నల్ల జాతి ముస్లిం మత పెద్ద- మాల్కం ఎక్స్
అతని తండ్రిని చిన్నప్పుడే హత్య చేశారు .తల్లి డిప్రెషన్ లో కుంగి మానసిక స్తితి ని కోల్పోయి ఆస్పత్రి పాలైంది ,కుటుంబం లో మిగిలిన వారి బతులులు ప్రభుత్వపరమైనాయి ,ఇతను వీధి రౌడీ గా వ్యభి చారిగా మాదక్క ద్రవ్యాలను అమ్మే వాడిగా దొంగగా జీవితం గడి పాడు .జైలు కు వెళ్లాడు అక్కడ పుస్తకాలు చదివి జీవితాన్ని సరి దిద్దు కొన్నాడు .ముద్దాయి ముస్లిం మత పెద్ద గా ఎదిగాడు అతడే మాల్కం ఎక్స్ .
సోదరి హీల్డా సోదరులు రిజినాల్ద్ ,ఫైల బర్న్ లు ఇతను జైలు లో ఉండగానే national islaam అనే మత సంస్థలో చురుగ్గా పాల్గొన్నారు .ఇది ఆద్రికన్ అమెరికన్ల కోసం ఏర్పడింది .వారందర్నీ మళ్ళీ ఆఫ్రికా కు పంపటమే ధ్యేయం గా ఏర్పడింది ‘’ఇదే బాక్ టో ఆఫ్రికా ‘’ఆ సంస్థ అధ్యక్షుడు elijaah mahmad రచనలు చదివి ప్రభావిత మయ్యాడు .అది నల్ల వారి వెన్నెముక గా నిల్చే సంస్థ అని భావించాడు .నల్లవాడిని అని గర్వించటం ,తెల్ల వారి కంటే నల్ల వారు జాతి ,సాంఘిక విషయాల్లో గొప్ప వారని అనుకోవటం ,నల్ల జాతి స్వయం సమృద్ధి సాధించటం అనే లక్ష్యాలు ఆ సంస్థ లో ఉన్నందుకు ఆనందించాడు ..తెల్ల వారే ప్రపంచం లో అన్ని అనర్ధాలకు కారణం అని అనుకొన్నాడు .వారి పై ద్వేషం పెంచు కొన్నాడు .
మురికి కూపాల్లో ఉంటున్న నల్ల జాతి వారి దగ్గరకు వెళ్లి వారి శక్తి సామర్ధ్యాలను తెలియ జేస్తున్న మహమ్మద్ అంటే ఆరాధన ఏర్పడింది .అతడు జైలు పక్షుల దగ్గరకూ వచ్చి ప్రబోదిస్తున్నాడు .మాల్కం అతని తో ఉత్తర ప్రత్యుత్త రాలు నది పాడు .వర్ణ వివక్షతను అంతం చేయాలని ప్రభుత్వానికి ,అది కారులకు జైలు నుండి అనేక ఉత్తరాలు రాశాడు .అతనికి పదేళ్ళ శిక్ష పడితే అతని సత్ ప్రవర్తనకు మూడేళ్ళు శిక్ష తగ్గించి విడుదల చేశారు .డెట్రాయిట చేరాడు .ఫర్నిచర్ షాప్ లో ఉద్యోగం చేశాడు .నేషనల్ ఇస్లాం వాళ్ళు వేసుకొనే దర్జా అయిన వేశం ధరించాడు .1952 లో ఎల్జః మహ్మద్ ను కలిశాడు .తోలి చూపు లోనే ఫ్లాట్ అయ్యాడు .అతన్ని సంస్థ లో చేర్చుకొని సభ్యులను పెంచే కార్యక్రమం అప్ప గించాడు .మాల్కం లిటిల్ గా ఉన్న పేరు ను మాల్కం ఎక్స్ గా మార్చుకొన్నాడు .ఎక్స్ అనేది ఊరూ పేరు తెలీని అనేక వేల నల్ల జాతి వారి కి ప్రతీక .దీనితో కొత్త జీవితం ప్రారంభమైంది .డెట్రాయిట లో టెంపుల్ నంబర్ వాన్ లో చేరిన కొన్ని నెలలకే సభ్యత్వాన్ని మూడు రెట్లు పెంచాడు .మంచి వాగ్ధాటి ,స్పురద్రూపం సూటిగా చెప్పే నేర్పు అతనికి బాగా ఉపయోగ పడ్డాయి .దేశం లో ‘’బెస్ట్ రిక్రూటర్ ‘’అని పేరొచ్చింది .అసిస్టంట్ మినిస్టర్ హోదా ఇచ్చారు . 1954 లో బోస్టన్ వెళ్లి కొత్త టెంపుల్ ఏర్పరచాడు .మహ్మద్ అతన్ని ఫిలడెల్ఫియా పంపాడు .అక్కడ టెంపుల్ పన్నెండు ఏర్పాటు చేశాడు .న్యూయార్క్ దగ్గరలోని హార్లెం టెంపుల్ సెవెన్ కు మినిస్టర్ అయ్యాడు .ఇలా క్రమంగా మత పెద్ద అయాడు .
అతనిది సంభాషణా శైలి .అప్పటికే మార్టిన్ లూధర్ కింగ్ సివిల్ రైట్స్ ఉద్యమం తీవ్రం గా సాగిస్తున్నాడు .కింగ్ భావాలను వ్యతి రేకించాడు .అతని అహింస నచ్చ లేదు .పౌరహక్కుల ను ఎవ గిన్చుకొన్నాడు .ఉత్తరాది మురికి వాడల్లోకి వెళ్లి నల్ల జాతి ఆత్మా గౌరవాన్ని తెలియ జేశాడు .కింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలు లో పెడితే వేలాది మంది నల్ల జాటీయులు స్టేషన్ వద్ద భాతా ఇంచారు .మాల్కం అక్కడికి వెళ్లాడు .అందరు అతను హింసా వాడి .యే ఉపద్రవం జరుగు తుందో నని భయపడి పోయారు .చాలా ప్రశాంతం గా మాట్లాడి అందరని శాంతింప జేశాడు .ఆ నాటి మాల్కమేనా ఇతను /అని పోలీసులే ఆశ్చర్య పోయారు ..మాల్కం కు జనం పై ఉన్న ప్రభావం చూసి ఆశ్చర్యపోయి భయపడి పోయారు .నల్ల జాతి సమీకరణానికి మాల్కం ఏంటో కృషి చేశాడు .
మ్స్లిం నేషన్ అధ్యక్షుడు మహమ్మద్ తన సెక్రెటరి లతో వ్యభియా చరిన్చాడని ఎందరికి తండ్రి అయ్యాడని ,ముస్లిం మతాన్ని అవమానం చేస్తున్నాడని ప్రారోపణలు బాగా వచ్చాయి .మొదట బుకాయించినా చివరికి మహ్మద్ ఒప్పు కొన్నాడు .ఇది మాల్కం జీర్ణించు కొ లేక పోయాడు .దేవుడని ,తన తండ్రి లాంటి వాడని నమ్మిన వాడు ఇంత దిగ జారి పోవటం దిగ మింగు కొ లేక పోయాడు .అతని కోసం ప్రాణాల నైనా అర్పించా టానికి సిద్దమ నుకొన్న మాల్కం పునరాలోచన లో పడ్డాడు .అప్పుడే ప్రెసిడెంట్ కేంనేది హత్యకు గురైనాడు .దాని పై స్పందిస్తూ మాల్కం ‘’a case of chickens coming home roosted ‘’అని నోరు జారాడు .ఇది ముస్లిం లలో కలవరం సృష్టించింది .కేంనేది చావటం వారికి ఇష్టం అనే అభిప్రాయం గా ఆ మాటలున్నాయి వెంటనే మాల్కంను సస్పెండ్ చేసి తరువాత తొలగించే శాడు మహ్మద్ .తన ఉనికి కి కూడా ప్రస్మాదం అని భావించాడు ..తన రహస్యాలను బయట పేద తాడని అనుకొన్నాడు
సంస్థ లోంచి బయటికి వచ్చి తానే muslim maque అనే సంస్తనేర్పరచి తానే మతాధి కారి అయాడు .తాను ఒక సామాన్య మత గురువునే కాని మహ్మద్ లా మత ప్రవక్త ను కాదు అని ప్రజలకు తెలియ జేశాడు .ఆత్మా గౌరవం పెరిగింది .1964 లో మక్కా యాత్ర చేశాడు .అక్కడి సాంప్రదాయ దుష్టులైన తెల్ల వస్త్ర ధారణా చేశాడు .అక్కడి ముస్లిం సోదరత్వం అతనికి ఎంతో నచ్చింది .అక్కడ గరీబు వజీరు అందరు ఒక్కటే .అందరు సమానమే .అందరికిసమాన అవకాశాలున్నాయి అక్కడ .అలాంటి ఆతిధ్యం ,ప్రవర్తన ఇంకెక్కడా లేవు అని భావించాడు .
న్యూయార్క్ కు తిరిగి వచ్చి తన పేరు el hajj maalik el shabaajj గా మార్చుకొన్నాడు .షాబాజ్ అంటే50,000 సంవత్స రాల క్రితం తూర్పు ఆసియా నుండి ఆఫ్రికా కు చేరిననల్ల జాతి వారు .అది వారికి ప్రతీక .ఎల హాజ్జ్ అంటే మక్కాకు వెళ్లి వచ్చినందుకు గుర్తు .మాలిక్ అనేది మాల్కం కు అరేబియా లో పేరు .తన స్వీయ చరిత్ర రాసుకొన్నాడు .organaizzetion of afro amerikan unity ‘’అనే సంస్థను స్తాపించాడు .ఆఫ్రికన్ యునితి లో ని విషయాలనే ఇందులో పొందు పరచాడు .ఇరవై రెండు మిలియన్ల నల్ల జాతి వారు నాలుగు వందల ఏళ్లుగా అమెరికా కు సేవ చేస్తూ ,అనేక యుద్ధాలు ,తిరుగు బాటలలో ప్రాణాలను కోల్పోతూ అమెరికా అస్తిత్వాన్ని కాపాడుతున్నా తమకు ఒరిగిందేమీ లేదని మొదటి సమావేశం లో ప్రసంగించాడు .నల్ల జాతి వారు వెన్నెముక ను గట్టి పరచు కోవాలని చెడు ప్రవర్తనకు దూరం గా ఉండాలని ,తమను తాము హీన పరచు కోరాడని ,నల్ల వారుగా పుట్టినందుకు గర్వ పదాలని బోధించాడు .కింగ్ పై ఉన్న ఇదివరకటి భావాల్ని మార్చుకొని పౌరహక్కులు కావాల్సిందే నని ఉద్యమించాలని ,సహకరించాడు .హ్యుమన్ డిగ్నిటి వస్తే హ్యుమన్ రైట్స్ వస్తాయని చెప్పాడు .right to self defence కు ఉద్యుక్తులవ్వాలని నల్ల జాతి వారిని ఉత్తేజితులను చేశాడు .
మాల్కం కు కస్టాలు ప్రారంభ మయ్యాయి .అతన్ని చంపుతామని బెదిరింపు లేఖలు ఫోన్లు వస్తున్నాయి .ముస్లిం నేషన్ నుంచి మరీ ఎక్కువ గా వస్తున్నట్లు భావించాడు .మహ్మద్ రహస్యాలను మరిన్ని బయట పీడా తాదేమో నని భయం .ఇంటికి నిప్పు అంటించారు .చాలా భాగం తగలడింది .1965 fibruary 21ణ ఉదయం న్యూయార్క్ లోని audubaan baalroom ‘’హాలులో students non violent co ordinating committee సభలో నాలుగు వందల మంది సభ్యులనుద్దేశించి ప్రసంగించాతానికి గర్భ వతి అయిన భార్య బెట్టీ శబ్బాజా తో వచ్చాడు .వేదిక ఎక్కి ప్రసంగం ప్రారంభించే లోగా కింద ఎవరో స్మోక్ బాంబ్ పేల్చారు .జనం కంగారు పది పారి పోతున్నారు .మాల్కం కు రక్షణ గా ఉండాల్సిన సెక్యురిటి బాంబ్ వైపుకు వెళ్లారు .ఇంతలో నలుగురు వ్యక్తులు మాల్కం మీద పదహారు బుల్లెట్లను వర్షం గా పాయింట్ బ్లాంక్ గా కురి పించారు .నేల కూలాడు మాల్కం .హాస్పిటల్ లో చేచారు మధ్యాహం మూడింటికి తుది శ్వాస విడిచాడు ..ఆ కేసు ఇన్వెస్ట్ గేషణ్ జరిగినా ఏమీ చివరికి తెల లేదు .ముస్లిం నేషన్ తామే ఆపని చేసి నట్లు చెప్పు కొంది .తగిన శాస్తి జరిగిందని ప్రకటించింది కూడా ..
temple chrch god in haarlom అని పేరు పొందిన మాల్కం దుండగుల చేతి లో హత మైనాడు’ ’నీగ్రో ‘’ అనే పదాన్ని ఏవగించుకొని తమ జాతిని నల్ల జాతి వారని లేక పోతే ఆఫ్రో అమెరికన్స్ అని సంబోధించాలని లోకానికి చెప్పిన తోలి తరం నల్ల నాయకులలో మాల్కం కూడా ఒకడు .నల్ల జాతి వారి ఆత్మా గౌరవాన్ని పెంచాడు .గౌరవ హీనం అన్న జాతికి గర్వ కారణం అయాడు .యువ సాహస యోధుడు గాgallant youth chaampion గా చరిత్ర లో నిలిచాడు మాల్కం .తన జాతి వారిని అమితం గా ప్రేమించి వారి ఆదరాభిమానాలకు పాత్రుడైనాడు .అతని మరణం తర్వాతా వేలాది యువకులు అతని బొమ్మ ఉన్న టీషర్ట్స్ ధరించి గౌరవం చాటారు .ఇప్పుడు అంటే 2012 may మాల్కం ఎనభై ఎదవా జయంతి .నల్ల వారి అస్తిత్వ నిరూపకుడు ,నల్ల ముస్లిం మతాధి కారి మాల్కం ఎక్స్ అమర జీవి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —8-6-12.—కాంప్—అమెరికా

