అమెరికా ఊసులు –2
మిలీషియా అనే మాటకు అర్ధం పౌర సైన్యం అని అంతే కాని మిలిటెంట్లు అని కాదు .మాటల కంటే చేతలకే విలువ ఎక్కువ అన్న దానికి actions speak louder than words అంటారు .ఒక సారి ఫ్రాంక్లి పియర్స్ స్కూల్ నుండి ఎగా కొట్టి ఇంటికి రావాలని ఆలోచించి వచ్చే శాడు .ఇంటికి వస్తే ఇంట్లో ఎవరు లేరు .ఇంతలో తండ్రి వచ్చి గుర్రబ్బండి ఎక్కించు కొని సరదాగా తీసుకొని వెళ్లి స్కూల్ కు అరమైలు దూరం లో ఆపి నడిచి వెళ్ళమన్నాడు .విపరీతం గా వర్షం పడుతోంది .అయినా తండ్రి మాట కు విలువ ఇచ్చి నడుచు కుంటూ బడికి వెళ్లాడు .అంత క్రమశిక్షణ తో ఉండ బట్టే అమెరికా ప్రెసిడెంట్ అయాడు ఫ్రాంక్లిన్ పియర్స్ .if your past is limited ,your future is boundless అనేది అతని సూక్తి .తన అల్లర చిల్లర వేషాలు ఎలా చదువు కు హాని కలిగిస్తున్నాయో గ్రహించి ,దారి మార్చుకొని గ్రేడులు పెంచుకొన్నాడు .
ఆకాలం లో యే రాష్ట్రం అధికారం దానిదే .మిస్సోరి బానిస రాష్ట్రం గా ఉనియన్ లో చేరితే ,మైనే అనేది ఫ్రీ స్టేట్ గా చేరింది .1825 లో ఈరీ కెనాల్ ద్వారా నౌకా యానం ప్రారంభమైంది .అది 360 మైళ్ళ పొడవు ,40 అడుగుల వెడల్పు ఉండి .దీనితో నౌకల ద్వారా వ్యాపారం విపరీతంగా పెరిగింది .1909 లో దాని పొడవు 340 మైళ్ళు వెడల్పు 150 అడుగులకు పెంచి పన్నెండు అడుగుల లోతు చేసి న్యు యార్క్ స్టేట్ బార్జి కెనాల్ సిస్టం గా రూపొందించారు .
ఫ్రాన్క్లిన్ పియర్స్ సైన్యం లో పదమూడు ఏళ్ళ కే చేరాదు .అతన్ని తోటి సైనికులు old hickery అనే వాళ్ళు .అంటే హికారీ చెట్టు లాగ ద్రుధం గా ఉన్నాడని అర్ధం .అప్పటి ప్రెసిడెంట్ జాక్సన్ అంటే అందరికి అభిమానం .ఆయన్ను ‘’పీపుల్స్ ప్రెసిడెంట్ ‘’అని ఆప్యాయం గా పిల్చే వారు .ఆ కాలం లో అమెరికా లో ఒకే ఒక్క బాంక్ ఉండేది .అది ‘’బాంక్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ‘’అది ధనికుల బాంక్ అని పేదలకు ఉపయోగం లేదని జాక్సన్ అభి ప్రాయ పడ్డాడు .దాన్ని రద్దు చేసి చిన్న బంకులను ఏర్పాటు చేయాలని భావించాడు .అప్పటి దాకా డెమొక్రాటిక్ రిపబ్లికన్ పార్టి అని పిలువా బడే దాన్ని జాక్సన్ డెమొక్రాటిక్ పార్టి అని మార్చాడు .
నతానియాల్ హతారన్ అనే రచయిత పియర్స్ క్లాస్ మేట్ .ఆయన గురించి చక్కని చిన్న పరిచయాన్ని రాసి ప్రెసిడెంట్ గా పియర్స్ పోటీ చేసినప్పుడు ఇచ్చాడు .అది అందరికీ నచ్చి అతను ప్రెసిడెంట్ అవటానికి బాగా తోడ్పడింది .పియర్స్ 1831లో శాసన సభకు ఎన్నికైన అతి చిన్న వాడు .
అప్పుడు ఆడ వాళ్లకు వోటింగ్ హక్కు లేదు .చదువుకునే వీలు వోటు వేసే హక్కు ,మగవారితో సమాన వేతనాలు ఉండేవి కావు .Elizabeth cady Stantan అనే మహిళా అనేక మంది స్త్రీల తో కలిసి భారీ రాలీ నిర్వ హించి diclaretion of sentiments ను 1848 జూలై ఇరవై న న్యూయార్క్ లో విడుదల చేసింది .అదే అమెరికా లో స్త్రీ ల సమాన హోదాకు ప్రాతి పదిక ఉద్యమం అయింది .అయితే వెంటనే వారికి అవి లభించాయి అనుకొంటే పోరా బాటే .ఆ తర్వాతా 72 ఏళ్లకు కాని వారి కళలు ఫలించ లేదు .పందొమ్మిదవ రాజ్యాంగ సవరణ వల్ల వారికి సమాన హక్కులు లభించాయి .
బానిస తనం అంటే కొద్ది మంది ధనికులు కొందరు మనుషుల్ని కొనుక్కొని వెట్టి చాకిరి చేయించు కోవటం .కొన బడ్డ వాళ్ళు ప్రైవేట్ ఆస్తి కింద జమ .దీన్నే స్లేవారి అన్నారు .ఇది ప్రపంచం అంతా పూర్వ కాలం లో ఉండేది .గ్రీసు ,రొమే లలో బాగా ఎక్కువ .జయించిన దేశాలలోని జనాన్ని బానిసలుగా వాడు కొనే వారు .అమెరికా కు మొట్ట మొదటగా బానిసలు మొదటి బ్రిటీష కాలని జేమేస్ టౌన్ లో ఏర్పడి నప్పుడు1620 లో వచ్చారు .ఆఫ్రికా లోని నల్ల జాతి వారిని ఇంగ్లీష ,స్పానిష్ ,పోర్చుగీసు వారు దిగుమతి చేసుకొన్నారు .అదే బానిస వ్యాపారం .మద్య దళారీలుందే వారు .వారికి డబ్బు బాగా గిట్టేది .ఎంత ఎక్కువ మంది బానిసలుంటే అంత గొప్ప వాడు అని భావించే వారు .బానిసలను దక్షిణ రాష్ట్రాలలో పంటలు పండించా తనికి ఎక్కువగా వాడు కొనే వారు .ఇంత తిండి పడేసి ఉండటానికి కాస్త చోటిస్తే చాలు రెక్కలు ముక్కలు చేసుకొని పగలు రాత్రి సేవ చేసే వారు .జీతం ఇవ్వక్కర్లేదు .మంచి లాభ సాటి పని .వారి పంతో బానిస అధికారులు పిచ్చ డబ్బు సంపాదించారు పంటలు బాగా పండటమే కారణం ..బానిసలకు ఒరిగిందేమీ లేదు .యజమానులు డబ్బు చేసింది వీరికి చాకిరి మిగి లింది .బానిస కుటుంబం అంతా ఊడిగం చేయాల్సిందే .
ఈ బానిస విధానం ఉత్తర రాష్ట్రాలలో లేదు .బానిస విమోచన ఉద్యమం క్రమంగా పెరిగింది .దీన్ని లాయడ్ గారిసన్ ,ఫ్రెడరిక్ దగ్లాస్ బాగా ప్రచారం చేసి వారిలో ఐక్యత తెచ్చి పోరాటాలు చేసి ,హక్కుల కోసం ఉద్యమాలు నది పించారు .దేశం డెందు గా చీలింది .ఉత్తర ,దక్షిణ రాష్ట్రాల మద్య యుద్ధం సాగింది .దక్షిణాది వారికి బానిసత్వం కావాలి లేకపోతే వారికి పంటలు పండించే జనం ఉండరు ..దీన్నే అమెరికన్ సివిల్ వార్ అంటారు .1863 లో ప్రెసిడెంట్ లింకన్ యుద్ధం చేసి బానిసలకు విముక్తి ప్రసాదించాడు .జేమేస్ పొలాక్ అనే స్పీకర్ బానిసత్వం అసాన్ఘికం అని భావించాడు .1836 లో టెక్సాస్ రాష్ట్రం మెక్సికో తో యుద్ధం చేసి స్వాతంత్రాన్ని సంపాదించు కొంది .యునియన్ లో చేరింది .
అమెరికా లోను సభల్లో బాగా తాగి వచ్చి సభ్యులు గోల చేసే వారు .ఒక సారి పియర్స్ ఎనేట్ సభ్యుడై పిత్మన్ అనే ఆయన ఇంట్లో ఉన్నాడు .ఆయన ఎవర్నీ తాగానిచ్చే వాడు కాదు . పియర్స్ తాగాను అని ప్రతిజ్ఞా చేసి అక్కడ ఉన్నాడు .మళ్ళీ చ్తాగలేదు మాట నిలుపు కొన్నాడు .ఎన్నేతర్ గా ,కల్నల్ గా పని చేశాడు .తర్వాతా లా ప్రాక్టీస్ చేసి హాయిగా రాజ కీయాలకు దూరం గా ఉన్నాడు .ఇంట్లో నే ఉన్నాడు .అప్పుడు ప్రెసిడెంట్ ఎన్నికలు వచ్చాయి .అతనేమీ ఆలోచించ లేదు .అప్పుడు డెమొక్రాటిక్ పార్టి వాళ్ళు అతన్ని నామినేషన్ వేయమని ఒత్తిడి చేశారు .వద్దన్నాడు చేసింది .అయినా చివరికి ఒప్పుకొన్నాడు .ముప్ఫై తొమ్మిది సార్లు అభిప్రాయ సేకరణ చేసి చివరికి పియర్స్ నే ఏకగ్రీవం గా డెమొక్రాటిక్ అభ్యర్ధి గా నిలబెట్టారు .అయిష్టం గా నే నిలబడ్డ గెలిచి ప్రెసిడెంట్ అయాడు .అదృష్టం అతని ఇంటి తలుపు తట్టి ప్రెసిడెంట్ ను చేసింది .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-6-12.—కాంప్ –అమెరి

