పరమాచార్య పధం జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు

పరమాచార్య పధం
”పొట్టి మనిషి .కషాయామ్బర దారి .నెత్తిన కూడా కప్పుకొన్న వస్త్రం
.బలహీన మైన శరీరం .చేతిలో దండం .నలభై ఏళ్ళను దాటిన వయసు .తెల్లబడిన
జుట్టు .కళ్ళు నల్లగా కాంతి వంతం .భావ గంభీర మైన నుదురు . కమనీయ మైన
కనులలో అలౌకిక కాంతి .కోటేరు తీసిన ముక్కు .బిరుసు గడ్డం .చిన్న నుదురు
.నోరు విశాలం .కూర్చున్న భంగిమ లో పరమ మేధావిత్వం .కలలుకాక ఏదో లోకం లో
విహరిస్తున్నట్లున్న కను లు .” ఇదీ paul brunton దర్శించిన కంచి పరమా
చార్య జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారి దివ్య స్వరూపం
.వారు ఆంగ్లాన్ని చక్క గా అర్ధం చేసుకో గలిగి మాట్లాడ గలిగినా తమిళం
ఆంగ్లము తెలిసిన మధ్య వర్తి చేత అనువాదం చేయించి సందేశమిచ్చారు ”.ప్ర
పంచ పరిస్థితులు ఎప్పుడు చక్క బడతాయి ”అని అడిగిన ప్రశ్నకు ”మార్పు
రావటానికి చాలా సమయం పడుతుంది .అదొక క్రమ పధ్ధతి లో రావాలి .ఆయుధాలను
విసర్జించి ,దేశాలు శాంతి కోసం ప్రయత్నించాలి ”అని సమాధానం .”ఆ దిశలో
దేశాలు కొంత ప్రయత్నిస్తున్నాయి ”అని అంటే -”ఆయుధాలు విసర్జినంత
మాత్రానే శాంతి రాదు ,యుద్ధం ఆగదు .కొట్టుకోవటానికి కర్రలు చాలు .దీనికి
పరిష్కారం ఆధ్యాత్మిక భావ వ్యాప్తి మాత్రమే .అది దేశాలమధ్య ,మనుషుల మధ్య
,బీద ధనికుల మధ్య పరి వ్యాప్తమైతేనే కుదురు తుంది .సుహృద్భావం పేర గాలి
.అప్పుడే నిజమైన శాంతి అభ్యుదయం కలుగుతాయి ‘ .”అయితే అది చాలా దూరం చాలా
కాలం పడుతుందేమో ”’అని సందేహించాడు పాల్ -దానికి స్వామి ”ఇంకా
దేవుడున్నాడు ”అన్నారు .”దేవుడెక్కడో లేడు దేవుడంటే ప్రేమ స్వరూపం
.జీవుల మీద ప్రేమే దైవం .”అని సమాధానం .
”దేవుడు మానవ పరికరాలను అవసరం వచ్చి నప్పుడు వాడుతాడు .మానవాళి
,సంఖోక్షోభాన్నఎదుర్కొన్నప్పుడు ఏదో రూపం లో వచ్చి పరిష్కరిస్తాడు .ప్రతి
శతాబ్దం లోను దివ్య విభూతి కలిగిన మహాత్ములు జన్మించి, మాన వాలి ని
ఉద్ధరించారు .ఈ విధానం అంతా భౌతిక శాస్త్ర నియమాలుగా పని చేస్తుంది .
.భౌతికత పెరిగి ఆధ్యాత్మికత కు జనం దూర మైన ప్రతి సారి ఇలా జరుగు తూనే
ఉండటం అందరికి తెలిసిన విషయమే .పాల్”మన కాలం లో కూడా అలాంటి మహాత్ముడు
జన్మిస్తాడా?”అని అడిగితే ”మా దేశం లో ఇది తప్పక జరుగు తుంది ,జరిగింది
.భౌతికత అనే  చేకటి విస్తరించి జ్ఞాన జ్యోతి మినుకు మినుకు మన్నప్పుడల్లా
ఇలా జరగటం మాకు సహజమే .వారినే మేము దైవాంశ సంభూతులు అంటాం ””అన్నారు
ఆచార్యులు .
”మనుష్యులు బాగా పతన మై పోయారా” అన్న ప్రశ్నకు ”అంతగా నాకు అని
పించటం లేదు .మనిషి లో దివ్యత్మమ్  జాగృతం అవాలి .  అప్పుడు మనిషి దేవుని
వైపుకు అడుగులేస్తాడు .”బ్రంటన్ ”మా పశ్చిమ దేశాల్లో దెయ్యాల లాగా
మానవులు ప్రవర్తించటం బాధా కరం గా ఉంది ”అంటే -”అలా వేరు చేసి మాట్లాడ
వద్దు .అక్కడి దేశ రాజకీయ ఆర్ధిక స్తితి గతులను మనం దృష్టిలో ఉంచుకోవాలి
.పిడుక్కు ,బియ్యానికి ఒకటే మంత్రం కాదు .సమాజాన్ని ఉన్నత స్తితికి
తీసుకొని వెళ్ళాలి .భౌతికత ను  ఆదర్శం ( ఐడియలిజం) తో సమానం చేయాలి
.ప్రపంచం ఎదుర్కొనే క్లిష్ట పరిస్తితికి నిజమైన నివారణ అంటూ ఏదీ లేదు
.”అన్నారు .”అయితే నిత్య జేవితం లో ఆధ్యాత్మికతను జోడిన్చాలా ?”అని
అడిగితే -”ఖచ్చితంగా .సరైన ఫలితాలు రావాలి అంటే అదొక్కటే మార్గం
.ప్రపంచం లో ఆ స్తాయి మనుష్యులు ఎక్కువైన కొద్దీ మార్పు వేగ వంత మవుతుంది
.మా అదృష్ట వశాత్తు మా దేశం లోఅలాంటి వారికి కొదువ లేదు .ఈ మార్పు
ప్రపంచం అంతటా వస్తే మంచి రావటానికి స్వల్ప సమయం చాలు .”
పాల్ ”తమరికి ఈ ఆశ్రమాధి కారం సంక్రమించి ఎంతకాలమైంది
”?అని ప్రశ్నిస్తే -”1907 లో నేను పన్నెండేళ్ళ వయసు లో ఉండగా లభించింది
.నాకు ఆశ్రమాది కారం వచ్చిన తర్వాత నాలుగేళ్ల కు, నేను కావేరి నది ఒడ్డున
ఒక గ్రామం లో తపస్సు చేసి ,మూడేళ్ళు వేద వేదాంగ విద్య లన్ని నేర్చాను
.”అని చెప్పారు .”మీరు నిత్యం సంచారం చేస్తూనే ఉంటారా ?”అన్న దానికి
”1918 లో లో నేపాల్ లో జరిగే ఒక కార్య క్రమానికి నేపాల్ రాజు
ఆహ్వానించారు .దానికి సమ్మ తించినేను అప్పటి నుండి  దేశ సంచారం చేస్తూ
ప్రతిగ్రామమూ తిరుగు తున్నాను .మా ఆశ్రమ ధర్మ ప్రకారం ప్రతి గ్రామము
సందర్శించాలి .ప్రజల్ని ఆధ్యాత్మికత వైపు మరల్చే ప్రసంగాలు చేయాలి .మా
ఆశ్రమ సంప్రదాయాలను పాటించాలి .నిత్యార్చన అవీ మాకు చాలా నియమాలుంటాయి
.”అని సమాధానం .
”నాకు మార్గ దర్శనం చేయ గలిగిన యోగుల కోసం నేను భారత దేశ మంతా పర్య
టిస్తున్నాను .సరై న వారిని మీరు నాకు సూచించ గలరా “?అని అడిగిన దానికి
సమాధానం గా కంచి స్వామి ”మీకు నిజం గా అలాంటి కోరిక ఉంటె అదేమీ అత్యాస
కాదు .మీ లోని నిజాయితీ తప్పక మీ కోరిక తీరుస్తుంది .ఇప్పుడే మీలో జాగృతి
కలిగింది .అదే మీకు మార్గ దర్శనం చేస్తుంది .మీ సందేహాలన్నీ పటా పంచలవు
తాయి ”.పాల్ మళ్ళీ ”ఆ ఆలోచనే నాకు ఇప్పటి దాకా  మార్గ దర్శకత్వంచేసింది
.నేను ఎ మహాను భావుడిని కలిసినా ”దేవుడు వేరుగా లేడునీ లోనే
ఉన్నాడు”అంటున్నారు ”చూపించండి  అంటే నువ్వే వెతుక్కో వాలి ”అని అంటూ
దాటేస్తున్నారు” అన్నాడు .నవ్వు తు  స్వామి ”దేవుడు అంతటా ఉన్నాడు
.మనిషి లో మాత్రమె ఉన్నాడని అక్కడే బంధించక్కర లేదు .ఈ విశ్వానికి
అంతటికి ఆధారం ఆయనే కదా “‘అన్నారు .”అయితే స్వామీ ! ఎ ప్రయోగాత్మక
పద్ధతి ని నేను అవలంబించాలి ?”-”మీ యాత్రలో మీరు అన్వేషించు కొంటూ
వెళ్ళండి . మీకు నచ్చిన వారిని ఎన్ను కొండి .”అన్నారు .”వారిలో ఎవరూ
నాకు సరైన మార్గ దర్శనం చెయ్య లేక పోతే “?సందేహించాడు పాల్ ”అలా అయితే
మీరు ఒంటరిగా ప్రయాణం చేసి దైవ విభూతిని పొందే వరకు ఆ మార్గం వదలకండి
”ధ్యానం క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి .ఉన్నత భావాలమీద ఆసక్తి ,ప్రీమ
పెంచుకోండి .మనసంతా ప్రేమ తో నింపు కొండి .తెల్ల వారు జామున ,సాయం
సంధ్యలో ధ్యానం సత్ఫలితాల నిస్తుంది .అప్పుడు ప్రపంచమంతా పరమ ప్రశాంతం
గాఉంటుంది .దీన్ని మాత్రం సాధన చేయటం మరవ కండి ”అని హితవు చెప్పారు .
”స్వామీ ! నా ప్రయత్నా లన్ని వ్యర్ధమై ,నా సాధన ఉపయోగ పడక
పోతే మీరు నాకు మార్గ దర్శనం చేస్తారా ?”అని సూటిగా ప్రశ్నించాడు
బ్రంటన్ బ్లంట్ గా .దీనికి సమాధానం గా పరమా చార్యులు ”నేను ఒక
సంస్థానానికి అధి పతి ని .ఇక్కడ నా సమయం అంటూ ఏమీ ఉండదు .నా నిత్య కార్య
క్రమాల తో నా సమయం అంతా ఖర్చు అయి పోతుంది .అవి కాల నియమ ప్రకారం
జరగాల్సినవి .వాటిని వేటినీ వదిలి పెట్ట రాదు .నేను ఎన్నో ఏళ్ళు గా
రోజూరాత్రిళ్ళు  నిద్ర పోయేది ”మూడు గంటలే ”.అలాంటి పరిస్థితుల్లో నేను
ఒక వ్యక్తీ మీద శ్రద్ధ పెట్టటం జరిగే పని కాదు .మీరే మీ కోసం సమయాన్ని
పూర్తిగా కేటాయించే గురువు ను ఎన్ను కొండి ”అని విస్పష్టం గా చెప్పారు .
”బాధ గురువులే తప్ప బోధ గురువులు లేరు అని అంతా అంటున్నారు .అందులో
నేను ఒక యూరోపియాన్ని .నాకు బోధించే వారు దొరకరేమో ?”అని సందేహం వెలి
బుచ్చాడు ”సత్యం ఉంది .దాన్ని కనుగొన వచ్చు ”అని సమా ధానం .”మీరే
ఒకరిద్దరి పేర్లను సూచించి నా అన్వేషణ కు దగ్గరి  దారి చూపించండి మహాత్మా
“‘అని అంటే ”నాకు తెలిసి ఇద్దరే మీ కు గురువులు అని పించుకోన దగిన
సమర్ధులు ఉన్నారు .అందులో ఒకాయన కాశీ లో ఎక్కడో విశాల మైన భవంతి లో దాగి
ఉంటారు .ఆయన దర్శనం అంత తేలిక కాదు .అదీ గాక వారు పాశ్చాత్యు లకు ప్రవేశం
కల్గిస్తారని నేను భావించటం లేదు ”అన్నారు పాల్ మీద కృపా ద్రుష్టి తో
.పట్టు వదలని విక్రమార్కుడు పాల్ -”రెండో వారు ?”అని ప్రశ్నించాడు
.”ఎక్కడో దక్షిణ భారత దేశం లో మారు మూల  ఉన్నారు .ఆయన్ను ”మహర్షి
”అంటారు .నేను ఇంత వరకు వారిని చూడ లేదు .కాని అ వారు ఉత్తమ దేశికులు
అని తెలుసు .వారు మీకు చక్కని మార్గ దర్శనం చేస్తారని నమ్మకం ఉంది .వారు
అరుణాచల జ్యోతి స్వరూప మైన అరుణా చలం లో ఉంటారు .వారి దర్శనం మీ కు మనో
భీ ష్టం కల్గిస్తుంది .”అని చెప్పగానే పాల్ పరమా నంద భరితుడయాడు .తన
అన్వేషణ ఫలించే రోజు దగ్గర లో ఉందని సంబర పడ్డాడు .అరుణా చలం వెళ్లి రమణ
మహర్షిని ఎప్పుడు సందర్సిద్దామా అనే తహ తహ పెరిగి పోయింది .చివరగా ఒక మాట
చెప్పారు శంకరులు ”రమణ మహర్షి ని దర్శించ కుండా ఇండియా నుండి తిరిగి మీ
దేశం వెళ్ళను అని నాకు మాట ఇవ్వండి ”అన్నారు కృపా దృష్టి తో .శ్రీ వారి
లోని ఆ కారుణ్యం ,తన తపనను అర్ధం చేసుకొన్న వారి మనో భావం చూసి పాల్
చలించి పోయాడు .”మీ మాట జవదాట ను మహాత్మా !”అనిమనస్పూర్తిగా చెప్పాడు
.చివరి సారిగా శంకరులు ”ఆదుర్దా పడకండి .మీరు సత్యాన్ని కనుక్కొంటారు
.మీరు వెతుకు తున్న వారు మీకు లభించి మీ కోరిక తీరుస్తారు ”అని అభయం
ఇస్తూ ”మీరు నన్నెప్పుడు గుర్తుంచు కొండి .నేనూ మిమ్మల్ని ఎప్పుడూ
గుర్తుంచు కొంటాను ”అని paul the seeker  కు వీడ్కోలు చెప్పారు పరమా
చార్యులు .ఆయన దేశ సంచారాన్ని ఆది శంకరుల దేశ సంచారం తో సరి పోల్చాడు
పాల్.ఒక ఆధ్యాత్మిక జ్యోతిని సందర్శించిన మహదానందం తో పాటు మరో అద్భుత
మహర్షిని సందర్శించా బోతున్న ఉద్వేగం పాల్ ను కుదిపేస్తోంది .మహాత్ములు
ఎంత ఉన్నతులో ,ఎంత మార్గ దర్శనం చేస్తారో ఆధ్యాత్మికానుభూతి పొందాలను
కొనే వారంటే వారికి ఎంత అభిమానమో వ్యక్తమయ్యే అన్ని వేశాలను ఇందులో మనం
చూశాం .ఇదే పరమాచార్య పధం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-12.–కాంప్–అమెరికా


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.