముద్రం లో వేసిన శిలలన్నీ తేలి పోవటం ఇప్పటికీ ఆశ్చర్యం గా నే ఉంది ఆయనకు .. .తాను స్వయం గా ఒక పెద్ద రాయి తెచ్చి సముద్రం లో విసిరేశాడు .అది డబుక్కున మునిగి పోయింది .సంభ్రమం లో మునిగి పోయాడు .ఇదేమిటి ఇలా జరిగిందేమిటి అని విచారిస్తున్నాడు .కొంప తీసి ఎవరు చూడలేదు కదా అని అటు ,ఇటు చూశాడు .హనుమ కన్పించాడు ‘’.చూశావా ‘’అని అడిగాడు .’’చూశానన్నా’’డు మారుతి .ఎవరికీ చెప్పవు కదా అని అడిగాడు ‘’.ముల్లోకాలకు చాటించి మరీ చెబుతాను’’ అన్నాడు పావని ‘’.యేమని చెబుతావు’’ మళ్ళీ రామ ప్రశ్న .పరువు పోతుందేమో నని భయం .అప్పుడు హను మంతుడు ‘శ్రీ రాముని చేతి పట్టు విడిచిన వారు మునిగి పోవటం ఖాయం అని ఎలుగెత్తి చాటు తాను’’ అన్నాడు నవ్వుతు .రాముడు ముసి ముసి నవ్వులు నవ్వుతు’’ అమ్మయ్య’’ అను కొన్నాడు .కనుక భగ వంతుని కంటే భగవన్నామం గొప్పది .వారధి కట్టేటప్పుడు రాళ్ళ మీద రామ నామం రాసిన విషయం మనం విన్నదే కదా .

                         ఒక సారి నారదుడు విష్ణు మూర్తి ని’’ అందరి కంటే గొప్ప వాడేవారు ‘’?అని ప్రశ్నించాడు .దానికి పరమాత్మ ‘’నారదా !అన్నిటి కంటే గొప్పది భూమి .దాని కంటే సముద్రం గొప్పది .అంతటి సముద్రాన్ని ఒక్క గుక్క లో తాగేసిన అగస్త్య మహర్షి గొప్ప వాడు .ఆ అగస్త్యుడిని నక్షత్ర రూపం లో భరిస్తున్న ఆకాశం గొప్పది .అలాంటి ఆకాశాన్ని ఒకే ఒక్క పాదం లో నేను అక్రమించాను .విశ్వ వ్యాప్తి ని అయిన నన్ను హృదయం లో దాచుకొన్న భక్త శిఖా మణి అందరి కంటే గొప్పవాడు ‘’అని సందేహాన్ని నివృత్తి చేసి భక్తుడే భగ వంతుని కంటే గొప్ప అని రుజువు తో  సహా పరమాత్మే తెలియ జేశాడు .

 ఇప్పుడు ఒక భక్తుడు చెప్పిన శ్లోకం, దాని లోని సత్యం తెలుసు కొందాం

   ‘’దాసోహమితి యా బుద్ధిహ్ పూర్వ మాసీత్ జనార్దనే —దకారో అపహృహృస్తేన గోపీ వస్త్రాప హారినా’’

    దీని అర్ధం –పూర్వం నేను భక్తీ తో ’’  దాసోహం ‘’అంటూ ఉండే వాడిని .అలా అనుకొంటుంటే గోపికా వస్త్రాపహరుడైన ఆయన  దాసోహం అనే నా భావనలో ‘’ధా’’ అనే అక్షరాన్ని అపహరించాడు .’’సోహం ‘’అనే భావం తో  నన్ను ముంచేశాడు .అంటే నాకు పరమాత్మ కు భేదం లేదని తెలియ జేశాడు .దీన్నే వ్యాజ స్తుతి అంటారు .పైకి నింద ఉన్నా లోపల అందమైన ఆనందార్ధం ఉంటుంది .

          భక్తీ అంటే ఏమిటో ‘’శివా నంద లహరి ‘’లో శంకర భగవత్పాదులు గొప్పగా వివ రించారు –ఆ వైభవం చూద్దాం –‘’      ‘’అన్కోలం నిజ బిందు సంతతి ,మయస్కామ్తోపలం సూచికః –సాధ్వీ నిజ విభుం లతాక్షి తిరుహం సిన్దుస్సరిద్వల్లభం –ప్రాప్నోతీ హయదా తధా పశు పతే పాదార వింద  ద్వయం –చేతో వ్రుత్తి రుపెత్య తిష్టతి సదా సా భక్తీ రిత్యుచ్యతే‘’బూరుగ చెట్టు విత్తనాలు పండి నేల రాలి తమకు తామే చెట్టు వైపుకు  ఆకర్షింప బడి మానుకు అంటూ కుంటాయి ..ఇనుప సూది అయస్కాంతానికి తానె ఆకర్షింప బడు తుంది పవిత్రత అనేది మనస్సు  భక్తీ భావం అనే మనో వాక్కాయ కర్మ లచే అనుసరిస్తుంది.తీగ చెట్టుకు  చుట్టు కోవటం ,నది సముద్రాన్ని చేరటం సహజం .అలానే  మనసు శివుని పాద పద్మము లను పట్టు కొని ఉండటం భక్తీ అంటారు .

 భాగవతం లో  భక్తీ అంటే ఏమిటో ప్రహ్లాదుని గురించి చెబుతూ పోతన గారు రాసిన అద్భుత పద్యం  జగద్విదితం

  ‘’పానీయమ్బులు త్రావుచున్ ,కుడుచుచున్ ,,భావించుచున్ ,హాస లీ

  లా నిద్రాదులు చేయుచున్ ,తిరుగు చుం ,లక్షించు చుం ,సంతత

 శ్రీ నారాయణ పాద పద్మయుగళ ,,చిన్తా మృతా  స్వాద సం

దానున్డై ,మరచేన్ సురారి సుతుడే తద్విశ్వమున్  భూవరా’’

     మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –10-5-12.

            కాంప్—అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

2 Responses to సత్య కధా సుధ -6

  1. తాడిగడప శ్యామలరావు's avatar తాడిగడప శ్యామలరావు says:

    >ప్రపంచం లో అంతకు ముందు ఎవ్వరు చూడని రంగు రంగుల ఖరీదైన చీరల వర్షం ద్రౌపది మీద కృష్ణుడు కురి పించే సరికి…..
    నన్నయగారు ‘అట్టివలువగాన్’ అన్నట్లు గుర్తు. రకరకాల రంగుల చీరలుకాదు. అలా అదే వలువ కొనసాగుతూ రావటంలోని సామంజస్యంమీద విశ్వనాథవారొక వ్యాసం వ్రాసారు.

    >….ఆ చీరలన్నీ చిలకలుగా మా రి పోయి, మధుర వైపు యెగిరి పోయాయట ….
    సమంజసంగా లేదీ కథ.

    >ద్రుష్టి
    కాదండీ దృష్టి అనాలి.

    >రావణ వధ తర్వాత ఒక రోజు రాముడు ఒంటరి గా సముద్రం ఒడ్డున కూర్చున్నాడు
    అంత తీరిక దొరికిందా ఆయనకు. ఆదరాబాదరాగా అయోధ్యకు వెళ్ళిపోయాడుకదా. లేకపోతే పాపం భరతుడు ప్రాయోపవేశం చేస్తాడాయె.

    ఇదంతా అలా ఉంచి మొత్తం మీద మంచి వ్యాసం

    Like

  2. అబ్బ! ఈ భాగవత కథలలో రమిన్చిపోయాననుకోండి ఆనందంగా స్వీకరించాను అందించినందులకు ప్రణతులు. సాయిరాం!

    Like

Leave a reply to ఎందుకో ‽ ఏమో Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.