అమెరికా ఊసులు –11–
మొదటి సారి అమెరికా అధ్యక్షు లైన తండ్రీ కొడుకులు
అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ అని అందరికి తెలుసు .ఆయన తో పాటు వైస్ ప్రెసిడెంట్ అయిన వాడు జాన్ ఆడమ్స్ .వాషింగ్తన్ రెండు సార్లు పదవి లో ఉన్నాడు .మూడో సారి కూడా ఉనాడమని జనం బలవంతం చేఇనా ఒప్పు కోలేదు .రెండవ అధ్యక్షుడు గా జాన్ ఆడమ్స్ ఎన్నిక అయాడు .ఇతని కొడుకు జాన్ క్విన్సీ ఆడమ్స్ ఆరవ అమెరికా అధ్యక్షుదయాడు .అక్కడి నుండే అమెరికా లోను వారసత్వం కోన సాగింది .తర్వాతా చాలా మంది తండ్రి కొడుకులు అధ్యక్షులయారు .
ఆ రోజుల్లో ఒక వింత రూల్ ఉండేది దాన్ని ”గాగ్ రూల్ ”అనే వారు .అప్పటికి దక్షిణ రాష్ట్రాలలో బానిసత్వం ఉంది .ఉత్తర రాష్ట్రాల వారు దీనికి వ్యతి రేకం ఆడంసులు మేసాచూసేత్స్ అనే ఉత్తర రాష్ట్రానికి చెందినా వారు .గాగ్ రూల్ అంటే ఎవరైనా బానిసత్వం పై పిటీషన్ సభ్యులకు ఇస్తే దాన్ని స్వీకా రించ.కూడదు .సభ లో ఆ విషయాన్ని ప్రస్తావించ కూడదు .ఒక వేళచేస్తే అభిశంశన కు గురి అవ్వాల్సిందే .అంటే సభ్యుల చేతులు కట్టేసి నట్లే .ఆ నాటి పరిస్తితి అది .
చిన్న ఆడమ్స్ అంటే క్విన్సీ అని పిలుద్దాం .ఆయన అమెరికా సెక్రెటరి ఆఫ్ స్టేట్స్ ,నాలుగు దేశాలకు రాయబారి ,అమెరికా కు సెనేటర్ గా పని చేసిన అనుభవం భావం ఉండి ప్రెసిడెంట్ అయాడు .ఈయన రిటైర్ అయిన తర్వాతబానిస విషయం మీద ఒక పిటీషన్ ఆయనకు చేరింది .అప్పుడాయన సాధారణ హౌస్ రిప్రేసేన్తతివ్ .సభలో ప్రస్తావించాడు .అభి శంషన తీర్మానం పెట్టారు .అది వీగి పోయింది .ఆ రోజున సభలో మాట్లాడుతూ ఆయన గాగ్ రూల్ ను సమర్ధించే వారిని ”ఎద్దు మాంసం తినే వాళ్ళని ,విస్కీ తో కొవ్వ్వేక్కి బానిసత్వాన్ని సమర్ధిస్తున్నారు ”అని విరుచుకు పడ్డాడు .అమెరికా ఫౌందింగ్ ఫాదర్స్ అని పిలువా బడే వాళ్ళలో వాషింగ్ తాన్ జెఫర్సన్ ఆడమ్స్ మాదిసాన్ ,మన్రో ,జాక్సన్ వంటి వారున్నారు .అందరికి స్వాతంత్రం ఉండాలి అన్న ధ్యేయం తో క్విన్సీ సాహసోపేత మైన నిర్ణయం తీసుకొని గాగ్ రూల్ ను వ్యతిరేకించాడు .మన మోతీ లాల్ జవహర్లాల్ లాగా గ్రేట్ ఫాదర్ అండ్ సన్అని పించు కొన్నారు .ఆడంసులిద్దరు .
తండ్రి ఆడమ్స్ అమెరికా డిక్ల రేషన్ రాసిన వారిలో సంతకం చేసిన వారి లో ఉన్నాడు .కాంతి నేన్తల్ కాంగ్రెస్ కు మాసా చ్చోస్త్స్ నుండి రిప్రేసేన్తటివ్ .అమెరికా లో మొదటి తిరుగు బాటు యుద్ధం మాసా చూసేత్స్ లోని లెక్సింగ్ తాన్ ,కాన్కార్డ్ లలో బ్రిటీష వారితో జరిగింది .1776జూలై నాలుగు న పదమూడు కాలనీల సమాఖ్య స్వాతంత్రాన్ని ప్రకటించుకొని బ్రిటీష పాలనకు మంగళ గీతం పాడింది .అదే వీళ్ళ స్వాతంత్ర దినోత్సవం .అప్పుడే ”అమెరికా సంయుక్త రాష్ట్రాలు ”అనే పేరు పెట్టు కొన్నారు .తండ్రి ఆడమ్స్ ను బ్రిటన్ ,ఫ్రాన్సు దేశాలతో చర్చలకు అమెరికా ప్రభుత్వం పంపింది .బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేఫిజిక్స శాస్త్ర వేత్త ఫ్రాన్స్ లో అమెరికా మినిస్టర్ అంటే రాయబారి గా ఉన్నాడు .
1780నాటికి రష్యా అధికార భాష ఫ్రెంచ్ భాషే .తండ్రి తో పాటు విదేశ పర్యటనలు చేసిన చిన్న ఆడమ్స్ బెర్లిన్ లో బానిసలను కొని అమ్మటం ,కోళ్ళకు ,గుర్రాలకు బదులుగా బానిసలను ఇచ్చేయటం స్వయం గా చూసి ఈసడించు కొన్నాడు .ఫ్రాన్స్ ప్రబుత్వం అమెరికా స్వాతంత్రాన్ని ఆమోదించింది ,రాష్యారాని కాతేరిన్ తిరస్కరించింది .రష్యా లో రాణి ,బానిసలు తప్ప తనకేమీ కానీ పించాలేదని క్విన్సీ రాసుకొన్నాడు .సెయింట్ పీటర్స్ బర్గ్ సిటీ లో విద్య నేర్పే ఒక్క స్కూల్ కూడా ఆ రోజుల్లో కనీ పించ లేదని చెప్పాడు .క్విన్సీ ని తల్లి అబిగాలి తీర్చి దిద్దింది .ఎప్పటి కప్పుడు తగిన సలహాలనిస్తూ ఉండేది .universal neat ness and cleanli ness అవసరమని బోధించేది . హార్వర్డ్ లో ని కేంబ్రిడ్జి లో చదివాడు .తండ్రి కూడా ఇక్కడే చదవటం విశేషం .వీళ్ళే మిటి ఆనాడు ప్రసిద్దు లందరూ ఇక్కడే చదువు కున్నారు .
వాషింగ్టన్ అమెరికా రాజ దాని కాలేదు న్యూయార్క్ లో రాజధాని ఉండేది .1788లో పెద్ద ఆడమ్స్ దేశానికి మొట్ట మొదటి విస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకో బడ్డాడు .వాషింగ్ తాన్ అధ్యక్షుడు .అమెరికా కాపిటల్ పెన్సిల్వేనియా రాష్ట్రం లోని ఫిలడెల్ఫియా కు మార్చారు .ఇక్కడ పదేళ్లు ఉంది .తర్వాతా 1800 లో శాశ్వతం గా వాషింగ్ టన్ రాజ దాని అయింది .క్విన్సీ ప్రెసిడెంట్ తో తండ్రి తో పాటు భోజనం చేశాడు .సుప్రీం కోర్ట్ చూశాడు .లా పాసై న్యాయ వాడ వ్రుత్తి లో చేరాడు బోస్టన్ లో .కాని విజయం పొంద లేక పోయాడు .రాజ కీయాల పై మనసు పోయింది అప్పుడు ఫెడరల్ పార్టి ఉండేది .వాళ్ళందరూ బానిసత్వానికి వ్యతి రేకులు .దాని లో చేరాడు .కేంద్రం బలంగా ఉండాలని తలచే వారు వీరందరూ .వాషింగ్ తాన్ క్వీన్సి ని నెదర్లాండ్ లో అమెరికా రాయ బారి గా నియమించాడు .అతనికి అప్పటికే జెర్మని ఫ్రాన్సు భాషలు బాగా వచ్చు .తండ్రి వల్ల ఈ ఉద్యోగం వచ్చిందేమో నని సందేహించాడు .కాని అధ్యక్షునికి అన్నీ తెలుసు నని గ్రహించాడు .ఆ తర్వాతా క్విన్సీ ని పోర్చుగల్ లో pleni potentiary మినిస్ట రా అధ్యక్షుడు నియమించాడు జీతమూ పెరిగింది హోదా పెరిగింది .ఆ పదానికి అర్ధం -సర్వ స్వతంత్రం గా అమెరికా ప్రభుత్వ ప్రతినిధి గా పని చేయటం .చాలా సంతృప్తి పడ్డాడు .తర్వాతా ప్రశ్యాకు పంపారు .అప్పుడే వివాహం చేసుకొన్నాడు .వారికి పుట్టిన మొదటి కుమారుడికి మొదటి అధ్యక్షుని పేరు వాషింగ్ తాన్ అని గౌరవం గా పెట్టు కొన్నారు .
మళ్ళీ స్వదేశం లో కాలు పెట్టాడు క్విన్సీ .ఫెడరల్ పార్టి టికెట్ పై మాసా చూసట్స్ కు సెనేట సభ్యుడయాడు .ఆప్పటికే టికే తండ్రి అధ్యక్షుడు గా రెండు సార్లు పని చేశి మూడో సారి పోటీ చేసి ఒడి పోయాడు .జెఫర్సన్ అధ్యక్షుడు గా ఎన్నికయ్యాడు .ఆయన రిపబ్లికన్ పార్టి నాయకుడు .ఆడమ్స్ ఫెడరల్ పార్టి లో ఉన్నాడు .అయినా జెఫర్సన్ ను చాలా విషయాలలో సమర్ధించాడు .నెమ్మదిగా రిపబ్లికన్ పార్టి లో చేరి పోయాడు క్విన్సీ .జెఫర్సన్ తర్వాతా మాడిసాన్ ప్రెసిడెంట్ అయ్యాడు .ఆయన చిన్న ఆడమ్స్ ను రష్యా రాయబారి గా నియమించాడు .అక్కడకి చేరే సరికి నెపోలియన్ రష్యాను ఓడించి ఆక్రమించుకొన్నాడు .అయితే రష్యా సైన్యం పుంజు కొని అతన్ని వెనక్కు పంపేయ గలిగింది .రాయబారి గా సమర్ధం గా పని చేసి మెప్పు పొందాడు .తర్వాతా ఇంగ్లాండ్ కు రాయబారి అయాడు .అమెరికా కు బ్రిటీష ఆధీనం లో ఉన్న కెనడా కు మధ్య ఉన్న గ్రేట్ లేక్స్ విషయం లో మంచి ఒడంబడిక కుదిర్చాడు .మాదిసాన్ దిగి పోయి జేమ్స్ మన్రో ప్రెసిడెంట్ అయాడు .
మన్రో క్విన్సీ ని సెక్రెటరి ఆఫ్ స్టేట్స్ చేశాడు .దేశం సరిహద్దుల్ని పెంచాలని నిర్ణయించుకొన్నాడు .ఫ్లారిడా రాష్ట్రాన్ని కొనేసే ఒడంబడిక కుదిర్చాడు .అందరూ జాక్సన్ ఆ ఆతి సైన్యాధ్యక్షుడు .వాషింగ్ త్న్ లో కాపురం .అకడి పోతోమాక్ నది లో స్నానం చేసే వాడు .ఈదే వాడు .ప్రెసిడెంట్ గా ఉన్నా ఈపని మాన లేదు .రోజు విందులు వినోదాలతో ఆరోగ్యం దెబ్బ తింది .తన ఇంటి లోనే రోజు సందర్శకులను చూడటం విందు తానే ఇవ్వటం చేశాడు .మన్రో డాక్యు మెంట్ ను సమర్ధం గా రూపొందించి అమలు చేశాడు ..దీని ఉద్దేశ్యం -పశ్చిమార్ధ గోళం లో యూరోపియన్ల జోక్యం ఉండ రాదు .కొత్తగా కాలనీల ఏర్పాటు చేయ రాదు .అమెరికా యూరోపియన్ల విషయాలలో జోక్యం కల్పించు కోదు.మిలిటరి బలం తగి నంత గా ఆ కాలం లో అమెరికా కు లేక పోయినా అమెరికా అంటే ఏమిటో తెలియ జెప్పిన ఒడంబడిక అది .
జాక్సన్ ను” వార్ హీరో ”.ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించి ,ప్రజల మనసుల్ని దోచిన వాడు .అతన్ని శర దాగా ”old hickery ”అంటారు .అంటే హిక్కరి అనే కలప అంత బలమైన వాడు అని .అతను ప్రెసిడెంట్ గ్ స్తానానికి పోటీ చేశాడు .అతన్తో తలపడ్డాడు క్విన్సీ .ఇద్దరి మధ్యా తీవ్ర మైన పోటి నెలకొంది .ఓటింగ్ లో తగిన ప్రతి నిధ్యపు ఓట్లు రానందున జెఫర్సన్ ఒడి క్విన్సీ ఆడమ్స్ గేలి చాడు .అయితే ఆయన్ను ఎవరూ బలపరచ లేదు .ఒంటరి వాడి నాడు .అయితే ఒక గొప్ప ఆలోచన చేశాడు ”astronomical observatory ”ని అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే సెనేట తిరస్కరించింది .యూరప్ లో ఇలాంటివి వందలాది ఉన్నాయని వాటివల్ల చాలా ప్రయోజనం ఉందని వాదించినా ఎవరూ విని పించు కో లేదు .వాటిని ఆయన ”light houses of the skies ” అని ముద్దు గా పిలిస్తే అందరు దాన్ని”national joke ” అని కొట్టి పారేశారు .ప్రెసిడెంట్ గా ఏమీ చెయ్య లేక పోయిన దురదృష్ట వంతుడు .మళ్ళీ ఎన్నిక లో నిలబడి జాక్సన్ చేతి లో ఒడి పోయాడు .మేదావే కాని ప్రాజా సంబంధాలను సరిగ్గా పాటించ లేక పోయాడు .అహంభావి అనే ముద్ర ఉంది .అప్పటికి రిపబ్లికన్ పార్టి ఉంది ఫెడరల్ పార్టి డెమొక్రాటిక్ పార్టి గా ఆవిర్భ వించింది .ఈయన దీనిలో ఉన్నాడు .వీరికి బానిసత్వ విధానం నచ్చాడు .అమెరికా గట్టి కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండాలన్న భావం ఉన్న వారు డెమోక్రాట్లు .
మళ్ళీ సవత ఊరు వెళ్లి లా ప్రాక్టీస్ చేస్తూ కాల క్షేపం చేశాడు .ప్రజా లందరూ ఆయన్ను ఒప్పించి హౌస్ రిప్రేసెంత టివ్ గా ప్రతి రెండేళ్ళ కోసారి ఎన్నుకొని గౌరవం చూపారు .ఒక బ్రిటీష శాస్త్ర వేత్త jemes smithson అమెరికా ప్రభుత్వానికి అయిదు లక్షల డాలర్లు విరాళం ఇచ్చి దానిని institute for advaanced knowledge ను ఏర్పాటు చేయ మని కోరాడు .దీన్ని క్విన్సీ ఆడమ్స్ ప్రభుత్వం తో చర్చించి ”smithonian institution ”అనే జాతీయ మ్యూజియం ను ,రిసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయించాడు .అలా తాను ప్రెసిడెంట్ గా చేయ లేక పోయిన దాన్ని ఇలా నేర ర్చు కొన్నాడు .టెక్సాస్ రాష్ట్రం మెక్సి కో నుడి విడి పోయింది అది బానిసత్వాన్ని సమర్ధించే రాష్టం .అది అమెరికా యూనియన్ లో కలవాలని భావించింది .మెక్సికో పై యుద్ధం చేయాలని ప్రెసిడెంట్ పొలాక్ కాంగ్రెస్ ను అనుమతి కోరాడు . పై యుద్ధానికి వెల్ల రాదనీ ఆడమ్స్ భావించాడు .అయినా యుద్ధం తప్ప లేదు .జాన్ క్విన్సీ ఆడమ్స్ హౌస్ ఆఫ్ రిప్రేసెంత టివ్ లో మాట్లాడుతూ కుప్ప కూలి రెండు రోజుల తర్వాత(1848 ) లో చని పోయాడు ఆయన పుట్టింది 1767 .లో ..ఇదీ ఆడమ్స్ ల ఊసులు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -07 -12 -కాంప్-అమెరికా .
వీక్షకులు
- 1,107,639 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


“అక్కడి నుండే అమెరికా లోను వారసత్వం కోన సాగింది .తర్వాతా చాలా మంది తండ్రి కొడుకులు అధ్యక్షులయారు”
Thats not correct Sir.
కేవలం రెండేసార్లు అయ్యింది తండ్రీ కొడుకులు అద్యక్షులవడం, 236 సంవత్సరాల్లో.
అది కూడా వారసత్వం అనరు. వాళ్ళ కొడుకులు ఎన్నికయ్యారు, వారసత్వంగా వాళ్ళకు రాలేదా పదవి.
జాన్ ఆడమ్స్ president గా దిగిపోయాక 24 ఏళ్లకి ఆయన కొడుకు ప్రెసిడెంట్ అయ్యాడు. John Adams was president during 1797–1801, wheras John Quincy Adams was president durin 1825 – 1829.
ఆ తర్వాత 170 years ki George H Bush president అయ్యాడు 1989-1993. మళ్ళీ ఆయన కొడుకు George W Bush 2000 లో ఎన్నికయ్యాడు.
I hope you would now agree that , there is no వారసత్వం in USA.
LikeLike