జన వేమన –13
వేమన గురించి కధలు -గాధలు
”dates are the weakest links in indian history ”అని మాక్సు ముల్లర్ మేధావి అన్నాడు .భారత దేశ చరిత్ర లో తారీఖులు సరిగ్గా ఉండవు .నిజమే .మన కవులు ,రచయితలు తాము రాసిన విషయాలకే ప్రాధాన్యం ఇచ్చారు కాని ,తమ జీవిత చరిత్ర కు ప్రాధాన్య త నివ్వ లేదు.యే కొద్ది మందో ,తండ్రి ,తాతలగురించి కొద్ది గా చెప్పుకొన్నారు .అవీ అరకొరగా .చరిత్ర కు ప్రాధాన్యత నివ్వ లేదు .మన చరిత్ర అంతా పాశ్చాత్యులే రాశారు .కాల నిర్ణయానికి సరైన తేదీలు ఇవ్వక పోవటం తో వాళ్ళ ఇష్టం వచ్చి నట్లు చరిత్ర సృష్టించి మన నెత్తిన రుద్దారు .అదంతా తప్పుల తడక అని తెలుసు కోవటానికి చాలా కాలం పట్టింది .దీనిని సరి చేసుకోవటం లో మన చరిత్ర కారులు కొంత కృషి చేశారు .దొరికిన ఆధారాలన్నీ గాలించారు .రాజుల కాలం ,కవుల కాలం బేరీజు వేసి ఎవరికి తోచింది వారు చెప్పారు .ఇక్కడా పొంతన కుదర లేదు .ఒకరిద్దరు దరి దాపులకు వచ్చినా ,మిగిలిన వారు కాదు పొమ్మన్న స్తితి .ఇదీ మన చరిత్ర .అందుకే అంతా సుమారు కాల నిర్ణయమే జరిగింది .పాశ్చాత్య వాదాన్ని కాదని మన చరిత్ర కారులు నిత్య ,చారిత్రిక ఆధారాల దృష్ట్యా కాల నిర్ణయం చేసినా ఇంకా అనుమానం .మూడు ,నాలుగు వందల క్రితం ఉన్న రచయితల చరిత్రే మనకు నిర్దుష్టం గా తెలియదు .అలాంటిది రామాయణ ,భారత కాల నిర్ణయం గగనమై పోయింది .పాశ్చాత్య నిర్ణయం లో వారికి తెలిసిన మూడు లేక నాలుగు వేల ఏళ్ళ నాటి విషయాలే ఆధారం .మనదిఅలా కాదు .మన భారతం ,భవిష్యత్ పురాణం మంచి ఆధారాలే ఇచ్చాయి .
భారత యుద్ధం ఆధారం గా ,కాల నిర్ణయం జరగాలి .మన పంచాంగాలే మన ప్రమాణాలు .వీటి అన్నిటి ఆధారం గా మన విజయ వాడ వాస్తవ్యులు స్వర్గీయ కోట వెంకటా చలం గారు భారత దేశం లోని రాజులు పాలించిన కాలాన్ని ,గుప్తుల కాలాన్ని ఆంద్ర రాజుల కాలాన్ని ,శంకరాచార్యుల కాలాన్ని నిర్దుష్ట ఆధారాలతో ప్రచురించారు .దాదాపు ఇరవై పుస్తకాలు చరిత్ర పై రాసి” చరిత్ర భాస్కరులు” అని పించుకొన్నారు .పాశ్చాత్య చరిత్ర కారు లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు .భారత చరిత్ర కారుల అభి ప్రాయాలను సేకరించారు .పెద్ద ,పెద్ద విశ్వ విద్యాలయాలు చేయాల్సిన పనిని వెంకటాచలం గారు ఒక్కరే ఒంటి చేత్తో నిర్వహించారు .అవును అనటానికి మనసు ఒప్ప లేదు .కాదు అనే దమ్మూ లేదు .ఇదీ మన చరిత్ర స్తితి .మన వాళ్లకు ఒక విచిత్ర భావన కూడా ఉంది .రాసే కవి ,రచయిత గొప్ప వాడు అని పిస్తే వారి చుట్టూ ,అభూత కల్పనలు ,అసంగత విషయాలు మా యలు, మహిమలు అంట గట్టి నమ్మ శక్యం కాని స్తితి లో అసలు చరిత్ర ను నేట్టేయటం వెగటు అని పిస్తుంది .అద్భుతాలు లేక పోతే చరిత్ర కు లోపం వస్తుందని భావం .కవుల ,రాజుల చరిత్ర లలో నిజమెంతో ,అల్లిక ఎంతో తెలియని అగమ్య గోచర పరిస్తితి .తెనాలి రామ లింగడి చుట్టూ ,శ్రీ నాధుడి చుట్టూ ఈ అల్లిక లన్నీ ,అల్లి బిల్లి గా అల్లుకున్నాయి .ఇంకా వేమన సంగతి చెప్ప నక్కర లేదు .కులం ,ఊరు ,పెరుల్లో మార్పులు .మహిమలు ,మంత్రాలు ఎన్నో చేరాయి .అదో కీకారణ్యం .ఒక సారి అందులో ప్రవేశించి ,తమాషా చూద్దాం .”షికారు ”చేసి నట్టుంటుంది .”నిజం సిరి ”దొరక్క పోయినా ,కాల క్షేపం బానే ఉంటుంది .
”రాష్ట్ర కూటులు ”రెడ్డి పదం తో వర్దిల్లారు .రాజ్య స్తాపన చేసి ,చరిత్ర సృష్టించారు .రెడ్డి రాజ్యానికి మూల పురుషుడి గా ”దొంతి అల్లాడ రెడ్డి ”పంట శాఖ కు చెందినా వాడు .నైజాం లోని ”చదల వాడ ”లో వ్యవసాయం చేస్తూండే వాడు .ఒక రోజు ఆయనకు అపార ధనం లభించింది .దాన్ని దోచు కోవటానికి కొందరు ప్రయత్నించారు .ఆ వూరి దేవుడు ”వీర రాఘవ స్వామి ”కలో కల్పించి ,వెంటనే ఊరు వదిలి వెళ్ళమని అన్నాడు .అక్కడి నుండి ”హనుమ కొండ ”చేరాడు .బంగారం తో ,రాఘవ దేవ విగ్రహం చేయించి ,పూజిస్తున్నాడు .అక్కడి నుండి కొండ వీడు లోని ,కవులూరు ,ఆ తర్వాత ధరణి కోట చేరి అందరి తో మంచిగా ఉంటూ ,సంపన్నుడై మన్ననలు పొందాడు .ఇది ఇలా ఉంటె వేమన అనే వైశ్యుడు శ్రీ శైలం వెళ్లి ,”పరుస వేది ”ని సంపాదించాడు .అతనికి ఆశ్రయం కల్పించాడు .దాని ప్రభావం తో ,అక్కడ ఉన్న నాగలి బంగారం గా మారింది .ఆది చూసిన అల్లాడ రెడ్డి పరుస వేది రహస్యం అర్ధమై ,ఆ కుండ ను ఇంట్లో దాచి ,పాకలకు నిప్పంటించాడు .ఆ మంటల్లో కోమటి వేమన సజీవ దహనం అయాడు .కధ అంతటి తో ఆగ లేడు .అల్లా రెడ్డి కి కలలో వేమన కన్పించి ,రెడ్డి చేసిన ద్రోహాన్ని అంతా వివరించి ,తనకు ఆశ్రయం ఇచ్చి నందుకు గాను కొంత జాలి పడి రెడ్డి వంశం లో ఆరుగురు రాజులు వంద ఏళ్ళు మాత్రమె రాజ్యం చేస్తారని ,వంశం లో పుట్టిన ప్రతి వాడికి తన పేరు పెట్ట మని ,దాన ధర్మా లన్ని తన కు సమర్పించ మని” శాపం లాంటి వరం ”ఇచ్చాడు .వంశం నిర్వంశం కాకుండా చేసి నందుకు రెడ్డి సంతోషించాడు .అప్పటి నుండి రెడ్డి రాజు లందరికి ”వేమ” అనే ది పేరుకు ముందు చేరింది .వీరిలో పొంతి ,దేసటి అనే రెండు ఇంటి పేర్ల వారున్నారు .ఈ విధం గా” కోమటి వేమన రెడ్డి ”వేమన ”గా రూపు దాల్చాడని ఒక కధ ప్రచారం లో ఉంది .అల్లాడ రెడ్డి కుమారుడు ”కోమటి ప్రోలయ వేమా రెడ్డి ”.ఇతడే కాకతి ప్రతాప రుద్రుని సైన్యాధ్యక్షుడై నాడు .తురుష్కులు రాజు ను బందీ చేసి తీసుకొని పోతే, రాజ్య పాలన చేశాడు .1324లో రెడ్డిరాజ్యాన్ని స్తాపించి 1350వరకు పాలించాడు .ఎర్రన రాసిన హరి వంశం లో ఇతడు అద్దంకికి రాజ దాని గా చేసు కొని పాలించి నట్లుంది .అక్కడి నుండి కొండ వీడు చేరి, గొప్ప కోట ను కట్టి పరి పాలించాడు .మరిన్ని కధలు తర్వాతచూద్దాం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –30-8-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,435 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

