అమెరికా ఊసులు –3
అమెరికా లో ఫ్రీ సాయిల్ పార్టి అనేది ఉండేది .అది స్లేవారి ని ఇంకా వ్యాపించకుండా చేయాలని కోరే సంస్థ .అలాగే లిబర్టి పార్టీ అనేది ఉండేది .ఇది స్లేవారి ని నిర్మూలించాలి అనే పార్టి .ఫ్రాంక్లి పియర్స్ అధ్యక్షుడి గా పోటీ చేసినప్పుడు ఈ రెండు పార్టీలకు ఓట్లు బానే వచ్చాయి .అంటే అప్పుడు అమెరికా లో ఇంకా ప్రజలు బానిసత్వం పై పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేక పోయారు .
పియర్స్ నలబహై ఎనిమిదేల్లకే ప్రెసిడెంట్ అయాడు .అప్పటికి ఆయన యంగెస్ట్ ప్రెసిడెంట్ .నతానియాల్ హతార్న్ ఆయన గురించి చక్కని బ్రీఫింగ్ ఇచ్చాడు .అది బాగా అతని పర్సనాలిటి ని పెంచింది .ప్రెసిడెంట్ గా ఆయన చేసిన ఉపన్యాసం 3,319 మాటలతో ఉండి .దాన్ని ఆయన కాగితం మీద రాసుకోవటం కాని ,లేక బ్రీఫింగ్ అంటే పాయింట్లు గా రాసుకోవటం కాని చేయ లేదు .అనర్గళం గా మాట్లాడాడు .ఆయన నడిచే బజార్లన్నీ తిరిగే వాడు .వీలయితే గుర్రం ఎక్కి వెళ్ళే వాడు .సెక్యురిటి ఉండేది కాదు . అధ్యక్షా భవనం గురించి మాట్లాడుతూ ‘’అది మీ అందరిది .నేను అద్దెకున్న వాడిని మాత్రమే ‘’అన్నాడు . అతని భార్య కొడుకు చావును జీర్ణించు కొ లేక కొడుక్కి రోజు ఉత్తరాలు రాసేది .
అధ్యక్షుడు గా మెక్సి కొ కు అమెరికాకు సరిహద్దు ను నిర్ణయించే బాధ్యత ను జేమేస్ గాడ్స్దేన్ కు అప్ప గించాడు .ఆయన వాళ్ళతో మాట్లాడి అమెరికా పది మిలియన్ల డాలర్లు వారికిచ్చేట్లు ,వారు గిలా నదికి దక్షిణాన ఉన్న ౩౦,౦౦౦ చదరపు మైళ్ళ భూభాగానిన్ని అమెరికా కు వదిలారు .అదే రార్వాత సదరన్ అరిజోనా ,సదరన్ న్యు మెక్సికో లు గా మారాయి .దీన్ని ‘’గాడ్సన్ కొనుగోలు ఒప్పందం ‘’అంటారు .దీనితో అమెరికా విస్తరణ పూర్తీ అయింది .ఇదే ఆధునిక అమెరికా మాప్ వేయటానికి తోడ్పడింది .
క్యూబా తో కూడా ఒప్పందం చేసుకొని దాన్ని అమెరికా లో కలిపే ప్రయత్నం పియర్స్ చేశాడు కాని అది కుదర లేదు .క్యూబ కు వచ్చిన మొదటి సెట్లర్స్ అందరు ఆఫ్రికా నుంచే వచ్చారు .హవాయి ద్వీపాలను అమెరికా లోకలిపే ప్రయత్నించాడు .బ్రిటన్ ,ఫ్రాన్సులు అడ్డుపడ్డాయి .చివరికి 1959లో హవాయి అమెరికా యాభైవ రాష్ట్రం గా చేరింది .ఆనాటి పియర్స్ ఆలోచన ఇప్పటికి నిజమైంది .
జపాన్ తో ఎవరు వర్తక వాణిజ్యాలు జరపలేదు .అది ఏకాకి గా ఉండేది .పియర్స్ దాన్ని ఒప్పించి వాణిజ్యం చేశాడు .తన వైస్ ప్రెసిడెంట్ పదవి చె బట్టిన కొత్త లోనే చని పోయినా మళ్ళీ ఎవర్నీ నియమించా లేదు .అతని కాలం లో అంటి స్లేవారి సొసైటీ అనే తోరోంతో లో ని సంస్థ 30,000 మంది బ్పట్టుబడిన బానిసలను విడుదల చేస్చేశాడు .వారంతా కెనడా లో భూములు కొన్నారు .
పియర్స్ లింకన్ ఉద్ద సన్నాహాలను అంగీకరించా లేదు .కాని ఏమీ నిర్ణయం తీసుకో లేక పోయాడు .రెండో సారి ప్రెసిడెంట్ గా నిలబడ లేదు .భార్య ,సంతానం అందరు చని పోయారు ,బాధను మర్చి పోవటానికి చివర్లో మళ్ళీ మందు మొదలు పెట్టాడు .1869 లో ఫ్రాన్క్లిన్ పియర్స్ మరణించాడు .ఒద్దు అనుకున్న వాడికి అధ్యక్షా పదవి దక్కింది .బానిసత్వం పై నిర్ణయం తీసుకో లేక పోయాడు .చివరికి లింకన్ యుద్ధమే పరిష్కారం అయింది .ఉనియన్ నిలిచింది .
మరి కొన్ని విశేషాలతో మరోసారి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 11-6-12 –కాంప్-అమెరికా

