సిద్ధ యోగి పుంగవులు — 7 ఆధునిక శుక యోగీన్ద్రులు మళయాళ స్వామి

  సిద్ధ యోగి పుంగవులు   —  7

                                                ఆధునిక శుక యోగీన్ద్రులు మళయాళ స్వామి  

                 అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసి కూర్మం లాగా అంత దాచుకొని ఉండి ,స్త్రీలకూ దీక్షనిచ్చి కులం కు ప్రాధాన్యత నివ్వని యోగి పుంగవులు మళయాళ స్వామి .

  కేరళ లోని తిరువాయుర్ సమీపం లో కరియప్ప ,నొత్తి యమ్మ దంపతులకు29-3-1885   జన్మించారు . వేళప్ప అని పేరు పెట్టారు .ఒక బైరాగి చూసి సర్వసంగ పరిత్యాగి అవుతాడని జోస్యం చెప్పాడు .పసితనం నుండే నేలమీదనే హాయిగా నిద్ర పోయే వాడు . జీవకారుణ్యం పుట్టుక తోనే వచ్చింది .పంజరం లోని పక్షులను విడిపించే వాడు .ఇంటి దగ్గర కుటీరం లో ఎప్పుడు ధ్యానం లోనే ఉండే వాడు ..ఒక సారి అన్న చూసి కోపం తో చెంప మీద చెల్లు మని పించి వెళ్తుంటే ద్వారం దగ్గర అడ్డంగా తెల్లని నంది కనిపించింది .భయమేసి తల్లికి చెప్పాడు .ఇంగ్లీష చదవటం ఇష్టం లేక సంస్కృతం నేర్వటా నికి వెళ్లి పోయాడు .

  తిరువంత పురానికి దూరం లో శివగిరి చేరాడు అక్కడి’’ నారాయణ గురుదేవు’’ల ఆశ్రమం ఉంది .ఆయన సామాజిక విప్లవ కారుడు .మానవులంతా ఒకే కులం ,ఒకే జాతి అనే వాడు .  ఆయన శిష్యుడు శివ లింగ స్వామి పెరింగోత్కర గ్రామం లో ఆధ్యాత్మ విద్య బోధించే వాడు .వేళప్ప  ఆయన్ను చేరాడు .అందరు ఇతన్ని ‘’భక్తాన్’’ అనే వారు .మంత్రోపదేశం చేసి ,యోగ రహస్యాలు నేర్పాడు గురువు ..పాతంజలి యోగ రహస్యాలు అలవాడ్డ్డాయి .నారాయణ గురు దర్శనం చేసి త్వరలోనే బ్రహ్మానంద దర్శనం కలుగుతుందనే ఆశీస్సు పొందాడు వేలన్ .ఇంటికి వెళ్లి జబ్బు తో ఉన్న అమ్మకు సేవలు చేసి నయం చేశాడు .వివాహ ప్రయత్నాలు చేస్తే తిరస్కరించాడు .

            వేళప్ప కాళి నడక తో దేశం లోని అన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించాలని బయల్దేరాడు .రోజుకు ఇరవై మైళ్ళు నడిచాడు .ఎవరైనా ఏదైనా పెడితే తినే వాడు .రక్త విరోచనాలతో ఒక వారం ఒక సత్రం లో బాధ పడ్డా ,ఇంటికి వెళ్ళ లేదు .స్వప్నం లో ఎవరో వచ్చి ఒక మాత్ర నోట్లో వేశారు .మళ్ళీ యే రోగము రాలేదు .ఓంకారేశ్వర్ ,గిర్నార్ ,ద్వారక లను సందర్శించి కాశ్మీరం వెళ్లాడు .కురుక్షేత్రం లో గీతా పారాయణం ముగించి ,హరిద్వారం ,రుశీకేశం చేరి ,బదరికాశ్రమం లో పితరులకుపిండ ప్రదానం  సమస్త ప్రాణి కోటి కి బ్రహ్మార్పణం చేసి,నైమిశారణ్యం లో కొన్ని రోజులుండి ,అయోధ్యలో రామ తారక మంత్రం లక్ష సార్లు జపించి ,,ప్రయాగ త్రివేణీ సంగమ స్నానం చేసి ,ఆ జలాన్ని కాశీ విశ్వేశ్వరునికి అభిషేకించి అక్షర లక్షలు శివ మంత్రం జపించి ,నవద్వీపం లో భజనలు చేసి ,కలకత్తా ,పూరీ సింహాచలం ,శ్రీశైలం క్షేత్రాలు దర్శించి .తిరుమల శ్రీని వాస దర్శనం చేసి ,గోగర్భ క్షేత్రం చేరాడు .అది తపస్సు కు అనుకూల మైన ప్రదేశం గా భావించాడు .అరుణాచలం ,చిదంబరం ,లలో అక్షరలక్ష శివమంత్రం జపించి ,పలని ,రామేశ్వరాల మీదుగా కన్యాకుమారి చేరి ,నేల రోజులుండి మళ్ళీ నారాయణ గురు పాద సన్నిధికి చేరాడు .గురువు అనుమతి తో ఇంటికి వెళ్లాడు .తండ్రి అప్పటికే చని పోయాడు .  29 ఏళ్ళ వయసు లో మళ్ళీ ఇల్లు వదిలి కుర్తాళం  వగైరా ప్రదేశాలు తిరిగి తిరుమల లోని ‘’గోగర్భ క్షేత్రానికి ‘’చేరుకొన్నాడు .

                  అవి భారత స్వాత్నత్ర్య ఉద్యమం రోజులు .స్వరాజ్యం తో పాటు’’ స్వారాజ్యం’’ అంటే ‘’ఆత్మా రాజ్యం ‘’రావాలని అప్పుడే శ్రేయస్సు అని భావించాడు .భగవంతున్ని ‘’అతీత వైరాగ్యం ,అఖండ బోధ ,ఉత్తమ సమాధి నిష్ఠ ,సర్వభూత సమదృష్టి తనకు లభించాలని కోరుకొన్నాడు .గోగర్భం లోని పాండవ గుహల్లో తపస్సు చేస్తూ ,తిరుమల లో భిక్షాటన చేసి ఒక పూట మాత్రమే తింటూ కొంత కాలం గడిపి ,చివరికి అదీ మాని .పితృదేవతలకు పెట్టె పిండాలను అంటే పచ్చి పిండిని తినే వాడు .ఆయన భాష,వేశం చూసి ‘’మళయాళ స్వామి ‘’అని పిలిచే వారు .అదే వాడుక నామమ అయింది .

    మైసూరు తిరువెంకతాచార్యుడు వెంకటేశ్వర పూజ చేసి రోజు ప్రసాదం ఇచ్చి వెళ్ళే వాడు స్వామికి .మూడు రోజులు విపరీతం వర్షాలు పది కదిలే వీలు లేక పోతే వెంకటేశ్వర స్వామి సుబ్బరామ శెట్టి అనే అతనికి కలలో కన్పించి స్వామికి ఆహారం పెట్టమని ఆదేశించాడు .ఆయన వెదురు గడకు ప్రసాదం కతట్టి ఆవలి ఒడ్డున ఉన్న స్వామికి అంద జేశాడు .భగవంతుడే ఆహారం పంపితే తింటాను అని ప్రతిన చేశాడు .అప్పట్నించి ఎవరో ఒకరు సమయానికి ఆహారం సమకూర్చే వారు .  

   తరిగొండ వెంగమాంబ గుహకు దగ్గరలో పాక వేసుకొని స్వామి ధ్యానం చేశాడు .పెద్ద పులి వస్తే ,భగవంతుడిని ప్రార్దిన్చాగానే అది పారి పోయింది .ఒక సారి తీవ్ర తపస్సు లో ఉండగా మృగం అనుకొని పొదల చాటు నుండి  ఒక వెతకాడు రెండు సార్లు తుపాకి పేల్చాడు .అదేమీ ఆయనకు తగల్లేదు .వెంగమాంబ స్వామిని దీవించింది .తనను తానే పరీక్షించు కోవాలని ఒక సారి సనకస నంద తీర్ధం నుండి ,తుంబురు తీర్దానికి వెళ్లారు .భక్తులు స్వామి కనపడక కంగారు పడ్డారు .ఒక భక్తుడు దారి తప్పి ఇక్కడికి వచ్చి స్వామిని చూసి ఆనందం తో ఆహారం అందించాడు .ఒకాయన ఎందుకు మీరు తపస్సు చేస్తున్నారని ప్రశ్నిస్తే ‘’భగవంతుని నిరంతర సందర్శనం కోసం ‘’అని చెప్పారు .వేయి కాళ్ళ మండపం లో బిచ్చమేట్టే పిల్లలకు ప్రసాదం పెట్టె ఏర్పాటు చేశారు స్వామి .కొతంబేడు లో కలరా వ్యాపిస్తే అక్కడికి వెళ్లి తపశ్శక్తి తో తగ్గించారు .తొమ్మిదేళ్ళు తపస్సు చేసినా ఆత్మా సాక్షాత్కారం లభించా లేదు .ఒక రోజు పన్నెండేళ్ళు తపస్సు చేస్తే కలుగుతుందని అంతర్వాణి విని పించింది .ఆయన నలభై వ ఏట అనుకొన్నట్లుగా నే ఆత్మా సాక్షాత్కారును భూతి పొందారు .

                తిరుమల విడిచి ‘’ఏర్పేడు ‘’దగ్గర ‘’కాశీ బుగ్గ ‘’లో ఆశ్రమం య్ర్పాటు చేసుకొన్నారు .కాళహస్తి జమీందార్ కుమారా వెంకట లింగమ నాయని గారు స్థల దానం చేసి ఇప్పుడున్న ఆశ్రమాన్ని నిర్మించే ఏర్పాటు చేశారు దాన్ని ‘’వ్యాసాశ్రమం ‘’అంటారు .వ్యవసాయ క్షేత్రం ఏర్పరచి ,పంటలు పండించారు .జంతు బలి మాన్పించారు .’’యదార్ధ భారతి ‘’అనే పత్రిక ను స్తాపించి అనేక వేదాంత విషయాలను రాసి పుస్తకాలుగా తెచ్చారు .అన్ని వర్ణాల వారికి సంస్కృతం నేర్పించారు .వ్యాసాశ్రమం ఆధ్యాత్మ విప్లవ కేంద్రమైంది .కేరళ లో నారాయణ గురు గారు ఏమి బోధించారో ,వ్యాసాశ్రమం లో అది అమలు పరచారు .బందరు లో పట్టాభి సీతా రామయ్య గారింట్లో గాంధీజీ ని కలసినపుడు ఆయన స్వామి సేవలను బహుదా ప్రశంసించారు ..దగ్గర లో ఉన్న ‘’కురుమద్దాలి పిచ్చమ్మ అవధూత ‘’ను స్వామి దర్శించారు .

         19 37 ‘’ఓంకార సత్రయాగం ‘’రాజమండ్రి లో ప్రారంభించి స్త్రీలకూ ,ఇతర కులాల వారికి ప్రనవాన్ని బోధించారు .’’1943లో శివ గిరి లో జ్ఞాన యజ్ఞం చేసి చేసిన జ్ఞాన బోధ భారతీయ తత్వ చరిత్ర లో ఒక అపూర్వ అధ్యాయం ‘’అన్నారు బిరుదు రాజు వారు .1945 ఒక స్త్రీకి సన్యాస దీక్ష నిచ్చి చరిత్ర సృష్టించారు .1951 లో రాజమండ్రి లో రెండవ చాతుర్మాస్యం చేసి నపుడు ,వేలాది మంది పంచములు పాల్గొన్నారు .అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి మహా పండితులు ,సర్వవేద శాస్త్ర్ర్ధ్యాయి వేద ప్రవచన నిపుణులు బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి గారు మహదానంద పది మనస్పూర్తిగా ఆశీర్వదించారు .వ్య్సాసాశ్రమం లో కొన్ని వందల సంఖ్యలో గ్రంధాలను ప్రచు రించి ఆ స్తిక జనాలకు అందించారు .

 మళయాళ స్వామి వేదాంత ప్రచారానికి ఎంత ప్రాముఖ్యత నిచ్చారో సంఘ సంస్కరణకు అంతే ప్రాధాన్యమిచ్చారు ‘’.ఆంద్ర నారాయణ గురు ‘’అని పించుకొన్నారు .వ్యాసాశ్రమ పూజా కార్య క్రమాలలో ‘’పరబ్రహ్మ గోత్రోద్భావస్య ,పరబ్రహ్మ గోత్రోద్బవాయాః’’ అని సంకల్పం చెప్పించే వారు .ఆహార నియమాలలో ,ఆశ్రమ నిర్వహణలో కఠోర నియమాలు పాటించే వారు .ఆసేతు హిమ నాగం పాదాలకు చెప్పులు లేకుండా తిరిగిన మహాను భావులు మళయాళ స్వాములు .అనారోగ్యం తో బాధ పడుతున్నా పాయకాపురం షాద్ నగర ,గాగిల్లా పురం లో జరిగిన సనాతన సభలకు వెళ్లారు .తన తర్వాతి ఆశ్రమాది పతులుగా విమలానంద స్వామిని నియమించారు .12-7-1962 లో మళయాళ స్వామి కై వల్యం పొందారు .మండలారాధన లో ముప్ఫై వేల మ్మంది పాల్గొని స్వామి వారిని అర్చించారు .వ్యాసాశ్రమానికి దేశం నిండా అనేక శాఖలున్నాయి . .విద్యాప్రకాశానంద స్వామి వారు ఈ ఆశ్రమాది పతి గా ఉండి ప్రజలకు మరింత దగ్గరై నారు .వారు రచించిన ‘’గీతా మకరందం ‘’నభూతో అని పిస్తుంది .ఇప్పుడు విద్యానంద గిరి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు .ఎక్కడో పుట్టి ,ఎక్కడో పెరిగి ఆంధ్రదేశం చేరి ఎందరికో మార్గ దర్శకులై సజీవితాన్నగడిపిన ఆధునిక శుక యోగీంద్రులు   మళయాళ స్వామి చరిత్ర పుణ్య ఫలం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

1 Response to సిద్ధ యోగి పుంగవులు — 7 ఆధునిక శుక యోగీన్ద్రులు మళయాళ స్వామి

  1. చిత్తూరు జిల్లా ఏర్పేడులోని’ వ్యాసాశ్రమం’ భారతీయ సనాతన ధర్మ ప్రచారానికి అంకితభావంతో
    కట్టుబడి పనిచేసిన అతికొద్ది సంస్థలలో ఒకటి.నారాయణ గురు బోధనల ప్రభావం కారణంగానేనేమో
    ఈ ఆశ్రమం మిగిలిన ధార్మిక సంస్థలకు భిన్నమైన రీతిలో వేదాంత ధర్మం పరమార్ధం మానవ సేవేనని
    భావించడం విశేషం. పలు ప్రాంతాలలో వీరిచే నడుపబడు ‘ఓంకార’ ఆశ్రమాల నిర్వహణలో లక్ష్యశుద్ధి
    ద్యోతకమవుతుంది. వీరి ప్రచురణలు కూడా ధర్మప్రచారంలో అద్వితీయమైన కృషి చేశాయి.
    నాకు పది పన్నెండేళ్ళ వయస్సులో మళయాళ స్వామి వారి అనంతరం వ్యాసాశ్రమ అధిపతిగా
    వ్యవహరించిన విమలానంద స్వామి తెనాలి ఓంకార ఆశ్రమంలో ఇచ్చిన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు
    వినే అవకాశం లభించింది. వారి ఉపన్యాసాలు సరళ సుబోధకంగానూ, సాధు స్వాదిష్టంగానూ
    ఉండి ఎల్లరనూ ఆకట్టుకునేవి.సుమనోహరమైన వారి శైలి, సోదాహరణ వ్యాఖ్యానంచేయగల వారినేర్పు
    శ్రోతలను కట్టిపడేస్తాయి .వారి స్ఫురద్రూపం, అనర్గళ వచోవైభవం నాకింకా గుర్తే.విమలానంద స్వామి
    పూర్వాశ్రమ నామం బొబ్బా కృష్ణ చరణ్.వారిది గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా మైనేని వారి పాలెం.
    (అన్నట్లు ఏర్పేడు లోని వ్యాసాశ్రమం, శ్రీ కాళహస్తిలోని శుకబ్రహ్మాశ్రమం రెండూ వేర్వేరు).
    — ముత్తేవి రవీంద్రనాథ్,డేటన్, న్యూజెర్సీ, యు.యస్.ఏ.నుంచి.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.