జర్మని సంగీత త్రయం -ముగ్గురు మహా ”బీ”లు
జర్మనీ సంగీత త్రయం అని పిలువ బడే ముగ్గురు మహా ”బీ”ల గురించి మనం తెలుసు కుందాం .వారి ముగ్గురి పేర్లు బి అనే అక్షరం తో ప్రారంభం అవటం ఒక విశేషం .అందుకే వారిని” ది త్రీ బి” లని గౌరవం గా పిలుచు కొన్నారు . .వారే బాచ్ ,బ్రామ్స్ మరియు బీథోవెన్ .ముగ్గురి సేవా గణనీయ మైనదే .వారి సంగీతజ్నత ను తెలుసు కొనే ప్రయత్నమే మనం చేస్తున్నాము .
జోహాన్ సే బాస్టియన్ బాచ్ (ష్)(johan sebastian bach ).
బాష్ 31-3-1665 లో జన్మించి ఎనభై అయిదేళ్ళు జీవించి 28-7-1750లో మరణించాడు .ఈయన జర్మన్ కంపోజర్ , ,వాద్య కారుడు- సైకార్దిస్ట్, హార్ప్ కార్దిస్ట్ ,వయోలిస్ట్ మరియు వయోలనిస్ట్
.ఆయన ఉన్న కాలాన్ని”Baroque period ”అంటారు .అప్పటికే ఉన్న అనేక సంగీత శైలులను శోభాయమానం చేసి నాణ్యత చేకూర్చాడు .కౌంటర్ పాయింట్ లో ఆయనది ప్రత్యెక మైన స్తానం ఉంది .
శ్రావ్య మైన ,ప్రేరక మైన ,వాద్య సమ్మేళనం నిర్వహించాడు. లయ కు ఎక్కువ వీలు కల్పించాడు . ఇటలీ మరియు ఫ్రాన్సు దేశాల నుండి భావాలను ,ప్రేరణ ను పొందాడు .ఆయన సంగీతం లో ప్రతిభా వంత మైన లోతులున్నాయని,సాంకేతిక పరి ణతి.వాటి పై గొప్ప పట్టు ఉన్న వాడు అని విశ్లేషకులు భావించారు . ఆయన చేసిన వన్నీ కళా సౌందర్యం తో విల సిల్లేవే అని భావిస్తారు .అసలు ఆయనది గొప్ప సంగీత వంశం .అంటే ఇంగువ కట్టిన గుడ్డ అన్న మాట .వాద్య కారుడిగా ఎంత పేరు పొందాడో పాటకుడి గా,సుమధుర శ్రావ్య స్వరాలతో అంతే కీర్తి పొందిన వాడు .యూరపు అంతా ఆయన సంగీత ఝరి లో ఒల లాడింది .ఆ నాటి leopald music academy కి డైరెక్టర్ గా పని చేశాడు
. బ్రతికినప్పటి కంటే ,చని ఆయిన తర్వాత ఆయన కీర్తి బాగా వ్యాపించింది .మొత్తం మీద యూరప్ అంతటిని తన సంగీతం తో స్నానం చేయించిన మహా విద్వాంసుడు బాష్ .బాష్ సంగీతం లో భేష్అని పించుకొన్నాడు
. జోహాన్నెస్ బ్రామ్స్(johannes brahms )
బ్రామ్స్ 7-5-1833న జన్మించి ,అరవై నాలుగేళ్ళు జీవించి 3-4-1897లో మరణించాడు .
రొమాంటిక్ కాలం లో సంగీతం లో నాయక స్థానాన్ని సాధించాడు .ఈయనా మంచి కంపోజర్ కాక గొప్ప పియానిస్టు కూడా .జీవితం లో ఎక్కువ కాలం ఆస్ట్రియా లోని వియన్నా లో ఉన్నాడు
.అక్కడే ఆయన కీర్తి పతాక స్తాయి ని పొందింది .ఆయన ప్రభావం చాలా మంది సంగీత కారు ల పై ఉండేది .బీథోవెన్ తో కలిసి సంగీత కచేరీలు చేసే వాడు .అలాగే బాష్ తోను కచేరీలు నిర్వహించిన చరిత్ర ఆయనది .పియానో వాయించటం లోనే కాక ,సింఫనీ సృజించటం లో ,ఆర్కెస్ట్రా తో సంగీత కార్య క్రమాలకు మార్గ నిర్దేశం చేయటం లో సంగీత పాటకుడి గా ,కోరస్ లు పాడటం లోను వాటిని పాదించటం లోను ప్రశస్త మైన భూమిక నిర్వ హించాడు .అన్నిటి కంటే పియానో వాయించటం లో అత్యధిక ప్రతిభా వంతుడి గా గుర్తింపు పొందాడు .ఆనాడు బ్రామ్స్ చేసిన వన్నీ ,ఈ నాటికిఆదర్శ ప్రాయం గానే సంగీతజ్ఞులు భావించి ,వాటిని ఉపయోగిస్తున్నారు .”never compromise in perfection” అని పేరు తెచ్చు కొన్నాడు .సంపూర్ణత పరి పూర్ణతా సాధించే దాకా నిద్ర పోయే వాడు కాదు .అందుకనే ఇప్పటికీ ఆయన సంగీతానికి ప్రాచుర్యం ఉంది .తనకు నచ్చని ట్యూనులను ,సింఫనీ లను రాసిన వన్నీ మిగల కుండా తగుల బెట్టె వాడు .కొన్ని రచనలు ఆయనకే నచ్చక ప్రచురించ నే లేదు .అంతటి perfectionist బ్రామ్స్ కు రాసి కంటే వాసి ముఖ్యం అని భావించిన సంగీత నిది ,అంబుధి . బ్రామ్స్ సంప్రదాయ వాది .దానితో పాటు సృజన శీలి .
అతని సంగీతం అంతా ”firmly rooted in structure and compositional techniques of Boroque and classical masters” అని సంగీత మర్మజ్నులు నిగ్గు తేల్చారు .ఆయన ”కౌంటర్ పాయింట్ ”లో అద్వితీయుడు అంటారు .దీనిలోనే బాష్ చాలా కృషి చేశాడని ముందే చెప్పు కొన్నాం .ఈయన దానికి మెరుగులు దిద్ది మరింత ముందుకు తీసుకొని వెళ్లాడు .ఈయన హేడెన్ ,మోజార్ట్ ,బీథోవెన్ లు చేసిన దానికి మెరుగులు పెట్టాడు .జర్మన్ structure ను పరిశుద్ధి చేసి (ప్యూరిఫై )రొమాంటిక్ idioms లోకి తెచ్చిన వాడిగా ఈయనను చెప్పు కొంటారు .వాటి స్తాయిని గౌరవాన్ని పెంచిన ఘనత బ్రామ్స్ దే .కొత్త మార్గాలు తోక్కటం అంటే మహా సరదా .ఐక్యత ,శ్రావ్యత లను సంగీతం లో బాగా సాధించి సంగీతాన్ని ఉన్నత స్తానం లో కూర్చో పెట్టాడు
.అయితే” మరీఎకడమిక్ ”అనే ముద్ర నుంచి తప్పించు కోలేక పోయాడు .ఎన్నో తరాలను ప్రభావితం చేసిన ఘనత సాధించాడు సంగీత బ్రహ్మ బ్రామ్స్ .
లుడ్విగ్ వాన్ బీథోవెన్(ludwig van Beethoven )
బీథోవెన్ జెర్మని లోని బాన్ లో 16-12-1770లో జన్మించి ,కేవలం యాభై ఏడేళ్ళు మాత్రమె
జీవించి26-3-1827 న ఆస్ట్రియా లోని వియన్నా లో మరణించాడు .సంగీత వంశం లో జన్మించాడు .తాత ,తండ్రి సంగీత విద్వాంసులే .తండ్రి ఇతని చిన్నప్పుడే తీవ్రం గా సంగీత సాధన చేయించే వాడు .ఒకో సారి అలా చేస్తూ నిద్ర పోయే వాడు .ఏడవ ఏట సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు .బాల మేధావి అనే వారు
.నీఫే అనే ఆయన వద్ద శిష్యరికం చేశాడు .తండ్రి పని చేసే కొలువు లోనే ఆర్గానిస్ట్ గా ఉద్యోగం పొందాడు .పద మూడేళ్ళ వయసు లోనే మొదటి సారిగా కంపోజు చేసిన పుస్తకాన్ని ప్రచురించిన ఘనత బీ థోవెన్ ది .దీనిలో key board variations అద్భుతం గా చూపి గొప్ప గొప్ప సంగీత విద్వామ్సులనే ఆశ్చర్య పరిచాడు .గురువు నీఫే తో కలిసి కొన్ని కచేరీలు చేసే గౌరవాన్ని పొందాడు .పద్నాలుగేళ్ళ కే court chapel లో ఉద్యోగి అయాడు .వెంటనే మూడు పియానో సొనాటా లను రాసి ఎలేకక్తార్ మాక్సి మిలియన్ ఫ్రేజర్ కు అంకితమిచ్చాడు .
1787లో అంటే పద్దెనిమిదో ఏట వియన్నా వెళ్లి ఆ నాటి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మొజార్ట్ దగ్గర శిష్యరికం చేశాడు. ,రెండు వారాలు మాత్రమె ఉండి ఇంటికి తిరిగి వచ్చాడు .తల్లి చని పోయింది .తండ్రి విపరీత మైన తాగు బోత’ .ఎలేక్తార్ ను అడిగి తండ్రి జీతం లో సగం కుటుంబ పోషణ కు ఇచ్చే ఏర్పాటు చేసుకొన్నాడు .1790లో హేడెన్ అనే గొప్ప సంగీత విద్వాంసుడి తో పరిచయం కలిగింది .అప్పటికే బీథోవెన్ ఎన్నో వాటిని కంపోజు చేసి గొప్ప పేరు పొందాడు .మోజార్టు చేసిన ఒపేరా లకు మూడింటికి సంగీతం కూర్చిన ఘనత బీథోవెన్ ది .అతను కూర్చిన వాటిలో స్థాయి, పరి పక్వత గొప్ప గా ఉంటాయి .హేడెన్ దగ్గర శిష్యరికం చేసి చాలా విశేషాలు గ్రహించాడు .ఇరవై మూడు ఏళ్లకే గొప్ప improviser అని పేరు పొందాడు .క్లావియర్ విద్య లో నిష్ణాతుడు అని పించుకొన్నాడు .
బీథోవెన్ పై హేడెన్ ,మొజార్ట్ ల ప్రభావం ఉంది .బీథోవెన్ శ్రావ్య మైన స్వరాలు సంగీతం ,సంగీతం లో పరిణత ,అభి వృద్ధి ,అవసరానికి తగిన మాడ్యు లేషన్ ,భావాల వ్యక్తీ కరణ (ఎమోషన్స్ )బీథోవెన్ ను మిగిలిన సంగీత విద్వాంసుల కంటే ఎంతో ఉన్నతాసనం పై కూర్చో బెట్టాయి .ఆయన సరసన కూర్చునే స్తాయి ఎవరికి లేదని సంగీత విశ్లేషకులు భావిస్తారు .అందుకే ఇప్పటికీ ఆయన అంటే క్రేజు .
దురదృష్ట వశాత్తు 26ఏళ్లకే బీతోవెన్” చెవిటి వాడు” అయాడు .ఒక సంగీత విద్వామ్సుడికి ఇది పెద్ద శాపమే .అయినా దాన్ని అధిగమించి ముందుకు సాగి పోయాడు .ఫుల్ మూన్ సొనాటా అనే ఆయన చేసిన సంగీత సృష్టికి ప్రపంచం అంతా అమోఘం గా స్పందించి జేజే లు పలికింది .అతన్ని అన్ని దేశాల వారు తమ వారు అనుకొన్నారు .సంగీతానికి ఎల్లలు లేవు అని నిరూపించాడు బీథోవెన్ ఆయన చేసిన” ninth symphony ”న భూతో న భవిష్యతి అంటారు .18 వ శతాబ్దపు క్లాసిజం నుండి ,సంగీతాన్ని19 వ శతాబ్దపు ”రోమాన్ టిజం ”లోకి తీసుకు వెళ్ళిన ఘనత బీథోవెన్ దే .సందేహం లేదు .ఆ తర్వాత ఇప్పటి వరకు ఎన్నో తరాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాడు .సింఫనీ కి ఒక కొత్త శోభ, నాణ్యత గౌరవం తెచ్చిన ఘనా ఘనుడు .ఆయన సంగీతాన్ని ఎస్టి మేట్ చేస్తూ”A broad sample of images ,cmmon sounds ,languages ,music of earth ” ఆయన సంగీతం లో ఉన్నాయని ప్రపంచం అంతా శ్లాఘించింది .అందుకే ఆ మహా విద్వామ్సుడికి ”హాట్స్ ఆఫ్ ”అంటారు .ఎన్నెన్నో వాయిద్యాలను అవసరాన్ని బట్టి వాడాడు .నిండుదనం పరి పూర్ణతా సాధించాడు .ఆయన గొప్పగా పాడనూ గలడు .పాడించను గలడు.
శబ్దానికి ఉన్న సంగీత శక్తి బీథోవెన్ కు తెలిసి నంత గా ఎవ్వరికీ తెలీదు అని విశ్లేషకుల భావన .చేంబర్ మ్యూజిక్ కు విలువైన సంగీతం అందించాడు .మొత్తం మీద ఆరు వందల కార్య క్రమాలను నిర్వ హించిన ఘనత బీతోవన్ ది. ఆయన సంగీతం ఇచ్చిన వాటిలో 32 piono sonataas ,10 violin sonatoas ,5 cello sonatas ,16 string quartets 12 wind istruments ఉన్నాయి .
ఆయన మరణిస్తే ఇరవై వేల మంది ప్రజలు ఆయన అంతిమ యాత్ర లో పాల్గొని నివాళులు అర్పించారు .అదే అతని గురువు మొజార్ట్ అంతకు ముందెప్పుడోఅక్కడే చని పోతే ,పట్టు మంటూ పది మంది కూడా స్మ శానానికి వెల్ల లేదట . ఆయన మరణానంతరం 75 .వ పుట్టిన రోజున ఆయన పుట్టిన బాన్ లోవిగ్రహం ఏర్పాటు చేశారు .జర్మని లో ఒక సంగీత విద్వామ్సుడికి ఏర్పాటు చేసిన మొదటి విగ్రహం ఇది .1880వరకు వియన్నా లో ఆయన విగ్రహం పెట్ట లేదు .బోస్టన్ లోని సింఫనీ హాల్ లో ఆయన పేరు ను బంగారు అక్ష రాలతో రాశారు బాన్ లో ఆయన పేర మ్యూజియం ఏర్పాటు చేసి గౌరవాన్నిచ్చారు .ఆయన పై ”erocia”అనే సినిమా ను ఆస్ట్రియా ప్రభుత్వం 1949లో నిర్మించింది .ఇది cannes film festival కు వెళ్ళింది .1962లో వాల్ట్ డిస్నీ ” the magnifishient rebel ”పేర టి.వి.కి తీశాడు .1994లో” immortal beethoven ”సినీగా వచ్చింది .2006లో బీథోవెన్ ninth symphony ఆధారంగా ”copying beethoven ”సినీమా తీసి ఆ సంగీత సార్వ భౌముడికి నివాళు లర్పించారు .”లుడ్విగ్ వాన్ బీథోవెన్ ”అంటుంటే నే ఒక రిధం ఆ మాటల్లోనే ప్రతిధ్వనిస్తుంది .పేరులోనే సంగీత పెన్నిది ని దాచుకొన్న” ముగ్గురు బీ ”లలో” బిగ్ బీ ” బీథోవెన్ .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –23-8-12-కాంప్–అమెరికా




గౌరవనీయులు దుర్గాప్రసాద్ గారికి
ఇంత చక్కటి బ్లాగు నడుపుతూ ఎన్న్తో ఆసక్తి కరమైన విషయాలను తెలియచేస్తున్నందుకు ముందుగా కృతజ్ఞతలు.
కాని అక్కడక్కడ తప్పులు దోర్లుతున్నట్లు ఉన్నాయి. ” అలాగే బాష్ తోను కచేరీలు నిర్వహించిన చరిత్ర ఆయనది ” అని బ్రామ్స్ గారి గురించి రాసారు …? కాని బాష్ గారికి బ్రామ్స్ గారికి ఎనభై సంవత్సరాల వత్యాసం ఉంది పుట్టుకలో..? అలాగే నిన్న రాసిన వ్యాసంలో బెతోవెన్ ఆరేళ్ళకే అందరిని విస్మయపరిచారు అని రాస్తే, ఈ వ్యాసంలో ఏడేళ్లకు అని ఉంది …? ఏది నిజం ?
LikeLike
This is one of the best Telugu blogs in our blog world Durgaprasad garu , (if not The Best)..
మీ బ్లాగ్ ఎంతో కాలం క్రితమే నోటీస్ చేయకుండా, ఈ మధ్యే చేయడం నా దురదృష్టంగా భావిస్తున్నాను , అన్నీ చదవలేనేమో అని.
అయినా, చాలా తరచుగా వచ్చి పాతవన్నీ కూడా చదువుతున్నాను.
ఇంత చక్కగా ఇన్ని విషయాల మీద తెలుగు ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. కొన్ని సార్లు వడి ఎక్కువయినట్లనిపించినప్పటికీ, ఎంతో గ్రౌండ్ కవర్ చేయాల్సి ఉన్నప్పుడు, క్లుప్తంగానూ త్వరత్వరగానూ చెప్పకతప్పదనుకోండి.
I admire the breadth and depth of your reading and inspires to me to wish that I do the same Sir, . Thank you again.
Sincerely,
Kumar N
LikeLike