జన వేమన -10
సామెతల ఆమెతలు
వేమన అనగానే మనకు ఏదో పద్యం గుర్తుకు వస్తుంది .సందర్భాను సారం గా సామెత లను వాడటం తెలుగు వారి ప్రత్యేకత .మనం వాడే సామెత లలో చాలాభాగం వేమన చెప్పిన పద్యాలే ఉంటాయి .అంతగా ,ఆయన జన జీవనం లో మమైకం అయారు .కనుక తెలుగింట ఆయన సామెతల ఆమెతలు నిత్యం తృప్తిని ,సంతోషాన్ని కల్గించి భావ పుష్టిని ,ఆరోగ్యపు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి .ఇంతకీ ”సామెత ”అంటే ?లోకోక్తి .అంటే ,ప్రజలు వాడుక లోని ,నీతి ,అనుభవం మొదలైన వాటిని తెలిపే వాక్యం లేదా పదాల సముదాయం .మరి ”ఆమెత ”అంటే ఏమిటి ?ఆమెత అంటే ”విందు, భోజనం ”.కలిస్తే విందు భోజనం .నిత్యం వేమన వాక్యా లను నేమరేస్తూ ,విందు భోజనం చేసి ఆనందిన్చటమే-”సామెతల ఆమెతలు ”.విన్దులే విందులు .ఆనందపు చిందులే చిందులు .అందులో మొట్ట మొదటిది ”ఆత్మ శుద్ధి లేని ఆచార మది ఎల -భాండ శుద్ధి లేని పాక మేల -చిత్త శుద్ధి లేని శివ పూజ లేలరా ”ఈ మూడింటిని మూడు ప్రత్యెక సందర్భా లలో వాడని వారున్నారా ?వేరు పురుగు వృక్షాన్ని ,చీడ పురుగు చెట్టునీ చెఱచి నట్లు ”కుత్సి తుండు చేరి గుణ వంతు జేరచురా ””అని అందరూ చెప్పే సామెతే .చెడు స్నేహం పనికి రాదనీ అర్ధం .”నీరు పల్ల మెరుగు ,నిజము దేవు డేరుగు-”అనీ వాడుతాం .”నీరు పల్ల మెరుగు నిజముగాను -తనయుని జననంబు తల్లి థా నేరుగును ”అనీ అంటాం .నిజమేదో ,అబద్ధం ఏదో తెలీని సందర్భం లో . స్టాన బలిమి చాలా గొప్పది .తనకు బలం లేని చోట పరుల బలం బలం గా ఉన్న చోట ,విర్ర వీగటంమంచిది కాదు .అప్పుడు తగ్గి ఉంటె ,మనకు పోయేదేమీ ఉండదు .”అనువు గాని చోట అధికుల మన రాదు -కొంచే ముండు టేల్ల కొదువ గాదు -కొండ అద్దమందు గొంచెమై యుండదా ?”అన్న పద్యం అందరికి స్పూర్తియే .అలాగే కీడు చేసే వాడికీ మేలు చేయటం మనకు అనాదిగా వస్తున్నాదే .భారతం లోనూ చెప్పిన నీతి .దీన్ని సూక్షం చేసి ”చంప దగిన యట్టి శత్రువు తన చేత -జిక్కె నేని కీడు సేయ రాదు -పొసగ మేలుచేసి పొమ్మనుటే చాలు ”అని పాటించ దగిన నీతిని ,లోక రీతినీ చెప్పాడు .డబ్బా కొట్టే వాడు అప్పుడూ ఇప్పుడుఎప్పుడూ ఉంటారు .మంచి వాడు ఒదిగి ఉంది మాట్లాడుతాడు .ఇద్దర్నీ పోలుస్తూ ”కంచు మోగు నట్లు కనకంబు మోగునా ”అని అంటూనే ఉంటాం .సూటీ పోటీ మాటలతో మనసులు విరిగి పోతాయి .ఇనుము విరిగితే కాల్చి అతుక వచ్చు .మనసు విరిగితే అతకటం అసాధ్యం ”మనసు విరిగే నేని ,మరి అంట నేర్చునా ”అని వేమన్న సామేతనే చెబుతాం .”మేడి పండు జూడ మేలి మై యుండు -పొట్ట విచ్చి చూడ పురుగు లుండు -బిరికి వాని మదిని బింక మీ లాగురా ”అని పైన పటారం ,లోన లొటారం లాంటి గొట్టం గాల్ల ను గురించి అంటూనే ఉంటాం .తలిదంద్రుల్ని ఆద రించ లేనికొడుకులను చూసి ,”తల్లి దండ్రి మీద దయ లేని పుత్రుండు -”పద్యం విని పించి జ్ఞాన బోధ చేస్తూనే ఉంటాం .
ఆలోచన కార్య రూపం లోకి రావాలి ఆది తీవ్ర మైతే పను లన్నీ లాభిస్తాయి .అందుకే వేమన ”అనగ అనగారాగ మతి శయిల్లుచు నుండు – తినగా తినగా వేము తియ్యనుండు -సాధనమున పనులు సమ కూరు ధరలోన ”అని నమ్మకం గా చెప్పి ఒప్పిస్తాం .సంగీతం కష్టమే .నిత్య సాధన తో రాగం దారికొస్తుంది .వాము చేదుగా నే ఉంటుంది .తినటం ప్రారంభిస్తేక్రమంగా తీపి అని పిస్తుంటుంది .కనుక పని సాధించాలి అంటే నిత్య సాధన కావాలి .కస్టాలు వచ్చాయి అనో ,సరిగా రావటం లేదు అనో నిరాశ చెంది వదిలెయ రాదు అని గుర్తు చేస్తాం .ఆనాడే కాదు ఈ నాడు కూడా ఇది ఆచరణ యోగ్య మైన సామెతే .”ఎలుక తోలు తెచ్చి ఏడాది నుతికిన –నలుపు గాక ,ఎల తెలుపు గలుగు ”అన్నదీ బుద్ధి మారని వారి గురించి చెప్పే మాటే .”కుక్క తోక బట్టి గోదావరి ఈదటం ”కూడా బాగా వాడుక లో ఉంది .”గంగి గోవు పాలు గరిటె డైనను జాలు -కడివెడైన నేమి ఖరము పాలు -భక్తీ కల్గు కూడు పట్టే డైనను చాలు ”పద్యాన్ని మన నిత్య జీవితం లో ఎన్ని సార్లు వాడి ఉంటామో లెక్కే లేదు .తెలుగు వారి మనసుకి ,శరీరానికి శల్య గతం గా పట్టిన సామెత ఇది .శ్రద్ధా భక్తీ లేకుండా యే పని చేసినా ఫలితం లేదు ,రాదు .భగ వంతుడికి కొండంత పత్రీ ,నైవేద్యాలు అక్కర్లేదు .పట్టెడు అన్నం ,పరమ పవిత్ర మైన మనసు తో సమర్పిస్తే విపరీతం గా సంతోషిస్తాడు. ఫలితం కలుగుతుంది .రంతి దేవుడు ,ద్రౌపది ,ఇలా చేసి చరితార్దులైన వారే .
సరైన వాడిని సరైన స్తానం లో కూర్చో బెట్టాలి .ప్రలోభాలకో ,పైరవీ లకో లొంగి అనర్హుడికి అధికారం ఇవ్వ రాదు .అలా చేస్తే చెప్పును తినే కుక్క చెరకు రసం తీపి తెలియ నట్లు గా ఉంటుంది .”అల్ప బుద్ధి వాని కధికార మిచ్చిన -దొడ్డ వారి నెల్ల దొలగ గొట్టు -చెప్పు తినేది కుక్క చెరకు తీపెరుగునా ”అని నేటి రాజకీయ పరిస్తితుల పై బాధ పడుతూ చీద రించు కొంటూ అంటూనే ఉంటాం .కాని జరిగి పోయే దేదో జరిగి పోతూనే ఉంటుంది .కులం, భాష, మతం, బంధుత్వం ,ఆశ్రిత పక్ష పాతం తో అనర్హులు పదవులు దక్కించు కొంటూ అర్హులు దూరమై పోతుంటే వేమన పద్యాలను మననం చేసు కొంటూ మనస్సు లోనే గోణుక్కుంటాం .అవతలి వాడిలో తప్పు లు వెదికే ”రంద్రాన్వేషకులు ”ఎక్కువ .తమ తప్పు తెలుసు కో లేరు .”తప్పు లెన్ను వారు తమ తప్పు లేరుగరు ”అన్న వేమన్న అన్న మాట గుర్తుంచుకోవాలి మనమందరం .ఒక వేలుఅవతలి వాడి వైపు చూపిస్తే ,నాలుగు వెళ్ళు మన వైపు చూపిస్తాయి అన్న ఏసు క్రీస్తు మాట మరిచి పోరానిది .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –27-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 995,055 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.11వ భాగం.25.3.23.
- రీ అణుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.28వ భాగం.న్యాయ దర్శనం.25.3.23
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.10వ భాగం.24.3.23
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.27వభగం.న్యాయ దర్శనం .24.3.23.
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (386)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు